విశ్వాస పుస్తకం (కితాబుల్ ఈమాన్) | మిష్కాతుల్ మసాబీహ్ | 01

విశ్వాస పుస్తకం; ’హ: 1-78 ; సంపుటం : I98
1- كتَابُ الِإيْمَانِ؛ ح :1-78 ؛ الجِلد : I 1-۔ كتَابُ الِإيْمَانِ

విశ్వాస (ఈ’మాన్‌) పుస్తకం

ఈమాన్‌ అంటే ధృవీకరించటం. ధార్మిక భాషలో ప్రవక్త (స) ఉపదేశాలను ధృవీకరించి నోటితో ఉచ్చరించటం, దాని ప్రకారం ఆచరించటం. విశ్వాసంలో ఆచరణ కూడా చేరి ఉంది. విశ్వాసంలో హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి. పుణ్యాలు చేస్తే విశ్వాసం పెరుగుతుంది. పాపాలు చేస్తే విశ్వాసం తరుగుతుంది. ఖుర్ఆన్ లో: ”ఆమినూ వ ‘అమిలు ‘స్సాలి’హాత్” అనేక సార్లు వచ్చింది. ఇమామ్ బు’ఖారీ తన పుస్తకం బు’ఖారీలో విశ్వాసం పెరగడం తరగడం గురించి అనేక ఖుర్‌ఆన్‌ ఆయతులను, ‘హదీసు’లను పేర్కొన్నారు. ప్రఖ్యాత పండితుల, పూర్వీకుల అభిప్రాయం కూడా ఇదే. ఇతర వివరాలకు ఫత్హుల్ బారీలో కితాబుల్ ఈమాన్ చూడండి. ఇది మొదటి అంశం. ముందు మాటలో వీటిని గురించి వివరించడం జరిగింది.

మొదటి విభాగం الْفَصْلُ الْأَوَّلُ

1 – ( متفق عليه) (1/8)
عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” إِنَّمَا الْأَعْمَالُ بِالنِّيَّاتِ. وَإِنَّمَا لِاِمْرِئٍ مَا نَوى فَمَنْ كَانَتْ هِجْرتُهُ إِلىَ اللهِ وَرَسُوْلِهِ فَهِجْرَتُهُ إِلَى اللهِ وَرَسُوْلِهِ، وَمَنْ كَانَتْ هِجْرَتُهُ إِلَى دُنْيَا يُصِيْبُهَا، أَوِ امْرَأَةً يَتَزَوَّجُهَا فَهِجْرَتُهُ إِلَى مَا هَاجَرَ إِلَيْهِ” . متفق عليه.

[1/8-ఏకీభవితం]
‘ఉమర్‌ బిన్‌ ‘ఖ’త్తాబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”కర్మలు సంకల్పంపైననే ఆధారపడి ఉంటాయి. ప్రతివ్యక్తికి తాను కోరుకునేదే లభిస్తుంది. ఒకవేళ ఎవరైనా అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త కోసం వలసపోతే, అతని వలస పోవడం అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త కొరకే అవుతుంది. అదేవిధంగా ఎవరైనా ప్రాపంచిక సంపదల కోసం లేదా స్త్రీ కోసం వలసపోతే, అతని వలసపోవటం వాటి గురించే అవుతుంది.” (బు’ఖారీ, ముస్లిమ్‌) )

వివరణ-1: ఈ ‘హదీసు’ ఉల్లేఖకులు ప్రఖ్యాత ప్రవక్త (స) అనుచరులు. అతని కునియత్‌ అబూ ‘హఫ్‌’సహ్, బిరుదు ఫారూఖ్‌. ఇస్లామ్‌ స్వీకరణకు ముందు ఇస్లామ్‌ వ్యతిరేకుల్లో ప్రముఖులు. ఎవరు దొరికితే వారిని హింసించేవారు.

ఉమర్‌ (ర) ఇస్లామ్‌ స్వీకరణ: ఖురైష్‌ నాయకుల్లో అబూ జ’హల్‌, ‘ఉమర్‌లు ఇస్లామ్‌, ప్రవక్త (స) శత్రుత్వంలో అధి కంగా నిమగ్నులై ఉండేవారు. అందువల్ల ప్రవక్త (స) వీరిద్దరి గురించి ఇలా దు’ఆ చేసేవారు: ”ఓ అల్లాహ్‌! అబూ జ’హల్‌ ద్వారా లేదా ‘ఉమర్‌ బిన్‌ ‘ఖ’త్తాబ్‌ ద్వారా ఇస్లాంను బల పరచు.” కాని ఈ భాగ్యం ‘ఉమర్‌(ర) దక్కింది. ఈ దు’ఆ ప్రభావం వల్ల ఇస్లామ్‌ బధ్ధ శత్రువు ఇస్లామ్‌ ప్రాణ మిత్రుడుగా మారిపోయాడు. అంటే ‘ఉమర్‌ (ర) ఇస్లామ్‌ స్వీకరించారు. ‘ఉమర్‌ ఇస్లామ్‌ స్వీకరణ వృత్తాంతం అనేక చారిత్రక పుస్తకాల్లో ఉంది. ఇక్కడ సంక్షిప్తంగా పేర్కొనడం జరిగింది.

ఒక ప్రఖ్యాత వృత్తాంతం: ‘ఉమర్‌ ఎంత ప్రయత్నించినా ఒక్క వ్యక్తిని కూడా ఇస్లామ్‌ నుండి మార్చలేక పోయారు. చేసేది లేక చివరికి ప్రవక్త (స)ను హత్యచేసేందుకు నిర్ణయించుకున్నారు. కరవాలం ధరించి బయలు దేరారు. దారిలో ను’ఐమ్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్ కలిశారు. ‘ఉమర్‌ ముఖవర్చస్సు చూసి: ‘ఏంటి సంగతి?’ అని అడిగారు. దానికి ‘ఉమర్‌: ‘ము’హమ్మద్‌ (‘స) పని పట్టడానికి వెళుతున్నాను.’ అని అన్నారు. దానికతను: ‘ముందు నీ ఇంటి సంగతి చూడు. నీ చెల్లెలు, నీ బావ ఇస్లామ్‌ స్వీకరించారు.’ అని అన్నారు. వెంటనే వెనక్కి తిరిగి చెల్లెలు ఇంటికి వెళ్ళారు. అప్పుడామె ఖుర్‌ఆన్‌ పఠిస్తుంది. ‘ఉమర్‌ శబ్దం విని ఆపివేసింది. ఖుర్‌ఆన్‌ను దాచివేసింది. కాని ఖుర్‌ఆన్‌ శబ్దం ఆయన చెవిలో పడనే పడింది. తన చెల్లెలును: ‘నేను విన్న శబ్దం ఏంటీ?’ అని అడిగారు. దానికి ఆమె: ‘ఏమీ లేదు.’ అన్నది. ‘నేను శబ్దాన్ని విన్నాను. మీరిద్దరూ మార్గ భ్రష్టులయి పోయారు.’ అని పలుకుతూ బావను కొట్టసాగారు. చెల్లెలు తప్పించడానికి వస్తే ఆమెను కూడా కొట్టారు. రక్తం కారసాగింది. కాని దానివల్ల ఆమెపై ఎటువంటి ప్రభావం పడలేదు. అంతేకాదు, ‘ఉమర్‌! నీవు చేయ గలిగింది చేసుకో, ఇప్పుడు ఇస్లామ్‌ మా హృదయాల నుండి తొలగడం జరగదు.’ అని హెచ్చరించింది. ఈ పదాలు ‘ఉమర్‌పై చాలా ప్రభావం చూపాయి. చెల్లెలు వైపు ప్రేమగా చూచి: ‘మీరు చదివేది నాకూ వినిపించండి.’ అని అన్నారు. ఫాతిమహ్ వాటిని తెచ్చి ఆయన ముందు పెట్టింది. తెరచి చూస్తే ఈ వాక్యం ఉంది: ”ఆకాశాలలోను మరియు భూమిలోనూ ఉన్న సమస్తం అల్లాహ్‌ పవిత్రతను కొని యాటుతుంటాయి. మరియు ఆయనే సర్వ శక్తి మంతుడు, మహా వివేకవంతుడు.” (సూ. అల్‌-హదీద్‌, 57:1)

ఆ ఆయతులోని ప్రతి పదాన్ని చాలా శ్రద్ధగా చదవసాగారు. చివరికి: ”అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించండి….”(సూ. అల్‌-హదీద్‌, 57:7) అన్న వాక్యం ముగించి అకస్మాత్తుగా: ”అష్‌హదు అన్ లా ఇలాహ ఇల్లా అల్లాహ్, వ అష్‌హదు అన్న ము’హమ్మదు ర్రసూలుల్లాహ్‌.” అని పలకసాగారు. ఆ రోజుల్లో ము’హమ్మద్ (స) ‘సఫా కొండ క్రింద ఉన్న అర్‌ఖమ్‌ ఇంటిలో ఉండేవారు. ‘ఉమర్‌ (ర) అక్కడకు వచ్చి తలుపు తట్టారు. కరవాలం ధరించి ఉన్నారు. అనుచరులకు అనుమానం వచ్చింది. కాని ‘హమ్‌’జహ్: ‘మంచిగా వస్తే మంచిదే లేదా వాడి కరవాలంతోనే వాడి తల నరుకుతాను.’ అని అన్నారు. ‘ఉమర్‌ (ర) లోపల అడుగుపెట్టగానే ప్రవక్త (స) ముందుకు వచ్చారు. ” ‘ఉమర్‌! ఎలా రావడం జరిగింది.” అని అడిగారు. దైవప్రవక్త మాటలు విని ‘ఉమర్‌ వణికిపోయారు. చాలా చిన్న స్వరంతో వినయ విధేయతలతో: ”ఇస్లామ్‌ స్వీకరించటానికి.” అని అన్నారు. అది విన్న ప్రవక్త (స): ”అల్లాహు అక్బర్‌!” అని ఎంత జోరుగా కేకవేశారంటే ఒక్కసారి ఆ ప్రాంతమంతా కంపించింది. (అసదుల్‌ ‘గాబ, ఇబ్ను అసాకిర్‌, దారుఖుతునీ, బైహఖీ)

‘ఉమర్‌ ఇస్లామ్‌ స్వీకరణవల్ల పెద్దకల్లోలం తలెత్తింది. అవి శ్వాసులు అతని ఇంటివద్దకు వచ్చి: ‘ఉమర్‌ మార్గభ్రష్ట త్వానికి గురయ్యాడు.’ అని అనసాగారు. (బు’ఖారీ)

‘ఉమర్‌ ఇస్లామ్‌ స్వీకరించిన తర్వాత ఇస్లామ్‌ చరిత్రలో ఒక క్రొత్త అధ్యాయం మొదలయింది. అప్పటికి ఇంచుమించు 40 మంది ఇస్లామ్‌ స్వీకరించి ఉన్నారు. కాని వారు అసహాయత, బలహీన తల్లో ఉండేవారు. బహిరంగంగా ఇస్లామ్‌ ఆదేశాలను పాలించడం అటు ఉంచి, తాను ముస్లిమునని చెప్పుకోవడానికి కూడా భయపడేవారు. క’అబహ్ లో నమా’జు చదవడం అసాధ్యంగా ఉండేది. ‘ఉమర్‌ ఇస్లామ్‌ స్వీకరించగానే పరిస్థితులు మారిపోయాయి. ‘ఉమర్‌ (ర) తాను ఇస్లామ్‌ స్వీకరించానని బహిరంగంగా ప్రకటించారు. అంతేకాదు అవిశ్వాసు లందరినీ ఒకచోట చేర్చి వారి ముందు తాను ఇస్లామ్‌ స్వీకరించానని బహిరంగంగా ప్రకటించారు. అది విన్న అవిశ్వాసులు చాలా ఆందోళన చెందారు. కాని ‘ఆస్‌ బిన్‌ వాయి’ల్‌ అంటే ‘ఉమర్‌ (ర) మామ. ‘ఉమర్‌ను తన శరణులోకి తీసుకున్నారు. ‘ఉమర్‌ (ర) ఇస్లామ్‌కు ముందు ముస్లింలపై జరిగే హింసా దౌర్జన్యాలు చూసేవారు. అందువల్ల మామ శరణు స్వీకరించక ముస్లింల వెంటే ఉండటానికి ప్రాధాన్యత నిచ్చారు. ముస్లిములకు తోడుగా ఉంటూ అవిశ్వాసులను ఎదుర్కొనడం ప్రారంభించారు. చివరికి ముస్లిములతో పాటు వెళ్ళి క’అబతుల్లాహ్‌లో నమా’జు ఆచరించసాగారు.

సత్యా-సత్యాల పోరాటంలో ఇది మొదటి విజయంగా పరిగణించబడింది. దీనివల్ల ‘ఉమర్‌కు ఫారూఖ్‌ అనే బిరుదు లభించింది.

హిజ్రత్‌: ‘ఉమర్‌ (ర) 7వ నబవీలో ఇస్లామ్‌ స్వీకరించారు. 13వ నబవీలో హిజ్రత్‌ చేశారు. అంటే ‘ఉమర్‌ (ర) ఇస్లామ్‌ స్వీకరించిన తర్వాత 6 లేక 7 సంవత్సరాల వరకు అవిశ్వాసుల హింసా దౌర్జన్యాలకు గురయ్యారు. ముస్లిము లకు వలసవెళ్ళే అనుమతి లభించగానే ‘ఉమర్‌ కూడా వలసవెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ప్రవక్త (స) అనుమతి తీసుకొని కొంత మందిని తీసుకొని క’అబ తుల్లాహ్‌ చేరుకున్నారు. నిశ్చింతగా ‘తవాఫ్‌ చేశారు. నమా’జు చదివారు. ఆ తరువాత అవిశ్వాసుల నుద్దేశించి, ‘నాతో ఎవరైనా యుద్ధం చేయాలనుకుంటే మక్కహ్ వెలు పలకురండి,’ అని ప్రకటించారు. కాని ఎవరికీ ధైర్యం చాల లేదు. అనంతరం ‘ఉమర్‌ (ర) మదీనహ్ బయలుదేరారు.

‘ఉమర్‌ (ర) మదీనహ్ చేరి రిఫా’అహ్ బిన్‌ ‘అబ్దుల్‌ మున్‌’జిర్‌ అతిథి అయ్యారు. ఖుబా’కు ‘అవాలీ అనే మరో పేరు కూడా ఉంది. అందు వల్ల ముస్లిమ్‌లో అతని నివాసం పేరు ‘అవాలీ అని ఉంది. ‘ఉమర్‌ (ర) తర్వాత అనేకమంది ప్రవక్త (స) అనుచరులు వలసవచ్చారు. చివరికి 632 క్రీ.శ.లో స్వయంగా ప్రవక్త (స) కూడా మక్కహ్ నుండి మదీనహ్ వలస వచ్చారు.

‘ఉమర్‌ (ర) ప్రత్యేకతలు: తారీఖుల్‌ ‘ఖులఫాలో అవి వివరంగా ఉన్నాయి. 1 లేక 2 ప్రత్యేకతలను ఇక్కడ సంక్షిప్తంగా పేర్కొనడం జరిగింది. ప్రవక్త (స): ‘ప్రాచీన జాతుల్లో చాలా మంది ‘హదీసు’వేత్తలు, మహా వ్యక్తులు గతించారు. అయితే ఈ అనుచర సమాజంలో ఎవరైనా అయితే అది కేవలం ‘ఉమర్‌ మాత్రమే.’ అని అన్నారు (బు’ఖారీ). ఇంకా ప్రవక్త (స) అల్లాహ్‌ (త) ‘ఉమర్‌ నోటిపై మరియు హృదయంపై సత్యాన్ని స్థాపించారు.’ అని ప్రవ చించారు (తిర్మిజీ’). ఇంకా ప్రవక్త(స)అన్నారు: ‘నా అను చర సమాజంలో నాతరువాత ఎవరైనా ప్రవక్త అయితే, అది ‘ఉమర్‌ మాత్రమే అవుతారు.’ (తిర్మిజీ’). ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ‘ఖుర్‌ఆన్‌లో అనేక ఆదేశాలు ‘ఉమర్‌ (ర) సూచించినట్లు అవతరించబడ్డాయి. ఇంకా షై’తాన్‌ అతనికి భయపడేవాడు. (‘తారీఖుల్‌ ‘ఖులఫా’). ‘ఉమర్‌ (ర) ద్వారా అనేక మహత్యాలు జరిగాయి. అయితే సారి యహ్ మహత్యం చాలా ప్రఖ్యాత గాంచింది. ‘ఉమర్‌ (ర) చాలాపుణ్యాత్ములు, దైవభీతిపరులు, ప్రవక్త సాంప్రదాయ విధేయులు, న్యాయశీలురు, ధర్మా త్తులు. అంతేకాదు రాజ కీయ నిపుణులు, వివేక వంతులు, మేధావులూను. అబూ బకర్‌ తర్వాత రెండవ ‘ఖలీఫా అయ్యారు. ‘ఉమర్‌ (ర) కాలంలో ఇస్లామ్‌ చాలా అభివృద్ధి చెందింది. ఫారూఖ్‌ (ర) ఘన కార్యాలు చాలా ఉన్నాయి.

వీర మరణం: ము’గీరహ్ బిన్‌ షు’అబహ్ అనే ఒక పారసీ బానిస తన యజమాని విషయంలో ‘ఉమర్‌ (ర)కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు సరైనది కానందువల్ల ‘ఉమర్‌ (ర) దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దానికి ఆ బానిస చాలా ఆగ్రహం చెంది ఫజ్ర్‌ నమా’జ్‌లో కత్తి తీసుకొని అకస్మాత్తుగా దాడి చేశాడు. వరుసగా 6 సార్లు దాడి చేశాడు. ‘ఉమర్‌ (ర) గాయాలతో క్రిందపడ్డారు. ‘అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ నమా’జు చదివించారు. గాయాలు చాలా ప్రమాదకరమైనవి కావటం వల్ల బ్రతికే అవకాశాలు కనిపించలేదు. ప్రజల కోరికపై 6 గురి పేర్లు పేర్కొన్నారు. వీరిలో ఒక్కరిని అందరి ఏకాభిప్రాయం ద్వారా ‘ఖలీఫాగా ఎన్నుకోమని సలహా ఇచ్చారు. వారిలో ‘అలీ (ర), ‘ఉస్మాన్‌ (ర), ‘జుబైర్‌ (ర), ‘తల్‌’హా (ర), స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ (ర), ‘అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ ఉన్నారు. ఈ దశ ముగిసిన తర్వాత ‘ఆయి’షహ్‌ (ర)ను ప్రవక్త(స) ప్రక్కన ఖననం చేయబడటానికి అనుమతి కోరారు.

ఆ తరువాత ముహాజిరీన్‌ల, అన్‌’సార్ల, అరబ్బుల, ముస్లిమే తరుల హక్కులను గురించి సూచించారు. ఇంకా తన కుమారుడు ‘అబ్దుల్లాహ్‌ను పిలిచి నాపై ఉన్న అప్పును వారసత్వం నుండి తీర్చటానికి ప్రయత్నించాలి. ఫలించని పక్షంలో ”అద్‌నీ” కుటుంబాన్ని కోరాలి. ఒకవేళ వారివల్లా కాకపోతే ఖురైషులందరితో అయితే ఖురైషులకు తప్ప మరెవరినీ అడగరాదు,’ అని ఉపదేశం చేశారు.

ఏది ఏమైనా ఇస్లామ్‌ గొప్ప హీరో, అత్యవసర విషయాలను గురించి సూచించిన తర్వాత 3 రోజులు అనారోగ్యంగా ఉండి ముహర్రమ్‌ 1వ తేదీన శనివారం నాడు 24వ హిజ్రీలో మరణించారు. ప్రవక్త (స) ప్రక్కన ఖననం చేయబడి గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయారు. (సియరుస్సహాబహ్‌)

సంకల్పం: సంకల్పం అంటే మనసులో ఉద్దేశ్యం. షరీ’అత్‌లో ఒక మంచి కార్యం చేసేటప్పుడు మనసులో సంకల్పం చేసుకోవాలి. ఉదాహరణకు వు’దూ చేయాలను కుంటే ముందు హృద యంలో పరిశుభ్రత పొందే ఉద్దేశ్యంతో వు’దూ చేయాలనుకుంటున్నాను అని సంకల్పం చేసుకోవాలి. అదేవిధంగా నమా’జు చదవడానికి ముందు నేను నమా’జు చేస్తాను అని సంకల్పం చేసు కోవాలి. అదేవిధంగా ప్రతి మంచి కార్యం చేసేటప్పుడు సంకల్పం చేసుకోవాలి. అవి విధి ఆరాధనలైనా, అదనపు ఆరాధనలైనా సరే. విశ్వాసం, ఇస్లామ్, నమా’జ్, ఉపవాసం, ‘జకాత్‌, ‘హజ్జ్, వు’దూ, స్నానం, తయమ్ముమ్‌ మొదలైనవన్నింటికీ సంకల్పం తప్పనిసరి. అంటే సత్కార్యాలన్నింటికీ. సత్కార్యాలు సంకల్పంపై ఆధారపడి ఉంటాయి. మంచి సంకల్పం, అంటే ఇ’ఖ్లాస్‌, అంటే చిత్తశుద్ధి. ఒకవేళ మంచి పని మంచి ఉద్దేశ్యంతో చేస్తే, అది అల్లాహ్‌ వద్ద స్వీకరించ బడుతుంది. సదుద్దేశంతో మంచి పని చేస్తే స్వీకరించడం జరుగదు. చిత్తశుద్ధి, సదుద్దేశంపై పుణ్యం లభిస్తుంది. ఒకవేళ ఆ పని చేయకపోయినా సరే.

ప్రవక్త (స) ప్రవచనం: ”మంచి పని చేయాలని నిశ్చయించు కొని కొన్ని కారణాల వల్ల చేయలేకపోతే, ఒక పుణ్యం లభిస్తుంది. ఒకవేళ సంకల్పం చేసుకొని, ఆ పనిచేస్తే 10 పుణ్యాలు లభిస్తాయి. ఒక్కోసారి 700 పుణ్యాలు కూడా లభిస్తాయి. అదేవిధంగా పాపకార్యం చేస్తానని సంకల్పం చేసుకొని దైవభీతి వల్ల చేయక పోతే, ఒక పుణ్యం లభిస్తుంది. ఒకవేళ ఆ పాపకార్యం చేస్తే ఒక పాపమే వ్రాయబడుతుంది. (తర్‌’గీబ్‌, బు’ఖారీ)

ఈ ‘హదీసు’ ద్వారా తెలిసినది ఏమిటంటే, మంచి పని గురించి సంకల్పం చేసుకొని చేయలేకపోతే ఒక పుణ్యం వ్రాయబడుతుంది. ఒకవేళ చేస్తే 700 పుణ్యకార్యాల వరకు లభిస్తాయి. ఉదాహరణకు రాత్రి చివరి జాములో తహజ్జుద్‌ చదువుతానని సంకల్పించుకొని పడుకొని మేల్కొనలేక పోయినప్పటికీ తహజ్జుద్‌ పుణ్యం లభిస్తుంది.

ప్రవక్త (స) ప్రవచనం: ”ఒక వ్యక్తి రాత్రి మేల్కొని నమా’జు చదువుతానని సంకల్పం చేసుకొని నిద్రపోయి, రాత్రి మేల్కొన లేకపోయాడు. అయితే సంకల్పం చేసినందువల్ల ఒక పుణ్యం వ్రాయబడు తుంది. నిద్ర అతని ప్రభువు తరఫున అతనిపై దానం చేయబడింది.” (ఇబ్నె మాజహ్)

ఇదంతా సంకల్ప చిత్తశుద్ధి వల్ల జరిగింది. తహజ్జుద్‌ పుణ్యం కూడా వ్రాయబడింది, రాత్రంతా నిద్ర కూడా లభించింది. ఒకవేళ అతను నిద్రలో మరణిస్తే తహజ్జుద్‌ చదివే వాడుగా పరిగణించబడుతాడు. ప్రవక్త (స) ప్రవచనం: ”ప్రజలు తమ సంకల్పాల ద్వారానే తీర్పు దినం నాడు లేపబడతారు.”

అనస్‌ బిన్‌ మాలిక్‌ (ర) కథనం: ”మేము ప్రవక్త (స) వెంట తబూక్‌ యుద్ధం నుండి తిరిగివస్తున్నాము. అప్పుడు ప్రవక్త (స): ”మదీనాలో కొంతమంది ఉండిపోయారు. కాని, ప్రతి విషయంలో వారు మీతో ఉన్నారు.” అని అన్నారు. దానికి మేము): ‘అదెలా? దైవప్రవక్తా!’ అని అడిగాము. దానికి ప్రవక్త (స): ‘సంకల్పం మాత్రం మీతోపాటు ఉందామని, ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఉండిపోయారు. అందువల్ల చిత్తశుద్ధితో కూడిన సంకల్పం వల్ల మీలో ఒకరుగా పరిగణింపబడతారు.’ అని అన్నారు. (బు’ఖారీ).

అంటే చిత్తశుద్ధితో కూడిన సంకల్పం వల్ల మానవుడు ఎంతో ఉన్నతమైన స్థానాలు పొందగలడని ఈ ‘హదీసు’ ద్వారా తెలిసింది.

ప్రవక్త (స) ప్రవచనం: ”ఇహలోకంలో నాలుగు రకాల వ్యక్తు లున్నారు.

1. ధనం మరియు జ్ఞానం ప్రసాదించబడిన వ్యక్తి. అతడు దైవభీతి కలిగి ఉంటాడు, బంధువుల హక్కులను నెరవేర్చుతాడు. ఇంకా ఆ ధనంలో అల్లాహ్‌ (త) హక్కు ఉందని గుర్తిస్తాడు. ఇంకా అతడు ఉభయ లోకాల హక్కులను నెరవేర్చుతాడు. ఇటువంటి వారు చాలా గొప్ప స్థానాలు పొందే వారు.

2వ వ్యక్తి అల్లాహ్‌ జ్ఞానం ప్రసాదించబడినవాడు. అతనికి ధనం ఇవ్వబడ లేదు. అతడు సంకల్పశుద్ధి గలవాడు. అతడు: ‘ఒకవేళ నా దగ్గర కూడా ధనం ఉంటే, నేను కూడా దైవమార్గంలో ధనం ఖర్చు చేసేవాడిని, ఫలానా వ్యక్తి దైవమార్గంలో ఖర్చు పెట్టినట్టు.’ అని అంటాడు. సంకల్పశుద్ధి కలిగి ఉండటం వల్ల ఇతడూ, మొదటి వ్యక్తి పుణ్యంలో ఇద్దరూ సమానులే.

ఇక 3వ వ్యక్తికి అల్లాహ్‌(త) ధనం ప్రసాదించాడు, జ్ఞానం ప్రసాదించాడు. అతడు తనధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. అల్లాహ్‌(త)కు భయ పడటం గానీ; హక్కుగల వారికి ఇవ్వటం గానీ చేయడు; బంధువులకు సహాయం చేయడు. ఇంకా అందులో అల్లాహ్‌ (త) హక్కు ఉందని కూడా గుర్తించడు. ఎటు వంటి భయం లేకుండా అధర్మంగా ఖర్చుచేస్తాడు. ఇతడు అందరికంటే నీచ తరగతికి చెందినవాడు.

4వ వ్యక్తికి అల్లాహ్‌ (త) ధనమూ, జ్ఞానమూ రెండూ ఇవ్వ లేదు. అతడు, ‘ఒకవేళ నా దగ్గర ధనం ఉంటే ఫలానా వ్యక్తిలా నేనూ డబ్బు ఖర్చుచేసేవాడిని,’ అని అంటాడు. తమ నీచ సంకల్పం వల్ల వీరిద్దరూ పాపంలో సమానులే. (తిర్మిజి’)

ఒక విషయంలో ఎన్ని సంకల్పాలు ఉంటే అంత అధికంగా పుణ్యం లభిస్తుంది. ఒకవేళ తన పేద బంధువుకు అన్నం పెట్టేవాడు; పేదవాడని అన్నం పెడితే ఒకపుణ్యం, పేదవాడు బంధువు అనే సంకల్పంతో అన్నంపెడితే రెండు పుణ్యాలు లభిస్తాయి. ప్రతి ఆరాధనలో ఈ విషయాన్ని గుర్తుంచు కోవాలి. సంకల్పం ఆచరణ కంటే ప్రాధాన్యత గలది.

వలస వెళ్ళటానికి గల ప్రత్యేకతలు: హిజ్రత్‌ అంటే వదలటం, విడిచి పెట్టటం అని అర్థం. ధార్మిక భాషలో ముస్లిములు తమ ప్రాంతంలో ఇస్లామీయ ఆదేశాలను అనుసరించలేని పరిస్థితి వచ్చినప్పుడు, అక్కడినుండి మరో ప్రాంతానికి వెళ్ళిపోవటాన్ని వలసపోవటం (హిజ్రత్‌) అంటారు. ఇది రెండు రకాలు. 1. దారుల్‌ ‘ఖౌఫ్‌ నుండి దారుల్‌ అమన్‌ వైపు వలసపోవటం. 2. దారుల్‌ ‘హర్బ్‌ నుండి దారుస్సలామ్‌ వైపు వలస వెళ్ళటం. ప్రారంభంలో ఇది తప్పని సరిగా ఉండేది. మక్కహ్ విజయం తర్వాత ఇది రద్దయిపోయింది. ప్రవక్త (స) ప్రవచనం: ”మక్కహ్ విజయం తర్వాత వలస వెళ్ళటం లేదు, కాని ధర్మ పోరాటం, దాని సంకల్పం తీర్పుదినం వరకు ఉంటుంది.” మరో ‘హదీసు’లో ఇలా ఉంది: ”హిజ్రత్‌ తీర్పుదినం వరకు అంతం కాదు. అంటే ఇటువంటి పరిస్థితి ఏర్పడినపుడు, ఎక్కడినుండైనా వలస వెళ్ళ వచ్చు. అదేవిధంగా తన ధార్మిక సంస్కరణ కోసం ఎప్పుడు, ఎక్కడ నుండైనా వలస వెళ్ళ వచ్చు. ప్రవక్త (స): ”హిజ్రత్‌ లేకపోతే, నేనూ ఒక అ’న్సారీ వ్యక్తిలా ఉండే వాడ్ని.” అని ప్రవచించారు. దీన్నిబట్టి ముహాజిరీన్లు అ’న్సార్లకన్నా గొప్పవారని తెలుస్తుంది. మరి కొందరు దీన్నిబట్టి అ’న్సార్ల గొప్పతనం వెళ్ళడౌతుందని తెలుస్తుంది. ప్రవక్త (స) ప్రవచనం: ”ఒక హిజ్రత్‌ మదీనహ్ వైపు జరిగింది. దీని తర్వాత మరో హిజ్రత్‌ చివరి కాలంలో సిరియావైపు జరుగుతుంది. అప్పుడు సిరియాను అంటిపెట్టుకొని ఉన్నవారే అందరికంటే ఉన్నతులుగా ఉంటారు. అల్లాహ్‌ (త) మరియు ప్రవక్త కోసం స్వదేశం వదలి మరో ప్రాంతానికి తరలి వెళ్ళడం చాలా గొప్ప కార్యం. ఖుర్ఆన్‌, ‘హదీసు’ల్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది.

అల్లాహ్‌ ఆదేశం:

1. ”మరియు అల్లాహ్‌(త) మార్గంలో వలస పోయే వాడు భూమిలో కావలసినంత స్థలాన్ని, సౌకర్యాలను పొందుతాడు. మరియు ఎవడు తన ఇంటిని వదలి, అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త కొరకు, వలసపోవటానికి బయలు దేరిన తరువాత, అతనికి చావువస్తే! నిశ్చయంగా, అతని ప్రతిఫలం అల్లాహ్‌ వద్ద స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.” (సూ. అన్నిసా, 4:100)

2. ”విశ్వసించి, అల్లాహ్‌ మార్గంలో వలసపోయిన వారికీ మరియు తమ ధనసంపత్తులను, ప్రాణాలను వినియో గించి పోరాడిన వారికీ, అల్లాహ్‌ దగ్గర అత్యున్నత స్థానముంది. మరియు అలాంటి వారే సాఫల్యం (విజయం) పొందేవారు. వారిప్రభువు వారికి తనతరఫునుండి కారుణ్యాన్ని మరియు ప్రసన్నతను మరియు శాశ్వత సౌఖ్యాలుగల స్వర్గవనాల శుభవార్తను ఇస్తున్నాడు.” (సూ. అత్తౌబహ్, 9:20- 21).

2 – 1 (1/9)
عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: بَيْنَمَا نَحْنُ عَنْدَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم ذَاتَ يَوْمٍ إِذْ طَلَعَ عَلَيْنَا رَجُلٌ شَدِيْدٌ بَيَاضِ الثِّيَابِ شَدِيْدُ سَوَادِ الشَّعْرِ لَا يُرَىَ عَلَيْهِ أَثَرُ الَّسفرِ وَلَا يَعْرِفُهُ مِنَّا أَحَدٌ حَتَّى جَلَسَ إِلَى النَّبِّيِ صلى الله عليه وسلم. فَأَسْنَدَ رُكْبَتَيْهِ إِلَى رَكْبَتَيْهِ وَوَضَعَ كَفَّيْهِ عَلَى فَخِذَيْهِ وَقَالَ: يَا مُحَمَّدُ أَخْبِرْنِيْ عَنْ الِإسْلَامِ. قَالَ: “اَلْإِسْلَامُ: أَنْ تَشْهَدَ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُوْلُ الله، وَتُقِيْمَ الصَّلَاةَ، وَتُؤتِيَ الزَّكَاةَ، وَتَصُوْمُ رَمَضَانَ، وَتَحُجَ الْبَيْتَ إِنِ اسْتَطَعْتَ إِلَيْهِ سَبِيْلًا”. قَالَ: صَدَقْتَ. فَعَجِبْنَا لَهُ يَسْأَلُهُ وَيُصَدِّقْهُ! قَالَ: فَأَخْبِرْنِيْ عَنْ الْإِيْمَانِ. قَالَ: “أَنْ تُؤْمِنَ بِاللهِ، وَمَلَائِكَتِهِ، وَكُتُبِهِ، وَرُسُلِهِ، وَالْيَوْمِ الْآخِرِ، وَتُؤْمِنَ بِالْقَدْرِ خَيْرِهِ وَشَرَّهِ”. قَالَ: صَدَقْتَ. قَالَ: فَأَخْبِرْنِيْ عَنْ الْإِحْسَانِ. قَالَ: “أَنْ تَعْبُدَ اللهَ كَأَنَّكَ تَرَاهُ، فَإِنْ لَمْ تَكُنْ تَرَاهُ فَإِنَّهُ يَرَاكَ”. قَالَ: فَأَخْبِرْنِيْ عَنْ السَّاعَةِ. قَالَ: “مَا الْمَسْؤُوْلُ عَنْهَا بِأَعْلَمَ مِنَ السَّائِلِ”. قَالَ: فَأَخْبِرْنِيْ عَنْ أَمَارَاتِهَا. قَالَ: “أَنْ تَلِدَ الْأَمَةْ رَبَّتَهَا، وَأَنْ تَرَى الْحُفَاةَ العُرَاةَ العَالَةَ رَعَاءَ الشَّاءِ يَتَطَاوَلُوْنَ فِيْ الْبُنْيَانِ”. قَالَ: ثُمَّ انْطَلَقَ، فَلَبِثْتُ مَلِياً، ثُمَّ قَالَ لِيْ: “يَا عُمَرُ! أَتَدْرِيْ مَنِ السَّائِلِ؟” قُلْتُ: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: “فَإِنَّهُ جِبْرِيْلٌ أَتَاكُمْ يُعَلِّمُكُمْ دِيْنَكُمْ”. رَوَاهُ مُسْلِمٌ .

2 . (1) [1/9-దృఢం]
ఉమర్‌ (ర) కథనం: ”ఒకరోజు మేము ప్రవక్త (స) వద్ద కూర్చొని ఉన్నాము. అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చాడు. అతని దుస్తులు పరిశుభ్రంగా ఉన్నాయి. అతని తల వెంట్రుకలు నల్లగా ఉన్నాయి. ప్రయాణ చిహ్నాలేవీ కనిపించడం లేదు. అంతేకాదు మాలో ఎవరితోనూ పరిచయం కూడా లేదు. అతడు తిన్నగా వచ్చి ప్రవక్త (స) మోకాళ్ళకు తన మోకాళ్ళు కలిపి కూర్చున్నాడు. ఇంకా తన రెండు చేతులను ప్రవక్త (స) తొడలపై ఉంచి: ‘ఓ ముహమ్మద్‌! ఇస్లామ్‌ అంటే ఏమిటో తెలుపండి.’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స): ‘1. నీవు ఇలా సాక్ష్య మివ్వాలి, అల్లాహ్‌ తప్ప ఆరాధ్యులెవరూ లేరు, ము’హమ్మద్‌ అల్లాహ్‌ ప్రవక్త. 2. నమా’జును స్థాపించాలి, 3. ‘జకాత్‌ చెల్లించాలి, 4. రమ’దాన్ ఉపవాసా (రో’జహ్)లు పాటించాలి, 5. స్తోమత ఉంటే ‘హజ్జ్ యాత్ర చేయాలి.’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి: ‘సత్యం పలికారు.’ అని అన్నాడు. మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రశ్నిస్తున్నాడు, విన్న తరువాత ధృవీక రిస్తున్నాడు. (అతనికి తెలిసి ఉన్నట్లు వ్యవహ రిస్తున్నాడు) ఆ తరువాత మళ్ళీ ప్రవక్త (స)ను: ‘ఈమాన్‌ (విశ్వాసం) గురించి తెలుపండి.’ అని అడిగాడు. దానికి ప్రవక్త (స): 1. ‘అల్లాహ్‌ను, 2. దైవ దూతలను, 3. దైవగ్రంథాలను, 4. దైవప్రవక్తలను, 5. తీర్పుదినాన్ని, ఇంకా 6. మంచి, చెడు పర్య వసానం (విధివ్రాత / నియతి / భవితవ్యం)ను విశ్వ సించాలి.’ అని అన్నారు. ఆ వ్యక్తి: ‘సత్యం పలికారు.’ అని అన్నాడు. ఆ తరువాత: ‘ఇహ్‌సాన్‌ (ఇ’ఖ్లాస్) అంటే ఏమిటి.’ అని అడిగాడు. దానికి ప్రవక్త (స): ‘నీవు అల్లాహ్‌(త) ను చూస్తున్నట్టు ఆరాధించాలి. ఒకవేళ నీవు ఆయన్ను చూడలేకపోతే ఆయన నిన్ను చూస్తున్నాడని భావించాలి.’ అని అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ: ‘తీర్పుదినం గురించి చెప్పండి, అది ఎప్పుడు సంభవించనున్నది?’ అని అడిగాడు. దానికి ప్రవక్త (స): ‘అడిగిన వ్యక్తి కంటే అడగ బడిన వ్యక్తి ఏమాత్రం అధికంగా ఎరుగడు.’ అని అన్నారు. అంటే నీలాగే నాకూ తెలియదు అని అన్నారు. ‘పునరుత్థానం ఎప్పుడు సంభవించ నున్నదనే విషయం కేవలం అల్లాహ్ (త)కు మాత్రమే తెలుసు’ అని అన్నారు, అప్పుడు ఆవ్యక్తి, ‘పునరుత్థానపు, సూచనలను చూపండి,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘బానిసరాలు యజమానిని కంటుంది. సంతానం తల్లిదండ్రులకు అవిధేయత చూపుతారు. చెప్పులు కూడా లేని దరిద్రులు, మేకల కాపరులు ఎత్తైన భవనాల్లో గర్వాహంకారాలు ప్రదర్శిస్తారు’ అని అన్నారు. ‘ఉమర్ అన్నారు, ‘ఆ తరువాత, అతడు వెళ్ళి పోయాడు. నేను ఎన్నో రోజులు ఆలోచనలో పడి ఉన్నాను. తరువాత ప్రవక్త (స) అన్నారు, ” ‘ఉమర్ నీకు తెలుసా ఆవ్యక్తి ఎవరు?” నేనన్నాను, ”అల్లాహ్, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు.” ప్రవక్త (స) అన్నారు, ‘అతను జిబ్రీల్ (అ). మీకు, మీ ధర్మము, బోధించడానికి వచ్చారు.’ )

వివరణ-2: ఈ ‘హదీసు’ హదీసె’ జిబ్రీల్‌ అనే పేరుతో ఖ్యాతి గడించింది. ఎందుకంటే ఆ అడిగిన వ్యక్తి జిబ్రీల్‌ (అ). అతడు ధార్మిక విషయాలను ప్రజలకు తెలియజేయడానికి మానవ రూపంలో వచ్చి, అడిగారు. దీనివల్ల ఇస్లామీయ ఆదేశాలను గురించి అడిగే పద్ధతి కూడా తెలిసిపోయింది. ఈ ‘హదీసు’లో ఇస్లామ్‌, ఈమాన్‌, ఇ’హ్‌సాన్‌ (ఇ’ఖ్లాస్), పునరుత్థాన సూచనలు, నమా’జు, ‘జకాత్‌, ఉపవాసం, ‘హజ్జ్ ల గురించి వివరించడం జరిగింది. అంటే ఈమాన్‌, ఇస్లామ్‌ వంటి ప్రాథమిక అంశాలు ఇందులో ఉన్నాయి. దీన్ని గురించి తెలుసుకునే ముందు ఈ విషయాలను గురించి తెలుసు కోండి. 1. ధార్మిక విద్య కోసం ప్రయాణం చేయాలి. 2. విద్యార్థి హృదయం, శరీరం, దుస్తులు శుభ్రంగా ఉంచుకోవాలి. 3. చిన్న వయస్సు, యవ్వనం లోనే ధార్మిక విద్య నేర్చుకోవాలి, ఈ విషయం నల్లని గడ్డం, నల్లని వెంట్రుకల వల్ల సూచించబడింది. 4. ఇబ్నె హిబ్బాన్ లో లహ్య అనే పదం ఉంది. ఇది నల్లని గడ్డాన్ని సూచిస్తుంది. 5. విద్యార్థులు గడ్డం పెంచుకోవాలి. 6. విద్యార్థి తన ఉపాధ్యాయుని ముందు వినయ విధేయతలతో కూర్చోవాలి, మోకాళ్ళు ముడుచుకొని, నమా’జులో కూర్చున్నట్లు. 7. తన చేతులను తొడలపై పెట్టుకోవాలి. 8. గురువు వస్తే సలాం చేయాలి.

ఇస్లామ్‌: ‘ఇస్లామ్‌ అంటే విధేయత మరియు ఆజ్ఞాపాలన,’ అని అర్థం. ధార్మిక భాషలో అల్లాహ్‌ (త) మరియు ఆయన ప్రవక్త (స) ఆదేశాలను శిరసావహించడం, వాటిని అనుకరించడం. అంటే అల్లాహ్‌(త) మరియు ఆయన ప్రవక్త (స) ఆదేశాల ప్రకారం జీవించడం. ప్రవక్తలందరూ దీన్ని గురించే హితబోధ చేశారు. ఒకవేళ ఎవరైనా ఇస్లామ్‌ను వదలి ఇతర మార్గాలను అనుసరిస్తే, అది ఎంత మాత్రం స్వీకరించబడదు. ఇంకా అటువంటి వ్యక్తి పరలోకంలో నష్టానికి గురవుతాడు. తన్నుతాను దైవానికి వశపరచిన వాడికంటే ఉత్తముడు ఎవరు? అంటే ఇటువంటి వ్యక్తే ఉత్తముడు. అదేవిధంగా మీ ఆరాధ్యుడు ఒకే ఒక్కడు. ప్రవక్తలందరి ధర్మం ఇస్లామ్‌ మాత్రమే. ఇందులోనే ఉభయలోకాల సాఫల్యం ఉంది. అందువల్లే అన్నిటికంటే ముందు ఇస్లామ్‌ గురించి అడిగారు. ప్రవక్త (స) ఇస్లామ్‌, దైవ విధేయత అంటే ఆయన్ను ఒక్కడిగా భావించాలి. ఆయన తప్ప ఆరాధ్యులెవరూ లేరని, ము’హమ్మద్‌ (స) ఆయన ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వాలి. నమా’జును స్థాపించాలి. ‘జకాత్‌ చెల్లించాలి. రమ’దాన్‌ ఉపవాసాలు పాటించాలి. స్తోమత ఉంటే బైతుల్లాహ్‌ ‘హజ్జ్ చేయాలి. ఈ ఐదింటిని కలిపి ఇస్లామ్‌ అంటారు. అంటే ఇస్లామ్‌ ఐదు విషయాలపై ఆధారపడి ఉంది. ఇన్‌షా అల్లాహ్‌ వీటిని వివరించడం జరుగుతుంది. ‘ఉమర్‌ (ర), ”ఆ వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు ఇంకా ధృవీకరిస్తున్నాడు కూడా. మాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే ప్రశ్నించడం వల్ల అతనికి తెలియదని అనుకున్నాము. కాని ధృవీకరించడం వల్ల అతనికి తెలుసని ఆశ్చర్య పడ్డాము,” అని అన్నారు. అంటే జిబ్రీల్‌ (అ) ప్రజలకు నేర్పించడానికి వచ్చి, ప్రశ్నించడం జరిగింది. ఇంకా ఈ సంఘటన ప్రవక్త (స) చివరి కాలంలో జరిగింది. ఇది ఫత్‌’హుల్‌ బారీ, ఐనీ మొదలైన వాటిలో ఉంది.

ఈమాన్‌: ఆ తరువాత ఆ వ్యక్తి ఈమాన్‌ గురించి అడిగారు. అప్పుడు ప్రవక్త (స) ఈమాన్‌ అంటే 1. అల్లాహ్‌ను, 2. దైవ దూతలను, 3. దైవగ్రంథాలను, 4. దైవప్రవక్తలను, 5. తీర్పు దినాన్ని, మరియు 6. విధివ్రాత (తఖదీర్)ను విశ్వసించటం అని చెప్పారు.

దైవదూతలు: దైవదూతలు అల్లాహ్‌ (త) దాసులు. వీరిని కాంతితో సృష్టించడం జరిగింది. వీరు స్త్రీలు కారు, పురుషులు కారు. వీరు తినరు, త్రాగరు. అయితే తాము కోరిన రూపం పొందగలరు. మనం వారిని చూడలేము. కాని వారు మమ్మల్ని చూడగలరు. వారు అల్లాహ్‌కు ఏమాత్రం అవిధేయత చూపరు. పాపకార్యాలు చేయరు. అల్లాహ్‌ ఇచ్చిన విధులను నిర్వర్తిస్తూ ఉంటారు. వీరు అసంఖ్యాకంగా ఉన్నారు. వీరి సంఖ్య అల్లాహ్‌(త)కే తెలుసు. దైవదూతలు అల్లాహ్‌ (త) ఆదేశంతో ప్రవక్తల వద్దకు దైవవాణిని తీసుకొని వస్తారు. వీరిని విశ్వసించటం కూడా తప్పనిసరి.

దైవగ్రంథాలను కూడా అదేవిధంగా విశ్వసించాలి. అల్లాహ్‌ (త) మానవుల మార్గదర్శకత్వం కోసం తన ప్రవక్తలపై దైవగ్రంథాలను అవతరింపజేశాడు. అవి పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. కొన్ని గ్రంథాలు ప్రఖ్యాతి గాంచాయి. అవి ఖుర్‌ఆన్‌, ఇంజీల్‌, ‘జబూర్, తౌరాత్‌.

ప్రవక్తలందరిపై విశ్వాసముంచడం విధి (ఫ’ర్ద్): ప్రవక్త లందరూ అల్లాహ్‌(త) ప్రియదాసులు. అల్లాహ్‌(త) వారిని తన దాసులవైపు పంపాడు. అనేకమంది ప్రవక్తలు గతించారు. కొందరిని గురించి ఖుర్ఆన్‌లో ప్రస్తావించ బడింది. కొందరిని గురించి ప్రస్తావించబడ లేదు. అందరి కంటే మొదటి ప్రవక్త ఆదమ్‌ (అ), అందరికంటే చిట్టచివరి ప్రవక్త ము’హమ్మద్‌ (స). వీరి తర్వాత మరే ప్రవక్తా రారు. ఎందుకంటే మన ప్రవక్త చిట్ట చివరి (‘ఖాతం) ప్రవక్త, అంతిమ ప్రవక్త.

తీర్పుదినం: తీర్పు దినాన్ని విశ్వసించాలి. ఆ దినం తప్పక రానున్నది. దాన్నే మనం పునరుత్థాన దినం అంటాము. ఆ రోజు ఈ ప్రపంచమంతా నాశనం అవు తుంది. మానవు లందరూ మరణించి, మళ్ళీ లేప బడతారు. తీర్పు మైదానంలో అల్లాహ్‌ (త) సన్నిధిలో హాజరౌతారు. అప్పుడు పుణ్యాత్ములు స్వర్గంలో, పాపాత్ములు నరకంలో ప్రవేశిస్తారు. స్వర్గం, నరకం, విచారణ అన్నీ సత్యం.

విధివ్రాత / భవితవ్యం/ నియతి (తఖ్దీర్): అంటే అంచనా వేయడం. అంటే జననం, మరణం, సంపాదన, పాపాలు, పుణ్యాలు, మంచీ, చెడు, కష్టాలు, నష్టాలు మొదలైనవి అన్నీ అంటే, జరిగింది, జరుగుతున్నది జరుగబోయేదీ అన్నీ అల్లాహు (త)కు తెలుసు. అవన్నీ మూల గ్రంథంలో వ్రాసి పెట్టబడ్డాయి. అంతా దాని ప్రకారమే నడుస్తుంది. మంచి, చెడు విధివ్రాత పట్ల దృఢ విశ్వాసం కలిగి ఉండడం కూడా విధి.
ఈ ‘హదీసు’లో విశ్వాసం అంటే ఏమిటీ? అనే దాని ఉత్త రంలో ఈ విషయాలను ప్రస్తావించడం జరిగింది. ఖుర్‌ ఆన్‌లో కూడా వీటిగురించి ప్రస్తావించడంజరిగింది. ఉదా:”ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు. మరియు (అదేవిధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్‌ (త)ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వ సించారు…” (సూ. అల్‌ బఖరహ్‌, 2:285)

”వినయ విధేయత (ధర్మనిష్ఠాపరత్వం) అంటే, అల్లాహ్‌ను, అంతిమదినాన్ని, దైవదూతలను, ప్రతి దివ్య గ్రంథాన్ని మరియు ప్రవక్తలను హృదయ పూర్వకంగా విశ్వసించడం…;” (సూ. అల్‌ బఖరహ్‌, 2:177)

ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ఇస్లామ్‌ మరియు ఈమాన్‌లలో తేడా ఉంది. అబ్దుల్‌ ఖైస్‌ బృందపు ‘హదీసు’లో ప్రవక్త (స) ఇస్లామ్‌ గురించి ఆ విషయాలనే ప్రస్తావించారు, ఏ విషయాలైతే ఈ ‘హదీసు’ లో ఈమాన్ గురించి ప్రస్తావించబడ్డాయో. ఈ రెండింటిని కలిపి విచారిస్తే సంపూర్ణ ఇస్లాం, సంపూర్ణ ఈమాన్ రెండూ ఒకటే. అందుకే ఈమాన్లో, ఇస్లాం విషయాలు వివరించ బడ్డాయి. (నిజం అల్లాహ్ కు తెలుసు)

ఇహ్‌’సాన్‌ (ఇ’ఖ్లాస్): ఆ వచ్చిన వ్యక్తి ఇస్లామ్‌, ఈమాన్‌ల తర్వాత 3 వ సారి ఇహ్‌సాన్‌ గురించి ప్రశ్నించాడు. ఇహ్‌సాన్‌ అంటే సత్కార్యం చేయటం, ఉపకారం చేయటం. అయితే ధార్మికంగా ప్రవక్త (స) ”మనం దైవాన్ని చూస్తున్నట్టు ఆరాధించాలని ఉపదేశించారు. దీనికి మరోపేరు ఇ’ఖ్లాస్‌. అంటే భయభక్తులతో దైవాన్ని ఆరాధించాలి. ఎందుకంటే ఆరాధన లన్నిటిలో ఇ’ఖ్లాస్‌ తప్పనిసరి. చిత్తశుద్ధి లేకుండా ఏ సత్కార్యం స్వీకరించబడదు. అంటే ఆరాధనల్లో, ‘నేను దైవాన్ని చూస్తున్నాను,’ అని భావించాలి. చిత్తశుద్ధి ఉన్నప్పుడే మనం అలా భావించగలం. ఇది ఇఖ్లాస్‌ మొదటి స్థానం. ఒక వేళ అది సాధ్యం కాకుంటే, అల్లాహ్ (త) మిమ్మల్ని చూస్తున్నాడని భావించండి. ఎందుకంటే యజమాని చూస్తున్నాడని భావించినప్పుడే, సేవకుడు పని మంచిగా చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇది ఇఖ్లాస్‌ రెండవ స్థానం.
తీర్పుదినం ( అంతిమ ఘడియ): ఇస్లామ్‌, ఈమాన్‌, ఇ’హ్‌సాన్‌ల గురించి ప్రశ్నించిన తర్వాత ఆ వ్యక్తి తీర్పుదినం గురించి ప్రశ్నించారు తీర్పుదినం ఎప్పుడు వస్తుందని అడిగాడు. దానికి ప్రవక్త (స), ‘ప్రశ్నించబడిన వ్యక్తి ప్రశ్నించే వ్యక్తికంటే ఎక్కువేమీ ఎరుగడు,’ అని అన్నారు. అంటే తీర్పుదినం గురించి ఎవ్వరికీ తెలియ దని సూచించారు. ఏ విధంగానైతే ఈ ఐదు విషయాలు గురించి తనకు తప్ప మరెవ్వరికీ తెలియదని అల్లాహు (త) ఖర్ఆన్ లో పేర్కొన్నాడో! 1. తీర్పుదినం ఎప్పుడు వస్తుంది? 2. వర్షం ఎప్పుడు పడుతుంది? 3. గర్భంలోని బిడ్డ సంగతి ఏంటి? 4. భవిష్యత్తులో ఏం జరుగుతుంది? 5. ఎక్కడ మరణిస్తాడు?

పునరుత్థాన సూచనలు: ఆ తరువాత ఆ వ్యక్తి ప్రళయ సూచనలను గురించి ప్రశ్నించాడు. దానికి ప్రవక్త(స) అనేక సూచనలు ఉన్నాయని అయితే ఈ రెండు సూచనలు ముఖ్యమైనవని అన్నారు. 1. బానిసరాలు తన యజ మానికి జననమిస్తుంది. అంటే యజమానులు తమ బానిసరాళ్ళతో సంభోగిస్తారు. దానివల్ల యజమాని బిడ్డకు తల్లి అవుతుంది. 2. అజ్ఞానులు, మేకల కాప రులు ఎత్తైన భవ నాలు నిర్మిస్తారు. వీరు చాలా ధన వంతులవుతారు. ధనాన్ని భవన నిర్మాణాల్లో ఖర్చు పెట్టి గర్వాహంకారాలు ప్రదర్శిస్తారు. ఒకరి పట్ల ఇంకొకరు గర్వం ప్రదర్శిస్తారు. అంటే అనర్హులు పాలకులుగా వర్థిల్లుతారు. ప్రవక్త (స) ప్రవచనం: అనర్హుల చేతిలో పాలనా పగ్గాలు వస్తే, ప్రళయాన్ని గురించి వేచి ఉండండి. ఈ రెండు సూచనలు కనబడుతున్నాయి. ఇవేకాక మరి కొన్ని చిన్నచిన్న సూచనలు కూడా అనేకం ఉన్నాయి.

‘ఉమర్‌ (ర) కథనం: ”ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. నేను చాలాసేపు వరకు నిలబడి చూస్తూ ఉన్నాను. మూడు రోజుల తరువాత, ప్రవక్త (స), ‘ఉమర్‌! ఆ వచ్చిన వ్యక్తి ఎవరో నీకు తెలుసా?’ అని అడిగారు. దానికి నేను ‘అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకే తెలియాలి’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స) ‘ఆ వచ్చిన వ్యక్తి జిబ్రీల్‌(అ) ధార్మిక విషయాలను మీకు నేర్పించడానికి వచ్చారు అని అన్నారు. (బుఖారీ).(ముస్లిం)

3- [ 2 ] ( متفق عليه ) (1/10)
وَرَوَاهُ أَبُوْ هُرَيْرَةَ مَعَ اخْتِلَافٍ، وَفِيْهِ: “وَإِذَا رَأَيْتَ الْحُفَاةَ العُرَاةَ الصُّمَّ الْبُكْمَ مُلُوْكَ الْأَرْضِ فِيْ خَمْسٍ لَا يَعْلَمُهُنَّ إِلّا اللهُ. ثُمَّ قَرَأَ: ]إِنّ اللهَ عَنْدَهُ عِلْمُ السَّاعَةِ وَيُنَزِّلُ الْغَيْثَ؛ 31: 34] الآيَة.
(2) [1/10-ఏకీభవితం]
పదాల మార్పులతో అబూ హురైరహ్‌ (ర) కూడా దీన్ని ఉల్లేఖించారు. అయితే ఇందులో ఈ విధంగా అధికంగా ఉంది: ”నగ్న పాదాలు, నగ్న శరీరాలు గలవాళ్ళు, మూగ వారిని, చెవిటివారిని పాలకులుగా నీవు చూస్తావు. అప్పుడు పునరుత్థానం రాబోతున్నదని నిర్థారించుకో. అదేవిధంగా పునరుత్థానపు జ్ఞానం కూడా ఈ ఐదు విషయాల వలే అల్లాహ్‌ (త)కు తప్ప మరెవ్వరికీ తెలియదు. వాటిని గురించి ఈ ఆయతులో ఉంది: “నిశ్చయంగా, ఆ (అంతిమ) ఘడియ జ్ఞానం, కేవలం అల్లాహ్‌(త)కు మాత్రమే ఉంది. మరియు ఆయనే వర్షం కురిపించేవాడు మరియు గర్భాలలో ఉన్నదాని విషయం తెలిసిన వాడు. మరియు తాను రేపు ఏమి సంపాదిస్తాడో, ఏ మానవుడు కూడా ఎరుగడు. మరియు ఏ మాన వుడు కూడా తాను ఏభూభాగంలో మరణిస్తాడో కూడా ఎరుగడు. నిశ్చయంగా, అల్లాహ్‌ (త) మాత్రమే సర్వజ్ఞుడు, సమస్తం తెలిసిన వాడు (ఎరిగిన వాడు).” (సూ. లుఖ్మాన్, 31:34). (బు’ఖారీ, ముస్లిమ్)

4 – [ 3 ] ( متفق عليه ) (1/10)
وعَنْ ابْنِ عُمُرَ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “بُنِيَ الْإِسْلَامُ عَلىَ خَمسٍ: شَهَادَةُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ، وَإِقَامِ الصَّلَاةِ ، وَإِيْتَاءِ الزَّكَاةِ ، وَالْحَجِّ، وَصَوْمِ رَمَضَانَ”. متفق عليه.
(3) [1/10-ఏకీభవితం]
ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ఇస్లామ్‌ ఐదు విషయాలపై ఆధారపడి ఉంది: 1. అల్లాహ్‌ (త) తప్ప ఆరాధ్యులెవరూ లేరని, ము’హ మ్మద్‌ (స) అల్లాహ్‌ (త) ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వటం, 2. నమా’జు స్థాపించటం, 3. ‘జకాత్‌ చెల్లించటం, 4. ఉపవాసాలు (రో’జహ్ లు) పాటించటం, 5. ‘హజ్జ్ చేయటం. )

వివరణ-4: ఈ ‘హదీసు’ ఉల్లేఖనకర్త, ‘అబ్దుల్లాహ్‌ బిన్ ‘ఉమర్‌ (ర). అతడు ప్రఖ్యాత ప్రవక్త (స) సహచరులు. మక్కహ్ లో ఇస్లామ్‌ స్వీకరించారు. తన తండ్రి ‘ఉమర్‌ (ర)తో మదీనహ్ కు హిజ్రత్‌ చేశారు. కందక యుద్ధం, బై’అతుర్రి’ద్వాన్‌, ‘ఖైబర్‌, మక్కహ్ విజయం, ‘హునైన్‌, ‘తాయిఫ్‌, తబూక్‌ మొదలైన యుద్ధాల్లోపాల్గొన్నారు. ఖుర్‌ ఆన్, ‘హదీసు’ల గొప్ప పండితులు. దైవభక్తులు, 740 క్రీస్తు శకంలో 84 సంవత్సరాల వయస్సులో మరణిం చారు. ముహాజిరీన్ల స్మశానంలో ఖననం చేయబడ్డారు.

ఈ ‘హదీసు’లో ఇస్లామ్‌ను ఒక ఇంటితో పోల్చడం జరిగింది. అంటే అది ఐదు స్తంభాలపై ఆధారపడి ఉంది. ఆ స్తంభాలకు చాలా ప్రాధాన్యత ఉంది. అవి లేకుంటే ఆ ఇల్లు నాశనం అవుతుంది. ఇస్లామ్‌ యొక్క ఈ ఐదు ముఖ్య విధులు ఐదు స్తంభాల వంటివి.
(బు’ఖారీ, ముస్లిమ్‌)

5 – [ 4 ] ( متفق عليه ) (1/10)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْإِيْمَانُ بِضْعٌ وَسَبْعُوْنَ شُعْبَةً، فَأَفْضَلُهَا: قُوْلٌ لَا إِلَهَ إِلَّا اللهُ، وَأَدْنَاهَا: إِمَاطَةُ الْأَذَىَ عَنْ الطَّرِيْقِ، وَالْحَيَاةِ شُعْبَةٌ مِّنَالْإِيْمَانِ”.
(4) [1/10-ఏకీభవితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, విశ్వాస (ఈమాన్) భాగాలు, 70 కన్నా అధికంగా ఉన్నాయి. వాటిలో అన్నిటి కంటే ఉత్తమమైనది ”లా ఇలాహ ఇల్లల్లాహ్‌” అని పలకటం. ఇంకా అన్నిటి కంటే చిన్నది హాని కరమైన వస్తువులను దారి నుండి తొలగించటం. సిగ్గు కూడా విశ్వాసంలోని భాగమే. )

వివరణ-5: ఈ ‘హదీసు’ ఉల్లేఖకులు అబూ హురైరహ్‌ (ర), ప్రఖ్యాత ప్రవక్త (స) అనుచరులు. ఇతని పేరు పట్ల అభిప్రాయభేదాలు ఉన్నాయి. కునియత్‌ ద్వారా చాలా గొప్ప గుర్తింపు ఉంది. ఇతను పిల్లులను చాలా ప్రేమించే వారు. 7 హిజ్రీలో ఇస్లామ్‌ స్వీకరించారు. హిజ్రత్‌ చేసి మదీ నహ్ వచ్చారు. అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. వీరు అస్‌ హాబె సుఫ్ఫహ్ లో ఒకరు. ఖుర్‌ఆన్‌ కంఠస్తం చేశారు. ‘హదీ సు’ల్లో ఇతనికి 5374 హదీసులు కంఠస్థ ముండి, ఇతని ద్వారా ఉల్లేఖించబడ్డాయి. చాలా దైవభక్తులు, పండితులు, చాలా గొప్ప ఆతిథ్యకర్త, తల్లి సేవకులు, ఇంకా ప్రవక్త (స)ను అతని(స) కుటుంబాన్ని చాలా ప్రేమించేవారు. 78 సంవత్సరాల వయస్సులో మరణించారు.

బు’ఖారీ వివరణ అయిన ఫత్‌’హుల్‌ బారీలో ఈ ముఖ్య విధులను గురించి ఇలా వివరించడం జరిగింది. ఆచరణలు మూడు రకాలు: I. మానసిక (ఖల్బి) ఆచరణలు-24; II.నోటి (లిసాని) ఆచరణలు-7 మరియు III. శారీరక (బదని) ఆచరణలు-38. అవి క్రింద పేర్కొనబడ్డాయి:
I. మానసిక (ఖల్బి): 1. అల్లాహ్‌(త)ను విశ్వసించటం, 2. దైవప్రవక్తలందరిని విశ్వసించటం, 3. దైవదూతలందరిని విశ్వసించటం, 4. దైవగ్రంథాలన్నిటినీ విశ్వసించటం, 5. విధివ్రాతను విశ్వసించటం, 6. తీర్పుదినాన్ని విశ్వసిం చటం, 7. పునరుత్థనాన్ని విశ్వసించటం, 8. తీర్పుదినం నాడు మైదానంలో హాజరవటాన్ని గురించి విశ్వ సించటం, 9. విశ్వాసులు స్వర్గంలోకి అవిశ్వాసులు నరకం లోకి వెళతారని విశ్వసించటం, 10. అల్లాహ్‌ (త) పట్ల ప్రేమ తప్పనిసరి అని విశ్వసించటం, 11. అల్లాహ్‌ (త) పట్ల భయభక్తులు కలిగి ఉండాలని విశ్వసించటం, 12. అల్లాహ్‌(త) పట్ల మంచి ఆశ కలిగి ఉండాలని విశ్వసించటం, 13. అల్లాహ్‌(త) పైననే నమ్మకం ఉంచుకోవటం, 14. ప్రవక్త (స) పట్ల ప్రేమ కలిగి ఉండాలి. 15. ప్రవక్త (స)ను గౌరవించాలి, 16. ఎన్ని కష్టాలు వచ్చినా, (కాల్చివేసినా) ఇస్లామ్‌ను త్యజించకూడదు, 17. విద్య నభ్యసించాలి, 18. ధార్మిక విద్యను వ్యాపింప జేయాలి. 19. ఖుర్‌ఆన్‌ విద్యను నేర్చుకోవాలి, నేర్పించాలి, 20. పరిశుభ్రంగా ఉండాలి. 21. ఐదు పూటల నమా’జులను తూ.చ. తప్ప కుండా క్రమశిక్షణతో పాటించాలి, 22. ‘జకాత్‌ చెల్లించాలి, 23. ఉపవాసాలు పాటించాలి, 24. ఏ’తెకాఫ్‌ పాటించాలి, 25. ‘హజ్జ్ చేయాలి, 26. జిహాద్‌ చేయాలి, 27. జిహాద్‌కొరకు ఏర్పాట్లు చేయాలి, 28. శత్రువుతో తలపడినప్పుడు స్థిరంగా ఉండి, వెన్ను చూపకూడదు, 29. యుద్ధ ధనం నుండి 5వ వంతు ప్రజానిధికి (బైతుల్ మాల్ కు) అప్పగించాలి, 30. బానిసలను విడుదల చేయాలి, 31. పరిహారం చెల్లించాలి, 32. మొక్కుబడులు, వాగ్దానం పూర్తి చేయాలి, 33. అల్లాహ్‌(త) ఉపదేశాలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి, 34. నోటిని పరిరక్షించాలి, 35. అమానతులను అప్పజెప్పాలి, 36. అన్యాయంగా ఇతరులను హింసించరాదు, 37. వ్యభిచారానికి దూరంగా ఉండాలి, 38. అధర్మ సంపాదనకు దూరంగా ఉండాలి, 39. అన్నపానీయాల్లో ధర్మా-ధర్మ సంపాదనను గుర్తించాలి, 40. షరాకు విరుద్ధంగా ఉన్న దుస్తుల్ని ధరించరాదు, 41. అనవసరమైన ఆటలను, పాటలను నిషిద్ధంగా భావించాలి, 42. ద్రోహం, ఈర్ష్య, ఆగ్రహం మొదలైనవాటికి దూరంగా ఉండాలి, 43. ప్రజలపై అత్యాచారాన్ని నిషిద్ధంగా భావించాలి, 44. అల్లాహ్‌ ప్రీతికొరకే ఆచరించాలి, 45. మంచి పనుల పట్ల సంతృప్తి, చెడు పనుల పట్ల అసహ్యం వ్యక్తం చేయాలి, 46. పాపాలకు వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, 47. ఖుర్‌బానీ (బలి) చేయాలి, 48. ముస్లిమ్‌ పాలకులకు విధేయత చూపాలి, 49. పూర్వీకుల్లోని పుణ్యాత్ములను (సలఫ్ సాలెహీన్లను) అనుసరించాలి, 50. న్యాయంగా ధర్మంగా వ్యవహరించాలి, 51. మంచిని ఆదేశించాలి, చెడును నిర్మూలించాలి, 52. మంచి పనుల్లో పరస్పరం సహకరించాలి, 53. సిగ్గు లజ్జలు కలిగి ఉండాలి, 54. తల్లిదండ్రుల సేవ చేయాలి, వారిపట్ల ఉత్తమంగా వ్యవహరించాలి, 55. బంధుత్వ హక్కులను నెరవేర్చాలి, 56. సద్గుణాలు కలిగి ఉండాలి, 57. బానిసలు, సేవకుల పట్ల ఉపకారం చేయాలి, 58.యజమాని హక్కును నెరవేర్చాలి, 59. భార్యాబిడ్డల హక్కు చెల్లించాలి, 60. దైవ భక్తులను ప్రేమించాలి, 61. సలామ్‌కు ప్రతిసలామ్‌ చెప్పాలి, 62. రోగులను పరామర్శించాలి, 63. విశ్వాసి యొక్క జనా’జహ్ నమా’జు చేయాలి, 64. తుమ్ముకు సమాధానం ఇవ్వాలి, 65. అవిశ్వాసులతో మానసిక సంబంధాలు పెట్టుకోరాదు, 66. పొరుగు వారిని గౌరవించాలి, 67. అతిథులను గౌరవించాలి, 68. ముస్లిముల లోపాలను కప్పిపుచ్చాలి, 69. కష్టాలలో ఓర్పు వహించాలి, 70. మనోకాంక్షలను తగ్గించాలి, 71. మహా పాపాలకు దూరంగా ఉండాలి, 72. అనవసరంగా మాట్లాడరాదు, 73. దానధర్మాలు చేయాలి, 74. చిన్న లపై దయ చూపాలి, పెద్దలను గౌరవించాలి, 75. పరస్పరం సంస్కరించుకోవాలి, 76. తన గురించి కోరిందే మరో ముస్లిమ్‌ సోదరుని గురించి కూడా కోరాలి, 77. హానికరమైన వస్తువులను మార్గం నుండి తొలగించాలి.

3 నుండి 10 వరకు బి’ద్అ అంటారు. అంటే విశ్వాస భాగాలు 70 కన్నా అధికంగా ఉన్నాయి. మరికొందరు 60 కన్నా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అంటే ఇక్కడ ఆధిక్యత ఉద్దేశ్యం. ఈ ‘హదీసు’ ద్వారా విశ్వాసం మిశ్రమ మైనదని తెలుస్తుంది. ఆచరణ కూడా విశ్వాసం లోనిదే. అన్ని భాగాలు ఉంటేనే పరిపూర్ణ విశ్వాసం అవుతుంది. అన్ని భాగాలు లేనిది అసంపూర్ణ విశ్వాసం అవుతుంది. విశ్వాసం ఒకవృక్షం వంటిది. పాపాలనుండి వారించే దాన్ని సిగ్గు అంటాం. అందువల్లే సిగ్గులేని వాడిలో విశ్వాసం లేనట్లే. సిగ్గు మేలుకు మారు పేరు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6 – [ 5 ] ( متفق عليه ) (1/10)
وعَنْ عَبْدَ اللهِ بْنِ عَمْرو، قَالَ: قَالَ رَسَوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمُسْلِمُ مَنْ سَلِمَ الْمُسْلِمُوْنَ مِنْ لِسَانِهِ وَيَدِهِ، وَالْمُهَاجِرُ مَنْ هَجَرَ مَا نَهَى اللهُ عَنْهُ”. هَذَا لَفْظُ الْبُخَارِيِّ. وَالْمُسْلِمُ قَالَ: “إِنَّ رَجُلًا سَأَلَ النَّبِيَّ صَلىَ الله عليه وسلم: أَيُّ الْمُسْلِمِيْنَ خَيْرٌ؟ قَالَ: مَنْ سَلِمَ الْمُسْلِمُوْنَ مِنْ لِسَانِهِ وَيَدِهِ”.
(5) [1/10-ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: తన చేతి నుండి, నోటి నుండి ఇతర ముస్లిములు క్షేమంగా ఉన్నవాడే ముస్లిమ్‌. ఇంకా అల్లాహ్ (త) నిషేధించిన వాటిని వదలి వేసిన వాడే ముహాజిర్‌. (బు’ఖారీ)

ముస్లిమ్‌లో ఇలా ఉంది, ”ప్రవక్త (స)తో ఒక వ్యక్తి అందరి కంటే ఉత్తమమైన ముస్లిమ్‌ ఎవరు,” అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స), ”అతని నోరు, చేతి నుండి ప్రజలు క్షేమంగా ఉన్నవాడే ఉత్తమ ముస్లిమ్‌. అంటే చేత్తో ఇతరులను హింసించని, నోటితో నిందించని, చాడీలు, తిట్టడం చేయని వాడే ఉత్తమ ముస్లిమ్‌.” )

వివరణ-6: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్ ఈ ‘హదీసు’ ఉల్లేఖన కర్త. ఇతను తన తండ్రి కంటే ముందు ఇస్లామ్‌ స్వీకరించారు. తరచూ ప్రవక్త (స) వద్ద ఉండేవారు. ప్రవక్త (స) చెప్పిన ‘హదీసు’లను వ్రాసుకునేవారు. తీరిక సమయాల్లో దైవాన్ని స్మరించేవారు. తరచూ ఉపవాసాలు పాటిస్తూ, రాత్రి ఆరాధనలో గడిపేవారు. ఒక్కోసారి ఈ విషయంలో భార్యా బిడ్డలను కూడా మరచిపోయే వారు. ఈ విషయం ప్రవక్త (స)కు తెలిసి, వారించారు. మధ్య మార్గాన్ని అనుసరించమని సలహా ఇచ్చారు. ఇతను 700 ‘హదీసు’లను ఉల్లేఖించారు. ఇతని శిష్యులు అనేకమంది ఉన్నారు. ఇతను అరబ్బీతో పాటు ఇబ్‌రానీ (హీబ్రూ) భాషలో కూడా ప్రవీణులు. 65 హిజ్రీలో ఫుస్తాత్‌లో మరణించారు.

7 – [ 6 ] (متفق عليه) (1/10)
وَعَنْ أَنَسٍ رَضِيَ اللهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صلى الله عليه وسلم: “لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى أَكُوْنَ أَحَبَّ إِلَيْهِ مَنْ وَّالِدِهِ وَوَلَدِهِ وَالَّنِاس أَجْمَعِيْنَ”.
(6) [1/10-ఏకీభవితం]
అనస్‌ బిన్ మాలిక్ (ర) కథనం, ప్రవక్త (స) ప్రవచనం: ”మీలో ఎవరూ, తన తండ్రికంటే, సంతానం కంటే నన్ను అధికంగా ప్రేమించనంత వరకు విశ్వాసులు కాలేరు.” )

వివరణ-7: ఈ ‘హదీసు’ ఉల్లేఖకులు ప్రఖ్యాత, అ’న్సారి ప్రవక్త (స) అనుచరులు, అనస్‌ (ర). ఇతను హిజ్రత్‌కు 10 సంవత్స రాలకు ముందు మదీనహ్ లో జన్మించారు. అతని వయస్సు 8 లేక 9 సంవత్స రాలున్నప్పుడు, అతని తల్లి ఇస్లామ్‌ స్వీకరించారు. ఇతని తండ్రి మాలిక్‌ సిరియా వెళ్ళి పోయారు. అక్కడే మరణించారు. అతని తల్లి ఉమ్మె సులైమ్‌ (ర) అబూ ‘తల్‌’హాను పెళ్ళి చేసుకున్నారు. అనస్‌ను కూడా తన వెంట తీసుకొని అబూ ‘తల్‌’హా ఇంటికి వెళ్ళారు. అనస్‌ (ర) అబూ ‘తల్‌’హా ఇంటిలో పోషించ బడ్డారు. ప్రవక్త (స) హిజ్రత్‌ చేసి మదీనహ్ వచ్చినప్పుడు, అబూ’తల్‌’హా అనస్‌ను తీసుకొని ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఈ అబ్బాయి అనస్‌ను తమరి సేవకోసం స్వీకరించండి’ అని విన్నవించుకున్నారు. ప్రవక్త (స) స్వీకరించారు. అనస్‌ (ర) 10 సంవత్సరాల వరకు ప్రవక్త (స) సేవచేశారు. ఇంటిలో ప్రయాణంలో వెంట ఉండే వారు. ప్రవక్త (స) అతని కోసం అధిక ధనం, అధిక సంతానం కోసం ప్రార్థించారు. అది స్వీక రించబడింది. అ’న్సారుల్లో ఇతను చాలా ధనవంతులు. 80 కంటే అధికంగా ఇతనికి సంతానం ఉండేది. కొడుకులు, మనవళ్ళు కలసి 100 కంటే అధికంగా ఉండే వారు. 93వ హిజ్రీ శకంలో 103 సంవత్సరాల వయస్సులో బ’స్రాలో మరణించారు. ప్రవక్త (స) ప్రేమ విశ్వాస భాగంగా ఉండేది. ప్రేమకు మూడు కారణాలుంటాయి. అందం, పరిపూర్ణత, దాతృత్వం ఈ మూడు గుణాలు ప్రవక్త (స)లో ఉండేవి.

ప్రేమ రెండు రకాలు. సహజమైనది, బుద్ధీజ్ఞానాలు గలది. బుద్ధీజ్ఞానాలు గలది అంటే ఆజ్ఞాపాలన, విధేయత. అంటే, తల్లి దండ్రులు, సంతానం, భార్య, బంధువులు, తన స్వంతం మొదలైన వారందరి కంటే అధికంగా ప్రవక్త (స)ను ప్రేమించాలి. ప్రవక్త ఆజ్ఞాపాలన కొరకు తన్ను తాను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే విశ్వాసం పరిపూర్ణం అవుతుంది.

ఇది ‘ఉమర్‌ (ర) సంఘటన ద్వారా తెలుస్తుంది. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ హిషామ్‌ కథనం: ”మేము ప్రవక్త (స) వెంట ఉన్నాము. ప్రవక్త (స) ‘ఉమర్‌ చేతిని పట్టుకొని ఉన్నారు. ‘ఉమర్‌ (ర), ప్రవక్త (స) తో: ‘ఓ ప్రవక్తా! మీరు నాకు నా ప్రాణం తప్ప మిగతా వాటన్నిటికంటే ప్రియులు.’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స): ‘నేను మీకు మీ ప్రాణం కంటే ప్రియుణ్ణి కానంత వరకు మీరు పరిపూర్ణ విశ్వాసులు కాలేరు.’ అని అన్నారు. అప్పుడు ‘ఉమర్‌ (ర): ‘ఇప్పుడు మీరు నాకు, నా ప్రాణం కంటే ప్రియమైనవారు అయిపోయారు.’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స): ‘ఇప్పుడు పరిపూర్ణ విశ్వాసులు అయిపోయారు.’ అని అన్నారు.”

ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఆదేశం: ”ఓ విశ్వాసులారా! మీ తండ్రి తాతలు మరియు మీసోదరులు సత్యతిరస్కారానికి విశ్వా సంపై ప్రాధాన్యతనిస్తే, మీరు వారిని స్నేహితులుగా చేసు కోకండి. మీలో వారి వైపు మొగ్గేవారే (వారిని మీ స్నేహితు లుగా చేసుకునే వారే) దుర్మార్గులు. వారితో ఇలా అను: ‘మీతండ్రితాతలు, మీకుమారులు, మీసోదరులు, మీసహ వాసులు (అ’జ్వాజ్), మీ బంధువులు, మీరు సంపా దించిన ఆస్తిపాస్తులు, మందగిస్తాయేమోనని భయపడే మీ వ్యాపారాలు, మీకుప్రీతికరమైన మీ భవనాలు — అల్లాహ్‌ కంటే, ఆయన ప్రవక్త కంటే మరియు ఆయన మార్గంలో పోరాడటంకంటే — మీకు ఎక్కువప్రియమైనవైతే, అల్లాహ్‌ తన తీర్పును బహిర్గతం చేసేవరకు నిరీక్షించండి. మరియు అల్లాహ్‌ అవిధేయులైన జాతివారికి సన్మార్గం చూపడు.” (సూ. అత్తౌబహ్, 9:23-24)

ఈ ఆయతుల ద్వారా అందరికంటే అధికంగా, అల్లాహ్‌(త)ను, ఆయన ప్రవక్తనే ప్రేమించాలి. ఇంకా తన బంధువుల కంటే అల్లాహ్‌(త)ను, ఆయన ప్రవక్తను అధికంగా ప్రేమించాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. అందరి ప్రేమకంటే వారిద్దరి ప్రేమ అధికంగా ఉండాలని తెలుస్తుంది. అ’న్సార్లు మరియు ప్రవక్త (స) అనుచరులు ఈ విధంగానే ప్రేమించేవారు. ఉ’హుద్‌ యుద్ధంలో ఒక అ’న్సారీ స్త్రీ యొక్క తండ్రి, సోదరుడు, భర్త ముగ్గురూ వీరమరణం పొందారు. ఈ వార్త అందిన వెంటనే ఆమె: ‘ప్రవక్త (స) క్షేమంగా ఉన్నారా?’ అని అడిగింది. దానికి ప్రజలు: ‘అవును, ప్రవక్త (స) క్షేమంగా ఉన్నారు.’ అని చెప్పారు. దానికి ఆమె: ‘నాకు చూపెట్టండి, నేను స్వయంగా చూసుకుంటాను.’ అని చెప్పింది. అనంతరం ఆమె ప్రవక్త (స)ను చూసి: ‘ఇప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా ఫరవా లేదు.’ అని పలికింది.

మక్కహ్ అవిశ్వాసులు ‘జైద్‌ బిన్‌-వస్న’ను ‘హరమ్‌ బయ టకు తీసుకొని వచ్చినపుడు అబూ సుఫియాన్‌ బిన్‌ ‘హర్‌బ్‌: ”ప్రమాణం చేసి చెప్పు ఓ ‘జైద్‌! ‘ఈ సమ యంలో ము’హమ్మద్‌(స) నీస్థానంలో, నీవు నీ ఇంట్లో ఉంటే బాగుండు.’ అనిఆలోచిస్తున్నావుకదూ.” అని అన్నాడు. దానికి ‘జైద్‌ ప్రమాణం చేసి: ‘నేను ఇంట్లో ఉండాలని, ప్రవక్త (స)కు ఒక్క ముల్లు కూడా గుచ్చుకోవాలని నాకు ఏమాత్రం ఇష్టంలేదు.’ అప్పుడు అబూ సుఫియాన్‌: ‘ప్రవక్త(స)ను ఆయన అనుచరులు ప్రేమించినట్లు, ఇతరులెవ్వరినీ చూడలేదు.’ అని అన్నాడు.(బు’ఖారీ, ముస్లిమ్‌)

8 – [ 7 ] ( متفق عليه ) (1/10)
وعَنْ أَنَسٍ رَضِيَ اللهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صلى الله عليه وسلم: “ثَلَاثٌ مَنْ كُنَّ فِيْهِ وَجَدَ بِهِنَّ حَلَاوَةَ الِإيْمَانِ: مَنْ كاَنَ اللهُ وَرَسُوْلَهَ أَحَبَّ إِلَيْهِ مِمَّا سِوَاهُمَا، وَمَنْ أَحَبَّ عَبْدًّا لَا يُحِبُّهُ إِلَّا للهِ، وَمَنْ يَّكْرَهُ أَنْ يَعُوْدَ فِيْ الْكُفْرِ بَعْدَ أَنْ أَنْقَذَهُ اللهُ مِنهُ كَمَا يَكْرَهُ أَنْ يُلْقَى فِيْ النَّارِ”.

(7) [1/10-ఏకీభవితం]
అనస్‌ (ర) కథనం, ప్రవక్త (స) ప్రవచనం: ”మూడు విషయాలు కలిగి ఉన్న వ్యక్తి విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించినట్లే: 1. అన్నిటి కంటే అత్యధికంగా అల్లాహ్‌ (త), ఆయన ప్రవక్త పట్ల ప్రేమ, 2. కేవలం అల్లాహ్‌ (త) కోసమే ప్రేమించటం, 3.విశ్వసించిన తరువాత, తిరిగి అవిశ్వాసాన్ని అవలంబించటాన్ని అగ్నిలో వేయబడే టంత అసహ్యంగా భావించటం.)

వివరణ-8: అంటే ఈ మూడు సుగుణాలు కలిగి ఉన్న వ్యక్తి విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. అల్లాహ్‌(త), ఆయన ప్రవక్త (స) ప్రేమ అత్యధికంగా ఉండాలి. ఎవరినైనా ప్రేమిస్తే కేవలం అల్లాహ్‌(త) కోసమే ప్రేమించాలి. ఇంకా విశ్వాసాన్ని వదలటం అగ్నిలో పడటంగా భావించాలి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

9 – 8 (1/11)
وَعَنْ الْعَبَّاسِ بْنِ عَبْدِ الْمُطَلَبِ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ذَاقَ طَعْمَ الْإِيْمَانِ مَنْ رَضِيَ بِاللهِ رَبًّا، وَبِالْإِسْلَامِ دِيْنًا، وَبِمُحَمَّدٍ رَسُوْلًا”. رواه مسلم.

(8) [1/11-దృఢం]
‘అబ్బాస్‌ బిన్‌ ‘అబ్దుల్‌ ము’త్తలిబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”అల్లాహ్‌(త)ను ప్రభువుగా, ఇస్లామ్‌ను తన ధర్మంగా, ము’హమ్మద్‌ (స)ను తన ప్రవక్తగా స్వీకరించిన వ్యక్తి విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించాడు.

వివరణ-9: వివిధ పదార్థాల్లో వివిధరుచులు ఉంటాయి. రుచిచూచే శక్తి ఉన్నవాడే వాటి రుచిని ఆస్వాదిస్తాడు. అదేవిధంగా విశ్వాసంలోనూ ఒక రుచి ఉంటుంది. అల్లాహ్‌(త)పై, ప్రవక్తపై, ఇస్లామ్‌పై అత్యధిక ప్రేమ ఉన్నవాడే ఈ రుచిని పొందుతాడు. ఇటువంటి వ్యక్తి అల్లాహ్‌(త)నే తన ప్రభువుగా, అల్లాహ్‌ (త) పట్లనే సంతృప్తిగా ఉంటాడు. ప్రవక్త (స)ను తన ప్రవక్తగా అతని దైవదౌత్యం పట్ల సంతృప్తిగా ఉంటాడు. ఇస్లామ్‌ను తన ధర్మంగా విశ్వసిస్తాడు. దానిపట్ల సంతృప్తి కలిగి ఉంటాడు. ఈ విషయాలు ఉన్న వ్యక్తి విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. అల్లాహ్‌(త) మనందరికీ విశ్వాస మాధుర్యాన్ని ప్రసాదించుగాక!

ఈ ‘హదీసు’ ఉల్లేఖనకర్త ‘అబ్బాస్‌ (ర). ఇతను ప్రవక్త (స)కు చిన్నాన్న. ప్రవక్త (స) కంటే 2 లేక 3 సంవత్సరాల ముందు జన్మించారు. మక్కహ్ లో ఇస్లామ్‌ స్వీకరించారు. మక్కహ్ విజయానికి ముందు మదీనహ్ వలస పోయారు. ‘హునైన్‌ యుద్ధంలో ప్రవక్త (స) వెంట ఉన్నారు. ప్రవక్త (స) వాహనం కళ్ళెం పట్టుకొని ఉన్నారు. ప్రవక్త (స) అతన్ని చాలా గౌరవించే వారు. ‘అబ్బాస్‌ (ర) చాలా దయామయులు, దానగుణం గలవారు. ఆతిథ్య స్వభావం గలవారు. ఇస్లామ్‌కు ముందు క’అబహ్ గృహ సంరక్షకులుగా ఉండేవారు. హాజీలకు నీళ్ళు త్రాపించేవారు. ఇంకా అతని దు’ఆ స్వీకరించబడేది. ‘ఉమర్‌ (ర) పరిపాలనా కాలంలో కరువు ఏర్పడినపుడు నమా’జె ఇస్తిస్ఖా’ చదివించేవారు. అతని ప్రార్థన స్వీకరించబడేది. 88 సంవత్సరాల వయస్సులో హిజ్రీ శకం 32లో మరణించారు.(ముస్లిమ్‌)

10 – 9 (1/11)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَالَّذِيْ نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ، لَا يَسْمَعُ بِيْ أَحَدٌ مِّنْ هَذِهِ الْأُمَّةِ، يَهُوْدِيٌّ وَلَا نَصْرَانِيٌّ، ثُمَّ يَمُوْتُ وَلَمْ يُؤْمِنُ بِالَّذِيْ أَرْسَلْتُ بِهِ؛ إِلا كَانَ مِنْ أَصْحَابِ النَّارِ” .رواه مسلم .

(9) [1/11-దృఢం]
అబూ హురైరహ్‌ (ర) కథనం, ప్రవక్త (స) ప్రవచనం: ”ఎవరిచేతిలో ము’హమ్మద్‌ ప్రాణం ఉందో ఆయన (త) సాక్షి! ఈ అనుచర సమాజంలోని యూదులు, క్రైస్తవులు నాగురించితెలుసుకొని, నన్నువిశ్వసించకుండా మరణిస్తే వారు నరకానికి వెళతారు. )

వివరణ-10: అంటే ప్రవక్త (స) దైవదౌత్యాన్ని పొంది, ప్రవక్త (స) సందేశం అతనికి అందినా, అతడు విశ్వసించకుండా ఉంటే, ఇస్లామ్‌ స్వీకరించకుండా మరణిస్తే, నరకంలోనికి ప్రవేశిస్తాడు. ఎందుకంటే ప్రవక్త (స)ను విశ్వసించడం తప్పని సరి. అదేవిధంగా ఈ ఆదేశం ఇతర మతస్థులకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ప్రవక్త (స) మానవులు, జిన్నుల అందరివైపు ప్రవక్తగా పంపబడ్డారు. ప్రవక్త (స): ‘నేను ఇప్పుడు ఉన్నవారు, నా తరువాత వచ్చేవారు అందరివైపు ప్రవక్తగా పంపబడ్డాను.’ అని అన్నారు. అల్లాహ్‌ ఆదేశం: ”ఓ ప్రవక్తా! ఇలా పలుకు, ‘ఓ ప్రజలారా! నేను మీ అందరివైపు ప్రవక్తగా పంపబడ్డాను.’ (సూ. అల్ అరాఫ్, 7:158)” మరోచోట: ”మేము అందరి కోసం మిమ్మల్ని ప్రవక్తగా పంపాము.” (సూ. సబా, 34:28) అని ఉంది.(ముస్లిమ్‌)

11 – [ 10 ] ( متفق عليه ) (1/11)
وَعَنْ أَبِيْ مُوْسَى الأَشْعَرِيِّ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ثَلَاثَةُ لَّهُمْ أَجْرَانٍ: رَجُلٌ مِّنْ أَهْلِ الْكِتَابِ آمَنَ بِنَبِيِّهِ وَآمَنَ بِمُحَمَّدٍ، وَالْعَبْدُ الْمَمْلُوْكُ إِذَا أَدَّى حَقَّ اللهِ وَحَقَّ مَوَالِيْهِ، وَرَجُلٌ كَانَتْ عَنْدَهُ أَمَةٌ يَّطَؤُهَا، فَأَدَّبَهَا فَأَحْسَنَ تَأْدِيْبَهَا، وَعَلَّمَهَا فَأَحْسَنَ تَعْلِيْمَهَا، ثُمَّ أَعْتَهَا فَتَزَوَّجَهَا؛ فَلَهُ أَجْرَانِ”.

(10) [1/11-ఏకీభవితం]
అబూ మూసా అష్‌’అరీ (ర) కథనం, ప్రవక్త (స) ప్రవచనం: ”ముగ్గురు వ్యక్తుల కోసం రెట్టింపు పుణ్యం ఉంది. 1. తమ ప్రవక్తను విశ్వసించి ఆ తరువాత ప్రవక్త ము’హమ్మద్‌ (స)ను విశ్వసించినవారు, 2. తన యజమాని హక్కులను, అల్లాహ్‌(త) హక్కులను నెరవేర్చే సేవకుడు, ఇంకా, 3. తన వద్ద ఉన్న బానిసరాలిని అనుభవిస్తూ, ఆమెకు విద్యాజ్ఞానాలు నేర్పుతూ, ఆ తరువాత ఆమెను విడుదల చేసి పెళ్ళిచేసుకున్న వ్యక్తికి, రెట్టింపు పుణ్యాలు లభిస్తాయి.)

వివరణ-11: ఈ ‘హదీసు’ను ఉల్లేఖించిన వారు ప్రఖ్యాత ప్రవక్త (స) అనుచరులు అబూ-మూసా అష్‌’అరీ (ర). ఇతని పేరు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ఖైస్‌. ఇతడు యమన్‌కు చెందినవారు. ఇతను అష్‌’అరీ తెగకు చెందిన వారు. అందువల్లే అతన్ని అష్‌’అరీ అంటారు. యమన్‌ నుండి మక్కహ్ వచ్చారు. ఇస్లామ్‌ స్వీకరించి స్వదేశం తిరిగి వెళ్ళిపోయారు. యమన్‌ వెళ్ళి ఇస్లామ్‌ సందేశం గురించి ప్రచారం చేశారు. ఫలితంగా చాలా మంది ఇస్లామ్‌ స్వీకరించారు. అబూ మూసా అష్‌’అరీ 50 మంది ముస్లిములను వెంటబెట్టుకొని సముద్ర మార్గం ద్వారా మక్కహ్ వైపు ప్రయాణమయ్యారు. కాని తుఫాన్‌ వల్ల పడవ ‘హిజాజ్‌’కి బదులు ‘హబ్‌షహ్ కు తీసుకొనిపోయింది. ఇటు జ’అఫర్‌ (ర) ఇంకా ఇతర బాధితులు అక్కడకు వలస వచ్చి ఉన్నారు. వీళ్ళు మదీనహ్ కు బయలుదేరారు. అబూ మూసా అష్‌’అరీ కూడా వాళ్ళ వెంట బయలు దేరారు. వీళ్ళందరూ ‘ఖైబర్‌ విజయం సమయంలో అక్కడకు చేరుకున్నారు. ప్రవక్త (స) యుద్ధ ధనం నుండి అతనికి కూడా ఒక వంతు ఇచ్చారు. మదీనహ్ వచ్చిన తర్వాత ఇస్లామీయ సేనల్లో నిమగ్నం అయి పోయారు. అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. ప్రవక్త (స) అతన్ని యమన్‌ గవర్నర్‌గా నియమించారు. 44 హిజ్రీలో మరణించారు. (త’జ్కర అల్’హాఫి”జ్)

గ్రంథ ప్రజలు యూదులైనా, క్రైస్తవులైనా తమ ప్రవక్తను విశ్వసించి వారి షరీ’అత్‌ల ప్రకారం ఆచరించారు. ఆ తరువాత ప్రవక్త (స) కాలం వారికి లభించింది. వారు ప్రవక్త (స)ను విశ్వసించారు. ఆయన తీసుకువచ్చిన షరీ’అత్‌ ప్రకారం ఆచరించారు. ముస్లిమ్‌గా మరణించారు. వారికి ప్రతి పుణ్యానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. ఉదాహరణకు మనం నమా’జు చదివినా, రో’జహ్ ఉన్నా 10 పుణ్యాలు లభిస్తాయి. అయితే గ్రంథ ప్రజలకు 20 పుణ్యాలు లభిస్తాయి. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ (త) ఇలా ఆదేశిస్తున్నాడు: ”ఎవరికైతే పూర్వం మేము గ్రంథాన్ని ఇచ్చామో వారు దీనిని (ఖుర్‌ఆన్‌ను) విశ్వసిస్తారు. మరియు వారికి ఇది వినిపించ బడి నప్పుడు, వారు ఇలా అంటారు: ‘మేము దీనిని విశ్వ సించాము, నిశ్చయంగా, ఇది మా ప్రభువు తరఫునుండి వచ్చిన సత్యం. నిశ్చయంగా, మేము మొదటి నుండియే అల్లాహ్‌కు విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము.’ వీరే, తమ సహనానికి ఫలితంగా రెండింతలు ప్రతిఫల మొసంగబడే వారు..”(సూ. అల్ ఖసస్, 28:52-54)

రెండవ విషయం: ఏమిటంటే, సేవకుడికి రెండు పుణ్యాలు లభిస్తాయి. ఎందుకంటే అతడు రెండు సేవలు చేస్తాడు. రెట్టింపు శ్రమ పడవలసి ఉంటుంది. అల్లాహ్‌(త) హక్కు ఆరాధనగా యజమాని హక్కును సేవగా నిర్వర్తిస్తాడు.

