14- كِتَابُ الْعِتْقِ
14. బానిసల విడుదల పుస్తకం
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3382 – [ 1 ] ( متفق عليه ) (2/1010)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَعْتَقَ رَقَبَةً مُسْلِمَةً أَعْتَقَ اللهُ بِكُلِّ عُضْوٍ مِنْهُ عُضْوًا مِّنَ النَّارِ حَتَّى فَرْجَهُ بِفَرْجِهِ”.
3382. (1) [2/101 –ఏకీభవితం]
అబూహురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా ఒక ముస్లిమ్ బానిసను విడుదల చేస్తే అల్లాహ్ (త)ఆ బానిస యొక్క ప్రతి ఒక్క అవయవానికి బదులు అతని అవయవాలకు నరకం నుండి విముక్తి ప్రసాదిస్తాడు. చివరకు అతని మర్మాంగానికి బదులు విడుదల చేసిన వాని మర్మాంగానికి విముక్తి ప్రసాదిస్తాడు.[1] (బు’ఖారీ, ముస్లిమ్)
3383 – [ 2 ] ( متفق عليه ) (2/1010)
وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: سَأَلْتُ النَّبِيَّ صلى الله عليه وسلم: أَيُّ الْعَمَلِ أَفْضَلُ؟ قَالَ: “إِيْمَانٌ بِاللهِ وَجِهَادٌ فِيْ سَبِيْلِهِ” .قَالَ: قُلْتُ: فَأَيُّ الرِّقَابِ أَفْضَلُ؟ قَالَ: “أَغُلَاهَا ثَمَنًا وَأَنْفسُهَا عِنْدَ أَهْلِهَا”. قُلْتُ: فَإِنْ لَمْ أَفْعَلْ؟ قَالَ: ” تُعِيْنُ صَانِعًا أَوْ تَصْنَعُ لِأَخْرَقَ”. قُلْتُ: فَإِنْ لَمْ أَفْعَلْ؟ قَالَ: “تَدَعُ النَّاسَ مِنَ الشَّرِّفَإِنَّهَا صَدَقَةٌ تَصَدَّقُ بِهَا عَلَى نَفْسِكَ”.
3383. (2) [2/1010–ఏకీభవితం]
అబూ జ’ర్ (ర) కథనం: ప్రవక్త (స) ను నేను, ‘ఏ సత్కార్యం అన్నిటికంటే గొప్పది,’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘అల్లాహ్ (త)ను విశ్వసించడం, ఆయన మార్గంలో కృషి (జిహాద్) చేయటం,’ అని అన్నారు. నేను మళ్ళీ, ‘ఎటువంటి బానిసను విడుదల చేయడం అన్నిటికంటే ఉత్తమం,’ అని ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స), ‘అధిక ధర గలవాణ్ణి, యజమానికి చాలా ఇష్టమైనవాణ్ణి,’ అని అన్నారు. నేను, ‘ఒకవేళ ఈ పనులు చేయలేకపోతే గొప్ప స్థానం కోసం మరే పని చేయగలను?’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘ఏ ముస్లింకైనా సహాయం చేయి లేదా సంపాదించి తినలేని వ్యక్తికి సహాయపడు.’ దానికి నేను, ‘ఒకవేళ ఇది చేయలేక పోతే,’ అని అడిగితే, ‘నువ్వు ప్రజలకు హాని చేకూర్చకు. వారికి కీడు తలపెట్టకు. నీ కోసం ఇదే సదఖా అవుతుంది. అంటే కీడు, హాని తలపెట్టకపోయినా సదఖా పుణ్యం లభిస్తుంది,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3384 – [ 3 ] ( صحيح ) (2/1010)
عَنِ الْبَرَاءِ بْنِ عَازِبِ قَالَ: جَاءَ أَعْرَابِيٌّ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: عَلِّمْنِيْ عَمَلًا يُدْخِلُنِيَ الْجَنَّةَ قَالَ: “لئن كُنْتَ أَقْصَرْتَ الْخُطْبَةَ لَقَدْ أَعْرَضْتَ الْمَسْأَلَةَ أَعْتِقِ النَّسَمَةَ وَفُكَّ الرَّقَبَةَ”. قَالَ: أَوْ لَيْسَا وَاحِدًا؟ قَالَ: “لَا عِتْقُ النَّسَمَةِ: أَنْ تَفَرَّدَ بِعِتْقِهَا وَفَكُّ الرَّقَبَةِ: أَنْ تُعِيْنَ فِيْ ثَمَنِهَا وَالْمِنْحَةَ: الْوَكُوْفَ وَالْفَيْءَ عَلَى ذِي الرُّحِمِ الظَّالِمِ فَإِنْ لَمْ تُطِقْ ذَلِكَ فَأَطْعِمِ الْجَائِعَ وَاسْقِ الظّمْآنَ وَأَمُرُ بِالْمَعْرُوْفِ وَانَّهُ عَنِ الْمُنْكَرِ فَإِنْ لَمْ تُطِقْ فَكُفَّ لِسَانَكَ إِلَّا مِنْ خَيْرٍ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ .
3384. (3) [2/1010– దృఢం]
బరా’ బిన్ ‘ఆ’జిబ్ (ర) కథనం: ఒక పల్లెవాసి ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ ప్రవక్తా! నేను స్వర్గంలో ప్రవేశించగలిగే ఏదైనా సత్కార్యం ఉంటే చెప్పండి,’ అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స), ‘నీ ప్రశ్న చాలా పెద్దది కాని నువ్వు సంక్షిప్తంగా అడిగావు, చాలా గొప్ప ప్రశ్నవేసావు, ఒక ప్రాణిని విడుదలచేయి లేదా బానిసను విడుదల చేయి,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘ఈ రెండు విషయాలు ఒకటి కావు,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘కాదు ప్రాణిని విడుదల చేయడం అంటే నువ్వు ఒక్కడివే ఒక బానిసను విడుదల చేయడం, బానిసను విడుదల చేయడం అంటే అతన్ని విడుదల చేయడంలో పాలుపంచు కోవటం, అంటే కొంతమంది కలసి విడుదల చేయండి. స్వర్గంలో పంపగలిగే మరో విషయం ఉంది. అదేమిటంటే బీదవానికి పాలిచ్చే జంతువును ఇచ్చివేయండి. ఇంకా దుర్మార్గుడైన బంధువుకు ఉపకారం చేయండి. ఒకవేళ అదీ సాధ్యం కాకపోతే ఆకలిగొన్న వానికి అన్నం పెట్టండి. దాహంగా ఉన్న వానికి నీళ్ళు త్రాపించండి. ప్రజలను మంచిని గురించి ఆదేశించండి, చెడునుండి వారించండి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే మీ నోటిని అదుపులో ఉంచండి. మంచి మాటలు తప్ప మరేమీ మాట్లాడకండి,’ అని అన్నారు. (బైహఖీ–షు’అబిల్ ఈమాన్)
3385 – [ 4 ] ( لم تتم دراسته ) (2/1011)
وَعَنْ عَمْرِو بْنِ عَبَسَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ بَنَى مَسْجِدًا لِيُذْكَرَ اللهُ فِيْهِ بُنِيَ لَهُ بَيْتٌ فِي الْجَنَّةِ. وَمَنْ أَعْتَقَ نَفْسًا مُسْلِمَةً كَانَتْ فِدْيَتَهُ مِنْ جَهَنَّمَ. وَمَنْ شَابَ شَيْبَةً فِيْ سَبِيْلِ اللهِ كَانَتْ لَهُ نُوْرًا يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.
3385. (4) [2/1011–అపరిశోధితం]
‘అమ్ర్ బిన్ ‘అబసహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దైవప్రార్థనా నిమిత్తం ఎవరైనా మస్జిద్ నిర్మిస్తే, అతని కోసం అల్లాహ్ (త) స్వర్గంలో భవనం నిర్మిస్తాడు. ఇంకా ఎవరైనా ముస్లిమ్‌ను విడుదల చేస్తే, అల్లాహ్ (త) అతన్ని నరకం నుండి విముక్తి ప్రసాదిస్తాడు. ఇంకా దైవమార్గంలో అంటే జిహాద్ మరియు ఇతర సత్కార్యాల్లో వృద్ధాప్యానికి చేరితే, ఈ వృద్ధాప్యం తీర్పుదినం రోజు అతనికోసం వెలుగుగా పనిచేస్తుంది. (షర’హ్ సున్నహ్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3386 – [ 5 ] ( ضعيف ) (2/1011)
عَنِ الْغَرِيْفِ بٍنِ عَيَّاشٍ الدَّيْلَمِيِّ قَالَ: أَتَيْنَا وَاثلةَ بْنَ الْأَسْقَعِ فَقُلْنَا: حَدَّثَنَا حَدِيْثًا لَيْسَ فِيْهِ زِيَادَةٌ وَلَا نُقْصَانٌ فَغَضِبَ وَقَالَ: إِنَّ أَحَدَكُمْ لَيَقْرَأُ وَمُصْحَفُهُ مُعَلَّقٌ فِيْ بَيْتِهِ فَيَزِيْدُ وَيَنْقُصُ فَقُلْنَا: إِنَّمَا أَرَدْنَا حَدِيْثًا سَمِعْتَهُ مِنَ النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: أَتَيْنَا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فِيْ صَاحِبِ لَنَا أَوْجَبَ يَعْنِيْ النَّارَ بِالْقَتْلِ فَقَالَ: “أَعْتِقُوْا عَنْهُ يُعْتِقِ اللهُ بِكُلِّ عُضْوٍ مِّنْهُ عُضْوًامِّنْهُ مِّنَ النَّارِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.
