17- كِتَابُ الْحُدُوْدِ
17. శిక్షల పుస్తకం
హద్ అంటే అడ్డు అని అర్థం. అంటే ఇక్కడ ధార్మిక చట్టపరంగా శిక్ష అని అర్థం. ఒకవేళ ఎవరైనా ధర్మవ్యతిరేక కార్యానికి పాల్పడితే, ఇతరులు చూచి అటువంటి పాపకార్యానికి సాహసించకుండా ఉండేవిధంగా అతన్ని శిక్షించడం జరుగుతుంది. ఇటువంటి శిక్షలను ‘హుదూదుల్లాహ్’ అంటారు. ఉదా. అల్లాహ్ ఆదేశం. ”…ఇవి అల్లాహ్ నియమించిన హద్దులు, కావున వీటిని అతిక్రమించకండి…” (అల్-బఖరహ్, 2:229). మరోచోట, ”..ఇవి అల్లాహ్ నియమించిన హద్దులు, (ఉల్లంఘించే ఉద్దేశంతో) వీటిని సమీపించకండి…” (అల్-బఖరహ్, 2:187)
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3555 – [ 1 ] ( متفق عليه ) (2/1056)
عَنْ أَبِيْ هُرَيْرَةَ وَزَيْدِ بْنِ خَالِدٍ: أَنَّ رَجُلَيْنِ اِخْتَصَمَا إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ أَحَدَهُمَا: اقْضِ بَيْنَنَا بِكِتَابِ اللهِ وَقَالَ الْآخَرُ: اَجَلْ يَا رَسُوْلَ اللهِ فَاقْضِ بَيْنَنَا بِكَتَابِ اللهِ وَائْذَنْ لِيْ أَنْ أَتَكَلَّمَ قَالَ: “تَكَلَّمَ” .قَالَ: إِنَّ ابْنِيْ كَانَ عَسِيْفًا عَلَى هَذَا فَزَنَى بِامْرَأَتِهِ فَأَخْبَرُوْنِيْ أَنَّ عَلَى اِبْنِي الرَّجْمَ فَاقْتَدَيْتُ مِنْهُ بِمَائَةِ شَاةٍ وَّبِجَارِيَةٍ لِّيْ. ثُمَّ إِنِّيْ سَأَلْتُ أَهْلَ الْعِلْمِ فَأخْبَرُوْنِيْ أَنَّ عَلَى ابْنِيْ جَلْدَ مِائَةٍ وَّتَغْرِيْبَ عَامٍ. وَإِنَّمَا الرَّجْمُ عَلَى امْرَأتِهِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَمَّا وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَأَقْضِيَنَّ بَيْنَكُمَا بِكِتَابِ اللهِ أَمَّا غَنَمُكَ وَجَارِيَتُكَ فَرَدٌّ عَلَيْكَ. وَأَمَّا اِبْنُكَ فَعَلَيْهِ جِلْدٌ مِائَةٍ وَتَغْرِيْبُ عَامٍ. وَأَمَّا أَنْتَ يَا أُنَيْسُ فَاغْدُ إِلَى امْرَأةِ هَذَا فَإنِ اعْتَرَفَتْ فَارْجُمُهَا”. فَاعْتَرَفَتْ فَرَجَمَهَا.
3555. (1) [2/1056- ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) మరియు జైద్ బిన్ ఖాలిద్ కథనం: ఇద్దరు వ్యక్తులు కలహించుకుంటూ ప్రవక్త (స) వద్దకు వచ్చారు. వారిలో ఒక వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! మా మధ్య ఖుర్‌ఆన్‌కి అనుగుణంగా తీర్పు ఇవ్వండి.’ మరో వ్యక్తి, ‘అవును ఓ ప్రవక్తా! తమరు మా మధ్య ఖుర్‌ఆన్‌కి అనుగుణంగా తీర్పు ఇవ్వండి. ఇంకా జరిగిన వృత్తాంతాన్ని మీకు విన్నవించుకునే అనుమతి ఇవ్వండి,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘అయితే సరే నువ్వు చెప్పు,’ అని అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి, ‘నా కుమారుడు ఇతని వద్ద సేవ చేసేవాడు. వాడు ఇతని భార్యతో వ్యభిచారం చేసాడు. అయితే ప్రజలు వాడ్ని రాళ్ళ ద్వారా చంపటం జరుగుతుంది, అని అంటున్నారు. నేను నా కొడుకును రజ్మ్ నుండి రక్షించడానికి ఆ వ్యక్తికి 100 మేకలు, ఒక బానిసరాలిని ఇచ్చాను. దానివల్ల నా కొడుకు ప్రాణం తప్పుతుందని. ఆ తరువాత పండితులతో దీన్ని గురించి అడిగాను. వాళ్ళు ఈ సమస్యకు పరిష్కారంగా నీ కొడుకుకు 100 కొరడా దెబ్బలు పడాలి, ఒక సంవత్సరం కోసం దేశబహిష్కరణ చేయాలి, అతని భార్యను రజ్మ్ చేయాలి, ఎందుకంటే ఆమె వివాహితురాలు, నా కొడుకు వివాహితుడు కాడు, అని చెప్పారని,’ అన్నాడు. ప్రవక్త (స) ఈ మాటలు విని, ‘అల్లాహ్ సాక్షి! నేను మీ ఇద్దరి మధ్య ఖుర్‌ఆన్ ప్రకారం తీర్పు ఇస్తాను,’ అని పలికి ఇలా అన్నారు, ‘నువ్వు నీ మేకలు, బానిసరాలిని తిరిగి తీసుకో, నీ కొడుకుకు 100 కొరడా దెబ్బలు, ఒక సంవత్సరం దేశ బహిష్కరణ ఉంది.’ ప్రవక్త (స) ఉనైస్ అనుచరునితో, ‘రేపు ఉదయం నువ్వు అతని భార్య దగ్గరకు వెళ్ళి అడుగు, ఒకవేళ ఆమె వ్యభిచారం చేసానని ఒప్పుకుంటే నువ్వు ఆమెను రజ్మ్ చేసివేయి,’ అని అన్నారు. మరుసటి రోజు అతను వెళ్ళారు, ఆమె తాను వ్యభిచారం చేసానని ఒప్పుకుంది. అప్పుడు ఉనైస్ (ర) ఆమెను రజ్మ్ చేసారు. (బుఖారీ, ముస్లిమ్)
3556 – [ 2 ] ( صحيح ) (2/1056)
وَعَنْ زَيْدِ بْنِ خَالِدٍ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَأْمُرُ فِيْمَنْ زَنَى وَلَمْ يُحْصِنْ جَلْدَ مِائَةٍ وَتَغْرِيْبَ عَامٍ. رَوَاهُ الْبُخَارِيُّ
3556. (2) [2/156– దృఢం]
జైద్ బిన్ మాలిక్ కథనం: నేను ప్రవక్త (స)ను ఇలా తీర్పు ఇస్తుండగా విన్నాను, ”అవివాహిత (పురుష / స్త్రీ) వ్యభిచారికి 100 కొరడా దెబ్బలు, ఒక సంవత్సరం దేశ బహిష్కరణ.” (బుఖారీ)
3557- [ 3 ] ( متفق عليه ) (2/1056)
وَعَنْ عُمَرَرَضِيَ اللهُ عَنْهُ قَالَ: إِنَّ اللهَ بَعَثَ مُحَمَّدًا وَأَنْزَلَ عَلَيْهِ الْكِتَابَ فَكَانَ مِمَّا أَنْزَلَ اللهُ تَعَالى آيةَ الرَّجْمِ رَجَمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَرَجَمْنَا بَعْدَهُ وَالرَّجْمُ فِيْ كِتَابِ اللهِ حَقٌّ عَلَى مَنْ زَنَى إِذَا أَحْصَنَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ إِذَا قَامَتِ الْبَيِّنَةُ أَوْ كَانَ الْحَبْلُ أَوْ الْاعْتِرَافُ.
3557. (3) [2/1056– ఏకీభవితం]
ఉమర్ (ర) కథనం: అల్లాహ్ (త) ప్రవక్త (స)ను సత్యం ఇచ్చి పంపాడు, ఇంకా ఆయనపై ఖుర్‌ఆన్‌ను అవతరింప జేసాడు. ఇంకా ఖుర్‌ఆన్‌లో రజ్మ్కి సంబంధించిన ఆయతులు కూడా ఉన్నాయి. ప్రవక్త (స) తన జీవితంలో వివాహిత వ్యభిచారులను రజ్మ్ చేసారు. అతని (స) తరువాత మేము కూడా రజ్మ్ చేసాము. రజ్మ్ చేయాలని అల్లాహ్ గ్రంథంలో ఉంది. వ్యభిచారి వివాహితులైతే, స్త్రీలయినా పురుషులైనా ఆ ఘటనపై నలుగురు ప్రత్యక్ష సాక్షులు కావాలి లేదా గర్భం ధరించాలి లేదా స్వయంగా ఒప్పు కోవాలి.” [1] (బుఖారీ, ముస్లిమ్)
3558 – [ 4 ] ( صحيح ) (2/1057)
وَعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “خُذُوْا عَنِّي خُذُوْا عَنِّي قَدْ جَعَلَ اللهُ لَهُنَّ سَبِيْلًا: البِكْرُ بِالْبِكْرِ جَلْدُ مِائَةٍ وَوتَغْرِيْبُ عَامٍ وَالثَّيِّبُ بِالثَّيِّبِ جَلْدُ مِائَةٍ وَالرَّجْمُ”. رَواه مُسلِمٌ
3558. (4) [2/1057 –దృఢం]
ఉబాదహ్ బిన్ సామిత్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం ”మీరు నా నుండి నేర్చుకోండి” ఈ విధంగా అనేకసార్లు అన్నారు. ”అల్లాహ్ (త) స్త్రీ పురుషులను గురించి ఈ మార్గం నిర్ణయించాడు. స్త్రీ పురుషులు ఒకవేళ అవివాహితు లైతే వారిని 100 కొరడా దెబ్బలు కొట్టాలి, ఒక సంవత్సరం దేశబహిష్కరణ చేయాలి. ఇంకా వివాహిత స్త్రీ పురుషులను 100 కొరడా దెబ్బలు కొట్టాలి మరియు రజ్మ్ చేయాలి. [2] (ముస్లిమ్)
3559 – [ 5 ] ( متفق عليه ) (2/1057)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ: أَنَّ الْيَهُوْدَ جَاؤُوْا إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَذَكَرُوْا لَهُ أَنَّ رَجُلًا مِّنْهُمْ وَامْرَأَةً زَنَيَا. فَقَالَ لَهُمْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا تَجِدُوْنَ فِي التَّوْرَاةِ فِيْ شَأن الرَّجْمِ؟” قَالُوْا: نَفْضَحُهُمْ وَيُجْلَدُوْنَ. قَالَ عَبْدُ اللهِ بْنِ سَلَامٍ: كَذَبْتُمْ إِنَّ فِيْهَا الرَّجْمَ فَأتَوْا بِالتَّوْرَاةِ فَنَشَرُوْهَا. فَوَضَعَ أَحَدُهُمْ يَدَهُ عَلَى آيَةِ الرَّجْمِ فَقَرَأَ مَا قَبْلَهَا وَمَا بَعْدَهَا. فَقَال عَبْدُ اللهِ بْنُ سَلَامِ: ارْفَعْ يَدَكَ فَرَفَعَ فَإِذَا فِيْهَا آيَةُ الرَّجْمِ. فَقَالُوْا: صَدَقَ يَا مُحَمَّدُ فِيْهَا آيَةُ الرَّجْمِ. فَأَمَرَ بِهِمَا النَّبِيُّ صلى الله عليه وسلم فَرُجِمَا.
وَفِيْ رِوَايَةٍ :قَالَ: ارْفَعْ يَدَكَ فَرَفَعَ فَإِذَا فِيْهَا آيَةُ الرَّجْمِ تَلُوْحُ فَقَالَ: يَا مُحَمَّدُ إِنَّ فِيْهَا آيَةَ الرَّجْمِ وَلَكِنَّا نَتَكَاتَمُهُ بَيْنَنَا فَأَمَرَ بِهِمَا فَرُجِمَا.
3559. (5) [2/1057 –ఏకీభవితం]
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (ర) కథనం: కొంతమంది యూదుల బృందం ఒకటి ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘మా జాతిలోని ఒక స్త్రీ, ఒక పురుషుడు వ్యభిచారానికి పాల్పడ్డారు. దీన్ని గురించి తమరు ఏం తీర్పు ఇస్తారు,’ అని అన్నారు. ప్రవక్త (స) వారితో, ‘మీ పుస్తకమైన తౌరాతులో రాళ్ళ వర్షం గురించి ఏముంది?’ అని అడిగారు. దానికి వారు, ‘మేము వ్యభిచార స్త్రీ పురుషు లను నీచంగా అవమానం పాలు చేస్తాం. కొరడా దెబ్బలు కొడతాం. తౌరాతులో కూడా ఇలాగే ఉంది,’ అని అన్నారు. ఇది విన్న అబ్దుల్లాహ్ బిన్ సలామ్, ‘మీరు అసత్యం పలుకుతున్నారు, తౌరాతులో రాళ్ళ వర్షం ఉంది, మీరు తౌరాతు తెచ్చి చదవండి,’ అని అన్నారు. దానికి వారు తౌరాతు తెచ్చి చదవసాగారు. ఒక వ్యక్తి రజ్మ్ వాక్యంపై చేయి పెట్టాడు. దాని ముందూ వెనుకా చదవసాగాడు. అప్పుడు అబ్దుల్లాహ్ బిన్ సలామ్ అతనితో, ఆ వాక్యంపై నుండి చేయి ఎత్తమని అన్నారు. ఆ వ్యక్తి చేయి ఎత్తాడు. అక్కడ రజ్మ్ వాక్యం ఉంది. అప్పుడు వారు, ‘ఓ ప్రవక్తా! అబ్దుల్లాహ్ బిన్ సలామ్ సత్యం పలికారు. తౌరాతులో రజ్మ్ వాక్యం ఉంది,’ అని అన్నారు. ప్రవక్త (స) ఆ ఇద్దరు స్త్రీ పురుషులను రజ్మ్ చేయమని ఆదేశించారు. వారిని రజ్మ్ చేయడం జరిగింది.
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”అబ్దుల్లాహ్ బిన్ సలామ్ అతనితో, ‘నీ చేతిని అక్కడి నుండి తీసివేయి,’ అని అన్నారు. అతడు తన చేతిని తీయగానే ఆ వాక్యం స్పష్టంగా కనబడింది. అప్పుడు ఆ యూదుడు, ‘ఓ ముహమ్మద్ (స) తౌరాతులో రజ్మ్ వాక్యం ఉంది. కాని మేము ఈ వాక్యాన్ని పరస్పరం దాచి ఉంచుతాం,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) వారిద్దరినీ రజ్మ్ చేయమని ఆదేశించారు. వారిద్దరినీ రజ్‌మ్ చేయడం జరిగింది. (బుఖారీ, ముస్లిమ్)
3560 – [ 6 ] ( متفق عليه ) (2/1057)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: أَتَى النَّبِيُّ صلى الله عليه وسلم رَجُلٌ وَهُوَ فِيْ الْمَسْجِدِ فَنَادَاهُ: يَا رَسُولَ اللهِ إِنِّيْ زَنَيْتُ فَأَعْرَضَ عَنْهُ النَّبِيُّ صلى الله عليه وسلم.فَتَنَحَّى لِشِقِّ وَجْهِهِ الَّذِيْ أَعْرَضَ قِبَلَهُ فَقَالَ: إِنِّيْ زَنَيْتُ. فَأَعْرَضَ عَنْهُ النَّبِيُّ صلى الله عليه وسلم. فَلَمَّا شَهِدَ أَرْبَعَ شَهَادَاتٍ دَعَاهُ النَّبِيُّ صلى الله عليه وسلم. فَقَالَ: “أَبِكَ جُنُوْنٌ؟” قَالَ: لَا. فَقَالَ: “أَحْصنْتَ ؟ “قَالَ: نَعَمْ يَا رَسُوْلَ اللهِ. قَالَ: “اذْهَبُوْا بِهِ فَارْجُمُوْهُ”. قَالَ ابْنُ شِهَاب: فَأَخْبَرَنِيْ مَنْ سَمِعَ جَابِرَ بْنَ عَبْدِ اللهِ يَقُوْلُ: فَرَجَمْنَاهُ بِالْمَدِيْنَةِ فَلَمَّا أَذْلَقَتْهُ الْحِجَارَةُ هَرَبَ حَتَّى أَدْرَكْنَاهُ بِالْحَرَّةِ فَرَجَمْنَاهُ حَتَّى مَاتَ
وَفِيْ رِوَايَةِ لِلْبُخَارِيِّ: عَنْ جَابِرٍ بَعْدَ قَوْلِهِ: قَالَ: نَعَمْ فَأَمَرَ بِهِ فَرُجِمَ بِالْمُصَلّى فَلَمَّا أَذْلَقَتْهُ الْحِجَارَةُ فَرَّ فَأُدْرِكَ فَرُجِمَ حَتَّى مَاتَ. فَقَالَ لَهُ النَبِيُّ صلى الله عليه وسلم خَيْرًا وَصَلّى عَلَيْهِ.
3560. (6) [2/1057 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) మస్జిద్‌లో ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి, ‘ఓ ప్రవక్తా! నేను వ్యభిచరించాను,’ అని అన్నాడు. ప్రవక్త(స) అతని వైపునుండి ముఖం త్రిప్పుకున్నారు. ఆ వ్యక్తి మళ్ళీ ప్రవక్త (స) ముందుకు వచ్చి, ‘ఓ ప్రవక్తా! నేను వ్యభిచరించాను,’ అని అన్నాడు. మళ్ళీ ప్రవక్త (స) తన ముఖం త్రిప్పు కున్నారు. ఈ విధంగా ఆ వ్యక్తి నాలుగు సార్లు తన తప్పును ఒప్పుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స) అతన్ని తన వద్దకు పిలిచి, ‘నీకైమైనా పిచ్చి ఉందా, నీవు పిచ్చివాడవా,’ అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, ‘లేదు,’ అని అన్నాడు. మళ్ళీ ప్రవక్త (స), ‘నువ్వు వివాహితుడివా,’ అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, ‘అవును,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘ఇతన్ని తీసుకు వెళ్ళి రజ్మ్ చేసివేయండి,’ అని అన్నారు.
ఈ ‘హదీసు’ ఉల్లేఖన కర్త ఇబ్నె షిహాబ్ కథనం: జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ ద్వారా విన్న వ్యక్తి నాతో ఇలా అన్నాడు, ‘మేము ఆ వ్యక్తిని రజ్మ్ చేసే మైదానంలోకి తీసుకువెళ్ళి రజ్మ్ చేయడం ప్రారంభించాం. అతనికి రాళ్ళు తగల సాగాయి. అతడు పారిపోవటానికి ప్రయత్నించాడు. మేమతన్ని పట్టి మళ్ళీ రజ్మ్ చేసాము. చివరికి అతడు మరణించాడు. (బుఖారీ, ముస్లిమ్)
బుఖారీ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”అతడు తన అపరాధం ఒప్పుకున్న తర్వాత ప్రవక్త (స) అతన్ని రజ్మ్ చేయమని ఆదేశించారు. అనంతరం అతన్ని ఈద్‌గాహ్ లోనికి తీసుకొని వెళ్ళి రజ్మ్ చేయడం ప్రారం భించారు. అతనికి రాళ్ళు తగలడం ప్రారంభం కాగానే పారిపోబోయాడు, కాని పట్టుబడ్డాడు. అతన్ని రజ్మ్ చేయడం జరిగింది, చివరికి మరణించాడు. ప్రవక్త (స) అతన్ని పొగిడారు, అతని జనా’జహ్ నమా’జు చదివారు. ఇంకా అతని క్షమాపణ కొరకు ప్రార్థించారు.
3561 – [ 7] ( صحيح ) (2/1058)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: لَمَّا أَتَى مَاعِزُ بْنُ مَالِكِ النَّبِيُّ صَلّى الله عليه و سلم فَقَالَ لَهُ: “لَعَلَّكَ قَبَّلْتَ أَوْ غَمَزْتَ أَوْ نَظَرْتَ؟” قَالَ: لَا يَا رَسُوْلَ اللهِ قَالَ: “أَنِكْتَهَا؟” لَا يَكْنِيْ قَالَ: نَعَمْ فَعِنْدَ ذَلِكَ أَمَرَ بِرَجْمِهِ. رَوَاهُ الْبُخَارِيُّ.
3561. (7) [2/1058–దృఢం]
ఇబ్నె అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు మాయిజ్ బిన్ మాలిక్ వచ్చి తాను వ్యభిచారం చేసానని ఒప్పుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘నువ్వు ముద్దు పెట్టుకొని ఉంటావు లేదా ముట్టుకొని ఉంటావు లేదా చూసి ఉంటావు,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘లేదు ఓ ప్రవక్తా!’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు నిజంగా వ్యభిచారం చేసావా?’ అని అడిగారు. ఆ వ్యక్తి, ‘అవును నిజంగా,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) అతన్ని రజ్మ్ చేయమని ఆదేశించారు. (బుఖారీ)
3562 – [ 8 ] ( صحيح ) (2/1058)
وَعَنْ بُرَيْدَةَ قَالَ: جَاءَ مَاعِزُ بْنُ مَالِكٍ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: يَا رَسُوْلَ اللهِ طَهِّرْنِيْ فَقَالَ: “وَيْحَكَ اِرْجِعْ فَاسْتَغْفِرِ الله وَتُبْ إِلَيْهِ”. فَقَالَ: فَرَجَعَ غَيْرَ بَعِيْدٍ ثُمَّ جَاءَ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ طَهِّرْنِيْ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم مِثْلَ ذَلِكَ حَتَّى إِذَا كَانَتِ الرَّابِعَةُ قَالَهُ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فِيْمَ أُطَهِّرُكَ؟” قَالَ: مِنَ الزِّنَا. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَبِهِ جُنُوْنٌ؟” فَأُخْبِرَ أَنَّهُ لَيْسَ بِمَجْنُوْنٍ فَقَالَ:”أَشْرِبَ خَمْرًا؟” فَقَامَ رَجُل فَاسْتَنْكَهَهُ فَلَمْ يَجِدْ مِنْهُ رِيْحَ خَمْرٍ فَقَالَ: “أَزَنَيْتَ؟” قَالَ: نَعَمْ فَأَمَرَ بِهِ فَرُجِمَ فَلَبِثُوْا يَوْمَيْنِ أَوْ ثَلَاثَةً ثُمَّ جَاءَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “اسْتَغْفِرُوْا لِمَاعِزِ بْنِ مَالِكٍ لَقَد تَابَ تَوْبَةً لَوْ قُسِمَتْ بَيْنَ أُمَّةٍ لَوْسِعَتُهُمْ”. ثُمَّ جَاءَتْهُ امْرَأَةٌ مِّنْ غُامِدٍ مِّنَ الْأَزْدِ فَقَالَتْ: يَا رَسُوْلَ اللهِ طَهِّرْنِيْ فَقَالَ:” وَيْحَكَ ارْجِعِيْ فَاسْتَغْفِرِيْ اللهَ وَتُوْبِيْ إِلَيْهِ ” فَقَالَتْ: تُرِيْدُ أَنْ تَرُدِّدِنِيْ كَمَا رَدَدْتَّ مَاعِزَ بْنَ مَالِكٍ: إِنَّهَا حُبْلَى مِنَ الزِّنَا فَقَالَ: “أَنْتِ؟” قَالَتْ: نَعَمْ قَالَ لَهَا:”حَتَّى تَضَعِيْ مَا فِيْ بَطْنِكَ”. قَالَ: فَكَفَلَهَا رَجُلٌ مِّنَ الْأَنْصَارِ حَتَّى وَضَعَتْ فَأَتَى النَّبِيُّ صلى الله عليه وسلم. فَقَالَ: قَدْ وَضَعَتِ الْغَامِدِيَّةُ فَقَالَ: “إِذَا لَا نَرْجُمُهَا وَنَدَعُ وَلَدَهَا صَغِيْرًا لَيْسَ لَهُ مَنْ يُّرضِعُهُ”. فَقَامَ رَجُلُ مِّنَ الْأَنْصَارِ فَقَالَ: إِلَيَّ رَضَاعُهُ يَا نَبِيَّ اللهِ قَالَ: فَرَجَمَهَا.