మూడవ విషయం: ఏమిటంటే యజమానికి రెండు పుణ్యాలు లభిస్తాయి. ఒక పుణ్యం విద్య నేర్పినందుకు, విడుదల చేసి నందుకు, రెండవ పుణ్యం వివాహం చేసుకున్నందుకు.(బు’ఖారీ, ముస్లిమ్‌)

12 – [ 11 ] ( متفق عليه ) (1/11)
وعَنْ ابْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أُمِرْتُ أَنْ أَقَاتِلَ النَّاسَ حَتَّى يَشْهَدُوْا أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُوْلُ اللهِ، وَيُقِيْمُواالصَّلَاةَ، وَيُؤْتُواالزَّكَاةَ. فَإِذَافَعَلُوْا ذَلِكَ عَصَمُوا مِنِّيْ دِمَاءَهُمْ وَأَمْوَالَهُمْ، إِلَّا بِحَقِّ الْإِسْلَامِ، وَحِسَابُهُمْ عَلى اللهِ.
إِلَّا أَنَّ مُسْلِمٌا لَمْ يَذْكُرْ “إِلَّا بِحَقِّ الْإِسْلَام”.

(11) [1/11-ఏకీభవితం]
ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ప్రజలు అల్లాహ్‌ (త) తప్ప ఆరాధనకు అర్హులెవరూ లేరని, ము’హమ్మద్‌ అల్లాహ్‌ ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వాలి, నమా’జు స్థాపించాలి, ‘జకాతు చెల్లించాలి. ఇలా చేసే వరకు వారితో యుద్ధం కొనసాగించాలని నన్ను ఆదేశించడం జరిగింది. వారిలా చేయడం ప్రారంభిస్తే, వారు నా నుండి తమ ప్రాణాలను, ధనాన్ని రక్షించుకున్నారు. ఇస్లామీయ హక్కు తప్ప. ఆ తరువాత వారి విచారణ అల్లాహ్‌పైనే ఉంది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

అయితే ముస్లిములో ”ఇల్లాబి’హఖ్ఖిల్‌ ఇస్లామ్‌,” లేదు.)

వివరణ-12: ‘హత్తా ‘యష్ హదు,’ అంటే అల్లాహ్‌(త) ను, ప్రవక్త (స)ను విశ్వసించి ఆదేశాలను పాలించాలి. ఇందులో నమా’జు, ఉపవాసం, ‘జకాత్‌, ‘హజ్జ్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఇక విశ్వసించనివాడు ఒప్పందం కుదుర్చుకుని పన్ను (జి’జ్య) ఇస్తామని ఒప్పుకోవాలి. ఇటువంటి పరిస్థితిలో యుద్ధ విరమణ చేసుకోవాలి. అన్ని విధాలా వారికి రక్షణ కల్పించాలి.

‘ఇల్లా బి హఖ్ఖిల్ ఇస్లాం’ అంటే ఇస్లాం స్వీకరించిన తరువాత నేరం చేస్తే మాత్రం తప్పకుండా దానికి శిక్ష పడుతుంది. ఎవరినయినా చంపితే అతన్ని కూడా చంపటం జరుగు తుంది. వ్యభిచారం చేస్తే తగిన శిక్ష విధించడం జరుగుతుంది. దొంగతనం చేస్తే చేతులు నరకడం జరుగుతుంది. ఎవరైనా వచ్చి, నేను ముస్లిమునని చెప్పి తగు విధంగా ఆచరిస్తూ ఉంటే, అతన్ని ముస్లిమ్‌గానే పరిగణించడం జరుగుతుంది. కాని ఒకవేళ అతని హృదయంలో కాపట్యం ఉంటే, అతని విషయం అల్లాహ్‌(త)పై ఉంది. పరలోకంలో అల్లాహ్‌ (త) అతన్నివిచారిస్తాడు. ప్రపంచంలో అతన్ని ముస్లిమ్‌గానే పరిగణించడం జరుగుతుంది.

13 – 12 (1/11)
وعَنْ أَنَسٍ رضى الله عَنْه، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَلَّى صَلَاتَنَا، وَاسْتَقْبَلَ قِبْلَتَنَا، وَأَكَلَ ذَبِيْحَتَنَا؛ فَذَلِكَ الْمُسْلِمُ الَّذِيْ لَهُ ذَمَّةُ اللهِ وَذَمَّةُ رَسُوْلِهِ، فَلَا تَخْفِرُوْا اللهَ فِيْ ذِمَّتِهِ”. رَوَاهُ الْبُخَارِيُّ .

(12) [1/11-దృఢం]
అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”మనలా నమా’జు చదివేవాడు, మన ఖిబ్లావైపు తిరిగేవాడు, మనం ‘జిబ’హ్‌ చేసిన జంతువును తినేవాడు ముస్లిమ్‌. అతనికి అల్లాహ్‌(త) శరణు, రక్షణ ఉంది. ప్రవక్త (స) వాగ్దానం, రక్షణ ఉంది. కనుక మీరు అతనితో చేసిన ఒప్పందం, అభయాన్ని భంగం చేయకండి.” )

వివరణ-13: ఇస్లామ్‌ ప్రారంభంలో ముస్లిములుగా మారిన కొంతమంది గురించి అనుమానంగా ఉండేది. అనుమానించ కూడదని సూచించడం జరిగింది. అంటే మనలా ఎవరైనా ఇస్లామ్‌ స్వీకరించి, నమా’జు, ‘జకాత్‌, ‘హజ్జు ఆచరిస్తూ ఉంటే అతడు అల్లాహ్‌ (త) మరియు ప్రవక్త రక్షణలోకి వచ్చినట్లే. అతన్ని కపటాచారిగా భావించి కయ్యానికి గురిచేయడం, చంపటం చేయరాదు. అతని ధనాన్ని దోచుకోరాదు. అతని ధన ప్రాణాలకు రక్షణ కల్పించాలి. అతన్ని హింసించి అల్లాహ్‌(త) మరియు ఆయన ప్రవక్త ఒప్పందాన్ని భంగం చేయరాదు.
(బు’ఖారీ)

14 – [ 13 ] ( متفق عليه ) (1/11)
وعَنْ أبَيْ هُرَيْرَةَ، قَالَ: أَتَى أَعَرَابِيُ النَّبِيَّ صلى الله عليه وسلم، فَقَالَ: دُلَّنِيْ عَلَى عَمَلٍ إِذَا عَمِلْتُهُ دَخَلَتُ الْجَنَّةَ. قَالَ: “تَعْبُدُ اللهَ وَلَا تُشْرِكُ بِهِ شَيْئًا، وَتُقِيْمُ الصَّلَاَة الْمَكْتُوْبَةَ، وَتُؤَدِّيَ الزَّكَاةَ الْمَفْرُوْضَةَ، وَتَصُوْمَ رَمْضَانَ”. قَالَ: وَالَّذِيْ نَفْسيْ بِيَدِهِ لَا أَزِيْدُ عَلَى هَذَا شَيْئًا وَلَا أَنْقُصُ مِنْهُ. فَلَمَّا وَلّى. قَالَ النَّبِيُ صلى الله عليه وسلم: “مَنْ سَرَّهُ أَن يَّنْظُرَ إِلَى رَجُلٍ مَنْ أَهْلِ الْجَنَّةِ فَلْيَنْظُرْ إِلَى هَذَا”.

(13) [1/11-ఏకీభవితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక బద్దూ (ఎడారి వాసి) వచ్చాడు. అతడు ప్రవక్త (స)ను: ‘స్వర్గం లోకి ప్రవేశింపజేసే ఏదైనా విషయాన్ని నాకు ఉపదేశించండి.’ అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స): ”నీవు అల్లాహ్‌ (త)ను ఒక్కనిగా భావించి ఆరాధించు, ఆయనకు సాటి కల్పించకు, విధి నమా’జులను తూ. చ. తప్పకుండా పాటించు. విధి ‘జకాత్‌ను చెల్లిస్తూ ఉండు, రమ’దాన్‌ ఉపవాసాలు ఆచరిస్తూ ఉండు. ఇలా ఎల్లప్పుడు చేస్తూ ఉంటే స్వర్గంలో చేర గలవు.’ అని అన్నారు. అది విన్న ఆ వ్యక్తి: ”ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన (త) సాక్షి! నేను దానికి మించను, తగ్గను.” అని అన్నాడు. అతడు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త (స): ‘ఒకవేళ ఎవరైనా స్వర్గవాసిని చూడా లనుకుంటే ఇతన్ని చూడండి.’ అని అన్నారు.)

వివరణ-14: ఆరాధన అంటే అల్లాహ్ (త) ఆదేశాల ప్రకారం ఆచరించాలి. ఆదేశించిన వాటిని ఆచరించాలి, నివారించిన వాటికి దూరంగా ఉండాలి. నమా’జు, ఉపవా సాలు, ‘జకాత్‌ మొదలైనవన్నీ ఆరాధనలోనిభాగాలే.

మరికొన్ని ఉల్లేఖనాల్లో ప్రవక్త (స) ఇస్లామ్‌ ఆదేశాలను, చిహ్నాలను గురించి ఉపదేశించారని ఉంది. ”లా అ’జీదు వలా అన్ఖు’సు” అంటే, మీరు ఆదేశించిన వాటిని తగ్గించను,’ లేక ‘వీటి ప్రచారంలో తగ్గింపుచేయను,’ అని అన్నాడు. ప్రవక్త (స) అతని దృఢవిశ్వాసాన్ని చూసి అతన్ని స్వర్గవాసి అని శుభవార్త ఇచ్చారు.(బు’ఖారీ, ముస్లిమ్‌)

15 – 14 (1/12)
وعَنْ سُفْيَانَ بْنِ عَبْدِ اللهِ الثَّقَفِيِّ، قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ! قُلْ لِّيْ فِيْ الْإِسْلَامِ قَوْلًا لَا أَسْأَلَ عَنْهُ أَحَدًا بَعْدَكَ- وَفِيْ رِوَايَةٍ: غَيْرَكَ- قَالَ: “قُلْ: آمَنْتُ بِاللهِ، ثُمَّ اسْتَقِم. رواه مسلم.

(14) [1/12-దృఢం]
సుఫియాన్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ స’ఖఫీ (ర) కథనం, నేను ప్రవక్త(స)ను: ”ఇస్లామ్‌ గురించి ఏదైనా విషయం నాకు తెలుపండి, దాని తరువాత మరొకరిని అడిగే అవసరం రాకూడదు.” అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త(స): ”అల్లాహ్‌(త)ను విశ్వసించాను అని చెప్పి, దానిపై స్థిరంగాఉండు.”అని ఉపదేశించారు.” )

వివరణ-15: ఈ ‘హదీసు’ను సుఫియాన్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ స’ఖఫీ ఉల్లేఖించారు. ‘ఉమర్‌ (ర) తన పరి పాలనా కాలంలో ఇతన్ని ‘తాయెఫ్‌ గవర్నర్‌గా నియమించారు.

ఇస్తిఖామత్‌ అంటే స్థిరంగా ఉండటం, తిన్నగా నడవడం, సరైన విధంగా అనుసరించటం. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా రుజుమార్గాన్ని అనుస రించడం. వీటిని గురించే ప్రవక్త (స) ముస్లిములందరికీ ఉపదేశించారు.

అల్లాహ్‌ ఆదేశం: ” కనుక (ఓ ప్రవక్తా!) నీవూ మరియు పశ్చాత్తాపపడి (ఆయన వైపుకు మరలిన) నీ సహచరులూ, నీకు ఆజ్ఞ ఇవ్వబడిన విధంగా ఋజు మార్గంపై స్థిరంగా ఉండండి, హద్దులు మీరకండి. నిశ్చయంగా, ఆయన మీకర్మలన్నీ చూస్తున్నాడు.” (సూ. హూద్, 11:112)

అల్లాహ్‌ ఆదేశం: ‘‘…నిశ్చయంగా, మీ ఆరాధ్యదేవుడు, ఒకే ఒక్క దేవుడు (అల్లాహ్‌); కావున మీరు నేరుగా ఆయన వైపునకే మరలండి మరియు ఆయననే క్షమాపణకై వేడుకోండి.” (సూ. ఫుస్సిలత్, 41:6) అల్లాహ్‌(త), ప్రవక్త (స)ను దీన్ని గురించే బోధించమని ఆదేశించాడు.

అల్లాహ్‌ ఆదేశం: ”కావున నీవు (ఓ ము’హమ్మద్‌!) దీని (ఈ సత్యధర్మం) వైపునకే వారిని పిలువు. మరియు నీకు ఆజ్ఞాపించబడిన విధంగా దానిపై స్థిరంగా ఉండు. మరియు వారి కోరికలను అనుసరించకు….” (సూ. అష్-షూరా’, 42:15)

ఇటువంటి వారు అల్లాహ్‌(త)ను తమ ప్రభువుగా విశ్వసించి ఇతర భయాలన్నిటిని తమ హృదయాల నుండి తీసివేశారు. ఇటువంటి వారికి అల్లాహ్‌(త): ‘మీకు ఎటువంటి భయంగానీ విచారంగాని ఉండదు.’ అని శుభవార్త తెలుపు తున్నాడు.

అల్లాహ్‌ ఆదేశం: ”నిశ్చయంగా, ఎవరైతే: “మా ప్రభువు అల్లాహ్‌ యే!” అని, తరువాత దానిపై స్థిరంగా ఉంటారో! అలాంటి వారికి ఎలాంటి భయమూ వుండదు మరియు వారు దుఃఖపడరు కూడా.” (సూ. అల్-అహ్‌ఖాఫ్‌, 46:13)

అదేవిధంగా మరో ఆదేశం: ”నిశ్చయంగా, ఎవరైతే: “అల్లాహ్‌ యే మా ప్రభువు!” అని పలుకుతూ తరువాత దానిపైననే స్థిరంగా ఉంటారో! వారిపై దేవదూతలు దిగివచ్చి (ఇలా అంటారు): “మీరు భయపడకండి మరియు దుఃఖపడకండి, మీకు వాగ్దానం చేయబడిన స్వర్గపు శుభవార్తను వినండి!” (సూ. ఫుస్సిలత్, 41:30)

ప్రవక్త (స) సుఫియాన్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ స’ఖఫీకి ఈ వాక్యాల వెలుగులోనే సమాధానం ఇచ్చారు. ఈ ‘హదీసు’ జవామి’ఉల్‌ కలిమ్‌లో ఉంది. ప్రవక్త(స) పలికిన రెండు పదాల్లో ఇస్లామ్‌ వివరణ అంతా ఇమిడి ఉంది. ఇస్లామ్‌ అంటే: ‘అల్లాహ్‌ను విశ్వసించి, దానిపై స్థిరంగా ఉండటమే.’ దాన్ని బోధించిన తర్వాత మరే పాఠం అవసరం లేదు. (ముస్లిమ్‌)

16 – [ 15 ] ( متفق عليه ) (1/12)
وعَنْ طلْحَةَ بْنِ عُبَيْدِ اللهِ، قَالَ: جَاءَ رَجُلٌ إِلَى رَسُول الله صلى الله عليه وسلم، منْ أَهْلِ نَجْدَ، ثَائِرَ الرَّأْس، نَسْمَعُ دَوِّيَّ صَوْتِهِ وَلَا نَفْقَهُ مَا يَقُوْلُ، حَتَّى دَنَا مِنْ رَّسُوْلِ اللهِ صلى الله عليه وسلم، فَإِذَا هُوَ يَسْأَلُ عَنْ الِإسْلَامِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خَمْسُ صَلَوَاتٍ فِيْ الْيَوْمِ وَاللَّيْلَةِ”. فَقَالَ: هَلْ عَلَي غَيْرُهُنَّ؟ فَقَالَ: “لَا، إِلَّا أَنْ تَطَوَّعَ. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: وَصِيَامُ شَهْرِ رَمْضَانَ”. قَالَ: هَلْ عَلَيَّ غَيْرُهُ؟ قَالَ: “لَا، إِلَّا أَنْ تَطَوَّعَ”. قَالَ: وَذَكَرَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم الزَّكَاةَ، فَقَالَ: هَلْ عَلَيَّ غَيْرُهَا؟ فَقَالَ: “لَا! إلَّا أَنْ تَطَوَّعَ. قَالَ: فَأَدْبَرَ الرَّجُلُ وَهُوَ يَقُوْلُ: وَاللهِ لَا أَزِيْدُ عَلَى هَذَا وَلاَ أَنْقُصُ مِنْهُ. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “أَفْلَحَ الرَّجُلُ إِنْ صَدَقَ” .

(15) [1/12-ఏకీభవితం]
‘తల్‌’హా బిన్‌ ‘ఉబైదుల్లాహ్‌ (ర) కథనం: ‘నజ్ద్‌ నుండి ఒక వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చాడు. అతని తల వెంట్రుకలు చిందర వందరగా ఉన్నాయి. మేము అతని నోటి నుండి వచ్చే శబ్దాన్ని వినేవాళ్ళం. కాని ఆయన మాటలు అతన్ని దూరంగా ఉండటం వల్ల అర్థం చేసుకోలేకపోయే వాళ్ళం. సరాసరి అతను ప్రవక్త (స) వద్దకు వచ్చి, ఇస్లామ్‌ గురించి ప్రశ్నించాడు.’ దానికి ప్రవక్త (స): ‘ఇస్లామ్‌ ఆదేశాల్లో రాత్రీపగల్లో 5 పూటలు నమా’జు తప్పనిసరిగా చదవాలి.’ అని ఉపదేశించారు. దానికతడు: ‘ఇవికాక మరేవైనా విధి నమా’జులు ఉన్నాయా.’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స): ‘లేవు కాని, అదనపు నమా’జులు ఉన్నాయి. నీవు సంతోషంగా చదివితే పుణ్యం లభిస్తుంది, చదవకపోతే ఎటువంటి పాపం చుట్టుకోదు.’ అని అన్నారు. ప్రవక్త (స): ‘ఇస్లామ్‌లోని మరో ముఖ్య విధి రమ’దాన్‌ నెల ఉపవాసాలు పాటింటాలి.’ అని హితబోధ చేశారు. దానికి ఆ వ్యక్తి: ‘ఇవి కాక మరేవైనా ఉపవాసాలు నాపై ఉన్నాయా?’ అని విన్న వించు కున్నాడు. దానికి ప్రవక్త (స): ‘ఇతర అదనపు ఉపవాసాలు ఉన్నాయి కాని, అవి విధికావు. అయితే నీవు కోరితే అదనపు ఉపవాసాలు పాటించ వచ్చు.’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స): ‘జకాత్‌ కూడా తప్పనిసరి విధి.’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి: ‘ఇవి కాక మరేవైనా విధిగా ఉన్నాయా?’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స): ‘లేవు కాని, దానధర్మాలు చేయవచ్చు.’ అని అన్నారు. ఆ తరువాత ఆ వ్యక్తి తిరిగి వెళుతూ: ‘అల్లాహ్ సాక్షి! మీరు చెప్పిన దానికి మించను, తగ్గించను.’ అని అంటూ పోయాడు. అప్పుడు ప్రవక్త (స): ‘ఒకవేళ ఈ వ్యక్తి సత్యం పలుకుతున్నట్లయితే, సాఫల్యం పొందుతాడు.’ అని అన్నారు.

వివరణ-16: ఈ ‘హదీసు’ ఉల్లేఖన కర్త ‘తల్‌’హా బిన్‌ ‘ఉబైదుల్లాహ్. ఇతను హిజ్రత్‌కు 24 లేక 25 సంవత్సరాలు ముందు జన్మించారు. వీరు ప్రారంభ ముస్లిముల్లో ఒకరు. ఇస్లామ్‌ స్వీకరించిన తర్వాత అవిశ్వాసులు ఇతన్ని చాలా హింసించారు. చివరికి హిజ్రత్‌ చేసి మదీనహ్ వచ్చారు. ఇస్లామీయ పోరాటాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 62 సంవత్స రాల వయస్సులో వీరమరణం పొందారు.
(బు’ఖారీ, ముస్లిమ్‌)

17 – [ 16 ] ( متفق عليه ) (1/12)
وعَنْ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا، قَالَ: إِنَّ وَفْدَ عَبْدِ الْقَيْسِ لمَاَّ أَتَوُا النَّبِيَّ صلى الله عليه وسلم؛ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنِ الْقَوْمُ ؟- أَوْ: مَنِ الْوَفْدُ؟- “قَالَوْا: رَبِيْعَةُ. قَالَ: “مَرْحَبًا بِالْقَوْمِ -أَوْ: بِالوَفْدِ – غَيْرَ خَزَايَا وَلَا نَدَامَى”. قَالَوْا: يَا رَسُوْلَ اللهِ! إِنَّا لَا نَسْتَطِيْعُ أَنْ نَأْتِيْكَ إلَّا فِيْ الشَّهْرِ الْحَرَامِ، وَبَيْنَنَا وَبَيْنَكَ هَذَا الْحَيُّ مِنْ كُفَّارِ مُضَرَ؛ فَمُرْنَا بِأَمْرِ فَصْلٍ نُخْبِرُ بِهِ مَنْ وَرَاءَنَا وَنَدْخُلُ بِهِ الْجَنَّةَ، وَسَأَلُوُهُ عَنْ الْأَشْرِبَةِ. فَأَمَرَهُمْ بِأَرْبَعٍ، وَنَهَاهُمْ عَنْ أَرْبَعٍ: أَمَرَهُمْ بِالْإِيْمَانِ بِاللهِ وَحْدَهُ، قَالَ: “أَتَدْرُوْنَ مَا الْإِيْمَانُ بِاللهِ وَحْدَهُ؟” قَالَوْا: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: “شَهَادَةُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُوْلُ اللهِ، وَإِقَامُ الصَّلَاةِ، وَإِيْتَاءِ الزَّكَاةِ، وَصِيَامُ رَمَضَانَ، وَأَنْ تُعْطُوْا مِنَ الْمَغْنَمِ الْخُمُسَ. “وَنَهَاهُمْ عَنْ أَرْبَعٍ: عَنْ الْحَنْتَمِ، وَالدُّبَآءِ، وَالنَّقِيْرِ، وَالْمُزَفَّتِ. وَقَالَ: “اِحْفَظُوْهُنَّ وَأَخْبِرُوْا بِهِنَّ مَنْ وَرَاءَكُمْ”. وَلَفْظُهُ لِلْبُخَارِيِّ

(16) [1/12-ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ‘అబ్దుల్‌ ఖైస్‌ తెగకు చెందిన ఒక బృందం ప్రవక్త (స) వద్దకు వచ్చినపుడు, ప్రవక్త (స) వారిని, ‘మీరు ఏతెగకు చెందినవారు.’ అని అడిగారు. దానికి వారు, ‘మేము రబీ’అహ్ తెగకు చెందినవారము.’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) వారికి స్వాగతం పలికారు. ఇంకా ఇహపరలోకాల్లో శుభం కలగాలని దీవించారు. అనంతరం వారు: ‘ఓ ప్రవక్తా! మేము చాలా దూరం నుండి వచ్చాం. మేము కేవలం యుద్ధం నిషేధించబడిన శుభ మాసాల్లోనే రాగలము. ఎందుకంటే మీకూ మాకూ మధ్య అవిశ్వాస ము’దర్‌ తెగవారున్నారు. ఇతర నెలల్లో వస్తే వారు మాతో యుద్ధం చేస్తారు. అందువల్ల తమరు ఏదైనా చాలా ముఖ్యమైన విషయాన్ని ఉపదేశించండి, మేము వెళ్ళి మా జాతి వారికి తెలియ పరుస్తాం. మేము కూడా దాన్ని ఆచరించి స్వర్గంలో ప్రవేశించడానికి అర్హులుగా మారతాము. దీనికి తోడు ఇంతకు ముందు నబీ’జ్‌ తయారుచేసే పాత్రల గురించి కూడా ప్రశ్నిస్తూ ‘ఆ పాత్రలను ఉపయో గించడం ధర్మమా అధర్మమా?’ అని అడిగారు. అప్పుడు ప్రవక్త (స) వారికి 4 విషయాల గురించి ఆదేశించారు, 4 విషయాల నుండి వారించారు:

”1. అల్లాహ్‌(త)ను విశ్వసించమని ఆదేశించారు. ‘కేవలం అల్లాహ్‌(త)నే విశ్వసించండి.’ అని పలికి; ‘మీకు తెలుసా? అల్లాహ్‌(త)ను ఎలా విశ్వసించాలో?’ అని అడిగారు. దానికి వారు: ‘అల్లాహ్(త), ఆయన ప్రవక్త(స) కే బాగా తెలుసు.’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స): ‘అల్లాహ్‌ (త)ను విశ్వసించడం అంటే, అల్లాహ్‌(త) తప్ప ఆరాధ్యులెవరూ లేరని, ము’హమ్మద్‌ (స) అల్లాహ్‌(త) ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వటం. నమా’జును ప్రశాంతంగా చదవటం, ‘జకాత్‌ చెల్లించటం, రమ’దాన్‌ ఉపవాసాలు పాటించటం, యుద్ధ ధనంలో నుండి 5వ వంతు ప్రజానిధికి ఇవ్వటం.’ ఇంకా 4 రకాల పాత్రలను ఉపయోగించ టాన్నుండి వారించారు అవి: 1. హతమ్, అంటే లాఖ్ తో చేసిన తొట్టె లేక మర్తబాన్. 2. దుబ్బ, అంటే ఎండిన గుమ్మడి కాయతో చేసిన పాత్రలను, 3. నఖీర్, అంటే ఖర్జూరం చెట్టు లోపలి భాగం తీసిన కర్రతో చేసినపాత్రలు, 4. ము’జఫ్పత్, అంటే సున్నితమైన లోహంతో చేయ బడిన పాత్రలను ఉపయోగించవద్దు.’ అని వారించారు. ఇంకా ఈ విషయాలను గుర్తుంచుకోండి, ఇక్కడకు రాని మీ జాతివారికి తెలియపరచండని ఆదేశించారు.)

వివరణ-17: ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) ప్రవక్త (స) చిన్నాన్న కుమారులు. హిజ్రత్‌కు 3 సం.ల ముందు మక్కహ్ లో జన్మించారు. తన తల్లితో పాటే బాల్యంలో ఇస్లామ్‌ స్వీక రించారు. ఇంకా తన తల్లివెంట బలహీన ప్రజలకు అండగా ఉండేవారు. ఆ తరువాత మదీనహ్ వైపు హిజ్రత్‌ చేశారు. ఎల్లప్పుడూ ప్రవక్త (స) వెంటే ఉండేవారు. ప్రవక్త (స) మరణ సమయంలో అతని వయస్సు 13 సంవత్సరాలు. చాలా జ్ఞానసంపన్నులు, ఖుర్ఆన్ వ్యాఖ్యాన విద్యలో ఆరితేరిన వారు. అదేవిధంగా ‘హదీసు’ విద్యలోనూ ప్రావీణ్యులే.

ఈ బృందం ప్రవక్త (స) వద్దకు రెండుసార్లు వచ్చింది. ఒకసారి మక్కహ్ విజయానికి ముందు 5వ హిజ్రీలో లేదా అంతకు ముందు. ఈ బృందంలో 13 లేక 14 మంది సభ్యులు ఉన్నారు. వీరి పేర్లు ఫత్‌’హుల్‌ బారీలో ఉన్నాయి. మరోసారి 8 లేక 9 వ హిజ్రీలో. అప్పుడు 40 మంది సభ్యులు ఉన్నారు. వీరు బహ్‌రైన్‌ ప్రాంతానికి చెందిన వారు. ఇస్లామ్‌లో మస్జిదె నబవీ తరువాత అన్నింటి కంటే మొట్ట మొదటి జుమ’అహ్ వీరి మస్జిద్‌లోనే చదివించబడింది. (బు’ఖారీ).

బహ్‌రైన్‌లోని జువాసీ’ అనే గ్రామంలో ‘అబ్దుల్‌ ఖైస్‌ మస్జిద్‌లో మస్జిదెనబవీ తరువాత మొట్టమొదటి జుమ’అహ్ జరి గింది. ఈ బృందంలో ‘అబ్దుల్‌ ఖైస్‌ అనే వ్యక్తి కూడా ఉండే వారు. ఇతను చాలా దయా మయుడు, బుద్ధిమంతు డూను. ఈ ‘హదీసు’లో ‘హజ్జ్ ప్రస్తావన లేదు. కాని బైహఖీ, ముస్నద్‌ అ’హ్మద్‌లలో ‘హజ్జ్ ప్రస్తావన ఉంది. నిజం అల్లాహ్ కు తెలుసు.

(బు’ఖారీ, ముస్లిమ్‌) దీని పదాలు బు’ఖారీలోనివి.

18 – [ 17 ] ( متفق عليه ) (1/13)
وعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ، قَالَ: قَالَ رسول الله صلى الله عليه وسلم، وَحَوْلَهُ عِصَابَةُ مِّنْ أَصَحَاِبهِ: “بَايِعُوْنِيْ عَلَى أَنْ لَّا تَشْرِكُوْا بِاللهِ شَيْئًا، وَلَا تَسْرِقُوْا، وَلَا تَزْنُوْا، وَلَا تَقْتُلُوْا أَوْلَادَكُمْ، وَلَا تَأْتُوْا بِبُهْتَانٍ تَفُتَرُوْنَهُ بَيْنَ أَيْدِيْكُمْ وَأَرْجُلِكُمْ، وَلَا تَعْصَوْا فِيْ مَعْرُوْفٍ. فَمَنْ وَفِىْ مِنْكُمْ فَأَجْرُهُ عَلَى اللهِ، وَمَنْ أَصَابَ مِنْ ذَلِكَ شَيْئًا فَعُوْقِبَ بِهِ فِيْ الدُّنْيَا؛ فَهُوَ كَفَّارَةٌ لَهُ، وَمَنْ أَصَابَ مِنْ ذَلِكَ شَيْئًا ثُمَّ سَتَرَهُ اللهُ عَلَيْهِ فِيْ الدُّنْيَا؛ فَهُوَ إِلَى اللهِ: إِنْ شَآءَ عَفَا عَنْهُ، وَإِنْ شَاءَ عاَقَبَهٌ”. فَبَايَعَنْاهُ عَلَى ذَلِكَ.

(17) [1/13-ఏకీభవితం]
‘ఉబాదహ్‌ బిన్‌ సా’మిత్‌ (ర) కథనం: ప్రవక్త (స): తమ వద్దకు వచ్చిన ఒక బృందంతో మీరు నాతో ఈ విధంగా వాగ్దానం (బై’అత్) చేయండి అని అన్నారు,” ‘అల్లాహ్‌(త)కు ఎవ్వరినీ సాటి కల్పించము, దొంగతనం చేయము, వ్యభిచారానికి పాల్పడము, బిడ్డలను సజీవంగా చంపము, ఇతరులపై అభాండాలు వేయము, సత్కార్యాల్లో అవిధేయత చూపము.’ ఈ వాగ్దానాన్ని నెరవేర్చిన వాడి ప్రతిఫలం అల్లాహ్‌(త)పై ఉంది. నిషేధించినవాటికి పాల్పడితే, ప్రపంచంలో అతనిని శిక్షించడం జరుగుతుంది. ఇది అతనికి పరిహారంగా. ఇంకా ఒకవేళ ఎవరైనా వాటికి పాల్పడితే, అల్లాహ్‌(త) దాన్ని దాచి ఉంచితే, అది అల్లాహ్‌(త)పై ఉంది. ఆయన కోరితే శిక్షించగలడు లేదా క్షమించగలడు. మేమందరం దీనిపై వాగ్దానం చేస్తున్నాము.”)

వివరణ-18: ఈ ‘హదీసు’ను ప్రఖ్యాత ప్రవక్త (స) అనుచరులు ‘ఉబాదహ్‌ బిన్‌ సా’మిత్‌ (ర) ఉల్లేఖించారు. ఇతను మదీనహ్ వాసులు (అ’న్సారి). ఇస్లామ్‌ సందేశం విన్న అదృష్టవంతుల్లో ‘ఉబాదహ్‌ బిన్‌ సా’మిత్‌ కూడా ఒకరు. అ’న్సారుల బృందం 3 సంవత్సరాల వరకు మదీనహ్ నుండి మక్కహ్ వచ్చే వారు. ఉబాదహ్‌ కూడా ప్రతిసారి వచ్చారు. మొదటి సారి 10 మంది గల బృందం వచ్చింది. వారిలో 6 గురు ఇస్లామ్‌ స్వీకరించారు. వారిలో ‘ఉబాదహ్‌ ఒకరు. రెండవ బృందంలో 12 మంది ఇస్లామ్‌ స్వీకరించారు. మూడవ బృందంలో 73 మంది వచ్చారు. అప్పుడు కూడా ఉబాదహ్‌ వచ్చారు. చివరిసారి వచ్చినపుడు ప్రవక్త (స) అతన్ని ప్రయాణ బృందానికి నాయకునిగా నియ మించారు. ముస్లిమ్‌ అయిన తర్వాత తన తల్లిని కూడా ముస్లిమ్‌గా మార్చారు. బద్ర్‌ యుద్ధం, బై’అతు ర్రి’ద్వాన్‌లలో పాల్గొన్నారు. ‘ఉమర్‌ (ర) తన పరి పాలనా కాలంలో అతన్ని ఫలస్తీన్‌ ఖా’దీగా నియమించారు. ‘ఉస్మాన్‌ (ర) కాలంలో సిరియా దేశంలో మరణించారు.

బా’య’ఊ’ (బై’అత్) అంటే క్రయవిక్రయాలు చేయడం, వ్యవ హారం, వస్తువును వస్తువుకు బదులు అమ్మడం, కొనడం, వ్యాపారం అంటారు. ఇస్లామ్‌లో ప్రవక్త చేతిపై లేక ఒక పుణ్య ముస్లిం పురుషుని చేతిపై చేయిపెట్టి తన్ను తాను ఆయనకు విధేయునిగా చేయటం (అమ్మటం). దాని ప్రకారం ఆచరిస్తే అతనికి స్వర్గం లభిస్తుంది. దైవప్రీతి లభిస్తుంది. అంటే తన ధన, మాన, ప్రాణాలకు బదులుగా స్వర్గాన్ని కొనడానికి బై’అత్‌ అంటారు. అల్లాహ్‌ ఆదేశం: ”నిశ్చయంగా, అల్లాహ్‌ విశ్వాసుల నుండి వారి ప్రాణాలను వారి సంపదలను కొన్నాడు. కాబట్టి నిశ్చయంగా, వారి కొరకు స్వర్గముంది. వారు అల్లాహ్‌ మార్గంలో పోరాడి (తమ శత్రువులను) చంపుతారు మరియు చంపబడతారు. మరియు ఇది తౌరాత్, ఇంజీల్‌ మరియు ఖుర్‌ఆన్‌లలో, ఆయన (అల్లాహ్‌) చేసిన వాగ్దానం, సత్యమైనది. మరియు తన వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్‌ను మించినవాడు ఎవడు? కావున మీరు ఆయనతో చేసిన వ్యాపారానికి సంతోషపడండి. మరియు ఇదే ఆ గొప్ప విజయం. (సూ. అత్‌-తౌబహ్, 9:111)

అంటే అల్లాహ్‌కూ విశ్వాసులకూ ఒక వ్యవహారం జరిగింది. వ్యాపారంలో లావాదేవీలు జరిగినట్లు. విశ్వాసులు తమ ధన, ప్రాణ, మానాలను అల్లాహ్‌(త)కు అమ్మివేశారు. వాటికి బదులు అల్లాహ్‌ స్వర్గం ప్రసాదిస్తాడు. దీన్నే బై’అత్‌ అంటారు. చేతిపై చేయి పెట్టి వాగ్దానం చేసినా, లేక కేవలం వాగ్దానం చేసినా సరే. దీన్ని ప్రమాణం అంటారు. ప్రపంచంలో అల్లాహ్ (త) ఆదేశంతో ప్రవక్త ఆ బాధ్యతను నిర్వహిస్తాడు. ప్రజల నుండి దైవవిధేయతపై దైవాజ్ఞాపాలనపై ప్రమాణం తీసుకుంటాడు. ప్రవక్త (స) చేతిపై ప్రమాణం చేసినవారు దైవం చేతిపై ప్రమాణం చేసినట్టే.

అల్లాహ్‌ ఆదేశం: ”(ఓ ము’హమ్మద్‌!) నిశ్చయంగా, (నీ చేతిలో చేయివేసి) నీతో శపథం చేసేవారు, వాస్తవానికి అల్లాహ్‌తో శపథం చేస్తున్నారు. అల్లాహ్‌ చెయ్యి వారి చేతుల మీద ఉంది. ఇక ఎవడు (తన శపథాన్ని) భంగం చేస్తాడో, వాస్తవానికి అతడు తన నష్టం కొరకే తన శపథాన్ని భంగం చేస్తాడు. మరియు ఎవడు తన వాగ్దానాన్ని పూర్తి చేస్తాడో, అల్లాహ్‌ అతనికి గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు.” (సూ. అల్‌-ఫత్‌హ్‌, 48:10)

హుదైబియాలో సుమారు 1400 మంది అనుచరులు దైవ మార్గంలో పోరాడుతామని ప్రవక్త (స) చేతిపై బై’అత్‌ చేశారు. దీన్ని బై’అతె రి’ద్వాన్‌ అంటారు. ఈ ఆయత్ లో దీన్ని గురించే ప్రస్తావించబడింది. ఈ బైఅత్‌ను ఆచరించి చూపించిన వారి పట్ల అల్లాహ్‌ సంతృప్తి చెందాడు.

అల్లాహ్‌ ఇలా ఆదేశించాడు: ”ఓ ప్రవక్తా! విశ్వసించిన స్త్రీలు ప్రమాణం (బై’అత్‌) చేయటానికి నీవద్దకు వచ్చి, తాము ఎవరినీ అల్లాహ్‌కు సాటి కల్పించమని మరియు దొంగతనం చేయమని మరియు వ్యభిచారం చేయమని మరియు తమ సంతానాన్ని హత్యచేయమని మరియు తమ చేతుల మధ్య మరియు తమ కాళ్ళ మధ్య నిందారోపణ కల్పించమని మరియు ధర్మసమ్మతమైన విషయాలలో నీకు అవిధేయత చూపమని ప్రమాణం చేస్తే, వారి నుండి ప్రమాణం (బై’అత్‌) తీసుకో మరియు వారిని క్షమించమని అల్లాహ్‌ను ప్రార్థించు. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.” (సూ. అల్-ముమ్‌తహినహ్‌, 60:12)

ఈ దైవాజ్ఞ ప్రకారం ప్రవక్త (స) స్త్రీ పురుషులతో ప్రమాణం తీసుకున్నారు. వారి ప్రమాణం స్వీకరించారు. కొందరు ఇస్లామ్‌పై, మరికొందరు జిహాద్‌, ‘హిజ్రత్‌లపై, నమా’జ్‌, ఉపవాసాలకు కట్టుబడి ఉంటామని, కొందరు ప్రవక్త సాంప్ర దాయానికి కట్టుబడి ఉంటామని, బిద్‌’అత్‌లకు దూరంగా ఉంటామని ప్రమాణం చేసేవారు. ప్రవక్త (స) వారి నుండి ఆ విధంగానే ప్రమాణం తీసుకునేవారు. ఆ తరువాత ‘ఖలీఫాలు కూడా ప్రజలతో ప్రమాణం తీసుకున్నారు. షాహ్‌ వలిఉల్లాహ్‌ కూడా ”ఖౌల్ అల్ జమీల్‌”లో అనేక రకాల బై’అత్‌లు ఉన్నాయని, వాటిలో బై’అతె ఖిలాఫత్‌, కొన్నిబై’అతె ఇస్లామ్‌,మరికొన్ని బైఅతె త’ఖ్‌వా, మరికొన్ని బై’అతె హిజ్రత్‌ మరియు జిహాద్‌ ఇంకా జిహాద్‌లో స్థిరంగా ఉండే బై’అత్‌ మొదలైనవి.

ఇస్లామీయ పద్ధతిపై బై’అత్‌ చేయడం సాంప్రదాయ బద్ధమైనదే. అయితే ఆ వ్యక్తిలో ఆ గుణాలన్నీ ఉండాలి. ‘హదీసు’ వివరణ ఏమిటంటే, ప్రవక్త (స) అనుచరులతో: ”మీరు అల్లాహ్‌కు సాటి కల్పించరని, దొంగతనం చేయరని, వ్యభిచారం చేయరని, పసిబిడ్డలను చంపరని, ఇతరులపై అభాండాలు వేయరని ప్రమాణం చేయండి.” అని అన్నారు. అయితే ‘ఉబాదహ్‌ బిన్‌ సా’మిత్‌ చేసిన ఈ బై’అత్‌ మక్కహ్ విజయం తరువాత జరిగింది. ‘హాఫిజ్‌ ఇబ్నె ‘హాజర్‌ ఫత్‌హుల్‌ బారీలో దీన్ని వివరంగా పేర్కొన్నారు.
(బు’ఖారీ, ముస్లిమ్)

19 – [ 18 ] ( متفق عليه ) (1/13)
وعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ، قَالَ: خَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ أَضْحَى أَوْ فِطْرٍ إِلَى الْمُصَلَّى، فَمَرَّ عَلَى النِّسَاءِ، فَقَالَ: يَا مَعْشَرَ النِّسَاءِ! تَصَدَّقْنَ، فَإِنِّيْ أَرِيْتُكُنَّ أَكْثَرَ أَهْلِ النَّارِ. فَقُلْنَ: وَبِمَ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “تَكْثِرنَ اللَّعَنْ، وَتَكْفُرْنَ الْعَشِيْرَ، مَا رَأَيْتُ مِنْ نَاقِصَاتِ عَقْلٍ وَدِيْنٍ أَذْهَبَ لِلُبِّ الرَّجُلِ الْحَازِمِ مِنْ إِحْدَاكِنَّ”. قُلْنَ: وَمَا نُقْصَانُ دِيْنِنَا وَعَقلِنَا يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “أَلَيْسَ شَهَادَةُ الْمَرْأَةِ مثل نِصْفُ شَهَادَةِ الرَّجُلِ؟” قُلْنَ: بَلَى. قَالَ: “فَذَلِكَ مِنْ نُّقْصَانِ عَقْلِهَا. قَالَ: أَلَيْسَ إِذَا حَاضَتِ لَمْ تُصَلِّ وَلَمْ تَصُمْ؟” قُلْنَ: بَلىَ. قَالَ: “فَذَلِكَ مِنْ نُّقْصَانِ دِيْنِهَا”.

(18) [1/13-ఏకీభవితం]
అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: “ప్రవక్త (స) ‘ఈదుల్‌ అ’ద్హా లేదా ‘ఈదుల్‌ ఫి’త్ర్‌ నాడు ‘ఈద్‌గాహ్‌ వైపు బయలుదేరారు. ప్రవక్త (స) మహిళల ప్రక్కనుండి వెళ్ళడం జరిగింది. ప్రవక్త (స) మహిళలను ఉద్దేశించి: ”ఓ స్త్రీలారా! మీరు దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉండండి. ఎందు కంటే మీరు చాలా అధిక సంఖ్యలో నరకంలో ప్రవేశించటం నాకు చూపటం జరిగింది.” అంటే, ‘స్త్రీలు అధిక సంఖ్యలో నరకంలో ప్రవేశిస్తారు.’ అని అన్నారు. దానికి వారు: ‘ప్రవక్తా! ఏ కారణం వల్ల స్త్రీలు అధికంగా నరకంలో ప్రవేశిస్తారు’ అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స), ”మీరు శాపనార్థాల, ఎత్తి పొడుపు మాటలు అధికంగా చేస్తారు. ఇంకా భర్తల పట్ల అవిధేయతగా, కృతఘ్నతగా ప్రవర్తిస్తారు. ధర్మం మరియు బుద్ధీజ్ఞానాల కొరత మీలోనే అధికంగా ఉంది.” అని అన్నారు. దానికి వారు: ‘మా ధర్మం, బుద్ధీజ్ఞానాల్లో కొరత ఎలా ఉంది.’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స): ‘ఒక స్త్రీ సాక్ష్యం ఒక వ్యక్తి సాక్ష్యానికి సగం ఉంది కదా (అంటే ఇద్దరు స్త్రీల సాక్ష్యం ఒక పురుషుని సాక్ష్యానికి సమానం).’ అని అన్నారు. దానికి వారు: ‘అవును.’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స): ‘ఇది వారి బుద్ధీ జ్ఞానాల కొరతవల్ల.’ అని అన్నారు. అదేవిధంగా: ‘స్త్రీలు రుతుస్రావం జరిగినప్పుడు నమా’జు, రో’జాలు ఆచరించరుకదా!’ అని అన్నారు. దానికి స్త్రీలు: ‘అవును.’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స): ‘ఇది వారి ధార్మిక లోపం.’ అని అన్నారు. )

వివరణ-19: ప్రఖ్యాత అనుచరులు అబూ స’యీద్‌ ‘ఖుద్రీ ఈ ‘హదీసు’ను ఉల్లేఖించారు. ఇతని పేరు స’అద్‌ ఉండేది. కునియత్‌ అబూ స’యీద్‌. ‘ఖుద్రహ్‌ వంశానికి చెందిన వారు. అందువల్లే ఇతన్ని ‘ఖుద్రీ అంటారు. 117 ‘హదీసు’లు ఉల్లేఖించారు. చాలా గొప్ప ‘హదీసు’వేత్త, పండితులు. మదీనహ్ లో తన తల్లిదండ్రులతో పాటు ఇస్లామ్‌ స్వీకరించారు. మస్జిదె నబవీ నిర్మాణంలో పాల్గొని ప్రశంసలందుకున్నారు. 15 సంవత్సరాల వయస్సులో ము’స్తలఖ్, కందక యుద్ధాలలో, ప్రవక్త (స) ప్రశంసలు పొందారు. ‘హుదైబియా ఒప్పందం, ‘ఖైబర్‌, మక్కహ్ విజయం, ‘హునైన్‌, తబూక్‌, అవ్’తాస్‌ పోరాటాల్లో పాల్గొన్నారు. ప్రవక్త (స) మరణానంతరం మదీనహ్ లో స్థిరపడ్డారు. ‘ఉమర్, ‘ఉస్మాన్‌ (ర) కాలంలో ఫత్వాలు ఇచ్చేవారు. 74 హిజ్రీ శకంలో శుక్రవారం నాడు మర ణించారు. అప్పుడు అతని వయస్సు 86 సంవత్సరాలు ఉండేది. బఖీ’లో ఖననం చేయబడ్డారు. మంచిని ఆదేశించే, చెడును నిర్మూలించే విషయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రవక్త సాంప్ర దాయబద్ధంగా ఉండే వారు.

స్త్రీలు నమా’జు చదవడానికి ఈద్గాహ్‌ వెళ్ళేవారు. పురుషులకు దూరంగా ఉండటం వల్ల ప్రవక్త (స) ప్రసంగం వినలేకపోయే వారు. ప్రవక్త (స) వారి వద్దకు వెళ్ళి, వారికి హితబోధచేశారు. సాధారణంగా స్త్రీలలో ఈ విషయాలు ఉంటాయి. అంటే శాపనార్థాలు పెట్టటం, ఎత్తిపొడవటం, భర్తలకు అవిధేయత చూపటం మొదలైనవి. అందువల్ల ప్రవక్త (స) వారిని హెచ్చరించి, దానధర్మాలు చేయమని ఆదేశించారు. దానధర్మాలు చేయటం వల్ల శిక్ష తగ్గుతుంది, నరకంనుండి విముక్తి కూడా లభిస్తుంది. శారీరకంగా, తెలివి తేటల పరంగా స్త్రీలు పురుషుల కంటే బలహీనులు. సాక్ష్యంలో ఇద్దరు స్త్రీల సాక్ష్యం ఒక పురుషుని సాక్ష్యానికి సమానంగా భావించడం జరుగు తుంది. ఒకామె మరచిపోతే మరొకామె గుర్తుచేస్తుంది. అదే విధంగా బహిష్టు, మరియు ప్రసవాల వల్ల పరిపూర్ణంగా ఆచరించలేరు కూడా. ఇది వారి ధార్మిక లోపం. వారి బుద్ధిహీనత, వారివరకే పరిమితమై ఉండదు. ఒక్కోసారి తెలివైన వాడిని కూడా బుద్ధిహీనుడిగా చేసివేస్తుంది.
(బు’ఖారీ, ముస్లిమ్‌)

20 – 19 (1/14)
وَعَنْ أبِيْ هُرَيْرَةَ، قَالَ: “قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قَالَ اللهُ تعالى: “كَذَّبَنِيْ اِبْنُ آدَمَ وَلَمْ يَكُنْ لَهُ ذَلِكَ، وَشَتَمَنِيْ وَلَمْ يَكُنْ لَهُ ذَلِكَ؛ فأَمَّا تَكْذِيْبُهُ إِيَّاَي فقوله: لن يعيدني كما بدأني، وَليس أول الخلق بأهون عليّ من اعادته. و أما شتمه إياي: فقوله: اِتَّخَذَ اللهُ وَلَدًا؛ ]وَأَنَا الأحد الصَّمَدُ الَّذِيْ لَمْ أَلِدْ وَلَمْ أُوْلَدْ ، وَلَمْ يَكُنْ لِّيْ كُفُؤًا أَحَدٌ[“.

(19) [1/14-దృఢం]
అబూ హురైరహ్‌ (ర) కథనం, ప్రవక్త (స) ప్రవచనం: ”అల్లాహ్‌ ఇలా ఆదేశిస్తున్నాడు: ” ‘ఆదమ్‌ పుత్రుడు నన్ను తిరస్కరిస్తున్నాడు, ఇది అతనికి తగదు, నన్ను తిడు తున్నాడు, ఇది కూడా అతనికి తగదు. అతడు నన్ను తిరస్కరించటం ఏమిటంటే, అల్లాహ్‌ (త) నన్ను మళ్ళీ లేప లేడు, అంటే మొదటిసారి సృష్టించి నట్టు.’ అని అంటున్నాడు. అయితే రెండవ సారి కంటే మొదటిసారి సృష్టించటం అంత సులువేమీ కాదు. ఇంకా నన్ను తిట్టటం ఏమిటంటే, అల్లాహ్‌ ఒకరిని కుమారుడుగా ఎన్నుకున్నాడని అంటు న్నాడు, వాస్తవం ఏమిటంటే, నేను ఒక్కడినే, అక్కర లేని వాడిని, నేను ఒకనికి (జన్మ మివ్వలేదు) తండ్రినికాదు, లేదా ఎవరికీ పుట్టనూ లేదు (నాకు తల్లి దండ్రులు లేరు) ఇంకా నాకు సరిసమానులు ఎవరూ లేరు.” (సూ. అల్ ఇఖ్లాస్, 112:1-4) )

వివరణ-20: ఈ ‘హదీసు’లో అల్లాహ్‌ (త) గుణాలను పేర్కొనడం జరిగింది. అంటే అల్లాహ్‌ (త) ఒకే ఒక్కడు, ఆయనకు సాటి ఎవరూ లేరు. ఆయనకు భార్యాపిల్లలు ఎవరూ లేరు. ఇటువంటి విషయాలకు ఆయన అతీతుడు. ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది. ప్రాణులన్నీ చని పోతాయి. తీర్పుదినం నాడు అల్లాహ్‌ (త) మానవులందరినీ సజీవపరచి అందరినీ విచారిస్తాడు. అయితే అవిశ్వాసులు తీర్పుదినాన్ని విశ్వసించరు. మరల సజీవపరచడాన్ని విశ్వసించరు. వీరు దైవాన్ని తిరస్కరిస్తారు. ఏమీ లేని వారిని మొదట సృష్టించాడు. మళ్ళీ సృష్టించడం అల్లాహ్‌(త)కు చాలా సులువైన పని. అందువల్ల అందరూ తీర్పుదినాన్ని, మరల లేపబడటాన్ని విశ్వసించాలి.

అల్లాహ్‌ను తిట్టటం అంటే అల్లాహ్‌(త)కు భార్యాబిడ్డలు ఉన్నారని విశ్వసించటం. ఉదాహరణకు క్రైస్తవులు ‘ఈసా (అ) అల్లాహ్‌ (త) కుమారులు అని నమ్ముతారు. యూదులు ‘ఉజైర్‌ (అ) అల్లాహ్‌ (త) కుమారులు అని విశ్వసిస్తారు. మరి కొందరు దైవదూతలు అల్లాహ్‌ (త) కుమార్తెలని విశ్వసిస్తారు. ఇవన్నీ అల్లాహ్‌ (త) విషయంలో తిట్లవంటివే. ఖుర్‌ఆన్‌లో వీటన్నిటినీ ఖండించటం జరిగింది. అల్లాహ్‌ (త) సూరహ్‌ ఇ’ఖ్లా’స్‌లో ఇలా ఆదేశించాడు: ”ఇలా అను: ‘ఆయనే అల్లాహ్‌! ఏకైకుడు. అల్లాహ్‌! ఎవరి అక్కరా లేనివాడు. ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు. మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చ దగినది ఏదీ లేదు.’ ” ( సూ. అల్-ఇఖ్లాస్, 112:1-4)
(బు’ఖారీ)

21 – 20 (1/14)
وَفِيْ رِوَايَةٍ عَنْ ابْنِ عَبَّاسٍ: “وَأَمَّا شَتْمُهُ إِيَّايَ فَقَوْلُهُ: “لِيْ وَلَدٌ وَسُبْحَانِيْ أَنْ اتَّخِذَ صَاحِبَةً أَوْ وَلَدًا”. رَوَاه البخاري.

(20) [1/14-దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”అతన్ని తిట్టటం ఏమిటంటే, ‘నాకు (అల్లాహ్ కు) సంతానం ఉందని అనడం. వాస్తవానికి నేను భార్యా పిల్లలు కలిగి ఉండటానికి అతీతుడ్ని.” )

వివరణ-21: అల్లాహ్‌(త)ను ఎవరూ బాధించలేరు. కాని అల్లాహ్‌ (త) సృష్టితాలు ఆయనకు అవిధేయత చూపినపుడు, ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించినపుడు, ఆయనకు బాధ కలుగుతుంది. అల్లాహ్‌(త) చాలా ఓర్పు సహనంతో వ్యవహరిస్తాడు. అల్లాహ్‌(త)కు అవిధేయత చూపినా ఆయన రక్షణ కల్పిస్తాడు క్షేమంగా ఉంచుతాడు. ఉపాధి ఆహారం ప్రసాదిస్తాడు.
(బు’ఖారీ)

22 – [ 21 ] ( متفق عليه ) (1/14)
وَعَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صلى الله عَلَيْهِ وَسلم: “قَالَ اللَّهُ تَعَالَى: يُؤْذِينِي ابْنُ آدَمَ يَسُبُّ الدَّهْرَ وَأَنَا الدَّهْرُ بِيَدِيَ الْأَمْرُ أُقَلِّبُ اللَّيْلَ وَالنَّهَارَ”.

(21) [1/14-ఏకీభవితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) ఆదేశం: మానవుడు నన్ను బాధిస్తున్నాడు, కాలాన్ని తిడుతున్నాడు. వాస్తవం ఏమిటంటే నేనే కాలాన్ని, అధికారం నా చేతిలోనే ఉంది. రాత్రీ పగలును నేనే మారుస్తాను.” )

వివరణ-22: కొందరు కష్టాల్లో, ఆపదల్లో కాలాన్ని తిడుతూ ఉంటారు. రోజులు బాగాలేవు, కాలం బాగాలేదని, కాలం, రోజులు, సమయం ఏమీ చేయలేవు. అంతా చేసే వాడు అల్లాహ్‌(త)యే. అదేవిధంగా అల్లాహ్‌(త)యే అన్నిటికీ యజమాని. కాలానికి ప్రతి వస్తువుకు యజమాని అల్లాహ్‌(త)యే. అంటే కాలాన్ని తిట్టటం అల్లాహ్‌(త)ను తిట్టటం వంటిదే. ఇదే అల్లాహ్‌(త)ను బాధించడం అంటే.
(బు’ఖారీ, ముస్లిమ్‌)

23 – [ 22 ] ( متفق عليه ) (1/14)
وعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا أَحَدٌ أَصْبَرَ عَلَى أَذْىٍ يَّسْمَعُهُ مِنَ اللهِ، يَدْعُوْنَ لَهُ الْوَلَدَ، ثُمَّ يُعَافِيْهِمْ وَيَرْزُقُهُمْ”.

(22) [1/14-ఏకీభవితం]
అబూ మూసా అష్‌’అరీ (ర) కథనం, ప్రవక్త (స) ప్రవచనం: ”అల్లాహ్‌ కంటే బాధాకరమైన మాటలు విని ఓర్పూ సహనాలను ప్రదర్శించే వారెవరూ లేరు. అవిశ్వాసులు దైవానికి సంతానం అంటగడుతున్నారు. అయినప్పటికీ అల్లాహ్‌ (త) వారిని సంరక్షిస్తున్నాడు, ఆహారం ప్రసాదిస్తున్నాడు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

24 – [ 23 ] ( متفق عليه ) (1/14)
وعَنْ مُعَاذٍ رَضِيَ اللهُ عَنْهُ، قَالَ: كُنْتُ رِدْفَ النبي صلى الله عليه وسلم عَلىَ حِمَارٍ، لَيْسَ بَيْنِىْ وَبَيْنَهُ اِلَّا مُؤَخِّرَةُ الرِّحْلِ، فَقَالَ: “يَا مَعاَذُ! هَلْ تَدْرِيْ مَا حَقُّ اللهِ عَلَى عِبَادِهِ؟ وَمَا حَقُ الْعِبَادِ عَلَى اللهِ؟” قُلْتُ: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: “فَإِنَّ حَقَّ اللهِ عَلَى الْعِبَادِ أَنْ يَّعْبُدُوْهُ وَلَا يُشْرِكُوْا بِهِ شَيْئًا، وَحَقَّ الْعِبَادِ عَلَى اللهِ أَنْ لَّا يُعَذِّبَ مَنْ لَا يُشْرِكُ بِهِ شَيْئًا.” فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ! أَفَلَا أَبَشِّرُ بِهِ النَّاسَ؟ قَالَ: “لَا تُبَشِّرُهُمْ فَيَتِّكُلُوْا”.

(23) [1/14-ఏకీభవితం]
ము’ఆజ్‌’బిన్ జబల్ (ర) కథనం: ”ప్రవక్త (స) ఒక గాడిదపై కూర్చొని ఉన్నారు. నేను అతని వెనుక కూర్చొని ఉన్నాను. ఆయనకు నాకు మధ్య వెదురు బద్ద మాత్రమే ఉంది. ప్రవక్త (స): ”ఓ ము’ఆజ్‌’, అల్లాహ్‌ దాసులపై గల అల్లాహ్‌(త) హక్కు ఏమిటో నీకు తెలుసా?” అని అన్నారు. దానికి నేను: ‘అల్లాహ్‌(త) మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు.’ అని అన్నాను. దానికి ప్రవక్త (స): ‘దాసులపై గల అల్లాహ్‌(త) హక్కు ఏమిటంటే, దాసులు అల్లాహ్‌(త)ను ఆరాధించాలి. ఆయన్ను ఒకే ఒక్కనిగా గుర్తించాలి. ఆయనకు ఇతరులను సాటి కల్పించరాదు. అదే విధంగా దాసుల హక్కు అల్లాహ్‌(త)పై ఏమిటంటే, అల్లాహ్‌(త)కు సాటికల్పించని వానికి, ఆయన (త) బాధ కలిగించరాదు.’ అని అన్నారు. అప్పుడు నేను: ‘ఓ ప్రవక్తా! మీరు అనుమతి ఇస్తే నేను ఈ శుభవార్తను ప్రజలకు తెలియజేస్తాను.’ అని అన్నాను. దానికి ప్రవక్త (స): ‘వద్దు వారికీ శుభవార్త తెలియజేయకు, ప్రజలు దీన్నే నమ్ముకుంటారు. ‘ ” అని అన్నారు.)

వివరణ-24: ఈ ‘హదీసు’ను ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌ ఉల్లేఖించారు. మదీనహ్ లో 18 సంవత్సరాల వయస్సులో ఇస్లామ్‌ స్వీకరించారు. మదీనహ్ నుండి మక్కహ్ వెళ్ళారు. ‘ఉఖ్‌బలో ప్రవక్త (స) చేతిపై బై’అత్‌ చేశారు. ప్రవక్త (స) మదీనహ్ వచ్చిన తరువాత ఆయన వెంటే ఉండేవారు. కొన్ని రోజుల్లోనే ఇస్లామ్‌ విద్యను నేర్చుకున్నారు. ప్రవక్త (స) అతన్ని చాలా ప్రేమించేవారు. వాహనంపై తన వెంట కూర్చోబెట్టు కునేవారు. ప్రత్యేకంగా ఆయనకే ఈ విషయాన్ని తెలిపారు. ప్రవక్త (స) అతన్ని యమన్‌కు గవర్నర్‌గా నియమించారు. ఇంకా అతని వీధిలోని మస్జిద్‌కు అతన్ని ఇమామ్‌గా నియమించారు. 36 సంవత్సరాల వయస్సులో మరణించారు.
(బు’ఖారీ, ముస్లిమ్‌)

25 – [ 24 ] ( متفق عليه ) (1/15)
وعَنْ أَنَسٍ: أَنَّ النًّبِيَ صلى الله عليه وسلم، وَمَعَاذُ رَدِيْفُهُ عَلَى الرَّحُلِ، قَالَ: “يَا مُعَاذُ!” قَالَ: لَبَّيْكَ يَا رَسُوْلَ اللهِ وَسَعْدَيْكَ. قَالَ: “يَا مَعَاذُ!” قَالَ: لَبَّيْكَ يَا رَسُوْلَ اللهِ وَسَعْدَيْكَ. قَالَ: “يَا مَعَاذُ!” قَالَ: لَبَّيْكَ يَا رَسُوْلَ اللهِ وَسَعْدَيْكَ – ثَلَاثَا – قَالَ: “مَا مِنْ أَحَدٍ يَّشْهَدُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدَا رَّسُوْلُ اللهِ، صِدْقًا مِّنْ قَلْبِهِ إِلَّا حَرَّمَهُ اللهُ عَلَى النَّارِ”. قَالَ: يَا رَسُوْلَ اللهِ! أَفَلَا أَخْبِرُ بِهِ النَّاسَ فَيَسْتَبْشِرُوْا! قَالَ: “إِذَا يَّتَّكِلُوْا” وَأَخْبَرَ بِهَا مَعَاذٌ عَنْدَ مَوْتِهِ تَأَثُّمًا”.

(24) [1/15-ఏకీభవితం]
అనస్‌ (ర) కథనం: ”ము’ఆజ్‌’ (ర), ప్రవక్త (స) వెనుక వాహనంపై కూర్చొని ఉన్నారు. ప్రవక్త (స): ‘ఓ ము’ఆజ్‌’.’ అని పిలిచారు. దానికి ము’ఆజ్‌’: ‘మీ సేవలో ఉన్నాను.’ అని అన్నారు. మళ్ళీ ప్రవక్త (స): ‘ఓ ముఆజ్‌!’ అని పిలిచారు. దానికి ము’ఆజ్‌’: ‘మీ సేవలోనే ఉన్నాను.’ అని అన్నారు. మళ్ళీ ప్రవక్త (స): ‘ఓ ము’ఆజ్‌’!’ అని పిలిచారు. దానికి ము’ఆజ్‌’: ‘మీ సేవలోనే ఉన్నానని.’ అన్నారు. ఇలా మూడు సార్లు పిలవటం, సమాధానం ఇవ్వటం జరిగింది. అప్పుడు ప్రవక్త (స): ” నిర్మలమైన మనస్సుతో అల్లాహ్‌(త) తప్ప ఆరాధ్యులెవరూ లేరని, ము’హమ్మద్‌ (స) అల్లాహ్‌ (త) ప్రవక్త.’ అని సాక్ష్యం ఇచ్చే వ్యక్తిపై నరకాగ్ని నిషేధించబడింది.” అని అన్నారు. అప్పుడు ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌, ‘ఓ ప్రవక్తా! ఈ శుభవార్త ప్రజలకు తెలియజేయనా?’ అని అన్నారు. దానికి ప్రవక్త (స): ‘ఈ శుభవార్త విని ప్రజలు దాన్నే నమ్ముకుని కూర్చుండిపోతారు. ఆచరించడం మాని వేస్తారు.’ అని అన్నారు. అయితే ము’ఆజ్‌’ తన మరణసమయానికి ముందు ఈ ‘హదీసు’ను ప్రజలకు తెలియజేశారు. పాపాలకు దూరంగా ఉండాలని.” ) వివరణ-25: అనేకసార్లు ఎందుకు పిలిచారంటే, చెప్ప బోయేది శ్రద్ధగా వినాలని. నిర్మలమైన మనస్సుతో ఏకత్వాన్ని, దైవదౌత్యాన్ని స్వీకరిస్తే, నిస్సందేహంగా అతడు నరకాగ్నికి గురికాడు. ప్రారంభంలో దాన్ని ప్రచారం చేయవద్దని వారించారు. ప్రజలు దాన్నే నమ్ముకొని ఆచరణ మానివేస్తారని. అయితే ము’ఆజ్‌’ మరణించడానికి ముందు ఈ’హదీసు’ను ప్రజలకు తెలియజేశారు – ‘హదీసు’ను దాచే పాపం తనను చుట్టుకోరాదని.
(బు’ఖారీ, ముస్లిమ్‌)

26 – [ 25 ] ( متفق عليه ) (1/15)
وَعَنْ أَبِيْ ذَرٍّ رَضِيَ اللهُ، قَالَ: أَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم، وَعَلَيْهِ ثَوْبٌ أَبْيَضُ، وَهُوَ نَائِمٌ، ثُمَّ أَتَيْتُهُ وَقَدْ اِسْتَيْقَظَ، فَقَالَ: “مَا مِنْ عَبْدٍ قَالَ: لَا إِلَهَ إِلَّا اللهُ، ثُمَّ مَاتَ عَلَى ذَلِكَ؛ إِلَّا دَخَلَ الْجَنَّةَ”. قُلْتُ: وَإِنْ زَنَى وَإِنْ سَرَقَ؟ قَالَ:”وَإِنْ زَنَى وَإِنْ سَرَق”. قُلْتُ: وَإِنْ زَنَى وَإِنْ سَرَقَ؟ قَالَ: “وَإِنْ زَنَى وَإِنْ سَرَقَ”. قُلْتُ: وَإِنْ زَنَى وَإِنْ سَرَقَ! قَالَ: وَإِنْ زَنَى وَإِنْ سَرَقَ عَلَى رَغْمٍ أَنْفَ أَبِيْ ذَرٍّ”. وَكَانَ أَبُوْ ذَرٍّ إِذَا حَدَّثَ بِهَذَا قَالَ: وَإِنْ رَغِمَ أَنْفُ أَبِيْ ذَرٍّ”.

(25) [1/15-ఏకీభవితం]
అబూజ’ర్‌ (ర) కథనం: “నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స) శరీరంపై తెల్లని వస్త్రం ఉంది. ప్రవక్త (స) పడుకొని ఉన్నారు. అది చూసి నేను వెళ్ళిపోయాను. నేను మళ్ళీవచ్చాను. అప్పటికి ప్రవక్త (స) మేల్కొని ఉన్నారు. అప్పుడు ప్రవక్త (స): ”లా ఇలాహ ఇల్లల్లాహ్‌.” – ‘అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు,’ అని పలికి ఆ నమ్మకంపైనే మరణిస్తే, అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు.” అని అన్నారు. దానికి నేను: ”ఒకవేళ అతడు వ్యభిచారం చేసి ఉన్నా, దొంగతనం చేసి ఉన్నానా?” అని ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స): ‘అవును ఒకవేళ అతను వ్యభిచారం చేసి ఉన్నా, దొంగతనం చేసి ఉన్నా సరే.’ అని అన్నారు. మళ్ళీ నేను: ‘ఒక వేళ అతడు వ్యభిచారం చేసి ఉన్నా, దొంగతనం చేసి ఉన్నా?’ అని అడిగాను. దానికి ప్రవక్త(స): ‘అతడు వ్యభిచారం చేసి ఉన్నా, దొంగతనం చేసి ఉన్నా సరే.’ అని అన్నారు. మూడవసారి నేను: ‘ఒకవేళ అతడు వ్యభిచారం చేసి ఉన్నా, దొంగతనం చేసి ఉన్నానా?’ అని ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స): ‘ఒకవేళ అతడు వ్యభిచారం చేసి ఉన్నా, దొంగతనం చేసి ఉన్నాసరే.’ అని; ‘అబూజ’ర్‌ ఎంత అసహ్యించుకున్నా సరే, ఆ వ్యక్తి క్షమించబడతాడు.’ అని అన్నారు.”) (బు’ఖారీ, ముస్లిమ్‌)

వివరణ-26: ఈ ‘హదీసు’ను ప్రఖ్యాత ప్రవక్త (స) అనుచరులు అబూ జ’ర్‌ ‘గిఫారీ (ర) ఉల్లేఖించారు. ఇతని పేరు జున్‌దుబ్‌, ఇతని బిరుదు మసీ’హ్ అల్‌ ఇస్లామ్‌. ఇతను ‘గిఫార్‌ తెగకు చెందినవారు. అజ్ఞాన కాలంలోకూడా ఇతడు ఏకదైవారాధకుడే. అంటే ఇస్లామ్‌ కు ముందు కూడా విగ్రహాలను ఆరాధించేవారు కారు. నమా’జు కూడా చేసే వారు. అందువల్ల ఇస్లామ్‌ సందేశం వినగానే స్వీకరించారు. ఇస్లామ్‌ స్వీకరించిన వారిలో ఇతను 5వ వ్యక్తి. ఇతనిఇస్లామ్‌ సంఘటన చాలా విచిత్ర మైనది. అబూ జ’ర్‌ ‘గిఫారీ కథనం: ”నేను ‘గిఫార్‌ తెగలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ‘నేను ప్రవక్తనని’ చెబుతున్నా డని తెలిసింది. అతన్ని గురించి తెలుసుకొని రమ్మని నేను నా సోదరుణ్ణి పంపాను. అతడు తిరిగి వచ్చిన తర్వాత, ‘ఏమిటీ వార్త?’ అని అడిగాను. దానికి నా సోదరుడు ‘దైవం సాక్షి! ఆ వ్యక్తి మంచిని ఆదేశిస్తు న్నాడు, చెడునుండి వారిస్తున్నాడు,’ అని అన్నాడు.

వివరాలు తెలుసుకోవాలని నాలో కుతూహలం కలిగింది. నేను స్వయంగా ప్రయాణానికి సిద్ధమై మక్కహ్ కు బయలుదేరాను. అక్కడకు చేరిన తర్వాత ఒక సమస్య ఏమిటంటే నేను అతనిని ఎరుగను. ఎవరినైనా అడుగు దామన్నా అది మరో సమస్యగా తయారుకావచ్చు. అందువల్ల నేను క’అబహ్ వద్దకు వెళ్ళి అక్కడే ఉండి ‘జమ్‌’జమ్‌ నీరు త్రాగుతూ కాలంగడపసాగాను.

ఒకరోజు ‘అలీ (ర) కలిశారు. ‘మీరు బాటసారిలా ఉన్నారు’ అని అడిగారు. దానికి నేను ‘అవునని’ అన్నాను. అతను నన్ను తన ఇంటికి తీసుకొని వెళ్ళారు. కాని వివరాలు మాట్లాడే అవకాశం చిక్కలేదు. ఉదయం లేచి మళ్ళీ క’అబహ్ గృహం దగ్గరకు వెళ్ళాను. వివరాలు తెలుసుకుందామని. ఎందుకంటే అప్పటి వరకు ప్రవక్త (స) గురించి తెలుసుకోలేక పోయాను. అనుకోకుండా మళ్ళీ ‘అలీ (ర) అటు నుండి వెళ్ళడం జరిగింది. ‘ఇప్పటి వరకు నీవు గమ్యాన్ని చేరుకోలేదా?’ అని అడిగారు. నేను, ‘లేదు’ అని అన్నాను. అతను తన ఇంటికి తీసుకొని వెళ్ళారు. ‘ఎలా రావటం జరిగింది?’ అని అన్నారు. దానికి నేను, ‘ఇది రహస్యం మీరెవరితో చెప్పరంటే చెబుతాను,’ అని అన్నాను, దానికతను, ‘మరేం భయంలేదు చెప్పు,’ అని అన్నారు. అప్పుడు నేను, ‘ఇక్కడ ఎవరో నేను దైవప్రవక్తను,’ అని అంటున్నారట, ముందు వివరాలు తెలుసుకురమ్మని నా సోదరుణ్ణి పంపాను. అతడు వివరంగా చెప్పలేదు. అందువల్ల నేనే స్వయంగా వచ్చాను,’ అని అన్నాను. అప్పుడు ‘అలీ (ర), ‘నీవు సన్మార్గం అందుకున్నావు. తిన్నగా నా వెంట వచ్చేయి. నేను ఏ ఇంట్లోకి వెళితే, నా వెనుక ఆ ఇంట్లోకి వచ్చేయి. ఒక వేళ మార్గంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే నేను చెప్పులు సరిచేసుకున్నట్లు ఒక ప్రక్కకు వెళ్ళిపోతాను. నీవు ముందుకు సాగి పోవాలి,’ అని అన్నారు. అతను చెప్పినట్టు నేను అతన్ని అనుసరించాను. ప్రవక్త (స) సన్నిధిలోకి ప్రవేశించి, ‘ఓ ప్రవక్తా (స)! నాకు ఇస్లామ్‌ గురించి బోధించండి,’ అని విన్నవించుకున్నాను. ప్రవక్త (స) ఇస్లామ్‌ గురించి బోధించారు. వెంటనే నేను ఇస్లామ్‌ స్వీకరించాను.

ఇస్లామ్‌ స్వీకరించిన తర్వాత ప్రవక్త (స), ‘అబూజ’ర్‌! దీన్ని రహస్యంగానే ఉంచు, ఇంటికి తిరిగి వెళ్ళిపో. నేను ఆధిక్యత పొందిన తర్వాత తిరిగి వద్దువుగాని,’ అని అన్నారు. దానికి నేను ప్రమాణం చేసి, ‘నేను ఇస్లామ్‌ను దాచలేను, ఇప్పడే వెళ్ళి నా ఇస్లామ్‌ను ప్రకటిస్తాను,’ అని పలికి క’అబహ్ దగ్గరకు వచ్చాను. అక్కడ ఖురైషు ప్రముఖులు ఉన్నారు. నేను అందరినీ ఉద్దేశించి, ‘ఖురైషులారా! అల్లాహ్‌(త) తప్ప ఆరాధ్యులెవరూ లేరని ము’హమ్మద్‌ (స) అల్లాహ్‌ ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను,’ అని అన్నాను. అది విన్న ఖురైషులు, ‘వీడిని పట్టుకొండి,’ అని అన్నారు. ఆ పిలుపు వినగానే నలువైపుల నుండి ప్రజలు నాపై విరుచుకు పడ్డారు. కొట్టటం ప్రారంభించారు. ఈ దృశ్యం చూసి ‘అబ్బాస్‌ (ర) భరించ లేక నన్ను రక్షించడానికి నన్ను కప్పు కున్నారు. వారితో ,’మీరందరూ ఒక ‘గిఫారీ వ్యక్తిని చంపు తున్నారా? ఇది మీ వ్యాపార మార్గంలో ఉంది,’ అని అన్నారు. అది విని అందరూ వెనక్కు తగ్గారు.”

కాని ఇస్లామ్‌ మత్తు దెబ్బలకు దిగుతుందా? మరుసటి రోజు కూడా అక్కడే తన ఇస్లామ్‌ను ప్రకటించారు. మళ్ళీ అదే సంఘటన చోటుచేసుకుంది. కొన్ని రోజులు మక్కహ్ లో ఉన్న తరువాత ప్రవక్త (స) అతన్ని అతని ఇంటికి పంపివేశారు. అప్పుడు ప్రవక్త (స) ‘అతి త్వరలో నేను మదీనహ్ వలస పోతున్నాను. అందువల్ల నీవు నీ జాతి వారిలోకి వెళ్ళి ఇస్లామ్‌ సందేశాన్ని ప్రచారం చేయి. అల్లాహ్‌ (త) నీ ద్వారా వాళ్ళకు మార్గం ప్రసాదిస్తాడు. దానికి బదులు అల్లాహ్‌ (త) నీకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు,’ అని అన్నారు.

ప్రవక్త (స) ఆదేశానుసారం ప్రయాణానికి సిద్ధమై, తన సోదరుడు అనీస్‌ను కలిశారు. అతడు, ‘ఏమయింది?’ అని అడిగాడు. దానికి, ‘ఇస్లామ్‌ స్వీకరించి వచ్చాను’ అని అన్నారు. అది విన్న వెంటనే అతడు కూడా ఇస్లామ్‌ స్వీక రించాడు. ఇద్దరు కలసి మూడవ సోదరుడు ఉమ్నా వద్దకు వెళ్ళారు. అతడు కూడా ఇస్లామ్‌ స్వీకరించాడు. ఆ తరువాత ముగ్గురూ తమ జాతివారి వద్దకు వెళ్ళారు. ఇస్లామ్‌ సందేశ ప్రచారంలో నిమగ్నులయి పోయారు. వారి జాతిలోని సగం మంది అప్పుడే ఇస్లామ్‌ స్వీకరించారు. సగం మంది హిజ్రత్‌ తర్వాత. (‘స’హీ’హ్‌ ముస్లిమ్‌, ఫజా యిలె అబూ జ’ర్‌, ముస్నద్‌ ఇబ్నె ‘హంబల్‌, 5/174)

మరణం: అబూజ’ర్‌ ‘గిఫారీ మరణ సంఘటన కూడా చాలా విచిత్రమైనది. 31వ హిజ్రీ శకంలో రబ’జహ్‌ ప్రాంతంలో మరణించారు. ఆయన భార్య కథనం: ”అబూ జ’ర్‌ పరిస్థితి విషాదకరంగా మారితే నేను ఏడ్వసాగాను. అతను, ‘ఎందుకు ఏడుస్తున్నావు,’ అని అడిగారు. దానికి నేను, ‘మీరు ఈ ఎడారిలో ప్రాణంపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ మీరు, నేను ఉపయోగించే బట్టలు తప్ప మీకు కఫన్‌ వస్త్రంగా పనికి వచ్చే వస్త్రం ఏదీ లేదు,’ అని అన్నాను. దానికి అబూ జ’ర్‌, ‘ఏడ్వటం ఆపి, నేను నీకు ఒక శుభవార్త తెలియజేస్తాను. అదేమిటంటే, నేను ప్రవక్త (స) నోట, ‘ఒక ముస్లిమ్‌ యొక్క ఇద్దరు లేక ముగ్గురు సంతానం చనిపోతే, అతన్ని నరకాగ్ని నుండి రక్షించటానికి వారు చాలు,’ అని అన్నారు. ఇంకా ప్రవక్త (స) కొంతమంది ముందు, వారిలో నేనూ ఉన్నాను.’ ఫ్రవక్త అన్నారు, ‘మీలో ఒక వ్యక్తి ఎడారిలో మరణిస్తాడు. అతని మరణసమయంలో కొంత మంది ముస్లిములు గల ఒక బృందం అక్కడకు చేరుకుంటుంది,’ అని అన్నారు. నేను తప్ప మిగిలిన వారందరూ జనవాసాల్లో మరణించారు. ఇప్పుడు నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను. అందువల్ల నిస్సందేహంగా ఆ వ్యక్తిని నేనే. అల్లాహ్ సాక్షి! నేను నీతో అసత్యం పలకటం లేదు. అందువల్ల మార్గం వద్దకు వెళ్ళిచూడు, వాళ్ళు వస్తూనే ఉంటారు. ‘ దానికి నేను ‘ఇప్పుడు హాజీలు కూడా తిరిగి వెళ్ళి పోయారు. మార్గం కూడా మూసి వేయబడింది,’ అని అన్నాను. దాని కతను, ‘కాదు వెళ్ళి చూడు’ అని అన్నారు. అనంతరం నేను దిబ్బపై ఎక్కి చూసేదాన్ని. రెండవ వైపు ఆయన్ను సేవచేసేదాన్ని. ఈ పరంపర కొనసాగుతూ ఉంది. ఇంతలో కొంతమంది వస్తున్నట్టు కనిపించింది. నేను సైగ చేశాను. వారు నా దగ్గరకు వచ్చి ఆగి పోయారు. అబూ జ’ర్‌ గురించి, ‘ఇతను ఎవరు,’ అని అడిగారు. నేను, ‘అబూ జ’ర్‌ (ర),’ అని అన్నాను. ‘ప్రవక్త (స) అనుచరులా?’ అని అన్నారు. నేను ‘అవునని’ అన్నాను. వాళ్ళు అబూ జ’ర్‌ వద్దకు వెళ్ళారు. అబూ జ’ర్‌ ప్రవక్త (స) భవిష్యవాణి వినిపించారు. ఇంకా ‘ఒకవేళ నా దగ్గర లేదా నా భార్య దగ్గర కఫన్‌కు వస్త్రం ఉంటే దానితో నాకు కఫన్‌ తొడిగించాలి. ఇంకా మీలో ప్రభుత్వ ఉద్యోగి ఎవరూ నాకు కఫన్‌ తొడిగించరాదు,’ అని అన్నారు. అనుకోకుండా వారిలో ఒక అ’న్సారీ యువకుడు తప్ప అందరూ ప్రభుత్వ ఉద్యోగులే. అనంతరం ఆ అన్సారీ యువకుడు, ‘చిన్నాన్నగారూ, నా వద్ద ఒక దుప్పటి ఉంది. అది కాక మరో రెండు వస్త్రాలు ఉన్నాయి. వాటిని నా తల్లి తయారు చేసింది. వీటితోనే మీకు కఫన్‌ తొడిగిస్తాను’ అని అన్నాడు. దానికి అబూజర్‌ ‘సరే’ అన్నారు. (ముస్తదరక్‌ ‘హాకిమ్‌ 2/345, ముస్నద్‌ అ’హ్మద్‌ బిన్‌ ‘హంబల్‌ 5/166)

ఈ వాంఙ్మూలం తరువాత మరణించారు. ఈ వచ్చినవారు యమన్‌కు చెందినవారు. కూఫా నుండి వస్తున్నారు. వీరి వెంట ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ కూడా ఉన్నారు. అతను ‘ఇరాఖ్‌ వెళ్తున్నారు. అనంతరం ఆ అ’న్సారీ యువకుడు కఫన్‌ తొడిగించాడు, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ జనా’జహ్ నమా’జు చదివించారు. (ముస్తదరక్‌ ‘హాకిమ్‌ 3/346) ఆ తరువాత అందరూ కలసి ఖనన సంస్కారాలు పూర్తిచేశారు.
అబూ-జ’ర్‌ (ర) దీన స్వభావులు, దైవభక్తిపరులు, అందు వల్లే ప్రవక్త (స) అతన్ని మసీహుల్‌ ఇస్లామ్‌ అనే బిరుదు ఇచ్చారు. చివరి శ్వాసవరకు సంతృప్తి చెందుతూ జీవించారు. తాను తిన్నది, ధరించిందే సేవకులకూ పెట్టేవారు. చాలా ధర్మాత్ములు, అందరితో కలసిమెలసి ఉండేవారు.

ఈ ‘హదీసు’లో కలిమ ”లా ఇలాహ ఇల్లల్లాహ్‌” పలకటం అంటే ‘ఏకత్వం, దైవదౌత్యంపై పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండటం’ అని అర్థం. ఇటువంటి వ్యక్తి స్వర్గంలో ప్రవే శిస్తాడు. ఒకవేళ పాపకార్యాలకు పాల్పడితే, అల్లాహ్‌ (త) అతన్ని క్షమిస్తాడు లేదా శిక్షించి స్వర్గంలో పంపిస్తాడు.

27 – [ 26 ] ( متفق عليه ) (1/15)
وعَنْ عبَادَةَ بْنِ الصَّامِتِ رَضِيَ اللهُ عَنْهُ، قَالَ: قَالَ النَّبِيِ صلى الله عليه وسلم: “مَنْ شَهِدَ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ، وَأَنَّ عِيْسَى عَبْدُ اللهِ وَرَسُوْلُهُ وَابْنُ أَمَتِهِ وَكَلِمَتُهُ أَلْقَاهَا إِلَى مَرْيَمَ، وَرُوْحُ مِنْهُ، وَالْجَنَّةُ وَالنَّارُ حَقٌّ؛ أَدْخَلَهُ اللهُ الْجَنَّةَ عَلَى مَا كَانَ مِنَ الْعَمَلِ”.

(26) [1/15-ఏకీభవితం]
‘ఉబాదహ్‌ బిన్‌ సా’మిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”అల్లాహ్‌ (త) తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే, ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. నిశ్చయంగా, ము’హమ్మద్‌ (స) అల్లాహ్‌ (త) దాసులు, ఆయన ప్రవక్త. వాస్తవానికి ‘ఈసా (అ) అల్లాహ్‌ (త) దాసులు మరియు ఆయన ప్రవక్త, ఆయన దాసి కుమారులు, మర్యమ్‌(అ) వైపు పంపబడిన అల్లాహ్‌(త) ఆజ్ఞ(కలిమహ్). ఆయన తరఫునుండి పంపబడిన ఆత్మ. ఇంకా స్వర్గనరకాలు వాస్తవం,’ అని, సాక్ష్యం ఇచ్చిన వానిని అల్లాహ్‌(త) స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. అతను ఎటువంటి పనిచేసి ఉన్నాసరే.” ) (బు’ఖారీ, ముస్లిమ్‌)

వివరణ27: అంటే ఎవడి నమ్మకం సత్యమైనదైతే వాడు స్వర్గంలో ప్రవేశించే అర్హత పొందుతాడు. ఇక్కడ ‘ఈసా (అ) ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, క్రైస్తవులు ‘ఈసా (అ)ను అల్లాహ్ (త) కుమారునిగా భావిస్తున్నారు. వాస్తవం ఏమి టంటే, అతను మర్యమ్‌ కుమారులు. తండ్రి లేకుండా జన్మించారు. అల్లాహ్ ‘అయిపో’ అంటే అయిపోయారు. అందువల్లే అతనిని, కలిమతుల్లాహ్‌ అంటారు. అతను అల్లాహ్(త) ఆజ్ఞతో మృతులను సజీవంగా చేసారు. అందువల్ల అతనిని రూహుల్లాహ్‌ అన్నారు.

28 – 27 (1/15)
وَعَنْ عَمْرو بْنِ الْعَاصِ قَالَ: “أَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم، فَقُلْتُ ابْسُطْ يَمِيْنُكَ فَلِأُبَايِعُكَ، فَبَسَطَ يَمِيْنَهُ، فَقَبَضْتُ يَدِيْ، فَقَالَ: “مَا لَكَ يَا عَمْرُو؟” قُلْتُ: أَرَدْتُّ أَنْ أَشْتَرطَ. فقَالَ: “تَشْتَرِطُ مَاذَا؟” قُلْتُ: أَنْ يُّغْفَرَ لِيْ. قَالَ: “أَمَا عَلِمْت يا عمرو! أَنَّ الْإِسْلاَمَ يَهْدِمُ مَا كَانَ قَبْلَهُ، وَأَنَّ الْهِجْرَةَ تَهْدِمُ مَا كَانَ قَبْلَهَا، وَأَنَّ الْحَجَّ يَهْدِمُ مَا كَانَ قَبْلَهُ؟” وَالْحَدِيْثَان الْمَرْوِيَّانِ عَنْ أَبِيْ هُرَيْرَةَ.
قَالَ: “قَالَ اللهُ تعالى: “أَنَا أَغْنَى الشُّرَكَاءِ عَنْ الشِّرْكِ. “وَالْآخَرُ: “الْكِبْرِيَاءُ رِدَائِي”.
سَنَذْكُرُهُمَا فِيْ بَابِ الرِّيَاءِ وَالْكِبْرِ إِنْ شَاءَ اللهُ تعالى.

(27) [1/15-దృఢం]
‘అమ్ర్‌ బిన్‌ అల్‌ ‘ఆ’స్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను: ‘మీ కుడిచేయి చాపండి, నేను మీ చేతిపై బైఅత్‌ చేస్తాను.’ అని విన్నవించుకున్నాను. ప్రవక్త (స) తన కుడిచేయిని చాచారు. నేను నా చేతిని లాక్కున్నాను. ప్రవక్త (స) ‘ఇదేమిటి.’ అని అన్నారు. దానికి నేను: ‘కొన్నిషరతులు పెట్టాలను కుంటున్నాను.’ అని అన్నాను. ప్రవక్త (స): ‘ఏ షరతులు పెట్టాలను కుంటున్నావో పెట్టుకో.’ అని అన్నారు. దానికి నేను: ‘నా పాపాలన్నీ క్షమించ బడాలి.’ అని అన్నాను. దానికి ప్రవక్త (స): ‘ఓ ‘అమ్ర్‌! ఇస్లామ్‌ అంతకు ముందు జరిగిన పాపా లన్నిటినీ చెరిపి వేస్తుందని నీకు తెలియదా?’ అదే విధంగా హిజ్రత్‌ అంతకు ముందు జరిగిన పాపా లన్నింటిని చెరిపేస్తుంది. అదేవిధంగా ‘హజ్జ్ అంతకు ముందు జరిగిన పాపాలన్నిటినీ చెరిపివేస్తుంది.” అని అన్నారు. (ముస్లిమ్‌).

అబూ హురైరహ్‌ (ర) పైరెండు ‘హదీసు’లను ఉల్లేఖించారు. 1. ఖాలల్లాహు 2. అల్‌ కిబ్‌రియాఉ’ రిదాయీ’. ఇన్‌షా అల్లాహ్‌ వీటిని బాబుర్రియా వల్‌ కిబ్‌ర్‌లో ప్రస్తావిస్తాము. )

వివరణ-28: మ’సాబీహ్‌ రచయిత (బ’గవీ) ఈ రెండు ‘హదీసు’లను కితాబుల్‌ ఈమాన్‌లో పేర్కొ న్నారు. అయితే మేము (‘తబ్రేజీ) ఇక్కడ వాటిని ప్రస్తావించ దలచుకోలేదు. ఇన్‌షా అల్లాహ్‌ బాబు ర్రియాలో పేర్కొందుము. విశ్వసించి ఇస్లామ్‌ స్వీకరిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అవి అల్లాహ్‌(త)కు చెందిన వైనా, దాసులకు చెందినవైనాసరే. కాని ‘హజ్జ్ మరియు హిజ్రత్‌ల ద్వారా కేవలం అల్లాహ్‌(త)కు చెందిన పాపాలే చెరిపివేయబడతాయి. దాసులకు చెందిన పాపాలు చెరిపివేయబడవు. వాళ్ళు క్షమిస్తే తప్ప. ఈ ‘హదీసు’ను ‘అమ్ర్‌ బిన్‌ అల్‌ ‘ఆస్‌ ఉల్లేఖించారు.

‘అమ్ర్‌ బిన్‌ అల్‌-‘ఆ’స్‌:
‘ఆ’స్‌ వంశం పేరు. పేరు ‘అమ్ర్‌. అబూ ‘అబ్దుల్లాహ్‌ మరియు అబూ ము’హమ్మద్‌ కునియత్‌. తండ్రి పేరు ‘ఆ’స్‌, తల్లి పేరు నాబి’గహ్. ఇస్లామ్‌కు ముందు, ‘అమ్ర్‌ బిన్‌ అల్‌-‘ఆ’స్‌ కుటుంబం బనూ సహమ్‌ తెగలకు చెందినది. అజ్ఞానకాలం నుండి గౌరవం గలది. ఖురైషులు ఇస్లామ్‌ మరియు ప్రవక్త (స)కు బద్ధ శత్రువులు. కాని వీరు కందకం యుద్ధం తరువాత ఇస్లామ్‌కు ప్రభావితులు కాసాగారు. వీరు ప్రపంచం, దాని పర్యవసానం మరియు ఇస్లామ్‌ బోధనలపట్ల ఆలోచించేవారు. ఆలోచించగా ఇస్లామ్‌ వాస్తవం బహిర్గతం కాసాగింది. ఆ తరువాత నేను ముస్లిముల పట్ల వ్యతిరేకతకు దూరం కాసాగాను. ఖురైషులు ఈ విషయాన్ని ఊహించి నా వద్దకు ఒక వ్యక్తిని పంపారు. అతను నాతో చర్చించడం ప్రారంభించాడు. నేనతనితో, ‘మనం సత్యంపై ఉన్నామా లేక ఫారిస్‌ మరియు రూమ్‌వారా?’ అని అడిగాను. దానికి ఆ వ్యక్తి ‘మనం,’ అని అన్నాడు. మళ్ళీ నేను, ‘సుఖభోగాల్లో మనం ఉన్నామా లేక వారున్నారా?’ అని అడిగాను. దానికి ఆ వ్యక్తి, ‘వారు’ అని అన్నాడు. అప్పుడు నేను, ‘ఈ లోకం తరువాత మరో లోకం లేకపోతే మరి సత్యంపై ఉండటం ఎలా పనికి వస్తుంది. ఎందుకంటే మనం సత్యంపై ఉండి కూడా దారిద్య్రంలో ఉన్నాము. మరోలోకంలో దాని ప్రతిఫలం దొరకదంటే ఎలా? అందువల్ల ప్రవక్త ము’హమ్మద్‌ (స) మరోలోకం వస్తుందని, అందులో ప్రతి వ్యక్తికి అతని ఆచరణ మేరకు ప్రతిఫలం, విచారణ జరుగుతుందని అంటున్నారు,’ అని అన్నాను. కందక యుద్ధం తరువాత ప్రవక్త (స) విజయం సాధిస్తారని పూర్తిగా నమ్మకం కలిగింది. ఈ నమ్మకమే అతను ఇస్లామ్‌ స్వీకరించడానికి దారి తీసింది. మిగతా వివరాలు ముస్నద్‌ బిన్‌ ‘హంబల్‌ స్వయంగా అతని నోట ప్రస్తావించబడి ఉంది.

