16- كِتَابُ الْقِصَاصِ
16. న్యాయ ప్రతీకార (ఖిసాస్) పుస్తకం
ఖి‘స‘స్ మరియు ఖి‘సా‘స్ అంటే వెనుక నడచుట అని అర్థం. ఒకవేళ ఎవరైనా ఒకరిని హత్యచేస్తే, హత్య చేయబడిన వ్యక్తికి బదులు హంతకుడ్ని చంపటాన్ని ఖి‘సా‘స్ అంటారు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి సంరక్షకుడు హంతకుని వెంట పడిపోతాడు. ఖి‘సా‘స్ అంటే సమానం అనే అర్థం కూడా వస్తుంది. ఒకవేళ హత్య చేయబడిన వ్యక్తి సంరక్షకుడు హంతకుణ్ని చంపివేస్తే హంతకుడు, హత్య చేయబడినవాడు ఇద్దరూ సమానులైపోతారు. అంటే ఇద్దరూ హతులు అయ్యారు. ఖి‘సా‘స్ వల్ల సమాజంలో శాంతిభద్రతలు ఉంటాయి. దానివల్ల ప్రతి ఒక్కరి ధనమానప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. అల్లాహ్ ఆదేశం: ”ఓ విశ్వాసులారా! హత్య విషయంలో మీ కొరకు న్యాయ ప్రతీకారం (ఖి‘సా‘స్) నిర్ణయించబడింది. ఆ హత్య చేసిన వాడు, స్వేచ్ఛ గలవాడైతే ఆ స్వేచ్ఛాపరుణ్ణి, బానిస అయితే ఆ బానిసను, స్త్రీ అయితే ఆ స్త్రీని (వధించాలి). ఒకవేళ హతుని సోదరులు (కుటుంబీకులు) హంతకుణ్ణి కనికరించదలిస్తే, ధర్మయుక్తంగా రక్తశుల్క నిర్ణయం జరగాలి. హంతకుడు రక్తధనాన్ని, ఉత్తమరీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు తరఫునుండి మీకు లభించే సౌకర్యం, కారుణ్యం. దీని తర్వాత కూడా ఈ హద్దును అతిక్రమించే వానికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. ఓ బుద్ధిమంతులారా! న్యాయ ప్రతీకారం (ఖి‘సా‘స్)లో మీకు ప్రాణ రక్షణ ఉంది, దీనివల్ల మీరు దైవభీతి గలవారు అవుతారు. (అల్ బఖరహ్, 2:178–179)
తౌరాతు గ్రంథంలో యూదుల కొరకు మేము ఈ ఆజ్ఞను వ్రాసాము. ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పన్నుకు బదులు పన్ను, ఇలా సమస్త గాయాల కొరకు సమానమైన ప్రతీకారం. కాని ఎవరైనా ప్రతీకారం తీర్చుకోకుండా క్షమిస్తే అది అతనికి పాపపరిహారం అవుతుంది. అల్లాహ్ అవతరింపజేసిన ఆదేశం ప్రకారం తీర్పుచేయని వారే దుర్మార్గులు.
——-
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3446 – [ 1 ] ( متفق عليه ) (2/1027)
عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَحِلُّ دَمُ امْرِئٍ مُسْلِمٍ يَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهَ وَأَنِّيْ رَسُوْلُ اللهِ إِلّضا بِإِحْدَى ثَلَاثٍ: النَّفْسُ بِالنَّفْسِ وَالثَّيِّبُ الزَّانِيْ وَالْمَارِقُ لِدِيْنِهِ اَلتَّارِكُ لِلْجَمَاعَةِ”.
3446. (1) [2/1027 –ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ తప్ప ఆరాధ్యులు ఎవరూ లేరని, ము’హమ్మద్ (స) అల్లాహ్ (త) ప్రవక్త అని సాక్ష్యం ఇచ్చే వ్యక్తిని హత్యచేయడం, అతని రక్తం చిందించడం ఈ మూడు కారణాల వల్ల తప్ప ధర్మసమ్మతం కాదు. 1. ఎవరినైనా హత్యచేస్తే అతని ఖి‘సా‘స్‌కు బదులు అతన్ని హత్యచేయడం ధర్మం. 2. వివాహిత వ్యభిచారిని పూర్తి సాక్ష్యాధారాలతో రాళ్ళతో కొట్టి చంపటం. 3. ముస్లిములను వదలి వేరైన అంటే ఇస్లామ్‌ను విసర్జించిన వ్యక్తిని చంపటం ధర్మం. (బు’ఖారీ, ముస్లిమ్)
3447 – [ 2 ] ( صحيح ) (2/1027)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَنْ يَزَالَ الْمُؤْمِنُ فِيْ فُسْحَةٍ مِّنْ دِيْنِهِ مَا لَمْ يُصِبْ دَمًا حَرَامًا”. رَوَاهُ الْبُخَارِيُّ.
3447. (2) [2/1027– దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఒక ముస్లిమ్ మరో ముస్లిమ్ ను అన్యాయంగా హత్య చేయనంతవరకు, అతడు తన ధార్మిక విశాలతలో ఉంటాడు. అతన్ని దైవకారుణ్యం ఆవరించి ఉంటుంది. (బు’ఖారీ)
3448 – [3] ( متفق عليه ) (2/1027)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أوَّلُ مَا يُقْضَى بَيْنَ النَّاسِ يَوْمَ الْقِيَامَةِ فِي الدِّمَاءِ”.
3448. (3) [2/1027 –ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పు దినం నాడు అన్నిటి కంటే ముందు ప్రజల మధ్య హత్యల గురించి తీర్పుచేయబడును.[1] (బు’ఖారీ, ముస్లిమ్)
3449 – [ 4 ] ( متفق عليه ) (2/1027)
وَعَنِ الْمِقْدَادِ بْنِ الْأَسْوَدَ أَنَّهُ قَالَ: يَا رَسُوْلَ اللهِ أَرَأَيْتَ إِنْ لَقِيْتُ رَجُلًا مِنَ الْكُفَّارِ فَاقْتَتَلْنَا فَضَرَبَ إِحْدَى يَدَيَّ بِالسَّيْفِ فَقَطَعَهُمَا ثُمَّ لَاذَ مِنِيْ بِشَجَرَةٍ. فَقَالَ: أَسْلمْتُ لِلّهِ.
وَفِيْ رِوَايَةٍ: فَلَمَّا أَهْوَيْتُ لِأَقْتُلَهُ قَالَ: لَا إِلَهَ إِلَّا اللهُ أَأَقْتُلُهُ بَعْدَ أَنْ قَالَهَا؟ قَالَ: “لَا تَقْتُلْهُ. “فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَّهُ قَطَعَ إِحْدَى يَدَيَّ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لا تَقْتُلْهُ فَإِنْ قَتَلْتَهُ فَإِنَّهُ بِمَنْزِلَتِكَ قَبْلَ أَنْ تَقْتُلَهُ وَإِنَّكَ بِمَنْزِلَتِهِ قَبْلَ أَنْ يَّقُوْلَ كَلِمَتُهُ الَّتِيْ قَالَ”.
3449. (4) [2/1027 –ఏకీభవితం]
మిఖ్‌దాద్ బిన్ అస్వద్ (ర) కథనం: అతను ప్రవక్త (స) తో, ”ఓ అల్లాహ్ ప్రవక్తా! ఒకవేళ నేను అవిశ్వాసితో యుద్ధం చేయటానికి బయలుదేరి పోరాటంలో మేమిద్దరం ఒకర్ని ఇంకొకరు కొట్టుకునేటప్పుడు, ఆ అవిశ్వాసి నా చేతిపై కరవాలంతో కొట్టాడు, దానివల్ల నా చేయి తెగింది. ఆ వ్యక్తి పారిపోయి ఒక చెట్టు చాటున నన్ను శరణుకోరి, ‘అల్లాహ్ (త) కోసం నేను ఇస్లామ్ స్వీకరించాను.’ అని అంటాడు.”
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”నేనితన్ని కొట్టటానికి సిద్ధపడినపుడు అతడు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ‘ అని పఠించసాగాడు. ఆ శుభవచనం పలికిన తరువాత నేనతన్ని చంపవచ్చునా?” అని అడిగాను. దానికి ప్రవక్త (స), ”ఇప్పుడు నువ్వు అతన్ని చంపకు,” అని ఉపదేశించారు. దానికి నేను, ‘ప్రవక్తా! ఆ వ్యక్తి నా ఒక చేయిని నరికివేసాడు,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ”అతన్ని చంపకు, ఒకవేళ నువ్వు అతన్ని చంపితే, అతడు నీ స్థానంలో ఉంటాడు. అతన్ని కొట్టక ముందు – శుభవచనం పలకటం వల్ల – అతడు ముస్లిమ్ అయిపోయాడు. అతడు నిన్ను కొట్టక ముందు నువ్వు ముస్లిమువు. నువ్వు అతన్ని చంపివేస్తే నీవు అతడి స్థానంలో వచ్చేస్తావు. అంటే అతడు శుభవచనం పలకక ముందు ఉండేస్థానం. అంటే కలిమహ్ పఠించక ముందు అతడు అవిశ్వాసి, ఇక అతడు కలిమహ్ పఠించిన తరువాత నీవు అతన్ని చంపితే నీవు అవిశ్వాసివి అయిపోతావు,” అని అన్నారు. [2] (బు’ఖారీ ముస్లిమ్)
3450 – [ 5 ] ( متفق عليه ) (2/1028)
وَعَنْ أُسَامَةَ بْنِ زَيْدٍ قَالَ: بَعَثَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلَى أُنَاسٍ مِنْ جُهَيْنَةَ فَأَتَيْتُ عَلَى رَجُلٍ مِنْهُمْ فَذَهَبْتُ أَطْعَنُهُ فَقَالَ: لَا إِلَهَ إِلَّا اللهُ فَطَعَنْتُهُ فَقَتَلْتُهُ فَجِئْتُ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَأَخْبَرْتُهُ فَقَالَ: “أَقَتَلْتَهُ وَقَدْ شَهِدَ أَنْ لَا إِلَهَ إِلّا اللهُ؟” قُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِنَّمَا فَعَلَ ذلك تَعَوُّذًا قَالَ: “فَهَلّا شَقَقْتَ عَنْ قَلْبِهِ؟”
3450. (5) [2/1028– ఏకీభవితం]
‘ఉసామహ్ బిన్ ‘జైద్ (ర) కథనం: ప్రవక్త (స) మమ్మల్ని జుహైనహ్ తెగవారి వద్దకు పోరాటానికి పంపారు. పోరాటంలో ఒక వ్యక్తి వద్దకు నేను వెళ్ళాను. మా ఇద్దరి మధ్య పోరాటం జరిగింది. నేనతన్ని బల్లెంతో పొడవటానికి సిద్ధపడ్డాను. ఇంతలో అతడు శుభవచనం ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ పఠించాడు. అదే స్థితిలో నేను అతన్ని బల్లెంతో చంపివేసాను. ప్రవక్త (స) వద్దకు వచ్చి జరిగినదంతా విన్నవించు కున్నాను. అది విన్న ప్రవక్త (స), ‘అతడు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ సాక్ష్యం ఇచ్చినా, నువ్వు అతన్ని చంపివేసావా?’ అని అన్నారు. దానికి నేను, ‘ప్రవక్తా! అతడు తన ప్రాణం రక్షించుకోవడానికి శుభవచనాన్ని పఠించాడు.’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘నువ్వు అతని హృదయం తెరచి చూచావా?’ అంటే అతని హృదయంలో ఉన్నది నీకు తెలియదు. నువ్వు బాహ్యపరంగా భావించాలి అని హితబోధ చేసారు. (బు’ఖారీ, ముస్లిమ్)
3451 – [ 6 ] ( صحيح ) (2/1028)
وَفِيْ رِوَايَةٍ عَنْ جُنْدُبِ بْنِ عَبْدِ اللهِ الْبَجَلِيِّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “كَيْفَ تَصْنَعُ بِلَا إِلَهَ إِلَّا اللهُ إِذَا جَاءَتْ يَوْمَ الْقِيَامَةِ؟” قَالَهُ مِرَارًا. رَوَاهُ مُسْلِمٌ.
3451. (6) [2/1028– దృఢం]
జుందుబ్ బిన్ ‘అబ్దుల్లాహ్ బజలి కథనం: ఆ తరువాత ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”తీర్పు దినంనాడు అతడు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ‘ పఠిస్తూ వస్తాడు. నువ్వు ఏం సమాధానం ఇస్తావు?” ఈ విధంగా అనేక సార్లు అన్నారు. (ముస్లిమ్)
3452 – [ 7 ] ( صحيح ) (2/1028)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عمرٍو رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَتَلَ مُعَاهِدًا لَمْ يَرِحْ رَائِحَةَ الْجَنَّةَ وَإِنَّ رِيْحَهَا تُوْجَدُ مِنْ مَسِيْرَةِ أَرْبَعِيْنَ خَرِيْفًا “. رَوَاهُ الْبُخَارِيُّ.
3452. (7) [2/1028–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఒప్పందం కుదుర్చుకున్న వారిని చంపిన వాడు, స్వర్గ సువాసనను ఆస్వాదించలేడు. అయితే స్వర్గ సువాసన 40 సంవత్సరాల దూరం వరకు వ్యాపిస్తుంది. [3] (బు’ఖారీ)
3453 – [8 ] ( متفق عليه ) (2/1028)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: مَنْ تَرَدّى مِنْ جَبَلٍ فَقَتَلَ نَفْسَهُ فَهُوَ فِيْ نَارِ جَهَنَّمَ يَتَرَدّى فِيْهَا خَالِدًا مُخَلَّدًا فِيْهَا أَبَدًا وَمَنْ تَحَسّى سَمًّا فَقَتَلَ نَفْسَهُ فَسَمَّهُ فِيْ يَدِهِ يَتَحَسَّاهُ فِيْ نَارِ جَهَنَّمَ خَالِدًا مُخَلَّدًا فِيْهَا أَبَدًا وَمَنْ قَتَلَ نَفْسَهُ بِحَدِيْدَةٍ فَحَدِيْدَتُهُ فِيْ يَدِهِ يَتَوَجَّأُ بِهَا فِيْ بَطْنِهِ فِيْ نَارِ جَهَنَّمَ خَالِدًا مُخَلَّدًا فِيْهَا أَبَدًا”.
3453. (8) [2/1028– ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా కొండపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటే, వాడు నరకంలో శాశ్వతంగా అలాగే చేస్తూ ఉంటాడు. అదేవిధంగా విషంతాగి ఆత్మహత్య చేసుకున్నవాడు నరకంలో శాశ్వతంగా విషంత్రాగి చస్తూ ఉంటాడు. అదేవిధంగా కత్తులు, కరవాలాల ద్వారా ఆత్మహత్య చేసుకున్నవాడు నరకంలో శాశ్వతంగా తన్ను తాను చంపుకుంటూ ఉంటాడు.” (బు’ఖారీ, ముస్లిమ్)
3454 – [ 9 ] ( صحيح ) (2/1028)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “الَّذِيْ يَخْنِقُ نَفْسَهُ يَخْنِقُهَا فِي النَّارِوَالَّذِيْ يَطعَنُهَا يَطعَنُهَا فِي النَّا”. رَوَاهُ الْبُخَارِيُّ.
3454. (9) [2/1028– దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పీక పిసుక్కొని ఆత్మహత్య చేసుకున్నవాడు నరకంలో శాశ్వతంగా తన పీక పిసుక్కొని ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాడు. అదేవిధంగా తన్ను తాను బల్లెంతో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నవారు నరకంలో శాశ్వతంగా బల్లెంతో పొడుచుకుంటూ ఉంటారు.” (బు’ఖారీ)
3455 – [ 10 ] ( متفق عليه ) (2/1029)
وَعَنْ جُنْدُبِ بْنِ عَبْدِ اللهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كَانَ فِيْمَنْ كَانَ قَبْلَكُمْ رَجُلٌ بِهِ جُرْحٌ فَجَزِعَ فَأَخَذَ سِكِيْنًا فَحَزبِهَا يَدَهُ فَمَا رَقَأ الدَّمُ حَتَّى مَاتَ قَالَ اللهُ تَعَالى: بَادَرَنِيْ عَبْدِيْ بِنَفْسِهِ فَحَرَّمْتُ عَلَيْهِ الْجَنَّةَ”.
3455. (10) [2/1029 –ఏకీభవితం]
జున్‌దుబ్ బిన్ ‘అబ్దుల్లాహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రాచీన కాలంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతడి చేతికి గాయం ఉండేది. దాన్ని భరించలేక తన చేతినే కోసుకున్నాడు. రక్తం కారటం మానలేదు. ఆ వ్యక్తి మరణించాడు. దానికి అల్లాహ్ (త) దాసుడు తన్ను తాను నాశనం చేయడంలో నా కంటే తొందరపడ్డాడు, నేనతనికి స్వర్గాన్ని నిషేధించాను,’ అని అన్నాడు. [4] (బు’ఖారీ, ముస్లిమ్)
3456 – [ 11 ] ( صحيح ) (2/1029)
وَعَنْ جَابِرٍ: أَنَّ الطُّفَيْلَ بْنَ عَمْرٍو الدَّوْسِيَّ لَمَّا هَاجَرَ النَّبِيُّ صلى الله عليه وسلم إِلَى الْمَدِيْنَةِ هَاجَرَ إِلَيْهِ وَهَاجَرَمَعَهُ رَجُلٌ مِنْ قَوْمِهِ فَمَرِضَ فَجَزَعَ فَأَخَذَ مَشَاقِصَ لَهُ فَقَطَعَ بِه ا بِرَاجِمَهُ فَشَخَبَتْ يَدَاهُ حَتَّى مَاتَ فَرَآهُ الطُّفَيْلُ بْنُ عَمْرٍو فِيْ مَنَامِهِ وَهَيْئَتُهُ حَسَنَةٌ وَرَآهُ مَغَطِّيًا يَدَيْهِ فَقَالَ لَهُ: مَا صَنَعَ بِكُلِّ رَبُّكَ؟ فَقَالَ: غَفَرَ لِيْ بِهِجْرَتِيْ إِلَى نَبِيِّهِ صلى الله عليه وسلم فَقَالَ: مَا لِيْ أَرَاكَ مُغَطٍّيًا يَدَيْكَ؟ قَالَ: قِيْلَ لِيْ : لَنْ تُصْلِحَ مِنْكَ مَا أَفْسَدْتَّ فَقَصَّهَا الطُّفَيْلُ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَللّهُمَّ وَلِيَدَيْهِ فَاغْفِرْ”. رَوَاهُ مُسْلِمٌ.
3456. (11) [2/1029 –దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) మదీనహ్ వైపు వలస వెళ్ళినపుడు ‘తుఫైల్ బిన్ ‘అమ్ర్ దోసి కూడా వలస వెళ్ళారు. అతని వెంట అతని వర్గానికి చెందిన ఒక వ్యక్తి కూడా వెళ్ళాడు. మదీనహ్ చేరిన తర్వాత అక్కడి వాతావరణం అతనికి ప్రతికూలంగా మారింది. అతను అనారోగ్యానికి గురయ్యాడు. అతనితోపాటు అతని వర్గానికి చెందిన మరోవ్యక్తి కూడా అస్వస్థతకు గురయ్యాడు. అతడు అశాంతికి గురై తన బల్లాన్ని తీసుకొని చేతి వ్రేళ్ళను కోసివేసాడు. రక్తం కారసాగింది. ఎంత మాత్రం ఆగలేదు. దాని వల్ల ఆ వ్యక్తి మరణించాడు. ‘తుఫైల్ బిన్ ‘అమ్ర్ అతన్ని కలలో చూసాడు. అతడు మంచి స్థితిలోనే ఉన్నాడు. కాని తన రెండు చేతులను దాచిపెట్టి ఉంచాడు. కలలోనే అతడు అతన్ని, ‘నీ ప్రభువు నీ పట్ల ఎలా వ్యవహరించాడు,’ అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి అల్లాహ్ (త) నన్ను క్షమించాడు. ఎందుకంటే నేను ఆయన ప్రవక్త (స) వైపుకు వలసవెళ్ళాను అని అన్నాడు. దానికి ‘తుఫైల్ బిన్ ‘అమ్ర్ అతనితో, ‘నీ రెండు చేతులను దాచుకున్నట్టు చూస్తున్నాను,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘నీవు పాడుచేసుకున్న వాటిని మేము సరిచేయం,’ అని నాతో చెప్పటం జరిగింది,” అని అన్నాడు. ‘తుఫైల్ బిన్ ‘అమ్ర్ ఈ కలను ప్రవక్త (స)కు తెలియపరిచాడు. అప్పుడు ప్రవక్త (స), ‘ఓ అల్లాహ్! అతన్ని నీవు క్షమించివేస్తే, అతని చేతులను కూడా క్షమించు. అంటే అతని చేతులను కూడా సరిచేయి,’ అని ప్రార్థించారు. [5] (ముస్లిమ్)
3457 – [ 12 ] ( صحيح ) (2/1029)
وَعَن أبي شُرَيحٍ الكعبيِّ عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: “ثُمَّ أَنْتُمْ يَا خُزَاعَةُ قَدْ قَتَلْتُمْ. هَذَا الْقَتِيلَ مِنْ هُذَيْلٍ. وَأَنَا وَاللَّهِ عَاقِلُهُ مَنْ قَتَلَ بَعْدَهُ قَتِيلًا فَأَهْلُهُ بَيْنَ خِيرَتَيْنِ: إِن أَحبُّوا قتلوا وَإِن أَحبُّوا أخذا العقلَ”. رَوَاهُ الترمذيُّ وَالشَّافِعِيّ.
وَفِي شرح السنَّة بإِسنادِه وَصَرَّحَ: بِأَنَّهُ لَيْسَ فِي الصَّحِيحَيْنِ عَنْ أَبِي شُرَيْح وَقَالَ…
3457. (12) [2/1029 – దృఢం]
అబూ షురై’హ్ క’అబీ కథనం: ప్రవక్త (స) ఖుజా’అహ్ వాళ్ళతో, ”ఓ ఖుజా’అహ్ ప్రజలారా! మీరు చంపిన ఈ హుజై’లీ మృతునికి బదులుగా అల్లాహ్ సాక్షి! నేను అతని రక్తపరిహారం చెల్లిస్తాను. ఇకముందు ఎవరినైనా చంపితే, మృతుని వారసులకు రెండు విషయాల అధికారం ఉంటుంది. వాళ్ళు కోరితే హంతకుడిని చంపగలరు లేదా రక్తపరిహారాన్ని స్వీకరించగలరు,” అని అన్నారు. (తిర్మిజి’, షాఫ’యీ, షర్’హ్ సున్నహ్)
3458 – [ 13 ] (متفق عليه ) (2/1029)
وَأَخْرَجَاهُ مِنْ رِوَايَةِ أَبِيْ هُرَيْرَةَ يَعْنِيْ بِمَعْنَاهُ.
3458. (13) [2/81029– ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కూడా దీన్ని పేర్కొన్నారు.[6] (బు’ఖారీ, ముస్లిమ్)
3459 – [ 14 ] ( متفق عليه ) (2/1030)
وَعَنْ أَنَسٍ: أَنَّ يَهُوْدِيًّا رَضَّ رَأْسَ جَارِيَةٍ بَيْنَ حَجَرَيْنِ فَقِيْلَ لَهَا: مَنْ فَعَلَ بِكِ هَذَا؟ أَفُلَانٌ؟ حَتَّى سُمِّيَ الْيَهُوْدِيُّ. فَأومَأتُ بِرَأْسِهَا فَجِيْءَ بِالْيَهُوْدِيِّ فَاعْتَرَفَ فَأَمَرَ بِهِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَرُضَ رَأْسُهُ بِالْحِجَارَةِ.
3459. (14) [2/1030 –ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ఒక యూదుడు ముస్లిమ్ అమ్మాయి తలను రెండు రాళ్ళ మధ్య పెట్టి పగల గొట్టాడు. తరువాత, ఆ అమ్మాయిని, ‘నిన్ను ఎవరు చంపారని,’ ప్రశ్నించడం జరిగింది. ఆమె ఆ యూదుణ్ని గుర్తించి, తల సైగతో సూచించింది. ఆ యూదుణ్ణి బంధించడం జరిగింది. ఆ యూదుడు తన తప్పు ఒప్పుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స) అతని తలను కూడా రెండు రాళ్ళ మధ్య నొక్కి చంపమని ఆదేశించారు. అనంతరం అలాగే చేయడం జరిగింది. [7] (బు’ఖారీ, ముస్లిమ్)
3460 – [ 15 ] ( متفق عليه ) (2/1030)
وَعَنْهُ قَالَ: كَسَرَتِ الرُّبَيِّعُ وَهِيَ عَمَّةُ أَنَسٍ بْنِ مَالِكٍ ثَنِيَّةَ جَارِيَةٍ مِنَ الْأَنْصَارِ. فَأَتَوُا النَّبِيَّ صلى الله عليه وسلم فَأَمَرَ بِالْقِصَاصِ. فَقَالَ أَنَسُ بْنُ النَّضْرِ عَمُّ أَنَسِ بْنِ مَالِكٍ لَا وَاللهِ لَا تُكْسِرُ ثَنِيَّتُهَا يَا رَسُوْلَ اللهِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا أَنَسُ كِتَابُ اللهِ الْقِصَاصُ” فَرَضِيَ الْقَوْمُ وَقَبِلُوا الْأَرْشَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ مِنْ عِبَادِ اللهِ مِنْ لَوْ أَقْسَم عَلَى اللهِ لَأَبَرَّهُ”.
