13- كِتَابُ النِّكَاحِ
13. వివాహ (నికా‘హ్) పుస్తకం
నికాహ్ అంటే సంభోగం, శారీరకంగా ఒకటవడం, పెళ్ళి చేసుకోవటం అని అర్థం. ఇస్లామ్‌లో ఒప్పందం అని అర్థం. దీని ద్వారా స్త్రీ పురుషుల మధ్య సంభోగం, భార్యాభర్తల సంబంధాలు ధర్మసమ్మతం అయిపోతాయి. దీనికి కొన్ని షరతులున్నాయి. స్త్రీ, పురుషుడు, స్త్రీ-సంరక్షకుడు, ఇద్దరు సాక్షులు, స్త్రీ పురుషుల స్వీకారం, అనుమతి, మహ్ర్ మొదలైనవి. వీటిని గురించి ముందు వస్తుంది. ఖుర్ఆన్, ‘హదీసు’ల్లో నికా’హ్ సాంప్రదాయానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. 1. అవిశ్వాస స్త్రీలు ఇస్లామ్ స్వీకరించ నంతవరకు వారితో వివాహం చేయకండి. 2. స్త్రీలలో మీకిష్టమైన వారితో ఒకరిని, ఇద్దరినీ, ముగ్గురినీ, నలుగురిని వివాహం చేసుకోండి. 3. మీ తాతలు, తండ్రులు పెళ్ళిచేసుకున్న వారితో మీరు పెళ్ళి చేసుకోకండి. 4. మీలోని వితంతువుల బానిసరాళ్ళ పెళ్ళి చేయండి. ఆ స్త్రీలను వారి భర్తలతో వివాహం చేసుకోవటంలో ఆటంక పరచకండి. 5. మీ కంటే ముందు చాలా మందిని ప్రవక్తలుగా పంపాము. వారికి భార్యాబిడ్డలను ప్రసాదించాము.
ప్రవక్తలు, సందేశహరులు, అల్లాహ్ భక్తులు అందరూ నికా’హ్ చేసుకున్నారు. ఈ నికా’హ్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. 1. నికా’హ్ చేయటం వల్ల మనిషి వ్యభిచారానికి, అధర్మ కామక్రీడలకు దూరంగా ఉంటాడు. 2. అల్లాహ్ (త) అతనికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. 3. నికా’హ్ చేసు కుంటే సగం ధర్మాన్ని నిర్వర్తించినట్టే. 4. దీని వల్ల సంతానం కలుగుతుంది. ప్రవక్త (స)కు ఇతర ప్రవక్తల సంఘాలపై ఆధిక్యత కలుగుతుంది. 5. దీనివల్ల దైవసంతృప్తి లభిస్తుంది. 6. పాపాలన్నీ తొలగి అల్లాహ్‌ను కలుసు కుంటాడు. 7. ఉత్తమ సంతానం కలిగితే తన మరణా నంతరం తన గురించి ప్రార్థిస్తుంది. ఫలితంగా తల్లిదండ్రులకు పుణ్యం చేరుతూ ఉంటుంది. 8. ఒకవేళ బాల్యంలో సంతానం చనిపోతే తల్లిదండ్రుల కొరకు సిఫారసు చేస్తుంది. వారి సిఫారసు అల్లాహ్ స్వీకరించి వారిని స్వర్గంలోకి పంపిస్తాడు. 9. అతనికి మనశ్శాంతి కలుగుతుంది. అతనికి సంతృప్తి కలుగుతుంది. ఫలితంగా జీవితం అవలీలగా గడిచిపోతుంది. 10. అన్నం వండటంలో, ఇతర ఇంటి పనుల్లో సహాయ సహకారాలు అందుతాయి. 11. భార్యాపిల్లలను పోషించటం వల్ల, ఆ మార్గంలో కష్టాలను భరించటం వల్ల ఉత్తమ ప్రతిఫలం లభిస్తుంది. 12. దీనివల్ల పరస్పరం ప్రేమ పెరుగుతుంది.
నికా’హ్ చేయకపోవటం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. ‘హదీసు’ల్లో నికా’హ్ పట్ల చాలా ప్రోత్సహించటం జరిగింది. నికా’హ్ పద్ధతి నిత్యం ఆచరించటం వల్ల అందరికీ తెలిస్తుంది. అయితే ఉపయోగ నిమిత్తం వ్రాయటమే మంచిదని భావించటం జరిగింది. వలీ, ఇద్దరు సాక్షులు ఇతర సభ్యులు, షరతులు అన్నీ ఉన్న తరువాత అందరి ముందు స్వీకరించడం జరుగుతుంది. స్వీకరణ నికా’హ్ ప్రధాన అంశాల్లోని ఒక అంశం. మొదటిది ఈజాబ్, రెండవది ఖుబూల్ అంటారు. ఈ స్వీకరణలో మహర్‌ను కూడా ప్రస్తావించడం జరుగుతుంది.
సభలోని ఈ స్వీకరణ కనీసం ఇద్దరు సాక్షుల ముందు జరగాలి. వారు వినినట్లు ఉండాలి. అవసరం పడినపుడు వారు సాక్ష్యం ఇవ్వాలి. స్వీకరణ స్పష్టమైన పత్రాలతో జరగాలి. సైగల ద్వారా చేయరాదు. నికా’హ్ పద్ధతి ఏమిటంటే అందరి ముందు సభలో ముందు సాంప్రదాయకమైన ప్రసంగం చదివిన తరువాత పెళ్ళి కొడుకును ముందు కూర్చోబెట్టి అతనితో, ‘నేను ఫలానా స్త్రీని, ఫలానావాని కూతురును నీ దాంపత్యంలోనికి, ఇంత మహర్‌కు బదులు ఇస్తున్నాను. నీకు ఇష్టమేనా?’ అని అనాలి. అప్పుడు పెళ్ళి కొడుకు, ‘నేను ఇంత మహర్తో ఫలానా స్త్రీని, ఫలానావాని కూతురును నా దాంపత్యంలోనికి స్వీకరించాను’ అని అనాలి. అయితే ఇవన్నీ జరగడానికి ముందు సాంప్రదాయక ఖు‘త్బాను పఠించాలి. దీన్ని గురించి క్రింద వివరించబడింది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3080 – [ 1 ] ( متفق عليه ) (2/927)
عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا مَعْشَرَ الشَّبَابِ مَنِ اسْتَطَاعَ مِنْكُمُ الْبَاءَةَ فَلْيَتَزَوَّجَ. فَإِنَّهُ أَغَضُّ لِلْبَصَرِ وَ أَحْصَنُ لِلْفَرْجِ وَمَنْ لَمْ يَسْتَطِعْ فَعَلَيْهِ بِالصَّوْمِ فَإِنَّهُ لَهُ وِجَاءٌ”
3080. (1) [2/927 –ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”యువకులారా! మీలో కుటుంబ నిర్వాహణ బాధ్యతలు నిర్వర్తించే శక్తిగలవారు నికా‘హ్ చేసుకోవాలి. ఎందుకంటే నికా‘హ్ చేసుకుంటే దృష్టి క్రిందికి వాలి ఉంటుంది. మర్మాంగం భద్రంగా ఉంటుంది. పెళ్ళిచేసుకోలేని స్థితిలో ఉన్నవారు ఉపవాసాలు పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే ఉపవాసం మనోకాంక్షలను తొలగిస్తుంది. కామ కోరికలు దరికిరావు. [1] (బు’ఖారీ, ముస్లిమ్)
3081 – [ 2 ] ( متفق عليه ) (2/927)
وَعَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ قَالَ: رَدَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى عُثْمَانَ ابْنِ مَظْعُوْنٍ التَّبَتُّلَ وَلَوْ أَذِنَ لَهُ لَاَخْتَصَيْنَا
3081. (2) [2/927–ఏకీభవితం]
స’అద్ బిన్ అబీ వఖ్ఖా’స్ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఉస్’మాన్ బిన్ మ”జ్ఊన్కు స్త్రీలకు దూరంగా ఉండటానికి అనుమతి ఇవ్వలేదు. ఒకవేళ ప్రవక్త (స) అతనికి స్త్రీలకు దూరంగా ఉండమని ఆదేశిస్తే, మేము కూడా స్త్రీలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించే వాళ్ళం. [2] (బు’ఖారీ, ముస్లిమ్).
3082 – [ 3 ] ( متفق عليه ) (2/927)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تُنْكَحُ الْمَرْأَةُ لِأَرْبَعِ: لِمَالِهَا وَلِحَسْبِهَا وَلِجَمَالِهَا وَلِدِيْنِهَا فَاظْفَرْ بِذَاتِ الدِّيْنِ تَرِبَتْ يَدَاكَ”.
3082. (3) [2/927 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఈ నాలుగు విషయాల వల్ల స్త్రీని పెళ్ళిచేసుకోండి. 1. ఆమె ధన సంపదలు, 2. ఆమె వంశం, 3. ఆమె అందచందాలు, 4. ఆమె ధార్మికత, సద్గుణ సంపన్నత. మీరు ధార్మికతకు ప్రాధాన్యత ఇచ్చి మీ లక్ష్యంలో సాఫల్యులు కండి. మీ చేతులు నిండుగా ఉండుగాక!” [3] (బు’ఖారీ, ముస్లిమ్)
3083 – [ 4 ] ( صحيح ) (2/927)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلدُّنْيَا كُلُّهَا مَتَاعٌ وَخَيْرُ مَتَاعِ الدُّنْيَا اْلَمَرْأَةُ الصَّالِحَةُ”. رَوَاهُ مُسْلِمٌ.
3083. (4) [2/927– దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఈ ప్రపంచం లాభం పొందే స్థలం. ప్రపంచంలోని లాభం పొందే వస్తువుల్లో అన్నిటికంటే గొప్పది ఉత్తమ ఇల్లాలు. [4] (ముస్లిమ్)
3084 – [ 5 ] ( متفق عليه ) (2/928)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خَيْرُ نِسَاءٍ رَكِبْنَ الْإِبْلَ. صَالِحُ نِسَاءٍ قَرَيْشٍ أَحْنَاهُ عَلَى وَلَدٍ فِيْ صِغَرِهِ وَ أَرْعَاهُ عَلَى زَوْجٍ فِيْ ذَاتِ يَدِهِ”.
3084. (5) [2/928 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒంటెపై ఎక్కే స్త్రీలలో అంటే అరబ్ స్త్రీలలో ఉత్తమ స్త్రీలు ఖురైష్కు చెందిన స్త్రీలు. వీరు తమ బిడ్డల పట్ల ఉదారంగా, ప్రేమగా, గారాబంగా ప్రవర్తిస్తారు. ఇంకా తమ భర్తల సంపదలను చాలా బాధ్యతగా పరిరక్షిస్తారు.” (బు’ఖారీ, ముస్లిమ్)
3085 – [ 6 ] ( متفق عليه ) (2/928)
وَعَنْ أُسَامَةَ بْنِ زَيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا تَرَكْتُ بَعْدِيْ فِتْنَةً أَضَرَّ عَلَى الرِّجَالِ مِنَ النِّسَاءِ”.
3085. (6) [2/928 –ఏకీభవితం]
ఉసామహ్ బిన్ ‘జైద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, నేను నా తరువాత పురుషుల కోసం స్త్రీల కంటే ప్రమాద కరమైన ఉపద్రవం మరొకటి వదలిపెట్ట లేదు.[5] (బు’ఖారీ, ముస్లిమ్)
3086 – [7 ] ( صحيح ) (2/928)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الدُّنْيَا حُلْوَةٌ خَضِرَةٌ وَإِنَّ اللهَ مُسْتَخْلِفُكُمْ فِيْهَا فَيَنْظُرُ كَيْفَ تَعْمَلُوْنَ فَاتَّقُوا الدُّنْيَا وَاتَّقُوا النِّسَاءَ فَإِنَّ أَوَّلَ فِتْنَةِ بَنِيْ إِسْرَائِيْلَ كَانَتْ فِي النِّسَاءِ”. رَوَاهُ مُسْلِمٌ.
3086. (7) [2/928– దృఢం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రపంచం చాలా తియ్యనిది, మనోరంజక మైనది. అల్లాహ్ (త) మీకు భూమిపై అధికారులుగా చేసాడు, మీరు ఎలా ఆచరిస్తారో చూద్దామని. మీరు ప్రపంచానికి దూరంగా ఉండండి, స్త్రీల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే బనీ ఇస్రాయీ’ల్లో మొట్టమొదటి ఉపద్రవం స్త్రీలవల్లే ప్రారంభ మైంది.” [6] (ముస్లిమ్)
3087 – [ 8 ] ( متفق عليه ) (2/928)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلشُّؤْمُ فِيْ الْمَرْأَةِ وَالدَّارِوَالْفَرَسِ”. مُتَّفَقٌ عَلَيْهِ.
وَفِيْ رِوَايَةٍ: “اَلشُّؤْمُ فِيْ ثَلَاثَةٍ: فِيْ الْمَرْأَةِ وَالْمَسْكَنِ وَالدَّابَّةِ”.
3087. (8) [2/928– ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మూడు విషయాల్లో దోషం ఉంది. 1. స్త్రీ, 2. ఇల్లు, 3. గుర్రం. (బు’ఖారీ, ముస్లిమ్)
మరో కథనంలో ఇలా ఉంది, మూడు విషయాల్లో చెడు ఉంది. 1. స్త్రీ, 2. ఇల్లు, 3. జంతువు.[7]
3088 – [ 9 ] ( متفق عليه ) (2/928)
وَعَنْ جَابِرٍ: قَالَ: كُنَّا مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ غَزْوَةٍ فَلَمَّا قَفَلْنَا كُنَّا قَرِيْبًا مِّنَ الْمَدِيْنَةِ قُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ حَدِيْثُ عَهْدٍ بِعُرْسٍ قَالَ: “تَزَوَّجْتَ؟” قُلْتُ: نَعَمْ.قَالَ: “أَبِكْرٌأَمْ ثَيِّبٌ؟” قُلْتُ: بَلْ ثَيِّبٌ. قَالَ: “فَهَلَّا بِكْرًا تَلَاعِبُهَا وَتَلَاعِبُكَ”. فَلَمَّا قَدِمْنَا ذهبنا لِنَدْخُلَ. فَقَالَ: “اَمْهِلُوْا حَتَّى نَدْخُلَ لَيْلًا أَيْ عِشَاءً لِكَيْ تَمْتَشِطَ الشَّعِثَةُ وَتَسْتَحِدَّ الْمَغِيْبَةُ”.
3088. (9) [2/928 –ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) వెంట మేము ఒక యుద్ధానికి వెళ్ళాము. తిరుగు ప్రయాణంలో మదీనహ్ సమీపానికి చేరుకున్నాము. అప్పుడు నేను ప్రవక్త (స)తో, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! నేను ఇటీవలే పెళ్ళి చేసు కున్నాను, ఒకవేళ మీరు అనుమతిస్తే, నేను తొంద రగా వెళ్ళిపోతాను,’ అని అన్నాను. ప్రవక్త (స), ‘నువ్వు పెళ్ళి చేసుకున్నావా?’ అని అడిగారు. నేను, ‘అవునని,’ అన్నాను. ప్రవక్త (స), ‘కన్నెపిల్లతో నా? వితంతువుతోనా?’ అని అడిగారు. నేను ‘వితంతు వుతో’ అని అన్నాను. ప్రవక్త (స), ‘కన్నెపిల్లతో ఎందుకు చేయలేదు. నువ్వు ఆమెతో ఆడుకునే వాడవు. ఆమె నీతో ఆడుకునేది. ఎటువంటి మొహ మాటం లేకుండా జీవితం సాగేది,’ అని అన్నారు. మేము మదీనహ్ చేరిన తర్వాత తమ తమ ఇళ్ళకు వెళ్ళడానికి సిద్ధపడ్డాము. అప్పుడు ప్రవక్త (స), ‘కొంచెం ఆగండి, సాయంత్రం అయిపో నివ్వండి, ఇళ్ళల్లోని ఆడవాళ్ళు దువ్వుకొని తమ్ము తాము సరిదిద్దు కోనివ్వండి. ఇప్పటి వరకు భర్తలు బయట ఉన్నవారు నాభి క్రింద వెంట్రుకలను శుభ్ర పరచు కోనివ్వండి,’ అని అన్నారు. [8] (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3089 – [ 10 ] ( حسن ) (2/929)
عَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “ثَلَاثَةٌ حَقٌّ عَلَى اللهِ عَوْنُهُمْ: اَلْمَكَاتَبُ الَّذِيْ يُرِيْدُ الْأَدَاءَ وَالنَّاكِحُ الَّذِيْ يُرِيْدُ الْعَفَافَ وَالْمُجَاهِدُ فِيْ سَبِيْلِ اللهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُ وَابْنُ مَاجَهُ.
3089. (10) [2/929– ప్రామాణికం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ముగ్గురు వ్యక్తులకు సహాయం చేయటం అల్లాహ్ (త) బాధ్యత. 1. తన విడుదల కోసం పరిహారం చెల్లించే ప్రయత్నంలో ఉన్న బానిస, 2. వ్యభిచారం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి పెళ్ళి ప్రయత్నంలో ఉన్న యువకుడు, 3. దైవ మార్గంలో పోరాడే ముజా హిద్. (తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్)
3090 – [ 11 ] ( حسن ) (2/929)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا خَطَبَ إِلَيْكُمْ مَنْ تَرْضَوْنَ دِيْنَهُ وَخُلُقَهُ فَزَوِّجُوْهُ إِنْ لَا تَفْعَلُوْهُ تَكُنْ فِتْنَةٌ فِيْ الْأَرْضِ وَفَسَادٌ عَرِيْضٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
3090. (11) [2/929 – ప్రామాణికం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వేళ ఎవరైనా ఉత్తమ నడవడిక, ధార్మిక అభిరుచిగల యువకుడు మీకు పెళ్ళి సందేశం పంపిస్తే అతని సందేశాన్ని స్వీకరించి పెళ్ళి చేయించండి. ఒకవేళ మీరు ఇటువంటి వ్యక్తి పెళ్ళిచేయించకపోతే భూమిపై ఉపద్రవాలు, కల్లోలాలు తలెత్తుతాయి.” [9] (తిర్మిజి’)
3091 – [ 12 ] ( صحيح ) (2/929)
وَعَنْ مَعْقَلِ بْنِ يَسَارٍقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ تَزَوَّجُوا الْوَدُوْدُ الْوَلُوْدَ فَإِنِّيْ مُكَاثِرٌ بِكُمُ الْأُمَمَ”. روَاهُ أَبُوْ دَاوُدَ وَ النَّسَائِيُّ.
3091. (12) [2/929– దృఢం]
మ’అఖల్ బిన్ యసార్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మీరు ప్రేమించే, అధికంగా పిల్లలు కనే స్త్రీని వివాహం చేసుకోండి. ఎందుకంటే మీ ఆధిక్యత వల్ల నేను ఇతర ప్రవక్తల సంఘాలపై గర్వపడతాను.[10] (అబూ దావూద్, నసాయి’)
3092 – [ 13 ] ( لم تتم دراسته ) (2/929)
وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ سَالِمِ بْنِ عُتْبَةَ بْنِ عُوَيْمِ بْنِ سَاعِدَةَ الْأَنْصَارِيِّ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عَلَيْكُمْ بِالْأَبْكَارِ فَإِنَّهُنَّ أَعْذَبُ أَفْوَاهَا وَأَنْتَقَ أَرْحَامًا وَأَرْضَى بِالْيَسِيْرِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ مُرْسَلًا.
3092. (13) [2/929– అపరిశోధితం]
‘అబ్దుర్ర’హ్మాన్ బిన్ సాలిమ్ బిన్ ‘ఉత్బహ్ బిన్ ‘ఉవైమ్ బిన్ సా’యిదహ్ అన్సారి, తన తండ్రి ద్వారా, అతడు తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు కన్యలతో వివాహం చేసుకోండి. ఎందుకంటే వారు తియ్యగా మాట్లాడుతారు, అధికంగా పిల్లలను కంటారు, చిన్న వస్తువు పట్ల కూడా సంతృప్తి చెందుతారు.” (ఇబ్నె మాజహ్ – తాబయీ’ ప్రోక్తం)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3093 – [ 14 ] ( لم تتم دراسته ) (2/930)
عَنِ ابْنِ عَبَّاسٍ قَال: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَمْ تَرَ لِلْمُتَحَابَّيْنِ مِثْلَ النِّكَاحِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.
3093. (14) [2/930 –అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”మీరు, ఇద్దరు అపరిచితుల మధ్య అనంతమైన ప్రేమను జనింపజేసే వస్తువు నికా’హ్ తప్ప మరి దేన్ని చూడలేరు. అంటే నికా’హ్ వల్ల ఇద్దరు అపరిచిత స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి ప్రేమ జనిస్తుందంటే ఒక్కోసారి తల్లిదండ్రులు, ఇతర బంధువుల పట్లకూడా అటువంటి ప్రేమ పుట్టదు. (ఇబ్నె మాజహ్)
3094 – [ 15 ] ( لم تتم دراسته ) (2/930)
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَرَادَ أَنْ يَلْقَى اللهَ طَاهِرًا مُّطَهَّرًا فَلْيَتَزَوَّجِ الْحَرَائِرَ”. رَوَاهُ ابْنُ مَاجَهُ
3094. (15) [2/930 –అపరిశోధితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్‌ను పరిశుద్ధ స్థితిలో కలుసుకోగోరే వ్యక్తి స్వతంత్రురాలైన ఉత్తమ స్త్రీని వివాహం చేసుకోవాలి. (ఇబ్నె మాజహ్)
3095 – [ 16 ] ( لم تتم دراسته ) (2/930)
وَعَنْ أَبِيْ أُمَامَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ يَقُوْلُ: “مَا اسْتَفَادَ الْمُؤْمِنُ بَعْدَ تَقْوَى اللهِ خَيْرًا لَهُ مِنْ زَوْجَةٍ صَالِحَةٍ إِنْ أَمَرَهَا أَطَاعَتْهُ وَإِنْ نَظَرَ إِلَيْهَا سَرَّتْهُ وَإِنْ أَقْسَمَ عَلَيْهِ أَبَرَّتْهُ وَإِنْ غَابَ عَنْهَا نَصَحَتْهُ فِيْ نَفْسِهَا وَمَالِهِ”. رَوَى ابْنُ مَاجَهُ الْأَحَادِيْثَ الثَّلَاثَةَ.
3095. (16) [2/930– అపరిశోధితం]
అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక విశ్వాసి, దైవభీతి తర్వాత తన కొరకు కోరేది – అన్నిటి కంటే ఉత్తమమైన వస్తువు –- ఉత్తమ ఇల్లాలు తప్ప మరేమీ కాదు. 1. ఆమెను ఆదేశిస్తే దాన్ని వెంటనే అమలు చేస్తుంది. 2. ఆమె వైపు చూస్తే సంతృప్తి కలిగిస్తుంది. 3. ఆమె ప్రమాణం చేస్తే దాన్ని నెరవేర్చుతుంది. పరదేశ ప్రయాణానికి వెళితే, తన శీలాన్ని, భర్త ధనసంపదలను సంరక్షిస్తుంది. ఈ మూడు ‘హదీసు’లను ఉల్లేఖించింది. (ఇబ్నె మాజహ్)
3096 – [ 17 ] ( حسن ) (2/930)
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا تَزَوَّجَ الْعَبْدُ فَقَدِ اسْتَكْمَلَ نِصْفَ الدِّيْنِ فَلْيَتَّقِ اللهَ فِي النِّصْفِ الْبَاقِيْ”.
3096. (17) [2/930 –ప్రామాణికం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: నికా’హ్ చేసు కున్నవారు తమ సగం ధర్మాన్ని పూర్తిచేసుకున్నారు. ఇప్పుడతను తన మిగతా సగం ధర్మంలో దైవభీతితో మసలు కోవాలి. (బైహఖీ)
3097 – [ 18 ] ( لم تتم دراسته ) (2/930)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِنَّ أَعْظَمَ النِّكَاحِ بَرَكَةً أَيْسَرُهُ مُؤَنَةُ”. رَوَاهُمَا الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإَيْمَانِ.
3097. (18) [2/930 –అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అన్నిటి కంటే తక్కువ ఖర్చులు, తక్కువ శ్రమ గలదే ఉత్తమమైన, శుభకరమైన నికా’హ్.” [11] (బైహఖీ)
=====
1- بَابُ النَّظْرِ إِلَى الْمَخْطُوْبَةِ وَبَيَانِ الْعَوَرَاتِ
1. వివాహమాడబోయే స్త్రీని చూడటం, కప్పి ఉంచ వలసిన విషయాలు
అనవసరంగా అపరిచిత స్త్రీని చూడటం ధర్మ సమ్మతం కాదు. కాని ఒకవేళ ఆమెను పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం ఉంటే ఆమెను చూడవచ్చు. ధార్మిక పరంగా దీనికి అనుమతి ఉంది. దీనికి సంబంధించిన ‘హదీసు’లను క్రింద పేర్కొనడం జరిగింది. స్త్రీలు తమ శరీరాన్నంతా తప్పనిసరిగా కప్పి ఉంచాలి, పురుషులు ముడుకుల వరకు దాచి ఉంచడం తప్పనిసరి. నగ్నంగా ఉండటం ఎంతమాత్రం ధర్మసమ్మతం కాదు.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3098 – [ 1 ] ( صحيح ) (2/931)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: إِنِّيْ تَزَوَّجْتُ اِمْرَأَةً مِّنَ الْأَنْصَارِ قَالَ: “فَانْظُرْ إِلَيْهَا فَإِنْ فِيْ أَعْيُنِ الْأَنْصَارِ شَيْئًا”. رَوَاهُ مُسْلِمٌ
3098. (1) [2/931–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! నేను ఒక అ’న్సారీ స్త్రీని నికా’హ్ చేసుకోవాలనుకుంటున్నాను.’ దానికి ప్రవక్త (స), ‘నువ్వు వెళ్ళి ఆమెను చూసుకో, ఎందుకంటే అ’న్సారీ స్త్రీల కళ్ళల్లో ఒక రకమైన లోపం ఉంటుంది,’ అని ఆదేశించారు.[12] (ముస్లిమ్)
3099 – [ 2 ] ( متفق عليه ) (2/931)
وَعَنِ ابْنِ مَسْعُوْدٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُبَاشِرِ الْمَرْأَةُ الْمَرْأَةَ فَتَنْعَتَهَا لِزَوْجِهَا كَأَنَّهُ يَنْظُرُ إِلَيْهَا”.
3099. (2) [2/931–ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్త్రీ తన నగ్న శరీరాన్ని మరో స్త్రీ నగ్న శరీరానికి తాకనియ్యకూడదు. అంతేకాదు ఆ స్త్రీ యొక్క శారీరక గొప్పతనాన్ని తన భర్త ముందు వివ రించకూడదు. ఎందుకంటే ఇటువంటి స్థితిలో మరో స్త్రీ గురించి తన భర్తకు వివరించడం భర్త ఆమె వైపు చూస్తున్నట్టు అవుతుంది.” [13] (బు’ఖారీ, ముస్లిమ్)
3100 – [ 3 ] ( صحيح ) (2/931)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَنْظُرُ الرَّجُلُ إِلَى عَوْرَةِ الرَّجُلِ وَلَا الْمَرَأَةُ إِلَى عَوْرَةِ الْمَرْأَةِ وَلَا يُفْضِي الرَّجُلُ إِلَى الرَّجُلِ فِيْ ثَوْبٍ وَّاحِدٍ وَلَا تُفْضِيْ الْمَرْأَةُ إِلَى الْمَرْأَةِ فِيْ ثَوْبٍ وَاحِدٍ “. رَوَاهُ مُسْلِمٌ
3100. (3) [2/931–దృఢం]
అబూ స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పురుషుడు మరో పురుషుని మర్మాంగాన్ని చూడ కూడదు, స్త్రీ మరో స్త్రీ యొక్క మర్మాంగాన్ని చూడ కూడదు, ఇద్దరు పురుషులు నగ్నంగా ఒక దుప్పటిని కప్పుకొని పడుకోరాదు. అదేవిధంగా ఇద్దరు స్త్రీలు నగ్నంగా ఒకే దుప్పటిలో పడుకో రాదు.” [14] (ముస్లిమ్)
3101 – [ 4 ] ( صحيح ) (2/931)
وَعَنْ جَابِرٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «إِلَّا لَا يبتن رَجُلٌ عِنْدَ امْرَأَةٍ ثَيِّبٍ إِلَّا أَنْ يَكُونَ ناكحا أَو ذَا محرم». رَوَاهُ مُسلم
3101. (3) [2/931–దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”గుర్తుంచు కోండి! ఎవరూ భర్తలేని స్త్రీతో ఏకాంతంగా రాత్రి గడపరాదు. అతను ఆమెకు భర్త అయి ఉండాలి లేదా ఆమె అతనికి మ’హ్రమ్ అయి ఉండాలి.’ (ముస్లిమ్)
3102 – [ 5 ] (مُتَّفِقٌ عَلَيه) (2/932)
وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “إِيَّاكُمْ وَالدُّخُولَ عَلَى النِّسَاءِ. فَقَالَ رَجُلٌ: يَا رَسُولَ اللَّهِ أَرَأَيْتَ الْحَمْوَ؟ قَالَ: «الْحَمْوُ الْمَوْتُ»
3102. (4) [2/932 –ఏకీభవితం]
‘ఉఖ్‌బ బిన్ ‘ఆమిర్ (ర) కథనం: ప్రవక్త (స) ”మీరు ఏకాంతంగా అపరిచిత స్త్రీల వద్దకు వెళ్ళకండి.” అని హితబోధ చేసారు. దానికి ఒక వ్యక్తి ”ఒకవేళ మరిది వదిన ఇంటికి వెళితే?” అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స) ”మరిది, మరణమే” అని అన్నారు.[15](బు’ఖారీ, ముస్లిమ్)
3103 – [ 6 ] ( صحيح ) (2/932)
وَعَنْ جَابِرٍ: أَنَّ أُمَّ سَلَمَةَ اِسْتَأْذَنَتْ رَسُوْلَ اللهِ فِيْ الْحِجَامَةِ فَأَمَرَ أَبَا طَيْبَةَ أَنْ يَحْجِمَهَا قَالَ: حَسِبْتُ أَنَّهُ كَانَ أَخَاهَا مِنَ الرَّضَاعَةِ أَوْ غُلَامًا لَمْ يَحْتَلِمْ. رَوَاهُ مُسْلِمٌ
3103. (6) [2/932 –దృఢం]
జాబిర్ (ర) కథనం: ఉమ్మె సలమహ్(ర), ప్రవక్త (స) ను కొమ్ము చికిత్స కొరకు అనుమతి కోరారు. ప్రవక్త (స) అబూ ‘తయ్యిబ్ను ఆమెకు శస్త్ర చికిత్స చేయమని ఆదేశించారు. అబూ ‘తయ్యిబ్ ఆమెకు పాల సోదరుడైనా కావచ్చు, లేదా ఇంకా యుక్త వయస్సుకు చేరని కుర్రవాడు కావచ్చు. అని ఉల్లేఖన కర్త అభిప్రాయం.[16] (ముస్లిమ్)
3104 – [ 7 ] ( صحيح ) (2/932)
وَعَنْ جَرِيْرِ بْنِ عَبْدِ اللهِ قَالَ: سَأَلْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَنْ نَظْرِ الْفُجَاءَةِ فَأَمَرَنِيْ أَنْ أَصْرِفَ بَصَرِيْ. رَوَاهُ مُسْلِمٌ
3104. (7) [2/932–దృఢం]
జరీర్ బిన్ ‘అబ్దుల్లాహ్ కథనం: నేను ప్రవక్త (స)ను అకస్మాత్తుగా పరాయి స్త్రీపై దృష్టి పడటాన్ని గురించి అడిగాను. దానికి ప్రవక్త (స) నువ్వు నీ దృష్టిని మరల్చుకో. మళ్ళీ అటువైపు చూడకు అని హితబోధ చేసారు.[17] (ముస్లిమ్)
3105 – [ 8 ] ( صحيح ) (2/932)
وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْمَرْأَةَ تُقْبِلُ فِيْ صُوْرَةِ شَيْطَانِ وَتُدْبِرُ فِيْ صُوْرَةِ شَيْطَانٍ. إِذَا أَحَدُكُمْ أَعْجَبْتْهُ الْمَرْأَةُ فَوَقَعَتْ فِيْ قَلْبِهِ فَلْيَعْمِدْ إِلَى امْرَأَتِهِ فَلْيُوَاقِعْهَا فَإِنَّ ذَلِكَ يَرُدُّ مَا فِيْ نَفْسِهِ”. رَوَاهُ مُسْلِمٌ.
3105. (8) [2/932– దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ” స్త్రీ షై’తాన్ వలే వస్తూ వెళుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఏదైనా స్త్రీ మంచిదనిపించి, మనసులో ఏదైనా కోరిక కలిగితే వెంటనే తన ఇంటికి తిరిగి వచ్చి తన భార్యతో సంభోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సంభోగం అతని హృదయంలో ఉన్న చెడు ఆలోచన లను తొలగిస్తుంది. (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3106 – [ 9 ] ( حسن ) (2/932)
عَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا خَطَبَ أَحَدُكُمْ الْمَرْأَةَ فَإِنِ اسْتَطَاعَ أَنْ يَنْظُرَ إِلَى مَا يَدْعُوْهُ إِلَى نِكَاحِهَا فَلْيَفْعَلْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3106. (9) [2/932– ప్రామాణికం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”మీలో ఎవరైనా ఒక స్త్రీకి పెళ్ళి సందేశం పంపితే, ఆమెలో వివాహం కొరకు ప్రోత్సహించే విషయాన్ని చూడ గలిగితే, ఆమెను చూసుకోవాలి.” (అబూ దావూద్)
3107 – [ 10 ] ( صحيح ) (2/932)
وَعَنِ الْمُغِيْرَةِ بْنِ شُعْبَةَ قَالَ خَطَبْتُ اِمْرَأَةً فَقَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَلْ نَظَرْتَ إِلَيْهَا؟ “قُلْتُ: لَا. قَالَ: “فَانْظُرْ إِلَيْهَا. فَإِنَّهُ أَحْرَى أَنْ يُؤْدَمَ بَيْنَكُمَا”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ .
3107. (10) [2/932 –దృఢం]
ము’గైరహ్ బిన్ షు’అబహ్ (ర) కథనం: నేను ఒక స్త్రీకి పెళ్ళి సందేశం పంపాను. ప్రవక్త (స)ను దీన్ని గురించి అడిగాను. దానికి ప్రవక్త (స), ‘ఆ అమ్మాయిని చూసుకున్నావా?’ అని అడిగారు. నేను, ‘లేదు’, అని సమాధానం ఇచ్చాను. దానికి ప్రవక్త (స), ‘నువ్వు ఆ అమ్మాయిని చూసుకో, చూసి నికా’హ్ చేసుకుంటే మీ మధ్య ఎంతో గొప్ప ప్రేమాభిమానాలు ఉంటాయి. ఎందుకంటే మీరు పరస్పరం ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. (అ’హ్మద్, తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్, దారమి)
3108 – [ 11 ] ( لم تتم دراسته ) (2/933)
وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: رَأَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم اِمْرَأَةً فَأَعْجَبَتْهُ فَأَتَى سَوْدَةَ وَهِيَ تَصْنَعُ طِيْبًا وَعِنْدَهَا نِسَاءٌ فَأَخْلَيْنَهُ فَقَضَى حَاجَتَهُ ثُمَّ قَالَ: “أَيُّمَا رَجُلٍ رَأَى اِمْرَأَةً تُعْجِبُهُ فَلْيَقُمْ إِلَى أَهْلِهِ فَإِنَّ مَعَهَا مِثْلَ الَّذِيْ مَعَهَا”. رَوَاهُ الدَّارَمِيُّ.
3108. (11) [2/933– అపరిశోధితం]
ఇబ్నె మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) బయటకు వెళ్ళారు. అకస్మాత్తుగా ఒక స్త్రీపై ఆయన దృష్టి పడింది. ఆమె చాలా అందంగా అనిపించింది. ప్రవక్త (స) వెంటనే ఇంటికి తిరిగి వచ్చి, సౌదహ్ (ర) వద్దకు వచ్చారు. అప్పుడు ఆమె సువాసన తయారు చేస్తున్నారు. కొంత మంది పొరుగు స్త్రీలు కూడా ఆమె వద్ద కూర్చుని ఉన్నారు. ఆ స్త్రీలు ప్రవక్త (స)ను చూసి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. ప్రవక్త (స) ఒక్కరే మిగిలారు. ప్రవక్త (స) సౌదహ్ (ర)తో సంభోగం చేసిన తరువాత బయటకు వచ్చి పరాయి స్త్రీపై దృష్టిపడి, ఆమె అందంగా ఉందని అనిపిస్తే, ఆ వ్యక్తి వెంటనే తన ఇంటికి వచ్చి తన భార్యతో సంభోగం చేసుకోవాలి. దానివల్ల అతని వ్యామోహం, చెడు ఆలోచనలు అంతమవుతాయి. ఎందు కంటే ఆ స్త్రీ వద్ద ఉన్నవే అతని భార్య వద్ద కూడా ఉన్నాయి” అని అన్నారు.[18] (దారమి)
3109 – [ 12 ] ( صحيح ) (2/933)
وَعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اَلْمَرْأَةُ عَوْرَةٌ فَإِذَا خَرَجْتِ اسْتَشْرَفَهَا الشَّيْطَانُ”. رَوَاهُ التِّرْمِذِيُّ
3109. (12) [2/933 –దృఢం]
ఇబ్నె మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్త్రీ మొత్తం తెరచాటున ఉండాలి. తెరచాటున ఉండటానికే తగినది. స్త్రీ బయటకు వెళితే పురుష షై’తానులు ఆమెను తెరచాటున తొంగిచూస్తూ ఉంటారు.” [19] (తిర్మిజి’)
3110 – [ 13 ] ( لم تتم دراسته ) (2/933)
وَعَنْ بُرَيْدَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِعَلِّيْ: “يَا عَليُّ لَا تُتْبِعِ النَّظْرَةَ النَّظْرَةَ فَإِنَّ لَكَ الْأَوْلَى وَلَيْسَتْ لَكَ الْآخِرَةُ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ
3110. (13) [2/933 –అపరిశోధితం]
బురైదహ్ (ర) కథనం: ప్రవక్త (స) ‘అలీ (ర)ను ఇలా ఆదేశించారు, ”ఓ ‘అలీ! ఒకవేళ అకస్మాత్తుగా నీ దృష్టి పరాయి స్త్రీపై పడితే, మళ్ళీ ఆమెవైపు చూసే ప్రయత్నం చేయకు. ఎందుకంటే మొదటిసారి అనుకోకుండా దృష్టిపడితే ఎటువంటి అభ్యంతరం లేదు. మళ్ళీ ఆమె వైపు చూడటం నీకు ఎంతమాత్రం ధర్మసమ్మతం కాదు.” (అ’హ్మద్, తిర్మిజి’, అబూ దావూద్, దారమి)
3111 – [ 14 ] ( حسن ) (2/933)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا زَوَّجَ أَحَدُكُمْ عَبْدَهُ أَمَتَهُ فَلَا يَنْظُرَنَّ إِلَى عَوْرَتِهَا”.
وَ فِيْ رِوَايَةٍ: “فَلَا يَنْظُرَنَّ إِلَى مَا دُوْنَ السُّرَةِ وَفَوْقَ الرُّكْبَةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3111. (14) [2/933 –ప్రామాణికం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి, తాతల ద్వారా, కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా తన బానిసరాలి పెళ్ళి తన బానిసతో చేసివేస్తే, ఆ తరువాత ఆమె మర్మాంగం వైపు చూడకూడదు.
మరో ఉల్లేఖనంలో; ”బొడ్డు నుండి మోకాళ్ళ క్రింది వరకు చూడకూడదు” అని ఉంది. [20] (అబూ దావూద్)
3112 – [ 15 ] ( ضعيف ) (2/933)
وَعَنْ جُرْهَدٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “أَمَا عَلِمْتَ أَنَّ الْفَخِذَ عَوْرَةٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ
3112. (15) [2/933 –బలహీనం]
జుర్హద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”తొడ కప్పబడే భాగమని నీకు తెలియదా!” [21](తిర్మిజి’, అబూ దావూద్)
3113 – [ 16 ] ( ضعيف ) (2/934)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ لَهُ: “يَا عَلِيُّ لَا تُبْرِزْ فَخِذَكَ وَلَا تَنْظُرْ إِلَى فَخِذِ حَيّ وَلَا مَيِّتٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
3113. (16) [2/934 –బలహీనం]
‘అలీ (ర) కథనం:ప్రవక్త (స) ”ఓ’అలీ! నీవు నీ తొడను విప్పకు, బ్రతికున్న లేదా చనిపోయిన వ్యక్తి తొడ వైపు చూడకు.” (అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
3114 – [ 17 ] ( ضعيف ) (2/934)
وَعَنْ مُحَمَّدِ بْنِ جَحْشٍ قَالَ: مَرَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى مَعْمَرٍوَفَخِذَهُ مَكْشُوْفَتَانِ قَالَ: “يَا مَعْمَرُغَطِّ فَخِذَيْكَ فَإِنَّ الْفَخِذَيْنِ عَوْرَةً”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ
3114. (17) [2/934– బలహీనం]
ము’హమ్మద్ బిన్ జ’హష్ (ర) కథనం: ప్రవక్త (స) మ’అమర్ ప్రక్కనుండి వెళ్ళారు. అతని రెండు తొడలు విప్పి ఉన్నాయి. అప్పుడు ప్రవక్త (స), ‘ఓ మ’అమర్! నీవు నీ తొడలను కప్పుకో. ఎందుకంటే తొడలు కూడా మర్మాంగాలు. దాచి ఉంచవలసిన భాగాలు,’ అని హితబోధ చేసారు. (షర్’హ్ సున్నహ్)
3115 – [ 18 ] ( لم تتم دراسته ) (2/934)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِيَّاكُمْ وَ التَّعَرِّيَ فَإِنَّ مَعَكُمْ مَنْ لَا يُفَارِقُكُمْ إِلَّا عِنْدَ الْغَائِطِ وَحِيْنَ يُفْضِيْ الرَّجُلُ إِلَى أَهْلِهِ فَاسْتَحْيُوْهُمْ وَأَكْرِمُوْهُمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ
3115. (18) [2/934– అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మిమ్మల్ని మీరు నగ్నంగా ఉంచకండి. ఒంటరిగా ఉన్నాసరే. ఎందుకంటే మీ వెంట దైవదూతలు ఉంటారు. ఎన్నడూ మీ నుండి వేరుకారు. వారిపట్ల సిగ్గుపడండి, వారిని గౌరవించండి. అయితే కాలకృత్యాలు మరియు భార్యతో సంభోగం చేసినపుడు తప్ప.” (తిర్మిజి’)
3116 – [ 19 ] ( ضعيف ) (2/934)
وَعَنْ أُمِّ سَلَمَةَ: أَنَّهَا كَانَتْ عِنْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. وَمَيْمُوْنَةَ إِذَ أَقْبَلَ اِبْنُ مَكْتُوْمٍ فَدَخَلَ عَلَيْهِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِحْتَجِبَا مِنْهُ” .فَقُلْتُ يَا رَسُوْلَ اللهِ أَلَيْسَ هُوَ أَعْمَى لَا يُبْصِرُنَا؟” فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَفَعَمْيَاوَانِ أَنْتُمَا؟ أَلَسْتُمَا تُبْصِرَانِهِ؟” رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.
3116. (19) [2/934 –బలహీనం]
ఉమ్ము సలమహ్ (ర) కథనం: నేను మరియు మైమూనహ్ ఇద్దరం ప్రవక్త (స) వద్ద కూర్చొని ఉన్నాం. ఇంతలో ‘అబ్దుల్లాహ్ బిన్ ఉమ్మె మక్తూమ్ ప్రవక్త (స) వద్దకు వచ్చారు. ప్రవక్త (స) మమ్మల్ని తెరచాటుకు వెళ్ళమని ఆదేశించారు. అప్పుడు నేను, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! అతడు అంధుడు మమ్మల్ని చూడలేడు’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘మీరిద్దరూ అంధులా? మీరు చూడలేరా?’ అని అన్నారు. [22] (అ’హ్మద్, తిర్మిజి’, అబూ దావూద్)
3117 – [ 20 ] ( حسن ) (2/934)
وَعَنْ بَهْزِ بْنِ حَكَيْمٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِحْفَظْ عَوْرَتَكَ إِلَّا مِنْ زَوْجَتِكَ أَوْ مَا مَلَكَتْ يَمِيْنُكَ” .فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَفَرَأَيْتَ إِنْ كَانَ الرَّجُلُ خَالِيًا؟ قَالَ: “فَاللهُ أَحَقُّ أَنْ يُسْتَحْيَى مِنْهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
3117. (20) [2/934– ప్రామాణికం]
బహ్’జ్ బిన్ ‘హకీమ్ తన తండ్రి, తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ మర్మాంగాలను కాపాడుకోండి. ఎవరి ముందూ బహిర్గతం చేయకండి. అయితే మీ భార్యల ముందు బానిసరాళ్ళ ముందు తప్ప.” దానికి నేను, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ఒకవేళ మనిషి ఒంటరిగా ఉంటే,’ అని ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స), ‘ఒంటరిగా ఉన్నాసరే మర్మాంగాలను బహిర్గతం చేయకండి. అల్లాహ్ (త) నుండి కూడా సిగ్గుపడాలి.’ అంటే అల్లాహ్ (త) కూడా మీ వెంట ఉంటాడు. కనుక ఆయన నుండి కూడా సిగ్గుపడాలి. (తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
3118 – [ 21 ] ( صحيح ) (2/935)
وَعَنْ عُمَرَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا يَخْلُوَنَّ رَجُلٌ بِاِمْرَأَةٍ إِلَّا كَانَ ثَالِثَهُمَا الشَّيْطَانُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
3118. (21) [2/935 –దృఢం]
‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”పరాయి పురుషుడు పరాయి స్త్రీతో ఉన్నప్పుడు వారి వెంట షై’తాన్ కూడా ఉంటాడు. చెడు కార్యాలవైపు ప్రేరేపిస్తాడు. అందువల్ల ఒంటరిగా పరాయి పురుషునితో గాని, పరాయి స్త్రీతో గాని ఉండరాదు. (తిర్మిజి’)
3119 – [ 22 ] ( لم تتم دراسته ) (2/935)
وَعَنْ جَابِرٍعَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا تَلِجُوْا عَلَى الْمَغِيِّبَاتِ فَإِنَّ الشَّيْطَانَ يَجْرِيْ مِنْ أَحَدِكُمْ مَجْرَى الدَّمِ”. قُلْنَا: وَمِنْكَ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “وَمِنِّيْ وَلَكِنَّ اللهَ أَعَانَنِيْ عَلَيْهِ فَأَسْلَمَ”. رَوَاهُ التِّرْمِذِيُّ
3119. (22) [2/935– అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భర్తలు విదేశాలకు వెళ్ళి ఉన్న స్త్రీల ఇళ్ళకు వెళ్ళకండి. ఎందుకంటే షై’తాన్ రక్తంలా మీ శరీరంలోని నరాలన్నిటిలో సంచరిస్తూ ఉంటాడు.” దానికి మేము, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! మీ వెంట కూడా షై’తాన్ ఉన్నాడా?’ అని ప్రశ్నించాము. దానికి ప్రవక్త (స), ‘అవును. కాని, అల్లాహ్ (త) దయవల్ల నేను వాడి పన్నాగాలకు దూరంగా ఉన్నాను,’ అని అన్నారు. (తిర్మిజి’)
3120 – [ 23 ] ( صحيح ) (2/935)
وَعَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أَتَى فَاطِمَةَ بِعَبْدٍ قَدْ وَهَبَهُ لَهَا وَعَلى فَاطِمَةَ ثَوْبٌ إِذَا قَنَّعَتْ بِهِ رَأْسَهَا لَمْ يَبْلُغْ رِجْلَيْهَا وَإِذَا غَطَّتْ بِهِ رِجْلَيْهَا لَمْ يَبْلُغْ رَأْسَهَا. فَلَمَّا رَأَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مَا تَلْقَى قَالَ: “إِنَّهُ لَيْسَ عَلَيْكَ بَأْسٌ إِنَّمَا هُوَ أَبُوْكِ وَغُلَامُكِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3120. (23) [2/935– దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక బానిసను తీసుకొని ఫా’తిమహ్ ఇంటికి వచ్చారు. ఆ బానిసను ఫా’తిమహ్కు సేవలు చేయడానికి ఇచ్చారు. ఆ సమయంలో ఆమెపై చిన్న వస్త్రం ఉండేది. అంటే ఒక చిన్న వస్త్రం ధరించి ఉన్నారు. తల కప్పుకుంటే కాళ్ళు కనబడేవి, కాళ్ళు కప్పితే తల కనబడేది. ప్రవక్త (స) ఆమె కష్టాన్ని చూచి ఇలా అన్నారు, ”చూడమ్మా కాళ్ళు కనబడితే మరేం ఫర్వాలేదు, ఇక్కడ పరాయి వాళ్ళెవరూ లేరు. నేను నీ తండ్రిని, ఇతడు నీ సేవకుడు.” [23] (అబూ దావూద్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3121 – [ 24 ] ( متفق عليه ) (2/935)
عَنْ أُمِّ سَلَمَةَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ عِنْدَهَا وَفِي الْبَيْتِ مَخَنَّثٌ فَقَالَ: لِعَبْدِ اللهِ بْنِ أَبِيْ أُمَيَّةَ أَخِيْ أُمِّ سَلَمَةَ: يَا عَبْدِ اللهِ إِنْ فَتَحَ اللهُ لَكُمْ غَدَا الطَّائِفَ فَإِنِّيْ أَدُلُّكَ عَلَى اِبْنَةِ غَيْلَانَ فَإِنَّهَا تُقْبِلُ بِأَرْبَعٍ وَتُدْبِرُ بِثَمَانٍ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “لَا يَدْخُلَنَّ هَؤُلَاءِ عَلَيْكُمْ”
3121. (24) [2/935 –ఏకీభవితం]
ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఆమె ఇంటికి వచ్చారు. అప్పుడు ఇంట్లో ఒక కొజ్జా కూర్చొని ఉన్నాడు. వాడు ఉమ్మె సలమహ్ సోదరుడు, ‘అబ్దుల్లాహ్ బిన్ అబీ ఉమయ్యతో, ”ఓ ‘అబ్దుల్లాహ్! ఒకవేళ అల్లాహ్(త) నీకు రేపు ‘తాయిఫ్పై విజయం ప్రసాదిస్తే, నేను ‘గీలాన్ అమ్మాయిలను చూపిస్తాను. వారు నాలుగు మడతలతో వస్తారు. ఎనిమిది మడతలతో వెళ్తారు. అంటే వారు బొద్దుగా ఉంటారు. అరబ్బులు బొద్దుగా ఉండే స్త్రీలంటే ఇష్టపడేవారు. అందు వల్ల వారిని పొగుడుతున్నాడు. అది విన్న ప్రవక్త (స), ‘ఇకముందు ఇటువంటి వారిని ఇంట్లోకి రానివ్వకండి,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
ఎందుకంటే, వారు మన స్త్రీల అందచందాలను వివరించి ఉపద్రవాలకు గురిచేస్తారు.
3122 – [ 25 ] ( صحيح ) (2/936)
وَعَنِ الْمِسْوَرِ بْنِ مَخْرَمَةَ قَالَ: حَمَلْتُ حَجْرًا ثَقِيْلًا. فَبَيْنَا أَنَا أَمْشِيْ سَقَطَ عَنِّيْ ثَوْبِيْ فَلَمْ أَسْتَطِعْ أَخَذَهُ فَرَآنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ لِيْ:”خُذْ عَلَيْكَ ثَوْبَكَ وَلَا تَمْشُوْا عُرَاةً”. رَوَاهُ مُسْلِمٌ.
3122. (25) [2/936 –దృఢం]
మిస్‌వర్ బిన్ మ’ఖ్‌రమహ్ (ర) కథనం: నేను బరువైన రాయిని ఎత్తుకొని వెళుతున్నాను. నా లుంగీ జారి పోయింది. నేను పట్టుకోలేకపోయాను. శరీరం అంతా బయటపడింది. ఆ స్థితిలో ప్రవక్త (స) నన్ను చూసి, ‘దుస్తులు ఎత్తికట్టుకో, అలా నగ్నంగా నడవకు,’ అని హితబోధ చేసారు. (ముస్లిమ్)
3123 – [ 26 ] ( ضعيف ) (2/936)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: مَا نَظَرْتُ أَوْ مَا رَأَيْتُ فَرْجَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَطُّ . رَوَاهُ ابْنُ مَاجَهُ
3123. (26) [2/936 –బలహీనం]
‘ఆయి’షహ్ (ర) కథనం: నేను ప్రవక్త (స) మర్మాంగాన్ని ఎన్నడూ చూడలేదు. (ఇబ్నె మాజహ్)
సంభోగ సమయంలో ఒకరి మర్మాంగంపై ఒకరి దృష్టి పడితే అభ్యంతరం ఏమీ లేదు. కాని పడకపోవడమే మంచిది.
3124 – [ 27 ] ( ضعيف ) (2/936)
وَعَنْ أَبِيْ أُمَامَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَا مِنْ مُسْلِمٍ يَنْظُرُ إِلَى مَحَاسِنِ اِمْرَأَةٍ أَوَّلَ مَرَّةٍ ثُمَّ يَغُضُّ بَصَرَهُ إِلَّا أَحْدَثَ اللهُ لَهُ عِبَادَةً يَجِدُ حَلَاوَتَهَا”. رَوَاهُ أَحْمَدُ .
3124. (27) [2/936 –బలహీనం]
అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్ దృష్టి అనుకోకుండా పరాయి స్త్రీ యొక్క ముఖారవిందంపై పడి వెంటనే అతడు దృష్టిని మరల్చు కుంటే, అల్లాహ్ (త) అతనికి ఎల్లప్పుడూ హృదయంలో తియ్యటి అనుభూతినిపొందే ఆరాధనను ప్రసాదిస్తాడు.”
3125 – [ 28 ] ( ضعيف ) (2/936)
وَعَنِ الْحَسَنِ مُرْسَلًا قَالَ: بَلَغَنِيْ أَنَّ رَسُوْلَ صلى الله عليه وسلم قَالَ: “لَعَنَ اللهُ النَّاظِرَ وَالْمَنْظُوْرَ إِلَيْهِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.
3125. (28) [2/936– బలహీనం]
‘హసన్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇతరుల మర్మాంగాన్ని లేదా పరాయి స్త్రీ ముఖాన్ని అనవసరంగా చూసే వ్యక్తిపై, దృష్టి పడిన వారిపై అల్లాహ్ (త) అభిశాపం పడుతుంది.” అనే వార్త నాకు అందింది. (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)
=====
2- بَابُ الْوَلِيِّ فِيْ النِّكَاحِ وَاسْتِئْذَانِ الْمَرْأَةِ
2. నికాహ్‌లో స్త్రీ సంరక్షకుడు, స్త్రీ అనుమతి
నికా’హ్ షరతులో ఒకటి సంరక్షకుడు తప్పనిసరిగా ఉండాలి. స్త్రీ ఇష్టం లేనిది, సంరక్షకుడు లేనిదే నికా’హ్ జరుగదు. నిఘంటువులో వలీకి – మిత్రుడు, దైవభక్తుడు మొదలైన అర్థాలున్నాయి. ఎందుకంటే దైవాన్ని ఆరాధిస్తూ దైవమిత్రుడు అయిపోతాడు. ఇస్లామీయ భాషలో బుద్ధి జ్ఞానాలు గలవాడు, యుక్త వయస్సుకు చేరిన వారసుడని కూడా అర్థాలున్నాయి.
1. బంధుత్వం అంటే తండ్రి, కూతురు పెళ్ళి చేయటం, 2. యజమాని తన బానిసరాలి పెళ్ళి చేయటం, 3. అధికారి అనాథుల నికా’హ్ చేయటం. నికా’హ్లో ఆమె కుటుంబంలోని అందరికంటే దగ్గరి బంధువే ఆమె వలీ, (సంరక్షకుడు). ఉదా: తండ్రి, తాత, సోదరుడు మొద లైన వారు, ఆమెకు వలీ అవుతారు.
ఒకవేళ బంధువుల్లో ఎవరూ లేకపోతే ప్రజా నాయకుడే వలీ అవుతాడు. అయితే వలీ ముస్లిమ్, బుద్ధిగల వాడు, యుక్త వయస్సుకు చేరినవాడు అయి ఉండాలి. అవిశ్వాసి, యుక్త వయస్సుకు చేరనివాడు, పిచ్చి వాడు దీనికి తగడు.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3126 – [ 1 ] ( متفق عليه ) (2/937)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُنْكَحُ الْأَيِّمُ حَتَّى تُسْتَأْمَرَ .وَلَا تُنْكَحُ الْبِكْرُحَتَّى تُسْتَأْذَنَ”. قَالُوْا: “يَا رَسُولَ اللهِ وَكَيْفَ إِذنُهَا؟” قَالَ: “أَنْ تَسْكُتَ”.
3126. (1) [2/937 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స), ”భర్త లేని స్త్రీ పెళ్ళి స్పష్టంగా ఆమె చెప్పిన తర్వాత, కన్య పెళ్ళి ఆమె అనుమతి తర్వాతనే చేయాలి,” అని అన్నారు. దానికి ప్రజలు, ”ప్రవక్తా! ఆమె సిగ్గుతో మాట్లాడ లేదు, మరి ఆమె నుండి అనుమతి ఎలా తీసుకోవాలి,” అని అడిగారు. దానికి ప్రవక్త (స), ‘ఆమె మౌనం, తిరస్కరించక పోవటమే ఆమె అనుమతి,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
3127 – [ 2 ] ( صحيح ) (2/937)
وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “الْأَيّمُ أَحَقُّ بِنَفْسِهَا مِنْ وَلِيِّهَا وَالْبِكْرُ تُسْتَأْذَنُ فِيْ نَفْسِهَا وَإِذْنُهَا صُمَاتُهَا”.
وَفِيْ رِوَايَةٍ: قَالَ: “اَلثَّيِّبُ أَحَقُّ بِنَفْسِهَا مِنْ وَلِيِّهَا وَالْبِكْرُ تُسْتَأْمَرُ وَإِذْنُهَا سُكُوْتُهَا”.
وَفِيْ رِوَايَةٍ: قَالَ: “اَلثَّيِّبُ أَحَقُّ بِنَفْسِهَا مِنْ وَلِيِّهَا وَالْبِكْرُ يَسْتَأْذِنُهَا أَبُوْهَا فِيْ نَفْسِهَا وَإِذْنُهَا صُمَاتُهَا”. رَوَاهُ مُسْلِمٌ.
3127. (2) [2/937– దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వితంతురాలు తన నికా‘హ్ విషయంలో తన సంరక్షకునికంటే తానే ఎక్కువ హక్కు గలది. కన్యతో ఆమె పెళ్ళి గురించి అనుమతి తీసుకోవాలి. ఆమె మౌనమే ఆమె అనుమతి.
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, భర్త లేని స్త్రీలు తమ పెళ్ళి విషయంలో తమ సంరక్షకునికంటే తామే అధిక అధికారం గలవారు. కన్యతో ఆమె తండ్రి ఆమె వివాహ విషయంలో ఆమె అనుమతి తీసుకోవాలి. ఆమె మౌనమే ఆమె అనుమతి.
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, భర్త లేని స్త్రీలు తమ పెళ్ళి విషయంలో తమ సంరక్షకుని కంటే తామే అధిక అధికారం గలవారు. కన్యతో ఆమె తండ్రి ఆమె వివాహ విషయంలో ఆమె అనుమతి తీసుకోవాలి. ఆమె మౌనమే ఆమె అనుమతి. (ముస్లిమ్)
3128 – [ 3 ] ( صحيح ) (2/937)
وَعَنْ خُنَسَاءَ بِنْتِ خِذَامٍ: أَنَّ أَبَاهَا زَوَّجَهَا وَهِيَ ثَيِّبٌ فَكَرِهَتْ ذَلِكَ. فَأَتَتْ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَرَدَّ نِكَاحَهَا. رَوَاهُ الْبُخَارِيُّ وَفِيْ رِوَايَةِ ابْنِ مَاجَهُ: “نِكَاحَ أَبِيْهَا”.
3128. (3) [2/938 –దృఢం]
‘ఖన్సా’ బిన్తె ‘ఖిజా’మ్ తండ్రి ఆమె అనుమతి లేకుండా ఆమె పెళ్ళిచేసారు. ఆమె వితంతురాలు. పెళ్ళిపట్ల ఆమె సంతృప్తిగా లేరు. ఆమె ప్రవక్త (స) వద్దకు వచ్చారు. తన వృత్తాంతం అంతా వివరించారు. అప్పుడు ప్రవక్త (స) ఆమె తండ్రి చేసిన నికా’హ్ను రద్దు చేసారు. (బు’ఖారీ, ఇబ్నె మాజహ్)
3129 – [ 4 ] ( صحيح ) (2/937)
وَعَنْ عَائِشَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم. تَزَوَّجَهَا وَهِيَ بِنْتُ سَبْعِ سَنِيْنَ وَزُفَّتْ إِلَيْهِ وَهِيَ بِنْتُ تِسْعِ سِنِيْنَ وَلُعَبُهَا مَعَهَا وَمَاتَ عَنْهَا وَهِيَ بِنْتُ ثَمَانِيْ عَشَرَةَ. رَوَاهُ مُسْلِمٌ.
3129. (4) [2/937 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) పెళ్ళి ఆమె (ర)తో ఆమె వయస్సు 7 సం. ఉన్నప్పుడు జరిగింది. ప్రవక్త (స) వద్దకు పంపినపుడు ఆమె వయస్సు 9 సంవత్సరాలు. ప్రవక్త (స) వద్దకు వచ్చినప్పుడు తన బొమ్మను కూడా తీసుకొనివచ్చారు. ప్రవక్త (స) మరణించినపుడు ఆమె వయస్సు 18 సంవత్సరాలు.[24] (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3130 – [ 5 ] ( صحيح ) (2/938)
عَنْ أَبِيْ مُوْسَى عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا نِكَاحَ إِلَّا بِوَلِيِّ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْدَاوُدَ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ
3130. (5) [2/938 –దృఢం]
అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సంరక్షకుడు లేనిదే నికా’హ్ నెరవేరదు.” (అ’హ్మద్, తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్, దారమి)
3131 – [ 6 ] ( صحيح ) (2/938)
وَعَنْ عَائِشَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أَيُّمَا امْرَأَةٍ نَكَحَتْ نفسها بِغَيْرِإِذْنِ وَلِيَّهَا. فَنَكَاحُهَا بَاطِلٌ. فَنِكَاحُهَا بَاطِلٌ. فَنِكَاحُهَا بَاطِلٌ. فَإِنْ دَخَلَ بِهَا فَلَهَا الْمَهْرُ بِمَا اسْتَحَلَّ مِنْ فَرْجِهَا. فَإِنِ اشْتَجَرُوْا فَالسُّلْطَانُ وَلِيُّ مَنْ لَا وَلِيَّ لَهُ”. روَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ
3131. (6) [2/938 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్త్రీ తన సంరక్షకుని అనుమతి లేకుండా చేసుకున్న పెళ్ళి చెల్లదు, ప్రవక్త (స) ఈ విధంగా మూడుసార్లు పలికారు. ఒకవేళ ఆ స్త్రీతో ఆ భర్త సంభోగం చేస్తే, ఆమె ద్వారా లాభం పొందినందుకు ఆ భర్త తప్పనిసరిగా మహర్ చెల్లించాలి. ఒకవేళ స్త్రీ యొక్క సంరక్షకుల విషయంలో భేదాభిప్రాయం తలెత్తితే, సంరక్షకులు లేనివారికి పాలకుడే సంరక్షకుడు. (అ’హ్మద్, తిర్మిజి’, ఇబ్ను మాజహ్, దారమి)
3132 – [ 7 ] ( لم تتم دراسته ) (2/938)
وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “اَلْبَغَايَا اللَّاتِيْ يُنْكِحْنَ أَنْفُسَهُنَّ بِغَيْرِ بَيِنَّةٍ”. وَالْأَصَحُّ أَنَّهُ مَوْقُوْفٌ عَلَى ابْنِ عَبَّاسٍ. رَوَاهُ التِّرْمِذيُّ
3132. (7) [2/938 -అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, సాక్షులు, సంరక్షకులు లేకుండా తమ పెళ్ళిళ్ళు చేసుకున్న స్త్రీలు వ్యభిచార స్త్రీలు, వాస్తవం ఏమిటంటే ‘హదీసు’ ఇబ్నె ‘అబ్బాస్ వద్ద ముగిసింది.[25](తిర్మిజి’)
3133 – [ 8 ] ( لم تتم دراسته ) (2/938)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْيَتِيْمَةُ تُسْتَأْمَرُ فِيْ نَفْسِهَا فَإِنْ صَمَتَتْ فَهُوَ إِذْنُهَا وَإِنْ أَبَتْ فَلَا جَوَازَعَلَيْهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ
3133. (8) [2/938– అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అనాథ యువతిని ఆమె నికాహ్ గురించి అడిగి తెలుసు కోవాలి. ఆమె మౌనంగా ఉంటే ఆమె మౌనమే అనుమతిగా భావించాలి. ఒకవేళ ఆమె నిరాకరిస్తే ఆమె నికా’హ్ చేయరాదు. బలవంతంగా పెళ్ళిచేయడం ధర్మ సమ్మతం కాదు.” (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’)
3134 – [ 9 ] ( لم تتم دراسته ) (2/938)
وَرَوَاهُ الدَّارَمِيُّ عَنْ أَبِيْ مُوْسَى
3134. (9) [2/938 –అపరిశోధితం]
దారమి ఈ ‘హదీసు’ను అబూ మూసా (ర) ద్వారా కూడా ఉల్లేఖించారు.
3135 – [ 10 ] ( لم تتم دراسته ) (2/938)
وَعَنْ جَابِرٍعَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “أَيُّمَا عَبْدٍ تَزَوَّجَ بِغَيْرِ إِذْنِ سَيِّدِهِ فَهُوَ عَاهِرٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ وَالدَّراَمِيُّ.
3135. (10) [2/938 –అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, తన యజమాని అనుమతి లేకుండా తన నికా’హ్ చేసుకున్న బానిస వ్యభిచారి. (తిర్మిజి’, అబూ దావూద్, దారమి)
ఎందుకంటే బానిసకోసం యజమాని అనుమతి తప్పని సరి. యజమాని అనుమతి లేకుండా నికా’హ్ చెల్లదు.
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3136 – [ 11 ] ( لم تتم دراسته ) (2/939)
عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: إِنَّ جَارِيَةً بِكْرًا أَتَتْ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَذَكَرَتْ أَنَّ أَبَاهَا زَوَّجَهَا وَهِيَ كَارِهَةٌ فَخَيَّرَهَا النَّبِيُّ صلى الله عليه وسلم. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
3136. (11) [2/939- అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ఒక యువతి ప్రవక్త (స) వద్దకు వచ్చి, తన తండ్రి తన ఇష్టం లేకుండానే పెళ్ళిచేసాడని, పెళ్ళిపట్ల ఆమె సంతోషంగా లేదని ఫిర్యాదు చేసింది. ప్రవక్త (స) ఆమెకు ఆ పెళ్ళిని కొనసాగించవచ్చు లేదా రద్దు చేయవచ్చు అని అనుమతి ఇచ్చారు. (అబూ దావూద్)
3137 – [ 12 ] ( لم تتم دراسته ) (2/939)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُزَوِّجِ الْمَرْأَةُ الْمَرْأَةَ وَلَا تزوج الْمَرْأَةُ نَفْسَهَا. فَإِنَّ الزَّانِيَةَ هِيَ الَّتِيْ تُزَوِّجُ نَفْسَهَا”. رَوَاهُ ابْنُ مَاجَهُ.
3137. (12) [2/939– అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక స్త్రీ మరొక స్త్రీకి వలీగా ఉండి నికా’హ్ చేయించ లేదు. వలీ లేకుండా తన పెళ్ళి తాను కూడా చేసుకోలేదు. ఎందుకంటే స్త్రీ వలీ లేకుండా తన పెళ్ళి చేసుకుంటే ఆమె వ్యభిచారం చేసినట్టే.” (ఇబ్ను మాజహ్)
3138 – [ 13 ] ( لم تتم دراسته ) (2/939)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ وَابْنِ عَبَّاسٍ قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ وُلِدَ لَهُ وَلَدٌ فَلْيُحْسِنِ اسْمَهُ وَأَدَبَهُ فَإِذَا بَلَغَ فَلْيُزَوِّجْهُ فَإِنْ بَلَغَ وَلَمْ يُزَوِّجْهُ فَأَصَابَ إِثْمًا فَإِنَّمَا إِثْمُهُ عَلَى أَبِيْهِ”.
3138. (13) [2/939 –అపరిశోధితం]
అబూ స’యీద్, ఇబ్నె ‘అబ్బాస్‌ల కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరికైనా సంతానం పుడితే మంచి పేర్లు పెట్టాలి, మరియు మంచి శిక్షణ ఇవ్వాలి, యుక్త వయస్సుకు చేరితే వారి వివాహం చేయాలి, యుక్త వయస్సుకు చేరినా పెళ్ళి చేయక, వారు పాపాలకు పాల్పడితే, ఆ పాపం వారి తండ్రిపై పడుతుంది.” (బైహఖీ-షు’అబిల్ఈమాన్)
3139 – [ 14 ] ( لم تتم دراسته ) (2/939)
وَعَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ وَأَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ اللهُ عَنْهُ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “فِيْ التَّوْرَاةِ مَكْتُوْبٌ: مَنْ بَلَغَتْ اِبْنَتُهُ اثْنَتَيْ عَشَرَةَ سَنَةً وَلَمْ يُزَوِّجْهَا فَأَصَابَتْ إِثْمًا فَإِثْمُ ذَلِكَ عَلَيْهِ”. رَوَاهُمَا الْبَيْهَقِيُّ فِيْ ” شُعَبِ الْإِيْمَانِ”.
3139. (14) [2/939 –అపరిశోధితం]
‘ఉమర్ బిన్ ‘ఖత్తాబ్, అనస్ బిన్ మాలిక్‌ల కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తౌరాతులో ఇలా వ్రాయబడి ఉంది, ”అమ్మాయి 12 సంవత్సరాల వయస్సుకు చేరినా, ఆమె తండ్రి ఆమె వివాహం చేయకుండా ఉండి, ఆమె ఏదైనా పాపానికి పాల్పడితే ఆ పాపానికి ఆమె తండ్రి బాధ్యుడు.” (బైహఖీ-షు’అబిల్ఈమాన్)
=====
3- بَابُ إِعْلَانِ النِّكَاحِ وَالْخُطْبَةِ وَالشَّرْطِ
3. వివాహ ప్రకటన, ప్రసంగం షరతులు
నిశ్చితార్థం: నికా’హ్కు ఉభయ లోకాల్లోనూ చాలా ప్రాధాన్యత ఉంది. నికా’హ్ చేసుకోవటం వల్ల జీవితాన్ని సరిదిద్దుకోవటం జరుగుతుంది. అనేక చెడుల నుండి, పాపాల నుండి విముక్తి లభిస్తుంది. విశ్వాసం స్థిరంగా ఉంటుంది. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (స)ల ప్రీతి లభిస్తుంది. అయితే షరీ’అత్ ప్రకారం నికా’హ్ చేసుకుంటే ఇవన్నీ లభిస్తాయి. నికా’హ్లో కావలసిన తప్పనిసరి విషయాలు వాటిని గురించి పేర్కొనడం జరిగింది. ముస్లిముల్లోని ప్రతి ఒక్కడూ వీటిపై అమలు చేయాలి. కాని చాలామంది నికా’హ్లో అధర్మ కార్యాలు, స్వయంకల్పిత మూఢాచారాలను అవలంబిస్తూ ఉంటారు. వీటిలో కొన్ని అవిశ్వాసం వరకు చేర్చేవి కూడా ఉన్నాయి. కొన్ని పాపాలకు గురి చేసేవి, మరికొన్ని నిషిద్ధ కార్యాలకు గురిచేసేవి కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో వడ్డీ ధనాన్ని తీసు కొని ఇటువంటి ఆచారాలను నెరవేరుస్తారు. వడ్డీ తీసుకోవటం మహా పాపం, అంతే కాకుండా వడ్డీ డబ్బు వల్ల ఆస్తి అంతా నాశనం అవుతుంది. జీవితమంతా ఆ భారం క్రింద గడచిపోతుంది. ఇక్కడ మేము కొన్ని అధర్మ కార్యాలను, ఆచారాలను పొందుపరిచాము.
నిశ్చితార్థంలోని కల్పిత కార్యాలు: కొన్ని చోట్ల నిశ్చితార్థం సందర్భంగా మంగలివాడు ఉత్తరం తీసుకొని వస్తాడు, అతనికి కృతజ్ఞతగా ఏదైనా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దాన్ని తప్పనిసరిగా భావిస్తారు. కాని ఇస్లామ్ ధర్మంలో దానికి ఎటువంటి స్థానమూ లేదు. ప్రవక్త (స) పెళ్ళి అయింది. అతని (స) కుమార్తెల పెళ్ళి జరిగింది. కాని కృతజ్ఞతా పూర్వ గా ఏదీ తిని పించలేదు, డబ్బూ ఇవ్వ లేదు. కొన్ని చోట్లలో అమ్మాయి తండ్రి కొంత డబ్బు పెళ్ళి కొడుకు వారికి ఇస్తాడు. అతడు దాన్ని తీసుకున్న తరువాత నిశ్చితార్థం జరిగినట్లు భావించబడుతుంది. ఇది హిందువుల ఆచారం. ఇటువంటి ఆచారాలకు దూరంగా ఉండాలి. కేవలం మాట్లాడుకుంటే సరిపోతుంది.
ఫా’తిమహ్ (ర) పెళ్ళి సందర్భంగా అబూ బకర్ (ర), ‘ఉమర్ (ర), ప్రవక్త (స)ను కోరడం జరిగింది. ప్రవక్త (స) మౌనంగా ఉన్నారు. ఆ తరువాత ‘అలీ (ర) స్వయంగా సిగ్గుపడుతూ వచ్చారు. ప్రవక్త (స) ముందు మాట్లాడే ధైర్యం లేకుండా ఉండగా, ప్రవక్త (స) స్వయంగా ”ఫా’తిమాతో పెళ్ళికావాలా?” అని అడగ్గా, ‘అలీ (ర) ‘అవును’ అని విన్నవించు కున్నారు. ప్రవక్త (స) అతని దరఖాస్తును ఆమోదించారు.
అప్పుడు ఫా’తిమా వయస్సు 15½ సంవత్సరాలు. ‘అలీ వయస్సు 21 సంవత్సరాలు. ప్రవక్త (స) అనస్‌ను వెళ్ళి అబూ బకర్, ‘ఉమర్, ‘ఉస్మాన్, తల్’హా, ‘జుబైర్ ఇతర అన్సార్లను పిలుచుకు రమ్మని ఆదేశించారు. వారందరూ వచ్చిన తర్వాత ప్రవక్త (స) ప్రభావ పూరితమైన ప్రసంగం చేశారు.
ఆ తరువాత ఇలా అన్నారు, ”ఫా’తిమహ్తో ‘అలీ పెళ్ళి చేయమని అల్లాహ్ (త) ఆదేశించాడు. కనుక మీరందరూ సాక్షులుగా ఉండండి. నేను ఫా’తిమహ్ పెళ్ళి 400 మిస్ఖాల్ వెండి ద్వారా చేసాను, ‘అలీకి ఇష్టం అయితే.” దానికి ‘అలీ (ర), ‘ఓ ప్రవక్తా! నాకు ఇష్టమే’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) ఖర్జూరాల ఒక పళ్ళెం తెప్పించారు. అందరికీ పంచిపెట్టారు. ఆ తరువాత పా’తిమహ్ను ఉమ్మె అయ్మన్, ‘అలీ (ర) ల వెంట పంపారు. కట్నంగా ఒక దుప్పటి, ఒక చర్మంతో చేయబడిన తలగడ ఇచ్చారు. (అబూ ‘హాతిమ్, అ’హ్మద్)
ఆ తరువాత ప్రవక్త (స), ‘అలీ (ర) ఇంటికి వెళ్ళారు. ఫా’తిమహ్ను నీళ్ళు తెమ్మని చెప్పారు. ఆమె కర్ర పాత్రలో నీళ్ళు తెచ్చి ఇచ్చారు. ప్రవక్త (స) అందులో పుక్కిలించి ఫా’తిమాను ఇటు తిరగమని చెప్పి ఆమె గుండెపై, తలపై చిలకరించారు. ఆ తరువాత ఈ దు’ఆ పఠించారు, ”ఓ అల్లాహ్! ఫా’తిమహ్ మరియు ఆమె సంతానాన్ని షై’తాన్ కీడు నుండి రక్షించు.” ఆ తరువాత ఇటు తిరగమని కొంత నీటిని ఆమె వెనుక వైపు చిలకరించి ఈ దు’ఆనే పఠించారు. ఆ తరువాత ‘అలీ (ర)ను కూడా నీళ్ళు తెమ్మని ఆదేశించి ఇదే విధంగా చేసారు.
”బిస్మిల్లాహ్ శుభంతో నీ భార్య వద్దకు వెళ్ళు” అని ఆదేశించారు. (అబూ ‘హాతిమ్, అ’హ్మద్)
ఆలోచించండి! ‘అలీ (ర) స్వయంగా తన నిశ్చితార్థ సందేశం ఇచ్చారు. కేవలం నోటితో అన్నారు. పెళ్ళి జరిగినపుడు గుర్రమూ లేదు, వాహనమూ లేదు. కాని ఈ నాడు వీటిని తప్పనిసరిగా భావిస్తున్నారు. ఇంకా ప్రవక్త (స) స్వయంగా తన కూతురు నికా’హ్ చదివించారు!
ఈ కాలంలో చాలామంది అమాయకులు నికా’హ్ సమయంలో దాక్కుంటారు. ఇది అజ్ఞానం, అవివేకం. అత్త వారింటికి పంపినపుడు దురాచారాలు లేవు, బ్యాండ్ పార్టీలు లేవు. సంబరాలు లేవు. అతి నిదానంగా ఉమ్మె అయ్మన్ వెంట పంపివేసారు. ఆ తరువాత ప్రవక్త (స) కూడా ఆమె ఇంటికి వెళ్ళి పైన వివరించిన విధంగా చేసారు.
పెళ్ళికి సంబంధించిన కొన్ని కల్పిత ఆచారాలు:
పెళ్ళికూతుర్ని పెళ్ళికి ముందు అలంకరించడం, స్త్రీలందరూ కలసి ఆమెను ఒక మూల కూర్చోబెట్టి, ఆట వస్తువులు ఆమె ముందు ఉంచడం, మిఠాయిలు ఉంచడం మొదలైనవన్నీ చేస్తారు. ధార్మిక పరంగా వీటికి ఎటువంటి స్థానం లేదు. ఫా’తిమహ్, ‘ఆయి’షహ్, ఇటువంటివేమీ చేయలేదు. పాటలు పాడటం, మ్యూజిక్‌లు ఇటువంటివన్నీ నిషిద్ధం.
కొందరు పసుపు, ఇనుప ఉంగరాన్ని ఒక గుడ్డలో కట్టి దాన్ని పెళ్ళి కొడుకు మరియు పెళ్ళి కూతురి చేతులకు కట్టేస్తారు. దాన్ని కంగనా అంటారు. ఈ ఆచారం ఇస్లామ్‌లో ఎంతమాత్రం లేదు. మజాహిరుల్ ‘హఖ్ దీన్ని అవిశ్వాసచర్యగా అభిప్రాయపడు తున్నారు. (మజాహిరుల్ ‘హఖ్, మిష్కాతుల్ మ’సాబీహ్ అనువాదం /3)
పెళ్ళి సందర్భంగా పెళ్ళి కొడుకుకు పసుపు రాయడం నిషిద్ధం. ఎందుకంటే స్త్రీలను అనుకరించి నట్టు అవుతుంది. స్త్రీలను అనుకరించటం నిషిద్ధం. నిసాబుల్ ఇహ్తిసాబ్లో పురుషులు పసుపును తమ శరీరానికి పులుముకోవటం తగదు అని ఉంది. ఫతావా ‘హమీదియ, కన్’జుల్ ‘ఇబాద్ మరియు అష్బాహ్ నజాయిర్లలో పురుషులు పసుపు రాసు కోవడం అసహ్యకరమైన చర్య అని, స్త్రీలు రాసు కోవడం ఇస్లామీయ సాంప్రదాయం అని పేర్కొన్నారు.
పురుషులు పట్టు ధరించడం నిషిద్ధం. పెళ్ళి సంద ర్భంగానైనా, మరే సందర్భంగానైనా సరే. ప్రవక్త (స) బంగారం, పట్టును అనుచర సంఘంలోని స్త్రీల కొరకు ధర్మసమ్మతం చేయబడింది. పురుషుల కొరకు నిషేధించబడ్డాయి” అని ప్రవచించారు. (తిర్మిజి’)
పెళ్ళి కొడుక్కి, పెళ్ళి కూతురుకి పెళ్ళి బట్టలు ధరించే టప్పుడు బంధువులు తమ శక్తిమేరకు మంగలివాడికి కానుకలు ఇవ్వటం తప్పనిసరిగా భావిస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే చెడుగా భావించటం జరుగుతుంది. ఇవన్నీ కల్పిత ఆచారాలు. వీటికి ఇస్లామ్‌తో ఎలాంటి సంబంధం లేదు.
పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు సహ్రా ధరించటం ఎంత మాత్రం ధర్మసమ్మతం కాదు. ఇవన్నీ అవిశ్వాసుల మజూసీల ఆచారాలు. వారిని అనుకరించటం నిషిద్ధం. వారి మెడల్లో హారాలు వేయడం కూడా కల్పిత ఆచారమే.
పెళ్ళి సందర్భంగా పెళ్ళివారు వెళ్ళడం, పెళ్ళి తరు వాత భోజనాలు ఏర్పాటు చేయటం ఎంత మాత్రం తప్పనిసరి కాదు. పెళ్ళికొడుకు, పెళ్ళి కూతురు, ఇద్దరు సాక్షులు వలీ, ఖా’దీ ఉంటే చాలు. బంధు ప్రీతితో ఇవ్వటం, తీసుకోవటం జరిగితే ఫర్వా లేదు. అప్పుచేసిదాన్ని చెల్లించడం తప్పని సరి కాదు.
బరీ తీసుకువెళ్ళడం, అందులో దుస్తులు, ఉంగరం, రుమాల్, సెంట్లు, నూనె, సుర్మ, దువ్వెన మొదలైనవి ఉంటాయి. ఇవన్నీ నిషిద్ధ కార్యాలు. పేరు ప్రఖ్యాతుల కోసం, గర్వం కోసం చేయడం నిషిద్ధం.
పెళ్ళి సందర్భంలో, ఇతర సందర్భాల్లో ఆట పాటలు, డాన్సుల ఏర్పాటు చేయడం మహా పాపం, నిషిద్ధం. ఖుర్ఆన్ ఆదేశం: ” మరియు మానవులలో కొందరు – జ్ఞానం లేక, వ్యర్థ కాలక్షేపం చేసే మాటలనుకొని – ప్రజలను అల్లాహ్ మార్గం నుండి తప్పించే వారున్నారు…” (లుఖ్మాన్, 31:6)
ఇటువంటి ఆటపాటలనే లహ్వల్ ‘హదీస్, రఖియ్యతు జ్జినా, ‘సౌతుల్ అ’హ్మఖ్ అంటారు. ఇబ్నె ‘అబ్బాస్, ఇంకా ఇతర అనుచరులు ఆట పాటలు గానే అభిప్రాయపడ్డారు. ఒక ‘హదీసు’ కూడా దీన్ని సమర్థిస్తుంది. ”ప్రవక్త (స) ఇలా ప్రవచించారు. పాటలు హృదయంలో కాపట్యాన్ని జనింపజేస్తాయి. నీరు పంటను జనింపజేసినట్టు.” (బైహఖీ)
ఒక (మౌఖూఫ్ ‘హదీసు’) సహచరుని ప్రోక్తంలో ఇలా ఉంది. ఇబ్లీసు గెంటివేయబడి భూమిపై విసరివేయబడి నపుడు, ”నా పని చేతబడి, నా ఖుర్ఆన్ పద్యాలు, కవిత్వాలు, నా పుస్తకం శరీరాలను పీడించడం, నా ఆహారం మృత దేహాలు, ఇంకా అల్లాహ్ (త) తప్ప ఇతరుల పేర సమర్పించ బడిన జంతువులు, నా నీళ్ళు మత్తుపానీయాలు, నా నివాసం బజారులు, నా శబ్దం ఆటపాటలు. ఇది వేర్వేరు పదాలతో తబ్రానీలో కూడా ఉంది. ఇందులో ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”షై’తాన్ నా ముఅ’జ్జిన్ ఎవరు అని అనగా మేళతాళాలు అని, షై’తాన్ నా ఖుర్ఆన్ ఏమిటి అని అడగ్గా పద్యాలు గేయాలు అని ఆదేశించడం జరిగింది.
ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”అల్లాహ్ (త) మద్య పానాన్ని, జూదాన్ని వాయించడాన్ని, పాచికలను, నృత్య గానాలను నిషేధించాడు.”
అల్లాహ్ (త) నన్ను విశ్వ కారుణ్యామూర్తిగా, రుజు మార్గదర్శకునిగా పంపాడు. ఆటపాటలను, నృత్య గానాలను అజ్ఞాన కాలం నాటి విగ్రహాలను ఖండించమని నన్ను ఆదేశించాడు. (అ’హ్మద్)
అశుభకరమైన వాయింపుల వల్ల ప్రవక్త (స) తన చెవులు మూసుకునేవారు. నా’ఫె (ర) కథనం: ఒకసారి ఇబ్నె ‘ఉమర్ గొర్రెలకాపరి పిల్లన గ్రోవి శబ్దం విని వెంటనే తన చెవులను మూసుకున్నారు. వస్తున్న దారి వదలి మరోదారి గుండా వచ్చారు. ”ప్రవక్త (స)ను ఇలా చేస్తూ ఉండగా నేను చూసాను. అందువల్ల నేనూ అలా చేస్తున్నాను” అని అన్నారు. (తల్బీస్ ఇబ్లీస్)
ఇటువంటి ‘హదీసు’లు అనేకం ఉన్నాయి. వీటిలో ఆట పాటలు, డప్పులు, నివారించడం జరిగింది. నృత్యం చేయటం, నృత్యం చూడటం కఠినంగా నిషేధించటం జరిగింది. ఎందుకంటే పరాయి స్త్రీని చూడటం, ఆమెతో ఎగతాళి, హాస్యంగా ప్రవర్తించటం వ్యభిచారం అవుతుంది. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”పరాయి స్త్రీని చూడటం కళ్ళ వ్యభిచారం, ఆమెను పట్టుకోవటం చేతుల వ్యభిచారం, ఆమె వైపు వెళ్ళడం కాళ్ళ వ్యభిచారం.” (ముస్లిమ్, అబూ దావూద్)
నృత్యం, డాన్సు చూడటంలో వీటన్నిటి వ్యభిచారం అవుతుంది. వ్యభిచారిణులతో మాట్లాడటం, హాస్య మాడటం ఇది నోటి వ్యభిచారం అవుతుంది. వారివైపు చూడటం చూపులు కలపటం ఇది కళ్ళ వ్యభిచారం, వారి ఆటపాటలు వినటం చెవుల వ్యభిచారం, ఇవన్నీ చేయటానికి వెళ్ళడం కాళ్ళ వ్యభిచారం, ఇవన్నీ చేయటానికి మనసు కోరటం, ఇది మనసు వ్యభిచారం, వారిని పట్టుకోవటం ఇది చేతుల వ్యభిచారం అవుతుంది. కొందరు వారితో సంభోగం చేయటం జరుగుతుంది. వీరందరిపై దేవుని అభిశాపం పడుతుంది. ప్రవక్త (స) ప్రవచనం: ”పరాయి స్త్రీని చూచే వారిపై పరాయి పురుషుడి ముందు తన అందాన్ని ప్రదర్శించే స్త్రీపై అల్లాహ్ అభిశాపం పడుతుంది. డాన్స్ చేయించేవాడు అందరికంటే పరమ దుర్మార్గుడు. చూచే వాళ్ళ పాపమంతా అతనిపై పడుతుంది. ఎందుకంటే అందరూ చూడ టానికి అతడే కారకుడు. అల్లాహ్ (త) మనందరికీ సన్మార్గం చూపుగాక! ఆమీన్.
పెళ్ళి సందర్భంలో, ఇతర సందర్భాల్లోనూ బాణ సంచా కాల్చటం ఎంతమాత్రం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే ఇది వ్యర్థ ఖర్చు అవుతుంది. ఖుర్ఆన్లో అల్లాహ్ (త) ఆదేశం: ”దుబారా ఖర్చులు చేసేవారు షై’తాన్ సోదరులు.”
నికా’హ్ తరువాత, నికా’హ్ చేయించే వారికి తగిన రుసుము చెల్లించడం ధర్మం కాదు. అయితే అది తప్పనిసరి మరియు ప్రభుత్వచట్టం అయితే ఇవ్వ వచ్చును. అదే విధంగా కానుకగా ఇవ్వటంలో అభ్యంతరం ఏమీ లేదు.
నికా’హ్ తరువాత ఎండు ఖర్జూరం పంచటం, ఎగురవేయటంలో అభ్యంతరం ఏమీ లేదు. పాలు గాని, తీపి పానీయాలు గాని ప్రత్యేక సమయాన్ని నిర్ణయించకుండా త్రాగిస్తే ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే వీటిని తప్పనిసరిగా భావించరాదు.
నికా’హ్ తరువాత పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇంటికి వెళ్ళడం, పరాయి స్త్రీలను చూడటం, వారు పెళ్ళి కొడుకును చూడటం, అతని ముందుకు వారు, వారి ముందు అతను రావటం అన్నీ నిషిద్ధమే. పరాయి స్త్రీ పరాయి పురుషుడ్ని, పరాయి పురుషుడు పరాయి స్త్రీని చూడటం నిషిద్ధం. అల్లాహ్ ఆదేశం: ”పరాయి స్త్రీలను చూడరాదని, తమ చూపులు క్రిందికి వాల్చి ఉంచమని ముస్లిములను ఆదేశించండి.” అదేవిధంగా స్త్రీలు కూడా పాటించాలని ఆదేశించటం జరిగింది. (ఇస్లామీ పర్దాలో దీన్ని గురించి వివరంగా ఉంది). కొన్నిచోట్ల నికా’హ్ తరువాత పెళ్ళికొడుకు, పెళ్ళి కూతురు భోజనానికి కూర్చుని, అలుపును ప్రదర్శిస్తారు. మంచి కానుక ఇచ్చేవరకు తినటానికి ముందుకురారు. కానుక ఇచ్చిన తరువాతనే తినటం ప్రారంభిస్తారు. ఇదొక కల్పిత ఆచారం. ఇందులో అజ్ఞానం అవివేకం ఇమిడి ఉన్నాయి. కొన్నిచోట్ల అయితే మంగలి వానికి లేదా చాకలి వానికి బహుమానం దొరుకుతుంది. అమ్మాయిని సాగనంపేటప్పుడు బంధు మిత్రు లందరూ అమ్మాయి దూరం కావటాన్ని భరించ లేక కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటారు. శబ్దం లేకుండా ఏడ్వటంలో ఎటువంటి అభ్యంతరం లేదు. కేకలు వేస్తూ రోదిస్తూ ఏడ్వటం నిషేధించటం జరిగింది. కొన్నిచోట్ల పెళ్ళి కొడుకుకు పెళ్ళి కూతుర్ని ఎత్తుకొని వెళ్ళి వాహనంలో కూర్చోబెట్టమని ఆదేశించటం జరుగుతుంది. ఇది అసభ్య కార్యం అనటంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ఇటువంటి వన్నీ సిగ్గుమాలిన అజ్ఞానంతో కూడుకున్న పనులు.
పరాయి పురుషుల ముందు పెళ్ళికూతుర్ని ప్రదర్శించడం వారి నుండి కానుకలు తీసుకోవటం నిషిద్ధం. స్త్రీల ముందు ధర్మసమ్మతమే. అయితే ఈ సందర్భంగా కానుకలు ఇవ్వటం తప్పనిసరిగా భావిం చటం, ఆచారంగా అనుసరించటం అధర్మ కార్యం.
చౌథీ చేయడం, తినిపించడం మంచిదికాదు. ఇదీ ఒక ఆచారమే. ధర్మంలో లేనికార్యాలకు దూరంగా ఉండాలి.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3140 – [ 1 ] ( صحيح ) (2/940)
عَنِ الرُّبَيِّعِ بِنْتِ مُعَوِّذِ بْنِ عَفْرَاءَ قَالَتْ: جَاءَ النَّبِيُّ صلى الله عليه وسلم فَدَخَلَ حِيْنَ بُنِيَ عَلَيَّ فَجَلَسَ عَلَى فِرَاشِيْ كَمَجْلِسِكَ مِنِّيْ. فَجَعَلَتْ جُوَيْرَاتٌ لَّنَا يَضْرِبْنَ بِالدِّفِ وَيَنْدُبْنَ مِنْ قُتِلَ مِنْ آبَائِيْ يَوْمَ بَدْرٍإِذْ قَالَتْ إِحْدَاهُنَّ: وَفِيْنَا نَبِيٌّ يَعْلَمُ مَا فِيْ غَدٍ فَقَالَ: “دَعِيَ هَذِهِ وَ قُوْلِيْ بِالَّذِيْ كُنْتِ تَقُوْلِيْنَ”. رَوَاهُ الْبُخَارِيُّ
3140. (1) [2/940–దృఢం]
రు’బై బింతె ము’అవ్విజ్’ బిన్ ‘అఫ్రా’ (ర) కథనం: నాకు పెళ్ళయి నేను నా భర్త ఇంటికి వచ్చినప్పుడు, ప్రవక్త (స) మా ఇంటికి వచ్చి నా పడకపై నీవు కూర్చున్నట్లు కూర్చున్నారు. (అంటే ‘ఖాలిద్ బిన్ జకవాన్కు వివరిస్తున్నారు). అప్పుడు నా ఇంట్లో యుక్త వయస్సుకు చేరని కొందరు అమ్మాయిలు ఉన్నారు. నా పెళ్ళి సంతోషంలో దఫ్ వాయిస్తూ బద్ర్ యుద్ధంలో మరణించిన మా తాత ముత్తాతలను ప్రశంసిస్తూ పాటలు పాడుతున్నారు. ఇంతలో ఒక అమ్మాయి ప్రవక్త (స)ను ప్రశంసిస్తూ జరగబోయే విషయాలు తెలిసిన ప్రవక్త మాలో ఉన్నాడని పాడింది. అది విన్న ప్రవక్త (స), ”ఇలా అనకు, ముందు అన్నదే పలుకు,” అని అన్నారు.[26] (బు’ఖారీ)
3141 – [ 2 ] ( صحيح ) (2/940)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَتْ: زُفَّتِ امْرَأَةٌ إِلَى رَجُلٍ مِّنَالْأَنْصَارِ فَقَالَ نَبِيُّ اللهِ صلى الله عليه وسلم: “مَا كَانَ مَعَكُمْ لَهْوٌ؟ فَإِنَّ الْأَنْصَارَ يُعْجِبُهُمُ اللَّهْوُ”. رَوَاهُ الْبُخَارِيُّ
3141. (2) [2/940–దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ఒక అమ్మాయిని ఆమె పుట్టింటి నుండి ఒక అ’న్సారీ ఇంటికి పంపడం జరిగింది. అప్పుడు ప్రవక్త (స), ”ఒకవేళ మీ దగ్గర పిల్లల ఆట వస్తువులు ఉంటే పంపండి. ఎందుకంటే అన్సార్ల పిల్లలకు ఆట వస్తువులంటే చాలా ఇష్టం” అని అన్నారు. (బు’ఖారీ)
3142 – [ 3 ] ( صحيح ) (2/940)
وَعَنْهَا قَالَتْ: تَزَوَّجَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ شَوَّالٍ وَ بَنَى بِيْ فِيْ شَوَّالٍ. فَأَيُّ نِسَاءِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم كَانَ أَحْظَى عِنْدَهُ مِنِّيْ؟ رَوَاهُ مُسْلِمٌ
3142. (3) [2/940 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ”షవ్వాల్ నెలలో ప్రవక్త (స) తో నా పెళ్ళి అయింది. 3 సంవత్సరాల తర్వాత షవ్వాల్ నెలలోనే నన్ను ప్రవక్త (స) ఇంటికి సాగనంపటం జరిగింది. నా కంటే అదృష్టవంతురాలు మరెవరు?” [27] (ముస్లిమ్)
3143 – [ 4 ] ( متفق عليه ) (2/940)
وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَحَقُّ الشُّرُوْطِ أَنْ تُوْفُوْا بِهِ مَا اسْتَحْلَلْتُمْ بِهِ الْفُرُوْجَ”.
3143. (4) [2/940–ఏకీభవితం]
‘ఉఖ్బహ్ బిన్ ‘ఆమిర్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”ఏ షరతుల ద్వారా మీ భార్యల మర్మాం గాలను ధర్మసమ్మతం చేసుకుంటారో, వాటిని నెరవేర్చడం తప్పనిసరి.” [28] (బు’ఖారీ, ముస్లిమ్)
3144- [ 5 ] ( متفق عليه ) (2/940)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَخْطُبِ الرَّجُلُ عَلَى خِطْبَةِ أَخِيْهِ حَتَّى يَنْكِحَ أَوْ يَتْرُكَ”.
3144. (5) [2/940–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకరి పెళ్ళి సందేశంపై మరొకరు పెళ్ళి సందేశం పంపరాదు. మొదటి వ్యక్తి పెళ్ళిచేసుకునే వరకు లేదా వదలిపెట్టే వరకు తాను పెళ్ళి సందేశం పంపరాదు.” (బు’ఖారీ, ముస్లిమ్)
3145 – [ 6 ] ( صحيح ) (2/941)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَسْأَلِ الْمَرْأَةُ طَلَاقَ أُخْتِهَا لِتَسْتَفْرِغَ صَحْفَتَهَا وَلْتَنْكِحْ فَإِنَّ لَهَا مَا قُدِّرَ لَهَا”.
3145. (6) [2/941–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక విశ్వాసురాలు తన భర్తను ఆమె సోదరికి విడాకులు ఇమ్మని అంటే ఆమె వంతును కూడా తాను పొందుదామని విన్నవించుకోరాదు. ఎవరి కర్మలో ఎంత ఉందో వారికి అది తప్పకుండా దొరుకుతుంది.” [29] (బు’ఖారీ, ముస్లిమ్)
3146 – [ 7 ] ( متفق عليه ) (2/941)
وَعَنِ ابْنِ عُمَرَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَهَى عَنِ الشِّغَارِ وَالشِّغَارِ: أَنْ يُّزَوِجَ الرَّجُلُ اِبْنَتَهُ عَلَى أَنْ يُزَوِّجَهُ الْآخَرُ ابْنَتَهُ وَلَيْسَ بَيْنَهُمَا صَدَاقٌ.
و في رواية لمسلم قال لا شغارة في الإسلام.
3146. (7) [2/941–ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) షి’గార్ నికా’హ్ను నిషేధించారు. ”షి‘గార్ నికా‘హ్ అంటే ఒక వ్యక్తి తన కూతురి వివాహం మరొక వ్యక్తితో చేయడం, ఆ వ్యక్తి తన కూతురి వివాహం ఈ వ్యక్తితో చేయడం, ఇద్దరి మధ్య ఎటువంటి మహర్ నిర్ణయించ బడక పోవటం.” [30] (బు’ఖారీ, ముస్లిమ్)
ఒక ఉల్లేఖనంలో, ”ఇస్లామ్‌లో షి’గార్ లేదు” అని ఉంది. (ముస్లిమ్)
3147 – [ 8 ] ( متفق عليه ) (2/941)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَهَى عَنْ مُتْعَةِ النِّسَاءِ يَوْمَ خَيْبَرَوَعَنْ أَكْلِ لُحُوْمِ الْحُمُرِ الْإِنْسِيَّةِ.
3147. (8) [2/941–ఏకీభవితం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఖైబర్ యుద్ధం సందర్భంగా నికా’హ్ ముత్’అహ్ను నిషేధించారు. కంచరగాడిదల మాంసాన్ని కూడా నిషేధించారు. [31] (బు’ఖారీ, ముస్లిమ్)
3148 – [ 9 ] ( صحيح ) (2/941)
وَعَنْ سَلَمَةَ بْنِ الْأَكْوَعِ قَالَ: رَخَّصَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَامَ أَوْطَاسٍ فِيْ الْمُتْعَةِ ثَلَاثًا. ثُمَّ نَهَى عَنْهَا. روَاهُ مُسْلِمٌ.
3148. (9) [2/941– దృఢం]
సలమహ్ బిన్ అక్వ’ (ర) కథనం: అవ్’తాస్ యుద్ధ సందర్భంగా మూడు రోజుల కోసం ప్రవక్త (స) ముత్’అహ్ కు అనుమతి ఇచ్చారు. ఆ తరువాత దాన్ని నిషేధించారు.[32] (ముస్లిమ్)
—–
الْفَصْلُ الثَّانِي రెండవ విభాగం
3149 – [ 10 ] ( صحيح ) (2/941)
عَنْ عَبْدِ اللَّهِ بْنِ مَسْعُودٍ قَالَ: عَلَّمَنَا رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ التَّشَهُّدَ فِي الصَّلَاةِ وَالتَّشَهُّدَ فِي الْحَاجَةِ قَالَ: التَّشَهُّدُ فِي الصَّلَاةِ: «التَّحِيَّاتُ لِلَّهِ وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللَّهِ الصَّالِحِينَ. أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ» . [ص:942]
وَالتَّشَهُّدُ فِي الْحَاجَةِ: «إِنَّ الْحَمْدَ لِلَّهِ نَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسنَا. من يهد اللَّهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ».
وَيَقْرَأُ ثَلَاثَ آيَاتٍ 1. (يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسلمُونَ؛ 3: 102)
2. (يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تساءلون وَالْأَرْحَامَ. إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا؛ 4: 1)
3. (يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا. يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيما؛ 33: 70-71 )
رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُو دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهْ وَالدَّارِمِيُّ.
وَفِي جَامِعِ التِّرْمِذِيِّ فَسَّرَ الْآيَاتِ الثَّلَاثَ سُفْيَانُ الثَّوْرِيُّ وَزَادَ ابْنُ مَاجَهْ بَعْدَ قَوْلِهِ: «إِنَّ الْحَمْدَ لِلَّهِ نَحْمَدُهُ» وَبَعْدَ قَوْلِهِ: «من شرور أَنْفُسنَا وَمن سيئات أَعمالنَا» وَالدَّارِمِيُّ بَعْدَ قَوْلِهِ «عَظِيمًا» ثُمَّ يَتَكَلَّمُ بِحَاجَتِهِ
وَرَوَى فِي شَرْحِ السُّنَّةِ عَنِ ابْنِ مَسْعُودٍ فِي خطْبَة الْحَاجة من النِّكَاح وَغَيره.
3149. (10) [2/941–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ”ప్రవక్త (స) మాకు నమా’జ్‌లోని తషహ్హుద్‌ను నేర్పారు. ఇంకా నికా’హ్ తషహ్హుద్ అంటే ఖుత్బహ్ నేర్పారు. నమా’జ్ తషహ్హుద్: ”అత్త‘హియ్యాతు లిల్లాహి, వ‘స్సలవాతు వ‘త్తయ్యిబాతు, అస్సలాము ‘అలైక అయ్యు హన్నబియ్యు, వ ర‘హ్మతుల్లాహి వ బరకాతుహు. అస్సలాము ‘అలైనా వ అలా ఇబాదిల్లా హిస్సాలి‘హీన్. వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ము‘హమ్మదన్ ‘అబ్దుహూ వరసూలుహూ.” — -‘ధన, మాన, ప్రాణాల ఆరాధనలన్నీ అల్లాహ్‌కే చెందుతాయి. ఓ ప్రవక్తా! శాంతి మరియు అల్లాహ్ కారుణ్యం మరియు అల్లాహ్ శుభాలు మీపై కురియుగాక! మరియు మాపై మరియు అల్లాహ్ భక్తులపై శాంతి కురియుగాక! అల్లాహ్ తప్ప ఆరాధ్యులెవరూ లేరని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఇంకా ము’హమ్మద్ (స) అల్లాహ్ దాసులు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను.’
నికాహ్ (‘హాజహ్) ఖు’త్బహ్: ”ఇన్నల్ హమ్దు లిల్లాహి, వ నస్తఈనహూ వ నస్తగ్ఫిరుహూ, వ నవూ జు‘ బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా, వ మిన్సయ్యి ఆతి ఆమాలినా, మన్ యహ్దిల్లాహు ఫలా ముదిల్స లహూ, వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహూ. వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ము‘హమ్మదన్ ‘అబ్దుహూ వరసూలుహూ.” — ‘స్తోత్రాలన్నీఅల్లాహ్ కొరకే. మేము ఆయన్ను స్తుతిస్తున్నాము. సహాయం కొరకు ఆయన్నే అర్థిస్తున్నాము. ఆయన్నే క్షమాపణ కోరుతున్నాము. ఇంకా మా హృదయాల, పనుల చెడు నుండి ఆయన్నే శరణు కోరుతున్నాము. అల్లాహ్ సన్మార్గం చూపించే వాడిని ఎవరూ మార్గ భ్రష్టత్వానికి గురిచేయలేరు. అల్లాహ్ మార్గ భ్రష్టత్వానికి గురిచేసే వాడికి ఎవరూ సన్మార్గం చూప లేరు. ఆరాధనకు అర్హుడు కేవలం అల్లాహ్‌యే అని, ఆయనకు ఎవరూ సాటిలేరని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఇంకా ము’హమ్మద్ (స) ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను.’
ఆ తరువాత ప్రవక్త(స) ఈ 3 ఆయతులు పఠించారు. ” ‘యా అయ్యుహల్లజీన ఆమనుత్త ఖుల్లాహ్, హఖ్క తుఖాతిహీ, వలా తమూతున్న ఇల్లాహ్ వ అంతుం ముస్లిమూన్. ‘ (ఆల అమ్రాన్, 3:102)
‘యా అయ్యుహన్నా సుత్తఖూ రబ్బకుముల్లజీ ఖల ఖకుం మిన్ నఫ్చింవాహిదహ్, వ ఖలఖ నిన్హా ‘జవ్జహా, వ బస్స మిన్హుమా రిజాలం కసీరం వ నిసాఅ‘. వత్తఖుల్లాహల్లజీ తసాఅలూన వల్ అర్ హామ, ఇన్నల్లాహ కాన అలైకుం రఖీబా.‘ (అన్ నిసా’, 4:1)
‘యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ, వ ఖూలూ ఖౌలన్ సదీదహ్, యుస్లిహ్ లకుం అ‘అమాలకుం, వ యగ్పిర్లకుం జునూబకుం, వ మన్ యుతీ ఇల్లాహ వ రసూలుహూ, ఫఖద్ ఫాజ ఫౌజన్ అజీమా‘ ” (అల్ అహ్జాబ్, 33:70–-71) — ‘ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు కర్తవ్య పాలనగా అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు అల్లాహ్‌కు విధేయులుగా (ముస్లింలుగా) ఉన్న స్థితిలో తప్ప మరణించకండి!’ (ఆల అమ్రాన్, 3:102)
‘ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకేప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట (హవ్వా)ను సృష్టించాడు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింపజేశాడు. మరియు ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి, ఎవరి ద్వారానైతే (పేరుతోనైతే) మీరు మీ పరస్పర (హక్కులను) కోరు తారో; మరియు మీ బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి). నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు.”(అన్ నిసా’, 4:1)
‘ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు మాట్లాడినప్పుడు యుక్తమైన మాటనే పలకండి. ఆయన మీకర్మలను సరిదిద్దుతాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఎవడైతే అల్లాహ్‌కు విధేయుడై సందేశ హరుని ఆజ్ఞను పాలిస్తాడో! నిశ్చయంగా, అతడే గొప్ప విజయం పొందినవాడు!’ (అల్ అహ్జాబ్, 33:70–-71)
(అ’హ్మద్, తిర్మిజి’, అబూ దావూద్, నసాయీ, ఇబ్నె మాజహ్, దారమి)
తిర్మిజి’లో ‘సుఫియాన్ సౌరీ ఈ మూడు వాక్యాలను పేర్కొన్నారు. ”అల్’హమ్దులిల్లాహ్” తరువాత, ”న‘హ్మదుహూ” మరియు ”మిన్షురూరి అన్ ఫుసినా” తరువాత ”మిన్సయ్యిఆతి ఆమాలినా” అధికంగా పేర్కొన్నారు.
దారమి, ”అ”జీమున్” తరువాత ఆ నికా’హ్లో ఆమోదం, స్వీకరణ గురించి పేర్కొన్నారు.
షర్’హ్ సున్నహ్లో, నికా‘హ్ మరియు ఇతర సందర్భాల్లో ఈ ఖుత్బానే పఠించేవారని ఉంది.
3150- [ 11 ] ( لم تتم دراسته ) (2/942)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كُلُّ خُطْبَةٍ لَيْسَ فِيْهَا تَشَهُّدُ فَهِيَ كَالْيَدِ الْجَذْمَاءِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.
3150. (11) [2/942– అపరిశోధితం]
అబూ హురైరహ్(ర) కథనం:ప్రవక్త(స)ప్రవచనం, దైవ స్తోత్రం, ప్రవక్త (స) పై శుభం లేని ప్రసంగం తెగి పోయిన చేయివంటిది. [33] (తిర్మిజి’- ప్రామాణికం -ఏకోల్లేఖనం)
3151 – [ 12 ] ( ضعيف ) (2/942)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كُلُّ أَمْرٍذِيْ بَالٍ لَا يُبْدَأُ فِيْهِ بِالْحَمْدُ لِلّهِ فَهُوَ أَقْطَعُ”. رَوَاهُ ابْنُ مَاجَةَ
3151. (12) [2/942 –బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముఖ్యమైన కార్యాన్ని దైవస్తోత్రం, స్మరణ లేకుండా చేస్తే, అది అశుభంగా ఉంటుంది. (ఇబ్నె మాజహ్)
3152 – [ 13 ] ( لم تتم دراسته ) (2/943)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَعْلِنُوْا هَذَا النِّكَاحَ وَاجْعَلُوْهُ فِيْ الْمَسَاجِدِ وَاضْرِبُوْا عَلَيْهِ بِالدُّفُوْفِ”. رواهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ
3152. (13) [2/943 –అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నికా ‘హ్ల గురించి ప్రకటించండి, నికా’హ్లను మస్జిదుల్లో ఏర్పాటు చేయండి. నికా’హ్ల ప్రకటనలో దఫ్ వాయించండి. అందరికీ తెలిసి పోవడానికి.” (అ’హ్మద్, తిర్మిజి’ – ఏకోల్లేఖనం, నసాయి, ఇబ్నె మాజహ్)
3153 – [ 14 ] ( حسن ) (2/943)
وَعَنْ مُحَمَّدِ بْنِ حَاطِبِ الْجُمَحِيِّ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “فَصْلُ مَا بَيْنَ الْحَلَالِ وَالْحَرَامِ: اَلصَّوْتُ وَالدَّفُ فِي النِّكَاحِ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ
3153. (14) [2/943– ప్రామాణికం]
ము’హమ్మద్ బిన్ ‘హా’తిబ్ అల్జుమ’హీ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ధర్మాధర్మాల మధ్య నికా’హ్లో ప్రకటన, మరియు దఫ్ (డప్పు) వాయించడం సముచితం. అంటే నికా’హ్ గురించి ప్రకటించడంవల్ల, దఫ్ వాయించడం వల్ల విషయం అందరికీ తెలిసి పోతుంది. (తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్)
3154 – [ 15 ] ( لم تتم دراسته ) (2/943)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَتْ عِنْدِيْ جَارِيَةٌ مِّنَ الْأَنْصَارِ. زَوَّجْتُهَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا عَائِشَةُ ألَا تُغَنِّيْنَ؟ فَإِنَّ هَذَا الْحَيَّ مِنَ الْأَنْصَارِيُحِبُّوْنَ الْغِنَاءَ”. رَوَاهُ ابْنُ حَبَّانَ فِيْ صَحِيْحِهِ.
3154. (15) [2/943– అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: నా దగ్గర ఒక అ’న్సారీ అమ్మాయి ఉండేది. నేను ఆమె తండ్రి అనుమతితో ఆమె వివాహం చేసాను. అప్పుడు ప్రవక్త (స), ‘ఆ అనాథ అమ్మాయి వెంట పాటలు పాడేందుకు ఎవరినైనా ఎందుకు పంపలేదు? ఎందుకంటే అన్సార్లకు పాటలు పాడటం అంటే చాలాఇష్టం,’ అని అన్నారు.[34] (ఇబ్నె’హిబ్బాన్ / దృఢం)
3155 – [ 16 ] ( لم تتم دراسته ) (2/943)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: أَنْكَحَتْ عَائِشَةَ ذَاتَ قَرَابَةٍ لَهَا مِنَ الْأَنْصَارِ. فَجَاءَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ: “أَهْدَيْتُمُ الْفَتَاةَ؟” قَالُوْا:نَعَمْ. قَالَ:”أَرْسَلْتُمْ مَعَهَا مَنْ تُغَنِّيْ؟” قَالَتْ: لَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْأَنْصَارَ قَوْمٌ فِيْهِمْ غَزْلٌ فَلَوْ بَعَثْتُمْ مَعَهَا مَنْ يَّقُوْلُ: أَتَيْنَاكُمْ أَتَيْنَاكُمْ فَحَيَّانَا وَحَيَّاكُمْ”. رَوَاهُ ابْنُ مَاجَهُ .
3155. (16) [2/943 –అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ‘ఆయి’షహ్ (ర) బంధు వుల్లోని ఒక అ’న్సారీ అమ్మాయి పెళ్ళి చేసారు. ప్రవక్త (స) వచ్చి, ‘ఆ అమ్మాయిని అత్తవారింటికి పంపించారా?’ అని అడిగారు. దానికి ప్రజలు, ‘అవును,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఆమె వెంట పాటలు పాడటానికి ఎవరినైనా పంపారా?’ అని అడగ్గా, ‘లేదు’ అని సమాధానం వచ్చింది. అప్పుడు ప్రవక్త (స), ‘అ’న్సార్లకు గీతాలు అంటే చాలా ఇష్టం, ఆమె వెంట ఎవరినైనా పంపిస్తే బాగుండు. వారు ఇలా పాడుతూ వెళతారు: ”అతైనాకుమ్ అతైనాకుమ్ ఫహయ్యానా వహయ్యాకుమ్ వలౌలల్ హిన్తతుస్సమరాఉ లమ్ తస్మున్ అజారాకుమ్, వలౌలల్ అజ్వతు స్సౌదాఉ మాకున్నా బవావాకుమ్.” — -‘మేము మీ వద్దకు వచ్చాము, మేము మీ వద్దకు వచ్చాము. మేము మీకు సలామ్ చేసాము. మీరు మా సలామ్‌కు సమాధానం ఇచ్చారు. ఒకవేళ ఎర్రటి గోధుమలు లేకపోతే కన్యలు దొడ్డుగా ఉండేవారు కారు, ఒకవేళ ‘అజ్వహ్ నల్లటి ఖర్జూరాలు లేకుంటే మేము మీ వీధుల్లో ఉండేవారం కాము, పేదరికం వల్ల మరో ప్రదేశానికి వెళ్ళి వుండేవారం.’ ఇది ఒక రకమైన పాట. అరబ్బులు పెళ్ళిళ్ళలో ఇలా పాడేవారు.
3156 – [ 17 ] ( لم تتم دراسته ) (2/943)
وَعَنْ سَمّرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أَيُّمَا امْرَأَةٍ زَوَّجَهَا وَلِيّانِ فَهِيَ لِلْأَوَّلِ مِنْهُمَا. وَمَنْ بَاعَ بَيْعًا مِنْ رَجُلَيْنِ فَهُوَ لِلْأَوَّلِ مِنْهُمَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ.
3156. (17) [2/943 –అపరిశోధితం]
సమురహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ఇద్దరు వలీలు ఒక స్త్రీ పెళ్ళి చేస్తే, మొదటి వలీ యొక్క నికా’హ్ను కొనసాగించటం జరుగుతుంది. రెండవ వలీ చేసిన నికా’హ్ రద్దు చేయబడుతుంది. ఒకవేళ ఇద్దరూ ఒకేసారి చేస్తే ఇద్దరి నికా’హ్ రద్దు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఒక వస్తువును ఒక వ్యక్తికి అమ్మితే, మొదట అమ్మిన వ్యక్తి అమ్మకం సరైనది. రెండవ వ్యక్తి అమ్మినది రద్దుచేయబడుతుంది. ఒకవేళ ఇద్దరూ ఒకేసారి అమ్మితే ఇద్దరి అమ్మకం రద్దు చేయబడుతుంది.” (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’, దారమి)
—–
الْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3157 – [ 18 ] ( متفق عليه ) (2/944)
عَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: كُنَّا نَغْزُوْ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مَعَنَا نِسَاءٌ فَقُلْنَا: أَلَا نَخْتَصِيْ؟ فَنَهَانَا عَنْ ذَلِكَ ثُمَّ رَخَّصَ لَنَا أَنْ نَسْتَمْتِعَ. فَكَانَ أَحَدُنَا يَنْكِحُ الْمَرْأَةَ بِالثَّوْب إلَى أَجَلٍ ثُمَّ قَرَأَ عَبْدُ اللهِ: (يَا أَيَّهَا الَّذِيْنَ آمَنُوْا لَا تُحَرِّمُوْا طَيِّبَاتِ مَا أَحَلَّ اللهُ لَكُمْ؛ 5: 87)
3157. (18) [2/944– ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) వెంట మేము జిహాద్‌కు వెళ్ళేవారం. మా వెంట స్త్రీలు కూడా ఉండే వారు. మేము ప్రవక్త (స)ను, ‘మేము ‘ఖసి చేసుకోవాలా,’ అని అడిగాము. దానికి ప్రవక్త (స), ‘వద్దు’ అన్నారు. నికా‘హ్ ముత్‘అహ్ కు అనుమతి ఇచ్చారు. అప్పుడు మేము ఒక వస్త్రానికి బదులు ఒక నిర్ణీత వ్యవధి వరకు స్త్రీతో నికా’హ్ ముత్’అహ్ చేసుకునే వారం. ఆ తరు వాత ‘అబ్దుల్లాహ్ నికా’హ్ ముత్’అహ్ను సమర్థిస్తూ ఈ ఆయతు పఠించారు. ”ఓ విశ్వాసులారా! అల్లాహ్ మీకు ధర్మసమ్మతం చేసిన పరిశుధ్ధ వస్తువులను నిషిధ్ధం చేసుకోకండి మరియు హద్దులు మీరకండి.” [35] (అల్ మాఇ’దహ్, 5:87) (బు’ఖారీ, ముస్లిమ్)
3158 – [ 19 ] ( لم تتم دراسته ) (2/944)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: إِنَّمَا كَانَتِ الْمُتْعَةُ فِيْ أَوَّلِ الْإِسْلَامِ كَانَ الرَّجُلُ يَقْدَمُ الْبَلْدَةَ لَيْسَ لَهُ بِهَا مَعْرِفَةٌ فَيَتَزَوَّجُ الْمَرْأَةَ بِقَدْرِ مَا يُرَى أَنَّهُ يُقِيْمُ فَتَحْفَظُ لَهُ مَتَاعَهُ وَتُصْلِحُ لَهُ شَيَّهَ حَتَّى إِذَا نَزَلَتِ الْآيَةُ (إِلَّا عَلَى أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ؛ 23: 6) قَالَ ابْنُ عَبَّاسُ: فَكُلُّ فَرْجٍ سِوَاهُمَا فَهُوَ حَرَامٌ. رَوَاهُ التِّرْمِذِيُّ
3158. (19) [2/944– అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ఇస్లామ్ ప్రారంభంలో ముత్‘అహ్ నికా‘హ్కు అనుమతి ఉండేది. ప్రజలు పరాయి దేశానికి వెళ్ళేవారు. అక్కడ తెలిసిన వారెవరూ ఉండేవారు కారు. అందువల్ల అక్కడ ఉన్నన్ని రోజుల కొరకు అక్కడి స్త్రీతో తాత్కాలికంగా నికా’హ్ చేసుకునే వారు. ఆమె సరకులు భద్రంగా ఉంచేది. ఆహారం వండే ఏర్పాటు కూడా అయి పోయేది. ఎప్పుడైతే: ”ఇల్లా అలా అ‘జ్వాజిహిమ్ అవ్మా మలకత్ అయ్మానహిమ్.” — ‘తమ భార్యలతో (అ’జ్వాజ్) లతో లేక తమ అధీనంలో (కుడిచేతిలో) ఉన్న బానిస స్త్రీలతో తప్ప.’ (అల్ ముఅ’మినూన్, 23:6), ఆయతు అవతరించిందో భార్య మరియు బానిసరాల మర్మాంగాలు తప్ప ఇతరులవి నిషిద్ధమై పోయాయి. (తిర్మిజీ’)
3159 – [ 20 ] ( صحيح ) (2/944)
وَعَنْ عَامِرِ بْنِ سَعْدٍ قَالَ: دَخَلْتُ عَلَى قَرَظَةَ بْنِ كَعْبٍ وَأَبِيْ مَسْعُوْدٍ الْأَنْصَارِيِّ فِيْ عُرْسٍ. وَإِذَا جَوَارٍ يُغَنِّيْنَ. فَقُلْتُ: أَيْ صَاحِبَيْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَأَهْلَ بَدْرٍ يُفْعَلُ هَذَا عِنْدَكُمْ؟ فَقَالَا: اِجْلِسْ إِنْ شِئْتَ فَاسْمَعْ مَعَنَا وَإِنْ شِئْتَ فَاذْهَبْ فَإِنَّهُ قَدْ رُخِّصَ لَنَا فِي اللَّهْوِ عِنْدَ الْعُرْسِ. رَوَاهُ النَّسَائِيُّ.
3159. (20) [2/944 –దృఢం]
‘ఆమిర్ బిన్ స’అద్ (ర) కథనం: నేను ఒక పెళ్ళిలో వెళ్ళాను. అక్కడ ఖర్”జహ్ బిన్ కఅ’బ్, అబూ మస్’ఊద్ అ’న్సారీలతో కలవడం జరిగింది. అప్పుడు కొంతమంది అమ్మాయిలు పాటలు పాడుతున్నారు. అప్పుడు నేను వారిద్దరితో, ”తమరిద్దరూ ప్రవక్త (స) అనుచరులు, ఉ’హద్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. అల్లాహ్ (త) వద్ద మీకు గొప్ప స్థానం ఉంది, మరి మీ ముందు ఇలా పాటలు పాడటం జరుగుతుంది. చాలా ఆశ్చర్యంగా ఉందే!” అని అన్నాను. దానికి వారిద్దరూ, ‘పెళ్ళిసందర్భాల్లో ఇలా పాటలు పాడుకునే అనుమతి ఇవ్వబడింది. మీరు కోరితే మాతోపాటు కూర్చొని వినండి, ఇష్టం లేకపోతే ఇక్కడినుండి వెళ్ళవచ్చు,’ అని సమాధానం ఇచ్చారు. (నసాయి’)
=====
4- بَابُ الْمُحَرَّمَاتِ
4. వీరిని వివాహమాడటం నిషిద్ధం
నిషిద్ధం అవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంత మంది బంధుత్వం వల్ల నిషిద్ధం అవుతారు. ఉదా: తల్లి, కూతురు, చెల్లెలు, అత్త, పిన్ని, సోదరుని కూతురు, చెల్లెలు కూతురు, నాన్నమ్మ, అమ్మమ్మ మొదలైన వారు. కొందరు అల్లుడు కావటంవల్ల నిషేధం అవుతారు. ఉదా: భార్యతల్లి, భార్య నాన్నమ్మ, అమ్మమ్మ, భార్యకూతురు, మనవరాలు మొదలైన వారు.
కొందరు అవిశ్వాసం బహుదైవారాధన వల్ల నిషిద్ధం అవుతారు. ఉదా: అవిశ్వాసులు, బహుదైవా రాధకులు అయిన స్త్రీలతో నికా’హ్ చేయటం నిషిద్ధం. ఇతరుల భార్యలు కావటం వల్ల నిషిద్ధం. ఆమె భర్త ఆమెకు ‘తలాఖ్ ఇవ్వనంత వరకు, లేదా ఆమె భర్త మరణించ నంత వరకు నిషిద్ధం. అదే విధంగా ఒకవేళ ఒక వ్యక్తికి నలుగురు భార్యలు ఉన్నారు. ఐదవ భార్యతో లేదా అంతకంటే ఎక్కువ మంది స్త్రీలతో పెళ్ళి చేయటం నిషిద్ధం. వీటి సాక్ష్యాధారాలన్నీ క్రింది ఆయాతులలో ఉన్నాయి. అల్లాహ్ ఆదేశం: ”మీ తండ్రులు వివాహ మాడిన స్త్రీలను మీరు వివాహమాడకండి. ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. నిశ్చయంగా, ఇది అసభ్య కరమైనది (సిగ్గుమాలినది), జుగుప్సా కరమైనది మరియు చెడు మార్గము. మీకు ఈ స్త్రీలు నిషేధించబడ్డారు: ‘మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ సోదరీమణులు, మీమేనత్తలు, మీ తల్లిసోదరీ మణులు (పినతల్లులు), మీ సోదరుల కుమార్తెలు, మీ సోదరీ మణుల కుమార్తెలు, మీకు పాలిచ్చిన తల్లులు (దాదులు), మీతో పాటు పాలుత్రాగిన సోదరీ మణులు, మీ భార్యల తల్లులు; మీ సంరక్షణలో ఉన్న మీ భార్యల కుమార్తెలు – ఏభార్యలతోనైతే మీరు సంభో గించారో – కాని మీరు వారితో సంభోగించకముందు (వారికి విడాకులిచ్చి వారి కూతుళ్ళను పెండ్లాడితే) తప్పు లేదు; మీ వెన్నునుండి పుట్టిన మీ కుమారుల భార్యలు మరియు ఏక కాలంలో అక్కా చెల్లెళ్ళను ఇద్దరినీ చేర్చటం (భార్యలుగా చేసుకోవటం నిషిద్ధం); కాని ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. మరియు ఇతరుల వివాహబంధంలో ఉన్న స్త్రీలు – (ధర్మ యుధ్ధంలో) మీ చేతికి చిక్కిన బానిస స్త్రీలు తప్ప – (మీరు వివాహమాడటానికి నిషేధించ బడ్డారు). ఇది అల్లాహ్ మీకు విధించిన అనుశాసనం. మరియు వీరు తప్ప మిగతా స్త్రీలంతా మీకు వివాహ మాడటానికి ధర్మ సమ్మతం చేయ బడ్డారు. మీరు వారికి తగిన స్త్రీ కట్నం (మహ్ర్) ఇచ్చి వ్యభిచారంగా కాకుండా వివాహబంధంలో తీసుకోవటానికి కోర వచ్చు. కావున మీరు దాంపత్య సుఖాన్ని అనుభ వించాలనుకున్న వారికి, వారి స్త్రీ కట్నం (మహ్ర్) విధిగా చెల్లించండి. కాని స్త్రీ కట్నం (మహ్ర్) ఒప్పందం జరిగిన తరువాత పరస్పర అంగీకారంతో మీ మధ్య ఏమైనా రాజీ కుదిరితే, అందులో దోషం లేదు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేక వంతుడు.’ (అన్నిసా, 4:22--24)
ఈ ఆయతుల వివరణ: 1. మీ తండ్రులు నికాహ్ చేసిన స్త్రీలు మీ కోసం నిషిద్ధం. 2. ఇంకా మీ సవతితల్లి, సొంతతల్లి, సొంతనాన్నమ్మ, సొంత అమ్మమ్మ, ముని అమ్మమ్మ మొదలైనవారు. 3. కూతుర్లు, మనవరాళ్లు, మొదలైన వారు. 4. అత్తలు అంటే తండ్రి, తాతల సొంత లేక సవతి చెల్లాయిలు. 5. పిన్నమ్మలు లేదా తల్లి పిన్నమ్మలు లేదా అమ్మమ్మల లేదా తండ్రి తరఫున పిన్నమ్మలు. 6. సోదరుని కూతుర్లు లేదా వారి మనవ రాళ్ళు మొదలైన వారు. 8. పాలుపట్టిన స్త్రీలు లేదా వారి కూతుర్లు. 9. బంధుత్వం వల్ల నిషిద్ధం అయిన వారే పాలు పట్టటం వల్ల కూడా నిషిద్ధం అవుతారు. వీటిని గురించి క్రింద వివరించడం జరుగుతుంది. 10. భార్యతల్లి, ఆమెతల్లి, అమ్మమ్మ, నాన్నమ్మ మొదలైన వారు. 11. మీ భార్యల కుమార్తెలు ఒకవేళ మీ భార్యలతో సంభోగం చేయకుండా ఉంటే వీరితో వివాహం చేసుకోవచ్చు. 12. సొంత కుమారుల భార్యలు. 13. ఒకేసారి అక్కాచెల్లెళ్ళతో నికా’హ్ చేయకూడదు. 14. భర్తలు బ్రతికున్న భార్యలతో వారు ఇంకా విడాకులు పొందకుండా ఉన్న స్త్రీలతో వివాహం చేయరాదు.
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: బంధుత్వం (నసబ్) ద్వారా 7 గురు స్త్రీలు నిషిద్ధం. ముసాహరత్ ద్వారా 7 గురు స్త్రీలు నిషిద్ధం. ఇంకా ”హుర్రిమత్ అలైకుమ్ ఉమ్మహాతుకుమ్” పఠించారు. (బు’ఖారీ)
భార్య ఉండగా ఆమె పిన్నితో లేదా అత్తతో పెళ్ళి చేసుకోవటం నిషిద్ధం. ఒకవేళ భార్య చనిపోయినా లేదా విడాకులు ఇచ్చినా ఆమె అత్తతో గాని, పిన్నితో గాని పెళ్ళిచేసుకోవచ్చును.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3160 – [ 1 ] ( متفق عليه ) (2/945)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يُجْمَعُ بَيْنَ الْمَرْأَةِ وَعَمَّتِهَا وَلَا بَيْنَ الْمَرْأَةِ وَخَالَتِهَا”.
3160. (1) [2/945– ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీ భార్య ఉండగా ఆమె మేనత్త (తండ్రిసోదరి)తో గాని, ఆమె పిన్ని (తల్లిసోదరి)తో గాని వివాహం తగదు.”[36] (బు’ఖారీ, ముస్లిమ్)
3161 – [ 2 ] ( صحيح ) (2/945)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَحْرُمُ مِنَ الرَّضَاعَةِ مَا يَحْرُمُ مِنَ الْوِلَادَةِ”. رَوَاهُ الْبُخَارِيُّ
3161. (2) [2/945 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, రక్త సంబంధం మూలంగా నిషిద్ధమయ్యే బంధుత్వాలు పాల వరస సంబంధం ద్వారా కూడా నిషిద్ధం అవుతాయి.[37](బు’ఖారీ)
3162 – [ 3 ] ( متفق عليه ) (2/945)
وَعَنْهَا قَالَتْ: جَاءَ عَمِّيْ مِنَ الرَّضَاعَةِ. فَاسْتَأْذَنَ عَلَيَّ فَأَبَيْتُ أَنْ آذَنَ لَهُ حَتَّى أَسْأَلَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَجَاءَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. فَسَأَلْتُهُ. فَقَالَ: “إِنَّهُ عَمُّكِ فَأذَنِيْ لَهُ”. قَالَتْ: فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِنَّمَا أَرْضَعَتْنِي الْمَرْأَةُ وَلَمْ يُرْضِعْنِي الرَّجُلُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّهُ عَمُّكِ فَلْيَلِجْ عَلَيْكِ” وَذَلِكَ بَعْدَمَا ضُرِبَ عَلَيْنَا الْحِجَابُ.
3162. (3) [2/945– ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: నా ర’దాయీ చిన్నాన్న, నా దగ్గరకు వచ్చేందుకు అనుమతికోరారు. దానికి నేను నిరాకరించాను. ప్రవక్త (స)ను అడగాలని నిశ్చయించు కున్నాను. ప్రవక్త (స) వచ్చిన తర్వాత దాన్ని గురించి అడిగాను. దానికి ప్రవక్త (స), ‘అతను మీ చిన్నాన్న, అతనితో నువ్వు మాట్లాడవచ్చు’ అని ఆదేశించారు. దానికి నేను, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! నాకు పాలు పట్టింది స్త్రీ, పురుషుడు కాదు,’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స) అతను మీ చిన్నాన్న, అతను నీ దగ్గరకు రావచ్చు. ఈ సంఘటన పర్దా ఆదేశం తరువాత జరిగింది. (బు’ఖారీ, ముస్లిమ్)
3163 – [ 4 ] ( صحيح ) (2/945)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: يَا رَسُوْلَ اللهِ هَلْ لَكَ فِيْ بِنْتِ عَمِّكَ حَمْزَةَ؟ فَإِنَّهَا أَجْمَلُ فَتَاةٍ فِي قُرَيْشٍ. فَقَالَ لَهُ: “أَمَا عَلِمْتَ أَنَّ حَمْزَةَ أَخِيْ مِنَ الرَّضَاعَةِ؟ وَأنَّ اللهَ حَرَّمَ مِنَ الرّضَاعَةِ مَا حَرَّمَ مِنَ النَّسَبِ؟” رَوَاهُ مُسْلِمٌ.
3163. (4) [2/945 –దృఢం]
‘అలీ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను, ”ఓ అల్లాహ్ ప్రవక్తా! మీరు మీ చిన్నాన్న ‘హంజహ్ కూతురుతో నికా’హ్ చేసుకోరాదా? ఎందుకంటే ఆమె ఖురైష్ అమ్మాయిల్లో అందరికంటే చాలా అందమైనది,” అని అన్నాను. దానికి ప్రవక్త (స), ”హంజహ్ నా ర’దాయీ’ సోదరుడు. అల్లాహ్ (త) బంధుత్వం ద్వారా నిషిద్ధం అయిన వారినే పాలు పట్టటం ద్వారా కూడా నిషిద్ధం చేసాడు అనే విషయం నీకు తెలియదా?” అని అన్నారు. (ముస్లిమ్)
3164 – [ 5 ] ( صحيح ) (2/946)
وَعَنْ أُمِّ الْفَضْلِ قَالَتْ: إِنَّ نَبِيَّ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا تُحَرِّمُ الرَّضْعَةُ أَوْ الرَّضْعَتَانِ”.
3164. (5) [2/946 –దృఢం]
ఉమ్మె ఫ’దల్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”గుక్కెడు, రెండు గుక్కలు లేదా ఒకసారి లేదా రెండుసార్లు పాలు పట్టడం వల్ల నిషేధం వర్తించదు.”
3165 – [ 6 ] ( صحيح ) (2/946)
وَفِيْ رِوَايَةِ عَائِشَةَ قَالَ: “لَا تُحَرِّمُ الْمَصَّةُ وَالْمَصَّتَانِ”.
3165. (6) [2/946 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనంలో, ‘ఒకసారి, రెండుసార్లు (పాలు) త్రాగడంవల్ల నిషేధం వర్తించదు,’ అని ఉంది. (ముస్లిమ్)
3166 – [ 7 ] ( صحيح ) (2/946)
وَفِيْ أُخْرَى لِأُمِّ الْفَضْلِ قَالَ: “لَا تُحَرِّمُ الْإِمُلَاجَةُ وَالْإِمْلَاجَتَانِ”. هَذَهِ رِوَايَاتٌ لِمُسْلِمٍ.
3166. (7) [2/946– దృఢం]
ఉమ్మెఫ’దల్ (ర) కథనంలో, ”ఒకసారి, రెండుసార్లు (పాలు) త్రాగడం వల్ల నిషేధం వర్తించదు” అని ఉంది. (ముస్లిమ్)
3167 – [ 8 ] ( صحيح ) (2/946)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ فِيْمَا أُنْزِلَ مِنَ الْقُرْآنِ: “عَشْرُ رَضْعَاتٍ مَّعْلُوْمَاتٍ يُحَرِّمْنَ”. ثُمَّ نُسِخْنَ بِخَمْسٍ مَّعْلُوْمَاتٍ فَتُوَفِّيَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَهِيَ فِيْمَا يُقْرَأُ مِنَ الْقُرْآنِ. رَوَاهُ مُسْلِمٌ
3167. (8) [2/946– దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: పదిసార్లు త్రాగటం వల్ల నిషిద్ధం వర్తిస్తుందని ఖుర్ఆన్లో అవతరించింది. మరల అందులో 5 సార్లు రద్దు చేయబడ్డాయి. 5 సార్లుగా ఆదేశించడం జరిగింది. ప్రవక్త (స) మరణం తరువాత 5 సార్లు గల వాక్యం పఠించబడేది. [38] (ముస్లిమ్)
3168 – [ 9 ] ( متفق عليه ) (2/946)
وَعَنْهَا: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم دَخَلَ عَلَيْهَا وَعِنْدَهَا رَجُلٌ فَكَأَنَّهُ كَرِهَ ذَلِكَ فَقَالَتْ: إِنَّهُ أَخِيْ فَقَالَ: “اُنْظُرْنَ مَنْ إِخْوَانُكُنَّ؟ فَإِنَّمَا الرّضَاعَةُ مِنَ الْمَجَاعَةِ”.
3168. (9) [2/946– ఏకీభవితం]
ప్రవక్త (స) ‘ఆయి’షహ్ (ర) వద్దకు వచ్చారు, అప్పుడు ఆమె ఇంటిలో ఒక వ్యక్తి ఉన్నాడు. అది చూసి ప్రవక్త (స) కు బాధకలిగింది. అప్పుడు ‘ఆయి’షహ్ (ర), ‘ఇతను నా ర’దాయీ సోదరుడు,’ అని అన్నది. దానికి ప్రవక్త (స), ‘ఎవరు నీ సోదరులో నీకే తెలియాలి. ర‘దాఅ‘త్ ఆకలి వల్ల వర్తిస్తుంది,’ అని అన్నారు. [39](బు’ఖారీ, ముస్లిమ్)
3169 – [10] ( صحيح ) (2/946)
وَعَنْ عُقْبَةَ بْنِ الْحَارِثِ: أَنَّهُ تَزَوَّجَ اِبْنَةً لِأَبِيْ إِهَابِ بْنِ عًزِيْزٍ فَأَتَتِ امْرَأَةً فَقَالَتْ: قَدْ أَرْضَعْتُ عُقْبَةَ وَالَّتِيْ تَزَوَّجَ بِهَا فَقَالَ لَهَا عُقْبَةُ: مَا أَعْلَمُ أَنَّكِ قَدْ أَرْضَعَتْنِيْ وَلَا أَخْبَرْتِنِيْ فَأَرْسَلَ إِلَى آلِ أَبِيْ إِهَابٍ فَسَأَلَهُمْ فَقَالُوْا: مَا عَلِمْنَا أَرْضَعَتْ صَاحِبَتَنَا فَرَكِبَ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم بِالْمَدِيْنَةِ فَسَأَلَهُ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كَيْفَ وَقَدْ قِيْلَ؟” فَفَارَقَهَا عُقْبَةُ وَنَكَحَتْ زَوْجًا غَيْرَهُ. رَوَاهُ الْبُخَارِيُّ
3169. (10) [2/946– దృఢం]
‘ఉఖ్బహ్ బిన్ ‘హారిస్’, అబూ ఇహాబ్ వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఒక స్త్రీ వచ్చి నేను ‘ఉఖ్బహ్ కుమరియు ఆ అమ్మాయికీ, పాలు త్రాపిం చాను. (అంటే వీరిద్దరూ ర’దాయీ అన్నా చెల్లెళ్ళు) అని చెప్పింది. అప్పుడు ‘ఉఖ్బహ్ ఆస్త్రీతో, ‘నీవు నాకు పాలు పట్టినట్టు నాకు తెలియదు. ఇంతకు ముందు నాకు తెలియపరచనూ లేదు,’ అని అన్నాడు. ‘ఉఖ్బహ్ తన అత్తవారింటికి మనిషిని పంపి తెలుసు కోవడానికి ప్రయత్నించారు. వాళ్ళు కూడా, ‘ఆ స్త్రీ మా అమ్మాయికి పాలుపట్టినట్టు మాకు తెలియదని’ అన్నారు. అప్పుడు ‘ఉఖ్బహ్ ఈ విషయం గురించి తెలుసు కోవడానికి వాహనంపై ఎక్కి మదీనహ్ లో ప్రవక్త (స) వద్దకు వెళ్ళి విషయం గురించి విన్నవించు కున్నారు. అప్పుడు ప్రవక్త (స) ఆమె గురించి ఇలా అనుకుంటున్నప్పుడు నువ్వు ఆమెతో ఎలా జీవితం గడపగలవు అని హితబోధ చేసారు. ‘ఉఖ్బహ్ ఆమెను వదలివేసాడు. ఆమె మరొకరిని పెళ్ళి చేసుకుంది. [40](బు’ఖారీ)
3170 – [ 11 ] ( صحيح ) (2/946)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَوْمَ حُنَيْنٍ بَعَثَ جَيْشًا إِلَى أَوْطَاسٍ فَلَقَوْا عَدُوًّا فَقَاتَلُوْهُمْ فَظَهَرُوْا عَلَيْهِمْ وَأَصَابُوْا لَهُمْ سَبَايَا فَكَأنَ نَاسًا مِنْ أَصْحَابِ النَّبِيِّ صلى الله عليه و سلم تَحَرَجُوْا مِنْ غِشْيَانِهِنَّ مِنْ أَجْلِ أَزْوَاجِهِنَّ مِنَ الْمُشْرِكِيْنَ .فَأَنْزَلَ اللهُ تَعَالى فِيْ ذَلِكَ (وَالْمُحْصَنَاتُ مِنَ النِّسَاءِ إِلَّا مَا مَلَكَتْ أَيْمَانُكُمْ 4: 24) أَيْ فَهُنَّ لَهُمْ حَلَالٌ إِذَا انْقَضَتْ عِدَّتُهُنَّ. رَوَاهُ مُسْلِمٌ.
3170. (11) [2/946 –దృఢం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ‘హునైన్ యుద్ధానికి ఒక సైన్యాన్ని అవ్’తాస్ వైపు పంపారు. ఆ సైన్యం శత్రువులను ఓడించి చాలామందిని పట్టుకున్నారు. వారిని బానిసలుగా, బానిసరాలుగా తీసుకొని వచ్చి యుద్ధవీరుల మధ్య పంచిపెట్టారు. కొందరి వంతులో బానిసరాళ్ళు వచ్చారు. వారి అవిశ్వాస భర్తలు ఉండగా వారితో సంభోగం చేయటానికి వారి యజమానులు అయిష్టం చూపారు. వారి ఈ అసహ్యించుకోవడం దూరం చేయడానికి అల్లాహ్ (త) ఈ వాక్యాన్ని అవతరింపజేసాడు. ”వల్ ముహ్సనాతు …నుండి… అలైకుమ్.” వరకు. – ‘భర్తలు ఉన్న స్త్రీలు మీకు నిషిద్ధం. అయితే మీ చేతిలోకి వచ్చిన వారు తప్ప.’ (అన్ నిసా’, 4:24) అల్లాహ్(త) ఈ ఆదేశాలు మీకు తెలియపరుస్తున్నాడు. ”అంటే ఈ బానిసరాళ్ళు ఒక గడువు ముగిసిన తర్వాత అంటే బహిష్టు గడిచిన తర్వాత తమ యజమానులకు ధర్మసమ్మతం అయిపోతారు.” [41] (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3171 – [ 12 ] ( لم تتم دراسته ) (2/947)
عَنْ أَبِيْ هُرَيْرَةَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَهَى أَنْ تُنْكَحَ الْمَرْأَةُ عَلَى عَمَّتِهَا أَوِ الْعَمّةُ عَلَى بِنْتِ أَخِيْهَا وَالْمَرْأَةُ عَلَى خَالَتِهَا أَوْ الْخَالَةُ عَلَى بِنْتِ أُخْتِهَا لَا تُنْكَحُ الصُّغْرَى عَلَى الْكُبْرَى وَلَا الْكُبْرَى عَلَى الصُّغْرَى. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ وَالنَّسَائِيُّ وَرَوَايَتُهُ إِلَى قَوْلِهِ: بِنْتِ أُخْتِهَا .
3171. (12) [2/947 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక స్త్రీ యొక్క మేనకోడలు, మీ దాంపత్యంలో ఉంటే, ఆ స్త్రీ తో (ఆమె అత్తతో) వివాహం తగదు. ఒకవేళ ”ఒక స్త్రీ యొక్క అత్త మీ దాంపత్యంలో ఉంటే ఆమె మేనకోడలుతో వివాహం తగదు. అదేవిధంగా, ఒక స్త్రీ యొక్క పిన్ని (తల్లి సోదరి) మీ భార్యగా ఉంటే ఆమె అక్క కూతురుని వివాహమాడరాదు. ఒక స్త్రీ యొక్క సోదరి కూతురు మీ భార్యగా ఉంటే, ఆమెను (పిన్నిని) వివాహం చేసుకోరాదు. అదేవిధంగా చెల్లెలు ఉండగా అక్కతో, అక్క ఉండగా చెల్లెలుతో పెళ్ళి చేసుకోరాదు.” (తిర్మిజి’, అబూ దావూద్)
నసాయి’లో బింతు ఉఖ్తహా వరకే ఉంది.
3172 – [ 13 ] ( لم تتم دراسته ) (2/947)
وَعَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ قَالَ: مَرَّبِيْ خَالِيْ أَبُوْ بُرْدَةَ بْنُ نِيارٍوَمَعَهُ لِوَاءٌ. فَقُلْتُ: أَيْنَ تَذْهَبُ فقال: بَعَثَنِيْ النَّبِيُّ صلى الله عليه وسلم إِلَى رَجُلٍ تَزَوَّجَ اِمْرَأَةَ أَبِيْهِ آتِيْةِ بِرَأْسِهِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْدَاوُدَ و في رواية له وللنسائي و ابن ماجا و الدارمي فامرني ان اضرب أنقه و آخذ ماله و في هذه الرواية قال أمي بدل خالي.
3172. (13) [2/947– అపరిశోధితం]
బరా’ బిన్ ‘ఆ’జిబ్ (ర) కథనం: మా మావయ్య అబూ బుర్దహ్ బిన్ నియార్ నా ప్రక్క నుండి వెళ్ళారు. అతని చేతిలో ఒక జెండా ఉంది. ‘మామగారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు,’ అని అడిగాను. దానికి అతను (ర), ‘నన్ను ప్రవక్త (స) ఈ జెండా ఇచ్చి ఒక వ్యక్తి వద్దకు పంపారు. ఆ వ్యక్తి సవతి తల్లితో పెళ్ళిచేసుకున్నాడు. నేను అతని తల నరికి ప్రవక్త (స) వద్దకు తీసుకొని వెళతాను. అంటే అతన్ని నరుకుతాను. ఎందుకంటే సవతి తల్లితో పెళ్ళి చేయటం నిషిద్ధం. అధర్మాన్ని ధర్మసమ్మతంగా భావించేవాడు అవిశ్వాసి’ అని అన్నారు.” (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’, ఇబ్నె మాజహ్, దారమి)
3173 – [ 14 ] ( لم تتم دراسته ) (2/947)
وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يُحَرِّمُ مِنَ الرَّضَاعِ إِلَّا مَا فَتَقَ الْأَمْعَاءَ فِي الثّديِ وَكَانَ قَبْلَ الْفِطَامِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
3173. (14) [2/947– అపరిశోధితం]
ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అంటే పాలు విడిపించడానికి ముందు దశలో, రొమ్ముల నుండి కడుపు నిండా త్రాగితే నిషిద్ధం వర్తిస్తుంది. [42]
3174 – [ 15 ] ( لم تتم دراسته ) (2/947)
وَعَنْ حَجَّاجِ بْنِ حَجَّاجِ الْأَسْلَمِيِّ عَنْ أَبِيْهِ أَنَّهُ قَالَ: يَا رَسُوْلَ اللهِ مَا يُذْهِبُ عَنِّي مَذِمَّةَ الرَّضَاعِ؟ فَقَالَ: “غُرَّةٌ عَبْدٌ أَوْ أَمَةٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ .
3174. (15) [2/947– అపరిశోధితం]
‘హజ్జాజ్ బిన్ ‘హజ్జాజ్ అస్లమి తన తండ్రి ద్వారా కథనం, అతని తండ్రి ఇలా అన్నాడు, ”ఓ అల్లాహ్ ప్రవక్తా! పాలు త్రాపించిన హక్కు ఎలా తొలగిపోతుంది. దానికి ప్రవక్త (స), ‘నువ్వు ఒక బానిస లేదా బానిస రాలును పాలుపట్టిన తల్లికి సేవచేయడానికి ఇచ్చి వేయి. దానివల్ల ఆమె హక్కు తొలగిపోతుంది,’ అని అన్నారు. [43] (తిర్మిజి’, అబూదావూద్, నసాయి’ దారమి)
3175 – [ 16 ] ( لم تتم دراسته ) (2/948)
وَعَنْ أَبِي الطُّفَيْلِ الْغَنَوِيِّ قَالَ: كُنْتُ جَالِسًا مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم إِذَ أَقْبَلَتِ امْرَأَةٌ فَبَسَطَ النَّبِيُّ صلى الله عليه وسلم رِدَاءَهُ حَتَّى قَعَدَتُّ عَلَيْهِ فَلَمَّا ذَهَبَتْ قِيْلَ هَذِهِ أَرْضَعَتِ النَّبِيَّ صلى الله عليه وسلم. رَوَاهُ أَبُوْ دَاوُدَ
3175. (16) [2/948– అపరిశోధితం]
అబూ ‘తుఫైల్ ‘గనవీ కథనం: నేను ప్రవక్త (స)వద్ద కూర్చొని ఉన్నాను. అకస్మాత్తుగా ఒక స్త్రీ వచ్చింది. ఆమె కోసం ప్రవక్త (స) తన దుప్పటిని పరిచారు. ఆమె దానిపై కూర్చుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె ప్రవక్త (స)కు పాలుపట్టిన తల్లి అని తెలిసింది.[44](అబూ దావూద్)
3176 – [ 17 ] ( صحيح ) (2/948)
وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ غَيْلَانَ بْنِ سَلَمَةَ الثَّقَفِيَّ أَسْلَمَ وَلَهُ عَشْرُ نِسْوَةٍ فِي الْجَاهِلِيَّةِ فَأَسْلَمْنَ مَعَهُ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “أَمْسِكُ أَرْبَعًا وَفَارِقْ سَائِرَهُنَّ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.
3176. (17) [2/948 –దృఢం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ‘గైలాన్ బిన్ సలమహ్ స’ఖఫీ ఇస్లామ్ స్వీకరించినప్పుడు పదిమంది స్త్రీలు అతని భార్యలుగా ఉండేవారు. ఇస్లామ్‌కు ముందు వారి వివాహం జరిగింది. వారు కూడా ఇస్లామ్ స్వీకరించారు. ప్రవక్త (స) అతన్ని నలుగురిని కొనసాగనివ్వమని, మిగిలిన వారిని వదలివేయమని ఆదేశించారు. [45] (అ’హ్మద్, తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
3177 – [ 18 ] ( لم تتم دراسته ) (2/948)
وَعَنْ نَوْفَلِ بْنِ مُعَاوَيَةَ قَالَ: أَسْلَمْتُ وَتَحْتِيْ خَمْسُ نِسْوَةٍ فَسَأَلْتُ النَّبِيَّ صلى الله عليه وسلم فَقَالَ: “فَارِقْ وَاحِدَةً وَأَمْسِكْ أَرْبَعًا” فَعَمَدْتُّ إِلَى أَقْدَمِهِنَّ صُحْبَةً عِنْدِيْ: عَاقِرٍ مُنْذُ سِتِّيْنَ سَنَةً فَفَارَقْتُهَا. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.
3177. (18) [2/948– అపరిశోధితం]
నౌఫీల్ బిన్ ము’ఆవియహ్(ర) కథనం: నేను ఇస్లామ్ స్వీకరించినపుడు నా దగ్గర ఐదుమంది భార్యలు ఉండే వారు. ప్రవక్త (స)ను అడిగితే, ప్రవక్త (స) వారిలో ఒకరిని వదలి వేయమని, మిగిలిన నలుగురిని ఉంచుకోమని ఆదేశించారు. అప్పుడు నేను 60 సంవత్సరాలుగా నాతో ఉంటున్న గొడ్రాలు అయిన మొదటి భార్యను వదలివేసాను. (షర్’హ్ సున్నహ్)
3178 – [ 19 ] ( لم تتم دراسته ) (2/948)
وَعَنِ الضَّحَّاكِ بْنِ فَيْرُوْزَ الديلمي عَنْ أَبِيْهِ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ أَسْلَمْتُ وَتَحْتِيْ أُخْتَانِ. قَالَ: “اخْتَرْأَيَّتُهَا شِئْتَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
3178. (19) [2/948 –అపరిశోధితం]
‘ద’హ్హాక్ బిన్ ఫైరో’జ్ అద్దైలమీ తన తండ్రిగారి ద్వారా ఉల్లేఖిస్తున్నారు. అతడు ప్రవక్త (స)తో ఓ అల్లాహ్ ప్రవక్తా! నేను ఇస్లామ్ స్వీకరించాను. నా నికా’హ్లో ఇద్దరు సొంత చెల్లెళ్ళు ఉన్నారు. దానికి ప్రవక్త (స), ‘వారిద్దరిలో నీవు కోరిన దాన్ని ఉంచుకో, నీవు కోరిన దాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే ఇద్దరు తోబుట్టువులను ఒకే నికా’హ్లో ఉంచరాదు,’ అని అన్నారు . (తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
3179 – [ 20 ] ( لم تتم دراسته ) (2/949)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: أَسْلَمَتِ امْرَأَةٌ فَتَزَوَّجَتْ فَجَاءَ زَوْجُهَا إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ قَدْ أَسْلَمْتُ وَعَلِمَتْ بِإِسْلَامِيْ فَانْتَزَعَهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنْ زَوْجِهَا الْآخِرِ وَرَدَّهَا إِلَى زَوْجِهَا الْأَوَّل.
وَفِيْ رِوَايَةٍ: أَنَّهُ قَالَ: إِنَّهَا أَسْلَمَتْ مَعِيَ فَرَدَّهَا عَلَيْهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3179. (20) [2/949 –అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ఒక స్త్రీ ఇస్లామ్ స్వీకరించింది. ఇస్లామ్ స్వీకరించిన తర్వాత మరో వ్యక్తితో నికా’హ్ చేసుకుంది. మొదటి భర్తకు ఈ విషయం తెలిసింది. అతడు ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! నేను ఇస్లామ్ స్వీకరించాను. ఈ విషయం నా భార్యకు కూడా తెలుసు,’ అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స) ఆ స్త్రీని రెండవ భర్త నుండి విడిపించి మొదటి భర్తకు అప్పజెప్పారు. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”నా భార్య నాతో పాటు ఇస్లామ్ స్వీకరించింది,” అని అంటే ప్రవక్త (స) అతని భార్యను తిరిగి అతనికి అప్పజెప్పారు. (అబూ దావూద్)
3180 – [ 21 ] ( لم تتم دراسته ) (2/949)
وَرُوِيَ فِيْ “شَرْحِ السُّنَّةِ”: أَنَّ جَمَاعَةُ مِّنَ النِّسَاءِ رَدَّهُنَّ النَّبِيُّ صلى الله عليه وسلم بِالنِّكَاحِ الْأَوَّلِ عَلَى أَزْوَاجِهِنَّ عِنْدَ اِجْتِمَاعِ الْإِسْلَامَيْنِ بَعْدَ اِخْتِلَافَ الدِّيْنِ وَالدَّارِ مِنْهُنَّ بِنْتُ الْوَلِيْدِ بْنِ مُغِيْرَةَ كَانَتْ تَحْتَ صَفْوَانَ بْنِ أُمَيَّةَ. فَأَسْلَمَتْ يَوْمَ الْفَتْحِ. وَهَرَبَ زَوْجَهَا مِنَ الْإِسْلَامِ. فَبَعَثَ إليه إبن عمه وهب ابن عمير برضائي النَّبِيُّ صلى الله عليه وسلم أَمَانًا لِصَفْوَانَ. فَلَمَّا قَدِمَ جَعَلَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم تَسِيْرُ أَرْبَعَةِ أَشْهُرِ حَتَّى أَسْلَمَ. فَاسْتَقَرَّتْ عِنْدَهُ وَأَسْلَمَتْ أُمُّ حَكِيْمٍ بِنْتُ الْحَارِثِ بْنِ هِشَامٍ اِمْرَأَةُ عِكْرَمَةَ بْنِ أَبِيْ جَهْلٍ يَوْمَ الْفَتْحِ بِمَكَّةَ وَهَرَبَ زَوْجُهَا مِنَ الْإِسْلَامِ حَتَّى قَدِمَ الْيَمَنَ فَارْتَحَلَتْ أُمُّ حَكِيْمٍ حَتَّى قَدِمَتْ عَلَيْهِ الْيَمَنَ فَدَعَتْهُ إِلَى الْإِسْلَامِ فَأَسْلَمَ فَثَبَتَا عَلَى نِكَاحِهِمَا. رَوَاهُ مَالِكٌ عَنِ ابْنِ شِهَابٍ مُرْسَلًا.