ఇస్లామ్‌: అతని కథనం: ”మేము అ’హ్‌’జాబ్‌ యుద్ధం నుండి తిరిగి వచ్చాము. నాకు తెలిసిన కొందరు ఖురైషులను ఒక చోట చేర్చి, ‘అల్లాహ్ సాక్షి! ము’హమ్మద్‌ (స) తప్పకుండా అధిగమిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది నా అభిప్రాయం,’ అని అన్నాను. వారు, ‘ఏమిటది’ అన్నారు. దానికి నేను, ‘మనం నజ్జాషీ వద్దకు వెళ్ళి ఉందాం. ఒకవేళ ము’హమ్మద్‌ అధిగమిస్తే మనం నజాషీ వద్దే ఉంది పోదాము. ఎందుకంటే ము’హమ్మద్‌ అధికారంలో ఉండటంకన్నా నజాషీ అధికారంలో ఉండటమే మంచిది. ఒకవేళ మన వాళ్ళు అధిగమిస్తే మనం గెలిచినట్టు. మన పట్ల వారు మంచిగానే ప్రవర్తిస్తారు,’ అని అన్నాను. దానికి అందరూ సమ్మతించారు. ‘మరి అతనికి కానుకగా ఇవ్వ డానికి ఏదైనా సిద్ధంచేయండి,’ అని అన్నాను. అతనికి కానుకగా ఇవ్వటానికి అన్నిటికంటే ఉత్తమమైనది చర్మం ఉంది. చర్మాలు తీసుకొని మేము హబ్‌షా చేరాము. ప్రజలు నజాషీ దర్బారులో వెళుతున్నారు. ఇంతలో ‘అమ్ర్ బిన్‌ ఉమయ్యా ‘దమ్‌రీ కూడా అక్కడకు చేరుకున్నారు. అతన్ని ప్రవక్త (స), జ’అఫర్‌ ఇంకా అతని మిత్రుల సహాయం కోసం పంపారు. అతను వచ్చి వెళ్ళి పోయిన తర్వాత, నేను నా మిత్రులతో, ‘మనం నజాషీతో ఈ వ్యక్తిని మనకు ఇవ్వమని కోరుదాం. ఒకవేళ ఇస్తే ఇతన్ని నరికి వేద్దాం. ఖురైషులకు మనం ము’హమ్మద్‌ (స) రాయబారిని చంపామని తెలియ పరుద్దాం’ అని అన్నాను. అనంతరం నజాషీ దర్బారులో వెళ్ళాను. అక్కడి రివాయిత్ ప్రకారం సజ్దా చేసాను. అతను స్వాగతం పలికాడు. ‘నా గురించి కానుకలు తెచ్చావా’ అని అడిగాడు. దానికి నేను, మహారాజా! ‘తమరి కొరకు అనేక చర్మాలు తెచ్చాను’ అని చెప్పి వాటినన్నిటినీ ముందు ఉంచాను. అతడు చాలా సంతోషించాడు. అనంతరం నేను, ‘ఇప్పుడు మీ దగ్గరి నుండి బయటకు వెళ్ళిన వ్యక్తి మా శత్రువు, అతన్ని మాకు ఇచ్చివేయండి చంపటానికి. అతడు మా నాయకులకు చాలా బాధలు కలిగించాడు,’ అని అన్నాను. నజాషీ అది విని చాలా ఆగ్రహం చెంది, తన ముక్కుపై తానే కొట్టుకున్నాడు. అతని ఆ పరిస్థితి చూసి నేను చాలా విచారించాను. నజాషీతో, ‘ఒకవేళ తమకు ఇది ఇష్టం లేదని తెలిస్తే అడిగేవాడిని కాదు,’ అని అన్నాను. దానికి నజాషీ, ‘నీవు ఎటువంటి వ్యక్తి రాయబారిని కోరుతున్నావో తెలుసా? అతని వద్దకు మూసా (అ) వద్దకు వచ్చిన దైవదూత వస్తున్నాడు,’ అని అన్నాడు. దానికి నేను, ‘నిజంగా ఇలా జరుగుతుందా?’ అని అడిగాను. దానికి నజాషీ, ‘ఓ ‘అమ్ర్‌ నీ పరిస్థితి చూస్తే చాలా జాలివేస్తుంది, నా మాట విను, అతన్ని అనుసరించు. దైవం సాక్షి! అతను సత్యంపై ఉన్నాడు. అతడు తన వ్యతిరేకులను అధిగమిస్తాడు. మూసా (అ) ఫిర్‌’ఔన్‌ సైన్యంపై అధిగ మించినట్టు,’ అని అన్నాడు. అప్పుడు నేను, ‘మరి అతని తరఫున మీరు నా నుండి బై’అత్‌ తీసుకోండి,’ అని అన్నాను. అనంతరం అతను చేయిచాపాడు. నేను ఇస్లామ్‌ స్వీకరించాను.

అక్కడి నుండి నేను నా మిత్రుల వద్దకు వెళ్ళినప్పుడు, నా ఆలోచనలన్నీ మారి ఉన్నాయి. కాని నేను ఈ విషయం వారికి చెప్పలేదు. ప్రవక్త (స) చేతిపై ఇస్లామ్‌ స్వీకరించ డానికి బయలుదేరాను. మార్గంలో ‘ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ మక్కహ్ నుండి వస్తూ కలిశారు. ఇది మక్కహ్ విజయానికి ముందు సంఘటన. నేనతనితో, ‘ఓ అబూ సులైమాన్, ఎటు వెళుతున్నారు?’ అని అడిగాను. దానికి అతను, ‘అల్లాహ్ సాక్షి! అంతా తలక్రిందులైంది. అల్లాహ్ సాక్షి! నిస్సందేహంగా ఇతడు ప్రవక్త. ఇప్పుడు త్వరగా ఇస్లామ్‌ స్వీకరించాలి. ఈ అనుమానాలు, సంకోచాలు ఎప్పటి వరకు’ అని అన్నారు. అప్పుడు నేను, ‘అల్లాహ్ సాక్షి! నేను కూడా అందుకే బయలుదేరాను,’ అని అన్నాను.

అనంతరం మేమిద్దరం కలసి ప్రవక్త (స) వద్దకు వెళ్ళాము. ముందు ‘ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ బై’అత్‌ చేశారు. ఆ తరువాత నేను ప్రవక్త (స) దగ్గరకు జరిగి, ‘ఓ ప్రవక్తా! నేను బై’అత్‌ చేస్తాను. కాని నా పాపాలన్నీ క్షమించాలి’ అని అన్నాను. దానికి ప్రవక్త (స),, ‘అమ్ర్‌! బై’అత్‌ చేసుకో, ఇస్లామ్‌ అంతకు ముందు జరిగిన పాపాలన్నిటినీ క్షమించివేస్తుంది. అదేవిధంగా హిజ్రత్‌ కూడా అంతకు ముందు జరిగిన పాపాలన్నిటినీ క్షమించివేస్తుంది,’ అని అన్నారు. అనంతరం నేను బై’అత్‌ చేసి తిరిగి వెళ్ళిపోయాను. (ముస్నద్‌ అ’హ్మద్‌ బిన్‌ ‘హంబల్‌ 4/198) (సియరు అ’స్స’హాబహ్)

హిజ్రత్‌: ఇస్లామ్‌ స్వీకరించిన తరువాత మక్కహ్ తిరిగి వెళ్ళి పోయారు. కొన్నిరోజుల తర్వాత మదీనహ్ వైపు హిజ్రత్‌ చేశారు.మదీనహ్ వచ్చినతరువాత ఇస్లామీయ సందేశ ప్రచారంలో నిమగ్నులై పోయారు. యుద్ధాలలో, పోరాటాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రవక్త (స) మరణా నంతరం కూడా అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. ‘అలీ మరియు ము’ఆవియహ్‌ల కాలంలో ము’ఆవియహ్‌ను సమర్థించేవారు. అల్లాహ్ (త) క్షమించు గాక! అల్లాహ్ (త) అతనితో సంతుష్టడవు గాక!

మరణం: ‘అమ్ర్‌ బిన్‌ అల్‌ ‘ఆ’స్‌ 43 లేదా 47 లేదా 51వ హిజ్రీ శకంలో ఈజిప్టులో తన పరిపాలనా కాలంలో అనారోగ్యానికి గురయ్యారు. దీర్ఘాయుష్షు పొందారు. ఇక ఆరోగ్యం లభించదని తెలిసి చివరి ఘడియల్లో జరిగిన పాపాలకు కుమిలి, కుమిలి విచారించేవారు. ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) పరామర్శించడానికి వచ్చారు. సలామ్‌ తర్వాత, ‘ఎలా ఉన్నారు’ అని అడిగారు. ప్రపంచాన్ని ఎక్కువగా పొందలేకపోయాను, కాని ధర్మాన్ని పాడు చేసుకున్నాను. ఒకవేళ పొందినదాన్ని పొందకుండా, పాడు చేసినదాన్ని మంచిచేసిఉంటే నిస్సందేహంగా సాఫల్యం పొంది ఉండేవాడిని.’ చివరి సమయంలోని కోరికలు లాభం చేకూర్చేవి అయితే కోరి ఉండే వాడిని. ఒకవేళ పారిపోయి తప్పించుకోగలిగితే, పారిపోయే వాడిని. కాని ఇప్పుడు భూమ్యాకాశాల మధ్య వ్రేలాడుతున్నాను. చేతుల ద్వారా ఎక్కలేను, కాళ్ళతో క్రిందికి దిగలేను,’ అని అన్నారు.

”ఓ అన్న కొడుకా! లాభం చేకూర్చే హితబోధ ఏదైనా ఉంటే చేయి” అని అన్నారు. దానికి ఇబ్నె ‘అబ్బాస్‌, ”ఇప్పుడు ఆ సమయం ఎక్కడ? మీ అన్నకొడుకు ఇప్పుడు మీ సోదరుడై పోయాడు. ఇప్పుడు ఒకవేళ మీరు ఏడ్వమంటే ఏడ్వగలను. స్థానికుడు ప్రయాణాన్ని ఎలా ఊహించ గలడు,” అని అన్నారు. అప్పుడు ‘అమ్ర్‌ బిన్‌ ‘అల్‌ ‘ఆస్‌ ,”ఇప్పుడు నా వయస్సు ఇంచు మించు 80కి చేరింది, నీవు నన్ను అల్లాహ్‌ (త) పట్ల నిరాశ కలిగిస్తావా? ఓ అల్లాహ్‌ (త)! ఈ ఇబ్నె ‘అబ్బాస్‌ నీ పట్ల నిరాశ కలిగిస్తున్నాడు. నా కష్టాలు పెంచి అయినా, నా పట్ల సంతృప్తి చెందు” అని అన్నారు. ఇబ్నె అబ్బాస్ అన్నారు, ”నీపాడుగాను (‘హైహాత్!) అబూ ‘అబ్దుల్లాహ్. నీవు కొత్త వస్తువు తీసు కున్నావు, పాత వస్తువు ఇస్తున్నావు.” ‘అమ్ర్ అన్నాడు, ‘నేను అనే మాటలకు విపరీత అర్థం, ఎందుకు తీస్తున్నావు? నీకేమయింది.’

ఇబ్నె షమాసహ్ ముహ్‌రీ పరామర్శించడానికి వెళ్ళారు. ‘అమ్ర్‌ ఇబ్నుల్‌ ‘ఆ’స్‌ గోడ వైపు తిరిగి ఏడుస్తున్నారు. అతని కొడుకు ‘అబ్దుల్లాహ్‌ ఓదార్చుతూ ‘తండ్రిగారూ! ప్రవక్త (స) మీకు అనేక శుభవార్తలు ఇచ్చి ఉన్నారు’ అని అన్నాడు. దానికి అమ్ర్‌, ‘నా వద్ద ఉన్న అన్నిటి కంటే ఉత్తమమైన ధనం, ”లా ఇలాహ ఇల్లల్లాహు ము’హమ్మ దుర్రసూలుల్లాహ్‌”. నా జీవితంలో మూడు దశలు గడి చాయి. ఒక దశలో నేను ప్రవక్త (స)కు బద్ధ శత్రువుగా ఉండేవాడిని. అవకాశం చూసి చంపేయాలని ఉండేది. ఒకవేళ అదే పరిస్థితిలో చనిపోతే నరకానికి గురయ్యేవాడిని. ఆ తరువాత అల్లాహ్‌(త) నాకు ఇస్లామ్‌ భాగ్యం ప్రసాదించాడు. ఇక మూడవ దశ వచ్చింది, దానిలో నేను వివిధ రకాల పనులు చేసాను. ఇప్పుడు నా విషయం ఏమవుతుందో అల్లాహ్(త)కే తెలుసు. మరణానికి ముందు, అతను చాలా పశ్చాత్తాప పడ్డారు.

షవ్వాల్‌ 1వ తేదీన 43వ హిజ్రీ శకంలో ‘ఈదుల్‌ ఫిత్ర్‌ నమా’జు తర్వాత ఆయన కుమారుడు జనా’జహ్ నమా’జు చదివించారు. అనంతరం మఖ్‌తమ్‌లో ఖననం చేయబడ్డారు.


اَلْفَصلُ الثَّانِيْ రెండవ విభాగం

29 – [ 28 ] ( لم تتم دراسته ) (1/16)
عَنْ مُعَاذٍ رَضِىَ اللهُ عَنْهُ، قَالَ: كُنْتُ مَعَ النَّبِيِ صَلَى الله عليه وسلم فِيْ سَفر فأصبحت يوما قريبا منه ونحن نسير فَقُلْتٌ: يَا رَسُوْلَ اللهِ أَخْبِرْنِيْ بِعَمَلٍ يُّدْخِلُنِي الْجَنَّةَ، وَيُبَاعِدُنِيْ عَنْ النَّارِ. قَالَ: “لَقَدْ سَأَلَت عَنْ امرٍعَظِيْمٍ، وَإِنَّهُ لَيَسِيْرٌ عَلَى مَنْ يَّسَّرَهُ اللهُ عَلَيْهِ: تَعْبُدُ اللهَ وَلَا تُشْرِكُ بِهِ شَيْئًا. وَتُقِيْمُ الصّلَاةَ، وَتَؤْتِيْ الزَّكَاةَ، وَتَصُوْمُ رَمَضَانَ، وَتَحُّجُّ الْبَيْتَ”. ثُمَّ قَالَ: “أَلَا أَدُلُّكَ عَلَى أَبْوَابِ الْخَيْرِ؟ الصَّوْمُ جُنَّةٌ، وَالصَّدَقَةُ تُطْفِئُ الْخَطِيْئَةَ، كَمَا يُطْفِئُ الْمَاءُ النَّارَ، وَصَلَاةُ الرَّجُلِ مِنْ جَوْفِ اللَّيْلِ”. ثُمَّ تَلَا: ]تَتَجَافَى جُنُوْبُهُمْ عَنْ الْمَضَاجِعِ ..[ حَتَّى بَلَغَ ]يَعْمَلُوْنَ[ ثُمَّ قَالَ: “أَلَا أَدْلُّكَ بِرَأْسِ الْأَمْرِ وَعُمُوْدِهِ وَذِرْوَةِ سَنَامِهِ؟” قُلْتُ: بَلَى يَا رَسُوْلَ اللهِ! قَالَ: “رَأْسُ الْأَمْرِ الْإِسْلَامِ، وَعُمُوْدُهُ الصَّلَاةُ، وَذِرْوَةُ سَنَامِهِ الْجِهَادُ”. ثُمَّ قَالَ: “أَلَا أَخْبِرُكَ بَمِلَاكَ ذَلِكَ كُلِّهِ؟” قُلْتُ: بَلَى يَا نَبِيَّ اللهِ! فَأَخَذَ بِلِسَانِهِ فَقَالَ: “كُفَّ عَلَيْكَ هَذَا”. فَقُلْتُ: يَا نَبِيَّ اللهِ! وَإِنَّا لَمُؤَاخَذُوْنَ بِمَا نَتَكَلَّمَ بِهِ؟” قَالَ: “ثَكِلَتْكَ أُمُّكَ يَا مَعَاذُ! وَهَلْ يَكُبُّ النَّاسَ فِيْ النَّارِعَلَى وُجُوْهِهِمْ، أَوْ عَلَى مَنَاخِرِهِمْ، إِلَّا حَصَائِدُ أَلْسِنَتَهِمْ؟” رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَةَ .

(28) [1/16-అపరిశోధితం]
ము’ఆజ్‌’ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను: ”స్వర్గంలో ప్రవేశింపజేసే, నరకం నుండి రక్షించే కార్యం ఏదైనా నాకు బోధించండి,” అని విన్నవించు కున్నాను. దానికి ప్రవక్త (స): ‘నీవు చాలా ముఖ్య మైన మరియు గొప్ప విషయం గురించి అడిగావు కాని, అల్లాహ్‌ (త) సులభతరం చేసిన వాడికే ఇది సులభతరం అవుతుంది. అదేమిటంటే, అల్లాహ్‌(త) ను ఆరాధించు, ఆయనకు సాటి కల్పించకు, ప్రశాంతంగా నమా’జు ఆచరించు, ‘జకాత్‌ చెల్లిస్తూ ఉండు, రమ’దాన్‌ ఉపవాసాలు పాటిస్తూ ఉండు, ఇంకా బైతుల్లాహ్‌ ‘హజ్జ్ చేయి. ఇంకా నేను మరికొన్ని మంచి కార్యాలు తెలపనా, ఉపవాసం ఢాలు వంటిది, దానధర్మాలు పాపాలను నీళ్ళు అగ్నిని ఆర్చినట్టు ఆర్పివేస్తాయి, ఇంకా మానవుని అర్థరాత్రి నమా’జు కూడా పాపాలను చెరిపివేస్తుంది.’ అని పలికి ప్రవక్త (స) ఈ ఆయతులు చదివారు: వారు (రాత్రులలో) తమ ప్రక్కలను తమ పరుపుల నుండి దూరంచేసి, తమ ప్రభువును భయంతో మరియు ఆశతో వేడుకుంటారు మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చుచేస్తారు. కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచిపెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు. (సూ. అస్-సజ్దా, 32:16-17)

ఆ తరువాత ప్రవక్త (స): ‘ఒక పని యొక్క తల, దాని స్తంభాలు, దాని మూపురాన్ని గురించి తెలపనా.’ అని అన్నారు. దానికి నేను: ‘తప్పకుండా తెలియజేయండి ఓ ప్రవక్తా!’ అని విన్నవించు కున్నాను. దానికి ప్రవక్త (స): ‘కార్యాలన్నిటికీ తల (మూలం) ఇస్లామ్‌. ఏ సత్కార్యం కూడా ఇస్లామ్‌ లేకుండా ఉనికి పొందజాలదు. ఏవిధంగా తల లేకుండా శరీరం పనికిరాదో, దాని స్తంభం, నమా’జు, దాని మూపురం జిహాద్‌.’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స): ‘వీటన్నిటికి మూలం మీకు తెలుపనా.’ అని అన్నారు. దానికి నేను: ‘తప్పకుండా.’ అని అన్నాను. ప్రవక్త (స) తన నాలుక పట్టి: ‘దీన్ని అదుపులో ఉంచండి.’ అని అన్నారు. దానికి నేను: ‘ప్రవక్తా! మేము మా నోటి మాటల ద్వారా కూడా విచారణకు గురవుతామా?’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స): ‘నీ పాడుగాను, ప్రజలు తమ నోటిమాటల ద్వారానే బోర్లా పడవేసి నరకంవైపు ఈడ్చబడతారు. అంటే పనికిరాని అధర్మ మాటల వల్లే చాలామంది నరకంలో వేయబడతారు.’ ” )
(అ’హ్మద్‌, తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

వివరణ-29: ‘హదీసు’ వివరణ చాలా స్పష్టంగా ఉంది. ము’ఆజ్‌ బిన్‌ జబల్‌ ప్రయాణంలో ఉదయంపూట ఇలా విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) ఇలా సమా ధానం ఇచ్చారు. అర్థరాత్రి నమా’జు అంటే త’హజ్జుద్‌ నమా’జు అని అర్థం. త’హజ్జుద్‌ నమా’జు చదవడం విశ్వాసి గొప్పతనం. అల్లాహ్‌ ఆదేశం: ”నిశ్చయంగా వారే, మా సూచనలు (ఆయాత్) వారికి బోధించి నప్పుడు, వాటిని విశ్వసించి సాష్టాంగం(సజ్దా)లో పడి పోతారు మరియు తమ ప్రభువు పవిత్రతను కొనియాడు తారు. మరియు ఆయనను స్తుతిస్తారు మరియు వారెన్నడూ గర్వపడరు. వారు (రాత్రులలో) తమ ప్రక్కలను, తమ పరుపుల నుండి దూరం చేసి, తమ ప్రభువును భయంతో మరియు ఆశతో వేడు కుంటారు. మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చుచేస్తారు. కాని వారికి వారి కర్మల ఫలితంగా వారి కొరకు పరలోకంలో కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామగ్రి దాచిపెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు.” (సూ. అస్సజ్‌దహ్‌, 32:15-17)

ఇస్లామ్‌ సత్కార్యాలన్నిటికీ తలవంటిది. ఇస్లామ్‌ లేకుండా ఏ ఆచరణ సత్కార్యంగా పరిగణించబడదు. అల్లాహ్ ఆదేశం: ”వ మన్ యబ్ తగి గైరల్ ఇస్లామి దీనన్, ఫలన్ యుఖ్ బలు మిన్ హు.” – ‘మరియు ఎవరైరైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏమాత్రం స్వీకరించబడదు…’ (సూ. ఆల ఇమ్రాన్, 3:85) మరియు ”ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం.” — ‘నిశ్యంగా, అల్లాహ్ కు సమ్మత మైన ధర్మం కేవలం అల్లాహ్ కు విధేయులవటం (ఇస్లాం) మాత్రమే….’ (సూ. ఆల ఇమ్రాన్, 3:19). ఇస్లామ్‌ అంటే శుభవచన సాక్ష్యం అంటే ఏకత్వం, దైవదౌత్యం. నమా’జు ఇస్లామ్‌ మూలస్తంభం. ఒక ‘హదీసు’లో నమా’జు ధర్మానికి స్తంభంవంటిది అని ఉంది. అదేవిధంగా నమా’జు లేకుండా ముస్లిమ్‌గా పరిగణించడం జరుగదు. అదేవిధంగా ఇస్లామ్‌ ఔన్నత్యం జిహాద్‌. దీనివల్లే ఇస్లామ్‌కు అలంకరణ లభిస్తుంది. ఇంకా ప్రతి పాపానికి దూరంగా ఉండాలి.

30 – [ 29 ] ( لم تتم دراسته ) (1/16)
وَعَنْ أَبِيْ أَمَامَةَ، قَالَ: قَالَ رسولُ الله صلى الله عليه وسلم: “مَنْ أَحَبَّ لِلهِ، وَأَبْغَضَ لِلهِ، وَأَعَطَى لِلهِ، وَمَنَعَ للهِ؛ فَقَدِ اسْتَكْمَلَ الْإِيْمَانَ”. رواه أبو داود .

(29) [1/16-అపరిశోధితం]
అబూ ఉమామహ్ (ర) కథనం: ‘ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌(త) కొరకే ప్రేమించేవారు, అల్లాహ్‌ (త) కొరకే శత్రుత్వం కొనితెచ్చుకునేవారు, అల్లాహ్‌ (త) కొరకే ఇచ్చే వారు, అల్లాహ్‌(త) కొరకే ఇవ్వని వారు అంటే ఏ పని చేసినా అల్లాహ్‌(త) ప్రీతికొరకే చేసేవారు పరిపూర్ణ విశ్వసం గలవారు.’ ) (అబూ దావూద్‌)

వివరణ-30: ఈ ‘హదీసు’ను అబూ ఉమామహ్ బాహిలీ (ర) ఉల్లేఖించారు. వీరు చాలా అధికసంఖ్యలో ‘హదీసు’లను ఉల్లేఖించారు. ఇతను ఈజిప్టులో నివాసం ఏర్పరచుకున్నారు. 86వ హిజ్రీ శకంలో మరణించారు. ఇతను 71 సంవత్సరాలు జీవించారు.

31 – [ 30 ] ( لم تتم دراسته ) (1/17)
وَ رَوَاهُ التِّرْمِذِيُّ عَنْ مُعَاذِ بْنِ أَنَسٍ مَعَ تَقْدِيْمٍ وَتَأْخِيْرٍ، وَفِيْهِ: “فَقَدِ اسْتَكْمَلَ إِيْمَانَهُ”.

(30) [1/17-అపరిశోధితం]
ము’ఆజ్‌’బిన్‌ అనస్‌ కూడా ఈ ‘హదీసు’ను ఉల్లేఖించారు. ఇందులో పదాలు ముందూ వెనుకా ఉన్నాయి. అందులో, ‘అతడు తన విశ్వాసాన్ని పరిపూర్తి చేసుకున్నాడు.’ అని ఉంది. (తిర్మిజి’)

32 – [ 31 ] ( لم تتم دراسته ) (1/17)
وَعَنْ أَبِيْ ذَرٍّ، قَالَ: قَالَ رسولُ اللهِ صلى الله عليه وسلم: “أَفْضَلُ الْأَعْمَالِ الْحُبُّ فِيْ اللهِ وَالْبُغْضُ فِيْ اللهِ”. رواه أبو داود.

(31) [1/17-అపరిశోధితం]
అబూ-జ’ర్‌ (ర) కథనం, ప్రవక్త (స) ప్రవచనం: ”అల్లాహ్‌(త) కోసమే స్నేహం, అల్లాహ్‌ (త) కోసమే శత్రుత్వం, అన్నిటి కంటే ఉత్తమమైన కార్యాలు.” (అబూ దావూద్‌)

33 – [ 32 ] ( لم تتم دراسته ) (1/17)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمُسْلِمُ مَنْ سَلِمَ الْمُسْلِمُوْنَ مِنْ لِسَانِهِ وَيَدِهِ. وَالْمُؤْمِنُ مَنْ أَمِنَهُ النَّاسُ عَلَى دِمَائِهِمْ وَأَمْوَالِهِمْ”. رواه الترمذي والنسائي

(32) [1/17-అపరిశోధితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం, ప్రవక్త (స) ప్రవచనం: ”తన నోటిద్వారా, చేతిద్వారా, ఇతర ముస్లింలకు హాని చేకూర్చని వాడే పరిపూర్ణ ముస్లిమ్‌. అదేవిధంగా ఇతరుల ధన, మాన, ప్రాణాలకు హాని చేకూర్చనివాడే పరిపూర్ణ ముస్లిమ్‌.” (తిర్మిజి’, నసాయి’)

34 – [ 33 ] ( لم تتم دراسته ) (1/17)
وَزَادَ الْبَيْهَقِيُّ فِيْ “شُعْبِ الْإِيْمَانِ”. بِرِوَايَةِ فَضَالَةَ: “وَالْمُجَاهِدُ مَنْ جَاهَدَ نَفْسَهُ فِيْ طَاعَةِ اللهِ، وَالْمُهَاجِرُ مَنْ هَجَرَ الْخَطَايَا وَالذُّنُوْبَ”.

(33) [1/17-అపరిశోధితం]
బైహఖీ ‘షుఅబిల్‌ ఈమాన్‌’లో ఫు’దాలహ్ (ర) ద్వారా ఉల్లేఖనం. ఇందులో దైవారాధనలో, దైవ విధేయతలో తనతో తాను పోరాడినవాడు పరి పూర్ణ ముజాహిద్‌. ఇంకా చిన్నా పెద్దా పాపాలకు దూరంగా ఉండేవాడు పరిపూర్ణ ము’హాజిర్‌ అని అధికంగా ఉంది. (బైహఖీ-షు’అబిల్‌ ఈమాన్‌)

35 – 34 (1/17)
وَعَنْ أَنَسٍ رَضِيَ اللهُ عَنْهُ، قَالَ: قَلَّمَا خَطَبنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلَّا قَالَ: “لَا إِيْمَانَ لِمَنْ لَا أَمَانَةَ لَهُ، وَلَا دِيْنَ لِمَنْ لَّا عَهْدَ لَهُ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعْبِ الْإِيْماَنِ”.

(34) [1/17-ప్రామాణికం]
అనస్‌ (ర) కథనం, ప్రవక్త (స): ”మా ముందు చేసే ప్రసంగాల్లో, ‘అమానతుదారు కానివాడు విశ్వాసికాడు, వాగ్దానం పూర్తి చేయనివాడు ధార్మికుడు కాడు,’ అని.” ప్రవచిస్తూ ఉండేవారు. ) (బైహఖీ-షు’అబిల్‌ ఈమాన్‌)

వివరణ-35: దీనివల్ల అమానతు, వాగ్దానాల ప్రాముఖ్యత విశదమవుతుంది.

الْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
36 – [ 35 ] ( لم تتم دراسته ) (1/17)
عَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ رَضِيَ اللهُ عَنْهُ، قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ شَهِدَ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَّسُوْلُ اللهِ، حَرَّمَ اللهُ عَلَيْهِ النَّارَ” .رَوَاه مُسْلِم .

(35) [1/17-అపరిశోధితం]
‘ఉబాదహ్‌ బిన్‌ సామిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను: ”అల్లాహ్‌(త) తప్ప ఆరాధ్యులెవరూ లేరని, ము’హమ్మద్‌ (స) అల్లాహ్‌(త) ప్రవక్త అని సాక్ష్యం ఇచ్చిన వ్యక్తిపై అల్లాహ్‌(త) నరకాగ్నిని నిషేధించాడు.” (ముస్లిమ్‌)
37 – 36 (1/17)
وَعَنْ عُثْمَان رَضِيَ اللهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ مَاتَ وَهُوَ يَعْلَمُ أَنَّهُ لَا إِلَهَ إِلَّا اللهَ دَخَلَ الْجَنَّةَ”. رَوَاهُ مُسْلِمٌ.

(36) [1/17-దృఢం]
‘ఉస్మాన్‌ (ర) కథనం, ప్రవక్త (స) ప్రవచనం: ”అల్లాహ్‌ (త) తప్ప ఆరాధ్యులెవరూ లేరనే విశ్వాసంతో మరణించిన వ్యక్తిని అల్లాహ్‌(త) స్వర్గంలో ప్రవేశింప జేస్తాడు.” )

వివరణ-37: ఈ ‘హదీసు’ను ప్రవక్త (స) అనుచరులు ‘ఉస్మాన్‌ బిన్‌ ‘అప్ఫాన్‌ జు’న్నూరైన్‌ ఉల్లేఖించారు. అస్‌’హాబుల్‌ ఫీల్‌ 6వ సంవత్సరం అంటే హిజ్రత్‌కు 47 సంవత్సరాల ముందు మక్కహ్ లో జన్మించారు. విద్య భ్యాసం తర్వాత వ్యాపారంలో నిమగ్నులయి పోయారు. తన సత్య సంధత, నిజాయితీల వల్ల పేరు ప్రతిష్టలు సంపాదించారు. 34 సంవత్సరాల వయస్సులో ఇస్లామ్‌ స్వీకరించారు. ఇతని భక్తిని చూసి ప్రవక్త (స) తన రెండవ కూతురైన రుఖయ్యను అతనికిచ్చి వివాహం చేశారు. రుఖయ్యను తీసుకొని అతను హబ్‌షా’ వైపు హిజ్రత్‌ చేశారు. కుటుంబ సమేతంగా హిజ్రత్‌ చేసిన వారిలో ‘ఉస్మాన్‌ మొట్ట మొదటి వ్యక్తి.
‘ఉస్మాన్‌ (ర) అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నారు. ఆ తరు వాత ఖురైషుల్లోని కొందరి గురించి తప్పుడు సమాచారం వల్ల స్వదేశం తిరిగి వచ్చారు. ఇక్కడకు వచ్చిన తర్వాత ఆ వార్త అసత్యమని తేలింది. అనంతరం చాలా మంది ప్రవక్త (స) అనుచరులు మళ్ళీ హబ్‌షా’ తిరిగి వెళ్ళిపోయారు. కాని ‘ఉస్మాన్‌ మాత్రం తిరిగి వెళ్ళలేదు.
మదీనహ్ వైపు హిజ్రత్‌: ఈ మధ్యలోనే మదీనహ్ వైపు హిజ్రత్‌ చేయడానికి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రవక్త (స) తన అనుచరులందరినీ మదీనహ్ హిజ్రత్‌ చేయమని ఆదేశించారు. అప్పుడు ‘ఉస్మాన్‌ కూడా తన కుటుంబ సమేతంగా మదీనహ్ వైపు హిజ్రత్‌ చేసారు. ‘ఔస్‌ బిన్‌ సా’బిత్‌కు అతిథులయ్యారు. ప్రవక్త (స) ‘ఉస్మాన్‌కు ‘ఔస్‌ బిన్‌ సా’బిత్‌కు సోదర సంబంధం ఏర్పరిచారు.
బీరె రూమా విక్రయం: మదీనహ్ వచ్చిన తర్వాత ముహాజిరీన్లకు నీటి సమస్య ఎదురైంది. మదీనహ్ పట్టణంలో కేవలం బీరె రూమాయే ఉండేది. అదొక్కటే మంచినీటి బావి. కాని దాని యజమాని యూదుడు. అతడు దాన్ని ఉపాధి మార్గంగా చేసుకున్నాడు. ‘ఉస్మాన్‌ (ర) ముస్లిములకు ఈ కష్టాన్ని దూరం చేయడానికి ఆ బావిని కొని ప్రజలకు అంకితం చేద్దామని అనుకున్నారు. అనేక కృషి ప్రయత్నాల తరువాత ఆ యూదుడు కేవలం సగం హక్కు మాత్రమే అమ్మాడు. ‘ఉస్మాన్‌ (ర) 12 వేల దిర్‌హమ్‌లు ఇచ్చి సగం బావి కొనుక్కున్నారు. షరతు ఏమిటంటే ఒకరోజు ఆ యూదుడు ఉపయోగిస్తాడు, రెండవ రోజు ‘ఉస్మాన్‌ వంతువస్తుంది. ‘ఉస్మాన్‌ వంతు వచ్చినప్పుడు ముస్లిములు నీళ్ళను నింపుకునే వారు. రెండురోజుల వరకు నీళ్ళు సరిపోయేవి. ఇక యూదుడు ఆ బావి వల్ల మరే లాభం లేదని భావించి మిగతా సగభాగం కూడా అమ్మడానికి సిద్ధపడ్డాడు. ఉస్మాన్‌ (ర) 8 వేల దిర్‌హమ్‌లు ఇచ్చి దాన్ని కూడా కొనుక్కున్నారు. దాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఈ విధంగా ఇస్లామ్‌లో ‘ఉస్మాన్‌ (ర) మొట్టమొదటి త్యాగం ముస్లిములకు అంకితం చేయ బడింది. ప్రజల దాహం తీర్చటానికి కారణభూతం అయింది.
బద్ర్‌ యుద్ధం, రుఖయ్య అనారోగ్యం: సత్యాసత్యాల మధ్య మొట్ట మొదటి సారిగా బద్ర్‌ యుద్ధం జరిగింది. ‘ఉస్మాన్‌ (ర) కొన్ని కారణాల వల్ల ఇందులో పాల్గొనలేక పోయారు. ప్రవక్త (స) కూతురు మరియు అతని భార్య అయిన రుఖయ్యహ్ అనారోగ్యానికి గురయ్యారు. అందువల్ల ప్రవక్త (స) అతన్ని ఆమె సేవలు చేయడానికి ఉండమన్నారు. ఇంకా నీకు అందులో పాల్గొన్నట్టు ప్రతిఫలం, యుద్ధధనం అన్నీ లభిస్తాయని అన్నారు. ప్రవక్త (స) స్వయంగా 317 అనుచరులతో బద్ర్‌ మైదానం వైపు బయలదేరారు. రుఖయ్య అనారోగ్యం ప్రాణాంతకంగా తయారయింది. ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణించసాగింది. చివరికి కొన్ని రోజుల తర్వాత మరణించారు. ‘ఉస్మాన్‌ మరియు ఉసామహ్ బిన్‌ ‘జైద్‌ ఆమె ఖనన సంస్కారాల్లో నిమగ్నమయి ఉండగా ‘అల్లాహు అక్బర్‌’ అనే నినాదం వినబడింది. చూస్తే, ‘జైద్‌ బిన్‌ ‘హారిస’హ్ ప్రవక్త (స) ఒంటెపై బద్ర్‌ విజయ శుభవార్తను తీసుకొని వస్తున్నారు. ప్రియమైన భార్య మరియు ప్రవక్త (స) ముద్దుల కుమార్తె మరణించటం సామాన్య విషయం కాదు. ఈ సంఘటన తర్వాత ‘ఉస్మాన్‌ ఎల్లప్పుడూ విచారంగా ఉండేవారు. బద్ర్‌ యుద్ధంలో పాల్గొనే అవకాశం లభించలేదనే విచారం కూడా ఉండేది. అది చూసి ‘ఉమర్‌ (ర) ‘అయినదేదో అయింది, ఇప్పుడు విచారించటం వల్ల లాభం ఏంటి?’ అని అన్నారు. అప్పుడు ‘ఉస్మాన్‌ (ర), ‘నా దురదృష్టంపై ఎంత విచారించినా తక్కువే, ‘తీర్పుదినంనాడు నా బంధుత్వం తప్ప మిగతా బంధుత్వాలన్నీ నశిస్తున్నాయి అని ప్రవక్త (స) ప్రవ చించారని అన్నారు. విచారకరమైన విషయం ఏమిటంటే, ప్రవక్త (స)తో బంధుత్వం తెగిపోయింది’ అని కుమిలి పోయారు. ప్రవక్త (స) అతన్ని ఓదార్చి, తాను స్వయంగా తన కూతురి సేవ నిమిత్తం బద్ర్‌ యుద్ధంలో పాల్గొనవద్దని చెప్పినందుకు, అతన్ని కూడా బద్ర్‌ యుద్ధంలో పాల్గొన్నట్టు పరిగణించి యుద్ధధనంలో అతనికి కూడా ఒకవంతు కల్పించారు. ఇంకా ప్రతిఫలం కూడా లభిస్తుందని శుభవార్త తెలియపరిచారు. అంతేకాక ప్రవక్త (స) తన మరో కూతురు ఉమ్మె కుల్‌సూ’మ్‌ను అతని కిచ్చి వివాహం చేశారు. మళ్ళీ రెండవసారి ప్రవక్త (స) ఇంటితో అతని బంధుత్వం ఏర్పడింది.
బద్ర్‌ యుద్ధం తరువాత జరిగిన యుద్ధాలు, సంగ్రామాలు అన్నింటిలో పాల్గొన్నారు. వీరోచితంగా పోరాడి ప్రవక్త (స)కు వెంట ఉన్నారు. ప్రతిసారి సరైన నిర్ణయాలతో, వీరత్వంతో ప్రవక్త (స)కు కుడిభుజంగా ఉన్నారు. 6వ హిజ్రీ శకంలో ప్రవక్త (స) క’అబహ్ సందర్శనానికి పూనుకున్నారు. ‘హుదైబియహ్ చేరిన తర్వాత అవిశ్వాసులు దీనికి సమ్మతించడంలేదని తెలిసింది. అయితే ప్రవక్త (స) ఉద్దేశ్యం యుద్ధం కాదు కనుక, సంప్రదింపులు, ఒప్పందంకోసం ‘ఉస్మాన్‌ను రాయబారిగా పంపారు.
రాయబార సేవలు: ‘ఉస్మాన్‌ మక్కహ్ చేరిన తర్వాత అవిశ్వాసులు అతన్ని నిర్బంధించారు. వెళ్ళనివ్వకుండా చేశారు. రోజులు గడిచినా ‘ఉస్మాన్‌ గురించి ఎటువంటి వార్త రాకపోవడంతో ముస్లిములు ఆందోళన చెందారు. ఇంతలో ‘ఉస్మాన్‌ (ర) వీరమరణం పొందారని గాలి వార్తలు చెలరేగాయి. తప్పుడు ప్రచారం జరిగింది. అప్పుడు ప్రవక్త (స) ఈ వార్తవిని ‘ఉస్మాన్‌ (ర) తరఫున ప్రతీకారం కోసం అక్కడున్న 1400 మంది అనుచరులతో ఒక చెట్టు క్రింద బై’అత్‌ తీసుకున్నారు. ‘ఉస్మాన్‌ తరఫున తన చేతిపై చేయివేసి బై’అత్‌ తీసుకున్నారు. ఇది ‘ఉస్మాన్‌ (ర)కు ఎంతో గౌరవమైన, గర్వకారణమైన విషయం. ఇది అతనికి తప్ప మరెవరికీ దక్కలేదు. 7వ హిజ్రీ శకంలో ‘ఖైబర్‌ యుద్ధం జరిగింది. ఆ తరువాత 8వ హిజ్రీ శకంలో మక్కహ్ విజయం సంభవించింది. ఆ తరువాత, అదే సంవత్సరం హౌ’జాన్ (‘హునైన్‌) యుద్ధం జరిగింది. ‘ఉస్మాన్‌ (ర) అన్నిటిలో పాల్గొన్నారు.
తబూక్‌ పోరాటం: జైషె ఉస్ర సన్నాహాలు: 9వ హిజ్రీ శకంలో ఖై’సరె రూమ్‌ అరబ్బులపై దండెత్తగోరుతున్నాడని తెలిసింది. దీన్ని ఎదుర్కోవడం కూడా అత్యవసరమే. కాని ఇది చాలా కరువుకాటకాల కాలం. అందువల్ల ప్రవక్త (స) చాలా ఆందోళనకు గురయ్యారు. అనుచరులకు ఆయుధాలు సమకూర్చటంలో నిమగ్నులయ్యారు. సహాయ సహకారాలు అందించమని ప్రజలను ప్రోత్సహించారు. చాలామంది పెద్ద మొత్తాలు సమర్పించారు. ‘ఉస్మాన్‌ (ర) చాలా పెద్ద వర్తకులు. ఆ కాలంలో అతని వ్యాపార బృందం సిరియా నుండి చాలా లాభాలు గడించి తిరిగి వచ్చింది. ఫలితంగా 1/3వ వంతు సైన్యం ఖర్చులన్నీ తాను భరిస్తానని ఒప్పుకున్నారు. ఇబ్ను స’అద్‌ వాహనాలతో కూడిన సైనికులు సిద్ధం చేయబడ్డారు. ఇందులో 30వేల సైనికులు, 10 వేల వాహనాలు తయారయ్యాయి. ఈ సందర్భంగా ‘ఉస్మాన్‌ (ర) 10 వేల మందికి పైగా సైనికులకు ఆయుధాలను సమకూర్చే బాధ్యత తీసుకున్నారు. ఇవేకాక 1000 ఒంటెలు, 70 గుర్రాలు ఖర్చులకు 1000 దీనార్లు సమర్పించారు. ప్రవక్త (స) ఆయన దాతృత్వానికి సంతోషించి అష్రఫీలను చేతులతో పైకి విసురుతూ, ‘నేటి తర్వాత ‘ఉస్మాన్‌ (ర) ఏమిచేసిన అతనికి హాని చేకూర్చలేదు’ అని అన్నారు.
10వ హిజ్రీ శకంలో ప్రవక్త (స) చివరి ‘హజ్జ్ చేశారు. దీన్ని ‘హజ్జతుల్‌ విదాఅ’ అంటారు. ‘ఉస్మాన్‌ (ర) కూడా వెంట ఉన్నారు. ‘హజ్జ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత 11వ హిజ్రీ శకం ప్రారంభంలో రబీఉల్‌ అవ్వల్‌లో ప్రవక్త (స) అనారోగ్యానికి గురయ్యారు. 12 రబీఉల్‌ అవ్వల్‌ నాడు మరణించారు.
ప్రవక్త (స) మరణానంతరం సఖీఫహ్ బనీ సా’యిదహ్‌లో అబూ బకర్‌ చేతిపై బై’అత్‌ చేయడం జరిగింది. అబూ బకర్‌ పరిపాలనలో ‘ఉస్మాన్‌ (ర) సలహాబృందంలో ఒక సభ్యునిగా ఉండేవారు. 2 సంవత్సరాల 3 నెలల పరిపాలన తర్వాత అబూ-బకర్‌(ర) మరణించారు. అబూ-బకర్‌ (ర) మరియు ముస్లిముల ఇష్ట ప్రకారం ‘ఉమర్‌ (ర) పరిపాలనా బాధ్యతలు చేపట్టారు. ‘ఉమర్‌ (ర) కోసం వీలునామా ‘ఉస్మాన్‌ చేతుల ద్వారా వ్రాయబడింది. సుమారు 10 సంవత్సరాలు పరిపాలించి 32 హిజ్రీ శకంలో ‘ఉమర్‌ (ర) అమర వీరులయ్యారు. చివరి ఘడియల్లో 6 గురి పేర్లను పేర్కొన్నారు. వారు ‘అలీ, ‘ఉస్మాన్‌, ‘జుబైర్‌, ‘తల్‌’హా, స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌, ‘అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ లు. అదేవిధంగా 3 రోజుల్లో ఎన్నుకోవాలని ఆదేశించారు.
‘ఉమర్‌ (ర) ఖనన సంస్కారాల తర్వాత ఎన్నికల సమస్య తలెత్తింది. 2 రోజుల వరకు దీనిపై చర్చ జరిగింది. కాని ఏమీ తేల లేదు. చివరికి 3వ రోజు ‘అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌, ‘వీలునామా ప్రకారం అధికారం 6 గురిలో ఉంది. కాని దీన్ని 3కే పరిమితం చేయాలి’ అని అన్నారు. ‘జుబైర్‌ (ర), ‘అలీని పేర్కొన్నారు. స’అద్‌, ‘అబ్దుర్రహ్మాన్‌ను పేర్కొన్నారు. ‘తల్‌’హా ‘ఉస్మాన్‌ను పేర్కొన్నారు. ‘అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌, ‘నేను తొలగిపోతున్నాను, అందువల్ల వ్యవహారం ఇప్పుడు ఇద్దరిపై ఉంది. వీరిద్దరిలో ఎవరు ఖుర్‌ఆన్‌, ప్రవక్త సాంప్రదాయంపై ప్రమాణం చేస్తే వారి చేతిపై బై’అత్‌ చేయ బడుతుంది’ అని అన్నారు. ఆ తరువాత ఇద్దరితో వేర్వేరుగా మాట్లాడి ‘మీరిద్దరూ ఈ వ్యవహారాన్ని నాకు అప్పగించండి’ అని అన్నారు. వారిద్దరూ సమ్మతించిన తర్వాత ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ఔఫ్‌ ప్రవక్త (స) అనుచరు లందరితో మస్జిద్‌లో సమావేశమై ప్రభావపూరితమైన ఒక చిన్న ప్రసంగం చేసి ‘ఉస్మాన్‌ (ర) చేతిపై బై’అత్‌ చేశారు. ఆ తరువాత ‘అలీ (ర) బై’అత్‌ కోసం చేయి ముందుకు చాచారు. అనంతరం అక్కడున్న వారందరూ బై’అత్‌ కోసం విరుచుకుపడ్డారు. ముహర్రమ్‌ 4వ తేదీ 24 హిజ్రీ సోమవారం నాడు ‘ఉస్మాన్‌ (ర) ముస్లిముల ‘ఖలీఫహ్ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇస్లామీయ సేవలో నిమగ్నులయిపోయారు. ‘ఉస్మాన్‌ తన పరిపాలనలో ఎన్నో ఘనకార్యాలు చేశారు. 12 సంవత్సరాల వరకు చాలా బాధ్యతగా విధులను నిర్వర్తించారు. చివరికి ద్రోహుల చేతుల్లో వీరమరణం పొందారు. వీరమరణం పొందినపుడు ఖుర్‌ఆన్‌ పఠిస్తున్నందువల్ల ”…ఫసయక్‌ ఫీకహుముల్లాహు వ హువ స్సమీఉల్‌ అలీమ్‌.” (సూ. అల్-బఖరహ్, 2:137) – ‘… వారి నుండి (రక్షించటానికి) మీకు అల్లాహ్ చాలు. ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.’ అనే వాక్యంపై రక్తం చిందింది.
(ముస్లిమ్‌)
38 – 37 (1/17)
وَعَنْ جَابِرٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ثِنْتَانِ مُوْجِبَتَانِ”. قَالَ رَجُلٌ: يَا رَسُوْلَ اللهِ! مَا الْمُوْجِبَتَانِ؟ قَالَ: “مَنْ مَاتَ يُشْرِكْ بِاللهِ شَيْئاً دَخَلَ النَّارَ، وَمَنْ مَّاتَ لَا يُشْرِكَ بِاللهِ شَيْئًا دَخَلَ الْجَنَّةَ”. رواه مسلم.

(37) [1/17-దృఢం]
జాబిర్‌ (ర) కథనం, ప్రవక్త (స): ‘రెండు వస్తువులు తప్పనిసరి చేస్తాయి.’ అని అన్నారు. ఒక వ్యక్తి: ‘ఏం తప్పనిసరి చేస్తాయి?’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స): స్వర్గం లేదా నరకం తప్పనిసరి చేస్తాయి, అల్లాహ్‌(త)కు సాటి కల్పిస్తూ మరణిస్తే నరకంలో ప్రవే శిస్తాడు. అదేవిధంగా అల్లాహ్‌ (త)కు సాటి కల్పించని స్థితిలో మరణిస్తే స్వర్గంలోనికి ప్రవేశిస్తాడు.”)

వివరణ-38: ఈ ‘హదీసు’ను జాబిర్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ ఉల్లేఖించారు. ఇతను తన తండ్రి వెంట ‘ఉఖ్‌బహ్ సా’నియలో ఇస్లామ్‌ స్వీకరించారు. తండ్రి వీరమరణం పొందిన తర్వాత ఇంటి బాధ్యతలు ఇతని నెత్తిపై పడ్డాయి. చెల్లెళ్ళ సంరక్షణ, విద్యాభ్యాసం బాధ్యతలను నిర్వర్తించారు. తండ్రి చేసిన అప్పులు తీర్చారు. కందకం యుద్ధం సందర్భంగా ప్రవక్త (స) కోసం విందు ఏర్పాటు చేశారు. అల్లాహ్‌ (త) అతని విందులో గొప్ప శుభం ప్రసాదించాడు. అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. 94 సంవత్సరాల వయస్సులో మరణించారు.
(ముస్లిమ్‌)
39 – 38 (1/18)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ، قَالَ: كُنَّا قُعُوْدٌا حَوْلَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم ومَعَنْا أَبُوْ بَكْرٍ وَعُمَرُ رَضِيَ اللهُ عَنْهُمَا فِيْ نَفَرٍ، فَقَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنْ بَيْنِ أَظْهَرِنَا، فَأَبْطَأَ عَلَيْنَا، وَخَشَيْنَا أَنْ يُّقْتَطِعَ دُوْنَنَا، وَفَزْعَنْا فَقُمْنَا، فَكُنْتُ أَوَّلَ مَنْ فَزِعَ، فَخَرَجْتُ أَبْتَغِيْ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم، حَتَّى أَتَيْتُ حَائِطًا لِلْأَنْصَارِ لِبَنِي النَّجَارِ، فَسَاورْتُ بِهِ، هَلْ أَجِدُ لَهُ بَابَا؟ فَلَمْ أَجِدْ، فَإِذَا رَبِيْعٌ يَّدْخُلُ فِيْ جَوْفِ حَائِطٍ مِّنْ بِئْرٍ خَارِجَةَ- وَالرَّبِيْعُ الْجَدُوْلُ- قَالَ: فَاحْتَفَزْتُ فَدَخَلْتُ عَلَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ: “أَبُوْ هُرَيْرَة؟” فَقُلْتُ: نَعَمْ يَا رَسُوْلَ اللهِ! قَالَ: “مَا شَأنُكَ؟” قُلْتُ: كُنْتَ بَيْنَ أَظْهُرِنَا فَقُمْتُ فَأَبْطَأْتَ عَلَيْنَا، فَخَشِيْنَا أَنْ تُقْتَطَعَ دُوْنَنَا، فَفَزِعَنْا، فَكُنْتُ أَوَّلَ مَنْ فَزِعَ، فَأَتَيْتُ هَذَا الْحَائِطَ، فَاحْتَفَزْتُ كَمَا يَحْتَفِزُ الثَّعْلَبُ، وَهَؤُلَاءِ النَّاسُ وَرَائِيْ. فَقَالَ: “يَا أَباَ هُرَيْرَةَ!” وَأَعْطَانِيْ نَعْلَيْهِ، فَقَالَ: اذْهَبْ بِنَعْلَيَّ هَاتَيْنِ، فَمَنْ لَقِيْتَ مِنْ وَّرَاءِ هَذَا الْحَائِطِ يَشْهَدُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ مُسْتَيْقِنَا بِهَا قَلْبُهُ؛ فَبَشِّرْهُ بِالْجَنَّةِ”. فَكَانَ أَوَّلُ مَنْ لَّقِيْتُ عُمْرُ فَقَالَ: مَا هَاتَانِ النَّعْلَانِ يَا أَبَا هُرَيْرَةَ؟ فَقُلْتُ: هَاتَانِ نَعْلًا رَسُولِ اللهِ صلى الله عليه وسلم بَعَثَنِيْ بِهِمَا، مَنْ لَّقِيْتُ يَشْهَدُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ مُسْتَيْقِنَا بِهَا قَلْبُهُ، بَشَّرْتُهُ بِالْجَنَّةِ، فَضَرَبَ عُمْرُ بَيْنَ ثَدُيَيَّ، فَخَرَرْتُ لِاِسْتِيْ. فَقَالَ: ارْجِعْ يَا أَبَا هُرَيْرَةَ! فَرَجَعْتُ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَأَجْهَشْتُ بُكَاءَ، وَرَكِبَنِيْ عُمْرُ، وَإِذَا هُوَ عَلَى أثَرِيْ، فَقَالَ رسولُ اللهِ صلى الله عليه وسلم: “ماَ لَكَ يَا أَبَا هُرَيْرَةَ؟” قُلْتُ: لَقِيْتُ عُمَرَ فَأَخْبَرْتُهُ بِالَّذِيْ بَعَثَتَنِيْ بِهِ، فَضَرَبَ بَيْنَ ثَدَيَيَّ ضَرَبَةً خَرَرْتُ لَاسْتِيْ. قَالَ: اِرْجِعْ. فَقَالَ رَسُوْلُ اللهِ: “يَا عُمَرُ! مَا حَمَلَكَ عَلَى مَا فَعَلْتَ؟” قَالَ: يَا رَسُوْلَ اللهِ! بِأَبِيْ أَنْتَ وَأُمِّيْ، أَبَعَثْتَ أَبَا هُرَيْرَةَ بِنَعْلَيْكَ، مَنْ لَقِيَ يَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ مُسْتَيْقِنًا بِهَا قَلْبُهُ بَشِّرْهُ بِالْجَنَّةِ؟ قَالَ: “نَعَمْ”. قَالَ: فَلَا تَفْعَلْ، فَإِنِّيْ أَخْشَى أَنْ يَّتَّكِلَ النَّاسُ عَلَيْهَا، فَخَلِّهِمْ يَعْمَلُوْنَ. فقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فَخَلِّهِمْ”. رواه مسلم .

(38) [1/18-దృఢం]
అబూ హురైరహ్‌ (ర) కథనం:”మేము ప్రవక్త (స) చుట్టూ కూర్చొని ఉన్నాం. అప్పుడు అబూ బకర్‌, ‘ఉమర్ (ర) కూడా మాలో ఉన్నారు. అకస్మాత్తుగా ప్రవక్త (స) నిలబడి, ఎటో వెళ్ళిపోయారు. చాలా సేపటి వరకు రాలేదు. మేము ప్రవక్త (స) గురించి ఆందోళన చెందాము. అందరికన్నా నేను ఎక్కువగా ఆందోళన చెంది వెతకటానికి బయలు దేరాను. వెతుక్కుంటూ నేను బనీ నజ్జార్‌ తెగకు చెందిన తోట వద్దకు చేరుకున్నాను. దాని నాలుగు ప్రక్కల గోడలతో ఆవరించి ఉంది. చుట్టూ తిరిగాను. లోపలికి వెళ్ళే మార్గం దొరకలేదు. అకస్మాత్తుగా నా దృష్టి లోపలికి వెళ్ళే కాలువపై పడింది. నేను అందులోనుండి దూరి తోటలోనికి ప్రవేశించాను. బయట బావి నుండి చూడగా ప్రవక్త (స) అక్కడ ఉన్నారు. నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. ప్రవక్త (స) నన్ను చూచి, ‘అబూ హురైరహ్‌,’ అని అన్నారు. దానికి నేను, ‘ఓ దైవప్రవక్తా!’ అని అన్నాను. దానికి ప్రవక్త (స) ‘ఏంటి సంగతి? నీవు ఇక్కడ ఎలా,’ అని అన్నారు. దానికి నేను, ‘ఓ ప్రవక్తా! తమరు మా మధ్యలో నుండి అకస్మాత్తుగా వెళ్ళిపోయారు, ఎంత సేపటికీ రాకపోయే సరికి, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తమరి కేదైనా ప్రాణాపాయం ఉందని భయపడ్డారు. మేము చాలా కలవరపడ్డాము. అందరి కన్నా నేను చాలా ఆందోళనకు గురై తమర్ని వెతుక్కుంటూ ఈ తోటవరకు చేరాను. ఇక్కడ లోపలికి ప్రవేశించాను. మిగిలినవారు నా వెనుక వస్తున్నారు’ అని అన్నారు. ప్రవక్త (స) తన రెండుచెప్పులు నాకిచ్చి, ‘నా రెండు చెప్పులు తీసుకొని వెళ్ళి, ఈ తోట బయట నీకు ఎవరు కలసినా, నిర్మలమైన మనస్సుతో అల్లాహ్‌ (త) తప్ప ఆరాధనకు అర్హులెవరూ లేరని సాక్ష్యమిస్తే, అతనికి స్వర్గ ప్రవేశం లభిస్తుందనే శుభవార్త అందజేయి,’ అని అన్నారు. అనంతరం తోట బయటకు వచ్చే సరికి ‘ఉమర్‌ (ర) కలిశారు. ఉమర్‌ (ర) నన్ను, ‘ఈ రెండు చెప్పులు ఎవరివని’ అడిగారు. దానికి నేను, ‘ఇవి ప్రవక్త (స) చెప్పులు, ప్రవక్త (స) నాకు ఇచ్చి పంపారు, ఇంకా నిన్ను కలసిన వారు నిర్మలమైన మనస్సుతో, అల్లాహ్‌(త) తప్ప ఆరాధనకు అర్హు లెవరూ లేరని సాక్ష్యం ఇస్తే, వారికి స్వర్గ శుభవార్త ఇమ్మన్నారు,’ అని అన్నాను. అది విన్న ‘ఉమర్‌ (ర) నా గుండెపై ఎంత గట్టిగా గుద్దారంటే నేను వెల్లకిలా పడిపోయాను. ఇంకా ‘తిరిగి వెళ్ళమని’ అన్నారు. నేను ప్రవక్త (స) వద్దకు తిరిగివెళ్ళి వెక్కివెక్కి ఏడ్వసాగాను. ఒకవైపు ‘ఉమర్‌ భయం కూడాను. ఇంతలో ‘ఉమర్‌ (ర) నా వెనుకే వచ్చారు. నేను ఏడ్వటం చూసి, ప్రవక్త (స) నన్ను ‘ఏమయింది?’ అని అడిగారు. దానికి నేను, ” ‘ఉమర్‌ (ర) దారిలో కలిశారు. తమరు చెప్పిన విధంగానే నేను చెప్పాను. దానికి ‘ఉమర్‌ (ర) నా గుండెపై ఎంత గట్టిగా కొట్టారంటే, నేను వెల్లకిలా పడిపోయాను. ఇంకా అతను నన్ను ‘తిరిగి వెళ్ళు,’ అని అన్నారు,” అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ఓ ‘ఉమర్‌! నీవు ఇలా ఎందుకుచేశావు?’ అని అడిగారు. ‘దీనికి కారణం ఏమిటి?’ అని అడిగారు. దానికి ‘ఉమర్‌ (ర), ”ఓ ప్రవక్తా! నా తల్లి దండ్రులు మీ కోసం త్యాగం కాను. తమరు నిజంగా అబూ హురైరహ్‌కు చెప్పులు ఇచ్చి, నిర్మలమైన మనస్సుతో అల్లాహ్‌(త) తప్ప ఆరాధనకు అర్హులెవరూ లేరని సాక్ష్యం ఇచ్చిన వారికి స్వర్గ శుభవార్తను అందజేయాలని పంపారా?” అని అడిగారు. దానికి ప్రవక్త (స) ‘అవును’ అని అన్నారు. దానికి ‘ఉమర్‌ (ర), ‘తమరు ఇలా చేయకండి, ఎందు కంటే ప్రజలు దీన్నే నమ్ముకొని ఉండిపోతారు. కృషి ప్రయత్నాలను వదలివేస్తారు. తమరు వారిని కృషి చేయడానికి వదలివేయండి,’ అని అన్నారు. అది విన్న ప్రవక్త (స), ”మంచిది అయితే వారిని శ్రమించ డానికి వదలివేయి” అని అన్నారు. )

వివరణ-39: 1. ప్రవక్త (స) వెళ్ళి రానందుకు ప్రజలు ఆందోళన చెందారు. ప్రవక్త (స) చిహ్నంగా తన రెండు చెప్పులు ఇచ్చి, వాటి ద్వారా ప్రవక్త (స) క్షేమంగా ఉన్నారని ప్రజలు తెలుసుకుంటారని పంపారు.

ఈ శుభవార్త ద్వారా కొందరు ప్రజలు అపార్థానికి గురయ్యే ప్రమాదం ఉండేది. ‘ఉమర్‌ (ర) అబూ హురైరహ్‌ (ర)ను వివరించి తిరిగి వెళ్ళమని చెప్పారు. అబూ హురైరహ్‌ (ర) అసలు ప్రవక్త (స) సందేశ ప్రచారకులు కావటం వల్ల తిరిగి వెళ్ళటానికి నిరాకరించి ఉంటారు. అందువల్ల ‘ఉమర్‌ (ర) హెచ్చరిస్తూ ఒక్క గుద్దుగుద్దారు.

ఏకత్వం సాక్ష్యంతో పాటు దైవదౌత్యం సాక్ష్యం కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకంటే రెండు సాక్ష్యాలూ ఒకదానికి ఇంకొకటి తప్పనిసరి.
(ముస్లిమ్‌)
40 – [ 39 ] ( لم تتم دراسته ) (1/19)
وَعَنْ مَعَاذٍ بْنِ جَبَلٍ، قَالَ: “قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم: “مَفَاتِيْحُ الْجَنَّةِ شَهَادَةُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ”. رواه أحمد

(39) [1/19-అపరిశోధితం]
ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌ (ర) కథనం, ప్రవక్త (స) ప్రవచనం: ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ అని సాక్ష్యం ఇవ్వటం స్వర్గం యొక్క తాళంచెవి.” )

వివరణ-40: అంటే ఏకత్వం గురించి సాక్ష్యం ఇవ్వటం స్వర్గం యొక్క తాళం చెవి. సాక్ష్యం ఇచ్చే వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఇక్కడ ఏకత్వం సాక్ష్యం అంటే ఈమాన్‌, ఇస్లామ్‌ అన్నీ వర్తిస్తాయి.
(అ’హ్మద్‌)
41 – [ 40 ] ( لم تتم دراسته ) (1/19)
عَنْ عُثْمَانَ بْنِ عَفَّانَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: إِنَّ رِجَالًا مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حِينَ تُوُفِّيَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حَزِنُوا عَلَيْهِ حَتَّى كَادَ بَعْضُهُمْ يُوَسْوِسُ قَالَ عُثْمَان: وَكنت مِنْهُم فَبينا أَنا جَالس فِي ظلّ أَطَم من الْآطَام مر عَليّ عمر رَضِي الله عَنهُ فَسلم عَليّ فَلم أشعر أَنه مر وَلَا سلم. فَانْطَلق عمر حَتَّى دخل على أبي بكر رَضِي الله عَنهُ. فَقَالَ لَهُ مَا يُعْجِبك أَنِّي مَرَرْت على عُثْمَان فَسلمت عَلَيْهِ فَلم يرد عَليّ السَّلَام. وَأَقْبل هُوَ وَأَبُو بكر فِي وِلَايَةَ أَبِي بَكْرٍ رَضِيَ اللَّهُ عَنْهُ حَتَّى سلما عَليّ جَمِيعًا. ثمَّ قَالَ أَبُو بكر جَاءَنِي أَخُوك عمر فَذكر أَنه مر عَلَيْك فَسلم فَلم ترد عَلَيْهِ السَّلَام فَمَا الَّذِي حملك على ذَلِك. قَالَ: قُلْتُ مَا فَعَلْتُ. فَقَالَ عُمَرُ بَلَى وَاللَّهِ لقد فعلت وَلكنهَا عبيتكم يَا بني أُميَّة. قَالَ: قُلْتُ وَاللَّهِ مَا شَعَرْتُ أَنَّكَ مَرَرْتَ وَلَا سَلَّمْتَ. قَالَ أَبُو بَكْرٍ صَدَقَ: عُثْمَانُ وَقد شَغَلَكَ عَنْ ذَلِكَ أَمْرٌ فَقُلْتُ أَجْلَ. قَالَ مَا هُوَ. فَقَالَ عُثْمَان رَضِي الله عَنهُ: توفى الله عز وَجل نَبِيَّهُ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَبْلَ أَنْ نَسْأَلَهُ عَنْ نَجَاةِ هَذَا الْأَمْرِ. قَالَ أَبُو بكر قد سَأَلته عَن ذَلِك. قَالَ فَقُمْت إِلَيْهِ فَقلت لَهُ: بِأَبِي أَنْتَ وَأُمِّي أَنْتَ أَحَقُّ بِهَا. قَالَ أَبُو بَكْرٍ: قُلْتُ يَا رَسُولَ اللَّهِ مَا نَجَاةُ هَذَا الْأَمْرِ. فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : [ص:20] مَنْ قَبِلَ مِنِّي الْكَلِمَةَ الَّتِي عَرَضْتُ عَلَى عَمِّي فَرَدَّهَا فَهِيَ لَهُ نجاة. رَوَاهُ أَحْمد.

(40) [1/19-అపరిశోధితం]
‘ఉస్మాన్‌ (ర) కథనం: ‘ప్రవక్త (స) మరణంపై అనుచరు లందరూ విచారానికి గురయ్యారు. చివరికి కొందరి హృద యాల్లో కలతలు ఉద్భవించసాగాయి. నేను కూడా వారిలో ఒకడ్నే. నేను విచారంలో మునిగి కూర్చున్నాను. ‘ఉమర్‌ (ర) నా ప్రక్క నుండి వెళుతూ నాకు సలామ్‌ చేశారు. అయితే నా ప్రక్క నుండి ఎవరో వెళ్ళినట్టు, సలామ్‌ చేసి నట్టు నేను గమనించ లేదు. ‘ఉమర్‌ (ర) దీన్ని గురించి అబూ బకర్‌(ర)కు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ కలసి నా దగ్గరకు వచ్చారు. వారిద్దరూ నాకు సలామ్‌ చేశారు. అనంతరం అబూ బకర్‌ నన్ను, ” ‘ఉస్మాన్‌ (ర)! నీవు ‘ఉమర్‌ (ర) సలామ్‌కు ప్రతి సలామ్‌ ఇవ్వలేదట.” అని అన్నారు. దానికి నేను, ‘అలా జరిగలేదే.’ అని అన్నాను. అప్పుడు ‘ఉమర్, ‘అలాగే జరిగింది. నేను మీకు సలామ్‌ చేశాను, మీరు ప్రతిసలామ్‌ చేయలేదు.’ దానికి నేను, ‘అల్లాహ్ సాక్షి, మీరు వచ్చినట్టు, సలామ్‌ చేసినట్టు నాకు తెలియనే తెలియదు.’ అని అన్నాను. అది విన్న అబూ బకర్‌కు విషయం అర్థమయి, నన్ను సమర్థిస్తూ, ‘ఉస్మాన్‌ (ర) చెప్పింది నిజం.’ అని పలికి, ‘అయితే ‘ఉస్మాన్‌ (ర)! ఏ విషయం వల్ల సలామ్‌కు ప్రతిసలామ్‌ ఇవ్వలేదు.’ అని అడిగారు. దానికి నేను, ”మనం ప్రవక్త (స) ను సాఫల్యం, అంటే నరకం, షై’తాన్ ప్రేరణ మరియు వాడి చేష్టల, నుండి ఎలా తప్పించు కోవాలి, అని అడిగి తెలుసుకోక ముందే అల్లాహ్‌ (త) తన ప్రవక్తను లేపుకున్నాడు.’ అని అన్నాను. దానికి అబూ బకర్‌: ‘దీన్ని గురించి నేను ప్రవక్త (స)ను అడిగి తెలుసుకున్నాను.’ అని అన్నారు.
అది విన్న వెంటనే అతని వైపు నిలబడి, ‘నా తల్లి దండ్రులు మీ కోసం త్యాగం కాను. దీన్ని గురించి అడగ టానికి అందరి కంటే అధికంగా మీరే అర్హులు. తమరు ఇటువంటి విషయాల గురించి అడిగేవారు.’ అని అన్నారు. ఆ తరువాత అబూ బకర్‌, ”నేను ప్రవక్త (స)ను దీన్ని గురించి అడుగుతూ, ‘ప్రవక్తా! సాఫల్య రహస్యం ఏమిటి, ప్రజలకు సాఫల్యం ఎలా లభిస్తుంది.’ అని అడిగాను. దానికి ప్రవక్త (స): ”నేను మా చిన్నాన్న ముందు పెట్టిన, అతను తిరస్క రించిన ఆ పవిత్ర వచనం (లాఇలాహ ఇల్లాఅల్లాహ్) నిర్మలమైన మనస్సుతో స్వీకరించిన వారు సాఫల్యం పొందుతారు. అంటే స్వర్గంలో ప్రవేశిస్తారని అన్నారు.’ అని అన్నారు.” (అ’హ్మద్‌)
42 – 41 (1/20)
عَنْ الْمَقْدَادِ رضى الله عنه، أنه سَمِعَ رَسُوْل اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا يَبْقَى عَلَى ظَهْرِ الْأَرْضِ بَيْتُ مَدَرٍ وَلَا وَبَرٍ إِلَّا أَدْخَلَهُ اللهُ كَلِمَةَ الْإِسْلَامِ، بِعِزِّعَزِيْزٍ وَّ ذُلِّ ذَلِيْلٍ، إِمَّا يُعِزُّهُم اللهُ عزوجل فَيَجْعَلُهُمْ مِنْ أَهْلِهَا، أَوْ يُذِلُّهُمْ فَيَدِيْنُوْنَ لَهَا”. قُلْت: فيكون الدِّين كلَّه لله. رواه أحمد.

(41) [1/20-దృఢం]
మిఖ్‌దాద్‌ (ర) కథనం, ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను: ‘భూమిపై ఉన్న ప్రతి ఇంటిలోనికి అల్లాహ్‌(త) ఇస్లాం వచనాన్ని ప్రవేశింపజేస్తాడు. అదృష్ట వంతుడికి దాన్ని అనుసరించే భాగ్యం ప్రసాదిస్తాడు. దురదృష్టవంతుడు దానిని తిరస్కరిస్తాడు.’ అని అన్నారు. అది విని నేను, ‘మరైతే అంతా అల్లాహ్‌ (త) ధర్మమే అయిపోతుంది’ అని అన్నాను. )

వివరణ-42: అంటే ప్రపంచమంతటా ఇస్లామ్‌ వ్యాపిం చింది. సంతోషంగా ఇస్లామ్‌ను స్వీకరించిన వారు అదృష్ట వంతులు. వారి ధన, ప్రాణ, సంపదలు సురక్షితంగా ఉంటాయి. ఇస్లామ్‌ను స్వీకరించనివారు అవమానానికి గురి అవుతారు. టాక్సు (జి’జ్యహ్) చెల్లిస్తూ జీవిస్తారు. ఇది అవమానానికి నిదర్శనం.
ఈ ‘హదీసు’ కథకులు, మిఖ్‌దాద్‌ బిన్‌ ‘అమ్ర్‌ బిన్‌ స”అలబహ్‌ (ర). ఇతని మరో పేరు మిఖ్దాద్ బిన్ అస్వద్. ఇస్లామ్‌ స్వీకరించిన తర్వాత ‘హబ్‌షా’ వైపు వలసవెళ్ళారు. అక్కడి నుండి తిరిగి వచ్చి కొన్నిరోజులు మక్కహ్ లో నివసించారు. ఆ తరువాత మక్కహ్ నుండి మదీనహ్ వలస వెళ్ళారు. యుద్ధాలలో (‘గజవాత్ లలో) పోరాటాల్లో చురుగ్గా పాల్గొనేవారు. బద్ర్‌ యుద్ధం సందర్భంగా ప్రవక్త (స) తో, ”మేము మూసా (అ) జాతిలా ‘నీవూ నీ ప్రభువు వెళ్ళి పోరాడండి, మేము ఇక్కడే కూర్చుంటాము,’ అని అనము. మేము మీకు అన్ని ప్రక్కల వీరత్వాన్ని ప్రదర్శిస్తాము. అల్లాహ్ సాక్షి! ఒకవేళ మీరు మమ్మల్ని బరకల్‌ ‘గిమాద్‌ వరకు తీసుకొని వెళ్ళదలచినా, మేము మీ వెంట వస్తాము, పోరాడు తాము.” అని అన్నారు. ప్రవక్త (స) వీరిపలుకుల పట్ల చాలా సంతోషించారు. (బు’ఖారీ).
ఇతడు ఏది మాట్లాడినా సరైనవిధంగా మాట్లాడేవారు. ప్రవక్త (స) ఇతని పెళ్ళి ‘జుబా’అహ్ బిన్‌తె ‘జుబైర్‌ బిన్‌ ‘అబ్దుల్‌ ముత్తలిబ్‌తో చేశారు. 33వ హిజ్రీ శకంలో 70 సంవత్సరాల వయస్సులో మరణించారు. మదీనహ్ లోని బఖీలో ఖననం చేయబడ్డారు.
(అ’హ్మద్‌)
43 – ] 42 [ ( لم تتم دراسته ) (1/20)
وعَنْ وَهْبِ بْنِ مُنَبَّهٍ، قِيْلَ لَهُ: أَلَيْسَ لَا إِلَهَ إِلَّا اللهُ مِفْتَاحَ الْجَنَّةِ؟ قَالَ: بَلَى، وَلَكِنْ لَيْسَ مِفْتَاحَ إِلَّا لَهُ أَسْنَانٌ، فَإِنْ جِئْتَ بِمِفْتَاحٍ لَهُ أَسْنَانٌ فُتِحَ لَكَ، وَإِلَّا لَمْ يُفْتَحْ لَكَ. رَوَاهُ الْبُخَارِيُّ فِيْ تَرْجُمَةِ بَابٍ.

(42) [1/20-అపరిశోధితం]
వహబ్‌ బిన్‌ మునబ్బహ్‌ (ర, తాబయీ) కథనం, అతన్ని:” ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ స్వర్గం తాళంచెవి కాదా?” అని ప్రశ్నించడం జరిగింది. అంటే స్వర్గంలో ప్రవేశించటానికి కేవలం కలిమహ్‌ ‘తయ్యిబహ్‌ సరిపోదా? అని ప్రశ్నించడం జరిగింది. దానికి అతను, ‘అవును నిస్సందేహంగా కలిమ ‘తయ్యిబహ్‌ స్వర్గం తాళంచెవియే, కాని ప్రతి తాళంచెవికి పళ్ళు తప్పకుండా ఉంటాయి. ఏ తాళంచెవి కూడా పళ్ళు లేకుండా ఉండదు. మీరు పళ్ళుఉన్న తాళంచెవి తెస్తే తప్పకుండా స్వర్గద్వారం తెరువవచ్చు లేకపోతే లేదు,’ అని అనారు. )

వివరణ-43: వహబ్‌ బిన్‌ మునబ్బహ్‌ అనే తాబయీ ఉన్నారు. అతడు జాబిర్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ మరియు ఇబ్నె ‘అబ్బాస్‌ల ద్వారా ‘హదీసు’లను ఉల్లేఖించేవారు. ఇతడు యమన్‌ న్యాయమూర్తిగా కూడా ఉన్నారు. 114 హిజ్రీ శకంలో మరణించారు. అంటే పవిత్ర వచనం సాక్ష్యంతో పాటు సత్కార్యాలు కూడా చేయాలి.
(బు’ఖారీ)
44 – [ 43 ] ( متفق عليه ) (1/20)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَحْسَنَ أَحَدُكُمْ إِسْلَامَهُ، فَكُلُّ حَسَنَةٍ يَّعْمَلُهَا تُكْتَبُ لَهُ بِعَشْرِ أَمْثَالِهَا إِلَى سَبْعِ مِائَةٍ ضِعْفٍ، وَكُلُّ سَيِّئَةٍ يَّعْمَلُهَا تُكْتَبُ لَهُ بِمِثْلِهَا حتَّى لَقِيَ الله”.

(43) [1/20-ఏకీభవితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరు తన ఇస్లామ్‌ను వృద్ధి చేసుకుంటే, అతని ప్రతి పుణ్యకార్యానికి పదిరెట్లు పుణ్యం లభిస్తుంది. చివరికి అతని ఒక పుణ్యానికి 700 రెట్లు పెంచి ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే పాపం మాత్రం ఒక్కటే వ్రాయబడు తుంది. అంటే ఒక్క చెడుపని చేస్తే ఒక్క పాపమే వ్రాయబడుతుంది. చివరికి అతడు అల్లాహ్‌ (త)ను కలుసుకుంటాడు. )

వివరణ-44: అంటే ఇస్లామ్‌ ఆదేశాలను తూ.చ. తప్ప కుండా పాటిస్తే అతని పుణ్యం అధికం చేయబడుతుంది. అంటే చిత్తశుద్ధిని బట్టి పుణ్యం పెరుగుతుంది.
(బు’ఖారీ, ముస్లిమ్‌)
45 – [ 44 ] ( لم تتم دراسته ) (1/20)
وَعَنْ أَبِيْ أُمَامَةَ، أَنَّ رَجُلًا سَأَلَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم: “مَا الْإِيْمَانُ؟ قَالَ: “إِذَا سَرَّتْكَ حَسَنَتُكَ، وَسَاءَتُكَ سَيِّئَتُكَ؛ فَأَنْتَ مُؤْمِنٌ”. قَالَ: يَا رَسُوْلَ اللهِ! فَمَا الْإِثْمُ؟ قَالَ: “إِذَا حَاكَ فِيْ نَفْسِكَ شَيْءٌ فَدَعْهُ”. رَوَاهُ أَحْمَدُ.

(44) [1/20-అపరిశోధితం]
అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స)ను ఒక వ్యక్తి: ‘ఈమాన్‌ అంటే ఏమిటి?’ అంటే ఈమాను గుర్తు ఏమిటి, అని అడిగాడు. దానికి ప్రవక్త (స), ‘నీ పుణ్యం నీకు మంచిదిగా, నీ చెడు నీకు చెడుగా అనిపించినపుడు నీవు విశ్వాసివి (ము’మినువు) అని గుర్తించు. మంచి పట్ల సంతోషం, చెడు పట్ల అసహ్యం కలిగినపుడు నీవు విశ్వాసివి అనడానికి చిహ్నం.’ అని అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ, ‘ఓ ప్రవక్తా! పాపం అంటే ఏమిటి?’ అంటే పాపపు గుర్తు ఏమిటి? అని అడిగాడు. దానికి ప్రవక్త (స), ‘నీ హృదయంలో సంకోచం, సందిగ్ధం ఏర్పడితే, దాన్ని వదలి వేయి. అంటే అనుమా నాస్పదమైన పని పాపం అనడానికి చిహ్నం.’ అని అన్నారు. (అ’హ్మద్‌)
46 – [ 45 ] ( لم تتم دراسته ) (1/20)
عَنْ عَمْرُو بْنِ عَبَسَةَ، قَالَ: أَتَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ! مَنْ مَعَكَ عَلَى هَذَا الْأَمْرِ؟ قَالَ: “حُرٌّ وَعَبْدٌ”. قُلْتُ: مَا الْإِسْلَامُ؟ قَالَ: “طِيْبُ الْكَلاَمِ، وَإِطْعَامِ الطَّعَامِ”. قُلْتُ: مَا الْإِيْمَانُ؟ قَالَ: “الصَّبْرُ وَالسَّمَاحَةُ”. قَالَ: قُلْتُ: أَيُّ الْإِسْلَامِ أَفَضلُ؟ قَالَ: “مَنْ سَلِمَ الْمُسْلِمُوْنَ مِنْ لِسَانِهِ وَيَدِهِ”. قَالَ: قُلْتُ: أَيُّ الْإِيْمَانِ أَفْضَلُ؟ قَالَ: “خُلُقٌ حَسَنٌ”. قَالَ: قُلْتُ: أَيُّ الصَّلَاةِ أَفْضَلُ؟ قَالَ: “طُوْلُ الْقُنُوْتِ”. قَالَ: قُلْتُ: أَيُّ الْهِجْرةِ أَفْضَلُ؟ قَالَ: “أَنْ تَهْجُرَ مَا كَرِهَ رَبُّكَ عز وجل”. قَالَ: قُلْتُ: أَيُّ الْجِهَادِ أَفْضَلُ؟ قَالَ: “مَنْ عُقِرَ جَوَادُهُ وَأُهْرِيْقَ دَمُهُ”. قَالَ: قُلْتُ: أَيُّ السَّاعَاتِ أَفْضَلُ؟ قَالَ: “جَوْفُ اللَّيْلِ الْآخِرُ”. رَوَاهُ أَحْمَدُ.
46.(45) [1/20-అపరిశోధితం]
‘అమ్ర్‌ బిన్‌ ‘అబసహ్ (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళి, ‘ఓ ప్రవక్తా! ఇస్లామ్‌ ప్రారంభంలో మీ వెంట ఎవరున్నారు.’ అని అడిగాను. దానికి ప్రవక్త (స): ‘ఒక స్వాతంత్రుడు-అబూ బకర్‌, ఒక బానిస-బిలాల్‌.’ అని అన్నారు. ఆ తరువాత నేను, ‘ఇస్లామ్‌ అంటే ఏమిటి?’ అంటే ఇస్లాం గుర్తు ఏమిటి? అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘ఓర్పూ, సహనాలు వహించటం, దానధర్మాలు చేయటం. అంటే చెడు పనులకు దూరంగా ఉండటం, దైవవిధేయతకు సిద్ధంగా ఉండటం.’ అని అన్నారు. ఆ తరువాత నేను, ‘ముస్లిముల్లో ఉత్తమమైన వారు ఎవరు?’ అని అడిగాను. దానికి ప్రవక్త (స): ‘అతని నోటినుండి, చేతి నుండి ఇతర ముస్లిములు క్షేమంగా ఉండేవారు.’ అని అన్నారు. ఆ తరువాత, ‘విశ్వాసంలో (ఈమానులో) ఉత్తమమైనది ఏమిటి?’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘ఉత్తమ గుణాలు,’ అని అన్నారు. మళ్ళీ నేను, ‘నమా’జులో అన్నిటి కంటే మంచి విషయం ఏది?’ అని అడిగాను. ‘చాలాసేపు వరకు నిలబడటం.’ అని అన్నారు. మళ్ళీ నేను, ‘ఎటువంటి హిజ్రత్‌ ఉత్తమ మైనది.’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘నీ ప్రభువుకు అసహ్యంగా ఉన్న వాటిని వదలివేయి,’ అని అన్నారు. మళ్ళీ నేను, ‘ఎటువంటి ముజాహిద్‌ ఉత్తమమైనవాడు,’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘గుర్రం యుద్ధంలో చంపబడినవాడు, ఇంకా అతడు కూడా చంపబడిన వాడు, అంటే వీరమరణం పొందిన వాడు.’ అని అన్నారు. మళ్ళీ నేను, ‘రాత్రీ పగళ్ళలో ఏ సమయం ఉత్తమమైనది.’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘అర్థరాత్రి చివరి భాగం.’ అని అన్నారు. (అ’హ్మద్‌)
47 – 46 (1/21)
وعَنْ مَعَاذِ بْنِ جَبَلٍ، قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ لَقِيَ اللهَ لَا يُشْرِكُ بِهِ شَيْئًا، يُصَلِّيْ الْخَمْسَ، وَيَصُوْمُ رَمْضَانَ؛ غُفِرَ لَهُ”. قُلْتُ: أَفَلَا أُبَشِّرُهُمْ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “دَعْهُمْ يَعْمَلُوْا”. رَوَاهُ أَحْمَدُ.

(46) [1/21-దృఢం]
మ’ఆజ్‌’ బిన్‌ జబల్‌ (ర) కథనం, ప్రవక్త (స): ”జీవితంలో ఏనాడూ అల్లాహ్‌(త)కు సాటి కల్పించకుండా, రోజుకు 5 పూటల నమా’జ్‌చేస్తూ, రమ’దాన్‌ ఉపవాసాలు పాటిస్తూ అల్లాహ్‌(త)ను కలిసే వ్యక్తిని క్షమించడం జరుగుతుంది.” అని ప్రవచించారు. అప్పుడు నేను: ‘ఓ ప్రవక్తా! ఈ శుభ వార్తను గురించి నేను ప్రజలకు తెలియజేయనా?’ అని అన్నాను. దానికి ప్రవక్త (స): ‘సత్కార్యాలు చేస్తూ ఉండ టానికి ప్రజలను వదలివేయి.’ అని అన్నారు. (అ’హ్మద్‌)
48 – [ 47 ] ( لم تتم دراسته ) (1/21)
وعَنْ مَعَاذِ بْنِ جَبَلٍ، سَأَلَ النَّبِيَّ صلى الله عليه وسلم عَنْ أَفْضَلِ الْإِيْمَانِ؟ قَالَ: “أَنْ تُحِبَّ لِلّهِ، وَتُبْغِضَ للهِ، وَتَعْمِلَ لِسَانَكَ فِيْ ذِكْرِ اللهِ”. قَالَ: وَمَاذَا يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “أَنْ تُحِبَّ لِلنَّاسِ مَا تُحِبُّ لِنَفْسِكَ، وَتَكْرَهَ لَهُمْ مَا تَكْرَهُ لِنَفْسِكَ”. رَوَاهُ أَحْمَدُ.

(47) [1/21-అపరిశోధితం]

మ’ఆజ్‌’ బిన్‌ జబల్‌ (ర) కథనం: అతను ప్రవక్త (స)ను విశ్వాసం(ఈమాన్)లోని అన్నిటికంటే ఉత్తమ గుణాన్ని గురించి ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స): ‘నీవు అల్లాహ్‌(త) కోసమే ప్రజలను ప్రేమించు, అల్లాహ్‌(త) కోసమే ప్రజలతో శత్రుత్వం కలిగి ఉండు, ఇంకా ఎల్లప్పుడూ దైవధ్యానంలోనే నిమగ్నుడవై ఉండు.’ అని హితబోధ చేశారు. దానికి మ’ఆజ్‌: ‘మరేమైనా చెప్పండి.’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స): ‘నీ కొరకు ఇష్టపడేదాన్నే ఇతరుల కొరకు కూడా ఇష్టపడు. అదేవిధంగా నీ కొరకు ఇష్టపడనిదాన్ని ఇతరుల కొరకు కూడా ఇష్టపడకు.’ అని బోధించారు. (అ’హ్మద్‌)

1- بَابَ الْكَبَائِرِ وَعَلَامَاتِ النِّفَاقِ

మహాపాపాలు మరియు కాపట్యచిహ్నాలు
మహా పాపాలు (గునాహ్‌ కబీరహ్): అంటే ధార్మిక భాషలో దైవాగ్రహం, శిక్షలు విధించబడే వాటిని మహా పాపాలు అంటారు. అయితే మహా పాపాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మేము కొన్నింటిని మాత్రమే పేర్కొంటున్నాము.

1.అన్యాయంగా హత్య చేయటం, 2. వ్యభిచారం చేయటం, 3. పవిత్ర స్త్రీ పురుషులపై అపనిందలు వేయటం, 4. దొంగతనం చేయటం, 5. జిహాద్ లో వెన్నుచూపి పారి పోవటం, 6. చేతబడి చేయటం, 7. అనాథల సొమ్మును అన్యాయంగా తినటం, 8. మత్తు పానీయాలు సేవించటం, 9. పందిమాంసం తినటం, 10. జూదం ఆడటం, 11. స్వలింగ సంపర్కము, 12. వడ్డీ తినటం, 13. అసత్యం పలకటం, 14. అసత్యపు సాక్ష్యం ఇవ్వటం, 15. సత్య సాక్ష్యాన్ని దాచటం, 16. ఇతరుల ధనాన్ని బలవంతంగాదోచుకోవటం, 17. పరోక్ష నిందలు, చాడీలు చెప్పటం, 18. తిట్టటం, 19. తల్లి-దండ్రుల పట్ల అవిధేయతకు పాల్పడటం, 20. అమానతులో నమ్మక ద్రోహం చేయటం, 21. బంధువుల హక్కులను చెల్లించక పోవటం, 22. భార్య తన భర్తకు అవిధేయత చూపటం, 23. వంశం, కులంపై ఎత్తిపొడవటం, 24. కష్టాల్లో బిగ్గరగా కేకలువేసి ఏడ్వటం, తల బాదుకోవటం, బట్టలు చించు కోవడం, 25. వాయిద్యాలు, (సంగీతం) వినటం, 26. వాగ్దానాన్ని భంగం చేయటం, 27. ప్రదర్శనా బుద్ధితో ఆరాధన చెయ్యటం, 28. ఖుర్‌ఆన్‌ కంఠస్తం చేసి మరచి పోవటం, 29. అనవసరంగా ధార్మిక విధులను నిర్వర్తించక పోవటం, 30. అల్లాహ్‌కు సాటి కల్పించటం మొదలైనవి.
చిన్న పాపాలు (గునాహ్ సగీరా): ఒకవేళ చిన్న పాపాలు చేయటం కొనసాగిస్తే అవి మహా పాపాలుగా మారుతాయి.
కాపట్యం (నిఫాఖ్‌): ఈ పదం ఖుర్‌ఆన్‌ మరియు ‘హదీసు’లలో వచ్చింది. నిఘంటువులో దీని అర్థం ఏమి టంటే, అడవి ఎలుక ఒక కన్నంలో దూరి మరో కన్నం ద్వారా తప్పించుకోవటం. కన్నంలో దూరటం అంటే హృదయంలో అవిశ్వాసం కలిగి ఉండటం, నోటితో ముస్లిమ్‌నని నమ్మించటం.
భావన (ఎ’తెఖాద్) మూడు రకాలు: 1. ఇస్లామ్‌, 2. అవిశ్వాసం, 3. నిఫాఖ్

అల్లాహ్‌ మరియు ప్రవక్తల ఆదేశాలను నిర్మలమైన మనస్సుతో స్వీకరించి, దాని ప్రకారం ఆచరించటాన్ని ఇస్లామ్‌ అంటారు.

అంతర్బాహ్యాలపరంగా వాటిని తిరస్కరించటం అవిశ్వాసం (కుఫ్ర్‌) అంటారు.

నోటితో ముస్లిమునని చెప్పుకొని, హృదయంలో అవిశ్వాసం కలిగి ఉండటం నిఫాఖ్‌ (కాపట్యం) అంటారు. ఈ నీచగుణం కలిగివున్న వానిని మునాఫిఖ్‌ అంటారు.
నిఫాఖ్‌ రెండు రకాలు: (1) భావపరమైన (ఏతెఖా’దీ) నిఫాఖ్‌. (2) ఆచరణాత్మకమైన నిఫాఖ్‌.
(1) అంటే హృదయంలో మూఢనమ్మకాలు కలిగి ప్రదర్శనాబుద్ధితో ఇస్లామీయ ఆదేశాలను పాటించటం భావపరమైన నిఫాఖ్‌. ఇది చాలా ప్రమాదకరమైనది.
(2) అల్లాహ్‌(త) మరియు ఆయన ప్రవక్త (స) ఆదేశాలను సత్యమైనవిగా భావించి, వాటి ప్రకారం ఆచరిస్తూ, కొన్ని పాపాలను ఆచరించటం ఆచరణాత్మక మైన నిఫాఖ్‌ అంటారు. ఉదా. అసత్యం పలకటం, తిట్టటం మొదలైనవి.

ఆచరణాత్మకమైన నిఫాఖ్‌ గలవాడు అపరిపూర్ణ ముస్లిమ్. భావపరమైన నిఫాఖ్‌ గల వ్యక్తి పూర్తిగా అవిశ్వాసి అవుతాడు.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
49 – [ 1 ] ( متفق عليه ) (1/22)
عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ، قَالَ: قَالَ رَجُلُ: يَا رَسُوْلَ اللهِ! أَيُّ الذَّنْبِ أَكْبَرُ عِنْدَ اللهِ؟ قَالَ: “أَنْ تَدْعُو للهِ نِدًّا وَهُوَ خَلَقَكَ”. قَالَ: ثُمَّ أَيُّ؟ قَالَ: “أَنْ تَقْتُلَ وَلَدَكَ خَشْيَةَ أَنْ يَّطْعَمَ مَعَكَ”. قَالَ: ثُمَّ أَيُّ؟ قَالَ: “أَنْ تُزَانِيَ حَلِيْلَةُ جَارِكَ”. فَأَنْزَلَ اللهُ عز وجل تَصْدِيْقَهَا: ]وَالَّذِيْنَ لَا يَدْعُوْنَ مَعَ اللهِ إِلَهًا آخَرَ وَلَا يَقْتُلُوْنَ النَّفْسَ الَّتِيْ حَرَّمَ اللهُ إِلَّا بِالْحَقِّ وَلَا يَزْنُوْنَ…؛ 25: 68[ الآية.

(1) [1/22-ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: “ప్రవక్త (స)ను ఒక వ్యక్తి, ‘ఏ పాపం అల్లాహ్‌ వద్ద అన్నిటికన్నా గొప్పది.’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స), ‘నిన్ను సృష్టించిన అల్లాహ్‌ (త) కు సాటికల్పించటం.’ అని అన్నారు. మళ్ళీ ఆ వ్యక్తి, ‘ఆ తరువాత ఏ పాపం పెద్దది.’ అని అడిగారు ప్రవక్త (స), ‘నీవు నీతోపాటు నీ సంతానం తింటుందని వారిని చంపటం,’ అని అన్నారు. ఆవ్యక్తి మళ్ళీ, ‘ఆ తరువాత ఏ పాపం,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘నీవు నీ పొరుగువాడి భార్యతో వ్యభిచారం చేయటం, అల్లాహ్‌ ఈ విషయాలను ఖుర్‌ఆన్‌లో పేర్కొన్నాడు: ”మరియు ఎవరైతే, అల్లాహ్‌తో పాటు ఇతర దైవాలను ఆరాధించరో! మరియు అల్లాహ్‌ నిషేధించిన ఏ ప్రాణిని కూడ న్యాయానికి తప్ప చంపరో! మరియు వ్యభిచారానికి పాల్పడరో,..” (సూ. అల్-ఫుర్ఖాన్, 25:68) అని అన్నారు.” )

వివరణ-49: ఈ ‘హదీసు’ను ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) ఉల్లేఖించారు. అతని ఇస్లామ్‌ స్వీకరణ వృత్తాంతం ఏమిటంటే, ఒక రోజు ప్రవక్త (స) తన స్నేహి తులు అబూ-బకర్‌ (ర) వెంట ఇతడు మేకలు మేపుతున్న ప్రాంతం ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. అబూ-బకర్‌ (ర) ఆ బాలునితో, ‘నీ దగ్గర పాలు ఉంటే ఇవ్వు బాబు,’ అని అన్నారు. దానికి అతడు, ‘నేను మీకు పాలు ఇవ్వలేను, ఎందుకంటే ఇది ఇతరుల అమానతు,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) ఆ బాలునితో, ‘ఇంకా పిల్లలు ఇవ్వని మేక ఏదైనా ఉందా?’ అని అన్నారు. ఆ బాలుడు, ‘ఉంది,’ అన్నాడు. ఒక మేకను తెచ్చి ఇచ్చాడు. ప్రవక్త (స) శిరలపై చేత్తో నిమురుతూ ప్రార్థించారు, అది పాలతో నిండిపోయింది. అబూ-బకర్‌ (ర) దాన్ని ఒక ప్రక్కకు తీసుకొని వెళ్ళి పాలు పితికారు. ఎంత అధికంగా పాలు వచ్చాయంటే, ముగ్గురూ కడుపునిండా త్రాగారు. ఆ తరువాత ప్రవక్త (స) శిరలను ‘ఎండిపో’ అన్నారు. అది తన మొదటి స్థితికి చేరుకుంది. (అసదుల్‌ ‘గాబహ్‌, సియరు ‘స్సహాబహ్)
ఈ సంఘటన అతనిపై చాలా ప్రభావం చూపింది. ఆ బాలుడు ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘నాకు ఈ అమోఘ మైన విద్యను నేర్పండి,’ అని విన్నవించుకున్నాడు. ప్రవక్త (స) ఆ బాలుని తల నిమురుతూ, ‘నీవు విద్యావంతుడివి,’ అని అన్నారు. ఆరోజు నుండి శిష్యుడిగా చేరిపోయాడు. దైవవాణి, సూరహ్ ల విద్య నేర్చుకున్నాడు. ఇందులో ఇతరు లెవ్వరూ అతనికి భాగస్వాములు కాలేకపోయారు. (ముస్నద్‌ అ’హ్మద్‌)
ఇస్లామ్‌ స్వీకరించిన తర్వాత ఎల్లప్పుడూ ప్రవక్త (స) సేవలో నిమగ్నమైపోయారు. ప్రవక్త (స) అతన్ని తన ప్రత్యేక సేవకునిగా చేసుకున్నారు. అతడు మిస్వాక్‌ భద్రపరిచేవారు, చెప్పులు తొడిగించేవారు. ప్రయాణ సమయాల్లో మావటిని సిద్ధం చేసేవారు. కర్రపట్టుకొని ముందు నడిచేవారు. రహస్యాలు వినేవారు. అందువల్ల అతన్ని కర్రవాడు, వు’దూవాడు అని పిలిచేవారు. ఖుర్‌ఆన్‌ ‘హాఫి”జ్‌, పండితుడు, వ్యాఖ్యానకర్తగా పేరుగాంచారు. ప్రవక్త (స) అనుచరుల్లో వీరికంటే విద్యావంతులు ఎవరూ లేరు.
విశ్వాస ఉత్తేజం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌-మస్‌’ఊద్‌ ఇస్లామ్‌ స్వీకరించినపుడు కొంతమంది ముస్లిములే ఉన్నారు. మక్కహ్ నగరంలో ప్రవక్త (స) తప్ప ఇతరులెవ్వరూ ఖుర్‌ఆన్‌ను బహిరంగంగా పఠించే సాహసం చేయలేదు. అనంతరం ముస్లిములు ఒకరోజు సమావేశమై ఈ విషయంపై చర్చించారు. ఇప్పటి వరకు ఖురైషులు బహిరంగంగా ఖుర్‌ఆన్‌ వినలేదని అభిప్రాయపడ్డారు. అయితే ఈ సాహసంతో కూడుకున్న పనిని ఎవరు చేస్తారని ఆలోచించారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌, ‘ఈ పని నేను చేస్తానని,’ అన్నారు. దానికి ప్రజలు నీవు ప్రమాదంలో పడటం మంచిది కాదు, ఈ పనికి ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి కావాలన్నారు. కాని ‘అబ్దుల్లాహ్‌ విశ్వాస ఉత్తేజంతో, ‘నాకు వదలివేయండి, అల్లాహ్ (త) నా రక్షకుడు,’ అని అన్నారు. మరుసటి రోజు ఉదయం అవిశ్వాసులందరూ తమ సంఘంలో ఉండగా, ‘అబ్దుల్లాహ్‌ ఒక వైపు నిలబడి ఖుర్‌ఆన్‌ పఠించటం ప్రారంభించారు. అవిశ్వాసులు ఆశ్చర్యంగా, శ్రద్ధగా విని, ‘ఇబ్నె ఉమ్మె అబ్ద్‌ ఏమంటున్నాడు?’ అని అన్నారు. వారిలో ఒకరు, ‘ము’హమ్మద్‌పై అవతరించబడిన గ్రంథాన్ని పఠిస్తున్నాడు,’ అని అన్నారు. అది విన్న వెంటనే వారందరూ ఆగ్రహంతో అతనిపై విరుచుకుపడ్డారు. ఎంత ఘోరంగా కొట్టారంటే ముఖం అంతా వాచిపోయింది. కాని అతని విశ్వాస ఉత్తేజం మాత్రం తగ్గలేదు. అవిశ్వాసులు కొడుతు న్నప్పటికీ అతని పఠనం మాత్రం ఆగలేదు. ‘అబ్దుల్లాహ్‌ తన విధిని పూర్తిచేసి తమ మిత్రుల వద్దకు వచ్చారు. అప్పుడు వారు, ‘అందు వల్లే వెళ్ళవద్దని చెప్పాము,’ అని అన్నారు. దానికి అబ్దుల్లాహ్‌, ‘మీరు కోరితే రేపు మళ్ళీ వెళ్ళి ఖుర్‌ఆన్‌ పఠిస్తాను,’ అని అన్నారు. దానికి వారు, ‘అసహ్యించు కున్న దాన్ని నీవు వారికి వినిపించివచ్చావు, అంతే చాలు, ‘ అని అన్నారు. (సియరు స్సహాబహ్)
మక్కహ్ అవిశ్వాసుల హింసలు భరించలేక మదీనహ్ వలస పోయారు. మదీనహ్ వచ్చిన తర్వాత అనేక యుద్ధాలలో, పోరాటాల్లో పాల్గొన్నారు. బద్ర్‌ యుద్ధంలో అబూ జ’హల్‌ గుండెపై కూర్చొని, ‘నీవేనా అబూ జహల్‌వి,’ అని అడిగారు. ప్రవక్త (స) మరణానంతరం న్యాయమూర్తిగా, ముఫ్తీగా సేవలు చేశారు. 33వ హిజ్రీలో మరణించారు.
(బు’ఖారీ, ముస్లిమ్‌)
50 – 2 (1/22)
وَعَنْ عَبْدِ اللهِ بْن عَمْروٍ، عَنْ النَّبِيِ صلى الله عليه وسلم قَالَ: “الْكَبَائِرُ: الْإِشْرَاكُ بِاللهِ، وَعَقُوْقُ الْوَالِدَيْنِ، وَقَتْلُ النَّفْسِ، وَالْيَمِيْنُ الْغُمُوْسُ”. رَوَاهُ الْبُخَارِيُّ .

(2) [1/22-దృఢం]
‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: మహా పాపాల్లో: ” ‘1. అల్లాహ్‌కు సాటి కల్పించటం, 2. తల్లి-దండ్రుల అవిధేయత, 3. అన్యాయంగా చంపటం, 4. అసత్య ప్రమాణం, మొదలైనవి ఉన్నాయని,’ ప్రవక్త (స) ప్రవచించారు.” (బు’ఖారీ)
51 – [ 3 ] ( متفق عليه ) (1/22)
وَفِيْ رِوَايَةِ أَنَسٍ: “وَشَهَادَةُ الزُّوْرِ” بَدَلَ: “الْيَمِيْنِ الْغَمُوْسِ”.
51.(3) [1/22-ఏకీభవితం]
అనస్‌ (ర) కథనం: ‘అసత్యపు ప్రమాణానికి బదులు అసత్యపు సాక్ష్యం’ అని ఉంది. (బు’ఖారీ, ముస్లిమ్‌)
52 – [ 4 ] ( متفق عليه ) (1/22)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ، عَنْ النَّبِيِ صلى الله عليه وسلم قَالَ: “اِجْتَنِبُوا السَّبْعَ الْمُوْبِقَاتِ” قَالُوْا: يَا رَسُوْلَ اللهِ وَمَا هُنَّ؟ قَالَ: “الشِّرْكُ بِاللهِ، وَالسِّحْرُ، وَقَتْلُ النَّفْسِ الَّتِيْ حَرَّمَ اللهُ إِلَّا بِالْحَقِّ، وَأَكْلُ الرِّبَا، وَأَكْلُ مَالِ الْيَتِيْمِ، وَالتَّوَلِّيْ يَوْمَ الزَّحْفِ، وَقَذْفُ الْمُحْصَنَاتِ الْمُؤْمِنَاتِ الْغَافِلَاتِ”.
52.(4) [1/22-ఏకీభవితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”నాశనం చేసే 7 (ఏడు) విషయాలకు దూరంగా ఉండండి,” అని ప్రవచించారు. దానికి అక్కడున్నవారు, ‘ఆ ఏడు వస్తువులు ఏమిటి ఓ ప్రవక్తా!’ అని విన్నవించు కున్నారు. అప్పుడు ప్రవక్త (స) ఇలా అన్నారు: ‘1. అల్లాహ్‌ (త) కు సాటి కల్పించటం, 2. చేతబడి చేయడం, 3. అల్లాహ్‌(త) నిషేధించిన ప్రాణిని అన్యాయంగా చంపటం, 4. వడ్డీ తినటం, 5. అనాథల సొమ్మను దోచుకోవటం, 6. యుద్ధంలో వెన్ను చూపటం, 7. పవిత్ర స్త్రీలపై అభాండాలు వేయటం.” (బు’ఖారీ, ముస్లిమ్‌)
53 – [ 5 ] ( متفق عليه ) (1/23)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ، إِنَّ النَّبِيَ صلى الله عليه وسلم قَالَ: “لَا يَزْنِي الزَّانِيْ حِيْنَ يَزْنِيْ وَهُوَ مُؤْمِنٌ، وَلَا يَسْرِقُ السَّارِقُ حِيْنَ يَسْرِقُ وَهُوَ مُؤْمِنٌ، وَلَا يَشْرَبُ الْخَمَرَ حِيْنَ يَشْرَبُهَا وَهُوَ مُؤْمِنٌ، وَلَا يَنْتَهِبُ نُهْبَةً يَرْفَعُ النَّاسُ إِلَيْهِ فِيْهَا أَبْصَارَهُمْ حِيْنَ يَنْتَهِبُهَا وَهُوَ مُؤْمِنٌ، وَلَا يَغُلُّ أَحْدُكُمْ حِيْنَ يَغُّلُ وَهُوَ مُؤْمِنٌ؛ فَإِيَّاكُمْ إِيَّاكُمْ”.

(5) [1/23-ఏకీభవితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”వ్యభిచారం చేసే వ్యక్తి వ్యభిచారం చేసినపుడు విశ్వా సిగా (ము’మిన్) ఉండడు. అదేవిధంగా దొంగతనం చేసేవాడు దొంగతనం చేసినపుడు విశ్వాసి (ము’మిన్) గా ఉండడు. సారాయి త్రాగేవాడు సారాయి త్రాగి నపుడు విశ్వాసి (ము’మిన్)గా ఉండడు. ఇంకా ఇతరుల ధనాన్ని దోచుకునే వాడు కూడా విశ్వాసి (ము’మిన్)గా ఉండడు. ద్రోహం (ఖియానత్) చేసేవాడు ద్రోహం చేసినపుడు విశ్వాసి (ము’మిన్)గా ఉండడు. మీరు వీటికి దూరంగా ఉండండి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)
ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) ఉల్లేఖనంలో, ‘విశ్వాసిని చంపే వాడు విశ్వాసిని చంపినపుడు విశ్వాసిగా ఉండడు’ అని ఉంది.
54 – 6 (1/23)
وَفِيْ رِوَايَةِ ابْنِ عَبَّاسٍ: “وَلَا يَقْتُلُ حِيْنَ يَقْتُلُ وَهُوَ مُؤْمِنٌ”. قَالَ عِكْرَمَةُ: قُلْتُ لِاِبْنِ عَبَّاسٍ: كَيْفَ يُنْزِعُ الْإِيْمَانُ مِنْهُ؟ قَالَ: هَكَذَا، وَشَبَّكَ بَيْنَ أَصَابِعِهِ ثُمَّ أَخْرَجَهَا، فَإِنْ تَابَعَادَ إِلَيْهِ هَكَذَا، وَشَبَّكَ بَيْنَ أَصَابِعِهِ. وَقَالَ أَبُوْ عَبْدِ اللهِ: لَا يَكُوْنُ هَذَا مُؤْمِنًا تَامًّا، وَلَا يَكُوْنُ لَهُ نُوْرُ الْإِيْمَانِ. هَذَا لَفْظُ الْبُخَارِيِّ .

(6) [1/23-దృఢం]
ఇక్రమ (ర) కథనం: నేను నా గురువు ఇబ్నె ‘అబ్బాస్‌ను విశ్వాసం ప్రజల హృదయాల నుండి ఎలా వెళ్ళిపోతుంది?’ అని అడిగాను. దానికి అతను సైగచేసి తన చేతి వ్రేళ్ళు ఒక దానిలో ఒకటి పెట్టి తీసివేశారు. మళ్ళీ ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) ‘ఒకవేళ పశ్చాత్తాపపడితే అతని విశ్వాసం తిరిగి వచ్చేస్తుంది,’ అని దాన్ని రెండు అరచేతులను కలిపి చూపించారు.
అబూ ‘అబ్దుల్లాహ్‌ అంటే బు’ఖారీ యొక్క ఈ ‘హదీసు’ గురించి అభిప్రాయం ఏమిటంటే, ఈ పాపాలకు పాల్పడి నపుడు పరిపూర్ణ విశ్వాసిగా ఉండడు, విశ్వాస వెలుగు పరిపూర్ణంగా ఉండదు. ఇవి బు’ఖారీ పదాలు.
55 – 7 (1/23)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “آيَةُ الْمُنَافِقِ ثَلَاثٌ”. زَادَ مُسْلِمٌ: “وَإِنْ صَامَ وَصَلَّى وَزَعَمَ أَنَّهُ مُسْلِمٌ”. ثُمَّ اتَّفَقَا: “إِذَا حَدَّثَ كَذِبَ، وَإِذَا وَعَدَ أَخْلَفَ، وَإِذَا اؤْتُمِنَ خَانَ”.

(7) [1/23-దృఢం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కపటాచారికి మూడు చిహ్నాలు ఉంటాయి. ”ముస్లిమ్‌” ఉల్లేఖనలో, ఒకవేళ అతడు ఉపవాసం పాటిస్తాడు, నమా’జు చదువుతాడు, ఇంకా నేను ముస్లింను, అని వాదిస్తాడు అనే పదాలు అధికంగా ఉన్నాయి.
బు’ఖారీ మరియు ముస్లిమ్‌ల ఉల్లేఖనలో ఉన్న పదాలు, ”మాట్లాడితే అసత్యం పలుకుతాడు, వాగ్దానం చేసి భంగపరుస్తాడు, ఏదైనా అమానతు ఉంచబడితే అందులో ద్రోహంచేస్తాడు.” )

వివరణ-55: ఇవన్నీ కాపట్య ఆచరణకు సంబంధించిన చిహ్నాలు. కాపట్య నమ్మకాలకు సంబం ధించినవి కావు.

56 – [ 8 ] ( متفق عليه ) (1/23)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عمرو، أَنَّ النَّبِيَ صلى الله عليه وسلم قَالَ: “أَرْبَعٌ مَنْ كُنَّ فِيْهِ كَانَ مُنَافِقًا خَالِصًا، وَمَنْ كَانَتْ فِيْهِ خَصْلَةٌ مِنْهُنَّ كَانَتْ فِيْهِ خَصْلَةٌ مِّنَ النِّفَاقِ حَتَّى يَدَعَهَا: إِذَا اؤْتُمِنَ خَانَ، وَإِذَا حَدَّثَ كَذَبَ، وَإِذَا عَاهَدَ غَدَرَ، وَإِذَا خَاصَمَ فَجَرَ”.

(8) [1/23-ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ బిన్ ‘ఆ’స్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఏ వ్యక్తిలో ఈ 4 గుణాలు ఉంటే అతడు ఖచ్చితంగా కపటాచారియే. ఎవరిలోనైనా వీటిలో ఒక్క గుణం ఉంటే ఒక కాపట్య చిహ్నం ఉన్నట్టే. దాన్ని కూడా ఎలాగైనా వదలివేయాలి. ఆ 4 గుణాలు ఇవి: 1. అమానతు ఉంచబడితే ద్రోహం తలపెడతాడు; 2. మాట్లాడితే అసత్యం పలుకు తాడు; 3. వాగ్దానం చేస్తే వాగ్దానభంగం చేస్తాడు; 4. వివాదం తలెత్తితే తిట్లకు దిగుతాడు. )

వివరణ-56: ఈ ‘హదీసు’ను ప్రవక్త (స) అనుచరులు ‘అబ్దుల్లాహ్‌ బిన్ ‘అమ్ర్‌ బిన్‌ ‘ఆ’స్‌ (ర) తన తండ్రి ‘అమ్ర్‌ బిన్‌ ‘ఆ’స్‌ కంటే ముందు ఇస్లామ్‌ స్వీకరించారు. వీరు తరచూ ప్రవక్త (స) వద్దకు వచ్చేవారు. ప్రవక్త (స) నోట విన్నదంతా వ్రాసుకునేవారు. ఒకసారి ఖురైషులు అతన్ని వారిస్తూ, ”ము’హమ్మద్‌ కోపావేశంలో ఏం మాట్లాడుతారో ఎవరికి తెలుసు. అందువల్ల వ్రాయకండి,” అని అన్నారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ ఈ విషయాన్ని ప్రవక్త (స) వద్ద ప్రస్తావించారు. దానికి ప్రవక్త (స), ‘నీవు రాస్తూ ఉండు, అల్లాహ్(త) సాక్షి, నా నోట సత్యమే వెలువడుతుంది,’ అని అన్నారు. (ముస్నద్‌ అ’హ్మద్‌ 4/192)
మిగిలిన సమయం అంతా వ్రాసుకున్న దాన్ని కంఠస్తం చేయడంలోనే గడిపేవారు. పగలు ఉపవాసంతో గడిపేవారు. రాత్రి ఆరాధనలో గడిపేవారు. రాను, రాను ఈ పని ఎంత అధికం అయిందంటే భార్యా-బిడ్డలను, ప్రాపంచిక వ్యవహారాలను వదలివేయడం జరిగింది. ‘అమ్ర్‌ బిన్‌ ‘ఆ’స్‌ తన కుమారుని గురించి, ప్రవక్త (స)కు ఫిర్యాదు చేశారు. అప్పుడు ప్రవక్త (స) అతన్ని పిలిచి తల్లి-దండ్రులకు విధేయత చూపమని, ఇంకా నీవు ఉపవాసాలు పాటించు, ఉపవాసాలు విరమించు, నమా’జులు చదువు, విశ్రాంతి తీసుకో, ఇంకా భార్యా-బిడ్డల హక్కులు చెల్లించు, ఇదే నా పద్ధతి. నా పద్ధతిని వ్యతిరేకించేవారు నా వారు కారు అని బోధించారు. (ముస్నద్‌ అ’హ్మద్‌ 4/158)
మొట్టమొదటి ‘హదీసు’ల సంకలనం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ బిన్‌ ‘ఆ’స్‌ ప్రవక్త (స) ఆదేశాలు, ఉపదేశాల ఒక సంకలనాన్ని తయారుచేశారు. దానికి ‘సాదిఖహ్ అని పేరు పెట్టారు. ఎవరైనా ఏదైనా సమస్య గురించి అడిగి, అతనికి దాని గురించి ఏమీ గుర్తుండకపోతే అందులో చూచి చెప్పేవారు.
అబూ ఖుబైల్‌ కథనం: ఒకసారి నేను, ”ఖు’స్తున్‌’తునియా ముందు జయించబడుతుందా? లేక రోమ్ ముందు జయించ బడుతుందా,” అని అడగ్గా అతనికి అప్పుడు గుర్తులేక పెట్టె తెప్పించి అందులోనుండి ఒక పుస్తకం తీసి చూచి, ”మేము ప్రవక్త (స) వద్ద కూర్చొని వ్రాస్తూ ఉన్నాము, అప్పుడు ఇలాంటి ప్రశ్న ఎవరో ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త (స), ‘హిరాకల్ నగరం (ఖు’స్తున్‌’తునియ) మొదట జయించబడుతుంది,’ అని సమాధానం ఇచ్చారు’ అని అన్నారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ బిన్‌ అల్‌ ‘ఆ’స్‌ ఆ పుస్తకాన్ని చాలా భద్రంగా ఉంచేవారు. (ముస్నద్‌ అహ్మద్‌ 2/176).
ముజాహిద్‌ కథనం: ఒకసారి నేను అతనివద్దకు వెళ్ళాను పడక క్రింద నుండి ఒక పుస్తకం తీసి చూడసాగాను. అతను వారించారు. అప్పుడు నేను, ”తమరు నాకు దేన్నుండీ వారించే వారు కారు, మరి ఇదేమిటి” అని అడిగాను. దానికి అతను, ”నేను ఒక్కడినే ప్రవక్త (స) నుండి విని సంకలనం చేసిన గ్రంథ మిది, ఒకవేళ ఇది మరియు ఖుర్‌ఆన్‌ మరియు హితబోధ చేసే సామర్థ్యం నాకు ఇవ్వబడితే మరి నాకు ప్రపంచం పట్ల మరే చింతా ఉండదు.” (అసదుల్‌ ‘గాబహ్‌ – 3/234)
‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ సుమారు 700 ‘హదీసు’లను ఉల్లేఖించారు. వాటిలో 17 బు’ఖారీ-ముస్లిముల్లో ఉన్నాయి. ఇవేకాక 8 బు’ఖారీలో, 20 ముస్లిములో ఉన్నాయి. (తహ్‌’జీబ్‌ / 208)
(బు’ఖారీ, ముస్లిమ్‌)
57 – 9 (1/23)
وَعَنْ ابْنِ عُمَرَ، عَنْ النَّبِيِ صلى الله عليه وسلم قَالَ: “مَثَلُ الْمُنَافِقِ الشَّاةِ الْعَائِرَةَ بَيْنَ الْغَنَمَيْن تَعِيْرُ إِلَى هَذِهِ مَرَّةَ وَإِلَى هَذِهِ مَرَّةً”. رَوَاهُ مُسْلِمٌ

(9) [1/23-దృఢం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కపటా చారి ఉదాహరణ ఒక మేకను పోలి ఉంది. జతకట్టే కోరికతో రెండు మందల మధ్య తిరుగుతూ ఉంటుంది. ఒక సారి అటుపోతుంది. మరోసారి ఇటుపోతుంది. ఇటువంటి పరిస్థితి కపటాచారిలో ఉంటుంది. ఒకసారి ముస్లిముల వద్దకు వస్తాడు, మరోసారి అవిశ్వాసులవైపుకు పరిగెడతాడు. (ముస్లిమ్‌)

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
58 – 10 (1/24)
عَنْ صَفْوَانَ بْنِ عَسَّالَ، قَالَ: قَالَ يَهُوْدِيٌّ لِصَاحِبِهِ: اِذْهَبْ بِنَا إِلَى هَذَا النَّبِيِّ. فَقَالَ لهُ صَاحِبُهُ: لَا تَقُلْ: نَبِيٌّ، إِنَّهُ لَوْ سَمِعَكَ كَانَ لَهُ أَرْبَعَةُ أَعْيُنٍ. فَأَتَيَا رَسُوْلَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَسَأَلَاهُ عَنْ تِسْعِ آيَاتٍ بَيِّنَاتٍ، فَقَالَ رسول الله صلى الله عليه و سلم: “لَا تُشْرِكُوْا بِاللهِ، شَيْئًا وَلَا تُسْرِقُوْا، وَلَا تَزْنُوْا، وَلَا تَقْتُلُوْا النَّفْسَ الَّتِيْ حَرَّمَ اللهُ إِلَّا بِالْحَقِّ، وَلَا تَمْشُوْا بِبَرِيْءٍ إِلَى ذِيْ سُلْطَانٍ لِيَقْتُلَهُ، وَلَا تَسْحَرُوْا، وَلَا تَأْكُلُوْا الرِّبَا، وَلَا تَقْذِفُوْا مُحْصَنَةً، وَلَا تُوَلُّوا الفِرَارِ يَوْمَ الزَّحْفِ، وَعَلَيْكُمْ خَاصَّةَ – الْيَهُوْدَ- أَنْ لَا تَعْتَدُوْا فِيْ السَّبْتِ”. قَالَ: فَقبلا يديه ورجليه، و قَالَا: نَشْهَدُ أَنَّكَ نَبِيٌّ. قَالَ: “فَمَا يَمْنَعَكُمْ أَنْ تَتَّبِعُوْنِيْ؟” قَالَا: إِنَّ دَاوُدَ دَعَا رَبَّهُ أَنْ لَّا يَزَالَ فِيْ ذُرْيَتِهِ نَبِيٌّ، وَإِنَّا نَخَافُ إِنْ تَبِعْنَاكَ أَنْ تَقْتُلَنَا الْيَهُوْدُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاودوالنسائي.

(10) [1/24-బలహీనం]
‘సఫ్వాన్‌ బిన్‌ ‘అస్సాల్‌ (ర) కథనం: ఒక యూదుడు తన మిత్రుడైన యూదునితో, ‘మనం ఆ ప్రవక్త వద్దకు వెళదాం,’ అని అన్నాడు. దానికి ఆ యూదుడు అతన్ని, ” ‘ప్రవక్త’ అని పిలవకు. ఒకవేళ అతడు నీ మాటలు వింటే చాలా సంబరపడిపోతాడు,” అని అన్నాడు. వారిద్దరూ కలసి ప్రవక్త (స) వద్దకు వచ్చి 9 గొప్ప చిహ్నాలను గురించి అడిగారు. అప్పుడు ప్రవక్త (స), ”1. అల్లాహ్‌ కు ఎవరినీ సాటి కల్పించకండి; 2. దొంగతనం చేయకండి; 3. వ్యభిచారం చేయకండి; 4. అల్లాహ్‌ నిషేధించిన ఏ ప్రాణినీ ధర్మంగా తప్ప, అన్యాయంగా చంపకండి; 5. నిరపరాధులను, అమాయకులను నిందారోపణ చేసి, అధికారులకు అప్పగించి, అతన్ని చంపించకండి; 6. చేతబడి చేయకండి; 7. వడ్డీ తినకండి; 8. పవిత్ర అమాయక స్త్రీలపై అపనిందలు మోపకండి; 9. ధర్మ పోరాటంలో వెన్నుచూపి పారిపోకండి. ఇంకా ఓ యూదులారా! మీపై శనివారం హద్దులు మీరి ప్రవర్తించ కూడదని కూడా ఉంది,” అని ప్రవచించారు. ప్రవక్త (స) నోటి ఈ మాటలు విని ఆ ఇద్దరు యూదులు ప్రవక్త (స) చేతులకు, కాళ్ళకూ ముద్దుపెట్టుకున్నారు.
అనంతరం వారిద్దరూ, ‘తమరు దైవప్రవక్త అని మేము సాక్ష్యం ఇస్తున్నాము,’ అని విన్నవించు కున్నారు. అప్పుడు ప్రవక్త (స) వారితో, ”నన్ను దైవ ప్రవక్తగా స్వీకరించిన తర్వాత నాకు విధేయత చూపటంలో మీకు గల ఆటంకం ఏమిటి?” అని అడిగారు. దానికి వారు ‘దావూద్‌ (అ) తన ప్రభువును ప్రవక్తలు ఎప్పుడూ తన సంతతిలోనే రావాలని ప్రార్థించారు. మీకు విధేయత చూపితే యూదులు మమ్మల్ని చంపివేస్తారని భయపడుతున్నాము,’ అని విన్నవించుకున్నారు. )

వివరణ-58: ఈ ‘హదీసు’ను ‘సఫ్వాన్‌ బిన్‌ ‘అస్సాల్‌ ఉల్లేఖించారు. ప్రవక్త (స) వెంట 12 పోరాటాల్లో పాల్గొన్నారు. కూఫహ్ లో నివాస మేర్పరచుకున్నారు.
ఆ ఇద్దరు యూదులు మూసా(అ)కు ఇవ్వబడిన 9 మహ త్యా లను గురించి ప్రశ్నించారు. ఈ ఆయత్ సూరహ్ బనీ ఇస్రాయీల్‌ (17)లో ఉంది. ప్రవక్త (స) వాటిని వివరంగా పేర్కొన్నారు. 1. చేతికర్ర, 2. చేతి వెలుగు, 3. తూఫాన్‌, 4. టిడ్డె (జరాద్), 5. పేళ్ళు, 6. కప్పలు, 7. రక్తం, 8. కరువు కాటకాలు, 9. పంటల నష్టం. ఈ 9 నిదర్శనాల గురించి ఖుర్‌ఆన్‌లో వివిధ సూరాల్లో ప్రస్తావించటం జరిగింది. మూసా (అ) అల్లాహ్ (త) సందేశాన్ని అందజేయటానికి ఫిర్‌’ఔన్‌ దర్బారులోకి వెళ్ళారు. అప్పుడు: ”(ఫిర్‌’ఔన్‌) అన్నాడు: ‘నీవు ఏదైనా సూచనను తీసుకొని వచ్చి ఉంటే – నీవు సత్య వంతుడవే అయితే – దానిని తీసుకొనిరా:’ అప్పుడు (మూసా) తన చేతికర్రను విసిరాడు, అకస్మాత్తుగా అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా (సు”అబాన్‌గా) మారిపోయింది. మరియు అతడు తన చేతిని బయటికి తీశాడు. ఇక అది చూసే వారికి తెల్లగా మెరుస్తూ కనిపించింది. (సూ. అల్-అ’అరాఫ్, 7:106-108),
ఈ చేతికర్రగురించి సూరహ్‌ ‘తా-హా లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ చేతి కర్రలో అనేక ఉపయోగాలు ఉండేవి. రాత్రి పూట దీపంగా ఉపయోగపడేది. మేకలను నియంత్రించేది, నీడ ఇచ్చేది, మాంత్రుకుల మంత్రాలను త్రిప్పికొట్టేది, నేలపై వేస్తే సర్పంగా మారిపోయేది, చేతిలోకి తీసుకుంటే కర్రగా మారి పోయేది. రెండవ నిదర్శనం సూరహ్‌ ఆరాఫ్‌లో ఉంది.
అల్లాహ్‌ ఆదేశం: ” మరియు వాస్తవానికి, మేము ఫిర్‌’ఔన్‌ జాతి వారిని – బహుశా వారికి తెలివి వస్తుందేమోనని – ఎన్నో సంవత్సరాల వరకు కరువుకు, ఫలాల నష్టానికి గురిచేశాము. ఆ పిదప వారికి మంచికాలం వచ్చి నపుడు వారు: ”మేము దీనికే అర్హులం!” అని అనేవారు. కాని వారికి కష్టకాలం దాపురించినపుడు, వారు మూసా మరియు అతనితో పాటు ఉన్నవారిని తమకు అపశకునంగా పరిగణించే వారు. వాస్తవానికి వారి అపశకునాలన్నీ అల్లాహ్‌ చేతులలోనే ఉన్నాయి, కాని వారిలో చాలామందికి తెలియదు. మరియు వారు (మూసాతో) అన్నారు: ”నీవు మమ్మల్ని భ్రమింప జేయటానికి ఏ సూచనను తెచ్చినా మేము నిన్ను నమ్మేవారం కాము!” కావున మేము వారిపై జలప్రళయం (‘తూఫాన్‌) మిడుతల దండు, పేనులు, కప్పలు మరియు రక్తం మొదలైన స్పష్టమైన సూచనలను పంపాము. అయినా వారు దురహంకారం చూపారు ఎందుకంటే వారు మహా అపరాధులై ఉండిరి. మరియు వారిపైకి ఆపద వచ్చి నపుడు వారనేవారు: ”ఓ మూసా! నీ ప్రభువు నీకిచ్చిన వాగ్దానం ఆధారంగా నీవు మా కొరకు ప్రార్థించు! ఒకవేళ నీవు మా నుండి ఈ ఆపదను తొలగిస్తే మేము నిన్ను విశ్వసిస్తాము; మరియు ఇస్రాఈ’ల్‌ సంతతివారిని తప్పక నీవెంట పంపుతాము.” కానీ, ఒక నిర్ణీత కాలం వరకు వారి నుండి ఆపదను తొలగించగానే – ఆ కాలానికి వారు చేరుకోవలసినవారే కాబట్టి – వారు తమ వాగ్దానాన్ని భంగపరిచేవారు!” (సూ. అల్‌ ఆరాఫ్‌, 7:130-135)
తఫ్‌సీర్‌ మ’ఆలిముత్తన్‌జీల్‌ మరియు తఫ్‌సీర్‌ ఖాజిన్‌లలో ఈ వాక్యపు వ్యాఖ్యానం ఇలా ఉంది: ”ఫిరౌన్‌ జాతివారు మూసా (అ)ను తిరస్కరించి, మహిమలన్నిటినీ మంత్రాలుగా పరిగణించారు. ఇంకా బనీ ఇస్రాయీ’ల్‌ జాతిపై అనేక దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అప్పుడు మూసా (అ) ఫిరౌన్‌ జాతిని శపించారు. అప్పుడు అల్లాహ్‌ ఫిరౌన్‌ జాతిపై నీటిశిక్ష పంపాడు. నల్లని మబ్బు వచ్చింది. 7 రోజుల వరకు నిరంతరంగా వర్షం కురిసింది. ఫిరౌన్‌ జాతివారి ఇళ్ళు నీటితో నిండిపోయాయి. పీకల వరకు నీరైపోయింది. పొలాలు, తోటలు, పంటలు అన్నీ మునిగిపోయాయి. కాని వీరికి దగ్గరలోనే ఉన్న బనీ ఇస్రాయీల్‌ జాతి వారి ఇళ్ళు మాత్రం ఎటువంటి వరదకు గురికాలేదు. అనంతరం ఫిరౌన్‌ జాతివారు పశ్చాత్తాపం చెందిన తర్వాత శిక్షను తొలగించటం జరిగింది. కాని వాళ్ళు మళ్ళీ తలబిరుసు తనానికి దిగారు. నెలరోజుల తర్వాత చిన్న పిచ్చుకల శిక్ష అవతరించింది. వారి పొలాలన్నీ నాశనం అయ్యాయి. అయితే వీరి పొలాల ప్రక్కనే బనీ ఇస్రాయీ’ల్‌ పొలాలు ఉండేవి. కాని వారి పొలాలకు ఎటువంటి హాని కలుగలేదు. 7 రోజుల వరకు ఈ శిక్ష ఉంది. చివరికి ఫిరౌన్‌ జాతివారు పశ్చాత్తాప పడితే, మూసా (అ) ప్రార్థించగా ఆ శిక్ష కూడా తొలగి పోయింది. కాని మళ్ళీ తిరస్కారానికి దిగారు. మళ్ళీ మూసా (అ) శపించారు. అప్పుడు వారిపై పేళ్ళ శిక్ష అవతరింపజేయబడింది. అవి వారి శరీరం అంతా వ్యాపించాయి. అవి తొలగిపోయిన తర్వాత, కప్పల శిక్ష అవతరించింది. అవి వారి ఇళ్ళల్లో నిండి పోయాయి. అన్నంలో, నీళ్ళలో, ప్రతి వస్తువులో కప్పలే కప్పలు. ఆతరువాత వారు త్రాగేనీరు రక్తంలా మారిపోయింది. నదులు, బావులు రక్తమయం అయి పోయాయి. ఈ శిక్ష కూడా 7 రోజుల వరకు నిరంతరంగా కొనసాగింది. మళ్ళీ వారు వేడుకున్న తర్వాత మూసా (అ) ప్రార్థించగా ఆ శిక్ష కూడా తొలగి పోయింది.
ఈ ఆయతులో ఇన్ని విషయాలను గురించి సూచించడం జరిగింది. ప్రవక్త(స) వీటిని వివరంగా పేర్కొన్నారు. అందు వల్లే ఉల్లేఖనకర్త ఈ ‘హదీసు’ను సంక్షిప్తంగా పేర్కొనలేదు. అయితే ప్రవక్త (స) పేర్కొన్న 9 విషయాలను గురించి మాత్రం పేర్కొన్నారు. ఎందుకంటే వాటి అవసరం అందరికీ ఉంది. చివరగా యూదుల ప్రత్యేకతను అంటే శనివారం నాడు చేపలు వేటాడరాదనే విషయాన్ని పేర్కొన్నారు. ఆ ఇద్దరు యూదులు ప్రవక్త (స) మాటలు విని సంతోషంతో ప్రవక్త(స) చేతులకు, కాళ్ళకు ముద్దు పెట్టుకున్నారు. ఇంకా దైవప్రవక్త అని సాక్ష్యం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ గ్రంథాలలో కూడా ప్రవక్త (స) గురించి భవిష్యవాణి ఉంది. కాని వారు దాన్ని దాచటానికి ప్రయత్నించే వారు. వారు దావూద్‌ (అ), ‘అతనికి విధేయత చూపవద్దని ఆదేశించారని,’ అంటారు. కాని ఇదంతా అసత్యం. ఎందు కంటే ప్రతి ప్రవక్త, ఇతర ప్రవక్తల (స)కు విధేయత చూపమనే ఆదేశించారు.
(తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’)
59 – 11 (1/24)
وعَنْ أَنَس بن مالك، قَالَ: قَالَ رسول الله صلى الله عليه وسلم: “ثَلَاثٌ مِّنْ أَصْلِ الْإِيْمَانِ: الْكَفُّ عَمَّنْ قَالَ: لَا إِلَهَ إِلَّا اللهُ، لَا نَكَفِّرْهُ بِذَنْبِ، وَلَا تُخْرِجْهُ مِنَ الْإِسْلَامِ بِعَمَلِ. وَالْجِهَادُ مَاض مُنْذُ بَعَثَنِيَ اللهُ إِلَى أَنْ يُّقَاتِلَ آَخِرُ هذه الأمة الدَّجَّالَ، لَا يُبْطِلُهُ جَوْرُ جَائِرٍ، وَلَا عَدْلُ عَادِلٍ، وَالْإِيْمَانُ بِالْأَقْدَارِ”. رواه أبو داود

(11) [1/24-బలహీనం]
అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”విశ్వాస మూలాలు మూడు: ‘1. లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ అని పలికిన వారిని మహా పాపాల కారణంగా అతన్ని అవిశ్వాసి అనకూడదు, ఇంకా అతన్ని ఇస్లామ్‌ నుండి బహిష్కరించకూడదు; 2. జిహాద్‌ ఆదేశం నా నుండి ప్రళయం వరకు కొనసాగుతుంది. అంటే అల్లాహ్‌ (త) నన్ను ప్రవక్తగా నియమించి నప్పటి నుండి జిహాద్‌ కొనసాగుతుంది. చివరికి ఈ అనుచర సమాజం చివరి వ్యక్తి దజ్జాల్‌ను సంహరిస్తాడు. దుర్మార్గుని దుర్మార్గం లేదా న్యాయమూర్తి న్యాయం దాన్ని తొలగించ లేదు; 3. విధి వ్రాతపై విశ్వాసం కలిగి ఉండటం,’ ” అని ప్రవచించారు. (అబూ దావూద్‌)
60 – [ 12 ] ( لم تتم دراسته ) (1/25)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا زَنَى الْعَبْدُ خَرَجَ مِنْهُ الْإِيْمَانُ، فَكَانَ فَوْقَ رَأْسِهِ كَالظُّلَةِ، فَإِذَا خَرَجَ مِنْ ذَلِكَ الْعَمَلِ عَادَ إِلَيْهِ الْإِيْمَانُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاودَ.

(12) [1/25-అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తి వ్యభిచారం చేసినపుడు, అతని విశ్వాసం అతనిలో నుండి బయటపడి, అతని తలపై నీడలా ఉంటుంది. అతడు ఆ చెడుకార్యం నుండి దూరం కాగానే అతని విశ్వాసం మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది.” (తిర్మిజీ’, అబూ దావూద్‌)

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
61 – [ 13 ] ( لم تتم دراسته ) (1/25)
عَنْ مُعَاذٍ، قَالَ: أَوْصَانِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِعَشْرِ كَلِمَاتٍ، قَالَ: “لَا تُشْرِكْ بِاللهِ شَيْئًا وَّإِنْ قُتِلْتَ وَحُرِّقْتَ، وَلَا تَعْقَّنَّ وَالِدَيْكَ وَإِنْ أَمَرَاكَ أَنْ تَخْرُجَ مِنْ أَهْلِكَ وَمَالِكَ، وَلَا تَتْرُكَنَّ صَلَاةً مَكْتُوْبَةً مُتَعَمِّدًا؛ فَإِنَّ مَنْ تَرَكَ صَلَاةً مَكْتُوْبَةً مُّتَعَمِّدًا فَقَدْ بَرِئَّتْ مِنْهُ ذِمَّةُ اللهِ، وَلَا تَشْرَبَنَّ خَمْرًا فَإِنَّهُ رَأْسٌ كُلِّ فَاحِشَةٍ، وَإِيَّاكَ وَالْمَعْصِيَةَ؛ فَإِنَّ بِالْمَعْصِيَةِ حَلَّ سَخَطُ اللهِ عز وجل، وَإِيَّاكَ وَالْفِرَارَ مِنَ الزَّحْفِ وَإِنْ هَلَكَ النَّاسُ، وَإِذَا أَصَابَ النَّاسَ موت وَأَنْتَ فِيْهِمْ، فَاثْبُتْ، وَأَنْفَقْ عَلَى عِيَالِكَ مِنْ طَوْلِكَ، وَلَا تَرْفَعْ عَنْهُمْ عَصَاكَ أَدَبًا وَأَخِفْهُمْ فِيْ اللهِ”. رواه أحمد.

(13) [1/25-అపరిశోధితం]
ము’ఆజ్‌’ (ర) కథనం: ప్రవక్త (స) నాకు 10 విషయాల గురించి బోధించారు. ”1. మిమ్మల్ని కాల్చివేసినా చంపివేసినా ఎన్నడూ అల్లాహ్‌(త)కు సాటి కల్పించరాదు; 2. ఒకవేళ తల్లి దండ్రులు భార్యా సంపదలను వదలివేయమన్నా – వారికి అవిధేయత చూపరాదు; 3. విధి నమా’జులను ఎంతమాత్రం వదలరాదు, ఎందుకంటే ఉద్దేశ్యపూర్వకంగా నమా’జులను వదలిన వాడు అల్లాహ్‌(త) రక్షణా పరిధి నుండి తొలగిపోతాడు; 4. సారాయి త్రాగకండి, ఎందుకంటే సారాయి పాపాలన్నిటికి మూలం; 5. పాపాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే పాపాలపట్ల దైవాగ్రహం అవతరిస్తుంది; 6. అవిశ్వాసులతో యుద్ధం జరిగినపుడు, వెన్నుచూపి పారిపోవటానికి ప్రయత్నించకండి. యుద్ధంలో ప్రజలు చంపబడు తున్నా సరే; 7. మీ ప్రాంతంలో ప్రజలు అనారోగ్యానికి గురైతే, మీరు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించకండి, అక్కడే ఉండండి; 8. మీ కుటుంబం గురించి మీ శక్తిమేరకే ఖర్చుపెట్టండి; 9. మీ కుటుంబం వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉండండి, ఒకవేళ కొట్టవలసి వస్తే విద్యాబుద్ధులు నేర్పించటానికి మాత్రమే కొట్టండి; 10. దైవభీతిని గురించి వారికి బోధించండి. (అ’హ్మద్‌)
62 – 14 (1/25)
وعَنْ حُذَيْفَة، قَالَ: إِنَّمَا كَانَ النِّفَاقُ عَلَى عَهْدِ النَّبِي صلى الله عليه وسلم، فَأَمَّا الْيَوْمَ، فَإِنَّمَا هُوَ الْكُفْرُ، أو الْإِيْمَانُ. رَوَاهُ الْبُخَارِيُّ.

(14) [1/25-దృఢం]
హుజై’ఫహ్ (ర) కథనం: ‘ప్రవక్త (స) కాలంలో కాపట్యం ఉండేది. కాని ఈనాడు, విశ్వాసం లేదా అవిశ్వాసం మాత్రమే.’ )

వివరణ-62: ఇది అతని అభిప్రాయం. ఎందుకంటే ప్రతి కాలంలో కాపట్యం ఉంటుంది.

(బు’ఖారీ)

2 – بَابُ فى الوسْوَسَة

కుశంకలు (చెడు ఆలోచనలు)
మంచి ఆలోచనలను దైవప్రేరణలు అంటారు. షై’తాన్‌ ప్రేరణలను కలతలు, చెడు ఆలోచనలు అంటారు. ఇవి రెండు రకాలు: 1. అవశ్య: హృదయంలో జనించే చెడు ఆలోచనలు, ప్రేరణలు ఇవి క్షమించబడతాయి. 2. అనా వశ్య: చెడు ఆలోచనలు, ప్రేరణల ప్రకారం ఆచరించటం.
అల్లాహ్‌ ఆదేశం: ”…మీరు మీమనస్సులలో ఉన్నది, వెలుబుచ్చినా లేక దాచినా అల్లాహ్‌ మీ నుంచి దానిలెక్క తీసుకుంటాడు. మరియు ఆయన తానుకోరిన వానిని క్షమిస్తాడు మరియు తాను కోరినవానిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.” (సూ. అల్‌ బఖరహ్‌, 2:284)
మరికొందరు ఈ ఆదేశం రద్దయిందని భావిస్తారు. ఈ విషయం క్రింది ‘హదీసు’ ద్వారా తెలుస్తుంది. ప్రవక్త (స) ప్రవచనం: అల్లాహ్‌ ఆదేశం: ”నా దాసుడు చెడును గురించి ఆలోచిస్తే, అతను దాన్ని చేయనంత వరకు వ్రాయకండి. ఒక వేళ చేసివేస్తే ఒక్క పాపం వ్రాయండి. అదే మంచిని గురించి సంకల్పిస్తే, ఒక పుణ్యం వ్రాసుకోండి. దాన్ని చేసివేస్తే, 10 పుణ్యాలు వ్రాసుకోండి.” (ముస్లిమ్‌)
ఒక ఉల్లేఖనంలో, ”ఒక పుణ్యానికి బదులు 700 పుణ్యాలు వ్రాయబడతాయి,” అని ఉంది. మరో ఉల్లేఖనంలో, ”దాసుడు చెడును గురించి సంకల్పిస్తే, దైవదూతలు అల్లాహ్‌తో, ‘ఓ అల్లాహ్‌! నీ దాసుడు చెడుకు పూనుకున్నాడు,’ అని అంటారు. దానికి అల్లాహ్‌, ‘ఆగండి! అతడు చేయనంత వరకు కర్మల పత్రంలో వ్రాయకండి. ఒకవేళ చేసివేస్తే ఒక పాపం వ్రాయండి. ఒకవేళ చేయకుండా వదలివేస్తే, ఒక పుణ్యం వ్రాయండి. ఎందుకంటే, నాకు భయపడి చేయకుండా వదలివేస్తాడు,’ అని ఆదేశిస్తాడు. ప్రవక్త (స) ప్రవచనం ప్రకారం, పరిపూర్ణ ముస్లిమ్‌ యొక్క 1 పుణ్యం 700 రెట్ల వరకు పెంచడం జరుగుతుంది. అధికం చేయటం జరుగుతుంది అని ఉంది. మరో ఉల్లేఖనంలో, ”ఇంత విశాల హృదయం, దయ, కరుణతో వ్యవహరించినప్పటికీ నాశనం అయ్యేవాడు ఎలాగూ నాశనం అవుతాడు.’ ఒకసారి అనుచరులు, ‘ఓ ప్రవక్తా! ఒక్కోసారి మా హృదయాలలో చెడు ఆలోచనలు, కలతలు వస్తుంటాయి. వాటి గురించి నోటితో చెప్పటానికి కూడా చాలా బాధగా ఉంటుంది,’ అని విన్నవించు కున్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘అలా అవు తుందా?’ అని అడిగారు. దానికి వారు, ‘అవును,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘విశ్వాసం అంటే ఇదే,’ అని అన్నారు. (ముస్లిమ్‌)

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర), ‘ఈ వాక్యం రద్దు కాలేదు. అంటే తీర్పుదినం నాడు అల్లాహ్‌ మానవులందరినీ ఒకచోట చేరవేసి, ఈ రోజు నేను మీ హృదయాల రహస్యాలను గురించి తెలియపరుస్తాను, వీటి గురించి దైవదూతలకు కూడా తెలియదు అని పలికి విశ్వాసులకు వాటి గురించి తెలియపరచి వారిని క్షమించివేస్తాడు. కాని అవిశ్వాసులకు కపటా చారులకు వారి హృదయాల కాపట్యాన్ని గురించి తెలియపరచి వారికి తగిన శిక్ష విధిస్తాడు,’ అని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా హసన్‌ బస్రీ కూడా దీన్ని రద్దయినదిగా అభిప్రాయపడరు. ఇబ్నె జరీర్‌ అభిప్రాయం కూడా ఇదే, అతను అంటారు, ‘లెక్క తీసుకోవటం వేరు, శిక్షించటం వేరు. లెక్కతీసు కోవటానికి, పాపం చేయటం తప్పనిసరి కాదు. విచారణ తర్వాత క్షమించడం జరగ వచ్చు, శిక్షించడం జరగవచ్చు.’ ఒక ‘హదీసు’లో ఇలా ఉంది, ”మేము ‘తవాఫ్‌ చేస్తున్నాం, ఒక వ్యక్తి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ను, ‘తమరు ప్రవక్త (స) నుండి గుసగుసల గురించి ఏం విన్నారు?’ అని అడిగారు. దానికి అతను ఇలా అన్నారు, ”ప్రవక్త (స) ప్రవచనం, ‘అల్లాహ్‌ విశ్వాసిని తన వద్దకు పిలుచుకొని తన చేయిని అతనిపై పెట్టి, నీవు ఫలానా పాపాలు చేశావు,’ అని అంటాడు.’ దానికి ఆ విశ్వాసి ఒప్పు కుంటాడు. అప్పుడు అల్లాహ్‌, ‘నేను ప్రపంచంలో కూడా నీ పాపాలను దాచాను, ఈనాడు వాటన్నిటినీ క్షమించి వేస్తున్నాను,’ అని పలికి అతని కర్మల పత్రాన్ని అతని కుడిచేతిలో ఇస్తాడు. కాని అవిశ్వాసులను, కపటాచారులను అందరి ముందు అవమాన పరచటం జరుగుతుంది. వారి పాపాలను బట్ట బయలు చేయడం జరుగుతుంది. ‘వీరే తమ ప్రభువుపై అభాండాలు మోపింది, ఇటువంటి దుర్మార్గులపై దైవాగ్రహం విరుచుకుపడుగాక!’ అని శపించటం జరుగుతుంది.” (తఫ్‌’సీర్‌ ఇబ్నె కసీ’ర్‌)

الْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
63 – [ 1 ] ( متفق عليه ) (1/26)
عَنْ أَبِيْ هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ تَعالى تَجَاوَزَعَنْ أُمَّتِيْ مَا وَسْوَسَتْ بِهِ صُدُوْرُهَا، مَا لَمْ تَعْمَلْ بِهِ أَوْ تَتكَلَّمْ”.
63.(1) [1/26-ఏకీభవితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజం హృదయాలలో ఉత్పన్న మయ్యే కలతలు, చెడు ఆలోచనలను అల్లాహ్‌ (త) క్షమించి వేశాడు. వాటిని ఆచరించనంత వరకు, నోటితో పలకనంత వరకు విచారించడం జరుగదు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)
64 – 2 (1/26)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْه، قَالَ: جَاءَ نَاسٌ مِّنْ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم إِلَى النَّبِيِ صلى الله عليه وسلم، فَسَأَلُوْهُ: إِنَّا نَجْدُ فِيْ أَنْفُسِنَا مَا يَتَعَاظَمُ أَحَدُنَا أَنْ يَّتَكَلَّمَ بِهِ! قَالَ: “أَوْ قَدْ وَجَدْتُّمُوْهُ؟” قَالُوْا: نَعَمْ. قَالَ: “ذَاكَ صَرِيْحُ الْإِيْمَانِ”. رَوَاهُ مُسْلِمٌ.

(2) [1/26-దృఢం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు కొంత మంది అనుచరులు వచ్చి, ‘ఒక్కోసారి మా మనస్సులలో ఎటువంటి చెడు ఆలోచనలు వస్తాయంటే, వాటిని నోటితో చెప్పాలంటేనే బాధగా ఉంటుంది,’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ‘నోటితో చెప్పా లంటేనే బాధ కలిగించే టటువంటి ఆలోచనలు మీ మనస్సుల్లో ఉత్పన్నం అవుతాయా?’ అని అడిగారు. దానికి అనుచరులు, ‘అవును,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘విశ్వాసం అంటే ఇదే,’ అని అన్నారు. (ముస్లిమ్‌)
65 – [ 3 ] ( متفق عليه ) (1/26)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْه، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَأتِيْ الشَّيْطَانُ أَحْدَكُمْ، فَيَقُوْلُ: مَنْ خَلَقَ كَذَا؟ مَنْ خَلَقَ كَذَا؟ حَتَّى يَقُوْلَ: مَنْ خَلَقَ رَبَّكَ؟ فَإِذَا بَلَغَهُ؛ فَلْيَسْتَعِذْ بِاللهِ وَلْيَنْتَه”.

(3) [1/26-ఏకీభవితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కొందరి వద్దకు షై’తాన్‌ వచ్చి, ‘దీన్ని ఎవరు సృష్టించారు, దాన్ని ఎవరు సృష్టించారు, నీ ప్రభువును ఎవరు సృష్టించారు?’ అనే ప్రశ్నలు అతని మనసులో సృష్టిస్తాడు. ఇటువంటి ప్రశ్నలు తలెత్తితే వెంటనే అల్లాహ్‌(త)ను శరణు వేడుకోవాలి. ఇంకా ఇటువంటి ఆలోచనలకు దూరంగా ఉండాలి.” (బు’ఖారీ,ముస్లిమ్‌)
66 – [ 4 ] ( متفق عليه ) (1/26)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْه، قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “لَا يَزَالُ النَّاسُ يَتَسَاءَلُوْنَ حَتَّى يُقَالَ: هَذَا خَلَقَ اللهُ الْخَلْقَ، فَمَنْ خَلَقَ اللهَ؟ فَمَنْ وَّجَدَ مِنْ ذَلِكَ شَيْئًا؛ فَلْيَقُلْ: آمَنْتُ بِاللهِ وَرُسُلِهِ”.

(4) [1/26-ఏకీభవితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నిరంతరం ప్రజలు పరస్పరం పరిశోధిస్తూ ఉంటారు. చివరికి వారిని సృష్టిరాసులన్నింటినీ అల్లాహ్‌ (త) సృష్టించినపుడు, ‘అల్లాహ్‌ (త)ను ఎవరు సృష్టించారు,’ అని కూడా ప్రశ్నించటం జరుగుతుంది. ఇటువంటి కలతలు మనసులో చెలరేగినపుడు, ‘నేను అల్లాహ్‌(త)ను, ఆయన ప్రవక్తనూ విశ్వసించాను.’ అని పలకాలి.” )

వివరణ-66: అంటే: “ఆయన (అల్లాహ్‌) కు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించినవాడునూ) కాదు. మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీలేదు.” (సూ. అల్ ఇఖ్లాస్, 112:3-4)
(బు’ఖారీ, ముస్లిమ్‌)
67 – 5 (1/26)
وعَنْ اِبْنِ مَسْعُوْدٍ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْكُمْ مِنْ أَحَدٍ إِلَّا وَقَدْ وَكِّلَ بِهِ قَرِيْنُهُ مِنَ الْجِنِّ وَقَرِيْنُهُ مِنَ الْمَلَائِكَةِ”. قَالُوْا: وَإِيَّاكَ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “وَإِيَّايَ، وَلِكِنَّ اللهَ أَعَانَنِيْ عَلَيْهِ فَأَسْلَمَ، فَلَا يَأْمُرُنِيْ إِلَّا بِخَيْرٍ”. رَوَاهُ مُسْلِمٌ .

(5) [1/26-దృఢం]
ఇబ్నె మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స), ” ‘మీలో ప్రతి ఒక్కరి వెంట జిన్నులు, దైవదూతలు నియ మించబడి ఉన్నారు,’ అని అన్నారు. అప్పుడు అనుచరులు, ‘దైవ ప్రవక్తా! మీ వెంట కూడానా?’ అని విన్నవించుకున్నారు. దానికి దైవప్రవక్త (స), ‘అవును, నా వెంట కూడా నియమించబడ్డాడు. కాని అల్లాహ్‌ (త), ఆ షై’తాన్‌ విషయంలో నాకు సహాయం చేశాడు. నాకు వాడిపై ఆధిక్యత ప్రసాదించాడు. అందు వల్ల నేను వాడి నుండి సురక్షితంగా ఉంటున్నాను. వాడు ఇస్లామ్‌ స్వీకరించాడు. ఇంకా నాకు మంచినే ఆదేశిస్తాడు,’ అని అన్నారు.” )

వివరణ-67: అంటే ప్రతి మానవుని వెంట ఇద్దరు ఉంటారు. ఒకరు జిన్నులనుండి, మరొకరు దైవదూతల నుండి. మొదటివాడు చెడును ఆదేశిస్తాడు. కలతలు రేకెత్తిస్తాడు. రెండవవాడు, మంచిని ఆదేశిస్తాడు. మొదటి వాని పేరు వస్‌వాస్‌, రెండవ వాని పేరు ముల్‌హిమ్‌. అనుచరులు ప్రవక్త (స)ను, ‘మీ వెంట కూడా షై’తాన్‌ ఉంటాడా?’ అని అడిగారు. దానికి ప్రవక్త (స), ‘నా వెంట కూడా షై’తాన్‌ ఉన్నాడు. కాని అల్లాహ్‌ వాడిపై నాకు ఆధిక్యత ప్రసాదించాడు. ఫలితంగా వాడు నాకు మంచినే ఆదేశిస్తాడు,’ అని అన్నారు.
(ముస్లిమ్‌)
68 – [ 6 ] ( متفق عليه ) (1/26)
وَعَنْ أَنَسٍ، قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “إِنَّ الشَّيْطَانَ يَجْرِيْ مِنَ الْإِنْسَانِ مَجْرَى الدَّمِ”.

(6) [1/26-ఏకీభవితం]
అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నిస్సందేహంగా షై’తాన్‌ మానవుని శరీరంలో రక్తంలా ప్రవహిస్తున్నాడు.” )

వివరణ-68: అంటే షై’తాన్‌ రక్తంలా ప్రవహిస్తాడు. మానవులను మార్గభ్రష్టత్వానికి గురిచేయగల లక్షణం షై’తాన్‌లో ఉంది.
(బు’ఖారీ, ముస్లిమ్‌)
69 – [ 7 ] ( متفق عليه ) (1/27)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْه، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ بَنِيْ آدَمَ مُوْلُوْدٌ إِلَّا يَمَسُّهُ الشَّيْطَانُ حِيْنَ يُوْلَدُ، فَيَسْتَهِلُّ صَارِخًا مِّنْ مَّسِّ الشَّيْطَانِ غَيْرَ مَرْيَمَ وَابْنِهَا”.

(7) [1/27-ఏకీభవితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఆదమ్‌ సంతతిలోని ప్రతిబిడ్డ జన్మించినపుడు షై’తాన్‌ దానిని తాకుతాడు. దానివల్ల బిడ్డ ఏడుస్తా డు. కాని మర్యమ్‌ (అ) మరియు ‘ఈసా (అ)లను షై’తాన్‌ తాక లేక పోయాడు.” )

వివరణ-69: ఇలా ఎందుకు జరిగిందంటే, మర్యమ్‌ (అ) తల్లి దైవాన్ని: ”ఇన్నీ ఉ’యీజుహా బిక వజు’ర్రియ్య తిహా మినష్షైతా నిర్రజీమ్‌”- ‘ఓ అల్లాహ్‌ నేను ఆమె (మర్యమ్‌) మరియు ఆమె సంతానం కొరకు షై’తాన్‌ నుండి శరణు వేడుకుంటున్నాను,’ అని ప్రార్థించింది. అల్లాహ్‌(త) ఆమె ప్రార్థనను స్వీకరించాడు. మర్యమ్‌ను, ‘ఈసా (అ)ను షై’తాన్‌ కీడు నుండి రక్షించాడు.
(బు’ఖారీ, ముస్లిమ్‌)
70 – [ 8 ] ( متفق عليه ) (1/27)
وعَنْ أبي هريرة رضي الله عَنْه، قَالَ: قَالَ رسولُ الله صلى الله عليه وسلم: “صِيَاحُ الْمَوْلُوْدِ حِيْنَ يَقَعُ نَزْغَةٌ مِنَ الشَّيْطَانِ”.

(8) [1/27-ఏకీభవితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బిడ్డ పుట్టినప్పుడు షై’తాన్‌ గిల్లటం వల్ల ఏడ్వటం జరుగు తుంది.” (బు’ఖారీ, ముస్లిమ్‌)
71 – 9 (1/27)
وعَنْ جَابِرٍ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ إِبْلِيْسَ يَضَعُ عَرْشَهُ عَلَى الْمَاءِ، ثُمَّ يَبْعَثُ سَرَايَاهُ يَفْتِنُونَ النَاسَ، فَأَدْنَاهُمْ مِنْهُ مَنْزِلَةً أَعْظَمُهُمْ فِتْنَةً. يَّجِيْءُ أَحَدُهُمْ فَيَقُوْلُ: فَعَلْتُ كَذَا وَكَذَا. فَيَقُوْلُ: مَا صَنَعْتَ شَيْئًا. قَالَ: ثُمَّ يَجِيْءُ أَحَدُهُمْ فَيَقُوْلُ: مَا تَرَكْتُهُ حَتَّى فَرَّقْتُ بَيْنَهُ وَبَيْنَ اِمْرَأَتِهِ. قَالَ: فَيُدِنِيْهِ مِنْهُ، وَيَقُوْلُ : نَعْمَ أَنْتَ”. قَالَ الْأَعْمَشُ: أَرَاهُ قَالَ: “فَيَلْتَزِمُهُ”. رواه مسلم.

(9) [1/27-దృఢం]
జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”షై’తాన్‌ తన సింహాసనాన్ని నీటిపై పెట్టి (దానిపై మహా రాజులా కూర్చొని) తన సైనికులను ప్రజలను మార్గభ్రష్ట త్వానికి గురిచేయటానికి పంపుతాడు. (అంటే ప్రపంచ మంతా వ్యాపించి ప్రజలను తప్పుదారి పట్టించమని ఆదేశిస్తాడు) అనంతరం వారు తమ మహారాజు ఇబ్లీసు వద్దకు వచ్చి తాము చేసిన ఘనకార్యాలను చెప్పుకుంటారు. ఎక్కువ మందిని వక్రమార్గానికి గురిచేసినవారే గౌరవచిహ్నంగా షై’తాన్ కు దగ్గరగా ఉంటారు. వారిలో ఒకరు తమ నాయకుని వద్దకు వచ్చి, ‘నేను ఇలా మరియు ఇలా చేసాను, అంటే మార్గం తప్పించాను, దొంగతనానికి గురి చేసాను, వ్యభిచారానికి గురిచేసాను,’ అని అంటాడు. దానికి షై’తాన్‌, ‘నువ్వు ఏ పెద్ద గొప్ప కార్యం చేయలేదు,’ అని అంటాడు. ఒక సైనికుడు వచ్చి, ‘నేను ఒక గొప్ప ఘనకార్యం చేశాను. అదేమిటంటే, భార్యాభర్తలను విడదీసేవరకు నేను వదలలేదు,’ అని చెప్పు కుంటాడు. అప్పుడు షై’తాన్‌ వాడిని, ‘నువ్వు ఒక్క డివే గొప్పపని చేసావు, నిజాయితీని నిరూపించు కున్నావు,’ అని ప్రశంసించి, పొగిడి దగ్గరకు చేర్చు కుంటాడు, అలింగనం చేసుకుంటాడు.” (ముస్లిమ్‌)
72 – 10 (1/27)
وَعَنْ جَابِرٍ، قَالَ النبي صلى الله عليه وسلم: “إِنَّ الشَّيْطَانَ قَدْ أَيِسَ مِنْ أَنْ يَّعْبُدَهُ الْمُصَلُّوْنَ فِيْ جَزِيْرَةِ الْعَرَبِ، وَلَكِنْ فِيْ التَّحْرِيْشِ بَيْنَهُمْ”. رَوَاهُ مُسْلِمٌ.

(10) [1/27-దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”షై’తాన్‌ ఇప్పుడు అరబ్బు భూభాగంలో ముస్లిములు (నమా’జీలు) ఇక తనను ప్రార్థించరని నిరాశచెందాడు. అయితే ప్రజలను ప్రేరేపించి వివాదాలకు, కలహాలకు గురిచేస్తాడు.”(ముస్లిమ్‌)

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
73 – [ 11 ] ( لم تتم دراسته ) (1/27)
عَنْ اِبْنِ عَبَّاسٍ: أَن النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: جَاءَهُ رَجُلٌ، فَقَالَ: إِنِّيْ أُحَدِّثُ نَفْسِيْ بِالشَّيْءِ لَأنْ أَكُوْنَ حُمَمَةً أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَتَكَلَّمَ بِهِ. قَالَ: “الْحَمْدُ لِلّهِ الَّذِيْ رَدَّ أَمْرَهُ إِلَى الْوَسْوَسَةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

(11) [1/27-అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘నా మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు వస్తున్నాయంటే, వాటిని నోటితో చెప్పటం కంటే అగ్నికి ఆహుతి అవటం మంచిదనిపిస్తుంది,’ అని విన్నవించు కున్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘కలతలవరకే ఉంచి, దానిపై అమలు చేయటం, పలకటం నుండి దూరముంచిన అల్లాహ్‌(త) కు కృతజ్ఞతలు,’ అని అన్నారు. (అబూ దావూద్‌)
74 – 12 (1/27)
وعَنِ بْنِ مَسْعُوْدٍ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: “إِنَّ لِلشَّيْطَانِ لَمَّةً بِاِبْنِ آدَمَ وَلِلْمَلَكِ لَمَّةً: فَأَمَّا لَمَّةُ الشَّيْطَانِ فَإِيْعَادٌ بِالشَّرِّ، وَتَكْذِيْبٌ بِالْحَقِّ. وَأَمَّا لَمَّةُ الْمَلَكِ فَإِيعَادٌ بِالْخَيْرِ وَتَصْدِيْقٌ بِالْحَقِّ. فَمَنْ وَّجَدَ ذَلِكَ؛ فَلْيَعْلَمْ أَنَّهُ مِنَ اللهِ، فَلْيَحْمَدِ اللهِ، وَمَنْ وَّجَدَ الْأُخْرى؛ فَلْيَتَعَوَّذَ بِاللهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيْمِ”. ثُمَّ قَرَأَ: (الشَّيْطَانُ يَعِدُكُمُ الْفَقْرَ وَيَأْمُرُكُمْ بِالْفَحْشَاءِ؛ 2 : 268) الآية. أخرجه الترمذي وقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.

(12) [1/27-బలహీనం]
ఇబ్నె మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”షై’తానులకు మానవులపై అధికారం ఉంది. దైవ దూతలకూ మానవులపై అధికారం ఉంది. షై’తానుల అధికారం ఏమిటంటే, వాడు మానవులకు చెడు గురించి వాగ్దానం చేస్తాడు, ఇంకా సత్యాన్ని తిరస్క రించమని ప్రేరేపిస్తాడు. అయితే దైవదూత అధికారం ఏమిటంటే, అతడు మానవుణ్ణి మంచిని ఆదేశిస్తాడు, సత్యాన్ని ధృవీక రించమని ప్రోత్స హిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన వ్యక్తి ఇది అల్లాహ్ (త) తరఫు నుండి, అని గుర్తించాలి. దానిపై దైవస్తోత్రం చేయాలి. ఒకవేళ చెడు గ్రహిస్తే, అది షై’తాన్‌ తరఫు నుండి, అని గుర్తించి షై’తాన్‌ నుండి అల్లాహ్‌(త)ను శరణు వేడుకోవాలి,’ అని పలికిన తరువాత ప్రవక్త (స), ఈ ఆయతును పఠించారు: ”షై’తాన్‌ దారిద్య్ర ప్రమాదం చూపి (భయపెట్టి) మిమ్మల్ని నీచకార్యాలు చేయటానికి ప్రేరేపి స్తుంటాడు….” (సూ. అల్-బఖరహ్, 2:268) (తిర్మిజి’ / ఏకోల్లేఖనం)
75 – [ 13 ] ( لم تتم دراسته ) (1/28)
عَنْ أَبِيْ هُرَيْرَةَ، عَنْ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالْ: “لَا يَزَالُ النَّاسُ يَتَسَاءَلُوْنَ, حَتَّى يُقَالَ: هَذَا خَلَقَ اللهُ الْخَلْقَ, فَمَنْ خَلَقَ اللهَ؟ فَإِذَا قَالُوْا ذَلِكَ فَقُوْلُوا: اللهُ أَحَدٌ, اللهُ الصَّمَدُ, لَمْ يَلِدْ وَلَمْ يُوْلَدْ, وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ, ثُمَّ لَيَتْفُلْ عَنْ يَّسَارِهِ ثَلَاثًا, وَّلْيَسْتَعِذْ بالله مِنَ الشَّيْطَانِ”. رواه أبو داود.

(13) [1/28-అపరిశోధితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎల్లప్పుడూ ప్రజలు పరస్పరం ప్రశ్నిస్తూ ఉంటారు. చివరికి, ‘అల్లాహ్‌(త) సృష్టిరాసులన్నిటినీ సృష్టించాడు, మరి అల్లాహ్‌(త)ను ఎవరు సృష్టించారు?’ అని చెప్పటం జరుగుతుంది. ప్రజలు ఇలా అన్నప్పుడు, మీరు ‘అల్లాహ్‌ ఒక్కడే, ఆయన అక్కర లేనివాడు, ఆయనకు సంతానం లేదు, ఆయన కూడా ఎవరి సంతానం కాడు’ అని పలికి మూడుసార్లు ఎడమవైపు ఉమ్మి, షై’తాన్‌ కుతంత్రాల నుండి అల్లాహ్‌(త)ను శరణుకోరండి.’ ”(అబూ దావూద్‌)

‘అమ్ర్‌ బిన్‌ అల్‌ అ’హ్‌వ’స్‌, ‘హదీసు’ను ”బాబు, ఖుత్‌బయే యౌమున్న’హర్‌లో చూడండి.

اَلْفَصْلُ الثَّالِثْ మూడవ విభాగం
76 – 14 (1/28)
عَن أنس بن مَالك يَقُولَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «لَنْ يَبْرَحَ النَّاسُ يَتَسَاءَلُونَ حَتَّى يَقُولُوا هَذَا الله خَالق كل شَيْء فَمن خلق الله». رَوَاهُ الْبُخَارِيُّ.
وَلِمُسْلِمٍ: “قَالَ: قَالَ اللَّهُ عَزَّ وَجل: إِن أمتك لَا يزالون يَقُولُونَ: مَا كَذَا؟ مَا كَذَا؟ حَتَّى يَقُولُوا: هَذَا اللَّهُ خَلَقَ الْخَلْقَ فَمَنْ خَلَقَ اللَّهَ عَزَّ وَجل؟”

(14) [1/28-దృఢం]
అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రజలు నిరంతరం పరస్పరం ప్రశ్నిస్తూ ఉంటారు. చివరికి అల్లాహ్‌ (త) సృష్టిరాసులన్నిటినీ సృష్టించాడు, మరి అల్లాహ్‌ (త)ను ఎవరు సృష్టించారు” అని కూడా ప్రశ్నిస్తారు. (బు’ఖారీ)
ముస్లిమ్‌లో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ప్రవచనం అల్లాహ్‌ (త) ఆదేశం: నీ అనుచర సమాజం వారు ఎల్లప్పుడూ పరస్పరం చర్చించుకుంటూ ఉంటారు. చివరికి, ”అల్లాహ్‌ (త) సృష్టితాలన్నిటినీ సృష్టించాడు, మరి అల్లాహ్‌ (త) ను ఎవరు సృష్టించారు” అని కూడా ప్రశ్నిస్తారు.
77 – 15 (1/29)
عَنْ عُثْمَانِ بْنِ أَبِيْ الْعَاصِ, قال: قلت: يَا رَسُوْلُ الله! إِنَّ الشَّيْطَانَ قَدْ حَالَ بَيْنِيْ وَبَيْنَ صَلَاتِيْ وَبَيْنَ قِرَاءَتِيْ يُلَبِّسُهَا عَلَيَّ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ذَاكَ شَيْطَانٌ يُقَالُ لَهُ خِنْزِبٌ، فَإِذَا أَحْسَسْتَهُ فَتَعَوَّذْ بِاللهِ مِنْهُ، وَاتْفُلْ عَلَى يَسَارِكَ ثَلَاثًا”. فَفَعَلْتُ ذَلِكَ فَأَذْهَبَهُ اللهُ عَنِّيْ . رواه مسلم .

(15) [1/29-దృఢం]
‘ఉస్మాన్‌ బిన్‌ అబిల్‌ ‘ఆ’స్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళి, ఓ ప్రవక్తా! ‘నమాజులో షై’తాన్‌ నాకు కలతలకు గురిచేస్తున్నాడు. ఇంకా ఖుర్‌ఆన్‌ పఠించే టప్పుడు కూడా నన్ను అనుమానంలో పడవేస్తున్నాడు,’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘వీడు షై’తాన్‌! వీడిని ఖిన్’జిబ్‌ అంటారు. నిన్ను షై’తాన్‌ కలతలకు గురిచేసి నపుడు అల్లాహ్‌(త)ను శరణు వేడుకో, ఇంకా మూడుసార్లు ఎడమవైపు ఉమ్ముకో,’ అని ఉపదేశించారు. అనంతరం నేను ఆవిధంగా చేశాను. అల్లాహ్‌(త) నన్ను దాన్నుండి రక్షించాడు.” (ముస్లిమ్‌)
78 – [ 16 ] ( لم تتم دراسته ) (1/29)
وَعَنْ الْقَاسِمِ بْنِ مُحَمَّدٍ: أَنَّ رَجُلًا سَأَلَهُ فَقَالَ: “إِنِّيْ أَهِمُ فِيْ صَلَاتِيْ فَيَكْثرُ ذَلِكَ عَلَيَّ, فَقَالَ له الْقَاسِمِ بْنِ مُحَمَّدٍ: امْضِ فِيْ صَلَاتِكَ, فَإِنَّهُ لَنْ يَّذْهَبَ ذلك عَنْكَ حَتَّى تَنْصَرِفَ وَأَنْتَ تَقُوْلُ: مَا أَتْمَمْتُ صَلَاتِيْ”. رَوَاهُ مَالِكٌ .

(16) [1/29-అపరిశోధితం]

ఖాసిమ్‌ బిన్‌ ము’హమ్మద్‌ (స) కథనం: ఒక వ్యక్తి అతనితో, ‘నేను నమా’జులో సంకోచాలకు గురవు తున్నాను. అది నాకు, చాలా బాధగా ఉంది.’ అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఖాసిమ్‌ అతనితో, ‘నీవు నీ నమా’జును చదువుతూ ఉండు, దానికి భయపడి నమా’జును వదలకు. ఎందుకంటే ఈ కలతలు ఎంత మాత్రం నీకు దూరంకావు. చివరికి నీవు నమా’జు ముగించుకొని, నేను నమా’జు పూర్తిగా చదవలేదు,’ అని అంటావు.” అని అన్నారు. (మాలిక్‌)

3- بَابُ الْإِيْمَانِ بِالْقَدْرِ

విధివ్రాత (తఖ్దీర్) పై విశ్వాసం
తఖ్‌దీర్‌ అంటే ఒక నిర్ణీత పథకం. అంటే అల్లాహ్‌(త)కు ప్రారంభంలోనే ఫలానా వ్యక్తి, ఫలానా చోట, ఫలానా పుణ్యం చేస్తాడని, దానికి మేము ఫలానా ప్రతిఫలం ప్రసాదిస్తామని తెలుసు. సారాంశం ఏమిటంటే, అల్లాహ్‌(త) అన్నిటి కంటే ముందు కలాన్ని సృష్టించి లౌ’హె-మ’హ్‌ఫూ”జ్‌లో మంచి-చెడు, విశ్వాసం-అవిశ్వాసం, విశాలఉపాధి-దారిద్య్రం, స్వర్గం-నరకం మొదలైన వాటిని తీర్పుదినం వరకు జరిగే విషయాలను గురించి వ్రాసి ఉన్నాడు. అంటే ఫలానా వ్యక్తి విశ్వాసి అవుతాడని, ఫలానా వ్యక్తి అవిశ్వాసి అవుతాడని, ఫలానా వ్యక్తికి ఇంత ఉపాధి లభిస్తుందని, ఫలానా వ్యక్తి కష్టాలకు, నష్టాలకు గురి అవుతాడని, ఫలానా వ్యక్తికి విలాసవంతమైన, సుఖమైన జీవితం లభిస్తుందని, ఫలానా వ్యక్తి స్వర్గవాసి అవుతాడని, ఫలానా వ్యక్తి నరకవాసి అవుతాడని వ్రాయడం జరిగింది. దీని ప్రకారమే ప్రపంచం నడుస్తుంది.
అనంతరం అల్లాహ్‌(త) ఖుర్‌ఆన్‌లో ప్రాణు లన్నిటినీ, వాటి కర్మల్నీ సృష్టించాడని ఉంది. ఒక వ్యక్తి విశ్వసించినా తిరస్కరించినా దైవాదేశం వల్లే. అల్లాహ్‌(త) కోరితే మీ అందరికీ ఒకే మార్గంపై నడిపించే వాడు. అల్లాహ్‌ (త) ఎవరికైనా విశ్వాస భాగ్యం ప్రసాదించ దలచుకుంటే ఇస్లామ్‌ కోసం అతని హృదయాన్ని వికసింపజేస్తాడు. అదేవిధంగా ఎవరినైనా మార్గభ్రష్టత్వానికి గురిచేయదలచుకుంటే, అతని హృదయానికి సీలువేస్తాడు. అంటే అంతా అల్లాహ్‌ (త) చేతుల్లోనే ఉంది.
ప్రవక్త (స) ప్రవచనం, ”భూమ్యాకాశాలను సృష్టించ డానికి 50 వేల సంవత్సరాల ముందే అల్లాహ్‌ (త) సృష్టితా లన్నిటి విధివ్రాత వ్రాసి ఉంచాడు.” (ముస్లిమ్‌).
‘అదేవిధంగా విధివ్రాత (తఖ్‌దీర్‌) ను విశ్వసించని వారు విశ్వాసులే కారు. అదేవిధంగా ప్రతి ఒక్కరి కోసం స్వర్గంలో ఒక స్థానం, నరకంలో ఒక స్థానం వ్రాయబడి ఉంది,’ అని ప్రవచించారు. దానికి అనుచరులు ఓ ప్రవక్తా! ‘మరి ఆచరించటం ఎందుకు, వ్రాయబడి ఉన్న దాన్ని నమ్ము కోవడమే మంచిది కదా,’ అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఆచరిస్తూ పోండి, ఎందుకంటే ఏ పనికి తగిన వాడికి ఆ పని సులభం చేయడం జరుగు తుంది. మంచివారికి మంచిపని సులభతరం అవుతుంది. చెడ్డవాళ్ళకు చెడు సులువవుతుంది,’ అని అన్నారు.
అంటే అల్లాహ్‌(త) ప్రతిఒక్కరికీ యోగ్యతలు ప్రసా దించాడు. వాటి ద్వారానే ఈ ప్రపంచం నడుస్తూ ఉంది. దీనికి ఒక ఉదాహరణ ఉంది. ఒక పెద్దచెట్టు ఉంది. దానికి అనేక కొమ్మలు ఉన్నాయి. వాటిలో కొన్ని కాల్చడానికి పనికివస్తాయి. కొన్ని పాత్రలు చేయడానికి పనికివస్తాయి. వాటిలో కొన్ని ఇళ్ళ నిర్మాణానికి పనికి వస్తాయి. మంచివారితో మంచిపని చేయించటం జరుగు తుంది. చెడ్డవారితో చెడ్డపని చేయించటం జరుగుతుంది.
ఆచరణలన్నీ మానవుని యోగ్యతపైనే ఆధారపడి ఉన్నప్పుడు, ఆరోపించటం, శిక్షించటం ఎందుకు? అని ప్రశ్న తలెత్తుతుంది. దీనికి సమాధానం ఏమిటంటే, అల్లాహ్‌ (త) రెండు రకాల సృష్టితాలను సృష్టించాడు. 1. నిర్జీవులు 2. జీవులు. మానవులకు శక్తిసామర్థ్యాలు, కళ్ళు, చెవులు, బుద్ధీ జ్ఞానాలు ప్రసాదించబడ్డాయి. ఆచరణలన్నీ మానవుడు తన ఇష్టప్రకారమే చేస్తాడు. అందువల్లే, అతన్ని చెడునుండి వారించడం, మంచిని ప్రోత్సహించడం జరిగింది. ఎందుకంటే మానవుడు మంచి చేసినా, చెడుచేసినా ఉద్దేశ్యపూర్వకంగానే చేస్తాడు. అందువల్ల చెడు తనవల్లే జరిగిందని భావించాలి. అందువల్లే మానవుణ్ణి మంచిపట్ల ప్రోత్సహించడం, చెడుపట్ల హెచ్చరించడం జరిగింది.
మానవునికి జ్ఞానం, గుణాలు, సంకల్ప శక్తి, ఆచ రించే శక్తి, పరీక్షించటానికే ప్రసాదించబడ్డాయి. ప్రతి వ్యక్తిని ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో సృష్టించడం జరిగింది. అటువంటప్పుడు ప్రవక్తలను పంపటం, గ్రంథాలను అవతరింపజేయడం, సందేశ ప్రచారం చేయటం, పోరాటం మొదలైన వాటిని గురించి ఆదేశించటం ఎందుకు? అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుంది. అది కేవలం అల్లాహ్‌ (త)కే తెలుసు.
మానవులకు సంకల్ప శక్తి, ఆచరణ శక్తి ఇచ్చింది అల్లాహ్‌(త)యే. అయితే మానవులు వీటిని తమ ఇష్ట ప్రకారమే చేస్తారు. అందువల్లే మానవులను మంచి పట్ల ప్రోత్సహించటం జరిగింది. చెడు నుండి వారించటం జరిగింది. ఫలితంగా మానవులు పాపాలకు దూరంగా ఉండాలని, సత్కార్యాలు చేస్తూ ఉండాలని, ఎందుకంటే రెంటి ఫలితం వేర్వేరుగా ఉంటుంది. ఒకదానిలో బాధలే బాధలు, మరో దానిలో సుఖాలే సుఖాలు. ఉదాహరణకు ఒక రాజు తన ఉద్యోగుల్లో తెలివితేటలు గల వారిని తనకు తెలిసి ఉన్నా ఒక గొప్ప ఘనకార్యం చేసినప్పుడే కానుకలు, బహుమతులు ఇచ్చి సత్కరిస్తాడు. అదే విధంగా ఒక వ్యక్తి చెడ్డవాడని తెలిసినా, ఆవ్యక్తి మహా అపరాధం చేసినప్పుడే అతన్ని శిక్షిస్తాడు.
అంటే మేఘాలు వర్షం కురిపిస్తేనే తోటల్లో పూలు వికసిస్తాయి. బిడ్డ ఏడిస్తేనే తల్లి పాలు పడుతుంది. మనం సత్కార్యాలు చేస్తేనే పుణ్యం లభిస్తుంది. పాపాలు చేస్తే శిక్ష పడుతుంది. ఎందుకంటే అల్లాహ్‌ (త) మనకు ఆ అధికా రాన్ని ప్రసాదించాడు. ఎందు కంటే, చెట్లు, రాళ్ళలా మనల్ని అధికారం లేకుండా సృష్టించ లేదు. ”స్వర్గం మంచి కార్యాలకు ప్రతిఫలంగా లభిస్తుంది. కోరినవారు విశ్వసించవచ్చు, కోరిన వారు అవిశ్వాస మార్గం అవలంబించవచ్చు” అని ఖుర్‌ఆన్‌లో పేర్కొనడం జరిగింది.
అధికారం వల్ల దాసుల వాస్తవం బట్టబయలు అయి పోతుంది. వారిలో విధేయులు ఎవరో అవిధేయులు ఎవరో తేలిపోతుంది. విషయాలన్నీ అల్లాహ్‌(త) చేతుల్లో ఉన్నా దాసుడు తన ఉద్దేశ్య పూర్వకంగానే ఆచరిస్తాడు. అతనికి సంకల్పంలో, ఆచరణలో స్వాతంత్య్రం ఉంది. అతన్ని చేయమని బలవంతం చేయడం జరుగదు. అంటే మానవుడు తన కృషి ప్రయత్నాల ఫలితం పొందుతాడు.
విషయాల వాస్తవికత: విషయాలను, వస్తువులను ఉనికిలోనికి తీసుకురావటాన్ని సృష్టించటం అంటారు. పాల్పడటం అంటే వాటిని ఆచరణలోనికి తీసుకు రావటం అవుతుంది. మంచీచెడులను సృష్టించటం తప్పుకాదు. ఎందుకంటే మంచి అనేది చెడుకు వ్యతిరేకం. ఒకవేళ చెడు లేకపోతే మంచి యొక్క ప్రాముఖ్యత, గొప్పదనం బహిర్గతం కాదు. మానవులకు మంచీ చెడుల అధికారం ఇవ్వబడింది. వాటి ద్వారా వారు పుణ్యాన్ని లేదా పాపాన్ని సంపాదిస్తారు. ఇంకా వారికి మంచిద్వారా పుణ్యం చెడుద్వారా పాపం లభిస్తుందని కూడా తెలియ పర్చడం జరిగింది. అంటే వారు ఏది చేస్తే, దానికి వారినే బాధ్యులుగా పరిగణించటం జరిగింది. అంతేకాదు, మంచిని గురించి ప్రోత్సహించటం, చెడు పట్ల హెచ్చరించటం కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల మానవుడు తనకు ప్రసాదించ బడిన బుద్ధీ-జ్ఞానాలను ఉపయోగించి తనకు లాభం చేకూర్చేదాన్ని ఎన్కుకొని ఆచరించాలి. లేక పోతే దైవాగ్రహానికి, కఠిన శిక్షకు గురికావలసి వస్తుంది.
సారాంశం ఏమిటంటే, ఆచరణలను అంటే మంచీ, చెడు లను సృష్టించింది అల్లాహ్‌(త)యే. అయితే వాటికి పాల్పడు తున్నది మానవుడని ముస్లిములు భావించాలి. అంటే పనులను సృష్టించింది అల్లాహ్‌(త) అయితే, వాటిని నెరవేర్చేవాడు మానవుడు. రాళ్ళు రెప్పల్లా మనం శక్తి హీనులం కాము. అలా చేద్దాం, ఇలా చేద్దాం అని అనుకుంటాము. కాని మనం కోరినట్లు చేయలేము. అంటే మానవుని ప్రతికోరిక తీరదు. ఒక్కోసారి ఓడలకు వ్యతిరేకంగా గాలులు వీస్తాయి. అంటే అల్లాహ్‌(త) మానవులకు పరిమిత అధికారాలు ఇచ్చి ఉన్నాడు. ఏది ఏమైనా సర్వాధికారాలు గలవాడు కేవలం అల్లాహ్‌(త) ఒక్కడే. మంచీ చెడులను సృష్టించేవాడు కూడా అల్లాహ్‌(త)యే. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. మంచీ చెడులను సృష్టించింది అల్లాహ్‌(త) అయినపుడు మరి పాపకార్యాలపై మానవులను ఎందుకు శిక్షించటం జరుగు తుంది? శిక్షించడం అన్యాయం అని అనిపిస్తుంది. దీనికి సమాధానం ఏమిటంటే, పాప-పుణ్యాలను సృష్టించింది అల్లాహ్‌(త) అయినప్పటికీ అల్లాహ్‌(త) మానవునికి అధికారాలు కూడా ఇచ్చాడు. మానవుడు తాను కోరితే మంచిపని చేయగలడు. లేదా చెడుపని చేయగలడు. అదేవిధంగా మంచి పని చేస్తే అల్లాహ్‌(త) సంతృప్తి, ప్రతిఫలం. చెడుపనిచేస్తే దైవాగ్రహం, శిక్షపడుతుందని కూడా హెచ్చరించి ఉన్నాడు. అందువల్ల మానవుడు ఏది ఆచరిస్తే, దానికి తగిన వాడవుతాడు.
ఎందుకంటే, ఇది చాలా సున్నితమైన విషయం. అందువల్లే ఈ విషయంలో చాలామంది అపార్థాలకు గురయ్యారు. దీన్ని గురించి ఇంతకన్నా ఎక్కువ ఆలోచించడం మంచిదికాదు. ఈ విషయంలో అనుమా నాలకు, సంకోచాలకు దూరంగా ఉండాలి. ఇది అల్లాహ్‌ (త) రహస్యం. దీన్ని గురించి దైవదూతలకు గాని, ప్రవక్తలకు గానీ, మానవులకుగాని ఏమాత్రం తెలియదు. దీన్ని గురించి అధికంగా పరిశోధించరాదని వారించడం జరిగింది. ఎందుకంటే ఇది అల్లాహ్‌(త) ప్రత్యేక జ్ఞానం. దీనికి సంబంధించిన సర్వాధికారాలూ అల్లాహ్‌(త)కే చెందుతాయి. అల్లాహ్‌ ఆదేశం: ”తాను చేసిన దానిని గురించి ఆయన (అల్లాహ్‌) ప్రశ్నించబడడు, కాని వారు ప్రస్నించబడతారు.” (సూ. అల్ అంబియా’, 21:23)
అల్లాహ్‌ ఇలా ఎందుకు చేశాడు? అని విమర్శించిన వాడు దైవాన్ని ధిక్కరించినట్టే. దైవాన్ని ధిక్కరించిన వ్యక్తి విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదముంది.
అందువల్లే ప్రవక్త (స) విధివ్రాతను తిరస్కరించే వారిని విమర్శించారు. విధివ్రాత తిరస్కారులంటే అగ్ని ఆరాధకులు, వీరి జనా’జహ్ లో పాల్గొనరాదు. వీరిని పరామర్శించడానికి వెళ్ళరాదు. వీరితో సంబంధాలు, సంభాషణలు కలిగి ఉండరాదు. అందువల్ల దాసులు దైవనిర్ణయం అంటే విధివ్రాత పై సంతృప్తి కలిగి ఉండాలి. అల్లాహ్‌(త)కు సర్వస్వం తెలుసునని దైవనిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరని భావించాలి. అల్లాహ్‌(త) తీర్పుదినం వరకూ జరగబోయే విషయాలన్నిటినీ వ్రాసి ఉంచాడు. ఇప్పుడు వీటిలో ఎంతమాత్రం మార్పులు, చేర్పులు జరగజాలవు. ఎందుకంటే అల్లాహ్‌ (త) జ్ఞానం పరిపూర్ణమైనది. అల్లాహ్‌(త) సంపూర్ణ అగోచర జ్ఞానం కలవాడు. అందువల్ల మానవులకు చేరవలసిన మంచీ, చెడులు చేరితీరుతాయి. తప్పనిసరిగా మనం వీటిపై విశ్వాసం కలిగి ఉండాలి. వీటిపట్ల మనం సంకోచానికి, అనుమానానికి గురికారాదు. అల్లాహ్‌ (త) ఆదమ్‌ మరియు అతని సంతతి నుండి తీసు కున్న వాగ్దానం సత్యం. దాని ప్రకారమే ప్రజలు స్వర్గ నరకాల్లో ప్రవేశిస్తారు. అల్లాహ్‌(త) ఎవరిని ఎందుకు సృష్టించాడో వారు ఆ పని చేస్తారు. ఇందులో ఎవరూ ఎటువంటి మార్పులు, చేర్పులు చేయలేరు.