وَفِيْ رِوايَةٍ: أَنَّهُ قَالَ لَهَا: “اذْهَبِيْ حَتَّى تَلِدِيْ”. فَلَمَّا وَلَدَتْ قَالَ: “اذْهَبِيْ فَأَرْضِعِيْهِ حَتَّى تَفْطِمِيْهِ”. فَلَمَّا فَطَمَتْهُ أَتَتْهُ بِالصَّبِيِّ فِيْ يَدِهِ كِسْرَةُ خُبْزٍ فَقَالَتْ: هَذَا يَا نَبِيَّ اللهِ قَدْ فَطَمْتُهُ وَقَد أَكَلَ الطَّعَامَ فَدَفَعَ الصَّبِيَّ إِلَى رَجُلٍ مِّنَ الْمُسْلِمِيْنَ ثُمَّ أَمَرَ بِهَا فَحُفِرَ لَهَا إِلَى صَدْرِهَا وَأَمَرَ النَّاسَ فَرَجَمُوْهَا فَيُقْبِلُ خَالِدُ بْنُ الْوَليْدِ بِحَجَرٍ فَرَمى رَأْسَهَا فَتَنَضَّحَ الدَّمُ عَلَى وَجْهِ خَالِدٍ فَسَبَّهَا. فَقَالَ النَّبِيُّ صلى الله عليه و سلم: “مَهْلًا يَا خَالِدً فَوَ الَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَقَدْ تَابَتْ تَوْبَةً لَوْ تَابَهَا صَاحِبُ مَكْسٍ لَغُفِرَلَهُ”. ثُمَّ أَمَرَبِهَا فَصَلَّى عَلَيْهَا وَدُفِنَتْ . رَوَاهُ مُسْلِمٌ.
3562. (8) [2/1058– దృఢం]
బురైద (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు మాయిజ్ బిన్ మాలిక్ వచ్చి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! నన్ను పరిశుద్ధ పరచండి,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘నీపై చాలా జాలివేస్తుంది, తిరిగి వెళ్ళి అల్లాహ్‌ను క్షమాపణ కోరుకో, తౌబహ్, ఇస్తిగ్‌ఫార్ చేయి,’ అని అన్నారు. అనంతరం అతడు కొంతదూరం వెళ్ళిపోయాడు. కొంతసేపు తర్వాత మళ్ళీ వచ్చి, ‘ఓ ప్రవక్తా! నన్ను పరిశుద్ధ పరచండి,’ అని అన్నాడు. ప్రవక్త (స) అప్పుడు ఇచ్చిన సమాధానమే ఇప్పుడూ ఇచ్చారు. ఈ విధంగా నాలుగు సార్లు విన్నపాలు, సమాధానాలు జరిగాయి. నాల్గవసారి ప్రవక్త (స), ‘నిన్ను దేన్నుండి పరిశుద్ధ పరచాలి,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘వ్యభిచారం నుండి,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘ఇతడు పిచ్చివాడా,’ అని అన్నారు. అక్కడున్న వారు, ‘ఇతడు పిచ్చివాడు కాదు,’ అని అన్నారు. ప్రవక్త (స), ‘ఇతడు మద్యం సేవించి వచ్చాడా,’ అని అడిగారు. అప్పుడు ఒక వ్యక్తి నిలబడి అతని నోటి వాసన చూసాడు. అతడు త్రాగిలేడని తెలిసింది. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు నిజంగానే వ్యభిచారం చేసి వచ్చావా?’ అని అడిగారు. దానికి ఆ వ్యక్తి ‘అవును,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) అతన్ని రజ్మ్ చేయమని ఆదే శించారు. అతన్ని రజ్మ్ చేయడం జరిగింది. రెండు మూడు రోజులు గడచిన తర్వాత ప్రవక్త(స) వచ్చి, ‘మాయిజ్ గురించి దు’ఆ చేయండి, అతడు ఎలాంటి పశ్చాత్తాపం చెందాడంటే, దాన్ని ముస్లిమ్ సంఘంపై పరచితే అందరికీ సరిపోతుంది,’ అని అన్నారు.
ఆ తరువాత అజ్‌ద్ తెగకు చెందిన, ‘గామిద్ వర్గానికి చెందిన ఒక స్త్రీ ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ ప్రవక్తా! నన్ను పరిశుద్ధపరచండి,’ అని విన్నవించు కుంది. ‘నిన్ను చూస్తే జాలి వేస్తుంది, ఇక్కడి నుండి వెళ్ళి అల్లాహ్(త)ను క్షమాపణ కోరుకో, పశ్చాత్తాపపడు,’ అని సలహా ఇచ్చారు. దానికి ఆమె, ‘నన్ను మీరు మాయిజ్‌ను తిరిగి పంపినట్లు నన్ను తిరిగి పంపాలను కుంటున్నారు. నేను వ్యభిచారం వల్ల గర్భం ధరించాను.’ దానికి ప్రవక్త (స), ‘అలాగా,’ అన్నారు. ఆమె, ‘అవును,’ అని సమాధానం ఇచ్చింది. ప్రవక్త (స) ఆమెతో, ‘నువ్వు ఇప్పుడు వెళ్ళిపో, బిడ్డ జన్మించిన తర్వాత నా దగ్గరకు రా,’ అని అన్నారు. ఒక అన్సారీ ఆమెను సంరక్షించాడు. ఆ తరువాత ఆమె ప్రసవించింది. కొన్ని రోజుల తర్వాత ఆ అన్సారీ ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఆ ‘గామిదియ స్త్రీ బిడ్డను ప్రసవించింది. ఇప్పుడు ఏమి చేయాలి,’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘ఇప్పుడే ఆమెను రజ్మ్ చేయమని ఆదేశించలేము. ఆమె బిడ్డను బాల్యంలోనే వదలి వేస్తామా, ఆ బిడ్డకు పాలు త్రాగించేవాడు ఎవరూ లేరు.’ అని అన్నారు. దానికి ఒక అన్సారీ నిలబడి ‘ఓ ప్రవక్తా! ఆ బిడ్డకు పాలు పట్టటం నా బాధ్యత, నేను ఒక స్త్రీని ఆ బిడ్డకు పాలు పట్టటానికి నియమిస్తాను,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ఆ స్త్రీని రజ్మ్ చేయమని ఆదేశించారు.
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ఆమెతో, ‘ఇప్పుడు నువ్వు వెళ్ళి, బిడ్డ జన్మించేవరకు వేచి ఉండు,’ అని అన్నారు. ఆమె తిరిగి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆమె ఒక బిడ్డను కన్నది. ఆ తరువాత ప్రవక్త (స) వద్దకు వచ్చింది. ప్రవక్త (స) ఆమెతో ఇప్పుడు వెళ్ళమని, బిడ్డకు పాలు పట్టమని, బిడ్డ పాలు వదలివేసిన తర్వాత రమ్మని అన్నారు. ఆమె వెళ్ళిపోయింది. పాలుపడుతూ ఉంది. చివరికి ఆ బిడ్డ పాలు వదలివేసాడు. ఆ బిడ్డ ఇప్పుడు రొట్టె ముక్క తినగలుగుతున్నాడు. ఆ స్త్రీ మళ్ళీ వచ్చింది, బిడ్డను కూడా తీసుకువచ్చింది. బిడ్డ చేతిలో రొట్టె ముక్క ఉంది. ఆమె ప్రవక్త (స)తో ఓ ప్రవక్తా! బిడ్డ పాలు మానివేసాడు. ఇప్పుడు అన్నం తింటున్నాడు అని విన్నవించుకుంది. ప్రవక్త (స) ఆ బిడ్డను పోషించగలిగే ఒక ముస్లిమ్‌కు ఇచ్చివేసారు. ఆ తరువాత రొమ్ము వరకు ఉండేలా ఒక గొయ్యిత్రవ్వారు. అందులో ఆమెను నిలబెట్టి రజ్‌మ్ చేయమని ఆదేశించారు. ప్రజలు ఆమెను రజ్మ్ చేసారు. ఖాలిద్ బిన్ వలీద్ ఆమె తలపై ఒక రాయి విసిరారు. ఆమె తల నుండి రక్తం చింది ఖాలిద్ ముఖంపై పడింది. దానికి అతడు విమర్శించసాగారు. అప్పుడు ప్రవక్త (స) ఖాలిద్, నోరు మూసుకో ఎవరి చేతుల్లో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! ఆమె ఎంత తీవ్రంగా పశ్చాత్తాపపడిందంటే దుర్మార్గంగా పన్ను తీసుకునే వాడు, దోచుకునేవాడు కూడా పశ్చాత్తాపపడితే క్షమించబడతాడు. ఆ తరువాత ఆమె జనాజహ్ నమా’జు చదవడం జరిగింది, ఖననం చేయబడింది. (ముస్లిమ్)
3563 – [ 9 ] ( متفق عليه ) (2/1059)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِذَا زَنَتْ أَمَةُ أَحَدِكُمْ فَتَبَيَّنَ زِنَاهَا فَلْيَجْلِدْهَا الْحَدَّ وَلَا يُثَرِّبْ عَلَيْهَا ثُمَّ إِنْ زَنَتْ فَلْيَجْلِدْهَا الْحَدَّ وَلَا يُثَرِّبُ ثُمَّ إِنْ زَنت الثَّالِثَةَ فَتَبَيَّنَ زَنَاهَا فَلْيَبِعْهَا وَلَوْ بِحَبْلٍ مِّنْ شَعْرٍ”.
3563. (9) [2/1059– ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”మీలో ఎవరి బానిసరాలైనా వ్యభిచారానికి పాల్పడితే, ఆమె వ్యభిచారం చేసిందని తెలిసిపోతే ఆమెను శిక్షించండి. అంటే కొరడా దెబ్బలు కొట్టండి. ఆ తరువాత ఆమెను తిట్లు చీవాట్లు పెట్టకండి. ఆ తరువాత ఒకవేళ మళ్ళీ వ్యభిచారానికి పాల్పడితే, ఆమెను శిక్షించండి. ఆమెకు చీవాట్లు పెట్టకండి. మూడవసారి మళ్ళీ వ్యభిచరిస్తే అది తెలిస్తే ఆమెను అమ్మివేయండి. ఒక త్రాడుకు బదులు అయినాసరే.” [3] (బు’ఖారీ, ముస్లిమ్)
3564 – [ 10 ] ( صحيح ) (2/1059)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: يَا أَيُّهَا النَّاسُ أَقِيْمُوْا عَلَى أَرِقَّائِكُمْ الْحَدَّ مَنْ أَحْصَنَ مِنْهُمْ وَمَنْ لَّمْ يُحْصِنْ. فَإِنَّ أَمَةً لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم زَنَتْ فَأَمَرَنِيْ أَنْ أَجْلِدَهَا فَإِذَا هِيَ حَدِيْثُ عَهْدٍ بِنِفَاسٍ فَخَشِيْتُ إِنْ أَنَا جَلَدْتُّهَا أَنْ أَقْتُلَهَا فَذَكَرْتُ ذَلِكَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم. فَقَالَ: “أَحْسَنْتَ”. رَوَاهُ مُسْلِمٌ.
وَفِيْ رِوَايَةٍ أَبِيْ دَاوُدَ: قَالَ: “دَعْهَا حَتَّى يَنْقَطِعَ دَمُهَا ثُمَّ أَقِمْ عَلَيْهَا الْحَدَّ وَأَقِيْمُوْاالْحُدُوْدَ عَلَى مَا مَلَكَتْ أَيْمَانُكُمْ” .
3564. (10) [2/1059 –దృఢం]
అలీ (ర) ప్రజలతో ఇలా అన్నారు: ”ప్రజలారా! ఒకవేళ మీ బానిసరాళ్ళు, బానిసలు వ్యభిచారం చేస్తే వారిని ధర్మపరంగా శిక్షించండి. వారు వివాహితులైనా అవివాహితులైనా సరే. ఎందుకంటే ప్రవక్త (స) యొక్క బానిసరాలు ఇటువంటి చెడు కార్యానికి పాల్పడింది. అప్పుడు ప్రవక్త(స) ఆమెకు కొరడా దెబ్బలు కొట్టమని చెప్పారు. నేను ఆమెను కొట్టటానికి వచ్చాను. అప్పుడే ఆమె బిడ్డను కన్నది, ఆమె చాలా బలహీనంగా ఉందని తెలిసింది. ఒకవేళ నేను ఆమెను కొడితే మరణించ వచ్చని భయంవేసింది. నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాను. ప్రవక్త (స) మంచి పని చేసావని అన్నారు. (ముస్లిమ్)
అబూ దావూద్ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) కొన్ని దినాలు ఆగమని ఆమె ప్రసవరక్తం ఆగిపోయిన తర్వాత శిక్షించమని, ఇంకా మీరు మీ బానిసలను ధర్మబధ్ధంగా శిక్షించండి,” అని అన్నారు.
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3565 – [ 11 ] ( صحيح ) (2/1060)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: جَاءَ مَاعِزُ الْأَسْلَمِيُّ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: إِنَّهُ قَدْ زَنَى. فَأَعْرَضَ عَنْهُ. ثُمَّ جَاءَ مِنْ شِقِّهِ الْآخَرِ فَقَالَ: إِنَّهُ قَدْ زَنَى. فَأَعْرَضَ عَنْهُ. ثُمَّ جَاءَ مِنْ شِقِّهِ الْآخَر. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَّهُ قَدْ زَنَى. فَأَمَرَبِهِ فِي الرَّابِعَةِ. فَأُخْرِجَ إِلَى الْحَرَّةِ فَرُجِمَ بِالْحِجَارَةِ فَلَمَّا وَجَدَ مَسَّ الْحِجَارَةِ فَرَّ يَشْتَدُّ حَتَّى مَرَّ بِرَجُلٍ مَعَهُ لَحْيُ جَمَلٍ فَضَرَبَهُ بِهِ وَضَرَبَهُ النَّاسُ حَتَّى مَاتَ. فَذَكَرُوْا ذَلِكَ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أَنَّهُ فَرَّحِيْنَ وَجَدَ مَسَّ الْحِجَارَةِ وَمَسَّ الْمَوْتِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَلَّا تَرَكْتُمُوْهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.
وَفِيْ رِوَايَةٍ: “هَلَّا تَرَكْتُمُوْهُ لَعَلَّهُ أَنْ يَّتُوْبَ اللهُ عَلَيْهِ”.
3565. (11) [2/1060 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు మాయిజ్ అస్లమీ వచ్చి నేను వ్యభిచరించానని, విన్న వించుకున్నాడు. అది విన్న ప్రవక్త (స) తన ముఖం త్రిప్పుకున్నారు. అతడు మరో ప్రక్క వచ్చి మళ్ళీ, ‘ఓ ప్రవక్తా! నేను వ్యభిచారం చేసాను,’ అని అన్నాడు. ఈ విధంగా అతడు నాలుగు సార్లు అన్నాడు. నాల్గవ సారి ప్రవక్త (స) అతన్ని తీసుకొని వెళ్ళి మదీనహ్ బయట రజ్మ్ చేసే మైదానంలో రజ్మ్ చేయమని ఆదేశించారు. అనంతరం అతన్ని అక్కడకు తీసుకొని వెళ్ళి రజ్మ్ చేయడం ప్రారంభించారు. అతనికి రాళ్ళు తగలగానే అక్కడి నుండి తప్పించుకొని పారిపోతూ ఉండగా ఒక వ్యక్తి అతన్ని చూసి తన చేతిలో ఉన్న ఒంటె దుమ్ముతో అతన్ని కొట్టాడు. అక్కడున్నవారు కూడా కొట్టారు. చివరికి ఆ వ్యక్తి మరణించాడు. ప్రజలు ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘రాళ్ళు తగలగానే పారిపోబోయాడు,’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘అప్పుడెందుకు వదలివేయలేదు,’ అని అన్నారు. (తిర్మిజి, ఇబ్నె మాజహ్)
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఒకవేళ అప్పుడు మీరు వదలివేస్తే అతడు పశ్చాత్తాపపడి ఉండేవాడు. అల్లాహ్ (త) అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించి ఉండేవాడు.” అని ప్రవక్త (స) అన్నారు.
3566 – [ 12 ] ( صحيح ) (2/1060)
وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ لِمَاعِزِ بْنِ مَالِكٍ: “أَحَقٌّ مَا بَلَغَنِيْ عَنْكَ؟ “قَالَ: وَمَا بَلَغَكَ عَنِّيْ؟ قَالَ: “بَلَغَنِيْ أَنَّكَ قَدْ وَقَعْتَ عَلَى جَارِيَةٍ آلِ فُلَانٍ”. قَالَ: نَعَمْ فَشَهِدَ أَرْبَعَ شَهَادَاتٍ فَأَمَرَ بِهِ فَرُجِمَ. رَوَاهُ مُسْلِمٌ
3566. (12) [2/1060– దృఢం]
ఇబ్నె అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) మాయిజ్ బిన్ మాలిక్‌తో, ‘నీ గురించి ఇలా తెలిసింది, దాని వాస్తవం ఏమిటి?’ అని అడిగారు. దానికి అతడు, ‘నా గురించి తమకు ఏం తెలిసింది? ‘ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు ఫలానా వ్యక్తి బానిసరాలితో వ్యభిచరించావట,’ అని అన్నారు. దానికి అతడు, ‘అవును అని నాలుగు సార్లు ఒప్పుకున్నాడు.’ అప్పుడు అతన్ని రజ్మ్ చేయమని ప్రవక్త (స) ఆదేశించారు. అనంతరం అతన్ని రజ్మ్ చేయడం జరిగింది. (ముస్లిమ్)
3567 – [ 13 ] ( لم تتم دراسته ) (2/1061)
وَعَنْ يَزِيْدَ بْنِ نُعَيْمٍ عَنْ أَبِيْهِ أَنَّ مَاعِزًا أَتَى النَّبِيَّ صلى الله عليه وسلم فَأَقَرَّ عِنْدَهُ أَرْبَعَ مَرَّاتٍ فَأَمَرَ بِرَجْمِهِ. وَقَالَ لِهَزَّالٍ: “لَوْ سَتَرْتَهُ بِثَوْبِكَ كَانَ خَيْرًا لَكَ”. قَالَ ابْنُ الْمُنْكَدِرِ: إِنَّ هِزَّالًا أَمَرَ مَاعِزًا أَنْ يَّأْتِيَ النَّبِيَّ صلى الله عليه وسلم فَيُخْبِرَهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3567. (13) [2/1061–అపరిశోధితం]
యజీద్ బిన్ నయీమ్ తన తండ్రి ద్వారా కథనం: మాయిజ్ ప్రవక్త (స) వద్దకు వచ్చి, నాలుగుసార్లు తప్పు ఒప్పు కున్నాడు. ప్రవక్త (స) అతన్ని రజ్మ్ చేయమని ఆదేశించారు. ఆ తరువాత హజ్జాల్‌తో, ”నువ్వు అతన్ని నీ బట్టలతో దాచివేస్తే బాగుండేది. అంటే అతని తప్పు బయట పెట్టకుండా ఉంటే నీకు శుభం చేకూరి ఉండేది అని ప్రవక్త (స) అన్నారు.
ఇబ్నె మున్‌కదిర్ ఉల్లేఖనకర్త కథనం: హజ్జుల్ మాయిజ్‌ను ప్రవక్త (స) వద్దకు వెళ్ళి జరిగింది చెప్పమని అన్నాడు. అతడు జరిగినదంతా ప్రవక్త (స) కు తెలియజేసాడు. [4] (అబూ దావూద్)
3568 – [ 14 ] ( لم تتم دراسته ) (2/1061)
وَعَنْ عَمْرِوبْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ عَبْدِ اللهِ بْنِ عَمْرِوبْنِ الْعَاصِ رَضِيَ اللهُ عَنْهُمَا أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “تَعَافُوا الْحُدُوْدَ فِيْمَا بَيْنَكُمْ فَمَا بَلَغَنِيْ مِنْ حَدٍّ فَقَدْ وَجَبَ”. رَوَاهُ أَبُوْدَاودَ وَالنَّسَائِيُّ
3568. (14) [2/1061– అపరిశోధితం]
అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి, తాత అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు పరస్పర శిక్షలను (తప్పులను) పరస్పరం క్షమించివేయండి, నా దాకా తీసుకు రాకండి. ఎందుకంటే నా దాకా వస్తే మాత్రం ధర్మబద్ధమైన శిక్ష తప్పని సరి అవుతుంది.” (అబూ దావూద్, నసాయి)
3569 – [ 15 ] ( لم تتم دراسته ) (2/1061)
وَعَنْ عَائِشَة أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “أَقِيْلُوْا ذَوِي الْهَيْآَتِ عَثَرَاتِهِمْ إِلَّا الْحُدُوْدَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ
3569. (15) [2/1061–అపరిశోధితం]
ఆయిషహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మంచి వాళ్ళ సజ్జనుల తప్పుల్ని మన్నించి వేయండి. కాని దైవశిక్షలను మాత్రం క్షమించకండి.” [5] (అబూ దావూద్)
3570 – [ 16 ] ( لم تتم دراسته ) (2/1061)
وَعَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِدْرَؤُا الْحُدُوْدَ عَنِ الْمُسْلِمِيْنَ مَا اسْتَطَعْتُمْ فَإِنْ كَانَ لَهُ مَخْرَجٌ فَخَلُّوْا سَبِيْلَهُ فَإِنَّ الْإِمَامَ أَنْ يُّخْطِئَ فِي الْعَفْوِ خَيْرٌ مِّنْ أَنْ يَّخْطِئَ فِي الْعُقُوْبَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ
وَقَالَ: قَدْ روِيَ عَنْهَا وَلَمْ يُرْفَعْ وَهُوَ أَصَحُّ.
3570. (16) [2/1061–అపరిశోధితం]
ఆయిషహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సాధ్యమై నంత వరకు ముస్లిముల తప్పులను పొరపాట్లను క్షమించివేయండి. క్షమించడానికి ఎటువంటి అవకాశం ఉన్నా వదలకండి. ఎందుకంటే శిక్షించడంలో పాలకుని వల్ల పొరపాటు జరగటం కంటే క్షమించడంలో పాలకుని వల్ల పొరపాటు జరగటం మంచిది.” (తిర్మిజి’)
3571 – [ 17 ] ( لم تتم دراسته ) (2/1061)
وَعَنْ وَائِلِ بْنِ حُجْرٍ قَالَ: اسْتُكْرِهَتِ امْرَأَةٌ عَلَى عَهْدِ النَّبِيِّ صلى الله عليه وسلم فَدَرَأ عَنْهَا الْحَدَّ وَأَقَامَهُ عَلَى الَّذِيْ أَصَاَبَهَا وَلَمْ يَذْكُرْ أَنَّهُ عَلَ لَهَا مَهْرًا. روَاهُ التِّرْمِذِيُّ.