3386. (5) [2/1011-బలహీనం]
‘గరీఫ్ బిన్ ‘అయ్యాష్ దైలమీ (ర) కథనం: నేను వాసి’లహ్ బిన్ అస్‌ఖ’అ వద్దకు వచ్చాను. ‘హెచ్చు తగ్గులు లేని ఏదైనా ‘హదీసు’ ఉంటే వినిపించండి,’ అని అన్నాను. అది విని అతను అయిష్టానికి గురయి, ‘మీలో ప్రతి ఒక్కరూ ఖుర్‌ఆన్ పఠిస్తారు. ఖుర్‌ఆన్ వారి ఇంట్లో వ్రేలాడి ఉంటుంది. అతడు అందులో హెచ్చుతగ్గులు చేయగలడా?’ అని అన్నారు. దానికి మేము, ‘మా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు స్వయంగా ప్రవక్త (స) ద్వారా విన్న ‘హదీసు’ దేన్నయినా వినిపించండి,’ అని అన్నాము. అప్పుడతను ఇలా అన్నారు, ‘నేను ప్రవక్త (స) వద్దకు నా స్నేహితుని విషయం గురించి వెళ్ళాను. అతడు ఒక వ్యక్తిని హత్యచేసాడు. అందువల్ల అతడికి నరకం తప్పని సరి అయిపోయింది. అతని తరఫున ఒక బానిసను విడుదల చేయమని, అల్లాహ్ (త) అతని ప్రతి అవయవానికి బదులు ఇతని ప్రతి అవయవాన్ని నరకం నుండి విముక్తి ప్రసాదిస్తాడని ప్రవక్త (స) ఆదేశించారు.’ (అబూ దావూద్, నసాయి)
3387 – [ 6 ] ؟ (2/1012)
وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَفْضَلُ الصَّدَقَةِ الشَّفَاعَةُ بِهَا تُفَكُّ الرَّقَبَةُ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.
3387. (6) [2/1012–?]
సమురహ్ బిన్ జున్‌దుబ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అన్నిటికంటే ఉత్తమమమైన ‘సదఖహ్ ఒక వ్యక్తి గురించి, అతని ప్రాణం పోకుండా ఉండేటట్లు సిఫారసు చేయడం.[2] (బైహఖీ— షు’అబిల్ ఈమాన్)
=====
- بَابُ إِعْتَاقِ الْعَبْدِ الْمُشْتَرَكِ وَشِرَاءِ الْقَرِيْبِ والعِتْق في المَرض
- భాగస్వామ్య బానిసకు స్వేచ్ఛనివ్వటం,
దగ్గరి బానిస బంధువును కొనటం,
అనారోగ్య బానిసకు స్వేచ్ఛనివ్వటం
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3388 – [ 1 ] ( متفق عليه ) (2/1013)
عَنِ ابْنِ عُمَرَرَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَعْتَقَ شِرْكًا لَهُ فِيْ عَبْدٍ وَكَانَ لَهُ مَالٌ يَبْلُغُ ثَمَنَ الْعَبْدِ قُوِّمَ الْعَبْدُ قِيْمَةَ عَدْلٍ فَأُعْطِيَ شُرَكَاؤُهُ حِصَصَهُمْ وَعَتَقَ عَلَيْهِ الْعَبْدُ وَإِلَّا فَقَدْ عَتَقَ مِنْهُ مَا عَتَقَ”.
3388. (1) [2/1013 –ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భాగస్వామ్య బానిసలో తన వంతును విడుదల చేసినవాడు, ఒకవేళ అతని వద్ద బానిస యొక్క ఇతర భాగస్వాముల వంతులను కొనే శక్తి ఉంటే వంతులన్నీ కొని బానిసను తన తరఫున విడుదల చేయాలి. న్యాయంగా ఆ బానిసను ధరకట్టి భాగస్వాములకు వారి పూర్తి మొత్తాన్ని చెల్లించాలి. ఒకవేళ అంత శక్తి లేకపోతే అతడు విడుదల చేసినంత విడుదల అయిపోయాడు.” (బు’ఖారీ, ముస్లిమ్)
3389 – [ 2 ] ( متفق عليه ) (2/1013)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ أَعْتَقَ شِقْصًا فِيْ عَبْدِ أُعْتِقَ كُلُّهُ إِنْ كَانَ لَهُ مَالٌ فَإِنْ لَمْ يَكُنْ لَهُ مَالٌ اُسْتُسْعِيَ الْعَبْدُ غَيْرَ مَشْقُوْقٍ عَلَيْهِ”.
3389. (2) [2/1013 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తి బానిసలోని తన వంతును విడుదల చేస్తే, ఒకవేళ అతనివద్ద భాగస్వాములకు మిగిలిన వంతులు ఇచ్చి కొనేశక్తి ఉంటే బానిస మొత్తం విడుదల అయిపోతాడు. ఒకవేళ అతని వద్ద అంత ధనం లేకపోతే, ఆ బానిసకు ప్రయత్నించే వీలు కల్పించాలి. అతనిపై భారం వేయరాదు. అంటే విడుదల చేసినంత అతడు విడుదల అయిపోయాడు. మిగిలింది ఆ బానిస తన స్వాతంత్ర్య దినాల్లో కష్టపడి డబ్బు సంపాదించి, ప్రయత్నించి తన మిగిలిన యజమానులకు ఇచ్చివేయాలి. మొత్తం డబ్బు ఇచ్చివేస్తే పూర్తిగా విడుదల అయిపోతాడు. (బు’ఖారీ)
3390 – [ 3 ] ( صحيح ) (2/1013)
وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ: أَنَّ رَجُلًا أَعْتَقَ ستَّةَ مَمْلُوْكِيْنَ لَهُ عِنْدَ مَوْتِهِ لَمْ يَكُنْ لَهُ مَالٌ غَيْرُهُمْ فَدَعَا بِهِمْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَجَزَّأهُمْ أَثْلَاثًا ثُمَّ أَقْرَعَ بَيْنَهُمْ فَأَعْتَقَ اثْنَيْنِ وَأَرَقَّ أَرْبَعَةً وَقَالَ لَهُ قَوْلًا شَدِيْدًا. رَوَاهُ مُسْلِمٌ وَرَوَاهُ النَّسَائِيُّ عَنْهُ وَذَكَرَ: “لَقَدْ هَمَمْتُ أَنْ لَا أُصَلِّيَ عَلَيْهِ”بَدْلَ: وَقَالَ لَهُ قَوْلًا شَدِيْدًا وَفِيْ رِوَايَةٍ أَبِيْ دَاوُدَ: قَالَ: “لَوْ شَهِدْتُّهُ قَبْلَ أَنْ يُدْفَنَ لَمْ يُدْفَنْ فِيْ مَقَابِرِالْمُسْلِمِيْنَ”.