ఒకవేళ అల్లాహ్‌(త) దృష్టిలో స్వర్గవాసి అయితే సత్కార్యాలు చేస్తారు, నరకవాసి అయితే పాపకార్యాలు చేస్తారు. సన్మార్గం చూపించేవాడూ అల్లాహ్‌(త)యే. వక్ర మార్గానికి గురిచేసేవాడూ అల్లాహ్‌(త)యే. అందువల్ల అల్లాహ్‌(త) మానవు లందరికీ విధేయతను తప్పనిసరి చేశాడు, అవిధేయతను నిషేధించాడు.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
79 – 1 (1/30)
عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو, قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “كَتَبَ اللهُ مَقَادِيْرَ الْخَلَائِقِ قَبْلَ أَنْ يَّخْلُقَ السَّمَوَاتِ وَالْأَرْضَ بِخَمْسِيْنَ أَلْفَ سَنَةٍ”. قَالَ: “وَكَانَ عَرْشُهُ عَلَى الْمَاءِ”. رواه مسلم.
79.(1) [1/30-దృఢం]
‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌(త) భూమ్యాకాశాలను సృష్టించ డానికి 50 వేల సంవత్సరాల ముందే సృష్టితాలన్నిటి విధివ్రాత వ్రాసి ఉన్నాడు. అప్పుడు ఆయన సింహాసనం నీటిపై ఉండేది.” (ముస్లిమ్‌)
80 – 2 (1/30)
وَعَنْ ابْنِ عُمَرَ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كُلُّ شَيْءٍ بِقَدَرٍ حَتَّى الْعَجْزَ وَالْكَيْسَ”. رَوَاهُ مُسْلِمٌ .
80.(2) [1/30-దృఢం]
‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి విషయం విధివ్రాతతో కూడుకుని ఉంటుంది. చివరికి వివేకం, మూర్ఖత్వాలు కూడా.” (ముస్లిమ్‌)
81 – 3 (1/30)
عَنْ أَبِيْ هُرَيْرَةَ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: “اِحْتَجَّ آدَمُ وَمُوْسَى عَلَيْهُمَا السلام عَنْد رَبِّهِمَا, فَحَجَّ آدَمُ مُوْسَى؛ قَالَ مُوْسَى: أَنْتَ آدَمُ الَّذِيْ خَلَقَكَ اللهُ بِيَدِهِ, وَنَفَخَ فِيْكَ مِنْ رُوْحِهِ, وَأَسْجَدَ لَكَ مَلَائِكَتَهُ, وَأَسْكَنَكَ فِيْ جَنَّتِهِ, ثُمَّ أَهْبَطْتَّ النَّاسَ بِخَطِيْئَتِكَ إِلَى الْأَرْضِ؟ قَالَ آدَمُ: أَنْتَ مُوْسَى الَّذِيْ اصْطَفَاكَ اللهُ بِرِسَالَتِهِ وَبِكَلَامِهِ, وَأَعْطَاكَ الْأَلْوَاحَ فِيْهَا تِبْيَانُ كُلِّ شَيْءٍ, وَقَرَّبَكَ نَجِيًّا, فَبِكَمْ وَجَدْتَّ اللهَ كَتَبَ التَّوْرَاةَ قَبْلَ أَنْ أُخْلَقَ؟ قَالَ مُوْسَى: بِأَرْبَعِيْنَ عاَمًا. قَالَ آدَمُ : فَهَلْ وَجَدْتَّ فِيْهَا (وَعَصَى آدَمُ رَبَّهُ فَغَوَى؛ 20 : 121)؟ قَالَ: نَعَمْ. قَالَ: أَفَتَلُوْمُنِيْ عَلَى أَنْ عَمِلْتُ عَمَلًا كَتَبَهُ اللهُ عَلَيَّ أَنْ أَعْمَلَهُ قَبْلَ أَنْ يَّخْلُقَنِيْ بِأَرْبِعِيْنَ سَنَةً؟” قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” فَحَجَّ آدَمُ مُوْسَى”. رَوَاهُ مُسْلِمٌ 

(3) [1/30-దృఢం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) ప్రవచనం, ‘ఆదమ్‌ మరియు మూసాల మధ్య ‘ఆలమె అర్వాహ్‌’లో తమ ప్రభువు ముందు వాదోపవాదం జరిగింది. అయితే ఆదమ్‌ మూసాను అధిగమించారు. అంటే వాదోపవాదం ఇలా మొదలయ్యింది . మూసా (అ) ఆదమ్‌ (అ)తో ‘అల్లాహ్‌ తన చేతులతో సృష్టించి, తన ఆత్మను మీలో ఊది, దైవదూతలను మీకు సాష్టాంగం చేయమని చెప్పి, చేయించి, తన స్వర్గంలో మీకు నివాసం కల్పించిన అనంతరం మీరు మీ పాపాల కారణంగా ప్రజలను భూలోకానికి దించిన ఆదమ్ (అ) మీరే కదూ! ఒకవేళ మీరు ఆ పాపం చేయకుండా ఉంటే, ప్రజలు భూమిపైకి వచ్చేవారు కాదు,’ అని అన్నారు. దానికి ఆదమ్‌ (అ), ‘అల్లాహ్‌ తన దైవదౌత్యానికి ఎన్నుకున్న, స్వయంగా సంభాషించిన, శిలాఫలకాలు ప్రసాదించిన మూసా (అ) మీరే కదూ! మరి మీ తౌరాతు నా జన్మానికి ఎంతకాలం ముందు వ్రాయ బడిందని ఉంది,’ అని అడిగారు. దానికి మూసా (అ), ’40 సంవత్సరాలు,’ అని అన్నారు. అప్పుడు ఆదమ్‌ (అ), ‘ఇంకా తౌరాతులో, ” ‘…ఆదమ్‌ తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించి, సన్మార్గం నుండి తప్పిపోయాడు.’ (సూ. తా-హా, 20:121) అని ఉందా” అని అడిగారు. దానికి మూసా (అ), ‘అవును, ఇలా వ్రాసి ఉంది,’ అని అన్నారు. అప్పుడు ఆదమ్‌ (అ), ‘మరి అటు వంటప్పుడు నన్ను ఎందుకు విమర్శిస్తున్నారు. అప్పుడు నేను అసహాయతకు గురయ్యాను, అల్లాహ్‌ (త) దాన్ని నా విధి వ్రాతలో, నా జన్మానికి 40 సంవత్సరాల ముందే వ్రాసి ఉంచాడు. అందువల్ల నన్ను విమర్శించడం సరికాదు’ అని అన్నారు. దీన్ని ప్రస్తావించి ప్రవక్త (స) ఈ విధంగా ఆదమ్‌ మూసాను అధిగమించారు,” అని అన్నారు. (ముస్లిమ్‌)
82 – [ 4 ] ( متفق عليه ) (1/31)
عَنْ عَبْد الله بْنِ مَسْعُوْدٍ, قَالَ: حَدَّثَنَا رَسُوْلُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ, وَهُوَ الصَّادِقُ الْمَصْدُوْقُ: “إِنَّ خلق أَحَدِكُمْ يُجْمَعُ فِيْ بَطْنِ أَمِّهِ أَرْبَعِيْنَ يَوْمًا نطفة, ثُمَّ يَكُوْنُ عَلَقَة مِثْلَ ذَلِكَ, ثُمَّ يَكُوْنَ مُضْغَةً مِثْلَ ذَلِكَ, ثُمَّ يبعث الله اليه ملكا بأَرْبَعٍ كَلِمَاتٍ: فيِكتب عَمَلَهُ, و اجله و رزقه, وَشَقِيٌ أَوْ سَعِيْدٌ, ثم ينفخ فيه الروح, فوالذي لا إله غَيْرُهُ إِنَّ أَحَدَكُمْ لَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ الْجَنَّةِ حَتَّى مَا يَكُوْنَ بَيْنَهُ وَبَيْنَهَا إِلَّا ذِرَاعٌ, فَيَسْبِقُ عَلَيْهِ الْكِتَابُ, فَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ النَّارِ فَيَدْخُلُهَا. وَإِنَّ أَحَدَكُمْ لَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ النَّارِ حَتَّى مَا يَكُوْنَ بَيْنَهُ وَبَيْنَهَا إِلَّا ذِرَاعٌ, فَيَسْبِقُ عَلَيْهِ الْكِتَابُ, فَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ الْجَنَّةِ فَيَدْخُلُهَا” .
82.(4) [1/31-ఏకీభవితం]
ఇబ్నె మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీ లోని ప్రతి ఒక్కరి జన్మం ఇలా జరుగుతుంది. 40 రోజుల వరకు తల్లి గర్భంలో వీర్యం భద్రపరచ బడుతుంది. ఆ తరువాత 40 రోజులలో ఈవీర్యం గడ్డకట్టిన రక్తంలా మారు తుంది. ఆ తరువాతి 40 రోజుల్లో మాంసం ముక్కలా మార తుంది. ఆ తరువాత అల్లాహ్‌ (త) ఒక దూతను 4 విషయాలను గురించి నిర్దేశించి పంపుతాడు. ఆదూత అతని ఆచరణను అతని మరణాన్ని, అతని ఉపాధిని, అతని అదృష్టం లేదా దురదృష్టాలను వ్రాస్తాడు. ఆ తరు వాత అతని శరీరంలో ఆత్మ ఊదుతాడు. ఆయన తప్ప ఆరాధ్యులెవరూ లేని, అల్లాహ్ (త) సాక్షి! మీలోని ఒకవ్యక్తి జీవితాంతం మంచి పనులు చేస్తాడు, చివరికి అతనికి స్వర్గానికి మధ్య ఒక గజం దూరం ఉంటుంది. కాని విధివ్రాత (తఖ్దీర్) అతన్ని అధిగమిస్తుంది. ఫలితంగా పాపకార్యం చేసి నరకంలో ప్రవేశిస్తాడు. అదేవిధంగా మీలోని ఒక వ్యక్తి జీవితాంతం పాపకార్యాలు చేస్తాడు. చివరికి అతనికి నరకానికి మధ్య ఒక్కగజం దూరం ఉంటుంది. కాని అతని విధి వ్రాత అధిగమిస్తుంది. చివరికాలంలో పుణ్యకార్యాలు చేసి స్వర్గంలో ప్రవేశిస్తాడు.” )

వివరణ-82: (స్వర్గవాసి లేదా నరకవాసి కావటం అంతిమ ఘడియపై ఆధారపడి ఉంది. అంతిమ ఘడియ మంచిదైతే స్వర్గం, అంతిమ ఘడియ చెడ్డదైతే నరకం. ఒక్క గజం అంటే అత్యంత సమీపం అని పేర్కొనడం జరిగింది.
(బు’ఖారీ, ముస్లిమ్‌)
83 – [ 5 ] ( متفق عليه ) (1/31)
وَعَنْ سَهْلِ بْنِ سَعِدٍ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْعَبْدَ لَيَعْمَلُ عَمَلَ أَهْلِ النَّارِ وَإِنَّهُ مِنْ أَهْلِ الْجَنَّةِ, وَيَعْمَلُ عَمَلَ أَهْلِ الْجَنَّةِ وَإِنَّهُ مِنْ أَهْلِ النَّارِ, وَإِنَّمَا الْاَعْمَالُ بِالْخَوَاتِيْمِ”.
83.(5) [1/31-ఏకీభవితం]
సహల్‌ బిన్‌ స’అద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వాస్తవంగా ఒక వ్యక్తి పాపకార్యాలు చేస్తాడు, కాని అతడు స్వర్గవాసి అయి ఉంటాడు. అదేవిధంగా ఒక వ్యక్తి, పుణ్య కార్యాలు చేస్తాడు కాని అతడు నరకవాసి అయి ఉంటాడు. అంటే ఆచరణలు అంతిమదశపై ఆధారపడి ఉంటాయి.” )

వివరణ-83: అంటే అంతిమ దశలో పుణ్యకార్యాలు చేస్తే స్వర్గవాసి, అదేవిధంగా అంతిమదశలో పాపకార్యాలు చేస్తే నరకవాసి.
(బు’ఖారీ, ముస్లిమ్‌)
84 – 6 (1/31)
عَنْ عَائِشَةَ أم المؤمنين, قَالَتْ: دُعِيَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلَى جَنَازَةِ صَبِيٍّ مِّنْ الْأَنْصَارِ, فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ! طُوْبَى لِهَذَا, عُصْفُوْرٌ مِّنْ عَصَافِيْرِ الْجَنَّةِ, لَمْ يَعْمَلِ السُّوْءَ وَلَمْ يُدْرِكْهُ. فقَالَ: “أَوْ غَيْرَ ذَلِكَ يَا عَائِشَةُ! إِنَّ اللهَ خَلَقَ لِلْجَنَّةِ أَهْلًا, خَلَقَهُمْ لَهَا وَهُمْ فِيْ أَصْلَابِ آبَائِهِمْ, وَخَلَقَ لِلنَّارِ أَهْلًا , خَلَقَهُمْ لَهَا وَهُمْ فِيْ أَصْلَابِ آبَائِهِمْ “. رَوَاهُ مُسْلِمٌ.

(6) [1/31-దృఢం]
‘ఆయి’షహ్‌ (ర) కథనం: ఒకసారి ప్రవక్త (స) ను ఒక అ’న్సారీ బాలుని జనా’జహ్ నమా’జుకు పిలవటం జరిగింది. అప్పుడు నేను, ఓ ప్రవక్తా! ‘ఆ బాలునికి శుభం, సంతోషం కలుగు గాక! ఆ బాలుడు స్వర్గ పిచ్చుకల్లో ఒక పిచ్చుకవంటి వాడు, ఆ బాలుడు ఎటువంటి పాపమూ చేయలేదు. అంటే ఇంకా ఆ వయస్సుకు చేరనేలేదు.’ అది విన్న ప్రవక్త (స), ‘ఆయి’షహ్‌, నువ్వు అలా భావిస్తున్నావా? కాని వాస్తవం దానికి భిన్నంగా ఉంది. అంటే ఎవరినీ స్వర్గవాసులని లేదా నరకవాసులని నిర్థారించ కూడదు. ఎందుకంటే అల్లాహ్‌ స్వర్గంకోసం కొందరిని సృష్టించి ఉన్నాడు – వారింకా తమ తండ్రుల వీపులో ఉండగానే. అదేవిధంగా నరకం కోసం కొందరిని సృష్టించి ఉన్నాడు – ఇంకా వారు తమ తండ్రుల వీపులో ఉండగానే” అని అన్నారు. )

వివరణ-84: అంటే ఈ ‘హదీసు’ ద్వారా స్వర్గవాసి లేదా నరకవాసి కావటం సత్కార్యాలు లేదా పాపకార్యాలపై ఆధారపడి లేదని, అల్లాహ్‌(త)పై ఆధారపడిఉందని అర్థం అవుతుంది. అల్లాహ్‌(త) ఒకవేళ అతని విధివ్రాతలో స్వర్గవాసి అని వ్రాస్తే తప్పకుండా అతన్ని అతడు పుణ్యంచేసినా సరే, పాపం చేసినా స్వర్గంలోకి పంపిస్తాడు. అదేవిధంగా అల్లాహ్‌(త) అతని విధివ్రాతలో నరకవాసి అని వ్రాసిఉంటే, అతడు పాపం చేసినా పుణ్యంచేసినా నరకంలోకి పంపిస్తాడు. అందువల్ల అల్లాహ్‌ ఒకవేళ ఆ బాలుణ్ణి నరకం కోసం సృష్టించి ఉంటే నరకంలో పంపిస్తాడు. ఒకవేళ స్వర్గం కోసం సృష్టించి ఉంటే స్వర్గంలోకి పంపుతాడు.
‘ఆయి’షహ్‌! అతను స్వర్గవాసి అని నిర్థారించకూడదు. అయితే ఇతర హదీసుల ద్వారా పిల్లలు ప్రకృతి ధర్మమైన ఇస్లామ్‌పైనే జన్మిస్తారు. బాల్యంలో చనిపోయిన పిల్లలు స్వర్గవాసులే అవుతారని ఆశించవచ్చు. అంటే ‘ఆయి’షహ్‌ (ర) ఒకరి గురించి స్వర్గవాసి అని నిర్థారించటం ప్రవక్త (స)కు నచ్చలేదు. అగోచరజ్ఞానం కేవలం అల్లాహ్‌(త)కే ఉంది. (అషిఅతుల్లమఆత్)
(ముస్లిమ్‌)
85 – [ 7 ] ( متفق عليه ) (1/31)
عَنْ علِيٍّ رضي الله عَنْه, قَالَ: قال رسول الله صلى الله عليه و سلم: “مَا مِنْكُمْ مِنْ أَحَدٍ إِلَّا وَ قَدْ كَتَبَ مقعدُه مِنْ النَّار وَ مقعُده مِنْ الجَنَّة”. قَالُوا: يَا رَسُولَ الله! أَفَلَا نَتّكِل عَلَى كِتَابَنَا وَنَدَعْ العَمَل؟ قَالَ: “اعْملوا فَكُل ميسّر لما خُلِق لَهُ؛ أَمّا مَنْ كَانَ مِنْ أَهْلِ السَعَادَة فَسَيُيَسَّر لعمل السعادة، وَأَمّا مَنْ كَانَ مِنْ أَهْلِ الشَقَاوَة فَسَيُيَسَّر لعمل الشَقَاوَة، ثُمَّ قَرَأَ: (فَأَمَّا مَنْ أَعْطى وَاتَّقَى وَصَدَّقَ بِالْحُسْنَى؛ 92: 5) الآية”.

(7) [1/31-ఏకీభవితం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స), ”ప్రతి వ్యక్తి నివాసం స్వర్గ నరకాల్లో వ్రాయబడి ఉంది. అంటే స్వర్గవాసి లేదా నరకవాసి అవడం అల్లాహ్‌(త) నిర్థారించి ఉన్నాడు,” అని అన్నారు. దానికి అనుచరులు, ‘ఓ ప్రవక్తా! మరి మేము విధివ్రాతను నమ్ముకొని, ఆచరణలను మానివేస్తే.’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స). ‘ఆచరణను వదలకండి. ఆచరిస్తూపోండి. ఎవరిని దేన్ని గురించి సృష్టించటం జరిగిందో ఆపని అతనికి సులభతరం చేయబడు తుంది. ఒక వేళ అతను స్వర్గవాసి అయితే సత్కార్యాలు అతనికి సులభతరం చేయబడతాయి. ఒకవేళ అతను నరకవాసి అయితే పాపకార్యాలు అతనికి సులభతరం చేయబడతాయి అని పలికి, ”ఫఅమ్మా మన్‌ అ’అ’తా వత్తఖా వ ‘సద్దఖ బిల్‌ ‘హుస్నా” – ”కాని, ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో!” (సూ. అల్-లైల్, 92:5) అనే ఆయతును పఠించారు. )

వివరణ-85: ఖుర్‌ఆన్‌లో ఈ సూరహ్‌ పూర్తిగా ఉంది: ”కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో! మరియు మంచిని నమ్ముతాడో! అతనికి మేము మేలు కొరకు దారిని సులభం చేస్తాము. కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్యవైఖరిని అవలంబిస్తాడో! మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో! అతనికి మేము చెడుకొరకు దారిని సులభం చేస్తాము. మరియు అతడు నశించిపోయి నప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగ పడుతుంది?” (సూ. అల్-ల్లైల్‌, 92:5-11)
అంటే ఆచరణను వదలివేయటం విశ్వాసం అనిపించు కోదు. మీరు ఆచరిస్తూపోండి. మంచి లేదా చెడును ఆచరించటం కూడా విధివ్రాతలో భాగమే. ఒకవేళ మీరు మంచిచేస్తే, మీ విధివ్రాతలో అది వ్రాయబడి ఉంది. ఒకవేళ చెడుచేస్తే అది కూడా మీ విధివ్రాతలో వ్రాయబడి ఉన్నట్టే.
(బు’ఖారీ, ముస్లిమ్)
86 – [ 8 ] ( متفق عليه ) (1/32)
عَنْ أَبِيْ هُرَيْرَةَ, قال: قال النَّبِيِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ كَتَبَ عَلَى ابْنِ آدَمَ حَظَّهُ مِنَ الزِّنَا, أَدْرَكَ ذَلِكَ لَا مَحَالَةَ, فَزِنَا الْعَيْنِ النَّظْرُ, وَزَنَا اللِّسَانِ الْنْطِقُ, وَالنَّفْسُ تَمَنَّى وَتَشْتَهِيْ, وَالْفَرْجُ يُصَدِّقُ ذَلِكَ وَيُكَذِّبُهُ”.
وَفِيْ رِوَايَةِ لِّمُسْلِمٍ قَالَ: ” كُتِبَ عَلَى ابْنِ آدَمَ نَصِيْبُهُ مِنَ الزِّنَا, مدرك ذَلِكَ لَا مَحَالَةَ, الْعَيْنَانِ زَنَاهُمَا النَّظْرُ, وَالْأُذُنَانِ زِنَاهُمَا الْاِسْتِمَاعُ, وَاللِّسَانُ زِنَاهُ الْكَلَامُ, وَالْيَدُ زِنَاهَا الْبَطْشُ, وَالرِّجْلُ زِنَاهَا الْخُطَا, وَالْقَلْبُ يَهْوِى وَيَتَمَنَّى, وَيُصَدِّقُ ذَلِكَ الْفَرْجُ وَيُكَذِّبُهُ”.
86.(8) [1/32-ఏకీభవితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌(త) మానవుని కోసం వ్రాసిపెట్టిన వ్యభిచార భాగం తప్పకుండా లభించిఉంటుంది. నిషిద్ధ వస్తువుల వైపు చూడటం కళ్ళ వ్యభిచారం అవు తుంది, నిషిద్ధ విషయాలుపలకటం నోటివ్యభి చారం అవుతుంది. అంటే పరాయి స్త్రీలతో అశ్లీల విషయాలు మాట్లాడటం, అంత రాత్మ దాన్ని కోరుతుంది. మర్మాంగం దాన్ని ధృవీక రిస్తుంది లేదా తిరస్కరిస్తుంది.” (బు’ఖారీ, ముస్లిమ్‌)
ముస్లిమ్‌ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”మానవునిపై అతని వ్యభిచారం, చెడు భాగం వ్రాసిపెట్టబడి ఉంది. దాన్ని అతడు తప్పకుండా పొందితీరుతాడు. కళ్ళ వ్యభిచారం పరాయి స్త్రీలను దురుద్దేశంతో చూడటం అవుతుంది. చెవుల వ్యభిచారం అశ్లీల మాటలను వినటం అవుతుంది. నోటి వ్యభిచారం అశ్లీల విషయాలను పలకటం అవుతుంది. చేతుల వ్యభిచారం పట్టుకోవటం అంటే పరాయి స్త్రీలను దురుద్దేశంతో ముట్టుకోవటం అవుతుంది. కాళ్ళ వ్యభిచారం పాపకార్యాల వైపు నడవటం, వెళ్ళటం అవుతుంది. మనసు దాన్ని కోరుతుంది. అయితే మర్మాంగం దాన్ని ధృవీకరిస్తుంది లేదా తిరస్కరిస్తుంది.
87 – 9 (1/32)
وَعَنْ عِمْرَانَ بْن حُصَيْن: أنَّ رَجُلَيْنِ مِنْ مُّزَيْنَةَ قَالَا: يَا رَسُوْلَ اللهِ! أَرَأَيْتَ مَا يَعْمَلُ النَّاسُ الْيَوْمَ وَيَكْدَحُوْنَ فِيْهِ؟ أَشَيْءٌ قُضِيَ عَلَيْهِمْ وَمَضَى فِيْهِمْ مِنْ قَدْرٍسَبَقَ, أَوْ فِيْمَا يَسْتَقْبِلُوْنَ بِهِ مِمَّا أَتَاهُمْ بِهِ نَبِيُّهُمْ وَثَبَتَتِ الْحُجَّةُ عَلَيْهِمْ؟ فَقَالَ: “لَا, بَلْ شَيْءٌ قُضِيَ عَلَيْهِمْ وَمَضَى فِيْهِمْ, وَتَصْدِيْقُ ذَلِكَ فِيْ كِتَابِ اللهِ عَزَّ وَجَلَّ: (وَّ نَفْسٍ وَمَا سَوَّاهَا؛ فَأَلْهَمَهَا فُجُوْرَهَا وَ تَقْوَاهَا؛91: 7-8)”. رواه مسلم .

(9) [1/32-దృఢం]
ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) కథనం: ”ము’జైన తెగకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రవక్త(స) వద్దకు వచ్చి ప్రవక్తా! ప్రజలుచేసే ఆచరణలు, వాటికోస చేసే కృషి ప్రయత్నాలు మొదలైనవన్నీ వారి విధివ్రాతలో వ్రాసి పెట్టబడి ఉన్నాయా? లేక వారి ప్రవక్త తీసుకు వచ్చిన వాటిని వారు స్వీకరించటం, వారికి తెలియ పరచటం క్రొత్త విషయాలా,’ అని అడిగారు. దానికి ప్రవక్త (స) వీటిలో ఏదీ క్రొత్తదికాదు, వారి విధి వ్రాతలో వ్రాయబడి ఉన్నదే జరుగుతుంది. దీన్ని అల్లాహ్‌(త) ఆయతు ధృవీకరిస్తుంది: ” మానవ ఆత్మ మరియు దానిని తీర్చిదిద్దిన ఆయన (అల్లాహ్) సాక్షిగా, ఆతరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు.” (సూ. అన్-నజ్మ్, 91:7-8) అని అన్నారు. )

వివరణ-87: అంటే ప్రపంచంలో జరిగేవన్నీ విధివ్రాత ప్రకారం జరుగుతున్నాయి. ఆదిలో ఇవన్నీ వ్రాయ బడ్డాయి. వీటిలో క్రొత్తదేమీ కాదు.
(ముస్లిమ్‌)
88 – 10 (1/32)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ, قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ! إِنِّيْ رَجُلٌ شَابٌ, وَأَناَ أَخَافُ عَلَى نَفْسِي الْعَنَتَ, وَلَا أَجِدُ مَا أَتَزَوَّجُ بِهِ النِّسَاءَ, كَأَنَّهُ يَسْتَأْذِنُهُ فِيْ الْاِخْتِصَاءِ, قَالَ: فَسَكَتَ عَنِّيْ, ثُمَّ قُلْتُ مِثْلَ ذَلِك, فَسَكَتَ عَنِّي, ثُمَّ قُلْتُ مِثْلَ ذَلِكَ, فَسَكَتَ عَنِّي, ثُمَّ قُلْتُ مِثْلَ ذَلِكَ, فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “يَا أَبَا هُرَيْرَةَ! جَفَّ الْقَلَمُ بِمَا أَنْتَ لَاقٍ, فَاخْتَصْ عَلَى ذَلِكَ أَوْ ذَرْ”. رَوَاهُ الْبُخَارِيُّ .

(10) [1/32-దృఢం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) ను, ”నేను యువకుడిని, నేనెక్కడ వ్యభిచారానికి గురవుతానోనని భయపడుతున్నాను. పెళ్ళి చేసుకుందామా అంటే అంత స్తోమత నాదగ్గర లేదు. అంటే అబూ హురైరహ్‌ (ర) మగతనాన్ని తొలగించు కునేందుకు అనుమతికోరారు. అది విన్న ప్రవక్త (స) మౌనంగా ఉన్నారు. సమాధానం ఇవ్వలేదు. మళ్ళీ నేను విన్నవించుకున్నాను, మళ్ళీ ప్రవక్త (స) ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. నేను మళ్ళీ విన్నవించుకున్నాను. ప్రవక్త (స) మౌనంగా ఉన్నారు. మూడవ సారి విన్న తరువాత ప్రవక్త (స) నీకు జరగబోయేవన్నీ విధివ్రాతలో వ్రాయబడి ఉన్నాయి. కలం వ్రాసి ఎండిపోయింది. అందువల్ల నీవు మగతనం తొలగించుకున్నా (ఖస్సీ చేసు కున్నా), తొలగించ కున్నా (ఖస్సీ చేసుకోకపోయినా) సమానమే” అని అన్నారు.” )

వివరణ-88: అంటే మంచీ చెడులన్నీ విధివ్రాతలో వ్రాయబడి ఉన్నాయి. ఖస్సీ చేసుకున్నా చేసుకోక పోయినా ఎటువంటి లాభంలేదు.
(బు’ఖారీ)
89 – 11 (1/33)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو بْن العاص, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ قُلُوْبَ بَنِيْ آدَمَ كُلَّهَا بَيْنَ إِصْبَعَيْنِ مِنْ أَصَابِعِ الرَّحْمَنِ كَقَلْبِ وَّاحِدٍ, يَصْرِفُهُ كَيْفَ يَشَاءُ “ثُمَّ قَالَ رسولُ اللهِ صلى الله عليه وسلم: “اللهُمَّ مُصَرِّفَ الْقُلُوْبِ صَرَّفَ قُلُوْبَنَا عَلَى طَاعَتِكَ”. رَوَاهُ مُسْلِمٌ

(11) [1/33-దృఢం]
‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ బిన్ ‘ఆస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మానవులందరి హృదయాలు అల్లాహ్‌ (త) రెండు వ్రేళ్ళమధ్య ఉన్నాయి. ఒకే హృదయంలా ఉంటాయి. అల్లాహ్‌(త) తాను కోరిన విధంగా మళ్ళిస్తూ ఉంటాడు అని పలికి, ప్రవక్త (స) ఇలా ప్రార్థించారు, ”ఓ హృదయాలను మళ్ళించే వాడా! మా హృదయాలను నీ వినయ-విధేయతల వైపు మళ్ళించు. అంటే నీ పట్ల విధేయత కలిగి ఉండే భాగ్యం ప్రసాదించు.” (ముస్లిమ్‌)
90 – [ 12 ] ( متفق عليه ) (1/33)
عَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْه, قَالَ: قَالَ النبي صلى الله عليه وسلم: “مَا مِنْ مَّوْلُوْدٍ إِلَّا يُوْلَدُ عَلَى الْفِطْرَةِ, فَأَبَوَاهُ يُهَوِّدَانِهِ أَوْ يُنَصِّرَانِهِ أَوْ يُمَجِّسَانِهِ, كَمَا تُنْتِجُ الْبَهِيْمَةُ بَهِيْمَةً جَمْعَاءَ, هَلْ تُحِسُّوْنَ فِيْهَا مِنْ جَدْعَاءَ؟ ثُمَّ يَقُوْلُ: (فِطْرَةَ اللهِ الَّتِيْ فَطَرَ النَّاسَ عَلَيْهَا لا تبديل لخلق الله ذلك الدين القيم؛ 30: 30)”.

(12) [1/33-ఏకీభవితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి బిడ్డ ప్రకృతి ధర్మమైన ఇస్లామ్‌పైనే జన్మిస్తాడు, కాని తరువాత అతని తల్లిదండ్రులు అతన్ని యూదునిగానో, క్రైస్తవునిగానో, అగ్ని ఆరాధకుని గానో మార్చివేస్తారు. అంటే తమలా మార్చివేస్తారు. అదేవిధంగా జంతువు ఆరోగ్యంగా ఉన్న జంతువును క్షేమంగా జన్మమిస్తుంది. అందులో ఎటువంటి లోపం ఉండదు. తరువాత ప్రజలు దాని చెవులు, ముక్కు కోసి లోపాలకు గురిచేస్తారు అని పలికి ఈ ఆయతు పఠించారు: ”…అల్లాహ్‌ మానవులను ఏ స్వభావంతో పుట్టించాడో, ఆ స్వభావంపైననే వారు ఉంటారు. అల్లాహ్ సృష్టి స్వభావాన్ని (ఎవ్వరూ) మార్చలేరు. ఇదే సరైన ధర్మం.” (సూ. అర్-రూమ్, 30:30). (బు’ఖారీ, ముస్లిమ్‌)
91 – 13 (1/33)
وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: قَامَ فِيْنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِخَمْسِ كَلِمَاتٍ فَقَالَ: “إِنَّ اللهَ عز وجل لَا يَنَامُ, وَلَا يَنْبَغِيْ لَهُ أَنْ يَّنَامَ, يَخْفِضُ الْقِسْطَ وَيَرْفَعُهُ, يُرْفَعُ إِلَيْهِ عَمْلُ اللَّيْلِ قَبْلَ عَمَلَ النَّهَار, وَعَمَلُ النَّهَارِ قَبْلَ عَمَلِ اللَّيْلِ, حِجَابُهُ النُّوْر, لَوْ كشفه لأحرقت سُبُحَاتُ وجهِهِ ما انتهى إِلَيْه بصره مِنْ خلقه”. رَوَاهُ مُسْلِمٌ

(13) [1/33-దృఢం]
అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) మా మధ్య బోధించటానికి నిలబడి, ఈ ఐదు విషయాల గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. 1. అల్లాహ్‌(త) నిద్రపోడు; 2. ఎందుకంటే నిద్రపోవటం అతనికి తగదు; 3. ఇంకా అల్లాహ్‌ (త) ఉపాధిని పెంచుతూ తగ్గిస్తూ ఉంటాడు; 4. రాత్రి ఆచరణ ఆయన వైపునకు, పగటి ఆచరణకంటే ముందుగా చేరుతుంది. అదేవిధంగా పగటి ఆచరణ రాత్రి ఆచరణ కంటే ఆయన వద్దకు ముందుగా చేరుకుంటుంది; 5. ఆయన తెర వెలుగు. ఒకవేళ దాన్ని తొలగిస్తే, ఆయన దృష్టి ఎంత వరకు పడుతుందో అంతవరకు సృష్టితాలను మాడ్చి వేస్తుంది. (ముస్లిమ్‌)
92 – [ 14 ] ( متفق عليه ) (1/33)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صَلى اللهُ عَلَيْهِ وَسلم: “يَدُ اللهِ مَلْأى لَا تَغِيْضُهَا نَفْقَةٌ, سَحَّاءُ اللَّيْلَ وَالنَّهَارَ, أَرَأَيْتُمْ مَا أَنْفَقَ مُذْ خَلَقَ السَّمَاءَ وَالْأَرْضَ؟ فَإِنَّهُ لَمْ يَغِضْ مَا فِيْ يَدِهِ, وَكَانَ عَرْشُهُ عَلَى الْمَاءِ, وَبِيَدِهِ الْمِيْزَانُ يَخْفِضُ وَيَرْفَعُ”.
وَفِيْ رِوَايَةِ لِّمُسْلِمٍ: “يَمِيْنُ اللهِ مَلأى – قَالَ ابْنُ نُمَيْرٍ مَلْآنُ – سَحَّاءُ لَا يَغِيْضُهَا شَيْءٌ اللَّيْل وَالنَّهَارُ”.

(14) [1/33-ఏకీభవితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ చేయి నిండిఉంది. అంటే ఆయన నిధినిండి ఉంది. ఖర్చుచేయటం వల్ల ఎటువంటి తరుగు ఉండదు. రాత్రి పగలు నిరంతరం ఇస్తూ ఉంటాడు. మీరు చూస్తున్నారు కదా! భూమ్యాకాశాలను సృష్టించినప్పటి నుండి ఎలా ఖర్చుపెడుతున్నాడో! కాని అతని నిధిలో ఎటువంటి తరుగుదల ఏర్పడ లేదు. అల్లాహ్‌(త) సింహాసనం నీటిపై ఉండేది. ఇంకా ఆయన చేతిలోనే ఉపాధి తూనిక ఉంది. ఆయనే హెచ్చు-తగ్గులు చేస్తూ ఉంటాడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)
ముస్లిమ్‌ ఉల్లేఖనంలో, ”అల్లాహ్‌(త) కుడిచేయి నిండి ఉంది” అని ఉంది. ముస్లిమ్‌ గురువుగారైన ఇబ్ను నమిర్‌ ఈ పదాలు సేకరించారు. అల్లాహ్‌(త) చేయి నిండిఉంది. ఆయన ఎల్లప్పుడూ ఖర్చుచేసే వాడు, ప్రసాదించేవాడూను. రాత్రింబవళ్ళు నిరంతరం ఖర్చుచేయడం వల్ల ఆయన నిధిలో ఎలాంటి తరుగుదల ఏర్పడదు.
93 – [ 15 ] ( متفق عليه ) (1/34)
وَعَنْهُ, قَالَ: سُئِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ ذَرارِيِّ الْمُشْرِكِيْنَ, قَالَ: “اللهُ أَعْلَمُ بِمَا كَانُوْا عَامِلِيْنَ”.

(15) [1/34-ఏకీభవితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను అవిశ్వాసుల సంతానం గురించి ప్రశ్నించటం జరిగింది. అంటే వారు ‘స్వర్గవాసులా లేక నరక వాసులా,’ అని. దానికి ప్రవక్త (స) సమాధానమిస్తూ, ‘ఎవరు ఏమి ఆచరిస్తారో అల్లాహ్‌(త) కు బాగా తెలుసు.’ అని అన్నారు.)

వివరణ-93: అంటే అప్పుడు దాన్ని గురించి ఎటువంటి దైవవాణి అవతరించలేదు. అందువల్ల అల్లాహ్‌(త) జ్ఞానం గురించి మాత్రమే పేర్కొన్నారు. కాని తరువాత పిల్ల లందరూ ప్రకృతి ధర్మంపై జన్మిస్తారని పేర్కొన్నారు. బాల్యంలో చనిపోతే స్వర్గంలో ప్రవేశిస్తారన్నదే సరైన నమ్మకం.

(బు’ఖారీ, ముస్లిమ్‌)

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
94 – 16 (1/34)
وَعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ رضي الله عنه, قَالَ: قال رسول الله صلى الله عليه وسلم: “إِنَّ أَوَّلَ مَا خَلَقَ اللهُ الْقَلَمَ, فَقَالَ له, اُكْتُبْ. فَقَالَ: مَا أَكْتُبُ؟ قَالَ: اُكْتُبِ الْقَدْرَ. فكتب ما كان وَمَا هُوَ كَائِنٌ إِلَى الْأَبْدِ”. رَوَاهُ التِّرْمِذِيُّ, وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ إِسْنَادًا.

(16) [1/34-బలహీనం]
‘ఉబాదా బిన్‌ ‘సామిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అన్నిటి కంటే ముందు అల్లాహ్‌(త) కలాన్ని సృష్టించాడు. ఆ కలంతో, ‘వ్రాయి,’ అని అన్నాడు. కలం, ‘ఏమి వ్రాయాలి,’ అని విన్నవించు కుంది. దానికి అల్లాహ్‌(త) ‘విధివ్రాతను వ్రాయి,’ అని అన్నాడు. అనంతరం కలం వ్రాయవలసినదేదో వ్రాసింది.” (తిర్మిజి’ / ఏకోల్లేఖన ఆధారాలు)
95 – [ 17 ] ( لم تتم دراسته ) (1/34)
وَعَنْ مُّسْلِمِ بْنِ يَسَارٍ, قَالَ: سُئِلَ عُمَرُ بْنِ الْخَطَّاب رَضِيَ اللهُ عَنْهُ, عَنْ هَذِهِ الْآيَةِ: (وَإِذَ أَخَذَ رَبُّكَ مِنْ بَنِيْ آدَمَ مِنْ ظُهُوْرِهِمْ ذريتهم؛7: 172) الاية. قَالَ عُمر بن الخطاب: سَمِعْتُ رسولَ الله صلى الله عليه وسلم يُسْأَلُ عَنْهَا فَقَالَ: “ان الله خَلَقَ آدَمَ ثُمَّ مَسَحَ ظَهْرَهُ بِيَمِيْنِهِ, فَأاسْتَخْرَجَ مِنْهُ ذُرِّيَّةً, فَقَالَ: خَلَقْتُ هَؤُلَاءِ لِلْجَنَّةِ, وَبِعَمَلِ أَهْل الْجَنَّةِ يَعْمَلُوْنَ, ثُمَّ مَسَحَ ظَهْرَهُ فَاسْتَخْرَجَ مِنْهُ ذُرِّيَّةً, فَقَالَ: خَلَقْتُ هَؤُلَاءِ لِلنَّارِ, وَبِعَمَلِ أَهْلِ النَّارِ يَعْمَلُوْنَ”. فَقَالَ رَجُلٌ: فَفِيْمَ الْعَمْلُ؟ يَا رَسُوْلَ اللهِ! فقَالَ رسول الله صلى الله عليه وسلم: “إِنَّ اللهَ إِذَا خَلَقَ الْعَبْدَ لِلْجَنَّةَ؛ اِسْتَعْمَلَهُ بِعَمَلِ أَهْلِ الْجَنَّةِ حَتَّى يَمُوْتَ عَلَى عَمَلِ مِّنْ أَعْمَالِ أَهْلِ الْجَنَّةِ فَيُدْخِلَهُ به الْجَنَّةَ, وَإِذَا خَلَقَ الْعَبْدَ لِلنَّارِ؛ اِسْتَعْمَلَهُ بِعَمَلِ أَهْلِ النَّارِ حَتَّى يَمُوْتَ عَلَى عَمَلٍ مِّنْ أَعْمَالِ أَهْلِ النَّارِ فَيُدْخِلَهُ به النَّارَ”. رَوَاهُ مَالِكٌ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

(17) [1/34-అపరిశోధితం]
ముస్లిమ్‌ బిన్‌ యసార్‌ (ర) కథనం: ‘ఉమర్‌ (ర) ను ”వ ఇజ్‌’ అ’ఖజ’ రబ్బుక మిన్‌ బనీ ఆదమ…” (సూ. అల్ అ’అరాఫ్, 7:172) – ‘మరియు (జ్ఞాపకం చేసుకోండి!) నీ ప్రభువు ఆదమ్‌ సంతతివారి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి…’ అనే ఆయతు వివరణ గురించి ప్రశ్నించటం జరిగింది. దానికి ‘ఉమర్‌ (ర), ”ప్రవక్త (స)ను కూడా దీన్ని గురించి ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘అల్లాహ్‌ ఆదమ్‌ (అ) ను సృష్టించి, అనంతరం అతని వీపుపై తనకుడిచేత్తో నిమిరాడు. ఆ తరువాత అతని వీపునుండి అతని సంతానాన్ని తీసి, ‘వీరిని స్వర్గం కోసం సృష్టించాను, వీళ్ళు సత్కార్యాలు చేస్తారు,’ అని పలికి, మళ్ళీ రెండవసారి ఆదమ్‌ (అ) వీపుపై చేత్తో నిమిరి అతని వీపు నుండి అతని సంతానాన్ని తీసి, ‘వీరిని నరకం కోసం సృష్టించాను. వీళ్ళు పాపకార్యాలు చేస్తారు,’ అని ఆదేశించాడు,’ అని అన్నారు.”
ప్రవక్త (స) ప్రవచనాలు విని ఒక వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! మరి సత్కార్యాలు చేసి ఏం లాభం!’ అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స) సమాధానమిస్తూ, ‘అల్లాహ్‌(త) ఒక వ్యక్తిని స్వర్గం కోసం సృష్టించి ఉంటే, అతనితో సత్కార్యాలు చేయిస్తాడు. అతడు మరణించే వరకు సత్కార్యాలు చేస్తూ ఉంటాడు. ఫలితంగా అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అదే విధంగా ఒక వ్యక్తిని నరకం కోసం సృష్టించి ఉంటే, అతని ద్వారా పాపకార్యాలు చేయిస్తాడు. మరణించేవరకు ఆ వ్యక్తి పాపకార్యాలు చేస్తూ ఉంటాడు. ఫలితంగా నరకంలో ప్రవేశిస్తాడు,’ అని అన్నారు.” (మాలిక్‌, తిర్మిజి’, అబూ దావూద్‌)
96 – 18 (1/35)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو بْن العاص, قَالَ: خَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم, وَفِيْ يَدَيْهِ كِتَاباَنِ, فَقَالَ: “أَتَدْرُوْنَ مَا هَذَانِ الْكِتَابَانِ؟” قُلْنَا: لَا, يَا رَسُوْلَ اللهِ! إِلَّا أَنْ تُخْبِرَنَا. فَقَالَ لِلَّذِيْ فِيْ يَدِهِ الْيُمْنَى: “هَذَا كِتَابٌ مِّنْ رَّبِّ الْعَالَمِيْنَ, فِيْهِ أَسْمَاءُ أَهْلِ الْجَنَّةِ, وَأَسْمَاءُ آبَائِهِمْ وَقَبَائِلِهِمْ ثُمَّ أَجْمَلَ عَلَى آخِرِهِمْ, فَلَا يُزْادُ فِيْهِمْ وَلَا يَنْقُصْ مِنْهُمْ أَبَدًا”. ثُمَّ قَالَ لِلَّذِيْ فِيْ شِمَالِهِ: “هَذَا كِتَابُ مِّنْ رِّبِّ الْعَالَمِيْنَ فِيْهِ أَسْمَاءُ أَهْلِ النَّارِ, وَأَسْمَاءُ آبَائِهِمْ وَقَبَائِلِهِمْ, ثُمَّ أَجْمَلَ عَلَى آخِرِهِمْ؛ فَلَا يَزَادُ فِيْهِمْ وَلَا يَنْقُصُ مِنْهُمْ أَبَدًا”. فَقَالَ أَصَحَابُهُ: فِفِيْمَ الْعَمَلُ يَا رَسُوْلَ اللهِ إِنْ كَانَ أَمْرٌ قَدْ فُرِغَ مِنْهُ؟ فَقَالَ: “سَدِّدُوْا وَقَارِبُوْا؛ فَإِنَّ صَاحِبَ الْجَنَّةِ يُخْتَمُ لَهُ بِعَمَلِ أَهْلِ الْجَنَّةِ وَإِنْ عَمِلَ أَيَّ عَمَلٍ. وَإِنَّ صَاحِبَ النَّارِ يُخْتَمُ لَهُ بِعَمَلِ أَهْلِ النَّارِ وَإِنْ عَمِلَ أَيَّ عَمَلٍ”. ثُمَّ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِيَدَيْهِ فَنَبَذَهُمَا, ثُمَّ قَالَ: ” فَرَغَ رَبُّكُمْ مِّنَ الْعِبَادِ (…فَرِيْقٌ فِي الْجَنَّةِ وَفَرِيْقٌ فِيْ السَّعِيْرِ؛ 42: 7)”. رَوَاهُ التِّرْمِذِيُّ

(18) [1/35-దృఢం]
‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) బయటకు వచ్చారు. అప్పుడు ప్రవక్త (స) చేతిలో రెండు పుస్తకాలు ఉన్నాయి. ప్రవక్త (స) మమ్మల్ని ఉద్దేశించి, ‘నా చేతిలో ఉన్న రెండు పుస్తకాలు ఏమిటో మీకు తెలుసా?’ అని అన్నారు. దానికి మేము, ‘తెలియదు. కాని తమరు తెలియ పరిస్తే! ‘ అని అన్నాము. ప్రవక్త (స) తన కుడిచేతివైపు సైగ చేస్తూ, ‘ఇది దైవగ్రంథం, ఇందులో స్వర్గవాసుల పేర్లు, వారి తండ్రుల పేర్లు వారి వంశాల పేర్లు వ్రాసి ఉన్నాయి. ఇంకా వాటిని నిర్థారించటం జరిగింది. ఇప్పుడు ఇందులో హెచ్చు-తగ్గులు అసాధ్యం,’ అని అన్నారు.
ఆ తరువాత ప్రవక్త (స) తన ఎడమ చేతివైపు సైగ చేస్తూ ఇది దైవగ్రంథం, ఇందులో నరకవాసుల పేర్లు, వారి తండ్రుల పేర్లు, వారి వంశాలపేర్లు వ్రాసి ఉన్నాయి. ఇంకా వాటిని నిర్థారించటం జరిగింది. ఇప్పుడు ఇందులో హెచ్చుతగ్గులు అసాధ్యం అని అన్నారు. అనుచరులు అది విని, ‘అన్నీ వ్రాసి ఉన్నప్పుడు, ఆచరించి ఏమి లాభం,’ అని విన్నవించు కున్నారు.
అప్పుడు ప్రవక్త (స), ‘రుజుమార్గాన్ని, మధ్యే మార్గాన్ని అనుసరించండి, ఇంకా సత్యమార్గాన్ని అంటి పెట్టుకొని ఉండండి, దైవసాన్నిహిత్యం కోసం కృషి చేయండి. ఎందు కంటే స్వర్గవాసుల చివరి కర్మలు స్వర్గవాసుల కర్మల్లా ఉంటాయి, జీవితాంతం వారి కర్మలు ఎలా ఉన్నాసరే. అదేవిధంగా నరక వాసుల చివరి కర్మలు నరకవాసుల కర్మల్లా ఉంటాయి. జీవితాంతం వారి కర్మలు ఎలా ఉన్నాసరే.’
ఆ తరువాత ప్రవక్త (స) తన రెండు చేతులపై సైగ చేసి, వాటిని ఉంచి, ”మీ ప్రభువు దాసుల పనులను పూర్తిచేసి ఉన్నాడు. అంటే ‘…(ఆ రోజు) ఒక వర్గం వారు స్వర్గానికి పోతారు, మరోక వర్గం వారు మండే నరకాగ్నిలోకి పోతారు.’ ” అని అన్నారు. (సూ. అష్-షూరా’, 42:7) (తిర్మిజి’)
97 – [ 19 ] ( لم تتم دراسته ) (1/36)
وَعَنْ أَبِيْ خَزَامَةَ, عَنْ أَبِيْهِ, قَالَ: قلت: يَا رَسُوْلَ الله! أَرَأَيْتَ رُقْىً نَّسْتَرْقِيْهَا, وَدَوَاءً نَّتَدَاوى بِهِ, وَتُقَاةً نَّتَّقِيْهَا, هَلْ تَرُدُّ مِنْ قَدْرِ الله شَيْئًا؟ قَالَ: “هِيَ مِنْ قَدَرِ اللهِ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

(19) [1/36-అపరిశోధితం]
అబూ ‘ఖు’జామహ్ తన తండ్రి ద్వారా కథనం: నేను ప్రవక్త (స)ను ”మేము చేసుకునే మంత్ర-తంత్రాలు చికిత్సలు ఇంకా రక్షణ కోసం ఉంచుకునే ఆయుధాలు మొదలైనవన్నీ అల్లాహ్‌ విధివ్రాతను మార్చగలవా?’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స) ఇవి కూడా అల్లాహ్‌ (త) విధి వ్రాతలోనివే అని సమాధానం ఇచ్చారు.” )

వివరణ-97: అంటే ప్రతి విషయం దైవం వ్రాసిపెట్టిన విధివ్రాత ప్రకారం జరుగుతుంది. అల్లాహ్‌ వ్యాధిని సృష్టిస్తే, దాని చికిత్స కూడా సృష్టించాడు. ఈ వ్యాధి ఫలానా మందు వల్ల నయం అవుతుంది, ఈ బాధ ఫలానా మంత్రం ద్వారా నయమవుతుంది, ఫలానా ఆయుధం వల్ల రక్షణ లభిస్తుందని మనం తెలుసుకున్నట్టు.
(అ’హ్మద్‌, తిర్మిజీ’, ఇబ్ను మాజహ్)
98 – [ 20 ] ( لم تتم دراسته ) (1/36)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ, قَالَ: خَرَجَ عَلَيْنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم, وَنَحْنُ نَتَنَازَعُ فِي الْقَدْرِ, فَغَضِبَ حَتَّى احْمَرَّ وَجْهُهُ, حَتَّى كَأَنَّمَا فُقِئَ فِيْ وَجْنَتَيْهِ حب الرُّمَانِ, فَقَالَ: “أَبِهَذَا أَمِرْتُمْ؟ أَمْ بِهَذَا أُرْسِلْتُ إِلَيْكُمْ؟ إِنَّمَا هَلَكَ مَنْ كَانَ قَبْلَكُمْ حِيْنَ تَنَازَعُوْا فِيْ هَذَا الْأَمْرِ, عَزَمْتُ عَلَيْكُمْ, الا تَتَنَازَعُوْا فِيْهِ”. رواه الترمذي. وقَالَ حديث غريب لا نعرفه إلا من هذا الوجه من حديث صالح المري وله غرائب يتفرد بها لا يتابع عليها قلت: لكن يشهد له الذي بعده.

(20) [1/36-అపరిశోధితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: మేము విధివ్రాతను గురించి చర్చించుకుంటున్నాము. ఇంతలో ప్రవక్త (స) విచ్చేశారు. విధివ్రాతను గురించి మేము చర్చించు కోవటం విని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రవక్త (స) ముఖం ఎర్రగా మారి పోయింది. బుగ్గలు దానిమ్మ పండులా ఎర్రగా మారి పోయాయి. అనంతరం, ”మీకు దీన్ని గురించే ఆదేశించబడిందా లేక దీని గురించే నేను మీ వద్దకు పంపబడ్డానా? మీకు పూర్వం జాతులు దీన్ని గురించి చర్చించుకోవటం, కలహించుకోవటం వల్లనే నాశనం అయ్యాయి. ప్రమాణం చేసి చెబుతున్నా, ఇక మీదట విధివ్రాత విషయంలో ఎన్నడూ చర్చించు కోకండి,” అని హెచ్చరించారు. (తిర్మిజీ’ / ఏకోల్లేఖనం)
99 – 21 (1/36)
وَرَوَى ابنُ مَاجَهَّ فِي الْقَدْرِ نَحْوَهُ عَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ, عَنْ أَبِيْهِ, عَنْ جَدِّهِ.

(21) [1/36-ప్రామాణికం]
దీనినే ఇబ్నె మాజహ్, అమ్ర్ బిన్‌ షు’ఐబ్‌ అతని తండ్రి మరియు తాతల ద్వారా ఉల్లేఖించారు.
100 – 22 (1/36)
وَعَنْ أَبِيْ مُوْسَى, قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ اللهَ خَلَقَ آدَمَ مِنْ قَبْضَةٍ قَبَضَهَا مِنْ جَمِيْعِ الْأَرْضَ, فَجَاءَ بِنُوْ آدَمَ عَلَى قَدْرِ الْأَرْضِ, مِنْهُمُ الْأَحْمَرُ وَالْأَبْيَضُ وَالْأَسْوَدُ وَبَيْنَ ذَلِكَ, وَالسَّهْلُ وَالْحَزْنُ, وَالْخَبِيْثُ وَالطَّيِّبُ”. رواه أحمد والترمذي وأبو داود .

(22) [1/36-దృఢం]
అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌(త) ఆదమ్‌ (అ)ను భూమిలోని వివిధ ప్రాంతాల నుండి తీసుకున్న పిడికెడు మట్టితో సృష్టించాడు. అంటే అన్ని రకాల మట్టి, ఎర్రమన్ను, తెల్లమన్ను మొదలయినవి తీసుకోవడం జరిగింది. అందువల్ల ఆదమ్‌ సంతతి కూడా ఆ ప్రకారమే అంటే తెల్లగా, ఎర్రగా, నల్లగా, సున్నిత స్వభా వులుగా, కఠిన స్వభావులుగా, పరిశుద్ధ స్వభావులుగా, అపరిశుద్ధ స్వభావులుగా జన్మించారు.” (అ’హ్మద్‌, తిర్మిజీ’, అబూ దావూద్‌)
101 – 23 (1/37)
وعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو, قَالَ: سَمِعْتُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقوْلُ: “إِنَّ اللهَ خَلَقَ خَلْقَهُ فِيْ ظُلْمَةٍ, فَأَلْقَى عَلَيْهِمْ مِنْ نُّوْرِهِ, فَمَنْ أَصَابَهُ مِنْ ذَلِكَ النُّوْرِ اهْتَدَى, وَمَنْ أَخْطَأهُ ضَلَّ, فَلِذَلِكَ أَقُوْلُ: جَفَّ الْقَلَمُ عَلَى عِلْمِ اللهِ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ.
101.(23) [1/37-దృఢం]
‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌(త) మానవులను, జిన్నులను చీకటిలో సృష్టించాడు. ఆ తరువాత వారిపై తన కాంతిని వెదజల్లాడు. అందువల్ల అల్లాహ్‌(త) కాంతి లభించిన వారికి రుజుమార్గం లభిస్తుంది. అల్లాహ్‌(త) కాంతి లభించని వారికి మార్గభ్రష్టత వరిస్తుంది. అందువల్లే అల్లాహ్‌(త) జ్ఞానంపై కలం ఎండి పోయింది’ అని అంటున్నాను.” (అ’హ్మద్‌, తిర్మిజీ’)
102 – 24 (1/37)
وَعَنْ أَنَسٍ, قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُكْثِرُ أَنَّ يَّقُوْلَ: “يَا مُقَلِّبَ الْقُلُوْبِ! ثَبِّتْ قَلْبِيْ عَلَى دِيْنِكَ”. فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ! آمَنَّا بِكَ وَبِمَا جِئْتَ بِهِ, فَهَلْ تَخَافُ عَلَيْنَا؟ قَالَ: “نَعَمْ؛ إِنَّ الْقُلُوْبَ بَيْنَ أَصْبَعَيْنِ مِنْ أَصَابِعِ اللهِ, يُقلِّبُهَا كَيْفَ يَشَاء”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَه.

(24) [1/37-దృఢం]
అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆను అత్యధికంగా పఠించేవారు, ”యా ముఖల్లిబల్‌ ఖులూబ్‌, స’బ్బిత్‌ ఖల్బీ ‘అలా దీనిక.” – ‘ఓ హృదయాలను మళ్ళించే వాడా! నా హృదయాన్ని నీ ధర్మంపై స్థిరంగా ఉంచు,’ నేను ప్రవక్త (స) ను, ‘దైవప్రవక్తా! మేము మిమ్మల్ని, మీరు తీసుకువచ్చిన ధర్మాన్ని విశ్వసించాము. కాని తమరు మా విషయంలో భయపడి, (మేము ధర్మంపై స్ధిరంగా ఉండాలని, మరియు ప్రజలకు నేర్పాలని) ఈ దు’ఆ చదువుతున్నారు. తమరి పాపాలన్నీ క్షమించ బడ్డాయి గనుక తమకు దీని అవసరం లేదు.’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘అవును,’ అని సమాధానమిస్తూ, ‘దాసుల హృదయాలు అల్లాహ్‌ (త) రెండు చేతివ్రేళ్ళ మధ్య [అంటే అల్లాహ్ (త) ఆజ్ఞలో, అధికారంలో] ఉన్నాయి. అల్లాహ్‌(త) తాను కోరినట్టు వాటిని మళ్ళిస్తాడు, (అంటే విశ్వా సానికైనా, అవిశ్వా సానికైనా గురిచేస్తాడు) కాబట్చి విశ్వాసంపై నిలకడగా, స్ధిరంగా ఉంచమని ప్రార్ధిస్తూ ఉండాలి’ అని అన్నారు. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
103 – 25 (1/37)
وَعَنْ أَبِيْ مُوْسَى, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَثَلُ الْقَلْبِ كَرِيْشَةٍ بِأَرْضِ فُلَاةٍ يُّقَلِّبُهَا الرِّيَاحُ ظَهْرًا لِّبَطْنٍ”. رَوَاهُ أَحْمَدُ.

[1/37-దృఢం]
అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”హృదయం మైదానంలో పడి ఉన్న ఒక రెక్కవంటిది. దాన్ని గాలి అటూఇటూ మళ్ళిస్తూ ఉంటుంది.” )

వివరణ-103: హృదయాన్ని అరబ్బీలో ఖల్బ్‌ అంటారు. ఖల్బ్‌ అంటే మళ్ళించడం అని అర్థం. ఎందు కంటే హృదయం లోని ఆలోచనలు ఎల్లప్పుడూ మారుతూ ఉంటాయి. ఒక్కో సారి మంచి, ఒక్కోసారి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందువల్ల ఇస్లాం పై స్థిరంగా ఉండటానికి ఈ దు’ఆను ఎల్లప్పుడూ పఠిస్తూ ఉండాలి.
(అ’హ్మద్‌)
104 – 26 (1/37)
وَعَنْ عليٍّ, قَالَ: قَالَ رسولُ اللهِ صلى الله عليه وسلم: “لَا يُؤْمِنُ عَبْدٌ حَتَّى يُؤْمِنَ بِأَرْبَعٍ: يَّشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنِّيْ رَسُوْلُ اللهِ بَعَثَنيْ بِالْحَقِّ, وَيُؤْمِنُ بِالْمَوْتِ, وَالْبَعْثِ بَعْدَ الْمَوْتِ, وَيُؤْمِنُ بِالْقَدْرِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ .

(26) [1/37-దృఢం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఈ నాలుగు విషయాలను విశ్వసించనంత వరకు ఎవడూ విశ్వాసి కాలేడు. 1. అల్లాహ్‌(త) తప్ప ఆరాధ్యులెవరూ లేరని సాక్ష్యం ఇవ్వటం; 2. నేను (ము’హమ్మద్-స) దైవ ప్రవక్తను, అని, అల్లాహ్‌(త) నన్ను(స) సత్యం ఇచ్చి పంపాడని విశ్వసించటం; 3. మరణాన్ని, మరణానంతరం మరల లేపబడటాన్ని విశ్వసించటం; 4. విధి వ్రాతలోని అదృష్టం, దురదృ ష్టాలను విశ్వసించటం. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
అంటే ఈ 4 విషయాలను విశ్వసించినవాడు పరిపూర్ణ విశ్వాసి అవుతాడు.
105 – 27 (1/38)
وَعَنْ ابْنِ عَبَّاسٍ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صِنْفَانِ مِنْ أُمَّتِيْ لَيْسَ لَهُمَا فِيْ الْإِسْلَامِ نَصِيْبُ: الْمُرْجِئَةُ وَالْقَدْرِيَةُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هذا حَدِيْثُ غَرِيْبٌ حسن صحيح.

(27) [1/38-బలహీనం]
ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజంలోని రెండు వర్గాలకు ఇస్లామ్‌తో ఎటు వంటి సంబంధం లేదు. 1. అల్‌-ముర్‌జిఅ’హ్, 2. అల్‌- ఖద్రియహ్ (తిర్మిజి’ – ఏకోల్లేఖనం, ప్రామాణికం, దృఢం)
106 – 28 (1/38)
وَعَنْ ابْن عُمَرَ, قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “يَكُوْنُ فِيْ أُمَّتِيْ خَسْفٌ وَمَسْخٌ, وَذَلِكَ فِيْ الْمُكَذِّبِيْنَ بِالْقَدْرِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَرَوَى التِّرْمِذِيُّ نَحْوَهُ.

(28) [1/38-ప్రామాణికం]
ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”నా అనుచర సమాజంలో భూమి దిగబడిపోవటం, రూపాలు మారి పోవటం జరుగుతుంది. ఇది విధివ్రాత తిరస్కారుల్లో జరుగుతుంది.” )

వివరణ-106: ముర్‌జిఅ’హ్ అంటే తమ్ముతాము ముస్లిములమని చెప్పుకునే ఒక వర్గం పేరు. వీరు విశ్వసించి ఎటువంటి పాపం చేసినా ఫరవాలేదని, ఆచరణకు విశ్వాసంతో సంబంధంలేదని, విశ్వాసంలో హెచ్చుతగ్గులు జరగవని, మానవులకు ఎటువంటి అధికారాలు లేవని భావిస్తారు. అదేవిధంగా విధివ్రాత తిరస్కారులను, ఖద్రియహ్ అంటారు. వీరు దాసులు స్వతంత్రులని, తమ కర్మలకు సృష్టికర్తలు వీరే అని భావిస్తారు. ఈ రెండూ మార్గభ్రష్టత్వానికి గురైన వర్గాలే. కొందరు దీన్ని కల్పిత ‘హదీసు’గా పేర్కొన్నారు.
(అబూ దావూద్‌, తిర్మిజీ’)
107 – 29 (1/38)
وَعَنْ ابْن عُمْرَ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “الْقَدَرِّيَةُ مَجُوْسُ هَذِهِ الْأُمَّةِ, إِنْ مَّرِضُوْا فَلَا تَعُوْدُوْهُمْ, وَإِنْ مَّاتُوْا فَلَا تَشْهَدُوْهُمْ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ .

(29) [1/38-ప్రామాణికం]
‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”ఖద్రియ్యహ్ (విధివ్రాత తిరస్కారులు) ఈ అనుచర సమాజంలోని మజూసీలు. వీరు వ్యాధికి గురైతే పరామర్శించడానికి వెళ్ళకండి, మరణిస్తే జనా’జహ్ లో పాల్గొనకండి.” )

వివరణ-107: అంటే వీరు తిరస్కారులు లేదా పాపాత్ములు. వీరికి దూరంగా ఉండటం తప్పనిసరి. మజూసీలు అంటే అగ్ని ఆరాధకులు, వీరు అవిశ్వాసులు.
(అ’హ్మద్‌, అబూ దావూద్‌)
108 – 30 (1/38)
وَعَنْ عُمَرَ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُجَالِسُوْا أَهْلَ الْقَدْرِوَلَا تُفَاتِحُوْهُمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

(30) [1/38-బలహీనం]
‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖద్రియ్యహ్ వారివద్ద కూర్చోకండి, ఇంకా తీర్పుకు వారి వద్దకు వెళ్ళ కండి, ఇంకా వారితో సంబంధాలు పెట్టుకోకండి.”(అబూ దావూద్‌)
109 – [ 31 ] ( لم تتم دراسته ) (1/38)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا, قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “سِتَّةٌ لَعَنْتُهُمْ وَلَعَنَهُمْ اللهُ وَكُلُّ نَبِيٍّ يُّجَابُ: الزَّائِدُ فِيْ كِتَابِ اللهِ, وَالْمُكَذِّبُ بِقَدَرِ اللهِ, وَالْمُتَسَلِّطُ بِالجبروتِ لِيُعِزَّ مَنْ أَذَلَّهُ اللهُ وَيُذِلَّ مَنْ أَعَزَّهُ اللهُ, وَالْمُسْتَحِلُّ لِحَرَمِ اللهِ, وَالْمُسْتَحِلُّ مِنْ عِتْرَتِيْ مَا حَرَّمَ اللهُ, وَالتَّارِكُ لِسُنَّتِيْ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “الْمَدْخَلِ” وَرَزِيْنُ فِيْ كِتَابِهِ .

(31) [1/38-అపరిశోధితం]
‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”6 రకాలకు చెందిన వ్యక్తులను నేను శపిస్తున్నాను, అల్లాహ్‌ (త) కూడా శపిస్తున్నాడు, ఇంకా ప్రతి ప్రవక్త(అ) శపిస్తున్నాడు. అంటే వీరందరూ శపిస్తున్నారు: 1. అల్లాహ్‌(త) గ్రంథం విషయంలో హద్దులుమీరి ప్రవర్తించే వాడు, 2. అల్లాహ్‌ విధి వ్రాతను తిరస్కరించేవాడు, 3. బలవంతంగా దురా క్రమణకు పాల్పడేవాడు, అల్లాహ్‌(త) గౌరవమిచ్చిన వానిని అగౌరవ పరిచేవాడు, అల్లాహ్‌(త) అవమాన పరచిన వానిని గౌరవించేవాడు, 4. అల్లాహ్‌(త) నిషేధించిన వాటిని ధర్మసమ్మతం చేసేవాడు. (ఉదా. మక్కహ్ లోని చెట్లను కోయటం, వేటాడటం, అక్కడ యుద్ధం చేయటం మొ.), 5. ప్రవక్త కుటుంబ సభ్యులను హింసించే, వారిని అగౌరవపరచే వాడు, 6. నా సాంప్ర దాయాలను, ‘హదీసు’లను వదలివేసే వాడు.)

వివరణ-109: ఈ ‘హదీసు’ను ఉల్లేఖించిన వారు ‘ఆయి’షహ్‌ (ర). ఈమె ప్రవక్త (స) భార్య. ‘ఖదీజహ్ (ర) మరణానంతరం దైవదౌత్య, 10వ సంవత్సరంలో ప్రవక్త (స)తో వివాహం జరిగింది. వివాహం తరువాత ప్రవక్త (స) 3 సంవత్సరాలు మక్కహ్ లో ఉన్నారు. దైవదౌత్య 13 సంవత్సరంలో ప్రవక్త (స) మదీనహ్ వలస వెళ్ళిన తరువాత ఉమ్మె రూమాన్‌ అస్మా’ మరియు ‘ఆయి’షహ్‌ను తీసుకురమ్మని అబూ బకర్‌ను, ఇంకా ఫాతిమహ్, ఉమ్మె కుల్‌సూమ్‌ మరియు ‘సౌదహ్‌ మొదలైన వారిని తీసుకురమ్మని ‘జైద్‌ బిన్‌ ‘హారిస్‌’, అబూ రాఫెను పంపారు. ‘ఆయి’షహ్‌ (ర) మదీనహ్ వచ్చిన తరువాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దానివల్ల ఆమె తల వెంట్రుకలు రాలిపోయాయి. ‘ఆయి’షహ్‌ (ర) ఆరోగ్యం పొందిన తర్వాత ఉమ్మె రూమాన్‌కు కూతురును అత్త వారింటికి పంపారు. ప్రవక్త (స) మరణానంతరం ‘ఆయి’షహ్‌ (ర) సుమారు 48 సంవత్సరాలు జీవించారు. 57వ హిజ్రీ శకంలో మరణించారు. అప్పుడు ఆమె వయస్సు 66 సంవత్సరాలు. వాంఙ్మూలం ప్రకారం మఖ్బరతుల్‌ బఖీలో రాత్రిపూట ఆమె ఖనన సంస్కారాలు పూర్తిచేయ బడ్డాయి. ఆమె చాలా గొప్ప పండితురాలు, విద్యావంతు రాలు. ఆమె 2210 ‘హదీసు’లను ఉల్లేఖించారు.
ఆమె మహాపండితులకు గురువు. ప్రవక్త (స) ప్రవచనం, ”పురుషుల్లో చాలామంది పరిపూర్ణతకు చేరి ఉన్నారు. కాని స్త్రీలలో కేవలం మర్యమ్‌ బిన్‌తె ఇమ్రాన్‌ మరియు ఫిరౌన్‌ భార్య ఆసియా మాత్రమే పరిపూర్ణ స్త్రీలు.” ‘ఆయి’షహ్‌ (ర) గురించి ప్రస్తావిస్తూ, ‘ఆయి’షహ్‌కు స్త్రీలందరిపై వంటకాల్లో సరీద్‌కు ఉన్నంత ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉంది. అల్లాహ్‌(త) ఖుర్‌ఆన్‌లో ఈమెను పవిత్ర స్త్రీగా పేర్కొన్నాడు. ఒక రుకూ మొత్తం ఈమె గురించే అవత రించటం జరిగింది. బు’ఖారీ ‘హదీసు’ల్లో దీన్ని గురించి వివరంగా పేర్కొనడం జరిగింది. ఈ సంఘటన ద్వారా ఆమె యొక్క దైవభీతి, దైవభక్తి, పవిత్రత, పరిశుద్ధత, వివేకం, వినయ విధేయతలను గురించి పేర్కొనడం జరిగింది. ఒక్కోసారి దైవవాణి ఆమె ఇంట్లో అవతరించేది. దైవదూత ఆమెకు సలామ్‌ చేసేవారు. ప్రవక్త (స), ‘వీరు జిబ్రీల్‌ (అ) నీకు సలామ్‌ చేస్తున్నారు,’ అని అంటే, ‘ఆయి’షహ్‌ (ర) ”వ అలైకుముస్సలామ్‌ వ రహ్మ తుల్లాహ్‌” అని అనేవారు. (బు’ఖారీ)
‘ఆయి’షహ్‌ (ర) వల్ల ముస్లిములకు అనేక లాభాలు, అను గ్రహాలు లభించాయి. తయమ్ముమ్‌ ఈమె వల్లనే లభించింది. ‘ఆయి’షహ్‌(ర) దైవమార్గంలో కృషిచేసేవారికి సేవలు చేసేవారు. పోరాటాల్లో నీటికుండలు ఎత్తుకొని తీసుకొని వచ్చేవారు. గాయాల పాలైన వారికి త్రాపించే వారు. పేదలపట్ల దయాదాక్షిణ్యాలతో ప్రవర్తించేవారు. అల్లాహ్‌ మార్గంలో చాలాధనాన్ని ఖర్చుచేసేవారు. ఎల్ల ప్పుడూ దైవధ్యానంలో ఉండేవారు. చారిత్రక పుస్తకాల్లో వీరి ప్రత్యేకతలు, సంఘటనలు వివరంగా ఉన్నాయి.
(బైహఖీ-ము’ద్ఖల్, ర’జీన్‌)
110 – 32 (1/39)
وَعَنْ مَّطَرِ بْنِ عُكاَمٍ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا قَضَى اللهُ لِعَبْدٍ أَنْ يَّمُوْتَ بِأَرْضٍ جَعَلَ لَهُ إِلَيْهَا حَاجَةً”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ .

(32) [1/39-దృఢం]
మ’తర్‌ బిన్‌ ‘ఉకామ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ ఒక వ్యక్తి ఫలానా ప్రాంతంలో మరణించాలని నిర్థారించినపుడు, దానివైపు వెళ్ళే అవసరాన్ని కల్పిస్తాడు. అందువల్లే ఎట్టి పరిస్థితుల్లోనూ అతడు దాని వైపునకు ప్రయాణం చేస్తాడు.” (అ’హ్మద్‌, తిర్మిజి’)
111 – 33 (1/39)
وَعَنْ عَاِئشَةَ رَضِيَ اللهُ عَنْهَا, قَالَتْ: قُلْتُ: يَا رَسُوْلَ الله! ذَرَارِيُّ الْمُؤْمِنِيْنَ؟ قَالَ: “مِنْ آبَائِهِمْ”. فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ بِلَا عَمَلٍ؟ قَالَ: “اللهُ أَعْلَمُ بِمَا كَانُوْا عَامِلِيْنَ”. قُلْتُ: فَذَارَارِيُّ الْمُشْرِكِيْنَ؟ قَالَ: “مِنْ آبَائِهِمْ”. قُلْتُ: بِلَا عَمَلٍ؟ قَالَ: “اللهُ أَعْلَمُ بِمَا كَانُوْا عَامِلِيْنَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
111.(33) [1/39-దృఢం]
‘ఆయి’షహ్‌ (ర) కథనం: నేను ప్రవక్త(స)ను, ‘ఓ ప్రవక్తా! విశ్వాసుల బిడ్డల సంగతేమిటి?’ (అంటే బాల్యంలో మరణించిన విశ్వాసుల బిడ్డలు స్వర్గంలో ప్రవేశిస్తారా? లేక నరకంలో ప్రవేశిస్తారా?)’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘వారు వారి తండ్రుల అనుసరణలో ఉంటారు (అంటే వారి విశ్వాస తండ్రులు స్వర్గంలో ప్రవేశిస్తే, వారి పిల్లలు కూడా స్వర్గంలో ప్రవేశిస్తారు,’ అని అన్నారు. దానికి నేను, ‘ప్రవక్తా! ఎటువంటి ఆచరణ లేకుండానేనా?’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘వారు ఏమి ఆచరించ బోయే వారో అల్లాహ్‌కు తెలుసు,’ అని అన్నారు. మళ్ళీ నేను అవిశ్వాసుల బిడ్డలను గురించి ప్రశ్నిస్తూ, ‘వారు స్వర్గంలో ఉంటారా లేక నరకంలో ఉంటారా?’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘వారు వారి తండ్రులను అనుసరించి ఉంటారు. (అంటే వారి అవిశ్వాస తండ్రులు నరకంలో ప్రవేశిస్తే, వారి బిడ్డలు కూడా నరకంలో ప్రవేశిస్తారు,’ అని అన్నారు. దానికి నేను, ‘ప్రవక్తా! ఎటువంటి ఆచరణ లేకుండానేనా?’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘వారు ఏమి ఆచరించ బోయే వారో అల్లాహ్‌కు తెలుసు,’ అని అన్నారు.) అయితే ”కుల్లుమౌలూదిన్‌ యు’అలదు అలల్‌ ఫి’త్‌రహ్‌,” అనే ‘హదీసు’ దీనికంటే ప్రామాణికమైనది, శ్రేష్ఠమైనదీను.
(అబూ దావూద్‌)
112 – 34 (1/39)
وَعَنْ ابْنِ مَسْعُوْدٍ رَضِيَ اللهُ عَنْهُ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْوَائِدَةُ وَالْمَوْؤُدَةُ فِيْ النَّارِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ

(34) [1/40-దృఢం]
ఇబ్నె మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సజీ వంగా బిడ్డలను ఖననం చేసేవారు, చేయమని ఆదేశించే వారు ఇరువురూ నరకవాసులే.” )

వివరణ-112: అరబ్బుల్లో ఇస్లామ్‌కు ముందు అవమాన భారంతో ఆడబిడ్డలను సజీవంగా ఖననం చేసేవారు. ఇస్లామ్‌ దీన్ని తీవ్రంగా విమర్శిస్తూ నిషేధించింది. చేసేవారిని, చేయించే వారిని నరక వాసులుగా పేర్కొంది. ఖుర్‌ఆన్‌లో సజీవంగా పాతి పెట్టబడిన ఆడబిడ్డను నిన్నెందుకు పాతిపెట్టడం జరిగిందని ప్రశ్నించడం జరుగుతుంది. మరోవిధంగా ఆ బిడ్డ స్వయంగా నన్నెందుకు పాతిపెట్టడం జరిగిందని ప్రశ్నిస్తుంది. ఏది ఏమైనా సజీవంగా పాతిపెట్టడం మహాపాపం. ఈ ఆధునిక యుగంలో గర్భాలు తొలగించడం, మందులద్వారా గర్భాలు తొలగించడం మొదలైనవన్నీ మహా పాపాలే.

(అబూ-దావూద్‌)

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
113 – [ 35 ] ( لم تتم دراسته ) (1/40)
عَنْ أَبِيْ الدَّرْدَاءِ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهُ عَزَّ وَجَلَّ فَرَغَ إِلَى كُلِّ عَبْدٍ مِّنْ خَلْقِهِ مِنْ خَمْسٍ: مِنْ أَجَلِهِ, وَعَمَلِهِ, وَمَضْجَعِهِ, وَأَثَرِهِ وَرِزْقِهِ”. رَوَاهُ أَحْمَدُ.

(35) [1/40-అపరిశోధితం]
అబూ దర్‌దా’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నిస్సందేహంగా అల్లాహ్‌(త) తన దాసుల ఐదు విషయా లను వ్రాయడం పూర్తిచేశాడు.

మరణం అంటే వయస్సు, 2. ఆచరణ అంటే మంచీ లేక చెడు, 3. ఎక్కడకు వెళ్ళి మరణిస్తాడు, 4. ఎక్కడకు చేరుతాడు అంటే స్వర్గం లేక నరకం, 5. అతని ఆహారం అంటే ఎంత ఆహారం అతనికి చేరుతుంది. (అ’హ్మద్‌)
114 – 36 (1/40)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا , قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ تَكَلَّمَ فِيْ شَيْءٍ مِّنْ الْقَدْرِ سُئِلَ عَنْهُ يَوْمَ الْقِيَامَةِ, وَمَنْ لَّمْ يَتَكَلَّمْ فِيْهِ لَمْ يُسْأَلُ عَنْهُ”. رَوَاهُ ابْنُ مَاجَهْ .
114.(36) [1/40-బలహీనం]
‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”విధివ్రాతను గురించి అనవసరంగా చర్చించేవారిని తీర్పుదినం నాడు విచారించటం జరుగుతుంది. అదేవిధంగా విధివ్రాతను గురించి చర్చించకుండా వదలివేసిన వారిని విచారించటం జరుగదు.” (ఇబ్నె మాజహ్)
115 – 37 (1/40)
وَعَنِ ابْنِ الدَّيْلَمِيِّ, قَالَ: أَتَيْتُ أُبَيَّ بْنَ كَعْبٍ, فَقُلْتُ لَهُ: قَدْ وَقَعَ فِيْ نَفْسِيْ شَيْءٌ مِّنْ الْقَدْرِ, فَحَدِّثْنِيْ بشيء لَعَلَّ اللهَ أَنْ يُّذْهِبَهُ مِنْ قَلْبِيْ. فقَالَ: لَوْ أَنَّ اللهَ عز و جل عَذَّبَ أَهْلَ سَمَاوَاتِهِ وَأَهْلَ أَرْضِهِ؛ عَذَّبَهُمْ وَهُوَ غَيْرُ ظَالِمٍ لَهُمْ, وَلَوْ رَحِمَهُمْ كَانَتْ رَحْمَتُهُ خَيْرًا لَّهُمْ مِّنْ أَعْمَالِهِمْ, وَلَوْ أَنْفَقْتَ مِثْلَ أَحْدٍ ذهَبًا فِيْ سَبِيْلِ اللهِ مَا قَبِلَهُ اللهُ مِنْكَ حَتَّى تُؤْمِنَ بِالْقَدْرِ, وَتَعْلَمَ أَنَّ مَا أَصَابَكَ لَمْ يَكُنْ لِّيُخْطِئَكَ, وَأَنَّ مَا أَخْطَأَكَ لَمْ يَكُنْ لِّيُصِيْبَكَ. وَلَوْ مُتَّ عَلَى غَيْرِ هَذَا لَدَخَلْتَ النَّار. قَالَ: ثُمَّ أَتَيْتُ عَبْدَ اللهِ بْنِ مَسْعُوْدٍ, فَقَالَ مِثْلَ ذَلِكَ. قَالَ: ثُمَّ أَتَيْتُ حُذَيْفَةَ بْنَ الْيَمَانِ, فَقَالَ مِثْلَ ذَلِكَ. قَالَ ثُمَّ أَتَيْتُ زَيْدَ بْنَ ثَابِتٍ فَحَدَّثَنِيْ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم مِثْلَ ذَلِكَ. رَوَاهُ أَحْمَدُ, وَأَبُوْ دَاوُدَ, وَابْنُ مَاجَهْ. 

(37) [1/40-దృఢం]
ఇబ్ను ద్దైలమీ (ర) కథనం: నేను ఉబయ్‌ బిన్‌ క’అబ్‌ వద్దకు వచ్చి, అతనితో, ‘విధివ్రాతను గురించి నా మనసులో అనేక అనుమానాలు జనించాయి. నా అనుమానాలు తొలగిపోయేలా నాకేదైనా ‘హదీసు’ వినిపించండి,’ అని అన్నాను. దానికి అతను, ‘ఒకవేళ అల్లాహ్‌ ఆకాశంలో ఉన్న వారిని, భూమిపై ఉన్న వారిని శిక్షిస్తే, అల్లాహ్‌ ఎంతమాత్రం అత్యాచారికాడు. అంటే భూమ్యాకాశాల వారందరినీ శిక్షకు గురిచేసే అల్లాహ్‌ (త)ను ఎంతమాత్రం, ‘అత్యాచారి’ అని అనలేము. ఒకవేళ దయచూపితే, ఇది వారి ఆచరణతో ఎటువంటి సంబంధంలేదు. ఒకవేళ నీవు ఉహుద్‌ కొండంత బంగారం దైవమార్గంలో ఖర్చు చేసినా, నీవు విధివ్రాతను విశ్వసించనంత వరకు దాన్ని స్వీకరించడు. ఇంకా నీవు బాగా గుర్తుంచుకో, నీకు చేరింది తప్పకుండా చేరుతుంది. అదే విధంగా నీకు చేరనిది, నీకు చేరదు. (అంటే సుఖ దుఃఖాలన్నీ ధనం, పేదరికం అన్నీ విధివ్రాతలోని భాగాలే. ఇందులో ఎవరి కృషి ప్రయత్నాలూ లేవు. ఒకవేళ నీవు దీనికి వ్యతిరేకంగా భావిస్తూ మరణిస్తే, నరకంలో ప్రవేశిస్తావు.” అని అన్నారు.
ఇబ్ను ద్దైలమీ కథనం, ”నేను ఇబ్నె మస్‌’ఊద్‌ వద్దకు వచ్చాను. ఆయన కూడా ఇలాగే అన్నారు. ఆ తరువాత హుజై’ఫహ్ బిన్‌ యమాన్‌ వద్దకు వచ్చాను. ఆయన్ను ఇలాగే అడిగాను. ఆయన కూడా ఇలాగే సమాధానం ఇచ్చారు. ఆ తరువాత నేను ‘జైద్‌ బిన్‌ సా’బిత్‌ వద్దకు వచ్చాను. అతను ప్రవక్త (స) ద్వారా ఇటువంటి ‘హదీసు’ ఉల్లేఖించారు. (అబూ దావూద్‌, అ’హ్మద్‌, ఇబ్నె మాజహ్)
116 – 38  (1/41)
عَنْ نَّاِفعٍ, أَنَّ رَجُلاً أَتَى ابْن عُمَر فَقَالَ: إِنَّ فُلَانًا يُقْرِأُ عَلَيْكَ السَّلَامَ. فَقَالَ: إِنَّهُ بَلَغَنِيْ أَنَّهُ قَدْ أَحْدَثَ, فَإِنْ كَانَ قَدْ أَحْدَثَ فَلَا تُقْرِئْهُ مِنِّي السَّلَامَ؛ فَإِنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “يَكُوْنُ في أُمَّتِي – أو فِيْ هَذِهِ الْأُمَّةِ – خَسْفٌ, أَوْ مَسْخٌ, أَوْ قَذْفٌ فِيْ أَهْلِ الْقَدْرِ”. رَوَاهُ التِّرِمِذِيُّ, وَأَبُوْ دَاوُدَ, وَابْنُ مَاجَه. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ غَرِيْبٌ.

(38) [1/41-ప్రామాణికం]
నాఫె’అ (ర) కథనం: ఒక వ్యక్తి, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) వద్దకు వచ్చి, ‘ఫలానా వ్యక్తి మీకు సలామ్‌ చెప్పాడు,’ అని అన్నాడు. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర), ‘కాని అతడు ధర్మంలో ఏదో నూతన పద్ధతి ప్రారంభించినట్టు నాకు తెలిసింది. అంటే ధర్మంలో కల్పించాడని, విధివ్రాతను తిరస్కరిస్తున్నాడని తెలిసింది. ఒకవేళ అతడు నిజంగా అలా అయిపోతే నా సలామ్‌ అతనికి చేరవేయకు, ఎందుకంటే, నేను ప్రవక్త(స) ను, ”నా అనుచర సమాజంలో లేదా ఈ అనుచర సమాజంలో భూమి దిగబడిపోవటం, రూపాలు, మార్చివేయటం, విధివ్రాత తిరస్కారుల్లో జరుగుతుంది.’ అని అంటూ ఉండగా విన్నాను, ” అని అన్నారు. )

వివరణ-116: ’ఖసఫ్‌ అంటే భూమిలో దిగబడి పోవటం, మస’ఖ్‌ అంటే రూపాలు మారిపోవటం. ఖద‘ఫ్‌ అంటే రజ్మ్, రాళ్ళతో కొట్టిచంపటం. అంటే విధివ్రాత తిరస్కారులు భూమిలో తొక్కివేయబడతారు, ఇంకా వారి రూపాలు మార్చి వేయబడతాయి. లేదా ఆకాశం నుండి వారిపై రాళ్ళ వర్షం కురుస్తుంది.
(తిర్మిజి – ప్రామాణికం – ఏకోల్లేఖనం – దృఢం; అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)
117 – [ 39 ] ( لم تتم دراسته ) (1/41)
عَنْ عَلِيٍّ رضي الله عَنْه, قَالَ: سَأَلْتُ خَدِيْجَةَ النَّبِيِّ صلى الله عليه وسلم, عَنْ وَّلَدَيْنِ مَاتَا لَهَا فِيْ الْجَاهِلِيَّةِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هُمَا فِيْ النَّارِ”. قَالَ: فَلَمَّا رَأَى الْكَرَاهَةَ فِيْ وَجْهِهَا قَالَ: “لَوْ رَأَيْتِ مَكَانَهُمَا لَأَبَغَضْتِهِمَا”. قَالَتْ: يَا رَسُوْلَ اللهِ! فَوَلِدِيْ مِنْكَ؟ قَالَ: “فِيْ الْجَنَّةِ”. ثُمَّ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْمُؤْمِنِيْنَ وَأَوْلَادَهُمْ فِيْ الْجَنَّةِ, وَإِنَّ الْمُشْرِكِيْنَ وَأَوْلَادَهُمْ فِيْ النَّارِ”. ثُمَّ قَرَأَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: (وَالَّذِيْنَ آمَنُوْا وَاتَّبَعَتْهُمْ ذُرِّيَّتُهُمْ بِإِيْمَانِ أَلْحَقْنَا بِهِمْ ذُرِّيَّتُهُمْ…؛ 52: 21).

(39) [1/41-అపరిశోధితం]
‘అలీ (ర) కథనం: ‘ఖదీజహ్ (ర) ప్రవక్త (స)ను ఇస్లామ్‌కు ముందు మరణించిన తన ఇద్దరు పిల్లలను గురించి అడిగారు. దానికి ప్రవక్త (స) ‘ఆ ఇద్దరూ నరకంలో ఉన్నారు’ అని సమాధానం ఇచ్చారు. అది విన్న ‘ఖదీజహ్ (ర) చాలా విచారానికి గురయ్యారు. ఆమె ముఖవర్చస్సు మారిపోయింది. అది గ్రహించిన ప్రవక్త (స) ‘ఒకవేళ నీవు వారి స్థానాన్ని చూస్తే నీవు అసహ్యించు కుంటావు,’ అని అన్నారు.
మళ్ళీ ‘ఖదీజహ్ (ర), ప్రవక్తా! మీ ద్వారా జన్మించిన వారి (ఖాసిమ్‌, ‘అబ్దుల్లాహ్‌ల) సంగతేంటి?’ అని అడిగారు. దానికి ప్రవక్త (స) వారిద్దరూ స్వర్గంలో ఉన్నారు విశ్వాసులు వారి సంతానం స్వర్గంలో ఉంటారు. అదేవిధంగా అవిశ్వాసులు, వారి సంతానం నరకంలో ఉంటారు’ అని పలికి, ”వల్లజీన ఆమనూ వత్తబ’అత్‌హుమ్‌ జు’ర్రియ్యతుహుమ్‌…” – ‘మరియు ఎవరైతే విశ్వ సిస్తారో మరియు వారి సంతానంవారు విశ్వాసంలో వారిని అనుసరిస్తారో! అలాంటి వారిని వారి సంతా నంతో (స్వర్గంలో) కలుపుతాము…’ అనే ఆయతు పఠించారు. (సూ. అ’త్-‘తూర్, 52:21). (అ’హ్మద్‌)
118 – 40 (1/42)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَمَّا خَلَقَ اللهُ آدَمَ مَسَحَ ظَهْرَهُ فَسَقَطَ عن ظَهْرِهِ كُلُّ نَسَمَةٍ هُوَ خَالِقُهَا مِنْ ذُرِّيَّتِهِ إِلَى يَوْمِ الْقَيَامَةِ, وَجَعَلَ بَيْنَ عَيْنَي كُلَّ إِنْسَانٍ مِنْهُمْ وَبِيْصَا مِّنْ نُوْرٍ, ثُمَّ عَرَضَهُمْ عَلَى آدَمَ, فَقَالَ: أَيْ رَبِّ! مَنْ هَؤُلَاءِ؟ قَالَ: ذُرِّيَّتُكَ. فَرَأَى رَجُلًا مِّنْهُمْ فَأَعْجَبَهُ وَبِيْصُ مَا بَيْنَ عَيْنَيْهِ, قَالَ: أَيْ رَبِّ! مَنْ هَذَا؟ قَالَ: دَاوُد. فَقَالَ: رَبِّ! كَمْ جَعَلْتَ عُمَرَهُ؟ قَالَ: سِتِّيْنَ سَنَةً. قَالَ: رَبِّ زِدْهُ مِنْ عُمْرِيْ أَرْبَعِيْنَ سَنَةً”. قال رسول الله صلى الله عليه و سلم: “فَلَمَّا انقضى عُمْرُ آدَمُ الا اربعين جَاءَهُ مَلَكُ الْمَوْتِ, فَقَالَ آدم: أَوَلَمْ يَبْقِ مِنْ عُمْرِيْ أَرْبَعُوْنَ سَنَةً؟ قَالَ: أوْلَمْ تُعْطِهَا اِبْنَكَ دَاوُدَ؟ فَجَحَدَ آدَمُ, فَجَحَدَتْ ذُرِّيَّتُهُ, وَنَسِيَ آدَمُ فاكل من الشجرة, فَنَسِيْتُ ذُرِّيَّتُهُ, وَخَطَأ و خطأت ذُرِّيَّتُهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

(40) [1/42-ప్రామాణికం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌(త) ఆదమ్‌(అ)ను సృష్టించి, అతని వీపుపై తన చేత్తో నిమిరాడు. అప్పుడు అతని వీపు నుండి తీర్పుదినం వరకు సృష్టించబోయే వారందరి ప్రాణాలు బయట పడ్డాయి. అనంతరం అల్లాహ్‌(త) వారందరి రెండు కళ్ళ మధ్య వెలుగు సృష్టించాడు. వారందరిని ఆదమ్‌ (అ) ముందుపెట్టాడు. అప్పుడు ఆదమ్‌ (అ), ‘అల్లాహ్! వీరెవరు?’ అని విన్నవించుకున్నాడు. అప్పుడు అల్లాహ్‌, ‘వీరు నీ సంతానం,’ అని అన్నాడు. ఆదమ్‌ (అ) వారిలోని ఒక వ్యక్తి రెండు కళ్ళ మధ్య అధిక వెలుగు కలిగి ఉండటం చూసి, ‘అల్లాహ్ (త)! ఇతనెవరు?’ అని విన్నవించు కున్నాడు. దానికి అల్లాహ్‌, ‘ఇతను నీ కుమారుడు దావూద్‌,’ అని అన్నాడు. అప్పుడు ఆదమ్‌, ‘అల్లాహ్(త)! ఇతనికి ఎంత వయస్సు నిర్ణయించావు,’ అని అన్నాడు. దానికి అల్లాహ్‌, ’60 సంవత్సరాలు,’ అని అన్నాడు. అప్పుడు ఆదమ్‌ (అ), ‘ప్రభూ! నా వయస్సులో నుండి 40 సంవత్సరాలు ఇతని వయస్సులో చేర్చు,’ అని విన్నవించుకున్నాడు.
ఆ తరువాత ఆదమ్‌ (అ) మరణసమయం ఆసన్నమయినప్పుడు, ప్రాణాలుతీసే దూత అతని వద్దకు వచ్చాడు. అప్పుడు ఆదమ్‌ (అ), ‘ఇంకా నలభై సంవత్సరాలు మిగిలి ఉన్నాయి,’ అని అన్నారు. దానికి ఆ దూత, ‘తమరు మీ వయస్సులో నుండి 40 సంవత్సరాలు దావూద్‌ (అ)కు ఇచ్చివేసారుగా,’ అని అన్నాడు. ఆదమ్‌ (అ) దాన్ని తిరస్కరించారు. అందు వల్ల అతని సంతానంకూడా తిరస్కరిస్తుంది. ఆదమ్‌ (అ) మరచిపోయారు. నిషేధించిన చెట్టు ఫలాన్ని తిన్నారు. అతని సంతానం కూడా మరచిపోతుంది. పొరపాట్లకు గురవుతుంది,” అని అన్నారు. (తిర్మిజీ’)
119 – 41 (1/42)
وَعَنْ أَبِيْ الدَّرْدَاءِ, عَنِ النَّبِيِ صلى الله عليه وسلم قَالَ: “خَلَقَ اللهُ آدَمَ حِيْنَ خَلَقَهُ, فَضَرَبَ كَتِفَهُ الْيُمْنَى, فَأَخْرَجَ ذُرِّيَّةً بَيْضَاءَ كَأَنَّهُمْ الذَّرُّ, وَضَرَبَ كَتِفَهُ الْيُسْرَى فَأَخْرَجَ ذُرِّيَّةً سَوْدَاءَ كَأَنَّهُمْ الْحُمَمُ, فَقَالَ لِلَّذِيْ فِيْ يَمِيْنِهِ: إِلَى الْجَنَّة وَلَا أُبَالِيْ, وَقَالَ لِلَّذِيْ فِيْ كَتِفِهِ الْيُسْرَى: إِلَى النَّارِ وَلَا أُبَالِيْ”. رَوَاُه أَحْمَدُ .

(41) [1/42-దృఢం]
అబూ-దర్‌దా’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌(త) ఆదమ్‌ (అ) ను సృష్టించి, అతని కుడి భుజంపై కొట్టాడు. అతన్నుండి తెల్లని ఆత్మలు వెలు వడ్డాయి. అవి చీమల్లా ఉన్నాయి. ఆ తరువాత అతని ఎడమ భుజంపై కొట్టాడు. అతన్నుండి నల్లని ఆత్మలు వెలువడ్డాయి. వాళ్ళు బొగ్గుల్లా ఉన్నారు. అల్లాహ్‌(త) కుడి ప్రక్కవారిని స్వర్గం కోసం సృష్టించానని, నాకేమీ ఫరవాలేడు మరియు ఎడమ ప్రక్క ఉన్న వారిని నరకం కోసం సృష్టించానని కూడా నాకేమీ ఫరవా లేదు,’ అని అన్నాడు.” (అ’హ్మద్‌)
120 – 42 (1/43)
وَعَنْ أَبِيْ نَضْرَةَ, أَنَّ رَجُلًا مِّنْ أَصْحَابِ النَّبِيِّ صلى الله عليه وسلم – يُقَالَ لَهُ: أَبُوْ عَبْدِ اللهِ – دَخَلَ عَلَيْهِ أَصْحَابُهُ يَعُوْدُوْنَهُ وَهُوَ يَبْكِيْ, فَقَالُوْا لَهُ: مَا يُبْكِّيْكَ؟ أَلَمْ يَقُلْ لَّكَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خُذْ مِنْ شَارِبِكَ ثُمَّ أَقِرَّهُ حَتَّى تَلْقَانِيْ؟ “قَالَ: بَلَى, وَلَكِنْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ اللهَ عَزَّ وَجَلَّ قَبَضَ بِيَمِيْنِهِ قَبْضَةً وَأخرى بِالْيَدِ الْأُخْرَى وَقَالَ: هَذِهِ لِهَذِهِ, وَهَذِهِ لِهَذِهِ, وَلَا أُبَالِيْ “و لَا أَدْرِيْ فِيْ أَيِّ الْقَبْضَتَيْنِ أَنَا”. رَوَاهُ أَحْمَدُ.