3460. (15) [2/1030 –ఏకీభవితం]
అనస్ (ర) కథనం: అతని అత్త రుబయ్యి’ఉ ఒక అ’న్సారీ అమ్మాయి పన్ను విరగ్గొట్టింది. ఆ అమ్మాయి బంధువులు ప్రవక్త (స) వద్దకు వచ్చారు. జరిగినదంతా చెప్పారు. ప్రవక్త (స) ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించారు. అంటే పన్నుకు బదులు పన్ను విరగ్గొట్టటం. ఇది విని అనస్ బిన్ మాలిక్ చిన్నాన్న అనస్ బిన్ న’దర్, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! దైవం సాక్షి! ఆమె పన్ను విరగ్గొట్టటం జరుగకూడదు,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఓ అనస్! దైవ గ్రంథంలో ఖి’సా’స్ ఆదేశం ఉంది. పన్నుకు బదులు పన్ను అని ఉంది,’ అని అన్నారు. ఆ అమ్మాయి బంధువులు రక్తపరిహారం తీసుకోవటానికి సిద్ధపడ్డారు. పన్ను విరగ్గొట్టడం జరగలేదు. అప్పుడు ప్రవక్త (స), ‘కొంత మంది దైవభక్తులు ఎలాంటి వారంటే, ఒకవేళ వారు ఏదైనా ప్రమాణం చేస్తే, అల్లాహ్ వారి ప్రమాణం పూర్తిచేస్తాడు,’ అని అన్నారు. [8] (బు’ఖారీ, ముస్లిమ్)
3461 – [ 16 ] ( صحيح ) (2/1030)
وَعَنْ أَبِيْ جُحَيْفَةَ قَالَ: سَأَلْتُ عَلِيًّا رَضِيَ اللهُ عَنْهُ هَلْ عِنْدَكُمْ شَيْءٌ لَيْسَ فِي الْقُرْآنِ؟ فَقَالَ: وَالَّذِيْ فَلَقَ الْحَبَّةَ وَبَرَأَ النَّسْمَةَ مَا عِنْدَنَا إِلَّا مَا فِي الْقُرْآنِ إِلَّا فَهْمًا يُعْطَى رَجُلٌ فِي كِتَابِهِ وَمَا فِي الصَّحِيْفَةِ. قُلْتُ: وَمَا فِي الصَّحِيْفَةِ؟ قَالَ: الْعَقْلُ وَفِكَاكُ الْأَسِيْرِ وَأَنْ لَا يُقْتَلَ مُسْلِمٌ بِكَافِرٍ. رَوَاهُ الْبُخَارِيُّ.
وَذُكِرَ حَدِيْثُ ابْنُ مَسْعُوْدٍ: “لَا تُقْتَلُ نَفْسٌ ظُلْمًا” فِي “كِتَابِ الْعِلْمِ”.
3461. (16) [2/1030 –దృఢం]
అబూ జు’హైఫహ్ (ర) కథనం: నేను ‘అలీ (ర)తో, ‘ఖుర్‌ఆన్‌లో లేనిది మీ దగ్గర ఏదైనా ఉందా,’ అని అడిగాను. దానికి ‘అలీ (ర), ‘విత్తనాల్ని చీల్చి పండించే, ప్రాణాల్ని ఉనికిలోకి తెచ్చే అల్లాహ్ సాక్షి! మా వద్ద ఖుర్‌ఆన్ తప్ప మరేమీ లేదు – – అల్లాహ్ (త) గ్రంథం ద్వారా మానవునికు ఇవ్వబడిన సత్యావగాహన, గ్రహణ శక్తి తప్ప, వాటి వల్ల మానవుడు ఖుర్‌ఆన్‌ను అర్థం చేసుకుంటాడు. ఇంకా మా వద్దకు పంపబడిన ప్రవచనాలలో ఉన్నదీను’ అని అన్నారు. దానికి నేను మీ వద్దకు పంపబడిన ప్రవచనాలలో ఏముంది? అని అడిగాను. దానికి అతను (ర) వాటిలో మూడు అంశాలు ఉన్నాయి. 1. హత్యా ప్రతీకారం మరియు రక్తపరిహారం. 2. ఖైదీలను విడుదల చేయడం. 3. అవిశ్వాసికి బదులు ముస్లిమ్‌ను వధించటం జరగదు. [9] (బు’ఖారీ)
—-
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3462 – [ 17 ] ( لم تتم دراسته ) (2/1031)
عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “لَزَوالُ الدُّنْيَا أَهْوَنُ عَلَى اللهِ مِنْ قَتْلِ رَجُلٍ مُّسْلِمٍ”. رَوَاهُ التِّرْمِذِيُّوَالنَّسَائِيُّ وَوَقَفَهُ بَعْضُهُمْ وَهُوَ الْأَصَحُّ.
3462. (17) [2/1031–అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ (త) ముస్లిమ్ హత్య తప్ప ప్రపంచ వినాశనాన్ని భరించగలడు. (తిర్మిజి’, నసాయి’)
3463 – [ 18 ] ( لم تتم دراسته ) (2/1031)
وَرَوَاهُ ابْنُ مَاجَهُ عَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ.
3463. (18) [2/1031–అపరిశోధితం]
ఇలాంటి హదీసునే బరా బిన్ ఆజిబ్ (ర) కూడా పేర్కొన్నారు.[10] (ఇబ్నె మాజహ్)
3464 – [ 19 ] ( لم تتم دراسته ) (2/1031)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ وَأَبِيْ هُرَيْرَةَ عَنْ رَسُوْلِ صلى الله عليه وسلم قَالَ: “لَوء أَنَّ أَهْلَ السَّمَاءِ وَالْأَرْضِ اِشْتَركُوْا فِيْ دَمٍ مُؤْمِنٍ لَأَكَبَّهُمُ اللهُ فِي النَّارِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.
3464. (19) [2/1031–అపరిశోధితం]
అబూ స’యీద్, అబూ హురైరహ్ (ర)ల కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ భూమ్యాకాశాల్లో ఉన్న వారందరూ ఒక ముస్లిమ్ వ్యక్తిని చంపటంలో భాగ స్వాములైతే, అల్లాహ్ (త) వారందరినీ నరకంలో పడ వేస్తాడు. [11] (తిర్మిజి’ / ఏకోల్లేఖనం)
3465 – [ 20 ] ( لم تتم دراسته ) (2/1031)
وَعَنِ ابْنِ عَبَّاسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “يَجِيْءُ الْمَقْتُوْلُ بِالْقَاتِلِ يَوْمَ الْقِيَامَةِ نَاصِيَتُهُ وَرَأْسُهُ بِيَدِهِ وَأَوْدَاجُهُ تَشَخُبُ دَمًا يَقُوْلُ: يَا رَبِّ قَتَلَنِيْ حَتَّى يُدْنِيْهِ مِنَ الْعَرْشِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.
3465. (20) [2/1031–అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు హతుడు తన హంతకుడ్ని ఏవిధంగా పట్టుకొని వస్తాడంటే, హంతకుడి నుదురు, తల హతుని చేతిలో ఉంటాయి. హతుని శరీరం నుండి రక్తం కారుతూ ఉంటుంది. హతుడు అల్లాహ్(త)తో, ‘ఓ నా ప్రభూ! ఈ హంతకుడ్ని ప్రపంచంలో నన్ను ఎందుకు హత్యచేసాడో అడగండి’ అని వేడుకుంటాడు. ఈ విధంగా అంటూ దైవసింహాసనం వరకు తీసుకొని వెళతాడు. (తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్)
3466 – [ 21 ] ( لم تتم دراسته ) (2/1031)
وَعَنْ أَبِيْ أُمَامَةَ بْنِ سَهْلِ بْنِ حُنَيْفٍ أَنَّ عُثْمَانَ بْنَ عَفَّانَ رَضِيَ اللهُ عَنْهُ أَشْرَفَ يَوْمَ الدَّارِ فَقَالَ: أَنْشُدُكُمْ بِاللهِ أَتَعْلَمُوْنَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا يَحِلُّ دَمُ امْرِئٍ مُسْلِمٍ إِلَّا بِإِحْدَى ثَلَاثٍ: زِنَى بَعْدَ إِحْصَانٍ أَوْ كُفْرٌ بَعْدَ إِسْلَامٍ أَوْ قَتْلُ نَفْسٍ بِغَيْرِ حَقٍّ فَقُتِلَ بِهِ”؟ فَوَ اللهِ مَا زَنَيْتُ فِيْ جَاهِلَيَّةٍ وَلَا إِسْلَامٍ وَلَا ارْتَدَدْتُّ مُنْذُ بَايَعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَلَا قَتَلْتُ النَّفْسَ الَّتِيْ حَرَّمَ اللهُ فَبِمَ تَقْتُلُوْنَنِيْ؟ رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَلِلدَّارِمِيِّ لَفْظُ الْحَدِيْثِ.
3466. (21) [2/1031–అపరిశోధితం]
అబూ ఉమామహ్ బిన్ సహల్ బిన్ ‘హునైఫ్ కథనం: ‘ఉస్మాన్ బిన్ ‘అఫ్ఫాన్ (ర) దార్ రోజున తన ఇంటి పైకప్పుపై ఎక్కి ప్రజల నుద్దేశించి, ”ఓ ప్రజలారా! నేను అల్లాహ్ (త)పై ప్రమాణం చేసి మిమ్మల్ని అడుగు తున్నాను, ”ప్రవక్త (స) ముస్లిమ్‌ను వధించటం ధర్మం కాదని, అయితే మూడు విషయాల్లో తప్ప, ‘1. వివాహం అయి ఉండి కూడా వ్యభి చారం చేసినవాడు, 2. ఇస్లామ్ స్వీకరించిన తర్వాత తన ధర్మాన్ని విసర్జించినవాడు, లేదా 3. ఎవరినైనా అన్యాయంగా చంపినవాడు’ అని ప్రవచించినట్టు మీకు తెలుసా?” అని అన్నారు. అంటే వ్యభిచరించిన వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపటం జరుగు తుంది, ఇస్లామ్‌ను విసర్జిస్తే వధించడం జరుగుతుంది. ఒకరిని అన్యాయంగా చంపితే హతునికి బదులుగా అతన్ని వధించడం జరుగుతుంది. ”అల్లాహ్ (త) సాక్షి! ఇస్లామ్‌కు ముందు నేను వ్యభచరించ లేదు, ఇస్లామ్ తర్వాత కూడా. ఇంకా ప్రవక్త (స) చేతిపై ఇస్లామ్ స్వీకరించిన నాటి నుండి ఇస్లామ్ పైననే ఉన్నాను, ఇస్లామ్‌ను త్యజించలేదు. ఇంకా నేను ఎవరిని అన్యాయంగా చంపనూ లేదు. మరి మీరెందుకు నన్ను చంపాలని కోరుతున్నారు,” అని అన్నారు. [12] (తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్, దార్మి)
3467 – [ 22 ] ( لم تتم دراسته ) (2/1032)
وَعَنْ أَبِي الدَّرْدَاءِ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا يَزَالُ الْمُؤْمِنُ مُعْنِقًا صَالِحًا مَا لَمْ يُصِبْ دَمًا حَرَامًا فَإِذَا أَصَابَ دَمًا حَرَامًا بَلَّحَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3467. (22) [2/1032– అపరిశోధితం]
అబూ దర్‌దా’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”విశ్వాసి అధర్మ రక్తాన్ని చిందించనంత వరకు మంచి వైపు ముందడుగు వేస్తూ ఉంటాడు. అధర్మంగా హత్య చేస్తే అలసిపోతాడు.[13] (అబూ దావూద్)
3468 – [ 23]؟ (2/1032)
وَعَنْهُ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ:”كُلُّ ذَنْبٍ عَسَى اللهُ أَنْ يَغْفِرَهُ إِلَّا مَنْ مَاتَ مُشْرِكًا أَوْ مَنْ يَقْتُلُ مُؤْمِنًا مُتَعَمِّدًا” . رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3468. (23) [2/1032 –? ]
అబూ దర్‌దా’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”అల్లాహ్ (త) దాసుని పాపాలను క్షమించడం సాధ్యం. కాని విగ్రహారాధకుడు, మరియు హంతకుడైన విశ్వాసిని క్షమించడు.” (అబూ దావూద్)
3469 – [ 24 ] ( لم تتم دراسته ) (2/1032)
وَرَوَاهُ النَّسَائِيُّ عَنْ مُعَاوِيَةِ
3469. (24) [2/1032 –అపరిశోధితం]
నసాయి’ ఈ ‘హదీసు’ను ము’ఆవియహ్ ద్వారా ఉల్లేఖించారు. [14]
3470 – [ 25 ] ( لم تتم دراسته ) (2/1032)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُقَامُ الْحُدُوْدُ فِي الْمَسَاجِدِ وَلَا يُقَادُ بِالْوَلَدِ الْوَالِدُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ.
3470. (25) [2/1032– అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మస్జిదులలో శిక్షలు అమలు జరపరాదు, ఖి‘సా‘స్ కూడా చేయరాదు. కొడుకు హత్యకు తండ్రిని విచారించరాదు.[15] (తిర్మిజి’)
3471 – [ 26 ] ( جيد ) (2/1032)
وَعَنْ أَبِيْ رِمْثَةَ قَالَ: أَتَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مَعَ أَبِيْ فَقَالَ: “مَنْ هَذَا الَّذِيْ مَعَكَ؟” قَالَ: اِبْنِيْ اشْهَدْ بِهِ قَالَ: “أَمَا إِنَّهُ لَا يَجْنِيْ عَلَيْكَ وَلَا تَجْنِيْ عَلَيْهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَزَادَ فِيْ “شَرْحِ السُّنَّةِ” فِيْ أَوَّلِهِ قَالَ: دَخَلْتُ مَعَ أَبِي عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَرَأَى أَبِيْ الَّذِيْ بِظَهْرِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: دَعْنِيْ أُعَالِجُ الَّذِيْ بِظَهْرِكَ فَإِنِّيْ طَبِيْبٌ. فَقَالَ: “أَنْتَ رَفِيْقٌ وَاللهِ الطَّبِيْبُ”.
3471. (26) [2/1032 –ఆమోదయోగ్యం]
అబూ రిమ్‌స’హ్ (ర) కథనం: ”నేను మా నాన్న గారి వెంట ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. ప్రవక్త (స), ‘నీ వెంట ఉన్నవాడెవడు,’ అని మా నాన్నగారిని అడిగారు. దానికి మా నాన్న, ‘వీడు నా కొడుకు, దీనికి మీరు సాక్ష్యం ఉండండి’ అని అన్నారు. దానికి ప్రవక్త(స) ‘ఈ అబ్బాయి నీపై ఏ పాపం చేయడు. నువ్వు కూడా వీడిపై ఏ పాపం చేయవు’ అని అన్నారు.”[16] (అబూ దావూద్, నసాయి’)
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, నేను మా తండ్రి వెంట ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. మా నాన్నగారు ప్రవక్త (స) వీపుపై దైవదౌత్య ముద్రను చూచి, ‘మీరు అనుమతిస్తే మీ వీపుపై కనబడుతున్న దానికి నేను చికిత్స చేస్తాను. ఎందు కంటే నేను వైద్యుణ్ణి,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘నువ్వు మిత్రుడివి అల్లాహ్ (త) వైద్యుడు,’ అని అన్నారు.
3472 – [ 27 ] ( لم تتم دراسته) (2/1032)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ عَنْ سُرَاقَةَ بْنِ مَالِكٍ قَالَ: حَضَرْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يُقِيْدُ الْأَبَ مِنْ اِبْنِهِ ولَا يُقيدُ الْاِبْنَ مِنْ أَبِيْهِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَ ضَعَّفَهُ.
3472. (27) [2/1032 –అపరిశోధితం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి తాతల ద్వారా సురాఖహ్ బిన్ మాలిక్ ద్వారా కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స) కూర్చొని ఒకని కొడుకుతో వాని తండ్రి యొక్క ప్రతీకారము తీసుకుంటున్నారు. కాని అతను (స), తండ్రి నుండి కొడుకు యొక్క ప్రతీకారం తీసుకునేవారు కాదు. (తిర్మిజి’ / ‘దయీఫ్)
3473 – [ 28 ] ( ضعيف ) (2/1033)
وَعَنِ الْحَسَنِ عَنْ سَمُرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَتَلَ عَبْدَهُ قَتَلْنَاهُ وَمَنْ جَدَعَ عَبْدَهُ جَدَعْنَاهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ
وَزَادَ النَّسَائِيُّ فِيْ رِوَايَةٍ أُخْرَى: “وَمَنْ خَصى عَبْدَهُ خَصَّيْنَاهُ”.
3473. (28) [2/1033 –బలహీనం]
‘హసన్ బస్రీ, సమురహ్ ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఒకరు తన బానిసను చంపితే, మేము కూడా వారిని చంపివేస్తాము, ఎవరైనా తన బానిస అవయవాలను కోసివేస్తే, మేము కూడా అతని అవయవాలను కోసి వేస్తాము.[17] (తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్, దార్మి, నసాయి’)
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”తన బానిస మర్మాం గాన్ని కోసివేసినవాడి మర్మాంగాన్ని మేము కూడా కోసివేస్తాము.”
3474 – [ 29 ] ( لم تتم دراسته ) (2/1033)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ:”مَنْ قَتَلَ مُتَعَمِّدًا دُفِعَ إِلَى أَوْلَيَاءِ الْمَقْتُوْلِ فَإِنْ شَاؤُوْا قَتَلَوْا وَإِنْ شَاؤُوْا أَخَذُوا الدِّيَةَ:وَهِيَ ثَلَاثُوْنَ حَقَّةُ وَثَلَاثُوْنَ جَذَعَةً وَأَرْبَعُوْنَ خَلِفَةً ومَا صَالَحُوْا عَلَيْهِ فَهُوَ لَهُمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
3474. (29) [2/1033 –అపరిశోధితం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినైనా చంపితే హంతకుడ్ని హతుని బంధువులకు అప్ప జెప్పాలి. వాళ్ళు కోరితే అతన్ని ఖి‘సా‘స్‌గా చంపవచ్చు. లేదా రక్తపరిహారం తీసుకొని వదలిపెట్టవచ్చు. రక్త పరిహారంగా 100 ఒంటెలు తీసుకోవాలి. వాటిలో మూడు సంవత్సరాలు వయస్సు గల 30 ఆడ ఒంటెలు, నాలుగు సంవత్సరాల వయస్సు గల 30 ఆడ ఒంటెలు, ఇంకా 40 గర్భంతో ఉన్న ఒంటెలు లేదా ఒప్పందం చేసుకున్న విషయాలు. (తిర్మిజి’)
3475 – [ 30 ] ( صحيح ) (2/1033)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اَلْمُسْلِمُوْنَ تَتكَافَأُ دِمَاؤُهُمْ وَيَسْعَى بِذِمَّتِهِمْ أَدْنَاهُمْ وَيَرُدُّ عَلَيْهِمْ أَقْصَاهُمْ وَهُمْ يَدٌ عَلَى مَنْ سِوَاهُمْ أَلَا لَا يُقْتَلُ مُسْلِمٌ بِكَافِر وَلَا ذُوْ عَهْدٍ فِيْ عَهْدِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.
3475. (30) [2/1033 –దృఢం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ముస్లిము లందరి రక్తం సమానం. అంటే ఒక ముస్లిమ్ ఖి‘సా‘స్ మరో ముస్లిమ్ వ్యక్తి నుండి తీసుకోవడం జరుగు తుంది. బలహీనులకు బదులుగా బలవంతులను వదలి వేయడం జరుగదు. వారిలోని అతి చిన్న వ్యక్తి కూడా ఎవరికైనా శరణు ఇవ్వగలడు. సైన్యం ముందుకు వెళ్ళి పోయినా వెనుక ఉండిపోయేవారు యుద్ధంలో పాల్గొనక పోయినా వారికి యుద్ధ ధనంలో భాగం ఉంటుంది. ఎందుకంటే యుద్ధ మైదానానికి అందరూ వెళతారు. వెనుక వారు ముందు ఉండేవారికి సహాయకులుగా ఉండేవారు. మరికొందరు ఒకవేళ దూరంగా ఉన్న ముస్లిమ్ అవిశ్వాసికి అభయం ఇస్తే దగ్గరగా ఉన్న ముస్లిమ్ ఆ అభయాన్ని భంగపరచ లేడు. ముస్లిములందరూ ముస్లిమేతరులకు వ్యతిరే కంగా ఒక చేయి వంటివారు. అంటే అందరూ ఒకే ఆదేశాన్ని పాలించాలి. ఐకమత్యంగా ఉండాలి. ఒక ముస్లిమ్‌కు బాధ కలిగితే అందరికీ కలిగినట్లే, అదే విధంగా ఒక ముస్లిమును అవిశ్వాసికి వ్యతిరేకంగా హత్యచేయడం జరుగదు. అదేవిధంగా ఒప్పందం ఉన్న వారిని చంపటం జరుగదు. అంటే ఒప్పందం ఉన్న వ్యక్తి వ్యతిరేక చర్య చేయనంత వరకు అతన్ని చంపకూడదు. (అబూ దావూద్, నసాయి’)
3476 – [ 31 ] ( صحيح ) (2/1033)
وَرَوَاهُ ابْنُ مَاجَهُ عَنِ ابْنِ عَبَّاسٍ.
3476. (31) [2/1033– దృఢం]
ఇబ్నె మాజహ్ ఈ ‘హదీసు’ను ఇబ్నే ‘అబ్బాస్ ద్వారా ఉల్లేఖించారు.
3477 – [ 32 ] ( لم تتم دراسته ) (2/1033)
وَعَنْ أَبِيْ شُرَيْحِ الْخُزَاعِيُّ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ أُصِيْبَ بِدَمٍ أَوْ خَبْلٍ وَالْخَبْلُ: الجَرْحُ فَهُوَ بِالْخِيَارِ بَيْنَ إِحْدَى ثَلَاثٍ: فَإِنْ أَرَادَ الرَّابِعَةَ فَخُذُوْا عَلَى يَدَيْهِ: بَيْنَ أَنْ يَقْتَصَّ أَوْ يَعْفُوَ أَوْ يَأْخُذَ الْعَقْلَ. فَإِنْ أَخَذَ مِنْ ذَلِكَ شَيْئًا ثُمَّ عَدَا بَعْدَ ذَلِكَ فَلَهُ النَّارُ خَالِدًا فِيها مُخَلَّدًا أَبَدًا”. رَوَاهُ الدَّارَمِيُّ.
3477. (32) [2/1033– అపరిశోధితం]
అబూ షురై’హ్ ‘ఖు’జా’యీ (ర) కథనం: ”ప్రవక్త (స) ఇలా ప్రసంగిస్తూ ఉండగా నేను విన్నాను, ‘ఒకవేళ ఎవరైనా ఎవరినైనా హత్యచేస్తే హతుని బంధువులకు మూడు విషయాల్లో ఒక విషయం ఎంచుకునే అధికారం ఉంది. వీటిని వదలి మరేదైనా అంటే వారిని ఆపివేయండి. ఆ మూడు విషయాల్లో ఒక విషయం హతునికి బదులు హంతకుడ్ని చంపటం, లేదా ఖి‘సా‘స్‌ను క్షమించడం, లేదా రక్త పరిహారం తీసుకోవటం. హంతకుడ్ని క్షమించి కూడా హత్య చేయడం అనేది అధిగమించటం అవుతుంది. దీనికి నరకశిక్ష పడుతుంది. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. అంటే హంతకుడ్ని క్షమించి కూడా హత్య చేయడం అనేది అధిగమించటం అవుతుంది. దానికి తగిన శిక్ష అనుభవించవలసిందే . (దార్మి)
3478 – [ 33 ] ؟ (2/1034)
وعَنْ طاؤوس عَنِ ابْنِ عَبَّاسٍ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ قُتِلَ فِيْ عَمِيَّةٍ فِيْ رَمْيٍ يَكُوْنُ بَيْنَهُمْ بِالْحِجَارَةِ أَوْ جَلْدٍ بِالسِّيَاطِ أَوْ ضَرْبٍ بَعْصًا فَهُوَ خَطَأُ عَقْلُهُ الْخَطَأُ. وَمَنْ قَتَلَ عَمْدًا فَهُوَ قَوَدٌ وَمَنْ حَالَ دُوْنَهُ فَعَلَيْهِ لَعْنَةُ اللهِ وَغَضَبُهُ لَا يُقْبَلُ مِنْهُ صَرْفٌ وَلَا عَدْلٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .
3478. (33) [2/1034 -? ]
‘తాఊ’స్ బిన్ ‘అబ్బాస్ ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం; పరస్పరం కొట్టుకోవటంలో ఎవరైనా చనిపోతే ఇది పొరపాటు హత్య. ఇందులో రక్తపరిహారం, ఖి‘సా‘స్ లేదు. అదేవిధంగా ఉద్దేశ్యపూర్వకంగా చంపితే హంతకుని నుండి ఖి‘సా‘స్ తీసుకోవటం జరుగును. ఖి‘సా‘స్ తీసుకోనియ్యకుండా అడ్డుకునే వాడిపై అల్లాహ్ అభిశాపం ఉంది. అల్లాహ్ ఆగ్రహం పడుతుంది. దాని వల్ల అతని విధి, అదనపు ఆరాధనలు కూడా స్వీకరించబడవు. (అబూ దావూద్, నసాయి’)
3479 – [ 34 ] ( ضعيف ) (2/1034)
وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا أُعْفِيُ مَنْ قَتَلَ بَعْدَ أَخْذِ الدِّيَةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3479. (34) [2/1034– బలహీనం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రక్తపరి హారం తీసుకొని కూడా హంతకుణ్ణి హతమార్చితే, నేను క్షమించను. అతన్నుండి ఖి‘సా‘స్ తీసు కుంటాను.” (అబూ దావూద్)
3480 – [ 35 ] ( لم تتم دراسته ) (2/1034)
وَعَنْ أَبِي الدَّرْدَاءِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَا مِنْ رَجُلٍ يُصَابُ بِشَيْءٍ فِيْ جَسَدِهِ فَتَصَدَّقَ بِهِ إِلَّا رَفَعَهُ اللهُ بِهِ دَرَجَةً وَحَطَّ عَنْهُ خَطِيْئَةً”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَه.