3571. (17) [2/1061 –అపరిశోధితం]
వాయిల్ బిన్ హుజ్ ర్ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో ఒక స్త్రీతో బలవంతంగా వ్యభిచారం చేయడం జరిగింది. అప్పుడు ప్రవక్త (స) ఆ స్త్రీ శిక్షను రద్దుచేసారు. ఆమెతో వ్యభిచారం చేసిన వ్యక్తిని ధర్మబద్ధమైన శిక్ష విధించారు. (తిర్మిజి’)
3572 – [ 18 ] ( صحيح ) (2/1061)
وَعَنْهُ: أَنَّ امْرَأَةَ خَرَجَتْ عَلَى عَهْدِ النَّبِيِّ صلى الله عليه وسلم تُرِيْدُ الصَّلَاةَ فَتَلقَّاهَا رَجُل فَتَجَلَّلَهَا فَقَضَى حَاجَتَهُ مِنْهَا فَصَاحَتْ وَانْطَلَقَ وَمَرَّتْ عِصَابَةٌ مِّنَ الْمُهَاجِرِيْنَ فَقَالَتْ: إِنَّ ذَلِكَ الرَّجُلَ فَعَلَ بِيْ كَذَا وَكَذَا فَأَخَذُوْا الرَّجُلَ فَأَتَوْا بِهِ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ لَهَا: “اِذْهَبِيْ فَقَدْ غَفَرَ اللهُ لَكِ”. وَقَالَ لِلرَّجُلِ الَّذِيْ وَقَعَ عَلَيْهَا: “ارْجُمُوْهُ”. وَقَالَ: “لَقَدْ تَابَ تَوْبَةً لَوْ تَابَها أَهْلُ الْمَدِيْنَةِ لَقُبِلَ مِنْهُمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ
3572. (18) [2/1061–దృఢం]
వాయిల్ బిన్ హుజ్ ర్ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో ఒకస్త్రీ నమాజుకు వెళ్ళే ఉద్దేశ్యంతో ఇంటి నుండి బయటకు వెళ్ళింది. ఒక వ్యక్తి ఆమెను పట్టుకున్నాడు. తన బట్టలతో ఆమెను కప్పిపుచ్చి వ్యభిచరించాడు. అంటే బలవంతంగా చేసాడు. ఆ స్త్రీ కేకలు వేసింది. అతడు మానభంగం చేసి పారిపోయాడు. ముహాజిరీన్ల ఒక బృందం అటుగా వచ్చింది. ఆమె జరిగినదంతా వారికి విన్నవించుకుంది. ప్రజలు ఆ వ్యక్తిని పట్టుకొని ప్రవక్త (స) వద్దకు తెచ్చారు. ఆ స్త్రీ కూడా వచ్చింది. అంతా విన్న తరువాత ప్రవక్త (స) ఆ స్త్రీతో నువ్వు వెళ్ళు, నిన్ను అల్లాహ్(త) క్షమించాడని అన్నారు. మానభంగం చేసిన ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి రజ్మ్ చేయండని అన్నారు. అతన్ని రజ్మ్ చేయడం జరిగింది. ఆ తరువాత ప్రవక్త (స) అతని గురించి ప్రస్తావిస్తూ, ‘అతడు ఎలా పశ్చాత్తాపం చెందాడంటే, మదీనహ్ వాళ్ళు కూడా అలా పశ్చాత్తాపపడితే వారిని క్షమించడం జరిగేది,’ అని అన్నారు. [6] (తిర్మిజి’, అబూ దావూద్).
3573 – [ 19 ] ( لم تتم دراسته ) (2/1062)
وَعَنْ جَابِرٍ: أَنَّ رَجُلًا زَنَى بِامْرَأَةٍ فَأَمَرَ بِهِ النَّبِيُّ صلى الله عليه وسلم فَجُلِدَ الْحَدَّ ثُمَّ أُخْبِرَأَنَّهُ مُحْصَنٌ فَأَمَرَبِهِ فَرُجِمَ.رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3573. (19) [2/1062 –అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ఒక వ్యక్తి ఒకస్త్రీతో వ్యభిచారం చేసాడు. అప్పుడు ప్రవక్త (స) అతనికి కొరడా దెబ్బలు కొట్టమని ఆదేశించారు. అతడు వివాహితుడని తెలియజేయటం జరిగింది. ప్రవక్త (స) అతన్ని రజ్మ్ చేయమని ఆదేశించారు. అతన్ని రజ్మ్ చేయటం జరిగింది. (అబూ దావూద్)
3574 – [ 20 ] ( لم تتم دراسته ) (2/1062)
وَعَنْ سَعِيْدِ بْنِ سَعْدِ بْنِ عُبَادَةَ أَنَّ سَعْدَ بْنَ عُبَادَةَ أَتَى النَّبِيّ صلى الله عليه وسلم بِرَجُلٍ كَانَ فِي الحَيِّ مُخْدَجٍ سَقِيْمٍ فَوُجِدَ عَلَى أَمَةٍ مِنْ إِمَائِهِمْ بَخْبُثُ بِهَا فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “خُذُوْا لَهُ عِثْكَالًا فِيْهِ مِائَةً شِمْرَاخٍ فَاضْرِبُوْهُ ضَرْبَةً”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ وَفِيْ رِوَايَةِ ابْنِ مَاجَهَ نَحْوَهُ
3574. (20) [2/1062– అపరిశోధితం]
సయీద్ బిన్ సఅద్ బిన్ ఉబాదహ్ (ర) కథనం: సఅద్ బిన్ ఉబాదహ్ ఒక వ్యక్తిని పట్టుకొని ప్రవక్త (స) వద్దకు తెచ్చారు. ఆ వ్యక్తి చాలా బలహీనంగా, అనారోగ్యంగా ఆరోగ్యం పొందలేని విధంగా ఉన్నాడు. అతడు వీధిలోని బానిసరాళ్ళ లోని ఒక బానిసరాలితో వ్యభిచరించాడు. అతడు అవివా హితుడు. ప్రవక్త (స) సఅద్ బిన్ ఉబాదహ్‌తో 100 చిన్న చిన్న కొమ్మలు ఉన్న ఒక ఖర్జూరం కొమ్మను తీసుకురమ్మని, దానితో కొరడా దెబ్బలు కొట్టే సంకల్పంతో ఒకసారి కొట్టమని, దాని ద్వారా శిక్షించి నట్టవుతుందని అన్నారు. అలాగే చేయడం జరిగింది.[7](ఇబ్నె మాజహ్, షర్హుస్సున్నహ్)
3575 – [ 21 ] ( حسن ) (2/1063)
وَعَنْ عِكْرَمَةَ عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ وَجَدْتُّمُوْهُ يَعْمَلُ عَمَلَ قَوْمِ لُوْطٍ فَاقْتُلُوْا الْفَاعِلَ وَالْمَفْعُوْلَ بِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ
3575. (21) [2/1063–ప్రామాణికం]
ఇక్రమ, ఇబ్నె అబ్బాస్ (ర)ల ద్వారా కథనం: ప్రవక్త (స) ఆదేశం: ”మీలో ఎవరైనా లూత్ పాపకార్యాలకు అంటే స్వలింగ సంపర్కానికి పాల్పడితే, చేసేవాడిని, చేయించుకునే వాడిని ఇద్దరినీ చంపివేయండి.” [8] (తిర్మిజి, ఇబ్నె మాజహ్)
3576 – [ 22 ] ( لم تتم دراسته ) (2/1063)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَتَى بَهِيْمَةً فَاقْتُلُوْهُ وَاقْتُلُوْهَا مَعَهُ”. قِيْلَ لِاِبْنِ عَبَّاسٍ: مَا شَأْنُ الْبَهِيْمَةِ؟ قَالَ: مَا سَمِعْتُ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ ذَلِكَ شَيْئًا وَلَكِنْ أَرَهُ كَرِهَ أَن يُّؤْكَلَ لَحْمُهَا أَوْ يُنْتَفَعَ بِهَا وَقَدْ فُعِلَ بِهَا ذَلِكَ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .
3576. (22) [2/1063 –అపరిశోధితం]
ఇబ్నె అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఎవరైనా జంతువుతో లైంగిక చర్యకు పాల్పడితే, అతన్ని ఆ జంతువును చంపివేయండి. ఇందులో జంతువు తప్పు ఏంటని ఇబ్నె అబ్బాస్‌ను ప్రశ్నించడం జరిగింది. దానికి అతడు, ‘దీన్ని గురించి ఏమీ వినలేదని, అయితే నా అభిప్రాయం ఏమిటంటే ఆ జంతువుతో అలా చేయడం వల్ల, దాని మాంసం తినడం, లేదా దాని పాలుత్రాగడం అసహ్యకరంగా ఉంటుంది,’ అని అన్నారు. (తిర్మిజి, అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
3577 – [ 23 ] ( لم تتم دراسته ) (2/1063)
عَنْ جَابِرٍقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَخْوَفَ مَا أَخَافُ عَلَى أُمَّتِيْ عَمَلُ قَوْمِ لُوْطٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ
3577. (23) [2/1063– అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను నా అనుచర సమాజం పట్ల స్వలింగ సంపర్కం గురించి చాలా భయపడుతున్నాను. లూత్ జాతి చేసినట్లు నా జాతి ఎక్కడ పాల్పడుతుందోనని నాకు చాలా భయంగా ఉంది.” (తిర్మిజి, ఇబ్నె మాజహ్)
3578 – [ 24 ] ( لم تتم دراسته ) (2/1063)
وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ رَجُلًا مِّنْ بَنِيْ بَكْرِ بْنِ لَيْثٍ أَتَى النَّبِيُّ صلى الله عليه وسلم فَأَقَرَّ أَنَّهُ زَنَى بِامْرَأةٍ أَرْبَعَ مَرَّاتٍ فَجَلَدَهُ مِائَةً وَكَانَ بِكْرًا ثُمَّ سَأَلَهُ الْبَيِّنَةَ عَلَى الْمَرْأَةِ فَقَالَتْ: كَذَبَ وَاللهِ يَا رَسُوْلَ اللهِ فَجُلِدَ حَدَّ الْفِرْيَةِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3578. (24) [2/1063 –అపరిశోధితం]
ఇబ్నె అబ్బాస్ (ర) కథనం: బనీ బక్ర్ బిన్ లైస్ తెగకు చెందిన ఒక వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి నేను వ్యభిచారం చేసానని నాలుగు సార్లు ఒప్పుకున్నాడు. అతడు అవివాహితుడు. ప్రవక్త (స) అతనికి 100 కొరడా దెబ్బలు వేయించటం జరిగింది. ఆ తరువాత ప్రవక్త (స) ఆ స్త్రీని విచారించారు. ఆమె దైవం సాక్షి అతడు అసత్యం పలుకుతున్నాడు, అని, సాక్ష్యాధారాలు కూడా ముందుంచింది. అప్పుడు ఆ వ్యక్తికి అపనిందమోపి నందుకు 80 కొరడా దెబ్బలు కొట్టటం జరిగింది.[9] (అబూ దావూద్)
3579 – [ 25 ] ( لم تتم دراسته ) (2/1063)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: لَمَّا نَزَلَ عُذْرِيْ قَامَ النَّبِيُّ صلى الله عليه وسلم عَلَى الْمِنْبَرِ فَذَكَرَ ذَلِكَ فَلَمَّا نَزَلَ مِنَ الْمِنْبَرِ أَمَرَ بِالرَّجُلَيْنِ وَالْمَرْأةِ فَضُرِبُوْا حَدَّهُمْ. رَوَاهُ أَبُوْ دَاوُدَ
3579. (25) [2/1063 –అపరిశోధితం]
ఆయిషహ్ (ర) కథనం: నేను నిరపరాధినని ఖుర్‌ఆన్ వాక్యాలు అవతరించబడినప్పుడు ప్రవక్త (స) మెంబర్‌పై నిలబడి ప్రసంగించారు. మెంబరు దిగిన తర్వాత ఇద్దరు పురుషులను, ఒక స్త్రీని అపనింద వేసినందుకుగాను శిక్షించడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికీ 80 కొరడా దెబ్బలు కొట్టటం జరిగింది. (అబూ దావూద్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3580 – [ 26 ] ( صحيح ) (2/1064)
عَنْ نَافِعٍ: أَنَّ صَفِيَّةَ بِنْتَ أَبِيْ عُبَيْدٍ أَخْبَرَتْهُ أَنَّ عَبْدًا مِّنْ رَقِيْقِ الْإِمَارَةِ وقَعَ عَلَى وَلِيْدَةٍ مِّنَ الْخُمْسِ فَاسْتَكْرَهَهَا حَتّضى افْتَضُّهَا فَجَلَدَهُ عُمَرُ وَلَمْ يَجْلِدْهَا مِنْ أَجَلِ أَنَّهُ اسْتَكْرَهَهَا. رَوَاهُ الْبُخَارِيُّ
3580. (26) [2/1064– దృఢం]
నాఫె (ర) కథనం: సఫియ్య బిన్‌తె అబీ ఉబైద్ కథనం: అమీరు సేవకుల్లో ఒక సేవకుడు యుద్ధ బూటీలోని బానిస రాలితో బలవంతంగా వ్యభిచారం చేసాడు. ఆమె కన్నెగా ఉండేది. ఆ వ్యభిచారం వల్ల ఆమె కన్యత్వం నశించింది. ఉమర్ (ర) ఆ బానిసను కొరడా దెబ్బలు కొట్టారు. బానిసరాలికి ఎటువంటి శిక్ష విధించలేదు. ఎందుకంటే ఆమెతో బలవంతం చేయడం జరిగింది. (బు’ఖారీ)
3581 – [ 27 ] ( حسن ) (2/1064)
وَعَنْ يَزِيْدَ بْنِ نُعَيْمِ بْنِ هَزَّالٍ عَنْ أَبِيْهِ قَالَ: كَانَ مَاعِزُ بْنُ مَالِكٍ يَتِيْمًا فِيْ حَجْرِ أَبِيْ فَأَصَابَ جَارِيَةً مِّنَ الْحَيِّ فَقَالَ لَهُ أَبِيْ: اِئْتِ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَأَخْبِرْهُ بِمَا صَنَعْتَ لَعَلَّهُ يَسْتَغْفِرُ لَكَ وَإِنَّمَا يُرِيْدُ بِذَلِكَ رَجَاءَ أَن يَّكُوْنَ لَهُ مَخْرَجَا فَأَتَاهُ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَنِيي زَنَيْتُ فَأَقِمْ عَلَيَّ كِتَابَ اللهِ حَتَّى قَالَهَا أَرْبَعَ مَرَّاتٍ. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: إِنَّكَ قَدْ قُلتَهَا أربَعَ مَرَّاتٍ فَبِمَنْ؟” قَالَ: بِفَلَانَةٍ. قَالَ: “هَلْ ضَاجَعتَهَا؟” قَالَ: نَعَمْ. قَالَ: “هَلْ بَاشَرْتَهَا؟” قَالَ: نَعَمْ. قَالَ: “هَلْ جَامَعْتَهَا؟” قَالَ: نَعَمْ. قَالَ: فَأَمَرَ بِهِ أَنْ يُّرْجَمَ فَأُخْرِجَ بِهِ إِلَى الْحَرَّةِ فَلَمَّا رُجِمَ فَوَجَدَ مَسَّ الْحِجَارَةِ فَجَزِعَ فَخَرَجَ يَشْتَدُّ فَلَقِيَهُ عَبْدُ اللهِ بْنِ أُنَيْسٍ وقَدْ عجزَ أَصْحَابُهُ فَنَزَعَ لَهُ بِوَظِيْفِ بَعِيْرٍ فَرَمَاهُ بِهِ فَقَتَلَهُ ثُمَّ أَتَى النَّبِيَّ صلى الله عليه وسلم فَذَكَرَ ذَلِكَ لَهُ. فَقَالَ: “هَلَّا تَرَكْتُمُوْهُ لَعَلَّهُ أَنْ يَّتُوْبَ. فَيَتُوْبَ اللهُ عَلَيْهِ”. روَاهُ أَبُوْ دَاوُدَ.
3581. (27) [2/1064– ప్రామాణికం]
యజీద్ బిన్ నుఐమ్ బిన్ హజ్జాల్ తన తండ్రి ద్వారా కథనం: మాయిజ్ బిన్ మాలిక్ ఒక అనాథ. మా తండ్రిగారి సంరక్షణలో పెరిగి యుక్త వయస్సుకు చేరిన తర్వాత ఆ వీధికే చెందిన ఒక బానిసరాలితో వ్యభిచారం చేసాడు. మా తండ్రిగారు అతనితో, ‘నువ్వు ప్రవక్త (స) వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని గురించి తెలియపర్చు, ప్రవక్త (స) నీ గురించి దు’ఆ, ఇస్తిగ్‌ఫార్ చేయవచ్చు,’ అని అన్నారు. మా తండ్రి ఉద్దేశం అదే. మా తండ్రిగారి మాటపై మాయిజ్ ప్రవక్త (స) వద్దకు వెళ్ళాడు. ‘ఓ ప్రవక్తా! నేను వ్యభిచారం చేసాను, నాపై దైవశిక్ష విధించండి,’ అని అన్నాడు. ప్రవక్త (స) అతని వైపునుండి ముఖం త్రిప్పుకున్నారు. అతడు రెండవ వైపు కూడా వచ్చాడు. మళ్ళీ అలాగే అన్నాడు. ఈ విధంగా నాలుగుసార్లు తన తప్పును ఒప్పుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు నాలుగుసార్లు ఒప్పుకున్నావు. ఎవరితో చేసావు ఏంటి?’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘ఫలానా స్త్రీతో,’ అని అన్నాడు. మళ్ళీ ప్రవక్త (స), ‘నువ్వు ఆమెను పడుకోబెట్టావా,’ అని అడిగారు. దానికి అతడు, ‘అవును’ అని అన్నాడు. మళ్ళీ ప్రవక్త (స), ‘నువ్వు ఆమెను ముట్టుకున్నావా? ఆమె శరీ రాన్ని నీ శరీరంతో తాకావా?’ అని అడిగారు. దానికి అతడు ‘అవును,’ అని అన్నాడు. మళ్ళీ ప్రవక్త (స), ‘నువ్వు నిజంగా సంభోగించావా?’ అని అడిగారు. దానికి అతడు, ‘అవును,’ అని అన్నాడు. ఆ తరువాత ప్రవక్త (స) అతన్ని రజ్మ్ చేయమని ఆదేశించారు.
అతన్ని మదీనహ్ బయట రాళ్ళ మైదానంలోనికి తీసుకు వెళ్ళారు. రజ్మ్ చేయడం ప్రారంభించారు. రాళ్ళు తగలటం ప్రారంభం కాగానే గాయాలు భరించలేక అటూ ఇటూ పారి పోసాగాడు. ప్రజలు అతన్ని పట్టుకోలేక పోయారు. అప్పుడు అబ్దుల్లాహ్ బిన్ ఉనైస్ ఒంటె కాలి దుమ్ముతో అతన్ని కొట్టారు. అతడు చనిపోయాడు. అబ్దుల్లాహ్ బిన్ ఉనైస్ ప్రవక్త (స) వద్దకు వచ్చి జరిగింది చెప్పారు. అప్పుడు ప్రవక్త (స) మీరు అతన్ని వదలివేయలేదెందుకు? అతడు తౌబహ్ చేసుకొని ఉండేవాడు. అల్లాహ్ అతన్ని క్షమించి ఉండేవాడు అని అన్నారు.(అబూ దావూద్)
3582 – [ 28 ] ( لم تتم دراسته ) (2/1064)
وَعَنْ عَمْرِو بْنِ الْعَاصِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يقول: “مَا مِنْ قَوْمٍ يَّظْهَرُ فِيْهِمُ الزِّنَا إِلَّا أُخِذُوْا بِالسِّنَةِ وَمَا مِنْ قَوْمٍ يَّظْهَرُ فِيْهِمُ الرُّشَا إِلَّا أُخِذُوْا بِالرُّعْبِ”. رَوَاهُ أَحْمَدُ.
3582. (28) [2/1064 –అపరిశోధితం]
అమ్ర్ బిన్ ఆస్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”ఏ జాతిలోని ప్రజలు వెచ్చల విడిగా వ్యభిచారానికి పాల్పడతారో, ఆ జాతిని కరువు కాటకాల ద్వారా శిక్షించడం జరుగుతుంది. అదేవిధంగా ఏజాతిలో లంచగొండితనం సర్వ సామాన్యం అయిపోతుందో ఆ జాతిని భయాందోళనల ద్వారా శిక్షించడం జరుగుతుంది.[10](అహ్మద్)
3583 – [ 29 ] ( لم تتم دراسته ) (2/1065)
وَعَنِ ابْنِ عَبَّاسٍ وَأَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَلْعُوْنٌ مَنْ عَمِلَ عَمَلَ قَوْمِ لُوْطٍ “. رَوَاهُ رَزِيْنٌ
3583. (29) [2/1065 అపరిశోధితం]
ఇబ్నె అబ్బాస్ (ర), అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”లూత్ జాతి పాపాలకు పాల్పడిన వాడు శాపానికి గురవుతాడు.” (ర’జీన్)
3584 – [ 30 ] ( لم تتم دراسته ) (2/1065)
وَفِيْ رِوَايَةٍ لَهُ عَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ عَلِيًّا رَضِيَ اللهُ عَنْهُ أَحْرَقَهُمَا وَأَبَا بَكْرٍ هَدَمَ عَلَيْهِمَا حَائِطًا.
3584. (30) [2/1065 –అపరిశోధితం]
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: అలీ (ర) చేసే వాడిని చేయించుకునే వాడిని ఇద్దరినీ కాల్చివేసారు. అబూ బకర్ (ర) ఇద్దరిపై గోడ పడవేయమని ఆదేశించారు.
3585 – [ 31 ] ( لم تتم دراسته ) (2/1065)
وَعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا يَنْظُرُ اللهُ عَزَّ وَجَلَّ إِلَى رَجُلٍ أَتَى رَجُلًا أَوْ اِمْرَأَةً فِيْ دُبُرِهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ
3585. (31) [2/1065 –అపరిశోధితం]
ఇబ్ను అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, పురుషునితో స్వలింగ సంపర్కం చేసుకునేవాడ్ని, స్త్రీతో ఆమె మలద్వారం ద్వారా సంభోగించిన వారిని అల్లాహ్ (త) కారుణ్యదృష్టితో చూడడు. (తిర్మిజి’ /, ప్రామాణికం, ఏకోల్లేఖనం)
3586 – [ 32 ] ( لم تتم دراسته ) (2/1065)
وَعَنْهُ أَنَّهُ قَالَ: “مَنْ أَتَى بَهِيْمَةُ فَلَا حَدَّ عَلَيْهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ
وَقَالَ التِّرْمِذِيُّ: عَنْ سُفْيَانَ الثَّوْرِيِّ أَنَّهُ قَالَ: وَهَذَا أَصَحُّ مِنَ الْحَدِيْثِ الْأَوَّلِ وَهُوَ: “مَنْ أَتَى بَهِيْمَةً فَاقتلُوْهُ”. وَالْعَمَلُ عَلَى هَذَا عِنْدَ أَهْلِ الْعِلْمِ .
3586. (32) [2/1065 –అపరిశోధితం]
ఇబ్నె అబ్బాస్ (ర) కథనం: జంతువుతో లైంగిక చర్యకు పాల్పడిన వారికి ధర్మచట్టపరమైన శిక్ష ఏదీ లేదు. (తిర్మిజి’, అబూ దావూద్)
తిర్మిజి’ అభిప్రాయం: ఈ ‘హదీసు’ మొదటి ‘హదీసు’ కంటే ప్రామాణికమైనది. అందులో జంతువుతో చెడుకు పాల్పడిన వారిని చంపివేయాలి అని ఉంది. పండితులు దీన్నే అనుసరిస్తున్నారు.
3587 – [ 33 ] ( جيد ) (2/1065)
وَعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَقِيْمُوْا حُدُوْدَ اللهِ فِي الْقَرِيْبِ وَالْبَعِيْدِ وَلَاَ تَأْخُذُكُمْ فِي اللهِ لَوْمَةُ لَائِمٍ”. رَوَاهُ ابْنُ مَاجَهُ .
3587. (33) [2/1065– ఆమోదయోగ్యం]
ఉబాదహ్ బిన్ సామిత్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు అల్లాహ్ శిక్షలను అమలుపరచండి. వారు మీ దగ్గరి బంధువులైనా దూరపు బంధువులైనా సరే. అందరిపై అల్లాహ్ (త) శిక్షలను అమలు పరచండి. ఈ విషయాల్లో విమర్శలను లక్ష్యపెట్టకండి. (ఇబ్నె మాజహ్)
3588 – [ 34 ] ( جيد ) (2/1065)
وَعَنِ ابْنِ عُمَرَأَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِقَامَةُ حَدٍّ مِنْ حُدُوْدِ اللهِ خَيْرُمِّنْ مَطَرِأَرْبَعِيْنَ لَيْلَةً فِيْ بِلَادِ اللهِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ
3588. (34) [2/1065 –ఆమోదయోగ్యం]
ఇబ్నె ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, నలభై రోజుల నిరంతరం భూమిపై వర్షం పడటంకంటే అల్లాహ్ శిక్షల్లోని ఒక శిక్షను అమలుపరచటం మంచిది. (ఇబ్నె మాజహ్)
3589 – [ 35 ] ( جيد ) (2/1065)
وَرَوَاهُ النَّسَائِيُّ عَنْ أَبِيْ هُرَيْرَةَ.
3589. (35) [2/1065– ఆమోదయోగ్యం]
దీన్నే నసాయి, అబూ హురైరహ్(ర) ద్వారా ఉల్లేఖించారు.[11]
=====
1- بَابُ قَطْعِ السَّرَقَةِ
1. దొంగతనానికి శిక్ష
భద్రంగా ఉన్న వస్తువును యజమాని అనుమతి లేకుండా తీసుకోవటాన్ని దొంగతనం అంటారు. ఇది చాలా నీచమైన పని. ఇటువంటి ధనం నిషిద్ధం. దొంగ తనానికి ఇహపర లోకాల్లో కఠిన శిక్ష ఉంది. ఇహలోకంలో చేతిని నరకటం జరుగుతుంది. తీర్పుదినం నాడు నరకంలో వేయబడతాడు. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఆదేశం: ”మరియు పురుషుడు దొంగ అయినా, లేదా స్త్రీ దొంగ అయినా, వారి చేతులను నరికివేయండి. ఇది వారి కర్మలకు గుణపాఠంగా, అల్లాహ్ నిర్ణ యించిన ప్రతిఫలం (శిక్ష). మరియు అల్లాహ్ సర్వశక్తి మంతుడు, మహా వివేచనాపరుడు.” (అల్ మాయి’దహ్, 5:38)
‘హదీసు’ల్లో దొంగతనానికి చాలా కఠిన శిక్షలు పేర్కొన బడ్డాయి. వాటిని క్రింద పేర్కొనటం జరిగింది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3590 – [ 1 ] ( متفق عليه ) (2/1066)
عَنْ عَائِشَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا تُقْطَعُ يَدُ السَّارِقِ إِلَّا بِرُبْعِ دِيْنَارٍ فَصَاَعِدًا”. متفق عليه.
3590. (1) [2/1066 –ఏకీభవితం]
ఆయిషహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దీనార్లో నాల్గవవంతు లేదా అంతకంటే ఎక్కువ దొంగతనం చేసినవారి చేయి నరకబడుతుంది. [12] (బుఖారీ, ముస్లిమ్)
3591 – [ 2 ] ( متفق عليه ) (2/1066)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَطَعَ النَّبِيُّ صلى الله عليه وسلم يَدَ سَارِقٍ فِيْ مِجَنٍّ ثَمَنُهُ ثَلَاثَةُ دَرَاهِمَ. متفق عليه.
3591. (2) [2/1066- ఏకీభవితం]
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక ఢాలు దొంగలించిన దొంగ చేయి నరికించారు. దాని ఖరీదు మూడు దిర్‌హమ్‌లు.[13] (బుఖారీ, ముస్లిమ్)
3592 – [ 3 ] ( متفق عليه ) (2/1066)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَعَنَ اللهُ السَّارِقَ يَسْرِقُ الْبَيْضَةَ فَتُقْطَعَ يَدهُ وَيَسْرِقُ الْحَبلَ فَتُقْطَعَ يَدُهُ”.
3592. (3) [2/1066- ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, గ్రుడ్డు దొంగతనం చేసే దొంగను అల్లాహ్ శపించుగాక! అతని చేయి నరికివేయడం జరుగుతుంది, త్రాడు దొంగలిస్తే చేయి నరికివేయడం జరుగుతుంది.[14] (బుఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3593 – [ 4 ] ( لم تتم دراسته ) (2/1066)
عَنْ رَافِعِ بْنِ خَدِيْجٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا قَطْعَ فِيْ ثَمَرٍ وَلَا كَثَرٍ”. رَوَاهُ مَالِكٌ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ وَابْنُ مَاجَهُ
3593. (4) [2/1066 –అపరిశోధితం]
రాఫె బిన్ ఖదీజ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చెట్టుపై ఉన్న పళ్ళను దొంగలిస్తే చేతులు నరకరాదు, ఖర్జూరం తెల్లని దాన్ని దొంగలిస్తే చేతులు నరకరాదు.”[15] (మాలిక్, తిర్మిజి, అబూ దావూద్, నసాయి, దార్మి, ఇబ్నె మాజహ్)
3594 – [ 5 ] ( حسن ) (2/1067)
وَعَنْ عَمْرِوبْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ عَبْدِ اللهِ بْنِ عَمْرِوبْنِ الْعَاصِ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: أَنَّهُ سُئِلَ عَنِ الثَّمَرِ الْمُعَلَّقِ قَالَ: “مَنْ سَرَقَ مِنْهُ شَيْئًا بَعْدَ أَنْ يُؤوِيَهُ الْجَرِيْنُ فَبَلَغَ ثَمَنَ الْمِجَنِّ فَعَلَيْهِ الْقَطْعُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.
3594. (5) [2/1067– ప్రామాణికం]
అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి ద్వారా, తన తాత అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (ర) ద్వారా కథనం: ప్రవక్త (స)ను చెట్టుపై వేలాడుతున్న పళ్ళను దొంగలించడం గురించి అడిగాను. దానికి ప్రవక్త (స), ‘భద్రంగా ఉంచబడి, వాటి ఖరీదు ఒకడాలు ఖరీదుకు చేరితే చేయి నరకడం జరుగుతుంది,’ అని అన్నారు. (అబూ దావూద్, నసాయి)
3595 – [6 ] ( لم تتم دراسته ) (2/1067)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَبْدِ الرَّحْمنِ بْنِ أَبِيْ حُسَيْنِ الْمَكِّيِّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا قَطْعَ فِيْ ثَمَرٍ مُّعَلَّقٍ وَّلَا فِيْ حَرِيْسَةِ جَبَلٍ فَإِذَا آوَاهُ الْمُرَاحُ وَالْجَرِيْنُ فَالْقَطْعُ فِيْمَا بَلَغَ ثَمَنَ الْمِجَنِّ”. رَوَاهُ مَالِكٌ.
3595. (6) [2/1067– అపరిశోధితం]
అబ్దుల్లాహ్ బిన్ అబ్దుర్రహ్మాన్ బిన్ అబీ హుసైన్ మక్కీహ్ కథనం: ప్రవక్త(స) ప్రవచనం,”చెట్టుపై వ్రేలాడు తున్న పళ్ళను దొంగలిస్తే చేతులు నరకబడవు, అదే విధంగా క్రూర జంతువులను దొంగలించిన చేతులు నరకబడవు. అంటే అడవిలో సంచరిస్తున్న జంతువులను దొంగలిస్తే చేతులు నరక బడవు. అయితే పళ్ళను గాని, జంతువులను గాని భద్రంగా ఉంచిన వాటిని దొంగలిస్తే, వాటి ఖరీదు ఒక ఢాలు ఖరీదుకు చేరితే చేతులు నరకబడతాయి. (మాలిక్)
3596 – [ 7 ] ( لم تتم دراسته ) (2/1067)
وَعَنْ جَابِرٍقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيْسَ عَلَى الْمُنْتَهِبِ قَطْعٌ وَمَنِ انْتَهَبَ نُهْبَةً مَشْهُوْرَةً فَلَيْسَ مِنَّا”. روَاهُ أَبُوْ دَاوُدَ.
3596. (7) [2/1067– అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, దోచుకునే వారి చేతులు నరకబడవు. ”బహిరంగంగా దోచుకునే వాడు ముస్లిమ్ కాడు.” (అబూ దావూద్)
3597 – [ 8 ] ( لم تتم دراسته ) (2/1067)
وَعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَيْسَ عَلَى خَائِنٍ وَلَا مُنْتَهِبٍ وَلَا مُخْتَلِسٍ قَطْعٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.
3597. (8) [2/1067 –అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ద్రోహం చేసే వారి, దోచుకునేవారి, ఎగరేసుకుపోయే వారి చేతులు నరక బడవు.”(తిర్మిజి, నసాయి, ఇబ్నె మాజ, దార్మి)
3598- [ 9 ] ( لم تتم دراسته ) (2/1067)
وَرَوَى فِيْ”شَرْحِ السُّنَّةِ”: أَنَّ صَفْوَانَ بْنَ أُمَيَّةَ قَدِمَ الْمَدِيْنَةَ فَنَامَ فِي الْمَسْجِدِ وَتَوَسّدَ رِدَاءَهُ فَجَاءَ سَارِقٌ وَأَخَذَ رِدَاءَهُ فَأَخَذَهُ صَفْوَانُ فَجَاءَ بِهِ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَأَمَرَ أَنْ تُقْطَعَ يَدُهُ فَقَالَ صَفْوَانُ: إِنِّيْ لَمْ أُرِدْ هَذَا هُوَ عَلَيْهِ صَدَقَةٌ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فَهَلَّا قَبْلَ أَنْ تَأْتِيَنِيْ بِهِ”.
3598. (9) [2/1067 –అపరిశోధితం]
సఫ్వాన్ బిన్ ఉమయ్య మదీనహ్ వచ్చారు. మస్జిద్‌లో పడుకున్నారు. తన దుప్పటిని తలగడగా చేసుకొని పెట్టుకున్నారు. దొంగవచ్చాడు, ఆ దుప్పటిని దొంగలించుకు పోయాడు. సఫ్వాన్ అతన్ని పట్టుకొని ప్రవక్త (స) ముందుకు తీసుకొనివచ్చారు. ప్రవక్త (స) అతని చేతులు నరకమని ఆదేశించారు. అప్పుడు సఫ్వాన్, ‘నేను అలా అని తీసుకురాలేదు. దుప్పటిని అతనికి దానం చేస్తున్నాను. అంటే నేను క్షమిస్తున్నాను,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘నా దగ్గ రకు తీసుకురావ డానికి ముందు ఎందుకు క్షమించి వేయ లేదు,’ అని అన్నారు. (షర్‌హుస్సున్నహ్)
3599 – [ 10 ] ( لم تتم دراسته ) (2/1068)
وَرَوَى نَحْوَهُ ابْنُ مَاجَهُ عَنْ عَبْدِ اللهِ بْنِ صَفْوَانَ عَنْ أَبِيْهِ.
3599. (10) [2/1068– అపరిశోధితం]
అబ్దుల్లాహ్ బిన్ సఫ్వాన్ తన తండ్రి ద్వారా కథనం.[16](ఇబ్నె మాజహ్)
3600 – [ 11 ] ( لم تتم دراسته ) (2/1068)
وَالدَّارَمِيُّ عَنِ ابْنِ عَبَّاسٍ .
3600. (11) [2/1068 –అపరిశోధితం]
ఇబ్నె అబ్బాస్ కథనం (దార్మి).
3601 – [ 12 ] ( صحيح ) (2/1068)
وَعَنْ بُسْرِبْنِ أَرْطَاةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يقول: “لَا تُقْطَعُ الْأَيْدِيْ فِيْ الْغَزْوِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ وَأَبُوْ دَاوُد وَالنَّسَائِيُّ
إِلَّا أَنَّهُمَا قَالَا: “فِي السَّفَرِ”بَدَلَ”الْغَزْوِ”.
3601. (12) [2/1068 –దృఢం]
బుస్‌ర్ బిన్ అర్ తాత్(ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ”యుద్ధంలో దొంగ చేతులు నరకరాదు.” [17] (తిర్మిజి, దార్మి, అబూ దావూద్, నసాయి)
3602 – [ 13 ] ( لم تتم دراسته ) (2/1068)
وَعَنْ أَبِيْ سَلَمَةَ عَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ فِي السَّارِقِ: “إِنْ سَرَقَ فَاقْطَعُوْا يَدَهُ ثُمَّ إِنْ سَرَقَ فَاقْطَعُوْا رِجْلَهُ ثُمَّ إِنْ سَرَقَ فَاقْطَعُوْا يَدَهُ ثُمَّ إِنْ سَرَقَ فَاقْطَعُوْا رِجْلَهُ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.
3602. (13) [2/1068 –అపరిశోధితం]
అబూ సలమహ్, అబూ హురైరహ్ (ర) ద్వారా కథనం: ప్రవక్త (స) దొంగ విషయంలో ఇలా తీర్పు ఇచ్చారు, ”దొంగ దొంగతనం చేస్తే అతని కుడిచేయిని నరకండి. మళ్ళీ దొంగతనం చేస్తే కుడికాలును నరకండి. మళ్ళీ దొంగతనం చేస్తే ఎడమచేతిని నరకండి. మళ్ళీ దొంగతనం చేస్తే ఎడమకాలును నరకండి.” (షరహుస్సున్నహ్)
3603 – [ 14 ] ( لم تتم دراسته ) (2/1068)
وَعَنْ جَابِرٍقَالَ: جِيْءَ بِسَارِقٍ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اقْطَعُوْهُ” فَقُطِعَ ثُمَّ جِيءَ بِهِ الثَّانِيَةَ فَقَالَ: “اقْطَعُوْهُ”فَقُطِعَ ثُمَّ جِيءَ بِهِ الثَّالِثَةَ فَقَالَ: “اقْطَعُوْهُ” . فَقُطِعَ ثُمَّ جِيءَ بِهِ الرَّابِعَةَ. فَقَالَ:”اقْطَعُوْهُ”فَقُطِعَ. فَأُتِيَ بِهِ الْخَامِسَةَ فَقَالَ: “اقْتُلُوْهُ”فَانْطَلَقَنَا بِهِ فَقَتَلْنَاهُ ثُمَّ اجْتَرَرْنَاهُ فَأَلْقَيْنَاهُ فِيْ بِئْرٍ وَرَمَيْنَا عَلَيْهِ الْحِجَارَةَ . رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ
3603. (14) [2/1068 –అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక దొంగను బంధించి తీసుకురావడం జరిగింది. ప్రవక్త (స) అతని కుడిచేయిని నరకమని ఆదేశించారు. ఆ తరువాత రెండవసారి అతడు దొంగతనం చేసాడు. అతని కుడికాలు నరకడం జరిగింది. మూడవసారి దొంగతనం చేసాడు. అతని ఎడమచేయి నరకడం జరిగింది. నాల్గవసారి దొంగతనం చేసాడు, అతని ఎడమకాలు నరకడం జరిగింది. ఆ తరువాత కూడా దొంగతనం చేసాడు. అతన్ని నరికి ఒక బావిలో వేసి అతనిపై రాళ్ళు వేయడం జరిగింది. (అబూ దావూద్, నసాయి)
3604 – [ 15 ] ( لم تتم دراسته ) (2/1068)
وَرَوَي فِيْ شَرْحِ السُّنَّةِ فِي قَطْعِ السَّارِقِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم: “اِقْطَعُوْهُ ثُمَّ احْسِمُوْهُ”.
3604. (15) [2/1068 –అపరిశోధితం]
షర’హ్‌స్సున్నహ్‌లో ఇలా ఉంది: ఆ దొంగ చేయి నరికి రక్తం రాకుండా వాతపెట్టండని అన్నారు. పండితులు ఈ ‘హదీసు’ రద్దు చేయబడిందని అభిప్రాయ పడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా నాలుగుసార్లు తరువాత మళ్ళీ దొంగతనం చేస్తే చంపటం జరగదు. అతన్ని జైలులో వేయడం జరుగుతుంది. ఎందుకంటే మరో ‘హదీసు’లో కేవలం మూడు పాపాలకే చంపటం ధర్మం. 1. ఇస్లామ్‌ను విసర్జించటం, 2. అన్యాయంగా చంపటం, 3. వ్యభిచరించిన వివాహితుడు.
3605 – [ 16 ] ( لم تتم دراسته ) (2/1069)
وَعَنْ فُضَالَةَ بْنِ عُبَيْدٍ قَالَ: أُتِيَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِسَارِقٍ فَقُطِعَتْ يَدَهُ ثُمَّ أَمَرَ بِهَا فَعُلِّقَتْ فِيْ عُنُقِهِ. رَوَاهُ التِّرْمِذيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.
3605. (16) [2/1069 –అపరిశోధితం]
ఫుజాల బిన్ ఉబైద్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక దొంగను తీసుకురావడం జరిగింది. అతని చేయి నరకడం జరిగింది. అతని చేతిని అతని మెడలో వేయమని దీని ద్వారా ఇతరులు గుణపాఠం నేర్చుకుంటారని ప్రవక్త (స) అన్నారు. (తిర్మిజి, నసాయి, అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
3606 – [ 17 ] ( لم تتم دراسته ) (2/1069)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا سَرَقَ الْمَمْلُوْكُ فَبِعْهُ وَلَوْ بَنَشٍّ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.
3606. (17) [2/1069 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బానిస దొంగతనం చేస్తే అతన్ని అమ్మివేయండి. అది ఇరవై దీనార్లకైనా సరే.” (అబూ దావూద్, నసాయి, ఇబ్నె మాజహ్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3607 – [ 18 ] ( لم تتم دراسته ) (2/1069)
عَنْ عَائِشَةَ قَالَتْ: أُتِيَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِسَارِقٍ فَقَطَعَهُ. فَقَالُوْا: مَا كُنَّا نَرَاكَ تَبْلُغُ بِهِ هَذَا قَالَ: “لَوْ كَانَتْ فَاطِمَةُ لَقَطَعْتُهَا”. رَوَاهُ النَّسَائِيُّ .
3607. (18) [2/1069 –అపరిశోధితం]
ఆయిషహ్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక దొంగను తీసుకురావడం జరిగింది. ప్రవక్త (స) అతని చేతిని నరికించారు. దానికి ప్రజలు, ‘తమరు అతని చేతులు నరికిస్తారని మేమనుకోలేదు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ఒకవేళ నా కూతురు ఫాతిమ అయినా సరే, చేతులు నరికివేస్తాను అని అన్నారు. (నసాయి)
అంటే శిక్షించడంలో అందరూ సమానులే. చిన్న పెద్ద, పేద గొప్ప అందరూ సమానులే.
3608 – [ 19 ] ( لم تتم دراسته ) (2/1069)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى عُمَرَ بِغُلَامٍ لَهُ فَقَالَ: اقْطَعْ يَدَهُ فَإِنَّهُ سَرَقَ مِرْآةً لِاِمْرَأَتِيْ. فَقَالَ عُمَرُ رَضِيَ الله عَنْهُ: لَا قَطْعَ عَلَيْهِ وَهُوَ خَادِمُكُمْ أَخَذَ مَتَاعَكُمْ. رَوَاهُ مَالِكٌ.
3608. (19) [2/1069 –అపరిశోధితం]
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (ర) కథనం: ఒక వ్యక్తి తన బానిసను తీసుకుని ఉమర్ (ర) వద్దకు వచ్చాడు. ‘వీడు నా భార్య అద్దం దొంగిలించాడు, ఇతని చేతులు నరకండి,’ అని అన్నాడు. దానికి ఉమర్ (ర), ‘వీడి చేతులు నరకను. వీడు మీ సేవకుడు. ఇతడు మీ ఉపయోగకరమైన వస్తువు తీసుకున్నాడు,’ అని అన్నారు. (మాలిక్)
3609 – [ 20 ] ( لم تتم دراسته ) (2/1069)
وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا أَبَا ذَرٍّ”. قُلْتُ: لَبَّيْكَ يَا رَسُوْلَ اللهِ وَسَعْدَيْكَ. قَالَ: “كَيْفَ أَنْتَ إِذَا أَصَابَ النَّاسَ مَوْتٌ يَكُوْنُ الْبَيْتُ فِيْهِ بِالْوَصِيْفِ”. يَعْنِي الْقَبْرَ قُلْتُ: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: “عَلَيْكَ بِالصَّبْرِ”. قَالَ حَمَّادُ بْنُ أَبي سُلَيْمَانَ: تُقْطَعُ يَدُ النَّبَّاشِ لِأَنَّهُ دَخَلَ عَلَى الْمَيِّتِ بَيْتَهُ. رَوَاهُ أَبُوْ دَاوُد.
3609. (20) [2/1069 –అపరిశోధితం]
అబూ జర్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అన్నారు, ”ఓ అబూ జర్!” ‘నేనిక్కడే ఉన్నాను ఓ ప్రవక్తా!’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స) ఆ సమయాన్ని గురించి ఆలోచించు, మరణాలు అధికంగా సంభ విస్తాయి. అంటే కలరా, ప్లేగు ద్వారా చాలామంది చనిపోతారు. సమాధి స్థలాల ఖరీదు పెరిగిపోతుంది. ఒక బానిస ధరకు ఒక సమాధి స్థలం దొరుకుతుంది. దానికి నేను అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్త (స)కే తెలుసు అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స) ఇటువంటి పరిస్థితుల్లో సహనం పాటించాలి. హమ్మాద్ బిన్ అబీ సులైమాన్ ఈ ‘హదీసు’ ద్వారా ఒకవేళ ఎవరైనా సమాధిలో నుండి కఫన్ దొంగలిస్తే, అతని చెయ్యి నరికివేయాలి అని అభిప్రాయపడ్డారు. (అబూ దావూద్)
=====
2- بَابُ الشَّفَاعَةِ فِي الْحُدُوْدِ
2. శిక్షల విషయంలో సిఫారసు
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3610 – [ 1 ] ( متفق عليه ) (2/1071)
عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا أَنَّ قُرَيْشًا أَهَمَّهُمْ شَأْنُ الْمَرْأَةِ الْمَخْزُوْمِيَّةِ الَّتِيْ سَرَقَتْ فَقَالُوْا: مَنْ يُكَلِّمُ فِيْهَا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم؟ فَقَالُوْا: وَمَنْ يَّجْتَرِئُ عَلَيْهِ إِلَّا أُسَامَةُ بْنُ زَيْد حِبُّ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَكَلَّمَهُ أُسَامَةُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَتَشْفَعُ فِيْ حَدٍّ مِّنْ حُدُوْدِ اللهِ؟” ثُمَّ قَامَ فَاخْتَطَبَ ثُمَّ قَالَ: “إِنَّمَا أَهْلَكَ الَّذِيْنَ قَبْلَكُمْ أَنَّهُمْ كَانُوْا إِذَا سَرَقَ فِيْهِمُ الشَّرِيْفُ تَرَكَوْهُ وَإِذَا سَرَقَ فِيْهِمُ الضَّعِيْفُ أَقَامُوْا عَلَيْهِ الْحَدَّ وَاَيْمُ اللهِ لَوْ أَنَّ فَاطِمَةَ بِنْتَ مُحَمَّدٍ سَرَقَتْ لَقَطَعْتُ يَدَهَا”. مُتَّفَقٌ عَلَيْهِ.
وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ: قَالَتْ: كَانَتِ امْرَأَةٌ مَخْزُوْمِيَّةٌ تَسْتَعِيْرُ الْمَتَاعَ وَتَجْحَدُهُ فَأَمَرَ النَّبِيُّ صلى الله عليه وسلم بِقَطْعٍ يَدِهَا فَأَتَى أَهْلُهَا أُسَامَةَ فَكَلَّمُوْهُ فَكَلَّمَ رَسُوْل اللهِ صلى الله عليه وسلم بِقَطْعِ يَدِهَا فَأَتَى أَهْلُهَا أُسَامَةَ فَكَلَّمُوْهُ فَكَلَّمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْهَا ثُمَّ ذَكَرَ الْحَدِيْثَ بِنَحْوٍ مَا تَقَدَّمَ.
