18. నాయకత్వం, తీర్పు  | మిష్కాతుల్ మసాబీహ్

18- كِتَابُ الْإِمَارَةِ وَالْقَضَاءِ
18. నాయకత్వం, తీర్పుల పుస్తకం

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం   

3661 – [ 1 ] ( متفق عليه ) (2/1085)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَطَاعَنِيْ فَقَدْ أَطَاعَ اللهَ وَمَنْ عَصَانِيْ فَقَدْ عَصَى اللهَ. وَمَنْ يُطِعِ الْأَمِيْرَ فَقَدْ أَطَاعَنِيْ وَمَنْ يَعْصِ الْأَمِيْرَ فَقَدْ عَصَانِيْ. وَإِنَّمَا الْإِمَامُ جُنَّةٌ يُقَاتِلُ مِنْ وَّرَائِهِ وَيُتَّقَى بِهِ فَإِنْ أَمَرَ بِتَقْوَى اللهِ وَعَدَلَ فَإِنَّ لَهُ بِذَلِكَ أَجْرًا وَإِنْ قَالَ بِغَيْرِهِ فَإِنْ عَلَيْهِ مِنْهُ.

3661. (1) [2/1085- ఏకీభవతం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నాకు విధేయత చూపినవారు అల్లాహ్‌కు విధేయత చూపినట్టే. నాకు అవిధేయత చూపినవారు అల్లాహ్‌కు అవిధేయత చూపినట్టే. అదేవిధంగా  నాయకునికి విధేయత చూపినవారు నాకు విధేయత చూపినట్టే. ఇంకా నాయకునికి అవిధేయత చూపినవారు నాకు అవిధేయత చూపినట్టే. ఇంకా నాయకుడు ఢాలు వంటివాడు. అంటే ఎవరి నేతృత్వంలో యుద్ధం చేయబడుతుందో, అంటే అతని నాయకత్వంలో శత్రువులతో యుద్ధం చేయబడుతుంది. అతని ద్వారానే రక్షించుకోవడం జరుగుతుంది. ఒకవేళ అతడు దైవభీతి గురించి ఆదేశించి, న్యాయంగా వ్యవహరిస్తే అతనికి పుణ్యం లభిస్తుంది. ఒకవేళ అతడు అలా చేయకపోతే దాని పాపం అతనిపైనే పడుతుంది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3662 – [ 2 ] ( صحيح ) (2/1085)

وَعَنْ أُمِّ الْحُصَيْنِ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنْ أُمِّرَعَلَيْكُمْ عَبْدٌ مُجَدَّعٌ يَقُوْدُكُمْ بِكِتَابِ اللهِ فَاسْمَعُوْا لَهُ وَأَطِيْعُوْا“. رَوَاه مُسْلِمٌ .

3662. (2) [2/108/5- దృఢం]

ఉమ్మె హు’సైన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఒకవేళ మీపై అందవికారంగా ఉన్న బానిసను నాయకునిగా నియమిస్తే, అతడు మిమ్మల్ని దైవగ్రంథం వైపు ఆహ్వానిస్తే అంటే ఖుర్‌ఆన్‌ ప్రకారం తీర్పుచేస్తే, పరిపాలిస్తే మీరు అతనికి విధేయత చూపాలి. (బుఖారీ, ముస్లిమ్‌)

అంటే ఒకవేళ నల్లగా, అందవికారంగా ఉన్న బానిసను కూడా మీ నాయకుడిగా నియమిస్తే, అతడు ఖుర్‌ఆన్‌, సున్నత్‌ల ప్రకారం పరిపాలిస్తే మీరు అతనికి విధేయత చూపాలి.

3663 – [ 3] ( صحيح ) (2/1085)

وَعَنْ أَنَسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: أَسْمَعُوْا وَأَطِيْعُوْا وَإِنِ اسْتُعْمِلَ عَلَيْكُمْ عَبْدٌ حَبَشِيٌّ كَأَنَّ رَأْسَهُ زَبِيْبَةٌ“. رَوَاهُ الْبُخَارِيُّ.

3663. (3) [2/1085- దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ నాయకుని మాట వినండి. అతనికి విధేయత చూపండి. ఒకవేళ నీగ్రోజాతికి చెందినవాడైనా, చిన్న తలగల వాడైనా, నల్లటివాడైనా అతను ఇస్లామ్‌ ప్రకారం పరిపాలించే వరకు అతనికి విధేయత చూపండి.[1](బు’ఖారీ)

3664 – [ 4 ] ( متفق عليه ) (2/1085)

وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلسَّمْعُ وَالطَّاعَةُ عَلَى الْمَرْءِ الْمُسْلِمِ فِيْمَا أَحَبَّ وَكَرِهَ مَا لَمْ يُؤْمَرْ بِمَعْصِيَةٍ فَإِذَا أُمِرَ بِمَعْصِيَةٍ فَلَا سَمْعَ وَلَا طَاعَة.

3664. (4) [2/1085- ఏకీభవతం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విధేయత పాటించటం ప్రతి ముస్లిమ్‌ యొక్క విధి. అతనికి ఇష్టమైనా ఇష్టం లేకున్నా పాలకుడు పాప కార్యాలకు ఆదేశించనంతవరకు అతనిమాట వినాలి. ఒకవేళ పాపకార్యాలకు ఆదేశిస్తే అతని మాట వినరాదు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3665 – [ 5 ] ( متفق عليه ) (2/1086)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا طَاعَةَ فِيْ مَعْصِيَةٍ إِنَّمَا الطَّاعَةُ فِي الْمَعْرُوْفِ.

3665. (5) [2/1086 ఏకీభవతం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, పాప కార్యాల్లో నాయకునికి విధేయత చూపనక్కర లేదు. సత్కార్యాల్లో విధేయత చూపాలి. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3666 – [ 6 ] ( متفق عليه ) (2/1086)

وَعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ قَالَ: بَايَعْنَا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَلَى السَّمْعِ وَالطَّاعَةِ فِيْ الْعُسْرِ وَالْيُسْرِ وَالْمَنْشَطِ وَالْمَكْرَهِ وَعَلَى أَثَرَةٍ عَلَيْنَا وَعَلَى أَنْ لَا نُنَازِعَ الْأَمْرَأَهْلَهُ وَعَلَى أَنْ نقُوْلَ بِالْحَقِّ أَيْنَمَا كُنَّا لَا نَخَافُ فِيْ اللهِ لَوْمَةَ لَائِمٍ.

وَفِيْ رِوَايَةٍ: وَعَلَى أَنْ لَا نُنَازِعَ الْأَمْرَ أَهْلَهُ إِلَّا أَنْ تَرَوْا كُفْرًا بَوَاحًا عِنْدَكُمْ مِنَ اللهِ فِيْهِ بُرْهَانٌ .

3666. (6) [2/1086 ఏకీభవతం]

‘ఉబాదహ్‌ బిన్‌ ‘సామిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) దగ్గర మేము విధేయత చూపుతామని, సులభమైనా, కష్టమైనా ఇష్టం ఉన్నా లేకపోయినా, మాపై ఇతరులకు ప్రాధాన్యత ఇస్తే సహనం వహిస్తామని బై’అత్‌ చేసాము. ఇంకా మేము ప్రవక్త (స)తో నాయకత్వానికి అర్హులైన వారితో మేము కయ్యానికి దిగమని, మేము ఎక్కడ ఉన్నా సత్యాన్నే పలుకుతామని, ఎవరు ఎలా అన్నా మాకు ఫరవాలేదని వాగ్దానం చేసాము.

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) మాతో ఇలా వాగ్దానం తీసుకున్నారు. ‘మేము నాయ కత్వానికి అర్హతగల వారితో కయ్యానికి దిగము, అయితే అతడు బహిరంగంగా అవిశ్వాసానికి పాల్పడితే తప్ప. మీ దగ్గర సాక్ష్యం ఉంటే మీరు వ్యతిరేకించగలరు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3667 – [ 7 ] ( متفق عليه ) (2/1086)

وَعَنِ ابْنِ عُمَرَرَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: كُنَّا إِذَا بَايَعْنَا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَلَى السَّمْعِ وَالطَّاعَةِ يَقُوْلُ لَنَا: ” فِيْمَا اسْتَطَعْتُمْ.

3667. (7) [2/1086 ఏకీభవతం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) దగ్గర మేము విధేయత చూపుతామని బై’అత్‌ చేసాము. ప్రవక్త (స) మాతో సాధ్యమైనంతవరకు నాకు విధేయత చూపండి, నన్ను అనుసరించండి అని అనేవారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3668 – [ 8 ] ( متفق عليه ) (2/1086)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: مَنْ رَأَى أَمِيْرِهِ يَكْرَهُهُ فَلْيَصْبِرْ فَإِنَّهُ لَيْسَ أَحَدٌ يُفَارِقُ الْجَمَاعَةَ شِبْرًا فَيَمُوْتَ إِلَّا مَاتَ مِيْتَةً جَاهِلِيَّةٍ.

3668. (8) [2/1086- ఏకీభవతం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మీలో ఎవరైనా తమ పాలకునిలో తనకు ఇష్టంలేని విషయం చూస్తే సహనం ఓర్పులను పాటించాలి. ముస్లిములకు ఒక్క జానెడు దూరమైనా వేరుగా ఉంటూ అదే స్థితిలో మరణిస్తే, అతనికి అజ్ఞానకాలపు మరణం సంభవిస్తుంది.[2] (బు’ఖారీ, ముస్లిమ్‌)

3669 – [ 9 ] ( صحيح ) (2/1086)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: مَنْ خَرَجَ مِنَ الطَّاعَةِ وَفَارَقَ الْجَمَاعَةَ فَمَاتَ مَاتَ مِيْتَةً جَاهِلِيَّةً. وَمَنْ قَاتَلَ تَحْتَ رَايَةٍ عِمِيَّةٍ يَغْضَبُ لِعَصَبِيَّةٍ أَوْ يَدْعُوْ لِعَصَبِيَّةٍ أَوْ يَنْصُرُ عَصَبِيَّةً فَقُتِلَ فَقِتْلَةٌ جَاهِلِيَّةٌ وَمَنْ خَرَجَ عَلَى أُمَّتِيْ بِسَيْفِهِ يَضْرِبُ بَرَّهَا وَ فَاجِرَهَا وَلَا يَتَحَاشَىَ مِنْ مُؤْمِنِهَا وَلَا يَفِيْ لِذِيْ عَهْدٍ عَهْدَهُ فَلَيْسَ مِنِّيْ وَلَسْتُ مِنْهُ“. رَوَاهُ مُسْلِمٌ .

3669. (9) [2/1086దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా ఆదేశిస్తూ ఉండగా నేను విన్నాను, ”నాయకుని విధేయతా పరిధినుండి తొలగిపోయిన వ్యక్తి, ముస్లిముల సమాజంనుండి వేరై చనిపోయిన వ్యక్తి అజ్ఞానకాలపు మరణాన్ని పొందుతాడు. అదేవిధంగా సత్యాసత్యాలను తెలుసుకోకుండా పక్షపాతంతో సహాయం చేస్తూ చనిపోతే అజ్ఞానకాలపు మరణం పొందుతాడు. అదేవిధంగా ముస్లిమ్‌ సమాజంలోని విశ్వాసులను చూడకుండా, ఒప్పందం గురించి ఆలోచించకుండా హింసించినా, చంపినా అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అతడు ముస్లిమ్‌ కాడు అని అన్నారు. (ముస్లిమ్‌)

3670 – [ 10 ] ( صحيح ) (2/1087)

وَعَنْ عَوْفِ بْنِ مَالِكٍ الْأَشْجَعِيِّ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “خِيَارُ أَئِمَّتِكُمُ الَّذِيْنَ يُحِبُّوْنَهُمْ وَيُحِبُّوْنَكُمْ وَتُصَلُّوْنَ عَلَيْهِمْ وَيُصَلُّوْنَ عَلَيْكُمْ وَشِرَارُ أَئِمَّتِكُمْ الَّذِيْ تُبْغِضُوْنَهُمْ وَيُبْغِضُوْنَكُمْ وَتَل عَنُوْنَهُمْ وَيَلْعَنُوْنَكُمْ. قَالَ: قُلْنَا: يَا رَسُوْلَ اللهِ أَفَلَا نُنَابِذُهُمْ عِنْدَ ذَلِكَ؟ قَالَ: “لَا مَا أَقَامُوْا فِيْكُمْ الصَّلَاةَ لَا مَا أَقَامُوْا فِيْكُمُ الصَّلَاةَ أَلَا مَنْ وُلِّيَ عَلَيْهِ وَالٍ فَرَآهُ يَأْتِيْ شَيْئًا مِّنْ مَّعْصِيَةِ اللهِ فَلْيَكْرَهُ مَا يَأْتِيْ مِنْ مَعْصِيَةِ اللهِ وَلَا يَنْزِعَنَّ يَدًا مِنْ طَاعَةٍ“. رَوَاهُ مُسْلِمٌ .

3670. (10) [2/1087దృఢం]

ఔఫ్‌ బిన్‌ మాలిక్‌ అష్‌జ’యీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం ,”మీ పాలకుల్లో మీరు వారిని ప్రేమించే, వారు మిమ్మల్ని ప్రేమించే, మీరు వారిని గురించి ప్రార్థించే, వారు మీ గురించి ప్రార్థించేవారే, ఉత్తములు. అదేవిధంగా మీ పాలకుల్లో మీరు వారిని అసహ్యించుకునే, వారు మిమ్మల్ని అసహ్యించుకునే, మీరు వారిని శపించే, వారు మిమ్మల్ని శపించేవారే, నీచులు,” అని అన్నారు. ఉల్లేఖన కర్త కథనం, ”అప్పుడు మేము ఇలా విన్నవించు కున్నాం. ‘ఓ ప్రవక్తా! ఇటువంటి నీచపాలకులను దించి, వారినుండి వేరై పోవచ్చా?’ అని అడిగాము. దానికి ప్రవక్త(స), ‘వద్దు, వారు నమా’జ్‌ స్థాపిస్తున్నంతవరకు, వారు ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నంతవరకు వారినుండి వేరుకాకండి. అయితే గుర్తుంచు డి! మీ పాలకులు అల్లాహ్‌, ఆయన ప్రవక్త (స) ఆదేశాలను వ్యతిరేకిస్తే దాన్ని మీరు చెడుగా భావించాలి. వారికి విధేయత చూపరాదు.’ (ముస్లిమ్‌)

3671 – [ 11 ] ( صحيح ) (2/1087)

وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: يَكُوْنُ عَلَيْكُمْ أُمَرَاءُ تَعْرِفُوْنَ وَتُنكِرُوْنَ فَمَنْ أَنْكَرَ فَقَدْ بَرِئَ وَمَنْ كَرِهَ فَقَدْ سَلِمَ وَلَكِنَّ مَنْ رَضِيَ وَتَابَعَ. قَالُوْا: أَفَلَا نُقَاتِلُهُمْ؟ قَالَ: لَا مَا صَلوْا لَا مَا صَلَوْاأَيْ: مَنْ كَرِهَ بِقَلْبِهِ وَأَنْكَرَ بِقَلْبِهِ. رَوَاهُ مُسْلِمٌ .

3671. (11) [2/1087దృఢం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, భవిష్యత్తులో మీపై ఎలాంటి పాలకులు వస్తారంటే, వారి కొన్ని పనులు మీకు బాగుంటాయి. కొన్ని పనులు చెడుగా ఉంటాయి. వారి చెడులను చెడుగా భావించేవారు ఆ నిందనుండి తప్పుకుంటారు. అతన్ని విచారించడం జరుగదు. అంటే చెడును తిరస్కరించి, దాన్ని చెడుగా భావించి అందులో భాగస్వామి కాకుండా ఉంటే సురక్షితంగా ఉంటాడు. అయితే వారి చెడుకు ఇష్టపడి, అతన్ని అనుసరిస్తే, అందులో పాల్గొంటే పాపంలో అతడు కూడా భాగస్వామి,’ అని అన్నారు. దానికి ‘హదీసు’ ఉల్లేఖనకర్త కథనం: అప్పుడు ప్రవక్త (స) అనుచరులు, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ఇటువంటి పాలకులతో యుద్ధం ఎందుకు చేయకూడదు,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘వద్దు వారు నమా’జు స్థాపిస్తున్నంత వరకు వారితో యుద్ధం చేయకండి, ద్రోహం  తలపెట్ట కండి,’ అని అన్నారు. (ముస్లిమ్‌)

3672 – [ 12 ] ( متفق عليه ) (2/1087)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ لَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: إِنَّكُمْ سَتَرَوْنَ بَعْدِيْ أَثَرَةً وَّأُمُوْرًا تُنْكِرُوْنَهَا. قَالُوْا: فَمَا تَأْمُرُنَا يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “أَدُّوْا إِلَيْهِمْ حَقَّهُمْ وَسَلُ وا اللهَ حَقَّكُمْ.

3672. (12) [2/1087ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘నా తరువాత మీరు ప్రాధాన్యతను చూస్తారు. అంటే మీపై అనర్హులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగు తుంది. పాలకులు అనేక ధర్మవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారు.’ దానికి ప్రవక్త (స) అనుచరులు, ‘ఓ ప్రవక్తా! ఇటువంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలి సెలవియ్యండి,’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) ‘వారి హక్కును చెల్లించండి. అంటే వారి నేతృత్వంలో పనిచేయండి. అల్లాహ్‌ను తమ హక్కును అర్థించండి,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3673 – [ 13 ] ( صحيح ) (2/1087)

وَعَنْ وَائِلِ بْنِ حُجْرِ قَالَ: سَأَلَ سَلَمَةُ بْنُ يَزِيْدَ الْجُعْفِيُّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ: يَا نَبِيَّ اللهِ أَرَأَيْتَ إِنْ قَامَتْ عَلَيْنَا أُمَرَاءُ يَسْأَلُوْنَا حَقَّهُمْ وَيَمْنَعُوْنَا حَقَّنَا فَمَا تَأْمُرُنَا؟ قَالَ: “اسْمَعُوْا وَأَطِيْعُوْا فَإِنَّمَا عَلَيْهِمْ مَا حُمِّلُوْا وَعَلَيْكُمْ مَا حُمِّلْتُمْ“. رَوَاهُ مُسْلِمٌ  .

3673. (13) [2/1087దృఢం]

వాయిల్‌ బిన్‌ హజర్‌ (ర) కథనం: సలమహ్ బిన్‌ య’జీద్‌ జు’అఫీ (ర) ప్రవక్త (స)ను ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ఒకవేళ మాపై మా హక్కులను హరించే పాలకులు వస్తే ఇటువంటి పరిస్థితుల్లో తమరి ఆదేశం ఏమిటి,’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) ‘వారి ఆదేశాల్ని పాలించండి, ధర్మంగా విధేయత చూపండి. వారి బాధ్యత నిర్వర్తించడం వారిపై ఉంది. మీ బాధ్యత నిర్వర్తించడం మీపై ఉంది.’ (ముస్లిమ్‌)

3674 – [ 14 ] ( صحيح ) (2/1088)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: مَنْ خَلَعَ يَدًا مِّنْ طَاعَةٍ لَقِيَ اللهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا حُجَّةَ لَهُ. وَمَنْ مَاتَ وَلَيْسَ فِيْ عُنُقِهِ بَيْعَةٌ مَاتَ مِيْتَةً جَاهِلِيَّةً “. رَوَاهُ مُسْلِمٌ .

3674. (14) [2/1088దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను, ”నాయకునికి అవిధేయత చూపినవాడు తీర్పుదినం నాడు అతని వద్ద ఎటువంటి ఆధారం లేకుండా అల్లాహ్‌ను కలుస్తాడు. అదేవిధంగా చని పోయిన వ్యక్తి మెడలో నాయకుని విధేయత లేకుంటే అతడు అజ్ఞాన కాలపు మరణం మరణిస్తాడు.” (ముస్లిమ్‌)

3675 – [ 15 ] ( متفق عليه ) (2/1088)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “كَانَتْ بَنُوْ إِسْرَائِيْلَ تَسُوْسُهُمُ الْأَنْبِيَاءُ كُلَّمَا هَلَكَ نَبِيٌّ خَلَفَهُ نَبِيٌّ وَإِنَّهُ لَا نَبِيَّ بَعْدِيْ وَسَيَكُوْنُ حُلُفَاءُ فَيَكْثُرُوْنَ. قَالُوْا: فَمَا تَأمُرُنَا؟  قَالَ: فُوْا بِيْعَةَ الْأَوَّلِ فَالْأَوَّلِ أَعْطُوْهُمْ حَقَّهُمْ فَإِنَّ اللهَ سَائِلُهُمْ عَمَّا اسْتَرْعَاهُمْ.

3675. (15) [2/1088ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘బనీ ఇస్రాయీల్‌ను వారి ప్రవక్తలు పరిరక్షించే వారు. ఒక ప్రవక్త మరణిస్తే, మరో ప్రవక్త ఆ బాధ్యతలను నిర్వర్తించేవాడు. వాస్తవం ఏమిటంటే నా తరువాత ఏ ప్రవక్తా రాడు. నా తరువాత చాలామంది ‘ఖలీఫాలు ఉంటారు’ అని అన్నారు. దానికి అనుచరులు, ‘మరి తమరి ఆదేశం ఏమిటి,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘మొదటి ‘ఖలీఫాకు విధేయత చూపండి. అదేవిధంగా ఒకరి తరువాత మరొకరు ‘ఖలీఫా అవుతూ ఉంటారు. వారికి విధేయత చూపండి. వారి హక్కును చెల్లించండి. ఎందుకంటే అల్లాహ్‌ (త) స్వయంగా ‘ఖలీఫాలను ప్రజల గురించి ప్రజల హక్కు చెల్లించారా లేదా అని ప్రశ్నించుకుంటాడు. ‘ (బు’ఖారీ, ముస్లిమ్‌)

3676 – [ 16 ] ( صحيح ) (2/1088)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: إِذَا بُوْيِعَ لِخَلَيْفَتَيْنِ فَاقْتُلُوا الْآخِرَ مِنْهُمَا“. رَوَاهُ مُسْلِمٌ  .

3676. (16) [2/1088 దృఢం]

అబూ స’యీద్‌(ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఇద్దరు ‘ఖలీఫహ్ లతో బై’అత్‌ చేసే పరిస్థితి వస్తే మొదటి ‘ఖలీఫహ్ కు విధేయత చూపండి, రెండో ‘ఖలీఫహ్ మెడ నరికివేయండి. (ముస్లిమ్‌)

అంటే ఒక ‘ఖలీఫహ్ ముందునుండే ఉన్నాడు. మరో వ్యక్తి కూడా ‘ఖలీఫహ్ గా వాదించాడు. ప్రజలతో బై’అత్‌ తీసుకో సాగాడు. అతడు ద్రోహి. అతడివల్ల కల్లోలాలు, ఉపద్రవాలు, యుద్ధాలు ఉత్పన్నం అవుతాయి. అందువల్ల రెండవ వ్యక్తిని చంపివేయండి. ఎందుకంటే ఏక కాలంలో ఇద్దరు రాజులు కాని, ‘ఖలీఫహ్ లు గానీ ఉండరాదు.

3677 – [ 17 ] ( صحيح ) (2/1088)

وَعَنْ عَرْفَجَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّهُ سَيَكُوْنُ هَنَاتٌ وَهَنَاتٌ فَمَنْ أَرَادَ أَنْ يُفَرِّقَ أَمْرَ هَذِهِ الْأَمَّةِ وَهِيَ جَمِيْعٌ فَاضْرِبُوْهُ بِالسَّيْفِ كَائِنا مَنْ كَانَ“. رَوَاهُ مُسْلِمٌ

3677. (17) [2/1088 దృఢం]

‘అర్‌ఫజహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ”భవిష్యత్తులో అనేక ఉపద్రవాలు, కల్లోలాలు తలెత్తుతాయి. నా అనుచర సమాజంలో అభిప్రాయ భేదాలు తలెత్తితే, ఒక నాయకత్వం క్రింద ఉండి మరో వ్యక్తి నాయకుడిగా వాదిస్తే అతన్ని కరవాలంతో నరికివేయండి. అతను ఎవరైనా సరే. అతడు పండితుడైనా, అజ్ఞాని అయినా. ఎందుకంటే  రెండోవాడు  ద్రోహి.  (ముస్లిమ్‌)

3678 – [ 18 ] ( صحيح ) (2/1088)

وَعَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: مَنْ أَتَاكُمْ وَأَمْرُكُمْ جَمِيْعٌ عَلَى رَجُلٍ وَّاحِدٍ يُرِيْدُ أَنْ يَشُقَّ عَصَاكُمْ أَوْ يُفَرِّقَ جَمَاعَتكُمْ فَاقْتُلُوْهُ“. رَوَاهُ مُسْلِمٌ  .

3678. (18) [2/1088- దృఢం]

‘అర్‌ఫజ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”మీ నాయకుడిగా ఒక వ్యక్తి ఉంటూ మరో వ్యక్తి నేను మీ నాయకుడ్ని అని వాదిస్తే, ముస్లిముల పట్ల ద్రోహానికి తలపడితే అతన్ని చంపివేయండి.”  (ముస్లిమ్‌)

3679 – [ 19 ] ( صحيح ) (2/1089)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: مَنْ بَايَعَ إِمَامًا فَأَعْطَاهُ صَفْقَةَ يَدِهِ وَثَمْرَةَ قَلْبِهِ فَلْيُطِعْهُ إِنِ اسْتَطَاعَ فَإِنْ جَاءَ آخَرُ يُنَازِعُهُ فَاضْرِبُوْا عُنُقِ الْآخَرِ“. رَوَاهُ مُسْلِمٌ .

3679. (19) [2/1089 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా ఒకవ్యక్తి చేతిపై నిర్మలమైన మనస్సుతో బై’అత్‌ చేస్తే, సాధ్యమైనంతవరకు అతని పట్ల విధేయత చూపాలి. ఒకవేళ మరోవ్యక్తి ఎవరైనా నేను నాయకుడని, వాదించి వాద ప్రతివాదాలకు దిగితే అతన్ని నరికివేయండి.”  (ముస్లిమ్‌)

3680 – [ 20 ] ( متفق عليه ) (2/1089)

وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ سَمُرَةَ قَالَ: قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَسْأَلِ الْإِمَارَةَ فَإِنَّكَ إِنْ أُعْطِيْتَهَا عَنْ مَسْأَلَةٍ وُكِلْتَ إِلَيْهَا وَإِنْ أُعْطِيْتَهَا عَنْ غَيْرِ مَسْأَلَةٍ أُعِنْتَ عَلَيْهَا.