3480. (35) [2/1034– అపరిశోధితం]
అబూ దర్‌దా (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా పలుకుతూ ఉండగా నేను విన్నాను, ”గాయపరచినా, హింసించినా, అత్యాచారిని క్షమించిన వారికి దానికి బదులుగా అల్లాహ్ (త) ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు, ఇంకా వారి పాపాలను క్షమించివేస్తాడు. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3481 – [ 36 ] ( لم تتم دراسته ) (2/1034)
عَنْ سَعِيْدِ بْنِ الْمُسَيَّبِ: أَنَّ عُمَرَ بْنَ الْخَطَّابِ قَتَلَ نَفَرّا خَمْسَةً أَوْ سَبْعَةً بِرَجُلٍ وَّاحِدٍ قَتَلُوْهُ قَتْلَ غِيْلَةٍ وَقَالَ عُمَرُ: لَوْ تَمَالَأَ عَلَيْهِ أَهْلُ صَنْعَاءَ لَقَتَلْتُهُمْ جَمِيْعًا. رَوَاهُ مَالِكٌ.
3481. (36) [2/1034– అపరిశోధితం]
స’యీద్ బిన్ ముసయ్యిబ్ కథనం: ‘ఉమర్ (ర) ఒక వ్యక్తికి బదులు ఐదు లేదా ఏడుగురు వ్యక్తులను చంపివేసారు. ఎందుకంటే వీరందరికీ ఆ వ్యక్తి హత్యలో భాగం ఉండేది. అతన్ని మోసం చేసి వీరందరూ అతన్ని చంపివేసారు. ‘ఉమర్ (ర) ‘ఒకవేళ ఒక వ్యక్తి హత్యలో ‘సన్’ఆ’ ప్రజలందరూ ఉన్నా నేను అందరినీ చంపేస్తాను’ అని అన్నారు. (ఇమామ్ మాలిక్)
3482 – [ 37 ] ( صحيح ) (2/1035)
وَرَوَى الْبُخَارِيُّ عَنِ ابْنِ عُمَرَ نَحْوَهُ.
3482. (37) [2/1035- దృఢం]
బు’ఖారీ ఈ ‘హదీసు’ను ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ ద్వారా ఉల్లేఖించారు.[18]
3483 – [ 38 ] ( لم تتم دراسته ) (2/1035)
وَعَنْ جُنْدَبٍ قَالَ: حَدَّثَنِيْ فُلَانٌ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “يَجِيْءُ الْمَقْتُوْلُ بِقَاتِلِهِ يَوْمَ الْقِيَامَةِ فَيَقُوْلُ: سَلْ هَذَا فِيْمَ قَتَلْنِيْ؟ فَيَقُوْلُ: قَتَلْتُهُ عَلَى مُلْكِ فُلَانٍ”. قَالَ جُنْدُبٌ: فَاتَّقِهَا. رَوَاهُ النَّسَائِيُّ.
3483. (38) [2/1035 –అపరిశోధితం]
జున్‌దుబ్ (ర) కథనం: ”ఫలానా వ్యక్తి నాతో ఇలా అన్నాడు, ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”తీర్పు దినం నాడు హతుడు తన హంతకుణ్ణి పట్టుకొని అల్లాహ్ (త) ముందుకు తీసుకొని వచ్చి, ”ఓ అల్లాహ్ (త)! ఈ హంత కునితో, ఇతడు నన్ను ఎందుకు చంపాడో అడగండి,” అని విన్నవించుకుంటాడు. దానికి హంతకుడు, ‘నేను ఈ వ్యక్తిని ఫలానా పాలకుని కాలంలో అతని సహాయార్థం చంపాను,’ అని అంటాడు. జున్‌దుబ్ ఉల్లేఖన కర్త, ‘మీరు రాజ్యాధికారం కోసం, పండితులపై అత్యాచారం కోసం హత్యలు చేయటానికి దూరంగా ఉండండి.’ (నసాయి’)
3484 – [ 39 ] ( ضعيف ) (2/1035)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَعَانَ عَلَى قَتْلِ مُؤْمِنٍ شَطْرَ كَلِمَةٍ لَقِيَ اللهَ مَكْتُوْبٌ بَيْنَ عَيْنَيْهِ آيِسٌ مِّنْ رَحْمَةِ اللهِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.
3484. (39) [2/1035 –బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఒక వ్యక్తి హత్యలో ఒక్క పలుకు ద్వారానైనా సహాయం చేస్తే, తీర్పు దినం నాడు అల్లాహ్ (త)ను కలసినపుడు అతని నుదుటిపై, ”ఈ వ్యక్తి అల్లాహ్ కారుణ్యం పట్ల విసిగి పోయాడు” అని రాసి ఉంటుంది.[19] (ఇబ్నె మాజహ్)
3485 – [ 40 ] ( لم تتم دراسته ) (2/1035)
وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا أَمْسَكَ الرَّجُلُ الرَّجُلَ وَقَتَلَهُ الْآخَرُ يُقْتَلُ الَّذِيْ قَتَلَ وَيُحْبَسُ الَّذِيْ أَمْسَكَ”. رَوَاهُ الدَّارَقُطْنِيُّ.
3485. (40) [2/1035– అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తి మరో వ్యక్తికి సహాయపడటానికి, ఒకనిని పట్టుకుంటే, అతడు అతన్నికొట్టి చంపితే, హంతకుణ్ణి, హత్యకు బదులుగా చంపడం జరుగుతుంది. పట్టుకున్న వాడిని జైలులో వేయడం జరుగుతుంది.” [20] (దారు ఖుతునీ)
=====
1- بَابُ الدِّيَّاتِ
1. రక్త పరిహారం
అంటే ఒకవేళ ఎవరైనా ఎవరినైనా పొరపాటున లేదా ఉద్దేశ్యపూర్వకంగా చంపితే, దానికి బదులు హంతకుని నుండి హత్యాపరిహారం వసూలుచేయడం జరుగు తుంది. దీన్ని దియ్యత్ అంటారు. ఇది రెండు రకాలు:
- దియ్యత్ ము’గ్‌లి”జహ్. ఇందులో 100 నాలుగు రకాల ఆడ ఒంటెలు ఇవ్వబడతాయి.
- దియ్యత్ ము’ఖఫ్ఫ’దహ్. ఒంటెలకు బదులు వాటి విలువ ఇవ్వటం జరుగుతుంది. కాలాన్నిబట్టి వాటి విలువ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3486 – [ 1 ] ( صحيح ) (2/1036)
عَنِ ابْنِ عَبَّاسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ:”هَذِهِ وَهَذِهِ سَوَاءٌ ” يَعْنِي الْخِنْصَرَ وَالْإِبْهَامَ . رَوَاهُ الْبُخَارِيُّ.
3486. (1) [2/1036-దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఇది, ఇది అన్ని సమానం అంటే చిన్నవేలు, పెద్దవేలు, బొటన వ్రేలు అన్ని సమానం, అంటే రక్తపరిహారంలో అందరూ సమానులే. [21] (బు’ఖారీ)
3487 – [ 2 ] ( متفق عليه ) (2/1036)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَضَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ جَنِيْنِ اِمْرَأَةٍ مِّنْ بَنِيْ لِحْيَانَ سَقَطَ مَيْتًا بِغُرَّة: عَبْدٍ أَوْ أَمَةٍ ثُمَّ إِنَّ الْمَرْأَةَ الَّتِيْ قَضَى عَلَيْهَا بِالْغُرَّةِ تُوُفِّيَتْ فَقَضَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِأَنَّ مِيْرَاثَهَا لِبَنِيْهَا وَزَوْجِهَا الْعَقْلُ عَلَى عَصَبَتِهَا .
3487. (2) [2/1036 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) బనీ లి’హ్‌యాన్‌కు చెందిన ఒక స్త్రీ గర్భంలో ఉన్న బిడ్డ విషయంలో ఇలా తీర్పు ఇచ్చారు. ‘ఆమెను కొట్టటం వల్ల గర్భస్రావం అయి, బిడ్డ చనిపోయింది. ఆ బిడ్డ హత్యా పరిహారంలో ఒక బానిస లేదా ఒక బానిసరాలు ఇవ్వాలి.’ బానిసను పొందవలసిన స్త్రీ మరణించినందు వల్ల, ప్రవక్త (స), ‘స్త్రీ ఆస్తి ఆమె కొడుకులకు, ఆమె భర్తకు లభిస్తుంది. అయితే పరిహారం హతమార్చిన స్త్రీ వర్గంపై ఉంది. అని ఆదేశించారు.” [22] (బు’ఖారీ, ముస్లిమ్)
3488 – [ 3 ] ( متفق عليه ) (2/1036)
وَعَنْهُ قَالَ: اِقْتَتَلَتِ امْرَأتَانِ مِنْ هُذَيْلٍ فَرَمَتْ إِحْدَاهُمَا الْأُخْرَى بِحَجَرٍ فَقَتَلَتهَا وَمَا فِيْ بَطْنِهَا فَقَضَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنَّ دِيَّةَ جَنِيْنِهَا غُرَّةٌ: عَبْدٌ أَوْ وَلِيْدَةٌ وَقَضَى بِدِيَةِ الْمَرْأَة عَلَى عَاقِلَتِهَا وَوَرَّثَهَا وَلَدَهَا وَمَنْ مَعَهُمْ.
3488. (3) [2/1036 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: హుజైల్ తెగకు చెందిన ఇద్దరు స్త్రీలలో వివాదం తలఎత్తింది. ఒక స్త్రీ మరొక స్త్రీని రాళ్ళతో కొట్టింది, దానితో ఆ స్త్రీ మరియు ఆమె గర్భంలో ఉన్న బిడ్డ చనిపోయారు. ప్రవక్త (స), ‘బిడ్డకు బదులు ఒక బానిసను లేదా ఒక బానిసరాలిని విడుదల చేయాలి, ఇంకా ఆ స్త్రీ పరిహారం, ఆమె (హంతకురాలి) తెగ వారిపై ఉంటుంది, ఆమె (మరణించిన స్త్రీ) ఆస్తి ఆమె సంతానానికి, బంధువులకు లభిస్తుంది,’ అని తీర్పు ఇచ్చారు. (బు’ఖారి, ముస్లిమ్)
3489 – [ 4 ] ( صحيح ) (2/1036)
وَعَنِ الْمُغَيْرَةَ بْنِ شُعْبَةَ: أَنَّ امْرَأَتَيْنِ كَانَتَا ضَرَّتَيْنِ فَرَمَتْ إِحْدَاهُمَا الْأُخْرَى بِحَجَرٍ أَوْ عَمُوْدِ فُسْطَاطٍ فَأَلْقَتْ جَنِيْنَهَا فَقَضَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ الْجَنِيْنِ غُرَّةً: عَبْدًا أَوْ أَمَةً وَجَعَلَهُ عَلَى عَصَبَةِ الْمَرْأَةِ هَذِهِ رِوَايَةُ التِّرْمِذِيِّ وَفِيْ رِوَايَةِ مُسْلِمٍ : قَالَ: ضَرَبَتِ امْرَأَةٌ ضَرَّتَهَا بِعُمُوْدِ فُسْطَاطٍ وَهِيَ حُبْلَى فَقَتَلَتْهَا قَالَ: وَإِحْدَاهُمَا لِحْيَانِيَّةٌ قَالَ: فَجَعَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم دِيَةَ الْمَقْتُوْلَةِ عَلَى عَصَبَةِ الْقَاتِلَةِ وَغُرَّةً لِمَا فِيْ بَطَنِهَا
3489. (4) [2/1036 –దృఢం]
ము’గైరహ్ బిన్ షు’అబహ్ (ర)కథనం: ఇద్దరు సవతుల మధ్య కలహం జరిగింది. ఒకామె మరొకామెను రాయితో లేదా షామియానా కర్రతో కొట్టింది, దానితో ఆమె గర్భస్రావం అయి, బిడ్డ చనిపోయింది. ప్రవక్త (స) చనిపోయిన బిడ్డకు బదులు ఒక బానిస, లేదా బానిస రాలిని ఇవ్వమని ఆదేశించారు. దాన్ని ఆ స్త్రీ వర్గం, బంధువులపై విధించారు. (తిర్మిజి’)
ముస్లిమ్ ఉల్లేఖనంలో ఈవిధంగా ఉంది, ”ము’గీరహ్ కథనం: ఒక స్త్రీ గర్భవతిగా ఉన్న తన సవతిని షామియానా కర్రతో కొట్టింది. దానివల్ల ఆమె చనిపోయింది. ఆమె గర్భంలో ఉన్న బిడ్డకూడా చనిపోయింది. వారిలో ఒక స్త్రీ బనూ-ల’హ్ యాన్ వర్గానికి చెందినది. ప్రవక్త (స) చనిపోయిన స్త్రీ హత్యా పరిహారం కొట్టిన స్త్రీ బంధువులపై వేసారు. కడుపులోని బిడ్డకు బదులు ఒక బానిస లేదా బానిసరాలను విడుదల చేయాలని నిర్ణయించారు.
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3490 – [ 5 ] ( لم تتم دراسته ) (2/1037)
عَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرٍو أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أَلَا إِنَّ دِيَةَ الْخَطَأِ شِبْهِ الْعَمَدِ مَا كَانَ بِالسَّوْطِ وَالْعَصَا مِائَةٌ مِّنَ الْإِبْلِ :مِنْهَا أَرْبَعُوْنَ فِيْ بُطُوْنِهَا أَوْلَادُهَا”. رَوَاهُ النَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.
3490. (5) [2/1037– అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, పొరపాటు హత్య, అనుమానాస్పదమైన హత్య అంటే కర్రతోగాని కమ్చీతో (కొరడా) గాని కొడితే చనిపోవటం. దీనికి రక్త పరిహారం 100 ఒంటెలు. వీటిలో 40 గర్భంతో ఉన్న ఆడ ఒంటెలు. (నసాయి’, ఇబ్నె మాజహ్, దార్మి)
3491 – [ 6 ] ( لم تتم دراسته ) (2/1037)
وَرَوَاهُ أَبُوْ دَاوُدَ عَنْهُ وَابْنُ مَاجَهُ وَعَنِ ابْنِ عُمَرَ. وَفِيْ” شَرْحِ السُّنَّةِ “لَفْظُ اَلْمَصَابِيْحِ” عَنِ ابْنِ عُمَرَ .
3491. (6) [2/1037 –అపరిశోధితం]
అబూ దావూద్, ఇబ్నె మాజహ్, మరియు షర్’హ్ సున్నహ్ లో ఈ ‘హదీసు’, ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ ద్వారా ఉల్లేఖించబడింది.
3492 – [ 7 ] ( لم تتم دراسته ) (2/1037)
وَعَنْ أَبِيْ بَكْرِ بْنِ مُحَمَّدِ بْنِ عُمْرِو بْنِ حَزْمٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَتَبَ إِلَى أَهْلِ الْيَمَنِ وَكَانَ فِيْ كِتَابِهِ: “أَنَّ مَنِ اعْتبَطَ مُ ؤْمِنًا قَتْلًا فَإِنَّهُ قَوَدُ يَدهِ إِلَّا أَنْ يَرْضَى أَوْلِيَاءُ الْمَقْتُوْل” وَفِيْهِ: “أَنَّ الرَّجُلَ يُقْتَلُ بِالْمَرْأَةِ”. وَفِيْهِ: “فِي النَّفْسِ الدِّيَةُ مِائَةٌ مِّنَ الْإِبِلِ وَعَلَى أَهْلِ الذَّهَبِ أَلْفُ دِيْنَارٍ وَفِيْ الْأَنْفِ إِذَا أُوْعِبَ جَدْعُهُ الدِّيَةُ مِائَةٌ مِّنَ الْإِبْلِ وَفِيْ الْأَسْنَانِ الدِّيَةَ وَفِي الشَّفَتَيْنِ الدِّيَةُ وَفِي الْبَيْضَيْنِ الدِّيةُ وَفِي الذَّكَرِ الدِّيَةِ وَفِي الصُّلبِ الدِّيَةُ وَفِي الْعَيْنَيْنِ الدِّيَةُ وَفِي الرِّجْلِ الْوَاحِدَةِ نِصْفُ الدِّيَةِ وَفِي الْمَأْمُوْمَةِ ثُلُثُ الدِّيَةِ وَفِي الْجَائِفَةِ ثُلُثُ الدِّيَةِ وَفِي الْمُنَقَّلَةِ خَمْسَ عَشْرَ مِنَ الْإِبِلِ وَفِيْ كُلِّ أَصْبَعٍ مِّنْ أَصَابِعِ الْيَدِ وَالرِّجْلِ عَشْرُ مِّنَ الْإِبِلِ وَفِي السِّنِّ خَمْسٌ مِّنَ الْإِبِلِ” . رَوَاهُ النَّسَائِيُّ وَالدَّارَمِيُّ وَفِي رِوَايَةِ مَالِكٍ: “وَفِي الْعَيْنِ خَمْسُوْنَ وَفِي الْيَدِ خَمْسُوْنَ وَفِي الرِّجْلِ خَمْسُوْنَ وَفِي الْمُوْضِحَةِ خَمْسٌ”
3492. (7) [2/1037– అపరిశోధితం]
అబూ బకర్ బిన్ ము’హమ్మద్ బిన్ ‘అమ్ర్ బిన్ ‘హ’జ్‌మ్ తన తండ్రి తాతల ద్వారా కథనం: ”ప్రవక్త (స) యమన్ ప్రజలకు ఒక ఉత్తరం వ్రాసారు. అందులో ఇలా ఉంది, ‘ఒక విశ్వాసిని ఉద్దేశ్యపూర్వకంగా చంపిన వ్యక్తి పట్ల ఖి‘సా‘స్ ఉంది. అంటే అతన్ని హతమార్చటం జరుగుతుంది. అయితే హతుని బంధువులు అతన్ని క్షమిస్తే, వదలివేయటం జరుగుతుంది.’ ఆ ఉత్తరంలో ఇలా కూడా ఉంది, ‘స్త్రీకి బదులు పురుషున్ని హత మార్చటం జరుగును. అంటే పురుషుడు స్త్రీని చంపితే ఆ పురుషుణ్ణే ఖి‘సా‘స్‌గా చంపటం జరుగును. ఆ ఉత్తరంలో ఇలా కూడా ఉంది, ”చంపిన దానికి 100 ఒంటెలు హత్యాపరిహారం. ఒకవేళ ఎవరివద్దనైనా ఒంటెలు లేక, బంగారం వెండి ఉంటే 1000 అష్రఫీలు పరిహారంగా ఇవ్వాలి. ఒకవేళ ముక్కు కోయబడితే, కోసినవారు 100 ఒంటెలను పరిహారంగా ఇవ్వాలి. పళ్ళకు పరిహారం ఉంది. అంటే పళ్ళు విరగ్గొట్టినా దానికి బదులుగా రక్తపరిహారం ఇవ్వాలి. పెదవులు కోసినా రక్తపరిహారం ఇవ్వాలి. పురుష బీజాలు కోసినా పూర్తి రక్తపరిహారం ఉంది. మర్మాంగం కోసినా రక్తపరిహారం ఉంది. వీపు విరగ్గొట్టినా రక్తపరిహారం ఉంది. కళ్ళు పోగొట్టినా, తీసి వేసినా పూర్తి రక్తపరిహారం ఉంది. ఒక కాలు నరికితే సగం పరిహారం ఉంది. తల గాయపరచితే 1/3 వంతు పరిహారం ఉంది. అదేవిధంగా తలపై, కడుపులో కొడితే 1/3 వంతు పరిహారం, రొమ్ము కొడితే 15 ఒంటెలు, చేతిలో 1/3వంతు రక్తపరిహారం ఉంది. అంటే ఒకవేళ ఎవరైనా తలపై కొడితే, తల మధ్య గాయం తగలడం వల్ల గాయం మెదడు వరకు చేరి ప్రమాదకరంగా మారితే 1/3వంతు రక్తపరిహారం ఉంది. అదేవిధంగా కడుపులో పొడిచి గాయంచేస్తే, 1/3 వంతు రక్తపరిహారం ఉంది. ఎముక మీద కొట్టడంవల్ల ఎముక తన స్ధానం జారితే 15 ఒంటెలు రక్తపరిహారం ఉంది. చేతుల లేదా కాళ్ళ ప్రతి వేలుకి 10 ఒంటెలు పరిహారం ఉంది. అదేవిధంగా ప్రతి పన్నుకు 5 ఒంటెలు ఉన్నాయి. (నసాయి’, దార్మి)
ఇమామ్ మాలిక్ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ఒక కన్నుకు బదులు 50 ఒంటెలు, ఒక చేయికి బదులు 50 ఒంటెలు, ఒక కాలికి బదులు 50 ఒంటెలు, కీలుమీద కొట్టి కీలు విరిగిపోతే 50 ఒంటెలు, ప్రతి పన్నుకు 5 ఒంటెలు.
3493 – [ 8 ] ( لم تتم دراسته ) (2/1038)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: قَضَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ الْمَوَاضِحِ خَمْسًا خَمْسًا مِّنَ الْإِبِلِ وَفِي الْأَسْنَانِ خَمْسًا خَمْسًا مِّنَ الْإِبِلِ. روَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ وَرَوَى التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ اَلْفَصْلُ الْأَوَّلُ.
3493. (8) [2/1038– అపరిశోధితం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ (ర) తన తండ్రి ద్వారా, అతడు తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) గాయాల గురించి ఇలా తీర్పు ఇచ్చారు. ప్రతి గాయానికి 5 ఒంటెలు. ప్రతి పన్నుకు ఐదు ఒంటెలు ఇవ్వాలి. [23] (అబూ దావూద్, నసాయి’, దార్మి, ఇబ్నె మాజహ్, తిర్మిజి’)
3494 – [ 9 ] ( لم تتم دراسته ) (2/1038)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: جَعَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَصَابِعَ الْيَدَيْنِ وَالرِّجْلَيْنِ سَوَاءً. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ.
3494. (9) [2/1038 –అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) కాళ్ళూ చేతుల వ్రేళ్ళను సమానంగా నిర్ణయించారు. (అబూ దావూద్, తిర్మిజి’)
అంటే వ్రేళ్ళన్ని సమానం. ప్రతి వేలికి పరిహారం సమానం.
3495 – [ 10 ] ( صحيح ) (2/1038)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْأَصَابِعُ سَوَاءٌ وَالْأَسْنَانُ سَوَاءٌ الثَّنِيَّةُ وَالضِّرْسُ سَوَاءٌ هَذِهِ وَهَذِهِ سَوَاءٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ
3495. (10) [2/1038– దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, వేళ్ళన్నీ సమానం, పళ్ళన్నీ సమానం. ముందు పళ్ళు దవడలు సమానం. బొటనవ్రేలు ఇతర వేళ్ళు సమానం. అంటే పరిహారం అన్నిటికీ సమానం. (అబూ దావూద్)
3496 – [ 11 ] ( حسن ) (2/1038)
وَعَنْ عُمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: خَطَبَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَامَ الْفَتْحِ ثُمَّ قَالَ: “أَيُّهَا النَّاسُ إِنَّهُ لاحِلْفَ فِي الْإِسْلَامِ وَمَا كَانَ مِنْ حِلْفٍ فِي الْجَاهِلِيَّةِ فَإِنَّ الْإِسْلَامَ لَا يَزِيْدُهُ إِلَّا شِدَّةً الْمُؤْمِنُوْنَ يَد عَلَى مَنْ سِوَاهُمْ يُجِيْرُ عَلَيْهِمْ أَدَناَهُمْ وَيَرُدُّ عَلَيْهِمْ أَقْصَاهُمْ يَرُدُّ سَرَايَاهُمْ عَلَى قَعِيْدَتِهِمْ لَا يُقْتَلُ مُؤْمِنٌ بِكَافِرٍ دِيَّةُ الْكَافِرِ نِصْفُ دِيَّةِ الْمُسْلِمِ لَا جَلَبَ وَلَا جَنَبَ وَلَا تُؤْخَذُ صَدَقاَتُهُمْ إِلَّا فِيْ دُوْرِهِمْ”.
وَفِيْ رِوَايَةٍ قَالَ: “دِيَّةُ الْمَعَاهِدِ نِصْفُ دِيَّةِ الْحُرِّ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3496. (11) [2/1038– ప్రామాణికం]
అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి ద్వారా, షుఐబ్ తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) మక్కహ్ విజయం నాడు ప్రసంగంలో అందరిముందు ఇలా ఉపదేశించారు. ”ఓ ప్రజలారా! అజ్ఞాన కాలంలో ఉండే ప్రమాణం ఇస్లామ్‌లో లేదు. అయితే అజ్ఞాన కాలంలో ఉన్న ఒప్పందాలు అంటే బాధితుని సహాయం చేయటం, బంధువుల పట్ల మంచిగా ప్రవర్తించటం మిగిలి ఉన్నాయి. ఎందుకంటే ఇస్లామ్ ఇటువంటి సంబంధాలను పటిష్టంగా ఏర్పరచమని ఆదేశిస్తుంది. ఇంకా ముస్లిములందరూ ఐకమత్యం విషయంలో ఒకచేయి వంటివారు. అంటే అవిశ్వాసులకు వ్యతిరేకంగా ముస్లిములందరూ ఒక చేయి వంటివారు. అంటే అవిశ్వాసులకు వ్యతిరేకంగా అందరూ ఏకం అవుతారు . ఒక సామాన్య ముస్లిమ్ ముస్లిములందరి తరఫున అభయం ప్రకటించ గలడు.ఇంకా దూరంగా ఉన్న వారికి తిరిగి అప్పజెప్ప గలడు. సైనికులు తమ తోటివారి వద్దకు తిరిగి అప్పజెప్పగలరు. అవిశ్వాసికి బదులుగా విశ్వాసిని చంపడం జరుగదు. అవిశ్వాసికి ముస్లిమ్ సగం పరిహారం ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా జంబ్, జల్బ్ సరి కావు. ‘జకాత్, ‘సదఖహ్ దానధర్మాలు ముస్లిముల ఇళ్ళ నుండి వసూలు చేయాలి.
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, జిమ్మీ‘ దియ్యత్ (పరిహారం) స్వతంత్రుని పరిహారానికి (దియ్యత్ కు) సగం. [24] (అబూ దావూద్)
3497 – [ 12 ] ( لم تتم دراسته ) (2/1039)
وَعَنْ خِشْفِ بْنِ مَالِكٍ عَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَضَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ دِيَّةِ الْخَطَأِ عِشْرِيْنَ بِنْتَ مَخَاض وَعِشْرِيْنَ ابْنَ مَخَاضٍ ذَكُوْرٍ وَعِشْرِيْنَ بِنْتَ لَبُوْنٍ وَعِشْرِيْنَ جِذَعَةً وَعِشْرِيْنَ حِقَّةً”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَالصَّحِيْحُ أَنَّهُ مَوْقُوْفٌ عَلَى ابْنِ مَسْعُوْدٍ وَخِشْفٌ مَجْهُوْلٌ لَا يُعرَف إِلَّا بِهَذَا الْحَدِيْثِ وَرَوَى فِيْ شَرْحِ السّنةِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم وَدَى قَتِيْلَ خَيْبَرَ بِمَائَةٍ مِنْ إِبِلِ الصَّدَقَةَ وَلَيْسَ فِيْ أَسْنَان إِبِلِ الصَّدْقَةِ اِبْنُ مَخَاضٍ إِنَّمَا فِيْهَا اِبْنُ لَبُوْنٍ .
3497. (12) [2/1039– అపరిశోధితం]
‘ఖిష్‌ఫ్ బిన్ మాలిక్, ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) పొరపాటు హత్యకు పరిహారం 100 ఒంటెలు నిర్ణయించారు. వాటిలో 1 సం. వయస్సుగల 20 ఒంటెలు, 2 సంవత్సరాల వయస్సుగల 20 ఒంటెలు, 3 సంవత్సరాల వయస్సుగల 20 ఒంటెలు, 4 సం.లు నిండిన 20 ఒంటెలు, 5 సం.లువయస్సు గల 20 ఒంటెలు. (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’)
వాస్తవం ఏమిటంటే ఈ ‘హదీసు’ ఇబ్నె మస్’ఊద్‌పై ఆగిపోయింది. షర్’హ్ సున్నహ్‌లో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ఒక వ్యక్తికి రక్తపరిహారం ఇచ్చారు. ఆ వ్యక్తి ‘ఖైబర్‌లో హతమార్చబడ్డాడు. ‘జకాత్ ఒంటెల్లో 100 ఒంటెలు ఇచ్చారు. వీటిలో అన్నీ 2 సం.ల వయస్సుగల ఒంటెలే ఉండేవి.
3498 – [ 13 ] ( حسن ) (2/1039)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: كَانَتْ قِيْمَةُ الدِّيَةِ عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم ثَمَانمِائَةِ دِيْنًارٍ أَوْ ثَمَانِيَةَ آلَافِ دِرْهَمٍ وَدِيَةُ أَهْلِ الْكِتَابِ يَوْمَئِذٍ النِّصْفُ مِنْ دِيَّةِ الْمُسْلِمِيْنَ قَالَ: فَكَانَ كَذَلِكَ حَتَّى اسْتُخْلِفَ عُمَرُ رَضِيَ اللهُ عَنْهُ عَلَى أَهْلِ الذَّهْبِ أَلْفَ دِيْنَارٍ وَعَلَى أَهْلِ الْوَرِقِ اِثْنَي عشَرَ أَلْفًا وَعَلَى أَهْلِ الْبَقَرِ مِائَتَيْ بَقَرَةٍ وَعَلَى أَهْلِ الشَّاءِ أَلْفَيْ شَاة وَعَلَى أَهْلِ الْحُلَلِ مِائَتَيْ حُلَةٍ. قَالَ: وَتَرَكَ دِيَةَ أَهْلِ الذِّمَّةِ لَمْ يَرْفَعْهَا فِيْمَا رَفَعَ مِنَ الدِّيَةِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3498. (13) [2/1039 –ప్రామాణికం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి మరియు తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) కాలంలో రక్తపరిహారం ఒంటెల విలువ 800 అష్రఫీలు లేదా 8000 దిర్హములు ఉండేది. గ్రంథ ప్రజల రక్తపరిహారం ఆ కాలంలో ముస్లిముల రక్తపరిహారానికి సగం ఉండేది. ‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తాతగారి కథనం: ‘ఉమర్ (ర) పరిపాలనా కాలం వరకు ఇలాగే ఉండేది. ‘ఉమర్ (ర) ‘ఖలీఫాగా నియమితులైన తర్వాత నిలబడి ప్రసంగంలో, ‘ఇప్పుడు ఒంటెల విలువ పెరిగిపోయింది,’ అని అన్నారు. ఉల్లేఖన కర్త కథనం: ‘ఉమర్ (ర) తన పరిపాలనాకాలంలో బంగారం ఉన్నవాళ్ళకు రక్తపరి హారం 1000 అష్రఫీలు నిర్ణయించారు, వెండి వ్యాపారస్తులపై 12000గా, ఆవులున్న వారిపై 200 ఆవులు, మేకలున్న వారిపై 2000 మేకలు, జతలు ఉన్న వారిపై 200 జతలు, పన్ను చెల్లించేవారిపై ప్రవక్త (స) నిర్ణయించినదే ఉంచారు. అందులో ఏమీ పెంచలేదు. (అబూ దావూద్)
3499 – [ 14 ] ( لم تتم دراسته ) (2/1040)
وَعَنِ ابْنِ عَبَّاسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ جَعَلَ الدِّيةَ اِثْنَي عَشَرَ أَلْفًا. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ.
3499. (14) [2/1040 –అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) వెండి ఉన్న వారిపై 12000 రక్తపరిహారంగా నిర్ణయించారు. (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’, దార్మీ)
3500 – [ 15 ] ( لم تتم دراسته ) (2/1040)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُقَوِّمُ دِيَةَ الْخَطَأُ عَلَى أَهْلِ الْقُرَى أَرْبَعَمِائَةِ دِيْنَارٍ أَوْ عِدْلَهَا مِنَ الْوَرِقِ وَيُقَوِّمُهَا عَلَى أَثْمَانِ الْإِبِلِ فَإِذَا غَلَتْ رَفَعَ فِيْ قِيْمَتِهَا وَإِذَا هَاجَتْ رُخْصٌ نَقَصَ مِنْ قِيْمَتِهَا وَبَلَغَتْ عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مَا بَيْنَ أَرْبَعِمِائَةِ دِيْنَارٍ إِلَى ثَمَانِمِائَةِ دِيْنَارٍ وَعِدْلُهَا مِنَ الْوَرِقِ ثَمَانِيَةُ آلافِ دِرْهَمٍ قَالَ: وَقَضَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى أَهْلِ الْبَقَرِ مِائَتَيْ بَقَرَةٍ وَعَلَى أَهْلِ الشَّاءِ أَلْفَيْ شَاةٍ وَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْعَقْلَ مِيْرَاثٌ بَيْنَ وَرَثَةِ الْقَتِيْلِ” وَقَضَى رَسُوْلُ الله صلى الله عليه وسلم أَنَّ عَقْلَ الْمَرْأَةِ بَيْنَ عَصَبَتِهَا وَلَا يَرِثُ الْقَاتِلُ شَيْئًا. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .
3500. (15) [2/1040 –అపరిశోధితం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి, తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) పొరపాటుగా చంపటంపై రక్తపరిహారం పట్న వాసులపై 400 దీనార్లు లేదా దానికి సమానంగా వెండిని నిర్ణయించారు. ఒంటెలున్న వాళ్ళపై కూడా ఒక విలువను నిర్ణయించారు. ఒక వేళ ఒంటెల విలువ పెరిగితే ధర పెంచుతారు, తగ్గితే విలువను తగ్గించే వారు. ప్రవక్త (స) కాలంలో రక్తపరిహారం విలువ 400 దీనార్లు నుండి 800 దీనార్ల వరకు పెరిగి పోయింది. లేదా దానికి సమానంగా 8000 దిర్‌హమ్‌లు. ఉల్లేఖనకర్త కథనం: ప్రవక్త (స) ఆవులున్న వారిపై 200 ఆవులు నిర్ణయించారు. మేకలున్న వారిపై 2000 మేకలు నిర్ణయించారు. ప్రవక్త(స) హతుని బంధువులు హతుని పరిహార వారసులు అవుతారని అన్నారు. ప్రవక్త (స) ‘స్త్రీ పరిహారం ఆమె బంధువుల్లో పంచబడుతుంది అని, హంతకుడు హతుని ఆస్తికి వారసుడు కాలేడు’ అని అన్నారు. (అబూ దావూద్, నసాయి)
3501 – [ 16 ] ( لم تتم دراسته ) (2/1040)
وَعَنْهُ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “عَقْلُ شِبْهِ الْعَمْدِ مُغَلَّظٌ مِثْلُ عَقْلِ الْعَمْدِ وَلَا يُقْتَلُ صَاحِبُهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3501. (16) [2/1040 –అపరిశోధితం]
అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) అనుమానాస్పద హత్యను ఉద్దేశపూరిత హత్యగా పరిగణించి, అంటే 100 ఒంటెలు ఇవ్వాలని నిర్ణయించారు. కాని అనుమానాస్పద హంతకునికి ఖి’సా’స్‌గా చంపటం జరుగదు. (అబూ దావూద్)
3502 – [ 17 ] ( لم تتم دراسته ) (2/1040)
وَعَنْهُ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: قَضَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ الْعَيْنِ الْقَائِمَةِ السَّادةِ لِمَكاَنِهَا بِثُلُثِ الدِّيَةِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائ.
3502. (17) [2/1040 అపరిశోధితం]
అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి ద్వారా, అతడు తన తండ్రి ద్వారా కథనం: కొట్టడం వల్ల కేవలం కంటిచూపు పోగొడితే, దానికి 1/3వ వంతు రక్తపరిహారం నిర్ణయించారు. (అబూ దావూద్, నసాయి)
3503 – [ 18 ] ( لم تتم دراسته ) (2/1040)
وَعَنْ مُحَمَّدِ بْنِ عَمْرٍو عَنْ أَبِيْ سَلَمَةَ عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَضَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِي الْجَنِيْنِ بِغُرَّةٍ: عَبْدٍ أَوْ أَمَةٍ أَوْ فَرَسٍ أَوْ بَغْلٍ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَقَالَ: رَوَى هَذَا الْحديث حماد بن سلمة وخالد الواسطي عَنْ محمد بن عمرو ولم يذكر: أو فرس أو بغل.
3503. (18) [2/1040 –అపరిశోధితం]
ముహమ్మద్ బిన్ అమ్ర్, అబూ సలమహ్, అబూ హురైరహ్ (ర)ల కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”గర్భవతి కడుపులో ఉన్న బిడ్డ కొట్టడం వల్ల మరణిస్తే, ఒక బానిస లేదా ఒక బానిసరాలు లేదా ఒక గుర్రం లేదా ఒక గాడిద పరిహా రంగా ఇవ్వాలి.” (అబూ దావూద్, నసాయి)
3504 – [ 19 ] ( لم تتم دراسته ) (2/1041)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ تَطَيَّبَ وَلَمْ يُعْلَمْ مِنْهُ طِبٌّ فَهُوَ ضَامِنٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.
3504. (19)[2/1041–అపరిశోధితం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, వైద్యం తెలియని వైద్యుడు వైద్యం చేసి, అతని అజ్ఞానం కారణంగా రోగి చనిపోతే, వైద్యుడు పరిహారం చెల్లించాలి. (అబూ దావూద్)
3505 – [ 20 ] ( لم تتم دراسته ) (2/1041)
وَعَنْ عِمْرانَ بْنِ حُصَيْنٍ: أَنَّ غُلَامًا لِأُنَاسٍ فُقَرَاءَ قَطَعَ أُذُنَ غُلَامٍ لِأُنَاسٍ أَغْنِيَاء فَأَتَى أَهْلُهُ النَّبِيَّ صلى الله عليه وسلم فَقَالُوْا: إِنَّا أُنَاسٌ فُقَرَاءً فَلَمْ يَجْعَلْ عَلَيْهِمْ شَيْئًا. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.
3505. (20) [2/1041–అపరిశోధితం]
‘ఇమ్రాన్ బిన్ ‘హు’సైన్ కథనం: పేదల యువకులు ధనవంతుల యువకుల చెవులు కోసివేసారు. పేద యువకుల తల్లిదండ్రులు ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘మేము చాలా పేద వాళ్ళం. బలహీనులం’ అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స) వాళ్ళపై ఎటువంటి పరిహారాన్ని విధించలేదు. [25] (అబూ దావూద్, నసాయి).
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3506 – [ 21 ] ( لم تتم دراسته ) (2/1041)
عَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ أَنَّهُ قَالَ:دِيَةُ شِبهِ الْعَمْدِ أَثْلَاثًا ثَلَاثٌ وَثَلَاثُوْنَ حِقَّةُ وَثَلَاثٌ وَّثَلَاثُوْنَ جَذَعَةً وَأَرْبَعٌ وَّثَلَاثُوْنَ ثَنِيَّةً إِلَى بَازِلِ عَامِهَا كُلُّهَا خَلِفَاتٌ وَفِيْ رِوَايَةٍ:قَالَ:فِي الْخَطأِ أَرْبَاعًا: خَمْسٌ وَّعِشْرُوْنَ حِقَّةٌ وَخَمْسٌ وَّعِشْرُوْنَ جَذَعةً وَخَمْسٌ وَّ عِشْرُوْنَ بِنَاتِ لَبُوْنٍ وَخَمْسٌ وَّعِشْرُوْنَ بِنَاتِ مَخَاضٍ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3506. (21) [2/1041– అపరిశోధితం]
‘అలీ (ర) కథనం: ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యకు పరిహారంలో మూడు రకాల ఒంటెలు ఉన్నాయి. నాలుగు సంవత్సరాల ఆడ ఒంటెలు 33, ఐదు సంవ త్సరాల ఆడ ఒంటెలు 33, 6 నుండి 8 సంవత్సరాల లోపుగల ఆడ ఒంటెలు 34. ఇవన్నీ గర్భం ధరించి ఉండాలి. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”పొరపాటు చేసిన హత్యకు పరిహారంలో నాలుగు రకాల ఒంటెలు ఉన్నాయి. మూడు సంవత్సరాల వయస్సు గల ఒంటెలు 25, నాలుగు సంవత్సరాల వయస్సుగల ఒంటెలు 25, రెండు సంవత్సరాల వయస్సుగల ఒంటెలు 25, ఒక సంవత్సరం వయస్సు గల ఒంటెలు 25. ఇవన్నీ ఆడ ఒంటెలు. (అబూ దావూద్)
3507 – [ 22 ] ( لم تتم دراسته ) (2/1041)
وَعَنْ مُجَاهِدٍ قَالَ: قَضَى عُمَرُ رَضِيَ اللهُ عَنْهُ فِيْ شِبَهِ الْعَمْدِ ثَلَاثِيْنَ حِقَّةً وَّثَلَاثِيْنَ جَذَعَةً وَّأَرْبَعِيْنَ خِلْفَةٌ مَا بَيْنَ ثَنِيَّةٍ إِلَى بَازِلِ عَامِهَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3507. (22) [2/1041–అపరిశోధితం]
ముజాహిద్ కథనం: ‘ఉమర్ (ర) ఉద్దేశ్యపూర్వకమైన హత్యా పరిహారంలో మూడు రకాల ఒంటెలు నిర్ణయించారు. 30 మూడు సంవత్సరాల ఆడ ఒంటెలు, 30 నాలుగు సంవత్సరాల ఆడ ఒంటెలు, 40 ఐదు సంవత్సరాల నుండి 8 సంవత్సరాల వరకు గల గర్భం ధరించి ఉన్న ఆడ ఒంటెలు. (అబూ దావూద్)
3508 – [ 23 ] ( لم تتم دراسته ) (2/1042)
وَعَنْ سَعِيْدِ بْنِ الْمُسَيَّبِ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَضَى فِي الْجَنِيْنِ يُقْتَلُ فِيْ بَطَنِ أُمِّهِ بِغُرَّةِ عَبْدٍ أَوْ وَلِيْدَةٍ. فَقَالَ الَّذِيْ قَضَى عَلَيْهِ: كَيْفَ أَغْرَمُ مَنْ لَا شَرِبَ وَلَا أَكَلَ وَلَا نَطَقَ وَلَا اسْتَهَلَّ وَمِثْلُ ذَلِكَ يُطَلُّ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّمَا هَذَا مِنْ أخْوَانِ الْكُهَّانِ”. رَوَاهُ مَالِكٌ وَالنَّسَائِيُّ مُرْسَلًا.
3508. (23) [2/1042 –అపరిశోధితం]
సయీద్ బిన్ ముసయ్యిబ్ (ర) కథనం: ప్రవక్త (స) గర్భవతిగా ఉన్న స్త్రీ కడుపులోని బిడ్డ ఒకరు కొట్టడం వల్ల చనిపోతే పరిహారంగా ఒక బానిస లేదా బానిసరాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ భారం పడినవారు, ‘ఆ బిడ్డకు పరిహారం మేమెందుకు చెల్లించాలి? ఆ బిడ్డ ఏ వస్తువూ తినలేదు, ఏ వస్తువునూ త్రాగలేదు, మాట్లాడలేదు, కేకలు వేయలేదు. అంటే ఆ బిడ్డ గాయం వల్ల క్రిందపడి చనిపోయాడు. దానికి పరిహారం ఎందుకు?’ అని అన్నారు. అది విన్న ప్రవక్త (స), ‘ఇతడు జోతిష్కుల సోదరుడిలా ఉన్నాడు. ఏవిధంగా వారు మోసపూరితమైన పలుకులు పలుకుతారో ఇతను కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా అతడు పరిహారం చెల్లించాలి,’ అని అన్నారు. (మాలిక్, నసాయి)
3509 – [ 24 ] ( لم تتم دراسته ) (2/1042)
وَرَوَاهُ أَبُوْ دَاوُدَ عَنْهُ عَنْ أَبِيْ هُرَيْرَةَ مُتَّصِلًا.
3509. (24) [2/1042 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: (అబూ దావూద్)
=====
2- بَابُ مَا يُضْمَنُ مِنَ الْجِنَايَاتِ
- పరిహారం తప్పనిసరి కాని సందర్భాలు
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3510 – [ 1 ] ( متفق عليه ) (2/1043)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ:قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْعَجَمَاءُ جُرْحُهَا جُبَارٌ وَالْمِعْدِنُ جُبَارٌ وَالْبِئْرُ جُبَارٌ”
3510. (1) [2/1043– ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, నోరులేని జంతువులు ఎవరినైనా గాయపరిచితే వాటి యజమానిపై ఎటువంటి పరిహారం లేదు. అదేవిధంగా గనుల్లో పనిచేసే కార్మికులు చనిపోతే, యజమానిపై ఎటువంటి పరిహారం లేదు. అదేవిధంగా బావి త్రవ్విస్తున్నప్పుడు కూలివాడు అందులో పడి మరణిస్తే యజమానిపై ఎటువంటి పరిహారంలేదు. అంటే ఈ సందర్భాల్లో పరిహారం లేదు. (బు’ఖారీ, ముస్లిమ్)
3511 – [ 2 ] ( متفق عليه ) (2/1043)
وَعَنْ يَعْلَى بْنِ أُمَيَّةَ قَالَ: غَزَوْتُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم جَيْشَ الْعُسْرَةِ وَكَانَ لِيْ أَجِيْرٌ فَقَاتَلَ إِنْسَانًا فَعَضَّ أَحَدُهُمَا الْآخِرِ فَانْتَزَعَ الْمَعْضُوْضُ يَدَهُ مِنْ فِي الْعَاضِّ فَأَنْدَرَ ثَنيَّتَهُ فَسَقَطَت فَانْطَلَقَ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَأَهْدَرَ ثَنِيَّتَهُ وَقَالَ: “أَيْدَعُ يَدَهُ فِيْ فِيْكَ تَقْضِمُهَا كَالْفَحُلِ”.
3511. (2) [2/1043– ఏకీభవితం]
య’అలా బిన్ ఉమయ్య కథనం: నేను ప్రవక్త (స) వెంట తబూక్ యుద్ధంలో పాల్గొనటానికి వెళ్ళాను. నా దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు. అతనికి ఒక వ్యక్తికి మధ్య వివాదం జరిగింది. వారిద్దరూ ఒకరి చేతిని మరొకరు నోటితో కరిచారు. ఒకరు మరొకరి నోటి నుండి తమ చేతిని లాగితే ఒకరి పన్ను విరిగిపోయింది. ప్రవక్త (స)కు ఫిర్యాదు చేసాడు. ప్రవక్త (స) విషయం అంతా విని అతడు తన చేతిని నీ నోట్లో వదలివేస్తే ఒంటెలా నములుతూ ఉంటావా? అని చీవాట్లు పెట్టారు. (బు’ఖారీ, ముస్లిమ్) అంటే ప్రవక్త (స) ఏ విధమైన పరిహారం విధించలేదు.
3512 – [ 3 ] ( متفق عليه ) (2/1043)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يقول: “مَنْ قُتِلَ دُوْنَ مَالِهِ فَهُوَ شَهِيْدٌ”.
3512. (3) [2/1043 –ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. తన ధన సంపదల పరిరక్షణలో చంపబడిన వాడు అమర వీరుడు. (బు’ఖారీ, ముస్లిమ్)
3513 – [ 4 ] ( صحيح ) (2/1043)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: جَاءَ رَجُلٌ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ أَرَأَيْتَ إِنْ جَاءَ رَجُلٌ يُرِيْدُ أَخْذَ مَالِيْ؟ قَالَ: “فَلَا تُعْطِهِ مَالَكَ”. قَالَ: أَرَأَيْتَ إِنْ قَاتَلَنِيْ؟ قَالَ: “قَاتِلْهُ” .قَالَ: أَرَأَيْتَ إِنْ قَتَلَنِيْ؟ قَالَ: “فاَنْتَ شَهِيْدٌ”. قَالَ: أَرَأَيْتَ إِنْ قَتَلْتُهُ؟ قَالَ: “هُوَ فِيْ النَّارِ”. رَوَاهُ مُسْلِمٌ.
3513. (4) [2/1043 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘ఓ ప్రవక్తా! దోపిడీ దొంగలు నా ధనాన్ని కాజేయాలని ప్రయత్నిస్తే ఏం చేయాలి,’ అని విన్నవించుకున్నాడు. ‘నువ్వు నీ ధనాన్ని వారికి ఇవ్వకు’ అని అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ ఒకవేళ ‘వారు నాతో వివాదానికి, పోట్లాటకు దిగితే ఏం చేయాలి?’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స) ‘నువ్వూ వారితో పోట్లాటకు దిగు,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి ‘వారు నన్ను చంపివేస్తే’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స) ‘నువ్వు వీరమరణం పొందుతావు,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి ‘ఒకవేళ నేను అతన్ని చంపివేస్తే,’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స) ‘వాడు నరకంలోకి పోతాడు,’ అని అన్నారు. (ముస్లిమ్)
3514 – [ 5 ] ( متفق عليه ) (2/1044)
وَعَنْهُ أَنَّهُ سَمِعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَوِ اطَّلَعَ فِيْ بَيْتِكَ أَحَدٌ وَلَمْ تَأْذَنْ لَهُ فَخَذَفْتَهُ بِحَصَاةٍ فَفَتَأْتَ عَيْنَهُ مَا كَانَ عَلَيْكَ مِنْ جُنَاحٍ”.
3514. (5) [2/1044– ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. ”ఒకవేళ ఎవరైనా మీ అనుమతి లేకుండా మీ ఇంట్లోకి తొంగిచూస్తే, మీకు రోషం వచ్చి అతడ్ని కంకరరాయితో కొట్టి వాడి కన్ను పోగొడితే, నీకు ఎలాంటి పాపం చుట్టుకోదు.” (బు’ఖారీ, ముస్లిమ్)
3515 – [ 6 ] ( متفق عليه ) (2/1044)
وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ: أَنَّ رَجُلًا اِطَّلَعَ فِيْ جُحْرٍ فِيْ بَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَمَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مِدْرى يحُكَّ بِهِ رَأْسَهُ فَقَالَ: “لَوْ أَعْلَمُ أَنَّكَ تَنْظُرُنِيْ لَطَعَنْتُ بِهِ فِيْ عَيْنَيْكَ إِنَّمَا جُعِلَ الْاستِئْذَانَ مِنْ أَجَلِ الْبَصَرِ”.
3515. (6) [2/1044– ఏకీభవితం]
సహల్ బిన్ స’అద్ (ర) కథనం: ఒక వ్యక్తి ప్రవక్త (స) ఇంటి తలుపు కన్నంలో నుండి తొంగిచూసాడు. ఆ సమయంలో ప్రవక్త (స) చేతిలో దువ్వెన ఉండేది. ప్రవక్త (స) ఆ వ్యక్తితో ”నువ్వు ఉద్దేశ్య పూర్వకంగా తొంగి చూస్తున్నావని నాకు తెలిస్తే, దీనితో నీ కంట్లో పొడిచి, కన్ను పోగొట్టే వాడిని, ఈ అనుమతి కేవలం కంటి వరకే వర్తిస్తుంది,” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
3516 – [ 7 ] ( متفق عليه ) (2/1044)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مُغَفَّلٍ أَنَّهُ رَأَى رَجُلًا يَخْذِفُ فَقَالَ: لَا تَخْذِفُ فَإِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَهَى عَنِ الْخَذْفِ وَقَالَ: “إِنَّهُ لَا يُصَادُ بِهِ صَيْدٌ وَلَا يُنْكَأُ بِهِ عَدُوٌّ وَلَكِنَّهَا قَدْ تَكْسِرُ السِّن وَتَفْقَأُ الْعَيْنَ”.
3516. (7) [2/1044– ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ము’గప్ఫర్ (ర) ఒక వ్యక్తిని కంకర రాళ్ళు విసరడం చూచి, ఆ వ్యక్తితో, ‘కంకరరాళ్ళు విసరకు ఎందుకంటే ప్రవక్త (స) అనవసరంగా కంకర రాళ్ళు విసరటాన్ని వారించారు. ఇంకా అనవసరంగా కంకరరాళ్ళు విసరటం వేటాడటానికి పనికిరాదు. శత్రువునూ గాయపరచదు. పైగా ఈ విధంగా కంకర రాళ్ళు విసరటం వల్ల పరుల పళ్ళు విరుగుతాయి లేదా కళ్ళు పోతాయి అని కూడా ప్రవచించారని,’ అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
3517 – [ 8 ] ( متفق عليه ) (2/1044)
وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا مَرَّ أَحَدُكُمْ فِيْ مَسْجِدِنَا وَفِيْ سُوْقِنَا وَمَعَهُ نَبْلٌ فَلْيُمْسِكْ عَلَى نِصَالِهَا أَنْ يُّصِيْبَ أَحَدًا مِّنَ الْمُسْلِمِيْنَ مِنْهَا بِشَيْءٍ”.
3517. (8) [2/1044– ఏకీభవితం]
అబూ మూసా (అ) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా మస్జిదులకూ, బజార్లకూ వస్తే, తమ వద్ద ఉన్న విల్లు, బాణాలను చేతిలోకి తీసుకోవాలి. దానివల్ల ముస్లిములు గాయపడకుండా ఉండటానికి. (బు’ఖారీ, ముస్లిమ్)
3518 – [ 9 ] ( متفق عليه ) (2/1044)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ:قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يُشِيْرُ أَحَدُكُمْ عَلَى أَخِيْهِ بِالسِّلَاحِ فَإِنَّهُ لَا يَدْرِيْ لَعَلَّ الشَّيْطَانَ يَنْزعُ فِيْ يَدِهِ فَيَقْعُ فِيْ حُفْرَةٍ مِّنَ النَّارِ”.
3518. (9) [2/1044– ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ ముస్లిమ్ సోదరుని వైపు ఎటువంటి ఆయుధం ద్వారా కూడా సైగ చేయకండి. ఎందుకంటే అతనికి తెలిసి ఉండదు. షై’తాన్ అతన్నుండి ఆయుధం లాక్కోవచ్చు, అది ఈ వ్యక్తికి తగలవచ్చు, అతడు చనిపోవచ్చు. ఆ వ్యక్తి నరకం పాలు కావచ్చు.[26](బు’ఖారీ, ముస్లిమ్)
3519 – [ 10 ] ( صحيح ) (2/1045)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَشَارَ إِلَى أَخِيْهِ بِحَدِيْدَةٍ فَإِنَّ الْمَلَائِكَةَ تَلْعَنُهُ حَتَّى يَضَعَهَا وَإِنْ كَانَ أَخَاهُ لِأَبِيْهِ وَأُمِّهِ”. رَوَاهُ البُخَارِيُّ .
3519. (10) [2/1045– దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన సోదరునివైపు ఆయుధంతో సైగచేసే వ్యక్తిని దైవదూతలు అతడు వాటిని భూమిపై పెట్టనంత వరకు శపిస్తూ ఉంటారు. అతడు సొంత సోదరుడైనా సరే. [27] (బు’ఖారీ)
3520 – [ 11 ] ( صحيح ) (2/1045)
وَعَنِ ابْنِ عُمَرَ وَأَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُمْ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ حَمَلَ عَلَيْنَا السِّلَاحَ فَلَيْسَ مِنَّا”. رَوَاهُ الْبُخَارِيُّ وَزَادَ مُسْلِمٌ: “وَمَنْ غَشَّنَا فَلَيْسَ مِنَّا”.
3520. (11) [2/1045– దృఢం]
ఇబ్నె ఉమర్, అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మాపై ఆయుధం ఎత్తినవాడు ముస్లిమ్ కాడు.” (బు’ఖారీ, ముస్లిమ్)
మరో ముస్లిమ్ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”మమ్మల్ని మోసగించిన వాడు ముస్లిమ్ కాడు,” [28]
3521 – [ 12 ] ( صحيح ) (2/1045)
وَعَنْ سَلَمَةَ بْنِ الْأَكْوَعِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ سَلَّ عَلَيْنَا السَّيْفَ فَلَيْسَ مِنَّا”. روَاهُ مُسْلِمٌ .
3521. (12) [2/1045–దృఢం]
సలమహ్ బిన్ అక్‌వహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మనపై కరవాలం ఎత్తినవాడు ముస్లిమ్ కాడు. (ముస్లిమ్)
3522 – [ 13 ] ( صحيح ) (2/1045)
وَعَنْ هِشَامِ بْنِ عُرْوَةَ عَنْ أَبِيْهِ أَنَّ هِشَامَ بْنِ حَكِيْمٍ مَرَّ بِالشَّامِ عَلَى أُنَاسِ مِّنَ الْأَنْبَاطِ وَقَدْ أُقِيْمُوْا فِي الشَّمْسِ وَصُبَّ عَلَى رُؤُوْسِهِمُ الزَّيْتُ فَقَالَ: مَا هَذَا؟ قِيْلَ: يُعَذَّبُونَ فِي الْخَرَاجِ فَقَالَ هِشَامٌ: أَشْهَدُ لَسَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ اللهَ يُعَذِّبُ الَّذِيْنَ يُعَذِّبُوْنَ النَّاسَ فِي الدُّنْيَا”. رَوَاهُ مُسْلِمٌ .
3522. (13) [2/1045– దృఢం]
హిషామ్ బిన్ ‘ఉర్‌వ తన తండ్రి ‘ఉర్‌వ ద్వారా కథనం: హిషామ్ బిన్ ‘హాకిమ్ సిరియాదేశంలో రైతులగుండా వెళుతూ వారిని ఎండలో నిలబెట్టి, వారితలపై వేడినూనె వేయడం చూచి, ‘ఏం జరిగింది’ అని అడిగారు. పన్నులు, చెల్లింపులు ఇవ్వనందున ఇలా శిక్షించడం జరుగుతుందని తెలియపర్చటం జరిగింది. అప్పుడు హిషామ్ ”ప్రవక్త (స) అనవసరంగా ప్రజలను శిక్షించేవారిని అల్లాహ్ (త) శిక్షిస్తాడని అంటూ ఉండగా నేను విన్నానని సాక్ష్యం ఇస్తున్నాను” అని అన్నారు.[29] (ముస్లిమ్)
3523 – [ 14 ] ( صحيح ) (2/1045)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُوْشِكُ إِنْ طَالَتْ بِكَ مُدَّةٌ أَنْ تَرَى قَوْمًا فِيْ أَيْدِيْهِمْ مِثْلُ أَذْنَابِ الْبَقَرِ يُغْدُوْنَ فِيْ غَضَبِ اللهِ وَيَرُوْحُوْنَ فِيْ سَخْطِ اللهِ”.
وَفِيْ رِوَايَةٍ: “وَيرُوْحُوْنَ فِيْ لَعْنَةِ اللهِ“. رَوَاهُ مُسْلِمٌ.
3523. (14) [2/1045 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీకు దీర్ఘాయుష్షు ప్రసాదించబడితే మీరు ఎలాంటి వారిని చూస్తారంటే వారిచేతుల్లో ఆవుతోకల్లా కొరడాలు ఉంటాయి. వాటితో వారు ప్రజలను అన్యాయంగా హింసిస్తూ ఉంటారు. వీరిపై ఉదయం సాయంత్రం అల్లాహ్ ఆగ్రహం అవతరిస్తూ ఉంటుంది. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”వారు అల్లాహ్ శాపానికి గురవుతూ ఉంటారు.”[30] (ముస్లిమ్)
3524 – [ 15 ] ( صحيح ) (2/1045)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صِنْفَانِ مِنْ أَهْلِ النَّارِ لَمْ أَرَهُمَا: قَوْمٌ مَّعَهُمْ سِيَاطٌ كَأَذْنَابِ الْبَقَرِ يَضْرِبُوْنَ بِهَا النَّاسَ وَنِسَاءٌ كَاسيَاتٌ عَارِيَاتٌ مُمِيْلَاتٌ مَائِلَاتٌ رُؤُوْسُهُمْ كَأَسْنِمَةِ الْبُخْتِ الْمَائِلَةِ لَا يَدْخُلْنَ الْجَنَّةَ وَلَا يَجِدُنْ رِيْحَهَا وَإِنَّ رِيْحَهَا لَتُوْجَدُ مِنْ مَّسِيْرَةِ كَذَا وَكَذَا”. رَوَاهُ مُسْلِمٌ.
3524. (15) [2/1045 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకంలోనికి వెళ్ళేవారు రెండురకాలు. (వారిని నేనింకా చూడలేదు). ఇటువంటివారు భవిష్యత్తులో పుడతారు. 1. వీరి చేతుల్లో ఆవు తోకల్లా కొరడాలు ఉంటాయి. వీటితో ప్రజలను అన్యాయంగా హింసిస్తారు. 2. దుస్తులు ధరించి ఉన్న స్త్రీలు. వీరి దుస్తులు చాలా పలుచగా ఉంటాయి. వీటి ద్వారా వారి శరీరం కనబడుతూ ఉంటుంది. అంటే వారు నగ్నంగా ఉన్నట్టే, వారు పురుషులను ఆకర్షిస్తూ వారి మనసుల్లో కామకోరికలు జనింపజేస్తారు. స్వయంగా వారు పురుషులవైపు ఆకర్షితులౌతారు. అంటే అలంకరించుకొని పురుషులను తమవైపు ఆకర్షిస్తారు. వారి తల కొప్పులు ఒంటె వీపులా ఎత్తుగా ఉంటాయి. ఇటువంటి స్త్రీలు స్వర్గంలో ప్రవేశించలేరు, దాని సువాసన కూడా పొందలేరు. వాస్తవంగా, స్వర్గ సువాసన ఎంతో దూరం నుండే వస్తూ ఉంటుంది. అంటే వారిని స్వర్గం నుండి చాలా దూరంగా ఉంచడం జరుగుతుంది.[31] (ముస్లిమ్)
3525 – [ 16 ] ( متفق عليه ) (2/1046)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا قَاتَلَ أَحَدُكُمْ فَلْيَجْتَنِبِ الْوَجْهَ فَإِنَّ اللهَ خَلَقَ آدَمَ عَلَى صُوْرَتِهِ”.
3525. (16) [2/1046– ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా కొడితే, ముఖంపై కొట్టరాదు. ఎందు కంటే అల్లాహ్ (త) ఆదమ్ (అ) ను తన ముఖ వర్చస్సులా, ప్రత్యేక గుణాలతో సృష్టించాడు. (బు’ఖారీ, ముస్లిమ్)
అందువల్ల గౌరవిస్తూ ఎవరినీ ముఖంపై కొట్టరాదు. ఇక్కడ అల్లాహ్ (త) ముఖవర్చస్సు అంటే ఆయన ప్రత్యేక గుణం.
—–
الْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3526- [ 17 ] ( لم تتم دراسته ) (2/1046)
عَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ كَشَفَ سِتْرًا فَأَدْخَلَ بَصْرَهُ فِيْ الْبَيْتِ قَبْلَ أَنْ يُؤْذَنَ لَهُ فَرَأَى عَوْرَةَ أَهْلِهِ فَقَدْ أَتَى حَدًّا لَا يَحِلُّ لَهُ أَنْ يَأْتِيَهُ وَلَوْ أَنَّهُ حِيْنَ أدْخَلَ بَصَرَهُ فَاسْتَقْبَلَهُ رَجُلٌ فَفَقَأ عَيْنَهُ مَا عَيَّرْتُ عَلَيْهِ وَإِنْ مَرَّ الرَّجُلُ عَلَى بَابٍ لَا سِتْرَ لَهُ غَيْرَ مُغْلَقٍ فَنَظَرَ فَلَا خَطِيْئَةَ عَلَيْهِ إِنَّمَا الْخَطِيْئَةُ عَلَى أَهْلِ الْبَيْتِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَال: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.
3526. (17) [2/1046 –అపరిశోధితం]
అబూ జర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఎవ రైనా పరాయి ఇంటి తలుపులు తెరచి అనుమతి లేకుండా ఎవరినైనా నగ్నంగా చూస్తే, అంటే తెర తొలగించి తొంగి చూస్తే అతడు తనకు తగని పని చేసాడు. ఒకవేళ ఇంటి యజమానికి రోషం వచ్చి అతని కళ్ళు పొడిచినా నేనతనికి ఎటువంటి శిక్ష వేయను, ఇంకా దానికి పరిహారం విధించను. ఒకవేళ ఎవరైనా తెరచాటులేని ద్వారం గుండా వెళుతూ అక్కడ తలుపు మూసిగాని, తెరచాటుగాని లేక అతని దృష్టిలోపల ఉన్న వారిపై పడితే, అతనికి ఎలాంటి పాపంలేదు. పైగా ఆ పాపం ఇంటిలోపల ఉన్నవారిపై పడుతుంది. ఎం కంటే తలుపు ఎందుకు మూయలేదు, దానిపై తెరచాటు ఎందుకు పెట్టలేదు, అది వాళ్ళ తప్పు. (తిర్మిజి’ / ఏకోల్లేఖనం)
3527 – [ 18 ] ( لم تتم دراسته ) (2/1046)
وَعَنْ جَابِرٍ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يُتَعَاطَى السَّيْفُ مَسْلُوْلًا. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.
3527. (18) [2/1046 –అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) కరవాలాన్ని ఒరలో నుంచి తీసి పట్టుకోవటాన్ని వారించారు. అంటే ఒరలేకుండా కరవాలాన్ని ఇతరులకు ఇవ్వటాన్ని వారించారు. [32] (తిర్మిజి’)
3528 – [ 19 ] ؟ (2/1046)
وَعَنِ الْحَسَنٍ عَنْ سَمُرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَهَى أَنْ يُقَدَّ السَّيْرُ بَيْنَ أَصْبَعَيْنِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3528. (19) [2/1046 -? ]
‘హసన్ సమురహ్ ద్వారా కథనం: ప్రవక్త (స) చెప్పుపట్టీని రెండు వ్రేళ్ళ మధ్య చీల్చటాన్ని వారించారు. [33] (అబూ దావూద్)
3529 – [ 20 ] ( صحيح ) (2/1047)
وَعَنْ سَعِيْدِ بْنِ زَيْدٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ قُتِلَ دُوْنَ دِيْنِهِ فَهُوَ شَهِيْدٌ وَمَنْ قُتِلَ دُوْنَ دَمِهِ فَهُوَ شَهِيْدٌ وَمَنْ قُتِلَ دُوْنَ مَالِهِ فَهُوَ شَهِيدٌ وَمَنْ قُتِلَ دُوْنَ أَهْلِهِ فَهُوَ شَهِيْدٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.
3529. (20) [2/1047 –దృఢం]
స’యీద్ బిన్ ‘జైద్ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తనధర్మాన్ని రక్షించటంలో చంపబడినవాడు అమర వీరుడు, తన ప్రాణరక్షణలో చంపబడినవాడు అమర వీరుడు, తన ధన సంరక్షణలో హతమార్చ బడిన వాడు అమరవీరుడు, తన భార్యాబిడ్డల, కుటుంబం పరి రక్షణలో హతమార్చబడినవాడు అమర వీరుడు.[34](తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’)
3530 – [ 21] ؟ (2/1047)
وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لِجَهَنَّمَ سَبْعَةَ أَبْوَابٍ: بَابٌ مِنْهَا لِمَنْ سَلَّ السَّيْفَ عَلَى أُمَّتِيْ أَوْ قَالَ: عَلَى أُمَّةِ مُحَمَّدٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَحَدِيْثٌ أَبِيْ هُرَيْرَةَ: “اَلرِّجْلُ جُبَارٌ”. ذُكِرَ فِيْ “بَابِ الْغَضْبِ”.
3530. (21) [2/1047 -? ]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”నరకానికి 7 ద్వారాలున్నాయి. నా అనుచర సంఘంపై కరవాలం ఎత్తినవారు వాటిలోని ఒక ద్వారంద్వారా ప్రవేశిస్తారు.” (తిర్మిజి’)
—–
هَذَا الْبَابُ خَالٍ مِنَ الْفَصْلُ الثَّالِثُ
ఈ అధ్యాయంలో మూడవ విభాగం లేదు
=====
3– بَابُ الْقَسَامَةِ
3. ప్రమాణం (ఖసామహ్)
ఖసామహ్ అంటే ప్రమాణం చేయటం. ఇస్లామీయ సాంప్రదాయంలో హంతకుడ్ని పట్టుకోవటానికి చేసే ప్రమాణాన్ని ఖసామహ్ అంటారు. ఒక ప్రాంతంలో శవం పడిఉండి హంతకుని ఆచూకీ తెలియకపోతే హతుడు దొరికిన పరిసరప్రాంత ప్రజలలో పాలకుడు అక్కడి అనుమానాస్పద వ్యక్తులను విచారించిన పిమ్మట కూడా హంతకుని ఆచూకీ లభించకపోతే అక్కడి 50 మంది నుండి ఇలా ప్రమాణం తీసుకోవటం జరుగు తుంది. ”దైవం సాక్షి! మేము హత్య చేయలేదు, ఇంకా హంతకుని గురించి మాకేమీ తెలియదు.” ఈ పరిస్థితుల్లో వారు దాని బాధ్యత నుండి తప్పు కుంటారు. వారిపై ప్రతీకారమూ ఉండదు. పరిహారమూ ఉండదు. అయితే ప్రజా సంక్షేమనిధి నుండి హతుని బంధువులకు పరిహారం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఖసామత్ను ‘అబ్దుల్ ము’త్తలిబ్ అజ్ఞానకాలంలో ప్రారంభించారు. దాన్ని ఇస్లామ్ కూడా కొనసాగించింది. ప్రవక్త (స) కాలంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3531 – [ 1 ] ( متفق عليه ) (2/1048)
عَنْ رَافِعِ بْنِ خَدِيْجٍ وَسَهْلِ بْنِ أَبِيْ حَثْمَةَ أَنَّهُمَا حَدَّثًا أَنَّ عَبْدَ اللهِ بْنِ سَهْلٍ وَمُحَيِّصَةَ بْنَ مَسْعُوْدٍ أَتَيَا خَيْبَرَ فَتَفَرَّقَا فِي النَّخْلِ فَقُتِلَ عَبْدُ اللهِ بْنِ سَهْلٍ فَجَاءَ عَبْدُ الرَّحْمَنِ بْنِ سَهْلٍ وَحُوَيِّصَةُ وَمُحيصَةُ اِبْنَا مَسْعُوْدٍ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَتَكَلَّمُوْا فِيْ أَمْرٍ صَاحِبِهِمْ فَبَدَأَ عَبْدِ الرَّحْمنِ وَكَانَ أَصْغَرَ الْقَوْمِ فَقَالَ لَهُ النَّبِيُّ صلى الله عليه وسلم: “كَبِّرِ الْكُبْرَ قَالَ يَحْيَى بْنُ سَعِدٍ: يَعْنِيْ لِيَلِيَ الْكَلَامَ الْأَكْبَرُ فَتَكَلَّمُوْا فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “اَسْتَحِقُّوْا قَتِيْلَكُمْ أَوْ قَالَ صَاحِبَكُمْ بِأَيْمَانِ خَمْسِيْنَ مِنْكُمْ”. قَالُوْا: يَا رَسُوْلَ اللهِ أَمْرٌ لَمْ نَرَهُ قَالَ : فتبرِّئُكُمْ يَهُوْدُ فِيْ أَيْمَانِ خَمْسِيْنَ مِنْهُمْ؟ قَالُوْا: يَا رَسُوْلَ اللهِ قَوْمٌ كُفَّارٌ فَفَدَاهُمْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنْ قِبَلِهِ. وَفِيْ رِوَايَةٍ: “تَحْلِفُوْنَ خَمْسِيْنَ يَمِيْنًا وَتَسْتَحِقُّوْنَ قَاتِلَكُمْ أَوْ صاحِبَكُمْ”. فَوَداهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنْ عِنْدِهِ بِمَائَةِ نَاقَةٍ.
3531. (1) [2/1048 –ఏకీభవితం]
రాఫె’అ బిన్ ‘ఖదీజ్, సహల్ బిన్ అబీ ‘హస్మ’హ్ (ర) కథనం: ‘అబ్దుల్లాహ్ బిన్ సహల్ మరియు ము’హీ’సహ్ బిన్ మస్’ఊద్ (ర) ‘ఖైబర్ వచ్చారు. వీరిద్దరూ ఖర్జూరాలతోటలో విడిపోయారు. ‘అబ్దుల్లాహ్ బిన్ సహ్‌ల్ హతమార్చబడ్డారు. అంటే ఎవరో అతన్ని చంపివేసారు. అప్పుడు ‘అబ్దుర్రహ్మాన్ బిన్ సహల్ మరియు మస్’ఊద్ ఇద్దరు కొడుకులు హులైస, మ’హీస ప్రవక్త (స) వద్దకు వచ్చారు. అందరికంటే ముందు ‘అబ్దుర్రహ్మాన్ తనసోదరుని హత్యాసంఘటన గురించి చెప్పాలని నిశ్చయించు కున్నారు. అయితే అతను అందరికంటే చిన్నవారు. అప్పుడు ప్రవక్త (స) ‘నువ్వు ముందు పెద్దవాడిని మాట్లాడనివ్వు, అతనికి మర్యాద నివ్వు’ అని అన్నారు. య’హ్‌యా బిన్ స’యీద్ ఏమన్నారంటే ‘ప్రవక్త (స) మాటలకు అర్థం, ముందు పెద్దవారిని మాట్లాడే అవకాశం ఇవ్వు’ అని. అనంతరం అందరికంటే ముందు అతను ఆ దుర్ఘటనను గురించి వివరించారు. అప్పుడు ప్రవక్త (స) వారితో మీలో 50 మంది కలసి ఆ యూదులే హతమార్చారని ప్రమాణం చేస్తేనే మీరు మీ హతుని లేదా సోదరుని రక్తపరిహారానికి అర్హులవుతారు. దానికి వారు ‘హత్య చేస్తుండగా మేము ఎవరినీ చూడలేదు. మరి మేము ఎలా ప్రమాణం చేయగలం’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) ‘మరయితే యూదుల్లో 50మంది ప్రమాణం చేసి ఈ వ్యవహారం నుండి వేరౌతారు,’ అని అన్నారు. దానికి వారు, ‘యూదులు అవిశ్వాసులు, వారి ప్రమాణంపై ఎలా నమ్మకం కలుగుతుంది,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) తన వద్ద నుండి 100 ఒంటెలను రక్తపరిహారంగా హతుని వారసులకు ఇచ్చివేసారు. (బు’ఖారీ, ముస్లిమ్)
هَذَا الْبَابُ خَالٍ مِنَ الْفَصْلُ الثَّانِيْ
ఇందులో రెండవ విభాగం లేదు
—–
الْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3532 – [ 2 ] ( لم تتم دراسته ) (2/1049)
عَنْ رَافِعِ بْنِ خَدِيْجٍ قَالَ: أَصْبَح رَجُلٌ مِّنَ الْأَنْصَارِ مَقْتُوْلًا بِخَيْبَرَ فَانْطَلَقَ أَوْلِيَاؤُهُ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَذَكَرُوْا ذَلِكَ لَهُ فَقَالَ: “أَلَكُمْ شَاهِدَانِ يَشْهَدَانِ عَلَى قَاتِلِ صَاحِبِكُمْ؟ “قَالُوْا: يَا رَسُوْلَ اللهِ لَمْ يَكُنْ ثُمَّ أَحَدٌ مِّنَ الْمُس لِمِيْنَ وَإِنَّمَا هُوَ يَهُوْدُ وَقَدْ يَجْتَرِئُوْنَ عَلَى أَعْظَمَ مِنْ هَذَا قَالَ: “فَاخْتَارُوْا مِنْهُمْ خَمْسِيْنَ فَاسْتَحْلِفُوْهُمْ”. فَأَبَوْا فَوَدَاهُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مِنْ عِنْدِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3532. (2) [2/1049 –అపరిశోధితం]
రాఫె’అ బిన్ ‘ఖదీజ్ కథనం: అ’న్సారుల్లోని ఒక వ్యక్తి ‘ఖైబర్‌లో హత్యచేయబడ్డారు. అతని వారసులు ప్రవక్త (స) వద్దకు వెళ్ళి తమ వ్యక్తి హత్య గురించి వివరించారు. అప్పుడు ప్రవక్త (స) వారితో, ‘ఈ విషయంపై ఇద్దరు సాక్షులను తీసుకురండి,’ అని అన్నారు. దానికి వారు, ‘హత్య జరిగినప్పుడు ముస్లిముల్లోని ఎవ్వరూ అక్కడ లేరు. యూదులైతే అంతకు మించిన దానికి తెగిస్తారు’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘అయితే వారిలో నుండి 50 మంది ప్రమాణం తీసుకోండి,’ అని అన్నారు. దానికి వారు నిరాకరించారు. అప్పుడు ప్రవక్త (స) తన వద్దనుండి హతుని వారసులకు రక్తపరిహారం ఇచ్చారు. (అబూ దావూద్)
=====
4—بَابُ قَتْلِ أَهْلِ الرّدَّةِ وَالسُّعَاةِ بِالْفَسَادِ
4. ఇస్లాంను త్యజించేవారికి, కల్లోలం రేకెత్తించేవారికి మరణ శిక్ష
ముర్తద్ అంటే ఇస్లామ్ స్వీకరించి మళ్ళీ ఇస్లామ్‌ను వదలివేసి అవిశ్వాసిగా మారినవాడు మరియు కల్లోలం సృష్టించేవాడు అంటే దోపిడీ దొంగ, ఇంకా ద్రోహులను కూడా శాంతి భద్రతల కోసం మరణ శిక్ష వేయడం జరుగు తుంది. దీన్ని గురించి, ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఆదేశం: ”నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్‌తో మరియు ఆయన ప్రవక్తతో పోరాడుతారో మరియు ధరణిలో కల్లోలం రేకెత్తించటానికి ప్రయత్నిస్తారో, అలాంటివారికి మరణ శిక్ష విధించాలి; లేదా శిలువపై ఎక్కించాలి; లేదా వారి అభిముఖ పక్షాల కాళ్ళు చేతులను నరికించాలి; లేదా వారిని దేశబహిష్క్రు తుల్ని చేయాలి. ఇది వారికి ఇహలోకంలో గల అవమానం. మరియు వారికి పరలోకంలో కూడా ఘోరశిక్ష ఉంటుంది –” (అల్ మాయి’దహ్, 5:33)
అంటే ద్రోహులను, దోపిడీదొంగలను, కల్లోలాన్ని, ఉపద్రవాల్ని సృష్టించేవారిని చంపివేయాలి. ఇది నాలుగు విధాలుగా ఉంటుంది.
1. ఇస్లామ్‌ను వదలిన అవిశ్వాసి ఉద్దేశ్యపూర్వకంగా ఒక ముస్లిమ్‌ను చంపాడు కాని అతని ధనాన్ని మాత్రం దోచుకోలేదు. అయితే అతన్ని చంపటమే అతనికి శిక్ష.
2. ఒకవేళ ఆ ముర్‌తద్ ధనాన్ని దోచుకొని చంపితే అతన్ని ఉరిశిక్ష వేయాలి.
3. ఒకవేళ దోపిడీ దొంగ డబ్బు దోచుకున్నాడు కాని చంపలేదు. అతని కుడిచేయి, ఎడమకాలు నరికివేయబడతాయి.
4. ఒకవేళ దోపిడీ దొంగ చంపలేదు, ధనం దోచుకో లేదు, కాని భయభ్రాంతులకు గురిచేసాడు. ఆ స్థితిలో పట్టుబడితే, అతన్ని దేశం నుండి బహిష్కరించటం జరుగుతుంది.
ప్రధాన న్యాయాధికారి ఈ శిక్షలను క్రమంగా విధించవచ్చు.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3533 – [ 1 ] ( صحيح ) (2/1050)
عَنْ عِكْرَمَةَ قَالَ: أُتِيَ عَلِيٌّ بِزَنَادِقَةٍ فَأحْرَقَهُمْ فَبَلَغَ ذَلِكَ ابْنَ عَبَّاسٍ فَقَالَ: لَوْ كُنْتُ أَنَا لَمْ أُحءقْهِمْ لِنَهْيِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: “لَا تُعَذِّبُوْا بِعَذَابِ اللهِ” .وَلَقَتَلْتُهُمْ لِقَوْلِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: “مَنْ بَدَّلَ دِيْنَهُ فَاقْتُلُوْهُ”. رَوَاهُ الْبُخَارِيُّ.
3533. (1) [2/1050– దృఢం]
ఇక్రమ (ర) కథనం: ‘అలీ (ర) వద్దకు కొంతమంది ముర్తద్లను తీసుకురావటం జరిగింది. ‘అలీ (ర) వారిని కాల్చి వేసారు. ఈ వార్త ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అబ్బాస్ (ర)కు తెలిసింది. దానికి ఆయన ”ఒకవేళ నేనక్కడ ఉంటే అతను కాల్చేవారు కాదు, ఎందుకంటే అగ్ని ద్వారా శిక్షించరాదని ప్రవక్త (స) వారించి ఉన్నారని, అగ్ని ద్వారా శిక్షించే హక్కు కేవలం అల్లాహ్‌కే ఉందని, అయితే వారిని చంపి ఉండవలసింది. ఎందుకంటే ప్రవక్త (స) ఇస్లామ్ ధర్మాన్ని వదలి అవిశ్వాసాన్ని అనుసరించిన వ్యక్తిని చంపివేయండని ఆదేశించి ఉన్నారని” అన్నారు. (బు’ఖారీ)
3534 – [ 2 ] ( صحيح ) (2/1050)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ النَّارَ لَا يُعَذِّبُ بِهَا إِلَّا اللهُ”. رَوَاهُ الْبُخَارِيُّ.
3534. (2) [2/1050 –దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అగ్నిద్వారా శిక్షించే హక్కు కేవలం అల్లాహ్‌కే ఉంది. అల్లాహ్ తప్ప ఇతరులెవ్వరూ ఎవరినీ అగ్ని ద్వారా శిక్షించలేరు.” (బు’ఖారీ)
3535 – [ 3 ] ( متفق عليه ) (2/1050)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يقول: “سَيَخْرُجُ قَوْمٌ فِيْ آخِرِ الزَّمَانُ حُدَّاثُ الْأَسْنَانِ سُفَهَاءُ الْأَحْلَامِ يَقُوْلُوْنَ مِنْ خَيْرِ قَوْلِ الْبَرِيَّةِ لَا يُجَاوِزُ إِيْمَانُهُمْ حَنَاجِرَهُمْ يَمْرُقُوْنَ مِنَ الدِّيْنِ كَمَا يَمْرُقُ السَّهْمُ مِنَ الرَّمِيَّةِ فَأَيْنَمَا لَقِيْتُمُوْهُمْ فَاقْتُلُوْهُمْ فَإِنَّ فِيْ قَتَلَهُمْ أَجْرًا لِمَنْ قَتَلَهُمْ يَوْمَ الْقِيَامَةِ”.
3535. (3) [2/1050– ఏకీభవితం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స)ను నేను ఇలా అంటూ ఉండగా విన్నాను. భవిష్యత్తులో ఒక జాతి ఉనికిలోనికి వస్తుంది. వారు యుక్తవయస్సు గలవారై, బుద్ధి హీనులైనా, ప్రజలతో మంచిగా మాట్లాడుతారు. కాని విశ్వాసం వారి గొంతునుండి క్రిందికి దిగదు. బాణం విల్లు నుండి బయలుదేరినట్లు వారు ఇస్లామ్ నుండి తొలగి పోతారు. వారు మీకు ఎక్కడ కనబడితే అక్కడే వారిని చంపివేయండి. ఎందుకంటే వారిని చంపినందుకు హంతకునికి తీర్పుదినం నాడు పుణ్యం లభిస్తుంది. [35] (బు’ఖారీ, ముస్లిమ్)
3536 – [ 4 ] ( صحيح ) (2/1051)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَكُوْنُ أُمَّتِيْ فِرْقَتَيْنِ فَيَخْرُجُ مِنْ بَيْنِهِمَا مَارِقةٌ يَّلِيْ قَتْلَهُمْ أَوْلَاهُمْ بِالْحَقِّ”. رَوَاهُ مُسْلِمٌ.
3536. (4) [2/1051– దృఢం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సంఘం రెండు వర్గాలుగా విడిపోతుంది. ఈ రెండు వర్గాల మధ్య మరో వర్గం ఉంటుంది. వారిని చంపేవారు న్యాయం, ధర్మంపై ఉంటారు.[36] (ముస్లిమ్)
3537 – [ 5 ] ( متفق عليه ) (2/1051)
وَعَنْ جَرِيْرٍقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ حِجَّةِ الْوَدَاعِ: “لَا تَرْجِعُنَّ بَعْدِيْ كُفَّارًا يَضْرِبُ بَعْضُكُمْ رِقَابَ بَعْضٍ”.
3537. (5) [2/1051 –ఏకీభవితం]
జరీర్ (ర) కథనం: ప్రవక్త (స) ‘హిజ్జతిల్ విదా‘అలో ఇలా ప్రసంగించారు: ”నా తరువాత మీరు ఒకరి మెడలు ఒకరు నరుక్కొని అవిశ్వాసానికి గురి కాకూడదు.” [37] (బు’ఖారీ, ముస్లిమ్)
3538 – [ 6 ] ( متفق عليه ) (2/1051)
وَعَنْ أَبِيْ بَكْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا الْتَقَى الْمُسْلِمَانِ حَمَلَ أَحَدُهُمَا عَلَى أَخِيْهِ السّلَاحَ فَهُمَا فِيْ جُرُفِ جَهَنَّمَ فَإِذَا قَتَلَ أَحَدُهُمَا صَاحِبَهُ دَخَلَاهَا جَمِيْعًا”.
وَفِيْ رِوَايَةٍ عَنْهُ: قَالَ: “إِذَا الْتَقَى الْمُسْلِمَانِ بِسَيْفَيْهِمَا فَالْقَاتِلُ وَالْمَقْتُوْلُ فِي النَّارِ”. قُلْتُ: هَذَا الْقَاتِلُ فَمَا بَالُ الْمَقْتُوْلِ؟ قَالَ: “إِنَّهُ كَانَ حَرِيْصًا عَلَى قَتْلِ صَاحِبِهِ”.
3538. (6) [2/1051–ఏకీభవితం]
అబూ బక్‌రహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇద్దరు ముస్లిములు ఒకర్ని ఒకరు చంపటానికి దాడి చేస్తే, ఇద్దరూ నరకం అంచున ఉంటారు. ఇంకా ఒకర్ని ఒకరు చంపుకుంటే వాళ్ళిద్దరూ నరకంలోనికి ప్రవేశిస్తారు. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ‘ఇద్దరు ముస్లిములు తమ కరవాలాలు పట్టుకొని తలపడితే, హంతకుడు, హతుడు ఇద్దరూ నరకంలోనికి ప్రవేశిస్తారు,’ అని అన్నారు. దానికి నేను, ‘ఓ ప్రవక్తా! హంతకుడు నరకంలోనికి వెళ్ళడం అర్థం అవుతుంది. కానీ హతుడు ఎందుకు వెళతాడు,’ అని అడిగాడు. దానికి ప్రవక్త (స), ‘ఈ హతుడు కూడా హంతకుడ్ని చంపే ప్రయత్నంలోనే ఉన్నాడు. అవకాశం దొరికితే వాడు వీడ్ని చంపుతాడు,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
3539 – [ 7 ] ( متفق عليه ) (2/1051)
وَعَنْ أَنَسٍ قَالَ: قَدِمَ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم نَفَرٌ مِّنْ عُكْلٍ فَأَسْلَمُوْا فَاجْتَوَوُا الْمَدِيْنَةَ فَأَمَرَهُمْ أَنْ يَّأْتُوْا إِبِلَ الصَّدَقَةِ فَيَشْرَبُوْا مِنْ أَبْوَالِهَا وَأَلْبَانِهَا فَفَعَلُوْا فَصَحُّوْا فَارْتَدُّوْا وَقتَلُوْا رُعَاتَهَا وَاسْتَاقُّوْا الْإِبِلَ فَبَعَثَ فِيْ آثَارِهِمْ فَأُتِيَ بِهِمْ فَقَطَعَ أَيْدِيْهِمْ وَأَرْجُلَهُمْ وَسَمَلَ أَعْيُنَهُمْ ثُمَّ لَمْ يَحْسِمْهُمْ حَتَّى مَاتُوْا”.
وَفِيْ رِوَايَةٍ: فَسُمِّرُوْا أَعْيُنُهُمْ وَفِيْ رِوَايَةٍ: أَمَرَ بِمَسَامِيْرَ فَأُحْمِيَتْ فَكَحَلَهُمْ بِهَا وَطَرَحَهُمْ بِالْحَرَّةِ يَسْتَسْقُوْنَ فَمَا يُسْقَوْنَ حَتَّى مَاتُوْا.
3539. (7) [2/1051–ఏకీభవితం]
అనస్ బిన్ మాలిక్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఉకుల్ తెగకు చెందిన కొంతమంది వచ్చి ఇస్లామ్ స్వీకరించారు. మదీనహ్ లో ఉండసాగారు. కాని మదీనహ్ వాతావరణం వారికి పట్టలేదు. వారు అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యం వల్ల వారి ముఖాలు పసుపు పచ్చగా మారి పోయాయి. అప్పుడు ప్రవక్త (స) వారిని అడవిలో బైతుల్ మాల్ ఒంటెలు ఉన్నచోట ఉండమని, ఒంటెల పాలు త్రాగమని, చికిత్సగా ఒంటెల మూత్రం త్రాగమని దానివల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆదేశించారు. వారు అలాగే చేసారు. ఆరోగ్యంగా తయారయ్యారు. ఆ తరువాత ఇస్లామ్‌ను వదలి అవిశ్వాసాన్ని అనుసరించారు. వారు ఒంటెల కాపరులను చంపి ఒంటెలను తోలుకొని పోయారు. ప్రవక్త (స)కు ఈ విషయం తెలిసి వారి వెనుక మనుషులను పంపారు. వారు వారిని పట్టుకొని ప్రవక్త (స) వద్దకు తీసుకొని వచ్చారు. ప్రవక్త (స) వారి కాళ్ళు చేతులు నరకమని, ఇనుప గజాలు వేడిచేసి వారి కళ్ళకు పెట్టమని ఆదేశించారు. చివరికి వారందరూ మరణించారు.
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ఇనుప గజాలు వేడిచేసి వారి కళ్ళకు పెట్టమని, వారిని మదీనహ్ లో రాతి నేలపై వదలివేయమని ఆదేశించారు. వాళ్ళు నీళ్ళు అడిగేవారు కాని వారికి నీళ్ళు ఇవ్వబడలేదు. చివరికి వారు చనిపోయారు.[38] (బుఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3540 – [ 8 ] ( جيد ) (2/1052)
عَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَحُثُّنَا عَلَى الصَّدَقَةِ وَيَنْهَانَا عَنِ الْمُثْلَةِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3540. (8) [2/1052– ఆమోదయోగ్యం]
ఇమ్రాన్ బిన్ ‘హుసైన్ కథనం: ప్రవక్త (స) మమ్మల్ని సదఖా దానధర్మాలు చేయమని ప్రోత్సహించే వారు. ఇంకా ముస్ల‘ చేయడాన్ని వారించేవారు. (అబూ దావూద్)
3541 – [ 9] ( جيد ) (2/1052)
وَرَوَاهُ النَّسَائِيُّ عَنْ أَنَسٍ.
3541. (9) [2/1052 –ఆమోదయోగ్యం]
అనస్ (ర) కథనం: [39] (నసాయి)
3542 – [ 10 ] ( لم تتم دراسته ) (2/1052)
وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ عَبْدِ اللهِ عَنْ أَبِيْهِ قَالَ: كُنَّا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ سَفَرٍ فَانْطَلَقَ لِحَاجَتِهِ فَرَأَيْنَا حُمَّرَةً مَعَهَا فُرَخَانِ فَأَخَذْنَا فَرْخَيْهَا فَجَاءَتِ الْحُمَّرَةُ فَجَعَلَتْ تُفَرِّشُ فَجَاءَ النَّبِيُّ صلى الله عليه وسلم فَقَالَ: “مَنْ فَجَّعَ هَذِهِ بِوَلَدِهَا؟ رُدُّوْا وَلَدَهَا إِلَيْهَا”. وَرَأَى قَرْيَةَ نَمْلٍ قَدْ حَرَّقْنَاهَا قَالَ: “مَنْ حَرَّقَ هَذِهِ؟” فَقُلْنَا: نَحْنُ. قَالَ: “إِنَّهُ لَا يَنْبَغِيْ أَنْ يُعَذِّبَ بِالنَّارِ إلَّا رَبُّ النَّارِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3542. (10) [2/1052– అపరిశోధితం]
‘అబ్దుర్రహ్మాన్ బిన్ ‘అబ్దుల్లాహ్ తన తండ్రి ద్వారా కథనం: ఒకసారి ప్రవక్త (స) వెంట ప్రయాణంలో ఉన్నాం. ఒకచోట ప్రవక్త (స) మలమూత్ర విసర్జన కోసం వెళ్ళారు. మేము ‘హుమ్రహ్ పిచ్చుకను చూసాము. దానికి రెండు పిల్లలు ఉన్నాయి. మేము వాటిని పట్టుకున్నాము. అప్పుడు ‘హుమ్రహ్ పిచ్చుక నేలపై తన రెక్కలను చాచటం, తన కడుపు భాగాన్ని భూమికి తగిలించటం చేసింది, మేము దాని పిల్లలను వదలి వేయాలని. ఇంతలో ప్రవక్త (స) తిరిగి వచ్చి, ‘ఎవరు దీని బిడ్డలను పట్టుకొని దీన్ని హింసింస్తున్నారు. దాని పిల్లలను వదలివేయండి,’ అని పలికిన తరువాత, మేము కాల్చివేసిన చీమల పుట్టను చూసి, వీటిని ఎవరు కాల్చారు అని అడిగారు. దానికి ‘మేము’ అని సమాధానం ఇచ్చాం. అప్పుడు ప్రవక్త (స) అగ్ని ద్వారా ఎవరినీ శిక్షించరాదని, కేవలం అల్లాహ్‌యే అగ్ని ద్వారా శిక్షించగలడు, ఎందుకంటే అతడే అగ్నికి ప్రభువు,’ అని అన్నారు.[40] (అబూ దావూద్)
3543 – [ 11 ] ( لم تتم دراسته ) (2/1052)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ وَأَنَسِ بْنِ مَالِكٍ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “سَيَكُوْنُ فِيْ أُمَّتِيْ اخْتِلَافٌ وَفُرْقَةٌ قَوْمٌ يُحْسِنُوْنَ الْقِيْلَ وَيُسِيْئُوْنَ الْفِعْلَ يَقْرَؤُوْنَ الْقُرْآنَ لَا يُجَاوِزَ تَرَاقِي هُمْ يَمْرُقُوْنَ مِنَ الدِّيْنَ مُرُوْقَ السَّهْمِ فِي الرَّمِيَّةِ لَا يَرْجِعُوْنَ حَتَّى يَرْتَدَّ السَّهْمُ عَلَى فُوْقِهِ هُمْ شَرُّ الْخَلْقِ وَالْخَلِيْقَةِ طُوْبَى لِمَنْ قَتَلَهُمْ وَقَتَلُوْهُ يَدْعُوْنَ إِلَى كِتَابِ اللهِ وَلَيْسُوْا مِنَّا فِيْ شَيْءٍ مَنْ قَاتَلَهُمْ كَانَ أَوْلَى بِاللهِ مِنْهُمْ قَالُوْا : يَا رَسُوْلَ اللهِ مَا سِيْمَاهُمْ؟ قَالَ: “التَّحْلِيْقُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3543. (11) [2/1052 –అపరిశోధితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ, అనస్ బిన్ మాలిక్ (ర) కథనం: ప్రవక్త (స) ‘భవిష్యత్తులో నా అనుచర సమాజంలో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి, విభిన్న అభిప్రాయాలు గల ప్రజలు తయారవుతారు. వీరిలో మరోవర్గం కూడా ఉంటుంది. వీళ్ళు మంచిగా మాట్లాడతారు. చెడుగా పనులు చేస్తారు. వీళ్ళు ఖుర్‌ఆన్ పఠిస్తారు. కాని వారిపై దాని ప్రభావం ఏమాత్రం ఉండదు. వీళ్ళు బాణం విల్లునుండి వేరయినట్లు ఇస్లామ్ నుండి వేరైపోతారు. ఇస్లామ్ వైపు మళ్ళీ తిరిగిరారు. ఇటువంటి వారు మళ్ళీ ఇస్లామ్ వైపు రావడం అసాధ్యం. వీళ్ళు మానవులందరికన్నా పరమ నీచులు. వీరిని చంపినవాడే అందరికంటే ఉత్తముడు, న్యాయం గలవాడూను. అతనికి శుభవార్త ఉంది. వీళ్ళు బహిరంగంగా అల్లాహ్ గ్రంథం వైపు ఆహ్వానిస్తారు. కాని ప్రవక్త (స) ఆయన సాంప్రదాయాన్ని వదలివేస్తారు. వీరితో నాకు ఎటువంటి సంబంధం లేదు. వీరిని చంపినవారు అల్లాహ్ దృష్టిలో గౌరవనీయులు’ అని ప్రవచించారు. దానికి అనుచరులు, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! వారి గుర్తు ,చిహ్నం ఏమిటి’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స) తలగీయించు కోవటం వారి ప్రత్యేకత అని సమాధానం ఇచ్చారు. [41] (అబూ దావూద్)
3544 – [ 12 ] ( لم تتم دراسته ) (2/1053)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَحِلُّ دَمُ امْرِئٍ مُسْلِمٍ يَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُوْلُ اللهِ إِلَّابِإِحْدَى ثَلَاثٍ زِنًا بَعْدَ إِحْصَانٍ فَإِنَّهُ يُرْجَمُ وَرَجُلٌ خَرَجَ مُحَارِبًا لِلّهِ وَرَسُوْلِهِ فَإِنَّهُ يُقْتَلُ أَوْ يُصَلُّبُ أَوْ يُنْفَى مِنَ الْأَرْضِ أَوْ يَقْتُلُ نَفْسًا فَيُقْتَلُ بِهَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3544. (12) [2/1053– అపరిశోధితం]
ఆయిషహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”శుభ వచనం పలికిన ముస్లిమ్‌ను హతమార్చటం, అతని రక్తం చిందించటం ధర్మసమ్మతం కాదు. అయితే ఈ మూడు మార్గాల ద్వారా తప్ప. 1. వివాహం అయిన తర్వాత కూడా వ్యభిచారం చేయడం. అప్పుడు అతన్ని రాళ్ళతో కొట్టి చంపడం. 2. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త(స)కు వ్యతిరేకంగా పోరాడటం, ప్రజల పట్ల దుర్మార్గం చేయటం, హత్యలు చేయటం అంటే ఇస్లామ్‌ను విసర్జించటం. అప్పుడు అతన్ని చంపటం జరుగుతుంది. లేదా అతన్ని ఉరితీయడం జరుగు తుంది. లేదా దేశబహిష్కరణ చేయబడుతుంది. 3. ఎవరినైనా చంపితే, అతనికి బదులు అతన్ని కూడా చంపటం జరుగుతుంది. (అబూ దావూద్)
3545 – [ 13 ] ( لم تتم دراسته ) (2/1053)
وَعَنِ ابْنَ أَبِيْ لَيْلَى قَالَ: حَدَّثَنَا أَصْحَابُ مُحَمَّدٍ صلى الله عليه وسلم أَنَّهُمْ كَانُوْا يَسِيْرُوْنَ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَنَامَ رَجُلٌ مِنْهُمْ فَانْطَلَقَ بَعْضُهُمْ إِلَى حَبَلٍ مَعَهُ فَأَخَذَهُ فَفَزِعَ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَحِلُّ لِمُسْلِمِ أَنْ يُرَوِّعَ مُسْلِمًا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3545. (13) [2/1053– అపరిశోధితం]
ఇబ్నె అబీ లైలా (ర) కథనం: ప్రవక్త (స) అనుచరులు మాకు ఇలా తెలియపరిచారు. ”వారు ప్రవక్త (స) వెంట రాత్రిపూట ప్రయాణం చేస్తున్నారు. వారిలో ఒకరు నిద్ర పోయారు. కొందరు ఆ పడుకున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి, అతని తాడు తీసుకున్నారు. ఆ పడుకున్న వ్యక్తి దానికి భయపడ్డాడు. ప్రవక్త (స) ఆ దృశ్యాన్ని చూసారు. అప్పుడు ప్రవక్త (స), ‘ముస్లిమ్‌ను భయపెట్టటం ముస్లిమ్‌కు తగదు,’ అని ప్రవచించారు. (అబూ దావూద్)
3546 – [ 14 ] ( لم تتم دراسته ) (2/1053)
وَعَنْ أَبِي الدَّرْدَاءِ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ:”مَنْ أَخَذَ أَرْضًا بِجِزْيتِهَا فَقَدِ اسْتَقَالَ هِجْرَتَهُ وَمَنْ نَزَعَ صِغَارَ كَافِرٍ مِّنْ عُنُقِهِ فَجَعَلَهُ فِيْ عُنُقِهِ فَقَدْ وَلَّى الْإِسْلَامَ ظَهْرَهُ”. روَاهُ أَبُوْ دَاوُدَ.
3546. (14) [2/1053 –అపరిశోధితం]
అబూ జ’ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, పన్ను విధించబడిన భూమిని కొన్నవాడు తన వలస పోవటాన్ని భంగంచేసాడు. అదేవిధంగా అవిశ్వాసుని అవమా నాన్ని తన మెడలో వేసుకున్న వ్యక్తి ఇస్లామ్‌ను వదలివేసినట్లే. [42] (అబూ దావూద్)
3547 – [ 15 ] ( لم تتم دراسته ) (2/1053)
وَعَنْ جَرِيْرِ بْنِ عَبْدِ اللهِ قَالَ: بَعَثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم سَرِيَّةً إِلَى خَثْعَمَ فَاعْتَصَمَ نَاسٌ مِّنْهُمْ بِالسُّجُوْدِ فَأَسْرَعَ فِيْهِمُ الْقَتْلَ فَبَلَغَ ذَلِكَ النَّبِيُّ صلى الله عليه وسلم فَأَمَرَ لَهُمْ بِنِصْفِ الْعَ قْلِ وَقَالَ: “أَنَا بَرِيْءٌ مِّنْ كُلِّ مُسْلِمٍ مُقِيْمٍ بَيْنَ أَظْهُرِ الْمُشْرِكِيْنَ” قَالُوْا: يَا رَسُوْلَ اللهِ لِمَ؟ قَالَ: “لَا تَتَرَاءَىَ نَارَاهُمَا”. روَاهُ أَبُوْ دَاوُدَ.
3547. (15) [2/1053 –అపరిశోధితం]
జరీర్ బిన్ ‘అబ్దుల్లాహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఖస్అమ్ వర్గం వారివైపు ఒక సైన్యాన్ని పంపారు. సైనికులు ఖస్‌అమ్ వర్గం వారి వద్దకు వెళ్ళారు. అక్కడి వారు సాష్టాంగ ప్రమాణం చేసి శరణు కోరసాగారు. అంటే నమా’జు చదవ డానికి నిలబడ్డారు. ఈ సైనికులు వారిని చూచి ముస్లిము లుగా భావించి చంపకుండా ఉండాలని, అయినా వారిని చాలా వేగంగా చంపడం జరిగింది. చాలామంది హతమార్చబడ్డారు. ప్రవక్త (స)కు ఈ వార్త తెలిసి వారికి సగం పరిహారం ఇవ్వమని ఆదేశించారు. ఇంకా, ‘అవిశ్వాసుల పట్టణంలో నివసించే ముస్లిములకు మాకు ఎటువంటి సంబంధం లేదు. వారి రక్షణా బాధ్యత మాపైలేదు,’ అని అన్నారు. దానికి అనుచరులు ‘ముస్లిములు అవిశ్వాసులకు ఎంతదూరంలో ఉండాలి,’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘ఒకరు మరొకరిని చూడనంత దూరం,’ అని అన్నారు.[43] (అబూ దావూద్)
3548 – [ 16 ] ( لم تتم دراسته ) (2/1053)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اَلْإِيْمَانُ قَيَّدَ الْفَتْكَ لَا يُفْتَكُ مُؤْمِنٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3548. (16) [2/1053 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అకస్మాత్తుగా హత్య చేయటాన్ని విశ్వాసం వారిస్తుంది. అంటే విశ్వాసి తెలియపర్చకుండా అవిశ్వాసిని అకస్మాత్తుగా చంపడు. పద్ధతి ప్రకారం తెలియపరచి యుద్ధం చేస్తాడు. [44] (అబూ దావూద్)
3549 – [ 17 ] ( لم تتم دراسته ) (2/1054)
وَعَنْ جَرِيْرٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا أَبَقَ الْعَبْدُ إِلَى الشِّرْكِ فَقَدْ حَلَّ دَمُهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
3549. (17) [2/1054– అపరిశోధితం]
జరీర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బానిస అవిశ్వాసులవైపు పారిపోయి, వెళ్ళిపోతే అతన్ని చంపటం ధర్మం అయిపోతుంది.” [45] (అబూ దావూద్)
3550 – [ 18 ] ( لم تتم دراسته ) (2/1054)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ يَهُوْدِيَّةً كَانَتْ تَشْتِمُ النَّبِيُّ صلى الله عليه وسلم وَتَقَعُ فِيْهِ فَخَنَقَهَا رَجُلٌ حَتَّى مَاتَتْ فَأَبْطَلَ النَّبِيُّ صلى الله عليه وسلم دَمَهَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3550. (18) [2/1054– అపరిశోధితం]
‘అలీ (ర) కథనం: ఒక యూద స్త్రీ ప్రవక్త (స)ను తిట్టేది. ప్రవక్త (స) లోపాలను ఎంచేది. ఒక ముస్లిమ్ వ్యక్తి ఆమె పీక పిసికివేసాడు. ఆమె చనిపోయింది. ప్రవక్త (స) ఆమె హత్యను రద్దు చేసారు. [46] (అబూ దావూద్)
3551 – [ 19 ] ( لم تتم دراسته ) (2/1054)
وَعَنْ جُنْدُبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “حَدُّ السَّاحِرِ ضَرْبَةٌ بِالسَّيْفِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
3551. (19) [2/1054– అపరిశోధితం]
జున్‌దుబ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, చేతబడి చేసేవారిని కరవాలంతో నరికివేయటమే వారి శిక్ష.[47] (తిర్మిజి’)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3552 – [ 20 ] ( لم تتم دراسته ) (2/1054)
عَنْ أُسَامَةَ بْنِ شَرِيْكٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَيُّمَا رَجُلٍ خَرَجَ يُفرِّقُ بَيْنَ أُمَّتِيْ فَاضْرِبُوْا عُنُقَهُ”. رَوَاهُ النَّسَائِيُّ.
3552. (20) [2/1054 –అపరిశోధితం]
ఉసామహ్ బిన్ షరీక్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ముస్లిముల నాయకునికి ద్రోహం తలపెట్టి, ముస్లిమ్ సమాజంలో భేదాభిప్రాయాలు సృష్టించిన ద్రోహి మెడ నరికివేయండి. (నసాయి)
ఈ ‘హదీసు’ ద్వారా ద్రోహుల్ని చంపడం ధర్మసమ్మతమేనని తెలిసింది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”మరియు ఒకవేళ విశ్వాసులలోని రెండు వర్గాల వారు పరస్పరం కలహించుకుంటే, వారిద్దరి మధ్య సంధి చేయించండి. కాని ఒక వేళ, వారిలోని ఒక వర్గం వారు రెండవ వర్గం వారిపై దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యం చేసిన వారు, అల్లాహ్ ఆజ్ఞ వైపునకు మరలేవరకు, వారికి వ్యతిరేకంగా పోరాడండి. తరువాత వారు మరలివస్తే, వారి మధ్య న్యాయంగా సంధి చేయించండి మరియు నిష్పక్ష పాతంగా వ్యవహరించండి. నిశ్చయంగా, అల్లాహ్ నిష్పక్షపాతంగా వ్యవహరించే వారిని ప్రేమిస్తాడు.” (అల్ హుజురాత్, 49:9)
3553 – [ 21 ] ( لم تتم دراسته ) (2/1054)
وَعَنْ شَرِيْكِ بْنِ شِهَابٍ قَالَ: كُنْتُ أَتَمَنّى أَنْ أَلْقَى رَجُلًا مِّنْ أَصْحَابِ النَّبِيِّ صلى الله عليه وسلم أَسْأَلُهُ عَنِ الْخَوَارِجِ فَلَقِيْتُ أَبَا بَرْزَةَ فِيْ يَوْمِ عِيْدٍ فِيْ نَفَرٍ مِّنْ أَصْحَابِهِ فَقُلْتُ لَهُ :هَلْ سَمِعْتَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَذْكُرُ الْخَوَارِجَ؟ قَالَ: نَعَمْ. سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى اللهِ عليه وسلم بِأُذُنَيَّ وَرَأَيْتُهُ بِعَيْنَيَّ: أُتِيَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِمَالٍ فَقَسَمَهُ فَأَعْطَى مَنْ عَنْ يَّمِيْنِهِ وَمَنْ عَنْ شِمَالِهِ وَلَمْ يُعْطِ مَنْ وَّرَاءَهُ شَيْئًا. فَقَامَ رَجُلٌ مِنْ وَّرَائِهِ فَقَالَ : يَا مُحَمَّدُ مَا عَدَلْتُ فِي الْقِسْمَةِ رَجُلٌ أَسْوَدُ مَطْمُوْمُ الشَّعْرِ عَلَيْهِ ثَوْبَانِ أَبْيَضَانِ فَغَضِبَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم غَضْبًا شَدِيْدًا وَقَالَ: “وَاللهِ لَا تَجِدُوْنَ بَعْدِيْ رَجُلًا هُوَ أَعْدَلُ مِنِّيْ”. ثُمَّ قَالَ: “يَخْرُجُ فِي آخِرِ الزَّمَانِ قَوْمٌ كَأَنَّ هَذَا مِنْهُمْ يَقْرَؤُوْنَ الْقُرْآنَ لَا يُجَاوِزُ تَرَاقِيَهُمْ يَمْرُقُوْنَ مِنَ الْإِسْلَامِ كَمَا يَمْرُقُ السَّهْمُ مِنَ الرَّمِيَّةِ سِيْمَاهُمُ التَّحْلِيْقُ لَا يَزَالُوْنَ يَخْرُجُوْنَ حَتَّى يَخْرُجَ آخِرُهُمْ مَعَ الْمَسِيْحِ الدَّجَّالِ فَإِذَا لَقِيْتُمُوْهُمْ هُمْ شَرُّ الْخَلْقِ وَالْخَلِيْقَةِ”. رَوَاهُ النَّسَائِيُّ.
3553. (21) [2/1054 –అపరిశోధితం]
షరీక్ బిన్ షిహాబ్ కథనం: ప్రవక్త (స) అనుచరులను కలవాలని, వారిని ఖారిజీల గురించి అడగాలని నాకు చాలా కోరికగా ఉండేది. పండుగ రోజు అనుచరుల ఒక బృందంలో అబూ బర్’జహ్ అనే అనుచరునితో కలిసాను. నేనతన్ని, ‘మీరు ‘ఖారిజీల గురించి ప్రవక్త (స) ద్వారా ఏమైనా విన్నారా? వింటే నాకు తెలియపర్చండి’ అని అన్నాను. దానికి అతను అవును, నేను ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా విన్నాను, కళ్ళతో చూచాను. ”ప్రవక్త (స) వద్దకు ధన సంపదలు తీసుకొనిరావడం జరిగింది. ప్రవక్త (స) ఆ ధనాన్ని పంచడం జరిగింది. తన కుడిచేతి వైపు ఉన్న వారికి ఇచ్చారు, ఎడమ వైపు ఉన్నవారికీ ఇచ్చారు. వెనుక కూర్చున్న వారికి ఏమీ ఇవ్వలేదు. అప్పుడు వెనుక కూర్చున్నవారిలో నుండి ఒక వ్యక్తి నిలబడి, ‘ఓ ముహమ్మద్! తమరు పంచటంలో న్యాయం చేయ లేదు’ అని అన్నాడు. ఆ వ్యక్తి నల్లగా ఉన్నాడు. అతని తల వెంట్రుకలు గీయించి ఉన్నాడు. అతని శరీరంపై రెండు తెల్లని వస్త్రాలు ఉన్నాయి. ఆ వ్యక్తి అభ్యంతరం వల్ల ప్రవక్త (స) చాలా ఆగ్రహం చెంది, ‘అల్లాహ్ సాక్షి! నా తరువాత నా కంటే న్యాయంగా వ్యవహరించే వ్యక్తిని మీరు చూడరు’ అని పలికి, ఆ తరువాత చివరి కాలంలో ఒక జాతి ఉద్భవిస్తుంది, ఈ వ్యక్తి కూడా వారిలో నుండే కావచ్చు. ఆ జాతి ఖుర్‌ఆన్ పఠిస్తుంది, కాని ఖుర్‌ఆన్ ప్రభావం వారి గొంతు క్రిందికి దిగదు. బాణం విల్లు నుండి వేరైనట్లు వారు ఇస్లామ్ నుండి వేరైపోతారు. వారి చిహ్నం ఏమిటంటే వారు ఎల్లప్పుడూ తలగీయించి ఉంటారు. ముస్లిముల నాయకునికి ద్రోహం తలపెడుతూ ఉంటారు. చివరికి వారిలోని ఒక బృందం మసీ‘హ్ దజ్జాల్‌తో కలసిపోతుంది. ఇటువంటి వారితో మీరు కలిస్తే వారిని చంపివేయండి. వీరు అందరికంటే, జంతువుల కంటే కూడా అధములు. (నసాయి)
3554 – [ 22 ] ( حسن ) (2/1055)
وَعَنْ أَبِيْ غَالِبٍ رَأَى أَبُوْ أُمَامَةَ رُؤُوْسًا مَنْصُوْبَةً عَلَى دَرَجٍ دِمَشْقَ فَقَالَ أَبُوْ أُمَامَةَ: “كِلَّابُ النَّارِ شَرُّ قَتْلَى تَحْتَ أَدِيْمِ السَّمَاءِ خَيْرُ قَتْلَى مَنْ قَتَلُوْهُ”. ثُمَّ قَرَأَ (يَوْمَ تَبْيَضُ وُجُوْهٌ وَّتَسْوَدُّ وُجُوْهٌ؛ 3: 106) الْآيَةَ. قِيْلَ لِأَبِيْ أُمَامَةَ: أَنْتَ سَمِعْتَ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم؟ قَالَ: لَوْ لَمْ أَسْمَعَهُ إِلَّا مَرَّةً أَوْ مَرَّتَيْنِ أَوْ ثَلَاثًا حَتَّى عَدَّ سَبْعًا مَا حَدَّثْتُكُمُوْهُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ.
3554. (22) [2/1055– ప్రామాణికం]
అబూ ‘గాలిబ్ కథనం: ప్రవక్త (స) అనుచరులు, అబూ ఉమామ, దిమిష్క్ మార్గంలో కొన్ని తలలు వ్రేలాడుతూ ఉండటం చూసారు. అంటే ‘ఖారిజీల తలలు వ్రేలాడుతూ ఉండటం చూసారు. వీరు యుద్ధంలో చంపబడ్డారు. గుణపాఠంగా వీరి తలలను దారిలో వ్రేలాడగట్టటం జరిగింది. వాటిని చూచి అబూ ఉమామహ్, ‘వీరు నరకంలోని కుక్కలు, ఆకాశం క్రింద హతులందరి కంటే అధములు. వీరిని చంపినవారు అందరికంటే శ్రేష్ఠులు,’ అని పలికి, ఈ ఆయతును పఠించారు, ”అంటే తీర్పుదినం నాడు అనేక ముఖాలు తెల్లగా ఉంటాయి. ఇంకా అనేక ముఖాలు నల్లగా ఉంటాయి.” (ఆల ఇమ్రాన్, 3:106) అబూ ‘గాలిబ్ అబూ ఉమామతో తమరు దీన్ని గురించి ప్రవక్త (స) ద్వారా ఏమైనా విన్నారా అని అడిగారు. దానికి అతడు నేను అనేకసార్లు విన్నాను. అలా కాకుంటే నేను మీతో ప్రస్తావించను. నేను ఒకటీ కాదు, రెండుకాదు, మూడు కాదు చివరికి 7 సార్లు ప్రవక్త (స)ను అంటూ ఉండగా విన్నాను అని అన్నారు. (తిర్మిజి’ / ప్రామాణికం, ఇబ్నె మాజహ్)
*****
[1]) వివరణ-3448: మానవ హక్కుల్లో అన్నిటి కంటే ముందు అధర్మ హత్య గురించి విచారించటం జరుగు తుంది. అదేవిధంగా దైవహక్కుల్లో అన్నిటికంటే ముందు నమా’జు గురించి విచారించటం జరిగింది.
[2]) వివరణ-3449: ఎందుకంటే ముస్లిమ్‌ను చంపేవాడు అవిశ్వాసి అయిపోతాడు, అని అన్నారు. అంటే ఒక ముస్లిమ్‌ను చంపటం అధర్మం అని ఈ ‘హదీసు’ ద్వారా తెలిసింది.
[3]) వివరణ-3452: ముహాయిద్ అంటే పరస్పరం హత్యలు చేయమని ముస్లిముల నాయకునితో ఒప్పందం కుదుర్చుకున్న అవిశ్వాసి. అంటే రాజు అతనికి అభయం ప్రసాదించాడు. ఈ ఉల్లేఖనంలో 40 సంవత్సరాలు అని ఉంది. మరో ఉల్లేఖనంలో 70 సంవత్సరాలు, మరో ఉల్లేఖనంలో 100 సంవత్సరాలు మరో ఉల్లేఖనంలో 500 సంవత్సరాలు, మరో ఉల్లేఖనంలో 1000 సంవత్సరాలు అని ఉంది. వీటన్నిటి ద్వారా చాలా అధిక దూరం అని అర్థం. స్వర్గ సువాసన పొందడు అంటే శిక్షపడే వరకు పొందడు. శిక్షించబడిన తర్వాత స్వర్గంలో ప్రవేశించడం జరుగుతుంది.
[4]) వివరణ-3455: అంటే ప్రారంభంలో అతనికి స్వర్గంలో ప్రవేశం లభించదు. తగిన శిక్ష అనుభవించిన తరువాత విశ్వాసం, సత్కార్యాల వల్ల స్వర్గంలో ప్రవేశించును. అంటే ప్రారంభ ప్రవేశం నిషేధించబడింది. లేదా ఆత్మహత్య ధర్మబద్ధం అని భావించి ఉంటాడు. కాని ఆత్మహత్య నిషిద్ధం. అంటే నిషిద్ధ కార్యాన్ని ధర్మసమ్మతంగా భావించడం అవిశ్వాసం. అందువల్ల అతని కొరకు స్వర్గం నిషేధించడం జరిగింది.
[5]) వివరణ-3456: ఈ ‘హదీసు’ ద్వారా ఆత్మహత్య చేసుకున్నవాడు పశ్చాత్తాపం చెంది మరణిస్తే అతన్ని క్షమించడం జరుగుతుంది. ప్రవక్త (స) వైపు వలస పోవటం క్షమాపణకు కారకం అవుతుంది.
[6]) వివరణ-3458: మక్కహ్ విజయం తర్వాత ప్రవక్త (స) మక్కహ్ లో ప్రసంగించారు. ఇందులో అజ్ఞానకాలానికి చెందిన అనేక దురాచారాలను ఖండించారు. ఈ రోజుల్లోనే ఖుజా’అ తెగవారు ఒక వ్యక్తిని చంపివేసారు. ప్రవక్త (స) అజ్ఞాన కాలంలో చంపబడిన ఆ వ్యక్తి వారసులు ఇస్లామ్ స్వీకరించిన తర్వాత వారికి రక్త పరిహారం ఇస్తానని వాగ్దానం చేసారు. ఎందుకంటే భవిష్యత్తులో అది కల్లోలంగా మారకూడదని. ఈ ‘హదీసు’లో దీన్ని గురించి సూచించడం జరిగింది.
[7]) వివరణ-3459: ఈ ‘హదీసు’ ద్వారా స్త్రీ హత్య చేసినందుకు, ఆ పురుష హంతకుణ్ణి చంపవచ్చని తెలిసింది.
[8]) వివరణ-3460: పన్ను విరగ్గొట్టిన స్త్రీ రుబయ్యి’ఉ. ముస్లిమ్‌లోని ‘హదీసు’ ద్వారా రుబయ్యి’ఉ సోదరి అని తెలుస్తుంది. ప్రమాణం చేసిన వారు అనస్ బిన్ న’దర్. మరి ముస్లిమ్ ‘హదీసు’లో ఉమ్మె రుబయ్యి’ఉ ప్రమాణం చేసిందని ఉంది. ఇందులో ఎటు వంటి వ్యతిరేకత లేదు, అనస్ బిన్ న’దర్, ఉమ్మె రుబయ్యి’ఉ ఇద్దరూ ప్రమాణం చేసారు. దీని ఉద్దేశం ఏమిటంటే వారు రక్తపరిహారం స్వీకరించేలా ప్రవక్త (స) సిఫారసు చేయాలని. కాని ప్రవక్త (స) ‘నేను సిఫారసు చేయలేనని, ఖిసాస్ తీసుకోవాలనే దైవాదేశం ఉందని’ అన్నారు. అయితే స్వయంగా వాళ్ళు రక్తపరిహారం తీసుకుంటామని సిద్ధపడ్డారు. అప్పుడు ప్రవక్త (స) ‘కొందరు అల్లాహ్ భక్తులు ఎలాంటి వారంటే, అల్లాహ్ ను నమ్మి ప్రమాణం చేస్తే, అల్లాహ్ (త) దాన్ని నిజం చేసి చూపిస్తాడు’ అని అన్నారు.
[9]) వివరణ-3461: కొందరు ‘అలీ (ర) వద్ద ప్రవక్త (స) వాఙ్మూలాలు ఉన్నట్టు ప్రచారం చేసారు. ఈ పరిశీలనలో జు’హైఫహ్ (ర) ‘అలీ (ర) ను వివరణ కోరారు. దానికి ‘అలీ (ర) నా వద్ద ఖుర్‌ఆన్, ఖుర్‌ఆన్ అవగాహన, ఇంకా ఈ ప్రతులు తప్ప నా దగ్గర మరేమీ లేవు అని సమాధానం ఇచ్చారు. అంటే ‘అలీ (ర) వద్ద ప్రవక్త (స) వాంఙ్మూలాలు ఏవీ లేవు అని తెలిసింది.
[10]) వివరణ-3463: అంటే అల్లాహ్ (త) ప్రపంచం నాశనం అవడం భరిస్తాడు గాని ఒక ముస్లిమ్ అన్యాయంగా చంపబడ్డం అల్లాహ్‌కు ఇష్టం లేదు. అంటే ఒక ముస్లిమ్ ప్రాణం అల్లాహ్ వద్ద అన్నిటికంటే విలువైనది.
[11]) వివరణ-3463: ఒక విశ్వాసి యొక్క రక్తం భూమ్యా కాశాలలో ఉన్న వారందరికంటే విలువైనదని ఈ ‘హదీసు’ ద్వారా తెలిసింది.
[12]) వివరణ-3466: అపార్థాల వల్ల కొందరు ‘ఉస్మాన్ (ర)కు వ్యతిరేకులయ్యారు. అతన్ని చంపటానికి సిద్ధపడ్డారు. అతన్ని చంపటానికి అతని ఇంటిని చుట్టు ముట్టారు. 40 రోజుల వరకు పరిస్థితి ఇలాగే కొనసాగింది. నీళ్ళు కూడా అతని ఇంట్లోకి వెళ్ళడం కష్టం అయి పోయింది. ఒకసారి ఉమ్మె ‘హబీబహ్ (ర) ఆహార పదార్థాలను కొన్నింటిని తీసుకొని ‘ఉస్మాన్ (ర) వద్దకు వెళదామని ప్రయత్నించారు. కాని ఆందోళనకారుల హృదయాల్లో విశ్వాసం ఏమాత్రం ఉండకుండా పోయింది. వారు ప్రవక్త (స) భార్యను కూడా లెక్కచేయలేదు. ఆమెను వెనక్కి పంపివేసారు. పొరుగింటి వారి నుండి అప్పుడప్పుడూ అన్న పానీయాలు అందేవి. ఆందోళనకారులు హద్దుమీరి పోయారు. ప్రవక్త (స) అనుచరులకు ఏమాత్రం గౌరవం లేకుండా పోయింది. ‘అబ్దుల్లాహ్ బిన్ సలామ్ (ర), అబూ హురైరహ్ (ర), స’అద్ బిన్ అబీ వఖ్ఖా’స్ (ర) ‘జైద్ బిన్ సా’బిత్ (ర) వంటి వారి మాట కూడా వినలేదు. వారిని అగౌరవ పరిచారు. ‘ఉస్మాన్ (ర) పిలుపుపై ‘అలీ (ర) అతని వద్దకు వెళ్ళాలని ప్రయత్నించారు. కాని ఆందోళన కారులు అతన్ని ఆపివేసారు. ఇక చేసేది లేక తన నల్లని అమామను రాయబారికి ఇచ్చి, వెళ్ళి పరిస్థితి చూసుకోండి, చాలామంది ప్రవక్త (స) అనుచరులు మదీనహ్ వదిలి వెళ్ళి పోయారని చెప్పండి,’ అని అన్నారు. ‘ఆయి’షహ్ (ర) ‘హజ్జ్ కు వెళదామని నిశ్చయించుకున్నారు. ప్రవక్త (స) అనుచరులు ఈ భయంకర పరిస్థితుల్లో తెరవెనుక ఉండటమే మంచిదని భావించారు. ఆ సమయంలో అక్కడ ముగ్గురు, అంటే ‘అలీ, ‘తల్‘హా, ‘జుబైర్ (ర)లు ఉన్నారు. వీరు విషయాన్ని వదిలే, లేదా దాన్ని పరిష్కరించే స్థితిలో లేరు. ఈ ఆందోళనలో ఒకరు మరొకరి మాటను వినేవారు కాదు. అందువల్ల వీళ్ళు వేరుగా ఉండే వారు. ‘అలీ (ర) తమ కొడుకులను ‘ఉస్మాన్ (ర) రక్షణకు పంపివేసారు. ‘హసన్ (ర) తలుపు దగ్గర కాపలా కాసేవారు. ‘అబ్దుల్లాహ్ బిన్ ‘జుబైర్‌ను, ‘ఉస్మాన్ (ర) ఇంట్లో అతనికి సేవకుడిగా నియమించారు. ‘ఉస్మాన్ (ర) ఇంటిని చుట్టు ముట్టిన ఆందోళనకారులకు అనేక సార్లు నచ్చజెప్పడం జరిగింది. వారికి ప్రభావపూరితమైన ప్రసంగాలు వినిపించటం జరిగింది. ఉబయ్ బిన్ క‘అబ్ కూడా ప్రసంగం చేసారు. కాని వారు ఏమాత్రం ప్రభావితం కాలేదు. ‘ఉస్మాన్ (ర) ఇంటి కప్పుపై నుండి వారిని ఉద్దేశించి ఇలా ప్రసంగించారు. ”మీకు తెలియదా? ప్రవక్త (స) మదీనహ్ వచ్చినపుడు మస్జిద్ చాలా ఇరుకుగా ఉండేది. ప్రవక్త (స) ‘ఎవరు ఈ భూమిని కొని దైవానికి సమర్పిస్తారు. దానికి బదులుగా అతనికి అంతకంటే మంచి ప్రదేశం స్వర్గంలో లభిస్తుంది,’ అని అన్నారు. అప్పుడు నేను ఆయన ఆదేశాన్ని పాలించాను. ఇప్పుడు మీరు నన్ను ఆ మస్జిద్‌లో నమా’జు చదవనివ్వరా? అల్లాహ్ సాక్షి! మీకు తెలుసా? ప్రవక్త (స) మదీనహ్ వచ్చినపుడు బీరె రూమా తప్ప మంచినీటి బావి మరొకటి ఉండేది కాదు. ప్రవక్త (స) ‘దీన్ని ఎవరు కొని ముస్లిములకు దానం చేస్తారో అంతకంటే మంచిది అతనికి స్వర్గంలో లభిస్తుంది,’ అని అన్నారు. అప్పుడు నేనే ఆయన ఆదేశాన్ని పాలించాను. ఇప్పుడు మీరు నన్ను దాని నీరు త్రాగనివ్వరా? మీకు తెలుసా? తబూక్ యుద్ధంలో సైన్యానికి ఆయుధాలు, ఇతర పరికరాలు ఇచ్చింది నేనే. అందరూ: ‘అదంతా నిజమే,’ అని అన్నారు. కాని కఠిన హృదయులపై ఈ ప్రసంగం ఏమాత్రం ప్రభావం చూపలేదు. ప్రజలనుద్దేశించి ఇంకా ఇలా అన్నారు, ‘అల్లాహ్ సాక్షి! మీకు గుర్తుందో లేదో ఒకసారి ప్రవక్త (స) కొండపై ఎక్కారు. కొండ కదలసాగింది. ప్రవక్త (స) కొండను తన్ని ఇలా అన్నారు. ‘ఓ హిరా ఆగిపో! నీ వీపుపై ఈ సమయం ఒక ప్రవక్త, ఒక సిద్దీఖ్, ఒక షహీద్ ఉన్నారు,’ అని అన్నారు. అప్పుడు నేను ఆయన వెంట ఉన్నాను. ప్రజలందరూ, ‘గుర్తుంది’ అని అన్నారు. ఆ తరువాత మళ్ళీ అల్లాహ్ సాక్షి! హుదైబియాలో నన్ను ప్రవక్త (స) మక్కహ్ రాయబారిగా పంపారు. ప్రవక్త (స) స్వయంగా తన చేతిని నా చేయిగా పరిగణించలేదా?’ అందరూ, ‘నిజమే’ అని అన్నారు. చివరికి ద్రోహులు ‘హజ్జ్ కాలం కొన్ని రోజుల్లో ముగుస్తుందని, ఆ వెంటనే ప్రజలు మదీనహ్ కు తరలి వస్తారని, అవకాశం చేజారిపోతుందని, ఆయన్ను చంపటానికి కుట్రలు పన్నసాగారు. వాటిని ‘ఉస్మాన్ (ర) స్వయంగా విన్నారు. ప్రజలనుద్దేశించి, ‘ప్రజలారా! ఏ విషయంపై నన్ను మీరు చంపటానికి సిద్ధమయ్యారు? ఇస్లామీయ షరీఅత్‌లో కేవలం మూడు కారణాల వల్లనే చంపటం జరుగుతుంది. వ్యభిచారం చేస్తే రాళ్ళద్వారా కొట్టి చంపటం జరుగుతుంది. ఎవరినైనా హత్యచేస్తే ప్రతీకారం తీర్చుకోవటం జరుగుతుంది, ఇస్లామ్‌ను త్యజిస్తే చంపటం జరుగుతుంది. నేను అజ్ఞాన కాలంలోనూ, ఇస్లామ్‌లోనూ వ్యభిచారానికి పాల్పడలేదు, ఎవరినీ చంపలేదు, ఇస్లామ్‌ను త్యజించనూ లేదు. ఇప్పుడు కూడా నేను అల్లాహ్ (త) ఒక్కడేనని, ము’హమ్మద్ (స) అల్లాహ్(త) దాసులు మరియు ప్రవక్త అని సాక్ష్యం ఇస్తున్నాను’ అని అన్నారు. కాని ఆయన ప్రసంగాలు ద్రోహులపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. ద్రోహులు ఇంటిపై దాడిచేసారు. తలుపు వద్ద కాపలా కాస్తున్న ‘హసన్ (ర)ను అడ్డుకోవడంలో గాయపడ్డారు. నలుగురు ద్రోహులు గోడ ఎక్కి వచ్చి కప్పుపై ఎక్కారు. ముందు అబూ బకర్ చిన్న కుమారులు ము‘హమ్మద్ బిన్ అబీ బకర్ ఉన్నారు. వీరు ‘అలీ (ర) సంరక్షణలో పెరిగారు. వీరు ఏదో ఒక పెద్ద పదవి గురించి ఆశించారు. అది లభించనందున ‘ఉస్మాన్ (ర)కు శత్రువులుగా మారి పోయారు. ఇతడు ముందుకు దూకి ‘ఉస్మాన్ (ర) జుత్తు పట్టుకున్నారు. బలంగా లాగారు. అప్పుడు ‘ఉస్మాన్ (ర), ‘కుమారా! ఒకవేళ మీ తండ్రి బ్రతికుంటే దీన్ని ఎంతమాత్రం సహించే వారు కాదు,’ అని అన్నారు. అది విని ము’హమ్మద్ బిన్ అబీ బక్ర్ సిగ్గుపడి వెనక్కి తగ్గారు. అప్పుడే మరో వ్యక్తి కనాన్ బిన్ బషీర్ ముందుకు వచ్చి నుదురుపై బలంగా కొట్టాడు. ‘ఉస్మాన్ (ర) బోర్లాపడ్డారు. అప్పుడు అతని నోటి నుంచి ‘బిస్మిల్లాహ్ తవక్కల్తు ‘అలల్లాహ్’ అనే పదాలు వెలువడ్డాయి. సాదాన్ బిన్ జమ్‌రాన్ మరోసారి కొట్టాడు. దానివల్ల రక్తం ప్రవహించసాగింది. ఒక కఠిన హృదయుడైన ‘అమ్ర్ బిన్ అల్ హమ్‌బ్ ఛాతీపై ఎక్కి కూర్చొని శరీరంపై వివిధ భాగాలపై 9 చోట్ల గాయ పరిచాడు. మరో పాపాత్ముడు కరవాలంతో దాడిచేసాడు. ఆయన ప్రక్కనే ఉన్న భార్య చేత్తో ఆపితే ఆమె మూడు వేళ్ళు తెగి వేరైపోయాయి. ఆ దాడి ‘ఉస్మాన్ (ర) జీవిత వెలుగు దీపాన్ని ఆర్పివేసింది. ఈ విధంగా ఉపద్రవాలు కల్లోలాలు తీర్పుదినం వరకు కొనసాగుతూ ఉంటాయి. షహాదత్ సమయంలో ‘ఉస్మాన్ (ర) ఖుర్‌ఆన్ పఠిస్తున్నారు. ఖుర్‌ఆన్ తెరచి ఉంది. అతని శరీరం నుండి చిందిన రక్త చుక్కలు ఈ ఆయత్, ”ఫసయక్ఫీకహుముల్లాహు వహువ స్సమీఉల్ అలీమ్” పై పడ్డాయి. శుక్రవారం నాడు ‘అ’సర్ సమయాన ఈ సంఘటన జరిగింది. రెండు రోజుల వరకు శవం అలాగే పడి ఉంది. ప్రవక్త (స) ‘హరమ్‌లో ప్రళయం సంభవించింది. ద్రోహుల రాజ్యం ఏలింది. వారి భయం వల్ల ఎవరికీ దఫన్ చేసే ధైర్యం కూడా లేకపోయింది. శని వారం గడిచింది. రాత్రి కొంతమంది ధైర్యం చేసి ఖనన సంస్కారాలు జరిపించారు. ఆ అమర వీరుని శరీరాన్ని గుసుల్ చేయించ కుండానే ఖననం చేయడం జరిగింది. మొత్తం 17 మంది కాబూల్ నుండి మరాకిష్ వరకు పాలించే పాలకుని జనా’జహ్ నమా’జ్ చదివారు. ముస్నద్ ఇబ్నె హంబల్‌లో ఇలా ఉంది: ‘జుబైర్ (ర), ఇబ్నెస’అద్‌లో ‘జుబైర్ ముత్‌యిమ్ జనా’జహ్ నమా’జు చదివించారు. బఖీ’ వెనుక హష్ కౌకబ్‌లో ఖననం చేసారు. తరువాత గోడ తొలగించి ఆ ప్రదేశాన్ని బఖీ’లో కలుపు కోవడం జరిగింది. ఈ నాడు కూడా బఖీ’ చివర అతని(ర) సమాధి ఉంది. అతన్ని చంపిన ద్రోహులు కూడా తరువాత తాము చేసిన దానికి పశ్చాత్తాపం చెందారు. కాని ఇస్లామ్ శత్రువుల కుట్రలు ఫలించాయి. విజయం వారిని వరించింది. ఇస్లామ్ ఐక్యత పతనం చెంది సున్ని, షి‘అ, ‘ఖారిజీ, ‘ఉస్మానీ అని, అనేక వర్గాలుగా వీడిపోయింది. ‘అలీ (ర) మస్జిద్ నుండి బయలుదేరి ‘ఉస్మాన్ (ర) ఇంటి వైపు వస్తున్నారు. దారిలో వీరమరణం వార్త తెలిసింది. ఈ వార్త వినగానే రెండు చేతులు ఎత్తి, ‘ఓ అల్లాహ్(త)! నేను ‘ఉస్మాన్ హత్యకు దూరంగా ఉన్నాను,’ అని అన్నారు. ‘ఉమర్ (ర) బావ స‘యీద్ బిన్ ‘జైద్ బిన్ ‘అమ్ర్ బిన్ ‘నఫీల్ ఇలా అన్నారు, ప్రజలారా! మీ ఈ అకృత్యాలకు ఉ’హుద్ కొండ మీపై పడినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.
[13]) వివరణ-3467: అంటే విశ్వాసికి అల్లాహ్ వైపు నుండి ఎల్లప్పుడూ సత్కార్యాల వైపు ముందడుగు వేసే భాగ్యం ప్రసాదించబడుతుంది. చాలా వేగంగా సత్కార్యాలు చేస్తూ ఉంటాడు. అయితే అధర్మంగా ఇతరుల రక్తాన్ని చిందించనంత వరకు. ఎప్పుడైతే అధర్మంగా ఇతరుల రక్తాన్ని చిందిస్తాడో ఆ పాపంవల్ల సత్కార్యాలు చేయటానికి అలసిపోతాడు. సత్కార్యాల్లో ముందడుగు వేయలేడు.
[14]) వివరణ-3469: ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ (త) ఇలా ఆదే శించాడు, ”అల్లాహ్ (త) సాటి కల్పించటాన్ని క్షమించడు. అది తప్పితే తాను కోరిన వారిని క్షమిస్తాడు. ఈ ఆయతు ద్వారా విశ్వాస హంతకుడు క్షమించ బడతాడని తెలుస్తుంది. లేదా విశ్వాసిని ధర్మంగా భావించి హతమారిస్తే, అతడు విగ్రహారాధకునిగా అవిశ్వాసి అయిపోతాడు. అతన్ని క్షమించడం జరుగదు. లేదా ఇలా హెచ్చరించడం జరిగిందని భావించవచ్చు.
[15]) వివరణ-3470: మస్జిద్‌లు దైవారాధనకోసం నిర్మించ బడతాయి. మస్జిదుల్లో ఎవరి నుండి ఖి‘సా‘స్ తీసుకోరాదు, శిక్షలూ అమలు చేయరాదు. ఎందుకంటే దీని ద్వారా రక్తం, మలమూత్రాలు వెలువడే అవకాశం ఉంది. దానివల్ల మస్జిద్ అపవిత్రం అవుతుంది. మస్జిద్ బయట ఖాళీ మైదానాల్లో ఖి‘సా‘స్ తీసుకోవాలి, శిక్షలు అమలు జరపాలి. ఒకవేళ తండ్రి తన బిడ్డను చంపితే తండ్రికి ఖి‘సా‘స్ వేయడం జరుగదు.
[16]) వివరణ-3471: ‘వీడు నా కొడుకు అని తమరు సాక్ష్యం ఉండండి.’ అంటే ‘ఒకవేళ ఈ నా కొడుకు ఏదైనా తప్పు చేస్తే నేను అతని తరఫున పరిహారం చెల్లిస్తాను. ఒకవేళ నేనేదైనా తప్పు చేస్తే నా తరఫున వీడు పరిహారం చెల్లిస్తాడు’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స) నీ కొడుకు అపరాధానికి నిన్ను, నీ అపరాధానికి నీ కొడుకును విచారించడం జరుగదు. అజ్ఞానకాలంలో తండ్రి తప్పుచేస్తే కొడుకును, కొడుకు తప్పు చేస్తే తండ్రిని పట్టుకునేవారు. శిక్షించేవారు. అల్లాహ్ (త) ఖుర్‌ఆన్‌లో ఇలా ఆదేశించాడు, ‘ఒకరి బరువు మరొకరు మోయరు. ప్రవక్త (స) వీపుపై నల్లని పుట్టుమచ్చలు ఉండేవి, వాటిపై వెంట్రుకలు కూడా ఉండేవి. అది దైవదౌత్య ముద్ర. ఆ వ్యక్తి దాన్ని ఏదో వ్యాధి అనుకొని, ‘మీరు అనుమతి ఇస్తే నేను చికిత్స చేస్తాను. నేను వైద్యుడను’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స) ‘వైద్యుడు అల్లాహ్ (త), ఆయనే స్వస్థత ప్రసాదించే వాడు, నీవు నా మిత్రుడివి మాత్రమే,’ అని అన్నారు.
[17]) వివరణ-3473: ఈ ‘హదీసు’ ”అల్ హుర్రు బిల్ హుర్రి వల్ అబ్‌దు బిల్ అబ్‌ది”కి వ్యతిరేకంగా ఉంది. కొందరు దీన్ని కఠిన హెచ్చరికగా పేర్కొన్నారు.
[18]) వివరణ-3482: సన్‌ఆ‘ యమన్ పట్టణాల్లో ఒక పట్టణం. సన్‌ఆ’ ప్రజలను ఎందుకు పేర్కొన్నారంటే, ఆ వ్యక్తిని చంపిన వారందరూ సన్‌ఆ’కు చెందినవారు. ఈ ‘హదీసు’ ద్వారా ఒక వ్యక్తి హత్యలో అనేక మంది పాత్ర ఉంటే అందరూ మరణశిక్షకు అర్హులు.
[19]) వివరణ-3484: సగం వచనం ద్వారా సహాయం చేయడ మంటే ”చంపు” అని సహాయం చేసినా ఇది కూడా హత్యలో సహాయం చేయటమే. విశ్వాసి హంతకుడు తౌబహ్ చేయక పోతే శిక్షకు అర్హుడు. ఎందుకంటే అల్లాహ్ ”అవిశ్వాసులే అల్లాహ్ కారుణ్యం పట్ల విసిగిపోతారు,” అని ఆదేశించాడు.
[20]) వివరణ-3485: పట్టుకున్నవాడు కూడా నేరస్తుడే. అయితే అసలు నేరస్తుడు చంపినవాడు. ఒకవేళ ఎవరైనా స్త్రీని పట్టు కుంటే మరో వ్యక్తి వ్యభిచరిస్తే, వ్యభిచరించిన వాణ్ణి రాళ్ళతో కొట్టి చంపటం జరుగు తుంది, పట్టుకున్న వాడ్ని శిక్షించడం జరుగుతుంది.
[21]) వివరణ-3486: అంటే చేతివేళ్ళు, కాలివేళ్ళు అన్ని సమానమే. ఒకవేలును కోసివేస్తే, దానికి బదులుగా 10 ఒంటెలు ఇవ్వాలి. చిన్న వేలిని కోసివేస్తే అప్పుడు కూడా 10 ఒంటెలు పరిహారంగా ఇవ్వాలి. అదేవిధంగా రెండు కాళ్ళ వేళ్ళు కోసివేస్తే 100 ఒంటెలు ఇవ్వాలి. ఎందుకంటే అన్నీ సమానమే.
[22]) వివరణ-3487: అంటే బనీ బహ్‌యాన్ తెగకు చెందిన ఇద్దరు స్త్రీలమధ్య వివాదం జరిగింది. వారిలో ఒక స్త్రీ గర్భవతి. వీరిద్దరిలో ఒక స్త్రీ గర్భంతో ఉన్న స్త్రీని షామియానా కర్రతో కొట్టింది. గర్భవతి కడుపులో ఉన్న బిడ్డ మరణించాడు. ఈ వ్యవహారం ప్రవక్త (స) వద్దకు వచ్చింది. అప్పుడు ప్రవక్త (స) ”బిడ్డకు బదులు ఆ స్త్రీ ఒక బానిస లేదా బానిసరాలిని ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. ఆ తరువాత కొట్టిన స్త్రీ మరణించింది. అప్పుడు ప్రవక్త (స) ఆమె ఆస్తి ఆమె వారసులకు లభిస్తుందని, ఆమె పరిహారం ఆమె బంధువులు, తెగవారిపై ఉందని తీర్పు ఇచ్చారు.
[23]) వివరణ-3493: మవాజిహ్ అంటే కొట్టడంవల్ల కీలు వీడి బయటపడటం. గాయాలు అనేకం ఉంటే, ప్రతి గాయానికి 5 ఒంటెలు ఇవ్వాలి.
[24]) వివరణ-3496: అజ్ఞాన కాలం నాటి ఒప్పందాలు ఇస్లామ్‌లో లేవు. ఒకవర్గం వారు మరోవర్గాన్ని దోచుకోవటానికి, నాశనం చేయటానికి మూడోవర్గం వారితో స్నేహం చేసేవారు. ఇస్లామ్‌లో ఇటువంటి స్నేహం ధర్మం కాదు. కాని ఇప్పుడు కూడా ఒకవేళ బాధితుని సహాయం చేయడానికి లేదా వాస్తవాన్ని తెలియపరచ టానికి ముస్లిముల ఒకవర్గం మరోవర్గంతో ఒప్పందం కుదుర్చుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదు.
[25]) వివరణ-3505: ఎందు కంటే వీరు యుక్త వయస్సుకు చేరని యువకులు. వీరిపై పరిహారం లేదు
[26]) వివరణ-3518: అంటే కత్తి, కరవాలం, బల్లెం మొదలైనవాటితో ఒక ముస్లిమ్ వైపు సైగచేయరాదు. ఇవి అతనికి తగలవచ్చు, అతడు గాయపడవచ్చు.
[27]) వివరణ-3519: అంటే హాస్యంగా ఎగతాళిగా ఇతరులవైపు ఆయుధాల ద్వారా సైగచేయరాదు. అతనికి తగలవచ్చు. దానివల్ల ఇహపరాల్లో విచారించటం జరగవచ్చు. అంటే సొంత సోదరుడైనా, ముస్లిమ్ సోదరుడైనా ఆయుధం ద్వారా సైగ చేయరాదు.
[28]) వివరణ-3520: అంటే అతడు పరిపూర్ణ ముస్లిమ్ కాడు.
[29]) వివరణ-3522: ఎండలో నిలబెట్టి శిక్షించడం ధర్మం కాదు. తగిన విధంగా శిక్షించాలి గాని హింసించకూడదు. ఈ విధంగా శిక్షించే హక్కు కేవలం అల్లాహ్‌కే ఉంది.
[30]) వివరణ-3523: వీరు దుర్మార్గులైన రాజులు, అధికారులు, సైనికులు. వీరు రాజుల ముందూ వెనుక వారికి రక్షణ కల్పిస్తూ ప్రజలను హింసిస్తూ పోతారు. ప్రజలను పీడిస్తారు. ఇటువంటి వారు దైవ శాపానికి గురవుతారు. ఇంకా దైవ శాపం ఎల్లప్పుడూ వారిపై అవతరిస్తూ ఉంటుంది.
[31]) వివరణ-3524: ప్రస్తుత కాలంలో రెండు రకాల ప్రజలు ఉన్నారు. ప్రవక్త (స) భవిష్యవాణి సత్యం అని తేలిపోయింది. అల్లాహ్ (త) మనందరినీ ఇటువంటి పాపకార్యాలకు దూరంగా ఉంచుగాక! ఆమీన్.
[32]) వివరణ-3527: ఎందుకంటే ఒరలేకుండా ఇస్తే గాయపడే అవకాశం ఉంటుంది. అందువల్ల కరవాలాన్ని ఒరలో పెట్టే ఇవ్వాలి.
[33]) వివరణ-3528: ఎందుకంటే వేళ్ళు గాయపడే భయం ఉంటుంది.
[34]) వివరణ-3529: ఎందుకంటే ఇటువంటి వ్యక్తి అన్యాయంగా చంపబడితే, వీరమరణం పొందుతాడు.
[35]) వివరణ-3535: వీరు ఖారిజీలు. మాట్లాడితే మంచి విషయాలేచెబుతారు. కాని వీరుఇస్లామ్ విసర్జించినవారు. అందువల్లే వీరిని చంపమని ఆదేశించటం జరిగింది.
[36]) వివరణ-3536: రెండు వర్గాలు అంటే ఒకటి ‘అలీ వర్గం, మరొకటి ము’ఆవియహ్ వర్గం. వీరిద్దరి మధ్య ‘ఖారిజీల వర్గం ఉద్భవించింది. ‘ఖారిజీలతో యుద్ధం చేసేవారి వైపు న్యాయం ఉంటుంది. అంటే ‘అలీ (ర) వీరితో పోరాడారు, వారిని చంపారు అంటే ‘అలీ (ర) వైపు న్యాయం ఉందని తెలిసింది.
[37]) వివరణ-3537: అంటే పరస్పరం వివాదాలకు, యుద్ధా లకు, చంపుకోవటాలకు గురికాకూడదు. ఎందు కంటే ఇది అవిశ్వాసుల పని. ఒకవేళ మీరు కూడా వారిలా పరస్పరం ప్రవర్తిస్తే మీరు కూడా అవిశ్వాసానికి గురవుతారు.
[38]) వివరణ-3539: వారు చాలా అపరాధాలు చేసారు. 1. ఇస్లామ్‌ను త్యజించారు. 2. దోపిడీ దొంగలుగా మారారు. 3. కాపరులను చంపారు. 4. కాపరుల కళ్ళల్లో ఇనుమును వేడిచేసి పెట్టి వారికళ్ళు పోగొట్టారు. అందువల్ల ఖి‘సా‘స్‌గా వారి పట్ల కూడా అలా ప్రవర్తించడం జరిగింది. కొందరు పండితులు ఇప్పుడు అలా చేయరాదని కేవలం నరికివేయడమే చాలని అభిప్రాయ పడుతున్నారు. ఖుర్‌ఆన్‌లో వీరి గురించి అల్ మాయిదహ్, 5: 33 వ ఆయతు: ”నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్‌తో మరియు ఆయన ప్రవక్తతో పోరాడుతారో మరియు ధరణిలో కల్లోలంరేకెత్తించటానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారికి మరణశిక్ష విధించాలి; లేదా శిలువపై ఎక్కించాలి; లేదా వారి అభిముఖ పక్షాల కాళ్ళు-చేతులను నరికించాలి; లేదా వారిని దేశ బహిష్క్రుతుల్ని చేయాలి. ఇది వారికి ఇహలోకంలో గల అవమానం. మరియు వారికి పరలోకంలో కూడా ఘోరశిక్ష ఉంటుంది –” అవతరించింది. అదేవిధంగా మందుగా ఒంటె మూత్రం త్రాగవచ్చని తెలసింది.
[39]) వివరణ-3541: ముస్ల’ అంటే కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు కోసి అందవికారంగా చేయడం. మృతిచెందినవారిని ఇలా చేయడం ధర్మం కాదు. ఇంతకుముందు ఖి’సా’స్‌గా చేసే అనుమతి ఉండేది.
[40]) వివరణ-3542: ‘హుమ్రహ్ ఒక చిన్న పక్షి. అది ఎర్రగా ఉంటుంది. ఈ ‘హదీసు’ ద్వారా జంతువునుగాని, చివరికి చీమనైనా అగ్నితో కాల్చడం ధర్మం కాదని తెలిసింది.
[41]) వివరణ-3543: తహ్లీఖ్ అంటే తలగీయించటం. వారి విశ్వాసాల ప్రకారం అది వారి చిహ్నం. తలపై వెంట్రుకలు ఉంచటాన్ని చెడుగా భావిస్తారు.
[42]) వివరణ-3546: అంటే పన్ను వసూలుచేసే భూమి. ఇది అవిశ్వాసుల భూమి. ఎందుకంటే ముస్లిముల నుండి 1/10వ వంతు తీసుకోవటం జరుగుతుంది. అవిశ్వాసుల నుండి పన్ను తీసుకోవటం జరుగుతుంది. ఎవరైనా అవిశ్వాసి భూమి కొంటే అతడు అవిశ్వాసి స్థానంలోకి వచ్చేస్తాడు. దాని పన్ను అతనిపై పడుతుంది. అంటే అతడు తన వలసపోవటాన్ని భంగంచేసాడు. అదేవిధంగా అవిశ్వాసి అవమానాన్ని తనపై వేసుకున్నవాడు. ఇస్లామ్‌ను పడవేసినట్లే. అంటే ఇలా కసిరినట్టు అనడం జరిగింది. అంటే పన్ను భారం ఉన్న భూమి కొనరాదు.
[43]) వివరణ-3547: ఖస్అమ్కి చెందిన కొందరు ఇస్లామ్ స్వీకరించారు. కాని వారు ముస్లిముల ప్రాంతానికి వలస రాలేదు. సైనికులు అక్కడికి చేరి వారిని అవిశ్వాసులుగా భావించి చంపివేసారు. వారు చూపించే ఉద్దేశ్యంతో నమా’జు చదివారని భావించారు. ప్రవక్త (స) వారి గురించి సగం పరిహారం ఇవ్వమని ఆదేశించారు. ఆ తరువాత అవిశ్వాసుల పట్టణంలో ఉండే ముస్లిములకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని, మేము వారి ధన, సంపదలకు రక్షకులం కాదని, ఒకవేళ యుద్ధంలో వారు మరణిస్తే, వారికి రక్తపరిహారం ఇవ్వడం జరగదని హెచ్చరించారు.
[44]) వివరణ-3548: కాని ఒకవేళ అవిశ్వాసి ద్రోహి, దుర్మార్గుడు అయితే ఉపద్రవాల్ని, కల్లోలాన్ని అరికట్టడానికి అకస్మాత్తుగా చంపవచ్చు. కఅబ్ బిన్ అష్రఫ్, రాఫె మొదలైన వారిని చంపినట్టు.
[45]) వివరణ-3549: అంటే బానిస, ముస్లిముల ప్రదేశం నుండి పారిపోయి అవిశ్వాసుల ప్రాంతానికి వెళ్ళి ఇస్లామ్‌ను త్యజిస్తే అతన్ని చంపటం ధర్మం అయిపోతుంది.
[46]) వివరణ-3550: ఒకవేళ ఎవరైనా ప్రవక్త (స)ను తిట్టినా, ద్రోహం తలపెట్టినా, వారిని చంపటం ధర్మం అవుతుంది అని ఈ ‘హదీసు‘ ద్వారా తెలిసింది.
[47]) వివరణ-3551: చేతబడి నేర్చుకోవటం, ఇతరులపై చేతబడి చేయడం కుఫ్ర్ అవుతుంది. ఒకవేళ మాంత్రికుడు ముస్లిమును చేతబడి చేసి హత్యచేస్తే ఆ మాంత్రికుడ్ని ధర్మబద్ధంగా చంపడం జరుగుతుంది.
***