12- كِتَابُ الْفَرَائِضِ وَالوَصَايَا
12. ఆస్తి పంపకం, వీలునామాల పుస్తకం
ఆస్తి పంపక జ్ఞానం దీని ద్వారా మృతుడు వదలి వెళ్ళిన ఆస్తిని సరైన పద్ధతిలో పంచటం. ఇందులో మూడు విషయాలు ఉన్నాయి. 1. వారిస్, 2. మూరస్, 3. మౌరూస్ అంటే ఆస్తిని సరైన విదంగా పంచటం. హక్కుగల వారికి వారి హక్కులను అందజేయడం, అందరికీ చేరినట్లు చూడటం.
ఈ జ్ఞానాన్ని ఫరాయిజ్ అని ఎందుకంటారంటే దీన్ని స్వయంగా అల్లాహ్ (త) విధించాడు. ఫరజ్ అంటే వంతు, ముక్క అని అర్థం. వివిధ పరిమాణంలో ఉంటాయి. దీన్ని మీరాస్ జ్ఞానం అంటారు. మీరాస్ అంటే మృతుని నుండి మరొకరి వైపునకు మారి పోతుంది. దీని బహువచనం మవారీస్. ఒకరి మరణా నంతరం ధన సంపదలకు యజమాని అయిన వాడిని వారిస్ అంటారు. మరణించిన వ్యక్తి మూరస్ అవుతాడు. వదలి వెళ్ళిన ధనం మౌరూస్ అవుతుంది. దీనికి సంబంధించిన ఆదేశాలు ఖుర్‌ఆన్, ‘హదీసు’ల్లో ఉన్నాయి. ఇందులో ఎటువంటి ఖియాస్కి చోటులేదు.
ఫరాయి‘జ్ జ్ఞానం చాలా గొప్ప జ్ఞానం. దీని ద్వారా హక్కు గలవారి హక్కు తెలుస్తుంది. ఖుర్‌ఆన్‌లో ప్రత్యేకంగా దీన్ని గురించి బోధించటం జరిగింది. ప్రతి ఒక్కరి హక్కు వేర్వేరుగా ఉంది. హక్కు గల వారికి, వారి హక్కును ఇవ్వనివారు చాలా పెద్ద నేరస్తులు. దాన్ని గురించి ముందు వస్తుంది. ప్రవక్త (స) ప్రవచనం: ”ఆస్తి హక్కుల జ్ఞానాన్ని మీరూ నేర్చుకోండి. ఇతరులకూ నేర్పండి. ఎందుకంటే ఇది సగం జ్ఞానం. ఈ జ్ఞానం ఎత్తివేయబడుతుంది. నా అనుచర సమాజంలో అన్నిటి కంటే ముందు ఈ జ్ఞానం ఎత్తుకోబడుతుంది.” (బైహఖీ, ‘హాకిమ్, సిరాజీ)
మరో ప్రవచనం: ”ఆస్తి పంపక జ్ఞానాన్ని నేర్చుకోండి, నేర్పండి, నన్ను సమాప్తం చేయటం జరుగుతుంది. ఈ జ్ఞానం కూడా క్రమక్రమంగా నశిస్తుంది. ఉపద్రవాలు ప్రారంభం అవుతాయి. చివరికి ఒక సమస్యపై ఇద్దరు వ్యక్తులు వివాదపడుతూ ఉంటారు. కాని వారికి తీర్పు ఇచ్చే వ్యక్తి ఎవరూ ఉండరు.” (దారమి)
కొన్ని ఉల్లేఖనాల్లో దీన్ని సగం జ్ఞానంగా పేర్కొనడం జరిగింది. ‘ఉమర్ (ర) ఉపదేశం: ”ప్రజలారా! ఖుర్‌ఆన్‌ను నేర్చుకున్నట్టు ఆస్తి పంపకజ్ఞానాన్ని నేర్చుకోండి.” (దారమి)
అబూ మూసా (ర) ఇలా అభిప్రాయపడ్డారు : ఖుర్‌ఆన్ నేర్చుకొని ఆస్తి పంపక జ్ఞానాన్ని నేర్చుకోనివాడు తలలేని మొండెం వంటివాడు. (దారమి) ఆస్తి పంపకజ్ఞానాన్ని నేర్చు కోవడం ఫర్’దె కిఫాయహ్.
ప్రవక్త (స) అనుచరుల్లో అందరికంటే ఎక్కువ ఆస్తి పంపక జ్ఞానం గలవారు ‘జైద్ బిన్ సా’బిత్. (అ’హ్మద్, తిర్మిజి’)
ఖుర్‌ఆన్‌లో ఆస్తి పంపకం గురించి అనేక ఆయతులు ఉన్నాయి. వాటిని అబ్దుస్సలాం బస్తవీ గారు ఇస్లామీ త’అలీమ్ 8వ భాగంలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ‘హదీసు’లు క్రింద పేర్కొనబడ్డాయి.
మృతుని ధనానికి హక్కుదారులు:
క్రమంగా ఉన్న 4 హక్కులు:
1. అతని ధనంలో నుండి అతని కఫన్ దఫన్ గురించి అతని స్తోమతకి తగ్గట్టు ఖర్చుచేయాలి. కఫన్‌లో అమి తంగా ఖర్చుచేయరాదు. అదేవిధంగా పిసినారి తనం ప్రదర్శించరాదు. మధ్యేమార్గాన్ని అవలంబించాలి.
2. ఆ తరువాత అప్పులు ఉంటే, అతని అప్పులన్నీ తీర్చాలి.
3. ఆ తరువాత ఒకవేళ అతను ఎవరి గురించైనా వీలునామా వ్రాసి ఉంటే అతని ఆస్తిలోని మూడవ వంతు అందులో పేర్కొన్నవారికి ఇచ్చివేయాలి.
4. తజ్’హీ‘జ్ మరియు తక్ఫీన్, అప్పులు, వీలునామా మొదలైన వాటిలో ధనం ఖర్చుచేసిన తరువాత మిగిలిన ధనంలో నుండి ఖుర్‌ఆన్, ‘హదీసు’ల ప్రకారం ఆస్తి హక్కులు ఉన్న వారికి ఇవ్వడం జరుగుతుంది.
క్రింద పేర్కొన్న విషయాల్లో ఏదైనా విషయం ఉంటే వారికి అందులో ఆస్తి హక్కు ఉంటుంది.
1) బంధుత్వం: అంటే బంధుత్వం వల్ల ఆస్తిలో హక్కు లభిస్తుంది.
2) వివాహం: అంటే వివాహబంధం వల్ల కూడా ఆస్తిలో హక్కు లభిస్తుంది.
3) మువాలాత్: అంటే మిత్రత్వం, అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తితో అతడు నా మిత్రుడు అని అనటం. నా కష్టసుఖాల్లో నీవు పనికిరావాలి. ఒకవేళ నేను ఎవరికైనా చంపివేస్తే నా తరఫున పరిహారం చెల్లించాలి. నేను చనిపోతే నా ధనానికి వారసుడు కావాలి. ఒకవేళ ఆ మిత్రుని తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, భార్య ఎవరూ లేకపోతే అతడు స్వీకరిస్తే దీన్ని అఖ్దుల్ మువాలాత్ అంటారు.
మృతుని ధనంలో పదిమంది వారసులు ఉన్నారు:
1. జవిల్ ఫురూ‘ద్ లేదా అస్హాబుల్ ఫురూ‘ద్ అంటే వీరి భాగాలు ఖుర్‌ఆన్‌లో పేర్కొనబడి వున్నాయి. ఉదా: 1/2, 1/4, 2/3, వీటిని సిహామ్ అని కూడా అంటారు. ఆస్తిపంపకం జవిల్ ఫురూ‘ద్ ద్వారా ప్రారంభమవుతుంది. వీరు 12 మంది. 10 మంది బంధువులు.
i. ముగ్గురు పురుషులు: తండ్రి, తాత, తండ్రి తరఫున (అ‘ఖ్యాఫి) సోదరుడు.
ii. ఏడుగురు స్త్రీలు: కూతురు, మనవరాలు (కుమారుని బిడ్డ), సొంత-చెల్లెలు, సవతి-చెల్లెలు, అఖ్‌యాఫీ-చెల్లెలు, తల్లి, నానమ్మ.
iii. రెండు సబబీ భార్యా, భర్తలు.
2. ‘అసబాత్ రెండు రకాలు 1. సబబీ, 2. నసబీ
అస్హాబుల్ ఫురూ‘ద్ లకు ఆస్తిపంచిన తర్వాత ‘అసబాత్ నసబియహ్కు ఆస్తి పంచబడుతుంది. ఎందు కంటే అసబ్, నసబియ్యహ్ కంటే శక్తిమంత మైనది.
3. ఆ తరువాత ‘అసబాత్ సబబీ అంటే విడుదలచేసే వానికి ఆస్తి ఇవ్వడం జరుగుతుంది. వారు పురుషులైనా స్త్రీలయినాసరే.
4. ఆ తరువాత మూతఖ్ యొక్క ‘అసబియ్యహ్ పురుషులకు ఆస్తి పంచబడుతుంది.
5. ఒకవేళ పైన పేర్కొన్న ‘అసబాత్లో ఎవరూ లేకపోతే ఆస్తి అస్హాబుల్ ఫురూ‘ద్ వైపునకు మారిపోతుంది. అంటే వారి హక్కుల ప్రకారం రెండవసారి ఇవ్వడం జరుగుతుంది. అయితే వారు బంధువులై ఉండాలి.
నోట్: ‘అసబాత్ అంటే అస్హాబుల్ ఫురూ‘ద్ తమ వంతు తీసుకున్న తర్వాత మిగిలిన ధనం తీసుకునే వారు. ఒకవేళ అస్హాబుల్ ఫురూ‘ద్ లేకపోతే అంతా వీరిదే అవుతుంది.
6. జ‘విల్ అర్’హామ్: అహ్లె ఫురూ‘ద్ నసబియ్య, పైన పేర్కొన్న ‘అసబాత్‌లో నుండి ఎవరూ లేకపోతే ఆస్తి జవిల్ అర్’హామ్‌కు పంచివేయబడుతుంది. వీరు మృతునికి బంధువులే కాని ఖుర్‌ఆన్, ‘హదీసు’, ఇజ్‌మహ్‌లలో వీరికి ప్రత్యేకంగా వంతులు లేవు. అస్‌హాబుల్ ఫురూ’ద్వి ఉన్నట్టు.
7. మౌలల్ మువాలాత్: అస్హాబుల్ ఫురూ‘ద్ మరియు ‘అసబాత్ మరియు జవిల్ అర్’హామ్లలో నుండి ఎవరూ లేకపోతే మృతుని ధనం మౌలల్ మువాలాత్లలో పంచివేయబడును. దీన్నిగురించి పైన పేర్కొనడం జరిగింది.
8. ముఖిర్ర్లహు బిన్నసబ్ అలల్గైరి: అంటే పరాయి వ్యక్తిని బంధువుగా పరిగణిస్తే పైవారు ఎవరూ లేకపోతే ఆస్తి అతనికి చెందుతుంది. అంటే ఉదా: ‘జైద్ ‘ఖాలిద్‌ను సోదరునిగా భావించాడు. అంటే ‘జైద్ ముఖిర్ర్ స్వీకరించే వాడు. ‘ఖాలిద్ ముఖిర్ర్‌లహు. అప్పుడు ‘జైద్ తండ్రి ‘ఖాలిద్‌కి కూడా తండ్రి అవుతాడు. ఒకవేళ ‘జైద్‌కి వారసులెవరూ లేకపోతే, అతని ఆస్తి అతనికి చెందుతుంది. కాని ‘జైద్ తండ్రితో అతనికి సంబంధం ఉండదు.
9. ముసాలహు బిజమీయిల్మాలి: అంటే ధనం మొత్తం వీలునామా చేయబడినవాడు. అంటే పైన పేర్కొన్న వారిలో ఎవరూ లేకపోతే ఈ వ్యక్తికి మొత్తం ధనం చెందుతుంది.
10. బైతుల్మాల్: పైన పేర్కొన్న వారిలో ఎవరూ లేక పోతే మృతునిధనం బైతుల్‌మాల్‌లో అంటేముస్లిముల ధనాగారానికి చెందుతుంది. అయితే ఇది ఆస్తిగా కాక యుద్ధ ధనంగా ముస్లిముల సంక్షేమానికి వినియో గించ టం జరుగుతుంది. బైతుల్‌మాల్ ఖర్చుల్లో అగత్య పరులు, పేద రోగుల చికిత్స, అనాథ శవాల కఫన్ దఫన్, అనాథ పిల్లల ఖర్చులు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో బైతుల్ మాల్ లేదు. అందువల్ల ఇటువంటి ధనాన్ని పేదలు, అనాధలకు పంచిపెట్ట వచ్చును.
ఆస్తి లభించని సందర్భాలు:
ఆస్తి లభించని సందర్భాలు నాలుగు ఉన్నాయి. వీటివల్ల ఆస్తి లభించదు.
1. బానిస: ఒకరి బానిసత్వంలో ఉంటే ఆస్తి లభించదు.
2. హత్య చేయటం: దానివల్ల హత్యా పరిహారం తప్పనిసరి అయితే, అంటే ఒక వ్యక్తి తన బంధువును చంపాడు. ఈ వ్యక్తి అతనికి వారసుడైనా, హత్యవల్ల ఇతనికి ఆస్తి లభించదు.
ప్రవక్త (స) ప్రవచనం: హంతకుడికి ఆస్తిలో నుండి ఏమీ దక్కదు. (నసాయి)
3. ధార్మిక భేదం: ఒకరు ముస్లిమ్, మరొకరు కాఫిర్. పరస్పరం ఒకరి ఆస్తి మరొకరికి చెందదు. ప్రవక్త (స) ముస్లిమ్ కాఫిర్‌కి వారసుడు కాలేడని, కాఫిర్ ముస్లిమ్‌కి వారసుడు కాలేడని ప్రవచించారు. (బు’ఖారీ)
4. దేశాల భేదం: ఒక వ్యక్తి ఒక దేశంలో మరో వ్యక్తి మరో దేశంలో ఉంటే, ఇది కేవలం కాఫిర్లకే. షాఫయీ దేశాల భిన్నత్వం ఆస్తి హక్కును ఆపలేదని అభిప్రాయ పడుతున్నారు.
నిర్ణీత భాగాలు:
ఖుర్‌ఆన్‌లో 6 భాగాలు ఉన్నాయి. వీటిని జవిల్ఫురూ‘ద్ అంటారు. ఇవి రెండు రకాలు. ఒక భాగంలో (1/2, 1/4, 1/8). రెండో భాగంలో, 2/3, 1/3, 1/6 ఉన్నాయి. ½ గురించి ఖుర్‌ఆన్‌లో అనేకచోట్ల పేర్కొనడం జరిగింది.
1. ఒకవేళ ఒక్క కూతురు ఉంటే ఆమెకు ½ .
2. మీ భార్యలు వదలివెళ్ళిన దానిలో ½ .
3. కేవలం ఒక్క చెల్లెలు ఉంటే ఆమెకు ½.
1/4వ గురించి ఖుర్‌ఆన్‌లో రెండుచోట్ల వచ్చింది.
1. భార్యల ఆస్తిలో మీకు ¼ వంతు ఆస్తి లభిస్తుంది.
2. మీ ఆస్తిలో భార్యలకు ¼ వంతు సంతానం లేకపోతే లభిస్తుంది.
1/8 వ వంతు గురించి అల్లాహ్ ఆదేశం:
1. మీరు విడిచివెళ్ళిన దాంట్లో మీ భార్యలది 1/8 వంతు, సంతానం ఉన్నాసరే.
రెండు, మూడవ వంతులు గురించి:
1. ఒకవేళ కుమార్తెలు రెండు లేక అంతకంటే ఎక్కువ ఉంటే వారికి ఆస్తిలో నుండి 2/3 వ వంతు లభిస్తుంది.
2. ఒకవేళ ఇద్దరు చెల్లెళ్ళు ఉంటే ఆస్తిలోనుండి వారికి 2/3 వంతు లభిస్తుంది.
1/3 వంతు గురించి ఖుర్‌ఆన్‌లో ఒకచోట వచ్చింది:
1. అతని తల్లికి 1/3 లభిస్తుంది. ఒకరికంటే అధికంగా ఉంటే, 1/3 వ వంతులో అందరూ భాగస్వాములే.
1/6వ వంతు గురించి ఖుర్‌ఆన్‌లో 3 చోట్ల వచ్చింది:
1. మృతుని తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి 1/6వ వంతు లభిస్తుంది.
2. ఒకవేళ అనేకమంది అన్నాచెల్లెళ్ళు ఉంటే తల్లికి 6వ వంతు లభిస్తుంది.
3. ఒకవేళ ఒక సోదరుడు, ఒక చెల్లెలు ఉంటే వీరిలో ప్రతి ఒక్కరికీ 1/6వ వంతు లభిస్తుంది.
వారసులకు లభించే 6 వంతులు ఖుర్‌ఆన్‌లో ఉన్నాయి. వీటి వివరణ క్రింద పేర్కొనడం జరిగింది.
జవిల్ ఫురూ‘ద్ భాగాలు:
జవిల్ ఫురూ’ద్ 12 మంది ఉన్నారని మనం తెలుసు కున్నాం. వీరిలో నలుగురు పురుషులు: తండ్రి, తాత, తండ్రి తరఫున సోదరుడు, భర్త. ఎనిమిది మంది స్త్రీలు: కూతురు, మనవరాలు, సొంతచెల్లెలు, తల్లి తరఫున చెల్లెలు, తండ్రి తరఫున చెల్లెలు, తల్లి, నాన్నమ్మ, భార్య. ముందు పురుషుల గురించి పేర్కొనటం జరుగుతుంది. ఆ తరువాత స్త్రీల భాగాల గురించి పేర్కొనటం జరుగుతుంది.
పురుషుల వంతులు:
తండ్రి: తండ్రికి మూడు స్థితులు ఉన్నాయి.
1. ఒక స్థితిలో తండ్రికి ఫర్’ద్ ముత్లఖ్ మాత్రమే చెందుతుంది. అంటే మృతుని ఆస్తిలో 1/6వ వంతు లభిస్తుంది. అయితే అతనితో పాటు మృతుని కొడుకు లేదా మనవడు, లేదా మునిమనవడు ఉండాలి. తల్లి దండ్రుల్లో ప్రతి ఒక్కరికి 6వ వంతు లభిస్తుంది. అయితే మృతుని ఒక కుమారుడు ఉండాలి.
సంతానం అంటే కొడుకు, మనవడు ఆ విధంగా క్రిందికి పోతుంది. అంటే ఒకవేళ కొడుకు లేకుంటే మనవడు, మనవడు లేకుంటే మునిమనవడు. అదేవిధంగా క్రిందివరకు. ఒకవేళ ‘జైద్ చనిపోయాడు, అతనికి తండ్రి, ఒక కుమారుడు ఉన్నారు. తండ్రికి 6వ వంతు చెందుతుంది. మిగిలినదంతా కొడుకుకి చెందుతుంది.
2. రెండవ స్థితిలో తండ్రికి ఫర్’ద్ ము‘త్లఖ్, ఉసూబత్ రెండూ లభిస్తాయి. అంటే జవిల్ ఫురూజ్ కావటం వల్ల 6వ వంతు, అస్‌బ కావటం వల్ల మిగిలిన ధనం లభిస్తుంది. మృతునికి తండ్రితో పాటు కూతురు లేదా మనవరాలు ఉంటే కూతురుకు సగం, మిగిలినది తండ్రికి లభిస్తుంది. ఎందుకంటే కొడుకులు, మనవళ్లు లేనందున అంతా తండ్రికే లభిస్తుంది. సగం మరియు ఆరవ వంతు ఒకచోట చేరడం వల్ల లెక్క 6 ద్వారా జరుగుతుంది. అంటే మృతుని ధనాన్ని 6 వంతులుగా చేయడం జరుగుతుంది. అందులో సగం కూతురుకు లభిస్తుంది. ఒకవేళ మృతునికి ఒకే కూతురు ఉంటే ఆమెకు సగం లభిస్తుంది. 6వ వంతు తండ్రికి లభిస్తుంది. ఒక వంతు తండ్రి జవిల్ఫురూ‘ద్ కావటం వల్ల లభించింది. రెండు భాగాలు మిగిలాయి. ఆ రెండు కూడా తండ్రికే అస్‌బ కావటం వల్ల లభించాయి. అంటే మూడు వంతులు తండ్రికి లభించాయి.
3. మూడవ స్థితిలో తండ్రి కేవలం అస్‌బ అవుతాడు. అంటే మృతునికి సంతానంలో ఏ ఒక్కరూ లేకుంటే అంతా తండ్రికే దక్కుతుంది. ఒకవేళ ఎవరైనా జవిల్ఫురూ‘ద్ ఉంటే అతని వంతు ఇచ్చి మిగిలింది తండ్రికి చెందుతుంది. అంటే మృతునికి తల్లి, తండ్రి ఉన్నారు. తల్లికి 1/3 వ వంతు లభిస్తుంది. మిగిలింది తండ్రికి లభిస్తుంది.
తాతవంతు:
ఒకవేళ మృతుని తండ్రి ఉన్నాడు. తాత కూడా ఉన్నాడు. తాత వారసుడు కాలేడు. తండ్రి లేకపోతే తాత తండ్రి స్థానాన్ని పొందుతాడు. ఇతనివి కూడా మూడు స్థితులు ఉన్నాయి. అయితే నాలుగు స్థితుల్లో మాత్రం తండ్రికి వేరుగా ఉన్నాయి. అవి ఫరాయిజ్ పుస్తకాల్లో ఉన్నాయి.
అవ్లాదుల్ ఉమ్ [సవతి (అ’ఖ్యాఫి) సోదరుడు, సోదరి]:
అంటే ఒక తల్లి, ఇద్దరు తండ్రులు గలవారిని ”అవ్లాదుల్ఉమ్” అంటారు. ఇటువంటి వారికి మూడు స్థితులు ఉన్నాయి.
1. ఒకవేళ ఒక సోదరుడు లేదా ఒక చెల్లెలు ఉంటే 1/6వ వంతు లభిస్తుంది.
అల్లాహ్ ఆదేశం: ”ఒకవేళ ఒక వ్యక్తి లేదా ఒక స్త్రీకి ఆస్తి ఉంటే వారికి తండ్రి, కొడుకు లేకపోతే అతడి రెండవ తండ్రి నుండి ఒక సోదరుడు లేదా ఒక సోదరి ఉంటే వారిలో ప్రతి ఒక్కరికీ 1/6వ వంతు లభిస్తుంది. (సూరహ్ నిసా, 4:12)
ఈ ఆయతులో తల్లి సంతానం అని అర్థం. అల్ ఉమ్ము అంటే తల్లి.
2. ఒకవేళ తల్లి తరఫున అన్నాచెల్లెళ్ళు ఇద్దరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే వారికి 1/3 వ వంతు లభిస్తుంది. ఇందులో అందరూ భాగస్వాములు. అల్లాహ్ ఆదేశం: ”ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ ఉంటే 1/3 వ వంతులో అందరూ భాగస్వాములు.” (అన్నిసా, 4:12) పంపకం, హక్కుల్లో అందరూ సమానులు. స్త్రీలైనా పురుషులైనా, ఇక్కడ పురుషులకు ఇద్దరు స్త్రీల వంతుకు సమానంగా ”అనేది” వర్తించదు. మిగతాచోట్ల అంతా ఇది వర్తిస్తుంది.
3. మృతుని తండ్రి లేదా తాత లేదా కొడుకు లేదా మనవడు లేదా కూతురు ఉంటే తండ్రి తరఫున సోదరులకు ఏమాత్రం చెందదు. ఎందుకంటే వారిని కలాలగా పరిగణించటం జరుగుతుంది. కలాల విషయంలో కుమారుడు, తండ్రి ఉండకూడదని షరతు ఉంది. అందువల్ల ఈ స్థితిలో అఖ్‌యాఫీ సోదరుడు, చెల్లెలు ఇద్దరూ వారసులు కారు.
భర్త వంతులు:
రెండు భర్త స్థితులు:
1. ఒకవేళ భార్య మరణిస్తే, ఆమెకు కొడుకు, కూతురు, మనవడు, మనవరాలు లేకుంటే భర్తకు ఆమె ఆస్తిలో నుండి సగం వంతు లభిస్తుంది.
2. ఒకవేళ భార్యకు కొడుకు, కూతురు లేదా మన వడు లేదా మనవరాలు ఉంటే భర్తకు మొత్తం ఆస్తిలో ¼ వంతు లభిస్తుంది. ఖుర్‌ఆన్ ఆదేశం : ”మీ భార్యలు వదలివెళ్ళిన దాంట్లో వారికి సంతానం లేకపోతే వారి ఆస్తిలో నుండి సగం, ఒకవేళ వారి సంతానం ఉంటే మీకు ¼ వ వంతు లభిస్తుంది.” (అన్నిసా, 4)
స్త్రీల వంతులు:
జ’విల్ ఫురూ’ద్లోని ఎనిమిది మంది స్త్రీలకు వంతులు ఉన్నాయి.
1. భార్య, 2. కూతురు, 3. మనవరాలు, 4. సొంత (‘ఐని) చెల్లెలు, 5. సవతి (‘అల్ల్తాతి) చెల్లెలు, 6. తల్లి తరఫున (అ’ఖ్యాఫి) చెల్లెలు, 7. తల్లి, 8. నాయనమ్మ.
1. భార్యకు రెండు స్థితులు ఉన్నాయి.
(1). ఒకవేళ మృతునికి కొడుకు, కూతురు, మనవడు, మనవరాలు లేకుంటే 1/4వ వంతు లభిస్తుంది. ఒక్క భార్య ఉన్నా అంతకంటే అధికంగా ఉన్నాసరే. 1/4లో భాగ స్వాములు.
(2) ఒకవేళ కొడుకు, కూతురు, మనవడు, మనవ రాలు ఉంటే 1/8వ వంతు లభిస్తుంది. అల్లాహ్ ఆదేశం: ”మీ ఆస్తిలో స్త్రీలది 4వ వంతు. ఇది సంతానం లేకుంటే; సంతానం ఉంటే వారికి 8వ వంతు” అంటే 1/8.
కూతురు వంతు:
సొంత చెల్లెలుకు మూడు స్థితులు ఉన్నాయి.
1. ఒకవేళ మృతునికి ఒకే ఒక్క కూతురు ఉంటే, ఆమెకు సగం 1/2 లభిస్తుంది.
2. ఒకవేళ మృతునికి రెండు లేదా అంతకంటే ఎక్కువ కూతుర్లు ఉంటే వారందరికీ కలిపి 2/3 వంతు లభిస్తుంది.
3. ఒకవేళ కూతురుతో పాటు కొడుకు కూడా ఉంటే కూతురు అస్బహ్ అవుతుంది. అప్పుడు కొడుకుకు రెండు వంతులు, కూతురుకు ఒక వంతు లభిస్తుంది. అల్లాహ్ ఆదేశం: మగవారికి ఇద్దరు స్త్రీల వంతులు ఇవ్వాలి.
మనవరాలి వంతు:
సమాజంలో కొడుకు కూతుర్ని మనవరాలు అంటారు. అయితే ఇక్కడ మనవళ్ళ, మనవరాళ్ళ కూతురిని కూడా మనవరాలు అంటారు. ఒకవేళ కొడుకు కూతురు లేకపోతే మనవడి కూతురికి లభిస్తుంది. ఇంకా ఒకవేళ మనవడి కూతురు కూడా లేకుంటే ముని మనవడి కూతురుకి లభిస్తుంది. మనవరాలికి ఆరు స్థితులు ఉన్నాయి. కాని ముని మనవరాలి స్థితులు కలిపి మొత్తం11 స్థితులు వ్రాయబడ్డాయి.
1. ఒకవేళ మృతునికి కొడుకు కూతురు లేక, కేవలం ఒక మనవరాలు మాత్రమే ఉంటే ఆమెకు ఆస్తిలో నుండి 1/2వ వంతు లభిస్తుంది. ఈ విధంగా మనవరాలు కూతురు స్థానంలో ఉంటుంది. ఒకవేళ మనవరాలు లేకుంటే ముని మనవరాలు వస్తుంది.
2. ఒకవేళ మృతుని కొడుకు కూతురు లేకుంటే, ఇద్దరు మనవరాళ్ళు లేదా అంతకంటే అధికంగా ఉంటే, వారికి మొత్తం ఆస్తిలో నుండి 2/3వ వంతు ఇవ్వబడు తుంది. ఈ స్థితిలో కూడా మనవరాళ్ళు కూతుర్ల స్థానంలో ఉంటారు. కూతుర్లలా వీరు కూడా 2/3వ వంతు ఆస్తిని పంచుకుంటారు. ఒకవేళ 2 మనవ రాళ్ళు ఉన్నా లేక ఎక్కువ ఉన్నా. ఒకవేళ మనవ రాళ్ళు ఎవరూ లేకుంటే ముని మనవరాళ్ళు వస్తారు.
3. ఒకవేళ మృతునికి కొడుకు, కూతురు లేరు. ఒక మనవరాలు లేదా అనేకమంది మనవరాళ్ళు ఉన్నారు. వారికి తోడు మనవడు ఉంటే, జవిల్ఫురూ‘ద్‌కి ఇచ్చిన తర్వాత మిగిలింది మనవడు, మనవరాళ్ళు పంచుకుంటారు. ఇక్కడ మునిమనవ రాలు మనవరాలి స్థానంలో ఉండదు. ఎందుకంటే మనవడి ముందు ఆమెకు ఏమీ దక్కదు.
4. (1) ఒకవేళ మృతుని కొడుకు, కూతురు లేకుంటే, మనవడు కూడా లేకుంటే ఒకటి లేక అనేక మనవరాళ్ళు ఉంటే, మునిమనవడు కూడా ఉంటే, జవిల్ఫురూ‘ద్ కు ఇచ్చిన తర్వాత మిగిలిన దాన్ని మనవరాళ్ళు, ముని-మనవరాల్ళు పంచుకుంటారు. పురుషునికి ఇద్దరు స్త్రీల వంతులు.
(2) ఒకవేళ మృతునికి కొడుకు, మనవడు, ముని మనవడు లేకుండా, కేవలం ఒక్క కూతురు మాత్రమే ఉంటే, మనవ రాళ్ళకు కేవలం 6వ వంతు లభిస్తుంది. మనవరాలు ఒక్కటి ఉన్నా అధికంగా ఉన్నా.
(3). ఒకవేళ మృతునికి కొడుకు, మనవడు, ముని-మనవడు లేకుండా మనవరాలు కూడా లేకుండా, కేవలం ఒక కూతురు మరియు ఒక మునిమనవరాలు ఉంటే మునిమనవ రాలికి 6వ వంతు లభిస్తుంది. ఒక్కటి ఉన్నా అంతకంటే అధికం ఉన్నాసరే.
5. (1) ఒకవేళ మృతునికి కొడుకు, మనవడు, ముని-మనవడు లేక ఇద్దరు కూతుర్లు లేదా అంత కంటే ఎక్కువ ఉంటే, మునిమనవరాలికి ఏమీ దక్కదు.
(2) ఒకవేళ మృతునికి కొడుకు, మనవడు, ముని మనవడు లేక ఇద్దరు కూతుర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మునిమనవరాలికి ఏమీ దక్కదు.
6. (1) ఒకవేళ మృతునికి కొడుకు ఉంటే, మనవ రాళ్ళకు, ముని మనవరాళ్ళందరికీ ఏమీ దక్కదు.
(2) ఒకవేళ మృతునికి మనవరాలు ఉంటే, ముని మనవరాళ్ళందరికీ ఏమీ దక్కదు.