3680. (20) [2/1089ఏకీభవితం]

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ సమురహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను ఇలా ఉపదేశించారు, ”నువ్వు నాయ కుడవు కావాలని కోరకూడదు, దాన్ని గురించి ఎవరినీ అర్థించ కూడదు. ఒకవేళ నీ కోరిక, అభ్యర్థన, కృషి ప్రయత్నాల వల్ల ఇది నీకు లభిస్తే, నీవు బాధ్యుడవైతే, నువ్వు దానికి గురిచేయబడతావు. ఇంకా దైవకారుణ్యం నీ వెంట ఉండదు, నీకు సహాయమూ అందదు. ఒకవేళ కోరకుండా, అడక్కుండా, ప్రయత్నించకుండా నువ్వు నాయకుడ వైతే, నీకు సహాయం అందుతుంది, దైవకారుణ్యం నీవెంట ఉంటుంది.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

3681 – [ 21 ] ( صحيح ) (2/1089)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: إِنَّكُمْ سَتَحْرِصُوْنَ عَلَى الْإِمَارَةِ وَسَتَكُوْنَ نِدَامَةً يَوْمَ الْقِيَامَةِ فَنِعْمَ الْمُرْضَعَةُ وَبِئْسَتِ الْفَاطِمَةُ. رَوَاهُ الْبُخَارِيُّ

3681. (21) [2/1089 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, భవిష్యత్తులో నాయకులు కావాలనే కోరికలు, కాంక్షలు పుడతాయి. కాని ఈ నాయకత్వం తీర్పు దినం నాడు విచారానికి గురిచేస్తుంది. పాలుపట్టే స్త్రీ మంచిదని పిస్తుంది. పాలు విడగొట్టే స్త్రీ చెడు.[3]  (బు’ఖారీ)

3682 – [ 22 ] ( صحيح ) (2/1089)

وَعَنْ أَبِيْ ذَرٍّقَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَلَا تَسْتَعْمِلُنِيْ؟ قَالَ: فَضَرَبَ بِيَدِهِ عَلَى مَنْكِبِيْ ثُمَّ قَالَ: يَا أَبَا ذَرٍّ إِنَّكَ ضَعِيْفٌ وَإِنَّهَا أَمَانَةٌ وَإِنَّهَا يَوْمَ الْقِيَامَةِ خِزْيٌ وَنَدَامَةٌ إِلَّا مَنْ أَخَذَهَا بِحَقِّهَا وَأَدَّى الَّذِيْ عَلَيْهِ فِيْهَا“.

وَ فِيْ رِوَايَةٍ: قَالَ لَهُ: يَا أَبَا ذَرٍّ إِنِّيْ أَرَاكَ ضَعِيْفًا وَإِنِّيْ أُحِبُّ لَكَ مَا أُحِبُّ لِنَفْسِيْ لَا تَأمَّرَنَّ عَلَى اثْنَيْنِ وَلَا تَوَلَّيَنَّ مَالَ يَتِيْمٍ“. رَوَاهُ مُسْلِمٌ .

3682. (22) [2/1089దృఢం]

అబూ జ’ర్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను, ‘ఓ ప్రవక్తా! తమరు నన్ను ఏ ప్రాంతానికైనా పాలకునిగా నియమించండి,’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స) తన చేత్తో నా భుజంపై ఒక్క గుద్దు గుద్ది అబూ-జ’ర్‌ నువ్వు బలహీనుడవు, దాసులపై అల్లాహ్‌ హక్కు, అల్లాహ్‌పై దాసుల హక్కు ఉంది. ఈ రెండూ లేని నాడు ఈ అధికారం అవమానం, నిరాశే మిగిల్చు తుంది. కాని న్యాయంగా ధర్మంగా ప్రవర్తించేవారు, ప్రజల హక్కులను చెల్లించేవారు, ధర్మంగా న్యాయంగా పరిపాలించే వారు ఎటువంటి అవమా నానికి గురికారు.

మరో ఉల్లేఖ నంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు. ”ఓ అబూ-జ’ర్‌! నువ్వు చాలా బలహీనుడవు. ఈ రాజ్య, అధికారభారాన్ని నీవు మోయలేవు. అందువల్ల నా గురించి నేను ఇష్టపడేదే, నీ గురించీ ఇష్టపడుతున్నాను. చివరికి ఇద్దరు వ్యక్తులపై కూడా నాయకుడు కావాలని అనాథల సంపాదనపై కూడా సంరక్షకుడు కావాలని కోరుకోకు అని ఉపదేశించారు.[4]  (ముస్లిమ్‌)

3683 – [ 23 ] ( متفق عليه ) (2/1089)

وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: دَخَلْتُ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم أَنَا وَرَجُلَانِ مِنْ بَنِيْ عَمِّيْ. فَقَالَ أحَدُهُمَا: يَا رَسُوْلَ اللهِ أُمِّرْنَا عَلَى بَعْضِ مَا وَلَّاكَ اللهُ. وَقَالَ الْآخر مِثْلَ ذَلِكَ فَقَالَ: “إِنَّا وَاللهِ لَا نُوَلِّيْ عَلَى هَذَا الْعَمَل أَحَدًا سَأَلَهُ وَلَا أَحَدًا حَرَصَ عَلَيْهِ“.

وَفِيْ رِوَايَةٍ قَالَ: “لَا نَسْتَعْمِلُ عَلَى عَمَلِنَا مَنْ أَرَادَهُ.

3683. (23) [2/1089ఏకీభవితం]

అబూ మూసా (ర) కథనం: నేను నా చిన్నాన్న కొడుకులు ఇద్దరు ప్రవక్త (స) వద్దకు వెళ్ళాం. వారిద్దరిలో ఒకరు, ‘ఓ ప్రవక్తా! తమరు మమ్మల్ని ఈ కొన్ని ప్రాంతాలకు అధికారులుగా నియమించండి,’ అని అన్నాడు, రెండవవాడు కూడా ఇదే అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘అల్లాహ్ సాక్షి! ధర్మాధికారిగా పాలకునిగా అధికారికావాలని కోరుకునే, కాంక్షించే వ్యక్తిని అధికారిగా నియమించను.[5] (బు’ఖారీ, ముస్లిమ్‌)

3684 – [ 24 ] ( متفق عليه ) (2/1089)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: تَجِدُوْنَ مِنْ خَيْرِ النَّاسِ أَشَدَّهُمْ كَرَاهِيَةً لِهَذَا الْأَمْرِ حَتَّى يَقَعَ فِيْهِ.

3684. (24) [2/1089ఏకీభవితం]

అబూ హురైరహ్‌(ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రాజ్యాలను, అధికారాలను, పాలనను కోరుకోనివారు అందరికంటే మంచివారు. అయితే వారు దానికి గురౌతారు. [6]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

3685 – [ 25 ] ( متفق عليه ) (2/1090)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلَا كُلُّكُمْ رَاعٍ وَكُلُّكُمْ مَسْؤُوْلٌ عَنْ رَعِيَّتِهِ فَالْإِمَامُ الَّذِيْ عَلَى النَّاسِ رَاعٍ وَهُوَ مَسْؤُوْلٌ عَنْ رَعِيَتِهِ وَالرَّجُلُ رَاعٍ عَلَى أَهْلِ بيتِهِ وَهُوَ مَسْؤُوْلٌ عَنْ رَعِيَّتِهِ وَالْمَرْأَةُ رَاِعِيَةٌ عَلَى بَيْتِ زَوْجِهَا وَوَلدِهِ وَهِيَ مَسْؤُوْلَةٌ عَنْهُمْ وَعَبْدُ الرَّجُلِ رَاعٍ عَلَى مَالِ سَيِّدِهِ وَهُوَ مَسْؤُوْلٌ عَنْهُ أَلَا فَكُلُّكُمْ رَاعٍ وَكُلُّكُمْ مَسْؤُوْلٌ عَنْ رَعِيَّتِه.

3685. (25) [2/1090ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, జాగ్రత్త! మీలో ప్రతి ఒక్కరూ అధికారి, పర్యవేక్షకుడు, సంరక్షకుడు. ప్రతి ఒక్కరినీ వారి బాధ్యత గురించి, ప్రశ్నించడం జరుగుతుంది. పాలకుడిని అతని పాలితుల గురించి ప్రశ్నించడం జరుగుతుంది. మనిషి తన ఇంటివారిపై బాధ్యుడు. అతన్ని అతని భార్యాబిడ్డల గురించి ప్రశ్నించడం జరుగుతుంది. స్త్రీ తన భర్త ఇంటికి బాధ్యురాలు, సంరక్షకురాలు. భర్త మరియు సంతానం గురించి ఆమెను ప్రశ్నించడం జరుగుతుంది. సేవకులు తమ యజమాని గురించి బాధ్యులు. వారిని వారి యజమాని గురించి ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా యజమానిని కూడా సేవకుల గురించి ప్రశ్నించడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరూ బాధ్యులే. ప్రతి ఒక్కరినీ వారి బాధ్యతల గురించి ప్రశ్నించడం జరుగుతుంది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3686 – [ 26 ] ( متفق عليه ) (2/1090)

وَعَنْ مَعْقِلِ بْنِ يَسَارٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَا مِنْ وَالٍ يَلِىْ رَعِيَّةً مِّنَ الْمُسْلِمِيْنَ فَيَمُوْتُ وَهُوَ غَاشٌ لَهُمْ إِلَّا حَرَّمَ اللهُ عَلَيْهِ الْجَنَّةَ.

3686. (26) [2/1090ఏకీభవితం]

మ’అఖల్‌ బిన్‌ యసార్‌(ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను. పాలకుడుగానీ, అధికారిగానీ, చక్రవర్తిగాని తన పాలితుల హక్కులు, సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించకుండా వారిపై అత్యాచారాలు, హింసలకు పాల్పడితే, అల్లాహ్‌ (త) అతనిపై  స్వర్గాన్ని నిషేధిస్తాడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3687 – [ 27 ] ( متفق عليه ) (2/1090)

وَعَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَا مِنْ عَبْدٍ يسترعيهِ الله رَعِيَّةً فَلَمْ يَحُطَّهَا بِنَصِيْحَةٍ إِلَّا لَمْ يَجِدْ رَائِحَةَ الْجَنَّةِ.

3687. (27) [2/1090ఏకీభవితం]

మ’అఖల్‌ బిన్‌ యసార్‌(ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రజల బాధ్య తలు, అధికారం ఇవ్వబడిన వారు ప్రజల సంక్షేమం, సంరక్షణ, పర్యవేక్షణ, హక్కుల గురించి స్పందించ కుండా, పాటు పడకుండా ఉంటే, ఇటువంటివారు స్వర్గ సువాసన కూడా ఆస్వాదించలేరు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3688 – [ 28 ] ( صحيح ) (2/1090)

وَعَنْ عَائِذِ بْنِ عَمْرٍو قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ شَرَّ الرِّعَاءِ الْحُطَمَةُ“. رَوَاهُ مُسْلِمٌ .

3688. (28) [2/1090దృఢం]

‘ఆయి’జ్‌’ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”ప్రజలను హింసించే వారు, వారిపై అత్యాచారాలు చేసేవారు పాలకుల్లో అందరి కంటే  నీచులు.”  (ముస్లిమ్‌)

3689 – [ 29 ] ( صحيح ) (2/1090)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَللّهُمَّ مَنْ وَلِيَ مِنْ أَمْرِ أُمَّتِيْ شَيْئًا فَشَقَّ عَلَيْهِمْ فَاشقُقْ عَلَيْهِ. وَمَنْ وَلِيَ مِنْ أَمْرِ أُمَّتِيْ شَيْئًا فَرَفَقَ بِهِمْ فَارْفَقْ بِهِ“. رَوَاهُ مُسْلِمٌ  

3689. (29) [2/1090దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నాయకులు, పాలకుల గురించి ఇలా ప్రార్థించారు, శపించారు, ”ఓ అల్లాహ్! నా అనుచర సమాజంలోని పాలకులు నా అనుచర సమాజాన్ని పీడించినా, హింసించినా, అత్యాచారాలుచేసినా నీవుకూడా వారిని ఆపద లకు, నష్టాలకుగురిచేసి నీచఅవమానానికి గురి చేయి. అదే విధంగా నా అనుచర సమాజం పట్ల దయ జాలి, కరుణా హృదయాలతో ప్రవర్తిస్తే నీవు కూడా వారిపై దయా కారుణ్యంతో  వ్యవహరించు.  (ముస్లిమ్‌)

3690 – [ 30 ] ( صحيح ) (2/1091)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ الْعَاصِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْمُقْسِطِيْنَ عِنْدَ اللهِ عَلَى مَنَابِرَ مِنْ نُوْرٍ عَنْ يَمِيْنِ الرَّحْمنِ وَكِلْتَا يَدَيْهِ يَمِيْنٌ الَّذِيْنَ يَعْدِلُونَ فِيْ حُكْمِهِمْ وَأَهْلِيْهِمْ وَمَا وَلُوْا“. رَوَاهُ مُسْلِمٌ.

3690. (30) [2/1091దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ బిన్‌ ‘ఆ’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, న్యాయంగా ధర్మంగా వ్యవహరించే పాలకులు తీర్పుదినం నాడు అల్లాహ్‌ (త) వెలుగు మెంబర్‌పై ఉంటారు. ఇది అల్లాహ్‌కు కుడి ప్రక్కే ఉంటుంది. అల్లాహ్‌ రెండు చేతులూ కుడిచేతులే. అంటే తనవారైనా పరాయివారైనా ప్రజలపట్ల న్యాయంగా ధర్మంగా పరిపాలించే  పాలకులు. (ముస్లిమ్‌)

అంటే తమ విషయాల్లో ప్రజల విషయాల్లో న్యాయంగా ధర్మంగా వ్యవహరిస్తారు.

3691 – [ 31 ] ( صحيح ) (2/1091)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: مَا بَعَثَ اللهُ مِنْ نَبِيٍّ وَلَا اسْتُخْلِفَ مِنْ خَلِيْفَةٍ إِلَّا كَانَتْ لَهُ بِطَانَتَانِ: بِطَانَةٌ تَأْمُرُهُ بِالْمَعْرُوْفِ وَتَحُضُّهُ عَلَيْهِ وَبِطَانَةٌ تَأْمُرُهُ بِاشَّرِّ وَتَحُضُّهُ عَلَيْهِ وَالْمَعْصُوْمُ مَنْ عَصَمَهُ الله“. رَوَاهُ الْبُخَارِيُّ.

3691. (31) [2/1091దృఢం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) ప్రవక్తలు పంపినా, లేదా ప్రవక్తల ప్రతినిధులు ‘ఖలీఫాలను పంపినా, వారివెంట ఇద్దరు రహస్య మిత్రులను అంటే కారుణ్య దైవదూతలను నియమిస్తాడు. ఒకదూత అతనికి మంచిని గురించి ఆదేశిస్తాడు. అతన్ని సత్కార్యాల పట్ల ప్రోత్సహిస్తాడు. మరొకడు షై’తాన్‌ కూడా అతని వెంట ఉంటాడు. వాడు చెడును గురించి ఆదేశిస్తాడు. చెడును ప్రోత్సహిస్తాడు. అయితే అల్లాహ్‌ (త) కాపాడినవాడే వీటి నుండి తప్పించుకోగలడు.  (బు’ఖారీ)

3692 – [ 32 ] ( صحيح ) (2/1091)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ قَيْسُ بْنُ سَعْدٍ مِنَ النَّبِيِّ صلى الله عليه وسلم بِمَنْزِلَةِ صَاحِبِ الشُّرَطِ مِنَ الْأَمِيْرِ. رَوَاهُ الْبُخَارِيُّ  .

3692. (32) [2/1091దృఢం]

అనస్‌ (ర) కథనం: ఖైస్బిన్సఅద్‌() ప్రవక్త() వద్ద సేవకుడు, రక్షకుడుగా ఉండేవారు. పాలకుల వద్ద చక్రవర్తుల వద్ద సైనికులు, అధికారులు ఉన్నట్టు. (బు’ఖారీ)

అంటే ఖైస్ బిన్ సఅద్ ప్రవక్త(స) వద్ద సైనికుడిలా, రక్షకుడిలా, సేవకుడిలా  ఉండేవారు.

3693 – [ 33 ] ( صحيح ) (2/1091)

وَعَنْ أَبِيْ بَكْرَةَ قَالَ: لَمَّا بَلَغَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَنَّ أَهْلَ فَارَسَ قَدْ مَلَّكُوْا عَلَيْهِمْ بِنْتَ كِسْرَى قَالَ: “لَنْ يُفْلِحَ قَوْمٌ وَلَوْا أَمَرَهُمْ اِمْرَأَةً“. رَوَاه الْبُخَارِيُّ .

3693. (33) [2/1091దృఢం]

అబూ బక్‌రహ్‌ (ర) కథనం: ఫారిస్‌ ప్రజలు కిస్రా రాజ కుమారిని తమ పాలకురాలిగా ఎన్నుకున్నారన్న వార్త ప్రవక్త (స) కు తెలియగానే అతను (స), స్త్రీని తమ పాలితురాలిగా ఎన్నుకున్న ప్రజలు ఎన్నడూ సాఫల్యం  పొందరు, అని అన్నారు.  (బుఖారీ)

ఎందుకంటే సాధారణంగా స్త్రీలు పాలనకు అనర్హులు. పురుషుల్లా పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించలేరు.

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

3694 – [ 34 ] ( صحيح ) (2/1091)

عَنِ الْحَارِثِ الْأَشْعَرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: آمُرُكُمْ بِخَمْسٍ:بِالْجَمَاعَةِ وَالسَّمْعِ وَالطَّاعَةِ وَالْهِجْرَةِ وَالْجِهَادِ فِيْ سَبِيْلِ اللهِ. وَإِنَّهُ مَنْ خَرَجَ مِنَ الْجَمَاعَةِ قِيْدَ شِبْرٍ فَقَدْ خَلَعَ رِبقَة الْإِسْلَامِ مِنْ عُنُقِهِ إِلَّا أَنْ يُّرَاجِعَ وَمَنْ دَعَا بِدَعْوَى الْجَاهِلِيَّةِ فَهُوَ مِنْ جُثَى جَهَنَّمَ وَإِنْ صَامَ وَصَلَّى وَزَعَمَ أَنَّهُ مُسْلِمٌ.  رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ .

3694. (34) [2/1091దృఢం]

‘హారిస్‌’ అష్‌’అరీ (ర) కథనం: ప్రవక్త (స) తన అను చరులతో ఇలా ప్రవచించారు, ”నేను మీకు ఐదు విష యాల గురించి ఆదేశిస్తున్నాను. 1. మీరు ముస్లి ములందరూ సామూహికంగా ఉండాలి. 2. ముస్లిము లందరూ ఐకమత్యంగా ఉండాలి. 3. తమ పాలకుల, నాయకుల ఆదేశాలను పాటించాలి, ఆజ్ఞాపాలన చేయాలి. 4. అవసర మైతే వలసపోవాలి. 5. దైవ మార్గంలోకృషిచేయాలి. ముస్లిమ్‌ సమాజానికి జానెడు దూరం అయిన వ్యక్తి ఇస్లామ్‌ త్రాడును తన మెడలో నుండి తీసిపారేసినట్లే, అంటే ఇస్లామ్‌ను త్యజించి నట్లే. అయితే తిరిగి వస్తే మంచిదే. అదే విధంగా అజ్ఞాన కాలపు మూఢాచారాలు, పద్ధతుల వైపు ప్రజలను పిలిచేవాడు నరకవాసి. ఒకవేళ అతడు నమా’జ్‌ చదివినా, రో’జా పాటించినా, తన్ను తాను ముస్లిమ్‌గా భావించినా సరే. (అ’హ్మద్‌, తిర్మిజి’)

3695 – [ 35 ] ( صحيح ) (2/1092)

وَعَنْ زِيَادِ بْنِ كُسَيِّبِ الْعَدَوِيّ قَالَ: كُنْتُ مَعَ أَبِيْ بَكْرَةَ تَحْتَ مِنْبَرابْنِ عَامِرٍ وَهُوَ يَخْطُبُ وَعَلَيْهِ ثِيَابٌ رِقَاقٌ فَقَالَ أَبُوْ بِلَالٍ: اُنْظُرُوْا إِلَى أَمِيْرِنَا يَلْبَسُ ثِيَابَ الْفُسَّاقِ. فَقَالَ أَبُوْ بَكْرَةَ: اُسْكُتْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: مَنْ أَهَانَ سُلْطَانَ اللهِ فِي الْأَرْضِ أَهَانَهُ اللهُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.

3695. (35) [2/1092దృఢం

జియాద్‌ బిన్‌ కుసైద్‌ (ర) కథనం: నేను, అబూ బక్రహ్‌ ఇద్దరం ఇబ్ను ‘ఆమిర్‌ మెంబర్‌ దగ్గర కూర్చొని ఉన్నాం. అతను అప్పుడు ‘ఖు’త్‌బహ్ ఇస్తున్నారు. అతను పలుచని దుస్తులు ధరించి ఉన్నారు. ‘తీబ్ పలుచని దుస్తులు ధరించి ఉండటం చూచి అబూ బిలాల్‌ మన నాయకుడ్ని చూడండి, పాపుల్లాంటి దుస్తులు ధరించి ఉన్నారు. అంటే పలుచని దుస్తులు పాపాత్ములే ధరిస్తారు, దైవభీతిపరులు కాదు. అది విని అబూ బక్రహ్‌, ”ఓ అబూ బిలాల్‌ నోరు మూసుకో, ఏమీ అనకు. ఎందుకంటే ప్రవక్త (స)ను, ‘ముస్లిముల పాలకులను అవమానపరచిన వారిని అల్లాహ్‌ (త) నీచ అవమానానికి గురిచేస్తాడు’ అని అంటూ ఉండగా విని ఉన్నాను” అని అన్నారు. [7]  (తిర్మిజి / ప్రామాణికం-ఏకోల్లేఖనం)

3696 – [ 36 ] ( صحيح ) (2/1092)

وعَنْ النواس بن سمعان قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: لَا طَاعَةَ لِمَخْلُوْقٍ فِيْ مَعْصِيَةِ الْخَالِقِ“. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ .

3696. (36) [2/1092దృఢం]

నవాస్‌ బిన్‌ సిమ్‌’ఆన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సృష్టికర్తకు అవిధేయతగా సృష్టితాలకు విధేయత చూపరాదు.”  [8]  (షర్‌హుస్సున్నహ్‌)

3697 – [ 37 ] ( لم تتم دراسته ) (2/1092)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ أَمِيْرِ عَشَرَةٍ إِلَّا يُؤْتى بِهِ يَوْمَ الْقِيَامَةِ مَغْلُوْلًا حَتَّى يَفُكَّ عَنْهُ الْعَدْلُ أَوْ يُوْبِقَهُ الْجَوْرُ“. رَوَاه الدَّارَمِيُّ .

3697. (37) [2/1092అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తి పదిమందిపై కూడా, పాలకుడిగా బాధ్యుడిగా ఉండి ఉంటే, తీర్పుదినంనాడు అతని మెడలో కంఠాహారం, చేతులకు బేడీలు వేసి, నేరస్తునిలా తీసుకురావటం జరుగుతుంది. ఒకవేళ అతడు న్యాయంగా ప్రవర్తించి ఉంటే అతని న్యాయం అతన్ని విడిపిస్తుంది. ఒకవేళ అతడు అన్యాయం చేసిఉంటే, అతని అన్యాయం అతన్ని నాశనం చేసివేస్తుంది. [9]  (దార్మి)

3698 – [ 38 ] ( ضعيف ) (2/1092)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَيْلٌ لِلْأُمَرَاءِ. وَيْلٌ لِلْعُرُفَاءِ. وَيْلٌ لِلْأَمنَاءِ لَيَتَمَنَّيْنَ أَقْوَامٌ يَوْمَ الْقِيَامَةِ أَنْ نَوَاصِيَهُمْ مُعَلَّقةٌ بِالثُرَيَّا يَتَجَلْجَلُوْنَ بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ. وَأَنَّهُمْ لَمْ يَلُوْا عَمَلًا“. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِوَرَوَاهُ أَحْمَدُ وَفِيْ رِوَايَتِهِ: “أَنَّ ذَوَائِبَهُمْ كَانَتْ مُعَلَّقَةً بِالثُرَيَّا يَتَذَبْذَبُوْنَ بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ وَلَمْ يَكُوْنُوْا عُمِّلُوْا عَلَى شَيْءٍ.

3698. (38) [2/1092బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నాయకులకు, పెద్దలకు కష్టాలే కష్టాలు. న్యాయాధి కారులకు కూడా, ట్రెజరర్‌లకు కూడా పెద్దకష్టాలే. తీర్పుదినంనాడు వీరు పాలకులుగా, నాయకులుగా ఉండేకంటే, తమ తలలు గ్రహాలకు కట్టి భూమ్యాకాశాల మధ్య వ్రేలాడదీసినా బాగుండేదని, భావిస్తారు. (షర్‌హు స్సున్నహ్‌, అహ్మద్‌)

మరో ఉల్లే ఖనంలో ఇలా ఉంది: ”వారి జుట్టు గ్రహాలకు వ్రేలాడబడి భూమ్యాకాశాల మధ్య ఊగుతూ ఉండి ఉన్నా ఫరవాలేదు గాని, ప్రపంచంలో ఒకరిపై అధికారులుగా, పాలకులుగా ఉండకుండా ఉంటే బాగుండేదని విచారిస్తారు.”

3699 – [ 39 ] ( ضعيف ) (2/1093)

وَعَنْ غَالِبِ القَطَّانِ عَنْ رَجُلٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: إِنَّ الْعِرَافَةَ حَقٌّ وَلَابدٌ لِلنَّاسِ مِنْ عُرَفَاءِ وَلَكِنَّ الْعُرفَاءَ فِي النَّارِ“. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3699. (39) [2/1093బలహీనం]

‘గాలిబ్‌ బిన్‌ ఖ’త్తాన్‌ ఒక వ్యక్తి ద్వారా కథనం: అతడు తనతండ్రి, తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నాయకత్వం, పెత్తనం తప్పనిసరి సత్యం. ఇది లేకుండా వ్యవస్థ నడవదు. కాని చాలామంది నాయకులు, హోదాదారులు నరకంలోకి పోతారు.” [10] (అబూ  దావూద్‌)

3700 – [ 40 ] ( لم تتم دراسته ) (2/1093)

وَعَنْ كَعْبِ بْنِ عُجْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أُعِيْذُكَ بِاللهِ مِنْ إمَارَةِ السُّفَهَاءِ“. قَالَ: وَمَا ذَاكَ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: أُمَرَاءَ سَيَكُوْنُوْنَ مِنْ بَعْدِيْ مَنْ دَخَلَ عَلَيْهِمْ فَصَدَّقَهُمْ بِكَذِبِهِمْ وَأَعَانَهُمْ عَلَى ظُلْمِهِمْ فَلَيْسُوْا مِنِّيْ وَلَسْتُ مِنْهُمْ وَلَنْ يَرِدُوْا عَلَيَّ الْحَوْضَ وَمَنْ لَمْ يَدْخُلْ عَلَيْهِمْ وَلَمْ يُصَدِّقُهُم بِكَذِبِهِمْ وَلَمْ يُعِنْهُمْ عَلَى ظُلْمِهِمْ فَأُوْلَئِكَ مِنِّيْ وَأَنَا مِنْهُمْ وَأُوَلَئِكَ يَرِدُوْنَ عَلَيَّ الْحَوْض“. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ .

3700. (40) [2/1093అపరిశోధితం]

క’అబ్‌ బిన్‌ ‘ఉజ్‌రహ్‌ కథనం: ప్రవక్త (స), నాతో ఇలా అన్నారు, ‘నేను నీ గురించి బుద్ధిహీనులైన నాయకులు, అధికారుల నుండి అల్లాహ్‌ శరణు కోరుతున్నాను. అంటే బుద్ధిహీనులైన అధికారుల నుండి అల్లాహ్‌ రక్షించు గాక!’ దానికి క’అబ్‌ బిన్‌ ‘ఉజ్‌రహ్‌ ఇలా అన్నారు, ”ఓ ప్రవక్తా! ఇది ఎప్పుడు మరియు ఎలా అవుతుంది? వారు ఎవరై ఉంటారు,” అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స), ‘నా తరువాత అవివేక నాయకులు ఉద్భవిస్తారు. ప్రజలను హింసిస్తారు. ప్రజల హక్కులను చెల్లించరు. ఇటువంటి నాయకుల వద్దకు వెళ్ళి, వారి అబద్ధాన్ని సత్యంగా భావించే, వారి అసత్యాన్ని సత్యంగా ధృవీకరించే, ఇంకా వారు పెట్టే హింసల్లో సహాయం చేసే వ్యక్తులు ముస్లిములు కారు. నేను వారికి చెందను. తీర్పుదినం నాడు హౌదె కౌసర్ వద్ద నా నుండి నీళ్ళు త్రాగడానికీ రారు. ఇటువంటి దుష్టపాలకుల వద్దకు వెళ్ళని వారు, వారి అసత్యాన్ని ధృవీకరించనివారు, వారి అత్యాచారాల పట్ల సహా యం చేయనివారు ముస్లిములు. నేను వారికి చెందుతాను. వీరు హౌదె కౌసర్ వద్దకు వస్తారు. (తిర్మిజి, నసాయి)

3701 – [ 41 ] ( لم تتم دراسته ) (2/1093)

وَعَنِ ابْنِ عَبَّاسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: مَنْ سَكَنَ الْبَادِيَةَ جَفَا وَمَنْ أَتْبَعَ الصَّيْدَ غَفَل وَمَنْ أَتَى السُّلْطَانَ افْتُتِنَ. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ.

وَفِيْ رِوَايَةِ أَبِيْ دَاوُدَ: مَنْ لَزِمَ السُّلْطَانَ اُفْتُتِنَ وَمَا ازْدَادَ عَبْدٌ مِنَ السُّلْطَانِ دُنُوّا إِلَّا ازْدَادَ مِنَ اللهِ بُعْدًا.

3701. (41) [2/1093అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, పల్లెల్లో నివాసం ఏర్పరచుకున్నవాడు తన్నుతాను కష్టానికి గురిచేసు కున్నాడు. వేట వెంట పడినవాడు దైవధ్యానం నుండి ఏమరుపాటుకు గురిఅయ్యాడు. ఎల్లప్పుడూ రాజులవద్దకు వచ్చే పోయే వారు ఉపద్రవాలకు, కల్లోలాలకు గురి అవుతారు.[11]   (అ’హ్మద్‌, తిర్మిజి’, నసాయి’) 

అబూ దావూద్‌ ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”రాజుల వద్దకు వచ్చేపోయే వ్యక్తులు పరీక్షకు గురౌతారు. అదేవిధంగా రాజులకు అధికారులకు ఎంత దగ్గరైతే దైవానికి  అంత దూరం  అవుతారు.”

3702 – [ 42 ] ( ضعيف ) (2/1094)

وَعَنِ الْمِقْدَامِ بْنِ مَعْدِيْ كَرَبَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم ضَرَبَ عَلَى مَنْكِبَيْهِ ثُمَّ قَالَ: “أَفْلَحْتَ يَا قُدَيْمُ إِنْ مُتَّ وَلَمْ تَكُنْ أَمِيْرًا وَلَا كَاتِبًا وَلَا عَرِيْفًا.  رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3702. (42) [2/1094బలహీనం]

మిఖ్‌దామ్‌ బిన్‌ మ’అదీ కర్‌బ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నాతొడపై తనచేత్తో కొట్టి ఇలా ఉపదేశించారు: ‘ఓ ఖుదైమ్, నువ్వు నాయకుడు, గుమస్తా, సెక్రటరీ, అధికారి, పెత్తందారు మొదలైన వారుగా కాకుండా మరణిస్తే నువ్వు తప్పకుండా సాఫల్యం పొందుతావు.[12]  (అబూ  దావూద్‌)

3703 – [ 43 ] ( ضعيف ) (2/1094)

وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَدْخُلُ الْجَنَّةَ صَاحِبُ مَكْسٍ. يَعْنِي الَّذِيْ يُعَشِّرُ النَّاسُ. روَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ  .

3703. (43) [2/1094బలహీనం]

‘ఉఖ్‌బహ్ బిన్‌ ‘ఆమిర్‌(ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అన్యాయంగా పన్ను వసూలుచేసేవారు స్వర్గంలో ప్రవేశించరు.”  (అ’హ్మద్‌, అబూ  దావూద్‌,  దార్మి)

3704 – [ 44 ] ( لم تتم دراسته ) (2/1094)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَحَبَّ النَّاسِ إِلَى اللهِ يَوْمَ الْقِيَامَةِ وَأَقْرَبَهُمْ مِنْهُ مَجْلِسًا إِمَامٌ عَادِلٌ وَإِنَّ أَبْغَضَ النَّاسِ إِلَى اللهِ يَوْمَ الْقِيَامَةِ وَأَشَدَّهُمْ عَذَابًا.

وَفِيْ رِوَايَةٍ: وَأَبْعَدَهُمْ مِنْهُ مَجْلِسًا إِمَامٌ جَائِرٌ.  رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ .

3704. (44) [2/1094అపరిశోధితం]

అబూ సయీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినంనాడు అల్లాహ్‌ వద్ద అందరికంటే ఉన్నతుడు, శ్రేష్ఠుడు,  న్యాయంగా ధర్మంగా పరి పాలించే పాలకుడు. అదేవిధంగా తీర్పుదినంనాడు అందరికంటే నీచుడు కఠిన శిక్షకు అర్హుడు దుర్మార్గ పరిపాలకుడు.[13]  (తిర్మిజి   / ప్రామాణికం -ఏకోల్లేఖనం)

3705 – [ 45 ] ( صحيح ) (2/1094)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَفْضَلُ الْجِهَادِ مَنْ قَالَ كَلِمَةَ حَقٍّ عِنْدَ سُلْطَانٍ جَائِرٍ.  رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

3705. (45) [2/1094దృఢం]

అబూ స’యీద్‌ (ర)కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దుర్మార్గ పరిపాలకుని ముందు సత్యం పలకటం అన్నిటి కంటే గొప్ప  జిహాద్‌.” (తిర్మిజి, అబూ  దావూద్‌,  ఇబ్నె మాజహ్)

3706 – [ 46 ] ( صحيح ) (2/1094)

وَرَوَاهُ أَحْمَدُ وَالنَّسَائِيُّ عَنْ طَارِقِ بْنِ شِهَابٍ .

3706. (46) [2/1094దృఢం]

తారిఖ్‌  బిన్‌ షిహాబ్‌  కథనం. (అ’హ్మద్‌, నసాయి’)

3707 – [ 47 ] ( لم تتم دراسته ) (2/1094)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: إِذَا أَرَادَ اللهُ بِالْأَمِيْرِ خَيْرًا جَعَلَ لَهُ وَزِيْرَ صِدْقٍ إِنْ نَسِيَ ذَكَّرَهُ وَإِنْ ذَكَرَ أَعَانَهُ. وَإِذَا أَرَادَ بِهِ غَيْرَ ذَلِكَ جَعَلَ لَهُ وَزِيْرَ سُوْءٍ إِنْ نَسِي لَمْ يُذَكِّرْهُ وَإِنْ ذكر لَمْ يُعِنْهُ“. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

3707. (47) [2/1094అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) పాలకులకు, మేలు చేయాలని కోరినపుడు అతని కోసం ఒక మంచి మంత్రిని నియమిస్తాడు. ఒకవేళ రాజు మరచితే మంత్రి గుర్తుచేస్తాడు. ఒకవేళ అతడు గుర్తుంచితే మంత్రి అందులో సహాయసహకారాలు అందిస్తాడు. అదేవిధంగా అల్లాహ్‌ (త) రాజులపట్ల చెడు చేయా లనుకుంటే, అతని కోసం బుద్ధిహీనుడైన మంత్రిని నియమిస్తాడు. ఒకవేళ రాజు మరచిపోతే అతనికి గుర్తుచేయడు. సహాయసహకారాలు అందించడు. గుర్తున్నా అందులో ఏమాత్రం సహాయం చేయడు. (అబూ  దావూద్‌, నసాయి’)

3708 – [ 48 ] ( لم تتم دراسته ) (2/1095)

وَعَنْ أَبِيْ أُمَامَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: إِنَّ الْأَمِيْرَ إِذَا ابْتَغَى الرِّيْبَةَ فِي النَّاسِ أَفْسَدَهُمْ“. رَوَاهُ أَبُوْ دَاوُدَ  .

3708. (48) [2/1095అపరిశోధితం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రాజులు, పాలకులు ప్రజల రహస్యాల వెంటపడితే, చివరికి ప్రజలను చెడగొడతారు.” [14](అబూ దావూద్‌)

3709 – [ 49 ] ( لم تتم دراسته ) (2/1095)

وَعَنْ مُعَاوِيَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: إِنَّكَ إِذَا اتْبَعْتَ عَوْرَاتِ النَّاسِ أَفْسَدْتَّهُمْ. روَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

3709. (49) [2/1095అపరిశోధితం]

ము’ఆవియహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను, ”మీరు ప్రజల లోపాల వెంటపడితే, చివరికి మీరు వారిని చెడగొడతారు.”  [15]  (బైహఖీ)

3710 – [ 50 ] ( لم تتم دراسته ) (2/1095)

وَعَنْ أَبِيْ ذَرٍّقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: كَيْفَ أَنْتُمْ وَأئِمَةٌ مِنْ بَعْدِيْ يَسْتَأْثِرُوْنَ بِهَذَا الْفَيْءِ؟ قُلْتُ: أَمَا وَالَّذِيْ بَعَثَكَ بِالْحَقِّ أضَعُ سَيْفِيْ عَلَى عَاتِقِيْ ثُمَّ أَضْرِبُ بِهِ حَتَّى أَلْقَاكَ قَالَ: “أَوَلًا أَدُلُّكَ عَلَى خَيْرٍ مِّنْ ذَلِكَ؟ تَصْبِرُ حَتَّى تَلْقَانِيْ“. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3710. (50) [2/1095అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా తరువాత చాలామంది పాలకులు, నాయకులు, యుద్ధ ధనానికి తన్ను తాను ప్రాధాన్యత  ఇచ్చినపుడు, హక్కు గలవారి హక్కులను కొల్లగొట్టినపుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది?” అప్పుడు నేను, ”తమకు సత్యం ఇచ్చి పంపిన దైవం సాక్షి! నేను నా కరవాలాన్ని నా భుజంపై పెట్టు కుంటాను. ఇంకా ఇటువంటి పాలకులను, రాజులను, అధికారులను నరికివేస్తాను. చివరికి మరణించి నేను తమర్ని కలుస్తాను” అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స) ”నేను నీకు ఇంతకంటే మంచిది మరియు సులభమైన విషయాన్ని తెలుపనా? అదేమిటంటే ఈ పాలకులతో, రాజులతో, అధికారులతో యుద్ధాలు, పోరాటాలు చేయకు. అంటే ఓర్పువహించు, చివరికి మరణించి నువ్వు నన్ను కలుసుకుంటావు,” అని అన్నారు.[16]  (అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం 

3711 – [ 51 ] ( لم تتم دراسته ) (2/1095)

عَنْ عَائِشَةَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أَتَدْرُوْنَ مَنِ السَّابِقُوْنَ إِلَى ظِلِّ اللهِ عَزَّ وَجَلَّ يَوْمَ الْقِيَامَةِ؟  قَالُوْا: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ قَالَ: “الَّذِيْنَ إِذَا أُعْطُوا الْحَقَّ قَبِلُوْهُ وَإِذَا سُئِلُوْهُ بَذَلُوْهُ وَحَكَمُوْا لِلنَّاسِ كَحُكْمِهِمْ لِأَنْفُسِهِمْ.

3711. (51) [2/1095అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”తీర్పుదినం నాడు అల్లాహ్‌ (త) నీడ వైపు పరిగెత్తే వారెవరో మీకు తెలుసా? అంటే దైవకారుణ్యం నీడవైపు అందరికంటే ముందు ఎవరు చేరుకుంటారో మీకు తెలుసా?” అని అన్నారు. దానికి ప్రజలు ‘ఆ విషయం అల్లాహ్‌, ఆయన ప్రవక్త (స)కే బాగా తెలుసు,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) ”వీళ్ళు ఎవరంటే వారిహక్కు వారి కిస్తే, వారు దాన్ని స్వీకరిస్తారు. అంటే ధర్మ రాజులకు ఎవరైనా సలహాఇస్తే దాన్ని స్వీకరిస్తారు. ప్రజలకు మేలుచేకూరుస్తారు. అదేవిధంగా ప్రజలు తమ హక్కును అడిగినపుడు సంతోషంగా వారిహక్కులను వారికి చెల్లిస్తారు. ఇంకా వారు తమ విషయంలో తీర్పు ఇచ్చినట్లు ప్రజల విషయంలో కూడా న్యాయంగా ధర్మంగా తీర్పు ఇస్తారు. అంటే తమ గురించి మేలుకోరినట్లే ప్రజల గురించి కూడా మేలు కోరుతారు,” అని అన్నారు. (అ’హ్మద్‌, బైహఖీ)

3712 – [ 52 ] ( لم تتم دراسته ) (2/1095)

وَعَنْ جَابِرِبْنِ سَمُرْةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: ثَلَاثَةٌ أَخَافُ عَلَى أُمَّتِيْ: الْاسْتَسْقَاءُ بِالْأَنْوَاءِ وَحَيْفُ السُّلْطَانِ وَتَكْذِيْبُ الْقَدْرِ.

3712. (52) [2/1095అపరిశోధితం]

జాబిర్‌ బిన్‌ సమురహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ను ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. ”నేను నా ముస్లిమ్‌ సమాజం గురించి మూడు విషయాల్లో భయపడు తున్నాను.” అంటే ఈ మూడు విషయాలు, నా అనుచర సమాజ మార్గభ్రష్టత్వానికి కారకం అవుతాయి. 1. నక్షత్రం ద్వారా వర్షాన్ని కోరటం అంటే వర్షానికి గ్రహాలు కారణంగా భావించడం. అంటే ఫలానా నక్షత్రం వల్ల వర్షం పడిందని భావిస్తారు. ఇలా భావించటం అవిశ్వాసం అవుతుంది. ఎందుకంటే వర్షం కురిపించే వాడు అల్లాహ్. 2. రాజులు, పాలకులు ప్రజలపై అత్యాచారాలు చేస్తారు. ప్రజలను హింసిస్తారు. 3. విధివ్రాతను తిరస్కరించడం. అంటే చాలా మంది విధివ్రాతను తిరస్కరిస్తారు. [17]   (అహ్మద్‌, బైహఖీ)

3713 – [ 53 ] ( لم تتم دراسته ) (2/1096)

وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: سِتَّةَ أَيَّامٍ اِعْقِلْ يَا أَبَا ذَرٍّمَا يُقَالُ لَكَ بَعْدُ. فَلَمّا كَانَ الْيَوْمُ السَّابِعُ قَالَ: أُوْصِيْكَ بِتَقْوَى اللهِ فِيْ سِرٍّأمرِكَ وَعَلَانِيَتِهِ وَإِذَا أَسَأْتَ فَأَحْسِنْ وَلَا تَسْأَلَنَّ أَحَدًا شَيْئًا وَإِنْ سَقِطَ سَوْطُكَ وَلَا تَقْبِضَ أَمَانَةً وَلَا تَقْضِ بَيْنَ اثْنَينِ.

3713. (53) [2/1096అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) నాతో ఇలా అన్నారు, ”ఓ అబూ జ’ర్‌ 6 రోజుల తరువాత చెప్పబోయే విషయాలను గురించి సిధ్ధంగాఉండు,” అని అన్నారు. 7వ రోజు ప్రవక్త(స) నాతో ఇలా అన్నారు, ”ఓ అబూ జ’ర్‌! నువ్వు ఎల్లప్పుడూ అంతర్బాహ్యాల్లో అల్లాహ్‌కు భయపడుతూ ఉండాలి. దైవభీతి, దైవభక్తి పట్టు వదలరాదు. ఒకవేళ నీ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే, తరువాత వెంటనే సత్కార్యం చేసుకోవాలి. నీ సత్కార్యం నీ చెడును చెరిపివేస్తుంది. ఇంకా ఎన్నడూ ఎవరినీ వస్తువూ అడగరాదు. చివరికి నీ కొరడా క్రింద పడిపోయినా ఇతరులను ఎత్తి ఇమ్మని అనరాదు. ఇతరుల అమానతు నీ దగ్గర ఉంచరాదు. ఇంకా ఇద్దరి మధ్య తీర్పు చేయరాదు. ఎందుకంటే అమానతు ఉంచడం నిందలకు గురిచేస్తుంది.

3714 – [ 54 ] ( لم تتم دراسته ) (2/1096)

وَعَنْ أَبِيْ أُمَاَمَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ قَالَ: “مَا مِنْ رَجُلٍ يَلِيْ أَمْرَ عَشَرَةٍ فَمَا فَوْقَ ذَلِكَ إِلَّا أَتَاهُ اللهُ عَزَّ وَجَلَّ مَغْلُوْلًا يَوْمَ الْقِيَامَةِ يَدُهُ إِلَى عُنُقِهِ فَكّهُ بِرَّهُ أَوْ أَوْبَقَهُ إِثْمُهُ أَوَّلَهَا مَلَامَةٌ وَأَوْسَطُهَا نَدَامَةٌ وَآخِرُهَا خِزْيٌ يَوْمَ الْقِيَامَةِ.

3714. (54) [2/1096 అపరిశోధితం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పదిమంది లేదా పదిమంది కన్నా ఎక్కువ మందికి బాధ్యుడైన వ్యక్తి తీర్పుదినం నాడు అల్లాహ్‌(త) ముందుకు వచ్చి నపుడు అతని చేతులు అతని మెడకు కట్టి ఉంటాయి. ఒకవేళ అతడు ధర్మపరాయణుడు అయితే అతని ధర్మం అతన్ని విడిపిస్తుంది. ఒకవేళ అతడు దుర్మార్గుడైతే అతని దుర్మార్గం అతన్ని నాశనం చేస్తుంది. అధికారికి అన్నివైపుల నుండి విమర్శలు వస్తాయి. ప్రజలు విమర్శనాస్త్రాలు వదులుతూ ఉంటారు. ఆ తరువాత అవమానాలు, పరాభవాలు ఎదురవుతాయి. తీర్పుదినం నాడు నీచాతినీచ అవమానానికి గురిచేయడం జరుగుతుంది. (బైహఖీ, అ’హ్మద్‌)

3715 – [ 55 ] ( لم تتم دراسته ) (2/1096)

وَعَنْ مُعَاوِيَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا مُعَاوِيَةُ إِنْ وُلِّيْتَ أَمْرًا فَاتَّقِ اللهَ وَاعْدِلْ“. قَالَ: فَمَا زِلْتُ أَظُنُّ أَنِّي مُبْتَلى بِعَمَلٍ لِقَوْلِ النَّبِيِّ صلى الله عليه وسلم حَتَّى ابْتُلِيْتُ.

3715. (55) [2/1096అపరిశోధితం]

ము’ఆవియహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”ఓ ము’ఆ వియహ్‌! ఒకవేళ నీవు ఎప్పుడైనా నాయకుడిగా నియమించబడితే దైవానికిభయపడుతూ న్యాయంగా వ్యవహరిస్తూఉండాలి,” అని హితబోధచేసారు. అప్పటి నుండి నాకు నాయకుడిగా నన్ను పరీక్షించడం జరుగు తుందని గుర్తుంచుకున్నాను. ప్రవక్త (స) ఆదేశం ద్వారా నేను దీనికి గురిచేయ బడ్డాను. నాయకత్వ వివాదంలో బంధించబడ్డాను. అంటే నాయకునిగా ఎన్నుకో బడ్డాను. అంటే అందువల్లే అతన్ని అమీర్‌ ము’ఆవియహ్‌ అని అనటం జరుగుతుంది. (బైహఖీ, అ’హ్మద్‌)

3716 – [ 56 ] ( لم تتم دراسته ) (2/1096)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: تَعَوَّذُوْا بِاللهِ مِنْ رَأسِ السَّبْعِيْنِ وَإِمَارَةِ الصِّبْيَانِ“. رَوَى الْأَحَادِيْثَ السِّتَّةَ أَحْمَدُ وَرَوَى الْبَيْهَقِيُّ حَدِيْثَ مُعَاوِيَةَ فِيْ دَلَائِلِ النبوةِ.

3716. (56) [2/1096అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”70 సంవత్సరాల వయస్సు యొక్క చెడు నుండి అల్లాహ్‌ను శరణుకోరండి. అదేవిధంగా పిల్లల పెత్తనం నుండి శరణు కోరండి.” [18]  (అ’హ్మద్‌, బైహఖీ)

3717 – [ 57 ] ( ضعيف ) (2/1097)

وَعَنْ يَحْيَى بْنِ هَاشِمٍ عَنْ يُوْنُسَ بْن أَبِيْ إِسْحَاقَ عَنْ أَبِيْهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كَمَا تَكُوْنُوْنَ كَذَلِكَ يُؤَمَّرُ عَلَيْكُمْ.

3717. (57) [2/1097బలహీనం]

య’హ్‌యా బిన్‌ హాషిమ్‌, యూనుస్‌ బిన్‌ అబీ ఇస్‌’హాఖ్‌ ద్వారా కథనం. అతడు తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ఎటువంటి వారయితే మీపై కూడా అటువంటివారే నాయకులు, అధికారులు అవుతారు.” అంటే ఒకవేళ మీరు మంచివారైతే మీ నాయకులు, అధికారులు కూడా మంచివారౌతారు. మీరు చెడ్డవారైతే మీ నాయకులు, అధికారులు కూడా చెడ్డవారౌతారు. (బైహఖీ)

3718 – [ 58 ] ( لم تتم دراسته ) (2/1097)

وَعَنِ ابْنِ عُمَرَرَضِيَ اللهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ السُّلْطَانَ ظِلُّ اللهِ فِي الْأَرْضِ يَأْوِي إِلَيْهِ كُلُّ مَظْلُوْمِ مِنْ عِبَادِهِ فَإِذَا عَدَلَ كَانَ لَهُ الْأَجْرُ وَعَلَى الرّعِيَّةِ الشُّكْرُ وَإِذَا جَارَ كَانَ عَلَيْهِ الْإِصْرُ وَعَلَى الرَّعِيةِ الصَّبْرُ.

3718. (58) [2/1097అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, భూమిపై పాలకులు అల్లాహ్‌ నీడల వంటి వారు. బాధితులు పాలకులను శరణువేడుకుంటూ ఉంటారు. ఒకవేళ పాలకులు ధర్మాత్ములైతే, వారికి ప్రతిఫలం, పుణ్యం లభిస్తుంది. పాలితులు వారికి కృతజ్ఞులై ఉంటారు.  ఒకవేళ పాలకులు దుర్మార్గు లైతే వారికి పాపం చుట్టుకుంటుంది. అయితే పాలితులు సహనం ఓర్పు పాటించాలి. (బైహఖీ)

3719 – [ 59 ] ( لم تتم دراسته ) (2/1097)

وَعَنْ عُمَرَبْنِ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: إِنَّ أَفْضَلَ عِبَادِ اللهِ عِنْدَ اللهِ مَنْزِلَةٌ يَوْمَ الْقِيَامَةِ إِمَامٌ عَادِلٌ رَفِيْقٌ. وَإِنَّ شَرَّ النَّاسَ عِنْدَ اللهِ مَنْزِلَةٌ يَوْمَ الْقِيَامَةِ إِمَامٌ جَائِرٌ خَرِقٌ.

3719. (59) [2/1097అపరిశోధితం]

‘ఉమర్‌ బిన్‌ ఖ’త్తాబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”న్యాయంగా, ధర్మంగా పాలించే, సున్నిత మనస్తత్వం గల పాలకుడు అల్లాహ్‌ వద్ద అందరికంటే శ్రేష్ఠుడు. అదేవిధంగా అన్యాయంగా అధర్మంగా పాలించే, కఠిన హృదయం కలిగిన పాలకుడు అల్లాహ్‌ వద్ద అందరికంటే నీచుడు.” (బైహఖీ)

3720 – [ 60 ] ( لم تتم دراسته ) (2/1097)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ نَظَرَإِلَى أَخِيْهِ نَظْرَةً يُخِيْفُهُ أَخَافُهُ اللهُ يَوْمَ الْقِيَامَةِ. رَوَى الْأَحَادِيْثَ الْأَرْبَعَةَ الْبَيْهَقِيُّ فِيْشُعَبِ الْإِيْمَانِ. وَقَالَ فِيْ حَدِيْثِ يَحْيَى هَذَا: مُنْقَطِعٌ وَروَايَتُهُ ضَعِيْفٌ .

3720. (60) [2/1097అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన చూపులద్వారా మరొక ముస్లిమ్ సోదరుడిని భయభ్రాంతులకు గురిచేసే వాడిని తీర్పుదినం నాడు అల్లాహ్‌ (త) భయపెడతాడు. అంటే ఒకవేళ ప్రపంచంలో పాలకుడు ముస్లిమ్‌ పాలితులను ఆగ్రహంగా తన దృష్టితో భయ భ్రాంతులకు గురిచేస్తే, తీర్పుదినంనాడు అల్లాహ్‌ (త) కూడా అతని వైపు ఆగ్రహదృష్టితో చూచి భయపెడతాడు.” (బైహఖీ / బలహీనం)

3721 – [ 61 ] ( لم تتم دراسته ) (2/1097)

وَعَنْ أَبِي الدَّرْدَاءِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: إِنَّ اللهَ تَعَالى يَقُوْلُ: أَنَا اللهُ لَا إِلَهَ إِلَّا أَنَا مَالِكُ الْمُلُوْكِ وَمَلِكُ الْملُوْكِ قُلُوْبُ الْمُلُوْكِ فِيْ يَدِيْ وَإِنَّ الْعِبَادَ إِذَا أَطَاعُوْنِيْ حَوَّلْتُ قُلُوْبَ ملُوْكِهِمْ عَلَيْهِمْ بِالرَّحْمَةِ وَالرَّأفَةِ وَإِنَّ الْعِبَادَ إِذَا عَصَوْنِيْ حَولَّتُ قُلُوْبَهُمْ بِالسَّخْطَةِ وَالنِّقْمَةِ فَسَامُوْهُمْ سُوءَ الْعَذَابِ فَلَا تَشغَلوا أَنْفُسَكُمْ بِالدُّعَاءِ عَلَى الْمُلُوْكِ وَلَكِنِ اشْغَلُوْا أَنْفُسَكُمْ بِالذِّكْرِ وَالتَّضَرُّعِ كَيْ أَكْفِيَكُمْ مُلُوْكَكُمْ. رَوَاهُ أَبُوْ نَعِيْم فِي الْحِلْيَةِ.

3721. (61) [2/1097అపరిశోధితం]

అబూ దర్‌దా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్ (త) ఇలా ఆదేశిస్తున్నాడు, ”నేను అల్లాహ్‌ను, నేను తప్ప ఆరాధనకు అర్హులెవరూలేరు. ఇంకా నేను రాజులకు రాజును, రాజుల హృదయాలు నా చేతిలో ఉన్నాయి. ఒకవేళ నా దాసులు నాకు విధేయత పాటిస్తే, వారి రాజుల హృదయాలను దయ కారుణ్యాలతో నింపివేస్తాను. అంటే వారిపై మంచి, ధర్మ, న్యాయపాలకులను నియమిస్తాను. దాసులు నాకు అవిధేయత చూపితే వారి పాలకుల హృదయాలను కాఠిన్యం, ఆగ్రహం, దుర్మార్గంతో నింపివేస్తాను.” అంటే దుర్మార్గ పాలకులను నియమిస్తాను. వారిని చాలా నీచంగా హింసిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వారిని శపించకూడదు. వారి గురించి చెడుగా మాట్లాడరాదు. మీరు దైవారాధనలో దైవస్మరణలో భయభక్తులతో గడపాలి. తమ పాపాలకు క్షమాపణ కోరుతూ ఉండాలి. నేను మీ తరఫు నుండి పాలకులను నిరోధిస్తాను. (అబూ న’యీమ్‌ ఫీ హిల్‌యహ్‌)

=====

1– بَابُ مَا عَلَى الْوُلَاةِ مِنَ التَّيْسِيْرِ

1. పాలకులు ప్రజలకు సౌలభ్యం కలిగించాలి

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం  

3722 – [ 1 ] ( متفق عليه ) (2/1099)

عَنْ أَبِيْ مُوْسَى قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا بَعَثَ أَحَدًا مِنْ أَصْحَابِهِ فِيْ بَعْضِ أَمْرِهِ قَالَ: “بَشِّرُوْا وَلَا تُنَفِّرُوْا وَيَسِّرُوْا وَلَا تُعَسِّرُوْا.

3722. (1) [2/1099ఏకీభవితం]

అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) తన అనుచరులను వివిధ ప్రాంతాలకు అధికారులుగా నియమించి పంపినపుడు, ఇలా హితోపదేశం చేసే వారు, ”మీరు ప్రజలకు మంచి విషయాలు తెలియ జేయండి. అసహ్యకరమైన, భయపడే విషయాలను వినిపించ కండి, మీరు ప్రజలను ద్వేషా నికి గురి చేయకండి, వారికి సౌలభ్యం  చేకూర్చండి, వారిని కాఠిన్యానికి గురిచేయ కండి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

3723 – [ 2 ] ( متفق عليه ) (2/1099)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَسِّرُوْا وَلَا تُعَسِّرُوْا وَسَكِّنُوْا وَلَا تُنَفِّرُوْا.

3723. (2) [2/1099ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”మీరు సౌలభ్యం కలిగించండి. కఠినంగా వ్యవహరించకండి. మనశ్శాంతి, శుభవార్తలు ఇచ్చే విషయాలను, వార్తలను తెలియజేయండి, అశాంతికి, ద్వేషానికి గురి చేసే విషయాలు మాట్లాడకండి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

3724– [ 3 ] ( متفق عليه ) (2/1099)

وَعَنِ ابْنِ أَبِيْ بُرْدَةَ قَالَ: بَعَثَ النَّبِيُّ صلى الله عليه وسلم جَدَّهُ أَبَا مُوْسَى وَمُعَاذَا إِلَى الْيَمَنِ فَقَالَ: يَسِّرَا وَلَا تُعَسِّرَا وَبَشِّرَا وَلَا تُنَفِّرَا وَتطَاوَعَا وَلَا تَخْتَلِفَا.

3724. (3) [2/1099ఏకీభవితం]

అబూ బుర్‌దహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) అతని తాతగారు అబూ మూసా మరియు మ’ఆజ్‌ బిన్‌ జబల్‌లను యమన్‌ గవర్నర్లుగా నియమించి పంపారు. ప్రవక్త (స) వారిద్దరినీ, ”మీరిద్దరూ సౌలభ్యం కలిగించండి, కఠినంగా వ్యవహరించకండి, సంతోష కరమైన వార్తలు వినిపించాలి, ద్వేషాన్ని జనింప జేయకూడదు. ఇంకా మీ రిద్దరూ పరస్పరం కలసి ఉండాలి, విభేదాలకు గురి కాకూడదు” అని హితబోధ చేసారు.[19]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

3725 – [ 4 ] ( متفق عليه ) (2/1099)

وَعَنِ ابْنَ عُمَرَأَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: إِنَّ الْغَادِرَ يُنْصَبُ لَهُ لِوَاءٌ يَوْمَ الْقِيَامَةِ فَيُقَالُ: هَذِهِ غَدْرَةُ فُلَانِ بْنِ فُلَانٍ.

3725. (4) [2/1099ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వాగ్దానభంగం చేసేవాడిని తీర్పుదినం నాడు నిలబెట్టి, అతని వీపుపై అతడు ద్రోహి అని ఒక జెండా నిల బెట్టటం జరుగును. ఇంకా ఇది వాగ్దాన భంగానికి, ద్రోహానికి  చిహ్నం అని ప్రకటించబడును.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

3726 – [ 5 ] ( متفق عليه ) (2/1099)

وَعَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: لِكُلِّ غَادِرٍ لِوَاءٌ يَوْمَ الْقِيَامَةِ يُعْرَفُ بِهِ.

3726. (5) [2/1099ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు వాగ్దానభంగం చేసే, ద్రోహం చేసే ప్రతి ఒక్కరికీ ఒక చిహ్నం ఉంటుంది. దాని ద్వారా వారు గుర్తించ బడతారు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

3727 – [ 6 ] ( صحيح ) (2/1100)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: لِكُلِّ غَادِرٍ لِوَاءٌ عِنْدَ اِسْتِهِ يَوْمَ الْقِيَامَةِ“.

وَفِيْ رِوَايَةٍ: “لِكُلِّ غَادِرٍ لِوَاءٌ يَوْمَ الْقِيَامَةِ يُرْفَعُ لَهُ بِقَدْرِ غَدْرِهِ أَلَا وَلَا غَادِرَ أَعْظَمُ مِنْ أَمِيْرِ عَامَّةٍ“. رَوَاهُ مُسْلِمٌ.

3727. (6) [2/1100దృఢం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వాగ్దాన భంగం చేసే ప్రతి ఒక్కరి వీపు క్రింద భాగంలో ఒక జండా ఉంటుంది. మరో ఉల్లేఖనంలో ఒక జండా ఉంటుంది. అతడు ఎంత ద్రోహి అయితే అది అంత ఎత్తుగా ఉంటుంది. రాజులు, నాయకులు తమ పాలితులపై దౌర్జన్యం చేస్తారు. వారి హక్కులను చెల్లించరు. వారి వాగ్దానాల్ని పూర్తిచేయరు. వీరే అందరి కంటే నీచ ద్రోహులు, వాగ్దానభంగం చేసేవారూను. వీరికంటే పరమనీచులు మరొకరు ఉండరు. (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం 

3728 – [ 7 ] ( لم تتم دراسته ) (2/1100)

عَنْ عَمْرِو بْنِ مُرَّةَ أَنَّهُ قَالَ لِمُعَاوِيَةَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ وَلَّاهُ الله شَيْئًا مِّنْ أَمْرِ الْمُسْلِمِيْنَ فَاحْتَجَبْ دُوْنَ حَاجَتِهِمْ وَخَلَّتِهِمْ وَفَقْرِهِمْ اِحْتَجَبَ الله دُوْنَ حَاجَتَه وَخَلَّتِهِ وَفَقْرِهِ“. فَجَعَلَ مُعَاوِيَةُ رَجُلًا عَلَى حَوَائِجِ النَّاسِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ.

وَفِيْ رِوَايَةٍ لَهُ وَلِأَحْمَدَ: “أَغْلَقَ اللهُ لَهُ أَبْوَابَ السَّمَاءِ دُوْنَ خَلَّتِهِ وَحَاجَتِهِ وَمَسْكَنَتِهِ.

3728. (7) [2/1100అపరిశోధితం]

‘అమ్ర్‌ బిన్‌ ముర్రహ్‌ (ర) ము’ఆవియహ్‌ (ర)తో ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను: ”అల్లాహ్‌ (త) ముస్లిములపై పాలకునిగా నియమించిన వారు, ప్రజల సమస్యలను పరిష్క రించక, వారి కష్టాలను, దుఃఖాలను పరిష్కరించక, పోగా వారి బాధలను కప్పి ఉంచితే, వారి బాధలపట్ల కూడా తీర్పుదినం నాడు అల్లాహ్‌ (త) కళ్ళు మూసుకుంటాడు. వారి సమస్యలను పరిష్కరించడు, వారి దుఃఖాలను దూరం చేయడు.” అది విని ము’ఆవియహ్‌ (ర) ప్రజల అవసరాలను పరిష్క రించమని, తనకు తెలియజేయమని ఒక వ్యక్తిని నియమించారు. (అబూ దావూద్‌, తిర్మిజి’)

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఎవరైనా అక్కర గల వారిని, నిస్సహాయులను తన వద్దకు రానీయకుండా చేస్తే, అల్లాహ్‌ (త) కూడా ఆకాశ ద్వారాలు అతని అవసరాలకు మూసివేస్తాడు. అంటే అల్లాహ్‌ (త) కూడా అతనికి సహాయం, ఆపదలను తొలగించడం వంటివి చేయడు.” 

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం 

3729 – [ 8 ] ( لم تتم دراسته ) (2/1100)
عَنْ أَبِي الشَّمَّاخِ الْأَزدِيّ عَنِ ابْنِ عَمٍّ لَهُ مِنْ أَصْحَابِ النَّبِيّ صلى الله عليه وسلم أَنَّهُ أَتَى مُعَاوِيَةَ فَدَخَلَ عَلَيْهِ فَقَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: مَنْ وُلِّيَ مِنْ أمْرِالنَّاسِ شَيْئًا ثُمَّ أَغْلَقَ بَابَهُ دُوْنَ الْمُسْلِمِيْنَ أَوِ الْمَظْلُوْمِ أَوْ ذِي الْحَاجَةِ أَغْلَقَ اللهُ دُوْنَهُ أَبْوَابَ رَحْمَتِهِ عِنْدَ حَاجَتِهِ وَفَقْرِهِ أَفْقَرَ مَا يَكُوْنُ إِلَيْهِ.

3729. (8) [2/1100అపరిశోధితం]

అబూ షిమ్మా’ఖ్‌ అల్‌ అ’జిదియ్యి తన చిన్నాన్న కుమారుని ద్వారా కథనం: ఇతడు ప్రవక్త (స) అనుచరులలో ఒకరు. అతడు ము’ఆవియహ్‌ వద్దకు వచ్చి, ‘ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను,’ అని అన్నారు. ”ఎవరైనా ముస్లిములపై పాలకునిగా నియమించబడి, అతడు ముస్లిములను, బాధితు లను, అక్కర గలవారిని తన వద్దకు రాకుండా చేస్తే, అల్లాహ్‌ (త) తన కారుణ్య ద్వారాలను అతని కోసం మూసివేస్తాడు. అప్పుడా వ్యక్తి అందరి కంటే అవసరం గల వాడుగా, అక్కర గల వాడుగా ఉంటాడు.  (బైహఖీ)

3730 – [ 9 ] ( لم تتم دراسته ) (2/1101)
وَعَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ أَنَّهُ كَانَ إِذَا بَعَثَ عُمَّالَهُ شَرَطَ عَلَيْهِمْ: أَنْ لَا تَرْكَبُوْا بِرْذَوْنَا وَلَا تَأْكُلُوْا نَقِيًّا وَلَا تَلْبَسُوْا رَقِيْقًا وَلَا تُغْلِقُوْا أَبْوَابَكُمْ دُوْنَ حَوَائِج النَّاسِ. فَإِنْ فَعَلْتُمْ شَيْئًا مِنْ ذَلِكَ فَقَدْ حَلَّتْ بِكُمُ الْعُقُوْبَةُ ثُمَّ يُشَيِّعُهُمْ. رَوَاهُمَا الْبَيْهَقِيُّ فِيْ شُعُب الْإِيْمَانِ.

3730. (9) [2/1101అపరిశోధితం]

‘ఉమర్‌ (ర) ఎవరినైనా ఏ ప్రాంతానికైనా పాలకునిగా నియమించి పంపితే అతనితో, ‘తుర్కీ గుర్రంపై స్వారీ చేయరాదు, పిండిరొట్టె తినరాదు, సున్నిత వస్త్రాలు ధరించరాదు, ఇంకా ప్రజల అవసరాలకు తన ద్వారం మూసి ఉంచరాదు. ఒకవేళ ఇలాచేస్తే నీవు శిక్షార్హుడవు,  నిన్ను తప్పకుండా శిక్షించడం జరుగు తుంది,’ అని బోధించిన తర్వాత కొంత దూరం అతనితో వెళ్ళి, తిరిగి వచ్చేవారు.” (బైహఖీ)

======

2- بَابُ الْعَمَلِ فِي الْقَضَاءِ وَالْخَوْفِ مِنْهُ

2. దైవభీతితో తీర్పు చేయడం

అంటే తప్పనిసరిగా ఖుర్‌ఆన్‌, ప్రవక్త (స) సాంప్ర దాయానికి అనుకూలంగా తీర్పులు చేయాలి. వీటికి వ్యతిరేకంగా తీర్పులు జరగకుండా జాగ్రత్త పడాలి.

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

3731 – [ 1 ] ( متفق عليه ) (2/1102)

عَنْ أَبِيْ بَكَرةَ قَالَ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا يَقْضِيَنَّ حَكَمٍ بَيْنَ اثْنَيْنِ وَهُوَ غَضْبَانُ.

3731. (1) [2/110ఏకీభవితం]

అబూ బకరహ్ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఏ పాలకుడూ ఆగ్రహావేశాల స్థితిలో ఇద్దరి మధ్య తీర్పు చేయ రాదు.”[20]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

3732 – [ 2 ] ( متفق عليه ) (2/1102)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو وَأَبِيْ هُرَيْرَةَ قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا حَكَمَ الْحَاكِمُ فَاجْتَهَدَ فَأَصَابَ فَلَهُ أَجْرَانِ وَإِذَا حَكَمَ فَاجْتَهَدَ فَأَخْطَأَ فَلَهُ أَجْرٌ وَّاحِدٌ.

3732. (2) [2/1102ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) మరియు అబూ హురైరహ్‌ (ర) ల కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పాల కుడు న్యాయంగా ధర్మంగా తీర్పు ఇస్తే, అతనికి ప్రతి ఫలం, రెండింతలు పుణ్యం లభిస్తుంది. ఒకవేళ తీర్పు ఇవ్వడంలో కృషిప్రయత్నాలు చేసి అనుకోకుండా పొరపాటు జరిగితే అప్పుడు కూడా అతనికి ఒక పుణ్యం లభిస్తుంది.”  [21]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం 

3733 – [ 3 ] ( صحيح ) (2/1102)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ جَعَلَ قَاضِيًا بَيْنَ النَّاسِ فَقَدْ ذُبِحَ بَغَيْرِ سِكِّيْنِ. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

3733. (3) [2/1102దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ప్రజలపై న్యాయమూర్తిగా పాలకుడిగా నియమించ బడిన వాడు కత్తి లేకుండానే జు’బహ్‌ చేయ బడ్డాడు.”[22] (అ’హ్మద్‌, తిర్మిజి’, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

3734 – [ 4 ] ( لم تتم دراسته ) (2/1103)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: مَنِ ابْتَغَى الْقَضَاءَ وَسَأَلَ وُكِّلَ إِلَى نَفْسِهِ وَمَنْ أُكْرِهَ عَلَيْهِ أَنْزَلَ اللهُ عَلَيْهِ مَلَكًا يُسَدِّدُهُ“. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

3734. (4) [2/1103అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”పాలకునిగా న్యాయాధికారిగా కావాలనుకున్నవారు, అధికారులను రాజులను న్యాయాధికారి చేయమని విన్నవించుకునే వారు పాలకులుగా, న్యాయాధి కారులుగా నియమించ బడితే, అతనికి దైవ సహాయం ఉండదు. అయితే బలవంతంగా న్యాయమూర్తిగా నియమించబడితే, అల్లాహ్‌(త) అతని కోసం ఒక దైవదూతను నియమిస్తాడు. ఆ దైవదూత అతనికి సరైనమార్గం చూపుతాడు.” (తిర్మిజి, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

3735 – [ 5 ] ( صحيح ) (2/1103)

وَعَنْ بُرَيْدَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: اَلْقُضَاةُ ثَلَاثَةٌ: وَاحِدٌ فِي الْجَنَّةِ وَاِثْنَانِ فِي النَّارِ فَأَمَّا الَّذِيْ فِي الْجَنَّةِ فَرَجُلٌ عَرَفَ الْحَقَّ فَقَضَى بِهِ وَرَجُلٌ عَرَفَ الْحَقَّ فَجَارَ فِي الْحُكْمِ فَهُوَ فِي النَّارِ وَرَجُلٌ قَضَى لِلنَّاسِ عَلَى جَهْلٍ فَهُوَ فِي النَّارِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

3735. (5) [2/1103దృఢం]

బురైదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”పాలకుల్లో, న్యాయమూర్తుల్లో మూడు రకాలున్నారు. ఒకరు స్వర్గంలోనికి వెళతారు. మిగతా రెండురకాలు నరకంలోనికి వెళతారు. స్వర్గంలోనికి వెళ్ళే పాలకులు, న్యాయమూర్తులు, సత్యాన్ని గ్రహిస్తారు. ధర్మంగా తీర్పు ఇస్తారు. సత్యాన్ని గ్రహించికూడా హింసించి, అన్యాయం చేసేవారు నరకంలోనికి పోతారు. అదే విధంగా ఆలోచించకుండా తీర్పు ఇచ్చేవారు కూడా నరకం లోనికి వెళతారు. ఎందుకంటే అతడు సత్యాన్ని గ్రహించటానికి ప్రయత్నించలేదు.”(అబూ దావూద్‌, ఇబ్నె  మాజహ్)

3736 – [ 6 ] ( ضعيف ) (2/1103)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: مَنْ طَلَبَ قَضَاءَ الْمُسْلِمِيْنَ حَتَّى يَنَالَهُ ثُمَّ غَلَبَ عَدْلُهُ جَوْرَهُ فَلَهُ الْجَنَّةُ وَمَنْ غَلَبَ جَوْرُهُ عَدْلَهُ فَلَهُ النَّارُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3736. (6) [2/1103బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా ముస్లిముల పాలకుడుగా కావాలని కోరి పాలకుడయితే, అంటే అధికారి లేదా పాలకుడు అయితే, ఒకవేళ అతని న్యాయం అతని హింసపై ఆధిక్యత పొందితే అతనికి స్వర్గం లభిస్తుంది. ఒకవేళ అతని హింస అతని న్యాయంపై ఆధిక్యత పొందితే అతనికి నరకం లభిస్తుంది. (అబూ  దావూద్‌)

3737 – [ 7 ] ( ضعيف ) (2/1103)

وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم لَمَّا بَعَثَهُ إِلَى الْيَمَنِ قَالَ: كَيْفَ تَقْضِيْ إِذَا عَرَضَ لضكَ قَضَاءٌ؟ قَالَ: أَقْضِيْ بِكِتَابِ اللهِ. قَالَ: فَإِنْ لَمْ تَجِدْ فِيْ كِتَابِ اللهِ؟ قَالَ: فَبِسُنَّةِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. قَالَ: فَإِنْ لَمْ تَجِدْ فِيْ سُنَّةِ رَسُوْلِ اللهِ؟ قَالَ: أَجْتَهِدُ رَأْيِيْ وَلَا آلُوْ. قَالَ: فَضَرَبَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى صَدْرِهِ وَقَالَ: اَلْحَمْدُ لِلّهِ الَّذِيْ وَفَّقَ رَسُوْلَ رَسُوْلِ اللهِ لِمَايَرْضَى بِهِ رَسُوْلُ اللهِ“. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ .

3737. (7) [2/1103బలహీనం]

మఆజ్‌’ బిన్‌ జబల్‌ (ర) కథనం: ప్రవక్త (స) అతన్ని యమన్‌ వైపు గవర్నర్‌గా పంపినపుడు పరీక్షిస్తూ అతన్ని, ‘ఒకవేళ నీ వద్దకు ఏదైనా కేసువస్తే నువ్వు ఎలా తీర్పుఇస్తావు’ అని అడిగారు. దానికి మఆజ్‌,’ ‘ఖుర్‌ఆన్‌ ద్వారా తీర్పుచేస్తా ను’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త(స) ‘ఒకవేళ ఆ విషయం గురించి ఖుర్‌ఆన్‌లో లేకపోతే’ అని అన్నారు. దానికి మఆజ్‌’ ‘ప్రవక్త (స) సాంప్రదాయం ప్రకారం తీర్పు ఇస్తాను’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘ఆ రెంటిలోనూ లేకపోతే’ అని అన్నారు. దానికి మఆజ్‌’ ‘నా బుద్ధిబలాలు ఉపయోగించి సరైన తీర్పు ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. అందులో ఎటువంటి లోపం రానివ్వను’ అని అన్నారు. అది విని ప్రవక్త (స) ‘మఆజ్‌’ (ర) గుండెపై ప్రేమగా చేయిపెట్టి స్తోత్రాలన్నీ అల్లాహ్‌ కొరకే, తన ప్రవక్త రాయబారికి ఈ బాధ్యత పూర్తిచేసే భాగ్యం ప్రసాదించాడు. దీనిపట్ల దైవప్రవక్త (స) సంతృప్తిగా ఉన్నారు’ అని అన్నారు.” (తిర్మిజి’, అబూ దావూద్‌, దార్మి)

3738 – [8 ] ( لم تتم دراسته ) (2/1104)

عَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: بَعَثَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلَى الْيَمَنِ قَاضِيًا فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ تُرْسِلُنِيْ وَأَنَا حَدِيْثُ السِّنِّ وَلَا عِلْمَ لِيْ بِالْقَضَاءِ؟ فَقَالَ: إِنَّ اللهَ سَيَهْدِيْ قَلْبَكَ وَيُثَبِّتُ لِسَانَكَ إِذَا تَقَاضى إِلَيْكَ رَجُلَانِ فَلَا تَقْضِ لِلْأَوَّلِ حَتَّى تَسْمَعَ كَلَامَ الْآخَرِ فَإِنَّهُ أَحْرَى أَنْ يَتَبَيَّنَ لَكَ الْقَضَاءُ“. قَالَ: فَمَا شَككْتُ فِيْ قَضَاءٍ بَعْدُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ

وَسَنَذْكُرُ حَدِيْثَ أُمِّ سَلَمَةَ: إِنَّمَا أَقْضَي بَيْنَكُمْ بِرَأْيِيْفِيْ بَابِالْأَقْضِيَةِ وَالشَّهَادَاتِ. إِنْ شَاءَ اللهُ تَعَالى .

3738. (8) [2/1104అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను యమన్‌ గవర్నర్‌గా నియమించి పంపినపుడు నేను ప్రవక్త (స)తో, ‘తమరు ఈ పని మీద నన్ను పంపు తున్నారు. ఇంకా నేను చాలా చిన్న వయస్సు గలవాడినే, ఇంకా నాకు తీర్పుచేసే అనుభవం కూడా లేదు’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘అల్లాహ్‌ నీకు మార్గం చూపుతాడు. నీ నోట సత్యం వెలువడేలా చేస్తాడు. నీ వద్దకు ఇద్దరు వ్యక్తులు అంటే వాద ప్రతివాదులు వస్తే, కేవలం ఒకరి మాట విని తీర్పుచేయకు. ఇద్దరిది విని తీర్పుచేయి. ఇలా చేస్తే సత్యం తెలిసిపోతుంది’ అని అన్నారు. ‘అలీ (ర), ‘ప్రవక్త (స) ఈ దు’ఆ మరియు శిక్షణల తరువాత నేను ఎటువంటి తీర్పులోనూ అనుమానానికి సంశయానికి గురికాలేదు’ అని అన్నారు. (తిర్మిజి, అబూ  దావూద్‌, ఇబ్నె  మాజహ్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం 

3739 – [ 9 ] ( لم تتم دراسته ) (2/1104)

عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ حَاكِمٍ يَحْكُمُ بَيْنَ النَّاسِ إِلَّا جَاءَ يَوْمَ الْقِيَامَةِ وَمَلَكٌ آخَذٌ بِقَفَاه ثُمَّ يَرْفَعُ رَأْسَهُ إِلَى السَّمَاءِ فَإِنْ قَالَ: أَلْقِهِ أَلْقَاه فِيْ مَهْوَاةٍ أَرْبَعِيْنَ خَرِيْفًا“. رَوَاهُ أَحْمَدُ وَابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ .

3739. (9) [2/1104అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”భూమిపై పాలకుడు తీర్పుదినం నాడు అల్లాహ్‌ (త) ముందు ఎటువంటి పరిస్థితిలో నిలబడతాడంటే దైవదూత అతని మెడపట్టుకొని, ఆకాశం వైపు తన తల ఎత్తి, అల్లాహ్ (త) ఆదేశం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఒకవేళ అల్లాహ్‌ అతన్ని విసరివేయమని ఆదేశిస్తే, అతడు నరకలోయలో 40 సంవత్సరాల వరకు పడుతూ ఉంటాడు. (అ’హ్మద్‌, ఇబ్నె  మాజహ్, బైహఖీ / షు’అబుల్ ఈమాన్)

3740 – [ 10 ] ( لم تتم دراسته ) (2/1104)

وَعَنْ عَائِشَةَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: لَيَأْتِيَنَّ عَلَى الْقَاضِي الْعَدْلِ يَوْمَ الْقِيَامَةِ يَتَمَنّى أَنَّهُ لَمْ يَقْضِ بَيْنَ اثْنَيْنِ فِيْ تَمْرَةٍ قَطُّ . رَوَاهُ أَحْمَدُ .

3740. (10) [2/1104అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”తీర్పు దినంనాడు న్యాయపరిపాలకుడు, రాజు, ఒక్క ఖర్జూరం విషయంలో ఇద్దరి మధ్య తీర్పు చేయకుండా ఉంటే ఎంత బాగున్ను” అని విచారిస్తారు. (అ’హ్మద్‌)

3741 – [ 11 ] ( لم تتم دراسته ) (2/1104)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ أَبِيْ أَوْفَى قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: إِنَّ اللهَ مَعَ الْقَاضِيْ مَا لَمْ يَجُرْفَإِذَا جَارَ تَخَلّى عَنْهُ وَلَزِمَهُ الشَّيْطَانُ“. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ

وَفِيْ رِوَايَةٍ: “فَإِذَا جَارَ وَكَلَهُ إِلَى نفْسِهِ.

3741. (11) [2/1104అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అబీ అవ్‌ఫా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”అల్లాహ్‌ (త) పాలకులు, న్యాయ మూర్తులై, దుర్మార్గాలు చేయనంతవరకు వారి వెంట ఉంటాడు. వారు దుర్మార్గాలు చేయడం ప్రారంభిస్తే అల్లాహ్‌ వారి నుండి వేరైపోతాడు. షైతాన్‌ వారితో కలసిపోతాడు.” (తిర్మిజి, ఇబ్నె  మాజహ్)

అంటే న్యాయపాలకుని వెంట అల్లాహ్‌ కారుణ్యం ఉంటుంది. దుర్మార్గ పరిపాలకుని వెంట షైతాన్‌ ఉంటాడు.

3742 – [ 12 ] ( لم تتم دراسته ) (2/1105)

وَعَنْ سَعِيْدِ بْنِ الْمُسَيِّبِ: أَنَّ مُسْلِمًا وَيَهُوْدِيًّا اِخْتَصَمَا إِلَى عُمَرَ فَرَأَى الْحَقَّ لِلْيَهُوْدِيّ فَقَضَى لَهُ عُمَرُبِهِ. فَقَالَ لَهُ الْيَهُوْدِيُّ: وَاللهِ لَقَدْ قَضَيْتَ بِالْحَقِّ فَضَرَبَهُ عُمَرُبِالدُّرَّةِ وَقَالَ: وَمَا يُدْرِيْكَ؟ فَقَالَ الْيَهُوْدِيُّ: وَاللهِ إِنَّا نَجِدُ فِي التَّوْرَاةِ أَنَّهُ لَيْسَ قَاضٍ يَقْضِيْ بِالْحَقِّ إِلَّا كَانَ عَنْ يَمِيْنِهِ مَلَكٌ وَعَنْ شِمَالِهِ مَلَكٌ يُسَدِّدُانِهِ وَيُوَفِّقَانِهِ لِلْحَقِّ مَا دَامَ مَعَ الْحَقِّ فَإِذَا تَرَكَ الْحَقَّ عَرَجَا وَتَرَكَاهُ. رَوَاهُ مَالِكٌ .

3742. (12)  [2/1105 –అపరిశోధితం]

స’యీద్‌ బిన్‌ ముసయ్యిబ్‌ కథనం: ఒకయూదుడు, ఒక ముస్లిమ్‌ ఏదో విషయంలో వివాదపడ్డారు. ‘ఉమర్‌ (ర) వద్దకు వెళ్ళారు. ‘ఉమర్‌ (ర) యూదునివైపు న్యాయం ఉన్నట్లు గ్రహించి అతనికి అనుగుణంగా తీర్పు ఇచ్చారు. దానికి యూదుడు ‘దైవం సాక్షి! మీరు న్యాయంగా తీర్పు ఇచ్చారు’ అని అన్నాడు. ఉమర్‌ (ర) అతనిని బెత్తంతో కొట్టి, ‘నేను న్యాయంగా తీర్పు ఇచ్చానని నీకెలా తెలిసింది,’ అని అడిగారు. దానికి ఆ యూదుడు ప్రమాణం చేసి, ‘మేము తౌరాత్‌లో న్యాయంగా తీర్పుచేసే పాలకుని రెండు వైపుల ఇద్దరు దైవదూతలు ఉంటారు, అతనికి సరైన తీర్పు సూచిస్తారు, న్యాయమైన తీర్పు ఇచ్చే భాగ్యం ప్రసా దిస్తారు, ఇలా అతడు సత్యం వైపు ఉన్నంత వరకు ఉంటారు, అతడు సత్యాన్ని విడిచిపెడితే ఆ ఇద్దరు దైవదూతలు అతన్ని వదలి ఆకాశం వైపు వెళ్ళి పోతారు,’ అని  ఉంది, ” అని అన్నాడు. (మాలిక్‌)

3743 – [ 13 ] ( لم تتم دراسته ) (2/1105)

وَعَنِ ابْنِ مَوْهَبٍ: أَنَّ عُثْمَانَ بْنَ عَفَّانَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ لِاِبْنِ عُمَرَ: اِقْضِ بَيْنَ النَّاسِ. قَالَ: أَوْ تَعَاقِبْنِيْ يَا أَمِيْرَ الْمُؤْمِنِيْنَ؟ قَالَ: وَمَا تكرهُ مِنْ ذَلِكَ وَقَدْ كَانَ أَبُوْكَ قَاضِيًا؟ قَالَ: لِأَنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: مَنْ كَانَ قَاضِيًا فَقَضَى بِالْعَدْلِ فَبَالْحَرِيِّ أَنْ يَنْقَلِبَ مِنْهُ كَفَافًا“. فَمَا رَاجَعَهُ بَعْدَ ذَلِكَ . رَوَاهُ التِّرْمِذِيُّ .

3743. (13) [2/1105అపరిశోధితం]

ఇబ్నె మౌహబ్‌ కథనం: ‘ఉస్మాన్‌ బిన్‌ ‘అప్ఫాన్‌, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌తో, ‘నీవు ప్రజల్లో తీర్పు చేయి.’ అంటే నేను నిన్ను పాలకునిగా నియమించాలను కుంటున్నాను. అని అన్నారు. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర), ‘ఓ ప్రభూ! నాకు దీన్నుండి దూరంగా ఉంచండి’ అని అన్నాడు. దానికి ‘ఉస్మాన్, ‘నువ్వు దీన్ని ఎందుకు చెడుగా భావిస్తున్నావు. మీ తండ్రి ‘ఉమర్‌ పాలకుడు, న్యాయమూర్తి నాయకుడిగా ఉండేవాడు. అతడు ప్రజల మధ్య తీర్పుచేసేవాడు.’ అది విని ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) ‘ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను’ అని అన్నాడు, ”న్యాయంగా వ్యవహరించే పాలకుడు శిక్షలేకుండా బయటపడితే మంచిదే.” అంటే పాలకుడు అవటంవల్ల ఎటువంటి లాభంలేదు. నష్టమే నష్టం, ఒకవేళ అన్యాయంగా ప్రవర్తిస్తే తగిన శిక్ష. ఒకవేళ న్యాయంగా వ్యవహరిస్తే శిక్ష లేకుండా బయట పడతాడు. శిక్ష ఉండదు, ప్రతిఫలమూ ఉండదు. ఇది కూడా చెడ్డ విషయమే. అది విన్న ‘ఉస్మాన్‌ ఈ విషయంలో అతనితో మళ్ళీ మాట్లాడలేదు.” (తిర్మిజి’)

3744 – [ 14 ] ( لم تتم دراسته ) (2/1105)

وَفِيْ رِوَايَةٍ رَزِيْنٍ عَنْ نَافِعٍ أَنَّ ابْنَ عُمَرَقَالَ لِعُثْمَانَ: يَا أَمِيْرَ الْمُؤْمِنِيْنَ لَا أَقْضِيْ بَيْنَ رَجُلَيْنِ: قَالَ: فَإِنَّ أَبَاكَ كَانَ يَقْضِيْ فَقَالَ: إِنَّ أَبِيْ لَوْأَشْكَلَ عَلَيْهِ شَيْءٌ سَأَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. وَلَوْ أَشْكَلَ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم شَيْءٌ سَأَلَ جِبْرِيْلَ عَلَيْهِ السَّلَامُ. وَإِنِّيْ لَا أَجِدُ مَنْ أَسْأَلُهُ وَسَمِعْتٌ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: مَنْ عَاذَ بِاللهِ فَقَدْ عَاذَ بِعَظِيْمٍ“. وَسَمِعْتُهُ يَقُوْلُ: مَنْ عَاذَ بِاللهِ فَأَعِيْذُوْهُ“. وَ إِنِّيْ أَعُوْذُ بِاللهِ أَنْ تَجْعَلَنِيْ قَاضِيًا فَأَعْفَاهُ وَقَالَ: لَا تُخْبِرْ أَحَدًا.

3744. (14) [2/1105అపరిశోధితం]

ర’జీన్‌ ఉల్లేఖనంలో ఇలా ఉంది: ” ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ ‘ఉస్మాన్‌ (ర) తో, ఓ నాయకా! ఇద్దరు వ్యక్తులపై కూడా నేను అధికారి కావాలని కోరుకోను. దానికి ‘ఉస్మాన్‌ (ర), ‘మీ తండ్రి ‘ఉమర్‌ తీర్పులు ఇచ్చేవారు’ అని అన్నారు. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌, ‘ఒకవేళ మా తండ్రిగారికి ఏదైనా ఆటంకం వస్తే ప్రవక్త (స)ను అడిగి తెలుసుకునే వారు, ప్రవక్త (స)కు ఏదైనా ఆటంకం వస్తే జిబ్రయీల్‌ దూతను అడిగి తెలుసుకునేవారు. ఇప్పుడు నేను అడిగి తెలుసుకోవటానికి ప్రవక్తా లేరు, నేను అడిగి తీర్పు ఇవ్వడానికి అటువంటి వ్యక్తీ లేడు. అదీగాక ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, అల్లాహ్‌ ద్వారా శరణు కోరేవారు. గొప్పవ్యక్తి ద్వారా శరణు కోరినవారవుతారు. ఇంకా అల్లాహ్‌ ద్వారా శరణు కోరితే అతనికి అభయం ఇచ్చి వేయండి. అదేవిధంగా నన్ను పాలకుడు, న్యాయమూర్తి చేయటం నుండి నేను అల్లాహ్‌ను శరణు కోరుతున్నాను అని అన్నారు. అప్పుడు ఉస్మాన్‌ (ర) అతన్ని క్షమించి, అతన్ని అధికారిగా నియమించలేదు. కాని ‘ఉస్మాన్‌ (ర) ‘ఈ సంఘటన గురించి ఎవరికీ చెప్పవద్దు,’ అని అన్నారు. (ర’జీన్‌)

=====

3- بَابُ رِزْقِ الْوُلَاةِ وَهَدَايَاهُمْ

3. పాలకుల జీతాలు, మరియు వారికి కానుకలు ఇవ్వడం

పాలకులకు, రాజులకు ప్రజా సంక్షేమనిధి నుండి వారి ఖర్చుల నిమిత్తం జీతాలు ఇవ్వవచ్చు. వారు తీసుకోవటం కూడా ధర్మసమ్మతమే. వాటి ద్వారా వారు తమ భార్యా బిడ్డలను పోషించుకోగలరు. అయితే వారికి కానుకలు, కట్నాలు ఇవ్వరాదు, ఎందుకంటే లంచంగా అనుమానించ బడవచ్చు.

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం   

3745 – [ 1 ] ( صحيح ) (2/1106)

عَنْ أَبِيْ هُرْيَرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: مَا أُعْطِيْكُمْ وَلَا أَمْنَعُكُمْ أَنا قَاسِمٌ أَضَعُ حَيْثُ أُمِرْتُ“. رَوَاهُ الْبُخَارِيُّ .

3745. (1) [2/1106దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను మీకు ఇచ్చేవాడ్నీ కాను, వారించేవాడ్నీ కాను. నాకు ఎక్కడ ఇవ్వమని ఆదేశించబడితే అక్కడ దైవాజ్ఞకు అనుగుణంగా ఇస్తాను, పంచుతాను, కేవలం నేను పంచేవాడిని మాత్రమే. నాకు ఇచ్చే అధికారమూ లేదు, వారించే అధికారమూ లేదు.” (బుఖారీ)

3746 – [ 2 ] ( صحيح ) (2/1106)

وَعَنْ خَوْلَةَ الْأَنْصَارِيَّةِ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ رِجُالًا يَتَخَوَّضُوْنَ فِيْ مَالِ اللهِ بِغَيريِ حَقٍّ فَلَهُمُ النَّارُ يَوْمَ الْقِيَامَةِ.  رَوَاهُ الْبُخَارِيُّ .

3746. (2) [2/1106- దృఢం]

‘ఖౌలహ్ అన్సారీయహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చాలామంది అల్లాహ్‌ (త) ధనాన్ని అన్యాయంగా ఖర్చు చేస్తున్నారు. అంటే సంక్షేమనిధి నుండి లేదా యుద్ధ ధనంలో నుండి అధికారుల అనుమతి లేనిదే అధర్మంగా ఖర్చుచేస్తూ ఉంటారు. ఇటువంటివారు తీర్పుదినం నాడు నరకంలో ప్రవేశిస్తారు.” (బు’ఖారీ)

3747 – [ 3 ] ( صحيح ) (2/1106)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: لَمَّا اسْتُخْلِفَ أَبُوْبَكْرٍرَضِيَ اللهُ عَنْهُ قَالَ: لَقَدْ عَلِمَ قَوْمِيْ أَنَّ حِرْفَتِيْ لَمْ تَكُنْ تَعْجِزُعَنْ مَؤُوْنَةِ أَهْلِيْ وَشُغِلْتُ بِأَمْرِ الْمُسْلِمِيْنَ فَسَيَأْكُلُ آلُ أَبِيْ بَكْرٍ مِنْ هَذَا الْمَالِ ويَحْتَرِفُ لِلْمُسْلِمِيْنَ فِيْهِ. رَوَاهُ الْبُخَارِيُّ .

3747. (3) [2/1106దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: అబూ బకర్‌ (ర) ఖలీఫహ్ గా నియమించబడినపుడు ”నా వృత్తి ద్వారా నా కుటుంబ ఖర్చులన్నీ నడుస్తాయన్నది నా జాతికి తెలుసు. అంటే నేను చేసే వ్యాపారం వల్ల నా ఇల్లు గడిచేది. ఆ సంపాదనే నా కుటుంబానికి సరిపోయేది. ఇప్పుడు కూడా ఇలా జరగ గలదు. కాని ఇప్పుడు నేను ముస్లిముల సమస్యల్లో  నిమగ్నమయి ఉన్నాను. అంటే నన్ను ఖలీఫాగా నియమించడం జరిగింది. రాత్రీపగలు ప్రజల సమస్యల్లో నిమగ్నమయి ఉంటాను. ఇప్పుడు నేను వ్యాపారం చేయలేను. అందువల్ల అబూ బక్ర్ భార్యా బిడ్డలు ఈ సంక్షేమ నిధి నుండే తింటారు. అబూ బకర్‌ ముస్లిముల ధనాన్ని వ్యాపారం ద్వారా పెంచుతూ పోతాడు,” అని అన్నారు. [23]   (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం 

3748– [ 4 ] ( صحيح ) (2/1107)

عَنْ بُرَيْدَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: مَنِ اسْتَعْمَلْنَاهُ عَلَى عَمَلٍ فَرَزَقْنَاهُ رِزْقًا فَمَا أَخَذَ بَعْدَ ذَلِكَ فَهُوَغُلُوْلٌ“. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3748. (4) [2/1107దృఢం]

బురైదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ఒక వ్యక్తిని మేము అధికారిగా నియమించి, అతని జీతం నిర్ణయించిన తర్వాత అనుమతి లేకుండా జీతం కన్నా ఎక్కువ తీసుకుంటే అది ద్రోహం అవుతుంది.” (అబూ దావూద్‌)

3749 – [ 5 ] ( صحيح ) (2/1107)

وَعَنْ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: عَمِلْتُ عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَعَمَّلَنِيْ. رَوَاهُ أَبُوْ دَاودَ .

3749. (5) [2/1107దృఢం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో నేను ఒక పనిచేసాను. ప్రవక్త (స) దానికి ప్రతిఫలం ఇచ్చారు. (అబూ  దావూద్‌)

3750 – [ 6 ] ( لم تتم دراسته ) (2/1107)

وَعَنْ مُعَاذٍ قَالَ: بَعَثَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلَى الْيَمَنِ فَلَمَّا سِرْتُ أَرْسَلَ فِيْ أَثَرِيْ فَرُدِدْتُّ فَقَالَ: أَتَدْرِيْ لَمْ بَعِثْتُ إِلَيْكَ؟ لَا تُصِيْبَنَّ شَيْئًا بِغَيْرِ إِذْنِيْ فَإِنَّهُ غُلُوْلٌ وَمَنْ يَّغْلُلْ يَاْتِ بِمَا غَلَّ يَوْمَ الْقِيَامَةِ لِهَذَا دَعَوْتُكَ فَامْضِ لِعَمَلِكَ“. رَوَاهُ التِّرْمِذِيُّ .

3750. (6) [2/1107అపరిశోధితం]

ము’ఆజ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను యమన్‌ గవర్నర్‌గా నియమించి పంపారు. నేను బయలు దేరి వెళుతుండగా నా వెనుక ఒక వ్యక్తిని పంపారు. నేను తిరిగి వచ్చాను. ప్రవక్త (స) నాతో, ”నేను మళ్ళీ ఎందుకు పిలిచానో నీకు తెలుసా? నేను నీకు మళ్ళీ ఎందుకు పిలిచానంటే, నా అనుమతి లేకుండా ఏ వస్తువూ తీసుకోకూడదు. ఒకవేళ నువ్వు అనుమతి లేకుండా ఏదైనా వస్తువు తీసుకుంటే అది దొంగతనం, ద్రోహం అవుతుంది. ఎవరైనా ప్రపంచంలో ఏదైనా వస్తువు దొంగలిస్తే, తీర్పుదినం నాడు అతడే ఆ వస్తువును తీసుకువస్తాడు. ఇది చెప్పడానికే నిన్ను పిలిచాను. ఇప్పుడు నీవు నీ పని మీద బయలుదేరు,” అని అన్నారు. (తిర్మిజి’)

3751 – [ 7 ] ( صحيح ) (2/1107)

وَعَنِ الْمَسْتَوْرِدِ بْنِ شَدَّادٍ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: مَنْ كَانَ لَنَا عَامِلًا فَلْيَكْتَسِبْ زَوْجَةً فَإِنْ لَمْ يَكُنْ لَهُ خَادِمٌ فَلْيَكْتَسِبْ خَادِمًا فَإِنْ لَمْ يَكُنْ لَهُ مَسْكَنٌ فَلْيَكْتَسِبْ مَسْكَنًا.

 وَفِيْ رِوَايَةٍ: “مَنِ اتَّخَذَ غَيْرَ ذَلِكَ فَهُوَ غَالٌ. رَوَاهُ أَبُوْ داوُدَ.

3751. (7) [2/1107- దృఢం]

ముస్తవ్రిద్‌ బిన్‌ షద్దాద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను: ”ఎవరినైనా మేము ఒక ప్రాంతానికి అధికారిగా నియమిస్తే, ఒకవేళ అతడు అవివాహితుడైతే ప్రజా సంక్షేమ నిధి ధనంతో పెళ్ళి చేసుకోవచ్చు. ఒకవేళ అతని వద్ద సేవకుడు లేకపోతే అధికారికంగా ఒక సేవకుడ్ని ఉంచగలడు. ఒకవేళ ఉండటానికి ఇల్లు లేకపోతే అధికారికంగా ఇల్లు తీసుకోవచ్చును. ఇవి తప్ప తీసుకున్నది ద్రోహం అవుతుంది.  (అబూ దావూద్)

3752 – [ 8 ] ( صحيح ) (2/1108)

وَعَنْ عَدِيِّ بْنِ عَمِيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: يَا أَيُّهَا النَّاسُ مَنْ عُمِلَ مِنْكُمْ لَنَا عَلَى عَمَلٍ فَكَتَمَنَا مِنْهُ مِخْيَطًا فَمَا فَوْقَهُ فَهُوَغَالٌ يَأْتِيْ بِهِ يَوْمَ الْقِيَامَةِ“. فَقَامَ رَجُلٌ مِّنَ الْأَنْصَارِ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ اِقْبَلْ عَنِّيْ عَمَلَكَ. قَالَ: وَمَا ذَاكَ؟ قَالَ: سَمِعْتُكَ تَقُوْلُ: كَذَا وَكَذَا. قَالَ: وَأَنَا أَقُوْلُ ذَلِكَ مَنِ اسْتَعْمَلْنَاهُ عَلَى عَمَلٍ فَلْيَأْتِ بِقَلِيْلِهِ وَكَثِيْرِهِ فَمَا أُوْتِيَ مِنْهُ أَخَذَهُ وَمَا نُهِيَ عَنْهُ انْتَهَى“. رَوَاهُ مُسْلِمٌ وَأَبُو دَاوُدَ وَاللَّفْظُ لَهُ .

3752 .(8) [2/1108 –దృఢం]

 ‘అదీ బిన్‌ ‘అమీరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”ప్రజలారా! మేము ఎవరినైనా అధికారిగా నియమించితే, అతడు తన జీతం కంటే ఒక్క సూది లేదా దానికంటే అధిక విలువగలది తీసుకున్నా అది ద్రోహం అవుతుంది. తీర్పుదినం నాడు అతడు ఆ వస్తువునే అల్లాహ్‌ (త) ముందుకు తీసుకువస్తాడు. అది విని ఒక అన్సారీ వ్యక్తి నిలబడి, ‘ఓ ప్రవక్తా! మీరు ఇచ్చిన పదవి తిరిగి తీసుకోండి’ అని అన్నాడు. ప్రవక్త (స) ‘ఎందుకు’ అని అడిగారు. దానికి ఆ వ్యక్తి ‘ఇప్పుడిప్పుడే మీరు అన్నమాట నేను విన్నాను’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘ఇప్పుడు కూడా నేను ఇదే అంటాను. నేను ఎవరినైనా అధికారిగా నియమిస్తే, అతడు రాబడి ఎక్కువైనా తక్కువైనా అంతా నా ముందు ఉంచాలి. దానిలో నుండి అతనికి ఇవ్వబడింది తీసుకోవాలి, ఇవ్వని దాన్నుండి దూరంగా ఉండాలి,’ అని అన్నారు. (ముస్లిమ్‌, అబూ  దావూద్‌)

3753 – [ 9 ] ( صحيح ) (2/1108)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: لَعَنَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم اَلرَّاشِيَ وَالْمُرْتَشِيَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

3753. (9) [2/1108దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) లంచం ఇచ్చేవారిని, లంచం పుచ్చుకునే వారిని శపించారు, లంచం గురించి మాట్లాడేవారిని కూడా శపించారు. (అబూ  దావూద్‌,  ఇబ్నె  మాజహ్)

3754 – [ 10 ] ( صحيح ) (2/1108)

وَرَوَاهُ التِّرْمِذِيُّ عَنْهُ وَعَنْ أَبِيْ هُرَيْرَةَ .

3754. (10) [2/1108దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌, అబూ హురైరహ్‌ల కథనం: (తిర్మిజి’)

3755 – [ 11 ] ( صحيح ) (2/1108)

وَرَوَاهُ أَحْمَدُ وَالْبَيْهَقِيُّ فِيْشُعَبِ الْإِيْمَانِعَنْ ثَوْبَانَ.وَزَادَ: وَالرَّائِشَ يَعْنِيْ الَّذِيْ يَمْشِيْ بَيْنَهُمَا.

3755. (11) [2/1108దృఢం]

సౌబాన్‌ (ర) కథనం. [24] (అహ్మద్‌, బైహఖీ  / షు’అబుల్  ఈమాన్)

3756 – [ 12 ] ( صحيح ) (2/1108)

وعَنْ عَمْرِوبْنِ الْعَاصِ قَالَ: أَرْسَلَ إِلَيَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: أَنِ اجْمَعَ عَلَيْكَ سِلَاحَكَ وَثِيَابَكَ ثُمَّ ائْتِنِيْ . قَالَ: فَأَتَيْتُهُ وَهُوَ يَتَوَضَّأُ فَقَالَ: يَا عَمْرُو إِنِّيْ أَرْسَلْتُ إِلَيْكَ لِأَبْعَثَكَ فِيْ وَجْهٍ يُسَلِّمَكَ الله وَيُغَنِّمُكَ وَأَزْعَبُ لَكَ زُعْبَةً مِّنَ الْمَالِ“. فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ مَا كَانَتْ هِجْرَتِيْ لِلْمَالِ وَمَا كَانَتْ إِلَّا لِلّهِ وَلِرَسُوْلِهِ قَالَ: “نِعِمَّا بِالْمَالِ الصَّالِحِ لِلرَّجُلِ الصَّالِحِ“. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.

وَرَوَى أَحْمَدُ نَحْوَهُ وَفِيْ رِوَايَتِهِ: قَالَ: “نِعْمَ الْمَالُ الصَّالِحُ لِلرَّجُلِ الصَّالِحِ.

3756. (12) [2/1108దృఢం]

‘అమ్ర్‌ బిన్‌ ‘ఆ’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) నువ్వు నీ ఆయుధాలు, దుస్తులు తీసుకొని నా దగ్గరకు రా అని కబురు పంపారు. అనంతరం నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స) వు’దూ చేస్తున్నారు. నన్ను చూచి నిన్ను ఎందుకు పిలిచానంటే ఒక పని మీద నిన్ను పంపాలి, అల్లాహ్‌ (త) నిన్ను క్షేమంగా ఉంచుగాక! అని పలికి యుద్ధధనం తీసుకొని వచ్చి, ‘ఇందులో నుండి నీకు కొంత ఇస్తాను’ అని అన్నారు. దానికి నేను, ‘ఓ ప్రవక్తా! నా వలస పోవటం ధన సంపాదన కోసంకాదు. నేను అల్లాహ్‌, ఆయన ప్రవక్తకోసం వలస పోతున్నాను,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స) సజ్జనులకు మంచి ధనం మంచిది.  అంటే నీవు సజ్జనుడివి. నీ శ్రమకు ప్రతిఫలంగా నీకు లభించే ధనం చాలామంచిది. (షర్‌హుస్సున్నహ్‌, అ’హ్మద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

3757 – [ 13 ] ( حسن ) (2/1109)

عَنْ أَبِيْ أُمَاَمَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: مَنْ شَفَعَ لِأَحَدٍ شَفَاعَةً فَأَهْدَى لَهُ هَدِيَّةً عَلَيْهَا فَقَبِهَا فَقَدْ أَتَى بَابًا عَظِيمًا مِنْ أَبْوَابِ الرِّبَا.  رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3757. (13) [2/1109-ప్రామాణికం[

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా ఒక అధికారికిగాని, పాలకునికిగాని సిఫారసు చేసి ఆ తర్వాత ఆ సిఫారసు చేసినవారికి సిఫారసుకు బదులు కట్నాలు, కానుకలు ఇవ్వగా అతడు వాటిని స్వీకరిస్తే అతడు వడ్డీకి చెందిన ఒక పెద్ద ద్వారం లోనికి ప్రవేశించినట్టే.”  [25]   (అబూ  దావూద్‌)

=====

4- بَابُ الْأَقْضِيَةِ وَالشَّهَادَاتِ

4. సాక్ష్యాధారాలు, తీర్పులు

ఏదైనా వ్యవహారంలో వివాదం తలెత్తితే, తీర్పుకోసం న్యాయమూర్తి దగ్గరకు వెళ్ళటాన్ని దియ్య అంటారు. ఒక పక్షంవారు, న్యాయమూర్తి ముందు తమ వాదాన్ని ప్రవేశపెడతారు. ఒకరు ముద్దయి మరొకరు ముద్దయి ఇలైహి ఉంటారు. తీర్పు వినిపించటానికి న్యాయమూర్తి ఉంటారు. ఇరుపక్షాల వాదన విని న్యాయమూర్తి చేసిందే సరైన తీర్పు అవుతుంది. ఈ విషయంలో తమ వాదనలను సమర్థించటానికి సాక్ష్యాధారాల అవసరం ఎంతైనా పడుతుంది. సాక్ష్యం ఇచ్చేవారిని షాహిద్ అంటారు. అతను వినిపించే వాదనను షహాదత్ అంటారు. సాక్ష్యానికి అనేక షరతులు ఉన్నాయి. ఆ షరతులు సాక్షుల్లో ఉంటే సాక్ష్యులను నమ్మటం జరుగుతుంది లేకపోతే లేదు. ఖుర్‌ఆన్‌లో సాక్ష్యాలను గురించి పేర్కొనటం జరిగింది. అల్లాహ్‌ ఆదేశం:  ” విశ్వాసులారా! మీరు పరస్పరం ఒక నిర్ణీతకాలం కొరకు అప్పు తీసుకున్నప్పుడు, దానిని వ్రాసిపెట్టుకోండి.మరియు మీలో పత్రం వ్రాసేవాడు, న్యాయంగా వ్రాయాలి. మరియు వ్రాసేవాడు నిరాకరించకుండా, అల్లాహ్‌ నేర్పినట్లు వ్రాయాలి. ఋణగ్రహీత అల్లాహ్‌కు భయపడి, నిర్ణీత షరతులను తగ్గించకుండా, చెప్పి వ్రాయించాలి. ఋణగ్రహీత అల్పజ్ఞాని లేక సామర్థ్యం లేనివాడు లేక బలహీనుడు మరియు తాను చెప్పి వ్రాయించలేని వాడైతే, అతని సంరక్షకుడు న్యాయంగా వ్రాయించాలి. మరియు మీలో ఇద్దరు మగవారిని సాక్ష్యమివ్వటానికి సాక్షులుగా ఉంచుకోండి. ఇద్దరు పురుషులు దొరకని పక్షమున ఒక పురుషుడు మరియు మీకు సమ్మతమైన ఇద్దరు స్త్రీలను సాక్షులుగా తీసుకోండి. (ఎందుకంటే) వారిలో ఒకామె మరచిపోతే, రెండవస్త్రీ ఆమెకు జ్ఞాపకం చేయించవచ్చు. మరియు పిలువబడినప్పుడు సాక్షులు, సాక్ష్యమివ్వటానికి నిరాకరించకూడదు. మరియు వ్యవహారం చిన్నదైనా పెద్దదైనా దానిని గడువు నిర్ణయంతో పాటు వ్రాసిపెట్టటానికి అశ్రధ్ధ చూప కూడదు. అల్లాహ్‌ దృష్టిలో ఇది న్యాయసమ్మతమైనది మరియు స్థిరమైన సాక్ష్యంగా తోడ్పడుతుంది మరియు ఏ విధమైన సందేహాలకు అవకాశం లేకుండా చేస్తుంది. కాని, మీరు అప్పటి కప్పుడు ఇచ్చి పుచ్చుకునే (సాధారణ) లావాదేవీలు చేస్తున్నపుడు వ్రాయకున్నా దోషంలేదు. కాని, వ్యాపార వ్యవహారాలు నిర్ణయించే టప్పుడు సాక్షులను పెట్టుకోండి. కాని వ్రాసేవానికి గానీ, సాక్షులకు గానీ ఏ విధమైన హాని జరుగకూడదు. ఒక వేళ అలా జరిగితే! నిశ్చయంగా, అది మీకు పాపం. మరియు అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు ఇది అల్లాహ్‌ మీకు నేర్పుతున్నాడు. మరియు అల్లాహ్‌కు ప్రతిదాని జ్ఞానం ఉంది.” (అల్‌ బఖరహ్‌, 2: 282)

అల్లాహ్‌ ఆదేశం: ” విశ్వాసులారా! మీరు న్యాయం కొరకు స్థిరంగా నిలబడి, అల్లాహ్‌ కొరకే సాక్ష్యమివ్వండి. మరియు మీసాక్ష్యం మీకుగానీ, మీ తల్లి-దండ్రులకుగానీ, మీ బంధువులకుగానీ, విరుధ్ధంగా ఉన్నాసరే. వాడు ధనవంతు డైనా లేక పేదవాడైనా సరే! (మీకంటే ఎక్కువ) అల్లాహ్‌ వారిద్దరి మేలుకోరేవాడు. కావున మీరు మీ మనోవాంఛలను అనుసరిస్తే న్యాయం చేయక పోవచ్చు.మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించినా, లేక దానిని నిరాకరించినా! నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును.” (అన్నిసా’, 4:135)

అంటే వ్యవహారాల్లో, లావాదేవీల్లో, చెల్లింపులలో, తీర్పులు ఇచ్చేటప్పుడు న్యాయంగా ధర్మంగా వ్యవ హరించండి. అదేవిధంగా అల్లాహ్‌ ప్రీతికోసం సత్యమైన సాక్ష్యం ఇవ్వండి. అది మీకూ మీ బంధువులకూ వ్యతిరేకంగా ఉన్నాసరే. వీడు నాయకుడు, వీడికి లాభం చేకూర్చుదాం అనే భావన లేకుండా ధనవంతు డైనా, పేదవాడైనా సత్యాన్ని అనుస రించండి. వారందరి కంటే అల్లాహ్‌ గొప్పవాడు. అదేవిధంగా మీ మనోకాంక్షలను మీరు అనుసరించకండి.

మీరు ఎన్నడూ న్యాయాన్ని, ధర్మాన్ని వదల కండి. ఒక వేళ మీరు తప్పుడు సాక్ష్యం ఇచ్చినా, సాక్ష్యం ఇవ్వటం నుండి తప్పించుకున్నా, ఇచ్చిన సాక్ష్యాన్ని ఒప్పుకోకపోయినా అల్లాహ్‌ (త) మీ పను లన్నీ చూస్తున్నాడని గుర్తుంచుకోండి. సాక్ష్యం గురించి వివరంగా వ్యాఖ్యాన గ్రంథాల్లో  పేర్కొనడం  జరిగింది.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం   

3758 – [ 1 ] ( صحيح ) (2/1110)

عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَوْ يُعْطَى النَّاسُ بِدَعْوَاهُمْ لَادَّعَى نَاسٌ دِمَاءَ رِجَاٍل وَأَمْوَالَهُمْ وَلَكِنَّ الْيَمِيْنَ عَلَى الْمُدَّعَى عَلَيْهِ. رَوَاهُ مُسْلِمٌ

وَفِي شَرْحِهِ لِلنَّوْوِيِّأَنَّهُ قَالَ: وَجَاءَ فِيْ رِوَايَةٍ الْبَيْهَقِيِّ بِإْسَنَادٍ حَسَنٍ أَوْصَحِيْحٍ زِيَادَةٌ عَنِ ابْنِ عَبَّاسٍ مَرْفُوْعًا: ” لَكِنَّ الْبَيِّنَةَ عَلَى الْمُدَّعِيْ وَالْيَمِيْنَ عَلَى مَن أَنْكَرَ.

3758. (1) [2/1110 దృఢం]

ఇబ్నె అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వేళ ప్రజలకు వారి వాదనకు తగ్గట్టు ఇవ్వబడితే, ప్రజల ధన, ప్రాణ సంపత్తులను వాదించి తీసుకుంటారు. కాని ప్రతివాది  ప్రమాణం  చేయాలి. [26] (ముస్లిమ్‌)

బైహఖీలో దృఢ- ప్రవక్త  ప్రోక్తం ఇలా ఉంది: వాది సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టాలి. ఇంకా ప్రతివాది ప్రమాణం చేయాలి.

3759 – [ 2 ] ( متفق عليه ) (2/1110)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: مَنْ حَلَفَ عَلَى يَمِيْنٍ صَبْرٍوَهُوَ فِيْهَا فَاجِرٌ يَقْتَطِّعُ بِهَا مَالَ امْرئٍ مُّسْلِمٍ لَقِيَ اللهُ يَوْمَ الْقِيَامَةِ وَهُوَعَلَيْهِ غَضْبَانٌ فَأَنْزَلَ اللهُ تَصْدِيْقَ ذَلِكَ: (إِنَّ الَّذِيْنَ يَشْتَرُوْنَ بِعَهْدِ اللهِ وَأَيْمَانِهِمْ ثَمَنًا قَلِيْلًا) إِلى آخِرِ الْآيَةِ.

3759. (2) [2/1110ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌ యొక్క హక్కును కొల్లగొట్టటానికి అసత్య ప్రమాణం చేసినవాడు తీర్పుదినం నాడు అల్లాహ్‌(త) ఆగ్రహంగా ఉన్న స్థితిలో అల్లాహ్‌ను కలుస్తాడు. దీన్ని ధృవీకరిస్తూ ఈ ఆయతు అవతరింపజేయబడింది: ”నిశ్చయంగా, ఎవరైతే తాము అల్లాహ్ తో చేసిన ఒప్పందాన్ని మరియు తమ ప్రమాణాలను స్వల్ప లాభాలకు అమ్ముకుంటారో అలాంటి వారికి పరలోక జీవితంలో ఎలాంటి భాగం ఉండదు మరియు పునరుత్థాన దినమున అల్లాహ్ వారితో మాట్లాడడు మరియు వారివైపు కూడా చూడడు మరియు వారిని పరిశుద్ధులుగా చేయడు మరియు వారికి బాధాకర మైన శిక్ష ఉంటుంది.” (ఆలఇమ్రాన్, 3:77) [27]  (బుఖారీ, ముస్లిమ్‌)

3760 – [ 3 ] ( صحيح ) (2/1111)

وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: مَنِ اقْتَطَعَ حَقُّ امْرِئٍ مُّسْلِمٍ بِيَمِيْنِهِ فَقَدْ أَوْجَبَ اللهُ لَهُ النَّارَ وَ حَرَّمَ اللهُ عَلَيْهِ الْجَنَّةَ. فَقَالَ لَهُ رَجُلٌ: وَإِنْ كَانَ شَيْئًا يَسِيْرًا يَا رَرَسُول اللهِ ؟ قَالَ: “وَإِنْ كَانَ قَضِيْبًا مِنْ أَرَاكٍ. رَوَاهُ مُسْلِمٌ .

3760. (3) [2/1111దృఢం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఎవరైనా అసత్య  ప్రమాణం చేసి ఒక ముస్లిమ్‌ హక్కును కొల్ల గొడితే, అల్లాహ్‌ అతని కోసం నరకాన్ని తప్పనిసరి చేస్తాడు. స్వర్గాన్ని నిషేధిస్తాడు అని ప్రవచించారు.’ ఒక వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! ఒకవేళ సాధారణమైన వస్తువైనానా?’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స) జిల్లేడు చెట్టు యొక్క ఒక్క కొమ్మ అయినా సరే అని ప్రవచించారు .[28] (ముస్లిమ్‌)

3761 – [ 4 ] ( متفق عليه ) (2/1111)

وَعَنْ أُمِّ سَلَمَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّمَا أَنَا بَشَرٌ وَإِنَّكُمْ تَخْتَصِمُوْنَ إِلَيَّ وَلَعَلَّ بَعْضَكُمْ أَنْ يَكُوْنَ أَلْحَنَ بِحُجَّتِهِ مِنْ بَعْضٍ فَأَقْضِيَ لَهُ عَلَى نَحْوِ مَا أَسْمَعْ مِنْهُ فَمَنْقَضَيتُ لَهُ بِشَيْءٍ مِنْ حَقّ أَخِيْهِ فَلَا يَأْخُذَنَّهُ فَإِنَّمَا أَقْطَعُ لَهُ قِطْعَةً مِّنَ النَّارِ.

3761. (4) [2/1111ఏకీభవితం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”నేను కూడా మానవుడినే. మీరు వివాద పడుతూ నా దగ్గరకు వస్తారు, ఒక్కోసారి ఒక వ్యక్తి తన వాదాన్ని ప్రతిపక్షం కంటే వివరంగా వాదించితే నేను అతనికి అనుగుణంగా తీర్పు ఇస్తాను. ఒకవేళ నేను నా పొరపాటు వల్ల పరుల హక్కును అతనికి ఇచ్చివేస్తే అతడు దాన్ని తీసుకో రాదు. ఎందుకంటే అతనికి నేను ఒక అగ్ని కణాన్ని ఇచ్చినట్లు అవుతుంది.” [29] (బు’ఖారీ, ముస్లిమ్‌)  

3762 – [ 5 ] ( متفق عليه ) (2/1111)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَبْغَضَ الرِّجَالِ إِلَى اللهِ الْأَلَدُّ الْخَصِمُ.

3762. (5)[2/1111ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అనవసరంగా వివాదపడే వాడు అల్లాహ్‌ వద్ద అందరి కంటే  నీచుడు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

3763 – [ 6 ] ( صحيح ) (2/1111)

وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَضَى بِيَمِيْنٍ وَشَاهِدٍ. روَاهُ مُسْلِمٌ .

3763. (6) [2/1111దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స), ఒక సాక్ష్యం ఒక ప్రమాణంతో తీర్పు  ఇచ్చారు.”  [30] (ముస్లిమ్‌)

3764 – [ 7 ] ( صحيح ) (2/1111)

وَعَنْ عَلْقَمَةَ بْنِ وَائِلٍ عَنْ أَبِيْهِ قَالَ: جَاءَ رَجُلٌ مِّنْ حَضْرَمُوْتَ وَرَجُلٌ مِنْ كِنْدَةَ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ الْحَضْرَمِيُّ:  يَا رَسُوْلَ اللهِ إِنَّ هَذَا غَلَبَنِيْ عَلَى أَرْضٍ لِيْ فَقَالَ الْكِنْدِيُّ: هِيَ أَرْضِيْ وَفِيْ يَدِيْ لَيْسَ لَهُ فِيْهَا حَقٌّ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم لِلْحَضْرَمِيِّ: أَلَكَ بَيِّنَةٌ؟ قَالَ: لَا. قَالَ: فَلَكَ يَمِيْنُهُ. قَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَّ الرَّجُلَ فَاجِرٌلَا يُبَالِيْ عَلَى مَا حَلَفَ عَلَيْهِ وَلَيْسَ يَتَوَرَّعُ مِنْ شَيْءٍ. قَالَ: لَيْسَ لَكَ مِنْهُ إِلَّا ذَلِكَ. فَانْطَلَقَ لِيَحْلِفَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَمَّا أَدْبَرَ: لَئِنْ حَلَفَ عَلَى مَالِهِ لِيَأْكُلَهُ ظُلْمًا لِيَلْقِيَنَّ اللهَ وَهُوَ عَنْهُ مُعْرِضٌ. رَوَاهُ مُسْلِمٌ .

3764. (7) [2/1111దృఢం]

అల్‌ఖమహ్‌ బిన్‌ వాయి’ల్‌ తన తండ్రి వాయి’ల్‌ ద్వారా కథనం: ఒకరు దరమౌత్కు చెందినవారు, మరొకరు కన్దకు చెందినవారు. ఇద్దరూ ప్రవక్త (స) దగ్గరకు వచ్చారు. దరమౌత్ వ్యక్తి,’ఓ ప్రవక్తా! ఇతడు అధర్మంగా నా భూమిని ఆక్రమించు కున్నాడు,’ అని ఫిర్యాదు చేసాడు. దానికి కింద నివాసి, ‘ఈ భూమి నాది, ఇది నా అధీనంలో ఉంది. ఇందులో అతనికి ఎలాంటి హక్కులేదు,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) హ’దరమీతో, ‘నీ వద్ద సాక్ష్యం ఉందా?’ అని అన్నారు. దానికతను, ‘లేదు’ అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ప్రవక్త (స), ‘మరయితే కింద వాడితో ప్రమాణం తీసుకోవటం జరుగుతుంది,’ అని అన్నారు. దానికి దరమి, ‘ఓ ప్రవక్తా! ఈ కిందవాడు దుర్మార్గుడు. వీడు ప్రమాణం చేయడానికైనా వెనుకాడడు,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘మన దగ్గర మరే మార్గం లేదు, నువ్వు సాక్ష్యం తీసుకురాని పక్షంలో అతని నుండి ప్రమాణం తీసుకోవటం జరుగుతుంది.’ ఆ కింద వ్యక్తి ప్రమాణం చేయటానికి సిద్ధపడ్డాడు. అతడు తిరిగి వెళుతుండగా ప్రవక్త(స), ‘ఒకవేళ అతడు అసత్యపు ప్రమాణం చేసి ఇతరుల ధనాన్ని అన్యా యంగా దోచుకుంటే, అతడు అల్లాహ్‌ (త)ను కలుసుకున్న ప్పుడు అల్లాహ్‌ (త) తన ముఖాన్ని త్రిప్పుకుంటాడు,’ అని అన్నారు. [31]   (ముస్లిమ్‌)

3765 – [ 8 ] ( صحيح ) (2/1112)

وَعَنْ أَبِيْ ذَرٍّرَضِيَ اللهُ عَنْهُ أَنَّهُ سَمِعَ رَسُولَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: مَنِ ادَّعَى مَا لَيْسَ لَهُ فَلَيْسَ مِنَّا وَلْيَتَبَوَّأ مَقْعَدَهُ مِنَ النَّارِ.  رَوَاهُ مُسْلِمٌ .

3765. (8) [2/1112 దృఢం]

అబూ జ’ర్‌ (ర) కథనం: అతను ప్రవక్త (స) ను ఇలా ప్రవచిస్తూ  ఉండగా విన్నారు, ”తనకు చెందని వస్తువును పొందడానికి ఎవరైనా వాదిస్తే అతడు ముస్లిమ్‌ కాడు. అతడు తన నివాసం నరకంలో ఏర్పరచుకోవాలి.” (ముస్లిమ్)

3766 – [ 9 ] ( صحيح ) (2/1112)

وَعَنْ زَيْدِ بْنِ خَالِدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلَا أُخْبِرُكُمْ بِخَيْرِ الشُّهَدَاءِ؟ الَّذِيْ يَأْتِيْ بِشَهَادَتِهِ قَبْلَ أَنْ يُسْأَلَهَا“. رَوَاهُ مُسْلِمٌ .

3766. (9) [2/1112-దృఢం]

‘జైద్‌ బిన్‌ ‘ఖాలిద్‌ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సాక్ష్యుల్లో అందరికంటే గొప్పవారు ఎవరో నేను మీకు తెలుపనా? సాక్ష్యం కోరక ముందే సాక్ష్యం ఇచ్చే వారు.”[32] (ముస్లిమ్‌)

3767 – [ 10 ] ( متفق عليه ) (2/1112)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: خَيْرُ النَّاسِ قَرْنِيْ ثُمَّ الَّذِيْنَ يَلُوْنَهُمْ ثُمَّ الَّذِيْنَ يَلُوْنَهُمْ ثُمَّ يَجِيْءُ قَوْمٌ تَسْبِقُ شَهَادَةٌ أَحَدِهِمْ يَمِيْنَهُ وَيِمِيْنَهُ شَهَادَتَهُ .

3767. (10) [2/1112ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అందరి కంటే ఉన్నతులు నా కాలానికి చెందిన వారు, అంటే ప్రవక్త (స) అనుచరులు. ఆ తరువాత వీరి తరువాతి వారు. ఆ తరువాత వారి తరువాత వారు. ఆ తరువాత ఎటువంటి వారు జన్మిస్తారంటే ప్రమాణానికి ముందే అసత్య ప్రమాణం ఇవ్వడానికి సిద్ధపడతారు. సాక్ష్యం ఇవ్వడానికి ముందే ప్రమాణం చేయడానికి సిద్ధపడతారు. అంటే నా కాలంలో అనుచరులు అందరికన్నా ఉన్నతులు. వారి తర్వాత తాబయీన్లు. వారి తర్వాత తబ’అ తాబయీన్లు, వారి తరువాత నమ్మశక్యం లేనివాళ్ళు ఉంటారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3768 – [ 11 ] ( صحيح ) (2/1112)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم عَرَضَ عَلَى قَوْمٍ الْيَمِيْنَ فَأَسْرَعُوْا فَأَمَرَأَنْ يُسْهَمَ بَيْنَهُمْ فِي الْيَمِيْنِ أَيُّهُمْ يَحْلِفُ. رَوَاهُ الْبُخَارِيُّ .

3768. (11) [2/1112-దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) కొందరిని ప్రమాణం చేయమని కోరారు. అందరూ ప్రమాణం చేయడానికి తొందరపడ్డారు. అప్పుడు ప్రవక్త (స) వారి మధ్య చీటీలు వేయమని ఎవరిపేర్లు వస్తే వారు ప్రమాణం చేయమని ఆదేశించారు. [33]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం 

3769 – [ 12 ] ( لم تتم دراسته ) (2/1112)

عَنْ عَمْرِو بْنِ شُعِيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ : اَلْبَيِّنَةُ عَلَى الْمُدَّعِيْ وَالْيَمِيْنُ عَلَى الْمُدَّعَي عَلَيْهِ.رَوَاهُ التِّرْمِذِيُّ .

3769. (12) [2/1112అపరిశోధితం]

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ తన తండ్రి ద్వారా, అతడు తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వాది సాక్ష్యం  ప్రవేశ పెట్టాలి, ప్రతివాది ప్రమాణం చేయాలి.” (తిర్మిజి’)

3770 – [ 13 ] ( حسن ) (2/1112)

وَعَنْ أُمِّ سَلَمَةَ رَضِيَ اللهُ عَنْهَا عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم: فِيْ رَجُلَيْنِ اِخْتَصَمَا إِلَيْهِ فِيْ مَوَارِيْثَ لَمْ تَكُنْ لَهُمَا بَيِّنَةٌ إِلَّا دَعْوَاهُمَا فَقَالَ: “مَنْ قَضَيْتُ لَهُ بِشَيْءٍ مِّنْ حَقِّ أَخِيْهِ فَإِنَّمَا أقْطَعُ لَهُ قِطْعَةُ مِّنَ النَّارِ. فَقَالَ الرَّجُلَانِ: كُلُّ وَاحِدٍ مِنْهُمَا: يَا رَسُوْلَ اللهِ حَقِّيْ هَذَا لِصَاحِبِيْ فَقَالَ: “لَا وَلَكِنِ اذْهَبَا فَاقْتَسِمَا وَتَوَخّيَا الْحَقَّ ثُمَّ اسْتَهِمَا ثُمَّ لِيُحَلِّلْ كُلُّ وَاحِدٍ مِنْكُمَا صَاحِبَهُ.

وَفِيْ رِوَايَةٍ قَالَ: “إِنَّمَا أَقْضِيْ بَيْنَكُمَا بِرَأْيِيْ فِيْمَا لَمْ يُنْزَلْ عَلَيَّ فِيْهِ.  رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3770. (13) [2/1112ప్రామాణికం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఇద్దరు వ్యక్తులు ఆస్తికోసం వివాదపడుతూ వచ్చారు. వీరిద్దరిలో ఎవరి వద్దా సాక్ష్యులు లేరు. అయితే ఇద్దరూ వాదిస్తున్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘ఎవరికైనా అతనిది కాని దాన్ని అతనికోసం నేను తీర్పు చేస్తే నేనతనికి అగ్ని కణం ఇచ్చినట్టే. అంటే సాక్ష్యం లేకుండా ఆస్తి ఎవరిదో తెలియడం లేదు. కనుక నేను ఆలోచించి తీర్పు ఇస్తే అది సరైన తీర్పు కావచ్చు. హక్కుగల వానికి దొరకక పోవచ్చు. హక్కులేని వారికి అది లభించవచ్చు. అయితే తీసుకున్న వ్యక్తికి ఇది నాది కాదని మరో వ్యక్తిదని తప్పకుండా తెలిసి ఉంటుంది. అది అగ్ని కణంతో సమానం. దాన్ని తీసుకోవటం అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మసమ్మతం కాదు’ అని అన్నారు. అది విని వారిద్దరూ, ‘ప్రవక్తా! నేను నా హక్కును నా సోదరునికి ఇచ్చి వేస్తాను. అంటే నేను నా హక్కు వదలి వేస్తున్నాను, అంతా అతనికి ఇచ్చి వేస్తున్నాను,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త(స) ‘అలా వద్దు. మీరిద్దరూ దాన్ని సరిసమానంగా న్యాయంగా పంచుకోండి. దాన్ని రెండు భాగాలు చేసుకోండి. ఆ రెండు భాగాలను చీటీలు వేయండి, ఆ తరువాత మీలో ప్రతి ఒక్కరూ తన వంతును ఇతరులకు ఇవ్వండి,’ అని అన్నారు.

మరో ఉల్లేఖనంలో ప్రవక్త (స) ”ఏ విషయం గురించి అయితే దైవవాణి అవతరించలేదో దాన్ని నేను ఆలోచించి తీర్పు ఇస్తాను. అందులో పొరపాటు జరిగే అవకాశం ఉంది. అటువంటప్పుడు మరొకరు దాన్ని తీసుకోవటం  సరికాదు.”  (అబూ దావూద్)

3771 – [ 14 ] ( لم تتم دراسته ) (2/1113)

وَعَنْ جَابِرِ بْنِ عَبْدِ اللهِ: أَنَّ رَجُلَيْنِ تَدَاعَيًا دَابَةً فَأَقَامَ كُلُّ وَاحِدٍ مِّنْهُمَا الْبَيِّنَةَ أَنَّهَا دَابَّتُهُ نَتَجَهَا فَقَضَى بِهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِلَّذِيْ فِيْ يَدِهِ. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.

3771. (14) [2/1113అపరిశోధితం]

జాబిర్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: ఇద్దరు వ్యక్తులు ఒక జంతువు గురించి వాదించారు. ఇద్దరూ సాక్ష్యులను తీసుకువచ్చారు. ఇంకా ఆడ జంతువుపై మగ జంతువును వదలడం వల్ల పుట్టిందని నిరూ పించడం జరిగింది. దానికి ప్రవక్త (స) ఎవరి అధీనంలో ఆ జంతువు ఉందో అతనికి  ఇప్పించారు.[34]   (షర్‌హుస్సున్నహ్‌)

3772 – [ 15 ] ( لم تتم دراسته ) (2/1113)

وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ: أَنَّ رَجُلَيْنِ ادَّعَيًا بَعِيْرًا عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَبَعَثَ كُلُّ وَاحِدٍ مِّنْهُمَا شَاهِدَيْنِ فَقَسَمَهُ النَّبِيّ صلى الله عليه وسلم بَيْنَهُمَا نِصْفَيْنِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ

وفِيْ رِوَايَةٍ لَهُ وَلِلنَّسَائِيِّ وَابْنُ مَاجَهُ: أَنَّ رَجُلَيْنِ ادَّعَيَا بَعِيْرًا لَيْسَتْ لِوَاحِدٍ مِّنْهُمَا بَيِّنَةٌ فَجَعَلَهُ النَّبِيُّ صلى الله عليه وسلم بَيْنَهُمَا.