(42) [1/43-దృఢం]
అబూ న’ద్ర (ర) కథనం: ”ప్రవక్త (స) అనుచరుల్లోని ఒకరు అనారోగ్యానికి గురయ్యారు. అతన్ని అబూ ‘అబ్దుల్లాహ్‌ అని పిలిచేవారు. అతన్ని పరామర్శించ టానికి అతని మిత్రులు వచ్చారు. అప్పుడతను ఏడుస్తున్నారు. అతని మిత్రులు, ‘ఎందుకు ఏడుస్తు న్నారు, ప్రవక్త (స) మీకు మీసాలు గీయించుకుంటూ ఉండమని, మమ్మల్ని కలిసే వరకు దానిపై స్థిరంగా ఉండమని అన్నారుగా, ప్రవక్త మమ్మల్ని కలుస్తారని శుభవార్త ఇచ్చారుగా, మరెందుకు ఏడుస్తున్నారు, ఏడ్వవలసిన అవసరం లేదు,’ అని అన్నారు. దానికి అబూ అబ్దుల్లాహ్‌, ”అవును ప్రవక్త (స) ఇలాగే అన్నారు కాని, ప్రవక్త (స), ‘అల్లాహ్‌ తన రెండు చేతుల పిడికిళ్ళు నింపుకొని, కుడి పిడికిలిలో ఉన్న వారిని స్వర్గం కోసం సృష్టించానని, ఎడమ చేతినిలో ఉన్న వారిని నరకం కోసం సృష్టించానని, నాకేం ఫరవాలేదని అన్నాడని’ కూడా అన్నారు. ఆ రెండు పిడి కిళ్ళలో ఎందులో నేను ఉన్నానో నాకు తెలియదు. అందు వల్లే నేను ఏడుస్తున్నాను” అని అన్నారు. (అ’హ్మద్‌)
121 – 43 (1/43)
وَعَنِ ابْنِ عَبَّاسٍ, عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “أَخَذَ اللهُ الْمِيْثَاقَ مِنْ ظَهْرِ آدَمَ بِنِعْمَانَ – يَعْنِيْ عَرَفَةَ – فَأَخْرَجَ مِنْ صُلْبِهِ كُلَّ ذُرِّيَّةٍ ذَرَأَهَا, فَنَثَرَهُمْ بَيْنَ يَدَيْهِ كَالذَّرِ, ثُمَّ كَلَّمَهُمْ قُبُلًا قَالَ: ]أَلَسْتُ بِرَبِّكُمْ, قَالُوْا: بَلَى! شَهِدْنَا أَنْ تَقُوْلُوْا يَوْمَ الْقَيَامَةِ إِنَّا كُنَّا عَنْ هَذَا غَافِلِيْنَ. أَوْ تَقُوْلُوْا إِنَّمَا أَشْرَكَ آبَاؤُنَا مِنْ قَبْلُ وَكُنَّا ذُرِّيَّةَ مِّنْ بَعْدِهِمْ أَفَتُهْلِكُنَا بِمَا فَعَلَ الْمُبْطِلُوْنَ[“. رَوَاهُ أَحْمَد.

(43) [1/43-దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అరఫాత్‌కు దగ్గరలో ఉన్న నో’మాన్‌ ప్రాంతంలో అల్లాహ్‌ (త) ఆదమ్‌ (అ) సంతతి నుండి వాగ్దానం తీసుకున్నాడు. ఆదమ్‌(అ) వీపు నుండి అతని సంతతిని తీసి అతని ముందు చీమల్లా పరచివేశాడు. ఆ తరువాత వారి ముందు నిలబడి, ‘నేను మీ ప్రభువును కానా?’ అని అన్నాడు. దానికి వారందరూ, ‘అవును, తమరు మా ప్రభువులు,’ అని అన్నారు. అప్పుడు అల్లాహ్‌(త), ‘మేము మీ నుండి ఈ వాగ్దానం ఎందుకు తీసుకున్నామంటే మీరు తీర్పుదినంనాడు, మాకు తెలియదని లేదా మా తాత-ముత్తాతలు అవిశ్వాసానికి పాల్పడితే, మేము వారిని అనుసరిస్తే, వారు చేసిన పాపాలకు మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నారు’ అని అనకుండా ఉండడానికి,’ అని అన్నాడు.” ) దీని అర్ధం ఏమిటంటే అల్లహ్(త) తాను వారి ప్రభువునని వారితో వాగ్దానం ఎందుకు తీసుకున్నాడంటే, తీర్పుదినం నాడు వారు మాకు ఈ విషయాలు తెలియవని లేదా మా తాత-ముత్తాతలు సాటి కల్పించారు, మేము వారి తరువాత వచ్చాం. మరి పాపాత్ముల పాపకార్యాల వల్ల మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నారు అని అనకుండా ఉండడానికి.
(అ’హ్మద్‌)
122 – 44 (1/43)
عَنْ أُبَيِّ بْنِ كَعْبٍ فِيْ قَوْلِ اللهِ عَزَّ وَجَلَّ: ]وَإِذْ أَخَذَ رَبُّكَ مِنْ بَنِيْ آدَمَ مِنْ ظُهُوْرِهِمْ ذُرِّيَّتُهُمْ[ قَالَ: جَمَعَهُمْ فَجَعَلَهُمْ أَزوَاجًا، ثُمَّ صَوَّرَهُمْ فَاسْتنْطَقَهُمْ، فَتَكَلَّمُوْا، ثُمَّ أَخَذَ عَلَيْهِمُ الْعَهْدَ وَالْمِيْثَاقَ، ]وَأَشْهَدَهُمْ عَلَى أَنْفُسِهمْ أَلَسْتُ بِرَبِّكُمْ[ قَالَوا: بلى. قال : فَإِنِّيْ أُشْهِدُ عَلَيْكُمْ السَّمَوَاتِ السَّبْعَ وَالْأَرْضِيْنَ السَّبْعَ، وَأُشْهِدُ عَلَيْكُمْ أَبَاكُمْ آدَمُ عَلَيْهِ السلام أَنْ تَقُوْلُوْا يَوْمَ الْقَيَامَةِ: لَمْ نَعْلَمْ بِهَذَا. اِعْلَمُوْا أَنَّهُ لَا إِلَهَ غَيْرِيْ, وَلَا رَبِّ غَيْرِيْ, و لَا تُشْرِكُوْا بِيْ شَيْئًا. إِنِّيْ سَأُرْسِلُ إِلَيْكُمْ رُسُلِيْ يُذَكِّرُوْنَكُمْ عَهْدِيْ وَمِيْثَاقِيْ, وَأُنْزِلَ عَلَيْكُمْ كُتُبِيْ. قَالُوْا: شَهِدْنَا بِأَنَّكَ رَبُّنَا وَإِلَهَنَا. لَا رَبَّ لَنَا غَيْرُكَ، و لا اله لنا غيرك. فَأَقَرُّوْا بِذَلِكَ، وَرُفِعَ عَلَيْهِمْ آدَمُ يَنْظُرُ إِلَيْهِمْ, فَرَأَى الْغَنِيَّ وَالْفَقِيْرَ, وَحَسَنَ الصُّوْرَةِ وَدُوْنَ ذَلِكَ. فَقَالَ: رَبِّ لَوْلَا سُوَّيْتَ بَيْنَ عِبَادِكَ! قَالَ: إِنِّيْ أَحْبَبْتُ أَنْ أُشْكَرَ. وَرَأَى الْأَنْبِيَاءَ فِيْهِمْ مِثْلُ السُّرُجِ عَلَيْهِمْ النُّوْرُ، خُصُّوْا بِمِيْثَاقِ آخَرَ فِيْ الرِّسَالَةِ وَالنُّبُوَّةِ, وَهُوَ قَوْلُهُ تَعَالَى: ]وَإِذَ أَخَذْناَ مِنَ النَّبِيِّيْنَ مِيْثَاقَهُمْ[إِلَى قَوْلِهِ:]عِيْسَى ابْنِ مَرْيَمَ[ كَانَ فِيْ تِلْكَ الْأَرْوَاحِ ، فَأَرْسَلَهُ إِلَى مَرْيَمَ عليهما السلام فَحُدِّثَ عَنْ أُبَيٍّ: أَنَّهُ دَخَلَ مَنْ فِيْهَا . رَوَاهُ أَحْمَدُ.

(44) [1/43-ప్రామాణికం]
ఉబయ్‌ బిన్‌ క’అబ్‌ (ర), ”వఇజ్‌’ అ’ఖజ’ రబ్బుక మిన్‌ బనీ ఆదమ మిన్‌”జుహూరిహిమ్‌ ‘జుర్రియత హుమ్‌….” (సూ. అల్ అ’అరాఫ్, 7:172) అనే ఆయతును గురించి ఇలా వ్యాఖ్యానించారు. – ‘అల్లాహ్‌(త) ఆదమ్‌ సంతతిని ఒక చోట చేర్చాడు. వారిని అనేక విధాలుగా మలచాడు. వారికి మాట్లాడే శక్తిని ప్రసాదించాడు, వారు మాట్లాడసాగారు. ఆవెంటనే అల్లాహ్‌(త) వారి నుండి వాగ్దానం తీసుకున్నాడు. ఇంకా వారికి వారి పైనే సాక్షులుగా నిలబెట్టాడు. ఇంకా, ‘నేను మీ ప్రభువును కానా?’ అని అన్నాడు. దానికి వారు, ‘నిస్సందేహంగా తమరే మా ప్రభువులు,’ అని అన్నారు. అప్పుడు అల్లాహ్‌, ”నేను సప్తాకాశాలను, భూమిని మీపై సాక్షులుగా నిలబెడు తున్నాను. ఇంకా మీతండ్రి ఆదమ్‌ను కూడా సాక్షిగా నిలబెడుతున్నాను. ఎందుకంటే మీరు తీర్పుదినంనాడు ‘మాకు తెలియదు’ అని అనకుండా ఉండటానికి. ఇప్పుడు తెలుసుకోండి! నేను తప్ప ఆరాధ్యులెవరూ లేరు. ఇంకా నా తప్ప ప్రభువులు కూడా ఎవరూ లేరు, మీరు నాకు(త) ఎవరినీ సాటి కల్పించకండి. భవిష్యత్తులో నేను మీ వద్దకు ప్రవక్తలను పంపుతాను. వారు మీకు ఈ వాగ్దానాలను గుర్తుచేస్తారు. నేను నా గ్రంథాలను కూడా మీపై అవతరింపజేస్తాను,” అని అన్నాడు. అది విని వాళ్ళందరూ, ”నీవే మా ప్రభువు, నీవే మా ఆరాధ్యుడవు. నీవుతప్ప మాకు ప్రభువులెవరూ లేరు. ఇంకా నీవు తప్ప మాకు మరో ఆరాధ్యుడూ లేడు.” ఆదమ్‌ (అ) సంతతి అంతా దీనిపై ప్రమాణం చేసింది. ఆదమ్‌ (అ)ను ఒక ఎత్తైన స్థలంపై నిలబెట్టి, అతని ముందు అతని సంతతిని ఉంచడం జరిగింది, ఆదమ్‌ (అ) తన సంతానాన్ని చూసుకోవాలని. అనంతరం ఆదమ్‌ (అ) తన సంతతిని చూసుకున్నారు. వారిలో ధనవంతు లున్నారు. పేదవారు ఉన్నారు. అందమైన వారున్నారు. అందవికారు లున్నారు. అదిచూసి, ఆదమ్‌(అ), ఓ ప్రభూ! ”అందరినీ సమానంగా ఎందుకు సృష్టించలేదు,” అని విన్న వించుకున్నారు. దానికి అల్లాహ్‌(త), ”నాకు కృతజ్ఞతలు తెలుపు కోవడానికి. ఒకరి పరిస్థితి మరొకరు చూసి నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అందరినీ సమానంగా సృష్టిస్తే కృతజ్ఞులై ఉండరు,” అని అన్నాడు. ఆ తరువాత ఆదమ్‌ (అ) వారిలో వెలుగుతో నిండి ఉన్న ప్రవక్తలను చూశారు. వారిలో ‘ఈసా (అ) కూడా ఉన్నారు. అల్లాహ్‌(త) అతని ఆత్మను మర్యమ్‌ (అ) గర్భంలోకి పంపాడు. అని ‘ఉబయ్‌ బిన్‌ క’అబ్‌కు తెలియపర్చటం జరిగింది.” )

వివరణ-122: అంటే సూరహ్‌ అ’అరాఫ్‌లో పూర్తి ఆయతు ఉంది: ”మరియు (జ్ఞాపకం చేసుకోండి!) నీ ప్రభువు ఆదమ్‌ సంతతివారి వీపులనుండి వారి సంతానాన్ని తీసి, వారికి వారినే సాక్షులుగా నిలబెట్టి: ‘ఏమీ? నేను మీ ప్రభువును కానా?’ అని అడుగగా! వారు: ‘అవును! (నీవే మా ప్రభువని) మేము సాక్ష్యమిస్తున్నాము.’ అని జవాబిచ్చారు. తీర్పు దినమున మీరు: ‘నిశ్చయంగా, మేము దీనిని ఎరుగము.’ అని అనగూడదని. లేక: ‘వాస్తవానికి ఇంతకు పూర్వం మా తాత ముత్తాతలు అల్లాహ్‌కు సాటి (భాగస్వాములు) కల్పించారు. మేము వారి తరువాత వచ్చిన, వారి సంతతివారం (కాబట్టి వారిని అనుసరించాము). అయితే? ఆ అసత్యవాదులు చేసిన కర్మలకు నీవు మమ్మల్ని నశింపజేస్తావా?’ అని అన గూడదని. మరియు ఈ విధంగానైనా వారు సన్మార్గానికి మరలుతా రేమోనని మేము ఈ సూచనలను స్పష్టంగా తెలుపు తున్నాము.” (సూ. అల్‌ అ’అరాఫ్‌, 7:172-174)
ఈ ఆయతు వ్యాఖ్యానంలో ఉబయ్‌ బిన్‌ క’అబ్‌ (ర) పైవిధంగా వ్యాఖ్యానించారు. ఇది ఆదిలో తీసు కున్న వాగ్దానం. ప్రతి ఒక్క రితో వేర్వేరుగా వాగ్దానం తీసుకోవటం జరిగింది. ప్రజలతో బాధ్యులతో, ప్రవక్తలతో ప్రత్యేకంగా వాగ్దానం తీసుకోవటం జరిగింది. దీన్ని గురించి రాబోయే ఆయతులో పేర్కొనడం జరిగింది: ”మరియు (జ్ఞాపకముంచుకో) వాస్తవానికి మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసుకున్నాము మరియు నీతో (ఓ ము’హమ్మద్‌), నూ’హ్‌తో, ఇబ్రాహీమ్‌తో, మూసాతో మరియు మర్యమ్‌ కుమారుడైన ‘ఈసాతో కూడా! మరియు మేము వారందరి నుండి గట్టివాగ్దానం తీసుకున్నాము. ఇది సత్యవంతులను, వారి సత్యాన్ని గురించి ప్రశ్నించడానికి. మరియు ఆయన సత్య-తిరస్కారుల కొరకు బాధాకరమైన శిక్షను సిధ్ధపరచి ఉంచాడు.” (సూ. అల్‌ అహ్‌జాబ్‌, 33:7-8)
అంటే ఈ ఐదుగురు గొప్ప ప్రవక్తలతో వేర్వేరుగా వాగ్దానం తీసుకోవటం జరిగింది. మేము నీ ధర్మాన్ని ప్రచారం చేస్తామని, దానిపై స్థిరంగా ఉంటామని, దాన్ని గురించి పరస్పరం సహకరించుకుంటామని, ఐకమత్యంగా ఉంటామని, వీరందరూ వాగ్దానం చేశారు. దీన్ని గురించి ”వ ఇజ్‌’ అఖ’జ’ల్లాహు మీసా’ఖన్నబియ్యీన, లమా ఆతైతుకుమ్‌ మిన్ కితాబిన్ వహిక్‌మతిన్‌…”లో ఉంది. – ‘మరియు అల్లాహ్ ప్రవక్తల నుండి తీసుకున్న గట్టిప్రమా ణాన్ని (జ్ఞాపకంచేసుకోండి): ”నేను మీకు ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించిన తరువాత, ఒక సందేశహరుడు (ము’హమ్మద్‌) వచ్చి (మీ గ్రంథాలలో నుండి మిగిలివున్న) సత్యాన్ని ధృవపరిస్తే, మీరు అతని (ధర్మాన్ని) విశ్వసించి, అతనికి సహాయం చేయవలసి ఉంటుంది.” అని చెప్పి ఇలా ప్రశ్నించాడు: ”ఏమి? మీరు దీనికి అంగీకరిస్తారా? మరియు నా ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తారా?” వారన్నారు: ”మేము అంగీకరిస్తాము.” అప్పుడు ఆయన అన్నాడు: ”అయితే, మీరు దీనికి సాక్షులుగా ఉండండి. మరియు నేను కూడా మీతోపాటు సాక్షిగా ఉంటాను.” (సూ. ఆల ఇమ్రాన్, 3:81) అని అన్నాడు.
(అ’హ్మద్‌)
123 – 45 (1/44)
وَعَنْ أَبِي الدَّرْدَاءِ، قَالَ: بَيْنَمَا نَحْنُ عِنْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم نَتَذَاكَرُ مَا يَكُوْنَ, إِذْ قَالَ رسولُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا سَمِعْتُمْ بِجَبَلٍ زَالَ عَنْ مَّكَانِهِ فَصَدِّقُوْه, وَإِذَا سَمِعْتُمْ بِرَجُلٍ تَغَيَّرَ عَنْ خُلُقِهِ فَلَا تَصَدِّقُوْا بِهِ, فإِنَّهُ يَصِيْرُ إِلَى مَا جُبِلَ عَلَيْهِ”. رَوَاهُ أَحْمَدُ.

(45) [1/44-బలహీనం]
అబూ దర్‌దా’ (ర) కథనం: ఒకసారి మేము ప్రవక్త (స) వద్ద కూర్చొని ఉన్నాం. భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి మేము చర్చించుకోసాగాము. అది విని విధివ్రాత విషయంలో అదృష్టం, దురదృష్టం గురించి చర్చించు కుంటున్నాము. అది విని ప్రవక్త (స), ‘ఏదైనా కొండ తన చోటి నుండి ప్రక్కకు జరిగిందంటే నమ్మండి. కాని ఒక వ్యక్తి గుణాలు మారాయంటే మాత్రం నమ్మకండి. ఎందుకంటే ఏ గుణాలతో అతన్ని సష్టించడం జరిగిందో వాటి వైపు మళ్ళీ మరలటం ఖాయం,’ అని అన్నారు. (అ’హ్మద్‌)
124 – 46 (1/44)
وَعَنْ أُمِّ سَلَمَةَ, قالت: يَا رَسُوْلَ اللهِ! لَا يَزَالُ يُصِيْبُكَ كُلِّ عَامٍ وَّجَعٌ مِّنْ الشَّاةِ الْمَسْمُوْمَة الَّتِيْ أَكَلْتَ. قَالَ: “مَا أَصَابَنِيْ شَيْءٌ مِّنْهَا إِلَّا وَهُوَ مَكْتُوْبٌ عَلَيَّ وَآدَمُ فِيْ طِيْنَتِهِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

(46) [1/44-బలహీనం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ”తమరు ఆ విషపూరితమైన మేక మాంసం తిన్నందుకు ప్రతి సంవ త్సరం తమకు దాని బాధ కలుగు తుంది. మరి దాన్ని గురించి,” అని విన్నవించు కున్నాను. దానికి ప్రవక్త (స), ”నాకు కలిగే వ్యాధులు, బాధలు నా విధివ్రాతలో ఆదమ్‌ (అ) ఇంకా మట్టిలో ఉన్నప్పుడే వ్రాయబడ్డాయి,” అని అన్నారు. (ఇబ్నె మాజహ్)

4- بَابُ إِثْباَتِ عَذَابِ الْقَبْر

సమాధి శిక్ష సాక్ష్యాధారాలు
సమాధి అంటే ఆలమె బ’ర్జ’ఖ్‌ దశ. మరణానికి తీర్పు దినానికి మధ్య కాలం. ఇహలోకానికి పరలోకానికి మధ్య ఒక తెర ఉంది. అల్లాహ్‌ ఆదేశం: ”…ఇక (ఈ మరణించిన) వారు తిరిగిలేపబడే దినం వరకు వారి ముందు ఒక అడ్డుతెర (బర్‌’జఖ్‌) ఉంటుంది.” (సూ. అల్ ముఅ’మినూన్, 23:100)
దీన్ని గురించి ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”అల్లాహ్‌ శవం వద్దకు ఇద్దరు దైవదూతలను పంపుతాడు. ఒకరి పేరు మున్‌కర్‌, మరొకరి పేరు నకీర్‌. ఇద్దరూ చాలా భయంకర రూపంలో ఉంటారు. వారు సమాధిలోకి వచ్చి శవాన్ని సజీవపరచి కూర్చోబెడతారు. సూర్యాస్తమయం అవబోతున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ అతను ముస్లిమ్‌ నమా’జీ అయితే, ‘నన్ను వదలండి, నేను ‘అస్ర్‌’ నమా’జు చదవాలి,’ అని అంటాడు. అప్పుడు దైవదూతలు, ‘అస్ర్‌ నమా’జు అయి పోయింది. ఇప్పుడు మా ప్రశ్నలకు సమా ధానాలు ఇవ్వు.’ అని అంటారు. అనంతరం దైవదూతలు అతన్ని మూడు ప్రశ్నలు అడుగుతారు. ” ‘1. నీ ప్రభువు ఎవరు?’ ఒకవేల అతను విశ్వాసి అయితే, ‘నా ప్రభువు అల్లాహ్‌(త),’ అని సమాధానం ఇస్తాడు. ‘2. నీ ప్రవక్త ఎవరు?’ అతడు, ‘నా ప్రవక్త ము’హమ్మద్‌ (స),’ అని సమాధానం ఇస్తాడు. ‘3. నీ ధర్మం ఏమిటి?’ అతడు, ‘నా ధర్మం ఇస్లామ్‌,’ అని అంటాడు. సరైన సమాధానాలు ఇస్తే కనుచూపు మేరకు సమాధి విశాలంగా తయారవుతుంది. స్వర్గపు కిటికీలు తెరువబడతాయి. వాటి ద్వారా స్వర్గం నుండి గాలి, సువాసన వస్తూ ఉంటాయి. అప్పుడు దైవ దూతలు, ‘నీవు తీర్పుదినం వరకు సుఖంగా నిద్రపో, నీకు ఎటువంటి విచారంగానీ, భయంగానీ ఉండదు,’ ” అని అంటారు.
ఒకవేళ మరణించినవ్యక్తి అవిశ్వాసి లేదా కపటాచారి అయి ఉంటే, అతన్ని కూడా ఆ మూడు ప్రశ్నలు అడుగు తారు. కాని అతడు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక, ‘అయ్యో, నాకు తెలియదే’ అని విచారిస్తాడు. అనంతరం వెంటనే సమాధి అన్ని వైపుల నుండి అతన్ని బంధిస్తుంది. ప్రక్కటెముకలన్నీ విరిగి అటుఇటూ అయిపోతాయి. నరక కిటికీలు తెరువబడతాయి. ఉదయం, సాయంత్రం నరకం చూపించబడుతుంది. దైవదూతలు అతన్ని ఇనుప కడ్డీలతో కొడుతూ ఉంటారు. అతని ఎముకలు, దుమ్ములు నుజ్జు-నుజ్జు అవుతూ ఉంటాయి. అంతేకాక విషసర్పాలు, తేళ్ళు అతన్ని కాటేస్తూ ఉంటాయి. అవి ఒకవేళ ఒకసారి భూమిపై కాటువేస్తే వాటి విషం వల్ల పునరుత్థానం వరకు పంటలు పండవు. తీర్పుదినం వరకు అదేవిధంగా శిక్షించటం జరుగుతుంది.

అంటే సమాధి శిక్షలు, ప్రతిఫలాలు సత్యం, వాస్తవం. మనం సమాధి సంఘటనలను విశ్వసిస్తాము. వాస్తవం ఏమి టంటే, సమాధి స్వర్గవనాలలోని ఒక వనం. లేదా నరక గోతుల్లోని ఒకగొయ్యి. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఆదేశం: ”….మరియు ఫిర్‌’ఔన్‌ జనులను దుర్భరమైన శిక్ష చుట్టుకున్నది. ఆ నరకాగ్ని! వారు దాని యెదుటకు ఉదయమూ మరియు సాయంత్రమూ రప్పింపబడుతూ ఉంటారు. మరియు (పునరుత్థాన) దినపు ఘడియ వచ్చి నపుడు: ‘ఫిర్‌’ఔన్‌ జనులను తీవ్రమైన శిక్షలో పడ వేయండి!’ అని ఆజ్ఞ ఇవ్వబడుతుంది.” (సూ. అల్‌ ముఅ‘మినూన్ (‘గాఫిర్), 40:45-46)
‘హాఫి”జ్‌ ఇబ్నె కసీ’ర్‌ అభిప్రాయం, ‘ఆలమె బ’ర్జఖ్‌లో సమాధులలో శిక్షించటం జరుగుతుందన టానికి ఈ ఆయత్ ప్రధాన సాక్ష్యాధారాలలో ఒకటి. కొన్ని ‘హదీసు’లలో ఆలమె బర్‌’జఖ్‌ గురించి ప్రవక్త (స) మదీనహ్ వలస వెళ్ళిన తర్వాత తెలియపర్చటం జరిగింది. ఈ ఆయత్ మక్కహ్ లో అవతరించింది. ఈ ఆయత్ ద్వారా అవిశ్వాసుల ఆత్మలను ఉదయం సాయంత్రం నరకం ముందుకు తీసుకురావటం జరుగుతుంది. అయితే ఈ శిక్ష ఎల్లప్పుడూ ఉంటుందా? లేదా, కేవలం ఆత్మలకే శిక్షించటం జరుగుతుందా లేక శరీరాలకూ శిక్షించటం జరుగుతుందా? దీన్ని గురించి అల్లాహ్‌(త) తరఫు నుండి ప్రవక్త(స)కు తెలియపరచబడింది. ప్రవక్త (స) దాన్ని ప్రజలకు తెలియపరచారు. అందువల్ల ఖుర్‌ఆన్‌ ‘హదీసు’ల వెలుగులో ప్రతిఫల శిక్షలు సమాధిలోని ఆత్మ మరియు శరీరం రెంటికీ వర్తిస్తాయి. ఇదే సత్యం.

”…దుర్మార్గులు మరణవేదనలో ఉన్నప్పుడు దేవదూతలు తమ చేతులు చాచి: ‘మీ ప్రాణాలను వదలండి! అల్లాహ్‌పై అసత్యాలు పలుకుతూ ఉన్నందువలన మరియు ఆయన సూచనల పట్ల అనాదరణ చూపటం వలన, ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది!’ అని అంటూ ఉండే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండేది!” (సూ. అల్‌ అన్‌’ఆమ్, 6:93)
అంటే దైవదూతలు వారి ప్రాణాలు తీస్తూ వారిని హింసిస్తారు. దైవదతలు వారికి, ‘అల్లాహ్‌ మీ పట్ల ఆగ్రహం చెంది ఉన్నాడు, మీకు వ్యధాభరితమైన శిక్ష పడుతుంది,’ అని చెడువార్త వినిపిస్తారు. దానివల్ల వారి ఆత్మలు వారి శరీరాలు వదలటానికి సిద్ధం కాక వారి శరీరంలోనే తిరుగుతూ ఉంటాయి. విశ్వాసుల, అవిశ్వాసుల మరణం గురించి ‘హదీసు’ల్లో వచ్చిన ప్రస్తావన అంతా: ”యు’సబ్బితుల్లా హుల్లజీ’న ఆమనూ బిల్‌ ఖౌలి’స్సాబితి.” అనే ఆయత్ వ్యాఖ్యానంలో ఉంది.

”చివరికి వారిలో ఒకడికి మరణం సమీపించి నప్పుడు వాడిలా వేడుకుంటాడు: ”ఓ నా ప్రభూ! నన్ను తిరిగి (భూలోకానికి) పంపు; ‘నేను చేయకుండా వచ్చిన సత్కార్యాలు చేయటానికి.’ అది కాని పని. నిశ్చయంగా, అది అతని నోటిమాట మాత్రమే! ఇక (ఈ మరణించిన) వారు తిరిగి లేపబడే దినం వరకు వారి ముందు ఒక అడ్డుతెర (బర్‌ ‘జ’ఖ్‌) ఉంటుంది.” (సూ. అల్‌ ముఅ’మినూన్‌, 23:99-100)
అంటే మరణ సమయంలో అవిశ్వాసులు, పాపాత్ములు చాలా విచారిస్తారు. మళ్ళీ భూలోకానికి పంపిస్తే, సత్కార్యాలు చేసి వచ్చేవాళ్ళం అని కోరు కుంటారు. కాని అప్పుడు ఆశించటం వ్యర్థమే. ఈ వాక్యాల్లో తీర్పుదినం నాడు అవిశ్వాసులు, పాపాత్ములు అల్లాహ్ (త) ముందు నిలబడి నరకాగ్ని నుండి తప్పించుకోవటానికి మమ్మల్ని తిరిగి భూలోకానికి పంపితే సత్కార్యాలు చేసి వస్తామని తీవ్రంగా విన్నవించుకుంటారు. కాని అప్పుడు వారి కోరిక తీర్చటం జరుగదు.
అబూ హురైరహ్‌ (ర) అభిప్రాయం: అవిశ్వాసి తన సమా ధిలో ఉంచబడి నరకంలోని తన నివాసాన్ని చూసుకొని, ‘ఓ నా ప్రభూ! నన్ను వెనక్కి పంపు, నేను పశ్చాత్తాపం చెంది సత్కార్యాలు చేసుకుంటాను,’ అని వేడుకుంటాడు. దానికి, ‘నీకు ఇవ్వబడిన వయస్సును నీవు వినియోగించుకున్నావు,’ అని సమాధానం లభిస్తుంది. అనంతరం అతని సమాధి ఇరుకైపోతుంది. పాములు, తేళ్ళు అతన్ని చుట్టుముడతాయి.
‘ఆయి’షహ్‌ (ర) అభిప్రాయం: ‘అవిశ్వాసులు, పాపా త్ములకు వారి సమాధులు కష్టాల నిలయాలుగా మారుతాయి. వారి సమాధుల్లో వారిని నల్లని సర్పాలు కాటువేస్తూ ఉంటాయి. అవి అతన్ని అన్ని వైపుల నుండి చుట్టుముడతాయి. ఇదే ఆ బర్‌’జ’ఖ్‌ ప్రపంచం. ఇక్కడ వారు తీర్పుదినం వరకు ఉంటారు.’ (ఇబ్నె కసీర్‌)
బర్‌’జ’ఖ్‌, సమాధి కారుణ్యాలు, శిక్షలు వాస్తవం. ముస్లిములందరూ వీటిని విశ్వసించాలి. ఖుర్‌ఆన్‌, ‘హదీసు’ల్లో వీటిని గురించి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. బుద్ధీ జ్ఞానాల ద్వారా కూడా మనం వీటిని గ్రహించవచ్చు. ఎందుకంటే మానవునిలో రెండు విషయాలు ఉన్నాయి: 1. ఆత్మ 2. శరీరం. జీవితంలో మానవునికి కలిగే కష్టసుఖాలను ఆత్మ, శరీరం రెండూ గ్రహిస్తాయి. ప్రపంచంలో ఆత్మ శరీరాన్ని అనుసరించి ఉంటుంది. మరణానంతరం శరీరం ఆత్మను అనుసరించి ఉంటుంది. మానవ జీవితంలో దీన్ని మనం చాలా సులువుగా గ్రహించగలం. మానవుడు స్వప్నాలు చూస్తూ ఉంటాడు. వాటిలో సుఖాలు, కష్టాలు రెండూ ఉంటాయి. అంటే ఆత్మ, శరీరం రెంటితో వాటి సంబంధం ఉంటుంది. ఒక్కోసారి కలలో చూసిన విషయాలు, గుర్తులు వాటి చిహ్నాలను తన శరీరంపై ఉండటం చూస్తాడు.
ఏది ఏమైనా నిద్రావస్థలో వచ్చే స్వప్నాలు ఆత్మపై ప్రభావం చూపుతాయి. దాని ప్రభావం శరీరంపై కూడా పడుతుంది. ఒక వ్యక్తికి సంబంధించిన కలను గురించి మరో వ్యక్తి చెప్పలేడు. ఎందుకంటే అది అతని ఆత్మతో సంబంధం కలిగి ఉంటుంది. ఆలమె బర్‌జఖ్‌లో అంటే సమాధి నుండి తీర్పు దినం వరకు సంభవించే విషయాల గురించి రాబోయే ‘హదీసు’ల్లో పేర్కొనడం జరిగింది. బుద్ధీజ్ఞానాలు గల వ్యక్తికి వీటిని అర్థం చేసుకోవటం అంత కష్టమైన పని కాదు.
షాహ్‌ వలియుల్లాహ్‌ ” ‘హుజ్జతుల్లాహి అల్‌ బాలి’గహ్‌” లో ‘ ‘గజాలీ అభిప్రాయాన్ని పేర్కొన్నారు. సమాధి శిక్షలకు సంబంధించిన ‘హదీసు’లన్నీ ప్రామాణికమైనవే. వీటి విషయాలు రహస్యంగా ఉన్నాయి. కాని దూరదృష్టి గలవారు వాటిని గ్రహిస్తారు. అందులో ఏమి జరుగుతుందో తెలియనంత మాత్రాన వాటిని తిరస్కరించడం తగదు. ఏమాత్రం విశ్వాసం ఉన్నా వీటిని ధృవీకరించవలసిందే. ఎందుకంటే ఈ విషయాలను మన కళ్ళు చూడలేవు. మన చెవులు వినలేవు, అటువంటప్పుడు వాటిని గురించి తెలుసుకోవాలని ఆరాట పడటం తగదు.

ప్రవక్త (స) అనుచరులు జిబ్రీల్‌ (అ) రావటాన్ని ఎలా గుర్తించేవారు? జిబ్రీల్‌ వారికి కనబడేవారు కాదు. అయితే జిబ్రీల్‌ (అ) ప్రవక్త (స)కు కనబడేవారు. కనుక ప్రవక్త (స) వారిని చూడగలిగేవారు, ఫలితంగా ఆయన (స) బోధించే వారు, హెచ్చరించేవారు. మానవుల కళ్ళు దైవదూతలను చూడలేనప్పుడు, జిన్నులను చూడలేనప్పుడు ఇటువంటి విషయాలు ఎలా చూడగలరు. అందువల్ల వీటిని గురించి అధికంగా ఆలోచించడం కంటే అల్లాహ్‌ (త) ఆదేశాలు, ప్రవక్త (స) ఉపదేశాలను విశ్వసిస్తూ వాటిపై స్థిరంగా ఉండటమే శ్రేయస్కరం.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
125 – [ 1 ] ( متفق عليه ) (1/45)
عَنِ الْبَرَّاءِ بْنِ عَازِبٍ, عن رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم, قَالَ: “اَلْمُسْلِمُ إِذَا سُئِلَ فِيْ الْقَبْرِ؛ يَشْهَدُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهَ وَأَنَّ مُحَمَّدًا رَسُوْلُ اللهِ, فَذَلِكَ قَوْلُهُ: (يُثَبِّتُ اللهُ الَّذِيْنَ آمَنُوْا بِالْقَوْلِ الثَّابِتِ فِيْ الْحَيَاةِ الدُّنْيَا وَفِيْ الْآخِرَةِ؛ 14: 27)”.
وَفِيْ رِوَايَةِ عَنْ النَّبِيِّ صلى الله عليه وسلم, قَالَ: “(يُثَبِّتُ اللهُ الَّذِيْنَ آمَنُوْا بِالْقَوْلِ الثَّابِتِ؛ 14: 27) نَزَلَتْ فِيْ عَذَابِ الْقَبْرِ, يُقَالُ لَهُ: مَنْ رَبُّكَ؟ فَيَقُوْلُ: رَبِّيْ اللهُ, وَنَبِيِّيْ مُحَمَّدٌ” .متفق عليه.

(1) [1/45-ఏకీభవితం]
బరా’బిన్‌ ‘ఆజి’బ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సమాధిలో ముస్లిమ్‌ ను, నీ ప్రభువు ఎవరు, నీ ప్రవక్త ఎవరని ప్రశ్నించినపుడు అతడు నిస్సందేహంగా నా ప్రభువు అల్లాహ్‌(త) అని ఆయన తప్ప ఆరాధ్యులెవరూ లేరని, నిస్సందేహంగా ము’హమ్మద్‌ (స) అల్లాహ్‌(త) ప్రవక్త అని సాక్ష్యం ఇస్తాడు. ఇదే ఈ ఆయతు అర్థం. విశ్వాసిని అల్లాహ్‌(త) సత్యవచనంపై స్థిరంగా ఉంచుతాడు. ఇహలోకంలో కూడా, పరలోకంలో కూడా.
మరో ఉల్లేఖనంలో ప్రవక్త (స) ఈ ఆయత్: ”యు స’బ్బి తుల్లాహు…” (సూ. ఇబ్రాహీం, 14:27), సమాధి శిక్ష గురించి అవతరించబడిందని ప్రవచించారు. అంటే సమాధిలో శవాన్ని, ‘నీ ప్రభువు ఎవరు?’ అని ప్రశ్నించినపుడు, విశ్వాసి, ‘నా ప్రభువు అల్లాహ్‌(త), నా ప్రవక్త ముహమ్మద్‌(స),’ అని సమాధానం ఇస్తాడు. )

వివరణ-125: అంటే సమాధిలో శవం వద్దకు ఇద్దరు దైవదూతలు వస్తారు. వారు, ‘నీ ప్రభువు ఎవరని, నీ ప్రవక్త ఎవరని, నీ ధర్మం ఏదని,’ ప్రశ్నిస్తారు. ఒకవేళ ముస్లిమ్‌ అయితే, ‘నా ప్రభువు అల్లాహ్‌ (త) అని, ఆయన తప్ప ఆరాధ్యులెవరూ లేరని, నా ప్రవక్త ము’హమ్మద్‌ (స) అని, నాధర్మం ఇస్లాం,’ అని సమాధానం ఇస్తాడు. అంటే అల్లాహ్‌(త) విశ్వాసి యొక్క పవిత్ర వచనాన్ని స్థిరంగా ఉంచుతాడు. స్థిరవచనం అంటే కలిమహ్‌ షహాదహ్‌. సమాధిలో అడగటం జరుగుతుంది. విశ్వాసి అల్లాహ్‌ (త) దయవల్ల సమాధానం సరిగ్గా ఇస్తాడు. ఈ కలిమయె షహాదత్ లో మూడు ప్రశ్నల సమాధానాలు ఉన్నాయి. ప్రపంచంలో కలిమయె షహాదత్ పై స్థిరంగా ఉండటం అంటే, ఒక విశ్వాసిని అగ్నిపరీక్షకు గురిచేసినా అతడు కలిమయె షహాదత్ పై స్థిరంగా ఉంటాడు. ఈ ‘హదీసు’ ఉల్లేఖకులు ప్రవక్త (స) అనుచరులైన బరా బిన్‌ ‘ఆ’జిబ్‌ (ర) అ’న్సారీ. ఇతడు ఎల్లప్పుడూ పోరాటాల్లో పాల్గొనేవారు. ఈ ‘హదీసు’ను ప్రత్యేకంగా ప్రచారం చేసేవారు. ఇతడు 305 హదీసులు ఉల్లేఖించాడు. 22 ‘హదీసు’లు బు’ఖారీ- ముస్లిమ్‌లలో ఉన్నాయి. ఇతడు 72వ హిజ్రీ శకంలో కూఫాలో మరణించాడు.
(బు’ఖారీ, ముస్లిమ్‌)
126 – 2 (1/45)
عَنْ أَنَسٍ رضي الله عَنْه, قال: قال رسول الله صلى الله عليه وسلم: “إِنَّ الْعَبْدَ إِذَا وُضِعَ فِيْ قَبْرِهِ, وَتَوَلَّى عَنْهُ أَصْحَابُه (و) إِنَّهُ لَيَسْمَعَ قَرَعَ نِعَالِهمْ أَتَاهُ مَلَكَانِ فَيُقْعِدَانِهِ, فَيَقُوْلَانِ: مَا كُنْتَ تَقُوْلُ فِيْ هَذَا الرَّجُلِ؟ لِمُحَمَّدٍ صلى الله عليه وسلم: فَأَمَّا الْمُؤْمِنُ فَيَقُوْلُ: أَشْهَدُ أَنَّهُ عَبْدُ اللهِ وَرَسُوْلُهُ. فَيُقَالُ لَهُ: اُنْظُرْ إِلَى مَقْعَدِكَ مِنَ النَّارِ, قَدْ أَبْدَلَكَ اللهُ بِهِ مَقْعَدًا مِّنَ الْجَنَّةِ, فَيُرَاهُمَا جَمِيْعًا. وَأَمَّا الْمُنَافِقُ وَالْكَافِرُ فَيُقَالُ لَهُ: مَا كُنْتَ تَقُوْلُ فِيْ هَذَا الرَّجُلِ؟ فَيَقُوْلُ: لَا أَدْرِيْ! كُنْت أَقُوْلُ مَا يَقُوْلُ النَّاسُ! فَيُقَالُ: لَا دُرَيْتَ وَلَا تَلَيْتَ, وَيُضْرِبُ بِمَطَارِقَ مِّنْ حَدِيْدٍ ضَرْبَةً فَيَصِيْحُ صَيْحَةً يَّسْمَعُهَا مَنْ يَّلِيْهِ غَيْرَ الثَّقَلَيْنِ”. لَفْظُهُ لِلْبُخَارِيِّ.

(2) [1/45-దృఢం]
అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నిస్సందేహంగా వ్యక్తిని సమాధిలో పెట్టి ప్రజలు తిరిగి వెళుతూ ఉన్నప్పుడు, ఆ శవం వారి చెప్పుల శబ్దం వింటుంది. అతని వద్దకు ఇద్దరు దైవదూతలు వచ్చి, అతన్ని కూర్చోబెడతారు. ‘మీ దగ్గరకు ప్రవక్తగా పంపబడిన వ్యక్తి గురించి నీ అభిప్రాయం ఏమిటి?’ అని ప్రశ్నిస్తారు. దానికి ఆ వ్యక్తి, ‘అతను(స), అల్లాహ్‌(త) దాసులు, ఆయన ప్రవక్త,’ అని సాక్ష్యం ఇస్తాడు. అప్పుడు వారు, ‘నరకంలో ఉన్న నీ స్థానాన్ని చూడు, కాని నీవు విశ్వసించినందు వల్ల, అల్లాహ్‌(త) నీకు స్వర్గంలో నివాసం ఏర్పాటు చేశాడు.’ అని అంటారు. అప్పుడా వ్యక్తి స్వర్గ-నరకాల్లో ఉన్న తన రెండు నివాసాలను చూస్తాడు.
ఒకవేళ ఆ మృతుడు, అవిశ్వాసి లేదా కపటాచారి అయితే, అతన్ని కూడా ఈవిధంగానే ప్రశ్నించడం జరుగుతుంది. ‘మీ వద్దకు ప్రవక్తగా పంపబడిన వ్యక్తి గురించి నీకు ఏం తెలుసు,’ అని ప్రశ్నిస్తారు. దానికి అతడు, ‘నాకేమీ తెలియదు. ప్రజలు అన్నదే నేనూ అనేవాడిని,’ అని అంటాడు. అంటే కపటాచారి తన్ను రక్షించుకోవటానికి నేను ముస్లిమ్‌ను అనేవాడు. దాన్ని అర్థం చేసుకోలేదు, దాన్ని ఆచరించనూ లేదు. కేవలం ముస్లిములను చూసి అనేవాడు. అందువల్లే దైవదూతలు అడిగే ప్రశ్నలకు వాస్తవం నాకు తెలియదు. ప్రజలు అన్నదే నేనూ అనే వాడిని. అప్పుడు ఆ వ్యక్తితో, ‘నీవు బుద్ధీజ్ఞానాలు ఉపయోగించలేదు, బుద్ధిమంతులను అనుసరించనూ లేదు. ఖుర్‌ఆన్‌ పఠించలేదు, దాని ప్రకారం అనుసరించనూ లేదు,’ అని అంటూ అతన్ని ఇనుప కడ్డీలతో కొడతారు. దానికి అతడు కేకలు పెడ బొబ్బలు పెడతాడు. వాటిని మానవులు, జిన్నాతులు తప్ప అందరూ వింటారు. (బు’ఖారీ, ముస్లిమ్‌, పదాలు బు’ఖారీలోనివి)
127 – [ 3 ] ( متفق عليه ) (1/45)
عَنْ عَبْدِاللهِ بْنِ عُمَرَ رضي الله عَنْهُمَا, قال: قال رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَحَدَكُمْ إِذَا مَاتَ عُرِضَ عَلَيْهِ مَقْعَدَهُ بِالْغَدَاةِ وَالْعَشِيِّ, إِنْ كَانَ مِنْ أَهْلِ الْجَنَّةِ فَمِنْ أَهْلِ الْجَنَّةِ, وَإِنْ كَانَ مِنْ أَهْلِ النَّارِ فَمِنْ أَهْلِ النَّارِ, فَيُقَالَ: هَذَا مَقْعَدُكَ حَتَّى يَبْعَثَكَ اللهُ اليه يَوْمَ الْقِيَامَةِ”.

(3) [1/45-ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”మీలో ఎవరైనా చనిపోతే సమాధిలో ఉదయం, సాయంత్రం అతని నివాసాన్ని చూపెట్టటం జరుగు తుంది. అతడు స్వర్గవాసి అయితే స్వర్గం చూపెట్టటం జరుగు తుంది. నరకవాసి అయితే నరకం చూపెట్టడం జరుగు తుంది. ఇంకా అతనితో తీర్పుదినం వరకు ఇదే నీ నివాసం, తీర్పుదినం నాడు అల్లాహ్‌(త) నిన్ను మరల లేపుతాడని అంటారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)
128 – [ 4 ] ( متفق عليه ) (1/46)
وَعَنْ عائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا, أَنَّ يَهُوْدِيَّةً دَخَلَتْ عَلَيْهَا, فَذَكَرَتْ عَذَابَ الْقَبْرِ, فَقَالَتْ لَهَا: أَعَاذَكِ اللهُ مِنْ عَذَابِ الْقَبْرِ, فَسَأَلَتْ عَائِشَةُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَنْ عَذَابِ الْقَبْرِ. فَقَالَ: “نَعَمْ, عَذَابُ الْقَبْرِ حق”. قَالَتْ عَائِشَةُ رضي الله عَنْها: فَمَا رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم بَعْدُ صلى صَلَاةً إِلَّا تَعَوّذَ بالله مِنْ عَذَابِ الْقَبْرِ”.

(4) [1/46-ఏకీభవితం]
‘ఆయి’షహ్‌ (ర) కథనం: ఆమె వద్దకు ఒక యూద స్త్రీ వచ్చింది. సమాధి శిక్షను గురించి ప్రస్తావించి, ” ‘ఆయి’షహ్! నిన్ను అల్లాహ్‌(త) సమాధిశిక్షల నుండి కాపాడు గాక!’ అని అన్నది. ‘ఆయి’షహ్‌ (ర) ప్రవక్త (స)ను సమాధిశిక్షల గురించి అడిగారు. దానికి ప్రవక్త (స), ‘అవును, సమాధిశిక్షలు వాస్తవమే’ అని అన్నారు. ఆ సంఘటన తర్వాత ప్రవక్త (స) ప్రతి నమాజు తర్వాత సమాధిశిక్షల నుండి శరణు కోరేవారు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)
129 – 5 (1/46)
عَنْ زَيْدِ بْنِ ثَابِتٍ, قَالَ: بَيْنَمَا النبي صلى الله عليه وسلم فِيْ حَائِطِ لِّبَنِي النَّجَّارِ عَلَى بَغْلِةِ لَهُ وَنَحْنُ مَعَهُ, إذ حَادَتْ بِهِ و كَادَتْ تُلْقِيْهِ. وَإِذَا أَقْبُرٌ سِتَّةٌ أَوْ خَمْسَةٌ, فقَالَ: “مَنْ يَّعْرِفُ أَصْحَابَ هَذِهِ الْأَقْبُرِ؟” قَالَ رَجُلٌ: أَنَا. قَالَ: “فَمَتَى مَاتَوا؟” قَالَ: في الشرك. فَقَالَ: “إِنَّ هَذِهِ الْأُمَّةُ تُبْتَلَى فِيْ قُبُوْرِهَا, فَلَوْلَا أَنْ لَّا تَدَافَنُوْا لَدَعَوْتُ الله أَنْ يُّسْمِعَكُمْ مِنْ عَذَابِ الْقَبْرِ الَّذِيْ أَسْمَعُ مِنْهُ”, ثُمَّ أَقْبَلَ بِوَجْهِهِ علينا, فَقَالَ: “تَعَوَّذُوْا بِاللهِ مِنْ عَذَابِ النَّارِ”. قَالُوْا: نَعُوْذُ باِللهِ مِنْ عَذَابِ النَّارِ. قَالَ: “تَعَوَّذُوْا بِاللهِ مِنَ عَذَابِ الْقَبْرِ”. قَالُوْا: نَعُوْذُ بِاللهِ مِنْ عَذَابِ الْقَبْرِ. قَالَ: “تَعَوَّذُوْا بِاللهِ مِنْ الْفِتَنِ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ”. قَالُوْا: نَعُوْذُ بِاللهِ مِنَ الْفِتَنِ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ. قَالَ: “تَعَوَّذُوْا بِاللهِ مِنْ فِتْنَةِ الدَّجَّالِ”. قَالُوْا: نُعُوْذُ بِاللهِ مِنْ فِتْنَةِ الدَّجَّالِ. رَوَاهُ مُسْلِمٌ.

(5) [1/46-దృఢం]
‘జైద్‌ బిన్‌ సా’బిత్‌ (ర) కథనం: ఒకసారి ప్రవక్త (స) తన గాడిదపై బనీ నజ్జార్‌ తోటలోకి వెళుతున్నారు. మేము కూడా ఆయన (స) వెంట ఉన్నాం. అకస్మాత్తుగా ఆ గాడిద భయంతో కంపించి గెంత సాగింది. ప్రవక్త (స)ను పడవేస్తుం దన్నట్టుగా అనిపించింది. అక్కడ 5 లేక 6 సమాధులు ఉన్నట్టు తెలిసింది. అప్పుడు ప్రవక్త (స) అక్కడున్న వారితో, ‘ఈ సమాధుల్లో ఉన్నవారు మీలో ఎవరికైనా తెలుసా?’ అని అన్నారు. దానికి ఒక వ్యక్తి, ‘నాకు తెలుసు,’ అని అన్నాడు. ప్రవక్త (స) అతనితో, ‘వీరు ఏ స్థితిలో మరణించారు,’ అని ప్రశ్నించారు. దానికి ఆ వ్యక్తి, ‘తిరస్కారులుగా మరణించారు,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘ఈ అనుచర సమాజం సమాధుల్లో విచారించ బడుతుంది, మీరు సమాధులలో శవాలను ఖననం చేయరనే భయం ఉండకపోతే, నేను వింటున్న సమాధి శిక్ష శబ్దాన్ని మీకు కూడా వినిపించమని అల్లాహ్‌(త)ను ప్రార్థించేవాడిని,’ అని అన్నారు.

ఆ తరువాత ప్రవక్త (స) మా వైపు తిరిగి, ”మీరు అగ్ని శిక్ష నుండి అల్లాహ్‌(త)ను శరణుకోరండి, అంటే అల్లాహ్‌(త)ను మిమ్మల్ని నరక శిక్షనుండి రక్షించమని ప్రార్థించండి,’ అని హితబోధ చేశారు. అప్పుడు మేము, ‘అల్లాహ్‌(త)ను అగ్నిశిక్ష నుండి శరణు కోరుతున్నాము,’ అని అన్నాము. అప్పుడు మళ్ళీ ప్రవక్త (స), ‘మీరు అల్లాహ్‌(త)ను సమాధిశిక్షల నుండి శరణుకోరండి,’ అని అన్నారు. అప్పుడు ‘మేము ‘అల్లాహ్‌ (త)ను సమాధి శిక్షలనుండి శరణుకోరుతున్నాము,’ అని అన్నాము. మళ్ళీ ప్రవక్త (స,)’ మీరు అల్లాహ్‌(త)ను అంతర్బాహ్య ఉపద్రవాల నుండి శరణుకోరండి,’ అని అన్నారు. అప్పుడు ‘మేము అంతర్బాహ్య ఉపద్రవాల నుండి అల్లాహ్‌ (త)ను శరణుకోరుతున్నాము,’ అని అన్నాము. మళ్ళీ ప్రవక్త (స), ‘మీరు దజ్జాల్‌ ఉపద్రవాల నుండి అల్లాహ్‌(త) శరణు కోరండి, ‘ అని అన్నారు. మేము, ‘అల్లాహ్‌(త)ను దజ్జాల్‌ ఉపద్రవాల నుండి శరణు కోరుతున్నాము,’ అని అన్నాము. (ముస్లిమ్‌)

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
130 – 6 (1/46)
عَنْ أَبِيْ هُرَيْرَةَ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا قُبِرَ الْمَيِّتُ أَتَاهُ مَلَكَانِ أَسْودَانِ أَزْرَقَانِ. يُقَالُ لِأَحَدِهِمَا: الْمُنْكِرُ, وَالْآخِرُ: النَّكِيْرُ. فَيَقُوْلَانِ: مَا كُنْتَ تَقُوْلُ فِيْ هَذَا الرَّجُلِ؟ فَيَقُوْلُ: هُوَ عَبْدُ اللهِ وَرَسُوْلُهِ, أَشْهَدُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ. فَيَقُوْلَانِ: قَدْ كُنَّا نَعْلَمُ أَنَّكَ تَقُوْلُ هَذَا, ثُمَّ يُفْسَحُ لَهُ فِيْ قَبْرِهِ سَبْعُوْنَ ذِرَاعًا فِيْ سَبْعِيْنَ. ثُمَّ يُنَوَّرُ لَهُ فِيْهِ ثُمَّ يُقَالُ لَهُ: نَمْ. فَيَقُوْلُ: أرْجِعُ إِلَى أَهْلِيْ فَأُخْبِرُهُمْ. فَيَقُوْلَانِ: نَمْ كَنَوْمَةِ الْعُرُوْسِ الَّذِيْ لَا يُوْقِظُهُ إِلَّا أَحَبُّ أَهْلِهِ إِلَيْهِ حَتَّى يَبْعَثَهُ اللهُ مِنْ مَضْجَعِهِ ذَلِكَ. وَإِنْ كَانَ مُنَافِقًا قَالَ: سَمِعْتُ النَّاسَ يَقُوْلُوْنَ قولاً فَقُلْتُ مِثْلَهُ, لَا أَدْرِيْ. فَيَقُوْلَانِ: قَدْ كُنَّا نَعْلَمُ أَنَّكَ تَقُوْلُ ذَلِكَ, فَيُقَالُ لِلْأَرْضِ: الْتَئِمِيْ عَلَيْهِ, فَتَلْتَئِمُ عَلَيْهِ, فَتَخْتَلِفُ أَضْلَاعَهُ, فَلَا يَزَالُ فِيْهَا مُعَذَّبَا حَتَّى يَبْعَثَهُ اللهُ مِنْ مَّضْجَعِهِ ذَلِكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

(6) [1/46-ప్రామాణికం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”శవాన్ని సమాధిలో ఉంచిన తర్వాత, అతని వద్దకు నీలి కన్నులు గల ఇద్దరు నల్లని దైవదూతలు వస్తారు. ఒకరి పేరు మున్‌కర్‌, మరొకరి పేరు నకీర్‌. వారిద్దరూ శవాన్ని, ‘మీ వద్దకు ప్రవక్తగా పంపబడిన ఆ వ్యక్తి గురించి నీ అభిప్రాయం ఏమిటి,’ అని అడుగుతారు. ఒకవేళ అతడు విశ్వాసి అయితే, ”అతను (స) అల్లాహ్‌(త) దాసులు మరియు ఆయన ప్రవక్త. ‘నిస్సందేహంగా అల్లాహ్‌(త) తప్ప ఆరాధ్యులెవరూ లేరని, ము’హమ్మద్‌(స) అల్లాహ్‌(త)దాసులు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను,’ అని అంటాడు. అది విని ఆ ఇద్దరు దైవదూతలు, ‘నీవు ఇలా సమాధానం ఇస్తావని మాకు ముందే తెలుసు,’ అని అంటారు. ఆ తరువాత అతని సమాధిని అన్ని వైపుల నుండి 70 గజాల దూరం విశాల దృఢంపరచటం జరుగుతుంది. ఇంకా దాన్ని వెలుగుతో నింపటం జరుగుతుంది. ఇంకా అతన్ని, ‘నీవు సుఖంగా నిద్రపో,’ అని అనటం జరుగుతుంది.
అప్పుడా వ్యక్తి, ‘నేను నా కుటుంబం వారివద్దకు వెళ్ళి, సమాధి విషయాలను గురించి చెప్పాలను కుంటున్నాను,’ అని అంటాడు. దానికి దైవదూతలు, ‘నీవు పెళ్ళి కూతురిలా నిద్రపో. ఆమెను అందరికన్నా అధికంగా ప్రేమించేవాడే ఆమెను లేపగలడు.’ చివరికి అల్లాహ్‌ (త) అతన్ని అతని చోటు నుండి లేపుతాడు. అంటే తీర్పుదినం వరకు సుఖంగా నిద్రపో’ అని అంటారు.
ఒకవేళ ఆ వ్యక్తి కపటాచారి అయితే, దైవదూతల ప్రశ్నలకు, ‘ప్రజలు అన్నదే నేనూ అనే వాడిని. వాస్తవం నాకు తెలియదు,’ అని అంటాడు. దానికి ఆ ఇద్దరు దైవదూతలు, ‘నీవు ఇటు వంటి సమాధానం ఇస్తావని మాకు ముందే తెలుసు,’ అని అంటారు. ఆ వెంటనే భూమిని అన్ని వైపుల నుండి వత్తిడి చేయమని ఆదేశించడం జరుగుతుంది. ఫలితంగా అతని ప్రక్కటెముకలు విరిగిపోతాయి. అతడు నిరంతరం ఆ శిక్షకు గురవుతూనే ఉంటాడు. చివరికి తీర్పు దినం నాడు లేపబడతాడు.” (తిర్మిజి’)
131 – 7  (1/47)
عَنْ الْبَرَاءِ بْنِ عَازِبٍ، عَنْ رَّسُوْلِ اللهِ صلى الله عليه وسلم، قَالَ: “يَأْتِيْهِ مَلَكَانِ فَيُجْلِسَانِهِ، فَيَقُوْلَانِ لَهُ: مَنْ رَّبُّكَ؟ فَيَقُوْلُ: رَبِّيَ اللهُ. فَيَقُوْلَانِ لَهُ: مَا دِيْنُكَ؟ فَيَقُوْلُ: دِيْنِيَ الْإِسْلَامُ. فَيَقُوْلَانِ: مَا هَذَا الرَّجُلُ الَّذِيْ بُعِثَ فِيْكُمْ؟ فَيَقُوْلُ: هُوَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. فَيَقُوْلَانِ له: وَمَا يُدْرِيْكَ؟ فَيَقُوْلُ: قَرَأْتُ كِتَابَ اللهِ فَآمَنْتُ بِهِ وَصَدَّقْتُ؛ فَذَلِكَ قَوْلُهُ: (يُثَبِّتُ اللهُ الَّذِيْنَ آمَنُوْا بِالْقَوْلِ الثَّابِتِ فِيْ الْحَيَاةِ الدُّنْيَا وَفِيْ الْآخِرَةِ؛ 14: 27) الآية. قَالَ: فَيُنَادِيْ مُنَادٍ مِّنَ السَّمَاءِ: أَنْ قَدْ صَدَقَ عَبْدِيْ فَأَفْرِشُوْهُ مِنَ الْجَنَّةِ، وَأَلْبِسُوْهُ مِنَ الْجَنَّةِ، وَافْتَحُوْا لَهُ بَابًا إِلَى الْجَنَّةِ، و يُفْتَح. قَالَ: فَيَأْتِيْهِ مِنْ رُّوْحِهَا وَطِيْبِهَا، وَيُفْتَحُ لَهُ فِيْهَا مَدَّ بَصَرِهِ. و أمَّا الْكَافِرُ فَذَكَرَ مَوْتَهُ، قَالَ: وَيُعَادُ رُوْحُهُ فِيْ جَسَدِهِ ، وَيَأْتِيْهِ مَلَكَانِ ، فَيُجْلِسَانِهِ فَيَقُوْلَانِ: مَنْ رَّبُّكَ؟ فَيَقُوْلُ: هَاهُ هَاهُ، لَا أَدْرِيْ! فَيَقُوْلَانِ لَهُ: مَا دِيْنُكَ؟ فَيَقُوْلُ: هَاهُ هَاهُ، لَا أَدْرِيْ! فَيَقُوْلَانِ: مَا هَذَا الرَّجُلُ الَّذِيْ بُعِثَ فِيْكُمْ؟ فَيَقُوْلُ: هَاهُ هَاهُ، لَا أَدْرِيْ! فَيُنَادِيْ مُنَادٍ مِّنَ السَّمَاءِ: أَنْ كَذَبَ فَأَفْرِشُوْهُ مِنَ النَّارِ، وَأَلْبِسُوْهُ مِنَ النَّارِ، وَافْتَحُوْا لَهُ بَابًا إِلَى النَّارِ. قَالَ: فَيَأْتِيْهِ مِّنْ حَرِّهَا وَسَمُوْمِهَا. قَالَ: وَيَضِيْقُ عَلَيْهِ قَبْرُهُ حَتَّى تَخْتَلِفَ فِيْهِ أَضْلَاعُهُ، ثُمَّ يُقَيَّضُ لَهُ أَعْمَى أَصَم، مَعَهُ مِرْزَبَةٌ مِّنْ حَدِيْدٍ، لَوْ ضُرِبَ بِهَا جَبَلٌ لَصَارَ تُرَابًا، فَيُضْرَبُهُ بِهَا ضَرْبةً يَّسْمَعُهَا مَا بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ إِلَّا الثَّقَلَيْنِ فَيَصِيْرُ تُرَابًا، ثُمَّ تُعَادُ فِيْهِ الرُّوْحُ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ .

(7) [1/47-దృఢం]
బరా’బిన్‌ ‘ఆజి’బ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సమాధిలోని శవంవద్దకు ఇద్దరు దైవదూతలు వస్తారు, శవాన్ని లేపి కూర్చోబెడతారు. అనంతరం ఆ ఇద్దరూ అతన్ని, ‘నీ ప్రభువు ఎవరు?’ అని అంటారు. ఆ వ్యక్తి విశ్వాసి అయితే, ‘నా ప్రభువు అల్లాహ్‌,’ అని సమా ధానం ఇస్తాడు. మళ్ళీ వారిద్దరూ, ‘నీ ధర్మం ఏమిటి,’ అని ప్రశ్నిస్తారు. దానికి ఆ వ్యక్తి, ‘నా ధర్మం ఇస్లామ్‌,’ అని అంటాడు. మళ్ళీ ఆ దైవదూతలు, ‘మీ వద్దకు పంపబడిన ఆ వ్యక్తి ఎవరు,’ అని అంటారు. దానికి ఆ వ్యక్తి,’అతను అల్లాహ్‌ ప్రవక్త,’ అనిసమాధానం ఇస్తాడు. దానికి ఆ దైవ దూతలు, ‘నీకీ విషయాలు ఎలా తెలిశాయి,’ అని అంటారు. దానికి ఆ వ్యక్తి, ‘నేను దైవ గ్రంథాన్ని చదివాను, అల్లాహ్‌ (త)ను విశ్వసించాను. ఇంకా దాన్ని ధృవీకరించాను,’ అని అంటాడు.
ఈ ఆయతు అంటే: ”యుస’బ్బితుల్లాహు…” – అల్లాహ్‌ (త) విశ్వాసుల పవిత్ర వచనాన్ని స్థిరంగా ఉంచుతాడు. ఆ తరువాత ఆకాశం నుండి, ‘నా దాసుడు సత్యం పలికాడు, అతడి కోసం స్వర్గ పడకను పరచండి, స్వర్గదుస్తులు తొడి గించండి, ఇంకా అతని కోసం స్వర్గ కిటికీలు తెరవండి,’ అని పిలుపునివ్వటం జరుగుతుంది. అనంతరం స్వర్గ కిటికీలు తెరవటం జరుగుతుంది. వాటి ద్వారా ఆహ్లాదకరమైన గాలి, సువాసన వస్తూ ఉంటుంది. కను చూపు మేరకు అతని సమాధి విశాలపరచ బడుతుంది.
ఒకవేళ అవిశ్వాసి అయితే, అతని ఆత్మ అతని శరీరంలోకి రప్పించబడుతుంది. అతని వద్దకు ఇద్దరు దైవదూతలు వచ్చి అతన్ని కూర్చోబెడతారు. ‘నీ ప్రభువు ఎవరు,’ అని ప్రశ్నిస్తారు. దానికతడు, ‘నాకు తెలియదే’ అని వాపోతాడు. మళ్ళీ ఆ దైవదూతలు, ‘నీ ధర్మం ఏది?’ అని అడుగుతారు. దానికా వ్యక్తి, ‘నాకు తెలియదే,’ అని విచారిస్తాడు. మళ్ళీ వారిద్దరూ, ‘మీ వైపునకు పంపబడిన ఆ వ్యక్తి గురించి నీకేం తెలుసు,’ అని అడుగుతారు. దానికి ఆ వ్యక్తి, ‘నాకు తెలియదే, ఏం చేయను!’ అని అంటాడు. అప్పుడు ఆకాశం నుండి, ‘వీడు అబద్ధాల కోరు, వీడికోసం అగ్నిపడక పరచండి, వీడికి అగ్నిదుస్తులు ధరించండి, ఇంకా వీడికోసం నరక కిటికీలు తెరవండి,’ అని పిలుపు నివ్వడం జరుగుతుంది. అనంతరం నరక కిటికీలు తెరవబడతాయి. దానిద్వారా వేడిగాలులు, దుర్వాసన వస్తూ ఉంటాయి. ఇంకా అతని కోసం అతని సమాధి ఇరుకుగా చేయబడుతుంది. అన్ని వైపుల నుండి వత్తిడి వల్ల ప్రక్కటెముకలు విరిగి చిందర వందర అయిపోతాయి. ఇంకా అతనిపై అంధుడు, చెవిటివాడైన దైవదూత నియమించ బడతాడు. అతని వద్ద ఇనుపగద ఉంటుంది. ఒకవేళ దానితో గుట్టను కొడితే అది పిండి అయిపోతుంది. దానితో అతన్ని కొట్టడం జరుగుతుంది. దానికి అతడు కేకలు, పెడబొబ్బలు ప్రారంభిస్తాడు. అతని కేకలు మానవులు, జిన్నాతులు తప్ప మిగతా ప్రాణులన్నీ వింటాయి. ఆ దెబ్బలకు అతడు పిండి-పిండి అయిపోతాడు. మళ్ళీ అతన్ని సజీవపరచటం జరుగు తుంది. తీర్పుదినం వరకు ఇలాగే జరుగుతూ ఉంటుంది.” (అబూ దావూద్‌)
132 – 8 (1/48)
وَعَنْ عُثْمَانَ رضي الله عَنْه، أَنَّهُ إِذَا وَقَفَ عَلَى قَبْرٍ بَكَى حَتَّى يَبُلَّ لِحْيَتَهُ، فَقِيْلَ لَهُ: تُذْكَرُ الْجَنَّةُ وَالنَّارُ فَلَا تَبْكِيْ، وَتَبْكِيْ مِنْ هَذَا؟ فَقَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ الْقَبْرَ أَوَّلُ مَنْزِلٍ مِنْ مَّنَازِلِ الْآخِرَةِ، فَإِنْ نَجَا مِنْهُ فَمَا بَعْدَهُ أَيْسَرُ مِنْهُ، وَإِنْ لَّمْ يَنْجُ مِنْهُ فَمَا بَعْدَهُ أَشَدُّ مِنْهُ”. قَالَ: وَقَالَ رسولُ اللهِ صلى الله عليه وسلم: “مَا رَأَيْتُ مَنْظَرًا قَطُّ إِلَّا وَ الْقَبْرُ أَفْظَعُ مِنْهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

(8) [1/48-ప్రామాణికం]
‘ఉస్మాన్‌ (ర) కథనం: అతను ఏదైనా సమాధి వద్ద నిల బడితే, చాలాసేపు వరకు కన్నీరు కార్చుతూ ఉండేవారు. చివరికి అతని గడ్డం తడిసి ముద్దయి పోయేది. అతన్ని, ”తమరు స్వర్గనరకాల గురించి ప్రస్తావిస్తే ఏడ్వరు, మరి సమాధులను చూస్తే ఎందుకు ఏడుస్తున్నారు?” అని అడగటం జరిగింది. దానికి ‘ఉస్మాన్‌ (ర), ‘సమాధి పునరుత్థానదశలలో మొదటి దశ, ఈదశను దాట గలిగితే, తరువాత అంతా సులభమే, ఒకవేళ ఈ దశను దాటలేకపోతే, తరువాత అన్నీ కష్టాలే, సమాధికంటే భయంకరమైన దృశ్యం నేనెప్పుడూ చూడలేదు, అంటే సమాధి శిక్షల దృశ్యం చాలా భయంకరంగా ఉంటుంది,’ అని ప్రవక్త (స) ప్రవచించారు,’ అని ‘ఉస్మాన్‌ (ర) సమాధానం ఇచ్చారు. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్).
133 – 9 (1/48)
وعَنْ عُثْمَانَ رضي الله عَنْه، قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا فَرَغَ مِنْ دَفْنِ الْمَيِّتِ وَقَفَ عَلَيْهِ، فَقَالَ: “اِسْتَغْفِرُوْا لِأَخِيْكُمْ، ثُمَّ سَلُوْا لَهُ بِالتَّثْبِيْتِ، فَإِنَّهُ الْآنَ يُسْأَلُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

(9) [1/48-దృఢం]
‘ఉస్మాన్‌ (ర) కథనం: ప్రవక్త (స), శవాన్ని ఖననం చేసిన తర్వాత సమాధి వద్ద నిలబడి ప్రజలతో, ”మీ సోదరుని క్షమాపణ కోసం ప్రార్థించండి, అతడు స్థిరంగా ఉండటానికి ప్రార్థించండి. ఎందుకంటే ఇప్పుడు అత నిని ప్రశ్నించటం జరుగుతోంది.’ అని అనేవారు.” )

వివరణ-133: ఈ ‘హదీసు’ ద్వారా సమాధిని పూడ్చి పెట్టిన తర్వాత మృత్యుని క్షమాపణ కొరకు ప్రార్థించటం అభిలషణీయం.

స’యీద్‌ బిన్‌ మన్‌’సూర్‌, ఇబ్నె మస్‌’ఊద్‌ ద్వారా కథనం: ప్రవక్త (స) సమాధిని పూడ్చిపెట్టిన తర్వాత ఈ దు’ఆ పఠించే వారు: ”అల్లాహుమ్మ న’జల బిక సాహిబునా, వ ’ఖల్లఫ ద్దునియా ’ఖల్‌ఫ ”జహ్‌రిహీ, అల్లాహుమ్మ స‘బ్బిత్‌ ఇన్‌దల్‌ మస్‌అలతి మన్‌’తిఖహ్, వలా తబ్‌తలీహీ ఫీ ఖబ్‌రిహీ బిమా లా’తాఖత లహు బిహీ.” – ‘ఓ అల్లాహ్‌! నా అనుచరుడు నీ దగ్గరకు వచ్చాడు. అతడు ఇహలోకాన్ని తన వీపువెనుక వదలి వేశాడు. ఓ అల్లాహ్ (త)! ఇతన్ని ప్రశ్నించినపుడు మాట్లాడే శక్తిని, నాలుకను స్థిరంగా ఉంచు. ఇంకా శక్తికి మించి అతన్ని సమాధిలో పరీక్షించకు.’

ఆజిరీ కథనం: ఖనన సంస్కారాలు పూర్తిచేసిన తర్వాత సమాధి వద్ద నిలబడి మృతున్ని స్థిరంగా ఉంచమని ప్రార్థించడం అభిలషణీయం. ”అల్లాహుమ్మ హాజా’ అబ్దుక, వ అన్‌త అ’అలము బిహీ మిన్నావలా న’అలము మిన్హు ఇల్లా’ఖైరన్, వఖద్‌ అజ్‌లస్‌తహు లితస్‌అలహు.. అల్లాహుమ్మ ఫస’బ్బిత్‌హు బిల్‌ఖౌలిస్సా’బితి ఫిల్‌ ఆ’ఖిరతి, కమా స’బ్బతహు ఫిద్దునియా. అల్లాహుమ్మర్‌హుమ్‌హు వ అల్‌’హిఖ్‌హు బి నబియ్యిహి వలా తు’దిల్లనా బ’అదహూ వలా త’హ్‌రిమ్‌నా అజ్‌రహు” – ఓ అల్లాహ్‌(త)! ఇతడు నీ దాసుడు. ఇతని గురించి మా కన్నా నీకు బాగా తెలుసు, మాకు అతని గురించి మంచి మాత్రమే తెలుసు. ప్రశ్నించే నిమిత్తం నీవు అతన్ని కూర్చోబెట్టావు. ఓ అల్లాహ్‌(త)! అతన్ని సమాధిలో, పరలోకంలో పవిత్ర వచనం ద్వారా స్థిరంగా ఉంచు. ఇహలోకంలో అతన్ని స్థిరంగా ఉంచినట్టు. నీవు అతన్ని కరుణించి, అతన్ని అతని ప్రవక్తను కలవ నివ్వు. ఇంకా అతని తర్వాత మమ్మల్ని మార్గభ్రష్టత్వానికి గురిచేయకు. ఇంకా అతని పుణ్యం నుండి మాకు దూరం చేయకు. (తయ్యుల్‌ ఫరాసి’ఖ్‌ ఫీ అ’హ్‌వాలిల్‌ బరా’జి’ఖ్‌ / పేజీ-18)
ఖననం చేసిన తర్వాత కలిమ చదివించడానికి చెందిన ఉల్లేఖనాలన్నీ బలహీనమైనవే. మరియు క్రింది ‘హదీసు’ ద్వారా ఇదే అర్థం అవుతుంది. ‘హాఫి”జ్‌ ఇబ్నె ‘హజర్‌ ”తల్‌ ఖీసుల్‌ జీర్”లో ఇలా పేర్కొన్నారు, ప్రవక్త (స) ఖననం పూర్తయిన తర్వాత సమాధివద్ద నిలబడి, తమ అనుచరు లతో, ‘మీరు మీ సోదరుని క్షమాపణకు ప్రార్థించండి. దృఢత్వాన్ని గురించి, స్థిరత్వాన్ని గురించి ప్రార్థించండి. ఎందుకంటే, ఇప్పుడు శవాన్ని ప్రశ్నించడం జరుగుతుంది,’ అని అనేవారు. (‘హాకిమ్‌, బ’జ్జా’జ్ / అబూ-దావూద్‌)
(అబూ దావూద్‌)
134 – 10 (1/48)
عَنْ أَبِي سَعِيْدٍ الْخُدْرِيْ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُسَلّطُ عَلَى الْكَافِرِ فِيْ قَبْرِهِ تِسْعَةُ وَتِسْعُوْنَ تِنِّيْنًا، تَنْهَشُهُ وَتَلْدَغُهُ حَتَّى تَقُوْمَ السَّاعَةُ، وَلَوْ أَن تِنِّيْنًا مِنْهَا نَفَخَ فِيْ الْأَرْضِ مَا أَنْبَتَتْ خَضْرَاءَ”. رَوَاهُ الدَّارَمِيُّ، وَرَوَى التِّرْمِذِيُّ نَحَوُهُ، وَقَالَ: “سَبْعُوْنَ بَدَلَ تِسْعَةٌ وَتِسْعُوْنَ”.

(10) [1/48-బలహీనం]
అబూ స’యీద్‌ ‘ఖుదరీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అవిశ్వాసిపై సమాధిలో 99 విషసర్పాలు నియమించబడతాయి. అవి అతన్ని పునరుత్థానం వరకు కాటువేస్తూ ఉంటాయి. ఒకవేళ వాటిలో ఒక సర్పం భూమిపై బుసకొడితే, భూమిపై పంటలు పండవు.” (దార్మీ, తిర్మిజి’)

99కు బదులు 70 అనే పదం కూడా ఉంది. ఇందులో ఎటువంటి వ్యతిరేకత లేదు. ఇక్కడ అధిక సంఖ్యను సూచించడమే ముఖ్య ఉద్దేశ్యం. అంటే కొందరికి 99, మరి కొందరికి 70 సర్పాలు నియమించబడవచ్చు.

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
135 – 11 (1/49)
عَنْ جَابِرٍ رضى الله عنه، قَالَ: خَرَجْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم إِلَى سَعْدِ بْنِ مُعَاذٍ حِيْنَ تُوَفِّيَ، فَلَمَّا صَلَّى عَلَيْهِ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَوُضِعَ فِيْ قَبْرِهِ وَسُوِّيَ عَلَيْهِ، سَبَّحَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم، فَسَبَّحْنَا طَوِيْلًا، ثُمَّ كَبَّرَ، فَكَبَّرَنَا. فَقِيْلَ: يَا رَسُوْلَ اللهِ! لِمَ سَبَّحْتَ ثُمَّ كَبَّرْتَ؟ قَالَ: “لَقَدْ تَضَايَقَ عَلَى هَذَا الْعَبْدِ الْصَّالِحِ قَبْرُهُ حَتَّى فَرَجَهُ اللهُ عز وجل عَنْهُ”. رَوَاهُ أَحْمَدُ.

(11) [1/49-బలహీనం]
జాబిర్‌ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట స’అద్‌ బిన్‌ ము’ఆజ్‌’ జనా’జహ్ లో పాల్గొనడానికి బయలు దేరాము. ఆయన మరణించటం జరిగింది. ప్రవక్త (స) అతని జనా’జహ్ నమా’జు చదివించారు. ఇంకా అతన్ని సమాధిలో దించటం జరిగింది. ఖనన సంస్కారాలు పూర్తయ్యాయి. ప్రవక్త (స) తస్‌బీ’హ్‌ చదివారు. అంటే ‘సుబ్‌హానల్లాహ్‌,’ అన్నారు. మేము కూడా చాలాసేపు వరకు ‘సుబ్‌హానల్లాహ్‌,’ అన్నాము. ఆ తరువాత ప్రవక్త (స), ‘అల్లాహు అక్బర్‌’ అన్నారు. మేము కూడా, ‘అల్లాహు అక్బర్‌,’ అన్నాము. అనంతరం ప్రవక్త (స)ను ఎందుకు త’స్‌బీహ్‌ చదవడం జరిగిందని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ”ఈ అల్లాహ్‌(త) దాసుని కోసం సమాధి ఇరుకుగా అయిపోయింది. మన త’స్‌బీహ్‌, తక్‌బీర్‌ల శుభం వల్ల అతని సమాధి విశాల మయ్యింది.” (అబూ-దావూద్‌)
136 – 12 (1/49)
وَعَنْ ابْنِ عُمَرَ, قَالَ: قال رسوال الله صلى الله عليه وسلم: “هَذَا الَّذِيْ تَحَرَّكَ لَهُ الْعَرْشُ, وَفُتِحَتْ لَهُ أَبْوَابُ السَّمَاءِ, وَشَهِدَهُ سَبْعُوْنَ أَلْفًا مِّنْ الْمَلَائِكَةِ, لَقَدْ ضُمَّ ضُمَّةً ثُمَّ فُرِجَ عَنْهُ”. رَوَاهُ النَّسَائِيُّ.

(12) [1/49-దృఢం]
‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సఅద్‌ బిన్‌ ము’ఆజ్‌’ ఎటువంటివ్యక్తి అంటే అతని ఆత్మ ఆకాశంపై చేరగానే, అల్లాహ్‌ సింహాసనం సంతోషంతో ఊగసాగింది. ఇంకా ఆకాశ ద్వారాలు తెరువబడ్డాయి. ఇంకా 70 వేలమంది దైవదూతలు అతని జనా’జహ్ లో వచ్చారు. అయి నప్పటికీ అతని సమాధి అతని కోసం ఇరుకైపోయింది. ఆ తరువాత విశాల పరచబడింది.” )

వివరణ-136: ప్రేమవల్ల సమాధి ఇరుకై పోయింది, కాని బాధాకరంగా దాన్ని పేర్కొనడం జరిగింది. అందువల్లే ఈ అధ్యాయంలో పేర్కొనడం జరిగింది. వాస్తవం అల్లాహ్ (త) కే తెలుసు.
(నసాయి)
137 – 13 (1/49)
عَنْ أَسْمَاءِ بِنْتِ أَبِيْ بَكْرٍ رضي الله عَنْهَا, قَالَتْ: قَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم خَطِيْبًا, فَذَكَرَ فِتْنَةَ الْقَبْرِ الَّتَيْ يُفْتَنُ فِيْهَا الْمَرْءُ, فَلَمَّا ذَكَرَ ذَلِكَ, ضجَّ الْمُسْلِمُوْنَ ضَجَّةً. رَوَاهُ الْبُخَارِيُّ هَكَذَا, وَزَادَ النِّسَائِي: حَالَتْ بَيْنِيْ وَبَيْنَ أَنْ أَفْهَمَ كَلَامَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم, فَلَمَّا سَكَنَتْ ضَجَّتُهُمْ قُلْتُ لِرَجُلِ قَرِيْبٌ مِّنِّي: أَيْ بَارَكَ اللهُ فِيْكَ! مَاذَا قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ آخِرِ قَوْلِهِ؟ قَالَ: “قَدْ أَوْحَى إِلَيَّ أَنَّكُمْ تُفْتَنُوْنَ فِيْ الْقُبُوْرِ قَرِيْبًا مِّنْ فِتْنَةٍ الدَّجَّالِ”.

(13) [1/49-దృఢం]
అస్మా బిన్‌తె అబూ బక్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రసం గించటానికి నిలబడ్డారు, మానవులను పరీక్షించే సమాధి ఉపద్రవాలను గురించి పేర్కొన్నారు. ప్రవక్త (స) దీన్ని గురించి మాట్లాడిన తర్వాత, అక్కడున్న వారు ఏడ్వసాగారు. (బు’ఖారీ)
నసాయి’లో ఈ భాగం అధికంగా ఉంది. అస్మా’ (ర) కథనం: ప్రజల ఏడుపులు, కేకలవల్ల నేను ప్రవక్త (స) మాట లను సరిగా వినలేకపోయాను. ప్రజల ఏడ్పులు, కేకలు తగ్గిన తర్వాత నా ప్రక్కనే కూర్చున్న ఒక వ్యక్తిని, ”ప్రవక్త (స) ఏం ఉపదేశించారు,” అని అడిగాను. దానికి ఆ వ్యక్తి, ‘ప్రవక్త (స) సమాధుల్లో మిమ్మల్ని, దజ్జాల్‌ కాలంలో దజ్జాల్‌ ఉపద్రవాలకు గురిచేసి పరీక్షించినట్టు పరీక్షించడం జరుగుతుందని, నా వద్దకు దైవవాణి వచ్చిందని,’ అన్నారని,” అన్నాడు. )

వివరణ-137: అస్మా’ బిన్‌తె అబీబక్ర్‌: ఈమెకు జా’తున్ని’ ‘తాఖైన్‌ అనే బిరుదు ఉండేది. ఈమె అబూ బకర్‌ (ర) కుమార్తె. ‘జుబైర్‌ బిన్‌ అవ్వామ్‌తో ఈమె వివాహం జరిగింది. తన భర్తలాగే ఈమె కూడా ఇస్లామ్‌ స్వీకరించడంలో ముందడుగు వేశారు. ఇబ్నె ఇస్‌హాఖ్‌ ఉల్లేఖనం ప్రకారం విశ్వసించిన వారిలో ఈమె క్రమసంఖ్య 18. ప్రవక్త (స) మదీనహ్ వలస వెళ్ళినప్పుడు అబూ-బకర్‌ సిద్దీఖ్‌ వెంట ఉన్నారు. ప్రవక్త (స) మధ్యాహ్న సమయంలో అతని దగ్గరకు వెళ్ళారు. వలస వెళ్ళే విషయాన్ని తెలిపారు. అస్మా’ (ర) ప్రయాణ సామగ్రి సిద్ధంచేశారు. రెండు మూడు రోజుల ఆహారం సిద్ధంచేసి టిఫిన్‌లో పెట్టారు. ని”తాఖ్‌ అంటే స్త్రీలు నడుముకు కట్టుకునే వస్త్రం చించి టిఫిన్‌ సిద్ధంచేశారు. అందువల్లే ఈమెకు జాతున్నితాఖైన్‌ అనే బిరుదుతో పిలవటం జరుగుతుంది. (బు’ఖారీ)
అబూ-బకర్‌ (ర) తమవెంట తమ ధనాన్నంతా తీసుకొని వెళ్ళారు. ఈ విషయం అబూ-బక్ర్‌ తండ్రిగారైన అబూ-ఖ’హాఫహ్ కు తెలిసింది. ‘అబూ బక్ర్‌ ధన, ప్రాణ కష్టాలకు గురిచేశాడు,’ అని అన్నారు. కాని అస్మా (ర) అతనితో తండ్రి చాలా ధనం వదలిపెట్టి వెళ్ళారని, చెప్పి అబూ-బక్ర్‌ (ర) ధనం ఉంచినచోట రాళ్ళుపెట్టి తాత గారిని నమ్మించారు. ఆయన అంధులు గనుక, ‘సరే తిన టానికి ధనం ఉంది,’ అని అన్నారు. ఆ తరువాత, ‘తాత గారూ మనశ్శాంతికి ఇలా చేశాను, వాస్తవంగా అక్కడ డబ్బులేమీ లేవు,’ అని అన్నారు. (ముస్నద్‌ అహ్మద్‌)
ప్రవక్త (స) మదీనహ్ చేరిన తర్వాత స్త్రీలను పిలిపించారు. అస్మా’ (ర) కూడా వచ్చారు. ఖుబాలో నివసించసాగారు. అక్కడ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ (ర) జన్మించారు. ఆమె అతన్ని తీసుకొని ప్రవక్త (స) వద్దకువచ్చారు. ప్రవక్త(స) అతన్ని ఒడిలోకి తీసుకున్నారు. నోట్లో తీపిని పెట్టారు. ఇంకా అతన్ని గురించి ప్రార్థించారు. (బు’ఖారీ)
‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ (ర) యుక్త వయస్సుకు చేరిన తర్వాత ఆమె తన కుమారుని వద్దనే నివసించసాగారు. ఎందుకంటే ‘జుబైర్‌ బిన్‌ ‘అవ్వామ్‌ ఆమెకు విడాకులు ఇచ్చారు. (ఫత్‌’హుల్‌ బారీ)
‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ (ర) బాల్యంలో తీపితో పాటు ప్రవక్త (స) జలాన్ని కూడా ఆరగించి వున్నారు. అందువల్ల ‘అబ్దుల్లాహ్‌ యుక్త వయస్సుకు చేరుకునేసరికి, అతనిలో సద్గుణాలు ఉట్టి పడసాగాయి. ఇటు బనూ ‘ఉమయ్య పాలకుడు య’జీద్‌ దుర్మార్గంలో మునిగి ఉన్నాడు. ‘అబ్దుల్లాహ్‌ వాడి చేతిపై బై’అత్‌ చేయడానికి తిరస్క రించారు. మక్కహ్ లో నివసించసాగారు. అక్కడి నుండే తన పరిపాలన ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి అతని గురించి తెలిసి ఉండేది. అందువల్ల అతని పిలుపును స్వీకరించారు. దేశంలోని అధిక భాగం అతన్ని పాలకుడుగా స్వీకరించారు. కాని ‘అబ్దుల్‌ మలిక్‌ బిన్‌ మర్వాన్‌ అధికారంలోకి రాగానే తన పన్నాగాలతో కొన్ని ప్రాంతాలపై పట్టు సాధించాడు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ పై దాడికి సన్నాహాలు చేశాడు. సిరియా సైన్యం క’అబహ్ గృహాన్ని చుట్టుముట్టింది. అప్పుడు ఇబ్నె ‘జుబైర్‌ తల్లి వద్దకు వచ్చారు. అప్పు డామె అనారోగ్యం ఉన్నారు. ‘ఆరోగ్యం ఎలా ఉంది,’ అని అడి గారు. ఆమె, ‘అనారోగ్యంగా ఉన్నాను,’ అని అన్నారు. దానికి ‘అబ్దుల్లాహ్‌, ‘మనిషికి మరణం తరువాత శాంతి లభిస్తుంది,’ అని అన్నారు. దానికి అస్మా’ (ర), ‘నువ్వు నేను మరణించాలని కోరుతున్నట్టు ఉంది, కాని నేను ఇప్పుడే మరణించదలచుకోలేదు. నా కోరిక ఏమిటంటే నువ్వు పోరాడుతూ చంపబడి, నేను సహనం పాటించాలి, లేదా నీవు విజయుడవై, నాకు కంటిచలువ కలగాలి,’ అని అన్నారు. ఇబ్నె ‘జుబైర్‌ (ర) చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయారు. వీరమరణం సమయం రానే వచ్చింది. రెండవసారి తల్లి దగ్గరకు వచ్చారు. ఆమె మస్జిద్‌లో కూర్చున్నారు. ఒప్పందం గురించి సంప్రదించారు. దానికి ఆమె, ‘కుమారా! ప్రాణ భయంతో అవమాన కరమైన ఒప్పందం మంచిది కాదు. ఎందుకంటే గౌరవంగా కరవాలం ఎత్తటం, అవమానంతో కొరడా కొట్టటం కంటే మంచిది,’ అని అన్నారు. ఇబ్నె’జుబైర్‌ దాన్ని ఆచరించారు. యుద్ధం చేసి వీరమరణం పొందారు. ‘హజ్జాజ్‌ అతని శవాన్ని శిలువపై వ్రేలాడగట్టాడు. 3 రోజులు గడచిన తర్వాత అస్మా’ తన సేవకురాలిని తీసుకొని తనకొడుకు శవంవద్దకు వచ్చారు. శవం తలక్రిందులుగా వ్రేలాడబడి ఉంది. గుండె నిబ్బరం చేసుకొని ఆ దృశ్యాన్ని చూశారు. అతి ఓర్పూ సహనాలతో, ‘ఈ వాహనదారుడికి ఇంకా దిగేసమయం రాలేదా?’ అని అన్నారు. ‘హజ్జాజ్‌ కయ్యానికి మల్లీ కాలు దువ్వాడు. మనిషిని పంపి ఆమెను రమ్మన్నాడు. దానికి అస్మా’ తిరస్కరించారు. వాడు మళ్ళీ మనిషిని పంపి, ‘ఇప్పుడు వస్తే సరి, లేదా మళ్ళీ వచ్చే వ్యక్తి జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ తెస్తాడు,’ అని కబరు పంపాడు. అస్మా’ (ర) కేవలం అల్లాహ్‌ (త) గొప్పతనాన్ని స్వీకరించేది. ఆమె, ‘నేను రాలేను,’ అని కబరుపంపింది. అపుడు ‘హజ్జాజ్ స్వయంగా వచ్చి నేను ఇబ్నె ‘జుబైర్‌ (ర) పట్ల ఎలా ప్రవర్తించానో చూశావా?’ అని అన్నాడు. దానికి అస్మా’ (ర), ‘నీవు అతని ఇహలోకాన్ని పాడుచేశావు, కాని అతడు నీ పరలోకాన్ని పాడుచేశాడు. నీవు అతన్ని విమర్శిస్తూ ‘జాతున్ని”తాఖైన్‌ యొక్క కొడుకు,’ అని అంటూ ఉన్నావట, అల్లాహ్ సాక్షి! ” ‘జాతున్ని”తాఖైన్‌ నేనే. నేను ని”తాఖ్‌తో ప్రవక్త (స), అబూ-బకర్‌ల ప్రయాణ సామగ్రిని కట్టాను. రెండవ దాన్ని నడుముకు కట్టుకున్నాను. కాని నీవు గుర్తుంచు కోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త (స) సఖీఫ్‌లో ఒక అసత్యవాది, ఒక దుర్మార్గుడు జన్మిస్తారని అంటూ ఉండగా విన్నాను. ఇప్పుడు అసత్యవాదిని చూసు కున్నాను. అయితే ఆ దుర్మార్గుడవు నీవే,” అని అన్నారు. ‘హజ్జాజ్‌ ఈ ‘హదీసు’ వినగానే మారు మాట్లాడకుండా లేచి నిలబడ్డాడు. (ముస్లిమ్‌)
కొన్నిరోజుల తర్వాత ‘అబ్దుల్‌ మలిక్‌ ఆదేశం మేరకు ‘హజ్జాజ్‌ శవాన్ని దించి యూదుల స్మశాన వాటికలో పారవేయించాడు. అస్మా’ (ర) శవాన్ని తెప్పించారు. స్నానం చేయించి జనా’జహ్ నమా’జు చదివించారు. శరీర మంతా క్రుళ్ళి, పట్టుకుంటే చేతిలో వచ్చినట్లు అయి పోయింది. అయినా అస్మా’ (ర) సహనం ఓర్పులతో ఇది దైవకారుణ్యం అని భావించారు. (అసదుల్‌ ‘గాబహ్)
అస్మా’ (ర), ”నేను ‘అబ్దుల్లాహ్‌ శవం చూడనంతవరకు నాకు మరణం రాకూడదని ప్రార్థించేవారు. అనంతరం ఒక్క వారం కూడా గడవలేదు. అస్మా’ (ర) కూడా మరణించారు. ఇది జమాదిల్‌ అవ్వల్‌ 73వ హిజ్రీ సంఘటన. అప్పటికి ఆమె వయస్సు 100 సంవత్సరాలు. అస్మా’ (ర) చాలా గొప్ప పుణ్యాత్ము రాలు. ఒకసారి ప్రవక్త (స) కు’సూఫ్‌ నమా’జు చది విస్తున్నారు. నమా’జు దీర్ఘంగా ఉంది. అస్మా’ (ర) అటూ ఇటూ చూడసాగారు. ఆమె ప్రక్కన ఇద్దరు స్త్రీలు నిలబడి ఉన్నారు. వారిలో ఒకరు లావుగా మరొకరు బక్కచిక్కి ఉన్నారు. అది చూసి, తన్ను తాను ఓదార్చుతూ, ‘నేను వారికంటే ఎక్కువసేపు నిలబడాలి,’ అని అనుకున్నారు. కాని నమా’జు చాలా దీర్ఘంగా ఉంది. అస్మా’ (ర) స్పృహ కోల్పోయారు. ముఖంపై నీళ్ళు చిలకరించటం జరిగింది. ఆమెకు తలనొప్పివస్తే తలపట్టుకొని, ‘ఇది నా పాపం. అల్లాహ్‌(త) క్షమించే గుణం దీనికంటే ఎక్కువగా ఉంటుంది,’ అని అనేవారు. (సియరుస్స’హాబియాత్‌)
ఈమె ఎల్లప్పుడూ సత్యం పలికేవారు. తన ముందు వ్యక్తి ఎంతటి దుర్మార్గుడైనా నిర్భయంగా సత్యాన్నే పలికేవారు. వినయ-విధేయతలు, దీనత్వం, సున్నితత్వం మొదలైన సద్గుణాలు కలిగి ఉండేవారు. శ్రమించటాన్ని అవమానంగా భావించేవారు కాదు. ఆమె వివాహం జరిగినప్పుడు ‘జుబైర్‌ వద్ద ఒక ఒంటె, ఒక గుర్రం ఉండేవి. ఆమె వాటికి ఆహారం అందించేది. నీళ్ళు నింపేది. డప్పుకుట్టేది. ఆమెకు రొట్టె చేయడం వచ్చేదికాదు. అందువల్ల పిండికలిపి ఉంచేది. అ’న్సార్‌ స్త్రీలు వచ్చి రొట్టెచేసి ఇచ్చేవారు. ప్రవక్త (స) ‘జుబైర్‌కు భూమి ఇచ్చారు. అక్కడకు వెళ్ళి ఆమె ఖర్జూరం గింజలు వేరేవారు. మూడు ఫర్లాంగ్‌ల నుండి మోసుకొని కాలి నడకన వచ్చేవారు. ఆ తరువాత అబూ-బక్ర్ (ర) ఆమెకు ఒక సేవకుడిని ఇచ్చారు. ఫలితంగా ఆమెకు కొంత శ్రమ తగ్గింది. పేదరికం వల్ల ఆమె చాలా జాగ్రత్తగా ఖర్చు చేసేవారు. ప్రవక్త (స) అల్లాహ్‌(త) కూడా ఆచి తూచి ఇస్తాడని అన్నారు. అనంతరం ఆమె ఖర్చుచేయ నారంభించారు. ఫలితంగా రాబడి అధికమయింది. మరెప్పుడూ దుస్థితి రాలేదు. (బు’ఖారీ)
అస్మా (ర) చాలా దాతృగుణం గలది. ‘ఆయి’షహ్‌ (ర) తన ఆస్తిలో ఒక తోట వదలి వెళ్ళారు. అది అస్మా’ (ర) కు వచ్చింది. ఆమె దాన్ని అమ్మి బంధువుల్లో పంచిపెట్టారు. అనారోగ్యానికి గురైతే సేవకులను విడుదల చేసేవారు. ‘జుబైర్‌ కొంత వేడి స్వభావం గలవారు. అందువల్ల ఆమె, ‘అనుమతి లేకుండా అతని ధనంలో నుండి దానధర్మాలు చేయవచ్చా’ అని అడిగారు. ప్రవక్త (స) ఆమెకు అనుమతి ఇచ్చారు. ఒకసారి ఆమె తల్లి మదీనహ్ వచ్చారు. ఆమెను డబ్బులు అడిగారు. అస్మా (ర) ప్రవక్త (స)ను, నా అవిశ్వాస తల్లి వచ్చిందని, నేను ఆమెకు సహాయం చేయవచ్చా? అని అడిగారు. దానికి ప్రవక్త (స) సహాయం చేసి బంధుత్వ హక్కును నెరవేర్చమని అన్నారు (బు’ఖారీ). మొదటి ‘హజ్జ్ ప్రవక్త (స) వెంటచేశారు. అందులో ఆచరించినవన్నీ ఆమెకు గుర్తుండిపోయాయి. ఈమె చాలా గొప్ప పుణ్య మరియు వీరవనిత. ప్రజలు ఈమెను తమను గురించి దు’ఆ చేయమని కోరేవారు. స్త్రీలలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే, ఈమె వద్దకువచ్చేవారు. వారి గుండెలపై నీళ్ళు చిలకరించే వారు. ఇంకా ప్రవక్త (స) దాన్ని నీటితో చల్లబరచమని చెప్పేవారని అనేవారు. (బు’ఖారీ)

138 – [ 14 ] ( لم تتم دراسته ) (1/50)
وَعَنْ جَابِرٍ, عَنْ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا أُدْخِلَ الْمَيِّتُ الْقَبْرَ مُثِّلَتْ لَهُ الشَّمْسُ عِنْدَ غُرُوْبِهَا, فَيَجْلِسُ يَمْسَحُ عَيْنَيْهِ, وَ يَقُوْلُ: دَعُوْنِيْ أُصَلِّيْ”. رَوَاهُ ابْنُ مَاجَهُ .