3610. (1) [2/1071–ఏకీభవితం]
ఆయిషహ్ (ర) కథనం: ఖురైష్ ఒక మఖ్‌జూమీ స్త్రీ విషయంలో విచారానికి గురయ్యారు. ఆమె దొంగతనం చేసింది. పట్టుబడి ప్రవక్త (స) వద్దకు తీసుకురావడం జరిగింది. ప్రవక్త (స) ఆ స్త్రీ చేతులు నరకమని ఆదేశిస్తారని, ఒకవేళ ఆమె చేతులు నరకబడితే మన వంశ ప్రతిష్ట మట్టి పాలు అవుతుందని, అందువల్ల ఈమె విషయంలో సిఫా రసు చేస్తే బాగుంటుందని భావించారు. దానికి ప్రజలు ఈ విషయంలో ప్రవక్త (స)కు సిఫారసు చేసే ధైర్యం ఉసామహ్ బిన్ జైద్‌కు తప్ప మరెవరికీ లేదు. ఎందుకంటే ప్రవక్త (స)కు అతనంటే చాలా ముద్దు. ఎటువంటి భయంలేకుండా సిఫారసు చేయగలడని అన్నారు. అనంతరం ప్రజలు ఉసామహ్ ను సిఫారసు చేయడానికి సిద్ధంచేసారు. ఉసామహ్ ఈ విషయం గురించి ప్రవక్త (స)కు విన్నవించుకున్నారు. ప్రవక్త (స) ఆగ్రహం చెంది అల్లాహ్ (త) విధించిన శిక్షల్లోనా నువ్వు సిఫారసు చేస్తున్నావు? [అంటే నువ్వు అల్లాహ్(త) విధించిన శిక్షల్లో సిఫారసు చేయకూడదు] అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) నిలబడి ప్రజల ముందు ఇలా ప్రసంగించారు. ”ఓ ప్రజలారా! మీ పూర్వీకులు ఈ కారణం వల్లనే మార్గభ్రష్టత్వానికి గురయ్యారు. వారిలో గొప్పవారు, ధనవంతులు దొంగతనం చేస్తే వదలి వేసేవారు. పేదలు, బలహీనులు దొంగతనం చేస్తే శిక్షించేవారు. అల్లాహ్‌పై ప్రమాణం చేసి చెబుతున్నాను. ఒకవేళ ఫాతిమహ్ బిన్‌తె ముహమ్మద్ (స) దొంగతనం చేసినా నేను ఆమె చేతులు నరికి వేస్తాను.” [18] (బుఖారీ, ముస్లిమ్)
ముస్లిమ్ ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”ఆయిషహ్ (ర) కథనం: మఖ్‌జూమ్ తెగకు చెందిన ఒక స్త్రీ అవసరార్థం ప్రజల దగ్గర వస్తువులను అడిగేది. ఆ తరువాత తిరస్కరించేది. ప్రవక్త (స) ఆమె చేతులు నరకమని ఆదేశించారు. ఆమె కుటుంబం వారు ఉసామా (ర) వద్దకు వచ్చారు. ఉసామహ్ ను ప్రవక్త (స)కు సిఫారసు చేయమని కోరారు. ఉసామహ్ ప్రవక్త (స)ను ఆమెను క్షమించమని విన్నవించుకున్నారు. ఆ తరువాతి విషయం బుఖారీలో ఉన్నట్లుగానే ఉంది. అంటే ప్రవక్త (స) ఉసామహ్ సిఫారసును స్వీకరించ లేదు. అంతే కాదు, ప్రజలముందు ప్రభావపూరితమైన ప్రసంగం చేసారు. ఈ ప్రసంగం న్యాయం, ధర్మంపై కేంద్రీకృతమై ఉంది. ‘ఒకవేళ ఫాతిమహ్ దొంగతనం చేసినా నేను ఆమె చేతులను కూడా నరికివేస్తాను,’ అని అన్నారు.
సుబ్‌హానల్లాహ్! చూడండి, ఎలా వ్యవహరించారో.
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3611 – [ 2 ] ( لم تتم دراسته ) (2/1072)
عَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ حَالَتْ شَفَاعَتُهُ دُوْنَ حَدٍّ مِّنْ حُدُوْدِ اللهِ فَقَدْ ضَادَ اللهَ وَمَنْ خَاصَمَ فِيْ بَاطِلٍ وَهُوَ يَعْلَمُهُ لَمْ يَزَلْ فِيْ سَخَطِ الله تَعَالى حَتّى يَنْزِعَ. وَمَنْ قَالَ فِيْ مُؤْمِنٍ مَا لَيْسَ فِيْهِ أَسْكَنَهُ اللهُ رَدْغَةَ الْخَبَالٍ حَتَّى يَخْرُجَ مِمَّا قَالَ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ
وَفِيْ رِوَايَةٍ لِلْبَيْهَقِيِّ فِيْ شُعَبِ الْإِيْمَانِ:” مَنْ أُعَانَ عَلَى خُصُوْمَةٍ لا يَدْرِيْ أَحَقٌّ أَمْ بَاطِلٌ فَهُوَ فِيْ سَخَطِ اللهِ حَتَّى يَنْزِعَ”
3611. (2) [2/1072 –అపరిశోధితం]
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ఆదేశిస్తూ ఉండగా నేను విన్నాను, ”అల్లాహ్ విధించిన శిక్షల విషయంలో సిఫారసు చేసి మధ్యవర్తిత్వం వహించి, దైవశిక్షలు అమలుకు ఆటంకం కలుగచేసిన వాడు దైవాన్ని వ్యతిరేకించినట్టే, అల్లాహ్‌తో తలపడినట్టే. అదేవిధంగా అన్యాయంగా అసత్యంగా వివాదాలకు దిగి తన వాదనే వాస్తవమని వాదించే వ్యక్తి దానికి దూరం కానంతవరకు ఎల్లప్పుడూ దైవాగ్రహానికి గురవుతూ ఉంటాడు. అదేవిధంగా ఒక ముస్లిమ్‌లో లేని విషయాన్ని అంటగడితే, అల్లాహ్ (త) అతన్ని రద్’గతుల్ ఖబాల్‌లో పడవేస్తాడు. అంటే నరకంలో నరకవాసుల చీము, నెత్తురు చేరే స్థలం. అయితే పశ్చాత్తాపం చెందితే క్షమిస్తాడు అని ప్రవచించారు. (అహ్మద్, అబూ దావూద్)
బైహఖీలో విశ్వాస అధ్యాయంలో ఇలా ఉంది; సత్యా సత్యాలను, న్యాయాన్యాయాలను తెలుసుకో కుండా సహాయం చేసేవారు వేరు కానంతవరకు అల్లాహ్ ఆగ్రహానికి గురవుతారు.
3612 – [ 3 ] ( لم تتم دراسته ) (2/1072)
وَعَنْ أَبِيْ أُمَيَّةَ الْمَخْزُوْمِيِّ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أُتِيَ بِلِصٍّ قَدِ اعْتَرَفَ اِعْتِرَافًا وَلَمْ يُوْجَدْ مَعَهُ مَتَاعٌ فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا إِخَالُكَ سَرَقْتَ”. قَالَ: بَلَى فَأَعَادَ عَلَيْهِ مَرَّتَيْنِ أَوْ ثَلَاثًا كُلُّ ذَلِكَ يَعْتَرِفُ فَأَمَرَ بِهِ فَقُطِعَ وَجِيْءَ بِهِ فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أسْتَغْفراللهَ وَتُبْ إِلَيْهِ” فَقَالَ: أَسْتَغْفِرُ اللهُ وَأَتُوْبَ إِلَيْهِ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”اَللّهُمَّ تُبْ عَلَيْهِ ” ثَلَاثًا. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ هَكَذَا وَجَدْتُّ فِي الْأُصُوْلِ الْأَرْبَعَةِ وَجَامِعِ الْأُصُوْلِ وَشُعَبِ الْإِيْمَانِ وَمَعَالِمِ السُّنَنِ عَنْ أَبِيْ أُمَيَّةَ
3612. (3) [2/1072– అపరిశోధితం]
అబూ ఉమయ్య మఖ్’జూమీ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక దొంగను తీసుకురావటం జరిగింది. ఆ దొంగ, తన తప్పు ఒప్పుకున్నాడు. అయితే ధనం మాత్రం అతని దగ్గర దొరకలేదు. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు దొంగతనం చేయలేదని నా అనుమానం,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘నేను దొంగతనం చేసాను,’ అని రెండుమూడు సార్లు అన్నాడు. ప్రవక్త (స) అతని చేతులు నరకమని ఆదేశించారు. అనంతరం అతన్ని ప్రవక్త (స) వద్దకు తీసుకు రావటం జరిగింది. ప్రవక్త (స) అతనితో, ‘నువ్వు అల్లాహ్‌ను క్షమాపణ వేడుకో, పశ్చాత్తాపం చెందు,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘అస్తగ్‌ఫిరుల్లాహ్ వ అతూబు ఇలైహ్,’ అని అన్నాడు. అది విని ప్రవక్త (స) అతని గురించి మూడు సార్లు ”అల్లాహుమ్మ తుబ్ ఇలైహి,” అని ప్రార్థించారు. (అబూ దావూద్, నసాయి, ఇబ్నె మాజహ్, దార్మి, షుఅబుల్ ఈమాన్, జామిఉల్ ఉసూల్)
3613 – [ 4 ] ؟ (2/1072)
وَفِيْ نُسَخِ الْمَصَابِيْحِ عَنْ أَبِيْ رِمْثَةَ بِالرَّاءِ وَالثَّاءِ الْمُثَلَّثَةِ بَدْلَ الْهَمْزَةِ وَالْيَاءِ .
3613. (4) [2/1072 ? ]
కొన్ని ప్రతుల్లో అబూరిమ్‌స అని ఉంది.
—–
هَذَا الْبَابُ خَالٍ عَنِ الْفَصْلُ الثَّالِثُ
ఇందులో మూడవ విభాగం లేదు
=====
3- بَابُ حَدِّ الْخَمْرِ
3. మద్యపాన సేవనానికి శిక్ష
సారాయి సేవించడం అంటే అందరికీ తెలుసు. మత్తు పానీయాలు నిషిద్ధం. అది ఎక్కువైనా, తక్కువైనా. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఆదేశం: ”ఓ విశ్వాసులారా! నిశ్చయంగా మద్యపానం, జూదం, బలి పీఠం మీద బలి ఇవ్వటం (అ‘న్సాబ్)మరియు శకునానికై బాణాల ప్రయోగం (అ‘జ్లామ్) ఇవన్నీ కేవలం అసహ్యకరమైన షై’తాన్ చేష్టలు, కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి. నిశ్చయంగా, షై’తాన్ మద్యపానం మరియు జూదం ద్వారా మీ మధ్య విరోధాలు మరియు విద్వేషాలు రేకెత్తించాలని మరియు మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి మరియు నమా’జ్ నుండి తొలగించాలని కోరుతున్నాడు. అయితే మీరిప్పుడైనా మానుకోరా?” (అల్ మాయి’దహ్, 5:90-91)
ఈ ఆయతులలో అల్లాహ్ (త) నిషేధించటానికి గల కారణాలు కూడా వివరించాడు. 1. ఇది షైతాను చేష్ట. 2. దీన్ని త్రాగి త్రాగుబోతులు పరస్పరం పోట్లాడు కుంటారు. 3. మానవున్ని తన బాధ్యతలకు దూరం చేస్తుంది. ఇందులో ఇహలోక నష్టాలతోపాటు పరలోక నష్టాలు కూడా ఉన్నాయి. తాగుబోతులు స్వర్గంలో ప్రవేశించలేరు. విశ్వాసి సారాయి త్రాగినపుడు అతని విశ్వాసం తొలగి పోతుందని ప్రవక్త (స) ప్రవచించారు. (బు’ఖారీ)
ప్రపంచంలో సారాయి త్రాగితే కనీసం 40 లేదా 80 కొరడా దెబ్బల ద్వారా శిక్షించాలి. దీన్ని గురించి వివరంగా క్రింది ‘హదీసు’ల్లో పేర్కొనడం జరిగింది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3614- [ 1 ] ( متفق عليه ) (2/1073)
عَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم ضَرَبَ فِي الْخَمْرِ بِالْجَرِيْدِ وَالنِّعَالِ وَجَلَدَ أَبُوْ بَكْرٍ رَضِيَ اللهُ عَنْهُ أَرْبَعِيْنَ.
3614. (1) [2/1073– ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) త్రాగుబోతును బెత్తం, చెప్పుల ద్వారా శిక్షించారు. అబూ బకర్ (ర) 40 కొరడా దెబ్బలు కొట్టారు. (బుఖారీ, ముస్లిమ్)
3615 – [ 2 ] ( متفق عليه ) (2/1073)
وَفِيْ رِوَايَةٍ عَنْهُ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَضْرِبُ فِي الْخَمْرِ بِالنِّعَالِ وَالْجَرِيْدِ أَرْبَعِيْنَ
3615. (2) [2/1073 –ఏకీభవితం]
మరో ఉల్లేఖనంలో ప్రవక్త (స) త్రాగుబోతును 40 చెప్పు దెబ్బలు లేదా 40 బెత్తాలు కొట్టేవారు.[19] (బుఖారీ, ముస్లిమ్)
3616 – [ 3 ] ( صحيح ) (2/1073)
وَعَنِ السَّائِبِ بْنِ يَزِيْدَ قَالَ: كَانَ يُؤْتَى بِالشَّارِبِ عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَإِمْرَةِ أَبِيْ بَكْرٍ وَصَدْرًا مِنْ خِلَافَةِ عُمَرَ فَنَقُوْمُ عَلَيْهِ بِأَيْدِيْنَا وَنِعَالِنَا وَأَرْدِيَتِنَا حَتَّى كَانَ آخِرُ إِمْرَةِ عُمَرَ فَجَلَدَ أَرْبَعِيْنَ حَتَّى إِذَا عَتَوْا وَفَسَقُوْا جَلَدَ ثَمَانِيْنَ. رَوَاهُ الْبُخَارِيُّ.
3616. (3) [2/1073– దృఢం]
సాయిబ్ బిన్ య’జీద్ (ర) కథనం: ప్రవక్త (స), అబూబకర్, ఉమర్, పరిపాలనా కాలాల్లో త్రాగు బోతును తీసుకువస్తే ప్రజలు నిలబడి తమ చేతులతో, చెప్పులతో, కొరడాలతో అతన్ని కొట్టేవారు. అయితే ‘ఉమర్ (ర) పరిపాలనా చివరి కాలంలో త్రాగుబోతును 40 కొరడా దెబ్బలు కొట్టారు. అయితే సారాయి, దుర్మార్గం అధికమయితే 80 కొరడా దెబ్బలు కొట్టసాగారు. [20] (బు’ఖారీ)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3617 – [ 4 ] ( لم تتم دراسته ) (2/1073)
عَنْ جَابِرٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ شَرِبَ الْخَمْرَ فَاجْلِدُوْهُ. فَإِنْ عَادَ فِي الرَّابِعَةِ فَاقْتُلُوْهُ”. قَالَ: ثُمَّ أُتِيَ النَّبِيُّ صلى الله عليه وسلم بَعْدَ ذَلِكَ بِرَجُلٍ قَدْ شَرِبَ فِي الرَّابِعَةِ فَضَرَبَهُ وَلَمْ يَقْتُلْهُ. رَوَاهُ التِّرْمِذِيُّ
3617. (4) [2/1073– అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సారాయి త్రాగేవారిని కొరడాదెబ్బలు కొట్టండి. ఈ విధంగా నాలుగుసార్లు చేయండి. నాల్గవసారి పట్టుబడితే, అతన్ని చంపివేయండి. ఈ ఆదేశం తరువాత ప్రవక్త(స) వద్దకు ఒక త్రాగుబోతును బంధించి తీసుకురావటం జరిగింది. ఆ వ్యక్తి నాల్గవసారి సారాయి త్రాగాడు. ప్రవక్త (స) అతనికి కొరడాదెబ్బలు కొట్టారు. చంపలేదు. (తిర్మిజి’)
3618 – [ 5 ] ( لم تتم دراسته ) (2/1074)
وَرَوَاهُ أَبُوْ دَاوُدَ عَنْ قَبِيْصَةَ بْنِ دُؤَيْبٍ
3618. (5) [2/1074– అపరిశోధితం]
ఖబీ’సహ్ ఇబ్నె దువైబ్ (అబూ దావూద్)
3619 – [ 6 ] ( لم تتم دراسته ) (2/1074)
وَفِيْ أُخْرَى لَهُمَا وَلِلنَّسَائِيِّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيِّ عَنْ نَفَرٍمِّنْ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مِنْهُمُ ابْنُ عُمَرَوَمُعَاوِيَةُ وَأَبُوْ هُرَيْرَةَ وَالشَّرِيْدُ إِلَى قَوْلِهِ:”فَاقْتُلُوْهُ.”
3619. (6) [2/1074 –అపరిశోధితం]
తిర్మిజి, అబూదావూద్, నసాయి, ఇబ్నె మాజహ్, దార్మిలలో ప్రవక్త (స) అనుచరుల ఒక సమూహం ద్వారా ఉల్లేఖించారు. ఇందులో ఇబ్నె ‘ఉమర్, ము’ఆవియహ్, అబూ హురైరహ్, షురైద్ కూడా ఉన్నారు. వీటిలో ఫఖ్‌తులూహు వరకే ఉంది.[21]
3620 – [ 7 ] ( لم تتم دراسته ) (2/1074)
وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ الْأَزْهَرِ قَالَ: كَأَنِّيْ أَنْظُرُ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم إِذْ أُتِيَ بِرَجُلٍ قَدْ شَرِبَ الْخَمْرَ فَقَالَ لِلنَّاسِ: “اضْرِبُوْهُ” فَمِنْهُمْ مَنْ ضَرَبَهُ بِالنَّعَالِ وَمِنْهُمْ مَنْ ضَرَبَهُ بِالْعَصَا وَمِنْهُمْ مَنْ ضَرَبَهُ بِالمِيْتَخَةِ. قَالَ ابْنُ وَهْبٍ: يَعْنِي الْجَرِيْدَةَ الرَّطْبَةَ ثُمَّ أَخَذَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم تُرَابًا مِّنَ الْأَرْضِ فَرَمَى بِهِ فِيْ وَجْهِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3620. (7) [2/1074– అపరిశోధితం]
అబ్దుర్రహ్మాన్ బిన్ అజ్‌హర్ (ర) కథనం: నేను ఇప్పుడు కూడా ఆ దృశ్యాన్ని చూస్తున్నాను. ప్రవక్త (స) వద్దకు ఒక త్రాగుబోతును తీసుకురావటం జరిగింది. అతడు సారాయి త్రాగి ఉన్నాడు. ప్రవక్త (స) అక్కడున్న ప్రజలతో, ‘అతన్ని కొట్టండి,’ అన్నారు. వెంటనే కొందరు చెప్పులతో కొట్టసాగారు, కొందరు కర్రలతో కొట్టసాగారు. కొందరు ఖర్జూరపు కొమ్మలతో కొట్టారు. ఆ తరువాత ప్రవక్త (స) పిడికెడు మన్ను తీసుకొని అతని ముఖంపై కొట్టారు. (అబూ దావూద్)
మన్ను కొట్టింది అవమానించడానికే తప్ప అది శిక్షలో లేదు. ఇంతకు ముందు ప్రస్తావించిందే శిక్ష.
3621 – [ 8 ] ( صحيح ) (2/1074)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أُتِيَ بِرَجًلٍ قَدْ شَرِبَ فَقَالَ: “اضْرِبُوْهُ” .فَمِنَّا الضَّارِبُ بِيَدِهِ وَالضَّارِبُ بِثَوْبِهِ وَ الضَّارِبُ بِنَعْلِهِ ثُمَّ قَالَ: “بَكِتُوْهُ”. فَأَقْبَلُوْا عَلَيْهِ يَقُوْلُوْنَ: مَا اتَّقَيْتَ اللهَ مَا خَشِيْتَ اللهَ وَمَا اسْتَحْيَيْتَ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ بَعْضُ الْقَوْمِ: أَخْزَاكَ اللهُ. قَالَ: “لَا تَقُوْلُوْا هَكَذَا لَا تُعِيْنُوْا عَلَيْهِ الشَّيْطَانَ وَلَكِنْ قُوْلُوْا: اَللّهُمَّ اغْفِرْ لَهُ اللَّهُمَّ ارْحَمْهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
3621. (8) [2/1074 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తిని తీసుకురావడం జరిగింది. అతడు త్రాగి ఉన్నాడు. ప్రవక్త (స), ‘కొట్టండి.’ అన్నారు. వెంటనే మాలో కొందరు తమ చేతులతో కొట్టారు, కొందరు తమ దుప్పట్ల అంచులతో కొట్టారు, మరికొందరు చెప్పులతో కొట్టారు. ఆ తరువాత ఇతనికి, ‘చీవాట్లు పెట్టండి’ అని అన్నారు. ప్రజలు చీవాట్లు పెడుతూ, ‘దైవం అంటే భయం లేదా? దైవభీతి బొత్తిగా లేకుండా పోయిందే, నీకు ప్రవక్త (స) పట్ల సిగ్గు లేదా?’ అని చీవాట్లు పెట్టసాగారు. కొందరు ‘అల్లాహ్ నిన్ను అవమాన పరచుగాక!’ అని శపించారు. ఈ పదం విని ప్రవక్త (స), ‘ఇలా అనకండి,’ షైతాన్‌లకు సహాయం చేయకండి, ‘అల్లాహ్ అతన్ని క్షమించుగాక! కరుణించుగాక!’ అని అనండని అన్నారు. (అబూ దావూద్)
3622 – [ 9 ] ( ضعيف ) (2/1075)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: شَرِبَ رَجُلٌ فَسَكِرَ فَلُقِيَ يَمِيْلُ فِي الْفَجِّ فَانْطَلَق بِهِ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَلَمَّا حَاذى دَارَ الْعَبَّاسِ انْفَلَتَ فَدَخَلَ عَلَى الْعَبَّاسِ فَالْتَزَمَهُ فَذُكِرَ ذَلِكَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم فَضَحِكَ وَقَالَ: “أَفَعَلَهَا؟” وَلَمْ يَأْمُرْفِيْهِ بِشَيْءٍ. رَوَاهُ أَبُوْ داوُدَ.
3622. (9) [2/1075– బలహీనం]
ఇబ్నె అబ్బాస్ (ర) కథనం: ఒక వ్యక్తి సారాయి త్రాగి మత్తులోనే ఊగుతూ దొర్లుతూ వెళుతున్నాడు. ప్రజలు అతన్ని పట్టుకొని ప్రవక్త (స) వద్దకు తీసుకు వస్తున్నారు. ‘అబ్బాస్ (ర) ఇంటి సమీపంలో ఉన్నారు. ప్రజల చేతుల్లో నుండి విడిపించుకున్నాడు. పారిపోయి ‘అబ్బాస్ (ర) ఇంట్లోకి ప్రవేశించి అతన్ని కౌగలించు కున్నాడు. జరిగిన దంతా ప్రవక్త (స) ముందు ప్రస్తావించడం జరిగింది. ప్రవక్త (స) పక్కున నవ్వారు. ‘అతడు అలాగే చేసాడా’ అని అడిగారు. కాని ఏమీ ఆదేశించలేదు. [22] (అబూ దావూద్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3623 – [ 10 ] ( متفق عليه ) (2/1075)
عَنْ عُمَيْرِ بْنِ سَعِيْدٍ النُّخْفِيِّ قَالَ: سَمِعْتُ عَلَيَّ بْنَ أَبِيْ طَالِبٍ يَقُوْلُ: مَا كُنْتُ لأُقِيْمَ عَلَى أَحَدٍ حَدًا فَيَمُوْتَ فَأَجِدَ فِيْ نَفْسِيْ مِنْهُ شَيْئًا إِلَّا صَاحِبَ الْخَمْرِ فَإِنَّهُ لَوْ مَاتَ وَدَيْتُهُ وَذَلِكَ أَنَّ رسُوْلَ اللهِ صلى الله عليه وسلم لَمْ يَسُنَّهُ. متفق عليه.
3623. (10) [2/1075– ఏకీభవితం]
‘ఉమైర్ బిన్ స’యీద్ (ర) కథనం: ‘అలీ బిన్ అబీ ‘తాలిబ్ (ర) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ”ఒక వేళ నేను ఎవరినైనా శిక్షించిన అనంతరం అతను చనిపోతే నేనేమీ బాధపడను. కాని సారాయి త్రాగినవాడు మాత్రం నేను శిక్షిస్తున్నప్పుడు చనిపోతే, నేనతని పరిహారం చెల్లిస్తాను. ఎందు కంటే ప్రవక్త (స) త్రాగుబోతుకి ప్రత్యేకంగా ఎటువంటి శిక్షా నిర్ణయించలేదు.” [23] (బుఖారీ, ముస్లిమ్)
3624 – [ 11 ] ( لم تتم دراسته ) (2/1075)
وَعَنْ ثَوْرِبْنِ زَيِدٍ الدَّيْلَمِيِّ قَالَ: إِنَّ عُمَرَ اسْتَشَارَ فِيْ حَدِّ الْخَمْرِ فَقَالَ لَهُ عَلِيٌّ: أَرَى أَنْ تَجْلِدَهُ ثَمَانِيْنَ جَلْدَةً فَإِنَّهُ إِذَا شَرِبَ سَكِرَ وَإِذَا سَكِرَ هَذَى وَإِذَا هَذَى اِفْتَرَى فَجَلَدَ عُمَرُ رَضِيَ اللهُ عَنْهُ فِيْ حَدِّ الْخَمْرِ ثَمَانِيْنَ. رَوَاهُ مَالِكٌ
3624. (11) [2/1075 –అపరిశోధితం]
సౌ’ర్ బిన్ ‘జైద్ దైలమీ (ర) కథనం: ‘ఉమర్ (ర) త్రాగు బోతు శిక్ష విషయంలో ప్రజలను సంప్రదించారు. ‘అలీ (ర) ’80 కొరడా దెబ్బలు కొట్టమని, ఎందుకంటే సారాయి త్రాగి కైపు ఎక్కిపోతారని, ఆ స్థితిలో బూతులు, తిట్లు అన్నీ పలుకుతాడని, ఇతరులను నిందలపాలు చేస్తాడని’ అన్నారు. ‘ఉమర్ (ర) ఈ సలహాను అనుసరిస్తూ 80 కొరడా దెబ్బలు నిర్ణయించారు.[24] (మాలిక్)
=====
4- بَابُ مَالَا يُدْعَى عَلَى الْمَحْدُوْدِ
4. శిక్షపొందినవారిని శపించరాదు
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3625 – [ 1 ] ( صحيح ) (2/1076)
عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَجُلًا اسْمُهُ عَبْدُ اللهِ يُلَقَّبُ حِمَارًا كَانَ يُضْحِكُ النَّبِيَّ صلى الله عليه وسلم وَكَانَ النَّبِيُّ صلى الله عليه وسلم قَدْ جَلَدَهُ فِي الشَّرَابِ فَأُتِيَ بِهِ يَوْمًا فَأَمَرَ بِهِ فَجُلِدَ فَقَالَ رَجُلٌ مِّنَ الْقَوْمِ: اَللّهُمَّ الْعَنْهُ مَا أَكْثَرَ مَا يُؤْتَى بِهِ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “لَا تَلْعَنُوْهُ فَوَ اللهَ مَا عَلِمْتُ أَنَّهُ يُحِبُّ اللهَ وَرَسُوْلَهُ”. رَواهُ الْبُخَارِيُّ .
3625. (1) [2/1076 –దృఢం]
‘ఉమర్ (ర) కథనం: ‘అబ్దుల్లాహ్ అనే పేరుగల ‘హిమార్ అనే బిరుదుగల వ్యక్తి ప్రవక్త (స)ను నవ్వించేవాడు. అతడు సారాయి త్రాగినందుకు ప్రవక్త (స) కొరడా దెబ్బలు కొట్టించారు. ఆ తరువాత సారాయి త్రాగుతూ పట్టుబడ్డాడు. ప్రవక్త (స) వద్దకు తీసుకురావటం జరిగింది. ప్రవక్త (స) అతనికి కొరడా దెబ్బలు కొట్టమని ఆదేశించారు. ఒక వ్యక్తి ”ఓ అల్లాహ్! ఇతన్ని శపించు. వీడు ఎన్నోసార్లు సారాయి త్రాగే విషయంలో పట్టుబడ్డాడు. కొరడా దెబ్బలు తిన్నాడు. కాని సారాయి త్రాగడం మాత్రం మానటం లేదు,” అని అన్నాడు. అది విని ప్రవక్త (స) ఈవిధంగా అతడ్ని శపించకు, దైవం సాక్షి! ఇతడు అల్లాహ్(త), ఆయన ప్రవక్తను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు.[25] (బు’ఖారీ)
3626 – [ 2 ] ( صحيح ) (2/1076)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: أُتِيَ النَّبِيُّ صلى الله عليه وسلم بِرَجُلٍ قَدْ شَرِبَ الْخَمَرُ فَقَالَ: “اضْرِبُوْهُ”. فَمِنَّا الضَّارِبُ بِيَدِهِ وَالضَّارِبُ بِنَعْلِه وَ الضَّارِبُ بِثَوْبِهِ. فَلَمَّا انْصَرَفَ قَالَ بَعْضُ الْقَوْمِ: أَخْزَاكَ اللهُ قَالَ: “لَا تَقُوْلُوْا هَكَذَا لَا تُعِيْنُوْا عَلَيْهِ الشَّيْطَانَ”. رَوَاهُ الْبُخَاريُّ
3626. (2) [2/1076–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక తాగుబోతును తీసుకురావటం జరిగింది. అతన్ని శిక్షించమని ప్రవక్త (స) ఆదేశించారు. మాలో కొందరు అతన్ని తమ చేతులతో, కొందరు తమ చెప్పులతో, కొందరు తమ బట్టలతో కొట్టారు. తిరిగి వెళుతుండగా ఒక వ్యక్తి, ‘అల్లాహ్(త) వీడిని అవమానపరచుగాక! వీడు అస్తమానం సారాయి త్రాగుతుంటాడు. దెబ్బలు తింటూ ఉంటాడు,’ అని అన్నాడు. అది విన్న ప్రవక్త (స), ‘ఇలా అనకు, ఈ విషయంలో షై’తాన్‌కు సహాయం చేయకు,’ అని అన్నారు. (బు’ఖారీ)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3627- [ 3 ] ( ضعيف ) (2/1077)
عَنْ أَبِيْ هُرَيْرةَ قَالَ: جَاءَ الْأَسْلَمِيُّ إِلَى نَبِيِّ اللهِ صلى الله عليه وسلم فَشَهِدَ عَلَى نَفْسِهِ أَنَّهُ أَصَابَ امْرَأةً حَرَامًا أَرْبَعَ مَرَّاتٍ كُلَّ ذَلِكَ يُعْرِضُ عَنْهُ فَأَقْبَلَ فِي الْخَامِسة فقَالَ: “أَنِكْتَهَا؟” قَالَ: نَعَمْ قَالَ: “حَتَّى غَابَ ذَلَكَ مِنْكَ فِيْ ذَلِكَ مِنْهَا”. قَالَ: نَعَمْ قَالَ: “كَمَا يَغِيْبُ الْمِرْوَدُ فِي الْمُكْحُلَةِ وَالرِّشَاءُ فِي الْبِئْرِ؟” قَالَ: نَعَمْ. قَالَ: “هَلْ تَدْرِيْ مَا الزِّنَا؟” قَالَ: نَعَمْ. أَتَيْتُ مِنْهَا حَرامًا مَا يَأْتِي الرَّجُلُ مِنْ أَهْلِهِ حَلَالًا قَالَ: “فَمَا تُرِيْدُ بِهَذَا الْقَوْلُ؟” قَالَ: أُرِيْدُ أَنْ تُطَهِّرَنِيْ فَأَمَرَ بِهِ فَرُجِمَ فَسَمِعَ نَبِيُّ اللهِ صلى الله عليه وسلم رَجُلَيْنِ مِنْ أَصْحَابِهِ يَقُوْلُ أَحَدُهُمَا لِصَاحِبِهِ: اُنْظُرَ إِلَى هَذَا الَّذِيْ سَتَرَ اللهُ عَلَيْهِ فَلَمْ تَدَعْهُ نَفْسُهُ حَتَّى رُجِمَ رَجْمَ الْكَلْبِ فَسَكَتَ عَنْهُمَا ثُمَّ سَارَ سَاعَةً حَتَّى مَرَّ بِجِيْفَةِ حِمَارٍ شَائِلٍ بِرِجْلِهِ فَقَالَ: “أَيْنَ فُلَانٌ وَفُلَانٌ؟” فَقَالَا: نَحنُ ذَانِ يَا رَسُوْلَ اللهِ. فَقَالَ: “انْزِلًا فَكُلَا مِنْ جِيْفَةِ هَذَا الْحِمَارِ”. فَقَالَا: يَا نَبِيَّ اللهِ مَنْ يَأْكُلُ مِنْ هَذَا؟ قَالَ: “فَمَا نِلْتُمَا مِنْ عِرْضِ أَخِيْكُمَا آنِفًا أَشَدُّ مِنْ أَكْلٍ مِّنْهُ وَالَّذِيْ نَفْسِيْ بِيَدهِ إِنَّهُ الْآنَ لَفِيْ أَنْهَارِ الْجَنَّةِ فِيْهَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3627. (3) [2/1077– బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: మాయిజ్ అస్‌లమీ ప్రవక్త (స) వద్దకు వచ్చి నేను ఒక స్త్రీతో వ్యభిచారం చేసానని ఒప్పుకున్నాడు. ఈ విధంగా నాలుగుసార్లు ఒప్పు కున్నాడు. ప్రవక్త (స) మాత్రం తన ముఖం అటూ ఇటూ త్రిప్పుతూ ఉన్నారు. శ్రద్ధ చూపక పోవడం వల్ల తిరిగి వెళ్ళిపోతాడని. కాని అతడు వెళ్ళలేదు. ఐదవసారి ప్రవక్త (స), ‘నువ్వు నిజంగా స్త్రీతో సంభోగం చేసావా? ‘ అని అడిగారు. దాని కతడు, ‘అవును’ అన్నాడు. ప్రవక్త (స), ‘నీ మర్మాంగం ఆమె మర్మాంగంలోకి వెళ్ళినట్టు చేసావా?’ అని అడిగారు. దానికి అతడు ‘అవును’ అన్నాడు. ప్రవక్త (స) మళ్ళీ, ‘నువ్వు సుర్మా సీసాలో సిలాయి వెళ్ళినట్లు సంభోగం చేసావా? త్రాడు బావిలో పడ్డట్టు చేసావా’ అని అడిగారు. దానికి అతడు ‘అవును’ అన్నాడు. ప్రవక్త (స) మళ్ళీ వ్యభిచారం అంటే నీకు తెలుసా? అని అడిగారు. దానికి అతడు, ‘అవును, నేనామెతో ఒక భర్త తన భార్యతో సంభోగం చేసినట్లు చేసాను,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స) ‘అయితే నీ కోరిక ఏమిటి,’ అని అడిగారు. దానికి అతడు, ‘నన్ను ఈ పాపం నుండి పరిశుద్ధపరచండి,’ అని అన్నాడు. ప్రవక్త (స) అతన్ని రాళ్ళ వర్షం ద్వారా శిక్షించమని ఆదేశించారు. అతడు శిక్షించబడ్డాడు. ఆ తరువాత ఇద్దరు అనుచరులను అతని గురించి, ‘ఆ వ్యక్తిని చూడు అల్లాహ్ (త) అతని తప్పును కప్పిపుచ్చాడు. కాని అతడు తన్నుతాను వదలిపెట్టలేదు చివరికి చంపబడ్డాడు. కుక్కలా చంపబడ్డాడు,’ అని అనడం, విని ప్రవక్త (స) కొంతసేపు మౌనంగా ఉన్నారు. ఆ తరువాత ముందుకు సాగారు. అక్కడ ఒక గాడిద ఉంది. దాని కడుపు ఉబ్బి ఉంది, ఒక కాలు ఎత్తి ఉంది. అది చూచి ప్రవక్త (స), ‘ఇందాక మాట్లాడు తున్న ఆ వ్యక్తులు ఏరి?’ అని అడిగారు. వారు ప్రవక్త (స)వెంటే ఉన్నారు. వారు వెంటనే, ‘మేమిక్కడే ఉన్నాం,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘మీరు మీ వాహనాల నుండి క్రిందికి దిగండి. ఈ చనిపోయిన గాడిద మాంసం తినండి,’ అన్నారు. వారు, ‘ఓ ప్రవక్తా! ఈ చనిపోయిన గాడిదను ఎవరు తింటారు?’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘మరి మీరు ఇప్పుడు మీ సోదరుడి తప్పులను ఎంచుతున్నది. ఇది ఆ గాడిద మాంసం తినటం కంటే చెడ్డది. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ దైవం సాక్షి! మాయిజ్ అస్లమీ చంప బడ్డాడు. కాని అతడు స్వర్గ సెలయేర్లలో మునిగి తేలుతున్నాడు.’ (అబూ దావూద్)
అంటే అతడు స్వర్గంలోనికి చేరుకున్నాడు అని అన్నారు.
3628- [ 4 ] ( لم تتم دراسته ) (2/1078)
وَعَنْ خُزَيْمَةَ بْنِ ثَابِتٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَصَابَ ذَنْبًا أُقِيْمَ عَلَيْهِ حَدُّ ذَلِكَ الذَّنْبِ فَهُوَ كَفَارَتُهُ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ
3628. (4) [2/1078– అపరిశోధితం]
‘ఖు’జైమ బిన్ సా’బిత్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”ఎవరైనా పాపం చేసి ఇహలోకంలోనే శిక్ష పొందితే, అది అతని పాపాలకు పరిహారంగా పనిచేస్తుంది. అంటే శిక్షించడం వల్ల అతని పాపాలు క్షమించబడతాయి.” (షర్‌హుస్సున్నహ్)
3629 – [ 5 ] ( لم تتم دراسته ) (2/1078)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ أَصَابَ حَدًّا فَعُجِلَ عُقُوْبَتُهُ فِي الدُّنْيَا فَاللهِ أَعْدَلُ مِنْ أَنْ يُثَنِّيَ عَلَى عَبْدِهِ الْعُقُوْبَةَ فِي الْآخِرَةِ وَمَنْ أَصَابَ حَدّ فَسَتَرَهُ اللهُ عَلَيه وَعَفَا عَنْهُ. فَاللهِ أَكْرَمُ مِنْ أَنْ يَّعُوْدَ فِي شَيْءٍ قَدْ عَفَا عَنْهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.
3629. (5) [2/1078– అపరిశోధితం]
అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా పాపం చేసి భూలోకంలోనే అతనికి శిక్షపడితే, తీర్పుదినం నాడు అతనికి శిక్షించడం జరుగదు. ఎందుకంటే అల్లాహ్ అందరికంటే ఎక్కువగా న్యాయం చేసేవాడు. అదే విధంగా ఎవరైనా ఏదైనా పాపం చేసి, అల్లాహ్ (త) దాన్ని కప్పిపుచ్చి, ఇహలోకంలోనే క్షమించి, శిక్షకు గురిచేయకపోతే అల్లాహ్ చాలా దయమయుడు, కరుణామయుడూను. అయితే దీనికి క్షమాపణ కోరాలి పశ్చాత్తాపం చెందాలి. అల్లాహ్ (త) స్వీకరించి ఉండాలి. (తిర్మిజి’ / ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)
—–
هَذَا الْبَابُ خَالٍ عَنِ الْفَصْلُ الثَّالِثُ
ఇందులో మూడవ విభాగం లేదు
=====
5– بَابُ التَّعْزِيْر
5. మందలింపు
త‘అ‘జీర్ అంటే శిక్ష, మందలింపు. ఇస్లామీయ చట్టంలో శిక్ష నిర్ణయించబడి ఉంటుంది. కఠినంగా ప్రవర్తించడంలో శిక్ష నిర్ణయించబడి ఉండదు. అది రాజు, పాలకుడు, అతని రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. పాలకుడు, ఇతరులకు గుణపాఠం కలిగేలా శిక్షిస్తాడు. అయితే 40 కొరడాల కంటే తక్కువగా ఉండాలి. కొన్ని కొరడా దెబ్బలు లేదా జైలు శిక్ష విధించవచ్చు.
الْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3630 – [ 1 ] ( متفق عليه ) (2/1079)
عَنْ أَبِيْ بُرْدَةَ بْنِ نِيَارٍعَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا يُجْلَدُ فَوْقَ عَشْرِ جَلَدَاتٍ إِلَّا فِيْ حَدٍّ مِنْ حُدُوْدِ اللهِ”. متفق عليه.
3630. (1) [2/1079–ఏకీభవితం]
అబూ బుర్‌ద బిన్ నియార్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఎటువంటి నేరానికి పాల్పడినా 10 కొరడా దెబ్బల కంటే కఠినమైన శిక్ష వేయరాదు. కాని అల్లాహ్ శిక్షల్లో వ్యభి చారం, సారాయి మొదలైన వాటిలో 40, 80 ఇంకా 100 కొరడా దెబ్బలు కొట్టవచ్చును. (బుఖారీ, ముస్లిమ్)
—–
الْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3631 – [ 2 ] ( لم تتم دراسته ) (2/1079)
عَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا ضَرَبَ أَحَدُكُمْ فَلْيَتَّقِ الْوَجْهَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3631. (2) [2/1079 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా దండించడానికి కొడితే ముఖంపై, నోటి పై కొట్టరాదు, వేరే చోట కొట్టవచ్చు.” (అబూ దావూద్)
3632 – [ 3 ] ( لم تتم دراسته ) (2/1079)
وَعَنِ ابْنِ عَبَّاسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا قَالَ الرَّجُلُ لِلرُّجُلِ: يَا يَهُوْدِيُّ فَاضْرِبُوْهُ عشْرِيْنَ وَإِذَا قَالَ: يَا مُخَنَّثُ فَاضْرِبُوْهُ عِشْرِيْنَ وَمَنْ وَقَعَ عَلَى ذَاتِ مَحْرَمٍ فَاقْتُلُوْهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.
3632. (3) [2/1079 –అపరిశోధితం]
ఇబ్నె అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మీలో ఎవరైనా ముస్లిమ్‌ను ఓ యహూదీ! అని పిలిస్తే, పిలిచే వాడికి శిక్షగా, దండనగా 20 కొరడా దెబ్బలు కొట్టండి, అదేవిధంగా ఎవరైనా ఓ అర్థనగ్నుడా అని పిలిస్తే, ఆ వ్యక్తికి 20 కొరడా దెబ్బలు కొట్టండి. అదేవిధంగా పర స్త్రీతో వ్యభిచరిస్తే, అతన్ని రాళ్ళతోకొట్టి చంపండి.” [26] (తిర్మిజి’ / ఏకోల్లేఖనం)
3633 – [ 4 ] ( لم تتم دراسته ) (2/1079)
وَعَنْ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِذَا وَجَدْتُّمْئُالرَّجُلَ قَدْ غَلَّ فِيْ سَبِيْلِ اللهِ فَأَحْرِقُوْا مَتَاعَهُ وَاضْرِبُوْهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.
3633. (4) [2/1079– అపరిశోధితం]
ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా ఇంకా పంచబడని యుద్ధ ధనంలో నుండి దొంగిలిస్తే, ద్రోహం చేస్తే, ఆ సామానుల్ని కాల్చివేయండి. శిక్షగా అతన్ని కొట్టండి.” [27] (తిర్మిజి / ఏకోల్లేఖనం, అబూ దావూద్)
هَذَا الْبَابُ خَالٍ عَنِ الْفَصْلُ الثَّالِثُ
ఇందులో మూడవ విభాగం లేదు
=====
6– بَابُ بَيَانِ الْخَمْرِ وَوَعِيْدِ شَارِبِهَا
6. మద్యం, త్రాగుబోతుకు శిక్ష
ఖమ్ర్ అంటే దాచటం, కప్పటం అని అర్థం. ఇక్కడ ఖమ్ర్ అంటే మత్తు ఎక్కించే పానీయం. త్రాగేవాడు అస్థిరతకు గురయి స్పృహ కోల్పోతాడు. మంచీ చెడులను పరికిం లేడు. దీనివల్ల ఉపద్రవాలు, కల్లోలాలు తలెత్తుతాయి. అందువల్లే ఇస్లామ్ దీన్ని నిషేధించింది. అల్లాహ్ ఆదేశం: ”ఓ విశ్వాసులారా! నిశ్చయంగా మద్య పానం, జూదం, బలిపీఠం మీద బలి ఇవ్వటం (అ‘న్సాబ్)మరియు శకునానికై బాణాల ప్రయోగం (అ‘జ్లామ్) ఇవన్నీ కేవలం అసహ్య కరమైన షై’తాన్ చేష్టలు, కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి.” (అల్ మాయిదహ్, 5:90) ఈ ఆయతు ద్వారా సారాయి నిషిద్ధమని తెలిసింది. అది ఎక్కువైనా తక్కువైనా సరే. దీన్ని గురించి అనేక ‘హదీసు’లు ఉన్నాయి.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3634 – [ 1 ] ( صحيح ) (2/1080)
عَنْ أَبِيْ هُرَيْرَةَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “اَلْخَمْرُ مِنْ هَاتَيْنِ الشَّجَرَتَيْنِ: النَّخلةِ وَالْعِنَبَةِ”. رَوَاهُ مُسْلِمٌ.
3634. (1) [2/1080–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మద్యం రెండు రకాల చెట్లు అంటే ఖర్జూరం, ద్రాక్ష పండ్ల ద్వారా తయారు చేయబడుతుంది.” [28](ముస్లిమ్)
3635 – [ 2 ] ( صحيح ) (2/1080)
وَعَنِ ابْنِ عُمَرَرَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: خَطَبَ عُمَرُ رَضِيَ اللهُ عَنْهُ عَلَى مِنْبَرِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فقَالَ: “إِنَّهُ قَدْ نَزَلَ تَحْرِيْمُ الْخَمْرِ وَهِيَ مِنْ خَمْسَةِ أَشْيَاءَ: الْعِنَبِ وَالتَّمَرِ وَالْحِنْطَةِ وَالشَّعِير وَالْعَسْلِ وَالْخَمْرُ مَا خَامَرَ الْعَقْلَ”. رَوَاهُ الْبُخَارِيُّ .
3635. (2) [2/1080-దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) యొక్క మెంబరుపై ఎక్కి ప్రసంగించారు. ప్రసంగంలో మద్యం నిషేధం అవతరించబడినపుడు ఈ ఐదు, అంటే ద్రాక్ష, ఖర్జూరం, గోధుమ, జొన్న, తేనెల ద్వారా తయారు చేయబడేది. మత్తు పదార్థం అంటే మతి పోగొట్టేది అని పేర్కొన్నారు. [29] (బు’ఖారీ)
3636 – [ 3 ] ( صحيح ) (2/1080)
وَعَنْ أَنَسٍ قَالَ: لَقَدْ حُرِّمَتِ الْخَمْرُحِيْنَ حُرِّمَتْ وَمَا نَجِدُ خَمْرَالْأَعْنَابِ إِلَّا قَلِيْلًا وَعَامَّةُ خَمْرِنَا الْبُسُرُ وَالتَّمْرُ. رَوَاهُ الْبُخَارِيُّ.
3636. (3) [2/1080 –దృఢం]
అనస్ (ర) కథనం: మద్యం నిషేధం ఆజ్ఞ అవతరించ బడినపుడు ద్రాక్ష సారాయి చాలా అరుదుగా దొరికేది. అప్పుడు మా ప్రాంతంలో అత్యధి కంగా పచ్చి, ఎండు ఖర్జూరాల ద్వారా తయారు చేయబడేది. (బు’ఖారీ)
3637 – [ 4 ] ( متفق عليه ) (2/1080)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: سُئِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ البِتَّعِ وَهُوَ نَبِيْذُ العَسَلِ فَقَالَ: “كُلُّ شَرَابٍ أَسْكَرَ فَهُوَ حَرَامٌ”.
3637. (4) [2/1080– ఏకీభవితం]
ఆయిషహ్ (ర) కథనం: ప్రవక్త (స)ను బిత్’ఉ తేనె మత్తు పదార్థాన్ని గురించి ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స) ‘ప్రతి మత్తు పదార్థం నిషిద్ధం,’ అని అన్నారు.[30] (బు’ఖారీ, ముస్లిమ్)
3638 – [ 5 ] ( صحيح ) (2/1080)
وَعَنِ ابْنِ عُمَرَرَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم: “كُلُّ مُسْكِرٍخَمْرٌوَكُلُّ مُسْكِرٍحَرَامٌ وَمَنْ شَرِبَ الْخَمْرَ فِي الدُّنْيَا فَمَاتَ وَهُوَ يُدْمِنُهَا لَمْ يَتُبْ لَمْ يَشْرَبْهَا فِي الْآخِرَةِ”. رَوَاهُ مُسْلِمٌ .
3638. (5) [2/1080 –దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి మత్తు పదార్థం మద్యం, ప్రతి మత్తు పదార్థం నిషిద్ధం. ప్రపంచంలో ఎల్లప్పుడూ మద్యం సేవిస్తూ పశ్చాత్తాపం చెందకుండా మరణిస్తే, పరలోకంలో స్వర్గ అమృతం పొందలేడు.” (బు’ఖారీ, ముస్లిమ్)
3639 – [ 6 ] ( صحيح ) (2/1081)
وَعَنْ جَابِرٍ أَنَّ رَجُلًا قَدِمَ مِنَ الْيَمَنِ فَسَأَلَ النَّبِيُّ صلى الله عليه وسلم عَنْ شَرَابٍ يَشْرَبُوْنَهُ بِأَرضِهِمْ مِنَ الذُّرَّةِ يُقَالُ لَهُ الْمِزْرُ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “أَوَ مُسْكِرٌ هُوَ؟” قَالَ: نَعَمْ. قَالَ: “كُلُّ مُسْكِرٍ حَرَامٌ إِنَّ عَلَى اللهِ عَهْدًا لِمَنْ يَشْرَبُ الْمُسْكِرَ أَنْ يَسْقِيَهِ مِنْ طِيْنَةِ الْخَبَالِ”. قَالُوْا: يَا رَسُوْلَ اللهِ وَمَا طِيْنَةُ الْخَبَالِ؟ قَالَ: “عَرَقُ أَهْلِ النَّارِ أَوْ عُصَارَةُ أَهْلَ النَّارِ”. رَوَاهُ مُسْلِمٌ .
3639. (6) [2/1081–దృఢం]
జాబిర్ (ర) కథనం: యమన్ నుండి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ప్రవక్త (స)ను యమన్‌లో జొన్నలతో చేసే మి‘జ్ర్ అనే మద్యం గురించి అడిగాడు. దానికి ప్రవక్త (స) అది మత్తు పదార్థమా అని అడిగారు. ఆ వ్యక్తి అవును అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ప్రవక్త (స), ‘ప్రతి మత్తు పదార్థం నిషిద్ధం అని, ఇహలోకంలో మత్తు పదార్థాలను సేవించేవారిని ‘తీనతుల్ ‘ఖబాల్ త్రాపిస్తానని, అల్లాహ్ దృఢ నిశ్చయంతో ఉన్నాడు’ అని అన్నారు. ప్రవక్త (స) అనుచరులు, ‘ఓ ప్రవక్తా! ‘తీనతుల్ ‘ఖబాల్ అంటే ఏమిటి?’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ‘నరకవాసుల చెమట, చీము నెత్తుర్లు,’ అని అన్నారు. (ముస్లిమ్)
అంటే నరకవాసుల చెమట, చీము నెత్తుర్లు త్రాగుబోతులకు నరకంలో త్రాపించబడతాయి.
3640 – [ 7 ] ( صحيح ) (2/1081)
وَعَنْ أَبِيْ قَتَادَةَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى عَنْ خَلِيْطِ التَّمْرِ وَالبُسْرِ وَعَنْ خَلِيْطِ الزَّبِيْبِ وَالتَّمْري وَعَنْ خَلِيْطِ الزَّهْوِ وَالرُّطَبِ. وَقَالَ: “انْتَبِذُوْا كُلَّ وَاحِدٍ عَلَى حَدَةٍ”. رَوَاهُ مُسْلِمٌ.
3640. (7) [2/1081–దృఢం]
అబూ ఖతాదా (ర) కథనం: ప్రవక్త (స) పచ్చి మరియు ఎండు ఖర్జూరాలు కలిపి నబీజ్’ తయారుచేయరాదని వారించారు. మరియు కిష్‌మిష్ మరియు ఖర్జూరాలను కలిపి నబీజ్’ తయారు చేయరాదని వారించారు. ఇంకా పచ్చి మరియు పండు ఖర్జూరాలు కలిపి నబీజ్’ తయారు చేయ రాదని వారించారు. అయితే వేర్వేరుగా నబీజ్’ చేయవచ్చని అనుమతించారు.[31] (ముస్లిమ్)
3641 – [ 8 ] ( صحيح ) (2/1081)
وَعَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم سُئِلَ عَنِ الْخَمْرِ يُتَّخَذُ خَلًّا؟ فَقَالَ: “لَا “. رَوَاهُ مُسْلِمٌ .
3641. (8) [2/1081–దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స)ను మత్తు పానీయంతో సిరక తయారుచేయటాన్ని గురించి ప్రశ్నించటం జరిగింది. ప్రవక్త (స) మత్తు పానీయంతో సిర్‌క చేయడం ధర్మసమ్మ తంకాదని అన్నారు. (ముస్లిమ్)
ఎందుకంటే మద్యం నిషిద్ధం, అపరిశుభ్రం. అందువల్ల నిషిద్ధమైన, అపరిశుభ్ర మైన వస్తువుతో సిర్‌క చేయడం సరికాదు,’ అని అన్నారు.
3642 – [ 9 ] ( صحيح ) (2/1081)
وَعَنْ وَائِلِ الْحَضْرَمِيِّ أَنَّ طَارِقَ بْنَ سُوَيْدٍ سَأَلَ النَّبِيّ صلى الله عليه وسلم عَنِ الْخَمْرِ فَنَهَاهُ. فَقَالَ: إِنَّمَا أضنْعُهَا لِلدَّوَاءِ فَقَالَ: “إِنَّهُ لَيْسَ بِدَوَاءٍ وَلَكِنَّهُ دَاءٌ”. رَوَاهُ مُسْلِمٌ.
3642. (9) [2/1081–దృఢం]
వాయిల్ హ’ద్రమీ కథనం: ‘తారిఖ్ బిన్ సువైద్ ప్రవక్త (స)ను మద్యం గురించి విన్నవించుకున్నాడు. ప్రవక్త (స) మద్యం సేవించటాన్ని వారించారు. దానికి అతడు ‘మేమ మద్యాన్ని మందుగా తయారు చేస్తాం,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఇది మందు కాదు వ్యాధి,’ అన్నారు. (ముస్లిమ్)
అంటే మద్యాన్ని మందుగా వాడటం కూడా నిషిద్ధమే. అది తినేదైనా, రాసుకునేదైనా సరే. ఎందు కంటే అల్లాహ్ (త) నిషిద్ధ వస్తువుల్లో ఆరోగ్యం ఉంచలేదు.
—–
الْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3643 – [ 10 ] ( لم تتم دراسته ) (2/1081)
عَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ شَرِبَ الْخَمْرَلَمْ يَقْبَلِ اللهُ لَهُ صَلَاةً أَرْبَعِيْنَ صَبَاحًا. فَإِنْ تَابَ تَابَ اللهُ عَلَيْهِ. فَإِنْ عَادَ لَمْ يَقْبَلِ اللهُ لَهُ صَلَاةً أَرْبَعِيْنَ صَبَاحًا .فَإنْ تَابَ تَابَ اللهُ عَلَيْهِ. فَإِنْ عَادَ لَمْ يَقْبَلِ اللهُ لَهُ صَلَاةً أَرْبَعِيْنَ صَبَاحًا. فَإِنْ تَابَ تَابَ اللهُ عَلَيْهِ فَإِنْ عَادَ فِي الرَّابِعَةِ لَمْ يَقْبَلِ اللهُ لَهُ صَلَاةً أَرْبَعِيْنَ صَبَاحًا. فَإِنْ تَابَ لَمْ يَتُبِ اللهُ عَلَيْهِ. وَسَقَاهُ مِنْ نَهْرِ الْخَبَالِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
3643. (10) [2/1081–అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా మద్యం సేవిస్తే 40 రోజుల వరకు అల్లాహ్ (త) అతని నమాజు స్వికరించడు. ఒకవేళ చిత్త శుద్ధితో, నిర్మలమైన మనస్సుతో పశ్చాత్తాపం చెందితే అల్లాహ్(త) అతని పశ్చత్తాపాన్ని స్వీకరిస్తాడు. మళ్ళీ మద్యం సేవిస్తే అల్లాహ్ అతని 40 రోజుల నమాజు స్వీకరించడు. ఒకవేళ అతడు మళ్ళీ పశ్చాత్తాపం చెందితే అల్లాహ్ (త) అతన్ని క్షమించివేస్తాడు. మళ్ళీ అతడు మద్యం సేవిస్తే అల్లాహ్ (త) అతని 40 రోజుల నమాజు స్వీకరించడు. అతడు మళ్ళీ పశ్చాత్తాపం చెందితే అల్లాహ్ (త) క్షమిస్తాడు. నాల్గవసారి మద్యం సేవిస్తే అల్లాహ్ అతని 40 రోజుల నమాజు స్వీక రించడు. అతడు మళ్ళీ పశ్చాత్తాపం చెందితే అల్లాహ్ (త) అతన్ని క్షమించడు. ఇంకా అల్లాహ్(త) అతనికి ‘ఖబాల్ నది నుండి అంటే పాపాత్ముల చెమట, చీము, నెత్తురు త్రాపిస్తాడు. (తిర్మిజి’)
3644- [ 11 ] ( لم تتم دراسته ) (2/1082)
وَرَوَاهُ النَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو .
3644. (11) [2/1082–అపరిశోధితం]
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ కథనం: (నసాయి, ఇబ్నె మాజహ్, దార్మి)
3645 – [ 12 ] ( لم تتم دراسته ) (2/1082)
وَعَنْ جَابِرٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَا أَسْكَرَ كَثِيْرُهُ فَقَلِيْلُهُ حَرَامٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ
3645. (12) [2/1082–అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అధిక పరిమాణంలో మత్తుగా ఉండే పదార్థం అల్ప పరిమాణంలో కూడా నిషిద్ధమే.” (తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
3646 – [ 13 ] ( لم تتم دراسته ) (2/1082)
وَعَنْ عَائِشَةَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَا أَسْكَرَ مِنْهُ الْفَرْقُ‘ فَمِلْءُ الكَفِّ مِنْهُ حَرَامٌ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ .
3646. (13) [2/1082 –అపరిశోధితం]
ఆయిషహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, 8 సేర్లు ఉపయోగించటం వల్ల మత్తుగా ఉంటే దాని ఒక్క గుక్కెడు కూడా నిషిద్ధమే. (అహ్మద్, తిర్మిజి, అబూ దావూద్)
3647 – [ 14 ] ( لم تتم دراسته ) (2/1082)
وَعَنِ النُّعْمَانِ بْنِ بَشِيْرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ مِنَ الْحِنْطَةِ خَمْرًا وَمِنْ الشَّعِيْرِ خَمْرًا وَمِنَ التّمْرِ خَمْرًا وَمِنَ الزَّبِيْبِ خَمْرًا وَمِنَ الْعَسَلِ خَمْرًا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .
3647. (14) [2/1082–అపరిశోధితం]
నోమాన్ బిన్ బషీర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: గోధుమల ద్వారా మద్యం తయారు చేయబడుతుంది. జొన్నల ద్వారా కూడా మద్యం తయారు చేయబడు తుంది. ఖర్జూరాల ద్వారా కూడా మద్యం తయారుచేయబడుతుంది, ఇంకా ద్రాక్ష మరియు తేనెల ద్వారా కూడా మద్యం తయారు చేయబడుతుంది. (తిర్మిజి/ఏకోల్లేఖనం, అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
3648 – [ 15 ] ( لم تتم دراسته ) (2/1082)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: كَانَ عِنْدَنَا خَمْرٌ لِيَتِيْمٍ فَلَمَّا نَزَلَتِ (الْمَائِدَةُ ) سَأَلْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَنْهُ. وَقُلْتُ: إِنَّهُ لِيَتِيْمٍ فَقَالَ: “أَهْرِيْقُوْهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
3648. (15) [2/1082 –అపరిశోధితం]
అబూ సయీద్ ఖుద్రీ (ర) కథనం: మద్యం నిషిద్ధం కావటానికి ముందు ఒక అనాథకు చెందిన మద్యం మా దగ్గర ఉండేది. సూరహ్ మాయిదహ్‌లో మద్యం నిషేధం అవతరించిన తరువాత నేను ప్రవక్త (స)ను దీన్ని గురించి ప్రస్తావిస్తూ, ‘ఇది అనాథ పిల్లలది,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘దాన్ని కూడా పారవేయి,’ అని అన్నారు. (తిర్మిజి’)
అంటే మద్యం నిషిద్ధం చేయబడింది. అది ఏ వస్తువులతో చేసినా సరే.
3649 – [ 16 ] ( صحيح ) (2/1082)
وَعَنْ أَنَسٍ عَنْ أَبِيْ طَلْحَةَ: أَنَّهُ قَالَ: يَا نَبِيَّ اللهِ إِنِّيْ اِشْتَرَيْتُ خَمْرًا لِأَيْتَامٍ فِيْ حَجْرِيْ قَالَ: “أَهْرِقِ الْخَمْرَ وَاكْسِرِ الدِّنَانَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَضَعَّفَهُ.
وَفِيْ رِوَايَة أَبِيْ دَاوُدَ: أَنَّهُ سَأَلَهُ النَّبِيَّ صلى الله عليه وسلم عَنْ أَيْتَامٍ وَرِثُوْا خَمْرًا قَالَ: “أهْرِقْهَا”. قَالَ: أَفَلَا أَجْعَلُهَا خَلًّا؟ قَالَ: ” لَا “.
3649. (16) [2/1082 –దృడం]
అనస్ (ర) కథనం: అబూ ‘తల్’హా ప్రవక్త (స)ను, ‘ఓ ప్రవక్తా! అనాథల కోసం నేను మద్యం కొని ఉంచాను,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఆ మద్యాన్ని పారవేయి, ఆ గిన్నెలను విరిచివేయి,’ అని అన్నారు. (తిర్మిజి’, అబూ దావూద్)
అబూ దావూద్ ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”అబూ ‘తల్’హా ప్రవక్త (స)ను, ‘నా సంరక్షణలో ఉన్న అనాథల ఆస్తిగా మద్యం లభించింది. అది నా దగ్గర ఉంది. నేను దాన్ని ఏం చేయాలి?’ అని విన్నవించుకున్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘దాన్ని పారవేయి,’ అన్నారు. నేను మళ్ళీ, ‘దాని సిర్‌క చేసుకోనా,’ అని అన్నాను. దానికి ప్రవక్త(స), ‘ఆ మద్యంతో సిర్‌క కూడా చేయకు,’ అని అన్నారు.
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3650 – [ 17 ] ( ضعيف ) (2/1083)
عَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ كُلِّ مُسْكِرٍ وَمُقْتِرٍ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
3650. (17) [2/1083 –బలహీనం]
ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రతి మత్తు పదార్థాన్ని ప్రతి చెడగొట్టే పదార్థాన్ని నిషేధించారు. [32] (అబూ దావూద్)
3651 – [ 18 ] ( صحيح ) (2/1083)
وَعَنْ دَيْلَمِ الْحِمْيَرِيِّ قَال: قُلْتُ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: يَا رَسُوْلَ اللهِ إِنَّا بِأَرْضٍ بَارِدَةٍ وَنُعَالِجُ فِيْهَا عَمَلًا شَدِيْدًا. وَإِنَّا نَتَّخِذُ شَرَابًا مِنْ هَذَا الْقَمْحِ نَتَقَوّى بِهِ عَلَى أَعْمَالِنَا وَعَلَى بَرْدِ بِلَادِنَا. قَالَ: “هَلْ يُسْكِرُ؟” قُلْتُ: نَعَمْ. قَالَ: “فَاجْتَنِبُوْهُ”. قُلْتُ: إِنَّ النَّاسَ غَيْرُ تَارِكِيْهِ. قَالَ: “إِنْ لَمْ يَتْرُكُوْهُ فَقَاتِلُوْهُمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
3651. (18) [2/1083- దృఢం]
దైలమ్ ‘హిమ్యరీ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను, ‘ఓ ప్రవక్తా! మేము శీతల ప్రాంతానికి చెందిన వారం. చాలా కష్టపడవలసి ఉంటుంది. మేము గోధుమల మద్యం తయారు చేస్తాం. దానివల్ల మాకు పనిచేయడంలో శక్తి లభిస్తుంది. సహాయం కూడా లభిస్తుంది. అది చల్లదనం నుండి కూడా రక్షిస్తుంది. ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో మేము దాన్ని త్రాగవచ్చా?’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘అది మత్తుగా ఉంటుందా? అని అడిగారు. దానికి నేను ‘అవును’ అన్నాను. అప్పుడు ప్రవక్త (స) ‘దానికి దూరంగా ఉండండి, త్రాగకండి’ అన్నారు. దానికి నేను ‘ప్రవక్తా! ప్రజలు దాన్ని వదలరు, దానికి అలవాటు పడిపోయారు. మద్యం త్రాగనిదే ఏ పనీ చేయలేరు’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘ఒకవేళ వారు మంచిగా వదలకపోతే వారితో పోరాడు,’ అని అన్నారు. (అబూ దావూద్)
3652 – [ 19 ] ( لم تتم دراسته ) (2/1083)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِو: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى عَنِ الْخَمْرِ وَالْمَيْسِرِ وَالْكُوْبَةِ وَالْغُبَيْرَاءِ وَقَالَ: “كُلُّ مُسْكِرٍ حَرَامٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3652. (19) [2/1083– అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) మద్యం, జూదం, పాచికల ద్వారా జోస్యం, చదరంగాలను నిషేధించారు. ఇంకా ప్రవక్త (స) ‘ప్రతి మత్తుపదార్థం నిషిధ్ధం’ అని అన్నారు.[33] (అబూ దావూద్)
3653 – [ 20 ] ( لم تتم دراسته ) (2/1083)
وَعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا يَدْخُلُ الْجَنَّةَ عَاقٌ وَلَا قَمَّارٌ وَلَا مَنَّانٌ وَلَا مُدْمِنٌ خَمْرٍ”. رَوَاهُ الدَّارَمِيُّ.
وَفِيْ رِوَايَةٍ لَهُ: “وَلَا وَلَدُ زِنْيَةٍ ” بَدَلَ ” قَمَّارٍ”.
3653. (20) [2/1083 –అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్(ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తల్లిదండ్రుల అవిధేయతకు పాల్పడిన వారు, జూదం ఆడిన వారు, ఎత్తిపొడిచేవారు, ఎల్లప్పుడూ మద్యం సేవించేవారు స్వర్గంలో ప్రవేశించలేరు.[34] (దార్మి)
మరో ఉల్లేఖనంలో అక్రమ సంతానం స్వర్గంలో ప్రవేశించదు అని ఉంది.
3654 – [ 21 ] ( ضعيف ) (2/1084)
وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ تَعَالى بَعَثَنِيْ رَحْمَةً لِّلْعَالَمِيْنَ وَهُدَى لِّلْعَالَمِيْنَ. وَأَمَرَنِيْ رَبِّيْ عَزَّ وَجَلَّ بِمَحْقِ الْمَعَازِفِ وَالْمَزَامِيْرِ وَالْأوْثَانِ وَالصُّلُبِ وَأَمْرِ الْجَاهِلِيَّةِ وَحَلَفَ رَبِّيْ عَزَّ وَجَلَّ: بِعِزَّتِيْ لَا يَشْرَبُ عَبْدٌ مِّنْ عَبِيْدِيْ جُرْعَةً خَمْرِ إِلَّا سَقَيْتُهُ مِنَ الصَّدِيْدِ مِثْلَهَا. وَلَا يَتْرُكُهَا مِنْ مَخَافَتِيْ إِلَّا سَقَيْتُهُ مِنْ حِيَاضِ الْقُدْسِ”. رَوَاهُ أَحْمَدُ .
3654. (21) [2/1084 –బలహీనం]
అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ (త) నన్ను ప్రపంచమంతటికీ కారుణ్యంగా మార్గదర్శకంగా పంపాడు. క్రైస్తవుల, అజ్ఞాన కాలపు ఆచారాలన్నిటినీ తొలగించేందుకు పంపాడు. నా ప్రభువు తన గౌరవం సాక్షిగా ఇలా ఆదేశించాడు: ”నా దాసుల్లో ఎవరైనా ప్రపంచంలో ఒక్క గుక్కెడు మద్యం అయినా త్రాగి వుంటే అతనికి నరకంలోని చీము రక్తాలు త్రాపిస్తాను. ఇంకా మరెవరైతే నా భయం వల్ల మద్యం సేవించడం మానివేస్తే, అతనికి నేను పవిత్ర హౌ‘ద్ లోని పానీయాన్ని త్రాపిస్తాను.” [35] (అ’హ్మద్)
3655 – [ 22 ] ( لم تتم دراسته ) (2/1084)
وَعَنِ ابْنِ عُمَرَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “ثَلَاثَةٌ قَدْ حَرَّمَ اللهُ عَلَيْهِمُ الْجَنَّةَ: مُدْمِنُ الْخَمْرِوَالْعَاقُّ وَالدَّيُّوْثُ الَّذِيْ يُقِرُّفِيْ أَهْلِهِ الْخَبَثَ”. رَوَاهُ أَحْمَدُ وَالنّسَائِيُّ.
3655. (22) [2/1084 –అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ (ర) కథనం: అల్లాహ్ (త) ముగ్గురు వ్యక్తులపై స్వర్గాన్ని నిషేధించాడు. 1. నిరంతరం మద్యం త్రాగేవాడు. 2. తల్లిదండ్రుల అవిధేయతకు పాల్పడినవాడు. 3. తన ఇంటివారిని చెడు చేస్తూ ఉన్నా వారించనివాడు. [36] (అ’హ్మద్, నసాయి’)
3656 – [ 23 ] ؟ (2/1084)
وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “ثَلَاثَةٌ لَا تَدْخُلُ الْجَنَّةَ: مُدْمِنُ الْخَمْرِ وَقَاطِعُ الرَّحِمِ وَمُصَدِّقُ السِّحْرِ” .رَوَاهُ أَحْمَدُ.
3656. (23) [2/1084– ? ]
అబూ మూసా అష్’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముగ్గురు వ్యక్తులు స్వర్గంలోకి ప్రవేశించరు. 1. ఎల్లప్పుడూ మద్యం సేవించేవారు. 2.బంధుత్వా లను త్రెంచేవారు. 3. మంత్రవిద్యపై నమ్మకం కల వారు. (అ’హ్మద్)
3657 – [ 24 ] ( لم تتم دراسته ) (2/1084)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مُدْمِنُ الْخَمْرِ إِنْ مَاتَ لَقِيَ اللهُ كَعَابِدٍ وَثَنٍ”. رَوَاهُ أَحْمَدُ .
3657. (24) [2/1084 –అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఎల్లప్పుడూ మద్యం త్రాగేవారు మరణిస్తే విగ్రహా రాధకులుగా అల్లాహ్(త)ను కలుసు కుంటారు. [37] (అ’హ్మద్)
3658 – [ 25 ] ( لم تتم دراسته ) (2/1084)
وَرَوَى ابْنُ مَاجَهُ عَنْ أَبِيْ هُرَيْرَةَ .