3390. (3) [2/1013 –దృఢం]
‘ఇమ్‌రాన్ బిన్ ‘హు’సైన్ (ర) కథనం: ఒక వ్యక్తి తాను మరణించినప్పుడు, ఆరుగురు బానిసలను విడుదల చేసాడు. వారు తప్ప అతని వద్ద మరే ధన సంపదలూ లేవు. ప్రవక్త (స) ఆ బానిసలందరినీ పిలిపించారు. వారిని మూడు భాగాలుగా చేసి, వారి మధ్య చీటీలు వేసి వారిలో ఇద్దరిని విడుదల చేసారు. నలుగురిని బానిసలుగా ఉంచారు. ఈ విధంగా విడుదల చేసిన వాడిని కఠినంగా విమర్శించారు. [3] (ముస్లిమ్, నసాయి’)
మరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”నేనతని జనా’జహ్ నమా’జు చదవకూడదని నిర్ణయించు కున్నాను,” అని ప్రవక్త (స) అన్నారు. అబూ దావూద్‌లో ఇలా ఉంది: ”అతన్ని ఖననం చేసి నప్పుడు నేనక్కడ ఉంటే అతన్ని ముస్లిముల ఖనన వాటికలో ఖననం చేయనిచ్చేవాడిని కాదు” అని అన్నారు.
3391 – [ 4 ] ( صحيح ) (2/1014)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَجْزِيْ وَلَدٌ وَالِدَهُ إِلَّا أَنْ يَّجِدَهُ مَمْلُوْكًا فَيَشْتَرِيَهُ فَيُعْتِقَهُ”. رَوَاهُ مُسْلِمٌ .
3391. (4) [2/1014– దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఏ కొడుకూ తన తండ్రి చేసిన ఉపకారానికి పరిపూర్ణ బదులు తీర్చలేడు. అయితే తండ్రి ఒకరికి బానిసగా ఉంటే అతన్ని కొని విడుదల చేయడం తప్ప.[4] (ముస్లిమ్)
3392 – [ 5 ] ( متفق عليه ) (2/1014)
وَعَنْ جَابِرٍ: أَنَّ رَجُلًا مِنَ الْأَنْصَارِ دَبَّرَ مَمْلُوْكَا وَلَمْ يَكُنْ لَهُ مَالٌ غَيْرُهُ فَبَلَغَ النَّبِيُّ صلى الله عليه وسلم فَقَالَ: “مَنْ يَشْتَرِيْهِ مِنِّيْ؟” فَاشْتَرَاهُ نُعَيْمُ بْنُ النَّحَامِ بِثَمَانِمِائَةِ دِرْهَمٍ. مُتَّفَقٌ عَلَيْهِ.
وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ: فَاشْتَرَاهُ نُعَيْمُ بْنُ عَبْدِ اللهِ الْعَدَوِيُّ بِثَمَانِ مِائَةِ دِرْهَمٍ فَجَاءَ بِهَا إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَدَفَعَهَا إِلَيْهِ ثُمَّ قَالَ: “اِبْدَأْ بِنَفْسِكَ فَتَصَدَّقْ عَلَيْهَا فَإِنْ فَضَلَ شَيْءٌ فَلِأَهْلِكَ فَإِنْ فَضَلَ عَنْ أَهْلِكَ شَيْءٌ فَلذِيْ قَرَابَتِكَ فَإِنْ فَضَلَ عَنْ ذِيْ قَرَابَتِكَ شَيْءٌ فَهَكَذَا وَهَكَذَا” يَقُوْلُ: فَبَيْنَ يَدَيْكَ وَعَنْ يَمِيْنِكَ وَعَنْ شِمَالِكَ.
3392. (5) [2/1014 –ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: ఒక అన్సారీ వ్యక్తి తన బానిసను ముదబ్బిర్ చేసాడు. అంటే బానిసతో, ‘నేను చనిపోయిన తర్వాత నువ్వు స్వతంత్రుడివి,’ అని అన్నాడు. అయితే ఆ బానిస తప్ప అతని వద్ద మరే ఆస్తీ లేదు. ప్రవక్త (స)కు ఈ వార్త అందినవెంటనే ప్రజలతో, ‘అతని ముదబ్బిర్ను నా నుండి ఎవరు కొంటారు,’ అని అన్నారు. ను’ఐమ్ బిన్ న’హామ్ ఆ బానిసను 800 దిర్‌హమ్‌లకు కొన్నాడు. (బు’ఖారీ, ముస్లిమ్)
ముస్లిమ్‌లో ఇలా ఉంది: ”ను’ఐమ్ బిన్ ‘అబ్దుల్లాహ్ ‘అదవి, ఆ బానిసను, 800 దిర్‌హమ్‌లకు కొన్నాడు. ఆ బానిసను, ప్రవక్త (స) కు ఇచ్చాడు. ప్రవక్త (స) ఆ 800 దిర్‌హమ్‌లను ఆ బానిస యజమానికి ఇచ్చి, ‘అన్నిటికంటే ముందు నువ్వు మొత్తాన్ని నీ గురించి ఖర్చుపెట్టు. ఇంకా మిగిలితే నీ బంధువుల కోసం ఖర్చుపెట్టు. ఇంకా మిగిలి ఉంటే నీ మిత్రుల కోసం ఖర్చుపెట్టు. అంటే కొందరు నీ ముందు నుంచి, అటు నుండి ఇటు నుండి వస్తారు,’ అని అన్నారు.