3180. (21) [2/949– అపరిశోధితం]
షర్’హ్ సున్నహ్లో ఇలా ఉంది: ”ప్రవక్త (స) కాలంలో చాలామంది స్త్రీలు ఇస్లామ్ స్వీకరించారు. ప్రవక్త (స) వారిని వారి భర్తల వద్దకు పంపివేశారు. అయితే ఇది భార్యా భర్త లిద్దరూ ఒకేసారి ఇస్లామ్ స్వీకరించి ఉంటే. వీరిలో వలీద్ బిన్ ము’గీర కూతురు కూడా ఉండేది. ఈమె ‘సఫ్వాన్ బిన్ ఉమయ్య నికా’హ్లో ఉండేది. ఈమె ఫత’హ్ మక్కహ్ రోజున ఇస్లామ్ స్వీకరించింది. ఆ రోజు ఆమె భర్త ‘సఫ్వాన్ ఇస్లామ్ స్వీకరించకుండా పారి పోయాడు. ప్రవక్త(స) ఆమె చిన్నాన్న కుమారుడు వహబ్ బిన్ ‘ఉమైర్‌ను తన దుప్పటి గుర్తుగా ఇచ్చి ఆమె భర్త వద్దకు పంపారు. ఇంకా ప్రవక్త (స) అతనికి అభయం ఇచ్చి నాలుగు నెలల వ్యవధి కూడా ఇచ్చారు. నాలుగు నెలలు పూర్తి అయ్యే లోపల ‘సఫ్వాన్ ప్రవక్త(స) వద్దకు వచ్చి ఇస్లామ్ స్వీకరించారు. అతని భార్యను అతనికి అప్పగించడం జరిగింది. ఇంకా మరో స్త్రీ ‘హారిస్’ బిన్ హిషామ్ కూతురు ఉమ్మె ‘హాకిమ్. ఈమె ఇక్రమ బిన్ అబీ జ’హల్ భార్య ఫత్’హ మక్కహ్ నాడు ఇస్లామ్ స్వీకరించింది. ఆమె భర్త ఇస్లామ్ స్వీకరించకుండా పారి పోయాడు. యమన్ వెళ్ళిపోయాడు. అతని భార్య ఉమ్మె ‘హకీమ్ మక్కహ్ నుండి ప్రయాణం చేసి యమన్ వెళ్ళి తన భర్తను ఇస్లామ్ స్వీకరించమని కోరింది. అతడు ఇస్లామ్ స్వీకరించాడు. వీరిద్దరూ మొదటి నికాహ్నే కొనసా గించారు. (మాలిక్ / తాబయీ ప్రోక్తం)
—–
الْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3181 – [ 22 ] ( صحيح ) (2/949)
عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: حُرِّمَ مِنَ النَّسَبِ سَبْعٌ وَمِنَ الصِّهْرِ سَبْعٌ ثُمَّ قَرَأَ: (حُرِّمَتْ عَلَيْكُمْ أُمَّهَاتُكُمْ؛ 4: 23) الآية . رَوَاهُ الْبُخَارِيُّ
3181. (22) [2/949 –దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: బంధుత్వం రీత్యా ఏడుగురు స్త్రీలతో వివాహం నిషేధించబడింది. అల్లుడి బంధుత్వం ద్వారా ఏడుగురు స్త్రీలు నిషిద్ధం అవుతారు. దీన్ని సమర్థిస్తూ ఈ ఆయతును పఠించారు. ”హుర్రిమత్ అలైకుమ్ ఉమ్మ హాతుకుమ్...” (అన్ నిసా, 4:23) (బు’ఖారీ)
3182 – [ 23 ] ( لم تتم دراسته ) (2/950)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أَيُّمَا رَجُلٍ نَكَحَ اِمْرَأَةً فَدَخَلَ بِهَا فَلَا يَحِلُّ لَهُ نِكَاحُ اِبْنَتِهَا وَإِنْ لَمْ يَدْخُلْ بِهَا فَلْيَنْكِحِ اِبْنَتَهَا. وَأَيُّمَا رَجُلٍ نَكَحَ اِمْرَأَةُ فَلَا يَحِلُّ لَهُ أَنْ يَنْكِحَ أُمَّهَا دَخَلَ أَوْ لَمْ يَدْخُلْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ لَا يُصِحُّ مِنْ قبلِ إِسْنَادِهِ إِنَّمَا رَوَاهُ ابْنُ لَهِيْعَةَ وَالْمُثَنَّى بْنُ الصَّبَّاحِ عَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ وَهُمَا يُضَعَّفَانِ فِيْ الْحَدِيْثِ.
3182. (23) [2/950– అపరిశోధితం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తి ఒక స్త్రీతో పెళ్ళి చేసుకొని ఆమెతో సంభోగం చేస్తే, ఆమె కూతురితో వివాహం చేయడం ధర్మసమ్మతం కాదు. ఒకవేళ ఆమెతో సంభోగం చేయకుండా ఉంటే ఆమె కూతురితో వివాహం చేయవచ్చు. అదేవిధంగా తన భార్య తల్లితో వివాహం చేయడం ధర్మ సమ్మతం కాదు, తన భార్యతో సంభోగం చేసినా చేయక పోయినా సరే. (తిర్మిజి’ / కథకులను ‘దయీఫ్గా పేర్కొన్నారు)
=====
5- بَابُ الْمُبَاشَرَةِ
5. సంభోగం
ముబాషరహ్ అంటే శారీరక సంబంధం, సంభోగం అని అర్థం. ఈ అధ్యాయంలో సంభోగ నియమాలను పేర్కొనడం జరిగింది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3183 – [ 1 ] ( متفق عليه ) (2/951)
عَنْ جَابِرٍ قَالَ: كَانَتِ الْيَهُوْدُ تَقُوْلُ: إِذَا أَتَى الرَّجُلُ اِمْرَأَتَهُ مِنْ دُبُرِهَا فِيْ قُبُلِهَا كَانَ الْوَلَدُ أَحْوَلَ فَنَزَلَتْ: (نِسَاوُكُمْ حَرْثٌ لَّكُمْ فَأَتُوْا حَرْثَكُمْ أَنّى شِئْتُمْ؛ 2: 223)
3183. (1) [2/951 –ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: తన భార్యతో వెనుక నుండి సంభోగం చేస్తే బిడ్డ మెల్లకన్నుతో జన్మిస్తాడని యూదులు అనేవారు. వారిని ఖండిస్తూ ఈ ఆయతు అవతరించింది. ”నిసాఉకుమ్ హర్సుల్లకుమ్ ఫాతూ హర్సకుమ్ అన్నా షీతుమ్” – మీ భార్యలు మీకు పంటపొలాల వంటి వారు, కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు.’ [46] (అల్ బఖరహ్, 2:223) (బు’ఖారీ, ముస్లిమ్)
3184 – [ 2] ( متفق عليه ) (2/951)
وَعَنْهُ فال: كُنَّا نَعْزِلُ وَالْقُرْآنُ يَنْزِلُ. مُتَّفَقٌ عَلَيْهِ. وَزَادَ مُسْلِمٌ: فَبَلَغَ ذَلِكَ النَّبِيّ صلى الله عليه وسلم فَلَمْ يَنْهِنَا.
3184. (2) [2/951- ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: ఖుర్ఆన్ అవతరిస్తున్న కాలంలో మేము‘అ‘జ్ల్ చేసుకునే వారం. (బు’ఖారీ, ముస్లిమ్)
ముస్లిమ్‌లో ఇలా ఉంది, ఈ వార్త ప్రవక్త (స)కు తెలిసింది. కాని ప్రవక్త (స) వారించలేదు.[47]
3185 – [ 3 ] ( صحيح ) (2/951)
وَعَنْهُ قَالَ: إِنَّ رَجُلًا أَتَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “إِنَّ لِيْ جَارِيَةً هِيَ خَادِمَتُنَا وَأَنَا أَطُوْفُ عَلَيْهَا وَأَكْرَهُ أَنْ تَحْمِلَ فَقَالَ: “اِعْزِلْ عَنْهَا إِنْ شِئْتَ فَإِنَّهُ سَيَأْتِيْهَا مَا قُدِّرَ لَهَا”. فَلَبِثَ الرَّجُلُ ثُمَّ أَتَاهُ فَقَالَ: إِنَّ الْجَارِيَةَ قَدْ حَبِلَتْ فَقَالَ: “قَدْ أَخْبَرْتُكَ أَنَّهُ سَيَأْتِيْهَا مَا قُدِّرَ لَهَا”. رَوَاهُ مُسْلِمٌ
3185. (3) [2/951–దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఓ అల్లాహ్ ప్రవక్తా! నా వద్ద ఒక బానిసరాలు ఉంది. అదే మాకు సేవ చేస్తుంది. నేను ఆమెతో సంభోగిస్తున్నాను. కాని ఆమె గర్భవతి కాకూడదని కోరుకుంటున్నాను. దానికి ప్రవక్త (స), ‘నీకు ఇష్టం అయితే ‘అ’జ్ల్ చేసుకో. అయితే ఆమె అదృష్టంలో ఉంటే తప్పకుండా గర్భవతి అయి తీరుతుంది.’ అతడు వెళ్ళి పోయాడు. కొన్ని దినాల వరకు ‘అ’జ్ల్ చేస్తూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఏ బానిసరాలితో నేను ‘అ’జ్ల్ చేస్తూ వచ్చానో ఆమె గర్భం దాల్చింది,’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘ఆమె అదృష్టంలో ఉన్నది తప్పకుండా జరిగి తీరుతుందని నేను నీకు ముందే చెప్పాను,’ అని అన్నారు. (ముస్లిమ్)
3186 – [ 4 ] ( متفق عليه ) (2/951)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: خَرَجْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم غَزْوَةِ بَنِيْ الْمُصْطَلِقِ فَأَصَبْنَا سَبْيًا مِّنْ سَبْيِ الْعَرَبِ فَاشْتَهَيْنَا النِّسَاءَ وَاشْتَدَّتْ عَلَيْنَا الْعُزْبَةُ وَأَحْبَبْنَا الْعَزْلَ فَأَرَدْنَا أَنْ نَعْزِلَ وَقُلْنَا: نَعْزِلَ وَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بَيْنَ أَظْهُرِنَا قَبْلَ أَنْ نَسْأَلَهُ؟ فَسَأَلْنَاهُ عَنْ ذَلِكَ فَقَالَ: “مَا عَلَيْكُمْ أَلَّا تَفْعَلُوْا مَا مِنْ نَسْمَةٍ كَائِنَةٍ إِلَى يَوْمِ الْقِيَامَةِ إِلَّا وَهِيَ كَائِنَةٌ”.
3186. (4) [2/951–ఏకీభవితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) వెంట మేము బనీ ము’స్తలిఖ్ యుద్ధం కోసం బయలు దేరాము. అక్కడ అరబ్బులకు చెందిన ఖైదీలలో కొందరు స్త్రీలు పట్టుబడ్డారు. స్త్రీల కోరిక చాలా తీవ్రంగా కలిగింది. మేము వారితో సంభోగం చేసాము. ‘అ’జ్ల్ చేసుకున్నాము. ఆ తరువాత ప్రవక్త (స) ఉండగా అనుమతి లేకుండా ‘అ’జ్ల్ చేయడం మంచిది కాదని భావించి, దీన్ని గురించి ప్రవక్త (స)ను విన్నవించు కున్నాం. దానికి ప్రవక్త (స) చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే తీర్పుదినం వరకు జన్మించ నున్న ప్రాణులు ఎలాగైనా జన్మిస్తారు. మీరు ‘అ’జ్ల్ చేసినా చేయక పోయినా! (బు’ఖారీ, ముస్లిమ్)
3187 – [ 5 ] ( صحيح ) (2/952)
وَعَنْهُ قَالَ: سُئِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ الْعَزْلِ فَقَالَ: “مَا مِنْ كُلِّ الْمَاءِ يَكُوْنُ الْوَلَدُ وَإِذَا أَرَادَ اللهُ خَلْقَ شَيْءٍ لَمْ يَمْنَعْهُ شَيْءٌ”. رَوَاهُ مُسْلِمٌ
3187. (5) [2/952– దృఢం]
అబూ స’యీద్ కథనం: ప్రవక్త (స)ను ‘అ’జ్ల్ గురించి ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘వీర్యం యొక్క ప్రతి చుక్క నుండి బిడ్డలు పుట్టరు. దాని కోసం ఒక్కచుక్క చాలు. అల్లాహ్ (త) సృష్టించాలను కున్నప్పుడు దాన్నెవరూ ఆపలేరు,’ అని సమాధానం ఇచ్చారు. (ముస్లిమ్)
3188 – [ 6 ] ( صحيح ) (2/952)
وَعَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَاصٍ: أَنَّ رَجُلًا جَاءَ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: إِنِّيْ أَعْزِلُ عَنِ امْرَأَتِيْ. فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لِمَ تَفْعَلُ ذَلِكَ؟” فَقَالَ الرَّجُل: أُشْفِقُ عَلَى وَلَدِهَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْ كَانَ ذَلِكَ ضَارًّا ضَرَّ فَارِسَ وَالرُّوْمَ”. رَوَاهُ مُسْلِمٌ.
3188. (6) [2/952 –దృఢం]
స’అద్ బిన్ అబీ వఖ్ఖా’స్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘నేను నా భార్యతో ‘అ’జ్ల్ చేస్తున్నాను,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు,’ అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, ‘నేను పిల్లలని భయపడుతున్నాను. గర్భవతి అయి పిల్లలైతే పాలు పట్టటం హానికరమని,’ అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘ఇది హానికరమైనదైతే రోమ్, ఫారిస్ వాసులకు కూడా హానికరమై ఉండేది,’ అని అన్నారు. (ముస్లిమ్)
3189 – [ 7 ] ( صحيح ) (2/952)
وَعَنْ جُذَامَةَ بِنْتِ وَهْبٍ قَالَتْ: حَضَرْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فِيْ أُنَاسٍ وَهُوَ يَقُوْلُ: “لَقَدْ هَمَمْتُ أَنْ أَنْهَى عَنِ الْغِيْلَةِ فَنَظَرْتُ فِي الرُّوْمِ وَفَارِسَ فَإِذَا هُمْ يُغِيْلُوْنَ أَوْلَادَهُمْ فَلَا يَضُرُّ أَوْلَادَهُمْ ذَلِكَ شَيْئًا”. ثُمَّ سَأَلُوْهُ عَنِ الْعَزْلِ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ذَلِكَ الْوَأْدُ الْخَفِيُّ وَهِيَ (وَإِذَا الْمَوْؤُوْدَةُ سُئِلَتْ). رَوَاهُ مُسْلِمٌ.
3189. (7) [2/952–దృఢం]
జుజా’మహ్ బిన్తె వహబ్ (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స) ఇలా ప్రసంగిస్తున్నారు. ”ప్రజలను ‘గీలా చేయటాన్ని వారించాలనుకున్నాను. కాని ఫారిస్, రూమ్ ప్రజలకు ఇలా చేయడం చూసాను. వారి పిల్లలకు ఏమీ నష్టం కలగటం లేదు. అందువల్ల నేను ‘గీలా గురించి వారించ లేదు,” అని అన్నారు. ఆ తరువాత ప్రజలు ‘అ‘జ్ల్గురించి ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స), ‘ఇలా చేయడం రహస్యంగా బిడ్డను ఖననం చేసినట్లే’ అని అన్నారు. ఆ తరువాత, ”వ ఇజ’ల్ మౌ’ఊదతు” పఠించారు. అంటే, ‘సజీవంగా పాతిపెట్ట బడిన అమ్మాయిని నీవు ఏ నేరం క్రింద చంపబడ్డావు’ అని ప్రశ్నించబడుతుంది.[48] (ముస్లిమ్)
3190 – [ 8 ] ( صحيح ) (2/952)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: إِنَّ أَعْظَمَ الْأَمَانَةِ عِنْدَ اللهِ يَوْمَ الْقِيَامَةِ”.
وَفِيْ رِوَايَةٍ: إِنَّ مِنْ أَشَرِّ النَّاسِ عِنْدَ اللهِ مَنْزِلَةً يَوْمَ الْقِيَامَةِ الرَّجُلَ يُفْضِيْ إِلَى امْرَأَتِهِ وَتُفْضِيْ إِلَيْهِ ثُمَّ يَنْشُرُ سِرَّهَا”. رَوَاهُ مُسْلِمٌ.
3190. (8) [2/952– దృఢం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్(త) వద్ద తీర్పు దినము అన్నిటి కంటే గొప్ప అమానతు.
మరో ఉల్లేఖనంలో తీర్పు దినం నాడు అల్లాహ్ వద్ద అందరి కంటే నీచుడు ఎవరంటే, తన భార్యతో సంభోగం చేసి ఆ రహస్యాలను ఇతరుల ముందు పెట్టేవాడు.” [49] (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3191 – [ 9 ] ( حسن ) (2/953)
عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: أُوْحِيَ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: (نِسَاوُكُمْ حَرَثٌ لَكُمْ فَأْتُوْا حَرْثَكُمْ؛2: 223) الآية: “أَقْبِلْ وَأَدْبِرْ وَاتَّقِ الدُّبُرَ وَالْحَيْضَةَ”. رَوَاهُ أبوداؤد والتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.
3191. (9) [2/953 –ప్రామాణికం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స)పై దైవవాణి అవతరించబడింది. ”నిసాఉకుమ్ ‘హర్సు’ల్లకుమ్ ఫఅ’తూ ‘హరసు’కుమ్ …” – ‘మీ భార్యలు మీకు పంట పొలాల వంటి వారు, కావున మీపొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు.’ (అల్ బఖరహ్, 2:223) ముందు నుండైనా, వెనుకనుండైనా. అయితే మర్మాం గాన్ని మాత్రం గర్భాశయ ద్వారంలో నేపెట్టాలి, మల మార్గంలో కాదు. ఇంకా బహిష్టుస్థితిలో సంభోగం చేయరాదు. (అబూ దావూద్, తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దారమి)
3192 – [ 10 ] ( صحيح ) (2/953)
وَعَنْ خُزَيْمَةَ بْنِ ثَابِتٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ اللهَ لَا يَسْتَحْيِيْ مِنَ الْحَقِّ لَا تَأْتُوْا النِّسَاءَ فِيْ أَدْبَارِهِنَّ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ . وَالدَّارَمِيُّ
3192. (10) [2/953 –దృఢం]
‘ఖుజైమ బిన్ సా’బిత్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ (త) సత్యం పలకటంలో సిగ్గుపడడు, మీరు స్త్రీలతో మలమార్గం గుండా సంభోగించకూడదని ఆదేశిస్తున్నాడు.” (అ’హ్మద్, తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దారమి)
3193 – [ 11 ] ( لم تتم دراسته ) (2/953)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” مَلْعُوْنٌ مَنْ أَتَى اِمْرَأَتَهُ فِيْ دُبُرِهَا”. رَوَاهُ أَحْمَدُ وَأبُوْ دَاوُدَ
3193. (11) [2/953 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, తన భార్యతో మలమార్గం గుండా సంభోగం చేసేవాడు శాపగ్రస్తుడు. (అ’హ్మద్, అబూ దావూద్)
3194 – [ 12 ] ( صحيح ) (2/953)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الَّذِيْ يَأْتِيْ اِمْرَأَتَهُ فِيْ دُبُرِهَا لَا يَنْظُرُ اللهُ إِلَيْهِ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.
3194. (12) [2/953–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, తన భార్యతో ఆమె మలమార్గం ద్వారా సంభోగం చేసే వ్యక్తి వైపు అల్లాహ్ కారుణ్య దృష్టితో చూడడు. (షర్’హ్ సున్నహ్)
3195 – [ 13 ] ( حسن ) (2/953)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَنْظُرُ اللهُ إِلَى رَجُلٍ أَتَى رَجُلًا أَوِ امْرَأَةً فِيْ الدُّبُرِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
3195. (13) [2/953 –ప్రామాణికం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ప్రకృతికి వ్యతిరేకంగా పరపురుషునితో కామక్రీడలో పాల్గొన్నా లేదా తన భార్యతో ఆమె మలమార్గం ద్వారా సంభోగంచేసినా, అటువంటి వ్యక్తి వైపు అల్లాహ్ (త) కారుణ్య దృష్టితో చూడడు. (తిర్మిజి’)
3196 – [ 14 ] ( لم تتم دراسته ) (2/954)
وَعَنْ أَسْمَاءَ بِنْتِ يَزِيْدَ قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا تَقْتُلُوْا أَوْلَادَكُمْ سِرًّا فَإِنَّ الْغَيْلَ يُدْرِكُ الْفَارِسَ فَيُدَعْثِرُهُ عَنْ فَرَسِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
3196. (14) [2/954 –అపరిశోధితం]
అస్మా’ బిన్తె య’జీద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ సంతానాన్ని రహస్యంగా చంపకండి. ఎందుకంటే ‘గైల ప్రయాణీకుడ్ని గుర్రం పైనుండి క్రిందికి పడవేస్తుంది.” [50] (అబూ దావూద్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3197 – [ 15 ] ( لم تتم دراسته ) (2/954)
عَنْ عُمْرِ بْنِ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يُعْزَلَ عَنْ اَلْحُرَّةِ إِلَّا بِإِذْنِهَا. روَاهُ ابْنُ مَاجَهُ.
3197. (15) [2/954 –అపరిశోధితం]
‘ఉమర్ (ర) కథనం: స్వతంత్రురాలైన స్త్రీతో ‘అ‘జ్ల్ చేయరాదని వారించారు. అయితే ఆమె అనుమతితో చేయవచ్చని ఆదేశించారు. (ఇబ్నె మాజహ్)
అంటే స్వతంత్రు రాలైన స్త్రీ అనుమతిస్తే ‘అ‘జ్ల్ చేయాలి లేదా చేయకూడదు. బానిసరాలితో ఆమె అనుమతి లేకుండానే ‘అ’జ్ల్ చేయవచ్చు.
=====
6- بَابُ خِيَارِ الْمَمْلُوْكَيْن
6. బానిస స్త్రీ పురుషులకు వివాహ స్వేచ్ఛ
ఒకవేళ భార్యభర్తలు బానిసలైతే యజమాని వారిద్దరి నికా’హ్ చేస్తే యజమాని తన బానిస స్త్రీని విడుదల చేయాలి. ఆమె భర్త మాత్రం బానిసగానే ఉంటాడు. అయితే ఇప్పుడు ఆమె తన భర్త అధీనంలో ఉండవచ్చు, వేరై పోవచ్చు. ఆమె వేరు కావడమే ‘తలాఖ్ గా పరిగణించబడుతుంది. ఒకవేళ బానిసరాలి భర్త స్వతంత్రుడు అయి ఉండి, అతడు విడుదల అయిన తర్వాత ఆమె విడుదల అయిన పక్షంలో ఆమె భర్త ఆమెకు ‘తలాఖ్ ఇచ్చేవరకు అతని అధీనంలోనే ఉంటుంది. ఒకవేళ ఇద్దరూ ఒకేసారి విడుదల అయితే బానిసరాలికి అధికారం ఉండదు. క్రింది ‘హదీసు’లు దీన్ని గురించే సూచిస్తున్నాయి.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3198 – [ 1 ] ( متفق عليه ) (2/955)
عَنْ عُرْوَةَ عَنْ عَائِشَةَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ لَهَا فِيْ بَرِيْرَةَ: “خُذِيْهَا فَأَعْتِقِيْهَا”. وَكَانَ زَوْجُهَا عَبْدًا فَخَيّرَهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. فَاخْتَارَتْ نَفْسَهَا وَلَوْ كَانَ حُرًّا لَمْ يُخَيِّرْهَا.
3198. (1) [2/955 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) ద్వారా, ‘ఉర్వహ్ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఆయి’షహ్ (ర)ను, ‘నువ్వు బరీరహ్ను కొనుక్కో ఆ తరువాత విడుదల చేయి,’ అని ఆదేశించారు. ‘ఆయి’షహ్ (ర) బరీరహ్ను కొని విడుదల చేసారు. ఆమె విడుదల అయినపుడు ఆమె భర్త బానిసత్వంలో ఉన్నాడు. అప్పుడు ప్రవక్త (స) ఆమెకు ఈ అధికారం ఇచ్చారు. ఆమె తన ఇష్టానికి ప్రాధాన్యత ఇస్తూ బానిస భర్తను వదలివేసింది. ఒకవేళ ఆమె భర్త మొదట విడుదల అయితే ప్రవక్త (స) ఆమెకు ఆ అధికారం ఇచ్చేవారు కారు. (బు’ఖారీ, ముస్లిమ్)
3199 – [ 2 ] ( صحيح ) (2/955)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ زَوْجُ بَرِيْرَةَ عَبْدًا أَسْوَدَ يُقَالُ لَهُ مَغِيْثٌ. كَأَنِّيْ أَنْظُرُ إِلَيْهِ يَطُوْفُ خَلْفَهَا فِيْ سِكَكِ الْمَدِيْنَةِ يَبْكِيْ وَدُمُوْعُهُ تَسِيْلُ عَلَى لِحْيَتِهِ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم لِلْعَبَّاسِ:” يَا عَبَّاسِ أَلَا تَعْجَبُ مِنْ حُبِّ مُغِيْثٍ بَرِيْرَةَ؟ وَمِنْ بُغْضِ بَرِيْرَةَ مُغِيْثًا؟” فقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “لَوْ رَاجَعْتِهِ ” فَقَالَتْ: يَا رَسُوْلَ اللهِ تَأْمُرُنِيْ؟ قَالَ: “إِنَّمَا أَشْفَعُ” قَالَتْ: لَا حَاجَةَ لِيْ فِيْهِ. رَوَاهُ الْبُخَارِيُّ .
3199. (2) [2/955 –దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: బరీరహ్ భర్త నల్ల జాతికి చెందిన వాడు, అతని పేరు ము’గైస్’. నేనతన్ని మదీ నహ్ వీధుల్లో బరీరహ్ వెనుక ఏడుస్తూ తిరగడం. అతని కన్నీళ్ళు కారి గడ్డం తడిసిపోవడం నేను చూసేవాడిని. అంటే బరీరహ్ విడుదల అయి తన భర్తనుండి వేరై పోయింది. అతడు ఆమె వెనుక తిరిగేవాడు. అది చూసి ప్రవక్త (స) ‘అబ్బాస్! నీకు ఆశ్చర్యంగా లేదా అతనికి ఆమె అంటే ఎంత ప్రేమో, మరి ఆమెకు అతనంటే ఎంత అసహ్యమో. ప్రవక్త (స) బరీరహ్ ను, ‘నువ్వు మళ్ళీ ము’గైస్’ పెండ్లి చేసుకుంటే బాగుండు’ అని అన్నారు. దానికి ఆమె, ‘ప్రవక్తా ఇది మీ ధార్మిక ఆదేశమా,’ అని అన్నది. ‘లేదు సిఫారసు చేస్తున్నాను,’ అని ప్రవక్త (స) అన్నారు. ‘అయితే అలా ఉండనివ్వండి,’ అని సమాధానం ఇచ్చింది, బరీరహ్. (బు’ఖారీ)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3200 – [ 3 ] ( لم تتم دراسته ) (2/956)
عَنْ عَائِشَةَ: أَنَّهَا أَرَادَتْ أَنْ تُعْتِقَ مَمْلُوْكَيْنَ لَهَا زَوْجٌ . فَسَأَلَتِ النَّبِيُّ صلى الله عليه وسلم فَأَمَرَهَا أَنْ تَبْدَأَ بِالرَّجُلِ قَبْلَ الْمَرْأَةِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.
3200. (3) [2/956 –అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) భార్యభర్తలయిన ఇద్దరు బానిసలను కొని విడుదల చేయాలని నిశ్చయించు కుంది. ఆమె దీన్ని గురించి ప్రవక్త (స)తో చర్చించింది. దానికి ప్రవక్త (స) ”నువ్వు ముందు భర్తను ఆ తర్వాత భార్యను విడుదలచేయి” అని ఆదేశించారు. (అబూ దావూద్, నసాయి’)
3201- [ 4 ] ( لم تتم دراسته ) (2/956)
وَعَنْهَا: أَنْ بَرِيْرَةَ عُتِقَتْ وَهِيَ عِنْدَ مُغِيْثٍ فَخَيَّرَهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وقَالَ لَهَا: “إِنْ قَرِبَكَ فَلَا خِيَارَلَكِ”. رَوَاهُ أَبُوْدَاوُدَ .
3201. (4) [2/956 –అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: బరీరహ్ విడుదల అయినపుడు ఆమె ము’గైస్’ నికా’హ్లో ఉండేది. అప్పుడు ప్రవక్త (స) ఆమెతో, ‘ఇప్పుడు నీవు నీ భర్తతో ఉండవచ్చు, లేదా వదలి వేయవచ్చు. అయితే నీవు విడుదల అయిన తర్వాత నీభర్త నీతో సంభోగం చేస్తే మరి నీవు అతన్ని వదలలేవు,’ అని సూచించారు. (అబూ దావూద్)
هَذَا الْبَابُ خَالٍ مِنَ الْفَصْلُ الثَّالِثُ
ఈ అధ్యాయంలో మూడవ విభాగం లేదు
=====
7- بَابُ الصَّدَاقِ
7. వధు కట్నం (మహ్ర్)
ఏ నిర్ణీత ధనానికి బదులు నికా’హ్ చేయబడు తుందో దాన్ని మహ్ర్ లేదా ‘సదాఖ్ అంటారు. నికా’హ్లో మహర్ తప్పని సరిగా ఇవ్వాలి. అల్లాహ్ ఆదేశం: ”కావున మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించా లనుకున్నవారికి, వారి వధు కట్నం (మహ్ర్) విధిగా చెల్లించండి…” (అన్నిసా’, 4:24) ”
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3202 – [ 1 ] ( متفق عليه ) (2/957)
عَنْ سَهْلِ بْنِ سَعْدٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم جَاءَتْهِ اِمْرَأَةٌ فَقَالَتْ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ وَهَبْتُ نَفْسِيْ لَكَ فَقَامَتْ طَوِيْلًا فَقَامَ رَجُلٌ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ زَوِّجْنِيْهَا إِنْ لَمْ تَكُنْ لَكَ فِيْهَا حَاجَةٌ. فَقَالَ: “هَلْ عِنْدَكَ مِنْ شَيْءٍ تُصْدِقُهَا ؟ “قَالَ: مَا عِنْدِيْ إِلَّا إِزَارِيْ هَذَا. قَالَ: “فَالْتَمِسْ وَلَوْ خَاتَمًا مِنْ حَدِيْدٍ”. فَالْتَمَسَ فَلَمْ يَجِدْ شَيْئًا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَلْ مَعَكَ مِنَ الْقُرْآنِ شَيْءٌ”. قَالَ: نَعَمْ سُوْرَةُ كَذَاَ وَسُوْرَةٌ كَذَا فَقَالَ: “زَوَّجْتُكَهَا بِمَا مَعَكَ مِنَ الْقُرْآنِ”. وَفِيْ رِوَايَةٍ: قَالَ: “اِنْطَلِقْ فَقَدْ زَوَّجْتُكَهَا فَعَلِّمْهَا مِنَ الْقُرْآنِ”.
3202. (1) [2/957– ఏకీభవితం]
సహల్ బిన్ స’అద్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక స్త్రీ వచ్చి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! నన్ను నేను మీకు సమర్పించుకున్నాను,’ అని అన్నది. మీరు నా గురించి ఏం ఆదేశించినా నాకు ఇష్టమే. చాలాసేపు వరకు ప్రవక్త (స) సమాధానం ఇవ్వలేదు. ఒక అనుచరుడు లేచి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ఒకవేళ మీకు అవసరం లేకపోతే ఆమెతో నా పెళ్ళి చేయించండి,’ అని అన్నాడు. ప్రవక్త (స), ‘మహర్‌గా ఇవ్వటానికి నీ దగ్గర ఏమైనా ఉందా?’ అని అడిగారు. ‘నా దగ్గర ఈ లుంగీ తప్ప మరేమీ లేదు,’ అని ఆ వ్యక్తి అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘నీవు వెళ్ళిఏదైనా వెతుకు. అది ఇనుప ఉంగరం అయినా ఫర్వాలేదు,’ అని అన్నారు. అతడు తిరిగి వచ్చి, ‘ఏ వస్తువూ దొరక లేదు,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘ఖుర్ఆన్లో నుండి ఏమైనా నీకు కంఠస్తం ఉందా?’ అని అడిగాడు. ఆ వ్యక్తి, ‘నాకు ఫలానా సూరాలు కంఠస్తం ఉన్నాయి,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘ఖుర్ఆన్లోని ఈ సూరహ్ లకు బదులు నీ పెళ్ళి ఆ అమ్మాయితో చేసాను. నువ్వు వెళ్ళి ఆమెకు ఖుర్ఆన్ నేర్పించు,’ అని ఆదేశించారు.[51] (బు’ఖారీ, ముస్లిమ్)
3203 – [ 2 ] ( صحيح ) (2/957)
وَعَنْ أَبِيْ سَلَمَةَ قَالَ: سَأَلْتُ عَائِشَةَ: كَمْ كَانَ صَدَاقُ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَتْ: كَانَ صَدَاقُهُ لِأَزْوَاجِهِ اثِنْتَيْ عَشَرَةَ أُوْقِيَّةً وَنَشّاً. قَالَتْ: أَتَدْرِيْ مَا النَّشُّ؟ قُلْتُ: لَا قَالَتْ: نِصْفُ أُوْقِيَّةٍ فَتِلْكَ خَمْسُمِائَةِ دِرْهَمٍ. رَوَاهُ مُسْلِمٌ. وَنْشٌّ بِالرَّفْعِ فِيْ شَرْحِ السُّنَّةِ وَفِيْ جَمِيْعِ الْأُصُوْلِ.
3203. (2) [2/957–దృఢం]
అబూ సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) భార్యల మహర్ ఎంత ఉండేదని ‘ఆయి’షహ్ (ర)ను అడిగాను. దానికి ఆమె, ‘ప్రవక్త (స) భార్యల మహర్ 12 ఊఖియాలు మరియు ఒక నష్ ఉండేది. నష్ అంటే ఎంతో నీకు తెలుసా?’ అని అడిగారు. దానికి నేను, ‘లేదు,’ అని సమాధానం ఇచ్చాను. అప్పుడు ‘ఆయి’షహ్ (ర), ‘నష్ అంటే సగం ఊఖియ, అంటే ఇవన్నీ కలసి సుమారు 500 దిర్’హమ్‌లు,’ అని అన్నారు. [52] (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3204 – [ 3 ] ( صحيح ) (2/958)
عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: أَلَا لَا تُغَالُوْا صَدْقَةَ النِّسَاءِ فَإِنَّهَا لَوْ كَانَتْ مَكْرُمَةً فِيْ الدُّنْيَا وَتَقْوَى عِنْدَ اللهِ لَكَانَ أَوْلَاكُمْ بِهَا نَبِيُّ الله صلى الله عليه وسلم. مَا عَلِمْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَكَحَ شَيْئًا مِنْ نِسَائِهِ وَلَا أَنْكَحَ شَيْئًا مِّنْ بَنَاتِهِ عَلَى أَكْثَرَ مِنْ اِثْنَتَيْ عَشْرَةَ أَوْقِيَّةً. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.
3204. (3) [2/958 –దృఢం]
‘ఉమర్ (ర) కథనం: జాగ్రత్త! స్త్రీల మహర్ అధికంగా నిర్ణయించకండి. ఎక్కువ మహర్ నిర్ణయించడం గౌరవం, దైవప్రీతి పొందే సాధనం అయితే ప్రవక్త (స) దానికి తగినవారు. నాకు తెలిసినంత వరకు ప్రవక్త (స) తన భార్యల మరియు కుమార్తెల మహర్ 12 ఊఖియాల కంటే అధికంగా నిర్ణయించలేదు.[53] (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’, ఇబ్నె మాజహ్, దారమి)
3205 – [ 4 ] ( لم تتم دراسته ) (2/958)
وَعَنْ جَابِرٍأَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ أَعْطَى فِيْ صَدَاقِ اِمْرَأَتِهِ مِلْءَ كَفَّيْهِ سَوِيْقًا أَوْ تَمْرًا فَقَدِ اسْتَحَلَّ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3205. (4) [2/958 –అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: మహర్‌గా తన భార్యకు రెండు అరచేతుల నిండా సత్తూ లేదా ఖర్జూరం ఇచ్చినవాడు తన భార్యను ధర్మసమ్మతం చేసుకున్నట్టే. (అబూ దావూద్)
అంటే భార్యాభర్తలు ఇద్దరూ ఇంత ఇచ్చి పుచ్చు కోవడంపై ఇష్టపడితే నికా’హ్ అయిపోతుంది.
3206- [ 5 ] ( لم تتم دراسته ) (2/958)
وَعَنْ عَامِرِ بْنِ رَبِيْعَةَ: أَنَّ اِمْرَأةً مِنْ بَنِي فَزَارَةَ تَزَوَّجَتْ عَلَى نَعْلَيْنِ. فَقَالَ لَهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَرَضِيْتِ مِنْ نَفْسِكِ وَمَالِكِ بِنَعْلَيْنِ؟” قَالَتْ: نَعَمْ. فَأَجَازَهُ. رَوَاهُ التِّرْمِذِيُّ.
3206. (5) [2/958– అపరిశోధితం]
‘ఆమిర్ బిన్ రబీ’అహ్ (ర) కథనం: బనీ ఫ’జార తెగకు చెందిన ఒక స్త్రీ ఒక జత చెప్పుల మహర్‌కు బదులు ఒక వ్యక్తితో పెళ్ళిచేసుకుంది. అప్పుడు ప్రవక్త (స), ‘ఒక జత చెప్పులకు బదులుగా నిన్ను నువ్వు అతనికి సమర్పించు కున్నావా?’ అని ఆమెతో అన్నారు. దానికి ఆమె, ‘అవునని’ బదులిచ్చింది. ప్రవక్త (స), ‘ఆ నికా’హ్ను కొనసాగనివ్వమని,’ అనుమతించారు. (తిర్మిజి’)
3207 – [ 6 ] ( لم تتم دراسته ) (2/958)
وَعَنْ عَلْقَمَةَ عَنِ ابْنِ مَسْعُوْدٍ: أَنَّهُ سُئِلَ عَنْ رَجُلٍ تَزَوَّجَ امْرَأَةً وَلَمْ يَفْرِضْ لَهَا شَيْئًا وَلَمْ يَدْخُلْ بِهَا حَتَّى مَاتَ فَقَالَ ابْنُ مَسْعُوْدٍ لَهَا مِثْلُ صَدَاقِ نِسَائِهَا. لَا وَكْسَ وَلَا شَطَطَ وَعَلَيْهَا الْعِدَّةُ وَلَهَا الْمِيْرَاثُ. فَقَامَ مَعْقِلُ بْنُ سَنَانَ الْأَشْجَعِيُّ فَقَالَ: قَضَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ بِرْوَعِ بِنْتِ وَاشِقِ اِمْرَأَةٍ مِنَّا بِمِثْلِ مَا قَضَيْتَ. فَفَرِحَ بِهَا ابْنُ مَسْعُوْدٍ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ.
3207. (6) [2/958– అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) ద్వారా ‘అల్‌ఖమహ్ (ర) కథనం: ‘ఒక వ్యక్తి ఒక స్త్రీతో వివాహం చేసుకున్నాడు. మహర్ నిర్ణయించలేదు, ఆమెతో సంభోగం చేయనూ లేదు. ఆ వ్యక్తి మరణించాడు. ఆమెకు మహర్ లభిస్తుందా? లేదా? ఆమె ఇద్దత్ దినాలు గడుపుతుందా లేదా? భర్త ఆస్తికి వారసురాలు అవుతుందా లేదా?’ అని అతన్ని ప్రశ్నించడం జరిగింది. దానికి ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర), ‘ఆమెకు మహర్ లభిస్తుంది, అంటే ఆమె కుటుంబంలో ఇవ్వబడేంత మహర్ ఆమెకు లభిస్తుంది. ఆమె ఇద్దత్ దినాలు గడుపుతుంది, ఇంకా తన భర్త ఆస్తికి వారసురాలు కూడా అవుతుంది,’ అని సమాధానం ఇచ్చారు. అది విన్న మ’అఖిల్ బిన్ సినాన్ అష్జయీ నిలబడి, ”మా కుటుంబంలోని ఒక స్త్రీ సమస్య కూడా ఇటువంటిదే ఉంది. మహర్ నిర్ణయించకుండా నికా’హ్ అయింది, సంభోగం చేయకుండా ఆమె భర్త మరణించాడు, అప్పుడు ప్రవక్త (స)ను కూడా ఇలాగే ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స) ఇప్పుడు నీవు ఇచ్చినట్టే సమాధానం ఇచ్చారు” అని అన్నారు. అది విని, ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ చాలా సంతోషించారు. (తిర్మిజి’, అబూదావూద్, నసాయి’, దారమి)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3208 – [7 ] ( لم تتم دراسته ) (2/959)
عَنْ أُمِّ حَبِيْبَةِ: أَنَّهَا كَانَتْ تَحْتَ عَبْدِ اللهِ بْنِ جَحْشٍ فَمَاتَ بِأَرْضِ الْحَبَشَةَ فَزَوَّجَهَا النَّجَّاشِيُّ النَّبِيَّ صلى الله عليه وسلم وَأَمْهَرَهَا عَنْهُ أَرْبَعَةَ آلْافٍ. وَفِيْ رِوَايَةٍ: أَرْبَعَةَ دِرْهَمٍ وَبَعَثَ بِهَا إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مَعَ شُرَحْبِيْلَ بْنِ حَسَنَةَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ
3208. (7) [2/959–అపరిశోధితం]
ఉమ్మె ‘హబీబహ్ మొదట ‘అబ్దుల్లాహ్ బిన్ జ‘హష్ నికా‘హ్లో ఉండేవారు. ‘అబ్దుల్లాహ్ హబ్షా వెళ్ళి చనిపోయారు. ఇద్దత్ దినాలు గడిసిన తర్వాత నజ్జాషీ రాజు ప్రవక్త (స) అనుమతితో, ‘హబీబహ్ పెళ్ళి ప్రవక్త (స)తో చేసారు. తన వద్ద నుండి నాలుగు వేల దిర్హమ్లు ఉమ్మె ‘హబీబహ్ కు మహర్‌గా, షుర‘హ్ బీల్ ద్వారా ప్రవక్త (స) వద్దకు పంపారు. [54] (అబూ దావూద్, నసాయి’)
3209 – [ 8 ] ( صحيح ) (2/959)
وَعَنْ أَنَسٍ قَالَ: تَزَوَّجَ أَبُوْ طَلْحَةَ أُمَّ سُلَيْمٍ فَكَانَ صَدَاقَ مَا بَيْنَهُمَا اَلْإِسْلَامُ أَسْلَمَتْ أُمُّ سُلَيْمٍ قَبْلَ أَبِيْ طَلْحَةَ فَخَطَبَهَا فَقَالَتْ: إِنِّيْ قَدْ أَسْلَمْتُ فَإِنْ أَسْلَمْتَ نَكَحْتُكَ فَأَسْلَمَ فَكاَنَ صَدَاقَ مَا بَيْنَهُمَا. رَوَاهُ النَّسَائِيُّ.
3209. (8) [2/959 –దృఢం]
అనస్ (ర) కథనం: అబూ ‘తల్’హా ఉమ్మె సులైమ్ తో నికా’హ్ చేసుకున్నారు. వీరిద్దరి మధ్య ఇస్లామ్ స్వీకరణ మహర్‌గా నిర్ణయించడం జరిగింది. అంటే ఉమ్మె సులైమ్ అబూ ‘తల్’హా కంటే ముందు ఇస్లామ్ స్వీకరించారు. అబూ ‘తల్’హా అవిశ్వాస స్థితిలోనే ఉమ్మె సులైమ్కు నికా’హ్ సందేశం పంపారు. దానికి ఉమ్మె సులైమ్, ‘నేను ఇస్లామ్ స్వీకరించాను, నువ్వు కూడా ఇస్లామ్ స్వీకరిస్తే నేను నీతో పెళ్ళి చేసు కుంటాను,’ అని సమాధానం పంపింది. ఆ తరువాత అబూ తల్హా ఇస్లామ్ స్వీకరించారు. అప్పుడు వీరిద్దరి మధ్య అబూ ‘తల’హా ఇస్లామ్ స్వీకరణను మహర్‌గా నిర్ణయించడం జరిగింది. (నసాయి’)
=====
8- بَابُ الْوَلِيْمَةِ
8. వివాహ (వలీమహ్) విందు
వలీమహ్ అంటే సభ, ఒకచోట కలవటం అని అర్థం. భార్యాభర్తలు కలిసిన తర్వాత కృతజ్ఞతా పూర్వకంగా ఇచ్చే విందును వలీమహ్ అంటారు. పండితుల్లో కొందరు ముఖ్య విధిగా భావిస్తారు. మరి కొందరి వద్ద ఇది ప్రవక్త సాంప్రదాయం. ‘హదీసు’ల్లో దీన్ని గురించి ప్రత్యేకించి చెప్పడం జరిగింది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3210 – [ 1 ] ( متفق عليه ) (2/960)
عَنْ أَنَسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم رَأَى عَلَى عَبْدِ الرَّحْمنِ بْنِ عَوْفٍ أَثَرَ صُفْرَةٍ فَقَالَ: “مَا هَذَا؟” قَالَ: إِنِّيْ تَزَوَّجْتُ اِمْرَأَةُ عَلَى وَزْنِ نَوَاةٍ مِنْ ذَهْبٍ قَالَ: “بَارَكَ اللهُ لَكَ أَوْلِمْ وَلَوْ بِشَاةٍ”.
3210. (1) [2/960 – ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ‘అబ్దుర్రహ్మాన్ బిన్ ‘ఔఫ్ దుస్తుల్లో పసుపు పచ్చరంగు చిహ్నాలు చూచి ఇదేమిటి అని అడిగారు. ‘నేను ఒక స్త్రీతో ఖర్జూరం గింజంత బరువు బంగారం మహర్‌కు బదులు వివాహం చేసుకున్నాను’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) అల్లాహ్(త) మీకు శుభం ప్రసాదించు గాక! ఒక్క మేకదైనా సరే వలీమహ్ చేయి,’ అని అన్నారు.[55] (బు’ఖారీ, ముస్లిమ్)
3211 – [ 2 ] ( متفق عليه ) (2/960)
وَعَنْهُ قَالَ: مَا أَوْلَمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى أَحَدٍ مِّنْ نِسَائِهِ مَا أَوْلَمَ عَلَى زَيْنَبَ أَوْلَمَ بِشَاةٍ.
3211. (2) [2/960– ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) తన భార్యల్లో ‘జైనబ్ (ర) నికా’హ్లో వలీమహ్ చేసినంత గొప్పగా ఇతర భార్యల వలీమాలు చేయలేదు. ప్రవక్త (స) ఆమె నికా’హ్లో ఒక మేకను కోసి వలీమహ్ చేసారు. (బు’ఖారీ, ముస్లిమ్)
3212 – [ 3 ] ( صحيح ) (2/960)
وَعَنْهُ قَالَ: أَوْلَمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم حِيْنَ بَنَى بِزَيْنَبَ بِنْتِ جَحْشٍ فَأَشْبَعَ النَّاسَ خُبْزًا وَلَحْمًا. رَوَاهُ الْبُخَارِيُّ.
3212. (3) [2/960 –దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ‘జైనబ్ (ర) తో నికా’హ్ చేసి మొదటి రాత్రి గడిపిన తర్వాత వలీమాలో ప్రజలకు కడుపు నిండా రొట్టె, మాంసం పెట్టారు. (బు’ఖారీ)
3213 – [ 4 ] ( متفق عليه ) (2/960)
وَعَنْهُ قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه أَعْتَقَ صَفِيَّةَ وَتَزَوَّجَهَا وَجَعَلَ عِتْقَهَاَ صَدَاقَهَا. وَأَوْلَمَ عَلَيْهَا بِحَيْسٍ. مُتَّفَقٌ عَلَيْهِ
3213. (4) [2/960– ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ‘సఫియ్యహ్ (ర)ను విడుదల చేసి నికా’హ్ చేసుకున్నారు, ఆమెను విడుదల చేయడమే మహర్‌గా నిర్ణయించారు. మొదటి రాత్రి తర్వాత వలీమహ్ లో ‘హైస్ విందు ఇచ్చారు.[56](బు’ఖారీ, ముస్లిమ్)
3214 – [ 5 ] ( صحيح ) (2/960)
وَعَنْهُ قَالَ: أَقَامَ النَّبِيُّ صلى الله عليه وسلم بَيْنَ خَيْبَرَ وَالْمَدِيْنَةِ ثَلَاثَ لَيَالٍ يُبْنَى عَلَيْهِ بِصَفِيَّةَ فَدَعَوْتُ الْمُسْلِمِيْنَ إِلَى وَلِيْمَتِهِ وَمَا كَانَ فِيْهَا مِنْ خُبْزٍ وَّلَا لَحْمٍ وَمَا كَانَ فِيْهَا إِلَّا أَنْ أَمَرَباِلْأَنْطَاعِ فَبُسِطَتْ فَأُلْقِيَ عَلَيْهَا التَّمْرُ وَالْأَقِطُ وَالسَّمْنُ. رَوَاهُ الْبُخَارِيُّ.
3214. (5) [2/960– దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఖైబర్ యుద్ధం తరువాత, ‘ఖైబర్ మరియు మదీనహ్ ల మధ్య మూడు రాత్రులు ఆగారు. అక్కడే ‘సఫియ్యహ్ (ర) తో నికా’హ్ చేసుకొని, మొదటి రాత్రి అక్కడే గడిపారు. వలీమహ్ చేసి ముస్లిములకు విందు ఇచ్చారు. అందరూ వచ్చారు. విందు చాప పరచబడింది. దానిపై ఖర్జూరాలు, పనీర్, నెయ్యి ఉంచబడ్డాయి. రొట్టె, మాంసం ఉంచలేదు. కేవలం ఇవే ఉంచబడ్డాయి. (బు’ఖారీ)
3215 – [ 6] ( صحيح ) (2/961)
وَعَنْ صَفِيَّةَ بِنْتِ شَيْبَةَ قَالَتْ: أَوْلَمَ النَّبِيُّ صلى الله عليه وسلم عَلَى بَعْضِ نِسَائِهِ بِمُدَّيْنِ مِنْ شَعِيْرٍ. رَوَاهُ الْبُخَارِيُّ.
3215. (6) [2/961–దృఢం]
‘సఫియ్యహ్ బిన్తె షైబహ్ (ర) కథనం: ప్రవక్త (స) తన భార్యల్లో కొందరి వలీమాల్లో రెండు ముద్ల యవ్వల పిండితో వలీమహ్ చేసారు. అంటే రెండు ముద్ల యవ్వల రొట్టెలు తినిపించారు. (బు’ఖారీ)
3216 – [ 7 ] ( متفق عليه ) (2/961)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِذَا دُعِيَ أَحَدُكُمْ إِلَى الْوَلِيْمَةِ فَلْيَأْتِهَا”. مُتَّفَقٌ عَلَيْهِ.
وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ: فَلْيُجِبْ عُرْسًا كَانَ أَوْ نَحْوَهُ.
3216. (7) [2/961–ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”మీలో ఎవరికైనా వలీమహ్ కు పిలిస్తే తప్పకుండా వెళ్ళండి.” (బు’ఖారీ, ముస్లిమ్)
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఆహ్వానాన్ని తప్పకుండా స్వీకరించాలి. పెళ్ళి ఆహ్వానం అయినా, మరే శుభకార్య ఆహ్వానం అయినా సరే.” (ముస్లిమ్)
3217 – [ 8 ] ( صحيح ) (2/961)
وَعَنْ جَابِرٍ: قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا دُعِيَ أَحَدُكُمْ إِلَى طَعَامٍ فَلْيُجِبْ وَإِنْ شَاءَ طَعِمَ وَإِنْ شَاءَ تَرَكَ”. رَوَاهُ مُسْلِمٌ.
3217. (8) [2/961దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా విందుకు ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్ళాలి. ఇష్టం అయితే తినాలి, ఇష్టం లేకపోతే తినకూడదు.” (ముస్లిమ్)
3218 – [ 9 ] ( متفق عليه ) (2/961)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “شَرُّ الطَّعَامِ طَعَامُ الْوَلِيْمَةِ يُدْعَى لَهَا الْأَغْنِيَاءُ وَيُتْرَكُ الْفُقَرَاءُ وَمَنْ تَرَكَ الدَّعْوَةَ فَقَدْ عَصَى اللهَ وَرَسُوْلَهُ”.
3218. (9) [2/961–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”ధనవంతులను ఆహ్వానించి, పేదలను వదలి వేసే విందు భోజనం మహా చెడ్డది. విందు ఆహ్వానాన్ని తిరస్కరించేవాడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపినట్టే.” (బు’ఖారీ, ముస్లిమ్)
3219 – [ 10 ] ( متفق عليه ) (2/961)
وَعَنْ أَبِيْ مَسْعُوْدٍ الْأَنْصَارِيِّ قَالَ: كَانَ رَجُلٌ مِّنَ الْأَنْصَارِ يُكَنَّى أَبَا شُعَيْبٍ كَانَ لَهُ غُلَامٌ لَحَّامٌ فَقَالَ: اِصْنَعْ لِيْ طَعَامًا يَكْفِيْ خَمْسَةً لَعَلِّي أَدْعُو النَّبِيُّ صلى الله عليه وسلم خَامِسَ خَمْسَةٍ فَصَنَعَ لَهُ طُعَيِّمًا ثُمَّ أَتَهَا فَدَعَاهُ فَتَبِعَهُمْ رَجُلٌ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “يَا أَبَا شُعَيْبٍ إِنَّ رَجُلًا تَبِعَنَا فَإِنْ شِئْتَ أَذِنْتَ لَهُ وَإِنْ شِئْتَ تَرَكْتَهُ”. قَالَ: لَا بَلْ أَذِنْتُ لَهُ .
3219. (10) [2/961–ఏకీభవితం]
అబూ మస్’ఊద్ అన్సారీ (ర) కథనం: అబూ షు’ఐబ్ అన్సారీ వద్ద ఒక సేవకుడు ఉండేవాడు. అతడు మాంసం అమ్మేవాడు. అబూ షు’ఐబ్ తన సేవకునితో, ‘ఐదు గురికి సరిపోయినట్లు భోజనం తయారుచేయి, నేను ప్రవక్త (స)ను విందుకు పిలుస్తున్నాను. ఆ ఐదుగురిలో ఆయనొకరు,’ అని అన్నాడు. సేవకుడు ఐదుగురికి సరి పోయినట్టు తయారు చేసాడు. ప్రవక్త (స) వద్దకు వెళ్ళి ఆయన్ని తనవెంట తీసుకొని వెళ్ళసాగారు. ఆయన వెంట మరోవ్యక్తి కూడా నడవసాగాడు. అప్పుడు ప్రవక్త (స), ‘అబూ షు’ఐబ్! మనవెంట మరోవ్యక్తి కూడా వస్తున్నాడు. ఇతనికి ఆహ్వానం లేదు, ఒక వేళ నీవు కోరితే ఇతన్ని కూడా తినిపించు లేదా ఇతన్ని తిప్పి పంపివేయవచ్చు,’ అని అన్నారు. దానికి అబూ షు’ఐబ్, ‘నేను ఇతన్ని కూడా ఆహ్వానిస్తున్నాను, ఇతడు కూడా వచ్చి తిని వెళ్ళాలి,’ అని అన్నాడు. (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3220 – [ 11 ] ( لم تتم دراسته ) (2/961)
عَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أَوْلَمَ عَلَى صَفِيَّةٍ بَسَوِيْقٍ وَتَمْرٍ. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ
3220. (11) [2/961–అపరిశోధితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త(స) ‘సఫియ్యహ్ (ర) వలీ మహ్ లో సత్తు మరియు ఖర్జూరాల విందు ఇచ్చారు. (తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్, అ’హ్మద్)
3221 – [ 12 ] ( لم تتم دراسته ) (2/962)
وَعَنْ سَفِيْنَةَ: أَنَّ رَجُلًا ضَافَ عَلي بْنَ أَبِيْ طَالِبٍ فَصَنَعَ لَهُ طَعَامًا فَقَالَتْ فَاطِمَةُ: لَوْ دَعَوْنَا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَأَكَلَ مَعَنَا فَدَعَوْهُ فَجَاءَ فَوَضَعَ يَدَيْهِ عَلَى عِضَادَتِي الْبَابِ فَرَأَى الْقِرَامَ قَدْ ضُرِبَ فِيْ نَاحِيَةِ الْبَيْتِ فَرَجَعَ. قَالَتْ فَاطِمَةُ: فَتَبِعْتُهُ فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ مَا رَدَّكَ؟ قَالَ: “إِنَّهُ لَيْسَ لِيْ أَوْ لِنَبِيِّ أَنْ يَّدْخُلَ بَيْتًا مُزَوَّقًا”. رَوَاهُ أَحْمَدُ وَابْنُ مَاجَهُ.
3221. (12) [2/962– అపరిశోధితం]
సఫీనహ్ (ర) కథనం: ‘అలీ (ర) ఇంటికి ఒక వ్యక్తి అతిధిగా వచ్చాడు. ‘అలీ (ర) అతని కోసం భోజనం తయారు చేయించారు. అప్పుడు ఫా’తిమ (ర) ‘అలీ (ర)తో, ‘ప్రవక్త (స)ను కూడా ఆహ్వానిస్తే, అతను (స) కూడా మనతోపాటు తింటే బాగుండేది,’ అని అన్నారు. మరి ఇద్దరూ అతనిని (స) ఆహ్వానించారు. ప్రవక్త (స) వచ్చారు. కడప దగ్గరకు వచ్చే సరికి ఇంటిలోని ఒక మూలలో ఒక తెర వేలాడుతూ ఉండటం చూసి తిరిగి వెళ్ళిపోయారు. లోపలికి రాలేదు. ఫా’తిమహ్ (ర) అతని(స) వెనుక వెళ్ళి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నారు,’ అని అడిగింది. దానికి ప్రవక్త (స), ‘నాకే కాదు, ఏ ప్రవక్తకూ అలంకరణ గల ఇంట్లో ప్రవేశించడం తగదు,’ అని సమాధానం ఇచ్చారు.[57] (అ’హ్మద్, ఇబ్నె మాజహ్)
3222 – [ 13 ] ( لم تتم دراسته ) (2/962)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ دُعِيَ فَلَمْ يُجِبْ فَقَدْ عَصَى اللهَ وَرَسُوْلَهُ وَمَنْ دَخَلَ عَلَى غَيْرِ دَعْوَةٍ دَخَلَ سَارِقًا وَخَرَجَ مُغِيْرًا”. روَاهُ أَبُوْ دَاوُدَ.
3222. (13) [2/962 –అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఆహ్వానించబడి ఆహ్వానాన్ని స్వీకరించని వ్యక్తి అల్లాహ్ (త), ఆయన ప్రవక్త (స)కు అవిధేయత చూపినట్లే, ఆహ్వానం లేకుండా వెళ్ళి తిన్నవాడు దొంగగా వెళ్ళి దోపిడి దొంగగా తిరిగి వచ్చినట్లే.” (అబూ దావూద్)
3223 – [ 14 ] ( لم تتم دراسته ) (2/962)
وَعَنْ رَجُلٍ مِّنْ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِذَا اجْتَمَعَ الدَّاعِيَانِ فَأَجِبْ أَقْرَبَهُمَا بَابًا وَإِنْ سَبَقَ أَحَدُهُمَا فَأَجِبِ الِّذِيْ سَبَقَ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ
3223. (14) [2/962– అపరిశోధితం]
ప్రవక్త (స) అనుచరుల్లో ఒకరి కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ఇద్దరు వ్యక్తులు ఆహ్వానించటానికి ఒకే సారి వస్తే, వారిద్దరిలో ఎవరి ఇల్లు దగ్గరగా ఉంటే వారి ఆహ్వానం స్వీకరించండి. ఒకవేళ వారిలో ఒకరు ముందు మరొకరు వెనుకవస్తే, ముందు వచ్చిన వారి ఆహ్వానం స్వీకరించండి. (అబూ దావూద్, అ’హ్మద్)
3224 – [ 15 ] ؟(2/962)
وعَنْ ابن مسعود قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “طَعَامُ أَوِّلِ يَوْمِ حَقٌّ وَطَعَامٌ يَوْمِ الثَّانِيْ سُنَّةٌ وَطَعَامُ يَوْمِ الثَّالِثِ سُمْعَةٌ وَمَنْ سَمَّعَ سَمَّعَ اللهُ بِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ
3224. (15) [2/962 ?]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర)కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వలీమహ్ లో మొదటి రోజు విందు ధర్మమైనదే. రెండవ రోజు విందు ప్రవక్త (స) సాంప్రదాయం, మూడవ రోజు విందు చూపుగోలు మరియు ప్రదర్శన. చూపుగోలు ఉద్దేశ్యంతో ఏదైనా పనిచేస్తే తీర్పుదినం నాడు అల్లాహ్ (త) అతన్ని అవమానంపాలు చేస్తాడు. (తిర్మిజి’)
3225 – [ 16 ] ( لم تتم دراسته ) (2/962)
وَعَنْ عِكْرَمَةَ عَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى عَنْ طَعَامٍ الْمُتَبَارِيَيْنِ أَنْ يُؤْكَلَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَقَالَ مُحْيُي السُّنَّةِ: وَالصَّحِيْحُ أَنَّهُ عَنْ عِكْرَمَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم مُرْسَلًا
3225. (16) [2/962 –అపరిశోధితం]
ఇబ్నె’అబ్బాస్ (ర) ద్వారా ‘ఇక్రమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇద్దరు పోటీపడే వ్యక్తుల ఆహ్వానాన్ని స్వీకరించరాదు.” [58] (అబూ దావూద్, మహ్యియ్ సున్నహ్ – తాబయీ ప్రోక్తం)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3226 – [ 17 ] ( لم تتم دراسته ) (2/963)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمُتَبَارِيَانِ لَا يُجَابَانِ وَلَا يُؤْكَلُ طَعَامُهُمَا”. قَالَ الْإِمَامُ أَحْمَدُ: يَعْنِي الْمُتَعَارِضَيْنِ بِالضِّيَافَةِ فَخْرًا وَرِيَاءً.
3226. (17) [2/963 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పోటీపడే వారి ఆహ్వానాన్ని స్వీకరించకండి. వారి విందులో పాల్గొనకండి.” (అహ్మద్, బైహఖీ)
3227 – [ 18 ] ( لم تتم دراسته ) (2/963)
وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِجَابَةِ الْفَاسِقِيْنَ
3227. (18) [2/963– అపరిశోధితం]
‘ఇమ్రాన్ బిన్ ‘హు’సైన్ (ర) కథనం: ప్రవక్త (స) పాప కార్యాలకు పాల్పడేవారి ఆహ్వానాన్ని స్వీకరించవద్దని హెచ్చరించారు. (బైహఖీ)
3228 – [ 19 ] ( لم تتم دراسته ) (2/963)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِذَا دَخَلَ أَحَدُكُمْ عَلَى أَخِيْهِ الْمُسْلِمِ فَلْيَأْكُلْ مِنْ طَعَامِهِ وَلَا يَسْأَلْ وَيَشْرَبْ مِنْ شَرَابِهِ وَلَا يَسْأَلْ”. رَوَى الْأَحَادِيْثَ الثَّلَاثَةَ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ” وَقَالَ: هَذَا إِنْ صَحَّ فَلِأَنَّ الظَّاهِرَ أَنَّ الْمُسْلِمَ لَا يُطْعِمُهُ وَلَا يَسْقِيْهِ إِلَّا مَا هُوَ حَلَالٌ عِنْدَهُ.
3228. (19) [2/963 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మీరు మీ ముస్లిమ్ సోదరుని ఇంటికి విందుకు వెళితే, అతను తినిపించింది తినండి, ఎలా ఉంది? ఎక్కడిది అని అడక్కండి. ఎందుకంటే అతడు ముస్లిమ్ అయినప్పుడు ధర్మసంపాదనే తినిపిస్తాడు. (బైహఖీ – షు’అబిల్ ఈమాన్)
=====
9– بَابُ الْقَسْمِ
9. భార్యల సమయాలు (వంతులు)
స్త్రీల హక్కులు పురుషులపై ఉన్నాయి. అదేవిధంగా పురుషుల హక్కులు స్త్రీలపై ఉన్నాయి. స్త్రీల హక్కులు ఏమిటంటే పురుషులు స్త్రీలను సంరక్షించాలి, పోషించాలి. వారి అన్నపానీయాలు మంచిచెడ్డలు చూడాలి. ఒకరి కంటే ఎక్కువ భార్యలు ఉంటే అందరి పట్ల న్యాయంగా వ్యవహరించాలి. రాత్రి గడపటానికి ప్రతిఒక్కరికీ ఒక్కోరాత్రి వంతులు నిర్ణయించుకోవాలి. ఎవరిపట్ల అన్యాయం చేయకూడదు. మరచి ఏదైనా పొరపాటు జరిగితే అల్లాహ్ (త) సన్నిధిలో పశ్చాత్తాపం చెందాలి. క్షమాపణ వేడుకోవాలి. కాని ఉద్దేశ్యపూర్వకంగా ఒక్కరివైపే మొగ్గు చూపకూడదు. మరొకరిపట్ల అశ్రద్ధ చూపకూడదు. అదేవిధంగా భార్యల హక్కులను నెరవేర్చక పోవటం మహా పాపం. అల్లాహ్ (త) ఆదేశం: ” మరియు ఒకవేళ స్త్రీ తన భర్త, అనాదరణతో ప్రవర్తిస్తాడేమోనని, లేదా విముఖుడవుతాడేమోనని, భయపడితే! వారిద్దరూ తమ మధ్య రాజీ చేసుకుంటే! వారిపై ఎలాంటి దోషం లేదు. రాజీపడటం ఎంతో ఉత్తమమైనది. మరియు మానవుల మనస్సులలో పేరాస ఇమిడి వున్నది. మీరు సజ్జనులై, దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ మీ కర్మలన్నింటినీ బాగా ఎరుగును. మరియు మీరు ఎంత కోరినా, మీ భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ చేతకాని పని. కనుక ఒక భార్య వైపునకు ఎక్కువగా మొగ్గి, మరొకామెను డోలాయమాన స్థితిలో వదలకండి. మీరు మీ ప్రవర్తనను సరిజేసుకొని దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. కాని ఒకవేళ వారు (దంపతులు) విడిపోతే! అల్లాహ్ తన దాతృత్వంతో వారిలో ప్రతి ఒక్కరినీ, స్వయం సమృధ్ధులుగా చేయవచ్చు! మరియు అల్లాహ్! విస్తారుడు (సర్వోపగతుడు), మహా వివేచనాపరుడు.” (అన్నిసా, 4:128–130)
ప్రవక్త (స) తన భార్యల పట్ల న్యాయంగా వ్యవహరించే వారు. వంతులు వేసి ప్రతి ఒక్కరి హక్కును పూర్తిచేసే వారు. ‘ఆయి’షహ్ (ర) కథనం: ”ప్రవక్త (స) తమ భార్యల పట్ల వంతులు వేసి న్యాయంగా వ్యవహరించే వారు. ఏమాత్రం హెచ్చుతగ్గులు చేసేవారు కారు. అయినా, ‘ఓ అల్లాహ్ (త)! నా శక్తిమేరకు నేను నా భార్యలపట్ల న్యాయంగా వ్యవహరించాను. నా శక్తికి మించినదాని పట్ల నన్ను విచారించకు’ అని ప్రార్థించేవారు.” (అబూ దావూద్, తిర్మిజి’, నసాయి’)
అంటే ప్రేమలో హెచ్చుతగ్గులు ఉంటే నన్ను విచారించకు. మానవునికి ఇది అసాధ్యం. భార్య ఉండగా ఎవరైనా కన్నె పిల్లతో వివాహం చేస్తే ఆమెతో 7 దినాలు గడిపి ఆ తరువాత వంతులు నిర్ణయించాలి. ఒకవేళ వితంతువుతో పెళ్ళిచేస్తే 3 రోజులు ఆమెతో గడిపి ఆ తరువాత వంతులు నిర్ణయించాలి. (బు’ఖారీ, ముస్లిమ్)
ఒకవేళ వితంతువు తాను ఇష్టపడి తన వంతును క్షమించి వేస్తే, తన వంతును ఇచ్చివేస్తే మిగతా వారి వద్ద ఉండటంలో తప్పులేదు.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3229 – [ 1 ] ( متفق عليه ) (2/964)
عَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قُبِضَ عَنْ تِسْعِ نِسْوَةٍ وَكَانَ يَقْسِمُ مِنْهُنَّ لِثَمَانٍ .
3229. (1) [2/964– ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) మరణించి నపుడు అతనికి(స) 9మంది భార్యలున్నారు. వారిలో 8 మంది భార్యల వంతులు నిర్ణయించబడి ఉండేవి. ఒకరి వంతు లేదు, ఎందుకంటే ఆమె తన వంతును ‘ఆయి’షహ్ (ర)కు ఇచ్చారు.[59] (బు’ఖారీ, ముస్లిమ్)
3230 – [ 2 ] ( متفق عليه ) (2/964)
وَعَنْ عَائِشَةَ أَنَّ سَوْدَةَ لَمَّا كَبِرَتْ قَالَتْ: يَا رَسُوْلَ اللهِ قَدْ جَعَلْتُ يَوْمِيْ مِنْكَ لِعَائِشَةَ. فَكَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقْسِمُ لِعَائِشَةَ يَوْمَيْنِ يَوْمَهَا وَيَوْمَ سَوْدَةَ. متفق عليه.
3230. (2) [2/964 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: సౌదహ్ (ర) ముసలివారై పోయిన తర్వాత ఆమె, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! నేను ముసలి దాన్నయిపోయాను. నా వంతును ‘ఆయి’షహ్ (ర)కు ఇస్తాను,’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) ‘ఆయి’షహ్ (ర) వద్ద రెండు రోజులు గడిపేవారు. ఒక రోజు ఆయి’షహ్ (ర)ది, మరొక రోజు సౌదహ్ (ర)ది. (బు’ఖారీ, ముస్లిమ్)
3231 – [ 3 ] ( صحيح ) (2/964)
وَعَنْهَا أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَسْأَلُ فِيْ مَرَضِهِ الَّذِيْ مَاتَ فِيْهِ: “أَيْنَ أَنَا غَدًا؟” يُرِيْدُ يَوْمَ عَائِشَةَ فَأَذِنَ لَهُ أَزْوَاجُهُ يَكُوْنُ حَيْثُ شَاءَ فَكَانَ فِيْ بَيْتِ عَائِشَةَ حَتَّى مَاتَ عِنْدَهَا. رَوَاهُ الْبُخَارِيُّ.
3231. (3) [2/964 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) మరణం పొందే టప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు మాటిమాటికీ, రేపు నేను ఎక్కడ ఉంటాను అని అడిగే వారు. అంటే ‘ఆయి’షహ్ (ర) వంతు ఎప్పుడు వస్తుందని. భార్య లందరూ, ‘మీకిష్టమైనచోట ఉండండి,’ అని అనుమతి ఇచ్చారు. వారి అనుమతితో మరణించేవరకు ‘ఆయి’షహ్ (ర) వద్దనే ఉన్నారు. (బు’ఖారీ)
3232 – [ 4 ] ( متفق عليه ) (2/964)
وَعَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا أَرَادَ سَفَرًّا أَقْرَعَ بَيْنَ نِسَائِهِ فَأَيَّتَهُنَّ خَرَجَ سَهْمُهَا خَرَجَ بِهَا مَعَهُ.
3232. (4) [2/964– ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణించి నపుడు భార్యల మధ్య చీటీలు వేసి ఎవరి పేరు వస్తే, ఆమెను తన వెంట తీసుకొని వెళ్ళేవారు. (బు’ఖారీ, ముస్లిమ్)
3233 – [ 5 ] ( متفق عليه ) (2/964)
وَعَنْ أَبِيْ قِلَابَةَ عَنْ أَنَسٍ قَالَ: مِنَ السُّنَّةِ إِذَا تَزَوَّجَ الرَّجُلُ الْبِكْرَ عَلَى الثَّيِّبِ أَقَامَ عِنْدَهَا سَبْعًا وَقَسَمَ إِذَا تَزَوَّجَ الثَّيِّبَ أَقَامَ عِنْدَهَا ثَلَاثًا ثُمَّ قَسَمَ. قَالَ أَبُوْ قِلَابَةَ: وَلَوْ شِئْتُ لَقُلْتُ: إِنَّ أَنَسًا رَفَعَهُ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم.
3233. (5) [2/964– ఏకీభవితం]
అబూ ఖలాబహ్ (ర) కథనం: అనస్ (ర) ఇలా పేర్కొన్నారు: ”ఒకవేళ ఎవరైనా మొదటి భార్య ఉండగా కన్యను వివాహం చేసుకుంటే ఆమె దగ్గర 7 రోజులు గడిపి ఆ తరువాత వంతులు నిర్ణయించాలి. అదేవిధంగా ఒకవేళ భార్య ఉండగా వితంతువును వివాహం చేసుకుంటే, ఆమె దగ్గర 3 రోజులు గడిపి ఆ తరువాత వంతులు నిర్ణయించాలి. ఇది ప్రవక్త (స) సాంప్రదాయం,” అని అన్నారు. అప్పుడు అబూ ఖలాబహ్ (ర) ‘నేను కోరితే ఈ ‘హదీసు’ను అనస్ (ర) ప్రవక్త (స) ద్వారా ఉల్లేఖించారని చెప్పగలను,’ అని అన్నారు. సున్నత్ అంటే ప్రవక్త (స) సాంప్రదాయం. (బు’ఖారీ, ముస్లిమ్)
3234 – [ 6 ] ( صحيح ) (2/965)
وَعَنْ أَبِيْ بَكْرِ بْنِ عَبْدِ الرَّحْمنِ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم حِيْنَ تَزَوَّجَ أُمَّ سَلَمَةَ وَأَصْبَحَتْ عِنْدَهُ قَالَ لَهَا: “لَيْسَ بِكِ عَلَى أَهْلِكِ هَوَانٌ إِنْ شِئْتِ سَبَّعْتُ عِنْدَكَ وَسَبَّعْتُ عِنْدَهُنَّ. وَإِنْ شِئْتَ ثَلّثْتُ عِنْدَكَ وَدُرْتُ”. قَالَتْ: ثَلِّثْ.
وَفِيْ رِوَايَةٍ: أَنَّهُ قَالَ لَهَا: “لِلْبِكْرِ سَبْعٌ وَلِلثِّيِبِ ثَلَاثٌ”. رَوَاهُ مُسْلِمٌ.
3234. (6) [2/965 –దృఢం]
అబూ బకర్ బిన్ ‘అబ్దుర్రహ్మాన్ (ర)కథనం: ప్రవక్త(స) ఉమ్మె సలమహ్ (ర)ను వివాహం చేసుకున్న మరుసటి రోజు ఉదయం ఆమెతో, ‘నీకు ఇందులో అవమాన కరమైన విషయం ఏమీ లేదు, ఒకవేళ నీవు కోరితే నీ దగ్గర 7 రోజులు గడిపి, ఏడేసి రోజులు ఇతర భార్యల వద్ద కూడా ఉండగలను. ఒకవేళ నీవు కోరితే నీ దగ్గర 3 రోజులు ఉండి, ఆ తరువాత వంతులు నిర్ణయించ గలను,’ అని అన్నారు. దానికి ఆమె, ‘తమరు 3 రోజులు ఉండండి,’ అని అన్నారు. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”కన్నె పిల్లతో 7 రోజులు, వితంతువుతో 3 రోజులు ఉండాలి.[60] (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3235 – [ 7 ] ( جيد ) (2/965)
عَنْ عَائِشَةَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَقْسِمُ بَيْنَ نِسَائِهِ فَيَعْدِلُ وَيَقُوْلُ: “اَللّهُمَّ هَذَا قَسَمِيْ فِيْمَا أَمْلِكُ فَلَا تَلُمْنِيْ فِيْمَا تَمْلِكُ وَلَا أَمْلِكُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.
3235. (7) [2/965– ఆమోదయోగ్యం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) తన భార్యల వంతులను నిర్ణయించే వారు. వారి పట్ల న్యాయంగా వ్యవహరించేవారు. ఇంకా ఇలా ప్రార్థించేవారు, ”ఓ అల్లాహ్! నా శక్తి మేరకు నేను ప్రయత్నించాను, నా శక్తికి మించిన దాన్ని గురించి నన్ను విచారించకు.” [61] (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’, ఇబ్నె మాజహ్, దారమి)
3236 – [ 8 ] ( صحيح ) (2/965)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا كَانَتْ عِنْدَ الرَّجُلِ اِمْرَأَتَانِ فَلَمْ يَعْدِلْ بَيْنَهُمَا جَاءَ يَوْمَ الْقِيَامَةِ وَشِقُّهُ سَاقِطٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ
3236. (8) [2/965 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండి, అతడు వారి పట్ల న్యాయంగా వ్యవహరించక పోతే, తీర్పుదినం నాడు సగం శరీరం క్రిందపడి ఉండే స్థితిలో లేచి వస్తాడు.” [62] (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’, ఇబ్నె మాజహ్, దారమి)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3237 – [ 9 ] ( متفق عليه ) (2/965)
عَنْ عَطَاءٍ قَالَ: حَضَرْنَا مَعَ ابْنِ عَبَّاسٍ جَنَازَةَ مَيْمُوْنَةَ بِسَرِفَ. فَقَالَ: هَذِهِ زَوْجَةُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَإِذَا رَفَعْتُمْ نَعْشَهَا فَلَا تُزَعْزِعُوْهَا وَلَا تُزَلْزِلُوْهَا وَارْفُقُوْا بِهَا فَإِنَّهُ كَانَ عِنْدَ رَسُوْلِ الله صلى الله عليه وسلم تِسْعُ نِسْوَةٍ كَانَ يَقْسِمُ مِنْهُنَّ لِثَمَانٍ وَلَا يَقْسِمُ لِوَاحِدَةٍ قَالَ عَطَاءُ: الَّتِيْ كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَا يَقْسِمُ لَهَا بَلَغَنَا أَنَّهَا صَفِيَّةُ وَكَانَتْ آخِرَهُنَّ مَوْتًا مَاتَتء بِالْمَدِيْنَةِ وَقَالَ رَزِيْنٌ: قَالَ غَيْرُ عَطَاءٍ: هِيَ سَوْدَةُ وَهُوَ أَصَحُّ وَهَبَتْ يَوْمَهَا لِعَائِشَةَ حِيْنَ أَرَادَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم طَلَاقَهَا فَقَالَتْ لَهُ: امْسِكْنِيْ قَدْ وَهَبْتُ يَوْمِيْ لِعَائِشَةَ لَعَلِيْ أَكُوْنُ مِنْ نِسَائِكَ فِي الْجَنَّةِ .
3237. (9) [2/965 –ఏకీభవితం]
‘అతా’ (ర) కథనం: మేము సర్ఫ్ ప్రాంతంలో మైమూనహ్ (ర) జనా’జహ్ లో ఇబ్నె ‘అబ్బాస్ (ర) వెంట ఉన్నాం. అప్పుడు ఇబ్నె ‘అబ్బాస్ (ర) ఇది ప్రవక్త (స) భార్య జనా’జహ్, ఆమెను ఎత్తినపుడు అటూఇటూ కదపకండి. మెల్లమెల్లగా ప్రశాంతంగా నిదానంగా తీసుకొని వెళ్ళండి. ప్రవక్త (స) కు 9 మంది భార్యలు ఉండేవారు. వారిలో 8 మంది భార్యల మధ్య వంతులు ఉన్నాయి. ఒకరి వంతు లేదు, ఎందుకంటే ఆమె తన వంతు మరొకరికి ఇచ్చి వేసారు. అప్పుడు వంతు లేని వారు సఫియ్యహ్ (ర), ఆమె అందరి తరువాత మదీనహ్ లో మరణించారని మాకు వార్త అందింది,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
ర’జీన్ కథనం: ‘అతా’ తప్ప, ఇతర సహాబీలందరూ వంతులేని భార్య సౌదహ్ (ర) అని అంటారు. ఆమె తన వంతును ‘ఆయి’షహ్ (ర)కు ఇచ్చారని. ప్రవక్త (స) ఆమెకు ‘తలాఖ్ ఇద్దామని అనుకున్నారని, కాని ఆమె, ‘నాకు ‘తలాఖ్ ఇవ్వకండి మీ నికా‘హ్లోనే ఉంచండి, స్వర్గంలో మీ భార్యల్లో ఉంటాను, నా వంతు ‘ఆయి’షహ్ (ర)కు ఇచ్చి వేస్తాను, ‘ అని అన్నారు. ఇదే సరైన అభిప్రాయం.
=====
10- بَابُ عِشْرَةِ النِّسَاءِ وَمَا لِكُلِّ وَاحِدَةٍ مِّنَ الْحُقُوْقِ
10. స్త్రీలపట్ల సద్వ్యవహారం, వారి హక్కులు
స్త్రీల పట్ల తప్పనిసరిగా, సున్నితంగా, మంచిగా వ్యవహ రించాలి. అల్లాహ్ ఆదేశం: ”…మరియు మీరు వారితో గౌరవంతో సహవాసం చేయండి. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే! బహుశా మీకు ఒక విషయం నచ్చకపోవచ్చు, కాని అందులోనే అల్లాహ్ ఎంతో మేలు ఉంచి ఉండవచ్చు!.” (అన్నిసా’, 4:19)
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3238 – [ 1 ] ( متفق عليه ) (2/967)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِسْتَوْصُوْا بِالنِّسَاءِ خَيْرًا فَإِنَّهُنّض خُلِقْنَ مِنْ ضِلَعٍ وَإِنَّ أَعْوَجَ شَيْءٍ فِي الضِّلَعِ أَعْلَاهُ فَإِنْ ذَهَبْتَ تَقِيْمُهُ كَسَرْتَهُ وَإِنْ تَرَكْتَهُ لَمْ يَزَلْ أَعْوَجَ فَاسْتَوْصُوْا بِالنِّسَاءِ”.