(14) [1/50-అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం “శవం సమాధిలో ఖననం చేయబడితే, సూర్యుడు అస్తమించక ముందు ఉన్న సమయంలా చేయడం జరుగుతుంది.అంటే అతనికి సూర్యస్తమయానికి ముందు సమయంలా అనిపిస్తుంది. అతడు కళ్ళు నులుపుకుంటూ లేచి కూర్చుంటాడు . ఒకవేళ విశ్వాసి అయితే, మున్కర్ నకీర్లతో, ‘నన్ను వదలండి, నేను నమా’జు చదువుతాను,’ అని అంటాడు. (ఇబ్నె మాజహ్) అతడు పరమ నమా’జీ అయి ఉంటాడు. నేను ఇహలోకంలో ఉన్నానని భావించి ఉంటాడు. ఆ తరువాత దైవదూతలు అతన్ని విచారిస్తారు.
139 – 15 (1/50)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ, عَنْ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ الْمَيّتَ يَصِيْرُ إِلَى الْقَبْرِ, فَيَجْلِسُ الرَّجُلُ فِيْ قَبْرِهِ غَيْر فَزَعٍ وَلَا مَشْغوْب, ثُمَّ يُقَالُ: فِيْمَ كُنْتَ؟ فَيَقُوْلُ: كُنْتُ فِيْ الْإِسْلَامِ. فَيُقَالُ: مَا هَذَا الرَّجُلُ؟ فَيَقُوْلُ: مُحَمَّدٌ رَسُوْلُ اللهِ صلى اللهِ عليه وسلم جَاءَنَا بِالْبَيِّنَاتِ مِنْ عِنْدِ اللهِ, فَصَدَّقْنَاهُ. فَيُقَالُ لَهُ: هَلْ رَأَيْتَ اللهَ؟ فَيَقُوْلُ: مَا يَنْبَغِيْ لِأَحَدٍ أَنْ يَّرَى اللهَ, فَيُفَرَّجُ لَهُ فُرْجَة قَبْلَ النَّارِ, فَيَنْظُرُ إِلَيْهَا يَحْطِمُ بَعْضَهَا بَعْضًا, فَيُقَالُ لَهُ: انْظُرْ إِلَى مَا وَقَاكَ اللهُ, ثُمَّ يُفَرَّجُ لَهُ فرجة قَبل الْجنَّةِ, فَيَنْظُرُ إِلَى زَهْرَتِهَا وَمَا فِيْهَا, فَيُقَالُ لَهُ: هَذَا مَقْعَدُكَ, عَلَى الْيَقِيْنِ كُنْتَ, وَعَلَيْهِ مُتَّ, وَعَلَيْهِ تُبْعَثُ إِنْ شَاءَ اللهُ تعالى. وَيَجْلِسُ الرَّجُلُ السَّوْءُ فِيْ قَبْرِهِ فَزِعًا مَّشْغوْبا, فَيُقَالُ: فِيْمَ كُنْتَ؟ فَيَقُوْلُ: لَا أَدْرِيْ! فَيُقَالُ لَهُ: مَا هَذَا الرَّجُلُ؟ فَيَقُوْلُ: سَمِعْتُ النَّاسَ يَقُوْلُوْنَ قَوْلًا فَقُلْتُهُ, فَيُفَرَّجُ لَهُ قبلَ الْجَنَّةِ, فَيَنْظُرُ إِلَى زَهْرِتِهَا وَمَا فِيْهَا, فَيُقَالُ لَهُ: اُنْظُرْ إِلَى مَا صَرَفَ اللهُ عَنْكَ, ثُمَّ يُفَرَّجُ لَهُ فُرْجَةٌ الى النَّارِ, فَيَنْظُرُ إِلَيْهَا يَحْطِمُ بَعْضُهَا بَعْضًا, فَيُقَالُ لَهُ: هَذَا مَقْعَدُكَ, عَلَى الشَّكِ كُنْتَ, وَعَلَيْهِ مُتَّ, وَعَلَيْهِ تُبْعَثُ إِنْ شَاءَ اللهُ تَعَالَى”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

(15) [1/50-దృఢం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”శవాన్ని సమాధిలో చేర్చిన తర్వాత, ఒకవేళ విశ్వాసి అయితే, నిశ్చింతగా లేచి కూర్చుంటాడు. ఏమాత్రం విచారానికి, ఆందోళనకు గురికాడు. అనంతరం అతన్ని, ‘నీవు ఏ ధర్మంలో ఉండేవాడవు,’ అని ప్రశ్నించడం జరుగు తుంది. దానికి అతడు, ‘నేను ఇస్లామ్‌ ధర్మాన్ని అవలంబించేవాడిని,’ అని సమాధానం ఇస్తాడు. మళ్ళీ అతన్ని, ‘ఆ వ్యక్తి గురించి నీకేం తెలుసు,’ అని ప్రశ్నిస్తారు. అతడు, ‘అతను (ము’హమ్మద్‌ స), అల్లాహ్‌ ప్రవక్త,’ అని అంటాడు. ‘అల్లాహ్‌(త) వద్ద నుండి అతను స్పష్టమైన నిదర్శనాలు తీసుకొని వచ్చారు. మేము వాటిని ధృవీక రించాము,’ అని అంటాడు. మళ్ళీ అతన్ని, ‘నీవు అల్లాహ్‌ (త)ను చూశావా!’ అని ప్రశ్నించడం జరుగుతుంది. దానికి ఆ వ్యక్తి, ‘ప్రపంచంలో అల్లాహ్‌(త)ను ఎవరూ చూడలేరు,’ అని అంటాడు. అనంతరం నరక కిటికీ తెరవబడుతుంది. అతడు దాని వైపు చూస్తాడు. భయంకరమైన అగ్ని జ్వాలలో కూడుకొని ఉంటుంది. అతనితో, ‘నరకం చూడు, అల్లాహ్‌ నిన్ను దీన్నుండి రక్షించాడు.’ ఆ తరువాత స్వర్గం కిటికీ తెరువబడుతుంది. అతడు స్వర్గాన్ని, అందులో ఉన్న అనుగ్రహాలను చూసి సంతోషం వ్యక్తం చేస్తాడు. అప్పుడతనితో, ‘ఇదే నీ నివాసం, ఎందుకంటే నీవు దృఢమైన విశ్వాసంతో ఉండే వాడవు. దానిపైనే నీ మరణం సంభవించింది. ఇన్‌షా అల్లాహ్‌ దీనిపైనే అల్లాహ్‌(త) నిన్ను మరల లేపటం జరుగుతుంది.’ అని అంటారు.

అవిశ్వాసులు, కపటాచారులు ఆందోళనకరమైన, విచారకరమైన పరిస్థితిలో లేచి కూర్చుంటారు. వారిని, ‘నీవు ఏ ధర్మంపై ఉండేవాడవు,’ అని ప్రశ్నించడం జరుగుతుంది. దానికి అతడు, ‘నాకు తెలియదు,’ అని అంటాడు. ఆ తరువాత, ‘మీ వద్దకు పంపబడిన వ్యక్తి గురించి నీ అభిప్రాయం ఏమిటి,’ అని అతన్ని ప్రశ్నించడం జరుగుతుంది. దానికతడు, ‘ప్రజలు అంటూ ఉండగా విన్నదే నేను అనే వాడిని,’ అని సమాధానం ఇస్తాడు. అనంతరం అతని కోసం స్వర్గ కిటికీలు తెరువబడతాయి. అతడు స్వర్గాన్ని, అందులో ఉన్న అను గ్రహాల్ని చూస్తాడు. అప్పు డతనితో, ‘ఈ స్వర్గాన్నిచూడు. అల్లాహ్‌(త) దీన్నుండి నిన్ను దూరంచేశాడు. ఇప్పుడు నీవు స్వర్గంలో ప్రవేశించలేవు,’ అని చెప్పటం జరుగు తుంది. అతనికోసం నరకంకిటికీలు, తెరువ బడతాయి. అతడు నరకాన్ని చూస్తాడు, దాని జ్వాలలు ఒకదాన్ని ఒకటి చుట్టుముట్టి ఉంటాయి. అతనితో, ‘ఈ నరకమే నీ నివాసం, నీవు ఇహలోకంలో అనుమానించేవాడవు, అనుమానంపైనే మర ణించావు. ఇన్‌షా అల్లాహ్‌ తీర్పుదినం నాడు ఈ అను మానంపైనే మరల లేపబడతావు,’ అని అంటారు. (ఇబ్నె మాజహ్)

5- بابُ الْاِعْتِصَامِ بِالْكِتَابِ وَالسُّنَةِ

ఖుర్‌ఆన్‌, ‘హదీసు’లపై దృఢ ఆచరణ
ఖుర్‌ఆన్‌ ‘హదీసు’లు, అల్లాహ్‌(త) మరియు ప్రవక్త (స) విధేయత గురించి ఖుర్‌ఆన్‌లో అనేక ఆదేశాలు ఉన్నాయి. వాటిని అబ్దుస్సలాం బస్తవీగారు ఫజాయిలె ‘హదీస్‌’, ఇస్లామీయ త’అలీమ్‌లలో పేర్కొన్నారు. కితాబ్‌ అంటే ఖుర్‌ఆన్‌, సున్నత్‌ అంటే ప్రవక్త (స) సాంప్రదాయం. దీన్నే మనం ‘హదీస్‌’ అంటాం.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
140 – [ 1 ] ( متفق عليه ) (1/51)
عَنْ عَائِشَةَ, قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَحْدَثَ فِيْ أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ”. متفق عليه.

(1) [1/51-ఏకీభవితం]
‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరు ఇస్లామ్‌లో లేని విషయాన్ని కల్పిస్తారో అది రద్దు చేయబడు తుంది.” )

వివరణ-140: అంటే ఎవరైనా ఇస్లామ్‌లో లేని విషయాన్ని కల్పించి, దాన్నిగురించి ఖుర్‌ఆన్‌, ‘హదీసు’ల్లో ఎటువంటి ఆధారాలు లేకపోతే, అది రద్దుచేయబడు తుంది, స్వీకరించబడదు. దీన్నే బిద్‌’అత్‌ అంటాం. దీన్ని గురించి ముందు పేజీల్లో పేర్కొనడం జరుగుతుంది.
(బు’ఖారీ, ముస్లిమ్‌)
141 – 2 (1/51)
وَعَنْ جَابِرٍ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”أَمَّا بَعْدُ, فَإِنَّ خَيْرَ الْحَدِيْثِ كِتَابُ اللهِ, وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ, وَشَرَّ الْأُمُوْرِ مُحْدَثَاتُهَا, وَكُلُّ بِدْعَةٍ ضَلَالَةُ”. رَوَاهُ مُسْلِمٌ.

(2) [1/51-దృఢం]
జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అన్నిటి కంటే పవిత్రమైనది అల్లాహ్‌ గ్రంథం, ఇంకా అన్ని మార్గాల కంటే సరైన మార్గం ము’హమ్మద్‌ (స) మార్గం, ఇంకా అన్నిటి కంటే నీచమైనవి ధర్మంలో కల్పించే కార్యాలు. ప్రతికల్పితం మార్గభ్రష్టత్వం.” (

వివరణ-141: బిద్‌అత్‌ అంటే కల్పితం. అంటే ధర్మంలో లేని, ఖుర్‌ఆన్‌ ‘హదీసు’ల సాక్ష్యాధారాలు లేని విషయాలను కల్పించటం. వాటిని ధర్మ కార్యాలుగా భావించటం. వాటిని ఆచరించటం. బిద్‌’అత్‌ రెండు రకాలు 1. బిద్‌అతె ’దలాలత్‌. అంటే అల్లాహ్‌(త) మరియు ఆయన ప్రవక్త (స) ఆదేశాలకు వ్యతిరేకంగా ఆచారాలు కల్పించి, ఆచరించటం. దీన్ని బిద్‌అతె సయ్యిఅ‘ అని కూడా అంటారు. 2. బిద్‌అతె హిదాయత్‌. అంటే అల్లాహ్‌(త) మరియు ప్రవక్త (స)కు వ్యతిరేకం కాని ఆచరణ, దీన్ని బిద్‌అతె హసన్ అని కూడా అంటారు. ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరు ఇస్లామ్‌లో అల్లాహ్‌(త) మరియు ప్రవక్త (స) ఆదేశాలకు అనుగుణంగా ఏదైనా ప్రారంభిస్తే, అతడికి పుణ్యం లభిస్తుంది, ఇంకా అతని తరువాత దానిపై అమలు చేసిన వారికీ పుణ్యం లభిస్తుంది. ఎవరి పుణ్యమూ తగ్గించబడదు. అదేవిధంగా ఎవరైనా అల్లాహ్‌(త), ఆయన ప్రవక్త ఆదేశాలకు వ్యతిరేకంగా ఏదైనా ఆచరణ ప్రారంభిస్తే, అతడికి పాపం చుట్టుకుంటుంది. ఇంకా దాన్ని అనుసరించే వారికీ పాపం చుట్టుకుంటుంది. ఎవరి పాపమూ తగ్గించ బడదు. (ముస్లిమ్‌)
‘ఉమర్‌ (ర), ”రమ’దాన్‌లోని తరావీహ్‌ నమా’జును సామూ హికంగా చేయటాన్ని మంచిపద్ధతి,” అని అన్నారు. దీనివల్ల బిద్‌’అత్‌ రెండు రకాలు బిద్‌అతె హిదాయత్‌, బిద్‌అతె ’దలాలత్‌ అని తెలిసింది. అయితే అల్లాహ్‌(త) మరియు ఆయన ప్రవక్త (స)కు వ్యతిరేకంగా ఆచరించేది బిద్‌అతె ’దలాలత్‌. దీన్ని గురించి ఖండించటం జరిగింది. అల్లాహ్‌(త) మరియు ఆయన ప్రవక్త ఆదేశాల కనుగుణంగా చేసేవి బిద్‌అతె హసన్ అంటే, అనాథశాలలు, ఇస్లామీ పాఠశాలలు, ధార్మిక పుస్తకాలు ప్రచురించటం మొదలైనవి. ఎందుకంటే వీటిని నిషేధించలేదు. ఇంకా ఇవి ఇస్లామ్‌కు వ్యతి రేకమూ కావు. ప్రవక్త (స) సత్కార్యాలు చేస్తే పుణ్యం లభిస్తుందని ప్రవచించి ఉన్నారు. ప్రవక్త (స) ప్రవచనం, ”షరీఅత్‌కు అనుగుణంగా ఎవరైనా ఏదైనా మంచి పద్ధతి ప్రారంభిస్తే, అతనికీ పుణ్యం లభిస్తుంది, దాన్ని ఆచరించే వారికీ పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా ఎవరైనా షరీఅత్‌కు వ్యతిరేకంగా ఏదైనా ప్రారంభిస్తే, దాని పాపం, ఆచరించిన వారి పాపం రెండూ అతనిమీద పడతాయి. ప్రవక్త (స) కాలంలో తరావీహ్‌ నమా’జు సామూహికంగా చదివేవారు కాదు. ‘ఉమర్‌ (ర) తన కాలంలో దీన్ని సామూహికంగా చేశారు. ప్రవక్త (స) కొన్ని రాత్రులు చదివి మానివేశారు. ప్రవక్త (స) కాలంలోనూ అలాగే కొనసాగింది. ‘ఉమర్‌(ర) అందరిని ఒకచోట చేర్చి ఒకే ఇమామ్‌ ఆధ్వర్యంలో చదవమని నిర్ణయించారు. ప్రతిరోజు తరావీహ్‌ నమా’జు చదవమని ప్రోత్సహించారు. అందువల్లే దీన్ని బిద్‌అత్‌ హసన్‌ అన్నారు. వాస్తవంగా ఇది బిద్‌అత్‌ కాదు, ఇది ప్రవక్త (స) సాంప్రదాయమే. ఎందుకంటే ప్రవక్త (స) ”మీరు నా సాంప్ర దాయాన్ని, నా ఖలీఫాల సాంప్రదాయాన్ని తప్పనిసరిగా పాటించండి. నా తర్వాత అబూ-బకర్‌ (ర), ‘ఉమర్‌ (ర)లను అనుసరించండి,” అని బోధించి ఉన్నారు. అదేవిధంగా ఇస్లామీయ ఆదేశాలకు వ్యతిరే కంగా నూతన ఆచారాలు కల్పించడం బిద్‌అత్‌ అవు తుంది. అందువల్ల ఇస్లామ్‌కు వ్యతిరేకమైన బిద్‌అత్‌లకు దూరంగా ఉండటం మన బాధ్యత, మనకు శ్రేయస్కరం.
(ముస్లిమ్‌)
142 – 3 (1/51)
وَعَنْ ابْنِ عَبَّاسٍ, قَالَ: قَالَ رسولُ اللهِ صلى الله عليه وسلم: “أَبْغَضُ النَّاسِ إِلَى اللهِ ثَلَاثَةٌ: مُلْحِدٌ فِيْ الْحَرَمِ, وَمُبتَغٍ فِيْ الْإِسْلَامِ سُنَّةَ الْجَاهِليَّةِ, وَمُطَّلِبُ دَمِ امْرِىءٍ بِغَيْرِ حَقٍّ لِيُهْرِيْقَ دَمَهُ”. رَوَاهُ الْبُخَارِيُّ

(3) [1/51-దృఢం]
ఇబ్నె అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ దృష్టిలో ముగ్గురు వ్యక్తులు పరమ నీచులు. వీరి పట్ల అల్లాహ్‌ ఆగ్రహం కలిగి ఉంటాడు, 1. ‘హరమ్‌ హద్దుల్లో అవిధేయతకు పాల్పడిన వాడు, 2. ఇస్లామ్‌లో అజ్ఞానకాలపు మూఢాచారాలను అన్వే షించే వాడు, 3. ఒక వ్యక్తిని అన్యాయంగా హత్య చేసిన వాడు. )

వివరణ-142: అంటే హద్దులు మీరి ప్రవర్తించటం, అవిధేయతకు పాల్పడటం, ‘హరమ్‌ హద్దుల్లో నిషేధించిన వాటికి పాల్పడటం, కలహాలు, పోరాటాలు, వేట మొదలైన నిషిద్ధాలకు పాల్పడటం. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ‘ ‘హరమ్‌లో హద్దులుమీరి ప్రవర్తించినవారికి మేము అగ్ని రుచిచూపిస్తాం.’ అదేవిధంగా ‘హరమ్‌ హద్దుల్లో ఆహార ధాన్యాలను ఆపడం నిషిద్ధం. అదేవిధంగా ఇస్లామ్‌లో అజ్ఞానకాలపు ఆచారాలను అన్వేషించటం అంటే, ఏడ్పులు పెడబొబ్బలు పెట్టటం, దుశ్శకునంగా భావించటం, అవిశ్వాసుల ఆచారాలను అవలం బించటం, అన్యాయంగా ఇతరులను చంపటం, హింసించటం మొదలైనవి.
(బు’ఖారీ)
143 – 4 (1/51)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كُلُّ أُمَّتِيْ يَدْخُلُوْنَ الْجَنَّةَ إِلَّا مَنْ أَبَى”. قِيْلَ: وَمَنْ أَبَى؟ قَالَ: “مَنْ أَطَاعَنِيْ دَخَلَ الْجَنَّةَ وَمَنْ عَصَانِيْ فَقَدْ أَبَى”. رَوَاهُ الْبُخَارِيُّ

(4) [1/51-దృఢం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స), ‘నా అనుచర సమాజంలోని ప్రతి వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. కాని తిరస్కరించినవాడు తప్ప,’ అని అన్నారు. దానికి అనుచరులు, ‘ఎవరు తిరస్క రించారు, ‘ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ‘నన్ను అనుసరించిన వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. ఇంకా నన్ను అనుసరించనివారు నన్ను తిరస్క రించినట్టే,’ అని అన్నారు. )

వివరణ-143: ఈ ‘హదీసు’ ప్రకారం ప్రవక్త (స) విధేయత తప్పనిసరి. అవిధేయత చూపటం తిరస్కరించి నట్టవుతుంది. ఇంకా ప్రవక్త (స)ను తిరస్కరించిన వారు స్వర్గంలో ప్రవేశించలేరు.
(బు’ఖారీ)
144 – 5 (1/51)
عَنْ جَابِرٍ رضى الله عنه , قال: جَاءَتْ مَلَائِكَةٌ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم وَهُوَ نَائِمٌ, فَقَالَوا: إِنَّ لِصَاحِبِكُمْ هَذَا مَثَلًا, فَاَضْرِبُوْا لَهُ مَثَلًا. فَقَالَ بَعْضُهُمْ: إِنَّهُ نَائِمٌ, وَقَالَ بَعْضُهُمْ: إِنَّ الْعَيْنَ نَائِمَةٌ وَالْقَلْبُ يَقَظَانٌ. فَقَالُوْا: مَثَلُهُ كَمَثَلِ رَجُلٍ بَنَى دَارًا وَجَعَلَ فِيْهَا مَأْدُبَةً وَّبَعَثَ دَاعِيًا, فَمَنْ أَجَابَ الدَّاعِيَ دَخَلَ الدَّارَ وَأَكَلَ من الْمَأدُبَةِ, وَمَنْ لَمْ يُجِبُ الدَّاعِيَ لَمْ يَدْخُلِ الدَّارَ وَلَمْ يَأْكُلْ مِنَ الْمَأْدُبُةِ. فَقَالُوْا: أَوِّلُوْهَا لَهُ يَفْقَهُهَّا. قَالَ بَعْضُهُمْ: إِنَّهُ نَائِمٌ, وَقَالَ بَعْضُهُمْ: إِنَّ الْعَيْنَ نَائِمَةٌ وَالْقَلْبُ يُقْظَانُ. فَقَالُوْا: الدَّارُ الْجَنَّةُ, وَالدَّاعِيْ مُحَمَّدٌ صلى الله عليه وسلم, فَمَنْ أَطَاعَ مُحَمَّدًا صلى الله عليه وسلم فَقَدْ أَطَاعَ اللهَ, وَمَنء عَصَى مُحَمَّدًا صلى الله عليه وسلم فَقَدْ عَصَى اللهَ, وَمُحَمَّدٌ صلى الله عليه وسلم فَرْقٌ بَيْنَ النَّاسِ. رَوَاهُ الْبُخَارِيُّ .

(5) [1/51-దృఢం]
జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు దైవదూతల బృందం వచ్చింది. అప్పుడు ప్రవక్త (స) నిద్రపోతున్నారు. ఆ దైవదూతలు పరస్పరం, ‘ఇతన్ని గురించి ఒక ఉదాహరణ ఉంది. ఆ ఉదాహరణను వివరించండి,’ అని అన్నారు. కొంత మంది దైవదూతలు, ‘అతను (స) పడు కున్నారు, ఎలా వినగలరు’ అని అన్నారు. మరికొంత మంది దైవదూతలు, ‘అతని కళ్ళు పడుకొని ఉన్నాయి, కాని హృదయం మాత్రం మేల్కొనే ఉంది మీరు వివరించండి, అతను అర్ధం చేసుకుంటారు,’ అని అన్నారు. అప్పుడు వారు ఇలా అన్నారు, ”అతని ఉదాహరణ ఎలా ఉందంటే ఒక వ్యక్తి ఇల్లు నిర్మిచాడు, ప్రజలను విందుకు ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేసాడు. ప్రజలను పిలవడానికి ఒకవ్యక్తిని పంపాడు. అతడు అందరినీ ఆహ్వా నిస్తున్నాడు. అతని పిలుపును స్వీకరించిన వారు అతని వెంట వస్తారు, ఆ ఇంట్లోకి ప్రవేశిస్తారు, విందు ఆరగిస్తారు. ఎవరు అతని పిలుపును తిరస్కరిస్తారో, వారు ఆ ఇంట్లో ప్రవేశించరు, విందు ఆరగించరు.’ కొంతమంది దైవదూతలు, ‘చాలా ఉత్తమ ఉదాహరణ, కాని దాన్ని విడమరచి చెప్పండి, అతను బాగా అర్థం చేసుకుంటారు.’ అని అన్నారు. కొంత మంది దైవదూతలు, ‘అతను పడుకున్నారు, ఏంఅర్ధం చేసుకుంటారు,’ అని అన్నారు. మరికొంత మంది, ‘అతని కళ్ళు పడుకున్నాయి కాని హృదయం మేల్కొనే ఉంది,’ అని అన్నారు. అప్పుడు వారు, ‘ఆ ఇల్లు స్వర్గం, దాన్ని నిర్మించిన వాడు అల్లాహ్ (త). అల్లాహ్ (త) పిలవటానికి ము’హమ్మద్‌ (స)ను పంపాడు. ముహమ్మద్‌ (స)కు విధేయత చూపిన వారు అల్లాహ్‌(త)కు విధేయత చూపినట్టే. వారు స్వర్గంలో ప్రవేశిస్తారు, ఇంకా అక్కడి అనుగ్రహాలను తింటారు. ము’హమ్మద్‌ను తిరస్కరించిన వారు అల్లాహ్‌(త)ను తిరస్కరించినట్టే. వారు స్వర్గంలో ప్రవేశించరు, అక్కడి అనుగ్రహాలను తినరు. ‘ము’హమ్మద్‌ (స) ప్రజలను విశ్వాసులుగా అవిశ్వాసులుగా వేరుపరిచేవారు.)

వివరణ-144: ఫరిఖ అంటే వేరుపరిచేవారు, అంటే విశ్వాసులను, అవిశ్వాసులను వేరుపరిచేవారు. అంటే ఆయన్ను అనుసరించేవారు విశ్వాసులు, ఆయన్ను తిరస్కరించినవారు అవిశ్వాసులు.
(బు’ఖారీ)
145 – [ 6 ] ( متفق عليه ) (1/52)
عَنْ أَنَسٍ رضي الله عَنْهُ, قُالُ: جَاءَ ثَلَاثَةُ رهْطٍ إِلَى أَزْوَاجِ النَّبِيِّ صلى الله عليه وسلم يَسْأَلُوْنَ عَنْ عِبَادَةِ النَّبِيِّ صلى الله عليه وسلم, فلما أُخْبِرُوْا بها كَأَنَّهُمْ تَقَالُّوْهَا؛ فَقَالُوْا: أَيْنَ نَحْنُ مِنَ النَّبِيِّ صلى الله عليه وسلم, و قَدْ غَفَرَ اللَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ وَمَا تَأَخَّرَ؟ فقَالَ أَحَدُهُمْ: أَمَّا أَنَا أُصَلِّي اللَّيْلَ أَبَدًا. وَقَالَ آخَرُ: أَنَا أَصُوْمُ النهار ابدا, و لا افطر. وَقَالَ آخَرُ: أَنَا أَعْتَزِلُ النِّسَاءَ فَلَا أَتَزَوَّجُ أَبَدًا, فَجَاءَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلَيْهِمْ فَقَالَ: “أَنْتُمْ الَّذِيْنَ قُلْتُمْ كَذَا وَكَذَا؟ أَمَا وَاللهِ إِنِّيْ لَأَخْشَاكُمْ للهِ, وَأَتْقَاكُمْ لَهُ, لَكِنِّيْ أَصُوْمُ وَأُفْطِرُ, وَأُصَلِّيْ وَأَرْقَدُ, وَأَتَزَوَّجُ النِّسَاءَ, فَمَنْ رَغِبَ عَنْ سُنَّتِيْ فَلَيْسَ مِنِّيْ” .

(6) [1/52-ఏకీభవితం]
అనస్‌ (ర) కథనం: ముగ్గురు వ్యక్తులు ప్రవక్త (స) ఆరాధనలను గురించి తెలుసుకోవడానికి ప్రవక్త (స) భార్యల వద్దకు వచ్చారు. ప్రవక్త (స) ఆరాధనలను గురించి వారికి తెలియపర్చటం జరిగింది. వారు దాన్ని చాలా చిన్న విషయంగా, అల్పమైనదిగా భావించి, పరస్పరం, ‘ప్రవక్త (స) కు మనమెక్కడ సమానం కాగలము. అల్లాహ్‌(త) అతని ముందూ వెనుకా పాపాలన్నీ క్షమించివేశాడు,’ అని అన్నారు. వారిలో ఒకరు, ‘నేను రాత్రంతా నమా’జులు చదువుతాను.’ అని అన్నాడు. మరో వ్యక్తి, ‘నేను పగలంతా ఉపవాసం ఉంటాను. ఉపవాసాన్ని విరమించను,’ అని అన్నాడు. మూడవ వ్యక్తి, ‘నేను ఎల్లప్పుడూ స్త్రీలకు దూరంగా ఉంటాను, ఎన్నడూ పెళ్ళిచేసుకోను,’ అని అన్నాడు. ఇంతలో ప్రవక్త (స) వచ్చారు. వారిని, ”మీరు ఇలా, ఇలా అన్నారా?” అని అడిగారు. ఇంకా, ”నేను అల్లాహ్‌(త)పై ప్రమాణం చేసి చెబు తున్నాను. నేను అల్లాహ్‌(త)కు మీకంటే అధికంగా భయపడుతాను. ఇంకా మీ అందరికంటే అధిక దైవభీతి కలవాడను కూడా. అయినప్పటికీ ఉపవాసాలు పాటిస్తున్నాను, విరమిస్తున్నాను, నమా’జులు చదువు తున్నాను. నిద్రపోతున్నాను కూడా. స్త్రీలను పెళ్ళి కూడా చేసుకున్నాను. ఇవన్నీ నా సాంప్రదాయాలు. నా సాంప్రదాయాలను తిరస్క రించిన వారు నా మార్గంపై లేరు,” అని అన్నారు. )

వివరణ-145: వచ్చిన వారు ‘అలీ, ‘ఉస్మాన్‌ బిన్‌ మ’’జ్‌’ఊన్‌, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ రవా’హ (ర). వీరి మాటలు విని, ప్రవక్త (స) మీ ఆలోచన మంచిది కాదు, నేను అల్లాహ్(త) హక్కును చెల్లిస్తున్నాను, మానవుల హక్కును చెల్లిస్తున్నాను. ప్రతి పని మధ్యస్థంగా చేస్తున్నాను. మీరు నా పద్ధతిని అనుసరించండి. ధర్మంలో హద్దులుమీరి ప్రవర్తించకండి. హెచ్చుతగ్గులు చేయకండి. నాది మధ్యమార్గం. నా మార్గానికి దూరమైన వాడు, నాకు దూరమయ్యాడు.
(బు’ఖారీ, ముస్లిమ్‌)
146 – [ 7 ] ( متفق عليه ) (1/52)
وعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا، قَالَتْ: صَنَعَ رسُوْلُ اللهَ صلى الله عليه وسلم شيئا، فَرَخَّصَ فِيْهِ، فَتَنَزَّهَ عَنْهُ قَوْمٌ، فَبَلَغَ ذَلِكَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم؛ فَخَطَبَ فَحَمِدَ اللهَ، ثُمَّ قَالَ: “مَا بَالَ أَقْوَامٍ يَتَنَزَّهُوْنَ عَنْ الشَّيْءِ أَصْنَعُهُ؟ فَوَاللهِ إِنَّيْ لَأَعْلَمُهُمْ بِاللهِ، وَأَشَدُّهُمْ لَهُ خَشْيَةً”. متفق عليه.

(7) [1/52-ఏకీభవితం]
‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక పని చేసారు. ఆ పని చేయడానికి అనుమతి కూడా ఇచ్చారు. కాని కొందరు దాన్ని చేయలేదు. ప్రవక్త (స)కు ఈ విషయం తెలిసింది. ప్రవక్త (స) ప్రసంగించారు. ‘దైవస్తోత్రం తరువాత, వారికి ఏమయింది? నేను చేసిన పనిని వారెందుకు చేయడం లేదు, దాన్ని అసహ్యించు కుంటున్నారు. అల్లాహ్ సాక్షి! నాకు దైవప్రీతి గురించి అందరికంటే బాగాతెలుసు. అందరికంటే అధికంగా అల్లాహ్‌(త)కు భయపడుతాను,’ అని అన్నారు.)

వివరణ-146: ప్రవక్త (స) ఉపవాస స్థితిలో తన భార్య ను ముద్దుపెట్టుకున్నారు. లేదా ప్రయాణంలో ఉపవాసం విరమించారు. వీటి గురించి ప్రజలకు అనుమతి కూడా ఇచ్చారు. అయితే కొందరు దీనికి ఇష్టపడ లేదు. ప్రవక్త (స)కు ఈ విషయం తెలిసి అసహ్యించు కున్నారు. ప్రసంగంలో చీవాట్లుపెడుతూ, ‘నేను మీ కంటే అధికంగా అల్లాహ్(త)కు భయపడుతూ ఆయన ఆజ్ఞలను ఆచరిస్తున్నాను,’ అని అన్నారు. ఈ ‘హదీసు’ ద్వారా అనుమతిపై ఆచరించటం ఉత్తమం అని తెలిసింది.
(బు’ఖారీ, ముస్లిమ్‌)
147 – 8 (1/52)
وَعَنْ رَافِعِ بْنِ خَدِيْجٍ، قَالَ: قَدِمَ نَبِيُّ اللهِ صلى الله عليه وسلم وَهُمْ يُؤَبِّرُوْنَ النَّخْلَ، فَقَالَ: “مَا تَصْنَعُوْنَ؟” قَالُوْا: كُنَّا نَصْنَعُهُ. قَالَ: “لَعَلَّكُمْ لَوْ لَمْ تَفْعَلُوْا كَانَ خَيْرًا”. فَتَرَكُوْهُ؛ فَنَقَصَتْ. قَالَ: فَذَكَرُوْا ذَلِكَ لَهُ. فَقَالَ: “إِنَّمَا أَنَا بَشَرٌ؛ إِذَا أَمَرْتُكُمْ بِشَيْءٍ مِنْ أَمْرِ دِيْنِكُمْ، فَخُذُوْا بِهِ؛ وَإِذَا أَمَرْتُكُمْ بِشَيءٍ مِّنْ رَّأيي، فَإِنَّمَا أَنَا بَشَرٌ”. رَوَاهُ مُسْلِمٌ

(8) [1/52-దృఢం]
రాఫె’ బిన్‌ ‘ఖదీజ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మదీనహ్ వచ్చిన తర్వాత, అక్కడి ప్రజలను ఖర్జూరపు చెట్లలో జతకడు తున్నట్టు చూశారు. ప్రవక్త (స), ‘మీరేం చేస్తున్నారు,’ అని అడిగారు. దానికి వారు, ‘మేము చాలా కాలం నుండి ఇలాగే చేస్తున్నాము,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘మీరిలా చేయకుండా ఉంటే బాగుంటుంది,’ అని అన్నారు. ప్రవక్త (స) మాటలు విని అలా చేయడం మానివేశారు. దానివల్ల ఆ సంవత్సరం తక్కువ పంట పండటాన్ని గురించి ప్రవక్త (స)కు తెలియపరిచారు. అప్పుడు ప్రవక్త (స) ‘నేనూ మీలాంటి మానవుడ్నే. నేను మీకు ఏదైనా ధార్మిక ఆదేశం ఇస్తే దాన్ని స్వీకరించండి. ఏదైనా విషయం గురించి నా అభిప్రాయం తెలిపితే దాన్ని స్వీకరించడం మాత్రం తప్పనిసరి కాదు. ఎందుకంటే నేను కూడా మీలాంటి మానవుడ్నే,’ అని అన్నారు.)

వివరణ-147: ఖర్జూరం చెట్లలో ఆడ, మగ ఉంటాయి. కొన్ని చెట్లకు ఆడపూలు పూస్తాయి. మరికొన్ని చెట్లకు మగపూలు పూస్తాయి. మగపూలు ఆడపూలపై వేస్తే పంటలు అధికంగా పండుతాయి. వేయకపోతే పంటలు తక్కువగా పండుతాయి. మదీనహ్ ప్రజలు మగపూలను ఆడపూలపై వేసేవారు. ఈ విధానాన్ని వారు ”తాబీర్‌” అనేవారు. ప్రవక్త (స) మదీనహ్ వచ్చిన తరువాత ప్రజలను తాబీర్‌ చేస్తుండగా చూశారు. దీన్ని గురించి ఎటువంటి దైవవాణి అవతరించలేదు. దీన్ని అజ్ఞానపు కాలపు మూఢాచారంగా భావించి దాన్నుండి వారించారు. మదీనహ్ ప్రజలు ఆయన (స) ఆదేశాన్ని పాలిస్తూ మానివేశారు. దానివల్ల పంటలు సరిగ్గా పండలేదు. దీన్ని గురించి వారు ప్రవక్త (స)కు తెలియపరిచారు. అప్పుడు ప్రవక్త (స), ‘ప్రాపంచిక విషయాలు నాకంటే మీకు బాగా తెలుసు. ధార్మిక విషయం గురించి నేను ఆదేశిస్తే ఆచరించండి, కాని ప్రాపంచిక విషయాల — అవి మీకు బాగా తెలిసి ఉంటాయి — కాబట్టి వాటిని గురించి, నేను నా అభిప్రాయం తెలిపితే దాన్ని ఆచరించటం, ఆచరించకపోవటం మీ ఇష్టం. నేను కూడా మీలాంటి మానవుడ్నే.’
(ముస్లిమ్‌)
148 – [ 9 ] ( متفق عليه ) (1/53)
وَعَنْ أَبِيْ مُوْسَى، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّمَا مَثَلِيْ وَمَثَلُ مَا بَعَثَنِيَ اللهُ بِهِ كَمَثَلِ رَجُلٍ أَتَى قَوْمًا، فَقَالَ: يَا قَوْمٍ! إِنِّيْ رَأَيْتُ الْجَيْشَ بِعَيْنِيَّ، وَإِنِّيْ أَنَا النَّذِيْرُ الْعُرْيَانَ! فَالنَّجَاءَ النَّجَاءَ. فَأَطَاعَهُ طَائِفَةٌ مِّنْ قَوْمِهِ فَأَدْلَجُوْا، فَانْطَلَقُوْا عَلَى مَهْلِهِمْ، فَنَجَوْا. وَكَذَّبَتْ طَائِفَةٌ مِنْهُمْ فَأَصْبَحُوْا مَكَانَهُمْ، فَصَبَّحُهُمْ الْجَيْشُ فَأَهْلَكَهُمْ وَاجْتَاحَهُمْ. فَذِلَكَ مَثَلُ مَنْ أَطَاعَنِيْ فَاتَّبَعَ مَا جِئْتُ بِهِ، وَ مَنْ عَصَانِيْ وَكَذَّبَ مَا جِئْتُ بِهِ مِنَ الْحَقِّ”.

(9) [1/53-ఏకీభవితం]
అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను నాకు ఇచ్చి పంపబడిన ధర్మం ఉదాహరణ ఎలా ఉందంటే, ఒకవ్యక్తి తన జాతివారి వద్దకు వచ్చి, ‘ఓ నా జాతి ప్రజలారా! శత్రు సైన్యాన్ని నేను నా కళ్ళారా చూశాను. నేను మిమ్మల్ని శత్రువును గురించి హెచ్చరిస్తున్నాను. మీ శ్రేయాన్ని కోరుతూ మిమ్మల్ని భయపెడుతున్నాను. ఆ శత్రువు రాకముందే మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి ప్రయత్నించండి,’ అని అన్నాడు. అతని జాతిలోని కొంత మంది అతని మాటలు విని తమ రక్షణా ఏర్పాట్లు చేసుకున్నారు. రాత్రికి రాత్రి అక్కడి నుండి పారిపోయారు. శత్రువు నుండి తప్పించుకున్నారు. మరికొందరు అతన్ని అసత్యవాదిగా భావించి, తెల్లవారే వరకు తమ పడకలపై పడుకున్నారు. ఉదయం శత్రుసైన్యం వారిపై విరుచుకు పడింది. వారిని సర్వనాశనం చేసివేసింది. వారి సంతతిని సమాప్తం చేసింది. సరిగ్గా ఈ విషయమే నామాట విన్న వారికి వర్తిస్తుంది. ఒకడు, నేను అల్లాహ్‌ (త) వద్ద నుండి తీసుకు వచ్చిన ఆదేశాలను పాటిస్తూ, విధేయత చూపుతూ గడుపుతాడు. మరోవ్యక్తి నేను అల్లాహ్‌(త) వద్ద నుండి తీసుకు వచ్చిన ఆదేశాలనూ, ఉపదేశాలనూ నన్నూ అసత్యవాదిగాభావించి తిరస్క రిస్తాడు, అంగీకరించడు.” )

వివరణ-148: అరబ్బుల్లో సాధారణంగా దారిదోపిడీలు ఉదయం సమయంలో చేసేవారు. అందువల్ల వారు ఎవరినైనా దీవిస్తే, ‘ఉదయంపూట నీకు శుభం కలుగు గాక,’ అని దీవించేవారు. అదేవిధంగా అరబ్బుల్లో ఎవరైనా శత్రువును చూస్తే, తన బట్టలు తొలగించి నగ్నంగా తన బట్టలను తలపై పెట్టుకొని, కేకలు పెట్టటం జరిగేది. అది చూసిన ప్రజలు వెంటనే అప్రమత్తం అయిపోయేవారు. శత్రువు రాకముందే రక్షించుకునే, ఎదుర్కొనే సన్నాహాలు చేసేవారు. ప్రవక్త (స) తన్ను తాను, ‘స్పష్టంగా హెచ్చరించే వాడిని,’ అని అన్నారు. ప్రవక్త (స) మాట విన్నవారు సాఫల్యం పొందుతారు. ప్రవక్త (స)ను తిరస్కరించినవారు నాశనం అవుతారు.
(బు’ఖారీ, ముస్లిమ్‌)
149 – [ 10 ] ( متفق عليه ) (1/53)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْهُ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَثَلِيْ كَمَثَلِ رَجُلٍ اِسْتَوْقَدَ نَارًا، فَلَمَّا أَضَاءَتْ مَا حَوْلَهَا، جَعَلَ الْفَرَاشُ وَهَذِهِ الدَّوَابُ الَّتِيْ تَقَعُ فِيْ النَّارِ يَقَعْنَ فِيْهَا، وَجَعَلَ يَحْجُزُهُنَّ وَيَغْلِبْنَهُ فَيَقَتَحَّمْنَ فِيْهَا، فَأَنَا آخِذٌ بِحُجَزِكُمْ عَنِ النَّارِ، وَأَنْتُمْ تَقْحَّمُوْنَ فِيْهَا”. هَذَهِ رِوَايَةُ الْبُخَارِيِّ.
وَلِمُسْلِمٍ نَحْوُهَا، وَقَالَ فِيْ آخِرِهَا: قَال: “فَذَلِكَ مَثَلِيْ وَمَثَلُكُمْ، أَنَا آخُذٌ بِحُجَزِكُمْ عَنِ النَّارِ: هَلَّمَّ عَنِ النَّارِ، هَلُمَّ عَنِ النَّارِ! فَتَغْلِبُوْنِيْ تَقَحَّمُوْنَ فِيْهَا”. متفق عليه.

(10) [1/53-ఏకీభవితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా ఉదాహరణ ఒక వ్యక్తిని పోలిఉంది. ‘అతడు మంట రాజేశాడు. దానివల్ల ఆ పరిసర ప్రాంతమంతా వెలుగుతో నిండిపోయింది. చుట్టు ప్రక్కల ఉన్న ఈగలు, కీటకాలు, వచ్చి ఆ మంటలో పడసాగాయి. అది చూసి ఆ వ్యక్తి రక్షించ సాగాడు. కాని అవి అతన్ని అధిగమించాయి. అవి ఆ మంటలో పడసాగాయి. అదేవిధంగా నేను మిమ్మల్ని పట్టు కొని ఆ మంట నుండి రక్షిస్తున్నాను. కాని మీరు ఆ మంటలో పడుతూనే ఉన్నారు.’ ” (బు’ఖారీ, ముస్లిమ్‌)
కాని ముస్లిమ్‌ ఉల్లేఖనంలో చివరన, ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”నాదీ, మీదీ ఉదాహరణ ఎలా ఉందంటే, నేను మీ నడుమును పట్టుకొని ఉన్నాను — మీరు నరకంలో పడకూడదని — కాని మీరు నన్ను అధిగమించి నరకంలో ప్రవేశిస్తున్నారు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)
అదేవిధంగా అవిశ్వాసులు, అవిధేయులు తమ మూర్ఖత్వం వల్ల నరకానికి పోయే పనిచేసి నరకానికి గురవుతారు. ప్రవక్త (స) మాటవింటే ఎన్నడూ నరకంలో పడేవారు కాదు.
150 – [ 11 ] ( متفق عليه ) (1/54)
وَعَنْ أَبِيْ مُوْسَى، قال: قال رسول الله صلى الله عليه وسلم: “مَثَلُ مَا بَعَثَنِيَ اللهُ بِهِ مِنَ الْهَدْىِ وَالْعِلْمِ كَمَثَلِ الْغَيْثِ الْكَثِيْرِ أَصَابَ أَرْضًا، فَكَانَت مِنْهَا طَائِفَة طَيِّبَة قَبِلَتِ الْمَاءَ، فَأَنْبَتَتِ الْكَلَأ وَالْعُشْبَ الْكَثِيْرَ، وَكَانَتْ مِنْهَا أَجَادِبُ أَمْسَكَتِ الْمَاءَ، فَنَفَعَ اللهُ بِهَا النَّاسَ، فَشَرِبُوْا وَسَقَوْا وَزَرَعُوْا، وَأَصَابَ مِنْهَا طَائِفَةً أخْرَى، إِنَّمَا هِيَ قِيْعَانٌ لَا تُمْسِكُ مَاءُ، وَلَا تُنْبِتُ كَلَأً. فَذَلِكَ مَثَلُ مَنْ فَقُهَ فِيْ دِيْنِ اللهِ وَنَفَعَهُ مَا بَعَثَنِيَ اللهُ بِهِ فَعَلِمَ وَعَلَّمَ، وَمَثَلُ مَنْ لَّمْ يَرْفَعُ بِذَلِكَ رَأْسًا، وَلَمْ يَقْبَلْ هُدَى اللهِ الَّذِيْ أُرْسِلْتُ بِهِ”. متفق عليه .

(11) [1/54-ఏకీభవితం]
అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నాకు ఇచ్చి పంపబడిన రుజుమార్గం, ధర్మం, కుండపోతగా కురిసే వర్షం వంటిది. అది భూమిపై వివిధ ప్రాంతాల్లో పడుతుంది. సారవంతమైన భూమిపై కురిసింది. దాని వల్ల అక్కడ పచ్చ దనం, పంటలు, ఆహార ధాన్యాలు పండాయి. ఆ వర్షం బంజరు భూమిపై కూడా పడింది. ఆ భూమి నీటిని నిలువ చేసింది. దానివల్ల ప్రజలకు లాభం కలిగింది. ప్రజలు త్రాగారు, త్రాపించారు, పంటలు పండించారు. ఈ వర్షం రాతి నేలపై కూడా కురిసింది. అది నీటిని ఆపి ఉంచలేదు, పంటలు పండించలేదు. సరిగ్గా ఇలాగే, ఒక వ్యక్తి, అల్లాహ్(త) ధర్మాన్ని అర్థం చేసుకున్నాడు. అల్లాహ్‌(త) ఆ ధర్మం ద్వారా అతనికి లాభం చేకూర్చాడు. అతను నేర్చుకున్నాడు, ఇతరులకు నేర్పించాడు. మరోవ్యక్తి దైవధర్మం వైపు తలఎత్తి చూడనైనా చూడలేదు. ఇంకా అల్లాహ్‌(త) రుజుమార్గాన్ని అంటే నేను తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించ లేదు.” )

వివరణ-150: దైవధర్మం వర్షం వంటిది. ఏ విధంగా వర్షం ద్వారా బంజరు భూమి కూడా పంటలు పండిస్తుందో, అదే విధంగా దైవధర్మం ద్వారా క్షీణదశలో ఉన్న హృదయాలు కూడా సజీవమవుతాయి. వర్షం లాభదాయకమైనది. అన్ని చోట్ల పడుతుంది. అందులో ఎటువంటి లోపం లేదు. కాని పంటల్లో హెచ్చుతగ్గులు జరుగుతాయి. ఒక ప్రాంతంలో పంటలు అధికంగా పండుతాయి. మరోచోట తక్కువగా పండుతాయి. మరోచోట అసలు పండవు. అదేవిధంగా దైవప్రవక్తలు తీసుకువచ్చిన ధర్మం పరిపూర్ణంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం, లోపం ఉండదు. దాన్ని స్వీకరించడం అనేది స్వభావంపై ఆధారపడి ఉంటుంది. మంచి స్వభావం గలవారు దాన్ని స్వీకరిస్తారు. చెడు స్వభావం గలవారు దాన్ని తిరస్కరిస్తారు. అంటే దాన్ని స్వీకరించలేరు. ‘హదీసు’లో దైవధర్మాన్ని వర్షంతో పోల్చటం జరిగింది. దైవధర్మం, దైవజీవన వ్యవస్థవల్ల హృదయాలు వికసిస్తాయి. కనుక దైవధర్మాన్ని స్వీకరించిన వ్యక్తి తాను ఆచరిస్తూ, ఇతరులకూ దాన్ని బోధించాలి, నేర్పించాలి. సారవంతమైన నేల తాను పచ్చగా ఉంటుంది. ఇతరుల కొరకు పంటలు పండిస్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తి తాను పూర్తిగా ఆచరించక పోయినా ఇతరులకు నేర్పించటం, బోధించటం చేస్తాడు. వీరు బంజరు నేల వంటివారు. అక్కడ పంటలైతే పండవు కాని, ఆ నేల నీటిని నిల్వచేస్తుంది. దానివల్ల మానవులు, జంతువులు, కీటకాలు లాభం పొందుతాయి. ఇంకా, ఒక వ్యక్తి నేర్చుకోడు, ఇతరులకు నేర్పించడు. అటువంటి వ్యక్తి రాతినేల వంటివాడు. అక్కడ పంటలు పండవు, నీరూ నిల్వదు. అక్కడ వర్షం పడుతుంది. చుట్టుప్రక్కల వ్యాపించిపోతుంది. అంటే అతనూ లాభం పొందలేదు, ఇతరులకూ లాభం చేకూర్చలేదు. ‘హదీసు’లో రెండు విధాల వ్యక్తులను గురించి పేర్కొనడం జరిగింది. ఒక రకం వ్యక్తులు దైవధర్మం ద్వారా రుజుమార్గం స్వీకరించి, సాఫల్యం పొంది లాభం పొందుతారు. రెండవ రకం వ్యక్తులు దైవధర్మం, రుజు మార్గాన్ని తిరస్కరించి, అసాఫల్యానికి గురై నష్టానికి గురవుతారు. అదేవిధంగా భూమి కూడా రెండు రకాలుగా విభజించబడింది. 1. లాభం పొంది, లాభం చేకూర్చేది, 2. ఏమాత్రం లాభం చేకూర్చలేనిది. అదేవిధంగా లాభం చేకూర్చే భూమి రెండు రకాలుగా ఉంది. 1. పంటలు పండించేది 2. పంటలు పండించనిది. వ్యక్తుల్లో కూడా ధర్మాన్ని స్వీకరించి, ఆచరించి, ఇతరులకు బోధించే వారు; దాన్ని స్వీకరించి, ఆచరించరు కాని ఇతరులకు బోధించేవారు. ఇక రాతినేల వంటివారు స్వీకరించరూ, ఆచరించరూ, ఇతరులకు బోధించరు కూడాను.
(బు’ఖారీ, ముస్లిమ్‌)
151 – [ 12 ] ( متفق عليه ) (1/54)
وَعَنْ عَائِشَةَ، قَالَتْ: تَلَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: (هُوَ الَّذِيْ أَنْزَلَ عَلَيْكَ الْكِتَابَ مِنْهُ آيَاتٌ مُحْكَمَاتٌ) وَقَرَأَ إِلَى (وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ؛3: 7). قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فَإِذَا رَأَيْتَ – وَعِنْدَ مُسْلِمٍ: رَأَيْتُمْ – الَّذِيْنَ يَتَّبِعُوْنَ مَا تَشَابَهَ مِنْهُ؛ فَأُولَئِكَ الَّذِيْنَ سَمَّاهُمُ اللهُ. فَاحْذَرُوْهُمْ”.

(12) [1/54-ఏకీభవితం]
‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”హువల్ల’జీ అన్‌’జల ’అలైకల్‌ కితాబ మిన్‌హు ఆయాతున్‌ ముహ్‌కమాతున్‌” నుండి ”వమా యజ్జక్కరు ఇల్లా ఊలుల్‌ అల్‌బాబ్‌” – వరకు పఠించారు [సూ. ఆల ఇమ్రాన్, 3:7]. ఈ ఆయతును పఠించిన తర్వాత, ‘ఆయి’షహ్‌ (ర)! ”అస్పష్టమైన వాటి వెంటపడే వారిని నువ్వు చూస్తే, (వారి పేరు అల్లాహుత’ఆలా, మార్గభ్రష్టులైన వారిలో వ్రాశాడనుకో), నిన్ను నీవు వారి నుండి కాపాడుకో!” అని అన్నారు. ముస్లిమ్‌ ఉల్లేఖనంలో, ”పరస్పరం పోలిఉన్న ఆయాతుల వెంట పడేవారిని అల్లాహ్‌ భ్రష్టత్వానికి గురిచేస్తాడు. వారికి దూరంగా ఉండాలి” అని ఉంది. )

వివరణ-151: ఇది సూరహ్‌ ఆల-ఇమ్రాన్‌, మొదటి రుకూలోని ఆయతు. అల్లాహ్‌ ఆదేశం: ”ఆయన (అల్లాహ్‌)యే నీపై (ఓ ము’హమ్మద్‌!) ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) అవతరింపజేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ము’హ్‌కమాత్‌) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్‌) ఉన్నాయి. కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు, సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను అపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్ట మైనవాటి వెంటపడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్‌కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ, పరిపక్వ జ్ఞానం గలవారు: ”మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!” అని అంటారు. జ్ఞానవంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.” (సూ. ఆల ఇమ్రాన్‌ 3:7)
ఖుర్‌ఆన్‌లో రెండు రకాల ఆయాతులు ఉన్నాయని ఈ ఆయతులో పేర్కొనడం జరిగింది. 1. స్పష్టమైనవి, 2. అస్పష్టమైనవి. స్పష్టంగా ఉన్న ఆయాతులను ఆచరించటం తప్పనిసరి విధి. అదేవిధంగా అస్పష్టంగా ఉన్న ఆయాతులను విశ్వసించటం కూడా తప్పనిసరి విధి. కాని వాటి వెంటపడరాదు. ప్రవక్త (స) తన అనుచరులను అస్పష్టమైన ఆయాతుల వెంట పడకూడదని వారించారు.
ఇటువంటి ఆయాతుల వెనుక పడేవారిని అల్లాహ్‌(త) హృద యాలలో వక్రత గలవారని పేర్కొన్నాడు.
(బు’ఖారీ, ముస్లిమ్‌)
152 – 13 (1/54)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو، قَالَ: هَجَّرْتُ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يَوْمًا، قَالَ: فَسَمِعَ أَصْوَاتَ رَجُلَيْنِ اخْتَلَفَا فِيْ آيَةٍ، فَخَرَجَ عَلَيْنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُعْرَفُ فِيْ وَجْهِهِ الْغَضَبُ، فَقَالَ:”إِنَّمَا هَلَكَ مَنْ كَانَ قَبْلَكُمْ بِاِخْتِلَافِهِمْ فِيْ الْكِتَابِ”. رَوَاهُ مُسْلِمٌ .

(13) [1/54-దృఢం]
‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ఒకరోజు మధ్యాహ్న సమయాన నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స) ఇద్దరు వ్యక్తుల మాటల శబ్దం విన్నారు, ఒక ఆయతు విషయంలో పరస్పరం విమర్శించు కుంటున్నారు. వెంటనే ప్రవక్త (స) మా వద్దకు వచ్చారు. ఆయన (స) ముఖవర్చస్సు ఆగ్రహంతో నిండిఉంది. ప్రవక్త (స), ”మీ పూర్వీకులు దైవగ్రంథం విషయంలో భేదాభి ప్రాయాలకు గురికావటం వల్లనే నాశనం చేయ బడ్డారు,” అని అన్నారు. )

వివరణ-152: ఒకేలా ఉండే వాక్యాల్లో చర్చిస్తూ ఒకరు దీని అర్థం ఇదని, మరొకరు అదికాదని విభేదించు కోవటం. ఇది క్రమంగా శత్రుత్వానికి దారితీస్తుంది. అందు వల్లే ప్రవక్త (స) దీన్నుండి వారించారు. ఇంకా దైవగ్రంథం పట్ల వివాదానికి గురికారాదు. యూదులు మరియు క్రైస్తవులు ఈకారణం వల్లనే నాశనం చేయబడ్డారు. వారు దైవగ్రంథం విషయంలో అభి ప్రాయభేదాలకు గురయి, ఆ విభేదాలవల్లే అనేక వర్గాలుగా చీలిపోయారు.
(ముస్లిమ్‌)
153 – [ 14 ] ( متفق عليه ) (1/55)
وَعَنْ سَعْدٍ بْنِ أَبِيْ وَقَاصٍ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَعْظَمُ الْمُسْلِمِيْنَ فِيْ المسلمين جُرْمًا مَنْ سَأَلَ عَنْ شَيْءٍ لَّمْ يُحَرَّمْ عَلَى النَّاسِ، فَحُرِّمَ مِنْ أَجْلِ مَسْأَلَتِهِ”. متفق عليه

(14) [1/55-ఏకీభవితం]
స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముస్లిముల్లో అందరికంటే నేరస్తులు, పాపా త్ములు ఎవరంటే, నిషిద్ధంకాని విషయం గురించి గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేసేవారు. కాని గుచ్చిగుచ్చి ప్రశ్నించటంవల్ల ఆవిషయం నిషిద్ధమయిపోయింది.” )

వివరణ-153: ఖుర్‌ఆన్‌లో అనవసరంగా ప్రశ్నించటాన్ని గురించి వారించడం జరిగింది. అల్లాహ్‌ ఆదేశం: ”ఓ విశ్వాసులారా! వ్యక్తపరిస్తే మీకు బాధ కలిగించెడు విషయాలను గురించి, మీరు ప్రశ్నించకండి. ఖుర్‌ఆన్‌ అవతరింపజేయబడేటప్పుడు, మీరు వాటిని గురించి ప్రశ్నిస్తే! అవి మీకు విశదపరచబడవచ్చు! వాటి కొరకు (ఇంతవరకు మీరు చేసిన ప్రశ్నల కొరకు) అల్లాహ్‌ మిమ్మల్ని మన్నించాడు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, సహనశీలుడు. వాస్తవానికి మీకు పూర్వం ఒక జాతివారు ఇటువంటి ప్రశ్నలనే అడిగారు. తరువాత వాటి (ఆ ప్రశ్నల) కారణంగానే వారు సత్యతిరస్కారానికి గురి అయ్యారు.” (సూ. అల్‌ మాయి’దహ్‌, 5:101-102)
అంటే అనవసర విషయాల గురించి ప్రశ్నించరాదు. వ్యర్థ ప్రశ్నలు వేయరాదు. సులువైనపని కఠినమైనదిగా మార బడవచ్చు. ధర్మసమ్మతమైనది, నిషిద్ధంగా మార్చబడ వచ్చు. ఆదేశం మేరకు ఆచరించండి. వారించిన వాటికి దూరంగా ఉండండి. మౌనం వహించిన వాటిపట్ల మీరూ మౌనంగా ఉండండి. వాటిని చర్చనీయాంశంగా చేసుకోకండి.
ప్రవక్త (స) ప్రవచనం: ”నేను మీకు వదలిపెట్టినంతవరకు మీరు నన్ను వదలిపెట్టి ఉంచండి. మీ పూర్వీకులు అధి కంగా ప్రశ్నించటం, ప్రవక్తల పట్ల విభేదాలకు గురికావటం వల్లనే నాశనం అయ్యారు. అల్లాహ్‌(త) మీపై తప్పనిసరి విధులను విధించాడు. వాటిని వదలకండి. హద్దులు నిర్ణయించాడు. వాటిని మీరకండి. నిషిద్ధాలకు దూరంగా ఉండండి. కొన్ని విషయాల పట్ల మౌనం వహించడం జరిగింది. మతిమరుపువల్ల కాదు.” (ఇబ్నె కసీర్‌)
ప్రవక్త (స) ప్రవచనం: ”అల్లాహ్‌ మీపై ‘హజ్జ్ విధించాడు,” అని అన్నారు. ఒక వ్యక్తి లేచి, ‘ఓ ప్రవక్తా! ‘హజ్జ్ ప్రతి సంవత్సరం తప్పనిసరిగా చేయాలా?’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స) ఆగ్రహించి, ”అల్లాహ్ సాక్షి! ఒకవేళ నేను అవును అంటే, ప్రతి సంవత్సరం తప్పనిసరి అయిపోతుంది. కాని మీరు దాన్ని ఆచరించలేరు, ఆచరించకపోతే అవిధేయతకు గురవుతారు. నేను చెప్పనంతవరకు మీరు అడగకండి. నేను ఆదేశించిన దాన్ని ఆచరించండి. దేని నుండైనా వారిస్తే దానికి దూరంగా ఉండండి.” (ఇబ్నె కసీ’ర్‌)
(బు’ఖారీ, ముస్లిమ్‌)
154 – 15 (1/55)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْه، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَكُوْنُ فِيْ آخِرِ الزَّمَانِ دَجَّالُوْنَ كَذَّابُوْنَ يَأْتُوْنَكُمْ مِنَ الْأَحَادِيْثِ بِمَا لَمْ تَسْمَعُوْا أَنْتُمْ وَلَا آبَاؤُكُمْ، فَإِيَّاكُمْ وَإِيَّاهُمْ، لَا يُضِلُّوْنَكُمْ وَلَا يَفْتِنُوْنَكُمْ”. رَوَاهُ مُسْلِمٌ .

(15) [1/55-దృఢం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రళయానికి సమీపకాలంలో అసత్యవాదులు, దుర్మార్గులూ జన్మిస్తారు. మీకు విచిత్రమైన ‘హదీసు’లను వినిపిస్తారు. మీరూ మీ పూర్వీకులు వాటిని విని ఉండరు. కనుక మీరు ఇటువంటి వారికి దూరంగా ఉండండి. వారిని మీ దగ్గరకు రానివ్వకండి. వారు మిమ్మల్ని మార్గ భ్రష్టత్వానికి గురిచేయకుండా ఉండటానికి, ఉపద్రవాలకు గురిచేయకుండా ఉండటానికి.” )

వివరణ-154: కొందరు ప్రదర్శనాబుద్ధి, పేరు ప్రతిష్ఠల కోసం ‘హదీసు’లను కల్పించి, ప్రవక్త (స) ప్రవచించారని, అనుచరులు చెప్పారని, తాబయీన్లు ఉల్లేఖించారని చెబుతారు. ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. వారి మాటలను వినకండి. వారివద్ద కూర్చోకండి, వారిని మీ వద్ద కూర్చోబెట్టుకోకండి. ఇలా ఎందుకంటే వారు మిమ్మల్ని మార్గభ్రష్టత్వానికి గురిచేయకుండా ఉండ టానికి. షై’తాన్‌ మానవరూపంలో మిమ్మల్ని తప్పు దారి పట్టించటానికి ప్రయత్నిస్తాడు. అప్రమత్తంగా ఉండండి!
(ముస్లిమ్‌)
155 – 16 (1/55)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْه، قَالَ: كَانَ أَهْلُ الْكِتَابِ يَقْرَؤُوْنَ التَّوْرَاةَ بِالْعِبْرَانِيَّةِ، وَيُفَسِّرُوْنَهَا بالْعَرَبِيَّةِ لِأَهْلِ الْإِسْلَامِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُصَدِّقُوْا أَهْلَ الْكِتَابِ وَلَا تُكَذِّبُوْهُمْ. وَ قُوْلُوْا: )آمَنَّا بِاللهِ وَمَا أُنْزَلَ إِلَيْنَا….؛2: 136( اَلْآيَة. رَوَاهُ الْبُخَارِيُّ .

(16) [1/55-దృఢం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: గ్రంథప్రజలు అంటే యూదులు తమ గ్రంథాన్ని ‘ఇబ్‌రానీ భాషలో పఠించే వారు. ముస్లిముల ముందు దాని అనువాదం, వ్యాఖ్యానం అరబ్బీ భాషలో వివరించేవారు. అది తెలిసిన ప్రవక్త (స) తన అనుచరులకు, ”మీరు ధృవీకరించకండి లేదా తిరస్కరించకండి. మీరు కేవలం ”…మేము అల్లాహ్‌ (త)ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన సందేశాలను… విశ్వసించాము,” అని పలకండని ఉపదేశించారు.” )

వివరణ-155: గ్రంథప్రజలు తమ గ్రంథంలో మార్పులు చేర్పులు చేసివేసారు. దైవాదేశాలను తొలగించి, తమకు తోచిన వాటిని చేర్చారు. దీన్ని గురించి ఖుర్‌ఆన్‌ సాక్ష్యం ఇస్తుంది.

”మరియు మీరు అది గ్రంథం లోనిదని భావించాలని, వాస్తవానికి వారిలో కొందరు తమ నాలుకలను త్రిప్పి గ్రంథాన్ని చదువుతారు, కాని (నిజానికి) అది గ్రంథం లోనిది కాదు; మరియు వారు: ”అది అల్లాహ్ దగ్గరనుండి వచ్చింది.” అని అంటారు, కాని అది (నిజానికి) అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది కాదు, మరియు వారు తెలిసి కూడా అల్లాహ్‌పై అబద్ధాలు పలుకుతున్నారు.” (సూ. ఆల ఇమ్రాన్‌, 3:78)

“యూదులలో కొందరు పదాలను వాటి సందర్భాల నుండి తారుమారు చేసి అంటారు: ”మేము (నీ మాటలను) విన్నాము మరియు ఉల్లంఘించాము (సమి’అనా వ ‘అ’సయ్‌నా).” అనీ; మరియు: ”విను! నీ మాట వినకబోవు గాక! (వస్‌మ’అ’గైర ముస్‌మ’ఇన్‌).” అనీ; మరియు (ఓ ము’హమ్మద్‌!) నీవు మామాట విను. (రా’ఇనా) అనీ తమ నాలుకలను మెలిత్రిప్పి సత్యధర్మాన్ని ఎగతాళిచేసే ఉద్దేశ్యంతో అంటారు. కాని అలా కాకుండా: ”విన్నాము, విధేయులమయ్యాము. (సమి’ అనా వ అ’త’అనా).” అనీ; మరియు: ”మమ్మల్ని విను మరియు మాదిక్కు చూడు / మాకు వ్యవధి నివ్వు (వస్‌మ’అ వన్‌”జుర్‌నా),” అనీ, అని ఉంటే వారికే మేలై ఉండేది మరియు ఉత్తమమైన పద్దతిగా ఉండేది. కాని వారి సత్యతిరస్కార వైఖరి వల్ల అల్లాహ్‌ వారిని శపించాడు (బహిష్కరించాడు). కావున వారిలో కొందరు మాత్రమే విశ్వసించేవారు ఉన్నారు.” (సూ. అన్నిసా’, 4:46)

“కావున ఎవరైతే తమ చేతులారా ఒక పుస్తకాన్ని వ్రాసి – దాని వల్ల తుచ్ఛమూల్యం పొందే నిమిత్తం – ”ఇది అల్లాహ తరఫు నుండి వచ్చింది.” అని (ప్రజలకు) చెబుతారో, వారికి వినాశముంది. వారి చేతులు వ్రాసినందుకు వారికి వినాశముంది మరియు వారు సంపాదించిన దానికి కూడా వారికి వినాశముంది.” (సూ. అల్‌-బఖరహ్‌, 2:79)

ఈ ‘హదీసు’లో పేర్కొనబడిన ఆయతులు: ”మరియు వారంటారు: ‘మీరు యూదులుగా లేదా క్రైస్తవులుగా ఉంటేనే మీకు మార్గదర్శకత్వం లభిస్తుంది!’ వారితో అను: ‘వాస్తవానికి, మేము (అనుసరించేది) ఇబ్రాహీమ్ మతం, ఏకదైవ సిధ్ధాంతం (’హనీఫా). మరియు అతను బహుదైవా రాధకుడు కాదు.’ (ఓ ముస్లింలారా!) మీరు ఇలా అనండి: ‘మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన సందేశాలను మరియు ఇబ్రాహీమ్, ఇస్మా’యీల్, ఇస్’హాఖ్, య’అఖూబ్ మరియు అతని సంతతి వారికి ఇవ్వబడిన వాటినీ మరియు మూసా, ’ఈసా మరియు ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభువు తరఫునుండి ఇవ్వబడిన వాటినీ (సందేశాలను) విశ్వసిస్తాము. వారిలో ఏ ఒక్కరిపట్లా మేము భేదభావం చూపము. మేము ఆయనకు విధేయులం (ముస్లింలం) అయ్యాము. వారు కూడా మీరు విశ్వసించినట్లు విశ్వసిస్తే, వారు సన్మార్గం పొందిన వారవుతారు. ఒకవేళ వారు తిరిగిపోతే, విరోధం వహించిన వారవుతారు. (వారినుండి రక్షించటానికి) మీకు అల్లాహ్ చాలు. ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.” (సూ. అల్‌ బఖరహ్‌, 2:135-137)
[సూ. అల్-బఖరహ్, 2:136], (బు’ఖారీ)
156 – 17 (1/55)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْهُ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كَفَى بِالْمَرْءِ كِذْبًا أَنْ يُّحَدِّثَ بِكُلِّ مَا سَمِعَ”. رَوَاهُ مُسْلِمٌ .

(17) [1/55-దృఢం]
అబూ-హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తి అసత్యం పలకడానికి, విన్న ప్రతీవిషయం (పరిశోధించకుండా) చెప్పటమేచాలు.” )

వివరణ-156: అంటే అతనికి అసత్యం పలికే అలవాటు లేదు. కాని విన్న ప్రతి విషయం సత్యమా, అసత్యమా అని ఆలోచించకుండా చెబుతూ ఉంటాడు. అది సత్యమైతే సరే, కాని అది అసత్యం అయితే, అసత్యం వినిపించేవాడు కూడా అసత్యవాదిగానే పరిగణించబడతాడు.
(ముస్లిమ్‌)
157 – 18 (1/55)
وعَنْ عبد الله بْنِ مَسْعُوْدٍ، قَال: قال رسول الله صلى الله عليه وسلم: “مَا مِنْ نَّبِيٍّ بَعَثَهُ اللهُ فِيْ أُمَّتِه قَبْلِيْ إِلَّا كَانَ لَهُ مِنْ أُمَّتِهِ حَوَارِيُّوْنَ وَأَصْحَابُ يَّأْخُذُوْنَ بسُنَّتِهِ، وَيَقْتَدُوْنَ بِأَمْرِهِ ، ثُمَّ إِنَّهَا تَخْلُفُ مِنْ بَعَدِهِمْ خُلُوْفٌ يَقُوْلُوْنَ مَا لَا يَفْعَلُوْنَ، وَيَفْعَلُوْنَ مَا لَا يُؤمَرُوْنَ، فَمَنْ جَاهَدَهُمْ بِيَدِهِ فَهُوَ مُؤْمِنٌ، وَمَنْ جَاهَدَهُمْ بِلِسَانِهِ فَهُوَ مُؤْمِنٌ، وَمَنْ جَاهَدَهُمْ بِقَلْبِهِ فَهُوَ مُؤْمِنٌ، وَلَيْسَ وَرَاءَ ذَلِكَ مِنَ الْإِيْمَانِ حَبَّةُ خَرْدَلٍ”. رَوَاهُ مُسْلِم .

(18) [1/55-దృఢం]
ఇబ్నె మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా కంటే ముందు ప్రవక్తలకు ఏజాతిలోనూ సహాయ సహకారాలు అందించేవారు, ప్రవక్తలను వారు అనుస రించేవారు, విధేయత చూపేవారు. అంటే ప్రతిజాతి లోనూ ప్రవక్తలకు సహాయ సహకారాలు అందించే వారు, విధేయత చూపేవారు ఉండే వారు. కాని ఆ తరువాత కొంత మంది చరిత్రహీనులు జన్మించారు. వారు తాము చెప్పింది చేయరు. ఆదేశించబడని దాన్ని చేసేవారు. ఇటువంటి వారితో తన చేతి ద్వారా పోరాడిన వాడు పరిపూర్ణ విశ్వాసి. అంటే వారి చెడుగులను వారించటానికి తన చేతితో ప్రయ త్నించే వారు పరిపూర్ణ విశ్వాసులు. వారితో తన నోటి ద్వారా పోరాడినవాడు పరిపూర్ణ విశ్వాసి. ఇంకా వారి చెడులను మనసులో చెడుగా భావించే వాడు పరిపూర్ణ విశ్వాసి. ఆ తరువాత ఒక్క రవ్వ కూడా విశ్వాసం లేదు. అంటే వారి చెడుగులను చెడుగా భావించని వారు విశ్వాసులు కారు.” (ముస్లిమ్‌)
158 – 19 (1/56)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ، قاَل رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم: “مَنْ دَعَا إِلَى هُدًى كَانَ لَهُ مِنَ الْأَجْرِ مِثْلُ أُجُوْرِ مَنْ تَبِعَهُ، لَا يَنْقُصُ ذَلِكَ مِنْ أُجُوْرِهِمْ شَيْئًا. وَمَنْ دَعَا إِلَى ضَلاَلَةٍ، كَانَ عَلَيْهِ مِنَ الْإِثْمِ مِثْلَ آثَامِ مَنْ تَبِعَهُ، لَا يَنْقُصُ ذَلِكَ مِنْ آثَامِهِمْ شَيْئا”. رَوَاهُ مُسْلِمٌ .

(19) [1/56-దృఢం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ఎవరైనా ఎవరినైనా రుజుమార్గం వైపుకు పిలిస్తే, పిలుపును స్వీకరించిన వానికి సమానంగా అతనికి పుణ్యం లభిస్తుంది. వారి పుణ్యంలో ఎటువంటి తగ్గుదల ఉండదు. అంటే పిలిచేవానికి, పిలుపు విన్న వానికి సమానంగా పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా ఎవరైనా చెడు వైపుకు పిలిస్తే, పిలిచే వానికి, పిలుపు విన్నవానికి సమానంగా పాపం చుట్టు కుంటుంది. వారి పాపంలో ఎటువంటి తగ్గుదల ఉండదు.” (ముస్లిమ్‌)
159 – 20 (1/56)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْهُ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “بَدَأَ الْإِسْلَامُ غَرِيْبًا، وَسَيَعُوْدُ كَمَا بَدَأَ فَطُوْبَى لِلْغُرَبَاءِ”. رَوَاهُ مُسْلِمٌ

(20) [1/56-దృఢం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇస్లామ్‌ పేదరికం ద్వారానే ప్రారంభం అయ్యింది. పేదరికం ద్వారానే అంతమవుతుంది. కనుక పేదవారికి శుభమవు గాక!” )

వివరణ-159: అంటే ఇస్లామ్‌ ప్రారంభంలో ముస్లిములు నిరుపేదలుగా ఉండేవారు. చివరి కాలంలో కూడా ఇస్లామ్‌ను అనుసరించేవారు పేద ప్రజలే ఉంటారు. అందువల్ల వీరే గొప్ప శుభవార్తకు తగినవారు. ప్రారంభంలో ఇస్లామ్‌ కొరకు పాటుపడింది ఈ పేద ప్రజలే, చివరి కాలంలో ఇస్లామ్‌ ప్రకారం జీవించేవారు కూడా ఈ పేదప్రజలే.
(ముస్లిమ్‌)
160 – [ 21 ] ( متفق عليه ) (1/56)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْإِيْمَانَ لَيَأْرِزُ إِلَى الْمَدِيْنَةِ كَمَا تَأْرِزُ الْحَيَّةُ إِلَى جُحْرِهَا”. متفق عليه.
و سنذكر حديث أبي هريرة: “ذَرُونِي مَا تَرَكْتُم” في كِتَابِ المَنَاسِك، و حديثي معاوية و جابر: “لا يزال من أمتي” و (الآخر): “لا يزال طائفة من أمتي” في باب: ثواب هذه الأمة، إن شاء الله.

(21) [1/56-ఏకీభవితం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసం ముడుచుకొని మళ్ళీ మదీనహ్ వైపునకే తిరిగి వచ్చేస్తుంది, ఏవిధంగా పాము తిరిగి తన పుట్టలోనికి ప్రవేశిస్తుందో.” ) వివరణ160: అంటే చివరి కాలంలో కష్టాలు, ఆపదలు అధికమవుతాయి. ముస్లిములు ఆ కష్టాలను, ఆపదలను భరించలేక మదీనహ్ కు వస్తారు. ఎందుకంటే ఇక్కడ శాంతి భద్రతలు ఉంటాయి. అంటే పాము తనపుట్టలోకి వచ్చినట్టు, ముస్లిములందరూ తిరిగి మదీనహ్ చేరుకుంటారు.

(బు’ఖారీ, ముస్లిమ్‌)

اَلْفَصْلُ الثَّانِيُ రెండవ విభాగం
161 – 22 (1/56)
عَنْ رَبِيعَةَ الْجُرَشِي، قَال: أتى النبي صلى الله عليه وسلم، فَقِيلَ لَهُ لِتَنَمْ عَيْنُكَ، وَلْتَسْمَعْ أُذُنُكَ، وَلْيَعْقِلْ قَلْبُكَ، قَالَ: “فَنَامَتْ عيني، وَسَمِعَتْ أُذُنَايَ، وَعَقَلَ قَلْبِيْ”. قَالَ: “فَقِيلَ لِي: سَيِّدٌ بنَى دَارًا، فَصَنَعَ فِيها مَأدُبَةً وَّأَرْسَلَ دَاعِيًا، فَمَنْ أَجَابَ الدَّاعِي، دَخَلَ الدَّارَ، وَأَكَلَ مِنَ الْمَأدُبَةِ، وَرَضِيَ عَنْهُ السَّيِّدُ، وَمَنْ لَّمْ يُجِبَ الدَّاعِيْ، لَمْ يُدْخِلِ الدَّارَ، وَلَمْ يَاْكُلْ مِنَ الْمَأْدُبَةِ، وَسَخَطَ عَلَيْه السَّيِّدُ”. قَالَ: “فَاللهُ السَّيِّدُ، وَمُحَمَّدٌ الدَّاعِيْ، وَالدَّارُ الْإِسْلَامُ، وَالْمَأدُبَةُ الْجَنَّةُ”. رَوَاهُ الدَّارِمِيُّ.

(22) [1/56-బలహీనం]
రబీ’అహ్ జురషి(ర) కథనం: కలలో ప్రవక్త (స) వద్దకు ఒక దైవదూత వచ్చాడు. వచ్చి, ‘మీ కళ్లు పడుకున్నాయి, మీ చెవులు నిద్రపోతున్నాయి, మీ హృదయం అర్థం చేసు కుంటుంది,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘నా కళ్ళు పడుకున్నాయి. నా చెవులు విన్నాయి, నా హృదయం గుర్తుంచింది,’ అని అన్నారు. అనంతరం దైవదూతలు నా ఉదాహరణ ఇలా పేర్కొన్నారు. ”ఒక నాయకుడు ఒక ఇల్లు నిర్మించాడు. అందులో విందు ఏర్పాటు చేశాడు. ఆ తరువాత ప్రజలను పిలవమని ఒక వ్యక్తిని పంపాడు. అతని పిలుపును స్వీకరించినవారు ఆ ఇంటిలో ప్రవే శిస్తారు. ఇంకా విందు భోజనాలు కూడా ఆరగిస్తారు. అతని యజమాని కూడా సంతోషిస్తాడు. మరి ఆ వ్యక్తి పిలుపును తిరస్క రించిన వారు ఆ ఇంటిలోనూ ప్రవేశించరు. విందూ ఆరగించరు. యజమాని కూడా సంతోషించడు. ఈ ఉదాహరణలో నాయకుడు అంటే అల్లాహ్‌, పిలిచేవాడు అంటే ముహమ్మద్‌ ప్రవక్త (స). ఇల్లు అంటే ఇస్లామ్‌. ఆహార పదార్థాలు అంటే స్వర్గం,” )

వివరణ-161: కళ్ళు నిద్రపోవటం అంటే, కళ్ళు చెవులు హృదయంతో శ్రద్ధగా వినండి అని అర్థం. ప్రవక్త (స) అలాగే చేశారు. ఈ ‘హదీసు’ ఉల్లేఖనకర్త ప్రఖ్యాత అనుచరులు రబీ’అహ్ జురషీ (ర).
అని అర్థం. (దార్మీ)
162 – 23 (1/57)
وَعَنْ أَبِيْ رَافِعٍ رضى الله عنه، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صَلى الله عليه وسلم: “لَاُ ألْفِيَنَّ أَحَدَكُمْ مُتَّكِئًا عَلَى أَرِيْكَتِهِ، يَأْتِيْهِ الأمر من أَمْرِي مِمَّا أُمِرْتُ بِهِ أَوْ نُهِيْتُ عَنْهُ، فَيَقُوْلُ: لَا أَدْرِيْ، مَا وَجَدْنَا فِيْ كِتَابِ اللهِ اتَّبَعْنَاهُ”. رَوَاهُ أَحْمَدُ، وَأَبُوْ دَاوُدَ، وَالتِّرْمِذِيُّ، وَابْنُ مَاجَه، وَالْبَيْهَقِيُّ فِيْ “دَلَائِلِ النَّبُوَّةِ”. وَقَالَ الترمذي حسن صحيح .

(23) [1/57-దృఢం]
అబూ రాఫె’అ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవ్వరూ తమ ఆసనాలపై దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉండి, నా ఆదేశాల్లో చేయమన్నవి లేదా వాటికి దూరంగా ఉండమన్నవి అతని వద్దకు చేరినప్పటికీ వాటిని విని, ‘నాకేమీ తెలియదు, ఖుర్‌ఆన్‌లో ఉన్నవాటినే మేము ఆచరిస్తాం,’ అని అనే స్థితిలో కనబడకూడదు.” )

వివరణ-162: ఇది ప్రవక్త (స) భవిష్యవాణి. అంటే భవిష్యత్తులో కొందరు భోగవిలాసాలకు బానిసలై గర్వాహం కారాలతో తమ ఖరీదైన కుర్చీలలో కూర్చొని నా ‘హదీసు’లను తిరస్కరిస్తారు. ఖుర్‌ఆన్‌ను అనుస రిస్తున్నామని వాదిస్తారు. వాస్తవం ఏమిటంటే ఖుర్‌ఆన్‌ ఏవిధంగా ఆచరణ యోగ్యమైనదో, ‘హదీసు’ కూడా ఆచరణ యోగ్యమైనదే. అసలు ఇస్లామ్‌ అంటే ఈ రెంటి ప్రకారం ఆచరించటమే. ఈ రెండు విషయాలు ప్రవక్త (స)కు ఇవ్వబడ్డాయి. ఇందులో స్పష్టంగా తెలియ పర్చటం జరిగింది.
(అ’హ్మద్‌, అబూ దావూద్‌, తిర్మిజి’ / ప్రామాణికం, దృఢం; ఇబ్నె మాజహ్, బైహఖీ)
163 – 24 (1/57)
وَعَنْ الْمِقْدَامِ بْنِ مَعْدِيْ كَرَبَ، قَال: قال رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: “أَلَا إِنِّيْ أُوْتِيْتُ الْقُرْآن وَمِثْلَهُ مَعَهُ، أَلَا يُوْشَكُ رَجُلٌ شَبْعَانُ عَلَى أَرِيْكَتِهِ يَقُوْلُ: عَلَيْكُمْ بِهَذَا الْقُرْآنِ، فَمَا وَجَدْتُمْ فِيْهِ مِنْ حَلَالٍ فَأَحِلُّوْهُ، وَمَا وَجَدْتُّمْ فِيْهِ مِنْ حَرَامٍ فَحَرِّمُوْهُ، وَإِنَّ مَا حَرَّمَ رَسُوْلُ اللهِ كَمَا حَرَّمَ اللهُ؛ أَلَا لَا يَحِلُّ لَكُمْ الْحِمَارُ الْأَهْلِيُّ، وَلَا كُلُّ ذِيْ نَابٍ مِّنَ السَّبَاعِ، وَلَا لُقَطَةُ مُعَاهِدٍ إِلَّا أَنْ يَّسْتَغْنِيْ عَنْهَا صَاحِبُهَا، وَمَنْ نَزَلَ بِقَوْمٍ، فَعَلَيْهِمْ أَنْ يَقْرُوْهُ، فَإِنْ لَّمْ يَقْرُوْهُ، فَلَهُ أَنْ يُعْقِبهُمْ بِمِثْلِ قِرَاهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ، وَرَوَى الدَّارَمِيُّ نَحْوَهُ، وَكَذَا ابْنُ مَاجَهُ إِلَى قَوْلِهِ: “كَمَا حَرَّمَ اللهُ” .

(24) [1/57-దృఢం]
మిఖ్‌దామ్ బిన్‌ మ’అదీ కరబ్‌(ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జాగ్రత్తగా వినండి! నాకు ఖుర్‌ఆన్‌ మరియు దానివంటి మరో వస్తువు ప్రసాదించబడ్డాయి. ఆ ‘హదీసు’ ఏమిటంటే, ‘గుర్తుంచుకోండి! త్వరలో కడుపునిండి ఉన్న ఒక వ్యక్తి దిండ్లపై చేరబడి, కేవలం ఖుర్‌ఆన్‌ను అనుస రించండి. ఇందులో ఉన్న ధర్మ సమ్మతమైన విషయాల్ని ధర్మసమ్మతంగా, ఇందులో ఉన్న నిషిద్ధాలను నిషిద్ధాలుగా భావించండి అని ప్రగల్భాలు పలుకుతాడు. వాస్తవం ఏమి టంటే, ప్రవక్త (స) నిషేధించింది, అల్లాహ్‌(త) నిషేధించి నటువంటిదే. గుర్తుంచుకోండి! మీకోసం పెంపుడు గాడిదలు నిషేధించబడ్డాయి, ఇంకా దాడిచేసి చీల్చు కుతినే జంతువులు నిషేధించబడ్డాయి. (అంటే క్రూర జంతువులు). ఇంకా మీతో ఒప్పందం ఉన్న వ్యక్తి పడి పోయిన వస్తువులు మీకు ధర్మసమ్మతం కావు, అయితే అతనికి అవసరం లేనివి తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా అతిథిగా వస్తే, అతనికి తప్పకుండా ఆతిథ్యం ఇవ్వాలి. ఒకవేళ ఆతిథ్యం ఇవ్వకపోతే, అతిథి తన ఆతిథ్యపు ఖర్చులు వసూలు చేసుకో వచ్చు.” )

వివరణ-163: ప్రవక్త (స) భవిష్యవాణి నూటికి నూరు శాతం నిజమయింది. ప్రస్తుత కాలంలో కూడా ‘హదీసు’ తిరస్కారులు ఉన్నారు. అల్లాహ్‌(త) మనందరినీ వారి నుండి రక్షించుగాక! ఖుర్‌ఆన్‌ మరియు ‘హదీసు’లు రెండూ అల్లాహ్‌(త) తరఫు నుండి అవతరించినవే. రెంటినీ తప్పనిసరిగా ఆచరించాలి. ‘హదీసు’ను తిరస్కరిస్తే ఖుర్‌ఆన్‌ను తిరస్కరించి నట్టవుతుంది. చాలా విషయాలు ఖుర్‌ఆన్‌లో వివరంగా లేవు. వాటి వివరాలు ‘హదీసు’లలో ఉన్నాయి. పెంపుడు గాడిదలు, క్రూర జంతువుల నిషిద్ధం గురించి ‘హదీసు’లో ఉంది. ఖుర్‌ఆన్‌లో వాటి గురించి వివరంగా లేదు, అదేవిధంగా ఒప్పందం ప్రకారం తమ ప్రాంతంలో ఉన్న వారి గురించి ఖుర్‌ఆన్‌లో లేదు. ‘హదీసు’లో దీన్ని గురించి వారించబడింది. ఆతిథ్యం కూడా చాలా అవసరమే. ఒకవేళ ఆతిథ్య హక్కును చెల్లించకపోతే, అతిథి తన హక్కును అడిగి పొందవచ్చు.
(అబూ-దావూద్‌, దార్మి, ఇబ్నె-మాజహ్)
164 – 25 (1/58)
وَعَنْ الْعِرْبَاضِ بْنِ سَارِيَةَ، قَالَ: قَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “أَيَحْسَبُ أَحْدُكُمْ مُّتَّكِأً عَلَى أَرِيكِتِهِ يَظُنُّ أَنَّ اللهَ لَمْ يُحَرِّمْ شَيْئًا إِلَّا مَا فِيْ هَذَا الْقُرْآنِ؟ أَلَا وَإِنِّي وَاللهِ قَدْ أَمَرْتُ وَوَعَظْتُ وَنَهَيْتُ عَنْ أَشْيَاءَ إِنَّهَا لَمِثْلُ الْقُرْآنِ أَوْ أَكْثَرُ، وَإِنَّ اللهَ لَمْ يَحِلَّ لَكُمْ أَنْ تَدْخُلُوْا بُيُوْتَ أَهْلِ الْكِتَابِ إِلَّا بِإِذْنِ، وَلَا ضَرْبَ نِسَائِهِمْ، وَلَا أَكَلَ ثِمَارِهِمْ إِذَا أَعْطَوْكُمْ الَّذِيْ عَلَيْهِمْ” .رَوَاهُ أَبُوْ دَاوُدَ وَفِيْ إِسْنَادِهِ: أَشْعَثُ بْنُ شُعْبَةَ الْمِصِّيْصِيُّ، قَدْ تُكُلِّمَ فِيْهِ.

(25) [1/58-బలహీనం]
’ఇర్‌బా’ద్ బిన్‌ సారియహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఒకరోజు ‘ఖు’త్బా ఇవ్వటానికి నిలబడ్డారు. ఖుత్బా ఇస్తూ, ”మీలో ఎవరైనా తన ఆసనంపై దిండ్లకు చేరబడి, అల్లాహ్‌(త) కేవలం ఖుర్‌ఆన్‌లో ఉన్న వాటినే నిషేధించాడని భావిస్తున్నారా? గుర్తుంచు కోండి, అల్లాహ్ సాక్షి, నిస్సందేహంగా నేను మీకు వీటిని గురించే ఆదేశించాను, ఇంకా వీటిని గురించే భోధించాను. ఇంకా అనేక విషయాలనుండి కూడా వారించి ఉన్నాను. అవి ఖుర్ఆన్ వంటివి, ఇంకా అంతకంటే ముఖ్యమైనవి. ఇంకా అల్లాహ్‌(త) మీకు అనుమతి లేకుండా గ్రంథప్రజల ఇళ్ళల్లోకి ప్రవేశించే అనుమతి ఇవ్వలేదు, ఇంకా మీకు వారి స్త్రీలను కొట్టే అనుమతి ఇవ్వలేదు, ఇంకా వారి తోటల పంటలను మీ కోసం ధర్మసమ్మతం చేయలేదు. ఇది వారిపై ఉన్న మీ హక్కులను నెరవేరుస్తూ ఉన్నప్పుడు” అని అన్నారు.) ఇర్‌బా’ద్, ’సుఫ్ఫహ్ విద్యార్థుల్లో ఒకరు. సిరియా దేశంలో నివసించసాగారు. అక్కడే 75 హిజ్రీ శకంలో మరణించారు.
(అబూ-దావూద్‌)
165 – 26 (1/58)
وَعَنْهُ، قَالَ: صَلَّى بِنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ذَاتَ يَوْمٍ، ثُمَّ أَقْبَلَ عَلَيْنَا بِوَجْهِهِ فَوَعَظَنَا مَوْعِظَةً بَلِيْغَةً، ذَرِفَتْ مِنْهَا الْعُيُوْنُ، وَوَجِلَتْ مِنْهَا الْقُلُوْبُ. فَقَالَ رَجُلٌ: يَا رَسُوْلَ اللهِ! كَأَنَّ هَذِهِ مَوْعِظَةً مُوَدِّعٍ فَأَوْصِنَا، فقَالَ: “أَوْصِيْكُمْ بتَقْوَى اللهِ، وَالسَّمْعِ وَالطَّاعَةِ، وَإِنْ كَانَ عَبْدًا حَبَشِيًّا، فَإِنَّهُ مَنْ يَّعْشُ مِنْكُمْ بعدي فسيَرَى اخْتِلَافًا كَثِيْرًا؛ فَعَلَيْكُمْ بِسُنَّتِيْ وَسُنَّةِ الْخُلَفَاءِ الرَّاشِدِيْنَ الْمَهْدِيِّيْنَ، تَمَسَّكُوْا بِهَا وَعَضُّوْا عَلَيْهَا بِالنَّوَاجِذِ، وَإِيَّاكُمْ وَمُحْدَثَاتُ الْأُمُوْرِ؛ فَإِنَّ كُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ، وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ “. رَوَاهُ أَحْمَدُ، وَأَبُوْ دَاوُدَ، وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ إِلَّا أَنَّهُمَا لَمْ يَذْكُرَا الصَّلَاةَ

(26) [1/58-దృఢం]
’ఇర్‌బా’ద్ (ర) కథనం: ప్రవక్త (స) ఒకరోజు మాకు నమా’జు చదివించారు. అనంతరం మావైపు తిరిగి ప్రసంగిస్తూ, ప్రభావ పూరితమైన విషయాలు బోధించారు. ఫలితంగా మా కళ్ళ వెంబడి అశ్రువులు రాలసాగాయి. మా హృదయాలు కంపించాయి. మాలోని ఒకవ్యక్తి ఓప్రవక్తా! ‘ఇది చివరి హితబోధలా ఉంది, అందువల్ల ఇంకా ఏమైనా ఉంటే బోధించండి,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స) ‘అల్లాహ్(త) కు భయపడుతూ ఉండండి, మీ నాయకునికి విధేయులై ఉండండి. ఒకవేళ మీపై నల్లజాతికి చెందిన వ్యక్తి నాయకుడైనా సరే. మీలో నా తరువాత సజీవంగా ఉన్న వ్యక్తి, అనేక విభేదాలను చూస్తాడు. అటు వంటప్పుడు నా సాంప్రదాయాన్ని, నాఖలీఫాల సాంప్రదాయాన్ని అంటి పెట్టుకొని ఉండండి. దాన్ని దృఢంగా పట్టుకొని ఉండండి. ఇంకా క్రొత్త విషయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రతి కల్పితం బిద్‌’అత్‌ అవుతుంది, ప్రతి బిద్‌’అత్‌ మార్గ భ్రష్టత్వానికి గురిచేస్తుంది” అని అన్నారు. (అ’హ్మద్‌, అబూ దావూద్‌, తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
166 – 27 (1/58)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ، قَالَ: خَطَّ لَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم خَطًّا، ثُمَّ قَالَ: “هَذَا سَبِيْلُ اللهِ”، ثُمَّ خَطَّ خَطُوْطًا عَنْ يَمِيْنِهِ وَعَنْ شِمَالِه، وَقَالَ: “هَذِهِ سُبُلٌ، عَلَى كُلِّ سَبِيْلِ مِّنْهَا شَيْطَانٌ يَدْعُوْ إِلَيْهِ”، و قَرَأَ: (وَأَنَّ هَذَا صِرَاطِي مُسْتَقِيمًا، فَاتَّبِعُوْهُ؛ 6: 153) الآية”. رَوَاهُ أَحْمَدُ، وَالنَّسَائِيُّ، وَالدَّارَمِيُّ .

(27) [1/58-ప్రామాణికం]
’అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) మాకు రుజుమార్గం, వక్రమార్గం విశదపరచటానికి మా ముందు ఒక గీతగీసి, ‘ఇది రుజుమార్గం, దైవమార్గం,’ అన్నారు. ఆ తరువాత ఆ గీత ఇరుప్రక్కల గీతలు గీసి, ‘ఇవి వక్రమార్గాలు, వీటిపై షై’తాన్‌ కూర్చొని ఉన్నాడు. ప్రజలను తన వైపు పిలుస్తున్నాడు.’ ఆ తరువాత దీన్ని సమర్థిస్తూ ఈ ఆయతును పఠించారు.
అల్లాహ్‌ ఆదేశం: ”మరియు నిశ్చయంగా ఇదే రుజుమార్గం. కావున మీరు దీనినే అనుసరించండి, ఇతర మార్గాలను అనుసరించకండి. అవి మిమ్మల్ని ఆయన మార్గంనుండి తప్పిస్తాయి…” ) ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిందేమిటంటే, రుజుమార్గం ఒక్కటే. దీన్ని ’సిరా’తె ముస్తఖీమ్‌ అంటారు. ప్రతి నమా’జులో దీన్ని గురించి మనం ప్రార్థిస్తాం. ‘అల్లాహ్‌ మనకు రుజుమార్గం ప్రసా దించుగాక! దానిపై నడిచే భాగ్యం ప్రసాదించుగాక!’ ఆమీన్.
(సూ. అల్ అన్ ఆమ్, 6:153), (అ’హ్మద్‌, నసాయి, దార్మీ)
167 – [ 28 ] ( سنده ضعيف ) (1/59)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى يَكُوْنَ هَوَاهُ تَبَعًا لِّمَا جِئْتُ بِهِ”. رَوَاهُ فِيْ “شَرْحِ السُّنَّةِ”.
وَقَالَ النَّووِيُّ فِيْ “أَرْبَعِيْنِهِ”: هَذَا حَدِيْثٌ صَحِيْحٌ ، رَوَيْنَاهُ فِيْ “كِتَابِ الْحُجَّةِ”. بِإِسْنَادٍ صَحِيْحٍ .

(28) [1/59-బలహీన ఆధారం]
’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలోని ఎవరూ, తన మనోకాంక్షలు, కోరికలు నేను తెచ్చిన షరీఅత్‌కు అనుగుణంగా ఉండనంత వరకు అతను ముస్లిమ్‌ కాలేరు.” (షర్‌హుస్సున్నహ్‌, నవవీ- అర్‌బయీన్‌ / దృఢం)
168 – 29 (1/59)
وَعَنْ بِلَالِ بْنِ الْحَارِثِ الْمُزَنِيِّ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَحْيَا سُنَّةً مِنْ سُنَّتِيْ قَدْ أُمِيْتَتْ بَعْدِيْ، فَإِنَّ لَهُ مِنَ الْأَجْرِ مِثْلَ أُجُوْرِ مَنْ عَمِلَ بِهَا مِنْ غَيْرِ أَنْ يَنْقَصَ مِنْ أُجُوْرِهِمْ شَيْئًا؛ وَمَنِ ابْتَدَعَ بِدْعَةً ضَلَالَةً لَا يَرْضَاهَا اللهُ وَرَسُوْلُهُ، كَانَ عَلَيْهِ (مِنَ الْإِثْمِ) مِثْلُ آثَامِ مَنْ عَمِلَ بِهَا لَا يُنْقَصُ مِنْ أَوْزَارِهِمْ شَيْئًا”. رَوَاهُ التِّرْمِذِيُّ

(29) [1/59-బలహీనం]
బిలాల్‌ బిన్‌ ‘హారిస్‌’ అల్ ము’జనీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా తరువాత వదలివేయబడిన నా సాంప్రదాయాన్ని మళ్ళీ ప్రారంభించిన వారికి, దాన్ని ఆచరించిన వారికి సమానంగా పుణ్యం లభిస్తుంది. ఇంకా ఆచరించిన వారి పుణ్యం ఏమాత్రం తగ్గించబడదు. అదే విధంగా ఎవరైనా అల్లాహ్‌(త), ఆయన ప్రవక్త (స) అసహ్యించుకున్న మార్గ భ్రష్టత్వపు ఆచరణ ఎవరైనా ప్రారంభిస్తే, దాన్ని ఆచరించినవారికి సమానంగా అతనికీ పాపం చుట్టు కుంటుంది, అయితే ఆచరించినవారి పాపం ఏ మాత్రం తగ్గదు.’ ( తిర్మిజి’)
169 – 30 (1/59)
وَ رَوَاهُ ابْنُ مَاجَهُ عَنْ كَثِيْرِ بْنِ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو، عَنْ أَبِيْهِ، عَنْ جَدِّهِ .

(30) [1/59-బలహీనం]
అదేవిధంగా ఇబ్నె మాజహ్, కసీ’ర్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ ద్వారా మరియు అమ్ర్‌ తన తండ్రి ద్వారా, అతడు తన తండ్రి ద్వారా ఉల్లేఖించారు.
170 – [ 31 ] ( سنده ضعيف ) (1/60)
وَعَنْ عَمْرٍو بْنِ عَوْفٍ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الدِّيْنَ لَيَأرِزُ إِلَى الْحِجَازِ كَمَا تَأرِزُ الْحَيَّةُ إِلَى جُحْرِهَا، وَلَيَعْقِلَنَّ الدِّيْنُ مِنَ الْحِجَازِ مَعْقِلَ الْأُرْوِيَّةِ منْ رَّأْسِ الْجَبَلِ. إِنَّ الدِّيْنَ بَدَأَ غَرِيْبًا وَسَيَعُوْدُ كَمَا بَدَأَ، فَطُوْبَى لِلْغُرَبَاءِ، وَهُمْ الَّذِيْنَ يُصْلِحُوْنَ مَا أَفْسَدَ النَّاسُ مِنْ بَعْدِيْ مِنْ سُنَّتِيْ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

(31) [1/60-బలహీన ఆధారం]
’అమ్ర్‌ బిన్‌ ’ఔఫ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇస్లామ్‌ ధర్మం తిరిగి హిజా’జ్‌కు చేరుకుంటుంది, పాము తిరిగి తన పుట్టలోనికి చేరుకున్నట్టు. ఇస్లామ్‌ ధర్మం హిజా’జ్‌లోనే స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది. మేకలు కొండపై భాగంలో నివాసం ఏర్పరచు కున్నట్టు. ఇస్లామ్‌ ధర్మం పేదరికం ద్వారానే ప్రారంభ మయింది. ప్రారంభమయినట్టే ముగుస్తుంది. కనుక ప్రజలు వదలి వేసిన నా సంప్రదాయాలను మళ్ళీ పునఃప్రారంభించిన పేదవారికి ఇందులో శుభవార్త ఉంది.” (తిర్మిజి’)
171 – 32 (1/61)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيَأْتِيَنَّ عَلَى أُمَّتِيْ كَمَا أَتَى علَى بَنِيْ إِسرَائِيْلَ حَذْوَ النَّعْلِ بِالنَّعْلِ، حَتَّى إِنْ كَانَ مِنْهُمْ مَنْ أَتَى أُمَّهُ عَلَانِيَةً، لَكَانَ فِيْ أُمَّتِيْ مَنْ يَصْنَعُ ذَلِكَ. وَإِنَّ بَنِي إِسْرَائِيلَ تَفَرَّقَتْ ثِنْتَيْنِ وَسَبْعِينَ مِلَّةً، وَتَفْتَرِقُ أُمَّتِي عَلَى ثَلَاثٍ وَّسَبْعِيْنَ مِلَّةً، كلُّهُمْ فِيْ النَّارِ إِلَّا مِلَّةً وَاحِدَةً “. قَالُوْا: مَنْ هِيَ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “مَا أَنَا عَلَيْهِ وَأَصْحَابِي”. رَوَاهُ التِّرْمِذِيُّ .

(32) [1/61-బలహీనం]
’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”నా అనుచర సమాజంపై ఒక కాలం రాబోతుంది, ఇస్రాయీల్‌పై వచ్చినట్టు, రెండు చెప్పులు సమానంగా ఉన్నట్టు. అంటే బనీ ఇస్రాయీ’ల్‌పై ఒక కాలం వచ్చినట్టే, నా అనుచర సమాజంపై కూడా వస్తుంది. చివరికి బనీ-ఇస్రాయీ’ల్‌లోని బుద్ధిహీనులు తమ తల్లితో సంభోగం చేసినట్లే, నా అనుచర సమాజంలో కూడా ఇటువంటి వారు జన్మిస్తారు. అలాగే చేస్తారు. బనీ-ఇస్రాయీ’ల్‌లో 72 వర్గాలు ఉండేవి, నా అనుచర సమాజం 73 వర్గాలుగా చీలిపోతుంది. వారిలో ఒక్క వర్గం వారే స్వర్గంలోకి ప్రవేశిస్తారు.” అని అన్నారు. దానికి అనుచరులు, ‘అది ఎటువంటి వర్గం?’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) ”నేనూ, నా అనుచరులు నడచిన మార్గాన్ని అనుసరించే వారు,” అని అన్నారు. (తిర్మిజి’)
172 – 33 (1/61)
وَفِي رِوَايَةِ أَحْمَدَ، وَأَبِيْ دَاوُدُ، عَنْ مَعَاوَيَةَ: “ثِنْتَانِ وَسَبعُوْنَ فِي النَّارِ، وَوَاحِدَةٌ فِيْ الْجَنَّةِ، وَهِيَ الْجَمَاعَةُ، وَإِنَّهُ سَيَخْرُجُ فِيْ أُمَّتِي أَقْوَامٌ تَتَجَارَى بِهِمْ تِلْكَ الْأَهْوَاءُ كَمَا يَتَجَارَى الْكَلْبُ بصَاحِبِهِ، لَا يَبْقَى مِنْهُ عِرْقٌ وَلَا مَفْصِلٌ إِلَّا دَخَلَهُ” .

(33) [1/61-దృఢం]
ఈ ‘హదీసు’ను అ’హ్మద్‌, అబూ-దావూద్‌లు ము’ఆ వియహ్‌ (ర) ద్వారా ఉల్లేఖించారు. అందులో పదాలు ఈ విధంగా ఉన్నాయి, ”72 వర్గాలు నరకం లోకి పోతాయి. ఒక వర్గం స్వర్గంలోకి ప్రవేశిస్తుంది. ఆ స్వర్గబృందంలో, నా బృందం. భవిష్యత్తులో నా అనుచరసమాజంలో ఎటువంటి వారు జన్మిస్తారంటే, వారిలో మనోకాంక్షలు ఎంత అధికంగా ఉంటాయంటే, పిచ్చికుక్క తన యజమానిని వదలదు, కాటు వేస్తుంది. అదీ చస్తుంది. అంటే ఇద్దరూ చస్తారు.” )

వివరణ-172: ఈ ‘హదీసు’లో ముస్లిమ్ సమాజం అంటే బలహీన విశ్వాస ముస్లిములు. వీరు ముస్లిములుగా పరిగణించబడతారు, కాని అవిశ్వాసం, పాపకార్యాల వల్ల శిక్షార్హులౌతారు. ఒకవేళ విశ్వాసం మిగిలి ఉంటే, క్షమాపణకు అర్హులౌతారు. ఒకవేళ విశ్వాసం లేకపోతే శాశ్వతంగా నరక శిక్షల్లో పడిఉంటారు. హజ్వున్ అంటే సమానమైన కొలతతో కత్తిరించటం. అంటే ఒక చెప్పు మరొక చెప్పుకు సమానంగా కత్తిరించటం. అంటే బనీ-ఇస్రాయీ’ల్ కు సరిసమానంగా ఉంటారు. విషయాలన్నిటిలో వారిని అనుసరిస్తారు. ఒక ‘హదీసు’లో ఇలా ప్రవచించడం జరిగింది, “మీరు మీకంటే ముందుగల యూదులు మరియు క్రైస్తవులను అనుస రిస్తారు,” ఒక చెప్పు మరొక చెప్పుకు సమానంగా కత్తిరించి నట్టు. ”తల్లి అంటే సవతి తల్లి. ఎందుకంటే కన్నతల్లితో అవిశ్వాసి కూడా ఇటువంటి చర్యకు సాహసించడు. తతజారా అంటే ప్రవేశించటం, వ్యాపించటం అని అర్ధం. అంటే మనోకాంక్షలు, మనోవాంఛలు వారిలో పిచ్చికుక్క వ్యాధి, పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తిలో ప్రవేశించినట్టు ప్రవేశిస్తుంది. ఇంకా దాని విషమంతా శరీరంలో ప్రవేశిస్తుంది. కల్బ్ ఎటువంటి వ్యాధి అంటే, ఇది పిచ్చి కుక్కకు సోకు తుంది. ఆ కుక్క ఎవరిని కరిస్తే, వారికి ఆవ్యాధి సోకుతుంది. ఇంకా దాని విషమంతా అతని శరీరంలో వ్యాపిస్తుంది. అంటే మనోకాంక్షలు, మనోవాంఛలకు గురయి మీరూ నాశనం అవుతారు. ఇతరులనూ నాశనం చేస్తారు. మనస్సు ఎంత ప్రమాదకరమైనదంటే, దైవసహాయం లేనిదే అది అధీనంలో ఉండదు. ఒక కుక్క, ఒక పంది మనస్సు వెంటపడి ఉన్నాయి. అటు కుక్క అతన్ని కలహాలకు, పోట్లాటలకు ఇతరులకు హాని చేకూర్చడానికి ప్రోత్స హిస్తుంది. ఇటు పంది సాధ్యమైనంత వరకు తినూ త్రాగు, స్త్రీలతో సంభోగంచేయి, ప్రాపంచిక రుచులంటే ఇవే అని ప్రోత్సహిస్తుంది. ఈ కుక్క మరియు పంది చక్రవర్తి అయిన బుధ్ధిని ఒక మూల కూర్చో బెడతాయి. అతనిపై అధికారాన్నంతా చేజిక్కించు కుంటాయి. బుధ్ధి వాటికి భయపడి మౌనంగా ఉండిపోతుంది. ఒకవేళ దైవ సహాయం లేకుంటే ఆ కుక్కల పందుల అధీనంలోనే పడి ఉంటాడు. (లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్.)
ఈ’హదీసు’ను వివిధ పదాల ద్వారా వివిధ ప్రమాణాలతో ఉల్లేఖించడం జరిగింది. దీని అర్ధం ఇదే అయి ఉండవచ్చు లేదా పండితులు ‘అబ్దుల్ ఖాదర్ జీలానీ, ఇబ్ను జౌ’జీ గ్రహించినట్టు ఉండవచ్చు. ఇబ్ను జౌ’జీ యొక్క ప్రఖ్యాత పుస్తకం తల్బీస్ ఇబ్లీస్ 23వ పేజీలో పైన పేర్కొన్న ‘హదీసు’ గురించి కొన్ని వాక్యాలను క్రింద పేర్కొనడం జరిగింది.
పండిత పరిశీలకులు ఏకత్వ విశ్వాసం, మనిషి సాఫల్యానికి ప్రధానమని పేర్కొన్నారు. ప్రవక్త(స) మరణానంతరం ‘ఉస్మాన్ (ర) తీవ్ర ఆందోళనకు గురయి, అబూ-బకర్(ర)తో అల్లాహ్(త) తన ప్రవక్తను ఎత్తు కున్నాడు, సాఫల్యం ఎలా లభిస్తుందని అడగలేక పోయము.’ అని విన్నవించుకున్నారు. దానికి అబూ-బకర్(ర), ‘నేను అడిగి తెలుసుకున్నాను,’ అని అన్నారు. దానికి ‘ఉస్మాన్(ర), ‘నా తల్లిదండ్రులు మీకోసం త్యాగంకాను. అల్లాహ్(త) తమకు ఈప్రత్యేకత ప్రసాదించాడు దయచేసి దాన్ని తెలియజేయండి,’ అని విన్నవించుకున్నారు. అప్పుడు అబూ-బకర్ (ర) నేను దీన్ని గురించి ప్రవక్త(స)ను అడిగాను, దానికి ప్రవక్త(స), ‘సాఫల్యం నేను మా చిన్నాన్న అబూ ‘తాలిబ్ ముందుపెట్టిన పవిత్ర వచనంపై ఆధారపడి ఉంది. అతడు దాన్ని నిరాకరించాడు,’ అని అన్నారు,” అని పేర్కొన్నారు. ఈ ‘హదీసు’ ద్వారా అసలు సాఫల్యం ఏకత్వ విశ్వాసంలో ఉంది అంటే, ”లా ఇలాహ ఇల్లల్లాహ్, ము’హమ్మదుర్రసూలుల్లాహ్.” ఈ విశ్వాసం మనసులో ప్రవేశిస్తే, మనిషి మనోకాంక్షల దాస్యం మానివేసి అల్లాహ్(త) కు దాస్యం చేస్తాడు. నమా’జ్, ఉపవాసం, ‘జకాత్, ‘హజ్జ్ మొదలన వాటిని ఆచరిస్తాడు.’ అని పేర్కొన్నారు. మరికొందరు పండితులు, ‘ఈ ఆచరణలన్నీ ఏకత్వ విశ్వాసం ముందు ఇసుక రేణువులాంటివి,’ అని పేర్కొన్నారు.
మరొక విషయం ఏమిటంటే, ప్రవక్త(స) తన అనుచరులకు బోధించిన ఏకత్వ విశ్వాసం కలిగి ఉండి, అల్లాహ్(త) ప్రీతి కోసం తలవంచి, ప్రవక్త(స) బోధించిన విషయాలపై నమ్మకం కలిగి, ప్రవక్త(స) ఆచరించిన విధంగా ఆచరిస్తే, అదే సాఫల్య మార్గం. కాని ఒకడు ఈ విశ్వాసాన్ని ‘ఖారిజీలు, రాఫి’దీలు, ము’అత’జిలీల్లా వ్యతిరేకిస్తే సాఫల్యమార్గం నుండి తప్పి పోయినట్టే. ఇంకా దానిలో రవ్వంత బుహుదైవారాధన కల్పించినా, నరకాగ్నిలో అంతర్బాహ్యాలు కాలుతూ ఉంటాడు. అయితే పూర్తి అవిశ్వాసానికి గురికాకుండా ఉండాలి. అలా అయితే అవిశ్వాసులు, విగ్రహారాధకులతో పాటు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటాడు. ఒకవేళ అవిశ్వా సానికి గురికాకుండా పాపాలకు గురయితే, పరలోకంలో శిక్షలకు గురవుతాడు. అయితే అవిశ్వాసుల్లా పరిగణించ బడడు. ‘అలీ(ర) కథనం –విశ్వాసుల్లో నుండి నరకశిక్షలకు గురయినవారు పైవర్గంలో ఉంటారు. అక్కడకు చేరగానే శవంగా మారిపోతారు. కాని నరకాగ్ని అతని హృదయాన్ని తాకలేదు. దీన్నిగురించి పూర్తి ఉల్లేఖన జామె’సగీర్ లో ఉంది.
ఈ వివరణ ద్వారా ‘హదీసు’ అర్ధం స్పష్టంగా తెలిసి పోయింది. రుజుమార్గం తప్పిన వర్గాలు నరకంలోనికి ప్రవేశిస్తాయి. అయితే అహ్లుస్సున్నహ్ వల్ జమా’అత్ వర్గం మాత్రం స్వర్గంలో ప్రవేశిస్తుంది. ‘హదీసు’లో పేర్కొ న్న దారి తప్పిన వర్గాలను మీరుకూడా గుర్తించగలరు.
దీనికి సమాధానం ఏమిటంటే, ముస్లిమ్ సమాజం చీలికలకు గురయిందన్నమాట వాస్తవమే. అంటే ప్రవక్త(స) అనుచరులు కలసికట్టుగా ఉన్న సమూహం నుండి ముందు ‘ఖారిజీల వర్గం వేరైపోయింది. తరువాత ము’అత’జిల, రాఫి’దీ వర్గాలు వేరై పోయాయి. ఇంకా తమ వర్గాలు ఏర్పరచుకున్నాయి. ముస్లిమ్ సమాజం నుండి వేరైన వర్గాల స్ధాపకుల గురించి కూడా తెలిసి పోయింది. ఈ వర్గాలన్నిటి గురించి మనం స్పష్టంగా తెలుసుకున్నాం. అయితే వాటి పేర్లు మనకు తెలియకపోవచ్చు. అదేవిధంగా కల్పిత వర్గాల గురించి మనకు స్పష్టంగా తెలిసిపోయింది. అవి I. ‘హరూరియహ్, II. ఖదరియహ్, III. జహీమియహ్, IV. మురజ్జియహ్, V. రాఫి’దహ్, VI. జబరియహ్. ఈ ఆరు బహిర్గతం అయ్యాయి. కొందరు పండితులు కల్పితాలకు మార్గభ్రష్టతకు మూలాలు ఈ 6 వర్గాలే అని పేర్కొన్నారు. ఇంకా ప్రతి వర్గంలో 12 శాఖలు ఉన్నాయి. మొత్తం 72 శాఖలు అయ్యాయి. ఇవన్నీ ముస్లిమ్ సమాజం నుండి వేరై వర్గాలుగా మారిపోయాయి.
I. ‘హురూరియహ్ వర్గం: ఇందులో 12 శాఖలు ఉన్నాయి. ప్రతి ఒక్క ‘ఖారిజీ వర్గానికి ఒక ప్రత్యేక భ్రష్టనమ్మకం ఉంది . అందువల్ల అన్నిటికంటే మొట్టమొదటిది.

అ’జ్రఖియ్యహ్ వర్గం, దీని వ్యవస్ధాపకుడు నాఫె అ’జ్రఖ్ ‘ఖారిజీ. ఈ వర్గం ఆవర్గం వారు తప్ప మరెవ్వరూ విశ్వాసులు కారు అని భావిస్తుంది. వీరు ఖిబ్లా వారిని అవిశ్వాసులుగా పరిగణించారు.

నా’సియహ్ వర్గం: వీరు మా మాట విన్నవారు విశ్వాసులని, మమ్మల్ని తిరస్కరించినవారు కపటా చారులని అంటే వారు విశ్వాసులూ కారు, అవిశ్వాసులూ కారు అని భావిస్తారు.

త’గ్లిబియ్యహ్ వర్గం: ఈ వర్గం దేవుడు ఏ ఆదేశాన్ని జారీ చేయలేదని మరియు విధివ్రాతలో ఏదీ వ్రాయలేదు అని భావిస్తారు .

జారిమియ్యహ్ వర్గం: వీరు విశ్వాసం అంటే ఏమిటో మనం తెలుసుకోలేమని, సృష్టితాల్లో దేనికీ ఈ శక్తి లేదని, విశ్వాసాన్ని గురించి తెలుసుకోవడం అసంభవం అని భావిస్తారు.

‘ఖల్ ఫియహ్ వర్గం: వీరు దైవమార్గంలో పోరాటం వదలిన వారు స్త్రీలయినా పురుషులైనా అవిశ్వాసులే అని భావిస్తారు.

కౌరయహ్: వీరు ఎవరూ ఎవరినీ ముట్టుకోరాదని, ఎందు కంటే ఎవరు పరిశుధ్ధులో ఎవరు అపరిశుధ్ధులో తెలుసు కోలేమని, మన ముందు స్నానం చేసి పశ్చాత్తాపం (తౌబ) చేయనంత వరకు అతనితో కలసి భోజనం చేయలేమని భావిస్తారు. అంటే చూడండి పరిశుధ్ధత పేరుతో షై’తాన్ ఈ అవివేక వర్గాన్ని ఎలా మోసం చేసాడో. దీనివల్ల ప్రజలు అనేక వర్గాలుగా విడిపోయి దూరమైపోయారు.
కాని ఇస్లామ్ ధర్మంలో అందరూ కలసి ఉండాలని, ఐక మత్యంగా ఉండాలని బోధించబడింది.

కన్’జియహ్ వర్గం: వీరు ఎవ్వరికీ ధనం ఇవ్వడం ధర్మం కాదని, అతడు దానికి తగనివాడు కావచ్చు, తగనివాడికి ఇవ్వడం దుర్మార్గం అవుతుందని, దానివల్ల అవిశ్వాసానికి గురికావటం జరుగుతుందని అందువల్ల ధనాన్ని నిధిగా భూమిలో తప్పని సరిగా పాతిపెట్టాలని, ఆ తరువాత సాక్ష్యా ధారాల ద్వారా అందరి కంటే ఎక్కువ అర్హతగలవారులభిస్తే, అతనికి ఇవ్వాలని ఆ విధంగా ఆ తరువాతవారికి క్రమంగా ఇవ్వాలి. అంటే ఈ పన్నాగంవల్ల ‘జకాత్ ఇవ్వవలసిన అవసరమే ఉండదు.

షుమార’ఖియహ్ వర్గం: తసఫ్ఫీ (ర) దీనికి షుమా’ఖియహ్ అనే పేరు పెట్టారు. ఈ నీచవర్గం పరస్త్రీలను ముట్టుకోవడంలో, పొందడంలో ఎటువంటి అభ్యంతరం లేదని, ఎందుకంటే స్త్రీలను పరిమళ పూలుగా సృష్టించడం జరిగింది. పరిమళం ఆస్వా దించడంలో ఎటువంటి అభ్యంతరం లేదని భావిస్తుంది.

అ’ఖ్నసియ్య వర్గం: ఈ వర్గం మరణించిన తరువాత శవానికి మేలుకానీ కీడుకానీ జరిగేదేమీ లేదని భావిస్తుంది. అంటే ఈ వర్గం మరణానంతర జీవితాన్ని, విచారణ, ప్రతిఫలాలను తిరస్కరిస్తుంది.

మ’హ్ కుమియహ్ వర్గం: ఈ వర్గం తీర్పుకోరి ఇతరుల వద్దకు వెళ్ళేవారు అవిశ్వాసులు అని భావిస్తుంది. అందువల్లే ‘అలీ (ర) మరియు సిరియా ప్రజలమధ్య మూడవ వర్గం తీర్పు నిర్ణయించడం జరిగినప్పుడు ఈ ‘ఖారిజీవర్గం ‘అలీ(ర) సైన్యం నుండి వేరై, రెండు వర్గాలను అవిశ్వాసులుగా తీర్మానించింది.

ము’అత’జిలహ్ వర్గం: ఇది హ’రూరియ్య లోని ఒక వర్గం. ఈ వర్గం ‘అలీ(ర) మరియు ము’ఆవియహ్(ర) వ్యవహారంలో మాకు అనుమానంగా ఉందని. అంటే తీర్పు అర్ధంకావడం లేదని. అందువల్ల మేము ఇరువర్గాలకు దూరంగా ఉంటామని అంటుంది.

మైమూనియహ్ వర్గం: ఈ వర్గం మా వీధివారు ఇష్టపడ నంత వరకు ఎవ్వరూ ఇమాము కాలేరని అంటుంది. అంటే మా వర్గం వారు అని అర్ధం. అంతా అల్లాహ్(త)కే తెలుసు.
II. ఖదరియహ్ వర్గం: ఇదికూడా 12 వర్గాలుగా విభజించ బడింది.

‘హమరియహ్ వర్గం: ఈ వర్గం అల్లాహ్(త) న్యాయాన్ని జారీ చేయడం తప్పనిసరి అని, ఇంకా అల్లాహ్(త) న్యాయంలో షరతు ఏమిటంటే, తన దాసులకు వారి కార్యాల్లో స్వతంత్ర అధికారం ఇవ్వాలని, ఇంకా అడ్డుగా ఉండి వారి పాప కార్యాలను ఆపాలని భావిస్తుంది.

స’నవియహ్ వర్గం: ఈ వర్గం మేలు అల్లాహ్(త) వైపు నుండి వస్తుందని, చెడు ఇబ్లీసు వైపు నుండి వస్తుందని భావిస్తుంది.

ము’అత’జిలహ్ వర్గం: ఈ వర్గం ఖుర్ఆన్ సృష్టించ బడిందని, పరలోకంలో దైవదర్శనం అసంభవమని భావిస్తుంది.

కైసానియహ్ వర్గం: ఈ వర్గం కర్మలు అల్లాహ్(త) తరపు నుండి జనిస్తాయా లేక దాసుల తరపునుండి జనిస్తాయా, ఇంకా దాసులు మరణానంతరం ప్రతిఫలం పొందుతారా లేక శిక్ష అనుభవిస్తారా అనేది మాకు తెలియదు అని భావిస్తుంది.

షై’తానియహ్ వర్గం: ఈ వర్గం అల్లాహ్(త) షై’తాన్ ను సృష్టించలేదని భావిస్తుంది.

షేర్ మకియహ్ వర్గం: ఈ వర్గం అవిశ్వాసం తప్ప పాపాలన్నీ విధిలో ఉన్నాయని భావిస్తుంది.

వ’హమియ్య వర్గం: ఈ వర్గం సృష్టితాల కర్మల, పుణ్య కార్యాల, పాపాల ఉనికి లేదని భావిస్తుంది.

రబ్వేదియహ్(రావన్దియహ్) వర్గం: ఈ వర్గం అల్లాహ్(త) నుండి అవతరింపజేయబడిన గ్రంథాల ప్రకారం ఆచరించడం తప్పనిసరి విధి. ఎవరైనా వాటిని రద్దుచేసేవి లేదా రద్దుచేయ బడేవి అని అన్నాసరే. అని భావిస్తుంది. ఈ మనోకాంక్షలను అనుసరించే వర్గం మాటకు అర్ధం ఏమిటంటే, ఒకవేళ ఆదమ్ కాలంలో సోదరుడు, సోదరి పెళ్ళి ధర్మసమ్మతమైతే, ఇప్పుడు కూడా ధర్మసమ్మతం కావాలి. అదేవిధంగా య’అఖూబ్ కాలంలో ఇద్దరు సోదరీమణులు ఒకే నికా’హ్ లో ఉండటం, మద్యం మొదలయినవాటిని ఇప్పుడు కూడా అమలు లోకి తీసుకురావాలి.

ముషీరియహ్ వర్గం: ఈవర్గం ఎవరైనా పాపంచేసి పశ్చాత్తాపం చెందితే, వారి పశ్చాత్తాపం స్వీకరించబడదు.

నాకిసి’యహ్ వర్గం: ఈ వర్గం ప్రవక్త(స)తో చేసిన బై’అత్ భంగం చేసినవారికి ఎటువంటి పాపం చుట్టుకోదు అని భావిస్తుంది.

ఖాసితియహ్ వర్గం: ఈవర్గం ప్రపంచంలో ప్రపంచ విషయాలకు దూరంగా ఉండటం కంటే ప్రపంచ అనుగ్రహాలను పొందటానికి కృషిచేయాలని భావిస్తుంది.

ని”జామియహ్ వర్గం: ఈ వర్గం ఇబ్రాహీమ్ వ్యవస్ధను అనుసరిస్తూ, అల్లాహ్(త) ను వస్తువుతో పోల్చినవారు అవిశ్వాసులు అని భావిస్తుంది.
III. జహీమియహ్ వర్గం కూడా 12 శాఖల్లో విడిపోయింది.

ము’అత్తలహ్ వర్గం: ఈ వర్గం మానవుడు అనుమా నానికి గురయిన వస్తువు సృష్టితం అని ,అదేవిధంగా దేవుని దర్శనం అసంభవం అని వాదించినవాడు అవిశ్వాసి అని భావిస్తుంది.

మర్ సియహ్ వర్గం: ఈ వర్గం దైవగుణాల్లోని అనేక గుణాలు మానవునిలో ఉన్నాయని భావిస్తుంది.

వారిదియహ్ వర్గం: ఈ వర్గం అల్లాహ్(త) ప్రతిచోట ఉన్నాడని భావిస్తుంది.

ముల్ త’జిఖహ్ వర్గం: ఈ వర్గం అల్లాహ్(త) ను గుర్తించినవాడు నరకంలో ప్రవేశించడని, నరకంలో ప్రవే శించిన వాడు బయటకు రావడం జరగదని భావిస్తుంది.

‘జనాదిఖహ్ వర్గం: ఈ వర్గం ఎవరైనా ఎవరికోసమైనా దేవుడ్ని నిరూపించాలి, ఎందుకంటే నిరూపించడం గుర్తించిన తరువాతనే జరుగుతుంది. వాస్తవం ఏమి టంటే గుర్తించడం అసంభవం, అందువల్ల నిరూపించడం కూడా జరగదని భావిస్తుంది.

‘హరఖియహ్ వర్గం: ఈ వర్గం అవిశ్వాసిని నరకంలో వేస్తే, నరకాగ్ని వాడిని బొగ్గుగా మార్చివేస్తుంది, తరు వాత వాడు నరకంలో శాశ్వతంగా బొగ్గుగ పడి ఉంటాడు ఏమాత్రం నరకాగ్ని వేడి తగలదు అని భావిస్తుంది.

మ’ఖ్లూఖియహ్ వర్గం:ఈ వర్గం ఖుర్ఆన్ సృష్టితాల్లోని ఒకటి అని భావిస్తుంది.

ఫానియహ్ వర్గం: ఈ వర్గం స్వర్గనరకాలు నాశనం అయ్యేవే అని భావిస్తుంది, వీరిలోనే మరోవర్గం స్వర్గనరకాలు ఇంకా సృష్టించబడనేలేదని భావిస్తోంది.

ఉర్ యహ్ వర్గం: ఈ వర్గం దైవప్రవక్తలను తిరస్కరిస్తుంది, అంటే వారు అల్లాహ్(త) తరపు నుండి పంపబడలేదని, అయితే వీరు కేవలం బుధ్ధిమంతులని భావిస్తుంది.

వాఖిఫియహ్ వర్గం: ఈ వర్గం మేము మౌనం వహిస్తామని, అంటే ఖుర్ఆన్ సృష్టితం అవునని గాని కాదని గాని అనము అని అంటుంది.

ఖబరియహ్ వర్గం: ఈ వర్గం సమాధిలో శిక్షా ప్రతి ఫలాలు ఏమీ లేవు, ఇంకా పరలోకంలో సిఫారసూ లేదు అని భావిస్తుంది.

లఫ్”జియహ్ వర్గం: ఈ వర్గం ఖుర్ఆన్ ను మనం వల్లించడం సృష్టితం అవుతుందని భావిస్తుంది.
IV. మురజ్జియహ్ వర్గం కూడా 12 వర్గాలుగా చీలి పోయింది.

తారికియహ్ వర్గం: ఈ వర్గం అల్లాహ్(త) కోసం సృష్టితాలపై కేవలం విశ్వాసం తప్ప ఏ ఆదేశమూ విధించబడలేదు. దాసుడు ఆయన్ను విశ్వసించి, గుర్తిస్తే ఏమి చేసినా ఫరవాలేదు అని భావిస్తుంది.

సాబియహ్ వర్గం: ఈ వర్గం అల్లాహ్ సృష్టితాలను సృష్టించి, ఏమైనా చేసుకోమని వదలివేసాడు అని భావిస్తుంది.

మర్ జియహ్ వర్గం: ఈ వర్గం మనం ఎవరినీ పాపాత్ముడని లేదా అవిధేయుడని అనలేము. అదేవిధంగా ఎవరినీ పుణ్యాత్ముడని లేదా విధేయుడని అనలేము. ఎందుకంటే అల్లాహ్(త) వద్ద అతని కోసం ఏమున్నదో మనకు తెలియదు అని అంటుంది. అంటే ఈ వర్గం అంతిమ పర్యవసానం మాకు తెలియదని అనడం లేదు. ఎందుకంటే అంతిమ పర్యవసానం ఎవరికీ తెలియదు. కాని కర్మలు బహిర్గతంగా ఉన్నాయి, వాటిని బట్టి మనం తెలుసు కోవచ్చు. ఈ వర్గం దీన్ని తిరస్కరిస్తుంది. అంటే పాపాత్ముడి పాపం మంచిదై ఉండవచ్చు అని అంటుంది. ఇది చాలా నీచమైన మార్గభ్రష్టత్వం.

సాకితియహ్ వర్గం: ఈ వర్గం సత్కార్యాలు ,విధేయత మొదలైనవి విశ్వాసానికి సంబంధించినవి కావని భావిస్తుంది.

అమలియహ్ వర్గం: ఈ వర్గం విశ్వాసం కేవలం ఆచరణ మాత్రమేనని భావిస్తుంది.

ముస్ తస్ నియహ్ వర్గం: ఈ వర్గం విశ్వాసంలో మినహాయింపును తిరస్కరిస్తుంది.

ముషబ్బిహ వర్గం: ఈ వర్గం అల్లాహ్(త) కళ్ళూ చేతులూ మన కళ్ళూ చేతుల్లా ఉన్నాయి. అదేవిధంగా మనం ఆసనాలపై కూర్చున్నట్టే అల్లాహ్(త) తన సింహాసనంపై కూర్చున్నాడు అని భావిస్తుంది.

‘హషవియహ్ వర్గం: ఈ వర్గం ‘హదీసు’లన్నిటినీ ఒకే విధంగా భావిస్తుంది. ఫలితంగా విధికార్యాలను వదలటం అదనపు కార్యాలను వదలినట్టేనని భావిస్తుంది. ఈ వర్గానికి ఈ పేరు ఎందుకు పెట్టారంటే, ఈ వర్గం ఖుర్ఆన్ లో కొన్ని సూరాల ప్రారంభంలో ఉన్న అక్షరాలను అదనపు అక్షరాలని, వాటికి ఎటువంటి అర్ధం లేదని, ఇంకా నరక శిక్షలగురించి ఉన్న ఆయతులు కేవలం హెచ్చరికలు మాత్రమేనని భావిస్తుంది. అల్లాహ్(త) మనందరినీ వీరి అవిశ్వాసం నుండి రక్షించుగాక.

‘జాహిరియహ్ వర్గం: ఈ వర్గం షరీఅత్ సమస్యల్లో దీర్ఘపరిశీలనను తిరస్కరిస్తుంది.

బిద”ఇయహ్ వర్గం: ఈ వర్గం ముస్లిమ్ సమాజంలో మొదటి సారి లో బిద్’అత్లు ప్రారంభించింది.

, 12. వీటిని గురించితెలియదు. ఈ వర్గం మనం విశ్వ సించిన తరువాత ఏమాత్రం పుణ్యం చేసినా స్వీకరించ బడుతుందని, ఇంకా పాపకార్యాలు అంటే వ్యభి చారం, దొంగతనాలు మొదలయినవి పశ్చత్తాపం చెందినా చెందక పోయినా క్షమించబడతాయని భావిస్తుంది.
V. రాఫి’దహ్ వర్గంలో కూడా 12 శాఖలు ఉన్నాయి.

‘అలవియహ్ వర్గం: ఈ వర్గం అసలు ప్రవక్త నియామకం ఆదేశం దైవదూత జిబ్రీల్ కు ఇచ్చి ‘అలీ(ర) వద్దకు పంపడం జరిగింది. జిబ్రీల్ పొరపాటున మరొకరికి అందజేసారు, అని భావిస్తుంది . ఇదేవిధంగా యూదులు కూడా జిబ్రీల్ మా శతృత్వం వల్ల బనీ ఇస్రాయీ’ల్ లో కాకుండా బనీఇస్మాయీ’ల్ లో దైవవాణి అందజేసారని, అంటారు . వీరందరూ అవిశ్వాసులే.

అమరియహ్ వర్గం: ఈ వర్గం దైవదౌత్యంలో ము’హమ్మద్(స) తో పాటు ‘అలీ కూడా భాగస్వాములే అని భావిస్తుంది. ఇది కూడా స్పష్టమైన అవిశ్వాసమే.

షీ’అహ్ వర్గం: ఈ వర్గం ప్రవక్త(స) తన తర్వాత ‘అలీని ‘ఖలీఫాగా సూచించారని, కాని ముస్లిములు ఇతరులపై బై’అత్ చేసి అవిశ్వాసానికి పాల్పడ్డారని భావిస్తుంది.

ఇస్’హాఖియహ్ వర్గం: ఈ వర్గం దైవదౌత్యం ప్రళయం వరకు కొనసాగుతుందని, అహ్లెబైత్ గురించి తెలుసు కున్నవారే ప్రవక్తలుగా అవుతూ ఉంటారని భావిస్తుంది.

నాఊ’సియహ్ వర్గం: ఈ వర్గం ‘అలీ(ర) ముస్లిమ్ సమాజంలో అందరికంటే ఉత్తములని, ‘అలీ(ర)పై ఇతర ప్రవక్త అనుచ రులకు ప్రాధాన్యత ఇచ్చినవారు అవిశ్వాసులని భావిస్తుంది.

ఇమామియహ్ వర్గం: ఈ వర్గం ప్రపంచం ఎప్పుడూ ఒక ఇమాము లేకుండా ఉండదని, ఇంకా ఇమాము ‘హుసైన్(ర) సంతతిలో నుండే అవుతారని, అతన్ని జిబ్రీల్ శిక్షణ ఇస్తారని, ఒకరు మరణిస్తే ,అటువంటి వారే మరొకరు ఇమాము అవుతారని భావిస్తోంది. ఈ కాలంలో తన పేరు ఇమామియ్య పెట్టిన వర్గం నాఊ’సియ్య, రాఫి’జియ్యల మిశ్రమం.

‘జైదియహ్ వర్గం: ఈ వర్గం నమా’జు ఇమామత్ కు ‘హుసైన్ సంతానమే అర్హులు .వారిలో ఎవరైనా ఉన్నంత వరకు ఇతరుల వెనుక వారు ఎంత ఉత్తములైనా దుర్మార్గులైనా నమా’జు ధర్మసమ్మతం కాదు అని భావిస్తుంది.

‘అబ్బాసియహ్ వర్గం: ఈ వర్గం అందరికంటే అధికంగా ‘అబ్బాస్ బిన్ ‘అబ్దుల్ ము’త్తలిబ్ ఒక్కరే ‘ఖిలాఫత్ కు అర్హులు అని భావిస్తుంది .

ముతనాసి’ఖహ్ వర్గం: ఈ వర్గం ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరం లోనికి ప్రవేశిస్తాయని భావిస్తోంది. అంటే పుణ్యాత్ముడి ఆత్మ సుఖశాంతులతో జీవించే వ్యక్తిలో ప్రవేశిస్తుంది. పాపాత్ముడి ఆత్మ దరిద్రునిలో ప్రవేశిస్తుంది.

రజ’ఇయహ్ వర్గం: ఈవర్గం ‘అలీ(ర) మరియు అతని అనుచరులు ఈ ప్రపంచంలోనికి తిరిగి వస్తారని, తమ శతృవులతో ప్రతీకారం తీర్చుకుంటారని భావిస్తోంది.

లా’అనహ్ వర్గం: ఈ వర్గం ‘ఉస్మాన్(ర), ‘త’ల్హా(ర) ‘జుబైర్(ర), ము’ఆవియ(ర), అబూ మూసా అష్’అరీ(ర), ‘ఆయి’షహ్(ర) లను శపిస్తుంది.

ముతరబ్బి’సహ్ వర్గం: ఈ వర్గం బిచ్చగాళ్ళాంటి దుస్తులు ధరిస్తారు, ఇంకా ఒకవ్యక్తిని తమ మహ్దీగా నియమించు కుంటారు . ఒకవ్యక్తి మరణిస్తే మరొకరిని ఆవిధంగానే నియమించుకుంటారు.
VI. జబరియహ్ వర్గం కూడా 12 శాఖలుగా చీలి పోయింది.

ము’ద’తర్రియహ్ వర్గం: ఈ వర్గం మానవుడు ఏమీ చేయ లేడు, చేస్తున్నదంతా అల్లాహ్ (త) యే చేస్తున్నాడు అని భావిస్తుంది.

అఫ్’ఆలియహ్ వర్గం: ఈ వర్గం మనం చేస్తున్న కర్మలు మనవల్ల జరుగుతున్నాయి, కాని వాటిని చేయడం, చేయక పోవడంలో మనకెలాంటి అధికారం లేదు. మనం పశువుల వంటి వాళ్ళం. వాటిని కట్టి ఎటైనా తోలుకు పోవచ్చు అని భావిస్తుంది.

మఫ్రూ’గియహ్ వర్గం: ఈ వర్గం సృష్టితాలన్ని సృష్టించబడి ఉన్నాయి. ఇప్పుడు మరేదీ సృష్టించ బడటం లేదు అని భావిస్తుంది.

నజారియహ్ వర్గం: ఈ వర్గం అల్లాహ్(త) తనదాసుల మంచి లేదా చెడుకార్యాలపై శిక్షించడు, దాసుడు చేసినందుకు శిక్షిస్తాడు.

ముబాఇ’నహ్ వర్గం: ఈ వర్గం నీ మనసులో మెది లిందే నీపై తప్పనిసరి అవుతుంది. హృదయం సూచించిన వాటిలో నీకు నచ్చినదాన్ని ఆచరించు అని అంటుంది.

కసబియహ్ వర్గం: ఈ వర్గం దాసుడు ఏమాత్రం ప్రతి ఫలాన్నిగాని శిక్షనుగాని సంపాదించడు అని అంటుంది.

సాబిఖహ్ వర్గం: ఈ వర్గం కోరినవారు సత్కార్యాలు చేయ వచ్చు కోరినవారు చేయకపోవచ్చు, ఎందుకంటే పుణ్యాత్ము లకు పాపాలవల్ల ఏమీ హాని కలుగదు. అదేవిధంగా పాపాత్ములకు పుణ్యాలవల్ల ఏమీ లాభం కలుగదు అని అంటుంది.

‘హబస్సియహ్ వర్గం: ఈ వర్గం దైవప్రీతి పొందిన వ్యక్తి నుండి ఆరాధనా విధులు తొలగిపోతాయి అని అంటుంది.

‘ఖౌఫియహ్ వర్గం: ఈ వర్గం దైవాన్ని ప్రేమించినవారు ఆయనకు భయపడకూడదు. ఎందుకంటే ప్రేమించే వారు ప్రేమించబడేవారికి భయపడరు అని అంటుంది.

బకరియహ్ వర్గం: ఈ వర్గం విద్యాజ్ఞానాలు పెరుగు దలకు సమానంగా ఆరాధనా విధులు తొలుగుతూ ఉంటాయని భావిస్తుంది.

‘హసనియ్యహ్ వర్గం: ఈ వర్గం ప్రపంచంలో అందరికి భాగస్వామ్యం ఉందని, ఒకరికి మరొకరిపై ఆధిపత్యం లేదని, అది వారి తండ్రి ఆదమ్(అ) వారసత్వసంపద అని అంటుంది.

మ’ఇయహ్ వర్గం: ఈ వర్గం ఈ కర్మలు మనవల్ల జరుగు తున్నాయని, మనకు వాటి శక్తి ఉందని అంటుంది. (తల్బీస్ ఇబ్లీస్)

173 – 34 (1/61)
وَعَنِ ابْنِ عُمَرَ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ لَا يَجْمَعُ أُمَّتِيْ – أَوْقَالَ: أُمَّةَ مُحَمَّدٍ – عَلَى ضَلَالَةٍ، وَيَدُ اللهِ عَلَى الْجمَاعَةِ، وَمَنْ شَذَّ شَذَّ فِيْ النَّارِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

(34) [1/61-బలహీనం]
ఇబ్నె ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌(త) నా అనుచర సమాజాన్ని [ము’హ మ్మద్‌ (స) అనుచర సమాజాన్ని] మార్గ భ్రష్టత్వంపై ఏకం చేయడు. మరియు సామూహిక వర్గం పై అల్లాహ్‌ (త) సహాయం ఉంటుంది. వర్గం నుండి వేరైనవాడు ఒంటరిగా నరకంలో వేయబడతాడు.” )

వివరణ-173: అంటే ము’హమ్మద్‌ (స) అనుచర సమాజం అంతా మార్గభ్రష్టత్వానికి గురికాదు. ఒకవర్గం మాత్రం ఎల్లప్పుడూ సత్యంపై ఉంటుంది. అది ప్రవక్త (స) సాంప్రదాయం ప్రకారం ఆచరించే వర్గం. ఈ వర్గానికి దూర మైనవారు నరకంలో వేయబడతారు. ఆ వర్గం అల్లాహ్‌ (త) రక్షణలో ఉంటుంది. అంటే ఇది సత్య ప్రియుల వర్గం.
(తిర్మిజి’)
174 – 35 (1/62)
وَعَنْهُ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”اِتَّبِعُوا السَّوَادَ الْأَعْظَمَ، فَإِنَّهُ مَنْ شُذَّ شُذَّ فِيْ النَّارِ”. رَوَاهُ (ابْنُ مَاجَهُ مِنْ حَدِيْثِ أَنَسٍ).

(35) [1/62-బలహీనం]
ఇబ్నె ’ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు పెద్ద వర్గాన్ని అనుసరించండి. ఎందుకంటే పెద్దవర్గానికి దూరమైనవాడిని, ఒంటరిగా నరకంలో వేయడం జరుగు తుంది.”)

వివరణ-174: పెద్ద వర్గం అంటే, ప్రవక్త (స) అనుచరుల, తాబయీన్ల వర్గం. ఎందుకంటే, సత్యాన్ని, ప్రవక్త (స) సాంప్ర దాయాలను ప్రేమించే ఏక దైవారాధనకుల బృందం ఇదే.
(ఇబ్నె మాజహ్)
175 – 36 (1/62)
وَعَنْ أَنَسٍ، قَالَ: قَالَ لِي رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا بُنَيَّ! إِنْ قَدَرْتَ أَنْ تُصْبِحَ وَتُمْسِيَ لَيْسَ فِيْ قَلْبِكَ غِشٌّ لِّأَحَدٍ فَافْعَلْ”. ثُمَّ قَالَ: “يَا بُنَيَّ! وَذَلِكَ مِنْ سُنَّتِيْ، وَمَنْ أَحَبَّ سُنَّتِي فَقَدْ أَحَبَّنِي، وَمَنْ أَحَبَّنِي كَانَ مَعِيَ فِيْ الْجَنَّةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ

(36) [1/62-బలహీనం]
అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) నాతో, ”ఓ కుమారా! నీకు వీలైతే, ఎల్లప్పుడూ నీ మనసులో ఇతరుల పట్ల ఈర్ష్యా ద్వేషాలు, శత్రుత్వం, కాపట్యం ఉండకుండా మసలుకో,” అని అన్నారు. మళ్ళీ ప్రవక్త (స) మాతో, ”ఓ కుమారా! ఇదే నా సాంప్రదాయం, ఇదే నా పద్ధతి. నా సాంప్రదాయాన్ని ప్రేమించే వారు నన్ను ప్రేమించి నట్టే, నన్ను ప్రేమించేవారు స్వర్గంలో నా వెంట ఉంటారు” అని అన్నారు. (తిర్మిజి’) )

వివరణ-175: ఈ ‘హదీసు’ ద్వారా ప్రవక్త (స) సాంప్ర దాయాన్ని అనుసరించే వారి ప్రాముఖ్యత నిరూపించ బడింది. ఎందుకంటే, ఈ ‘హదీసు’ ప్రకారం ఆచరించే వారు ప్రవక్త (స)ను ప్రేమించినట్టు, ప్రవక్త (స)ను ప్రేమించే వారు, స్వర్గంలో ప్రవక్త (స) వెంట ఉంటారు. అల్లాహ్‌(త) మనందరికి ఈ భాగ్యం ప్రసాదించుగాక!

176 – 37 (1/62)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ تَمَسَّكَ بِسُنَّتِيْ عِنْدَ فَسَادِ أُمَّتِيْ، فَلَهُ أَجْرُ مِائَةِ شَهِيْدٍ” .

(37) [1/62-బలహీనం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజంలోని ఉపద్రవాలు, విభేదాల సమయంలో నా సాంప్రదాయాన్ని అనుసరించేవారికి 100 మంది అమరవీరుల పుణ్యం లభిస్తుంది.” )

వివరణ-176: అంటే అనుచర సమాజంలో ఉపద్రవాల్లో విభేదాల్లో ప్రవక్త సాంప్రదాయం ప్రకారం ఆచరించటం చాలా కష్టం అవుతుంది. వ్యతిరేకులతో పోరాడవలసి ఉంటుంది. వారి వైపునుండి కష్టాలు, ఆపదలు కలిగే ప్రమాద ముంటుంది. ఒక్కోసారి ప్రాణహాని కూడా జరుగుతుంది. ఇటువంటి సున్నత్‌ కోసం వీరమరణం పొందే వారికి 100 మంది అమరవీరుల పుణ్యం లభిస్తుంది.
(బైహఖీ)
177 – 38 (1/63)
وَعَنْ جَابِرٍ،عَنْ النَّبِيِ صلى الله عليه وسلم حِيْنَ أَتَاهُ عُمَرُ فَقَالَ: إِنَّا نَسْمَعُ أَحَادِيْثَ مِنْ يَهُوْدٍ تُعْجِبُنَا، أَفْتَرَى أَنْ نَكْتُبَ بَعْضَهَا؟ فَقَالَ: “أَمُتَهَوِّكُوْنَ أَنْتُمْ كَمَا تَهَوَّكَتِ الْيَهُوْدُ وَالنَّصَارَى؟ لَقَدْ جِئْتُكُمْ بِهَا بَيْضَاءَ نَقِيَّةً، وَلَوْ كَانَ مُوْسَى حَيًّا مَا وَسِعَهُ إِلَّا اتِّبَاعِي” . رَوَاهُ أَحْمَدُ، وَالْبَيْهَقِيُّ فِيْ كِتَابِ- “شُعَبِ الْإِيْمَانِ”.

(38) [1/63-ప్రామాణికం]
జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ‘ఉమర్‌ (ర) వచ్చి, ‘మేము యూదుల ఉల్లేఖనాలను వింటూ ఉంటాం, అవి మాకు మంచివనిపిస్తాయి. వాటిని మేము వ్రాసుకోవచ్చా?’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ”నువ్వు, యూదులు మరియు క్రైస్తవుల్లా అసంతృప్తిగా ఉన్నావా? ఎందుకంటే యూదులు మరియు క్రైస్తవులు కూడా తమ ధర్మం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. వారు తమ ధర్మాన్ని అసంపూర్ణంగా భావిస్తున్నారు. అందువల్లే వారు అల్లాహ్‌(త) గ్రంథాన్ని వదలి తమ పండితుల మనోకాంక్షలను, కల్పితాలను అనుసరిస్తున్నారు. నేను మీ వద్దకు పవిత్రమైన, పరిశుద్ధమైన జీవన విధానాన్ని తీసుకువచ్చాను. ఒకవేళ మూసా (అ) కూడా సజీవంగా ఉన్నా, నన్నే అనుసరించవలసి ఉంటుంది.” (అ’హ్మద్‌, బైహఖీ – షు’అబిల్ ఈమాన్)
178 – 39 (1/63)
وَعَنْ أَبِيْ سَعِيْدُ الْخُدْرِيِّ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “منْ أَكَلَ طَيِّبًا، وَعَمِلَ فِيْ سُنَّةٍ، وَأَمِنَ النَّاسُ بِوَائِقَهُ، دَخَلَ الْجَنَّةَ”. فَقَالَ رَجُلٌ: يَا رَسُوْل اللهِ! إِنَّ هَذَا الْيَوْمَ لَكَثِيْرٌفِيْ النَّاسِ؟ قَالَ: “وَسَيَكُوْنَ فِيْ قُرُوْنٍ بَعْدِيْ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

(39) [1/63-బలహీనం]
అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స), ”ధర్మ సంపాదన తింటూ, నా సాంప్రదాయం ప్రకారం ఆచరిస్తూ, ప్రజలపట్ల అత్యాచారాలకు పాల్పడ కుండా ఉండే వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు,’ అని అన్నారు. ఒకవ్యక్తి లేచి, ‘ఓ ప్రవక్తా! ఇటువంటివారు ఈ కాలంలో చాలామంది ఉన్నారు,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘నా తరువాత కూడా భవిష్యత్తులో చాలామంది ఉంటారు,’ అని సమాధానం ఇచ్చారు. (తిర్మిజి’)
179 – 40 (1/63)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّكُمْ فِيْ زَمَانٍ مَنْ تَرَكَ مِنْكُمْ عُشْرَ مَا أُمِرَ بِهِ هَلَكَ، ثُمَّ يَأْتِيْ زَمَانُ مَنْ عَمِلَ مِنْهُمْ بِعُشْرِ مَا أُمِرَ بِهِ نَجَا”. رَوَاهُ التِّرْمِذِيُّ .

(40) [1/63-బలహీనం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ఎలాంటి కాలంలో ఉన్నారంటే, ఒకవేళ ఎవరైనా దైవాదేశాల్లో 10వ వంతు వదలివేసినా నాశనం అయి పోతారు. కాని భవిష్యత్తులో ఒక కాలం రాబోతుంది. అందులో ఎవరైనా దైవాదేశాల్లోని 10వ వంతును ఆచరించినా సాఫల్యం పొందగలరు.” (తిర్మిజి’)
180 – 41 (1/63)
وَعَنْ أَبِيْ أَمَامَةَ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا ضَلَّ قَوْمٌ بَعْدَ هُدَى كَانُوْا عَلَيْهِ إِلَّا أُوْتُوا الْجَدَلَ”، ثُمَّ قَرَأَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم هَذِهِ الْآية: (…مَا ضَرَبُوْهُ لَكَ إِلَّا جَدَلًا بَلْ هُمْ قَوْمٌ خَصِمُوْنَ؛ 43: 58). رَوَاهُ أَحْمَدُ، وَالتِّرْمِذِيُّ، وَابْنُ مَاجَهُ .

(41) [1/63-దృఢం]
అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘ఏ జాతీ, రుజుమార్గం పొందిన తర్వాత మార్గ భ్రష్టత్వానికి గురికాలేదు, వివాదాలతో కూడిన జాతి తప్ప!’ అంటే వివాదాలు, కయ్యాలు కోరుకునే జాతి రుజుమార్గం పొందిన తర్వాత కూడామార్గభ్రష్టత్వానికి గురవుతుంది. ఆ తరువాత ప్రవక్త (స) దీన్ని సమర్థించే ఈ ఆయతును పఠించారు, ”వీరు మిమ్మల్ని వివాదాల ఉదాహరణ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీరు స్వయంగా కయ్యాలు కోరుకునేవారు.” )

వివరణ-180: ఈ ఆయతు సూరహ్‌ జుఖ్‌రుఫ్‌ (43)లో ఉంది, ”మరియు మర్యమ్‌ కుమారుడు ఒక ఉదాహరణగా పేర్కొనబడి నప్పుడు (ఓ ము’హమ్మద్‌!) నీ జాతి ప్రజలు అతనిని గురించి కేకలువేస్తారు. మరియు అంటారు: “మా దేవుళ్ళు మంచివా లేక అతనా (‘ఈసానా)?” వారు ఈ విషయం నీముందు పెట్టేది కేవలం జగడమాడటానికే. వాస్తవానికి వారు కలహప్రియులైన జనులు. అతను (‘ఈసా) కేవలం ఒక దాసుడు మాత్రమే. మేము అతనిని అనుగ్రహించాము. మరియు మేము అతనిని ఇస్రా’యీల్‌ సంతతి వారికి ఒక నిదర్శనంగా చేశాము.” (సూ. జుఖ్రరుఫ్, 43:57-59)
దీని అవతరణా కారణం ఏమిటంటే, ప్రవక్త (స) వలీద్‌ బిన్‌ ముగీరహ్ మొదలైన ఖురైష్‌ నాయకుల వద్ద కూర్చొని ఉన్నారు. ఇంతలో న’జ్ర్‌ బిన్‌ ‘హారిస్‌’ కూడా వచ్చాడు. ప్రవక్త (స)తో మాట్లాడసాగాడు. చివరికి సమాధానం ఇవ్వలేక పోయాడు. ప్రవక్త (స), ”మీరూ మీ విగ్రహాలు నరకానికి ఆహుతి అవుతారు” అనే ఖుర్ఆన్ వాక్యం పఠించి వినిపించారు. అది విన్న అవిశ్వాస నాయకులు, ‘ఈసా, ఉ’జైర్‌ మరియు దైవదూతలు కూడా నరకంలోకి వెళతారా? ఎందుకంటే వారిని కూడా ప్రజలు పూజిస్తున్నారు!’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఆరాధించేవారు, ఆరాధించమని కోరేవారు నరకంలోకి వెళతారు, ఈ దైవదాసులు ఇతరులను ఆరాధించలేదు, తమను ఆరాధించమని ఇతరులను కోరలేదు,’ అని అన్నారు. అప్పుడు ఈ వాక్యం అవతరించింది.
(అ’హ్మద్‌, తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
181 – 42 (1/64)
وَعَنْ أَنَسٍ بْنِ مَالِكٍ، أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَقُوْلُ: “لَا تُشَدِّدُوْا عَلَى أَنْفُسِكُمْ فَيُشَدِّدَ اللهُ عَلَيْكُمْ، فَإِنَّ قَوْمًا شَدَّدُوْا عَلَى أَنْفُسِهِمْ، فَشَدَّدَ اللهُ عَلَيْهِمْ، فَتِلْكَ بَقَايَاهُمْ فِيْ الصَّوَامِعِ وَالدِّيَارِ (…رَهْبَانِيَّة ابْتَدَعُوهَا مَا كَتَبْنَاهَا عَلَيْهِمْ…؛ 57: 27)”. رواه أبو داود.

(42) [1/64-బలహీనం]
అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”మిమ్మల్ని మీరు కష్టాలకు, కాఠిన్యాలకు గురిచేసుకోకండి, ఫలితంగా అల్లాహ్‌(త) మీకు కష్టాలకు గురిచేస్తాడు. ఎందుకంటే మీ కంటే ముందు బనీ-ఇస్రాయీ’ల్‌ జాతి తమ్ముతాము కష్టాలకు గురిచేసుకుంది. ఫలితంగా అల్లాహ్‌(త) కూడా వారిపై అధిక బరువు బాధ్యతలు వేశాడు. ఈకాలంలో కనబడే, సైనగోజీలు, చర్చీలు (ఆరాధనాలయాలు) మొదలైనవి వారి జ్ఞాపకార్థాలే. వారు సన్యాసత్వాన్ని స్వీకరించి, ప్రకృతి బాధ్యతలను త్యజించారు. ఇవన్నీ అల్లాహ్‌ ఆదేశించని ఆజ్ఞలే.” )

వివరణ-181: మిమ్మల్ని మీరు కష్టాలకు గురిచేసు కోకండి. అంటే శక్తికి మించిన ఆరాధనా పద్ధతులను నెత్తిన వేసుకో కండి. అల్లాహ్‌(త) మీ కోసం ధర్మ సమ్మతం చేసిన వివాహం, లైంగిక కోరికలను వదలి, జనవాసాలకు దూరంగా, అడవుల్లో నగ్నంగా లేదా అర్థనగ్నంగా తిరుగుతూ దాన్ని దైవసాన్నిహిత్యం పొందే మార్గంగా భావించకండి. ఇవన్నీ మీరు కల్పించుకున్న విషయాలే. వీటిని గురించి ఎటువంటి దైవాదేశాలూ అవతరించ లేదు.
సన్యాసత్వానికి చెందిన వాక్యం సూరహ్‌ హదీద్‌లో ఉంది. ”మరియు వాస్తవంగా మేము నూ’హ్‌ను మరియు ఇబ్రాహీమ్‌ను పంపాము. మరియు వారిద్దరి సంతానంలో ప్రవక్త పదవినీ మరియు గ్రంథాన్ని ఉంచాము. కాని వారి సంతతిలో కొందరు మార్గదర్శకత్వం మీద ఉన్నారు, కాని వారిలో చాలా మంది అవిధేయులు (ఫాసిఖూన్‌) ఉన్నారు. ఆ తరువాత చాలా మంది ప్రవక్తలను మేము వారి తరువాత పంపాము. మరియు మర్యమ్‌ కుమారుడు ఈసాను కూడా పంపాము మరియు అతనికి ఇంజీల్‌ను ప్రసాదించాము. మరియు అతనిని అనుసరించే వారి హృదయాలలో మేము జాలిని, కరుణను కలిగించాము, కాని సన్యాసాన్ని వారే స్వయంగా కల్పించుకున్నారు. మేము దానిని వారిపై విధించలేదు, కాని అల్లాహ్‌ ప్రసన్నతను పొందగోరి వారే దానిని విధించుకున్నారు, కాని వారు దానిని పాటించవలసిన విధంగా నిజాయితీతో పాటించలేదు. కావున వారిలో విశ్వసించిన వారికి వారి ప్రతిఫలాన్ని ప్రసాదించాము. కాని వారిలో చాలా మంది అవిధేయులు (ఫాసిఖూన్‌) ఉన్నారు.” (సూ. అల్‌ హదీద్‌, 57:26-27)
పూర్వం ఆచరణలో ఉన్న సన్యాసత్వం ఇస్లామ్‌లో నిషిద్ధం. ప్రవక్త (స), ”నా అనుచర సమాజంలోని సన్యాసత్వం ‘దైవ మార్గంలో పోరాడటం’ అని అన్నారు.” (ముస్నద్‌ అ’హ్మద్‌)
(అబూ-దావూద్‌)
182 – [ 43 ] ( ضعيف جدا ) (1/64)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْه، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “نَزَلَ الْقُرْآنُ عَلَى خَمْسَةِ أَوْجُهٍ: حَلَالٍ، وَحَرَامٍ، وَمُحْكَمٍ، وَّمُتَشَابِهٍ، وَأَمْثَالٍ. فَأَحِلُّوا الْحَلَالَ، وَحَرِّمُوْا الْحَرَامَ، وَاعْمَلُوْا بِالْمُحْكَمِ، وَآمِنُوْا بِالْمُتَشَابِهِ، وَاعْتَبِرُوْا بِالْأَمْثَالِ”. هَذَا لَفْظُ الْمَصَابِيْحِ، وَرَوَى الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ” وَلَفْظُهُ: “فَاعْمَلُوْا بِالْحَلَالِ، وَاجْتَنِبُوْا الْحَرَامَ، وَاتَّبِعُوْا الْمُحْكَمَ”.

(43) [1/64-అతి బలహీనం]
అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖుర్‌ఆన్‌ ఐదు విధాలుగా అవతరించబడింది. అంటే ఐదురకాల ఆదేశాలు అవతరించబడ్డాయి. 1. ‘హలాల్‌, 2. హరామ్‌, 3. ముహ్‌కమ్‌, 4. ముత షాబిహ్‌, 5. అమ్‌సాల్‌. కనుక మీరు ‘హలాల్‌ను ‘హలాల్‌ గా పరిగణించండి, ‘హరామ్‌ను ‘హరామ్‌గా పరిగణించండి, ము’హకమ్‌ ప్రకారం ఆచరించండి, ముతషాబిహ్‌లను విశ్వసించండి, అమ్‌సాల్‌ అంటే గాథలు వృత్తాంతాలద్వారా గుణపాఠంనేర్చుకోండి. )

వివరణ-182: ముహ్‌కమ్‌ అంటే స్పష్టంగా ఉన్నవి. ఏమాత్రం సందేహాలు, అనుమానాలు లేనివి. ఉదా. నమా’జు ఆచరించండి, ‘జకాత్‌ చెల్లించండి. ముతషాబిహ్‌ అంటే వాటి అర్థం అల్లాహ్‌(త) తప్ప ఎవ్వరూ ఎరుగరు. హురూఫె ముఖత్త ఆత్‌, గుణాలు. అంటే చేయి, దృష్టి, వినడం మొదలైనవి. ఇటు వంటి వాటిని విశ్వసించాలి. అమ్‌సాల్‌ అంటే ప్రాచీన గాథలు, కథలు వీటిద్వారా గుణపాఠం నేర్చుకోవాలి.
(బైహఖీ)
183 – 44 (1/64)
وَعَنْ ابْنِ عَبَّاسٍ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْأَمْرُ ثَلَاثَةٌ: أَمَرٌ بَيِّنٌ رُشْدُهُ فَاتَّبِعْهُ، وَأَمْرٌ بَيِّنٌ غَيُّهُ فَاجْتَنِبْهُ، وَأَمْرٌ اُخْتُلِفَ فِيْهِ فَكِلْهُ إِلَى اللهِ عَزَّ وَجَلَّ”. رواه أحمد .

(44) [1/64-బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మూడురకాల ఆచరణలు ఉన్నాయి. 1. స్పష్టంగా ఉన్నవాటిని ఆచరించండి, 2. స్పష్టంగా చెడు ఉన్నవాటి నుండి దూరంగా ఉండండి, 3. అనుమానాస్పద విషయాలను అల్లాహ్‌(త)కు అప్పజెప్పండి.” (అ’హ్మద్‌)

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
184 – 45 (1/65)
عَنْ مَعَاذِ بْنِ جَبَلٍ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الشَّيْطَانَ ذِئْبُ الْإِنْسَانِ كَذِئْبِ الْغَنَمِ، يَأْخُذُ الشَّاذَةَ وَالْقَاصِيَةَ وَالنَّاحِيَةَ، وَإِيَّاكُمْ وَالشِّعَابَ، وَعَلَيْكُمْ بِالْجَمَاعَةِ وَالْعَامَّة”. رَوَاهُ أَحْمَدُ

(45) [1/65-బలహీనం]
ము’ఆజ్‌ బిన్‌ జబల్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”షైతాన్‌ మానవుని పట్ల తోడేలు వంటి వాడు. మేకను తోడేలు ఎత్తుకుపోయినట్లు. ఎందుకంటే అది మందనుండి దూరంగా వెళ్ళి ఉంటుంది ఏ విధంగా తోడేలు ఒంటరిగా ఉన్న మేకను ఎత్తుకుపోయి చంపివేస్తుందో, అదేవిధంగా సంఘం నుండి వేరైన ముస్లిమ్‌పై షై’తాన్‌ పట్టు సాధిస్తాడు. కనుక కొండ మార్గాలకు దూరంగా ఉండండి. అంటే ఇస్లామీయ మార్గాన్ని వదలకండి. ముస్లిమ్‌ సంఘాన్ని అంటిపెట్టుకొని ఉండండి.” (అ’హ్మద్‌)
185 – 46 (1/65)
وَعَنْ أَبِيْ ذَرٍّ، قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ فَارَقَ الْجَمَاعَةَ شِبْرًا فَقَدْ خَلَعَ رقة الْإِسْلَامِ مِنْ عُنْقِهِ”. رَواهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ.

(46) [1/65-దృఢం]
అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తి ముస్లిమ్‌ సంఘానికి ఏమాత్రం దూరం అయినా, అతడు తన మెడలో ఉన్న ఇస్లామ్‌ పట్టాను తీసిపారవేసి నట్టే.” (అ’హ్మద్‌, అబూ దావూద్)
186 – 47 (1/66)
وَعَنْ مَالِكِ بْنِ أَنَسٍ مُرْسَلًا, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَرَكْتُ فيِكُمْ أَمْرَيْنِ لَنْ تَضِلُّوْا مَا تَمَسَّكَتُمْ بِهِمَا: كِتَابُ اللهِ وَسُنَّةُ رَسُوْلِهِ”. رَوَاهُ فِيْ “الْمُوَطَّأ”.

(47) [1/66-ప్రామాణికం]
మాలిక్‌ బిన్‌ అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను మీలో రెండు విషయాలు వదలాను. మీరు ఆ రెంటిని అంటిపెట్టుకొని ఉన్నంత వరకు, మీరు ఎంత మాత్రం మార్గభ్రష్టత్వానికి గురికారు. అవి: 1. దైవ గ్రంథం, 2. ప్రవక్త సాంప్రదాయం.” (మువ’త్తా-మాలిక్‌)
187 – 48 (1/66)
وَعَنْ غُضَيْفِ بْنِ الْحَارِثِ الثَّمَالِيْ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا أَحْدَثَ قَوْمٌ بدْعَةً إِلَّا رُفِعَ مِثْلُهَا مِنَ السُّنَةِ؛ فَتَمَسُّكَ بِسُنَّةِ خَيْرٌ مِّنْ إِحْدَاثِ بِدْعَةٍ”. رَوَاهُ أَحْمَدُ .

(48) [1/66-బలహీనం]
’గు’దై ఫ్ బిన్ ’హారిస్‌‘ అస్స‘మాలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఏదైనా జాతి ఒక కల్పితానికి పాల్పడితే, ఆ జాతి నుండి ఒక సున్నత్‌ ఎత్తుకోవటం జరుగుతుంది. కనుక ప్రవక్త సాంప్రదాయాలను అంటిపెట్టుకొని ఉండండి. ఇది కల్పించటం కంటే శ్రేష్ఠమైనది.” )

వివరణ-187: ధర్మంలో కల్పించటం చాలా అశుభకర మైన విషయం. కల్పితం రాగానే సాంప్రదాయం యొక్క వెలుగు తొలగిపోతుంది. సున్నత్‌ స్థానంలో అంధకారం వ్యాపిస్తుంది. ఈ అంధకారమే ముస్లిమ్‌ సమాజాన్ని తుప్పు పట్టిస్తుంది. దీనివల్ల బిద్‌’అత్‌లకు పాల్పడిన వారికి సున్నత్‌లపై ఆచరించే భాగ్యం కలుగదు. ఎట్టి పరిస్థితు ల్లోనూ ప్రవక్త సాంప్రదాయం (సున్నత్‌) ప్రకారమే ఆచరించాలి. ప్రవక్త సాంప్రదాయానికి (సున్నత్‌ కు) అను గుణంగా ఆచరించేవారు నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటారు. అతని హృదయంలో వెలుగు జనిస్తూ ఉంటుంది.
(అ’హ్మద్)
188 – 49 (1/66)
وَعَنْ حَسَّانَ, قَالَ: “مَا ابْتَدَعَ قَوْمٌ بِدْعَةً فِيْ دِيْنِهِمْ إِلَّا نَزَعَ اللهُ مِنْ سُنَّتِهِمْ مِثْلَهَا, ثُمَّ لَا يُعِيْدُهَا إِلَيْهِمْ إِلَى يَوْمِ الْقَيَامَةِ. رَوَاهُ الدَّارَمِيُّ.

(49) [1/66-బలహీనం]
‘హస్సాన్‌ బిన్‌ సా’బిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకజాతి ఒక కల్పితానికి పాల్పడితే, అల్లాహ్‌ (త) ఆ జాతి నుండి ఒక సున్నత్‌ ఎత్తు కుంటాడు. తీర్పు దినం వరకు దాన్ని మళ్ళీ వెనక్కి పంపటం జరుగదు.” (దార్మీ)
189 – 50 (1/66)
وَعَنْ إِبْرَاهِيْمَ بْنِ مَيْسَرَةٍ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ وَّقَّرَ صَاحِبَ بِدْعَةٍ, فَقَدْ أَعَانَ عَلَى هَدْمِ الْإِسْلَامِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ” مُرْسَلًا .

(50) [1/66-బలహీనం]
ఇబ్రాహీమ్‌ బిన్‌ మైసర (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బిద్‌’అతీని ఆదరించిన వాడు ఇస్లామ్‌ను కూల్చి వేయడంలో సహాయపడి నట్టే.” )

వివరణ-189: ఎందుకంటే, బిద్‌’అతీని గౌరవించటం, ఇస్లామ్‌ను అవమానించటం అవుతుంది. సున్నత్‌ మరియు ఇస్లామ్‌ను అవమానించటం వల్ల ఇస్లామ్‌ పునాదులు ధ్వంసం అవుతాయి.
(బైహఖీ-షు’అబిల్ ఈమాన్, తాబయీ ప్రోక్తం)
190 – [ 51 ] ( لم تتم دراسته ) (1/67)
وَعَنْ ابْنِ عَبَّاسٍ, قَالَ: مَنْ تَعَلَّمَ كِتَابَ اللهِ ثُمَّ اتَّبَعَ مَا فِيْهِ؛ هَدَاهُ اللهُ مِنَ الضَّلَالَةِ فِيْ الدُّنْيَا, وَوَقَاهُ يَوْمَ الْقَيَامَةِ سُوْءَ الْحِسَابِ. وَفِيْ رِوَايَةٍ قَالَ: مَنِ اقْتَدَى بِكِتَابِ اللهِ لَا يَضِلُّ فِيْ الدُّنْيَا وَلَا يَشْقَى فِيْ الْآخِرَةِ, ثُمَّ تَلَا هَذِهِ الْآيَةِ: (…فَمَنِ اتَّبَعَ هُدَايَ فَلَا يُضِلُّ وَلَا يَشْقَى؛20: 123) . رَوَاهُ رَزِيْنٌ .

(51) [1/67-అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ”దైవగ్రంథం నేర్చుకొని, దానిప్రకారం ఆచరించేవారిని, అల్లాహ్‌(త) ప్రపంచంలో మార్గభ్రష్టత్వం నుండి దూరంగా ఉంచుతాడు. ఇంకా, తీర్పుదినంనాడు అతన్ని అవమానానికి గురి చేయడు.
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ‘అల్లాహ్‌ గ్రంథం ప్రకారం ఆచరించినవారు ప్రపంచంలో మార్గ భ్రష్టత్వా నికి గురికారు, పరలోకంలో అవమానానికి గురికారు.’ ఆ తరువాత ఇబ్నె ‘అబ్బాస్‌, ”…నా మార్గదర్శ కత్వాన్ని అనుసరించేవాడు, మార్గభ్రష్టుడూ కాడు మరియు దురవస్థకూ గురికాడు.” (సూ. ‘తా-హా, 20: 123) ఆయతును పఠించారు. (ర’జీన్‌)
191 – 52 (1/67)
وَعَنْ ابْنِ مَسْعُوْدٍ, أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “ضَرَبَ اللهُ مَثَلًا صِرَاطًا مُّسْتَقِيْمًا, وَعَنْ جَنْبَتَي الصِّرَاطِ سُوْرَانِ, فِيْهِمَا أَبْوَابٌ مُفَتَّحَةٌ, وَعَلَى الْأَبْوَابِ سُتُوْرٌ مُّرْخَاةٌ, وَعِنْدَ رَأْسِ الصِراطِ دَاعٍ يَقُوْلُ: اِسْتَقِيْمُوْا عَلَى الصِّرَاطِ وَلَا تَعْوَجُّوْا, وَفَوْقَ ذَلِكَ دَاعٍ يَّدْعُوْ, كُلَّمَا هُمْ عَبْدٌ أَنْ يَّفْتَحَ شَيْئًا مِنْ تِلْكَ الْأَبْوَابِ قَالَ: وَيْحَكَ! لَا تَفْتَحْهُ, فَإِنَّكَ إِنْ تَفْتَحْهُ تُلِجْهُ”. ثُمَّ فَسَّرَهُ فَأَخْبَرَ: “أَنَّ الصِّرَاطَ هُو الْإِسْلَامُ, وَأَنَّ الْأَبْوَابَ الْمُفْتَّحَةَ مُحَارِمُ اللهِ, وَأَنَّ السُّتُوْرَ الْمُرْخَاةَ حُدُوْدُ اللهِ, وَأَنَّ الدَّاعِيَ عَلَى رَأْسِ الصِّرَاطِ هُوَ الْقُرْآنُ, وَأَنَّ الدَّاعِيَ مِنْ فَوْقِهِ واعظُ اللهِ فِيْ قَلْبِ كُلِّ مُؤْمِنٍ”. رَوَاهُ رَزِيْنٌ وَأَحْمَدُ .

(52) [1/67-దృఢం]
ఇబ్నె మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ రుజుమార్గాన్ని గురించి ఒక ఉదాహరణ పేర్కొ న్నాడు, ‘ఒక మార్గం నిటారుగా ఉంది. ఆ మార్గానికి ఇరువైపుల రెండు గోడలు ఉన్నాయి. ఆ గోడలకు తెరచి ఉన్న ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలపై తెరలు ఉన్నాయి. మార్గం పై ఒక పిలిచేవాడు నిలబడి ఉన్నాడు. అతను, తిన్నగా వెళ్ళండి అటూ ఇటూ తిరగకండి అని కేకలు వేస్తున్నాడు. అతని పై భాగంలో మరొక పిలిచేవాడు కూడా, తిన్నగా వెళ్ళిపోండి, అటూ ఇటూ చూడకండి అని కేకలు పెడుతున్నాడు. ఎవరైనా ఆ ద్వారాలను తెరవటానికి ప్రయత్నిస్తే, ఆ పిలిచేవాడు, చాలా విచారకరమైన విషయం. ‘ఈ తలుపును తెరవకు, ఎందుకంటే ఒకవేళ నువ్వు తెరచి వేస్తే తప్పకుండా అందులో ప్రవేశిస్తావు,’ అని అంటాడు. ఈ ఉదాహరణను పేర్కొని, ప్రవక్త (స), దీనికి ఈ విధంగా వివరణ ఇచ్చారు, ”రుజుమార్గం ఇస్లామ్‌. ఇది స్వర్గానికి తీసుకుపోతుంది. గోడలకు ఉన్న ద్వారాలు అల్లాహ్‌ (త) నిషేధించిన విషయాలు. వాటిపై ఉన్న తెరలు అల్లాహ్‌ (త) హద్దులు. మార్గంపై నిల్చున్నవాడు ఖుర్‌ఆన్‌. అతని ముందు నిలబడి కేకలు పెడుతున్నవాడు హితబోధ చేసే మనిషిలో దాగి ఉన్న అతని మనస్సు. అంటే అతనిలో ఉన్న దైవదూత,” అని అన్నారు. (ర’జీన్‌, అ’హ్మద్‌)
192 – 53 (1/67)
وَالْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ” عَنِ النَّوَّاسِ بْنِ سَمْعَانَ, وَكَذَا التِّرْمِذِيُّ عَنْهُ إِلَّا أَنَّهُ ذَكَرَ أَخْصَرَ مِنْهُ .

(53) [1/67-దృఢం]
నవాస్‌ ఇబ్నె సమ్‌’ఆన్‌ (ర)…ఈ ‘హదీసు’ను కొంత తగ్గించి చెప్పారు… (బైహఖీ, తిర్మిజి’)
193 – 54 (1/67)
وَعَنْ ابْنِ مَسْعُوْدٍ, قَالَ: مَنْ كَانَ مُسْتِنّا؛ فَلْيَسْتَنَّ بِمَنْ قَدْ مَاتَ, فَإِنَّ الْحَيَّ لَا تُؤْمَنُ عَلَيْهِ الْفِتْنَةُ. أُولئِكَ أَصْحَابُ مُحَمَّدٍ صلى الله عليه وسلم كَانُوْا أَفْضَلَ هَذِهِ الْأُمَّةِ, أَبَرَّهَا قُلُوْبًا, وَأَعْمَقَّهَا عِلْمًا, وَأَقَلَّهَا تَكَلُّفًا, اِخْتَارَهُمُ اللهُ لِصُحْبَةِ نَبِيِّهِ, وَلِإِقَامَةِ دِيْنِهِ, فَاَعْرَفُوْا لَهُمْ فَضْلَهُمْ, وَاتَّبْعُوْهُمْ عَلَى آثَارِهِمْ, وَتَمَسَّكُوْا بِمَا اسْتَطَعْتُمْ مِنْ أَخْلَاقِهِمْ وَسِيَرِهِمْ, فَإِنَّهُمْ كَانُوْا عَلَى الْهُدَى الْمُسْتَقِيْمِ . رَوَاهُ رَزِيْنٌ .

(54) [1/67-బలహీనం]
ఇబ్నె మస్‌’ఊద్‌ (ర) కథనం: ఒకవేళ ఎవరైనా ఎవరినైనా అనుసరించాలనుకుంటే, గతించిన వారిని అనుసరించాలి. ఎందుకంటే సజీవంగా ఉన్నవారు ఉపద్రవాలకు, కల్లోలాలకు గురవుతూ ఉంటారు. అనుసరించవలసినవారు మరణించిన ప్రవక్త (స) అనుచరులు. ఈ అనుచర సమాజంలో అందరికంటే శ్రేష్ఠులు. వారి హృదయాలు అందరికంటే నిష్కల్మష మైనవి. వారు పరిపూర్ణ వ్యక్తులు. అతి సామాన్యంగా మొహమాటం పడేవారు. అల్లాహ్‌(త) వారిని తన ప్రవక్త (స) అనుచరులుగా, ఇంకా తన ధర్మాన్ని స్థాపించటానికి ఎన్నుకున్నాడు. అందువల్ల మీరు వారి గొప్పతనాన్ని గుర్తించండి, ఇంకా వారి అడుగు జాడలను అనుసరించండి, సాధ్యమైనంత వరకు వారి సద్గుణాలను, అలవాట్లను కలిగి ఉండండి. ఎందుకంటే వీరే సిరాతె ముస్తఖీమ్‌పై ఉన్నవారు. అదే రుజు మార్గం.” )

వివరణ-193: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ తన కాలానికి చెందిన తాబయీన్లతో, ‘మీరు ప్రవక్త (స) అనుచరులను అనుసరించండి, ఎందుకంటే వీరే అందరి కంటే పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండేవారు. వీరే ప్రవక్త సాంప్రదాయాలను అనుసరించేవారు. వాటిని గురించి అందరికంటే వీరికే ఎక్కువగా తెలిసి ఉండేది. వీరు ఎటువంటి ప్రదర్శనా బుద్ధికి పాల్పడేవారు కాదు. ప్రతి విషయంలో వీరు మధ్యమార్గాన్ని అనుసరించే వారు. అందుకే అల్లాహ్‌(త) వీరిని తన ప్రవక్త అనుచరులుగా ఎన్నుకున్నాడు. కనుక మీరందరూ వీరినే అనుసరించండి, వీరి అడుగు జాడలపైనే నడవండి,’ అని హితబోధ చేసేవారు.
(ర’జీన్‌)
194 – 55 (1/68)
عَنْ جَابِرٍ, أَنَّ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُمَا: أَتَى رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم بِنُسْخَةٍ مِّنَ التَّوْرَاةِ, فَقَالَ: يَا رَسُوْلَ اللهِ! هَذِهِ نُسْخَةٌ مِّنَ التَّوْرَاةِ, فَسَكَتَ, فَجَعَلَ يَقْرَأُ وَوَجْهُ رَسُوْلِ اللهِ صلى الله عليه و سلم يَتَغَيَّرُ. فَقَالَ أَبُوْ بَكْرٍ: ثَكِلَتْكَ الثَّوَاكِلُ! مَا تَرَى مَا بِوَجْهِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم؟ فَنَظَرَ عُمَرُ إِلَى وَجْهِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: أَعُوْذُ بِاللهِ من غَضَبِ اللهِ وَغَضَبِ رَسُوْلِهِ صلى الله عليه وسلم, رَضِيْنَا بِاللهِ رَبًّا, وَبِالْإِسْلَامِ دِيْنًا, وَبِمُحَمَّدٍ نَبِيًّا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَالَّذِيْ نَفْسُ مُّحَمَّدٍ بِيَدِهِ, لَوْ بَدَاَ لَكُمْ مُوْسَى فاتَّبَعْتُمُوْهُ وَتَرَكْتُمُوْنِيْ لَضَلَلْتُمْ عَنْ سَوَاءِ السَّبِيْلِ؛ وَلَوْ كَانَ حَيًّا وَأَدْرَكَ نُبُوَّتِيْ لَاتَّبَعَنِيْ”. رَوَاهُ الدَّارَمِيُّ .

(55) [1/68-ప్రామాణికం]
జాబిర్‌ (ర) కథనం: ఒకసారి ‘ఉమర్‌ (ర) ప్రవక్త (స) వద్దకు ఒక తౌరాతు ప్రతి ఒకటి తీసుకొని వచ్చి, ‘ఓ ప్రవక్తా! ఇది తౌరాతు కాపీ,’ అని అన్నారు. ప్రవక్త (స) మౌనంగా ఉన్నారు. ‘ఉమర్‌ (ర) దాన్ని చదవటం ప్రారంభించారు. అది విన్న ప్రవక్త (స) ముఖవర్చస్సు మారిపోయింది. అది చూసిన అబూ-బక్ర్‌ (ర), ”ఓ ‘ఉమర్‌! నీకేమయింది?” ‘ఉమర్‌ మళ్ళి చూసి, ప్రవక్త (స) ముఖం ఆగ్రహంతో నిండి ఉండటం గమనించారు. వెంటనే, ”నేను అల్లాహ్‌(త) అయిష్టం నుండి, ఆయన ప్రవక్త (స) అయిష్టం నుండి శరణుకోరుతున్నాను. ఇంకా, అల్లాహ్‌(త)ను మా ప్రభువుగా, ఇస్లామ్‌ను ధర్మంగా, ము’హమ్మద్‌ (స)ను ప్రవక్తగా స్వీక రిస్తున్నాను,” అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ప్రమాణం చేసి, ”ఎవరి చేతుల్లో నా ప్రాణం ఉందో ఆ అలాహ్ సాక్షి! ఒకవేళ మూసా (అ) కూడా మీలో ఉండి, మీరు నన్ను వదలి అతనికి విధేయత చూపితే, సన్మార్గం నుండి దూరమై మార్గభ్రష్టత్వానికి గురవు తారు. మూసా (అ) సజీవంగా ఉండి, ఈ సమాజంలో ఉంటే, అతనికి నన్ను అనుసరించడం తప్ప మరో మార్గం లేదు,” అని అన్నారు. )

వివరణ-194: ఈ ‘హదీసు’ ద్వారా ఖుర్‌ఆన్‌, ‘హదీసు’లను వదలి, ఇతర దైవగ్రంథాలను చదవటం, అనుసరించటం అల్లాహ్(త) ఆగ్రహానికి, ప్రవక్త (స) అయిష్టతకు గురిచేస్తాయని తెలిసింది. ఇంకా ఖుర్‌ఆన్‌, ప్రవక్త సాంప్రదాయాలను చదవటం, అనుసరించటం మార్గ దర్శకత్వానికి గురిచేస్తాయి.
(దార్మీ)
195 – 56 (1/68)
وَعَنْ جَابِرٍ, قَالَ: قَالَ رسولُ اللهِ صلى الله عليه وسلم: “كَلَامِيْ لَا يَنْسَخُ كَلَامُ اللهِ, وَكلَامُ اللهِ يَنْسَخُ كَلَامِيْ, وَكَلَامُ اللهِ يَنْسَخُ بَعْضُهُ بَعْضا”.

(56) [1/68-కల్పితం]
జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా వాక్కు అల్లాహ్‌ (త) వాక్కును రద్దు చేయలేదు, అల్లాహ్‌(త) వాక్కు నావాక్కును రద్దు చేయగలదు, అదేవిధంగా ఒక దైవవాక్కు మరో దైవవాక్కును రద్దుచేస్తుంది.” )

వివరణ-195: నస్‌ఖ్‌ అంటే రద్దు చేయటం. అల్లాహ్‌(త) ఖుర్‌ఆన్‌లో మేము ఒక ఆదేశాన్ని రద్దుచేసినా, లేదా మరపింపజేసినా, దానికి సమానమైనది, లేదా దానికంటే మంచిది తీసుకువస్తాము. ఖుర్‌ఆన్‌లో కొన్ని ఆదేశాలు రద్దు చేయబడ్డాయి, కాని వాటి పఠనం రద్దు కాలేదు. మరికొన్ని ఆదేశాలు, పఠనం రెండూ రద్దుచేయబడ్డాయి. దీన్ని గురించి అనేక ఆయతులు ఉన్నాయి.


(దారు ఖుతునీ)
196 – [ 57 ] ( موضو ع ) (1/68)
وَعَنِ ابْنِ عُمَرَ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَحَادِيْثَنَا يَنْسَخُ بَعْضُهَا بَعْضًا كَنَسْخِ الْقُرْآن”

(57) [1/68-కల్పితం]
ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మా వాక్కుల్లో కొన్ని మరికొన్నింటిని రద్దుచేస్తాయి, దైవవాక్యాలు కొన్ని మరికొన్నింటిని రద్దు చేసినట్లు.” (దారు ఖుతునీ)
197 – 58 (1/69)
وَعَنْ أَبِيْ ثَعْلَبَةَ الْخُشَنِيِّ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ فَرَضَ فَرَائِضُ فَلَا تُضَيِّعُوْهَا, وَحَرَّمَ حُرُمَاتٍ فَلَا تَنْتَهِكُوْهَا, وَحَدَّ حُدُوْدًا فَلَا تَعْتَدُوْهَا, وَسَكَتَ عَنْ أَشْيَاءِ مِنْ غَيْرِ نِسْيَانٍ فَلَا تَبْحَثُوْا عَنْهَا”. رَوى الْأَحَادِيْثَ الثَّلَاثَةَ الدَّارَقُطْنِيُّ .

(58) [1/69-బలహీనం]
అబూ-స‘’అలబహ్ అల్‌ ’ఖుషనీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌(త) కొన్ని విషయాలను విధిగా చేశాడు. మీరు వాటిని నిర్లక్ష్యంగా వృథా చేసుకోకండి. కొన్ని విష యాలను నిషిద్ధంచేశాడు. మీరు వాటి దగ్గరకు కూడా వెళ్ళకండి. అల్లాహ్‌(త) కొన్ని హద్దులను విధించాడు. మీరు వాటిని మీరకండి. అల్లాహ్‌(త) అనేక విషయాల పట్ల మౌనం వహించాడు. మీరు వాటి గోతులను త్రవ్వకండి.” (దారు ఖుతునీ)


%d bloggers like this: