15- كِتَابُ الْأَيْمَانِ وَالنُّذُوْرِ
15. ప్రమాణాలు, మొక్కుబడుల పుస్తకం
అయ్‌మాన్ అన్నది యమీన్‌కి బహువచనం. దాని అర్థం బలం, ధృఢత్వం. ఇస్లామీయ ధార్మిక పరిభాషలో, ‘అల్లాహ్ పేరుతో లేదా ఆయన గుణాలద్వారా చేసే ప్రమాణం,’ అని అర్థం. అంటే దృఢమైన ప్రమాణం అని అర్థం. ఇవి మూడు రకాలు: 1. యమీన్ ‘గమూస్: గడచిన దానిపై ఉద్దేశ్యపూర్వకంగా అసత్య ప్రమాణం చేయుట. ఇది మహా పాపం. అల్లాహ్ (త) ముందు దీన్ని గురించి విచారించడం జరుగుతుంది. ప్రపంచంలో కొందరి దృష్టిలో క్షమాపణ, పశ్చాత్తాపం తప్పనిసరి. కొందరి దృష్టిలో పరిహారం చెల్లించడం తప్పనిసరి. 2. యమీన్ మున్‌అఖద: భవిష్యత్తులో ఏదైనా పని చేయడం చేయక పోవడంలో అల్లాహ్‌పై ప్రమాణం చేయడం. ఒకవేళ దానికి అనుగుణంగా చేస్తే సరి, లేదా పరిహారం ఉంది. అదేమిటంటే 10మంది నిరుపేదలకు అన్నం పెట్టాలి. లేదా 10మంది నిరుపేదలకు బట్టలు పెట్టాలి. లేదా బానిసను విడుదల చేయాలి. ఇవేవీ చేయలేకపోతే 3 రోజులు ఉపవాసం పాటించాలి. 3. యమీనె లగ్వ్: ఆలోచించకుండా, ఎటువంటి ఉద్దేశ్యం లేకుండా ప్రమాణం చేయటం. ఇది క్షమించ దగినది. దీన్ని గురించి విచారించడం జరుగదు.
ఖుర్‌ఆన్‌లో ప్రమాణాల గురించి ఇలా ఆదేశించడం జరిగింది: ” మరియు మీరు అల్లాహ్ (పేరుతో) చేసే ప్రమాణాలు మిమ్మల్ని సన్మార్గం నుండి, దైవభీతి నుండి మరియు ప్రజలలో శాంతి స్థాపించటం నుండి ఆటంకపరిచేవిగా కానివ్వకండి. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. మీరు అనాలోచితంగా చేసే ప్రమా ణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు హృదయపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన తప్ప కుండా మిమ్మల్ని పట్టుకుంటాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, సహనశీలుడు.” (అల్ బఖరహ్, 2:224–225)
” మీరు ఉద్దేశం లేకుండానే చేసిన ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు బుధ్ధిర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని (తప్పకుండా) పట్టుకుంటాడు. కావున దానికి (ఇలాంటి ప్రమాణభంగానికి) పరిహారంగా మీరు మీ ఇంటి వారికి పెట్టే, మధ్యరకమైన ఆహారం పదిమంది పేదలకు పెట్టాలి. లేదా వారికి వస్త్రాలు ఇవ్వాలి. లేదా ఒక బానిసకు స్వాతంత్ర్యం ఇప్పించాలి. ఎవడికి ఈ శక్తిలేదో! అతడు మూడు దినాలు ఉపవాసం ఉండాలి. మీరు ప్రమాణం చేసి భంగపరిస్తే, ఇది దానికి పరిహారం (కఫ్ఫారా). మీ ప్రమాణాలను కాపాడుకోండి. మీరు కృతజ్ఞులై ఉండటానికి అల్లాహ్ తన ఆజ్ఞలను ఈ విధంగా మీకు విశదపరుస్తున్నాడు.” (అల్ మాయిదహ్, 5:89)
అదేవిధంగా సూరహ్ న’హల్ (16), సూరహ్ త’హ్‌రీమ్ (66)లో కూడా ప్రమాణాల గురించి పేర్కొనడం జరిగింది. ముందు ‘హదీసు’ల్లో క్లుప్తంగా వివరించడం జరిగింది. దీనితోపాటు మొక్కుబడి గురించి కూడా పేర్కొనడం జరిగింది.
మొక్కుబడి
తనపై తప్పనిసరికాని దాన్ని తనపై తప్పనిసరి చేసుకోవడం. ఒకవేళ పాపకార్యం కాని మొక్కుబడి అయితే దాన్ని తప్పకుండా పూర్తిచేయాలి. అల్లాహ్ ఆదేశం: ”వారు తమ మొక్కుబడులు పూర్తి చేయాలి.” (అల్ హజ్జ్, 22:29)
పాపకార్యాల మొక్కుబడి చెల్లించడం ధర్మ సమ్మతం కాదు. అయితే ప్రమాణ పరిహారం చెల్లించాలి. అదేవిధంగా అల్లాహ్‌ను వదలి ఇతరుల పేర మొక్కుకోవడం నిషిద్ధం. దీని గురించి పూర్తి వివరాలు ఫిఖహ్, ‘హదీస్’ల పుస్తకాల్లో ఉన్నాయి.
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3406 – [ 1 ] ( صحيح ) (2/1018)
عَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا أَكْثَرُ مَا كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَحْلِفُ: “لَا وَمُقَلِّبِِِ الْقُلُوْبِ”. رَوَاهُ الْبُخَارِيُّ.
3406. (1) [2/1018– దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) తరచూ ఈవిధంగా ప్రమాణం చేసేవారు. ”లా వ ముఖల్లి బిల్ ఖులూబ్.” ఈ విషయం ఈ విధంగా లేదు, హృదయాలను మరల్చే వాని (అల్లాహ్) సాక్షి! (బు’ఖారీ)
3407 – [ 2 ] ( متفق عليه ) (2/1018)
وَعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ اللهَ يَنْهَاكُمْ أَنْ تَحْلِفُوْا بِآبَائِكُمْ مَنْ كَانَ حَالِفًا فَلْيَحْلِفْ بِاللهِ أَوْ لِيَصْمُتْ”.
3407. (2) [2/1018 –ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తాత ముత్తాతల పేరట ప్రమాణం చేయటం నుండి అల్లాహ్ (త) మిమ్మల్ని వారిస్తున్నాడు. ఒకవేళ ప్రమాణం చేయాలనే ఉంటే, అల్లాహ్పై ప్రమాణం చేయాలి లేదా ఊరుకోవాలి. (బు’ఖారీ)
3408 – [ 3 ] ( صحيح ) (2/1018)
وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ سَمُرةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَحْلِفُوْا بِالطَّواغِيْ وَلَا بِآبَائِكُمْ”. رَوَاهُ مُسْلِمٌ
3408. (3) [2/1018 –దృఢం]
‘అబ్దుర్రహ్మాన్ బిన్ సమురహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు విగ్రహాలపైగాని, మీ పెద్దలపై గాని ప్రమాణం చేయకండి.” (ముస్లిమ్)
3409- [ 4 ] ( متفق عليه ) (2/1018)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ حَلَفَ. فَقَالَ فِيْ حَلْفِهِ: بِاللَّاتِ وَالعُزَّى فَلْيَقُلْ: لَا إِلَهَ إِلَّا اللهُ.وَمَنْ قَالَ لِصَاحِبِهِ: تَعَالَ أُقَامِرْكَ فَلْيَتَصَدَّقْ”.
3409. (4) [2/1018 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”లాత్, ఉజ్జాలపై ప్రమాణం చేసినవారు ‘లా ఇలాహ ఇల్ల ల్లాహ్’ పలకాలి. అదేవిధంగా ఎవరైనా తన మిత్రునితో, ‘జూదం ఆడటానికిరా!’ అని అన్నవాడు ‘సదఖహ్ చేయాలి.”[1] (బు’ఖారీ, ముస్లిమ్)
3410 – [ 5 ] ( متفق عليه ) (2/1018)
وَعَنْ ثَابِتِ بْنِ الضّحَاكِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ حَلَفَ عَلَى مِلَّةِ الْإِسْلَامِ كَاذِبًا فَهُوَ كَمَا. قَالَ وَلَيْسَ عَلَى اِبْنِ آدَمَ فِيْمَا لَا يَمْلِكُ وَمَنْ قَتَلَ نَفْسَهُ بِشَيْءٍ فِي الدُّنْيَا عُذِبَ بِهِ يَوْمَ الْقِيَامَةِ وَمَنْ لَعَنَ مُؤْمِنًا فَهُوَ كَقَتْلِهِ وَمَنْ قَذَفَ مُؤْمِنًا بِكُفْرٍ فَهُوَ كَقَتْلِهِ وَمَنِ ادْعَى دَعْوَى كَاذِبَةً لِيَتَكَثَّرَ بِهَا لَمْ يَزِدْهُ اللهُ إِلَّا قِلَّةً”.