3772. (15) [2/1113అపరిశోధితం]

అబూ మూసా అష్‌’అరీ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో ఇద్దరు వ్యక్తులు ఒక ఒంటె విషయంలో వివాదపడ్డారు. ఇద్దరూ సాక్ష్యాధారాలను ప్రవేశ పెట్టారు. అప్పుడు ప్రవక్త (స) ఆ ఒంటెను వాళ్ళిద్దరికీ చెరిసగంగా పంచిపెట్టారు. (అబూ  దావూద్‌)

మరొక అబూ దావూద్‌, నసాయి, ఇబ్నెమాజహ్ ఉల్లే ఖనంలో ఇలా ఉంది, ”ఇద్దరు వ్యక్తులు ఒక ఒంటె విషయంలో వివాదపడ్డారు. ఇద్దరి వద్ద సాక్ష్యాధారాలు లేవు. అప్పుడు ప్రవక్త (స) ఒంటెను ఇద్దరికీ పంచివేసారు.

3773 – [ 16 ] ( لم تتم دراسته ) (2/1113)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَجُلَيْنِ اِخْتَصَمَا فِيْ دَابَّةٍ وَلَيْسَ لَهُمَا بَيِّنَةٌ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “اِسْتَهِمَا عَلَى الْيَمِيْنِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

3773. (16) [2/1113అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ఇద్దరు వ్యక్తులు ఒక జంతువు విషయంలో ఇది నాది, ఇది నాది, అని వివాద పడ్డారు. వీరిద్దరిలో ఎవరివద్దా సాక్ష్యాలు లేవు. అప్పుడు ప్రవక్త (స) ప్రమాణం చేయించటానికి ఇద్దరిలో చీటీలు వేయండి  అన్నారు. (అబూ  దావూద్‌, ఇబ్నె మాజహ్)

3774 – [ 17 ] ( لم تتم دراسته ) (2/1113)

وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ لِرَجُلٍ حَلَّفَهُ: اِحْلِفْ بِاللهِ الَّذِيْ لَا إِلَهَ إِلَّا هُوَ مَالَهُ عِنْدَكَ شَيْء. يَعْنِيْ لِلْمُدَّعِيْ . رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3774. (17) [2/1113అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రమాణం చేయడానికి నిశ్చయించుకున్న వ్యక్తితో నువ్వు ”ఆయన తప్ప ఆరాధ్యుడు ఎవరూ కాని దైవంసాక్షిగా అతనికి సంబం ధించిన ఏ వస్తువూ నా వద్ద లేదు” అని ప్రమాణం చేయి” అని  అన్నారు.  (అబూ  దావూద్‌)

3775 – [ 18 ] ( لم تتم دراسته ) (2/1113)

وَعَنِ الْأَشْعَثِ بْنِ قَيْسٍ قَالَ: كَانَ بَيْنِيْ وَبَيْنَ رَجُلٍ مِّنَ الْيَهُوْدِ أَرْضٌ فَحَجَدَنِيْ فَقَدَّمْتُهُ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: أَلَكَ بَيِّنَةٌ ؟قُلْتُ: لَا. قَالَ لِلْيَهُوْدِيّ: “اَحْلِفْ. قُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِذَنْ يَحْلِفُ وَيَذْهَبُ بِمَالِيْ فَأَنْزَلَ اللهُ تَعَالى: (إِنَّ الَّذِيْنَ يَشْتَرُوْنَ بِعَهْدِ اللهِ وَأَيْمَانِهِمْ ثَمَنًا قَلِيْلًا)-(3:77) الآية. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

3775. (18) [2/1113అపరిశోధితం]

అష్‌’అస్‌ బిన్‌ ఖైస్‌ (ర) కథనం: నాకూ, ఒక యూదునికీ మధ్య ఒక భూమి ఉండేది. అంటే మా ఇద్దరి భాగ స్వామ్యంలో ఉండేది. అతడు నన్ను తప్పించి అంతా తనదేనని వాదించాడు. ప్రవక్త (స) వద్దకు వచ్చాడు. ప్రవక్త (స) ‘నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా,’ అని నన్ను అడిగారు. దానికి నేను, ‘లేదు’ అని అన్నాను. ప్రవక్త (స) ‘ఆ యూదునితో నువ్వు ప్రమాణం చేయి,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి ప్రమాణం చేయటానికి సిద్ధపడ్డాడు. అప్పుడు నేను, ‘ఓ ప్రవక్తా! ఈ యూదుడు అసత్య ప్రమాణం చేసి నా భూమిని ఆక్రమించు కుంటున్నాడు,’ అని అన్నాను. అప్పుడు అల్లాహ్‌ (త) ఈ  ఆయతును  అవతరింప జేసాడు.

”నిశ్చయంగా, ఎవరైతే తాము అల్లాహ్ తో చేసిన ఒప్పందాన్ని మరియు తమ ప్రమాణాలను స్వల్ప లాభాలకు అమ్ముకుంటారో అలాంటివారికి పరలోక జీవితంలో ఎలాంటి భాగం ఉండదు మరియు పునరుత్థాన దినమున అల్లాహ్ వారితో మాట్లాడడు మరియు వారివైపు కూడా చూడడు మరియు వారిని పరిశుద్ధులుగా చేయడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.” (ఆల ఇమ్రాన్, 3:77). (అబూ దావూద్‌, ఇబ్నె  మాజహ్)

3776 – [ 19 ] ( لم تتم دراسته ) (2/1114)

وَعَنْهُ أَنَّ رَجُلًا مِنْ كِنْدَةَ وَرَجُلًا مِّنْ حَضْرَمَوْتَ اِخْتَصَمَا إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ أَرْضٍ مِّنَ الْيَمَنِ فَقَالَ الْحَضْرَمِيُّ: يَا رَسُوْلَ اللهِ إِنَّ أَرْضِيْ اغْتَصَبنِيْهَا أَبُوْ هَذَا وَهِيَ فِيْ يَدِهِ قَالَ: “هَلْ لَكَ بَيِنَّةٌ؟ قَالَ: لَا وَلَكِنْ أُحَلِّفُهُ وَاللهِ مَا يَعْلَمُ أَنَّهَا أَرْضِيْ اغْتَصَبنَيْهَا أَبُوْهُ ؟ فَتَهَيَّأَ الْكِنْدِيُّ لِلْيَمِيْنِ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَقْطَعُ أَحَدٌ مَالًا بِيَمِيْنٍ إِلَّا لَقِيَ اللهُ وَهُوَ أَجْذَمُ. فَقَالَ الْكِنْدِيُّ: هِيَ أَرْضُهُ. روَاهُ أَبُوْ دَاوُدَ.

3776. (19) [2/1114అపరిశోధితం]

అష్‌’అస్‌ బిన్‌ ఖైస్‌ కథనం: యమన్‌లో ఒక భూమి కొరకు, ఒక కిందీ మరియు ఒక ద్రమీల మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరూ కలసి ప్రవక్త (స) వద్దకు వచ్చారు.. ద్రమీ, ‘ఓ ప్రవక్తా! ఇది నా భూమి, అతని తండ్రి దాన్ని బలవంతంగా ఆక్రమించు కున్నాడు, అది నా అధీనంలో ఉండేది,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స) నీ వద్ద సాక్ష్యులు ఉన్నారా అని అతని(ద్రమీతో) అడిగారు. దానికి అతడు ‘లేదు, కాని నేనతని (కిందీ) తో ప్రమాణం చేయిస్తాను. ఎందుకంటే ఇది నాదని అతనికి తెలి యదు. మా తండ్రిగారి నుండి  బలవంతంగా లాక్కొన బడింది. కిందీ ప్రమాణం చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ప్రవక్త (స) ”ఎవరైనా అసత్య ప్రమాణం చేసి ఇతరుల ధనాన్ని దోచుకుంటే, అతడు అల్లాహ్‌ (త)ను కుష్ఠిరోగిగా, చేతులు నరికి వేయబడిన వాడిగా కలుస్తాడు,” అని అన్నారు. అది విని కిందీ ఈ భూమి అతనిదే  అన్నాడు. (అబూ  దావూద్‌)

3777 – [ 20 ] ( لم تتم دراسته ) (2/1114)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ أُنَيْسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ مِنْ أَكْبَرِ الْكَبَائِر الشِّرْكَ بِاللهِ وَعَقُوْقَ الْوَالِدَيْنِ وَالْيَمِيْنَ الْغَمُوْسَ وَمَا حَلَفَ حَالِفٌ بِاللهِ يَمِيْنَ صَبْرٍ فَأَدْخَلَ فِيْهَا مِثْلَ جَنَاحٍ بَعُوْضَةٍ إِلَّا جُعِلَتْ نُكْتَةً فِيْ قَلْبِهِ إِلَى يَوْمِ الْقِيَامَةِ“. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

3777. (20) [2/1114 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉనైస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌(త)కు సాటి కల్పించడం, తల్లి దండ్రులకు అవిధేయత చూపటం, అసత్య ప్రమాణం చేయటం మొదలైనవి మహా పాపాలు. ఎవరైనా అసత్య ప్రమాణం చేసి, దోమరెక్కంత పరుల ధనాన్ని నాది, అని వాదిస్తే తీర్పుదినం నాడు అతని హృదయంపై ఒక మచ్చ తగిలించడం జరుగుతుంది. అంటే అతడు అసత్య ప్రమాణం చేయడం వల్ల శిక్షించడం జరుగుతుంది.  (తిర్మిజి’)

3778 – [ 21 ] ( صحيح ) (2/1114)

وَعَنْ جَابِرٍقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: لَا يَحْلِفُ أَحَدٌ عِنْدَ مِنْبَرِيْ هَذَا عَلَى يَمِيْنٍ آثِمَةٍ وَلَوعَلَى سِوَاكٍ أَخْضَرَإِلَّا تَبَوَّأَمَقْعَدَهُ مِنَ النَّارِأَوْوَجَبَتْ لَهُ النَّارُ. رَوَاهُ مَالِكٌ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

3778. (21) [2/1114దృఢం]

జాబిర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా నాయీ మెంబర్‌పై అసత్య ప్రమాణం చేస్తే, అది చిన్న జిల్లేడు పుల్లకైనాసరే, అతడు తన నివాసం నరకంలో ఏర్పరచుకో వలసిందే.[35] (మాలిక్‌, అబూ  దావూద్‌, ఇబ్నె  మాజహ్)

అంటే అతని కోసం నరకం తప్పనిసరి అవుతుంది.

3779 – [ 22 ]؟ (2/1114)

وَعَنْ خُرَيْمِ بْنِ فَاتِكٍ قَالَ: صَلّى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم صَلَاةَ الصُّبْحِ. فَلَمَّا انْصَرَفَ قَامَ قَائِمًا فَقَالَ:”عُدِلَتْ شَهَادَةُ الزُّوْرِ بِالْإِشْرَاكِ بِاللهِ ثَلَاثَ مَرَّاتٍ. ثُمَّ قَرَأَ: (فَاجْتَنِبُوا الرِّجْسَ مِنَ الْأَوْثَانِ وَاجْتَنِبُوا قَوْلَ الزُّوْرِ حُنَفَاءَ لِلّهِ غَيْرَ مُشْرِكِيْنَ بِهِ) رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

3779. (22) [2/1114 ? ]

ఖురైమ్‌ బిన్‌ ఫాతిక్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఫజ్‌ర్‌ నమాజు తర్వాత నిలబడి ప్రసంగిస్తూ, ”అసత్య సాక్ష్యం దైవానికి సాటి కల్పించడంతో సమానం” అని మూడు సార్లు అన్నారు. అనంతరం ఈ ఆయతును పఠించారు.

”…ఇక మీరు విగ్రహారాధనవంటి మాలిన్యం నుండి దూరంగా ఉండండి మరియు అబద్దపు (బూటకపు) మాటల నుండి కూడా దూరంగా ఉండండి.”(అల్ హజ్జ్, 22:30)  [36]  (అబూ  దావూద్‌, ఇబ్నె  మాజహ్)

3780 – [ 23 ] ( لم تتم دراسته ) (2/1115)

وَرَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ عَنْ أَيْمَنِ بْنِ خُرَيْمٍ. إِلَّا أَنَّ ابْنَ مَاجَهَ لَمْ يَذْكُرِ الْقِرَاءَةَ .

3780. (23) [2/1115అపరిశోధితం]

ఐమన్‌ బిన్‌ ‘ఖురైమ్‌. (అ’హ్మద్‌, తిర్మిజి’)

 ఇబ్నె మాజహ్ ఉల్లేఖనంలో ఖుర్‌ఆన్‌ ఆయతు పఠించడం లేదు.

3781 – [ 24 ] ( لم تتم دراسته ) (2/1115)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَجُوْزُ شَهَادَةُ خَائِنٍ وَلَا خَائِنَةٍ وَلَا مَجْلُوْدٍ حَدًّا وَلَا ذِيْ غِمْرٍ عَلَى أَخِيْهِ وَلَا ظَنِيْنٍ فِي وِلَاءٍ وَلَا قَرَابَةٍ وَلَا الْقَانِعِ مَعَ أَهْلِ الْبَيْتِ. رَوَاهُ التِّرْمِذيُّ وَقَالَ: هَذَا حَدِيْثُ غَرِيْبٌ.

وَيَزِيْدُ بْنُ زِيَادِ الدَّمِشْقِيُّ الرَّاوِيُّ مُنْكَرُ الْحَدِيْث.

3781. (24) [2/1115అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”వీరి సాక్ష్యానికి ఎటువంటి విలువ ఉండదు: 1. ద్రోహం తలపెట్టే స్త్రీ పురుషులు, 2. నిందమోపబడినవారు, 3. తన సోదరులను శత్రువులుగా భావించేవారు, 4. తన యజమానిని కాదని మరొకర్ని తన యజ మానిగా గుర్తించే బానిస, 5. తన తండ్రిని కాక మరొకర్ని తన తండ్రిగా  గుర్తించేవారు. (తిర్మిజి’  /  ఏకోల్లేఖనం)

ఈ ‘హదీసు’లో య’జీద్ బిన్ ‘జియాద్ ఉల్లేఖన కర్త తిరస్కరింపదగిన వాడు.

3782 – [ 25 ] ( لم تتم دراسته ) (2/1115)

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا تَجُوْزُ شَهَادَةُ خَائِنٍ وَلَا خَائِنَةٍ وَلَا زَانٍ وَلَا زَانِيَةٍ وَلَا ذِيْ غِمْرٍ عَلَى أَخِيْهِ“. وَرَدَّ شَهَادَةَ الْقَانِعِ لِأَهْلِ الْبَيْتِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ

3782. (25) [2/1115 అపరిశోధితం]

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ తన తండ్రి మరియు తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ద్రోహం చేసే స్త్రీ పురుషులు, వ్యభిచారం చేసే స్త్రీ పురుషుల సాక్ష్యం చెల్లదు. అదేవిధంగా తన సోదరుని పట్ల శత్రుత్వంగా వ్యవహరించే వారు, ఒకేచోట కలసి ఉండేవారు అంటే బంధువులు, సేవకుల సాక్ష్యం చెల్లదు.” (అబూ దావూద్‌)  

3783 – [ 26] ( لم تتم دراسته ) (2/1115)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: لَا تَجُوْزُ شَهَادَةُ بَدَوِيٍّ عَلَى صَاحِبِ قَرْيَةٍ. رَوَاهُ أَبُوْدَاوُدَوَابْنُ مَاجَهُ.

3783. (26) [2/1115 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పట్టణంలో ఉన్నవారి కోసం పల్లెవాసి సాక్ష్యం చెల్లదు. ఎందుకంటే అతనికి వాస్తవ విషయాలు తెలియవు.” (అబూ  దావూద్‌, ఇబ్నె  మాజహ్)

3784 – [ 27] ( لم تتم دراسته ) (2/1116)

وَعَنْ عَوْفِ بْنِ مَالِكٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَضَى بَيْنَ رَجُلَيْنِ فَقَالَ الْمَقْضِيُّ عَلَيْهِ لَمَّا أَدْبَرَ: حَسْبِيَ اللهُ وَنِعْمَ الْوَكِيْلُ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: إِنَّ اللهَ تَعَالى يَلُوْمُ عَلَى الْعَجْزِ وَلَكِنْ عَلَيْكَ بِالكَيْسِ فَإِذَا غَلَبَكَ أَمْرٌ فَقُلْ: حَسْبِيَ اللهُ وَنِعْمَ الْوَكِيْل“. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3784. (27) [2/1116అపరిశోధితం]

‘ఔఫ్‌ బిన్‌ మాలిక్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇద్దరు వ్యక్తుల మధ్య తీర్పుచేసారు. తనకు తీర్పు వ్యతిరేకంగా చేయబడినవాడు తిరిగి వెళుతూహస్బియల్లాహు నిఅమల్వకీల్‌’ — ‘నాకు అల్లాహ్‌యే చాలు. కార్య సాధకుడు ఆయనే’ అని అన్నాడు. అది విని ప్రవక్త (స) అల్లాహ్‌ (త) అవివేకాన్ని తెలివితక్కువతనాన్ని సమర్థించడు. నువ్వు తెలివితేటలను, వివేకాన్ని ప్రదర్శించి ఉండవలసింది, సాక్ష్యాధారాలు సమర్పించినప్పటికీ ఓడిపోతే అప్పుడు, ”హస్బియల్లాహు వనిఅమల్వకీల్‌’ అని అనాలి, అని ప్రవచించారు.” (అబూ  దావూద్‌)

3785 – [ 28 ] ( حسن ) (2/1116)

وَعَنْ بَهْزِ بْنِ حَكِيْمٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم حَبَسَ رَجُلًا فِيْ تُهْمَةٍ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَزَادَ التِّرْمِذِيُّ والنَّسَائِيُّ: ثُمَّ خَلَى عَنْهُ .

3785. (28) [2/1116ప్రామాణికం]

బహ’జ్‌ బిన్‌ ‘హకీమ్‌ తన తండ్రి తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) ఒక వ్యక్తిని అతనిపై ఉన్న ఒక ఆరోపణ కారణంగా జైలులో వేసారు. పరిశీలన తర్వాత అతడు నిర్దోషి అని తేలింది, అతన్ని విడిచిపెట్టటం జరిగింది. (అబూ దావూద్‌, తిర్మిజి’, నసాయి’)

అంటే ఒక వ్యక్తిని ఆరోపణ  కారణంగా బంధించటం ధర్మమే. పరిశీలన తర్వాత నిర్దోషి అయితే అతన్ని వదలివేయవచ్చు. అంటే బంధించటం ధర్మమే.

———-

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

3786 – [ 29 ] ( لم تتم دراسته ) (2/1116)

عَنْ عَبْدِ اللهِ بْنِ الزُّبَيْرِرَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَضَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنَّ الْخَصْمَيْنِ يُقْعَدَانِ بَيْنَ يَدَيِ الْحَاكِمِ. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ.  

3786. (29) [2/1116అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వాదిని, ప్రతివాదిని న్యాయాధికారి ముందు కూర్చోబెట్టటం జరగాలి.” (అబూ దావూద్‌, అ’హ్మద్‌, ‘హాకిమ్‌)

*****


[1]) వివరణ-3663: నాయకుడు, ఖలీఫా అవడానికి అర్హత కలిగిన ఖురైషీ అయిఉండాలి. కాని ఒకవేళ అటువంటి వ్యక్తి లభించకపోతే, హబషీ బానిసలో ఈ షరతులన్నీ ఉంటే అతన్ని కూడా నాయకునిగా చేసుకోవచ్చు. అతని పట్ల విధేయత పాటించాలి.

[2]) వివరణ-3668: ముస్లిమ్‌ సమాజానికి దూరం అంటే ఇస్లామ్‌ పాలకునికి, నాయకునికి దూరంగా ఉండటం. వారి విధేయతా పరిధి నుండి వెళ్ళిపోవటం. ‘అలీ (ర) పరిపాలనా కాలంలో ఖారిజీలు చేసినట్లు, అంటే దేశద్రోహులు, దీని అర్థం బిద్‌’అతీల నుండి, ముష్రిక్‌ల నుండి వేరు కాకూడదని కాదు. తప్పకుండా వారికి దూరంగా ఉండాలి. అంటే ధర్మపరమైన పాలకుని విధేయత తప్పనిసరి. అయితే వారు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త(స) ఆదేశాలకనుగుణంగా ఆదేశించాలి.

[3]) వివరణ-3681: అంటే పాలుపట్టేది. ప్రభుత్వం, సేవ. (వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి). ఇంకా పాలు విడిపించేది (బర్తరఫ్‌, పదవీ విరమణ, మరణం) అంటే అధికారం పొందితే మానవునికి సంతోషం కలుగుతుంది. ధనం, అధికారం లభిస్తాయి. కాని ఈ సంతోషం దేనికీ పనికిరాదు. ఎందుకంటే దానికితోడు నిరాశ కూడా ఉంటుంది. ఒక రోజు బర్తరఫ్‌ లేదా పదవీ విరమణ లేదా మరణం వస్తుంది. అప్పుడు ఈ మనోకాంక్షలన్నీ పటా పంచలై పోతాయి. ప్రజల హక్కుల భారం మెడలో సర్పంలా కదులుతూ ఉంటుంది. ఆ విచారణకు సిద్ధం కావాలి. ఇటువంటి అధికారం వల్ల ఏం లాభం? ఇది కేవలం కొన్ని రోజుల వెన్నెల రాత్రి, తర్వాత చీకటి రాత్రి.

[4]) వివరణ-3682: అంటే నేను కూడా నీలా బలహీనుడ నయితే ఎన్నడూ నాయకుడు కావాలని కోరుకోను. కాని అల్లాహ్‌ నన్ను ఆ శక్తి ప్రసాదించాడు. దానికి కావలసిన తెలివి తేటలు, బుద్ధిబలం ఇచ్చాడు. ఇవి ఇతరుల్లో లేవు. ఇందులోనే నీ క్షేమం ఉందని భావిస్తున్నాను. నువ్వు ఎన్నడూ నాయకుడివి కావాలని గాని, అనాథల ధనానికి సంరక్షకుడివి కావాలని గాని కోరుకోకు. అబూ జ’ర్‌ ప్రవక్త(స) చెప్పినట్టు విన్నారు. మదీనహ్ వదలి రబ్‌జహ్‌ అనే ఊరిలో నివసించసాగారు. జీవితాంతం అపరిచితునిగానే ఉన్నారు.

[5]) వివరణ-3683: అంటే ఎవరిలో ఆ శక్తి సామర్థ్యాలు మేము చూస్తామో వారిని అధికారులుగా చేస్తాం. శక్తి సామర్థ్యాలు లేకుండా అధికారి కావాలని కోరుకునే వారిని అధికారులుగా నియమించలేము.

[6]) వివరణ-3684: అంటే యోగ్యత, అర్హత ఉన్నా అధికారం వద్దని అంటారు. దాన్ని చెడుగా భావిస్తారు. దాన్ని కోరుకోరు. వారే అందరికంటే ఉత్తములు. అయితే వారు దానికి గురౌతారు. దాన్ని స్వీకరిస్తారు. అంటే వారి ధర్మపరాయణత, న్యాయశీలతను బట్టి ప్రజలు వారిని అధికారులుగా, పాలకులుగా స్వీకరిస్తారు. వారు తప్పక స్వీకరించవలసి ఉంటుంది. వారు ప్రజలను న్యాయంగా ధర్మంగా పరిపాలిస్తారు. ఇటువంటివారే ఉత్తములు.

[7]) వివరణ-3695: అంటే అతడు ముస్లిమ్‌ పాలకుడు. అతన్ని పాపాత్ముడని, దుష్టుడని అనకు, ఇది అతన్ని అవమానపరిచేదిగా ఉంటుంది. ఎందుకంటే మీరు మీ పాలకులను గౌరవించండి. వారిని అవమానపరచకండి అని ముస్లిములను ఆదేశించడం జరిగింది. పలుచని దుస్తులు ధరించడం ధర్మసమ్మతమే. కాని ఇది దైవభీతికి వ్యతిరేకం. ఇలా చేసినంత  మాత్రాన అతను దుష్టుడు కాడు. అయితే పాలకులు దళసరి దుస్తులు ధరించాలి.

[8]) వివరణ-3696: అంటే ఒకవేళ ఎవరైనా అల్లాహ్‌ అవిధేయతకు ఆదేశిస్తే, ఎంతమాత్రం అతని మాట వినరాదు.

[9]) వివరణ-3697: ఏదిఏమైనా తీర్పుదినం నాడు పాలకులకు కష్టాలే కష్టాలు.

[10]) వివరణ-3699: అంటే నాయకులు, పెద్దతనందార్లు, అధికారులు అయిన తర్వాత ప్రజలపట్ల న్యాయంగా ధర్మంగా వ్యవహరించనివారు నరకంలోకి పోతారు.

[11]) వివరణ-3701: సాధారణంగా పల్లెల్లో ఉండటం వల్ల హృదయం కఠినంగా తయారౌతుంది. ఎందుకంటే అక్కడ విద్యావంతులు, పండితులు, వివేకవంతులు ఉండరు. అక్కడ బోధనలూ ఉండవు. అందువల్ల అక్కడివారు అజ్ఞానానికి గురవుతారు. అదేవిధంగా వేటగాళ్ళు ఆరాధనకు, విధేయతకు దూరం అయిపోతారు. సరైన మంచిని పెంచడం చెడును నిర్మూలించడం సాధ్యంకాదు. ఒకవేళ చేస్తే రాజుల ఆగ్రహానికి గురవుతారు. అంటే రాజులవద్దకు, అధికారుల వద్దకు అస్తమానం వస్తూపోతూ ఉండటం మంచిది కాదు.

[12]) వివరణ-3702: అంటే సాధారణంగా రాజులు, గుమస్తాలు, పెత్తందార్లు ప్రజల హక్కులు చెల్లించరు. అందువల్ల వారికి అనేక కష్టనష్టాలు ఎదురవుతాయి. అనామకుడిగా ఉంటే ఎవరి బాధ్యతా ఉండదు. ఫలితంగా తీర్పుదినంనాడు చాలా సులభంగా సాఫల్యం విముక్తులను పొందుతాడు.

[13]) వివరణ-3704: అంటే న్యాయ పరిపాలకుడు అల్లాహ్‌ వద్ద అందరికంటే ప్రీతిపాత్రుడిగా, ఉన్నతుడిగా ఉంటాడు. దుర్మార్గ పాలకులు అల్లాహ్‌ వద్ద అందరికంటే నీచుడుగా, మహా నేరస్తుడిగా దైవకారుణ్యానికి దూరంగా ఉంటాడు. కఠిన శిక్షకు గురవుతాడు.

[14]) వివరణ-3708: అంటే రహస్య గూఢచారులు నియమించి ప్రజల రహస్యాల వెంటపడతారు. వారిని క్షమించడం, వదలివేయడం వంటివి చేయక వారి కల్లోలాలకు, ఉపద్రవాలకు కారకుడౌతాడు.

[15]) వివరణ-3709: అంటే ఇతరుల లోపాల వెంట పడకూడదు.