వివరణ: మునిమనవరాళ్ళు ఒకే కొడుకు సంతానం కానక్కరలేదు. అనేకమంది కొడుకుల సంతానం అయినా అదే వారికి లభిస్తుంది. ఉదా: ఒక కొడుకుకి ఒక కూతురు ఉంది. మరో కొడుకుకు ఐదుమంది కూతుర్లు ఉన్నారు. వారికి 2/3వ వంతు లభిస్తే దాన్ని 6 భాగాలుగాచేసి ప్రతి ఒక్కరికి ఒక వంతు ఇవ్వడం జరుగుతుంది. ఒక్క కూతురుకు అధికంగా ఇవ్వడం జరుగదు. అదేవిధంగా మనవళ్ళతో కలసి ‘అస్‌బ అవడంలో ఒక్కరి సంతానం కానక్కరలేదు. ఒకవేళ మనవరాళ్ళు ఒక కొడుకు సంతానం అయితే వారితో పాటు ఉన్న మనవడు మృతుని మరో కొడుకు సంతానం అయినా ‘అస్‌బ అయిపోతాడు. అంతే కాదు మనవళ్ళకు దొరక్కపోవడానికి మృతుని కొడుకు ఉండటం షరతు కాదు. ఒకవేళ మనవళ్ళ తండ్రి చనిపోయాడు, మరొక కొడుకు ఉన్నాడు. అతడు మనవరాళ్ళ తండ్రి కాదు. అప్పుడు కూడా వారికి ఏమీ దక్కదు. ఇప్పుడు చెల్లెళ్ళ విషయం చదవండి.
సొంత చెల్లెలు:
సొంత చెల్లెళ్ళ ఐదు స్థితులు ఉన్నాయి:
1. ఒకవేళ ఒకే చెల్లెలు ఉంటే, ఆమెకు మృతుని సగం ఆస్తి లభిస్తుంది. అల్లాహ్ ఆదేశం: ”అతనికి చెల్లెలు ఉంటే ఆమెకు సగం ఆస్తి లభిస్తుంది.”
2. ఒకవేళ రెండు లేదా రెండుకంటే ఎక్కువ ఉంటే 2/3 వారి హక్కు లభిస్తుంది. అల్లాహ్ ఆదేశం: ”ఒకవేళ ఇద్దరు చెల్లెళ్ళు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆస్తిలో నుండి వారికి 2/3 లభిస్తుంది.”
3. ఒకవేళ చెల్లెళ్ళతో పాటు సొంత (‘ఐని) సోదరుడు ఉంటే అమ్మాయికి ఒక వంతు, అబ్బాయికి రెండు వంతులు లభిస్తాయి. ఖుర్‌ఆన్‌లో సోదరి సోదరుడితో కలసి ‘అస్‌బ అయిపోతుంది.
4. మృతుని కూతుర్లు, మనవరాళ్ళు చెల్లెళ్ళతో కలసి ఉంటే కూతుర్ల, మనవరాళ్ళ వంతులు ఇచ్చిన తర్వాత మిగిలిన దాంట్లో అందరికీ హక్కు ఉంది. ప్రవక్త (స) ప్రవచనం: ”చెల్లెళ్ళను కూతుర్లతో ‘అస్‌బ చేయండి.”
ఇబ్నె మస్’ఊద్‌ను ”ఒక వ్యక్తి చనిపోయాడు. అతడికి ఒక కూతురు ఒక మనవరాలు, ఒక చెల్లెలు ఉంది. ప్రతి ఒక్కరికీ ఎంత లభిస్తుంది” అని ప్రశ్నించడం జరిగింది. అతను ఈ ‘హదీసు’ ప్రకారం, ”కూతురుకి సగం, మనవరాలికి 1/6, మిగిలింది అంతా చెల్లెలిది,” అని సమాధానం ఇచ్చారు. (బు’ఖారీ)
సవతి సోదరి వంతు:
ప్రశ్న: సవతి చెల్లెల స్థితులు ఎన్ని? సొంత చెల్లెలు ఉంటే సవతి చెల్లెలుకి ఆస్తి దక్కుతుందా లేదా?
జవాబు: సొంత చెల్లెలు ఉంటే సవతి చెల్లెలు వారసురాలు కాదు. సొంత చెల్లెలు లేకపోతే సవతి చెల్లెలు ఆమె స్థానంలో ఉంటుంది. వారికి 7 స్థితులు ఉన్నాయి.
సవతి చెల్లెలు వంతు:
మృతుని సవతి చెల్లెళ్ళు కూడా సొంత చెల్లెళ్ళవంటి వారే. వీరికి 7 స్థితులు ఉన్నాయి.
1. సవతి చెల్లెలు ఒక్కతే ఉంటే ఆమెకు సగం లభిస్తుంది. అయితే మృతుని సొంత చెల్లెళ్ళు ఉండరాదు.
2. ఒకవేళ రెండు లేదా అంతకంటే ఎక్కువ సవతి చెల్లెళ్ళు ఉంటే 1/3వ వంతు లభిస్తుంది. అందరూ ఇందులో భాగస్వాములు. అయితే సొంత చెల్లెళ్ళు ఉండరాదు.
3. మృతుని సవతిచెల్లెళ్ళు, ఒక సొంత చెల్లెలు ఉంటే సవతి చెల్లెళ్ళకు 1/4వ వంతు లభిస్తుంది. ఎందుకంటే చెల్లెళ్ళ వంతు 2/3. అందులో సగం సొంత చెల్లెలు తీసుకొని పోయింది. మిగిలింది 6వ వంతు. అది సవతి చెల్లెళ్ళకు లభిస్తుంది. దీనివల్ల చెల్లెళ్ళ హక్కులు పూర్తయ్యాయి.
4. ఒకవేళ మృతునికి ఇద్దరు చెల్లెళ్ళు ఉంటే సవతి చెల్లెళ్ళకు ఏమీ లభించదు. ఎందుకంటే సొంత ఇద్దరు చెల్లెళ్ళకు 2/3వ వంతు ఉంది. ఇప్పుడు మరేమీ మిగలలేదు.
5. ఒకవేళ మృతునికి ఇద్దరు సొంత చెల్లెళ్ళతో పాటు సవతి చెల్లెళ్ళు ఉండి వారితో పాటు ఒక సవతి సోదరుడు కూడా ఉంటే, ఇప్పుడు సవతి చెల్లెళ్ళు సోదరుని వల్ల ‘అస్‌బ అయిపోతారు. మిగిలిన ఆస్తిని సవతి అన్నా చెల్లెళ్ళలో మగవారికి ఇద్దరుస్త్రీలవంతు చొప్పున పంచిపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే సోదరుడు, సొంత చెల్లెళ్ళ ఆస్తి అవ్లాద్ సల్బియ్యహ్ స్థానం పొందటం జరుగుతుంది. ఇంకా సోదరుని సవతి సోదరీమణుల ఆస్తి కొడుకు సంతానం స్థానంలో ఉండి ఉంటుంది. వీరిలో పురుషులు, స్త్రీలు అందరూ సమానులే.
6. సవతి సోదరి మృతుని కుమార్తెలు లేదా మనవరాళ్ళతో కలసి ‘అస్‌బ అయిపోతుంది. ఎందుకంటే ‘హదీసు’లో ఇలా ఉంది, ”చెల్లెళ్ళను కూతుర్లతో పాటు ‘అస్‌బ చేయండి.” చాలామంది పండితుల అభిప్రాయం ఇదే.
7. మృతుని సవతి చెల్లెళ్ళు, సవతి సోదరులు — అతని కొడుకు లేదా మనవడు లేదా మునిమనవడు లేదా తండ్రితో ఉంటే — ఎవ్వరికీ ఏదీ దక్కదు.
మరో అభిప్రాయం ప్రకారం ఒకవేళ మృతునికి తాత ఉంటే సవతి సోదరులకు ఏమీ దక్కదు. అదేవిధంగా మృతునికి సొంత సోదరుడు లేదా సోదరి ఉన్నా సవతి సోదర సోదరీ మణులకు ఏమీ దక్కదు. అంటే సొంత చెల్లెళ్ళతో ఉండి ‘అస్బగా ఉన్నప్పుడు అంటే కుమార్తెలు, మనవరాళ్ళతో పాటు ఉన్నప్పుడు.
తల్లి వంతు:
తల్లికి మూడు స్థితులు ఉన్నాయి:
1. ఒకవేళ మృతునికి సంతానం కొడుకు, కూతురు లేదా మనవడు, మనవరాలు ఉంటే మృతుని తల్లికి 6వ వంతు లభిస్తుంది. అల్లాహ్ ఆదేశం: ”మృతునికి సంతానం ఉంటే తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికీ 6వ వంతు లభిస్తుంది.” (అన్-నిసా’, 4:11)
ఆయతులో వలద్ అని ఉంది. అంటే కొడుకులు, కూతుళ్లు, మనవడు, మనవరాళ్ళు అందరూ ఉన్నారు.
2. ఒకవేళ మృతునికి ఇద్దరు లేదా ఇద్దరికంటే ఎక్కువ సోదర సోదరీమణులు ఉంటే వారు సొంత వారైనా, సవతి వారైనా సంబంధం తల్లినుండైనా, తండ్రినుండైనా ఎట్టి పరిస్థితుల్లోనూ మృతుని తల్లికి 6వ వంతు లభిస్తుంది. ఎందుకంటే అల్లాహ్ ఆదేశం: ”అతనికి సోదరులు, సోదరీమణులు ఉంటే తల్లికి 6వ వంతు లభిస్తుంది.” (అన్-నిసా’, 4:11)
3. ఒకవేళ మృతునికి కొడుకు, కూతురు లేక మనవడు, మనవరాలు లేక, లేదా, ఇద్దరు లేక ఇద్దరికంటే ఎక్కువ సోదర, సోదరీలు లేకుంటే మృతుని తల్లికి 1/3వంతు లభిస్తుంది. అల్లాహ్ ఆదేశం: ”ఒకవేళ సంతానం లేకుంటే అతని వారసులైన తల్లిదండ్రుల్లో తల్లికి 1/3వ వంతు లభిస్తుంది.” (అన్-నిసా’, 4:11)
మిగిలిన దానికి తండ్రి వారసుడు అవుతాడు. కాని పైన పేర్కొనబడిన స్థితులలో తల్లిదండ్రులతో పాటు భార్యా భర్తల్లో ఒకరు ఉండకూడదు. ఒకవేళ తల్లిదండ్రులతో పాటు భార్యా భర్తల్లో ఒకరు ఉంటే, భార్యాభర్తల్లో ఒకరి వంతు ఇచ్చిన తర్వాత మిగిలిన ఆస్తిలో 1/3 వంతు తల్లికి లభిస్తుంది.
ఇవి రెండు రకాలు:
1. మృతుని తల్లిదండ్రులు మరియు భార్యాభర్తల్తో ఒకరు (భర్త) ఉండాలి.
2. మృతుని తల్లిదండ్రులు మరియు అతని భార్య ఉంటే రెండు స్థితుల్లోనూ మిగిలిన దాంట్లో 1/3వ వంతు తల్లికి లభిస్తుంది. మిగిలింది తండ్రికి లభిస్తుంది. ఈ విషయంపై ‘ఉమర్ (ర), ‘అలీ (ర), ఇబ్నె మస్’ఊద్ (ర), ధార్మిక పండితులు, ధార్మిక ప్రవీణులు, షాఫయీ ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు.
ఒకవేళ ఈ రెండు సమస్యల్లో తండ్రికి బదులు తాత ఉంటే ఉదా: మృతుని తల్లి మరియు భార్యాభర్తల్లో ఒకరు మరియు తాత ఉన్నా తల్లికి మొత్తం ఆస్తిలో నుండి 1/3వ వంతు లభిస్తుంది. దీన్ని ఇబ్నె ‘అబ్బాస్, అబూ ‘హనీఫా, ము’హమ్మద్ సమర్థిస్తున్నారు. కూఫా వారు కూడా ఇబ్నె మస్’ఊద్ యొక్క ఉల్లేఖనాన్ని స్వీకరించారు. భార్యాభర్తల్లో ఒకరు ఉంటేనే. కాని ఈ స్థితిలో ఇమామ్ అబూ యూసుఫ్ తాతతో తల్లికి మిగిలిన దాంట్లో నుండి 1/3వ వంతు ఇవ్వాలని అభిప్రాయ పడ్డారు. తండ్రితో చేసినట్టు. (షరీఫా) కాఫేలో ఇలా ఉంది. పైన పేర్కొన్నదాంట్లో అంటే తండ్రికి బదులు తాత ఉంటే తల్లికి మొత్తం ఆస్తిలో, 1/3 వ వంతు లభిస్తుంది.
అమ్మమ్మ నాన్నమ్మల వంతు:
అమ్మమ్మను, నాన్నమ్మను ఇద్దరినీ జద్దహ్ అంటారు. మనవలు, మనవరాళ్ళ ఆస్తిలో నాన్నమ్మ, ముని నాన్నమ్మ, అమ్మమ్మ, ముని అమ్మమ్మలకు వంతులు లభిస్తాయి. సిరాజీలో ఇలా ఉంది, ”ప్రతి వ్యక్తికి ఇద్దరు జద్దాలు ఉంటారు. 1. తల్లి యొక్క తల్లి, 2. తండ్రి యొక్క తల్లి. ఆ తరువాత జద్దహ్వి రెండు రకాలు:
1. అంటే తండ్రి తల్లి, లేదా తండ్రి తల్లి యొక్క తల్లి.
2. తల్లి తండ్రి యొక్క తల్లి. ఇందులో ఇద్దరు తల్లుల గురించి ఉంది. అంటే మృతుని తల్లి, అతని తాతతల్లి. నాన్నమ్మకు, అమ్మమ్మకు 6వ వంతు లభిస్తుంద. ఎందుకంటే ప్రవక్త (స) ఇలా ప్రవచించారు. ”అమ్మమ్మ, నాన్నమ్మలకు 6వ వంతు ఇచ్చివేయండి.” వారు ఒక్కరైనా అధికంగా ఉన్నా 6వ వంతులో భాగ స్వాములు.
నాన్నమ్మకు, అమ్మమ్మకు 6వ వంతు ఇవ్వడం గురించి మరో ‘హదీసు’ కూడా ఉంది. దాన్ని అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) మరియు ము’గీర బిన్ షీబఅ మరియు ‘ఖబీస బిన్ జువైబ్ (ర) ఉల్లేఖించారు. ప్రవక్త (స) జద్దహ్‌కు 6వ వంతు ఇచ్చారు. ఒకవేళ అధిక సంఖ్యలో ఉంటే 6వ వంతులో వీరందరూ భాగస్వా ములు. దీనికి సాక్ష్యం ఏమిటంటే అబూ బకర్ సిద్దీఖ్ వద్దకు ఒక నాన్నమ్మ వచ్చి, ”నాకు నా మనవడి ఆస్తి లభించినట్లు చూడండి,” అని విన్నవించుకుంది. దానికి అబూ బకర్ (ర) మీరు కొంచెం వేచి ఉండండి, నేను ప్రవక్త (స) అనుచరులతో సంప్రదించుకుంటాను. ఎందుకంటే నాకు ఖుర్‌ఆన్‌లో మీ వంతు కనబడలేదు, ప్రవక్త (స) కూడా మీ గురించి ఏమీ ప్రవచించలేదు అని తెలిపి ఇతరులతో సంప్రదించారు. ము’గీరహ్ (ర), ప్రవక్త (స) అమ్మమ్మకు 6వ వంతు ఇచ్చారని అన్నారు. అబూ బకర్ సిద్దీఖ్ అతనితో ‘మీతో పాటు ఇంకెవరైనా సాక్ష్యం ఉన్నారా?’ అని అన్నారు. అప్పుడు ము’హమ్మద్ బిన్ ముస్లిమహ్ అ’న్సారీ సాక్ష్యం ఇచ్చారు. ఆ తరువాత ఆ వ్యక్తికే చెందిన నాన్నమ్మ వచ్చి మనవడి ఆస్తి గురించి విన్నవించుకుంది. అప్పుడు అబూ బకర్ ఆ ఇద్దరితో, ‘మీ ఇద్దరూ ఆస్తిలో 6వ వంతును పంచుకోండి,’ అని తీర్పు ఇచ్చారు. (బు’ఖారీ)
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”నాన్నమ్మ ‘ఉమర్ (ర) వద్దకు వచ్చి, ”అమ్మమ్మ కంటే నేను ఉత్తమ మైనదాన్ని. ఎందుకంటే ఒకవేళ అమ్మమ్మ చనిపోతే మనవడు ఆమె ఆస్తిని పొందలేడు, ఎందుకంటే ఆమె జవిల్ అర్’హామ్లలోనివారు. ఇంకా ఒకవేళ నాన్నమ్మ చనిపోతే మనవడు నా ఆస్తికి వారసుడు అవుతాడు అని విన్నవించుకుంది. అప్పుడు ‘ఉమర్ (ర), ‘ఆ ఆరవ వంతులో నీ వంతు కూడా ఉంది. ఒకవేళ మీరు అధికంగా ఉంటే 6వ వంతులో అందరూ భాగస్వాములే. ఒక్కరే ఉంటే అంతా ½ వ వంతు ఆమెకే చెందుతుంది.
‘హాకిమ్ ఇలా ఉల్లేఖించారు, ”ప్రవక్త (స) ఇద్దరు నాన్నమ్మలకు 1/6వ వంతు పంచిపెట్టమని తీర్పు ఇచ్చారు. (ము’హమ్మద్ ‘అలీ హాషియహ్ మువత్తా). అబూ బకర్, ‘ఉమర్, ఇతర అనుచరుల తీర్పుల వల్ల ఈ విషయంపై ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. మొదటి శ్రేణికి చెందిన అమ్మమ్మలు, నాన్నమ్మలు 1/6వ వంతులో భాగ స్వాములు. (షరీఫియ్యహ్)
ఒకవేళ మృతుని తల్లి ఉంటే నాన్నమ్మ, అమ్మమ్మలకు ఏమీ లభించదు. అదేవిధంగా మృతుని తండ్రి ఉన్నా వీరికేమీ లభించదు. ఒకవేళ మృతుని తాత ఉంటే కూడా నాన్నమ్మలకు ఏమీ లభించదు. అయితే తాత ఉండగా తండ్రి యొక్క తల్లికి కూడా లభిస్తుంది. అంతేకాక ఆమె తాతతో పాటు ఆస్తి పొందుతుంది. ఎందుకంటే ఆమె బంధుత్వం తాత తరఫు నుండి కాదు. ఆమె తాతకు భార్య. అందువల్ల ఆమె భాగానికి హక్కుదారు అవుతుంది. ఉదా: తల్లి తండ్రితో పాటు ఆస్తి పొందుతుంది. అప్పుడు నాన్నమ్మలకు ఏమీ లభించదు. అయితే మృతునికి రెండు శ్రేణుల దూరం ఉంటే తాత తండ్రి, అప్పుడు ఇద్దరు స్త్రీలు అతనితో పాటు వారసులౌతారు.
1. తాత తల్లి (ముని నాన్నమ్మ) మరియు 2. తండ్రి తల్లి యొక్క తల్లి. ఒకవేళ దూరం మూడవ శ్రేణికి ఉంటే తండ్రి-తండ్రి-తండ్రి యొక్క తండ్రి. ఇతనితో పాటు ముగ్గురు నాన్నమ్మలు వారసులౌతారు. 1. తండ్రి – తండ్రి యొక్క తల్లి అంటే నాన్నమ్మ యొక్క తల్లి. 2. తండ్రి యొక్క తల్లి యొక్క తల్లి. అంటే నాన్నమ్మ తల్లి. 3. తండ్రి యొక్క తండ్రి యొక్క తండ్రి అంటే ముత్తాత యొక్క తల్లి. అదేవిధంగా జద్ల దూరం పెరుగుతున్నకొలది. జద్దాత్ల అబవయ్యాత్ల సంఖ్య పెరుగుతుంది. వారు జద్తో పాటు వారసులౌతారు. నాన్నమ్మలు, అమ్మమ్మలు బంధుత్వంలో దగ్గరైతే వీరికి ఏమీ లభించదు.
అసబాత్:
‘అసబహ్ రెండు రకాలు 1. నసబీ 2. సబబీ
I. నసబీ అంటే అతనికి మృతునికి సంబంధం ఉంటుంది.
II. సబబీ అంటే బంధుత్వం లేనిది. బానిస మరియు యజమాని.
‘అసబాత్ నసబియ్య మూడు రకాలు: 1. ‘అసబియహ్బి నఫ్సిహ్, 2. ‘అసబియ్య బి‘గైరిహీ, 3. ‘అసబియ్య మఅ ‘గైరిహీ.
1. ‘అసబియ్య బినఫ్సిహీ: పురుషుడు అంటే మృతునితో అతనికున్న సంబంధంలో స్త్రీ మధ్య లేదు. అంటే కొడుకు, మనవడు. ఒకవేళ మధ్య స్త్రీవస్తే ‘అసబ కాదు. సవతి సోదరుడు, సోదరి వీరు జ‘విల్ఫురూ‘ద్లోని వారు. మరియు ‘అస్‌బ బి నఫ్సిహీలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. వారు (1)కొడుకు, మనవడు, (2) మృతుని అసలు తండ్రి, తాత.( 3) మృతుని తండ్రి భాగాలు సోదరుడు, సోదరుని కొడుకు. (4) మృతుని తాత భాగాలు, చిన్నాన్న అతని సంతానం. ఆస్తి పంపకం జరిగినపుడు ఈ నలుగురిలో ముందు మృతునికి దగ్గరి సంబంధం గలవారు. అంటే కొడుకు, మనవడు, ముని మనవడు ముందు ఉంటారు. ఆ తరువాత మృతుని ప్రధాన మూలాలు తండ్రి, తాత, ముత్తాత, ఆ తరువాత మృతుని తండ్రి భాగాలు అంటే సోదరుడు, సోదరుని కుమారుడు ఆ తరువాత మృతుని తాత సంతానం అంటే సొంత చిన్నాన్న, అతని సంతానం మిగిలిన వివరాలు ఫరాయి’ద్లో చూడండి.
2. ‘అస్‌బ బి‘గైరిహీలో: నలుగురు స్త్రీలు ఉన్నారు:
(1) కూతురు, (2) మనవరాలు, (3) సొంత చెల్లెలు, (4) సవతి సోదరి.
ఈ నలుగురు తమ సోదరులతో పాటు ‘అస్‌బ అయి పోతారు. అందువల్లే వీరిని ‘అస్‌బ బి’గైరిహీ అంటారు. వీరి గురించి సాక్ష్యాధారాలు ఈ వాక్యంలో ఉన్నాయి.
i. అల్లాహ్ తమ సంతానం విషయంలో కొడుకులకు ఇద్దరు కుమార్తెలకు సమానంగా ఇవ్వమని ఆదేశిస్తున్నాడు.
ii. ఒకవేళ సోదరుడు, సోదరి స్త్రీ పురుషులు ఉంటే ఒక పురుషునికి ఇద్దరు స్త్రీల భాగాలకు సమానంగా ఇవ్వండి.
మొదటి ఆయతు ద్వారా కూతురు మరియు మనవరాలుకి, రెండవ వాక్యం ద్వారా సొంత చెల్లెలు, సవతి చెల్లెలు ‘అస్‌బ అవడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి.
3. ‘అస్‌బ మ‘అ ‘గైరిహి: మరో స్త్రీతో కలసి ‘అస్‌బ అయ్యే స్త్రీ. అంటే మృతుని కూతురు లేక మనవరాలు. మరియు మృతుని సొంత లేదా సవతి చెల్లెలు కావచ్చును. ఈ సోదరి కూతురు లేదా మనవరాలితో కలసి ‘అస్‌బ అయిపోతుంది. కూతురు, మనవరాలు ఒక్కరున్నా అధికంగా ఉన్నా సరే. ‘హదీసు’లో ఉన్నట్టు. చెల్లెళ్ళు కూతుర్లతో కలసి ‘అస్‌బ అయిపోతారు.
II. ‘అస్‌బ బిసబబిహి: యజమాని బానిసను విడుదల చేసిన యజమాని. బానిస చనిపోతే యజమాని బానిస ఆస్తికి వారసుడు అవుతాడు. దీన్ని గురించి వివరంగా ఫరాయి’ద్ పుస్తకాల్లో ఉంది.
జవిల్ –అర్హామ్:
ఇస్లామీయ పరిభాషలో జూ-రహమ్ అంటే బంధు వులు, చుట్టాలు అని అర్థం. అయితే జూ-రహమ్ అంటే బంధువు అయి కూడా హక్కులు, ‘అస్‌బ లేనివాడు. అంటే ఆస్తిలో వంతులేని బంధువు. ఇటువంటి వ్యక్తిని జూ-రహమ్ అంటారు. దీని బహువచనం జవిల్--అర్’హామ్. అల్లాహ్ ఆదేశం: ”బంధువుల్లో కొందరు మరి కొందరిపై ఔన్నత్యం గలవారని అల్లాహ్ గ్రంథంలో ఉంది.”(అల్ అన్ఫాల్, 8:75)
కాని జూ-రహమ్ ఫర్’ద్, ‘అస్బల వాడై కూడా ఆస్తికి వారసుడు కాలేడు, అయితే భర్త మరియు భార్యలు ఉండగా వారసుడు కాగలడు. ఒకవేళ జవిల్–అర్’హమ్ ఒక్కడే ఉంటే బంధుత్వం వల్ల ఆస్తి అంతటికీ యజమాని కాగలడు.
జ’విల్–అర్’హమ్ వారసత్వం ‘అసబాత్ వంటిది. ఇందులో అందరికంటే దగ్గరి బంధువులకు అవకాశం ఉంటుంది. ఒక్కోసారి శ్రేణుల వల్ల జరుగుతుంది. కొడుకు తండ్రికంటే ముందు ఉన్నట్లు. అదేవిధంగా జ’విల్ అర్’హామ్‌లో మృతుని భాగం మృతుని అసలు కంటే ముందు ఉంటాడు. జ’విల్–అర్’హామ్‌లో అతి దగ్గరున్న వారు అతిదూరంగా ఉన్నవారిని నిరోధిస్తారు. అంటే దూరపు బంధువుని నిరోధిస్తాడు. ‘అసబాత్లో అతి దగ్గరి సంబంధీకుడు అతిదూరంగా ఉన్నవారిని తొలగిస్తాడు. అదేవిధంగా దగ్గరి బంధువు దూరపు బంధువును ఆస్తి దక్కనివ్వడు.
జవిల్–అర్హామ్ 4 రకాలు:
1. మృతుని భాగం అంటే మృతుని కూతురు సంతానం మనవలు, మనవరాళ్ళు.
2. మృతుని మూలాలు అంటే తాత, అమ్మమ్మ.
3. మృతుని తల్లిదండ్రుల భాగాలు అంటే మేనల్లుడు. మేనగోడలు.
4. జద్దైన్, జద్దతైన్ల భాగాలు అంటే తాతలు, లేదా అమ్మమ్మ నాన్నమ్మల సంతానం.
ఇవి నాలుగు రకాలు. కాని ఇవి తమకు దూరంగా ఉండే వారిని తొలగిస్తాయి. మృతుని భాగం ముందు ఉంటుంది. ఆస్తిలో మృతుని భాగం అంటే కొడుకుల సంతానం, మనవళ్ళ సంతానం. వాళ్ళ స్త్రీలయినా పురుషులైనా. ఆ తరువాత మృతుని సంతానం తర్వాత మూలం ముందు ఉంటుంది. అంటే మృతుని జద్ఫాసిద్, జద్దహ్ ఫాసిదహ్, ఆ తరువాత తల్లి దండ్రులు మృతుని భాగాలు ముందు ఉంటాయి. అంటే సొంత చెల్లెళ్ళు లేదా సవతి చెల్లెళ్ళ సంతానం మరియు సొంత సోదరుల సంతానం. వాళ్ళు స్త్రీలయినా పురుషులైనా, ఆ తరువాత కూతుర్ల సంతానం తాత కంటే ముందు ఉంటారు. మేనల్లుడు, మేనగోడళ్ళపై తీర్పు దానిపైనే ఆధారపడి ఉంది. (త’హావీ)
ఆ తరువాత జద్దైన్ జద్దతైన్‌ల సంతానం ముందు ఉంది. వీరు మామ, పిన్ని సవతి చిన్నాన్న మరియు అత్త మరియు చిన్నాన్న కూతురు, అత్త సంతానం. వీరి తర్వాత మృతుని తండ్రి మరియు మామలు, అత్తలు, ఇంకా వారి మామలు, పిన్నిమరియు తండ్రి సవతి చిన్నాన్న మరియు తల్లి చిన్నాన్న వారు సొంతవారైనా, సవతి వారైనా వీరందరి సంతానం దూరం వారైనా సరే. ఆస్తికి అర్హులు ఇంకా ఈ రకాల్లో దగ్గరున్నవారు ముందు ఉంటారు. జవిల్ అర్‌హామ్ అందరూ సమానంగా ఉండి, సంబంధాలు అనేకం ఉంటే తండ్రి బంధువులకు రెండు వంతులు, తల్లి బంధువులకు ఒక వంతు లభిస్తుంది. ఒకవేళ జవిల్ అర్‌హామ్ ఒకే శ్రేణికి చెంది వారిలో స్త్రీలు పురుషులు అందరూ సమానంగా ఉంటే ఈ వివరాలన్నీ ఫరాయిజ్ పుస్తకాల్లోచూడగలరు.
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3041 – [ 1 ] ( متفق عليه ) (2/917)
عَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “أَنَا أَوْلَى بِالْمُؤْمِنِيْنَ مِنْ أَنْفُسِهِمْ فَمَنْ مَّاتَ وَعَلَيْهِ دَيْنٌ وَلَمْ يَتْرُكْ وَفَاءً فَعَلَيَّ قَضَاؤُهُ. وَمَنْ تَرَكَ مَالًا فَلِوَرَثَتِهِ”.
وَفِيْ رِوَايَةٍ: “مَنْ تَرَكَ دَيْنًا أَوْ ضِيَاعًا فَلْيَأْتِنِيْ فَأَنَا مَوْلَاهُ”.
وَفِيْ رِوَايَةٍ: “مَنْ تَرَكَ مَالًا فَلِوَرَثَتِهِ وَمَنْ تَرَكَ كَلًا فَإِلَيْنَا”.
3041. (1) [2/917- ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను ముస్లిముల పట్ల జాగ్రత్త గలవాడిని. మరణించిన వ్యక్తిపై అప్పు ఉంటే, అతను ఏమీ వదల కుండా వెళ్ళి ఉంటే అతని అప్పు తీర్చటం నా బాధ్యత. ధనం వదలి వెళితే అతని వారసులకు చెందుతుంది.
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: అప్పు ఉండి చనిపోయినా, నశించే వస్తువు వదలి వెళ్ళినా అంటే భార్యా భిడ్డలు. అతని వారసులు లేదా అతని వీలునామా గలవారు నా దగ్గరకు రావాలి, నేను అతని సంరక్షకుడను.
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”ధనం వదలివెళితే అది అతని వారసులది. బరువైన వస్తువు అంటే అప్పు వదలి వెళితే అతని సంరక్షకుడు నా దగ్గరకు రావాలి. అతని అప్పు బాధ్యత నాది.[1] (బు’ఖారీ, ముస్లిమ్)
3042 – [ 2 ] ( متفق عليه ) (2/917)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلْحِقُوْا الْفَرَائِضَ بِأَهْلِهَا فَمَا بَقِيَ فَهُوَ لِأُوْلَى رَجُلٍ ذَكَرٍ”.
3042. (2) [2/917– ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఆస్తి హక్కు గలవారికి వారి హక్కును చెల్లించండి, మిగిలిన ధనం మృతునికి అందరికంటే సన్నిహిత పురుషునిది.”[2] (బు’ఖారీ, ముస్లిమ్)
3043 – [ 3 ] ( متفق عليه ) (2/917)
وَعَنْ أُسَامَةَ بْنِ زَيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَرِثُ الْمُسْلِمُ الْكَافِرَ وَلَا الْكَافِرُ الْمُسْلِمَ”.
3043. (3) [2/917– ఏకీభవితం]
ఉసామహ్ బిన్ ‘జైద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముస్లిమ్-అవిశ్వాసికి, అవిశ్వాసి-ముస్లిమ్‌కు వారసులు కాలేరు.” (బు’ఖారీ, ముస్లిమ్)
3044 – [ 4 ] ( صحيح ) (2/917)
وَعَنْ أَنَسٍ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَوْلى الْقَوْمِ مِنْ أَنْفُسِهِمْ”. رَوَاهُ الْبُخَارِيُّ
3044. (4) [2/917– దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వర్గం విడుదల చేసిన బానిస ఆ జాతివాడిగానే పరిగణించ బడతాడు.” [3] (బు’ఖారీ)
3045 – [ 5 ] ( متفق عليه ) (2/918)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ابْنُ أُخْتِ الْقَوْمِ مِنْهُمْ”.
وَذُكِرَحَدِيْثُ عَائِشَةُ: “إِنَّمَا الْوِلَاءُ”فِيْ بَابٍ قَبْلَ”بَابِ السُّلَمِ”.و سنذكرُ حديث البراء الخالة بمنزلة الأمي في باب بُلوغِ الصغيري و حضانته انشا الله.
3045. (5) [2/918 – ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఒక జాతి సోదరి సంతానం ఆ జాతికే చెందుతుంది. [4] (బు’ఖారీ)
—–
الفَصَل الثَّانِيْ రెండవ విభాగం
3046 – [ 6 ] ( لم تتم دراسته ) (2/918)
عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَتَوَارَثُ أَهْلُ مِلَّتَيْنِ شَتَى”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ
3046. (6) [2/918 – అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇద్దరు విభిన్న మతాల వారు పరస్పర వారసులు కాలేరు.” (అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
3047 – [ 7 ] (لم تتم دراسته) (2/918)
وَرَوَاهُ التِّرْمِذِيُّ عَنْ جَابِرٍ.
3047. (7) [2/918 – అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ముస్లిమ్ అవిశ్వాసికి, అవిశ్వాసి ముస్లిమ్‌కు వారసులు కాలేరు. (తిర్మిజి’)
3048 – [ 8 ] ( ضعيف جدا ) (2/918)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْقَاتِلُ لَا يَرِثُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ
3048. (8) [2/918 – అతి బలహీనం]
అబూహురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”హంతకుడు హతుడి ఆస్తికి వారసుడు కాలేడు.” (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
3049 – [ 9 ] ( لم تتم دراسته ) (2/918)
وَعَنْ بُرَيْدَةَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم جَعَلَ لِلْجَدَّةِ السُّدُسَ إِذَا لَمْ تَكُنْ دُوْنَهَا أُمٌّ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3049. (9) [2/918– అపరిశోధితం]
బురైదహ్ (ర) కథనం: ప్రవక్త (స) నాన్నమ్మకు 6వ వంతు నిర్ణయించారు. అయితే ఆమెతో పాటు, మృతుని తల్లి ఉండ కూడదు.[5](అబూ దావూద్)
3050 – [ 10 ] ( لم تتم دراسته ) (2/918)
وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا اسْتَهَلَّ الصَّبِيُّ صُلِّيَ عَلَيْهِ وَوُرِّثَ”. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.
3050. (10) [2/918 –అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బిడ్డ జన్మించి నప్పుడు ఏడుపు కేకలు వేస్తే అటువంటి బిడ్డ జనా’జహ్ నమా’జు చదవబడుతుంది. మరియు అతన్ని వారసుడుగా పరిగణించడం జరుగుతుంది.” [6] (ఇబ్నె మాజహ్, దారమి)
3051 – [ 11 ] ( لم تتم دراسته ) (2/918)
وَعَنْ كَثِيْرِ بْنِ عَبْدِ اللهِ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَوْلَى الْقَوْمِ مِنْهُمْ وَحَلِيْفُ الْقَوْمِ مِنْهُمْ وَابْنُ أُخْتِ الْقَوْمِ مِنْهُمْ”. رَوَاهُ الدَّارَمِيُّ
3051. (11) [2/918 –అపరిశోధితం]
కసీ’ర్ బిన్ ‘అబ్దుల్లాహ్ తన తండ్రి ద్వారా, అతడు తన తండ్రి ద్వారా ఉల్లేఖనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక జాతిలోని స్వతంత్ర బానిస ఆ జాతివాడిగా పరిగణించ బడతాడు. యజమాని తాను విడుదలచేసిన బానిస ఆస్తికి వారసుడౌతాడు. అయితే బానిసకు ఎవరూ నసబీ ‘అ’స్ బహ్ ఉండకూడదు. ఒక జాతితో స్నేహ సంబంధాలు కలిగి ఉన్న వాడు ఆ జాతికే చెందినవాడు అవుతాడు. అదేవిధంగా ఒక జాతి సోదరి సంతానం కూడా ఆ జాతి వారిగానే పరిగణించబడతారు.” [7] (దారమి)
3052 – [ 12 ] ( لم تتم دراسته ) (2/919)
وَعَنِ الْمِقْدَامِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَنَا أَوْلَى بِكُلِّ مُؤْمِنٍ مِنْ نَفْسِهِ فَمَنْ تَرَكَ دَيْنًا أَوْ ضَيْعَةً فَإِلَيْنَا. وَمَنْ تَرَكَ مَالًا فَلِوَرَثَتِهِ. وَأَنَا مَوْلَى مِنْ لَا مَوْلَى لَهُ. أُرِثُ مَاَلَهُ وَأَفُكُّ عَانَهُ وَالْخَالُ وَارِثُ مَنْ لَّا وَارِثَ لَهُ يَرِثُ مَالَهُ وَيَفُكُّ عَانَهُ”.
وَفِيْ رِوَايَةٍ: “وَأَنَا وَارِثُ مَنْ لَّا وَارِثَ لَهُ. أَعْقِلُ عَنْهُ وَأَرِثُهُ وَالْخَالُ وَارِثُ مَنْ لَّا وَارِثَ لَهُ. يَعْقِلُ عَنْهُ وَيَرِثُهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
3052. (12) [2/919 –అపరిశోధితం]
మిఖ్‌దామ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి విశ్వాసికి నేనతని ప్రాణం కంటే ఉత్తమమైన వాడ్ని. ఎవరైనా అప్పులు ఉండి, చిన్న చిన్న పిల్లలను అనాథులుగా చేసి మరణిస్తే నేను అతడి సంరక్షకుడను. అతని అప్పును నేను తీరుస్తాను. అతని పిల్లల్ని నేను పోషిస్తాను. ఒకవేళ అతడు ధనం వదలి వెళితే అది అతని వారసులకు చెందుతుంది. అంటే నేను అతని సంరక్షకుడ్ని. అదేవిధంగా వారసులు లేని వారికి నేను వారసుడను. అతడి ధనాన్ని బైతుల్ మాల్‌లో పెడతాను. అక్కడి నుండి హక్కు గలవారికి ఇవ్వటం జరుగుతుంది. నేను అతని ఖైదీలను బానిసత్వపు బంధనాల నుండి విడిపిస్తాను. మామ తన సోదరి సంతానానికి వారసుడౌతాడు. అయితే అతనికి ఇతర వారసులు ఉండకూడదు. అతని ఖైదీలను విడిపిస్తాడు.”
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది. ”ఎవరూ వారసులు లేని వారికి నేను వారసుడను. అతని రక్తపరిహారాన్ని చెల్లిస్తాను. అతనికి వారసుడనౌతాను. ఎవరూ వారసులు లేని సోదరి సంతానానికి మామ వారసు డౌతాడు. అతడు అతని రక్త పరిహారం చెల్లిస్తాడు. అతనికి వారసుడౌతాడు. (అబూ దావూద్)
3053 – [ 13 ] ( لم تتم دراسته ) (2/919)
وَعَنْ وَائِلَةَ بْنِ الْأَسْقَعِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَحُوْزُ الْمَرْأَةِ ثَلَاثَ مَوَارِيْثَ عَتِيْقَهَا وَلَقِيْطَهَا وَوَلَدَهَا الَّذِيْ لَاعَنْتْ عَنْهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ
3053. (13) [2/919 –అపరిశోధితం]
వాసి’లహ్ బిన్ అస్ఖ’అ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్త్రీ ముగ్గురు వ్యక్తుల ఆస్తిని చేజిక్కించు కుంటుంది. 1.తాను విడుదల చేసిన బానిస లేదా బానిసరాలి ఆస్తిని, అయితే వారి జ’విల్ ఫురూ’ద్ మరియు ‘అస్బహ్ ఎవరూ ఉండకూడదు. 2.పడి ఉన్న అనాథ పసి కందును తెచ్చి పెంచి పోషించిన బాలుడు, ఆ బాలుడు చనిపోతే, ఈ స్త్రీ అతని వారసురాలౌతుంది, 3. లిఆన్ చేసిన సంతానపు ఆస్తికి.” [8] (తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
3054 – [ 14 ] ( لم تتم دراسته ) (2/919)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “أَيُّمَا رَجُلٍ عَاهِرَ بِحُرَّةٍ أَوْ أَمَةٍ فَالْوَلَدُ وَلَدُ زِنَى لَا يَرِثُ وَلَا يُوْرَثُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
3054. (14) [2/919– అపరిశోధితం]
తన తండ్రి తాతల ద్వారా ‘అమ్ర్ బిన్ షు’ఐబ్ కథనం: ప్రవక్త (స) ప్రవచనం: స్వతంత్ర స్త్రీ లేదా బానిసరాలితో వ్యభిచారం ఫలితంగా పుట్టిన బిడ్డ వ్యభిచారబిడ్డగా పరిగణించబడతాడు. అతడు ఇతరులకు వారసుడు కాలేడు. అతనికీ ఎవరూ వారసులు కాలేరు. (తిర్మిజి’)
3055 – [ 15 ] ( لم تتم دراسته ) (2/919)
وَعَنْ عَائِشَةَ: أَنَّ مَوْلَى لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مَاتَ وَتَرَكَ شَيْئًا وَلَمْ يَدَعْ حَمِيْمًا وَلَا وَلَدًا فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أُعْطُوْا مِيْرَاثَهُ رَجُلًا مِّنْ أَهْلِ قَرْيَتِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ
3055. (15) [2/919 –అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) విడుదల చేసిన ఒక బానిస మరణించాడు. అతడు కొంత ధనాన్ని, కొందరు బంధువుల్ని కొంతమంది న’సబీ ‘అ’సబీ గలవారిని, సంతానాన్ని వదలివెళ్ళాడు. అప్పుడు ప్రవక్త (స) ”అతని ధనాన్ని అతని ఊరి వారిలో ఒకరికి ఇచ్చి వేయండి” అని ఆదేశించారు. [9] (అబూ దావూద్, తిర్మిజి’)
3056 – [ 16 ] ( لم تتم دراسته ) (2/920)
وَعَنْ بُرَيْدَةَ قَالَ: مَاتَ رَجُلٌ مِنْ خُزَاعَةَ فَأُتِيَ النَّبِيُّ صلى الله عليه و سلم بِمِيْرَاثِهِ فَقَالَ: “الْتَمِسُوْا لَهُ وَارِثًا أَوْ ذَا رَحِمٍ”. فَلَمْ يَجِدُوْا لَهُ وَارِثًا وَلَا ذَا رَحِمٍ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أُعْطُوْا الْكُبْرَ مِنْ خُزَاعَةَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
وَفِيْ رِوَايَةٍ لَهُ: قَالَ: “انْظُرُوْا أَكْبَرَ رَجُلٍ مِّنْ خُزَاعَةَ”.
3056. (16) [2/920– అపరిశోధితం]
బురైదహ్ (ర) కథనం: ఖు’జా’అహ్ తెగకు చెందిన ఒక వ్యక్తి మరణించాడు. అతని ఆస్తిని ప్రవక్త (స) వద్దకు తీసుకు రావటం జరిగింది. అప్పుడు ప్రవక్త (స) ‘అతని జ’విల్ ఫురూ’ద్ లేదా ‘అసబాత్‌లను వెదకండి’ అని ఆదేశించారు. ప్రజలు వెదికారు. ఎవరూ దొరకలేదు. అప్పుడు ప్రవక్త (స) ఖుజా’అహ్ తెగలో అందరి కంటే గొప్ప వ్యక్తికి పంపివేయమని ఆదేశించారు. [10] (అబూ దావూద్)
3057 – [ 17 ] ( لم تتم دراسته ) (2/920)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: إِنَّكُمْ تَقْرَؤُوْنَ هَذِهِ الْآيَةِ: (مِنْ بَعْدِ وَصَيَّةٍ تُوْصُوْنَ بِهَا أَوْ دَيْنٍ، 4: 12) وَإِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَضَى بِالدَّيْنِ قَبْلَ الْوَصِيَّةِ. وَأَنَّ أَعْيَانَ بَنِي الْأُمِّ يَتَوَارَثُوْنَ دُوْنَ بَنِي الْعَلَّاتِ الرَّجُلُ يَرِثُ أَخَاهُ لِأَبِيْهِ وَأُمِّهِ دُوْنَ أَخِيْهِ لِأَبِيْهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.
وَفِيْ رِوَايَةِ الدَّارَمِيُّ: قَالَ: “الْإخْوَةُ مِنَ الْأُمِّ يَتَوَارَثُوْنَ دُوْنَ بَنِي الْعَلَّاتِ” .إِلَى آخِرِهِ.
3057. (17) [2/920– అపరిశోధితం]
‘అలీ (ర) ఇలా అన్నారు: ”ప్రజలారా! ఈ ఆయతును పఠించారా! … ” అంటే వీలునామా, అప్పులు చెల్లించిన తర్వాత వారసులకు ఆస్తి లభిస్తుంది.
ఈ ఆయతులో అన్నిటి కంటే ముందు వీలునామా ఉంది. ఆ తరువాత అప్పు. అయితే ప్రవక్త (స) అప్పును వీలునామా కంటే ముందు చెల్లించమని ఆదేశించారు. ఈ ఆయతులో అప్పు తరువాత ఉంది. కాని చెల్లించడంలో మాత్రం ముందు ఉంది. అంతే కాదు ప్రవక్త (స) ఇలా కూడా ఆదేశించారు. సొంత సోదరులు వారసులౌతారు. సవతి సోదరులు వారసులు కారు. అంటే సొంత సోదరులు ఉండగా సవతి సోదరులు వారసులు కాలేరు. ఒక వ్యక్తి తన సొంత సోదరునికి వారసుడౌతాడు. సవతి సోదరునికి వారసుడు కాడు. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దారమి)
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”తల్లిదండ్రుల సోదరులు అంటే సొంత సోదరులు పరస్పరం వారసులు అవుతారు. సవతి సోదరులు కారు.”
3058 – [ 18 ] ( لم تتم دراسته ) (2/920)
وَعَنْ جَابِرٍ قَالَ: جَاءَتِ امْرَأَةُ سَعْدِ بْنِ الرَّبِيْعِ بِابْنَتَيْهَا مِنْ سَعْدِ بْنِ الرَّبِيْعِ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَتْ: يَا رَسُوْلَ اللهِ هَاتَانِ ابْنَتَا سَعْدِ بْنِ الرَّبِيْعِ. قُتِلَ أَبُوْهُمَا مَعَكَ يَوْمَ أُحَدٍ شَهِيْدًا وَإِنَّ عَمَّهُمَا أَخَذَ مَالَهُمَا وَلَمْ يَدَعْ لَهُمَا مَالًا وَلَا تُنْكَحَانِ إِلَّا وَلَهُمَا مَالَ. قَالَ: “يَقْضِي اللهُ فِيْ ذَلِكَ”. فَنَزَلَتْ آيَةُ الْمِيْرَاثِ. فَبَعَثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلَى عَمِّهِمَا فَقَالَ: “أَعْطِ لِاِبْنَتَيْ سَعْدٍ الثُّلُثَيْنِ وَأعْطِ أُمَّهُمَا الثُّمُنَ وَمَا بَقِيَ فَهُوَ لَكَ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.
3058. (18) [2/920 –అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: స’అద్ బిన్ రబీ’అ భార్య స’అద్ బిన్ రబీ’అ ద్వారా పుట్టిన తన ఇద్దరు కుమార్తెలను తీసుకొని ప్రవక్త (స) వద్దకు వచ్చి, ”ఓ అల్లాహ్ ప్రవక్తా! వీరు స’అద్ బిన్ రబీ’అ కుమార్తెలు. వీరి తండ్రి ఉ’హుద్ యుద్ధంలో మీతో పాటు వెళ్ళి వీరమరణం పొందారు. వీరి పినతండ్రి వీరి ఆస్తిని లాక్కున్నాడు. వీరికి ఏమీ ఉంచలేదు. ధనం లేకుండా వీరి పెళ్ళికాదు అని విన్నవించుకుంది.” దానికి ప్రవక్త (స), ”ఇప్పుడు నువ్వు వెళ్ళు, అల్లాహ్ (త) దీన్ని గురించి తీర్పు ఇస్తాడు,” అని అన్నారు. ఆ తరువాత ఆస్తి ఆయతు అవతరించింది. అప్పుడు ప్రవక్త (స) వారి చిన్నాన్న దగ్గరకు పంపి, ”స’అద్ బిన్ రబీ’అ కుమార్తెలకు 2/3వ వంతు, వారి తల్లికి 1/8వ వంతు ఇవ్వమని, మిగిలింది నీదని,” ఆదేశం పంపారు. [11] (అబూ దావూద్, ఇబ్నె మాజహ్, అ’హ్మద్, తిర్మిజి’ / ప్రామాణికం -ఏకోల్లేఖనం)
3059 – [ 19 ] ( صحيح ) (2/921)
وَعَنْ هُزَيْلِ بْنِ شُرَحْبِيْلَ قَالَ: سُئِلَ أَبُوْ مُوْسَى عَنِ ابْنَةٍ وَبِنْتِ ابْنٍ وَأُخْتٍ فَقَالَ: لِلْبِنْتِ النِّصْفُ وَلِلْأُخْتِ النِّصْفُ وَائْتِ ابْنَ مَسْعُوْدٍ فَسَيُتَابِعُنِيْ فَسُئِلَ ابْنُ مَسْعُوْدٍ وَأَخْبِرَ بِقَوْلِ أَبِيْ مُوْسَى فَقَالَ: لَقَدْ ضَلَلْتُ إذَنْ وَمَا أَنَا مِنَ الْمُهْتَدِيْنَ أَقْضِيْ فِيْهَا بِمَا قَضَى النَّبِيُّ صلى الله عليه وسلم: “لِلْبِنْتِ النِّصْفِ وَلِاِبْنَةِ الْاِبْنِ السُّدُسُ تَكْمِلَةَ الثُّلُثَيْنِ وَمَا بَقِيَ فَلِلْأُخْتِ” فَأَتَيْنَا أَبَا مُوْسَى فَأَخْبَرْنَاهُ بِقَوْلِ ابْنِ مَسْعُوْدٍ فَقَالَ: لَا تَسْأَلُوْنِيْ مَادَامَ هَذَا الْحِبْرُ فِيْكُمْ . رَوَاهُ الْبُخَارِيُّ
3059. (19) [2/921–దృఢం]
‘హు’జైల్ బిన్ షుర’హ్ బీల్ (ర) కథనం: అబూ మూసాను, ”ఒక వ్యక్తి చనిపోయాడు. అతనికి ఒక కూతురు, ఒక కుమారుని -కూతురు, ఒక చెల్లెలు ఉన్నారు. ఈ ముగ్గురికీ ఎంతెంత ఆస్తి వస్తుంది,” అని ప్రశ్నించడం జరిగింది. దానికి అబూ మూసా, ‘కుమార్తెకు ½ వంతు, చెల్లెలుకు ½ వంతు లభిస్తుంది. (మనుమరాలికి ఏమీ దక్కదు), మీరు ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ వద్దకు వెళ్ళండి, వారు నా వాదాన్ని సమర్థిస్తారు,’ అని సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తి వెళ్ళి దీన్ని గురించి ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్‌ను ప్రశ్నించాడు. అబూ మూసా ఇచ్చిన సమాధానం కూడా తెలియపర్చటం జరిగింది. అంతా విని ‘అబ్దు ల్లాహ్ బిన్ మస్’ఊద్, ”అబూ మూసా చెప్పినట్టే నేనూ చెబితే నేను మార్గభ్రష్టత్వానికి గురవుతాను. ప్రవక్త (స) తీర్పు ఇచ్చినట్టే నేనూ తీర్పు ఇస్తాను. ప్రవక్త (స) కుమార్తెకు 1/2వ వంతు, కుమారుని -కూతురుకు 1/6వ వంతు మిగిలింది సోదరికి ఇచ్చారు,’ అని అన్నారు. మేము మళ్ళీ అబూ మూసా వద్దకు వచ్చాము. ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ సమాధానం వినిపించాము. అప్పుడు అబూ మూసా అష్’అరీ ”నేను బ్రతికున్నంత కాలం నన్ను ఏ విషయాన్ని గురించీ ప్రశ్నించ కండి,’ అని అన్నారు.” (బు’ఖారీ)
3060 – [ 20 ] ( ضعيف ) (2/921)
وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: إِنَّ ابْنِيْ مَاتَ فَمَا لِيْ مِنْ مِّيْرَاثِهِ؟ قَالَ: “لَكَ السُّدُسُ”. فَلَمّض وَلَى دَعَاهُ قَالَ: “لَكَ سُدُسٌ آخَرُ”. فَلَمَّا وَلّى دَعَاهُ. قَالَ: “إِنَّ السُّدُسَ الْآخِرَ طُعْمَةٌ لك”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ
3060. (20) [2/921– బలహీనం]
‘ఇమ్‌రాన్ బిన్ ‘హు’సైన్ (ర) కథనం: ఒక వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! నా కుమారుని-కొడుకు మరణించాడు. అతని ఆస్తిలో నుండి నాకు ఎంత లభిస్తుంది అని ప్రశ్నించాడు.’ దానికి ప్రవక్త (స), ‘అతని ఆస్తిలో నుండి నీకు 1/6వంతు లభిస్తుంది’ అని అన్నారు. అతను తిరిగి వెళుతున్నప్పుడు ప్రవక్త (స) అతన్ని పిలిపించి, ‘నీకు మరో 1/6వ వంతు లభిస్తుంది,’ అని అన్నారు. అతను మళ్ళీ తిరిగి వెళుతున్నప్పుడు పిలిచి, ‘ఈ రెండవ 1/6వ వంతు నీకు అనుగ్రహంగా లభిస్తుంది,’ అని అన్నారు.[12] (అ’హ్మద్, అబూ దావూద్, తిర్మిజి’ / ప్రామాణికం – దృఢం)
3061 – [ 21 ] ( لم تتم دراسته ) (2/921)
وَعَنْ قَبِيْصَةَ بْنِ ذُؤَيْبٍ قَالَ: جَاءَتِ الْجَدَّةُ إِلَى أَبِيْ بَكْرٍ رَضِيَ اللهُ عَنْهُ تَسْأَلُهُ مِيْرَاثَهَا. فَقَالَ لَهَا: مَا لَكَ فِيْ كِتَابِ اللهِ شَيْءٍ وَمَا لَكِ فِيْ سُنَّةِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم شَيْءٌ. فَارْجِعِيْ حَتَّى أَسْأَلَ النَّاسَ فَسْأَلْ. فَقَالَ الْمُغِيْرَةُ بْنُ شُعْبَةَ: حَضَرْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَعْطَاهَا السُّدُسُ. فَقَالَ أَبُوْ بَكْرٍ رَضِيَ اللهُ عَنْهُ هَلْ مَعَكَ غَيْرُكَ؟ فَقَالَ مُحَمَّدُ بْنُ مَسْلَمَةَ مِثْلَ مَا قَالَ الْمُغِيْرَةُ. فَأنْفَذَهُ لَهَا أَبُوْ بَكْرٍ رَضِيَ اللهُ عَنْهُ. ثُمَّ جَاءَتِ الْجَدَّةُ الْأُخْرَى إِلَى عُمَرَرَضِيَ اللهُ عَنْهُ تَسْأَلُهُ مِيْرَاثَهَا. فَقَالَ: هُوَذَلِكَ السُّدُسُ فَإِنِ اجْتَمَعَا فَهُوَ بَيْنَكُمَا. وَأَيْتُكُمَا خَلَتْ بِهِ فَهُوَ لَهَا. رَوَاهُ مَالِكٌ وَأَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ وَابْنُ مَاجَهُ.
3061. (21) [2/921–అపరిశోధితం]
ఖబీ’సహ్ బిన్ జు’వైబ్ (ర) కథనం: నాన్నమ్మ లేదా అమ్మమ్మ తన వంతును గురించి అబూ బకర్ (ర)ను, ‘మనవడు చనిపోయాడు, అతని ఆస్తిలో నుండి నాకు ఎంత లభిస్తుంది,’ అని ప్రశ్నించింది. అప్పుడు అబూ బకర్ (ర) ఖుర్‌ఆన్‌లో, ‘హదీసు’లో నీ గురించి ఏమీ లేదు, ప్రస్తుతం ఇప్పుడు నీవు వెళ్ళిపో, నేను ఇతర సహచరులతో సంప్రదించి సమాధానం ఇస్తాను,’ అని అన్నారు. ఆ తరువాత అబూ బకర్ ప్రజలను సంప్రదించారు. దానికి ము’గీరహ్ బిన్ షో’బహ్ ప్రవక్త (స) నాన్నమ్మ లేదా అమ్మమ్మకు 6వ వంతు ఇచ్చారని, ప్రవక్త (స) ఈ తీర్పు ఇచ్చినపుడు నేను అక్కడే ఉన్నానని సమాధానం ఇచ్చారు. దానికి అబూ బకర్ (ర) దీనికి వేరే వ్యక్తి ఎవరైనా సాక్ష్యం ఉన్నారా? అని అడిగారు. వెంటనే అక్కడున్న ము’హమ్మద్ బిన్ ముస్లిమహ్ ము’గీర బిన్ షో’బహ్ను సమర్థిస్తూ, ‘ప్రవక్త (స) నాన్నమ్మకు 6వ వంతు ఇచ్చినపుడు నేను అక్కడే ఉన్నాను,’ అని అన్నారు. అబూ బకర్ (ర) నాన్నమ్మకు 6వ వంతు కేటాయించారు. ఆ తరువాత ‘ఉమర్ (ర) కాలంలో మరో నాన్నమ్మ ‘ఉమర్ (ర) వద్దకు వచ్చి తన హక్కును గురించి ప్రశ్నించింది. ‘ఉమర్ (ర), ‘మీకు 6వ వంతు,’ అని తీర్పు ఇచ్చారు. మీరు ఇద్దరు నాన్నమ్మ, అమ్మమ్మ ఉన్న ఒక్కరు ఉన్నా 6వ వంతు మాత్రమే లభిస్తుందని తీర్పు ఇచ్చారు. (మాలిక్, అ’హ్మద్, తిర్మిజి’, అబూ దావూద్, దారమి, ఇబ్నె మాజహ్)
3062 – [ 22 ] ( لم تتم دراسته ) (2/922)
وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ فِي الْجَدَّةِ مَعَ ابْنِهَا: إِنَّهَا أَوَّلُ جَدَّةٍ أَطْعَمَهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم سُدُسًا مَعَ ابْنِهَا وَابْنُهَا حَيٌّ. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ . وَالتِّرْمِذِيُّ ضَعَّفَهُ .
3062. (22) [2/922– అపరిశోధితం]
ఇబ్నె మస్’ఊద్ (ర) కథనం: నాన్నమ్మ, తండ్రి బ్రతికి ఉన్నారు. అంటే ఒక వ్యక్తి చనిపోయాడు. అతని నాన్నమ్మ, తండ్రి ఉన్నారు. దానికి ప్రవక్త (స) ముందు నాన్నమ్మకు ఆమె కొడుకుతో పాటు ఉంటే ఆమెకు 6వ వంతు కేటాయించారు.[13] (తిర్మిజి’ / బలహీనం, దార్మీ)
3063 – [ 23 ] ( لم تتم دراسته ) (2/922)
وَعَنِ الضِّحَاكِ بْنِ سُفْيَانَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَتَبَ إِلَيْهِ: “أَنْ وَّرْثِ امْرَأَةَ أَشِيْمِ الضِّبَابِيُّ مِنْ دِيَةِ زَوْجِهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ
3063. (23) [2/922 –అపరిశోధితం]
‘ది’హాక్ బిన్ ‘సుఫియాన్ (ర) కథనం: ప్రవక్త (స) అతనికి ఒక ఉత్తరం వ్రాసారు. అందులో ‘అష్‌యమ్ ‘దిబాబీ భార్యకు ఆమె భర్త రక్తపరిహారం నుండి ఆస్తి ఇప్పించు’ అని పేర్కొన్నారు. [14] (అబూ దావూద్, తిర్మిజి’ / ప్రామాణికం- దృఢం)
3064 – [ 24 ] ( لم تتم دراسته ) (2/922)
وَعَنْ تَمِيْمٍ الدَّارِيِّ قَالَ: سَأَلْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم: مَا السُّنَّةُ فِي الرَّجُلِ مِنْ أَهْلِ الشِّرْكِ يُسْلَمُ عَلَى يَدَيْ رَجُلٍ مِّنَ الْمُسْلِمِيْنَ؟ فَقَالَ: “هُوَ أَوْلَى النَّاس بِمَحْيَاهُ وَمَمَاتِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.
3064. (24) [2/922 –అపరిశోధితం]
తమీమ్ దారీ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ఒక ముస్లిమ్ ద్వారా ఇస్లామ్ స్వీకరించిన అవిశ్వాసి గురించి ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స) ‘ఎవరి ద్వారా ఇస్లామ్ స్వీకరించారో, అతనే జీవన్మరణాల్లో అందరికంటే దగ్గరివాడు’ అని ప్రవచించారు. [15] (తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దారమి)
3065 – [ 25 ] ( لم تتم دراسته ) (2/922)
وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ رَجُلًا مَاتَ وَلَمْ يَدَعْ وَارِثًا إِلَّا غُلَامًا. كَانَ أَعْتَقَهُ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “هَلْ لَّهُ أَحَدٌ؟” قَالُوْا: لَا إِلَّا غُلَامٌ لَّهُ كَانَ أَعْتَقَهُ. فَجَعَلَ النَّبِيُّ صلى الله عليه وسلم مِيْرَاثَهُ لَهُ. روَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.
3065. (25) [2/922– అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ‘ఒక వ్యక్తి మరణించాడు. అతనికి కేవలం అతడు విడుదల చేసిన బానిస మాత్రమే ఉన్నాడు,’ అని ప్రవక్త (స)ను విన్నవించుకోవడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘అతనికి ఎవరైనా వారసులు ఉన్నారా,’ అని ప్రశ్నించారు. దానికి ప్రజలు ఎవరూ వారసులు లేరు, ఒక్క బానిస మాత్రమే ఉన్నాడు, ఆ బానిసను అతడు విడుదల చేసి ఉన్నాడు,’ అని అన్నారు. ప్రవక్త (స) అతని ఆస్తిని అతడు విడుదల చేసిన బానిసకు ఇచ్చివేసారు. [16] (అబూ దావూద్, తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
3066 – [ 26 ] ( لم تتم دراسته ) (2/922)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “يَرِثُ الْوَلَاءَ مَنْ يَرِثُ الْمَالَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ إِسْنَادُهُ لَيْسَ بِالْقَوِيِّ.
3066. (26) [2/922– అపరిశోధితం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి, తాతల ద్వారా ఉల్లేఖనం: ప్రవక్త (స) ప్రవచనం: వలాను పొందే వారసుడే ఆస్తినీ పొందుతాడు.[17](తిర్మిజి’/ ఆధారాలు బలహీనం)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3067 – [ 27 ] ( ضعيف ) (2/922)
عَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَا كَانَ مِنْ مِيْرَاثٍ قُسِمَ فِي الْجَاهِلِيَّةِ فَهُوَ عَلَى قِسْمَةِ الْجَاهِلِيَّةِ وَمَا كَانَ مِنْ مِّيْرَاثٍ أَدركَهُ الْإِسْلَامُ فَهُوَ عَلَى قِسْمَةِ الْإِسْلَامِ “. رَوَاهُ ابْنُ مَاجَهُ
3067. (27) [2/922 –బలహీనం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అజ్ఞానకాలంలో పంచబడిన ఆస్తి అజ్ఞాన కాలంలోనే అంతం అయ్యింది. ఇందులో ఎటువంటి మార్పు కాదు. ఇస్లామ్ కాలంలో వచ్చే ఆస్తి ఇస్లామ్ ప్రకారం పంచడం జరుగుతుంది. ” (ఇబ్నె మాజహ్)
3068 – [ 28 ] ( لم تتم دراسته ) (2/923)
وَعَنْ مُحَمَدِّ بْنِ أَبِيْ بَكْرٍ بْنِ حَزْمٍ أَنَّهُ سَمِعَ أَبَاهُ كَثِيْرًا يَقُوْلُ: كَانَ عُمَرُ بْنُ الْخَطَّابِ يَقُوْلُ:عَجَبا لِّلْعُمِّةِ تُوْرِثُ وَلَا تَرِثُ.رَوَاهُ مَالِكٌ
3068. (28) [2/923 – అపరిశోధితం]
ము’హమ్మద్ బిన్ అబూబకర్ బిన్ ‘హ’జ్‌మ్ తరచూ తన తండ్రి నుండి ఇలా వినేవారు, ‘ఉమర్ (ర) ఇలా అనేవారు, ”మేనత్త విషయం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆమె మేనల్లుడు ఆమెకు వారసుడు అవుతాడు. కాని ఆమె తన మేనల్లుడికి వారసురాలు కాదు.” [18] (మాలిక్)
3069 – [ 29 ] ( لم تتم دراسته ) (2/923)
وَعَنْ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: تَعَلَّمُوا الْفَرَائِضَ وَزَادَ ابْنُ مَسْعُوْدٍ: وَالطَّلَاقَ وَالْحَجَّ قَالَا: فَإِنَّهُ مِنْ دِيْنِكُمْ. روَاهُ الدَّارَمِيُّ
3069. (29) [2/923 – అపరిశోధితం]
‘ఉమర్ (ర) ఇలా అన్నారు: ”ప్రజలారా! మీరు ఆస్తి పంపక జ్ఞానాన్ని నేర్చుకోండి, ఇబ్నె మస్’ఊద్ (ర) కొంచెం అధికం చేస్తూ మీరు ‘తలాఖ్ మరియు ‘హజ్జ్ విషయాలను కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఇవి మీ ధర్మంలోని అత్యవసర విషయాలు’,’ అని అన్నారు . (దారమి)
=====
1- بَابُ الْوَصَايَا
1. వీలునామాలు
వీలునామా అంటే ఆజ్ఞ అని అర్థం. ఇస్లామీయ పరిభాషలో మరణానంతరం ఒకరికి యాజమాన్యం అప్పచెప్పటం. మరణానంతరం అది ఆచరణలోకి వస్తుంది. వీలునామా వ్రాసేవారిని మూ’సీ అంటారు. వీలునామాను వ’సీయ్యతు అంటారు. ఇవ్వబడిన వ్యక్తిని మూ’సాలహు అంటారు. ఇవ్వబడుతున్న వస్తువును మూ’సాబిహి అంటారు. ఖుర్‌ఆన్, ‘హదీసు’ల్లో వ’సియ్యత్‌కి చాలా ప్రాధాన్యత ఉంది. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఆదేశం: ”మీలో ఎవరైనా మరణించి నపుడు అతని వద్ద ధనసంపదలు ఉంటే మీపై వీలునామాను విధిగా నిర్ణయించడం జరిగింది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
3070 – [ 1 ] ( متفق عليه ) (2/924)
عَنِ ابْنِ عُمَرَ رضي الله عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا حَقُّ امْرِئٍ مُّسْلِمٍ لَّهُ شَيْءٍ يُّوْصَي فِيْهِ يَبِيْتُ لَيْلَتَيْنِ إِلَّا وَوَصِيَّةُ مَتْكُوْبَةٌ عِنْدَهُ. متفق عليه .
3070. (1) [2/924 – ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వీలునామాకు సరిపడ్డ ధనం ఉన్నప్పుడు వీలునామా వ్రాసిపెట్టకుండా రెండు రాత్రులు గడపటం ముస్లిమ్‌కు తగని పని.” [19]
3071 – [ 2 ] ( متفق عليه ) (2/924)
وَعَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ قَالَ: مَرِضْتُ عَامَ الْفَتْحِ مَرَضًا أَشْفَيْتُ عَلَى الْمَوْتِ فَأَتَانِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَعُوْدُنِيْ فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ: إِنَّ لِيْ مَالًا كَثِيْرًا وَلَيْسَ يَرِثُنِيْ إِلَّا ابْنَتَيْ أَفَأُوْصِيَ بِمَالِيْ كُلَّهِ؟ قَالَ: “لَا” .قُلْتُ: فَثُلُثَيْ مَالِيْ؟ قَالَ: “لَا”. قُلْتُ: فَالشَّطْرُ؟ قَالَ: “لَا” .قُلْتُ: فَالثُّلُثُ؟ قَالَ: “الثُلُثُ وَالثُّلُثُ كَثِيْرٌإِنَّكَ أَنْ تَذَرَوَرِثَتَكَ أَغْنِيَاءَ خَيْرٌ مِّنْ أَنْ تَذِرَهُمْ عَالَةً يتكففون النَّاسَ وَإِنَّكَ لَنْ تُنْفِقَ نَفْقَةً تَبْتَغِيْ بِهَا وَ جْهَ اللهِ إِلَّا أُجِرْتَ بِهَا حَتَّى اللُّقْمَةَ تَرْفَعُهَا إِلَى فِيْ اِمْرَأَتِكَ”.
3071. (2) [2/924 – ఏకీభవితం]
స’అద్ బిన్ అబీ వఖ్ఖా’స్ (ర) కథనం: ఫత్’హ మక్కహ్ సంవత్సరం నేను తీవ్రంగా వ్యాధికి గురయ్యాను. చనిపోతా ననుకున్నాను. ప్రవక్త (స) నన్ను పరామర్శించటానికి వచ్చారు. అప్పుడు నేను, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! నా వద్ద చాలా ధనం ఉంది. నాకు ఒక్క కుమార్తె మాత్రమే ఉంది. మరెవరూ వారసులు లేరు. నేను నా మొత్తం ధనం గురించి వీలునామా చేయించాలా?’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స) ‘వద్దు’ అని అన్నారు. ఆ తరువాత మళ్ళీ నేను, ‘2/3వ వంతు వీలునామా వ్రాయించాలా,’ అని ప్రశ్నించాను. దానికి అతను(స) ‘వద్దు’ అన్నారు. ఆ తరువాత మళ్ళీ నేను ‘సగం ధనానికి వీలునామా చేయించాలా’ అని ప్రశ్నించాను. దానికి అతను(స) ‘వద్దు’ అని అన్నారు. మళ్లీ నేను 1/3వ వంతు ధనానికి వీలునామా చేయించాలా అని అన్నాను. దానికి ప్రవక్త (స) ‘1/3వ వంతు ధనానికి వీలునామా చేయగలవు. ఇది కూడా ఎక్కువే, ఒకవేళ నువ్వు నీ వారసులకు ధనవంతులుగా, మంచి స్థితిలో వదలి వెళితే ఇది వారు అగత్యపరులుగా ఇతరుల ముందు చేయి చాచే వారుగా ఉండటం కంటే మంచిది. దైవప్రీతి కోసం నీవు అల్లాహ్ మార్గంలో ఏది ఖర్చు చేసినా నీకు దాని పుణ్యం లభిస్తుంది. చివరికి నీవు నీ భార్య నోటిలో వేసిన అన్నం ముద్దకు కూడా నీకు పుణ్యం లభిస్తుంది’ అని ప్రవచించారు.’ [20] (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
3072 – [ 3 ] ( لم تتم دراسته ) (2/925)
عَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ قَالَ: عَادَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَأَنَا مَرِيْضٌ فَقَالَ: “أُوْصِيْتَ؟” قُلْتُ: نَعَمْ قَالَ: “بِكَمْ؟” قُلْتُ: بِمَالِيْ كُلِّهِ فِيْ سَبِيْلِ اللهِ. قَالَ: “فَمَا تَرَكْتَ لِوَلَدِكَ؟” قُلْتُ: هُمْ أَغْنِيَاءُ بِخَيْرٍ. فَقَالَ: “أُوْصِ بِالْعَشْرِ”. فَمَا زَالَتْ أُنَاقِصُهُ حَتَّى قَالَ: “أُوْصِ بِالثُّلُثِ وَالثُّلُثُ كَثِيْرٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
3072. (3) [2/925 – అపరిశోధితం]
స’అద్ బిన్ అబీ వఖ్ఖా’స్ (ర) కథనం: నేను అనా రోగ్యంగా ఉన్నప్పుడు ప్రవక్త (స) నన్ను పరామర్శించ డానికి వచ్చారు. ప్రవక్త (స) నన్ను, ‘ఏం నీకు ఏమైనా వీలునామా వ్రాసే ఉద్దేశ్యం ఉందా,’ అని అన్నారు. దానికి నేను ‘అవును,’ అని అన్నాను. ప్రవక్త (స) ‘ఎంత’ అని అన్నారు. దానికి నేను, ‘నా మొత్తం ధనాన్ని దైవమార్గంలో ఇచ్చివేద్దామని ఆలో చిస్తున్నాను.’ దానికి ప్రవక్త (స), ‘నీ సంతానానికి ఏం వదలావు,’ అని అన్నారు. దానికి నేను ‘వారు మంచి స్థితిలో ఉన్నారు, వారు ధనవంతులు’ అని అన్నాను. ప్రవక్త (స) ’10వ వంతు వీలునామా చేయి’ అని అన్నారు. నేను పెంచుతూ పోయాను. చివరికి ప్రవక్త (స) నీవు, ‘1/3వ వంతు వీలునామా చేయగలవు, కాని 1/3వ వంతు కూడా ఎక్కువే,’ అని అన్నారు. (తిర్మిజి’)
3073 – [ 4] ( صحيح ) (2/925)
وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ فِيْ خُطْبَتِهِ عَامَ حَجَّةِ الْوَدَاعِ: “إِنَّ اللهَ قَدْ أُعْطِىَ كُلَّ ذِيْ حَقٍّ حَقَّهُ فَلَا وَصِيَّةَ لِوَارِثٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ
وَزَادَ التِّرْمِذِيُّ: “الْوَلَدُ لِلْفَرَاشِ وَلِلْعَاهِرِ الْحَجَرُ وَحِسَابهمْ عَلَى اللهِ”.
3073. (4) [2/925–దృఢం]
అబూ ఉమామహ్ (ర) కథనం: ‘హజ్జతుల్ విదా’ ప్రసంగంలో ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”అల్లాహ్ (త) ప్రతి ఒక్క హక్కు గలవారికి వారి హక్కును నిర్ణయించాడు. కనుక వారసుల హక్కుల పట్ల వీలునామా తగదు.” (అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
తిర్‌మిజి’లో ఇది అధికంగా ఉంది, ”బిడ్డ భర్తకు చెందుతాడు. ఒకవేళ బిడ్డ వ్యభిచారం వల్ల జన్మిస్తే, వ్యభిచారికి రాళ్ళ వర్షం ఉంది. లేదా అతనికి ఆస్తి లభించదు. వారి విచారణ అల్లాహ్‌పై ఉంది.
3074 – [ 5 ] ( لم تتم دراسته ) (2/925)
وَيُرْوى عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا وَصِيَّةَ لِوَارِثٍ إِلَّا أَنْ يَّشَاءَ الْوَرَثَةُ” مُنْقَطِعٌ هَذَا لَفْظُ الْمَصَابِيْحُ .
وَفِيْ رِوَايَةِ الدَّارَقُطْنِيُّ: قَالَ: “لَا تَجُوْزَ وَصِيَّةٌ لِّوَارِثٍ إِلَّا أَنْ يَّشَاءَ الْوَرَثَةَ”.
3074. (5) [2/925– అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, వారసుల కోసం వీలునామా చెల్లదు, వారసులు కోరితే తప్ప. (‘హదీస్’ మున్‌ఖతహ్)
దారుఖుతునీలో ఇలా ఉంది, ”వారసులకోసం వీలు నామా చేయడం ధర్మంకాదు. అయితే వారసులు కోరితే తప్ప. అంటే ఒకవేళ వారసులందరూ సంతో షంగా తమ హక్కులను ఒక్కరికే కట్టబెట్టాలని కోరితే ఇది వారి ఇష్టా ఇష్టాలపై ఆధారపడి ఉంది. అయితే వారసుల హక్కు నిర్ణయించబడి ఉంది. వీలునామా చేసి ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ ఇవ్వటం సరికాదు.
3075 – [ 6 ] ( لم تتم دراسته ) (2/925)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ الرَّجُلَ لِيَعْمَلُ وَالْمَرْأَةُ بِطَاعَةِ اللهِ سِتِّيْنَ سَنَةً ثُمَّ يَحْضُرُهُمَا الْمَوْتُ فَيُضَارَّانِ فِي الْوَصِيَّةِ. فَتَجِبُ لَهُمَا النَّارُ” ثُمَّ قَرَأَ أَبُوْ هُرَيْرَةَ (مِنْ بَعْدِ وَصِيَّةٍ يُّوْصى بِهَا أَوْ دَيْنٍ غَيْرَ مُضَارٍّ) إِلَى قَوْلِهِ (وَذَلِكَ الْفَوْزُ الْعَظِيْمِ؛ 4: 11) رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
3075. (6) [2/925 – అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మనిషి సత్కార్యాలు చేస్తూ ఉంటాడు. స్త్రీ కూడా దైవ విధేయతలో జీవిస్తూ ఉంటుంది. వీరిద్దరూ ఇలా చేస్తూ 60 సంవత్సరాల వయస్సుకు చేరి చనిపోయే టప్పుడు వీలునామా చేసి తమ వారసులకు హాని తలపెడితే, వీరిద్దరి గురించి నరకం తప్పనిసరి అయిపోతుంది. ఆ తరువాత అబూ హురైరహ్ (ర) ఈ ఆయతును పఠించారు, ”మిమ్‌బాది వసియ్యతిన్ యూసా బిహా అవ్ దైనిన్ గైరుము’దార్రిన్..” [21] (అన్ నిసా, 4:11) (అ’హ్మద్, తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
3076 – [ 7 ] ( لم تتم دراسته ) (2/926)
عَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ مَّاتَ عَلَى وَصِيَّةٍ مَاتَ عَلَى سَبِيْلٍ وَّسُنَّةٍ وَمَاتَ عَلَى تَقْىٍّ وَّشَهَادَةٍ وَّمَاتَ مَغْفُوْرًا لَّهُ”. رَوَاهُ ابْنُ مَاجَهُ .
3076. (7) [2/926– అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వీలునామా చేసి మరణించినవాడు ప్రవక్త సాంప్రదాయం, దైవభీతి, పవిత్ర వచనాలపై క్షమించబడి మరణించాడు.” (ఇబ్నె మాజహ్)
3077 – [ 8 ] ( حسن ) (2/926)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ الْعَاصَ بْنَ وَائِلٍ أُوْصَى أَنْ يُّعْتَقَ عَنْهُ مِائَةُ رَقَبَةٍ فَأعْتَقَ ابْنُةُ هَشَّام خَمْسِيْنَ رَقَبَةً فَأَرَادَ ابْنُهُ عَمْرٌو أَنْ يُّعْتِقَ عَنْهُ الْخَمْسِيْنَ الْبَاقِيَةَ. فَقَالَ: حَتَّى أَسْأَلَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَأَتَى النَّبِيُّ صلى الله عليه وسلم فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَّ أَبِيْ أَوْصَى أَنْ يُعْتَقَ عَنْهُ مِائَةُ رَقَبَةٍ. وَإِنَّ هَشَّامًا أَعْتَقَ عَنْهُ خَمْسِيْنَ. وَبَقِيْتُ عَلَيْهِ خَمْسُوْنَ رَقَبَةً أَفَأُعْتِقُ عَنْهُ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم : ” إِنَّهُ لَوْ كَانَ مُسْلِمًا فَأَعْتَقْتُمْ عَنْهُ أَوْ تَصَدَّقْتُمْ عَنْهُ أَوْ حَجَجْتُمْ عَنْهُ بَلَغَهُ ذَلِكَ” .رَوَاهُ أَبُوْ دَاوُدَ.
3077. (8) [2/926 – ప్రామాణికం]
అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రిగారి ద్వారా, అతడు తన తండ్రి గారి ద్వారా కథనం: ‘ఆ’స్ బిన్ వాయి’ల్ తన కొడుకులకు వాంఙ్మూలంగా తన తరఫున 100 మంది బానిసలు విడుదల చేయమని మరణించాడు. అతని కొడుకు హిషామ్ తన వంతుగా 50 మంది బానిసలను విడుదల చేసాడు. మరో కొడుకు ‘అమ్ర్ కూడా తన తరఫున 50 మంది బానిసలను విడుదల చేయాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఈ విషయం గురించి ప్రవక్త (స)తో సంప్రదిద్దామని ఆలోచించి ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! మా తండ్రిగారు 100 మంది బానిసలను విడుదల చేయమని వాంఙ్మూలం ఇచ్చి మరణించారు. నా సోదరుడు హిషామ్ తన వంతుగా 50 మంది బానిసలను విడుదలచేసాడు. నా వంతుగా 50 మందిని విడుదల చేయవలసి ఉంది. ‘మిగిలిన బానిసలను విడుదల చేయాలా?’ అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రవక్త (స) ఒకవేళ అతడు ముస్లిమ్ అయి ఉండి, మీరు అతని తరఫున బానిసలు విడుదల చేసినా, దాన ధర్మాలు చేసినా, ‘హజ్జ్ చేసినా ఆ పుణ్యం అతనికి చేరేది. [22] (అబూ దావూద్)
3078 – [ 9] ( لم تتم دراسته ) (2/926)
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَطَعَ مِيْرَاثَ وَارِثِهِ قَطَعَ اللهُ مِيْرَاثَهُ مِنَ الْجَنَّةِ يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ .
3078. (9) [2/926 – అపరిశోధితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఎవరైనా తన వారసుల్లోని ఎవరికైనా వారసత్వ ఆస్తి దొరక్కుండా చేస్తే, తీర్పుదినం నాడు అల్లాహ్ (త) అతనికి స్వర్గం లభించ కుండా చేస్తాడు. (ఇబ్నె మాజహ్)
3079 – [ 10 ] ? (2/926)
وَرَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ عَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ .
3079. (10) ? [2/926]
బైహఖీ, షు’అబిల్ ఈమాన్ లో, దీనిని అబూ హురైరహ్ ద్వారా ఉల్లేఖించారు.
*****
[1]) వివరణ-3041: ఇది ప్రవక్త (స) ఉత్తమ నైతికత. ఇతరుల రుణభారాన్ని తనపై వేసుకుంటున్నారు. మృతుని అప్పును తాను చెల్లిస్తానని అంటున్నారు. ఒకవేళ అతను ఆస్తి వదలి వెళితే అది అతని వారసులది అని అంటున్నారు.
[2]) వివరణ-3042: అంటే జవిల్ఫురూ‘ద్ మరియు హక్కు గలవారికి ఇచ్చిన తర్వాత మిగిలింది. ‘అస్‌బ వాళ్ళకు దొరుకుతుంది. అసలు అంటే ప్రత్యేకంగా నిర్దేశించబడని మృతుని బంధువు. కాని మృతుని ఆస్తిలో అతని హక్కు ఉంది. జవిల్ ఫురూ‘ద్ మరియు ‘అస్బల గురించి ఇంతకు ముందు వివరించడం జరిగింది.
[3]) వివరణ-3044: విడుదల పొందిన బానిసను మేలా అంటారు. అంటే ఒక వర్గం విడుదల చేసిన బానిస ఆ జాతి వాడిగానే పరిగణించబడతాడు. ఒకవేళ సయ్యద్‌లు విడుదల చేస్తే ఆ బానిస సయ్యిద్‌గా పరిగణించబడతాడు. కొందరు విడుదల చేసేవాడిగా అభిప్రాయపడ్డారు. అంటే విడుదల చేసే యజమాని అంటే తాను విడుదలచేసిన బానిసకు వారసుడు అవుతాడు. అయితే అతనికి అసబ–నసబీ ఉండకూడదు.
[4]) వివరణ-3045: అంటే సోదరి సంతానం తన మామకు వారసులౌతారు. వీరు జవిల్ అర్‌హామ్‌లలోని వారు. అయితే మామకు చెందిన జవిల్ ఫురూజ్ మరియు అస్‌బ ఉండ డదు. ‘ఆయి’షహ్ (ర) ‘హదీసు’ ”ఇన్నమల్ వలాఉ” ఇంతకు ముందు బాబుస్సల్మ్లో పేర్కొనడం జరిగింది. ”అల్ఖాలతు బి మన్జిలతిల్ ఉమ్మి” అనే బరా ‘హదీసు’ను ఇన్‌షా అల్లాహ్ బాబుస్స’గీర్‌లో పేర్కొందుము.
[5]) వివరణ-3049: ఒకవేళ మృతుని తల్లి బ్రతికి ఉండి, అతని నాన్నమ్మ కూడా బ్రతికుంటే మృతుని తల్లి ఉండగా నాన్నమ్మకు వంతు లభించదు. ఒకవేళ మృతుని తల్లి లేకపోతే నాన్నమ్మకు 6వ వంతు లభిస్తుంది.
[6]) వివరణ-3050: అంటే ఒకవేళ బిడ్డ జన్మించినపుడు శబ్దం చేసాడు, ఆ తరువాత మరణించాడు. కనుక ఆ బిడ్డకు జనాజహ్ నమాజు చదవబడుతుంది. ఇంకా అతన్ని వారసుడిగా కూడా పరిగణించడం జరుగుతుంది.
[7]) వివరణ-3051: అంటే స్నేహ సంబంధాలు కలిగి ఉన్నవారు, అజ్ఞాన కాలంలో ఇటువంటి ఒప్పందాలు జరిగేవి. అయితే ఇస్లామ్‌లో ఇటువంటి అజ్ఞాన కాలపు ఒప్పందాలు లేవు. అయితే ఇప్పుడు కేవలం బాధితుణ్ని ఆదుకోవటానికి, సత్యం కోసం ఒప్పందాలు చేయడంలో తప్పేమీ లేదు.
[8]) వివరణ-3053: లిఆన్ అంటే శపించటం ఇస్లామ్ ప్రకారం భర్త తన భార్యపై ఆమె వ్యభిచారానికి పాల్పడిందని నేరం మోపుతాడు. అయితే భార్య నిరాకరిస్తుంది. వీరివద్ద వారి ఆత్మలు తప్ప మరెవరూ సాక్ష్యం లేరు. ఈ వ్యవహారం న్యాయాధికారి వద్దకు వెళుతుంది. న్యాయాధికారి ఇద్దరిలో ఒకరు అసత్యం పలుకుతున్నారని, వారు తమ తప్పును ఒప్పుకోవాలని ఆదేశిస్తాడు. ఒకవేళ ఇద్దరూ దానికి సిద్ధపడకపోతే, న్యాయాధికారి వారిద్దరి నుండి ప్రమాణం తీసుకుంటాడు. ముందు భర్తను తన ఆరోపణ సత్యమని నాలుగు సార్లు ప్రమాణం చేయమని, ఐదవసారి ఒకవేల అతడు అసత్యం పలికి ఉంటే, అతనిపై అల్లాహ్ అభిశాపం పడాలని ప్రమాణం చేయవలసిందిగా ఆదేశిస్తాడు. ఆ తరువాత భార్యను తనపై వచ్చిన ఆరోపణ అసత్యమని నాలుగు సార్లు ప్రమాణం చేయమని, ఐదవసారి ఒకవేళ ఆమె అసత్యం పలికి ఉంటే, ఆమెపై అల్లాహ్ ఆగ్రహం పడాలని ప్రమాణం చేయవలసిందిగా ఆదేశిస్తాడు. ఈ సాక్ష్యాలు, ప్రమాణాలు వ్యభిచార ఆరోపణ శిక్షల స్థానంలో ఉంటాయి. ఒకవేళ ఇలా ప్రమాణాలు చేయకపోతే ఆరోపణ నేరశిక్షగా 80 కొరడా దెబ్బలు తిన వలసి ఉంటుంది. ప్రమాణం చేయటం వల్ల ఈ ఆరోపణ క్షమించబడుతుంది. స్త్రీకి ఇది వ్యభిచార నేర శిక్షగా పరిగణించబడుతుంది. భార్య ఒకవేళ ప్రమాణం చేయకపోతే వ్యభిచార శిక్షకు గురికావలసి వస్తుంది. ఇలా ప్రమాణం చేయటం వల్ల వ్యభిచార శిక్ష తొలగిపోతుంది. ఈ చర్యను లిఆన్ అంటారు. లిఆన్ తర్వాత న్యాయాధికారి భార్యా భర్తలను విడదీస్తాడు. వారు మళ్ళీ కలవలేరు. మళ్ళీ పెళ్ళి చేసుకోలేరు. దీన్ని గురించి వివరంగా బాబుల్లిఆన్లో పేర్కొనడం జరుగుతుంది. ఒకవేళ లిఆన్ చేసిన స్త్రీ బిడ్డ చనిపోతే ఆస్తి స్త్రీకి దక్కుతుంది. తండ్రికి లభించదు.
[9]) వివరణ-3055: ఆ విడుదల అయిన బానిసకు వారసులు ఎవరూ లేరు. ప్రవక్త (స) అతని ధనాన్ని బైతుల్‌మాల్‌లో వేయించి అతని ఊరికి చెందిన పేదల్లో అగత్యపరుల్లో పంచివేసారు. ఇస్లామీయ చట్టం ప్రకారం అది ప్రవక్త (స)కు చెంద లసింది. కాని ప్రవక్తలు వారసులూ కారు. ఆస్తినీ వదలి వెళ్ళరు.
[10]) వివరణ-3056: ఆ అనాథుని ఆస్తి బైతుల్మాల్లో ఉంచబడింది. ఆ తర్వాత ప్రవక్త (స) ఆ ధనాన్ని ఖుజా‘అహ్ తెగకు చెందిన నాయకుల వద్దకు పంపి వేసారు. వారు తమ ఇష్టప్రకారం పేదలకు, అగత్యపరులకు, ఇతర విధాలుగా ఖర్చుచేయాలని.
[11]) వివరణ-3058: అంటే ఆస్తినంతా 24 వంతులు చేసి వేయండి. అందులో నుండి ఇద్దరు కుమార్తెలకు 16 వంతులు చేసివేయండి. అంటే ఒక్కొక్కరికి 8 వంతులు భార్యకు 1/8వ వంతు అంటే మూడు వంతులు. మిగిలింది 5 వంతులు చిన్నాన్న తీసుకోవాలి.
[12]) వివరణ-3060: అంటే ఒక వ్యక్తి మరణించాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక తాత ఉన్నాడు. ఇద్దరు కుమార్తెలకు 2/3వ వంతు తాతకి జవిల్ ఫురూజ్ కావటం వల్ల1/6వ వంతు లభిస్తుంది. మరొకవంతు మిగిలి ఉంటుంది. రెండవ వంతు ‘అసబగా అతనికి లభిస్తుంది. ఈ సందర్భంగా తాత జ‘విల్ ఫురూ‘ద్ మరియు ‘అస్‌బ అవుతాడు.
[13]) వివరణ-3062: పద్ధతి ప్రకారం మృతుని తండ్రి ఉండగా నాన్నమ్మకు ఏమీ దొరక్కూడదు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో నాన్నమ్మకు మనవడి ఆస్తి నుండి ఏమీ దక్కదు. అయితే ధార్మిక పండితులు ఈ ‘హదీసు’ బలహీనమైనదని, ఇది ఆచరణయోగ్యమైనది కాదని, లేదా ప్రవక్త (స) ఉపకారంగా, నానమ్మకు 6వ వంతు ఇచ్చారని, ఆస్తి హక్కుగా ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు.
[14]) వివరణ-3063: అష్‌యమ్ జబాబీ ప్రవక్త (స) కాలంలో పొరపాటున హత్య చేయబడ్డారు. హంతకుల నుండి హత్యా పరిహారం వసూలు చేయబడింది. ఆ ధనం నుండి అతని భార్యకు ఆమెవంతు ఇప్పించడం జరిగింది. అంటే భార్య హతమార్చబడిన తన భర్త రక్తపరిహారం నుండి కొంత భాగానికి వారసురాలు అవుతుందని తెలిసింది.
[15]) వివరణ-3064: అంటే ఒక అవిశ్వాసి ఒక ముస్లిమ్ ద్వారా ఇస్లామ్ స్వీకరించి, ఆ నూతన ముస్లిమ్‌కి జ’విల్ ఫురూ’ద్ లేదా ‘అస్‌బ మొదలైన వారసులు ఎవరూ లేకుండా ఉంటే మేలల్ మవాలాత్ పద్ధతి ప్రకారం ముస్లిమ్ చేసిన వారు ఆ నూతన ముస్లిమ్ ఆస్తికి వారసులు అవుతారు.
[16]) వివరణ-3065: విడుదల పొందిన బానిస తన యజమాని వారసులెవరూ లేనిపక్షంలో యజమాని ఆస్తికి వారసుడౌతాడు అని తెలుస్తుంది. అయితే మరికొందరు ప్రవక్త (స) అతనికి ఉపకారంగా, దానంగా ఇప్పించారని అభిప్రాయ పడ్డారు.
[17]) వివరణ-3066: విడుదల చేయబడిన బానిస యొక్క ధనాన్ని వలా అంటారు. దీన్ని గురించి ఇంతకుముందు పేర్కొనడం జరిగింది.
[18]) వివరణ-3068: అంటే ఒకవేళ ఒకరి అత్త మరణిస్తే మేనల్లుడు ఆమె ఆస్తికి వారసుడు అవుతాడు. ఒకవేళ మేనల్లుడు చనిపోతే అత్త అతని ఆస్తికి వారసురాలు కాదు. ఇందులో రహస్యం ఏమిటో అల్లాహ్‌కే తెలియాలి.
[19]) వివరణ-3070: అంటే అతనిపై ఇతరుల హక్కు ఉంటే వాటి చెల్లింపునకు వీలునామా వ్రాయడం తప్పనిసరి. వీలునామా వ్రాయకుండా చనిపోతే ప్రజల హక్కులు చెల్లించక పోతే పాపాత్ముడుగా పరిగణించబడతాడు.
[20]) వివరణ-3071: అంటే 1/3వ వంతు కంటే అధిక ధనానికి వీలునామా చేయడం తగదని ఈ ‘హదీసు’ ద్వారా తెలిసింది. 1/3వ వంతు లేదా అంతకంటే తక్కువ ధనాన్ని వీలునామా చేయవచ్చును.
[21]) వివరణ-3075: మిమ్‌బాది వసియ్యతిన్ ….. వ జా’లికల్ ఫౌ’జుల్ ‘అ’జీమ్.
[22]) వివరణ-3077: ‘ఆ’స్ బిన్ వాయిల్ ఇస్లామ్ కాలాన్ని పొందాడు. కాని ఇస్లామ్ స్వీకరించలేదు. అతని ఇద్దరు కుమారులు ఇస్లామ్ స్వీకరించారు. హిషామ్ సమస్య గురించి వివరణ కోరకుండా తన వంతుగా 50 మంది బానిసలను విడుదల చేసివేసాడు. రెండవ కుమారుడు ‘అమ్ర్ కూడా 50 మంది బానిసలను విడుదల చేద్దామని నిశ్చయించుకున్నాడు. ప్రవక్త (స)ను దీన్ని గురించి వివరాలు కోరాడు. ప్రవక్త (స), ‘అవిశ్వాసి తరఫున దానధర్మాలు, సత్కార్యాలు చేయటం వల్ల పుణ్యం లభించదు. వీటివల్ల అవిశ్వాసి దైవశిక్ష నుండి రక్షించుకోలేడు, ‘ అని అన్నారు.
***