3410. (5) [2/1018 –ఏకీభవితం]
సా’బిత్ బిన్ ‘ద’హ్హాక్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనాలు, ఇస్లామ్‌కు వ్యతిరేకంగా మరో ధర్మంపై అసత్య ప్రమాణం చేసేవాడు అతను అన్నట్లే అయి పోతాడు. అంటే, ‘ఒకవేళ నేను అలాచేస్తే యూదున్ని, క్రైస్తవుణ్ని లేదా హిందువును,’ అని అంటే అతడు ఆవిధంగానే అయిపోయినట్లు. అదేవిధంగా తన అధీనంలో లేని దాని గురించి మొక్కుకుంటే, ఆ మొక్కుబడి సరికాదు. అదేవిధంగా ఇహలోకంలో ఎవరైనా ఏ వస్తువుతోనైనా తన్నుతాను చంపుకుంటే తీర్పుదినం నాడు అతన్ని దాని ద్వారానే శిక్షించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా ఒక ముస్లిమ్‌ను శపిస్తే, దాని పాపం అతన్ని చంపడంతో సమానం. అదేవిధంగా ఎవరైనా మరో ముస్లిమ్పై అవిశ్వాస నిందవేస్తే అతన్ని చంపినట్టే. అంటే శపించేవాడు, నిందవేసేవాడు, విశ్వాసిని చంపినవాడితో సమానం. అదేవిధంగా మరొకరి ధనాన్ని దోచుకోవటానికి అసత్యవాదన చేసి తన ధనం పెరుగుతుందని భావిస్తే, అల్లాహ్ (త) అతని ధనాన్ని తరిగిస్తాడు, తగ్గిస్తాడు.” (బు’ఖారీ, ముస్లిమ్)
3411 – [ 6 ] ( متفق عليه ) (2/1019)
وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: قَالَ رَسُولُ اللهِ صلى الله عليه وسلم: “إِنِّيْ وَ اللهِ إِنْ شَاءَ اللهُ لَا أَحْلِفُ عَلَى يَمِيْنٍ فَأَرَى غَيْرَهَا خَيْرًا مِنْهَا إِلَّا كَفَّرْتُ عَنْ يَمِيْنِيْ وَأَتَيْتُ الَّذِيْ هُوَ خَيْرٌ”.
3411. (6) [2/1019 –ఏకీభవితం]
అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ సాక్షి! అల్లాహ్ కోరితే, ఒకవేళ నేను – ఏ దైనా పని చేయాలని ప్రమాణం చేసిన తరువాత అందులో కాక ఇతర దానిలో అంతకంటే మంచితనం చూస్తే, నేను నా ప్రమాణానికి పరిహారం చెల్లించి, అంతకంటే మంచిపనిని చేస్తాను.” (బు’ఖారీ, ముస్లిమ్)
3412 – [ 7 ] ( متفق عليه ) (2/1019)
وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ سَمُرةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا عَبْدَ الرَّحْمنِ بْنِ سَمُرَةَ لَا تَسْأَلِ الْإِمَارَةَ فَإِنَّكَ إِنْ أُوْتِيْتَهَا عَنْ مَسْأَلَةٍ وُكِّلْتَ إِلَيْهَا وَإِنْ أُوْتِيْتَهَا عَنْ غَيْرِ مَسْأَلَة أُعِنْتَ عَلَيْهَا وَإِذَا حَلَفْتَ عَلَى يَمِيْنٍ فَرَأَيْتَ غَيْرَهَا خَيْرًا مِنْهَا فَكَفِّرْ عَنْ يَمِيْنِكَ وَأْتِ الَّذِيْ هُوَ خَيْرٌ”. وَفِيْ رِوَايَةٍ: “فَأْتِ الَّذِيْ هُوَ خَيْرٌ وَكَفِّرْ عَنْ يَمِيْنِكَ”.
3412. (7) [2/1019– ఏకీభవితం]
‘అబ్దుర్ర’హ్మాన్ బిన్ సమురహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఓ ‘అబ్దుర్ర’హ్మాన్ నువ్వు నాయకుడు కావాలని దరఖాస్తు చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ దరఖాస్తు చేయడం వల్ల, నీ కోరిక వల్ల నాయకుడిగా చేయబడితే, నిన్ను నాయకత్వానికే గురిచేయడం జరుగుతుంది. ఇంకా అల్లాహ్(త) సహాయం నీ నుండి ఎత్తుకోబడుతుంది. ఒక వేళ నువ్వు కోరకుండా, దరఖాస్తు చేయకుండా నువ్వు నాయకుడివైతే, నీకు సహాయం చేయడం జరుగుతుంది. నీపై అల్లాహ్(త) దయ ఉంటుంది. నువ్వు ఏ విషయంలోనైనా ప్రమాణం చేస్తే, దానికి వ్యతిరేకంగా చేయడంలో లాభం ఉంటే, నీవు నీ ప్రమాణానికి పరిహారం చెల్లించు. నీకు లాభం ఉన్నదాన్ని చేయి.” మరో ఉల్లేఖనంలో నువ్వు ఆ మంచి పనిని చేయి, నీ ప్రమాణానికి పరిహారం చెల్లించు. (బు’ఖారీ, ముస్లిమ్)
ఈ ‘హదీసు’ ద్వారా ప్రమాణం భంగపరచక ముందు కూడా పరిహారం చెల్లించడం ధర్మసమ్మతమేనని, ప్రమాణం భంగపరచిన తరువాత అయితే పరిహారం తప్పని సరిగా ఇవ్వాలని తెలిసింది.
3413 – [ 8 ] ( صحيح ) (2/1019)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ حَلَفَ عَلَى يَمِيْنٍ فَرَأَى خَيْرًا مِنْهَا فَلْيُكَفِّرْعَنْ يَمِيْنِهِ وَلْيَفْعَلْ”. رَوَاهُ مُسْلِمٌ.
3413. (8) [2/1019 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఒక వ్యక్తి ఒక విషయంపై ప్రమాణం చేసి, దానికి వ్యతిరేకంగా లాభం ఉందని అనిపిస్తే, అతడు తన ప్రమాణానికి పరిహారం చెల్లించాలి, లాభం ఉన్న పని చేయాలి. (ముస్లిమ్)
3414 – [ 9 ] ( متفق عليه ) (2/1019)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَاللهِ لَأَنْ يَّلِجَّ أَحدُكُمْ بِيَمِيْنِهِ فِيْ أَهْلِهِ آثَمَّ لَهُ عِنْدَ اللهِ مِنْ أَنْ يُعْطِيَ كَفَّارَتَهُ الَّتِيْ اِفْتَرَضَ اللهُ عَلَيْهِ”.
3414. (9) [2/1019 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ సాక్షి! మీలో ఎవరైనా తన భార్యాబిడ్డల పట్ల అన్యాయం చేస్తానని ప్రమాణం చేసి, ప్రమాణ భంగం చేసి పరిహారం చెల్లించడమే ఉత్తమమని తెలిసికూడా, తన ప్రమాణంపైనే పట్టు వదలకుండా ఉంటే, అతనికి అతనిపై విధించిన ఆ పరిహారం చెల్లించడం కన్నా ఎక్కువ పాపం చుట్టుకుంటుంది.(ఎందుకంటే పరిహారం వల్ల పాపం తొలగిపోతుంది, కాని ఇక్కడ మంకుపట్టు వదలక పోవడం ప్రమాణం భంగం చేయడం కన్నా ఘోరమైన పాపం. [2] (బు’ఖారీ, ముస్లిమ్)
3415 – [ 10 ] ( صحيح ) (2/1019)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَمِيْنُكَ عَلَى مَا يُصَدِّقُكَ عَلَيْهِ صَاحِبُكَ”. رَوَاهُ مُسْلِمٌ .
3415. (10) [2/1019 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నీ ప్రమాణం నీ స్నేహితుడు ధృవీకరించిన సంకల్పంపై ఉంటుంది.” [3] (ముస్లిమ్)
3416 – [ 11 ] ( صحيح ) (2/1020)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْيَمِيْنُ عَلَى نِيَّةِ الْمُسْتَحْلِفِ”. رَوَاهُ مُسْلِمٌ.
3416. (11) [2/1020–దృఢం]
అబూహురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రమాణం, ప్రమాణం చేయించే వారి సంకల్పంపై ఆధారపడి ఉంటుంది.” (ముస్లిమ్)
3417 – [ 12 ] ( صحيح ) (2/1020)
عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: أُنْزِلَتْ هَذِهِ الْآيَةُ: (لَا يُؤَاخِذُكُمُ اللهُ بِاللَّغْوِ فِيْ أَيْمَانِكُمْ؛ 2: 225) فِيْ قَوْلِ الرَّجُلِ: لَا وَاللهِ وَبَلَى وَاللهِ. رَوَاهُ الْبُخَارِيُّ وَفِيْ شَرْحِ السُّنَّةِ لَفْظُ الْمَصَابِيْحِ وَقَال: رَفَعَهُ بَعْضُهُمْ عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهُ.
3417. (12) [2/1020 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ఈ ఆయతు: ”లా యువాఖిజు కుముల్లాహు బిల్లగ్వి ఫీ ఐమానికుమ్,” (అల్బఖరహ్, 2:225) – ‘మీరు అనాలోచితంగా చేసే ప్రమా ణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు.’ ఈవ్యక్తి విషయంలో అవతరించింది, ఒక వ్యక్తి సంకల్పం సందర్భం లేకుండా ప్రతిమాటకు ప్రమాణాలు చేసేవాడు. ‘దైవం సాక్షి! నేనాపని చేయను,’ ఆ పనిచేయను అని అనేవాడు. అంటే ప్రతిమాటకు ప్రమాణం చేసేవాడు. అతడి ఉద్దేశ్యం ప్రమాణం చేయటం ఉండేది కాదు. ఇటువంటివన్నీ వ్యర్థప్రమాణాలు, వీటిని గురించి అల్లాహ్ (త) విచారించడం జరుగదు. (బు’ఖారీ, షర’హ్ సున్నహ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3418 – [ 13 ] ( لم تتم دراسته ) (2/1020)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَحْلِفُوْا بِآبَائِكُمْ وَلَا بِأُمَّهَاتِكُمْ وَلَا بِالْأَنْدَادِ وَلَا تَحْلِفُوْا بِاللهِ إِلَّا وَأَنُتُمْ صَادِقُوْنَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.
3418. (13) [2/1020 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు తండ్రులపై, తల్లులపై ప్రమాణాలు చేయకండి. విగ్రహాలపై ప్రమాణాలు చేయకండి. అయితే అల్లాహ్ పై ప్రమాణాలు చేస్తే నిజమైన ప్రమాణాలు చేయండి.” (అబూ దావూద్, నసాయి’)
3419 – [ 14 ] ( لم تتم دراسته ) (2/1020)
وَعَنِ ابْنِ عُمَرَرَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ حَلَفَ بِغَيْرِاللهِ فَقَدْ أَشْرَكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
3419. (14) [2/1020– అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”అల్లాహ్ (త) తప్ప ఇతరుల పేర ప్రమాణం చేసినవారు అల్లాహ్(త)కు సాటి కల్పించినట్లే.” (తిర్మిజి’)
అంటే అల్లాహ్ (త) తప్ప ఇతరులపై ప్రమాణం చేసినవారు అల్లాహ్(త)కు సాటి కల్పించిన వారౌతారు.
3420 – [ 15 ] ( صحيح ) (2/1020)
وَعَنْ بُرَيْدَةَ قَالَ:قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ حَلَفَ بِالْأَمَانَةِ فَلَيْسَ مِنَّا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3420. (15) [2/1020– దృఢం]
బురైదహ్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”అమానతుపై ప్రమాణం చేసిన వారు మనలోని వారు కారు.” (అబూ దావూద్)
ఎందు కంటే అమానతు కూడా దైవ సృష్టితాలలోనిదే.
3421 – [ 16 ] ( لم تتم دراسته ) (2/1021)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَالَ: إِنِّيْ بَرِيْءٌ مِّنَ الْإِسْلَامِ فَإِنْ كَانَ كَاذِبًا فَهُوَ كَمَا قَالَ وَإِنْ كَانَ صَادِقًا فَلَنْ يَرْجِعَ إِلَى الْإِسْلَامِ سَالِمًا”. رواهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.
3421. (16) [2/1021–అపరిశోధితం]
బురైదహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ఎవరైనా ఒకవేళ నేను ఇలా చేస్తే, నేను ఇస్లామ్ పట్ల విసిగి పోయినట్లే అని ప్రమాణం చేస్తే, ఒకవేళ అతడు అసత్య ప్రమాణం చేస్తే అన్నట్టు అయిపోతాడు, అంటే అతడు ఇస్లామ్ పట్ల విసుగు చెందుతాడు. ఒకవేళ అతడు సత్య ప్రమాణం చేసినా ఇస్లామ్ వైపు సురక్షితంగా రాలేడు. (అబూ దావూద్, నసాయి’, ఇబ్నె మాజహ్)
అంటే ఈవిధంగా పలికినవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ పాపానికి గురవుతాడు.
3422 – [ 17 ] ( لم تتم دراسته ) (2/1021)
وَعَنْ أَبَيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا اجْتَهَدَ فِي الْيَمِيْنِ قَالَ: “لَا وَالَّذِيْ نَفْسُ أَبِى الْقَاسِمِ بِيَدِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3422. (17) [2/1021–అపరిశోధితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రమాణం చేయటాన్ని తప్పనిసరిగా భావిస్తే ఇలా అంటారు, ”ఎవరి చేతిలో అబుల్ ఖాసిమ్ ప్రాణం ఉందో ఆయన (త) సాక్షి! ఈ విషయం ఇలా లేదు.” (అబూ దావూద్)
అబుల్ ఖాసిమ్ ప్రవక్త (స) కునియత్.
3423 – [ 18 ] ( ضعيف ) (2/1021)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كَانَتْ يَمِيْنُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم إِذَا حَلَفَ: “لَا وَأسْتَغْفِرُاللهَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
3423. (18) [2/1021–బలహీనం]
అబూహురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక్కోసారి ఈ విధంగానూ ప్రమాణం చేసేవారు, ”ఈ విషయం ఇలా లేదు. నేను అల్లాహ్ (త)ను క్షమాపణ కోరుతున్నాను.” (అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
3424 – [ 19 ] ( صحيح ) (2/1021)
وَعَنِ ابْنِ عُمَرَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله ليه وسلم قَالَ: “مَنْ حَلَفَ عَلَى يَمِيْنِ فَقَالَ: إِنْ شَاءَ اللهُ فَلَا حِنْثَ عَلَيْهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ وَذَكَرَ التِّرْمِذِيُّ جَمَاعَةُ وَقَفُوْهُ عَلَى ابْنُ عُمَرَ.
3424. (19) [2/1021–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రమాణం చేసేటప్పుడు ”ఇన్షాఅల్లాహ్” అని పలికితే, అతని ప్రమాణం భంగం కాదు.”[4] (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి, ఇబ్నె మాజహ్, దారమి)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3425 – [ 20 ] ؟(2/1021)
عَنْ أَبِيْ الْأَحْوَصِ عَوْفِ بْنِ مَالِكٍ عَنْ أَبِيْهِ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَرَأَيْتَ ابْنَ عَمِّ لِيْ آتِيْهِ فَلَا يُعْطِيْنِيْ وَلَا يُصِلُنِيْ ثُمَّ يَحْتَاجُ إِلَيَّ فَيَأْتِيْنِيْ فَيَسْأَلُ نِيْ وَقَدْ حَلَفْتُ أَنْ لَا أَعْطِيَهُ وَلَا أَصِلَهُ فَأَمَرَنِيْ أَنْ آتِيَ الَّذِيْ هُوَ خَيْرٌ وَأُكَفِّرَ عَنْ يَمِيْنِيْ. رَوَاهُ النَّسَائِيُّ وَابْنُ مَاجَهُ
وَفِيْ رِوَايَةٍ قَالَ:قُلْتُ: يَا رَسُوْلَ اللهِ يَأْتِيْنِيْ اِبْنُ عَمِّيْ فَأَحْلِفُ أنْ لَا أَعْطِيَهُ وَلَا أَصِلَهُ قَالَ: “كَفِّرْ عَنْ يَمِيْنِكَ”.
3425. (20) [2/1021?]
అబూ అ’హ్‌వ’స్ ‘ఔఫ్ బిన్ మాలిక్ తన తండ్రి మాలిక్ ద్వారా కథనం: అతని తండ్రి కథనం: ”ఓ అల్లాహ్ ప్రవక్తా! నాకేదైనా అవసరం వచ్చి, నేను నా చిన్న కొడుకు దగ్గరకు వెళితే, అతడు నాకు సహాయం చేయడు, బంధుత్వవిధినీ చెల్లించడు, నా పట్ల మంచితనంతో వ్యవహరించడు. అదేవిధంగా అతనికి అవసరం ఉండి, నా దగ్గరకు వస్తే, నేను అతనికి సహాయం చేయనని, అతని పట్ల బంధుప్రీతితో వ్యవహరించనని నేను ప్రమాణం చేసుకున్నాను,” అని అన్నాను. దానికి ప్రవక్త (స), ”నువ్వు మంచి పనులు చేస్తూ ఉండు. నీ ప్రమాణానికి తగిన పరిహారం చెల్లించివేయి,” అని అన్నారు. (నసాయి’, ఇబ్నె మాజహ్)
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”నేను ఓ అల్లాహ్ ప్రవక్తా! మా చిన్నాన్న కొడుకు అవసరార్థం నా దగ్గరకు వస్తాడు, అయితే నేను అతనికి సహాయం చేయనని, మంచిగా ప్రవ ర్తించనని ప్రమాణం చేసి ఉన్నాను,” అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ”నీవు నీ ప్రమాణానికి పరిహారం చెల్లించు, మంచి పనులు చేస్తూ ఉండు,” అని హితబోధ చేసారు.”
=====
1– بَابُ فِي النُّذُوْرِ
1. మొక్కుబడులు
ధార్మికంగా తనపై తప్పనిసరి కాని విషయాన్ని తనపై తప్పనిసరి చేసుకోవడం. అంటే ఒకవేళ ఫలానా విషయం అయితే, నేను 10 మందికి భోజనం పెడతాను అని అనడం. ఆ పని అయిపోతే 10 మందికి భోజనం పెట్టటం తప్పనిసరి అయిపోతుంది. ఒకవేళ పాపకార్యం పట్ల మొక్కుకుంటే దాన్ని చెల్లించడం తప్పనిసరికాదు. అయితే దానికి పరిహారం చెల్లించడం తప్పనిసరి. దీన్ని క్రింది ‘హదీసులలో వివరించడం జరిగింది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3426 – [ 1 ] ( متفق عليه ) (2/1022)
عَنْ أَبِيْ هُرَيْرَةَ وَابْنُ عُمَرَرَضِيَ اللهُ عَنْهُمْ قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَنْذُرُوْا فَإِنَّ النَّذْرَ لَا يُغْنِيْ مِنَ الْقَدَرِ شَيْئًا وَإنَّمَا يُسْتَخْرِجُ بِهِ مِنَ الْبَخَيْلِ”.
3426. (1) [2/1022– ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర), ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) ఇద్దరి కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మొక్కుబడులు మొక్కుకోకండి. ఎందుకంటే మొక్కుబడి విధివ్రాతను మార్చలేదు. పైగా దాని ద్వారా పిసినారితనం నుండి ధనం పొందడం జరుగు తుంది.” [5] (బు’ఖారీ, ముస్లిమ్)
3427 – [ 2 ] ( صحيح ) (2/1022)
وَعَنْ عَائِشَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ نَذَرَ أَنْ يُطِيْعَ اللهَ فَلْيُطِعْهُ وَمَنْ نَذَرَ أَنْ يَعْصِيَهُ فَلَا يَعْصِهِ”. رَوَاهُ الْبُخَارِيُّ.
3427. (2) [1022– దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా అల్లాహ్(త) విధేయత గురించి మొక్కు కుంటే, అల్లాహ్ (త) విధేయతకు కట్టుబడిఉండాలి. తన మొక్కుబడి పూర్తిచేయాలి. ఇంకెవరైనా అల్లాహ్ (త) అవిధేయత గురించి మొక్కుకుంటే, అతడు అల్లాహ్(త) అవిధేయతకు పాల్పడరాదు. ఇటువంటి మొక్కుబడినీ చెల్లించరాదు.[6] (బు’ఖారీ)
3428 – [ 3 ] ( صحيح ) (2/1022)
وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا وَفَاءَ لِنَذْرٍ فِيْ مَعْصِيَةٍ وَلَا فِيْمَا لَا يَمْلِكُ الْعَبْدُ”. رَوَاهُ مُسْلِمٌ وَفِيْ رِوَايَةٍ: “لَا نَذْرَ فِيْ مَعْصِيَةِ اللهِ”.
3428. (3) [2/1022 –దృఢం]
‘ఇమ్‌రాన్ బిన్ ‘హు’సైన్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, పాపకార్యం కొరకు మొక్కుబడి పూర్తి చేయడం మంచిది కాదు. అదేవిధంగా తన అధీనంలో లేని దాన్ని గురించి కూడా మొక్కుకోవటం మంచిది కాదు. (ముస్లిమ్)
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”అల్లాహ్(త) అవిధేయత కొరకు చేసుకున్న మొక్కుబడిని పూర్తిచేయకండి.”
3429 – [ 4 ] ( صحيح ) (2/1022)
وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍعَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “كَفَّارَةُ النَّذْرِ كَفَّارَةُ الْيَمِيْنِ”. رَوَاهُ مُسْلِمٌ.
3429’ (4) [2/1022 –దృఢం]
‘ఉఖ్‌బహ్ బిన్ ‘ఆమిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మొక్కుబడి పరిహారం, ప్రమాణ పరిహారం వంటిదే. [7] (ముస్లిమ్)
3430 – [ 5 ] ( صحيح ) (2/1022)
وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: بَيْنَا النَّبِيُّ صلى الله عليه وسلم يَخْطُبُ إِذَا هُوَ بِرَجُلٍ قَائِمٍ فَسَأَلَهُ عَنْهُ فَقَالُوْا: أَبُوْ إِسْرَائِيْلَ نَذَرَ أَنْ يَقُوْمَ وَلَا يَقْعُدَ وَلَا يَسْتَظِلُّ وَ لَا يَتَكَلَّمَ وَيَصُوْمُ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “مُرُوْهُ فَلْيَتَكَلَّمْ وَلْيَسْتَظِلَّ وَلْيَقْعُدْ وَلْيُتِمَّ صَوْمَهُ”. رَوَاهُ الْبُخَارِيُّ.
3430. (5) [2/1022 –దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రసంగం చేస్తూ ఉన్నారు. ఇంతలో ఒక వ్యక్తి నిలబడి ఉండటం చూచారు. ప్రవక్త (స), ‘అతని పేరేమిటి, అతను ఎందుకు నిలబడ్డాడు,’ అని ప్రజలను అడిగారు. దానికి ప్రజలు, ”అతని పేరు అబూ ఇస్రాయీ’ల్, అతడు, ‘నిలబడతానని, కూర్చోనని, ఏ వస్తువు నీడలో ఉండనని, ఎవరితోనూ మాట్లాడనని, ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాడు,’ ” అని అన్నారు. దానికి ప్రవక్త (స), ”అతన్ని, ‘మాట్లాడాలి, నీడలో ఉండాలి, కూర్చోవాలి, అయితే ఉపవాసం మాత్రం పాటించాలి,’ అని ఆదేశించండి,” అని ప్రజలతో అన్నారు. [8] (బు’ఖారీ)
3431 – [ 6 ] ( متفق عليه ) (2/1023)
وَعَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم رَأَى شَيْخًا يُهَادَى بَيْنَ اِبْنَيْهِ فَقَالَ:”مَا بَالَ هَذَا؟” قَالُوْا: نَذَرَأَنْ يَّمْشَيَ إِلَى بَيْتِ اللهِ قَالَ: “إِنَّ اللهَ تَعَالى عَنْ تَعْذِيْبِ هَذَا نَفْسَهُ لَغَنِيٌّ”. وَأَمَرَهُ أَنْ يَرْكَبَ.
3431. (6) [2/1023- ఏకీభవితం]
(ర) కథనం: ప్రవక్త (స) ఒక వృధ్ధ వ్యక్తిని చూసారు. అతడు తన ఇద్దరు కొడుకుల సహాయంతో నడుస్తున్నాడు. విషయం ఏమిటని’ ప్రవక్త (స) ప్రజలను అడిగారు. ‘అతడు కాలినడకన ‘హజ్జ్ కు వెళ్తానని మొక్కుకున్నాడు,’ అని తెలియపరిచారు. అప్పుడు ప్రవక్త (స), ‘అల్లాహ్ (త) ప్రాణులకు ఈవిధంగా కష్టపెట్టడు. అతన్ని వాహనంపై ఎక్కి వెళ్ళమనండి’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
3432 – [ 7 ] ( صحيح ) (2/1023)
وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: “ارْكَبْ أَيُّهَا الشَّيْخُ فَإِنَّ اللهَ غَنِيٌّ عَنْكَ وَعَنْ نَذْرِكَ”.
3432. (7) [2/1023 –దృఢం]
ముస్లిమ్‌లో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ఆ ముసలివాని తో ”గురువుగారూ వాహనంపై ఎక్కి వెళ్ళిండి, అల్లాహ్ (త) మీరు, మీ మొక్కుబడి అక్కర లేనివాడు,” అని అన్నారు.
3433 – [ 8 ] ( متفق عليه ) (2/1023)
وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ سَعْدَ بْنَ عُبَادَةَ رَضِيَ اللهُ عَنْهُم اِسْتَفْتَى النَّبِيّ صلى الله عليه وسلم فِيْ نَذْرٍ كَانَ عَلَى أُمِّهِ فَتُوُفَّيَتْ قَبْلَ أَنْ تَقْضِيَهُ فَأفْتَاهُ أَنْ يَقْضِيَهُ عَنْهَا.
3433. (8) [2/1023– ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స)ను స’అద్ బిన్ ‘ఉబాదహ్, ”నా తల్లి మొక్కుకుంది, మొక్కుబడి చెల్లించకముందే మరణించింది, ఇప్పుడు నేను ఏం చేయాలి,” అని అడిగారు. దానికి ప్రవక్త (స), ‘ఆమె మొక్కుబడిని ఆమె తరఫున నువ్వు చెల్లించు,’ అని సమాధానం ఇచ్చారు. [9] (బు’ఖారీ, ముస్లిమ్)
3434 – [ 9 ] ( متفق عليه ) (2/1023)
وَعَنْ كَعْبِ بْنِ مَالِكٍ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِنَّ مِنء تَوْبَتِيْ أَنْ أَنْخَلِعَ مِنْ مَالِيْ صَدَقَةً إِلَى اللهِ وَإِلَى رَسُوْلِهِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَمْسِكْ بَعْضَ مَالِكَ فَهُوَ خَيْرٌ لَكَ”. قُلْتُ: فَإِنِّيْ أَمْسِكُ سَهْمِي الَّذِيْ بِخَيْبَرَ. وَهَذَا طَرَفٌ مِنْ حَدِيْثِ مُطَوَّلٍ.
3434. (9) [2/1023 –ఏకీభవితం]
క’అబ్ బిన్ మాలిక్ (ర) కథనం: నేను ”ఓ ప్రవక్తా! నేను నా పశ్చాత్తాపం స్వీకరణకు కృతజ్ఞతగా నా ధనాన్నంతా అల్లాహ్ (త) మరియు ఆయన ప్రవక్త మార్గంలో ‘సదఖహ్ చేయాలని మొక్కుకున్నాను. అందువల్ల నా ధనాన్నంతా అల్లాహ్ (త) మరియు ఆయన ప్రవక్త (స) మార్గంలో దానధర్మాలు చేయాలను కుంటున్నాను,” అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘నీ ధనంలో నీ కోసం కొంత ఉంచుకో, నీకు పనికి వస్తుంది,’ అని అన్నారు. దానికి నేను, ‘ఓ ప్రవక్తా! ‘ఖైబర్ యుద్ధధనంలో నుండి నాకు లభించిన భాగాన్ని నేను ఉంచుకున్నాను,’ అని అన్నాను. (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3435 – [ 10 ] ( صحيح ) (2/1023)
عَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا نَذْرَ فِيْ مَعْصِيَةٍ وَكَفَّارَتُهُ كَفَّارَةُ الْيَمِيْنِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ.
3435. (10) [2/1023 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ అవిధేయత విషయంలో మొక్కుకున్న మొక్కుబడి చెల్లించడం ధర్మసమ్మతం కాదు. ఇటువంటి మొక్కుబడికి ప్రమాణ పరిహారం సరిపోతుంది.” (అబూ దావూద్, తిర్మిజి’, నసాయి’)
3436 – [ 11 ] ( لم تتم دراسته ) (2/1024)
وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ نَذَرَ نَذْرًا لَمْ يُسَمِّهِ فَكَفَّارَتُهُ كَفَّارَةُ يَمِيْنٍ.وَمَنْ نَذَرَنَذْرًا لَا يُطِيْقُهُ فَكَفَّارَتُهُ كَفَّارَةُ يَمِيْنٍ.وَمَنْ نَذَرَ نَذْرًا أَطَاقَهُ فَلْيَفِ بِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَوَقَفَهُ بَعْضُهُمْ عَلَى ابْنِ عَبَّاسٍ.
3436. (11) [2/1024– అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, నిరవధిక మొక్కుబడి పరిహారం ప్రమాణ పరిహారం . అదేవిధంగా పాపకార్య మొక్కుబడికీ ప్రమాణ పరిహారమే. శక్తికి మించిన మొక్కుబడికీ ప్రమాణ పరిహారమే. అదేవిధంగా తన శక్తికి తగిన విధంగా మొక్కుకుంటే దాన్ని చెల్లించాలి. (అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
3437 – [ 12 ] ( صحيح ) (2/1024)
وَعَنْ ثَابِتِ بْنِ الضَّحَاكِ قَالَ: نَذَرَ رَجُلٌ عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أَنْ يَنْحَرَإِب لًا ببُوَانَةَ فَأَتَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَأَخْبَرَهُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَلْ كَانَ فِيْهَا وَثَنٌ مِنْ أَوْثَانِ الْجَاهِلِيَّةِ يُعْبَدُ؟” قَالُوْا: لَا قَالَ: “فَهَلْ كَانَ فِيْهِ عِيْدٌ مِنْ أَعْيَادِهُمْ ؟” قَالُوْا:لَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أُوْفِ بِنَذْرِكَ فَإِنَّهُ لَا وَفَاءَ لِنَذْرٍ فِيْ مَعْصِيَةِ اللهِ وَلَا فِيْمَا لَا يَمْلِكُ ابْنُ آدَمَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3437. (12) [2/1024– దృఢం]
సా’బిత్ బిన్ ‘ద’హ్హాక్ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో ఒక వ్యక్తి బువానహ్ ప్రదేశంలో ఒంటె జిబహ్ చేస్తానని మొక్కుకున్నాడు. ఆ వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘బువాన ప్రదేశంలో అజ్ఞాన కాలంలో విగ్రహపూజ జరిగేదా?’ అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, ‘లేదు,’ అని సమాధానం ఇచ్చాడు. ప్రవక్త (స) మళ్ళీ, ‘అక్కడ ఉత్సవాలు జరిగేవా,’ అని ప్రశ్నించారు. ఆ వ్యక్తి, ‘లేదు,’ అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ప్రవక్త (స), ‘అయితే నీవు నీ మొక్కుబడి చెల్లించుకో. దైవ అవిధేయతా మొక్కుబడి చెల్లించకు. దాన్ని చెల్లించే అవసరం కూడా లేదు. అదేవిధంగా మానవుని శక్తికి మించిన మొక్కు బడి చెల్లించనవసరం లేదు,’ అని అన్నారు. (అబూ దావూద్)
3438 – [ 13 ] ( حسن ) (2/1024)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ اِمْرَأَةً قَالَتْ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ نَذَرْتُ أَنْ أَضْرِبَ عَلَى رَأْسِكَ بِالدَّفِ قَالَ: “أَوفِيْ بِنَذْرِكَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَزَادَ رَزِيْنٌ: قَالَتْ: وَنَذَرْتُ أَنْ أَذْبَحَ بِمَكَانِ كَذَا وَكَذَا مَكَانٌ يَذْبَحُ فِيْهِ أَهْلُ الْجَاهِلَيَّةِ فَقَالَ: “هَلْ كَانَ بِذَلِكَ الْمَكَان وَثَنٌ مِنْ أَوْثَانِ الْجَاهِلِيَّةِ يُعْبَدُ؟” قَالَت: لَا قَالَ: “هَلْ كَانَ فِيْهِ عِيْدٌ مِنْ أَعْيَادِهِمْ؟” قَالَتْ: لَا قَالَ: “أَوْفِيْ بِنَذْرِكِ”.
3438. (13) [2/1024 –ప్రామాణికం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి, తాతల ద్వారా, కథనం: ఒక స్త్రీ, ”తమరు జిహాద్ నుండి సురక్షితంగా వచ్చే సంతో షంలో, ‘మీ ముందు దఫ్ వాయిస్తాను,’ అని మొక్కుకున్నాను,” అని పలికింది. దానికి ప్రవక్త (స), ‘అయితే నీవు నీ మొక్కుబడి చెల్లించుకో,’ అని అన్నారు.[10] (అబూ దావూద్, రజీన్)
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ఆ స్త్రీ ”ఫలానా చోట అజ్ఞాన కాలంలో ప్రజలు జంతువులను జి’బ’హ్ చేసేవారు. నేనూ ఆ ప్రదేశంలో జంతువును జి’బ’హ్ చేయాలనుకుంటున్నాను,” అని పలికింది. దానికి ప్రవక్త (స), ‘ఆ ప్రాంతాల్లో అజ్ఞాన కాలంలో విగ్రహారాధన జరిగేదా?’ అని ప్రశ్నించారు. దానికి ఆమె, ‘లేదు,’ అని సమాధానం ఇచ్చింది. మళ్ళీ ప్రవక్త (స), ‘అక్కడ ఉత్సవాలు, జరిగేవా?’ అని అన్నారు. దానికి ఆమె, ‘లేదు’ అని సమాధానం ఇచ్చింది. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు నీ మొక్కుబడి చెల్లించుకో,’ అని అన్నారు.
3439 – [ 14 ] ( صحيح ) (2/1025)
وَعَنْ أَبِيْ لُبَابَةَ: أَنَّهُ قَالَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم: إِنَّ مِنْ تَوْبَتِيْ أَنْ أَهْجُرَ دَارَ قَوْمِيْ الَّتِيْ أَصَبْتُ فِيْهَا الذَّنْبَ وَأَنْ أَنْخَلِعَ مِنْ مَالِيْ كُلِّهِ صَدَقَةً قَالَ: “يُجْزِئُ عَنْكَ الثُّلُثُ”. رَوَاهُ رَزِيْنٌ.
3439. (14) [2/1025 –దృఢం]
అబూ లుబాబహ్ (ర) కథనం: అతడు ప్రవక్త (స)తో, ‘నా పశ్చాత్తాపంలో భాగంగా నేను పాపానికి పాల్పడిన ఆ ఇంటిని వదులుతాను, ఇంకా నా ధనాన్నంతా అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చేసివేస్తాను,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘మూడవ వంతు ధనం నీ తరఫు నుండి చాలు,’ అని అన్నారు.[11] (ర’జీన్)
3440 – [ 15 ] ( صحيح ) (2/1025)
وَعَنْ جَابِرِ بْنِ عَبْدِ اللهِ: أَنَّ رَجُلًا قَامَ يَوْمَ الْفَتْحِ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ لِلّهِ عَزَّوَجَلَّ إِنْ فَتَحَ الله عَلَيْكَ مَكَّةَ أَنْ أُصَلِّيَ فِيْ بَيْتِ الْمُقَدِسِ رَكْعَتَيْنِ قَالَ: “صَلى الله عليه وسلم هَهُنَا”. ثُمَّ عَادَ فَقَالَ: “صَلِّ هَهُنَا “ثُمَّ أَعَادَ عَلَيْهِ فَقَالَ: “شَأْنَكَ إِذَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ.
3440. (15) [2/1025 –దృఢం]
జాబిర్ బిన్ ‘అబ్దుల్లాహ్ (ర) కథనం: మక్కహ్ విజయం నాడు ఒక వ్యక్తి ప్రవక్త (స)ను, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! నేను, ”ఒకవేళ అల్లాహ్ (త) మక్కహ్ విజయం ప్రసాదిస్తే, నేను బైతుల్ ముఖద్దిస్ వెళ్ళి రెండు రకా’తులు నమా’జ్ చదువు తానని మొక్కు కున్నాను,” అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ”నువ్వు ఇక్కడ బైతుల్లాహ్‌లో నమా’జు చదువుకో, నీ మొక్కుబడి చెల్లించినట్టవుతుంది.” అతడు మళ్ళీ ప్రశ్నించాడు. ప్రవక్త (స) అలాగే సమాధానం ఇచ్చారు. అతడు మళ్ళీ ఇలాగే ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స), ‘అయితే నీ యిష్టం,’ అని అన్నారు. (అబూ దావూద్, దార్మి)
ఎందుకంటే బైతుల్ ముఖద్దస్, బైతుల్లాహ్ ఒక్కటే. ఒకవేళ ఎవరైనా బైతుల్ ముఖద్దస్‌లో నమా’జు చదువుతానని మొక్కుకొని బైతుల్లాహ్‌లో చదివితే సరిపోతుంది. అదేవిధంగా మస్జిదె నబవీలో చదివినా మొక్కుబడి తీరిపోతుంది.
3441 – [ 16 ] ( لم تتم دراسته ) (2/1025)
وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ أُخْتَ عُقْبَةَ بْنِ عَامِرٍ رَضِيَ اللهُ عَنْهُمْ نَذَرَتْ أَنْ تَحُجَّ مَاشِيَةُ وَأَنَّهَا لَا تُطِيْقُ ذَلِكَ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ لَغَنِيٌّ عَنْ مَشي أُخْتِكَ فَلْتَرْكَبْ وَلُتُهْدِ بَدَنَةُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ.
وَفِيْ رِوَايَةٍ لِأَبِيْ دَاوُدَ : فَأَمَرَهَا النَّبِيُّ صلى الله عليه وسلم أَنْ تَرْكَبَ وَتُهْدِيَ هَدْيًا.
وَفِيْ رِوَايَةٍ لَهُ: فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ لَا يَصْنَعُ بِشِقَاءِ أُخْتِكَ شَيْئًا فَلْتَرْكَبْ وَلْتَحُجَّ وَتُكَفِّرْ يَمِيْنَهَا”.
3441. (16) [2/1025 –అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ‘ఉఖ్‌బ బిన్ ‘ఆమిర్ చెల్లెలు కాలి నడకన ‘హజ్జ్ కు వెళ్తానని మొక్కుకుంది. అయితే ఆమెకు ఆ శక్తి లేదు. అప్పుడు ప్రవక్త (స) అల్లాహ్(త) నీ చెల్లెలు కాలి నడకన ‘హజ్జ్ కు వెళ్ళే అవసరం లేదు, వాహనం ఎక్కి వెళ్ళి, ఒంటెను జి’బ’హ్ చేయమను,’ అని అన్నారు. (అబూ దావూద్, దార్మి)
అబూ దావూద్‌లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ఆమెను వాహనం ఎక్కి వెళ్ళి ఒక జంతువును తీసుకు వెళ్ళమని ఆదేశించి, అల్లాహ్ (త) నీ చెల్లెలును నడిపించి కష్టపెట్టాలని కోరుకోడు, దానివల్ల ఎటువంటి ప్రతిఫలమూ లభించదు. వాహనం ఎక్కి వెళ్ళి ‘హజ్జ్ చేయమను, తన మొక్కుబడి, ప్రమాణాల పరిహారం చెల్లించమను,’ అని అన్నారు.
3442 – [ 17 ] ( لم تتم دراسته ) (2/1025)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَالِكٍ أَنَّ عُقْبَةَ بْنَ عَامِرٍسَأَلَ النَّبِيُّ صلى الله عليه وسلم عَنْ أُخْتٍ لَهُ نَذَرَتْ أَنْ تَحُجَّ حَافِيَةً غَيْرَمُخْتَمِرَةٍ فَقَالَ: مُرُوْهَا فَلْتَخْتَمِرْ وَلْتَرْكَبْ وَلْتَصُم ثَلَاثَةً أَيَّامٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.
3442. (17) [2/1025 –అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మాలిక్ (ర) కథనం: ‘ఉఖ్‌బహ్ బిన్ ‘ఆమిర్ తన సోదరి గురించి ప్రవక్త (స)తో ఆమె కాలి నడకన, తలపై కాళ్ళకు ఏమీ లేకుండా ‘హజ్జ్ కు వెళతానని మొక్కుకుందని విన్నవించుకున్నారు. ప్రవక్త (స) అతనితో, ‘ఆమెను తల కప్పుకోమను, వాహనం ఎక్కి వెళ్ళమను, మొక్కుబడి పరిహారంగా 3 రోజులు ఉపవాసాలు ఉండమను,’ అని అన్నారు. (అబూ దావూద్, తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దార్మి)
3443 – [ 18 ] ( لم تتم دراسته ) (2/1026)
وَعَنْ سَعِيْدِ بْنِ الْمُسَيِّبِ: أَنَّ أَخَوَيْنِ مِنَ الْأَنْصَارِ كَانَ بَيْنَهُمَا مِيْرَاثٌ فَسَأَلَ أَحَدُهُمَا صَاحِبَةُ الْقِسْمَةَ فَقَالَ: إِنْ عُدْت تَسْأَلُنِيْ الْقِسْمَةَ فَكُلُّ مَالِيْ فِيْ رِتَاجِ الْكَعْبَةِ فَقَالَ لَهُ عُمَرُ: إِنَّ الكعبة غَنَيَّةٌ عَنْ مَالِكَ كَفِّرْ عَنْ يَمِيْنِكَ وَكَلِّمْ أَخَاكَ فَإِنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا يَمِيْنُ عَلَيْكَ وَلَا نَذْرَ فِيْ مَعْصِيَةِ الرَّبِّ وَلَا فِيْ قَطِيْعَةِ الرَّحِمِ وَلَا فِيْمَا لَا يَمْلِكُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3443. (18) [2/1026 –అపరిశోధితం]
స’యీద్ బిన్ ముసయ్యిబ్ కథనం: ఇద్దరు అ’న్సారీ సోదరులకు ఆస్తి లభించింది. అందులో వీరిద్దరూ సమాన భాగస్వాములే. ఆస్తి గురించి, వారిలో ఒకరు ఇంకొకరితో, ‘ఈ ఆస్తిలో నుండి సగం నాకు ఇచ్చివేయి, సగం నీవు తీసుకో’ అని అన్నాడు. రెండవవాడు, ‘ఒకవేళ మళ్ళీ ఆస్తి పంపకం గురించి మాట్లాడితే నా వంతు అంతా బైతుల్లాహ్‌కు ఖర్చు అయిపోయినట్లే, అని అన్నాడు. అంటే అతడు మొక్కుబడిగా లేదా ప్రమాణంగా ఇలా అన్నాడు. దానికి ‘ఉమర్ (ర) బైతుల్లాహ్ షరీఫ్‌కు నీ ధనం అక్కర లేదు. నువ్వు నీ ప్రమాణ పరిహారం చెల్లించుకో, నీ సోదరునితో మాట్లాడుకో. ఎందుకంటే ప్రవక్త (స) ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ”అల్లాహ్ అవిధేయతలో ప్రమాణం చేయడం ధర్మం కాదు, మొక్కుకోవటమూ ధర్మం కాదు. అదేవిధంగా బంధుత్వాలు తెంపే మొక్కుబడి, ప్రమాణం కూడా ధర్మం కాదు. అదేవిధంగా మానవుని శక్తికిమించిన మొక్కుబడి కూడా చెల్లించనక్కర లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మొక్కుబడి లేదా ప్రమాణ పరిహారం చెల్లించాలి. సత్కార్యాలు చేసుకోవాలి” అని అన్నారు. (అబూ దావూద్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3444 – [ 19] ( لم تتم دراسته ) (2/1026)
عَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه و سلم يَقُوْلُ: “اَلنَّذْرُنَذْرَانِ:فَمَنْ كَانَ نَذَرَ فِيْ طَاعَةٍ فَذَلِكَ لِلّهِ فِيْهِ الْوَفَاءِ وَمَنْ كَانَ نَذَرَ فِيْ مَعْصِيَةٍ فَذَلِكَ لِلشَّيْطَانِ وَلَا وَفَاءَ فِيْهِ وَيُكَفِّرُهُ مَا يُكَفِّرُ الْيَمِيْنَ”. رَوَاهُ النَّسَائِيُّ.
3444. (19) [2/1026– అపరిశోధితం]
‘ఇమ్రాన్ బిన్ ‘హు’సైన్ కథనం: ప్రవక్త (స) ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”మొక్కుబడి రెండు రకాలు. ఒకటి అల్లాహ్ విధేయత గురించి మొక్కు కోవటం. అది అల్లాహ్ కోసం అవుతుంది. దాన్ని చెల్లించడం తప్పనిసరి. రెండవది, అల్లాహ్ అవిధేయత గురించి మొక్కుకోవటం. ఇది షై’తాన్ కోసం అవుతుంది. దీన్ని చెల్లించకూడదు. దీని పరిహారం చెల్లించాలి. (నసాయి’)
3445 – [ 20 ] ( لم تتم دراسته ) (2/1026)
وَعَنْ مُحَمَّدِ بْنِ الْمُنْتَشِرِ قَالَ: إِنَّ رَجُلًا نَذَرَ أَنْ يَنْحَرَ نَفْسَهُ إِنْ نَجَّاهُ اللهُ مِنْ عَدُوِّهِ فَسَأَلَ ابْنَ عَبَّاسٍ فَقَالَ لَهُ: سَلْ مَسْرُوْقًا فَسَأَلَهُ فَقَالَ لَهُ: لَا تَنْحَرْ نَفْسَكَ فَإِنَّكَ إِنْ كُنْتَ مُؤْمِنًا قَتَلْتَ نَفْسًا مُؤْمِنَةً وَإِنْ كُنْتَ كَافِرًا تَعَجَّلْتَ إِلَى النَّارِ وَاشْتَرْ كَبْشًا فَاذْبَحْهُ لِلْمَسَاكِيْنَ فَإِنَّ إِسْحَاقَ خَيْرٌ مِنْكَ وَفْدِيَ بِكَبْشٍ فَأَخْبَرَ ابْنَ عَبَّاسٍ فَقَالَ: هَكَذَا كُنْتُ أَرَدْتُّ أَنْ أُفْتِيَكَ. رَوَاهُ رَزِيْنٌ.
3445. (20) [2/1026– అపరిశోధితం]
ము’హమ్మద్ బిన్ మున్‌తషిర్ కథనం: ఒక వ్యక్తి, ”ఒకవేళ అల్లాహ్ (త) తనను శత్రువుల నుండి రక్షిస్తే తన్ను తాను నరుక్కుంటానని దాన్ని మీకు సమర్పిస్తానని,” మొక్కుకున్నాడు. ఆ వ్యక్తి ఇబ్నె ‘అబ్బాస్ (ర) వద్దకు వచ్చి దీన్ని గురించి ప్రశ్నించాడు. ఇబ్నె ‘అబ్బాస్ (ర), ‘నువ్వు మస్‌రూఖ్ దగ్గరకు వెళ్ళి అడుగు,’ అని అన్నారు. ఆ వ్యక్తి మస్‌రూఖ్ వద్దకు వెళ్ళి అడిగాడు. దానికి అతడు, ‘నువ్వు ఆత్మ హత్య చేసుకోకు, నిన్ను నీవు, చంపుకోకు. ఎందుకంటే నువ్వు ముస్లిమ్‌వి, అయితే నువ్వు నీ ముస్లిమ్ ఆత్మను చంపుతావు, అది నిషిద్ధం. ఒకవేళ నువ్వు అవిశ్వాసి అయితే నరకంలోనికి వెళ్ళడానికి తొందరపెడు తున్నావు. నువ్వు ఒక గొర్రెను కొనుక్కో. నీ స్థానంలో గొర్రెను జి’బ’హ్ చేసి పేదలకు తినిపించు. ఎందుకంటే ఇస్’హాఖ్ (అ) నీ కంటే ఉత్తములు. అతనికి బదులుగా గొర్రెను జి’బ’హ్ చేయడం జరిగింది,’ అని అన్నారు. ఆ వ్యక్తి ఇబ్నె ‘అబ్బాస్‌తో ఇదంతా చెప్పాడు. అప్పుడు ఇబ్నె ‘అబ్బాస్ నేను కూడా నీ ప్రశ్నకు ఇటువంటి తీర్పునే ఇవ్వాలని అనుకున్నాను,’ అని అన్నారు.[12] (ర’జీన్)
*****
[1]) వివరణ-3409: లాత్, ఉజ్జా అనేవి మక్కాలోని రెండు విగ్రహాలు. విగ్రహారాధకులు ఆ విగ్రహాలపై ప్రమాణం చేసే వారు. విగ్రహాలపై ప్రమాణం చేసేవారు విగ్రహారాధకు లౌతారు. ఒకవేళ ముస్లిమ్ నోట ఇటువంటి పదాలు వెలువడితే వెంటనే క్షమాపణ కోరాలి. పశ్చాత్తాపపడాలి. ”లా యిలాహ ఇల్లల్లాహ్” అని పలికి తన విశ్వాసాన్ని సరిచేసుకోవాలి. అదేవిధంగా జూదం ఆడటం నిషిద్ధం. ఒకవేళ ఒక వ్యక్తి మరో వ్యక్తిని జూదం ఆడటానికి పిలిస్తే సదఖా దాన ధర్మాలు చేయాలి.
[2]) వివరణ-3414: ప్రమాణాన్ని నెరవేర్చడం మంచిదే. తన ఇంటివారికి నష్టం కలిగే భయం ఉన్న ప్రమాణాన్ని భంగ పరచడం తప్పనిసరి అవుతుంది. భంగపరచని వాడు పాపానికి గురవుతాడు. ఉదా: నేను నా భార్యతో పాటు భోజనం చేయను, ఆమెతో మాట్లాడను, బజారు నుండి ఏ వస్తువు కొని తీసుకురాను మొదలైనవి. ఇటువంటి ప్రమాణాలను భంగపరచడం తప్పనిసరి. పరిహారం చెల్లించడం కూడా తప్పనిసరి. ఇటువంటి ప్రమాణంపై అంటిపెట్టుకొని ఉండటం మహానేరం. ఎందుకంటే ఇందులో ఇంటివారికి అన్యాయం జరుగుతుంది.
[3]) వివరణ-3415: అంటే పాలకుడు లేదా ఖా’దీ ఏదైనా విషయంపై ప్రమాణం చేయిస్తే, ప్రమాణం చేసినవాడు తెలివిగా తన్ను తాను పాపానికి దూరంగా ఉంచడానికి ప్రమాణంచేసి దాన్ని వేరే విషయంగా భావిస్తే, దానివల్ల ఏమీ లాభం ఉండదు. ఏ విషయంపై ప్రమాణం చేయిస్తే ప్రమాణం దానిపైనే అవుతుంది. క్రింద ‘హదీసు’లు వస్తున్నాయి.
[4]) వివరణ-3424: అంటే ఒకవేళ ప్రమాణం చేసినపుడు ‘ఇన్షాఅల్లాహ్ నేను ఫలానా పని చేస్తాను’ అని పలికి ఆ పని చేయకపోతే, తన ప్రమాణానికి వ్యతిరేకంగా చేయటం వల్ల పాపమూ చుట్టుకోదు, పరిహారమూ ఉండదు.
[5]) వివరణ-3426: అంటే పిసినారి సంతోషంగా అల్లాహ్ మార్గంలో ఖర్చుచేయడు. కాని మొక్కుకుంటే, దైవం అతని కోరిక తీర్చితే మాత్రం ఖర్చుపెడతాడు. అయితే మొక్కుబడుల వల్ల ఎటువంటి లాభమూ లేదు. ఇంకా ఈ మొక్కుబడులు కష్టాలను, ఆపదలను దూరం చేయలేవు. విధివ్రాతను మార్చలేవు. అందువల్ల మొక్కుబడుల వల్ల ఎటువంటి లాభమూ లేదు. కాని ఒకవేళ మొక్కుకుంటే, అల్లాహ్ ఆ పనిచేయించివేస్తే, దాన్ని చెల్లించడం తప్పనిసరి అవుతుంది. మొక్కు కోవటాన్ని ఎందుకు వారించడం జరిగిందంటే, మొక్కుకొని అలసతనాన్ని ప్రదర్శించకూడదు. ఎందుకంటే మొక్కుకుంటే దాన్ని పూర్తిచేయడం తప్పనిసరి అవుతుంది.
[6]) వివరణ-3427: అంటే ఎవరైనా ఒకవేళ ఈ పని అయితే నేను ఉపవాసం పాటిస్తాను, లేదా ‘హజ్ చేస్తాను లేదా ‘సదఖహ్, దానధర్మాలు చేస్తాను అని మొక్కు కుంటే ఇటువంటి మొక్కుబడి పూర్తిచేయాలి. ఎందుకంటే ఇది సత్కార్యం. ఒకవేళ ఎవరైనా ఈ పని అయితే ఫలానా వ్యక్తి సమాధిపై ఖరీదైన దుప్పటిని సమర్పిస్తాను, లేదా దీపాలు వెలిగిస్తాను అని మొక్కు కుంటే, ఇటువంటి మొక్కుబడులు నిషిద్ధం. ఇలా ఎంతమాత్రం చేయరాదు. ఇటువంటి మొక్కుబడికి తప్ప కుండా పరిహారం చెల్లించాలి.
[7]) వివరణ-3429: ప్రమాణం భంగం చేస్తే చెల్లించే పరిహారమే. మొక్కుబడి భంగం చేసినా చెల్లించాలి.
[8]) వివరణ-3430: ప్రవక్త (స) అతని మొక్కుబడిని రద్దు చేసారు. ఇటువంటి పనులకు మన జీవన విధానంలో ఎటువంటి ప్రతిఫలం లేదు. ఇది కేవలం తన్ను తాను హింసించుకోవటమే అవుతుంది. అనవసరంగా తన్ను తాను పాపానికి గురిచేసుకోవడమే అవుతుంది. అభిలషణీయమైన మొక్కుబడులు పూర్తి చేయడంలో తప్పులేదు.
అబూదావూద్, బైహఖీలలో ఇలా ఉంది, ”ఒక స్త్రీ ఒకవేళ ప్రవక్త (స) యుద్ధం నుండి సురక్షితంగా వస్తే ప్రవక్త (స) ముందు, దఫ్ వాయిస్తానని మొక్కుకుంది. ప్రవక్త (స) ఆమెతో, ‘నీ మొక్కుబడి చెల్లించు,’ అని అన్నారు. కొందరు ధర్మసమ్మతమైన విషయాల్లో మొక్కుబడి చేసుకోవచ్చును. దఫ్ వాయించడం ఇస్లామీయ సంతోషానికే. ఇది కూడా పుణ్యకార్యమే.
[9]) వివరణ-3433: ఈ ‘హదీసు’ ద్వారా ఒకవేళ మరణించిన వారి తరఫున మొక్కుబడి బాకీఉంటే వారి తరఫున వారి వారసులు చెల్లించాలి అని తెలిసింది.
[10]) వివరణ-3438: పెళ్ళి సందర్భంగా దఫ్ వాయించే అనుమతి లభించింది. ప్రవక్త (స) సురక్షితంగా వస్తే, తాను దఫ్ వాయిస్తానని మొక్కుకుంది. ఆమె సంతోషం దృష్టిలో పెట్టుకొని ప్రవక్త (స) దఫ్ వాయించే అనుమతి ఇచ్చారు.
[11]) వివరణ-3439: అబూ లుబాబహ్ రిఫా‘అ, ‘ఔస్ వర్గానికి చెందినవారు. ‘ఉఖ్‌బహ్ సానియలో ఇస్లామ్ స్వీకరించారు. దూతగా కూడా పని చేసారు. ప్రముఖ అనుచరుల్లో ఒకరు. ప్రవక్త (స)ను అమితంగా ప్రేమించే వారిలో ఒకరు. యుద్ధాలు: అనేక యుద్ధాలలో పాల్గొన్నారు. అయితే బద్ర్ యుద్ధంలో ప్రత్యేకత లభించింది. ప్రతి ఒంటెపై ముగ్గురు కూర్చున్నారు. అబూ లుబాబహ్ కూర్చున్న ఒంటె మహారాజులకు చెందినది. అలీ (ర) కూడా దానిపైనే కూర్చున్నారు. వంతుల ప్రకారం దిగుతూ ఎక్కుతూ ఉన్నారు. ప్రవక్త (స) దిగే సమయం వస్తే వీళ్ళిద్దరూ, ”తమరు కూర్చోండి మేము నడుస్తాము,” అని అనేవారు. కాని ప్రవక్త (స), ”మీరు నా కంటే ఎక్కువ నడవలేరు, నా కంటే ఎక్కువ పుణ్యమూ మీ దగ్గర లేదు,” అని అనేవారు. (తబఖాతు ఇబ్నె సఅద్) మదీనహ్ నుండి రెండు రోజుల ప్రయాణ దూరంలో రూమా అనే ప్రదేశం ఉంది. అక్కడకు చేరి ప్రవక్త (స) అబూ లుబాబహ్ ను మదీనహ్ కు తన ఉప అధికారిగా నియమించి తిరిగి పంపివేసారు. యుద్ధంలో వచ్చే యుద్ధరంగంలో ఇతరుల్లాగే అతని వంతును కూడా చేర్చేవారు. ఖైన్‌ఖాహ్ మరియు సువైలిఖ్ యుద్ధాల్లో కూడా వీరే మదీనహ్ కు ప్రవక్త (స) తరఫున అధికారిగా ఉండేవారు. (తబఖాత్ ఇబ్నెసఅద్)
5వ హిజ్రీలో ప్రవక్త (స) ఇస్లామ్ శత్రువులైన బనీ ఖురైజహ్ యూదులను చుట్టుముట్టారు. వీరు ఔస్ తెగకు మిత్రులు. అందువల్ల వీరు అబూ లుబాబహ్ ను సంప్రదింపుల కోసం పిలిచారు. అక్కడకు చేరిన తరువాత యూదులు చాలా ఘనంగా సత్కరించారు. వారి ముందు అసలు విషయం పెట్టారు. యూదుల స్త్రీలు, పిల్లలు ఏడుస్తూ అతని ముందుకు వచ్చారు. అది చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశం. దాన్ని చూచి ఆయన కలత చెందారు. ”నా అభిప్రాయం ఏమిటంటే ప్రవక్త (స) ఆదేశాన్ని మీరు స్వీకరించాలి. మెడవైపు సైగ చేస్తూ, స్వీకరించని పక్షంలో చంపబడతారు,” అని హెచ్చరించారు. కాని తరువాత అల్లాహ్ మరియు ప్రవక్త (స) పట్ల ద్రోహం జరిగిందని తెలియగానే అతని కాళ్ళ క్రింద భూమి క్రుంగిపోయింది. అక్కడ నుండి లేచి మస్జిదె నబవీలోనికి వచ్చి ఒక దృఢమైన సంకెళ్ళతో తన్ను తాను బంధించుకున్నారు. అల్లాహ్ నా తౌబహ్ స్వీకరించే వరకు ఈ విధంగానే బంధించబడి ఉంటాను అని నిశ్చయించుకున్నారు. చాలా సమయం గడచిన తర్వాత ప్రవక్త (స) ప్రజలను అడిగారు. జరిగినదంతా తెలిసి ప్రవక్త (స) జరిగిందేదో జరిగింది. ఒకవేళ అతను నా దగ్గరకు వస్తే నేను ఇస్తిగ్‌ఫార్ చేసేవాడిని. 8 రోజులు ఇలాగే గడిచి పోయాయి. కాలకృత్యాలకు సంకెళ్ళు విప్పుకునేవారు. అయిన తర్వాత అతని కుమార్తె అతన్ని మళ్ళీ కట్టివేసేది. నిరాహార దీక్షలో ఉండేవారు. చెవులు కూడా వినబడలేదు. కళ్ళుకూడా కనబడ్డం లేదు. శక్తి క్షీణించి స్పృహ కోల్పోయి క్రింద పడిపోయారు. అప్పుడు దివ్యవాణి అవతరించింది. ప్రవక్త (స) ఉమ్మె సలమహ్ (ర) ఇంట్లో ఉన్నారు. ఫజ్‌ర్‌కి ముందు తౌబహ్ ఆయతు అవతరించింది. ప్రవక్త (స) సంతోషంతో చిరునవ్వు నవ్వసాగారు. అప్పుడు ఉమ్మె సలమహ్ అల్లాహ్ ప్రవక్తా! అల్లాహ్ (త) మీకు ఎల్లప్పుడూ నవ్వించే మాట్లాడాడు. అప్పుడు ప్రవక్త (స) అబూ లుబాబహ్ తౌబహ్ స్వీకరించబడింది అని అన్నారు. ఇంత అన్నంతనే ఈ వార్త పట్టణం అంతా వ్యాపించింది. ప్రజలు అబూ లుబాబహ్ సంకెళ్ళు విప్పడానికి వచ్చారు. అప్పుడు అబూ లుబాబహ్, ”ప్రవక్త (స) విప్పటానికి వచ్చే వరకు ఈ స్థితిలోనే ఉంటా,” అని అన్నారు. ఉదయం ప్రవక్త (స) వచ్చి తన చేతులతో స్వయంగా అబూ లుబాబహ్ సంకెళ్ళనుండి తొలగించారు. అబూ లుబాబహ్ సంతోషం పట్టలేక నేను నా ఇల్లూ వాకిలీ వదలి మీ వెంటే ఉంటానని, నా ధనమంతా దానధర్మాలు చేసేవేస్తానని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ”1/3వ వంతు దాన ధర్మాలు చేయి,” అని అన్నారు. సూరహ్ తౌబలో ఈ ఆయతులు అవతరించబడ్డాయి: ”ఓవిశ్వాసులారా! మీరు అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు నమ్మక ద్రోహం చేయకండి మరియు తెలిసి ఉండి కూడా మీ (పరస్పర) అమానతుల విషయంలో నమ్మకద్రోహం చేయకండి. మరియు వాస్తవానికి మీ ఆస్తిపాస్తులు, మీ సంతానం, పరీక్షాసాధనాలనీ మరియు నిశ్చయంగా, అల్లాహ్ వద్ద గొప్ప ప్రతిఫలం ఉన్నదనీ తెలుసుకోండి! ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మీకు (మంచి-చెడులను గుర్తించే) విచక్షణాశక్తిని ప్రసాదించి, మీ నుండి మీ పాపాలను తొలగించి మిమ్మల్ని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ దాతృత్వంలో సర్వోత్తముడు.” (అల్-అన్ఫాల్, 8:27)
[12]) వివరణ-3445: మస్‌రూఖ్ తాబెయీల్లో చాలా పెద్ద పండితులు. ‘హదీసు’వేత్తలు. ఇబ్నె ‘అబ్బాస్ అతని తీర్పును సమర్థించారు. అయితే పొరపాటున ఇస్’హాఖ్ (అ) పేరు ప్రస్తావించారు. వాస్తవం ఏమిటంటే ఇస్మా‘యీల్ (అ)కు బదులుగా గొర్రెను జిబహ్ చేయడం జరిగింది.
***