[16]) వివరణ-3710:  అంటే రాజులు, నాయకులు, పాలకుల అన్యాయాలకు పాల్పడితే, వారితో యుద్ధాలు, పోరాటాలు చేయకూడదు.  ఓర్పు సహనం వహించాలి.

[17]) వివరణ-3712: మూడు విషయాల గురించి అయితే ప్రవక్త () భయపడ్డారో మూడు విషయాలూ జరుగుతున్నాయి.

[18]) వివరణ-3716: 70 సంవత్సరాలంటే హిజ్రత్‌ యొక్క 70 సంవత్సరాలు. యజీద్‌ బిన్‌ ముఆవియహ్‌ 70 సంవత్సరాల హిజ్రీ కాలంలో నాయకులయ్యారు. వారి ఆయుష్షులు కూడా తక్కువగా ఉండేవి. ఈ కాలంలో కల్లోలాలు, ఉపద్రవాలు తలెత్తాయి. అందువల్లే ప్రవక్త (స) ఇటువంటి నాయకుల నుండి ఇటువంటి కాలం నుండి శరణు కోరమని ఆదేశించారు.

[19]) వివరణ-3724: అబూ బుర్‌దహ్, అబూ మూసా కుమారులు. బుర్‌దహ్ అబూ బుర్‌దహ్ కు తాతగారు. బు’ఖారీ ఉల్లేఖన వల్ల ఈ ‘హదీసు’ ఉల్లేఖనకర్త స’యీద్‌ బిన్‌ అబూ బుర్‌దహ్. అతను తన తండ్రి బుర్‌దహ్ ద్వారా ఉల్లే ఖిస్తున్నారని, అబూ బుర్‌దహ్ తన తండ్రి అబూ మూసా అష్‌’అరీ ద్వారా ఉల్లేఖిస్తున్నారని తెలుస్తుంది. ఇంచుమించు ఉల్లేఖనకర్త సయీ’ద్‌ బిన్‌ అబీ బుర్‌దహ్‌ను మరచిపోయారు.

[20]) వివరణ-3731: ఎందుకంటే ఆగ్రహంలో ఆవేశంలో తీర్పు సరిగా చేయలేరు.

[21]) అంటే పాలకుడు ఆలోచించికూడా ఒకవేళ పొరపాటు చేస్తే విచారించడం జరగదని, పుణ్యం లభిస్తుందని ఈ ‘హదీసు’ ద్వారా తెలుస్తుంది. అయితే ఆ తీర్పు ధర్మవ్యతిరేకంగా ఉందని తెలిసిన తర్వాత దాన్ని ఆచరించకూడదు.

[22]) వివరణ-3733: అంటే న్యాయమూర్తిగా నియమించ బడిన డు, కత్తిలేకుండానే జు’బహ్‌ చేయబడ్డాడు. అంటే అతని శరీరం సురక్షితంగా ఉంటుంది. కాని అతని భయభక్తులు నాశనం అవుతాయి. కత్తిఉంటే జంతువు సులభంగా జు’బహ్‌ అవుతుంది. కాని కత్తి లేకుండా చంపితే చాలా బాధతో చస్తుంది. అదేవిధంగా న్యాయమూర్తి చాలా వ్యధతో చస్తాడు. నివోయలో ఇలా ఉంది, ”తాను న్యాయమూర్తిగా అవ్వాలని దాన్ని గురించి కృషి ప్రయత్నాలుచేసే వ్యక్తిగురించి ఉంది. కాని ఒక వ్యక్తి బలవంతంగా న్యాయమూర్తిగా నియమించబడి, దాని కోరిక లేకుంటే అల్లాహ్‌ (త) అతనికి సహాయపడతాడు, అతనికి న్యాయంగా ధర్మంగా తీర్పుచేసే భాగ్యం ప్రసాదిస్తాడు.”

[23]) వివరణ-3747: అంటే ఇప్పుడు నేను పరిపాలనా బాధ్యతల్లో నిమగ్నమయి ఉండి నా వ్యాపారం నేను చేయలేను. వ్యాపార నిమిత్తం తిరిగే అవకాశం నాకు లభించదు. ప్రజా సంక్షేమ నిధినుండి నా కోసం, నా కుటుంబ ఖర్చుల కోసం ఖర్చుచేస్తాను. ప్రజా సంక్షేమ నిధి ధనం ద్వారా వ్యాపారం చేస్తాను. ఈవిధంగా ముస్లిముల ధనాన్ని అధికం చేస్తాను. ‘లేదా అబూ బకర్‌ ఇప్పుడు దీనివల్ల తన వ్యాపారం చేయలేడు. రాత్రీ పగలు ప్రజాసేవలో నిమగ్నమయి ఉంటాడు. దీనికి బదులుగా తన ఖర్చుల కోసం ప్రజా సంక్షేమ నిధి నుండి జీతం తీసుకుంటాడు’ అని అన్నారు. అందరూ దీన్ని ఆమోదించారు. అబూ బకర్‌ (ర) బట్టల వ్యాపారం చేసే వారు. ఇదే అతని వృత్తి కూడా. ‘ఉమర్‌ (ర) కూడా వ్యాపారం చేసేవారు. ఆహార ధాన్యాలు అమ్మేవారు. ‘ఉస్మాన్‌ (ర) కూడా ఖర్జూరం, బట్టల వ్యాపారం చేసేవారు. అబ్బాస్‌ (ర) ఇళ్ళ నిర్మాణం పనిచేసేవారు. అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ చాలా పెద్ద వర్తకులు. సలమహ్ కూడా వ్యాపారం చేసేవారు. ఇతడు ఒక వ్యాపార ప్రయాణంలో ఉండగా ప్రవక్త (స) పంపబడినట్టు వార్త వినగానే వెంటనే ఇస్లామ్‌ స్వీకరించారు. మదీనహ్ లో నివాసమేర్పరచుకున్నారు. వ్యవసాయం కూడా చేసే వారు. వీటివల్ల ఇతను చాలా అభివృద్ధి చెందారు. ప్రతి రోజు 3000 దిర్‌హమ్‌లు రాబడి ఉండేది. (తబఖాతు ఇబ్నె సఅద్‌ 1/2, 3/58)

జుబైర్‌ కూడా వ్యాపారం చేసేవారు. అల్లాహ్‌ (త) అతని ధనంలో అద్భుతమైన శుభం ప్రసాదించాడు. అతడు ఏ పనిలో చేయివేసినా విజయం లభించేది. (ఇస్తిఆబ్‌ 1/2008)

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ ఒంటెల వ్యాపారం చేసేవారు. వాటిని అమ్మేవారు. (ఇబ్నె మాజిద్‌)

అర్‌ఖమ్‌ బిన్‌ అర్‌ఖమ్‌ చాలాపెద్ద వ్యాపారస్తులు. మిఖ్‌ దాద్‌కు ప్రవక్త (స) ఖైబర్‌లో భూమి ఇచ్చినా అతని అసలువృత్తి వ్యాపారమే ఉండేది. (తబఖాత్‌ ఇబ్నె సఅద్‌)

ప్రవక్త (స) అనుచరుల్లో చాలామంది వ్యాపారమే చేసేవారు. ఇతరుల వద్ద పనిచేసే వారు కారు. ఒకసారి ‘ఉమర్‌ ప్రజా సంక్షేమ నిధి నుండి జీతాలు నిర్ణయించాలని చూసారు. అప్పుడు సుఫియాన్‌ ”మా పేర్లు కూడా రూమిల్లా రిజస్టర్లలో వ్రాయడం జరుగుతుందా? ఒకవేళ వీరి జీతాలు నిర్ణయించడం జరిగితే వీటికి అలవాటు పడి వ్యాపారం మానివేస్తారు” అని అన్నారు.

[24]) వివరణ-3755: లంచం అంటే అధర్మ కార్యాలకు ఆటంకపరచకుండా సాగనివ్వడం. దానికోసం ధనం ఇవ్వటాన్ని లంచం అంటారు. ఇచ్చే వారిని రాషీ, పుచ్చుకునే వారిని ముర్తషీ అంటారు. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరించే వ్యక్తిని రాయిష్ అంటారు. ఈ ముగ్గురిని శపించడం జరిగింది. లంచం ఇచ్చి పుచ్చు కోవడాన్ని ఈ ‘హదీసు’లో వారించినట్టు ఖుర్‌ఆన్‌లో కూడా నిషేధించడం జరిగింది. అల్లాహ్‌ ఆదేశం: ”మరియు మీరు ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా కబళించకండి మరియు బుధ్ధిపూర్వకంగా, అక్రమమైనరీతిలో, ఇతరుల ఆస్తిలో కొంతభాగం తినే దురుద్దేశంతో, న్యాయాధికారులకు లంచాలు ఇవ్వ కండి.”  (అల్ బఖరహ్, 2:188)

ఇందులో దొంగతనం, ద్రోహం, దోచుకోవటం, లంచం, వడ్డీ అన్నీ ఉన్నాయి. లంచాల సంపాదన నిషిద్ధం. లంచం అధర్మ సంపాదన.

[25]) వివరణ-3757: అంటే ఈ కానుక లంచం, వడ్డీ క్రిందికే వస్తాయి. అదేవిధంగా అప్పు ఇచ్చేవాడికి అప్పు వల్ల ఏదైనా కానుకలు ఇస్తే వాటిని కూడా తీసుకోరాదు. ఎందుకంటే అవి కూడా లంచం, వడ్డీ క్రిందికే వస్తాయి. ప్రవక్త (స) ప్రవచనం, ‘మీరు ఎవరికైనా అప్పు ఇస్తే కానుకలు ఇచ్చినా, తన వాహనంపై కూర్చోబెట్టినా కూర్చోకూడదు. అతని కానుకలను స్వీకరించకూడదు. అంతకుముందు నుండి వారిద్దరి మధ్య ఇటువంటి వ్యవహారం ఉంటే మరేం భయంలేదు.’ (ఇబ్నె మాజహ్)

ఎవరైనా ఒకరికి అప్పు ఇస్తే అతని నుండి కానుకలు స్వీకరించరాదు. ఎందుకంటే అది వడ్డీ అయ్యే భయం ఉంది. సిఫారసు చేసిందానికీ కానుక స్వీకరించరాదు. అది కూడా వడ్డీ అయ్యే ప్రమాదముంది. (బుఖారీ)

ప్రవక్త (స) ఉపదేశం: ‘ఒకరు మరొకరి గురించి సిఫారసు చేసి, అతడు కానుకలు ఇస్తే అతడు స్వీకరిస్తే అది వడ్డీ అవుతుంది.’ (అబూ దావూద్‌)

[26]) వివరణ-3758: ప్రతివాది ఒకవేళ వాదనకు అనుగుణంగా ఇద్దరు సాక్ష్యులను తెస్తే, అతనికి అనుగుణంగా తీర్పు ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ అతని వద్ద సాక్ష్యాధారాలు లేకపోతే ప్రతివాదితో ప్రమాణం తీసుకొని తీర్పు ఇవ్వటం జరుగుతుంది. ధార్మిక పండితులందరి అభిప్రాయం ఇదే.

[27]) వివరణ-3759: సబ్ర్ అంటే ఆపటం, నిరోధించడం. యమీన్సబ్ర్ అంటే ఒకరు మరొకరికి బలవంతంగా ప్రమాణం చేయించటం, దాని ద్వారా ఇతరుల వస్తువును తాను ఆక్రమించుకోవడం. అంటే అసత్య ప్రమాణం చేసి ఇతరుల వస్తువులను దోచుకోవటం.

[28]) వివరణ-3760: ముస్లిముల హక్కులు దోచుకోవటం, అసత్య ప్రమాణం చేయటం మహా పాపం. దీనికి స్వర్గం నిషేధించడమే సరైన శిక్ష. నరకంలోనికి వెళతాడు. ఇది చిన్నదైనా, పెద్దదైనా సరే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదే శిక్ష. ఎందుకంటే అతడు ఇస్లామ్‌ హక్కును గుర్తించలేదు. ఇంకా దైవనామాన్ని గౌరవించనూ లేదు.

[29]) వివరణ-3761: అంటే నేను అతని వాదన సాక్ష్యాల కారణంగా అతనికి అనుగుణంగా తీర్పు ఇచ్చి, వాదికి తాను అసత్యవాదినని, తన హక్కులేదని తెలసి ఉండి కూడా అతనికి నేను ఇచ్చివేస్తే నేనతనికి నరకాగ్నిని ఇచ్చినట్టే. నా తీర్పు వల్ల ఆ ధనం అతనికి ధర్మసమ్మత మైనదిగా అవుతుందని భావించరాదు. ఈ ‘హదీసు’ ద్వారా స్పష్టంగా తెలిసిన విషయం ఏమిటంటే ప్రవక్త (స) కు అగోచరాల జ్ఞానం ఉండేది కాదు. ప్రవక్త (స) కూడా ఇతర న్యాయమూర్తుల్లా వాదప్రతివాదాలు, సాక్ష్యా ధారాల ద్వారా తీర్పు ఇచ్చేవారు. న్యాయమూర్తి తీర్పు ఇచ్చినంత మాత్రాన అధర్మం ధర్మం కాజాలదు. అందుకే అందరూ దైవానికి భయపడుతూ జీవించాలి.

[30]) వివరణ-3763: అంటే ఒకవేళ వాది వద్ద ఒకే సాక్ష్యం ఉంటే మరో సాక్ష్యానికి బదులు ప్రమాణం సరిపోతుంది.

[31]) వివరణ-3764: నవవీ ముస్లిమ్‌ వివరణలో ఈ ‘హదీసు’ గురించి వివరిస్తూ, ఈ రెండు ‘హదీసు’ల వల్ల అనేక విషయాలు తెలుస్తున్నాయి, 1. అధీనంలో ఉన్న వాడు అధీనంలో లేనివాడి కంటే ఎక్కువ అర్హుడు. 2. ప్రతివాది వ్యతిరేకిస్తూ, వాది వద్ద సాక్ష్యాధారాలు లేకపోతే ప్రతివాది ప్రమాణం చేయాలి. 3. సాక్ష్యాధారాలు లేకపోతే ప్రమాణం చేయాలి. ప్రమాణం చేయకుండా వస్తువు అతనికి ఇప్పించడం జరుగుదు. 4. ఒకవేళ ప్రతివాది దుర్మార్గుడైనా అతని ప్రమాణానికి విలువ ఇవ్వటం జరుగుతుంది. వాది వాదన రద్దు చేయబడుతుంది. 5. తీర్పు సమయంలో ఇద్దరూ పరస్పరం తిట్టుకుంటే వారిని విచారించటం జరుగదు. 6. ఒకవేళ వారసుడు దేన్ని గురించైనా వాదిస్తే, వ్యక్తి మరణిస్తే సాక్ష్యాధారాలు లేకుండా అతన్ని వారసుడిగా గుర్తించడం జరుగుతుంది. ఒకవేళ తెలియకపోతే వారసత్వాన్ని గురించి సాక్ష్యాలు సేకరించి ఆ తరువాత వాదనను పరిశీలించడం జరుగుతుంది.

[32]) వివరణ-3766: అంటే ఒకరికి అన్యాయం జరుగుతున్నా, ప్రాణానికి హాని కలుగుతున్నా, సాక్ష్యం తెలియకపోతే కోరకుండా సాక్ష్యం ఇవ్వాలి. మరో ‘హదీసు’లో తీర్పు దినానికి ముందు సాక్ష్యం అడక్కుండానే సాక్ష్యం ఇవ్వటానికి ముందుకు రావటం జరుగుతుందని, ఉంది. అయితే అది ఈ ‘హదీసు’కు వ్యతిరేకం కాదు.

[33]) వివరణ-3768: అబూ దావూద్‌ మరియు నసాయి’లో ఇలా ఉంది: ఇద్దరు వ్యక్తులు ఒక వస్తువు విషయంలో వాదనకు దిగారు. ఎవరిదగ్గరా సాక్ష్యులు లేవు. అప్పుడు ప్రవక్త (స) చీటీలు వేయమని, ఎవరి పేరు వస్తే వారు ప్రమాణం చేయాలని అన్నారు. హాకిమ్‌ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఇద్దరు వ్యక్తులు ఒక ఒంటె విషయంలో వాదనకు దిగారు. ఇద్దరూ సాక్ష్యాలు తెచ్చారు. ప్రవక్త(స) ఒంటెను ఇద్దరికీ సగం, సగం పంచిపెట్టారు. అబూదావూద్‌ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) చీటీలు వేయమని, ఎవరి పేరు వస్తే వారిచేత ప్రమాణం చేయించారు. దీన్నే వివరంగా పేర్కొనటం జరిగింది.”

[34]) వివరణ-3771: ఎవరి అధీనంలో ఉందో వారి సాక్ష్యం నమ్మడం జరుగుతుంది.

[35]) వివరణ-3778: నా మెంబరు అంటే అది చాలా గౌరవం కలది. ఇటువంటి చోట అసత్య ప్రమాణంచేస్తే దైవశిక్ష తప్ప కుండా అవతరిస్తుంది.

[36]) వివరణ-3779: అంటే అసత్యపు సాక్ష్యం దైవానికి సాటి కల్పించే  పాపానికి సమానం. ఎందుకంటే సాటి కల్పించటం కూడా అసత్యమే. అసత్యపు సాక్ష్యం ఇవ్వటం కూడా అసత్యమే. అందువల్ల రెండూ మహా పాపాలే. ఖురైమ్‌ బిన్‌ ఫాతిక్‌ (ర)   ప్రవక్త (స) ప్రముఖ అనుచరుడు. అతడు తన ఇస్లామ్‌ స్వీకరణ సంఘటనను ఇలా పేర్కొన్నారు, ”ఒకసారి నా ఒంటెలు తప్పి పోయాయి. వాటిని వెదుకుతూ బయలు దేరాను. అడవిలో చాలా దూరంగా అవి నాకు దొరికి పోయాయి. కాని ఇంతలో సాయంత్రం అయిపోయింది. అజ్ఞానకాలపు ఆచారం ప్రకారం నేను బిగ్గరగా ”ఈ అడవి నాయకుని శరణుకోరుతున్నాను” అని అన్నాను. ఈ పదాలు అన్న వెంటనే ఇలా ఒక శబ్దం వచ్చింది: ”ఓ జిన్నులను శరణు కోరేవాడా! నీపై చాలా విచారం వేస్తుంది. శుభాలమయుడైన, గొప్పవాడైన, కటాక్షించేవాడైన, కరుణించేవాడైన అల్లాహ్‌(త)ను శరణువేడుకో. ఆయన ధర్మాధర్మాల ఆదేశాలను జారీ చేసేవాడు. అల్లాహ్‌(త) ఏకత్వాన్ని స్వీకరించు, ఏమాత్రం విచారించకు. జిన్నులకు భయపడటం మానివేయి, సూరహ్‌ అన్‌ఫాల్‌ వాక్యాలు పఠించు. ఎల్లప్పుడూ కేవలం అల్లాహ్‌(త)ను ప్రార్థించు, మైదానాల్లో, కొండల్లో, పర్వతాల్లో ఆయన్నే ధ్యానించు, జిన్నుల కుట్రలు, కుతంత్రాలు అన్నీ అంత రించాయి. ఇప్పుడు కేవలం దైవభీతి, సత్కార్యాలే పనికి వస్తాయి. ‘ఖురైమ్‌ బిన్‌ ఫాతిక్‌ ఈ పదాలు విని భయంతో కంపించిపోయారు. స్పృహ కోల్పోయినట్లు అయింది. కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇలా అన్నారు, ”ఓ పిలిచేవాడా, ఇవి మార్గదర్శకత్వానికి చెందినవా? లేక మార్గభ్రష్టత్వానికి చెందినవా?”  ”వీరు అల్లాహ్‌(త) ప్రవక్త, శుభాలు గలవారు, సత్కార్యాలు గలవారు. మదీనహ్ లో పిలుస్తున్నారు. ప్రజలకు సాఫల్యం వైపునకు పిలుస్తున్నారు. వీరు ఖుర్‌ఆన్‌లోని యా సీన్‌ మరియు హా మీమ్‌ సూరాలు తీసుకొనివచ్చారు. వీటి తర్వాత అనేక స్పష్టమైన సూరాలు తీసుకొనివచ్చారు. ఈ సూరాల్లో ధర్మాధర్మ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంకా ఈ ప్రవక్త నమా’జు గురించి, రోజాల గురించి ఆదేశిస్తున్నారు, చెడుకార్యాల నుండి వారిస్తున్నారు. భూమిపై ఉన్న అంధకార తెరలను తొలగిస్తున్నారు.”

‘ఖురైమ్‌ బిన్‌ పాతిక్‌ కథనం: నాకు చాలా భయం ఆవరించింది. నాతో మాట్లాడుతున్నది ఎవరని చాలా కంగారుపడ్డాను. నేను ధైర్యం తెచ్చుకొని ఇలా అన్నాను! ‘ఓ కవిత్వాలు చదువతున్న వాడా, నీవెవరవు? ‘ అని అడిగాను. అతడు సమాధానంగా నా పేరు మాలిక్‌, నేను ముస్లిమ్‌ జిన్నును. ప్రవక్త (స) నన్ను నజ్‌ద్‌ వైపు ముస్లిమ్‌ జిన్నుల నాయకునిగా నియమించి పంపారు. నేను వారందరికీ నాయకుడను. నేను ఈ అడవిగుండా పోతూ ఉంటే నువ్వు అడవి నాయకుడి శరణుకోరటం విన్నాను. ఈ సాటి కల్పించే పదాలు విని నాకు చాలా ఆగ్రహం కలిగింది. నిన్ను సందేశం వినిపించడానికి వచ్చాను. ఈ పాపాన్ని వదలి ఏకత్వం మార్గాన్ని అవలంబించు. ఇతరులను పిలవటం మాని వేసి కేవలం అల్లాహ్‌(త)నే ప్రార్థించు. ఓ మానవుడా! నేను ఇస్లామ్‌ ధర్మాన్ని స్వీకరించాను. ఇంకా ప్రవక్త (స) ప్రేమతో నా శరీరం నిండిపోయింది. ఎందుకంటే అతని ద్వారా నాకు సన్మార్గం లభించింది” అని అన్నాడు.

‘ఖురైమ్‌ ఫాతిక్‌ ఇలా అన్నాడు, ”ఓ మాలిక్‌, జిన్నాత్‌ల నాయకుడా! నీ మాటలు విని నా హృదయంలో కూడా ఆ అల్లాహ్‌ (త) ప్రవక్తను కలుసుకోవాలనే కుతూహలం కలిగింది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా నా ఒంటెలు పరిరక్షించే వారుంటే నేను ఇక్కడి నుండి తిన్నగా మదీనహ్ వెళ్ళి ఇస్లామ్‌ సందేశకర్తను కలుసుకుంటాను. ఇస్లామ్‌ స్వీకరిస్తాను” అని అన్నాను. దానికి జిన్నాత్‌ల నాయకుడు, ”ఒకవేళ నీ ఉద్దేశ్యం ఇదే అయితే నువ్వు మదీనహ్ వెళ్ళు, నీ ఒంటెలను సురక్షితంగా నీ ఇంటికి చేరుస్తాను,” అని అన్నాడు. ‘ఖురైమ్‌ బిన్‌ ఫాతిక్ ఈ మాటలు విని సంతోషం పట్టలేక ఒక ఒంటెపై కూర్చొని మదీనహ్ వైపు బయలుదేరాడు. ‘ఖురైమ్‌ ఫాతిక్ బయలుదేరి నపుడు అతన్ని ఈ విధంగా వీడ్కోలు పలకడం జరిగింది. ‘దైవం నీకు తోడుగా ఉండుగాక! నిన్ను సురక్షితంగా ఉంచుగాక! నిన్ను నీ వాహనాన్ని నీ గమ్యానికి చేర్చుగాక! నీవు అతన్ని విశ్వసించు, అల్లాహ్‌(త) నీకు సాఫల్యం ప్రసాదించుగాక! నీవు అతని ధర్మంలో సహాయంచేయి. దైవం నీకు సహాయం చేయుగాక!’  ‘ఖురైమ్‌ బిన్‌ ఫాతిక్‌ నడుస్తూ నడుస్తూ మదీనహ్ చేరుకున్నాడు. మస్జిదె నబవీ వద్ద తన ఒంటెపై నుండి దిగాడు, అది శుక్రవారం. ప్రజలు మస్జిద్‌లోనికి వచ్చి ఉన్నారు.

‘ఖురైమ్‌ కథనం: నేను ఒంటెను కట్టివేసి, నమా’జు తర్వాత ప్రవక్త (స)ను కలుద్దామని నిర్ణయించుకున్నాను. ఇంతలో ఇద్దరు అనుచరులు ఒకరు అబూ జ’ర్‌, మరొకరు అబూ బకర్‌ నా దగ్గరకు వచ్చి ప్రవక్త (స) తమను లోపలికి రమ్మంటున్నారని అన్నారు. నేను నా మనసులో చాలా సంతోషించి, పరిశుభ్రతను పొంది మస్జిద్‌ లోపలికి వెళ్లాను. లోపల చూచే సరికి ప్రవక్త (స) జుమ’అహ్ ఖుత్‌బహ్ ఇస్తున్నారు. దైవం సాక్షి! ప్రవక్త (స) నాకు వెన్నెల రాత్రి చంద్రుడిలా మెరుస్తూ కనిపించారు.  ప్రవక్త (స) నన్ను చూచి ఇలా అన్నారు, ఎందుకంటే అన్ని విషయాలు దైవవాణి ద్వారా తెలియపర్చబడ్డాయి. ” ‘ఖురైమ్‌ బిన్‌ ఫాతిక్‌, ఆ జిన్నాతుల నాయకుడు మీ ఒంటెలను సురక్షితంగా మీ ఇంటికి చేర్చుతానని వాగ్దానం చేసాడా? అతడు తన వాగ్దానం ప్రకారం మీ ఒంటెలను సురక్షితంగా మీ ఇంటికి చేర్చివేసాడు.” ‘ఖురైమ్‌ బిన్‌ ఫాతిక్‌, ”అల్లాహ్‌ (త) మీపై తన కారుణ్యం అవతరింపజేయుగాక!” అని అన్నాడు. ప్రవక్త (స) కూడా అతనిపై అల్లాహ్‌(త) కారుణ్యాలు కురవాలని ప్రార్థించారు. ‘ఖురైమ్‌ బిన్‌ ఫాతిక్‌ తనివితీరా ప్రవక్త (స)ను దర్శించుకున్నాడు. వెంటనే అష్‌హదు అల్లాయిలాహ ఇల్లల్లాహ్‌ అని పలికి ఇస్లామ్‌ స్వీకరించాడు.

‘ఖురైమ్‌ (ర) కథనం: జుము’అహ్‌ రోజు ఈ ‘హదీసు’ను ప్రవక్త (స) ప్రవచించారు.” ఎవరైతే భక్తిశ్రద్ధలతో వుజూ చేసి, భయభీతులతో నమా’జు చేస్తారో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. (తబ్‌రానీ, సంక్షిప్త కన్‌జుల్‌ ఉమ్మాల్‌, ముస్నద్‌ అహ్‌మద్‌)

***

%d bloggers like this: