19. పోరాటం (జీహాద్‌) | మిష్కాతుల్ మసాబీహ్

19– كِتَابُ الْجِهَادِ

19. జిహాద్ పుస్తకం

జిహాద్‌ అంటే కష్టం, శ్రమ, ప్రయత్నం. ఇస్లామీయ పరిభాషలో ధన, మాన, ప్రాణ భయం లేకుండా ఇస్లామ్‌ పై స్థిరంగా ఉండటానికి కృషి ప్రయత్నాలు, పోరాటం చేయటం. చేతులతో, కాళ్ళతో, నోటితో, కలంతో లేదా ఆయుధాలతో అంటే దైవవ్యవస్థను వ్యాపింప జేయటంలో ప్రయత్నించడం, కృషి చేయటం. అల్లాహ్‌ (త) మరియు ఆయన ప్రవక్త (స)ల వ్యతి రేకులతో యుద్ధం తప్పనిసరి అయితే యుద్ధం చేయటం జిహాద్‌ అనబడుతుంది. షరతులన్నీ ఉంటేనే జిహాద్‌ చేయడం తప్పనిసరి అవుతుంది. ఖుర్‌ఆన్‌లో జిహాద్‌ గురించి అనేక ఆయతులు అవతరించబడ్డాయి. సూరహ్‌ బఖరహ్‌ (2)లో అల్లాహ్‌ ఆదేశం: ”మీకు అసహ్య కరమైనా! (ధర్మ) యుధ్ధం చేయటం మీకు విధిగా నిర్ణయించ బడింది.మరియు మీకు నచ్చని విషయమే మీకు మేలైనది కావచ్చు మరియు మీకు నచ్చే విషయమే మీకు హానికరమైనది కావచ్చు! మరియు అల్లాహ్‌కు అంతా తెలుసు, కాని మీకు ఏమీ తెలియదు.” (అల్‌ బఖరహ్‌, 2:216)

తఫ్‌సీర్‌ ఇబ్నె కసీ’ర్‌ ఈ వాక్యం గురించి వివరిస్తూ, ఇస్లామ్‌ శత్రువుల నుండి ఇస్లామ్‌ను రక్షించడానికి వారితో యుద్ధం చేయవచ్చని ఈ వాక్యంలో పేర్కొనడం జరిగింది. ఇమామ్‌ జుహ్‌రీ అభిప్రాయం, ”జిహాద్‌ ప్రతి వ్యక్తిపై తప్పనిసరి విధి. యుద్ధానికి బయలు దేరడంలోనూ, ఇంట్లో కూర్చోవడంలోనూ, సహాయం కోరితే సహాయం చేయాలి, యుద్ధానికి పిలిస్తే యుద్ధానికి సిద్ధం కావాలి.”

‘స’హీ’హ్‌ ‘హదీసు’లో ఇలాఉంది, ”మరణించిన వ్యక్తి జిహాద్‌ చేయకున్నా, తన మనస్సులో జిహాద్‌ పట్ల కోరకుండా ఉన్నా, అతడు అజ్ఞానకాలపు మరణం పొందుతాడు. ఒక ‘హదీసు’లో ఇలా ఉంది, ”మక్కహ్ విజయం తర్వాత హిజ్రత్ లేదు. అయితే జిహాద్‌ మరియు సంకల్పం ఉంది. ఒకవేళ మిమ్మల్ని జిహాద్‌ కోసం బయలుదేరమని ఆదేశిస్తే వెంటనే బయలు దేరాలి. ఇలా మక్కహ్ విజయం నాడు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా జిహాద్‌ ఆదేశం మీకు కష్టంగా ఉంటుంది. అందులో ఆపదలు, కష్టాలు కనబడతాయి. ఎందుకంటే అందులో హతమార్చ బడటం కూడా సాధ్యమే. అందులో గాయాల పాలవ వచ్చు. ప్రయాణ కష్టనష్టాలు ఎదురవవచ్చు. దీన్ని మీరు చెడుగా భావించవచ్చు. కాని అందులో మీకు మేలుఉంది. ఎందుకంటే దీనివల్లే మీకు ఆధిపత్యం లభిస్తుంది. శత్రువులకు ఓటమి. వారి ధన సంపదలు, వారి ఆస్తులు చివరికి వారి భార్యాబిడ్డలు సైతం మీ పాదాలపై పడటం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఒక విషయాన్ని తమ కోసం మంచిదిగా భావించ వచ్చు. కాని అది మీకోసం హానికరమైనదిగా ఉండవచ్చు.

సాధారణంగా మానవుడు ఒక విషయానికి ఇష్టపడతాడు. అయితే అందులో ఎటువంటి లాభం ఉండదు. అదేవిధంగా మీరు యుద్ధం చేయక పోవటంలోనే లాభం ఉందని మీరు భావిస్తారు. కాని అది మీకోసం హానికరంగా ఉండవచ్చు. ఎందుకంటే దీనివల్ల శత్రువు మీపై ఆధిక్యాన్ని పొందుతాడు. దానివల్ల ప్రపంచంలో కాలుపెట్ట టానికి కూడా మీకు వీలుఉండదు. కార్యాల పర్యవసానం అల్లాహ్‌(త)కే తెలుసు. ఏ కార్యం మీకు లాభకరమైనది, ఏ కార్యం మీకు హానికరమైనది అనేది కేవలం అల్లాహ్‌(త)కే తెలుసు. దేనిలో మీ కోసం లాభం ఉందో అల్లాహ్‌(త) వాటినే ఆదేశిస్తాడు. అల్లాహ్‌(త) ఆదేశాలను తూ.చ. తప్పకుండా ఆచరించండి. ఇందులోనే మీ అందరికీ లాభం, సాఫల్యం ఉంది. మౌలానా ఆ’జాద్‌ సదాయ్‌ ‘హఖ్‌లో ఈ జిహాద్‌ గురించి ఎంతగానో ప్రసంశించారు.

అల్లాహ్‌ మార్గంలో జిహాద్‌ మంచిని బోధించటం: మంచిని బోధించడం చెడును నిర్మూలించడాన్నే ఖుర్‌ఆన్‌ దైవమార్గంలో జిహాద్‌గా పేర్కొంటుంది. దీన్ని ఇస్లామ్‌ స్థాపనకు మార్గంగా, ముస్లిముల ప్రార్థనలకు, ఆచరణలకు మూలంగా అభివర్ణిస్తుంది. జిహాద్‌ అనే పదం జుహుద్ నుండి వచ్చింది. దీని అర్థం కష్టం, శ్రమ, ప్రయత్నం, ఆశయసాధన కోసం కష్టాలను, నష్టాలను అధిగమించడం అని అర్థం. జిహాద్‌ అంటే శత్రువు ఎదురుదాడిలో సాధ్యమైనంత వరకు పూర్తి శక్తిని ఉపయోగించటం. ఆ శత్రువు ఇస్లామ్‌, ముస్లిమ్‌ బహిరంగంగా శత్రువులైనా, అంతర్గత శత్రువులు షై’తాన్‌, మనోకాంక్షలైనా సరే. ప్రపంచంలో శాంతి భద్రతలను స్థాపించడం చెడును, అజ్ఞానాన్ని నిర్మూలించడమే ఇస్లామ్‌ ప్రధాన ఉద్దేశ్యం. అయితే మంచిని బోధించడం, చెడును నిర్మూ లించడం ద్వారానే ఇది సాధ్యం అవుతుంది. చెడు అనేక రూపాల్లో ఎదురౌతుంది. అందువల్ల మానవుల నుండి అజ్ఞానాంధకారాలను దూరం చేయటానికి ప్రయత్నించాలి. చెడును నిర్మూలించటం దైవ ధర్మాన్ని స్థాపించటం మొదలైన వాటినే ఖుర్‌ఆన్‌లో జిహాద్‌ ఫీ సబీలిల్లాహ్‌గా పేర్కొనడం జరిగింది. ఇస్లామ్‌ అసలు ఉద్దేశ్యం మంచిని బోధించడం. అయితే చెడును నిర్మూలించనంత వరకు మంచిని బోధించడం సాధ్యం కాదు. మంచిని ఆదేశించడమంటే సత్యాన్ని, సత్కార్యాలను గురించి ఆదేశించటం, ఆహ్వానించడం చెడును నిర్మూలించటమంటే పాపాలనుండి, చెడు నుండి వారించటం, వెలుగు ఉంటేనే కదా స్పష్టంగా కనబడుతుంది. దీన్నే మనం జిహాద్‌ అంటాం.  అంతర్బాహ్యాల గురించి ముఫ్రదాత్‌ రచయిత చాలా చక్కగా పేర్కొన్నారు. ఈ చెడు ఒక్కోసారి శత్రువుల ఆయుధాల రూపంలో కనబడుతుంది. ఒక్కోసారి నమ్మకాలు, ఆచరణల రూపంలో కనబడుతుంది. ఒక్కోసారి ఆక్రమణ రూపంలో కనబడుతుంది. ఒక్కోసారి సత్యాన్ని ఓడించటానికి, న్యాయాన్ని రూపుమాప టానికి కరవాలాలు ప్రత్యక్షం అవుతాయి. ఒక్కోసారి విష పానీ యాలు త్రాపించటానికి సిద్ధం అవుతాయి. చెడుకు సంబం ధించిన సైన్యంలో ఆయుధాలు ఉంటే సత్యానికి చెందిన సైన్యం వద్ద కూడా ఆయుధాలు ఉండాలి.

మనోకాంక్షలు, షైతాన్ప్రభావం

ఆయుధాలతో దాడిచేసిన శత్రువును ఆయుధాలతో ఎదుర్కొంటాం. కాని ఎక్కడైతే అజ్ఞానం, మార్గ భ్రష్టత్వం, మూఢ నమ్మకాలు, ఆచారాలు, కల్పితాలు ఉంటే అక్కడ ఒక మోమిన్‌, ముస్లిమ్‌ మంచిని బోధించే, చెడును నిర్మూలించే ఆయుధాల ద్వారా, తన నోటి ద్వారా, కలం ద్వారా చెడును నిర్మూలించడం కోసం జిహాద్‌ (కృషి) చేయాలి. అది బహిర్గతం అయితే ఇది అంతర్గతం.

వివరణ: అందువల్లే అనేక ‘హదీసు’ల్లో జిహాద్‌ ఆదేశం గురించి వివరంగా చెప్పటం జరిగింది. షైతానుకు, మనోకాంక్షలకు వ్యతిరేకంగా చేసే ప్రయత్నాలన్నింటినీ జిహాద్‌గా పరిగణించడం జరిగింది. ఉదాహరణకు శత్రువులకు వ్యతిరేకంగా ఆయుధాలతో పోరాడినట్లు మీ మనోకాంక్షలకు వ్యతిరేకంగా పోరాడండి. వాస్తవంగా ఇదే చాలాగొప్ప జిహాద్. నసాయి,

అబూదావూద్‌లో అనస్‌ (ర) ఉల్లేఖనం ఉన్న ‘హదీసు’లో స్పష్టంగా వివరించటం జరిగింది. ”అవిశ్వా సులకు వ్యతిరేకంగా మీ ధన, ప్రాణాల ద్వారా, నోటి ద్వారా జిహాద్‌ చేయండి. అంటే తప్పనిసరి జిహాద్‌. ఒక్కోసారి యుద్ధం, పోరాటాల రూపంలో, ఒక్కోసారి సత్యవాక్కు పలకటానికి, ఒక్కోసారి నోటితో మంచిని బోధించడం, చెడును నిర్మూలించడం ద్వారా చేయండి.”

ఇస్లామ్‌ వచ్చింది మంచిని ఆదేశించి, చెడును నిర్మూలించడం కోసమే. అంతేకాదు, మంచిని ఆదే శించడం, జిహాద్‌ అనేది ఒకే ఆదేశానికి రెండు పేర్లు. సత్యానికి చేసే ఏ ప్రయత్నం అయినా, సత్యం కోసం చేసే ఎటువంటి ఖర్చు అయినా, సత్యంకొరకు చేసే ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి కష్టం, నష్టం అయినా జిహాద్ఫీ సబీలిల్లాహ్గా పరిగణించబడు తుంది. ఈ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితి అయినా జిహాద్‌ అనబడుతుంది. ఇవన్నీ మంచిని ఆదేశించడం, చెడును వారించడంలోనికి వస్తాయి. ఎవరికి ఎంత భాగ్యం కలిగితే అంతవరకు కృషి ప్రయత్నాలు చేయాలి.

జిహాద్వాస్తవం

ఈ కారణంగానే జిహాద్‌ ఆదేశం ఇస్లామ్‌లో తప్పనిసరి అయింది. ముజాహిద్‌ కానంత వరకు ఎవరూ ముస్లిమ్‌ కాలేరు. అనేకచోట్ల ఖుర్‌ఆన్‌ జిహాద్ఫీ సబీ లిల్లాహ్ను ఒక ముస్లిమ్‌ ప్రత్యేకతలుగా సూచించింది.

మరియు అల్లాహ్‌ మార్గంలో పోరాడవలసిన విధంగా ధర్మపోరాటం చేయండి. ఆయన మిమ్మల్ని ఎన్ను కున్నాడు. మరియు ఆయన ధర్మవిషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. ఇది మీ తండ్రి ఇబ్రాహీమ్‌ మతమే. ఆయన మొదటి నుండి మీకు అల్లాహ్‌కు విధేయులు (ముస్లింలు) అని పేరు పెట్టాడు. దీనికై మీ సందేశహరుడు మీకు సాక్షిగా ఉండటానికి మరియు మీరు ప్రజలకు సాక్షులుగా ఉండటానికి. కావున నమా’జ్‌  స్థాపించండి, విధిదానం (‘జకాత్‌) ఇవ్వండి. మరియు అల్లాహ్‌తో గట్టి సంబంధం కలిగి ఉండండి, ఆయనే మీ సంరక్షకుడు. ఎంత శ్రేష్టమైన సంరక్షకుడు మరియు ఎంత ఉత్తమ సహాయకుడు!” (అల్‌’హజ్జ్, 22:78)

ఈ ఆయతులో అల్లాహ్‌ (త) ముస్లిములకు ఇతరుల కంటే గొప్పతనం, శ్రేష్ఠత ప్రసాదించే శుభవార్త ఇచ్చాడు. ఇబ్రాహీమ్‌ (అ) గురించి సూచిస్తూ అతన్ని ఆదర్శంగా స్వీకరించాలని హితబోధ చేసాడు. అతడు దైవప్రీతి కోసం తన మనోకాంక్షలను, చివరికి తన సంతానాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. మీరు కూడా అతని ధర్మ అనుచరులుగా పరిగణింప బడతారు. నమా’జ్‌, ‘జకాత్‌ ప్రస్తావిస్తూ ఈ రెంటి ద్వారా త్యాగానికి సిద్ధంగా ఉండాలని శిక్షణ ఇవ్వడం జరిగింది. నమా’జ్‌ ద్వారా తన మనోకాంక్షలను, కోరికలను అదుపులో ఉంచుతూ, తన అసహాయతను ప్రకటించడం. అతను ప్రసాదించిన తలను అతని ముందే వంచాలి. ‘జకాత్‌ ద్వారా తన ధనంలో నుండి దైవమార్గంలో ఖర్చుచేసి అవసరార్థులను ఆదుకునే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా మంచిని బోధిస్తూ, చెడును నిర్మూలిస్తూ ఉండాలని, మీకు ముస్లిమ్‌ అనే పేరు ఎందుకు పెట్టటం జరిగిందంటే మీరు సత్యాన్ని ప్రపంచంలో వ్యాపింపజేసి సాక్షులుగా ఉండటానికి, ప్రవక్త (స) మీ విధేయతకు సాక్ష్యంగా ఉండటానికి. అదేవిధంగా వాక్యం ప్రారంభంలో ప్రత్యేకంగా అల్లాహ్‌ మార్గంలో చేయవలసిన విధంగా జిహాద్‌ చేయండి అని సూచించడం జరిగింది. అల్లాహ్‌ ధర్మాన్ని పరిపూర్తికి, వ్యాప్తికి దైవమార్గంలో జిహాద్‌ చేయడం మీ బాధ్యత. దాన్ని గురించి కృషి, ప్రయత్నాలు చేయండి. దాని కొరకు మీ దగ్గర ఉన్న వనరులన్నీ ఉపయోగించండి. ఈ మార్గంలో వివిధ రకాలైన ఆటంకాలు, ఆపదలు, కష్టాలు, నష్టాలు వస్తాయి. అదేవిధంగా ప్రాపంచిక విషయాలకు, ఆకర్షణలకు లొంగిపోకండి, అందరూ కలసి కట్టుగా ఉండండి అని హితబోధ చేయడం జరిగింది. అతనితో గట్టి సంబంధం కలిగి ఉండండి, మానవుల్లోని చాలా మంది లెక్క లేనన్ని దేవుళ్ళు కల్పించుకున్నారు, కాని మీకు ఒకే ఒక్క దేవుడు, మీరు ఆయన్నే నమ్ముకోవాలి, ఆయనకే భయ పడాలి,’ అని ఆదేశించబడింది.

ఇస్లామ్‌ జిహాద్‌ను ఇస్లామ్‌ వ్యతిరేకులను ఎదుర్కొన టానికి సూచించింది. అంటే ప్రారంభకాలంలో ఇస్లామ్‌ శత్రువులు ముస్లిములపై దాడిచేసేవారు. వారిని ఎదుర్కొనేందుకు, తమ ప్రాణ, ధన, మానాలను కాపాడుకొనేందుకు జిహాద్‌ను ఆదేశించడం జరిగింది. దీన్ని గురించి ఖుర్ఆన్లో ఇలా ఆదేశించడం జరిగింది:

 ”మరియు మీతో, పోరాడేవారితో, మీరు అల్లాహ్‌ మార్గంలో పోరాడండి, కాని హద్దులను అతిక్రమించ కండి. నిశ్చయంగా, అల్లాహ్‌ హద్దులను అతిక్రమించే వారిని ప్రేమించడు.

 వారు, మీకు ఎక్కడ ఎదురైతే అక్కడనే  వారిని చంపండి. మరియు వారు మిమ్మల్ని ఎచ్చటినుండి తరిమివేశారో, మీరు కూడా వారిని అచ్చటినుండి తరిమివేయండి. మరియు సత్యధర్మానికి అడ్డుగా నిలవటం (ఫిత్నా),  చంపటంకంటే ఘోరమైనది. మస్జిద్‌ అల్‌-‘హరామ్‌ వద్ద వారు మీతో యుధ్ధం చేయనంత వరకు మీరు వారితో అక్కడ యుధ్ధం చేయకండి. ఒకవేళ వారే  మీతో (ఆ పవిత్ర స్థలంలో) యుద్ధం చేస్తే వారిని వధించండి. ఇదే సత్య తిరస్కారులకు తగిన శిక్ష.

 కానీ, వారు (యుధ్ధం చేయటం) మాను కుంటే (మీరు కూడా మానుకోండి). ఎందుకంటే నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. (అల్‌ బఖరహ్‌, 2:190-192)

ఈ ఆయతులలో ఇస్లామీ జిహాద్‌ కేవలం ఇస్లామ్‌ శత్రువులను ఎదుర్కొనడానికే తప్ప కల్లోలాలు, ఉపద్రవాలు సృష్టించడానికి కాదు,  అని స్పష్టం చేయబడింది. మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ ‘అల్‌ హర్‌బ్‌  ఫిల్‌ ఖుర్‌ఆన్‌’లో  పేర్కొన్న దాన్ని చదవండి.

అల్జిహాద్

అందువల్లే ఇస్లామ్‌ యుద్ధం, విప్లవం మొదలైన వాటి పదాలను వదలి కేవలం జిహాద్‌ అనే సామాన్య పదాన్ని ఉపయోగించింది. ఇందులో ఎటువంటి ఆగ్రహావేశాలు, దోపిడీలు, భయం బహిర్గతం అయ్యేవి కావు. ఇది ఒక ఉత్తమ ప్రయత్నం, సంకల్పాన్ని సూచించేది. దీన్ని దైవభీతిద్వారా, నోటిద్వారా, ఆచారణల ద్వారా, కరవాలం ద్వారా దీన్ని బహిర్గతం చేయడం జరిగేది. ఎందుకంటే మానవునికి కేవలం అతని శ్రమకు తగిన ఫలితమే లభిస్తుంది. ఖుర్‌ఆన్‌ యుద్ధ సందర్భా లన్నిటిలో దీన్ని ఉపయోగించింది. దీన్ని కేవలం యుద్ధంగా కాకుండా అనేక అర్థాలు అంటే ఆత్మ పరిశీలన, మౌనం, ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఖుర్ఆన్:

 ”కాని, ప్రవక్త మరియు అతనితో పాటు విశ్వసించిన వారు తమ సిరిసంపదలతో మరియు తమ ప్రాణాలతో (అల్లాహ్‌ మార్గంలో) పోరాడారు. మరియు అలాంటి వారికి అన్ని మేళ్ళూ ఉన్నాయి. మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు.

 అల్లాహ్ వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు సిధ్ధంచేసి ఉంచాడు, వారందులో శాశ్వతంగా ఉంటారు. అదే గొప్ప విజయం.” (అత్తౌబహ్, 9:88-89)

ఈ ఆయతులో ఏ జిహాద్‌ను గురించైతే పేర్కొనడం జరిగిందో దాన్ని ప్రవక్త (స) అన్నిటికంటే గొప్ప ‘హదీసై’న ‘హదీసె’ జిబ్రీల్‌లో స్పష్టంగా వివరించారు. అంటే, అల్లాహ్ (త)ను మనం చూస్తున్నట్టు ఆరాధించాలి. అలా సాధ్యం కాకపోతే కనీసం ఆయన మమ్మల్ని చూస్తున్నాడు అన్నట్లు భావించాలి. చూ. ఖుర్ఆన్:  ”ఇక నిశ్చయంగా నీ ప్రభువు! వారి కొరకు ఎవరైతే మొదట పరీక్షకు గురిచేయబడి, పిదప (తమ ఇల్లూ వాకిలి విడిచి) వలసపోయి, తరువాత ధర్మపోరాటంలో పాల్గొంటారో మరియు సహనం వహిస్తారో! దాని తరువాత నిశ్చయంగా అలాంటి వారి కొరకు నీ ప్రభువు! ఎంతో క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. దినమును (జ్ఞాపకముంచుకోండి), ఎప్పుడైతే ప్రతిప్రాణి కేవలం తన స్వంతం కొరకే బ్రతి మాలుకుంటుందో! ప్రతి ప్రాణికి దాని కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.” (అన్న’హ్ల్‌, 16:110-111)

”నిశ్చయంగా, అల్లాహ్‌! తన మార్గంలో దృఢమైన కట్టడం వలే బారులుతీరి పోరాడేవారిని ప్రేమిస్తాడు.” (అ’స్సఫ్‌, 61:4)

ఈ మూడు ఆయతుల ద్వారా ఇస్లామీ జిహాద్‌ వాస్తవం కేవలం సహనం, స్థిరత్వం, పట్టుదల, ఇతరుల పట్ల ప్రాముఖ్యం మొదలైన వాటిలోనే ఇమిడి ఉంది. యుద్ధ ధనం, ఆగ్రహం, ఆవేశం, ప్రతీకారం దీని పరిధిలోనికి రావు. ఇవన్నీ తాత్కాలికమైనవే. అసలు ఉద్దేశ్యం చాలా గొప్పది, శ్రేష్ఠ మైనది. ఇస్లామ్‌ ప్రారంభంలో యుద్ధ ధనంపై ఆసక్తి చూపే వారిని హెచ్చరించటం జరిగింది.

బద్ర్‌ యుద్ధంనాడు యుద్ధధనాన్ని సమకూర్చ టంలో నిమగ్నమయి పోయారు. అప్పటికి ఇంకా అది ధర్మసమ్మతం కాలేదు. ఒకవేళ అల్లాహ్‌ మీ పట్ల ఒక నిర్ణయం తీసుకోకుండా ఉంటే మీపై అల్లాహ్ (త) శిక్ష అవతరించి ఉండేది.

ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ఒక ఇస్లామీయ జిహాద్‌ ఉద్దేశ్యం దోపిడీయే అయితే శత్రువులైన ఖురైష్‌ నాయకులను దోచుకొని ఉండేవారు. అటువంటి మంచి అవకాశం వచ్చింది. ఆ తరువాత యుద్ధ ధనం ధర్మసమ్మతం చేయబడింది. దీనివల్ల జిహాద్‌ పుణ్యంలో, సంకల్పాల్లో, చిత్తశుద్ధిలో లోపం వచ్చి ఉండేది.

అల్లాహ్ మార్గంలో పోరాడి యుద్ధ ధనం పొందే సైన్యం దాని పరలోక పుణ్యానికి చెందిన మూడులో రెండు వంతులు వెంటనే పొందుతుంది. ఇంకా ఒక వంతు మిగిలి ఉంటుంది. ఆ తరువాత వారు దోపిడి చేయకపోతే ఈ వంతు కూడా వారికి లభిస్తుంది. స్వయంగా ప్రవక్త (స)ను హెచ్చరించటం జరిగింది. అంటే నీకు ఆ విషయంలో ఎటువంటి హక్కులేదు. అల్లాహ్‌ (త) వారిని శిక్షించగలడు లేదా క్షమించగలడు. ఎందుకంటే వారు దుర్మార్గులు.

ఇక జిహాద్‌ గురించి పేర్కొన్న ‘హదీసు’లను చదువుదాం.

——–

اَلْفَصْلُ الْأَوَّلُ     మొదటి విభాగం

3787- [ 1 ] ( صحيح ) (2/1117)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ آمَنَ بِاللهِ وَرَسُوْلِهِ وَأَقَامَ الصَّلاةَ وَصَامَ رَمَضَانَ كَانَ حَقًّا عَلَى اللهِ أَنْ يُدْخِلَهُ الْجَنَّةَ جَاهَدَ فِيْ سَبِيْلِ اللهِ أَوْ جَلَسَ فِيْ أَرْضِهِ الَّتِي وُلِدَ فِيْهَا”. قَالُوْا: أَفَلَا نُبَشِّرُالنَّاسُ؟ قَالَ: “إِنَّ فِي الْجَنَّةِ مِائَةَ دَرَجَةٍ أَعَدَّهَا اللهُ لِلْمُجَاهِدِيْنَ فِيْ سَبِيْلِ اللهِ مَا بَيْنَ الدَّرَجَتَيْنِ كَمَا بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ. فَإِذَا سَأَلْتُمُ اللهَ فَاسْأَلُوْهُ الْفِرْدَوْسَ فَإِنَّهُ أَوْسَطُ الْجَنَّةِ وَأَعْلَى الْجَنَّةِ .وَفَوْقَهُ عَرْشُ الرَّحْمنِ وَمِنْهُ تَفَجَّرُ أَنْهَارُ الْجَنَّةِ”. رَوَاهُ الْبُخَارِيُّ .

3787. (1) [2/1117 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘అల్లాహ్‌(త)ను, ఆయన ప్రవక్తనూ విశ్వసించిన వాని, నమా’జ్‌ పాటించే వారిని, రమ’దాన్‌ ఉపవాసాలు పాటించేవారిని అల్లాహ్‌(త) తప్పకుండా స్వర్గంలోనికి ప్రవేశింపజేస్తాడు వారు జిహాద్‌ చేసినా లేదా ఇంట్లో కూర్చున్నా సరే’ అని ప్రవచించారు. దానికి అక్కడున్న వారు, ‘మరి మేము ప్రజలకు ఈ శుభవార్త అందజేస్తాం,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) స్వర్గంలో ఇటువంటి 100 తరగతులు ఉన్నాయి. వీటిని అల్లాహ్‌ (త) ముజాహిదీన్ల కొరకు తయారుచేసి ఉంచాడు. ప్రతి రెండు తరగతుల మధ్య భూమ్యాకాశాలంత దూరం ఉంటుంది. మీరు అల్లాహ్‌(త)ను స్వర్గం అర్థిస్తే జన్నతుల్‌ ఫిర్‌దౌస్‌ను అర్థించండి. ఎందుకంటే జన్నతుల్‌ ఫిర్‌దౌస్‌ స్వర్గంలో అన్నిటికంటే శ్రేష్ఠమైనది. దానిపై అల్లాహ్ (త) సింహాసనం ఉంది. అక్కడి నుండే స్వర్గకాలువలు ప్రవహిస్తాయి అని అన్నారు.[1]  (బు’ఖారీ)

3788 – [ 2 ] ( متفق عليه ) (2/1117)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَثَلُ الْمُجَاهِدِ فِيْ سَبِيْلِ اللهِ كَمَثَلِ الصَّائِمِ الْقَائِمِ الْقَانِتِ بِآيَاتِ اللهِ لَا يَفْتُرُ مِنْ صِيَامٍ وَلَا صَلَاةٍ حَتَّى يَرْجِعُ الْمُجَاهِدُ فِيْ سَبِيْلِ اللهِ”.

3788. (2) [2/1117 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ (త) మార్గంలో జిహాద్‌ చేసేవాడు ఎల్లప్పుడూ రో’జా పాటించేవారితో, ఎల్లప్పుడూ ఆరాధించేవారితో, ఎల్లప్పుడూ ఖుర్‌ఆన్‌ పఠిస్తూ ఉండేవారితో సమానం. అంటే అతడు ఉపవాసం పాటించడం, నమా’జు చదవడం, జిహాద్‌ దినాలలో మానకుండా పాటించినట్లు. ఇది వారు తిరిగి వచ్చేవరకు లెక్కించబడుతుంది.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

3789 – [ 3 ] ( متفق عليه ) (2/1117)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِنْتَدَبَ اللهُ لِمَنْ خَرَجَ فِيْ سَبِيْلِهِ لَا يُخْرِجُهُ إِلَّا إِيْمَانٌ بِيْ وَتَصْدِيْقٌ بِرُسُلِيْ أَنْ أَرْجِعَهُ بِمَا نَالَ مِنْ أَجْرٍ وَغَنِيْمَةٍ أَوْ أُدْخِلُهُ الْجَنَّةَ”.

3789. (3) [2/1117 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”అల్లాహ్‌ (త) అల్లాహ్‌ మార్గంలోని ముజాహిద్‌ కోసం బాధ్యుడయిపోతాడు. అతనికి ప్రతిఫలం, యుద్ధధనం ఇచ్చి పంపాలి, లేదా విచారించకుండా స్వర్గంలోనికి పంపాలి. అయితే ఆ వ్యక్తి అల్లాహ్‌(త) మరియు ప్రవక్తను విశ్వసించి, ఆయన్ను ధృవీకరించి అంటే అల్లాహ్‌(త) ప్రీతికోసం ఇంటి నుండి బయలుదేరి ఉండాలి, మనోకాంక్షల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా ఉండాలి. అంటే ముజాహిద్‌ చిత్తశుద్ధితో జిహాద్‌ చేస్తే ప్రతిఫలం, యుద్ధధనం తీసుకొని సురక్షితంగా తిరిగి వస్తాడు. లేదా వీరమరణం పొంది స్వర్గంలో ప్రవేశిస్తాడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3790 – [ 4 ] ( متفق عليه ) (2/1117)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَوْلَا أَنَّ رِجَالًا مِّنَ الْمُسْلِمِيْنَ لَا تَطِيْبُ أَنْفُسَهُمْ أَنْ يَّتَخَلَّفُوْا عَنِّيْ وَلَا أَجِدُ مَا أَحْمِلُهُمْ عَلَيْهِ مَا تَخَلَّفْتُ عَنْ سَرِيِّةٍ تَغْزُوْ فِيْ سَبِيْلِ اللهِ. وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَوْدِدْتُ أَنْ أُقْتَلَ فِيْ سَبِيْلِ اللهِ ثُمَّ أُحْيَى ثُمَّ أُقْتَلُ ثُمَّ أُحْيَى ثُمَّ أُقْتَلُ ثُمَّ أُحْيَى ثُمَّ أُقْتَلُ”.

3790. (4) [2/1117ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరి చేతుల్లో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! నేను విశ్వాసులను విడిచి పోతానన్న భయం లేకుంటే, అందరినీ తీసుకువెళ్ళే వాహనాలు గనుక ఉంటే నేను సైన్యాలతో బయలుదేరి అల్లాహ్‌ మార్గంలో జిహాద్‌ చేస్తాను. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ దైవం సాక్షి! నా కోరిక ఏమిటంటే నేను అల్లాహ్‌ (త) మార్గంలో చంపబడాలి. మళ్ళీ సజీవపర్చబడాలి. మళ్ళీ చంపబడాలి, మళ్ళీ సజీవపర్చబడాలి. మళ్ళీ చంపబడాలి, మళ్ళీ సజీవపర్చబడాలి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

3791 – [ 5 ] ( متفق عليه ) (2/1118)

وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “رِبَاطُ يَوْمٍ فِيْ سَبِيْلِ اللهِ خَيْرٌ مِّنَ الدُّنْيَا وَمَا عَلَيْهَا”.

3791. (5) [2/1118 ఏకీభవితం]

సహల్‌ బిన్‌ స’అద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ (త) మార్గంలో ఒక్కరోజు కాపలా కాయడం ప్రపంచం, ప్రపంచంలోని వస్తువులన్నింటి కంటే ఉత్తమం.”   [2]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

3792 – [ 6 ] ( متفق عليه ) (2/1118)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَغَدْوَةٌ فِيْ سَبِيْلِ اللهِ أَوْ رَوْحَةٌ خَيْرٌ مِّنَ الدُّنْيَا وَمَا فِيْهَا”.

3792. (6) [2/1118 -ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ (త) మార్గంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కాపలా కాయడం, నడవటం ప్రపంచంలోని వస్తువులన్నిటి కంటే  శ్రేష్ఠం.” (బు’ఖారీ,  ముస్లిమ్‌)

3793 – [ 7 ] ( صحيح ) (2/1118)

وَعَنْ سَلْمَانَ الْفَارِسِيِّ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “رِبَاطُ يَوْمٍ وَلَيْلَةٍ فِيْ سَبِيْلِ اللهِ خَيْرٌ مِّنْ صِيَامٍ شَهْرٍ وَقِيَامِهِ وَإِنْ مَاتَ جَرَى عَلَيْهِ عَمَلُهُ الَّذِيْ كَانَ يَعْمَلُهُ وَأُجْرِيَ عَلَيْهِ رِزْقُهُ وَأَمِنَ الْفتَّانَ”. رَوَاهُ مُسْلِمٌ.

3793. (7) [2/1118దృఢం]

సల్మాన్‌ ఫారసీ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”అల్లాహ్‌(త) మార్గంలో ఒక పగలు, ఒక రాత్రి కాపలా కాయడం, నెల రోజుల ఉపవాసాల కన్నా, జాగరణ, తహజ్జుద్‌ కన్నా శ్రేష్ఠమైనది. ఒకవేళ అతడు అదేస్థితిలో చనిపోతే, తీర్పుదినం వరకు అతని ఆచరణకు పుణ్యం లభిస్తూ ఉంటుంది. స్వర్గం నుండి అతనికి ఉపాధి లభిస్తూ ఉంటుంది. ఇంకా పరీక్షకు గురిచేసే అంటే శిక్షించే దైవదూతలు, షైతాన్‌, దజ్జాల్‌ ల నుండి సురక్షితంగా ఉంటాడు. (ముస్లిమ్‌)

3794 – [ 8 ] ( صحيح ) (2/1118)

وَعَنْ أَبِيْ عَبْسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا اغْبَرَّتْ قَدَمَا عَبْدٍ فِيْ سَبِيْلِ اللهِ فَتَمَسَّهُ النَّارُ”. رَوَاهُ الْبُخَارِيُّ.

3794. (8) [2/1118 దృఢం]

అబూ అబ్ స (ర) కథనం: ”ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్‌ (త) మార్గంలో దుమ్ము ధూళికి గురైన కాళ్ళను నరకాగ్ని ముట్టుకోలేదు. అంటే ఆ వ్యక్తి నరకంలో ప్రవేశించడు.”  (బు’ఖారీ)

3795 – [ 9 ] ( صحيح ) (2/1118)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا يَجْتَمِعُ كَافِرٌ وَقَاتِلُهُ فِي النَّارِ أَبَدًا”. رَوَاهُ مُسْلِمٌ.

3795. (9) [2/1118దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అవిశ్వాసి, అవిశ్వాసిని చంపేవాడు ఇద్దరూ సరిసమానంగా నరకంలో ఉండలేరు. అంటే జిహాద్‌లో అవిశ్వాసిని చంపిన ముస్లిమ్‌ నరకంలో ప్రవేశించడు.” (ముస్లిమ్‌)

3796 – [ 10 ] ( صحيح ) (2/1118)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مِنْ خَيْرِ معَاشِ النَّاسِ لَهُمْ رَجُلٌ مُمْسِكٌ عِنَانَ فَرَسِهِ فِيْ سَبِيْلِ اللهِ يَطِيْرُ عَلَى مَتْنِهِ كُلَّمَا سَمِعَ هَيْعَةً أَوْ فَزْعَةً طَارَعَلَيْهِ يَبْتَغِي الْقَتْلَ وَالْمَوْتَ مَظَانَّهُ. أَوْ رَجُلٌ فِيْ غُنَيْمَةٍ فِيْ رَأْسٍ شَعَفَةٍ من هَذِهِ الشَّعَفِ أَوْ بَطْنِ وَادٍ مِّنْ هَذِهِ الْأَوْدِيَةِ يُقِيْمُ الصَّلَاةَ وَيُؤْتِي الزَّكَاةَ وَيَعْبُدُ الله حَتَّى يَأْتِيَهُ الْيَقِيْنُ لَيْسَ مِنَ النَّاسِ إِلَّا فِيْ خَيْرٍ”. رَوَاهُ مُسْلِمٌ .

3796. (10) [2/1118దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అందరికంటే ఉత్తమ జీవితం ఇటువంటి ముజాహిద్‌ ది.” అతడు దైవమార్గంలో తన గుర్రంపై కళ్ళెం పట్టుకొని కూర్చుని ఉంటాడు. ఎప్పుడైనా ఎవరైనా సహాయం కోరితే వెంటనే వెళ్ళి అతనికి సహాయం చేస్తాడు. వీరమరణం లేదా మరణాన్ని కోరుకుంటాడు. అంటే జిహాద్ఫీ సబీ లిల్లాహ్‌’ కోసం వెళ్ళిపోతాడు. వీర మరణం పొందటానికి మరణాన్ని వెదుకుతాడు. ఎందు కంటే అతని ఆలోచన ఇలాగే ఉంది. ఈ ఉద్దేశంతోనే అతడు చేరాడు. అతని తరువాత మరో వ్యక్తి జీవితం ఉత్తమమైనది. అతడు కొండ శిఖరంపై లేదా అడవిలో ఉంటూ నమా’జు చుదువుతాడు, ‘జకాత్‌ చెల్లిస్తాడు, ఇంకా తన ప్రభువును ఆరాధిస్తాడు. చివరికి అతనికి చావు వస్తుంది. ఈ వ్యక్తి ప్రజలకు దూరంగా ఉంటూ ఉత్తమ జీవితం గడుపుతాడు. [3]  (ముస్లిమ్‌)

3797 – [ 11 ] (متفق عليه) (2/1119)

وَعَنْ زَيْدِ بْنِ خَالِدٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ جَهَّزَغَازِيًا فِيْ سَبِيْلِ اللهِ فَقَدَ غَزَا. وَمَنْ خَلَفَ غَازِيًا فِيْ أَهْلِهِ فَقَدْ غَزًا”.

3797. (11) [2/1119ఏకీభవితం]

‘జైద్‌ బిన్‌ ‘ఖాలిద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా ముజాహిద్‌కి జిహాద్‌ పరికరాలు సమకూర్చితే అతడు జిహాద్‌ చేసినట్లే. అదేవిధంగా ఎవరైనా ముజాహిద్‌ భార్యాబిడ్డలను పరిరక్షిస్తే వారు కూడా జిహాద్‌ చేసినట్టే. అంటే ఈ రెండు పుణ్య కార్యాలకు జిహాద్‌ పుణ్యం సమానంగా లభిస్తుంది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3798 – [ 12 ] ( صحيح ) (2/1119)

وَعَنْ بُرَيْدَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “حُرْمَةُ نِسَاءِ الْمُجَاهِدِيْنَ عَلَى الْقَاعِدِيْنَ كَحُرْمَةِ أُمَّهَاتِهِمْ وَمَا مِنْ رَجُلٍ مِّنَ الْقَاعِدِيْنَ يَخْلُفُ رَجُلًا مِّنَ الْمُجَاهِدِيْنَ فِيْ أَهْلِهِ فَيَخُوْنَهُ فِيْهِمْ إِلَّا وُقِفَ لَهُ يَوْمَ الْقِيَامَةِ فَيَأْخُذُ مِنْ عَمَلِهِ مَا شَاءَ فَمَا ظَنُّكُمْ؟” رَوَاهُ مُسْلِمٌ .

3798. (12) [2/1119 దృఢం]

బురైదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముజాహిదీన్ల స్త్రీలను జిహాద్‌లో వెళ్లని వారిపై నిషేధించడం జరిగింది. వారి తల్లులు, కొడుకుల్లా నిషేధం. జిహాద్‌లో వెళ్ళకుండా ముజాహిదీన్ల స్త్రీల వైపు చెడుదృష్టితో చూసినవాడిని, తీర్పుదినం నాడు దైవం ముందు నిలబెట్టటం జరుగుతుంది. ”ముజాహిద్ తో, ఇతడు నీ భార్యాపిల్లల పట్ల ద్రోహం చేసినందుకు నీకు ఇష్టం వచ్చినన్ని ఇతని పుణ్యాలు తీసుకో’ అని అనుమతించడం జరుగుతుంది. అతను వదులు తాడని అనుకుంటున్నారా? అంటే పుణ్యాలన్నింటినీ  తీసుకుంటాడు.” (ముస్లిమ్‌)

3799 – [ 13 ] ( صحيح ) (2/1119)

وَعَنْ أَبِيْ مَسْعُوْدِ الْأَنْصَارِيِّ قَالَ: جَاءَ رَجُلٌ بِنَاقَةٍ مَخْطُوْمَةٍ فقَالَ: هَذِهِ فِيْ سَبِيْلِ اللهِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَكَ بِهَا يَوْمَ الْقِيَامَةِ سَبْعُ مِائَةِ نَاقَةٍ كُلُّهَا مَخْطُوْمَةٌ”. رَوَاهُ مُسْلِمٌ.

3799. (13) [2/1119 దృఢం]

అబూ మస్‌’ఊద్‌ అ’న్సారీ (ర) కథనం: ఒక వ్యక్తి నాళ్ళు ఉన్న ఒంటెను ప్రవక్త (స) వద్దకు తీసుకొని వచ్చి ‘దీన్ని అల్లాహ్‌(త) మార్గంలో దానం చేస్తున్నాను,’ అని అన్నాడు. అది విని ప్రవక్త (స) దీనికి బదులుగా నీకు తీర్పుదినం నాడు 700 నాళ్ళు ఉన్న ఒంటె లభిస్తుంది అన్నారు. (ముస్లిమ్‌)

3800 – [ 14 ] ( صحيح ) (2/1119)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم بَعَثَ بَعْثًا إِلَى بَنِي لِحْيَانَ مِنْ هُذَيْلٍ فَقَالَ: “لِيَنْبَعِثْ مِنْ كُلِّ رَجُلَيْنِ أَحَدُهُمَا وَالْأَجْرُ بَيْنَهُمَا”. روَاهُ مُسْلِمٌ.

3800. (14) [2/1119 దృఢం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) హుజైల్ వర్గానికి చెందిన బనీ లుహ్యాన్ తెగ వద్దకు ముజాహిదీన్ల ఒక సైన్యాన్ని పంపాలని సంకల్పించి నట్లు చెప్పారు. ఇద్దరు ఉన్న ఇంట్లో నుండి ఒకరు సైన్యంలో చేరాలని, ఒక వ్యక్తి ఇంట్లోనే ఉండాలని జిహాద్‌ పుణ్యం ఇద్దరికీ సమానంగా లభిస్తుందని అన్నారు. (ముస్లిమ్‌)

3801 – [ 15 ] ( صحيح ) (2/1119)

وَعَنْ جَابِرِبْنِ سَمُرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَنْ يَّبْرَحَ هَذَا الدَّيْنُ قَائِمًا يُقَاتِلُ عَلَيْهِ عِصَابَةٌ مِنَ الْمُسْلِمِيْنَ حَتّى تَقُوْمُ السَّاعَةُ “. رَوَاهُ مُسْلِمٌ .

3801. (15) [2/1119దృఢం]

జాబిర్‌ బిన్‌ సమురహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ఈ ఇస్లామ్‌ ధర్మం ఎల్లప్పుడూ వర్ధిల్లుతూ ఉంటుంది. ముస్లిముల వర్గాలు ఎక్కడో ఒకచోట జిహాద్‌ చేస్తూ ఉంటాయి. చివరికి ప్రళయం రానే వస్తుంది.” [4] (ముస్లిమ్‌)

3802 – [ 16 ] ( متفق عليه ) (2/1119)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يُكلَمُ أَحَدٌ فِيْ سَبِيْلِ اللهِ وَاللهِ أَعْلَمُ بِمَنْ يُكلَمُ فِي سَبِيْلِهِ إِلَّا جَاءَ يَوْمَ الْقِيَامَةِ وَجُرْحُهُ يَثْعَبُ دَمًا اللَّوْنَ لَوْنُ الدَّمِ وَالرِّيْحُ رِيْحُ الْمِسْكِ”.

3802. (16) [2/1119ఏకీభవితం]  

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జిహాద్‌లో గాయపడిన వ్యక్తి అయితే అల్లాహ్‌ మార్గంలో ఎవరు గాయపడతారు అల్లాహ్‌కు బాగా తెలుసు. తీర్పుదినం నాడు ఆ గాయపడిన ముజాహిద్‌ ఎటువంటి స్థితిలో వస్తా డంటే, అతని శరీరం నుండి రక్తం కారుతూ ఉంటుంది. దాని రంగు కూడా రక్తంలాగే ఉంటుంది. కాని అందులో కస్తూరి సువాసన ఉంటుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)

3803 – [ 17 ] ( متفق عليه ) (2/1120)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ أَحَدٍ يَدْخُلُ الْجَنَّةَ يُحِبُّ أَنْ يَّرْجِعَ إِلَى الدُّنْيَا وَلَهُ مَا فِي الْأَرْضِ مِنْ شَيْءٍ إِلَّا الشَّهِيْدُ يَتَمَنّى أَنْ يَّرْجِعَ إِلَى الدُّنْيَا فَيُقْتَلَ عَشَرَ مَرَّاتٍ لِمَا يَرَى مِنَ الْكَرَامَةِ”.

3803. (17) [2/1120ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలోనికి ప్రవేశించిన తర్వాత ఎవరూ మళ్ళీ ప్రపంచంలోనికి రావడానికి ఇష్టపడరు, వారికి లెక్కలేనన్ని ధన సంపదలు లభించినా సరే. కాని అమరవీరుడు మాత్రం మళ్ళీ ప్రపంచంలోనికి రావాలని కోరుకుంటాడు, పదిసార్లు వీరమరణం పొంది, దాని ప్రతిఫలాన్ని పొందాలని కోరుకుంటాడు. ఎందుకంటే అతడు షహాదహ్‌ వీరమరణం ప్రత్యేకతను చూచి ఉంటాడు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

3804 – [ 18 ] ( صحيح ) (2/1120)

وَعَنْ مَسْرُوْقٍ قَالَ: سَأَلْنَا عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ عَنْ هَذِهِ الْآيَةِ: (وَلَا تَحْسَبَنَّ الَّذِيْنَ قُتِلُوْا فِيْ سَبِيْلِ اللهِ أَمْوَاتًا بَلْ أَحْيَاءٌ عِنْدَ رَبِّهِمْ يُرْزَقُوْنَ. 3:169 ) الآية قَالَ: إِنَّا قَدْ سَأَلْنَا عَنْ ذَلِكَ فَقَالَ: “أَرْوَاحُهُمْ فِيْ أَجْوَافِ طَيْرٍ خُضْرٍلَهَا قَنَادِيْلُ مُعَلَّقَةٌ بِالْعَرْشِ تَسْرَحُ مِنَ الْجَنَّةِ حَيْثُ شَاءَتْ ثُمَّ تَأوِيْ إِلَى تِلْكَ الْقَنَادِيْلِ فَاطَّلَعَ إِلَيْهِمْ رَبُّهُمْ اطِّلَاعَةً فَقَالَ: هَلْ تَشْتَهُوْنَ شَيْئًا؟ قَالُوْا: أَيْ شَيْءٍ نَشْتَهِيْ وَنَحْنُ نَسْرَحُ مِنَ الْجَنَّةِ حَيْثُ شِئْنَا فَفَعلَ ذَلِكَ بِهِمْ ثَلَاثَ مَرَّاتٍ فَلَمَّا رَأَوْا أَنَّهُمْ لَنْ يُّتْرَكُوْا مِنْ أَنْ يَّسْأَلُوْا قَالُوْا: يَا رَبِّ نُرِيْدُ أَنْ تَرُدَّ أَرْوَاحَنَا فِيْ أَجْسَادِنَا حَتّى نُقْتَلَ فِيْ سَبِيْلِكَ مَرَّةً أُخْرَى فَلَمَّا رَأَى أَنْ لَيْسَ لَهُمْ حَاجَةٌ تَرَكُوْا”. رَوَاهُ مُسْلِمٌ .

3804. (18) [2/1120దృఢం]

మస్‌రూఖ్‌ (ర) కథనం: మేము ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర)ను ఈ ఆయతు వివరణ గురించి అడిగాము.

” మరియు అల్లాహ్‌ మార్గంలో చంపబడిన వారిని మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులై, తమ ప్రభువువద్ద జీవనోపాధి పొందు తున్నారు. అల్లాహ్‌ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానితో (ప్రాణత్యాగంతో) వారు సంతోషంతో ఉప్పొంగిపోతారు. మరియు వారిని కలువక, వెనుక (బ్రతికి) ఉన్న వారి కొరకు (ఇవ్వబడిన శుభవార్తతో) వారు సంతోష పడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియువారు దుఃఖపడరు కూడా! వారు అల్లాహ్‌ అనుగ్రహానికి, దాతృత్వానికి సంతోషపడుతూ ఉంటారు. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ విశ్వాసుల ప్రతిఫలాన్ని వ్యర్థం కానివ్వడు.” (అల్‌ మాయి’దహ్‌, 3:169-171)

దానికి అబ్దుల్లాహ్‌(ర) కథనం:”ప్రవక్త (స) ను మేము ఈ ఆయతును గురించి అడిగాము. దానికి ప్రవక్త (స) ‘వారి ఆత్మలు పచ్చని పక్షుల గూళ్ళలో స్వర్గంలోని దీపాలలో వ్రేలాడుతున్నాయి. వారి ప్రభువు వారివైపు తిరిగి, ‘ఏమైనా కావాలా’ అని అడిగాడు. దానికి వారు ‘ప్రభూ! స్వర్గమంతా తిరిగి ఏం కావాలన్నా తిరిగి తింటున్నాం. మరి ఇంకేమి కావాలి మాకు?’ ఇలా మూడుసార్లు ప్రశ్నించడం జరుగుతుంది. వారు అడగటం తప్పనిసరి అని భావించి, ‘మా ఆ త్మలను మా శరీరాల్లోకి పంపు, మేము మళ్ళీ పోరాడి మళ్ళీ వీర స్వర్గం అలంకరిస్తాం,’ అని అంటారు. దానికి అల్లాహ్‌ మౌనం వహిస్తాడు. సామాన్యంగా ప్రజలు మరణించి స్వర్గం లోనికి వెళ్ళి మళ్ళీ దాన్నుండి బయటకు రాకూడదని భావిస్తారు. కాని అమర వీరులు మళ్ళీవచ్చి మళ్ళీ వీరమరణం పొందాలని కోరుకుంటారు. ఎందుకంటే దాని ఔన్నత్యాన్ని వారు చూసి ఉన్నారు అని ప్రవచించారు.” (ముస్లిమ్‌)

3805 – [ 19 ] ( صحيح ) (2/1120)

عَنْ أَبِيْ قَتَادَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَامَ فِيْهِمْ فَذَكَرَ لَهُمْ أَنَّ الْجِهَادَ فِيْ سَبِيْلِ اللهِ وَالْإِيْمَانِ بِاللهِ أَفْضَلُ الْأَعْمَالش فَقَامَ رَجُلٌ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ أَرَأَيْتَ إِنْ قُتِلْتُ فِيْ سَبِيْلِ اللهِ يُكَفِّرُ عَنِّي خَطَايَايَ؟ فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “نَعَمْ إِنْ قُتِلْتَ فِيْ سَبِيْلِ اللهِ وَأَنْتَ صَابِرٌمُحْتَسِبٌ مُقْبِلٌ غَيْرُ مُدْبِرٍ”. ثُمَّ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كَيْفَ قُلْتَ؟” فَقَالَ: أَرَأَيْتَ إِنْ قُتِلْتُ فِيْ سَبِيْلِ اللهِ أَيُكَفَّرُ عَنِّيْ خَطَايَايَ؟ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “نَعَمْ وَأَنَتَ صَابِرٌ مُّحْتَسِبٌ مُقْبِلٌ غَيْرُ مُدْبِرٍإِلَّا الدَّيْنَ فَإِنَّ جِبْرِيْلَ قَالَ لِيْ ذَلِكَ”. رَوَاهُ مُسْلِمٌ.

3805. (19) [2/1120 దృఢం]

అబూ ఖతాదహ్ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరుల ముందు నిలబడిప్రసంగించారు. ఆ ప్రసంగంలో, ‘అల్లాహ్‌ (త) మార్గంలో జిహాద్‌ చేయడం, అల్లాహ్‌(త)ను విశ్వసించడం అన్నిటి కంటే ఉత్తమమైన కార్యాలు’ అని అన్నారు. ఒక వ్యక్తి నిలబడి, ‘ఓ ప్రవక్తా! ఒకవేళ నేను అల్లాహ్‌ మార్గంలో వీరమరణం పొందితే నా పాపాలన్నీ క్షమించ బడతాయా?’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స), ‘అవును, ఒకవేళ నువ్వు అల్లాహ్‌మార్గంలో చంప బడితే. అయితే అప్పుడు నీవు సహనం పాటిస్తూ పుణ్యంగా భావిస్తూ శత్రువుతో తలపడాలి, వీపు చూపించకూడదు,’ అని పలికి, ఆ తరువాత ప్రవక్త (స) ఆ వ్యక్తి తో, ‘నువ్వు ఏమని అన్నావు,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘ఒకవేళ నేను అల్లాహ్‌(త) మార్గంలో చంపబడితే, నా పాపా లన్నీ క్షమించ బడతాయా, అని అన్నాను,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘అవును, అయితే నువ్వు సహనం పాటించాలి. పుణ్యంగా భావించి శత్రువుతో తలపడాలి. వెనకడుగు వేయరాదు. కాని అప్పు మాత్రం క్షమించబడదు. జిబ్రీల్‌ (అ) ఇప్పు డిప్పుడే నాతో ఇలా అన్నారు,’ అని అన్నారు. (ముస్లిమ్‌)

అంటే దేవుని హక్కులు క్షమించబడతాయి. కాని దాసుల హక్కులు క్షమించబడవు.

3806 – [ 20 ] ( صحيح ) (2/1121)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِوبْنِ الْعَاصِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “الْقَتْلُ فِيْ سَبِيْلِ اللهِ يُكَفِّرُكُلّ شَيْءٍ إِلَّا الدَّيْنَ”. رَوَاهُ مُسْلِمٌ .

3806. (20) [2/1121దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ బిన్‌ ‘ఆ’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ మార్గంలో వీరమరణం పొందటం వల్ల అప్పు తప్ప మిగిలిన పాపాలన్నిటినీ క్షమించటం జరుగుతుంది.” (ముస్లిమ్‌)

3807 – [ 21 ] ( متفق عليه ) (2/1121)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “يَضْحَكُ اللهُ تَعَالى إِلَى رَجُلَيْنِ يَقْتُلُ أَحَدُهُمَا الْآخِرَ يَدْخُلَانِ الْجَنَّةَ: يُقَاتِلُ هَذَا فِيْ سَبِيْلِ اللهِ فَيُقْتَلُ ثُمَّ يَتُوْبُ اللهُ عَلَى الْقَاتِلِ فَيُسْتَشْهَدُ”.

3807. (21) [2/1121ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”యుద్ధంలో పరస్పరం చంపుకున్న ఇద్దరు వ్యక్తుల పట్ల అల్లాహ్ సంతోషం వ్యక్తం చేస్తాడు. అంటే చంపినవాడిని, చంపబడినవాడిని ఇద్దరినీ స్వర్గంలోనికి పంపివేస్తాడు. వారిలో ఒకరు దైవమార్గంలో అవిశ్వాసులతో యుద్ధం చేస్తూ అవిశ్వాసి ద్వారా చంపబడిన వ్యక్తి వీరరణం పొందుతాడు. ఆ తరువాత అవిశ్వాసికి ఇస్లామ్‌ స్వీకరించే భాగ్యం కలుగుతుంది. అతడు విశ్వాసిగా మారిపోతాడు. అప్పుడతడు జిహాద్‌ చేయడానికి వెళ్ళి చంపబడి, వీరమరణం పొంది, స్వర్గంలోనికి ప్రవేశిస్తాడు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

3808 – [ 22 ] ( صحيح ) (2/1121)

وَعَنْ سَهْلِ بْنِ حُنَيْفٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ سَأَلَ اللهُ الشَّهَادَةَ بِصِدْقٍ بَلَّغَهُ اللهُ مَنَازِلَ الشُّهَدَاءِ وَإِنْ مَاتَ عَلَى فِرَاشِهِ. رَوَاهُ مُسْلِمٌ .

3808. (22) [2/1121-దృఢం]

సహల్‌ బిన్‌ ‘హనీఫ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చిత్తశుద్ధితో వీరమరణం కోరేవారిని అల్లాహ్‌ (త) అమరవీరుల స్థానానికి చేర్చివేస్తాడు. అతడు తన పడకపై  మరణించినా  సరే.”  (ముస్లిమ్‌)

3809 – [ 23 ] ( صحيح ) (2/1121)

وَعَنْ أَنَسٍ أَنَّ الرُبَيِّعَ بِنْتَ الْبَرَاءِ وَهِيَ أُمُّ حَارِثَةَ بْنِ سُرَاقَةَ أَتَتِ النَّبِيَّ صلى الله عليه وسلم فَقَالَتْ: يَا رَسُوْلَ اللهِ أَلَا تُحَدِّثُنِيْ عَنْ حَارِثَةَ وَ كَانَ قُتِلَ يَوْمَ بَدْرٍأَصَابَهُ سَهْمُ غَرْبٍ فَإِنْ كَانَ فِيْ الْجَنَّةِ صَبَرْتُ وَإِنْ كَانَ غَيْرَذَلِكَ اجْتَهَدْتُ عَلَيْهِ فِي الْبُكَاءِ فَقَالَ: “يَا أُمَّ حَارِثَةَ إِنَّهَا جِنَانٌ فِيْ الْجَنَّةِ وَإِنَّ ابْنَكِ أَصَابَ الْفِرْدَوْسَ الْأَعْلَى”. رَوَاهُ الْبُخَارِيُّ .

3809. (23) [2/1121దృఢం]

అనస్‌ (ర) కథనం: ‘హారిస’హ్ బిన్‌తె సురాఖహ్ తల్లియైన రబీ’అ బిన్‌తె బరాఅ’, ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ ప్రవక్తా! నా కొడుకు ‘హారిసహ్, గురించిన విషయాలు తెలియ పర్చండి. అతడు బద్ర్‌ యుద్ధంలో అకస్మాత్తుగా ఒక బాణం వచ్చి తగలటం వల్ల వీరమరణం పొందాడు. ఒకవేళ అతడు స్వర్గంలోనికి వెళ్ళి ఉంటే నేను సహనం పాటిస్తాను, ఒకవేళ దురదృష్టవల్ల అందులోకి వెళ్ళకపోతే మొరపెట్టు కుంటాను’ అని విన్నవించుకుంది. దానికి ప్రవక్త (స), ‘ఓ ‘హారిస’హ్ తల్లి! స్వర్గంలో అనేక తరగతులు ఉన్నాయి. అన్నిటికంటే ఉత్తమమైనది జన్నతుల్‌ ఫిర్‌దౌస్‌. నీ కొడుకు ‘హారిస’హ్ జన్నతుల్‌ ఫిర్‌దౌస్‌లోనికి చేరుకున్నాడు,’ అని అన్నారు. (బు’ఖారీ)

3810 – [ 24 ] ( صحيح ) (2/1121)

وَعَنْهُ قَالَ: اِنْطَلَقَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَأَصْحَابُهُ حَتّى سَبَقُوْا الْمُشْرِكِيْنَ إِلَى بَدْرٍ. وَجَاءَ الْمُشْرِكُوْنَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قُوْمُوْا إِلَى جَنَّةٍ عَرْضُهَا السَّمَاوَاتُ وَالْأَرْضُ”. قَالَ عُمَيْرُ بْنُ الْحُمَّامِ: بَخْ بَخْ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا يَحْمِلُكَ عَلَى قَوْلِكَ بَخْ بَخْ؟” قَالَ: لَا وَاللهِ يَا رَسُوْلَ اللهِ إِلَّا رِجَاءُ أَنْ أَكُوْنَ مِنْ أَهْلِهَا قَالَ: “فَإِنَّكَ مِنْ أَهْلِهَا”. قَالَ: فَأَخْرَجَ تَمراتٍ مِنْ قَرْنِهِ فَجَعَلَ يَأْكُلُ مِنْهُنَّ ثُمَّ قَالَ: لَئِنْ أَنَا حَيِيْتُ حَتَّى آكُلَ تَمَرَاتِيْ إِنَّهَا لَحَياةٌ طَوِيْلَةٌ قَالَ: فَرَمَى بِمَا كَانَ مَعَهُ مِنَ التَّمَرِ ثُمَّ قَاتَلَهُمْ حَتَّى قُتِلَ. رَوَاهُ مُسْلِمٌ.

3810. (24) [2/1121దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త(స), ఆయన అనుచరులు మదీనహ్ మునవ్వరహ్ నుండి బయలుదేరి అవిశ్వాసుల కంటే ముందు బద్‌ర్‌ ప్రాంతానికి చేరు కున్నారు. ఆ తరువాత అవిశ్వాసులు వచ్చారు. ప్రవక్త (స) తన అనుచరులను ఉద్దేశించి, ‘మీరు స్వర్గాన్ని పొందేందుకు సిద్ధంకండి. దాని వైశాల్యం భూమ్యాకాశాలంత ఉంది. పొడవు, వెడల్పుల విషయం ఏమాత్రం చెప్పనక్కర లేదు,’ అని అన్నారు. అది విని ఉమైర్‌ బిన్‌ హమ్మామ్‌, ‘ఎంత బాగుంది,’ అని అన్నాడు. అది విని ప్రవక్త(స) అతనితో, ‘నువ్వు ఎంత బాగుంది, అని ఎలా అన్నావు,’ అని ప్రశ్నించారు. దానికి అతడు, ‘ఓ ప్రవక్తా! నేను కూడా స్వర్గవాసిని అవ్వాలనే ఆశతో అన్నాను,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘నువ్వు స్వర్గలోనికి వెళ్ళేవారిలో ఉన్నావు,’ అని అన్నారు. ఆ తరువాత ‘ఉమైర్‌ తన పొదలో నుండి ఖర్జూరాలు తీసి తినటం ప్రారంభించారు. ‘వీటిని తింటూ, తింటూ జీవితం గడిచిపోతుంది,’ అని పలికి ఖర్జూరాలన్నిటినీ పారవేసి వెళ్ళి అవిశ్వాసులతో పోరాడుతూ వీరమరణం పొందాడు.” (ముస్లిమ్‌)

3811 – [ 25 ] ( صحيح ) (2/1122)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا تَعُدُّونَ الشَّهِيْدَ فِيْكُمْ؟” قَالُوْا: يَا رَسُوْلَ اللهِ مَنْ قُتِلَ فِيْ سَبِيْلِ اللهِ فَهُوَ شَهِيْدٌ. قَالَ: ” إِنَّ شُهَدَاءَ أُمَّتِيْ إِذَا لِقَلِيْلٌ: مَنْ قُتِلَ فِيْ سَبِيْلِ اللهِ فَهُوَ شَهِيْدٌ وَمَنْ مَاتَ فِيْ سَبِيْلِ اللهِ فَهُوَ شَهِيْدٌ وَمَنْ مَاتَ فِي الطَّاعُوْنِ فَهُوَ شَهِيْدٌ وَمَنْ مَاتَ فِي الْبَطَنِ فَهُوَ شَهِيْدٌ”. رَوَاهُ مُسْلِمٌ .

3811. (25) [2/1122దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స), ప్రజల నుద్దేశించి, ‘అమరవీరుడెవరో మీకు తెలుసా?’ అని అన్నారు. ప్రజలు, ‘అల్లాహ్‌(త) మార్గంలో చంపబడిన వ్యక్తి అమరవీరుడు ఓ ప్రవక్తా!’ అని అన్నారు. దానికి ప్రవక్త(స), ‘అప్పుడైతే నా అనుచర సమాజంలో చాలా తక్కువ అమర వీరులుంటారు. అందువల్ల దైవమార్గంలో చంపబడిన వారు అమర వీరులు, ప్లేగు వ్యాధి ద్వారా మరణించినవారు అమర వీరులు, కడుపు నొప్పి ద్వారా మరణించిన వారు అమర వీరులు, అంటే వీరందరూ అమర వీరులుగా పరిగణించబడతారు.’ (ముస్లిమ్‌) 

3812 – [ 26 ] ( صحيح ) (2/1122)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ غَازِيَةٍ أَوْ سَرِيَّةٍ تَغْزُوْ فَتَغْتَنَمَ وَتَسْلمَ إِلَّا كَانُوْا قَدْ تَعَجَّلُوْا ثلُثَيْ أُجُوْرِهِمْ وَمَا مِنْ غَازِيَةٍ أَوْ سَرِيَّةٍ تُخْفِقُ وَتُصَابُ إِلَّا تَمَّ أُجُوْرُهُمْ”. رَوَاهُ مُسْلِمٌ .

3812. (26) [2/1122దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జిహాద్‌ చేసే బృందం లేదా జిహాద్‌ చేసే వ్యక్తి జిహాద్‌లో పాల్గొని యుద్ధ ధనం పొంది, సురక్షితంగా తిరిగివస్తే వారికి 2/3వ వంతులు పుణ్యం ఇహలోకంలోనే లభించినట్లు. ఒకవేళ యుద్ధధనం పొందకుండా గాయాలతో తిరిగివస్తే వారికి పరిపూర్ణ పుణ్యం లభిస్తుంది.  (ముస్లిమ్‌)

3813 – [ 27 ] ( صحيح ) (2/1122)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ مَاتَ وَلَمْ يَغْزُ وَلَمْ يُحَدِّثُ بِهِ نَفْسَهُ مَاتَ عَلَى شُعْبَةٍ مِّنْ نِفَاقٍ”. رَوَاهُ مُسْلِمٌ .

3813. (27) [2/1122దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మరణించిన వ్యక్తి, జిహాద్‌ చేయకుండా, కనీసం జిహాద్‌ చేస్తానని కాంక్షించకుండా ఉండి ఉంటే, కపటచారిగా మరణించినట్లే.” (ముస్లిమ్‌)

3814 – [ 28 ] ( متفق عليه ) (2/1122)

وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: الرَّجُلُ يُقَاتِلُ لِلْمَغْنَمِ وَالرَّجُلُ يُقاتِلُ لِلذِّكْرِ وَالرَّجُلُ يُقَاتِلُ لِيُرَى مَكَانُهُ فَمَنْ فِيْ سَبِيْلِ اللهِ؟ قَالَ: ” مَنْ قَاتَلَ لِتَكُوْنَ كَلِمَةُ اللهِ هِيَ الْعُلْيَا فَهُوَ فِيْ سَبِيْلِ اللهِ”.

3814. (28) [2/1122 ఏకీభవితం]

అబూ మూసా అష్‌’అరీ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘కొందరు యుద్ధ ధనం పొందటానికి యుద్ధం చేస్తారు. కొందరు పేరు ప్రఖ్యాతుల కోసం మరికొందరు గౌరవమర్యాదల కోసం యుద్ధాలు చేస్తారు. వీరిలో అల్లాహ్ మార్గంలో జిహాద్‌ చేసేవారెవరు?’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స) ‘దైవధర్మ ఔన్నత్యం కోసం యుద్ధం చేసేవాడే ముజాహిద్‌ ఫీ సబీలిల్లాహ్‌’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3815 – [ 29 ] ( صحيح ) (2/1123)

وَعَنْ أَنَسٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم رَجَعَ مِنْ غَزْوَةِ تَبُوْكَ فَدَناَ مِنَ الْمَدِيْنَةِ فَقَالَ: “إِنَّ بِالْمَدِيْنَةِ أَقْوَامًا مَا سِرْتُمْ مَسِيْرًا وَلَا قَطَعْتُمْ وَادِيًا إِلَّا كَانُوْا مَعَكُمْ”.

وَفِيْ رِوَايَةٍ: “إِلّا شَرِكُوْكُمْ فِيْ الْأَجْرِ”. قَالُوْا: يَا رَسُوْلَ اللهِ وَهُمْ بِالْمَدِيْنَةِ؟ قَالَ: “وَهُمْ بِالْمَدِيْنَةِ حَبَسَهُمُ الْعُذْرُ”.  رَوَاهُ الْبُخَارِيُّ .

3815. (29) [2/1123 దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) తబూక్‌ యుద్ధం నుండి తిరుగు ప్రయాణమై మదీనహ్ సమీపానికి చేరుకున్నారు. అప్పుడు ప్రవక్త(స), ‘మదీనహ్ లో చాలామంది ఉండి పోయారు. మీతో పాటు రాలేక పోయారు, అడవులను, ఎడారులను దాటలేదు, కాని పుణ్యంలో మాత్రం మీవెంట ఉన్నారు,’ అని అన్నారు. దానికి ప్రజలు, ‘వాళ్ళు మదీనహ్ లో ఉన్నారా,’ అని అడిగారు. దానికి ప్రవక్త (స), ‘అవును, వారు మదీనహ్లో ఉన్నారు, అసహాయత వారిని జిహాద్‌లో పాల్గొనకుండా చేసింది,’ అని అన్నారు. (బు’ఖారీ)

3816 – [ 30 ] ( صحيح ) (2/1123)

وَرَوَاهُ مُسْلِمٌ عَنْ جَابِرٍ .

3816. (30) [2/1123దృఢం]

జాబిర్‌ (ర) కథనం. [5]  (ముస్లిమ్‌)

3817 – [ 31 ] ( متفق عليه ) (2/1123)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍوقَالَ: جَاءَ رَجُلٌ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَاسْتَأْذَنَهُ فِيْ الْجِهَادِ فَقَالَ: “أَحَيٌ وَالِدَكَ؟” قَالَ: نَعَمْ.” قَالَ: “فَفِيْهِمَا فَجَاهِدُ”. مُتَّفَقٌ عَلَيْهِ.

وَفِيْ رِوَايَةٍ: “فَارْجِعْ إِلَى وَالِدَيْكَ فَأَحْسِنْ صُحْبَتَهُمَا”.

3817. (31) [2/1123ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి జిహాద్‌లోకి వెళ్తానని అనుమతి కోరాడు. దానికి ప్రవక్త (స), ‘నీకు తల్లిదండ్రులు ఉన్నారా?’ అని ప్రశ్నించారు. దానికి ఆ వ్యక్తి అవునని సమాధానం ఇచ్చాడు.అప్పుడు ప్రవక్త (స) ”తల్లి దండ్రుల సేవచేస్తూ ఉండు, ఇదే నీకు జిహాద్‌,” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”నువ్వు తల్లి దండ్రుల వద్దకు వెళ్ళి, వారి పట్ల మంచిగా ప్రవర్తించు.”

3818 – [ 32 ] ( متفق عليه ) (2/1123)

وَعَنِ ابْنِ عَبَّاسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ يَوْمَ الْفَتْحِ: “لَا هِجْرَةَ بَعْدَ الْفَتْحِ وَلَكِنْ جِهَادٌ وَنِيَّةٌ وَإِذَا اسْتُنْفِرْتُمْ فَانْفِرُوْا”.

3818. (32) [2/1123ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మక్కహ్ విజయం నాడు ప్రసంగంలో ఇలా ఉపదేశించారు, ”మక్కహ్ విజయం తరువాత హిజ్రత్‌ తప్పనిసరి విధి కాదు. కాని జిహాద్‌ మరియు సత్కార్యాల సంకల్పం శాశ్వతంగా ఉంటుంది. మిమ్మల్ని జిహాద్‌కి రమ్మంటే వెంటనే తమ ఇళ్ళ నుండి బయలు దేరండి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం  

3819 – [ 33 ] ( لم تتم دراسته ) (2/1123)

عَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَزَالُ طَائِفَةٌ مِنْ أُمَّتِيْ يُقَاتِلُوْنَ عَلَى الْحَقِّ ظَاهِرِيْنَ عَلَى مَنْ نَاوَأهُمْ حَتَّى يُقَاتِلَ آخِرُهُمُ الْمَسِيْحَ الدَّجَّالَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3819. (33) [2/1123అపరిశోధితం]

‘ఇమ్‌రాన్‌ బిన్‌ హు’సైన్‌(ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజంలోని ఒక బృందం సత్యం కోసం ఎల్లప్పుడూ యుద్ధం చేస్తూ ఉంటుంది, ఇంకా తన శత్రువులపై ఎల్లప్పుడూ ఆధిక్యత కలిగి ఉంటుంది. చివరికి అందరికంటే వెనుక మసీహు ద్దజ్జాల్‌తో యుద్ధం చేస్తుంది. (అబూ  దావూద్‌)

అంటే ప్రళయం వరకు ముస్లిమ్‌ సమాజంలో నుండి ఒక వర్గం జిహాద్‌ చేస్తూ ఉంటుంది.

3820 – [ 34 ] ( ضعيف ) (2/1123)

وَعَنْ أَبِيْ أُمَامَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ لَمْ يَغْزُ وَلَمْ يُجَهِّزْ غَازِيًا أَوْ يَخْلُفُ غَازِيًا فِيْ أَهْلِهِ بِخَيْرٍ أَصَابَهُ اللهُ بِقَارِعَةٍ قَبْلَ يَوْمِ الْقِيَامَةِ”. روَاهُ أَبُوْ دَاوُدَ.

3820. (34) [2/1123 బలహీనం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా జిహాద్‌ చేయకుండా లేదా, జిహాద్‌ చేసే వారికి ఆయుధాలు సమకూర్చకుండా లేదా జిహాద్‌లో వెళ్ళేవారి భార్యాపిల్లల్ని మంచిగా సంరక్షించకుండా ఉంటే, తీర్పుదినానికి ముందు అల్లాహ్‌(త) అతన్ని ఏదో ఒక  కష్టంలో పడవేస్తాడు.” (అబూ  దావూద్‌)

3821 – [ 35 ] ( صحيح ) (2/1124)

وَعَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “جَاهِدُوْا الْمُشْرِ كِيْنَ بِأَمْوَالِكُمْ وَأَنْفُسِكُمْ وضأَلْسِنَتِكُمْ”. رواهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ .

3821. (35) [2/1124 దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీ ధన, ప్రాణాలు మరియు నోటిద్వారా అవిశ్వాసులతో యుద్ధం చేస్తూ  ఉండండి.”  [6]  (అబూ దావూద్‌, నసాయి, దార్మి)

3822 – [ 36 ] ( لم تتم دراسته ) (2/1124)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَفْشُوا السَّلامَ وَأَطْعِمُوا الطَّعَامَ وَاضْرِبُوا الْهَامَ تُوْرَثُوا الْجِنَانَ” رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

3822. (36) [2/1124 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఉపదేశం, ”మీరు సలామ్‌ను వ్యాపింపజేయండి, అన్నం పెట్టండి, శత్రువులను మట్టుపెట్టండి, అంటే అవిశ్వాసులతో యుద్ధం చేయండి. అలా చేస్తే జన్నతుల్ఫిర్దౌస్కి వారసులౌతారు. (తిర్మిజి’)

3823 – [ 37 ] ( صحيح ) (2/1124)

وَعَنْ فَضَالَةَ بْنِ عُبِيْدٍ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “كُلُّ مَيِّتٍ يُخْتَمُ عَلَى عَمَلِهِ إِلَّا الَّذِيْ مَاتَ مُرابِطًا فِيْ سَبِيْلِ اللهِ فَإِنَّهُ يُنْمَى لَهُ عَمَلُهُ إِلَى يَوْمِ الْقِيَامَةِ وَيَأْمَنُ فِتْنَةَ الْقَبْرِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ .

3823. (37) [2/1124 దృఢం]

ఫజాలహ్‌ బిన్‌ ‘ఉబైద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి మృతుని యొక్క ఆచరణ దాని మరణానంతరం సమాప్తమవుతుంది. కాని దైవమార్గంలో పాటుపడే ముజాహిద్‌ ముస్లిముల ధన, ప్రాణాలను కాపాడుతూ మరణిస్తే, అతని ఆచరణ ప్రళయం వరకు పెరుగుతూ ఉంటుంది. అంటే అతడు అదే స్థితిలో ఉన్నట్టు పరిగ ణించటం జరుగుతుంది. ఇంకా అతన్ని సమాధి శిక్ష నుండి రక్షించటం జరుగుతుంది. (తిర్మిజి’, అబూ దావూద్‌)

3824 – [ 38 ] ( صحيح ) (2/1124)

وَرَوَاهُ الدَّارَمِيُّ عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ .

3824. (38) [2/1124దృఢం]

ఉఖ్‌బహ్ బిన్‌ ఆమిర్‌ (ర), ఆధారంగా, దార్మి ఉల్లేఖనం.

3825 – [ 39 ] ( صحيح ) (2/1124)

وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ أَنَّهُ سَمِعَ رَسُوْل اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ قَاتَلَ فِيْ سَبِيْلِ اللهِ فَوَاقَ نَاقَةٍ فَقَدْ وَجَبَتْ لَهُ الْجَنَّةَ وَمَنْ جُرِحَ جُرْحًا فِيْ سَبِيْلِ اللهِ أَوْ نُكِبَ نَكْبَةً فَإِنَّهَا تَجِيْءُ يَوْمَ الْقِيَامَةِ كَأَغْزَرِ مَا كَانَتْ لَوْنُهَا الزَّعْفَرَانُ وَرِيْحُهَا الْمِسْكُ وَمَنْ خَرَجَ بِهِ خُرَاجٌ فِيْ سَبِيْلِ اللهِ فَإِنَّ عَلَيْهِ طَابَعَ الشُّهَدَاءِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْدَاوُدَ وَالنَّسَائِيُّ .

3825. (39) [2/1124 దృఢం]

మఆజ్‌ బిన్‌ జబల్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ”ఎవరైనా కొద్దిసే పయినా అల్లాహ్‌ మార్గంలో జిహాద్‌ చేస్తే, అతని కొరకు స్వర్గం తప్పనిసరి అయిపోతుంది. ఇంకా ఒకవేళ దైవమార్గంలో గాయపడి, ఏదైనా వ్యాధికి గురిచేయ బడితే, తీర్పుదినం నాడు అతడు గాయాలతో వస్తాడు. ఆ గాయాలతో రక్తం కారుతూ ఉంటుంది. ఆ రక్తం కుంకుమ రంగుకలిగి ఉంటుంది. ఇంకా ఆ రక్తం నుండి కస్తూరి సువాసన వస్తూ ఉంటుంది. ఇంకా జిహాద్‌లో ఎవరికైనా మొటిమలు పుళ్ళు ఏర్పడితే, అవి వీరమరణ సూచికలుగా గుర్తించ బడతాయి. దైవ మార్గంలోని జిహాద్‌గా పరిగణించ బడతాయి.”  [7] (తిర్మిజి’, అబూ  దావూద్‌, నసాయి)

3826 – [ 40] ( صحيح ) (2/1125)

وَعَنْ خُرَيْمِ بْنِ فَاتِكٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَنْفَقَ نَفْقَةً فِيْ سَبِيْلِ اللهِ كُتِبَ لَهُ بِسَبْعِمَائَةِ ضِعْفٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ .

3826. (40) [2/1125దృఢం]

‘ఖురైమ్‌ బిన్‌ ఫాతిక్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”అల్లాహ్మార్గంలో దానం చేసిన వారికి 700 రెట్లు అధికం చేసి ప్రతిఫలం ఇవ్వబడుతుంది.” (తిర్మిజి’, నసాయి)

అంటే ఒక్కరూపాయి దైవమార్గంలో ఖర్చుచేస్తే 700 ఖర్చు చేసినంత ప్రతిఫలం ఇవ్వటం జరుగుతుంది.

3827 – [ 41 ] ( حسن ) (2/1125)

وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَفْضَلُ الصَّدَقَاتِ ظِلُّ فُسْطَاطٍ فِيْ سَبِيْلِ اللهِ وَمِنْحَةُ خَادِمٍ فِيْ سَبِيْلِ اللهِ أَوْ طَرُوْقَةُ فَحلٍ فِيْ سَبِيْلِ اللهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

3827. (41) [2/1125 ప్రామాణికం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జిహాద్‌లో అత్యుత్తమమైన దానం నీడకోసం టెంట్‌ ఇవ్వటం. అంటే ముజాహిదీన్ల విశ్రాంతికోసం టెంట్‌ ఇవ్వటం అన్నిటికంటే ఉత్తమమైన సదఖ. అదే విధంగా ముజాహిదీన్ల సేవకోసం సేవకుడ్ని ఇవ్వడం కూడా ఉత్తమమైన దానమే. అదేవిధంగా ముజాహి దీన్లు ప్రయాణం చేయడానికి దృఢంగా ఉన్న ఒంటెను ఇవ్వటం కూడా ఉత్తమమైన  దానమే.”  (తిర్మిజి’)

3828 – [ 42 ] ( صحيح ) (2/1125)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَلِجُ النَّارَ مَنْ بَكَى مِنْ خَشْيَةِ اللهِ حَتَّى يَعُوْدَ اللبَنُ فِي الضَّرْعِ وَلَا يَجْتَمِعُ عَلَى عَبْدٍ غُبَارٌ فِيْ سَبِيْلِ اللهِ وَدُخَانٌ جَهَنَّمَ”.  رَوَاهُ التِّرْمِذِيُّ.

وَزَادَ النَّسَائِيُّ فِيْ أُخْرَى “فِيْ مَنْخَرَيْ مُسْلِمٍ أَبَدًا”

وَفِيْ أُخْرَى: “فِيْ جَوْفٍ عَبْدٍ أَبَدًا وَلَا يَجْتَمِعُ الشُّحُّ وَالْإِيْمَانِ فِيْ قَلْبِ عَبْدٍ أَبَدًا”.  

3828. (42) [2/1125 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దైవభీతివల్ల  ఏడ్చేవాడు ఎన్నడూ నరకంలోనికి ప్రవేశించ లేడు. జంతువు సిరాల నుండి వెలువడిన పాలు మళ్ళీ తిరిగి సిరాల్లో ప్రవేశించడం తప్ప, అదే విధంగా జిహాద్‌లో ముజాహిద్‌వంటిపై పడిఉన్న మట్టి, ధూళి, నరకంలోని పొగ ఒకచోట చేరలేవు. అంటే  జిహాద్‌లో మట్టి ధూళి మొదలైన వాటికి గురైన ముజాహిద్‌ ఎన్నడూ నరకంలోనికి ప్రవేశించడు.” (తిర్మిజి, నసాయి)

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది. పిసినారితనం, విశ్వాసం ఒక దైవదాసుని హృదయంలో ఏకం కాలేవు. అంటే విశ్వాసి పిసినారి కాలేడు.

3829 – [ 43 ] ( صحيح ) (2/1125)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عَيْنَانِ لَا تَمَسُّهُمَا النَّارُ: عَيْنٌ بَكَتْ مِنْ خَشْيَةِ اللهِ وَعَيْنٌ بَاتَتْ تَحْرُسُ فِيْ سَبِيْلِ اللهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

3829. (43) [2/1125 దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఆ రెండు కళ్ళకు నరకాగ్ని ఎన్నడూ ముట్టుకోదు. ఒకటి దైవభీతితో ఏడ్చేకన్ను, రెండవది అల్లాహ్‌ మార్గంలో జాగరణచేసే కన్ను. అంటే ముజాహిద్‌ కాపలా కాచేవాడు, దైవభీతితో ఏడ్చేవాడు ఇద్దరూ నరకంలో ప్రవేశించరు.” (తిర్మిజి’)

3830 – [ 44 ] ( حسن ) (2/1125)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: مَرَّرَجُلٌ مِنْ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم بِشِعْبٍ فِيْهِ عُيَيْنَةٌ مِنْ مَّاءٍ عَذْبَةٍ فَأَعْجَبَتْهُ فَقَالَ: لَوِ اعْتَزَلْتُ النَّاسَ فَأَقَمْتُ فِيْ هَذَا الشِّعْبِ فَذَكَرَ ذَلِكَ لِرَسُوْلِ اللهِ صلى الله عليه و سلم. فَقَالَ: “لَا تَفْعَلْ فَإِنَّ مَقَامَ أَحَدِكُمْ فِيْ سَبِيْلِ اللهِ أَفْضَلُ مِنْ صَلَاتِهِ سَبْعِيْنَ عَامًا أَلَا تُحِبُّوْنَ أَنْ يَّغْفِرَ اللهُ لَكُمْ وَيُدْخِلَكُمُ الْجَنَّةَ؟ اُغْزُوْا فِيْ سَبِيْلِ اللهِ مَنْ قَاتَلَ فِيْ سَبِيْلِ اللهِ فُوَاقَ نَاقَةٍ وَجَبَتْ لَهُ الْجَنَّةَ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

3830. (44) [2/1125 ప్రామాణికం]

అబూ హురైరహ్‌(ర) కథనం: ప్రవక్త (స) అనుచరుల్లోని ఒక వ్యక్తి ఒక కొండ ప్రక్కనున్న ఊట ప్రక్కనుండి వెళుతూ దాన్ని చూచి చాలా సంతోసించి తన మనసులో ప్రజల నుండి వేరై ఇక్కడే నివసిస్తూ దైవారాధన చేసుకుందామని తలచుకొని, తన అభిప్రాయాన్ని  ప్రవక్త (స) ముందు పెట్టాడు. ప్రవక్త (స) ఆ వ్యక్తితో, ‘నువ్వు అలా చేయకు. ఎందుకంటే అల్లాహ్‌ (త) మార్గంలో గడపటం 70 సంవత్సరాలు అతను తన ఇంట్లో చేసిన నమా’జు కంటే గొప్పది, అల్లాహ్‌ (త) నిన్ను క్షమించి, స్వర్గంలోనికి పంపి వేయాలనే కోరిక నీకు లేదా అల్లాహ్‌(త) మార్గంలో జిహాద్‌ చేయి. ఎందుకంటే అల్లాహ్‌ మార్గంలో కొద్దిసేపు పోరాడిన వ్యక్తి కోసం స్వర్గం తప్పనిసరి అవుతుంది’ అని హితబోధ చేసారు. (తిర్మిజి’)

3831 – [ 45 ] ( ضعيف ) (2/1126)

وَعَنْ عُثْمَانَ رَضِيَ اللهُ عَنْهُ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “رِبَاطُ يَوْمِ فِيْ سَبِيْلِ اللهِ خَيْرٌمِّنْ أَلْفِ يَوْمٍ فِيْمَا سِوَاهُ مِنَ الْمَنَازِلِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ .

3831. (45) [2/1126 బలహీనం]

‘ఉస్మాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ (త) మార్గంలో అవిశ్వాసులకు వ్యతిరేకంగా సరిహద్దుపై ఒక రాత్రి పగలు కాపలా కాయటం వేల దినాలకంటే ఎంతో ఉత్తమం, అయితే ఈ ప్రాంతాలు తప్ప.” (తిర్మిజి’, నసాయి’)

3832 – [ 46 ] ( لم تتم دراسته ) (2/1126)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “عُرِضَ عَلَيَّ أَوَّلُ ثَلَاثَةٍ يَدْخُلُوْنَ الْجَنَّةَ:شَهِيْدٌ وَعَفِيْفٌ مُتَعَفِّفٌ وَعَبْدٌ أَحْسَنَ عِبَادَةَ اللهِ وَنَصَحَ لِمَوَالِيْهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

3832. (46) [2/1126 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”నా ఎదుట మూడు రకాలకు చెందిన స్వర్గవాసులను ప్రవేశపెట్టటం జరిగింది. అందరికంటే ముందు వీరు స్వర్గంలోనికి ప్రవేశిస్తారు. వీరిలో ఒకరు వీరమరణం పొందిన వారు, మరొకరు నిషిద్ధ కార్యాలకు దూరంగా ఉండేవారు, ఎవరినీ అర్థించనివారు, మూడవ వ్యక్తి చిత్తశుద్ధితో అల్లాహ్‌(త)ను ఆరాధిస్తూ, తనయజమాని సేవచేసిన  సేవకుడు.” (తిర్మిజి’)

3833 – [ 47 ] ( صحيح ) (2/1126)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ حُبَشِيٍّ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم سُئِلَ أَيُّ الْأَعْمَالِ أَفْضَلُ؟ قَالَ: “طُوْلُ الْقِيَامِ”  قِيْلَ: فَأَيُّ الصَّدَقَةِ أَفْضَلُ؟ قَالَ: “جُهْدُ الْمِقُلِّ ” قِيْلَ: فَأَيُّ الْهِجْرَةِ أَفْضَلُ؟ قَالَ: “مَنْ هَجَرَ مَا حَرَّمَ اللهُ عَلَيْهِ”. قِيْلَ: فَأَيُّ الْجِهَادِ أَفْضَلُ؟ قَالَ: “مَنْ جَاهَدَ الْمُشْرِكِيْنَ بِمَالِهِ وَنَفْسِهِ”.  قِيْلَ: فَأَيُّ الْقَتْلِ أَشْرَفُ؟ قَالَ: “مَنْ أُهْرِيْقَ دَمُهُ وَعُقِرَ جَوَادُهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

وَفِيْ رِوَايَةِ للنَّسَائِيِّ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم سُئِلَ: أَيُّ الْأَعْمَالِ أَفْضَلُ؟ قَالَ: “إِيْمَانٌ لَا شَكُّ فِيْهِ وَجِهَادٌ لَا غُلُوْلَ فِيْهِ وَحَجَّةٌ مَبْرُوْرَةٌ”.  قِيْلَ: فَأَيُّ الصَّلَاةِ أَفْضَلُ؟ قَالَ: “طُوْلُ الْقُنُوْتِ”. ثُمَّ اتَّفَقَا فِي الْبَاقِيْ .

3833. (47) [2/1126 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘హుబషీ (ర) కథనం: ప్రవక్త (స) ను ‘ఎటువంటి ఆచరణ అన్నిటికంటే ఉత్తమం,’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స) నమా’జులో చాలాసేపు వరకు నిలబడటం, అంటే నమా’జులో అన్నిటి కంటే ఉత్తమమయినది చాలాసేపు వరకు నిలబడటం,’ అని అన్నారు. ఆ తరు వాత, ‘ఏ సదఖహ్ ఉత్తమమైనది,’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘పేదవాడు శ్రమించి, కష్టపడి తన శక్తికి తగ్గట్టు చేసిన దానం,’ అని సమాధానం ఇచ్చారు. ఆ తరువాత ‘ఏ హిజ్రత్‌ ఉత్తమమైనది,’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘అల్లాహ్‌ (త) నిషిద్ధంచేసిన వాటి నుండి, అంటే వాటిని వదలివేయటం,’ అని అన్నారు. ఆ తరువాత, ‘మళ్ళీ ఏ జిహాద్‌ ఉత్తమమైనది,’ అని ప్రశ్నించటం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘తన ధనప్రాణాలతో చేసిన జిహాద్‌,’ అని సమాధానం ఇచ్చారు. మళ్ళీ, ‘ఎటువంటి హత్య అన్నిటికంటే మంచిది,’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి, ‘అతన్ని హత్యచేసి అతని గుర్రం కాళ్ళు కోసివేయబడినది.’ (అబూ  దావూద్‌, నసాయి’)

మరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ప్రవక్త (స)ను, ‘ఆచరణ లన్నిటిలో ఏ ఆచరణ గొప్పది’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స) ఎటువంటి అనుమానం లేని విశ్వాసం, ఇంకా, ఎటువంటి ద్రోహం లేని జిహాద్‌, ఇంకా ఆమోదయోగ్యమైన ‘హజ్జ్,’ అని సమాధానం ఇచ్చారు. ఆ తరువాత ‘ఏ నమా’జు ఉత్తమ నది,’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి, ‘చాలా సేపువరకు నిలబడే నమా’జు,’ అని సమాధానం ఇచ్చారు. (నసాయి’)

3834 – [ 48 ] ( صحيح ) (2/1127)

وَعَنِ الْمِقْدَامِ بْنِ مَعْدِي كَربَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم: “لِلشَّهِيْدِ عِنْدَ اللهِ سِتُّ خِصَالٍ: يُغْفَرُلَهُ فِيْ أَوَّلِ دَفْعَةٍ وَيُرَى مَقْعَدَهُ مِنَ الْجَنَّةِ وَيُجَارُمِنْ عَذَابِ الْقَبْرِوَيَأْمَنُ مِنْ الْفَزَعِ الْأَكْبَرِ وَيُوْضَعُ عَلَى رَأْسِهِ تَاجُ الْوَقَارِ الْيَاقُوْتَةُ مِنْهَا خَيْرٌ مِّنَ الدُّنْيَا وَمَا فِيْهَا وَيُزَوَّجُ ثِنْتَيْنِ وَسَبْعِيْنَ زَوْجَةً مِّنَ الْحَوْرِ الْعَيْنِ وَيُشَفَّعُ فِيْ سَبْعِيْنَ مِنْ أَقْرِبَائِهِ”.  رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ .

3834. (48) [2/1127దృఢం]

మిఖ్‌దామ్‌ బిన్‌ మ’అదీ కరబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ వద్ద వీరమరణం పొందిన వ్యక్తికోసం 6 విషయాలు ఉన్నాయి. 1. అతని రక్తం మొదటి చుక్క చిమ్మిన వెంటనే అతన్ని క్షమించడం జరుగుతుంది. 2. స్వర్గంలోని అతని నివాసం అతనికి చూపెట్టడం జరుగుతుంది. 3. సమాధి శిక్ష నుండి రక్షించడం జరుగుతుంది. 4. ఇంకా తీర్పుదినం నాటి ఆందోళన నుండి దూరంగా ప్రశాంతంగా ఉంచడం జరుగుతుంది. 5. ఇంకా అతని తలపై గౌరవ కిరీటం  పెట్టడం జరుగుతుంది. దాని ముత్యం ప్రపంచంలోని వస్తువులన్నిటి కంటే గొప్పదిగా ఉంటుంది. 6. అతనికి 72 స్వర్గ కన్యలతో నికా’హ్‌ చేయటం జరుగుతుంది. వారికి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. ఇంకా అతని బంధువుల్లో 70 మంది కొరకు సిఫారసుచేసే అనుమతి ఇవ్వటం జరుగుతుంది.” (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

3835 – [ 49 ] ( لم تتم دراسته ) (2/1127)

وَعَنْ أَبِيْ هُرْيَرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ لَقِيَ الله بِغَيْرِ أَثَرٍ مِّنْ جِهَادٍ لَقِيَ اللهُ وَفِيْهِ ثُلْمَةٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ .

3835. (49) [2/1127అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”శరీరంపై ఎటువంటి జిహాద్‌ చిహ్నం లేకుండా అల్లాహ్‌(త)ను కలిస్తే, ఒక విధమైన నష్టం ఉన్నట్టే.” (తిర్మిజి’, ఇబ్నె  మాజహ్)

3836 – [ 50] ( حسن ) (2/1127)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلشَّهِيْدُ لَا يَجِدُ أَلَم الْقَتْلِ إِلَّا كَمَا يَجِدُ أَحَدُكُمْ أَلَمَ الْقَرْصَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.

3836. (50) [2/1127 ప్రామాణికం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వీరమరణం పొందినప్పుడు అమరవీరుడికి చీమ కుట్టినంత బాధ కలుగుతుంది.” (తిర్మిజి -ప్రామాణికం-ఏకోల్లేఖనం, నసాయి’, దార్మి)

3837 – [ 51 ] ( حسن ) (2/1127)

وَعَنْ أَبِيْ أُمَامَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَيْسَ شَيْءٌأَحَبَّ إِلَى اللهِ مِنء قَطْرَتَيْنِ وَأَثرَيْنِ: قَطْرةُ دُمُوْعٍ مِنْ خَشْيَةِ اللهِ وَ قَطْرَةُ  دَمٍّ يُهْرَاقُ فِيْ سَبِيْلِ اللهِ وَأَمَّا الْأَثَرَانِ: فَأَثَرٌ فِيْ سَبِيْلِ اللهِ وَأَثَرٌفِيْ فَرِيْضَةٍ مِّنْ فَرَائِضِ اللهِ تَعَالى”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ .

3837. (51) [2/1127ప్రామాణికం]

అబూ ఉమామ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ వద్ద రెండు చుక్కలు, రెండు చిహ్నాలు చాలా విలువైనవి. అవి. 1. దైవభీతివల్ల రాలే కన్నీటి చుక్క 2. దైవమార్గంలో చిందే రక్తపుచుక్క. చిహ్నాల్లో 1. దైవమార్గంలో ఏర్పడే చిహ్నం. కాళ్ళు చేతులు నుదురు మొదలైన వాటిపై నమాజు వల్ల కలిగే చిహ్నాలు. (తిర్మిజి’  /  ప్రామాణికం- ఏకోల్లేఖనం)

3838 – [ 52 ] ( ضعيف ) (2/1127)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَرْكَبِ الْبَحْرَ إِلَّا حَاجًّا أَوْ مُعْتَمِرًا أَوْغَازِيًا فِيْ سَبِيْلِ اللهِ فَإِنْ تَحْتَ الْبَحْرِ نَارًا وَتَحْتَ النَّارِ بَحْرًا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3838. (52) [2/1127 బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సముద్ర ప్రయాణం కేవలం ‘హాజీలు, ‘ఉమ్‌రహ్‌ చేసేవారు లేదా దైవమార్గంలో పోరాడేవారే చేయాలి. ఎందుకంటే సముద్రం క్రింద అగ్ని ఉంది. అగ్ని క్రింద సముద్రం  ఉంది. (అబూ  దావూద్‌)

అంటే సముద్ర ప్రయాణం చాలా ప్రమాదకరమైనది. అయితే ఈమూడు కార్యాలకు మాత్రమే ఇది తగినది. అయితే ఖుర్‌ఆన్‌, ‘హదీసు’లను నేర్చుకోవడానికి, వ్యాపారానికి ప్రయాణం చేయవచ్చును. బు’ఖారీ (ర) పేర్కొన్నట్లు.

3839 – [ 53 ] ( حسن ) (2/1127)

وَعَنْ أُمِّ حَرَامٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “الْمَائِدُ فِي الْبَحْرِ الَّذِيْ يُصِيْبُهُ الْقَيْءُ لَهُ أَجْرُ شَهِيْدٌ وَالْغَرِيْقُ لَهُ أَجْرُ شَهِيْدَيْنِ”. روَاهُ أَبُوْ دَاوُدَ.  

3839. (53) [2/1127 ప్రామాణికం]

ఉమ్మె ‘హరామ్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”ఎవరికైనా సముద్ర ప్రయాణంలో వాంతి వస్తే అతనికి ఒక వ్యక్తి వీరమరణం పొందినంత పుణ్యం లభిస్తుంది. అదే విధంగా మునిగి మరణిస్తే ఇద్దరు షహీదుల పుణ్యం లభిస్తుంది.” (అబూ  దావూద్‌)

3840 – [ 54 ] ( ضعيف ) (2/1127)

وَعَنْ أَبِيْ مَالِكٍ الْأَشْعَرِيِّ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ فَصَلَ فِيْ سَبِيْلِ اللهِ فَمَاتَ أَوْ قُتِلَ أَوْ وَقَصَهُ فَرَسُهُ أَوْ بَعِيْرُهُ أَوْ لَدَغَتْهُ هَامَّةٌ أَوْ مَاتَ فِيْ فِرَاشِهِ بِأَيِّ حَتْفٍ شَاءَ اللهُ فَإِنَّهُ شَهِيْدٌ وَإِنْ لَهُ الْجَنَّةَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3840. (54) [2/1127బలహీనం]

అబూ మాలిక్‌ అష్‌’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”అల్లాహ్‌ (త) మార్గంలో బయలుదేరి చనిపోయినా, హత్య చేయబడినా, లేదా అతని గుర్రం లేదా అతని ఒంటె అతన్ని క్రిందపడేసినా, లేదా విషజంతువు కాటేసినా, లేదా తన పడకపై మరణించినా, ఏవిధంగా మరణించినా అతడు షహీద్‌గానే పరిగణించ బడతాడు. అతనికోసం స్వర్గం తప్పనిసరి అయి పోతుంది.” (అబూ  దావూద్‌)

3841 – [ 55 ] ( لم تتم دراسته ) (2/1127)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍوأَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “قَفْلَةٌ كَغَزْوَةٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3841. (55) [2/1127 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జిహాద్‌ నుండి తిరిగి రావటం జిహాద్‌కి వెళ్తున్నట్టే. అంటే జిహాద్‌ నుండి తిరుగు ప్రయాణం కూడా జిహాద్‌గానే పరిగణించబడుతుంది. అంటే దానికీ పుణ్యం  లభిస్తుంది.” (అబూ  దావూద్‌)

3842 – [ 56 ] ( لم تتم دراسته ) (2/1127)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لِلْغَازِيْ أَجْرُهُ وَلِلْجَاعِلِ أَجْرُهُ وَأَجْرُ الْغَازِيْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3842. (56) [2/1127 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ‘ ‘గాజీకి, ముజాహిద్‌కి వారి పుణ్యం లభిస్తుంది, ముజాహిద్‌కు జీతం ఇచ్చి జిహాద్‌ చేయించిన వారికి ప్రతిఫలం లభిస్తుంది. అంటే ఇటువంటి వ్యక్తికి రెండు ప్రతిఫలాలు లభిస్తాయి.” (అబూ  దావూద్‌)

3843 – [ 57 ] ( لم تتم دراسته ) (2/1127)

وَعَنْ أَبِيْ أَيُّوْبَ سَمِعَ النَّبِيّ صلى الله عليه وسلم يَقُوْلُ: “سَتُفْتَحُ عَلَيْكُمْ الْأَمْصَارُوَسَتَكُوْنُ جُنُوْدٌ مُجَنَّدَةٌ يُقْطَعُ عَلَيْكُمْ فِيْهَا بُعُوْثٌ فَيَكْرَهُ الرَّجُلُ الْبَعْثَ فَيَتَخَلَّصُ مِنْ قَوْمِهِ ثُمَّ يَتَصَفَّحُ الْقَبَائِلَ يَعْرِضُ نَفْسَهُ عَلَيْهِمْ مَن أَكْفِيْهِ بَعَثَ كَذَا أَلَا وَذَلِكَ الْأَجِيْرُإِلَى أَخِرِقَطْرَةٍ مِنْ دَمِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3843. (57) [2/1127అపరిశోధితం]

అబూ అయ్యూబ్‌ (ర) కథనం: ప్రవక్త(స) ను ఇలా అంటూఉండగా నేను విన్నాను. ”భవిష్యత్తులో మీరు పెద్ద పెద్ద నగరాలను జయిస్తారు. మీవద్ద పెద్దసైన్యాలు ఉంటాయి. జిహాద్‌ కోసం పంపడం జరుగుతుంది. ఒక వ్యక్తి పారితోషికం లేకుండా జిహాద్‌ చేయటానికి సిద్ధపడడు. అతడు తన జాతి నుండి వెళ్ళి మరో జాతిలోనికి వెళ్ళి నేను జీతంపై జిహాద్‌కు వెళతానని విన్నవించుకుంటాడు. జీతంపై చేసే ఈ ముజాహిద్‌ ముజాహిద్‌ కాడు. అతడు తన చివరి రక్తపుబొట్టు వరకు కూలివాడిగానే ఉంటాడు.” (అబూ  దావూద్‌)

3844 – [ 58 ] ( لم تتم دراسته ) (2/1129)

وَعَنْ يَعْلَى بْنَ أُمَيَّةَ قَالَ: آذَنَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِالْغَزْوِ وَأَنَا شَيْخٌ كَبِيْرٌ لَيْسَ لِيْ خَادِمٌ فَالْتَمَسْتُ أَجِيْرًا يَكْفِيْنِيْ فَوَجَدْتُّ رَجُلًا سَمَّيْتُ لَهُ ثَلَاثَةَ دَنَانِيْرَفَلَمَّا حَضَرَتْ غَنِيْمَةٌ أَرَدْتُّ أَنْ أُجْرِيَ لَهُ سَهْمَهُ فَجِئْتُ النَّبِيّ صلى الله عليه وسلم. فَذَكَرْتُ لَهُ فَقَالَ: “مَا أَجِدُ لَهُ فِيْ غزوته هَذِهِ فِي الدُّنْيَا وَالْآخِرَةِ إِلَّا دَنَانِيْرَهُ الَّتِيْ تُسَمّى”.  رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3844. (58) [2/1129 అపరిశోధితం]

య’అలా బిన్‌ ఉమయ్య (ర) కథనం: ప్రవక్త (స) జిహాద్‌ గురించి ప్రకటించినపుడు నేను చాలా ముసలి వాడ్ని. నా దగ్గర పనివాడు కాని సేవకుడు కాని లేడు. నేను పనివాడ్ని వెతకటం ప్రారంభించాను. నా వెంట ఉండటానికి నా సేవ చేయటానికి. నాకు ఒక వ్యక్తి దొరికాడు. అతనికి మూడు దీనార్లు జీతం నిర్ణయించాను. అతడు నా వెంట వచ్చాడు, యుద్ధం జరిగింది. యుద్ధంలో యుద్ధధనం చేతికి చిక్కింది. అందులో అతని వంతును కూడా నిర్ణయిద్దామని అను కున్నాను. దీన్ని గురించి అడగటానికి ప్రవక్త (స) వద్దకు వచ్చి జరిగింది విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘నీవు నిర్దేశించిన ఆ మూడు దీనార్లే అతనికి చెందుతాయి. అవి తప్ప అతనికి పుణ్యం కాని, యుద్ధ ధనంలో నుండి గాని ఏమీ లభించదు’ అని అన్నారు.” (అబూ  దావూద్‌)

3845 – [ 59 ] ( صحيح ) (2/1129)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَجُلًا قَالَ: يَا رَسُوْلَ اللهِ رَجُلٌ يُرِيْدُ الْجِهَادَ فِيْ سَبِيْلِ اللهِ وَهُوَ يَبْتَغِيْ عَرَضًا مِنْ عَرَضِ الدُّنْيَا. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “لَا أَجْرَ لَهُ”.  رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3845. (59) [2/1129దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ఒక వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! ఒక వ్యక్తి జిహాద్‌లో వెళ్ళాలనుకుంటున్నాడు. ఇంకా అతడు ధన సంపదలపట్ల కూడా ఆశగా ఉన్నాడు’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స) ఇటువంటి ముజాహిద్‌ కోసం పుణ్యం లేదు. ఎందుకంటే అతడు ప్రాపంచిక అనుగ్రహాల కోసం జిహాద్‌ చేసాడు. దైవధర్మ ఆధిక్యత కోసం కాదు.’ (అబూ  దావూద్‌)

3846 – [ 60 ] ( حسن ) (2/1129)

وَعَنْ مُعَاذٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْغَزْوُ غَزْوَانِ فَأَمَّا مَنِ ابْتَغَى وَجَهَ اللهِ وَأَطَاعَ الْإِمَامَ وَأَنْفَقَ الْكَرِيْمَةَ وَيَاسَرَ الشَّرِيْكَ وَاجْتَنَبَ الْفَسَادَ فَإِنَّ نَوْمَهُ وَنُهْبَهُ أَجْرٌ كُلُّهُ. وَأَمَّا مَنْ غَزَا فَخْرًا وَرِيَاءً وَسُمْعَةً وَعَصَى الْإِمَامَ وَأَفْسَدَ فِي الْأَرْضِ فَإِنَّهُ لَمْ يَرْجِعْ بِالءكَفَافِ”.  رَوَاهُ مَالِكٌ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

3846. (60) [2/1129ప్రామాణికం]

ము’ఆజ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జిహాద్‌ రెండు రకాలు. ఒక ముజాహిద్‌ దైవప్రీతి కోసం జిహాద్‌ చేస్తాడు. తన నాయకునికి విధేయత చూపుతాడు, తన ప్రాణాన్ని ధనాన్ని సంతోషంగా ఖర్చుపెడతాడు. తన భార్యపట్ల మంచిగా వ్యవహరిస్తాడు. ఉపద్రవాలకు, కల్లోలాలకూ దూరంగా ఉంటాడు. అతని పగలు రాత్రి అంతా పుణ్యమే  పుణ్యం. మరోవ్యక్తి గర్వంగా చూపుగోలు కోసం పేరు ప్రతిష్టల కోసం జిహాద్‌ చేస్తాడు. గొప్పలు చెప్పుకుంటాడు. తన నాయకునికి అవిధేయత చూపుతాడు. భూమిపై కల్లోలాలు రేపుతాడు. అతనికి జిహాద్‌ పుణ్యం లభించదు. దానికి ప్రయత్నించడు కూడా. సరిసమానంగా కూడా తిరిగి రాడు.” (మాలిక్, అబూ  దావూద్‌, నసాయి’)

3847 – [ 61 ] ( ضعيف ) (2/1129)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْروأَنَّهُ قَالَ: يَا رَسُوْلَ اللهِ أَخْبِرْنِيْ عَنِ الْجِهَادِ. فَقَالَ: “يَا عَبْدَ اللهِ بْنِ عَمْرٍوإِنْ قَاتَلْتَ صَابِرًا مُّحْتَسِبًا بَعَثَكَ اللهُ صَابِرًا مُحْتَسِبًا وَإِنْ قَاتَلْتَ مُرَائِيًا مُكَاثِرًا بَعَثَكَ اللهُ مُرَائِيًا مُكَاثِرًا. يَا عَبْدَ اللهِ بْنِ عَمْرٍوعَلَى أَيِّ حَالٍ قَاتَلْتَ أَوْ قُتِلْتَ بَعَثَكَ اللهُ عَلَى تِلْكَ الْحَالِ”.رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3847. (61) [2/1129 బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌(ర) ఇలా విన్నవించు కున్నారు: ”ఓ ప్రవక్తా! దయచేసి తమరు జిహాద్‌లో ఎంత పుణ్యం ఉందనేది తెలియపర్చండి.” దానికి ప్రవక్త(స), ‘అబ్దుల్లాహ్‌! ఒకవేళ నీవు పుణ్యంగా భావించి చిత్తశుద్ధితో సహనం వహించి జిహాద్‌ చేస్తే అల్లాహ్‌ (త) నీకు సహనం వహించినందుకు పుణ్యం, ముజాహిద్‌ పుణ్యం ప్రసాదిస్తాడు. ఒకవేళ నీవు ఆ స్థితిలోనే మరణిస్తే, ఆస్థితిలోనే అల్లాహ్‌ (త) నిన్ను లేపుతాడు. ఒకవేళ నీవు చూపుగోలు కోసం, ప్రతిష్ఠల కోసం జిహాద్‌ చేస్తే, ఒకవేళ నీవు మరణిస్తే, ఆ స్థితిలోనే అల్లాహ్‌ (త) నిన్ను లేపుతాడు. ఓ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌! ఏ స్థితిలో నువ్వు యుద్ధం చేసినా చంపబడినా, అల్లాహ్‌ (త) ఆ స్థితిలోనే నిన్ను లేపుతాడు. ” ( అబూ  దావూద్ )

3848 – [ 62] ( لم تتم دراسته ) (2/1130)

وَعَنْ عُقْبَةَ بْنِ مَالِكٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “أَعَجَزْتُمْ إِذَا بَعَثْتُ رَجُلًا فَلَمْ يَمْضِ لِأَمْرِيْ أَنْ تَجْعَلُوْا مَكَانَهُ مَنْ يَمْضِيْ لِأَمْرِيْ؟” رَوَاهُ أَبُوْدَاوُدَ وَذُكِرَحَدِيْثُ فَضَالَةَ: “وَالْمُجَاهِدُ مَنْ جَاهَدَ نَفْسَهُ”. فِيْ ” كِتَابِ الْإِيْمَانِ.”

3848. (62) [2/1130 అపరిశోధితం]

‘ఉఖ్‌బహ్ బిన్‌ మాలిక్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను ఎవరినైనా పాలకునిగా నిర్ణయించి పంపితే, అతడు నా ఆదేశాల కనుగుణంగా పరి పాలించ కుంటే, అతని స్థానంలో నా ఆదేశాల కను గునంగా పరిపాలించే వాడిని ఎన్నుకోండి.” (అబూ- దావూద్‌)

 ఫ’దాలహ్ ‘హదీసు’ను ”కితాబుల్‌ ఈమాన్‌” లో పేర్కొనడం జరిగింది. ‘తన ధన ప్రాణాల ద్వారా జిహాద్‌ చేసే వ్యక్తి పరిపూర్ణ ముజాహిద్‌,’ అని పేర్కొనడం జరిగింది.

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం 

3849 – [ 63 ] ( لم تتم دراسته ) (2/1130)

عَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: خَرَجْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ سَرِيَّةِ فَمَرَّرَجُلٌ بِغَارٍ فِيْهِ شَيْءٌ مِن مَّاءٍ وَبَقْلٍ فَحَدَّثَ نَفْسَهُ بِأَنْ يُّقِيْمَ فِيْهِ وَيَتَخَلّى مِنَ الدُّنْيَا فَاسْتَأْذَنَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فِيْ ذَلِكَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنِّيْ لَمْ أُبْعَثْ بِالْيَهُوْدِيَّةِ وَ لَا بِالنَّصْرَانِيَّةِ وَلَكِنِّيْ بُعِثْتُ بِالْحَنيْفِيَّةِ السَّمْحَةِ وَالَّذِيْ نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَغَدْوَةٌ أَوء رَوْحَةٌ فِيْ سَبِيْلِ اللهِ خَيْرٌمِّنَ الدُّنْيَا وَمَا فِيْهَا وَلِمَقَامُ أَحَدِكُمْ فِي الصَّفِّ خَيْرٌمِّنْ صَلَاتِهِ سِتِّيْنَ سَنَةً”. رَوَاهُ أَحْمَدُ .

3849. (63) [2/1130 అపరిశోధితం]

అబూ ఉమామహ్ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట ముజాహిదీన్ల సైన్యంతో బయలుదేరాము. మాలో ఒక వ్యక్తికి, ఒక గుహలో నీటిని, ఆకుకూరలను చూచి ఇక్కడే నివసిద్దాము, ప్రజలకు దూరంగా ఉందామనే ఆలోచన వచ్చింది. అతడు ప్రవక్త (స)ను అనుమతి కోరాడు. దానికి ప్రవక్త (స) యూదుత్వం, క్రైస్తవత్వం కోసం నేను పంపబడలేదు. నేను సులభ మైన ధర్మం ప్రచారం కోసం పంపబడ్డాను. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! ఉదయం లేదా సాయంత్రం అల్లాహ్ (త) మార్గంలో ప్రాణాలు అర్పించడం ప్రాపంచిక వస్తువులన్నిటికంటే ఉత్తమమైనది. జిహాద్‌ పంక్తుల్లో నిలబడటం 60 సంవ త్సరాల నమాజ్‌ కంటే ఉత్తమమైనది.” (అ’హ్మద్‌)

3850 – [ 64 ] ( صحيح ) (2/1130)

وَعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ غَزَا فِيْ سَبِيْلِ اللهِ وَلَمْ يَنْوِ إِلَّا عِقَالًا فَلَهُ مَا نَوَى”. رَوَاهُ النَّسَائِيُّ.

3850. (64) [2/1130 దృఢం]

‘ఉబాదహ్‌ బిన్‌ ‘సామిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ మార్గంలో జిహాద్‌ చేసేవాడు, ఒక్క త్రాడు కోసం జిహాద్‌ చేస్తే, అతనికి అదే లభిస్తుంది.” (నసాయి’)

3851 – [ 65 ] ( صحيح ) (2/1130)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ رَضِيَ بِاللهِ رَبّا وَالْإِسْلَامِ دِيْنًا وَبِمُحَمَّدٍ رَسُوْلًا وَجَبَتْ لَهُ الْجَنَّةُ”. فَعَجِبَ لَهَا أَبُوْ سَعِيْدٍ فَقَالَ: أَعِدْهَا عَلي يَا رَسُوْلَ اللهِ فَأَعَادَهَا عَلَيْهِ. ثُمَّ قَالَ: “وَأُخْرَى يَرْفَعُ اللهُ بِهَا الْعَبْدَ مِائَةَ دَرَجَةٍ فِي الْجَنَّةِ مَا بَيْنَ كُلِّ دَرَجَتَيْنِ كَمَا بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ”. قَالَ: وَمَا هِيَ يَا رَسُوْلَ اللهِ ؟ قَالَ:”اَلْجِهَادُ فِيْ سَبِيْلِ الْجِهَادُ فِيْ سَبِيْلِ اللهِ الْجِهَادُ فِيْ سَبِيْلِ اللهِ.” رَوَاهُ مُسْلِمٌ .

3851. (65) [2/1130 దృఢం]

అబూ సయీద్‌ (ర) కథనం : ప్రవక్త (స) ‘అల్లాహ్‌ను ప్రభువుగా, ఇస్లామ్‌ను తన ధర్మంగా, ము’హమ్మద్‌ (స)ను తన ప్రవక్తగా స్వీకరిస్తే, అతని కోసం స్వర్గం తప్పనిసరి అయిపోతుంది’ అని అన్నారు. అది విని అబూ స’యీద్‌ ‘ఖుద్‌రీ చాలా ఆశ్చర్యపడి, ‘ఓ ప్రవక్తా! ఈ పదాల్ని మళ్ళీ ఉచ్చరించండి,’ అని అన్నాడు. ప్రవక్త (స) ఈ పదాల్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించారు. ఆ వెంటనే, ‘మరో విషయం దీనివల్ల అల్లాహ్‌(త) తన దాసుని 100 తరగతులు ఉన్నతం చేస్తాడు, వాటి మధ్య భూమ్యాకాశాలంత దూరం ఉంటుంది,’ అని అన్నారు. అబూ స’యీద్‌ ‘ఖుదరీ, ‘ఓ ప్రవక్తా! అది ఏమిటి?’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త(స), ‘అల్లాహ్‌ మార్గంలో జిహాద్‌,’ ఈ పదాన్ని ప్రవక్త (స) మూడుసార్లు వల్లించారు.” (ముస్లిమ్‌)

3852 – [ 66 ] ( صحيح ) (2/1131)

وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَبْوَابَ الْجَنَّةِ تَحْتَ ظِلَالِ السُّيُوْفِ” .فَقَامَ رَجُلٌ رَثُّ الْهَيْئَةِ فَقَالَ: يَا أَبَا مُوْسَى أَنْتَ سَمِعْتَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ هَذَا؟ قَالَ: نَعَمْ فَرَجَعَ إِلَى أَصْحَابِهِ فَقَالَ: أقْرَأُ عَلَيْكُمُ السَّلَامَ ثُمَّ كَسَرَجَفْنَ سَيْفِهِ فَأَلْقَاهُ ثُمَّ مَشَى بِسَيْفِهِ إِلَى الْعَدُوِّ فَضَرَبَ بِهِ حَتَّى قُتِلَ. روَاهُ مُسْلِمٌ .

3852. (66) [2/1131దృఢం]

అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గ ద్వారాలు ఖడ్గాల నీడలో ఉన్నాయి. అది విని ధూళితో ఉన్న ఒక వ్యక్తి ఓ అబూ మూసా! నువ్వు ఈ ‘హదీసు’ను ప్రవక్త (స) ప్రవచిస్తూ ఉండగా విన్నావా?’ అని అడిగాడు. దానికి అతడు, అవునని అన్నాడు. అది విని అతడు తన సహచరుల వద్దకు వెళ్ళి నేను మీకు చివరి సలామ్‌ చేయడానికి వచ్చాను అని పలికి తన కరవాలం యొక్క ఒరను విరచిపారేసాడు. శత్రువువైపు వెళ్ళాడు. పోరాడుతూ వీరమరణం  పొందాడు. (ముస్లిమ్‌)

3853 – [ 67 ] ( لم تتم دراسته ) (2/1131)

وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ لِأَصْحَابِهِ: “إِنَّهُ لَمَّا أُصِيْبَ إِخْوَانُكُمْ يَوْمَ أُحَدٍ جَعَلَ اللهُ أَرْوَاحَهُمْ فِيْ جَوْفِ طَيْرٍ خُضْرٍ تَرِدُّ أَنْهَارَ الْجَنَّةِ تَأْكُلُ مِنْ ثِمَارِهَا وَتَأْوِيْ إِلَى قَنَادِيْلَ مِنْ ذَهَبٍ مُعَلَّقَةٍ فِيْ ظِلِّ الْعَرْشِ فَلَمَّا وَجَدُوْا طِيْبَ مَأْكَلِهِمْ وَمَشْرَبِهِمْ وَمَقِيْلِهِمْ قَالُوْا:مَنْ يُبَلِّغُ إِخْوَانَنَا عَنَّا أَنَّنَا أَحْيَاءٌ فِي الْجَنَّةِ لِئَلَّا يَزْهَدُوْا فِي الْجَنَّةِ وَلَا يَنْكُلُوْا عِنْدَ الْحَرْبِ فَقَالَ اللهُ تَعَالى: أَنَا أُبَلِّغُكُمْ عَنْكُمْ. فَأَنْزَلَ اللهُ تَعَالى: (ولَا تَحْسَبَنَّ الَّذِيْنَ قُتِلُوْا فِيْ سَبِيْلِ اللهِ أَمْوَاتًا بَلْ أَحْيَاءٌ…) إِلى أَخِرِ الْآيَاتِ3:169) رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3853. (67) [2/1131 అపరిశోధితం]

ఇబ్నె అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన అనుచరులతో ఉహుద్‌ యుద్ధ అమరవీరుల గురించి ప్రస్తా విస్తూ ఉహుద్‌ యుద్ధంలో వీరమరణం పొందిన మీ సోదరుల ఆత్మలను అల్లాహ్‌ ఆకుపచ్చని గూళ్ళలో భద్రపరచి ఉంచాడు. అవి స్వర్గంలోని కాలువల వద్దకు వచ్చి, వాటి పళ్ళను తింటాయి. బంగారపు పడకలపై విశ్రాంతి పొందుతాయి. అవి దైవసింహాసనం క్రింద వ్రేలాడుతూ ఉన్నాయి. అవి తమ రుచికరమైన ఆహారం, విలాస వంతమైన విశ్రాంతి మందిరాలను చూచి, ‘మన సోదరుల వద్దకు మనం ఇక్కడ సజీవంగా విలాసవంతమైన జీవితం గడుపుతున్నామని, వారిని కూడా వీటికోసం కృషిచేయాలని, యుద్ధంలో అశ్రద్ధ, సోమరితనం చూపకూడదనే సందేశం ఇచ్చేదెవరు?’ అని అంటారు. అప్పుడు అల్లాహ్‌, ‘నేను మీ ఈ సందేశాన్ని మీ సోదరుల వరకు చేరుస్తానని,’ అన్నాడు, వారిని గురించే అల్లాహ్‌ (త) ఈ ఆయతును అవతరింప జేసాడు: ”అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మృతులుగా భావించకండి, వాస్తవానికి వారు సజీవులై, తమ ప్రభువు వద్ద జీవనోపాధి పొందుతున్నారు.” (ఆల ఇమ్రాన్, 3:169). (అబూ  దావూద్‌)

3854 – [ 68 ] ( لم تتم دراسته ) (2/1131)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “اَلْمُؤْمِنُوْنَ فِي الدُّنْيَا عَلى ثَلَاثَةِ أَجْزَاءٍ: اَلَّذِيْنَ آمَنُوْا بِاللهِ وَرَسُوْلِهِ ثُمَّ لَمْ يَرْتَابُوْا. وَجَاهَدُوْا بِأَمْوَالِهِمْ وَأَنْفُسِهِمْ فِيْ سَبِيْلِ اللهِ. وَالَّذِيْ يَأْمَنُهُ النَّاسُ عَلَى النَّاسِ عَلَى أَمْوَالِهِمْ وَأَنْفُسِهِمْ ثُمَّ الَّذِيْ إِذَا أَشْرَفَ عَلَى طَمَعٍ تَرَكَهُ لِلّهِ عَزَّ وَجَلَّ”. رَوَاهُ أَحْمَدُ .

3854. (68) [2/1131 అపరిశోధితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రపంచంలోని విశ్వాసులు మూడు రకాలు. 1. అల్లాహ్‌(త) నూ, ఆయన ప్రవక్తనూ విశ్వసించి, ఏమాత్రం సంకోచానికి గురికాకుండా తమ ధన ప్రాణాలతో దైవమార్గంలో జిహాద్‌ చేసేవారు. ఇటువంటి వారు అందరికంటే ఉత్తములు. 2. ఇతరులకు ధన, ప్రాణ నష్టాన్ని కలిగించని వారు. వీరు రెండవ తరగతికి చెందినవారు. 3. వీరి హృదయంలో ఆశగా ఉంటుంది. కాని దైవప్రీతి కోసం తన మనోకాంక్షల్ని వదలి వేస్తారు.” (అ’హ్మద్‌)

3855 – [ 69 ] ( حسن ) (2/1132)

وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ أَبِيْ عُمَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَا مِنْ نَفْسٍ مُسْلِمَةٍ يَقْبِضُهَا رَبّهَا تُحِبُّ أَنْ تَرْجِعَ إِلَيْكُمْ وَأَنَّ لَهَا الدُّنْيَا وَمَا فِيْهَا غَيْرُ الشَّهِيْدِ”. قَالَ ابْنُ عمِيْرَةَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَأَنْ أُقتلَ فِيْ سَبِيْلِ اللهِ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ يَكُوْنَ لِيْ أَهْلُ الْوَبَرِ وَالْمَدَرِ”.  رَوَاهُ النَّسَائِيُّ .

3855. (69) [2/1132ప్రామాణికం]

అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ అబీ ‘ఉమైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ఏ విశ్వాసి ఆత్మను అల్లాహ్‌ (త) ఎత్తుకుంటాడో ఆ ఆత్మ మళ్ళీ ప్రపంచంలోనికి రావడానికి ఇష్టపడదు, భూలోకంలోని ధన సంపద లన్నీ లభించినా సరే. అయితే షహీద్‌ తప్ప. అంటే షహీద్‌ స్వర్గంలోని అనుగ్రహాలను చూచి మళ్ళీ ప్రపంచంలోనికి రావాలని కాంక్షిస్తాడు, ”నేను అల్లాహ్ (త) మార్గంలో వీరమరణం పొందటం ప్రపంచంలోని వస్తువులన్నిటి కంటే  నాకు  ఇష్టం.”  (నసాయి’)

3856 – [ 70 ] ( لم تتم دراسته ) (2/1132)

وَعَنْ حَسْنَاءَ بِنْتِ مُعَاوِيَةَ قَالَتْ: حَدَّثَنَا عَمِّيْ قَالَ: قُلْتُ لِلنَّبِيِّ صلى الله عليه وسلم: مَنْ فِي الْجَنَّةِ؟ قَالَ: “النَّبِيُّ فِي الْجَنَّةِ وَالشَّهِيْدُ فِي الْجَنَّةِ وَالْمَوْلُوْدُ فِي الْجَنَّةِ وَالْوَئِيْدُ فِي الْجَنَّةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3856. (70) [2/1132 అపరిశోధితం]

‘హస్‌నా’ బిన్‌తె ము’ఆవియహ్‌ (ర) కథనం: మా చిన్నాన్న నాతో ఇలా అన్నారు, ”నేను ప్రవక్త (స)ను, ‘స్వర్గంలో ఎటువంటి వారుంటారు,’ అని అడిగాను. దానికి ప్రవక్త (స) స్వర్గంలో ప్రవక్తలు, అమరవీరులు, యుక్త వయస్సుకు చేరని పిల్లలు, సజీవంగా ఖననం చేయబడిన బాలికలు ఉంటారు,’ అని సమాధానం ఇచ్చారు.  (అబూ  దావూద్‌)

3857 – [ 71 ] ( ضعيف ) (2/1132)

وَعَنْ عَلِيٍّ وَأَبِيْ الدَّرْدَاءِ وَأَبِيْ هُرَيْرَةَ وَأَبِيْ أُمَامَةَ وَعَبْدِ اللهِ بْنِ عُمَرَ وَعَبْدِ اللهِ بْنِ عَمْرٍووَجَابِرِبْنِ عَبْدِ اللهِ وَعِمْرَانَ بْنِ حُصَيْنٍ رَضِيَ اللهُ عَنْهُمْ أَجْمَعِيْنَ كُلُّهُمْ يُحَدِّثُ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أَنَّهُ قَالَ: “مَنْ أَرْسَلَ نَفَقَةً فِيْ سَبِيْلِ اللهِ وَأَقَامَ فِي بَيْتِهِ فَلَهُ بِكُلِّ دِرهَمٍ سَبْعُمِائَةِ دِرْهَمٍ وَمَنْ غَزَا بِنَفْسِهِ فِي سَبِيْلِ اللهِ وَأَنْفَقَ فِيْ وَجْهِهِ ذَلِكَ فَلَهُ بِكُلِّ دِرْهَمٍ سَبْعُمِائَةِ أَلْفِ دِرْهَمٍ”.ثُمَّ تَلَا هَذِهِ الْآيَةِ: (وَاللهِ يُضَاعِفُ لِمَنْ يَّشَاءُ؛ 2: 261).  رَوَاهُ ابْنُ مَاجَهُ .

3857. (71) [2/1132 బలహీనం]

అలీ, అబూ దర్‌దా, అబూ హురైరహ్‌, అబూ ఉమామ, అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ మరియు అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్ర్‌, జాబిర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌, ఇమ్రాన్‌ బిన్‌ హుసైన్‌ (ర) మొదలైన వారి కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దైవ మార్గంలో ఖర్చుల నిమిత్తం ధనాన్ని పంపి, తాను ఇంట్లో కూర్చున్న వ్యక్తికి ప్రతి దిర్‌హమ్‌కు బదులు 700 దిర్‌హమ్‌ల పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా తాను దైవమార్గంలోని జిహాద్‌లో పాల్గొని, తన ధనాన్ని కూడా ఖర్చుపెడితే, ప్రతి దిర్‌హమ్‌కి బదులు అతనికి 7 లక్షల దిర్‌హమ్‌ల పుణ్యం లభిస్తుంది. దీన్ని సమర్థిస్తూ ఈ వాక్యాన్ని పఠించారు: ”..అల్లాహ్ తాను కోరినవారికి హెచ్చుగా నొసంగుతాడు…” (ఇబ్నె  మాజహ్)

3858- [ 72 ] ( لم تتم دراسته ) (2/1132)

وعَنْ فُضَالَةَ بْنِ عُبَيْدٍ قَالَ: سَمِعْتُ عُمَرَبنِ الخَطَّابِ يَقُولُ: سَمِعْتُ رَسُول الله صَلىَّ الله عَلَيهِ وسَلَّم يَقُولُ: “الشُّهَدَاءُ أربَعَةٌ: رَجُلٌ مُّؤمِنٌ جَيَّدُ الإيمَانِ لَقِيَ العدو فصدق الله حتى قتل فذلك الذي يرفع الناس إليه أعينهم يوم القيامة هكذا “. ورفع رأسه حتى سقطت قلنسوته فما أدري أقلنسوة عمرأراد أم قلنسوة النبي صلى الله عليه وسلم؟ قَالَ: “ورجل مؤمن جيد الإيمان لقي العدو كأنما ضرب جلده بشوك طلح من الجبن أتاه سهم غرب فقتله فهو في الدرجة الثانية ورجل مؤمن خلط عملا صالحا وآخر سيئا لقي العدو فصدق الله حتى قتل فذلك في الدرجة الثالثة ورجل مؤمن أسرف على نفسه لقي العدو فصدق الله حتى قتل فذاك في الدرجة الرابعة”.  رواه الترمذي وقَالَ: هذا حديث حسن غريب .

3858. (72) [2/1132 అపరిశోధితం]

ఫుజాల బిన్‌ ఉబైద్‌ కథనం: నేను ఉమర్‌ (ర) ను ఇలా అంటూ ఉండగా విన్నాను, ”ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”అమరవీరులు నాలుగు రకాలు. 1. దృఢ విశ్వాసం కలిగి దైవమార్గంలో శత్రువులతో పోరాడి అల్లాహ్‌తో చేసిన వాగ్దానాలను నిజమని నిరూపించి పోరాడుతూ వీరమరణం పొందాడు. తీర్పుదినం నాడు అతనికి ఎంత గొప్ప స్థానం లభిస్తుందంటే, ప్రజలు అతనివైపు కళ్ళార్పకుండా చూస్తూ ఉంటారు. వారు తమ తలలు ఎత్తటం వల్లవారి టోపీలు పడిపోతాయి. ఉల్లేఖనకర్త ఎవరి టోపీ పడిందో నాకు తెలీదు అని అన్నారు. ఉమర్‌(ర)దా లేక ప్రవక్త(స)దా. 2. పరిపూర్ణ విశ్వాసం కలిగి, అల్లాహ్‌ (త) మార్గంలో శత్రువుతో పోరాడాడు. భయాందోళనలకు గురి అయ్యాడు. తనకు ముళ్ళు గుచ్చినట్లు గ్రహించాడు. ఇంతలో అనుకోకుండా బాణం వచ్చింది, అతన్ని హతమార్చింది. ఇతనికి రెండవ స్థానం లభిస్తుంది. 3. ఇతడు కొన్ని సత్కార్యాలు చేసాడు. కొన్ని పాపకార్యాలు చేసాడు.  ఇంకా దైవమార్గంలో శత్రువుతో పోరాడి దైవంతో చేసిన వాగ్దా లను సత్యమని నిరూపించాడు, చివరికి వీరమరణం పొందాడు. ఇతడు మూడవ తరగతికి చెందినవాడు. 4. తన్ను తాను దుర్మార్గానికి గురిచేసుకున్న విశ్వాసి. అంటే పాపాలు చేసి అల్లాహ్‌ మార్గంలో శత్రువులతో పోరాడి, అల్లాహ్‌తో చేసిన వాగ్దానాలను నిజమని నిరూపించాడు. అంటే చాలా వీరోచితంగా పోరాడాడు. అమరవీరుల గురించి అల్లాహ్‌ (త) చేసిన వాగ్దానాలను సత్యమైనవని గ్రహించాడు. చివరికి వీరమరణం పొందాడు. ఇతడు నాల్గవ తరగతికి చెందినవాడు. (తిర్మిజి’ / ప్రామాణికం-ఏకోల్లేఖనం)

3859 – [ 73 ] ( صحيح ) (2/1133)

وَعَنْ عُتْبَةَ بْنِ عَبْدِ السُّلَمِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم : “اَلْقَتْلَى ثَلَاثَةٌ: مُؤْمِنٌ جَاهَدَ بِنَفْسِهِ وَمَالِهِ فِيْ سَبِيْلِ اللهِ فَإِذَا لَقِيَ الْعَدُوّ قَاتَلَ حَتَّى يُقْتَلَ” .قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم فِيْهِ: “فَذَلِكَ الشَّهِيْدُ الْمُمْتَحَنُ فِيْ خَيْمَةِ اللهِ تَحْتَ عَرْشِهِ لَا يَفْضلُهُ النَّبِيُّوْنَ إِلَّا بِدَرَجَةِ النبُوَّةِ. وَمُؤْمِنٌ خَلَطَ عَمَلًا صَالِحًا وَآخَرَ سَيِّئًا جَاهَدَ بِنَفْسِهِ وَمَالِهِ فِيْ سَبِيْلِ اللهِ إِذَا لَقِيَ الْعَدُوَّ قَاتَلَ حَتَّى يُقْتَلَ”. قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم فِيْهِ: “مُمَصْمِصَةٌ مَحَتْ ذُنُوْبَهُ وَخَطَايَاهُ إِنَّ السَّيْفَ مَحَّاءٌلِلْخَطَايَا وَأُدْخِلَ مِنْ أَيِّ أَبْوَابِ الْجَنَّةِ شَاءَ وَمُنَافِقٌ جَاهَدَ بِنَفْسِهِ وَمَالِهِ فَإِذَا لَقِيَ الْعَدُوّ قَاتَلَ حَتَّى يُقْتَلَ فَذَاكَ فِي النَّارِ إِنَّ السَّيْفَ لَا يَمْحُوالنِّفَاقَ”. رَوَاهُ الدَّارَمِيُّ .

3859. (73) [2/1133దృఢం]

‘ఉత్‌బహ్ బిన్‌ ‘అబ్దుసులమీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, దైవమార్గంలో మరణించేవారు మూడు రకాలు. 1. దైవమార్గంలో తన ధనప్రాణాల ద్వారా జిహాద్‌ చేస్తూ శత్రువుతో వీరోచితంగా పోరాడి, వీరమరణం పొందిన విశ్వాసి. ప్రవక్త (స) ‘అతడు షహీద్‌, అతన్ని సహనం, కష్టాలు, స్థిరత్వాల ద్వారా పరీక్షించడం జరిగింది, అతడు పరీక్షలో నెగ్గాడు,’ కనుక అతడు అల్లాహ్‌ (త) సింహాసనం క్రింద అమోఘమైన భావనంలో ఉంటాడు. ప్రవక్తలు తప్ప అతనికంటే గొప్ప స్థానాలు కలిగి ఇతరులెవ్వరూ ఉండరు. ప్రవక్తలు మాత్రమే దైవదౌత్యంవల్ల అతనికంటే గొప్పస్థానాలు కలిగి ఉంటారు,’ అని అన్నారు. 2. కొన్ని సత్కార్యాలు, కొన్ని పాపకార్యాలు చేసి, తన ధన ప్రాణాల ద్వారా అల్లాహ్‌ మార్గంలో జిహాద్‌ చేస్తూ శత్రువును ఎదుర్కొని అతనితో యుద్ధం చేస్తూ చంపబడిన విశ్వాసి. అతని గురించి ప్రవక్త (స) చర్చిస్తూ అతడి పాపాలను అతని వీరమరణం తుడిచివేస్తుంది. ఎందుకంటే కరవాలం పాపాలను చెరిపివేస్తుంది. ఇంకా అతన్ని స్వర్గంలోని ఏ ద్వారం ద్వారా నైనా ప్రవేశించవచ్చని ఆదేశించడం జరుగుతుంది,’ అని అన్నారు. 3. తన ధన ప్రాణాల ద్వారా దైవమార్గంలో పోరాడి శత్రువులను ఎదుర్కొని వీరోచితంగా పోరాడి చివరికి చంపబడ్డ కపటాచారి నరకంలో ప్రవేశిస్తాడు. ఎందుకంటే కరవాలం కాపట్యాన్ని తొలగించదు. (దార్మి)

3860 – [ 74 ] ( لم تتم دراسته ) (2/1133)

وَعَنِ ابْنِ عَائِذٍ قَالَ: خَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ جَنَازَةِ رَجُلٍ فَلَمَّا وُضِعَ قَالَ عُمَرُ بْنُ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ: لَا تُصَلِّ عَلَيْهِ يَا رَسُوْلَ اللهِ فَإِنَّهُ رَجُلٌ فَاجِرٌ . فَالْتَفَتَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلَى النَّاسِ فَقَالَ: “هَلْ رَآهُ أَحَدٌ مِّنْكُمْ عَلَى عَمَلِ الْإِسْلَامِ؟” فَقَالَ رَجُلٌ: نَعَمْ يَا رَسُوْلَ اللهِ حَرَسَ لَيْلَةً فِيْ سَبِيْلِ اللهِ. فَصَلّى عَلَيْهِ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَحَثَا عَلَيْهِ التُّرَابَ وَقَالَ: “أَصْحَابُكَ يَظُنُّوْنَ أَنَّكَ مِنْ أَهْلِ النَّارِ وَأَنَا أَشْهَدُ أَنَّكَ مِنْ أَهْلِ الْجَنَّةِ”. وَقَالَ: “يَا عُمَرُ إِنَّكَ لَا تُسْأَلُ عَنْ أَعْمَالِ النَّاسِ وَلَكِنْ تُسْأَلُ عَنِ الْفِطْرَةِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

3860. (74) [2/1133 అపరిశోధితం]

ఇబ్నె ‘ఆయిజ్‌’ (ర) కథనం: ప్రవక్త (స) ఒక జనా’జహ్ లో పాల్గొన్నారు. జనా’జహ్ ను ఉంచి నపుడు ప్రవక్త (స) జనా’జహ్ నమా’జు చదవటానికి సిద్ధపడగా, ‘ఉమర్‌ (ర) ‘ప్రవక్తా! ఈ వ్యక్తి జనా’జహ్ నమా’జు చదవకండి, ఎందుకంటే ఇతడు చాలా నీచమైనవాడు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ప్రజల నుద్దేశించి, ‘మీలో ఎవరైనా ఇతన్ని ఇస్లామీయ కార్యం చేస్తుండగా చూసారా?’ అని ప్రశ్నించారు. ఒక వ్యక్తి, ‘అవును ఓ ప్రవక్తా! ఈ వ్యక్తి ఒక రోజు రాత్రి అల్లాహ్ (త) మార్గంలో కాపలాకాసాడు’ అని అన్నాడు. ప్రవక్త (స) అతని జనా’జహ్ నమా’జు చదివించారు, ఇంకా తన చేత్తో అతని సమాధిలో మట్టి వేసారు. ఇంకా అతని గురించి ప్రస్తావిస్తూ ‘నీ మిత్రులు నిన్ను నరకవాసిగా భ్రమపడు తున్నారు. అయితే నీవు స్వర్గవాసివని నేను సాక్ష్యం ఇస్తున్నాను,’ అని పలికి, ఆ తరువాత, ‘ఓ ‘ఉమర్‌! ప్రజల ఆచరణల గురించి నిన్ను ప్రశ్నించడం జరుగదు. అయితే నిన్ను ఇస్లామ్‌ గురించి ప్రశ్నించడం జరుగుతుంది.’  (బైహఖీ)

=====

1بَابُ إِعْدَادِ آلَةِ الْجِهَادِ

1. యుద్ధంకోసం ఆయుధాలు సిద్ధపరచటం

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

3861 – [ 1 ] ( صحيح ) (2/1135)

عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَهُوَ عَلى الْمِنْبَرِ يَقُوْلُ: “(وَأَعِدُّوْا لَهُمْ مَا اسْتَطَعْتُمْ مِنْ قُوَّةٍ…8:60). أَلَا إِنَّ الْقُوَّةَ الرَّمْيُ أَلَا إِنَّ الْقُوَّة الرَّمْيُ. أَلَا إِنَّ الْقُوَّةَ الرّمْيُ. رَوَاهُ مُسْلِمٌ .

3861. (1) [2/1135దృఢం]

ఉఖ్‌బ బిన్‌ ఆమిర్‌ (ర) కథనం: మెంబరుపై ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ”మరియు మీరు వారి (మీ శత్రువుల) కొరకు, మీ శక్తిమేరకు  బలసామాగ్రిని, సిద్ధపరచుకొండి..(అల్ అన్ఫాల్, 8:60),” అయితే గుర్తుంచుకోండి! బలం అంటే విసరటమే, గుర్తుంచుకోండి! బలం అంటే విసరటమే, గుర్తుంచు కోండి! బలం అంటే విసరటమే.” [8] (ముస్లిమ్‌)

3862 – [ 2 ] ( صحيح ) (2/1135)

وَعَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ الله صلى الله عليه وسلم يَقُوْلُ: “سَتُفْتَحُ عَلَيْكُمْ الرُّوْمُ وَيَكْفِيْكُمُ اللهُ فَلَا يُعْجَزُ أَحَدُكُمْ أَنْ يَلهُوَ بِأَسْهُمِهِ”.  رَوَاهُ مُسْلِمٌ .

3862. (2) [2/1135దృఢం]

‘ఉఖ్‌బహ్ బిన్‌ ‘ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. ”భవిష్యత్తులో మీరు రూమ్‌ సామ్రాజ్యాన్ని జయిస్తారు. అల్లాహ్‌ (త) మీకు సహాయం చేస్తాడు. అయితే మీరు బాణవిద్యను విస్మరించరాదు, సోమరితనానికి గురికారాదు.” [9]  (ముస్లిమ్‌)

3863 – [ 3 ] ( صحيح ) (2/1135)

وَعَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ عَلِمَ الرَّمْيَ ثُمَّ تَرَكَهُ فَلَيْسَ مِنَّا أَوْ قَدَ عَصَى”. رَوَاهُ مُسْلِمٌ .

3863. (3) [2/1135దృఢం]

‘ఉఖ్‌బ బిన్‌ ‘ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”బాణ విద్య నేర్చుకొని, దాన్ని వదలివేసినవాడు మనలోనివాడు కాడు, లేదా అతడు అవిధేయతకు పాల్పడ్డాడు” అని అన్నారు.  (ముస్లిమ్‌)

3864 – [ 4 ] ( صحيح ) (2/1135)

وَعَنْ سَلَمَةَ بْنِ الْأَكْوَعِ قَالَ: خَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم علَى قَوْمٍ مِنْ أَسْلَمَ يَتَنَاضَلُوْنَ بِالسُّوْقِ فَقَالَ: “ارْمُوْا بَنِيْ إِسْمَاعِيْلَ. فَإِنَّ أَبَاكُمْ كَانَ رَامِيًا وَأَنَا مَعَ بَنِي فُلَانٍ”. لِأَحَدٍ الْفَرِيْقَيْنِ فَأَمْسَكُوْا بِأَيْدِيْهِمْ فَقَالَ: “مَا لَكُمْ؟” قَالُوْا: وَكَيْفَ نَرْمِيْ وَأَنْتَ مَعَ بَنِيْ فُلَانٍ؟ قَالَ: “ارْمُوْا وأَنَا مَعَكُمْ كُلِّكُمْ”. رَوَاهُ الْبُخَارِيُّ .

3864. (4) [2/1135దృఢం]

సలమహ్ బిన్‌ అక్వ’అ కథనం: ప్రవక్త (స) అస్‌లమ్‌ వర్గం వద్దకు వెళ్ళారు. అక్కడ వారు బజారులో బాణాలు వదలటం చూచారు. అదిచూసి ప్రవక్త(స) ‘ఓ ఇస్మాయీల్‌ సంతానమా! అంటే అరబ్‌ ప్రజలారా! మీరు బాణవిద్య నేర్చుకుంటూ ఉండండి. మీ తండ్రి ఇస్మాయీల్‌ కూడా విలువిద్యలో ప్రావీణ్యులే. ఇక్కడున్న రెండు బృందాలలో, ఒక బృందంతో నేను ఉన్నాను,’ అని అన్నారు. అది విన్న మరో వర్గం వారు నేర్చుకుంటున్న విలువిద్య ఆపివేసారు. ప్రవక్త (స) వారితో, ‘మీరెందుకు ఆపివేసారు,’ అని ప్రశ్నించారు. దానికి వారు, ‘తమరు వారి వైపు ఉన్నారు, మా వైపుకు రాలేదు, మరి మేమెలా బాణాలు వదలాలి,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఇప్పుడు నేను మీ అందరివెంట ఉన్నాను. ఇప్పుడు మీరు పరస్పరం బాణవిద్య నేర్చుకోవడం కొనసాగించండి,’ అని అన్నారు.  (బు’ఖారీ)

3865 – [ 5 ] ( صحيح ) (2/1136)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ أَبُوْ طَلْحَةَ يَتَتَرَّسُ مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم بِتُرْسٍ وَاحِدٍ وَكَانَ أَبُوْ طَلْحَةَ حَسَنَ الرَّمْيِ فَكَانَ إِذَا رَمَى تَشَرَّفَ النَّبِيُّ صلى الله عليه وسلم فَيَنْظُرُ إِلَى مَوْضِعِ نَبْلِهِ. رَوَاهُ الْبُخَارِيُّ .

3865. (5) [2/1136 దృఢం]

అనస్‌ (ర) కథనం: అబూ ‘త’ల్హా ఒక ఢాలుతో ప్రవక్త (స)ను శత్రువుల నుండి తప్పించేవారు, అబూ ‘త’ల్హా విలువిద్యలో ప్రావీణ్యులు. అబూ ‘త’ల్హా బాణాలు వదిలినప్పుడు ప్రవక్త (స) అతని బాణం పడే చోటును, అంటే ఆ బాణం శత్రువుకు తగిలిందా లేదా చూచేవారు. (బు’ఖారీ)

3866 – [ 6 ] ( متفق عليه ) (2/1136)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: (اَلْبَرَكَةُ فِيْ نَوَاصِيْ الْخَيْلِ).

3866. (6) [2/1136ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”గుర్రాల నుదుటిపై శుభం ఉంది” అని అన్నారు. [10] (బు’ఖారీ, ముస్లిమ్‌)

3867 – [ 7 ] ( صحيح ) (2/1136)

وَعَنْ جَرِيْرِ بْنِ عَبْدِ اللهِ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَلْوِيْ نَاصِيَةَ فَرَسٍ بِأصْبَعِهِ وَيَقُوْلُ: “اَلْخَيْلُ مَعْقُوْدٌ بِنَوَاصِيْهَا الْخَيْرُ إِلَى يَوْمِ الْقِيَامَةِ: الْأَجْرُ وَالْغَنِيْمَةُ”. رَوَاهُ مُسْلِمٌ.

3867. (7) [2/1136దృఢం]

జరీర్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) ను ఒక గుర్రం యొక్క నుదుటి వెంట్రుకలను త్రిప్పుతూ చూచాను. ప్రవక్త (స) తన వ్రేళ్ళతో త్రిప్పుతూ గుర్రాల నుదుర్లలో తీర్పుదినం వరకు శుభం ఉంచడం జరిగింది.[11](ముస్లిమ్‌)

3868 – [ 8 ] ( صحيح ) (2/1136)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنِ احْتَبَسَ فَرَسًا فِيْ سَبِيْلِ اللهِ إِيْمَانًا وَتَصْدِيْقًا بِوَعْدِهِ فَإِنَّ شِبَعَهُ وَرَيَّهُ وَرَوْثَهُ وَبَوْلَهُ فِيْ مِيْزَانِهِ يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ الْبُخَارِيُّ .

3868. (8) [2/1136 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘విశ్వాసంతో, ప్రతిఫలం లభిస్తుందనే దృఢ నమ్మకంతో గుర్రాన్ని దైవమార్గంలో ఉంచితే గుర్రం ఆహారం, నీరు, మూత్రం, మలం మొదలైన వాటన్నిటినీ తీర్పుదినం నాడు తూనికల్లో పెట్టి తూయటం జరుగుతుంది. అంటే వీటన్నిటికీ పుణ్యం లభిస్తుంది.’  (బు’ఖారీ)

3869 – [ 9 ] ( صحيح ) (2/1136)

وَعَنْهُ قَالَ:كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَكْرَهُ الشِّكَالَ فِي الْخَيْلِ وَالشِّكَالُ: أَنْ يَّكُوْنَ الْفَرَسُ فِيْ رِجْلِهِ الْيُمْنَى بِيَاضٌ وَفِيْ يَدِهِ الْيُسْرَى أَوْ فِيْ يَدِهِ الْيُمْنَى وَرِجْلِهِ الْيُسْرَى. رَوَاهُ مُسْلِمٌ.

3869. (9) [2/1136దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) షికాల్ ఉండే గుర్రం అంటే ఇష్టపడేవారు కాదు. షికాల్ అంటే కుడికాలు, ఎడమచేతిలో తెల్లదనం లేదా ఎడమ కాలు, కుడిచేతిలో తెల్లదనం ఉండటం. (ముస్లిమ్‌)

3870 – [ 10 ] ( متفق عليه ) (2/1136)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم سَابَقَ بَيْنَ الْخَيْلِ الَّتِيْ أُضْمِرَتْ مِنَ الْحَفْيَاءِ وَأَمَدُهَا ثَنِيَّةُ الْوَدَاعِ وَبَيْنَهُمَا سَتَّةُ أَمْيَالٍ وَسَابَقَ بَيْنَ الْخَيْلِ الَّتِيْ لَمْ تُضْمَرْمِنَ الثَّنيَّةِ إِلَى مَسْجِدِ بَنِيْ زُرَيْقٍ وَبَيْنَهُمَا مِيْلٌ.

3870. (10) [2/1136ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ము’ద్మిర్‌ గుర్రాల మధ్య గుర్రపు పందాలు పెట్టారు. హఫ్‌యా నుండి సవియ్యతుల్‌ విదా వరకు. అంటే ఈ రెండు ప్రదేశాల మధ్య దూరం 6 మైళ్ళ దూరం ఉంటుంది. కళ్ళాలు లేని గుర్రాలకు ఒక మైలు దూరంలో పోటీ జరిగింది.[12] (బు’ఖారీ, ముస్లిమ్‌)

3871 – [ 11 ] ( صحيح ) (2/1137)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَتْ نَاقَةٌ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم تُسَمَّى الْعَضْبَاء وَكَانَتْ لَا تُسْبَقُ فَجَاءَ أَعْرَابِيّ عَلَى قُعُوْدٍ لَهُ فَسَبَقَهَا فَاشْتَدَّ ذَلِكَ علَى الْمُسْلِمِيْنَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ حَقّا عَلَى اللهِ أَن لَّا يَرْتَفِعَ شَيْءٌ مِّنَ الدُّنْيَا إِلَّا وَضَعَهُ”. رَوَاهُ الْبُخَارِيُّ .

3871. (11) [2/1137 దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త(స) వద్ద ద్బా అనే ఆడ ఒంటె ఉండేది. ఇది చాలా వేగంగా పరిగెత్తేది. ఏ ఒంటే దానికంటే ముందు పరిగెత్తేది కాదు. అంటే ప్రవక్త (స) ఒంటె ఎప్పుడూ ముందు ఉండేది. ఒకపల్లెవాసి ఒంటెపై కూర్చొని వచ్చాడు. అతడు ప్రవక్త (స) ఒంటె కంటే ముందుకు పోయాడు. ముస్లిములు దీన్ని భరించలేక పోయారు. అది చూచి ప్రవక్త (స) ”ప్రపంచంలో ఒక్కోసారి ముందు ఉండటం, ఒక్కోసారి వెనుక ఉండటం అల్లాహ్‌ తీర్పే,”  అని అన్నారు.[13]  (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం  

3872 – [ 12 ] ( لم تتم دراسته ) (2/1137)

عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ اللهَ تَعَالى يُدْخِلُ بِالسَّهْمِ الْوَاحِدِ ثَلَاثَةَ نَفَرِ الْجَنَّةَ: صَانِهُ يَحْتَسِبُ فِيْ صَنْعَتِهِ الْخَيْرَ وَالرَّامِيَ بِهِ وَمُنَبِّلَهُ فَارْمُوْا وَارْكبُوْا وَأَنْ تَرَمُوْا أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ تَرْكَبُوْا كُلُّ شَيْءٍ يَلْهُوْ بِهِ الرَّجُلُ بِاطِلٌ إِلَّا رَمْيَةُ بِقَوْسِهِ وَتَأْدِيْبَهُ فَرَسَهُ وَمَلَاعَبَتَهُ اِمْرَأَتَهُ فَإِنَّهُنَّ مِنَ الْحَقِّ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ

وَزَادَ أَبُوْدَاوُدَ وَالدَّارَمِيُّ: “وَمَنْ تَرَكَ الرَّمْيَ بَعْدَ مَا عَلِمَهُ رَغْبَةً عَنْهُ فَإِنَّهُ نِعْمَةٌ تَرَكَهَا”. أَوْقَالَ: ” كَفَرَهَا “.

3872. (12) [2/1137అపరిశోధితం]

‘ఉఖ్‌బహ్ బిన్‌ ‘ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ”అల్లాహ్‌ (త) ఒక్క బాణం వల్ల ముగ్గురిని స్వర్గంలోనికి పంపిస్తాడు: 1. పుణ్యఫలా పేక్షతో బాణం తయారుచేసే వాడిని, 2. జిహాద్‌లో బాణం విసిరే వాడిని, 3. జిహాద్‌లో ముజాహిద్‌కు బాణం అందించే వాడిని. అందువల్ల మీరు బాణవిద్య నేర్చుకోండి, గుర్రపు స్వారీ నేర్చుకోండి. అయితే గుర్రపు స్వారీ కంటే విలువిద్య మాకు చాలా ఇష్టం. ప్రపంచంలో ప్రతి ఆట లాభం లేనిదే. కాని విలువిద్య, గుర్రాన్ని పరిగెత్తించటం నేర్పటం ఇంకా తన భార్యపట్ల సంతోషంగా ప్రవర్తించటం, నవ్వు, ఎగతాళి ధర్మమైనవి. ఎందుకంటే ఇవి వారి హక్కులు.” (తిర్మిజి,  ఇబ్నె  మాజహ్)

అయితే అబూ  దావూద్‌, దార్మిలలో అధికంగా, ”విలువిద్య నేర్చుకుని వదలివేసి, దానిపట్ల ఆసక్తి చూపక  పోతే కృతఘ్నతకు పాల్పడినట్లవుతుంది.” అని ఉంది.

3873 – [ 13 ] ( صحيح ) (2/1137)

وَعَنْ أَبِيْ نَجِيْحٍ السُّلَمِيِّ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ بَلَغَ بِسَهْمٍ فِيْ سَبِيْلِ اللهِ فَهُوَ لَهُ دَرَجَةٌ فِي الْجَنَّةِ. وَمَنْ رَمَى بِسَهْمٍ فِيْ سَبِيْلِ اللهِ فَهُوَ لَهُ عِدْلُ مُحَرَّرٍ. وَمَنْ شَابَ شَيْبَةً فِي الْإِسْلَامِ كَانَتْ لَهُ نُوْرًا يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعْبِ الْإِيْمَانِ.

 وَرَوَى أَبُوْ دَاوُدَ اَلْفَصْلُ الْأَوَّلُ وَالنَّسَائِيُّ الْأَوَّلَ وَالثَّانِيْ وَالتِّرْمِذِيُّ الثَّانِيَ وَ الثَّالِثَ وَفِيْ رِوَايَتِهِمَا: “مَنْ شَابَ شَيْبَةً فِيْ سَبِيْلِ اللهِ “بَدَلَ” فِي الْإِسْلَامِ”.

3873. (13) [2/1137 దృఢం]

అబూ నజీ’హ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా, నేను విన్నాను. ”అల్లాహ్(త) మార్గంలో బాణం వదలి శత్రువును చంపితే అతని కొరకు స్వర్గం తప్పనిసరి అవుతుంది. అదేవిధంగా అల్లాహ్(త) మార్గంలో బాణం వదిలితే, అతనికి బానిసను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా ముస్లిమ్‌గా ముసలివాడైతే తీర్పు దినం నాడు అతని ముసలితనం వెలుగుగా మారిపో తుంది.” (బైహఖీ, అబూ దావూద్‌, నసాయి, తిర్మిజి’)

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”అల్లాహ్‌(త) మార్గంలో ముసలి తనానికి చేరుకున్నవాడు అంటే ఇస్లామీయ ఆచరణలు ఆచరిస్తూ లేదా అల్లాహ్‌ (త) మార్గంలో జిహాద్‌ చేస్తూ ముసలివాడైతే తీర్పుదినం నాడు అతని ముసలితనం వెలుగుగా, కారుణ్యంగా పనికివస్తుంది.

3874 – [ 14 ] ( صحيح ) (2/1137)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا سَبَقَ إِلَّا فِيْ نَصْلٍ أَوْ خُفٍّ أَوْ حَافِرٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

3874. (14) [2/1137 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పందాలు కేవలం 3 విషయాల్లో ధర్మసమ్మతం: 1. బాణాలు విసరటం, 2. ఒంటె, లేదా 3. గుర్రాలను పరిగెత్తించటం.” [14]  (తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’)

3875 – [ 15 ] ( ضعيف ) (2/1138)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَدْخَلَ فَرَسًا بَيْنَ فَرَسَيْنِ فَإِنْ كَانَ يُؤْمَنُ أَنْ يَسْبِقَ فَلَا خَيْرَ فِيْهِ وَإِنْ كَانَ لَا يُؤْمِنُ أَنْ يَسْبِقَ فَلَا بَأْسَ بِهِ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ

وَفِيْ رِوَايَةِ أَبِيْ دَاوُدَ: قَالَ: “مَنْ أَدْخَلَ فَرَسًا بَيْنَ فَرَسَيْنِ يَعْنِيْ وَهُوَ لَا يَأْمَنُ أَنْ يُسْبَقَ فَلَيْسَ بِقِمَارٍوَ مَنْ أَدْخَلَ فَرَسًا بَيْنَ فَرَسَيْن وقَدْ أَمِنَ أَنْ يُسْبَقَ فَهُوَ قِمَارٌ”.

3875. (15) [2/1138 బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ఎవరైనా తన గుర్రాన్ని పందెంలో ఉన్న రెండు గుర్రాల మధ్య వదలి, ఈ గుర్రం ఆ రెంటికన్నా ముందుకు దూసుకు పోతుందనే నమ్మకం ఉంటే ఇది మంచిపని కాదు. ఒకవేళ ముందుకు దూసుకు పోతుందని నమ్మకం లేకుంటే ఎటువంటి అభ్యంతరం లేదు.” [15] (షర్‌హుస్సున్నహ్‌)

అబూ దావూద్‌లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఎవ రైనా రెండు పందెపు గుర్రాల మధ్య తన గుర్రాన్ని వదిలితే, అది ముందుకు దూసుకు పోతుందని నమ్మకం లేకుంటే ఇది జూదం కాదు. అదే విధంగా ఎవరైనా తన గుర్రాన్ని రెండు గుర్రాల మధ్య వదిలితే, అది ముందుకు పోతుందని నమ్మకం ఉంటే అది జూదం అవుతుంది.”

3876 – [ 16 ] ( لم تتم دراسته ) (2/1138)

وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا جَلَبَ وَلَا جَنَبَ”.

 زَادَ يَحْيَى فِيْ حَدِيْثِهِ:”فِي الرِّهَانِ”. رَوَاهُ أَبُوْدَاوُدَ وَالنَّسَائِيُّ.

 وَرَوَاهُ التِّرْمِذِيُّ مَعَ زيَادَةٍ فِيْ بَابِ “الْغَضْبِ”.

3876. (16) [2/1138 అపరిశోధితం]

‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”గుర్రపు పందాలలో బ్‌, బ్ ధర్మ సమ్మతం కావు.” [16]  (అబూ  దావూద్‌, నసాయి’, తిర్మిజి’)

3877 – [ 17 ] ( صحيح ) (2/1138)

وَعَنْ أَبِيْ قَتَادَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “خَيْرُ الْخَيْلِ الْأَدْهَمُ الْأَقْرَحُ الْأَرْثَمُ. ثُمَّ الْأَقْرَحُ الْمَحَجّلُ طُلُقُ الْيَمِيْنِ فَإِنْ لَمْ يَكُنْ أَدْهَمَ فَكُمَيْتٌ عَلَى هَذِهِ الشِّيَةَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ .

3877. (17) [2/1138 దృఢం]

అబూ ఖతాదహ్ (ర) కథనం: ప్రవక్త (స)  ప్రవచనం: ”అన్నిటి కంటే మేలైన గుర్రం అద్‌హమ్‌ -అఖ్‌ర’హ్‌-అర్‌స’మ్‌. ఆ తరువాత అఖ్‌రహ్‌ ము’హజ్జల్‌ తుల్‌ఖుల్‌ యమీన్‌. ఒక వేళ అద్‌హమ్‌ లేకుంటే, దాని చిహ్నాలు గల దాన్ని ఎంచుకోవటం జరుగుతుంది.”[17](తిర్మిజి’, దార్మి)

3878 – [ 18 ] ( ضعيف ) (2/1139)

وَعَنْ أَبِيْ وَهْبِ الْجُشَمِيُّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عَلَيْكُمْ بِكُلِّ كُمَيْتٍ أَغَرَّ مُحَجَّلٍ أَوْ أَشْقَرَ أَغَرَّ مُحَجَّلٍ أَوْ أَدْهَمَ أَغَرَّ مُحَجَّلٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

3878. (18) [2/1139 బలహీనం]

అబూ వహబ్‌ జుషమీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ఒకవేళ మీరు గుర్రాలు ఉంచితే అ’గర్ర్‌-ము’హజ్జల్‌ (అంటే నుదురులు, కాళ్ళు చేతులు తెల్లగా ఉన్నది) లేదా అష్‌ఖర- అ’గర్ర్‌-ము’హజ్జల్‌ (అంటే ఎర్రగా ఉండి, నుదరు, కాళ్ళు చేతులు తెల్లగా ఉన్నది) లేదా అద్‌హమ్‌ అ’గర్ర్‌-ము’హజ్జల్‌ (అంటే నల్లగాఉండి, నుదురు, కాళ్ళు చేతులు తెల్లగా ఉన్న) గుర్రాలు ఉంచండి.” [18]  (అబూ దావూద్‌, నసాయి’)

3879 – [ 19 ] ( حسن ) (2/1139)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُمْنُ الْخَيْلِ فِي الشُّقْرِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ .

3879. (19) [2/1139 ప్రామాణికం]

ఇబ్నె అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎర్రగా ఉండే గుర్రంలో శుభం ఉంది.” (తిర్మిజి, అబూ దావూద్‌)

3880 – [ 20 ] ( ضعيف ) (2/1139)

وَعَنْ عُتْبَةَ بْنِ عَبْدِ السُّلَمِيِّ أَنَّهُ سَمِعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا تَقُصُّوْا نَوَاصِيَ الْخَيْلِ وَلَا مَعَارِفَهَا وَلَا أَذْنَابَهَا فَإِنَّ أَذْنَابَهَا مَذَابُّهَا وَمَعَارِفَهَا دِفَاءُهَا وَنَوَاصِيَهَا مَعْقُوْدٌ فِيْهَا الْخَيْرُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3880. (20) [2/1139బలహీనం]

‘ఉత్‌బహ్ బిన్‌ ‘అబ్ద్‌ సుల్లమీ (ర) కథనం: ప్రవక్త (స) ను ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ‘మీరు గుర్రాల నుదుటి వెంట్రుకలు కత్తిరించకండి. వాటి తోక వెంట్రుకలను కత్తిరించకండి. ఎందుకంటే తోక వాటికి చాలా ఉపయోగకరమైనది. దానితో అవి ఈగలను తోలుకుంటాయి. వాటి నుదురుపై శుభం ఉంటుంది.” (అబూ  దావూద్)

3881 – [ 21 ] ( ضعيف ) (2/1139)

وَعَنْ أَبِيْ وَهْبِ الْجُشَمِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ارْتَبِطُوا الْخَيْلَ وَامْسَحُوْا بِنَوَاصِيَهَا وَأَعْجَازِهَا أَوْ قَالَ: اَكْفَالِهَا وَقَلِّدُوْهَا وَلَا تُقَلِّدُوْهَا الْأَوْتَار”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

3881. (21) [2/1139 బలహీనం]

అబూ వహబ్‌ జుషమీ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”మీరు గుర్రాలను కట్టి ఉంచండి. వాటి నుదుటిపై, తొడలపై చేత్తో నిమురుతూ ఉండండి, వాటి మెడలో ఏదైనా హారాన్ని వేసి ఉంచండి. అయితే తావీజులు, తాయెత్తులు మాత్రం తొడిగించ కండి.” [19] (అబూ దావూద్‌.  నసాయి’)

3882 – [ 22 ] ( لم تتم دراسته ) (2/1139)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَبْدًا مَأْمُوْرًا مَا اخْتصنَا دُوْنَ النَّاسِ بِشَيْءٍ إِلَّا بِثَلَاثٍ: أَمَرَنَا أَنْ نُسْبِغَ الْوُضُوْءَ وَأَنْ لَا نَأْكُلَ الصَّدَقَةَ وَأَنْ لَا نُنْزِيَ حِمَارًا عَلَى فَرَسٍ. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ .

3882. (22) [2/1139అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) అల్లాహ్‌ యొక్క పరమ విధేయులైన దాసులు. అల్లాహ్‌ (త) ఆదేశించిన విధంగానే ఆచరించేవారు. తన ఇష్టం వచ్చినట్లు ఏమాత్రం ప్రవర్తించేవారు కారు. ఇతరుల మాదిరిగానే మమ్మల్ని ఆదేశించేవారు. మాకు ప్రత్యేకంగా ఆదేశించేవారు కారు. అయితే మూడు విషయాల పట్ల మాకు ప్రత్యేకంగా ఆదేశించే వారు. 1. పరిపూర్ణ వు’దూ చేయమని. 2. ‘జకాత్‌ ధనాన్ని తినకూడదని. 3. గుర్రం మీద  గాడిదను  ఎక్కించ రాదని. [20]  (తిర్మిజి’, నసాయి’)

3883 – [ 23 ] ( صحيح ) (2/1140)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: أُهْدِيَتْ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم بَغْلَةٌ فَرَكِبَهَا فَقَالَ عَلِيٌّ: لَوْ حَمَلْنَا الْحَمِيْرَعَلَى الْخَيْلِ فَكَانَتْ لَنَا مِثْلُ هَذِهِ؟ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّمَا يَفْعَلُ ذَلِكَ الَّذِيْنَ لَا يَعْلَمُوْنَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

3883. (23) [2/1140దృఢం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) కు కానుకగా ఒక కంచర గాడిద ఇవ్వబడింది. ప్రవక్త (స) దానిపై ఎక్కారు. అప్పుడు ‘అలీ (ర) ‘ఒకవేళ మనం కూడా గాడిదలను గుర్రాలపై జత కట్టిస్తే మనకు కూడా ఇటువంటి జంతువులు దొరుకుతాయి,’ అని అన్నారు. అది విని ప్రవక్త(స), ‘ధర్మాదేశాలు, నియమాలు తెలియని వారే ఇలా చేస్తారు,’ అని అన్నారు. [21]  (అబూ దావూద్‌, నసాయి’)

3884 – [ 24 ] ( لم تتم دراسته ) (2/1140)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَتْ قَبِيْعَةُ سَيْفِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مِنْ فِضَّةٍ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ.

3884. (24) [2/1140అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) కరవాలానికి వెండి పిడికిలి ఉండేది.[22](తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’, దార్మి)

3885 – [ 25 ] ( لم تتم دراسته ) (2/1140)

وَعَنْ هُوْدِ بْنِ عَبْدِ اللهِ بْنِ سَعْدٍ عَنْ جَدِّهِ مَزِيْدَةَ قَالَ: دَخَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَوْمَ الْفَتْحِ وَعَلَى سَيْفِهِ ذَهَبٌ وَفِضَّةٌ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

3885. (25) [2/1140 అపరిశోధితం]

హూద్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ స’అద్‌ తన తాత మ’జీదహ్ ద్వారా కథనం: ప్రవక్త (స) మక్కహ్ విజయం నాడు మక్కహ్ ముకర్రమహ్లో ప్రవేశించారు. అప్పుడు ప్రవక్త (స) కరవాలం పిడికిలికి బంగారం, వెండి పొదుగులు ఉన్నాయి. (తిర్మిజి’ /  ఏకోల్లేఖనం)

3886 – [ 26 ] ( لم تتم دراسته ) (2/1140)

وَعَنِ السَّائِبِ بْنِ يَزِيْدَ : أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ عَلَيْهِ يَوْمَ أُحُدٍ دِرْعَانِ قَدْ ظَاهَرَ بَيْنَهُمَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ

3886. (26) [2/1140 అపరిశోధితం]

సాయి’బ్‌ బిన్‌ య’జీద్‌ (ర) కథనం: ఉ’హుద్‌ యుద్ధంలో ప్రవక్త (స) శరీరంపై రెండు కవచాలు ఉండేవి. అంటే ఒక దానిపై ఒకటి ఉండేవి. (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

3887 – [ 27 ] ؟(2/1140)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَتْ رَايَةُ نَبِيِّ الله صلى الله عليه وسلم سَوْدَاءَ وَلِوَاؤُهُ أَبْيَضُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

3887. (27) [2/1140? ]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్ద పెద్ద జండా నల్లగా ఉండేది, చిన్న జండా తెల్లగా ఉండేది. (తిర్మిజి’, ఇబ్నె  మాజహ్)

3888 – [ 28 ] ( لم تتم دراسته ) (2/1140)

وَعَنْ مُوْسَى بْنِ عُبَيْدَةَ مُوْلَى مُحَمَّدِ بْنِ الْقَاسِمِ قَالَ: بَعَثَنِيْ مُحَمَّدُ بْنُ الْقَاسِمِ إِلَى الْبَرَاءِ بْنِ عَازِبٍ يَسْأَلُهُ عَنْ رَايَةِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: كَانَتْ سَوْدَاءَ مُرَبَّعَةً مِّنْ نَمِرةٍ . رَوَاهُ أَحْمَدُ وَ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ .

3888. (28) [2/1140 అపరిశోధితం]

మూసా బిన్‌ ‘ఉబైదహ్ (ర) అంటే ము’హమ్మద్‌ బిన్‌ ఖాసిమ్‌ (ర) విడుదల చేసిన బానిస కథనం: ము’హమ్మద్‌ బిన్‌ ఖాసిమ్‌ (ర) నన్ను బరాఅ’ బిన్‌ ‘ఆ’జిబ్‌ వద్దకు పంపి, ప్రవక్త (స) జండా రంగు ఎలా ఉండేదో తెలుసుకొని రమ్మన్నారు. నేను అతనిని ప్రవక్త (స) జండారంగు ఎలా ఉండేదని అడిగాను. దానికి అతడు, పెద్ద జండా రంగు నల్లగా, నాలుగు పలకలుగా ఉండేది. అందులో నల్లని, తెల్లని గీతలు ఉండేవి. (అ’హ్మద్‌, తిర్మి’జి, అబూ  దావూద్‌)

3889 – [ 29 ] ( لم تتم دراسته ) (2/1140)

وَعَنْ جَابِرٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم دَخَلَ مَكَّةَ وَلِوَاؤُهُ أَبْيَضُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

3889. (29) [2/1140 అపరిశోధం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) మక్కహ్ లో ప్రవేశించి నపుడు, ఆయన చిన్న జండా తెల్లగా ఉండేది. (తిర్మిజి’, అబూ  దావూద్‌, ఇబ్నె  మాజహ్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం   

3890 – [ 30 ] ( لم تتم دراسته ) (2/1141)

عَنْ أَنَسٍ قَالَ: لَمْ يَكُنْ شَيْءٌ أَحَبَّ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم بَعْدَ النِّسَاءِ مِنض الْخَيْلِ. رَوَاهُ النِّسَائِيُّ .

3890. (30) [2/1141 అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స)కు స్త్రీల తర్వాత గుర్రాలంటే  చాలా  ఇష్టం.  (నసాయి’)

3891 – [ 31 ] ( لم تتم دراسته ) (2/1141)

وَعَنْ عَلِيٍّ قَالَ: كَانَتْ بِيَدِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَوْسٌ عَرَبِيَّةٌ فَرَأَى رَجُلًا بِيَدِهِ قَوْسٌ فَارِسَيَّةٌ قَالَ: “مَا هَذِهِ؟ أَلْقِهَا وَعَلَيْكُمْ بِهَذِهِ وَ أَشْبَاهِهَا وَرِمَاحِ الْقَنَا فَإِنَّهَا يُؤَيِّدُ اللهُ لَكُمْ بِهَا فِي الدِّيْنِ وَيُمَكِّنُ لَكُمْ فِي الْبِلَادِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ .

3891. (31) [2/1141 అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) చేతిలో అరబ్బీ విల్లు ఉండేది. ప్రవక్త (స) ఒక వ్యక్తి చేతిలో ఫారసీ విల్లు చూచి, ఆ ఈరానీ, ఫారసీ విల్లును పారవేసి ఇటువంటి అరబీ విల్లును ఉంచుకో, ఇంకా దీటుగా ఉన్న బల్లెం ఉంచు. ఎందుకంటే అల్లాహ్‌ (త) వీటి మూలంగానే మీ ధర్మానికి సహాయం చేస్తాడు, ఇంకా అవిశ్వాసులను ఓడించి వారి నగరాలపై మీకు ఆధిపత్యాన్ని ప్రసాదిస్తాడు అని ప్రవచించారు. (ఇబ్నె మాజహ్)

=====

2– بَابُ آدَابِ السَّفَرِ

2. ప్రయాణ నియమాలు

మానవ అవసరాల కోసం ప్రయాణ అవసరం ఎంతైనా పడుతుంది. ప్రయాణంలో ఒక మంచి, ఉత్తమ, దైవభీతి గల వ్యక్తితో తోడైతే మరీ బాగుంటుంది. ఎందుకంటే మంచి వాళ్ళతో లాభం కలుగుతుంది. అందువల్ల ప్రయాణం చేసినప్పుడు మంచి వాళ్ళను ఎన్నుకోవాలి. చెడ్డ వాళ్ళతో ప్రయాణం చేయటం గాని, చెడ్డవాళ్ళను ప్రయా ణంలో తోడుగా ఉంచుకోవటం గానీ చేయరాదు. ప్రయాణంలో ఇతరులకు సాధ్యమైనంత వరకు సహాయం చేయాలి. అదేవిధంగా ఇతరులకు ఎటువంటి ఆటంకం కలిగించరాదు. అయితే గురువారం ప్రయాణం చేయటం మంచిది. ఉదయం కూడా బయలుదేర వచ్చును. ప్రయాణానికి బయలుదేరటానికి ముందు ఇస్తిఖారా చేసుకోవాలి. ప్రయాణానికి ముందు రెండు రకాతులు నమా’జును ఇంట్లో చదువుకోవటం మంచిది. ఒకవేళ తనపై అప్పు ఉన్నా, లేక అమానతు ఉన్నా వాటిని చెల్లించి వెళ్ళాలి. తన కుటుంబీకులను అల్లాహ్‌(త)కు అప్పజెప్పి వెళ్ళాలి. ప్రజలను తన తప్పులుంటే క్షమాపణ కోరుకోవాలి. దైవంపై నమ్మకంతో, చిత్తశుద్ధితో ఇంటి నుండి బయలుదేరాలి.

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

3892 – [ 1 ] ( صحيح ) (2/1142)

عَنْ كَعْبِ بْنِ مَالِكٍ: أَنَّ النَّبِيُّ صلى الله عليه وسلم خَرَجَ يَوْمَ الْخَمِيْسِ فِيْ غَزْوَةِ تَبُوْكَ وَكَانَ يُحِبُّ أَنْ يَّخْرُجَ يَوْمَ الْخَمِيْسِ. رَوَاهُ الْبُخَارِيُّ .

3892. (1) [2/1142 దృఢం]

క’అబ్‌ బిన్ మాలిక్‌(ర) కథనం: ప్రవక్త (స) తబూక్‌ యుద్ధానికి గురువారం బయలుదేరారు, గురువారం ప్రయాణం చేయటం అంటే ఆయనకు చాలా ఇష్టం.[23]  (బు’ఖారీ)

3893 – [ 2 ] ( صحيح ) (2/1142)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي الْوَحْدَةِ مَا أَعْلَمُ مَا سَارَ رَاكِبٌ بِلَيْلٍ وَحْدَهُ”. رَوَاهُ الْبُخَارِيُّ .

3893. (2) [2/1142 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ప్రజలకు ఒంటరిగా ప్రయాణం చేయటంలోని కష్టం తెలిస్తే, ఎన్నడూ ఒంటరిగా ప్రయాణం చేయరు. [24]   (బు’ఖారీ)

3894 – [ 3 ] ( صحيح ) (2/1142)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” لَا تَصْحَبُ الْمَلَائِكَةُ رُفْقَةً فِيْهَا كَلْبٌ وَلَا جَرَسٌ”. رَوَاهُ مُسْلِمٌ.

3894. (3) [2/1142దృఢం]

అబూ హురైరహ్‌(ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కుక్క మరియు గంట ఉన్న ప్రయాణ బృందం వెంట కారుణ్య దూతలు ఉండరు.”  [25]  (ముస్లిమ్‌)

3895- [ 4 ] ( صحيح ) (2/1142)

وَعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “اَلْجَرَسُ مَزَامِيْرُ الشَّيْطَانِ”. رَوَاهُ مُسْلِمٌ .

3895. (4) [2/1142దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”గంటలు షైతాన్‌ పిల్లనగ్రోవి వంటివి.”  [26] (ముస్లిమ్)

3896 – [ 5 ] ( متفق عليه ) (2/1142)

وَعَنْ أَبِيْ بَشِيْرِالْأَنْصَارِيِّ: أَنَّهُ كَانَ مَعَ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم فِيْ بَعْضِ أَسْفَارِهِ فَأَرْسَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم رَسُوْلًا: “لَا تُبْقَيَنَّ فِيْ رَقَبَةٍ بَغِيْرٍقِلَادَةٌ مِنْ وَتَرٍأَوْقَلَادَةٌ إِلَّا قُطِعَتْ”.

3896. (5) [2/1142ఏకీభవితం]  

అబూ బషీర్‌ అ’న్సారీ (ర) కథనం: ప్రవక్త (స) వెంట ఒక ప్రయాణంలో ఉన్నాను. ప్రవక్త (స) ఒక వ్యక్తిని ప్రయాణీకుల వద్దకు పంపి ఎవరైనా ఒంటె మెడలో తాయెత్తులు, తావీజులు కట్టి ఉంటే దాన్ని తెంపివేయమని ప్రకటించమని చెప్పి పంపారు.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

3897 – [ 6 ] ( صحيح ) (2/1142)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا سَافَرْتُمْ فِي الْخِصْبِ فَأعْطُوا الْإِبْلَ حَقَّهَا مِنَ الْأَرْضِ وَإِذَا سَافَرْتُمْ فِي السَّنَةِ فَأَسْرِعُوْا عَلَيْهَا السَّيْرَ وَإِذَا عَرَّسْتُمْ بِاللَّيْلِ فَاجْتَنِبُوْا الطَّرِيْقَ فَإِنَّهَا طُرُقُ الدَّوَابِّ وَمَأوَى الْهَوَامِّ بِاللَّيْلِ”.

وَفِيْ رِوَايَةٍ: “إِذَا سَافَرْتُمْ فِي السَّنَةِ فَبَادِرُوْا بِهَا نِقْيَهَا”. رَوَاهُ مُسْلِمٌ .

3897. (6) [2/1142దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం: ”మీరు మంచి స్థితిలో ప్రయాణం చేస్తే ఒంటెలకు వాటి హక్కులను చెల్లించండి. అంటే గడ్డి, మేత, నీరు వేస్తూ తీసుకువెళ్ళండి. అవి ఆహారం అందటం వల్ల చాలా చురుగ్గా ఉంటాయి. అదేవిధంగా కరువుకాటకాల్లో ప్రయాణం చేస్తే వేగంగా ప్రయాణించండి, దీనివల్ల గమ్యం తొందరగా వస్తుంది. గమ్యం చేరుకున్న తరువాత మేత నీరు వెయ్యండి. ఒకవేళ ప్రయాణంలో రాత్రిపూట ఎక్కడైనా దిగితే, దారికి అడ్డంగా ఉండకుండా కొంత ఎడంగా విడిది చేయండి. ఎందుకంటే వచ్చేపోయే మార్గంలో రాత్రిపూట అడవి జంతువులు, క్రిమి కీటకాలు మొదలైనవి తమ గూళ్ళ నుండి బయటకు వచ్చి సంచరిస్తూ ఉంటాయి.

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఒకవేళ మీరు కరువు కాటకాలలో ప్రయాణంచేస్తే తొందరగా ప్రయాణం చేయండి. దానివల్ల జంతువుల శరీరంలో శక్తి ఉంటుంది. (ముస్లిమ్‌)

3898 – [ 7 ] ( صحيح ) (2/1143)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: بَيْنَمَا نَحْنُ فِيْ سَفَرٍمَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم إِذْ جَاءَهُ رَجُلٌ عَلَى رَاحِلَةٍ فَجَعَلَ يَضْرِبُ يَمِيْنًاوَشِمَالًا فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ كَانَ مَعَهُ فَضْلُ ظَهْرٍ فَلْيَعُدْ بِهِ عَلَى مَنْ لَا ظَهْرَ لَهُ وَمَنْ كَانَ لَهُ فَضْلُ زَادٍ فَلْيَعُدْ بِهِ عَلَى مَنْ لَا زَادَ لَهُ ” قَالَ: فَذَكَرَ مِنْ أَصْنَافِ الْمَالِ حَتَّى رَأَيْنَا أَنَّهُ لَا حَقَّ لِأَحَدٍ مِّنَّا فِيْ فَضْلٍ. رَوَاهُ مُسْلِمٌ.

3898. (7) [2/1143దృఢం]

అబూస’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట ప్రయాణంలోఉన్నాం. ఒకవ్యక్తి ఒంటెపై వచ్చాడు. అతడు తన ఒంటెను ఎడమవైపు త్రిప్పు తున్నాడు, లేదా కుడి, ఎడమలవైపు త్రిప్పు తున్నాడు. అది చూచి ప్రవక్త (స) ఎవరి దగ్గరైనా గుర్రం అనవసరంగా ఉంటే వాహనం లేని వారికి తన గుర్రాన్ని ఇచ్చివేయాలి. అదే విధంగా అన్నం, లేదా బట్టలు అనవసరంగా ఉంటే, వాటి అవసరం ఉన్న వారికి ఇచ్చి వేయాలి. అదే విధంగా అనేకవస్తువులను ప్రస్తావిస్తూ ఇలా అన్నారు. అది విని మేము అనవసరమైనది ఏ వస్తువునూ ఉంచే హక్కు లేనట్లుగా  భావించాము. [27] (ముస్లిమ్‌)

3899 – [ 8 ] ( متفق عليه ) (2/1143)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلسّفَرُ قِطْعَةً مِّنَ الْعَذَابِ يَمْنَعُ أَحَدَكُمْ نَوْمَهُ وَطَعَامَهُ وَشَرَابَهُ فَإِذَا قَضَى نَهْمَتَهُ مِنْ وَجْهِهِ فَلْيُعَجَّلْ إِلَى أَهْلِهِ”. متفق عليه.

3899. (8) [2/1143 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ప్రయాణం శిక్ష మరియు కష్టం వంటిది. అది మిమ్మల్ని నిద్ర నుండి, అన్నపానీయాల నుండి దూరంగా ఉంచు తుంది. ప్రయాణంలో మీ పని పూర్తయితే తొందరగా తమ ఇళ్ళకు వచ్చేయండి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

3900 – [ 9 ] ( صحيح ) (2/1143)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ جَعْفَرٍقَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا قَدِمَ مِنْ سَفَرٍ تُلقِّيَ بِصِبْيَانِ أَهْلِ بَيْتِهِ وَإِنَّهُ قَدِمَ مِنْ سَفَرٍ فَسُبِقَ بِيْ إِلَيْهِ فَحَمَلَنِيْ بَيْنَ يَدَيْهِ ثُمَّ جِيْءَ بِأَحَدِ ابْنَيْ فَاطِمَةَ فَأَرْدَفَهُ خَلْفَهُ قَالَ: فَأُدْخِلْنَا الْمَدِيْنَةَ ثَلَاثَةً عَلَى دَاَّبةٍ. روَاهُ مُسْلِمٌ.

3900. (9) [2/1143దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ జ’అఫర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణం నుండి తిరిగి వస్తే, ఆయన కుటుంబానికి చెందిన పిల్లల్ని స్వాగతించడానికి రప్పించడం జరిగేది. ప్రవక్త (స) ఒక ప్రయాణం నుండి తిరిగి వచ్చారు. నన్ను ఆయన ముందు ఉంచడం జరిగింది. ప్రవక్త (స) నన్ను తన వాహణంపై తన ముందు కూర్చోబెట్టు కున్నారు. ఆ తరువాత ఫాతిమహ్ కుమారుల్లోని ఒకరిని ప్రవక్త (స) ముందుకు తీసుకురావటం జరిగింది. ప్రవక్త (స) తన వెనుక కూర్చోబెట్టుకున్నారు. మేము ముగ్గురం గుర్రంపై కూర్చొనే మదీనహ్లో  ప్రవేశించాము. (ముస్లిమ్‌)

3901 – [ 10 ] ( صحيح ) (2/1143)

وَعَنْ أَنَسٍ: أَنَّهُ أَقْبَلَ هُوَ وَأَبُوْ طَلْحَةَ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه و سلم وَمَعَ النَّبِيِّ صلى الله عليه وسلم صَفِيَّةُ مُرْدِفَهَا عَلَى رَاحِلَتِهِ. رَوَاهُ الْبُخَارِيُّ .

3901. (10) [2/1143 దృఢం]

అనస్‌ (ర) కథనం: అనస్‌ (ర), అబూ ‘తల్‌’హా ప్రవక్త (స) వెంట ఒక ప్రయాణం నుండి మదీనహ్ తిరిగి వచ్చారు. ప్రవక్త (స) వెంట అతని(స) సతీమణి సఫియ్యహ్ (ర) కూడా ఉన్నారు. వాహనంపై అతని (స) వెనుక   ఆమె కూర్చొని  ఉన్నారు.[28] (బు’ఖారీ)

3902 – [ 11 ] ( متفق عليه ) (2/1143)

وَعَنْهُ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَا يَطْرُقُ أَهْلَهُ لَيْلًا وَكَانَ لَا يَدْخُلُ إِلَّا غُدْوَةً أَوْ عَشِيَّةً. متفق عليه.

3902. (11) [2/1143ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణం నుండి తిరిగి రాత్రిపూట ఇంటికి వచ్చేవారు కారు. ఉదయం గాని సాయంత్రంగానివచ్చేవారు.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

3903 – [ 12 ] ( متفق عليه ) (2/1143)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا طَالَ أَحَدُكُمُ الْغَيْبَةَ فَلَا يَطْرُقُ أَهْلَهُ لَيْلًا”. متفق عليه.

3903. (12) [2/1143 ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘మీరు ప్రయాణంలో ఎక్కువ రోజులు గడిపిన తర్వాత తెలియపర్చ కుండా రాత్రిపూట ఇంటికి రాకండి’ అని ప్రవచించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3904 – [ 13 ] ( متفق عليه ) (2/1144)

وَعَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ : ” إِذَا دَخَلْتَ لَيْلًا فَلَا تَدْخُلْ عَلَى أَهْلِكَ حَتَّى تَسْتَحِدّ الْمُغِيْبَةُ وَتَمْتَشِطَ الشَّعِثَةُ” متفق عليه.

3904. (13) [2/1144ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ప్రయాణం నుండి ఇంటికి తిరిగివస్తే, రాత్రిపూట ఇంటి లోనికి ప్రవేశించకండి. అంటే మీ భార్యలు బొడ్డుక్రింద వెంట్రుకలను, తలను దువ్వెనతో సరిచేసుకోనంత వరకు ఇంటిలోనికి ప్రవేశించకండి.” [29] (బు’ఖారీ, ముస్లిమ్‌)

3905 – [ 14 ] (متفق عليه) (2/1144)

وَعَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم لَمَّا قَدِمَ الْمَدِيْنَةَ نَحَرَجَزُوْرًا أَوْ بَقَرَةً. رَوَاهُ الْبُخَارِيُّ.

3905. (14) [2/1144 ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణం నుండి మదీనహ్ తిరిగివస్తే, సురక్షితంగా వచ్చిన సంతోషంలో ఒంటె లేదా ఆవు జిబహ్‌ చేసేవారు. [30]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

3906 – [ 15 ] ( متفق عليه ) (2/1144)

وَعَنْ كَعْبِ بْنِ مَالِكٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم لَا يَقْدَمُ مِنْ سَفَرٍ إِلَّا نَهَارًا فِيْ الضُّحى فَإِذَا قَدِمَ بَدَأَ بِالْمَسْجِدِ فَصَلّى فِيْهِ رَكْعَتَيْنِ ثُمَّ جَلَسَ فِيْهِ لِلنَّاسِ. متفق عليه

3906. (15) [2/1144 ఏకీభవితం]

కఅబ్‌ బిన్‌ మాలిక్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణం నుండి పగటి పూట సూర్యోదయానికి, మిట్ట మధ్యాహ్నానికి మధ్య తిరిగి వచ్చేవారు. అన్నిటి కంటే ముందు మస్జిద్‌లోకి వెళ్ళి రెండు రకాతులు నమా’జ్‌ కృతజ్ఞతా సూచకంగా చదివేవారు. ఆ తరువాత ప్రజలతో కూర్చొని వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకునే వారు.  (బుఖారీ, ముస్లిమ్‌)

3607 – [ 16 ] ( صحيح ) (2/1144)

وَعَنْ جَابِرٍ قَالَ: كُنْتُ مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ سَفَرٍ فَلَمَّا قَدِمْنَا الْمَدِيْنَةَ قَالَ لِيْ: “ادْخُلِ الْمَسْجِدَ فَصَلِّ فِيْهِ رَكْعَتَيْنِ”. رَوَاهُ الْبُخَارِيُّ .

3907. (16) [2/1144 దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) వెంట నేను ప్రయాణంలో ఉన్నాను. నేను తిరిగి వచ్చినపుడు ప్రవక్త (స) నన్ను మస్జిద్‌లోనికి వెళ్ళి రెండు రకాతులు నమా’జ్‌ చదవమని ఆదేశించారు. (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం   

3908 – [ 17 ] ( جيد ) (2/1144)

عَنْ صَخْرِبْنِ وَدَاعَةَ الْغَامِدِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم: “اَللّهُمَّ بَارِكْ لِأُمَّتِيْ فِيْ بُكُوْرِهَا” .وَكَانَ إِذَا بَعَثَ سَرِيَّةً أَوْ جَيْشًا بَعَثَهُمْ مِنْ أَوَّلِ النَّهَارِوَكَانَ صَخْرٌتَاجِرًا فَكَانَ يَبْعَثُ تِجَارَتَهُ أَوَّلَ النَّهَارِفَأَثْرَى وَكَثُرَمَالُهُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْدَاوُدَ وَالدَّارَمِيُّ .

3908. (17) [2/1144ఆమోదయోగ్యం]

‘స’ఖర్‌ బిన్‌ వదా’అ ‘గామిదీ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రార్థించారు, ”అల్లాహుమ్మ బారిక్‌ లి ఉమ్మితీ ఫీ బుకూరిహా” -‘ఓ అల్లాహ్‌ నా అనుచర సమాజం కోసం ఉదయం తొందరగా లేవడంలో శుభం ప్రసాదించు.’ ప్రవక్త (స) ఏ ప్రాంతానికైనా ఎటువంటి సైన్యం పంపినా పగటి ప్రారంభ సమయంలో పంపేవారు. స’ఖర్‌ అనే వ్యక్తి పెద్ద వ్యాపారి. తన సేవకులను, ఉద్యోగులను ఉదయం కాగానే పంపించేవాడు. అతనికి చాలా లాభాలు వచ్చాయి. చాలా పెద్ధ ధన వంతుడిగా మారిపోయాడు. (తిర్మిజి’,  అబూ  దావూద్‌,  దార్మి)

3909 – [ 18 ] ( جيد ) (2/1144)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عَلَيْكُمْ بِالدُّلْجَةِ فَإِنَّ الْأَرْضَ تُطْوَى بِاللَّيْلِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3909. (18) [2/1144ఆమోదయోగ్యం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు రాత్రి పూట ప్రయాణం కొనసాగించండి. ఎందుకంటే భూమి రాత్రి పూట చుట్టివేయబడుతుంది.” [31] (అబూ దావూద్‌)

3910- [ 19 ] ( صحيح ) (2/1144)

وَعَنْ عَمْرِوبْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “اَلرَّاكِبُ شَيْطَانٌ وَالرَّاكِبَانِ شَيْطَانَانِ وَالثَّلَاثَةُ رَكْبٌ”.  رَوَاهُ مَالِكٌ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

3910. (19) [2/1144దృఢం]

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ తన తండ్రి తాతల ద్వారా కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”ఒంటరి ప్రయాణీకుడు ఒక షై’తాన్‌, ఇద్దరు ప్రయాణీకులు ఇద్దరు షై’తా నులు, ముగ్గురు ప్రయాణీకులు ఒక బృందం.” [32]  (మాలిక్‌, తిర్మిజి’, అబూ దావూద్, నసాయి)

3911 – [ 20 ] ( حسن ) (2/1145)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِذَا كَانَ ثَلَاثَةٌ فِيْ سَفَرٍ فَلْيُؤَمِّرُوْا أَحَدَهُمْ”. روَاهُ أَبُوْ دَاوُدَ.

3911. (20) [2/1145 ప్రామాణికం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రయాణంలో ఒకవేళ ముగ్గురు కలసి ఉంటే ఒకర్ని నాయకునిగా చేసుకోవాలి.” [33] (అబూ దావూద్‌)

3912 – [ 21 ] ( مرسل ) (2/1145)

وَعَنِ ابْنِ عَبَّاسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “خَيْرُ الصَّحَابَةِ أَرْبَعَةٌ وَخَيْرُالسَّرَايَا أَرْبَعُمِائَةٍ وَخَيْرُالْجُيُوْشِ أَرْبَعَةُ آلْافٍ وَلَنْ يُغْلَبَ اِثْنَا عَشَرَأَلْفًا مِّنْ قِلَّةٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْدَاوُدَ وَالدَّارَمِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

3912. (21) [2/1145 తాబయీ ప్రోక్తం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నలుగురు వ్యక్తులు కలసి ప్రయాణం చేస్తే చాలా మంచిది. అదేవిధంగా చిన్న సైన్యం  (సరాయహ్)లో 400 మంది సైనికులు గల సైన్యం మంచి సైన్యం. పెద్ద సైన్యాలలో 4000 గల సైన్యం ఉత్తమ సైన్యం. 12000 మందిగలసైన్యం ఎంతమాత్రం ఓటమి చవిచూడదు.[34](తిర్మిజి’  / ఏకోల్లేఖనం, అబూ  దావూద్‌, దార్మి)

3913 – [ 22 ] ( جيد ) (2/1145)

وَعَنْ جَابِرٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَتَخَلَّفُ فِي الْمَسِيْرِفَيُزْجِي الضَّعِيْفَ وَيُرْدِفُ وَيَدْعُوْ لَهُمْ.رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3913. (22) [2/1145 ఆమోదయోగ్యం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) సౌమ్యం, అణకువను అవలంబిస్తూ బిడారం వెనుక ఉంటూ ప్రయాణం చేసేవారు. బలహీనమైన వాహనాలను వెనుక నుండి తోలుతూ, వాటికి సహాయపడుతూ వచ్చేవారు. ఇంకా తన సహచరుల కోసం దుఆ’ చేసేవారు. (అబూ దావూద్‌)

3914 – [ 23 ] ( جيد ) (2/1145)

وَعَنْ أَبِيْ ثَعْلَبَةَ الْخُشَنِيُّ قَالَ: كَانَ النَّاسُ إِذَا نَزَلُوْا مَنْزِلًا تَفَرَّقُوْا فِي الشِّعَابِ وَالْأَودِيَةِ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنّ تَفَرُّقَكُمْ فِي هَذِهِ الشِّعَابِ وَالْأَوْدِيَةِ إِنَّمَا ذَلِكُمْ مِنَ الشَّيْطَانِ”. فَلَمْ يَنْزِلُوْا بَعْدَ ذَلِكَ مَنْزِلًا إِلَّا انْضَمَّ بَعَضُهُمْ إِلَى بَعْضِ حَتّى يُقَالَ: لَوْ بُسِطَ عَلَيْهِمْ ثَوْبٌ لَعَمَّهُمْ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3914. (23) [2/1145 ఆమోదయోగ్యం]

అబూ స’అలబహ్ ‘ఖుష్‌నీ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరులు ప్రయాణంలో ఎక్కడైనా దిగితే కొందరు అటు, మరికొందరు ఇటూ వేర్వేరుగా బసచేసేవారు. అది చూసి ప్రవక్త (స) మీరిలా వేర్వేరుగా బస చేయడం షై’తాన్‌ పన్నాగం వల్లే ఈ విధంగా మీ మధ్య విభేదాలు కల్పిస్తాడు. విభేదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఈ ఆదేశం విన్న తర్వాత అనుచరులు ప్రయాణంలో ఎక్కడ బసచేసినా ఒకచోట కలసి బసచేసేవారు. ఒకవేళ వారిపై ఏదైనా వస్త్రం కప్పితే అందరూ దాని క్రిందికి  వచ్చేటట్లు  ఉండే వారు. [35]  (అబూ  దావూద్‌)

3915 – [ 24 ] ( لم تتم دراسته ) (2/1145)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كُنَّا يَوْمَ بَدْرٍ كُلُّ ثَلَاثَةٍ عَلَى بَعِيْرٍ فَكَانَ أَبُوْ لُبَابَةَ وعَلِيُّ بْنُ أَبِيْ طَالِبٍ زَمِيْلَيْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: فَكَانَتْ إِذَا جَاءَتْ عُقْبَةُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَا: نَحْنُ نَمْشِيْ عَنْكَ قَالَ: “مَا أَنْتُمَا بِأَقْوَى مِنِّيْ وَمَا أَنَا بِأَغْنى عَنِ الْأَجْرِ مِنْكُمَا”. روَاهُ فِي شَرْحِ السُّنَّةِ.

3915. (24) [2/1145 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: బద్‌ర్‌ నాడు మేము ఒక్కో వంతులో ముగ్గురేసి ఒక ఒంటెపై కూర్చునే వారం. అబూ లుబాబహ్‌ (ర), ‘అలీ (ర) మరియు ప్రవక్త (స)ల కోసం ఒక ఒంటె ఉండేది. ఈ ముగ్గురు తమ వంతుల ప్రకారం వాహనంపై కూర్చునేవారు, దిగేవారు. ప్రవక్త (స) దిగే వంతువస్తే, అబూ లుబాబహ్, ‘అలీలు, ‘ఓ ప్రవక్తా! తమరు కూర్చోండి. మేము మా వంతులో నడుస్తుంటాము,’ అని అన్నారు. దానికి సమాధానంగా ప్రవక్త (స), ‘మీరు నా కంటే శక్తిమంతులు కారు, ఇంకా మీ ద్వారా పుణ్యం అక్కర లేనంత గొప్పవాడిని కాను,’  అని అన్నారు. (షర్‌హుస్సున్నహ్‌)

ప్రవక్త (స) ప్రయాణంలో తన సహచరుల పట్ల దయా కారుణ్యాలతో వ్యవహరించేవారు.

3916 – [ 25 ] ( صحيح ) (2/1146)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا تَتَّخِذُوْا ظُهُوْرَ دَوَابِكُمْ مَنَابِرَ. فَإِنَّ اللهَ تَعَالى إِنَّمَا سَخَّرَهَا لَكُمْ لِتُبَلِّغَكُمْ إِلَى بَلَدٍ لَمْ تَكُوْنُوْا بِالْغِيْهِ إِلَّا بِشِقِّ الْأَنْفُسِ وَجَعَلَ لَكُمُ الْأَرْضَ فَعَلَيْهَا فَاقْضُوْا حَاجَاتِكُمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3916. (25) [2/1146 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”మీరు మీ వాహనాల వీపులను మెంబర్లుగా చేయకండి. అల్లాహ్‌ (త) వాటిని మీ అధీనంలోకి ఎందుకు ఇచ్చాడంటే మీరు వాటిపై ఎక్కి సులభంగా మీ గమ్యానికి చేరుకోవాలని. భూమిని కూడా మీ సౌలభ్యం కోసం సృష్టించాడు. ఆ భూమి పైనే మీ అవసరాలను తీర్చుకోండి.” [36]  (అబూ దావూద్‌)

3917 – [ 26 ] ( صحيح ) (2/1146)

وَعَنْ أَنَسٍ قَالَ: كُنَّا إِذَا نَزَلْنَا مَنْزِلًا لَا نُسَبِّحُ حَتّى نَحُلَّ الرِّحَالَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3917. (26) [2/1146దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రయాణంలో మేము ఎక్కడైనా దిగితే, వాహనాలపై ఉన్న సామాన్లను క్రిందపెట్టే వరకు నమా’జు చదివేవారము  కాదు. [37] (అబూ  దావూద్‌)

3918 – [ 27 ] ( صحيح ) (2/1146)

وَعَنْ بُرَيْدَةَ قَالَ: بَيْنَمَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَمْشِيْ إِذَا جَاءَهُ رَجُلٌ مَعَهُ حِمَارٌ .فَقَالَ: يَا رَسُوْلَ اللهِ ارْكَبْ وَتَأَخَّرَ الرَّجُلُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا أَنْتَ أَحَقُّ بِصَدْرِ دَابْتِكَ إِلَّا أَنْ تَجْعَلَهُ لِيْ”. قَالَ: جَعَلتُهُ لَكَ فَرَكِبَ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

3918. (27) [2/1146దృఢం]

బురైదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) కాలి నడకన వెళుతున్నారు. ఇంతలో గాడిదపై కూర్చొని ఒక వ్యక్తి వచ్చి, ఓ ప్రవక్తా! తమరు దీనిపై ఎక్కండి అని పలికి తాను వెనక్కి తగ్గాడు. అప్పుడు ప్రవక్త (స), ‘వాహనం యజమానికే ముందు కూర్చునే హక్కు ఉంది. అయితే అతను తన హక్కు నాకు ఇస్తే తప్ప,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘నా హక్కును మీకు ఇస్తున్నాను,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) ముందు కూర్చున్నారు. (తిర్మిజి’,  అబూ దావూద్‌)

3919 – [ 28 ] ( حسن ) (2/1146)

وَعَنْ سَعِيْدِ بْنِ أَبِيْ هِنْدٍ عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” تَكُوْنُ إِبِلٌ لِلشَّيَاطِيْنِ وَبُيُوْتٌ لِلشَّيَاطِيْنِ”  فَأَمَّا إِبِلُ الشَّيَاطِيْنِ فَقَدْ رَأَيْتُهَا: يَخْرُجُ أَحَدُكُمْ بِنَجِيْبَاتٍ مَعَهُ قَدْ أَسْمَنَهَا فَلَا يَعْلُوْ بَعِيْرًا مِنْهَا وَيَمُرُّ بِأَخِيْهِ قَدِ انْقَطَعَ بِهِ فَلَا يَحْمِلُهُ. وَأَمَّا بُيُوْتُ الشَّيَاطِيْنَ فَلَمْ أَرَهَا كَانَ سَعِيْدٌ يَقُوْلُ: لَا أَرَاهَا إِلَّا هَذِهِ الْأَقْفَاصَ الَّتِيْ يَسْتُرُ النَّاسُ بِالدِّيْبَاجِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3919. (28) [2/1146 ప్రామాణికం]

స’యీద్‌ బిన్‌ అబీ హింద్‌ అబూ హురైరహ్‌ ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ‘కొన్ని ఒంటెలు షై’తా నుల కోసం ఉంటాయి. కొన్నిగృహాలుకూడా షై’తానుల కోసం ఉంటాయి. షై’తానుల ఒంటెలను నేను చూసాను. మీరు మంచి, బలసిన ఒంటెలను తమవెంట ప్రదర్శనగా, గర్వంగా, అహంకారంగా, గొప్పగా తీసుకొని వెళతారు. వాటిపై ఎవరూ కూర్చొని ఉండరు. అతడు అంత గొప్ప ధనవంతుడని చెప్పుకోటానికి. ముందు వెనుక అటూ ఇటూ ఒంటెలు నడుస్తూ ఉంటాయి. అతనితో సమానంగా ఒక ముస్లిమ్‌ నడుస్తున్నాడు. అతడు నడచి నడచి అలసిపోతాడు కాని ఒంటెల యజమాని తాను ఎక్కడు, ఇతరులను ఎక్కనివ్వడు. ఇటువంటి ఒంటెలు షై’తాన్‌ ఒంటెలు. ఇంకా నేను షై’తాన్‌ గృహాలు చూడలేదు.’ ఈ ‘హదీసు’ ఉల్లేఖన కర్త అయిన స’యీద్‌ తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడిస్తున్నారు, ‘షై’తాన్‌ గృహాలంటే నా అనుమానం గర్వంగా, గొప్పతనంగా పెద్దపెద్ద ఎత్తైన భవనాలు నిర్మించి వాటికి అందచందాలు దిద్ది ఖరీదైన తెరలతో అలంకరిస్తారు. కాని అందులో ఎవరూ ఉండరు. ఇటువంటివి  షై’తాన్‌  గృహాలు.’  (అబూ  దావూద్‌)

3920 – [ 29 ] ( صحيح ) (2/1147)

وَعَنْ سَهْلِ بْنِ مُعَاذٍ عَنْ أَبِيْهِ قَالَ: غَزَوْنَا مَعَ النَّبِيِّ صلى الله عليه و سلم فَضَيَّقَ النَّاسُ الْمَنَازِلَ وَقَطَعُوا الطَّرِيْقَ فَبَعَثَ نَبِيُّ اللهِ صلى الله عليه وسلم مُنَادِيًا يُّنَادِيْ فِي النَّاسِ: “إِنَّ مَنْ ضَيَّقَ مَنْزِلًا أَوْ قَطَعَ طَرِيْقًا فَلَا جَهَادَ لَهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3920. (29) [2/1147దృఢం]

సహల్‌ బిన్‌ మ’ఆజ్‌ (ర) తన తండ్రి ద్వారా కథనం: మేము ప్రవక్త (స) వెంట ఒక జిహాద్‌లో వెళ్ళాము. విశ్రాంతికి స్థలం చాలా ఇరుకుగా అయింది. అంటే కొందరు ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. అంతేకాదు వచ్చే పోయే వారి కోసం కూడా స్థలం ఇరు కుగా  కాసాగింది. ప్రవక్త (స) ఒక ప్రకటించేవాడిని పంపి బిగ్గరగా ఇలా ప్రకటించమని ఆదేశించారు, ‘స్థలాన్ని ఇరుకుగా చేసే, మార్గాన్ని ఆక్రమించుకునే వ్యక్తికి  జిహాద్‌ పుణ్యం లభించదు.”  (అబూ  దావూద్‌)

3921 – [ 30 ] ( لم تتم دراسته ) (2/1147)

وَعَنْ جَابِرٍرَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ أَحْسَنَ مَا دَخَلَ الرَّجُلُ أَهْلَهُ إِذَا قَدِمَ مِنْ سَفَرٍأَوَّلُ اللَّيْلِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3921. (30) [2/1147 అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ప్రయాణం నుండి ఇంటికి తిరిగి రావటానికి అన్నిటి కంటే మంచి సమయం రాత్రి  ప్రారంభ  భాగం.”  [38] (అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం   

3922 – [ 31 ] ( صحيح ) (2/1147)

عَنْ أَبِيْ قَتَادَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا كَانَ فِيْ سَفَرٍفَعَرَّسَ بِلَيْلٍ اِضْطَجَعَ عَلَى يَمِيْنِهِ. وَإِذَا عَرَّسَ قُبَيْلَ الصُّبْحِ نَصَبَ ذِرَاعَهُ وَوَضَعَ رَأْسَهُ عَلَى كَفِّهِ. رَوَاهُ مُسْلِمٌ .

3922. (31) [2/1147దృఢం]

అబూ ఖతాదహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణంలో ఎక్కడైనా రాత్రిపూట దిగితే కుడి ప్రక్కవైపు తిరిగి పడుకుంటారు. ఉషోదయానికి ముందు దిగితే తన కుడిచేయి నిలబెట్టి ఉంచుతారు. తన అరచేతిపై తల ఉంచుతారు. నిద్ర రాకుండా ఉండటానికి. అంటే పూర్తిగా పడుకోరు. (ముస్లిమ్‌)

3923 – [ 32 ] ( لم تتم دراسته ) (2/1147)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: بَعَثَ النَّبِيُّ صلى الله عليه وسلم عَبْدَ اللهِ بْنِ رَوَاحَةَ فِيْ سَرِيَّةٍ فَوَافَقَ ذَلِكَ يَوْمَ الْجُمُعَةِ فَغَدَا أَصْحَابُهُ وَقَالَ: أَتَخَلَّفُ وَأُصَلِّيْ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم ثُمَّ أَلْحَقُهُمْ فَلَمَّا صَلّى مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم رَآهُ فَقَالَ: “مَامَنَعَكَ أَنْ تَغْدُوَمَعَ أَصْحَابِكَ؟” فَقَالَ: أَرَدْتُّ أَنْ أُصَلِّيَ مَعَكَ ثُمَّ أَلْحَقَهُمْ. فَقَالَ: “لَوْ أَنْفَقْتَ مَا فِي الْأَرْضِ جَمِيْعًا مَا أَدْرَكْتَ فَضْلَ غَدْوَتِهِمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

3923. (32) [2/1147అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) జిహాద్‌లో ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ రవా’హ (ర) ను చిన్న సైన్యం ఇచ్చి పంపుదా మని అనుకున్నారు. అనుకోకుండా ప్రయాణం చేసే రోజు శుక్రవారం వచ్చింది. అతని మిత్రులందరూ శుక్రవారం ఉదయం వెళ్ళిపోయారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ రవా’హ తన మనసులో నేను వెనుక ఉండిపోయి శుక్రవారం నమాజు ప్రవక్త (స) వెంట చదివి ఆ తరువాత సైన్యం వాళ్ళతో కలుస్తాను అను కున్నారు. ప్రవక్త (స) శుక్రవారం నమా’జు తర్వాత అతన్ని చూసి, ‘నీవు నీ స్నేహితుల వెంట ఉదయం ఎందుకు వెళ్ళలేదు?’ అని ప్రశ్నించారు. దానికి అతను, ‘జుమ’అ నమాజును మీ వెనుక చదివి, వాళ్ళతో కలుద్దామని అనుకున్నాను,’ అని విన్న వించుకున్నాడు. దానికి ప్రవక్త (స) భూమిపై ఉన్న ధనసంపదలన్నీ అల్లాహ్ (త) మార్గంలో ఖర్చు చేసినా, ఉదయం జిహాద్‌లో వెళితే లభించినంత పుణ్యం లభించదు అని హితబోధ చేసారు. (తిర్మిజి’)

3924 – [ 33 ] ( لم تتم دراسته ) (2/1148)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَصْحَبُ الْمَلَائِكَةُ رُفْقَةُ فِيْهَا جِلْدُ نَمْرٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3924. (33) [2/1148 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”చిరుతపులి చర్మం ఉన్న బిడారం వెంట కారుణ్య దూతలు ఉండరు.” [39] (అబూ  దావూద్‌)

3925 – [ 34 ] ( لم تتم دراسته ) (2/1148)

وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “سَيِّدُ الْقَوْمِ فِي السَّفَرِخَادِمُهُمْ فَمَنْ سَبَقَهُمْ بِخِدْمَةٍ لَمْ يَسْبِقُوْهُ بِعَمَلٍ إِلَّا الشَّهَادَةَ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ”شُعَبِ الْإِيْمَانِ”.

3925. (34) [2/1148అపరిశోధితం]

సహల్‌ బిన్‌ స’అద్‌(ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ప్రజల నాయకుడు ప్రయాణంలో ప్రజల సేవకుడు. అంటే ప్రయాణంలో నాయకుడు తన అనుచరుల సేవచేయాలి. ప్రయాణంలో ఇతరుల సేవ చేయడంలో ఇతరులను అధిగమిస్తే అతన్ని అమరవీరుడు తప్ప ఎవ్వరూ అధిగమించ లేరు.” [40]  (బైహఖీ)

=====

3– بَابُ الْكِتَابِ إِلى الْكُفَّارِ وَدُعَائِهِمْ إِلى الْإِسْلَامِ

3. ముస్లిమేతరులకు ఉత్తరాలు వ్రాయటం వారిని ఇస్లామ్వైపుకు ఆహ్వానించడం

ముస్లిమేతరులకు అన్నిటికంటే ముందు ఇస్లామ్‌ సందేశాన్ని అందజేయాలి. ఒకవేళ వారు ఇస్లామ్‌ స్వీకరించడానికి సిద్ధంగా లేకపోతే ఒప్పందానికి ప్రయత్నించాలి. దాన్ని కూడా తిరస్కరించి, యుద్ధానికి కాలుదువ్వితే, ఎదుర్కొనే విధంగా వారితో పోరాడాలి. ఇస్లామీయ సందేశం అందజేస్తూ, ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ప్రయత్నించాలి.

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

3926 – [ 1 ] ( متفق عليه ) (2/1149)

عَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَتَبَ إِلَى قَيْصَرَ يَدْعُوْهُ إِلَى الْإِسْلَامِ. وَبَعَثَ بِكِتَابِهِ إِلَيْهِ دَحْيَةَ الْكَلْبِيْ. وَأَمَرَهُ أَنْ يَدْفَعَهُ إِلى عَظِيْمِ بُصْرَى لِيَدْفَعَهُ إِلَى قَيْصَرَفَإِذَا فِيْهِ: “بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ. مِنْ مُحَمَّدٍ عَبْدِ اللهِ وَرَسُوْلِهِ إِلَى هِرَقْلَ عَظِيْمِ الرُّوْمِ. سَلَامٌ عَلَى مَنِ اتَّبَعَ الْهُدَى. أَمَّا بَعْدُ. فَإِنِّيْ أَدْعُوْكَ بِدَاعِيَةِ الْإِسْلَامِ، أَسْلِمْ تَسْلَمْ، وَأَسْلِمْ يُؤْتِكَ اللهُ أَجْرَكَ مَرَّتَيْنِ، وَإِنْ تَوَلَّيْتَ فَعَلَيْكَ إِثْمُ الْأَرْيُسِيّيْنَ. وَ(يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْا إِلى كَلِمَةٍ سَوَاءٍ بَيْنَنَا وَبَيْنَكُمْ أَنْ لَّا نَعْبُدَ إِلَّا اللهَ وَلَا نُشْرِكَ بِه شَيْئًا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًا مِنْ دُوْنِ اللهِ. فَإِنْ تَوَلّوْا فَقُوْلُوْا: اشْهَدُوْا بِأَنَّا مُسْلِمُوْنَ3:64) مُتَّفَقٌ عَلَيْهِ.

وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ قَالَ: مِنْ مُحَمَّدٍ رَسُوْلِ اللهِ”. وقَالَ: “إِثْمُ الْيَرِيْسِيِّيْنَ”. وَقَالَ: “بِدِعَايَةِ الْإِسْلَامِ”. متفق عليه.

3926. (1) [2/1149ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఖై’సర్‌ రాజుకు ఉత్తరం వ్రాసారు. అందులో ఇస్లామ్‌ స్వీకరించమని సందేశం అందజేసారు. ఆ ఉత్తరాన్ని ద’హియ్య కల్బీకి ఇచ్చి పంపారు. దాన్ని బ’స్రా అధికారికి ఇవ్వమని, బ’స్రా అధికారి ఖై’సర్‌ రాజుకు ఇవ్వమని ఆదేశించారు. ఆ ఉత్తరంలో ఇలా ఉంది: ”నేను అల్లాహ్‌ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయన ‘అనంత కరుణామయుడు, అపార కరుణాప్రదాత.’ ఈ ఉత్తరం అల్లాహ్ (త) దాసుడు, ఆయన (త) ప్రవక్త ముహమ్మద్‌ (స) తరఫు నుండి రూమ్‌ రాజుకు. ‘సన్మార్గాన్ని అవలంబించిన వ్యక్తిపై కారుణ్యాలు కురియుగాక! ఆ తరువాత నేను నీకు ఇస్లామ్‌ సందేశాన్ని అందజేస్తున్నాను. ఒకవేళ నీవు ఇస్లామ్‌ స్వీకరిస్తే ఉభయలోకాల్లోనూ శాంతి లభిస్తుంది. అల్లాహ్‌ (త) నీకు రెట్టింపు పుణ్యం ప్రసాదిస్తాడు. ఒక వేళ నా సందేశాన్ని తిరస్కరిస్తే, నీ ప్రజల పాపం కూడా నీపైనే పడుతుంది. ఇంకా: ‘ఇలా అను: ‘ఓ గ్రంథ ప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ధర్మ విషయం (ఉత్తరువు) వైపునకు రండి, అది ఏమిటంటే: ‘మనం అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదు, ఆయనకు భాగస్వాములను ఎవ్వరినీ నిలబెట్టరాదు మరియు అల్లాహ్ తప్ప, మనవారిలో నుండి ఎవ్వరినీ ప్రభువులుగా చేసుకోరాదు.’ వారు (సమ్మతించక) తిరిగిపోతే: ‘మేము నిశ్చయంగా అల్లాహ్‌కు విధేయులము (ముస్లిం లము), దీనికి మీరు సాక్షులుగా ఉండండి.’ అని పలుకు అని చెప్పండి.” [41]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

 ముస్లిమ్‌ ఉల్లేఖనంలో: ”అల్లాహ్‌ ప్రవక్త ము’హమ్మద్‌ తరఫున,” అని ఉంది.

3927 – [ 2 ] ( صحيح ) (2/1149)

وَعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم بَعَثَ بِكِتَابِهِ إِلَى كِسْرَى مَعَ عَبْدِ اللهِ بْنِ حُذَافَةَ السَّهْمِيِّ فَأَمَرَهُ أَنْ يَدْفَعَهُ إِلى عَظِيْمِ الْبَحْرَيْنِ فَدَفَعَهُ عَظِيْمُ الْبَحْرَيْنِ إِلى كِسْرَى فَلَمَّا قَرَأَ مَزَّقَهُ  قَالَ ابْنُ الْمُسَيَّبِ: فَدَعَا عَلَيْهِمْ رَسُوْل اللهِ صلى الله عليه وسلم أَنْ يُمَزَّقُوْا كُلّ مُمَزَّقٍ. رَوَاهُ الْبُخَارِيُّ .

3927. (2) [2/1149దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర)కథనం: ప్రవక్త (స) ‘అబ్దుల్లాహ్ బిన్ హుజా’ఫహ్(ర)కు ఒక ఉత్తరం రాసి ఇచ్చి అతనితో బ’హ్‌రైన్‌ గవర్నర్‌ కిస్రా వద్దకు పంపారు. బ’హ్‌రైన్‌ పాలకుడు దాన్ని రా రాజైన కిస్రా వద్దకు పంపాడు. కిస్రా  రా రాజు ఆ ఉత్తరాన్ని చదివి, దాన్ని చింపివేసాడు. స’యీద్‌ బిన్‌ ము’సయ్యిబ్‌ కథనం: ‘ఈ సంఘటనను విని ప్రవక్త (స) కిస్రా రారాజు కూడా ఉత్తరంలా ముక్కలు ముక్కలు  అవాలని  శపించారు.’ [42] (బు’ఖారీ)

3928 – [ 3 ] ( صحيح ) (2/1150)

وَعَنْ أَنَسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَتَبَ إِلى كِسْرَى وَإِلى قَيْصَرَوَإِلى النَّجَاشِيِّ وَإِلى كُلِّ جَبَّارٍيَدْعُوْهُمْ إِلى اللهِ وَلَيْسَ بِالنَّجَاشِيِّ الَّذِيْ صَلّى عَلَيْهِ النَّبِيّ صلى الله عليه وسلم. رَوَاهُ مُسْلِمٌ .

3928. (3) [2/1150 దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) కిస్రా, ఖైసర్‌, నజ్జాషీ, ప్రతి పాలకుని వద్దకు ఇస్లామ్‌ సందేశాన్ని పంపారు. కాని ఈ నజ్జాషీ ప్రవక్త (స) పరోక్షంగా జనాజహ్ నమా’జు చదివిన నజాషీ కాదు. [43]  (ముస్లిమ్‌)

3929 – [ 4 ] ( صحيح ) (2/1150)

وَعَنْ سُلَيْمَانَ بْنِ بُرَيدَةَ عَنْ أَبِيْهِ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: إِذَا أَمَّرَ أَمِيْرًا عَلَى جَيْشٍ أَوْ سَرِيَّةٍ أَوْصَاهُ فِيْ خَاصَّتِهِ بِتَقْوَى اللهِ وَمَنْ مَعَهُ مِنَ الْمُسْلِمِيْنَ خَيْرًا ثُمَّ قَالَ: “اغْزُوْا بِسْمِ اللهِ قَاتِلُوْا مَنْ كَفَرَ بِاللهِ اغْزُوْا فَلَا تَغُلُّوْا وَلَا تَغْدِرُوْا وَلَا تَمَثَّلُوْا وَلَا تَقْتُلُوْا وَلِيْدًا وَإِذَا لَقِيْتَ عَدُوَّكَ مِنَ الْمُشْرِقيْنِ فَادْعُهُمْ إِلَى ثَلَاثِ خِصَالٍ أَوْ خِلَالٍ فَأَيّتُهُنَّ مَا أَجَابُوْكَ فاقبَل مِنْهُمْ وَكُفَّ عَنْهُمْ ثُمَّ ادْعُهُم إِلى الْإِسْلَامِ فَإِنْ أَجَابُوْكَ فَاقْبَلَ مِنْهُمْ وَكُفَّ عَنْهُمْ ثُمَّ ادْعُهُمْ إِلى التَّحَوُّلِ مِنْ دَارِهِمْ إِلَى دَارِ الْمُهَاجِرِيْنَ وَأَخْبِرْهُمْ أَنَّهُمْ إِنْ فَعَلُوْا ذَلِكَ فَلَهُمْ مَا لِلْمُهَاجِرِيْنَ وَعَلَيْهِمْ مَا عَلَى الْمُهَاجِرِيْنَ فَإِنْ أَبَوْا أَنْ يَّتَحَوَّلُوْا مِنْهَا فَأَخْبِرْهُمْ أَنَّهُمْ يَكُوْنُوْنَ كَأَعْرَابِ الْمُسْلِمِيْنَ يُجْرَي عَلَيْهِمْ حُكْمُ اللهِ الَّذِيْ يَجْرِيْ عَلَيْهِمْ حُكْمُ اللهِ الَّذِيْ يَجْرِيْ عَلَى الْمُؤْمِنِيْنَ وَلَا يَكُوْنُ لَهُمْ فِي الْغَنِيْمَةِ وَالْفَيْءِ شَيْءٌ إِلّا أَنْ يُّجَاهِدُوْا مَعَ الْمُسْلِمِيْنَ فَإِنْ هُمْ أَبَوْا فَسَلْهُمُ الْجِزْيَةَ فَإِنْ هُمْ أَجَابُوْكَ فَاقْبَلَ مِنْهُمْ وَكُفَّ عَنْهُمْ فَإِنْ هُمْ أَبَوْا فَاسْتَعِنْ بِاللهِ وَقَاتِلْهُمْ وَإِذَا حَاصَرْتَ أَهْلَ حِصْنٍ فَأَرَادُوْكَ أَنْ تَجْعَلَ لَهُمْ ذِمَّةَ اللهِ وَذِمَّةَ نَبِيِّهِ فَلَا تَجْعَلَ لَهُمْ ذِمَّةَ اللهِ وَلَا ذِمَّةَ نَبِيِّهِ وَلَكِنِ اجْعَل لَهُمْ ذِمَّتَكَ وَذِمَّةَ أَصْحَابِكَ فَإِنَّكُمْ أَنْ تُخفِرُوْا ذِمَمَكُم وَذِمَمَ أَصْحَابِكُمْ أَهْوَنُ مِنْ أَنْ تُخْفِرُوْا ذِمَّةَ اللهِ وَذِمَّةَ رَسُوْلِهِ وَإِنْ حَاصَرْتَ أَهْلَ حِصْنٍ فَأَرَادُوْكَ أَنْ تُنْزِلَهُمْ عَلَى حُكْمِ اللهِ فَلَا تُنْزِلْهُمْ عَلَى حُكْمِ اللهِ وَلَكِنَّ أَنْزِلْهُمْ عَلَى حُكْمِكَ فَإِنَّكَ لَا تَدْرِيْ: أَتُصِيْبُ حُكْمَ اللهِ فِيْهِمْ أَمْ لَا؟”  رَوَاهُ مُسْلِمٌ .

3929. (4) [2/1150- దృఢం]

సులైమాన్‌ బిన్‌ బురైదహ్‌ తన తండ్రి ద్వారా కథనం: అతని తండ్రి కథనం: ప్రవక్త (స) ఎవరినైనా సైన్యం లేదా బృందానికి నాయకునిగా నియమిస్తే, ఆ నాయకునికి ప్రత్యేకంగా అల్లాహ్‌ (త) పట్ల భయపడమని, ఇతర ముస్లిముల పట్ల సేవాభావంతో మెలగమని ఉపదేశించేవారు.అంటే జిహాద్‌లో అల్లాహ్‌కు భయపడుతూ ఉండమని, తన సహచరుల పట్ల సేవాభావంతో మంచిగా ప్రవర్తించమని, దైవమార్గంలో దేవుని పేరుతో జిహాద్‌ చేయమని, అల్లాహ్‌ (త) పట్ల సాటికల్పించే వారిని చంపమని, ఇంకా ఎవరికీ ద్రోహం తలపెట్టవద్దని, వాగ్దానభంగం చేయరాదని, మృతులను వ్యతిరేకదిశలో అవయవాలుకోసి అంద వికారంగా చేయరాదని, పిల్లల్ని చంపరాదని, మీకు శత్రువులను కలిస్తే యుద్ధానికి ముందు వారికి మూడు విషయాల్లో ఒక విషయం వైపునకు పిలవండి. వాటిలో దేన్ని అంగీకరించినా దాన్ని మీరు స్వీకరించండి. యుద్ధాన్ని మానుకోండి. అన్నిటి కంటే మొదటి విషయం. 1. వారిని ఇస్లామ్‌ వైపునకు ఆహ్వానించండి. అంటే మీరు ఇస్లామ్‌ స్వీకరించండి, అల్లాహ్‌ (త) మరియు ఆయన ప్రవక్త(స)కు విధేయత చూపండి. ఒకవేళ వారు స్వీకరిస్తే, వారితో యుద్ధం చేయకండి, ఆ తరువాత వారితో దారుల్‌ హర్బ్‌ నుండి దారుల్‌ ముహాజిరీన్‌ లోనికి వచ్చేయమని చెప్పండి. అంటే దారుస్సలామ్‌లోనికి రమ్మని చెప్పండి. ఒకవేళ వారు అక్కడికి వస్తే, వారికి ముహాజిరీన్లకు చెందిన హక్కులే వారికీ చెందుతాయని చెప్పండి. ఒకవేళ వారు రావడానికి సిద్ధపడకపోతే, అక్కడే ఉంటామంటే ఇతర ముస్లిముల్లా వారు పరిగణించబడతారు. అంటే వారు నమా’జు, రో’జహ్ మొదలైనవి ఆచరిస్తారు. అయితే అక్కడి జిహాద్‌ యుద్ధ ధనం నుండి ఏమీ లభించదని, ఒకవేళ వారు ముస్లిములతో కలసియుద్ధంలో పాల్గొంటే వారికి కూడా యుద్ధ ధనం లభిస్తుందని చెప్పండి. ఒకవేళ వారు ఇస్లామ్‌ స్వీకరించడానికి సిద్ధంగా లేకపోతే, మాకు టాక్స్‌ చెల్లిస్తూ ఉండాలని, మేము మీ ధన, ప్రాణాల రక్షణా బాధ్యతలు స్వీకరిస్తామని చెప్పండి. దానికి వారు ఒప్పు కుంటే దాన్ని స్వీక రించండి. యుద్ధం చేయకండి. ఒకవేళ టాక్సు ఇవ్వటానికి అంగీకరించక పోతే, అల్లాహ్‌ను సహాయం కోరి వారితో యుద్ధం చేయండి. ఒకవేళ మీరు కోటను ముట్టడిస్తే, వారు అల్లాహ్‌ (త) ఆయన ప్రవక్త (స) అభయం అర్థిస్తే, వారికి అల్లాహ్‌ (త) మరియు ఆయన ప్రవక్త (స) అభయం ఇవ్వకండి. మీది, మీ సహచరుల అభయం ఇవ్వండి. ఎందుకంటే దానికంటే దీన్ని భంగంచేయడం మీకు సులభం. ఒకవేళ మీరు కోటను ముట్టడిస్తే, వారు మీ ఆదేశాలకు లొంగితే, వారిని మీ ఇష్టప్రకారం లొంగదీసు కోండి. ఎందుకంటే అల్లాహ్(త) తీర్పు ఏమిటో మీకు తెలియదు. అంటే మీ నిర్ణయం సరిగా ఉంటుందో లేదో మీకు తెలియదు. (ముస్లిమ్‌)

3930- [ 5 ] ( متفق عليه ) (2/1151)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ أَبِيْ أَوْفى: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فِيْ بَعْضِ أَيَّامِهِ الَّتِيْ لَقِيَ فِيْهَا الْعَدُوَّ انْتَظَرَ حَتَّى مَالَتِ الشَّمْسُ ثُمَّ قَامَ فِي النَّاسِ فَقَالَ: “يَا أَيُّهَا النَّاسُ لَا تَتَمَنَّوْا لِقَاءَ الْعَدُوِّ وَاسْأَلُوا اللهَ الْعَافِيَةَ .فَإِذَا لَقِيْتُمْ فَاصْبِرُوْا وَاعْلَمُوْا أَنَّ الْجَنَّةَ تَحْتَ ظِلَالِ السُّيُوْفِ”ثُمَّ قَالَ: ” اللّهُمَّ مُنْزِلَ الْكِتَابِ وَمُجْرِيَ السَّحَابِ وَهَازِمَ الْأَحْزَابِ وَاُهْزِمْهُمْ وَ انْصُرْنَا عَلَيْهِمْ”.

3930. (5) [2/1151ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అబీ అవ్‌ఫా (ర) కథనం: ప్రవక్త (స) శత్రువులతో యుద్ధం చేయడానికి నిశ్చయించు కున్నప్పుడు సూర్యాస్తమయం కోసం వేచి ఉండేవారు. సూర్యాస్తమయం అయిన వెంటనే ప్రజల మధ్య నిలబడి ఇలా ప్రసంగించేవారు. ”ఓ ప్రజలారా! శత్రువుతో యుద్ధం చేయాలని కోరకండి. అల్లాహ్‌(త)తో మీ క్షేమం కోరండి. అయితే శత్రువును ఎదుర్కొంటే మాత్రం సహనం, స్థిరత్వాలను అవలంబించండి. అయితే  స్వర్గం కరవాలాలనీడలో ఉందనే విషయాన్ని మాత్రం మరువకండి.” మళ్ళీ ఇలా ప్రార్థించారు, ”ఓ గ్రంథాలను అవతరింప జేసేవాడా! ఓ మేఘాలను నడిపించే వాడా!  మరియు అవిశ్వాసులను ఓడించేవాడా! ఆ అవిశ్వాసులను ఓడించు. వారిపై మాకు సహాయం చేయి.”  (బు’ఖారీ, ముస్లిమ్‌)

3931 – [ 6 ] ( متفق عليه ) (2/1151)

وَعَنْ أَنَسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَا غَزَا بِنَا قَوْمًا لَمْ يَكُنْ يَغْزُوْ بِنَا حَتّى يُصْبِحَ وَيَنْظُرَ إِلَيْهِمْ فَإِنْ سَمِعَ أَذَانًا كَفَّ عَنْهُمْ وَإِنْ لَمْ يَسْمَعْ أَذَانًا أَغَارَ عَلَيْهِمْ قَالَ: فَخَرَجْنَا إِلى خَيْبَرَ فَانْتَهَيْنَا إِلَيْهِمْ لَيْلًا فَلَمَّا أَصْبَحَ وَلَمْ يَسْمَعْ أَذَانًا رَكِبَ وَرَكِبْتُ خَلْفَ أَبِيْ طَلْحَةَ وَإِنَّ قَدَمِيْ لَتَمَسُّ قَدَمَ نَبِيّ اللهِ صلى الله عليه وسلم قَالَ: فَخَرَجُوْا إِلَيْنَا بِمَكَاتِلِهِمْ وَمَسَاحِيْهِمْ فَلَمَّا رَأَى النَّبِيّ صلى الله عليه وسلم قَالُوْا: مُحَمَّدٌ وَاللهِ مَحَمَّدٌ وَالْخَمِِيْسُ فَلَجَؤُوْا إِلى الْحِصْنِ فَلَمَّا رَآى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم قَالَ: “اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ خَرِبَتْ خَيْبَرُ إِنَّا إِذَا نَزَلْنَا بِسَاحَةِ قَوْمٍ فَسَاءَ صَبَاحُ الْمُنْذِرِيْنَ”.

3931. (6) [28/1151 ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మమ్మల్ని తీసుకొని ఏదైనా పోరాటినికి వెళితే, ఉదయం వరకు శత్రువుపై దాడిచేయరు. ఉదయం అయిన తర్వాత ఎక్కడి నుండైనా అ’జాన్‌ శబ్దం వస్తే యుద్ధం చేయరు, దాడి చేయరు. అ’జాన్‌ వినకపోతే దాడి చేసేవారు. మేము ‘ఖైబర్‌ వెళ్ళాము. అక్కడికి రాత్రిచేరాము. ఉదయం ప్రవక్త (స) అ’జాన్‌ శబ్దం వినలేదు. ప్రవక్త (స) వాహనంపై కూర్చున్నారు. నేను అబూ ‘తల్‌’హా వెనుక కూర్చున్నాను. ప్రవక్త (స) వాహనంతో పాటు నా వాహనం కూడా నడుస్తుంది. నా పాదాలు ప్రవక్త (స) పాదాలకు తగిలేవి. అంటే మేము సరిసమానంగా నడుస్తున్నాము. ఉదయం ఖైబర్‌ ప్రజలు తమ పనిముట్లు సంచులు, పారలు, మొదలైనవి పట్టుకొని బయలుదేరారు. వారు ప్రవక్త (స) ను చూచి దైవం సాక్షి! ముహమ్మద్‌(స) సైన్యంతో వచ్చారని పలికి, కోటలోనికి వెళ్ళిపోయారు. ప్రవక్త (స) వారిని చూచి, ‘అల్లాహ్‌ (త) చాలా గొప్పవాడు. ‘ఖైబర్‌ పాడుగాను. మేము ఏ జాతి వద్దకైనా యుద్ధానికి దిగితే భయపడే ఆ జాతి పరిస్థితి చాలా నీచంగా తయారవుతుంది,’ అని అన్నారు.[44] (బు’ఖారీ, ముస్లిమ్‌).

3932 – [ 7 ] ( صحيح ) (2/1151)

وَعَنِ النُّعْمَانِ بْنِ مُقَرِّنِ قَالَ: شَهِدْتُّ الْقِتَالَ مَعَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَكَانَ إِذَا لَمْ يُقَاتِلُ أَوَّلَ النَّهَارِ انْتَظَرَ حَتَّى تَهُبَّ الْأَرْوَاحُ وَتَحْضُرَ الصَّلَاةُ. رَوَاهُ الْبُخَارِيُّ.

3932. (7) [2/1151దృఢం]

నోమాన్‌ బిన్‌ ముఖర్రిన్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) వెంట అనేక యుద్ధాల్లో తోడుగా ఉన్నాను. ప్రవక్త (స) పగలు ప్రారంభదశలో యుద్ధం చేసేవారు కారు. అనం తరం దైవసహాయ సహకారాల గాలులు వీయడం ప్రారంభమవుతాయి. నమాజు సమయం అయిన తరు వాత  ప్రవక్త  (స) యుద్ధం  చేసేవారు.  (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం 

3933 – [ 8 ] ( لم تتم دراسته ) (2/1152)

عَنِ النُّعْمَانِ بْنِ مُقَرِّنٍ قَالَ: شَهِدْتُّ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَكَانَ إِذَا لَمْ يُقَاتِلْ أَوَّلَ النَّهَارِ انْتَظَرَ حَتَّى تَزُوْلَ الشَّمْسُ وَتَهُبَّ الرِّيَاحُ وَيَنْزِلَ النَّصْرُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3933. (8) [2/1152అపరిశోధితం]

నోమాన్‌ బిన్‌ ముఖర్రిన్‌ (ర) కథనం: ప్రవక్త (స) వెంట నేను అనేక యుద్ధాలలో పాల్గొన్నాను. ప్రవక్త (స) పగలు ప్రారంభదశలో యుద్ధం చేయకపోతే ఆగి వేచి ఉండి, సూర్యుడు వాలిన తర్వాత గాలులు వీస్తూ దైవసహాయం అవతరించసాగినపుడు ప్రవక్త  (స) యుద్ధం  ప్రారంభిస్తారు.  (అబూ  దావూద్‌)

3934 – [ 9 ] ( لم تتم دراسته ) (2/1152)

وَعَنْ قَتَادَةَ عَنِ النُّعْمَانِ بْنِ مُقَرِّنٍ قَالَ: غَزَوْتُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَكَانَ إِذَا طَلَعَ الْفَجْرُ أَمْسَكَ حَتَّى تَطْلَعَ الشَّمْسُ فَإِذَا طَلَعَتْ قَاتَلَ فَإِذَا انْتَصَفَ النَّهَاُر أَمْسَكَ حَتَّى تَزُوْلَ الشَّمْسُ فَإِذَا زَالَتِ الشَّمْسُ قَاتَلَ حَتَّى الْعَصْرِ ثُمَّ أَمْسَكَ حَتَّى يُصَلِّي الْعَصْرَ ثُمَّ يُقَاتِلُ قَالَ قَتَادَةَ: كَانَ يُقَالُ: عِنْدَ ذَلِكَ تَهِيْجُ رِيَاحُ النَّصْرِ وَيَدْعُو الْمُؤْمِنُوْنَ لِجُيُوْشِهِمْ فِيْ صَلَاتِهِمْ. رَوَاهُ التِّرْمِذِيُّ .

3934. (9) [2/1152 అపరిశోధితం]

ఖతాదహ్‌ (ర), నోమాన్‌ బిన్‌ ముఖర్రిన్‌ (ర) కథనం: ప్రవక్త (స) వెంట నేను యుద్ధంలో పాల్గొన్నాను. రాత్రి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఉషోదయం కాగానే ప్రవక్త (స) యుద్ధం సూర్యోదయం వరకు ఆపివేస్తారు. సూర్యోదయం అయిన తర్వాత యుద్ధం చేస్తారు. మధ్యాహ్నం అయితే యుద్ధాన్ని ఆపివేస్తారు. సూర్యుడు వాలిన తర్వాత అస్ర్‌ వరకు యుద్ధం చేస్తారు. అస్ర్‌ సమయం కాగానే యుద్ధం ఆపివేస్తారు. అస్ర్‌ నమాజు చదివిన తర్వాత మళ్ళీ యుద్ధం చేస్తారు. ఖతాదహ్ కథనం, ”అప్పుడు అల్లాహ్ విజయ, సహాయాల గాలులు వీస్తూ ఉంటాయి. ముస్లిములు తమ  నమా’జులలో ముస్లిముల విజయం కోసం దు’ఆలు  చేస్తారు.”  (తిర్మిజి’)

3935 – [ 10 ] ( لم تتم دراسته ) (2/1152)

وَعَنْ عِصَامِ الْمُزَنِّيِ قَالَ: بَعَثَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِي سَرِيَّةٍ فقَالَ: “إِذَا رَأَيْتُمْ مَسْجِدًا أَوْ سَمِعْتُمْ مُؤَذِّنًا فَلَا تَقْتُلُوْا أَحَدًا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

3935. (10) [2/1152 అపరిశోధితం]

ఇసామ్‌ ము’జ్‌నీ కథనం: ప్రవక్త (స) ఒక సైన్యం ఇచ్చి మమ్మల్ని పంపారు. ఇంకా మీరు ఎక్కడైనా మస్జిద్‌ చూసినా, అ’జాన్‌ విన్నా అక్కడ వారెవరినీ చంపకండి అని  ఉపదేశించారు.[45]  (తిర్మిజి’, అబూ  దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ     మూడవ విభాగం

3936 – [ 11 ] ( لم تتم دراسته ) (2/1152)

عَنْ أَبِيْ وَائِلٍ قَالَ: كَتَبَ خَالِدُ بْنُ الْوَلِيْدِ إِلَى أَهْلِ فَارِسَ: بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ. مِنْ خَالِدِ بْنِ الْوَلِيْدِ إِلى رُسْتُم وَمِهْرَانَ فِيْ مَلَأ فَارِسَ. سَلَامٌ عَلَى مَنِ اتَّبَعَ الْهُدَى. أَمَّا بَعْدُ فَإِنَّا نَدْعُوْكُمْ إِلى الْإِسْلَامِ فَإِنْ أَبَيْتُمْ فَأَعْطُوا الْجِزْيَةَ عَنْ يَدٍ وَأَنْتُمْ صَاغِرُوْنَ فَإِنْ أَبَيْتُمْ فَإِنَّ مَعِيَ قَوْمًا يُحِبُّوْنَ الْقَتْلَ فِيْ سَبِيْلِ اللهِ كَمَا يُحِبُّ فَارِسُ الْخَمْرَ وَالسَّلَامُ عَلَى مَنِ اتَّبَعَ الْهُدَى. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.

3936. (11) [2/1152 అపరిశోధితం]

అబూ వాయిల్‌ (ర) కథనం: ‘ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ ఫారిస్‌ పాలకులకు ఇలా ఉత్తరం వ్రాస్తారు: బిస్మిల్లాహ్హిర్రహ్మా నిర్రహీమ్. ఈ ఉత్తరం ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ తరఫునుండి ఫారిస్‌ పాలకుడు రుస్తుమ్‌కి వ్రాయబడు తోంది. రుజుమార్గాన్ని అవలంబించే వారిపై శాంతి కురియుగాక! ఆ తరువాత నేను మీ అందరికీ ఇస్లామ్‌ స్వీకరించమని సందేశం అంద జేస్తున్నాను. అంటే మీరు ఇస్లామ్‌ స్వీకరించమని కోరుతున్నాను. ఒకవేళ తిరస్కరిస్తే, మీరు టాక్స్‌ చెల్లించాలి. మీరు మా అధీనంలో ఉండాలి. దీన్ని కూడా తిరస్కరిస్తే, మా సైన్యంలో ఎటువంటి వారున్నారంటే దైవమార్గంలో యుద్ధాలు చేయ టానికి, వీరమరణం పొందటానికి ఫారిస్‌ ప్రజలు మద్యాన్ని ప్రేమించినట్లు ప్రేమిస్తారు. రుజుమార్గం అనుసరించేవారిపై శాంతి కురియు గాక!” (షర్‌హుస్సున్నహ్‌)

=====

4– بَابُ الْقِتَالِ فِي الْجِهَادِ

4. జిహాద్ లో వీరమరణం

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం  

3937 – [ 1 ] ( متفق عليه ) (2/1153)

عَنْ جَابِرٍ قَالَ: قَالَ رَجُلٌ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم يَوْمَ أُحُدٍ: أَرَأَيْتَ إِنْ قُتِلْتُ فَأَيْنَ أَنَا؟ قَالَ: “فِي الْجَنَّةِ” فَأَلْقَى ثَمَرَاتٍ فِيْ يَدِهِ ثُمَّ قَاتَلَ حَتَّى قُتِلَ. متفق عليه.

3937. (1) [2/1153ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: ఉ’హుద్‌ యుద్ధం రోజు ఒక అనుచరుడు ప్రవక్త (స)ను, ‘ఒకవేళ నేను వీరమరణం పొందితే నేనెక్కడ ఉంటాను,’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స), ‘స్వర్గంలో’ అని సమాధానం ఇచ్చారు. అప్పుడు అతని చేతిలో కొన్ని ఖర్జూరం పళ్ళు ఉన్నాయి. ప్రవక్త (స) సమాధానం విన్న వెంటనే ఖర్జూరాలను పారవేసి యుద్ధం చేయసాగాడు.చివరికి వీరమరణం  పొందాడు.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

3938 – [ 2 ] ( صحيح ) (2/1153)

وَعَنْ كَعْبِ بْنِ مَالِكٍ قَالَ: لَمْ يَكُنْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُرِيْدُ غَزْوَةُ إِلَّا وَرّى بِغَيْرِهَا حَتَّى كَانَتْ تِلْكَ الْغَزْوَةُ يَعْنِيْ غَزْوَةَ تَبُوْكَ غَزَاهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ حَرٍّ شَدِيْدٍ وَاسْتَقْبَلَ سَفْرًا بَعِيْدًا وَمَفَازًا وَعَدُوًّا كَثِيْرًا فَجَلّى لِلْمُسْلِمِيْنَ أَمَرَهُمْ لِيَتَأَهَّبُوْا أُهْبَةَ غَزوِهِمْ فَأَخْبَرَهُمْ بِوَجْهِهِ الَّذِيْ يُرِيْدُ. رَوَاهُ الْبُخَارِيُّ.

3938. (2) [2/1153దృఢం]

క’అబ్‌ బిన్‌ మాలిక్‌ (ర) కథనం: ప్రవక్త (స) యుద్ధంలో వెళ్ళడానికి నిశ్చయించుకున్నప్పుడు, తౌరియ చేస్తారు. కాని తబూక్‌ యుద్ధంలో వెళ్ళి నప్పుడు మాత్రం తౌరియ చేయలేదు. అందరి ముందు స్పష్టంగా, తబూక్వెళ్ళి మనం యుద్ధం చేయాలి,’ అని అన్నారు. మంచి ఎండా కాలంలో ప్రవక్త (స) యుద్ధానికి పూనుకున్నారు. సుదూర ప్రయాణం, అడవులు దాటి శత్రువులతో పోరాడాలనే తన నిశ్చయాన్ని వెల్లడించారు. అందరూ యుద్ధ సామాగ్రిని సమకూర్చుకోవాలని, ఏమార్గం గుండా వెళ్ళాలో దాన్ని అందరికీ స్పష్టపరిచారు.[46](బు’ఖారీ)

3939 – [ 3 ] ( متفق عليه ) (2/1153)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْحَرْبُ خُدْعَةٌ”.

3939. (3) [2/1153 ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”యుద్ధం అంటే  కుట్రలు, కుతంత్రాలే.” [47] (బు’ఖారీ, ముస్లిమ్‌)

3940 – [ 4 ] ( صحيح ) (2/1153)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَغْزُو بِأُمِّ سُلَيْمٍ وَنِسْوَةٍ مِّنَ الْأَنْصَارِ مَعَهُ إِذَا غَزَا يَسْقِيْنَ الْمَاءَ وَيُدَاوِيْنَ الْجَرحَىٌّ. رَوَاهُ مُسْلِمٌ .

3940. (4) [2/1153 దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఉమ్మె సులైమ్‌, మరియు ఇతర అ’న్సారీ స్త్రీలను తన వెంట జిహాద్‌కి తీసుకు వెళ్ళేవారు. వీరు యుద్ధంలో ముజాహిదీన్లకు నీళ్ళు త్రాపించేవారు, ఇంకా గాయాలకు కట్లు కట్టేవారు, మందులు ఇచ్చేవారు. [48]  (ముస్లిమ్‌)

3941- [ 5 ] ( صحيح ) (2/1153)

وَعَنْ أُمّ عطيَّةَ قَالَتْ: غَزَوْتُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم سَبْعَ غَزْوَاتٍ أَخْلُفُهُمْ فِيْ رِحَالِهِمْ. فَأصْنَعْ لَهُمُ الطَّعَامَ وَأَدَاوِي الْجَرْحَى وَأَقُوْمُ عَلَى الْمَرْضَى. رَوَاهُ مُسْلِمٌ

3941. (5) [2/1153దృఢం]

ఉమ్మె ‘అ’తియ్యహ్ (ర) కథనం: నేను ప్రవక్త (స) వెంట 7 యుద్ధాల్లో పాల్గొన్నాను. ముజాహిదీన్ల టెంట్లలో వారు యుద్ధానికి వెళ్ళిపోయిన తర్వాత వారికోసం అన్నం తయారు చేసేదాన్ని, గాయపడిన వారికి కట్లు కట్టేదాన్ని. అనారోగ్యంగా ఉన్నవారిని కనిపెట్టు కొని ఉండేదాన్ని. [49] (ముస్లిమ్‌)

3942 – [ 6 ] ( متفق عليه ) (2/1154)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ قَتْلِ النِّسَاءِ وَالصِّبْيَانِ .

3942. (6) [2/1154 ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌(ర) కథనం: ప్రవక్త (స) స్త్రీలను, పిల్లలను చంపకూడదని వారించారు.[50] (బు’ఖారీ, ముస్లిమ్‌)

3943 – [ 7 ] ( متفق عليه ) (2/1154)

وَعَنِ الصُّعْبِ بْنِ جَثَّامَةَ قَالَ: سُئِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ أَهْلِ الدّارِ يُبَيِّتُوْنَ مِنَ الْمُشْرِكِيْنَ فَيُصَابُ مِنْ نِسَائِهِمْ وَذَرَارِيْهِمْ قَالَ: “هُمْ مِنْهُمْ”.

وَفِيْ رِوَايَةٍ : “هُمْ مِنْ آبَائِهِمْ”.

3943. (7) [2/1154 ఏకీభవితం]

‘స’అబ్‌ బిన్‌ జసా’మహ్ (ర)కథనం: ప్రవక్త (స)ను రాత్రి దాడి గురించి ప్రశ్నించడం జరిగింది. అంటే రాత్రిపూట అవిశ్వాసులతో యుద్ధం జరిగితే, యుద్ధంలో అనుకోకుండా స్త్రీగానీ, పిల్లలుగానీ చంపబడితే పరిష్కారం ఏమిటని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స) ”వారు వారి తండ్రులను అనుసరించి ఉంటారు. అంటే ఒకవేళ అనుకోకుండా ముస్లిముల చేతుల్లో చనిపోతే మరేం ఫరవాలేదు,” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3944 – [ 8 ] ( متفق عليه ) (2/1154)

وَعَنِ ابْنِ عُمَرَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَطَعَ نَخْلَ بَنِي النَّضِيْرِ وَحَرَّقَ وَلَهَا يَقُوْلُ حَسَّانٌ: وَهَانَ عَلَى سَرَاةِ بَنِيْ لُؤَيٍّ حَرِيْقٌ بِالْبُوَيرَةِ مُسْتَطِيْرُ وَفِيْ ذَلِكَ نَزَلَتْ (مَا قَطَعْتُمْ مِنْ لِيْنَةٍ أَوْ تَرَكْتُمُوْهَا قَائِمَة عَلَى أُصُوْلِهَا فَبِإِذْنِ اللهِ، 59:5) .

3944. (8) [2/1154ఏకీభవితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) బనూ న’దీర్‌కు చెందిన ఖర్జూరపు చెట్లను నరకమని, కాల్చమని ఆదేశించారు. అప్పుడు ఈ ఆయతు అవతరించింది.

 ”(ఓ విశ్వాసులారా!) మీరు ఏ ఖర్జూరపు చెట్లను నరికి వేశారో  లేక ఏ ఖర్జూరపుచెట్లను వాటి వ్రేళ్ళ మీద నిలబడేలా వదలిపెట్టారో, అంతా అల్లాహ్‌ ఆజ్ఞతోనే జరిగింది. మరియు ఇదంతా అవిధే యులను అవమా నించటానికి జరిగిన విషయం.” [51] (బు’ఖారీ, ముస్లిమ్‌)

3945 – [ 9 ] ( متفق عليه ) (2/1154)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَوْنٍ:أَنَّ نَافِعًا كَتَبَ إِلَيْهِ يُخْبِرُهُ أَنَّ ابْنَ عُمَرَ أَخْبَرَهُ أَنَّ ابْنَ عُمَرَ أَخْبَرَهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أَغَارَ عَلَى بَنِي الْمُصْطَلِق غَارِّيْنَ فِيْ نَعَمِهِمْ بِالْمُرَيْسِيْعِ فَقَتَلَ الْمُقَاتِلَةَ وَسَبى الذُّرِّيَّةَ.

3945. (9) [2/1154 ఏకీభవితం]

అబ్దుల్లాహ్‌ బిన్‌ ఔన్‌ (ర) కథనం: నాఫె అతనికి ఉత్తరం పంపారు. అందులో ఇలా ఉంది, ”అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ అతనికి ఈ విషయం తెలిపారు, ‘ప్రవక్త (స) బనీ ముస్తలిఖ్‌పై దాడి చేయించారు.  అప్పుడు వారు ఏమరుపాటుకు గురై ఉన్నారు. మరీసీ ప్రాంతంలో వారిని చంపారు. వారి స్త్రీలను, పిల్లల్ని అదుపులోకి తీసుకున్నారు.  [52] (బు’ఖారీ, ముస్లిమ్‌)

3946 – [ 10 ] ( صحيح ) (2/1154)

وَعَنْ أَبِيْ أُسَيْدٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ لَنَا يَوْمَ بَدْرٍ حِيْنَ صَفَفْنَا لِقُرَيْشٍ وَصَفُّوْا لَنَا: “إِذَا اُكثَبوكُمْ فَعَلَيْكُمْ بِالنَّبْلِ”. وَفِيْ رِوَايَةٍ: “إِذَا أَكْثَبُوْكُمْ فَارْمُوْهُمْ وَاسْتَبْقُوْا نَبْلَكُمْ”. رَوَاهُ الْبُخَارِيُّ

وَحَدِيْثُ سَعْدٍ: “هُوَ تُنْصَرُوْنَ” سَنَذْكُرُهُ فِيْ بَابِ” فَضْلِ الْفُقَرَاءِ”. وَحَدِيْث الْبَرَاءِ: بَعَثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم رَهْطًا فِيْ بَابِ. “اَلْمُعْجِزَاتِ” إِنْ شَاءَ اللهُ تَعَالى .

3946. (10) [2/1154 దృఢం]

అబూ ఉసైద్‌ (ర) కథనం: బద్ర్‌ యుద్ధం సందర్భంగా మేము ఖురైషులకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమ య్యాము. వాళ్ళు మాకు వ్యతిరేకంగా సిద్ధపడ్డారు. అప్పుడు ప్రవక్త (స) మాతో ఇలా అన్నారు, ”ఈ అవిశ్వాసులు మీ దగ్గరకు వచ్చినపుడు మీరు వారిని బాణాలతో కొట్టాలి. మరో ఉల్లేఖనంలో ”వారు మీ దగ్గరకు వస్తే మీరు వారిపై బాణాలు వదలండి. అయితే బాణాలను మిగిల్చి ఉంచండి.”  [53]  (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం 

3947 – [ 11 ] ( لم تتم دراسته ) (2/1155)

عَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ عَوْفٍ قَالَ: عَبَّأنَا النَّبِيُّ صلى الله عليه وسلم بِبَدْرٍ لَيْلًا. رَوَاهُ التِّرْمِذِيُّ.

3947. (11) [2/1155-అపరిశోధితం]

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ (ర): బద్ర్‌లో రాత్రిపూట ప్రవక్త (స) మమ్మల్ని సిద్ధం చేసారు. అంటే సైన్యాన్ని యుద్ధం కోసం అందరినీ తమ తమ స్థానాల్లో సన్న ద్ధులు చేసారు. అరబ్బులు దీన్ని ఉబ్‌సు జైషన్‌ అంటే సైన్యాన్ని సిద్ధం చేయటం అని అంటారు. (తిర్మిజి’)

అంటే యుద్ధం కోసం సైనికులను తమ తమ స్థానాల్లో నియమించారు.

3948 – [ 12 ] ( لم تتم دراسته ) (2/1155)

وَعَنِ الْمُهلَّبِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنْ بَيَّتَكُمُ الْعَدُوّ فَلْيَكُنْ شِعَارُكُمْ: “حم لَا يُنْصَرُوْنَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

3948. (12) [2/1155అపరిశోధితం]

ముహల్లబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒకవేళ రాత్రి సమయంలో శత్రువు మీపై దాడిచేస్తే, మీ చిహ్నం హామీమ్‌, లా యున్సరూన్‌” ఉండాలి అని అన్నారు.[54]  (తిర్మిజి’, అబూ  దావూద్‌)

3949 – [ 13 ] ( ضعيف ) (2/1155)

وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ قَالَ: كَانَ شِعَارُ الْمُهَاجِرِيْنَ: عَبْدُ اللهِ وَشِعَارُ الْأَنْصَارِ: عَبْدُ الرَّحْمنِ . رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3949. (13) [2/1155 బలహీనం]

సమురహ్‌ బిన్‌ జున్‌దుబ్‌ (ర) కథనం: ముహాజిరీన్ల చిహ్నం, అబ్దుల్లాహ్‘ఉండేది. అ’న్సార్ల చిహ్నం, అబ్దుర్రహ్మాన్‘ ఉండేది. (అబూ  దావూద్‌)

అంటే ఒక యుధ్ధంలో ముహాజిరీన్ల చిహ్నం ‘అబ్దు ల్లాహ్‌’ ఉండేది. అన్సార్ల చిహ్నం, ‘అబ్దుర్ర’హ్మాన్‌’ ఉండేది.    

3950 – [ 14 ] ( حسن ) (2/1155)

وَعَنْ سَلَمَةَ بْنِ الْأَكْوَع ِقَالَ: غَزَوْنَا مَعَ أَبِيْ بَكْرٍ زَمَنَ النَّبِيّ صلى الله عليه وسلم فَبيَّتُنَاهُمْ نَقْتُلُهُمْ وَكَانَ شِعَارُنَا:تِلْكَ اللَّيْلَةَ : أَمِتْ أَمِتْ . رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3950. (14) [2/1155 ప్రామాణికం]

సలమహ్ బిన్‌ అక్‌వ’అ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో అబూ బకర్‌ (ర) వెంట యుద్ధంలో పాల్గొన్నాను. రాత్రిపూట మేము అవిశ్వాసులపై దాడి చేసాము, వారిని చంపసాగాము. ఆ రాత్రి మా చిహ్నం అమిత్అమిత్‌”గా ఉండేది. —- అంటే ”ఓ అల్లాహ్! నువ్వు శత్రువులను చంపు.” (అబూ  దావూద్‌)

3951 – [ 15 ] ( لم تتم دراسته ) (2/1155)

وَعَنْ قَيْسِ بْنِ عُبَادٍ قَالَ: كَانَ أَصْحَابُ النَّبِيِّ صلى الله عليه وسلم يَكْرَهُوْنَ الصَّوْتَ عِنْدَ الْقِتَالِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3951. (15) [2/1155అపరిశోధితం]

ఖైస్‌ బిన్‌ ‘ఉబాద (ర) కథనం: యుద్ధ సమయంలో ప్రవక్త (స) అనుచరులు అల్లరి చేయటాన్ని, శబ్దాలు చేయటాన్ని అసహ్యించుకునేవారు. అంటే మౌనంగా ఉంటూ యుద్ధం చేసేవారు. అల్లర్లు చేసేవారు కారు. (అబూ  దావూద్‌)

3952 – [ 16 ] ( لم تتم دراسته ) (2/1155)

وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اقْتُلُوْا شُيُوْخَ الْمُشْرِكِيْنَ وَاسْتَحْيُوا شَرْخَهُمْ أَيْ صِبْيَانَهُمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ .

3952. (16) [2/1155 అపరిశోధితం]

సమురహ్‌ బిన్‌ జున్‌దుబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అవిశ్వాసుల్లో పెద్దలను చంపివేయండి. చిన్న వయస్సుగల, యుక్తవయస్సుకు చేరనివారిని విడిచి పెట్టండి.”  [55]  (తిర్మిజి’, అబూ  దావూద్‌)

3953 – [ 17 ] ( ضعيف ) (2/1155)

وَعَنْ عُرْوَةَ قَالَ: حَدَّثَنِيْ أُسَامَةُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ عَهِدَ إِلَيْهِ قَالَ: “أَغِرْ عَلَى أُبْنَى صَبَاحًا وَحَرِّقْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3953. (17) [2/1155బలహీనం]

‘ఉర్‌వహ్ (ర) కథనం: ఉసామహ్ (ర) నాకు ఈ ‘హదీసు’ వినిపించారు: ”ప్రవక్త (స) అతన్ని ఉబ్‌నా వర్గంపై ఉదయం వేళ దాడిచేయమని, వారిని కాల్చి వేయమని ఆదేశించారు.”  [56]  (అబూ  దావూద్‌)

3954 – [ 18 ] ( لم تتم دراسته ) (2/1155)

وَعَنْ أَبِيْ أُسَيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَوْمَ بَدْرٍ: “إِذَا أَكْثَبُوْكُمْ فَارْمُوْهُمْ وَلَا تَسُلُّوا السُّيُوْفَ حَتّى يَغْشَوْكُمْ”.  رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3954. (18) [2/1155 అపరిశోధితం]

అబూ ఉసైద్‌ (ర) కథనం: ప్రవక్త (స) బద్‌ర్‌ యుద్ధం నాడు ఇలా ఉపదేశించారు: ”అవిశ్వాసులు మీ దగ్గరకు రాగానే వారిని బాణంతో కొట్టండి, అయితే వారు మీకు చాలా దగ్గరకు వచ్చి మిమ్మల్ని చుట్టుముట్టుకోనంత వరకు కరవాలం ఎత్తకండి.” (అబూ  దావూద్‌)

3955 – [ 19 ] ( لم تتم دراسته ) (2/1156)

وَعَنْ رَبَاحِ بْنِ الرَّبِيْعِ قَالَ: كُنَّا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ غَزَوَةٍ فَرَأَى النَّاسَ مُجْتَمِعِيْنَ عَلَى شَيْءٍ فَبَعَثَ رَجُلًا فَقَالَ: “اُنْظُرُوْا عَلَامَ اجْتَمَعَ هَؤُلَاءِ؟” فَجَاءَ فَقَالَ عَلى اِمْرَأَةٍ قَتِيْلٍ فَقَالَ: “مَا كَانَتْ هَذِهِ لِتُقَاتِلَ”. وَعَلَى الْمُقَدَّمَةِ خَالِدُ بْنُ الْوَلِيْدِ فَبَعَثَ رَجُلًا فَقَالَ: “قُلْ لِخَالِدٍ: لَا تَقْتُلْ اِمْرَأَةً وَلَا عَسِيْفًا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3955. (19) [2/1156 అపరిశోధితం]

రబా’హ్‌ బిన్‌ రబీ’అ (ర) కథనం: ప్రవక్త (స) వెంట మేము ఒక యుద్ధంలో పాల్గొన్నాము. ప్రవక్త (స) చాలా మంది ప్రజలు ఒకచోట గుమిగూడి ఉండటం చూసారు. ప్రవక్త (స) ఒక వ్యక్తిని పంపి కారణం ఏమిటో తెలుసుకోమని చెప్పారు. ఆ వ్యక్తి తిరిగి వచ్చి, ‘ఒక స్త్రీ హత్య చేయబడింది, ఆమె శవం వద్ద ప్రజలు గుమి గూడారు,’ అని అన్నాడు. అది విని ప్రవక్త (స), ‘ఆ స్త్రీ యుద్ధం చేస్తున్నటువంటిది కాదనిపిస్తుంది, మరి ఆమెను హత్య ఎందుకు చేసారు?’ అక్కడి సైనికుల ముందుభాగాన ‘ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ సైన్యాధికారిగా ఉన్నారు. ఒక వ్యక్తిని పంపి ‘ఖాలిద్‌ను పిలిపించి స్త్రీలను చంపరాదని, అదేవిధంగా యుద్ధం చేయని సేవకులనూ చంపరాదని వారించారు. (అబూ దావూద్‌)

3956 – [ 20 ] ( لم تتم دراسته ) (2/1156)

وَعَنْ أَنَسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “اِنْطَلِقُوْا بِاسْمِ اللهِ وَبِاللهِ وَعَلى مِلَّةِ رَسُوْلِ اللهِ لَا تَقْتُلُوْا شَيْخًا فَانِيًا وَلَا طِفْلًا صَغِيْرًا وَلَا امْرَأَةً وَلَا تَغُلُّوْا وَضُمُّوْا غَنَائِمَكُمْ وَأَصْلِحُوْا وَأَحْسِنُوْا فَإِنَّ اللهَ يُحِبُّ الْمُحْسِنِيْنَ. ” رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3956. (20) [2/1156అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇస్లామ్‌ ముజాహిదీన్లు జిహాద్‌లోకి వెళ్తున్నప్పుడు ఇలా ఉపదేశించేవారు. ”మీరు అల్లాహ్(త) పేరుతో బయలుదేరండి, అల్లాహ్‌(త) మరియు ప్రవక్తను సమర్థిస్తూ పోరాడండి, యుద్ధంలో వృద్ధులను, బలహీనులను, పిల్లలను, స్త్రీలను చంపకండి, యుద్ధధనం విషయంలో ద్రోహానికి పాల్పడకండి, యుద్ధధనాన్ని ఒకచోట చేర్చండి. పరస్పరం మంచిగా ప్రవర్తించండి, ఉపకారం చేయండి, ఎందుకంటే, ‘అల్లాహ్‌ (త)కు ఉపకారం చేసేవారంటే ఎంతో ఇష్టం.’  ”  (అబూ  దావూద్‌)

3957 – [ 21 ] ( لم تتم دراسته ) (2/1156)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: لَمَّا كَانَ يَوْمُ بَدْرٍتَقَدَّمَ عُتْبَةُ بْنُ رَبِيْعَةَ وَتَبِعَهُ ابْنهَ وَأخُوْهُ فَنَادَى: مَنْ يُبَارِزُ؟ فَانْتَدَبَ لَهُ شَبَابٌ مِّنَ الْأَنْصَارِ فَقَالَ: مَنْ أَنْتُمْ؟ فَأَخْبَرُوْهُ فَقَالَ: لَا حَاجَةَ لَنَا فِيْكُمْ إِنَّمَا أَرَدْنَا بَنِيْ عَمِّنَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قُمْ يَا حَمْزَةُ قُمْ يَا عَلِيُّ قُمْ يَا عُبَيْدَةَ بْنَ الْحَارِث”. فَأَقْبَلَ حَمْزَةُ إِلَى عُتْبَةَ وَأَقْبَلْتُ إِلى شَيْبَةَ وَاخْتَلَفَ بَيْنَ عُبَيْدَةَ وَالْوَلِيْدِ ضَرْبَتَانِ فَأَثْخَنَ كُلُّ وَاحِدٍ مِّنْهُمَا صَاحِبَهُ ثُمَّ مِلْنَا عَلَى الْوَلِيْدِ فَقَتَلْنَاهُ وَاحْتَمَلْنَا عُبَيْدَةَ. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ .

3957. (21) [2/1156అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: బద్‌ర్‌ యుద్ధం నాడు అవిశ్వాసుల సైన్యం నుండి ఉత్హ్ బిన్రబీహ్ ముందుకు వచ్చాడు, వాడి కొడుకు వలీద్బిన్‌ ‘ఉత్హ్, అతడి సోదరుడు షీబహ్ అతని వెనుక నిలబడ్డారు. వాడు సవాలు చేస్తూ, ‘మాతో యుద్ధం చేయాలని ఎవడు ప్రయత్నిస్తున్నాడు, దమ్ముంటే ముందుకు రావాలి’ అని అన్నాడు. వెంటనే అనేక అ’న్సారీ యువకులు వాడికి ఎదురుగా ముందుకు వచ్చారు. మీరెవరని వాడు అడిగాడు. అంటే అ’న్సార్లా లేక ముహాజిర్లా. దానికి వారు, ‘మేము అ’న్సార్లము,’ అని సమాధానం ఇచ్చారు. దానికి వాడు, ‘మాకు మీ అవసరం లేదు. మేము మా చిన్నాన్న కొడుకులతో అంటే ఖురైష్‌ మరియు ముహాజిర్లతో యుద్ధం చేయాలని కోరుతున్నాం,’ అని అన్నాడు. అది విని ప్రవక్త (స), ‘ఓ ‘హంజహ్ నువ్వు నిలబడు, ఇంకా ఓ ‘అలీ నువ్వూ నిలబడు, ఇంకా ఓ ‘ఉబైదహ్‌ బిన్‌ ‘హారిస్‌’ నువ్వూ నిలబడు.’ అంటే ఈ ముగ్గురినీ, ఆ ముగ్గురికి వ్యతిరేకంగా పంపారు. అనంతరం ‘హంజహ్, ‘ఉత్‌బహ్ బిన్‌ రబీ’అహ్కు వ్యతిరేకంగా వెళ్ళి వధించారు. ఇంకా నేను అంటే ‘అలీ (ర) షీ’అబకు వ్యతిరేకంగా వెళ్ళి అతన్ని వధించాను. ఇంకా ‘ఉబైదహ్‌ మరియు వలీద్‌ల మధ్య చాలా ఘోరమైన యుద్ధం జరిగింది. ఒకరు మరొకర్ని గాయపరిచారు. కాని ఎవరూ చావలేదు. నేను వలీద్‌పై దాడిచేసి వాడ్ని చంపాను. అనంతరం తీవ్రంగా గాయపడిన ‘ఉబైదహ్‌ను యుద్ధమైదానం నుండి తొలగించాము.” (అ’హ్మద్‌, అబూ  దావూద్‌)

3958 – [ 22 ] ( لم تتم دراسته ) (2/1156)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: بَعَثَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ سَرِيَّةٍ فَحَاصَ النَّاسُ حَيْصَةً فَأَتَيْنَا الْمَدِيْنَةَ فَاخْتَفَيْنَا بِهَا وَقُلْنَا: هَلَكْنَا ثُمَّ أَتَيْنَا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَقُلْنَا: يَا رَسُوْلَ اللهِ نَحْنُ الْفَرَارُوْنَ. قَالَ: “بَلْ أَنْتُمْ الْعَكَّارُوْنَ وَأَنَا فِئَتُكُمْ.”رَوَاهُ التِّرْمِذِيُّ.

وَفِيْ رِوَايَةٍ أَبِيْ دَاوُدَ نَحْوَهُ وَقَالَ: ” لَا بَلْ أَنْتُمُ الْعَكَّارُوْنَ”. قَالَ: فَدَنَوْنَا فَقَبَّلْنَا يَدَهُ فَقَالَ: “أَنَا فِئَةُ الْمُسْلِمِيْنَ”.

وَسَنَذْكُرُ حَدِيْثَ أُمَيَّةَ بْنِ عَبْدِ اللهِ: كَانَ يَسْتَفْتَحُ وَحَدِيْثَ أَبِي الدَّرْدَاءِ “اِبْغُوْنِيْ فِيْ ضُعَفَائِكُمْ” فِيْ بَابِ”فَضْلِ الْفُقَرَاءِ” إِنْ شَاءَ اللهُ تَعَالى .

3958. (22) [2/1156 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త(స) మమ్మల్ని ఒక సైన్యంలో జిహాద్‌ కోసం పంపించారు. శత్రువులు అధిక సంఖ్యలో ఉన్నారు, మేము తక్కువ సంఖ్యలో ఉన్నాము. శత్రువుల అధిక సంఖ్యను చూచి సైనికులు పారిపోవటానికి సిద్ధపడ్డారు. మేము మదీనహ్ చేరి సిగ్గుతోదాక్కున్నాము. ఇంకా ‘యుద్ధం నుండి పారిపోయి నాశనం అయ్యాము,’ అని అన సాగాము. ఆ తరువాత ప్రవక్త (స) ముందుకు వచ్చి, ‘ఓప్రవక్తా! మేము యుద్ధంనుండి పారిపోయి వచ్చాం,’ అని విన్నవించు కున్నాం. ప్రవక్త (స) మమ్మల్ని ప్రోత్సహించేందుకు, ‘మీరు పారిపోయే వారు కారు, మళ్ళీ దాడి చేయవలసిన వారు, నేను కూడా మీతో పాటు ఉంటాను,’ అని అన్నారు. (తిర్మిజి’)

అబూ దావూద్‌ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”మీరు పారి పోయేవారు కారు, మళ్ళీ దాడి చేసేవారు,” అని అన్నారు. ఆ తరువాత మేము ప్రవక్త (స) కు దగ్గరయ్యాము. ప్రవక్త (స) చేతికి ముద్దు పెట్టుకున్నాము. ఆ తరువాత ప్రవక్త (స), ‘నేను ముస్లిముల బృందంవెంట ఉన్నాను. ఇంకా వారి సహాయ కుడిని, సహాయకారిని,’ అని అన్నారు. [57]

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం  

3959 – [ 23 ] ( لم تتم دراسته ) (2/1157)

عَنْ ثَوْبَانَ بْنِ يَزِيْدَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَصَبَ الْمَنْجَنِيْقَ عَلَى أَهْلِ الطَّائِفِ . رَوَاهُ التِّرْمِذِيُّ مُرْسَلًا

3959. (23) [2/1157 అపరిశోధితం]

సౌ’బాన్‌ బిన్‌ య’జీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘తాయిఫ్‌ వాళ్ళకోసం రాళ్ళను విసిరే పరికరాన్ని ఎక్కు పెట్టారు.[58](తిర్మిజి’ /  తాబయీ  ప్రోక్తం)

=====

5– بَابُ حُكْمِ الْاسَرَاءِ

5. ఖైదీల గురించి ఆదేశాలు

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

3960 – [ 1 ] ( صحيح ) (2/1158)

عَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “عَجِبَ اللهُ مِنْ قَوْمٍ يُدْخِلُوْنَ الْجَنَّةَ فِيْ السَّلَاسِلِ”.

وَفِيْ رِوَايَةٍ: “يُقَادُوْنَ إِلى الْجَنَّةِ بِالسَّلَاسِلِ”. رَوَاهُ الْبُخَارِيُّ.

3960. (1) [2/1158దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) గొలుసులతో బంధించబడి వచ్చేవారి పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. మరో ఉల్లేఖనంలో ఈ విధంగా ఉంది, ”గొలుసులతో బంధించి స్వర్గంవైపు ఈడ్చబడే వారు.” [59]   (బు’ఖారీ)

3961 – [ 2 ] ( متفق عليه ) (2/1158)

وَعَنْ سَلَمَةَ بْنِ الْأَكْوَعِ قَالَ: أَتَى النَّبِيّ صلى الله عليه وسلم عَيْنٌ مِنَ الْمُشْرِكِيْنَ وَهُوَ فِيْ سَفَرٍ فَجَلَسَ عِنْدَ أَصْحَابِهِ يَتَحَدَّثُ ثُمَّ انْفَتَلَ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “اُطْلُبُوْهُ وَاقْتُلُوْهُ”. فَقَتَلْتُهُ فنفلَنِيْ سَلْبَهُ.

3961. (2) [2/1158ఏకీభవితం]

సలమహ్ బిన్‌ అక్వ’అ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు అవిశ్వాసుల గూఢచారి వచ్చాడు. అప్పుడు ప్రవక్త (స) ప్రయాణంలో ఉన్నారు. ప్రవక్త (స) అనుచరులు పరస్పరం కూర్చొని మాట్లాడు కుంటున్నారు. ఆ గూఢచారి వారివద్ద కూర్చొని వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు. అతడు తిరిగి వెళ్ళబోయాడు. అప్పుడు ప్రవక్త (స), ‘ఇతన్ని తనిఖీ చేయండి, ఇంకా చంపి వేయండి,’ అని ఆదేశించారు. నేనతన్ని చంపివేసాను. ప్రవక్త (స) అతని సామాన్లు నాకు ఇప్పించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3962 – [ 3 ] ( متفق عليه ) (2/1158)

وَعَنْهُ قَالَ: غَزَوْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم هَوَازِنَ فَبَيْنَا نَحْنُ نَتَضَحّى مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. إِذْ جَاءَ رَجُلٌ عَلَى جَمَلٍ أَحْمَرَفَأَنَاخَهُ وَجَعَلَ يَنْظُرُ وَفِيْنَا ضَعْفَةٌ وَرِقَّةٌ مِّنَ الظّهْرِوَبَعْضُنَا مُشَاةٌ إِذْ خَرَجَ يَشْتَدُّ فَأَتَى جَمَلَهُ فَأَثَارَهُ فَاشْتَدَّ بِهِ الْجَمَلُ فَخَرَجْتُ أَشْتَدُّ حَتَّى أَخَذْتُ بِخِطَامِ الْجَمَلِ فَأَنْخَتُهُ ثُمَّ اخْترطتُ سَيْفِيْ فَضَرَبْتُ رَأْسَ الرَّجُلِ ثُمَّ جِئْتُ بِالْجَمَلِ أَقُوْدُهُ وَعَلَيْهِ رَحْلُهُ وَسِلَاحُهُ فَاسْتَقْبَلَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَالنَّاسُ فَقَالَ: “مَنْ قَتَلَ الرَّجُلَ؟” قَالُوْا: اِبْنُ الْأَكْوَعِ فَقَالَ: “لَهُ سَلْبُهُ أَجْمَعُ”.

3962. (3) [2/1158ఏకీభవితం]

సలమహ్ బిన్‌ అక్వ’అ (ర) కథనం: ప్రవక్త (స) తో పాటు మేము హవాజిన్ వర్గం వారితో యుద్ధం చేసాము. మేము ప్రవక్త (స) ప్రక్కన కూర్చొని అల్పాహారం సేవిస్తున్నాము. ఒక వ్యక్తి ఎర్రటి ఒంటెపై కూర్చొని వచ్చాడు. ఒంటెను కూర్చోబెట్టి దిగి, అటూ ఇటూ చూడసాగాడు. మాలో చాలామంది వాహనాలు లేక పోవటం వల్ల అలసత్వానికి గురయ్యారు. బలహీనపడ్డారు. కొందరు కాలినడకన నడిచేవారూ ఉన్నారు. ఆ తరువాత ఆ వ్యక్తి తొందరగా తనఒంటె వద్దకు వచ్చి దానిపై కూర్చొని దాన్ని లేపి తోలుకొని పోతున్నాడు. నేను పరిగెత్తుకుంటూ అతని వెనుక వెళ్ళాను. అతని ఒంటె కళ్ళాన్ని పట్టుకొని దాన్ని కూర్చోబెట్టి, నా కరవాలాన్ని తీసి అతని తల నరికివేసాను. ఆ తరువాత ఒంటెను తీసుకొని వెళ్ళి ప్రవక్త (స) ముందు నిలబెట్టాను. ఆ ఒంటెపై అతని సామాన్లు, ఆయుధాలు ఉన్నాయి. ప్రవక్త (స), ఇతరులు నా ముందుకు వచ్చారు. ప్రవక్త (స), ‘ఈ వ్యక్తిని ఎవరు వధించారు,’ అని అడిగారు. ప్రజలు, సలమహ్ బిన్‌ అక్వ’అ,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఈ మృతుని సామానంతా సలమహ్ బిన్‌ అక్వ’అకు చెందుతుంది,’  అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3963 – [ 4 ] ( متفق عليه ) (2/1158)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: لَمَا نَزَلَتْ بَنُوْ قُرَيْظَةَ عَلَى حُكَمِ سَعْدِ بْنِ مُعَاذٍ بَعَثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلَيْهِ فَجَاءَ عَلَى حِمَارٍ فَلَمَّا دَنَا. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قُوْمُوْا إِلَى سَيِّدِكُمْ”فَجَاءَ فَجَلَسَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ هَؤُلَاءِ نَزَلُوْا عَلَى حُكْمِكَ”. قَالَ: فَإِنِّيْ أَحْكُمُ أَنْ تُقْتَلَ الْمُقَاتِلَةُ وَأَنْ تُسْبى الذُّرِّيَةُ. قَالَ: ” لَقَدْ حَكَمْت فِيْهِمْ بِحُكْمِ الْمَلِكِ”.

وَفِيْ رِوَايِةٍ : “بِحُكْمِ اللهِ”.

3963. (4) [2/1158 ఏకీభవితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: అద్బిన్ఆజ్‌’ తీర్పును స్వీకరించినపుడు, ప్రవక్త (స) స’అద్‌ బిన్‌ మ’ఆజ్‌’ ను పిలుచుకురమ్మని ఒక వ్యక్తిని పంపారు. ఎందుకంటే స’అద్‌ బిన్‌ మ’ఆజ్‌’ అనారోగ్యం వల్ల మదీనహ్లోనే ఉండిపోయారు. అనంతరం స’అద్‌ బిన్‌ మ’ఆజ్‌’ గాడిదపై ఎక్కి ప్రవక్త (స) వద్దకు వచ్చారు. అప్పుడు ప్రవక్త (స) అక్కడున్న అన్సార్లతో, ”మీరు మీ నాయకుడు స’అద్‌ బిన్‌ మ’ఆజ్‌’ వద్ద నిలబడి అతన్ని వాహనం నుండి దింపి తీసుకురండి, ఎందుకంటే అనారోగ్యం వల్ల వారు స్వయంగా వాహనం నుండి దిగలేరు,” అని అన్నారు. ఆ తరువాత దిగి ప్రవక్త (స) వద్దకు వచ్చి కూర్చుండి పోయారు. అప్పుడు ప్రవక్త (స) అతనితో, బనూ ఖురైహ్ ప్రజలు మీ తీర్పును ఒప్పుకున్నారు. కనుక వారి విషయంలో తీర్పు చేసివేస్తే బాగుంటుంది,’ అని అన్నారు. దానికి స’అద్‌ బిన్‌ మ’ఆజ్‌’, ‘వారి గురించి నా తీర్పు ఏమిటంటే పురుషులను చంపటం, పిల్లల్ని, స్త్రీలను అదుపులోకి తీసుకోవటం,’ అని అన్నారు. అది విని ప్రవక్త (స), ‘నీవు చాలా మంచి తీర్పు ఇచ్చావు.’ మరో ఉల్లేఖనంలో, ‘నీవు అల్లాహ్(త) నిర్ణయానికి అనుగుణంగా తీర్పు ఇచ్చావు,’ అన్నారు. [60] (బు’ఖారీ, ముస్లిమ్‌)

3964 – [ 5 ] ( صحيح ) (2/1159)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: بَعَثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم خَيْلًا قِبَلَ نَجْدٍ فَجَاءَتْ بِرَجُلٍ مِنْ بَنِيْ حَنِيْفَةَ يُقَالَ لَهُ: ثُمَامَةُ بْنُ أُثَالٍ سَيِّدُ أَهْلِ الْيَمَامَةَ فَرَبَطُوْهُ بِسَارِيَةٍ مِّنْ سَوَارِي الْمَسْجِدِ فَخَرَجَ إِلَيْهِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “مَاذَا عِنْدَكَ يَا ثَمَامَةُ؟” فَقَالَ: عِنْدِيْ يَا مُحَمَّدُ خَيْرٌ إِنْ نَقْتُلَ تَقْتُلْ ذَا دَمٍ وَإِنْ تُنْعِمْ تُنْعِمْ عَلَى شَاكِرٍ وَإِنْ كُنْتَ تُرِيْدُ الْمَالَ فَسَلْ تُعْطَ مِنْهُ مَا شِئْتَ فَتَرَكَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم حَتَّى كَانَ الْغَدُ فَقَالَ لَهُ: “مَا عِنْدَكَ يَا ثُمَامَةُ؟” فَقَالَ: عِنْدِيْ مَا قُلْتُ لَكَ: إِنْ تُنْعِمْ تُنْعِمْ عَلى شَاكِرٍ وَإِنْ تَقْتُل تَقْتُلْ ذَا دَمٍ وَإِنْ كُنْتَ تُرِيْدُ الْمَالَ فَسَلْ تُعْطَ مِنْهُ مَا شِئْتَ. فَتَرَكَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم حَتَّى كَانَ بَعْدَ الْغَدِ فَقَالَ لَهُ: “مَا عِنْدَكَ يَا ثَمَامَةُ؟” فَقَالَ: عِنْدِيْ مَا قُلْتُ لَكَ: إِنْ تُنْعِمْ تُنْعِمْ عَلَى شَاكِرٍ وَإِنْ تَقْتُلْ تَقْتُلْ ذَا دَمٍ وَإِنْ كُنْتَ تُرِيْدُ الْمَالَ فَسَلْ تُعْطَ مِنْهُ مَا شِئْتَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَطْلِقُوْا ثمَامَةَ”. فَانْطَلَقَ إِلى نَخْلٍ قَرِيْبٍ مِّنَ الْمَسْجِدِ فَاغْتَسَلَ ثُمَّ دَخَلَ الْمَسْجِدِ فَقَالَ: أَشْهَدُ أَنْ لَا إِلَهِ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ. يَا مُحَمَّدُ وَاللهِ مَا كَانَ عَلَى وَجْهِ الْأَرْضِ وَجْهِ أَبْغض إلي من وجهك فقد أصبح وجهك أحب الوجوه كلها إلي. والله ما كان من دين أَبغَضَ إِلَيَّ مِنْ دِيْنِكَ فَأَصْبَحَ دِيْنكَ أحبُّ الدينِ كُله إِليَّ وَ واللهِ مَا كَانَ من بَلَدٍ أَبْغَضَ إِلَيَّ مِنْ بَلَدِكَ فَأَصْبَحَ بَلَدُكَ أحبّ الْبِلَادِ كُلّهَا إِلَيَّ. وَإِنَّ خَيْلُكَ أخذتني وَأَنَا أُرِيْدُ الْعُمْرَةَ فَمَاذَا تَرَى؟ فبشره رسول الله صلى الله عليه وسلم وأمره أن يعتمر فلما قدم مكة قَالَ له قائل: أصبوت؟ فَقَالَ: لَا وَلَكِنِّيْ أَسْلَمْتُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. وَاللهِ لَا يَأْتِيَكُمْ مِنَ الْيَمَامَةِ حَبَّةُ حِنْطَةٍ حَتّى يَأْذَنَ فِيْهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ مُسْلِمٌ وَاخْتَصَرَهُ الْبُخَارِيُّ.

3964. (5) [2/1159 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ఒక సైన్యాన్ని నజ్‌ద్‌ వైపు పంపారు. ఆ సైన్యం బనూహనీఫహ్ కు చెందిన ఒక వ్యక్తిని పట్టుకున్నారు. మదీనహ్ తీసుకొని వచ్చారు. అతని పేరు సు’మామహ్ బిన్‌ అసా’ల్‌, అతడు యమామహ్ పట్టణ నాయకుడు కూడాను. ప్రవక్త (స) అనుచరులు అతన్ని మస్జిద్‌లోని ఒక స్తంభానికి కట్టివేసారు. ప్రవక్త (స) వచ్చి, ‘సు’మామహ్ నీ సంగ తేమిటి?’ అని అడిగారు. దానికి అతడు, ‘క్షేమంగా ఉన్నాను, ఎందుకంటే నేను ధనవంతుడ్ని, వ్యాపా రిని కూడా. ఒకవేళ మీరు నన్ను చంపితే నేను దానికి తగిన వాడను. నా జాతి ప్రతీకారం తీర్చు కుంటుంది. లేదా ఒకవేళ మీరు నన్ను ఉపకారం చేస్తే కృతజ్ఞుడ్ని. ఈ ఉపకారానికి ప్రతిఫలం చెల్లిస్తాను. ఒకవేళ పరిహారం కోరితే చెప్పండి పరిహారం చెల్లించడం జరుగుతుంది.’ అది విని ప్రవక్త (స) అతన్ని వదలి తిరిగివెళ్ళి పోయారు. రెండవ రోజు కూడా ఈ సమాధానమే దొరికింది. మూడవ రోజు తర్వాత ప్రవక్త (స), ”సుమామహ్ ను విప్పి విడుదల చేయండి,’ అని ఆదేశించారు. అనంతరం అతన్ని విప్పి విడుదల చేయడం జరిగింది. అతను విడుదలై మస్జిదెనబవీ నుండి బయటకు వెళ్ళి పోయాడు. మస్జిద్‌ బయట ఖర్జూరపు తోట ఉండేది. అందులో ఒక నీటి కొలను ఉండేది. అక్కడ స్నానం చేసి మళ్ళీ మస్జిదులోనికి వచ్చి, ”అల్లాహ్‌ తప్ప ఆరాధ్యులెవరూ లేరని సాక్ష్యం ఇస్తున్నాను, ఇంకా ము’హమ్మద్‌ (స) అల్లాహ్‌ ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను” అని పలికి, ‘ఇస్లామ్‌ స్వీకరించడానికి ముందు తమరి (స) ముఖం నావద్ద అందరికంటే నీచంగా ఉండేది. అదేవిధంగా తమరి ధర్మం కూడా అన్నిటి కంటే నీచంగా ఉండేది. అదేవిధంగా తమరి పట్టణం కూడా నీచంగా ఉండేది. కాని ముస్లిమ్‌ అయిన తర్వాత తమరి ముఖవర్చస్సు, తమరి ధర్మం, తమరి ఊరు అన్నిటి కంటే ప్రియమైనవిగా అయిపోయాయి. ఇంకా నేను ‘ఉమ్‌రహ్‌ ఆచరించటానికి మక్కహ్ వెళు తున్నాను. మీ సైనికులు నన్ను బంధించారు. ఇప్పుడు మీరే చెప్పండి నేను ఏమి చేయాలి?’ ప్రవక్త (స) అతనికి శుభవార్త తెలియపరుస్తూ ‘ఉమ్‌రహ్‌ చేయడానికి అనుమతి ఇచ్చారు. అతడు మక్కహ్ వచ్చాడు. ఒక వ్యక్తి, ‘నువ్వు మార్గభ్రష్టతకు గురయ్యావు,’ అని అన్నాడు. దానికి అతడు, ‘నేను మార్గభ్రష్టత్వానికి గురికాలేదు. ప్రవక్త (స) చేతిపై ఇస్లామ్‌ స్వీకరించాను. అల్లాహ్ సాక్షి! ప్రవక్త (స) అనుమతి ఇచ్చే వరకు యమామహ్ నుండి ఒక్క గోదుమగింజకూడా మీరుపొందలేరు,’ అని అన్నాడు. (ముస్లిమ్‌)

ఇమామ్‌ బు’ఖారీ దీనిని సంక్షిప్తంగా పేర్కొన్నారు.

3965 – [ 6 ] ( صحيح ) (2/1160)

وَعَنْ جُبَيْرِبْنِ مُطْعِمٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ فِيْ أُسَارى بَدْرٍ: “لَوْ كَانَ الْمُطْعِمُ بْنُ عَدِيٍّ حَيًّا ثُمَّ كَلَّمَنِيْ فِيْ هَؤُلَاءِ النَتْنَى لَتَرَكْتُهُمْ لَهُ”. رَوَاهُ الْبُخَارِيُّ .

3965. (6) [2/1160దృఢం]

జుబైర్‌ బిన్‌ ము’త్‌’యిమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) బద్ర్‌ యుద్ధ ఖైదీల గురించి ఇలా ఆదేశించారు. ”ఒకవేళ ము’త్‌’యిమ్‌ బిన్‌ ‘అదీ బ్రతికిఉంటే ఈ నీచఖైదీల గురించి నన్ను సిఫారసు చేసేవాడు. నేను వాళ్ళందరినీ వదలి వేసేవాడిని.”  [61]  (బు’ఖారీ)

3966 – [ 7 ] ( صحيح ) (2/1160)

وَعَنْ أَنَسٍ: أَنَّ ثَمَانِيْنَ رَجُلًا مِنْ أَهْلِ مَكَّةَ هَبَطُوْا عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مِنْ جَبَلِ التَّنْعِيْمِ مُتَسَلِّحيْنَ يُرِيْدُوْنَ غِرَّةَ النَّبِيِّ صلى الله عليه وسلم وَأَصْحَابَهُ فَأَخَذَهُمْ سِلْمًا فَاسْتَحْيَاهُمْ.

وَفِيْ رِوَايَةٍ: فَأعتَقهُمْ فَأَنْزَلَ اللهُ تَعَالى (وَهُوَ الَّذِيْ كَفَّ أَيْدِيَهُمْ عَنْكُمْ وَأَيْدِيَكُمْ عَنْهُمْ بِبَطْنٍ مَكَّةَ؛ 48:24).  رَوَاهُ مُسْلِمٌ .

3966. (7) [2/1160దృఢం]

అనస్‌ (ర) కథనం: మక్కహ్ నుండి 80 మంది ఆయుధాలతో ప్రవక్త (స) ను, అనుచరులపై దాడిచేసి చంపివేద్దామని వచ్చారు. కాని ముస్లిములు వారిని పట్టుకున్నారు. కాని వారికి ఎటువంటి హాని చేకూర్చలేదు. ప్రవక్త (స) వారిని సజీవంగా వదలివేసారు. విడుదల చేసారు. వీరి గురించే అల్లాహ్‌ (త) ఈ ఆయతులు అవతరింపజేసాడు,

మరియు మక్కహ్ లోయలో మీకు వారి మీద ప్రాబల్యం ఇచ్చిన తర్వాత, ఆయనే వారి చేతులను మీపై పడకుండా మరియు మీ చేతులు వారిపై పడకుండా చేశాడు.”  [62] (ముస్లిమ్‌)

3967 – [ 8 ] ( متفق عليه ) (2/1160)

وَعَنْ قَتَادَةَ قَالَ: ذَكَرَلَنَا أَنَسُ بْنُ مَالِكٍ عَنْ أَبِيْ طَلْحَةَ أَنَّ نَبِيَّ الله صلى الله عليه وسلم أَمَرَ يَوْمَ بَدْرٍ بِأَرْبَعَةٍ وَّعِشْرِيْنَ رَجُلًا مِّنْ صَنَادِيْدِ قُرَيْشٍ فَقُذِفُوْا فِيْ طَوِيٍّ مِنْ أَطْوَاءِ بَدْرٍ خَبِيْثٍ مُخْبِثٍ وَكَانَ ذَا ظَهَرَ عَلَى قَوْمٍ أَقَامَ بِالْعَرْصَةِ ثَلَاثَ لَيَالٍ فَلَمَّا كَانَ بِبَدْرِ الْيَوْمُ الثَّالِثُ أَمْرَ بِرَاحِلَتِهِ فَشَدَّ عَلَيْهَا رَحَلَهَا ثُمَّ مَشَى وَأَتَّبَعَهُ أَصْحَابُهُ حَتَّى قَامَ عَلَى شَفَةِ الرَّكِيِّ فَجَعَلَ يُنَادِيْهِمْ بِأَسْمَائِهِمْ وَأَسْمَاءِ آبَائِهِمْ. “يَا فَلَانُ بْنُ فُلَانٍ وَيَا فُلَانُ بْنَ فُلَانٍ أَيَسُرُّكُمْ أَنَّكُمْ أَطَعْتُمُ اللهَ وَرَسُوْلَهُ ؟ فَإِنَّا قَدْ وَجَدْنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقًّا فَهَلْ وَجَدْتُّمْ مَا وَعَدَكُمْ رَبُّكُمْ حَقًّا؟” فَقَالَ عُمَرُ: يَا رَسُوْلَ اللهِ مَا تُكَلِّمُ مِنْ أَجْسَادٍ لَا أَرْوَاحَ لَهَا ؟ قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “وَالَّذِيْ نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ مَا أَنْتُمْ بِأَسْمَعَ لما أَقُوْلُ مِنْهُمْ”.

وَفِيْ رِوَايَةٍ: “مَا أَنْتُمْ بِأَسْمَع مِّنْهُمْ وَلَكِنَّ لَا يُجِيْبُوْنَ”.  مُتَّفَقٌ عَلَيْهِ.

وَزَادَ الْبُخَارِيُّ: قَالَ قَتَادَةُ: أَحْيَاهُمُ اللهُ حَتَّى أَسْمَعَهُمْ قَوْلهُ تَوْبِيْخًا وَتَصْغِيْرًا وَنَقْمَةُ وَحَسْرَةُ وَنَدَمًا .

3967. (8) [2/1160ఏకీభవితం]

ఖతాదహ్‌ (ర) కథనం: అనస్‌ బిన్‌ మాలిక్‌ అబూ ‘తల్‌’హా ద్వారా ఇలా పేర్కొన్నారు, ”ప్రవక్త (స) బద్ర్యుద్ధం నాడు అవిశ్వాసుల 24 శవాలను ఆ ప్రాంతంలోని ఒక పాడుబడిన నుయ్యిలో పారవేయమని ఆదే శించారు. అనంతరం ఆ శవాలను అందులో పారవేయడం జరిగింది. ప్రవక్త(స) ఎక్కడైనా యుద్ధంలో గెలిస్తే  మూడు రోజుల వరకు అక్కడ ఉండేవారు. ఈ అలవాటు ప్రకారం మూడు రోజుల వరకు బద్ర్‌లో ఉండి, మూడవ రోజు, నా ఒంటె తీసుకురండని, ఆదేశించారు. దాన్ని రప్పించి దానిపై మావటి పెట్టటం జరిగింది. ఆ తరువాత ప్రవక్త (స) కాలినడకన బయలుదేరారు. అనుచరులు కూడా ఆయన్ని అనుసరించారు. ప్రవక్త (స) ఎక్కడికో వెళ్తున్నారు అని అనుచరులు భావించారు. ప్రవక్త (స) నడుస్తూ అవిశ్వాసుల శవాలు పడిఉన్న బావివద్దకు వెళ్ళి, వారిని వారితండ్రుల పేర్లతో పిలవటం ప్రారంభించారు. ‘ఓ ఫలానా వ్యక్తి, ఓ ఫలాన వాని కుమారుడా! ఇప్పుడు మీకు అల్లాహ్‌, ఆయన ప్రవక్తను అనుసరిస్తే బాగుండేదని తెలిసి నట్టుంది. అల్లాహ్‌ (త) మాతో చేసిన వాగ్దానం మాకు లభించింది. దాన్ని మేము సత్యమైనదిగా పొందాము. మీతో చేసిన వాగ్దానం మీరు పొంది, సత్యమైనదని తెలుసుకున్నారా?’ అని అన్నారు. అది విని, ‘ఉమర్‌ (ర), ‘ఓ ప్రవక్తా! తమరు శవాలతో ఇలా మాట్లాడు తున్నారు. వాటిలో ప్రాణం లేదు. వారెలా వింటారు,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! నేను చెపుతున్నదంతా మీకంటే, వారే బాగా వింటున్నారు. కాని సమాధానం ఇవ్వలేక పోతున్నారు,’ అని అన్నారు. ‘ప్రవక్త (స) చీవాట్లు, నీచ అవమానకరమైన మాటలు వినడానికి అల్లాహ్‌ (త) వారిని సజీవపరిచాడు,’ అని ఖతాదహ్‌ పేర్కొన్నారు. (బు’ఖారీ)

3968 – [ 9 ] ( صحيح ) (2/1161)

وَعَنْ مَرْوَانَ وَالْمِسْوَرَ بْنِ مَخْرَمَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَامَ حِيْنَ جَاءَهُ وَفْدُ من هَوَازِنَ مُسْلِمِيْنَ فَسَأَلُوْهُ أَنْ يَرُدَّ إِلَيْهِمْ أَمْوَالِهُمْ وَسَبْيَهُمْ فَقَالَ: “فَاخْتَارُوْا إِحْدَى الطَّائِفَتَيْنِ: إِمَّا السَّبْيَ وَإِمَّا الْمَالَ”. قَالُوْا: فَإِنَّا نَخْتَارُ سَبينَا. فَقَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَأَثْنَى عَلَى اللهِ بِمَا هُوَ أَهْلَهُ ثُمَّ قَالَ: “أَمَّا بَعْدُ فَإِنَّ إِخْوَانَكُمْ قَدْ جَاؤُوْا تَائِبِيْنَ وَإِنِّيْ قَدْ رَأَيْتُ أَنْ أَرُدَّ إِلَيْهِمْ سبيهِمْ فَمَنْ أَحَبَّ مِنْكُمْ أَنْ يُطَيِّبَ ذَلِكَ فَلْيَفْعَلْ وَمَنْ أَحَبَّ مِنْكُمْ أَنْ يَكُوْنَ عَلَى حَظِّهِ حَتَّى نُعْطِيَهُ إِيَّاهُ مِنْ أَوَّلٍ مَا يُفيْءُ الله عَلَيْنَا فَلْيَفْعَلْ”. فَقَالَ النَّاسُ: قَدْ طَيَّبَنَا ذَلِكَ يَا رَسُوْلَ اللهِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّا لَا نَدْرِيْ مَنْ أَذِنَ مِنْكُمْ مِمَّنْ لَمْ يَأْذَنْ فَارْجِعُوْا حَتَّى يَرْفَعَ إِلَيْنَا عُرَفَاؤُكُمْ أَمرَكُمْ”. فَرَجَعَ النَّاسُ فَكَلَّمَهُمْ عُرَفَاؤُهُمْ ثُمَّ رَجَعُوْا إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَأخْبرُوْهُ أَنَّهُمْ قَدْ طَيَّبُوْا وَأَذِنُوْا. رَوَاهُ الْبُخَارِيُّ .

3968. (9) [2/1161దృఢం]

మర్‌వాన్‌, మిస్‌వర్‌ బిన్ మక్రమహ్ ల కథనం: ప్రవక్త (స) వద్దకు హవాజిన్ తెగకు చెందిన కొంతమంది ప్రతినిధులు వచ్చారు. తమ ఖైదీలను, ధనాన్ని తిరిగి ఇమ్మని కోరారు. ఎందుకంటే హునైన్ యుద్ధంలో చాలా నీచంగా ఓడిపోయి పారిపోయారు. వారి ధనాన్ని, వారి స్త్రీలను పట్టుకోవటం జరిగింది. 15 రోజుల వరకు ప్రవక్త (స), వీరు ముస్లిములయి తిరిగివస్తే వీరి ఖైదీలను, ధనాన్ని తిరిగి ఇచ్చివేద్దామని వేచి ఉన్నారు. కాని వారు రాలేదు. అనంతరం వారి ధనాన్ని, ఖైదీలను పంచివేయటం జరిగింది. ప్రవక్త (స) మదీనహ్ చేరిన తర్వాత, హవా’జిన్‌ తెగవారు తమ ప్రతినిధులను మదీనహ్ పంపించారు. వారు వచ్చి, ‘మేము ఇస్లామ్‌ స్వీకరించాము, మా ధనసంపదలు, ఖైదీలు తిరిగి ఇప్పించమని,’  కోరారు. అది విని ప్రవక్త (స), ‘రెండు విషయాల్లో ఏదో ఒకటి కోరుకోండి. ఖైదీలనైనా విడిపించుకుపోండి లేదా ధన సంపదలు తీసుకోండి. రెండూ లభించవు,’ అని అన్నారు. అనంతరం వారు ఖైదీలను కోరారు. అప్పుడు ప్రవక్త (స) నిలబడి ప్రసంగించారు. అన్నిటికంటే ముందు అల్లాహ్ (త) స్తోత్రం పఠించి, అనుచరులను ఉద్దేశించి, మీ హవా’జిన్‌ సోదరులు ముస్లిములై పశ్చాత్తాపం చెంది తిరిగి వచ్చి నన్ను తమ ధన సంపదలను, ఖైదీలను కోరుతున్నారు. నేను ఆలోచించి వారితో, ‘ధన సంపదలైనా కోరుకోండి, లేదా ఖైదీలనైనా విడిపించుకు పోండి,’ అని అన్నాను. దానికి వారు ‘ఖైదీలను తిరిగి ఇచ్చి వేయండి,’ అని కోరారు. నేను కూడా దాన్నే సమర్థి స్తున్నాను. అంటే వారిఖైదీలను వారికి ఇచ్చివేయండి. మీలో సంతోషంగా తిరిగి ఇవ్వదలచుకున్న వారు తిరిగి ఇచ్చివేయండి. ఇంకా మీలో దీనికి బదులుగా ప్రతిఫలం తీసుకొని ఇవ్వదలచుకున్నవారు కూడా ఇచ్చి వేయండి. దీని తరువాత యుద్ధం జరిగితే, అన్నిటికంటే ముందు యుద్ధ ధనం నుండి అతనికి దీనికి తగినంత ధనం ఇవ్వటం జరుగుతుంది. అందరూ ముక్త కంఠంతో, ‘మేమందరం తిరిగి ఇవ్వడానికి సంతోషంగా సిద్ధంగా ఉన్నాము,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఎవరు సంతోషంగా ఇస్తారో, ఎవరు కాదో నాకు తెలియడం లేదు. అందువల్ల మీరు మీ ఇళ్ళకు తిరిగి వెళ్ళండి, మీ పెద్దలతో సంప్రదించండి. ఒకవేళ వారు సంతోషంగా ఇవ్వటానికి సిద్ధపడితే ఇచ్చివేయండి,’ అని అన్నారు. అందరూ తమ ఇళ్ళకు తిరిగివెళ్ళి తమ పెద్దలతో సంప్రదించారు. వారు సంతోషంగా అనుమతించారు. మళ్ళీ తిరిగి వచ్చి ప్రవక్త (స)కు అందరూ సంతోషంగా తిరిగి ఇవ్వమని ఆదేశించారని విన్నవించుకున్నారు. (బు’ఖారీ)

3969 – [ 10 ] ( صحيح ) (2/1161)

وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: كَانَ ثَقِيْفٌ حَلِيْفًا لِبَنِيْ عُقَيْلٍ فَأَسرت ثَقِيْفٌ رَجُلَيْنِ مِنْ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَأَسْرَ أَصْحَابُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم رَجُلًا مِّنْ بَنِيْ عُقَيْلٍ فَأَوْثَقُوْهُ فَطَرَحُوْهُ فِي الْحَرَّةِ فَمَرَّ بِهِ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَنَادَاهُ: يَا مُحَمَّدُ يَا مُحَمَّدُ فِيْمَ أَخَذْتَ؟ قَالَ: “بِجَرِيْرَةِ حُلَفَائِكُمْ ثَقِيْفٍ”. فَتَرَكَهُ وَمَضَى فَنَادَاهُ: يَا مُحَمَّدُ يَا مُحَمَّدُ فَرَحِمَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَرَجَعَ فَقَالَ: “مَا شَأْنُكَ؟” قَالَ: إِنِّيْ مُسْلِمٌ. فَقَالَ: ” لَوْ قلتها وَأَنْتَ تَمْلِكُ أَمْرَكَ أَفْلَحْتَ كُلَّ الْفَلَاحِ”. قَالَ: فَفَدَاهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِالرَّجُلَيْنِ اللَّذَيْنِ أَسَرَتْهُمَا ثَقِيْفٌ. رَوَاهُ مُسْلِمٌ .

3969. (10) [2/1161దృఢం]

‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) కథనం: ఖీఫ్‌, బనీఅఖీల్ మిత్రవర్గాలు. స’ఖీఫ్‌ వర్గానికి చెందినవారు, ఇద్దరు ప్రవక్త అనుచరులను పట్టుకున్నారు. వారికి బదులుగా ప్రవక్త (స) బనూ ‘అఖీల్‌కు చెందిన ఒక వ్యక్తిని పట్టుకున్నారు. బంధించి రాళ్ళ మైదానంలో ఉంచారు. ప్రవక్త (స) అతని ప్రక్కనుండి వెళుతుండగా ఆ వ్యక్తి ప్రవక్త (స)ను, ‘ఓ ము’హమ్మద్‌, ఓ ము’హ మ్మద్‌ అని కేకవేసి నన్ను ఎందుకు పట్టుకున్నారు,’ అని అడిగాడు. దానికి ప్రవక్త (స), ‘మీ మిత్రవర్గం చేసిన నేరానికి అంటే, మీ మిత్రవర్గం వారు మాకు చెందిన ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకున్నారు. వారికి బదులు నేను నిన్ను పట్టుకున్నాను.’ ఇలా చెప్పి ప్రవక్త (స) వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ వ్యక్తి, ‘ఓ ము’హమ్మద్‌, ఓ ము’హమ్మద్‌,’ అని కేకవేసాడు. ప్రవక్త (స)కు అతనిపై జాలివేసింది. ప్రవక్త (స) తిరిగి వచ్చి, ‘ఏమిటి?’ అని అడిగారు. ఆ వ్యక్తి, ‘నేను ముస్లిమును,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘పట్టుకోక ముందు అని ఉంటే విముక్తి లభించి ఉండేది.’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) ఆ ఇద్దరు ముస్లిములకు బదులు అతన్ని వదలి వేసారు. (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం  

3970 – [ 11 ] ( لم تتم دراسته ) (2/1162)

عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: لَمَّا بَعَثَ أَهْلُ مَكَّةَ فِيْ فِدَاءِ أُسَرَائِهِمْ بَعَثَتْ زَيْنَبُ فِيْ فِدَاءِ أَبِي الْعَاصِ بِمَالٍ وَبَعَثَتْ فِيْهِ بِقَلَادَةٍ لَهَا كَانَتْ عِنْدَ خَدِيْجَةَ أَدْخَلَتْهَا بِهَا عَلَى أَبِي الْعَاصِ فَلَمَّا رَآهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم رَقَّ لَهَا رِقَّةً شَدِيْدَةً وَقَالَ: “إِنَّ رَأَيْتُمْ أَنْ تُطْلِقُوْا لَهَا أَسِيْرَهَا وَتَرَدُّوْا عَلَيْهَا الَّذِيْ لَهَا”. فَقَالُوْا: نَعَمْ. وَكَانَ النَّبِيُّ صلى الله عليه وسلم أَخَذَ عَلَيْهِ أَنْ يُخَلِّيَ سَبِيْلَ زَيْنَبَ إِلَيْهِ وَبَعَثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم زَيْدَ بْنَ حَارِثَةَ وَرَجُلًا مِّنَ الْأَنْصَارِ فَقَالَ: “كَوْنَا بِبَطْنِ يَأحِجٍ حَتَّى تَمُرَّ بِكُمَا زَيْنَبُ فَتَصْحَبَاهَا حَتَّى تَأْتِيَا بِهَا”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ .

3970. (11) [2/1162అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: బద్ర్‌ యుద్ధం తరువాత మక్కహ్ అవిశ్వాసులు తమ ఖైదీలను విడిపించ డానికి కొంత మొత్తం పంపించారు. ప్రవక్త (స) కుమార్తె జైనబ్ (ర) తన భర్తను విడిపించడానికి కొంత మొత్తం పంపారు. అందులో ‘ఖదీజహ్ (ర)కు చెందిన హారం కూడా ఉంది. ఆమె దాన్ని జైనబ్‌కు, ఆమె పెళ్ళి సందర్భంగా బహూకరించారు. ఆ హారాన్ని చూచి ప్రవక్త (స) చాలా ప్రభావితులయ్యారు. ‘ఖదీజహ్ (ర) గుర్తుకు వచ్చారు. ఆమె ఆ హారాన్ని ధరించేవారు. ప్రవక్త (స) అనుచరులతో ‘జైనబ్‌ ఖైదీలను విడిచిపెట్టి, ఇంకా వారు పంపిన మొత్తం కూడా తిరిగి ఇచ్చివేస్తే బాగుంటుంది,’ అని అన్నారు. దానికి అనుచరులు, ‘చాలా బాగుంది,’ అని అన్నారు. ప్రవక్త (స) అబుల్‌ ‘ఆ’స్‌ నుండి, తమ కూతురిని మదీనహ్ పంపివేయాలని వాగ్దానం తీసుకున్నారు. దానికి అతడు ఒప్పుకున్నాడు. అబుల్‌ ‘ఆ’స్‌ మక్కహ్ బయలుదేరినపుడు ‘జైద్‌ బిన్‌ హారిసహ్ ను, మరో అ’న్సారీ వ్యక్తిని అతని వెంట పంపుతూ, ‘మీరు బత్న్యాహిజ్ వద్ద ఉండిపోండి (ఇది మక్కహ్ నుండి 8 కోసుల దూరం). అబుల్‌ ‘ఆ’స్‌, ‘జైనబ్‌ను మీ వద్దకు చేర్చుతాడు. మీరు ‘జైనబ్‌ను మీ వెంట మదీనహ్ తీసుకురండి,’ అని అన్నారు. అనంతరం అలాగే జరిగింది. [63]  (అ’హ్మద్‌, అబూ దావూద్‌)

3971- [ 12 ] ( لم تتم دراسته ) (2/1162)

وَعَنْهَا: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم لَمَّا أَسَرَأَهْلَ بَدْرٍ قَتَلَ عُقْبَةَ بْنِ أَبِيْ مُعَيْطٍ وَالنَّضْرَ بْنِ الْحَارِثِ وَمَنَّ عَلَى أَبِيْ عَزَّةَ الْجُمَحِيِّ. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ وَالشَّافِعِيُّ وَابْنُ إِسْحَاقَ فِيْ”السِّيْرَةِ”.

3971. (12) [2/1162 అపరిశోధితం]

ఆయిషహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) బద్ర్‌ యుద్ధంలో అవిశ్వాసులను పట్టుకున్నారు. వారిలో ఉఖ్‌బ బిన్‌ ముహీత్‌, నజ్‌ర్‌ బిన్‌ హారిస్‌లను చంపివేసారు. అయితే అబూ ఉజ్జాను ఉపకారానికి ప్రత్యుపకారంగా వదలి వేసారు. (షరహ్ సున్నహ్, షాఫ’యీ, ఇబ్నె ఇస్హాఖ్–సీరతున్నబీ)

3972 – [ 13 ] ( لم تتم دراسته ) (2/1162)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم لَمَّا أَرَادَ قَتْلَ عُقْبَةَ بْنِ أَبِيْ مُعَيْطٍ قَالَ: مَنْ لِلصِّبْيَةِ؟ قَالَ: “اَلنَّارُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3972. (13) [2/1162అపరిశోధితం]

అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఉఖ్‌బ బిన్‌ ముఐత్ను చంపినపుడు, అతడు నా సంతానాన్ని ఎవరు సంరక్షిస్తారు. దానికి ప్రవక్త (స) అగ్ని అని అన్నారు. (అబూ  దావూద్‌)

అంటే, ‘నీమరణానంతరం నీ సంతానాన్ని గురించి విచారమెందుకు, నీలా వాళ్ళూ అవిశ్వాసులైతే, నరకాగ్నికి  గురౌతారు,’ అని అన్నారు.

3973 – [ 14 ] ( لم تتم دراسته ) (2/1162)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: “أَنَّ جِبْرِيْلَ هَبَطَ عَلَيْهِ فَقَالَ لَهُ: خَيِّرْهُمْ يَعْنِيْ أَصْحَابَكَ فِيْ أُسَارَى بَدْرٍ: اَلْقَتْلَ اوِالْفِدَاءَ عَلَى أَنْ يَّقْتُلَ مِنْهُمْ قَابِلًا مِّثْلَهُمْ “. قَالُوْا الْفِدَاءُ وَيُقْتَلُ مِنَّا. روَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

3973. (14) [2/1162 అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”జిబ్రీల్‌ (అ) నా దగ్గరకు వచ్చి బద్ర్‌ యుద్ధ ఖైదీలను చంపివేసే లేదా వారి నుండి పరిహారం తీసుకొని వదలిపెట్టే అనుమతి తమ అనుచరులకు ఇవ్వమని. అయితే రాబోయే యుద్ధంలో అంతమంది వీరమరణం పొందుతారు అని ఆదేశించారు. అనం తరం అనుచరులు మేము పరిహారం తీసు కుంటా మని, రాబోయే యుద్ధంలో మాలో 70 మందికి వీర మరణం పొందటం  ఇష్టమేనని అన్నారు.[64]  (తిర్మిజి’)

3974 – [ 15 ] ( لم تتم دراسته ) (2/1163)

عَنْ عَطِيةَ الْقَرْظِيِّ قَالَ : كُنْتُ فِيْ سَبْيِ قُرَيْظَةَ عُرِضْنَا عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَكَانُوْا يَنْظُرُوْنَ فَمَنْ أَنْبَتَ الشَّعرَ قُتِلَ وَمَنْ لَمْ يَنْبُتْ لَمْ يُقْتَلْ فَكَشَفُوْا عَانَتِيْ فَوَجَدُوْهَا لَمْ تُنْبِتْ فَجَعَلُوْنِيْ فِيِ السَّبْيِ . رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ . وَالدَّارَمِيُّ .

3974. (15) [2/1163అపరిశోధితం]

‘అతియ్య ఖుర”జియ్యి (ర) కథనం: నేను బనూ ఖురై”జహ్ ఖైదీల్లో ఉన్నాను. మా అందరినీ ప్రవక్త (స) ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అందరూ చూడసాగారు. నాభి క్రింద వెంట్రుకలు వచ్చి ఉన్నవారిని చంపివేయడం జరిగింది. నాభిక్రింద వెంట్రుకలు రానివారిని వదలివేయడం జరిగింది. వారు నా నాభిక్రింద చూచారు. అక్కడ వెంట్రుకలు లేక పోవటం చూచి నన్ను యుక్తవయస్సుకు చేరనివాడిగా పరిగణించి వదలివేసారు. [65]  (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్, దార్మి)

3975 – [ 16 ] ( لم تتم دراسته ) (2/1163)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: خَرَجَ عَبْدَان إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يَعْنِي يَوْمَ الْحُدَيْبِيَةِ قَبْلَ الصُّلْحِ فَكَتَبَ إِلَيْهِ مَوَالِيْهِمْ قَالُوْا: يَا مُحَمَّدُ وَاللهِ مَا خَرَجُوْا إِلَيْكَ رَغْبَةً فِيْ دِيْنِكَ وَإِنَّمَا خَرَجُوْا هَرَبًا مِّنَ الرِّقِّ. فَقَالَ نَاسٌ: صَدَقُوْا يَا رَسُوْلَ اللهِ رُدَّهُمْ إِلَيْهِمْ فَغَضِبَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَقَالَ: “مَا أَرَاكُمْ تَنْتَهُوْنَ يَا مَعْشَرَ قُرَيْشٍ حَتَّى يَبْعَثَ اللهُ عَلَيْكُمْ مَنْ يَضْرِبُ رِقَابَكُمْ عَلَى هَذَا”. وَأَبَى أَنْ يَرُدَّهُمْ وَقَالَ: ” هُمْ عُتَقَاءُ اللهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3975. (16) [2/1163 అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: హుదైబియా ఒప్పందానికి ముందు మక్కహ్ నుండి కొందరు బానిసలు వలసవెళ్ళి ప్రవక్త (స) వద్దకు వెళ్ళారు. వారి యజమానులు ప్రవక్త (స)కు ఉత్తరం వ్రాస్తూ, ”మా బానిసలు ఇక్కడి నుండి పారిపోయి మీ దగ్గరకు వచ్చారు. వీరు మీ ధర్మాన్ని ప్రేమిస్తున్నారని కాదు, బానిసత్వం నుండి విముక్తి పొందటానికి పారిపోయి మీ దగ్గరకు వచ్చారు. కొందరు ఈ విషయాన్ని ధృవీకరించారు. వారిని పంపివేయండని సిఫారసు చేసారు.” అది విని ప్రవక్త (స) ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంకా ఇలా అన్నారు, ”ఓ ఖురైషులారా! ఇంకా మీరు మీ కుట్రలు, పన్నాగాలను మీ తలలు నరకడానికి అల్లాహ్‌ (త) ఒక వ్యక్తిని పంపనంత వరకు మానరా?” అని పలికి, తిరిగి పంపటానికి నిరాకరించి, ‘వీరందరూ అల్లాహ్‌ (త) ద్వారా స్వతంత్రులు,’ అని అన్నారు. (అబూ  దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం  

3976 – [ 17 ] ( صحيح ) (2/1163)

عَنِ ابْنِ عُمَرَ قَالَ: بَعَثَ النَّبِيُّ صلى الله عليه وسلم خَالِدَ بْنَ الْوَلِيْدِ إِلى بَنِيْ جَذَيْمَةَ فَدَعَاهُمْ إِلى الْإِسْلَامِ. فَلَمْ يُحْسِنُوْا أَنْ يَّقُوْلُوْا: أَسْلَمْنَا فَجَعَلُوْا يَقُوْلُوْنَ: صَبَأنَا صَبَأْنَا. فَجَعَلَ خَالِدٌ يَقْتُلُ وَيَأْسِرُوَدَفَعَ إِلى كُلِّ رَجُلٍ مِّنَّا أَسِيْرَهُ حَتّى إِذَا كَانَ يَوْمٌ أَمَرَخَالِدٌ أَنْ يَّقْتُلَ كُلُّ رَجُلٌ منَّا أَسِيْرَهُ فَقُلْتُ: وَاللهِ لَا أَقْتُلْ أَسِيْرِيْ وَلَا يَقْتُلُ رَجُلٌ مِّنْ أَصْحَابِي أَسِيْرَهُ حَتَّى قَدِمْنَا إِلى النَّبِيِّ صلى الله عليه وسلم. فَذَكَرْنَاهُ فَرَفَعَ يَدَيْهِ فَقَالَ: “اَللَّهُمَّ إِنِّيْ أَبْرَأُ إِلَيْكَ مِمَّا صَنَعَ خَالِدٌ”. مَرَّتَيْنَ. رَوَاهُ الْبُخَارِيُّ.

3976. (17) [2/1163 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ను బనీ జజై’మహ్‌ వర్గం వారి వైపు పంపారు. ‘ఖాలిద్‌ (ర) వారిని ఇస్లామ్‌ వైపు ఆహ్వానించారు. వారందరూ ముక్తకంఠంతో ఇస్లామ్‌ స్వీక రించాం, అనక, సబానా, ‘సబానా – అంటే, ‘మేము మా తాతముత్తాతల ధర్మాన్ని విడిచిపెట్టాం,’ అని అన్నారు. ‘ఖాలిద్‌ (ర) దాన్ని అర్థం చేసుకో లేక వారిని పట్టుకొని చంపసాగారు. మాలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఖైదీని ఇచ్చి, మరుసటి రోజు ప్రతిఒక్కరు వారి ఖైదీనిచంపమని ఆదేశించారు. దానికి నేను నా ఖైదీని చంపాను, నా అనుచరులు వారి ఖైదీలను చంపారు. ఈ విషయం ప్రవక్త (స) వద్దకు ఎలాగైనా వెళ్ళవలసిందే. మేము ప్రవక్త (స) వద్దకు వెళ్ళి జరిగి నదంతా చెప్పాము. అది విన్న ప్రవక్త (స) రెండు చేతులు పైకి ఎత్తి, ”ఓ అల్లాహ్‌! ‘ఖాలిద్‌ చేసిందానికి నేను బాధ్యుడనుకాను,” అని రెండుసార్లు అన్నారు.[66]  (బు’ఖారీ)

=====

6– بَابُ الْأَمَانِ

6. శరణు ఇవ్వటం

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

3977 – [ 1 ] ( متفق عليه ) (2/1164)

عَنْ أُمِّ هَانِئٍ بِنْتِ أَبِىْ طَالِبٍ قَالَتْ: ذَهَبْتُ إِلى رَسُوْلِ اللهِ عَامَ الْفَتْحِ فَوَجَدْتُّهُ يَغْتَسِلُ وَفَاطِمَةُ ابْنَتَهُ تَسْتُرُهُ بِثَوْبٍ فَسَلَّمْتُ فَقَالَ: “مَنْ هَذِهِ؟” فَقُلْتُ: أَنَا أُمّ هَانِئٍ بِنْتُ أَبِيْ طَالِبٍ فَقَالَ: “مَرْحَبَا بِأُمِّ هَانِئٍ”. فَلَمَّا فَرَغَ مِنْ غُسْلِهِ قَامَ فَصَلّى ثَمَانِيَ رَكْعَاتٍ مُلْتَحِفًا فِيْ ثَوْبٍ ثُمَّ انْصَرَفَ فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ زَعَمَ ابْنُ أُمِّيْ عَلِيٌّ أَنَّهُ قَاتِلٌ رَجُلًا أَجَرْتُهُ فُلَانَ بْنَ هُبَيْرَةَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قَدْ أَجَرْنَا مَنْ أَجَرْتِ يَا أُمَّ هَانِئٍ”. قَالَتْ أُمُّ هَانِئٍ وَذَلِكَ ضُحى. مُتَّفَقٌ عَلَيْهِ .

وَفِيْ رِوَايَةٍ لِلتِّرْمِذِيّ قَالَتْ: أَجَرْتُ رَجُلَيْنِ مِنْ أَحْمَائِيْ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قَدْ أَمَنَّا مَنْ أمَنْتِ”.

3977. (1) [2/1164ఏకీభవితం]

ఉమ్మె హానీ బిన్‌తె అబీ ‘తాలిబ్‌ (ర) కథనం: ఫత’హ్‌ మక్కహ్ సంవత్సరం నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స) స్నానం చేస్తున్నారు. ప్రవక్త (స) కూతురు ఫాతిమహ్ ఒక వస్త్రాన్ని తెరగా ఉంచారు. నేను సలామ్‌ చేసాను. ప్రవక్త (స) ‘ఎవరు నీవు’ అని అన్నారు. నేను ఉమ్మె హానీ, అబూ తాలిబ్కూతుర్ని‘ అని సమాధానం ఇచ్చాను. ప్రవక్త (స) సంతోషంతో, ‘స్వాగతం ఉమ్మె హానీ’ అని పలికారు. ప్రవక్త (స) స్నానం చేసి వస్త్రం కప్పుకొని 8  రకాతులు నమా’జు ఆచరించారు. నమా’జు ముగిసిన తర్వాత, నేను, ‘ఓ ప్రవక్తా! నా సోదరుడు ‘అలీ (ర), ఫలానా వ్యక్తిని చంపాలని అనుకుంటున్నారు. అయితే అతనికి నేను అభయం ఇచ్చి ఉన్నాను,’ అని అన్నాను. అది విన్న ప్రవక్త (స) ‘ఓ ఉమ్మె హానీ! నీవు అభయం ఇచ్చిన వ్యక్తికి, నేనూ అభయం ఇస్తున్నాను,’ అని అన్నారు. ప్రవక్త (స) చదివింది సూర్యోదయం తరువాత నమా’జు అని ఉమ్మె హానీ పేర్కొన్నారు. [67] (బు’ఖారీ, ముస్లిమ్‌)

 తిర్మిజి’ ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”నేను నా ఇద్దరు మరిదులకు అభయం ఇచ్చాను అని ఉమ్మె హానీ అన్నారు. అప్పుడు ప్రవక్త(స) నీవు అభయం ఇచ్చిన వారికి నేనూ అభయం ఇచ్చాను,” అని అన్నారు.

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం

3978 – [ 2 ] ( لم تتم دراسته ) (2/1164)

عَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: ” إِنَّ الْمَرْأَةَ لَتَأْخُذُ لِلْقَوْمِ”. يَعْنِيْ تُجِيْرُ عَلى الْمُسْلِمِيْنَ. روَاهُ التِّرْمِذِيُّ .

3978. (2) [2/1164 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”స్త్రీ తన జాతి చేతిని ఆప గలదు, అంటే ఒకవేళ స్త్రీ అవిశ్వాసికి అభయం ఇస్తే ఆమె అభయం ఆ తెగ మొత్తం అభయం ఇచ్చినట్టే. అంటే స్త్రీ అభయం ఇచ్చినవారిని చంపడం తగదు. ఎందుకంటే వాగ్దాన భంగం అవుతుంది.” (తిర్మిజి’)

3979 – [ 3 ] ( لم تتم دراسته ) (2/1164)

وَعَنْ عَمْرِو بْنِ الْحَمِقِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ أَمَنَ رَجُلًا عَلى نَفْسِهِ فَقَتَلهُ أُعْطِيَ لِوَاءَ الْغَدْرِ يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّة.

3979. (3) [2/1164 అపరిశోధితం]

అమ్ర్‌ బిన్‌ ‘హమిఖ్‌(ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూఉండగా నేను విన్నాను, ”ఎవరైనా ఒకరికి అభయం ఇచ్చిన తరువాత చంపితే, తీర్పుదినం నాడు వాగ్దాన భంగం జెండా అతనికి ఇవ్వటం జరుగుతుంది.” (షర్‌హుస్సున్నహ్‌)

అంటే వాగ్దానభంగం జండా అతనికి ఇవ్వటం జరుగు తుంది. దానిద్వారా ప్రజలు అతన్ని ఈ వ్యక్తి మోసగాడు, ద్రోహి అని గుర్తిస్తారు. ఇది నీచ అవమానం.

3980 – [ 4 ] ( لم تتم دراسته ) (2/1165)

وَعَنْ سَلِيْمِ بْنِ عَامِرٍ قَالَ: كَانَ بَيْنَ مُعَاوِيَةَ وَبَيْنَ الرُّوْمِ عَهْدٌ وَكَانَ يَسِيْرُ نَحْوَ بِلَادِهِمْ حَتَّى إِذَا انْقَضَى الْعَهْدُ أَغَارَ عَلَيْهِمْ فَجَاءَ رَجُلٌ عَلَى فَرَسٍ أَوْ بِرْذَوْنٍ وَهُوَ يَقُوْلُ: اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ وَفَاءٌ لَا غَدْرٌ فَنَظَرَ فَإِذَا هُوَ عَمْرُو ابْنُ عَبَسَةَ فَسَأَلَهُ مُعَاوِيَةُ عَنْ ذَلِكَ فَقَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ كَانَ بَيْنَهُ وَبَيْنَ قَوْمٍ عَهْدٌ فَلَا يَحُلَّنَّ عَهْدًا وَلَا يَشُدَّنَّهُ حَتَّى يَمْضِي أَمَدُهُ أَوْ يَنْبِذَ إِلَيْهِمْ عَلَى سَوَاءٍ”. قَالَ: فَرَجَعَ مُعَاوِيَةُ بِالنَّاسِ . رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ .

3980. (4) [2/1165అపరిశోధితం]

సలీమ్‌ బిన్‌ ‘ఆమిర్‌ (ర) కథనం: ముఆవియహ్ (ర) మరియు రూమీల మధ్య ఒక నిర్ణీత గడువు వరకు ఒప్పందం కుదిరింది. మేము, ము’ఆవియహ్‌ తో సహా వారి దేశంవైపు సైన్యంతో నిర్ణీత గడువు పూర్తి కాగానే వారిపై అకస్మాత్తుగా దాడిచేద్దా మని వెళుతున్నాము. ఒక వ్యక్తి గుర్రంపై వచ్చి, ”అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వాగ్దానం నెరవేర్చండి, వాగ్దానభంగం చేయకండి,” అని అనసాగాడు. ప్రజలు చూడగా అతను ‘అమ్ర్‌ బిన్‌ ‘అబస ప్రవక్త (స) అనుచరులు. ము’ఆవియహ్‌ దాని కారణం అడిగారు. దానికి అతను ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”ఒకరికి మరో వర్గానికి మధ్య ఒప్పందం జరిగితే, దాన్ని భంగం చేయరాదు. లేదా అందులో ఎటువంటి మార్పూ చేయకూడదు. దాని నిర్ణీత గడువు పూర్తిచేయాలి. లేదా ఇరువర్గాలు ఒప్పందం భంగం చేసే ప్రకటన చేయాలి. ఒక వర్గం మరో వర్గానికి తెలియపరచాలి.” అది విన్న ము’ఆవియహ్‌ (ర) సైన్యాన్ని తీసుకొని తిరిగి వెళ్ళిపోయారు. (తిర్మిజి’, అబూ  దావూద్‌)

3981 – [5 ] ( لم تتم دراسته ) (2/1165)

وَعَنْ أَبِيْ رَافِعٍ قَالَ: بَعَثَنِيْ قُرَيْشٌ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه و سلم فَلَمَّا رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أُلْقِيَ فِيْ قَلْبِي الْإِسْلَامِ فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ وَاللهِ لَا أَرْجِعُ إِلَيْهِمْ أَبَدًا قَالَ: “إِنِّيْ لَا أَخِيْسُ بِالْعَهْدِ ولَا أَحْبِسُ الْبُرُدَ وَلَكِنِ ارْجِعْ فَإِنْ كَانَ فِيْ نَفْسِكَ الَّذِيْ فِيْ نَفْسِكَ الآنَ فَارْجِعْ”. قَالَ: فَذَهَبْتُ ثُمَّ أَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم فَأَسْلَمْتُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3981. (5) [2/1165 అపరిశోధితం]

అబూ రాఫె (ర) కథనం: హుదైబియ ఒప్పందం తరువాత ఖురైషులు నన్ను ప్రవక్త (స) వద్దకు పంపారు. నేను ప్రవక్త (స)ను చూడగానే ఇస్లామ్‌ పట్ల ప్రేమతో నా హృదయం నిండిపోయింది. అప్పుడు నేను ప్రవక్త (స) తో, ‘ఓ ప్రవక్తా! ఇప్పుడు నేను తిరిగి మక్కహ్ ఖురైషుల వద్దకు వెళ్ళను,’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘లేదు నేను ఒప్పందాన్ని భంగం కానివ్వను. ఇంకా రాయబారిని, ప్రతినిధిని వెళ్ళకుండా ఆపలేను. కాని నువ్వు ఇప్పుడు తిరిగి వెళ్ళిపో, ఒకవేళ నీ హృదయంలో ఇప్పుడున్నదే ఉంటే నువ్వు తిరిగి వచ్చేయి.’ నేను తిరిగి వెళ్ళిపోయాను. ఆ తరువాత తిరిగి వచ్చి ప్రవక్త (స) వద్ద ఇస్లామ్‌ స్వీకరించారు. [68] (అబూ  దావూద్‌)

3982 – [ 6 ] ( لم تتم دراسته ) (2/1165)

وَعَنْ نُعَيْمِ بْنِ مَسْعُوْدٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ لِرَجُلَيْنِ جَاءَا مِنْ عِنْدِ مُسَيْلَمَةَ: “أَمَا وَاللهِ لَوْلَا أَنَّ الرُّسَلَ لَا تُقْتَلُ لَضَرَبْتُ أَعْنَاقَكُمَا”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ.

3982. (6) [2/1165అపరిశోధితం]

న’యీమ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ముసైలమహ్ దగ్గర నుండి వచ్చిన ఇద్దరు ప్రతినిధులతో,  ”ఒక వేళ ఇస్లామ్‌లో రాయబారు లను, ప్రతినిధులను చంపటం నిషిద్ధం కాకుండా ఉండి ఉంటే, నేను మీ ఇద్దరి తలలు నరికి ఉండేవాడిని.” అని అన్నారు. [69] (అ’హ్మద్‌, అబూ  దావూద్‌)

3983 – [ 7 ] ( لم تتم دراسته ) (2/1165)

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ فِيْ خُطْبَةِ: “أَوْفُوْا بِحِلْفِ الْجَاهِلِيةِ فَإِنِّهُ لَا يَزِيْدُ يَعْنِي الْإِسْلَامِ إِلَّا شِدَّةً وَلَا تُحْدِثُوْا حِلْفًا فِي الْإِسْلَامِ”. رَوَاهُ التِّرْمِذِيُّ مِنْ طَرِيْقِ ابْنِ ذَكْوَانَ عَنْ عَمْرٍو وَقَالَ: حَسَنٌ وَذُكِرَ حَدِيْثُ عَلِيٍّ: “اَلْمُسْلِمُوْنَ تَتْكَافَأُ”. فِيْ”كِتَابِ الْقِصَاصِ.”

3983. (7) [2/1165 అపరిశోధితం]

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ తన తండ్రి తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) ఒక ప్రసంగంలో అజ్ఞాన కాలపు ఒప్పందాలను, వాగ్దానాలను పూర్తిచేయండి. ఎందుకంటే  ఇస్లామ్ ఒప్పందాలను, వాగ్దానాలను పూర్తిచేయటాన్ని సమర్థిస్తుంది. ఇప్పుడు వేరే ఒప్పందం అవసరం లేదు.[70]  (తిర్మిజి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం 

3984 – [ 8 ] ( لم تتم دراسته ) (2/1166)

عَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: جَاءَ ابْنُ النَّوَاحَةِ وَابْنُ أُثَالٍ رَسُوْلًا مُسَيْلَمَةَ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ لَهُمَا: “أَتَشْهَدَانِ أَنِّيْ رَسُوْلُ اللهِ؟” فَقَالَا: نَشْهَدُ أَنَّ مُسَيْلَمَةَ رَسُوْلُ اللهِ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “آمَنْتُ بِاللهِ وَرَسُوْلِهِ وَلَوْ كُنْتُ قَاتِلًا رَسُوْلًا لَقَتَلْتُكُمَا”. قَالَ عَبْدُ اللهِ: فَمَضَتِ السُّنَّةُ أَنَّ الرَّسُوْلَ لَا يُقْتَلُ. رَوَاهُ أَحْمَدُ.

3984. (8) [2/1166అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ఇబ్నె నవా’హ, ఇబ్నె ఉసాల్‌ ఇద్దరూ ముసైలమ కజ్జా’బ్‌ ప్రతినిధులుగా ప్రవక్త (స) వద్దకు వచ్చారు. ప్రవక్త (స) వారిద్దరితో, ‘మీరు ఇద్దరూ నేను అల్లాహ్‌ ప్రవక్తనని సాక్ష్యం ఇస్తారా?’ అని అంటే, వారు ”మేము ముసైలమ అల్లాహ్‌ ప్రవక్త అని సాక్ష్యం ఇస్తాం,” అని అన్నారు. అప్పుడు ప్రవక్త(స), ‘నేను అల్లాహ్‌నూ, ఆయన ప్రవక్తనూ విశ్వసించాను. ఒకవేళ నేను రాయబారులను చంపదలచుకుంటే మీ ఇద్దరినీ చంపి ఉండేవాడిని,’ అని అన్నారు. ”రాయబారుల పట్ల, ప్రతినిధుల పట్ల ప్రవక్త సాంప్రదాయం ఇలాగే కొనసాగుతుంది,” అని ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ పేర్కొన్నారు.  (అ’హ్మద్‌)

=====

7– بَابُ قِسْمَةِ الْغَنَائِمِ وَالْغُلُوْلُ فِيْهَا

7. యుద్ధప్రాప్తి పంపిణి, అందులో నమ్మకద్రోహం

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

3985 – [ 1 ] ( متفق عليه ) (2/1167)

عَنْ أَبِيْ هُرَيْرَةَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “فَلَمْ تَحِلَّ الْغَنَائِمُ لِأَحَدٍ مِنْ قَبْلِنَا ذَلِكَ بِأَنَّ اللهَ رَأى ضَعْفَنَا وَعِجْزَنَا فَطَيَّبَهَا لَنَا”.

3985. (1) [2/1167ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”నా కంటే ముందు ఎవ్వరికీ యుద్ధ ధనం ధర్మసమ్మతం కాలేదు. అల్లాహ్‌ (త) మన బలహీనత, నిస్సహాయతను చూచి యుద్ధ ధనాన్ని మన కోసం ధర్మసమ్మతం చేసాడు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

3986 – [ 2 ] ( متفق عليه ) (2/1167)

وَعَنْ أَبِيْ قَتَادَةَ قَالَ: خَرَجْنَا مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم عَامَ حُنَيْنٍ فَلَمَّا الْتَقَيْنَا كَانَتْ لِلْمُسْلِمِيْنَ جَوْلَةٌ فَرَأَيْتُ رَجُلًا مِّنَ الْمُشْرِكِيْنَ قَدْ عَلَا رَجُلًا مِّنَ الْمُسْلِمِيْنَ فَضَرَبْتُهُ مِنْ وَّرَائِهِ عَلَى حَبَلٍ عَاتِقِهِ بِالسَّيْفِ فَقَطَعْتُ الدِّرْعَ وأَقْبَلَ عَلَيَّ فَضَمَّنِي ضَمَّةً وَجَدْتُّ مِنْهَا رِيْحَ الْمَوْتِ ثُمَّ أَدْرَكَهُ الْمَوْتُ فَأَرْسَلَنِيْ فَلَحِقْتُ عُمَرَ بْنِ الْخَطَّابِ فَقُلْتُ: مَا بَالُ النَّاس؟ قَالَ: أَمْرُ اللهِ ثُمَّ رَجَعُوْا وَجَلَسَ النَّبِيُّ صلى الله عليه وسلم فَقَالَ: “مَنْ قَتَلَ قَتِيْلًا لَهُ عَلَيْهِ بَيِّنَةٌ فَلَهُ سَلَبُهُ”. فَقُلْتُ: مَنْ يَشْهَدُ لِيْ؟ ثُمَّ جَلَسْتُ ثُمَّ قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم مِثْلَهُ فَقُمْتُ فَقَالَ: “مَا لَكَ يَا أَبَا قَتَادَةَ؟” فَأَخْبَرْتُهُ فَقَالَ رَجُلٌ: صَدَقَ وَسَلْبُهُ عِنْدِيْ فَأَرْضِهِ مِنِّيْ. فَقَالَ أَبُوْ بَكْرٍ: لَا هَا اللهُ إِذَا لَا يَعْمِدُ اِلى أَسَدٍ مِّنْ أَسَدِ اللهِ يُقَاتِلُ عَنْ اللهِ وَرَسُوْلِهِ فَيُعْطِيْكَ سَلَبَهُ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “صَدَقَ فَأَعْطِهِ” فَأَعْطَانِيْهِ فَاتْبَعْتُ بِهِ مَخْرَفًا فِيْ بَنِيْ سَلِمَةٍ فَإِنَّهُ لِأَوَّلُ مَالٍ تَأَثَّلْتُهُ فِي الْإِسْلَامِ.

3986. (2) [2/1167ఏకీభవితం]

అబూ ఖతాదహ్ (ర) కథనం: హునైన్ యుద్ధం సంవత్సరం మేము ప్రవక్త (స) వెంట యుద్ధం చేయడానికి బయలు దేరాము. మేము అవిశ్వాసులను కలసి వారితో యుద్ధం ప్రారంభం అయ్యింది. ముస్లిములు ఓడిపోయే సూచనలు కనిపించాయి. ఒక అవిశ్వాసి ఒక ముస్లింపై ఆధిక్యత పొందినట్లు చూచాను. వాడి వెనుక నుండి నేను కరవాలంతో మెడపైకొట్టాను. అది అతని కవచాన్ని ఛేదించింది. అతడు నా వైపు తిరిగి నన్ను గట్టిగా కౌగిలించు కున్నాడు. ఇంతలో నేను చావు సువాసన గ్రహించాను. వెంటనే వాడు మరణించాడు. నన్ను వదలివేసాడు. ఆ తరువాత ‘ఉమర్‌ బిన్‌ ఖ’త్తాబ్‌ (ర)ను కలిసాను. ‘ఏమయింది, ప్రజలు అటూ ఇటూ పరిగెడుతున్నారు. ఓడి పోయామా?’ అని అన్నాను. దానికి అతను దైవనిర్ణయం ఇదే అయి ఉంటుంది,’ అని అన్నారు. ఆ తరువాత రెండవ సారి యుద్ధం ప్రారంభం అయ్యింది. ముస్లిములు విజయం సాధించారు. ప్రజలు తిరిగి వచ్చారు. ప్రవక్త (స) ఒకచోట కూర్చుండి పోయారు. ఇంకా, ‘ఎవరైనా అవిశ్వాసిని చంపిఉంటే దానికి సాక్ష్యం కూడా ఉంటే ఆ అవిశ్వాసి సామాను అతనికి లభిస్తుంది,’ అని అన్నారు. నేను నా మనసులో, ‘నా గురించి సాక్ష్యం ఎవరిస్తారు,’ అని కూర్చున్నాను. ప్రవక్త (స) మళ్ళీ అలాగే ప్రకటించారు. నేను నిలబడి మళ్ళీ మనసులో, ‘నాకు సాక్ష్యం ఎవరు ఇస్తారు?’ అని కూర్చుండి పోయాను.  మళ్ళీ ప్రవక్త (స) అలాగే అన్నారు. నేను మళ్ళీ, ‘నాకు సాక్ష్యం ఎవరున్నారు,’ అని కూర్చుండిపోయాను. అప్పుడు ప్రవక్త (స) అబూ ఖతాదహ్, ‘ఏమయింది మాటి మాటికీ నిలుచుంటున్నావు, కూర్చుంటున్నావు?’ అని ప్రశ్నించారు. అప్పుడు నేను జరిగినదంతా విన్నవించు కున్నాను. ఒక వ్యక్తి నిలబడి, ‘అబూ ఖతాదహ్ నిజం చెబుతున్నారు. అతని హతుని సామాన్లు నా దగ్గర ఉన్నాయి. తమరు అతన్ని ఒప్పించి ఆ సామాన్లు అతనికి ఇవ్వండి,’ అని అన్నాడు. అప్పుడు అబూ బకర్‌ (ర), ‘అల్లాహ్ సాక్షి! అబూ ఖతాదహ్‌ విషయంలో అతనికి వ్యతిరేకంగా విచారించటం జరుగదు. అల్లాహ్‌, ఆయన ప్రవక్త (స) ఆదేశాల ప్రకారం యుద్ధం చేసినవారి హతుని సామాను అతనికి ఇవ్వకపోవడం ఎంతమాత్రం జరుగదు,’ అని అన్నారు. ప్రవక్త (స), ‘అబూ బకర్‌ నిజం పలుకుతున్నారు, ఆ ధనం అతనికి ఇచ్చివేయండి,’ అని ఆదేశించారు. ప్రవక్త (స) ఆ సామాన్లను అతనికి ఇచ్చి వేసారు. నేను ఆ సామాన్లతో బనూ సలమహ్ తెగకు చెందిన ఒకతోట కొన్నాను. ఇస్లామ్‌ స్వీకరించిన తర్వాత అన్నిటికంటే ముందు దాన్ని పొందాను. [71] (బు’ఖారీ, ముస్లిమ్‌)

3987- [ 3 ] ( متفق عليه ) (2/1168)

وِعَنِ ابْنِ عُمَرَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَسْهَمَ لِلرَّجُلِ وَلِفَرْسِهِ ثَلَاثَةَ أَسْهَمٍ: سَهْمًا لَهُ وَسَهْمَيْنِ لِفَرْسِهِ .

3987. (3) [2/1168 ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ముజాహిద్‌ వీరులకు, వారి గుర్రాలకు యుద్ధ ధనం నుండి 3 వంతులు నిర్ణయించారు. ఒక వంతు వ్యక్తికి, రెండు వంతులు అతని గుర్రానికి. [72] (బు’ఖారీ, ముస్లిమ్‌)

3988 – [ 4 ] ( صحيح ) (2/1168)

وَعَنْ يَزِيْدَ بْنِ هُرْمُزَ قَالَ: كَتَبَ نَجْدَةُ الْحَرْوَرِيُّ إِلَى ابْنِ عَبَّاسٍ يَسْأَلُهُ عَنِ الْعَبْدِ وَالْمَرْأَةِ يَحْضُرَانِ لْمَغْنَمَ هَلْ يُقْسَمُ لَهُمَا؟ فَقَالَ لِيَزْيِدَ: اُكْتُبْ إِلَيْهِ أَنَّهُ لَيْسَ لَهُمَا سَهْمٌ إِلَّا أَنْ يُحْذَيَا. وَفِيْ رِوَايَةٍ: كَتَبَ إِلَيْهِ ابْنُ عَبَّاسٍ: إِنَّكَ كَتَبْتَ إِلَيَّ تَسْأَلُنِيْ: هَلْ كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَغْزُوْ بِالنِّسَاءِ؟ وَهَلْ كَانَ يَضْرِبُ لَهُنَّ بِسَهْمٍ؟ فَقَدْ كَانَ يَغْزُو بِهِنَّ يُدَاوِيْنَ الْمَرْضَى وَيُحْذَيْنَ مِنَ الْغَنِيْمَةِ وَأَمَّا السَّهْمُ فَلَمْ يَضْرِبْ لَهُنَّ بِسَهْمٍ. رَوَاهُ مُسْلِمٌ .

3988. (4) [2/1168 దృఢం]

య’జీద్‌ బిన్‌ హుర్‌ము’జ్‌ కథనం: నజ్‌దహ్‌ ‘హరూరీ ఇబ్నె ‘అబ్బాస్‌కు ఉత్తరం వ్రాసి, ”ఒకవేళ యుద్ధంలో స్త్రీలు బానిసలు పాల్గొంటే యుద్ధ ధనం నుండి వారికి భాగం ఇవ్వబడుతుందా లేదా?” అని అడిగారు. దానికి ఇబ్నె ‘అబ్బాస్‌ య’జీద్‌ బిన్‌ హుర్‌ము’జ్‌తో, ”వీరిద్దరికీ యుద్ధ ధనం నుండి ఎటువంటి భాగమూ లేదు, అయితే కానుకగా వారికి కొంత ఇవ్వ వచ్చు.’  

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఇబ్నె ‘అబ్బాస్‌ సమాధానంగా ఇలా వ్రాసారు: ‘నీవు ప్రవక్త (స) స్త్రీలను జిహాద్‌లోకి తీసుకొని వెళ్ళేవారా? మరియు యుద్ధధనం నుండి వారికి కొంత భాగం ఇచ్చేవారా,’ అని ప్రశ్నించావు. అయితే ప్రవక్త (స) స్త్రీలకు జిహాద్‌లో పాల్గొనే అనుమతి ఇచ్చేవారు. స్త్రీలు యుద్ధ మైదానంలో గాయపడిన వారికి సేవ చేసేవారు, వారి గాయాలకు కట్లు కట్టేవారు. ఫలితంగా కానుకల రూపంలో వారికి కొంత ఇచ్చివేయటం జరిగేది. కాని వారికి యుద్ధ ధనం నుండి ఎటువంటి వంతులు  ఇవ్వబడేవి కావు. (ముస్లిమ్‌)

3989 – [ 5 ] ( صحيح ) (2/1168)

وَعَنْ سَلَمَةَ بْنِ الْأَكْوَعِ قَالَ: بَعَثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِظَهْرِهِ مَعَ رِبَاحِ غُلَامٍ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَأَنَا مَعَهُ فَلَمَّا أَصْبَحْنَا إِذَا عَبْدُ الرَّحْمنِ الْفَزَارِيُّ قَدْ أَغَارَ عَلَى ظَهْرِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقُمْتُ عَلى أَكَمَةٍ فَاسْتَقْبَلْتُ الْمَدِيْنَةَ فَنَادَيْتُ ثَلَاثًا يَا صَبَاحَاهُ ثُمَّ خَرَجْتُ فِيْ آثَارِ الْقَوْمِ أَرْمِيْهِمْ بِالنَّبْلِ وَأَرْتَجِزُ وَأَقُوْلُ: أَنَا ابْنُ الْأَكْوَعِ وَالْيَوْمُ يَوْمُ الرُّضّعِ فَمَا زِلْتُ أَرْمِيْهِمْ وَأَعْقِرُ بِهِمْ حَتّى مَا خَلَقَ اللهُ مِنْ بَعِيْرٍ مِنْ ظَهْرِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم إِلَّا خَلَّفَتُهُ وَرَاءَ ظَهْرِيْ ثُمَّ اتَّبَعْتُهُمْ أَرْمِيْهِمْ حَتّى أَلْقَوْا أَكْثَرَ مِنْ ثَلَاثِيْنَ بُرْدَةً وَثَلَاثِيْنَ رُمْحَا يَسْتَخِفُّوْنَ ولَا يَطْرَحُوْنَ شَيْئًا إِلَّا جَعَلْتُ عَلَيْهِ آرَامًا مِنَ الْحِجَارَةِ يَعْرِفُهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَأَصْحَابُهُ حَتّى رَأَيْتُ فَوَارِسَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَلَحِقَ أَبُوْ قَتَادَةَ فَارِسُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم بِعَبْدِ الرّحْمنِ فَقَتَلَهُ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خَيْرُ فُرْسَانِنَا الْيَوْمَ أَبُوْ قَتَادَةَ وَخَيْرُ رَجَّالَتنَا سَلَمةُ”. قَالَ: ثُمَّ أَعْطَانِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم سَهْمَيْنِ: سَهْمَ الْفَارِسِ وَسَهْمَ الرَّاجِلِ فَجَمَعَهُمَا إِلَيَّ جَمِيْعًا ثُمَّ أَرْدَفَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَرَاءَهُ عَلى الْعَضْبَاءِ رَاجِعَيْنِ إِلى الْمَدِيْنَةِ. رَوَاهُ مُسْلِمٌ.

3989. (5) [2/1168 దృఢం]

సలమహ్ బిన్‌ అక్వ’అ (ర) కథనం: ప్రవక్త (స) తన వాహనాలను మేపటానికి రబాహ్ అనే వ్యక్తికి ఇచ్చి అడవిలోనికి పంపేవారు. నేనూ అతని వెంట ఉన్నాను. ఉదయం వేళ ‘అబ్దుర్ర’హ్మాన్‌ అనే దోపిడీ దొంగ దాడిచేసి ఒంటెలను దోచుకున్నాడు. నేను ఒక కొండపైకి ఎక్కి మదీనహ్ వైపు తిరిగి మూడు సార్లు బిగ్గరగా, ‘ప్రజ లారా! జాగ్రత్తగా ఉండండి. శత్రువు ఉదయం వేళ దాడిచేసాడు,’ అని కేకవేసి నేను ‘అబ్దుర్ర’హ్మాన్‌, అతని సహచరుల వెంటపడ్డాను. వారిపై బాణాలు కురిపించసాగాను. కవిత్వాలు పఠిస్తూ ”నేను అక్వ’అ సంతానాన్ని, ‘ఈ నాడు దుర్మార్గుల నాశనం ఉంది,” అని అంటూ ఉన్నాను. చివరికి ఒంటెలన్నీ విడిపించుకున్నాను. వాటిని వదులుతూ వాటిపై గుర్తులువేస్తూ పోయాను, ఇతరులు తీసుకోకుండా ఉండేందుకు. మళ్ళీ వారివెంట పడ్డాను. వారు పారిపోతూ 30 దుప్పట్లు, 30 బల్లాలు పారవేసి వెళ్ళి పోయారు. చివరికి ప్రవక్త (స), ఆయన అనుచరులు రావటం చూసాను. ప్రవక్త (స) వాహనం నడిపే అబూ ఖతా దహ్, ‘అబ్దుర్రహ్మా’న్‌ దోపిడీ దొంగను కలిసి అతన్ని పట్టుకొని అతన్ని చంపివేసారు. ప్రవక్త (స) ఈనాడు వాహన సారథుల్లో ఉత్తమ సారథి అబూ ఖతాదహ్‌ ఇంకా కాలి నడకన వెళ్ళేవారిలో అందరికంటే శ్రేష్ఠుడు సలమహ్ బిన్‌ అక్వ’అ అని అన్నారు.[73] (ముస్లిమ్‌)

 సలమహ్ బిన్‌ అక్వ’అ కథనం: ప్రవక్త (స) నాకు రెండు వంతులు ఇచ్చారు. ఒకటి వాహనానిది, రెండవది కాలినడకన వెళ్ళేవానిది. నేను ఈ రెండు వంతులను కూడబెట్టి తీసు కున్నాను. తిరుగు ప్రయాణంలో ప్రవక్త (స) నన్ను, తమ వాహనంపై వెనుక కూర్చోబెట్టు కున్నారు. మేము అజ్‌బా ఒంటెపై కూర్చొని మదీనహ్ తిరిగి వచ్చాము. (ముస్లిమ్‌)

3990 – [ 6 ] ( متفق عليه ) (2/1169)

وَعَنِ ابْنِ عُمَرَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يُنْفِلُ بَعْضَ مَنْ يَّبْعَثُ مِنَ السَّرَايَا لِأَنْفُسِهِمْ خَاصَّةً سِوَى قِسْمَةِ عَامَّةِ الْجَيْشِ.

3990. (6) [2/1169ఏకీభవితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) సైన్యాలలో పంపే వారిలో కొందరికి ఇవ్వబడే వంతులే కాక ప్రత్యేకంగా కొంత అధికంగా ప్రోత్సాహకాలుగా ఇచ్చే వారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3991 – [ 7 ] ( متفق عليه ) (2/1169)

وَعَنْهُ قَالَ: نَفَّلَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم نَفَلًا سِوى نَصِيْبِنَا مِنَ الْخُمُسِ فَأَصَابَنِيْ شَارِفٌ وَالشَّارِفُ: اَلْمُسِنُّ الْكَبِيْرُ.

3991. (7) [2/1169ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ఒకసారి ప్రవక్త (స) సాధారణ వంతు కాకుండా, కొంత అధికంగా ఇచ్చారు.  అంటే ఒక అధిక వయస్సు గల ఒంటె నాకు లభించింది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3992 – [ 8 ] ( صحيح ) (2/1169)

وَعَنْهُ قَالَ: ذَهَبْتْ فَرَسٌ لَهُ فَأَخَذَهَا الْعَدُوُّ فَظَهَرَ عَلَيْهِمُ الْمُسْلِمُوْنَ فَرُّدَّ عَلَيْهِ فِيْ زَمَنٍ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم.

وَفِيْ رِوَايَةٍ: أَبَقَ عَبْدٌ لَهُ فَلَحِقَ بِالرُّوْمِ فَظَهَرَ عَلَيْهِمُ الْمُسْلِمُوْنَ فَرُدَّ عَلَيْهِ خَالِدُ بْنُ الْوَلِيْدِ بَعْدَ النَّبِيِّ صلى الله عليه وسلم. رَوَاهُ الْبُخَارِيُّ .

3992. (8) [2/1169దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: నా గుర్రం పారి పోయింది. దాన్ని శత్రువులు పట్టుకున్నారు. ఆ తరువాత వారితో ముస్లిములు యుద్ధం చేయడం జరిగింది. యుద్ధధనంగా గుర్రం కూడా తీసుకొని వచ్చారు. ఆ గుర్రాన్ని నాకు ఇచ్చివేయడం జరిగింది. దాన్ని యుద్ధధనంలో చేర్చలేదు. ఇలా ప్రవక్త (స) కాలంలో జరిగింది.

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ సేవకుడు పారిపోయాడు. వెళ్ళి రూమీలతో కలసిపోయాడు. ముస్లిములు రూమీలతో యుద్ధం చేసి జయించిన తరువాత ‘ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ ఆ సేవకుడ్ని ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌కు తిరిగి ఇచ్చి వేసారు. అయితే ఈ సంఘటన ప్రవక్త (స) మరణానంతరం జరిగింది. [74] (బు’ఖారీ)

3993- [ 9 ] ( صحيح ) (2/1169)

وَعَنْ جُبَيْرِ بْنِ مُطْعِمٍ قَالَ: مَشَيْتُ أَنَا وَعُثْمَانُ بْنُ عَفَّانَ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم فَقُلْنَا: أَعْطَيْتَ بَنِي الْمُطَّلِبِ مِنْ خُمْسِ خَيْبَرَ وَتَرَكْتَنَا وَنَحْنُ بِمَنْزِلَةٍ وَاحِدَةٍ مِّنْكَ؟ فَقَالَ: “إِنَّمَا بَنُوْ هَاشِمٍ وَبَنُو الْمُطَّلِبِ وَاحِدٌ”. قَالَ جُبَيْرُ: وَلَمْ يُقْسِمِ النَّبِيُّ صلى الله عليه وسلم لِبَنِيْ عَبْدِ شَمْسٍ وَبَنِيْ نَوْفَلٍ شَيْئً ا. رَوَاهُ الْبُخَارِيُّ.

3993. (9) [2/1169 దృఢం]

జుబైర్‌ బిన్‌ ము’త్‌’యిమ్‌ (ర) కథనం: నేనూ, ‘ఉస్మాన్‌బిన్‌ ‘అప్ఫాన్‌(ర) ప్రవక్త (స) వద్దకు వెళ్ళాము. మేము ”ఓ ప్రవక్తా! తమరు ‘ఖైబర్‌ యుద్ధ ధనం నుండి బనీ ము’త్తలిబ్‌కి ఇచ్చారు. మమ్మల్ని వదలివేసారు. మేమందరం సమానులమే కదా,” అని విన్నవించు కున్నాం. దానికి ప్రవక్త(స) ”అవును బనూ హాషిమ్‌, బనూ ము’త్తలిబ్‌ ఒక్కటే,” అని అన్నారు, అప్పుడు ‘జుబైర్ కాని ప్రవక్త (స) బనీ అబ్దె షమ్స్‌ మరియు బనీ నౌఫిల్‌కి ఏమీ ఇవ్వలేదు. అంటే ‘ఉస్మాన్‌ మరియు ‘జుబైర్‌లకు ఏమీ ఇవ్వ లేదు.[75]  (బు’ఖారీ)

3994 – [ 10 ] ( صحيح ) (2/1169)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَيُّمَا قَرْيَةٍ أَتَيْتُمُوْهَا وَأَقمْتُمْ فِيْهَا فَسَهْمُكُمْ فِيْهَا وَأَيُّمَا قَرْيَةٍ عَصَتِ اللهُ وَرَسُوْلَهُ فَإِنَّ خُمْسَهَا لِلّهِ وَلِرَسُوْلِهِ ثُمَّ هِيَ لَكُمْ”. رَوَاهُ مُسْلِمٌ .

3994. (10) [2/1169దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ఏదైనా పట్టణంలోకి వెళ్ళి, అక్కడ నివసిస్తే, అందులో మీ వంతు ఉంది. ఒక పట్టణం వారు అల్లాహ్‌(త)కు ఆయన ప్రవక్తకూ అవిధేయత చూపితే, ఆ పట్టణం ధనంలో ఐదవ వంతు అల్లాహ్‌ (త) మరియు ఆయన ప్రవక్తది. మిగిలింది మీది. [76]  (ముస్లిమ్‌)

3995 – [ 11 ] ( صحيح ) (2/1170)

وَعَنْ خَوْلَةَ الْأَنْصَارِيَّةِ قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ رِجَالًا يَتَخَوَّضُوْنَ فِي مَالِ اللهِ بِغَيْرِ حَقٍّ فَلَهُمُ النَّارُ يَوْمَ الْقِيَامَةِ “. رَوَاهُ الْبُخَارِيُّ .

3995. (11) [2/1170 దృఢం]

‘ఖౌలహ్ అన్సారియహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ‘అల్లాహ్ (త) ధనాన్ని అన్యాయంగా ఖర్చుచేసేవారి కొరకు తీర్పుదినం నాడు నరకాగ్ని ఉంది.”  [77] (బు’ఖారీ)

3996 – [ 12 ] ( متفق عليه ) (2/1170)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ذَاتَ يَوْمٍ فَذَكَرَ الْغُلُوْلَ فَعَظَّمَهُ وَعَظَّمَ أَمْرَهُ ثُمَّ قَالَ: “لَا أُلْفِيَنَّ أَحَدَكُمْ يَجِيْءُ يَوْمَ الْقِيَامَةِ عَلى رَقْبَتِهِ بِعِيْرٌ لَهُ رَغَاءٌ يَقُوْلُ: يَا رَسُوْلَ اللهِ أَغِثْنِيْ فَأَقُوْلُ: لَا أَمْلِكُ لَكَ شَيْئًا قَدْ أَبْلَغْتُكَ. لَا أُلْفِيَنَّ أَحَدَكُمْ يَجِيْءُ يَوْمَ الْقِيَامَةِ عَلَى رَقْبَتِهِ فَرَسٌ لَهُ حَمْحَمَةٌ فَيَقُوْلُ: يَا رَسُوْلَ اللهِ أَغِثْنِيْ فَأَقُوْلُ: لَا أَمْلِكُ لَكَ شَيْئًا قَدْ أَبْلَغْتُكَ لَا أُلْفِيَنَّ أَحَدَكُمْ يَجِيْءُ يَوْمَ الْقِيَامَةِ عَلَى رَقْبَتِهِ شَاةٌ لَهَا ثُغَاءٌ يَقُوْلُ: يَا رَسُوْلَ اللهِ أَغِثْنِيْ فَأَقُوْلُ: لَا أَمْلِكُ لَكَ شَيْئًا قَدْ أَبْلَغْتُكَ لَا أُلْفِيَنَّ أَحَدَكُمْ يَجِيْءُ يَوْمَ الْقِيَامَةِ عَلَى رَقْبَتِهِ نَفْسٌ لَهَا صِيَاحٌ فَيَقُوْلُ: يَا رَسُوْلَ اللهِ أَغِثْنِيْ فَأَقُوْلُ: لَا أَمْلِكُ لَكَ شَيْئَا قَدْ أَبْلَغْتُكَ لَا أُلْفِيَنَّ أَحَدَكُمْ يَجِيْءُ يَوْمَ الْقِيَامَةِ عَلَى رَقْبَتِهِ رِقَاعٌ تَخْفقُ فَيَقُوْلُ: يَا رَسُوْلَ اللهِ أَغِثْنِيْ فَأَقُوْلُ: لَا أَمْلِكُ لَكَ شَيْئًا قَدْ أَبْلَغْتُكَ لَا أُلْفِيَنَّ أَحَدَكُمْ يَجِيْءُ يَوْمَ الْقِيَامَةِ عَلَى رَقْبَتِهِ صَامِتٌ فَيَقُوْلُ: يَا رَسُوْلَ اللهِ أَغِثْنِيْ فَأَقُوْلُ: لَا أَمْلِكُ لَكَ شَيْئًا قَدْ أَبْلَغْتُكَ”. وَهَذَا لَفْظٌ مُسْلِمٍ وَهُوَ أَتَمٌّ .

3996. (12) [2/1170 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ఒకరోజు ప్రవక్త (స) ఉపదేశించడానికి నిలబడ్డారు. అందులో ద్రోహాన్ని గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. దాని పాపభారాన్ని గురించి పేర్కొంటూ, తీర్పుదినం నాడు మీలో ఎవరూ తన భుజంపై ఒంటెను మోసుకుంటూ బాధపడుతూ రాడు. దొంగతనం చేసి ఉన్నవాడు, లేదా ద్రోహం చేసి ఉన్నవాడు తప్ప, ఒంటెను తన భుజంపై మోసుకుంటూ నా ముందుకు సిఫారసు కోసం రావటం జరగరాదు. వాడు వచ్చి, ‘ఓ ప్రవక్తా! నాకు సహాయం చేయండి,’ అని అంటాడు. అప్పుడు నేను నీకు ఎటువంటి సహాయం చేయలేను. ఇహలోకంలో నేను స్పష్టంగా దొంగతనం చేసినవాడు తీర్పుదినం నాడు దాన్ని తీసుకువస్తాడని చెప్పి ఉన్నాను. నేనతనికి ఎటువంటి సహాయం చేయలేను. అదేవిధంగా మీలో ఎవరూ తీర్పుదినం నాడు తన భుజంపై గుర్రం మోసుకొని రావటం జరగరాదు. గుర్రం శబ్దం చేస్తూ ఉంటుంది. ప్రజలందరికీ ఇది  దొంగతనం చేసిన గుర్రం అని తెలిసిపోతుంది. అతడు నా దగ్గరికి వచ్చి, ‘ఓ ప్రవక్తా! నాకు సహాయం చేయండి,’ అని అంటాడు. అప్పుడు నేను నేనేమీ చేయలేను, ఎందుకంటే ఇహలోకంలోనే నేను నీకు తెలియపర్చాను.’ ఆ తరువాత ఇలా అన్నారు, ”మీలో ఎవరూ ఎంత మాత్రం తన భుజంపై మేకను మోసుకొని రావటం నేను చూడకూడదు. మేక అరుస్తూ ఉంటుంది. అతడు నా దగ్గరకు వచ్చి, ‘ఓ ప్రవక్తా! నాకు సహాయం చేయండి,’ అని అంటాడు. అప్పుడు నేను నీకు ఎటువంటి సహాయం చేయలేను. దీన్ని గురించి నీకు ముందే చెప్పాను. అదేవిధంగా మీలో ఎవ్వరూ తీర్పుదినంనాడు మానవుడ్ని, బానిసను తన భుజాలపై వేసుకొని రావటం జరగరాదు. ఆ వ్యక్తి అరుస్తూ ఉంటాడు. నా దగ్గరకు వచ్చి, ఓ ప్రవక్తా! నాకు సహాయం చేయండి,’ అని అంటాడు. నేను, ‘నీకు ఏమీ చేయలేను. దీన్ని గురించి నీకు ముందే చెప్పి ఉన్నాను,’ అని అంటాను. అదే విధంగా మీలో ఎవరూ తన భుజాలపై బట్టలు మోసుకొని రావటం జరగకూడదు. అంటే ప్రపంచంలో ఆ వ్యక్తి యుద్ధధనం నుండి బట్టలు దొంగలించాడు. లేదా అన్యాయంగా ఇతరుల బట్టల్ని ధరించాడు. ఆ బట్టలు కదులుతూ శబ్దం చేస్తూ ఉంటాయి. అతడు, ‘ఓ ప్రవక్తా! నాకు సహాయం చేయండి,’ అని అంటాడు. నేను నీకు ఎటువంటి సహాయం చేయలేను, దీన్ని గురించి నీకు ముందే చెప్పాను,’ అని అంటాను. అదేవిధంగా మీలో ఎవ్వరూ బంగారం, వెండి, మొదలైనవి తన భుజాన వేసు కొని రావటం జరక్కూడదు. అతను వచ్చి, ‘ఓ ప్రవక్తా! నాకు సహాయం చేయండి,’ అని అంటాడు. దానికి నేను ఇహలోకంలో దీన్ని గురించి హెచ్చ రించి ఉన్నాను,’ అని అంటాను.”  [78]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

3997 – [ 13 ] ( متفق عليه ) (2/1170)

وَعَنْهُ قَالَ: أَهْدَى رَجُلٌ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم غُلَامًا يُقَالُ لَهُ: مِدْعَمٌ فَبَيْنَمَا مِدْعَمٌ يَحُطُّ رَحْلًا لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم إِذْ أَصَابَهُ سَهْمٌ عَاثِرٌ فَقَتَلَهُ فَقَالَ النَّاسُ: هَنِيْئًا لَهُ الْجَنَّةَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كَلَّا وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ إِنَّ الثَّمْلَةَ الَّتِيْ أَخَذَهَا يَوْمَ خَيْبَرَ مِنَ الْمَغَانِمِ لَمْ تُصِبْهَا الْمَقَاسِمُ لِتَشْتَعِلُ عَلَيْهِ نَارًا”. فَلَمَّا سَمِعَ ذَلِكَ النَّاسُ جَاءَ رَجُلٌ بِشِرَكٍ أَوْ شِرَاكَيْنِ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: “شِرَاكٌ مِنْ نَارٍ أَوْ شِرًاكَانَ مِنْ نَار”.

3997. (13) [2/1170 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర)కథనం: ప్రవక్త (స)కు ఒక వ్యక్తి ఒక బానిసను కానుకగా ఇచ్చాడు. ఆ బానిస పేరు మిద్‌’అమ్‌. అతడు ప్రయాణంలో ప్రవక్త (స) వాహనం మావటిని విప్పుతున్నాడు. అకస్మాత్తుగా ఒక బాణం వచ్చి తగిలింది, అతడు మరణించాడు. ప్రజలు అతడు అమరవీరుడు, స్వర్గవాసి,’ అని శుభాకాంక్షలు పలుకుతున్నారు. అంటే దైవమార్గంలో వీరమరణం పొందటం వల్ల స్వర్గవాసి అని అన్నారు. అది విని ప్రవక్త (స), ‘ఎంతమాత్రం కాదు, ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! ఖైబర్‌ యుద్ధం తరువాత యుద్ధధనం పంచటానికి ముందు దొంగలించిన దుప్పటి అతనిపై నరకాగ్ని జ్వాలలు రాజేస్తుంది. ఎందుకంటే అతను దొంగతనం చేసాడు,’ అని అన్నారు. అది విన్న ప్రజల్లోని ఒక వ్యక్తి చర్మం చెప్పులు తెచ్చిపెట్టాడు. అప్పుడు ప్రవక్త (స) ఇవి అగ్నిచెప్పులు అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3998 – [ 14 ] ( صحيح ) (2/1171)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِو قَالَ: كَانَ عَلَى ثَقْلٍ النَّبِيّ صلى الله عليه وسلم رَجُلٌ يُقَالُ لَهُ كِرَكِرَةُ فَمَاتَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هُوَ فِي النَّارِ”.  فَذَهَبُوْا يَنْظُرُوْنَ فَوَجَدُوْا عَبَاءَةً قَدْ غَلَّهَا. رَوَاهُ الْبُخَارِيُّ.

3998. (14) [2/1171దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్ద కర్‌కరహ్‌ అనే బానిస ఉండేవాడు. అతడు ప్రవక్త (స) కు సేవలు చేసేవాడు. జిహాద్‌లో అతడు మరణించాడు. ప్రవక్త (స), ‘అతడు నరకంలోనికి వెళ్ళాడు,’ అని అన్నారు. ప్రజలు వెళ్ళి అతని సామాన్లు చూసారు. అతని సామాన్లలో ఒక కంబళి ఉంది. దాన్ని అతడు యుద్ధధనం నుండి దొంగిలించాడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3999 – [ 15 ] ( صحيح ) (2/1171)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: كُنَّا نَصِيْبُ فِيْ مَغَازِيْنَا الْعَسْلَ وَالْعِنَبَ فَنَأْكلهُ وَلَا نَرْفَعُهُ رَوَاهُ الْبُخَارِيُّ.

3999. (15) [2/1171దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: యుద్ధంలో మాకు యుద్ధధనంగా తేనె, ద్రాక్ష లభించేవి. మేము వాటిని తినే వారం. వాటిని ప్రవక్త (స) వద్దకు తీసుకొని వెళ్ళేవారం కాము. [79]  (బు’ఖారీ)

4000 – [ 16 ] ( متفق عليه ) (2/1171)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مُغَفَّلٍ قَالَ: أَصَبْتُ جِرَابًا مِنْ شَحَمٍ يَوْمَ خَيْبَر فَالْتَزَمْتُهُ فَقُلْتُ: لَا أُعْطِيَ الْيَوْمَ أَحَدًا مِنْ هَذَا شَيْئًا فَالْتَفتُّ فَإِذَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَبَتَسَّمُ إِلَيَّ. مُتَّفَقٌ عَلَيْهِ.

وَذُكِرَ الْحَدِيْثُ أَبِيْ هُرَيْرَةَ “مَا أُعْطِيْكُمْ” فِيْ بَابِ”. رِزْقِ الْوَلَاةِ”.

4000. (16) [2/1171ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ము’గఫ్ఫల్‌ (ర) కథనం: యుద్ధంలో నాకు ఒక సంచి దొరికింది. అందులో క్రొవ్వు నిండి ఉంది. నేను దాన్ని తీసుకొని, ‘ఇందులో నుండి ఎవరికీ ఇవ్వను,’ అని అంటూ తిరిగి చూసేసరికి ప్రవక్త (స) నా వెనుక నిలబడి చిరునవ్వు నవ్వు తున్నారు.[80](బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ    రెండవ విభాగం

4001 – [ 17 ] ( لم تتم دراسته ) (2/1171)

عَنْ أَبِيْ أُمَامَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ اللهَ فَضَّلَنِيْ عَلَى الْأَنْبِيَاءِ

أَوْ قَالَ: فَضَّلَ أُمَّتِيْ عَلَى الْأُمَمِ وَأَحَلَّ لَنَا الْغَنَائِمَ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

4001. (17) [2/1171అపరిశోధితం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”అల్లాహ్‌ (త) ప్రవక్తలందరిపై నాకు ప్రత్యేకతను ప్రసాదించాడు. నా అనుచర సమాజాన్ని ఇతర సమాజాలన్నిటిపై ప్రత్యేకతను ప్రసాదించాడు. మా కోసం యుద్ధధనాన్ని ధర్మసమ్మతం చేసాడు.” (తిర్మిజి’)

4002 – [ 18 ] ( لم تتم دراسته ) (2/1171)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: يَوْمَئِذٍ يَوْمَ حُنَيْن: “مَنْ قَتَلَ كَافِرًا فَلَهُ سَلَبُهُ “. فَقَتَلَ أَبُوْ طَلْحَةَ يَوْمَئِذٍ عِشْرِيْنَ رَجُلًا وَأَخَذَ أَسْلَابَهُمْ. رَوَاهُ الدَّارَمِيُّ

4002. (18) [2/1171అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘హునైన్‌ యుద్ధం నాడు ఇలా ప్రవచించారు, ”ఎవరైనా అవిశ్వాసిని చంపితే మృతుని సామాన్లన్నీ హంతకునికి లభిస్తాయి,” అని అన్నారు. ఆ రోజు అబూ ‘తల్‌’హా 20 మంది అవిశ్వాసులను హతమార్చారు. వాళ్ళందరి సామాన్లను అతను తీసుకున్నారు.  (దార్మి)

4003 – [ 19 ] ( لم تتم دراسته ) (2/1171)

وَعَنْ عَوْفِ بْنِ مَالِكِ الْأَشْجَعِيِّ وَخَالِدِ بْنِ الْوَلِيْدِ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَضَى فِي السَّلَبِ لِلْقَاتِلِ. وَلَمْ يُخَمِّسِ السَّلبَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4003. (19) [2/1171అపరిశోధితం]

‘ఔఫ్‌ బిన్‌ మాలిక్‌ అష్‌జ’యీ మరియు ‘ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) మృతుని సామాన్ల గురించి ప్రస్తావిస్తూ, అతని సామాన్లన్నీ హంతకుడికి దక్కుతాయని, అందులో నుండి ఐదవ వంతు తీయటం జరగదని ప్రవచించారు. (అబూ  దావూద్‌)

4004 – [ 20 ] ( لم تتم دراسته ) (2/1171)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: نَفَّلَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَوْمَ بَدْرٍ سَيْفَ أَبِيْ جَهْلٍ وَكَانَ قَتَلَهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4004. (20) [2/1171అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) బద్ర్‌ యుద్ధం నాడు అబూ జహల్ కరవాలం నాకిచ్చారు. దాని తోనే వాడిని చంపారు. [81] (అబూ దావూద్‌)

4005 – [ 21 ] ( لم تتم دراسته ) (2/1172)

وَعَنْ عُمَيْر مَوْلى آبِي اللَّحْمِ قَالَ: شَهِدْتُّ خَيْبَرَ مَعَ سَادَاتِيْ فَكَلَّمُوْا فِيْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَكَلَّمُوْهُ أَنِّيْ مَمْلُوْكٌ فَأَمَرَنِيْ فَقُلِدْتُّ سَيْفًا فَإِذَا أَنَا أَجُرُّهُ فَأَمَرَلِيْ بِشَيْءٍ مِنْ خُرثِيِّ الْمَتَاعِ وَعَرَضْتُ عَلَيْهِ رُقِيَّةً كُنْتُ أَرْقِيْ بِهَا الْمَجَانِيْنَ فَأَمَرَنِيْ بِطَرْحِ بَعْضَهَا وَحَبْسٍ بَعْضِهَا . رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ إِلَّا أَنَّ رَوَايَتَهُ اِنْتَهَتْ عِنْدَ قَوْلِهِ : اَلْمَتَاعِ .

4005. (21) [2/1172అపరిశోధితం]

‘ఉమైర్‌ మౌలా అబీల్లహమ్‌ (ర) కథనం: నేను నా యజమానుల వెంట ‘ఖైబర్‌లో పాల్గొన్నాను. అంటే నేను కూడా యుద్ధంలో పాల్గొన్నాను. నా యజమానులు నా గురించి ప్రవక్త (స)తో మాట్లాడారు. నేను వారి బానిసనని ప్రవక్త (స) కు తెలియపరిచారు. ఇది తెలుసుకున్న ప్రవక్త (స) కానుకగా ఏదో ఇవ్వమని ఆదేశించారు. నా మెడలో ఒక కరవాలం వేయడం జరిగింది. అది నా కంటే పొడవైనది. అందువల్ల దాన్ని ఈడ్చుకుంటూ నడిచేవాడిని. అది చూచి ప్రవక్త (స), ‘ఇంట్లో  పనికివచ్చే వస్తువు ఏదైనా ఉంటే ఇచ్చి వేయండి,’ అన్నారు. నేను ఇస్లామ్‌కు ముందు అజ్ఞాన కాలంలో మతిస్థిమితం లేనివారిని, పిచ్చివారిని మంత్రించే వాడిని. ఆ మంత్రాలు, దు’ఆలను ప్రవక్త (స)కు వినిపించాను. వాటిలో కొన్ని సరిగాలేవు. అప్పుడు ప్రవక్త (స) ఈ పదాలను పఠించకు, వీటిని పఠించు అని ఆదేశించారు. (తిర్మిజి’, అబూ  దావూద్‌)

4006- [ 22 ] ( لم تتم دراسته ) (2/1172)

وَعَنْ مُجَمَّعِ بْنِ جَارِيَةَ قَالَ: قُسِمَتْ خَيْبَرُ عَلى أَهْلِ الْحُدَيْبِيَّةِ فَقَسَمَهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ثَمَانِيَةَ عَشْرَ سَهْمًا وَكَانَ الْجَيْشُ أَلْفًا وَخَمْسَمِائَةٍ فِيْهِمْ ثَلَاثُمِائَةِ فَارِسٍ فَأَعْطَى الْفَارِسَ سَهْمَيْنِ وَالرَّاجِلَ سَهْمًا رَوَاهُ أَبُوْ دَاوُدَ وَقَالَ: حَدِيْثُ ابْنِ عُمَرَ أَصَحُّ فَالْعَمَلُ عَلَيْهِ وَأَتَى الْوَهْمُ فِيْ حَدِيْثِ مُجَمَّعٍ أَنَّهُ قَالَ: إِنَّهُ قَالَ: ثَلَاثَمِائَةِ فَارِسٍ وَإِنَّمَا كَانُوْا مِائَتَيْ فَارِسٍ .

4006. (22) [2/1172 అపరిశోధితం]

ముజమ్మ’అ బిన్‌ జారియహ్‌ (ర) కథనం: ‘ఖైబర్‌ యుద్ధధనాన్ని ‘హుదైబియావారిలో పంచటం జరిగింది. ప్రవక్త (స) యుద్ధధనాన్ని 18 వంతులుగా చేసారు. సైన్యం 1500 మంది. వీరిలో 300 మంది గుర్రంపై స్వారీ చేసేవారు. మిగిలిన వారు నడిచేవారు. గుర్రం గలవారికి రెండు వంతులు, కాలి నడక గలవారికి 1 వంతు ఇచ్చారు. [82]  (అబూ  దావూద్‌)

అబూ దావూద్‌ అభిప్రాయం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ ‘హదీసు ప్రామాణికమైనది. చాలామంది పండి తులు దీన్నే సమర్థిస్తున్నారు. ముజమ్మ’అ ‘హదీసు’ లో అనుమానం ఉంది. 200 గుర్రపు స్వారీ లకు బదులు 300 గుర్రపు స్వారీలు అని  పేర్కొన్నారు.

4007 – [ 23 ] ( لم تتم دراسته ) (2/1172)

وَعَنْ حَبِيْبِ بْنِ مَسْلَمَةَ الْفِهْرِيِّ قَالَ شَهِدْتُّ النَّبِيّ صلى الله عليه وسلم نَفَّلَ الرُّبُعَ فِي الْبَدَأةِ وَالثُّلُثَ فِي الرَّجْعَةِ. رَوَاهُ أَبُوْدَاوُدَ.

4007. (23) [2/1172 అపరిశోధితం]

‘హబీబ్‌ బిన్‌ మస్‌లమహ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స). ప్రారంభంలో 1/4వ వంతు ఇవ్వటం, తరువాత 1/3వవంతు ఇవ్వటంచూసాను. [83]  (అబూ  దావూద్‌)

4008 – [ 24 ] ( لم تتم دراسته ) (2/1172)

وَعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يُنَفِّلُ الرُّبُعَ بَعْدَالْخَمُسِ وَالثُّلُثَ بَعْدَ الْخُمُسِ إِذَا قَفَلَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4008. (24) [2/1172 అపరిశోధితం]

‘హబీబ్‌ బిన్‌ మస్‌లమహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) 1/5 వంతు తీసిన తర్వాత 1/4 వంతు ఇచ్చేవారు. తిరుగు ప్రయాణంలో 1/5 వంతు తీసిన తర్వాత 1/3 వంతు ఇచ్చేవారు.[84](అబూ  దావూద్‌)

4009 – [ 25 ] ( لم تتم دراسته ) (2/1172)

وَعَنْ أَبِي الْجُوَيْرِيَةِ الْجَرْمِيِّ قَالَ: أَصَبْتُ بِأَرْضِ الرُّوْمِ جَرَّة حَمَرَاءَ فِيْهَا دَنَانِيْرُ فِيْ إِمْرَةِ مُعَاوِيَةَ وَعَلَيْنَا رَجُلٌ مِنْ أَصْحَابِ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مِنْ بَنِي سُلَيْمٍ يُقَالُ لَهُ :مَعْنُ بْنُ يَزِيْدَ فَأَتَيْتُهُ بِهَا فَقَسَمَهَا بَيْنَ الْمُسْلِمِيْنَ وَأَعْطَانِيْ مِنْهَا مِثْلَ مَا أَعْطَى رَجُلًا مِنْهُمْ ثُمَّ قَالَ: لَوْلَا أَنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا نَفَلَ إِلَّا بَعْدَ الْخُمُس”. لَأَعْطَيْتُكَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4009. (25) [2/1172 అపరిశోధితం]

అబూ జువైరియ జర్మీ కథనం: రూమీల ప్రాంతంలో నాకు ఒక ఎర్రటి కుండ దొరికింది. అందులో అష్రఫీలు ఉన్నాయి. అప్పటి  పాలకులు, ప్రవక్త (స) అనుచరులైన మ’అన్‌బిన్‌ య’జీద్‌ ముందు ఉంచాను. అతను దాన్ని యుద్ధధనంగా పరిగణించి ఇతరులకు ఇచ్చినంతే నాకూ ఇచ్చారు. ఇంకా ”ఒకవేళ  ప్రవక్త(స) ను, ‘1/5 తరువాత ఇవ్వవచ్చు’ అని అనటం విని ఉంటే నేను నీకు తప్పకుండా అధికంగా ఇచ్చి ఉండేవాడిని,” అని అన్నారు.[85] (అబూ దావూద్‌)

4010 – [ 26 ] ( لم تتم دراسته ) (2/1173)

وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ قَالَ: قَدِمْنَا فَوَافَقْنَا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم حِيْنَ افْتَتَحَ خَيْبَرَ فَأَسْهَمَ لَنَا أَوْ قَالَ: فَأَعْطَانَا مِنْهَا وَمَا قَسَمَ لِأَحَدٍ غَابَ عَنْ فَتْحِ خَيْبَرَ مِنْهَا شَيْئًا إِلَّا لِمَنْ شَهِدَ مَعَهُ إِلَّا أَصْحَابَ سَفِيْنَتِنَا جَعْفَرًا وَأَصْحَابَهُ أَسْهَمُ لَهُمْ مَعَهُمْ . رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4010. (26) [2/1173 అపరిశోధితం]

అబూ మూసా అష్‌’అరీ (ర) కథనం: మేము ‘హబ్‌షా నుండి తిరిగి వచ్చి మదీనహ్ చేరాము. అప్పటికి ‘ఖైబర్‌ను జయించడం జరిగింది. ప్రవక్త (స) ‘ఖైబర్‌ యుద్ధధనం నుండి మాకు కూడా వంతు ఇచ్చారు. అయితే మేము యుద్ధంలో పాల్గొనలేదు. మా తప్ప మరే పాల్గొననివారికి వంతు ఇవ్వబడలేదు. కాని పడవ ప్రయాణీకులకు అంటే అందరితో సమానంగా జ’అఫర్‌ అతని మిత్రులకు వంతులు ఇచ్చారు.  [86] (అబూ దావూద్‌)

4011 – [ 27 ] ( لم تتم دراسته ) (2/1173)

وَعَنْ يَزِيْدَ بْنِ خَالِدٍ: أَنَّ رَجُلًا مِّنْ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم تُوَفِّيْ يَوْمَ خَيْبَرَ فَذَكُرُوْا لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “صَلُّوْا عَلَى صَاحِبِكُمْ”. فَتَغَيَّرَتْ وُجُوْهُ النَّاسِ لِذَلِكَ فَقَالَ: “إِنَّ صَاحِبَكُمْ غَلَّ فِيْ سَبِيْلِ اللهِ”. فَفَتَّشَنَا مَتَاعَهُ فَوَجَدْنَا خَرْزًا مِنْ خَرَزِ يَهُوْدَ لَا يُسَاوِيْ دِرْهَمَيْنِ. رَوَاهُ مَالِكٌ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ  .

4011. (27) [2/1173అపరిశోధితం]

య’జీద్‌ బిన్‌ ‘ఖాలిద్‌ (ర) కథనం: ‘ ఖైబర్‌ యుద్ధంలో ఒక అనుచరుడు మరణించాడు. ప్రజలు ప్రవక్త (స)కు ఈ విషయం తెలియపరిచారు. దానికి ప్రవక్త (స), ‘మీ సహచరుని జనా’జ’హ్ నమా’జు చదవండి,’ అని అన్నారు. అది విని అనుచరులు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. అది చూచి ప్రవక్త (స), ‘మీ సహచరుడు దైవమార్గంలో ద్రోహం,దొంగతనం చేసాడు. నేను ఇలాంటి వారి జనా’జహ్ నమా’జు చదవను,’ అని అన్నారు. మేము అతని సామాన్లను పరిశీ లించాము. వాటిలో యూదస్త్రీల లోపలి దుస్తులు ఉన్నాయి. వాటి వెల రెండు దిర్‌హమ్‌ల కంటే అధికం లేదు. (మాలిక్, అబూ దావూద్‌, నసాయి’)

4012 – [ 28 ] ( لم تتم دراسته ) (2/1173)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍوقَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا أَصَابَ غَنِيْمَةً أَمَرَ بِلَالًا فَنَادَى فِي النَّاسِ فَيَجِيْئُوْنَ بِغَنَائِمِهِمْ فَيُخَمِّسُهُ وَيُقْسِمَهُ فَجَاءَ رَجُلٌ يَوْمًا بَعْدَ ذَلِكَ بِزِمَامِ مِّنْ شَعْرٍ. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ هَذَا فِيْمَا كُنَّا أَصَبْنَاهُ مِنَ الْغَنِيْمَةَ. قَالَ: “أَسَمِعْتَ بِلَالًا نَادَى ثَلَاثًا؟” قَالَ: نَعَمْ قَالَ: “فَمَا مَنَعَكَ أَنْ تَجِيْءَ بِهِ؟” فَاعْتَذَرَ قَالَ: “كُنْ أَنْتَ تَجِيْءُ بِهِ يَوْمَ الْقِيَامَةِ فَلَنْ أَقْبَلَهُ عَنْكَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4012. (28) [2/1173 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: సాధారణంగా ప్రవక్త (స) యుద్ధంలో యుద్ధధనం లభిస్తే బిలాల్‌ను సైన్యంలో ఎవరి వద్దనైనా యుద్ధధనంలో నుండి ఏదైనా ఉంటే చేరవేయమని ప్రకటించమని ఆదేశించేవారు. ఉన్న వారందరూ తెచ్చి ఇచ్చేవారు. ప్రవక్త (స) 1/5 వంతు తీసి మిగిలింది అందరికీ పంచేవారు. ఒకసారి ప్రవక్త (స) పంచి వేసిన తర్వాత ఒక వ్యక్తి కళ్ళెం తీసుకొని వచ్చి, ‘ప్రవక్తా! ఇది యుద్ధధనం నుండి తీసుకున్నాను,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు, బిలాల్‌ 3 సార్లు ప్రకటించింది, విన్నావా?’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘విన్నాను,’ అని అన్నాడు. ‘అప్పుడు ఎందుకు తీసుకురాలేదు,’ అని అడిగారు. ఏదో సాకు చెప్పాడు. ‘ఇలాగే తీర్పుదినం నాడు దీన్ని తీసుకువస్తావు,’ అని అన్నారు. (అబూ  దావూద్‌)

4013 – [ 29 ] ( لم تتم دراسته ) (2/1173)

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَأَبَا بَكْرٍ وَعُمَرَ حَرَّقُوْا مَتَاعَ الْغَالِّ وَضَرَبُوْهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4013. (29) [2/1173అపరిశోధితం]

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ తన తండ్రి ద్వారా, అతడు తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) మరియు అబూ బకర్‌ మరియు ‘ఉమర్‌ దొంగతనం చేసిన వారిని కొట్టే వారు, వారి వస్తువులను కాల్చివేసే వారు. [87] (అబూ  దావూద్‌)

4014 – [ 30 ] ( لم تتم دراسته ) (2/1173)

وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ يَكْتُم غَالًّا فَإِنَّهُ مِثْلُهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4014. (30) [2/1173అపరిశోధితం]

సమురహ్‌ బిన్‌ జున్‌దుబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ద్రోహం చేసిన వారి ద్రోహాన్ని కప్పిపుచ్చటం ద్రోహం  చేసినట్లే.”  (అబూ  దావూద్‌)

4015 – [ 31 ] ( لم تتم دراسته ) (2/1174)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ شِرَي الْمَغَانِمِ حَتّى تُقْسَمَ. رَوَاهُ التِّرْمِذِيُّ .

4015. (31) [2/1174అపరిశోధితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) యుద్ధ ధనాన్ని పంచకముందే దాన్ని అమ్మటాన్ని నిషేధించారు. [88]  (తిర్మిజి’)

4016 – [ 32 ] ( لم تتم دراسته ) (2/1174)

وَعَنْ أَبِيْ أُمَامَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم: نَهَى أَنْ تُبَاعَ السِّهَامُ حَتّى تُقْسَمَ. رَوَاهُ الدَّارَمِيُّ .

4016. (32) [2/1174 అపరిశోధితం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) యుద్ధ ధనం పంచబడనంతవరకు వంతును అమ్మటాన్ని నిషేధించారు.  (దార్మి)

4017 – [ 33 ] ( لم تتم دراسته ) (2/1174)

وَعَنْ خَوْلَةَ بِنْتِ قَيْسٍ: قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ هَذِهِ الْمَالَ خَضِرَةٌ حُلْوَةٌ فَمَنْ أَصَابَهُ بِحَقِّهِ بُوْرِكَ لَهُ فِيْهِ وَرُبَّ مُتَخَوِّضٍ فَمَا شَاءَتْ بِهِ نَفْسُهُ مِنْ مَّالٍ اللهِ وَرَسُوْلِهِ لَيْسَ لَهُ يَوْمَ الْقِيَامَةِ إِلَّا النَّارُ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

4017. (33) [2/1174 అపరిశోధితం]

‘ఖౌలహ్ బిన్‌తె ఖైస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఈ ధనం పచ్చగా, తియ్యగా ఉంటుంది. అంటే హృదయాన్ని ఆకర్షిస్తుంది. ధర్మంగా దొరికిన వారికి శుభం కలుగుతుంది. అయితే చాలా మంది అల్లాహ్‌ (త) మరియు ఆయన ప్రవక్త (స) ధనంలో అనవసరంగా, అధర్మంగా ఖర్చుచేస్తూ ఉంటారు. ఇటువంటి వారికి తీర్పుదినం నాడు నరకాగ్ని ఉంది. [89]  (తిర్మిజి’)

4018 – [ 34 ] ( لم تتم دراسته ) (2/1174)

وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم تَنَفَّلَ سَيْفَهُ ذَا الْفَقَارِ يَوْمَ بَدْرٍ. رَوَاهُ أَحْمَدُ وَابْنُ مَاجَهُ

وَزَادَ التِّرْمِذِيُّ وَهُوَ الَّذِيْ رَأَى فِيْهِ الرُّؤْيَا يَوْمَ أُحُدٍ .

4018. (34) [2/1174అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) బద్ర్‌ యుద్ధంలో తన నిర్ణీతవంతు కంటే అదనంగా ఒక కరవాలం తీసుకున్నారు. దాని పేరు జు’ల్‌ ఫఖ్ఖార్‌. (ఇబ్నె మాజహ్, తిర్మిజి’)

తిర్మిజీ’లో ఇలా ఉంది: ”ఆ తరువాత ప్రవక్త (స) కల గన్నారు. బద్ర్‌ యుద్ధంలో మమ్‌బహ్ బిన్‌ ‘హజ్జాజ్‌ హతమార్చబడ్డాడు. ఈ కరవాలం అతనిదే. ఇది చాలా ప్రఖ్యాత కరవాలం. ప్రవక్త (స) ముందు తాను దాన్ని ఉంచుకున్నారు. తరువాత ‘అలీ (ర) కు ఇచ్చివేసారు. ఈ కరవాలాన్ని జు’ల్ఫఖ్ఖార్ అని ఎందుకంటారంటే, దీని పిడికిలిలో  పొదుగులు  ఉండేవి.

4019 – [ 35 ] ( لم تتم دراسته ) (2/1174)

وَعَنْ رُوَيْفِعِ بْنِ ثَابِتٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِفَلَا يَرْكَبْ دَابَّةً مِنْ فيءِ الْمُسْلِمِيْنَ حَتّى إِذَا أَعْجَفَهَا رَدهَا فِيْهِ وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِفَلَا يَلْبَسْ ثَوْبًا مِنْ فَيْءِ الْمُسْلِمِيْنَ حَتّى إِذَا أَخْلَقَهُ رَدّهَا فِيْهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4019. (35) [2/1174 అపరిశోధితం]

రువైఫి’అ బిన్‌ సా’బిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌(త)ను, తీర్పుదినాన్ని విశ్వసించే వ్యక్తి ముస్లిముల యుద్ధధనంలోని జంతువులపై పంచక ముందు అనవసరంగా కూర్చోరాదు. దానిపై కూర్చుంటూ అది బక్క చిక్కినదైన తర్వాత మళ్ళీ తెచ్చి యుద్ధధనంలో కలపరాదు. అదేవిధంగా అల్లాహ్‌(త)నూ, తీర్పుదినాన్ని విశ్వసించే వ్యక్తి ముస్లిముల యుద్ధధనంలోని దుస్తులను ధరించరాదు. ధరించి, చించి తిరిగి తీసుకురావటం సరికాదు. [90] (అబూ  దావూద్‌)

4020 – [ 36 ] ( لم تتم دراسته ) (2/1174)

وَعَنْ مُحَمَّدِ بْنِ أَبِي الْمُجَالِدِ عَنْ عَبْدِ اللهِ بْنِ أَبِيْ أَوْفَى قَالَ: قُلْتُ: هَلْ كُنْتُمْ تُخَمِّسُوْنَ الطَّعَامَ فِيْ عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم؟ قَالَ: أَصَبْنَا طَعَامًا يَوْمَ خَيْبَرَ فَكَانَ الرَّجُلُ يَجِيْءُ فَيَأْخُذُ مِنْهُ مِقْدَارَ مَا يَكْفِيْهِ ثُمَّ يَنْصَرِفُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4020. (36) [2/1174 అపరిశోధితం]

ము’హమ్మద్‌ బిన్‌ అబిల్‌ ముజాలిద్‌ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అబీ ‘అవ్ఫా (ర) ద్వారా కథనం: నేను, ‘మీరు ప్రవక్త (స) కాలంలో ఆహార వస్తువుల్లో 1/5 వంతు తీసేవారా?’ అని అడిగాను. దానికి అతను ‘ఖైబర్‌ యుద్ధంలో మాకు తినే వస్తువులు దొరికాయి. ఎవరికి ఎంత అవసరం ఉంటే అంత తీసుకొని వెళ్ళేవారు. (అబూ  దావూద్‌)

అంటే తినే వస్తువుల్లో 1/5 వంతు తీసేవారు కాదు.

4021 – [ 37 ] ( لم تتم دراسته ) (2/1175)

وَعَنِ ابْنِ عُمَرَ: أَنَّ جَيْشًا غَنِمُوْا فِيْ زَمَنِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم طَعَامًا وَعَسَلًا فَلَمْ يُؤْخَذْ مِنْهُمُ الْخُمُسُ.رَوَاهُ أَبُوْ دَاوُدَ

4021. (37) [2/1175 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో ముజాహిదీన్లకు యుద్ధధనంగా అన్నం, తేనె లభించేది. అందులో నుండి 1/5 వంతు తీయబడేది కాదు. (అబూ  దావూద్‌)

4022- [ 38 ] ( لم تتم دراسته ) (2/1175)

وَعَنِ الْقَاسِمِ مَوْلَى عَبْدِ الرَّحْمَنِ عَنْ بَعْضِ أَصْحَابِ النَّبِيّ صلى الله عليه وسلم قَالَ: كُنَّا نَأْكُلُ الْجَزُوْرَ فِي الْغَزْوِ وَلَا نُقْسِمُهُ حَتّى إِذَا كُنَّا لَنَرْجِعُ إِلى رَحَالِنَا وَأَخْرِجَتُنَا مِنْهُ مَمْلُوْءَةٌ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4022. (38) [2/1175 అపరిశోధితం]

ఖాసిమ్‌  ‘అబ్దుర్ర’హ్మాన్‌ బానిస, కొందరు ప్రవక్త (స) అనుచరుల ద్వారా కథనం: యుద్ధాల్లో మేము ఒంటె లను జి’బహ్‌ చేసి తినేవారము. పంచేవారం కాము. అంటే యుద్ధధనం ఒంటెలనుండి ఆకలికి తట్టు కోలేక నిస్సహాయ స్థితిలో నాయకుని అనుమతితో జి’బహ్‌ చేసి తినేవారం. అంటే పంచకముందు ఇది జరిగేది. మేము మా ఇళ్ళకు తిరిగి వచ్చినపుడు సంచులు మాంసంతో నిండి  ఉండేవి. (అబూ  దావూద్‌)

4023 – [ 39 ] ( لم تتم دراسته ) (2/1175)

وَعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَقُوْلُ: “أدُّوا الْخِيَاطَ وَالْمِخْيَطَ وَإِيَّاكُمْ وَالْغُلُوْلَ فَإِنَّهُ عَارَ عَلَى أَهْلِهِ يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ الدَّارَمِيُّ .

4023. (39) [2/1175 అపరిశోధితం]

‘ఉబాదహ్‌ బిన్‌ ‘సామిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించేవారు, ”యుద్ధధనంగా సూది లేదా దారం దొరికినా దాన్ని కూడా తెచ్చి ఉంచండి. ద్రోహానికి దొంగతనానికి దూరంగా ఉండండి. ఎందు కంటే తీర్పుదినంనాడు దొంగతనం చేసినవాడు నీచ అవమానానికి, పరాభవానికి గురవుతాడు. అతడు సూది, దారాలను తీసుకొని తీర్పు మైదానంలో తిరుగుతూ ఉంటాడు. ప్రజలు చూచి, ఇహలోకంలో సూదీ దారాల దొంగ అని గ్రహిస్తారు. ఇంత కంటే నీచమైన అవమానం మరేముంటుంది. (దార్మీ)

4024 – [ 40 ] ( لم تتم دراسته ) (2/1175)

وَرَوَاهُ النَّسَائِيُّ عَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ

4024. (40) [2/1175 అపరిశోధితం]

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ తన తండ్రి, తాతల ద్వారా కథనం. (నసాయి)

4025 – [ 41 ] ( لم تتم دراسته ) (2/1175)

وَعَنْ عَمْرِوبْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: دَنَا النَّبِيُّ صلى الله عليه وسلم مِنْ بَعِيْرٍ فَأَخَذَ وَبَرَةً مِنْ سَنَامِهِ ثُمَّ قَالَ: يَا أَيُّهَا النَّاُس إِنَّهُ لَيْسَ لِيْ مِنْ هَذَا الْفَيْءِ شَيْءٌ وَلَا هَذَا وَرَفَعَ أَصْبَعَهُ إِلَّا الْخُمَسَ وَالْخُمُسُ مَرْدُوْدٌ عَلَيْكُمْ فَأَدُّوا الْخِيَاطَ وَالْمِخْيَطَ”. فَقَامَ رَجُلٌ فِيْ يَدِهِ كُبَّةٌ شَعْرٍ فَقَالَ: أَخَذْتُ هَذِهِ لِأُصْلِحَ بِهَا بَرْدَعَةً فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “أَمَّا مَا كَانَ لِيْ وَلِبَنِيْ عَبْدِ الْمُطَّلِبِ فَهُوَ لَكَ”. فَقَالَ: أَمَّا إِذَا بَلَغَتْ مَا أَرَى فَلَا أَرَبَ لِيْ فِيْهَا وَنبَذَهَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4025. (41) [2/1175 అపరిశోధితం]

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ తన తండ్రి తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) ఒక ఒంటెవద్ద నిలబడ్డారు. ఒంటె కుహరంపై నుండి కొన్ని వెంట్రుకలు తీసుకొని ఇలా ప్రవచించారు, ”ప్రజలారా! ఈ యుద్ధధనం నుండి ఏమాత్రం తీసుకోవడం కూడా నాకు ధర్మసమ్మతం కాదు. ఇంకా తన వేలును ఎత్తి ఈ మాత్రం కూడా కాదు. కాని 1/5వ వంతుకూడా, ఇది కూడా మీలో పంచటం జరుగుతుంది. అందువల్ల యుద్ధధనానికి చెందిన ప్రతీది తెచ్చి ఇక్కడ పెట్టండి. చివరికి సూది, దారం కూడా,” అని అన్నారు. అది విన్న ఒక వ్యక్తి నిలబడ్డాడు. అతని చేతిలో వెంట్రుకల త్రాడు ఉంది. ఆ వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! దీన్ని అవసరానికి తీసు కున్నాను,’ అని అన్నాడు. దానికి ప్రవక్త(స), ‘ఈ త్రాడులో నా వంతు, బనీ అబ్దుల్‌ ము’త్తలిబ్‌ వంతు ఉన్నాయి, అదంతా నీదే, నేను నిన్ను క్షమిస్తున్నాను. అది తప్ప అందులో మిగిలిన వారి వంతు ఉంది. దానికి నేను బాధ్యుణ్ని కాను.’ అది విని ఆ వ్యక్తి, ‘దీనికి ఇంత గొప్ప ప్రాముఖ్యత ఉంటే నాకక్కర లేదు,’ అని పారవేసాడు.” (అబూ దావూద్‌)

4026 – [ 42 ] ( لم تتم دراسته ) (2/1175)

وَعَنْ عَمْرِو بْنِ عَبَسَةَ قَالَ: صَلّى بِنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلى بَعِيْرٍ مِنَ الْمُغْنَمِ فَلَمَّا سَلَّمَ أَخَذَ وَبَرَةً مِنْ جَنَبِ الْبَعِيْرِ ثُمَّ قَالَ: “وَلَا يَحِلُّ لِيْ مِنْ غَنَائِمِكُمْ مِثْلُ هَذَا إِلَّا الْخُمَسَ وَالْخُمَسُ مَرْدُوْدٌ فِيْكُمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4026. (42) [2/1175 అపరిశోధితం]

‘అమ్ర్‌ బిన్‌ ‘అబస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మాకు నమా’జ్‌ చదివించారు. ఆ తరువాత యుద్ధధనంలోని ఒక ఒంటె ప్రక్కన నిలబడి దాని కొన్ని వెంట్రుకలు చేతిలోకి తీసుకొని ఈ మాత్రమైనా మీ యుద్ధధనం నా కోసం ధర్మసమ్మతం కాదు. అయితే 1/5వ వంతు తప్ప. అయితే 1/5వ వంతు కూడా మీకే తిరిగి ఇవ్వడం జరుగుతుంది. (అబూ  దావూద్‌)

4027 – [ 43 ] ( لم تتم دراسته ) (2/1175)

وَعَنْ جُبَيْرِ بْنِ مُطْعِمٍ قَالَ: لَمَّا قَسَمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم سَهْمَ ذَوِي الْقُرْبَى بَيْنَ بَنِيْ هَاشِمٍ وَبَنِيْ الْمُطَّلَبٍ أَتَيْتُهُ أَنَا وَعُثْمَانُ بْنُ عَفَانَ فَقُلْنَا: يَا رَسُوْلَ اللهِ هَؤُلَاءِ إِخْوَانَنَا مِنْ بَنِي هَاشِمٍ لَا نُنْكِرُ فَضْلَهُمْ لِمَكَانِكَ الَّذِيْ وَضَعَكَ اللهُ مِنْهُمْ أَرَأَيْتَ إِخْوَانَنَا مِنْ بَنِي الْمُطَّلِبِ أَعْطَيْتَهُمْ وَتَرَكْتَنَا وَإِنَّمَا قَرَابَتُنَا وَقَرَابَتُهُمْ وَاحِدَةٌ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّمَا بَنُو هَاشِمٍ وَبَنُو الْمُطَّلِبِ شَيْءٌ وَاحِدٌ هَكَذَا”. وَشَبَّكَ بَيْنَ أَصَابِعِهِ.

رَوَاهُ الشَّافِعِيُّ.

وَفِيْ رِوَايَةٍ أَبِيْ دَاوُدَ وَالنَّسَائِيُّ نَحْوَهُ وَفِيْهِ: “إِنَّا وَبَنُو الْمُطَّلِبِ لَا نَفْتَرِقُ فِيْ جَاهِلِيَّةِ وَلَا إِسْلَامٍ وَإِنَّمَا نَحْنُ وَهُمْ شَيْءٌ وَاحِدٌ”. وَشَبَّكَ بَيْنَ أَصَابِعِهِ.

4027. (43) [2/1175అపరిశోధితం]

జుబైర్‌ బిన్‌ ముత్‌’యిమ్‌ (ర) కథనం: ప్రవక్త(స) దగ్గరి బంధువుల వంతులు కూడా బనీ హాషిమ్‌, బనీ ము’త్తలిబ్‌లకు పంచిపెట్టారు. అప్పుడు నేను, ‘ఉస్మాన్‌ బిన్‌ అప్ఫాన్‌ (ర) ప్రవక్త (స) వద్దకు వెళ్ళి, ‘ఓ ప్రవక్తా! మేము మా సోదరులు బనీ హాషిమ్‌ల స్థానాన్ని వ్యతిరే కించటం లేదు. కాని తమరు బంధువు వంతులను కూడా వారిలోనే పంచి పెట్టారు. మాది, వారిది బంధుత్వం సమానమే,’ అని అన్నారు. దానికి ప్రవక్త(స), ‘అవును బనీ హాషిమ్‌ మరియు బనూ ము’త్తలిబ్‌ ఇద్దరూ సమానులే అని పలికి ఒక చేతి వ్రేళ్ళను మరో చేతి వేళ్ళతో కలిపి, ‘ఇదేవిధంగా అజ్ఞాన కాలంలో కలసి ఉండేవారు,’ అని అన్నారు. మరో ఉల్లేఖనంలో ”మేమూ, బనీ ము’త్తలిబ్‌ అజ్ఞాన కాలంలోనూ వేరు కాలేదు. ఇస్లామ్‌లోనూ వేరు కాలేదు. మేమంతా ఒక్కటే,” అని అన్నారు. (అబూ దావూద్‌, నసాయి’, షాఫ’యీ)

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం 

4028 – [ 44 ] ( متفق عليه ) (2/1176)

عَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ عَوْفٍ قَالَ: إِنِّيْ وَاقِفٌ فِي الصَّفِّ يَوْمَ بَدْرٍ فَنَظَرْتُ عَنْ يَمِيْنِيْ وَعَنْ شِمَالِيْ فَإِذَا بِغُلًامَيْنِ مِنَ الْأَنْصَارِ حَدِيْثَةٍ أَسْنَانُهَا فَتَمَنَّيْتُ أَنْ أَكُوْنَ بَيْنَ أَضْلَعَ مِنْهُمَا فَغَمَزَنِيْ أَحَدُهُمَا فَقَالَ: يَا عَمِّ هَلْ تَعْرِفُ أَبَا جَهْلٍ؟ قُلْتُ: نَعَمْ فَمَا حَاجَتُكَ إِلَيْهِ يَا ابْنَ أَخِيْ؟ قَالَ: أخْبِرْتُ أَنَّهُ يَسُبُّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَئِنْ رَأَيْتُهُ لَا يُفَارِقُ سَوَادِيْ سَوَادَهُ حَتَّى يَمُوْتَ الْأَعْجَلُ مِنَّا فَتَعَجَّبْتُ لِذَلِكَ. قَالَ: وَغَمَزَنِي الْآخَرُ فَقَالَ لِيْ مِثْلَهَا فَلَمْ أَنْشَبُ أَنْ نَظَرْتُ إِلَى أَبِيْ جَهْلٍ يَجُوْلُ فِي النَّاسِ فَقُلْتُ: أَلَا تَرَيَانِ؟ هَذَا صَاحِبُكُمَا الَّذِيْ تَسْأَلَانِيْ عَنْهُ قَالَ: فَابْتَدَرَاهُ بِسَيْفَيْهِمَا فَضَرَبَاهُ حَتّى قَتَلَاهُ ثُمَّ انْصَرَفَا إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَأَخْبَرَاهُ. فَقَالَ: “أَيُّكُمَا قَتَلَهُ؟” فَقَالَ كُلُّ وَاحِدٍ مِنْهُمَا: أَنَا قَتَلْتُهُ فَقَالَ: “هَلْ مَسَحْتُمَا سَيْفَيْكُمَا؟” فَقَالَا: لَا. فَنَظَرَ رَسُوْلُ اللهِ صلىالله عليه وسلم إِلَى السَّيْفَيْنِ فَقَالَ: “كِلَاكُمَا قَتَلَهُ”. وَقَضَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِسَلَبِهِ لِمُعَاذِ بْنِ عَمْرِو بْنِ الْجَمُوْحِ وَالرَّجُلَانِ: مُعَاذُ بْنُ عَمْرِو بْنِ الْجَمُوْحِ وَمُعَاذُ بْنُ عَفْرَاءَ.

4028. (44) [2/1176ఏకీభవితం]

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ (ర) కథనం: బద్ర్‌ నాడు నేను పంక్తిలో నిలబడి ఉన్నాను. నేను కుడిప్రక్క, ఎడమ ప్రక్కకు చూసాను. ఇద్దరు అ’న్సారీ యువకులు నిలబడి ఉన్నారు. మీ రెవరని నేను వారిని అడిగాను. ఆ యిద్దరూ అ’న్సారీ యువకులని తెలిసింది. అప్పుడు నేను, ‘ఇద్దరు వీరుల మధ్య ఉంటే బాగుండేది, ఈ ఇద్దరూ అనుభవం లేనివారు,’ అని అనుకున్నాను. ఇంతలో ఆ ఇద్దరిలో ఒకరు, ‘చిన్నాన్నగారూ అబూ జహల్ ఎవరో మీకు తెలుసా?’ అని అడిగారు. నేను, ‘అవును, కాని అతనితో మీకేంపని,’ అని అడిగాను. దానికి ఆ యువకుడు, ‘వాడు ప్రవక్త (స)ను తిడు తున్నాడు. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ అల్లాహ్ (త) సాక్షి! ఒకవేళ నేను వాడిని చూస్తే నాశరరం వాడి శరీరంతో వేరుకాదు. చివరికి ఎవరి మరణం సంభవించినా సరే,’ అంటే అతడైనా, నేనైనా చావ వలసిందే అని అన్నాడు. అది విని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతలో మరో యువకుడు కూడా ఇలాగే అన్నాడు. అతనికి కూడా నేను అదే సమాధానం ఇచ్చాను.

అదే సమయంలో అబూ జహల్‌ ప్రజలమధ్య అటూ ఇటూ తిరుగుతున్నాడు. నేను వారిద్దరితో, ‘మీ రిప్పుడు ఎవరి గురించి అడిగారో ఆ వ్యక్తి అక్కడ తిరుగాడుతున్నాడు చూడండి,’ అని అన్నాను. అది వినగానే ఆ యిద్దరు యువకులు తమ కరవాలాలు తీసుకొని వాడిపై దాడిచేసి వాడినిచంపి క్రింద పడేసారు. ఆ తరువాత ప్రవక్త (స) వద్దకు తిరిగి వచ్చి జరిగినదంతా చెప్పారు. ప్రవక్త (స), ‘మీ ఇద్దరిలో ఎవరు వాడినిచంపారు,’ అనిఅడిగారు. ప్రతి ఒక్కరూ, ‘నేను,’ అని సమాధానం ఇచ్చారు. అప్పుడు ప్రవక్త (స), ‘మీరిద్దరూ మీ కరవాలాలను తుడుచు కున్నారా?’ అని అడిగారు. దానికి వారు, ‘లేదు,’ అని సమాధానం ఇచ్చారు. ప్రవక్త (స) వారిద్దరి కరవాలాలు చూచి, ‘అవును మీరిద్దరూ చంపారు,’ అని అన్నారు. ప్రవక్త (స) అబూ జహల్‌ సామాన్లను, మ’ఆజ్‌ బిన్‌ ‘అమ్ర్‌ బిన్‌ జమూహ్‌, మ’ఆజ్‌ బిన్‌ అఫ్రాలకు ఇప్పించారు. [91]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4029 – [ 45 ] ( متفق عليه ) (2/1177)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَوْمَ بَدْرٍ: “مَنْ يَنْظُرُلَنَا مَا صَنَعَ أَبُوْ جَهْلٍ؟” فَانْطَلَقَ ابْنُ مَسْعُوْدٍ فَوَجَدَهُ قَدْ ضَرَبَهُ ابْنَا عَفْرَاءَ حَتّى بَرَدَ قَالَ: فَأَخَذَ بِلَحْيَتِهِ فَقَالَ: أَنْتَ أَبُوْجَهْلٍ فَقَالَ: وَهَلْ فَوْقَ رَجُلٍ قَتَلْتُمُوْهُ.

وَفِيْ رِوَايَةٍ: قَالَ: فَلَوْ غَيْرَ أَكَارَ قَتَلَنِيْ .

4029. (45) [2/1177 ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: బద్ర్‌ యుద్ధం నాడు ప్రవక్త (స) ”ఎవరైనా అబూ జహల్‌ చచ్చాడా, బ్రతికి ఉన్నాడా చూచిరండని పంపారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ చూడటానికి వెళ్ళారు. అక్కడ ‘అఫ్‌రాఅ’ ఇద్దరు కుమారులు వాడిని పడవేసి ఉండటం చూచి, అబూ జహల్‌ గడ్డం పట్టుకొని, ‘నువ్వేనా అబూ జహల్‌వి,’ అని అన్నారు. అప్పుడు అబూ జహల్‌ మరణావస్థలో ఉన్నాడు. మరణిస్తూ, ‘తన జాతివారే చంపినవాడి కంటే గొప్పవాడు ఎవడు కాగలడు.’ అంటే ఖురైష్‌లో అందరికంటే నేనే గొప్పవాడిని అని అన్నాడు.” 

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ‘జమిందారులు, రైతులను వదలి మరొకరు ఎవరైనా నన్ను చంపితే బాగుండేది,’ అని అన్నాడు. అంటే అ’న్సారులు కాక ముహాజిర్లు చంపితే బాగుండేది ఎందుకంటే అ’న్సారులు వ్యవసాయం చేసేవారు. రైతులను ఖురైషీ జమిందారులు నీచంగా భావించేవారు. ”ఖురైషుల్లో ఎవరైనా నన్ను చంపితే బాగుండేది,” అని అన్నాడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4030 – [ 46 ] ( متفق عليه ) (2/1177)

وَعَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ قَالَ: أَعْطَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم رَهْطًا وَأَنَا جَالِسٌ فَتَرَكَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنْهُمْ رَجُلًا وَهُوَ أَعْجَبُهُمْ إِلَيَّ فَقُمْتُ فَقُلْتُ: مَا لَكَ عَنْ فُلَانٍ؟ وَاللهِ إِنِّيْ لَأَرَاهُ مُؤْمِنًا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَوْ مُسْلِمًا”. ذَكَرَ سَعْدٌ ثَلَاثًا وَأَجَابَهُ بِمِثْلِ ذَلِكَ ثُمَّ قَالَ: “إِنِّيْ لَأُعْطِي الرَّجُلَ وَغَيْرُهُ أَحَبُّ إِلَيَّ مِنْهُ خَشْيَةَ أَنْ يُكَبَّ فِي النَّارِ عَلى وَجْهِهِ”. مُتَّفَقٌ عَلَيْهِ .

وَفِيْ رِوَايَةٍ لَهُمَا: قَالَ الزُّهْرِيُّ: فَتَرَى: أَنَّ الْإِسْلَامَ الْكَلِمَةُ وَالْإِيْمَانَ الْعَمَلُ الصَّالِحُ .

4030. (46) [2/1177ఏకీభవితం]

స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్ద కూర్చొని ఉన్నాను. యుద్ధధనంలో నుండి ప్రజలకు ఇచ్చారు. ఒక వ్యక్తికి మాత్రం ఇవ్వలేదు. అయితే అతడు నా దృష్టిలో అందరికంటే ఎక్కువ హక్కు గలవాడు. అప్పుడు నేను ప్రవక్త (స)తో, ‘ఓ ప్రవక్తా! తమరు అందరికీ ఇచ్చారు, కాని ఆ వ్యక్తికి ఇవ్వలేదు. అయితే అతడు ముస్లిము, హక్కుగల వాడు,’ అని నా ఉద్దేశ్యం,” అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స) ముస్లిమ్‌ అను, ఇలా మూడుసార్లు జరిగింది. ఆ తరువాత ప్రవక్త (స) స’అద్‌! నేను వారిని ప్రోత్సాహకాలుగా ఇస్తున్నాను. విశ్వాస దృఢత్వానికి ఇస్తున్నాను. లేకపోతే వారు చతికిల నరకంలో వేయబడతారనే భయంతో ఇస్తున్నాను అన్నారు. [92]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4031 – [ 47 ] ( لم تتم دراسته ) (2/1177)

وَعَنِ ابْنِ عُمَرَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَامَ يَعْنِي يَوْمَ بَدْرٍ فَقَالَ: “إِنَّ عُثْمَانَ اِنْطَلَقَ فِيْ حَاجَةِ اللهِ وَحَاجَةِ رَسُوْلِهِ وَإِنِّيْ أُبَايِعُ لَهُ”. فَضَرَبَ لَهُ رَسُوْلُ اللهِ بِسَهْمٍ وَلَمْ يَضْرِبْ بِشَيْءٍ لِأَحَدٍ غَابَ غَيْرَهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ

4031. (47) [2/1177 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: బద్ర్‌ యుద్ధంలో ప్రవక్త (స) నిలబడి, ‘ఉస్మాన్‌, అల్లాహ్‌ (త), ఆయన ప్రవక్త (స) పనిమీద వెళ్ళారు, నేను అతని తరఫున బై’అత్‌ చేస్తున్నాను అని పలికి, ప్రవక్త (స) ‘ఉస్మాన్‌ వంతు ఇచ్చారు. ఇతరు లెవ్వరికీ పరోక్షంగా వంతు ఇవ్వలేదు.[93] (అబూ దావూద్‌)

4032 – [ 48 ] ( لم تتم دراسته ) (2/1177)

وَعَنْ رَافِعِ بْنِ خَدِيْجٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَجْعَلُ فِيْ قَسْمِ الْمَغَانِمِ عَشْرًا مِّنَ الشَّاءِ بِبَعِيْرٍ. رَوَاهُ النَّسَائِيُّ .

4032. (48) [2/1177 అపరిశోధితం]

రాఫె’అ బిన్ ‘ఖదీజ్ (ర)కథనం: ప్రవక్త(స) పశువుల పంపకంలో పదిమేకలను ఒకఒంటెకు సమానంగా నిర్ణయించేవారు . [94](నసాయీ’)  

4033 – [ 49 ] ( متفق عليه ) (2/1177)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “غَزَا نَبِيٌّ مِّنَ الْأَنْبِيَاءِ فَقَالَ لِقَوْمِهِ: لَا يَتَّبِعُنِيْ رَجُلٌ مَلَكَ بُضْعَ امْرَأَةٍ وَهُوَ يُرِيْدُ أَنْ يَبْنِيَ بِهَا وَلَمَّا يَبْنَ بِهَا وَلَا أَحَدٌ بَنَى بُيُوْتًا وَلَمْ يَرْفَعْ سُقُوْفَهَا وَلَا رَجُلٌ اِشْتَرَى غَنَمًا أَوْ خَلِفَاتٍ وَهُوَ يَنْتَظِرُ وَلَادَهَا فَغَزَا فَدَنَا مِنَ الْقَرْيَةِ صَلَاةَ الْعَصْرِ أَوْ قَرِيْبًا مِنَ ذَلِكَ. فَقَالَ لِلشَّمْسِ: إِنَّكَ مَأْمُوْرَةٌ وَأَنَا مَأْمُوْرٌ اللّهُمَّ احْبِسْهَا عَلَيْنَا فَحُبِسَتْ حَتّى فَتَحَ اللهُ عَلَيْهِ فَجَمَعَ الْغَنَائِمَ فَجَاءَتْ يَعِنِي النَّارُ لِتَأْكُلَهَا فَلَمْ تَطْعَمْهَا فَقَالَ: إِنَّ فِيْكُمْ غُلُوْلًا فَلْيُبَا يِعْنِيْ مِنْ كُلِّ قَبِيْلَةٍ رَجُلٌ فَلَزِقَتْ يَدُ رَجُلٍ بِيَدِهِ فَقَالَ: فِيْكُمُ الْغُلُوْلُ فَجَاؤُوْا بِرَأسِ مِثْلَ رَأْسِ بَقَرَةٍ مِنْ الذَّهْبِ فَوَضَعَهَا فَجَاءَتِ النَّارُ فَأَكَلَتْهَا”.

زَادَ فِيْ رِوَايَةٍ: “فَلَمْ تَحِلَّ الْغَنَائِمَ لِأَحَدٍ قَبْلَنَا ثُمَّ أَحَلَّ اللهُ لَنَا الْغَنَائِمَ رَأَى ضَعْفَنَا وَعِجْزَنَا فَأَحَلَّهَا لَنَا”.

4033. (49) [2/1177 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”పూర్వం ప్రవక్తల్లో ఒకరు యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు ఆ ప్రవక్త, నావెంట మూడురకాల వ్యక్తులు రాకూడదు అన్నారు. 1. పెళ్ళి చేసుకొని, ఇంకా తన ఇంటికి తీసుకు రాలేదు, ఇంకా ఆమెతో సంభోగం చేయలేదు. ఇటువంటి వ్యక్తి నాతో రాకూడదు. 2. తన ఇంటి గోడలు నిర్మించి ఇంకా పైకప్పువేయని వాడు అంటే ఇంకా ఇల్లు పూర్తిగా నిర్మించని వాడు. 3. గర్భంతో ఉన్న ఆవు, మేక కొని, ఇంకా అవి బిడ్డను ఇవ్వక, అతడు వేచి ఉన్నవాడు. మిగిలిన వారందరినీ తీసుకొని యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం చేస్తూ అసర్‌ సమయం అయిపోయింది. ప్రాచీన కాలంలో సూర్యాస్తమయం అవగానే యుద్ధం ఆగి పోయేది. ఆయన సూర్యునితో, ‘ఓ అస్తమించే సూర్యుడా! నీకు అస్తమించమని దైవం ఆదేశించాడు. నాకు కూడా ఈ పట్టణాన్ని జయించమని ఆదేశ మివ్వబడింది.’ ‘ఓ అల్లాహ్‌! ఈ సూర్యుణ్ణి అస్తమించ కుండా విజయం పొందేవరకు ఆపు,’ అని ప్రార్థించారు. సూర్యుడు ఆగిపోయాడు. అల్లాహ్‌ (త) విజయం ప్రసాదించాడు. యుద్ధధనాన్నంతా ఒకచోట ఉంచారు. అగ్ని హరించటానికి వచ్చింది కాని, హరించలేదు. అప్పుడు ఆ ప్రవక్త మీలో ఎవరో దొంగతనం చేసారు. కనుక ప్రతి వర్గానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి నా చేతిపై బై’అత్‌ చేయండి,’ అని ఆదేశించారు. బై’అత్‌ ప్రారంభ మయింది. ఒక వ్యక్తి చేయి ఆయన చేతిని అంటుకొని ఉండిపోయింది. ‘మీలో ఎవరో దొంగ ఉన్నారు, దొంగ సొమ్ము బయటకు తీయండి,’ అని అన్నారు. అనంతరం దొంగలించబడిన వస్తువు తీయగా అది ఒక బంగారు ఆవుతల బయటపడింది. దాన్ని యుద్ధ ధనంలో ఉంచడం జరిగింది. ఆకాశం నుండి అగ్ని వచ్చింది. దాన్ని హరించి వెళ్ళిపోయింది. మనకంటే ముందు ఎవ్వరికీ యుద్ధధనం ధర్మసమ్మతం చేయబడ లేదు. మన బలహీనత, అసహాయత చూచి అల్లాహ్‌ (త) యుద్ధ ధనాన్ని మన కోసం ధర్మసమ్మతం చేసాడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4034 – [ 50 ] ( صحيح ) (2/1178)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: حَدَّثَنِيْ عُمَرُقَالَ: لَمَّا كَانَ يَوْمُ خَيْبَرَأَقْبَلَ نَفَرٌ مِّنْ صَحَابَةِ النَّبِيّ صلى الله عليه وسلم. فَقَالُوْا: فُلَانٌ شَهِيْدٌ وَفُلَانٌ شَهِيْدٌ حَتّى مَرُّوْا عَلَى رَجُلٍ فَقَالُوْا: فُلَانٌ شَهِيْدٌ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كَلّا إِنِّيْ رَأَيْتُهُ فِي النَّارِ فِيْ بُرْدَةٍ غَلَّهَا أَوْعَبَاءَةٍ ” ثُمَّ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا اْبَن الْخَطَّابِ اِذْهَبْ فَنَادِ فِي النَّاسِ: أَنَّهُ لَا يَدْخُلُ الْجَنَّةَ إِلَّا الْمُؤْمِنُوْنَ ثَلَاثًا”. قَالَ: فَخَرَجْتُ فَنَادَيْتُ: أَلَا إِنَّهُ لَا يَدْخُلُ الْجَنَّةَ إِلَّا الْمُؤْمِنُوْنَ ثَلَاثًا. رَوَاهُ مُسْلِمٌ .

4034. (50) [2/1178దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ‘ఉమర్‌ (ర) నాతో ఇలా అన్నారు, ‘ ‘ఖైబర్‌ యుద్ధంలో కొందరు అనుచరులు ఒక వ్యక్తి వీరమరణం పొందాడని ప్రవక్త (స)కు తెలియజేయసాగారు. ఒక వ్యక్తి వీరమరణం పొందిన వారిని గురించి ప్రస్తావిస్తూ ఒక వ్యక్తి పేరు కూడా ప్రస్తావించాడు. అది విన్న ప్రవక్త (స) ఎంత మాత్రం అతడు వీరమరణం పొందలేదు. నేనతన్ని నరకంలో కాలుతుండగా చూచాను, అతడు యుద్ధధనం నుండి ఒక దుప్పటి దొంగిలించాడు. ప్రవక్త (స) ‘ఉమర్‌ను, ”ఓ ‘ఉమర్‌! ‘స్వర్గంలో కేవలం పరిపూర్ణ విశ్వాసి మాత్రమే ప్రవేశిస్తాడు’ అని 3 సార్లు ప్రకటించు,” అని అన్నారు. నేను వెళ్ళి 3 సార్లు, ‘పరిపూర్ణ విశ్వాసి మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తాడు,’ అని ప్రకటించానని అన్నారు. (ముస్లిమ్‌)

=====

8– بَابُ الْجِزْيَةِ

8. రక్షణ రుసుము (జిజ్హ్)

దారుల్ఇస్లామ్లో అవిశ్వాసుల రక్షణా బాధ్యతలకు ముస్లిమ్పాలకులు వార్షిక టేక్స్తీసుకుంటారు. దీన్ని జిజ్హ్ అంటారు. ఇవి రెండు రకాలు: 1. ధనప్రాణం రక్షణా బాధ్యతలు 2. రాబడి పన్ను వసూలుచేయబడుతుంది. అంటే పంటల రాబడిలో ముస్లిముల నుండి ‘జకాత్‌ ముస్లి మేతరులనుండి పన్ను తీసుకోవటం జరుగుతుంది. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ (త) ఇలా ఆదేశించాడు, ”యూదులు మరియు క్రైస్తవులు పన్ను చెల్లిస్తే వారి ధనప్రాణాలకు రక్షణ లభిస్తుంది. దీన్ని గురించే క్రింది ‘హదీసు’లు పేర్కొనబడ్డాయి.

اَلْفَصْلُ الْأَوَّلُ    మొదటి విభాగం

4035 – [ 1 ] ( صحيح ) (2/1179)

عَنْ بَجَالَةَ قَالَ: كُنْتُ كَاتِبًا لِجُزْءِ بْنِ مُعَاوِيَةَ عَمِّ الْأَحْنَفِ فَأَتَانَا كِتَابُ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ قَبْلَ مَوْتِهِ بِسَنَةٍ: فَرِّقُوْا بَيْنَ كُلِّ ذِيْ مَحْرَمٍ مِنَ الْمَجُوْسِ وَلَمْ يَكُنْ عُمَرُ أَخَذَ الْجِزْيَةَ مِنَ الْمَجُوْسِ حَتّى شَهِدَ عَبْدُ الرَّحْمنِ بْنُ عَوْفٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَخَذَهَا مِنْ مَجُوْسِ هَجَرَ. رَوَاهُ الْبُخَارِيُّ.

وَذُكِرَ حَدِيْثُ بُرَيْدَةَ: إِذَا أَمَّرَ أَمِيْرًا عَلَى جَيْشٍ فِيْ “بَابِ الْكِتَابِ إِلى الْكُفَّارِ”.

4035. (1) [2/1179దృఢం]

బజాలహ్‌ (తాబ’యీ) కథనం: నేను అహ్‌నఫ్‌ చిన్నాన్న అయిన జ’జ్‌ బిన్‌ ము’ఆవియహ్‌ వద్ద గుమస్తాగా ఉండే వాడిని. అతడు మరణించటానికి ఒక సంవత్సరం ముందు ‘ఉమర్‌ (ర) దగ్గర నుండి ఒక ఉత్తరం వచ్చింది, ”నాస్తికుల్లో, అగ్ని ఆరాధకుల్లో ఎవరైనా నిషిద్ధ స్త్రీలతో వివాహం చేసి ఉంటే వారిని విడదీయమని, ఎందుకంటే ఇస్లామ్‌ దీన్ని నిషేధించిందని, వారు ముస్లిమయినా, ముస్లిమే తరులైనా సరే అని వ్రాసారు. ‘ఉమర్‌ (ర) నాస్తికుల నుండి పన్ను వసూలు చేసేవారు కారు. చివరికి ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ ప్రవక్త (స) ముస్లిమేతరుల నుండి పన్నువసూలు చేసేవారని సాక్ష్యం ఇచ్చారు. [95]   (బు’ఖారీ)

—–

الْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం  

4036 – [ 2 ] ( لم تتم دراسته ) (2/1179)

عَنْ مُعَاذٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم لَمَّا وَجَّهَهُ إِلى الْيَمَنِ أَمَرَهُ أَنْ يَأْخُذَ مِنْ كُلِّ حَالِمٍ يَعْنِيْ مُحْتَلِمٍ دِيْنَارًا أَوْ عِدْلَهُ مِنَ الْمُعَافِرِيِّ: ثِيَابٌ تَكُوْنُ بِالْيَمْنِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4036. (2) [2/1179అపరిశోధితం]

ము’ఆజ్‌(ర) కథనం: ప్రవక్త(స) ము’ఆజ్‌ను యమన్‌ పాలకునిగా నియమించి పంపినపుడు యమన్లో ప్రతి యుక్త వయస్సుకు చేరిన వ్యక్తి నుండి వార్షిక పన్నుగా, ‘ఒక అష్‌రఫీ లేదా దానికి సమానంగా ము’ఆఫిరీ వస్త్రం తీసుకో’ అని ఆదేశించారు. (అబూ దావూద్‌)

4037 – [ 3 ] ( لم تتم دراسته ) (2/1179)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُولُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَصْلُحُ قِبْلَتَانِ فِيْ أَرْضٍ وَّاحِدَةٍ وَلَيْسَ عَلَى الْمُسْلِمِ جِزْيَةٌ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ .

4037. (3) [2/1179 అపరిశోధితం]

ఇబ్నె అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రెండు  ధర్మాల వారు ఒక దేశంలో సమానంగా రాజ్యమేలలేరు. ముస్లిములపై పన్ను లేదు.” [96] (అ’హ్మద్‌, తిర్మిజి’, అబూ  దావూద్‌)

4038 – [ 4 ] ( لم تتم دراسته ) (2/1179)

وَعَنْ أَنَسٍ قَالَ: بَعَثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم خَالِدَ بْنَ الْوَلِيْدِ إِلى أُكَيْدِرِ دُوْمَةَ فَأَخَذُوْهُ فَأَتَوْا بِهِ فَحَقَنَ لَهُ دَمَهُ وَصَالَحَهُ عَلَى الْجِزْيَةِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4038. (4) [2/1179 అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ను అకీదర్‌ రూమా వద్దకు వెళ్ళి అతన్ని బంధించి తెమ్మని, ఆదేశించారు. అతన్ని క్షమించి పన్నుపై ఒప్పందం కుదుర్చు కున్నారు. [97] (అబూ  దావూద్‌)

4039 – [ 5 ] ( لم تتم دراسته ) (2/1179)

وَعَنْ حَرْبِ بْنِ عُبَيْدِ اللهِ عَنْ جَدِّهِ أَبِيْ أُمِّهِ عَنْ أَبِيْهِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّمَا الْعُشُوْرِ عَلَى الْيَهُوْدِ وَالنَّصَارَى وَلَيْسَ عَلَى الْمُسْلِمِيْنَ عُشُوْرٌ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ

4039. (5) [2/1179 అపరిశోధితం]

‘హర్‌బ్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ తన తాతగారితో, అతడు తన తండ్రిగారి ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”1/10 వంతు యూదులు, క్రైస్తవులపై ఉంది. ముస్లిములపై  లేదు.” [98] (అ’హ్మద్‌, అబూ  దావూద్‌)

4040 – [ 6 ] ( لم تتم دراسته ) (2/1180)

وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِنَّا نَمَّرٌ بِقَوْمٍ فَلَا هُمْ يُضَيّفُوْنَا وَلَا هُمْ يُؤَدُّوْنَ مَا لَنَا عَلَيْهِمْ مِنَ الْحَقِّ وَلَا نَحْنُ نَأْخُذُ مِنْهُمْ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنْ أَبَوْا إِلَّا أَنْ تَأْخُذُوْا كُرْهًا فَخَذُوْا”. رَوَاهُ التِّرْمِذِيُّ .

4040. (6) [2/1180అపరిశోధితం]

‘ఉఖ్‌బ బిన్‌ ‘ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త(స) ను నేను ఇలా విన్నవించుకున్నాను, ”ఓ ప్రవక్తా! ఒక్కోసారి ఎటువంటి వారు ఎదురవుతారంటే, మాకు ఆతిథ్యం ఇవ్వరు, మా హక్కులను నేరవేర్చరు, వారి నుండి మేము ఏదైనా వస్తువులను తీసుకోలేము,” అని విన్నవించుకున్నారు. అది విని ప్రవక్త(స) ”ఒక వేళ వారు సంతోషంగా మీ హక్కులను ఇవ్వకపోతే, మీరు బలవంతంగా మీ హక్కులను తీసుకోండి,” అని అన్నారు. [99]   (తిర్మిజి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం 

4041 – [ 7 ] ( لم تتم دراسته ) (2/1180)

عَنْ أَسْلَمَ أَنَّ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ ضَرَبَ الْجِزْيَةَ عَلَى أَهْلِ الذَّهْبِ أَرْبَعَةَ دَنَانِيْرَ وَعَلَى أَهْلِ الْوَرِقِ أَرْبَعِيْنَ دِرْهَمًا مَعَ ذَلِكَ أَرْزَاقُ الْمُسْلِمِيْنَ وَضِيَافَةُ ثَلَاثَةِ أَيَّامٍ. رَوَاهُ مَالِكٌ.

4041. (7) [2/1180అపరిశోధితం]

అస్లమ్‌ కథనం: ‘ఉమర్‌ (ర) బంగారం వ్యాపారులపై సంవత్సరానికి 4 అష్రఫీలు పన్ను విధించారు. అదేవిధంగా వెండివ్యాపారులపై 40 దిర్‌హమ్‌లు, దీనితోపాటు 3 రోజులు ముస్లిమ్‌ తాహ్సీల్దార్ల ఆతిథ్యం విధించారు. (మువత్తా ఇమామ్‌ మాలిక్‌)

=====

9– بَابُ الصُّلْحِ

9. సంధి ఒప్పందాలు

ఒప్పందం అంటే కలయిక అంటే భేదాభిప్రాయాలు మరియు మనస్పర్థలు ఏర్పడినపుడు వివాదం తలెత్తి నపుడు ఒప్పందం కుదుర్చటం మానవత్వం మరియు ఎంతో గొప్పతనం. అందరూ దాన్ని మంచిగానే భావిస్తారు. కాని ఇస్లామ్‌లో దానికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ (త) ఇలా ఆదేశించాడు: ”మరియు ఒకవేళ విశ్వాసులలోని రెండువర్గాల వారు పరస్పరం కలహించుకుంటే, వారిద్దరి మధ్య సంధి చేయించండి. కాని ఒకవేళ, వారిలోని ఒక వర్గంవారు రెండవవర్గం వారిపై దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యం చేసినవారు, అల్లాహ్‌ ఆజ్ఞవైపునకు మరలే వరకు, వారికి వ్యతిరేకంగా పోరాడండి. తరువాత వారు మరలివస్తే, వారి మధ్య న్యాయంగా సంధి చేయించండి మరియు నిష్పక్ష పాతంగా వ్యవహరించండి. నిశ్చయంగా, అల్లాహ్  నిష్పక్ష పాతంగా వ్యవహరించే వారిని ప్రేమిస్తాడు. వాస్తవానికి విశ్వాసులు పరస్పరం సహోదరులు, కావున మీ సహోదరుల మధ్య సంధి చేయించండి.మరియు మీరు కరుణించబడాలంటే అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి.” (అల్‌  ‘హుజురాత్‌, 49:9-10)

ఈ వాక్యంలో ఒకవేళ ముస్లిముల వర్గాలు వివాదానికి దిగినా, పోరాటానికి దిగినా ముస్లిములు వారి వివాదాన్ని పరిష్కరించాలి. ఎందుకంటే వారు అన్నదమ్ములు. సోదరభావం కోరేదీ ముస్లిములను వివాదాలకు దూరంగా ఉంచడమే. ఒక ముస్లిమ్‌కు బాధ కలిగితే మనకూ బాధ కలుగుతుంది. ముస్లిము లందరూ ఒక శరీరం వంటివారు. ఒకవేళ శరీరంలోని ఒక అవయవానికి బాధ కలిగితే శరీరమంతా నొప్పితో అలమటిస్తుంది. అందువల్లే ఒప్పందం, ఐకమత్యం సోదరభావానికి, సంఘీభావానికి సరైన మార్గం. ఒకవేళ భార్యాభర్తల్లో ఏకాభిప్రాయం లేనప్పుడు సమస్యను పరిష్కరించడం చాలా మంచి పని.

”మరియు ఒకవేళ స్త్రీ తనభర్త, అనాదరణతో ప్రవర్తిస్తాడేమోనని, లేదా విముఖుడవుతాడేమోనని, భయపడితే! వారిద్దరూ తమ మధ్య రాజీచేసుకుంటే! వారిపై ఎలాంటి దోషం లేదు. రాజీపడటం ఎంతో ఉత్తమ మైనది. మరియు మానవుల మనస్సులలో పేరాస ఇమిడివున్నది. మీరు సజ్జనులై, దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్‌ మీ కర్మ లన్నింటినీ బాగా ఎరుగును. మరియు మీరు ఎంత కోరినా, మీ భార్యలమధ్య పూర్తి న్యాయంచేయటం మీ చేతకానిపని.కనుక ఒక భార్య వైపునకు ఎక్కువగా మొగ్గి మరొకామెను డోలాయ మాన స్థితిలో వదలకండి. మీరు మీ ప్రవర్తనను సరిజేసుకొని దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమా శీలుడు, అపార కరుణాప్రదాత.” (అన్నిసా’, 4:128-129)

ప్రజల వివాదాలను సంస్కరించే వారికి గొప్ప ఉన్నత స్థానాలు ఉన్నాయి. ప్రపంచంలో సంస్కర్తకు చాలా గౌరవం ఉంటుంది. వారిని గౌరవించటం సన్మా నించటం జరుగుతుంది. పరలోకంలో కూడా అల్లాహ్‌ (త) వారికి గొప్ప  ప్రతి ఫలాన్ని  ప్రసాదిస్తాడు.  

”వారు చేసే రహస్యసమావేశాలలో, చాలామట్టుకు ఏ మేలు లేదు. కాని ఎవరైనా దానధర్మాలు చేయటానికి, సత్కార్యాలు (అరూఫ్) చేయటానికి లేదా ప్రజల మధ్య సంధి చేకూర్చటానికి (సమాలోచ నలు) చేస్తే తప్ప! ఎవడు అల్లాహ్‌ ప్రీతికొరకు ఇలాంటి పనులు చేస్తాడో, అతనికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము.” (అన్నిసా’, 4:114)

వాంఙ్మూలంలో మార్పులు చేర్పులు చేయరాదు. అయితే అధర్మ వాంఙ్మూలాలను మార్చి షరీ’అత్‌ ప్రకారం సరిచేయ వచ్చు. ఇటువంటి కార్యాలలో పుణ్యం ఉంది. అల్లాహ్‌ (త) ఆదేశం:  ”కాని వీలు నామా చేసిన వ్యక్తి పక్షపాతమో, లేదా అన్యాయమో చేశాడనే భయం ఎవనికైనా ఉంటే, అతడు ఈ వ్యవహారంతో సంబంధ మున్న వారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులో ఎలాంటి దోషంలేదు. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.” (అల్‌ బఖరహ్‌, 2:182)

తగాదాలను పరిష్కరించటం వల్ల నమా’జ్‌, రో’జాల కంటే అధిక పుణ్యఫలం లభిస్తుంది. ప్రవక్త (స) తన అనుచరులతో, ‘నేను మీకు నమా’జ్‌ రో’జాల కంటే ఉత్తమమైన ఆచరణను గురించి తెలియపరచనా,’ అన్నారు. దానికి అనుచరులు, ‘తప్పకుండా,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఇద్దరిమధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించడం,’ ఇంకా వ్యతిరేకత, అసత్యం ధర్మాన్ని, విశ్వాసాన్ని హరించివేస్తాయి, ఇంకా మానవుని శరీరంలో 360 కీళ్ళు ఉన్నాయి. ప్రతిరోజు ఒక కీలుకు బదులు దానధర్మాలు చేయాలి. ఇద్దరి మధ్య న్యాయంగా వ్యవహారాన్ని పరిష్కరిస్తే దానధర్మాల పుణ్యం లభిస్తుంది.  ప్రజల్లో వివాదాస్పద విషయాలను పరిష్కరించటం చాలా గొప్ప ధర్మం. ప్రజల వ్యవహారాలను పరిష్కరించటం అంటే అల్లాహ్‌(త)కు చాలా ఇష్టం. ప్రజల వివాదాలను పరిష్కరించేవారి సమస్యలను అల్లాహ్‌ (త) పరిష్కరిస్తాడు. ప్రతి తీర్పుకు బదులు ఒక బానిస విడుదల చేసే పుణ్యం లభిస్తుంది. ఇంకా అతని భవిష్యత్తులోని పాపాలను క్షమించటం జరుగుతుంది.  పై ఆయతుల ‘హదీసు’ల ద్వారా పరిష్కారం ప్రాధాన్యత, ప్రాముఖ్యత నిరూపించడం జరిగింది. ఇది కేవలం ముస్లిములకే కాదు, ముస్లిమే తరులలో కూడా చేయవచ్చును. ప్రవక్త (స) యూదులతో, క్రైస్తవు లతో, అవిశ్వాసులతో ఒప్పందం చేసు కున్నారు. ”ఒకవేళ వారు ఒప్పందానికి వస్తే మీరు కూడా ఒప్పందానికి సంసిద్ధత వ్యక్తం చేయండి.”

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం 

4042 – [ 1 ] ( صحيح ) (2/1181)

عَنِ الْمِسْوَرِ بْنِ مَخْرَمَةَ وَمَرْوَانَ بْنِ الْحَكَمِ قَالَا: خَرَجَ النَّبِيُّ صلى الله عليه وسلم عَامَ الْحُدَيْبِيِّةِ فِيْ بِضْعِ عَشْرَةَ مِائَةٍ مِّنْ أَصْحَابِهِ فَلَمَّا أَتَى ذَا الْحُلَيْفَةَ قَلَّدَ الْهَدْيَ وَأَشْعَرَ وَأَحْرَمَ مِنْهَا بِعُمْرَةٍ وَسَارَ حَتّى إِذَا كَانَ بِالثَّنِيَّةِ الَّتِيْ يُهْبَطُ عَلَيْهِمْ مِنْهَا بَرَكَتْ بِهِ رَاحِلَتُهُ فَقَالَ النَّاسُ: حَلُ حَلُ خَلَأتِ الْقَصْوَاءُ خَلَأتِ الْقَصْوَاءُ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “مَا خَلَأَتِ الْقَصْوَاءُ وَمَا ذَاكَ لَهَا بِخُلُقٍ وَلَكِنْ حَبَسَهَا حَابِسُ الْفِيْلِ”. ثُمَّ قَالَ: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَا يَسْأَلُوْنِيْ خُطَّةً يُعَظِّمُوْنَ فِيْهَا حُرُمَاتِ اللهِ إِلَّا أَعْطَيْتُهُمْ إِيَّاهَا”. ثُمَّ زَجَرَهَا فَوَثَبَتْ فَعَدَلَ عَنْهُمْ حَتَّى نَزَلَ بِأَقْصَى الْحُدَيْبِيَةِ عَلَى ثَمَدٍ قَلِيْلِ الْمَاءِ يَتَبَرَّضُهُ النَّاسُ تَبَرّضًا فَلَمْ يُلْبِثْهُ النَّاسُ حَتَّى نَزَحُوْهُ وَشُكِيَ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم اَلْعَطْشُ فَانْتَزَعَ سَهْمًا مِنْ كِنَانَتِهِ ثُمَّ أَمَرَهُمْ أَنْ يَجْعَلُوْهُ فِيْهِ فَوَ اللهِ مَا زَالَ يَجِيْشُ لَهُمْ بِالرِّيِّ حَتّى صَدَرُوْا عَنْهُ فَبَيْنَا هُمْ كَذَلِكَ إِذْ جَاءَ بُدَيْلُ بْنُ وَرَقَاءَ الْخُزَاعِيُّ فِيْ نَفَرٍ مِنْ خُزَاعَةَ ثُمَّ أَتَاهُ عُرْوَةُ بْنُ مَسْعُوْدٍ وَسَاقَ الْحَدِيْثَ إِلى أَنْ قَالَ: إِذْ جَاءَ سُهَيْلُ بْنُ عَمْرٍو. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “اُكْتُبْ: هَذَا مَا قَاضَى عَلَيْهِ مُحَمَّد رَّسُوْلُ اللهِ”. فَقَالَ سُهَيْلٌ: وَاللهِ لَوْ كُنَّا نَعْلَمُ أَنَّكَ رَسُوْلُ اللهِ مَا صَدَدْنَاكَ عَنِ الْبَيْتِ وَلَا قَاتَلْنَاكَ وَلَكِنْ اُكْتُبْ: مُحَمَّدُ بْنُ عَبْدِ اللهِ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “وَاللهِ إِنِّيْ لَرَسُوْلُ اللهِ وَإِنْ كَذَّبْتُمُوْنِيْ اُكْتُبْ: مُحَمَّدَ بْنَ عَبْدِ اللهِ”. فَقَالَ سُهَيْلٌ: وَعَلى أَنْ لَّا يَأْتِيَكَ مِنَّا رَجُلٌ وَإِنْ كَانَ عَلَى دِيْنِكَ إِلَّا رَدَدْتَّهُ عَلَيْنَا فَلَمَّا فَرَغَ مِنْ قَضِيَّةِ الْكِتَابِ. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِأَصْحَابِهِ: “قُوْمُوْا فَانْحَرُوْا ثُمَّ احْلِقُوْا”. ثُمَّ جَاءَ نِسْوَةٌ مُّؤْمِنَاتٌ فَأَنْزَلَ اللهُ تَعَالى: (يَا أَيُّهَا الَّذِيْنَ آمَنُوْا إِذَا جَاءَكُمُ الْمُؤْمِنَاتُ مُهَاجِرَاتٍ…؛60:10) الآية. فَنَهَاهُمُ اللهُ تَعَالى أَنْ يَرُدُّوْهُنَّ وَأَمَرَهُمْ أَنْ يَرُدُّوا الصَّدَاقَ ثُمَّ رَجَعَ إِلى الْمَدِيْنَةِ فَجَاءَهُ أَبُوْ بَصِيْرٍ رَجُلٌ مِّنْ قُرَيْشٍ وَهُوَ مُسْلِمٌ فَأَرْسَلُوْا فِيْ طَلَبِهِ رَجُلَيْنِ فَدَفَعَهُ إِلى الرَّجُلَيْنِ فَخَرَجَا بِهِ حَتَّى إِذَا بَلَغَا ذَا الْحُلَيْفَةِ نَزَلُوْا يَأْكُلُوْنَ مِنْ تَمْرٍ لَهُمْ. فَقَالَ أَبُوْ بَصِيْرٍ لِأَحَدِ الرَّجُلَيْنِ: وَاللهِ إِنِّيْ لَأُرَى سَيْفَكَ هَذَا يَا فُلَانُ جَيِّدًا أَرِنِيْ أَنْظُرْ إِلَيْهِ فَأَمْكَنَهُ مِنْهُ فَضَرَبَهُ حَتّى بَرَدَ وَفَرَّ الْآخَرُ حَتَّى أَتَى الْمَدِيْنَةَ فَدَخَلَ الْمَسْجِدُ يَعْدُوْ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “لَقَدْ رَأَى هَذَا ذُعْرًا”. فَقَالَ: قُتِلَ وَاللهِ صَحَابِيْ وَإِنِّيْ لَمَقْتُوْلٌ فَجَاءَ أَبُوْ بَصِيْرٍ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “وَيْلٌ أُمِّهِ مِسْعَرُ حَرْبٍ لَوْ كَانَ لَهُ أَحَدٌ”. فَلَمَّا سَمِعَ ذَلِكَ عَرْفَ أَنَّهُ سَيَرُدُّهُ إِلَيْهِمْ فَخَرَجَ حَتّى أَتَي سِيْفَ الْبَحْرِقَالَ: وَ انْفَلَتَ أَبُوْ جَنْدَلِ بْنِ سُهَيْلٍ فَلَحِقَ بِأَبِيْ بَصِيْرٍ فَجَعَلَ لَا يَخْرُجُ مِنْ قُرَيْشٍ رَجُلٌ قَدْ أَسْلَمَ إِلَّا لَحِقَ بِأَبِيْ بَصِيْرٍ حَتّى اجْتَمَعَتْ مِنْهُمْ عِصَابَةٌ فَوَ اللهِ مَا يَسْمَعُوْنَ بِعِيْرٍخَرَجَتْ لِقُرَيْشٍ إِلى الشَّامِ إِلَّا اِعْتَرَضُوْا لَهَا فَقَتَلُوْهُمْ وَأَخَذُوْا أَمْوَالَهُمْ فَأَرْسَلَتْ قُرَيْشٌ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم تُنَاشِدُهُ اللهَ وَالرَّحِمَ لَمَّا أَرْسَلَ إِلَيْهِمْ فَمَنْ أَتَاهُ فَهُوَ آمِنٌ فَأَرْسَلَ النَّبِيُّ صلى الله عليه وسلم إِلَيْهِمْ. رَوَاهُ الْبُخَارِيُّ .

4042. (1) [2/1181దృఢం]

   మిస్‌వర్‌ బిన్‌ మ’ఖ్‌రమహ్‌ మరియు మర్వాన్‌ బిన్‌ ‘హకమ్‌ కథనం: ప్రవక్త (స) హుదైబియహ్ ఒప్పందం సంవత్సరం 1000 మందికి పైగా అనుచరులతో ‘ఉమ్‌రహ్‌ చేయటానికి బయలుదేరారు. జుల్‌ ‘హులైఫహ్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఖుర్‌బానీ జంతువుల మెడలో చిహ్నంగా హారాలు వేసారు. ‘ఉమ్‌రహ్‌ ఇహ్రామ్ధరించారు. ఆ తరువాత అక్కడి నుండి బయలుదేరారు. మక్కహ్లో దిగేచోటు అయిన సనయ్య చేరగానే ప్రవక్త (స) ఒంటె కూర్చుండి పోయింది. ప్రజలు దాన్ని లేపటానికి చాలా ప్రయత్నించారు. కాని అది లేవలేదు. అది చూచి ప్రజలు, ‘ఖన్వా ఒంటె అలిగింది,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘దానికి అలిగే అలవాటు లేదు, కాని దాన్ని ఆపడం జరిగింది. ఏనుగును ఆపినవారే దాన్ని ఆపారు,’ అని అన్నారు. ఇంకా, ”ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! ఒకవేళ మక్కహ్ వారు అల్లాహ్‌(త), చిహ్నాల గౌరవం విషయంలో, వాటి గౌరవం విషయంలో ఏదైనా కోరితే నేను వారి మాటను స్వీకరిస్తాను,” అని పలికి దాన్ని కసిరారు. అది వెంటనే నిలబడింది. ఆ తర్వాత ప్రవక్త(స) తిరిగి ‘హుదైబియహ్ ప్రాంతానికి చెందిన ఒక లోయ ప్రాంతంలో దిగారు. అక్కడ కొంత నీరు ఉంది. అది చూచిన ప్రజలు అక్కడినుండి నీళ్ళు త్రాగటం ప్రారంభించారు. నీళ్ళన్ని అయిపోయాయి. ఇంకా ప్రజలు దాహంతో అలమటిస్తూ ప్రవక్త (స)కు ఫిర్యాదు చేసారు. ప్రవక్త (స) తన బాణాల్లోని ఒక బాణాన్ని ఇచ్చి దాన్ని ఆ గొయ్యిలో పాతిపెట్టమని ఆదేశించారు. బాణాన్ని పాతి పెట్టిన వెంటనే అందులో నుండి నీళ్ళు రావటం ప్రారంభం అయింది. ప్రజలందరూ తమ అవసరాలకు నీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రజలు తమ అవసరాలు తీర్చుకొని టెంట్ల వైపు రాసాగారు. ఇంతలో బుదైత్‌ బిన్‌ వరఖహ్‌ ‘ఖుజా’యీ తన జాతి ఖుజాయీ వారిని తీసుకొని అక్కడికి చేరు కున్నాడు. వాళ్ళు మక్కహ్ వారి తరఫున ప్రవక్త (స) వద్దకు వచ్చారు. అయితే వీరు ప్రవక్త (స) శ్రేయం కోరుతూ ఉన్నారు. అతడు ఇలా అన్నాడు, ”క’అబ్‌ బిన్‌ లు’యీ మరియు ‘ఆమిర్‌ బిన్‌ లు’యీని ‘హుదైబియహ్ వద్ద వదలి వచ్చాను. అక్కడ నీటి ఊట ఉంది. వారు అక్కడే ఉన్నారు. వారి వద్ద చాలా అధికంగా ఆహారపదార్థాలు ఉన్నాయి. వారి వెంట బిడ్డలు గల ఆడ ఒంటెలు ఉన్నాయి. మరియు ఇంకా పాలు ఇచ్చే ఒంటెలు కూడా ఉన్నాయి. అంటే నీటి ఊట వద్ద వారు ఆధిక్యత కలిగి ఉన్నారు. వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. వారు మీతో యుద్ధం చేయాలనే కోరుతున్నారు. వారు మిమ్మల్ని బైతుల్లాహ్‌ చేరకుండా చేయాలని కోరుతున్నారు” అని అన్నాడు. అది విని ప్రవక్త (స), ”నేను యుద్ధం చేయటానికి రాలేదు, మేము కేవలం ‘ఉమ్రహ్‌ చేయడానికి వచ్చాము,” అని అన్నారు. ఇటు సంభాషణ జరుగుతూ ఉంది. ఇంతలో ‘ఉర్‌వహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ కూడా వచ్చాడు. ఇతరులు కూడా వచ్చారు. ఉల్లేకనకర్త కథనం: ఆ తరువాత సుహైల్బిన్‌ ‘అమ్ర్ కూడా వచ్చాడు. అప్పుడు ప్రవక్త (స) ఒప్పందం పత్రం ఇలా వ్రాయండి, ”ము’హమ్మద్‌ (స) ఈ ఒప్పందాన్ని తీర్మానించారు. అప్పుడు సుహైల్‌, ”మేము మిమ్మల్ని అల్లాహ్‌ ప్రవక్తగా స్వీకరించము. ఒకవేళ అలా స్వీకరిస్తే ఆపడం, యుద్ధం రెండూ జరిగి ఉండేవి కావు. మీరు మీ పేరు కేవలం ము’హమ్మద్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ మాత్రమే వ్రాయండి,” అని అన్నాడు. దానికి ప్రవక్త (స) నేను అల్లాహ్‌ సత్య ప్రవక్తను. వీరు స్వీకరించినా, స్వీకరించకపోయినాసరే. ప్రవక్త (స) గుమస్తాతో, ‘ము’హమ్మద్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌యే వ్రాయి,’ అని అన్నారు. అనంతరం ఈ పదం వ్రాయబడింది. అప్పుడు సుహైల్‌, ‘నా తరఫు నుండి ఒప్పందం పత్రంలో భవిష్యత్తులో ఎవరైనా ముస్లిమ్‌ అయి మీ దగ్గరకు వస్తే, ఆ వ్యక్తిని మా వద్దకు తిరిగి పంపాలి.’ ఒప్పందం వ్రాయడం పూర్తి అయిన తర్వాత ప్రవక్త (స) తన అనుచరులతో, ‘నిలబడండి, ఖుర్‌బానీ జంతువులను జి’బహ్‌ చేసి, తలగీయించి ‘హలాల్‌ అయిపోండి.’ ఒప్పందం కుదిరిన తర్వాత చాలామంది స్త్రీలు ముస్లిములయి మదీనహ్ వచ్చారు. మక్కహ్ వారు వాళ్ళను తిరిగి పంపమని కోరారు. కాని ప్రవక్త (స) తిరస్కరించారు. వీరి గురించే అల్లాహ్‌ (త) ఈ వాక్యం అవతరింపజేసాడు. దీన్ని అనుసరిస్తూ స్త్రీలను తిరిగి పంపలేదు. ఎందుకంటే, అల్లాహ్‌ (త) [అల్ ముంతహినహ్, 60:10]లో ఆ ముస్లిమ్‌ స్త్రీలను తిరిగి పంపటాన్ని వారించాడు. అయితే వారి మహర్లను తిరిగి ఇవ్వమని ఆదేశించాడు. ఆ తరువాత ప్రవక్త (స) మదీనహ్ మునవ్వరహ్‌ తిరిగి వచ్చారు. మదీనహ్ చేరిన తర్వాత ఖురైషులకు చెందిన అబూ నసీర్‌ అనే వ్యక్తి ముస్లిమ్‌ అయి మదీనహ్ చేరుకున్నారు. ఖురైష్‌ ఇద్దరు వ్యక్తులను అతన్ని తిరిగి తీసుకురమ్మని పంపారు. వారు వచ్చి, ‘మన ఒప్పందం ప్రకారం అతన్ని మీరు తిరిగి పంపివేయండి,’ అని అన్నారు. ప్రవక్త (స) వారి మాట ప్రకారం ఆ వ్యక్తిని వారికి అప్పగించారు. వారు అతన్ని తీసుకొని మదీనహ్ నుండి బయలు దేరారు. జుల్‌’హులైఫహ్ చేరారు. అక్కడ టిఫిన్‌ చేద్దామని తమ వాహనాలపై నుండి దిగారు. ఆహార పదార్థాలు తీసి తినటం ప్రారంభించారు. టిఫిన్‌ చేస్తూ అబూ నసీర్‌ ఆ ఇద్దరిలో ఒకరితో, ‘అల్లాహ్ సాక్షి! నీ కరవాలం చాలా బాగుంది,’ అని అన్నారు. ఆ వ్యక్తి ఒరలోనుండి తీసి కరవాలాన్ని అతనికి ఇచ్చాడు. అబూ నసీర్ ఆ కరవాలాన్ని తీసుకొని అతన్ని హతమార్చాడు. అది చూచిన రెండవ వ్యక్తి భయంతో పారిపోయి మదీనహ్ చేరాడు. ప్రవక్త (స) అతని చూచి, ‘చాలా భయపడి ఉన్నాడు,’ అని అన్నారు. దానికి అతడు, ‘ఒకవేళ పారిపోకపోతే నేను కూడా చంపబడి ఉండేవాడిని.’ అని అన్నాడు. ఇంతలో వెనుక అబూ నసీర్‌ కూడా వచ్చారు. ప్రవక్త (స) అతన్ని చూచి, ‘ఈ వ్యక్తి కలహాలు రేపేవాడులా ఉన్నాడు. అక్కడ ఎవరైనా ఉండి సహాయం చేస్తే యుద్ధమే ప్రారంభమై ఉండేది.’ అని అన్నారు. అప్పుడు అబూ నసీర్‌, ‘ఓ ప్రవక్తా! మీరు మీ ఒప్పందాన్ని పూర్తిచేసారు. అల్లాహ్‌ (త) నాకు విముక్తి ప్రసాదించాడు,’ అని అన్నాడు. ప్రవక్త(స) ఒప్పందం ప్రకారం మళ్ళీ తిరిగి పంపాలని అనుకున్నారు. అది గ్రహించిన అబూ నసీర్‌ మదీనహ్ నుండి పారిపోయి సముద్ర  ఒడ్డుకు చేరుకున్నాడు.

ఉల్లేఖన కర్త కథనం: అబూ జన్‌దల్‌ బిన్‌ అబూ సుహైల్‌ మక్కహ్ వారి నుండి తప్పించుకొని పారిపోయి అబూ బసీర్‌ను కలిసారు. ఆ తరువాత మక్కహ్లో ముస్లిమైన ప్రతి వ్యక్తి సముద్ర మార్గాన వెళ్ళి అబూ నసీర్‌ గ్రూపులో చేరిపోయే వారు. ఇలా చేస్తూ వీరందరూ ఒక బృందంగా తయారయ్యారు. ఈ మార్గాన పోయే బిడారులు వీరిని అల్లరిపెడితే వారితో పోరాడేవారు, యుద్ధం చేసి విజయం సాధించి యుద్ధధనాన్ని పొందే వారు. ఖురైష్‌ ఈ బాధ భరించలేక మక్కహ్ నుండి వ్యక్తులను పంపి ఈ ఒప్పందం రద్దుచేయవలసిందిగా కోరారు. (బు’ఖారీ)

4043 – [ 2 ] ( متفق عليه ) (2/1183)

وَعَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ قَالَ: صَالَحَ النَّبِيُّ صلى الله عليه وسلم اَلْمُشْرِكِيْنَ يَوْمَ الْحُدَيْبِيَةِ عَلَى ثَلَاثَةِ أَشْيَاءَ:عَلَى أَنَّ مَنْ أَتَاهُ مِنَ الْمُشْرِكِيْنَ رَدَّهُ إِلَيْهِمْ وَمَنْ أَتَاهُمْ مِنَ الْمُسْلِمِيْنَ لَمْ يَرُدُّوهُ وَعَلَى أَنْ يَدْخُلَهَا مِنْ قَابِلٍ وَيُقِيْمَ بِهَا ثَلَاثَةَ أَيَّامٍ وَلَا يَدْخُلَهَا إِلَّابِجُلُبَّانِ السَّلَاحِ وَ السَّيْفِ وَالْقَوْسِ وَنَحْوهِ فَجَاءَ أَبُوْ جَنْدَلٍ يَحْجُلُ فِيْ قيُوْدِهِ فَرَدَّهُ إِلَيْهِمْ .

4043. (2) [2/1183 ఏకీభవితం]

బరాఅ’ బిన్‌’ఆ’జిబ్‌(ర) కథనం: ప్రవక్త (స) మక్కహ్ అవిశ్వాసులతో ‘హుదైబియహ్ సందర్భంగా ఈ మూడు విషయాలపై ఒప్పందం కుదుర్చుకున్నారు.

1. మక్కహ్ అవిశ్వాసుల్లో ఎవరైనా ముస్లిములు మదీనహ్ వస్తే, అతన్ని మక్కహ్ తిరిగి పంపాలి.

2. ఒకవేళ ముస్లిముల్లోని ఎవరైనా అవిశ్వాసం అవలంబించి మక్కహ్ వస్తే, వారిని తిరిగి పంపటం జరుగదు.

3. ఈ సంవత్సరం ‘ఉమ్‌రహ్‌ కోసం మక్కహ్లో ప్రవేశించ లేరు, వచ్చే సంవత్సరం ప్రవేశించగలరు. ‘ఉమ్‌రహ్‌ చేయగలరు. అయితే ‘ఉమ్‌రహ్‌ విషయంలో మక్కహ్లో కేవలం మూడు రోజులు మాత్రమే ఉండ గలరు. ఇంకా వచ్చే సంవత్సరం వచ్చినపుడు కరవాలాలు, బాణాలు ప్రదర్శిస్తూ రాకూడదు, వాటిని సంచులలో దాచిపెట్టి ఉంచాలి. ఈ ఒప్పందం జరుగుతూనే ఉంది. అబూ జన్‌దల్‌ ముస్లిమ్‌ అనుచరుడు సంకెళ్ళలో బంధించబడి ‘హుదైబియహ్లో ప్రవక్త (స) వద్దకు చేరుకున్నారు. ఇటు అతని తండ్రి సుహైల్‌ ఒప్పందం వ్రాయిస్తున్నాడు. తన కుమారుణ్ని చూచి అందరి కంటే ముందు అబూ జందల్‌ను అవిశ్వాసులకు అప్పగించండి. అప్పుడే ఒప్పందం పూర్తయినట్టు లేకపోతే లేదు. అని అన్నాడు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రవక్త (స) అతన్ని త్రిప్పిపంపివేసారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4044 – [ 3 ] ( صحيح ) (2/1183)

وعَنْ أنس: أن قريشا صالحوا النبي صلى الله عليه وسلم فَاشْتَرَطُوْا عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّ مَنْ جَاءَنَا مشنْكُمْ لَمْ نُرُدَّهُ عَلَيْكُمْ وَمَنْ جَاءَكُمْ مِنَّا رَددْتُّمُوْهُ عَلَيْنَا فَقَالُوْا: يَا رَسُوْلَ اللهِ أَنَكْتُبُ هَذَا؟ قَالَ: “نَعَمْ إِنَّهُ مَنْ ذَهَبَ مِنَّا إِلَيْهِمْ فَأَبْعَدَهُ اللهُ وَمَنْ جَاءَنَا مِنْهُمْ سَيَجْعَلُ اللهُ لَهُ فَرَجًا وَّمَخْرَجًا”.  رَوَاهُ مُسْلِمٌ.

4044. (3) [2/1183దృఢం]

అనస్‌ (ర) కథనం: మక్కహ్ అవిశ్వాసులు ప్రవక్త (స) తో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, ముస్లిములు మక్కహ్లో మాకు దొరికితే మేము వారిని మదీనహ్ పంపము. కాని మా వారు ఎవరైనా ముస్లిములై మదీనహ్ వస్తే తిరిగి పంపివేయాలి అనే షరతు పెట్టారు. అది విని ముస్లిములు, ‘ప్రవక్తా! ఇది వ్రాద్దామా?’ అని కోరారు. ప్రవక్త (స), ‘అవును, మనలో ఎవరైనా అవిశ్వాసానికి గురయి మక్కా వెళితే అల్లాహ్‌ (త) అతన్ని తన కారుణ్యానికి దూరంచేసి వేస్తాడు, వారిలో ఎవరైనా ముస్లిమయి వస్తే, అల్లాహ్‌ (త) వారి కోసం ఏదో ఒక మార్గం చూపిస్తాడు, మీరు స్వతంత్రులైపోతారు,’ అని అన్నారు. (ముస్లిమ్‌)

4045 – [ 4 ] ( متفق عليه ) (2/1183)

وَعَنْ عَائِشَةَ قَالَتْ فِيْ بَيْعَةِ النِّسَاءِ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَمْتَحِنَّهُنَّ بِهَذِهِ الْآيَةِ: (يَا أَيُّهَا النَّبِيُّ إِذَا جَاءَكَ الْمُؤْمِنَاتُ يُبَايِعْنَكَ…60:12) فَمَنْ أَقَرَّتْ بِهَذَا الشَّرْطِ مِنْهُنَّ قَالَ لَهَا: ” قَدْ بَايْعتُكِ”. كَلَامَا يُكَلِّمُهَا بِهِ وَاللهِ مَا مَسَّتْ يَدُهُ يَدَ اِمْرَأَةٍ قَطُّ فِي الْمُبَايَعَةِ . متفق عليه

4045. (4) [2/1183 ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ఒప్పందం తరువాత మక్కహ్ నుండి స్త్రీలు ముస్లిములై వస్తే, ప్రవక్త (స) వారిని క్షుణ్ణంగా పరిశీలించి, వారు కేవలం అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త కోసం ఇస్లామ్‌ స్వీకరించారని తెలిస్తే వారితో బై’అత్‌ తీసు కుంటారు. వీరి గురించే అల్లాహ్‌ (త) ఈ ఆయతులు అవత రింపజేసాడు.

”ఓ ప్రవక్తా! విశ్వసించిన స్త్రీలు ప్రమాణం (బైఅత్) చేయటానికి నీ వద్దకు వచ్చి, తాము ఎవరినీ అల్లాహ్‌కు సాటి కల్పించము మరియు దొంగతనం చేయము మరియు వ్యభిచారం చేయము మరియు తమ సంతానాన్ని హత్యచేయము మరియు తమ చేతుల మధ్య మరియు తమ కాళ్ళమధ్య నిందారోపణ కల్పించము మరియు ధర్మసమ్మతమైన విషయాలలో నీకు అవిధేయత చూపము అని, ప్రమాణం చేస్తే, వారి నుండి ప్రమాణం (బైఅత్) తీసుకో మరియు వారిని క్షమించమని అల్లాహ్‌ను ప్రార్థించు. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.” (అల్ ముమ్తహినహ్, 60:12)

ప్రవక్త (స) వారితో ఒప్పందం చేసుకునేవారు. కాని, చేతిలో చేయి వేసి పురుషులు చేసినట్లు చేసే వారు కారు. ఎందుకంటే పరాయి స్త్రీలను ముట్టుకోవటం ప్రవక్తలను, ఇతరులకూ నిషిధ్ధమే. (బు’ఖారీ, ముస్లిమ్‌)

——

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం

4046 – [ 5 ] ( لم تتم دراسته ) (2/1184)

عَنِ الْمِسْوَرِ وَمَرْوَانَ:أَنَّهُمْ اصْطَلَحُوْا عَلَى وَضْعِ الْحَرْبِ عَشْرَسِنِيْنَ يَأْمَنُ فِيْهَا النَّاسُ وَعَلَى أَنَّ بَيْنَنَا عَيْبَةً مَكْفُوْفَةٌ وَأَنَّهُ لَاإِسْلَالَ وَلَاإِغْلَالَ. روَاهُ أَبُوْ دَاوُدَ .

4046. (5) [2/1184 అపరిశోధితం]

మిస్‌వర్‌ మరియు మర్వాన్‌ కథనం: ‘హుదైబియహ్ ఒప్పందంలో అవిశ్వాసుల తరఫున ఈ నిబంధన కూడా వ్రాయడం జరిగింది. ”10 సంవత్సరాల వరకు మీకూ మాకూ యుద్ధం ఉండదు.” దీనివల్ల 10 సంవత్సరాల సూత్రం ప్రకారం ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. కరవాలాలను ఒరల్లో పెట్టుకొని ఉంటారు. హృదయాల నుండి ఈర్ష్యా ద్వేషాలను తీసివేస్తారు. నిర్మలమైన మనస్సులు కలిగి ఉంటారు. పరస్పరం మోసానికి పాల్పడరు, ఒకరికి ఇంకొకరు హాని తలపెట్టరు. ఒకరిపై ఒకరు దాడిచేయరు. (అబూ  దావూద్‌)

4047 – [ 6 ] ( جيد ) (2/1184)

وَعَنْ صَفْوَانَ بْنِ سُلَيْمٍ عَنْ عِدَّةٍ مِنْ أَبْنَاءِ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم عَنْ آبَائِهِمْ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أَلَا مَنْ ظَلَمَ مُعَاهِدًا أَوِ انْتَقَصَهُ أَوْ كَلَّفَهُ فَوْقَ طَاقَتِهِ أَوْ أَخَذَ مِنْهُ شَيْئًا بِغَيْرِ طِيْبِ نَفْسٍ فَأَنَا حَجِيْجُهُ يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4047. (6) [2/1184- ఆమోదయోగ్యం]

సఫ్వాన్‌ బిన్‌ సులైమ్‌ అనేకమంది అనుచరుల సంతానం ద్వారా కథనం: వారు వారి పెద్దలద్వారా ఇలా విన్నారు, ”ప్రవక్త (స) ప్రవచనం, ‘ఎవరైనా ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తిపై అత్యాచారం చేసినా, ఒప్పందం భంగంచేసినా, అతని హక్కును కొల్లగొట్టినా, శక్తికి మించిన భారం వేసినా, అతనికి ఇష్టం లేక పోయినా అతన్నుండి ఏదైనా వస్తువు తీసుకున్నా, నేను తీర్పుదినం నాడు అతనితో కలహానికి దిగుతాను. వారి హక్కును వారికి ఇప్పిస్తాను.” (అబూ  దావూద్‌)

4048 – [ 7 ] ( صحيح ) (2/1184)

وَعَنْ أُمَيْمَةَ بِنْتِ رُقَيْقَةَ قَالَتْ: بَايَعْتُ النَّبِيّ صلى الله عليه وسلم فِيْ نِسْوَةٍ فَقَالَ لَنَا: “فِيْمَا اسْتَطَعْتُنَّ وَأَطْقتُنَّ”. قُلْتُ: اللهُ وَرَسُوْلُهُ أَرْحَمُ بِنَا مِنَّا بِأَنْفُسِنَا. قُلْتُ: يَا رَسُوْلَ اللهِ بَايِعْنَا تَعْنِيْ صَافِحْنَا. قَالَ: “إِنَّمَا قَوْلِيْ لِمَائَةِ اِمْرَأَةٍ كَقَوْلِيْ لِامْرَأَةٍ وَّاحِدَةٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَمَالِكٌ فِي الْمُوَطَّأْ.

4048. (7) [2/1184దృఢం]

ఉమైమ బిన్‌తె రఖీఖ తన సంఘటన ఇలా తెలుపుతుంది: ప్రవక్త (స)తో స్త్రీలతో పాటు నేనూ బైఅత్‌ చేసాను. ప్రవక్త (స) మాతో వాగ్దానం తీసుకున్నారు, ఇంకా, ‘సాధ్యమైనంత వరకు ఆచరించండి,’ అని అన్నారు. అల్లాహ్‌, ప్రవక్త (స) మాపై చాలా దయామయులు అని అన్నాము. అప్పుడు నేను ఓ ప్రవక్తా! మాతో కరచాలనం చేయండి అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స) ఒక్క స్త్రీకైనా, 100 స్త్రీలకైనా నేను నోటితో చెబితే చాలు. స్త్రీలతో కరచాలనం చేయడం ధర్మం కాదు” అని అన్నారు. (తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్, మాలిక్- మువ’త్తా)

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం  

4049- [ 8 ] ( متفق عليه ) (2/1184)

عَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ قَالَ: اعْتَمَرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِي ذِي الْقَعْدَةِ فَأَبَى أَهْلُ مَكَّةَ أَنْ يَدْعُوْهُ يَدْخُلَ مَكَّةَ حَتّى قَاضَاهُمْ عَلَى أَنْ يَدْخُلَ يَعْنِيْ مِنَ الْعَامِ الْمُقْبِلِ يُقِيْمَ بِهَا ثَلَاثَةَ أَيَّامٍ فَلَمَّا كَتَبُوْا الْكِتَابَ كَتَبُوْا: هَذَا مَا قَاضَى عَلَيْهِ مُحَمَّدٌ رَسُوْلُ اللهِ. قَالُوْا: لَا نُقِرُّ بِهَا فَلَوْ نَعْلَمُ أَنَّكَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مَا مَنَعْنَاكَ وَلَكِنْ أَنْتَ مُحَمَّدُ بْنُ عَبْدِ اللهِ فَقَالَ: ” أَنَا رَسُوْلُ اللهِ وَأَنَا مُحَمَّدُ بْنُ عَبْدِ اللهِ”. ثُمَّ قَالَ لِعَلِيِّ بْنِ أَبِيْ طَالِبٍ: “أُمْحُ: رَسُوْلَ اللهِ”. قَالَ: لَا وَاللهِ لَا أَمْحُوْكَ أَبَدًا فَأَخَذَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَلَيْسَ يُحْسِنُ يَكْتُبُ فَكَتَبَ: “هَذَا مَا قَاضَى عَلَيْهِ مُحَمَّدُ بْنُ عَبْدُ اللهِ: لَا يَدْخُلُ مَكَّةَ بِالسِّلَاحِ إِلَّا السَّيْفَ فِي الْقَرَابِ وَأَنْ لَا يَخْرُجَ مِنْ أَهْلِهَا بِأَحَدٍ إِنْ أَرَادَ أَنْ يَتْبَعَهُ وَأَنْ لَا يَمْنَعَ مِنْ أَصْحَابِهِ أَحَدًا إِنْ أَرَادَ أَنْ يُقِيْمَ بِهَا”. فَلَمَّا دَخَلَهَا وَمَضَى الْأَجَلُ أَتوْا عَلِيًّا فَقَالُوْا: قُلْ لِصَاحِبِكَ: اُخْرُجْ عَنَّا فَقَدْ مَضَى الْأَجْلُ فخَرَجَ النَّبِيُّ صلى الله عليه وسلم .

4049. (8) [2/1184 ఏకీభవితం]

బరాఅ’ బిన్‌ ‘ఆ’జిబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) జు’ల్‌ ఖ’అదహ్‌ నెలలో ‘ఉమ్‌రహ్‌ ఇహ్‌రామ్‌ ధరించి మక్కహ్ ముకర్రమహ్ బయలుదేరారు. కాని అవిశ్వాసులు మక్కహ్లో కి రానివ్వకుండా ఆపివేసారు. ఇంకా ఈ క్రింది విషయాలపై ఒప్పందం చేసారు. 1. ప్రవక్త (స) వచ్చే సంవత్సరం ‘ఉమ్‌రహ్‌ చేస్తారు. 2. కేవలం మూడు రోజులు మాత్రమే మక్కహ్లో ఉంటారు. ఒప్పందం పత్రం వ్రాసినప్పుడు ప్రవక్త (స) ఇలా అన్నారు, ”అల్లాహ్ ప్రవక్త అయిన, ము’హమ్మద్‌ ఈ విషయాలపై ఒప్పందం చేసాడు.” అప్పుడు అవిశ్వాసులు ‘తమరిని, దైవప్రవక్తగా స్వీకరిస్తే ఆపడమూ ఉండదు, యుద్ధమూ జరుగదు. అందువల్ల ము’హమ్మద్‌ పదం తరువాత ప్రవక్త పదం వ్రాయకూడదు. మీరు ము’హమ్మద్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌, గనుక, అదే వ్రాయండి,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) నేను అల్లాహ్‌ ప్రవక్తను, మరియు ‘అబ్దుల్లాహ్‌ కుమారుడ్ని కూడా అని పలికి గుమస్తాతో అంటే అలీ (ర)తో రసూలుల్లాహ్‌ పదాన్ని చెరిపి వేయమని ఆదేశించారు. ‘అలీ (ర), తమరి పేరును వ్రాసిన తర్వాత చెరపలేనని అన్నారు. ప్రవక్త (స)కు చదవడం, వ్రాయడం రాదు. అందువల్ల ‘అలీ (ర) నుండి కలం తీసుకొని ము’హమ్మద్‌ బిన్ ‘అబ్దుల్లాబ్, ఈ ఒప్పందాన్ని స్వీకరిస్తున్నాడు అని వ్రాసారు. 1. వచ్చే సంవత్సరం ఆయుధాలను ఒరల్లో ఉంచి ప్రవేశిస్తారు. 2. మక్కహ్లో ప్రవేశించిన తర్వాత ఎవరైనా వారి వెంట వెళతానంటే వారిని తీసుకొని పోలేరు. ఒకవేళ వారిలో ఎవరైనా మక్కహ్లో ఉండిపోతానంటే వారిని ఆపలేరు. వచ్చే సంవత్సరం ఒప్పందం ప్రకారం మక్కహ్ వస్తే మూడు రోజులు మాత్రమే మక్కహ్లో ఉండగలరు. మూడవ రోజు పూర్తి కావటానికి కొంత సమయం ఉండగా అవిశ్వాసులు ‘అలీ (ర)తో, ‘నీ నాయకున్ని ఇక్కడి నుండి వెళ్ళిపోమను. సమయం కావస్తుంది,’ అని అన్నారు. ప్రవక్త (స) ఒప్పందం ప్రకారం మూడవ రోజు సంతోషంగా మదీనహ్ వైపు బయలుదేరారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

ప్రవక్త (స) వ్రాయడం మహిమగా ఏర్పడింది.

=====

10– بَابُ إِخْرَاجِ الْيَهُوْدِ مِنْ جَزِيْرَةِ الْعَرَبِ

10. అరబ్భూభాగం నుండి యూదుల బహిష్కర

చుట్టూ నీళ్ళు ఉన్న భూభాగాన్ని ద్వీపం అంటారు. అరబ్‌కి మూడు వైపుల నీరు ఉంది. అంటే ఇది ఒక ద్వీపం. ఈ భూభాగంలో అనేక జాతులు నివసించేవి. యూదులు, క్రైస్తవులుకూడా ఉండేవారు. వీళ్ళు భూమిపై ఉపద్రవాలు, కల్లోలాలు సృష్టించే వారు. చేసిన ఒప్పందాలను  భంగం చేసే వారు. ఇక్కడ శాంతి భద్రతలు వ్యాపింపజేయ టానికి వీరిని ఇక్కడి నుండి బహిష్కరించటమే మంచిది. క్రింది ‘హదీసు’ల్లో దీన్ని గురించే పేర్కొనడం జరిగింది.  

اَلْفَصْلُ الْأَوَّلُ    మొదటి విభాగం   

4050 – [ 1 ] ( متفق عليه ) (2/1186)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: بَيْنَا نَحْنُ فِي الْمَسْجِدِ خَرَجَ النَّبِيُّ صلى الله عليه وسلم فقَالَ: “اِنْطَلِقُوْا إِلى يَهُوْدَ”. فَخَرَجْنَا مَعَهُ حَتَّى جِئْنَا بَيْتَ الْمِدْارَسِ. فَقَامَ النَّبِيُّ صلى الله عليه وسلم فَقَالَ: “يَا مَعْشَرَ يَهُوْدَ أَسْلِمُوْا تَسْلَمُوْا اِعْلَمُوْا أَنَّ الْأَرْضَ لِلّهِ وَلِرَسُوْلِهِ وَأَنِّيْ أُرِيْدُ أَنْ أُجْلِيَكُمْ مِنْ هَذِهِ الْأَرْضِ. فَمَنْ وَجَدَ مِنْكُمْ بِمَالِهِ شَيْئًا فَلْيَبِعْهُ”.

4050. (1) [2/1186ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: మేము మస్జిద్‌లో కూర్చొని ఉన్నాము. ప్రవక్త (స) వచ్చి మాతో, ‘మీరందరూ నాతో పాటు యూదులవద్దకు పదండి,’ అని అన్నారు. మేము ప్రవక్త (స) వెంట యూదుల పాఠశాలలోనికి వెళ్ళాము. ప్రవక్త (స) వారి మధ్య నిలబడి వారితో, ‘ఓ యూదులారా! మీరు ముస్లిములై పోతే  బాగుంటుంది. మీ ధన ప్రాణాలకు రక్షణ ఉంటుంది. ఒకవేళ మీరు మీ ధర్మంపైనే ఉండాలనుకుంటే మీ ఇష్టం. ఈ భూభాగం అల్లాహ్‌ (త) మరియు ఆయన ప్రవక్తది. ఆయన ఎవరికైనా ప్రసాదించ వచ్చును. నేను మిమ్మల్ని ‘హిజా’జ్ భూభాగం నుండి మరో ‘అరబ్‌ ప్రాంతానికి మార్చాలని నిర్ణయించు కున్నాను. కనుక మీలో ఎవరైనా తన ధన సంపదల్లో దేన్నయినా అమ్మి వెళ్ళిపోవాలను కుంటే వెళ్ళి పోవచ్చు,’ అని  అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4051 – [ 2 ] ( صحيح ) (2/1186)

وَعَنِ ابْنِ عُمَرَقَالَ: قَامَ عُمَرُخَطِيْبًا فَقَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ عَامَلَ يَهُوْدَ خَيْبَرَ عَلَى أَمْوَالِهِمْ وَقَالَ: “نُقِرُّكُمْ مَا أَقَرَّكُمُ اللهُ”. وَقَدْ رَأَيْتُ إِجْلَاءَهُمْ فَلَمَّا أَجْمَعَ عُمَرُ عَلَى ذَلِكَ أَتَاهُ أَحَدُ بَنِيْ أَبِي الْحُقَيْقِ فَقَالَ: يَا أَمِيْرَ الْمُؤْمِنِيْنَ أَتُخْرِجُنَا وَقَدْ أَقَرَّنَا مُحَمَّدٌ وَعَامَلَنَا عَلَى الْأَمْوَالِ؟ فَقَالَ عُمَرُ: أَظَنَنْتَ أَنِّيْ نَسِيْتُ قَوْلَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: “كَيْفَ بِكَ إِذَا أُخْرِجْتَ مِنْ خَيْبَرَ تَعْدُوْ بِكَ قُلُوْصُكَ لَيْلَةً بَعْدَ لَيْلَةٍ؟” فَقَالَ: هَذِهِ كَانَتْ هُزَيْلَةً مِنْ أَبِي الْقَاسِمِ. فَقَالَ كَذَبْتَ يَا عَدُوَّ اللهِ فَأَجْلَاهُمْ عُمَرُ وَأَعْطَاهُمْ قِيْمَةَ مَا كَانَ لَهُمْ مِنَ الثَّمَرِ مَالًا وَإِبِلًا وَعَرُوْضًا مِنْ أَقْتَابِ وَحِبَالٍ وَغَيْرَ ذَلِكَ. رَوَاهُ الْبُخَارِيُّ .

4051. (2) [2/1186దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ‘ఉమర్‌ (ర) తన పరిపాలనా కాలంలో ప్రసంగించడానికి నిలబడ్డారు. తన ప్రసంగంలో ప్రవక్త (స) ‘ఖైబర్‌ యూదులతో ఎలా వ్యవహారం చేసారంటే ‘ఖైబర్‌ భూమిని పంటలు పండించమని వారికిఇచ్చి వాళ్ళనే వ్యవసాయం చేయమని అయితే పంటలో సగం ముస్లిములకు ఇవ్వమని ఆదేశించారు. అయితే ఇప్పుడు ఆ నిర్ణీత గడువు ముగుస్తుంది, అందువల్ల నేను మీకు మరోచోట పంపటానికి నిర్ణయించాను,’ అని అన్నారు. అప్పుడు అబిల్‌ హుఖైఖ్‌ తెగకు చెందన ఒక వ్యక్తి ‘ఉమర్‌ (ర) వద్దకు వచ్చి, ‘ఓ విశ్వాసుల నాయకుడా! మీరు మమ్మల్ని ఇక్కడి నుండి బహిష్కరించాలని అనుకుంటున్నారా? ప్రవక్త (స) మాకు ఇక్కడ ఉండమని, వ్యవసాయం చేసుకోమని ఆదేశించారు,’ అని అన్నాడు. దానికి ‘ఉమర్‌ (ర) ప్రవక్త (స) శాశ్వతంగా ఇలా నిర్ణయించలేదు. నిర్ణీత గడువువరకే ఇలా చేసారు. ఇప్పుడు ఆ గడువు పూర్తవుతుంది, ప్రవక్త (స) పలికిన ఆ భవిష్యవాణిని మరచిపోయానను కున్నారా? ప్రవక్త (స) మీ గురించి భవిష్యవాణి ఇలా పలికారు, ”అప్పుడు మీరు ‘ఖైబర్‌ నుండి బహిష్కరించబడి నపుడు ఎలా ఉంటుంది? మీరు ఆడ ఒంటెలపై కూర్చొని ఇక్కడి నుండి వెళతారు, మీ ఆడఒంటెలు మిమ్మల్ని తీసుకొని రాత్రికి రాత్రి వేగంగా పరిగెత్తుతూ తీసుకొని వెళతాయి,’ అని అన్నారు. అప్పుడు అబుల్‌ ‘హఖీఖ్‌ అనే వ్యక్తి, ‘అబుల్‌ ఖాసిమ్‌ ఇలా పరిహాసానికి మాత్రమే అన్నారు,’ అని అన్నాడు. దానికి ‘ఉమర్‌ (ర), ‘నీవు అసత్యం పలుకుతున్నావు,’ అని అన్నారు. ఏదైతేనేం ‘ఉమర్‌ (ర) వారిని బహిష్కరించారు. ఇంకా వారి పండ్లు మొదలైన వాటికి తగిన వెల ఇచ్చి వారిని సాగనంపారు. ఇంకా వారు వెళ్ళటానికి ఒంటెలకు కావలసిన త్రాళ్ళు కళ్ళాలు మొదలైన వాటిని సమకూర్చారు. (బు’ఖారీ)

4052 – [ 3 ] ( متفق عليه ) (2/1187)

وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَوْصَى بِثَلَاثَةٍ: قَالَ: “أَخْرِجُوا الْمُشْرِكِيْنَ مِنْ جَزِيْرَةِ الْعَرَبِ وَأَجِيْزُوا الْوَفْدَ بِنَحْوِ مَا كُنْتُ أُجِيْزُهُمْ”. قَالَ ابْنُ عَبَّاسٍ: وَسَكَتَ عَنِ الثَّالِثَةِ أَوْ قَالَ: فَأُنْسِيْتُهَا

4052. (3) [2/1187ఏకీభవితం]

ఇబ్ను ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) తాను మరణించటానికి కొన్ని దినాలు ముందు ఈ మూడు విషయాలను గురించి ఉపదేశించారు, 1. అవిశ్వాసులను అరబ్‌ భూభాగం నుండి తొలగించాలి. 2. రాజుల ప్రతినిధుల, రాయబారులపట్ల మంచిగా వ్యవహరించాలి. నేను చేసినట్టు. 3. మూడవ విషయం చెప్పలేదు, లేదా నేను మరచిపోయాను. (బు’ఖారీ, ముస్లిమ్‌)

కొందరి అభిప్రాయం: ‘ఆ మూడవ విషయం ఏమిటంటే నా సమాధిని  పూజా స్థలంగా చేయరాదు, అక్కడ జాతరలు జరగరాదు. ఉరుసులు మొదలైనవి చేయరాదు’ అని అన్నారు.

4053 – [ 4 ] ( صحيح ) (2/1187)

وَعَنْ جَابِرِبْنِ عَبْدِ اللهِ قَالَ: أَخْبَرَنِيْ عُمَرُ بْنُ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ أَنَّهُ سَمِعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَأُخْرِجَنَّ الْيَهُوْدَ وَالنَّصَارَى مِنْ جَزِيْرَةِ الْعَرَبِ حَتَّى لَا أَدَعَ فِيْهَا إِلَّا مُسْلِمًا”. رَوَاهُ مُسْلِمٌ.

وَفِيْ رِوَايَةٍ: “لَئِنْ عِشْتُ إِنْ شَاءَ اللهُ لَأُخْرِجَنَّ الْيَهُوْدَ وَالنَّصَارَى مِنْ جَزِيْرَةِ الْعَرَبِ”.

4053. (4) [2/1187దృఢం]

జాబిర్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: ‘ఉమర్‌ (ర) నాతో ఇలా అన్నారు, ”ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”మీరు నా మరణానంతరం యూదులను, క్రైస్తవులను ‘అరబ్‌ భూభాగం నుండి తీసి వేయండి. ముస్లిములు తప్ప మరెవరూ ఉండరాదు. ఒకవేళ నేను బ్రతికి ఉంటే, అల్లాహ్‌ కోరితే యూదులను, కైస్తవులను అరబ్‌ భూభాగం నుండి నేను తీసివేస్తాను.” (ముస్లిమ్‌)

—–

రెండవ విభాగం     اَلْفَصْلُ الثَّانِيْ

لَيْسَ فِيْهِ إِلَّا حَدِيْثُ ابْنُ عَبَّاسٍ: “لَا تَكُوْنُ قِبْلَتَانِ” وَقَدْ مَرَّ فِيْ بَابِ الْجِزْيَةِ.

ఈ భాగంలో ఇంతకు ముందు పేర్కొన్న ఇబ్నెఅబ్బాస్‌ ‘హదీసు’ వస్తుంది. అంటే ”ఒక భూభాగంపై రెండువర్గాలు ఉండలేవు.” ఇది జిజ్య అద్యాయంలో వచ్చింది.

—–

اَلْفَصْلُ الثَّالِثُ     మూడవ విభాగం

4054- [ 5 ] ( متفق عليه ) (2/1187)

عَنِ ابْنِ عُمَرَ: أَنَّ عُمَرَبْنَ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُمَا أَجْلَى الْيَهُوْدَ وَ النَّصَارَى مِنْ أَرْضِ الْحِجَازِ وَكَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَمَّا ظَهَرَ عَلَى أَهْلِ خَيْبَرَ أَرَادَ أَنْ يُخْرِجَ الْيَهُوْدَ مِنْهَا وَكَانَتِ الْأَرْضِ لَمَّا ظَهَرَ عَلَيْهَا لِلّهِ وَلِرَسُوْلِهِ وَلِلْمُسْلِمِيْنَ. فَسَأَلَ الْيَهُوْدُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَنْ يَتْركَهُمْ عَلَى أَنْ يَكْفُوا الْعَمَلَ وَلَهُمْ نِصْفُ الثَّمَرِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “نُقِرُّكُمْ عَلَى ذَلِكَ مَا شِئْنَا”. فَأُقِرُّوْا حَتَّى أَجْلَاهُمْ عُمَرُ فِيْ إِمَارَتِهِ إِلَى تَيْمَاءَ وَأَرِيْحَاءَ. متفق عليه.

4054. (5) [2/1187 ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ‘ఉమర్‌ (ర) యూదులను క్రైస్తవులను హిజాజ్ ప్రాంతం అంటే అరబ్‌ ద్వీపం నుండి బహిష్కరించారు. ఇంకా ప్రవక్త (స) ‘ఖైబర్‌ను జయించినపుడే యూదులను ‘ఖైబర్‌ నుండి బహిష్కరించాలని నిశ్చయించుకున్నారు. మీకు కూడా ఈ విషయం తెలుసు. అదేవిధంగా మీరు వ్యవసాయం చేస్తారని పంటలో సగం మీకు ఇస్తారని దానికి ఒక గడువు కూడా నిర్ణయించా రు. అయితే ఇప్పుడు ఆ గడువు పూర్తయ్యింది. అందువల్ల నేను మీకు తైమా మరియు రైహాల వైపు బహిష్కరిస్తున్నాను,’ అని అన్నారు.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

=====

11– بَابُ الفَيْءِ

11. యుద్ధం జరగకుండా లభించే ధనం (ఫై‘)

తఫ్‌సీర్‌ ఇబ్నె కసీ’ర్‌లో ఇలా ఉంది. మాలె ఫై అంటే అవిశ్వాసులతో యుద్ధం జరగకుండా లభించేది. ఉదా: వారితో ఒప్పందం కుదుర్చుకొని కొంత ధనం పరిహారంగా వసూలు చేయటం. లేదా యజమాని లేని ధనం, వారసుడు లేని ధనం లేదా పన్ను మొదలైనవి. ఇమామ్‌ షాఫ’యీ ఇంకా ఇతర పండితుల అభిప్రాయం ఇదే:

మరియు అల్లాహ్‌ తన ప్రవక్తకు, వారి నుండి ఇప్పించిన  ఫయ్ కొరకు, మీరు గుర్రాలను గానీ ఒంటెలను గానీ పరిగెత్తించలేదు. కాని అల్లాహ్‌ తాను కోరిన వారిపై, తన సందేశహరునికి ఆధిక్యత నొసంగుతాడు. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు. అల్లాహ్ తన ప్రవక్తకు ఆ నగరవాసుల నుండి ఇప్పించిన దానిలో (ఫయ్లో), అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు మరియు అతని దగ్గరి బంధువులకు మరియు అనాథులకు మరియు పేదలకు మరియు బాటసారులకు హక్కు ఉంది. అది మీలో ధనవంతులైన వారి మధ్యనే తిరగ కుండా ఉండటానికి, ఇలా నిర్ణయించబడింది. మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు అతను మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి. అల్లాహ్‌ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ శిక్షించటంలో చాలా కఠినుడు. ”   (అల్‌ హష్‌ర్‌. 59: 67)

اَلْفَصْلُ الْأَوَّلُ    మొదటి విభాగం   

4055 – [ 1 ] ( متفق عليه ) (2/1188)

عَنْ مَالِكِ بْنِ أَوْسِ بْنِ الْحَدَثَانِ قَالَ : قَالَ عُمَرُ بْنُ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ : إِنَّ اللهَ قَدْ خَصَّ رَسُوْلَهُ صلى الله عليه وسلم فِيْ هَذَا الْفَيْءِ بِشَيْءٍ لَمْ يُعْطِهِ أَحَدًا غَيْرَهُ ثُمَّ قَرَأَ (مَا أَفَاءَ اللهُ عَلَى رَسُوْلِهِ مِنْهُمْ) إِلى قَوْلِهِ (قَدِيْرٌ) فَكَانَتْ هَذِهِ خَالِصَةٍ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يُنْفِقُ عَلَى أَهْلِهِ نَفَقَةَ سَنَتِهِمْ مِنْ هَذَا الْمَالِ . ثُمَّ يَأْخُذُ مَا بَقِيَ فَيَجْعَلُهُ مَجْعَلَ مَالِ اللهِ .

4055. (1) [2/1188 ఏకీభవితం]

మాలిక్‌ బిన్‌ ఔస్‌బిన్‌ హదసాన్‌ కథనం: ఉమర్‌ (ర)  ఇలా అన్నారు, ”అల్లాహ్‌ (త) ఈ ధనంలో తన ప్రవక్త కొరకు ఒక ప్రత్యేక వంతు నిర్ణయించాడు. మరెవరికీ ఇవ్వలేదు. ఆ తరువాత దాన్ని పఠించారు. ఈ ధనం ప్రవక్త (స)కు ప్రత్యేకించడం జరిగింది. ఈ వంతునుండే తన భార్యా బిడ్డలకు సంవత్సరం ఖర్చంతా ఇచ్చేసే వారు. మిగిలిన ధనాన్ని అల్లాహ్‌ మార్గంలో ఖర్చుపెట్టే వారు. (బుఖారీ, ముస్లిమ్‌) తరువాతి వాక్యాల్లో దీని అర్హత గలవారి గురించి పేర్కొనడం జరిగింది.

” (దానిలో నుండి కొంత భాగంపై) తమ ఇండ్ల నుండి మరియు తమ ఆస్తిపాస్తుల నుండి వెడలగొట్టబడి, వలస వచ్చిన (ముహాజిర్లకు) పేదవారికి కూడా హక్కు ఉంది. వారు అల్లాహ్‌ అనుగ్రహాన్ని మరియు ఆయన ప్రసన్నతను కోరుతున్నారు. మరియు వారు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకు సహాయం చేస్తున్నారు. ఇలాంటి వారు, వీరే సత్యవంతులు. మరియు ఎవరైతే – ఈ (వలస వచ్చినవారు) రాక పూర్వమే – విశ్వసించి వలస కేంద్రం (మదీనహ్)లో నివసిస్తూ ఉండేవారో! వారికి కూడా హక్కువుంది.   వారు తమ వద్దకు వలస వచ్చిన వారిని ప్రేమిస్తారు. మరియు వారు (వలసవచ్చిన) వారికి ఏది ఇవ్వ బడినా! దాని అవసరం తమకు ఉన్నట్లు భావించరు. మరియు తమకు అవసరమున్నా వారికి తమ సొంత (అవసరాల) మీద ప్రాధాన్యతనిస్తారు. మరియు ఎవరైతే ఆత్మలోభం నుండి రక్షింపబడతారో! అలాంటివారు, వారే! సాఫల్యం పొందేవారు. మరియు ఎవరైతే వారి తరువాత వచ్చారో! వారికి అందులో హక్కుఉంది. వారు ఇలా అంటారు: “ఓ మా ప్రభూ! మమ్మల్ని మరియు మాకంటే ముందు విశ్వసించిన మా సోదరులను క్షమించు. మరియు మా హృదయాలలో విశ్వాసులపట్ల ద్వేషాన్ని కలిగించకు.   ఓ మా ప్రభూ! నిశ్చయంగా, నీవు చాలా కనికరించే వాడవు, అపార కరుణాప్రదాతవు!”  (అల్‌ హష్ర్‌, 59:8-10)

4056 – [ 2 ] ( متفق عليه ) (2/1188)

وَعَنْ عُمَرَ قَالَ: كَانَتْ أَمْوَالُ بَنِي النَّضِيْرِ مِمَّا أفَاءَ اللهُ عَلَى رَسُوْلِهِ مِمَّا لَمْ يُوْجِفِ الْمُسْلِمُوْنَ عَلَيْهِ بِخَيْلٍ وَلَا رِكَابٍ فَكَانَتْ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم خَالِصَةً يُنْفِقُ عَلَى أَهْلِهِ نَفَقَةَ سَنَتِهِمْ ثُمَّ يَجْعَلُ مَا بَقِيَ فِي السِّلَاحِ وَالْكُرَاعِ عُدَّةً فِيْ سَبِيْلِ اللهِ .

4056. (2) [2/1188 ఏకీభవితం]

ఉమర్‌ (ర) కథనం: బనూ నజీర్ ధనం ఆ లభించిన ధనంలోనిదే. అల్లాహ్‌ (త) దాన్ని తన ప్రవక్త (స)కు ప్రసాదించాడు. దీన్ని గురించి ముస్లిముల గుర్రాలు పరిగెత్త లేదు, ఒంటెలు పరిగెత్తలేదు. అంటే యుద్ధం చేయకుండానే లభించింది. ఈ ధనం ప్రత్యేకంగా ప్రవక్త (స)కు చెందింది. ఇందులో నుండే ప్రవక్త(స) తన భార్యాబిడ్డల కొరకు ఖర్చుచేసేవారు. మిగిలిన ధనాన్ని ప్రజా సంక్షేమనిధిలో వేసి ఆయుధాలు కొనేవారు.

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం 

4057 – [ 3 ] ( لم تتم دراسته ) (2/1188)

عَنْ عَوْفِ بْنِ مَالِكٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ إِذَا أَتَاهُ الْفَيْءُ قَسَمَهُ فِيْ يَوْمِهِ فَأَعْطَى الْآهِلَ حَظَّيْنِ وَأَعْطَى الْأَعْزَبَ حَظّا فَدُعِيْتُ فَأَعْطَانِيْ حَظَّيْنِ وَكَانَ لِيْ أَهْلٌ ثُمَّ دُعِيَ بَعْدِيْ عَمَّارُ بْنُ يَاسِرٍ فَأُعِطْيَ حَظًّا وَاحِدًا. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4057. (3) [2/1188 అపరిశోధితం]

‘ఔఫ్‌ బిన్‌ మాలిక్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఏ రోజు ఈ ధనం వస్తే ఆ రోజే పంచిపెట్టేవారు. భార్యా బిడ్డలు గల వారికి రెండువంతులు ఇచ్చేవారు. లేని వారికి ఒక వంతు ఇచ్చే వారు. నన్ను పిలిచి రెండువంతులు ఇచ్చారు. ఎందుకంటే నేను భార్యాబిడ్డలు గలవాడిని, నా తరువాత ‘అమ్మార్‌ను పిలిచి ఒకవంతు ఇచ్చారు. (అబూ  దావూద్‌)

4058 – [ 4 ] ( لم تتم دراسته ) (2/1189)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَوَّلَ مَا جَاءَهُ شَيْءٌ بَدَأَ بِالْمُحَرَّرِيْنَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4058. (4) [2/1189అపరిశోధితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ధనం వస్తే ప్రవక్త (స) అందరి కంటే ముందు విడుదల అయిన బానిసలకు, బానిస స్త్రీలకు ఇవ్వటం నేను చూసాను. (అబూ దావూద్‌)

4059 – [ 5 ] ( لم تتم دراسته ) (2/1189)

وَعَنْ عَائِشَةَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أُتِيَ بِطَبْيَةِ فِيْهَا خَرَزٌ فَقَسَمَهَا لِلْحُرَّةِ وَالْأَمَةِ قَالَتْ عَائِشَةُ: كَانَ أَبِيْ يَقْسِمُ لِلْحُرِّ وَالْعَبْدِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4059. (5) [2/1189అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక సంచి తీసుకురావటం జరిగింది. అందులో వజ్రాలు ఉన్నాయి. ప్రవక్త (స) వాటిని విడుదల అయిన బానిస స్త్రీ పురుషులలో పంచివేసారు. మా నాన్నగారైన అబూ బకర్‌ (ర) కూడా తన పరిపాలనా కాలంలో ఇటువంటి ధనాన్ని బానిసల్లో, విడుదల అయిన వారిలో పంచివేసే వారు.  (అబూ దావూద్‌)

4060 – [ 6 ] ( لم تتم دراسته ) (2/1189)

وَعَنْ مَالِكِ بْنِ أَوْسِ بْنِ الْحَدَثَانِ قَالَ: ذَكَرَ عُمَرُ بْنُ اْلْخَطَّابِ يَوْمًا اَلْفَيْءَ فَقَالَ: مَا أَنَا أَحَقُّ بِهَذَا الْفَيْءِ مِنْكُمْ وَمَا أَحَدٌ مِّنَّا بِأَحَقَّ بِهِ مِنْ أَحَدٍ إِلَّا أَنَا عَلَى مَنَازِلِنَا مِنْ كِتَابِ اللهِ عَزَّ وَجَلَّ وَقَسْمِ رَسُوْلِهِ صَلى الله عليه وسلم فَالرَّجُلُ وَقِدَمُهُ وَالرَّجُلُ وَبَلَاؤُهُ وَالرَّجُلُ وَعِيَالُهُ وَالرَّجُلُ وَحَاجَتُهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4060. (6) [2/1189 అపరిశోధితం]

మాలిక్‌ బిన్‌ ఔస్‌ బిన్‌ ‘హదసా’న్‌ కథనం: ‘ఉమర్‌ (ర) ఒకసారి ఇటువంటి ఫైఅ’ ధనాన్ని గురించి ప్రస్తావిస్తూ మాలో ఒక ఎక్కువ హక్కు గలవారని, ఒకరు మరొకరి కంటే అధిక హక్కుగలవారని ఎంతమాత్రం కాదు. ఖుర్‌ఆన్‌ ప్రకారం, ప్రవక్త (స) పంచే విధానాన్నిబట్టి మా కోసం కొన్ని రకాలు, కొన్ని స్థానాలు ఉన్నాయి. వారిలో అందరికంటే ముందు ఇస్లామ్‌ స్వీకరించిన వ్యక్తి, వీరోచితంగా పోరాడేవ్యక్తి, భార్యాపిల్లలుగల వ్యక్తి.[100]  (అబూ  దావూద్‌)

4061 – [ 7 ] ( لم تتم دراسته ) (2/1189)

وَعَنْهُ قَالَ: قَرَأَ عَمَرُ بْنُ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ: (إِنَّمَا الصَّدَقاَتُ لِلْفُقَرَاءِ وَالْمَسَاكِيْنَ) حَتّى بَلَغَ (عِلِيْمٌ حَكِيْمٌ ؛ 9:60) فَقَالَ: هَذِهِ لِهَؤُلَاءِ. ثُمَّ قَرَأَ (وَاعْلَمُوْا أَنَّ مَا غَنِمْتُمْ مِنْ شَيْءٍ فَأَنّ لِلّهِ خُمُسَهُ وَلِلرَّسُوْلِ) حَتَّى بَلَغَ (وَابْنِ السَّبِيْلِ؛8:41) ثُمَّ قَالَ: هَذِهِ لِهَؤُلَاءِ. ثُمَّ قَرَأَ (مَا أَفَاءَ اللهُ عَلَى رَسُوْلِهِ مِنْ أَهْلِ الْقُرَى) حَتَّى بَلَغَ (لِلْفُقَرَاءِ؛ 59:7) ثُمَّ قَرَأَ (وَالَّذِيْنَ جَاؤُوْا مِنْ بَعْدِهِمْ؛ 59:10) ثُمَّ قَالَ: هَذِهِ اسْتَوعَبَتِ الْمُسْلِمِيْنَ عَامَّةً فَلَئِنْ عِشْتُ فَلْيَأْتِيَنَّ الرَّاعِيَ وَهُوَ بِسَرْوِ حِمْيَرَ نَصِيْبُهُ مِنْهَا لَمْ يَعْرَقْ فِيْهَا جَبِيْنَهُ. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ .

4061. (7) [2/1189 అపరిశోధితం]

మాలిక్‌ బిన్‌ ఔస్‌ కథనం: ఉమర్‌ (ర) ”ఇన్న మస్సదఖాతు లిల్‌ ఫుఖరాయి వల్‌ ముహాజిరీన” నుండి ”అలీమున్‌ హకీమ్,” (అత్ తౌబహ్, 9:60) వరకు పఠించి, ‘జకాత్‌ వీరికొరకే అని పలికిన తర్వాత, ”వ అ’అలమూ నుండి ఇబ్నుస్సబీల్‌ (అల్ అన్ఫాల్, 8:41), వరకు పఠించి యుద్ధ ధనం వీరి కొరకే అని పఠించి, ఆ తరువాత, ”మా అఫా’ అల్లాహు” నుండి బ’అదిహిమ్‌” (అల్ ‘హష్ర్, 59:6-10), వరకు. ‘ఇది ఫైఅధనం, ఇది ముస్లిము లందరికీ లభిస్తుంది, ఈ ఆయతు ద్వారా అందరూ హక్కు గలవారు. ఒకవేళ నేను బ్రతికుంటే బిస్ర్ ‘హమీర్ ప్రాంతంలో ఉన్న ఒంటెల, గొర్రెల కాపరులకు ఇంకా నుదుటిపై చెమట రానివారికి కూడా వంతు లభిస్తుంది,’ అని అన్నారు.[101] (షర్‌హు స్సున్నహ్‌)

4062 – [ 8 ] ( لم تتم دراسته ) (2/1190)

وَعَنْهُ قَالَ: كَانَ فِيْمَا احْتَجَّ فِيْهِ عُمَرُ أَنَّ قَالَ: كَانَتْ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم ثَلَاثُ صَفَايَا بَنُو النَّضِيْرِ وَ خَيْبَرُ وَفَدَكُ فأَمَّا بَنُوْ النَّضِيْرِ فَكَانَتْ حُبْسًا لِنَوَائِبِهِ وَأَمَّا فَدَكُ فَكَانَتْ حُبْسًا لِأَبْنَاءِ السَّبِيْلِ وَأَمَّا خَيْبَرُ فَجَزَأَهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ثَلَاثَةَ أَجْزَاءٍ: جُزْأَيْنِ بَيْنَ الْمُسْلِمِيْنَ وَجُزْءَ نَفَقَةً لِأَهْلِهِ فَمَا فَضَلَ عَنْ نَفْقَةِ أَهْلِهِ جَعَلَهُ بَيْنَ فُقَرَاءِ الْمُهَاجِرِيْنَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ

4062. (8) [2/1190అపరిశోధితం]

మాలిక్‌ బిన్‌ ఔస్‌ కథనం: ప్రవక్త (స)కు ఈ మూడు ఆదాయాలు ఉండేవి. 1. బనూ దీర్ 2. ‘ఖైబర్ 3. ఫదక్. ‘ఉమర్‌ (ర) ఈ మూడు ఆదాయాల నుండి ‘అలీ (ర)ను, ‘అబ్బాస్‌ (ర)ను ఏం కోరారంటే బనూ న’దీర్‌ భూమి మొద లైన వాటి నుండి వచ్చే రాబడి ద్వారా ప్రవక్త (స) వద్దకు వచ్చే అతిథులకు, యుద్ధసామగ్రికి వినియోగించబడేది. మరియు ‘ఖైబర్‌ రాబడిని ప్రవక్త (స) మూడు భాగాలుగా విభజించారు. రెండు వంతులను ముస్లిములపై ఖర్చుచేసే వారు. ఒక వంతు తన భార్యాబిడ్డలపై ఖర్చుచేసేవారు. మిగిలింది ముహాజిరీన్లపై, అవసరార్థులపై ఖర్చుచేసే వారు.[102] (అబూ  దావూద్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం 

4063 – [ 9 ] ( لم تتم دراسته ) (2/1190)

عَنِ الْمُغِيْرَةَ قَالَ: إِنَّ عُمَرَ بْنَ عَبْدِ الْعَزِيْزِ جَمَعَ بَنِيْ مَرْوَانَ حِيْنَ اسْتُخْلِفَ فَقَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَتْ لَهُ فَدَكُ فَكَانَ يُنْفِقُ مِنْهَا وَيَعُوْدُ مِنْهَا عَلَى صَغِيْرِ بَنِيْ هَاشِمٍ وَيُزَوِّجُ مِنْهَا أَيِمَّهُمْ وَإِنَّ فَاِطمَةَ سَأَلَتْهُ أَنْ يَّجْعَلَهَا لَهَا فَأَبَى فكَانَتْ كَذَلِكَ فِيْ حِيَاةِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ حَيَاتِهِ حَتَّى مَضَى لِسَبِيْلِهِ فَلَمَّا وُلِّيَ أَبُوْ بَكْرٍ عَلِمَ فِيْهَا بِمَا عَمِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ حَيَاتِهِ حَتَّى مَضَى لِسَبِيْلِهِ فَلَمَّا أَنْ وُلِّيَ عُمَرُ بْنُ الْخَطَّابِ عَمِلَ فِيْهَا بِمِثْلِ مَا عَمِلًا حَتَّى مَضَى لِسَبِيْلِهِ ثُمَّ اقْتَطَعَهَا مَرْوَانُ ثُمَّ صَارَتْ لِعُمَرَ بْن عَبْدِ الْعَزِيْزِ فَرَأَيْتُ أَمْرًا مَنَعَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَاطِمَةَ لَيْسَ لِيْ بِحَقٍّ وَإِنِّيْ أُشْهِدُكُمْ أَنِّيْ رَدَدْتُّهَا عَلَى مَا كَانَتْ. يَعْنِيْ عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وأَبِيْ بَكْر وَعُمَرَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4063. (9) [2/1190 అపరిశోధితం]

ముగీరహ్‌ (ర) కథనం: ఉమర్బిన్‌ ‘అబ్దుల్ జీజ్ ‘ఖలీఫహ్ అయిన తర్వాత, సింహాసనంపై కూర్చోగానే మర్వాన్కుమారులను పిలిచి, ఒకచోట చేర్చి, ఫదక్‌ భూమి కేవలం ప్రవక్త (స)కు చెందినదని, ఆ భూమి నుండి రాబడి ద్వారా ప్రవక్త (స) బనూ హాషిమ్‌, ఇతర రుణగ్రస్తులపై ఖర్చుచేసేవారని, ఇంకా వారి వితంతువులకు, అనాథులకు వివాహం చేసేవారు. ఇంకా పేదలకు, అక్కర గలవారికి సహాయం చేసేవారు. ఫాతిమహ్ (ర) అందులో నుండి ప్రవక్త (స)ను కోరగా ప్రవక్త (స) ఇవ్వలేదు. ప్రవక్త (స) కాలంలో ఆ భూమి రాబడి రుణగ్రస్తులపై, అనాథులపై, పేదలపై ఖర్చు చేయ బడేది. చివరికి ప్రవక్త (స) ఈ లోకం నుండి పరమ పదించారు. ఈ భూమి ఒకరి తర్వాత ఒకరి ఖలీఫాల చేతుల్లోకి వచ్చింది. వీరు కూడా ప్రవక్త (స) పద్ధతి ప్రకారమే చేసేవారు. ఆ తరువాత ఆ భూమి మర్వాన్‌ అధీనంలోనికి వచ్చింది. ఆ తర్వాత మర్వాన్వారసులు వారసత్వ సంపదగా దాన్ని ఆక్రమించు కున్నారు. దాన్ని విభజించి తమ తమ వంతులుగా తీసుకున్నారు. మర్వాన్‌ మరణా నంతరం ఈ భూమి ‘ఉమర్‌ బిన్‌ ‘అబ్దుల్‌’అ’జీ’జ్‌ అధీనంలోకి వచ్చింది. ఏ భూమినైతే ప్రవక్త (స) తన కుమార్తెకు కూడా ఇవ్వలేదో, దానిపై ఎవరికీ ఎటువంటి హక్కులేదు. నేను మీకు సాక్షులుగా పెట్టి ఈ భూములను ప్రవక్త (స) కాలంలో ఏ స్థితిలో ఉండేవో ఆ స్థితిలోనే వదలిపెడు తున్నాను. ఇవి అల్లాహ్‌ (త)కు చెందినవి. దీనికి ఎవరూ యజమానులు కారు”  అని అన్నారు.[103]   (అబూ  దావూద్‌)

*****


[1]) వివరణ-3787: ఈ ‘హదీసు’ ద్వారా విశ్వసించి నమా’జు, ఉపవాసాలు పాటిస్తే స్వర్గంలో ప్రవేశించే అర్హత లభిస్తుందని తెలిసింది. ‘హజ్‌ గురించి ఇందులో ప్రస్తావించబడలేదు. అప్పటికి ‘హజ్‌ విధి అయి ఉండక పోవచ్చు. లేదా ‘హజ్‌ ముస్లిము లందరిపై విధికాదు, కేవలం ధనవంతులపైనే. జిహాద్‌ కూడా ఫర్జె కిఫాయ. అందరిపై విధికాదు. ముజాహిదీన్లకు గొప్ప గొప్ప తరగతులు ఉన్నాయి. ఈ ‘హదీసు’లో ఇంకా ఇతర ‘హదీసు’ల్లో పేర్కొనడం జరిగింది.

[2]) వివరణ-3791: అంటే అల్లాహ్‌(త) మార్గంలో ముస్లిముల ధన, ప్రాణ, మానాలను రక్షించటం. శత్రువులు రాకుండా కాపలా కాయటం ప్రపంచంలోని వస్తువులన్నింటి కంటే శ్రేష్ఠం. సుబ్హానల్లాహ్‌!’ అల్లాహ్‌ (త) ధర్మం కోసం ప్రయత్నించటం, కృషి చేయటం ఎంత గొప్ప మహా భాగ్యం!

[3]) వివరణ-3796: అంటే దుర్మార్గులకు, చెడులకు దూరంగా ఉంటూ జీవితం గడుపుతాడు. ఇతరులకు హాని చేకూర్చడు. అతనికి ఎవరూ హాని తలపెట్టలేరు. అంటే మొదటి స్థానంలో ముజాహిద్‌ ఫీ సబీలిల్లాహ్‌, రెండవ స్థానంలో ఇటువంటి భక్తుడు.

[4]) వివరణ-3801: అంటే తీర్పుదినం వరకు జిహాద్‌ కొనసాగుతుంది. ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ముస్లిముల వర్గాలు జిహాద్‌ చేస్తూ ఉంటాయి.

[5]) వివరణ-3816: అంటే అంధులు, వికలాంగులు, కుంటి వారు, మూగవారు, ఒకవేళ వీరు ఇలా కాకపోతే శారీర కంగా ఆరోగ్యంగా ఉంటే మీతో పాటు యుద్ధంలో పాల్గొనే వారు. కాని జిహాద్‌లో పాల్గొనేవారి స్థానం గొప్పది. అల్లాహ్‌ ఆదేశం: ”తమధనాన్ని, ప్రాణాన్ని వినియోగించి ధర్మ యుధ్ధం (జిహాద్) చేసేవారి స్థానాన్ని అల్లాహ్‌! ఇంట్లో కూర్చుండిపోయే వారి స్థానంకంటే, ఉన్నతం చేశాడు.” (బు’ఖారీ)

[6]) వివరణ-3821: ధన, ప్రాణాలతో జిహాద్‌ చేయడం అంటే ఈ రెండు అవసరమైనప్పుడు జిహాద్‌ కోసం ఈ రెంటిని త్యాగం చేయాలి. అదేవిధంగా నోటిద్వారా జిహాద్‌ చేయడం అంటే విగ్రహారాధకులను విగ్రహారాధన నుండి వారించాలి. అంటే మంచిని ఆదేశించాలి, చెడును నిర్మూలించాలి. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అవిశ్వాసులను శపించాలి. వారికి వ్యతిరేకంగా దుఆయె ఖునూత్పఠించాలి.

[7]) వివరణ-3825: వాఖ్నాఖహ్ అంటే ఒంటె పాలు ఒకసారి పితికి, మళ్ళీ మరోసారి పితకడానికి మధ్య గల సమయం.

[8]) వివరణ-3861: అంటే ఈ ఆయతులో శక్తి అంటే విసరటం అని అర్థం. అది తుపాకి అయినా, గుండు అయినా, మషీన్‌ గన్‌ అయినా, బాంబు అయినా, రాకెట్‌ అయినా ఇవన్నీ యుద్ధ బలగం క్రిందికే వస్తాయి.

[9]) వివరణ-3862: అంటే ఆ విజయం తరువాత ఎల్లప్పుడూ మీరు జిహాద్‌కు సంసిద్ధులై ఉండాలి. ఒకవేళ ఇటువంటి విజయం తరువాత మీరు ఆధిక్యత కోల్పోతే, ఆ అహంకారం మూలంగా సోమరితనానికి గురయితే, మీ విజయం ఓటమిగా మారిపోతుంది.

[10]) వివరణ-3866: అంటే జిహాద్‌ గుర్రాలు ఉభయ లోకాల్లోనూ శుభాన్ని తెచ్చి పెడతాయి.

[11]) వివరణ-3867: అంటే గుర్రంపై జిహాద్‌ చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. యుద్ధ ధనం కూడా లభిస్తుంది. ఈ పరంపర తీర్పుదినం వరకు కొనసాగుతుంది.

[12]) వివరణ-3870: ‘దిమార్‌ అంటే పలుచని, బక్క చిక్కిన, అంటే బక్కచిక్కిన గుర్రాన్ని పరిగెత్తించటానికి తయారు చేయటం. అంటే ముందు దాన్ని బాగా తినిపించి దొడ్డుగా చేస్తారు. ఆ తరువాత ఆహారం తగ్గించి నడక, పరిగెత్తటం నేర్పటానికి మైదానంలో పరిగెత్తించి బక్కపలుచగా చేస్తారు. అప్పుడది సన్నగా శక్తిమంతంగా తయారవుతుంది. ఇటువంటి గుర్రాలు చాలా వేగవంతంగా ఉంటాయి. యుద్ధంలో చాలా పనికి వస్తాయి. ఇలా కాని గుర్రాలు దూరం వరకు పరిగెత్తలేవు. దీనివల్ల తెలిసిన విషయం ఏమిటంటే జిహాద్‌ కోసం శిక్షణ ఇవ్వటానికి, గుర్రపు పందాలు పెట్టటం మంచిదే. ఇందులో షరతులు పందాలు జూదం మొదలైనవి జరుగవు. ఒకవేళ ఉంటే ఇటువంటివి ధర్మం కావు.

[13]) వివరణ-3871: అంటే ప్రతి వస్తువు ముందుకు వెళ్తుంది, వెనుకకు వస్తుంది. ముందుకెళ్ళే ప్రతి వస్తువు వెనుక కూడా వెళుతుంది. నా ఒంటె వెనుక వెళ్ళటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇది దైవ నియమమని అన్నారు.

[14]) వివరణ-3874: అంటే ఇతరుల కంటే ముందుకు వెళ్ళడం. అంటే పోటీలు, మూడు విషయాల్లో అనే షరతు పెట్టటం సరైనదే. ఒంటె, గుర్రం మరియు బాణాలు. ఇప్పుడు బాణాల స్థానంలో తుపాకులు, పిస్తోలు మొదలైనవి వచ్చేసాయి. ముస్లిములు వీరత్వంలో ఇతరుల కంటే తక్కువేమీ కాదు. అయితే అజ్ఞానం, విలాసాలకు బానిసలవటం వల్ల నాశనమవుతున్నారు. ఇతర జాతులు, విద్యలో, శాస్త్ర పరిజ్ఞానంలో చాలా అభివృద్ధి చెందారు, ఆధునిక ఆయుధాలు తయారు చేసారు. ముస్లిములకు ఇవి తెలియవు. ముస్లిములు పరస్పరం సహాయ సహకారాలు అందించుకోరు. ముస్లిములు అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఒకరినొకరు శత్రువులుగా భావిస్తున్నారు. ముస్లిముల పరిస్థితి ఇలా ఉంటే, వారి శక్తి ఎలా పనికి వస్తుంది. ప్రతి జాతి యొక్క ధార్మిక, ప్రాపంచిక అభివృద్ధి వారి సద్గుణాలపై ఆధారపడి ఉంటుంది. ముస్లిములు విద్య నభ్యసించ నంత వరకు ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకో లేరు. తమ ధర్మంపై నడవలేరు. అంతవరకు హీన, నీచమైన స్థితి నుండి బయటకు రాలేరు.

[15]) వివరణ-3875: ఈ మూడవ వ్యక్తిని ముహల్లిల్ అంటారు. అంటే పందాన్ని ధర్మసమ్మతం చేసేవాడు. పందెంలో రూపాయిలు ఒకవేళ వినోదం కోసం లేదా ఒక వైపు పందెంగాపెడితే ఎటువంటి అభ్యంతరంలేదు. రెండు వైపులా పందెం ఉంటే ముహల్లిల్‌ లేకుండా అది చెల్లదు.

[16]) వివరణ-3876: బ్‌, బ్ ‘జకాత్‌ అధ్యాయం లో కూడా ఉన్నాయి. వీటిని గురించి కితాబు’జ్జకాత్‌లో పేర్కొనటం జరిగింది. ఇవి గుర్రపు పందాలలో కూడా ఉన్నాయి. గుర్రపు పందాలలో జలబ్‌ అంటే తన గుర్రం వెనుక ఒక మనిషిని నియమించడం, అతడు దాన్ని తోలుతూ ఉంటాడు, అది ముందుకు పోవాలని. అదే విధంగా గుర్రపు పందాలలో జనబ్‌ అంటే ఒక గుర్రాన్ని తన గుర్రం వెనుక ఉంచటం, తాను ఉన్న గుర్రం అలసి పోతే దీనిపై నుండి దిగి దానిపై ఎక్కి కూర్చోవడం, అది ముందుకు పోవాలని. ఇలా చేయడం ధర్మం కాదు.

[17]) వివరణ-3877: అంటే అన్నిటికంటే ఉత్తమమైన గుర్రం నల్లగా ఉండి నుదుటిపై తెల్లదనం ఉంటుంది. పై పెదాలు కూడా తెల్లగా ఉంటాయి. ఇటువంటి గుర్రం ఉత్తమ గుర్రంగా పరిగణించబడుతుంది. రెండవది అఖ్‌రహ్-ముహజ్జల్‌ అంటే నుదుటిపై తెల్లదనం ఉండి, దాని కాళ్ళూ చేతులు కూడా తెల్లగా ఉంటాయి. కాని కుడిచేయి తెల్లగా ఉండదు.

[18]) వివరణ-3878: అష్‌ఖర్‌ ఎర్రగా ఉండే గుర్రాన్ని అంటారు. కమీత్‌ ఏమిటంటే కమీత్‌ తోక నల్లగా, అష్‌ఖర్‌ది ఎర్రగా ఉంటాయి.

[19]) వివరణ-3881: అంటే గుర్రాల మెడలలో హారాలు వేయవచ్చును. కాని తాయెత్తులు, తావీజులు వేయరాదు. అజ్ఞానకాలంలో దిష్టి తగలకుండా ఉండటానికి తావీజులు, తాయెత్తులు కట్టేవారు. అయితే ఈ తాయెత్తులు దైవనిర్ణయాలను మార్చలేవు. తావీజులు కూడా ఇలాంటివే. చాలా మంది ప్రజలు తావీజులు, తాయెత్తులు ధరిస్తూ ఉంటారు. ఇది ఎంతమాత్రం ధర్మసమ్మతం కాదు.

[20]) వివరణ-3882: అంటే ప్రత్యేకంగా ఈ మూడు విషయాల పట్ల మాకు ఆదేశించేవారు. పరిపూర్ణంగా వు’దూ చేయడం అందరికీ వర్తిస్తుంది. కాని, మాకు మరీ శ్రద్ధాశక్తులతో వు’దూ చేయమని ఆదేశించారు. రెండవది దానధర్మాలు స్వీకరించటం కూడా మాకు తగని పని. మూడవది గుర్రంపై గాడిద ద్వారా జతకట్టిస్తే కంచర గాడిద జన్మిస్తుంది. దీన్ని గురించి కూడా అందరినీ వారించడం జరిగింది. అయితే, మమ్మల్ని ప్రత్యేకంగా వారించడం జరిగింది.

[21]) వివరణ-3883: అంటే ఇటువంటి పని అజ్ఞానులే చేస్తారు. నీకు ధార్మిక విషయాలన్నీ తెలుసు. కనుక నీకు ఇది తగదు.

[22]) వివరణ-3884: దీనివల్ల వెండిని పురుషులు ఉపయోగించ వచ్చని తెలిసింది.

[23]) వివరణ-3892: తబూక్‌ అంటే సవూది అరేబియా లోని ఒక ప్రదేశం పేరు. మదీనహ్ నుండి నెల రోజుల ప్రయాణం. ఈ యుద్ధం మంచి ఎండ కాలంలో 9 హిజ్రీలో జరిగింది.

[24]) వివరణ-3893: ఒంటరిగా ప్రయాణం చేయటంలో సామాన్య ఆహార భద్రతలో చాలా ఆటంకాలు ఎదురవు తాయి. అందువల్ల ప్రయాణంలో కనీసం ముగ్గురు తోడుగా ఉండాలి.

[25]) వివరణ-3894: అంటే వేటకోసం రక్షణకోసం కాక కుక్కలను తోడుగా ఉంచితే కారుణ్య దూతలు వెంట ఉండరు. అయితే వేటకోసం, లేదా రక్షణకోసం కుక్కలను ఉంచవచ్చును. అదేవిధంగా ప్రయాణంలో జంతువు మెడలో గంటలు ఉన్నా కారుణ్య దూతలు తోడు ఉండరు.

[26]) వివరణ-3895: ఏవిధంగా పిల్లన గ్రోవి ధర్మం కాదో, అదే విధంగా గంటలు కూడా కట్టడం మంచిది కాదు.

[27]) వివరణ-3898: ఒంటెపై వచ్చిన వ్యక్తి అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. అతనికి ఆహారం అవసరం ఉన్నట్టుంది. కాని అతడు ఎవరినీ ఏదీ అడగలేదు. ప్రవక్త (స) అతని పరిస్థితిని గమనించి మీ దగ్గర ఏదైనా వస్తువు అనవసరంగా ఉంటే అవసరం ఉన్న వారికి ఇచ్చివేయండి అని అన్నారు.

[28]) వివరణ-3901: అంటే ఖైబర్ యుద్ధం నుండి తిరిగి వస్తున్నప్పుడు ప్రవక్త(స) తన భార్య సఫియ్యహ్ (ర)ను తమ వెనుక కూర్చోబెట్టుకున్నారు.

[29]) వివరణ-3904: సుదూర ప్రయాణం నుండి తిరిగి వచ్చినపుడు ఇంటి వారికి తెలియపరచకుండా అకస్మాత్తుగా ఇంట్లోకి రాకూడదు. ఇంటి వారికి తెలియ పరిస్తే, తన భార్య ఉన్న స్థితిని మార్చుకుంటుంది. భర్త నన్ను చూచి సంతోషపడాలని ప్రయత్నిస్తుంది. ఎందుకంటే అసభ్యంగా ఉన్న వెంట్రుకలను చూచి అసహ్యించుకునే ప్రమాదం ఉంది.

[30]) వివరణ-3905: అంటే ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తర్వాత విందు చేయటంలో అభ్యంతరం ఏమీ లేదు.

[31]) వివరణ-3909: అంటే కేవలం పగటి పూట మాత్రమే ప్రయాణం సాగించకండి, రాత్రి కూడా ప్రయాణం సాగించండి. ఎందుకంటే రాత్రి ప్రయాణంలో దూరం చాలా తొందరగా తగ్గుతుంది.

[32]) వివరణ-3910: అంటే ఒంటరిగా ప్రయాణం చేయటం వల్ల మార్గంలో ఒక్కోసారి కష్టాలను, ఆపదలకు గురి కావలసి వస్తుంది. అనేక శుభాలకు దూరం కావలసి వస్తుంది. అందు వల్ల షై’తాన్‌ ప్రభావం అతనిపై అధికంగా ఉంటుంది. అందువల్లే అతనికి షై’తాన్‌ అనటం జరిగింది. అదేవిధంగా ఇద్దరు వ్యక్తులు కలసి ప్రయాణం చేసినా ఇటువంటి ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణంలో ఒకవేళ ముగ్గురు ఉంటే చాలా సౌలభ్యంగా ఉంటుంది. సామూహికంగా నమా’జు చదువు కోవచ్చు. కలసి ప్రేమాభిమానాలతో  మాట్లాడుకోవచ్చు. పరస్పరం అనేక విధాలుగా సహాయం చేసుకోవచ్చు.

[33]) వివరణ-3911: ఒకవేళ వివాదం తలెత్తితే అతడు తీర్పుచేయడానికి కార్యం చాలా సులువుగా నెరవేరు తుంది. నాయకుడు కూడా తన అనుచరుల పట్ల సున్నితంగా వ్యవహరించాలి. వారి సేవచేయాలి.

[34]) వివరణ-3912:ప్రయాణంలో నలుగురు ఉంటే మంచిది. ఎందుకంటే, ఒకవేళ ఎవరైనా వ్యాధికి గురైతే, వాఙ్మూలం ఇచ్చినపుడు ఇద్దరు సాక్షులుగా ఉంటారు. ఈ ‘హదీసు’ లో కనీసం నలుగురు అని పేర్కొనడం జరిగింది. కాని ప్రయాణంలో ఎంతమంది అధికంగా ఉంటే అంత మంచిది. 12 వేల మంది గల సైన్యం తక్కువ కారణంగా ఓడిపోదు. ఒకవేళ ఓడిపోయినా అల్లాహ్‌ (త) ఆయన ప్రవక్త (స)కు అవిధేయత వల్లే ఓడిపోతుంది.

[35]) వివరణ-3914: ప్రయాణంలో అందరూ ఒకేచోట బస చేయాలని ఈ ‘హదీసు’ ద్వారా తెలిసింది.

[36]) వివరణ-3916: కొందరు తమ వాహనాలపై కూర్చోనే మార్గంలో ఇతరులతో మాట్లాడుతూ ఉండిపోతారు. వాహనాలను అలాగే నిలబెట్టి వాటిపై కూర్చొనే ఉంటారు. క్రిందకు దిగరు. వాహనాల వీపులను మెంబర్లుగా మార్చుకుంటారు. దానివల్ల వాహనానికి ఎంతో బాధ కలుగుతుంది. అందువల్ల ప్రవక్త(స) వాటి వీపులను మెంబర్లుగా మార్చటాన్ని వారించారు. క్రిందికి దిగి తన అవసరాన్ని తీర్చుకోమని ఆదేశించారు. నైతికతలో ఇదొక బోధన. దీనివల్ల జంతువుకు కూడా కష్టం కలుగదు.

[37]) వివరణ-3917: సామాన్లు దించటంవల్ల జంతువుకు కొంత సుఖంగా ఉంటుంది. అంటే వాహనంపై సామాన్లు ఉంటే ప్రయాణంలో ఎక్కడైనా దిగితే, వాటిని దించిన తర్వాతనే నమా’జు చదవాలి. దానివల్ల వాటికి కొంత విశ్రాంతి కలుగుతుంది.

[38]) వివరణ-3921: ఒకవేళ సుదూర ప్రయాణం నుండి ఇంటికి తిరిగి వస్తే పగటిపూట రావాలి. ఒకవేళ దగ్గరి ప్రయాణం అయితే రాత్రి ప్రారంభ సమయంలో రావటం మంచిది.

మరి కొందరు ప్రయాణంతోవస్తే రాత్రి ప్రారంభంలో తన భార్యతో సంభోగం చేస్తే అలసట దూరమై సుఖంగా నిద్రవస్తుందని అభిప్రాయపడ్డారు.

[39]) వివరణ-3924: చిరుతపులి ఒక క్రూర జంతువు. దాని చర్మంపై స్వారీ చేయడం, దాన్ని పరచి కూర్చోవడం అహంకారుల పని. ఇది నిషిద్ధం కూడా. అందువల్ల సింహం, చిరుతపులుల చర్మాన్ని ఇంట్లోనూ ఉంచ కూడదు. ప్రయాణంలో కూడా ఉపయోగించకూడదు.

[40]) వివరణ-3925: ఈ హదీసు ద్వారా ప్రయాణంలో తన అనుచరులకు సాధ్యమైనంత అధికంగా సేవచేయడంలో ముందు ఉండాలి. అంటే అతన్ని కేవలం అమరవీరుడే అధిగమిస్తాడు.

[41]) వివరణ-3926: ఖైసర్ అనేది రూమ్ పాలకుల బిరుదు. అదేవిధంగా కిస్రా, ఫారిస్ రాజుల బిరుదు. నజ్జాషీ, హబ్షీ రాజుల బిరుదు. ప్రవక్త (స) ఉత్తరం పంపిన ఖైసర్‌ రాజు పేరు హిర్ఖల్. 6వ హిజ్రీ సంవత్సరంలో ప్రవక్త (స) ఈ ఉత్తరాన్ని పంపారు. బస్రా అనేది సిరియా దేశంలోని ఒక పట్టణం పేరు. ఈ ‘హదీసు’ ద్వారా ఉత్తరం ప్రారంభంలో బిస్మిల్లాహ్వ్రాయ వచ్చును. సులైమాన్‌ () కూడా బిల్ఖీస్ఉత్తరం ప్రారంభంలో వ్రాసారు.

[42]) వివరణ-3927: అయితే అల్లాహ్‌ (త) ప్రవక్త (స) ఈ దుఆ’ను స్వీకరించాడు. కిస్రా సామ్రాజ్యం ముక్కలు ముక్కలు అయిపోయింది. అనంతరం స్వయంగా వాడి కొడుకే అతడి కడుపు చీల్చాడు. అతడు మరణించి నపుడు మందుల భాండాగారం తెరచి విషం ఉన్న డబ్బాపై కామశక్తికి మంచి ఔషధం అని వ్రాసాడు. అతడి కొడుకు కామవాంఛి కావటం చేత, అతడు చనిపోయిన తర్వాత అతనికొడుకు ఆ మందును తిన్నాడు. కాని అది విషయం కావటం చేత అతడు కూడా మరణించాడు. ఆ రోజు నుండి సామ్రాజ్య పతనం మొదలైంది. చివరికి ఉమర్‌ (ర) కాలంలో వారి చిహ్నాలు కూడా మిగలకుండా పోయాయి.

[43]) వివరణ-3928: ప్రవక్త (స) హుదైబియ నుండి తిరిగి వచ్చినతర్వాత రాజుల పేర ఇస్లామ్‌ సందేశాలు పంపారు. అప్పుడు అనుచరులు ముద్రలేనిదే రాజులు ఉత్తరాలు స్వీకరించరని సలహా ఇచ్చారు. అప్పుడు ప్రవక్త (స) వెండిముద్ర చేయించారు. అందులో మూడు లైన్లు ముహమ్మద్‌, రసూల్‌, అల్లాహ్‌ అని చెక్కించారు. దాన్ని ఉత్తరాలపై వేయించారు. 7వ హిజ్రీ ముహర్రమ్‌ మాసం లో ప్రతినిధులు ఉత్తరాలు తీసుకొని బయలుదేరారు.

[44]) వివరణ-3931: ఈ ‘హదీసు’లో 6వ హిజ్రీ లేదా 7వ హిజ్రీ ప్రారంభంలో జరిగిన ఖైబర్ యుధ్ధం గురించి ప్రస్తావించటం జరిగింది. సీరతున్నబీ 1వ భాగం నుండి మరియు అసహ్హుస్సియర్ నుండి కొన్ని వివరాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. ‘ఖైబర్ అనేది (హీబ్రూ) ఇబ్రానీ పదం. ‘ఖైబర్ అంటే కోట అని అర్ధం. ఇది మదీనహ్ మునవ్వరహ్ నుండి 8 కోసుల దూరంలో ఉంది. యూరప్ కు చెందిన డ్రోటీ క్రీ.శ 1877లో అనేక నెలలు ఇక్కడ బసచేసాడు. అతడు మదీనహ్ నుండి దాని దూరం 200 మైళ్ళు అని వ్రాసాడు. ఇది సస్యశ్యామలమైన ఖర్జూర తోటల ప్రక్కన ఉంది. యూదులు ఇక్కడ అనేక కోటలు నిర్మించారు. వీటిలో కొన్నిటి శిథిలాలు ఇప్పటివరకు ఉన్నాయి.

అరబ్ లో యూదులకు ఇది ప్రధాన కేంద్రంగా ఉండేది. మదీనహ్ నుండి బనూ దీర్ నాయకులు బహిష్కరించబడి ఖైబర్ లో నివాసం ఏర్పరచు కున్నప్పుడు, వారు అరబ్బులందరినీ ఇస్లామ్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. దాని మొదటి ఫలితమే హ్జాబ్ యుధ్ధం. వారి నాయకుల్లో ‘హయ్యి బిన్ అఖ్తబ్ ‘ఖురై”జహ్ యుధ్ధంలో హతమార్చబడ్డాడు. వీడి తరువాత అబూ రాఫె’అ సలామ్ బిన్ అబిల్ ‘హఖీఖ్ నాయకుడయ్యాడు. ఇతడు ప్రముఖుడు మరియు గొప్ప వ్యాపారి.

అరబ్బులకు చెందిన ప్రముఖ ‘గత్ఫాన్ వర్గం ‘ఖైబర్ ప్రక్కనే ఉండేది. చాలా కాలంగా యూదులు మరియు ‘ఖైబర్ వర్గం మధ్య మంచి మిత్రత్వం ఉండేది. 6వ హిజ్రీలో స్వయంగా సలామ్ వెళ్ళి ‘గత్ఫాన్ మరియు చుట్టుప్రక్కల ఉన్న ఇతర వర్గాలను ముస్లిములతో పోరాటానికి రెచ్చగొట్టాడు. చివరికి ఒక పెద్ద సైన్యం తీసుకొని మదీనహ్ పై దాడికి సన్నాహాలు చేసాడు. ప్రవక్త(స)కు ఈ విషయం తెలిసింది. ప్రవక్త(స) సూచనతో 6వ హిజ్రీ రమదాన్ లో ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అతీక్ అనే ‘ఖజ్రజీ అ’న్సారీ ద్వారా తన కొట ఖైబర్ లో పడుకొని ఉండగా చంపబడ్డాడు.

   సల్లామ్ తరువాత యూదులు ‘అసీర్ బిన్ రజ్జామ్ ను నాయకుడిగా ఎన్నుకున్నారు. వాడు యూద తెగ లన్నిటినీ ఒకచోట చేర్చి ప్రసంగం చేస్తూ, ‘నాకంటే ముందు మన నాయకులు ము’హమ్మద్ (స) కు వ్యతిరేకంగా పన్నిన పన్నాగాలన్నీ పనికిరానివి. సరైన పన్నాగం ఏమిటంటే, ము’హమ్మద్ (స) ప్రధాన కేంద్రంపై దాడిచేయాలి, నేను ఇలాగే చేస్తాను,’ అని అన్నాడు. దీనికోసం వాడు ‘గత్ఫాన్ మరియు ఇతర వర్గాలను సందర్శించాడు. ఒకపెద్ద సైన్యాన్ని తయారుచేసాడు. ప్రవక్త(స)కు ఈ వార్త అందింది. కాని ప్రవక్త(స) దానిపై ఏమాత్రం శ్రధ్ధ చూపలేదు. ఇంకా ‘అబ్దుల్లాహ్ బిన్ రవా’హాను ‘ఖైబర్ వెళ్ళి వాస్తవాలు తెలుసుకు రమ్మని పంపించారు. అనంతరం అతడు కొంతమందిని తీసుకొని ‘ఖైబర్ వెళ్ళాడు. రహస్యంగా వారి కుట్రలు, కుతంత్రాల గురించి విన్నాడు. తిరిగివచ్చి ప్రవక్త(స)కు వివరాలన్నీ అందజేసాడు. ప్రవక్త(స) అతనికి 30మందిని ఇచ్చి ‘ఖైబర్ పంపించారు. వారు ‘అసీర్ తో మీరు కోరితే ఖైబర్ ప్రభుత్వం మీకు అప్పగించమని ప్రవక్త (స) మాకు పంపారని అన్నారు. అనంతరం అతడు ఆ 30మందిని తీసుకొని ‘ఖైబర్ నుండి బయలుదేరారు. రక్షణా బాధ్యతలు దృష్టిలో పెట్టుకొని ఒక్కో వాహనంపై ఇద్దరు కూర్చున్నారు. వారిలో ఒకరు ముస్లిమ్ మరొకరు యూదుడు. ఖర్ఖరహ్ చేరిన తరువాత అసీర్ కు దురాలోచన కలిగింది. వాడు తన చేతిని చాచి ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉనైస్ కరవాలాన్ని లాక్కోబోయాడు. అప్పుడతను, ‘ఓ అల్లాహ్ (త) శత్రువా, వాగ్దాన భంగం చేయాలనుకుంటున్నావా,’ అని వాహనాన్ని ముందుకు నడిపారు. కాని అసీర్   కరవాలంతో కొట్టాడు. వాడి తొడ తెగిపోయింది. గుర్రం నుండి క్రిందపడ్డాడు. కాని వాడు క్రింద పడుతూ ‘అబ్దుల్లాహ్ ను గాయరిచాడు. వెంటనే అది గ్రహించిన ముస్లిములు యూదులపై విరుచుకుపడ్డారు. ఫలితంగా ఈ యుధ్ధంలో ఒక్కడు తప్ప యూదు లందరూ హతమార్చబడ్డారు.  6వ హిజ్రీ చివర్లో లేదా7వ హిజ్రీ ము’హర్రమ్ లో జరిగిన సంఘటన ఇది.

ఇస్లామ్ కు అందరికంటే ‘ఖైబర్ బధ్ధ శత్రువుగా, ప్రమాదకర మైనదిగా ఉండేది. వీరు మక్కహ్ వెళ్ళి ఖురైషుల ద్వారా ఇస్లామ్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టి, యుధ్ధానికి సన్నధ్ధం చేసారు. ఫలితంగా అహ్జాబ్ సంఘటనలో ఇస్లామ్ కేంద్రమైన మదీనాహ్ మునవ్వరహ్ అస్ధిరతకు గురయ్యింది. అయితే ఈ ప్రయత్నం ఫలించలేదు.కాని కుతంత్రాలు పన్నేవారు ఇప్పటికీ ఉన్నారు.

 అహ్జాబ్ యుధ్ధం సంభవించడంలో ప్రధాన కారకులు ప్రముఖ ఇబ్ను అబిల్ హఖీఖ్ కుటుంబం. వీరు బనూ దీర్ వర్గానికి చెందినవారు. మదీనహ్ నుండి బహిష్కరించబడి ఇక్కడకు వచ్చారు. అతడు ప్రఖ్యాత ‘ఖైబర్ కోటను ఆక్రమించుకున్నాడు. పైన ప్రస్తావించబడిన సల్లామ్ బిన్ అబిల్ ‘హఖీఖ్ ఈ కుటుంబానికి చెందిన నాయకుడే. వాడు హత్యచేయ బడిన తరువాత అతని అన్న కొడుకు కనాన బిన్ అర్రబీ బిన్ అబిల్ ‘హఖీఖ్ నాయకుడయ్యాడు.

    ఇటు ‘ఖైబర్ యూదులు ‘గత్ఫాన్ తెగవారితో కలసి ఇస్లామ్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. అటు మదీనహ్ కుచెందిన కపటాచారులు, ముస్లిముల వార్తలు వారికి అందజేస్తూ ముస్లిములు మిమ్మల్ని ఎదుర్కోలేరని వారికి ధైర్యం చెప్పేవారు. ప్రవక్త(స) వారితో సంధి కుదుర్చుకుంటే బాగుంటుందని నిర్ణయించుకొని ‘అబ్దుల్లాహ్ బిన్ రవా’హా(ర)ను పంపారు. కాని ఇటు కఠిన హృదయులైన అనుమానాలు అపార్ధాలు చేసుకునే యూదులు ఉండేవారు. అటు వారిని ప్రోత్సహించే కపటాచారులు ఉండేవారు. ఆకాలంలోనే కపటాచారుల నాయకుడు ‘అబ్దుల్లాహ్ బిన్ ఉబయ్ బిన్ సలూల్ ‘ఖైబర్ ప్రజలకు, ‘ము’హ మ్మద్ (స) మీపై దాడిచేయటానికి సిధ్ధంగా ఉన్నారు, కాని మీరు ఏమాత్రం భయపడకండి, వారు పిడికెడు మంది మాత్రమే ఉన్నారు, వారివద్ద ఆయుధాలు కూడా లేవు,’ అని కబురు పంపాడు. అది విన్న యూదులు మాతో కలసి మదీనహ్ పై దాడి చేస్తే సగం ఖర్జూరం పంట మీకు ఇస్తాం అనే వార్తతో కనాన మరియు హవా బిన్ ఖైస్ ను ‘గత్ఫాన్ వద్దకు పంపారు. మరో ఉల్లే ఖనలో, ‘గత్ఫాన్ వర్గం దాన్ని స్వీకరించింది,’ అని ఉంది.

‘గత్ఫాన్ వర్గంలో శక్తి సామర్ధ్యాలు కలిగి వీరోచితంగా పోరాడే తెగ బనూ ఫజారహ్. ‘ఖైబర్ ప్రజలు ప్రవక్త(స)పై దాడిచేయా లనుకుంటున్నారని వారికి తెలిసిన వెంటనే, వారు స్వయంగా ‘ఖైబర్ వచ్చి, ‘మేము మీతో కలసి యుధ్ధం చేస్తాం,’ అని అన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రవక్త(స) బనూ ఫజారహ్ కు, మీరు ‘ఖైబర్ వారికి సహాయం చేయటం మానివేయండి, ‘ఖైబర్ జయించబడితే, మీకు కూడా వంతు లభిస్తుంది అని ఉత్తరం వ్రాసారు. కాని బనూ ఫజార దాన్ని తిరస్కరించింది.

జీఖిర్ద్ ముహర్రమ్ 7వ హిజ్రీలో ‘గత్ఫాన్ యుధ్ధంలో పాలు పంచుకోవటానికి ఈవిధంగా ప్రారంభం అయ్యింది. జీఖిర్ద్ పచ్చిక మైదానం ప్రక్కనే ప్రవక్త(స) పచ్చిక మైదానంకూడా ఉండేది. ఆ వర్గానికి చెందిన కొందరు ‘అబ్దుర్ర’హ్మాన్ బిన్ ‘ఐనియ నేతృత్వంలో దాడి చేసి 20 ఒంటెలు తీసుకొని పోయారు. ఇంకా ఒంటెలను కాపలా కాస్తున్న అబూ జ’ర్(ర) కుమారున్ని చంపి, అతని భార్యను బంధించి తీసుకొని వెళ్ళారు. ముస్లిములు వెంటాడారు. వారు కొండల్లో దాక్కున్నారు. అక్కడ ‘గత్ఫాన్ తెగకు చెందిన సైన్యాధికారి ఐనియ బిన్ హిస్న్ వారి సహాయంకోసం వేచి ఉన్నాడు. ముస్లిముల్లో ప్రముఖ అనుచరులు సల్మా బిన్ అక్వ బాణ విద్యలో ప్రవీణులు. అందరికంటే ముందు అతనికి ఈ వార్త అందింది. మిత్రులారా పదండి అని కేకలు వేస్తూ వారిని పట్టుకోవటానికి బయలుదేరాడు. అప్పుడు వారు ఒంటెలకు నీళ్ళు త్రాపిస్తున్నారు. సలమహ్ (ర) వారిపై బాణాల వర్షం కురిపించసాగారు. వెంటనే వారు పారిపోయారు. వారిని వెంబడించి వారితో యుధ్ధంచేసి ఒంటెలను విడిపించుకొని తెచ్చారు. ప్రవక్త(స) వద్దకువచ్చి, ‘శత్రువులను దాహంతో వదలి వచ్చాను. ఒకవేళ 100మంది దొరికినా ఒక్కొక్కరినీ పట్టుకొని వస్తాను,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త(స), ‘వారిని అధిగమిస్తే వారిపట్ల విశాలహృదయంతో ప్రవర్తించు,’ అని హితబోధ చేసారు. ఈ సంఘటన జరిగిన 3రోజుల తర్వాత ‘ఖైబర్ యుధ్ధం సంభవించింది.

   ఇతర యుధ్ధాల కంటే ‘ఖైబర్ యుధ్ధానికి ఒక ప్రత్యేకత ఉంది. అయితే చరిత్రకారుల దృష్టి వీటి కారణాలపై పడలేదు. సంఘటనాపరంగా కూడా ప్రత్యేకతలు ఉండవచ్చు. అయితే చరిత్రకారులు కూడా దీన్ని గురించి చర్చించకుండా ఉండలేక పోయారు. ప్రత్యేకతల్లో అన్నిటికంటే ముందు ఏమిటంటే, ‘ఖైబర్ యుధ్ధానికి ముందు ప్రవక్త (స) జిహాద్ ను కోరుకునే వారే మాతో రావాలి అని ప్రకటించారు.

ఇప్పటి వరకు జరిగిన యుధ్ధాలన్నీ కేవలం రక్షణకోసం మాత్రమే జరిగాయి. కాని ఇందులో ముస్లిమేతర పాలితులను చట్టబధ్ధం చేయటం జరిగింది. ప్రభుత్వ స్ధాపన జరిగింది. ఇస్లామ్ అసలు ఉద్దేశం ఇస్లామ్ సందేశాన్ని అందజేయటం. ఒకవేళ ఏ వర్గం అయినా దాన్ని స్వీకరించకపోతే, దానితో యుధ్ధం చేయటంగాని, వారిని పాలితులుగా భావించటంగాని జరుగదు. వారితో సంధి, ఒప్పందాలు మాత్రమే చేసుకోవటం జరుగుతుంది. దీన్ని గురించి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాని ఒకవేళ ఏవర్గమైనా ఇస్లామ్ పట్ల వ్యతిరేకిగా దానికి హాని చేకూర్చదలిస్తే మాత్రం, రక్షణకోసం యుధ్ధం చేయటం తప్పనిసరి అవుతుంది. ఇంకా దాన్ని తన అధీనంలో ఉంచవలసి వస్తుంది.

ఈ సూత్రాల ప్రకారం జయించబడిన మొట్టమొదటి దేశం ‘ఖైబర్. యుధ్ధాల ప్రస్తావన తర్వాత దీన్ని గురించి వివరంగా చర్చించటం జరిగింది.ఎందుకంటే అరబ్బుల ప్రాచీన పధ్ధతి ప్రకారం చాలాకాలం వరకు ప్రజలు జిహాద్ ను ఉపాధి సాధనంగా భావించేవారు. ‘ఖైబర్ యుధ్ధం వరకు ఈ అపార్ధాలు అలాగే ఉన్నాయి.

ఇది తెర ఎత్తవేయబడిన మొట్టమొదటి యుధ్ధం. అందువల్లే ప్రవక్త(స), ‘ఖైబర్ యుధ్ధానికి ముందు, ‘ఇస్లామ్ ఔన్నత్యం కోసం జిహాద్ ను కోరుకునేవారే మాతో రావాలి,’ అని ప్రకటించారు. ప్రవక్త(స) ‘గత్ఫాన్ మరియు యూదుల దాడులను ఎదుర్కొనడానికి మదీనహ్ నుండి ము’హర్రమ్ 7వ హిజ్రీలో సబా బిన్ అర్ఫత్ ‘గిఫారీని మదీనహ్ అధికారిగా నియమించి బయలుదేరారు. ప్రవక్త(స) భార్యల్లో ఉమ్మె సలమహ్ (ర) వెంట ఉన్నారు. సైన్యం 1600. ఇందులో 200 మంది గుర్రాలపై మిగిలిన వారు కాలినడకన ఉన్నారు. మొట్ట మొదటి సారిగా ప్రవక్త (స) 3 జండాలు తయారు చేయించారు. 2 జెండాలను ఖబ్బాబ్ బిన్ మున్జిర్ మరియు అద్ బిన్ ఉబాదహ్ లకు ఇచ్చారు. ‘ఆయి’షహ్(ర) దుప్పటితో తయారుచేయబడిన మూడవ జెండా ప్రవక్త (స) తనవద్ద ఉంచుకున్నారు. సైన్యం బయలు దేరినపుడు ప్రముఖ కవి ఆమిర్ బిన్ అల్అక్వ ఈ కవిత్వాలు చదువుతూ ముందుకు సాగారు. ”ఓ దేవా , ఒకవేళ నీవు మాకు సన్మార్గం చూప కుంటే, మేము సన్మార్గం పొందకుండా, నమా’జు చదవకుండా, దాన ధర్మాలు చేయకుండా ఉండేవాళ్ళం. నేను నీకోసం త్యాగంకాను. ఆచరణల్లో మా కొరతను క్షమించు. మాపై ప్రశాంతతను అవతరింపజేయి. మమ్మల్ని సహాయం కోరితే, వెంటనే చేరుకుంటాము. మేము తలపడినపుడు మమ్మల్ని స్ధిరంగా ఉంచు. ప్రజలు మమ్మల్ని సహాయంకోసం వేడుకున్నారు.”

   ఈ కవిత్వాలు ‘స’హీ’హ్ ముస్లిమ్, ‘స’హీ’హ్ బు’ఖారీల్లో ఉన్నాయి. ముస్నద్ ఇబ్ను ‘హంబల్ లో కొన్ని కవిత్వాలు అధికంగా ఉన్నాయి. మొదటి రెండు లైన్లు కొంత వ్యత్యాసంతో ‘స’హీ’హ్ ముస్లిమ్ లో ఉన్నాయి.

మాపై దుర్మార్గానికి పాల్పడినవారు ఏదైనా కల్లోలం రేకెత్తించ దలచినపుడు, మేము వారి ముందు తలదించు కోము. ఇంకా ఓ ప్రభూ, మేము నీ అనుగ్రహాల అవసరం లేనివాళ్ళం కూడా కాలేము.

మార్గంలో ఒక మైదానం వచ్చింది. ప్రవక్త (స) అనుచరులు తక్బీర్ నినాదాలు బిగ్గరగా పలకసాగారు. ఎందుకంటే ఎల్లప్పుడూ విద్యా శిక్షణ, హితబోధనలు జరిగేవి. ప్రతి సందర్భానికి ఆదేశాలు, ఉపదేశాలు లభించేవి. అప్పుడు ప్రవక్త (స), ‘నెమ్మదిగా పలకండి, మీరు చెవిటివాడిని, గృడ్డివాడిని పిలవటం లేదు. మీరు పిలుస్తున్నవాడు మీవద్దనే ఉన్నాడు,’ అని ఉపదేశించారు. ఈ యుధ్ధంలో కొంతమంది స్త్రీలు తమ ఇష్టంతో సైన్యం వెంట వచ్చారు. ఈ విషయం ప్రవక్త(స)కు తెలిసింది. ప్రవక్త(స) వారిని పిలిచి ఆగ్రహం వ్యక్తంచేస్తూ, ‘మీరు ఎవరివెంట వచ్చారు, ఎవరి ఆదేశంతో వచ్చారు,’ అని ప్రశ్నించారు. దానికి వారు సహాయంగా ఉంటామని, గాయపడిన వారికి మందులతో కట్లు కడదామని, బాణాలు ఏరి తీసుకు వద్దామని సైన్యం సేవచేద్దామని వచ్చామని విన్నవించు కున్నారు. విజయం ప్రసాదించబడిన తరువాత యుధ్ధ ధనం పంచినపుడు, వాళ్ళకూ వాటాలు (వంతులు) ఇచ్చారు. అవి ఏమిటో తెలుసా? ధనసంపదలు దీనార్లు కాదు. అవి ఖర్జూరాలు. అందరికీ ఇవే లభించాయి.

ఈ సంఘటన గురించి అబూ దావూద్ లో ప్రస్తావించడం జరిగింది. ‘హదీసు మరియు చారిత్రక పుస్తకాల ద్వారా యుధ్ధాల్లో స్త్రీలు కూడా పాల్గొనేవారని, గాయపడిన వారికి కట్లు కట్టేవారని, దాహం వేసేవారికి నీళ్ళు త్రాపించే వారని తెలుస్తుంది. ఉ’హుద్ యుధ్ధంలో ‘ఆయి’షహ్ (ర) కుండలతో నీళ్ళు తీసుకురావటం, గాయపడిన వారికి త్రాపించటం గురించి ఇంతకు ముందు ప్రస్తావించటం జరిగింది. అదేవిధంగా స్త్రీలు యుధ్ధ మైదానం నుండి బాణాలు ఏరితెచ్చి సైనికులకు ఇచ్చేవారు. దీన్ని గురించి అబూ దావూద్ మాత్రమే పేర్కొన్నారు. అంతే కాదు ప్రామాణిక ఆధారాలతో పేర్కొన్నారు. అందువల్ల అనుమానాలకు తావులేదు. అరబ్బు స్త్రీల నుండి కనీసం దీన్నే ఆశించవచ్చు.

‘గత్ఫాన్ వర్గం ‘ఖైబర్ ప్రజలకు సహాయం కోసం వస్తుందని తెలిసిన ప్రవక్త (స) సైన్యాన్ని రజీ ప్రాంతంలో దించారు. ఇది ‘గత్ఫాన్ మరియు ‘ఖైబర్ ల మధ్య ఉంది. స్త్రీలను, ఇతర సామగ్రిని ఇక్కడ వదలివేసి సైన్యం ఖైబర్ వైపు ముందుకు సాగాయి. ముస్లిముల సైన్యం ‘ఖైబర్ చేరుకుంటుందని తెలిసిన ‘గత్ఫాన్ ఆయుధాలు ధరించి బయలుదేరారు. కాని ముందుకు వెళ్ళిన తరువాత తాము ప్రమాదంలో ఉన్నామని తెలిసి, తిరిగి వెళ్ళి పోయారు. ‘ఖైబర్ లో 6 కోటలు ఉండేవి. సాలిమ్, ఖమూస్, నతాతున్, ఖసారహ్, షఖ్, మర్బతహ్. యాఖూబీ పేర్కొన్నట్టు వీటిలో 20,000 మంది సైనికులు ఉన్నారు. ఈ కోటలన్నిటిలో ఖమూస్ బలమైన మరియు సురక్షితమైన కోట. మురహ్హిబ్ అరబ్బుల్లో ప్రఖ్యాత పహల్వాన్. 1000 మందికి సమానంగా భావించబడేవాడు. అతడు ఈ కోటకు నాయకుడు. అదేవిధంగా మదీనహ్ నుండి బహిష్కరించబడి, ‘ఖైబర్ లో పౌరసత్వం పొందిన ఇబ్ను అబిల్ ‘హఖీఖ్ ఇక్కడే ఉండేవాడు.

ముస్లిముల సైన్యం ‘ఖైబర్ కు సమీపంలో ఉన్న సహ్బా చేరుకున్నప్పటికి అస్ర్ సమయం రానేవచ్చింది. ప్రవక్త(స)తో సహా అందరూ అస్ర్ నమాజు ఆచరించారు. ఆహారం కోరారు. ఆహారంలో సత్తూ మాత్రమే ఉండేది. ప్రవక్త(స) దాన్నే నీటిలో కలుపుకొని తిన్నారు. రాత్రి అయినప్పటికి ‘ఖైబర్ పొలిమేరలకు చేరుకున్నారు. భవనాలు కనపడసాగాయి. అప్పుడు ప్రవక్త(స) అనుచరులతో ఆగిపోండి అని పలికి అల్లాహ్(త) ను ఇలా ప్రార్ధించారు. ”ఓ ప్రభూ, నిన్ను ఈ ఊరి మంచిని, ఈ ఊరివారి మంచిని, ఈ ఊరి వస్తువుల మంచిని కోరుతున్నాము. ఇంకా వీరందరి చెడునుండి నీ శరణు కోరుతున్నాము.”

సాధారణంగా ప్రవక్త(స) ఏదైనా ప్రాంతంలో దిగితే, ముందు ఈ దు’ఆ చదివేవారు అని ఇబ్ను హిషామ్ పేర్కొన్నారు. అదేవిధంగా రాత్రిపూట దాడి చేసేవారు కారు. అందువల్ల రాత్రి అక్కడే గడిపారు.ఉదయం ‘ఖైబర్ లో ప్రవేశించారు. యూదులు తమ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వేసారు. ఆహార సామాగ్రి, ఇతర వస్తువులను నాయిమ్ కోటలో చేరవేసారు. సైన్యాలను నతాతున్, ఖమూస్ కోటలకు పంపారు. సల్లామ్ బిన్ ముష్కిమ్ నజీరీ అనారోగ్యంగా ఉన్నాడు. అయినా అందరికంటే అధికంగా పాల్గొన్నాడు. స్వయంగా నతాతున్ కోటలోనికి వచ్చి సైన్యంలో పాల్గొన్నాడు. ప్రవక్త(స)కు యుధ్ధం ఏమాత్రం ఇష్టంలేదు. కాని యూదులు పెద్ద ఎత్తున ఆయుధాలతో యుధ్ధ సన్నాహాలు చేయటంవల్ల, ప్రవక్త(స) అనుచరులను ఉద్దేశించి ఉపదేశిస్తూ జిహాద్ పట్ల ప్రోత్సహించారు.

ఈ సందర్భం గురించి తారీఖ్ ఖమీస్ లో ఇలా పేర్కొనడం జరిగింది. యూదులు యుధ్ధానికి సన్నధ్ధులై ఉన్నారని ప్రవక్త (స)కు నమ్మకం కలగగానే, అనుచరులకు హితబోధ చేస్తూ జిహాద్ పట్ల ప్రోత్సహించారు. అన్నిటి కంటే ముందు నాయిమ్ కోటపై దాడిచేసారు. మ’హ్మూద్ బిన్ మస్లమహ్ ధైర్యం కూడ గట్టుకొని దాడిచేసారు. చాలాసేపు వరకు యుధ్ధం చేస్తూ ఉన్నారు. ఎండవేడి చాలా అధికంగా ఉండడంవల్ల, అలసిపోయి కొంత విశ్రాంతి తీసుకోవడానికి కోటగోడనీడలో కూర్చుండి పోయారు. కనానహ్ బిన్ రబీ’అ కోటగోడ పైనుండి రాతిమరను అతనిపై పడ వేయించాడు. దానివల్ల తలపగిలి అతను మరణించారు. కాని కోటను చాలా త్వరగా జయించటం జరిగింది. నాయిమ్ కోట విజయం తరువాత మురహ్హిబ్ సింహాసనం ఉన్న ఖమూస్ కోట తప్ప మిగిలిన కోటలు చాలా సులువుగా జయించబడ్డాయి. ఖమూస్ కోటపై ప్రవక్త(స) అబూ బకర్(ర) మరియు ‘ఉమర్(ర)లను పంపారు. కాని వారిద్దరూ విఫలయత్నం చేసి తిరిగి వచ్చారు.

ఒక రోజు సాయంత్రం ప్రవక్త(స), ‘రేపు నేను ఒక వ్యక్తికి జెండా ఇస్తాను, అతని ద్వారా అల్లాహ్ (త) విజయం ప్రసాదిస్తాడు. అతడు అల్లాహ్(త) ను ఆయన ప్రవక్తను ప్రేమిస్తున్నాడు. అల్లాహ్(త) మరియు ఆయన ప్రవక్త కూడా అతన్ని ప్రేమిస్తున్నారు’ అని ప్రవచించారు. అనుచరులు రాత్రంతా ఈ అదృష్టం ఎవరికి దక్కుతుందా అనే అనుమానాల్లో, ఆశల్లో తలమునకలై ఉన్నారు. పదవులు, అధికారాలు ఆశించని ‘ఉమర్ (ర) కూడా దీనికి గురయ్యారు. ‘స’హీ’హ్ ముస్లిమ్, ‘అలీ ప్రత్యేకతలు లో ‘ఉమర్(ర) స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. ఉదయం అకస్మాత్తుగా అందరి చెవులలో ‘అలీ ఎక్కడ? అనే శబ్దం ఢీకొంది. ఇది ఎవరూ ఆశించని శబ్దం. ఎందుకంటే ‘ఆలీ(ర) కంటి జబ్బుతో ఉన్నారు. యుధ్ధానికి సన్నధ్ధంగా లేరనే విషయం అందరికీ తెలుసు. అనంతరం ప్రవక్త(స) ఆదేశంపై ‘అలీ(ర) వచ్చారు. ప్రవక్త(స) ‘అలీ (ర) కళ్ళల్లో తన ఉమ్మిని పూసి ప్రార్ధించారు. అనంతరం జండా అతనికి ఇచ్చినపుడు, ‘యూదులతో యుధ్ధం చేసి వారిని ముస్లిములుగా చేసుకోవాలా?’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) మంచిగా వారికి ఇస్లామ్ సందేశం అందజేయి. నీవల్ల ఒక్క వ్యక్తి ఇస్లామ్ స్వీకరించినా, ఎంతో ఖరీదైన ఒంటెల కంటే ఉత్తమం. కాని యూదులకు ఇస్లామ్ లేదా ఒప్పందానికి సిధ్ధంగా ఉన్నట్టు అనిపించలేదు. మురహ్హిబ్ కోట లోపలి నుండి ఇలా గర్వంతో కూడిన కవిత్వం చదువుతూ బయటకు వచ్చాడు. ‘నేను మురహ్హిబ్ను , ధైర్యవంతుడను, అనుభవం గల వాడిని, సాయుధుడను’ అని ‘ఖైబర్ ప్రజలందరికి తెలుసు. ‘మురహ్హిబ్ తలపై పసుపు పచ్చని యమనీ పగిడి ఉండి, మధ్య గుండ్రని రాతి కిరీటం ఉండేది. దీన్నే ఖూద్ అనే వారు. మురహ్హిబ్ కు సమాధానంగా ‘అలీ(ర) ఈ కవిత్వం చదివారు. ‘నేను ఎటువంటివాడినంటే, నాతల్లి నాకు సింహం అని పేరు పెట్టింది. సింహాలవలే నేను చాలా భయంకరమైన వాణ్ణి.

మురహ్హిబ్ చాలా గర్వంతో వచ్చాడు. కాని ‘అలీ(ర) ఎంత బలంగా కరవాలంతో కొట్టారంటే, కరవాలం తలను చీల్చుతూ పన్నుల వరకు దిగిపోయింది. అతడు చంపబడ్డాడు, అనేవార్త సైన్యం వరకు  చేరుకుంది. నాయకుడు మరియు చాలా బలవంతుడు చంపబడటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అందువల్ల ఆశ్చర్యానికి గురైనవారు అపార్ధాలతో కూడిన పుకార్లు వ్యాపించారు. మఆలి ముత్తన్జీల్ ప్రకారం, ‘అలీ (ర) మురహ్హిబ్ తలపై కరవాలంతో కొట్టినపుడు, రక్షించు కోవడానికి ప్రయత్నించాడు. కాని అప్పటికే కరవాలం కిరీటాన్ని, తలను చీల్చుతూ పన్నుల వరకు దిగిపోయింది. మురహ్హిబ్ చంపబడిన తరువాత యూదు లందరూ ఏకమై దాడిచేసినపుడు అనుకోకుండా ‘అలీ (ర) చేతినుండి ఢాలుజారి క్రిందపడింది. వెంటనే రాతితో చేయబడిన కోట గోపు రాన్ని పెకిలించి దాన్ని ఢాలుగా ఉపయోగించారు.

అనంతరం ఖమూస్ కోటను 20 రోజుల నిర్బంధం తరువాత జయించడం జరిగింది. ఈ యుధ్ధంలో 92 మంది యూదులు చంపబడ్డారు. వీరిలో హారిస్, మురహ్హిబ్ అసర్, యాసిర్, ఆమిర్ ప్రముఖులు. ప్రవక్త(స) అనుచరుల్లో 15 మంది వీరమరణం పొందారు. వీరి పేర్లను ఇబ్ను స’అద్ వివరంగా పేర్కొన్నారు.

‘ఖైబర్ విజయం తరువాత దాన్ని అధీనంలోకి తీసుకోవటం జరిగింది. కాని యూదులు భూములను మా అధీ నంలోనే ఉండనివ్వండని, పంటలో సగభాగం చెల్లిస్తామని విన్నవించుకున్నారు. వారి విన్నపం స్వీకరించబడింది. పంటకోతకు వచ్చినపుడు ప్రవక్త(స) ‘అబ్దుల్లాహ్ బిన్ రవా’హాను పంపేవారు. అతను పంటను రెండు భాగాలుగా చేసి, యూదులతో మీ కిష్టమైన వంతును తీసుకోండని చెప్పే వారు. ఆతీర్పుకు యూదులు ఆశ్చర్యంతో భూమ్యాకాశాలు ఇటువంటి న్యాయంతోనే స్ధాపించబడ్డాయి అని పలికేవారు. ‘ఖైబర్ భూమంతా ‘ఖైబర్ విజయంలో పాల్గొన్నవారిలో పంచి వేయబడింది. ఇందులో ప్రవక్త(స) ఖుముస్ కూడా ఉండేది.

ఒక ఉల్లేఖనలో ఇలా ఉంది, యుధ్ధ ధనంలోనుండి ఖుముస్ తో పాటు మరోవంతు కూడా ప్రవక్త (స) కోసం కేటాయించటం జరిగేది. దాన్ని సఫీ అనేవారు. ఎందు కంటే ప్రవక్త(స) కనానహ్ బిన్ రబీ భార్యను తీసుకొని, ఆమెను విడుదలచేసి వివాహం చేసుకున్నారు.

‘ఖైబర్ విజయం తరువాత ప్రవక్త(స) కొన్నిరోజులు ‘ఖైబర్ లో ఉన్నారు. యూదులకు పరిపూర్ణ రక్షణ, శాంతి భద్రతలు, అనుమతులు ఇచ్చినప్పటికీ, వారు వ్యతిరేకత, విద్రోహచర్యలకు పాల్పడేవారు. దాని మొదటి ఉదాహరణ ఏమిటంటే, ఒకరోజు మురహ్హిబ్ వదిన, సలామ్ బిన్ ముష్కిమ్ భార్య అయిన జైనబ్ ప్రవక్త (స) మరియు అనుచరులను ఆతిధ్యానికి ఆహ్వానించింది. ప్రవక్త (స) ఆతిధ్యాన్ని స్వీకరించారు. ఆమె అన్నంలో విషం కలిపింది. ప్రవక్త(స) ఒక్క ముద్ద తిని ఆపివేసారు. కాని బష్ర్ బిన్ బరాఅ(ర) కడుపు నిండా తినటంవల్ల విషప్రభావం వల్ల మరణించారు. ప్రవక్త(స) జైనబ్ ను పిలిపించి అడగ్గా, తన నేరాన్ని ఒప్పుకుంది. యూదులు, ‘మేము ఇలా ఎందుకు చేసామంటే, ఒకవేళ తమరు ప్రవక్త అయితే, విషం పని చేయదు. ఒకవేళ తమరు ప్రవక్త కాకపోతే మీ నుండి మమ్మల్ని మేము రక్షించుకుంటాము,’ అని అన్నారు. ప్రవక్త (స) ఏనాడూ తన కోసం ఎవరితోనూ ప్రతీకారం తీర్చుకునేవారు కాదు. అందువల్ల ఆమెను ఏమీ అనలేదు. కాని రెండు, మూడు రోజుల తర్వాత బిష్ర్ (ర) విష ప్రభావం వల్ల మరణించారు. అతని ప్రాణానికి బదులుగా ఖిసాస్ లో ఆమెను చంపివేయటం జరిగింది. ‘ఖైబర్ విజయం గురించి పూర్తి వివరాలు రహ్మతుల్లిల్ ఆలమీన్ మొదలైన పుస్తకాల్లో చూడండి.

[45]) వివరణ-3935: ఎందుకంటే మస్జిద్‌, అ’జాన్‌ ఉన్న చోట ముస్లిములు ఉన్నట్టే కదా!

[46]) వివరణ-3938: తౌరియహ్ అంటే దాచటం, అంటే ఒక పదంద్వారా మరొక అర్థం గ్రహించటం, దాన్ని ఎదుటి వాడు గ్రహించ లేక పోవటం. దాని ద్వారా తన ఉద్దేశ్యం పూర్తి కావటం. ప్రవక్త (స) యుద్ధానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నప్పుడు, ఆ రహస్యాన్ని ఎవరి ముందూ బహిర్గతం చేసేవారు కారు. ఒక ప్రత్యేక ప్రదేశం పేరును పేర్కొనే వారు. ఎందుకంటే ప్రవక్త (స)కు యుధ్ధ నియమాల గురించి తెలిసి ఉండేది. ముందుగాఎవరికీ తెలియపరిచేవారు కారు. కాని తబూక్‌ యుద్ధం సందర్భంగా మాత్రం స్పష్టంగా ప్రకటించారు. అందరూ మంచిగా సన్నద్ధులు కావాలని. తబూక్‌ అనేది ఒక ప్రఖ్యాత ప్రదేశం పేరు. ఇది మదీనహ్ మరియు దిమిష్క్‌ మధ్య ఉంది. మౌతహ్ యుద్ధం తరువాత రూమీ సామ్రాజ్యం అరబ్‌పై దండెత్తటానికి నిశ్చయించుకుంది. ‘గస్సానీ వంశం షామ్‌లో రూమీల అధీనంలో పరిపాలించేది. వీరు క్రైస్తవ మతస్తులు.  అందువల్లే రూమీ ఖైసర్‌ వీరినే దీనికి నియమించాడు. ఈ వార్త మదీనాలో వినబడేది. ప్రవక్త (స) ఈలా సంఘటనలో ఉత్‌బాన్‌ బిన్‌ మాలిక్‌ వచ్చి అకస్మాత్తుగా ‘ఉమర్‌ (ర)తో ‘కొంప మునిగింది’ అని అన్నాడు. దానికి ‘ఉమర్‌ (ర) ‘గస్సానీలు వచ్చారా ఏంటి?’ అని అన్నారు. (బు’ఖారీ, ఈలా సంఘటన)

ఏమైతేనేం ఈ వార్తలు అరబంతా వ్యాపించాయి. బలమైన  సూచనలు కనిపించసాగాయి. అప్పుడు ప్రవక్త (స) సైన్యం సిద్ధం చేయమని ఆదేశించారు. అనుకోకుండా అది కరువు కాటకాల కాలం, తీవ్ర ఎండాకాలం. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఇంటినుండి బయటకు రావటమే కష్టం. కపటులు తమ్ము తాము ముస్లిములుగానే ప్రకటించుకుంటూ ఉండేవారు. వారి బండారం బయటపడింది. తాము వెళ్ళడానికి వెనుకంజ వేసేవారు. ఇతరులకూ వెళ్ళవద్దని వారించే వారు. శ్రేయోభిలాషుల్లా, ఎండల్లో వెళ్ళకండని చెప్పేవారు.

సువైలిమ్‌ అనే ఒక యూదుడుండే వాడు. వాడి ఇంట్లో కపటులందరూ సమావేశమయి ప్రజలను వెళ్ళవద్దని రెచ్చగొట్టేవారు. దేశంపై రూమీల దాడి భయం ఉండేది. అందువల్ల ప్రవక్త(స) అరబ్‌లో ఉన్న జాతుల వారి నందరినీ సహాయం కోరారు. ప్రవక్త (స) అనుచరుల్లో ‘ఉస్మాన్‌ (ర) 200 ఊఖియాల వెండి, 200 ఒంటెలు సహాయం చేసారు. చాలామంది అనుచరులు చాలా పెద్ద పెద్ద మొత్తాలు తెచ్చి ఇచ్చారు. చాలా మంది ముస్లిములు ప్రయాణ సౌకర్యాలు లేనందున యుద్ధానికి వెళ్ళలేక పోయారు. వారు ప్రవక్త (స) వద్దకు వచ్చి తమ అసహాయతను విన్నవించుకుంటూ ఏడ్చారు. ప్రవక్త (స) వారి స్థితిని చూచి చాలా జాలి పడ్డారు. వారు బయలు దేరడానికి ఎటువంటి సామాగ్రి లభించలేదు. వారి గురించే ఈ వాక్యం అవతరించింది:

”మరియు ఎవరైతే నీవద్దకు వచ్చి వాహనాలు కోరినప్పుడు నీవు వారితో: ‘నా దగ్గర మీకివ్వటానికి ఏ వాహనం లేదు.’ అని పలికినప్పుడు, ఖర్చు చేయటానికి తమదగ్గర ఏమీలేదు కదా అనే చింతతో కన్నీరు కార్చుతూ తిరిగిపోయారో, అలాంటి వారిపై కూడా ఎలాంటి నిందలేదు.” (అత్తౌబహ్‌, 9:92)

సాధారణంగా ప్రవక్త (స) మదీనహ్ నుండి వెళ్లినపుడు ఎవరి నైనా పాలకునిగా నియమించి వెళ్ళేవారు. ఎందుకంటే ఈ యుద్ధంలో ప్రవక్త (స) భార్యలు వెంట వెళ్ళేలేదు. మదీనహ్ రక్షణకు ఎవరో ఒకరు ఉండటం తప్పనిసరి అయింది. ఇప్పుడు ఈ స్థానం ‘అలీకి లభించింది. అయితే ‘అలీ (ర) నన్ను మహిళల్లో పిల్లల్లో విడిచిపోతున్నారని ఫిర్యాదు చేసారు. దానికి ప్రవక్త (స), ‘నీకూ నాకూ మూసాకు హారూన్‌కు ఉన్నంత సంబంధం ఉండటం నీకు ఇష్టం లేదా’ అని ఓదార్చారు. (బు’ఖారీ)

అయితే ప్రవక్త (స) 30 వేల మంది గల సైన్యాన్ని తీసుకొని మదీనహ్ నుండి బయలుదేరారు. ఇందులో 10 వేలు గుర్రాలు కూడా ఉన్నాయి. మార్గంలో చారిత్రక గుణపాఠ ప్రదేశాలు కూడా ఉన్నాయి. వీటి గురించి ఖుర్‌ఆన్‌లో ప్రస్తావన ఉంది. అంటే సమూద్‌ గృహాలు. వీరు కొండలను తొలచి గృహాలుగా చేసేవారు. ఇక్కడ దైవశిక్ష అవతరించి ఉంది. అందువల్ల ప్రవక్త (స) ఎవరూ ఇక్కడ దిగరాదని, నీరు తాగరాదని, దేనికీ ఉపయోగించరాదని. తబూక్‌ చేరిన తర్వాత ఈ వార్త అసత్యం అని తేలింది. అయితే కొంతైనా నిజం ఉండకపోలేదు. గసాయి ధనవంతుడు ‘అరబ్‌లో కుట్రలు పన్నుతున్నట్లు తెలిసింది. (బు’ఖారీ)

తబూక్‌లో కఅబ్‌ బిన్‌ మాలిక్‌ సంఘటన జరిగింది. షామ్‌ నుండి ఒక రాయబారి వచ్చి క’అబ్‌ బిన్‌ మాలిక్‌కు రయీ’స్‌ ‘గస్సాన్‌ ఉత్తరం ఇచ్చాడు. అందులో ఇలాఉంది: ”ముహమ్మద్‌ నిన్ను సరిగా గుర్తించలేదని నేను విన్నాను. అందువల్ల నువ్వు నా దగ్గరకు వచ్చేయి. నేను నీకు మంచి గుర్తింపు ఇస్తాను. అప్పుడు క’అబ్‌ ఆంక్షలకు గురై ఉన్నారు. కాని అతను ఆ ఉత్తరాన్ని పొయ్యిలో వేసేసారు.

తబూక్‌ చేరి ప్రవక్త (స) 20 రోజుల వరకు అక్కడే ఉన్నారు. ఈలా నాయకుడైన యోహన్నా వచ్చి టాక్స్‌ ఇస్తామని ఒప్పుకున్నాడు. ఒక తెల్లని కంచరగాడిదను కానుకగా ఇచ్చాడు. దానికి బదులుగా ప్రవక్త (స) తన దుప్పటిని కానుకగా ఇచ్చారు. (జర్‌తానీ)

దౌమతుల్‌ జందల్‌ దిమిష్క్‌ నుండి కొంతదూరంలో ఉంది. అక్కడి నాయకుడు అకీదర్‌ ఖైసర్‌ అధీనంలో ఉన్నాడు. ప్రవక్త (స) ఖాలిద్‌కు 400 సైన్యం ఇచ్చి అతన్ని ఎదుర్కొ నడానికి పంపారు. ఖాలిద్‌ అతన్నిబంధించారు. అయితే స్వయంగా వచ్చి ప్రవక్త(స) ఒప్పందం కుదుర్చుకోవాలని షరతు పెట్టారు. అతడు తన సోదరుని వెంట మదీనహ్ వచ్చాడు. ప్రవక్త (స) అతనికి అభయం ఇచ్చారు.

ప్రవక్త (స) తబూక్‌ నుండి తిరిగి వచ్చి మదీనహ్ చేరేసరికి ప్రజలు ఆనందోత్సాహాలతో స్వాగతించడానికి బయలు దేరారు. స్త్రీలు కూడా తమ ఇళ్ళ నుండి బయలుదేరి వచ్చారు. అమ్మాయిలు గీతాలు, పాటలు పాడసాగారు.

మస్జిదె దిరార్‌: కపటులు ఎల్లప్పుడూ ముస్లిములను విడగొడదా మనే ప్రయత్నంలోనే ఉండేవారు. చాలా కాలంగా వారు మస్జిద్‌ ఖుబా’కు దగ్గరగా ఉండాలని కోరుకునేవారు. మరో మస్జిద్‌ను నిర్మించాలనే ఆలోచ నలో ఉండేవారు. అన్సారీ నుండి క్రైస్తవునిగా మారిన అబూ ‘ఆమిర్‌ కపటులతో, ‘మీరు సామాన్లు సిద్ధం చేయండి. నేను ఖైసర్‌ వద్దకు వెళ్ళి సైన్యం తెస్తాను. దీని ద్వారా ఇస్లామ్‌ను చెరిపివేద్దాం’ అని అన్నాడు.

ప్రవక్త (స) తబూక్‌ వెళుతున్నప్పుడు కపటులు వచ్చి, మేము రోగుల కోసం, బలహీనుల కోసం ఒక మస్జిద్‌ను నిర్మించాం. దయచేసి తమరు ఒకసారి అందులో నమాజ్‌చేస్తే బాగుంటుంది అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) ‘ఇప్పుడు నేను యుద్ధానికి వెళుతున్నాను’ అని అన్నారు. తబూక్‌ నుండి తిరిగి వస్తూ మాలిక్‌, మ’అద్‌ బిన్‌ ‘అదీలను ఆ మస్జిద్‌కు నిప్పంటించమని ఆదేశించారు. దీన్ని గురించే ఈ వాక్యాలు అవతరించబడ్డాయి:

మరియు (కపటవిశ్వాసులలో) కొందరు (విశ్వాసులకు) హాని కలిగించటానికి, సత్యతిరస్కారవైఖరిని (బలపరచ టానికి) మరియు విశ్వాసులను విడదీయటానికి, అల్లాహ్‌ మరియు ఆయన సందేశహరునితో ఇంతకు ముందు పోరాడినవారు పొంచి ఉండటానికి, ఒక మస్జిద్‌ నిర్మించారు. మరియు వారు: ”మా ఉద్దేశం మేలు చేయటం తప్ప మరేమీ కాదు!” అని గట్టి ప్రమాణాలు కూడా చేస్తున్నారు. కాని వారువాస్తవంగా అసత్యవాదులని అల్లాహ్‌ సాక్ష్యమిస్తున్నాడు.  నీవెన్నడూ దానిలో (నమా’జ్‌కు) నిలబడకు. మొదటి రోజు నుండియే దైవభీతి ఆధారంగా స్థాపించబడిన మస్జిదే నీకు (నమా’జ్‌కు) నిలబడటానికి తగినది. అందులో పరిశుద్ధులు కాగోరే వారున్నారు. మరియు అల్లాహ్‌ పరిశుద్ధులు కాగోరేవారిని ప్రేమిస్తాడు.” (అత్తౌబహ్, 9:107108)

[47]) వివరణ-3939: అంటే యుద్ధం అంటే కుట్రలూ, పన్నాగాలే. వీటిలో అధిగమించినవాడే గెలుస్తాడు. పన్నాగాలు, కుట్రలు సరిగా లేకపోతే సైన్యాలు కూడా ఏమీ చేయలేవు. ప్రజలు విజయం ఆశతో వెళతారు. కాని అక్కడ చంపబడతారు. చాలా విచారకరమైన విషయం ఏమిటంటే 14 వందల సంవత్సరాల క్రితం ముస్లిముల ప్రవక్త యుద్ధ కుతంత్రాలను వివరించారు. వాటిని ముస్లిములు వదలివేసారు. ఇతరులు వాటిని అనుసరించారు. వారు వీటిని ఉపయోగించి ముస్లిములను చీల్చివేసారు. స్నేహితులుగా మారి ఇతరుల నుండి వేరుచేసారు. ఆ తరువాత ఇద్దరినీ నాశనం చేసారు. యూదులుగాని, పారసీలుగాని, క్రైస్తవులుగానీ మీ మిత్రులు కాలేరనే సంగతి గ్రహించ రెందుకని? వీరందరూ ఒక్కటే. ముస్లిములకు వ్యతి రేకంగా వీరందరూ ఒక్కటౌతారు.

[48]) వివరణ-3940: ధార్మిక సేవల్లో అన్నిటి కంటే ఉత్తమమైన సేవ జిహాద్‌. ప్రవక్త (స) అనుచర మహిళలు ఎంత ఉత్సాహంగా, ఎంత సంతోషంగా ఈ సేవ చేసే వారంటే, ఇటువంటి ఉపమానం చరిత్రలో మరెక్కడా కానరాదు. హుద్ యుద్ధంలో అవిశ్వాసులు ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. ప్రవక్త (స) వెంట కొందరు అనుచరులు చేరి తన్నుతాను ప్రవక్త (స) రక్షణా కవచంగా నిలబడ్డారు. అవిశ్వాసులు ప్రవక్త (స)పై దాడి చేసినపుడు బాణాల ద్వారా కరవాలం ద్వారా ఎదుర్కొనే వారు. కందకం యుద్ధంలో ‘సఫియ్యా (ర) ఎంతో వీరోచితంగా పోరాడి ఒక యూదుని అంతం చేసారు. ఇంకా యూదుల దాడిని ఎదుర్కోవడానికి అవలంబించిన పద్ధతి చాలా అమోఘమైనది. హునైన్ యుద్ధంలో ఉమ్మె సులైమ్‌ కరవాలం తీసుకొని బయలు దేరటం అనేది ప్రఖ్యాత సంఘటన. అబూ బకర్‌ కాలంలో జరిగిన యర్‌మూక్ యుద్ధంలో అస్మా బిన్‌తె అబూ బకర్‌, ఉమ్మె అబాన్‌, ఉమ్మె ‘హకీమ్‌ ఖౌల, హింద్‌, మరియు ఉమ్ముల్‌ మూమినూన్‌  జువైరియ చాలా వీరోచితంగా పోరాడారు. ఇంకా అస్మా బిన్‌తె యజీద్‌ అన్సారీ ఖౌమ సూదులతో రూమీలను సంహరించారు.  భూమిపై యుద్ధాలలోనే కాదు సముద్ర యుద్ధాలలో కూడా అనుచర మహిళలు పాల్గొనేవారు. యుద్ధ మైదానంలో 1. నీళ్ళు త్రాపించడం. 2. గాయపడిన వారికి కట్లు కట్టటం. 3. చనిపోయిన వారిని, గాయపడిన వారిని యుద్ధ మైదానం నుండి తీసుకు వెళ్ళడం. 4. నూలు వడకడం. 5. బాణాలు ఏరి ఇవ్వడం. 6. ఆహార పదార్థాలు ఏర్పాటు చేయడం, వండటం. 7. సమాధులు త్రవ్వటం. 8. సైనికులను ప్రోత్సహించడం. ఆయిషహ్‌, ఉమ్మె సులైమ్‌, ఉమ్మె సులైత్‌ ఉహుద్‌ యుద్ధంలో గాయపడిన వారిని నీళ్ళు త్రాపించేవారు. ఉమ్మె సులైమ్‌ మరియు అన్సార్లకు చెందిన కొందరు స్త్రీలు గాయపడిన వారికి సేవలు చేసేవారు. ఈ ఉద్దేశ్యంతోనే వీరు ఎల్లప్పుడూ, ప్రవక్త (స) వెంట యుద్ధాల్లో పాల్గొనేవారు. రబీ’అ బిన్‌తె ము’అవ్విజ్‌ మొదలైన వారు చనిపోయిన వారినీ, గాయపడిన వారినీ మైదానం నుండి ఎత్తుకొని పోయి మదీనహ్ చేర్చారు. ఉమ్మె జియాద్‌ అష్షయీ మరియు ఇతర ఐదుగురు స్త్రీలు ఖైబర్‌ యుద్ధంలో ముస్లిములకు సహాయపడ్డారు. ఆమె బాణాలు ఏరి ఇవ్వటం, సత్తూ త్రాపించడం చేసేది. ఉమ్మె అతియ్యహ్‌ 7 యుద్ధాల్లో ప్రవక్త (స) సహచరుల కోసం అన్నం వండారు. అబూ బకర్‌ కాలంలో జరిగిన గవాస్‌, అమారత్‌ మొదలైన యుద్ధాల్లో స్త్రీలు, పిల్లలు అనేక సేవలు అందించారు. యర్మూక్‌ యుద్ధంలో ముస్లిములు వెనక్కి తగ్గితే ఉత్సాహవంతమైన పద్యాలు చదివి వారిని పౌరుషం తెప్పించారు.

ఇస్లామ్‌ వ్యాప్తి కూడా ఒక గొప్ప సేవే. అనుచర మహిళలు కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. ఫాతిమహ్ బిన్‌తె ఖత్తాబ్‌ ఆహ్వానంపై ‘ఉమర్‌ (ర) ఇస్లామ్‌ స్వీకరించారు. ఉమ్మె సులైమ్‌ ప్రయత్నం వల్ల అబూ ‘తల్‌’హా ఇస్లామ్‌ స్వీకరించారు. ఇక్రమ తన భార్య హితబోధ వల్ల ఇస్లామ్‌ స్వీకరించారు. అదేవిధంగా ఉమ్మె షరీక్‌ దోసియ వల్ల ఖురైష్‌ స్త్రీల్లో ఇస్లామ్‌ వ్యాపించింది. ఈమె చాలా రహస్యంగా చేసేది. ఇస్లామ్‌ రక్షణ కూడా చాలా గొప్ప బాధ్యతే. అందరికంటే అధికంగా ఈ బాధ్యతను ‘ఆయి’షహ్‌ (ర) నిర్వర్తించారు. 35 హిజ్రీలో ‘ఉస్మాన్‌ వీరమరణం పొందినపుడు ఇస్లామ్‌ వ్యవస్థ అంతా ఛిన్నా భిన్నం అయిపోయింది. ఆమె సంస్కర ణోద్యమాన్ని ప్రారంభించారు. దీనికి మక్కహ్, బసర ప్రజలు సంసిద్ధత వ్యక్తం చేసారు. ‘ఆయి’షహ్‌ (ర), ఉమ్మె సలమహ్, ఉమ్మె వరఖ స్త్రీలకు ఇమామత్‌ చేసేవారు. అ’జాన్‌ ఇచ్చే వారు. స్త్రీలను స్త్రీలు నమా’జ్‌ చేయించవచ్చును. రాజకీయ ఘనకార్యాలు: అనుచర మహిలలు అనేక రాజకీయ సేవలు అందించారు. షఫా’ బిన్‌తె ‘అబ్దుల్లాహ్‌ చాలా గొప్ప వ్యక్తిత్వం గలవారు. ‘ఉమర్‌ (ర)  ఆమె సలహాలు స్వీకరించేవారు. ఒక్కో సారి బజారు వ్యవహారం ఆమెకే అప్పజెప్పేవారు. హిజ్రత్‌కి ముందు ప్రవక్త (స)ను ముట్టడిద్దామనే అవిశ్వాసుల కుట్ర గురించి రఖీఖ బిన్‌తె సైఫీ ప్రవక్త (స)కు తెలియ పరిచారు. అనంతరం ప్రవక్త (స) పడకపై ‘అలీ (ర)ను పడుకోబెట్టి మదీనహ్ వైపు బయలుదేరారు. స్త్రీలకు రాజకీయ హక్కులున్నాయి. వారు శత్రువులను అభయం ఇవ్వగలరు. పాలకులు ఆమె అభయాన్ని కొనసాగించాలి. సునన్‌ అబూ దావూద్‌లో ఇలా ఉంది: ”మక్కహ్ విజయం రోజుల్లో ఉమ్మె హానీ (ఈమె ‘అలీ (ర) చెల్లెలు). ఒక అవిశ్వాసికి అభయం ఇచ్చారు. అప్పుడు ప్రవక్త (స) ఇలా అన్నారు, ”నీవు అభయం ఇచ్చిన వారికి మేమూ అభయం ఇస్తున్నాము.”  

విద్యా ఘనకార్యాలు: ఇస్లామీయ విద్యలు అంటే పఠనం, తఫ్‌సీర్‌, ‘హదీస్‌’, ఫిఖహ్‌, ఫరాయి’ద్ మొదలైన వాటిలో అనేక మంది అనుచర మహిళలు గొప్ప జ్ఞానం కలిగి ఉండేవారు. ‘ఆయి’షహ్‌ (ర), ‘హఫ్‌సహ్ (ర), ఉమ్మె సలమహ్ (ర), ఉమ్మె వరఖహ్‌ (ర), ఖుర్‌ఆన్‌ అంతటినీ తమ హృదయాలలో భద్రపరచుకున్నారు. హింద్‌ బిన్‌తె అసీద్‌, ఉమ్మె హిషామ్‌ బిన్‌తె ‘హారిస’హ్, రాయిత బిన్‌తె ‘హయ్యాన్‌ మరియు ఉమ్మె స’అద్‌ బిన్‌తె స’అద్‌ ఇబ్ను రబీ కొన్ని భాగాలు గుర్తు చేసుకున్నారు. ఉమ్మె స’అద్‌ ఖుర్‌ఆన్‌ బోధించేవారు. తఫ్‌సీర్‌లో ‘ఆయి’షహ్‌ (ర)కు ప్రత్యేక స్థానం ఉండేది. అందువల్లే ముస్లిమ్‌ చివరి భాగంలో వీరి కొన్ని భాగాలు ఉన్నాయి. ‘హదీసు’లో ప్రవక్త (స) సతీమణుల్లో ‘ఆయి’షహ్‌ (ర), ఉమ్మె సలమహ్ (ర) ప్రత్యేకంగా అందరికంటే ప్రత్యేక స్థానం కలిగి ఉండేవారు. ఆయిషహ్ (ర) 2210 ‘హదీసు’లు ఉల్లేఖించారు. ఉమ్మె లమహ్ 378 ‘హదీసు’లు ఉల్లేఖించారు. వీరేకాక ఇంకా ఇతరులు ఉమ్మె అతియ, అస్మా బిన్‌తె అబూ బకర్‌, ఉమ్మె హానీ, ఫాతిమహ్ బిన్‌తె ఖైస్‌ కూడా అధిక సంఖ్యంలో ఉల్లేఖించారు. ఫిఖహ్‌లో ‘ఆయి’షహ్‌ (ర) ఫత్వాలు ఎంత అధిక సంఖ్యంలో ఉన్నాయంటే ఇప్పుడు అవి ఎన్నో కాండాలుగా తయారయి ఉన్నాయి. ఉమ్మె సలమహ్ ఫత్వాలు ఒక  చిన్న పుస్తకం తయారవుతుంది. ఫరాయి’ద్లో ‘ఆయి’షహ్‌ (ర)కు ప్రత్యేక స్థానం ఉండేది. గొప్ప గొప్ప ‘స’హాబీలు ఆమెను ఫరాయి’ద్ గురించి విషయాలను అడిగి తెలుసుకునేవారు. ఇస్లామీయ విద్యలేకాక, ఇతర విద్యల్లోనూ వీరికి అనుభవం ఉండేది. ఉదాహరణకు, రాజకీయంలో ఉమ్మె సలమహ్ ఆరితేరినవారు. ప్రసంగంలో అస్మా బిన్‌తె సకన్‌కు ప్రత్యేక స్థానం ఉండేది. పరమార్థంలో అస్మా బిన్‌తె అమీస్‌ ప్రముఖులు. వైద్యం, శస్త్రచికిత్సలో రఫీదహ్‌ (ర), అస్లమియ్య (ర), ఉమ్మె మతా, ఉమ్మె కబ్‌స, హమ్‌న బిన్‌తె జహష్‌, ముఆజహ్‌, లైలా, ఉమైమ, ఉమ్మె జియాద్‌, రబీ బిన్‌తె ము’అవ్వజ్‌, ఉమ్మె అతియ్య, ఉమ్మె సలీమ్‌ మొదలైన వారు నిపుణులు. రఫీద ఖీమ శస్త్రచికిత్సా శిబిరంగా ఉండేది. ఇది మస్జిద్‌ నబవీకి దగ్గర గానే ఉండేది.  కవిత్వంలో ఖన్‌సా, సూదీ, సఫియ్య, ఆతిక, అమామ మరీదియ్య, హింద్‌ బిన్‌తె ‘హారిస్‌’, జైనబ్‌ బిన్‌తె అవ్వామ్‌ అర్వీ, ఆతిక బిన్‌తె జైద్‌, హింద్‌ బిన్‌తె అసాస, ఉమ్మె అయ్‌మన్‌ (ర), ఖనీల అజ్జదియ్య, కబ్‌స బిన్‌తె రాఫె, మైమూనహ్ బలవియ్య, నఅమున్‌, రుఖయ్యహ్‌ ప్రముఖులు.

[49]) వివరణ-3941: ఉమ్మె ‘అ’తియ్య ప్రవక్త (స) ప్రముఖ అనుచర మహిళ. ఈమె ప్రవక్త (స) వెంట 7 యుద్ధాల్లో పాల్గొన్నారు. ఈ ‘హదీసు’ ద్వారా ఈ సేవల కోసం స్త్రీలను యుద్ధంలో తీసుకొని వెళ్ళవచ్చని తెలిసింది.

[50]) వివరణ-3942: అంటే జిహాద్‌లో ఒకవేళ శత్రువుకు చెందినవారెవరైనా స్త్రీలు లేదా పిల్లలు, వృద్ధులు, అంధులు, కుంటివారు, అంగవైకల్యం గలవారు, పిచ్చివారు కనబడితే, వారిని చంపకూడదని, ఒకవేళ స్త్రీ సైన్యాధిపతిగా యుద్ధం చేస్తుంటే మాత్రం ఆమెను చంపవచ్చును.

[51]) వివరణ-3944: బనూ దీర్ యుద్ధ సంఘటన ఇలా ఉంది. దీన్ని మేము సీరతున్నబీ నుండి తీసు కున్నాము.ఉమర్బిన్ఉమయ్య ‘ఆమిర్‌ వర్గానికి చెందిన ఇద్దరిని చంపివేసారు. దాని హత్యాపరిహారం ఇంకా బాకీ ఉంది. అదేవిధంగా ఒప్పందంపరంగా బనూ న’దీర్‌కు చెందిన యూదులపై కూడా ఒక భాగం ఇంకా బాకీ ఉంది. దాన్ని కోరుతూ ప్రవక్త (స) బనూ న’దీర్‌ వద్దకు వెళ్ళారు. వారు దానికి ఒప్పుకున్నారు. కాని తెరచాటుగా కుట్రపన్నారు. ఒక వ్యక్తి రహస్యంగా డాబా పైకి ఎక్కి ప్రవక్త (స)పై ఒక బండరాయిని పడవేయాలని ప్రయత్నించాడు. అనుకోకుండా ప్రవక్త (స) ఆ గోడ నీడలోనే నిలబడి ఉన్నారు. అమ్ర్‌ బిన్‌ హిజాష్‌ అనే ఒక యూదుడు పైకి ఎక్కాడు. ప్రవక్త (స) కు ఈ విషయం తెలిసిపోయింది. అనంతరం ప్రవక్త (స) మదీనహ్ తిరిగి వెళ్ళిపోయారు. విషయం ఏమిటంటే ఖురైష్‌ ప్రవక్త (స)ను చంపివేయమని బనూ న’దీర్‌కు వార్త పంపారు. లేదా మేము మీ మీదకు దండెత్తి వస్తామని హెచ్చరించారు. మొదటి నుండీ బనూ న’దీర్‌ ఇస్లామ్‌ శత్రువులు. ఖురైషుల వార్త వారిని మరీ రెచ్చగొట్టింది. ప్రవక్త (స)ను బనూ న’దీర్‌ 30 మందిని తీసుకురమ్మని, మేము కూడా మా వాళ్ళను తీసుకువస్తామని సందేశం పంపారు.  ప్రవక్త (స) మాటలు విని ఒకవేళ మా పండితులు ధృవీకరిస్తే మాకూ అభ్యంతరం ఉండదు. ఎందుకంటే వారు ద్రోహం తలపెట్టే ఉద్దేశ్యంతో ఉన్నారు. ప్రవక్త (స) ఒక ఒప్పందం వ్రాయమని అన్నారు. దానికి వారు సిద్ధపడలేదు. ప్రవక్త (స) బనీ ఖురైజహ్ యూదుల వద్దకు వెళ్ళారు. వారిని ఒప్పందాన్ని పునర్విచారించాలని కోరారు. దానికి వారు సరైన విధంగా స్పందించారు. బనూ న’దీర్‌కు ఈ ఉదాహరణ ముందు ఉంది. వారి పండితులు ఒప్పందాన్ని వ్రాసారు. కాని వారు ఒప్పందానికి సిద్ధం కాలేదు. చివరికి ప్రవక్త (స)కు ముగ్గురు వ్యక్తుల్ని తీసుకు రమ్మని, మేము కూడా ముగ్గురు పండితులను తీసుకు వస్తామని, వీరు మిమ్మల్ని విశ్వసిస్తే మేము కూడా మిమ్మల్ని విశ్వసిస్తామని సందేశం పంపారు. ప్రవక్త (స) దానికి ఒప్పుకున్నారు. కాని మార్గంలోనే ఒక ప్రామాణిక వార్తద్వారా యూదులు కరవాలాలు ధరించి ఉన్నారని, తమరు వెళితే చంపివేస్తారని తెలిసింది. బనూ న’దీర్‌ అనేక విధాలుగా ధిక్కారణకు దిగింది. వారు చాలా దృఢమైనకోటల్లో ఉండేవారు. వాటిని జయించడం అంత తేలిక పని కాదు. అంతేకాక అబ్దుల్లాహ్బిన్ఉబయ్, మీరు వారి మాట వినకూడదు, బనూ ఖురైజహ్ మీకు సహాయం చేస్తారు, ఇంకా నేను 2000 మందిని తీసుకొని మీ సహాయం కోసం వస్తాను,’ అని కబురు పంపాడు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:

”(ఓ ము’హమ్మద్‌!) కపట విశ్వాసులను గురించి నీకు తెలియదా? వారు గ్రంథప్రజలలో సత్యతిరస్కారులైన తమ సోదరులతో, ఇలా అంటారు: “ఒకవేళ మీరు వెళ్ళగొట్టబడినట్లయితే, మేము కూడా తప్పక మీతోబాటు వెళ్తాము. మరియు మీ విషయంలో మేము ఎవ్వరి మాటా వినము. ఒక వేళ మీతో యుద్ధం జరిగితే, మేము తప్పక మీకు సహాయపడతాము…” (అల్‌ ‘హష్‌ర్‌, 59:11)

కాని బనూ న’దీర్‌ అంచనాలన్నీ తారుమారయ్యాయి. బనూ ఖురైజ వారికి సహాయం చేయలేదు. కపటులు బహిరంగంగా ఇస్లామ్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా నిరసన తెలియజేయలేక పోయారు. ప్రవక్త (స) 15 రోజుల వరకు వారిని చుట్టుముట్టి ఉంచారు. కోటచుట్టూ ఉన్న ఖర్జూరపు చెట్లలో కొన్నిటిని నరికివేయించారు. ఖుర్‌ఆన్‌లో కూడా దీన్ని పేర్కొనడం జరిగింది:

”( విశ్వాసులారా!) మీరు ఏ ఖర్జూరపు చెట్లను నరికి వేశారో లేక ఏ ఖర్జూరపుచెట్లను వాటి వ్రేళ్ళ మీద నిలబడేలా వదలిపెట్టారో, అంతా అల్లాహ్‌ ఆజ్ఞతోనే జరిగింది. మరియు ఇదంతా అవిధేయులను అవమానించటానికి జరిగిన విషయం.” (అల్‌ హష్‌ర్‌, 59:5)  చివరికి బనూ న’దీర్‌ ఒక షరీతుపై ఒప్పుకున్నారు. తమ ధన సంపదలను ఒంటెలపై తీసుకొనివెళ్ళగలిగినంత తీసుకొని వెళ్ళవచ్చును. మదీనహ్ నుండి బయటకు వెళ్ళిపోవాలి. అనంతరం అందరూ తమ ఇళ్ళను వదలి వెళ్ళిపోయారు. వీరిలో పెద్దపెద్ద నాయకులు సలామ్‌ బిన్‌ అబీల్‌ ‘హఖీఖ్‌, కనాన బిన్‌ రబీఅ, ‘హయ్యి బిన్‌ అఖ్‌తబ్‌ ఖైబర్‌ వెళ్ళిపోయారు. అక్కడి పాలకుడు వారిని ఆదరించి గౌరవించాడు. బనూ న’దీర్‌ తమ ప్రాంతాన్ని వదలి బయలుదేరారు. కాని చాలా అట్టహాసంగా, గొప్పగా ఒంటెలపై కూర్చొని డప్పులు వాయి స్తూ వెళుతున్నారు. మదీనహ్ ప్రజలు కూడా ఎన్నడూ చూడని అటువంటి సంఘటనను చూస్తూ ఉండిపోయారు. వారు చాలా ఆయుధాలు వదలి వెళ్ళారు. ఆ తరువాత కొందరు అ’న్సార్‌ యువకులు యూదులుగా మారిపోయారు. వారూ వెళ్ళడానికి ప్రయత్నించారు. అప్పుడు అ’న్సారీలు వారిని అడ్డుకున్నారు. అప్పుడు ఈ ఆయతు అవతరించింది. ”ధర్మం విషయంలో బలవంతం లేదు…” (అల్‌ బఖరహ్‌, 2:256

అబూ దావూద్‌ ఈ సంఘటనను ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ ద్వారా పేర్కొన్నారు.

[52]) వివరణ-3945: మరీసీ ఒక ప్రదేశం పేరు. ఇది మక్కహ్ మదీనహ్ ల మధ్య ఉంది. ఇక్కడ బనీ ముస్తలిఖ్ కోనేరు ఉండేది. అక్కడ వీరు తమ జంతువులను మేపేవారు. వీరు ముస్లిములకు బద్ధశత్రువులు. ప్రవక్త (స) వీరితో యుద్ధంచేసారు. విజయం సాధించారు. వీరిని చంపి స్త్రీలను, పిల్లల్ని అదుపులోకి తీసుకున్నారు.

[53]) వివరణ-3946: అంటే యుద్ధంలో దూరం నుండి బాణాలు కొట్టకండి. శత్రువు దగ్గరకు వస్తే బాణం కొట్టండి. అనవసరంగా తమ బాణాలను వృథా చేయకండి. అవి అయిపోతే మీరు నిస్సహాయులై పోతారు.

[54]) వివరణ-3948: అంటే రాత్రి యుద్ధంలో ముస్లిమ్‌ ఎవరో, అవిశ్వాసి ఎవరో తెలియదు. అందువల్ల ముస్లిములు యుద్ధంలో, హామీమ్లా తున్సరూన్‌” అనాలి. దీనివల్ల ముస్లిములెవరో తెలిసిపోతుంది. అంటే ఇది ముస్లిముల గుర్తు. ముస్లిమ్‌ మరో ముస్లిమ్‌ను చంపకుండా ఉండటానికి. కందక యుద్ధం సందర్భంగా ఈ చిహ్నాన్ని ఆదేశించడం జరిగింది. మరో సందర్భంలో మరో చిహ్నం సూచించడం జరిగింది.

[55]) వివరణ-3952: షుయూ’ఖ్‌ అంటే శక్తిమంతులు లేదా అధిక వయస్కులు. అయితే వృద్ధులనుచంపటం ధర్మం కాదు.

[56]) వివరణ-3953: ప్రవక్త (స) ఉసామహ్ (ర)ను ఒక సైన్యానికి నాయకుడిగా చేసి పంపుతూ సిరియా దేశానికి చెందిన ఉబ్‌నా వర్గ ప్రజలపై ఉదయం వేళ దాడి చేయమని, వారి పొలాలను, తోటలను కాల్చివేయమని ఆదేశించారు.

[57]) వివరణ-3958: అక్కారూన అంటే దాడిచేసేవారు. అంటే శత్రువులతో పోరాడుతూ రహస్య ఉద్దేశ్యంతో వెనుతిరిగి పారిపోయి మళ్ళీ అవకాశం చూచి దాడి చేయడం. ఇలా చేయడంలో అభ్యంతరం ఏమీ లేదు.

[58]) వివరణ-3959: మిన్జనీఖ్ ఒక రకమైన పరికరం. ప్రాచీన కాలంలో  ఇందులో రాయి పెట్టి శత్రువును చంపేవారు.

[59]) వివరణ-3960: అంటే యుద్ధంలో అవిశ్వాసులను గొలుసులతో బంధించి ఖైదీగా చేయబడుతుంది. ఆ తరువాత వారు సంతోషంగా ముస్లిమ్‌ అయిపోతారు, ముస్లిమ్‌గానే మరణిస్తారు. వారిని గొలుసులతో బంధించడం స్వర్గప్రవేశానికి కారణం అవుతుంది. అందువల్ల అల్లాహ్‌ (త) వారిపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. ఇంకా సంతోషిస్తాడు.

[60]) వివరణ-3963: ప్రవక్త (స) బనూ ఖురైజహ్ యూదులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే వారు చాలా పెద్ద ద్రోహాన్ని తలపెట్టారు. అప్పుడు ప్రవక్త (స) వారిని ముట్టడించారు. నెలరోజుల వరకు ముట్టడి కొనసాగించారు. చివరికి అసహాయులై సఅద్బిన్మఆజ్ తీర్పును స్వీకరించారు. ఎందుకంటే సఅద్‌ బిన్‌ మఆజ్‌ వారి మిత్రవర్గానికి చెందినవారు. అప్పుడు సఅద్‌ బిన్‌ మఆజ్‌ లేరు. కందక యుద్ధంలో బాణం తగలటం వల్ల తీవ్రంగా గాయపడి, మదీనహ్లోనే ఉండి పోయారు. మస్జిదె నబవీకి చెందిన ఒక ఖైమలో నివసిస్తున్నారు. ప్రవక్త (స) ఒక వ్యక్తిని పంపి పిలిపించి ఈ వ్యవహారం అతనికి అప్పగించారు. అనంతరం అతను యూదుల ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు ఇచ్చారు.

[61]) వివరణ-3965: ప్రవక్త (స) ‘తాయిఫ్‌ నుండి మక్కహ్ వస్తున్నప్పుడు అల్లరి మూకలు ప్రవక్త (స)ను వెంబడించారు. ముత్‌’యిమ్బిన్‌ ‘అదీ వారి నుండి ప్రవక్త (స) ను కాపాడారు. అంటే అతడు ప్రవక్త (స)కు ఉపకారం చేసాడు. ప్రవక్త (స) కూడా ఉపకారం చేసేవారికి ఉపకారం చేసేవారు. అందువల్లే ప్రవక్త (స), ‘ఒకవేళ ము’త్‌’యిమ్‌ బిన్‌ ‘అదీ బ్రతికిఉండి, ఈ ఖైదీల గురించి సిఫారసుచేస్తే, నేను తప్పకుండా అతని సిఫారసును స్వీకరించేవాడిని. ఖైదీలను విడుదలచేసి ఉపకారానికి ఉపకారం చేసి ఉండేవాడిని,’ అని అన్నారు. ఈ ‘జుబైర్‌ బిన్‌ ము’త్‌’యిమ్‌ బిన్‌ ‘అదీ బిన్‌ నౌఫిల్‌ బిన్‌ ‘అబ్ద్‌ మునాఫ్‌ ప్రవక్త (స) దూరపు బంధువులు.

[62]) వివరణ-3966: ఈ ఆయతు సూరహ్‌ ఫతహ్‌(48)కు చెందినది. ఇందులో హుదైబియహ్ ఒప్పందం గురించి ఉంది. ఒప్పందం అయిన తరువాత మక్కహ్ అవిశ్వాసులు ద్రోహం తలపెట్టారు. ప్రవక్త (స), అనుచరులు తిరిగి వస్తున్నప్పుడు తన్‌’యీమ్కొండ వద్ద రాత్రిపూట దాడికి పాల్పడ్డారు. ఎందుకంటే ఒప్పందం వల్ల ప్రవక్త (స) నిశ్చింతగా ఉండసాగారు. కాని అవిశ్వాసులు ఎక్కడ ఏ అవకాశం దొరికినా చంపి వేద్దామని ప్రయత్నించారు. ఈ పని కోసం అవిశ్వాసులు 80 మందిని ఎన్నుకున్నారు. వారు ఆయుధాలు ధరించి తన్‌’యీమ్‌ కొండవైపు నుండి రహస్యంగా అవకాశం చూచి దిగివచ్చారు. కాని అల్లాహ్‌ (త) ముస్లిములకు ఈ విషయాన్ని గురించి తెలియ పరిచాడు. ముస్లిముల సైనికులు వీరందరినీ పట్టుకున్నారు. ప్రవక్త (స) వద్దకు తీసుకొనివచ్చారు. ప్రవక్త (స) వారిని, ‘మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మీకు అనుమతి ఎవరిచ్చారు? ఎవరి వల్ల మీరు ఇక్కడికి వచ్చారు?’ అని అడిగారు. కాని వారు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ద్రోహానికి పాల్పడినందువల్ల వీరందరూ మరణశిక్షకు అర్హులే. కాని ప్రవక్త (స) వీరిని విడుదల చేసివేసారు. ఇంకా ద్రోహం వారి వైపునుండే ప్రారంభం కావాలి. ముస్లిముల తరఫు నుండి కాకూడదు. ఎందుకంటే ప్రవక్త (స) వారిని చంపివేస్తే అవిశ్వాసులు ముస్లిములపై ఆరోపణాస్త్రాలు సంధిస్తారు. ఈ ఆయతులో దీన్ని గురించే పేర్కొనడం జరిగింది. అంటే అల్లాహ్‌ (త) ఇటువంటి సమయంలో అవిశ్వాసుల చేతుల నుండి మిమ్మల్ని రక్షించాడు. వారు మిమ్మల్ని హాని తలపెట్ట లేక పోయారు. అదేవిధంగా మీ నుండి వాళ్ళను రక్షించాడు, ఇదంతా అల్లాహ్‌ ఉపకారం.

[63]) వివరణ-3970: ప్రవక్త (స) అబుల్‌ ‘ఆ’స్‌ను విడిచిపెట్టి ‘జైనబ్‌ను అవిశ్వాసుల చేతుల్లో నుండి విడిపించి మదీనహ్ పంపమని షరతుపెట్టారు. ప్రవక్త (స)కు అందరికంటే ముందు జైనబ్ జన్మించారు. దైవదౌత్యం లభించడానికి 10 సంవత్సరాలు ముందు ప్రవక్త (స) వయస్సు 30 సం. ఉన్నప్పుడు జన్మించారు. ప్రవక్త (స) మదీనహ్ వలసపోయినప్పుడు భార్యా బిడ్డలు మక్కాహ్ లోనే ఉండిపోయారు. ‘జైనబ్‌(ర) పెళ్ళి ఆమె పిన్ని కొడుకు అబుల్‌ ‘స్బిన్రబీ జరిగింది. బద్ర్‌ యుద్ధంలో అబుల్‌ ‘ఆ’స్‌ పట్టుబడ్డారు. అతనితో పైవిధంగా వాగ్దానం తీసుకోవటం జరిగింది. ఆ తరువాత ‘జైనబ్‌ (ర) మదీనహ్ వచ్చారు. తన భర్త అబుల్‌ ‘ఆ’స్‌ను అవిశ్వాస స్థితిలో వదలిపెట్టారు. అబుల్‌ ‘ఆ’స్‌ మళ్ళీ ఒక యుద్ధంలో పట్టుబడ్డారు. అప్పుడు కూడా ‘జైనబ్‌ (ర) విడిపించారు. మక్కహ్ వెళ్ళి అతడు తన వద్ద ఉన్న అమానతులను తిరిగి అప్పజెప్పి ఇస్లామ్‌ స్వీకరించి మదీనహ్ వచ్చారు. ‘జైనబ్‌ అతన్ని అవిశ్వాస స్థితిలో వదలిపెట్టారు. అందువల్ల ఇద్దరిని వేరు చేయటం జరిగింది. అతడు మదీనహ్ వచ్చిన తర్వాత ‘జైనబ్‌ మళ్ళీ అతని నికా’హ్‌లోకి చేరారు. అబుల్‌ ‘ఆ’స్‌ ‘జైనబ్‌ పట్ల చాలామంచిగా వ్యవహరించారు. ప్రవక్త (స) కూడా అతన్ని ప్రశంసించారు. నికా’హ్‌ తరువాత ‘జైనబ్‌ (ర) చాలా తక్కువ రోజులు బ్రతికి ఉన్నారు. ఉమ్మె ఐమన్‌ (ర) సౌ’దహ్ బిన్‌తె జుము’అహ్ (ర), ఉమ్మె సలమహ్ (ర) ఆమెను స్నానం చేయించారు. ప్రవక్త (స) జనా’జహ్ నమా’జు చదివించారు. అబుల్‌ ‘ఆ’స్‌ మరియు ప్రవక్త (స) సమాధిలోకి దింపారు. ‘జైనబ్‌ (ర) కు సంతానం ఇద్దరు. ఉమామహ్, అలీ. ప్రవక్త (స) ఉమామహ్ను చాలా ప్రేమించేవారు. ప్రార్థనా సమయాల్లో కూడా ఆమెను వదలిపెట్టేవారు కారు. ఒకసారి ఎవరో ఒక ఖరీదైన హారం కానుకగా ఇచ్చారు. ప్రవక్త (స) భార్యలందరూ అది ‘ఆయి’షహ్‌ (ర)కు దక్కుతుందని భావించారు. కాని ప్రవక్త (స) ఉమామహ్ను పిలిచి ఆ హారాన్ని ప్రవక్త (స) స్వయంగా ఆమె మెడలో వేసారు. అబుల్‌ ‘ఆ’స్‌ జుబైర్బిన్‌ ‘అవ్వామ్ను ఉమామహ్తో పెళ్ళి చేసుకోమని మరణించడానికి ముందు కోరారు. ఫాతిమహ్ మరణానంతరం అతడు ‘అలీ (ర)తో ఆమెకు నికా’హ్‌ చేయించారు. ‘అలీ (ర) వీరమరణం పొందిన తర్వాత ముగీరహ్ను ఆమెను పెళ్ళిచేసుకోమని కోరడం జరిగింది. ము’గీరహ్‌ ఆమెను పెళ్ళిచేసుకున్నారు. అతనికి ఒక సంతానం కలిగింది. అతని పేరు హ్యా, ఉమామహ్ ముగీరహ్ వద్దే మరణించారు. (సీరతున్నబీ)

[64]) వివరణ-3973: బద్ర్‌ యుద్ధంలో 70 మంది అవిశ్వాసులను పట్టుకొని మదీనహ్ తీసుకొని రావడం జరిగింది. అల్లాహ్‌ (త) తరఫు నుండి జిబ్రీల్‌ (అ) వచ్చి ఈ ఖైదీలను చంపివేయండి లేదా పరిహారం తీసుకొని విడిచిపెట్టండి. కాని ఒకవేళ పరిహారం తీసుకొని వదలివేస్తే వచ్చే యుద్ధంలో 70 మంది ముస్లిములు వీరమరణం పొందుతారు అనే సలహా ఇచ్చారు. అయితే అనుచరులు పరిహారం తీసుకొని, యుద్ధంలో చంపబడటాన్ని ఎన్ను కున్నారు. అనంతరం ఉ’హుద్‌ యుద్ధంలో 70 మంది ముస్లిములు వీరమరణం పొందారు. పరిహారం తీసుకొని వదలిపెట్టటం అనేది అల్లాహ్ (త) నిర్దేశానికి వ్యతిరేకంగా జరిగింది. అసలు అల్లాహ్ (త) నిర్ణయం వారిని చంపివేయాలనే సూచించింది. అయితే ఆలోచనల అంచనాల పొరపాటు జరిగింది. అల్లాహ్‌ ఆదేశం: ”(శత్రువులతో తీవ్రంగా పోరాడి, వారిని) పూర్తిగా అణచ నంతవరకు, తనవద్ద యుద్ధఖైదీలను ఉంచుకోవటం ధరణిలో, ఏ ప్రవక్తకూ తగదు. మీరు ప్రాపంచిక సామగ్రి కోరుతున్నారు. కాని అల్లాహ్‌ (మీ కొరకు) పరలోక (సుఖాన్ని) కోరుతున్నాడు. మరియు అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు. ఒకవేళ అల్లాహ్‌ (ఫర్మానా) ముందే వ్రాయబడి ఉండకపోతే, మీరు తీసుకున్నదానికి (నిర్ణయానికి) మీకు ఘోరశిక్ష విధించబడి ఉండేది. కావున మీకు ధర్మ సమ్మతంగా లభించిన ఉత్తమమైన విజయధనాన్ని అనుభవించండి. అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.  ఓ ప్రవక్తా! నీ అధీనంలో ఉన్న యుధ్ధ ఖైదీలతో ఇలా అను: ”ఒకవేళ అల్లాహ్‌ మీ హృదయాలలో మంచితనం చూస్తే ఆయన మీ వద్ద నుండి తీసుకున్న దానికంటే ఎంతో ఉత్తమమైన దానిని మీకు ప్రసాదించి ఉంటాడు. మరియు మిమ్మల్ని  క్షమించి ఉంటాడు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.” కాని ఒకవేళ వారు నీకు నమ్మకద్రోహం చేయాలని తలచుకుంటే, వారు ఇంతకు పూర్వం అల్లాహ్‌కు నమ్మకద్రోహం చేశారు, కావున వారిపై నీకు శక్తినిచ్చాడు. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.” (అల్‌ అన్‌ఫాల్‌, 8:67-71)

బద్ర్‌ యుద్ధంలో అవిశ్వాసులు ముస్లిములకు పట్టుబడ్డారు. అల్లాహ్‌ (త) వీరి గురించే ముస్లిముల ముందు రెండు మార్గాలు పెట్టాడు.

1. చంపటం.

2. పరిహారం తీసుకొని విడిచిపెట్టడం.

అయితే విడిచిపెడితే వచ్చే యుద్ధంలో 70 మంది ముస్లిములు చంపబడతారని తెలియపరచడం జరిగింది. వాస్తవంగా రెంటిలో ఒక దాన్ని వారిని ఎంచుకోమని చెప్పడం జరిగింది. అనంతరం ప్రవక్త (స) అనుచరుల అభిప్రాయాన్ని కోరారు. అప్పుడు అబూ బకర్‌ (ర), ‘ఓ ప్రవక్తా! ఈ ఖైదీలందరూ మన బంధువులు, చుట్టాలే. పరిహారం తీసుకొని వదలివేస్తే, ఈ ఉపకారం గుర్తించి వీరిలో కొంత మంది ఇస్లామ్‌ స్వీకరించవచ్చు. వచ్చే ధనం సామాజిక, ధార్మిక పనుల్లో పనికివస్తుంది. అయితే వచ్చే యుద్ధంలో 70 మంది చనిపోతారనేది. మరేం భయం లేదు. వీరమరణం స్థానం లభిస్తుంది.’ ప్రవక్త (స) కూడా దీన్నే కోరుకునేవారు. అయితే కొందరు ధన లాభాన్ని దృష్టిలో ఉంచుకొని ఒప్పుకున్నారు. అయితే ‘ఉమర్‌ (ర) మరియు స’అద్‌బిన్‌ మ’ఆజ్‌ (ర) దీనికి వ్యతిరేకంగా స్పందించారు. ‘ఉమర్‌ (ర), ‘ఓ ప్రవక్తా! ఈ ఖైదీలు అవిశ్వాసుల నాయకులు, వీరిని చంపటమే మంచిది. దీనివల్ల వారిలో భయం చోటుచేసుకుంటుంది. ఇక ముందు ముస్లిములపై దాడి చేయటానికి సాహసించరు. ఇంకా దైవం ముందు మనం వీరిపట్ల ఆగ్రహం, అసహ్యం ప్రకటించి బంధువులని గాని, ధన వ్యామోహానికి గాని లొంగలేదని తేలిపోతుంది. ఈ ఖైదీల్లో మన దగ్గరి బంధువులు ఉంటే, ఎవరి బంధువును వారు సంహరించాలి,’ అని విన్నవించుకున్నారు. ఏది ఏమైనా అబూ బకర్‌ (ర) సలహాపై అమలు చేయడం జరిగింది. ఎందుకంటే అధికసంఖ్య దీన్నే కోరారు. స్వయంగా ప్రవక్త (స) కూడా దీన్నే సమర్థించారు. ఈ అభిప్రాయమే సరైనదని భావించారు. కాని పరిస్థితులను బట్టి వారిని సంహరించటమే మంచిదని ఇస్లామ్‌ కోరింది. అయితే పరిహారం తీసుకొని వదలివేయడం చాలా పెద్ద అపరాధంగా పరిగణించడం జరిగింది. ప్రవక్త (స) మాత్రం బంధుత్వం, దయ, జాలి మొదలైన కారణాలవల్ల అబూ బకర్‌ (ర) అభిప్రాయాన్ని సమర్థించారు. కొందరు ధనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అభిప్రాయాన్ని సమర్థించారు. మరికొందరు ధార్మిక, నైతిక లాభాలతో పాటు ఆర్థిక వనరులను కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని సమర్థించారు. అయితే ఇది చాలా పెద్ద అపరాధమని అల్లాహ్ (త) ఆగ్రహం వ్యక్తం చేసాడు.

ఒక ‘హదీసు’లో ఇలా ఉంది, ”ఒక వ్యక్తి తలపై గాయం తగిలింది. అతనికి స్నానం అవసరం ఏర్పడింది. నీళ్ళు ఉపయోగించడం చాలా ప్రమాదకరంగా ఉంది. సహచరులతో విషయాన్ని గురించి అడిగారు. వాళ్ళు నీళ్ళు  ఉపయోగించమని సలహా ఇచ్చారు. అతడు నీళ్ళు ఉపయోగించాడు, మరణించాడు. ప్రవక్త(స)కు ఈ విషయం తెలియగానే, ‘వాళ్ళు అతన్ని చంపివేసారు,’ అని అన్నారు.

3. బద్ర్‌ వారి పొరపాట్లను అల్లాహ్‌ (త) మన్నించివేసాడు.

4. ఈ నిర్ణయం అల్లాహ్ నిర్ణయంగా, ఇక ముందు దీని అనుమతి వస్తుందని సూచించడం జరిగింది.

5. ప్రవక్త (స) వారిలో ఉన్నంతవరకు చిత్తశుద్ధితో వారు క్షమాపణ కోరితే శిక్షించడం జరగదని సూచించడం జరిగింది.

6. ఈ ఖైదీల్లోని చాలామంది విధివ్రాతలో ఇస్లామ్‌ స్వీకరణ వ్రాయబడింది.  ఇటువంటి అవకాశాలు ఉండకపోతే, ఈ మహాపరాధానికి అల్లాహ (త) శిక్ష అవతరించి ఉండవలసింది.

ఒక సందర్భంలో ఆ శిక్షను ప్రవక్త (స)కు చూపించడం జరిగింది. ‘ఉమర్‌ (ర) కారణం అడిగారు. దానికి ప్రవక్త (స) వారి శిక్షను నా ముందు ప్రదర్శించడం జరిగింది. ఒక సందర్భంలో ప్రవక్త (స) కుసూఫ్‌ సలాహ్‌ చేస్తున్నప్పుడు ప్రవక్త (స) ముందు స్వర్గ, నరకాలను ప్రదర్శించడం జరిగింది.

[65]) వివరణ-3974: అద్(ర) బనీ ఖురైహ్ ఖైదీల విషయంలో, యుక్తవయస్సుకు చేరిన వారిని చంపమని, పిల్లల్ని, స్త్రీలను విడిచిపెట్టమని తీర్పు ఇచ్చారు. అదేవిధంగా ఆచరించటం జరిగింది. వారి బట్టలు విప్పి నాభి క్రింద వెంట్రుకలు వచ్చి ఉంటే వారిని చంపటం జరిగింది. రాని వారిని పిల్లలుగా పరిగణించడం జరిగి, వారిని విడిచిపెట్టటం జరిగింది. వీరిలో ‘అతియ్యహ్ ఖర్జీ కూడా ఉన్నారు. ఆ తరువాత మస్జిద్‌లో ఇస్లామ్‌ స్వీకరించారు. స్త్రీలందరినీ వదలివేయడం జరిగింది. కేవలం ఒక్క స్త్రీని చంపటం జరిగింది. ఎందుకంటే ఆమె ప్రజలను చాలా దుర్మార్గంగా చంపింది. ఆమెను రక్త ప్రతీకారంగా చంపటం జరిగింది.

అబూ దావూద్‌లో ‘ఆయి’షహ్‌ (ర) ఆ స్త్రీ గురించి ఇలా  పేర్కొన్నారు. ఆ స్త్రీకి తాను చంపబడే వాళ్ళలో తాను కూడా ఉన్నానని తెలిసిపోయింది. ఇంతలో ఆమె పేరు పిలవటం జరిగింది. అప్పుడు ఆమె ‘ఆయి’షహ్‌తో మాట్లాడుతూ నవ్వుతూ ఉంది. వెంటనే ఆమె లేచి, నిలబడి వెళ్ళసాగింది. నేను ఆమెతో, ‘ఎక్కడికి వెళుతున్నావు,’ అని అడిగాను. దానికి ఆమె, ‘నేరం చేసాను, శిక్ష అనుభవించడానికి వెళుతున్నాను,’ అని పలికి, అక్కడికి వెళ్ళగానే కరవాలం క్రింద తలపెట్టి, చంపబడింది.

[66]) వివరణ-3976: ‘సబానాసుబూఉన్ నుండి వచ్చింది. అంటే ఒక ధర్మాన్ని వదలి మరో ధర్మాన్ని అవలంబించడం. బనీ జజీమ వారు, ‘మేము మా ధర్మాన్ని వదలాము,’ అని అన్నారు. కాని ‘ఖాలిద్‌ వారి ఈ పలుకులను నమ్మలేదు. చాలా మందిని హత్య చేసారు. ఈ సంఘటన విన్న ప్రవక్త (స), ‘ఖాలిద్‌ ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తంచేసారు. అంటే ‘ఖాలిద్‌ అభిప్రాయం తప్పయింది. ప్రవక్త (స) రక్తపరి హారం ఇచ్చి ఉండవచ్చు.

[67]) వివరణ-3977: ఉమ్మె హానీకి ఫాఖ్ అనే పేరు  ఉండేది. ఉమ్మె హానీ ఆమె బిరుదు. ఆమె ప్రవక్త (స) చిన్నాన్న కూతురు. ఈ విధంగా ప్రవక్త (స)కు ఈమె చెల్లెలు అవుతుంది. 8వ హిజ్రీలో ఇస్లామ్‌ స్వీకరించారు. ఈమె ప్రవక్త (స)ను చాలా అధికంగా ప్రేమించేవారు. మక్కహ్ విజయం నాడు ప్రవక్త (స) ఆమె ఇంటికి వెళ్ళారు. స్నానం చేసారు, తీపి పానీయం త్రాగారు. ఒకసారి ఉమ్మె హానీ ప్రవక్త(స)తో నేను చాలా ముసలిదాన్నయి పోయాను. నడవలేకపోతున్నాను, కూర్చొని చేసే పని ఏదైనా ఉంటే చెప్పండి అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) 100 సార్లు సుబ్‌’హానల్లాహ్‌, 100 సార్లు అల్‌’హమ్‌దులిల్లాహ్‌, 100 సార్లు అల్లాహు అక్బర్, 100 సార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్‌ పఠిస్తూ ఉండమని ఉపదేశించారు. (ముస్నద్‌ అహ్మద్‌) ఫతహ్‌ మక్కహ్ కాలంలో ఉమ్మె హానీ ఇద్దరు వ్యక్తులకు అభయం ఇచ్చారు. ప్రవక్త (స) ఆమె అభయాన్ని కొనసాగించారు. దీనివల్ల ఒకవేళ స్త్రీ కూడా అవిశ్వాసికి అభయం ఇస్తే, దానిపట్ల ముస్లిములందరూ గౌరవించాలని తెలిసింది.

[68]) వివరణ-3981: ఇతని పేరు విషయంలో విభేదాలు ఉన్నాయి. అతని పేరు అస్లమ్ అని కూడా అంటారు. అబూ రాఫె అతని బిరుదు. ప్రవక్త (స) అతన్ని తన కుటుంబంలో చేర్చుకున్నారు. ఇతడు ‘అబ్బాస్‌ (ర) సేవకులు. ‘అబ్బాస్‌ (ర) ఇతన్ని ప్రవక్త (స)కు ఇచ్చివేసారు. ప్రవక్త (స) అతన్ని విడుదల చేసారు. ఇతడు స్వయంగా తన ఇస్లామ్‌ సంఘటనను పేర్కొన్నారు. ఇతడు తెరవెనుక చాలా కాలం ముందే ఇస్లామ్‌ స్వీకరించారు. కాని తన ఇస్లామ్‌ గురించి ప్రకటించలేదు. ఒక రోజు ‘జమ్‌’జమ్‌ నీటి వద్ద కూర్చొని బాణాలు సరిచేసు కుంటున్నారు. ‘అబ్బాస్‌ (ర) భార్య కూడా అక్కడే కూర్చొని ఉన్నారు. ఇంతలో అబూ లహబ్‌ వచ్చాడు. గది ప్రక్కన  కూర్చున్నాడు. ఆ తరువాత అబూ ‘సుఫియాన్‌ వచ్చాడు. అబూ లహబ్‌ అతన్ని బద్ర్‌ యుద్ధం గురించి అడిగి తెలుసు కోసాగాడు. దానికి అతడు, ‘ఏం చెప్పమంటావు! ముస్లిములు మన బలగాల్ని సర్వనాశనం చేసివేసారు. చాలా మందిని చంపారు, ఇంకా చాలా మందిని పట్టుకున్నారు. ఈ సంఘటన గురించి విచిత్రంగా చెప్పటం జరుగుతుంది. యుద్ధమైదానంలో ఆకాశం నుండి భూమి వరకు తెల్లని వస్త్రాలు ధరించి, గుర్రంపై కూర్చున్న వ్యక్తులు కనబడ్డారు,’ అని అన్నాడు. దానికి అబూ రాఫె’అ, ‘వారు దైవదూతలు,’ అని అన్నారు. అబూ లహబ్‌ అతని ముఖంపై చాలా బలంగా ఒక దెబ్బ కొట్టాడు. అతను ఓర్చుకున్నాడు. అబూ లహబ్‌ అతన్ని ఎత్తి పడేసాడు. పైకెక్కి కొట్టగలిగినంత వరకు కొట్టాడు. ‘అబ్బాస్‌ (ర) భార్య ఈ  హింస చూడలేక పోయింది. ఆమె కర్ర స్తంభం ఎత్తి అబూ లహబ్‌ తలపై ఒక్క దెబ్బ కొట్టింది. ‘అతని యజమాని లేడని బలహీనుడను కున్నావా?’ అని అన్నది. (ఇబ్నె సఅద్‌)

బద్ర్‌ యుద్ధం తరువాత హిజ్రత్‌ చేసి మదీనహ్ వచ్చాడు. ప్రవక్త (స)తో కలసి నివసించసాగాడు. అనేక యుద్ధాల్లో పాల్గొంటూ ఉన్నాడు. ఇతడు గొప్ప పండితుడు, ప్రవక్త (స) యొక్క అనేక హదీసులను ఇతడు ఉల్లేఖించాడు. ‘అలీ (ర) పరిపాలన ప్రారంభకాలంలో మరణించాడు.

[69]) వివరణ-3982: ముసైలమ కజ్జాబ్ ప్రవక్త (స) కాలంలో నేనూ ప్రవక్తనే అని వాదించాడు. ఇంకా వాడు ఇద్దరు వ్యక్తులను తన ప్రతినిధులుగా ప్రవక్త (స) వద్దకు పంపాడు. ఈ ఇద్దరు వ్యక్తులు ముసైలమ ప్రవక్త అని విశ్వసించి ఉన్నారు. అందువల్ల వీరు మరణ శిక్షకు అర్హులు. అందువల్ల ప్రవక్త (స) నేను మీ ఇద్దరినీ నరికి ఉండేవాడిని, కాని ఇస్లామ్‌లో రాయబారులను, ప్రతినిధులను చంపటం నిషిద్ధం. అందువల్ల ఇప్పుడు నేను మీ ఇద్దరినీ చంపను,” అని అన్నారు.

[70]) వివరణ-3983: అంటే ఒప్పందాలను, వాగ్దానాలను పూర్తిచేయాలి. ఇస్లామ్‌కు పూర్వం చేసినా సరే. అయితే ఇస్లామ్‌కు వ్యతిరేకంగా ఉండరాదు. ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే వాటిని పూర్తి చేయనక్కరలేదు. ఇతరులకు హాని చేకూర్చే ఉద్దేశ్యంతో ఒప్పందాలు, వాగ్దానాలు చేయరాదు. అయితే ఇతరులకు సహాయం చేయటానికి ముస్లిముల ఒక వర్గం మరో వర్గంతో ఒప్పందాలు కుదుర్చుకోవటంలో ఎటువంటిఅభ్యంతరం లేదు.

[71]) వివరణ-3986: హునైన్ మక్కహ్ మరియు ‘తాయఫ్‌ల మధ్య ఒక లోయ. ఇక్కడ యుద్ధం జరిగింది. అందువల్ల ఇస్లామీయ చరిత్రలో ఈ యుద్ధం ప్రఖ్యాతి గాంచింది. మక్కహ్ విజయం తరువాత ‘అరబ్‌ తెగలన్నీ స్వయంగా ముందుకు వచ్చి ఇస్లామ్‌ స్వీకరించసాగారు. కాని హవాజిన్, మరియు సఖీఫ్ వర్గాలపై వ్యతిరేక ప్రభావం పడింది. ఈ తెగలు యుద్ధ నైపుణ్యం కలిగి ఉండే వారు. ఇస్లామ్‌ ఆధిక్యత పొందుతున్న కొలది వీరు భయానికి గురవుతూ పోయారు. వారి రాజ్య ప్రాముఖ్యత పతనమవుతూ ఉంది. ఈ కారణం వల్ల మక్కహ్ విజయం తరువాత ‘హవాజి’న్‌, ‘సఖీఫ్‌ నాయకులు ఇప్పుడు తమ వంతు వస్తుందని, అందువల్ల పరస్పరం కలసి సంప్రదింపులు జరుపుదామని ఆలోచించి పరస్పరం మక్కహ్ లో ఉన్న ముస్లిములపై దాడి చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం తెగలన్నీ చురుగ్గా, ఉత్సాహంగా దాడికి ముందుకు సాగాయి. ప్రతి వర్గం తన వారందరినీ తీసుకు రావటం జరిగింది. పిల్లలు, స్త్రీలు తోడుంటే వారి రక్షణ కోసం తమ ప్రాణాలు అర్పించటానికైనా సిద్ధపడతారు. ఈ యుద్ధంలో ‘సఖీఫ్‌, ‘హవాజి’న్‌లకు చెందిన తెగలన్నీ పాల్గొన్నాయి. కాని అబ్‌, కిలాబ్ తెగలు వేరుగా ఉన్నారు. సైన్యాధికారిగా మాలిక్బిన్ఔఫ్ను నియమించడం జరిగింది. ఇతడు ‘హవాజి’న్‌ తెగలో గొప్ప ధనవంతుడు. కాని కవిగా దురైద్‌ బిన్‌ అస్సుమ్‌అను తీసుకోవటం జరిగింది. ఇతడు ప్రఖ్యాత ‘అరబ్‌ కవి. జష్‌మ్‌ తెగ నాయకుడు. ఇతని కవిత్వం అరబ్‌లో ఖ్యాతి గాంచింది. కాని అతని వయస్సు 100 దాటి పోయింది. కేవలం దుమ్ములే మిగిలి ఉన్నాయి. అరబ్బులు అతనిని చాలా గౌరవించేవారు. అతని సలహాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. స్వయంగా మాలిక్‌ బిన్‌ ‘ఔఫ్‌ అతన్ని పాల్గొన వలసిందిగా కోరాడు. అతన్ని మంచంపై ఉంచే తీసుకువెళ్ళడం జరిగింది. ప్రవక్త (స)కు ఈ వార్తలందాయి. ప్రవక్త (స) ధృవీకరణకు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అబీ హద్‌రద్‌ను పంపారు. అతను గూఢచారిగా హునైన్‌లోకి వచ్చి కొన్ని రోజులు సైన్యంలో ఉండి, పరిశీలించారు. ప్రవక్త (స) మరో మార్గం లేక యుద్ధ సన్నాహాలు చేసారు. యుద్ధ సన్నాహాల కోసం రుణం తీసుకోవలసి వచ్చింది. అబ్దుల్లాహ్బిన్రబీ చాలా ధనవంతులు. అతని దగ్గరి నుండి 30 వేల దిర్‌హమ్‌లు రుణం తీసుకోవటం జరిగింది. సఫ్వాన్బిన్ఉమయ్య మక్కహ్లోని చాలా పెద్ద ధనవంతులు. ఆతిథ్యంలో చాలా పేరు ప్రఖ్యాతులు గలవాడు. కాని అప్పటి వరకు ఇంకా ఇస్లామ్‌ స్వీకరించలేదు. అతని వద్ద ప్రవక్త (స) ఆయుధాలను తాత్కాలికంగా అడిగారు. అతడు 100 కవచాలు, వాటికి సంబంధించిన పరికరాలు ఇచ్చాడు. షవ్వాల్‌ 8 హిజ్రీ, జనవరి, ఫిబ్రవరి 630 క్రీస్తు శకం ఇస్లామీయ సైన్యం 12000 సంఖ్యలో ఈ కొన్ని ఆయుధాలతో ‘హునైన్‌కు చేరింది. కొందరు ప్రవక్త (స) అనుచరులు ”ఈ నాడు మనల్ని ఎవరు అధిగమించ గలరు,” అని గర్వంగా పలకడం జరిగింది. కాని అల్లహ్ కు ఇది ఎంతమాత్రం నచ్చలేదు. ” ‘హునైన్‌ సంగ్రామం రోజున:

వాస్తవానికి ఇది వరకు చాలా యుధ్ధరంగాలలో (మీరు కొద్ది మంది ఉన్నా) అల్లాహ్‌ మీకు విజయం చేకూర్చాడు. మరియు ‘హునైన్‌ (యుధ్ధం) రోజు మీ సంఖ్యాబలం మీకు గర్వ కారణ మయింది. కాని, అది మీకు ఏ విధంగానూ పనికిరాలేదు. మరియు భూమి విశాలమైనది అయినప్పటికీ మీకు ఇరుకై పోయింది. తరువాత మీరు వెన్నుచూపి పారిపోయారు. తరువాత అల్లాహ్‌ తన ప్రవక్తపై మరియు విశ్వాసులపై ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. మరియు మీకు కనిపించని (దైవదూతల) దళాలను దింపి, సత్య తిరస్కారులను శిక్షించాడు. మరియు ఇదే సత్య తిరస్కారులకు లభించే ప్రతిఫలం.” (అత్‌ తౌబహ్‌, 9:25-26)

ఫతహ్‌ మక్కహ్ కంటే ఇక్కడ ఆకాశం నిర్మలంగా ఉంది. ప్రవక్త (స) తలఎత్తి చూసారు. తన మిత్రుల్లో ఎవరూ లేరు. యుద్ధంలో పాల్గొన్న అబూ ఖతాదహ్ కథనం: ప్రజలు పారిపోసాగారు. ఇంతలో ఒక అవిశ్వాసి ఒక ముస్లిమ్‌ గుండెపై కూర్చొని ఉన్నాడు. నేను వెనుక నుండి వెళ్ళి కరవాలంతో ఒక్క వేటు వేసాను. అది కవచాన్ని ఛేదిస్తూ లోపలికి దూసుకు పోయింది. ఆ వ్యక్తి వెంటనే నా వైపు తిరిగి నన్ను గట్టిగా పట్టుకున్నాడు. నాకు చచ్చేంత అనుభూతి కలిగింది. కాని వెంటనే వదలి పడిపోయాడు. ఇస్లామీయ సైన్యం ఉదయం సమయాన ఇంకా తెల్లవారక ముందే దాడిచేసింది. యుద్ధ మైదానం వాలుగా ఉంది. పాదాలకు నిలకడ లేకుండా పోయింది. ముందు నుండి సైన్యాలు దాడిచేసాయి. అటు నుండి బాణాల వర్షం కురవసాగింది. ఇస్లామీయ సైన్యం అతలాకుతలం అయింది. పాదాల క్రింద భూమి కదలసాగింది.

బు’ఖారీలో ఇలా ఉంది, ”అందరూ పారిపోయారు, ప్రవక్త (స) ఒక్కరే మిగిలి ఉన్నారు. బాణాల వర్షం కురుస్తుంది. 12 వేల మంది సైనికులు చెల్లాచెదరైపోయారు. ప్రవక్త (స) కుడివైపు చూసారు. ‘ఓ అ’న్సార్‌ యువకుల్లారా!’ అని కేకవేసారు. అటు నుండి, ‘మేమున్నాం,’ అనే శబ్దం వచ్చింది. ఆ తరువాత ఎడమ వైపు తిరిగి పిలిచారు. ఇప్పుడు కూడా అటువంటి శబ్దమే వచ్చింది. ప్రవక్త (స) వాహనం నుండి దిగారు. ‘నేను అల్లాహ్ దాసుణ్ణి, ఆయన ప్రవక్తను,’ అని అన్నారు.

 ‘స’హీ’హ్‌ బు’ఖారీలోని రెండవ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”నేను ప్రవక్తను అసత్యవాదిని కాను, నేను ‘అబ్దుల్‌ ము’త్తలిబ్‌ సంతానాన్ని,” అని అన్నారు. ‘అబ్బాస్‌ (ర) బిగ్గరగా కేకలు వేయగలిగేవారు. ముహాజిర్లను, అన్సార్లను బిగ్గరగా పిలవమని ప్రవక్త (స) అతన్ని ఆదేశించారు. ఈ శబ్దం చెవిలో పడగానే సైన్యం అంతా ఒక్కసారిగా తిరిగింది. సైనికులు తమ గుర్రాలపై నుండి దిగి, కవచాలు పారవేసి దూసుకుపోసాగారు. యుద్ధం రంగు మారిపోయింది. అవిశ్వాసులు పారిపోసాగారు. మిగిలిన వారి చేతులకు బేడీలు పడ్డాయి. ‘సఖీఫ్‌కు చెందిన బనూ మాలిక్‌ పట్టుదలతో యుద్ధం చేసింది. కాని వారి 70 మంది హతమార్చబడ్డారు. వారి జెండా ఎత్తినవాడు ‘ఉస్మాన్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ చంపబడిన తరువాత వారు కూడా నిలువ లేక పోయారు. అందరూ పారిపోయారు.

[72]) వివరణ-3987: అంటే యుద్ధ ధనం నుండి కాలి నడకన నడిచే వారికి ఒక వంతు, వాహనానికి రెండు వంతులు. ఒక వంతు సైనికులది, రెండు వంతులు వాహనానిది అంటే, గుర్రం కూడా ముజాహిద్‌ అన్నమాట. దాని ఆహారం నిమిత్తం రెండు వంతులు.

[73]) వివరణ-3989: ఈ ‘హదీసు’ ఉల్లేఖనకర్త లమహ్ బిన్అక్వ. ప్రఖ్యాత అరబ్‌ పహిల్వాన్‌, వేగంగా పరిగెత్తడంలో అందరికంటే గొప్పవాడు. ఇతడు వీరులలో ఒకడు. పరిగెత్తడంలో గుర్రాలతో పోటీ పడేవాడు. వాటికంటే వేగంగా ముందుకు పోయేవాడు. హుదైబియా ఒప్పందం సందర్భంగా ప్రవక్త (స), ‘వాహనుల్లో ఉత్తముడు అబూ ఖతాదహ్‌, పాదసంచారంలో సలమహ్ బిన్‌ అక్వ’అ ఉత్తముడు,’ అని అన్నారు. ఈ ప్రశంస తరువాత అతనికి రెండు వంతులు ఇవ్వబడ్డాయి. సలమహ్ బిన్‌ అక్వ’అ 6వ హిజ్రీలో ఇస్లామ్‌ స్వీకరించాడు. ఆ తరువాత హిజ్రత్‌ చేసి మదీనహ్ వెళ్ళిపోయాడు. మదీనహ్ వచ్చిన తరువాత ఇంచుమించు అన్ని యుద్ధాల్లో పాల్గొన్నాడు. అన్నిటి కంటే ముందు హుదైబియాలో పాల్గొన్నాడు.హుదైబియా ఒప్పందంలో బై’అతె రి’ద్వాన్‌ కు చారిత్రక ప్రాముఖ్యత ఉంది.

ఖర్దహ్యుద్ధం: ప్రవక్త (స)కు చెందిన కొన్ని ఒంటెలు జీ’ ఖర్‌దహ్‌ మైదానంలో మేస్తున్నాయి. గత్పాన్ వర్గం వారు వాటిని తోలుకొని పోయారు. సలమహ్ బిన్‌ అక్వ’అ ఫజ్‌ర్‌కు ముందు బయలుదేరారు. ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ సేవకుడు అతనితో, ‘ప్రవక్త (స) ఒంటెలు దోపిడీకి గురయ్యాయి అని’ అన్నాడు. ‘ఎవరు దోచుకున్నారని,’ అని అన్నారు. ‘గత్‌ఫాన్‌,’ అని అన్నారు. అది విన్న సలమహ్ బిన్‌ అక్వ’అ పెద్దగా కేకలు వేసారు. మదీనహ్ ఈ మూల నుండి ఆ మూల వరకు కేకలు వినిపించాయి. ఒంటరిగా దోపిడీ దొంగల వెనుక బయలుదేరారు. వాళ్ళు నీళ్ళు వెతుకు తున్నారు. ఇంతలో సలమహ్ బిన్‌ అక్వ’అ చేరు కున్నారు. వీరు బాణ విద్యలో నిపుణులు. గురిచూసి బాణాల వర్షం కురిపించసాగారు. దోపిడీ దొంగలు ఒంటెలను వదలి పారిపోయారు. పారిపోయే ప్రయత్నంలో తమ వద్ద ఉన్న దుప్పట్లను  వదిలి పోయారు. ఈ మధ్య ప్రవక్త (స) కూడా సహచరులను తీసుకొని చేరుకున్నారు. అప్పుడు సలమహ్, ‘ఓ ప్రవక్తా! నేను వారిని నీల్ళు త్రాగనివ్వలేదు. ఇప్పుడు కూడా వారిని వెంటాడితే దొరికిపోతారు,’ అని అన్నారు. కాని ప్రవక్త (స), ‘నీ అధీనంలోనికి వచ్చిన తర్వాత వారిని క్షమించివేయి,’ అని అన్నారు.

ఖైబర్‌: దీని తర్వాతనే ఖైబర్‌లో వీరోచితంగా పోరాడారు. ‘ఖైబర్‌ విజయం తరువాత ప్రవక్త (స) చేతిలో చేయివేసి తిరిగి వచ్చారు. ‘ఖైబర్‌ యుద్ధం తరువాత ‘సఖీఫ్‌, హవా’జిన్‌ యుద్ధాలలో పాల్గొన్నారు. ఈ యుద్ధంలో ఒక వ్యక్తి ముస్లిముల సైన్యం ఉన్నచోట ఒంటెపై వచ్చి, దాన్ని కట్టి ముస్లిములతో పాటు అల్పాహారం సేవించాడు. తరువాత అన్ని వైపుల చూచి, ముస్లిముల శక్తి అంచనా వేసి, ఒంటెపై ఎక్కి వేగంగా వెళుతున్నాడు. అతని ఈ వ్యవహారంపై ముస్లిములకు అనుమానం కలిగింది. ఒక వ్యక్తి అతని వెనుక వెళ్ళాడు. సలమహ్ కూడా వెనుక వెళ్ళారు. ముందుకు వెళ్ళి అతన్ని పట్టుకొని కరవాలంతో ఒక్కవేటు వేసారు. అతను అక్కడికక్కడే మరణించాడు. అతని వాహనం తీసుకొని తిరిగి వచ్చారు. ప్రవక్త (స)చూచి, ‘ఆ వ్యక్తిని ఎవరు చంపారు,’ అని అన్నారు. దానికి ప్రజలు ‘సలమహ్’ అని అన్నారు. ‘అయితే మృతుని సామాన్లన్నీ అతనికే చెందుతాయి,’ అని అన్నారు.

బనీ కిలాబ్యుద్ధం: 7వ హిజ్రీలో ప్రవక్త (స) అబూ బకర్‌ నేతృత్వంలో ఒక సైన్యాన్ని బనూ ఫజారహ్‌ వైపు పంపారు. అందులో సలమహ్ కూడా ఉన్నారు. అతడు 7 కుటుంబాలను సమాప్తం చేసారు. వారి స్త్రీలను పట్టుకున్నారు. వారిలో ఒక అమ్మాయి చాలా అందంగా ఉండేది. అబూ బకర్‌ (ర) ఆమెను సలమహ్కు ఇచ్చివేసారు. మదీనహ్ వచ్చిన తర్వాత ప్రవక్త (స) ఆ అమ్మాయిని నాకివ్వమని చెప్పారు. దానికి సలమహ్ ప్రవక్తా! ఇంకా నేను ముట్టుకోనైనా ముట్టుకోలేదు అని పలికి ఆమెను తెచ్చి ముందుంచాడు. ప్రవక్త (స) ఆమెను మక్కహ్ పంపి, ఆమెకు బదులు అవిశ్వాసుల వద్ద ఖైదీలుగా ఉన్న ముస్లిములను విడిపించారు.

యుద్ధాల సంఖ్య: సలమహ్ బిన్‌ అక్వ’అ ఇస్లామ్‌ స్వీకరించిన తర్వాత అనేక యుద్ధాలలో పాల్గొన్నారు. కొన్ని ఉల్లేఖనాల్లో 14 యుద్ధాల్లో పాల్గొన్నట్లు ఉంది. వాటిలో 7 యుద్ధాల్లో అయితే ప్రవక్త (స)కు తోడుగా కూర్చొనే భాగ్యం కలిగింది. మిగతా 7 యుద్ధాల్లో వివిధ ప్రాంతాలకు అతన్ని పంపటం జరిగింది.

మరణం: ప్రవక్త (స) మరణానంతరం మదీనహ్లోనే నివసిస్తూ ఉండేవారు. ‘ఉస్మాన్‌ వీరమరణం తరువాత రబ్జహ్లో నివసించసాగారు. అక్కడే పెళ్ళి చేసుకున్నారు. సంతానమూ కలిగింది. బు’ఖారీ ప్రకారం 73 హిజ్రీలో మళ్ళీ మదీనహ్ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన నాలుగైదు రోజుల్లోనే మరణించారు.

[74]) వివరణ-3992: ఒకవేళ ఒకరి గుర్రం లేదా సేవకుడు అవిశ్వాసుల అధీనంలోకి వెళ్ళిపోయి, మళ్ళీ ముస్లిములు వాటిని తమ అధీనంలోనికి తీసుకుంటే, ఆ వస్తువు ఎవరిదైతే వారికి ఇచ్చివేయాలి. దాన్ని యుద్ధధనంగా పరిగణించరాదు.

[75]) వివరణ-3993: ‘ఖైబర్‌ యుద్ధ ధనం నుండి ప్రవక్త (స) బనీ ము’త్తలిబ్‌కుఇచ్చారు. ‘ఉస్మాన్‌ (ర)కు, ‘జుబైర్‌ బిన్‌ ము’త్‌’యిమ్‌ (ర)లకు ఇవ్వలేదు, అయితే వంశం ప్రకారం అందరూ సమానులే. ఎందుకంటే వీరందరూ ‘అబ్దు మునాఫ్‌ సంతానమే. బనీము’త్తలిబ్‌కు ఇచ్చారు. అబ్దె షమ్స్‌ మరియు నౌఫిల్‌ సంతానానికి ఇవ్వలేదు. దీన్నిగురించే వీరిద్దరూ ప్రవక్త (స) వద్దకు వెళ్లారు.

[76]) వివరణ-3994: యుద్ధం, పోరాటం లేకుండా ఏదైనా పట్టణంలో మీరు ప్రవేశిస్తే, అక్కడి ప్రజలు పట్టణం ఖాళీ చేసి వేస్తే, మీతో ఒప్పందం కుదుర్చుకొని, మీరు అక్కడ నివసిస్తే, ఆ ధనం మీదే కాదు, ఇతర ముస్లిములదీను. ఒకవేళ అక్కడున్న వారు అల్లాహ్‌ (త), ఆయన ప్రవక్త పట్ల అవిధేయత చూపితే, యుద్ధం ద్వారా మీరు వారిని జయిస్తే అది యుద్ధ ధనం అవుతుంది. అందువల్ల దాన్ని ఐదువంతులు చేయాలి. ఐదవవంతు అల్లాహ్‌ (త), ఆయన ప్రవక్తది. ఈ నాలుగు వంతులు సైనికుల మధ్య పంచడం జరుగుతుంది.

[77]) వివరణ-3995: అంటే యుద్ధధనాన్ని, ‘జకాత్‌ ధనాన్ని అన్యాయంగా ఖర్చుచేసేవారి కొరకు తీర్పు దినం నాడు కఠినమైన శిక్ష ఉంది.

[78]) వివరణ-3996: అల్లాహ్‌ (త) ఖుర్‌ఆన్‌లో ఇలా ఆదేశించాడు: ” అప్పుడు ప్రతివ్యక్తికి తన కర్మల ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారి కెలాంటి అన్యాయం జరుగదు.” (బఖరహ్, 2:281)

[79]) వివరణ-3999: అంటే తినే త్రాగే వస్తువులు నాయకుని అనుమతి లేకుండా  తీసుకోవటంలో ఎటువంటి అభ్యంతరం లేదు. యుద్ధం చేస్తున్న సైనికుడు దాహం వేస్తే యుద్ధధనంలో వచ్చిన నీటిని త్రాగగలడు. అదేవిధంగా ఆహార వస్తువులు ఆకలిగా ఉన్న ముజాహిద్‌కి దొరికితే తిన వచ్చును. ఇది దొంగతనంలోకి రావు.

[80]) వివరణ-4000: ప్రవక్త (స) చిరునవ్వు అనుమతిని సూచిస్తుంది.

[81]) వివరణ-4004: అబూ జహల్ను ఇద్దరు అ’న్సారీ యువకులు చంపారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కూడా వాడిని చంపటంలో పాల్గొన్నారు. ఎలా అంటే ఆ ఇద్దరు యువకులు అబూ జహల్‌ను చంపి క్రిందపడేసారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ వాడి తలను కరవాలంతో వేరుచేసి వేసారు. కనుక అబూ జహల్‌ కరవాలాన్ని ప్రోత్సాహకంగా ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌కి ఇవ్వబడింది.

[82]) వివరణ-4006: హుదైబియా వారంటే 7 హిజ్రీలో ‘ఉమ్‌రహ్‌ చేసే ఉద్దేశ్యంతో మదీనహ్ నుండి బయలు దేరిన ప్రవక్త(స) అనుచరులు. ‘హుదైబియ ప్రాంతానికి చేరుకున్న తరువాత అవిశ్వాసులు మక్కహ్ లోకి ప్రవేశించకుండా ఆపివేసారు. ఇక్కడ ఒప్పందం జరిగింది. అనుచరుల సంఖ్యలో అభిప్రాయభేదాలు ఉన్నాయి. కొన్ని ఉల్లేఖనాల్లో 1400 మంది అని ఉంది. మరికొన్ని ఉల్లేఖనాల్లో 1500 మంది అని ఉంది. అయితే 1400 మంది గల ఉల్లేఖనం ప్రామాణికమైనది. గుర్రపు స్వారీలు 200 ఉన్నారు. యుద్ధదనంలో గుర్రపు స్వారీల వారికి 3 వంతులు కేటాయించారు. ఒక వంతు మనిషికి, రెండు వంతులు గుర్రానికి లభించాయి.

[83]) వివరణ-4007: సైన్యం యుద్ధానికి వెళ్ళినప్పుడు నాయకుని అనుమతితో కొంతమంది సైన్యం నుండి వేరై శత్రువులతో యుద్ధం చేయటానికి వెళ్ళేది. యుద్ధదనం తీసుకొని సైన్యం తిరిగివస్తే, ఆ ధనాన్ని ప్రవక్త (స) 4 భాగాలు చేసేవారు. ఒకవంతు యుద్ధం చేసిన వారికి, మిగిలిన 3 వంతులు యుద్ధం చేసిన వారికి మరియు చేయమని వారికి కలిపి పంచేవారు. తిరుగు ప్రయాణంలో శత్రువులతో యుద్ధం చేసి యుద్ధ ధనం తీసుకొని వస్తే దాన్ని మూడు భాగాలు చేసే వారు. ఒక వంతు యుద్ధం చేసినవారికి, రెండువంతులు యుద్ధం చేసినవారికి మరియు చేయనివారికి కలిపి ఇచ్చేవారు.

[84]) వివరణ-4008: ఇంతకు ముందు ‘హదీసు’లో 1/5 వంతు తర్వాత 1/4 వంతు మరియు 1/3 వంతు ఇచ్చే ప్రస్తావన లేదు. ఇందులో 1/5వ వంతు తీసిన తర్వాత 1/4 వంతు లేదా 1/3 వంతు ఇచ్చేవారని ఉంది. అంటే మొదటి ‘హదీసు’లో సంక్షిప్తంగా ఉంది. ఈ ‘హదీసు’లో వివరంగా ఉంది.

[85]) వివరణ-4009: అంటే 1/2 వ వంతు ఇచ్చిన తర్వాత అదనంగా ఇవ్వవచ్చు. ఇది కేవలం యుద్ధధనంలోని 1/5వంతులో ఉంటుంది. కాని అందరి సొత్తులో 1/5 వంతు లేదు. కనుక ఇందులో అదనంగా ఇవ్వటం జరుగదు.

[86]) వివరణ-4010: అబూ మూసా అష్‌’అరీ పేరు అబ్దుల్లాహ్బిన్ఖైస్. ఇతడు యమన్కి చెందినవారు. అష్‌’అర్‌ తెగకు చెందినవారు. అందువల్లే ఇతన్ని అబూ మూసా అష్‌’అరీ అంటారు. ఇతని ఇస్లామ్‌ స్వీకరణ సంఘటన ఈ విధంగా ఉంది. అబూ మూసా యమన్‌ నుండి నడచి మక్కహ్ వచ్చారు. వెంటనే ఇస్లామ్‌ స్వీకరించారు. తరువాత తన ప్రాంతానికి వెళ్ళి ఈ సందేశాన్ని అందేజేసారు. అబూ మూసా అష్‌’అరీ అతని కుటుంబంలో చాలా గొప్ప ధనవంతులు. అందువల్లే అతని సందేశం చాలా త్వరగా వ్యాపించింది,. అతను సుమారు 50 మంది నూతన ముస్లిములను తీసుకొని సముద్ర మార్గాన బయలుదేరారు. కాని తుఫాను ఆ నావను ‘హబ్‌షా చేర్చింది. ఇక్కడ వలస వచ్చిన జ’అఫర్‌ మొదలైనవారు కూడా ఉన్నారు. వీరు మదీనహ్ కు బయలుదేరారు. అబూ మూసా (ర) కూడా ఈ బృందంలో చేరిపోయారు. వీరు మదీనహ్ చేరుకున్నప్పటికి ఖైబర్‌ను జయించి తిరిగి రావటం జరిగింది. అప్పుడు ప్రవక్త (స) అబూ మూసాకు, అతని మిత్రులకు ‘ఖైబర్‌ యుద్ధధనంలో నుండి వంతులు ఇచ్చారు. (బు’ఖారీ)

అబూ మూసా అష్‌’అరీ అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు. ప్రవక్త (స) అబూ మూసా అష్‌’అరీని యమన్‌కి గవర్నర్‌గా నియమించారు. అబూ మూసా అష్‌’అరీ ప్రవక్త (స) సన్నిహిత అనుచరులలో ఒకరు. ఇతనికి ప్రవక్త (స) వద్ద ప్రత్యేక స్థానం ఉండేది. ఖుర్‌ఆన్‌ చాలా బాగా పఠించే వారు. 44వ హిజ్రీలో మరణించారు.

[87]) వివరణ-4013: కాల్చటం ఇప్పుడు నిషిద్ధం. శిక్షగా, గుణపాఠంగా దొంగతనం చేసినవారిని కొట్టాలి. దీనివల్ల ఇతరులు జాగ్రత్తగా ఉంటారు.

[88]) వివరణ-4015: ఎందుకంటే పంచక ముందు అతడు దానికి యజమాని కాడు.

[89]) వివరణ-4017: అంటే ‘జకాత్‌, యుద్ధధనం మొదలైన వాటి నుండి అధర్మంగా ఖర్చుచేస్తే, ఎందుకంటే అందులో ఇతరుల హక్కులు కూడా ఉంటాయి. ఇతరుల హక్కుల్ని కొల్లగొట్టినందువల్ల తీర్పుదినంనాడు కఠిన శిక్షలకు గురి కావలసి వస్తుంది.

[90]) వివరణ-4019: అంటే ఇంకా పంచబడని యుద్ధధనాన్ని ఉపయోగించరాదు. ఇది కూడా ద్రోహం, దొంగతనంగా పరిగణించబడుతుంది.

[91]) వివరణ-4028: అంటే చంపటంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ కూడా కలసి పోయారు. ఇతనికి అబూ జహల్‌ కరవాలం ఇవ్వడం జరిగింది. ఈవిధంగా అబూ జహల్‌ సామాన్లు ఈ ముగ్గురికి పంచటం జరిగింది. ఎందుకంటే వాడిని చంపటంలో ముగ్గురూ పాల్గొన్నారు.

[92]) వివరణ-4030: అంటే వారి విశ్వాసాన్ని దృఢం కావటానికి ఇస్తున్నాను. ఒకవేళ వారికి ఇవ్వకపోతే వారు ఇస్లామ్‌ను త్యజిస్తారు. ఫలితంగా వారు చతికిల పడవేయబడి నరకంలో విసరివేయబడతారు.

[93]) వివరణ-4031: అంటే బైతుర్రిద్వాన్లా బద్ర్‌ యుద్ధ సందర్భంగానూ ప్రవక్త (స) అనుచరులనుండి బై’అత్‌ తీసుకున్నట్టు తెలుస్తుంది. చివరకి ‘ఉస్మా’న్‌ (ర) అక్కడ లేనందున అతని తరఫున స్వయంగా ప్రవక్త (స) బై’అత్‌ తీసుకున్నారు. బద్ర్‌ యుద్ధంలో ‘ఉస్మా’న్‌ లేకపోవటానికి కారణం ఏమిటంటే, ప్రవక్త (స)కుమార్తె రుఖయ్యహ్ (ర) ‘ఉస్మా’న్‌ భార్య, చాలా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సేవచేయడానికి ఎవరూ లేరు. ప్రవక్త (స) ఉస్మాన్(ర)ను, ఉసామహ్ (ర)ను, మదీనహ్ నుండి బద్ర్‌ బయలుదేరుతూ, ‘మీరిద్దరూ యుద్ధంలో పొల్గొనకండి, రుఖయ్య అనారోగ్యంతో ఉంది. ఇక్కడ ఎవరూలేరు అందువల్ల మీరు ఆమెకు సేవచేస్తూ, కనిపెడుతూ ఉండండి. అయితే బద్ర్‌ యుద్ధపు పుణ్యం యుద్ధధనం ఇతరులకు లభించినట్టే మీకూ లభిస్తుంది,’ అని అన్నారు.  అందువల్ల వీరిద్దరూ మదీనహ్లోనే ఉండి పోయారు. ఆ రోజు బద్ర్‌లో ముస్లిములకు విజయం ప్రాప్తించింది. ఆ రోజు రాత్రి రుఖయ్యహ్ మరణించారు. ప్రవక్త (స) విజయ శుభవార్త అందించటానికి జైద్బిన్‌ ‘హారిసహ్ను మదీనహ్ పంపారు.

ఉసామహ్ కథనం, ”రుఖయ్యహ్ మరణించిన తరువాత ‘జైద్‌ మదీనహ్ చేరారు. మేము అప్పుడే ఖనన సంస్కారాల నుండి తిరిగి వచ్చాము. మేము మా నాన్నగారి దగ్గరకు వచ్చి చూసాము. ప్రజలు అతన్ని చుట్టుముట్టి ఉన్నారు. ఆయన ‘ఉత్‌బహ్ బిన్‌ రబీ’అ, షీబహ్ బిన్‌ రబీ’అ, అబూ జహల్‌, ‘ఉమయ్య బిన్‌ ‘ఖలఫ్ మొదలైన వారందరూ హతమార్చబడ్డారు అని అన్నారు. నేను, ‘ఇది నిజమా,’ అని అన్నాను. దానికి మా నాన్నగారు, ‘అవును కుమారా ఇది నిజం,’ అని అన్నారు.”

[94]) వివరణ-4032: మగానిమ్ పదం సరికాదు. గనాయిమ్ సరైన పదం (తన్ ఖీహుర్రువాత్ 3/ 177)

[95]) వివరణ-4035: ఖుర్‌ఆన్‌లోగ్రంథప్రజల నుండి పన్ను తీసుకోవటం గురించి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాని నాస్తికులతో పన్ను వసూలు చేయటం గురించి స్పష్టంగా లేదు. ‘ఉమర్‌ (ర) తన పరిపాలనా కాలంలో నాస్తికుల నుండి పన్ను వసూలు చేసేవారు కారు. అప్పుడు ‘అబ్దుర్ర’హ్మాన్‌ ప్రవక్త(స) ‘హిజ్‌ర్‌ ప్రాంతానికి చెందిన అగ్ని ఆరాధకుల నుండి పన్ను వసూలుచేసే వారని తెలిపారు. అప్పుడు ‘ఉమర్‌ (ర) అన్ని ప్రాంతాల్లో ఈ ఆదేశాన్ని జారీచేసారు. గ్రంథప్రజల్లా వీరినుండి కూడా పన్ను వసూలు చేయసాగారు.

[96]) వివరణ-4037: ఒక దేశంలో రెండు ధర్మాలు సరిసమానంగా ఉండలేవు. అంటే ఒక ధర్మం ఆధిక్యత కలిగి ఉంటుంది. మరొకటి అణిగి ఉంటుంది. దారుల్‌ ఇస్లామ్‌లో ఇస్లామ్‌, దారుల్‌ కుఫ్‌ర్‌లో కుఫ్‌ర్‌.

[97]) వివరణ-4038: దౌమహ్ అనేది సిరియా దేశంలోని ఒక నగరం. ఇది తబూక్‌కు సమీపంగా ఉంది. అకీదర్‌ అనేది అక్కడి రాజుపేరు. ఇతడు క్రైస్తవుడు. ప్రవక్త (స) పన్నుద్వారా ఒప్పందం కుదుర్చుకున్నారు. అతన్ని క్షమించివేసారు.

[98]) వివరణ-4039: ఈ ‘హదీసు’లో ఉష్‌ర్‌ అంటే వ్యాపార సామాగ్రిలో 10వ వంతు అని అర్థం. అంటే యూదులు, క్రైస్తవుల వ్యాపార సామాగ్రి నుండి 10వ వంతు, ముస్లిమ్‌ పాలకుడు సంక్షేమనిధి కోసం వసూలు చేస్తాడు. అయితే ముస్లిములకు లేదు. అయితే అందులో ‘జకాత్‌ ఉంది. అది నిర్ణీత పరిమాణానికి చేరితే, సంవత్సరం పూర్తిగా గడిచితే.

[99]) వివరణ-4040: ‘మేము పన్ను మొదలైన వాటిని తీసుకోవటానికి వారి వద్దకు వెళతాము. వారు మాకు ఆతిధ్యం ఇవ్వరు. సంతోషంగా పన్ను చెల్లించరు, దాన ధర్మాలూ ఇవ్వరు.’ దానికి ప్రవక్త (స), ‘ఇటువంటి పరిస్థితిలో మీరు మీ హక్కును బలవంతంగా వసూలు చేయగలరు,’ అని అన్నారు.

[100]) వివరణ-4060: అంటే అందరికంటే ముందు ఇస్లామ్‌ స్వీకరించిన వ్యక్తిని దృష్టిలో పెట్టుకోవటం జరుగుతుంది. ఆ తరువాత ఇస్లామీయ వ్యాపిక్తికి వీరోచితంగా పోరాడే వ్యక్తిని దృష్టిలో పెట్టుకోవటం జరుగుతుంది. ఆ తరువాత భార్యాబిడ్డలు ఉన్న వ్యక్తిని కూడా దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. ఇందులో అందరికీ వంతులు ఉన్నాయి. కాని వారి అవసరం మేరకు హెచ్చుతగ్గులు సాధ్యం. ఇవన్నీ ఖుర్‌ఆన్‌ ఆయతులల ద్వారా తెలుస్తుంది.

[101]) వివరణ-4061: అంటే అందరికంటే ముందు ఇస్లామ్‌ స్వీకరించిన వ్యక్తిని దృష్టిలో పెట్టుకోవటం జరుగుతుంది. ఆ తరువాత ఇస్లామీయ వ్యాపిక్తికి వీరోచితంగా పోరాడే వ్యక్తిని దృష్టిలో పెట్టుకోవటం జరుగుతుంది. ఆ తరువాత భార్యా డ్డలు ఉన్న వ్యక్తిని కూడా దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. ఇందులో అందరికీ వంతులు ఉన్నాయి. కాని వారి అవసరం మేరకు హెచ్చుతగ్గులు సాధ్యం. ఇవన్నీ ఖుర్‌ఆన్‌ ఆయతుల ద్వారా తెలుస్తుంది.

”నిశ్చయంగా దానాలు (‘సదఖాత్‌) కేవలం యాచించే నిరు పేదలకు మరియు యాచించని పేదవారికి, (‘జకాత్‌) వ్యవహారాలపై నియుక్తులైన వారికి మరియు ఎవరి హృదయాలనైతే (ఇస్లాంవైపుకు) ఆకర్షించవలసి ఉందో వారికి, బానిసల విముక్తికొరకు, ఋణగ్రస్తులైన వారికొరకు, అల్లాహ్‌ మార్గంలో (పోయేవారి కొరకు) మరియు బాటసారుల కొరకు. ఇది అల్లాహ్‌ నిర్ణయించిన ఒక విధి. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.” (అత్తౌబహ్‌, 9:60)

మరోచోట ఇలా ఆదేశించడం జరిగింది:

”అల్లాహ్‌ మార్గంలో నిమగ్నులైన కారణంగా (తమ జీవనోపాధి కొరకు) భూమిలో తిరిగే అవకాశం లేక లేమికి గురిఅయ్యే పేదవారు (ధనసహాయానికి అర్హులు). ఎరుగని మనిషి వారి అడగకపోవటాన్ని చూసి, వారు ధనవంతులని భావించవచ్చు! (కాని) వారి ముఖ చిహ్నాలు చూసి నీవు వారిని గుర్తించగలవు. వారు ప్రజలను పట్టుబట్టి అడిగేవారు కారు…” ఆత్మ గౌరవం వల్ల ప్రజల ముందు చేయిచాపరు. వీరే అసలైన పేదలు.

1. ఫఖీర్‌ అంటే ఏమీ లేనివాడు అక్కరగలవాడు. 2. మిస్‌కీన్‌ అంటే అవసరానికి తగ్గుట్టు లేనివాడు. ప్రవక్త (స) అడుక్కుంటూ తిరిగేవారు మిస్‌కీన్‌ కారని, మిస్‌కీన్‌ అంటే తన అవసరానికి తగ్గట్టు లేనివాడు, తన అవసరాన్ని ఇతరుల ముందు చెప్పుకోలేని వాడు. ఇటువంటి వాడే అర్హుడు. 3. ‘ఆమిలీన్‌ అంటే ‘జకాత్‌ ధనాన్ని వసూలు చేసే అధికారులు, సేవకులు అంటే వీరికి జీతాలు ఈ ధనంలో నుండి ఇవ్వ వచ్చును. 4. ప్రోత్సాహకాలు: వీరిలో అనేకమంది ఉన్నారు. ఇంకా ముస్లిములు కాలేదు, కాని ఇస్లామ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు ఇస్లామ్‌ స్వీకరించారు కాని కొంత బలహీనత ఉన్నవారు. వీరికి ఇస్తూ ఉండాలి. దీని ద్వారా వీరు స్థిరత్వాన్ని పొందుతారు. 5. బానిసలను విడిపించడానికి, ఖైదీలను విడిపించటానికి ఈ ధనాన్ని ఉపయోగించ వచ్చును. 6. రుణగ్రస్తులకు కూడా ఈ ధనాన్ని ఇవ్వవచ్చును. 7. దైవ మార్గంలో జిహాద్‌, జిహాద్‌ అవసరాలకు. 8. ప్రయాణీ కులకు అంటే ప్రయాణంలో నష్టం వాటిల్లినందున, ధనవంతుడైనా తొందరగా తెప్పించలేని స్థితి ఉన్న వాడు. ఈ 8 రకాల మార్గాల గురించి ఉమర్‌ (ర) సూచించారు.

”మరియు మీ విజయధనంలో నిశ్చయంగా, అయిదవ భాగం, అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకు మరియు (అతని) దగ్గరి బంధువులకు మరియు అనాథులకు మరియు యాచించని పేద వారికి మరియు ప్రయాణీ కులకు ఉందని తెలుసు కోండి.” (అల్ అన్ఫాల్, 8:41)

అంటే ఈ యుద్ధ ధనంలో నుండి ఐదవ వంతు అల్లాహ్‌ది, ఆయన ప్రవక్తది. ఇంకా ప్రవక్త దగ్గరి బంధువులది, అనాథు లది, పేదవారిది, ప్రయాణీకులది. మిగిలిన 4 వంతులు ముజా హిదీన్లది. ‘ఉమర్‌ (ర) ఈ వంతుల గురించే సూచించారు,

మూడవది సూరహ్‌ హష్‌ర్‌ లోనిది. ”మరియు అల్లాహ్‌ తన ప్రవక్తకు, వారినుండి ఇప్పించిన  ఫయ్ కొరకు, మీరు గుర్రాలను గానీ ఒంటెలను గానీ పరిగెత్తించ లేదు. కాని అల్లాహ్‌ తాను కోరినవారిపై, తన సందేశహరునికి ఆధిక్యత నొసంగుతాడు. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు. అల్లాహ్ తన ప్రవక్తకు ఆ నగర వాసులనుండి ఇప్పించిన దానిలో (ఫయ్‌అ’లో), అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు మరియు అతని దగ్గరి బంధువులకు మరియు అనాథులకు మరియు పేదలకు మరియు బాటసారులకు హక్కు ఉంది.అది మీలో ధనవంతులైన వారి మధ్యనే తిరగకుండా ఉండటానికి, ఇలా నిర్ణయించబడింది. మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు అతను మీకు నిషేధించినదానికి దూరంగా ఉండండి. అల్లాహ్‌ పట్ల భయ భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ శిక్షించటంలో చాలా కఠినుడు. (దానిలో నుండి కొంత భాగంపై) తమ ఇండ్ల నుండి మరియు తమ ఆస్తిపాస్తుల నుండి వెడలగొట్టబడి, వలస వచ్చిన (ముహాజిర్లకు) పేద వారికి కూడా హక్కుఉంది. వారు అల్లాహ్‌ అనుగ్రహాన్ని మరియు ఆయన ప్రసన్నతను కోరు తున్నారు. మరియు వారు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకు సహాయంచేస్తున్నారు. ఇలాంటివారు, వీరే సత్యవంతులు. మరియు ఎవరైతే – ఈ (వలస వచ్చిన వారు) రాకపూర్వమే – విశ్వసించి వలస కేంద్రం (మదీనహ్)లో నివసిస్తూ ఉండేవారో! వారికి కూడా హక్కువుంది. వారు తమవద్దకు వలస వచ్చిన వారిని ప్రేమిస్తారు. మరియు వారు (వలస వచ్చిన) వారికి ఏది ఇవ్వబడినా! దాని అవసరం తమకు ఉన్నట్లు భావించరు. మరియు తమకు అవసరమున్నా వారికి తమ సొంత (అవసరాల) మీద ప్రాధాన్యతనిస్తారు. మరియు ఎవరైతే ఆత్మ లోభం నుండి రక్షింపబడతారో! అలాంటి వారు, వారే! సాఫల్యం పొందేవారు. మరియు ఎవరైతే వారి తరువాత వచ్చారో! వారికి అందులో హక్కు ఉంది. వారు ఇలా అంటారు: “ఓ మా ప్రభూ! మమ్మల్ని మరియు మాకంటే ముందు విశ్వసించిన మా సోదరులను క్షమించు. మరియు మా హృదయాలలో విశ్వాసుల పట్ల ద్వేషాన్ని కలిగించకు. ఓ మా ప్రభూ! నిశ్చయంగా, నీవు చాలా కనికరించేవాడవు, అపార కర