3658. (25) [2/1084 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: (ఇబ్నె మాజహ్)
3659 – [ 26 ] ( لم تتم دراسته ) (2/1084)
وَالْبَيْهَقِيُّ فِيْ”شُعَبِ الْإِيْمَانِ”عَنْ مُحَمَّدِ بْنِ عُبَيْدِ اللهِ عَنْ أَبِيْهِ. قَالَ: ذَكَرَ الْبُخَارِيُّ فِي التَّارِيْخِ عَنْ مُحَمَّدِ بْنِ عَبْدِ اللهِ عَنْ أَبِيْهِ .
3659. (26) [2/1084- అపరిశోధితం]
ము’హమ్మద్ బిన్ ‘ఉబేదుల్లాహ్, తన తండ్రి ద్వారా ఉల్లేఖనం. (బైహఖీ / షు’అబుల్ ఈమాన్). అదే విధంగా ముహమ్మద్ బిన్ అబ్దుల్ ముహ్సిన్, తన తండ్రి ద్వారా ఉల్లేఖనం. (బు’ఖారీ / తారీఖ్-అల్-కబీర్)
3660 – [ 27 ] ( لم تتم دراسته ) (2/1084)
وَعَنْ أَبِيْ مُوْسَى أَنَّهُ كَانَ يَقُوْلُ: مَا أُبَالِيْ شَرِبْتُ الْخَمْرَ أَوْ عَبَدْتُّ هَذِهِ السَّارِيَةَ دُوْنَ اللهِ. رَوَاهُ النَّسَائِيُّ .
3660. (27) [2/1084– అపరిశోధితం]
అబూ మూసా (ర) ఇలా అనేవారు, ”నాకు మద్యం త్రాగడం, శిలా ఫలకాన్ని మొక్కడం రెండూ సమానమే.” (నసాయి).
అంటే, ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనంలో ఉన్నట్టు, నాకు మత్తు పానీయాలు త్రాగటం, విగ్రహారాధన రెండూ ఒక్కటే.
*****
[1]) వివరణ-3557: ఖుర్ఆన్లో రజ్మ్కు సంబంధించిన ఆయతు ఉండేది. కాని దాని పఠనం రద్దయిపోయింది. అయితే దాని ఆదేశం మిగిలి ఉంది.
[2]) వివరణ-3558: రజ్‌మ్ వాక్యం అవతరించడానికి ముందు వ్యభిచార స్త్రీ, పురుషులకు సాధారణమైన శిక్ష పడేది. స్త్రీలను ఇంటిలో ఆపుకోవటం జరిగేది. వ్యభిచార పురుషులను చీవాట్లు పెట్టి, రెండు మూడు దెబ్బలు పడేవి. అల్లాహ్ ఆదేశం: ”మరియు మీ స్త్రీలలో ఎవరైనా వ్యభిచారానికి పాల్పడితే, వారికి వ్యతిరేకంగా, మీలో నుండి నలుగురి సాక్ష్యం తీసుకోండి. వారు (నలుగురు) సాక్ష్యమిస్తే, వారు మరణించే వరకైనా, లేదా వారి కొరకు అల్లాహ్ ఏదైనా మార్గం చూపించేవరకైనా, వారిని ఇండ్లలో నిర్బంధించండి. మరియు మీలో ఏ ఇద్దరూ (స్త్రీలు గానీ, పురుషులు గానీ) దీనికి (వ్యభిచారానికి) పాల్పడితే వారిద్దరినీ శిక్షించండి. వారు పశ్చాత్తాపపడి తమ ప్రవర్తనను సవరించుకుంటే వారిని విడిచిపెట్టండి. నిశ్చయంగా, అల్లాహ్‌యే పశ్చాత్తాపాన్ని అంగీకరించే వాడు, అపార కరుణాప్రదాత.” (అన్నిసా’, 4: 15–16).
ఇప్పుడు వారికొరకు నిర్ణయం వచ్చేసింది, ఒకవేళ వివాహితులైతే రాళ్ళ వర్షం ద్వారా చంపడం జరుగు తుంది. అవివాహితులైతే కొరడా దెబ్బలు పడతాయి. అందువల్లే ప్రవక్త (స) ”స్త్రీల గురించి ఆదేశాలు వచ్చేసాయి. నన్నడిగి నేర్చుకోండి,” అని అన్నారు.
[3]) వివరణ-3563: బానిస, బానిసరాలిపై రజ్‌మ్ లేదు, వారిని కొరడాదెబ్బలు కొట్టాలి.
[4]) వివరణ-3567: హజ్జాల్ వద్ద ఫాతిమ అనే పేరుగల బానిసరాలు ఉండేది. ఆమెతో మాయిజ్ వ్యభి చరించాడు. అది హజ్జాల్‌కి తెలిసిపోయింది. అతడు మాయిజ్‌తో నువ్వు ప్రవక్త (స) వద్దకు వెళ్ళి దీన్ని గురించి ప్రస్తావించు అన్నాడు. మాయిజ్ ప్రవక్త (స) వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. అప్పుడు ప్రవక్త (స) అతన్ని రజ్మ్ చేయమని ఆదేశించారు. మాయిజ్ రజ్మ్ చేయబడ్డాడు. ఆ తరువాత ప్రవక్త (స) హజ్జాల్‌తో, ‘ఒకవేళ నువ్వు మాయిజ్ తప్పును కప్పిపుచ్చి, అతన్ని నా వద్దకు పంపకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే తౌబహ్, ఇస్తిగ్‌ఫార్ తర్వాత క్షమించబడవచ్చు,’ అని అన్నారు.
[5]) వివరణ-3569: అంటే మంచివాళ్ళ వల్ల పొరపాట్లు తప్పులు దొర్లితే క్షమించివేయండి. కాని ప్రజల్లో వ్యాపించిన వాటిని మాత్రం క్షమించకండి.
[6]) అంటే ఆ వ్యక్తి తన తప్పును ఒప్పుకున్నాడు. (సయ్యిద్ అల్‌బాని) శిక్షించడం జరిగింది. అతని పాపాలన్నీ క్షమించబడ్డాయి. అల్లాహ్ (త) అతనికి సాఫల్యం ప్రసాదించాడు.
[7]) ప్రవక్త (స) ఇలా ప్రేమగా చేయడంజరిగింది. ఎందు కంటే ఇటువంటి రోగికి 100 కొరడా దెబ్బలు కొడితే చని పోతాడు. అందువల్లే 100 చిన్న కొమ్మలు ఉన్న ఒక కొమ్మ తెమ్మని దానితో కొడితే సరిపోతుందని ఆదే శించారు. సూరహ్ సాద్ – ”వఖుజ్‌బియదిక”లో ఉన్నట్టు.
[8]) వివరణ-3575: లివాతత్ విషయంలో ఇమాముల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయి. కొందరు దీన్ని వ్యభిచారంగా పరిగణిస్తారు. ఒకవేళ ఇద్దరూ వివాహితులైతే ఇద్దరినీ రాళ్ళతో కొట్టి చంపడం జరుగుతుంది. ‘హదీసు’లో చంపమని ఉంది. అందువల్ల ఇద్దరినీ చంపటం జరుగుతుంది. ఎందుకంటే ఇది కూడా చాలా పెద్ద నేరమే. అందువల్లే అల్లాహ్(త) వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపమని ఆదేశించాడు.
[9]) వివరణ-3578: మొదట వ్యభిచారం చేసానని చెప్పి నందుకు 100 కొరడాలు కొట్టబడ్డాయి. రెండవసారి అపనింద వేసినందుకు 80 కొరడా దెబ్బలు పడ్డాయి.
[10]) అంటే వ్యభిచారం వల్ల కరవుకాటకాలకు గురిచేయడం జరుగుతుంది. లంచం తీసుకోవటం వల్ల హృదయాల్లో భయాందోళనలు జనిస్తాయి.
[11]) ఎందుకంటే శిక్షపడితే ప్రజలు వ్యభిచారానికి దూరంగా ఉంటారు. దానివల్ల భూమిపై 40 రోజులు వర్షం పడటం కన్నా కలిగే లాభం ఎక్కువ. ఎందుకంటే వ్యభిచారం వల్ల కరవు కాటకాలు తాండవిస్తాయి.
[12]) వివరణ-3590: దొంగ చేతులు నరకడానికి దీనార్‌లో నాల్గవవంతు, 12 అణాలు దొంగలించి ఉండాలి. అంత కంటే తక్కువ దొంగలిస్తే చేతులు నరకరాదు. అహ్లె’హదీస్’, షాఫయీ, అ’హ్‌మద్ ధార్మిక పండితు లందరూ దీన్నే సమర్థిస్తున్నారు.
[13]) వివరణ-3591: ఒక దిర్హమ్ ఇంచుమించు, నాలుగు అణాలకు సమానం. పావు దీనార్ కూడా మూడు దిర్హమ్లకు సమానం. ఈ రెండు ‘హదీసు’ల ద్వారా సుమారు 12 అణాల వస్తువు దొంగలిస్తే చేతులు నరికివేయబడతాయి. 10 దిర్‌హమ్‌ల ‘హదీసు’కు ఏమాత్రం ప్రామాణికత లేదు.
[14]) వివరణ-3592: ఇది సాధారణమైన ‘హదీసు’. అయితే గుడ్డు కనీసం మూడు దిర్‌హమ్‌లకు సమానమైన ధర కలిగి ఉండాలి. త్రాడు మూడు దిర్‌హమ్‌లు అంతకంటే ఎక్కువ ధర కలిగి ఉండాలి.
[15]) వివరణ-3593: ఒకవేళ ఈ పళ్ళ చెట్టు భద్రంగా ఉంటే మాత్రం చేతులు కోయటం జరుగుతుంది. భద్రతలేని ప్రదేశంలో ఉంటే చేతులు నరకటం జరుగదు.
[16]) వివరణ-3599: అంటే న్యాయాధికారి వద్దకు వెళ్ళడానికి ముందు దొంగను క్షమించివేస్తే అతని చేతులు నరకడం జరగదు. కేసు న్యాయాధికారి వద్దకు వెళ్ళిన తర్వాత క్షమించడానికి ఏమాత్రం విలువ ఉండదు. న్యాయాధికారి అతని చేతులు నరకమని ఆదేశిస్తాడు.
[17]) వివరణ-3601: ప్రయాణంలో, యుద్ధంలో ఎవరైనా దొంగతనానికి పాల్పడితే చేతులు నరకరాదు. తిరిగి వచ్చిన తర్వాత అతని చేతులు నరకాలి. కొందరు యుద్ధ ధనం పంచక ముందు దొంగలిస్తే చేతులు నరకరాదని అభిప్రాయ పడుతున్నారు.
[18]) వివరణ-3610: ఈ స్త్రీలో రెండు చెడు అలవాట్లు ఉండేవి. అవసరానికి వాడుకునే వస్తువులను ప్రజల దగ్గరి నుండి తీసుకునేది. ఆతరువాత తిరస్కరించేది. అంటే నేను మీదగ్గర నుండి ఏ వస్తువూ తీసుకోలేదని చెప్పేది. రెండవది ఈమె దొంగతనం కూడా చేసేది. ఈమె ఇలాంటిదని అందరికీ తెలిసి ఉండేది. ఈమె చేతులు దొంగతనం చేయటం వల్ల నరకబడ్డాయి.
[19]) వివరణ-3615: మొదటి ‘హదీసు’లో శిక్ష నిర్ణయించ లేదు. మరో ఉల్లేఖనంలో శిక్ష నిర్ణయించబడింది. అంటే కనీసం 40 కొరడా దెబ్బలు కొట్టాలి.
[20]) వివరణ-3616: ఉమర్ (ర) చట్టపరంగా, రాజకీయ పరంగా 80 కొరడా దెబ్బలు కొట్టారు. అయితే 40 కొరడా దెబ్బలే సరిపోయేవి. దీనివల్ల తెలిసిన విషయం ఏమిటంటే పాలకునికి 40 లేదా 80 కొరడా దెబ్బలు కొట్టే అధికారం ఉంది.
[21]) వివరణ-3619: అంటే ఇస్లామ్ ప్రారంభంలో త్రాగు బోతుకు నాల్గవసారి త్రాగితే చంపివేసేవారు. ఆ తరు వాత ఈ శిక్ష రద్దయిపోయింది. ఎన్నిసార్లు త్రాగినా చంపటం జరుగదు. కేవలం కొరడా దెబ్బలు మాత్రమే పడతాయి. అంటే 40 లేదా 80 కొరడా దెబ్బలు పడతాయి.
[22]) వివరణ-3622: అంటే అతన్ని ధార్మిక చట్టం ప్రకారం శిక్షించలేదు. ఆ వ్యక్తి సారాయి త్రాగానని ఒప్పుకోనూ లేదు. అతడు సారాయి త్రాగుతూ ఉండగా ఎవరూ చూడలేదు. అతడు పాలకుని వద్దకు చేరనైనా చేరలేదు.
[23]) వివరణ-3623: ప్రవక్త (స) 40 కొరడా దెబ్బలు కొట్టారని ఇంతకుముందు తెలుసుకున్నాం. అంటే త్రాగుబోతుకు 40 కొరడా దెబ్బలు శిక్ష అన్నమాట. అలీ (ర)కు ఈ విషయం తెలిసి ఉండదు.
[24]) వివరణ-3624: అంటే ఇప్పుడు త్రాగుబోతుకు 80 కొరడా దెబ్బలు. దీన్ని సహచరులంతా సమర్థించారు.
[25]) వివరణ-3625: ప్రవక్త పట్ల ప్రేమ విశ్వాసంలోని భాగం. ప్రవక్త (స) అనుచరులు తమ ధన ప్రాణాల కంటే ఎక్కువగా ప్రవక్త (స)ను ప్రేమించేవారు. దీన్ని గురించి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒకసారి ఒక అనుచరుడు ప్రవక్త (స) వద్దకు వచ్చి ప్రేమ పూర్వకంగా షర్టును తిరగేసి లోపలికి దూరి ముద్దు పెట్టుకొని, ప్రవక్త (స)ను కౌగలించుకున్నారు. (అబూ దావూద్)
ఉసైద్ బిన్ ‘హు’దైర్ మంచి మనస్తత్వం గల వ్యక్తి. అతను ఒకరోజు హాస్య సంభాషణ చేస్తున్నారు. ప్రవక్త (స) బెత్తంతో పొడిచారు. అతడు ప్రతీకారం తీర్చుకోగోరాడు. ప్రవక్త (స) దానికి సిద్ధపడ్డారు. కాని అతడు మీ శరీరంపై షర్టు ఉంది, నా శరీరంపై షర్టు లేదు అని అన్నాడు. ప్రవక్త (స) షర్టు విప్పి వేసారు. షర్టు విప్పగానే అతను ప్రవక్త (స)ను కౌగలించుకున్నాడు. ముద్దుపెట్టు కున్నాడు. ఇంకా, ‘ఇదే నా ప్రతీకారం,’ అని అన్నాడు. (ఉస్వ సహాబహ్)
అబ్దుల్ ఖైస్ తెగ నుండి ఒక బృందం వచ్చింది. వాహనాల నుండి దిగగానే అందరూ ప్రవక్త (స) వైపు పరిగెత్తి కాళ్ళు చేతులకు ముద్దులు పెట్టసాగారు. (అబూ దావూద్)
జాహిర్ ఒక పల్లెవాసి. అతను ప్రవక్త (స)ను ఎంతగానో ప్రేమించేవారు. ప్రవక్త (స)కు కానుకలు పంపించేవారు. ప్రవక్త (స) కూడా అతన్ని ప్రేమించేవారు. ఇంకా జాహిర్ మా పల్లె వాసులు, మేము అతని పట్టణవాసులం అని అనేవారు. ఒక సారి మార్కెట్‌లో సరుకులు కొంటున్నారు. వెనుక నుండి ప్రవక్త (స) అతన్ని ఒడిలోకి తీసుకున్నారు. అతను ఎవరు? ఎవరు? నన్ను వదలండి అని అంటూ తిరిగి చూసేసరికి ప్రవక్త (స) సంతోషం పట్టలేక తన వీపును ప్రవక్త గుండెతో రాస్తున్నారు. కాని ఇంకా తనివి తీరటం లేదు. (షమాయిల్ తిర్మిజి)
‘అబ్దుల్లాహ్ ‘హిమార్ ప్రవక్త (స)ను ప్రేమించేవారు. అతడు ప్రేమిస్తున్నాడనే దానికి స్వయంగా ప్రవక్త (స) సాక్ష్యం ఇచ్చేవారు. ‘అబ్దుల్లాహ్ ‘హిమార్ బజారు నుండి అరువుగా ఏదైనా వస్తువుకొని ప్రవక్త (స)కు ఇచ్చేవారు. దుకాణదారుడు దాని ధర కోసం వస్తే, అతన్ని ప్రవక్త (స) ముందు నిలబెట్టి, ‘తమరు దీని ధరను ఇచ్చివేయండి,’ అని అనేవారు. ఈ విధంగా హాస్యాలు, హాస్య సంభాషణ చేసేవారు. అందువల్ల ప్రజలు అతన్ని ‘అబ్దుల్లాహ్ ‘హిమార్ అని పిలిచేవారు. ఈ ‘అబ్దుల్లాహ్ ‘హిమార్‌ను ప్రవక్త (స) చాలా అధికంగా ప్రేమించేవారు. ఇతని వల్ల పొరపాట్లు తప్పులు జరిగేవి. ఒక్కోసారి ఇతడు సారాయి త్రాగేవారు. ప్రవక్త (స) కొరడాదెబ్బలు కొట్టేవారు. దైవశిక్షలు విధించడంలో ప్రవక్త (స) ఎవరినీ లక్ష్యపెట్టేవారు కారు.
[26]) అంటే ఇటువంటి పదాలు, తిట్లటం వల్ల పాలకుడు దండనగా కొరడా దెబ్బలు కొట్టగలడు. మొదటి ‘హదీసు’లో 80 కొరడా దెబ్బల వరకు కొట్టవచ్చును. ఈ ‘హదీసు’లో 20 కొరడా దెబ్బలు పేర్కొనడం జరిగింది.
[27]) వివరణ-3633: యుద్ధ ధనంలో నుండి దొంగతనం చేసే వాడిని చేతులు నరకబడవు. అయితే దండనగా కొద్దిగా శిక్షించి వదలివేయడం జరుగుతుంది. సామానును కాల్చివేసే ఆదేశం రద్దయిపోయింది. ఇస్లామ్ ప్రారంభంలో ఈ ఆదేశం ఉండేది.
[28]) అంటే అత్యధికంగా ఈ రెంటి ద్వారా తయారవు తుంది. ఇవేకాక ఇతర పండ్లద్వారా కూడా తయారవు తుంది. ఒక వస్తువు తిన్నా, త్రాగినా మత్తువస్తే అది మత్తు పదార్థం అవుతుంది. అది గోదుమలు, తేనె, ద్రాక్ష, ఖర్జూరం, బియ్యం మరే వస్తువుతో చేయబడినాసరే.
[29]) అది ఈ వస్తువులు మొక్కజొన్న, జొన్నలు, బియ్యం మొదలైన వాటితో తయారైనా సరే. ఖర్జూరం కల్లులో ఒకవేళ మత్తువస్తే అది కూడా మద్యంగానే పరిగణించబడుతుంది. అది కూడా నిషిద్ధం.
[30]) వివరణ-3637: తేనె సారాయిని బిత్’ఉ అంటారు. దీన్ని గురించి ప్రజలు ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స) ప్రతి మత్తుపదార్థం నిషిద్ధం అని, ఒకవేళ ఆ తేనె సారాయిలో మత్తు ఏర్పడితే, దాన్ని సేవించడం కూడా నిషిద్ధమే అని అన్నారు .
[31]) వివరణ-3640: ఈ రెంటిని కలిపి నబీజ్ తయారు చేస్తే, అందులో మత్తు ఏర్పడుతుంది. అందువల్ల వారించారు. అయితే వేర్వేరుగా చేసి వాటిలో మత్తు ఉండకపోతే సేవించ వచ్చును.
[32]) వివరణ-3650: ముఫ్తిదిన్ అంటే ఉపయోగించటం వల్ల శరీరం వేడెక్కిపోయే పదార్థం. కాళ్ళు చేతులు సోమరితనానికి గురవుతాయి. ఇటువంటి పదార్థాలను కూడా ఉపయోగించ వద్దని ప్రవక్త (స) వారించారు.
[33]) వివరణ-3652: కూబహ్ చదరంగం లేదా చిన్న తబ్‌లాను అంటారు. అంటే ఆటల డప్పుల వస్తువుల నుండి వారించారు. అల్–గుబైరావు చనగల మద్యం ఇది చాలా ధాటుగా ఉంటుంది. ఒక ‘హదీసు’లో ‘గబీర్ మద్యాన్నుండి దూరంగా ఉండండి. ఇది జొన్నలతో తయారు చేయబడుతుంది. ఇది ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో లభిస్తుంది. అంటే అందరూ దీన్ని మద్యం అంటారు. ఇది కూడా ఇతర మద్యాల్లా మత్తుగా ఉంటుంది. అందరూ దీన్ని ఉపయోగిస్తారు.
[34]) వివరణ-3653: తల్లిదండ్రుల విధేయత తప్పనిసరి విధి. అవిధేయత నిషిద్ధం. తల్లిదండ్రుల అవిధేయత ధర్మమని భావించి చేసేవారు అవిశ్వాసులౌతారు. స్వర్గంలో ప్రవేశించలేరు. జూదం, ఉపకారం చేసి ఎత్తిపొడవటం, త్రాగుబోతు అన్నీ ఇటువంటివే. అక్రమ సంతానం అంటే యుక్తవయస్సుకు చేరిన తర్వాత కూడా తప్పుడు మార్గాన్ని అనుసరించేవారు.
[35]) వివరణ-3654: అంటే ఎటువంటి మేళతాళాల, డప్పులు, సంగీతాలు అన్నిటినీ నిర్మూలించటానికే అల్లాహ్ (త) నన్ను పంపాడు. ప్రస్తుతం ఉన్న ఆధునిక సంగీత పరికరాలు ఈ కోవకు చెందినవే. ఇవన్నీ నిషిద్ధం. ఎందుకంటే వీటివల్ల కల్లోలాలు, ఉపద్రవాలు తలెత్తుతాయి.
[36]) వివరణ-3655: ‘దయ్యూస్’ అంటే తన భార్య వద్దకు పరపురుషులు వస్తూ-పోతూ ఉండటం భరించే పౌరుషం లేని వ్యక్తి. అశ్లీల పనులు జరుగుతూ ఉన్నా చూసి వారించని మనిషి. ఒక ‘హదీసు’లో ఇలా ఉంది: ‘దయ్యూస్’ స్వర్గంలో ప్రవేశించడు. లేదా స్వర్గ పరిమళాన్ని ఆస్వాదించలేడు. అప్పుడు ప్రవక్త (స) అనుచరులు ‘దయ్యూస్’ అంటే ఎవరు’ అని ప్రశ్నించారు. ”తన భార్య అశ్లీల కార్యాలకు పాల్పడుతుందన్న విషయం తెలిసి కూడా వారించని వ్యక్తి” అని ప్రవక్త (స) సమాధానమిచ్చారు. కొందరు ‘దయ్యూస్’ అంటే పర పురుషులను తన భార్య దగ్గరకు రానిచ్చేవాడని, తన సోదరీ ణులవద్దకు పరపురుషులను రానిచ్చేవాడని, తన కూతుర్లవద్దకు పరపురుషులను రానిచ్చేవాడని అభిప్రాయపడుతున్నారు. ఇంకా తమ తల్లులను, కూతుర్లను, చెల్లాయిలను స్త్రీలను బుర్‌ఖా లేకుండా త్రిప్పేవారు ఈ కోవకు చెందినవారే.
[37]) వివరణ-3657: అంటే త్రాగుబోతు విగ్రహారాధకుడుగా పరిగణించబడతాడు, ఎందుకంటే మనోకాంక్షలకు బానిస అయినవాడూ, విగ్రహారాధకుడూ ఇద్దరూ ఒక్కటే.
***