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3393 – [ 6 ] ( لم تتم دراسته ) (2/1014)
عَنِ الْحَسَنِ عَنْ سَمُرَةَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ مَلَكَ ذَا رَحِمٍ مَحْرَمٍ فَهُوَ حُرٌّ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
3393. (6) [2/1014– అపరిశోధితం]
‘హసన్ బ’స్రీ సమురహ్ ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా తన మ‘హ్రమ్ బంధువుకు యజమాని అయితే ఆ మ‘హ్రమ్ బంధువు స్వతంత్రుడౌతాడు. అంటే అతని అధీనంలోకి రాగానే స్వతంత్రుడౌతాడు. కానుకగా ఇవ్వబడినా లేదా వాంగ్మూలం ద్వారా చెందినా లేదా కొనినా సరే. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్, అబూ దావూద్)
3394 – [ 7 ] ( لم تتم دراسته ) (2/1014)
وَعَنِ ابْنِ عَبَّاسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا وَلَدَتْ أَمَةُ الرَّجُلِ مِنْهُ فَهِيَ مُعْتَقَةٌ عَنْ دُبُرٍ مِنْهُ أَوْ بَعْدَهُ”. رَوَاهُ الدَّارَمِيُّ.
3394. (7) [2014– అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక బానిసరాలు తన యజమాని వీర్యంతో బిడ్డకు జన్మమిస్తే, యజమాని మరణించిన తరువాత ఆ బానిసరాలు విడుదలపొందుతుంది.” [5] (దార్మి)
3395 – [ 8 ] ( صحيح ) (2/1015)
وَعَنْ جَابِرٍ قَالَ: بِعْنَا أُمَّهَاتِ الْأَوْلَادِ عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَأَبِيْ بَكْرٍ فَلَمَّا كَانَ عُمَرُ نَهَانَا عَنْهُ فَانْتَهَيْنَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3395. (8) [2/1015–దృఢం]
జాబిర్ (ర) కథనం: మేము ప్రవక్త (స), అబూ బకర్ (ర)ల కాలంలో ఉమ్మహాతుల్ అవ్లాద్‌లను అమ్మే వారం. ‘ఉమర్(ర) తన పరిపాలనా కాలంలో మమ్మల్ని ఉమ్మ హాతుల్ అవ్లాద్‌లను అమ్మటాన్ని వారించారు. మేము అమ్మటం మానివేసాము. [6] (అబూ దావూద్)
3396 – [ 9 ] ( صحيح ) (2/1015)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَعْتَقَ عَبْدًا وَلَهُ مَالٌ فَمَالُ الْعَبْدِ لَهُ إِلَّا أَنْ يَشْتَرِطَ السَّيِّدُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
3396. (9) [2/1015–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”యజమాని తన బానిసను అమ్మితే, బానిస వద్ద ధనం ఉంటే ఆ ధనం యజమానిది. అయితే అతని యజమాని ముందు షరతు పెట్టుకోవాలి.” (అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
3397 – [ 10 ] ( صحيح ) (2/1015)
وَعَنْ أَبِي الْمَلِيْحِ عَنْ أَبِيْهِ: أَنَّ رَجُلًا أَعْتَقَ شِقْصًا مِنْ غُلَامٍ فَذُكِرَ ذَلِكَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: “لَيْسَ لِلّهِ شَرِيْكٌ” فَأَجَازَ عِتْقَهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3397. (10) [2/1015 –దృఢం]
అబూ మలీ’హ్ తన తండ్రి ద్వారా కథనం: ఒక వ్యక్తి తన బానిస యొక్క ఒక భాగాన్ని విడుదల చేసి ప్రవక్త (స) వద్దకు వచ్చి తాను ఇలా చేసానని చెప్పాడు. అప్పుడు ప్రవక్త (స) అల్లాహ్(త)కు భాగస్వాములెవరూ లేరని అన్నారు. ఆ వ్యక్తి అది విని బానిసను పూర్తిగా విడుదల చేసివేసాడు. ఇంకా తన భాగ స్వాములకు వారి ధన భాగాలను ఇచ్చి వేసాడు. (అబూ దావూద్)
3398 – [ 11 ] ( جيد ) (2/1015)
وَعَنْ سَفِيْنَةَ قَالَ: كُنْتُ مَمْلُوْكًا لِأُمِّ سَلَمَةَ فَقَالَتْ: أُعْتِقُكَ وَأَشْتَرِطُ عَلَيْكَ أَنْ تَخْدُمَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مَا عِشْتَ فَقُلْتُ: إِنْ لَمْ تَشْتَرِطِيْ عَلَيَّ مَا فَارَقْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مَا عِشْتُ فَأَعْتَقَتْنِيْ وَاشْتَرَطَتْ عَليَّ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
3398. (11) [2/1015 –ఆమోదయోగ్యం]
సఫీనహ్ (ర) కథనం: నేను ఉమ్మె సలమహ్ (ర) బానిసగా ఉండేవాడిని. ఒకరోజు ఉమ్మె సలమహ్ నాతో, ‘నేను నిన్ను విడుదల చేస్తున్నాను, అయితే ఒక షరతు ఏమిటంటే నీవు బ్రతికున్నంత కాలం ప్రవక్త (స) సేవలో ఉండాలి,’ అని అన్నారు. దానికి నేను, ‘ఒక వేళ మీరు ఈ షరతు పెట్టక పోయినా నేను జీవితాంతం ప్రవక్త (స) సేవలో ఉంటాను,’ అని అన్నాను. చివరికి ఉమ్మె సలమహ్ నన్ను విడుదల చేసారు. జీవితాంతం ప్రవక్త (స)కు సేవచేస్తూ ఉండాలని షరతు పెట్టారు. [7] (అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
3399 – [ 12 ] ( حسن ) (2/1015)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اَلْمُكَاتَبُ عَبْدٌ مَا بَقِيَ عَلَيْهِ مِنْ مُكَاتَبَتِهِ دِرْهَمٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3399. (12) [2/1015– ప్రామాణికం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్, తన తండ్రి, తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముకాతిబ్ బానిసపై ఒక్క రూపాయి ఉన్నా అతడు బానిసగా ఉంటాడు. [8] (అబూ దావూద్)
3400 – [ 13 ] ( ضعيف ) (2/1015)
وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا كَانَ عِنْدَ مُكَاتَبِ إِحْدَاكُنَّ وَفَاءٌ فَلْنَحْتَجِبْ مِنْهُ”. روَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
3400. (13) [2/1015– బలహీనం]
ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మీ స్త్రీల వద్ద తన ముకాతబ్ ధనం ఇవ్వగలిగే ముకాతబ్ బానిస ఉంటే, అతని యజమానురాలు అతనికి తెరచాటుగా ఉండాలి.[9] (తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
3401 – [ 14 ] ( لم تتم دراسته ) (2/1016)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ كَاتَبَ عَبْدَهُ عَلَى مِائَةِ أَوْقِيَّةٍ فَأَدَّاهَا إِلَّا عَشْرَ أَوَاقٍ أَوْ قَالَ: عَشْرَةَ دَنَانِيْرٍ ثُمَّ عَجَزَ فَهُوَ رَقِيْقٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
3401. (14) [2/1016 –అపరిశోధితం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి, తన తాతల ద్వారా కథనం: ”ఎవరైనా తన బానిసతో 1 ¼ ఊఖియపై ముకాతిబ్ చేసుకొని, బానిస 90 ఊఖియాలు చెల్లించి, 10 ఊఖియాలు లేదా 10 దీనార్లు చెల్లించలేకపోతే బానిసగానే ఉంటాడు” అని ప్రవక్త (స) ప్రవచించారు. [10] (తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
3402 – [ 15 ] ( لم تتم دراسته ) (2/1016)
وَعَنِ ابْنِ عَبَّاسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا أَصَابَ الْمُكَاتَبُ حَدًّا أَوْ مِيْرَاثًا وَرِثَ بِحِسَابِ مَا عَتَقَ مِنْهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَفِيْ رِوَايَةٍ لَهُ قَالَ: “يُوْدَى الْمُكَاتَبُ بِحِصِّةِ مَا أَدّى دِيَةَ حُرّ وَمَا بَقِيَ دِيَةَ عَبْدٍ” وَضَعَّفَهُ.
3402. (15) [2/1016 –అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముకాతిబ్ బానిస రక్తపరిహారానికి గురియినా లేదా వారసత్వ సంపదకు వారసుడైనా అతడు విడుదల అయినంత భాగానికి అర్హుడౌతాడు.” (తిర్మిజి’)
—–
الْفَصَل الثالث మూడవ విభాగం
3403 – [ 16 ] ( لم تتم دراسته ) (2/1016)
عَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ أَبِيْ عُمْرَةَ الْأَنْصَارِيِّ: أَنَّ أُمَّهُ أَرَادَتْ أَنْ تُعْتِقَ فَأَخَّرَتْ ذَلِكَ إِلَى أَنْ تُصْبِحَ فَمَاتَتْ قَالَ عَبْدُ الرَّحْمنِ: فَقُلْتُ لِلْقَاسِمِ بْنِ مُحَمَّدٍ: أَيَنْفَعُهَا أَنْ أَعْتِقَ عَنْهَا؟ فَقَالَ الْقَاسِمُ: أَتَى سَعْدُ بْنُ عُبَادَةَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “إِنَّ أُمِّيْ هَلَكَتْ فَهَلْ يَنْفَعُهَا أَنْ أُعْتِقَ عَنْهَا؟ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “نَعَمْ”. رَوَاهُ مَالِكٌ.
3403. (16) [2/1016- అపరిశోధితం]
‘అబ్దుర్ర’హ్మాన్ బిన్ అబీ ‘ఉమ్‌రహ్ అ’న్సారీ (ర) కథనం: అతని తల్లి ఒక బానిసను విడుదల చేస్తానని నిశ్చయించుకున్నారు. కాని విడుదల చేయడం ఎంత ఆలస్యం అయిందంటే అతని తల్లి మరణించింది. ‘అబ్దుర్ర’హ్మాన్ ఇలా అన్నారు, ”నేను ఖాసిమ్ ము’హమ్మద్‌ను, నేను నా తల్లి తరఫున బానిసను విడుదల చేస్తే నా తల్లికి లాభం చేకూరుతుందా? లేదా అని అడిగాను. దానికి ఖాసిమ్ ఇలా అన్నారు, ”సఅద్ బిన్ ‘ఉబాదహ్ ప్రవక్త (స) వద్దకు వెళ్ళి, ‘నా తల్లి మరణించింది. ఒకవేళ నేను తల్లి తరఫున బానిసను విడుదల చేస్తే నా తల్లికి లాభం చేకూరుతుందా లేదా,’ అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘అవును లాభం చేకూరుతుంది,’ అని సమాధానం ఇచ్చారు. (మాలిక్)
3404 – [ 17 ] ( لم تتم دراسته ) (2/1017)
وَعَنْ يَحْيَى بْنِ سَعِيْدٍ قَالَ : تُوُفِّيَ عَبْدُ الرَّحْمنِ بْنُ أَبِيْ بَكْرٍ فِيْ نَوْمٍ نَامَهُ فَأعْتَقَتْ عَنْهُ عَائِشَةُ أُخْتُهُ رِقَابًا كَثِيْرَةً .رَوَاهُ مَالِكٌ
3404. (17) [2/1017-అపరిశోధితం]
య’హ్‌యా బిన్ స’యీద్ (ర) కథనం: ‘అబ్దుర్ర’హ్మాన్ బిన్ అబీ బకర్ (ర) అకస్మాత్తుగా నిద్రావస్థలోనే మరణించారు. అతని మరణానంతరం అతని సోదరి ‘ఆయి’షహ్ (ర) అతని తరఫున అనేకమంది బానిసలను విడుదల చేసారు. (మువత్తా ఇమామ్ మాలిక్)
3405 – [ 18 ] ( لم تتم دراسته ) (2/1017)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنِ اشْتَرَى عَبْدًا فَلَمْ يَشْتَرِطْ مَالَهُ فَلَا شَيْءَ لَهُ”. رَوَاهُ الدَّارَمِيُّ.
3405. (18) [2/1017-అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఎవరైనా బానిసను కొన్నప్పుడు బానిస ధనం తీసుకునే షరతు పెట్టకపోతే, కొన్న వ్యక్తికి బానిస ధనంలో నుండి ఏమీ లభించదు. (దార్మి)
*****
[1]) వివరణ-3382: ఈ హదీసులో బానిసను విడుదల చేయటానికి ఉన్న గొప్ప ప్రత్యేకతను పేర్కొనడం జరిగింది. ఖుర్‌ఆన్‌లో కూడా దీన్ని గురించి అల్లాహ్ (త) ప్రత్యేకంగా పేర్కొన్నాడు. ”మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా? ఇంకా నాలుక, పెదవులు ప్రసాదించలేదా? మేము అతనికి రెండు మార్గాలను చూపలేదా? కాని అతడు కనుమను దాటలేదు. ఆ కనుమ అంటే నీవు ఏమని అనుకున్నావు? ఎవరినైనా బానిసపు బంధనాల నుండి విముక్తి గావించటం, లేదా ఆకలిగొన్న రోజున సమీప అనాథుడికి లేదా దిక్కులేని నిరుపేదకు అన్నం పెట్టడం. అంతేకాదు, (వీటితో పాటు) విశ్వసించి, సహనం, సానుభూతుల్ని గురించి ఒకరికొకరు బోధించుకునే వారిలో కూడ మనిషి చేరిపోవాలి. వీరే కుడిపక్షం వారు. (అల్ బలద్, 90 :7-18)
[2]) వివరణ-3387: అంటే బానిసను విడుదల చేయడంలో సిఫారసు చేయండి. లేదా ఏదైనా నేరం చేసి మరణ శిక్ష పడితే సిఫారసు చేయడం వల్ల అతన్ని విడుదల చేయడం జరిగితే, ఇది అన్నిటికంటే శ్రేష్ఠమయిన సదఖహ్.
[3]) వివరణ-3390: మరణించే వ్యక్తికి మూడవ వంతు మాత్రమే ఖర్చుచేసే అధికారం ఉంది. 1/3 వ వంతుకు మాత్రమే వీలునామా రాయాలి లేదా దానధర్మాలు చేయాలి. అంతకు మించి ధనాన్ని వీలునామా వ్రాయ లేడు లేదా దానధర్మాలు చేయలేడు. ఇందులో వారసుల హక్కులు కొల్లగొట్టి నట్టవుతుంది. ఇది అధర్మం. మరణ సమయంలో బానిసలందరిని విడుదల చేసిన వ్యక్తి ధనం అంతా ఈ ఆరుగురు బానిసలే. అతడు ఈ 1/3వ వంతును విడుదల చేసి 2/3వ వంతు బానిసలను అతని వారసులకు ఇచ్చివేసాడు. దీనివల్ల అందరి హక్కులు భద్రంగా ఉంటాయి. మరణించిన వారికి పాపం కూడా చుట్టుకోదు. ఒకవేళ ఎవరైనా అధర్మ వీలునామా వ్రాస్తే, అధర్మంగా దానధర్మాలు చేస్తే అతని మరణానంతరం షరీఅత్ ప్రకారం మార్పులు చేర్పులు చేయవచ్చు. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ (త) ఇలా ఆదేశించాడు: ”కాని వీలునామా చేసిన వ్యక్తి పక్షపాతమో, లేదా అన్యాయమో చేశాడనే భయం ఎవనికైనా ఉంటే అతడు ఈ వ్యవహారంతో సంబంధమున్న వారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులో ఎలాంటి దోషం లేదు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.” (అల్ బఖరహ్, 2:182)
[4]) వివరణ-3391: తల్లిదండ్రులది చాలా పెద్దహక్కు ఉంది. వారి హక్కులకూ, ఉపకారాలకు పరిపూర్ణ బదులు తీర్చడం జరగదు. అయితే ఒకవేళ తండ్రి బానిసగా ఉంటే కొని విడుదల చేస్తే, అతని హక్కు తీర్చబడుతుంది. తండ్రిని కొనటమే విడుదల చేయటం అవుతుంది. ఇక్కడ విడుదల చేయడం అనే పదం వాడకూడదు, ఎందుకంటే ప్రవక్త (స) ప్రవచనం, ఎవరికైనా తన బంధువు యజమాని అయితే, అతడు విడుదల అయినట్లే.
[5]) వివరణ-3394: ఇటువంటి బానిసరాలును ఉమ్మె వలద్ అంటారు. ఉమ్మె వలద్ తన యజమాని మరణించిన తరువాత విడుదల అయిపోతుంది.
[6]) వివరణ-3395: ఉమ్మె వలద్‌ను అమ్మే విషయంలో ధార్మిక పండితుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఉమ్మె వలద్‌ను అమ్మక పోవటమే సరైన అభిప్రాయం. అమ్మే విషయం ఉన్న హదీస్ రద్దయిపోయింది. అమ్మేవారికి రద్దుచేసే ‘హదీసు’ అందలేదు.
[7]) వివరణ-3398: సఫీనహ్ పేరు హిరాన్‌గా ఉండేది. సఫీనహ్ అనేది అతని బిరుదు. ఎందుకంటే ఓడలా అధిక బరువును ఎత్తుకునేవారు. దానివల్ల అతనికి సఫీనహ్ అనే బిరుదు పడింది. ఈ బిరుదుతోనే అతడు ఖ్యాతి గడించాడు. ప్రవక్త (స) అతన్ని తన భార్య అయిన ఉమ్మె సలమహ్ (ర)కు ఇచ్చివేసారు. అతడు ఉమ్మె సలమహ్ బానిసగా ఉన్నారు. ఆ తరువాత ఉమ్మె స సలమహ్ అతన్ని విడుదల చేస్తూ జీవితాంతం ప్రవక్త (స) సేవలో ఉండాలని షరతు పెట్టారు. ఇతడు చాలా మహిమాన్వితుడైన వ్యక్తి. ఒకసారి ఇస్లామీయ సైన్యంతో యుద్ధానికి వెళుతూ అడవిలో మార్గం తప్పారు, దారి చూపడానికి అతని వద్దకు సింహం వచ్చింది. అప్పుడు సఫీనహ్, ”ఓ అబుల్ ‘హారిస్’! నా పేరు సఫీనహ్, ప్రవక్త (స) విడుదల చేసిన బానిసను, దారి తప్పాను. నాకు దారి చూపించు.” అని అన్నాడు. ఆ సింహం అతని ముందు నడుస్తూ పోయింది. ఈ సైన్యాలు తమ స్థలానికి చేరిన తరువాత ఆ సింహం అక్కడి నుండి వెళ్ళిపోయింది. సింహం వారికేమీ హాని చేకూర్చలేదు. పైగా దారి చూపించి ఉపకారం చేసింది. నిజమే కేవలం దైవానికి భయపడేవారికి వస్తువులన్నీ భయపడతాయి.
[8]) వివరణ-3399: ముకాతిబ్ బానిస అంటే యజమాని అతనికి నువ్వు ఇంత ఇస్తే నీవు విడుదల అయిపోతావు అని వ్రాసిఇస్తాడు. బానిస పూర్తి మొత్తాన్ని చెల్లిస్తే పూర్తిగా విడుదల అయిపోతాడు. కాని ఒకవేళ చెల్లించడంలో ఒక్క రూపాయి బాకీ ఉన్నా అతడు ఇంకా బానిసగానే ఉంటాడు.
[9]) వివరణ-3400: ఇలా తెరచాటుగా దైవభీతి, జాగ్రత్తల పరంగా ఉండాలి. అయితే పూర్తిగా మొత్తాన్ని ఇవ్వనంత వరకు అతడు బానిసగానే ఉంటాడు.
[10]) వివరణ-3401: అంటే మొత్తం డబ్బును చెల్లించనంత వరకు బానిసగానే ఉంటాడు.
***