3238. (1) [2/967 –ఏకీభవితం]
అబూహురైరహ్ (ర) కథనం: ‘నేను మిమ్మల్ని స్త్రీల పట్ల మంచి చేయండని ఉపదేశిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ప్రక్కటెముకలద్వారా సృష్టించబడ్డారు. పై నున్న ప్రక్కటెముక అన్నిటికంటే వంకరగా ఉంటుంది. ఒకవేళ మీరు దాన్ని తిన్నగా చేయదలిస్తే దాన్ని విరి చేస్తారు. ఒకవేళ దాన్ని అలాగే వదలివేస్తే శాశ్వతంగా వంకరగానే ఉంటుంది. ఏది ఏమైనా వారిపట్ల మంచిగా వ్యవహరించమని ఉపదే శిస్తున్నాను,’ అని ప్రవక్త (స) ప్రవచించారు.[63] (బు’ఖారీ)
3239 – [ 2 ] ( صحيح ) (2/967)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْمَرْأَةُ خُلِقَتْ مِنْ ضِلْعٍ لَنْ تَسْتَقِيْمَ لَكَ عَلَى طَرِيْقَةٍ فَإِنِ اسْتَمْتَعْتَ بِهَا اسْتَمْتَعْتَ بِهَا وَبِهَا عِوَجٌ وَإِنْ ذَهَبْتَ تُقِيْمُهَا كَسَرْتَهَا وَكَسْرُهَا طَلَاقُهَا”. رَوَاهُ مُسْلِمٌ.
3239. (2) [2/967 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్త్రీ వంకర మనస్తత్వంతో సృష్టించబడింది. ఎన్నడూ ఆమె తిన్నగా నడవలేదు. ఆమె వంకర మనస్తత్వంలోనే లాభం పొందుతూ ఉండండి. ఒకవేళ నీవు ఆమెను తిన్నగా చేయాలని అనుకుంటే ఆమెను విరిచి వేస్తావు. ఆమెను విరిచి వేయడం అంటే ‘తలాఖ్ ఇచ్చి వేయడం.” (ముస్లిమ్)
3240 – [ 3 ] ( صحيح ) (2/967)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَفْرَكْ مُؤْمِنٌ مُؤْمِنَةٌ إِنْ كَرِهَ مِنْهَا خُلُقًا رَضِيَ مِنْهَا آخَرَ”. رَوَاهُ مُسْلِمٌ.
3240. (3) [2/967–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసి భర్త విశ్వాసిని భార్య పట్ల ఆగ్రహం కలిగి ఉండ కూడదు. ఆమె కొన్ని అలవాట్ల పట్ల అసంతృప్తిగా ఉన్నా, మరి కొన్ని అలవాట్ల పట్ల సంతృప్తి చెంద వచ్చు. [64] (ముస్లిమ్)
3241 – [ 4 ] ( متفق عليه ) (2/967)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:‘لَوْلَا بَنُوْ إِسْرَائِيْلَ لَمْ يَخْنُزِ اللَّحْمُ وَلَوْلَا حَوَّاءُ لَمْ تَخُنْ أُنْثَى زَوْجَهَا الدَّهْرَ‘
3241. (4) [2/967 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బనీ ఇస్రాయీ’ల్ లేకపోతే మాంసం కూడా క్రుళ్ళి పోయేది కాదు. అదేవిధంగా ‘హవ్వా అవిధేయత చూప కుంటే స్త్రీ తన భర్తకు అవిధేయత చూపేది కాదు.” [65](బు’ఖారీ, ముస్లిమ్)
3242 – [ 5 ] ( متفق عليه ) (2/968)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ زَمْعَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَجْلِدُ أَحَدُكُمْ اِمْرَأَتَهُ جَلْدَ الْعَبْدِ ثُمَّ يُجَامِعُهَا فِي آخِرِالْيَوْمِ”.
وَفِي رِوَايَةٍ: “يَعْمِدُ أَحَدُكُمْ فَيَجْلِدُ اِمْرَأَتَهُ جَلْدَ الْعَبْدِ فَلَعَلَّهُ يُضَاجِعُهَا فِي آخِرِ يَوْمِهِ”. ثُمّ وَعَظَهُمْ فِي ضَحْكِهِمْ مِنَ الضَّرْطَةِ فَقَالَ: “لِمَ يَضْحَكُ أَحَدُكُمْ مِمَّا يَفْعَلُ؟”
3242. (5) [2/968– ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘జమ్’అహ్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”మీలో ఎవరూ తన భార్యను బానిసలా కొట్టరాదు. ఎందుకంటే రాత్రి ఆమెతోనేకదా సంభోగంలో పాల్గొంటారు. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, మీలో ఎవరైనా తన భార్యను బానిసలా కొట్టి సాయంత్రం సంభోగంలో మీకు సహకరించమంటే సహకరిస్తుందా? అందువల్ల ఇది తగని పని. ఆ తరువాత అపాన వాయువు వెలువడినపుడు ప్రజలు నవ్వటాన్ని గురించి ఇలా ఉపదేశించారు: ”ఇటు వంటి పని మీద మీ రెందుకు నవ్వుతారు, మీరు కూడా అలా చేస్తారు కదా! అంటే అపానవాయువు అందరినుండి వెలువడుతుంది. ఇది నవ్వేపని కాదు.” (బు’ఖారీ,ముస్లిమ్)
3243 – [ 6 ] ( متفق عليه ) (2/968)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: كُنْتُ أَلْعَبُ بِالْبِنَاتِ عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم وَكَانَ لِيْ صَوَاحِبُ يَلْعَبْنَ مَعِيَ فَكَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا دَخَلَ يَنْقَمِعْنَ فَيُسَرِّبُهُنَّ إِلَيَّ فَيَلْعَبْنَ مَعِيَ.
3243. (6) [2/968 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర)కథనం: నేను నా స్నేహితురాళ్ళతో ప్రవక్త(స) ఇంట్లో బొమ్మలతో ఆడుకునేదాన్ని. ప్రవక్త (స) ఇంటిలోనికి వచ్చినపుడు వాళ్ళు బయటకు వెళ్ళి పోయేవారు. ప్రవక్త (స) నా స్నేహితురాళ్ళను నా దగ్గరకు పంపేవారు. వాళ్ళు నాతో ఆడుకునేవారు. (బు’ఖారీ, ముస్లిమ్)
3244 – [ 7 ] ( متفق عليه ) (2/968)
وَعَنْهَا قَالَتْ: وَاللهِ لَقَدْ رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْمُ عَلَى بَابِ حُجْرَتِيْ وَالْحَبْشَةُ يَلْعَبُوْنَ بِالْحِرَابِ فِي الْمَسْجِدِ وَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَسْتُرُنِيْ بِرِدَائِهِ لِأَنْظُرَ إِلَى لَعِبِهِمْ بَيْنَ أُذُنِهِ وَعَاتِقِهِ ثُمَّ يَقُوْمُ مِنْ أَجْلِيْ حَتَّى أَكُوْنَ أَنَا الَّتِيْ أَنْصَرِفُ فَاقْدُرُوْا قَدْرَ الْجَارِيَةِ الْحَدِيْثَةِ السِّنِّ الْحَرِيْصَةِ عَلَى اللَّهْوِ.
3244. (7) [2/968 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స)ను మా ఇంటి తలుపు దగ్గర నిలబడటం చూసాను. ‘హబ్షీ ముజాహిదీన్లు యుద్ధ విన్యాసాలు చూపిస్తున్నారు. యుద్ధ శిక్షణ పొందుతున్నారు. ప్రవక్త (స) నన్ను తన దుప్పటి ద్వారా కప్పుకున్నారు. నేను ప్రవక్త (స) భుజంపై తలపెట్టి వారి విన్యాసాల్ని, శిక్షణను చూస్తూ ఉన్నాను. నా వల్ల ప్రవక్త (స) చాలాసేపువరకు నిలబడి ఉన్నారు. నేను చూసి భయపడి లోపలికి వెళ్ళి పోయాను. దీన్నిబట్టి ఆటలంటే మక్కువ గల అమ్మాయి ఎంతసేపు నిలబడుతుందో ఊహించు కోండి. (బు’ఖారీ, ముస్లిమ్)
3245 – [8] ( متفق عليه ) (2/968)
وَعَنْهَا قَالَتْ: قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنِّيْ لَأَعْلَمُ إِذَا كُنْتِ عَنِّيْ رَاضِيَةً وَإِذَا كُنْتِ عَلَىَّ غَضْبِىْ”. فَقُلْتُ: مِنْ أَيْنَ تَعْرِفُ ذَلِكَ؟ فَقَالَ: “إِذَا كُنْتِ عَنِّيْ رَاضِيَةً فَإِنَّكَ تَقُوْلِيْنَ: لَا وَرَبِّ مُحَمَّدٍ وَإِذَا كُنْتِ عَلَيَّ غَضْبِى قُلْتِ: لَا وَرَبِّ إِبْرَاهِيْمَ”. قَالَتْ: قُلْتُ: أَجَلْ وَاللهِ يَا رَسُوْلَ اللهِ مَا أَهْجُرُ إِلَّا اِسْمَكَ.
3245. (8) [2/968 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఒకసారి నాతో ఇలా అన్నారు, ”నువ్వు నా పట్ల సంతోషంగా ఉన్నది, లేనిది నాకు తెలిసిపోతుంది. అప్పుడు ‘ఆయి’షహ్ (ర), ‘నేను సంతోషంగా ఉన్నానో లేదో మీకెలా తెలిసిపోతుంది’, అని అడిగారు. ‘నీవు నా పట్ల సంతోషంగా ఉంటే ము’హమ్మద్ ప్రభువు సాక్షి, అని అంటావు, నా పట్ల సంతోషంగా లేకపోతే నా పేరు ప్రస్తావించక ఇబ్రాహీమ్ ప్రభువు సాక్షి, అని అంటావు. దానివల్ల నాపట్ల సంతోషంగా లేవని నేను తెలుసుకుంటాను,’ అని అన్నారు. దానికి నేను, ‘మీరు చెప్పింది సరే కాని మీ పేరు ప్రస్తావించేదాన్ని కాదు. కాని మనసులో ప్రేమ మాత్రం ఉండేది,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
3246 – [ 9 ] ( متفق عليه ) (2/968)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا دَعَا الرَّجُلُ اِمْرَأَتَهُ إِلَى فِرَاشِهِ فَأَبَتْ فَبَاتَ غَضْبَانَ لَعَنَتْهَا الْمَلَائِكَةُ حَتَّى تُصْبِحَ”. مُتَّفَقٌ عَلَيْهِ.
وَفِيْ رِوَايَةٍ لَهُمَا قَالَ: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ مَا مِنْ رَجُلٍ يَدْعُوْ اِمْرَأَتَهُ إِلَى فِرَاشِهِ فَتَأبى عَلَيْهِ إِلَّا كَانَ الَّذِيْ فِي السَّمَاءِ سَاخِطًا عَلَيْهَا حَتّى يَرْضَى عَنْهَا”.
3246. (9) [2/968– ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘భర్త భార్యను పడకపైకి పిలిస్తే, ఆమె నిరాకరిస్తే రాత్రంతా భర్త, భార్య లేకుండా గడిపితే, భార్యను ఉదయం వరకు దైవదూతలు శపిస్తూ ఉంటారు.’ మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ‘దైవం సాక్షి! భర్త భార్యను తనవద్ద పడుకోవడానికి పిలిస్తే, భార్య రాకపోతే అల్లాహ్ (త) ఆమె తన భర్తను సంతోషపరిచే వరకు ఆమెపట్ల అయిష్టంగా ఉంటాడు.’
3247 – [ 10 ] ( متفق عليه ) (2/969)
وَعَنْ أَسْمَاءَ أَنَّ اِمْرَأةً قَالَتْ: يَا رَسُولَ اللهِ إِنَّ لِيْ ضَرَّةً فَهَلْ عَلَيَّ جُنَاحٌ إِنْ تَشَبَّعْتُ مِنْ زَوْجِيْ غَيْرَ الَّذِيْ يُعْطِيْنِيْ؟ فَقَالَ: “اَلْمُتَشَبَّعُ بِمَا لَمْ يُعْطَ كَلَابِسِ ثَوْبَيْ زُوْرٍ”.
3247’ (10) [2/969– ఏకీభవితం]
అస్మా’ (ర) కథనం: ఒక స్త్రీ వచ్చి ప్రవక్త (స)ను, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ఒకవేళ నేను నా భర్త మరో భార్యతో, ‘నా భర్త ఫలానా వస్తువు నాకు ఇచ్చాడని ఉత్తినే చెబితే ఎలా ఉంది,’ అని ప్రశ్నించింది. దానికి ప్రవక్త (స), ‘దొంగతనంగా మోసంగా రెండు వస్త్రాలు ధరించినట్టే,’ అని సమాధానం ఇచ్చారు. [66] (బు’ఖారీ, ముస్లిమ్)
3248 – [ 11 ] ( صحيح ) (2/969)
وَعَنْ أَنَسٍ قَالَ: آلَى رَسُوْلُ اللهِ مِنْ نِسَائِهِ شَهْرًا وَكَانَتِ انْفَكَّتْ رِجْلُهُ فَأَقَامَ فِي مَشْرُبَةٍ تِسْعًا وَّعِشْرِيْنَ لَيْلَةً ثُمَّ نَزَلَ فَقَالُوْا: يَا رَسُوْلَ اللهِ آلَيْتَ شَهْرًا فَقَالَ: “إِنَّ الشَّهْرَ يَكُوْنُ تِسْعًا وَّعِشْرِيْنَ”. رَوَاهُ الْبُخَارِيُّ.
3248. (11) [2/969 –దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) తన భార్యల నుండి ఒక నెల ఈలా చేసుకున్నారు. ప్రవక్త (స) కాలు బెణికింది, నడవలేక పోయేవారు. నెల రోజుల వరకు తన దాబా పైననే ఉన్నారు. ఆ తరువాత క్రిందికి దిగారు. అప్పుడు ప్రజలు, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! తమరు నెలరోజుల పాటు ఈలా చేసారు. మరి ఇంకా 29 రోజులే గడిచాయి,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘నెల 29 రోజులది,’ అని సమాధానం ఇచ్చారు.[67](బు’ఖారీ)
3249 – [ 12 ] ( صحيح ) (2/969)
وَعَنْ جَابِرٍ قَالَ: دَخَلَ أَبُوْ بَكْرٍ رَضِيَ اللهُ عَنْهُ يَسْتَأْذِنُ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَوَجَدَ النَّاسَ جُلُوْسًا بِبَابِهِ لَمْ يُؤْذَنْ لِأَحَدٍ مِّنْهُمْ قَالَ: فَأَذِنَ لِأَبِيْ بَكْرٍ فَدَخَلَ ثُمَّ أَقْبَلَ عُمَرُ فَاسْتَأْذَنَ فَأَذِنَ لَهُ فَوَجَدَ النَّبِيُّ صلى الله عليه وسلم جَالِسًا حَوْلَهُ نِسَائُهُ وَاجِمًا سَاكِتًا. قَالَ فَقُلْتُ: لَأَقُوْلَنَّ شَيْئًا أُضْحِكُ النَّبِيُّ صلى الله عليه وسلم. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ لَوْ رَأَيْتَ بِنْتَ خَارِجَةَ سَأَلَتْنِيَ النَّفَقَةَ فَقُمْتُ إِلَيْهَا فَوَجَأْتُ عُنُقَهَا. فَضَحِكَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَقَالَ: “هُنَّ حَوْلِيْ كَمَا تَرَى يَسْأَلْنَنِيْ النَّفَقَةَ”. فَقَامَ أَبُوْ بَكْرٍ إِلَى عَائِشَةَ يَجَأ عُنُقَهَا وَقَامَ عُمَرُ إِلَى حَفْصَةَ يَجَأْ عُنُقَهَا كِلَاهُمَا يَقُوْلُ: تَسْأَلِيْنَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مَا لَيْسَ عِنْدَهُ؟ فَقُلْنَ: وَاللهِ لَا نَسْأَلُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم شَيْئًا أَبَدًا لَيْسَ عِنْدَهُ ثُمَّ اعْتَزَلَهُنَّ شَهْرًا أَوْ تِسْعًا وَّعِشْرِيْنَ ثُمَّ نَزَلَتْ هَذِهِ الْآيَةُ: (يَا أَيُّهَا النَّبِيُّ قُلْ لِأَزْوَاجِكَ) حَتَّى بَلَغَ (لِلْمُحْسْنِاَتِ مِنْكُنَّ أَجْرًا عَظِيْمًا). قَالَ : فَبَدَأَ بِعَائِشَةَ فَقَالَ: “يَا عَائِشَةَ إِنِّيْ أُرِيْدُ أَنْ أَعْرِضَ عَلَيْكَ أَمْرًا أُحِبُّ أَنْ لَا تَعْجَلِيْ فِيْهِ حَتَّى تَسْتَشِيْرِيْ أَبَوَيْكَ”. قَالَتْ: وَمَا هُوَ يَا رَسُوْلَ اللهِ؟ فَتَلَا عَلَيْهَا الآيَةَ قَالَتْ: أَفِيْكَ يَا رَسُوْلَ اللهِ أَسْتَشِيْرُ أَبَوَيَّ؟ بَلْ أَخْتَارُ اللهَ وَرَسُوْلَهُ وَالدَّارَ الْآخِرَةَ وَأَسْأَلُكَ أَنْ لَا تُخْبِرَ امْرِأَةً مِنْ نِّسَائِكَ بِالَّذِيْ قُلْتُ: قَالَ: “لَا تَسْأَلُنِيْ اِمْرَأَةً مِّنْهُنَّ إِلَّا أَخْبَرَتْهَا إِنَّ اللهَ لَمْ يَبْعَثْنِيْ مُعَنِّتًا وَلَا مُتَعَنِّتًا وَلَكِنَّ بَعَثَنِيْ مُعَلِّمًا مُيَسَّرًا”. رَوَاهُ مُسْلِمٌ.
3249. (12) [2/969– దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు రావడానికి అబూ బకర్ (ర) అనుమతి కోరారు. అనుమతి పొందిన తర్వాత ప్రవక్త (స) వద్దకు వచ్చారు. అతనికి తప్ప ఇతరులెవ్వరికీ అనుమతి లభించలేదు. ప్రజలు ప్రవక్త (స) తలుపు దగ్గర కూర్చొని ఉన్నారు. ‘కేవలం అబూ బకర్కు అనుమతి ఇవ్వండని ఆదేశించారు. ఇతరులకు అను మతి ఇవ్వకండని’ అన్నారు. అయితే అబూ బకర్ (ర) ఇంటిలోనికి ప్రవేశించారు. ‘ఉమర్ వచ్చారు. అతను(ర) కూడా అనుమతి కోరారు. అతనికి కూడా అనుమతి లభించింది. ప్రవక్త (స) విచారంతో మౌనంగా ఉండటం ‘ఉమర్(ర) గమనించారు. అతని(స) ముందు అతని సతీమణులు కూడా మౌనంగా కూర్చొని ఉన్నారు. ‘ఉమర్ (ర) తన మనసులో ‘ప్రవక్త (స) సంతోషించి నవ్వేలా, విచారం తొలగిపోయేలా ఏదైనా ఒక మాట అంటే బాగుండేది’ అని అనుకొని, ‘ఓ ప్రవక్తా! ‘ఖారిజహ్ అమ్మాయి, అంటే నా భార్య నా శక్తికి మించిన పోషణా సామాగ్రిని కోరుతుంది. నేను నిలబడి ఆమె మెడ కొలవసాగాను అంటే తీవ్రంగా బాదాను, మెడ నలిపి వేసాను. అది తమరు చూస్తే ఎంతో బాగుండేది’ అని అన్నారు. అది విన్న ప్రవక్త (స) ఫక్కున నవ్వి, ‘నా దగ్గర కూర్చున్న నా భార్యలు కూడా నా శక్తికి మించిన పోషణాసామగ్రి కోరుతున్నారు,’ అని అన్నారు. అది విన్న అబూ బకర్ (ర) తన కూతురైన ‘ఆయి’షహ్ (ర) ను కొట్టటం ప్రారంభించారు. ‘ఉమర్ (ర) కూడా తన కూతురు ‘హఫ్’సహ్ ను కొట్టసాగారు. వీరిద్దరూ కొడుతూ ‘మీరు ప్రవక్త (స) శక్తికి మించింది కోరుతారా,’ అని చీవాట్లు పెట్టసాగారు. అది విన్న స్త్రీలందరూ ”అల్లాహ్ సాక్షి! ఇక ముందు ప్రవక్త (స) శక్తికి మించిన వస్తువులను కోరము,” అని పలక సాగారు. ఆ తరు వాత ప్రవక్త (స) ఒక నెల అంటే 29 రోజుల వరకు తన భార్యలకు దూరంగా ఉన్నారు. ఆ తరువాత ఈ ఆయతు అవతరించింది. అల్లాహ్ ఆదేశం: ”ఓ ప్రవక్తా! నీవు నీ భార్యలతో ఇలా అను: ‘ఒకవేళ మీరు ప్రాపంచిక జీవితాన్ని మరియు దాని శోభను కోరుతున్నట్లైతే, రండి నేను మీకు తప్పక జీవన సామాగ్రినిచ్చి, మిమ్మల్ని మంచి పద్ధతిలో విడిచి పెడతాను.’ ” (అల్-అ’హ్’జాబ్, 33:28)
జాబిర్ (ర) కథనం: ఈ ఆయతు అవతరించిన తర్వాత అందరికంటే ముందు ప్రవక్త (స) ‘ఆయి’షహ్ (ర) వద్దకు వెళ్ళారు. ఆమెతో, ‘నీకో విషయం చెబుతాను, ఇందులో తొందరపడవలసిన అవసరం లేదు. నీవు నీ తల్లిదండ్రులతో సంప్రదించుకో,’ అని అన్నారు. దానికి ‘ఆయి’షహ్ (ర), ‘దేన్ని గురించి ఓ రసూలుల్లాహ్!’ అని అడిగింది. ప్రవక్త (స) ఈ ఆయతును పఠించి వినిపించారు. ‘ఆయి’షహ్ (ర) అర్థం చేసుకొని, ‘ఓ రసూలుల్లాహ్, నేను మీ గురించి తల్లి దండ్రులతో సంప్రదించటమా? నేనైతే అల్లాహ్, ఆయన ప్రవక్త, పరలోక గృహాన్ని ఇష్టపడతాను,’ అని పలికి, ‘నే నిచ్చిన సమాధానం ఇతర భార్యలకు చెప్పకండి,’ అని చెప్పింది. దానికి ప్రవక్త (స) ‘అడిగిన వారికి నేను చెప్తాను. అల్లాహ్ (త) నన్ను దుఃఖాలు కష్టాలు ఇచ్చే వాడుగా కాకుండా అధ్యాపకునిగా సులభతరం చేసే వాడుగా పంపాడు,’ అని అన్నారు. (ముస్లిమ్)
3250 – [ 13 ] ( متفق عليه ) (2/970)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: كُنْتُ أَغَارُ مِنَ اللَّاتِيْ وَهَبْنَ أَنْفُسَهُنَّ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقُلْتُ: أَتَهُبُ الْمَرْأَةُ نَفْسَهَا؟ فَلَمَّا أَنْزَلَ اللهُ تَعَالى: (تُرْجِيْ مَنْ تَشَاءُ مِنْهُنَّ وَتُؤْوِيْ إِلَيْكَ مَنْ تَشَاءُ وَمَنِ ابْتَغَيْتَ مِمَّنْ عَزَلْتَ فَلَا جُنَاحَ عَلَيْكَ؛ 33: 51) قُلْتُ: مَا أَرَى رَبَّكَ إِلَّا يُسَارِعُ فِي هَوَّاكَ. مُتَّفَقٌ عَلَيْهِ.
وَحَدِيْثُ جَابِرٍ: “اِتَّقُوا اللهَ فِي النِّسَاءِ”. وَذُكِرَ فِي”قِصَّةِ حَجَّةِ الْوَدَاعِ”.
3250. (13) [2/970 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: తమ్ముతాము ప్రవక్త (స)కు అర్పించుకున్న స్త్రీలపట్ల నాకు పౌరుషం వచ్చేది. అంటే తమ వ్యవహారాలకు ప్రవక్త (స)ను వకీలుగా నియమించి తమ వ్యవహారాల్ని ప్రవక్త (స)కు అప్పజెప్పారు. ‘స్త్రీ తన్నుతాను ఎవరికైనా అర్పించుకుంటుందా,’ అని నేను అన్నాను. ఆ తరువాత ఈ ఆయతు అవతరింపజేయబడింది. ” నీవు వారిలో (నీ భార్యలలో) నుండి, నీవు కోరిన ఆమెను నీ నుండి కొంత కాలం వేరుగా ఉంచవచ్చు. మరియు నీవు కోరిన ఆమెను నీతోపాటు ఉంచవచ్చు. మరియు నీవు వేరుగా ఉంచిన వారిలో నుండి ఏ స్త్రీనైనా నీవు తిరిగి పిలుచుకో గోరితే, నీపై ఎలాంటి దోషం లేదు. దీనితో వారి కళ్లకు చల్లదనం కలుగుతుందని, వారు దుఃఖపడరనీ నీవు వారికి ఏమి ఇచ్చినా, వారు సంతోషపడుతారని ఆశించవచ్చు! వాస్తవానికి మీ హృదయాలలో ఏముందో అల్లాహ్‌కు తెలుసు.మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, శాంత స్వభావుడు (సహనశీలుడు).” (అల్- అ’హ్’జాబ్, 33:51)
అప్పుడు నేను, ”ఓ అల్లాహ్ ప్రవక్తా! తమరి కోరికలను, తమకు ఇష్టమైన వాటిని మీప్రభువు అల్లాహ్ (త) చాలా తొందరగా స్వీకరిస్తున్నాడు,” అని అన్నాను.[68](బు’ఖారీ, ముస్లిమ్)
ఇంకా జాబిర్ (ర) ‘హదీసు’ ఇత్తఖుల్లాహ ఫిన్ని సాయి’ ‘హజ్జతుల్ విదాలో పేర్కొనడం జరిగింది.
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3251 – [ 14 ] ( صحيح ) (2/971)
عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا أَنَّهَا كَانَتْ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِي سَفَرٍ قَالَتْ: فَسَابَقْتُهُ فَسَبَقْتُهُ عَلَى رِجْلَيّ فَلَمَّا حَمَلْتُ اللَّحْمَ سَابَقْتُهُ فَسَبَقَنِيْ قَالَ: “هَذِهِ بِتِلْكَ السَّبْقَةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3251. (14) [2/971–దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ఒక ప్రయాణంలో నేను ప్రవక్త (స) వెంట ఉన్నాను. ఉల్లాసం కొరకు నేను, ప్రవక్త (స) పరిగెత్తసాగాము. మా ఇద్దరిలో ఎవరు గెలుస్తారో అని. నేను గెలిచాను. నేను దొడ్డుగా అయిన తర్వాత మరో సందర్భంలో మళ్ళీ ఇద్దరం పరిగెత్తాము. ప్రవక్త (స) గెలిచారు. నేను వెనుక ఉండిపోయాను. ‘ఇంతకు ముందు నువ్వు గెలిచావు, ఇప్పుడు నేను గెలిచాను, దానికి ఇది చెల్లు,’ అని అన్నారు. (అబూ దావూద్)
3252 – [ 15 ] ( صحيح ) (2/971)
وَعَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خَيْرُكُمْ خَيْرُكُمْ لِأَهْلِهِ وَأَنَا خَيْرُكُمْ لِأَهْلِيْ وَإِذَا مَاتَ صَاحِبُكُمْ فَدَعُوْهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ
3252. (15) [2/971–దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, తన భార్యాబిడ్డలు, బంధువులతో మంచిగా ఉండేవాడే అందరికంటే మంచివాడు. నేను నా భార్యాబిడ్డల కొరకు మీ అందరికంటే మంచివాడిని. అదేవిధంగా మీ స్నేహితుడు చనిపోతే అతని గురించి చెడుగా మాట్లాడకండి. (తిర్మిజి’, అబూ దావూద్, దారమి)
3253 – [ 16 ] ( صحيح ) (2/971)
وَرَوَاهُ ابْنُ مَاجَهُ عَنِ ابْنِ عَبَّاسٍ إِلَى قَوْلِهِ: “لِأَهْلِيْ”.
3253. (16) [2/971–దృఢం]
ఇబ్నె మాజహ్ ఈ ‘హదీసు’ను ఇబ్నే ‘అబ్బాస్ ద్వారా ఉల్లేఖించారు. [69]
3254 – [ 17 ] ( صحيح ) (2/971)
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمَرْأَةُ إِذَا صَلَّتْ خَمْسَهَا وَصَامَتْ شَهْرَهَا وَأَحْصَنَتْ فَرْجَهَا وَأَطَاعَتْ بَعْلَهَا فَلْتَدْخُلْ مِنْ أَيِّ أَبْوَابِ الْجَنَّةِ شَاءَتْ”. رَوَاهُ أَبُوْ نَعِيْمٍ فِي الْحُلْيَةِ.
3254. (17) [2/971–దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”5 పూటలు నమా’జ్ చేస్తూ, రమ’దాన్ ఉపవాసాలు పాటిస్తూ తన శీలాన్ని కాపాడుకుంటూ, తన భర్తపట్ల విధేయత పాటిస్తూ ఉండే స్త్రీ స్వర్గంలోనికి ఏద్వారం గుండానైనా ప్రవేశించవచ్చు.” (అబూ న’యీమ్-‘హుల్యలో)
3255 – [ 18 ] ( صحيح ) (2/972)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْ كُنْتُ آمر أَحَدًا أَنْ يَّسْجُدَ لِأَحَدٍ لَأَمَرْتُ الْمَرْأَةَ أَنْ تَسْجُدَ لِزَوْجِهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ.
3255. (18) [2/972 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఒకవేళ నేను అల్లాహ్ (త) తప్ప ఇతరులెవరికైనా సజ్దా చేయమని స్త్రీలను ఆదేశించదలచుకుంటే తమ భర్తలకు సజ్దాచేయమని ఆదేశించేవాడిని.[70] (తిర్మిజి’)
3256 – [ 19 ] ( لم تتم دراسته ) (2/972)
وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَيُّمَا امْرَأَةٍ مَاتَتْ وَزَوْجُهَا عَنْهَا رَاضٍ دَخَلَتِ الْجَنَّةَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
3256. (19) [2/972– అపరిశోధితం]
ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన భర్తను సంతోషపెట్టి మరణించే స్త్రీ స్వర్గం లో ప్రవేశిస్తుంది.” (తిర్మిజి’)
3257 – [ 20 ] ( لم تتم دراسته ) (2/972)
وَعَنْ طَلَقِ بْنِ عَلِيٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا الرَّجُلُ دَعَا زَوْجَتَهُ لِحَاجَتِهِ فَلْتَأْتِهِ وَإِنْ كَانَتْ عَلَى التَّنُوْرِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
3257. (20) [2/972– అపరిశోధితం]
‘తలఖ్ బిన్ ‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ భర్త భార్యను సంభోగం కోసం లేదా అత్య వసర పరిస్థితుల్లో పిలిస్తే, ఆమె వెంటనే హాజరవ్వాలి. ఒకవేళ వంట చేస్తున్నాసరే.” [71] (తిర్మిజి’)
3258 – [ 21 ] ( لم تتم دراسته ) (2/972)
وَعَنْ مُعَاذٍ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا تُؤْذِي امْرَأَةٌ زَوْجَهَا فِي الدُّنْيَا إِلَّا قَالَتْ زَوْجَتُهُ مِنَ الْحُوْرِالْعَيْنِ: لَا تُؤْذِيْهِ قَاتَلَكِ اللهُ فَإِنَّمَا هُوَ عِنْدَكَ دَخِيْلٌ يُوْشِكُ أَنْ يُّفَارِقَكِ إِلَيْنَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ
3258. (21) [2/972– అపరిశోధితం]
ము’ఆజ్’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇహ లోకంలో ఏ భార్య అయినా తన భర్తను పీడిస్తే, స్వర్గంలో ఉండే అతని భార్య అంటే పెద్ద పెద్ద కళ్ళుగల దేవకన్య ఆమెతో, ”నీ పాడుగాను, అతన్ని పీడించకు, నీ వద్ద కొన్ని రోజులు మాత్రమే ఉంటాడు. త్వరలో అతడు నిన్ను వదలి మా దగ్గరకు వచ్చేస్తాడు,” అని అంటారు. (తిర్మిజి’ / ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)
3259 – [ 22 ] ( حسن ) (2/972)
وَعَنْ حَكِيْمِ بْنِ مُعَاوِيَةَ الْقُشَيْرِيِّ عَنْ أَبِيْهِ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ مَا حَقُّ زَوْجَةِ أَحَدِنَا عَلَيْهِ؟ قَالَ: “أَنْ تُطْعِمَهَا إِذَا طَعِمْتَ وَتَكْسُوَهَا إِذَا اكْتَسَيْتَ وَلَا تَضْرِبِ الْوَجْهَ وَلَا تُقَبِّحْ وَلَا تَهْجُرْ إِلَّا فِيْ الْبَيْتِ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
3259. (22) [2/972 –ప్రామాణికం]
తన తండ్రి ద్వారా, ‘హకీమ్ బిన్ ము’ఆ వియహ్ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ‘ఓ రసూలుల్లాహ్! భర్తపై గల భార్య హక్కు ఏమిటి?’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ”మీరు తింటే ఆమెకూ తినిపించాలి, మీరు ధరిస్తే ఆమెకూ ధరించాలి, ఆమె ముఖంపై కొట్టరాదు. ఆమెను చీవాట్లు పెట్టరాదు. ఇంట్లో తప్ప ఆమెతో వేరుగా ఉండకండి. (ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగితే సంభోగానికి దూరంగా ఉండండి. అయితే ఆమెను ఇంటి నుండి గెంట కండి)” అని ప్రవచించారు. (అ’హ్మద్, అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
3260 – [ 23 ] ( لم تتم دراسته ) (2/973)
وَعَنْ لَقِيْطِ بْنِ صَبِرَةَ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِنَّ لِيْ اِمْرَأَةً فِي لِسَانِهَا شَيْءٌ يَعْنِي الْبَذَاءَ قَالَ: “طَلِّقْهَا”.قُلْتُ: إِنَّ لِيْ مِنْهَا وَلَدًا وَلَهَا صُحْبَةٌ قَالَ: “فَمُرْهَا” يَقُوْلُ عِظْهَا “فَإِنْ يَكُ فِيْهَا خَيْرٌ فَسَتَقْبَلُ وَلَا تَضْرِبَنَّ ظَعِيْنَتَكَ ضَرْبَكَ أُمَيَّتَكَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3260. (23) [2/973 –అపరిశోధితం]
లఖీ’త్ బిన్ ‘సబురహ్ (ర) కథనం: ప్రవక్త (స)తో నేను, ‘నాభార్య నోరు మంచిది కాదు,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘దాన్ని వదలి వేయి,’ అన్నారు. దానికి నేను, ‘ఆమె వల్ల నాకు పిల్లలున్నారు, చాలా కాలంగా కలసి ఉంటున్నాం. ఒక వేళ నేను ఆమెకు ‘తలాఖ్ ఇస్తే నాకు బాధ కలుగుతుంది,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘అయితే ఆమెకు హితబోధ చేయి, ఆమెలో మంచి ఉంటే తప్పకుండా స్వీకరిస్తుంది, భార్యలను బానిసల్లా కొట్టకూడదు’, అని అన్నారు. (అబూ దావూద్)
3261- [ 24 ] ( لم تتم دراسته ) (2/973)
وَعَنْ إِيَاسِ بْنِ عَبْدِ اللهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَضْرِبُوْا إِمَاءَ اللهِ”فَجَاءَ عُمَرُ إِلَى رَسُوْلِ اللهِ فَقَالَ: ذَئِرْنَ النِّسَاءُ عَلَى أَزْوَاجِهِنَّ فَرَخَّصَ فِي ضَرْبِهِنَّ فَأَطَافَ بِآلِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم نِسَاءٌ كَثِيْرٌ يَشْكُوْنَ أَزْوَاجَهُنَّ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَقَدْ طَافَ بِآلِ مُحَمَّدٍ نِسَاءٌ كَثِيْرٌ يَشْكُوْنَ أَزْوَاجَهُنَّ لَيْسَ أَوْلَئِكَ بِخِيَارِكُمْ”رَوَاهُ أَبُوْدَاوُدَ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.
3261. (24) [2/973 –అపరిశోధితం]
ఇయాస్ బిన్ ‘అబ్దుల్లాహ్ (ర) కథనం: ప్రవక్త (స) ”మీరు అల్లాహ్ దాసురాళ్ళను అంటే భార్యలను కొట్టకండి,” అని అన్నారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ‘ఉమర్ (ర) ప్రవక్త (స) వద్దకువచ్చి ఓ అల్లాహ్ ప్రవక్తా! స్త్రీలకు తమ భర్తలంటే బొత్తిగా భయం లేకుండా పోయింది. అది విని ప్రవక్త (స) భార్యలను కొట్టే అనుమతి ఇచ్చారు. ఈ అనుమతి లభించగానే భర్తలు తమ భార్యలను చావబాదారు, ఆ తరువాత స్త్రీల బృందం ఒకటి ప్రవక్త (స) భార్యల వద్దకు వచ్చి తమ భర్తలు చావబాదుతున్నారని ఫిర్యాదు చేసారు. అది విని ప్రవక్త (స), ”చాలా మంది స్త్రీలు మా ఇంటికి వచ్చి తమ భర్తలు కొడుతున్నారని ఫిర్యాదు చేసారు. అనవరసరంగా తమ భార్యలను కొట్టేవారు మంచివారు కారు” అని అన్నారు. (అబూ దావూద్, ఇబ్నె మాజహ్, దారమి)
3262 – [ 25 ] ( لم تتم دراسته ) (2/973)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيْسَ مِنَّا مَنْ خَبَّبَ اِمْرَأَةً عَلَى زَوْجِهَا أَوْ عَبْدًا عَلَى سَيِّدِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3262. (25) [2/973 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, భార్యా భర్తల మధ్య, యజమాని బానిసల మధ్య అపార్థాలు సృష్టించేవారు ముస్లిములు కారు.[72] (అబూ దావూద్)
3263 – [ 26] ( ضعيف ) (2/973)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ مِنْ أَكْمَلِ الْمُؤْمِنِيْنَ إِيْمَانًا أَحْسَنُهُمْ خُلُقًا وَأَلْطَفَهُمْ بِأَهْلِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
3263. (26) [2/973 –బలహీనం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఉత్తమ గుణాలు గలిగి, తన భార్యాబిడ్డల పట్ల దయార్ద్ర హృదయంతో మెలిగే వ్యక్తి పరిపూర్ణ ముస్లిమ్.” (తిర్మిజి’)
3264 – [ 27 ] ؟ (2/973)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَكْمَلُ الْمُؤْمِنِيْنَ إِيْمَانًا أَحْسَنُهُمْ خُلُقًا وَخِيَارُكُمْ خِيَارُكُمْ لِنِسَائِهِمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ وَرَوَاهُ أَبُوْ دَاوُدَ إِلَى قَوْلِهِ “خُلُقًا”.
3264. (27) [2/973– ?]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అందరి కంటే ఉత్తమ గుణాలు గలవాడు ఇతరుల కంటే పరిపూర్ణ విశ్వాసి. తన భార్యపట్ల మంచిగా సున్నితంగా ప్రవర్తించేవాడు అందరికంటే మంచివాడు. (తిర్మిజి’ – ప్రామాణికం – దృఢం, అబూ దావూద్)
3265 – [ 28 ] ( صحيح ) (2/974)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَدِمَ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم مِنْ غَزْوَةَ تَبُوْكَ أَوْ حُنَيْنٍ وَفِي سَهْوَتِهَا سَتْرٌ فَهَبَّتْ رِيْحٌ فَكَشَفَتْ نَاحِيَةَ السِّتْرِ عَنْ بَنَاتٍ لِعَائِشَةَ لُعَبٍ فَقَالَ: “مَا هَذَا يَا عَائِشَةَ؟” قَالَتْ: بَنَاتِيْ وَرَأَى بَيْنَهُنَّ فَرَسًا لَّهُ جَنَاحَانِ مِنْ رِقَاعٍ فَقَالَ: “مَا هَذَا الَّذِيْ أَرَى وَسْطَهُنَّ؟” قَالَتْ: فَرَسٌ قَالَ: “وَمَا الَّذِيْ عَلَيْهِ؟” قَالَتْ: جَنَاحَانِ. قَالَ: “فَرَسٌ لَهُ جَنَاحَانِ؟” قَالَتْ: أَمَا سَمِعْتَ أَنَّ لِسُلَيْمَانَ خَيْلًا لَهَا أَجْنِحَةٌ؟ قَالَتْ: فَضَحِكَ حَتَّى رَأَيْتُ نَوَاجِذَهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3265. (28) [2/974– దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) తబూక్ యుద్ధం లేదా ‘హునైన్ యుద్ధం నుండి తిరిగి వచ్చారు. అటుకపై ఒక తెర ఉండేది. తెర వెనుక నా ఆట వస్తువులు ఉండేవి. ఒక బొమ్మ కూడా ఉండేది. గాలివల్ల తెర కొంచెం జరిగింది. అటుకపై ఉన్న ఆట వస్తువులపై ప్రవక్త (స) దృష్టి పడింది. ” ‘ఆయి’షహ్! ఈ అటుకపై ఉన్నవి ఏమిటి?” అని ప్రవక్త (స) అడిగారు. నేను, ”నా ఆట వస్తువులు, బొమ్మలు ఉన్నాయి,” అని అన్నాను. ప్రవక్త (స) ఆట వస్తువుల మధ్య ఒక గుర్రం కూడా చూసారు. దానికి రెండు బట్టరెక్కలు ఉండేవి. ప్రవక్త (స), ‘నేను చూస్తున్న ఆట వస్తువుల మధ్య ఏముంది,’ అని అన్నారు. నేను, ‘గుర్రం,’ అని అన్నాను, ప్రవక్త (స), ‘గుర్రంపై ఏముంది,’ అని అన్నారు. దానికి నేను, ‘రెండు రెక్కలు,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘గుర్రానికి రెండు రెక్కలు ఉంటాయా?’ అని అన్నారు. దానికి నేను, ‘సులైమాన్ (అ) గుర్రానికి రెండురెక్కలు ఉండేవన్న విషయం వినలేదా?’ అని సమాధానం ఇచ్చాను. నా ఈ సమాధానం విని కిలకిల నవ్వారు. ఆయన లోపలి పళ్ళు కనబడసాగాయి. (అబూ దావూద్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3266- [ 29 ] ( ضعيف ) (2/974)
عَنْ قَيْسِ بْنِ سَعْدٍ قَالَ: أَتَيْتُ الْحِيْرَةَ فَرَأْيُتُهُمْ يَسْجُدُوْنَ لِمَرْزُبَانٍ لَهُمْ فَقُلْتُ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: أَحَقُّ أَنْ يُسْجَدَ لَهُ. فَأَتَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَقُلْتُ: إِنِّيْ أَتَيْتُ الْحِيْرَةَ فَرَأَيْتُهُمْ يَسْجُدُوْنَ لِمَرْزُبَانِ لَهُمْ فَأَنْتَ أَحَقُّ بِأَنْ يَسْجَدَ لَكَ. فَقَالَ لِيْ: “أَرَأَيْتَ لَوْ مَرَرْتَ بِقَبْرِيْ أَكُنْتَ تَسْجُدُ لَهُ؟” فَقُلْتُ: لَا. فَقَالَ: “لَا تَفْعَلُوْا لَوْ كُنْتُ آمُرُ أَحَد أَنْ يَسْجُدَ لِأَحَدٍ لَأَمَرْتُ النِّسَاءَ أَنْ يَسْجُدْنَ لِأَزْوَاجِهِنَّ لِمَا جَعَلَ اللهُ لَهُمْ عَلَيْهِنَّ مِنْ حَقٍّ”. روَاهُ أَبُوْ دَاوُدَ .
3266. (29) [2/974– బలహీనం]
ఖైస్ బిన్ స’అద్ (ర) కథనం: నేను హీరహ్ నగరానికి వచ్చాను. అక్కడ ప్రజలు తమ నాయకులకు సజ్దా చేయడం చూసాను. ప్రవక్త (స) వీరికంటే ఎక్కువ సజ్దాకు అర్హులు అని మనసులో అనుకున్నాను. హీరహ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ప్రవక్త (స)వద్దకు వెళ్ళి, ‘నేను హీరహ్ వెళ్ళాను అక్కడి ప్రజలు తమ నాయకులకు సజ్దా చేస్తున్నారు, వారి కంటే తమరు సజ్దాకు ఎక్కువ అర్హులు’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘ఒకవేళ నేను మరణించిన తరువాత నా సమాధి ప్రక్కనుండి నీవు వెళ్ళినపుడు నీవు నా సమాధి దగ్గర సజ్దా చేస్తావా?’ అని అడిగారు. దానికి నేను, ‘లేదు,’ అని సమాధానం ఇచ్చాను. ప్రవక్త (స), ‘నువ్వు అలా చేయకు, నా జీవితంలో కూడా నాకు సజ్దా చేయకు. ఒకవేళ నేను ఎవరికైనా సజ్దా చేయమని ఆదేశించదలిస్తే, భర్తలకు సజ్దా చేయమని భార్యలకు ఆదేశించేవాడిని. ఎందుకంటే అల్లాహ్ (త) పురుషులకు స్త్రీలపై ఒక స్ధానం అధికంగా ప్రసాదించాడు,’ అని అన్నారు. (అబూ దావూద్)
3267 – [ 30 ] ( لم تتم دراسته ) (2/975)
وَرَوَاهُ أَحْمَدُ عَنْ مَعَاذِ بْنِ جَبَلٍ.
3267. (30) [2/975 –అపరిశోధితం]
అ’హ్మద్, ఈ ‘హదీసు’ను ము’ఆజ్’ బిన్ జబల్ ద్వారా ఉల్లేఖించారు. [73]
3268 – [ 31 ] ( لم تتم دراسته ) (2/975)
وَعَنْ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا يَسْأَلُ الرَّجُلُ فِيْمَا ضَرَبَ اِمْرَأَتَهُ عَلَيْهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
3268. (31) [2/975 –అపరిశోధితం]
‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ఎవరైనా భర్త, భార్య పొరపాటుపై ఆమెను కొడితే ఉభయ లోకాల్లోనూ అతన్ని విచారించడం జరుగదు.[74] (అబూ దావూద్)
3269- [ 32 ] ( صحيح ) (2/975)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: جَاءَتِ امْرَأَةٌ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَنَحْنُ عِنْدَهُ فَقَالَتْ: زَوْجِيْ صَفْوَانُ بْنُ الْمُعَطَّلِ يَضْرِبْنِيْ إِذَا صَلَّيْتُ وَيُفَطِّرُنِيْ إِذَا صُمْتُ وَلَا يُصَلِّيَ الْفَجْرَ حَتَّى تَطْلُعَ الشَّمْسُ. قَالَ: وَصَفْوَانُ عِنْدَهُ قَالَ: فَسَأَلَهُ عَمَّا قَالَتْ. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ أَمَا قَوْلُهَا: يَضْرِبُنِيْ إِذَا صَلَّيْتُ فَإِنَّهَا تَقْرَأ بِسُوْرَتَيْنِ وَقَدْ نَهَيْتُهَا. قَالَ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْ كَانَتْ سُوْرَةً وَاحِدَةً لَكَفَتِ النَّاسَ”. قَالَ: وَأَمَّا قَوْلُهَا يُفَطِّرُنِيْ إِذَا صُمْتُ فَإِنَّهَا تَنْطَلِقُ تَصُوْمُ وَأَنَا رَجُلٌ شَابٌّ فَلَا أَصْبِرُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَصُوْمُ امْرَأة إِلَّا بِإِذْنِ زَوْجِهَا” وَأَمَّا قَوْلُهَا: إِنِّيْ لَا أُصَلِّيَ حَتَّى تَطْلُعَ الشَّمْسُ فَإِنا أَهْلُ بَيْتٍ قَدْ عُرِفَ لَنَا ذَاكَ لَا نَكَادُ نَسْتَيْقِظُ حَتَّى تَطْلُعَ الشَّمْسُ. قَالَ: “فَإِذَا اسْتَيْقَظْتَ يَا صَفْوَانُ فَصَلِّ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
3269. (32) [2/975 –దృఢం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: మేము ప్రవక్త (స) వద్ద కూర్చొని ఉన్నాము. ఇంతలో ఒక స్త్రీ వచ్చి, తన భర్త గురించి ఇలా ఫిర్యాదు చేసింది, ”నా భర్త ‘సఫ్వాన్ బిన్ ము’అత్తల్. నేను నమా’జ్ చదివినప్పుడల్లా నన్ను కొడతాడు, ఉపవాసం ఉంటే విరమింపజేస్తాడు. అతడు స్వయంగా ఫజ్ర్ నమా’జ్ సూర్యోదయం అయిన తర్వాత చదువుతాడు.” ఉల్లేఖనకర్త ప్రకారం ఆమె తన భర్త గురించి ఫిర్యాదు చేస్తున్నప్పుడు ఆమె భర్త కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు. ప్రవక్త (స) ‘సఫ్వాన్తో, ”నీ భార్య ఇలా ఫిర్యాదు చేస్తుంది. అసలు సంగతేమిటి,” అని అడిగారు. దానికి అతడు, ‘ఆమె నమా’జు చేసినపుడు నేను కొడతానని చెప్పింది. దానికి కారణం ఏమిటంటే ఆమె నఫిల్ నమా’జులలో పెద్ద పెద్ద సూరాలు పఠిస్తుంది. నేను పెద్ద పెద్ద సూరాలు చదవవద్దని వారించాను,’ అని అన్నాడు. అది విని ప్రవక్త (స), ‘సూరహ్ ఫా’తిహా తరువాత ఒకే సూరహ్ పఠిస్తే సరిపోతుంది,’ అని అన్నారు. ఆ తరువాత ‘సఫ్వాన్, ”ఆమె ఉపవాసం ఉంటే నేను విరమింపజేస్తానని అంటుంది. దానికి కారణం ఏమిటంటే ఈమె వరుసగా ఉపవాసాలు పాటిస్తూ పోతుంది. నేను యువకుడను, పగటిపూట కూడా సంభోగం చేయాలనిపిస్తుంది. సంభోగం చేయనిదే నాకు మనశ్శాంతి ఉండదు. పగలు సంభోగం చేయడానికి నేను ఆమె నఫిల్ ఉపవాసాన్ని విరమింపజేస్తాను,” అని అన్నాడు. అది విని ప్రవక్త (స), ”భర్త ఉండగా అతని అనుమతి లేనిదే ఏ స్త్రీ నఫిల్ ఉపవాసాలు పాటించరాదు,” అని అన్నారు. ఆ తరువాత మళ్ళీ ‘సఫ్వాన్, ”ఆమె నేను సూర్యోదయం అయిన తర్వాత ఫజ్ర్ నమా’జు చదువుతానని ఫిర్యాదు చేసింది, దానికి కారణం మేము వ్యవసాయం చేసే వాళ్ళం, రాత్రి చాలాసేపటి వరకు తోటల్లో నీళ్ళు తోడుతాము. పగలంతా రాత్రి చాలా సేపటి వరకు ఈ శ్రమలోనే గడుస్తుంది. పడుకోవటానికి ఎక్కువ సమయం దొరకదు. అలసి ఉంటాం. ఆ స్థితిలో పడుకుంటే సూర్యోదయం అయిన తర్వాత లేచి నమా’జు చదవుకుంటాను,” అని అన్నాడు. అది విని ప్రవక్త (స), ”ఓ ‘సఫ్వాన్ నిద్రపోయి లేచినపుడు నమా’జ్ చదువుకో,” అని అన్నారు. (అబూ దావూద్)
3270 – [ 33 ] ( لم تتم دراسته ) (2/975)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ فِيْ نَفَرٍ مِّنَ الْمُهَاجِرِيْنَ واَلْأَنْصَارِ فَجَاءَ بِعَيْرٌ فَسَجَدَ لَهُ. فَقَالَ أَصْحَابُهُ: يَا رَسُوْلَ اللهِ تَسْجُدُ لَكَ الْبَهَائِمُ وَالشَّجَرُ فَنَحْنُ أَحَقُّ أَنْ نَسْجُدَ لَكَ. فَقَالَ: “اِعْبُدُوْا رَبَّكُمْ وَأَكْرِمُوْا أَخَاكُمْ وَلَوْ كُنْتُ آمُرُ أَحَدًا أَنْ يَّسْجُدَ لِأَحَدٍ لَأَمَرْتُ الْمَرْأَةَ أَنْ تَسْجُدَ لِزَوْجِهَا وَلَوْ أَمَرَهَا أَنْ تَنْقُلَ مِنْ جَبَلٍ أَصْفَرَ إِلَى جَبَلٍ أسْوَدَ وَمِنْ جَبَلٍ أَسْوَدَ إِلَى جَبَلٍ أَبْيَضَ كَانَ يَنْبَغِيْ لَهَا أَنْ تَفْعَلَهُ”. رَوَاهُ أَحْمَدُ.
3270. (33) [2/975 – అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ముహాజిర్ల మరియు అ’న్సార్ల మధ్య కూర్చొని ఉన్నారు. ఇంతలో ఒక ఒంటె వచ్చి ప్రవక్త (స)కు సజ్దా చేసింది. అది చూచి అనుచరులు, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! జంతువులు, చెట్లు తమకు సజ్దా చేస్తున్నాయి. సజ్దా చేయడానికి మేము మీకు తగిన వారం,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘మీ ప్రభువును ఆరాధించండి. మీ ముస్లిమ్ సోదరున్ని గౌరవించండి. ఒకవేళ నేను ఒకరిని మరొకరికి సజ్దా చేయమని ఆదేశించదలిస్తే భర్తకు సజ్దా చేయమని భార్యను ఆదేశించేవాడిని. భార్యపై భర్తది ఎంత పెద్ద హక్కు ఉందంటే ఒకవేళ భర్త కొండను తీసుకొని రమ్మన్నా కొండను తీసుకురావటానికి ప్రయత్నిం చాలి. నల్లకొండను తెల్లకొండ వైపు ఉంచమన్నా ఉంచ డానికి ప్రయత్నించాలి. కష్టమైన పని చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి,’ అని అన్నారు. (అ’హ్మద్)
3271 – [ 34 ] ( لم تتم دراسته ) (2/976)
وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ثَلَاثَةٌ لَا تُقْبَلُ لَهُمْ صَلَاةٌ وَلَا تُصْعَدُ لَهُمْ حَسَنَةً اَلْعَبْدُ الآبِقُ حَتَّى يَرْجِعَ إِلَى مَوَالِيْهِ فَيَضَعَ يَدَهُ فِيْ أَيْدِيْهِمْ وَالْمَرْأَةُ السَّاخِطُ عَلَيْهَا زَوْجُهَا وَالسَّكْرَانُ حَتَّى يَصْحُوَ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِي شُعُبِ الْإِيْمَانِ.
3271. (34) [2/976 –అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముగ్గురు వ్యక్తుల నమా’జు స్వీకరించబడదు, వారి ఏ సత్కార్యమూ ఆకాశం వైపు ఎక్కదు. యజమాని నుండి పారిపోయిన బానిస అయితే అతడు తిరిగి తన యజమాని దగ్గరకు వెళ్ళి తన చేయిని అతని చేతిలో పెట్టాలి. అంటే తన్నుతాను అతనికి అప్పగించాలి. రెండవది భర్త సంతృప్తిగా లేని భార్య, మూడవది మత్తు పదార్థాలను సేవించేవాడు, మత్తు నుండి తెలివిలోకి వచ్చి పశ్చాత్తాపం చెందాలి. (బైహఖీ–షుఅబిల్ ఈమాన్)
3272 – [ 35 ] ( حسن ) (2/976)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قِيْلَ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: أَيُّ النِّسَاءِ خَيْرٌ؟ قَالَ: “اَلَّتِي تَسُرُّهُ إِذَا نَظَرَ وَتَطِيْعُهُ إِذَا أَمَرَ وَلَا تُخَالِفُهُ فِي نَفْسِهَا وَلَا مَالِهَا بِمَا يَكْرَهُ”. رَوَاهُ النَّسَائِيُّ وَالْبَيْهَقِيُّ فِي شُعَبِ الْإِيْمَانِ.
3272. (35) [2/976– ప్రామాణికం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స)ను స్త్రీలలో అందరికంటే ఉత్తమ స్త్రీ ఎవరు అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘భర్త ఆమె వైపు చూస్తే అతన్ని సంతోషపరిచే, ఏదైనా ఆదేశిస్తే పాలించే, తన విషయంలో, అతని ధనం విషయంలో అతనికి అవిధేయత చూపని స్త్రీ అందరికంటే ఉత్తమురాలు,’ అని సమాధానం ఇచ్చారు. (నసాయి’, బైహఖీ -షుఅబిల్ ఈమాన్)
3273 – [ 36 ] ( لم تتم دراسته ) (2/976)
وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أَرْبَعٌ مَنْ أَعْطِيَهُنَّ فَقَدْ أُعْطِيَ خَيْرَالدُّنْيَا وَالْآخِرَةِ: قَلْبٌ شَاكِرٌ وَلِسَانٌ ذَاكِرٌ وَبَدَنٌ عَلَى الْبَلَاءِ صَابِرٌ وَزَوْجَةٌ لَا تَبْغِيْهِ خَوْنًا فِي نَفْسِهَا وَلَا مَالِهِ”. روَاهُ الْبَيْهَقِيُّ فِي شُعَبِ الْإِيْمَانِ .
3273. (36) [2/976– అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నాలుగు విషయాలు దొరికిన వారికి ఇహపరలోకాల మంచి దొరికినట్టే: 1.కృతజ్ఞతా భావంగల హృదయం, 2. దైవ స్మరణలో ఉండే నాలుక, 3. కష్టనష్టాలను సహించే శరీరం, 4. తన విషయంలో, భర్త ధనం విషయంలో నిజాయితీగా ఉండే భార్య. (బైహఖి–షు’అబిల్ ఈమాన్)
=====
11- بَابُ الْخُلْعِ وَالطَّلَاقِ
11. స్త్రీ విడిపోగోరటం (‘ఖుల‘అ), విడాకులు (‘తలాఖ్)
ఖుల‘అ అంటే ఒక వస్తువును తీయటం, శరీరం నుండి దుస్తులు దించటం అని అర్థం. ఇస్లామీయ ధర్మ శాస్త్రం ప్రకారం ధనానికి బదులు ‘తలాఖ్ ఇవ్వటాన్ని ఖుల‘అ అంటారు. అంటే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడితే, భార్య ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తతో ఉండటానికి సిద్ధపడకపోతే, భర్త ఇచ్చిన మహర్‌ను తిరిగి ఇచ్చినాలేదా క్షమించివేసినా భర్త దానికి బదులు ‘తలాఖ్ ఇవ్వటం. భర్తకు ఈ హక్కు ఉన్నట్టు అంటే ఏదైనా కారణం వల్ల భార్య నచ్చకపోతే, దాంపత్య జీవితం సరిగా సాగకుండా ఉంటే ‘తలాఖ్ ఇవ్వగలడు. అదేవిధంగా భార్యకు కూడా ఈ హక్కు ఉంది. ఒకవేళ భర్త నచ్చకపోయినా, దాంపత్య జీవితం సరిగా కొనసాగక పోయినా ధనం ఇచ్చి తన్ను తాను వేరుచేసుకోవాలి. ఖుర్ఆన్లో ఇలా ఉంది. అల్లాహ్ ఆదేశం: ”విడాకులు రెండు సార్లే! ఆ తర్వాత (భార్యను) సహృదయంతో తమ వద్ద ఉండనివ్వాలి, లేదా ఆమెను మంచితనంతో సాగనంపాలి. మరియు సాగనంపేటప్పుడు మీరు వారికిచ్చిన వాటి నుండి ఏమైనా తిరిగి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేము అనే భయం ఆ ఇద్దరికీ ఉంటే తప్ప! కాని అల్లాహ్ విధించిన హద్దుకు కట్టుబడి ఉండలేమనే భయం ఆ దంపతులకు ఉంటే స్త్రీ పరిహారమిచ్చి (విడాకులు / ఖుల‘అ తీసుకుంటే) అందులో వారికి ఎలాంటి దోషం లేదు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు, కావున వీటిని అతిక్రమించకండి. మరియు ఎవరైతే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తారో, అలాంటి వారే దుర్మార్గులు.” (అల్ బఖరహ్, 2:229)
ఈ ఆయతు ద్వారా ఖుల‘అ నిరూపించడం జరిగింది. అంటే దంపతులిద్దరికీ కలసి జీవితం గడపలేమనే భయం ఉంటే ఇద్దరికీ ఒకరి నుండి ఒకరు వేరు అయ్యే అనుమతి ఉంది. ఇంకా మహర్ చెల్లించమని ఆదేశించడం జరిగింది. స్త్రీ కూడా వేరు కావటానికి మహర్ ధనం తిరిగి ఇచ్చి ‘తలాఖ్ పొందవచ్చును. స్త్రీ విషయం ప్రస్తావిస్తే భర్త దాన్ని స్వీకరించాలి.
ఖుర్ఆన్లో ఫిద్యహ్ పదం సర్వసాధారణంగా ఉపయోగించటం జరిగింది. అంటే ఇరువర్గాలు నిర్ణయించుకున్నది అది మహర్ కంటే ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ‘హాఫి”జ్ ఇబ్నె కసీ’ర్ ప్రకారం ఖుల’అలో ఇవ్వబడిన మహర్ కంటే ఎక్కువ నిర్ణయించినా ధర్మమే. అంటే ఖుల‘అలో ఇరువురూ ఎంతయినా నిర్ణయించుకోవచ్చు.
‘తలాఖ్ అంటే విప్పటం అని అర్థం. ఇస్లామీయ ధర్మ శాస్త్రంలో నికా‘హ్ ముడిని విప్పటం, దాంపత్య బంధాన్ని విడదీయటం అని అర్థం. భార్యాభర్తల్లో అభిప్రాయభేదాలు వచ్చి ఒకరితో మరొకరు కొనసాగలేమని నిర్థారించుకున్న ప్పుడు చివరికి ఇద్దరినీ విడదీయడం తప్పనిసరి అవుతుంది. ఖుర్ఆన్లో అల్లాహ్ ఆదేశం: ”మరియు వారిద్దరి (భార్యా-భర్తల) మధ్య సంబంధాలుతెగిపోతాయనే భయం మీకుకలిగితే అతని (భర్త) బంధువుల నుండి ఒక మధ్యవర్తిని మరియు ఆమె (భార్య) బంధువులనుండి ఒక మధ్యవర్తిని నియమించండి. వారిద్దరూ సంధి చేసుకోగోరితే అల్లాహ్ వారి మధ్య ఐకమత్యం చేకూర్చవచ్చు!” (అన్-నిసా’, 4:35)
ఇద్దరికీ పడనపుడు ‘తలాఖ్ ఇవ్వటమే ధర్మం. అల్లాహ్(త) వద్ద ఇది ధర్మసమ్మతం. ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ (త) వద్ద ధర్మసమ్మతమైన కార్యాల్లో అన్నిటికంటే అసహ్యించుకో దగ్గది ‘తలాఖ్. (అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
అనవసరంగా ‘తలాఖ్ ఇవ్వటం మంచి పనికాదు. ప్రవక్త (స) ప్రవచనం, ” అనవసరంగా తన భర్తనుండి ‘తలాఖ్ కోరే స్త్రీకి స్వర్గ సువాసనకూడా లభించదు.” (అల్ మున్తఖహ్, నైలుల్ అవతార్)
అదేవిధంగా ఖుల‘అ మరియు తలాఖ్ తీసుకునే స్త్రీలు కాపట్య స్త్రీలు అని ప్రవక్త (స) ప్రవచించారు. (నసాయి’)
ఇంకా అల్లాహ్ (త) ‘తలాఖ్ కంటే అయిష్టమైన ఏ వస్తువును సృష్టించలేదు. (అన్నిసా’, 4:)
ఒకవేళ భార్య నచ్చక పోయినా లేదా చెడుగుణాలు కలదైనా అప్పుడు కూడా ఆమెను ఉంచమని ఆదేశించడం జరిగింది. అల్లాహ్ ఆదేశం: ”మరియు మీరు వారితో గౌరవంతో సహవాసం చేయండి. ఒకవేళ మీకు వారు నచ్చక పోతే! బహుశా మీకు ఒక విషయం నచ్చకపోవచ్చు, కాని అందులోనే అల్లాహ్ ఎంతో మేలు ఉంచి ఉండవచ్చు!” (అన్నిసా’, 4:19)
ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగడం సాధ్యం కానప్పుడు నికా’హ్ను రద్దు చేయవచ్చును. అయితే ఒకేసారి విడిచిపెట్టటం మంచిది కాదు. ఒక్కో నెల విడిచి ఇవ్వాలి. మళ్ళీ రెండో నెల, మూడవ నెల ముగిసినప్పుడు ఇవ్వాలి. ఈ అంతరాయం ఇద్దరూ ఆలోచించుకోవటానికి సమయం దొరుకుతుంది. దీనివల్ల సరిదిద్దుకునే అవకాశం ఏదైనా కనబడు తుంది. అయినా ఇద్దరూ కలసి ఉండలేమని అనుకున్నప్పుడు విడిపోయే అధికారం ఉంది. ఖుర్ఆన్లో ‘తలాఖ్ గురించి అనేక ఆయతులు ఉన్నాయి. దీనివల్ల ‘తలాఖ్ విషయం అంతా స్పష్టంగా అర్థమవుతుంది. అల్లాహ్ ఆదేశం: ”విడాకులు రెండు సార్లే! ఆ తర్వాత (భార్యను) సహృద యంతో తమ వద్ద ఉండనివ్వాలి, లేదా ఆమెను మంచితనంతో సాగనంపాలి. మరియు సాగనంపే టప్పుడు మీరు వారి కిచ్చిన వాటి నుండి ఏమైనా తిరిగి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేము, అనే భయం ఆ ఇద్దరికీ ఉంటే తప్ప! కాని అల్లాహ్ విధించిన హద్దుకు కట్టుబడి ఉండలేమనే భయం ఆ దంపతులకు ఉంటే స్త్రీ పరిహారమిచ్చి (విడాకులు / ఖుల‘అ తీసుకుంటే) అందులో వారికి ఎలాంటి దోషం లేదు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు, కావున వీటిని అతిక్రమించకండి. మరియు ఎవరైతే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తారో, అలాంటివారే దుర్మార్గులు. ఒకవేళ అతడు (మూడవ సారి) విడాకులిస్తే, ఆ తర్వాత ఆ స్త్రీ అతనికి ధర్మ సమ్మతం కాదు, ఆమె వివాహం వేరే పురుషునితో జరిగితే తప్ప! ఒకవేళ అతడు (రెండవ భర్త) ఆమెకు విడాకులిస్తే! అప్పుడు ఉభయులూ (మొదటి భర్త, ఈ స్త్రీ) తాము అల్లాహ్ హద్దులకు లోబడి ఉండ గలమని భావిస్తే, వారు పునర్వివాహం చేసు కోవటంలో దోషం లేదు. మరియు ఇవి అల్లాహ్ నియమించిన హద్దులు. వీటిని ఆయన గ్రహించేవారికి స్పష్టపరుస్తున్నాడు. మరియు మీరు స్త్రీలకు విడాకు లిచ్చినప్పుడు, వారికొరకు నిర్ణయింపబడిన గడువు (‘ఇద్దత్) సమీపిస్తే వారిని సహృదయంతో మీ వద్ద ఉంచుకోండి, లేదా సహృదయంతో విడిచి పెట్టండి. కేవలం వారికి బాధకలిగించే మరియు పీడించే ఉద్దేశ్యంతో వారిని ఉంచుకోకండి. మరియు ఆ విధంగా చేసేవాడు వాస్తవానికి తనకు తానే అన్యాయం చేసుకున్నట్లు. మరియు అల్లాహ్ ఆదేశాలను (ఆయాత్‌లను) పరిహాసంగా తీసుకోకండి. మరియు అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాన్ని మరియు మీపై అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు వివేకాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన (అల్లాహ్) మీకు ఈ విధంగా బోధిస్తున్నాడు. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసని తెలుసుకోండి. మరియు మీరు మీ స్త్రీలకు (మొదటి సారి లేక రెండవ సారి) విడాకులిస్తే, వారు తమ నిరీక్షణా వ్యవధిని (‘ఇద్దత్‌ను) పూర్తిచేసిన తరువాత, తమ (మొదటి) భర్తలను ధర్మసమ్మ తంగా పరస్పర అంగీకారంతో వివాహం చేసుకో దలిస్తే, మీరు వారిని ఆటంకపరచకండి. మీలో ఎవరికి అల్లాహ్ యందు మరియు అంతిమ దినము నందు విశ్వాసముందో, వారికి ఈ బోధన చేయబడు తోంది. ఇది మీకు నిష్కళంకమైనది మరియు నిర్మలమైనది. మరియు అల్లాహ్ కు అంతా తెలుసు, కాని మీకు ఏమీ తెలియదు. (అల్ బఖరహ్, 2:229-232)
అంటే కేవలం రెండు ‘తలాఖ్‌ల వరకే నిర్ణయం మార్చుకునే అనుమతి ఉంది. రెండు కూడా వేర్వేరు సమయాల్లో ఇవ్వాలి. ఒకేసారి ఎన్నయినా ఇవ్వ కూడదు. రెండు ‘తలాఖ్‌ల తర్వాత తమ్ముతాము సరిదిద్దుకొని కలసి ఉండాలి. లేదా సహృదయంతో సాగనంపాలి. ఆమెను ఏ విధంగానూ పీడించకూడదు. మంచిగా సాగనంపి మళ్ళీ ఆమె జోలికి పోకూడదు. ఇద్దత్ దినాలు గడచిన తర్వాత ఆమె తనకిష్టం ఉన్న వారితో వివాహం చేసుకుంటుంది. మూడవ ‘తలాఖ్ తర్వాత వదలివేయాలి. స్త్రీని పీడించ కూడదు. ఆమె లోపాలను ప్రపంచంముందు పెట్టకూడదు. ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించకూడదు.
‘హాఫి”జ్ ఇబ్నె కసీ’ర్ తన వ్యాఖ్యానంలో ఇలా పేర్కొన్నారు. ”ఇస్లామ్‌కి ముందు భర్త తన భార్యకు ఎన్ని ‘తలాఖ్లైనా ఇస్తూ పోయేవాడు. ఇద్దత్‌లో మళ్ళీ విర మించుకునేవాడు. స్త్రీలు చాలా కష్టాలకు గురయ్యే వారు. ఈ విధంగా స్త్రీలను హింసించడం జరిగేది. ఇస్లామ్ దీన్ని పూర్తిగా అరికట్టింది. ఈవి ధంగా రెండుసార్లు మాత్రమే ఇవ్వగలరని, మూడవ ‘తలాఖ్ తర్వాత మళ్ళీ విరమించుకునే అవకాశం ఉండదని ఆదేశించింది.
ఇబ్నె అబీ ‘హాతిమ్లో ఇలా ఉంది, ”ఒక వ్యక్తి తన భార్యతో, ‘నిన్ను నేను స్వీకరించనూ- వదలనూ,’ అని అన్నాడు. దానికి ఆమె, ‘అదెలా?’ అన్నది. దానికి అతడు, ” ‘తలాఖ్ ఇస్తాను, గడువు ముగిసే సమయం వస్తే తిరిగి ఉద్దేశ్యం మార్చుకుంటాను. ఇలాగే చేస్తూ ఉంటాను,’ అని అన్నాడు. ఆమె ప్రవక్త (స) వద్దకు వచ్చి తన కష్టాన్ని తెలిపి ఏడ్వసాగింది. అప్పుడు ఈ ఆయత్ అవతరించబడింది: మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఈ ఆయత్ అవతరించిన తర్వాత ప్రజలు ‘తలాఖ్ విషయంలో శ్రద్ధచూపటం ప్రారంభించారు. సరిగ్గా ఆచరించసాగారు. ఎందుకంటే మూడవ ‘తలాఖ్ కు ముందు మళ్ళీ పునర్విచా రించుకోవచ్చు. లేదా పునర్విచారించుకోకుండా అలాగే వదలితే, మరొకరితో నికా’హ్ చేసుకునే స్థితి వస్తుంది. మూడవసారి ‘తలాఖ్ ఇచ్చినా సుహృ ద్భావంతో ఇవ్వాలి. ఆమె హక్కులను కొల్ల గొట్ట కూడదు, ఆమెపై అత్యాచారం చేయకూడదు. ఆమెకు హాని తలపెట్టకూడదు. ఒక వ్యక్తి ప్రవక్త (స)తో, ”ఈ ఆయతులో రెండు ‘తలాఖ్‌లు మాత్రమే పేర్కొన బడ్డాయి, మూడవ ‘తలాఖ్ గురించి ఎక్కడ ఉంది,’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స), ”అల్తస్రీహున్ బిఇహ్సానిన్”లో ఉంది. మూడవ ‘తలాఖ్ గురించి సంకల్పిస్తే, స్త్రీని హింసించడం, కఠినంగా వ్యవహ రించటం చేయకూడదు. ఇది పురుషులకు నిషిద్ధం. మరోచోట ఇలా ఉంది: ”…మరియు మీరు వారికిచ్చిన దాని (మహ్ర్) నుండి కొంత తీసుకోవటానికి వారిని ఇబ్బందిలో పెట్టకండి, వారు నిస్సందేహంగా వ్యభి చారానికి పాల్పడితే తప్ప…” (అన్నిసా’, 4 : 19)
భార్యాభర్తల్లో మనస్పర్థలు ఏర్పడి, స్త్రీ భర్తపట్ల సంతృప్తికరంగా లేకపోతే, అతని హక్కులు నెరవేర్చనిచో, ఇటువంటి స్త్రీ కొంత ఇచ్చి, పుచ్చుకొని భర్తనుండి ‘తలాఖ్ తీసుకొని వేరైపోవచ్చు. ఇచ్చి పుచ్చుకోవడంలో ఎటువంటి దోషం లేదు. దీన్ని ఖుల‘అ అంటారు. ఖుల‘అ గురించి ఇంతకు ముందు వివరించి ఉన్నాము.
ఒకవేళ ఎవరైనా రెండు ‘తలాఖ్‌లు ఇచ్చిన తర్వాత మూడవ ‘తలాఖ్ కూడా ఇచ్చివేస్తే ఆమె అతనికి నిషిద్ధం అయిపోతుంది. అంటే మరొకరు నికా‘హ్ చేసుకొని సంభోగం చేసి ఆ తర్వాత అతను చనిపోతే, లేదా ‘తలాఖ్ ఇస్తే, అప్పుడు మళ్ళీ మొదటి భర్త, ఆమెతో వివాహం చేసుకోవచ్చు. ఒక ‘హదీసు’లో ఇలా ఉంది, ”ఒక వ్యక్తి ఒక స్త్రీతో నికా‘హ్ చేసుకుంటాడు. సంభోగం చేయకుండానే ‘తలాఖ్ ఇస్తాడు. ఆమె మరో పెళ్ళి చేసుకుంటుంది. రెండవ వాడు కూడా సంభోగానికి ముందు ‘తలాఖ్ ఇచ్చి వేస్తాడు. ఆ తరువాత ఆమె మూడవ వానితో పెళ్ళి చేసుకో వచ్చునా?” అని ప్రవక్త (స)ను ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స) ”కాదు, కాదు వారిద్దరూ ఒకరితో మరొకరు సుఖాన్ని అనుభవించనంత వరకు తగదు” అని సమాధానం ఇచ్చారు.
ఒక ఉల్లేఖనం ప్రకారం రిఫాయీ’ ‘ఖర్జీ (ర) భార్య తమీమహ్ బిన్తె వహబ్‌ను అతడు మూడవ ‘తలాఖ్ ఇచ్చివేస్తే, ఆమెను ‘అబ్దుర్రహ్మాన్ బిన్ ‘జుబైర్‌తో వివాహం చేయడం జరిగింది. కాని ఆమె, ‘అతడు స్త్రీలకు తగనివాడని, నేను మొదటి భర్త వద్దకు వెళ్ళిపోతానని,’ విన్నవించుకుంది. దానికి ప్రవక్త (స), ”ఈ భర్తతో సంభోగం చేయనిదే ఇది సంభవం కాదు,” అని ఆదేశించారు. (బు’ఖారీ)
ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మరొకరి కోసం పెళ్ళిచేసుకోవడం, ‘తలాఖ్ ఇవ్వటం జరుగ రాదు. ఇలా చేసే వారిని, చేయించే వారిని అల్లాహ్(త), ఆయన ప్రవక్త (స) శపించారు.
అంటే ఒకవేళ రెండవ భర్త సంభోగం తరువాత ‘తలాఖ్ ఇస్తే, మొదటి భర్తతో పెళ్ళి చేసుకోవటంలో ఎటువంటి అభ్యంతరం లేదు. రెండవ నికా’హ్ దగా, మోసంగా ఉండ కూడదు.
”వఇజా’ ‘తల్లఖ్తు మున్నిసాఅ’ ఫబల’గ్న” ఈ వాక్యంలో స్త్రీల వలీలను వారించడం జరిగింది. ఒక స్త్రీకి ‘తలాఖ్ మరియు ఇద్దత్ గడచిన తరువాత, భార్యాభర్తలు మళ్ళీ నికా‘హ్ చేసుకో గోరితే వారిని వారించకండి. ఈ ఆయతులో స్త్రీ తన నికా‘హ్ వలీ లేకుండా చేయరాదని పేర్కొనడం జరిగింది. (తిర్మిజి’),
ఇబ్నె జరీర్ ఈ ఆయత్ వ్యాఖ్యానంలో స్త్రీ, స్త్రీ యొక్క నికా‘హ్ చేయరాదు, స్త్రీ తన నికా‘హ్ తాను చేయించుకోరాదు, ఇలా చేసే స్త్రీలు వ్యభిచారుణు లని పేర్కొనడం జరిగింది. మరో ఉల్లేఖనంలో నికా‘హ్ వలీ మరియు ఇద్దరు సాక్షులు లేకుండా జరగదని పేర్కొనడం జరిగింది. ఈ ఆయత్ మ’అఖల్ బిన్ యసార్ (ర), అతని సోదరిని గురించి అవతరించబడింది.
‘స’హీ’హ్ బు’ఖారీలో ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో ఇలా ఉంది: ”మ’అఖల్ బిన్ యసార్ (ర) కథనం: ”నా చెల్లెలి ప్రియుడు నా వద్దకు వచ్చాడు. ‘నీ చెల్లెలితో పెళ్ళిచేయి’ అని అన్నాడు. నేను పెళ్ళి చేసివేసాను. అతడు కొన్నిదినాల తర్వాత ‘తలాఖ్ ఇచ్చివేసాడు. ఆ తరువాత ఇద్దత్ గడచిన తర్వాత మళ్ళీ నికాహ్ చేయమని విన్నవించు కున్నాడు. దానికి నేను నిరాకరించాను. అప్పుడు ఈ ఆయత్ అవతరించబడింది. అది విన్న మ’అఖల్ బిన్ యసార్ నీతో పెళ్ళిచేయనని ప్రమాణం చేసి ఉన్నా, అతనితో నికా‘హ్ చేయడానికి ఒప్పుకొని, ‘నేను దైవాదేశం విన్నాను, స్వీకరించాను,’ అని తన బావను పిలిపించి మళ్ళీ తన సోదరితో నికా‘హ్ చేసి వేసారు. తాను చేసిన ప్రమాణానికి పరిహారం చెల్లించారు. ఆమె పేరు జమీలహ్ బిన్తె యసార్. ఆమె భర్తపేరు అబుల్ బద్దాహ్, కొందరు ఈమె పేరు ఫా’తిమ బిన్తె యసార్ అని పేర్కొన్నారు. మరి కొందరు, ఈ ఆయత్ జాబిర్ బిన్ ‘అబ్దుల్లాహ్ మరియు అతని చిన్నాన్న కూతురు గురించి అవతరించ బడిందని అభిప్రాయపడ్డారు. కాని మొదటి అభి ప్రాయమే సరైనది. ఈ హితబోధ విశ్వాసు లందరికీ వర్తిస్తుంది. దైవభీతి, అంతిమదిన భీతి గలవారు పైవిధంగా అమలుచేయాలి. ఏది మంచిదో, ఏది చెడో అల్లాహ్(త)కు తెలుసు, మనకు తెలియదు.
‘తలాఖ్‌కు అనేక రకాలు ఉన్నాయి. వీటిని గురించి అనేక ఆదేశాలు ఉన్నాయి. వీటిని బస్తవీగారు ఇస్లామీయ తాలీమ్ 7వ భాగంలో పేర్కొన్నారు. కొన్ని విషయాలను ఇక్కడ పేర్కొనడం జరిగింది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3274 – [ 1 ] ( صحيح ) (2/977)
عَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ امْرَأَةَ ثَابِتِ بْنِ قَيْسٍ أَتَتِ النَّبِيَّ صلى الله عليه وسلم فَقَالَتْ: يَا رَسُوْلَ اللهِ ثَابِتُ بْنُ قَيْسٍ مَا أَعْتِبُ عَلَيْهِ فِي خُلُقٍ وَ لَا دِيْنٍ وَلَكِنِّيْ أَكْرَهُ الْكُفْرَفِي الْإِسْلَامِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَتَرَّدَيْنَ عَلَيْهِ حَدِيْقَتَهُ؟” قَالَتْ: نَعَمْ. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِقْبَلِالْحَدِيْقَةَ وَطَلِّقْهَا تَطْلِيْقَةً”. رَوَاهُ الْبُخَارِيُّ
3274. (1) [2/977–దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: సా’బిత్ బిన్ ఖైస్ (ర) భార్య ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! సా’బిత్ బిన్ ఖైస్లో గాని, అతని నైతికతలోగాని, అతని ధార్మికతలోగాని ఎటువంటి లోపం లేదు, అతనిపై ఎలాంటి కోపమూ లేదు. అయితే అతని పట్ల అవిధేయత, కృతఘ్నతల పట్ల భయపడు తున్నాను. అతనికి సరైన సేవ చేయలేక పోతున్నాను. ఎందుకంటే అతడు అందవికారంగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు. నేను చాలా అందంగా ఉన్నాను. అతని అందవికారం వల్ల నాకు అతనంటే అసహ్యం వేస్తుంది. తమరు నన్ను అతన్నుండి వేరేచేయవలసిందిగా కోరుతున్నాను.’ దానికి ప్రవక్త (స), ‘సా’బిత్ నీకు మహర్లో ఇచ్చిన తోట తిరిగి ఇవ్వగలవా?’ అని అడిగారు. దానికి ఆమె సమ్మతించింది. ప్రవక్త (స) సా’బిత్ బిన్ ఖైస్‌తో, ‘నీవు ఇచ్చిన తోట తీసుకో, నీ భార్యకు ‘తలాఖ్ ఇవ్వు,’ అని అన్నారు. (బు’ఖారీ)
3275 – [ 2] ( متفق عليه ) (2/977)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ: أَنَّهُ طَلَّقَ اِمْرَأَةُ لَهُ وَهِيَ حَائِضٌ فَذَكَرَ عُمَرُ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَتَغَيَّظَ فِيْهِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم ثُمَّ قَالَ: “لِيُرَاجِعْهَا ثُمَّ يُمْسِكْهَا حَتَّى تَطْهُرَ ثُمَّ تَحِيْضَ فَتَطْهُرَ فَإِنْ بَدَا لَهُ أَنْ يُطَلِّقَهَا فَلْيُطَلِّقْهَا طَاهِرًا قَبْلَ أَنْ يَمَسَّهَا فَتِلْكَ الْعِدَّةُ الَّتِيْ أَمَرَ اللهُ أَنْ تُطَلَّقَ لَهَا النِّسَاءُ”. وَفِي رِوَايَةٍ: “مُرْهُ فَلْيُرَاجِعْهَا ثُمَّ لِيُطَلِّقْهَا طَاهِرًا أَوْ حَامِلًا”.
3275. (2) [2/977 –ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) తన భార్యకు ఆమె బహిష్టు స్థితిలో ‘తలాఖ్ ఇచ్చారు. ‘ఉమర్ (ర) ప్రవక్త (స) వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పారు. ప్రవక్త(స) అది విని అసహ్యించుకున్నారు. ఆ తరువాత ‘తలాఖ్‌ను రద్దు చేసి, ఆమె బహిష్టు స్థితి నుండి బయటపడిన తర్వాత, అప్పుడు కోరితే ‘తలాఖ్ ఇవ్వమని చెప్పు. అయితే సంభోగం చేయరాదు. ఇదేవారి గడువు. స్త్రీలను వారి పరిశుద్ధావస్థలో ‘తలాఖ్ ఇమ్మని అల్లాహ్ (త) ఆదేశించాడు. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఓ ‘ఉమర్! అతన్ని విరమించుకోమను, ఆ తరువాత పరిశుద్ధ స్థితిలో లేదా గర్భం ధరించని స్థితిలో ఆమెకు ‘తలాఖ్ ఇవ్వమను అని ప్రవచించారు.” [75] (బు’ఖారీ, ముస్లిమ్)
3276 – [ 3 ] ( متفق عليه ) (2/977)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: خَيَّرَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَاخْتَرْنَا اللهَ وَرَسُوْلَهُ فَلَمْ يَعُدَّ ذَلِكَ عَلَيْنَا شَيْئًا.
3276. (3) [2/977 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) మాకు ఎన్నుకునే అధికారం ఇచ్చారు. మేము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ఎన్నుకున్నాము. అప్పుడు ప్రవక్త (స) మా గురించి దినాలను ప్రస్తావించ లేదు.[76] (బు’ఖారీ, ముస్లిమ్)
3277 – [ 4 ] ( متفق عليه ) (2/977)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: فِي الْحَرَامِ يُكَفَّرُ لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُوْلِ اللهِ أُسْوَةٌ حَسَنَةٌ.
3277. (4) [2/977 –ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర)కథనం : తనపై ఏ వస్తువునైనా నిషిద్ధం చేసుకున్నవారు పరిహారం చెల్లించాలి. ఈ విషయంలో ప్రవక్త (స)లో ఎంతోగొప్ప ఆదర్శం ఉంది.[77](బు’ఖారీ, ముస్లిమ్)
3278 – [ 5 ] ( متفق عليه ) (2/978)
وَعَنْ عَائِشَةَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَمْكُثُ عِنْدَ زَيْنَبَ بِنْتَ جَحْشٍ وَشَرِبَ عِنْدَهَا عَسَلًا فَتَوَاصَيْتُ أَنَا وَحَفْصَةُ أَنْ أَيَّتَنَا دَخَلَ عَلَيْهَا النَّبِيُّ صلى الله عليه وسلم فَلْتَقُلْ: إِنِّيْ أَجِدْ مِنْكَ رِيْحَ مَغَافِيْرَأَكَلْتَ مَغَافِيْرَ؟ فَدَخَلَ عَلَى إِحْدَاهُمَا. فَقَالَتْ لَهُ ذَلِكَ فَقَالَ: “لَا بَأْسَ شَرِبْتُ عَسَلًا عِنْدَ زَيْنَبَ بِنْتِ جَحْشٍ فَلَنْ أَعُوْدَ لَهُ وَقَدْ حَلَفْتُ لَا تُخْبِرِيْ بِذَلِكَ أَحَدًا”. يَبْتَغِيْ مَرْضَاةَ أَزْوَاجِهِ فَنَزَلَتْ: (يَا أَيُّهَا النَّبِيُّ لِمَ تُحرِّمُ مَا أَحَلَّ اللهُ لَكَ تَبْتَغِيْ مَرْضَاةَ أَزْوَاجِكَ؛ 66: 1) الآية
3278. (5) [2/978 –ఏకీభవితం]
‘ఆయి‘షహ్ (ర) కథనం: ప్రవక్త (స) తన భార్య ‘జైనబ్ బిన్తె జ‘హష్ ఇంటికి తరచూ వెళ్ళేవారు. అక్కడ కొంతసేపు ఆగి ఆమెవద్ద తేనె ఆరగించేవారు. నేను, ‘హఫ్’సహ్ కలిసి ఒక పథకం ఆలోచించాము. అదేమిటంటే మన ఇద్దరిలో ప్రవక్త (స) ఎవరి వద్దకు వచ్చినా, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! మీ నోటి నుండి ము‘గాఫీర్ వాసన వస్తుంది, మీరు ము’గాఫీర్ తిన్నారా,’ అని అడుగుదాం. ప్రవక్త (స) మా ఇద్దరిలో ఒకరి వద్దకు వచ్చారు. ఆమె అనుకున్నట్టుగానే అడిగింది, అప్పుడు ప్రవక్త (స), ”నేను ‘జైనబ్ వద్ద తేనె త్రాగాను. అందులో ఇటువంటిదేమీ లేదు, ఒకవేళ తేనె త్రాగటం వల్ల మీకు దుర్వాసన వస్తే ఇకముందు నేను తేనె త్రాగనని ప్రమాణం చేస్తున్నాను. ఈ విషయం ఇతరులెవరికీ చెప్పకండి,” అని అన్నారు. దానివల్ల అతని(స) ఉద్దేశ్యం భార్యలు సంతోషించాలని. ఆ తరువాత ఈ ఆయతు అవతరించింది: ”యా అయ్యుహన్నబియ్యు లిమ తు’హర్రిము మా అ’హల్లల్లాహు లక తబ్త’గీ మర్’దాత అ’జ్వాజిక.” – ‘ఓ ప్రవక్తా, అల్లాహ్ నీకోసం ధర్మసమ్మతం చేసిన దానిని నీవు ఎందుకు నిషేధించుకుంటున్నావు. నీవు నీ భార్యల ప్రసన్నతను కోరుతున్నావా?…” [78] (అత్తహ్రీమ్, 66:1-5) (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3279 – [ 6 ] ( صحيح ) (2/978)
عَنْ ثَوْبَانَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَيُّمَا امْرَأَةٍ سَأَلَتْ زَوْجَهَا طَلَاقًا فِي غَيْرِ مَا بَأْسٍ فَحَرَامٌ عَلَيْهَا رَائِحَةُ الْجَنَّةِ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَالدَّارِمِيُّ.
3279. (6) [2/978– దృఢం]
సౌ’బాన్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అకారణంగా తన భర్త నుండి, ‘తలాఖ్ కోరిన స్త్రీపై స్వర్గ పరిమళం నిషేధించడం జరుగుతుంది.” (అ’హ్మద్, తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్, దారమి)
3280 – [ 7 ] ( ضعيف ) (2/978)
وَعَنِ ابْنِ عُمَرَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “أَبْغَضُ الْحَلَالِ إِلَى اللهِ الطَّلَاقُ”. روَاهُ أَبُوْ دَاوُدَ.
3280. (7) [2/978– బలహీనం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ధర్మసమ్మతమైన విషయాల్లో, అల్లాహ్ వద్ద అన్నిటికంటే చెడ్డది ‘తలాఖ్.” [79] (అబూ దావూద్)
3281 – [ 8 ] ( لم تتم دراسته ) (2/978)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا طَلَاقَ قَبْلَ نِكَاحٍ وَلَا عِتَاقَ إِلَّا بَعْدَ مِلْكٍ وَلَا وِصَالَ فِي صِيَامٍ وَلَا يُتْمَ بَعْدَ اِحْتِلَامٍ وَلَا رِضَاعَ بَعْدَ فِطَامٍ وَلَا صَمْتَ يَوْمَ إِلى اللَّيْلِ”. رَوَاهُ فِي شَرْحِ السُّنَّةِ.
3281. (8) [2/978 –అపరిశోధితం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”1. నికా‘హ్ కాకముందే ‘తలాఖ్ ఇస్తే, ‘తలాఖ్ చెల్లదు. అదేవిధంగా 2. బానిసకు యజమాని అవకముందే విడుదల చేస్తే, విడుదల చెల్లదు. అదేవిధంగా 3. ఉపవాసాలలో విసాల్ అంటే నిరంతరం రాత్రీపగలు ఉపవాసం పాటించడం చెల్లదు. అదేవిధంగా 4. వీర్యస్ఖలనం అయిన తర్వాత అనాథ అనాథగా ఉండడు. 5. పాలగడువు పూర్తయిన తర్వాత పాలుపడితే బంధుత్వం వర్తించదు. అదేవిధంగా 6. పగలంతా మౌనవ్రతం పాటించడం ధర్మసమమ్మతం కాదు.[80] (షర్’హ్ సున్నహ్)
3282 – [ 9 ] ( لم تتم دراسته ) (2/979)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا نَذْرَ لِاِبْنِ آدَمَ فِيْمَا لَا يَمْلِكُ وَلَا عِتْقَ فِيْمَا لَا يَمْلِكُ وَلَا طَلَاقَ فِيْمَا لَا يَمْلِكُ”. روَاهُ التِّرْمِذِيُّ وَزَادَ أَبُوْ دَاوُدَ: “وَلَا بَيْعَ إِلَّا فِيْمَا يَمْلِكُ”.
3282. (9) [2/979– అపరిశోధితం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి, తాతల ద్వారా, కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మానవుడు తన అధీనంలో లేనిదాని గురించి మొక్కుకోవటం ధర్మం కాదు. అదేవిధంగా బానిసకు యజమాని కాకముందే విడుదల చేస్తే, బానిస విడుదల కాలేడు. ఎందుకంటే విడుదల చేయటానికి ముందు బానిస తన అధీనంలోకి రావటం, యజమాని కావటం తప్పనిసరి. అదేవిధంగా నికా’హ్ కాకముందే ‘తలాఖ్ ఇవ్వడం చెల్లదు. అదేవిధంగా ఎవరైనా ఏదైనా వస్తువు అమ్మితే అమ్మటానికి ముందు దానికి యజమాని కావాలి. యజమాని కాకముందే అమ్మడం ధర్మం కాదు.” (తిర్మిజి’, అబూ దావూద్)
3283 – [ 10 ] ( لم تتم دراسته ) (2/979)
وَعَنْ رُكَانَةَ بْنِ عَبْدِ يَزِيْدَ أَنَّهُ طَلَّقَ اِمْرَأَتَهُ سُهَيْمَةَ اَلْبَتَّةَ فَأَخْبِرَ بِذَلِكَ النَّبِيُّ صلى الله عليه وسلم وَقَالَ: وَاللهِ مَا أَرَدْتُّ إِلَّا وَاحِدَةً فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَاللهِ مَا أَرَدْتَّ إِلَّا وَاحِدَةً؟” فَقَالَ رُكَانَةُ: وَاللهِ مَا أَرَدْتُّ إِلَّا وَاحِدَةً فَرَدَّهَا إِلَيْهِ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَطَلَّقَهَا الثَّانِيَةَ فِي زَمَانِ عُمَرَ وَالثَّالِثَةَ فِي زَمَانِ عُثْمَانَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ إِلَّا أَنَّهُمْ لَمْ يَذْكُرُوْا الثَّانِيَةَ وَالثَّالِثَةَ.
3283. (10) [2/979– అపరిశోధితం]
రుకానహ్ బిన్ అబ్ద్ య’జీద్ తన భార్య సుహైమహ్ కు ‘తలాఖ్ బత్త (తిరుగులేని విడాకులు) ఇచ్చారు. ప్రవక్త (స)కు దీన్ని గురించి తెలియజేయటం జరిగింది. అతడు, ”అల్లాహ్ సాక్షి నేను ఒక ‘తలాఖ్ సంకల్పం తోనే నేను ‘తలాఖ్ ఇచ్చాను,” అని అన్నాడు. ప్రవక్త (స), ‘అల్లాహ్ సాక్షిగా చెప్పు నీవు ఒకే ఒక్క ‘తలాఖ్ ఇచ్చావా?’ అని అన్నారు. దానికి అతడు ‘అల్లాహ్ సాక్షి! నేను ఒకే ఒక్క ‘తలాఖ్ ఇచ్చాను,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) అతని భార్యను అతనికి అప్పజెప్పారు. అయితే రుకానహ్ ‘ఉమర్ పరిపాలనా కాలంలో తన భార్యకు రెండవ, ‘ఉస్మాన్ కాలంలో మూడవ ‘తలాఖ్ ఇచ్చాడు. [81] (తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దారమి, అబూ దావూద్)
3284 – [ 11 ] ( ضعيف ) (2/979)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “ثَلَاثٌ جِدُّهُنَّ جِدٌّ وَهَزْلُهُنَّ جِدٌّ:النِّكَاحُ وَالطَّلَاقُ وَالرَّجْعَةُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.
3284. (11) [2/979– బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మూడు విషయాల్లో నిజంగా చెప్పినా, హాస్యానికి చెప్పినా నిజమవుతుంది. 1. నికా‘హ్, 2. ‘తలాఖ్, 3. రు‘జూ (ఆడిన మాటను వెనక్కితీసుకోవటం).[82] (తిర్మిజి’, అబూ దావూద్)
3285 – [ 12 ] ( لم تتم دراسته ) (2/979)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا طَلَاقَ وَلَا عِتَاقَ فِي إِغْلَاقٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ قِيْلَ: مَعْنَى الْإِغْلَاقِ: اَلْإِكْرَاهُ.
3285. (12) [2/979– అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, బలవంతంగా ‘తలాఖ్ సంభవించదు, విడుదల సంభవించదు.[83] (అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
3286 – [ 13 ] ( لم تتم دراسته ) (2/979)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كُلُّ طَلَاقٍ جَائِزٌ إِلَّا طَلَاقَ الْمَعْتُوْهِ وَالْمَغْلُوْبِ عَلَى عَقْلِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَعَطَاءُ بْنُ عَجْلَانَ الرَّاوِيُّ ضَعِيْفٌ ذَاهِبُ الْحَدِيْثِ.
3286. (13) [2/979– అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి వ్యక్తి యొక్క ‘తలాఖ్ ,‘తలాఖ్గా పరిగణించబడు తుంది. కాని పిచ్చివారి, బుద్ధిహీనుల, మతి స్థిమితం లేని వ్యక్తుల ‘తలాఖ్ చెల్లదు.” (తిర్మిజి’)
3287 – [ 14 ] ( صحيح ) (2/980)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “رُفِعَ الْقَلَمُ عَنْ ثَلَاثَةٍ: عَنِ النَّائِمِ حَتَّى يَسْتَيْقِظَ وَعَن الصَبِيِّ حَتَّى يَبْلُغَ وَعَنِ الْمَعْتُوْهِ حَتَّى يَعْقِلَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُد .
3287. (14) [2/980– దృఢం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముగ్గురు వ్యక్తుల వాక్కర్మలను పరిగణించటం జరుగదు. 1. నిద్రలో ఉన్నవాడు మేల్కోనంత వరకు, 2. బాలుడు, యుక్త వయస్సుకు చేరనంత వరకు, 3. మతి స్థిమితం లేని వ్యక్తి, తెలివి వచ్చేంత వరకు. (తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
3288 – [ 15 ] ( صحيح ) (2/980)
وَرَوَاهُ الدَّارَمِيُّ عَنْ عَائِشَةَ وَابْنُ مَاجَهُ عَنْهُمَا.
3288. (15) [2/980 –దృఢం]
దారమి, ఈ ‘హదీసు’ను, ‘ఆయి’షహ్ (ర), ద్వారా ఉల్లేఖించారు. ఇబ్నే మాజహ్ వారి ద్వారా.
3289 – [ 16 ] ؟(2/980)
وَعَنْ عَائِشَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “طَلَاقُ الْأَمَةِ تَطْلِيْقَتَانِ وَ عِدَّتُهَا حَيْضَتَانِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْدَاوُدَ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.
3289. (16) [2/980 – ? ]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బానిస స్త్రీకి రెండు ‘తలాఖ్‌లు, ఆమె గడువు రెండు బహిష్టు దశలు.” [84] (తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్, దారమి)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3290 – [ 17 ] ( لم تتم دراسته ) (2/980)
عَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “اَلْمُنْتَزِ عَاتُ وَالْمُخْتَلِعَاتُ هُنَّ الْمُنَافِقَاتُ”. رَوَاهُ النَّسَائِيُّ.
3290. (17) [2/980 – అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భర్తల పట్ల అవిధేయతగా ప్రవర్తించేవారు, భర్తలతో వివాదానికి దిగేవారు, అనవసరంగా ‘తలాఖ్ కోరేవారు, కాపట్య స్త్రీలు.” (నసాయి’)
3291 – [ 18 ] ( لم تتم دراسته ) (2/980)
وَعَنْ نَافِعٍ عَنْ مَوْلَاةٍ لِصَفِيَّةَ بِنْتَ أَبِيْ عُبَيْدٍ أَنَّهَا اخْتُلِعَتْ مِنْ زَوْجِهَا بِكُلِّ شَيْءٍ لَهَا فَلَمْ يُنْكِرْ ذَلِكَ عَبْدُ اللهِ بْنُ عُمَرَ. رَوَاهُ مَالِكٌ.
3291. (18) [2/980– అపరిశోధితం]
నా’ఫె (ర), ‘సఫియ్యహ్ బిన్తె అబూ ‘ఉబైద్ విడుదల చేసిన బానిసరాలి ద్వారా కథనం. ” ‘సఫియ్యహ్ తన మొత్తం ధనం ద్వారా తన భర్త నుండి ‘తలాఖ్ (ఖుల‘అ) తీసుకున్నారు. అప్పుడు ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ దాన్ని ఎంత మాత్రం వ్యతిరేకించలేదు.” (మాలిక్)
3292 – [ 19 ] ( ضعيف ) (2/980)
وَعَنْ مَحْمُوْدِ بْنِ لَبِيْدٍ قَالَ: أُخْبِرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ رَجُلٍ طَلَّقَ اِمْرَأَتُهُ ثَلَاثَ تَطْلِيْقَاتٍ جَمِيْعًا فَقَامَ غَضْبَانَ ثُمَّ قَالَ: “أَيُلْعَبُ بِكَتَابِ اللهِ عَزَّ وَجَلَّ وَأَنَا بَيْنَ أَظْهُرِكُمْ؟” حَتَّى قَامَ رَجُلٌ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ أَلَا أَقْتُلُهُ؟ . روَاهُ النَّسَائِيُّ.
3292. (19) [2/980 –బలహీనం]
మ’హ్మూద్ బిన్ లబీద్ (ర) కథనం: ఒక వ్యక్తి తన భార్యను ఒకేసారి మూడు ‘తలాఖ్‌లు ఇచ్చాడని తెలిసింది. అది విన్న ప్రవక్త (స) కోపంతో నిలబడి, ”అల్లాహ్ గ్రంథం పట్ల ఆటగా ఉందా? ఇంకా నేను మీ ముందు ఉన్నాను,” అని అన్నారు. అది విన్న ఒక వ్యక్తి నిలబడి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ఒకేసారి మూడు ‘తలాఖ్‌లు ఇచ్చిన వ్యక్తిని నేను చంపనా?’ అని విన్నవించుకున్నాడు. [85] (నసాయి’)
3293 – [ 20 ] ( لم تتم دراسته ) (2/981)
وَعَنْ مَالِكٍ بَلَغَهُ أنَّ رَجُلًا قَالَ لِعَبْدِ اللهِ بْنِ عَبَّاسٍ: إِنِّيْ طَلَّقْتُ اِمْرَأَتِيْ مِائَةَ تَطْلِيْقَةٍ فَمَاذَا تَرَى عَلَيَّ؟ فَقَالَ ابْنُ عَبَّاسٍ: طُلِّقَتْ مِنْكَ بِثَلَاثٍ وَسَبْعٌ وَّتِسْعُوْنَ اتَّخَذْتَ بِهَا آيَاتِ اللهِ هُزُوًا. رَوَاهُ فِي الْمُوَطَّأِ.
3293. (20) [2/981–అపరిశోధితం]
”ఒక వ్యక్తి ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అబ్బాస్‌తో, ‘నేను నా భార్యకు 100 ‘తలాఖ్‌లు ఇచ్చాను. దానికి మీరే మంటారు అంటే ‘తలాఖ్ పడినట్టా లేదా?’ అని అడిగాడు. దానికి ఇబ్నె ‘అబ్బాస్, ‘నీ భార్య నీ నుండి మూడు ‘తలాఖ్లతో వేరైపోయింది. మిగతా 97 ‘తలాఖులతో నువ్వు అల్లాహ్ ఆయతులను ఎగతాళి చేసావు.” ఈ వార్త ఇమామ్ మాలిక్‌కు చేరింది.[86] (ముఅత్తా ఇమామ్ మాలిక్)
3294 – [ 21 ] ( ضعيف ) (2/981)
وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا مُعَاذُ مَا خَلَقَ اللهُ شَيْئًا عَلَى وَجْهِ الْأَرْضِ أَحَبَّ إِلَيْهِ مِنَ الْعِتَاقِ وَلَا خَلَقَ اللهُ شَيْئًا عَلَى وَجْهِ الْأَرْضِ أَبْغَضَ إِلَيْهِ مِنَ الطَّلَاقِ”. رَوَاهُ الدَّارَقُطْنِيُّ .
3294. (21) [2/981–బలహీనం]
ము’ఆజ్’ బిన్ జబల్ (ర) కథనం: ప్రవక్త (స) నాతో ఇలా అన్నారు, ”ఓ ము’ఆజ్’! సృష్టితాల్లో అన్నిటికంటే అల్లాహ్(త) కు ప్రియమైనది స్వాతంత్రం. అంటే బానిసలను విడుదల చేయడం అన్నిటికంటే ప్రియమైనది. అదేవిధంగా సృష్టితాల్లో అల్లాహ్ దృష్టిలో అన్నిటికంటే నీచమైనది ‘తలాఖ్ తప్ప మరేదీ కాదు.” అంటే భార్యాభర్తలు విడిపోవడం అల్లాహ్ వద్ద అన్నిటికంటే నీచమైనది. (దారు ఖుతునీ)
=====
12- بَابُ الْمُطَلَّقَةِ ثَلَاثًا
12. ముమ్మార్లు విడాకులు పొందిన స్త్రీ
భర్త మూడు ‘తలాఖులు ఇవ్వవచ్చు. ఒకవేళ మూడు పరిశుద్ధావస్థల్లో సంభోగం చేయకుండా మూడు ‘తలాఖులు వేర్వేరుగా ఇస్తే ‘తలాఖ్ బాయిన్ మరియు ‘తలాఖ్ ము‘గల్ల‘జ్ అవుతుంది. ఆ తరువాత ధార్మిక ‘హలాల పద్ధతి లేకుండా ఆ స్త్రీతో అతడు మళ్ళీ నికా‘హ్ చేసుకోలేడు. దీన్ని క్రింది ‘హదీసు’లలో ప్రస్తావించడం జరిగింది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3295 – [ 1 ] ( متفق عليه ) (2/982)
عَنْ عَائِشَةَ قَالَتْ: جَاءَتِ امْرَأَةُ رِفَاعَةَ الْقُرَظِيِّ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَتْ: إِنِّيْ كُنْتُ عِنْدَ رِفَاعَةَ فَطَلَّقَنِيْ فَبَتَّ طَلَاقِيْ فَتَزَوَّجْتُ بَعْدَهُ عَبْدَ الرَّحْمنِ بْنِ الزُّبَيْرِ وَمَا مَعَهُ إِلَّا مِثْلُ هُدْبَةِ الثَّوْبِ فَقَالَ: “أَتُرِيْدِيْنَ أَنْ تَرْجِعِيَّ إِلَى رِفَاعَةَ؟” قَالَتْ: نَعَمْ. قَالَ: “لَا حَتَّى تَذُوْقِيْ عُسَيْلَتَهُ وَيَذُوْقُ عُسَيْلَتَكِ”.
3295. (1) [2/982 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: రిఫా’అహ్ ఖుర్”జీ భార్య ప్రవక్త (స) వద్దకు వచ్చి ఇంతకు ముందు నేను రిఫా’అహ్ నికా’హ్లో ఉండేదాన్ని, అతను నాకు ‘తలాఖ్ బత్త ఇచ్చాడు. ఆ తరువాత నేను ‘అబ్దుర్రహ్మాన్ బిన్ ‘జుబైర్ నికా’హ్లోనికి వచ్చాను. అతడు నపుంసకుడని తెలిసింది. అతని మర్మాంగం చాలా బలహీనంగా ఉంది. స్త్రీకి తగినది కాదు.’ అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు నీ మొదటి భర్త రిఫా’అహ్ వద్దకు వెళ్ళాలను కుంటున్నావా?’ అని అడిగారు. దానికి ఆమె, ‘అవును,’ అని సమాధానం ఇచ్చింది. అప్పుడు ప్రవక్త (స), ‘అతను నిన్ను, నువ్వు అతన్ని అనుభవించనంత వరకు, నీవు మొదటి భర్తతో వివాహం చేసుకోలేవు,’ అని అన్నారు.[87] (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3296 – [ 2 ] ( صحيح ) (2/982)
عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: لَعَنَ رَسُوْلُ اللهِ الْمُحَلِّلَ وَالْمُحَلَّلَ لَهُ. رَوَاهُ الدَّارَمِيُّ.
3296. (2) [2/982 –దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ము‘హల్లిలను, ము‘హల్లలహును శపించారు. (దారమి)
3297 – [ 3 ] ( صحيح ) (2/982)
وَرَوَاهُ ابْنُ مَاجَهُ عَنْ عَلِيٍّ وَابْنُ عَبَّاسٍ وَعُقْبَةَ بْنِ عَامِرٍ
3297. (3) [2/982 –దృఢం]
ఇబ్నె మాజహ్ ఈ ‘హదీసు’ను, ‘అలీ (ర), ఇబ్నె ‘అబ్బాస్ మరియు ‘ఉఖ్బహ్ బిన్ ‘ఆమిర్ ద్వారా ఉల్లేఖించారు. [88]
3298 – [ 4 ] ( لم تتم دراسته ) (2/982)
وَعَنْ سُلَيْمَانِ بْنِ يَسَارٍ قَالَ: أَدْرَكْتُ بِضْعَةَ عَشَرَ مِنْ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم كُلُّهُمْ يَقُوْلُ: يُوْقَفُ الْمُؤْلِيْ. رَوَاهُ فِي شَرْحِ السُّنَّةِ.
3298. (4) [2/982 –అపరిశోధితం]
సులైమాన్ బిన్ యసార్ (ర) కథనం: పదిమంది కంటే అధిక ప్రవక్త సహచరులతో కలిసాను. అందరూ మౌలా అంటే ఈలా చేసే వాడుగా పరిగ ణిస్తున్నారు.[89] (షర’హ్ సున్నహ్)
3299 – [ 5 ] ( لم تتم دراسته ) (2/983)
وَعَنْ أَبِيْ سَلَمَةَ: أَنَّ سَلْمَانَ بْنِ صَخْرٍ وَيُقَالُ لَهُ: سَلَمَةُ بْنُ صَخْرِ الْبَيَاضِيُّ جَعَلَ اِمْرَأَتُهُ عَلَيْهِ كَظَهْرِ أُمِّهِ حَتَّى يَمْضِيَ رَمَضَانُ فَلَمَّا مَضَى نِصْفُ مِّنْ رَمْضَانَ وَقَعَ عَلَيْهَا لَيْلًا فَأَتَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَذَكَرَ لَهُ. فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَعْتِقْ رَقَبَةً”. قَالَ: لَا أَجِدُهَا قَالَ: “فَصُمْ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ”. قَالَ: لَا أَسْتَطِيْعُ. قَالَ: “اطْعِمْ سِتِّيْنَ مِسْكِيْنًا” قَالَ: لَا أَجِدُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لفَرْوَة بْنِ عَمْرٍو: “أَعْطِهِ ذَلِكَ الْعَرَقَ” وَهُوَ مِكْتَلٌ يَأْخُذُ خَمْسَةَ عَشَرَ صَاعًا أَوْ سِتَّةَ عَشَرَ صَاعًا.”لِيُطْعِمَ سِتِّيْنَ مِسْكِيْنًا”. رَوَاهُ التِّرْمِذيُّ.
3299. (5) [2/983 –అపరిశోధితం]
అబూ సలమహ్ (ర) కథనం: సులైమాన్ బిన్ ‘స’ఖ్ర్ వీరిని సలమహ్ బిన్ ‘స’ఖ్ర్ అల్ బయా’దీ, అని కూడా పిలిచేవారు. రమ’దాన్ పూర్తయ్యే వరకు తన భార్యతో ”జి‘హార్ చేసుకున్నారు. సగం రమ’దాన్ గడవకముందే తన భార్యతో సంభోగం చేసుకున్నారు. ప్రవక్త (స) వద్దకు వచ్చి జరిగినదంతా విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స) అతన్ని ఒక బానిసను విడుదల చేయమని ఆదేశించారు. దానికి ఆ వ్యక్తి, ‘నాకు అంత స్తోమత లేదు,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) అతన్ని రెండు నెలలు నిరంతరం ఉపవాసాలు పాటించమని ఆదేశించారు. ‘దానికీ నాకు శక్తిలేదు’ అని అన్నాడు. ప్రవక్త (స), ‘60 మంది నిరుపేదలకు అన్నం పెట్టమని’ ఆదేశించారు. ‘ఆ శక్తి కూడా నాలో లేదు’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) ఫర్వ బిన్ అమ్ర్ను 15 లేక 16 సాఅల ఖర్జూరాలు ఉన్న ఆ గంపను ఇతనికి ఇచ్చి వేయండి, అతడు 60 మంది నిరుపేదలకు అన్నం పెడతాడు అని ఆదేశించారు. (తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్, దారమీ)
3300 – [ 6 ] ( لم تتم دراسته ) (2/983)
وَرَوَى أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ عَنْ سُلَيْمَانَ بْنِ يَسَارٍ عَنْ سَلَمَةَ بْنِ صَخْرٍ نَحْوَهُ قَالَ: كُنْتُ اِمْرًأ أُصِيْبُ مِنَ النِّسَاءِ مَا لَا يُصِيْبُ غَيْرِيْ وَفِيْ رِوَايَتِهِمَا أَعْنِيْ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ: “فَأَطْعِمْ وَسْقًا مِنْ تَمْرٍ بَيْنَ سِتِّيْنَ مِسْكِيْنًا”.
3300. (6) [2/983 –అపరిశోధితం]
అబూ దావూద్, ఇబ్నె మాజహ్, దారమీల, మరో ఉల్లేఖనలో ఇలా ఉంది: సులైమాన్ బిన్ యసార్, కథనంలో, ‘సలమహ్ బిన్ ‘స’ఖ్ర్: ‘ఇతరుల కంటే నాకు స్త్రీల కాంక్ష అధికంగా ఉండేదని,’ అన్నారు.
మరో అబూ దావూద్, దారమీల ఉల్లేఖనలో: ”నువ్వు ఒక వసఖ్ ఖర్జూరం 60 మంది నిరుపేదలకు తినిపించు,” అని ఉంది. [90]
3301 – [ 7 ] ( لم تتم دراسته ) (2/983)
وَعَنْ سُلَيْمَانَ بْنِ يَسَارٍعَنْ سَلَمَةَ بْنِ صَخْرٍعَنِ النَّبِيِّ صلى الله عليه وسلم فِي الْمَظَاهِرِ يُوَاقِعُ قَبْلَ أَنْ يُّكَفِّرَ قَالَ: “كَفَّارَةٌ وَّاحِدَةٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ
3301. (7) [2/983– అపరిశోధితం]
సులైమాన్ బిన్ యసార్, సలమహ్ బిన్ ‘స’ఖ్ర్ ద్వారా కథనం: ఒకవేళ పరిహారం చెల్లించక ముందు తన భార్యతో సంభోగం చేసుకుంటే దానికి ఒక పరిహారమా లేక రెట్టింపు పరిహారమా అని ప్రవక్త (స)ను ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘ఒక పరిహారమే’ అని సమాధానం ఇచ్చారు. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3302 – [ 8 ] ( لم تتم دراسته ) (2/984)
عَنْ عِكْرَمةَ عَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ رَجُلًا ظَاهَرَ مِنْ اِمْرَأَتِهِ فَغَشِيَهَا قَبءلَ أَنْ يُّكَفِّرَ فَأَتَى النَّبِيُّ صلى الله عليه وسلم فَذَكَرَ ذَلِكَ لَهُ فَقَالَ: “مَا حَمَلَكَ عَلَى ذَلِكَ؟” قَالَ: يَا رَسُوْلَ اللهِ رَأَيْتُ بَيَاضَ حَجْلَيْهَا فِي الْقَمَرِ فَلَمْ أَمْلِكْ نَفْسِيْ أَنْ وَقَعْتُ عَلَيْهَا فَضَحِكَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَأَمَرَهُ أَنْ لَا يَقْرَبَهَا حَتَّى يُكَفِّرَ. روَاهُ ابْنُ مَاجَهُ. وَرَوَى التِّرْمِذِيُّ نَحْوَهُ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ غَرِيْبٌ. ورَوَى أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ نَحْوَهُ مُسْنَدًا وَمُرْسَلًا وَقَالَ النَّسَائِيُّ: اَلْمُرْسَلُ أَوْلَى بِالصَّوَابِ مِنَ الْمُسْنَدِ.
3302. (8) [2/984 –అపరిశోధితం]
‘ఇక్రమ ద్వారా, ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ఒక వ్యక్తి తన భార్యతో ”జిహార్ చేసుకున్నాడు. పరిహారం చెల్లించటానికి ముందు తన భార్యతో సంభోగం కూడా చేసుకున్నాడు. ఆ వ్యక్తి ప్రవక్త (స) ముందు నిలబడి తన వృత్తాంతాన్ని వివరించాడు. ‘నిన్ను అలా ప్రేరేపించిన విషయం ఏమిటి,’ అని ప్రవక్త (స) అడిగారు. దానికి ఆ వ్యక్తి, ‘నేను నా భార్య కాళ్ళ పట్టీల మెరుపును చూచి నన్ను నేను ఆపుకోలేక పోయాను. వెంటనే సంభోగం చేసుకున్నాను.’ అతని మాటల వల్ల ప్రవక్త (స) ఫక్కున నవ్వి, ‘అయితే ఇప్పుడు మాత్రం పరిహారం చెల్లించనిదే ఆమె దగ్గరకు వెళ్ళకు,’ అని అన్నారు. (ఇబ్నె మాజహ్, అబూ దావూద్)
=====
13- بَابٌ فِي وُجُوْبِ كَوْنِ الرَّقَبَةِ فِي الْكَفَّارةً مُؤْمِنَةً
13. పరిహారంగా బానిసను విడుదల చేయడం
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3303 – [ 1 ] ( صحيح ) (2/985)
عَنْ مُعَاوِيَةَ بْنِ الْحَكَمِ قَالَ: أَتَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِنَّ جَارِيَةً كَانَتْ لِيْ تَرَعى غَنَمًا لِيْ فَجِئْتُهَا وَقَدْ فَقَدْتُّ شَاةً مِنَ الْغَنَمِ فَسَأَلْتُهَا عَنْهَا فَقَالَتْ: أَكَلَهَا الذِّئْبُ فَأَسِفْتُ عَلَيْهَا وَكُنْتُ مِنْ بَنِيْ آدَمَ فَلَطَمْتُ وَجْهَهَا وَعَلَيَّ رَقَبَةٌ أَفَأَعْتِقُهَا؟ فَقَالَ لَهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَيْنَ اللهُ؟” فَقَالَتْ: فِي السَّمَاءِ فَقَالَ: “مَنْ أَنَا؟” فَقَالَتْ: أَنْتَ رَسُوْلُ اللهِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَعْتِقْهَا”. رَوَاهُ مَالِكٌ
وَفِي رِوَايَةِ مُسْلِمٍ قَالَ: كَانَتْ لِيْ جَارِيَةٌ تَرْعَى غَنَمًا لَيْ قِبْلَ أُحُدٍ وَالْجَوَانِيَّةِ فَاطَّلَعْتُ ذَاتَ يَوْمٍ فَإِذَا الذِّئْبُ قَدْ ذَهَبَ بِشَاةٍ مِنْ غَنَمِنَا وَأَنَا رَجُلٌ مِنْ بَنِيْ آدَمَ آسَفُ كَمَا يَأْسَفُوْنَ لَكِنْ صَكَكْتُهَا صَكَّةً فَأَتَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَعَظَّمَ ذَلِكَ عَلَيَّ قُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَفَلَا أَعْتِقُهَا؟ قَالَ: “اِئْتِنِيْ بِهَا؟” فَأَتَيْتُهُ بِهَا. فَقَالَ لَهَا: “أَيْنَ اللهُ؟” قَالَتْ: فِي السَّمَاءِ قَالَ: “مَنْ أَنَا؟” قَالَتْ:أَنْتَ رَسُوْلُ اللهِ قَالَ: “أَعْتِقْهَا فَإِنَّهَا مُؤْمِنَةٌ”.
3303. (1) [2/985 –దృఢం]
ము’ఆవియహ్ బిన్ ‘హకమ్ కథనం: ప్రవక్త (స) వద్దకు నేను వెళ్ళి ఓ అల్లాహ్ ప్రవక్తా! నా బానిసరాలు మేకలు మేపేది. ఒకసారి నేను చూడ్డానికి వచ్చాను. ఆ మేకల్లో ఒక మేక కనబడలేదు. ‘ఆ మేక ఏమయిందని’ ఆమెను అడిగాను. దానికి ఆమె ‘తోడేలు తిని వేసిందని’ సమాధానం ఇచ్చింది. ‘నాకు కోపం వచ్చింది. నేను మానవుడ్నే. ఆమెను చెంప చెల్లు మన్నట్టు కొట్టాను. నాపై పరిహారం తప్పనిసరి అయింది. ఇప్పుడు నేను బానిసను విడుదల చేయాలి, నేను ఈ బానిస రాలిని విడుదల చేసి వేయాలా?’ అని విన్నవించుకున్నాను. ప్రవక్త (స) ఆ బానిస రాలిని, ‘అల్లాహ్ ఎక్కడున్నాడు?’ అని అడిగారు. దానికి ఆమె, ‘ఆకాశంలో,’ అని సమాధానం ఇచ్చింది. ఆ తరువాత ప్రవక్త (స) ఆమెను, ‘నేనెవర్ని,’ అని అడిగారు. దానికి ఆమె, ‘తమరు అల్లాహ్ ప్రవక్త (స),’ అని సమాధానం ఇచ్చింది. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు ఈమెను విడుదల చేసి వెయ్యి,’ అని ఆదేశించారు. (మాలిక్, ముస్లిమ్)
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”నా బానిసరాలు నా మేకలను ఉ’హుద్ కొండ మరియు జివానియల మధ్య మేపేది. ఒకసారి మేకలను చూద్దామని నేను అక్కడకు వెళ్ళాను. తోడేలు ఒక మేకను పట్టుకుపోయిందని తెలిసింది. నేనూ మానవుడ్నే, ఇతరులకు వచ్చినట్టు నాకూ కోపం వస్తుంది. నేను బానిసరాలికి చెంపపై కొట్టాను. ఆ తరువాత ప్రవక్త (స) వద్దకు వచ్చి జరిగిన దంతా విన్నవించుకున్నాను. ఆమెను నేను కొట్టడాన్ని ప్రవక్త (స) పెద్ద అపరాధంగా భావించారు. అప్పుడు నేను, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! నేను ఈ బానిసరాలిని విడుదల చేసివేయాలా?’ అని విన్నవించుకున్నాను. ప్రవక్త (స), ‘ఆ బానిసరాలిని నా వద్దకు తెమ్మని’ ఆదేశించారు. నేను ఆమెను తీసుకు వచ్చాను. ప్రవక్త (స) ఆమెను, ‘అల్లాహ్ ఎక్కడున్నాడు,’ అని అడిగారు. ఆమె, ‘ఆకాశంలో,’ అని సమాధానం ఇచ్చింది. మళ్ళీ ప్రవక్త (స), ‘నేను ఎవరను? ‘ అని ప్రశ్నించారు. ఆమె, ‘తమరు అల్లాహ్ ప్రవక్త,’ అని సమాధానం ఇచ్చింది. అప్పుడు ప్రవక్త (స), ‘ఈ బానిసరాలిని విడుదల చేసివేయి, ఎందుకంటే ఈమె విశ్వాసురాలు,’ అని ఆదేశించారు.
هذة الباب خالِ من فصَل الثّاني و الثّالث
ఇందులో రెండవ, మూడవ విభాగాలు లేవు
=====
14- بَابُ اللِّعَانِ
14. శపించటం (అల్—లి‘ఆన్)
లి‘ఆన్ అంటే శపించటం, ఇస్లామీయ షరీఅత్తులో భర్త తన భార్యపై వ్యభిచార నిందవేయటం. భార్య నేను ఆ పని చేయలేదని ఖండిస్తుంది. వీరిరువురి వద్ద తమ ఆత్మలు తప్ప ఇతరులెవ్వరూ సాక్ష్యులు లేరు. ఈ కేసు పాలకుని ముందు పెడితే, పాలకుడు ఇద్దరినీ నచ్చజెప్పి ఇద్దరిలో ఒకరు అసత్యవంతులని అసత్యవాది తన నిర్ణయాన్ని మార్చకోవాలని సలహాఇస్తాడు. ఒకవేళ ఇద్దరూ దీనికి సిద్ధం కాకపోతే పాలకుడు ఇద్దరి నుండి ప్రమాణం తీసుకుంటాడు. ముందు భర్త నుండి నాలుగు సార్లు తన ఆరోపణ సత్యం అని, ఐదవ సారి, ”ఒకవేళ అతడు అసత్యవాది అయితే అతనిపై అల్లాహ్ అభిశాపం పడుగాక!” అని ప్రమాణం తీసుకుంటాడు. అదే విధంగా భార్య నుండి నాలుగు సార్లు తనపై మోపబడిన నింద అసత్యం అని, ఐదవ సారి ”ఒకవేళ ఈ నిందారోపణ నిజమైతే ఆమెపై అల్లాహ్ ఆగ్రహం పడుగాక!” అని ప్రమాణం తీసు కుంటాడు.
భర్త యొక్క ఐదవ ప్రమాణంలో అభిశాపం అనే పదం, భార్య యొక్క ఐదవ ప్రమాణంలో ఆగ్రహం అనే పదం ఉన్నాయి. ఎందుకంటే స్త్రీలు ఆగ్రహం అంటే చాలా భయపడతారు. ఈ సాక్ష్యాలు, ప్రమాణాలు నిందారోపణ శిక్ష, వ్యభిచార శిక్షలకు ప్రతిచర్యలు. ఒకవేళ ప్రమాణాలు చేయక పోతే వ్యభిచార నిందగా 80 కొరడా దెబ్బలు కొట్టబడతాయి. ప్రమాణం చేయటం వల్ల ఈ శిక్షలు క్షమించబడతాయి. ఒకవేళ భార్య ప్రమాణం చేయకపోతే వ్యభిచార నేరం క్రింద మరణ శిక్ష పడుతుంది. ఈ ప్రమాణం చేయటం వల్ల వ్యభిచార శిక్ష తప్పుతుంది. ఈ విధానాన్ని లి‘ఆన్ అంటారు. లి‘ఆన్ తర్వాత పాలకుడు భార్యా భర్తలిద్దరినీ వేరుచేస్తాడు. వీరిద్దరూ మరల కలవలేరు, మళ్ళీ నికా’హ్ కూడా చేసు కోలేరు. లి‘ఆన్ గురించి అల్లాహ్ (త) ఇలా ఆదేశించాడు: ”మరియు ఎవరైతే, తమ భార్యల మీద అపనిందమోపి, దానికి తాము స్వయమే తప్ప ఇతరులను సాక్షులుగా తేలేరో, వారు తమంతట తామే నాలుగు సార్లు అల్లాహ్ పై ప్రమాణం చేసి సాక్ష్య మిస్తూ: నిశ్చయంగా, తాను సత్యం పలుకు తున్నా ననీ; మరియు ఐదవసారి అతడు ఒకవేళ అసత్యం పలుకు తున్నట్లయితే! నిశ్చయంగా, అల్లాహ్ అభి శాపం తనమీద విరుచుకుపడు గాక! అనీ అనాలి. ఇక ఆమె (భార్య) శిక్షను తప్పించు కోవటానికి, నాలుగు సార్లు అల్లాహ్‌పై ప్రమాణం చేస్తూ: నిశ్చ యంగా అతడు అబద్ధంచెబుతున్నాడనీ; మరియు అయిదవ సారి ఒకవేళ అతడు సత్య వంతుడైతే! నిశ్చయంగా, తన మీద అల్లాహ్ ఆగ్రహం విరుచుకు పడుగాక!’ అనీ అనాలి. మరియు మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే! (ఆయన మీ శిక్షను త్వరలోనే తెచ్చే వాడు) మరియు నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీక రించే వాడు, మహా వివేక వంతుడు. (అన్నూర్, 24:6-10)
ఈ ఆయతులలో అల్లాహ్ (త) తమ భార్యలపై నిందారోపణ చేసే భర్తలను శిక్ష నుండి తప్పుకునే మార్గం పేర్కొన్నాడు. ఒకవేళ వారు సాక్ష్యాధారాలు చూపని పక్షంలో లి‘ఆన్ చేసుకోవాలి. లి‘ఆన్ కోసం క్రింది విషయాలు తప్పనిసరి.
1. లి‘ఆన్ అధికారి ముందు జరగాలి, 2. లి‘ఆన్‌కు ముందు అధికారి ఇద్దరికీ నచ్చజెప్పాలి, అర్థం చేసు కునే అవకాశం ఇవ్వాలి, 3. లి‘ఆన్ తర్వాత అధికారి ఇద్దరినీ శాశ్వతంగావిడదీయాలి. అంటే ఎన్నడూ కలవలేరు, పెళ్ళీ చేసుకోలేరు, 4. లి‘ఆన్ వల్ల మహర్ రద్దవదు. ఇవ్వకుండా ఉంటే ఇప్పుడు చెల్లించాలి, ఒకవేళ ఇచ్చి ఉంటే ఇప్పుడు తిరిగి తీసుకోలేడు, 5. లి‘ఆన్ తర్వాత పుట్టిన సంతానం తల్లి ద్వారా గుర్తించబడుతుంది, తండ్రి ద్వారా గుర్తించబడదు, 6. ఆ సంతానాన్ని అక్రమ సంతానంగా అనరాదు, 7. ఒకవేళ భర్త లి‘ఆన్ తిరస్కరిస్తే అతనికి వ్యభిచార నేరశిక్ష విధించ బడుతుంది. ఒకవేళ స్త్రీ నిరాకరిస్తే ఆమెనూ వ్యభిచార నేరం క్రింద శిక్షించటం జరుగుతుంది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3304 – [ 1 ] ( مُتَّفِقٌ عَلَيْهٍ ) (2/986)
عَنْ سَهْلِ بْنِ سَعْدِ السَّاعِدِيِّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: إِنَّ عُوَيْمِرَ الْعَجَلَانِيَّ قَالَ: يَا رَسُوْلَ اللهِ أَرَأَيْتَ رَجُلًا وَجَدَ مَعَ اِمْرَأَتِهِ رَجُلًا أَيَقْتُلُهُ فَيَقْتُلُوْنَهُ؟ أَمْ كَيْفَ يَفْعَلُ؟ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قَدْ أُنْزِلَ فِيْكَ وَفِيْ صَاحِبَتِكَ فَاذْهَبْ فَأْتِ بِهَا”. قَالَ سَهْلٌ: فَتَلَاعَنَا فِي الْمَسْجِدِ وَأَنَا مَعَ النَّاسِ عِنْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَلَمَّا فَرَغَا قَالَ عُوَيْمِرٌ: كَذَبْتُ عَلَيْهَا يَا رَسُوْلَ اللهِ إِنْ أَمْسَكْتُهَا فَطَلَّقَتَهَا ثَلَاثًا. ثُمَّ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اُنْظُرُوْا فَإِنْ جَاءَتْ بِهِ اسْحَمَ ادْعَجَ الْعَيْنَيْنِ عَظِيْمُ الْأَلْيَتَيْنِ خَدَلُجَ السّضاقَيْنِ فَلَا أَحْسِبُ عُوَيْمِرً إِلَّا قَدْ صَدَقَ عَلَيْهَا وَإِنْ جَاءَتْ بِهِ أُحَيْمِرَ كَأَنَّهُ وَحَرَةٌ فَلَا أَحْسِبُ عُوَيْمِرًا إِلَّا قَدْ كَذَبَ عَلَيْهَا فَجَاءَتْ بِهِ عَلَى النَّعْتِ الَّذِيْ نَعَتَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنْ تَصْدِيْقِ عُوَيْمِرٍ فَكَانَ بَعْدُ يُنْسَبُ إِلَى أُمِّهِ. مُتَّفِقٌ عَلَيْهٍ.
3304. (1) [2/986 –ఏకీభవితం]
సహల్ బిన్ స’అద్ సా’యిదీ కథనం: ‘ఉవైమిర్ ‘అజ్లానీ, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ఒకవేళ ఎవరైనా, తన భార్య పరాయి పురుషుడితో వ్యభిచారంచేస్తూ పట్టుబడితే ఏం చేయాలి’ ఒకవేళ అతడు ఆమెను చంపితే, మీరు అతన్ని చంపేస్తారు. మరేం చేయాలి,’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘నీ గురించి, నీ భార్య గురించి ఖుర్ఆన్లో ఆయతులు అవతరించబడ్డాయి. నువ్వు వెళ్ళి ఆమెను తీసుకురా,’ అని అన్నారు. అతడు పిలుచుకు వచ్చాడు. మస్జిద్లో ఇద్దరూ లి‘ఆన్ చేసారు. నేనూ ప్రజలతో పాటు ప్రవక్త (స)కు సమీపంగానే ఉన్నాను. ఇద్దరూ లి‘ఆన్ చేసిన తర్వాత ‘ఉవైమిర్, ‘ఒకవేళ నేను ఈ స్త్రీని ఉంచుకుంటే నేను అసత్యవాదిగా పరిగణించబడతాను,’ అని పలికి అతడు ఆమెకు మూడు ‘తలాఖ్‌లు ఇచ్చివేసాడు. ఆ తరువాత ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”మీరు చూస్తూ ఉండండి. ఈ స్త్రీ గోధుమరంగు, పెద్దపెద్ద కళ్ళు, పెద్ద లింగం గల, మృదువైన పాదాలుగల బిడ్డకు జన్మమిస్తే, ‘ఉవైమిర్ సత్యవంతుడు, స్త్రీ అసత్యవాది. ఒకవేళ ఎర్రగా, పొట్టిగా ఉంటే స్త్రీ సత్యవతి, ఉవైమిర్ అసత్యవాది. ఆ తర్వాత ప్రవక్త (స) చెప్పినట్లు ఆ స్త్రీ బిడ్డకు జన్మం ఇచ్చింది. ‘ఉవైమిర్ సత్యవంతుడిగా తేలాడు. ఆ బిడ్డను స్త్రీకి చెందినదిగా పేర్కొనడం జరిగింది. భర్తకు చెందదని పేర్కొనడం జరిగింది. (బు’ఖారీ, ముస్లిమ్)
3305 – [ 2 ] ( متفق عليه ) (2/987)
وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم لَاعَنْ بَيْنَ رَجُلٍ وَاِمْرَأَتِهِ فَانْتَقَى مِنْ وَلَدِهَا فَفَرَّقَ بَيْنَهُمَا وَأَلْحَقَ الْوَلَدَ بِالْمَرْأَةِ. مُتَّفَقٌ عَلَيْهِ.
وَفِيْ حَدِيْثِهِ لَهُمَا أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَعَظَهُ وَذَكَّرَهُ وَأَخْبَرَهُ أَنَّ عَذَابَ الدُّنْيَا أَهْوَنٌ مِنْ عَذَابِ الْآخِرَةِ ثُمَّ دَعَاهَا فَوَعَظَهَا وَذَكَّرَهَا وَأَخْبَرَهَا أَنَّ عَذَابَ الدُّنْيَا أَهْوَنُ مِنْ عَذَابِ الْآخِرَةِ .
3305. (2) [2/987 –ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక జంట మధ్య లి‘ఆన్ చేయించారు. ఇంకా అతని అబ్బాయిని అతన్నుండి వేరుచేసివేసారు. అబ్బాయి గుర్తింపు తల్లివైపు చేయించారు. ఇద్దరినీ వేరుచేసారు. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) భర్తను ఇహపరలోకాల శిక్షలను గురించి హెచ్చరించారు. ఇహలోక శిక్ష పరలోక శిక్షకంటే తేలికైనదని హితబోధ చేసారు. అదేవిధంగా భార్యకు కూడా ఇహలోక శిక్ష పరలోక శిక్షకంటే తేలికైనదని బోధించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
3306 – [ 3 ] ( صحيح ) (2/987)
وَعَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ لُلْمُتَلَاعِنَيْنِ: “حِسَابُكُمَا عَلَى اللهِ أَحَدُكُمَا كَاذِبٌ لَا سَبِيْلَ لَكَ عَلَيْهَا” .قَالَ: يَا رَسُوْلَ اللهِ مَالِيْ قَالَ: “لَا مَالَ لَكَ إِنْ كُنْتَ صَدَقْتَ عَلَيْهَا فَهُوَ بِمَا اسْتَحَلَلْتَ مِنْ فَرْجِهَا وَإِنْ كُنْتَ كَذَبْتَ عَلَيْهَا فَذَاكَ أَبْعَدُ وَأَبْعَدُ لَكَ مِنْهَا”.
3306. (3) [2/987 –దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ”ప్రవక్త (స) లి‘ఆన్ కోసం సిద్ధపడిన ఇద్దరు భార్యాభర్తలతో ‘మీ ఇద్దరి విచారణ అల్లాహ్‌పై ఉంది, మీ ఇద్దరిలో ఒకరు అసత్యవాది, ఇప్పుడు ఈ స్త్రీ నీతో ఉండటానికి తగదు’ ” అని అన్నారు. దానికి ఆ వ్యక్తి ఓ ప్రవక్తా! నేను మహర్లో కొంత ధనం ఇచ్చాను. అది నాకు తిరిగి రావాలి అని అన్నాడు.’ఒకవేళ నీవు నీతిమంతుడవైతే, నీవు ఆమె మర్మాంగం ద్వారా లాభం పొందావు. ఆమె మర్మాంగాన్ని నీవు ధర్మసమ్మతం చేసుకున్నావు. ఆ ధనం నీకు మరి దక్కదు. ఒక వేళ నీవు నీచుడవైతే అసత్యపు అపనిందవేసి ధనం తీసుకోవటం చాలా నీచమైన పని,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
3307 – [ 4 ] ( صحيح ) (2/987)
وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ هِلَالَ بْنَ أُمَيَّةَ قَذَفَ اِمْرَأَتَهُ عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم بِشَرِيْكِ بْنِ سَحْمَاءَ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “اَلْبَيِّنةَ أَوْ حَدًّا فِيْ ظَهْرِكَ”. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِذَا رَأَى أَحَدُنَا عَلَى اِمْرَأَتِهِ رَجُلًا يَنْطَلِقُ يَلْتَمِسُ الْبَيِّنَةَ؟ فَجَعَلَ النَّبِيُّ صلى الله عليه وسلم يَقُوْلُ: “الْبَيِّنَةَ وَإِلَّا حَدُّ فِيْ ظَهْرِكَ”. فَقَالَ هِلَالٌ: وَالَّذِيْ بَعَثَكَ بِالْحَقِّ إِنِّيْ لَصَادِقٌ فَلْيُنْزِلَنَّ اللهُ مَا يُبْرِئُ ظَهْرِيْ مِنَ الْحَدِّ فَنَزَلَ جِبْرِيْلُ وَأُنْزِلَ عَلَيْهِ: (وَالَّذِيْنَ يَرْمُوْنَ أَزْوَاجَهُمْ؛ 24: 6) فَقَرَأَ حَتَّى بَلَغَ (إِنْ كَانَ مِنَ الصَّادِقِيْنَ) فَجَاءَ هِلَالٌ فَشَهِدَ وَالنَّبِيُّ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ اللهَ يَعْلَمُ أَنَّ أَحَدَكُمَا كَاذِبٌ فَهَلْ مِنْكُمَا تَائِبٌ؟” ثُمَّ قَامَتْ فَشَهَدَتْ فَلَمَّا كَانَتْ عِنْدَ الْخَامِسَةِ وَقِّفُوْهَا وَقَالُوْا: إِنَّهَا مُوْجِبَةٌ. فَقَالَ ابْنُ عَبَّاسٍ: فَتَلَكَّأَتْ وَنَكَصَتْ حَتَّى ظَنَّنَا أَنَّهَا تَرْجِعُ ثُمَّ قَالَتْ: لَا أُفْضَحُ قَوْمِيْ سَائِرَ الْيَوْمِ فَمَضَتْ. وَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “أَبْصِرُوْهَا فَإِنْ جَاءَتْ بِهِ أَكْحَلَ الْعَيْنَيْنِ سَابِغَ الْأَلْيَتَيْنِ خَدَلَّجَ السَّاقَيْنِ فَهُوَ لِشَرِيْكِ بْنِ سَحْمَاءَ”. فَجَاءَتْ بِهِ كَذَلِكَ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “لَوْلَا مَا مَضَى مِنْ كِتَابِ اللهِ لَكَانَ لِيْ وَلَهَا شَأْنٌ”. رَوَاهُ الْبُخَارِيُّ
3307. (4) [2/987– దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: హిలాల్ బిన్ ఉమయ్య ప్రవక్త (స) ముందు తన భార్యపై షరీక్ బిన్ సమ్హాతో అక్రమ సంబంధం ఉందని అపనిందవేసాడు. అప్పుడు ప్రవక్త (స) ‘నలుగురు సత్య సాక్ష్యుల్ని తెమ్మని, లేక పోతే నీ వీపుపై అపనిందకు తగిన శిక్ష పడుతుందని’ అన్నారు. అప్పుడు హిలాల్ బిన్ ఉమయ్య, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! తన భార్యను చెడు పని చేస్తూ ఉండగా చూచి ఎవడైనా సాక్ష్యులు వెదకటానికి వెళతాడా?’ అంటే ఇటువంటి సమయంలో ఆ అవకాశం ఎక్కడ దొరుకుతుంది అని అన్నాడు. కాని ప్రవక్త (స) మాత్రం, ‘సాక్ష్యుల్ని తీసుకురా లేదా నీ వీపుపై దానికి తగిన శిక్ష పడుతుంది,’ అని అన్నారు. దానికి హిలాల్ బిన్ ఉమయ్య, ‘మిమ్మల్ని సత్యం ఇచ్చి పంపిన ఆ అల్లాహ్ సాక్షి! నిజంగా నేను సత్యం పలుకుతున్నాను. అల్లాహ్ తప్పకుండా ఏదో ఒక ఆదేశం పంపుతాడు. దానివల్ల నా వీపు శిక్ష పడకుండా తప్పుతుంది,’ అని అన్నాడు. ఆ తరువాత జిబ్రీల్ (అ) ఆకాశం నుండి దిగి ప్రవక్త (స) పై ఈ ఆయతులను అవతరింప జేసారు. ఈ ఆయతులను పఠించి వినిపించారు. హిలాల్ బిన్ ‘ఉమయ్యహ్ వచ్చి ప్రవక్త (స)ముందు లి‘ఆన్ చేసారు. ఇందులో ఐదు సార్లు సాక్ష్యం ఇచ్చారు. అప్పుడు ప్రవక్త (స) మీ ఇద్దరిలో ఒకరు అసత్యవాది అని, మరొకరు సత్యవంతులని మీలో ఎవరైనా పశ్చాత్తాపం చెందుతారా?’ అని అన్నారు. ఆ తరువాత ఆ స్త్రీ నిలబడి నాలుగు సార్లు సాక్ష్యం ఇచ్చింది. ఐదవసారి సాక్ష్యం ఇచ్చినపుడు ఆ స్త్రీని ఆపండి అని అన్నారు. ప్రవక్త అనుచరులు ఆ స్త్రీతో, ‘ఈ శాపం నీపై తప్పనిసరి అవుతుంది,’ అని అన్నారు. ఆమె కొంత వెనక్కి తగ్గింది. సందిగ్ధంలో పడిపోయింది. ఆమె నిర్ణయం మార్చుకుంటుందని అనుకున్నాం. ఆ తరువాత ఆ స్త్రీ ”నేను భర్తనూ వారి కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయను,” అని అన్నది. ఆమె ఐదవసారి కూడా సాక్ష్యం ఇచ్చింది. లి‘ఆన్ అయిన తర్వాత ప్రవక్త (స) ప్రజలతో మీరు చూస్తూ ఉండండి ఈమె ద్వారా గోదుమ రంగుగల, లావు మర్మాంగం, దుడ్డు పాదాలు గల బిడ్డ జన్మిస్తే ఆ బిడ్డ షరీక్ బిన్ సమ్హాకు చెందినవాడు. ఎందుకంటే అతను కూడా ఇటువంటి వాడే. అయితే ఆ స్త్రీకి అటు వంటి బిడ్డే జన్మించాడు. అప్పుడు ప్రవక్త (స), ‘ఒకవేళ ఖుర్ఆన్లో లి‘ఆన్ ఆదేశం రాకుండా ఉంటే ఈమెకు మరణశిక్ష విధించే వాడిని,’ అని అన్నారు. (బు’ఖారీ)
3308 – [ 5 ] ( صحيح ) (2/988)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ سَعْدُ بْنُ عُبَادَةَ: لَوْ وَجَدْتُّ مَعَ أَهْلِيْ رَجُلًا لَمْ أَمَسَّهُ حَتَّى آتِيَ بِأَرْبَعَةِ شُهَدَاءَ؟ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم: “نَعَمْ” قَالَ: كَلَّا وَالَّذِيْ بَعَثَكَ بِالْحَقِّ إِنْ كُنْتُ لَأُعَاجِلُهُ بِالسَّيْفِ قَبْلَ ذَلِكَ. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِسْمَعُوْا إِلَى مَا يَقُوْلُ سَيِّدُكُمْ إِنَّهُ لَغَيُوْرٌوَأَنَا أَغْيَرُمِنْهُ وَاللهِ أَغْيَرُ مِنِّيْ”. رَوَاهُ مُسْلِمٌ .
3308. (5) [2/988 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: స’అద్ బిన్ ‘ఉబాదహ్ (ర) ఇలా అన్నారు: ”ఒకవేళ నేను నా భార్యతో ఎవరి నైనా పాపకార్యం చేస్తూ చూస్తే వారిని నాలుగు సాక్ష్యులను తెచ్చేవరకు ముట్టుకోను.” దానికి ప్రవక్త (స) ‘అవును నలుగురు సాక్ష్యులను తీసుకురా,’ అని అన్నారు. దానికి అతడు, ‘ఎంత మాత్రం కాదు మిమ్మల్ని సత్యంతో పంపిన అల్లాహ్ సాక్షి! నేను సాక్ష్యాలు తీసుకురావడానికి ముందే ఆ వ్యక్తిని నరికి వేస్తాను,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ”వింటున్నారా మీ నాయకుడు ఏమంటు న్నాడో! అవును ఇతడు చాలా పౌరుషం గలవారు, నేను ఇతని కంటే పౌరుషం గలవాడిని, అల్లాహ్ నా కంటే పౌరుషం కలవాడు!” అంటే, ‘ఇటువంటి పదాలు పౌరుషం వల్ల పలుకుతున్నాడు, ‘ అని అన్నారు. (బు’ఖారీ)
3309 – [ 6 ] ( متفق عليه ) (2/988)
وَعَنِ الْمُغِيْرَةِ قَالَ: قَالَ سَعْدُ بْنُ عُبَادَةَ: لَوْ رَأَيْتُ رَجُلًا مَعَ اِمْرَأَتِيْ لَضَرَبْتُهُ بِالسَّيْفِ غَيْرَ مُصْفِحٍ فَبَلَغَ ذَلِكَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “أَتَعْجَبُوْنَ مِنْ غَيْرَةِ سَعْدٍ؟ وَاللهِ لَأَنا أَغْيَرُ مِنْهُ وَاللهِ أَغْيَرُ مِنِّيْ وَمِنْ أَجَلِ غَيْرَةِ اللهِ حَرَّمَ اللهُ الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ وَلَا أَحَدَ أَحَبُّ إِلَيْهِ الْعُذْرُ مِنَ اللهِ مِنْ أَجْلِ ذَلِكَ بَعَثَ الْمُنْذِرِيْنَ وَالْمُبَشِّرِيْنَ وَلَا أَحَدَ أَحَبُّ إِلَيْهِ الْمِدْحَةُ مِنَ اللهِ وَمِنْ أَجْلِ ذَلِكَ وَعَدَ اللهُ الْجَنَّةَ”.
3309. (6) [2/988 –ఏకీభవితం]
ము’గీరహ్ (ర) కథనం: ”ఒకవేళ నా భార్య పరాయి వ్యక్తితో పాపకార్యం చేస్తూ నాకు పట్టుబడితే, కరవాలంతో ఆమెను నరికివేస్తాను,” అని స’అద్ బిన్ ‘ఉబాదహ్ అన్నారు. ఈ వార్త ప్రవక్త (స)కు తెలిసింది. దానికి ప్రవక్త (స), ”స’అద్ పౌరుషంపై మీరు ఆశ్చర్యపడు తున్నారా? అల్లాహ్ సాక్షి! నేను అతనికంటే పౌరుషం గలవాడిని, అల్లాహ్ (త) నా కంటే పౌరుషం గలవాడు. ఈ పౌరుషం వల్లే అల్లాహ్ (త) అన్నీ అంతర్గత బహిర్గత చెడులన్నిటినీ నిషేధించాడు. అల్లాహ్ (త) హెచ్చరించే శుభవార్తలు ఇచ్చే ప్రవక్తలను పంపాడు. అల్లాహ్‌కు ప్రశంసలంటే ఇష్టం. అందుకే తనను ప్రశంసించే వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తానని వాగ్దానంచేసాడు’ అని అన్నారు.” (బు’ఖారీ, ముస్లిమ్)
3310 – [ 7 ] ( متفق عليه ) (2/989)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ تَعَالى يُغَارُ وَإِنَّ الْمُؤْمِنَ يَغَارُ وَغَيْرَةُ اللهِ أَنْ لَا يَأْتِيَ الْمُؤْمِنُ مَا حَرَّمَ اللهُ”.
3310. (7) [2/989 – ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ (త) పౌరుషం చూపుతాడు, విశ్వాసులు కూడా పౌరుషం చూపుతారు. అల్లాహ్ పౌరుషం ఏమిటంటే అల్లాహ్ నిషేధించిన దాన్ని ఏ విశ్వాసి చేయకూడదు. (బు’ఖారీ, ముస్లిమ్)
3311 – [ 8 ] ( متفق عليه ) (2/989)
وَعَنْهُ أَنَّ أَعْرَابِيًّا أَتَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: إِنَّ اِمْرَأَتِيْ وَلَدَتْ غُلَامًا أَسْوَدَ وَإِنِّيْ اَنْكَرْتُهُ. فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَلْ لَكَ مِنْ إِبِلٍ؟” قَالَ: نَعَمْ قَالَ: “فَمَا أَلْوَانُهَا؟” قَالَ: حُمْرٌ قَالَ: “هَلْ فِيْهَا مِنْ أَوْرَقَ؟” قَالَ: إِنَّ فِيْهَا لَوُرْقًا. قَالَ: ” فَأَنَّى تُرى ذَلِكَ جَاءَهَا؟” قَالَ: عِرْقٌ نَزَعَهَا. قَالَ: “فَلَعَلَّ هَذَا عِرْقٌ نَزَعَهُ” وَلَمْ يُرَخِّصْ لَهُ فِي الْاِنْتِفَاءِ مِنْهُ.
3311. (8) [2/989 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ఒక నిరక్షరాసి వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘నా భార్యకు నల్లరంగు గల బిడ్డ జన్మించాడు. వాడు నా బిడ్డ కాదని నేను వాదిస్తున్నాను. ఎందుకంటే నేను ఎర్రగా ఉన్నాను. ఆ బిడ్డ రంగు నల్లగా ఉంది,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘నీ వద్ద ఒంటెలు ఉన్నాయా,’ అని అడిగారు. దానికి ఆ వ్యక్తి ‘అవును’ అని అన్నాడు. ‘ఒంటెలు ఏ రంగులో ఉన్నాయి’ అని అడిగారు. ఆ వ్యక్తి ‘ఎర్రగా’ అని అన్నాడు. ప్రవక్త (స) ‘వాటిలో మచ్చ లున్నవి, ఖాకీ రంగు గలవి కూడా ఉన్నాయా’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి ‘అవును’ అన్నాడు. ప్రవక్త (స) ‘ఈ రంగు ఎక్కడి నుండి వచ్చింది, అంటే ఒంటెలన్నీ ఎర్రగా ఉంటే మచ్చలున్నవి, నల్లవి ఎక్కడి నుండి పుట్టాయి?’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి ‘ఆడ ఒంటె నరం లోపమయి ఉంటుంది’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) ‘నీ కొడుకు పరిస్థితి కూడా ఏదైనా నరం లోపమయి ఉంటుంది’ ” అని అన్నారు.[91] (బు’ఖారీ)
3312 – [ 9 ] ( متفق عليه ) (2/989)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ عُتْبَةُ بْنُ أَبِيْ وَقَّاصٍ عَهِدَ إِلَى أَخِيْهِ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ: أَنَّ ابْنَ وَلِيْدَةَ زَمْعَةَ مِنِّيْ فَاقْبِضُهُ إِلَيْكَ فَلَمَّا كَانَ عَامُ الْفَتْحِ أَخَذَهُ سَعْدٌ فَقَالَ: إِنَّهُ ابْنُ أَخِيْ وَقَالَ عَبْدُ بْنُ زَمْعَةَ: أَخِيْ فَتَسَاوَقَا إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ سَعْدٌ: يَا رَسُوْلَ اللهِ إِنَّ أَخِيْ كَانَ عَهِدَ إِلَيَّ فِيْهِ وَقَالَ عَبْدَ بْنَ زَمْعَةَ: أَخِيْ وَابْنُ وَلِيْدَةِ أَبِيْ وُلِدَ عَلَى فِرَاشِهِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هُوَ لَكَ يَا عَبْدَ بْنَ زَمْعَةَ الْوَلَدُ لِلْفَرَاشِ وَلِلْعَاهِرِ الْحَجَرُ”. ثُمَّ قَالَ لِسَوْدَةَ بِنْتِ زَمْعَةَ: “اِحْتَجِبِيْ مِنْهُ”. لَمَّا رَأَى مِنْ شَبْهِهِ بِعُتْبَةَ فَمَا رَآهَا حَتَّى لَقِيَ اللهَ وَفِيْ رِوَايَةٍ: قَالَ: “هُوَ أَخُوْكَ يَا عَبْدَ بْنَ زَمْعَةَ مِنْ أَجَلِ أَنَّهُ وُلِدَ عَلَى فِرَاشِ أَبِيْهِ”
3312. (9) [2/989– ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ” ‘ఉత్బహ్ బిన్ అబీ వఖ్ఖా‘స్ తన మరణానికి ముందు, తన సోదరుడు స‘అద్ బిన్ అబీ వఖ్ఖాస్తో, ‘జుమ్’అహ్ బానిసరాలి కొడుకు నా వీర్యం నుండి జన్మించాడు, అతన్ని నువ్వు తీసుకో’అని వాగ్మూలం ఇచ్చాడు. ‘ఆయి’షహ్ (ర) అన్నారు, మక్కహ్ విజయం జరిగినపుడు స’అద్ ఆ బిడ్డను తీసుకున్నాడు, వీడు నా అన్న కొడుకు, నా అన్న నాతో, ‘వీడు నా వీర్యం నుండి జన్మించాడని’ అన్నాడు. అక్కడ ఉన్న ‘ఉత్బహ్ బిన్ జుమ్’అహ్ నిలబడి, ‘ఈ అబ్బాయి నా సోదరుడు, నా తండ్రి బానిసరాలి కొడుకు, ఇంకా నా తండ్రి పడకపై జన్మించాడు,’ అని అన్నాడు. ఇద్దరూ అంటే స‘అద్ మరియు ‘ఉత్బహ్ బిన్ జుమ్’అహ్ వివాదపడుతూ ప్రవక్త (స) వద్దకు వచ్చారు. స’అద్ ఈ బిడ్డ నా సోదరుని బిడ్డ అని, ఇతన్ని తీసుకోమని నా సోదరుడు మరణించటానికి ముందు వాంఙ్మూలం ఇచ్చాడని వాదించాడు. ‘ఉత్బహ్ బిన్ జుమ్’అహ్ ఇతడు నా సోదరుడు, నా తండ్రి బానిసరాలి కొడుకు, అతడి పడకపై జన్మించాడు,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) ”ఓ ‘ఉత్బహ్ బిన్ జుమ్’అహ్, ఆ అబ్బాయి నీకు దక్కుతాడు,” అని పలికి ప్రవక్త (స) ఎవరి భార్య లేదా బానిసరాలికి జన్మించిన బిడ్డ అతనికే చెందుతాడు. ఇంకా వ్యభిచారికి రాళ్ళ శిక్ష ఉంది. అంటే అతనిని రాళ్ళతో కొట్టి చంపటం జరుగుతుంది అని పలికారు. తరువాత ప్రవక్త (స) తన భార్య సౌదహ్ బిన్తె జుము‘అహ్ తో, ‘ఆ బిడ్డ నుండి తెరచాటుగా ఉండు,’ అని ఆదేశించారు. ఎందుకంటే, ఆ అబ్బాయి ముఖ కవళికలు ‘ఉత్బతో కలుస్తాయి. ఆ యువకుడ్ని సౌద (ర) మరణించే వరకు చూడలేదు.[92] (బు’ఖారీ, ముస్లిమ్)
3313 – [ 10 ] ( متفق عليه ) (2/989)
وَعَنْهَا قَالَتْ: دَخَلَ عَلَيَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ذَاتَ يَوْمٍ وَهُوَ مَسْرُوْرٌ. فَقَالَ: “أَيْ عَائِشَةُ أَلَمْ تَرَيْ أَنَّ مُجَزِّزًا الْمُدْلَجِيَّ دَخَلَ فَلَمَّا رَأَى أُسَامَةَ وَزَيْدًا وَعَلَيْهِمَا قَطِيْفَةً قَدْ غَطّيَا رُؤُوْسَهُمَا وَبَدَتْ أَقْدَامُهُمَا فقَالَ: إِنَّ هَذِهِ الْأَقْدَامَ بَعْضُهَا مِنْ بَعْضٍ”.
3313. (10) [2/989 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ఒకరోజు ప్రవక్త (స) సంతోషంతో నా వద్దకు వచ్చారు. నాతో ఇలా అన్నారు, ”ఓ ‘ఆయి’షహ్! ఈ విషయం నీకు తెలియదా? ముజ’జ్జి’జ్ ముద్‌లజీ ఇప్పుడిప్పుడే మస్జిద్‌లోనికి ప్రవేశించాడు. అతడు ఉసామహ్ మరియు ‘జైద్‌లను మస్జిద్లో నిద్రపోతుండటం చూసాడు. వారిద్దరిపై ఒక దుప్పటి ఉంది. వారి తలలు కప్పబడి ఉన్నాయి, కాళ్ళు మాత్రం తెరచి ఉన్నాయి. అది చూచి అతడు వీరిద్దరి పాదాలు ఒకరివి మరొకరితో పోలి ఉన్నాయి’ అని అన్నాడు.” [93] (బు’ఖారీ, ముస్లిం)
3314 – [ 11 ] ( متفق عليه ) (2/990)
وَعَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ وَأَبِيْ بَكْرَةَ قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنِ ادَّعَى إِلَى غَيْرِ أَبِيْهِ وَهُوَ يَعْلَمُ أَنَّهُ غَيْرَ أَبِيْهِ فَالْجَنَّةُ عَلَيْهِ حَرَامٌ”.
3314. (11) [2/990 –ఏకీభవితం]
స’అద్ బిన్ అబీ వఖ్ఖా’స్, అబూ బక్ర్ల కథనం: ప్రవక్త (స), ”తన తండ్రిని వదలి మరోవ్యక్తిని తన తండ్రిగా గుర్తించే వ్యక్తికి స్వర్గం నిషేధించబడింది,” అని ప్రవచించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
3315 – [ 12 ] ( متفق عليه ) (2/990)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَرْغَبُوْا عَنْ آبَائِكُمْ فَمَنْ رَغِبَ عَنْ أَبِيْهِ فَقَدْ كَفَرَ”. وَذُكِرَ حَدِيْثُ عَائِشَةَ “مَا مِنْ أَحَدٍ أَغْيَرُمِنَ اللهِ” فِيْ”بَابِ صَلَاةِ الْخسُوْفِ” .
3315. (12) [2/990 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ఆదేశించారు, ”ఓ ప్రజలారా! మీరు మీ తండ్రులను తిరస్కరించకండి. అంటే కన్నతండ్రిని తిరస్కరించ కండి. తన కన్న తండ్రిని తిరస్కరించినవాడు అంటే, ‘ఇతడు నా తండ్రి కాడు,’ అని ఇతరుల్ని తన తండ్రిగా గుర్తించేవాడు అవిశ్వాసానికి పాల్పడినట్లే.” [94] (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3316 – [ 13 ] ( لم تتم دراسته ) (2/990)
عَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّهُ سَمِعَ النَّبِيُّ صلى الله عليه وسلم يَقُوْلُ لَمَّانَزَلَتْ آيَةُ الْمَلَاعَنَةِ: “أَيُّمَا امْرَأَةٍ أَدْخَلَتْ عَلَى قَوْمٍ مَنْ لَيْسَ مِنْهُمْ فَلَيْسَتْ مِنَ اللهِ فِيْ شَيْءٍ وَلَنْ يُدْخِلَهَا اللهُ جَنَّتَهُ وَأَيُّمَا رَجُلٍ جَحَدَ وَلَدَهُ وَهُوَ يَنْظُرُ إِلَيْهِ اِحْتَجَبَ اللهُ مِنْهُ وَفَضَحَهُ عَلَى رُؤُوْسِ الْخَلَائِقِ فِي الْأَوَّلِيْنَ وَالْآخِرِيْنَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ
3316. (13) [2/990– అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: లి‘ఆన్‌కు సంబం ధించిన ఆయతులు అవతరించబడినపుడు ప్రవక్త (స)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”సంబంధంలేని వర్గంలోనికి బిడ్డను చేర్చుకున్న స్త్రీ నమ్మదగినది కాదు. అల్లాహ్ (త) ఎంతమాత్రం ఆమెను తన స్వర్గంలోనికి వెళ్ళనివ్వడు. అదేవిధంగా చూసి కూడా తన బిడ్డను తిరస్కరించిన వ్యక్తికి అల్లాహ్ తన దర్శన భాగ్యం ప్రసాదించడు. ఇంకా అతన్ని విశ్వ సృష్టితాల ముందు నీచ అవమానానికి గురిచేస్తాడు.” [95] (అబూ దావూద్, నసాయి’, దార్మి)
3317 – [ 14 ] ( لم تتم دراسته ) (2/990)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: إِنَّ لِيْ اِمْرَأَةٌ لَا تَرُدُّ يَدَ لَامِسٍ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “طَلِّقْهَا”. قَالَ: إِنِّيْ أُحِبُّهَا. قَالَ: “فَأَمْسِكْهَا إِذَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَقَالَ النَّسَائِيُّ: رَفَعَهُ أَحَدُ الرُّوَاةِ إِلَى ابْنِ عَبَّاسٍ وَأَحَدُهُمْ لَمْ يَرْفَعْهُ. قَالَ: وَهَذَا الْحَدِيْثُ لَيْسَ بِثَابِتٍ.
3317. (14) [2/990 –అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి ‘నా భార్య ఎవరు కోరితే వాళ్ళతో సహకరిస్తుంది,’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘అయితే ఆమెకు ‘తలాఖ్ ఇచ్చివేయి,’ అని అన్నారు. అప్పుడా వ్యక్తి, ‘ఆమె అంటే నాకు ఎంతో ఇష్టం,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘అయితే ఆమెను కనిపెట్టి ఉంచు,’ అని అన్నారు.[96] (అబూ దావూద్, నసాయి’)
3318 – [ 15 ] ( لم تتم دراسته ) (2/991)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَضَى أَنّ كُلَّ مُسْتَحْلَق اِسْتُحْلِقَ بَعْدَ أَبِيْهِ الَّذِيْ يُدْعَى لَهُ ادَّعَاهُ وَرَثَتُهُ فَقَضَى أَنَّ كُلَّ مَنْ كَانَ مِنْ أَمَةٍ يَمْلِكُهَا يَوْمَ أَصَابَهَا فَقَدْ لَحِقَ بِمَنِ اسْتَحْلَقَهُ وَلَيْسَ لَهُ مِمَّا قُسِمَ قَبْلَهُ مِنَ الْمِيْرَاثِ شَيْءٌ وَمَا أَدْرَكَ مِنْ مِيْرَاثٍ لَمْ يُقْسَمْ فَلَهُ نَصِيْبُهُ وَلَا يُلْحِقُ إِذَا كَانَ أَبُوْهُ الَّذِيْ يُدْعَى لَهُ أَنْكَرَهُ فَإِنْ كَانَ مِنْ أَمَةٍ لَمْ يَمْلِكْهَا أَوْ مِنْ حُرَّةٍ عَاهَرَ بِهَا فَإِنَّهُ لَا يَلْحَقُ بِهِ وَلَا يَرِثُ وَإِنْ كَانَ الَّذِيْ يُدْعَى لَهُ هُوَ الَّذِيْ اِدَّعَاهُ فَهُوَ وَلَدُ زَنْيَةٍ مِنْ حُرَّةٍ كَانَ أَوْ أَمَةٍ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3318. (15) [2/991–అపరిశోధితం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి తాతల ద్వారా కథనం: ప్రవక్త (స), తండ్రి చనిపోయిన బిడ్డ గురించి అతని వారసులు – ఆ బిడ్డ ఫలానా వ్యక్తి బిడ్డ అని – వాదించిన బిడ్డ గురించి తీర్పు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆ తీర్పు ఏమిటంటే బానిసరాలితో సంభోగం చేసినపుడు అతడు ఆమె యజమానిగా ఉంటే ఆ పుట్టిన బిడ్డ అతనికే చెందుతాడు. అతనికి వారసుడు కూడా అవుతాడు. ఆ బిడ్డ జన్మించటానికి ముందు పంచబడిన ధనం నుండి ఆ బిడ్డకు ఏమీ లభించదు. ఇంకా పంచబడకుండా ఉన్న ఆస్తిలో అతని వంతు ఉంది. ఇంకా తండ్రి తిరస్కరించిన బిడ్డ, అతని బిడ్డగా పరిగణించబడడు. ఆ బిడ్డ, అతడు సంభోగం చేసిన బానిస రాలికి పుట్టినా సరే, ఎందుకంటే అతడు ఆమెకు యజమాని కాడు గనక. అదేవిధంగా స్వతంత్ర స్త్రీతో సంభోగంచేస్తే ఆ బిడ్డ అతనికి చెందడు. అతని ఆస్తికీ వారసుడుకాడు. అతడు చెప్పినా అతని వారసులు చెప్పినా సరే. ఆ బిడ్డ అక్రమ సంతానం అనబడతాడు. ఆ బిడ్డ బానిసరాలికి జన్మించినా, స్వతంత్ర స్త్రీకి జన్మించినా సరే. (అబూ దావూద్)
3319 – [ 16 ] ( لم تتم دراسته ) (2/991)
وَعَنْ جَابِرِبْنِ عَتِيْكٍ أَنَّ نَبِيَّ الله صلى الله عليه وسلم قَالَ: “مِنَ الْغَيْرَةِ مَا يُحِبُّ اللهُ وَمِنْهَا مَا يُبْغِضُ اللهُ فَأَمَّا الَّتِيْ يُحِبُّهَا اللهُ فَالْغَيْرَةُ فِي الرِّيْبَةِ وَأَمَّا الَّتِيْ يُبْغِضُهَا اللهُ فَالْغَيْرَةُ فِيْ غَيْرِ رِيْبَةٍ وَإِنَّ مِنَ الْخُيَلَاءِ مَا يُبْغِضُ اللهُ وَمِنْهَا مَا يُحِبُّ اللهُ فَأَمَّا الْخُيَلَاءُ الَّتِيْ يُحِبُّ اللهُ فَاخْتِيَالُ الرَّجُلِ عِنْدَ الْقِتَالِ وَاخْتِيَالُهُ عِنْدَ الصَّدَقَةِ وَأَمَّا الَّتِيْ يُبْغِضُ اللهُ فَاخْتِيَالُهُ فِي الْفَخْرِ”.
وَفِيْ رِوَايَةٍ: “فِي الْبَغْيِ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ
3319. (16) [2/991–అపరిశోధితం]
జాబిర్ బిన్ ‘అతీక్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: పౌరుషం అనేక రకాలుగా ఉంది. వాటిలో ఒకటి ఏమిటంటే అల్లాహ్ (త)కు అదంటే చాలా ఇష్టం. మరొకటి అల్లాహ్‌కు అదంటే చాలా అసహ్యం. అంటే దాన్ని తప్పుగా భావిస్తాడు. అల్లాహ్‌కు ఇష్టమైన పౌరుషం అనుమానం, సందేహాల సందర్భం. ఉదా: భార్య లేదా బానిసరాలిపై వారు పరాయి వ్యక్తులతో సంబంధం ఏర్పరచుకున్నారేమో అని అనుమా నించడం. ఇంకా అల్లాహ్ ఇష్టపడని పౌరుషం ఏమిటంటే అనుమానం సందేహం వల్ల కాదు. అనవసరంగా అనుమానించడం. అదేవిధంగా గర్వం అహంకారంలో కూడా అనేక రకాలున్నాయి. కొన్ని రకాల గర్వం అల్లాహ్‌కు ఇష్టం. మరికొన్ని రకాల గర్వం అల్లాహ్‌కు ఇష్టంలేదు. అల్లాహ్‌కు ఇష్టమైన గర్వం యుద్ధంలో బహిర్గతమౌతుంది. అంటే జిహాద్లో శత్రువులతో పోరాడినప్పుడు దూసుకుపోతూ తన్ను తాను గొప్పగా ప్రదర్శించాలి. అదేవిధంగా దాన ర్మాలు చేసేటప్పుడు కూడా తన గొప్పతనాన్ని ప్రదర్శించాలి. దానివల్ల ఇతరులు కూడా దానధర్మాల్లో ముందడుగు వేస్తారు. అదేవిధంగా అల్లాహ్‌కు ఇష్టంలేని గర్వం అంటే అత్యాచారాలు, వంశ ప్రతిష్ఠల సందర్భాల్లో ప్రదర్శించే గర్వం. (అ’హ్మద్, అబూ దావూద్, నసాయి’)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3320 – [ 17 ] ( لم تتم دراسته ) (2/991)
عَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: قَامَ رَجُلٌ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَّ فُلَانًا اِبْنِيْ عَاهَرْتُ بِأُمِّهِ فِي الْجَاهِلِيَّةِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا دَعْوَةَ فِي الْإِسْلَامِ ذَهَبَ أَمْرُ الْجَاهِلِيَّةِ اَلْوَلَدُ لِلْفِرَاشِ وَلِلْعَاهِرِ الْحَجَرُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3320. (17) [2/991–అపరిశోధితం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి తాతల ద్వారా, కథనం: ఒక వ్యక్తి నిలబడి, ”ఓ అల్లాహ్ ప్రవక్తా! ఫలానా యువకుడు నా కొడుకు, అజ్ఞాన కాలంలో నేను వాడి తల్లితో వ్యభిచారం చేసాను,” అని అన్నాడు. దానికి రసూల్ (స) అన్నారు: ”ఇస్లామ్‌లో ఇటువంటి వాదనల వల్ల బంధుత్వం వర్తించదు. అజ్ఞాన కాలం నాటి విషయాలు అంతమయ్యాయి. భార్య బానిసరాలు ఎవరిదైతే బిడ్డ వారికే వర్తిస్తుంది. వ్యభిచారికి రాళ్ళ శిక్ష లేదా నిరాశ మాత్రమే మిగులుతుంది.” (అబూ దావూద్)
3321 – [ 18 ] ( لم تتم دراسته ) (2/992)
وَعَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ:”أَرْبَعٌ مِّنَ النِّسَاءِ لَا مُلَاعَنَةَ بَيْنَهُنَّ: النَّصْرَانِيَّةُ تَحْتَ الْمُسْلِمِ وَالْيَهُوْدِيَّةُ تَحْتَ الْمُسْلِمِ وَ الْحُرَّةُ تَحْتَ الْمَملُوْكِ وَالْمَمْلُوْكَةُ تَحْتَ الْحُّر”.رَوَاهُ ابْنُ مَاجَهُ.
3321. (18) [2/992– అపరిశోధితం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి, తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, నలుగురు స్త్రీలతో లి‘ఆన్ తగదు: 1. ఒక ముస్లిమ్ నికా’హ్లో ఉన్న క్రైస్తవ స్త్రీ, 2. ఒక ముస్లిమ్ నికాహ్‌లో ఉన్న యూద స్త్రీ, 3. బానిస నికా’హ్లో ఉన్న స్వతంత్ర స్త్రీ, 4. స్వతంత్రుని నికా’హ్లో ఉన్న బానిసరాలు. (ఇబ్నె మాజహ్)
3322 – [ 19 ] ( لم تتم دراسته ) (2/992)
وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أَمَرَ رَجُلًا حِيْنَ أَمَرَ الْمُتَلَاعِنَيْنِ أَنْ يَتَلَاعَنَا أَنْ يَضَعَ يَدَهُ عِنْدَ الْخَامِسَةِ عَلَى فِيْهِ وَقَالَ: “إِنَّهَا مُوْجِبَةٌ”. رَوَاهُ النَّسَائِيُّ .
3322. (19) [2/992 –అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ఇద్దరు వ్యక్తుల లి’ఆన్ జరుగుతున్న సమయంలో ప్రవక్త (స) ”వీరు ఐదవ సారి సాక్ష్యం ఇస్తున్నప్పుడు వారి నోటిపై చేయి అడ్డం పెట్టమని ఒక వ్యక్తిని ఆదేశించారు. ఎందుకంటే ఐదవసారి సాక్ష్యం ఇవ్వటం వల్ల అభిశాపం, వేర్పాటు తప్పనిసరి అయిపోతాయి,” అని అన్నారు. (నసాయి’)
3323 – [20 ] ( صحيح ) (2/992)
وَعَنْ عَائِشَةَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم خَرَجَ مِنْ عِنْدَهَا لَيْلًا قَالَتْ: فَغِرْتُ عَلَيْهِ فَجَاءَ فَرَأَى مَا أَصْنَعُ فَقَالَ: “مَا لَكِ يَا عَائِشَةُ أَغِرْتِ؟” فَقُلْتُ: وَمَا لِيْ؟ لَا يَغَارُ مِثْلِيْ عَلَى مِثْلِكَ؟ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَقَدْ جَاءَكِ شَيْطَانُكِ”. قَالَتْ: يَا رَسُوْلَ اللهِ أَمَعِيَ شَيْطَانٌ؟ قَالَ: “نَعَمْ”. قُلْتُ: وَمَعَكَ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “نَعَمْ وَلَكِنْ أَعَانَنِيَ عَلَيْهِ حَتَّى أَسْلَمَ”. رَوَاهُ مُسْلِمٌ.
3323. (20) [2/992 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) నా వద్ద నుండి లేచి రాత్రి ఎక్కడికో వెళ్ళిపోయారు. నాకు చాలా పౌరుషం వచ్చింది. కొంతసేపటి తర్వాత ప్రవక్త (స) తిరిగి వచ్చారు. నేను అశాంతిగా ఉండటం చూసి, ‘ఏమయింది? ఓ ‘ఆయి’షహ్, నీకు పౌరుషం వచ్చిందా?’ అని అడిగారు. దానికి నేను, ‘అవును మీ భార్యనైన నాకు పౌరుషం రాకపోతే మరెవరికి వస్తుంది?’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘నీ షైతాన్ నీ దగ్గరికి వచ్చేసాడు, అందువల్లే,’ అన్నారు. అప్పుడు నేను, ‘ఓ ప్రవక్తా! నా వెంట షైతాన్ ఉంటాడా?’ అని ప్రశ్నించాను. దానికి ప్రవక్త, ‘అవును,’ అని అన్నారు. మళ్ళీ నేను ,’ఓ ప్రవక్తా! మీ వెంట కూడా ఉంటాడా,’ అని అడిగాను. అప్పుడు ప్రవక్త (స), ‘అవును! కాని వాడి విషయంలో అల్లాహ్ నాకు సహాయం చేసాడు. చివరికి ఇస్లామ్ స్వీకరించాడు,’ అని అన్నారు. [97](ముస్లిమ్)
=====
15– بَابُ الْعِدَّةِ
15. స్త్రీ వేచి ఉండే గడువు (‘ఇద్దత్)
ఇద్దత్ అంటే నిర్ణీత దినాలు. ధార్మిక భాషలో ‘తలాఖ్ ఇవ్వబడిన, భర్త మరణించిన స్త్రీలు కొన్ని దినాలు మళ్ళీ నికా‘హ్ చేసుకోవడానికి ముందు కొన్ని నిర్ణీత దినాలు వేచి ఉంటారు. ఒకవేళ స్త్రీకి ‘తలాఖ్ ఇవ్వబడితే, ఆమెకు రుతు స్రావం వస్తూ ఉంటే ఆమె మూడు రుతుస్రావాల వరకు వేచి ఉంటుంది. అంటే నికా’హ్ చేయకుండా ఉంటుంది. మూడు రుతుస్రావాలు గడచిపోయిన తర్వాత ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు. అదేవిధంగా భర్త చనిపోయిన స్త్రీ నాలుగు నెలల 10 రోజుల వరకు అలంకరణలకు, సింగారాలకు, మళ్ళీ పెళ్ళికి దూరంగా ఉండాలి. ఈ గడువు పూర్తికాగానే మళ్ళీ పెళ్ళిచేసుకోవచ్చు. ఈ దినాల్లో ఎవరితోనూ పెళ్ళి చేసుకోవటం ధర్మ సమ్మతం కాదు. అల్లాహ్ ఆదేశం: ”మరియు విడాకు లివ్వబడిన స్త్రీలు మూడు ఋతువుల వరకు (మరొకనితో పెండ్లి చేసుకోకుండా) వేచి ఉండాలి. మరియు వారు అల్లాహ్ యందు మరియు అంతిమ దినము నందు విశ్వాసమున్నవారే అయితే, అల్లాహ్ వారి గర్భాలలో సృష్టించిన దానిని దాచటం వారికి ధర్మసమ్మతం కాదు. మరియు వారి భర్తలు దాంపత్య సంబంధాలను సరిదిద్దుకోవటానికి సిధ్ధంగా ఉంటే! ఈ నిరీక్షణ కాలంలో వారిని తమ భార్యలుగా తిరిగి స్వీకరించే హక్కు వారికి ఉంది. మరియు వారికి (స్త్రీలకు) వారి (భర్తల)పై ధర్మసమ్మతమైన హక్కులున్నాయి, ఏ విధంగానైతే వారికి (భర్తలకు) వారిపై ఉన్నాయో. కాని పురుషులకు స్త్రీలపై (కర్తవ్య) ఆధిక్యత ఉంది. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు. విడాకులు రెండు సార్లే! ఆ తర్వాత (భార్యను) సహృదయంతో తమ వద్ద ఉండనివ్వాలి, లేదా ఆమెను మంచితనంతో సాగ నంపాలి. మరియు సాగనంపేటప్పుడు మీరు వారికిచ్చిన వాటినుండి ఏమైనా తిరిగి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేము అనే భయం ఆ ఇద్దరికీ ఉంటే తప్ప! కాని అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండ లేమనే భయం ఆ దంపతులకు ఉంటే స్త్రీ పరిహారమిచ్చి (విడాకులు / ఖులా’ తీసుకుంటే) అందులో వారికి ఎలాంటి దోషం లేదు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు, కావున వీటిని అతిక్రమించ కండి. మరియు ఎవరైతే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తారో, అలాంటి వారే దుర్మార్గులు. ఒకవేళ అతడు (మూడవ సారి) విడాకులిస్తే, ఆ తర్వాత ఆ స్త్రీ అతనికి ధర్మసమ్మతం కాదు, ఆమె వివాహం వేరే పురుషునితో జరిగితే తప్ప! ఒకవేళ అతడు (రెండవ భర్త) ఆమెకు విడాకులిస్తే! అప్పుడు ఉభయులూ (మొదటి భర్త, ఈ స్త్రీ) తాము అల్లాహ్ హద్దులకు లోబడి ఉండగలమని భావిస్తే , వారు పునర్వివాహం చేసుకోవటంలో దోషం లేదు. మరియు ఇవి అల్లాహ్ నియమించిన హద్దులు. వీటిని ఆయన గ్రహించే వారికి స్పష్టపరుస్తున్నాడు.” (అల్ -బఖరహ్, 2:228-230)
అంటే సంభోగం తర్వాత ‘తలాఖ్ ఇవ్వబడిన, రుతుస్రావం వస్తున్న స్త్రీలు మూడు రుతుస్రావాల వరకు అంటే మూడు నెలల వరకు రెండవ పెళ్ళికి దూరంగా ఉండాలి. వారి గర్భాలలో ఉన్నదాన్ని దాచకూడదు. ఖిచ్చతంగా లెక్కకట్టి చూపాలి. మరోపెళ్ళి చేసుకునే తొందరలో రుతుస్రావాన్ని దాచకూడదు. గర్భంతో ఉంటే, ‘9 మాసాల వరకు ఎవరు వేచి ఉంటారు,’ అని భావించరాదు. అల్లాహ్నూ, తీర్పుదినాన్ని విశ్వసించే వారైతే, విచారణ జరుగుతుందని భావించేవారే అయితే ఇటువంటి అధర్మ కార్యాలకు పాల్పడరాదు. ఒకవేళ గడువు ఇంకా పూర్తి కాకపోతే భర్తకు, ఆలోచించుకొని మళ్ళీ భార్యను స్వీకరించే హక్కు ఉంది. అదే విధంగా రుతుస్రావం రాని స్త్రీలు కూడా మూడు నెలలు ‘ఇద్దత్ గడపాలి. అదేవిధంగా బాల్యావస్థలోనే ఉంటూ ఇంకా రుతుస్రావం రాని ‘తలాఖ్ పొందిన అమ్మాయిలు కూడా మూడునెలలు ‘ఇద్దత్ గడపాలి. గర్భిణులు బిడ్డను ప్రసవించడమే వారి గడువు. అల్లాహ్ ఆదేశం: ”మరియు మీ స్త్రీలు ఋతుస్రావపు వయస్సు గడిచిపోయినవారైతే లేక మీకు దానిని గురించి ఎలాంటి అనుమానం ఉంటే; లేక వారి ఋతుస్రావం ఇంకా ప్రారంభంకానివారైతే, అలాంటి వారి గడువు మూడు మాసాలు. మరియు గర్భవతులైన స్త్రీల గడువు, వారి కాన్పు అయ్యేవరకు. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు గలవానికి ఆయన, అతని వ్యవహారంలో సౌలభ్యం కలిగిస్తాడు. ఇది అల్లాహ్ ఆజ్ఞ, ఆయన దానిని మీపై అవతరింపజేశాడు. మరియు ఎవడైతే అల్లాహ్ పట్ల భయ భక్తులు కలిగి ఉంటాడో, ఆయన అతని పాపాలను తొలగిస్తాడు. మరియు అతని ప్రతిఫలాన్ని అధికం చేస్తాడు.” (అ’త్తలాఖ్, 65:4–5)
క’అబ్ (ర), ‘ఓ ప్రవక్తా! ఇంకా చాలామంది స్త్రీల ‘ఇద్దత్ ఇంకా పేర్కొనబడలేదు. యుక్తవయస్సుకు రాని అమ్మాయిలు, అధిక వయస్సుగల స్త్రీలు, గర్భిణీ స్త్రీలు,’ అని అన్నారు. దానికి సమాధానంగా ఈ ఆయతు అవతరించింది. ఆ తరువాత గర్భిణీ స్త్రీ యొక్క ‘ఇద్దత్ కనడం అని పేర్కొనడం జరిగింది. ఒకవేళ ‘తలాఖ్ లేదా భర్త చనిపోయిన కొన్ని రోజులకే ప్రసవం జరిగితే, ఖుర్ఆన్ ‘హదీసు’ల ప్రకారం పండితులందరూ ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. అయితే ‘అలీ, ఇబ్నె ‘అబ్బాస్ కథనం, (సూరహ్ బఖరహ్ ఆయత్, ఈ ఆయత్ ను కలిపి వీరి తీర్పు ఏమిటంటే, ఈ రెంటిలో ఆలస్యంగా ఉన్నదే ‘ఇద్దత్గా నిర్ణయించడం జరుగుతుంది. దాన్ని గడపాలి. అంటే ఒకవేళ బిడ్డ మూడు నెలలోపు జన్మిస్తే ఇద్దత్ మూడు నెలలు అవుతుంది. మూడు నెలలు గడచినా బిడ్డ జన్మించకపోతే బిడ్డపుట్టే వరకు ఇద్దత్ గడపాలి.
‘స’హీ’హ్ బు’ఖారీలో అబూ సలమహ్ (ర) కథనం ఇలా ఉంది: ”ఒక వ్యక్తి ఇబ్నె ‘అబ్బాస్ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో అబూ హురైరహ్ (ర) కూడా అక్కడ ఉన్నారు. ‘భర్త చనిపోయిన 40 రోజుల తర్వాత బిడ్డను కన్న స్త్రీ గురించి మీ ఉద్దేశ్యం ఏమిటి?’ అని ప్రశ్నించాడు. దానికి ఇబ్నె ‘అబ్బాస్ రెండు గడువుల్లో నుంచి చివరి గడువు గడపాలి. అంటే ఈ విధంగా ఉంటే ఆమె మూడు నెలలు ఇద్దత్ పాటించాలి. అబూ సలమహ్ మాట్లాడుతూ, ‘ఖుర్ఆన్లో గర్భిణీ స్త్రీలు బిడ్డకనేవరకు అని ఉంది కదా?’ అని అన్నారు. అక్కడే ఉన్న అబూ హురైరహ్ (ర), ‘నేను కూడా నా చిన్నాన్న కొడుకును సమర్థిస్తున్నాను. అంటే నా అభిప్రాయం కూడా ఇదే,’ అని అన్నారు. అప్పటికప్పుడే ఇబ్నె ‘అబ్బాస్ తన బానిసను ఉమ్మె సలమహ్ వద్దకు పంపి సరైన అభిప్రాయం తెలుసుకొని రమ్మన్నారు. దానికి ఆమె, ‘సబీ’అ అస్లమ్ హతమార్చబడ్డారు. నలభై రోజుల తర్వాత బిడ్డ జన్మించాడు. ఆ తరువాత పెళ్ళి సంబంధం వచ్చింది. ప్రవక్త (స) నికా‘హ్ చేసివేసారు. పెళ్ళికోసం వచ్చిన వారిలో అబుస్సనాబిల్ కూడా ఉన్నారు,’ అని అన్నారు. (తఫ్సీర్ ఇబ్నె-కసీర్)
సంభోగం చేయని స్త్రీపై ఎటువంటి ‘ఇద్దత్ లేదు. అల్లాహ్ ఆదేశం: ” ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసినులైన స్త్రీలను వివాహమాడి, తరువాత – మీరు వారిని తాకక పూర్వమే – వారికి విడాకు లిచ్చినట్లైతే, మీ కొరకు వేచివుండే వ్యవధి (‘ఇద్దత్) పూర్తి చేయమని అడిగే హక్కు మీకు వారిపై లేదు. కనుక వారికి పారితోషికం ఇచ్చి, మంచితనంతో వారిని సాగనంపండి.” (అల్ -అహ్జాబ్, 33:49)
అంటే సంభోగానికి ముందు ‘తలాఖ్ ఇస్తే, వారిపై ఎటువంటి ‘ఇద్దత్ లేదు. పైగా ‘తలాఖ్ తరువాత వారు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఒకవేళ భర్త చనిపోతే నాలుగు నెలల 10 రోజులు ‘ఇద్దత్ గడపాలి. అందరి అభిప్రాయం ఇదే. ఒకవేళ నికా‘హ్ తరువాత వెంటనే ‘తలాఖ్ ఇస్తే, మహర్ నిర్ణయించి ఉంటే సగం మహర్ ఇవ్వటం తప్పనిసరి. అల్లాహ్ ఆదేశం: ఒకవేళ తాకక ముందే ‘తలాఖ్ ఇస్తే, మహర్ నిర్ణయించి ఉంటే, సగం మహర్ ఇవ్వాలి. ఒకవేళ మహర్ నిర్ణయించకుండా ఉండి, సంభోగానికి ముందే ‘తలాఖ్ ఇస్తే, మహర్ ఇవ్వనక్కర లేదు. అయితే కొంత ధనం ఇచ్చి సాగనంపాలి. సజ్జనులకు ఇది తప్పనిసరి.
ఉమైమహ్ బిన్తె షరా‘హీల్‌తో ప్రవక్త (స) నికా‘హ్ చేసు కున్నారు. సంభోగానికి ముందే ప్రవక్త (స) ‘తలాఖ్ ఇచ్చి రెండు జతల బట్టలు ఇచ్చి సాగనంపారు. (బు’ఖారీ)
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3324 – [ 1 ] ( صحيح ) (2/993)
عَنْ أَبِيْ سَلَمَةَ عَنْ فَاطِمَةَ بِنْتِ قَيْسٍ: أَنَّ أَبَا عَمْرِو بْنِ حَفْصٍ طَلَّقَهَا اَلْبَتَّةَ وَهُوَ غَائِبٌ فَأَرْسَلَ إِلَيْهَا وَكِيْلُهُ الشَّعِيْرَ فَسَخِطَتْهُ. فَقَالَ: وَاللهِ مَا لَكَ عَلَيْنَا مِنْ شَيْءٍ فَجَاءَتْ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَذَكَرَتْ ذَلِكَ لَهُ فَقَالَ: “لَيْسَ لَكَ نَفَقَةٌ”. فَأَمَرَهَا أَنْ تَعْتَدَّ فِي بَيْتِ أُمِّ شَرِيْكٍ ثُمَّ قَالَ: “تِلْكَ اِمْرَأَةٌ يَغْشَاهَا أَصْحَابِيْ اِعْتَدِّيْ عِنْدَ ابْنِ أُمِّ مَكْتُوْمٍ فَإِنَّهُ رَجُلٌ أَعْمَى تَضَعِيْنَ ثِيَابَكِ فَإِذَا حَلَلْتِ فَآذِنِيْنِيْ”. قَالَتْ: فَلَمَّا حَلَلْتُ ذَكَرْتُ لَهُ أَنْ مُعَاوِيَةَ بْنَ أَبِيْ سُفْيَانَ وَأَبَا جَهْمٍ خَطَباَنِيْ فَقَالَ: “أَمَّا أَبُو الْجَهْمِ فَلَا يَضَعُ عَصَاهُ عَنْ عَاتِقِهِ وَأَمَّا مُعَاوِيَةَ فَصُعْلُوْكٌ لَا مَالَ لَهُ اِنْكِحِيْ أُسَامَةَ بْنَ زَيْدٍ” فَكَرِهْتُهُ ثُمَّ قَالَ: “اِنْكِحِيْ أُسَامةَ” فَنَكَحْتُهُ فَجَعَلَ اللهُ فِيْهِ خَيْرًا وَاغْتُبِطْتُّ وَفِيْ رِوَايَةٍ عَنْهَا: “فَأَمَّا أَبُوْ جَهْمٍ فَرَجُلٌ ضَرَّابٌ لِلنِّسَاءِ”. رَوَاهُ مُسْلِمٌ وَفِيْ رِوَايَةٍ: أَنَّ زَوْجَهَا طَلَّقَهَا ثَلَاثًا فَأَتَتِ النَّبِيَّ صلى الله عليه وسلم فَقَالَ: “لَا نَفْقَةَ لَكِ إِلَّا أَنْ تَكُوْنِيْ حَامِلًا”.
3324. (1) [2/993– దృఢం]
అబూ సలమహ్, ఫా’తిమహ్ బిన్తె ఖైస్ ద్వారా కథనం: ఫా’తిమహ్ భర్త అబూ ‘అమ్ర్ బిన్ ‘హఫ్స్ తన భార్య ఫా’తిమహ్ కు ‘తలాఖ్ బత్త ఇచ్చివేసారు. అప్పుడతను విదేశాల్లో ఉన్నారు. ఇంతకు ముందు అతను రెండు ‘తలాఖులు ఇచ్చారు. ఒకటి మిగిలి ఉంది. అతడు ‘అలీ (ర) వెంట యమన్ వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి ద్వారా ‘మిగిలివున్న ఆ ఒక్క ‘తలాఖ్ కూడా ఇస్తున్నానని’ చెప్పి పంపారు. అతని వకీలు ఫా’తిమహ్ కు యవ్వలు ఇస్తే ఆమె అయిష్టాన్ని వ్యక్తం చేసారు. ‘మూడు ‘తలాఖుల తర్వాత ఇప్పుడు మాపై ఎటువంటి బాధ్యతా లేదు. ఇప్పుడు మేలుగా ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు’ అని అతను చెప్పాడు. ఇది విని ఫా’తిమహ్ బిన్తె ఖై’స్ ప్రవక్త (స) వద్దకు వెళ్ళి జరిగినదంతా విన్నవించుకుంది. ప్రవక్త (స) కూడా, ”మూడు ‘తలాఖుల తర్వాత నీ గురించి ఎటువంటి బాధ్యత లేదు,” అని చెప్పారు. ఆ తరువాత, ‘నీవు నీ భర్త ఇంటి నుండి వెళ్ళి ఉమ్మెషరీక్ ఇంట్లో ‘ఇద్దత్ గడుపు’అని పలికి మళ్ళీ ఉమ్మెషరీక్ ఇంట్లో ఆమె బంధువులైన నా అనుచరులు వస్తూపోతూ ఉంటారు. అందువల్ల అక్కడ ఉండటం సరికాదు. నువ్వు ఇబ్నె ఉమ్మె మక్తూమ్ ఇంటికి వెళ్ళు, అక్కడే ‘ఇద్దత్ గడుపు, ఎందుకంటే ఇబ్నె ఉమ్మె మక్తూమ్ అంధులు, అక్కడ దుస్తుల్లో ఏవైనా తీసి ఉంచినా ఫరవా లేదు. ఎందుకంటే అక్కడ తెరచాటుగా ఉండే అవసరం కూడా ఉండదు. నీ గడువు పూర్తయిన తర్వాత నాకు తెలియజేయి,’ అని అన్నారు. ఫా’తిమహ్ కథనం, నా ‘ఇద్దత్ పూర్తియితే నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళి, ‘ము’ఆవియహ్ బిన్ అబీ ‘సుఫియాన్ మరియు అబూ జ’హమ్ నన్ను పెళ్ళాడటానికి సందేశాలు పంపారు. వారిద్దరిలో ఎవరిని పెళ్ళాడను’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘అబూ జ’హమ్ కఠిన హృదయుడు, ఎల్లప్పుడూ తనవెంట దుడ్డుకర్ర ఉంచుతాడు. భుజం నుండి క్రిందికి దించడు. ఇటువంటి పరిస్థితుల్లో అతనితో పెళ్ళి చేసుకోవటం మంచిది కాదు. మరియు ము‘ఆవియహ్ బిన్ అబీ ‘సుఫియాన్ చాలా పేదవాడు. అతని వద్ద ధనం లేదు. అతనితో కూడా పెళ్ళి చేయటం సరికాదు. నువ్వు ఉసామహ్ బిన్ ‘జైద్‌తో పెళ్ళి చేసుకో,’ అని అన్నారు. నేను దానికి ఇష్టపడలేదు. మళ్ళీ ప్రవక్త (స), ‘నువ్వు ఉసామహ్ బిన్ ‘జైద్‌తో పెళ్ళిచేసుకో, అందులోనే నీకు చాలా మేలు ఉంది’ అని అన్నారు. నేను ప్రవక్త (స) సలహాను ఆచరించాను. ఉసామాతో పెళ్ళి చేసుకున్నాను. అల్లాహ్ (త) ఆ నికా‘హ్లో నాకు శుభం మేలు ప్రసాదించాడు. నన్ను గురించి గర్వంగా చెప్పుకో సాగారు. ఒక కథనంలో ఇలా ఉంది: ప్రవక్త (స), ‘అబూ జ’హమ్ స్త్రీలను కొట్టేవాడని’ అన్నారు. ముస్లిమ్‌లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది; ఆమె భర్త ఆమెకు మూడు ‘తలాఖులు ఇచ్చివేసాడు. ఆమె ప్రవక్త (స) వద్దకు వచ్చింది. అప్పుడు ప్రవక్త (స), ‘నీ గురించి అన్నపానీయాల సౌకర్యం లేదు, ఒకవేళ నీవు గర్భం దాల్చిఉంటే లభించేది,’ అని అన్నారు.[98]
3325 – [ 2 ] ( صحيح ) (2/994)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: إِنَّ فَاطِمَةَ كَانَتْ فِي مَكَانٍ وَحْشٍ فَخِيْفَ عَلَى نَاحِيَتِهَا فَلِذَلِكَ رَخَّصَ لَهَا النَّبِيُّ صلى الله عليه وسلم تَعْنِي فِى النُّقْلَةِ وَفِيْ رِوَايَةٍ: قَالَتْ: مَا لِفَاطِمَةَ؟ أَلَا تَتَّقِي اللهَ؟ تَعْنِيْ فِيْ قَوْلِهَا: لَا سُكْنَى وَلَا نَفْقَةَ. رَوَاهُ الْبُخَارِيُّ.
3325. (2) [2/994– దృఢం]
‘ఆయి’షహ్(ర) కథనం: ఫా’తిమహ్ బిన్తె ఖై’స్ ఇల్లు మారుమూల ప్రాంతంలో ఉండేది. చుట్టు ప్రక్కల ఇండ్లు ఉండేవి కావు. అందువల్ల అక్కడ దొంగలు, అల్లరి మూకలు వచ్చే భయం ఉండేది. అందువల్లే ప్రవక్త (స) ఆమెకు మరొకరి ఇంట్లో ‘ఇద్దత్ దినాలు గడపమని అనుమతి ఇచ్చారు. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ” ‘ఆయి’షహ్ (ర) ఫా’తిమహ్ తో ఓ ఫా’తిమహ్! అల్లాహ్ కు భయపడు, ‘తలాఖ్ ఇవ్వబడిన స్త్రీకి సుక్నహ్, నఫ్ఖహ్ లేదని నువ్వు అంటున్నావు, దాన్ని ప్రవక్త (స) అన్నారని చెబుతున్నావు. ఇది మంచిది కాదు,’ అని అన్నారు.” [99] (బు’ఖారీ)
3326 – [ 3 ] ( لم تتم دراسته ) (2/994)
وَعَنْ سَعِيْدِ بْنِ الْمُسَيِّبِ قَالَ: إِنَّمَا نُقِلَتْ فَاطِمَةُ لِطُوْلِ لِسَانِهَا عَلَى أَحْمَائِهَا. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.
3326. (3) [28/994– అపరిశోధితం]
స’యీద్ బిన్ ముసయ్యిబ్ ఇలా అభిప్రాయ పడ్డారు: ”ఫా’తిమహ్ బిన్తె ఖై’స్ను మరొకరి ఇంట్లో ‘ఇద్దత్ గడపమని ఎందుకు ఆదేశించబడిందంటే ఆమె నోరు పారేసుకునేది, అస్తమానం నోటితో వివాదపడే విధంగా ప్రవర్తించేది. అందు వల్లే ప్రవక్త (స) ఆమెకు మరొకరి ఇంట్లో ‘ఇద్దత్ గడపడానికి అనుమతి ఇచ్చారు.” (షర’హ్ సున్నహ్)
3327 – [ 4 ] ( صحيح ) (2/994)
وَعَنْ جَابِرٍقَالَ: طُلِّقَتْ خَالَتِيْ ثَلَاثًا فَأَرَادَتْ أَنْ تَجُدَّ نَخْلَهَا فَزَجَرَهَا رَجُلٌ أَنْ تَخْرُجَ فَأَتَتِ النَّبِيُّ صلى الله عليه وسلم. فَقَالَ: “بَلَى فَجُدِّيْ نَخْلَكِ فَإِنَّهُ عَسَى أَنْ تَصَدَّقي أَوْ تَفْعَلِيْ مَعْرُوْفًا”. رَوَاهُ مُسْلِمٌ.
3327. (4) [2/994 –దృఢం]
జాబిర్ (ర) కథనం: మా అత్తకు మూడు ‘తలాఖులు ఇవ్వబడ్డాయి. ఆమె ‘ఇద్దత్ గడుపుతూ ఇంటి నుండి బయటకు వెళ్ళి ఖర్జూరాలు కోసి తీసుకు వద్దామని అనుకున్నారు. అంటే ఖర్జూరాలను తోటనుండి కోసి తీసుకు వద్దామని అనుకున్నారు. ఒక వ్యక్తి ఆమెను బయటకు వెళ్ళవద్దని వారించాడు. ఆమె ప్రవక్త (స) వద్దకు వచ్చింది. ప్రవక్త (స) ఆమెతో, ‘నువ్వు తోటకు వెళ్ళి ఖర్జూరాలను కోసి తీసుకు రా, దానధర్మాలు గాని ఏదైనా మంచి పని అయినా చేయగలవు’ అని అన్నారు. (ముస్లిమ్)
ఈ ‘హదీసు’ ద్వారా ముతల్లఖ బాయిన అవసరం పడితే ‘ఇద్దత్ గడువులో ఇంటి నుండి బయటకు వెళ్ళవచ్చని తెలుస్తుంది.
3328 – [ 5 ] ( صحيح ) (2/994)
وَعَنِ الْمِسْوَرِ بْنِ مَخْرَمَةَ: أَنّض سُبَيْعَةَ الْأَسْلَمِيَّةَ نُفِسَتْ بَعْدَ وَفَاةِ زَوْجِهَا بِلَيَالٍ فَجَاءَتِ النَّبِيَّ صلى الله عليه وسلم فَاسْتَأْذَنَتْهُ أَنْ تَنْكِحَ فَأذِنَ لَهَا فَنَكَحَتْ. رَوَاهُ الْبُخَارِيُّ
3328. (5) [2/994 –దృఢం]
మిస్‌వర్ బిన్ మ’ఖ్‌రమహ్ ఇలా అన్నారు: ”సుబై’అహ్ అస్లమియ్యహ్ తన భర్త మరణానంతరం బిడ్డను కన్నది. కొన్ని రోజుల తర్వాత ఆమె ప్రవక్త (స) వద్దకు వచ్చి నికా‘హ్కు అనుమతి కోరింది. ప్రవక్త (స) ఆమెకు నికా‘హ్ అనుమతి ఇచ్చారు. ఎందుకంటే బిడ్డ జన్మించిన తర్వాత ఆమె ‘ఇద్దత్ గడువు పూర్తయి పోయింది. (బు’ఖారీ)
3329 – [ 6 ] ( متفق عليه ) (2/994)
وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: جَاءَتِ امْرَأَةُ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَتْ: يَا رَسُوْلَ اللهِ إِنَّ اِبْنَتِيْ تُوَفِّيَ عَنْهَا زَوْجُهَا وَقَدِ اشْتَكَتْ عَيْنُهَا أَفَنُكْحُلُهَا؟ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا” مَرَّتَيْنِ أَوْ ثَلَاثًا كُلَّ ذَلِكَ يَقُوْلُ: “لَا” .قَالَ: “إِنَّمَا هِيَ أَرْبَعَةُ أَشْهُرٍ وَعَشْرٌ وَقَدْ كَانَتْ إِحْدَاهُنَّ فِي الْجَاهِلَيَّةِ تَرْمِيْ بِالْبَعْرَةِ عَلَى رَأْسِ الْحَوْلِ”.
3329. (6) [2/994 –ఏకీభవితం]
ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక స్త్రీ వచ్చి, ‘ఓ ప్రవక్తా! నా కూతురి భర్త చనిపోయాడు. నా కూతురు ‘ఇద్దత్ గడుపుతుంది. ఆమె కళ్ళకు వ్యాధి సోకింది, మందుగా ఆమె కళ్ళకు సుర్మా పెట్టనా,’ అని ప్రశ్నించింది. ప్రవక్త (స), ‘వద్దు,’ అని అన్నారు. ఇలా మూడు సార్లు అన్నారు. మళ్ళీ ప్రవక్త (స), ” ‘ఇద్దత్‌లో సుర్మా పూయడం అలంకరణ చేయడం ధర్మం కాదు. ‘ఇద్దత్ దినాలు కేవలం నాలుగు నెలల 10 రోజులే. అజ్ఞాన కాలంలో మీరు సంవత్సరం అంతా ‘ఇద్దత్ గడిపే వారు. ఒక సంవత్సరం తరువాత పేడ గింజలను విసిరే వారు” అని అన్నారు.[100] (బు’ఖారీ, ముస్లిమ్)
3330 – [ 7 ] ( متفق عليه ) (2/995)
وَعَنْ أُمِّ حَبِيْبَةَ وَزَيْنَبَ بِنْتِ جَحْشٍ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه و سلم قَالَ:”لَا يَحِلُ لِاِمْرَأَةٍ تُؤْمِنَ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِأَنْ تُحِدَّ عَلَى مَيِّتٍ فَوْقَ ثَلَاثِ لَيَالٍ إِلَّا عَلَى زَوْجٍ أَرْبَعَةَ أَشْهُرٍوَعَشْرًا”.
3330. (7) [2/995 –ఏకీభవితం]
ఉమ్మె ‘హబీబహ్, ‘జైనబ్ బిన్తె జ’హష్‌ల కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్నూ, తీర్పుదినాన్ని విశ్వసించే ముస్లిమ్ స్త్రీ మృతులపై మూడు రోజులకంటే అధికంగా సంతాపం పాటించడం ధర్మం కాదు. అయితే తన భర్తపై మాత్రం నాలుగు నెలల 10 రోజులు సంతాపం పాటించ వచ్చు. (బు’ఖారీ, ముస్లిమ్)
3331 – [ 8 ] ( متفق عليه ) (2/995)
وَعَنْ أُمِّ عَطِيَّةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا تُحِدُّ اِمْرَأَةٌ عَلَى مَيِّتٍ فَوْقَ ثَلَاثٍ إِلَّا عَلَى زَوْجٍ أَرْبَعَةَ أَشْهُرٍ وَعَشْرًا وَلَا تَلْبَسُ ثَوْبًا مَصْبُوْغًا إِلَّا ثَوْبَ عَصْبٍ وَلَا تَكْتَحِلُ وَلَا تَمَسُّ طِيْبًا إِلَّا إِذَا طَهُرَتْ نُبْذَةً مِنْ قُسْطٍ أَوْ أَظْفَارٍ”. مُتَّفَقٌ عَلَيْهِ. وَزَادَ أَبُوْ دَاوُدَ: ” وَلَا تَخْتَضِبُ”.
3331. (8) [2/995 –ఏకీభవితం]
ఉమ్మె ‘అతియ్యహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఏ స్త్రీ మృతులపై మూడు రోజుల కంటే అధికంగా సంతాపాన్ని పాటించకూడదు. కాని తన భర్త చనిపోతే మాత్రం 4 నెలల 10 రోజులు సంతాపం పాటించాలి. ఈ దినాల్లో రంగుల దుస్తులు ధరించరాదు. కేవలం తెల్లబట్టలు ధరించాలి. ఈ దినాల్లో సుర్మా, సుగంధ పరిమళాలు ఉపయో గించరాదు. అయితే బహిష్టు దశ నుండి పరిశుద్ధత పొందినపుడు సుగంధ పరిమళాలను దుర్వాసన దూరం చేయటానికి ఉపయోగించ వచ్చును. ఇంకా ఈ దినాల్లో చేతులకు, వెంట్రుకలకు గోరింటాకు పులమరాదు. (బు’ఖారీ, ముస్లిమ్, అబూ దావూద్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3332 – [ 9 ] ( لم تتم دراسته ) (2/995)
عَنْ زَيْنَبَ بِنْتِ كَعْبٍ: أَنَّ الْفُرَيْعَةَ بِنْتَ مَالِكِ بْنِ سِنَانٍ وَهِيَ أُخْتُ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ أَخْبَرَتْهَا أَنَّهَا جَاءَتْ اِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم تَسْأَلُهُ أَنْ تَرْجِعَ إِلَى أَهْلِهَا فِي بَنِيْ خُدْرَةَ فَإِنَّ زَوْجَهَا خَرَجَ فِي طَلْبِ أَعْبُدٍ لَهُ أَبَقُوْا فَقَتَلُوْهُ قَالَتْ: فَسَأَلْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَنْ أَرْجِعَ إِلَى أَهْلِيْ فَإِنَّ زَوْجِيْ لَمْ يَتْرُكْنِيْ فِي مَنْزِلٍ يَمْلِكُهُ وَلَا نَفَقَةٍ فَقَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “نَعَمْ”. فَانْصَرَفْتُ حَتَّى إِذَا كُنْتُ فِي الْحُجْرَةِ أَوْ فِي الْمَسْجِدِ دَعَانِيْ فَقَالَ: “اَمْكُثِيْ فِيْ بَيْتِكِ حَتَّى يَبْلُغَ الْكِتَابُ أَجلَهُ”. قَالَتْ: فَاعْتَدَدْتُّ فِيْهِ أَرْبَعَةَ أَشْهُرٍ وَعَشْرًا. رَوَاهُ مَالِكٌ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.
3332. (9) [2/995 –అపరిశోధితం]
‘జైనబ్ బిన్తె క’అబ్ (ర) కథనం: నాకు అబూ స’యీద్ ‘ఖుద్రీ సోదరి అయిన ఫురైఅహ్ బిన్తె మాలిక్ బిన్ సినాన్, ఇలా తెలిపారు, ”ఆమె ఈ విషయం గురించి అడగటానికి ప్రవక్త (స) వద్దకు వచ్చారు. అదేమిటంటే, ఆమె భర్త పారిపోయిన బానిసలను వెతకటానికి వెళ్ళారు. అతని బానిసలు అతన్ని చంపివేసారు. భర్త ఆమెకు ఇల్లుగానీ, ఆస్తిగాని ఉంచలేదు. ఆమె ప్రవక్త (స) తో ఇటువంటి పరిస్థితిలో ‘ఇద్దత్ పుట్టినింటిలో గడపాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా భర్త ఉండటానికి ఇల్లుగానీ, ఆస్తిగానీ ఉంచలేదు,’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ‘అవును ఇటువంటి పరిస్థితుల్లో నీవు నీ పుట్టింట్లో గడప గలవు అన్నారు. నేను అడిగి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా అంటే నేను ఇంకా అతనింటి గడపలోనో లేదా మస్జిద్లోనో ఉన్నాను. ప్రవక్త (స) నన్ను తిరిగి పిలిచారు. నేను తిరిగి వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స), ‘నీ భర్త నిన్ను వదలిన ఇంట్లోనే ఉండు’ అని అన్నారు. నేను ఆ ఇంట్లోనే 4 నెలల 10 రోజులు ‘ఇద్దత్ గడిపాను. (మాలిక్, తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్, అబూ దావూద్, దార్మి)
ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, భర్త చనిపోయిన స్త్రీ సాధ్యమైనంత వరకు భర్త వదలి వెళ్ళిన ఇంట్లోనే ‘ఇద్దత్ గడపాలి.
3333 – [ 10 ] ( لم تتم دراسته ) (2/996)
وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: دَخَلَ عَلي رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم حِيْنَ تُوَفِّيَ أَبُوْ سَلَمَةَ وقَدْ جَعَلْتُ عَلَيَّ صَبِرًا فَقَالَ: “مَا هَذَا يَا أُمَّ سَلَمَةَ؟” قُلْتُ: إِنَّمَا هُوَ صَبِرٌ لَيْسَ فِيْهِ طِيْبٌ فَقَالَ: “إِنَّهُ يَشُبُّ الْوَجْهَ فَلَا تَجْعَلِيْهِ إِلَّا بِاللَّيْلِ وَتَنْزِعِيْهِ بِالنَّهَارِ وَلَا تَمْتَشِطِيْ بِالطِّيْبِ وَلَا بِالْحِنَّاءِ فَإِنَّهُ خِضَابٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.
3333. (10) [2/996– అపరిశోధితం]
ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) నా మొదటి భర్తమరణించినపుడు నావద్దకువచ్చారు. అపుడునేను ‘ఇద్దత్ గడుపుతున్నాను. నా ముఖంపై ఏల్వా పులుముకొని ఉన్నాను. ప్రవక్త (స), ‘ఇదేమిటి,’ అని అడిగారు. నేను, ‘ఇది ఏల్వా, ఇందులో సువాసన లేదు,’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘ఇది ముఖాన్ని ఆకర్షణీయంగా చేస్తుంది. దాన్ని నువ్వు కేవలం రాత్రి మాత్రమే పులుముకో, ఉదయం కడిగివేయి. వెంట్రుకలకు సువాసన గల నూనె రాయకు, గోరింటాకు ఉపయోగించకు. ఎందుకంటే ఇది రంగు వదులుతుంది’ అని అన్నారు. అప్పుడు నేను, ‘మరి దేనితో దువ్వుకోవాలి,’ అని ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స), ‘రేగిచెట్టు ఆకులతో తలంతా కప్పబడి ఉండేలా రుద్దుకో,’ అని అన్నారు.[101] (అబూ దావూద్, నసాయి’)
3334 – [ 11 ] ( لم تتم دراسته ) (2/996)
وَعَنْهَا عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ:” اَلْمُتَوَفَّى عَنْهَا زَوْجُهَا لَا تَلبَسُ الْمُعَصْفَرَ مِنَ الثِّيَابِ وَلَا الْمُمَشَّقَةَ وَلَا الْحُلِيَّ وَلَا تَخْتَضِبُ وَلَا تَكْتَحِلُ ” . رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ
3334. (11) [2/996 –అపరిశోధితం]
ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, భర్త చనిపోయిన స్త్రీ ‘ఇద్దత్‌లో ఉన్నప్పుడు రంగు దుస్తులు ధరించరాదు. ఆభరణాలు ధరించరాదు, గోరింటాకు ఉపయోగించరాదు, సుర్మా పెట్టుకోరాదు. (అబూ దావూద్, నసాయి’)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3335 – [ 12 ] ( لم تتم دراسته ) (2/996)
عَنْ سُلَيْمَانَ بْنِ يَسَارٍ: أَنَّ الْأَحْوَصَ هَلَكَ بِالشَّامِ حِيْنَ دَخَلَتِ امْرَأَتُهُ فِي الدَّمِ مِنَ الْحَيْضَةِ الثَّالِثَةِ وَقَدْ كَانَ طَلَّقَهَا فَكَتَبَ مُعَاوِيَةُ بْنُ أَبِيْ سُفْيَانَ إِلَى زَيْدِ بْنِ ثَابِتٍ يَسْأَلُهُ عَنْ ذَلِكَ فَكَتَبَ إِلَيْهِ زَيْدٌ: إِنَّهَا إِذَا دَخَلَتْ فِي الدَّمِ مِنَ الْحَيْضَةِ الثَّالِثَةِ فَقَدْ بَرِئَتْ مِنْهُ وَبَرِئَ مِنْهَا لَا يَرِثُهَا وَلَا تَرِثُهُ. روَاهُ مَالِكٌ.
3335. (12) [2/996 –అపరిశోధితం]
సులైమాన్ బిన్ యసార్ (ర) కథనం: అ’హ్వ’స్ సిరియా దేశంలో మరణించారు. అతని భార్య ‘ఇద్దత్‌లో ఉంది. ఆమె తన ‘ఇద్దత్ చివరి రోజు అంటే మూడవ బహిష్టును పూర్తి చేయనుంది. ఎందుకంటే అ’హ్వస్ తన భార్యకు ‘తలాఖ్ ఇచ్చి ఉన్నాడు. (ఇప్పుడు ఆ స్త్రీ భర్త మరణం తరువాత కూడా ‘ఇద్దత్ గడపాలా వద్దా?) ము’ఆవియహ్ బిన్ ‘సుఫియాన్ దీన్ని గురించి తెలుసుకునేందుకు ‘జైద్ బిన్ సా’బిత్‌కు ఇలా ఉత్తరం వ్రాసారు. ”ఈ స్త్రీ తన భర్త మరణించిన తరువాత కూడా ‘ఇద్దత్ గడపాలా లేద్దా? భర్త ఆస్తికి వారసురాలు అవుతుందా లేదా?” ‘జైద్ బిన్ సా’బిత్ ఇలా సమాధానం ఇచ్చారు, ”ఆ స్త్రీ మూడవ బహిష్టు దినాలకు ‘ఇద్దత్ గడుపుతూ చేరుకుంటే ఆమె ‘ఇద్దత్ పూర్తయ్యింది. ఆమె భర్తతో వేరైపోయింది. ఇంకా ఆమె భర్త మరణ ‘ఇద్దత్ దినాలు గడిపే అవసరం లేదు. ఇంకా తన భర్త ధనానికి ఆమె వారసురాలు కాజాలదు. భర్త కూడా ఆమెకు వారసుడు కాలేడు. ఎందుకంటే ఇద్దరూ పూర్తిగా విడిపోయారు. (మాలిక్)
3336 – [ 13 ] ( لم تتم دراسته ) (2/997)
وَعَنْ سَعِيْدِ بْنِ الْمُسَيَّبِ قَالَ: قَالَ عُمَرُ بْنُ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ أَيُّمَا امْرَأَةٍ طُلِّقَتْ فَحَاضَتْ حَيْضَةً أَوْ حَيْضَتَيْنِ ثُمَّ رُفِعَتْهَا حَيْضَتُهَا فَإِنَّهَا تَنْتَظِرُ تِسْعَةَ أَشْهُرٍ فَإِنْ بَانَ لَهَا حَمْلٌ فَذَلِكَ وَإِلَّا اعْتَدَّتْ بَعْدَ التِّسْعَةِ الْأَشْهُرِ ثَلَاثَةَ أَشْهُرٍ ثُمَّ حَلَّتْ. رَوَاهُ مَالِكٌ.
3336. (13) [2/997 –అపరిశోధితం]
స’యీద్ బిన్ ముసయ్యిబ్ కథనం: ‘ఉమర్ బిన్ ‘ఖ’త్తాబ్ (ర) ఇలా ఆదేశించారు, ” ‘తలాఖ్ ఇవ్వబడిన స్త్రీకి ఒకటి, రెండు బహిష్టులు వచ్చి మూడవ బహిష్టు కాక పోతే, ఆ స్త్రీ 9 మాసాల వరకు నిరీక్షించాలి. ఒకవేళ గర్భం ఉంటే ప్రసవమే ఆమె ‘ఇద్దత్ అవుతుంది. లేకపోతే 9 మాసాల తర్వాత, 3 మాసాలు ‘ఇద్దత్ గడపాలి. ఈ ‘ఇద్దత్ తర్వాత ఆమె ధర్మసమ్మతం అవుతుంది. (మాలిక్)
=====
16– بَابُ الْاِسْتِبْرَاءِ
16. గర్భ శుద్ధి (ఇస్తిబ్రాఅ‘)
ఇస్తిబ్రాఅ‘అంటే గర్భాన్ని పరిశుద్ధపరచడం అని అర్థం. అంటే ఒకవేళ ఎవరైనా బానిసరాలిని కొన్నా, లేక యుద్ధధనంగా లభించినా ఒక బహిష్టు వరకు యజమాని ఆమెతో సంభోగం చేయకుండా ఉండాలి. ఒకవేళ బహిష్టు అయితే ఆమె గర్భవతి కాదని తెలిసిపోతుంది. బహిష్టు అయిన తర్వాత ఆమెతో సంభోగం ధర్మసమ్మతం అవుతుంది. ఒకవేళ గర్భవతి అని తెలిస్తే సంభోగం చేయరాదు. దీన్నే ఇస్తిబ్రా‘అర్రహ్మ్ అంటారు. అంటే ఆ బానిసరాలి గర్భం పిండం లేకుండా ఖాళీగా ఉంది. ‘హై‘ద్ తర్వాత పరిశుభ్రమైన గిన్నెలో నీళ్ళు వేయవచ్చును. ఇది ఇంతకు ముందు సంభోగం అయిన స్త్రీకే వర్తిస్తుంది. కన్యలకు, కన్యగా ఉండే బానిసరాలికి వర్తించదు.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3337 – [ 1 ] ( صحيح ) (2/997)
عَنْ أَبِي الدَّرْدَاءِ قَالَ: مَرَّ النَّبِيُّ صلى الله عليه وسلم بِامْرَأةٍ مُجِحٍّ فَسَأَلَ عَنْهَا فَقَالُوْا: أَمَةٌ لِفُلَانٍ قَالَ: “أَيُلِمُّ بِهَا؟” قَالُوْا: نَعَمْ. قَالَ: “لَقَدْ هَمَمْتُ أَنْ أَلْعَنَهُ لَعْنًا يَدْخُلُ مَعَهُ فِي قَبْرِهِ كَيْفَ يَسْتَخْدِمُهُ وَهُوَ لَا يَحِلُّ لَهُ؟ أَمْ كَيْفَ يُوَرِّثُهُ وَهُوَلَا يَحِلُّ لَهُ؟” رَوَاهُ مُسْلِمٌ.
3337. (1) [2/997 –దృఢం]
అబూ దర్దా (ర) కథనం: ప్రవక్త (స) బిడ్డ కనబోతున్న ఒక బానిసరాలి వద్దకు వెళ్ళారు. ఆమె గురించి వివరాలు అడిగారు. ‘ఈమె ఎవరి బానిసరాలు’ అని అడిగారు. ప్రజలు ‘ఈమె ఫలానా వ్యక్తి బానిసరాలు’ అని తెలిపారు. అప్పుడు ప్రవక్త (స), ‘అతడు గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెతో సంభోగం చేసాడా?’ అని అడిగారు. దానికి ప్రజలు, ‘అవును,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘నేను ఇటువంటి వ్యక్తిని శపించాలనుకుంటున్నాను. ఆ శాపం అతనితో పాటు అతని సమాధిలోనికి పోతుంది. అసలు ఆ వ్యక్తి ఆ బిడ్డ ద్వారా ఎలా సేవ పొందగలడు? అది అతనికి ఎంతమాత్రం ధర్మం కాదు. లేదా అతడు ఆ బిడ్డను ఎలా వారసుడు చేయ గలడు? ఆ బిడ్డ అతని బిడ్డ కాదు. ఆ బిడ్డ అతని వారసుడు కాడు.” అని అన్నారు. [102] (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3338 – [ 2 ] ( لم تتم دراسته ) (2/998)
عَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ رَفَعَهُ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم. قَالَ فِيْ سَبَايَا أَوْطَاسٍ: “لَا تُوْطَأُ حَامِلٌ حَتَّى تَضَعَ وَلَا غَيْرُ ذَاتِ حَمْلٍ حَتَّى تَحِيْضَ حَيْضَةً”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ.
3338. (2) [2/998 –అపరిశోధితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) అవ్’తాస్ యుద్ధ ఖైదీల్లోని బానిసరాళ్ళ గురించి, గర్భవతులైన బానిస రాళ్ళతో వారు బిడ్డను కనేవరకు వారితో సంభోగం చేయరాదని, గర్భవతులు కాని బానిస రాళ్ళతో ఒక బహిష్టు అయ్యేవరకు వారితో సంభోగం చేయరాదని ఆదేశించారు.[103] (అ’హ్మద్, అబూ దావూద్, దార్మి)
3339 – [ 3 ] ؟ (2/998)
وَعَنْ رُوَيْفَعِ بْنِ ثَابِتٍ الْأَنْصَارِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَوْمَ حُنَيْنٍ: “لَا يَحِلُّ لامرئٍ يُؤْمِنُ بِاللهِ وَ الْيَوْمِ الْآخِرِ أَنْ يَّسْقِيَ مَاءَهُ زَرْعَ غَيْرِهِ .يَعْنِي “إِتْيَانَ الْحَبَالَى”. وَلَا يَحِلُّ لِاِمْرِئِ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِ أَنْ يَقَعَ عَلَى اِمْرَأَةٍ مِنَ السَّبْيِ حَتَّى يَسْتَبْرِئَهَا وَلَا يَحِلُّ لِاِمْرِئٍ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِ أَنْ يَبِيْعَ مَغْنَمًا حَتَّى يُقْسَمَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَرَوَاهُ التِّرْمِذِيُّ إِلَى قَوْلِهِ” زَرْعَ غَيْرِهِ”.
3339. (3) [2/998 ? ]
రువై ఫ’అ ఇబ్నె సా’బిత్ అ’న్సారీ (ర) కథనం: ప్రవక్త (స) ‘హునైన్ యుద్ధం రోజు, ”అల్లాహ్నూ, తీర్పుదినాన్ని విశ్వసించే వ్యక్తికి తన నీటిని ఇతరుల పొలంలో వేయడం ధర్మం కాదు.” అంటే తన వీర్యాన్నీ గర్భవతిగా ఉన్న స్త్రీ గర్భంలో వేయడం, ఆమెతో సంభోగం చేయడం ఇస్తిబ్రాఅ‘ చేయకుండా ధర్మం కాదు. అదేవిధంగా అల్లాహ్నూ, తీర్పు దినాన్ని విశ్వసించే వ్యక్తి ఇస్తిబ్రా‘అ చేయకుండా పట్టుబడ్డ బానిసరాలితో సంభోగం ధర్మం కాదు. అదేవిధంగా అల్లాహ్నూ, తీర్పుదినాన్ని విశ్వసించే వ్యక్తి యుద్ధ ధనాన్ని పంచకముందే అమ్మడం ధర్మసమ్మతం కాదు,” అని ప్రవచించారు. (అబూ దావూద్, తిర్మిజి’)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3340 – [ 4 ] ( لم تتم دراسته ) (2/999)
عَنْ مَالِكٍ قَالَ: بَلَغَنِيْ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَأْمُرُ بِاِسْتِبْرَاءِ الِإِمَاءِ بِحَيْضَةِ إِنْ كَانَتْ مِمَّنْ تَحِيْضُ وَثَلَاثَةِ أَشْهُرٍ إِنْ كَانَتْ مِمَّنْ تَحِيْضُ وَيَنْهَى عَنْ سَقِيْ مَاءِ الْغَيْرِ
3340. (4) [2/999- అపరిశోధితం]
మాలిక్ ఉల్లేఖనం: ఒక వార్త ఇలా నాకు అందింది: ”ప్రవక్త (స) బానిసరాళ్ళ విషయంలో ఒక ‘హై‘ద్ ద్వారా ఇస్తిబ్రాఅ‘ చేయమని ఆదేశించేవారు. బహిష్టు వచ్చే వారైనా, రాని వారైనా మూడునెలలు వీక్షించమని ఆదేశించేవారు. అదేవిధంగా ఇతరుల పొలంలో నీళ్ళు వేయటాన్ని కూడా వారించేవారు. అంటే ఇతరుల ద్వారా గర్భవతులుగా ఉన్నవారితో కూడా సంభోగం చేయరాదని వారించారు. (ర’జీన్)
3341 – [ 5 ] ( لم تتم دراسته ) (2/999)
وَعَنِ ابْنِ عُمَرَ: أَنَّهُ قَالَ: إِذَا وُهِبَتِ الْوَلِيْدَةُ الَّتِيْ تُوْطَأُ أَوْ بِيْعَتْ أَوْ أُعْتِقَتْ فَلْتَسْتَبْرِئْ رَحِمَهَا بِحَيْضَةٍ وَلَا تَسْتَبْرِئُ الْعَذْرَاءُ. رَوَاهُمَا رَزِيْنٌ.
3341. (5) [2/999 –అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) అభిప్రాయం: సంభోగం చేయబడిన బానిసరాలు కానుకగా ఇవ్వబడినా, కొన్నా లేదా ఆమెను విడుదలచేసినా ఆమె తన గర్భాన్ని ఒక బహిష్టు ద్వారా పరిశుభ్రపరచాలి. అంటే ఒక బహిష్టువరకు ఆగాలి. ఆమె యజమాని ఇస్తిబ్రాఅ‘ చేయకుండా ఆమెతో సంభోగం చేయ రాదు. కన్యలతో ఇస్తిబ్రాఅ‘ చేయనవసరం లేదు. ఎందుకంటే వారి గర్భం ముందు నుండి ఖాళీగా, పరిశుభ్రంగా ఉంది. ఇస్తిబ్రాఅ‘ చేయకుండానే వారితో సంభోగం చేయవచ్చును. (ర’జీన్)
=====
17- بَابَ النَّفَقَاتِ وَحَقِّ الْمَمْلُوْكِ
17. బానిసల హక్కులు, వారికోసం ఖర్చు చేయటం
భర్త మరియు యజమాని బాధ్యత, భార్యాబిడ్డల, బానిసల, బానిసరాళ్ళ హక్కులను చెల్లించడం. ఒకవేళ భర్త, తన భార్యకు ‘తలాఖ్ ర‘దాయీ ఇచ్చినా సరే ‘ఇద్దత్ పూర్తయ్యేవరకు, అన్న పానీయాలు సమకూర్చాలి. ఖుర్ఆన్లో అల్లాహ్ ఆదేశం: ”(విడాకుల తరువాత) పూర్తి రెండు సంవత్సరాల పాల గడువు పూర్తి చేయవలెనని (తల్లి దండ్రులు) కోరినట్లయితే, తల్లులు తమ పిల్లలకు పాలివ్వాలి. బిడ్డ తండ్రిపై, వారికి తగు రీతిగా భోజనం మరియు వస్త్రాలిచ్చి పోషించవలసిన బాధ్యత ఉంటుంది. శక్తికి మించిన భారం ఏ వ్యక్తిపై కూడా మోపబడదు. తల్లి తనబిడ్డ వలన కష్టాలకు గురికాకూడదు. మరియు తండ్రికూడా తనబిడ్డ వలన (కష్టాలకు గురికాకూడదు). మరియు (పాలిచ్చే తల్లిని పోషించే బాధ్యత తండ్రిపై ఉన్నట్లు తండ్రి చనిపోతే) అతని వారసులపై కూడా ఉంటుంది. మరియు (తల్లి-దండ్రులు) ఇరువురు సంప్రదించుకొని పరస్పర అంగీకారంతో (రెండు సంవత్సరాలు పూర్తికాకముందే) బిడ్డచేత పాలు విడిపిస్తే, వారిరువురికి ఎలాంటి దోషంలేదు. మరియు మీరు మీ బిడ్డలకు వేరే స్త్రీ ద్వారా పాలు ఇప్పించే ఏర్పాటు చేయదలిస్తే, మీపై ఎలాంటి దోషంలేదు. కాని మీరు ఆమెకు (తల్లికి) ఇవ్వవలసింది ధర్మసమ్మతంగా చెల్లించాలి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు చేసేదంతా నిశ్చయంగా, అల్లాహ్ చూస్తు న్నాడని తెలుసుకోండి.” (అల్ బఖరహ్, 2:233)
”(నిర్ణీత గడువు కాలంలో) మీ శక్తి మేరకు, మీరు నివసించేచోటనే, వారిని కూడా నివసించనివ్వండి. మరియు వారిని ఇబ్బందులకు గురిచేయడానికి వారిని బాధించకండి. మరియు వారు గర్భవతులైతే, వారు ప్రసవించేవరకు వారి మీద ఖర్చుపెట్టండి. ఒకవేళ వారు మీ బిడ్డకు పాలుపడుతున్నట్లైతే వారికి వారి ప్రతిఫలం ఇవ్వండి. దాని కొరకు మీరు ధర్మసమ్మతంగా మీ మధ్య సంప్రదింపులు చేసుకోండి. ఒకవేళ మీకు దాని (పాలిచ్చే) విషయంలో ఇబ్బందులు కలిగితే, (తండ్రి) మరొక స్త్రీతో (బిడ్డకు) పాలిప్పించవచ్చు! సంపన్నుడైన వ్యక్తి తన ఆర్థిక స్తోమత ప్రకారం ఖర్చుపెట్టాలి. మరియు తక్కువ జీవనోపాధిగల వ్యక్తి అల్లాహ్ తనకు ప్రసాదించిన విధంగా ఖర్చుపెట్టాలి. అల్లాహ్ ఏ వ్యక్తిపై కూడా అతనికి ప్రసాదించిన దానికంటే మించిన భారం వేయడు. అల్లాహ్ కష్టం తరువాత సుఖం కూడా కలిగిస్తాడు.” (అ’త్తలాఖ్, 65 : 6–7)
ఈ రెండు ఆయతుల ద్వారా భార్యాబిడ్డల ఖర్చు భర్త బాధ్యత అని, అదేవిధంగా బానిసల, బానిసరాళ్ళ బాధ్యత యజమానులపై ఉందని నిరూపించడబడుతుంది. ‘హదీసు’ల ద్వారా మరికొంత వివరంగా పేర్కొన బడింది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3342 – [ 1 ] ( متفق عليه ) (2/1000)
عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: إِنَّ هِنْدًا بِنْتَ عُتْبَةَ قَالَتْ: يَارَسُوْلَ اللهِ إِنَّ أَبَا سُفْيَانَ رَجُلٍ شَحِيْحٌ وَلَيْسَ يُعْطِيْنِيْ مَا يَكْفِيْنِيْ وَوَلَدِيْ إِلَّا مَا أَخَذْتُ مِنْهُ وَهُوَ يَعْلَمُ. فَقَالَ: “خُذِيْ مَا يَكْفِيْكِ وَوَلَدَكِ بِالْمَعْرُوْفِ”.
3342. (1) [2/1000 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: హిందా బిన్తె ‘ఉత్బహ్, ఇస్లామ్ స్వీకరించిన తర్వాత ప్రవక్త (స) వద్దకు వచ్చి ”నా భర్త అబూ ‘సుఫియాన్ చాలా పిసినారి, నాకు నా సంతానం ఖర్చులకు చాలినన్ని డబ్బులు ఇవ్వడం లేదు. ఒకవేళ అతను లేనప్పుడు అతన్ని అడక్కుండా అతని సంపదలోనుండి నాకోసం, నా బిడ్డల కోసం కావలసినంత ధనం తీసుకుంటే ధర్మమా కాదా?” అని విన్నవించుకుంది. దానికి ప్రవక్త (స), ”పద్ధతి ప్రకారం నీకూ నీ పిల్లలకూ చాలినంత ధనం నీవు తీసుకోవచ్చును,” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
3343 – [ 2 ] ( صحيح ) (2/1000)
وَعَنْ جَابِرِ بْنِ سَمُرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَعْطَى اللهُ أَحَدَكُمْ خَيْرًا فَلْيَبْدَأُ بِنَفْسِهِ وَأَهْلِ بَيْتِهِ”. رَوَاهُ مُسْلِمٌ.
3343. (2) [2/1000– దృఢం]
జాబిర్ బిన్ సమురహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్ (త) మీలో ఎవరికైనా ధన సంపదలు ఇస్తే, అందరికంటే ముందు తనపై ఆ తరువాత తన ఇంటి వారిపై, భార్యా బిడ్డలపై ఖర్చుచేయాలి. (ముస్లిమ్)
3344 – [ 3 ] ( صحيح ) (2/1000)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لِلْمَمْلُوْكِ طَعَامُهُ وَكِسْوَتُهُ وَلَا يُكَلَّفُ مِنَ الْعَمَلِ إِلَّا مَا يُطِيْقُ”. رَوَاهُ مُسْلِمٌ.
3344. (3) [2/1000– దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: బానిసలకు అన్న వస్త్రాలు సమకూర్చడం యజ మాని నైతిక బాధ్యత. ఇంకా అతని శక్తికి మించిన పని చెప్పరాదు. చేయగలిగినంత పని మాత్రమే అతనికి చెప్పాలి. (ముస్లిమ్)
3345 – [ 4 ] ( متفق عليه ) (2/1000)
وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِخْوَانُكُمْ جَعَلَهُمُ الله تَحْتَ أَيْدِيْكُمْ فَمَنْ جَعَلَ اللهُ أَخَاهُ تَحْتَ يَدَيْهِ فَلْيُطْعِمْهُ مِمَّا يَأْكُلُ وَلْيُلْبِسْهُ مِمَّا يَلْبَسُ وَلَا يُكَلِّفُهُ مِنَ الْعَمَلِ مَا يَغْلِبُهُ فَإِنْ كَلَّفَهُ مَا يَغْلِبُهُ فَلْيُعِنْهُ عَلَيْهِ”.
3345. (4) [2/1000 –ఏకీభవితం]
అబూ జ’ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: మీ సేవకులను, మీ సోదరులను, అల్లాహ్ (త) మీ అధీనంలో ఉంచాడు. అల్లాహ్ (త) ఎవరినైనా బానిసలకు, సేవకులకు యజమాని చేస్తే, తాను తిన్నదే వారికీ తినిపించాలి. తాను ధరించిందే వారికీ ధరింపచేయాలి, ఇంకా వారి శక్తికి మించిన పని చెప్పరాదు, ఒకవేళ అటువంటి పని ఏదైనా ఉంటే అతనికి సహాయంగా అతని వెంట ఉండి తానూ చేయాలి. (బు’ఖారీ, ముస్లిమ్)
3346 – [ 5 ] ( صحيح ) (2/1000)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو جَاءَهُ قَهْرَمَانٌ لَهُ فَقَالَ لَهُ: أَعْطَيْتَ الرَّقِيْقَ قُوْتَهُمْ؟ قَالَ:لَا. قَالَ: فَانْطَلِقُ فَأَعْطِهِمْ فَإِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه و سلم قَالَ: “كَفَى بِالرَّجُلِ إِثْمًا أَنْ يَحْبِسَ عَمَّنْ يَمْلِكُ قَوْتَهُ”.
وَفِيْ رِوَايَةٍ :”كَفَى بِالْمَرْءِ إِثْمًا أَنْ يُضَيْعَ مَنْ يَقُوْتُ”.رَوَاهُ مُسْلِمٌ
3346. (5) [2/1000 –దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ యొక్క గుమాస్తా అతని వద్దకు వచ్చాడు. ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ అతనితో ‘బానిసలకు, సేవకులకు అన్నపానీయాలు సమకూర్చావా?’ అని అడిగారు. దానికి అతడు లేదు అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు అతను నువ్వు వెళ్ళి వారి అన్నపానీయాలు ఇచ్చిరా, ఎందుకంటే ప్రవక్త (స), ”మానవుడికి, ఎవరి ఆహారం తన చేతిలో ఉందో దాన్ని ఆపివేసే పాపము అతనికి చాలు.
మరో ఉల్లేఖనంలో మానవుడికి, తన అధీనంలో ఉన్న ఇతరుల ఆహారాన్ని వృథా చేసే పాపమే చాలు. వారికి అన్నపానీయాలు సమకూర్చక పోవడమే చాలు” అని ప్రవచించారు. (ముస్లిమ్)
3347 – [ 6 ] ( صحيح ) (2/1001)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا صَنَعَ لِأَحَدِكُمْ خَادِمُهُ طَعَامَهُ ثُمَّ جَاءَهُ بِهِ وَقَدْ وَلِيَ حَرَّهُ وَدُخَانَهُ فَلْيُقْعِدْهُ مَعَهُ فَلْيَأْكُلْ وَإِنْ كَانَ الطَّعَامُ مَشْفُوْهَا قَلِيْلًا فَلْيَضَعْ فِيْ يَدِهِ مِنْهْ أُكْلَةً أَوْ أُكْلَتَيْنِ”. رَوَاهُ مُسْلِمٌ.
3347. (6) [2/1001–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సేవకుడు భోజనం తయారుచేసి యజమాని ముందు ఉంచితే యజమాని సేవకుడిని తనతోపాటు కూర్చోబెట్టి తినిపించాలి. ఎందుకంటే వేడి, పొగ, శ్రమ మొదలైన వాటిని భరించి ఆ సేవకుడు భోజనం తయారుచేసాడు. సేవకుడిని తనతోపాటు కోర్చోబెట్టి తినిపిస్తే సేవకుడు తనకు కలిగిన కష్టాన్నంతా మరచిపోతాడు. ఒకవేళ భోజనం తక్కువ, తినేవారు చాలామంది ఉంటే ఒకటి రెండు ముద్దలు అతని చేతిలో పెట్టాలి.” (ముస్లిమ్)
3348 – [ 7 ] ( متفق عليه ) (2/1001)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ الْعَبْدَ إِذَا نَصَحَ لِسَيِّدِهِ وَأَحْسَنَ عِبَادَةَ اللهِ فَلَهُ أَجْرُهُ مَرَّتَيْنِ”.
3348. (7) [2/1001–ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నిస్సందేహంగా సేవకుడు తన యజమాని శ్రేయస్సు కోరుతూ ఉత్తమరీతిలో అల్లాహ్(త)ను ఆరాధిస్తే అతనికి రెండు పుణ్యాలు లభిస్తాయి.” [104] (బు’ఖారీ, ముస్లిమ్)
3349 – [ 8 ] ( متفق عليه ) (2/1001)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “نِعِمّا لِلْمَمْلُوْكِ أَنْ يَّتَوَفَّاهُ اللهُ بِحُسْنِ عِبَادَةِ رَبِّهِ وَطَاعَةِ سَيِّدِهِ نِعِمًّا لَهُ”.
3349. (8) [2/1001–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన యజమానికి సేవచేస్తూ అల్లాహ్(త)ను ఆరాధిస్తూ మరణించే సేవకుడికి చాలా శుభం కలుగుతుంది.” [105] (బు’ఖారీ, ముస్లిమ్)
3350 – [ 9 ] ( صحيح ) (2/1001)
وَعَنْ جَرِيْرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَبَقَ الْعَبْدُ لَمْ تُقْبَلْ لَهُ صَلَاةٌ”.
وَفِيْ رِوَايَةٍ عَنْهُ قَالَ: “أَيُّمَا عَبْدٍ أَبَقَ فَقَدْ بَرِئَتْ مِنْهُ الذِّمَّةُ”.
وَفِيْ رِوَايَةٍ عَنْهُ قَالَ: “أَيُّمَا عَبْدٍ أَبَقَ مِنْ مَوَالِيْهِ فَقَدْ كَفَرَ حَتَّى يَرْجِعَ إِلَيْهِمْ”. رَوَاهُ مُسْلِمٌ.
3350. (9) [2/1001–దృఢం]
జరీర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సేవకుడు తన యజమాని దగ్గర నుండి పారిపోతే, అతడి నమా’జ్ స్వీకరించబడదు.
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ‘యజమాని దగ్గర నుండి పారిపోయిన సేవకుడు ఇస్లామీయ పరిధి నుండి తొలగిపోయి నట్లే. అంటే అతడు మార్గభ్రష్టత్వానికి గురిఅయినట్లే.’
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ‘యజమాని నుండి పారి పోయిన సేవకుడు తిరిగి వచ్చేవరకు, అవిశ్వాస స్థితిలో ఉంటాడు. ఇది వాస్తవం కావచ్చు లేదా ఆంక్ష కావచ్చు లేదా కృతఘ్నత వల్ల కావచ్చు.’ (ముస్లిమ్)
3351 – [ 10 ] ( متفق عليه ) (2/1001)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: سَمِعْتُ أَبَا الْقَاسِمِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ قَذَفَ مَمْلُوْكُهُ وَهُوَ بَرِيْءٌ مِمَّا قَالَ جُلِدَ يَوْمَ الْقِيَامَةِ إِلَّا أَنْ يَّكُوْنَ كَمَا قَالَ”.
3351. (10) [2/1001–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: అబుల్ ఖాసిమ్ (ర)ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”తన బానిసపై వ్యభిచార అభాండం వేసినవాడికి తీర్పు దినం నాడు కొరడా శిక్ష వేయబడును. ఒకవేళ బానిస ఆ పనిచేసి ఉంటే ఇలా జరుగదు.” (బు’ఖారీ, ముస్లిమ్)
3352 – [ 11] ( صحيح ) (2/1001)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ ضَرَبَ غُلَامًا لَهُ حَدًّا لَمْ يَأْتِهِ أَوْ لَطَمَهُ فَإِنْ كَفَّارَتَهُ أَنْ يُعْتِقَهُ”. رَوَاهُ مُسْلِمٌ .
3352. (11) [2/1001–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”ఎవరైనా తన బానిసను చేయని నేరానికి శిక్షించినా , లేదా లంపకాయ కొట్టినా అతన్ని విడుదల చేయడమే వారి పరిహారం.” (ముస్లిమ్)
3353 – [ 12 ] ( صحيح ) (2/1002)
وَعَنْ أَبِيْ مَسْعُوْدِ الْأَنْصَارِيِّ قَالَ: كُنْتُ أَضْرِبُ غُلَامًا لِيْ فَسَمِعْتُ مِنْ خَلْفِيْ صَوْتًا: “اِعْلَمْ أَبَا مَسْعُوْدٍ للهُ أَقْدَرُ عَلَيْكَ مِنْكَ عَلَيْهِ” فَالْتَفَت فَإِذَا هُوَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ هُوَ حُرٌّ لِوَجْهِ اللهِ. فَقَالَ: “أَمَا لَوْ لَمْ تَفْعَلْ لَلَفَحَتْكَ النَّارُ أَوْ لَمَسَّتْكَ النَّارُ”. رَوَاهُ مُسْلِمٌ.
3353. (12) [2/1002– దృఢం]
అబూ మస్’ఊద్ అన్సారీ (ర) కథనం: నేను నా బానిసను కొడుతున్నాను. ఇంతలో వెనుకనుండి అబూ మస్’ఊద్ జాగ్రత్త! నీకు ఇతనిపై ఉన్న అధికారం కంటే అల్లాహ్(త)కు నీపై చాలా ఎక్కువగా అధికారం ఉంది అనే శబ్దం వచ్చింది. నేను వెనుక తిరిగి చూసేసరికి ప్రవక్త (స) ఉన్నారు. అప్పుడు నేను, ‘ఓ ప్రవక్తా! ఈ బానిసను నేను అల్లాహ్(త) కోసం విడుదల చేస్తున్నాను,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘ఒకవేళ నీవు విడుదల చేయకపోతే నరకాగ్ని నిన్ను కాల్చివేస్తుంది,’ అని అన్నారు. [106] (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3354 – [ 13 ] ( صحيح ) (2/1002)
عَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ: أَنَّ رَجُلًا أَتَى النَّبِيُّ صلى الله عليه وسلم فَقَالَ: إِنَّ لِيْ مَالًا وَإِنَّ وَالِدِيْ يَحْتَاجُ إِلى مَالِيْ قَالَ: “أَنْتَ وَمَالُكَ لِوَالِدِكَ إِنَّ أَوْلَادَكُمْ مِنْ أَطْيَبِ كَسْبِكُمْ كُلُوْا مِنْ كَسَبِ أَوْلَادِكُمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
3354. (13) [2/1002–దృఢం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి, తన తాత ద్వారా కథనం: ”ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘నా దగ్గర ధనం ఉంది, నా తండ్రికి డబ్బు అవసరం ఉంది. నేను నా ధనాన్ని నా తండ్రికి ఇవ్వవచ్చునా లేదా?’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘నువ్వు, నీ ధనం నీ తండ్రివి. ఎందుకంటే మీ సంతానమే మీ ఉత్తమ సంపాదన, మీరు మీ సంతాన సంపాదనలో నుండి తిన వచ్చును,’ అని అన్నారు. (అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
3355 – [ 14 ] ( لم تتم دراسته ) (2/1002)
وَعَنْهُ وَعَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ: أَنَّ رَجُلًا أَتَى النَّبِيُّ صلى الله عليه وسلم فَقَالَ: إِنِّيْ فَقِيْرٌ لَيْسَ لِيْ شَيْءٌ وَلِيْ يَتِيْمٌ فَقَالَ: “كُلَّ مِنْ مَالِ يَتِيْمِكَ غَيْرَ مُسْرِفٍ وَلَا مُبَادِرٍ وَلَا مُتَأثِّلٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.
3355. (14) [2/1002 –అపరిశోధితం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి, తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘నేను చాలా పేదవాడ్ని. అగత్యపరుడ్ని, నా దగ్గర ఏమీ లేదు. అయితే నేను ఒక అనాథకు సంరక్షకుడ్ని. నేనతని ధనం నుండి ప్రతిఫలంగా కొంత ధనాన్ని తినవచ్చునా లేదా?’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘నీ ప్రతిఫలానికి తగినంత నువ్వు తీసుకోగలవు. అయితే అనాథ సంపాదన నుండి దుబారా ఖర్చు చేయరాదు. ఖర్చు చేయడంలో తొందరపడకు. ఇంకా నీకోసం ధనాన్ని కూడబెట్టకు’ అని అన్నారు. [107] (అబూ దావూద్, నసాయి’, ఇబ్నె మాజహ్)
3356 – [ 15 ] ( لم تتم دراسته ) (2/1002)
وَعَنْ أُمِّ سَلَمَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ كَانَ يَقُوْلُ فِيْ مَرَضِهِ: “اَلصَّلَاةَ وَمَا مَلَكَتْ أَيْمَانُكُمْ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.
3356. (15) [2/1002– అపరిశోధితం]
ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) తాను అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇలా ప్రవచించారు: ”ప్రజలారా! మీరు ఎల్లప్పుడూ నమా’జును నిర్ణీత సమయాల్లో ఆచరిస్తూ ఉండండి. ఇంకా బానిసల, సేవకుల హక్కులను చెల్లిస్తూ ఉండండి.”(బైహఖీ- -షు’అబిల్ ఈమాన్)
3357 – [ 16 ] ( لم تتم دراسته ) (2/1002)
وَرَوَى أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ عَنْ عَلِيٍّ نَحْوَهُ
3357. (16) [2/1002– అపరిశోధితం]
అ’హ్మద్, అబూ దావూద్ ఈ ‘హదీసు’ను ‘అలీ (ర) ద్వారా కూడా ఉల్లేఖించారు.
3358 – [ 17 ] ( لم تتم دراسته ) (2/1002)
وَعَنْ أَبِيْ بَكْرِالصِّدِّيْقِ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا يَدْخُلُ الْجَنَّةَ سَيِّئُ الْمَلَكَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.
3358. (17) [2/1002– అపరిశోధితం]
అబూ బకర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బానిసల, సేవకుల పట్ల చెడుగా ప్రవర్తించేవాడు, అసభ్యంగా వ్యవహరించే వాడు స్వర్గంలో ప్రవేశించడు.”[108] (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
3359 – [ 18 ] ( لم تتم دراسته ) (2/1003)
وَعَنْ رَافِعِ بْنِ مَكِيْثٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “حُسْنُ الْمَلَكَةِ يُمْنٌ وَسُوْءُ الْخُلُقِ شُؤْمٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَلَمْ أَرَ فِيْ غَيْرِ الْمَصَابِيْحِ مَا زَادَ عَلَيْهِ فِيْهِ مِنْ قَوْلِهِ: “وَالصَّدَقَةُ تَمْنَعُ مِيْتَةَ السُّوْءِ وَالْبِرُّ زَيَادَةٌ فِي الْعُمُرِ”.
3359. (18) [2/1003 –అపరిశోధితం]
రా’ఫె బిన్ మకీస్’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: బానిసలు, సేవకుల పట్ల మంచిగా వ్యవహరిస్తే శుభం కలుగుతుంది. వారిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే అశుభం నెలకొంటుంది.” (అబూ దావూద్)
మరో ఉల్లేఖనంలో ”దాన ధర్మాలు (‘సదఖహ్) మానవుణ్ణి దుర్మరణం నుండి కాపాడుతాయి. పుణ్యం, సత్కార్యాలు ఆయుష్షును పెంచుతాయి” అని ఉంది.
3360 – [ 19 ] ( لم تتم دراسته ) (2/1003)
وَعَنْ أَبِيْ سَعِيْدِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا ضَرَبَ أَحَدُكُمْ خَادِمَهُ فَذَكَرَ اللهَ فَارْفَعُوْا أَيْدِيَكُمْ”. روَاهُ التِّرْمِذِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ لَكِنَّ عِنْدَهُ. “فَلْيُمْسِكْ” بَدْلَ “فَارْفَعُوْا أَيْدِيَكُمْ”.
3360. (19) [2/1003 –అపరిశోధితం]
అబూ స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ సేవకుడ్ని గాని, బానిసనుగాని కొడుతు న్నప్పుడు అతడు దైవం పేరు పలికితే అంటే అల్లాహ్ (త) కోసం నన్ను వదలివేయండి, ఇంకా నన్ను క్షమించండి అని అంటే, మీరు మీ చేతిని ఎత్తివేయండి అంటే కొట్టటం ఆపివేయండి, ఇంకా అతని తప్పును క్షమించండి.” (తిర్మిజి’, బైహఖీ–షు’అబిల్ ఈమాన్)
3361 – [ 20 ] ( حسن ) (2/1003)
وَعَنْ أَبِيْ أَيُّوْبَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ فَرَّقَ بَيْنَ وَالِدَةٍ وَوَلَدِهَا فَرَّقَ اللهُ بَيْنَهُ وَبَيْنَ أَحِبَّتِهِ يَوْمَ الْقِيَامَةِ”. روَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ.
3361. (20) [2/1003 –ప్రామాణికం]
అబూ అయ్యూబ్(ర) కథనం: ప్రవక్త(స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”తల్లి కొడుకులను దూరం చేసిన వారిని అల్లాహ్ (త) తీర్పుదినం నాడు వారి కుటుంబం నుండి దూరం చేస్తాడు.” [109] (తిర్మిజి’, దార్మి)
3362 – [ 21 ] ( ضعيف ) (2/1003)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: وَهَبَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم غُلَامَيْنِ أَخَوَيْنِ فَبِعْثُ أَحَدَهُمَا. فَقَالَ لِيْ رَسُوْلُ صلى الله عليه وسلم: “يَا عَلِيُّ مَا فَعَلَ غُلَامُكَ؟ “فَأَخْبَرْتُهُ. فَقَالَ: “رُدَّهُ رُدَّهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.
3362. (21) [2/1003– బలహీనం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ఇద్దరు బానిసలను ఇచ్చారు. వారిద్దరూ పరస్పరం సోదరులు. ఒకరిని నేను అమ్మివేసాను. ప్రవక్త (స) నన్ను, ‘ఆ రెండవ బానిస ఎక్కడ,’ అని అడిగారు. నేను, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! అతన్ని నేను అమ్మివేసాను,’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు అతన్ని తిరిగి తీసుకో, నువ్వు అతన్ని తిరిగి తీసుకో,’ అని అన్నారు. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్) అంటే ఆ బేరాన్ని రద్దు చేయి. వారిద్దరినీ తోడు ఉంచు, వారిద్దరూ కలసి ఉంటారు.
3363 – [ 22 ] ( لم تتم دراسته ) (2/1003)
وَعَنْهُ أَنَّهُ فَرَّقَ بَيْنَ جَارِيَةٍ وَوَلَدِهَا فَنَهَاهُ النَّبِيُّ صلى الله عليه وسلم عَنْ ذَلِكَ فَرَدَّ الْبَيْعَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ مُنْقَطِعًا .
3363. (22) [2/1003 –అపరిశోధితం]
‘అలీ (ర) ఒక బానిసరాలిని ఆమె కొడుకును వేర్వేరుగా అమ్మివేసారు. ప్రవక్త (స) ఆ బేరాన్ని రద్దుచేసారు. (అబూ దావూద్)
3364 – [ 23 ] ( لم تتم دراسته ) (2/1003)
وَعَنْ جَابِرٍعَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “ثَلَاثٌ مَنْ كُنَّ فِيْهِ يَسَّرَاللهُ حَتْفَهُ وَأَدْخَلَهُ جَنَّتَهُ: رِفْقٌ بِالضَّعِيْفِ وَشَفَقَةٌ عَلَى الْوَالِدَيْنِ وَ إِحْسَانٌ إِلَى الْمَمْلُوْكِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.
3364. (23) [2/1003– అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరిలో ఈ మూడు సుగుణాలు ఉంటాయో అల్లాహ్ (త) అతనికి ప్రశాంత మరణం ప్రసాదిస్తాడు. స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. 1. బలహీనుల పట్ల సున్నితంగా వ్యవహరించడం, 2. తల్లి దండ్రులపట్ల గౌరవమర్యాదలతో ప్రవర్తించడం, 3. సేవకులు, బానిసలకు మేలు చేయటం. (తిర్మిజి’ / ఏకోల్లేఖనం)
3365 – [ 24 ] ؟ (2/1004)
وَعَنْ أَبِيْ أُمَامَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَهَبَ لِعَلِيٍّ غُلَامًا فَقَالَ: “لَا تَضْرِبْهُ فَإِنِّيْ نُهِيْتُ عَنْ ضَرْبِ أَهْلِ الصَّلَاةِ وَقَدْ رَأَيْتُهُ يُصَلِّيْ”. هَذَا لَفْظُ الْمَصَابِيْحِ.
3365. (24) [2/1004 ? ]
అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ‘అలీ (ర)కు ఒక బానిసను ఇచ్చి, ‘ఇతన్ని నీవు కొట్టకూడదు. నమా’జీలను కొట్టడాన్ని నిషేధించటం జరిగింది, అతడు నమా’జ్ చదువు తుండగా నేను చూచాను,’ అని అన్నారు.
3366 – [ 25 ] ( لم تتم دراسته ) (2/1004)
وَفِي”الْمُجْتَبَى” لِلدَّارَقُطْنِيِّ: أَنَّ عُمَرَ بْنَ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: نَهَانَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ ضَرْبِ الْمُصَلِّيْنَ.
3366. (25) [2/1004 –అపరిశోధితం]
దారు ఖుతునీ, ఒక ఉల్లేఖనంలో, ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) మమ్మల్ని నమా’జీలను కొట్టకూడదని వారించారు. అని ఉంది.
3367 – [ 26 ] ( لم تتم دراسته ) (2/1004)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: يَا رَسُوْلَ اللهِ كَمْ نَعْفُوْ عَنِ الْخَادِمِ؟ فَسَكَتَ ثُمَّ أَعَادَ عَلَيْهِ الْكَلَامَ فَصَمَتَ فَلَمَّا كَانَتِ الثَّالِثَةُ قَالَ: “اعْفُوْا عَنْهُ كُلَّ يَوْمٍ سَبْعِيْنَ مَرَّةً”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3367. (26) [2/1004– అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! మేము మా బానిసల తప్పులను ఎంతవరకు క్షమించాలి,’ అని ప్రశ్నించాడు. ప్రవక్త (స) మౌనంగా ఉన్నారు. ఆ వ్యక్తి మూడుసార్లు అడిగాడు, ప్రవక్త (స) మౌనంగా ఉన్నారు. మూడవసారి ప్రవక్త (స), ‘నువ్వు నీ బానిసల తప్పులను ప్రతి రోజూ 70 సార్లు క్షమించాలి,’ అని అన్నారు. (అబూ దావూద్)
అంటే ప్రతి రోజూ 70 సార్లు క్షమించు. 70 సార్లు అంటే అత్యధికంగా నీవు వారి చిన్న పెద్ద తప్పులను, పొరపాట్లను క్షమిస్తూ ఉండు.
3368 – [ 27 ] ( لم تتم دراسته ) (2/1004)
وَرَوَاهُ التِّرْمِذِيُّ عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو.
3368. (27) [2/1004– అపరిశోధితం]
దీన్నే, తిర్మిజి’ మరో ఉల్లేఖనంలో ‘అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ ఆధారంగా పేర్కొన్నారు.
3369 – [ 28 ] ( لم تتم دراسته ) (2/1004)
وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ لَاءَمَكُمْ مِنْ مَمْلُوْكِيْكُمْ فَأَطْعِمُوْهُ مِمَّا تَأْكُلُوْنَ وَاكْسُوْهُ مِمَّا تَكْسُوْنَ وَمَنْ لَا يُلَائِمُكُمْ مِنْهُمْ فَبِيْعُوْهُ وَلَا تُعَذِّبُوْا خَلَقَ اللهِ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ.
3369. (28) [2/1004 –అపరిశోధితం]
అబూజ’ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మీ బానిసల్లోని మీకు అనుకూలంగా ఉంటూ మీకు సేవచేసే వారికి మీరు తిన్నదే వారికీ పెట్టండి, మీరు ధరించేదే వారికీ ధరింపజేయండి. ఇంకా మీకు అనుకూలంగా లేని, మీకు సేవచేయని బానిసలను అమ్మివేయండి. అంతేగాని దైవ సృష్టితాలను హింసించకండి. (అ’హ్మద్, అబూ దావూద్)
3370 – [ 29 ] ( صحيح ) (2/1004)
وَعَنْ سَهلِ بْنِ الْحَنْظَلِيَّةِ قَالَ: مَرَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِبَعِيْرٍ قَدْ لَحِقَ ظَهْرُهُ بِبَطْنِهِ فَقَالَ: “اتَّقُوْا اللهَ فِيْ هَذِهِ الْبَهَائِمِ الْمُعْجَمَةِ فَارْكَبُوْهَا صَالِحَةً وَاتْرُكُوْهَا صَالِحَةً”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3370. (29) [2/1004 –దృఢం]
సహల్ బిన్ ‘హం”జలియ్యహ్ (ర) కథనం: ప్రవక్త (స) బక్కచిక్కిన, బలహీనమైన ఒంటె ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. బలహీనత వల్ల కడుపు వీపుకు తగిలి ఉంది. అది చూచి ప్రవక్త (స) ఈ నోరులేని ప్రాణులను కనికరించండి, పైవానికి భయపడండి. వాటిపై స్వారీ చేయగలిగే పరిస్థితిలో అవి ఉంటేనే వాటిపై స్వారీ చేయండి. అంటే బలంగా ఆరోగ్యంగా ఉండాలి. అవి బలహీనంగా ఉంటే వాటిపై స్వారీ చేయకండి. సాధ్యమైనంత వరకు వాటిని బాగా తినిపించండి. వాటితో పనితీసుకొని ఆహారం పెట్టటం మాని వేయటం జరుగకూడదు. (అబూ దావూద్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3371 – [ 30 ] ( لم تتم دراسته ) (2/1005)
عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: لَمَّا نَزَلَ قَوْلُهُ تَعَالى (وَلَا تَقْرَبُوْا مَالَ الْيَتِيْمِ إِلَّا بِالَّتِيْ هِيَ أَحْسَنُ؛6: 152) وَقَوْلُهُ تَعَالى: (إِنَّ الَّذِيْنَ يَأْكُلُوْنَ أَمْوَالَ الْيَتَامى ظُلْمًا؛4: 10) الآيَةَ اِنْطَلَقَ مَنْ كَانَ عِنْدَهُ يَتِيْمٌ فَعَزَلَ طَعَامَهُ مِنْ طَعَامِهِ وَشَرَابَهُ مِنْ شَرَابِهِ فَإِذَا فَضَلَ مِنْ طَعَامش الْيَتِيْمِ وَشَرَابِهِ شَيْءٌ حُبِسَ لَهُ حَتَّى يَأْكُلَهُ أَوْ يَفْسُدَ فَاشْتَدَّ ذَلِكَ عَلَيْهِمْ فَذَكَرُوْا ذَلِكَ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَأَنْزَلَ اللهُ تَعَالى: (وَيَسْأَلُوْنَكَ عَنِ الْيَتَامى قُلْ: إِصْلَاحٌ لَهُمْ خَيْرٌ وَإِنْ تُخَالِطُوْهُمْ فَإِخْوَانُكُمْ 2: 220) فَخَلَطُوْا طَعَامَهُمْ بِطَعَامِهِمْ وَشَرَابَهُمْ بِشَرَابِهِمْ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.
3371. (30) [2/1005 –అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: అల్లాహ్ (త) ”వలా తఖ్రబూ మాలల్ యతీమి ఇల్లా బిల్లతీ హియ అ‘హ్సను, (అల్ అన్’ఆమ్, 6:152) ఇన్నల్లజీ‘న యాకులూన అమ్వాలల్ యతామా జుల్మన్.” (అన్ నిసా’, 4:10) అవతరించి నపుడు ప్రజలు తమ సంరక్షణలో ఉన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూడ సాగారు. అనాథల ఆహార పదార్థాలను వేరుచేసి వేసారు. అంటే తమ భోజనం వేరుగా వండేవారు. అనాథల భోజనం వేరుగా వండేవారు. అనాథల ఆహార పదార్థాలు మిగిలితే వాటిని జాగ్రత్త పరిచే వారు. ఈ విషయం అనాథల బంధువులకు బాధ కలిగించింది. వారు ప్రవక్త (స) వద్దకు వచ్చి విన్న వించుకున్నారు. అప్పుడు ఈ ఆయతు అవత రించింది: ”…మరియు అనాథులను గురించి వారు నిన్ను అడుగుతున్నారు. నీవు ఇలా సమాధాన మివ్వు: ‘వారి సంక్షేమానికి తోడ్పడటమే మేలైనది.’ మరియు మీరు వారితో కలిసి మెలిసి ఉంటే (తప్పు లేదు), వారు మీ సోదరులే! మరియు చెరచే వాడె వడో, సవరించే వాడెవడో అల్లాహ్‌కు బాగా తెలుసు. మరియు అల్లాహ్ కోరితే మిమ్మల్ని కష్టపెట్టి ఉండే వాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.” (అల్ బఖరహ్, 2 : 220)
ఈ ఆయతు అవతరించిన తరువాత వారిపట్ల న్యాయంగా, ధర్మంగా ప్రవర్తించడం ప్రారంభించారు. (అబూ దావూద్, నసాయీ’)
3372 – [ 31 ] ( ضعيف ) (2/1005)
وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: لَعَنَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مَنْ فَرَّقَ بَيْنَ الْوَالِدِ وَوَلَدِهِ وَبَيْنَ الْأَخِ وَبَيْنَ أَخِيْهِ. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالدَّارَقُطْنِيُّ.
3372. (31) [2/1005– బలహీనం]
అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) తండ్రి కొడుకులను, ఇద్దరు సోదరులను విడదీసే వారిని శపించారు. (ఇబ్నె మాజహ్, దారు ఖుతునీ)
3373 – [ 32] ( لم تتم دراسته ) (2/1005)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا أُتِيَ بِالسَّبْيِ أَعْطَى أَهْلَ الْبَيْتِ جَمِيْعًا كَرَاهِيَةَ أَنْ يُفَرِّقَ بَيْنَهُمْ. رَوَاهُ ابْنُ مَاجَهُ.
3373. (32) [2/1005 –అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒకే ఇంటికి చెందిన ఖైదీలను తీసుకు రావటం జరిగితే, ప్రవక్త (స) వారినందరినీ ఒకే వ్యక్తికి ఇచ్చివేసేవారు. వారు పరస్పరం దూరం కారాదని, ప్రవక్త (స) ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ఒకరికొకరు దూరం కావటాన్ని చెడుగా భావించే వారు. (ఇబ్నె మాజహ్)
3374 – [ 33 ] ( لم تتم دراسته ) (2/1005)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أَلَا أُنَبِّئُكُمْ بِشَرَارِكُمْ؟ اَلَّذِيْ يَأْكُلُ وَحْدَهُ وَيَجْلِدُ عَبْدَهُ وَيَمْنَعُ رِفْدَهُ”. رَوَاهُ رَزِيْنٌ .
3374. (33) [2/1005 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మీలో అందరికంటే చెడ్డవారిని గురించి నేను మీకు తెలుపనా? వారు ఒంటరిగా తింటారు, తమతో పాటు భార్యాబిడ్డలకు తినిపించరు, ఇంకా తమ బానిసలను అన్యాయంగా హింసిస్తారు, ఇంకా తప్పనిసరి దానధర్మాలు కూడా చేయరు. (ర’జీన్)
3375 – [ 34 ] ( لم تتم دراسته ) (2/1006)
وَعَنْ أَبِيْ بَكْرِ الصِّدِّيْقِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَدْخُلُ الْجَنَّةَ سَيْئُ الْمَلْكَةِ”. قَالُوْا: يَا رَسُوْلَ اللهِ أَلَيْسَ أَخْبَرْتَنَا أَنَّ هَذِهِ الْأُمَّةَ أَكْثَرُ الْأُمَمِ مَمْلُوْكِيْنَ وَيَتَامَى؟ قَالَ: “نَعَمْ فَأَكْرِمُوْهُمْ كِكَرَامَةِ أَوْلَادِكُمْ وَأَطْعِمُوْهُمْ مِمَّا تَأْكُلُوْنَ”. قَالُوْا: فَمَا تَنْفَعُنَا الدُّنْيَا؟ قَالَ: “فَرَسٌ تَرْتَبِطُهُ تُقَاتِلُ عَلَيْهِ فِيْ سَبِيْلِ اللهِ وَمَمْلُوْكٌ يَكْفِيْكَ فَإِذَا صَلّى فَهُوَ أَخُوْكَ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.
3375. (34) [2/1006– అపరిశోధితం]
అబూ బకర్ (ర) కథనం: ప్రవక్త (స), ”బానిసల పట్ల అన్యాయంగా, అధర్మంగా ప్రవర్తించేవారు స్వర్గంలోనికి ప్రవేశించలేరు.” దానికి ప్రజలు, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ఇతర సమాజాల కంటే ముస్లిమ్ సమాజంలో అధికంగా బానిసలు, అనాథులు ఉంటారని తమరు మాకు చెప్పారు కదా! ఇంత పెద్ద సంఖ్యలో ఉంటే మేమెలా అందరి పట్ల ఇలా వ్యవహరించగలం,’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘మీరు మీ సంతానాన్ని గౌరవించినట్లు వారినీ గౌరవించండి, మీరు తిన్నదే వారికీ తినిపించండి,’ అని ఉపదేశించారు. అప్పుడు ప్రజలు, ‘ప్రపంచంలో అన్నిటికంటే లాభం చేకూర్చే వస్తువు ఏదీ?’ అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స), ‘దైవమార్గంలో శత్రువులతో యుద్ధం చేయడానికి కట్టి ఉంచ బడిన గుర్రం ఇంకా మీరు నమా’జ్, ఆరాధనల పట్ల గుర్తుచేసే, సహాయపడే సేవకులు, మీ సేవకుడు నమా’జ్ చేస్తే అతడు మీ సోదరుడే. అతని పట్ల మీ సోదరునిలా వ్యవహరించండి అని ప్రవచించారు.’ (ఇబ్నె మాజహ్)
=====
18- بَابُ بُلُوْغِ الصَّغِيْرِ وَحِضَانَتِهِ فِي الصِّغْرِ
18. పిల్లలు యుక్తవయస్సుకు చేరటం, వారి శిక్షణ
బాలుడు యుక్త వయస్సుకు చేరినట్లు ముఖంపై మీసాలు, గడ్డం లేదా వీర్యస్ఖలనం ద్వారా తెలుస్తోంది. ఒకవేళ ఈ రెండూ కాకపోతే సాధారణంగా, 15 సంవత్సరాల వయస్సులో యువకులు యుక్త వయస్సుకు చేరుకుంటారు. అయితే కొందరు 12 సంవత్సరాల్లోనే యుక్త వయస్సుకు చేరుకుంటారు. బాలికలు 9 సంవత్సరాల వయస్సులో యుక్త వయస్సుకు చేరుకుంటారు. లేదా ఆమెకు బహిష్టు వస్తుంది. గర్భం దాల్చుతుంది. యుక్తవయస్సుకు చేరక ముందు కొన్ని ఆదేశాలు ఉన్నాయి. యుక్త వయస్సుకు చేరిన తర్వాత కొన్ని ఆదేశాలు ఉన్నాయి. ఖుర్ఆన్లో అల్లాహ్ (త) యుక్త వయస్సు గురించి ఇలా ఆదేశించాడు: ”ఓ విశ్వాసులారా! మీ బానిసలు మరియు యుక్త వయస్సుకు చేరని మీ పిల్లలు, మూడు సమయాలలో అనుమతి తీసుకొనే మీవద్దకు రావాలి. (అవి) ఉదయపు (ఫజ్ర్) నమా’జ్‌కు ముందు, మధ్యాహ్నం (“జుహ్ర్) తరువాత – మీరు మీ వస్త్రాలు విడిచి ఉన్నప్పుడు – మరియు రాత్రి (‘ఇషా) నమా’జ్ తరువాత. ఈ మూడు, మీ కొరకు ఏకాంత (పరదా) సమయాలు. వీటి తరువాత వారు మరియు మీరు ఒకరివద్దకు మరొకరు వచ్చిపోతూ వుంటే, వారిపై గానీ, మీపై గానీ ఎలాంటి దోషం లేదు. ఈ విధంగా అల్లాహ్ మీకు తన ఆజ్ఞలను విశదీకరిస్తున్నాడు. అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేక వంతుడు. మరియు మీ పిల్లలు యుక్తవయస్సుకు చేరుకున్నప్పుడు; వారికంటే పెద్దవారు (ముందువారు) అనుమతి తీసుకున్నట్లు వారు కూడా అనుమతి తీసుకోవాలి. ఈ విధంగా అల్లాహ్ మీకు తన ఆజ్ఞలను విశదీకరిస్తున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.”[110] (అన్నూర్, 24:58–59)
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3376 – [ 1 ] ( متفق عليه ) (2/1007)
عَنِ ابْنِ عُمَرَرَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: عُرِضْتُ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم عَامَ أَحَدٍ وَأَنَا ابْنُ أَرْبَعَ عَشَرَةَ سَنَةً فَرَدَّنِيْ ثُمَّ عُرِضْتُ عَلَيْهِ عَامَ الْخَنْدَقِ وَأَنَا ابْنُ خَمْسَ عَشَرَةَ سَنَةً فَأَجَازَنِيْ. فَقَالَ عُمَرَبْنُ عَبْدِ الْعَزِيْزِ: هَذَا فَرْقٌ مَا بَيْنَ الْمُقَاتِلَةِ وَالذُرِّيَّةِ.
3376. (1) [2/1007 –ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ఉ’హుద్ యుద్ధ సంవత్సరం జిహాద్లో చేరడానికి ప్రవక్త (స) ముందు నన్ను తీసుకురావటం జరిగింది. అప్పుడు నా వయస్సు 14 సంవత్సరాలు. ఇంకా నేను యుక్త వయస్సుకు చేరలేదని ప్రవక్త (స) నన్ను తిరిగి పంపించి వేసారు. ముజాహిదీన్లలో నన్ను చేర్చలేదు. మరుసటి సంవత్సరం కందకం యుద్ధంలో నన్ను ప్రవక్త (స) ముందు నిలబెట్టటం జరిగింది. అప్పుడు నాకు 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. ప్రవక్త (స) నన్ను అనుమతించారు. ముజాహిదీన్లలోకి చేర్చుకున్నారు. ‘ఉమర్ బిన్ ‘అబ్దుల్ ‘అ’జీ’జ్ ఈ ‘హదీసు’ను విని, ‘ఈ 15 సంవత్సరాల వయస్సు, పోరాడే వారిని, యువకుల నుండి వేరుచేస్తుంది అని,’ అన్నారు.[111] (బు’ఖారీ, ముస్లిమ్)
3377 – [ 2 ] ( متفق عليه ) (2/1007)
وَعَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ قَالَ: صَالَحَ النَّبِيُّ صلى الله عليه وسلم يَوْمَ الْحُدَيْبِيَةِ عَلَى ثَلَاثَةِ أَشْيَاءَ: عَلَى أَنَّ مَنْ أَتَاهُ مِنَ الْمُشْرِكِيْنَ رَدَّهُ إِلَيْهِمْ وَمَنْ أَتَاهُمْ مِنَ الْمُسْلِمِيْنَ لَمْ يَرِدُّوْهُ وَعَلَى أَنْ يَدْخُلَهَا مِنْ قَابِلٍ وَّيُقِيْمُ بِهَا ثَلَاثَةَ أَيَّامٍ فَلَمَّا دَخَلَهَا وَمَضَى الْأَجَلُ خَرَجَ فَتَبِعَتْهُ ابْنَةُ حَمْزَةَ تُنَادِيْ: يَا عَمِّ يَا عَمِّ فَتَنَاوَلَهَا عَلِيٌّ فَأَخَذَ بِيَدِهَا فَاخْتَصَمَ فِيْهَا عَلِيٌّ وَزَيْدٌ وَجَعْفَرٌ. قَالَ عَلِيٌّ: أَنَا أَخَذْتُهَا وَهِيَ بِنْتُ عَمِّيْ. وَقَالَ جَعْفَرٌ: بِنْتُ عَمِّيْ وَخَالَتُهَا تَحْتِيْ وَقَالَ زَيْدٌ: بِنْتُ أَخِيْ فَقَضَى بِهَا النَّبِيُّ صلى الله عليه وسلم لِخَالَتِهَا وَقَالَ: “اَلْخَالَةُ بِمَنْزِلَةِ الْأُمِّ”. وَقَالَ لِعَلِيٍّ: “أَنْتَ مِنِّيْ وَأَنَا مِنْكَ”. وَقَالَ لِجَعْفَرٍ: “أَشْبَهْتَ خَلْقِيْ وَخُلُقِيْ”. وَقَالَ لِزَيْدٍ: “أَنْتَ أَخُوْنَا وَمَوْلَانَا”.
3377. (2) [2/1007 –ఏకీభవితం]
బరా’ బిన్ ‘ఆ’జిబ్ (ర) కథనం: ప్రవక్త (స) ‘హుదైబియ రోజు విగ్రహారాధకులతో మూడు షరతులతో ఒప్పందం కుదుర్చుకున్నారు: 1. అవిశ్వాసి ముస్లిమయి మదీనహ్ మునవ్వరహ్ వస్తే అతన్ని విగ్రహారాధకుల వైపు తిప్పి పంపడం జరుగుతుంది, 2. ఒకవేళ ముస్లిమ్ పారిపోయి లేదా, ఇస్లామ్‌ను త్యజించి అవిశ్వాసుల వద్దకు వెళ్ళిపోతే అతన్ని తిరిగి ఇవ్వడం జరుగదు, 3. వచ్చే సంవత్సరం ‘ఉమ్రహ్ చేయడానికి మక్కహ్ లో ప్రవేశించవచ్చు, కాని, కేవలం మూడు రోజులు మాత్రమే ఉండాలి. ఈ ఒప్పందం ప్రకారం ప్రవక్త (స) వచ్చినప్పుడు గడువు అయిపోయింది. అప్పుడు ప్రవక్త (స) మదీనహ్ వైపు ప్రయాణానికి సిద్ధపడ్డారు. అప్పుడు ‘హం’జహ్ (ర) కూతురు, ‘చిన్నాన్న చిన్నాన్న అని ప్రవక్త (స) వెంట పడసాగింది. అంటే నన్ను కూడా తీసుకువెళ్ళండి,’ అని ప్రాధేయపడింది. అప్పుడు ‘అలీ (ర) ఆమె చేయిపట్టుకొని, నువ్వు నీ చిన్నాన్న కూతుర్ని పట్టుకో అని ఫా’తిమహ్ తో అన్నారు. ఫా’తిమహ్ ఆ అమ్మాయిని తనఒంటెపై కూర్చోబెట్టు కున్నారు. మదీనహ్ చేరిన తర్వాత, ‘అలీ (ర), ‘జైద్ (ర), జ’అఫర్ (ర), ఆ అమ్మాయి సంరక్షణా విషయంలో వివాదానికి గుర య్యారు. ‘అలీ (ర), ‘ఆమెను సంరక్షించే హక్కు నాకు ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆమె నా చిన్నాన్న కూతురు” అని అన్నారు.’ జ’అఫర్, ‘ఆమె నా చిన్నాన్న కూతురు, ఆమె పిన్ని నా భార్య,’ అని అన్నారు. ‘జైద్ (ర), ‘ఆమె నా అన్న కూతురు,’ అని అన్నారు. కాని ప్రవక్త (స) ఆమెను, ఆమె పిన్నికి అప్పగించి, ‘పిన్ని తల్లితో సమానం,’ అని అన్నారు. ‘అలీ(ర)తో, ‘నీవు నా వాడివి, నేను నీ వాడిని,’ అని అన్నారు. జ’అఫర్తో, ‘నీవు ముఖవర్చస్సులో గుణగణాల్లో నన్ను పోలిఉన్నావు,’ అని అన్నారు. ‘జైద్‌తో, ‘నీవు మా సోదరుడివి అంటే మేము విడుదల చేసిన వాడవు,’ అని అన్నారు.[112] (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3378 – [ 3 ] ( لم تتم دراسته ) (2/1008)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو: أَنَّ اِمْرَأَةً قَالَتْ: يَا رَسُوْلَ اللهِ إِنَّ اِبْنِيْ هَذَا كَانَ بَطْنِيْ لَهُ وِعَاءً وَثَدْيَيَّ لَهُ سِقَاءً وَحِجْرِيْ لَهُ حِوَاءً وَإِنَّ أَبَاهُ طَلَّقَنِيْ وَأَرَادَ أَنْ يَنْزِعَهُ مِنِّيْ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَنْتِ أَحَقُّ بِهِ مَا لَمْ تَنْكِحِيْ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ.
3378. (3) [2/1008– అపరిశోధితం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి ద్వారా, అతడు తన తండ్రి ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ ద్వారా కథనం: ప్రవక్త (స)ను ఒక స్త్రీ, ‘ఓ ప్రవక్తా! వీడు నా బిడ్డ, నేను వీడిని కన్నాను, పాలు త్రాపించాను. నా ఓడిలో వీడు పెరిగాడు. వీడి తండ్రి నాకు ‘తలాఖ్ ఇచ్చాడు. ఈ బిడ్డను నా నుండి లాక్కోవాలను కుంటున్నాడు,’ అని విన్నవించుకుంది. సమాధానంగా ప్రవక్త (స) నీవు మరోపెళ్ళి చేసుకోనంత వరకు ఈ బాలుణ్ని సంరక్షించే హక్కు నీకు ఉంది.’ [113] (అ’హ్మద్, అబూ దావూద్)
3379 – [ 4 ] ( لم تتم دراسته ) (2/1008)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم خَيَّرَ غُلَامًا بَيْنَ أَبِيْهِ وَأُمِّهِ. رَوَاهُ التِّرْمِذِيُّ.
3379. (4) [28/1008 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ”ఒక యువకుడు, తన తల్లిదండ్రుల్లో ఎవరివద్దనైనా ఉండవచ్చు” అని అన్నారు. [114] (తిర్మిజి’)
3380 – [ 5 ] ( لم تتم دراسته ) (2/1008)
وَعَنْهُ قَالَ: جَاءَتِ امْرَأَةٌ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَتْ: إِنَّ زَوْجِيْ يُرِيْدُ أَنْ يَذْهَبَ بِاِبْنِيْ وَقَدْ سَقَانِيْ وَنَفَعَنِيْ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “هَذَا أَبُوْكَ وَهَذِهِ أُمُّكَ فَخُذْ بِيَدِ أَيِّهِمَا شِئْتَ”. فَأَخَذَ بِيَدِ أُمِّهِ فَانْطَلَقَتْ بِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ .
3380. (5) [2/1008 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక స్త్రీ వచ్చి, ‘నా భర్త నాకు ‘తలాఖ్ ఇచ్చాడు. నా బిడ్డను కూడా తీసుకోవాలనుకుంటున్నాడు. ఆ బిడ్డ బావి నుండి నీళ్ళు తోడి, తనివి తీరా త్రాపించి, నాకు లాభం చేకూర్చుతుంటాడు,’ అని విన్నవించుకుంది. అప్పుడు ప్రవక్త (స), ఓ యువకుడా! ఇతడు నీ తండ్రి, ఈమె నీ తల్లి వీళ్ళిద్దరిలో నీవు కోరినవారి చేయి పట్టుకో,’ అని అన్నారు. ఆ యువకుడు తల్లి చేయి పట్టుకున్నాడు. ఆమె ఆ యువకుడ్ని తనవెంట తీసుకు వెళ్ళింది. (అబూ దావూద్, నసాయీ’, దార్మి)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3381 – [ 6 ] ( لم تتم دراسته ) (2/1008)
عَنْ هَلَالِ بْنِ أُسَامَةَ عَنْ أَبِيْ مَيْمُوْنَةَ سُلَيْمَانَ مَوْلى لِأَهْلِ الْمَدِيْنَةِ قَالَ: بَيْنَمَا أَنَا جَالِسٌ مَعَ أَبِيْ هُرَيْرَةَ جَاءَتْهُ اِمْرَأَةٌ فَارِسِيَّةٌ مَعَهَا ابْنٌ لَهَا وَقَدْ طَلَّقَهَا زَوْجُهَا فَادَّعْيَاهُ فَرَطَنَتْ لَهُ تَقُوْلُ: يَا أَبَا هُرَيْرَةَ زَوْجِيْ يُرِيْدُ أَنْ يَذْهَبَ بِاِبْنِيْ . فَقَالَ أَبُوْ هُرَيْرَةَ: اِسْتَهِمَا رَطَنَ لَهَا بِذَلِكَ . فَجَاءَ زَوْجُهَا وَقَالَ: مَنْ يُحَاقُنِيْ فِيْ اِبْنِيْ؟ فَقَالَ أَبُوْ هُرَيْرَةَ: اَللّهُمَّ إِنِّيْ لَا أَقُوْلُ هَذَا إِلَّا إِنِّيْ كُنْتُ قَاعِدًا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَأَتَتْهُ اِمْرَأَةٌ فَقَالَتْ: يَا رَسُوْلَ اللهِ إِنَّ زَوْجِيْ يُرِيْدُ أَنْ يَذْهَبَ بِاِبْنِيْ وَقَدْ نَفَعَنِيْ وَسَقَانِيْ مِنْ بِئْرِ أَبِيْ عِنَبَةَ وَعِنْدَ النَّسَائِيّ: مِنْ عَذْبِ الْمَاءِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِسْتَهِمَا عَلَيْهِ”. فَقَالَ زَوْجُهَا مَنْ يُحَاقُّنِيْ فِيْ وَلَدِيْ؟ فَقَالَ رسول الله صلى الله عليه وسلم: “هَذَا أَبُوْكَ وَهَذِهِ أُمُّكَ فَخُذْ بِيَدِ أَيِّهِمَا شِئْتَ”. فَأَخَذَ بِيَدِ أُمِّهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ. وَالنَّسَائِيُّ لَكِنَّهُ ذَكَرَ الْمُسْنَدِ.
3381. (6) [2/1008 –అపరిశోధితం]
హిలాల్ బిన్ ఉసామహ్, అబూ మైమూనహ్ ద్వారా కథనం: అతని పేరు సులైమాన్ ఉండేది. మదీనహ్ లోని ఒక వ్యక్తి అతన్ని విడుదలచేసాడు. అబూ మైమూనహ్ కథనం: ”నేను అబూ హురైరహ్ వద్ద కూర్చున్నాను. ఒక స్త్రీ అతని వద్దకు వచ్చింది. ఆమె ఫారిస్ దేశానికి చెందినది. ఆమె వెంట ఆమె బిడ్డ కూడా ఉన్నాడు. ఆమెకు ఆమె భర్త ‘తలాఖ్ ఇచ్చి ఉన్నాడు. బిడ్డకోసం భార్యాభర్తలిద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఆ ఫారసీ స్త్రీ అబూ హురైరహ్తో ఫారసీ భాషలో, ‘ఓ అబూ హురైరహ్! నా భర్త నా బిడ్డను తీసుకుపోవాలను కుంటున్నాడు, మీరే తీర్పు చేయండి,’ అని విన్నవించుకుంది. అప్పుడు అబూ హురైరహ్ (ర), ‘మీ రిద్దరూ బిడ్డ గురించి చీటీలు వేయండి,’ అని పలికి, ఆ స్త్రీని ఫారసీ భాషలో ఓదార్చారు. ఆ తరువాత ఆమె భర్త వచ్చి, ‘నా బిడ్డ గురించి నాతో వాదించేది ఎవరు?’ అని అన్నాడు. అప్పుడు అబూ హురైరహ్, ” ‘ఓ అల్లాహ్ (త) నేనీ విషయంలో ప్రవక్త (స) నుండి విన్నదే చెబుతాను’ అని పలికి, నేను ప్రవక్త (స) వద్ద కూర్చున్నాను. ఒక స్త్రీ వచ్చి, ‘ఓ ప్రవక్తా! నా భర్త నా బిడ్డను నా నుండి దూరం చేయాలనుకుంటున్నాడు. ఆ బిడ్డ నా చేతికి వచ్చాడు. అబూ అంబ, బావినుండి నాకు నీళ్ళు త్రాపిస్తాడు,’ అని విన్నవించుకుంది. అది విని ప్రవక్త (స) ‘మీరిద్దరు ఈ విషయంలో చీటీలు వేయండి,’ అని అన్నారు. ఆమె భర్త, ‘నా బిడ్డ గురించి నాతో వాదిస్తున్నదెవరు?’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘ఓ యువకుడా! ఇతడు నీ తండ్రి, ఈమె నీ తల్లి, వీరిద్దరిలో నీవు కోరినవారి చేయిపట్టుకో’ అని అన్నారు. ఆ యువకుడు తల్లిచేయి పట్టుకున్నాడు అని అన్నారు.” (అబూ దావూద్, నసాయీ’, దారమి)
*****
[1]) వివరణ-3080: బాఅ అంటే శక్తి బలం, సంభోగ శక్తి, సంరక్షణా శక్తి. ఇవి ఉంటే పెళ్ళిచేసుకోవాలి. శక్తిలేని వారు ఉపవాసాలు పాటిస్తూ ఉండాలి. దీనివల్ల కామ కోరికలు చెంతకు రావు.
[2]) వివరణ-3081: గంభీరంగా చెప్పటం జరిగింది. ఇలా చేయటం నిషేధించబడింది. అంటే మేము స్త్రీలకు దూరంగా ఉండటానికి ముందు ఏదైనా తినివేస్తాము. అప్పుడు స్త్రీల కోరిక ఉండదు. కాని ప్రవక్త (స) నికా’హ్కు దూరంగా ఉండమని ఎంతమాత్రం ఆదేశించలేదు. అందు వల్ల నికా‘హ్ చేయటం ప్రవక్త సాంప్రదాయం. తబత్తుల్ అంటే నికా‘హ్ చేసుకోకుండా స్త్రీలకు దూరంగా ఉండటం. క్రైస్తవుల్లో ఈ తబత్తుల్ అభిలషణీయమైనది. ఇస్లామ్‌లో సన్యాసత్వం, తబత్తుల్ ఎంతమాత్రం ధర్మం కాదు.
[3]) వివరణ-3082: అంటే సాధారణంగా స్త్రీలను వివాహం చేసుకోవడంలో ఈ నాలుగు విషయాల్లో ఏదో ఒక విషయం కారణం అయి ఉంటుంది. కొందరు ధన వంతురాలైన స్త్రీని వివాహం చేసుకుంటారు. మరికొందరు అందాన్ని చూచి, మరికొందరు నైతికతను చూచి వివాహం చేసుకుంటారు. అనస్ (ర) ఉల్లేఖనం: ప్రవక్త (స) ప్రవచనం, ”గౌరవ మర్యాదలు గల కుటుంబపు స్త్రీని పెళ్ళి చేసుకుంటే అల్లాహ్ (త) అవమానాలకు గురిచేస్తాడు. ధనసంపదల కొరకు పెళ్ళి చేసుకుంటే అల్లాహ్ (త) దారిద్య్రానికి గురిచేస్తాడు. వంశాన్ని చూచి పెళ్ళిచేసు కుంటే నీచత్వాన్ని అధికం చేస్తాడు. ఇంకా తనను తాను పాపకార్యాల నుండి రక్షించుకోవడానికి, బంధుత్వ ఉపకారానికి వివాహం చేస్తే అల్లాహ్ (త) అతని కార్యాల్లో శుభం ప్రసాదిస్తాడు.” (తబ్రానీ)
[4]) వివరణ-3083: అంటే ప్రపంచంలోని ప్రతి వస్తువూ లాభం చేకూర్చేది. ప్రపంచ వస్తువుల్లో అన్నిటికంటే గొప్పది ఉత్తమ ఇల్లాలు. ఆమెద్వారా ఉభయలోకాల్లో లాభం చేకూరుతుంది.
[5]) వివరణ-3085: పురుషులకు స్త్రీలకంటే హాని చేకూర్చే ఉపద్రవం మరొకటి లేదు. అంటే స్త్రీల వల్ల అనేక ఉపద్రవాలు తలెత్తుతాయి. వివాదాలు తగాదాలు స్త్రీల వల్లే ప్రారంభం అవుతాయి. అందువల్లే స్త్రీ, ధనం, భూమి ఈ మూడు వివాదాలకు మూలాలు. అందువల్లే సాధ్యమైనంతవరకు వీటికి దూరంగా ఉండాలి.
[6]) వివరణ-3086: ఈ ప్రపంచం చాలా తియ్యనిది. దీని ప్రతి వస్తువు మనోరంజకమైనది. కంటికి గొప్పగా కనబడుతుంది. అల్లాహ్ (త) భవిష్యత్తులో మిమ్మల్ని అధికారం కట్టబెడతాడు, మీరు ఎలా ఆచరిస్తారని. ప్రత్యేకంగా ప్రాపంచిక వినోదాలు, స్త్రీలపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ రెండే ఉపద్రవాలకు మూలాలు. బనీ ఇస్రాయీల్‌లో అన్నిటి కంటే మొట్టమొదటి ఉపద్రవం స్త్రీలవల్లే వచ్చింది. అంటే బల్అమ్ బిన్ బాఊర్ను సూచించడం జరిగింది, స్త్రీల మాటలు విని తన్ను తాను నష్టపరచుకున్నాడు. ఖుర్ఆన్లో ఇలా ఉంది. ”ఓ ప్రవక్తా! ఆ వ్యక్తి వృత్తాంతాన్ని వారికి వినిపించు. అతడికి మేము మా ఆయతుల జ్ఞానాన్ని ప్రసాదించాము. కాని అతడు వాటిని పాటించకుండా విముఖుడైపోయాడు, చివరకు షైతాను అతన్ని వెంబడించాడు. ఫలితంగా అతడు మార్గభ్రష్టుల్లో కలసి పోయాడు. మేము కోరితే అతనికి మా వాక్యాల ద్వారా ఔన్నత్యం ప్రసాదించి ఉండేవారము. కాని అతడు ఇహలోకం వైపునకే మొగ్గాడు. మనోకాంక్షలను అనుసరించాడు. అతడి పరిస్థితి కుక్కలా అయి పోయింది. మీరు దానిపై దాడిచేసినా చేయక పోయినా నాలుక వెళ్ళబెడుతుంది. మా వాక్యాలను తిరస్కరించేవారి ఉదాహరణ కూడా ఇటు వంటిదే. నీవు ఈగాధలను వినిపిస్తూ ఉండు. వారు వాటిని గ్రహించగలరు.” (అల్ అ’అరాఫ్, 7:175-177). తఫ్సీర్ ఇబ్నె కసీర్లో ఇలా ఉంది, ”మూసా (అ) తన జాతి బనీ ఇస్రాయీల్‌ను తీసుకొని బల్అమ్ ఉన్న ప్రాంతం వైపు బయలుదేరారు. లేదా షామ్ వైపు బయలుదేరారు. మూసా (అ) సైన్యాన్ని చూచి అక్కడి ప్రజలు భయపడి బల్అమ్ వద్దకు వచ్చి, మూసా (అ) మరియు అతని సైన్యాన్ని శపించమని అన్నారు. దానికతను ఉండండి ముందు ప్రభువుతో సంప్రదిస్తాను అని సంప్రదించాడు లేదా ఇస్తిఖారా చేసాడు. దానికి ప్రభువు, ‘వారిని శపించకండి, వారు నా దాసులు, వారిలో నా ప్రవక్త కూడా ఉన్నాడు,’ అని అన్నాడు. అప్పుడతను ప్రజలతో, ‘ప్రభువును సంప్రదించాను, కాని శపించవద్దని ఆదేశించాడు’ అని అన్నాడు. అప్పుడు ప్రజలు అతని వద్దకు అనేక కట్నాలు కానుకలు పంపారు. అతడు స్వీకరించకుండా ఉండవలసింది. కాని అతడు స్వీకరించాడు. ఆ తరువాత మూసా (అ) సైన్యంలోకి స్త్రీలను పంపి వారిలో చాలా మందిని వ్యభిచారానికి గురిచేసాడు. అంటే ఇది స్త్రీల ద్వారా జరిగింది. అదే విధంగా బర్సీసా వృత్తాంతం ఉంది. క్రింది వాక్యాల్లో దీన్ని గురించే పేర్కొనడం జరిగింది. షైతాన్ మానవుడ్ని పాపకార్యం చేయమని అంటాడు. పాపకార్యం చేసిన తర్వాత, ‘నీకూ నాకూ ఎటువంటి సంబంధం లేదు, నేను సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్‌కు భయపడు తున్నాను’ అని అంటాడు. వారిద్దరి నివాసం నరకం, వారందులో శాశ్వతంగా ఉంటారు. ఇదే దుర్మార్గులకు సరైన శిక్ష. (అల్ హష్ర్, )
బనీ ఇస్రాయీల్‌లో ఒక భక్తుడు ఉండేవాడు. 60 సంవత్సరాలు దైవారాధనలో గడచిపోయాయి. షై’తాన్ అతన్ని ప్రేరేపించాడు. కాని అతడు షై’తాన్కు చిక్కలేదు. ఆ తరువాత షై’తాన్ ఒక స్త్రీ ద్వారా అతన్ని కల్లోలానికి గురిచేసాడు. షై’తాన్ అతని ద్వారా చేయవలసినవన్నీ చేయించాడు. అప్పుడు షై’తాన్ నీకూ నాకూ ఎటువంటి సంబంధంలేదని, నేను అల్లాహ్‌కు భయపడుతున్నానని అన్నాడు. (ఇబ్నె జరీర్)
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఒక స్త్రీ మేకలు కాసేది. ఒక దైవభక్తుని కుటీరంలో తలదాచుకునేది. ఆమెకు నలుగురు సోదరులు. ఒక రోజు షై’తాన్ వారిద్దరినీ పాపానికి గురిచేసాడు. ఆ తరువాత ఆ భక్తుడు ఆమెను చంపి ఒక చోట పాతిపెట్టాడు. షై’తాన్ అతని వృత్తాంతాన్ని ఇతరులకు కలలో చూపించాడు. చివరికి చేయవలసిందంతా చేసి నీకూ నాకూ ఎటువంటి సంబంధం లేదు, నేను అల్లాహ్‌కు భయపడుతున్నానని షై’తాన్ అంటాడు. అతని పేరు బర్సీసా ‘అలీ, ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్, తా’ఊస్, మఖాతిల్ బిన్ హయాన్ మొదలైన వారి ద్వారా ఈ వృత్తాంతాన్ని ఉల్లేఖించడం జరిగింది.
[7]) వివరణ-3087: పండితుల అభిప్రాయం ప్రకారం స్త్రీలో దోషం ఏమిటంటే స్త్రీ గొడ్రాలు కావటం, చెడు గుణాలు కలది, చెడ్డ నోరు గలది. గుర్రం దోషం ఏమిటంటే దైవమార్గంలో దానిపై జిహాద్ చేయకపోవటం. హీనజాతికి చెందినది. ఇంటి దోషం ఏమిటంటే ప్రాంగణం ఇరుకుగా ఉండటం, చెడ్డ స్నేహితులు. ఇక్కడ దోషం అంటే జోస్యం కాదు. అంటే ఇంటి నుండి బయటికి వెళ్ళినపుడు ఎవరైనా అడ్డువస్తే, స్త్రీ లేదా పిల్లి, లేదా తుమ్ము వస్తే అశుభంగా భావించటం. ఇవన్నీ అపార్థాలు, వీటిని నమ్మేవారు మూర్ఖులు.
[8]) వివరణ-3088: ఈ ‘హదీసు’ ద్వారా కన్యలతో వివాహం చేయటం ఉత్తమం అని తెలిసింది. కొన్ని ఉల్లేఖనాల్లో ప్రవక్త (స) ‘ప్రయాణం నుండి రాత్రి సమయంలో రాకండి’ అని ఉంది. ఈ ‘హదీసు’లో ప్రవక్త (స) రాత్రి రావచ్చు అని అన్నారని ఉంది. ఈ రెంటిలో వ్యతిరేకత ఉంది. అంటే తెలియపరచకుండా రాత్రి సమయంలో రాకూడదు. ముందు తెలియపరచి రాత్రి వస్తే మరేం అభ్యంతరం లేదు.
[9]) వివరణ-3090: ఈ సందేశం ఆడపిల్ల తల్లిదండ్రులకు, ధనసంపదల వైపు చూడకుండా ఉత్తమ నడవడిక, ధార్మి కతను చూడాలి. ఒకవేళ ఎవరైనా ఉత్తమ యువకుడు పెళ్ళి సందేశం పంపితే దాన్ని స్వీకరించాలి. ఒకవేళ పెళ్ళి చేయకపోతే అనేకమంది స్త్రీలు పెళ్ళి జరగకుండానే ఉండిపోతారు. ఫలితంగా వ్యభిచారానికి గురిఅవుతారు. అటు అనేకమంది పురుషులు కూడా అనేకమంది పెళ్ళిళ్ళు లేకుండా ఉండిపోతారు. వారు కూడా చెడు వ్యసనాలకు గురయి, ఫలితంగా వ్యభిచారం ప్రబలి కల్లోలాలు, ఉపద్రవాలు ఉత్పన్నం అవుతాయి.
[10]) వివరణ-3091: ఈ ‘హదీసు’లో కూడా కన్యలతో వివాహం చేయమని సూచించడం జరిగింది. ఎందుకంటే వీరే అధికంగా ప్రేమిస్తారు. అధికంగా పిల్లలు కంటారు.
[11]) వివరణ-3097: అంటే తక్కువ మహర్ గల నికా’హ్, అధిక ఖర్చుల కొరకు భార్య, భర్తను పీడించరాదు. ఏది ఎంత దొరికినా దానిపట్ల సంతృప్తి చెందాలి. ఇటువంటిదే శుభకరమైన, ఉత్తమమైన నికా’హ్.
[12]) వివరణ-3098: అంటే ఒక స్త్రీని పెళ్ళి చేసుకునే ముందు ఆమెను చూసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా లోపం ఉన్నా, నచ్చక పోయినా పెళ్ళి చేసుకోకూడదు. ఒకవేళ లోపం ఏదీలేక, నచ్చితే నికా’హ్ చేసుకోవాలి. అయితే ఈ చూడటం ముఖం వరకే. ఇతర అవయవాల వైపు కాదు. చూసి, ఇష్టపడి చేసుకునే నికా’హ్లో చాలా ప్రేమ ఉంటుంది. స్త్రీని చూచే అనుమతి పురుషునికి ఉన్నట్లు తాను చేసుకోబోయే పురుషున్ని చూచే అనుమతి స్త్రీకి కూడా ఉంది.
[13]) వివరణ-3099: అంటే ఇద్దరు స్త్రీలు నగ్నంగా ఒక పడకపై పడుకోకూడదు. కౌగిలించుకోకూడదు. ఎందు కంటే ఇటువంటి స్థితిలో ఒకరికి మరొకరి శరీరభాగాల గురించి తెలిసి పోతుంది. ఆ తర్వాత ఈ స్త్రీలు తమ భర్తలతో పడుకున్నప్పుడు, నేను ఫలానా స్త్రీతో పడు కున్నప్పుడు ఆమె శరీర అవయవాలు ఇలా ఉన్నాయి అని అంటారు. అది విని భర్త చాలా ప్రభావితుడౌతాడు. అంటే అతడు చూస్తున్నట్లు అనుభూతి చెందుతాడు. దీని వల్ల కల్లోలాలు, ఉపద్రవాలు తలెత్తుతాయి. అందు వల్లే ప్రవక్త (స), ‘ఇద్దరు స్త్రీలు నగ్నంగా పరస్పరం కౌగిలించు కోకూడదు, దుస్తుల్లో ఉండి ఒకచోట పడుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదు’ అని అన్నారు.
[14]) వివరణ-3100: అంటే అకారణంగా మరొకరి మర్మాంగాన్ని చూడకూడదు. పురుషులు పురుషుల మర్మాంగాన్ని, స్త్రీలు స్త్రీల మర్మాంగాన్ని చూడ కూడదు. అదే విధంగా నగ్నంగా కలసి కూర్చోకూడదు, పడుకోకూడదు.
[15]) వివరణ-3102: ‘హమ్వ అంటే భర్త సోదరుడు, పెద్ద వాడైనా చిన్నవాడైనా ఒంటరిగా ఏకాంతంగా వదిన ఇంట్లోకి వెళ్ళరాదు. ఎందుకంటే ఒకవేళ ఏకాంతంగా వదిన వద్దకు పోతే చావులా చాలా ప్రమాదకరంగా తయారవతాడు. ఎందుకంటే వదినతో వ్యభిచారానికి పాల్పడవచ్చు. అందువల్ల మరిది వదినకు తెరచాటున ఉండాలి. ఉపద్రవాలు తలెత్తకుండా ఉండడానికి.
[16]) వివరణ-3103: ఇదే వాస్తవం అయి ఉండవచ్చు. కాని చికిత్స కోసం వైద్యుడు, డాక్టరు మహ్రిమ్ కానవసరం లేదు. అత్యవసర పరిస్థితుల్లో పరాయి వారు కూడా చికిత్స చేయగలరు.
[17]) వివరణ-3104: అంటే అనుకోకుండా దృష్టిపడిపోతే ఎటువంటి అభ్యంతరం లేదు. రెండవసారి ఉద్దేశ్య పూర్వకంగా చూడటం నిషిద్ధం. ఖుర్ఆన్లో అల్లాహ్ ఆదేశం: ”విశ్వసించిన పురుషులతో, వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు…” (అన్ నూర్, 24:30)
[18]) వివరణ-3108: ప్రవక్త (స) పాపరహితులు. ముస్లిమ్ సమాజానికి శిక్షణా నిమిత్తం ఇలా చేసారు. ప్రవక్త సాంప్రదాయంగానూ ఉంటుంది. ప్రజలు నిషిద్ధ కార్యాలకూ దూరంగా ఉంటారు.
[19]) వివరణ-3109: అంటే స్త్రీలు ఎల్లప్పుడూ తెరచాటున ఉండాలి. విచ్చలవిడిగా బయటకు వెళ్ళరాదు. ఎందుకంటే అలా వెళ్ళటం వల్ల అల్లరి మూకలు, నీచులు రెప్పలు ఆర్పకుండా చూస్తూ ఉంటారు. దీనివల్ల ఉపద్రవాలు, కల్లోలాలు తల ఎత్తుతాయి. ఇస్లామీ పర్దాలో దీన్ని గురించి మేము వివరంగా పేర్కొన్నాము.
[20]) వివరణ-3111: బానిస స్త్రీ తన భార్యలా ధర్మసమ్మతమైనది. ఆమెతో సంభోగం చేయవచ్చు. కాని తన బానిస స్త్రీని తన బానిసకిచ్చి పెళ్ళి చేసిన తరువాత ఆమెతో సంభోగం చేయడం నిషిద్ధం. అయితే ఇంటి పనులు చేయించుకోవచ్చును.
[21]) వివరణ-3112: జుర్హద్ మస్జిద్లో కూర్చొని ఉన్నారు. అతని తొడ కప్పబడి లేదు. అతని తొడ వైపు ప్రవక్త (స) చూసి, ‘నీ తొడను కప్పుకో, అది కూడా కప్పి ఉంచవలసిన భాగం, ‘ అని అన్నారు. అంటే తొడ కూడా కప్పి ఉంచవలసిన భాగం అని తెలిసింది.
- [22]) వివరణ-3116: అంటే పురుషులు స్త్రీల వైపు చూడటం నిషిద్ధమే, అదే విధంగా స్త్రీలు పురుషుల వైపు చూడటం నిషిద్ధం. ఒకవేళ అంధుడు స్త్రీ వైపు చూడలేక పోతే కళ్ళున్న స్త్రీ అతనివైపు చూడటం నిషిద్ధం. దృష్టిని క్రిందికి వాల్చి ఉంచాలనే ఆదేశం ఇద్దరికీ వర్తిస్తుంది. అల్లాహ్ ఆదేశం: ”విశ్వసించినపురుషులతో, వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. ఇది వారికి ఎంతో శ్రేష్ఠమైనది. నిశ్చయంగా, అల్లాహ్ వారి చేష్టలను బాగా ఎరుగును. మరియు విశ్వసించిన స్త్రీలతో కూడా వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. మరియు వారి అలంకరణను ప్రదర్శించవద్దని చెప్పు – (దానంతటఅదే) ప్రదర్శనమయ్యేదితప్ప. వారిని, తమ తలమీది దుప్పటిని రొమ్ముల వరకు కప్పుకోమని చెప్పు. వారు తమ అలంకారాన్ని తమ భర్తలకు, తమ తండ్రులకు, తమ భర్తల తండ్రులకు, తమ కుమారులకు, తమ భర్తల కుమారులకు, తమ సోదరులకు, తమ సోదరుల కుమారులకు, తమ సోదరీమణుల కుమారులకు, తమ (తోటి) స్త్రీలకు, తమ బానిస స్త్రీలకు, లేక కామ ఇచ్ఛ లేని మగ సేవకులకు, లేక స్త్రీల గుప్తాంగాలను గురించి తెలియని బాలురకు తప్ప, ఇతరుల ముందు ప్రదర్శించ కూడదని మరియు కనబడకుండా ఉన్న తమ అలంకారం తెలియబడేటట్లుగా, వారు తమపాదాలను నేలపై కొడుతూ నడవకూడదని చెప్పు. మరియు ఓ విశ్వాసులారా! మీరందరూ కలసి అల్లాహ్ ను క్షమాపణకై వేడుకుంటే, మీరు సాఫల్యం పొందవచ్చు!. (అన్నూర్, 24 : 30-31)
ఈ ఆయతులలో చూపులు క్రిందికి వాల్చి ఉంచాలని, తమ మర్మాంగాలు కాపాడుకోవాలని, తమ ఆత్మ విమర్శ చేసుకోవాలని స్త్రీ పురుషులిరువురికీ ఆదేశించడం జరిగింది. మొదటి భాగంలో తమ చూపులు క్రిందికి వాల్చి ఉంచాలని ఆదేశించడం జరిగింది. రెండవ భాగంలో తమ మర్మాంగాలను కాపాడుకోవాలని, ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఇందులో స్త్రీ పురుషులిరువురూ సమానులే. ఇస్లామీ పర్దాలో పరదా గురించి వివరంగా పేర్కొనబడింది.
[23]) వివరణ-3120: బానిసలు, సేవకులపట్ల పర్దా అవసరం లేదు. అప్పటికి ఆ బానిస యుక్త వయస్సుకు చేరనివాడై ఉండవచ్చు.
[24]) వివరణ-3129: ఈ ‘హదీసు’ ద్వారా ఒకవేళ ఇంకా యుక్త వయస్సుకు చేరని అమ్మాయి నికా’హ్ ఎవరితోనైనా చేసివేస్తే నికా’హ్ అయిపోతుంది. ‘ఆయి’షహ్ (ర) పెళ్ళి 7 సంవత్సరాల వయస్సులో జరిగింది. అప్పటికి ఆమె ఇంకా యుక్తవయస్సుకు చేరలేదు. 9 సంవత్సరాల వయస్సులో ఆమె ప్రవక్త (స) వద్దకు వచ్చారు. అప్పటికి ఆమె యుక్త వయస్సుకు చేరి ఉన్నారు. ఎందుకంటే 9 సంవత్సరాల వయస్సులో చాలామంది అమ్మాయిలు యుక్త వయస్సుకు చేరిపో తారు. ఆమె ఆడుకునే బొమ్మ కూడా ఆమె వెంట ఉంది. ‘ఆయి’షహ్ (ర) ప్రవక్త (స) దాంపత్య జీవితంలో కేవలం 9 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. 18 సంవత్సరాల వయస్సులో వితంతువు కావలసి వచ్చింది.
[25]) వివరణ-3132: ఎందు కంటే నికా’హ్ కోసం సాక్షులు, సంరక్షకుడు ఉండటం తప్పనిసరి.
[26]) వివరణ-3140: అంటే పెళ్ళిసందర్భంగా దఫ్డప్పులు కొట్టవచ్చని తెలుస్తుంది. ఈ ‘హదీసు’ ద్వారా ప్రవక్త (స)కు అగోచర విషయాలు తెలియవని తెలుస్తుంది.
[27]) వివరణ-3142: కొంత మంది షవ్వాల్ నెలను అశుభంగా భావించేవారు. ఆ నెలలో ఏ శుభ కార్యాన్నయినా చెడుగా భావించే వారు. అంటే ‘ఆయి’షహ్ (ర) వారి భావనను ఖండిస్తుంది. ఆ నెల లోనే పెళ్ళి జరిగిందని, ఆ నెలలోనే మెట్టినింటికి వెళ్ళానని, భార్యాభర్తల సంబంధాలు ఎంతో సంతృప్తి కరంగా ఉండేవని పేర్కొన్నారు.
[28]) వివరణ-3143: అంటే సంరక్షణా బాధ్యతలు మరియు మహ్ర్ చెల్లించడం. నికా’హ్లో ఈ షరతులనే అంగీకరించటం జరుగుతుంది.
[29]) వివరణ-3145: అంటే ఒక వ్యక్తి భార్య ఉండగా మరో స్త్రీకి పెళ్ళి సందేశం పంపగా ఆ రెండవ స్త్రీ అతన్ని నువ్వు మొదటి భార్యకు ‘తలాఖ్ ఇస్తే నేను నీతో వివాహం చేసుకుంటాను అని అనటం ధర్మం కాదు. ఎందుకంటే ఎవరి అదృష్టంలో ఎంత ఉంటే, వారికి అంత లభిస్తుంది.
[30]) వివరణ-3146: షి‘గార్ అంటే కాలు ఎత్తటం అని అర్థం. అరబీలో షి’గార్ అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తితో, ”నీ కూతుర్ని లేదా చెల్లెల్ని నాకిచ్చి వివాహం చేయి, నేను నా కూతుర్ని లేదా చెల్లెల్ని నీకిచ్చి వివాహం చేస్తాను. బదులుగా ఇవ్వటమే మహర్‌గా నిర్ణయించబడుతుంది” అని అనటం. ఇటువంటి నికా’హ్ ఎంతమాత్రం ధర్మ సమ్మతం కాదు.
[31]) వివరణ-3147: ముత్’అహ్ అంటే లాభం పొందటం అని అర్థం. అరబీలో నిర్ణీత వ్యవధికి ఒకస్త్రీను పెళ్ళి చేసు కొని లాభం పొందటం. వ్యవధి పూర్తవగానే వదలి వేయటం. ఉదాహరణకు 10 రోజులకోసం పెళ్ళి చేసుకోవటం, 10 రోజులు గడచిన తర్వాత వదలి వేయటం. ఇస్లామ్ ప్రారంభంలో ఇలా చేసుకునే అనుమతి ఉండేది. మక్కహ్ విజయంనాడు పూర్తిగా నిషేధించబడింది. ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ”ఇస్లామ్ ప్రారంభంలో ప్రజలు పరదేశానికి వెళ్ళేవారు. అక్కడ తెలిసిన వారు లేక అక్కడ ఉన్నంత కాలం ఒక స్త్రీని వివాహం చేసుకునేవారు సరకుల భద్రత, వండి వడ్డించే సౌకర్యం కూడా ఉండేది. కాని ఈ ఆయత్ అవతరించింది, ”తమ భార్యలు (అ‘జ్వాజ్), లేదా ధర్మ సమ్మతంగా తమ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలతో తప్ప – అలాంటప్పుడు వారు నిందార్హులు కారు.” (అల్ మ’ఆరిజ్, 70:30), (తిర్మిజి’)
[32]) వివరణ-3148: అవ్’తాస్ అన్నది ఒక అడవి పేరు. అక్కడ యుద్ధం అయినందువల్ల దాన్ని అవ్’తాస్ యుద్ధం అంటారు. ఫత’హ్ మక్కహ్కు కొన్ని రోజులుకు ముందే ఇది జరిగింది. అత్యవసరపరిస్థితుల్లో ప్రవక్త (స) మూడు రోజుల కోసం ఇస్లామీయ సైనికుల కోసం ముత్’అహ్ నికా’హ్ కు అనుమతి ఇచ్చారు. ఫత’హ్ మక్కహ్ తర్వాత ప్రవక్త (స) దీన్ని పూర్తిగా నిషేధించారు.
[33]) వివరణ-3150: ప్రతి ప్రసంగంలో దైవస్తోత్రం, ప్రవక్త (స)పై దరూద్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఆ ప్రసంగంలో ఆ సభలో శుభం ఉంటుంది. ఇవి లేని ప్రసంగం, సభ అశుభంగా ఉంటాయి. అంటే తెగిన చేయి దేనికీ పనికిరానట్లు.
[34]) వివరణ-3154: అంటే ధార్మిక హద్దుల్లో పాడే పాటలు, ధర్మవ్యతిరేక చర్యలు లేని పాటలు.
[35]) వివరణ-3157: ఇస్లామ్ ప్రారంభంలో నికాహ్ ముత్’ఆకు అనుమతి ఉండేది. కాని తరువాత శాశ్వతంగా నిషేధించబడింది. ఈ ఉల్లేఖనాలన్నీ నిషేధానికి ముందువి.
[36]) వివరణ-3160: అంటే భార్య ఉండగా ఆమె అత్తతో గాని, పిన్నితోగాని నికా’హ్ చేసుకోరాదు.
[37]) వివరణ-3161: అంటే పురుషుల నికా’హ్ స్త్రీలతో బంధుత్వం వల్ల నిషిద్ధం అవుతుంది. అదేవిధంగా పాలు పట్టటం వల్ల కూడా నిషిద్ధం అవుతుంది.
[38]) వివరణ-3167: పాలు పట్టటాన్ని ర‘దా‘అత్ అంటారు. పాలుపట్టే స్త్రీని ముర్’ది‘అహ్ అంటారు. పాలు త్రాగేబిడ్డను ర‘దీ అంటారు. బిడ్డ తన తల్లి పాలు కాక పరాయి స్త్రీ పాలు త్రాగితే ఆ స్త్రీ ఆ బిడ్డకు ర‘దాయీ తల్లి అవుతుంది. ఆమె భర్త ఆ బిడ్డకు ర’దాయీ తండ్రి అవుతాడు. ఆమె సంతానం ఆ బిడ్డకు ర’దాయీ సోదర సోదరీలు అవుతారు. బంధుత్వం వల్ల నిషేధం వర్తించినట్లు పాలు త్రాగటం వల్ల కూడా ఆ నిషేధాలే వర్తిస్తాయి. అందువల్ల ర’దాయీ తల్లి, చెల్లెలు సొంతతల్లి, చెల్లెలులా నిషేధం అవుతారు. ఖుర్ఆన్లో అల్లాహ్ (త) ఇలా ఆదేశించాడు: ”మీకు మీ పాలుపట్టిన తల్లులు, చెల్లెళ్ళు నిషేధించబడ్డారు.” (అన్ నిసా, 4:23) కొందరు నిర్ణీత సంఖ్య లేదని, పాలు పట్టగానే నిషేధం కొనసాగుతుందని అభిప్రాయపడుతున్నారు. వీరు ఇమామ్ మాలిక్, ఇబ్నె ‘ఉమర్, స’యీద్ బిన్ ముసయ్యిబ్, ‘ఉర్వబిన్ ‘జుబైర్, ”జుహ్రీ. మరికొందరు మూడు సార్లు త్రాగితే నిషేధం వర్తిస్తుందని అంటారు. వీరు అ’హ్మద్, ఇస్’హాఖ్ బిన్ ర’హ్వైహ్, అబూ ‘ఉబైదహ్, అబూసౌ’ర్, ‘అలీ, ‘ఆయి’షహ్ (ర), ఉమ్మె ఫ’దల్, ఇబ్నె ‘జుబైర్, సులైమాన్ బిన్ యసార్, స’యీద్ బిన్ ‘జుబైర్. మరికొందరు 5 సార్లు పాలుపడితే నిషిద్ధం వర్తిస్తుందని అభిప్రాయ పడుతున్నారు. (తఫ్సీర్ ఇబ్నె కసీర్)
[39]) వివరణ-3168: అంటే బిడ్డ ఆహారం కేవలం పాలు మాత్రమే అయి ఉండాలి. ఇది రెండు సంవత్సరాల వయసు లోపల జరగాలి. అంటే జన్మించిన తర్వాత రెండు సంవత్సరాలలో పాలుపట్టాలి. రెండు సంవత్సరాలు తర్వాత పాలుపడితే నిషేధం వర్తించదు.
[40]) వివరణ-3169: అంటే ర‘దాఅత్ విషయంలో ఒక స్త్రీ సాక్ష్యం చాలని ఈ ‘హదీసు’ ద్వారా తెలిసింది.
[41]) వివరణ-3170: అంటే భర్తలున్న స్త్రీలు నిషిద్ధం. అయితే అవిశ్వాస స్త్రీలు యుద్ధంలో ఖైదీలుగా ముస్లిముల చేతికి చిక్కితే బహిష్టు అయిన తర్వాత ఈ స్త్రీలు వారి భర్తలు ఉన్నాసరే వారి యజమానులకు ధర్మసమ్మతం అయిపోతారు.
[42]) వివరణ-3173: అంటే కేవలం పాలే బిడ్డ ఆహారం అయి ఉండినపుడు త్రాగితేనే నిషిద్ధం వర్తిస్తుంది. లేదా వర్తించదు.
[43]) వివరణ-3174: ప్రస్తుత కాలంలో బానిసలు, బానిస రాలు లేరు. కనుక ప్రతిఫం కాకుండా వస్త్రాలు, ఆభరణాలు మొదలైనవి కానుకగా ఇచ్చివేయాలి.
[44]) వివరణ-3175: ఈమె ‘హలీమహ్ స‘అదియ (ర). ఈమె ప్రవక్త (స)ను బాల్యంలో పాలుపట్టింది. ప్రవక్త (స) ఆమె గౌరవార్థం తన దుప్పటిని పరిచారు. అంటే పాలుపట్టిన తల్లినీ కన్నతల్లిలా గౌరవించాలి.
[45]) వివరణ-3176: ఎందుకంటే ఇస్లామ్‌లో ఒకేసారి నలుగురి కన్నా ఎక్కువ మంది భార్యలను ఉంచరాదు.
[46]) వివరణ-3183: వెనుక నుండి సంభోగం చేస్తే బిడ్డ మెల్ల కన్నుతో జన్మిస్తాడని యూదులు చెప్పేవారు. వారికి విరుద్ధంగా ఈ ఆయతు అవతరించింది. మీరు ఏ రీతిగానైనా సంభోగం చేయండి. అది మీ ఇష్టం. అయితే మల ద్వారంలో సంభోగం చేయటం నిషిద్ధం, వివరాలు క్రింద పేర్కొనడం జరిగింది.
[47]) వివరణ-3184: అ‘జ్ల్ అంటే భార్యతో సంభోగం చేసి నప్పుడు వీర్యం ఆమె మర్మాంగంలోనికి పోకుండా తన మర్మాంగాన్ని బయటకు తీసుకోవటం. వీర్యాన్ని బయట వదలి వేయటం, దీనివల్ల ఆమె గర్భవతి కాకుండా జాగ్రత్త పడేవారు. ప్రవక్త (స)కు ఈ విషయం తెలిసినా ఏమాత్రం స్పందించ దు. అంటే ‘అ’జ్ల్ చేయడంలో అభ్యంతరం లేదు. కొన్ని ‘హదీసు’ల్లో దీన్ని వారించడం జరిగింది. అంటే అసహ్యించకోవటం జరిగింది.
[48]) వివరణ-3189: బిడ్డకు పాలుపట్టే దశలో సంభోగం చేయడాన్ని గీలా అంటారు. అంటే పాలుపట్టే దశలో భార్యతో సంభోగం చేయరాదని వారిద్దామని అనుకున్నారు. దీనివల్ల స్త్రీ పాలుపట్టే దశలో గర్భం ధరించదు. ఆమె గర్భవతి అయితే బిడ్డ బలహీనతకు గురవుతాడు. ఆ బిడ్డకు కడుపునిండా పాలు లభించవు. కడుపులో ఉన్న బిడ్డ కూడా బలహీనతకు గురవుతాడు. ఆ తరువాత ప్రవక్త (స) గర్భవతిని బిడ్డకు పాలు పట్టటాన్ని వారిద్దామని అనుకున్నారు. వారించలేదు. ఎందుకంటే ఫారిస్, రూమ్ ప్రజలు ఇలా చేసేవారు. వారి బిడ్డలకు ఎటువంటి హానీ కలిగేది కాదు. ప్రవక్త (స) ‘అ‘జ్ల్ గురించి వివరిస్తూ అది రహస్యంగా పూడ్చి పెట్టటం అని అన్నారు. అజ్ఞాన కాలంలో చాలామంది తమ అమ్మాయిలను సజీవంగా ఖననం చేసేవారు. దీన్ని గురించి తీర్పుదినం నాడు ప్రశ్నించడం జరుగుతుందని, శిక్షించడం జరుగుతుందని హెచ్చరించబడింది. దీన్నిబట్టి కొందరు పండితులు ‘అ’జ్ల్ చేయడం సరికాదని భావిస్తున్నారు.
[49]) వివరణ-3190: ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే భార్యతో సంభోగంచేసి ఆ విషయాలను ఇతరుల ముందు చెప్పుకోరాదు, ఇది అమానతు. ఇందులో మోసం పాపం ఉంది. ఇలా చేసే వాడు తీర్పుదినం నాడు అల్లాహ్ వద్ద అందరికంటే నీచుడు.
[50]) వివరణ-3196: ‘గైల అంటే ఏమిటో ఇంతకుముందు చెప్పడం జరిగింది. బిడ్డకు పాలుపట్టే దశలో లేదా, గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెతో సంభోగం చేయడం. దానివల్ల బిడ్డ బలహీనతకు గురవుతాడు. ఆ బలహీనత యుక్త వయస్సు వరకు ఉంటుంది. అతడు యుద్ధానికి గుర్రంపై ఎక్కి యుద్ధం చేస్తే బలహీనత వల్ల చంపబడతాడు. అంటే దానికి కారణం తల్లిదండ్రులే. తల్లిదండ్రులే అతన్ని చంపినట్లు అవుతుంది. అందువల్ల ప్రవక్త (స) గైల చేసి పిల్లల్ని చంపకండని ఆదేశించారు. ఈ ‘హదీసు’ ద్వారా నిషేధించినట్లు తెలుస్తుంది. పై ‘హదీసు’లో అభ్యంతరం లేదని తెలుస్తుంది. అజ్ఞాన కాలంలో ‘గైల ప్రభావం చూపుతుందని భావించేవారు. అందువల్లే ప్రవక్త (స) దీన్ని ఖండించారు. అంతా అల్లాహ్ (త) అధీనంలోనే ఉంది.
[51]) వివరణ-3202: ఒకవేళ ఎవరివద్దనైనా మహర్‌గా ఇవ్వడానికి ఏమీ లేకపోతే ఖుర్ఆన్ మాత్రమే నేర్చుకొని ఉంటే, మహర్‌గా ఖుర్ఆన్ నేర్పిస్తే నికా’హ్ అయిపోతుంది.
[52]) వివరణ-3203: 500 వెండి దిర్హములు ఈనాటి 131 రూపాయల నాలుగు అణాలకు సమానం. ఉమ్మె ‘హబీబహ్ (ర) మహర్ తప్ప ఇతర భార్యలందరి మహర్ 131 రూపాయల నాలుగు అణాలు ఉండేది. ప్రతి ఒక్క భార్య మహర్ ఇంత ఉండేది. ఉమ్మె’హబీబహ్ (ర) మహర్ 4000 దిర్హములు ఉండేది. దాన్ని నజ్జాషీ చక్రవర్తి చెల్లించారు. అవి 1500 రూపాయలకు సమానం. అదే విధంగా ఫాతిమహ్ (ర) మహర్ 400 వెండి మిస్ఖాళ్ళు. ఇవి 150 రూపాయలకు సమానం. వీటన్నిటి వివరాలు మజాహిరె ‘హఖ్ మూడవ భాగంలో ఉన్నాయి .
[53]) వివరణ-3204: ప్రవక్త (స) భార్యలందరి మహర్ 12½ ఊఖియాలు ఉండేదని ఇంతకుముందు పేర్కొనడం జరిగింది. ‘ఉమర్ సగం ఊఖియాను ప్రస్తావించలేదు. ఉమ్మె ‘హబీబహ్ (ర) యొక్క మహర్ ప్రవక్త (స) నిర్ణయించలేదు. ఆమె మహర్ నజాషీ రాజు నిర్ణయించాడు.
[54]) వివరణ-3208: ఉమ్మె ‘హబీబహ్ కు రమ్ల అనే పేరు ఉండేది. ముద్దుగా ఉమ్మె ‘హబీబహ్ అని పిలిచేవారు. ప్రవక్త (స) దైవదౌత్యానికి 17 సంవత్సరాలు ముందు జన్మించారు. ‘అబ్దుల్లాహ్ బిన్ జ’హష్‌తో పెళ్ళయింది. ప్రవక్త(స)కు దైవదౌత్యం లభించిన తరువాత ఈమె ఇస్లామ్ స్వీకరించారు. ‘హబ్షా వైపు వలసపోయారు. ఒక ఉల్లేఖనం ప్రకారం ఆమె కూతురు అక్కడే జన్మించింది. ‘హబ్షా వెళ్ళిన తర్వాత ‘అబ్దుల్లాహ్ బిన్ జ’హష్ క్రైస్తవం పుచ్చుకున్నాడు. కాని ఈమె మాత్రం ఇస్లామ్‌పైనే స్థిరంగా ఉంది. ఇద్దరిదీ వేర్వేరు ధర్మాలు కావటం వల్ల అతను ఆమెకు వేరుగా ఉన్నారు. కొన్నిరోజుల తర్వాత చనిపోయాడు. ఇప్పుడు ఆమెకు ప్రవక్త(స) భార్య స్థానం లభించే సమయం ఆసన్న మయింది. ప్రవక్త (స) ‘అమ్ర్ బిన్ ఉమయ్య అ’జ్జుమరీని నజ్జాషీవద్దకు నికా’హ్ సందేశం ఇచ్చి పంపారు. అప్పుడు నజ్జాషీ తన సేవకురాలు అబ్రహియ్య ద్వారా ఉమ్మె ‘హబీబహ్ కు ప్రవక్త (స) నికా’హ్ సందేశాన్ని అందించాడు. ఆమె ‘ఖాలిద్ బిన్ స’యీద్ ఉమవీని వకీలుగా నియమించారు. ఈ సందేశాన్ని స్వీకరిస్తూ అబ్రహియ్యకు రెండు వెండి కడియాలు, ఉంగరాలు ఇచ్చారు. సాయంత్రం నజ్జాషీ జ’అఫర్ బిన్ అబీ ‘తాలిబ్ ను, ఇంకా అక్కడి ముస్లిములను ఒకచోట చేర్చారు. స్వయంగా నికా‘హ్ చదివించారు. ఆ పదాలు ఇవి, అంటే అల్లాహ్ స్తోత్రం తరువాత ప్రవక్త (స) ఏ విషయం గురించి నన్ను ఆదేశించారో, దాన్ని నేను స్వీకరించాను. 400 బంగారు దీనార్లకు బదులు నేను ఉమ్మె ‘హబీబహ్ మహర్ నిర్ణయించాను. ఆ తరువాత వాటిని అందరి ముందు పెట్టి వాటిని ప్రవక్త (స) తరఫున చెల్లిస్తున్నాను,” అని ‘ఖాలిద్ బిన్ స’యీద్కు ఇచ్చి వేసారు. ‘ఖాలిద్ ఇలా అన్నారు, ”అంటే ప్రవక్త (స) చెప్పిన దాన్ని నేను స్వీకరించాను. ఉమ్మె ‘హబీబహ్ బిన్తె అబీ ‘సుఫియాన్ యొక్క నికాహ్ ప్రవక్త (స)తో చేసాను. అల్లాహ్ (త) ప్రవక్త(స)కు శుభం ప్రసాదించు గాక!” (మవాహిబుద్దీనియ్య; మిర్ఖాత్ షర’హ్ మిష్కాత్)
నికా’హ్ అయి పోయిన తర్వాత అందరూ లేవబోయారు. అప్పుడు నజ్జాషీ వలీమ విందు ప్రవక్తలందరి సాంప్రదాయం. కూర్చోండి వలీమ తిని వెళ్ళండి, ప్రజలు విందు ఆరగించి వెళ్ళారు. మహర్ ధనం ఉమ్మె ‘హబీబహ్ కు అందిన తరువాత ఆమె అబ్రహియ సేవకురాలికి కానుకగా ఇచ్చారు. కాని ఆమె వాటన్నిటినీ తిరిగి ఇచ్చివేసారు. రెండవ రోజు ఆమె వద్దకు కస్తూరి, గుగ్గిలం అంబర్ మొదలైనవి తీసుకొని వచ్చింది. ఆమె వాటిని తీసుకొని ప్రవక్త (స) వద్దకు వచ్చారు. నికా’హ్ ముగియగానే నజ్జాషీ ఆమెను షర్హబీర్ వెంట ప్రవక్త(స) వద్దకు పంపివేసారు.
[55]) వివరణ-3210: నవాహ్ ఒక రకమైన నాణెం. అది 5 దిర్హమ్లకు సమానం. మరికొందరు 3 దిర్హములని అభిప్రాయ పడుతున్నారు. అంటే మూడు లేక ఐదు దిర్హమ్లు మహర్ నిర్ణయించుకోవచ్చును. 10 దిర్హమ్లు ఇవ్వ నవసరం లేదు. వలీమహ్ చేయటం ప్రవక్త సాంప్రదాయం. ఒక్క మేక అయినాసరే. అంటే తన స్థోమతకు తగ్గట్టు చేయవచ్చును.
[56]) వివరణ-3213: ‘హైస్ అనేది ఒక తీపి పదార్థం. దీన్ని ఖర్జూరం, నెయ్యి, పనీర్ మొదలైన వాటితో చేస్తారు. అంటే మలీదహ్ లేదా హల్వా.
[57]) వివరణ-3221: అంటే అందంగా చిత్రీకరించబడిన ఒక తెర. ప్రవక్త (స) కుటుంబానికి ఇది తగదు. ఎందుకంటే దుబారా ఖర్చుతో పాటు ధర్మవ్యతిరేక చర్య కూడాను. అందువల్ల ప్రవక్త (స) మందలించడానికి ఇలా చేసారు. అంటే విందులో ఏదైనా ధర్మవ్యతిరేక చర్య చూస్తే అక్కడి నుండి వచ్చేయాలని హితబోధ చేయబడింది.
[58]) వివరణ-3225: ముతబారియిన్ అంటే ఆహ్వానించటంలో పోటీపడే ఇద్దరు వ్యక్తులు అంటే ఒకరి కంటే మరొకరు అధిక సంఖ్యలో ఆహ్వానించాలని కోరుతూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు గర్వం, అహంకారం, తలబిరుసుతనం, చూపుగోలు మొదలైన వాటిని ప్రదర్శిస్తారు. ఇటువంటి వారి ఆహ్వానాన్ని స్వీకరించ రాదు. వెళ్ళరాదు.
[59]) వివరణ-3229: తుదిశ్వాస వరకు ప్రవక్త(స)తో పాటు ఉన్న భార్యల పేర్లు: 1. ‘హఫ్సహ్ (ర), 2. ఉమ్మె ‘హబీ బహ్ (ర), 3. సౌదహ్ (ర), 4. ఉమ్మె సలమహ్ (ర), 5. సఫియ్య (ర), 6. మైమూనహ్ (ర), 7. జైనబ్ (ర) 8. జువైరియహ్ (ర), 9. ‘ఆయి’షహ్ (ర). వీరిలో 8 మంది భార్యలకు వంతులు నిర్ణయించబడేవి. కాని సౌదహ్ (ర) తన వంతును ‘ఆయి’షహ్ (ర)కు బహూకరించారు.
[60]) వివరణ-3234: అంటే 3 రోజులు ఉండటం వల్ల మీ వర్గానికి గానీ, నీకు గానీ ఎటువంటి అవమానంగా భావించరాదు. అంటే 3 రోజులు గడపటం ధార్మిక ఆదేశం. ఒకవేళ నీవు కోరితే ఏడేసి రోజులు వంతు నిర్ణయిస్తాను. దానికి ఆమె 3 రోజులు ఉండండి. ఆ తరువాత ఇతరుల వద్దకూడా మూడేసి రోజులు ఉండండి అని అన్నారు.
[61]) వివరణ-3235: అంటే అందరి మధ్య న్యాయంగా ధర్మంగా వంతులు నిర్ణయించారు. కాని ఒకవేళ ప్రేమలో హెచ్చుతగ్గులు పట్ల నన్ను విచారించకు. ఎందుకంటే హృదయాల ప్రేమ నీ చేతుల్లో ఉంది.
[62]) వివరణ-3236: అంటే తీర్పు దినం నాడు అతను నీచ అవమానానికి గురవుతాడు. అంటే ఇద్దరున్నా, ముగ్గురున్నా ఈ శిక్ష పడుతుంది.
[63]) వివరణ-3238: సాధారణంగా స్త్రీలు మంకుపట్టు, అవివేకంగా ప్రవర్తిస్తారు. ఒక్కోసారి భర్త భార్య మంకు పట్టును దూరం చేద్దామని అనుకుంటాడు కాని దూరం చేయలేడు. పైగా ఆమె మరీ వంకర తనానికి గురవుతుంది. అందువల్లే ప్రవక్త (స) ఈమెను వంకర రొమ్ము భాగపు దుమ్ము ద్వారా సృష్టించటం జరిగింది. అంటే వంకర మనస్తత్వం కలిగి ఉంటుంది. ఒకవేళ తిన్నగా చేయాలనుకుంటే చేయలేవు. చివరికి తలాఖ్ పరిస్థితి వస్తుంది. అంటే విరిచివేయడం అన్నమాట. అందువల్ల ఎల్లప్పుడూ సున్నితంగా వ్యవహరించాలి. అలా వ్యవహరిస్తే ఆ వంకర వస్తువు ద్వారా లాభం పొందుతూ ఉంటావు.
[64]) వివరణ-3240: అంటే ఒకవేళ ఆమెలో ఏదైనా చెడు గుణం ఉంటే, మరో మంచి గుణం కూడా ఉంటుంది. ఆమె మంచి గుణం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆమె ద్వారా లాభం పొందుతూ ఉండాలి. ఆమెలో అన్నిటికంటే మంచి గుణం ఏమిటంటే మనిషిని నిషిద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉంటాడు.
[65]) వివరణ-3241: మూసా (అ) కాలంలో బనీ ఇస్రాయీల్‌పై అల్లాహ్ (త) తరఫున మన్ వ సల్వా అవతరించబడేవి. ఎటువంటి శ్రమలేకుండా వారు ఆహారం పొందేవారు. అయితే వారిపై చాలినంత తిని మిగిలింది వదలిపెట్టాలని, దాని నిల్వ చేయకూడదనే నిబంధన విధించడం జరిగింది. కాని వారు అత్యాశకు పోయి మిగిలిన ఆహారాన్ని నిల్వ చేయడం ప్రారంభించారు, ఆ ఆహారం క్రుళ్ళి పోవడం ప్రారంభం అయింది. దానికి ప్రవక్త (స) బనీ ఇస్రాయీల్ ఇలా చేయకుండా ఉంటే మాంసం క్రుళ్ళేది కాదు. అదేవిధంగా హవ్వా (అ) ఆదమ్ (అ)ను బలవంతంగా దేన్నుండైతే వారించబడిందో ఆ వృక్ష ఫలాన్ని తినమని వత్తిడికి గురిచేసింది. ఒక వేళ ఆమె ఆదమ్‌ను ఆ వృక్ష ఫలం తినిపించకుండా ఉంటే భర్త అవిధేయతకు గురికాకుండా ఉంటే ఏ స్త్రీ తన భర్త అవిధేయతకు గురయి ఉండేది కాదు.
[66]) వివరణ-3247: అంటే దగా మోసం అని అర్థం.
[67]) వివరణ-3248: ఈలా అంటే ప్రమాణం చేయటం. ఇస్లామీయ ధర్మశాస్త్రం ప్రకారం ఈలా అంటే భర్త తన భార్యతో సంభోగం చేయనని ప్రమాణం చేయటం. అంటే, ‘అల్లాహ్(త) సాక్షి! నేను నా భార్యతో సంభోగంచేయను,’ అని అనటం. లేదా ‘ఆమె దగ్గరకు వెళ్ళను’ అని అనటం. ఇవి రెండు రకాలు, నాలుగు నెలల కంటే తక్కువ లేదా ఎక్కువ ఉంటుంది. ఈ కాలంలో భార్య ఓర్పు వహించాలి. అతన్ని అడగటం గాని పీడించడం గాని చేయకూడదు. ఆ తరువాత ఇద్దరూ కలుసుకోవాలి. ఈలా ఆదేశం ఏమిటంటే ఈలా కాలం అయిన తర్వాత సంభోగం చేసుకుంటే కలుసుకుంటే ఎటువంటి అభ్యం తరం లేదు. ఒకవేళ గడువులోపలే సంభోగంచేసి ప్రమాణ భంగం చేస్తే ప్రమాణం భంగం చేసినందుకు పరిహారం చెల్లించాలి. ఈలా గురించి ఖుర్ఆన్లో ఈ ఆయతు అవతరించింది. ”ఎవరైతే తమ భార్యలతో, (‘సంభోగించము,’) అని ప్రమాణం చేస్తారో, వారికి నాలుగు నెలల వ్యవధి ఉంది. కాని వారు తమ దాంపత్య జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తే! నిశ్చయంగా అల్లాహ్ క్షమా శీలుడు, అపార కరుణాప్రదాత. కాని వారు విడాకులకే నిర్ణయించుకుంటే! నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.” (అల్ బఖరహ్, 2: 226-227)
అంటే ప్రమాణం చేసిన తర్వాత కలసిపోవాలి లేదా ‘తలాఖ్ ఇవ్వాలి. అటూ ఇటూ కాక మధ్య వేలాడగట్టడం మహా పాపం. ఒకవేళ భర్త ‘తలాఖ్ ఇవ్వకపోతే, ముస్లిమ్‌ల నాయకుడు ‘తలాఖ్ ఇప్పిస్తాడు. ‘తలాఖ్ ఇవ్వనిదే ‘తలాఖ్గా పరిగణించబడదు. అంటే ముస్లిమ్ పాలకుని ముందు అతన్ని నిలబెట్టి అతని చేత ‘తలాఖ్ ఇప్పించడం జరుగుతుంది. ఇబ్నె ‘ఉమర్ (ర) అభిప్రాయం: ”నాలుగు నెలలు గడిచిన తర్వాత ఈలా ఇచ్చిన వాడిని ముస్లిముల పాలకుని ముందు నిలబెట్టాలి, పాలకుడు లేకుండా ‘తలాఖ్ ఇస్తే పరిగణించబడదు. ‘ఉస్మాన్, ‘అలీ, అబూ దర్దాల అభిప్రాయం ఇదే.” (నైలుల్ అవ్తార్)
[68]) వివరణ-3250: ఒక స్త్రీ తన్ను తాను ప్రవక్త (స)కు సమర్పించుకోవటం చాలా సిగ్గు, పౌరుషం గల విషయం. ఈ ఆయతులోని ప్రవక్త (స)కు ప్రత్యేక అధికారాలు ఇవ్వటం జరిగింది. మీరు కోరిన వారిని ఉంచవచ్చును, మీరు కోరిన వారిని ఉంచకపోవచ్చును. వారి మధ్య వంతులుకూడా ఉంచకపోవచ్చు. కాని ప్రవక్త (స) ఎప్పుడూ తన భార్యల పట్ల న్యాయంగా ధర్మంగా వ్యవహరించేవారు.
[69]) వివరణ-3253: అంటే తన భార్యాబిడ్డలపట్ల, బంధువులపట్ల, సేవకులపట్ల మంచిగా ప్రవర్తించేవాడే అందరికంటే మంచివాడు. నేను నా భార్యాబిడ్డలపట్ల మీ అందరికంటే మంచివాడను. మీలో ఎవరైనా మరణిస్తే అతడు మరణించిన తరువాత అతని గురించి చెడుగా మాట్లాడకండి.
[70]) వివరణ-3255: అంటే భర్తకు అంత గొప్ప స్థానం ఉంది. ఒకవేళ అల్లాహ్యేతరులకు సజ్దా చేయడం ధర్మసమ్మతం అయివుంటే స్త్రీలను తమ భర్తలకు సజ్దా చేయమని ఆదేశించడం జరిగేది. కాని అల్లాహ్(త)కు తప్ప ఇతరులెవ్వరికీ సజ్దా చేయడం ధర్మం కాదు.
[71]) వివరణ-3257: అంటే ఏదైనా పనిలో ఉన్నాసరే, నష్టం కలుగుతుందన్న భయం ఉన్నాసరే, అప్పుడు కూడా భర్త పిలుపుపై వెళ్ళితీరాలి.
[72]) వివరణ-3262: అంటే భార్య గురించి పరోక్షంగా భర్తకు చాడీలు చెప్పడం, భర్త గురించి చెడుగా భార్య వద్ద చెప్పడం, ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు సృష్టించటం, ఇద్దరి మధ్య శతృత్వాన్ని కల్పించటం. అదేవిధంగా యజమాని బానిసల మధ్య చాడీలు కల్పించి ఒకరి పట్ల మరొకరికి అనుమానాలు సృష్టించడం.
[73]) వివరణ-3267: ఈ ‘హదీసు’ ద్వారా అల్లాహ్ (త) తప్ప ఇతరులకు వారి జీవితంలోనే కాదు మరణించిన తర్వాత కూడా సజ్దా చేయరాదు, అది మహాపాపం, అని తెలిసింది. కొందరు పీర్లకు, వలీలకు సజ్దాలు చేస్తుంటారు, వారు అల్లాహ్(త)కు సాటి కల్పిస్తున్నారు. షిర్క్ చేస్తున్నారు. ఎందుకంటే అల్లాహ్ (త) ఇలా ఆదేశిస్తున్నాడు: ”..మీరుసూర్యునికి గానీ చంద్రునికి గానీ సాష్టాంగం (సజ్దా) చేయకండి, కాని కేవలం వాటిని సృష్టించిన అల్లాహ్‌కు మాత్రమే సాష్టాంగం (సజ్దా) చేయండి …” (హా మీమ్ సజ్దా, 41:37)
[74]) వివరణ-3268: స్త్రీల శిక్షణ నిమిత్తం వారిని కొట్టడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. అల్లాహ్ ఆదేశం: ”…కానీ అవిధేయత చూపుతారని మీకు భయముంటే, వారికి (మొదట) నచ్చజెప్పండి, (తరువాత) పడకలో వేరుగా ఉంచండి, (ఆ తరువాత కూడా వారు విధేయులు కాకపోతే) వారిని (మెల్లగా) కొట్టండి.కాని వారు మీకు విధేయులై ఉంటే! వారిని నిందించటానికి మార్గం వెతకకండి…” (అన్నిసా, 4: 34)
అంటే లేచిపోవటం అని అర్థం. ఇంటి బయటకు వెళ్లడం అటూ ఇటూ తొంగి చూడటం. ముందు వారిని మందలించాలి. అప్పటికీ వినక పోతే వారిని కొట్టాలి. కాని అనవసరంగా హింసించడం నిషిద్ధం.
[75]) వివరణ-3275: బహిష్టు స్థితిలో ‘తలాఖ్ ఇస్తే ‘తలాఖ్ అయిపోతుంది, కాని దాన్ని మళ్ళీ ఆచరించాలి. ‘తలాఖ్ ఇవ్వాలనే ఉంటే పరిశుద్ధావస్థలో ‘తలాఖ్ ఇవ్వాలి. ఎందుకంటే అల్లాహ్ ఇలాగే ఆదేశించాడు. అంటే పరిశుద్ధస్థితిలోనే ‘తలాఖ్ ఇవ్వండి, బహిష్టు స్థితినుండి ఆమె గడువు లెక్కించాలి. ఖుర్ఆన్లో అల్లాహ్ ఆదేశం: ”మరియు విడాకులివ్వబడిన స్త్రీలు మూడు ఋతువుల వరకు (మరొకనితో పెండ్లి చేసుకో కుండా) వేచి ఉండాలి.మరియు వారు అల్లాహ్ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాసమున్నవారే అయితే, అల్లాహ్ వారి గర్భాలలో సృష్టించిన దానిని దాచటం వారికి ధర్మసమ్మతం కాదు. మరియు వారి భర్తలు దాంపత్య సంబంధాలను సరిదిద్దుకోవటానికి సిధ్ధంగా ఉంటే! ఈ నిరీక్షణ కాలంలో వారిని తమ భార్యలుగా తిరిగి స్వీకరించే హక్కు వారికి ఉంది. మరియు వారికి (స్త్రీలకు) వారి (భర్తల)పై ధర్మ సమ్మతమైన హక్కులున్నాయి, ఏ విధంగానైతే వారికి (భర్తలకు) వారిపై ఉన్నాయో. కాని పురుషులకు స్త్రీలపై (కర్తవ్య) ఆధిక్యత ఉంది. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు. విడాకులు రెండు సార్లే! ఆ తర్వాత (భార్యను) సహృదయంతో తమ వద్ద ఉండనివ్వాలి, లేదా ఆమెను మంచితనంతో సాగ నంపాలి. మరియు సాగనంపేటప్పుడు మీరు వారికిచ్చిన వాటి నుండి ఏమైనా తిరిగి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేము అనే భయం ఆ ఇద్దరికీ ఉంటే తప్ప! కాని అల్లాహ్ విధించిన హద్దుకు కట్టుబడి ఉండలేమనే భయం ఆ దంపతులకు ఉంటే స్త్రీ పరిహార మిచ్చి (విడాకులు / ఖులా’ తీసుకుంటే) అందులో వారికి ఎలాంటి దోషం లేదు.ఇవి అల్లాహ్ విధించిన హద్దులు కావున వీటిని అతిక్రమించకండి. మరియు ఎవరైతే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తారో, అలాంటి వారే దుర్మార్గులు.” (అల్ బఖరహ్, 2:228–229)
అంటే స్త్రీలకు సంభోగం తరువాత తలాఖ్ ఇవ్వబడి, వారు బహిష్టు స్థితి వస్తున్నవారైతే, వారిని రెండవపెళ్ళి నుండి 3 నెలల వరకు ఆపి ఉంచాలి. ఇంకా వారి గర్భాలలో ఉన్న దాన్ని వారు దాచకూడదు. బహిష్టు కాలాలను సరిగా లెక్కించి ఉంచాలి. రెండవ పెళ్ళి చేయడానికి బహిష్టును దాచి ఉంచరాదు. అదేవిధంగా 9 నెలల వరకు, ఎవరు వేచి ఉంటారని భావించరాదు. ఒకవేళ వారికి అల్లాహ్‌పై, తీర్పు దినంపై విశ్వాసం ఉంటే అక్కడ విచారించడం జరుగుతుందని, తెలిసిఉంటే ఇటువంటి పొరపాటు చేయరాదు. ఇంకా గడువు పూర్తికాని పక్షంలో భర్తకు పునర్విచారించుకునే హక్కు ఉంది. అధిక వయస్సు గల స్త్రీలు, ఇంకా రుతుస్రావం ప్రారంభం కాని కన్యలు తలాఖ్ తర్వాత 3 నెలల వ్యవధి ఇద్దత్ గడపాలి. గర్భవతి ప్రసవిస్తే ఆమె గడువు పూర్తి అయినట్టే.
[76]) వివరణ-3276: ఒకవేళ ఏ భర్త అయినా తాను స్వయంగా ‘తలాఖ్ పదం పలుక కుండా భార్యకు నీవు కోరితే నిన్నునీవు ఎన్నుకో, ‘తలాఖ్ ఇచ్చివేయి, లేదా నన్ను, అంటే భర్తను ఎన్నుకో, ‘తలాఖ్ ఇవ్వకు అని ఎన్నుకునే అధికారం భార్యకు ఇస్తే, ఒకవేళ భార్య అదే సభలో నన్ను నేను ఎన్నుకున్నాను అని అంటే ఒక ‘తలాఖ్ అవుతుంది. ఒకవేళ ఆమె నేను భర్తను ఎన్నుకున్నాను అని అంటే ‘తలాఖ్సంభవించదు. ప్రవక్త (స) తమ భార్యలకు ఇటువంటి అనుమతి ఇచ్చారు. ప్రవక్త (స) భార్యలు ప్రవక్త (స)ను ఎన్నుకున్నారు. ‘తలాఖ్ సంభవించలేదు. దీన్ని గురించి పైన పేర్కొనడం జరిగింది.
[77]) వివరణ3277: అంటే ఒకవేళ ఎవరైనా తన భార్యను లేదా అన్నపానీయాల్లో దేన్నయినా తనపై నిషేధం చేసుకుంటే, అతడు పరిహారం చెల్లించాలి. పరిహారం చెల్లించిన తర్వాత అతనికి ఆ వస్తువును ధర్మసమ్మతం అయిపోతాయి. పాపం తొలగిపోతుంది. క్రింద దీన్ని గురించి వివరంగా పేర్కొనడం జరిగింది.
[78]) వివరణ-3278: సూరహ్ తహ్రీమ్లో వృత్తాంతం అంతా ఈ విధంగా ఉంది, ”ఓ ప్రవక్తా! అల్లాహ్ నీకు ధర్మ సమ్మతం చేసిన దానిని నీవు ఎందుకు నిషేధించు కుంటున్నావు? నీవు నీ భార్యల ప్రసన్నతను కోరు తున్నావా? మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. వాస్తవానికి అల్లాహ్ మీ ప్రమాణాల పరిహారపద్ధతి మీకు నిర్దేశించాడు.మరియు అల్లాహ్‌యే మీ యజమాని. మరియు ఆయన సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు. మరియు (జ్ఞాపకం చేసుకోండి) ప్రవక్త తన భార్యలలో ఒకామెకు రహస్యంగా ఒక విషయం చెప్పగా ఆమె దానిని (ఆ రహస్యాన్ని) మరొకామెకు చెప్పింది మరియు అల్లాహ్ అతనికి (ప్రవక్తకు) ఆ విషయాన్ని తెలియజేశాడు. (వాస్తవానికి) అతను (ప్రవక్త) ఆ విషయాన్ని (మొదటి) ఆమెకు కొంత తెలిపి, మరికొంత తెలుపలేదు. ఇక ప్రవక్త, (మొదటి) ఆమెకు దానిని (రహస్యం బయటపడిన సంగతిని) తెలిపినప్పుడు, ఆమె (ఆశ్చర్యపోతూ) అతనితో ఇలాఅడి గింది: ‘ఇది నీకు ఎవరు తెలిపారు? ‘ అతను జవాబిచ్చాడు: ‘నాకు ఈ విషయం ఆ సర్వజ్ఞుడు, ఆ సర్వం తెలిసినవాడు తెలిపాడు. ‘ (ఆ ఇద్దరు స్త్రీలతో ఇలా అనబడింది): ‘ఒకవేళ మీరిద్దరూ అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలితే (అది మీ మేలుకే), వాస్తవానికి మీ ఇద్దరి హృదయాలు (ఋజుమార్గం నుండి) తొలగిపోయాయి. ఒకవేళ మీరిద్దరు ప్రవక్తకు విరోధంగాపోతే! నిశ్చయంగా, అల్లాహ్ అతని సంరక్షకుడు మరియు జిబ్రీల్ మరియు సత్పురుషులైన విశ్వాసులు అతని (సహాయకులు). మరియు దేవదూతలందరు కూడా అతని సహాయకులని (తెలుసుకోండి). ‘ఒకవేళ అతను (ము’హమ్మద్) మీ అందరికీ విడాకులిస్తే! అల్లాహ్, మీకు బదులుగా, మీకంటే మంచి భార్యలను, అతనికి (ప్రవక్తకు) ప్రసాదించ గలడు! వారు మంచి ముస్లింలు, విశ్వాసులు, భక్తిపరులు, పశ్చాత్తాప పడేవారు, (అల్లాహ్ ను) ఆరాధించే వారు, వలసపోయే (ఉపవాసాలు చేసే) వారు అయిన, విధవలు లేదా కన్యలు అయి ఉంటారు!” (అత్తహ్రీమ్, 66:1-5)
ప్రవక్త (స)కు తేనె అంటే చాలా ఇష్టం. కలవడానికి తన భార్యల వద్దకు వెళ్ళినప్పుడు వారు తమ వద్ద ఉన్న వాటిని ప్రవక్త (స) ముందు పెట్టేవారు. జైనబ్ (ర) ప్రవక్త (స) ముందు తేనె సమర్పించేవారు. అందువల్ల ప్రవక్త (స) మరికాసేపు ఆమె వద్ద ఆగేవారు. ‘ఆయి‘షహ్ (ర), హఫ్స (ర)లకు ఇది నచ్చలేదు. వారిద్దరూ పరస్పరం సంప్రదించుకొని మనలో ఎవరి వద్దకు వచ్చినా మీ నోటి నుండి దుర్వాసన వస్తుందని అందాం అని పథకం వేసుకున్నారు. ఎందుకంటే ప్రవక్త (స) దుర్వాసన అంటే అసహ్యించుకునేవారు. మ’గాఫీర్ అంటే దుర్వాసన గల జిగురు పదార్థం. అప్పుడు ప్రవక్త (స) ఇక ముందు నేను తేనె త్రాగనని ప్రమాణం చేసారు. అంటే తేనెను తనపై నిషేధించుకున్నారు. ఈ ఆయతులలో అల్లాహ్ (త) తేనె ధర్మసమ్మతమైన పదార్థం అని పేర్కొన్నాడు. అల్లాహ్ (త) ధర్మసమ్మతం చేసినదాన్ని నీవు నిషేధించరాదని హెచ్చరించడం జరిగింది. పరిహారం చెల్లించిన తర్వాత మళ్ళీ ఆ పదార్థం ధర్మసమ్మతం అయిపోతుంది. (ఉస్వహసనహ్)
[79]) వివరణ-3281: అంటే ‘తలాఖ్ ధర్మసమ్మతం అయి నప్పటికీ, అల్లాహ్(త) దృష్టిలో చాలా చెడ్డది. ఎందు కంటే దీని వల్ల షై’తాన్ సంతోషిస్తాడు.
[80]) వివరణ-3281: నికా’హ్ చేయటానికి ముందే ‘తలాఖ్ ఇస్తే ‘తలాఖ్ చెల్లదు. ఎందుకంటే ‘తలాఖ్కి ముందు నికా‘హ్ అయి ఉండటం తప్పనిసరి. నికా‘హ్ లేనిదే ‘తలాఖ్ చెల్లదు. అదేవిధంగా బానిసకు యజమాని కాకముందే విడుదల చేస్తే విడుదల కాలేడు. ఎందుకంటే విడుదల చేసే ముందు యజమాని కావటం తప్పనిసరి. అదేవిధంగా రాత్రీపగలు నిరంతరం ఉపవాసం పాటించడం ధర్మసమ్మతం కాదు. అంటే సాయంత్రం ఉపవాసం విరమించకుండా నిరంతరం ఉపవాసం పాటించడం ధర్మసమ్మతం కాదు. బాలుడు యుక్త వయస్సుకు చేరిన పిదప అంటే స్ఖలనం వచ్చిన తర్వాత అనాథ కాడు. యుక్త వయస్సుకు చేరక ముందు అనాథగా పరిగణించబడతాడు. అదేవిధంగా పాలుపట్టే గడువు ముగిసిన తర్వాత పాలుపడితే పాల బంధుత్వం పరిగణించబడదు. ప్రాచీన కాలంలో ఉదయం నుండి సాయంత్రం వరకు మౌనవ్రతం పాటించే వారు. అయితే ఇప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు మౌనవ్రతం పాటించటం ధర్మసమ్మతం కాదు.
[81]) వివరణ-3283: బత్త అంటే కోయటం అని అర్థం. నికా’హ్ను కోసే ‘తలాఖ్‌ను ‘తలాఖ్ బత్త అంటారు. షాఫ’యీ (ర) వద్ద ‘తలాఖ్ బత్త ఇచ్చిన తర్వాత పునర్విచారించుకో వచ్చు. ‘ఇద్దత్‌లో పునర్విచారించు కోవచ్చు. ‘ఇద్దత్ తర్వాత మళ్ళీ నికా‘హ్ చేసుకోవచ్చు. రుకానహ్ ‘తలాఖ్ ఇచ్చే విషయంలో అనేక ఉల్లేఖనాలు ఉన్నాయి. ఈ ఉల్లేఖనం వల్ల ‘తలాఖ్ బత్త ఇచ్చినట్లు తెలుస్తుంది. ముస్నద్ అ’హ్మద్లోని ఉల్లేఖనం వల్ల, ఒకే సభలో మూడు ‘తలాఖ్‌లు ఇచ్చినట్లు తెలుస్తుంది. ‘అబ్బాస్ (ర) పేర్నొన్నట్టు: అంటే రుకానహ్ తన భార్యకు మూడు ‘తలాఖ్‌లు ఇచ్చి చాలా విచారించారు. ప్రవక్త (స) అతన్ని, ‘నీవు ‘తలాఖ్ ఎలా ఇచ్చావు,’ అని అడిగారు. దానికి అతడు మూడు ‘తలాఖ్‌లు అని అన్నాడు. మళ్ళీ ప్రవక్త (స), ‘ఒకే సభలోనా’ అని ప్రశ్నించారు. దానికి అతడు ‘అవును,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) ఒక ‘తలాఖ్ అయింది, నీవు కోరితే దాన్ని మార్చుకోవచ్చు’ అని అన్నారు. అప్పుడు రుకానహ్ నిర్ణయం మార్చుకున్నాడు. ఈ రెండు ఉల్లేఖనాల్లో ఎటువంటి అభిప్రాయ భేదం లేదు. ఎందు కంటే ఒకే సభలో మూడు ‘తలాఖ్‌లు ఇస్తే మళ్ళీ పునర్విచారించుకోవచ్చు.
[82]) వివరణ-3284: ఈ మూడు పదాలు ఎలాంటివంటే ఒకవేళ నిజంగా షరతులన్నిటితో నికా‘హ్ చేస్తే, నికా‘హ్ అయిపోతుంది. అదేవిధంగా ఒకవేళ నిజంగా ‘తలాఖ్ ఇస్తే ‘తలాఖ్ అయిపోతుంది. ఒకవేళ ‘తలాఖ్ ఇచ్చిన భార్యను తిరిగి స్వీకరిస్తే రుజా అయిపోతుంది. ఒకవేళ ఎగతాళికి పలికినా నిజంగా పడిపోతుంది. అంటే ఒక స్త్రీ ఒక పురుషుని మధ్య హాస్యంగా వలీ ఇద్దరు సాక్షుల ముందు ఈజాబు వ ఖుబూల్ అయితే నికా‘హ్ అయిపో తుంది. అదేవిధంగా ఎగతాళిగా ‘తలాఖ్ పలికినా ‘తలాఖ్ అయిపోతుంది. అదే విధంగా ఎగతాళికి ‘తలాఖ్ తర్వాత రుజూ చేసుకుంటే రజ్అత్ సంభవిస్తుంది.
[83]) వివరణ-3285: అంటే ఒకవేళ ఎవరైనా బలవంతంగా ‘తలాఖ్ ఇవ్వమని అంటే నీవు నీ భార్యకు ‘తలాఖ్ ఇవ్వు లేదా నిన్ను చంపివేస్తాను. నిస్సహాయ స్థితిలో ‘తలాఖ్ ఇస్తే ‘తలాఖ్ అవదు. అదేవిధంగా ఎవరైనా బలవంతంగా తన బానిసను విడుదల చేయమని లేకపోతే చంపివేస్తానని అతను విడుదల చేస్తే బానిస విడుదల అయినట్టు పరిగణించబడదు.
[84]) వివరణ-3289: స్వతంత్ర స్త్రీకి మూడు నెలల్లో మూడు ‘తలాఖ్‌లు ఇవ్వడం వల్ల నిషిద్ధం అవుతుంది. ఆమె గడువు 3 రుతు స్రావాలు. కాని బానిసరాలికి రెండు ‘తలాఖ్‌లు అంటే రెండు ‘తలాఖ్‌లు ఇస్తే, నిషిద్ధ మవుతుంది. ఆమె గడువు రెండు రుతు స్రావాలు అంటే రెండు రుతు స్రావాలు గడిచితే ఆమె గడువు పూర్తవుతుంది.
[85]) వివరణ-3292: ఇబ్నె ‘అబ్బాస్ (ర) అభిప్రాయం: ‘తలాఖ్ 4 రకాలు. 2 రకాల్లో ‘హలాల్, 2 రకాల్లో ‘హరామ్. ‘హలాల్ రెండు రకాలు. ఇందులో మొదటిది, స్త్రీకి సంభోగం చేయని పరిశుద్ధావస్థలో ‘తలాఖ్ ఇవ్వడం, రెండవది గర్భావస్థలో ‘తలాఖ్ ఇవ్వడం. ‘హరామ్గల రెండు రకాల్లో మొదటిది అపరిశుద్ధావస్థలో ‘తలాఖ్ ఇవ్వటం, రెండవది సంభోగం తర్వాత ‘తలాఖ్ ఇవ్వడం. ఇందులో స్త్రీ గర్భావస్థలో ఉందా లేదా అనే అనుమానం ఉంటుంది. (దారు ఖుతనీ, మున్తఖా, షౌకానీ /నైలుల్ అవ్తార్)
షౌకానీ నైలుల్ అవ్తార్లో ఇలా అభిప్రాయపడ్డారు: కొన్ని సందర్భాల్లో ‘తలాఖ్ అసహ్యకరమైనదిగా, నిషిద్ధ మైనదిగా, కొన్ని సందర్భాల్లో వాజిబ్, మరికొన్ని సందర్భాల్లో ధర్మసమ్మతమైనదిగా ఉంటుంది. ఇబ్నె ‘ఖు’దామా కూడా అల్ ము’గ్నీలో ఈ విధంగా అభిప్రాయపడ్డారు. కొందరు ‘తలాఖ్ రెండు రకాలు సున్నీ, బిద్’యీ అని అంటారు. ‘తలాఖ్ సున్నీ అంటే అల్లాహ్, ఆయన ప్రవక్త ఆదేశాల కనుగుణంగా సంభోగం చేయని పరిశుద్ధావస్థలో ‘తలాఖ్ ఇచ్చి గడువు పూర్తయ్యే వరకు వదలివేయాలి. తలాఖ్ బిద్’యీ అంటే అపరిశుద్ధావస్థలో లేదా సంభోగం చేసిన తరువాత ‘తలాఖ్ ఇవ్వడం. కొందరు పండితులు ‘తలాఖ్‌ను మూడు రకాలు: అ‘హ్సన్, ‘హసన్, బిద్’యీ. 1. అ‘హ్సన్ అంటే సంభోగంచేయని పరిశుద్ధావస్థలో ‘తలాఖ్ ఇచ్చి, గడువులో పునర్విచారించనిది. 2. ‘హసన్ అంటే మూడు పరిశుద్ధావస్థల్లో మూడు ‘తలాఖ్‌లు ఇచ్చి, ఈ మూడు పరిశుద్ధావస్థల్లో సంభోగం చేయనిది ‘తలాఖ్కి ముందు సంభోగం చేసి ఉన్నది. అయితే సంభోగం చేయని స్త్రీకి ఒకసారి ‘తలాఖ్ ఇస్తే సరిపోతుంది. ఇంకా 3. బిద్‘యీ అంటే మూడు వేర్వేరు ‘తలాఖ్‌లు ఇవ్వటం లేదా ఒకే పరిశుద్ధావస్థలో రెండు సార్లు ‘తలాఖ్ ఇవ్వడం. పునర్విచారించక పోవడం, సంభోగం చేసిన పరిశుద్ధావస్థలో ‘తలాఖ్ ఇవ్వటం, లేదా బహిష్టు స్థితిలో తలాఖ్ ఇవ్వటం. ‘తలాఖ్‌ను మరోవిధంగా కూడా విభజించవచ్చును. రజయీ, బాయిన్, ముగల్లజహ్. 1. రజయీ అంటే ఒకే ‘తలాఖ్ ఇవ్వటం, గడువులోపల పునర్విచారించుకోవచ్చు. గడువు తర్వాత నికా‘హ్ చేసుకోవచ్చు. 2. బాయిన్ అంటే ‘తలాఖ్ బాయిన్ ఇస్తున్నాను అని అనటం, ‘తలాఖ్‌తో పాటు దాన్ని సమర్థిస్తూ మరోదాన్ని ఉపయోగించటం, బాయిన్, లేదా బత్త అని అనటం. ఇందులో కూడా గడువు తర్వాత నికా‘హ్ చేసుకోవచ్చు. 3. ‘తలాఖ్ ముగ్లిజ అంటే మూడు పరిశుద్ధావస్థల్లో వేర్వేరుగా మూడు ‘తలాఖ్‌లు ఇవ్వటం. ఇందులో గడువు తరువాత వివాహం చేసుకోలేడు. ఆ స్త్రీకి మరో వ్యక్తితో వివాహమై ఆ వ్యక్తి ‘తలాఖ్ ఇస్తే లేదా చనిపోతే మొదటి వ్యక్తితో పెళ్ళి చేసుకోగలదు.
స్పష్టంగా అంటే స్పష్టంగా, ‘నేను నీకు ‘తలాఖ్ ఇచ్చివేసాను,’ అని పలకడం. సూచన ప్రాయంగా అంటే ఇందులో ‘తలాఖ్ సూచన ప్రాయంగా అంటే ‘తలాఖ్ పడుతుంది. సంకల్పం లేకపోతే ‘తలాఖ్ సంభవించదు. ‘తలాఖ్ తఫ్వీజ్ అనే రకం కూడా ఉంది. అంటే ‘తలాఖ్ ఇచ్చే బాధ్యత మరొకరికి అప్పజెప్పటం. ఇందులో మూడు రకాలు ఉన్నాయి. 1.తఫ్వీజ్ అంటే మరొకర్కి ‘తలాఖ్ ఇచ్చే అధికారం ఇవ్వటం. 2. ఇతరులను వకీలుగా నియమించటం అంటే మరో వ్యక్తిని ‘తలాఖ్ వకీల్‌గా నిర్ణయించటం. 3. రిసాల మరియు సందేశం అంటే మరొకరి ద్వారా ‘తలాఖ్ అందజేయటం. తఫ్వీజ్కి మూడు పదాలు ఉన్నాయి.1. తఖ్యీర్, 2. అమ్ర్బిల్యద్, 3. మషియత్.
1. ఒకవేళ భర్త భార్యతో ‘తలాఖ్ ఇచ్చే ఉద్దేశ్యంతో నీ ఇష్టం అని అంటే, ఒకవేళ భార్య తన్ను తాను అనుసరిస్తే ‘తలాఖ్ అయిపోతుంది. ‘తలాఖ్ రజయీ పడుతుంది. ఒకవేళ ఆమె భర్తను అనుసరిస్తే ‘తలాఖ్ పడదు. 2. అమ్ర్బిల్యద్ అంటే భర్త భార్యతో నీ పని నీ చేతిలోనే ఉంది అని అంటే ఇదీ తఖ్యీర్ లాగే ఉంది. ఒకవేళ భార్య ‘తలాఖ్ ఇస్తే ‘తలాఖ్ పడిపోతుంది. లేకపోతే పడదు. 3. మషియత్ అంటే కోరటం అని అర్థం. అంటే భర్త తన భార్య కోరికపై ‘తలాఖ్ ఇవ్వటం. ఒకవేళ ‘తలాఖ్ ఇస్తే సరిలేకపోతే లేదు. భర్త తనకు ‘తలాఖ్ ఇస్తాడని తెలిసి తాను ‘తలాఖ్ ఇచ్చివేస్తే ‘తలాఖ్ పడుతుంది. ‘తలాఖ్ రకాలన్నీ ఇంతకు ముందు పేర్కొనబడ్డాయి.
[86]) వివరణ-3293: అంటే మూడు ‘తలాఖ్‌లు సరిపోయేవి. 100 తలాఖ్‌లు ఇచ్చి లాభం ఏమిటి? మిగిలినవన్నీ వ్యర్థమయ్యాయి. అంతేకాదు నువ్వు ఖుర్ఆన్కి వ్యతిరేకంగా ఆచరించావు. అల్లాహ్ వాక్యాల పట్ల ఎగతాళి చేసావు. అల్లాహ్ ఆదేశం: ”వలాతత్తఖిజూ ఆయాతిల్లాహి హుజువన్.” (అల్ బఖరహ్, 2:231) అయితే అబ్దుల్లాహ్ బిన్ ‘అబ్బాస్ యొక్క ఈ ఉల్లేఖనం వల్ల ఆ వ్యక్తి ఒకే సభలో 100 తలాఖ్‌లు ఇచ్చాడా, లేక వివిధ సభల్లో 100 తలాఖ్‌లు ఇచ్చాడా అనేది స్పష్టం కాలేదు. ఒకవేళ వేర్వేరు సభల్లో ఇచ్చి ఉంటే మూడు తలాఖులు అయిపోయాయి. ఆమె బాయినహ్ అయి పోయింది. ఒకవేళ ఒకే సభలో ఇస్తే ఒకే ‘తలాఖ్ అయింది. ముస్లిమ్ షరీఫ్‌లో ఒక ఉల్లేఖనం ఇలా ఉన్నట్లు ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో ఒకేసారి మూడు తలాఖ్‌లు ఇస్తే ఒకటిగానే పరిగణించబడేది. ‘స’హీ’హ్ ముస్లిమ్‌లో ఇలా ఉంది: ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: అంటే ప్రవక్త (స) కాలంలో, అబూ బకర్ కాలంలో, ‘ఉమర్ (ర) కాలంలో మూడు తలాఖ్‌లు ఒకే తలాఖ్గా పరిగణించబడేవి. అనేకమంది అనుచరులు ఈ నిర్ణయమే కలిగి ఉండేవారు. ఇవి తాలీఖుల్ ము‘గ్నీ, షర్హ దారు ఖుతునీలలో ఉన్నాయి. అంటే అబూబకర్ కాలం నుండి ‘ఉమర్ (ర) పరిపాలనా కాలం వరకు అనేకమంది అనుచరులు ఈవిధంగానే భావించే వారు. ఒకే సభలో మూడు ‘తలాఖ్‌లు. ఒక ‘తలాఖ్గా పరిగణించబడేది. అయితే భర్తలు అనవసరంగా ‘తలాఖ్‌లు ఇవ్వడం మొదలుపెడితే ‘ఉమర్ (ర) మూడు ‘తలాఖ్లను మూడుగా నిర్దేశించారు. ‘స’హీ’హ్ ముస్లిమ్‌లో ‘ఉమర్ (ర) అభిప్రాయం: కాని ఈ ఉపాయం వల్ల ”తలాఖ్‌లు ఇవ్వడం తగ్గక పోయేసరికి ‘ఉమర్ (ర) చాలా విచారించారు. తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీన్ని గురించి ప్రఖ్యాత ‘హదీసు’ పుస్తకం ముస్నద్ ఇస్మాయీల్లో ఉంది. ఈ వాక్యంలో స్పష్టంగా ‘తలాఖ్ రెండుసార్లు అని ఉంది. ఇందులో పునరాలోచించుకునే అవకాశం ఉంటుంది. ఒకేసారి మూడు ‘తలాఖ్‌లు ఇవ్వటంవల్ల ఆ అవకాశం ఉండదు. ఇలా చేయటం అల్లాహ్ వాక్యాన్ని వ్యతిరేకించినట్లు అవుతుంది. ఒకేసారి మూడుసార్లు ‘తలాఖ్‌లు ఇచ్చే ప్రస్తావన ఖుర్ఆన్లో ఎక్కడా లేదు. అందువల్లే పండితులు దీన్ని తలాఖె బిద్యీ అంటారు. (అల్ ఆసారుల్ మల్బూఅ)
అంటే రుకాన తన భార్యకు మూడు ‘తలాఖ్‌లు ఇచ్చేవేసాడు. కాని తర్వాత చాలా విచారించాడు. ప్రవక్త (స) అతన్ని నీవు ‘తలాఖ్ ఎలా ఇచ్చావు అని ప్రశ్నించారు. అతడు మూడు ‘తలాఖ్‌లు ఇచ్చానని అన్నాడు. మళ్ళీ ప్రవక్త (స) ఒకే సభలో ఇచ్చావా? అని ప్రశ్నించారు. దానికి అతడు అవునని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ప్రవక్త (స), ‘అయితే అది ఒక ‘తలాఖ్ అయింది, నువ్వు కోరితే పునరాలోచించుకో వచ్చు,’ అని అన్నారు. రుకాన తన భార్యను తిరిగి స్వీకరించాడు. ఈ రెండు ‘హదీసు’లు ప్రామాణికమైనవి. మొదటిది ముస్లిమ్లోనిది. దీనిపట్ల అందరూ ఏకాభిప్రాయం కలిగిఉన్నారు. రెండవది ముస్నద్ అ‘హ్మద్లోనిది. ము’హద్దిసీ’న్లలోని ఒక వర్గం దీనిపట్ల ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. ఏది ఏమైనా ప్రవక్త కాలం, అబూ బకర్ కాలం, ‘ఉమర్ కాలం యొక్క ప్రారంభంలో నూ ఈ విధంగానే ఆచరించడం జరిగింది. అయితే ప్రజలు ‘తలాఖ్ ఇవ్వటం సర్వసాధారణం అయినపుడు ‘ఉమర్ (ర) మూడింటినీ మూడుగా పరిగణించటం జరిగింది. ఇది రాజకీయంగా జరిగింది కాని ధార్మికంగా కాదు. ఎందుకంటే ఒక వేళ ఏదైనా రద్దుచేసే ‘హదీసు’ ఉంటే తప్ప కుండా సమర్థించడం జరిగేది. అప్పుడు ‘ఉమర్(ర) కూడా ఏ ‘హదీసు’ను పేర్కొన లేదు. ఏ అనుచరుడూ దాన్ని ధృవీకరించలేదు. అంటే ‘ఉమర్ (ర) ఇలా చేద్దామని ఆశించారు. ఆ తరువాత ముత్ఆ గురించి ప్రవక్త (స) ఆదేశాన్ని పేర్కొంటూ ప్రసంగించారు. ఒక ధర్మసమ్మతమైన విషయాన్ని ప్రజా శ్రేయస్సు కోరి పాలకుడు నిషేధించగలడు. స్వయంగా ‘ఉమర్ ఈ విషయమే కాక కొన్నిఇతర ధర్మసమ్మతమైన విషయాలను నిషేధించారు. ‘ఉమర్ (ర) వద్దకు ఒక స్త్రీ రప్పించబడింది. ఆమె తన బానిసతో పెళ్ళి చేసుకుంది. ‘ఉమర్ (ర) వారిద్దరినీ విడదీసారు. ఇతరులనూ ఆమెతో నికా‘హ్ చేయకూడదని నిషేధించారు. (కన్జుల్ ఉమ్మాల్)
హు’జైఫా (ర) మదాయన్లో ఒక యూదస్త్రీతో నికా‘హ్ చేసుకున్నారు. ‘ఉమర్ (ర) ఆమెకు ‘తలాఖ్ ఇవ్వవల సిందిగా లేఖ వ్రాసారు. ఇది ముస్లిమ్ స్త్రీల కొరకు చాలా పెద్ద ఉపద్రవం. వాస్తవం ఏమిటంటే గ్రంథప్రజల స్త్రీలతో పెళ్ళిచేసుకోవటాన్ని ఖుర్ఆన్ సమర్థిస్తుంది.ఈ పథకం వల్ల కూడా ‘తలాఖ్‌లు ఇవ్వడం తగ్గకపోతే, ‘ఉమర్ (ర) చాలా విచారించారు. ఇబ్నె ఖయ్యిమ్ ముస్నద్ ఉమర్ ద్వారా దీన్ని పేర్కొన్నారు. ఒకవేళ ఇది ధార్మిక ఆదేశమే అయితే విచారించటం ఎందుకు? ‘హనఫీ పండితుల్లో కూడా చాలామంది ఇది ‘ఉమర్ యొక్క రాజకీయ నిర్ణయంగా భావిస్తున్నారు. (మజ్మఉల్ అన్హర్ షర్హు మున్తఖా అల్ అబ్హర్ – 382) ఇదేవిధంగా ఖహ్’తానీ (తహ్ తావీ) మొదలైన వాటిలో కూడా ఉంది. ‘తలాఖ్ విషయంలో షరీఅత్ కల్పించిన సౌకర్యం మూడు ‘తలాఖ్‌ల పక్షంలో నశిస్తుంది. అల్లాహ్ ఆదేశం: ”ఈ ఆయతు ద్వారా స్పష్టంగా తెలిసిన విషయం ఏమిటంటే ‘తలాఖ్ రెండుసార్లు ఇవ్వాలి. దీనివల్ల పునరాలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. అబూ దావూద్‌లో రుకాన సంఘటనలో ఈ పదాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రవక్త (స) పైన పేర్కొన్న ఆయతు పఠించటం గడువు కోసమే ‘తలాఖ్ ఇవ్వటం అనడానికి నిదర్శనం. కోరితే గడువు పూర్తవకుండానే పునరాలోచించుకోవచ్చు. లేదా ఆమెను వదలివేయ వచ్చు. ‘తలాఖ్ ఇచ్చే వాడికి సౌకర్యంకోసమే గడువు ఇవ్వటం జరిగింది. ఒకవేళ ‘తలాఖ్ ఇచ్చిన తర్వాత అయ్యే ‘తలాఖ్ ఎందుకు ఇచ్చానా అని విచారిస్తే, గడువులోపల స్వీకరించవచ్చు. మూడు ‘తలాఖ్‌లు పడితే ఈ అవకాశం ఉండదు. ఇలా చేయడం షరియత్ నిర్ణయానికి వ్యతిరేకం అవుతుంది. ఇమామ్ రా‘జీ తన వ్యాఖ్యానంలో ఇలా పేర్కొన్నారు: మూడు ఒకటి కావడమే ధర్మం. దీన్నే పండితులందరూ సమర్థిస్తున్నారు.
ప్రవక్త (స) అనుచరుల్లో ‘అలీ (ర), ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్, ‘అబ్దుర్ర’హ్మాన్ బిన్ ఔఫ్, ‘జుబైర్ బిన్ అవ్వామ్, అబూ మూసా అష్’అరీ, ఇబ్నె ‘అబ్బాస్‌ల అభిప్రాయం ఇదే. అదేవిధంగా తాబియీన్లు మరియు ము‘హద్దిసీ‘న్లలో చాలా మంది దీన్నే సమర్థిస్తున్నారు. ఉదా: జాబిర్ బిన్ జైద్, తాఊస్, ‘ఉమర్ బిన్ దీనార్, ఇక్రమ, అతా బిన్ రిబాహ్, ఇమామ్ నఖయీ, ఇమామ్ మాలిక్ జొహిరీ మరియు వారి అనుచరులు, అ’హ్మద్ బిన్ ఇస్’హాఖ్, ‘హజ్జాజ్ బిన్ అర్తాత్, ము’హమ్మద్ బిన్ మఖాతిల్, ము’హమ్మద్ బిన్ నఖీ బిన్ ముఖ్లిద్, ము’హమ్మద్ బిన్ ‘అబ్దుస్సలామ్, ఖుష్నీ, హాదీ, ఖాసిమ్, బాఖిర్, నాసిర్, అహ్మద్ బిన్ ఈసా, ‘అబ్దుల్లాహ్ బిన్ మూసా, ‘జైద్ బిన్ అలీ, ఖిల్లాస్ బిన్ ‘ఉమర్, ‘హారిస్’, మరి కొందరు అ’హ్మద్, ఇమామ్ ఇబ్నె తైమియ, ‘హాఫి”జ్ ఇబ్న ఖయ్యిమ్, ఇంకా మరి కొందరు, ఖుర్తుబలోని ఒక వర్గం, ఇంకా చాలామంది పేర్లు నైలుల్ అవ్తార్లో పేర్కొనడం జరిగింది. మిగిలిన పేర్లు ఫత్హుల్ బారీ ఉమ్దతుల్ ఖారీ, ఆలాముల్ మూఖియీన్ ఉమ్దతుర్బియా ద్వారా తెలుసు కోవచ్చు. ఒక ‘తలాఖ్‌ను సమర్థించేవారు ప్రతికాలంలో అధికంగాఉన్నారని తెలుస్తుంది. ‘హాఫిజ్ ఇబ్నె తైమియ కొందరు ‘హనఫీ పండితుల నుండి ఒక ‘తలాఖ్‌ను పేర్కొన్నారు. ము’హమ్మద్ బిన్ మఖాతిల్ రా’జీ — అంటే ‘హనఫీ వర్గంలోని ఇమాముల్లో ము’హమ్మద్ బిన్ మఖాతిల్ రా’జీ కూడా దీన్నే సమర్థిస్తున్నారు. ఇంకా అహ్లె ‘హదీస్’, అహ్లె జొహిరీ, ‘హనఫీల్లోని ఒక వర్గం, మాలికీలు, ‘హనాబిల్, ఇమామ్ జ’అఫర్ సాదిఖ్ మరియు ఇమామ్ బాఖిర్ మరియు ఇతర అహ్లె బైత్ 3 తలాఖులను సమర్థించటం లేదు. అదేవిధంగా ‘అలీ (ర), ఇబ్నె మస్’ఊద్ అభిప్రాయం: అంటే మరోవర్గం అభిప్రాయం ఇలా ఉంది: మూడు తలాఖులు మూడుకావు, ఒకటే అవుతుంది. తావూస్, ఇక్రమ, ఖలాస్, ‘ఉమర్, ము’హమ్మద్ బిన్ ఇస్’హాఖ్, ‘హజ్జాజ్ బిన్ అర్తాత్ మరియు జొహిరీ వర్గం వారు అంటే దావూద్ మరియు వారి అనుచరులు మరియు ఇమామ్ అబూ ‘హనీఫా అనుచరుల్లోని ఒకవర్గం కూడా దీన్నే సమిర్థస్తుంది. మరియు ఇమామ్ మాలిక్ మరియు ఇమామ్ అ’హ్మద్ సహచరులు, అనుచరులు కూడా దీన్నే సమర్థిస్తున్నారు. ఇంకా మౌలానా అబ్దుల్ ‘హయ్యి లక్నోవి షర్హు విఖాయలోని వివరణలో ఇమామ్ మాలిక్ అభిప్రాయం కూడా ఇదేనని పేర్కొన్నారు. రెండవ అభిప్రాయం అంటే ఒకేసారి మూడు ఇస్తే, ఒకటే అవుతుంది. గడువులో పునరాలోచించుకునే హక్కు, అవకాశం ఉంటుంది. ఇదే సరైన అభిప్రాయం.
[87]) వివరణ-3295: అంటే నీతో సంభోగించి సుఖం పొందాలి. ఆ తరువాత అతడు ‘తలాఖ్ ఇస్తే గడువు ముగిసిన తర్వాత నువ్వు మొదటి భర్తతో పెళ్ళి చేసుకో గలవు. ఖుర్ఆన్లో అల్లాహ్ ఆదేశం: ”ఒకవేళ రెండు ‘తలాఖ్‌లు తర్వాత మూడవ ‘తలాఖ్ కూడా ఇస్తే, మరోవ్యక్తి పెళ్ళిచేసుకొని ‘తలాఖ్ ఇవ్వనంత వరకు అతనికి ఆమె ధర్మ సమ్మతం కాదు.” (బఖరహ్) దీన్ని హలాలహ్ అంటారు. మూడు తలాఖుల తర్వాత మరోవ్యక్తితో పెళ్ళిచేసుకోవాలి, అతనితో సంభోగం చేయాలి. ఎటువంటి అభ్యంతరం లేకుండా ఆ వ్యక్తి ఆమెకు ‘తలాఖ్ ఇవ్వాలి. లేదా మరణించాలి. గడువు అయిపోయిన తర్వాత మొదటి భర్తతో పెళ్ళి చేసుకోవచ్చు. రిఫా’అహ్ భార్య అన్యాయంగా అతనిపై అభాండాలు వేసింది. దీన్ని స్వయంగా అబ్దుర్ర’హ్మాన్ వివరించాడు. ఇమామ్ బు’ఖారీ ఈ వృత్తాంతాన్నంతా కితాబు ల్లిబాస్లో ఈవిధంగా పేర్కొన్నారు.
ఇక్రమ (ర) కథనం: రిఫా’అహ్ తన భార్యకు మూడు ‘తలాఖ్‌లు ఇచ్చాడు. ఆ తరువాత ‘అబ్దుర్ర’హ్మాన్ బిన్ ‘జుబైర్ ఖుర్జీ ఆమెతో నికా‘హ్ చేసుకున్నారు. ‘ఆయి’షహ్ (ర) కథనం: ఈ స్త్రీ పచ్చనిదాన్ని కప్పుకొని వచ్చి భర్త గురించి, ఫిర్యాదులు చేయసాగింది. తన శరీరంపై దెబ్బల వాతలను నాకు చూపెట్ట సాగింది. స్త్రీల సహజ గుణం ఏమిటంటే వారు పరస్పరం సహాయం చేసుకుంటారు. ప్రవక్త (స) వచ్చిన తర్వాత ‘ఆయి’షహ్ (ర) ఆమె పరిస్థితిని ప్రవక్త (స) ముందు పెట్టింది. ‘ఆమె వీపు ఆమె వోణ్ని కంటే పచ్చగా అయిపోయింది’ అని వివరించింది. ముస్లిమ్ స్త్రీలకు బాధ కలిగినట్లు మరెవరిని చూడలేదని పేర్కొంది. ఈ వార్త ఆమె భర్తకు అందింది. అతను కూడా వచ్చాడు ఇంకా తన ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకువచ్చాడు. వారు మరో భార్య బిడ్డలు. ఆమె అల్లాహ్ సాక్షి! ఓ అల్లాహ్ ప్రవక్తా! నా తప్పేమి లేదు. విషయం అంతా అతని దగ్గర ఉన్నది. బట్టకంటే మెత్తగా ఉంది అంటూ తన బట్టకొనలను చూపెట్ట సాగింది. ‘అబ్దుర్ర’హ్మాన్ మాట్లాడుతూ, ఓ అల్లాహ్ ప్రవక్తా! ఇది అసత్యం పలుకుతుంది. నేనైతే సంభోగంలో దీన్ని చితక బాదుతున్నాను. కాని ఇది చాలా పెంకి. ఇది తన మొదటి భర్త దగ్గరకు వెళ్ళాలను కుంటుంది. అప్పుడు ప్రవక్త (స) అయితే మరి ‘అబ్దుర్ర’హ్మాన్, నీ రుచి చూడనంతవరకు, నీవు రిఫా’అహ్ వద్దకు వెళ్ళలేవు. ప్రవక్త (స) ‘అబ్దుర్ర’హ్మాన్ వెంట ఉన్న ఇద్దరు పిల్లలతో అప్పుడు ప్రవక్త (స) ఆ స్త్రీతో, ‘నువ్వు ఈ వ్యక్తికి మగతనం లేదని అన్నావు. దైవం సాక్షి! వీళ్ళు అచ్చం ‘అబ్దుర్ర’హ్మాన్ లాగే ఉన్నారు,’ అని అన్నారు. (బు’ఖారీ)
[88]) వివరణ-3297: ము’హల్లిల అంటే — మూడు ‘తలాఖులు ఇవ్వబడిన స్త్రీని, ఆమె భర్తకొరకు ఆమెను — ‘హలాల్ చేయటానికి వివాహం చేసుకునేవాడు. అతడు ఆమెతో సంభోగం చేసి ఆమెకు ‘తలాఖ్ ఇచ్చివేస్తాడు. ఎందుకంటే ఆ ము‘హల్లిల్ లో ముందు నుంచే ‘తలాఖ్ ఇచ్చే ఉద్దేశ్యం ఉంటుంది. ఒకటి రెండు రోజులకు నికా‘హ్ చేసుకుంటాడు. ఇది ముత్’అహ్ పరిధిలోనికి వస్తుంది. ఇటువంటి ము‘హల్లిల్ శాపానికి గురవుతాడు. ఎవరికోసం చేయబడుతుందో అతడు శాపగ్రస్తుడే. ఒకవేళ మరోవ్యక్తి తన సంతోషంతో పెళ్ళి చేసుకొని, తన సంతోషంతో వదలివేస్తే లేదా చనిపోతే గడువు తరువాత మొదటి భర్తతో పెళ్ళి చేసుకోవచ్చు. ఇలా చేయడం ధర్మసమ్మతమే. కొన్ని ‘హదీసు’ల్లో ము‘హల్లిల్ను నిశ్చితార్థం గొర్రెపోతుగా భావించడం జరిగింది. ఇబ్నె మాజహ్ లో ఇలా ఉంది: ”ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ‘నేను మీకు నిశ్చితార్థం గొర్రెపోతు గురించి చెప్పనా,’ అని అన్నారు. దానికి అనుచరులు, ‘తప్పకుండా’ అని అన్నారు. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ” ‘హలాల్ చేసేవాడు, ‘హలాల్ చేయించే వాడు ఇద్దరినీ అల్లాహ్ (త) శపిస్తున్నాడు.
నైలుల్ అవ్తార్లో ఇలా ఉంది: అంటే త’హ్లీల్ గురించిన ఈ ‘హదీసు’లు నిషేధాన్ని సూచిస్తున్నాయి.
[89]) వివరణ-3298: ఈలా అంటే ప్రమాణం అని అర్థం. షరీ’అత్‌లో ఈలా అంటే భర్త తన భార్యతో సంభోగం చేయనని ప్రమాణం చేయటం. అంటే, ‘అల్లాహ్ సాక్షి! నేను నా భార్యతో సంభోగం చేయను లేదా నేను ఆమె వద్దకు వెళ్ళను’ అని అనడం. అంటే నేను ఆమెతో సంభోగం చేయనని అతని ఉద్దేశం. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి గడువు నాలుగు నెలలు మరొకటి నాలుగు నెలల కంటే తక్కువ గడువు. నాలుగు నెలల కంటే తక్కువ అయితే ఈ మధ్య భార్య ఏమీ కోరకుండా ఓర్పు వహించి ఉండి, ఆ తరువాత ఇద్దరూ కలుసుకోవాలి. ఈలా ఆదేశం ఏమంటే ఒకవేళ గడువు తర్వాత సంభోగంచేసి పునరాలోచించుకుంటే ఎటువంటి పరిహారమూ లేదు. ఒకవేళ ఎవరైనా గడువులో సంభోగం చేసి ప్రమాణం భంగంచేస్తే పరిహారం చెల్లించవలసి ఉంటుంది. ఈలా గురించి ఖుర్ఆన్లో ఈ ఆయతు అవతరించబడింది: ”ఎవరైతే తమ భార్యలతో (సంభో గించము అని) ప్రమాణంచేస్తారో, వారికి నాలుగు నెలల వ్యవధి ఉంది. కాని వారు తమ దాంపత్య జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తే! నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.” (బఖరహ్, 2: 226)
అంటే ప్రమాణం తరువాత పునరాలోచించుకొని భార్యా భర్త లిద్దరూ సంతోషంగా ఉండాలి. ఒకవేళ కలసి ఉండడానికి ఇష్టపడకపోతే ‘తలాఖ్ ఇచ్చివేయాలి. అటూకాక ఇటూకాక మధ్య ఉంచడం మంచిదికాదు. ఒకవేళ భర్త ‘తలాఖ్ ఇవ్వకుండా పీడిస్తుంటే, ముస్లిమ్ పాలకుడు ‘తలాఖ్ ఇప్పించాలి. అయితే ‘తలాఖ్ ఇవ్వకుండా ‘తలాఖ్ పడదు. ధార్మిక పండితుల అభిప్రాయం ఇదే. అంటే మూలీ (ఈలా చేసేవాడు) అంటే ప్రమాణం చేసిన వాడిని అధికారి ముందు నిలబెట్టటం జరుగుతుంది. అతను తిరిగి స్వీకరించాలి లేదా ‘తలాఖ్ ఇవ్వాలి. ‘తలాఖ్ ఇవ్వకుండా ‘తలాఖ్ పడదు. సులైమాన్ బిన్ యసార్ మాటలకు అర్థం ఇదే. ఇబ్నె ‘ఉమర్ (ర) అభిప్రాయం ఏమిటంటే ఈలా ఇచ్చిన తర్వాత 4 నెలలు గడచిపోతే ప్రమాణంచేసిన వారిని అధికారిముందు నిలబెట్టటం జరుగుతుంది. మూలీ, లేకుండా ‘తలాఖ్ ఇవ్వడం జరుగదు. ‘ఉస్మాన్, ‘అలీ, అబూ దర్దా, ఇంకా ఇతర సహచరులందరి అభిప్రాయం కూడా ఇదే. (నైలుల్ అవ్తార్)
- [90]) వివరణ-3300: ”జిహార్ ”జుహ్ర్ నుండి వచ్చింది, ”జుహ్ర్ అంటే వీపు అని అర్థం. ఇస్లామ్‌లో ”జిహార్ అంటే భర్త తన భార్యను తన తల్లి గర్భం లేదా వీపుతో పోల్చడం అని అర్థం. అంటే నువ్వు నా తల్లి వీపులా ఉన్నావు అని అర్థం. అంటే అతని ఉద్దేశ్యం నిషేధం అని అర్థం. అంటే నా తల్లిలా నీవూ నాకు నిషిద్ధం అని అనటం. అజ్ఞాన కాలంలో ఇలా అనటం వల్ల ‘తలాఖ్ అయిపోయేది. భార్య నిషిద్ధం అయిపోయేది. అల్లాహ్ (త) ముస్లిముల కోసం ఇందులో పరిహారం నిర్ణయించాడు, దాన్ని ‘తలాఖ్గా పరిగణించలేదు. అజ్ఞానకాంలో ఒకవేళ ఎవరైనా ఇలా అంటే సంభోగానికి ముందు ఈ తప్పుకు పరిహారంగా ఒక ముస్లిమ్ బానిసను విడుదల చేసేవాడు. ఈ శక్తి లేకపోతే నిరంతరం రెండు నెలలు ఉపవాసం పాటించే వాడు. ఈ శక్తి కూడా లేకపోతే 60 మంది పేదలకు అన్నం పెట్టేవారు. ఇస్లామ్ ప్రారంభంలో ”జిహార్ సంఘటన ప్రాచీన అరబ్బుల ప్రకారం ఆదేశం జారీచేసారు. ఆ తరువాత వెంటనే ఈ క్రింది ఆయతులు అవతరించబడ్డాయి. వెంటనే ప్రవక్త (స) ఈ ఆయతుల ప్రకారం తీర్పు ఇచ్చారు. ముందు ఆ ఆయతులను చదువుకోండి. ఆ తరువాత అవతరణా కారణాలను చదువుకుంటారు గాని. అల్లాహ్ ఆదేశం: ”వాస్తవానికి, తన భర్తను గురించి నీతో వాదిస్తున్న మరియు అల్లాహ్‌తో మొరపెట్టుకుంటున్న ఆ స్త్రీ మాటలు అల్లాహ్ విన్నాడు.అల్లాహ్ మీ ఇద్దరి సంభాషణ వింటున్నాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సమస్తం చూసేవాడు. మీలో ఎవరైతే తమ భార్యలను “జిహార్ ద్వారా దూరంగా ఉంచుతారో! అలాంటివారి భార్యలు, వారి తల్లులుకాలేరు. వారిని కన్నవారు మాత్రమే వారితల్లులు. మరియు నిశ్చయంగా వారు అనుచితమైన మరియు అబద్ధమైన మాట పలుకుతున్నారు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ మన్నించేవాడు, క్షమాశీలుడు.మరియు ఎవరైతే తమ భార్యలను “జిహార్ ద్వారా దూరంచేసి తరువాత తమ మాటను వారు ఉపసంహ రించుకో దలిస్తే! వారిద్దరు ఒకరినొకరు తాకక ముందు, ఒక బానిసను విడుదల చేయించాలి.ఈ విధంగా మీకు ఉపదేశమివ్వబడుతోంది. మరియు మీరు చేస్తున్న దంతా అల్లాహ్ ఎరుగును. కాని ఎవడైతే ఇలా చేయలేడో, అతడు తన భార్యను తాకక ముందు, రెండు నెలలు వరుసగా ఉపవాసముండాలి. ఇది కూడా చేయలేనివాడు, అరవై మంది నిరుపేదలకు భోజనం పెట్టాలి. ఇదంతా మీరు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించటానికి. మరియు ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. మరియు సత్య తిరస్కారులకు బాధాకరమైన శిక్ష పడ