11. వాణిజ్య పుస్తకం (కితాబుల్ బుయూ) | మిష్కాతుల్ మసాబీహ్

11- كِتَابُ الْبُيُوْعِ

11. వాణిజ్య పుస్తకం

بِابُ الْكَسْبِ وَطَلْبِ الْحَلَالِ

ధర్మసమ్మత మార్గంలో ధనార్జన

సంతోషంగా ఒక సరకుతో మరో సరకును ఇవ్వటం, తీసుకోవటం. తన వస్తువును ఇంకొకరికి ఇవ్వటం, ఇతరుల వస్తువును తీసుకోవటం. ప్రతి ఒక్కరికీ దీని అవసరం పడుతుంది. ఇది జీవిత అవసరాల్లోని ప్రధానమైన అవసరం. ఇవి లేకుండా జీవితం నడవదు. ప్రతి దేశంలో ప్రతి జాతిలో వ్యాపారస్తులు ఉంటారు. వీరు ప్రాపంచిక లావాదేవీల్లో చాలా తెలివితేటలతో వ్యవహరిస్తారు. వారు కేవలం ధనం కూడబెట్టటంలో ఉంటారు. వారికి కేవలం లాభంతోనే ఆశక్తి ఉంటుంది. ధర్మం అధర్మం అనేది ఏమాత్రం ఆలోచించరు. అయితే ఒక ముస్లిమ్‌ వ్యాపారికి ధర్మాధర్మాల పట్ల అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. అధర్మ మార్గాలను వదలి ధర్మమార్గాలను అనుసరించాలి. దీన్ని గురించి కొన్ని విషయాలు ఇంతకు ముందు పేర్కొనడం జరిగింది. కొన్నిటిని ఇప్పుడు పేర్కొనడం జరుగుతుంది. దీనివల్ల ధర్మ సంపాదనలో ఉన్న రహస్యం, పరమార్ధం స్పష్టమౌతుంది.

1. అమ్మేవారు, కొనేవారు తమ ఇష్టపూర్వకంగా వ్యవహరించాలి. ఒకవేళ అమ్మేవారు సంతోషంగా అమ్మారు కాని కొనే వారు వత్తిడివల్ల కొంటే ఆ వ్యవహారం సరైనది కాదు. ఎందుకంటే వ్యాపారంలో ఇద్దరి తరఫున ఇష్టపూర్వకంగా జరగాలి. ప్రవక్త (స) ప్రవచనం, ”ఇద్దరూ ఇష్టపూర్వకంగా వేరవ్వాలి.” (అబూ దావూద్‌)

2. ఒకరు ‘అమ్మాను’ అంటే రెండవ వారు ‘కొన్నాను’ అని అనాలి. ఒకవేళ ఒకరు ‘అమ్మాను’ అని అంటే రెండవ వ్యక్తి ‘కొన్నాను’ అని అనకపోతే, అదేవిధంగా ఒకరు ‘కొన్నాను’ అని అంటే మరొకరు ‘అమ్మలేదు’ అని అంటే ఇది అధర్మ వ్యవహారం అవుతుంది.

3. అమ్ముతున్న లేదా కొంటున్న వస్తువు అక్కడ ఉండాలి. ఆ వస్తువు అక్కడ లేకున్నా దాన్ని అప్పగించే శక్తి లేకున్నా ఆ వ్యవహారం చెల్లదు. ప్రవక్త (స) ప్రవచనం, ”మీ దగ్గరలేని వస్తువును అమ్మకండి.” మోసం ఉన్న వ్యాపారాన్ని గరర్‌ అంటారు. ప్రవక్త (స) ‘గరర్‌ను అధర్మ వ్యాపారంగా పరిగణించారు.

4. నియమానుసారంగా జరిగిన వ్యవహారాన్ని సరైన కారణం లేకుండా రద్దు చేయరాదు.

వ్యాపార లాభాలు: 1) వ్యాపారం కన్నా మంచి వృత్తి ఈ ప్రపంచంలోనే లేదన్నది వాస్తవం. ఆర్థిక, మానసిక, ధార్మిక, ప్రాపంచిక లాభాలు ఒక్క వ్యాపా రస్తునికే లభించినంత మరే వృత్తిలో ఉన్నవారికి లభించవు. ఒక ఉద్యోగి రాబడి పెంచాలంటే సాధా రణంగా తప్పడు మార్గాలు అవలంబించ వలసి వస్తుంది. కాని ఒక వ్యాపారి రాత్రీ పగలు పనిచేసి తన రాబడి పెంచుతాడు. అతనికి వ్యతిరేకతకు, ధార్మిక పాపానికి పాల్పడే అవసరం లేదు. వ్యాపారం ద్వారా లభించినంత ధనం మరో మార్గం ద్వారా లభించదు. అనేక దేశాలలో వీటి గురించి అనేక ఉపమానాలు ఉన్నాయి. వ్యాపార కారణంగానే యూరప్‌, అమెరి కాల్లో అనేకమంది కోటీశ్వరులయ్యారు. అంతకు ముందు వారు జీవితం గడపటమే కష్టంగా ఉండేది. అంత ఎందుకు మన దేశంలోనూ ఎంతోమంది కొన్ని రోజుల్లోనే వ్యాపార పరంగా అభివృద్ధి చెందినవారు, ఎంతోమంది ఉన్నారు.

2) వ్యాపారం వల్ల కేవలం ధనమే కాదు దీనితోపాటు స్వాతంత్య్రం కూడా లభిస్తుంది. స్వాతంత్య్రం కన్నా విలువైనది మరో వస్తువు ఉంటుందా? ఈ అనుగ్రహం గురించే ప్రపంచమంతా కృషిచేస్తూ ఉంటుంది. నోరులేని పక్షుల దగ్గరి నుండి మానవుల వరకు స్వాతంత్య్రాన్ని కోరుకుంటారు. వ్యాపారి ఉన్నంత స్వతంత్రంగా మరో వ్యక్తి ఉండడు. రాజు కూడా ఇంత స్వతంత్రంగా ఉండడు. అతను తన సంతోషంతో, దుఃఖంలో ఉంటాడు. అతడు ఏది చేసినా తన ఇష్టప్రకారం చేస్తాడు. స్వతంత్రుడుగా ఉండగోరేవారు వ్యాపార వృత్తిని అవలంబించాలి.

3) వ్యాపారం వల్ల మరో ముఖ్యమైన లాభం ఏమి టంటే వ్యాపారి కష్టసుఖాలను గురించి, లాభ నష్టా లను గురించి మంచి అవగాహన పొందుతాడు. వ్యాపా రికి అనేకవిధాల మనస్తత్వాలు గల వ్యక్తులతో కలిసే అవకాశం దొరుకుతుంది. అందువల్ల ఎటువంటి విద్య నభ్యసించకుండానే మానసిక విద్య నభ్య సిస్తాడు. అనుభవంలాంటి గొప్ప అనుగ్రహం ఎంత విలువ ఇచ్చినా బజారులో లభించదు. దీనికి తన జీవితం లోని అనేక సంవత్సరాలు ధారపోయ వలసి ఉంటుంది. ఒక వ్యాపారి మాత్రమే కొన్ని దినాల్లోనే సంవత్సరాల అనుభవం నేర్చుకుంటాడు. సంతోషం, దుఃఖం, మంచి చెడులను ఒక వ్యాపారి పోల్చినట్టు ఇతరు లెవ్వరూ పోల్చలేరు. ప్రపంచంలో మానవుడు ఎంత అనుభవం ఉంటే కష్ట నష్టాలకు అంతదూరం ఉంటాడు. తన జీవితాన్ని కష్టాల నుండి గట్టెక్కించి విజయ పథాన ముందుకు సాగుతాడు.

4) ప్రాచీన కాలంలో వ్యాపారులు వ్యాపార నిమిత్తం అనేక దేశాలకు ప్రయాణం చేసేవారు. తద్వారా భౌగోళిక విషయాలను కూడా ఎరిగి ఉండేవారు. మానవులకు వాటి గురించి ఇతరులకు తెలియ పరిచేవారు. సామాన్యంగా ఒక వ్యక్తికి పర్యటించే అవకాశం లభించదు. కాని ఇతరులకంటే అతనికి ఎన్నోవిషయాలు తెలిసి ఉంటాయి. వీటివల్ల ఎంతో లాభం ఉంటుంది.

5) మరో లాభం ఏమిటంటే వ్యాపారం నైతిక గుణాల్ని నేర్పుతుంది. ఒక వ్యక్తి సత్యసంధుడు, సత్యవంతుడు, గుణవంతుడు అవనంతవరకు అతని వ్యాపారం అభివృద్ధి చెందదు. సద్గుణాలను అవలం బించడం అతనికి తప్పనిసరి అవుతుంది. వ్యాపారం వల్ల అతని బుద్ధీజ్ఞానాలలో, అలవాట్లలో బాగా వృద్ధి వస్తుంది. ఒక వ్యాపారి నిరంతర కృషి ప్రయత్నాలు చేసిన తర్వాత ఫలితాలను గురించి దేవునిపై భారం వేస్తాడు. ఒక వ్యాపారికి దైవంపైనే నమ్మకం ఉంటుంది. ప్రయాణంలో ఉన్నా, దుకాణంలో ఉన్నా ఇతరు లెవ్వరినీ నమ్మడు. దైవాన్నే నమ్ము కుంటాడు.

6) ధార్మికపరంగా చూస్తే ఒక వ్యాపారి వ్యాపార నియమ నిబంధనలను అనుసరించి ధర్మంగా సంపాదిస్తాడు. దీనికన్నా మంచి వృత్తి మరొకటి లేదు. ఈ విధంగా ఎంత సంపాదించినా ఆ ధనం పరిశుద్ధంగానే ఉంటుంది.

7) వ్యాపార లాభాలు కేవలం వ్యాపారస్తుని వరకే ఉండవు. ఇతర మానవులకూ వాటి లాభం చేకూరు తుంది. అంతేకాదు, ఒక దేశ పరిశ్రమల అభివృద్ధి అక్కడి వ్యాపారంపై ఆధారపడి ఉంటుంది. వ్యాపారం పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా వ్యాపారం తగ్గడం వల్ల అక్కడి పరిశ్రమలు కూడా కుంటు పడ తాయి. వృత్తి కార్మికులు తమ ఇళ్ళల్లో కూర్చొని ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రమిస్తారు. కాని వారు పడిన శ్రమకు మార్కెట్‌లో ప్రదర్శించడం వ్యాపారం పని. వ్యాపారులు తమ దేశ పరిశ్రమలను వృత్తులను ప్రోత్సహించి వాటిని సరైన విధానంలో ప్రవేశపెడితే వారి దేశం ఆర్థికంగా, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధిచెందుతుంది. అంటే జనాభాలో అధికశాతం మంది వృత్తికార్మికులు, వ్యాపారులది. వీరు తమ ఉపాధి ద్వారా సామాన్లు తయారు చేస్తారు. ఒక వ్యాపార దేశం వీరిపై ఎంత గర్వించినా తక్కువే. ఇళ్ళకు భవనాలకు అందచందాలు, ఆకర్షణలు వ్యాపారం వల్లే సాధ్యమవుతాయి. మన సమాజ సౌలభ్యాలు, అనుగ్రహాల ఆధిక్యం వ్యాపారం వల్లే సాధ్యం అవుతుంది. ఒకవేళ వ్యాపార పరంపర ఆగిపోతే ప్రపంచ సంస్కృతి అనేక సంవత్సరాలు వెనక్కి వెళ్ళి పోతుంది. ఈ కారణంగా వ్యాపార వృత్తిని కొనసాగించేవారు ప్రపంచ సంస్కృతీ, సభ్యతలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. తమ స్వలాభంతో పాటు మానవత్వానికి చాలా లాభం చేకూరుస్తున్నారు.

8) వ్యాపారం వల్ల మరో ప్రత్యేక లాభం కూడా ఉంది. మరో వృత్తి వల్ల ఇది సాధ్యం కాదు. ఒక వ్యక్తి వ్యాపారం చేస్తే అతనితో పాటు ఇతరులు కూడా అతని ద్వారా ఉపాధి పొందుతారు. ఒక దుకాణం ప్రారంభించినా, ఒక పరిశ్రమ ప్రారంభమైనా, ఒక వ్యాపారం ప్రారంభమైనా దాని యజమానికి అనేకమంది సహాయకుల అవసరం పడుతుంది. ఈ విధంగా అనేకమంది ఉపాధి ఏర్పాటు జరుగుతుంది. అందువల్ల అధిక సంఖ్యలో పరిశ్రమలు ఉన్న పట్టణాల్లో వేలల్లో కాదు లక్షల్లో జనం వివిధ సేవల్లో నిమగ్నమయి ఉన్నారు. ఏ చీకూ చింతా లేకుండా ఉన్నారు. కనుక ఒక వ్యాపారి జీవితం ఎంతో ప్రయోజనకరమైనది, ఆదర్శనీయమైనదీను.

సంక్షిప్తంగా చెప్పాలంటే వ్యాపారంలో ఎన్నోలాభాలు ఉన్నాయి. వ్యాపారానికి ప్రాధాన్యతనిచ్చే దేశాలు ఎంతో గొప్పవి. ఇవి చాలా అభివృద్ధి చెందుతాయి. వారు నిరంతరం వ్యాపార వృత్తిని అభివృద్ధిపరుస్తూ, అభివృద్ధి పొందుతూ వ్యాపారంలో నిమగ్నమయి ఉన్నారు. సూక్ష్మంగా ఆలోచిస్తే సంస్కృతి ఆర్థిక పరిస్థితి, ఉపాధి, రాజకీయ అభివృద్ధి రహస్యం వ్యాపారంలోనే దాగి ఉంది. దాని పట్ల ఆసక్తి, ఉత్సా హం ఉన్నవారు అన్ని విధాలా సుఖసంతోషాల్లో ఉన్నారు. దానితో ఎటువంటి సంబంధం లేని వారు ఇతరుల ముందు చేతులు చాపుతున్నారు. వ్యాపారం చేసేవారు ఇతరుల సంస్కృతీ, నాగరికత, ఆర్థిక పరిస్థితి, రాజకీయ, మతంపై కూడా ఆధిక్యత సంపాదిస్తారు. వారిని తమ బానిసలుగా మలచు కుంటారు. ఇప్పుడూ అలాగే జరుగుతుంది.

ఆంగ్లేయులు సస్యశ్యామలమైన భారతదేశాన్ని వ్యాపారం ద్వారానే చేజిక్కించుకున్నారు. ఈజిప్టు, ఈరాన్‌, ఇరాఖ్‌, సిరియా మొదలైన వాటన్నిటిపై కూడా వ్యాపారం ద్వారానే ఆక్రమించారు. అయితే ఈనాటి యుద్ధం అంతా వ్యాపారంపైనే. శక్తివంతమైన దేశాలు తమ వ్యాపారాన్ని అభివృద్ధిపరచడానికి ఇతర దేశాలతో యుద్ధంచేసి దాన్ని ఆక్రమించుకొని వ్యాపారాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాపారం లేని జాతి నిర్జీవిగా భావించబడుతుంది. వ్యాపారం చేసే దేశం సజీవిగా పరిగణించబడుతుంది. అంటే జీవన్మరణాలు వ్యాపారంపైనే ఆధారపడి ఉన్నాయి. అందువల్లే ఇస్లామ్‌ వ్యాపారం ప్రోత్స హిస్తుంది. ఇందులోఉన్న శుభాలను, ప్రాధాన్యతలను, ధార్మిక ప్రాపంచిక లాభాలను గురించి తెలిపింది.

9) వ్యాపారం ఉపాధి మార్గాలన్నిటిలోకెల్లా గొప్పది. దీనివల్ల ఉపాధి అధికమవుతుంది. ప్రవక్త (స) ప్రవచనం, ”వ్యాపారం చేసేవారికి, ఒక పట్టణం నుండి మరో పట్టణానికి సరుకును చేర్చేవారికి ఉపాధి ప్రసాదించబడుతుంది. సరకును ఆపేవాడు దైవ కారుణ్యాలకు దూరమవుతాడు.

10) నిజాయితీగా వ్యాపారం చేసేవాడు అనేక ప్రాము ఖ్యతలు కలిగి ఉంటాడు. ఇటువంటివారు ప్రవక్తలు, పుణ్యాత్ముల సహవాసంలో లేపబడతారు. ఇహ్‌యా ఉల్‌ ఉలూమ్‌లో ఇలా ఉంది. ప్రవక్త (స), అనుచరులు కూర్చొని ఉన్నారు. ఒక వీర అనుచరుడ్ని చూచారు. ఉదయాన్నే తన వ్యాపారంలో నిమగ్నమయి పోయాడు. అది చూచిన ప్రజలు ”ఇతని యవ్వనం దైవమార్గంలో గడిపితే ఎంత బాగుండేది” అని అన్నారు. అది విని ప్రవక్త (స) ఇలా అనకండి, ఎందు కంటే ఒకవేళ ఈ పని తనకోసం, ఇతరుల నిరపేక్షా కొరకు చేస్తే, ఇదీ ఒక విధమైన జిహాద్‌ అవుతుంది. ఒకవేళ భార్యాబిడ్డల కొరకు చేసినా అప్పుడు కూడా దైవమార్గంలో జిహాద్‌ చేసినట్లే అని అన్నారు.

అహ్‌మద్‌ బిన్‌ హంబల్‌ను ప్రజలు తన ఇంటిలో లేదా మస్జిద్‌లో కూర్చొని, నేను ఏమీ చేయను. ఆహారం దానంతట అదే నా దగ్గరకు రావాలి అని అనే వ్యక్తిని గురించి ప్రశ్నించారు. దానికి అతను ఇటువంటి వ్యక్తి అవివేకి, తెలివి తక్కువగలవాడు. ఇటువంటి వారు ప్రవక్త (స) ఈ హదీసు వినలేదు, ”అల్లాహ్‌ (త)  ఉపాధిని బల్లాల నీడలో ఉంచాడు.” పక్షులగురించి ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”పక్షులు ఉదయం ఆకలితో బయలుదేరుతాయి. సాయంత్రం కడుపులు నింపుకొని తిరిగి వస్తాయి. అంటే అవి పగలంతా ఆహారం వెదికి తిని త్రాగి తిరిగివస్తాయి.”  

వ్యాపార నియమాల వివరణ:

1. అభివృద్ధి సాఫల్యం నీతి నిజాయితీలో ఉంది. అందు వల్లే ఇస్లామ్‌ వీటిని గురించి గుచ్చిచెప్పింది. ప్రవక్త (స) ప్రవచనం: నీతి, నిజాయితీ లేనిదే విశ్వాసం చెల్లదు.

2. నీతి నిజాయితీతో పాటు కృషి, శ్రమ, స్థిరత్వం, నిలకడలు కూడా తప్పనిసరి. ఒక వ్యక్తి వ్యాపారంలో నిరంతర కృషి, కష్టాలు, ఆపదలు ఉండనంతవరకు సాఫల్యం పొందలేడు. కఠిన పరీక్షలో నిలకడగా ఉంటే కష్టాలు వాటంతట అవే సమసిపోతాయి.

3. దీనికి తోడు గుణసంపన్నత కూడా చాలా అవసరం. ఎందుకంటే దుర్మార్గులతో, చెడ్డవారితో ప్రజలు ఎటువంటి వ్యవహారానికీ సిద్ధపడరు. అందు వల్ల ఇటువంటి వారు వ్యాపారంలో విజయం సాధించ లేరు. సద్గుణాలు కష్టాలన్నిటినీ దూరం చేస్తాయి. సద్గుణవంతుడ్ని, నీతిమంతుడ్ని, నిజాయితీ పరుడ్ని అందరూ ప్రేమిస్తారు. అతనికి సహాయ సహకారాలు అందిస్తారు. నోరు తియ్యగా ఉంటే దేశాన్నే ఏలవచ్చు. మంచిగా ప్రవర్తించేవారి గురించి హదీసులో చాలా పొగడటం, ప్రశంసించటం జరిగింది. ఒక వ్యాపారి తప్పకుండా సద్గుణ సంపన్నుడు కావాలి. ఇది కేవలం అనుభవం వల్ల తెలుస్తుంది.

4. ఈ విషయంలో అన్నిటికంటే ముందు వ్యాపారి సత్సంకల్పం కలిగి ఉండాలి. ఇతరుల పట్ల శ్రేయోభిలాష, దయ, కరుణ, సహాయం మొదలైన వాటిని అవలంబించాలి. కేవలం స్వలాభాపేక్షే ఉండరాదు. ఇస్లామ్‌లో వీటిని గురించి ప్రోత్సహించటం జరిగింది. నీ కోసం ఇష్టపడేదాన్నే ఇతరుల కొరకు కూడా ఇష్టపడాలి. ప్రవక్త (స) ప్రవచనం, ”తన కోసం ఇష్టపడినదాన్నే ఇతరులకోసం కూడా ఇష్టపడనంత వరకు దాసుడూ విశ్వాసి కాజాలడు.”

5. వ్యాపారంలో సత్యం పాత్ర ప్రధానమైనది. అసత్యానికి, మోసానికి పాల్పడరాదు. వ్యాపార లావా దేవీల్లో ఎంతమాత్రం అసత్యం, మోసం పనికిరావు. ప్రవక్త (స) ప్రవచనం, నిజాయితీగల వ్యాపారి ప్రవక్తల, సత్యవంతుల, అమరవీరుల సహవాసం కలిగి ఉంటాడు. (తిర్మిజి’). మరో ఉల్లేఖనంలో ”అమ్మేవారికి, కొనేవారికి వారు విడిపోనంత వరకు అనుమతి ఉంది. ఒకవేళ ఇద్దరూ సత్యం పలికితే, వస్తువుల లోపాలను బయటపెడితే ఇద్దరికీ శుభం కలుగుతుంది. ఒకవేళ దాచి, అసత్యం పలికితే వారి వ్యాపారంలో శుభం ఉండదు.”  

ధార్మికపరంగా చూస్తే సత్యసంధత, వ్యవహారశీలత తప్పనిసరి కాని, ప్రాపంచికంగా ఆలోచించినా సత్య సంధత చాలా అవసరం. వ్యవహారశీలత ఉంటేనే ప్రజలు నమ్ముతారు. వ్యాపారం వృద్ధిచెందుతుంది. లాభాలు చేకూరుతాయి. దగా, మోసం, ద్రోహం చేస్తే ప్రజలు నమ్మరు, కొనుగోలు చేయరు. అంతేకాదు ఎటువంటి వ్యవహారమూ చేయరు. అతడు వ్యాపారంలో విజయం సాధించలేడు. ప్రవక్త (స) ప్రవచనం, ”మోసగాడు మనలోనివాడు కాడు.” (ముస్లిమ్‌). దగా, మోసం, ద్రోహం చేసేవారు ఉభయ లోకాల్లోనూ సాఫల్యం పొందలేరు.

6. వాగ్దానం చేయటం, దాన్ని నిలబెట్టుకోవటం అందరికీ తప్పనిసరి. అల్లాహ్‌ ఆదేశం, ”వాగ్దానాలను పూర్తిచేయండి, ఎందుకంటే వాగ్దానాల పట్ల కూడా విచారించడం జరుగుతుంది.” వాగ్దానాన్ని భంగ పరచడం మహాపాపం. ప్రత్యేకంగా వ్యాపారులకు మాటలు, వాగ్దానాలతో చాలా పని ఉంటుంది. వ్యాపారమంతా నమ్మకం వాగ్దానాలపైనే ఆధారపడి ఉంటుంది. నమ్మకంగా వ్యవహరించని, వాగ్దానాల్ని పాలించనివారి వ్యాపారం విఫలమౌతుంది.

7. వ్యాపారంలో వ్యవహారశీలత చాలా అవసరం. ఇటువంటి వారిని ప్రజలు ప్రేమిస్తారు. నమ్మకం కలిగి ఉంటారు. అందులోనే శుభం ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. తప్పుడు వ్యవహారం వల్ల నష్టమే కలుగుతుంది. వ్యాపారంలో మోసం, ద్రోహం, దగా, హాని తలపెట్టటం మొదలైన వాటికి ఎంత మాత్రం అవకాశం ఇవ్వరాదు.

8. తొందరపాటు, తొందరపడి ఏ పనీ చేయరాదు. వ్యాపారంలో తొందర ప్రమాదకరంగా పరిణమిస్తుంది. నిశ్చింతగా, నిదానంగా, నిలకడగా వ్యవహరించాలి.

9. వ్యాపారి వ్యాపారంలోని ప్రతి పనికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రతి పనికి ఒక సమయం, స్థానం నిర్థారించాలి. నియమనిబంధనలను అనుస రించి వ్యాపారం చేస్తే వ్యాపారంలో లాభం కలుగు తుంది. వ్యవస్థ లేకుంటే నష్టాలే వచ్చిపడతాయి.

10. తనవద్ద కొనే కొనుగోలుదారులతో చిరు నవ్వుతో, వినయ వినమ్రతలతో సహనం ఓర్పులను పాటిస్తూ దయాశీలతతో వ్యవహరించాలి. వీటికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కొనుగోలుదారు వెనుతిరిగే భయం ఉంటుంది. దాని వల్ల, వ్యాపారానికి నష్టం వాటిల్లుతుంది. ప్రవక్త (స) ప్రవచనం, ”కొనినప్పుడు, అమ్మినపుడు వినయవినమ్రతలను పాటించిన వారి పట్ల అల్లాహ్‌(త) కారుణ్యం ఉంటుంది.”

11. ప్రపంచంలో ఏ పని అయినా నిరంతర కృషి ప్రయత్నాలు లేకుండా పూర్తవదు. వ్యాపారి కయితే ఇతరులకంటే అధికంగా శ్రమపడవలసి ఉంటుంది. వ్యాపారి ఎంత అధికంగా కష్టపడితే అంత తొందరగా అభివృద్ధి చెందుతాడు. ప్రవక్త (స) కూడా వ్యాపారు లకు ఉదయాన్నే లేచి తమ వ్యాపారాల్లో నిమగ్న మవ్వాలని హితవుచేసారు. దీనివల్ల చాలా అభివృద్ధి, శుభం కలుగుతుందని ప్రవచించారు. ప్రవక్త (స) ఇలా ప్రార్థించారు, ”ఓ అల్లాహ్‌! నా అనుచర సంఘం ఉదయాన్నే లేవటంలో శుభం ప్రసాదించు.” ప్రవక్త (స) సైన్యాన్ని ఎక్కడికైనా పంపిస్తే ఉదయాన్నే పంపిస్తారు. సఖ్‌ర్‌ (ర) ఒక వ్యాపారి. ఇతడు ప్రవక్త (స) యొక్క ఈ ఉపదేశంపై అమలుచేసారు. తన సేవకులను ఉదయాన్నే పనిపై పెట్టేవారు. దీనివల్ల అతను చాలా అభివృద్ధి చెందారు. చాలా పెద్ద పెట్టుబడి దారులై పోయారు. ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఉదయాన్నే అల్లాహ్‌ తరఫు నుండి ఉపాధి పంచబడుతుంది. అందువల్ల ఉదయాన్నేలేవండి.” (తర్‌’గీబ్‌).

12. ప్రతివ్యక్తి ఆచితూచి ఖర్చుచేస్తాడు. కాని వ్యాపారి దీనిపై ప్రత్యేక దృష్టి కలిగి ఉండాలి. దీనివల్ల వ్యాపారంలో అభివృద్ధి లభిస్తుంది. రాబడికన్నా ఖర్చులు అధికంగా ఉన్నవాడు కొన్ని రోజుల్లోనే ఇతరుల ముందు చేతులు చాపుతాడు. అందువల్లే ‘హదీసు’లో దీన్ని గురించి హెచ్చరించడం జరిగింది. రాబడి, ఖర్చులను ఎప్పటికప్పుడు లెక్కలు సరిచూసుకోవాలి. వ్రాయడం వస్తే వ్రాసి ఉంచుకోవాలి.

కొనుగోలు, అమ్మకాలను గురించి వ్యాపారాన్ని గురించి ఖుర్‌ఆన్‌ ‘హదీసు’ల్లో వివరంగా ఉంది. ఇవి లేకుండా మానవ జీవితం ముందుకు సాగదు. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ (త) ఇలా ఆదేశించాడు, ”జుమా నమా’జు ముగిసిన తరువాత భూమిపై అన్నివైపుల వ్యాపించండి. దైవానుగ్రహాన్ని వెదకండి.”(సూ. అల్ జుము ‘అహ్, 62:10) మరోచోట ”…మరికొందరు అల్లాహ్‌ అనుగ్రహాన్ని అన్వేషిస్తూ భూమిలో ప్రయాణంలో ఉండవచ్చు…” (సూ. అల్ ము’జ్జమ్మిల్, 73:20) ఈ రెండు ఆయతుల్లో వ్యాపారాన్ని దైవాను గ్రహంగా పేర్కొనడం జరిగింది. దీనివల్ల వ్యాపార ప్రాముఖ్యత అర్థమవుతుంది. అల్లాహ్‌ ఆదేశం: ”అల్లాహ్‌ (త) వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసాడు, వడ్డీని నిషేధించాడు.” (సూ. అల్ బఖరహ్, 2:275) మరో ఆదేశం: ”ఓ విశ్వాసులారా! మీరు ఒకరిసొమ్ము నొకరు అన్యాయంగా తినకండి, పరస్పర అంగీ కారంతో చేసే వ్యాపారంవల్ల వచ్చేది (లాభం) తప్ప.” (సూ. అన్నిసాఅ’, 4:29) అల్లాహ్‌ (త) ఆదేశం: మీరు మీ ప్రభువు అనుగ్రహాలు అన్వేషిస్తే అందులో దోషం లేదు. (సూ. అల్ బఖరహ్, 2:198) అంటే ఖుర్‌ఆన్‌ వ్యాపారాన్ని గొప్ప గుణంగా పేర్కొంది. అందువల్లే వ్యాపారం చేసేవారు గొప్పవారు ఉన్నతులూను. పూర్వకాలంలో ముస్లిములు దీన్ని అనుసరించారు. వ్యాపారం ద్వారానే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. 

వ్యాపారం మరియు ప్రవక్త () ఆదర్శం:

మన ప్రవక్త (స) పరిపూర్ణ గుణాలుగల ఉత్తమ పురుషులు. వీటిలో ధర్మసంపాదన కూడా ప్రధాన మైనది. ప్రవక్త (స) బాల్యంలో మేకలను కాచేవారు. యుక్త వయస్సుకు చేరిన తర్వాత వ్యాపారం చేసారు. హాఫిజ్‌ ఇబ్నె కసీర్‌ అల్‌ బిదాయహ్‌ వన్నిహాయహ్‌”లో ఇలా పేర్కొన్నారు:

“ప్రవక్త (స) దైవ దౌత్యానికి ముందు పూర్తిగా 12 సంవత్సరాల వరకు వ్యాపారం చేసారు. తన వ్యాపా రాన్ని బాగా వ్యాపింపజేసారు. ప్రవక్త (స) సరకులు సిరియా, యమన్‌, హబ్‌షా, బహ్‌రైన్‌, కువైట్‌, మస్‌ ఖత్‌ మొదలైన ప్రాంతాలకు వెళ్ళేవి. వ్యాపార విషయంలోనే ప్రవక్త(స) రెండుసార్లు సిరియా ప్రయాణం చేసారు. అబూ-దావూద్‌లో సాయిబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) దైవదౌత్యానికి పూర్వం వ్యాపారంలో నాతోపాటు భాగస్వామిగా ఉండేవారు. అతని వ్యవహారం ఎప్పుడూ స్పష్టంగా ఉండేది. అదేవిధంగా దైవదౌత్యం తరువాత బహ్‌రైన్‌ నుండి అబ్దుల్‌ ఖైస్‌ బృందం వచ్చింది. వారి ముందు తన సరకులు మీ ఊళ్లకు వెళ్ళేవని గుర్తుచేసారు.” (తారీఖు ఇబ్నె జరీర్‌)

ఆచరణ రూపంగా ప్రవక్త (స) చేసిచూపెట్టారు. వాక్కుపరంగా కూడా ప్రవక్త (స) దీనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ధర్మ సంపాదనను జిహాద్‌గా పరిగణించారు. (ముస్నద్‌ అహ్మద్‌). ప్రవక్త (స) ప్రవచనం, ”ధర్మసంపాదనతో తన సంతానాన్ని పోషించేవారు, పొరుగువారికి సహాయం చేసేవారు తీర్పుదినం నాడు అల్లాహ్‌ను కలుసుకున్నప్పుడు వారి ముఖాలు వెన్నెల రాత్రుల చంద్రునిలా వెలుగుతూ ఉంటాయి.” అన్నిటికంటే పరిశుద్ధమైన సంపాదన ఏదని ప్రవక్త (స)ను ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స) తన చేత్తో సంపాదించింది, దగా మోసం, ద్రోహం లేని వ్యాపారం అని సమాధానం ఇచ్చారు. (అహ్మద్‌). వ్యాపారం ఉపాధి మార్గం అని ప్రవక్త (స) ప్రవచించారు. వ్యాపారాన్నే అనుస రించండి. ఎందుకంటే ఇందులో ఉపాధికి సంబంధించిన 9 భాగాలు ఉన్నాయి.

ధర్మ సంపాదన:

ధర్మమార్గాన ఉపాధి సంపాదించడం ప్రతి ఒక్కరి విధి. ఇస్లామ్‌ దీన్ని గురించి నొక్కి చెప్పింది. అల్లాహ్‌ ప్రవక్తలు, సందేశహరులు, పుణ్యాత్ములు ధర్మ మార్గాన్నే ఉపాధి సంపాదించేవారు. ఉపాధి రెండు విధాలుగా సంపాదించ వచ్చు. ఒకటి ధర్మమార్గాన, మరొకటి అధర్మమార్గాన. అధర్మమార్గాన ఉపాధి సంపాదించడం మహాపాపం. ధర్మ సంపాదనలో ఎంతో శుభం ఉంది. ఇందులో ఉభయలోకాల శుభాలు ఉన్నాయి. ధర్మ సంపాదన చేసేవారు ప్రజల దృష్టిలో ప్రియులు. అతన్ని అందరూ ప్రేమిస్తారు. గౌరవిస్తారు. అల్లాహ్‌ కూడా అతన్ని ప్రేమిస్తాడు. అతడు చేసే ఆరాధన కూడా స్వీకరించబడుతుంది. అధర్మ సంపాదన తినేవాడి ఆరాధన స్వీకరించబడదు.

ఈ పరంపరలోని ‘హదీసు’లు.

—–

1- الكَسْب وَ طَلْبِ ِالْحَلَال

  1. ధర్మ సమ్మత మార్గంలో ధనార్జన

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం   

2759 – [ 1 ] ( صحيح ) (2/842)

عَنْ الْمِقْدَادِ بْنِ مَعْدِيْ كَرِبَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا أَكَلَ أَحَدٌ طَعَامًا قَطُّ خَيْرًا مِّنْ أَنْ يَّأْكُلَ مِنْ عَمَلِ يَدَيْهِ وَإِنَّ نَبِيَّ اللهِ دَاوُدَ عَلَيْهِ السَّلَامُ كَانَ يَأْكُلُ مِنْ عَمَلِ يَدَيْهِ” .رَوَاهُ الْبُخَارِيُّ .

2759. (1) [2/842-దృఢం]

మిఖ్‌దాద్‌ బిన్‌ మ’అది కరబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన చేతి సంపాదనతో చేసిన భోజనం కంటే మంచి భోజనం మనిషి ఎప్పుడూ చేయలేదు. దైవప్రవక్త, దావూద్‌ (అ) తన స్వహస్తాలతో పనిచేసి సంపాదించి భుజించే వారు.” [1] (బు’ఖారీ)

2760 – [ 2 ] ( صحيح ) (2/842)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ طَيِّبُ لَا يُقْبَلُ إِلَّا طَيِّبًا. وَإِنَّ اللهَ أَمَرَ الْمُؤْمِنِيْنَ بِمَا أَمَرَ بِهِ الْمُرْسِلِيْنَ فَقَالَ: (يَا أَيهَا الرُّسُلُ كُلُوْا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوْا صَالِحًا؛23: 51) وَقَالَ: (يَا أَيُّهَا الَّذِيْنَ آمِنُوْا كُلُوْا مِنْ طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ-2:172) ثُمَّ ذَكَرَ الرَّجُلَ يُطِيْلُ السَّفَرَ أَشْعَثَ أَغْبَرَ يَمُدُّ يَدَيْهِ إِلَى السَّمَاءِ: يَا رَبِّ يَا رَبِّ وَمَطْعَمُهُ حَرَامٌ وَمَشْرَبُهُ حَرَامٌ وَمَلْبَسُهُ حَرَامٌ وَغُذِيَ بِالْحَرَامِ فَإِنَّى يُسْتَجَابُ لِذَلِكَ؟” رَوَاهُ مُسْلِمٌ.

2760. (2) [2/842-దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ పరమ పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ వస్తువులనే స్వీకరిస్తాడు. అల్లాహ్‌ (త) తన సందేశ హరులకు ఆదేశించినట్లే విశ్వాసులకూ ఆదేశించాడు: ”ఓ ప్రవక్తలారా! పరిశుద్ధమయిన ఉపాధిని తినండి. సత్కార్యాలను ఆచరించండి.” (సూ. అల్-ముఅ’మినూన్, 23:51) అదేవిధంగా విశ్వాసుల నుద్దేశించి, ”…ఓ విశ్వాసులారా! మేము మీకు జీవనో పాధిగా ఇచ్చిన పరిశుధ్ధమైన (ధర్మసమ్మతమైన) వస్తువులనే తినండి …” (సూ. అల్ బఖరహ్, 2:172) ఆపైన ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”ఒకడు బహు దూరాన్నుండి ప్రయాణం చేసి పుణ్యస్థలానికి వస్తాడు, ధూళిలో పూర్తిగా మునిగి ఉంటాడు. వంటినిండా దుమ్ము పట్టి ఉంటుంది. అతడు తన రెండు చేతులూ చాచి, ”ఓ నా ప్రభూ! నాకు అది ప్రసాదించు, ఇది ప్రసాదించు” అని వేడుకుంటాడు. వాస్తవానికి అతడు తినేది అధర్మమైనది. అతడు త్రాగేదీ అధర్మమైనది. అతడు ధరించింది సయితం అధర్మమైనది. అధర్మ ఉపాధి ద్వారానే అతడి జీవితం గడుస్తుంది. మరి అతడి దు’ఆ ఎలా స్వీకరించబడుతుంది . (ముస్లిమ్‌)

2761 – [ 3 ] ( صحيح ) (2/842)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَأْتِيَ عَلَى النَّاسِ زَمَانٌ لَا يُبَالِي الْمَرْءُ مَا أَخَذَ مِنْهُ أَمِنَ الْحَلَالِ أَمْ مِنَ الْحَرَامِ”. رَوَاهُ الْبُخَارِيُّ.

2761. (3) [2/842-దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రజలు ఒక కాలాన్ని ఎదుర్కోబోతున్నారు. ఆ కాలంలో మనిషి తాను ఆర్జించే సంపద ధర్మసమ్మత మైనదా లేక అధర్మమైనదా? అనే విషయాన్ని పట్టించుకోరు.” (బు’ఖారీ)

2762 – [ 4 ] ( متفق عليه ) (2/843)

وَعَنِ النُّعْمَانِ بْنِ بَشِيْرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْحَلَالُ بَيْنَ وَالْحَرَامُ بَيْنَ وَبَيْنَهُمَا مُشْتَبِهَاتٌ. لَا يَعْلَمُهُنَّ كَثِيْرٌ مِّنَ النَّاسِ فَمَنِ اتَّقَى الشُّبهَاتِ اسْتَبْرَأَ لِدِيْنِهِ وَعِرْضِهِ وَمَنْ وَقَعَ فِي الشُّبُهَاتِ وَقَعَ فِيْ الْحَرَامِ كَالرَّاعِيْ يَرْعَى حَوْلَ الْحَمَى يُوْشِكَ أَنْ يَّرْتَعَ فِيْهِ أَلَا وَإِنَّ لِكُلِّ مَلِكٍ حِمَىَّ أَلَا وَإِنَّ حِمَى اللهِ مَحَارِمُهُ. أَلَا وَإِنَّ فِيْ الْجَسَدِ مُضْغَةً إِذَا صَلَحَتْ صَلَحَ الْجَسَدُ كُلُّهُ وَإِذَا فَسَدَتْ فَسَدَ الْجَسَدُ كُلُّهُ أَلَا وَهِيَ الْقَلْبُ”.

2762. (4) [2/843-ఏకీభవితం]

నో’మాన్‌ బిన్‌ బషీర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ధర్మమయినవి స్పష్టంగా ఉన్నాయి. అధర్మమైనవీ స్పష్టంగా ఉన్నాయి. కానీ వీటి మధ్య కొన్ని సందేహాస్పదమైన విషయాలున్నాయి. చాలామందికి వీటిగురించి తెలియదు. ఎవడయితే సందేహాస్పదమైన విషయాలకు దూరంగా ఉంటాడో, అతడు తన ధర్మాన్ని, గౌరవాన్ని కాపాడు కుంటాడు.  ఏ వ్యక్తి సందేహభరితమైన విషయాలకు గురవుతాడో అతడు ఒక మేకలకాపరిని పోలి ఉంటాడు. అతడు తన జంతువులను రాజుగారి పొలానికి దగ్గరలో మేపుతున్నాడు. అతడి జంతువుల్లోని ఏదైనా జంతువు అందులోనికి వెళ్ళ వచ్చు. గుర్తుంచుకోండి, ప్రతి రాజుకు ఒక ప్రత్యేక జంతువులుమేసే స్ధలం ఉంది. ఇతరుల జంతువులు అందులో ప్రవేశించలేవు. గుర్తుంచుకోండి, అల్లాహ్ మైదానం అంటే ఆయన భూమిపై ఆయన నిషిధ్ధాలు. గుర్తుంచుకోండి, శరీరంలో ఒక మాంసం ముక్క ఉంది. అది ఆరోగ్యంగా ఉంటే శరీరమంతా ఆరోగ్యంగా ఉంటుంది. అది పాడయితే, శరీరమంతా పాడయి పోతుంది. వినండి అది హృదయం.” [2] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2763 – [ 5 ] ( صحيح ) (2/843)

وَعَنْ رَافِعِ بْنِ خَدِيْجٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ثَمَنُ الْكَلْبِ خَبِيْثٌ وَمَهْرُ الْبَغِيِّ خَبِيْثٌ وَكَسْبُ الْحَجَّامِ خَبِيْثٌ”. رَوَاهُ مُسْلِمٌ.

2763. (5) [2/843దృఢం]

రా’ఫె బిన్‌ ‘ఖదీజ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కుక్క ఖరీదు అపరిశుద్ధమైనది. వ్యభిచార స్త్రీ సంపాదన నీచమైనది, నిషిద్ధమైనది. కొమ్ముపట్టేవాడి ప్రతిఫలం అసహ్య పూరితమైనది.” [3]  (ముస్లిమ్‌)

2764 – [ 6 ] ( متفق عليه ) (2/843)

وَعَنْ أَبِيْ مَسْعُوْدِ الْأَنْصَارِيِّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَهَى عَنْ ثَمَنِ الْكَلْبِ وَمَهَرِ الْبَغِيِّ وَحُلْوَانِ الْكَاهِنِ.

2764. (6) [2/843ఏకీభవితం]

అబూ మస్‌’ఊద్‌ అ’న్సారీ (ర) కథనం: ప్రవక్త (స) కుక్కవెలను, వ్యభిచారిణి సంపాదనను, జ్యోతిష్కుని సంపాదనను తీసుకోవద్దని వారించారు. [4] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2765 – [ 7 ] ( صحيح ) (2/843)

وَعَنْ أَبِيْ حُجَيْفَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى عَنْ ثَمْنِ الدَّمِ وَثَمَنِ الْكَلْبِ وَكَسْبَ الْبَغِيِّ. وَلَعَنَ آكِلَ الرِّبَا وَمُوْكِلَهُ وَالْوَاشِمَةَ وَالْمُسْتَوْشِمَةَ وَالْمُصَوِّرَ. رَوَاهُ الْبُخَارِيُّ.

2765. (7) [2/843దృఢం]

అబూ జుహైఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) రక్తం ప్రతిఫలాన్ని, కుక్క ఖరీదు తీసుకోవటాన్ని, స్త్రీ వ్యభిచార ప్రతిఫలం తీసుకోవటాన్ని నిషేధించారు. ఇంకా వడ్డీ తినేవారిని, తినిపించేవారిని, శరీర ఆకృతిని మార్చే, మార్పించే స్త్రీలను, చిత్రాలు వేసే వారిని శపించారు. (బు’ఖారీ)

2766 – [ 8 ] ( متفق عليه ) (2/843)

وَعَنْ جَابِرٍ أَنَّهُ سَمِعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ عَامَ الْفَتْحِ وَهُوَ بِمَكَّةَ: “إِنَّ اللهَ وَرَسُوْلَهُ حَرَّمَ بَيْعَ الْخَمْرِ وَالْمَيْتَةِ وَالْخِنْزِيْرِ وَ الْأَصْنَامِ”. فَقِيْلَ: يَا رَسُوْلَ اللهِ أَرَأَيْتَ شُحُوْمَ الْمَيْتَةِ؟ فَإِنَّهُ تُطْلَى بِهَا السُّفُنُ وَيُدَّهَنُّ بِهَا الْجُلُوْدُ وَيَسْتَصْبِحُ بِهَا النَّاسُ؟ فَقَالَ: “لَا هُوَ حَرَامٌ” . ثُمَّ قَالَ عِنْدَ ذَلِكَ: “قَاتَلَ اللهُ الْيَهُوْدَ إِنَّ اللهَ لَمَّا حَرَّمَ شُحُوْمَهَا أَجْمَلُوْهُ ثُمَّ بَاعُوْهُ فَأَكَلُوْا ثَمَنَهُ”.

2766. (8) [2/843ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: అతను ప్రవక్త (స)ను మక్కహ్ విజయం సంవత్సరంలో ఇలా అంటూ ఉండగా విన్నారు, ”అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త మద్యపానం అమ్మటాన్ని, మృతజంతువును అమ్మటాన్ని, పందిని అమ్మటాన్ని, విగ్రహాలను అమ్మటాన్ని నిషేధించారు. అప్పుడు, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! మృతజంతువు క్రొవ్వు గురించి ఆజ్ఞ ఏమిటి? ఎందుకంటే దాని క్రొవ్వు పడవలకు పట్టటం జరుగుతుంది, ఇంకా చర్మాలకు రాయబడుతుంది. ప్రజలు దాన్నుండి దీపాలు వెలిగిస్తారు,’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘మృతజంతువు యొక్క క్రొవ్వుతో లాభం పొందటం ధర్మసమ్మతం కాదు. ఇది నిషిద్ధం. ఈ సందర్భంగా ప్రవక్త (స), ”యూదులను అల్లాహ్‌ (త) నాశనం చేయుగాక! ఇంకా వారిని శపించుగాక! అల్లాహ్‌ (త) మృతజంతువు క్రొవ్వును నిషేధిస్తే, ఆ యూదులు వాటి క్రొవ్వును కరిగించి అమ్మేవారు. దాని ద్వారా వచ్చే ధనాన్ని తినేవారు అని ప్రవచించారు.[5]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

2767 – [ 9 ] ( متفق عليه ) (2/843)

وَعَنْ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “قَاتِلَ اللهُ الْيَهُوْدَ حُرِّمَتْ عَلَيْهِمُ الشُّحُوْمُ فَجَمَلُوْهَا فَبَاعُوْهَا”

2767. (9) [2/843ఏకీభవితం]

ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) యూదులను సర్వనాశనం చేయుగాక! వారికి మృతజంతువు క్రొవ్వును నిషేధించబడితే దాన్ని కరిగించి అమ్మేవారు.” [6] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2768 – [ 10 ] ( صحيح ) (2/844)

وَعَنْ جَابِرٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَهَى عَنْ ثَمَنِ الْكَلْبِ وَالسِّنُّوْرِ. رَوَاهُ مُسْلِمٌ .

2768. (10) [2/844దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) శిక్షణ లేని కుక్క ఖరీదు, పిల్లి ఖరీదును తీసుకోవటాన్ని నిషేధించారు.[7] (ముస్లిమ్‌)

2769 – [ 11 ] ( متفق عليه ) (2/844)

وَعَنْ أَنَسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: حَجَمَ أَبُوْ طَيْبَةَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَأَمَرَ لَهُ بِصَاعٍ مِّنْ تَمْرٍ وَأَمَرَ أَهْلَهُ أَنْ يُّخَفِّفُوْا عَنْهُ مِنْ خَرَاجِهِ .

2769. (11) [2/844ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స)కు అబూ ‘తయ్యిబహ్‌ కొమ్ము చేసారు. ప్రవక్త (స) దానికి ప్రతిఫలంగా ఒక సా’ [అంటే పావు తక్కువ మూడు (2 ¾) సేర్లు] ఖర్జూరాలు ఇమ్మని ఆదేశించారు. ఇంకా అతని యజమానులకు అతని చెల్లింపు నుండి కొంత తగ్గించమని ఆదేశించారు. [8]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ    రెండవ విభాగం  

2770 – [ 12 ] ( صحيح ) (2/844)

عَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِنَّ أَطْيَبَ مَا أَكَلْتُمْ مِنْ كَسْبِكُمْ. وَإِنَّ أَوْلَادَكُمْ مِنْ كَسْبِكُمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ .

وَفِيْ رِوَايَةِ أَبِيْ دَاوُدَ وَالدَّارَمِيُّ:”إِنَّ أَطْيَبَ مَا أَكَلَ الرَّجُلُ مِنْ كَسْبِهِ وَإِنَّ وَلَدَهُ مِنْ كَسْبِهِ .

2770. (12) [2/844దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు సంపాదించే వాటిలో మీచేతి సంపాదనే అన్నిటి కంటే గొప్పది. అంటే చేతి సంపాదనే అన్నిటి కంటే ఉత్తమ సంపాదన. మీ సంతానం మీ సంపాదనే. (తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్)

అబూ దావూద్‌, దారమీలలో ఒక ఉల్లేఖనం ఇలా ఉంది, ”మనుషులు తినే సంపాదనలన్నిటిలో అన్నిటి కంటే ఉత్తమ మైనది చేతిసంపాదన. సంతానం కూడా అతని సంపాదనే.”

2771 – [ 13 ] ( لم تتم دراسته ) (2/844)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا يَكْسِبُ عَبْدٌ مَالَ حَرَامٍ فَتَيَصَدَّقُ مِنْهُ فَيُقْبَلُ مِنْهُ وَلَا يُنْفِقُ مِنْهُ فَيُبَارَكُ لَهُ فِيْهِ وَلَا يَتْرُكُهُ خَلْفَ ظُهْرِهِ إِلَّا كَانَ زَادَهُ إِلَى النَّارِ. إِنَّ اللهَ لَا يَمْحُو السَّيِئَ بِالسَّيِّئِ وَلَكِنْ يَمْحُو السَّيئَ بِالْحَسَنِ. إِنَّ الْخَبِيْثَ لَا يَمْحُو الْخَبِيْثَ”. رَوَاهُ أَحْمَدُ وَكَذَا فِيْ شَرْحِ السُّنَّةِ.

2771. (13) [2/844అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”ఎవరైనా అధర్మ సంపాదనలో నుండి దానధర్మాలు చేస్తే అల్లాహ్‌(త) స్వీకరించడు. అధర్మ సంపాదనను తాను ఉపయోగించినా శుభం కలగదు, అధర్మ సంపాదన సంపాదించి వదలివెళితే నరక కారకం అవుతుంది, అల్లాహ్‌ (త) చెడును చెడుద్వారా తొలగించడు, చెడును మంచి ద్వారా తొలగిస్తాడు, అపరిశుద్ధత అపరిశుద్ధాన్ని దూరం చేయలేదు, అని ప్రవచించారు.” (అ’హ్మద్‌, షర్‌’హ్ సున్నహ్‌)

2772 – [ 14 ] ( لم تتم دراسته ) (2/845)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَدْخُلُ الْجَنَّةَ لَحْمٌ نَبَتَ مِنَ السُّحْتِ وَكُلُّ لَحْمٍ نَبَتَ مِنَ السُّحْتِ كَانَتِ النَّارُ أَوْلَى بِهِ”. رَوَاهُ أَحْمَدُ وَالدَّارَمِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

2772. (14) [2/845అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అధర్మ సంపాదన ద్వారా పోషించబడిన శరీరం స్వర్గంలో ప్రవేశించదు. అధర్మ సంపాదన ద్వారా పోషించబడిన శరీరం నరకంలో వెళ్ళటానికే తగినది.” (అ’హ్మద్‌, తిర్మిజి’, బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

2773 – [ 15 ] ( صحيح ) (2/845)

وَعَنِ الْحَسَنِ بْنِ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: حَفِظْتُ مِنْ رَّسُوْلِ اللهِ صلى الله عليه وسلم: “دَعْ مَا يُرِيْبُكَ إِلَى مَا لَا يُرِيْبُكَ فَإِنَّ الصِّدْقَ طُمَأنِيْنَةٌ وَإِنَّ الْكَذِبَ رِيْبَةٌ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَرَوَى الدَّارَمِيُّ اَلْفَصْلُ الْأَوَّلُ.

2773. (15) [2/845దృఢం]

‘హసన్‌ బిన్‌ ‘అలీ (ర) కథనం: నేను ప్రవక్త (స) ద్వారా ఈ విషయాల్ని కంఠస్తం చేసుకున్నాను, ”అనుమానాస్పదంగా ఉన్న వాటిని వదలివేయండి. స్పష్టంగా ఉన్న వాటిని అనుసరించండి. సత్యం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. అసత్యం, దురాలోచనల వల్ల అనుమానం కలుగుతుంది.” [9] (అ’హ్మద్‌, తిర్మిజి’, నసాయి’, దారమి)

2774 – [ 16 ] ( لم تتم دراسته ) (2/845)

وَعَنْ وَّابِصَةَ بْنِ مَعْبَدٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “يَا وَابِصَةُ جِئْتَ تَسْأَلُ عَنِ الْبَرِّ وَالْإِثْمِ؟” قُلْتُ: نَعَمْ. قَالَ: فَجَمَعَ أَصَابِعَهُ فَضَرَبَ صَدْرَهُ وَقَالَ: “اسْتَفْتِ نَفْسَكَ اسْتَفْتِ قَلْبَكَ “ثَلَاثًا” اَلْبِرُّ مَا أَطْمَأَنتْ إِلَيْهِ النَّفْسُ وَاطْمَأَنَّ إِلَيْهِ الْقَلْبُ وَالْإِثْمُ مَا حَاكَ فِيْ النَّفْسِ وَ تَرَدَّدَ فِيْ الصَّدْرِ وَإِنْ إِفْتَاكَ النَّاسُ”. رَوَاهُ أَحْمَدُ وَالدَّارِمِيُّ

2774. (16) [2/845అపరిశోధితం]

వాబి’సహ్ బిన్‌ మ’అబద్‌ (ర) కథనం: ప్రవక్త (స) నాతో ”ఓ వాబి’సహ్! నీవు పాపపుణ్యాల గురించి తెలుసుకోవడానికి వచ్చావు.” నేను, ‘అవును,’ అని అన్నాను. అది విని ప్రవక్త (స), ‘తన వేళ్ళను కలిపి పిడికిలితో నా గుండెపై కొట్టి నీవు నీ హృదయాన్ని అడుగు.’ ఇలా మూడుసార్లు అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స), ‘నీ మనస్సుకు సంతృప్తినిచ్చేది పుణ్య కార్యం, నీ మనస్సు సంకోచానికి గురిఅయ్యేదే పాపం. ప్రజలు దాన్ని ధర్మసమ్మతమని చెప్పినా సరే.” (అ’హ్మద్‌, దారమి)

2775 – [ 17 ] ( حسن ) (2/845)

وَعَنْ عَطِيَّةَ السَّعْدِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَبْلُغُ الْعَبْدُ أَنْ يَّكُوْنَ مِنَ الْمُتَّقِيْنَ حَتَّى يَدَعَ مَا لَا بَأْسَ بِهِ حَذَرًا لِمَا بِهِ بَأْسٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

2775. (17) [2/845ప్రామాణికం]

‘అతియ్య స’అదీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దాసుడు నిషిద్ధ వస్తువుల నుండి దూరంగా ఉండే ప్రయత్నంలో అనుమతించబడిన వాటిని కూడా వదలి వేయనంత వరకు దైవభీతిపరునిగా పరిగణించ బడడు. [10]   (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

2776 – [ 18 ] ( لم تتم دراسته ) (2/846)

وَعَنْ أَنَسٍ قَالَ: لَعَنَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ الْخَمْرِ عَشْرَةً: عَاصِرَهَا وَمُعْتَصِرَهَا وَشَارِبَهَا وَحَامِلَهَا وَالْمَحْمُوْلَةَ إِلَيْهِ وَسَاقِيهَا وَبَائِعَهَا وَآكِلَ ثَمَنِهَا وَالْمُشْتَرِيَ لَهَا وَالْمُشْتَرِىَ لَهُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

2776. (18) [2/846అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: మత్తుపానీయాల విషయంలో ప్రవక్త (స) 10 మందిని శపించారు. 1. ద్రాక్ష మరియు పండ్ల నుండి మత్తుపానీయంకొరకు రసం తీసేవాడు. 2. మత్తు పానీయం కొరకు రసం తీయించేవాడు. 3. మత్తు పానీయం తాగేవారు. 4. మత్తు పానీయం ఎత్తేవారు. 5. ఎవరి గురించి మత్తు పానీయం ఎత్త బడిందో వారు, 6. మత్తుపానీయం త్రాపించే వారు. 7. మత్తు పానీయం అమ్మేవారు, 8. మత్తు పానీయం సంపాదనను తినేవారు, 9. మత్తు పానీయం కొనేవారు, 10. ఎవరి గురించి కొనడం జరిగిందో వారు. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

2777 – [ 19 ] ( صحيح ) (2/846)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَعَنَ اللهُ الْخَمْرَ وَشَارِبَهَا وَسَاقِيَهَا وَبَائِعَهَا وَمُبْتَاعَهَا وَعَاصِرَهَا وَمُعْتَصِرَهَا وَحَامِلَهَا وَالْمَحْمُوْلَةَ إِلَيْهِ”.  رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

2777. (19) [2/846-దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్‌(త) మత్తుపానీయాన్ని, మత్తు పానీయం త్రాగేవారిని, మత్తుపానీయం త్రాపించేవారిని, మత్తు పానీయం అమ్మే వారిని, మత్తు పానీయం కొనేవారిని, మత్తు పానీయం కొరకు పళ్ళరసం తీసేవారిని, తీయించే వారిని, మత్తుపానీయాన్ని ఎత్తేవారిని, ఎవరి కొరకు తీసుకు వెళ్ళ బడుతుందో వారిని శపించాడు. (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

2778 – [ 20 ] ( لم تتم دراسته ) (2/846)

وَعَنْ مُحَيْصَةَ أَنَّهُ اِسْتَأْذَنَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فِيْ أُجْرَةِ الْحَجَّامِ فَنَهَاهُ فَلَمْ يَزَلْ يَسْتَأْذِنُهُ حَتَّى قَالَ: “اِعْلِفْهُ نَاضِحَكَ وَأَطْعِمْهُ رَقِيْقَكَ”. رَوَاهُ مَالِكٌ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

2778. (20) [2/846అపరిశోధితం]

ము’హయ్యసహ్ (ర) కథనం: అతను ప్రవక్త (స)ను కొమ్ముచికిత్సకు ప్రతిఫలం అనుమతికోరారు. అంటే, ‘కొమ్ము చికిత్సకు ప్రతిఫలం తీసుకోవడం, ఇవ్వడం, తినడం ధర్మసమ్మతమా కాదా?’ అని ప్రశ్నించారు. ప్రవక్త (స) వరుసగా వారిస్తూ ఉన్నారు. చివరికి ప్రవక్త (స), ”దాని ప్రతిఫలం నీ ఒంటెకు తినిపించు లేదా బానిసకు ఇచ్చివేయి,” అని అన్నారు. [11] (తిర్మిజి’, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

 2779 – [ 21 ] ( لم تتم دراسته ) (2/846)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ ثَمَنِ الْكَلْبِ وَكَسْبِ الزَّمَّارَةِ. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.

2779. (21) [2/846అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) కుక్క వెలను, వ్యభిచారం, నృత్యం చేసే స్త్రీ ప్రతిఫలం తీసుకోవటాన్ని నిషేధించారు. (షర’హ్ సున్నహ్‌)

2780 – [ 22 ] ( لم تتم دراسته ) (2/846)

وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَبِيْعُوْا الْقَيْنَاتِ وَلَا تَشْتَرُوْهُنَّ وَلَا تُعَلِّمُوْهُنَّ وَثَمَنُهُنَّ حَرَامٌ وَفِيْ مِثْلِ هَذَا نَزَلَتْ:(وَمِنَ النَّاسِ مَنْ يَّشْتَرِيْ لَهُوَ الْحَدِيْثِ- 6:  31) رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَعَلِيُّ بْنُ يَزِيْدٍ الرَّوِايُّ يُضَعَّفُ فِيْ الْحَدِيْثِ.

 وَسَنَذْكُرُ حَدِيْثَ جَابِرٍ: نَهَى عَنْ أَكْلِ الْهِرِّ فِيْ بَابِ مَا يَحِلُّ أَكْلُهُ”. إِنْ شَاءَ اللهُ تَعَالى.

2780. (22) [2/846అపరిశోధితం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, పాటలు పాడే బానిసరాళ్ళను కొనకండి. అమ్మకండి. వారి వ్యాపారం కూడా చేయకండి. వారికి పాడటం కూడా నేర్పకండి. ఇటువంటి బానిసరాళ్ళకు ధర ఇవ్వటం నిషిద్ధం. దీన్ని గురించే ఈ ఆయతు అవతరించింది. ”అంటే కొందరు కాలక్షేపం, ఆటపాటల వస్తువులు కొంటారు.” [12] (సూ. అల్- అన్ఆమ్, 6:31) (అ’హ్మద్‌, తిర్మిజి’ – ఏకోల్లేఖనం-అలీ బిన్ య’జీద్ బలహీన కథకుడు, ఇబ్నె మాజహ్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

2781 – [ 23 ] ( ضعيف ) (2/847)

عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “طَلَبُ كَسْبِ الْحَلَالِ فَرِيْضَةٌ بَعْدَ الْفَرِيْضَةِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

2781. (23) [2/847బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ధర్మబద్ధంగా సంపాదించడం అల్లాహ్‌ విధుల తర్వాత తప్పనిసరి విధి. [13] (బైహఖీ-షుఅబిల్ ఈమాన్)

2782 – [ 24 ] ( لم تتم دراسته ) (2/847)

وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا أَنَّهُ سُئِلَ عَنْ أُجْرَةِ كِتَابَةِ الْمُصْحَفِ. فَقَالَ: لَا بَأْسَ إِنَّمَا هُمْ مُصَوِّرُوْنَ وَإِنَّهُمْ إِنَّمَا يَأْكُلُوْنَ مِنْ عَمَلِ أَيْدِيْهِمْ. رَوَاهُ رَزِيْنٌ.

2782. (24) [2/847అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) ను ఖుర్‌ఆన్‌ వ్రాసేవారిని ప్రతి ఫలం ఇచ్చి పుచ్చుకునే దాన్ని గురించి ప్రశ్నించడం జరిగింది. అంటే, ‘ఖుర్‌ఆన్‌ వ్రాసిన వారికి ప్రతిఫలం ఇవ్వ వచ్చునా, తీసుకో వచ్చునా,’ అని ప్రశ్నించడం జరిగింది. ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) సమాధానం ఇస్తూ, ‘ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే వ్రాసేవారు దానికి లిఖిత రూపం ఇస్తున్నారు. తమ చేతి సంపాదన తింటున్నారు,’ అని అన్నారు. (ర’జీన్‌)

2783 – [ 25 ] ( لم تتم دراسته ) (2/847)

وَعَنْ رَافِعِ بْنِ خُدَيْجٍ قَالَ: قِيْلَ: يَا رَسُوْلَ اللهِ أَيُّ الْكَسْبِ أَطْيَبُ؟ قَالَ: “عَمَلُ الرَّجُلِ بِيَدِهِ وَكُلُّ بَيْعٍ مَّبْرُوْرٍ”. رَوَاهُ أَحْمَدُ.

2783. (25) [2/847అపరిశోధితం]

రా’ఫె బిన్‌ ‘ఖదైజ్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను ఏ సంపాదన అన్నిటికంటే పరిశుద్ధమైనదని ప్రశ్నించడం జరిగింది. ప్రవక్త (స) సమాధానం ఇస్తూ మనిషి తన చేత్తో సంపాదించి తినటం, దగా మోసం లేని వ్యాపారం,” అని అన్నారు. [14] (అ’హ్మద్‌)

2784 – [ 26 ] ( لم تتم دراسته ) (2/847)

وَعَنْ أَبِيْ بَكْرِ بْنِ أَبِيْ مَرْيَمَ قَالَ : كَانَتْ لِمِقْدَامِ بْنِ مَعْدِيْ كَرِبَ جَارِيَةٌ تَبِيْعُ اللَّبَنَ وَيَقْبِضُ الْمِقْدَامُ ثَمَنَهُ فَقِيْلَ لَهُ : سُبْحَانَ اللهِ أَتَبِيْعُ اللَّبَنَ ؟ وَتَقْبِضُ الثَّمَنَ ؟ فَقَالَ نَعَمْ وَمَا بَأْسَ بِذَلِكَ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ : ” لَيَأْتِيَنَّ عَلَى النَّاسِ زَمَانٌ لَا يَنْفَعُ فِيْهِ إِلَّا الدِّيْنَارُ وَالدِّرْهمُ ” . رَوَاهُ أَحْمَدُ.

2784. (26) [2/847అపరిశోధితం]

అబూ బకర్‌ బిన్‌ అబూ మర్యమ్‌ (ర) కథనం: మిఖ్‌దామ్‌ బిన్‌ మ’అదీ కర్‌బ్‌కు ఒక బానిసరాలు ఉండేది. అతని పాలు అమ్మేది. మిఖ్‌దామ్‌ బిన్‌ మ’అదీ కర్‌బ్‌ వాటి డబ్బు వసూలు చేసేవారు. మిఖ్‌దామ్‌ను, ‘సుబ్‌హానల్లాహ్‌ మీబానిసరాలు పాలు అమ్ముతుంది, మీరు వాటి డబ్బులు వసూలు చేస్తున్నారు,’ అని అనడం జరిగింది. దానికి మిఖ్‌దామ్‌ ”అవును ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ‘ప్రజలపై ఒక కాలం రాబోతోంది. ఆ కాలంలో దీనార్లు, దిర్‌హమ్‌లు తప్ప మరేమీ లాభం చేకూర్చలేవు, ‘ ” అని అన్నారు. [15] (అ’హ్మద్‌)

2785 – [ 27 ] ( لم تتم دراسته ) (2/848)

وَعَنْ نَافِعٍ قَالَ: كُنْتُ أُجَهِّزُ إِلَى الشَّامِ وَإِلَى مَصْرٍ فَجَهَّزْتُ إِلَى الْعِرَاقِ فَأَتَيْتُ إِلَى أُمُّ الْمُؤْمِنِيْنَ عَائِشَةَ فَقُلْتُ لَهَا: يَا أُمَّ الْمُؤْمِنِيْنَ كُنْتُ أُجْهِّزُ إِلَى الشَّامِ فَجَهَّزْتُ إِلَى الْعِرَاقِ. فَقَالَتْ: لَا تَفْعَلْ مَالَكَ وَلِمُتَّجَرِكَ؟ فَإِنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِذَا سَبَّبَ اللهُ لِأَحَدِكُمْ رِزْقًا مِّنْ وَجْهِ فَلَا يَدَعْهُ حَتَّى يَتَغَيَّرَ لَهُ أَوْ يَتَنَكَّرَ لَهُ”. رَوَاهُ أَحْمَدُ وَابْنُ مَاجَهُ.

2785. (27) [2/848అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: నేను సిరియా మరియు ఈజిప్టు దేశాలకు వ్యాపారసామగ్రిని తీసుకొని వెళ్ళి, అక్కడ అమ్మేవాడిని, కొనేవాడిని. ఆ తరువాత ‘ఇరాఖ్‌ దేశం సరకు తీసుకువెళ్ళి అక్కడ వ్యాపారం ప్రారంభించి, సిరియా, ఈజిప్టు వెళ్ళడం మాని వేద్దామని అనుకొని సంప్రదించడానికి ‘ఆయి’షహ్‌ (ర) వద్దకు వెళ్ళాను. ఆమెతో, ”ఇంతవరకు నేను సిరియా ఈజిప్టులకు వ్యాపారసరకు తీసుకొని వెళ్ళేవాడిని, ఇప్పుడు వ్యాపారసామగ్రి తీసుకొని ఇరాఖ్‌ వెళ్ళి, అక్కడ వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను,” అని విన్నవించుకున్నారు. దానికి ‘ఆయి’షహ్‌ (ర), ”మీరు అలా చేయకండి, అసలు మీ వ్యాపారానికి ఏమయింది? సిరియా, ఈజిప్టు వ్యాపారం ఎందుకు వదులుతున్నారు? ఇంకా నేనుప్రవక్త (స)ను, ‘అల్లాహ్‌ (త) మీ కోసం ఉపాధి మార్గం సుగమం చేస్తే, అందులో ఏదైనా అంతరాయం, నష్టం కలగనంత వరకు దాన్ని వదలకండి,’ అని ప్రవచించగా విన్నాను,” అని చెప్పారు. [16]  (అ’హ్మద్‌, ఇబ్నె మాజహ్)

2786 – [ 28 ] ( صحيح ) (2/848)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ لِأَبِيْ بَكْرٍ رَضِيَ اللهُ عَنْهُ غُلَامٌ يُّخَرِّجُ لَهُ الْخَرَاجَ فَكَانَ أَبُوْ بَكْرٍ يَأْكُلُ مِنْ خَرَاجِهِ فَجَاءَ يَوْمًا بِشَيْءٍ فَأَكَلَ مِنْهُ أَبُوْ بَكْرٍ. فَقَالَ لَهُ الْغُلَامُ: تَدْرِيْ مَا هَذَا؟ فَقَالَ أَبُوْ بَكْرٍ: وَمَا هُوَ؟ قَالَ: كُنْتُ تَكَهَّنْتُ لِإِنْسَانٍ فِيْ الْجَاهِلِيَّةِ وَمَا أُحْسِنُ الْكُهَانَةَ إِلَّا أَنّي خَدَعْتُهُ فَلَقِيَنِيْ فَأَعْطَانِيْ بِذَلِكَ فَهَذَا الَّذِيْ أَكَلْتَ مِنْهُ. قَالَتْ: فَأَدْخَلَ أَبُوْ بَكْرٍ يَّدَهُ فَقَاءَ كُلَّ شَيْءٍ فِيْ بَطْنِهِ. رَوَاهُ الْبُخَارِيُّ.

2786. (28) [2/848దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: అబూ బకర్‌ (ర) వద్ద ఒక బానిస ఉండేవాడు. ప్రతిరోజూ తాను సంపాదించింది అబూ బకర్‌ (ర) కు తెచ్చి ఇచ్చేవాడు. అబూ బకర్‌ (ర) దాన్ని తినే వారు. ఒకసారి సంపాదించి తెచ్చాడు. అబూ-బకర్‌ అందులో నుండి తిన్నారు. అప్పుడు ఆ బానిస, ‘ఇప్పుడు మీరు తిన్నది ఏమిటో మీకు తెలుసా?’ అని అడిగాడు. దానికి అబూ-బకర్‌, ‘విషయం ఏమిటి?’ అని ప్రశ్నించారు. దానికి ఆ బానిస, ‘అజ్ఞానకాలంలో నేను ఒక వ్యక్తికి ఉత్తినే జ్యోతిష్యం చెప్పాను. నాకు జ్యోతిష్యంరాదు, అంటే జ్యోతిష్కునిలా ఏదో అన్నాను. ఆ వ్యక్తి దానికి ప్రతిఫలం ఇప్పుడు ఇచ్చాడు. మీరు తిన్నది అదే,’ అని అన్నాడు. అది విన్న అబూ-బకర్‌ (ర) నోటిలో వేలు పెట్టి తిన్నదంతా వాంతిచేసారు. [17] (బు’ఖారీ)

2787 – [ 29 ] ( لم تتم دراسته ) (2/848)

وَعَنْ أَبِيْ بَكْرٍ رَضِيَ اللهُ عَنْهُ. أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ:”لَا يَدْخُلُ الْجَنَّةَ جَسَدٌ غُذِيَ بِالْحَرَامٍ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

2787. (29) [2/848అపరిశోధితం]

అబూ-బకర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అధర్మ సంపాదనతో సంరక్షించబడిన శరీరం స్వర్గంలో ప్రవేశించదు.” (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

2788 – [ 30 ] ( لم تتم دراسته ) (2/848)

وَعَنْ زَيْدِ بْنِ أَسْلَمَ أَنَّهُ قَالَ: شَرِبَ عُمَرُ بْنُ الْخَطَّابِ لَبَنًا وَأَعْجَبَهُ وَقَالَ لِلَّذِيْ سَقَاهُ: مِنْ أَيْنَ لَكَ هَذَا اللَّبَنُ؟ فَأَخْبَرَهُ أَنَّهُ وَرَدَ عَلَى مَاءٍ قَدْ سَمَّاهُ فَإِذَا نَعَمٌ مِّنْ نِعَمِ الصَّدَقَةِ وَهُمْ يَسْقُوْنَ فَحَلَبُوْا لِيْ مِنْ أَلْبَانِهَا فَجَعَلْتُهُ فِيْ سِقَائِيْ وَهُوَ هَذَا فَأَدْخَلَ عُمَرُ يَدَهُ فَاسْتَقَاءَهُ. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ .

2788. (30) [2/848అపరిశోధితం]

‘జైద్‌ బిన్‌ అస్‌లమ్‌ (ర) కథనం: ‘ఉమర్‌ (ర) పాలు త్రాగారు. ఆ పాలు అతనికి కమ్మగా రుచిగా అనిపించింది. పాలు ఇచ్చిన వ్యక్తితో, ‘నువ్వు ఈ పాలు ఎక్కడి నుండి తెచ్చావు,’ అని అడిగారు. ఆ వ్యక్తి, ‘చెరువు లేదా బావి దగ్గరకు వెళ్ళాను. అక్కడ ‘సదఖహ్ ఒంటెలు ఉండేవి. వాటి పాలు తీసి ప్రజలకు త్రాపిస్తున్నారు. నేను కూడా కొన్నిపాలు తీసుకొని వచ్చాను. దాన్నే మీరు ఇప్పుడు త్రాగారు. అవి ‘సదఖహ్ పాలు,’ అని చెప్పాడు. ‘ఉమర్‌ (ర) తన చేతిని నోటిలో వేసి త్రాగిన పాలన్నిటినీ వాంతి ద్వారా తీసివేసారు. (బైహఖీ-షు’అబిల్ఈమాన్‌)

2789 – [ 31 ] ( لم تتم دراسته ) (2/849)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: مَنِ اشْتَرَى ثَوْبًا بِعَشَرَةِ دَرَاهِمَ وَفِيْهِ دِرْهَمٌ حَرَامٌ لَمْ يَقْبَلُ اللهُ لَهُ صَلَاةً مَّا دَامَ عَلَيْهِ ثُمَّ أَدْخَلَ أَصْبَعَيْهِ فِيْ أُذُنَيْهِ وَقَالَ صُمْتًا إِنْ لَّمْ يَكُنِ النَّبِيُّ صلى الله عليه وسلم سَمِعْتُهُ يَقُوْلُهُ. رَوَاهُ أَحْمَدُ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ. وَقَالَ: إِسْنَادُهُ ضَعِيْفٌ.

2789. (31) [2/849అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ”ఒకవేళ ఎవరైనా 10 దిర్‌హమ్‌ల దుస్తులు కొన్ననప్పుడు, వాటిలో 1 దిర్‌హమ్‌ అధర్మ సంపాదన అయితే ఆ  దుస్తులు అతని శరీరంపై ఉన్నంత వరకు అల్లాహ్‌ (త) అతని నమా’జును స్వీకరించడు,” అని చెప్పి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ తన రెండు చేతుల వ్రేళ్ళను తన చెవుల్లో పెట్టుకొని, ఒకవేళ నేను ఈ ‘హదీసు’ను ప్రవక్త (స) ద్వారా వినకుండా ఉంటే, ఈ నా రెండు చెవులు చెవుడుకు గురవుతాయి,’ అని అన్నారు. [18]  (అ’హ్మద్‌, బైహఖీ-షు’అబిల్ ఈమాన్‌ – బలహీన ఆధారాలు) 

=====

2- بَابُ الْمُسَاهِلَةِ فِيْ الْمُعَامِلَاتِ

2. వ్యవహారాల్లో మృదుత్వం

ప్రతి విషయంలో నీతి, నిజాయితీ, సత్యసంధత, ఇంకా సద్ప్రవర్తన సున్నితత్వం మంచిగా మాట్లాడటం కూడా తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే దుర్మార్గులతో, చెడు స్వభావం గల వారితో ప్రజలు ఎటువంటి వ్యవహారం చేయరు. సద్ప్రవర్తన కష్టాలన్నిటినీ సులభతరం చేసివేస్తుంది. అతన్ని అందరూ ప్రేమిస్తారు. ఒక నానుడి ఉంది. ‘మాట మంచిదైతే దేశాన్నే ఏలవచ్చు.’ కొనుగోలు దారులతో సున్నితత్వంతో వినయ వినమ్రతలతో సహనం ఓర్పులతో ప్రవర్తించాలి. దీన్నే ముసాహలత్ అంటారు. అంటే చూడనట్టు ప్రవర్తించాలి. కొనుగోలు దారు ఒకవేళ ఉద్దేశ్యపూర్వకంగా లేదా మరచి చెల్లని నాణాలు ఇచ్చినా కళ్ళు మూసుకొని తీసుకోవాలి. ఇది కూడా ఒక రకమైన సత్కార్యమే. దీన్ని గురించి క్రింది ‘హదీసు’ల్లో పేర్కొనడం జరిగింది.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

2790 – [ 1 ] ( صحيح ) (2/850)

عَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: رَحِمَ اللهُ رَجُلًا سَمْحًا إِذَا بَاعَ وَإِذَا اشْتَرَى وَإِذَا اقْتَضَى. رَوَاهُ الْبُخَارِيُّ.

2790. (1) [2/850దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అమ్మి నపుడు, కొన్నపుడు, అడిగినపుడు సున్నితంగా ప్రవర్తించే వ్యక్తిని అల్లాహ్‌ (త) కరుణించు గాక! [19] (బు’ఖారీ)

2791 – [ 2 ] ( متفق عليه ) (2/850)

وَعَنْ حُذَيْفَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ رَجُلًا كَانَ فِيْمَنْ قَبْلَكُمْ أَتَاهُ الْمُلْكُ لِيَقْبِضَ رُوْحَهُ. فَقِيْلَ لَهُ: هَلْ عَلِمْتَ مِنْ خَيْرٍ؟ قَالَ: مَا أَعْلَمُ. قِيْلَ لَهُ: اُنْظُرْ. قَالَ: مَا أَعْلَمُ شَيْئًا غَيْرَ أَنِّيْ كُنْتُ أُبَايِعُ النَّاسَ فِي الدُّنْيَا وَأُجَازِيْهِمْ فَأَنْظِرُ الْمُوْسِرَ وَأَتَجَاوَزُ عَنِ الْمُعْسِرِ فَأَدْخَلَهُ اللهُ الْجَنَّةَ”.

2791. (2) [2/850ఏకీభవితం]

హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, పూర్వీకుల్లో ఒక వ్యక్తి ఉండేవాడు. మరణదూత అతని వద్దకు ప్రాణం తీయడానికి వచ్చాడు. ఆ వ్యక్తితో, ‘నీవేదైనా సత్కార్యం చేసి ఉన్నావా?’ అని ప్రశ్నించాడు. దానికి ఆ వ్యక్తి, ‘నాకు గుర్తులేదు,’ అని అన్నాడు. ఆ వ్యక్తితో, ‘నువ్వు బాగా ఆలోచించు. ఏదైనా గుర్తుకు రావచ్చు,’ అని అనటం జరిగింది. ఆ వ్యక్తి మళ్ళీ, ‘నాకు గుర్తుకు రావటం లేదు, అయితే నాకు కేవలం ఈ మాత్రం గుర్తుంది. అదేమిటంటే నేను అమ్మినపుడు కొన్నపుడు వారి పట్ల మంచిగా ప్రవ ర్తించే వాడిని. వారికి ఉపకారం చేసేవాడిని. నేను అడిగి నపుడు మంచి స్థితిలో ఉన్న వ్యక్తికి కూడా మరికొంత వ్యవధి ఇచ్చే వాడిని. కష్టాల్లో ఉన్నవాడిని క్షమించే వాడిని.’ అల్లాహ్‌ (త) ఆ సత్కార్యం ద్వారా ఆ వ్యక్తిని స్వర్గంలోకి పంపాడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

2792 – [ 3 ] ( صحيح ) (2/850)

وَفِيْ رِوَايَةٍ لِّمُسْلِمٍ نَحْوَهُ عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ وَأَبِيْ مَسْعُوْدِ الْأَنْصَارِيِّ: “فَقَالَ اللهُ أنَا أَحَقُّ بذَا مِنْكَ تَجَاوَزُوْا عَنْ عَبْدِيْ”.

2792. (3) [2/850దృఢం]

ముస్లిమ్ లోని మరొక ‘ఉఖ్బహ్ బిన్ ‘ఆమిర్ మరియు అబూ మస్’ఊద్ కథనాల్లో ఇలా ఉంది: ”ఆ మాటలు విని అల్లాహ్‌ (త) నాకు నీకంటే క్షమించే గుణం అధికంగా ఉంది. ‘ఓ దైవదూతలారా! ఇతన్ని క్షమించండి. కఠినంగా ప్రవర్తించకండి,’ ” అని ఆదేశించాడు. (ముస్లిమ్‌)

2793 – [ 4 ] ( صحيح ) (2/850)

وَعَنْ أَبَيْ قَتَادَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِيَّاكُمْ وَ كَثْرَةَ الْحَلْفِ فِيْ الْبَيْعِ فَإِنَّهُ يَنْفُقُ ثُمَّ يَمْحَقُ”. رَوَاهُ مُسْلِمٌ.

2793. (4) [2/850దృఢం]

అబూ ఖతాదహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అమ్మేటపుడు, కొనేటపుడు ఎల్లపుడూ ప్రమాణాలు చేయకండి, ఎందుకంటే ప్రమాణం సరకును అమ్మి వేస్తుంది, కాని దాని శుభాన్ని చెరిపివేస్తుంది. [20] (ముస్లిమ్‌) 

2794 – [ 5 ] ( متفق عليه ) (2/850)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَلْحَلْفُ مَنْفَقَةٌ لِلّسَّلْعَةِ مُمْحِقَةٌ لِلّبَرَكَةِ”.

2794. (5) [2/850ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”అధికంగా ప్రమాణాలు చేయటం వల్ల సరకు అమ్ముడవుతుంది. కాని శుభం నశిస్తుంది. [21] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2795 – [ 6 ] ( صحيح ) (2/850)

وَعَنْ أَبِيْ ذَرٍّ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “ثَلَاثَةٌ لَا يُكَلِّمُهُمُ اللهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يَنْظُرُ إِلَيْهِمْ وَلَا يُزَكِّيْهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيْمٌ”. قَالَ أَبُوْ ذَرٍّ: خَابُوْا وَخَسِرُوْا مَنْ هُمْ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “اَلْمُسْبِلُ وَالْمَنَّانُ وَالْمُنَفِّقُ سِلْعَتهُ بِالْحِلْفِ الْكَاذِبِ” .رَوَاهُ مُسْلِمٌ .

2795. (6) [2/850దృఢం]

అబూ-జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పు దినం నాడు ముగ్గురు వ్యక్తుల పట్ల అల్లాహ్‌ (త) ఆగ్రహంతో, వారితో మాట్లాడడు, వారివైపు చూడడు, వారిని పాపాల నుండి పరిశుద్ధపరచడు. వారి కొరకు కఠిన శిక్ష ఉంటుంది. ఈ ‘హదీసు’ కథకుడు, అబూ-జ’ర్‌ (ర), ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ఈ నష్టపోయే దురదృష్టవంతులు ఎవరు’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), 1. అహంకారం వల్ల చీల మండల క్రింద వరకు తన పైజామాను వ్రేలాడగట్టే వాడు, 2. ఉపకారం చేసి ఎత్తి పొడిచే వాడు, 3. అసత్య ప్రమాణంచేసి తన సరకును అమ్మే వాడు అని ప్రవచించరు. (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ    రెండవ విభాగం 

2796 – [ 7 ] ( ضعيف ) (2/851)

عَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “التَّاجِرُ الصُّدُوْقُ الْأَمِيْنُ مَعَ النَّبِيِّيْنَ وَالصِّدِّيْقِيْنَ وَالشُّهَدَاءِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَقُطْنِيْ .

2796. (7) [2/851బలహీనం]

అబూ-స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, నీతీ నిజాయితీ గల వ్యాపారి తీర్పుదినం నాడు ప్రవక్తల, సత్యవంతుల, అమరవీరుల సహవాసంలో ఉంటాడు. (తిర్మిజి’, దారు ఖుత్నీ)

2797 [ 8 ] ( ضعيف ) (2/851)

وَرَوَاهُ ابْنُ مَاجَهُ عَنِ ابْنِ عُمَرَ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

2797. (8) [2/851బలహీనం]

ఇబ్నె-మాజహ్, దారు-ఖుతునీ ఈ ‘హదీసు’ను, ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ ద్వారా ఉల్లాఖించారు. (తిర్మిజీ’ – ఏకోల్లేఖనం).

2798 – [ 9 ] ( صحيح ) (2/851)

وَعَنْ قَيْسِ بْنِ أَبِيْ غَرْزَةَ قَالَ: كُنَّا نُسَمَّى فِيْ عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم السَّمَاسِرَةَ. فَمَرَّ بِنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَسَمَّانَا بِاسْمِ هُوَ أَحْسَنُ مِنْهُ. فَقَالَ: “يَا مَعْشَرَ التُّجَّارِ إِنَّ الْبَيْعَ يَحْضُرُهُ اللَّغْوُ وَالْحَلْفُ فَشُوْبُوْهُ بِالصَّدَقَةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ .

2798. (9) [2/851దృఢం]

ఖైస్‌ బిన్‌ అబూ ‘గర్’జహ్ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో మేము వ్యాపారులము, సమాసిరహ్ ‘ అని పిలువబడే వారం. అంటే మమ్మల్ని తాజిర్‌ అన కుండా సమాసిరహ్ అనేవారు. దీని అర్థం దలాల్ (ఏజంటు). ఒకసారి ప్రవక్త (స) మా ప్రక్క నుండి వెళుతూ మాకు ఒక మంచి పేరు పెట్టారు. ఇంకా ఇలా అన్నారు, ”ఓ వ్యాపార సంఘ ప్రతినిధులారా! మీ వ్యాపారంలో వ్యర్థ ప్రేలాపనలు, అశ్లీల పలుకులు, అసత్య ప్రమాణాలు జరుగుతూ ఉంటాయి. కనుక మీరు దాన ధర్మాలను కూడా చేర్చుకోండి. అంటే వ్యాపార సరకుల్లో నుండి దానధర్మాలు చేస్తూ ఉండండి. అవి మీ పాపాలకు పరిహారంగా పనికి వస్తాయి.” (అబూ-దావూద్‌, తిర్మిజి’, నసాయి’, ఇబ్నె-మాజహ్)

2799 – [ 10 ] ( ضعيف ) (2/851)

وَعَنْ عُبَيْدِ بْنِ رَفَاعَةَ عَنْ أَبِيْهِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “التُّجَارُ يَحْشَرُوْنَ يَوْمَ الْقِيَامَةِ فُجَّارًا إِلَّا مَنِ اتْقَى وَبَرَّ وَصَدَقَ”  .رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ .و الدارمي.

2799. (10) [2/851బలహీనం]

‘ఉబైద్‌ బిన్‌ రఫా’అహ్ (ర) తన తండ్రిగారి ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు వ్యాపారులను అవిధేయులు, పాపాత్ములు, దుర్మా ర్గుల సహవాసంలో లేపడం జరుగుతుంది. కాని దైవ భీతితో, సత్కార్యాలు చేస్తూ, సత్యం పలికే వ్యాపా రులు తప్ప. (తిర్మిజి’, ఇబ్నె-మాజహ్, దారమి)

2800 – [ 11 ] ? (2/852)

وروى البيهقي في شُعَبِ الْإِيْمَانِ عَنِ الْبَرَاءِ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ .

2800. (11) [2/852?]

బరా (ర) కథనం: నీతినిజాయితీ గల వ్యాపారులు ప్రవక్తల సహవాసంలో, అవినీతిపరులైన వ్యాపారులు దుర్మార్గుల, నీచుల, పాపాత్ముల సహవాసంలో లేప బడతారు. (బైహఖీ-షు’అబిల్ ఈమాన్, తిర్మిజి’ – ప్రామాణికం – దృఢం)

—–

هَذَا الْبَابُ خَالٍ مِّنَ الْفَصْلِ الثَّالِثُ.

ఈ అధ్యాయంలో మూడవ విభాగం లేదు.

=====

3- بَابُ الْخِيَارِ

3. వ్యవహారంలో స్వేచ్ఛాధికారం

రెండు వస్తువుల్లో మంచిదాన్ని ఎంచుకోవటాన్ని ఖియార్ లేదా ఇ’ఖ్తియార్  అంటారు. వ్యాపారంలో అమ్మేవారికి, కొనేవారికి ఒక్కోసారి ఎంచుకునే అవసరం ఏర్పడుతుంది. ఇవి నాలుగు రకాలు: 1. ఖియారె మజ్లిస్‌, 2. ఖియారె రూయత్, 3. ఖియారె ‘ఐబ్‌, 4. ఖియారె షర్‌’త్‌.

1. ఖియారె మజ్లిస్‌: అంటే అమ్మేవారు, కొనేవారు ఒకే సమావేశంలో ఉంటే వారు అమ్మడం, కొనడం జరిగి ఉన్నా, దాన్ని తిరిగి ఇచ్చివేయవచ్చు. అమ్మిన వారు తిరిగి ఆ వస్తువును తీసుకొని, అతని సొమ్ము తిరిగి ఇచ్చివేయ వచ్చు. అంటే ఆ సమావేశంలో ఇద్దరికీ బేరాన్ని రద్దుచేసుకునే అధి కారం ఉంది. క్రింది ‘హదీసు’లో ఇలాగే ఉంది.

2. ఖియారె రూయత్: ఎవరైనా చూడకుండా వస్తువును కొంటే, ఈ వ్యవహారం ధర్మసమ్మతమే. కాని చూచిన తరువాత తీసుకునే, లేదా తిరిగి ఇచ్చివేసే అధికారం అతనికి ఉంది. దీన్ని ‘ఖియారె రూయత్ అంటారు.

3. ఖియారెఐబ్: ఒకవేళ కొన్న తరువాత వస్తువులో లోపం కనబడితే, లోపంవల్ల వస్తువును తిరిగి ఇచ్చే అధికారం ఉంది. దీన్ని ‘ఖియారె ‘ఐబ్ అంటారు. అమ్మినవారు కూడా లోపాన్ని బయటపెట్టి అమ్మాలి. లోపం చూపకుండా అమ్మితే పాపానికి గురవుతాడు. ప్రవక్త (స) ప్రవచనం: ”లోపం ఉన్న వస్తువును లోపం చూపకుండా అమ్మినవాడు  దైవాగ్రహానికి గురిఅవుతాడు. ఎల్లప్పుడూ దైవదూతలు శపిస్తూ ఉంటారు.” (ఇబ్నె మాజహ్)

4. ఖియారె షర్‌’త్‌: ఒకవేళ కొన్నప్పుడు తీసుకోవడం, తీసుకోక పోవడం నా ఇష్టం అని షరతు పెట్టాలి. దీన్ని ‘ఖియారె షర్‌’త్‌ అంటారు. ఇది ధర్మసమ్మతం. కొందరివద్ద ఇది మూడు రోజుల వరకు ఉంది. పరిశోధకుల వద్ద నిర్ణీత వ్యవధి లేదు. ఇదే సరైనది. తిర్మిజి’లో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ఒక పల్లెవాసికి అమ్మిన తరువాత, అతనికి కొనే, కనుగోలు రద్దుచేసే అనుమతి ఇచ్చారు.”

—–

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం   

2801 – [ 1 ] ( متفق عليه ) (2/853)

عَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمُتَبَايِعَانِ كُلُّ وَاحِدًّ مِّنْهُمَا بِالْخِيَارِ عَلَى صَاحِبِهِ ما لَمْ يَتَفَرَّقَا إِلَّا بَيْعَ الْخِيَارِ”.

وَفِيْ رِوَايَةٍ لِّمُسْلِمٍ: “إِذَا تَبَايَعَ الْمُتَبَايِعَانِ فَكُلُّ وَاحِدٍ مِّنْهُمَا بِالْخِيَارِ مِنْ بَيْعِهِ مَا لَمْ يَتَفَرَّقَا أَوْ يَكُوْنَ بَيْعُهُمَا عَنْ خِيَارٍ فَإِذَا كَانَ بَيْعُهُمَا عَنْ خَيَارٍفَقَدْ وَجَبَ”.

وَفِيْ رِوَايَةٍ لِلِّتِّرْمِذِيِّ: “اَلْبَيِّعَانِ بِالْخِيَارِمَا لَمْ يَتَفَرَّقَا أَوْ يَخْتَارَا”.

وَفِيْ الْمُتَّفَقِ عَلَيْهِ: “أَوْ يَقُوْلُ أَحَدُهُمَا لِصَاحِبِهِ: اخْتَر”بَدَلَ”. أَوْ يَخْتَارَا”.

2801. (1) [2/853ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అమ్మేవారికి కొనే వారికి ఇద్దరికీ అధికారం ఉంది. ఆ బేరాన్ని కొనసాగించినా, రద్దుచేయాలను కున్నా. అయితే ఇద్దరూ ఒకే సమావేశంలో ఉండాలి వేరవకూడదు. అయితే స్వేచ్ఛా వ్యాపారం ) బై ఇ’ఖ్‌తియార్‌)లో అధికారంఉంటుంది. [22] (బు’ఖారీ, ముస్లిమ్)

ముస్లిమ్‌ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”అమ్మేవారు కొనేవారు ఇద్దరూ ఒకే సమావేశంలో ఉంటే విడిపో నంత వరకు వారి వ్యవహారంలో ఇద్దరి స్వేచ్ఛ తప్పని సరి అవుతుంది.

తిర్మిజిలోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ఇద్దరూ వేరవనంత వరకు అమ్మేవారికి, కొనేవారికి స్వేచ్ఛ ఉంటుంది.

బు’ఖారీ, ముస్లిమ్‌లలోని కొన్ని ఉల్లేఖనాల్లో ఇ’ఖ్‌తారకు బదులు ఇ’ఖ్‌తర్‌ అని ఉంది. పదాల తేడా ఉంది. అర్థం ఒక్కటే.

2802 – [ 2 ] ( متفق عليه ) (2/853)

وَعَنْ حَكِيْمِ بْنِ حِزَامٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْبَيِّعَانِ بِالْخِيَارِمَا لَمْ يَتَفَرَّقَا. فَإِنْ صَدَقَا وَبَيَّنَا بُوْرِكَ لَهُمَا فِيْ بَيْعِهِمَا وَإِنْ كَتَمَا وَكَذَبَا مُحِقَتْ بَرَكَةُ بَيْعِهِمَا”.

2802. (2) [2/853ఏకీభవితం]

‘హకీమ్‌ బిన్‌ ‘హి’జామ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అమ్మేవారికి కొనేవారికి ఆ సమావేశం నుండి వేరుకానంత వరకు అధికారం ఉంది. ఒకవేళ ఇద్దరూ సత్యం పలికితే, తమ వస్తువులోపాన్ని బహిర్గతంచేస్తే వారి వ్యాపారంలో శుభం కలుగుతుంది. ఒక వేళ ఇద్దరూ లోపాలను కప్పిపుచ్చి, అసత్యం పలికితే వారి వ్యాపారంలో శుభం ఉండదు. [23]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

2803 – [ 3 ] ( متفق عليه ) (2/853)

وَعَنِ ابْنِ عُمَرَقَالَ: قَالَ رَجُلٌ لِلنَّبِيِّ صلى الله عليه وسلم إِنِّيْ أُخْدَعُ فِيْ الْبُيُوْعِ فَقَالَ: “إِذَا بَايَعَتْ فَقُلْ: لَاخِلَابَةَ” .فَكَانَ الرَّجُلُ يَقُوْلُهُ . متفق عليه.

2803. (3) [2/853-ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ఒక వ్యక్తి ప్రవక్త (స)తో, ‘నేను అమ్మటంలో కొనటంలో మోస పోతున్నాను,’ అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు ఏదైనా అమ్మితే ఇందులో ఎలాంటి మోసంలేదని చెప్పు,’ అని అన్నారు. ఆ వ్యక్తి అలాగే అనేవాడు. [24] (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ      రెండవ విభాగం

2804 – [ 4 ] ( حسن ) (2/854)

عَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “اَلْبَيِّعَانِ بِالْخِيَارِمَا لَمْ يَتَفَرَّقَا إِلَّا أَنْ يَّكُوْنَ صَفْقَةَ خِيَارٍ وَلَا يَحِلُّ لَهُ أَنْ يُّفَارِقَ صَاحِبُهُ خَشْيَةَ أَنْ يَّسْتَقِيْلَهُ”.  رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ

2804. (4) [2/854ప్రామాణికం]

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ (ర) తన తండ్రి ద్వారా, ఆయన తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అమ్మేవారికీ, కొనేవారికీ సమావేశం నుండి వేరు కానంత వరకు అధికారం ఉంటుంది. అయితే ప్రత్యేక వ్యవహారంలో మాత్రమే అధికారం ఉంటుంది. అందువల్ల వ్యవహారం అవగానే రెండవ వ్యక్తికి వ్యవహారం రద్దు చేసేహక్కు ఉండకూడదని వెంటనే సమావేశం నుండి వెళ్ళడానికి లేచి నిలబడటం ధర్మసమ్మతం కాదు.” [25]  (తిర్మిజి’, అబూ-దావూద్‌, నసాయి’)

2805 – [ 5 ] ( لم تتم دراسته ) (2/854)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا يَتَفَرَّقَنَّ إِثْنَانِ إِلَّا عَنْ تَرَاضٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2805. (5) [2/854అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, కొనేవారు అమ్మేవారు వేరవకముందు వ్యవహారంపై ఇద్దరూ సంతృప్తి చెందాలి . [26] (అబూ-దావూద్‌)

—–

الْفَصْلُ الثَّالِثُ    మూడవ విభాగం  

2806 – [ 6 ] ( لم تتم دراسته ) (2/854)

عَنْ جَابِرٍ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم خَيَّرَ أَعْرَابِيًّا بَعْدَ الْبَيْعِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ غَرِيْبٌ.

2806. (6) [2/854అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక పల్లెవాడికి అమ్మిన తర్వాత అతనికి రద్దుచేసే అవకాశం ఇచ్చారు. (తిర్మిజి’- ప్రామాణికం-దృఢం-ఏకోల్లేఖనం)

=====

4- بَابُ الرِّبَا

4. వడ్డీ

అప్పుగా ఇచ్చిన దానికన్నా అధిక మొత్తాన్ని పొందటాన్ని వడ్డీ అంటారు. ఉదాహరణకు ఒకరికి 100 రూపాయలు అప్పుగా ఇచ్చి, 125 రూపాయలు తీసుకుంటానని చెప్పడం. ఇటువంటి మార్గాలు అనేకం ఉన్నాయి. వడ్డీ తీసుకోవడం నిషిద్ధం. ఖుర్‌ఆన్‌ మరియు ‘హదీసు’ల్లో దీని గురించి కఠినంగా హెచ్చరించబడింది. అల్లాహ్‌ (త) ఆదేశం, ”ఎవరైతే వడ్డీ తింటారో! వారి స్థితి (పునరుత్థాన దినమున) షై’తాన్‌ తాకడం వల్ల భ్రమపరచబడిన వ్యక్తి స్థితివలె ఉంటుంది. ఇది ఎందు కంటే! వారు: ”వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే!” అని చెప్పడం. కాని అల్లాహ్‌ వ్యాపారాన్ని ధర్మ సమ్మతం (‘హలాల్‌) చేశాడు మరియు వడ్డీని నిషిధ్ధం (‘హరామ్‌) చేశాడు. కనుక తన ప్రభువు చేసిన ఈ హితబోధ అందిన వ్యక్తి మున్ముందు వడ్డీ తినటం త్యజిస్తే, అతడు పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతడి వ్యవహారమంతా అల్లాహ్‌కే చెందుతుంది. (ఈ ఆదేశం తరువాత ఈ దుర్వ్యవహారానికి) పాల్పడే వారు నరకవాసు లవుతారు, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు.” (సూ. అల్‌ బఖరహ్‌, 2:275)

మరోచోట అల్లాహ్‌ (త) ఇలా ఆదేశించాడు: ”అల్లాహ్‌ వడ్డీ (ఆదాయాన్ని) నశింపజేస్తాడు మరియు దానధర్మాలు (చేసేవారికి) వృధ్ధినొసంగుతాడు. మరియు సత్యతిరస్కారుడు (కృతఘ్నుడు) పాపిష్ఠుడు అయిన వ్యక్తిని అల్లాహ్‌ ప్రేమించడు.  నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారికీ మరియు నమా’జ్‌ స్థాపించే వారికీ, ‘జకాత్‌ ఇచ్చే వారికీ, తమ ప్రభువు వద్ద తగిన ప్రతిఫలం లభిస్తుంది మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా! ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ యందు భయ భక్తులు కలిగి ఉండండి మరియు మీరు (నిజంగా) విశ్వాసులే అయితే, మీకు రావలసిన వడ్డీని విడిచి పెట్టండి. కాని, ఒకవేళ మీరు అలా చేయక పోతే! అల్లాహ్‌ మరియు ఆయన సందేశహరుని తరఫునుండి యుద్ధప్రకటన ఉందని తెలుసుకోండి. కాని మీరు పశ్చాత్తాపపడితే (వడ్డీ వదలు కుంటే), మీ అసలు సొమ్ము మీకు లభిస్తుంది. మీరు (ఇతరులకు) అన్యాయం చేయకండి మరియు మీకూ అన్యాయం జరుగదు.” (సూ. అల్‌ బఖరహ్‌, 2:276-279)

ఈ ఆయాతులలో విషయం స్పష్టంగా ఉంది. వడ్డీ ఇవ్వడం, తినడం నిషిద్ధం. వడ్డీ తినేవారు తీర్పుదినం నాడు పిచ్చివారిలా అటూ ఇటూ పడుతూ నిలబడతారు. ప్రపంచంలో వినాశనం, తీర్పుదినం నాడు నరకం వారికి తప్పదు. సూరహ్‌ ఆలి ‘ఇమ్రాన్‌లో అల్లాహ్‌ ఆదేశం: ”ఓ విశ్వాసులారా! ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినకండి. మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లాహ్ యందు భయభక్తులు కలిగిఉండండి.” (సూ. ఆల ‘ఇమ్రాన్‌, 3:130)

అజ్ఞాన కాలంలో ప్రజలు నిర్ణీత గడువులో చెల్లించే షరతు పెట్టి డబ్బు అప్పుగా ఇచ్చేవారు. గడువు పూర్తవగానే అప్పు చెల్లించని పక్షంలో వడ్డీని అసలులో కలిపి దానిపై మళ్ళీ వడ్డీ నిర్ణయించేవారు. ఈ విధంగా వడ్డీపై వడ్డీ చక్రవడ్డీగా చేసి ఆస్తులను స్వాధీనం చేసుకునేవారు. ప్రత్యేకంగా దీన్ని గురించి ఈ ఆయతు అవతరించింది.

ఖుర్‌ఆన్‌లోని ఈ ఆయతుల ద్వారా వడ్డీ నిషేధం నిరూపించబడింది. ‘హదీసు’ల్లో కూడా దీని నిషేధం గురించి పేర్కొనడంజరిగింది. 6 విషయాల్లో నిరూపణలు ఉన్నాయి. మిగతా విషయాల్లో వీటిని అనుసరించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రవక్త (స) 6 వస్తువుల్లో స్పష్టంగా వడ్డీ తీసుకోరాదని ఆదేశించారు.

1. బంగారం, 2. వెండి, 3. గోధుమలు, 4. జొన్న లు, 5. ఖర్జూరం, 6. ఉప్పు. మిగతా విష యాల్లో ధార్మిక పండితులు కారణం పేర్కొని నిషేధించారు.

ఇమామ్‌ షాఫయీ ఖరీదు, తినే పదార్థం, ఇమామ్‌ మాలిక్‌ ఖరీదు నిల్వ ఉండటం, ఇమామ్‌ అబూ హనీఫా బరువు కారణాలుగా పేర్కొన్నారు. వీటిని గురించి వివరంగా ఫిఖహ్‌ పుస్తకాల్లో ఉంది.

—–

            మొదటి విభాగం اَلْفَصْلُ الْأَوَّلُ

2807 – [ 1 ] ( صحيح ) (2/855)

عَنْ جَابِرٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: لَعَنَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم آكِلَ الرِّبَا وَمُوْكِلَهُ وَكَاتِبَهُ وَشَاهِدَيْهِ وَقَالَ: “هُمْ سِوَاءٌ”. رَوَاهُ مُسْلِمٌ.

2807. (1) [2/855దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) వడ్డీ సొమ్మును తినే వారినీ, వడ్డీ ఇచ్చేవారినీ, వడ్డీ తీసుకునేవారినీ, వడ్డీ తినిపించేవారినీ, వడ్డీ వ్యాపారం గురించి వ్రాసేవారినీ, దాని సాక్ష్యుల్ని శపించారు. పాపంలో  వీరందరూ సమానులే. [27] (ముస్లిమ్‌)

2808 – [ 2 ] ( صحيح ) (2/855)

وَعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلذَّهَبُ بِالذَّهَبِ وَالْفِضَّةُ بِالْفِضَّةِ وَالْبُرُّ بِالْبُرِّ وَالشَّعِيْرُ بِالشَّعِيْرِ وَالتَّمْرُ بَالتَّمْرِ وَالْمِلْحُ بِالْمِلْحِ. مِثْلًا بِمِثْلِ سَوَاءً بِسَوَاءٍ يَدًا بِيَدٍ فَإِذَا اخْتَلَفَتْ هَذِهِ الْأَصْنَافُ فَبِيْعُوْا كَيْفَ شِئْتُمْ إِذَا كَانَ يَدًا بِيَدٍ”. رَوَاهُ مُسْلِمٌ.

2808. (2) [2/855దృఢం]

‘ఉబాదహ్‌ బిన్‌ ‘సామిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బంగారానికి బదులు బంగారం, వెండికి బదులు వెండి, గోధుమలకు బదులు గోధుమలు, యవ్వలకు బదులు యవ్వలు, ఖర్జూరాలకు బదులు ఖర్జూరాలు, ఉప్పుకు బదులు ఉప్పు సరిసమానంగా, ఇవ్వాలి. ఒకవేళ వేరే పదార్థాలు ఉంటే మీకు వీలైన విధంగా ఇచ్చిపుచ్చుకోవచ్చును. వెను వెంటనే అయితే, నగదుగా అమ్మాలి.[28] (ముస్లిమ్‌)

2809 – [ 3 ] ( صحيح ) (2/855)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلذَّهَبُ بَالذَّهَبِ وَالْفِضَّةِ بِالْفِضَّةِ وَالْبُرُّ بِالْبُرِّ وَالشَّعِيْرُ بِالشَّعِيْرِ وَالتَّمْرُ بِالتَّمْرِ وَالْمِلْحُ بِالْمِلْحِ مِثْلًا بِمِثْلٍ يَدًا بِيَدٍ فَمَنْ زَادَ أَوِ اسْتَزَادَ فَقَدْ أَرْبَى الْآخِذُ وَالْمُعْطِيْ فِيْهِ سَوَاءٌ”. رَوَاهُ مُسْلِمٌ.

2809. (3) [2/855దృఢం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బంగారానికి బదులు బంగారాన్ని వెండికి బదులు వెండిని, గోధుమలకు బదులు గోధుమలు, యవ్వలకు బదులు యవ్వలు, ఖర్జూరాలకు బదులు ఖర్జూరాలు, ఉప్పుకు బదులు ఉప్పు సరిసమానంగా వెనువెంటనే ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చినా, ఎక్కువ తీసుకున్నా అది వడ్డీ అవుతుంది. ఇచ్చే వారూ పుచ్చుకునేవారూ ఇద్దరూ పాపాత్ములే. (ముస్లిమ్‌)

2810 – [ 4 ] ( متفق عليه ) (2/855)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَبِيْعُوا الذَّهَبَ بِالذَّهَبِ إِلَّا مِثْلًا بِمِثْلٍ. وَلَا تُشِفُّوْا بَعْضَهَا عَلَى بَعْضٍ وَلَا تَبِيْعُوا الْوَرِقَ بِالْوَرِقَ إِلَّا مِثْلًا بِمِثْلٍ. وَلَا تُشِفُّوْا بَعْضَهَا عَلَى بَعْضٍ. وَلَا تَبِيْعُوْا مِنْهَا غَائِبًا بِنَاجِزٍ”.

وَفِيْ رِوَايَةٍ: “لَا تَبِيْعُوْا الذَّهْبَ بَالذَّهْبِ وَلَا الْوَرِقَ بِالْوَرِقِ إِلَّا وَزْنًا بِوَزْنٍ”.

2810. (4) [2/855ఏకీభవితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”బంగారానికి బదులుగా బంగారం సరి సమా నంగా అమ్మండి. ఇంకా ఒక దాన్ని మరొక దానిపై అధికం చేయకండి. అదేవిధంగా వెండిని వెండికి బదు లుగా సరిసమానంగా అమ్మండి. ఒక దానికి మరొక దానిపై పెంచకండి. అదేవిధంగా నగదును అప్పుకు బదులుగా అమ్మకండి. (బు’ఖారీ, ముస్లిమ్‌)

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”బంగారానికి బదులు బంగారాన్ని, వెండికి బదులుగా వెండిని సరిసమానంగా అమ్మండి.”

2811 – [ 5 ] ( صحيح ) (2/856)

وَعَنْ مَعْمَرِ بْنِ عَبْدِ اللهِ قَالَ: كُنْتُ أَسْمَعُ رَسُوْلَ صلى اللهِ عليه وسلم يَقُوْلُ: “الطَّعَامُ بِالطَّعَامِ مِثْلًا بِمِثْلٍ” . رَوَاهُ مَسْلِمٌ.

2811. (5) [2/856దృఢం]

మ’అమర్‌  బిన్’అబ్దుల్లాహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఆహార ధాన్యాలను ఆహారధాన్యాలకు సమానంగా అమ్మండి. (రెండూ ఒకే రకానికి చెందినవై ఉండాలి). (ముస్లిమ్‌)

2812 – [ 6 ] ( متفق عليه ) (2/856)

وَعَنْ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلذَّهَبُ بِالذَّهَبِ رِبَا إِلَّا هَاءَ وَهَاءَ. وَالْوَرِقُ بِالْوَرِقِ رِبَا إِلَّا هَاءَ وَهَاءَ. وَالْبُرُّ بِالْبُرِّ إِلَّا هَاءَ وَهَاءَ. وَالشَّعِيْرُ بِالشَّعِيْرِ رِبَا هَاءَ وَهَاءَ. وَالتَّمْرُ بِالتَّمْرِ رِبَا إِلَّا هَاءَ وَهَاءَ..

2812. (6) [2/856ఏకీభవితం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బంగా రానికి బదులు బంగారం కొనటం అమ్మటం వడ్డీ అవుతుంది. కాని రెండూ సమానంగా వెనువెంటనే ఉంటే వడ్డీ అవదు. వెండికి బదులు వెండి, అమ్మటం కొనటం వడ్డీ అవుతుంది. కాని రెండూ సరిసమానంగా వెనువెంటనే ఉంటే వడ్డీ అవదు. గోధుమలకు బదులు గోధుమలు కొనటం, అమ్మటం వడ్డీ అవుతుంది. కాని సరిసమానంగా, వెనువెంటనే ఉంటే వడ్డీ అవదు. మరియు యవ్వలకు బదులు యవ్వలు అమ్మటం కొనటం వడ్డీ అవుతుంది. కాని సరిసమానంగా వెనువెంటనే ఉంటే వడ్డీ అవదు. ఖర్జూరాలకు బదులు ఖర్జూరాలు అమ్మటం కొనటం వడ్డీ అవుతుంది. అయితే అవి సరిసమానంగా వెనువెంటనే ఉంటే వడ్డీ అవదు. [29] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2813 – [ 7 ] ( متفق عليه ) (2/856)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ وَأَبِيْ هُرَيْرَةَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم اِسْتَعَمَلَ رَجُلًا عَلَى خَيْبَرَ فَجَاءَهُ بِتَمْرٍ جَنِيْبٍ فَقَالَ: “أَكَلَ تَمْرِ خَيْبَرَ هَكَذَا؟” قَالَ: لَا وَاللهِ يَا رَسُوْلَ اللهِ إِنَّا لَنَأْخُذُ الصَّاعَ مِنْ هَذَا بِالصَّاعَيْنِ وَالصَّاعَيْنِ بِالثَّلَاثِ فَقَالَ: “لَا تَفْعَلْ بِعِ الْجَمْعَ بِالدَّرَاهِمِ ثُمَّ ابْتَعْ بِالدَّرَاهِمِ جَنِيْبًا”. وَقَالَ: “فِيْ الْمِيْزَانِ مِثْلَ ذَلِكَ”.

2813. (7) [2/856ఏకీభవితం]

అబూ ‘సయీద్‌ మరియు అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక వ్యక్తిని ఖైబర్‌కు అధికారిగా పంపించారు. అతడు ప్రవక్త (స) వద్దకు నాణ్యమైన ఖర్జూరాలు తీసుకొని వచ్చాడు. ప్రవక్త (స), ‘ఖైబర్‌లోని ఖర్జూరాలన్నీ ఇలాగే ఉంటాయా?’ అని అడిగారు. ఆ వ్యక్తి, ‘అల్లాహ్ (త) సాక్షి! ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ఖర్జూరాలన్నీ ఇలాగే ఉండవు, మేము ఒక ‘సా’అ మంచి ఖర్జూరాలకు బదులు రెండు ‘సా’అ లేక మూడు ‘సా’అలు నాసిరకం ఖర్జూరాలకు బదులు తీసుకున్నాం. అది విని ప్రవక్త (స), ”ఇలా చేయకండి, నాసిరకం ఖర్జూరాలను దిర్‌హమ్‌లకు బదులుగా అమ్మివేయండి. తరువాత దిర్‌హమ్‌లకు బదులు మంచి ఖర్జూరాలను కొనుక్కోండి. అదేవిధంగా తూచే వస్తువుల్లో కూడా,” అని ఉపదేశించారు. [30] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2814 – [ 8 ] ( متفق عليه ) (2/856)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: جَاءَ بِلَالٌ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم بِتَمْرٍ بِرُنِيٍّ فَقَالَ لَهُ النِّبِيُّ صلى الله عليه وسلم: “مِنْ أَيْنَ هَذَا؟” قَالَ: كَانَ عِنْدَنَا تَمْرٌ رَدِيءٌ فَبِعْتُ مِنْهُ صَاعَيْنِ بِصَاعٍ. فَقَالَ: “أَوَهُ عَيْنُ الرِّبَا عَيْنُ الرِّبَا لَا تَفْعَلْ وَلَكِنْ إِذَا أَرَدْتَّ أَنْ تَشْتَرِيَ فَبِعِ التَّمْرَ بِبَيْعِ آخَرَ ثُمَّ اشْتَرِ بِهِ”.

2814. (8) [2/856ఏకీభవితం]

అబూ స’యీద్‌ (ర) కథనం: బిలాల్‌ (ర) ప్రవక్త (స) వద్దకు నాణ్యమైన ఖర్జూరాలు తీసుకొని వచ్చారు. ప్రవక్త (స), ‘నీవు వీటిని ఎక్కడి నుండి తీసుకు వచ్చావు,’ అని అడిగారు. దానికి బిలాల్‌, ‘మా వద్ద రెండు  ‘సా’అలు నాసిరకం ఖర్జూరాలు ఉండేవి. రెండు ‘సా’అ నాసిరకం ఖర్జూరాలు ఇచ్చి ఒక ‘సా’అ మంచి ఖర్జూరాలు కొన్నాము,” అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) మరైతే ఇది వడ్డీ అవుతుంది. ఇలా చేయకండి. మీకు కొనాలని ఉంటే నాసిరకం ఖర్జూ రాలను అమ్మి ఆ సొమ్ముతో మంచి ఖర్జూరాలను కొనండి, అని ప్రవచించారు. [31] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2815 – [ 9 ] ( صحيح ) (2/857)

وَعَنْ جَابِرٍ قَالَ: جَاءَ عَبْدٌ فَبَايَعَ النَّبِيَّ صلى الله عليه وسلم عَلَى الْهِجْرَةِ وَلَمْ يَشْعُرْ أَنَّهُ عَبْدٌ فَجَاءَ سَيِّدُهُ يُرِيْدُهُ فَقَالَ لَهُ النَّبِيُّ صلى الله عليه وسلم :“بِعْيِنْهِ” فَاشْتَرَاهُ بِعَبْدَيْنِ أَسْوَدَيْنِ وَلَمْ يُبَايِعْ أَحَا بَعْدَهُ حَتَّى يَسْأَلَهُ أَعْبَدٌ هُوَ أَوْ حُرٌّ. رَوَاهُ مُسْلِمٌ.

2815. (9) [2/857దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ఒక బానిస ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ప్రవక్త (స) చేతిపై వలస పోతానని వాగ్దానం చేసాడు.’ అంటే, తన జన్మస్థలం వదలి ప్రవక్త (స) సహచర్యంలో ఉంటానని వాగ్దానం చేసాడు. అతడు బానిసని ప్రవక్త (స) కు తెలియదు. ఆ బానిస యజమాని అతన్ని వెదుకుతూ ప్రవక్త(స) వద్దకు వచ్చాడు. అప్పుడు ప్రవక్త (స) అతనితో, ‘నీ బానిస వలసపోతానని వాగ్దానం చేసి ఉన్నాడు. ఇప్పుడు వాగ్దానం భంగపరచడానికి వీలుకాదు, ఇప్పుడు అతడు మీతో ఉండలేడు. కనుక ఆ బానిసను నాకు అమ్మేయి,’ అని అన్నారు. ప్రవక్త (స) అతన్ని ఇద్దరు నల్లజాతి బానిసలకు బదులుగా కొన్నారు. అంటే ఇద్దరు బానిసలను ఇచ్చి ఆ బానిసను తీసు కున్నారు. ఆ తరువాత ప్రవక్త (స) స్వతంత్రుడో, బానిస అని తెలుసుకోనంత వరకు బై’అత్‌ చేసేవారు కాదు. [32] (ముస్లిమ్‌)

2816 – [ 10 ] ( صحيح ) (2/857)

وَعَنْهُ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ بَيْعِ الصُّبْرَةِ مِنَ التَّمْرِلَا يُعْلَمُ مَكِيْلَتُهَا بِالْكَيْلِ الْمُسَمّى مِنَ التَّمْرِ. رَوَاهُ مُسْلِمٌ .

2816. (10) [2/857దృఢం]

జాబిర్‌ (ర) కథనం: తూయబడని లేదా కొలవ బడని ఖర్జూరాలను, తూయబడిన లేదా కొలవబడిన ఖర్జూరాలకు బదులుగా అమ్మరాదని ప్రవక్త (స) వారించారు. [33]  (ముస్లిమ్‌)

2817 – [ 11 ] ( صحيح ) (2/857)

وَعَنْ فَضَالَةَ بْنِ أَبِيْ عُبَيْدٍ قَالَ: اشْتَرَيْتُ يَوْمَ خَيْبَرَ قِلَادَةً بِاثْنَيْ عَشَرَ دِيْنَارًا فِيْهَا ذَهْبٌ وَخَرَزٌ فَفَصَّلْتُهَا فَوَجَدْتُّ فِيْهَا أَكْثَرَ مِنْ اثْنَيْ عَشَرَ دِيْنَارًا فَذَكَرْتُ ذَلِكَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: “لَا تُبَاعُ حَتَّى تُفَصَّل”. رَوَاهُ مُسْلِمٌ.

2817. (11) [2/857దృఢం]

ఫ’దాలహ్‌ బిన్‌ అబీ ‘ఉబైద్‌ (ర) కథనం: ‘ఖైబర్‌ యుద్ధం సందర్భంగా 12 అష్రఫీలకు బదులుగా ఒక హారాన్ని కొన్నాను. అందులో బంగారం, వజ్రాలు ఉండేవి. నేను బంగారాన్ని వేరుచేసాను, వజ్రాలను వేరుచేసాను. బంగారం 12 అష్రఫీల కంటే అధికంగా ఉన్నది. ప్రవక్త (స) తో వీటిని గురించి ప్రస్తావించాను. అది విని ప్రవక్త(స), ‘ఈవిధంగా అమ్మకు, రెంటినీ వేరు వేరుగా చేసి అమ్ము,’ అని ప్రవచించారు. [34] (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

2818 – [ 12 ] ( ضعيف ) (2/857)

عَنْ أَبِيْ هُرَيْرَةَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَيَأْتِيَنَّ عَلَى النَّاسِ زَماَنٌ لَا يَبْقَى أَحَدٌ إِلَّا أَكِلُ الرِّبَا فَإِنْ لَمْ يَأْكُلْهُ أَصَابَهُ مِنْ بُخَارِهِ”. وَيُرْوَى مِنْ “غُبَارِهِ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.

2818. (12) [2/857బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకకాలం రాబోతుంది. వడ్డీ తిననివాడు ఎవడూ ఉండడు. ఒక వేళ తినకుండా ఉన్నా వడ్డీ ప్రభావానికి గురయి ఉంటాడు. మరో ఉల్లేఖనంలో ”దాని దుమ్ము అతనికి అంటుకుంటుంది” అని ఉంది. [35] (అ’హ్మద్‌)

2819 – [ 13 ] ( لم تتم دراسته ) (2/858)

وَعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا تَبِيْعُوا الذَّهَبَ بِالذَّهَبِ وَلَا الْوَرِقَ بِالْوَرِقِ وَلَا الْبُرَّ بِالْبِرِّ وَلَا الشَّعِيْرَ بِالشَّعِيْرِ وَلَا التَّمْرَ بِالتَّمْرِ وَلَا الْمِلْحَ بِالْمِلْحِ إِلَّا سَوَاءً بِسَوَاءٍ عَيْنًا بِعَيْنٍ يَدًا بِيَدٍ. وَلَكِنْ بِيْعُوا الذَّهَبَ بِالْوَرِقِ وَالْوَرِقَ بِالذَّهَبِ وَالْبُرَّ بِالشَّعِيْرَ وَالشَّعِيْرَ بِالْبُرِّ وَالتَّمْرَ بِالْمِلْحِ وَالْمِلْحَ بِالتَّمْرِ يَدًا بِيَدٍ كَيْفَ شِئْتُمْ”. رَوَاهُ الشَّافِعِيُّ .

2819. (13) [2/858అపరిశోధితం]

‘ఉబాదహ్‌ బిన్‌ ‘సామిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బంగారానికి బదులు బంగారంగానీ, వెండికి బదులు వెండిగానీ, గోదుమలకు బదులు గోదుమలు గానీ, యవ్వలకు బదులు యవ్వలు గానీ, ఖర్జూరాలకు బదులు ఖర్జూరాలుగానీ, ఉప్పు కు బదులు ఉప్పుగానీ, సరిసమానంగా, వెనువెంటనే ఇవ్వాలి. కాని బంగారానికి బదులు వెండి గానీ, వెండికి బదులు బంగారం గానీ, గోదుమలకు బదులు యవ్వలుగానీ యవ్వలకు బదులు గోదుమలుగానీ, ఖర్జూరాలకు బదులు ఉప్పుగానీ, ఉప్పుకు బదులు ఖర్జూరాలు గానీ హెచ్చుతగ్గులతో అమ్మవచ్చును. కానీ వెనువెంటనే అమ్మవచ్చు.  (షాఫ’యీ)

2820 – [ 14 ] ( لم تتم دراسته ) (2/858)

وَعَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه و سلم سُئِلَ عَنْ شِرَاءِ التَّمْرِ بِالرُّطَبِ فَقَالَ: “أَيَنْقُصُ الرُطْبُ إِذَا يَبِسَ؟” فَقَالَ: نَعَمْ فَنَهَاهُ عَنْ ذَلِكَ. رَوَاهُ مَالِكٌ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.

2820. (14) [2/858అపరిశోధితం]

స’అద్‌ బిన్‌ అబీ వ’ఖ్ఖా’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) ద్వారా నేను ఇలా విన్నాను, ”ప్రవక్త (స)ను ఎండు ఖర్జూరాలకు బదులుగా పండు ఖర్జూరాలు కొనవచ్చా? అని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ప్రవక్త (స), ‘పండు ఖర్జూరాలు ఎండిన తర్వాత తక్కువవుతాయా,’ అని ప్రశ్నించారు. దానికి అతను, ‘అవును,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) ‘అయితే కుదరదు,’ అని వారించారు. [36] (మాలిక్‌, తిర్మిజి’, నసాయి’, అబూ-దావూద్‌, ఇబ్నె-మాజహ్)

2821 – [ 15 ] ( لم تتم دراسته ) (2/858)

وَعَنْ سَعِيْدِ بْنِ الْمُسَيِّبِ مُرْسَلًا: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَهَى عَنْ بَيْعِ اللَّحْمِ بِالْحَيْوَانِ. قَالَ سَعِيْدٌ: كَانَ مِنْ مَيْسِرٍ أَهْلِ الْجَاهِلِيَّةِ. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.

2821. (15) [2/858అపరిశోధితం]

స’యీద్‌ బిన్‌ ముసయ్యిబ్‌ (ర) తాబి’యీ ప్రోక్తం: ప్రవక్త (స) జంతువుకు బదులు మాంసం అమ్మటాన్ని నిషేధించారు. అజ్ఞానకాలంలో ఈ ఆచారం ఉండేదని స’యీద్‌ పేర్కొన్నారు. [37] (షర’హ్ సున్నహ్‌)

2822 – [ 16 ] ( لم تتم دراسته ) (2/858)

وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى عَنْ بَيْعِ الْحَيْوَانِ بِالْحَيْوَانِ نَسِيْئَةً. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ و الدارمي.

2822. (16) [2/858అపరిశోధితం]

సమురహ్ బిన్‌ జున్‌దుబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) జంతువుకు బదులు జంతువును రుణంగా అమ్మటం కొనటం చెల్లదని వారించారు. అంటే వెనువెంటనే నగదు అమ్మవచ్చును, కొనవచ్చును. ఒకవైపు నుండి నగదు మరోవైపు నుండి రుణం ఉంటే చెల్లదు. (తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’, ఇబ్నె మాజహ్, దారమి)

2823 – [ 17 ] ( ضعيف ) (2/858)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمْرِوبْنِ الْعَاصِ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أَمَرَهُ  أَنْ يُّجَهِّزَ جَيْشًا فَنَفَدَتِ الِإِبْلُ فَأَمَرَهُ أَنْ يَّأْخُذَ عَلَى قَلَائِصِ الصَّدَقَةِ فَكَانَ يَأْخُذُ الْبَعِيْرَ بِالْبَعِيْرَيْنَ إِلَى إِبِلِ الصَّدَقَةِ . رَوَاهُ أَبُوْ دَاوُدَ

2823. (17) [2/858బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ బిన్‌ ‘ఆస్‌ (ర) కథనం: ప్రవక్త (స) అతన్ని సైన్యానికి కావలసిన వస్తువులు ఏర్పాటు చేయమని ఆదేశించారు. ఒంటెలు తక్కువ పడ్డాయి. ప్రవక్త (స) ‘సదఖహ్ ఒంటెలకు బదులు ఒంటెలు అప్పుగా తీసుకోమని ఆదేశించారు. అప్పుడు ‘అబ్దుల్లాహ్‌ ఒక ఒంటెను రెండు ‘సదఖహ్ ఒంటెలకు బదులుగా ఒంటెలు వస్తాయనే వాగ్దానంపై తీసుకున్నారు. [38]  (అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

2824 – [ 18 ] ( متفق عليه ) (2/859)

عَنْ أُسَامَةَ بْنِ زَيْدِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “الرِّبَا فِيْ النَّسِيْئَةِ”. وَفِيْ رِوَايَةٍ قَالَ: “لَا رِبَا فِيْمَا كَانَ يَدًا بِيَدٍ”.

2824. (18) [2/859ఏకీభవితం]

ఉసామహ్ బిన్‌ ‘జైద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”రుణంలో వడ్డీ ఉందని ప్రవచించారు. మరో ఉల్లేఖనంలో నగదులో వడ్డీలేదు,” అని అన్నారు. [39] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2825 – [ 19 ] ( صحيح ) (2/859)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ حَنْظَلَةَ غَسِيْلِ الْمَلَائِكَةِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “دِرْهَمُ رِبًا يَّأْكُلُهُ الرَّجُلُ وَهُوَ يَعْلَمُ أَشَدُّ مِنْ سِتَّةٍ وَّثَلَاثِيْنَ زِنْيَةً”. رَوَاهُ أَحْمَدُ وَالدَّرَاقُطْنِيُّ وَرَوَى الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ عَنِ ابْنِ عَبَّاسٍ وَزَادَ: وَقَالَ: “مَنْ نَبَتَ لَحْمُهُ مِنَ السُّحْتِ فَالنَّارُ أَوْلَى بِهِ”.

2825. (19) [2/859దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘హన్‌”జలహ్‌ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వడ్డీకి చెందిన ఒక్క దిర్‌హమ్‌ను ఒక వ్యక్తి ఉద్దేశ్య పూర్వకంగా తింటే, అది 36 సార్లు వ్యభిచారం చేయటం కంటే మహాపాపం. [40] (అ’హ్మద్‌, దారు-ఖుతునీ, బైహఖీ)

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది. ”ప్రవక్త (స) (స) ప్రవచనం,  అధర్మ సంపాదన ద్వారా పోషించబడిన మాంసం నరకానికే తగినది.

2826 – [ 20 ] ( لم تتم دراسته ) (2/859)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “الرِّبَا سَبْعُوْنَ جُزْءًا أَيْسَرُهَا أَنْ يَّنْكِحَ الرَّجُلُ أُمَّهُ”.

2826. (20) [2/859అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వడ్డీ పాపంలో 70 భాగాలు ఉన్నాయి. వాటిలో అన్నిటి కంటే సామాన్యమైనది తన తల్లి శీలాన్ని దోచుకోవటం, వడ్డీ తినేవాడు ఒక్క పైసా వడ్డీ తిన్నా అది 70 పాపాల కంటే అధికంగా ఉంటుంది. (బైహఖీ)

2827 – [ 21 ] ( لم تتم دراسته ) (2/859)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الرِّبَا وَإِنْ كَثُرَ فَإِنَّ عَاقِبَتَهُ تَصِيْرُ إِلَى قُلٍّ: رَوَاهُمَا ابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ. وَرَوَى أَحْمَدُ الْأَخِيْرَ.

2827. (21) [2/859అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వడ్డీ తీసుకోవటం వల్ల ధనం కొంత పెరుగు తుంది. కాని దాని పర్యవసానం అశుభం, తగ్గుదల వైపు ఉంటుంది. (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

2828 – [ 22 ] ( لم تتم دراسته ) (2/859)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَتَيْتُ لَيْلَةَ أُسْرِيَ بِيْ عَلَى قَوْمٍ بُطُوْنُهُمْ كَالْبُيُوْتِ فِيْهَا الْحَيَّاتُ تَرَى مِنْ خَارِجِ بُطُوْنِهِمْ. فَقُلْتُ: مَنْ هَؤُلَاءِ يَا جِبْرِيْلُ؟ قَالَ: هَؤُلَاءِ أَكْلَةُ الرِّبَا”. رَوَاهُ أَحْمَدُ وَابْنُ مَاجَهُ .

2828. (22) [2/859అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మేరాజ్‌ రాత్రి కొందరిని చూచాను. వారి కడుపులు పెద్ద పెద్ద ఇళ్ళల్లా ఉన్నాయి. వాటిలో పాములు నిండి ఉన్నాయి. అవి బయటనుండి కనబడుతున్నాయి. వీళ్ళు ఎవరని నేను జిబ్రీల్‌ (అ)ను అడిగాను. దానికి జిబ్రీల్‌ వీరు వడ్డీతినేవారని అన్నారు. (అ’హ్మద్‌, ఇబ్నె-మాజహ్)

2829 – [ 23 ] ( لم تتم دراسته ) (2/860)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ أَنَّهُ سَمِعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَعَنَ آكِلَ الرِّبَا وَمُوْكِلَهُ وَكَاتِبَهُ وَمَانِعَ الصّدَقَةِ وَكَانَ يَنْهَى عَنِ النَّوْحِ. رَوَاهُ النَّسَائِيُّ.

2829. (23) [2/860అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స)  ఇలా అంటూఉండగా నేను విన్నాను, ”వడ్డీ తినేవారినీ, వడ్డీ తినిపించే వారినీ, ఆ వ్యవహారాన్ని రాసేవారినీ, దానధర్మాలు చేయనివారిని శపించారు. ఇంకా పెడ బొబ్బలు పెట్టకూడదని వారించారు. [41] (నసాయి’)

2830 – [ 24 ] ( لم تتم دراسته ) (2/860)

وَعَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ إِنَّ آخِرَمَا نَزَلَتْ آيَةُ الرِّبَا وَإِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قُبِضَ وَلَمْ يُفَسِّرْهَا لَنَا فَدَعُوْا الرِّبَا وَالرِّيْبَةِ. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.

2830. (24) [2/860అపరిశోధితం]

‘ఉమర్‌(ర) కథనం: వడ్డీకి సంబంధించిన ఆయతు అన్నిటి కంటే చివరన ప్రవక్త (స)పై అవతరించింది. ఆ తరువాత ప్రవక్త (స) మరణించారు. ప్రవక్త (స) వడ్డీ గురించి పూర్తి వివరాలు తెలుపలేదు. కనుక మీరు వడ్డీకీ, అనుమానాస్పద విషయాలకూ దూరంగా ఉండండి. (ఇబ్నె మాజహ్, దారమి)

2831 – [ 25 ] ( صحيح ) (2/860)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَقْرَضَ أَحَدُكُمْ قَرْضًا فَأَهْدَى إِلَيْهِ أَوْ حَمَلَهُ عَلَى الدَّابَةِ فَلَا يَرْكَبْهُ وَلَا يَقْبَلْهَا إِلَّا أَنْ يَّكُوْنَ جَرَى بَيْنَهُ وَبَيْنَهُ قَبْلَ ذَلِكَ”. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

2831. (25) [2/860దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా మీలో అప్పు ఇచ్చి ఉండి, అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చేవాడికి ఏదైనా కానుకగా పంపినా లేదా ప్రయాణానికి ఏదైనా జంతువు ఇచ్చినా వాటిని స్వీక రించరాదు. అయితే అప్పు తీసుకోవడానికి ముందు కూడా అతడు కానుకలు మొదలైనవి పంపుతూ ఉంటే, అప్పుడు స్వీకరించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. (ఇబ్నె మాజహ్, బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

2832 – [ 26 ] ( لم تتم دراسته ) (2/860)

وَعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا أَقْرَضَ الرَّجُلُ الرَّجُلَ فَلَا يَأْخُذْ هَدِيَّةً”. رَوَاهُ الْبُخَارِيُّ فِيْ تَارِيْخِهِ. هَكَذَا فِيْ الْمُنْتَقَى .

2832. (26) [2/860అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా అప్పుఇస్తే, అప్పు ఇచ్చేవాడు అప్పు తీసుకునే వాడి కానుకలు స్వీకరించరాదు.” (బు’ఖారీ, మున్తఖా’)

2833 – [ 27 ] ( صحيح ) (2/860)

وَعَنْ أَبِيْ بُرْدَةَ بْنِ أَبِيْ مُوْسَى قَالَ: قَدِمْتُ الْمَدِيْنَةَ فَلَقِيْتُ عَبْدِ اللهِ بْنِ سَلَامٍ فَقَالَ: إِنَّكَ بِأَرْضٍ فِيْهَا الرِّبَا فَاشٍ إِذَا كَانَ لَكَ عَلَى رَجُلٍ حَقٌّ فَأَهْدَى إِلَيْكَ حِمْلَ تِبْنٍ أَوْ حِمْلَ شَعِيْرٍ أَوْ حِبْلَ قَتٍّ فَلَا تَأْخُذْهُ فَإِنَّهُ رِبًا. رَوَاهُ الْبُخَارِيُّ.

2833. (27) [2/860దృఢం]

అబూ బుర్‌దహ్ బిన్‌ అబూ మూసా కథనం: నేను మదీనహ్ వచ్చాను. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ను కలిసాను. అతను నాతో, ”వడ్డీ వ్యాపారం అధికంగా ఉన్న దేశంలో మీరు ఉంటున్నారు, ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరిపై అయినా మీ హక్కు, మీ అప్పు ఉండి వారు మీ వద్దకు కానుకగా బుట్టతో పొట్టుగానీ, యవ్వలుగానీ, గడ్డిగానీ పంపినా దాన్ని మీరు తీసుకోకండి, ఎందుకంటే అది వడ్డీ అవుతుంది,” అని అన్నారు . (బు’ఖారీ)

=====

5- بَابُ الْمَنْهِيِّ عَنْهَا مِنَ الْبُيُوْعِ

5. నిషిద్ధ వ్యాపారాలు

కొన్ని వస్తువుల వ్యాపారం షరీఅత్‌ పరంగా అధర్మం. వాటిని అమ్మరాదు, కొనరాదు. ఇది నిషిద్ధం, అసహ్యం. షరతు కోల్పోవడంవల్ల జరుగు తుంది. ఇలా అనేకవిధాలుగా జరుగుతుంది. ఉదా: వేటాడకుండా చెరువులోని చేపలను అమ్మరాదు. వేటాడిన తర్వాత వాటిని అమ్మవచ్చును. అదే విధంగా జంతువు గర్భంలోని బిడ్డను అది జన్మించ కుండానే దాన్ని అమ్మరాదు. అయితే జన్మించిన తర్వాత అమ్మ వచ్చును. జంతువు సిరాల్లో నిండి ఉన్న పాలను పితకడానికి ముందు అమ్మరాదు. అయితే పాలు పితికిన తర్వాత అమ్మ వచ్చును. అదేవిధంగా చెట్టుపై ఉన్న పచ్చి కాయలను తీయడానికి ముందు అమ్మరాదు. అయితే పండిన తర్వాత అమ్మవచ్చును. మామిడి పువ్వు పుట్టగానే లేదా చిన్న చిన్న కాయలు వచ్చి ఉండి ఇంకా అవి తిన దగనివి కానప్పుడు అమ్మడం తగదు. ఎందుకంటే వీటన్నిటిలో నష్టం ఉంది.

ప్రవక్త (స) కంకరరాయి విసిరే బేరం, మోసం మరియు నష్టం కలిగించే వ్యవహారం నుండి వారించారు. (ముస్లిమ్‌).

అజ్ఞాన కాలంలో కొందరు ఈవిధంగా చేసేవారు. కొనేవారు అమ్మేవారితో నేను నీ వస్తువుపై కంకర రాయి విసురుతాను, దేనిమీద పడితే దాన్ని మీరు ఇవ్వాలి, అది ఎంత ఖరీదైనా సరే. అమ్మేవాడు కొనే వాడితో దేనిమీద నా కంకరరాయి పడితే దాన్ని నీవు తీసుకోవాలి. అది ఎంత సాధారణమైనదైనా, ఖరీదైన దైనా సరే. ఇది ఒక విధమైన జూదం. అందువల్లే షరీ’అత్‌ ఇటువంటి జూదాన్ని వ్యాపారాన్ని నిషేధించింది. అదేవిధంగా రెండు మూడు సంవత్సరాల పళ్ళు పండడానికి ముందే అమ్మడం తగదు. ఇందులో కొనే వారికి నష్టం కలుగుతుంది. ప్రవక్త (స) ప్రవచనం, ”కొన్ని సంవత్సరాల బేరం చేయరాదు. ఇంకా నష్టం కలిగితే ధర తక్కువ చేయమని ఆదేశించారు. అంటే నాలుగైదు సంవత్సరాల పళ్లను అవి పండకముందే కొన్నాడు. ఆ తరువాత తోట పండలేదు. లేదా గాలి, తుఫాను వల్ల నష్టం వాటిల్లింది. ఇటువంటి పరిస్థితుల్లో నష్టానికి అనుగుణంగా ధర తగ్గించాలి. దీనివల్ల కొన్నవాడికి నష్టం వాటిల్లకూడదు. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో వివాదాలు, కలహాలు తలెత్తుతాయి. అందువల్లే ఇటువంటి వ్యవహారాలను నిషేధించడం జరిగింది. దీన్ని ధార్మిక పరిభాషలో బై ముఆవమహ్‌ మరియు బై సినీన్‌ అంటారు.

అదేవిధంగా చెట్టుపై ఉన్న పండ్లను, ఎండు పండ్లకు బదులు కొనటం ధర్మసమ్మతం కాదు. పండు ఖర్జూరాలు చెట్టుపై ఉన్నాయి. వాటిని 10 కిలోల ఎండు ఖర్జూరాలకు బదులుగా కొనటం ధర్మసమ్మతం కాదు. రెండు వైపుల ఒకే సరకు ఉండటం వల్ల హెచ్చుతగ్గులు ఉన్నందున వడ్డీ క్రిందికే వస్తుంది. దీన్ని ధార్మిక పరిభాషలో ము’జాబనహ్ అంటారు. అదేవిధంగా పంట పొలంలోనే ఉంది. ఇంకా కోత జరగలేదు. దాన్ని నిల్వ ఉన్న ఆహార ధాన్యాలకు బదులు అమ్మటం కొనటం ధర్మసమ్మతం కాదు. ఉదా: పొలంలో గోదుమ పంట పచ్చిగా ఉంది. అది పండడానికి ఇంకా సమయం పడు తుంది. దాన్ని నిల్వ ఉన్న గోధుమలకు బదులుగా అమ్మటం, కొనటం నిషిద్ధం. ఎందుకంటే అందులో హెచ్చు తగ్గులు జరగవచ్చు. దాన్ని ము’హాఖలహ్ అంటారు. ముఖాబరహ్‌, ము’జారఅత్‌లలోని కొన్ని సందర్భాల్లో నిషేధించడం జరిగింది. అదేవిధంగా ప్రవక్త (స) ము’జాబనహ్‌, ము’హా ఖలహ్‌ మొదలైన వాటి నుండి నిషేధించారు. ఇంకా వ్యవహారంలో షరతును కూడా నిషేధించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”అరువు, అమ్మడం ధర్మసమ్మతం కాదు. ఒక అమ్మకంలో రెండు షరతులు ధర్మసమ్మతం కావు. దానికి హామీ (గ్యారంటీ) ఇవ్వడం జరగదు. దాని ద్వారా లాభం పొందడం ధర్మసమ్మతం మీ దగ్గర లేనిదాన్ని అమ్మడం తగదు.

అరువు, అమ్మడం అంటే ఎవరైనా ”ఈ ఎద్దును 100 రూపాయలకు నీకు అమ్ముతున్నాను. అయితే షరతు ఏమిటంటే నీవు నాకు 1000 రూపాయలు అప్పుగా ఇవ్వాలి” అని పలకడం. అతడు ఆ అప్పుద్వారా లాభం పొందుతాడు. ఏ అప్పుద్వారా లాభంపొందే ఉద్దేశ్యం ఉందో అది వడ్డీగా పరిగణించబడుతుంది. అందువల్ల ఇది ధర్మసమ్మతం కాదు. అదేవిధంగా ఎవరైనా రెండు షరతులను పెట్టటం అంటే ఎవరైనా ఈ దుస్తుల్ని రెండు షరతులపై అమ్ముతున్నాను అంటే నేను దాన్ని శుభ్రపరచి ఇస్తాను, కుట్టి ఇస్తాను అని అనటం తగదు. అదేవిధంగా తన అధీనంలో లేని దానిపై లాభం సంపాదించడం తగదు. ప్రస్తుత కాలంలో  సాధారణంగా నోటిద్వారా కొనుక్కుంటారు. అయితే ఇంకా దాని ఖరీదు ఇచ్చి ఉండరు. తన అధీనంలోనికి తెచ్చి ఉండరు. మళ్ళీ లాభానికి మరొకరికి అమ్ముతారు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఎవరైనా ఏదైనా కొంటే పూర్తిగా తన అధీనంలోకి తెచ్చిన తర్వాతనే అమ్మాలి. అంటే తాను కొన్న వస్తువును తన అధీనంలోనికి తెచ్చుకున్న తర్వాతనే అమ్మాలి. బై’ఆనా తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం ధర్మం కాదు. అంటే కొన్ని వాగ్దానాల సందర్భంగా కొంత డబ్బు ముందు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఆ వస్తువు తీసుకుంటే దాని ధరలో అంత డబ్బును తగ్గించి తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఆ వస్తువు తీసుకోకపోతే వాగ్దాన భంగ పాపం అతనికి తగులు తుంది. కాని అతని బై’ఆన సొమ్మును తినటం ధర్మ సమ్మతం కాదు. ప్రవక్త (స) బై’ఉర్‌బాన్‌ను నిషేధించారు. (అబూ-దావూద్‌) దీన్నే ఉర్దూలో బై’ఆన అంటారు.

కొందరు వ్యాపారులకు లాలుగా ఉంటారు. వీరు వ్యాపారులను మోసగించటానికి ఉత్తినే వ్యాపారులుగా వ్యవహరిస్తారు. ఖరీదును పెంచివేస్తారు. దీనివల్ల కొనుగోలు దారులు అధిక ధరను పాడుతారు. దీన్ని అరబీలో బ’ఖ్‌ష్‌ అంటారు. ప్రవక్త (స) దీన్ని నిషేధించారు. (బు’ఖారీ, ముస్లిమ్)

చనిపోయిన ధర్మసమ్మతమైన జంతువు యొక్క పచ్చి చర్మాన్ని పరిశుద్ధపరచకుండా అమ్మడం, కొన డం ధర్మసమ్మతం కాదు. పరిశుద్ధపరచిన తరువాత అమ్మవచ్చును, కొనవచ్చును. (మున్‌తఖా)

బజారుకు బయట ఉండి, బజారుకు వచ్చే సరకు లను వాటి యజమానుల వద్ద నుండి బజారుకన్నా తక్కువ ధరకు కొనటం ధర్మసమ్మతం కాదు. ఒకవేళ ఎవరైనా ఇలా కొనుక్కుంటే బజారులోనికి వచ్చిన తర్వాత సరకుల యజమాని ఆ అమ్మకాన్ని కొనసా గించగలడు. లేదా రద్దు చేయ గలడు. (ముస్లిమ్‌)

ప్రవక్త (స) ప్రవచనం, ”కొనే ఉద్దేశంతో బజారుకు వచ్చే బిడారులతో కలవరాదు. ఒక ముస్లిమ్‌ యొక్క కొనుగోలు, అమ్మకాలపై కొనుగోలు, అమ్మకాలను చేయరాదు. అంటే, అమ్మేవారు కొనేవారు సమావేశం నుండి వేరుకాక ముందే మూడవ వ్యక్తి అమ్మేవాడితో – ‘నేను అంతకంటే ఎక్కువ ధరను ఇస్తాను’ – అని అన కూడదు. అదేవిధంగా కొనేవాడితో అంతకంటే తక్కువ ధరకు మంచి వస్తువు ఇప్పిస్తానని అన కూడదు. అదేవిధంగా ధరపై ధర పలకరాదు. ము’స్‌ రాత్‌ చేయరాదు. అంటే ఒక జంతువును పాలు పితక కుండా మోసగించేఉద్దేశ్యంతో అమ్మరాదు. కొనుగోలు దారుడు దాన్ని ఉంచగలడు, తీసివేయగలడు. (బు’ఖారీ)

ఒకవేళ ఎవరైనా చెట్టుపై పండ్లను అమ్ముతూ కొన్ని పళ్ళు అమ్మటం లేదు, తోటను అమ్ముతూ కొన్ని చెట్లు అమ్మటం లేదు అని అనటం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే మినహాయింపు వల్ల వివాదం తలెత్తవచ్చును. అయితే తోటను అమ్ముతూ, ‘ఫలానా చెట్లను లేదా చెట్టును,’ అని నిర్థారిస్తే అమ్మవచ్చును.

జాబిర్‌ (ర) కథనం, ”ప్రవక్త (స) అమ్మకంలో మినహా యింపును నిషేధించారు. అయితే మినహాయింపు నిర్ధారించబడి ఉండాలి. నిర్థారించని మినహా యింపును నిషేధించడం జరిగింది. అదేవిధంగా ఒకడికి అమ్మటం ఇష్టం లేకున్నా బలవంతంగా కొనటం ధర్మసమ్మతం కాదు. అదే విధంగా ప్రవక్త (స) కష్టాల్లో ఉన్నవాడి నుండి అవకాశంగా భావించి కొనడం, అమ్మటం ఇష్టం లేనివాడి నుండి కొనడం ప్రవక్త (స) నిషేధించారు. అదేవిధంగా ఇరువర్గాల నుండి అరువుగా అమ్మకం కొనుగోలు మంచిది కాదు. ప్రవక్త (స) ఇద్దరి తరఫున రుణ వ్యవహారాన్ని నిషేధించారు.

ఇది ఎలాగంటే ఒక వ్యక్తి ఒక వస్తువును కొంత గడువుకు అరువుగా తీసుకున్నాడు. గడువు పూర్తవగానే దాని విలువ ఇవ్వలేక, మరికొంత విలువ, గడువుపెంచి దాన్ని కొనుక్కుంటాడు. అంటే అరువును, అరువుగా కొనుక్కున్నాడు. అంటే ఇరు పక్షాలలో ఎవరూ నగదు చెల్లించలేదు.

అదేవిధంగా మగ జంతువును ఆడ జంతువుపై ఎక్కించడానికి ప్రతిఫలాన్ని తీసుకోవటం ధర్మసమ్మ తం కాదు. ప్రవక్త (స) దీన్ని నిషేధించారు. (బు’ఖారీ).

అయితే నిర్ణయించకుండా కానుకగా, ప్రోత్సాహకంగా ఇచ్చిపుచ్చుకోవడాలు చేయడంలో అభ్యంతరం లేదు.

అదేవిధంగా బై’ఆన కూడా ధర్మసమ్మతం కాదు. ఇది ఎలాగంటే, కొంత గడువుకు వస్తువులు, ఇల్లు, భూమి మొదలైనవి అమ్మివేసి, ఆ తరువాత మళ్ళీ దానికంటే తక్కువ ధరకు నగదుగా ఇచ్చి కొనటం. ఇందులో వడ్డీ ఉంది. అందు వల్ల ఇది ధర్మం కాదు.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం  

2834 – [ 1 ] ( متفق عليه ) (2/861)

عَنِ ابْنِ عُمَرَ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ الْمُزَابَنَةِ: أَنْ يَّبِيْعَ تَمَرَ حَائِطَهُ إِنْ كَانَ نَخْلًا بِتَمْرٍ كَيْلًا وَإِنْ كَانَ كَرْمًا أَنْ يَّبِيْعَهُ زَبِيْبٍ كَيْلًا أَوْ كَانَ وَعِنْدَ مُسْلِمٍ وَإِنْ كَانَ زَرْعًا أَنْ يَّبِيْعَهُ بِكَيْلِ طَعَامٍ نَهَى عَنْ ذَلِكَ كُلُّهُ. مُتَّفَقُ عَلَيْهِ.

وَفِيْ رِوَايَةٍ لَهُمَا: نَهَى عَنِ الْمُزَابَنَةِ قَالَ: “وَالْمُزَابَنَةِ أَنْ يُّبَاعَ مَا فِيْ رُؤُوْس النَّخْلِ بِتَمْرٍ بِكَيْلٍ مُسَمَّى إِنْ زَادَ فَعَلَيَّ وَإِنْ نَقَصَ فَعَلَيَّ.

2834. (1) [2/861ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ము’జాబనహ్ అమ్మకాన్ని నిషేధించారు. ము’జా బనహ్ అంటే, చెట్టుపై ఉన్న పండు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలకు బదులు తూచి అమ్మడం. అదేవిధంగా తీగపై ఉన్న ద్రాక్ష పళ్ళను ఎండు ద్రాక్షలకు బదులు అమ్మటం.

ముస్లిమ్‌లో ఈ విధంగా ఉంది, ఇప్పుడే కోసిన ఆహార ధాన్యాలను ఎండిన ఆహార ధాన్యాలకు బదులు అమ్మటం ప్రవక్త (స) వీటన్నిటినీ నిషేధించారు. [42] (బు’ఖారీ, ముస్లిమ్‌).

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, చెట్టుపై ఉన్న తా’జహ్ ఖర్జూరాలను ఎండు ఖర్జూరాలకు బదులు తూచి అమ్మడం. అంటే నాలుగు లేదా ఐదు సేర్ల ఎండు ఖర్జూరాలు ఇస్తాను అని అనడం. కొనేవాడు ఒకవేళ చెట్టుపై ఖర్జూరాలు ఎక్కువ ఉంటే నావి, ఒకవేళ తక్కువ ఉంటే నష్టం నాదే అని అంటాడు.

2835 – [ 2 ] ( صحيح ) (2/861)

وَعَنْ جَابِرٍ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ الْمُخَابَرَةِ وَالْمُحَاقَلَةِ وَالْمُزَابَنَةِ.  وَالْمُحَاقَلَةُ: أَنْ يَّبِيْعَ الرَّجُلُ الزَّرْعَ بِمَائَةِ فَرَقٍ حِنْطَةٍ وَالْمُزَابِنَةُ : أَنْ يَّبِيْعَ التَمْرَ فِيْ رُؤُوْسِ النَّخْلِ بِمَائَةٍ فَرَقٍ وَالْمُخَابَرَةُ : كِرَاءُ الْأَرْضِ بِالثُّلُثِ وَالرُّبُعِ. رَوَاهُ مُسْلِمٌ.

2835. (2) [2/861దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ము’ఖాబరహ్, ము’హాఖలహ్‌ మరియు ము’జాహ్ అమ్మకాన్ని నిషేధించారు. 1. ము’హాఖలహ్‌: అంటే ఇంకా పొలంలో ఉన్న పంటను 100 బస్తాల గోదుమలకు అమ్మటం. 2. ము’జాబనహ్‌: అంటే చెట్టుపై ఉన్న పండు ఖర్జూరాలను 100 బస్తాల ఎండు ఖర్జూరాలకు అమ్మటం. 3. ము’ఖాబరహ్‌: అంటే భూమిని దాని పంటయొక్క సగం లేదా మూడవవంతు పంటకు బదులుగా అద్దెకు ఇవ్వడం. [43] (ముస్లిమ్‌)

2836 – [ 3 ] ( صحيح ) (2/861)

وَعَنْهُ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ الْمُحَاقَلَةِ وَالْمُزَابَنَةِ وَالْمُخَابَرَةِ وَالْمُعَاوَمَةِ وَعَنِ الثَّنْيَا وَرَخَّصَ فِيْ الْعَرَايَا.  رَوَاهُ مُسْلِمٌ.

2836. (3) [2/861దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ము’హాఖహ్‌ను, ము’జాబనహ్‌ను, ము’ఖాబరహ్‌ను, ము’ఆవ మహ్‌ ను, సు’న్‌యాను నిషేధించారు. అయితే రాయాను అనుమతించారు. [44] (ముస్లిమ్‌)

2837 – [ 4 ] ( متفق عليه ) (2/862)

وَعَنْ سَهْلِ بْنِ أَبِيْ حَثَمَةَ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ بَيْعِ التَّمْرِ بِالتَّمْرِ إِلَّا أَنَّهُ رَخَّصَ فِيْ الْعَرِيَّةِ أَنْ تُبَاعَ بِخَرْصِهَا تَمْرًا يَأْكُلُهَا أَهْلُهَا رُطْبًا.

2837. (4) [2/862ఏకీభవితం]

సహ్‌ల్‌ బిన్‌ అబూ ‘హస్మ’ (ర) కథనం: ప్రవక్త (స) ఖర్జూరాన్ని ఖర్జూరానికి బదులుగా అమ్మటాన్ని, కొనటాన్ని నిషేధించారు. అయితే అరియ్యహ్కు అనుమతి ఇచ్చారు. ‘అరియ్యహ్ అంటే చెట్లపై ఉన్న పండు ఖర్జూరాలను ఎండు ఖర్జూరాలకు బదులుగా అంచనా వేసి కొనటం, తన కుటుంబం వారు పండు ఖర్జూరాలను ఆహారంగా వినియోగించటానికి. (బు’ఖారీ, ముస్లిమ్‌)

2838 – [ 5 ] ( متفق عليه ) (2/862)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَرْخَصَ فِيْ بَيْعٍ الْعَرَايَا بِخَرَصِهَا مِنَ التَّمْرِ فِيْمَا دُوْنَ خَمْسَةِ أَوْسُقٍ أَوْ خَمْسَةِ أَوْسُقٍ شَكَّ دَاوُدَ ابْنُ الْحُصَيْنِ.

2838. (5) [2/862ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘అరియ్యహ్ను అనుమతించారు. అయతే 5 వసఖ్‌లకు మించరాదు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

ఉల్లేఖన కర్త దావూద్‌ బిన్‌ ‘హు’సైన్‌కు ప్రవక్త (స) 5 వసఖ్‌లు అన్నారా? లేక 5 వసఖ్‌లకు తక్కువ అన్నారా? అనే విషయంలో అనుమానం ఉంది.

2839 – [ 6 ] ( متفق عليه ) (2/862)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ بَيْعِ الثِّمَار حَتّى يَبْدُو صَلَاحُهَا نَهَى الْبَائِعَ وَالْمُشْتَرِيَ.

وَفِيْ رِوَايَةٍ لِّمُسْلِمٍ: نَهَى عَنْ بَيْعِ النَّخْلِ حَتَّى تَزْهُو وَعَنِ السُّنْبُلِ حَتَّى يَبْيَضَ وَيَأْمَنَ الْعَاهَةَ.

2839. (6) [2/862ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: పచ్చి కాయలు అమ్మటాన్ని, కొనటాన్ని ప్రవక్త (స) నిషేధించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

ముస్లిమ్‌లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”ప్రవక్త (స) ఖర్జూరాలు ఎరుపు లేదా పసుపురంగు దాల్చ నంతవరకు అమ్మటాన్ని నిషేధించారు. ఎందుకంటే ఎరుపు, పసుపు రంగులు పరిపూర్ణం చెందిందని సూచిస్తాయి. అదేవిధంగా పంటగుత్తులు తెల్లవి, సురక్షితం కానంత వరకు అమ్మటాన్ని నిషేధించారు. వీటిని అమ్మటం కొనటం రెండూ నిషిద్ధమే. ఎందు కంటే పచ్చికాయల్లో, పచ్చిపంటలో నష్టం వాటిల్ల వచ్చు.

2840 – [ 7 ] ( متفق عليه ) (2/862)

وَعَنْ أَنَسٍ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ بَيْعِ الثِّمَارِ حَتَّى تُزَهِّيَ قِيْلَ: وَمَا تُزْهِيَ؟ قَالَ: “حَتَّى تُخْمَرُ” وَقَالَ: “أَرَأَيْتَ إِذَا مَنَعَ اللهُ الثُّمَرَةَ بِمَ يَأْخُذُ أَحَدُكُمْ مَالَ أَخِيْهِ؟”

2840. (7) [2/862ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) పచ్చికాయలు అమ్మటాన్ని నిషేధించారు. అయితే అవి పటిష్టంగా తయారవ్వాలి. రంగు రావటం అంటే ఏమిటని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స) ఎరుపురంగు రావాలి. ఆ తరువాత ప్రవక్త (స) మీరే చెప్పండి అల్లాహ్‌ (త) ఆ పళ్ళను ఆపివేస్తే మరి దేనికి బదులుగా తన సోదరునికి ధనం చెల్లిస్తాడు, అని అన్నారు. [45]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

2841 – [ 8 ] ( صحيح ) (2/862)

وَعَنْ جَابِرٍ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ بَيْعِ السِّنِيْنَ وَأَمَرَ بِوَضْعِ الْجَوَائِحِ. رَوَاهُ مُسْلِمٌ.  

2841. (8) [2/862దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) కొన్ని సంవత్సరాల బేరాన్ని నిషేధించారు. నష్టాలకు కష్టాలకు గురి అయిన పక్షంలో ధరను తగ్గించటం లేదా పూర్తిగా క్షమించటాన్ని గురించి ఆదేశించారు. [46] (ముస్లిమ్‌)

2842 – [ 9 ] ( صحيح ) (2/863)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْ بِعْتَ مِنْ أَخِيْكَ ثَمْرًا فَأَصَابَتْهُ جَائِحَةٌ فَلَا يَحِلُّ لَكَ أَنْ تَأْخُذَ مِنْهُ شَيْئًا بِمَ تَأْخُذُ مَالَ أَخِيْكَ بِغَيْرِ حَقٍّ؟” رَوَاهُ مُسْلِمٌ .

2842. (9) [2/863దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వేళ మీరు మీ సోదరునికి పచ్చికాయలు అమ్మి, వాటిపై ఆపదలు వచ్చి పళ్ళలో నష్టం వస్తే, మీరు అతని నుండి దాని ధరను తీసుకోవటం ఎంతమాత్రం ధర్మసమ్మతం కాదు. అతనికి ఏదీ ఏమాత్రం దక్కలేనప్పుడు మీరు అతన్నుండి దేనికి బదులుగా డబ్బులు తీసు కుంటారు? ” (ముస్లిమ్‌)

2843 – [ 10 ] ( لم تتم دراسته ) (2/863)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: كَانُوْا يَبْتَاعُوْنَ الطَّعَامَ فِيْ أَعْلَى السُّوْقِ فَيَبْيْعُوْنَهُ فِيْ مَكَانِهِ فَنَهَاهُمْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ بَيْعِهِ فِيْ مَكَانِهِ حَتَّى يَنْقُلُوْهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَلَمْ أَجِدْهُ فِيْ الصَّحِيْحَيْنِ.

2843. (10) [2/863అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రజలు బజారులో ఆహార ధాన్యాలను కొని, అక్కడికక్కడే తమ అధీనంలోకి తీసుకోవడానికి ముందే అమ్మివేసేవారు. ప్రవక్త (స) అక్కడి కక్కడే అమ్మటాన్ని నిషేధించారు. ముందు ఆ సరకును మరోచోటుకి మార్చుకొని తన అధీనంలోకి తీసుకోవాలి. [47]  (అబూ దావూద్‌)

2844 – [ 11 ] ( متفق عليه ) (2/863)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنِ ابْتَاعَ طَعَامًا فَلَا يَبِيْعُه حَتَّى يَسْتَوْفِيَهُ”.

2844. (11) [2/863ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ఎవరైనా సరకులు కొంటే తన అధీనంలోనికి తీసుకోకుండా వాటిని అమ్మరాదు.

2845 – [ 12 ] ( متفق عليه ) (2/863)

وَفِيْ رِوَايَةِ ابْنِ عَبَّاسٍ: “حَتَّى يَكْتَالَهُ .

2845. (12) [2/863ఏకీభవితం]

ఇబ్నె’అబ్బాస్‌(ర) ఉల్లేఖనంలో ఇలా ఉంది. ”ముందు దాన్ని కొలుచుకోవాలి.” [48] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2846 – [ 13 ] ( متفق عليه ) (2/863)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: أَمَّا الَّذِيْ نَهَى عَنْهُ النَّبِيُّ صلى الله عليه وسلم فَهُوَ الطَّعَامُ أَنْ يُّبَاعَ حَتَّى يُقْبَضُ. قَالَ ابْنُ عَبَّاسٍ: وَلَا أَحْسَبُ كُلَّ شَيْءٍ إِلَّا مِثْلَهُ .

2846. (13) [2/863ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ఆహార ధాన్యాలను తన అధీనంలోనికి తీసుకోకుండా అమ్మరాదని ప్రవక్త (స) వారించారు. ఇబ్నె ‘అబ్బాస్‌ (ర), ‘ఇతర వస్తువులకూ ఆహార ధాన్యాల్లాగే నిషేధం వర్తిస్తుందని నా అభిప్రాయం,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

2847 – [ 14 ] ( متفق عليه ) (2/863)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا تَلَقَّوْا الرُّكْبَانَ لِبَيْعٍ وَلَا يَبْعِ بَعْضُكُمْ عَلَى بَيْعِ بَعْضٍ وَلَا تَنَاجَشُوْا وَلَا يَبِعْ حَاضِرٌ لِبَادٍ وَلَا تَصَرَّوُا الْإِبْلَ وَالْغَنَمَ فَمَنِ ابْتَاعَهَا بَعْدَ ذَلِكَ فَهُوَ بِخَيْرِ النَّظْرَيْنِ بَعْدَ أَنْ يَّحْلِبَهَا .إِنْ رَضِيَهَا أَمْسَكَهَا وَإِنْ سَخِطَهَا رَدَّهَا وَ صَاعًا مِّنْ تَمْرٍ”.

وَفِيْ رِوَايَةٍ لِّمُسْلِمٍ: “مَنِ اشْتَرَى شَاةً مُصَرَّاةً فَهُوَ بِالْخِيَارِ ثَلَاثَةَ أَيَّامٍ: فَإِنْ رَدَّهَا رَدَّ مَعَهَا صَاعًا مِنْ طَعَامٍ لَا سَمَرَاءَ”.

2847. (14) [2/863ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు బజారు లేదా పట్టణానికి వెలుపలకు వచ్చి ఆహార ధాన్యాలు, కూరగాయలు తీసుకొని వచ్చే రైతులను కలవకండి. అంటే బజారులోనికి రాకముందే వారితో కలసి కొనకండి. వారిని బజారులోనికి రాని  య్యండి. మార్కెట్టు రేటు ప్రకారం మీరు కొనవచ్చు. మీలో ఎవరూ ఇద్దరు అమ్ముతూ, కొంటూ ఉన్న ప్పుడు మధ్య కలుగజేసుకోరాదు. అదేవిధంగా బఖ్ష్‌ చేయరాదు. అంటే మోసగించటానికి అనవసరంగా సరకులను ప్రశ్నించరాదు. దాని ధర పెంచే ప్రయత్నం చేయరాదు. సారాంశం ఏమిటంటే, తీసుకునే ఉద్దేశం లేకుండా ధరను పెంచే ప్రయత్నం చేయరాదు. కొనే ఉద్దేశంతో సరకు ధర పెంచితే ఫరవాలేదు. వేలం పాటలో జరిగినట్లు. పట్టణ వాసులు రైతుల బ్రోకర్లుగా వ్యవహరించ రాదు. రైతులను అమ్మనివ్వాలి.

కొంత మంది అభిప్రాయం ప్రకారం రైతులు ఆహార ధాన్యాలను తీసుకొని పట్టణాలకు వచ్చే వారు. పట్టణ వాసులు వారితో మీ సరకులను మా వద్ద ఉంచి వెళ్ళండి. మేము మంచి ధరకు అమ్ముతాము అని అనేవారు. ప్రవక్త(స) దీన్ని నిషేధించారు.

అదేవిధంగా పాలు ఆపి ఉంచి జంతువులను అమ్మరాదు.

 కొన్నవాడికి ఇష్టమైతే ఉంచుకుంటాడు లేకపోతే తిరిగి ఇచ్చి వేస్తాడు. పాలుకు బదులు ఒక ‘సా’అ ఖర్జూరం ఇవ్వాలి. [49] (బు’ఖారీ, ముస్లిమ్‌)

 ముస్లిమ్‌లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”ముసిర్రాత్‌ మేకను కొంటే మూడు రోజులు గడువు ఉంటుంది. అతను కోరితే తిరిగి ఇచ్చివేయగలడు. దానికి తోడు ఒక ‘సా’అ ఖర్జూరం కూడా ఇవ్వాలి, గోదుమలు కాదు.

2848 – [ 15 ] ( صحيح ) (2/864)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَلَقَّوُا الْجَلَبَ فَمَنْ تَلَقَّاهُ فَاشْتَرَى مِنْهُ فَإِذَا أَتَى سَيِّدُهُ السُّوْقَ فَهُوَ بِالْخَيَارِ”. رَوَاهُ مُسْلِمٌ .

2848. (15) [2/864దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: మీరు బజారు కన్నా ముందు వెళ్ళి సరకులు తీసుకొని వచ్చే రైతులను కలవకండి. ఒకవేళ ఎవరైనా ముందుకు వెళ్ళి సరకులు కొనుక్కున్నా సరకుల యజమాని బజారులోకి వచ్చిన తర్వాత మార్కెట్టు రేటు తెలుసుకొని, అతనికి నష్టం వచ్చి నట్లు తెలిస్తే ఆ బేరాన్ని అతడు కొనసాగించగలడు లేదా రద్దు చేయగలడు. [50] (ముస్లిమ్‌)

2849 – [ 16 ] ( متفق عليه ) (2/864)

وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَلَقَّوُا السِّلَعَ حَتَّى يُهْبَطَ بِهَا إِلَى السُّوْقِ”.

2849. (16) [2/864ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: సరకులను ఆహార ధాన్యాలను బజారులో దించే వరకు రైతులను కలవవద్దని ప్రవక్త (స) వారించారు. [51] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2850 – [ 17 ] ( صحيح ) (2/864)

وَعَنْهُ قَالَ :قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَبِعُّ الرَّجُلُ عَلَى بَيْعِ أَخِيْهِ وَلَا يَخْطُبُ عَلَى خِطْبَةِ أَخِيْهِ إِلَّا أَنْ يَأْذَنَ لَهُ”. رَوَاهُ مُسْلِمٌ .

2850. (17) [2/864దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ఒక వ్యక్తి బేరమాడుతుండగా మరొకరు తన సరకులను అమ్మరాదు. ఒకరు పెళ్ళి సందేశం ఇస్తూ ఉండగా తాను కూడా పెళ్ళి సందేశం పంపరాదు. అయితే అతనికి అనుమతి దొరికితే పంపవచ్చు. [52] (ముస్లిమ్‌)

2851 – [ 18 ] ( صحيح ) (2/864)

وَعَنْ أَبَيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا يَسُمْ الرَّجُلُ عَلَى سَوْمِ أَخِيْهِ الْمُسْلِمِ” .رَوَاهُ مُسْلِمٌ.

2851. (18) [2/864దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ఒక ముస్లిమ్‌ వ్యక్తి బేరమాడుతున్నప్పుడు తాను బేరమాడరాదని ప్రవక్త (స) వారించారు. [53] (ముస్లిమ్‌)

2852 – [ 19 ] ( صحيح ) (2/864)

وَعَنْ جَابِرٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَبِعْ حَاضِرٌ لِبَادٍ دَعُوا النَّاسَ يَرْزُقُ اللهُ بَعْضَهُمْ مِنْ بَعْضٍ”. رَوَاهُ مُسْلِمٌ.

2852. (19) [2/864దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, పట్టణ వాసులు పల్లెవాసుల బ్రోకరుగా మారి సరకులు అమ్మరాదు. వారు తమ ఇష్టప్రకారం అమ్మడం, కొనుగోలు చేసుకోవడానికి వదలివేయాలి. అల్లాహ్‌ (త) కొందరి ద్వారా కొందరికి ఉపాధి ప్రసాదిస్తాడు. [54] (ముస్లిమ్‌)

2853 – [ 20 ] ( متفق عليه ) (2/864)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ الْخُدَرِيِّ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ لِبْسَتَيْنِ وَعَنْ بَيْعَتَيْنِ: نَهَى عَنِ الْمُلَامَسَةِ وَالْمُنَابِذَةِ فِيْ الْبَيْعِ  و الْمُلَامَسَةُ . لَمَسُ الرَّجُلِ ثَوْبَ الْآخِرِ بِيَدِهِ بِاللَّيْلِ أَوْ بِالنَّهَارِ وَلَا يَقْلِبُهُ إِلَّا بِذَلِكَ وَالْمُنَابِذَةُ . أَنْ يَّنْبِذَ الرَّجُلُ إِلَى الرَّجُلِ بِثَوْبِهِ وَيَنْبِذَ الْآخِرُ ثَوْبَهُ وَيَكُوْنُ ذَلِكَ بَيْعُهُمَا عَنْ غَيْرِ نَظْرٍ وَّلَا تَرَاضٍ وَاللِّبْسَتَيْنِ. اشْتِمَالُ الصَّمَاءِ وَالصَّمَاءُ أَنْ يَّجْعَلَ ثَوْبَهُ عَلَى أَحَدِ عَاتِقَيْهِ. فَيَبْدُوْ أَحَدُ شَقِيْهِ لَيْسَ عَلَيْهِ ثَوْبٌ وَاللِّبْسةُ الْأُخْرَى . احْتِبَاؤُهُ بِثَوْبِهِ وَهُوَ جَالِسٌ لَيْسَ عَلَى فَرْجِهِ مِنْهُ شَيْءٌ.

2853. (20) [2/864ఏకీభవితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) రెండు రకాల దస్తులను నిషేధించారు. అదేవిధంగా రెండు రకాల బేరాలను నిషేధించారు. అంటే ములామసహ్, మునాబజ’హ్ బేరాల నుండి కూడా వారించారు. ములామసహ్ అంటే, ఒక వ్యక్తి మరొకరి వస్త్రాన్ని తన చేత్తో ముట్టుకోవటం. అది రాత్రయినా పగలైనా సరే. దాన్ని అటూ ఇటూ త్రిప్పి ఊరకనే చూడటం. అదే విధంగా మునాబజ’హ్ అంటే, ఒక వ్యక్తి తన వస్త్రాన్ని మరోవ్యక్తి వైపు విసరివేయడం, రెండవ వ్యక్తి కూడా తన వస్త్రాన్ని మొదటి వ్యక్తి వైపు విసరివేయడం. ఇదే వారి బేరం అయిపోతుంది. అంటే చూడకుండా ఇష్టపడ కుండా. అదేవిధంగా ప్రవక్త (స) రెండురకాల దుస్తులను నిషేధించారు. ఒకటి ఇష్‌తిమాలుస్సమ్మా. ఇది ఎలాగంటే ఒక భుజాన్ని కప్పి, మరో భుజాన్ని విప్పి ఉంచడం. మరో రకం ఇహ్‌తిబా అంటే రెండు పాదాలపై కూర్చోవటం. ఆ స్థితిలో మర్మాంగం బహిర్గతం అవడం. [55] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2854 – [ 21 ] ( صحيح ) (2/865)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ بَيْعِ الْحَصَاةِ وَعَنْ بَيْعِ الْغَرْرِ. رَوَاهُ مُسْلِمٌ.

2854. (21) [2/865దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) బైహసా’త్‌, బైగరర్‌ను నిషేధించారు. అంటే కంకరరాయి బేరం, మోస పూరితమైన బేరాన్ని నిషేధించారు. [56] (ముస్లిమ్)

2855 – [ 22 ] ( متفق عليه ) (2/865)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ بَيْعِ حَبَلِ الْحَبَلَةَ. وَكَانَ بَيْعًا يَتَبَايَعُهُ أَهْلُ الْجَاهِلِيَّةِ. كَانَ الرَّجُلُ يَبْتَاعُ الْجَزُوْرَ إِلَى أَنْ تُنْتَجَ النَّاقَةُ ثُمَّ تُنْتَجُ الَّتِيْ فِيْ بَطْنِهَا.

2855. (22) [2/865ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) గర్భాలను అమ్మటాన్ని నిషేధించారు. అదేవిధంగా ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం ప్రకారం అజ్ఞాన కాలంలో ప్రజలు ఒంటె మాంసాన్ని ‘హబ్‌లుల్‌ ‘హబ్‌ల్‌ వరకు అమ్మేవారు. అంటే గర్భం ధరించి ఉన్న ఒంటె బిడ్డను కని, మళ్ళీ దాని బిడ్డ గర్భం ధరించిన తర్వాత అది కూడా బిడ్డను కనడం. [57] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2856 – [ 23 ] ( صحيح ) (2/865)

وَعَنْهُ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ عَسْبِ الْفَحْلِ. رَوَاهُ الْبُخَارِيُّ .

2856. (23) [2/865దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) అస్ బిల్‌ ఫ’హ్‌లిను నిషేధించారు. [58]  (బు’ఖారీ)

2857 – [ 24 ] ( صحيح ) (2/865)

وَعَنْ جَابِرٍ: قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ بَيْعِ ضَرَابِ الْجَمَلِ وَعَنْ بَيْعِ الْمَاءِ وَالْأَرْضِ لِتُحْرَثَ. رَوَاهُ مُسْلِمٌ .

2857. (24) [2/865దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) మగ ఒంటెను ఆడ ఒంటెపై ఎక్కించి, దాని వీర్యాన్ని అమ్మటాన్ని నిషేధించారు. అదేవిధంగా నీళ్ళను అమ్మటాన్ని నిషేధించారు. వ్యవసాయం కోసం భూమిని అమ్మటాన్ని నిషేధించారు. [59] (ముస్లిమ్‌)

2858 – [ 25 ] ( صحيح ) (2/865)

وَعَنْهُ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ عَنْ بَيْعِ فَضْلِ الْمَاءِ. رَوَاهُ مُسْلِمٌ .

2858. (25) [2/865దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) మిగిలి ఉన్న నీటిని అమ్మటాన్ని నిషేధించారు. [60]  (ముస్లిమ్‌)

2859 – [ 26 ] ( متفق عليه ) (2/865)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”لَا يُبَاعُ فَضْلُ الْمَاءِ لِيُبَاعَ بِهِ الْكَلْأَ”.

2859. (26) [2/865ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: అదనంగా ఉన్న నీటిని అమ్మరాదని, దాని ద్వారా గడ్డి అమ్మవచ్చని ప్రవక్త (స) ప్రవచించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

2860 – [ 27 ] ( صحيح ) (2/865)

وَعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مَرَّعَلَى صُبْرَةِ طَعَامٍ فَأَدْخَلَ يَدَهُ فِيْهَا فَنَالَتْ أَصَابِعُهُ بِلَلًا فَقَالَ: “مَا هَذَا يَا صَاحِبَ الطَّعَامِ؟” قَالَ: أَصَابَتْهُ السَّمَاءُ يَا رَسُولَ اللهِ. قَالَ: “أَفَلَا جَعَلْتَهُ فَوْقَ الطَّعَامِ حَتَّى يَرَاهُ النَّاسُ؟ مَنْ غَشَّ فَلَيْسَ مِنِّيْ”. رَوَاهُ مُسْلِمٌ.

2860. (27) [2/865దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) కుప్పలుగా ఉన్న ఆహార ధాన్యాల ప్రక్క నుండి వెళుతూ ఒక కుప్పలో తన చేతిని ముంచారు. ఆయన చేతికి తడి తగిలింది. అంటే లోపల కొన్ని గింజలు తడిగా ఉన్నాయి. అప్పుడు ప్రవక్త (స), ‘ఓ వ్యాపారి దీని సంగతేంటి? క్రింద తడిగా ఉన్నాయి, పైన పొడిగా ఉన్నాయి,’ అని ప్రశ్నించారు. దానికి ఆ వ్యాపారి, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! వర్షం పడినందున ఆహార ధాన్యాలు తడిసి పోయాయి. అందువల్ల నేను పైన ఎండుగా ఉన్న ఆహార ధాన్యాలు వేసాను,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు తడిగా ఉన్నది పైన ఉంచితే బాగుండేది. ప్రజలు చూసుకునే వారు. మనకు మోసం చేసేవారు మనలోని వారు కారు,’ అని ప్రవచించారు. (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం 

2861 – [ 28 ] ( لم تتم دراسته ) (2/866)

عَنْ جَابِرٍ قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَهَى عَنِ الثَّنْيَا إِلَّا أَنْ يُّعْلَمَ. رَوَاهُ التِّرْمِذِيُّ.

2861. (28) [2/866అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: బేరంలో మినహాయించటాన్ని ప్రవక్త (స) నిషేధించారు. అయితే మినహాయింపు నిర్థారించబడి ఉండాలి. [61] (తిర్మిజి’)

2862 – [ 29 ] ( صحيح ) (2/866)

وَعَنْ أَنَسٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: نَهَى رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ بَيْعِ الْعِنَبِ حَتَّى يَسْوَدَّ وَعَنْ بَيْعِ الْحَبِّ حَتَّى يَشْتَدَّ هَكَذَا رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُو دَاوُدَ عَنْ أَنَسٍ.

وَالزِّيَادَة الَّتِي فِي المصابيح وَهُوَ قولُه: نهى عَن بيْعِ التَمْرِ حَتَّى تزهوَ إِنَّما ثبتَ فِي رِوَايَتِهِمَا: عَنِ ابْنِ عُمَرَ قَالَ: نَهَى عَنْ بَيْعِ النَّخْلِ حَتَّى تَزْهُوَ وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيث حسن غَرِيب.

2862. (29) [2/866దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇంకా నల్లరంగురాని అంటే పండని ద్రాక్షపళ్లను అమ్మటాన్ని నిషేధించారు. అదేవిధంగా ఆహారధాన్యాలను ధృడంగా తయారవ నంత వరకు అమ్మటాన్ని నిషేధించారు. [62]  (తిర్మిజి’-ప్రామాణికం-ఏకోల్లేఖనం, అబూ దావూద్‌)

మసాబీహ్‌లోని కొన్ని ఉల్లేఖనాల్లో ప్రవక్త (స) ఖర్జూ రాలను పండనంత వరకు అమ్మటాన్ని వారించారు.

2863 – [ 30 ] ( لم تتم دراسته ) (2/866)

وَعَنِ ابْنِ عُمَرَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى عَنْ بَيْعِ الْكَالئِ بِالْكَالِئِ . رَوَاهُ الدَّارَقُطْنِيُّ.

2863. (30) [2/866అపరిశోధితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) అప్పును – అప్పుతో అమ్మటాన్ని నిషేధించారు. [63] (దారు ఖుతునీ)

2864 – [ 31 ] ( ضعيف ) (2/866)

وَعَنْ عُمرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ بَيْعِ الْعُرْبَانَ. رَوَاهُ مَالِكٌ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

2864. (31) [2/866- బలహీనం]

‘అమ్ర్ బిన్‌ షు’ఐబ్‌ తన తండ్రి ద్వారా, అతడు తన తండ్రి ద్వారా(ర) కథనం: ప్రవక్త (స) బై ‘ఉర్‌బాన్‌ను నిషేధించారు. [64] (మాలిక్‌, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

2865 – [ 32 ] ( ضعيف ) (2/867)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ بَيْعِ الْمُضْطَرِّ وَعَنْ بَيْعِ الْغَرَرِ وَعَنْ بَيْعِ الثَّمْرَةِ قَبْلَ أَنْ تُدْرِكَ. روَاهُ أَبُوْ دَاوُدَ.

2865. (32) [2/867బలహీనం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) బలవంతంగా అమ్మటాన్ని, మోసంతో అమ్మటాన్ని, ఇంకా పండని కాయలను అమ్మ టాన్ని నిషేధించారు. [65] (అబూ దావూద్‌)

2866 – [ 33 ] ( لم تتم دراسته ) (2/867)

وَعَنْ أَنَسٍ: أَنَّ رَجُلًا مِنْ كِلَابِ سَأَلَ النَّبِيَّ صلى الله عليه وسلم عَنْ عَسْبِ الْفَحْلِ فَنَهَاهُ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَّا نُطْرِقُ الْفَحْلَ فَنُكْرَمُ فَرَخَّصَ لَهُ فِيْ الْكِرَامَةِ. رَوَاهُ التِّرْمِذِيُّ.

2866. (33) [2/867అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: కిలాబ్‌ తెగకు చెందిన ఒక వ్యక్తి మగ జంతువును ఆడ జంతువుపై ఎక్కించే నిమిత్తం ప్రతిఫలం విషయాన్ని గురించి ప్రవక్త (స)ను విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స) ప్రతిఫలం తీసుకోవటాన్ని నిషేధించారు. ఆ వ్యక్తి ఎవరైనా అడక్కుండా ఇస్తే తీసుకోవచ్చునా, అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స) అనుమతించారు. (తిర్మిజి’)

2867 – [ 34 ] ( صحيح ) (2/867)

وَعَنْ حَكِيْمِ بْنِ حِزَامٍ قَالَ: نَهَانِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ أَبِيْعَ مَا لَيْسَ عِنْدِيْ. رَوَاهُ التِّرْمِذِيُّ فِيْ رِوَايَةٍ لَهُ وَلِأَبِيْ دَاوُدَ وَالنَّسَائِيُّ: قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ يَأْتِيْنِيْ الرَّجُلُ فَيُرِيْدُ مِنِّيْ الْبَيْعَ وَلَيْسَ عِنْدِيْ فَأبْتَاعُ لَهُ مِنَ السُّوْقِ قَالَ: “لِاُ تْبِعُ مَا لَيْسَ عِنْدَكَ”.

2867. (34) [2/867దృఢం]

‘హకీమ్‌ బిన్‌ ‘హి’జామ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను, నా వద్ద లేని వస్తువును అమ్మవద్దని వారించారు. (తిర్మిజి’)

అబూ దావూద్‌, నసాయీ’లలో ఇలా ఉంది, ”ప్రవక్త (స)ను నేను ఇలా విన్నవించుకున్నాను, ”ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి, నా నుండి ఏదో కావాలని కోరుతాడు. అది నా వద్ద ఉండదు. అతనితో ఒప్పందం కుదిరిపోతుంది. ఆ తరువాత బజారుకు వెళ్ళి కొని తెచ్చిఇస్తాను. అప్పుడు ప్రవక్త (స) నీ దగ్గర లేనిదాన్ని, నీ అధీనంలో లేనిదాన్ని అమ్మకు, అని హితబోధ చేసారు.

2868 – [ 35 ] ( صحيح ) (2/867)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ بَيْعَتَيْنِ فِيْ بَيْعَةٍ. رَوَاهُ مَالِكٌ وَالتِّرْمِذِيُّ و أبوداؤد وَالنَّسَائِيُّ.

2868. (35) [2/867దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ఒక వ్యవహారంలో రెండు వ్యవహారాలు చేయటాన్ని నిషేధించారు. [66] (మాలిక్‌, తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’)

2869 – [ 36 ] ( لم تتم دراسته ) (2/867)

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ بَيْعَتَيْنِ فِيْ صَفَقَةٍ وَّاحِدَةٍ. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ .

2869. (36) [2/867అపరిశోధితం]

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ తన తండ్రి, తాతల ద్వారా, కథనం: ప్రవక్త (స) ఒక వ్యవహారంలో రెండు వ్యవహారాలు చేయటాన్ని నిషేధించారు. (షర’హ్ సున్నహ్‌)

2870 – [ 37 ] ( حسن ) (2/867)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَحِلُّ سَلَفٌ وَبَيْعٍ وَّلَا شَرْطَانِ فِيْ بَيْعٍ وَّلَا رِبْحُ مَا لَمْ يُضْمَنْ وَلَا بَيْعُ مَا لَيْسَ عِنْدَكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا صِحِيْحٌ.

2870. (37) [2/867ప్రామాణికం]

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ తన తండ్రి, తాతల ద్వారా, కథనం: ప్రవక్త (స)  అరువును బేరాన్ని ఒకచోట చేర్చరాదు, బేరంలో రెండు షరతులను పెట్టరాదు, తన అధీనంలో రానిదాని లాభాన్ని తీసుకోరాదు, తన దగ్గర లేని వస్తువును అమ్మరాదు అని ప్రవక్త(స) ప్రవచించారు. [67] (తిర్మిజి’ / దృఢం, అబూ దావూద్‌, నసాయి)

2871 – [ 38 ] ( لم تتم دراسته ) (2/868)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: كُنْتُ أَبِيْعُ الْإِبِلَ بِالنَّقِيْعِ بِالدَّنَانِيْرَ فَآخَذُ مَكَانَهَا الدَّاَرهِمَ وَأَبِيْعُ بِالدَّرَاهِمِ فَآخُذُ مَكَانَهَا بِالدَّنَانِيْرَ فَأَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم فَذَكَرْتُ ذَلِكَ لَهُ فَقَالَ: “لَا بَأْسَ أَنْ تَأْخُذَهَا بِسِعْرِ يَوْمِهَا مَا لَمْ تَفْتَرِقَا وَبَيْنَكُمَا شَيْءٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَ الدَّارَمِيُّ .

2871. (38) [2/868అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: నేను నఖీ ప్రదేశంలో ఒంటెలను దీనార్లకు, అష్రఫీలకు బదులు అమ్మేవాడిని. అష్రఫీలకు బదులు దిర్‌హమ్‌లను ఇచ్చేవాడిని. దిర్‌హమ్‌లను అమ్మేవాడిని, వాటికి బదులు అష్‌రఫీలు, దీనార్లు తీసుకునేవాడిని. ఒకసారి నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళి, ‘నేను ఇలా చేస్తున్నాను,’ అని విన్నవించుకున్నాను. ప్రవక్త (స) ‘దానికేమి అభ్యంతరం లేదు. నీవు దిర్‌హమ్‌లను, దీనార్లను ఆ రోజు మార్కెట్టు రేటు ప్రకారం తీసుకో. అయితే అమ్మేవారు, కొనేవారు విడిపోకుండా ఉన్నంత వరకు.’ [68] (తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’, దారమి)

2872 – [ 39 ] ( حسن ) (2/868)

وَعَنِ الْعَدَّاءِ بْنِ خَالِدِ بْنِ هَوْذَةَ أَخْرَجَ كِتَابًا: هَذَا مَا اشْتَرَى الْعَدَّاءُ بْنُ خَالِدِ بْنِ هَوْذَةَ مِنْ مُحَمَّدٍ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم اشْتَرَى مِنْهُ عَبْدًا أَوْ أَمًةً لَا دَاءَ وَلَا غَائِلَةَ وَلَا خِبْثَةَ بَيْعُ الْمُسْلِمَ الْمُسْلِمَ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

2872. (39) [2/868ప్రామాణికం]

‘అదా బిన్‌ ‘ఖాలిద్‌ బిన్‌ హౌజ’హ్‌ ఒక వ్రాత ప్రతిని తీసారు. అందులో ఇలా వ్రాసిఉంది. ‘అదా బిన్‌ ‘ఖాలిద్‌ బిన్‌ హౌ’జహ్‌ ప్రవక్త (స) నుండి ఒక బానిస లేదా బానిసరాలు కొన్నారు. ఆ బానిస లేదా బానిస రాలిలో ఎటువంటి లోపంలేదు. అతడు ఒక ముస్లిమ్‌ నుండి మరో ముస్లిమ్‌ కొన్నట్లుకొన్నారు. [69]  (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

2873 – [ 40 ] ( ضعيف ) (2/868)

وَعَنْ أَنَسٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم بَاعَ حِلْسًا وَّقَدَحًا فَقَالَ: “مَنْ يَّشْتَرِيْ هَذَا الْحِلْسَ وَالْقَدَحَ؟” فَقَالَ رَجُلٌ: آخُذُهُمَا بِدِرْهَمٍ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “مَنْ يَّزِيْدُ عَلَى دِرْهَمٍ؟” فَأَعَطَاهُ رَجُلٌ دِرْهَمَيْنِ فَبَاعَهُمَا مِنْهُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

2873. (40) [2/868బలహీనం]

అనస్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) ఒక గోనెసంచి, ఒక కప్పును అమ్మటానికి నిశ్చయించుకున్నారు. ప్రజలతో ‘ఈ గోనె సంచిని, ఈ కప్పును ఎవరు కొంటారు’ అని అన్నారు. ఒక అనుచరుడు ‘నేను ఒక దిర్‌హమ్‌లో వీటిని కొంటాను’ అని అన్నాడు. ప్రవక్త (స) ‘ఒక దిర్‌హమ్‌ కన్నా ఎక్కువలో ఎవరు కొంటారు’ అని అన్నారు. మరో అనుచరుడు ‘నేను రెండు దిర్‌హమ్‌లు ఇస్తాను’ అని అన్నాడు. ప్రవక్త (స) ఆ రెంటిని రెండు దిర్‌హమ్‌లకు బదులుగా అతినికి అమ్మివేసారు.” [70] (తిర్మిజి’, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం  

2874 – [ 41 ] ( لم تتم دراسته ) (2/869)

عَنْ وَاثِلَةَ بْنِ الْأَسْقَعِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ بَاعَ عَيْبًا لَمْ يُنَبِّهِ لَمْ يَزَلْ فِيْ مَقْتِ اللهِ أَوْ لَمْ تَزَلِ الْمَلَائِكَةُ تَلْعَنُهُ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

2874. (41) [2/869అపరిశోధితం]

వాసి’లహ్‌ బిన్‌ అస్‌ఖ’అ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. ఎవరైనా లోపం ఉన్న వస్తువును లోపం చూపెట్టకుండా అమ్మితే ఎల్లప్పుడూ అల్లాహ్‌ ఆగ్రహంతో ఉంటాడు. లేదా ఎల్లప్పుడూ దైవదూతల శాపానికి గురవుతూ ఉంటాడు. (ఇబ్నె మాజహ్)

=====

6- بَابٌ فِىْ الْبَيْعِ الْمَشْرُوْطِ

6. షరతులతో కూడిన అమ్మకం

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం  

2875 – [ 1 ] ( صحيح ) (2/870)

عَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنِ ابْتَاعَ نَخْلًا بَعْدَ أَنْ تُؤَبَّرَ فَثَمْرَتُهَا لِلْبَائِعِ إِلَّا أَنْ يَّشْتَرِطَ الْمُبْتَاعُ وَمَنِ ابْتَاعَ عَبْدًا وَلَهُ مَالٌ فَمَالُهُ لِلْبَائِعِ إِلَّا أَنْ يَشْتَرِطَ الْمُبَتَاعُ”. رَوَاهُ مُسْلِمٌ وَرَوَى الْبُخَارِيُّ الْمَعْنَى الْأَوَّلُ وَحْدَهُ.

2875. (1) [2/870దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఫలదీకరణం చేసిన తరువాత ఖర్జూరాల చెట్లను కొంటే, దాని ఆ సంవత్సరపు పళ్ళు అమ్మే వాడికి చెందుతాయి. అయితే కొనేవారు షరతు పెట్టుకోవాలి. అదేవిధంగా బానిసను కొంటే, బానిస వద్ద ఉన్న ధనం అమ్మేవారికి చెందుతుంది. అయితే బానిస ధనం కూడా నేనే తీసుకుంటాను అని షరతు పెట్టుకుంటే ఆ ధనం కొనేవారికి  లభిస్తుంది. [71]  (ముస్లిమ్‌)

2876 – [ 2 ] ( متفق عليه ) (2/870)

وَعَنْ جَابِرٍ: أَنَّهُ كَانَ يَسِيْرُعَلَى جَمَلٍ لَهُ قَدْ أَعْيي فَمَرَّ النَّبِيُّ صلى الله عليه وسلم بِهِ فَضَرَبَهُ فَسَارَ سَيْرًا لَيْسَ يَسِيْرُ مِثْلَهُ ثُمَّ قَالَ: “بِعْنِيْهِ بِوُقِّيَّةٍ” .قَالَ: فَبِعْتُهُ فَاسْتَثْنَيْتُ حُمْلَانَهُ إِلَى أَهْلِيْ فَلَمَّا قَدِمْتُ الْمَدِيْنَةَ أَتَيْتُهُ بِالْجَمَلِ. وَنَقَدَنِيْ ثَمَنَهُ.

وَفِيْ رِوَايَةٍ فَأَعْطَانِيْ ثَمَنَهُ وَرَدَّهُ عَلَيَّ. مُتَّفَقٌ عَلَيْهِ.

وَفِيْ رِوَايَةٍ لِلْبُخَارِيِّ أَنَّهُ قَالَ لِبِلَالٍ: “اِقْضِهِ وَزِدْهُ” فَأَعْطَاهُ وَزَادَهُ قِيْرَاطًا.

2876. (2) [2/870ఏకీభవితం]

జాబిర్‌(ర) తన వృత్తాంతాన్ని ఇలా తెలిపారు, ”అతను ప్రయాణంలో అలసిపోయిన ఒంటెపై వెళుతున్నారు. ఒంటె కూడా చాలా అలసిపోయింది. నడవలేకపోతుంది. దాన్ని అడవిలో వదలి వెళ్ళిపోదామని అనుకున్నారు. ప్రవక్త (స) అతని సమీపం నుండి వెళ్ళారు. అతని ఒంటె పరిస్థితిని చూసి తన చేతి కొరడాతో ఒకసారి కొట్టారు. ఫలితంగా అది వేగంగా నడవసాగింది. అంతకు ముందు ఎన్నడూ అలా నడవలేదు. ప్రవక్త (స) జాబిర్‌ (ర) తో ఇలా అన్నారు, ”నీవు ఒంటెను నాకు ఒక ఊఖియకు బదులు అమ్మివేయి.”

జాబిర్‌ ర. ”నేను ఈ ఒంటెను మీకు(స) అమ్ముతాను, కాని ప్రయాణంలో ఉండటం వల్ల ఇంటి వరకు ఒంటెపై వెళతాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒంటెను మీకు అప్పగిస్తాను, మార్గం మధ్యలో ఒకవేళ నేను మీకు ఒంటెను ఇచ్చివేస్తే ఇంటివరకు నడచి వెళ్ళడం నాకు చాలా కష్టం అవుతుంది’ అని అన్నాను. ప్రవక్త (స) నా షరతుకు ఒప్పుకున్నారు. నేను ఇంటికి చేరిన తర్వాత ఒంటెను తీసుకొని ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. ఒంటెను ప్రవక్త(స) కు అప్పగించాను. ప్రవక్త (స) దాని ఖరీదును నాకు ఇచ్చారు.

మరో కథనంలో ఇలా ఉంది,”ఆ ఒంటె ఖరీదును ఇచ్చారు, ఒంటెను కూడా తిరిగి ఇచ్చివేసారు. [72] (బు’ఖారీ, ముస్లిమ్)

బు’ఖారీ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ప్రవక్త (స) బిలాల్‌ను జాబిర్‌ (ర)కు ఆ ఒంటె ఖరీదును ఇమ్మని, అంతకంటే కొంత ఎక్కువ ఇమ్మని ఆదేశించారు. బిలాల్‌ (ర) నాకు ఒంటె ఖరీదును కూడా ఇచ్చారు. ప్రవక్త (స) ఆదేశం ప్రకారం ఒక ఖీరాత్‌ అధికంగా ఇచ్చారు.

2877 – [ 3 ] ( متفق عليه ) (2/870)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: جَاءَتْ بَرِيْرَةُ فَقَالَتْ: إِنِّيْ كَاتَبْتُ عَلَى تِسْعِ أَوْاقٍ فِيْ كُلِّ عَامٍ وُّقِيَّةٌ فَأعِيْنِيْنِيْ فَقَالَتْ عَائِشَةُ: إِنَّ أَحَبَّ أَهْلُكِ أَنْ أَعُدَّهَا لَهُمْ عَدَّةً وَّاحِدَةً وَأعْتِقَكَ فَعَلَتْ وَيَكُوْنُ وَلَاؤُكَ لِيْ فَذَهَبْتُ إِلَى أَهْلِهَا فَأَبَوْا إِلَّا أَنْ يَّكُوْنَ الْوِلَاءُ لَهُمْ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خُذِيْهَا وَأعْتِقِيْهَا”. ثُمَّ قَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ النَّاسِ فَحَمِدَ اللهَ وَأثْنَى عَلَيْهِ ثُمَّ قَالَ: “أَمَّا بَعْدُ فَمَا بَالُ رِجَالٌ يَّشْتَرِطُوْنَ شُرُوْطًا لَيْسَتْ فِيْ كِتَابِ اللهِ مَا كَانَ مِنْ شَرْطٍ لَيْسَ فِيْ كِتَابِ اللهِ فَهُوَ بَاطِلٌ. وَإِنْ كَانَ مِائَةَ شَرْطٍ فَقَضَاءُ اللهُ أَحَقُّ وَشَرْطُ اللهِ أَوْثَقَ وَإِنَّمَا الْوِلَاءُ لِمَنْ أَعْتَقَ”.

2877. (3) [2/870ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: బరీరహ్ నా వద్దకు వచ్చి ”నేను నా యజమానితో, 9 ఊఖియాలపై ప్రతి సంవత్సరం ఒక ఊఖియా ఇస్తానని ఒప్పందం చేసుకున్నాను. ఇప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నాను. ఒప్పందం చేసుకున్న దాన్ని ఇవ్వలేక పోతున్నాను. కనుక మీరు నాకు సహాయం చేయండని విన్నవించుకుంది. అప్పుడు నేను ఒకవేళ నీ యజమాని ఒకేసారి నీ ధర తీసుకుని నిన్ను అమ్మితే, నేను, నిన్ను కొని, విడుదల చేయించాలను కుంటే ఇలా చేయగలను. అయితే నీ వలా‘ నాకు చెందాలి,’ అని అన్నారు. బరీరహ్ తన యజ మానుల వద్దకు వెళ్ళి ‘ఆయి’షహ్‌ (ర) సందేశాన్ని అందజేసింది. వారు,  ‘ఆమె కొని నిన్ను విడుదల చేయగలదు. కాని వలా మాకు చెందాలి,’ అని అన్నారు. ‘ఆయి’షహ్‌కు వలా ఇవ్వటానికి వారు నిరాకరించారు. ప్రవక్త (స) ఇంటికి వచ్చిన తరువాత ‘ఆయి’షహ్‌ (ర) జరిగినదంతా వివరించారు. అప్పుడు ప్రవక్త (స), ”నీవు బరీరహ్ను కొని విడుదల చేయగలవు. వలా‘ విడుదల చేసేవారికి వర్తిస్తుంది. ఈ విషయాన్ని అందరికీ తెలియపర్చ టానికి ప్రవక్త (స) ప్రసంగం ప్రారంభించి అన్నిటి కంటే ముందు దైవాన్ని స్తుతించారు. ఆ తరువాత కొందరు దైవగ్రంథంలో లేని షరతులను పెడుతున్నారు. ఇటువంటి షరతుగల దైవాదేశాలూ లేవు. దైవ తీర్పుకు వ్యతిరేకంగా ఉన్న షరతులన్నీ రద్దుచేయ బడతాయి. 100 షరతులు ఉన్నా దైవతీర్పునే అనుసరించడం జరుగుతుంది. అల్లాహ్‌ (త) షరతు, ఇతరషరతులన్నిటికంటే దృఢమైనది. వలా‘ విడుదల చేసిన వారికే వర్తిస్తుంది,” అని అన్నారు. [73]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

2878 – [ 4 ] ( متفق عليه ) (2/871)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ بَيْعِ الْوِلَاءِ وَعَنْ هِبَتِهِ .

2878. (4) [2/871ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) వలా’ను అమ్మటాన్ని, కానుకగా ఇవ్వటాన్ని నిషేధించారు. [74]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం 

2879 – [ 5 ] ( لم تتم دراسته ) (2/871)

عَنْ مَخْلَدِ بْنِ خُفَافٍ قَالَ: ابْتِعْتُ غُلَامًا فَاسْتَغَللتُهُ ثُمَّ ظَهَرْتُ مِنْهُ عَلَى عَيْبٍ فَخَاصَمْتُ فِيْهِ إِلَى عُمَرَبْنِ عَبْدِ الْعَزِيْزِ فَقَضَى لِيْ بِرَدِهِ وَقَضَى عَلَيَّ بِرَدّ غَلَّتِهِ. فَأَتَيْتُ عُرْوَةَ فَأَخْبَرْتُهُ فَقَالَ: أَرْوَحُ إِلَيْهِ الْعَشِيَّةَ فَأَخْبَرَهُ أَنْ عَائِشَةَ أَخْبَرَتْنِيْ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَضَى فِيْ مِثْلِ هَذَا: أَنَّ الْخِرَاجَ بِالضِّمَانِ فَرَاحَ إِلَيْهِ عُرْوَةُ فَقَضَى لِيْ أَنْ آخُذَ الْخِرَاجَ مَنِ الَّذِيْ قَضَى بِهِ عَلَيَّ لَهُ. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.

2879. (5) [2/871అపరిశోధితం]

ము’ఖ్‌లద్‌ బిన్‌ ‘ఖుఫాఫ్‌ (ర): నేను ఒక బానిసను కొన్నాను. అతని సంపాదన కూడా తిన్నాను. చాలా కాలం వరకు అతని సంపాదనను నా కోసం వినియోగిస్తూ ఉన్నాను. ఆ తరువాత అతడి లోపం తెలిసింది. అంటే అతనిలో ఇంతకు ముందు నుండే లోపం ఉండేది. కాని అది నాకు తెలియదు. కొన్న చాలా కాలం తరువాత నాకు తెలిసింది. ఈ విషయంలో ప్రస్తుత పాలకులు, ‘ఉమర్‌ బిన్‌ ‘అబ్దుల్‌ ‘అ’జీ’జ్‌ కు ఫిర్యాదు చేసాను. ”ఈ బానిసను అతని మొదటి యజమానికి తిరిగి ఇచ్చివేయి. అతడు సంపాదించి నీకు ఇచ్చింది అతనికి తిరిగి ఇచ్చివేయి,” అని అన్నారు. అప్పుడు నేను ‘ఉర్‌వహ్ బిన్‌ ‘జుబైర్‌ వద్దకు వచ్చాను. ఇవ్వబడిన తీర్పుగురించి అతనికి చెప్పాను. దానికి ‘ఉర్‌వహ్, ”నేను సాయంత్రం ‘ఉమర్‌ బిన్‌ ‘అబ్దుల్‌ ‘అ’జీ’జ్‌ వద్దకు వెళతాను. అతనితో, ‘ప్రవక్త (స) ఇటువంటి కేసుల్లో రాబడి వారసత్వానికి బాధ్యుడైన వాడికే చెందుతుందని తీర్పు ఇచ్చారని, ‘ఆయి’షహ్‌ (ర) చెప్పారని’ చెబుతాను,” అని అన్నారు.

ఉదాహరణకు ఒకడు ఒక బానిసను కొని అతన్ని పనిలో పెట్టాడు. కొంత లాభం పొందాడు. ఆ తరువాత అతనిలో లోపం కనబడింది. అతను కొన్నప్పుడు అమ్మేవారు అతనికి ఆ లోపం తెలియపర్చలేదు. లోపంవల్ల కొన్నవాడు ఆ బానిసను తిరిగి ఇచ్చివేస్తే తన ధరను తిరిగి తీసుకోవాలి. బానిస సంపాదించింది కొన్న వ్యక్తికే లభిస్తుంది. ఎందుకంటే అతడే బానిసకు బాధ్యుడు, వారసుడు. ఒకవేళ బానిస చనిపోతే అతనికి నష్టం కలుగుతుంది.

సాయంత్రం వేళ ‘ఉర్వ బిన్‌ ‘జుబైర్‌, పాలకుడు ‘ఉమర్‌ బిన్‌ ‘అబ్దుల్‌ ‘అ’జీ’జ్‌ వద్దకు వెళ్ళాడు. అతనికి ఈ ‘హదీసు’ను వినిపించాడు. వెంటనే ‘ఉమర్‌ బిన్‌ ‘అబ్దుల్‌ ‘అ’జీ’జ్‌ తన మొదటి అభిప్రాయాన్ని మార్చుకున్నారు. (షర’హ్ సున్నహ్‌)

2880 – [ 6 ] ( لم تتم دراسته ) (2/871)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا اخْتَلَفَ الْبَيِّعَانِ فَالْقَوْلُ قَوْلُ الْبَائِعِ وَالْمُبْتَاعُ بِالْخِيَارِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

وَفِيْ رِوَايَةِ ابْنِ مَاجَهُ وَالدَّارَمِيُّ قَالَ: “اَلْبَيِّعَانِ إِذَا اخْتَلَفَا وَالْمُبِيْعُ قَائِمٌ بِعَيْنِهِ وَلَيْسَ بَيْنَهُمَا بَيِّنَةٌ فَالْقَوْلُ مَا قَالَ الْبَائِعُ أَوْ يَتَرَادَّانِ الْبَيْعَ”.

2880. (6) [2/871అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర)కథనం: అమ్మే వారికీ, కొనే వారికి అభిప్రాయభేదం ఏర్పడితే, అమ్మే వారి వాదనకు ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. అయితే కొనే వారికి వ్యవహారాన్ని కొనసాగించే లేదా రద్దు చేసే అధికారం ఉంది. [75]  (తిర్మిజి’)

ఇబ్నె మాజహ్ మరియు దారమి ఉల్లేఖనాల్లో ఇలా ఉంది: ”ఒకవేళ అమ్మేవారు, కొనేవారి మధ్య అభిప్రాయభేదం ఏర్పడితే, వారివద్ద ఎవరూ సాక్ష్యం లేకపోతే, అమ్మబడిన వస్తువు అక్కడే ఉంటే, ఇటు వంటి పరిస్థితిలో అమ్మేవారి వాదనకే ప్రామాణికత ఉంటుంది. ఆ ఇద్దరూ కోరితే వ్యవహరాన్ని కొనసా గించ వచ్చు లేదా రద్దు చేయవచ్చు.

2881 – [ 7 ] ( صحيح ) (2/871)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ :قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَقَالَ مُسْلِمًا أَقَالَهُ اللهُ عَثْرَتَهُ يَوْمَ الْقِيَامَةِ”. روَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ

وَفِيْ “شَرْحِ السُّنَّةِ “بِلَفْظِ”اَلْمَصَابِيْحِ”عَنْ شُرَيْحِ الشَّامِيِّ مُرْسَلًا .

2881. (7) [2/871దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ”ఎవరైనా వ్యవహారంలో వ్యాపారంలో రెండవ వ్యక్తికి ఇష్టంలేని దాన్ని రద్దుచేస్తే, అల్లాహ్‌ (త) తీర్పుదినం నాడు ఆ రద్దు చేసిన వ్యక్తి పాపాలను క్షమించివేస్తాడని,” ప్రవక్త (స) ప్రవచించారు. [76]  (ఇబ్నె మాజహ్, అబూ దావూద్‌, షర్‌’హ్ సున్నహ్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

2882 – [ 8 ] ( متفق عليه ) (2/872)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اشْتَرَى رَجُلٌ مِمَّنْ كَانَ قَبْلَكُمْ عِقَارًا مِّنْ رَجُلٍ فَوَجَدَ الَّذِيْ اشْتَرَى الْعِقَارَ فِيْ عشقَارِهِ جَرَّةً فِيْهَا ذَهْبٌ. فَقَالَ لَهُ الَّذِي اشْتَرَى الْعِقَارَ: خُذْ ذَهْبَكَ عَنِّيْ إِنَّمَا اشْتَرَيْتُ الْعَقَارَ وَلَمِ ابْتَعْ مِنْكَ الذَّهْبَ. فَقَالَ بَائِعُ الْأَرْضِ: إِنَّمَا بِعْتُكَ الْأَرْضَ وَمَا فِيْهَا فَتَحَاكَمَا إِلَى رَجُلٍ فَقَالَ الَّذِيْ تَحَاكَمَا إِلَيْهِ: أَلَكُمَا وَلَدٌ؟ فَقَالَ أَحَدُهُمَا: لِيْ غُلَامٌ. وَقَالَ الْآخَرُ: لِيْ جَارِيَةٌ. فَقَالَ: أَنْكِحُوا الْغُلَامَ الْجَارِيَةَ وَأَنْفِقُوْا عَلَيْهِمَا مِنْهُ وَتَصَدَّقُوْا”.

2882. (8) [2/872ఏకీభవితం]

 అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పూర్వకాలంలో ఒకవ్యక్తి మరోవ్యక్తి దగ్గర నుండి భూమి కొన్నాడు. కొన్నవ్యక్తి తన భూమిలో ఒక కుండను చూచాడు. అది బంగారంతో నిండి ఉంది. ఆ వ్యక్తి భూమి అమ్మిన వ్యక్తితో, ‘నీ భూమిలో నాకు ఒక కుండ దొరికింది, అది బంగారంతో నిండి ఉంది. నేను నీ నుండి భూమి కొన్నాను. బంగారం కాదు. ఈ బంగారాన్ని తీసుకో,’ అని అన్నాడు. దానికి అమ్మిన వ్యక్తి, ‘నేను నీకు భూమి, దానిలో ఉన్నదంతా అమ్మాను. అది నీదవుతుంది.’ వారిద్దరిలో అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. ఆ బంగారం తీసుకోవటానికి ఇద్దరూ వెనుకాడారు. ఎందుకంటే ఇద్దరూ నిజాయితీ పరులు. వారిద్దరూ కలసి న్యాయం చేకూర్చే న్యాయ పీఠం వద్దకు వెళ్ళారు. ఆ ఇద్దరూ వారిముందు తమ వాదనను వెలిబుచ్చారు. న్యాయాధిపతి వారిద్దరితో, ‘మీకు సంతానం ఉందా?’ అని అడిగారు. వారిలో ఒకడు, ‘నాకు ఒక కుమారుడు ఉన్నాడని,’ అన్నాడు. మరొకడు, ‘నాకు ఒక కుమార్తె ఉందని,’ అన్నాడు. ఆ న్యాయాధికారి, ‘నీవు నీ కుమారుడి పెళ్ళి ఇతని కుమార్తెతో చేయి, అతనితో నీవు నీ కుమార్తె పెళ్ళి ఇతని కుమారుడితో చేయి, ఈ బంగారాన్ని వారిద్దరిపై ఖర్చు పెట్చండి. మిగిలిన దాన్ని దైవమార్గంలో ఖర్చుచేయండి,’ అని తీర్పు ఇచ్చాడు. వారిద్దరూ ఆ విధంగానే చేసారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

=====

7- بَابُ السَّلَمِ وَالرِّهْنِ

7. సలమ్‌” మరియు తాకట్టు

1. ఒక వ్యక్తి మరో వ్యక్తికి నగదు రూపాయలు ఇచ్చి, ‘వీటికి బదులు ఇన్ని గోదుమలు మొదలైనవి ఇన్ని దినాలలో తీసుకుంటాను,’ అని అంటాడు. రెండవ వ్యక్తి ఆ డబ్బును తీసుకుంటాడు. ఈ వ్యవహారాన్ని అరబీలో సలమ్‌ వ్యాపారం లేదా సలఫ్‌ వ్యాపారం అంటారు. డబ్బు ఇచ్చేవారిని రబ్బుస్సలమ్‌, తీసుకునేవారిని ముస్‌లమ్‌ ఇలైహి, డబ్బును ముస్‌లమ్‌ ఫీహ్‌ అంటారు. ఉదా: జైద్‌, బకర్‌తో 10 రూ. నీకు ఇస్తున్నాను. నెల రోజుల తర్వాత ఇటువంటి ఉన్నత శ్రేణికి చెందిన 10 కేజీల గోదుమలు తీసుకుంటాను. బకర్‌ ఈ వ్యవహారాన్ని స్వీకరించి డబ్బు తీసుకున్నాడు. ఇటువంటి వ్యవహారాన్ని సలమ్‌ అంటారు. ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి. ఈ షరతులన్ని ఉంటేనే ఇది సలమ్‌ అమ్మకం అవుతుంది. డబ్బు విషయంలో కొన్ని షరతులు ఉన్నాయి. మొత్తం 16 షరతులు ఉన్నాయి.

1. నగదు రూపం. రూపాయలు లేదా అష్రఫీలు లేదా బంగారం లేదా వెండి. 2. ఎటువంటి రూపాయలు లేదా అష్రఫీలు ఇండియాకు చెందినవా లేక అరబ్బులకు చెందినవా. 3. అవి చెల్లేవి, చెల్లనివి వాటి వివరణ. 4. వాటి సంఖ్య ఒక వంద లేదా రెండు వందలు. 5. నగదా? లేదా అప్పా? 6. ఆ సభలోనే వాటిని తాను వసూలు చేసుకోవాలి.

ముస్‌లమ్‌ ఫీహ్‌ షరతులు: 1. సరకుల వివరాలు అంటే అవి గోదుమలు లేదా జొన్నలు, 2. అవి ఏ రకానికి చెందినవి, 3. వాటి ప్రామాణికత అంటే అవి మొదటి రకానికి చెందినవా లేక రెండవ రకానికి చెందినవా, 4. వాటి పరిమాణం అంటే అవి ఎన్ని కేజీలు, 5. ఒకవేళ నగదుగా ఉండాలి అంటే వెండి బంగారాల్లో సలమ్‌ ధర్మం కాదు, 6. గడువు వివరణ ఒక నెల లేదా రెండు నెలలు, 7. ప్రపంచంలో ఆ వస్తువు దొరికేదై ఉండాలి, 8. వ్యవహారం పరిపూర్తిగా ఉండాలి. అందులో ఎలాంటి అధికారం ఉండరాదు, 9. సరకును అప్పగించే స్థలం.

II. అంటే తాకట్టు పెట్టటం. ఇది ఎలా అంటే ఒకవేళ మీరు ఎవరికైనా వంద లేదా రెండు వందలు అప్పుగా అడిగితే, అప్పు ఇచ్చేవారు మీతో, ”మీపై మాకు నమ్మకం లేదు కనుక దాని ధరకు తగిన వస్తువును మా వద్ద ఉంచండి. మీరు అప్పు చెల్లించిప్పుడు, మీ వస్తువును తిరిగి తీసుకొని వెళ్ళవచ్చు,” అని అంటాడు. దీన్ని అరబ్బీలో రహన్‌ అంటారు. తెలుగులో తాకట్టు అంటారు. ఖుర్‌ఆన్‌ ‘హదీసు’ల్లో దీన్ని గురించి అనుమతించబడింది. అల్లాహ్‌ ఆదేశం: ”ఒకవేళ మీరు ప్రయాణంలో ఉండి వ్రాసేవారు లేకుంటే తాకట్టు పెట్టండి.” (అల్‌-బఖరహ్‌, 2) తన ఇంటిలోనూ, ప్రయాణంలోనూ తాకట్టు పెట్టవచ్చును. దీన్నిగురించి వివరించడం జరుగుతుంది.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

2883 – [ 1 ] ( متفق عليه ) (2/873)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَدِمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم اَلْمَدِيْنَةَ وَهُمْ يُسْلِفُوْنَ فِيْ الثِّمَارِ السَّنَةَ وَالسَّنَتَيْنِ وَالثَّلَاثَ فَقَالَ: “مَنْ اسَلَفَ فِيْ شَيْءٍ فَلْيُسْلِفْ فِيْ كَيْلٍ مَّعْلُوْمٍ وَوَزْنٍ مَّعْلُوْمٍ إِلَى أَجَلٍ مَّعْلُوْمٍ”.

2883. (1) [2/873ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మదీనహ్ వలస వెళ్ళినపుడు మదీనహ్ వాసులు పళ్ళ విషయంలో సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాల సలమ్‌ వ్యాపారం చేసేవారు. ప్రవక్త (స) వారి ఈ పరిస్థితి చూసి, ”ఎవరైనా సలమ్‌ వ్యాపారం చేస్తే నిర్ణీత కొలపాత్ర, నిర్ణీత బరువు, నిర్ణీత కాలంతో చేయాలి,” అని హితబోధచేసారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

2884 – [ 2 ] ( متفق عليه ) (2/873)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: اشْتَرَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم طَعَامًا مِنْ يَهُوْدِيٍّ إِلَى أَجَلٍ وَرَهَنَهُ دِرْعًا لَهُ مِنْ حَدِيْدٍ.

2884. (2) [2/873ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ఒకసారి ప్రవక్త (స) ఒక యూదుని వద్ద నుండి ఆహారధాన్యాలు అప్పుగా కొన్నారు. దాని వెలకు బదులు తన ఇనుప కవచాన్ని అతని వద్ద తాకట్టు పెట్టారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

2885 – [ 3 ] ( صحيح ) (2/873)

وَعَنْهَا قَالَتْ: تُوُفِّيَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَدِرْعُهُ مَرْهُوْنَةٌ عِنْدَ يَهُوْدِيٍّ بِثَلَاثِيْنَ صَاعًا مِّنْ شَعِيْرٍ. رَوَاهُ الْبُخَارِيُّ .

2885. (3) [2/873దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మరణించి నపుడు 30 ‘సా’అల యవ్వలకు బదులు ప్రవక్త (స) కవచం ఒక యూదుని వద్ద తాకట్టు ఉంది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

2886 – [ 4 ] ( صحيح ) (2/873)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “الظَّهْرُ يُرْكَبُ بِنَفَقَتِهِ إِذَا كَانَ مَرْهُوْنًا وَلَبَنُ الدّرِّ يَشْرَبُ بِنَفَقَتِهِ إِذَا كَانَ مَرْهُوْنًا وَعَلَى الَّذِيْ يَرْكَبُ وَيَشْرَبُ النَّفَقَةُ “.رَوَاهُ الْبُخَارِيُّ .

2886. (4) [2/873దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ వాహనంగా ఉపయోగపడే జంతువు తాకట్టుగా ఉంటే దానికి అయ్యే ఖర్చుకు బదులు దాని పై ప్రయాణం చేయవచ్చును. ఒకవేళ పాలిచ్చే జంతువు తాకట్టుగా ఉంటే దానికి అయ్యే ఖర్చుకు తగ్గట్టు పాలు త్రాగవచ్చును. అయితే ప్రయాణంచేసే, పాలుత్రాగే వారిపై దాని ఖర్చు బాధ్యత ఉంది. [77] (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ    రెండవ విభాగం

2887 – [ 5 ] ( لم تتم دراسته ) (2/874)

عَنْ سَعِيْدِ بْنِ الْمُسَيِّبِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا يُغْلَقُ الرَّهْنُ. الرَّهْنَ مِنْ صَاحِبِهِ الَّذِيْ رَهَنَهُ لَهُ غُنْمُهُ وَعَلَيْهِ غُرْمُهُ”. رَوَاهُ الشَّافِعِيُّ مُرْسَلًا.

2887. (5) [2/874అపరిశోధితం]

స’యీద్‌ బిన్‌ ముసయ్యిబ్‌ (ర) ముర్సల్ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తాకట్టు పెట్టబడిన వస్తువును దాని యజమాని నుండి తాకట్టు వేరుచేయలేదు. దాని లాభం దాని యజమానికే చెందుతుంది. లాభనష్టాలు ఆయనవే. (షాఫ’యి / తాబయీ ప్రోక్తం)

2888 – [ 6 ] ( لم تتم دراسته ) (2/874)

وَرُوِيَ مِثْلُهُ أَوْ مَثَلُ مَعْنَاهُ لَا يُخَالِفُ عَنْهُ عَنْ أَبِيْ هُرَيْرَةَ مُتَّصَلًا.

2888. (6) [2/874అపరిశోధితం]

ఇలాంటి ‘హదీసు’ను, అబూ హురైరహ్‌ (ర) కథనంగా, షాఫ’యీ/ ముత్తసిల్ గా, ఉల్లేఖంచారు. [78]

2889 – [ 7 ] ( لم تتم دراسته ) (2/874)

وَعَنِ ابْنِ عُمَرَأَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “اَلْمِكْيَالُ مِكْيَالُ أَهْلِ الْمَدِيْنَةِ. وَالْمِيْزَانُ مِيْزَانُ أَهْلِ مَكَّةَ “. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

2889. (7) [2/874అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కొలత పాత్ర మదీనహ్ వారిది ప్రామాణిక మైనది. త్రాసు మక్కహ్ వారిది ప్రామాణికమైనది. [79] (అబూ దావూద్‌, నసాయి’)

2890 – [ 8 ] ( لم تتم دراسته ) (2/874)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِأَصْحَابِ الْكَيْلِ وَالْمِيْزَانِ: “إِنَّكُمْ قَدْ وَلَّيْتُمْ أَمْرَيْنِ هَلَكَتْ فِيْهِمَا الْأُمَمُ السَّابِقَةُ قَبْلَكُمْ “.  رَوَاهُ التِّرْمِذِيُّ.

2890. (8) [2/874అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) తూనికలు కొలతల వాళ్ళతో మీరు ఎటువంటి రెండు వస్తువులకు నిర్వాహకులుగా కొనసాగుతున్నారంటే ప్రాచీన జాతులు వీటిలో హెచ్చుతగ్గులు చేయటం వల్ల నాశనం చేయబడ్డాయి. [80] (తిర్మిజి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం  

2891 – [ 9 ] ( لم تتم دراسته ) (2/874)

عَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَسْلَفَ فِيْ شَيْءٍ فَلَا يَصْرِفْهُ إِلَى غَيْرِهِ قَبْلَ أنْ يَقْبِضَهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

2891. (9) [2/874అపరిశోధితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా ఏదైనా వస్తువు విషయంలో సలమ్‌ వ్యాపారం చేస్తే, అది అతని అధీనంలోనికి రాకుండా ఇతరులకు అందించరాదు. [81] (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

=====

8- بَابُ الْاِحْتِكَارِ

8. ధరలు పెంచే ఉద్దేశంతో ఆహార ధాన్యాలను ఆపిఉంచడం

కొందరు మార్కెట్‌ ధరలు పెంచటానికి ఆహార ధాన్యాలను, నిత్యావసర వస్తువులను అమ్మకుండా ఆపి ఉంచుతారు. దీనివల్ల ప్రజలకు చాలా అసౌకర్యం కలుగుతుంది. ఇటువంటి నీచ కార్యాన్ని అరబీలో ఇ’హ్‌తికార్‌ అంటారు. అధిక రేట్లకు అమ్మే ఉద్దేశంతో ఆహార ధాన్యాలను సరకులను ఆపిఉంచి దానివల్ల ప్రజలకు బాధ కలుగుతుందనే విషయాన్ని పట్టించుకోరు. ఇది ధార్మికంగా, నైతికంగా పెద్ద నేరం.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం   

2892 – [ 1 ] ( صحيح ) (2/875)

عَنْ مُعْمَرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنِ احْتَكَرَ فَهُوَ خَاطِئٌ”. رَوَاهُ مُسْلِمٌ.

وَسَنَذْكُرُ حَدِيْثَ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُ “كَانَتْ أَمْوَالُ بَنِي النَّضِيْرِ” فِيْ بَابِ الْفَيْءِ إِنْ شَاءَ اللهُ تَعَالى.

2892. (1) [2/875దృఢం]

ము’అమర్‌(ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”ఆహార ధాన్యాలను ఆపేవాడు పాపాత్ముడు.” (ముస్లిమ్‌)

ఉమర్ (ర) ఉల్లేఖించిన బనూ న’జీర్ ధనసంప దలకు చెందిన ‘హదీసు’ను ఇన్ షాఅల్లాహ్ బాబుల్ ఫైఅ’ లో పేర్కొందుము.

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం

2893 – [ 2 ] ( ضعيف ) (2/875)

عَنْ عُمَرَرَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “الْجَالِبُ مَرْزُوْقٌ وَالْمُحْتَكِرُ مَلْعُوْنٌ”. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ

2893. (2) [2/875బలహీనం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇతర పట్టణాల నుండి ఆహార ధాన్యాలను తీసుకువచ్చే, అమ్మే వారికి ఉపాధి ప్రసాదించబడుతుంది. వీటిని ఆపేవారు అల్లాహ్ (త) కారుణ్యానికి దూరం అవుతారు.” [82] (ఇబ్నె మాజహ్, దారమి)

2894 – [ 3 ] ( صحيح ) (2/875)

وَعَنْ أَنَسٍ قَالَ: غَلَا السِّعْرُ عَلَى عَهْدِ النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالُوْا: يَا رَسُوْلَ اللهِ سَعِّرْ لَنَا. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ هُوَ الْمُسَعِّرُالْقَابِضُ الْبَاسِطُ الرَّازِقُ وَإِنِّيْ لَأَرْجُوْ أَنْ أَلقَى رَبِّيْ وَلَيْسَ أَحَدٌ مِّنْكُمْ يَطْلُبُنِيْ بِمُظْلَمَةٍ بِدَمٍ وَّلَا مَالٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ .

2894. (3) [2/875దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అప్పుడు ప్రజలు వచ్చి ఓ అల్లాహ్‌ ప్రవక్తా! తమరు మాకోసం ధర నిర్ణయించండి. నిర్థారిత రేటుకు అమ్మడానికి అంటే రేట్లను అదుపులో పెట్టండి. దానికి ప్రవక్త (స) అల్లాహ్‌(త)యే ధరలను నిర్ణయిస్తాడు. ఆయన ధరలను అధికం చేస్తాడు. తగ్గిస్తాడు. ఆయనే ఉపాధి ప్రసాదిస్తాడు. ఎవరూ నన్ను ప్రతీకారంగానీ, ధనంగాని అడగని స్థితిలో దైవంతో కలుస్తానని భావిస్తున్నాను. (తిర్మిజి’, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్, దారమి)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

2895 – [ 4 ] ( لم تتم دراسته ) (2/876)

عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنِ احْتَكَرَ عَلَى الْمُسْلِمِيْنَ طَعَامَهُمْ ضَرَبَهُ اللهُ بِالْجُذَامِ وَالْإِفْلَاسٍ”. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ . وَرَزِيْنٌ فِيْ كِتَابِهِ.

2895. (4) [2/876-అపరిశోధితం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”ఆహార ధాన్యాలను ఆపి ధరలు పెంచి ముస్లిములకు అమ్మేవాడిని అల్లాహ్‌ (త) కుష్టురోగానికి, దారిద్య్రానికి గురిచేస్తాడు.” (ఇబ్నె మాజహ్, బైహఖీ-షు’అబిల్ ఈమాన్, ర’జీన్‌)

2896 – [ 5 ] ( لم تتم دراسته ) (2/876)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنِ احْتَكَرَ طَعَامًا أَرْبَعِيْنَ يَوْمًا يُرِيْدُ بِهِ الْغَلَاءَ. فَقَدْ بَرِئَ مِنَ اللهِ وَبَرِئَ اللهُ مِنْهُ”. رَوَاهُ رَزِيْنٌ.

2896. (5) [2/876అపరిశోధితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ధరలు పెంచే ఉద్దేశంతో 40 రోజుల వరకు ఆహార ధాన్యాలను ఆపేవాడు అల్లాహ్‌ (త) పరిధి నుండి తొలగిపోయాడు, అల్లాహ్‌ (త) అతని పట్ల విసిగి పోయాడు. (ర’జీన్‌)

2897 – [ 6 ] ( لم تتم دراسته ) (2/876)

وَعَنْ مُعَاذٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “بِئْسَ الْعَبْدُ الْمُحْتَكَرُ: إِنْ أَرْخَصَ اللهُ الْأَسْعَارَ حَزِنَ وَإِنْ أغْلَاهَا فَرِحَ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ وَرَزِيْنُ فِيْ كِتَابِهِ.

2897. (6) [2/876అపరిశోధితం]

ము’ఆజ్‌’ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ”ఆహార ధాన్యాలను ఆపే వాడు దాసుల్లో మహా చెడ్డవాడు. ఒకవేళ అల్లాహ్‌ (త) ధరలు తగ్గిస్తే దుఃఖం వ్యక్తంచేస్తాడు. ధరలు పెంచితే సంతోషిస్తాడు.” (బైహఖీ-షు’అబిల్ ఈమాన్, ర’జీన్‌)

2898 – [ 7 ] ( لم تتم دراسته ) (2/876)

وَعَنْ أَبِيْ أُمَامَةَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنِ احْتَكَرَ طَعَامًا أَرْبَعِيْنَ يَوْمًا ثُمَّ تَصَدَّقَ بِهِ لَمْ يَكُنْ لَهُ كَفَّارَةً”. رَوَاهُ رَزِيْنٌ.

2898. (7) [2/876అపరిశోధితం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకడు ధరలు పెంచడానికి 40 రోజుల వరకు ధాన్యాన్ని ఆపి ఉంచి, ఆ తరువాత దాన్ని దానం చేసినా, అతనికి పుణ్యం లభించదు, పరిహారంగా కూడా పనికిరాదు. (ర’జీన్)

=====

9- بَابُ الْإِفْلَاسِ وَالْاِنْظَارِ

9. దివాలా తీయటం, అవకాశం ఇవ్వటం

ఇఫ్‌లాస్‌ అంటే దారిద్య్రం, నష్టాల పాలు కావటం. తఫ్‌లీస్‌ అంటే ఒకరిని దరిద్రుడిగా భావించడం. అంటే పాలకుడు అప్పులపాలై ధననష్టానికి గురైన వ్యక్తిని దరిద్రునిగా గుర్తించిన తరువాత, ఒకవేళ అమ్మే వాడు, అమానతు ఉంచేవాడు అతడి వద్ద  తన ధనాన్ని పొందితే ఇతర అప్పు అడిగే వాళ్ళందరి కంటే ఇతడే తన వస్తువు తీసుకునే హక్కు గలవాడు.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

2899 – [ 1 ] ( متفق عليه ) (2/877)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَيُّمَا رَجُلٍ أَفْلَسَ فَأَدْرَكَ رَجُلٌ مَاَلهُ بِعَيْنِهِ فَهُوَ أَحَقُّ بِهِ مِنْ غَيْرِهِ”.

2899. (1) [2/877ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దారిద్య్రానికి గురయిన వ్యక్తి వద్ద తన సరుకునే పొందితే, అతడే ఇతరుల కంటే  తన సరుకును తీసు కునే హక్కు కలిగి ఉంటాడు.” [83] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2900 – [ 2 ] ( صحيح ) (2/877)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: أُصِيْبَ رَجُلٌ فِيْ عَهْدِ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ ثِمَارٍ ابْتَاعَهَا فَكَثُرَ دَيْنُهُ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَصَدَّقُوْا عَلَيْهِ”فَتَصَدَّقَ النَّاسُ عَلَيْهِ فَلَمْ يَبْلُغْ ذَلِكَ وَفَاءَ دَيْنِهِ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِغُرَمَائِهِ. “خُذُوْا مَا وَجَدْتُّمْ وَلَيْسَ لَكُمْ إِلَّا ذَلِكَ”. رَوَاهُ مُسْلِمٌ.

2900. (2) [2/877దృఢం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో ఒక వ్యక్తి పచ్చికాయలను కొన్నాడు. అవి వ్యర్థం కావటం వల్ల ఆ వ్యక్తి అప్పుల పాలయ్యాడు. అప్పుడు ప్రవక్త (స) ప్రజలతో, ‘ఈ అప్పుల పాలైన వ్యక్తికి దానధర్మాలు చేయండి,’ అని ఆదేశించారు. ప్రజలు అతనికి దానధర్మాలు చేసారు. అయినప్పటికీ అతని అప్పు తీరలేదు. ప్రవక్త (స) అతనికి అప్పు ఇచ్చిన వారితో, ‘మీరు ఇవ్వబడుతున్న దాన్ని తీసుకోండి. అది తప్ప మరేమీ మీకు లభించదు,’ అని అన్నారు. [84]  (ముస్లిమ్‌)

2901 – [ 3 ] ( متفق عليه ) (2/877)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “كَانَ رَجُلٌ يُدَائِنُ النَّاسَ فَكَانَ يَقُوْلُ لِفَتَاهُ: إِذَا أَتَيْتَ مُعْسِرًا تَجَاوَزَعَنْهُ لَعَلَّ اللهُ أنْ يَّتَجَاوَزَعَنَّا. قَالَ: فَلَقِيَ اللهَ فَتَجَاوَزَعَنْهُ”.

2901. (3) [2/877ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తి ప్రజలకు అప్పులు ఇచ్చేవాడు. అతడు తన సేవకులకు, ‘అప్పు తీసుకున్నవారు దారిద్య్రానికి, నష్టాలకు గురైతే, వారికి అప్పుతీర్చే శక్తి లేకపోతే వారి అప్పును క్షమించివేస్తాను, దానికి బదులు అల్లాహ్‌ (త) నా పాపాలను క్షమించి వేయ వచ్చు,’ అని చెప్పేవాడు. ఆ వ్యక్తి మరణించాడు. అల్లాహ్‌ను కలిసాడు, అల్లాహ్‌ (త) ఆ వ్యక్తిని క్షమించివేసాడు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

2902 – [ 4 ] ( صحيح ) (2/877)

وَعَنْ أَبِيْ قَتَادَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ سَرَّهُ أَنْ يُّنَجِّيَهُ اللهُ مِنْ كُرَبِ يَوْمَ الْقِيَامَةِ فَلْيُنَفِّسْ عَنْ مُعْسِرٍ أَوْ يَضَعْ عَنْهُ”. رَوَاهُ مُسْلِمٌ.

2902. (4) [2/877దృఢం]

అబూ ఖతాదహ్‌(ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, తీర్పు దినం నాడు అల్లాహ్‌ (త) తన ఆందోళనను దూరం చేయాలని కోరుకునేవారు దారిద్య్రానికి గురైన వారికి, అప్పు ఉన్నవారికి కొంత గడువు ఇవ్వాలి. లేదా అతని అప్పును క్షమించివేయాలి. (ముస్లిమ్‌)

2903 – [ 5 ] ( صحيح ) (2/877)

وَعَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ أَنْظَرَ مُعْسِرًا أَوْ وَضَعَ عَنْهُ أَنْجَاهُ اللهُ مِنْ كُرِبَ يَوْمِ الْقِيَامَةِ”. روَاهُ مُسْلِمٌ.

2903. (5) [2/877దృఢం]

అబూ ఖతాదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా అంటుండగా నేను విన్నాను, ”తన అప్పును వసూలు చేయడంలో అప్పు ఉన్నవారికి మరికొంత గడువు ఇచ్చినా, లేదా అప్పును క్షమించినా, తీర్పుదినం నాడు అల్లాహ్‌ (త) కష్టనష్టాల నుండి అతనికి విముక్తి ప్రసాదిస్తాడు. (ముస్లిమ్‌)

2904 – [ 6 ] ( صحيح ) (2/878)

وَعَنْ أَبِيْ الْيَسَرِ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ أَنْظَرَ مُعْسِرًا أَوْ وَضَعَ عَنْهُ أَظَلَّهُ اللهُ فِيْ ظِلِّهِ”.رَوَاهُ مُسْلِمٌ.

2904. (6) [2/878దృఢం]

అబుల్‌ యస్‌ర్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”అప్పు ఉన్న వాడికి లేదా అగత్యపరుడికి అప్పు వసూలు చేయడంలో గడువు ఇచ్చినా, లేదా అప్పును క్షమించినా, క్షమించిన వ్యక్తిని అల్లాహ్‌ (త) తన నీడలో చోటిస్తాడు.” [85] (ముస్లిమ్‌)

2905 – [ 7 ] ( صحيح ) (2/878)

وَعَنْ أَبِيْ رَافِعٍ قَالَ: اسْتَسْلَفَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بَكْرًا. فَجَاءَتْهُ إِبِلٌ مِّنَ الصَّدَقَةِ. قَالَ: أَبُوْرَافِعٍ فَأَمَرَنِيْ أَنْ أَقْضِيَ الرَّجُلَ بَكْرَهُ فَقُلْتُ: لَا أَجِدُ إِلَّا جَمَلًا خِيَارًا رَّبَاعِيًا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَعْطِهِ إِيَّاهُ فَإِنَّ خَيْرَالنَّاسِ أَحْسَنُهُمْ قَضَاءً” .رَوَاهُ مُسْلِمٌ

2905. (7) [2/878దృఢం]

అబూ రా’ఫె (ర) కథనం: ప్రవక్త (స) ఒక వ్యక్తి నుండి యుక్త వయస్సులో ఉన్న ఒక ఒంటెను అప్పుగా తీసుకున్నారు. ఆ తరువాత ‘సదఖహ్ ఒంటెలు కొన్ని ప్రవక్త (స) వద్దకు వచ్చాయి. ”నేను ఒంటెను అప్పుగా తీసుకున్న వ్యక్తికి ఇచ్చివేయమని” నన్ను ఆదేశించారు. దానికి నేను, ‘ఆ ఒంటెల్లో కేవలం ఒకటి మాత్రమే యుక్తవయస్సులో ఉంది, అయితే ఇది అతని ఒంటెకంటే ఎంతో ఉత్తమంగా ఉంది,’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘ఆ అత్యుత్తమంగా ఉన్న ఒంటెనే ఇచ్చివేయి, ఎందు కంటే అప్పును అంత కంటే ఉత్తమంగా చెల్లించే వ్యక్తి అందరి కంటే ఉత్తముడు,’ అని ప్రవచించారు. [86]  (ముస్లిమ్‌)

2906 – [ 8 ] ( متفق عليه ) (2/878)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَجُلًا تَقَاضَى رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَأَغْلَظَ لَهُ فَهَمَّ أَصْحَابُهُ فَقَالَ: “دَعَوْهُ فَإِنَّ لِصَاحِبِ الْحَقِّ مَقَالًاوَاشْتَرَوْا لَهُ بَعِيْرًا فَأَعْطَوْهُ إِيَّاهُ” .قَالُوْا:لَا نَجِدُ إِلَّا أَفْضَلَ مِنْ سِنِّهِ قَالَ:”اشْتَرَوْهُ فَأَعْطَوْهُ إِيَّاهُ فَإِنَّ خَيْرَكُمْ أَحْسَنُكُمْ قَضَاءً.

2906. (8) [2/878ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక వ్యక్తి వద్ద అప్పుతీసుకొని ఉన్నారు. ఆ వ్యక్తి అప్పును వసూలు చేయడానికి ప్రవక్త (స) వద్దకు వచ్చారు. తన అప్పును అడుగుతూ కఠినంగా ప్రవర్తించసాగాడు. ప్రవక్త (స) అతనుచరులు కూడా అతని కఠిన ప్రవర్త నకు, అతన్ని కొట్టడానికి, హెచ్చరించడానికి సిద్ధ పడ్డారు. అప్పుడు ప్రవక్త (స), ‘అతన్ని ఏమీ అనకండి, వదలివేయండి. హక్కు ఉన్న వారికి అనే హక్కు ఉంది. ఒక ఒంటెకొని అతనికి ఇచ్చి వేయండి, దానివల్ల అతని అప్పు తీరిపోతుంది,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) అనుచరులు, ‘అతని ఒంటె కన్నా మంచి ఒంటె ఉంది,’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) దాన్నే కొని అతనికి ఇచ్చివేయండి, ఎందుకంటే అప్పు చెల్లించటంలో ఉత్తమంగా ప్రవర్తించిన వారే అందరి కంటే ఉత్తములు,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

2907 – [ 9 ] ( متفق عليه ) (2/878)

وَعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَطْلُ الْغَنِيِّ ظُلْمٌ. فَإِذَا أَتْبَعَ أَحَدُكُمْ عَلَى مَلَيءٍ فَلْيَتْبَعْ”.

2907. (9) [2/878ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ధనవంతులు అప్పు తీర్చడంలో సాకులు వెదకడం, ఆలస్యం చేయడం మహాపరాధం. అదేవిధంగా ఒకవేళ తన అప్పును ధనవంతునికి అప్పగిస్తే దాన్ని ఆమోదించాలి. [87](బు’ఖారీ, ముస్లిమ్)

2908 – [ 10 ] ( متفق عليه ) (2/878)

وَعَنْ كَعْبِ بْنِ مَالِكٍ: أَنَّهُ تَقَاضَى ابْنَ أَبِيْ حَدْرَدَ دَيْنًا لَهُ عَلَيْهِ فِيْ عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ الْمَسْجِدِ فَارْتَفَعَتْ أَصْوَاتُهُمَا حَتَّى سَمِعَهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَهُوَ فِيْ بَيْتِهِ. فَخَرَجَ إِلَيْهِمَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم حَتَّى كَشَفَ سَجِفَ حُجْرَتِهِ وَنَادَى كَعْبَ بْنَ مَالِكٍ قَالَ: “يَا كَعْبُ”    قَالَ: لَبَّيْكَ يَا رَسُوْلَ اللهِ فَأَشَارَ بِيَدِهِ أَنْ ضَع الشَّطْرَمِنْ دَيْنِكَ قَالَ كَعْبٌ: قَدْ فَعَلْتُ يَا رَسُوْلَ اللهِ قَالَ: “قُمْ فَاقْضِهِ”.

2908. (10) [2/878ఏకీభవితం]

క’అబ్‌ బిన్‌ మాలిక్‌ (ర) ప్రవక్త (స) కాలంలో ఇబ్నె అబీ ‘హద్‌రద్‌ను మస్జిద్‌లో తన అప్పుసొమ్ము గురించి అడిగారు. ఇద్దరి మాటలు ఎంత బిగ్గరగా అయ్యాయంటే ప్రవక్త (స) తన ఇంట్లో నుండి వారిద్దరి సంభాషణ విన్నారు. ప్రవక్త (స) బయటకు వచ్చారు. తన తలుపు తెరను ప్రక్కకు తొలగించి క’అబ్‌ బిన్‌ మాలిక్‌ను ఉద్దేశించి ఇలా అన్నారు, ‘ఓ క’అబ్‌,’ అన్నారు, వెంటనే క’అబ్‌, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! నేనిక్కడే ఉన్నాను, ఆదేశించండి,’ అని విన్నవించు కున్నారు. అప్పుడు ప్రవక్త (స) తన చేతి సైగల ద్వారా, ‘నువ్వు నీ సగం అప్పును క్షమించివేయి,’ అని అన్నారు. దానికి క’అబ్‌, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! నేను క్షమించివేసాను,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ఇబ్నె అబీ ‘హద్‌రద్‌తో, ‘నువ్వు వెళ్ళి మిగిలిన సగం అప్పును తీర్చివేయి,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

2909 – [ 11 ] ( صحيح ) (2/879)

وَعَنْ سَلَمَةَ بْنِ الْأَكْوَعَ قَالَ: كُنَّا جُلُوْسًا عِنْدَ النَّبِيِّ صلى الله عليه و سلم. إِذْ أُتِيَ بِجَنَازَةٍ فَقَالُوْا: صَلِّ عَلَيْهَا. فَقَالَ: “هَلْ عَلَيْهِ دَيْنٌ؟” قَالُوْا: لَا. فَصَلَّى عَلَيْهَا. ثُمَّ أُتِيَ بِجَنَازَةٍ أُخْرَى. فَقَالَ:”هَلْ عَلَيْهِ دَيْنٌ؟” قَالُوْا: نَعَمْ فَقَالَ: “فَهَلْ تَرَكَ شَيْئًا؟” قَالُوْا: ثَلَاثَةَ دَنَانِيْرَ. فَصَلَّى عَلَيْهَا ثُمَّ أُتِيَ بِالثَّالِثَةِ فَقَالَ: “هَلْ عَلَيْهِ دَيْنٌ؟” قَالُوْا: ثَلَاثَةُ دَنَانِيْرَ. قَالَ:”هَلْ تَرَكَ شَيْئًا ؟” قَالُوْا: لَا. قَالَ: “صَلُّوْا عَلَى صَاحِبِكُمْ” .قَالَ أَبُوْ قَتَادَةَ: صَلى الله عليه وسلم عليه يَا رَسُوْلَ الله وعلي دَيْنُهُ فَصَلَّى عَلَيْهِ. رَوَاهُ الْبُخَارِيُّ .

2909. (11) [2/879దృఢం]

సలమహ్ బిన్‌ అక్‌వ’అ (ర) కథనం: మేము ప్రవక్త (స) వద్ద కూర్చొని ఉన్నాము. ఒక జనా’జహ్ తీసుకు రావడం జరిగింది. ప్రజలు ప్రవక్త (స)ను, ‘జనా’జహ్ నమా’జును చదివించమని’ విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఇతనిపై అప్పులభారం ఉందా,’ అని అడిగారు. దానికి ప్రజలు, ‘లేదు,’ అని అన్నారు. ప్రవక్త (స) జనా’జహ్ నమా’జు చదివించారు. ఆ తరువాత మరో జనా’జహ్ తీసుకురావడం జరిగింది. ప్రజలు జనా’జహ్ నమా’జు చదవమని కోరారు. అప్పుడు ప్రవక్త (స) ‘ఇతనిపై అప్పుల భారం ఉందా’ అని అడిగారు. ‘అవును’ అని సమాధానం ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రవక్త (స) ‘ఇతడు వారసత్వంలో ఏమి వదలి వెళ్ళాడు’ అని అడిగారు. దానికి ప్రజలు ‘మూడు దీనార్లు వదలివెళ్ళాడు. వాటిద్వారా అప్పు తీర్చవచ్చు’ అని అన్నారు. ప్రవక్త (స) జనా’జహ్ నమా’జు చదివించారు. ఆ తరువాత మూడవ జనా ‘జహ్ తీసుకు రావడం జరిగింది. ప్రవక్త (స) ‘ఇతనిపై అప్పుల భారం ఉందా?’ అని అడిగారు. దానికి ప్రజలు, ‘అవును ఇతనిపై మూడు అష్‌రఫీల అప్పు ఉందని’ అన్నారు. ‘అప్పు తీర్చడానికి అతనేమైనా వదలి వెళ్ళడం జరిగిందా?’ అని అన్నారు. దానికి ప్రజలు ‘లేదు’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘మీ సోదరుని జనా’జహ్ నమా’జుచదవండి’ అని అన్నారు. వెంటనే అబూఖతాదహ్ (ర) ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! తమరు ఇతని జనా’జహ్ నమా’జు చదివించండి, నేను అతని అప్పు తీర్చివేస్తాను’ అని అన్నారు. వెంటనే ప్రవక్త (స) జనా’జహ్ నమా’జు చదివించారు. [88]  (బు’ఖారీ)

2910 – [ 12 ] ( صحيح ) (2/879)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ أَخَذَ أَمْوَالَ النَّاسِ يُرِيْدُ أَدَاءَهَا أَدَّى اللهُ عَنْهُ. وَمَنْ أَخَذَ يُرِيْدُ إِتْلَافَهَا أَتْلَفَهُ اللهُ عَلَيْهِ”. رَوَاهُ الْبُخَارِيُّ.

2910. (12) [2/879దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”ప్రజల ధనాన్ని తీసుకున్న వ్యక్తి, అంటే అప్పు తీసుకున్న వ్యక్తి, దాన్ని తీర్చే ఉద్దేశం కూడా కలిగి ఉంటే అల్లాహ్‌ (త) అతని అప్పును తీర్చివేస్తాడు. అయితే అప్పు తీసుకొని తీర్చే ఉద్దేశం లేనివాడి ధనాన్ని అల్లాహ్‌ నాశనం చేస్తాడు. [89] (బు’ఖారీ)

2911 – [ 13 ] ( صحيح ) (2/879)

وَعَنْ أَبِيْ قَتَادَةَ قَالَ: قَالَ رَجُلٌ: يَا رَسُوْلَ اللهِ أَرَأَيْتَ إِنْ قُتِلْتُ فِيْ سَبِيْلِ اللهِ صَابِرًا مُّحْتَسِبًا مُقْبِلًا غَيْرَ مُدْبِرٍ يُكَفِّرُ اللهُ عَنِّيْ خَطَايَايَ؟ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “نَعَمْ”. فَلَمَّا أَدْبَرَنَادَاهُ فَقَالَ: “نَعَمْ إِلَّا الَّذِيْنَ كَذَلِكَ قَالَ جِبْرِيْلَ”. رَوَاهُ مُسْلِمٌ.

2911. (13) [2/879దృఢం]

అబూ ఖతాదహ్ (ర) కథనం: ఒక వ్యక్తి, ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ఒకవేళ నేను దైవమార్గంలో వీరమర ణం పొంది, కష్టాల్లో సహనం పాటించేవాడినై, దైవంపట్ల పుణ్యఫలాపేక్ష గలవాడినై, యుద్ధంలో శత్రువుతో పోరాడేవాడినై, వెనుకాడని వాడినై ఉంటే అల్లాహ్‌ (త) నా పాపాలన్నీ క్షమించివేస్తాడా,” అని ప్రశ్నించాడు. ప్రవక్త (స), ”అవును,” అని సమాధానం ఇచ్చారు. అతను సమాధానం విని వెళ్ళబోతూ ఉంటే ప్రవక్త(స), ”అవును పాపాలన్నిటినీ అల్లాహ్‌ (త) క్షమించి వేస్తాడు, కాని అప్పును మాత్రం క్షమించడు. జిబ్రీల్‌ ఈ విధంగానే చెప్పారు,” అని అన్నారు. [90] (ముస్లిమ్‌)

2912 – [ 14 ] ( صحيح ) (2/879)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍوأَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “يُغْفَرُ لِلشَّهِيْدِ كُلُّ ذَنْبٍ إِلَّا الدَّيْنَ”. رَوَاهُ مُسْلِمٌ

2912. (14) [2/879దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వీరమరణం పొందిన వారి పాపాలన్నీ క్షమించబడతాయి, కాని అప్పు మాత్రం క్షమించ బడదు.” (ముస్లిమ్‌)

2913 – [ 15 ] ( متفق عليه ) (2/879)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُؤْتي بِالرَّجُلِ الْمُتَوَفَّى عَلَيْهِ الدَّيْنُ فَيَسْأَلُ: “هَلْ تَرَكَ لِدَيْنِهِ قَضَاءً؟” فَإِنْ حُدِّثَ أَنَّهُ تَرَكَ وَفَاءً صَلَّى. وَإِلَّا قَالَ لِلْمُسْلِمِيْنَ: “صَلُّوْا عَلَى صَاحِبِكُمْ “. فَلَمَّا فَتَحَ اللهُ عَلَيْهِ الْفُتُوْحَ قَامَ فَقَالَ: “أَنَا أَوْلَى بِالْمُؤْمِنِيْنَ مِنْ أَنْفُسِهِمْ فَمَنْ تَوُفِّيَ مِنَ الْمُؤْمِنِيْنَ فَتَرَكَ دَيْنًا فَعَلَيَّ قَضَاؤُهُ وَمَنْ تَرَكَ فَهُوَ لِوَرَثَتِهِ”.

2913. (15) [2/879ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ముందుకు అప్పుపడిన జనా’జహ్ను తీసుకువస్తే, అప్పు తీర్చడానికి ఇతడేమైనా వదలి ఉన్నాడా అని ప్రవక్త (స) అడిగేవారు. ఒకవేళ అవును ఇంత ధనం వదలి వెళ్ళాడు, దాని ద్వారా అతని అప్పు తీర్చబడు తుంది అని అంటే ప్రవక్త (స) ఆ జనా’జహ్కు నమా’జు చదివేవారు. లేదంటే ఇతరులతో ‘మీరు మీ సోదరుడి జనా’జహ్ నమా’జు చదవండి’ అని అనే వారు. అల్లాహ్‌ (త) విజయాలు ప్రాప్తించిన తరువాత ధన సంపదలు లభించి ప్రజాహితనిధి (బైతుల్‌మాల్‌) ఏర్పడిన తర్వాత ప్రవక్త (స) నేను ముస్లిములకు వారి ప్రాణాలకంటే ప్రియమైన వాడను. ఒక ముస్లిమ్‌ బాకీ పడి చనిపోతే అతని బాకీ తీర్చడం నా బాధ్యత. కాని ధనం వదలి చనిపోతే అది అతని వారసులది.” అని ప్రవచించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ     రెండవ విభాగం  

2914 – [ 16 ] ( ضعيف ) (2/880)

عَنْ أَبِيْ خَلْدَةَ الزُّرْقِيّ قَالَ: جِئْنَا أَبَا هُرَيْرَةَ فِيْ صَاحِبٍ لَنَا قَدْ أَفْلَسَ فَقَالَ: هَذَا الَّذِيْ قَضَى فِيْهِ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَيُّمَا رَجُلٍ مَاتَ أَوْ أَفْلَسَ فَصَاحِبُ الْمَتَاعِ أَحَقُّ بِمَتَاعِهِ إِذَا وَجَدَهُ بِعَيْنِهِ”. روَاهُ الشَّافِعِيُّ وَابْنُ مَاجَهُ .

2914. (16) [2/880బలహీనం]

అబూ ‘ఖల్‌దహ్‌ ‘జర్‌ఖీ (ర) కథనం: మేము అబూ హురైరహ్‌ (ర) వద్దకు మా స్నేహితుల్లోని దారిద్య్రానికి గురైన ఒకరి గురించి చర్చించడానికి వచ్చాము. దానికి అబూ హురైరహ్‌ (ర) ‘ఒకవేళ ఎవరైనా దారిద్య్రానికి గురై ఒక వ్యక్తి సంపద అలాగే ఉంటే, ఆ వ్యక్తి తన వస్తువు తీసుకోవడానికి అందరికంటే ఎక్కువ హక్కుదారుడు అని ప్రవక్త (స) ప్రవచించారు,’ అని అన్నారు. (షాఫ’యీ, ఇబ్నె మాజహ్)

2915 – [ 17 ] ( صحيح ) (2/880)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “نَفْسُ الْمُؤْمِنِ مُعَلَّقَةٌ بِدَيْنِهِ حَتَّى يُقْضَى عَنْهُ”. رَوَاهُ الشَّافِعِيُّ وَأَحْمَدُ وَ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

2915. (17) [2/880దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: విశ్వాసి ఆత్మ తన అప్పు భారం వల్ల వ్రేలాడుతూ ఉంటుంది. అంటే అతని అప్పు తీర్చే వరకు స్వర్గంలో ప్రవేశించలేదు. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం, షాఫ’యీ, అ’హ్‌మద్‌, ఇబ్నె మాజహ్, దారమి)

2916 – [ 18 ] ( لم تتم دراسته ) (2/880)

وَعَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صَاحِبُ الدَّيْنِ مَأْسُوْرٌ بِدَيْنِهِ يَشْكُو إِلَى رَبِّهِ الْوَحْدَةَ يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.

2916. (18) [2/880అపరిశోధితం]

బరా’బిన్‌ ‘ఆ’జిబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అప్పుల పాలయి మరణించిన వ్యక్తి అప్పుల భారం వల్ల స్వర్గంలో ప్రవేశించకుండా ఆపివేయబడతాడు, తీర్పుదినం నాడు తన ఒంటరితనాన్ని గురించి ఫిర్యాదు చేసు కుంటాడు.” (షర’హ్ సున్నహ్‌)

2917 – [ 19 ] ( لم تتم دراسته ) (2/881)

وَرَوَي أَنَّ مُعَاذًا كَانَ يَدَّانِ فَأُتِىَ غُرَمَاؤُهُ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَبَاعَ النَّبِيُّ صلى الله عليه وسلم مَالَهُ كُلَّهُ فِيْ دَيْنِهِ حَتَّى قَامَ مُعَاذٌ بِغَيْرِ شَيْءٍ. مُرْسَلٌ هَذَا لَفْظُ الْمَصَابِيْحِ . وَلَمْ أَجِدْهُ فِيْ الْأُصُوْلِ إِلَّا فِيْ الْمُنْتَقَى.

2917. (19) [2/881అపరిశోధితం]

మరో ఉల్లేఖనం ఇలా ఉంది, ”ము’ఆజ్‌’ (ర) అప్పు తీసుకునేవారు. ఒకసారి అతనికి అప్పు ఇచ్చిన వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి ము’ఆజ్‌’ను తన అప్పు చెల్లించ మని కోరారు. అప్పుడు ము’ఆజ్‌’ వద్ద నగదు వస్తువు ఏదీలేదు. అప్పుడు ప్రవక్త (స) ము’ఆజ్‌’ సామానులన్నిటినీ అమ్మివేసారు. ము’ఆజ్‌’ పూర్తిగా దారిద్య్రానికి గురయ్యారు. అతని వద్ద ఏమీ మిగలలేదు.

ఈ ‘హదీసు’ తాబయీ ప్రోక్తం (ముర్సల్‌) శ్రేణికి చేరి నది. ఇవి మసాబీహ్‌ పదాలు. స’హా సిత్తలో ఈ ‘హదీసు’ నాకు దొరకలేదు. అయితే మున్‌తఖాలో ఉంది.

2918 – [ 20 ] ( لم تتم دراسته ) (2/881)

وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ كَعْبِ بْنِ مَالِكٍ قَالَ: كَانَ مُعَاذُ بْنُ جَبَلٍ شَابًّا سَخِيًّا وَكَانَ لَا يُمْسِكُ شَيْئًا فَلَمْ يَزَلْ يَدَّانِ حَتَّى أَغْرَقَ مَالَهُ كُلَّهُ فِيْ الدَّيْنِ فَأَتَى النَّبِيّ صلى الله عليه وسلم فَكَلَّمَهُ لِيُكَلِّمْ غُرَماَءَهُ فَلَوْ تَرَكُوْا لِأَحَدٍ لَتَرَكُوْا لِمُعَاذٍ لِأَجَلٍ رَسُوْلِ الله صلى الله عليه وسلم فَبَاعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مَالَهُ حَتَّى قَامَ مُعَاذٌ بِغَيْرِ شَيْءٍ. رَوَاهُ سَعِيْدٌ فِيْ سُنَنِهِ مُرْسَلًا.

2918. (20) [2/881అపరిశోధితం]

‘అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ క’అబ్ బిన్ మాలిక్‌ (ర) కథనం: ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌ యువకుడు మరియు మహా ధర్మాత్ముడూను. ఏదీ ఉంచేవారు కాదు. అంతా ఖర్చుచేసే వారు. ఇతరులకు ఇచ్చేసేవారు. అందు వల్లే అతను ఎల్లప్పుడూ అప్పుల పాలయ్యేవారు. చివరికి అతని ధనమంతా అప్పులు తీర్చడంలో ఖర్చయి పోయింది. ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌ ప్రవక్త (స) వద్దకు వచ్చి ‘తమరు నేను అప్పు ఉన్నవారితో, వారు అప్పును క్షమించమని లేదా కొంతయినా క్షమించమని, లేదా కొంత గడువు ఇవ్వమని’ మాట్లాడండి అని అన్నారు. కాని అప్పు ఇచ్చినవారు గడువు ఇవ్వలేదు. ఏ మాత్రం వదల్లేదు, క్షమించ లేదు. ఉల్లేఖన కర్త అభిప్రాయం ”ఒకవేళ అప్పు ఇచ్చిన వారు ఎవరి అప్పు అయినా వదలి వేస్తే ము’ఆజ్‌’ అప్పును వదలివేసేవారు. ఎందుకంటే ప్రవక్త (స) అతని గురించి సిఫారసు చేసారు. అప్పుడు చేసేది లేక ప్రవక్త (స) ము’ఆజ్‌’ దగ్గరున్న సామానంతా అమ్మివేసి అప్పు ఇచ్చిన వాళ్ళందరికీ చెల్లించారు. చివరికి ము’ఆజ్‌’ వద్ద ఏమీ మిగుల లేదు. (స’యీద్‌ తన సునన్‌లో ఈ ‘హదీసు’ను పేర్కొన్నారు)

2919 – [ 21 ] ( صحيح ) (2/881)

وَعَنِ الشَّرِيْدِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم : ” لَيُّ الْوَاجِدِ يُحِلُّ عِرْضُهُ وَعُقُوْبَتُهُ”. قَالَ ابْنُ الْمُبَارِكِ: يَحِلُّ عِرْضُهُ: يُغلِّظُ لَهُ. وَعَقُوْبَتُهُ: يُحْبَسُ لَهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

2919. (21) [2/881దృఢం]

షరీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ధనవంతుడై ఉండికూడా అప్పు చెల్లించడంలో ఆలస్యం చేయడం, సాకులు వెదకడం, అతన్ని అగౌరవ పర్చడాన్ని, శిక్షించటాన్ని తప్పనిసరి చేస్తుంది. ఇబ్నె ముబారక్‌ అభిప్రాయం ప్రకారం చీవాట్లు పెట్టటం, శిక్షించటం, బంధించటం అని అర్థం. (అబూ దావూద్‌, నసాయి’)

2920 – [ 22 ] ( لم تتم دراسته ) (2/881)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: أُتِيَ النَّبِيُّ صلى الله عليه وسلم بِجَنَازَةٍ لِيُصَلِّيَ عَلَيْهَا فَقَالَ: “هَلْ عَلَى صَاحِبِكُمْ دَيْنٌ؟” قَالُوْا: نَعَمْ قَالَ: “هَلْ تَرَكَ لَهُ مِنْ وَفَاءٍ؟” قَالُوْا: لَا. قَالَ: “صَلُّوْا عَلَى صَاحِبِكُمْ”. قَالَ عَلِيُّ بْنُ أَبِيْ طَالِبٍ: عَلَيَّ دَيْنُهُ يَا رَسُوْلَ اللهِ. فَتَقَدَّمَ فَصَلَّى عَلَيْهِ.

وَفِيْ رِوَايَةٍ مَعْنَاهُ وَقَالَ: “فَكَّ اللهُ رِهَانَكَ مِنَ النَّارِ كَمَا فَكَكْتَ رِهَانَ أَخِيْكَ الْمُسْلِمِ لَيْسَ مِنْ عَبْدٍ مُّسْلِمٍ يَقْضِيْ عَنْ أَخِيْهِ دَيْنَهُ إِلَّا فَكَّ اللهُ رِهَانَهُ يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.

2920. (22) [2/881అపరిశోధితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త(స) వద్దకు ఒక జనా’జహ్ తీసుకురావడం జరిగింది, ప్రవక్త (స) జనా’జహ్ నమా’జు చదివిస్తారని. ప్రవక్త  (స), ‘ఇతనిపై అప్పు ఉందా,’ అని అడిగారు. ప్రజలు ‘అవును ఇతనిపై అప్పు ఉందని’ అన్నారు. ప్రవక్త (స) ‘అతని అప్పు తీర్చబడేటంత ధనం వదలి వెళ్ళాడా’ అని అడిగారు. దానికి ప్రజలు ‘లేదు’ అని సమాధానం ఇచ్చారు. అప్పుడు ప్రవక్త(స) ‘మీరు మీ స్నేహితుని జనా’జహ్ నమా’జు చదువుకోండి’ అని అన్నారు. అప్పుడు ‘అలీ (ర) ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! అతని అప్పు బాధ్యత నాది, దయచేసి తమరు జనా’జహ్ నమా’జు చదివించండి’ అని విన్నవించుకున్నారు. ప్రవక్త (స) ముందుకు వెళ్ళి జనా’జహ్ నమా’జు చదివించారు.

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ‘అలీ (ర) మాటలు విని నీవు ఆ మృతుని అప్పు నుండి విముక్తి ప్రసాదించినట్లు అల్లాహ్‌ (త) నిన్ను నరకం నుండి విముక్తి ప్రసాదించు గాక!” అని దీవించారు. ఆ తరువాత తన ముస్లిమ్‌ సోదరుని అప్పులను చెల్లించిన వారిని దానికి బదులుగా అల్లాహ్‌ (త) తీర్పు దినం నాడు అక్కడి కాఠిన్యాల నుండి రక్షిస్తాడు అని ప్రవచించారు. (షర’హ్ సున్నహ్‌)

2921 – [ 23 ] ( لم تتم دراسته ) (2/881)

وَعَنْ ثَوْبَانَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ مَّاتَ وَهُوَ بَريْءٌ مِّنَ الْكِبْرِ وَالْغُلُوْلِ وَالدَّيْنِ دَخَلَ الْجَنَّةَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.

2921. (23) [2/881అపరిశోధితం]

సౌ’బాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరు  గర్వం, అహంకారం, అవినీతి, అప్పులు లేకుండా మరణిస్తే అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు.” (తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దారమి)

2922 – [ 24 ] ( لم تتم دراسته ) (2/882)

وَعَنْ أَبِيْ مُوْسَى عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ أَعْظَمَ الذُّنُوْبِ عِنْدَ اللهِ أَنْ يَلْقَاهُ بِهَا عَبْدٌ بَعْدَ الْكَبَائِرِالَّتِيْ نَهَى اللهُ عَنْهَا أَنْ يَّمُوْتَ رَجُلٌ وَّعَلَيْهِ دَيْنٌ لَا يَدَعُ لَهُ قَضَاءً”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ.

2922. (24) [2/882అపరిశోధితం]

అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తి తన అప్పు తీర్చబడినంత ధనాన్ని వదల కుండా అల్లాహ్‌ను కలవటం అల్లాహ్‌(త) వద్ద మహా పాపాల తర్వాత అన్నిటి కంటే గొప్ప పాపం. (అ’హ్మద్‌, అబూ దావూద్‌).

అంటే మహా పాపాల తర్వాత అన్నిటికంటే మహా పాపం అప్పు. దాన్ని తీర్చే ఎటువంటి మార్గమూ లేకపోవటం.

2923 – [ 25 ] ( لم تتم دراسته ) (2/882)

وَعَنْ عَمْرِو بْنِ عَوْفٍ الْمُزَنِيِّ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “الصُّلْحُ جَائِزٌ بَيْنَ الْمُسْلِمِيْنَ إِلَّا صُلْحًا حَرَّمَ حَلَالًا أَوْ أَحَلَّ حَرَامًا وَالْمُسْلِمُوْنَ عَلَى شُرُوْطِهِمْ إِلَّا شَرْطًا حَرَّمَ حَلَالًا أَوْ أَحَلَّ حَرَامًا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَأَبُوْ دَاوُدَ وَانْتَهَتْ رِوَايَتُهُ عِنْدَ قَوْلِهِ “شُرُوْطِهِمْ”.

2923. (25) [2/882అపరిశోధితం]

‘అమ్ర్‌ బిన్‌ ‘ఔఫ్‌ ము’జునీ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ముస్లిముల మధ్య ఒప్పందం మంచిదే కాని ధర్మసమ్మతమైన దాన్ని నిషిద్ధం, నిషిద్ధమైన దాన్ని ధర్మసమ్మతం చేసే ఒప్పందం మంచిది కాదు. ముస్లిములు పరస్పరం షరతులు పెట్టుకోవటం ధర్మమే. కాని ధర్మసమ్మతమైన వాటిని నిషిద్ధాలుగా, నిషిద్ధాలను ధర్మసమ్మత మైనవిగా చేసే షరతులు కావు.” [91] (తిర్మిజి’, ఇబ్నెమాజహ్, అబూదావూద్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

2924 – [ 26 ] ( لم تتم دراسته ) (2/882)

عَنْ سُوَيْدِ بْنِ قَيْسٍ قَالَ: جَلَبْتُ أَنَا وَمَخْرَفَةُ الْعَبْدِيْ بَزًّا مَنْ هَجَرَ فَأَتَيْنَا بِهِ مَكَّةَ. فَجَاءَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَمْشِيْ فَسَاوَمَنَا بِسَرَاوِيْلَ فَبِعْنَاهُ وَثَمَّ رَجُلٌ يَزِنُ بِالْأَجْرِ. فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ: “زِنْ وَأَرْجِحْ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ.

2924. (26) [2/882అపరిశోధితం]

సువైద్‌ బిన్‌ ఖైస్‌ (ర) కథనం: నేను మరియు మఖ్‌రమ హిజ్‌ర్‌ నుండి అమ్మటానికి బట్టలుకొని తెచ్చాము. మేము బట్టలు తీసుకొని మక్క చేరాము. ప్రవక్త (స) కాలి నడకన మా వద్దకు వచ్చారు. ఒక పైజామా బేరమాడారు. మేము పైజామాను ప్రవక్త (స)కు అమ్మివేసాము. ప్రవక్త (స) కూలిపై తూచే ఒక వ్యక్తితో నువ్వు దీని ధరను తూచి వారికి ఇచ్చివేయి. కొంత ఎక్కువగా ఇచ్చివేయి అని ఆదేశించారు. [92] (అ’హ్మద్‌, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్, దారమి, తిర్మిజీ – ప్రామాణికం-దృఢం)

2925 – [ 27 ] ( لم تتم دراسته ) (2/883)

وَعَنْ جَابِرٍ قَالَ: كَانَ لِيْ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم دَيْنٌ فَقَضَانِيْ وَزَادَنِيْ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

2925. (27) [2/883అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) నాకు బాకీ ఉన్నారు. ఆ తర్వాత నా బాకీ తీర్చారు, ఇంకా అధికంగా కూడా ఇచ్చారు. (అబూ దావూద్‌)

2926 – [ 28 ] ( لم تتم دراسته ) (2/883)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ أَبِيْ رَبِيْعَةَ قَالَ: اِسْتَقَرَضَ مِنِّيْ النَّبِيُّ صلى الله عليه وسلم أَرْبَعِيْنَ أَلْفًا فَجَاءَهُ مَالٌ فَدَفَعَهُ إِلَيَّ وَقَالَ:”بَارَكَ اللهُ تَعَالى فِيْ أَهْلِكَ وَمَالِكَ إِنَّمَا جَزَاءُ السَّلَفِ الْحَمْدُ وَالْأَدَاءُ”. رَوَاهُ النَّسَائِيُّ.

2926. (28) [2/883అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అబీ రబీ’అహ్ (ర) కథనం: ప్రవక్త (స) నా దగ్గర నుండి 40 వేల దిర్‌హమ్‌లు అప్పుగా తీసుకున్నారు. ప్రవక్త (స) వద్ద ధనసంపదలు వచ్చిన తర్వాత ప్రవక్త (స) నా అప్పు తీర్చారు. ఇంకా, ‘అల్లాహ్‌(త) నీ కుటుంబంలో, ధనంలో శుభం ప్రసాదించు గాక! అరువుకు బదులు దైవాన్ని స్తుతించడం, అప్పు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపడం, అప్పును చెల్లించడమే ఉత్తమం,’ అని ప్రవచించారు. (నసాయి’)

2927 – [ 29 ] ( لم تتم دراسته ) (2/883)

وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ كَانَ لَهُ عَلَى رَجُلٍ حَقٌّ فَمَنْ أَخَّرَهُ كَانَ لَهُ بِكُلِّ يَوْمٍ صَدَقَةٌ”. رَوَاهُ أَحْمَدُ.

2927. (29) [2/883అపరిశోధితం]

‘ఇమ్‌రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకరికి మరొకరు అప్పు బాకీ ఉంటే అప్పు వసూలు చేయడంలో కొంత ఆలస్యం చేయాలి. అంటే మరి కొంత గడువు ఇవ్వాలి. అతడు గడువు ఇచ్చిన ప్రతి ఒక్క రోజుకు దాన ధర్మాలు చేసినంత పుణ్యం అతనికి లభిస్తుంది. (అ’హ్మద్)

2928 – [ 30 ] ( لم تتم دراسته ) (2/883)

وَعَنْ سَعْدِ بْنِ الْأَطْوَلِ قَالَ: مَاتَ أَخِيْ وَتَرَكَ ثَلَاثَمِائَةِ دِيْنَارٍ وَتَرَكَ وَلَدًا صِغَارًا فَأَرَدْتُّ أَنْ أُنْفِقَ عَلَيْهِمْ فَقَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَخَاكَ مَحْبُوْسٌ بِدَيْنِهِ فَاقْضِ عَنْهُ”. قَالَ: فَذَهَبْتُ فَقَضَيْتُ عَنْهُ. ثُمَّ جِيتُ فقُلتُ: يا رسول الله: قد قديتُ عنه وَلَمْ تَبْقَ إِلَّا امْرَأَةٌ. تَدَّعِيْ دِيْنَارَيْنِ وَلَيْسَتْ لَهَا بَيِّنَةٌ. قَالَ: “أَعْطِهَا فَإِنَّهَا صَادِقَة”. رَوَاهُ أَحْمَدُ.  

2928. (30) [2/883అపరిశోధితం]

స’యీద్‌ బిన్‌ అ’త్‌వల్‌ కథనం: ‘నా సోదరుడు మరణించాడు. అతడు మూడు వందల అష్రఫీలు, ఒక పసిబిడ్డను వదలివెళ్ళాడు. ఆ ధనాన్ని ఆ బిడ్డపై ఖర్చు చేద్దామని నేననుకున్నాను’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) నాతో ‘నీ సోదరుడు తన అప్పుకు బదులు పట్టుబడి ఉన్నాడు. ముందు నీ సోదరుని బాకీ తీర్చు,’ అని ఆదేశించారు. నేను వెళ్ళి నా సోదరుని బాకీ చెల్లించాను. ఆ తరువాత ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! నా సోదరుని బాకీని తీర్చివేసాను. ఇంకా ఒక్క స్త్రీ మిగిలి ఉంది. ఆమె తనకు రెండు అష్రఫీలు రావాలని అంటుంది. అయితే సాక్షులు మాత్రం ఎవరూ లేరు’ అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స) ఆమె బాకీని తీర్చివేయి. ఆమె సత్యం పలుకుతుంది అని ఆదేశించారు. (అ’హ్మద్‌).

2929 – [ 31 ] ( لم تتم دراسته ) (2/883)

وَعَنْ مُحَمَّدِ بْنِ عَبْدِ اللهِ بْنِ جَحْشٍ قَالَ: كُنَّا جُلُوْسًا بِفِنَاءِ الْمَسْجِدِ حَيْثُ يُوْضَعُ الْجَنَائِزُ وَرَسُوْلُ اللهِ جَالِسٌ بَيْنَ ظَهْرَيْنَا فَرَفَعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بَصَرَهُ قِبْلَ السَّمَاءِ فَنَظَرَ ثُمَّ طَأْطَأْ بَصَرَهُ وَوَضَعَ يَدَهُ عَلَى جَبْهَتِهِ قَالَ: “سُبْحَانَ اللهِ سُبْحَانَ اللهِ مَا نَزَلَ مِنَ التَّشْدِيْدِ؟” قَالَ: فَسَكَتْنَا يَوْمَنَا وَلَيْلَتَنَا فَلَمْ نَرَ إِلَّا خَيْرًا حَتَّى أَصْبَحْنَا. قَالَ مُحَمَّدُ: فَسَأَلْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم: مَا التَّشْدِيْدُ الَّذِيْ نَزَلَ؟ قَالَ: “فِيْ الدَّيْنِ وَالَّذِيْ نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَوْ أَنَّ رَجُلًا قُتِلَ فِيْ سَبِيْلِ اللهِ ثُمَّ عَاشَ ثُمَّ قُتِلَ فِيْ سَبِيْلِ اللهِ ثُمَّ عَاشَ ثُمَّ قُتِلَ فِيْ سَبِيْلِ اللهِ ثُمَّ عَاشَ وَعَلَيْهِ دَيْنٌ مَا دَخَلَ الْجَنَّةَ حَتَّى يُقْضَى دَيْنُهُ”. رَوَاهُ أَحْمَدُ وَفِيْ شَرْحِ السُّنَّةَ نَحْوُهُ.

2929. (31) [2/883అపరిశోధితం]

ము’హమ్మద్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ జ’హష్‌ (ర) కథనం: మేము మస్జిద్‌ ప్రాంగణంలో కూర్చొని ఉన్నాము. అక్కడే జనా’హ్లు ఉంచబడేవి. ప్రవక్త (స) కూడా మా మధ్య కూర్చుని ఉన్నారు. ప్రవక్త (స) ఆకాశం వైపు చూసారు. మళ్ళీ తల దించుకున్నారు. అనంతరం తన నుదురుపై చేయిపెట్టి, ”సుబ్‌’హా నల్లాహ్‌, సుబ్‌’హానల్లాహ్‌ ఎంత కఠినమైన  విషయం అవతరించింది,” అని అన్నారు. మేమంతా ఆ రోజు పగలు, రాత్రి మౌనంగా ఉన్నాము. మంచి తప్ప మరేమీ మేము ఎరుగము. చివరికి ఉదయం క్షేమంగా మేల్కొన్నాము. ‘హదీసు’ ఉల్లేఖనకర్త ము’హమ్మద్‌ ఇలా అన్నారు, ”నిన్న తమరు, ‘ఎంత కఠినమైన విషయం అవతరించింది,’ అని అన్నారు, ‘దేన్ని గురించి కఠినమైన విషయం అవతరించింది’ అని ప్రవక్త (స)తో విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘అప్పు (రుణం) గురించి, ఎవరి చేతిలో ము’హమ్మద్‌ ప్రాణం ఉందో ఆయన సాక్షి! ఒకవేళ ఎవరైనా అల్లాహ్‌ మార్గంలో చంపబడి మళ్ళీ సజీవంగా లేచి మళ్ళీ అల్లాహ్‌ మార్గంలో చంపబడి మళ్ళీ సజీవంగా లేచి మళ్ళీ అల్లాహ్‌ మార్గంలో చంపబడి మళ్ళీ సజీవంగా లేచినా అతనిపై అప్పు ఉంటే, అతడు అతని బాకీ తీర్చే వరకు స్వర్గం లోనికి ప్రవేశించలేడు. (అ’హ్మద్‌, షర్‌’హ్ సున్నహ్‌)

=====

10- بَابُ الشِّرْكَةِ وَالْوَكَالَةِ

10. భాస్వామ్యం, ప్రాతినిధ్యం

I. షిర్‌కత్‌ అంటే భాగస్వామ్యం. రెండు అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక వ్యాపారంలో భాగస్వాములుగా ఉండటాన్ని భాగస్వామ్యం అంటారు. ఉదా: ఇద్దరు లేక నలుగురు వ్యక్తులు కలసి ఒక దుకాణం ప్రారంభించారు. అందరూ కలసి అమ్ముతారు, కొంటారు. అంటే ఇది భాగస్వామ్యం అవుతుంది. ఈ పని చేసే వారిని భాగస్వాములు అంటారు. ఈ భాగస్వామ్యంలో చాలా సహాయ, సహకారాలు అందుతాయి. ఒక వ్యక్తి చేయలేని పనిని అనేకమంది కలసి చేస్తే అది చాలా సులభతరం అవుతుంది. ఇందులో అధికంగా శుభాశీస్సులు ఉంటాయి. అయితే వీరిలో ఎవరూ అవినీతికి పాల్పడరాదు. అలా చేస్తే శుభం నశిస్తుంది.

భాగస్వామ్యం రెండు రకాలు: 1. షిర్‌కతె మిల్క్‌ 2. షిర్‌కతె ‘అఖ్‌ద్‌.

1. షిర్‌కతె మిల్క్‌: అంటే ఇద్దరు వ్యక్తులు ఒకే వస్తువుకు యజమానులు కావడం. వారసత్వం లేదా కొనటం లేదా వృత్తి మొదలైన వాటిద్వారా.

2. షిర్‌కతె ‘అఖ్‌ద్‌: ఒక వ్యక్తి మరో వ్యక్తితో ఫలానా పనిలో నిన్ను భాగస్వామిగా చేర్చుకున్నాము. రెండవ వ్యక్తి దాన్ని స్వీకరించాడు. ధార్మిక పండితులు షిర్‌కతె ‘అఖ్‌ద్‌ను నాలుగు రకాలుగా విభజించారు.

i. షిర్‌కతె ముఫావ’, ii. షిర్‌కతె ‘ఇనాన్‌, iii. షిర్‌కతె వుజూహ్‌, iv. షిర్‌కతె ‘దాయి”అ. వీటిని గురించి వివరంగా ఫిఖహ్‌ పుస్తకాల్లో ఉంది. భాగ స్వామ్యంలోని వస్తువులను భాగస్వామి అనుమతి లేకుండా అమ్మడం ధర్మం కాదు.

II. వకాలత్‌ అంటే అప్పజెప్పుట అని అర్థం. ధార్మిక భాషలో స్వయంగా నీవుచేసే పనిని ఇతరులకు అప్పగించటం. అతను నీ తరఫున ఆ పనిచేస్తాడు. అయితే ఆ వ్యక్తిలో ఆ పనిచేసే శక్తి, సామర్థ్యాలు ఉండాలి. నీవు ముఅక్కిల్‌  నీ ప్రాతినిధ్యం చేసేవారు వకీల్‌ అవుతాడు. వకాలత్‌కు షరతు ఏమిటంటే ముఅక్కిల్‌, వకీల్‌ ఇద్దరూ యుక్త వయస్సు, బుద్ధిబలం సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. మతి స్థిమితం లేనివారిని, పిచ్చివారిని, యుక్త వయస్సుకు చేరని వారిని వకీలుగా నియమించడం మంచిదికాదు. అత్యవసర పరిస్థితుల్లో ముస్లిమేతరులను కూడా వకీలుగా నియమించ వచ్చును. పనివారు, సేవకులు కూడా వకీలు అవుతారు. అమ్మటంలో, కొనటంలో, అద్దె వసూలు చేయటంలో, నికా’హ్‌ చేయించడంలో ఇతర అత్యవసర కార్యాల్లో వకీలును నియమించవచ్చును. వకీలును అకస్మాత్తుగా తొలగించడం కూడా ధర్మమే. భాగస్వామి తన భాగస్వామిని తన వకీలుగా నియమించ వచ్చును. వీటి గురించి ఈ క్రింది ‘హదీసు’లలో పేర్కొనబడింది.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

2930 – [ 1 ] ( صحيح ) (2/884)

عَنْ زُهْرَةَ بْنِ مَعْبَدٍ: أَنَّهُ كَانَ يَخْرُجُ بِهِ جدُّهُ عَبْدُ اللهِ بْنِ هَشَّامٍ إِلَى السُّوْقِ فَيَشْتَرِيْ الطَّعَامَ فَيَلْقَاهُ ابْنُ عُمَرَ وَابْنُ الزُّبَيْرِ فَيَقُوْلَانِ لَهُ: أشْرِكْنَا. فَإِنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَدْ دَعَا لَكَ بِالْبَرَكَةِ فَيُشْرِكُهُمْ. فَرُبَّمَا أَصَابَ الرَّاحِلَةَ كَمَا هِيَ فَيَبْعَثُ بِهَا إِلَى الْمَنْزِلِ وَكَانَ عَبْدُ اللهِ بْنُ هَشامٍ ذَهَبْتُ بِهِ أُمُّهُ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم. فَمَسَحَ رَأْسَهُ وَدَعَا لَهُ بِالْبَرَكْةِ. رَوَاهُ الْبُخَارِيُّ.

2930. (1) [2/884దృఢం]

‘జుహ్‌రహ్‌ బిన్ మ’అబద్‌ కథనం: అతని తాతగారు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ హిషామ్‌ అతన్ని బజారుకు తీసుకొని వెళ్ళేవారు. అక్కడ ఆహారధాన్యాలు కొనేవారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ మరియు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ అతన్ని కలసి, ‘మమ్మల్ని కూడా ఈ సరకులో భాగస్వాములుగా చేర్చుకో, ఎందుకంటే ప్రవక్త(స) మీకు శుభం కలగాలని ఆశీర్వదించారు,’ అని అన్నారు. అతను వారిని కూడా భాగస్వాములుగా చేర్చుకున్నారు. ఒక్కోసారి ఎంత అధిక లాభం వచ్చేదంటే లాభంగా వచ్చిన ఆహార ధాన్యాలను ఒంటె నిండా ఇంటికి పంపేవారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ హిషామ్‌ను అతని తల్లిగారు ప్రవక్త (స) వద్దకు తీసుకువెళ్ళారు. ప్రవక్త (స) ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ హిషామ్‌ తలపై తన చేతితో నిమురుతూ ‘ఇతనికి శుభం కలగుగాక’ అని దు’ఆ చేసారు. [93] (బు’ఖారీ)

2931 – [ 2 ] ( صحيح ) (2/884)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَتِ الْأَنْصَارُ لِلنَّبِيِّ صلى الله عليه وسلم: اقْسِمْ بَيْنَنَا وَبَيْنَ إِخْوَانِنَا النَّخِيْلَ قَالَ: “لَا تَكْفُوْنَنَا الْمَؤُوْنَةَ وَنُشْرِكُكُمْ فِيْ الثَّمَرَةِ”. قَالُوْا: سَمِعْنَا وَأَطَعْنَا. رَوَاهُ الْبُخَارِيُّ.

2931. (2) [2/884దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: అన్సార్లు ప్రవక్త (స) తో ఖర్జూరపు తోటలను, ముహాజిరీన్ల మరియు మా మధ్య పంచివేయండి అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) నేను ఖర్జూరంతోటలను పంచను. మీరు మాకు అండగా నిలబడండి. అంటే ముహాజిరీన్లకు శ్రమ కలిగించకుండా, పెట్టుబడి శ్రమ మీరే చేయండి. అయితే మేము మీ పంటలో భాగస్వాములుగా ఉంటాం. దానికి అన్సార్లు, ‘మేము తమరి ఆదేశాన్ని విన్నాము. పాటిస్తాము,’ అని అన్నారు. [94]  (బు’ఖారీ)

2932 – [ 3 ] ( صحيح ) (2/884)

وَعَنْ عُرْوَةَ بْنِ أَبِيْ الْجَعْدِ الْبَارَقِيِّ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَعْطَاهُ دِيْنَارًا لِيَشْتَرِيَ بِهِ شَاةً فَاشْتَرَى لَهُ شَاتَيْنِ فَبَاعَ إِحْدَاهُمَا بِدِيْنَارٍوَأَتَاهُ بِشَاةٍ وَدِيْنَارٍفَدَعَا لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ بَيْعِةِ بِالْبَرَكَةِ فَكَانَ لَوِاشْتَرَى تُرَابًا لَرَبِحَ فِيْهِ.رَوَاهُ الْبُخَارِيُّ.

2932. (3) [2/884దృఢం]

‘ఉర్‌వహ్‌ బిన్‌ అబిల్‌ జ’అద్‌ అల్‌ బారిఖీ కథనం: ఒకసారి ప్రవక్త (స) అతనికి ఒక అష్రఫీ ఇచ్చి తన కోసం ఒక మేక కొనుక్కురమ్మని పంపారు. అతడు ఒక అష్రఫీలో రెండు మేకలను కొని ఒక మేకను ఒక అష్రఫీకి అమ్మి, ప్రవక్త (స)కు ఒక మేకను ఒక అష్రఫీని తెచ్చి ఇచ్చారు. ప్రవక్త (స) ‘వ్యాపారంలో అతనికి శుభం కలగాలని’ దీవించారు. ఆ తరువాత అతడు మట్టితో వ్యాపారం చేసినా అందులో అతనికి లాభం కలిగేది. [95]  (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

2933 – [ 4 ] ( لم تتم دراسته ) (2/885)

عَنْ أَبِيْ هُرَيْرَةَ رَفَعَهُ قَالَ: “إِنَّ اللهَ عَزَّ وَجَلَّ يَقُوْلُ: أَنَا ثَالِثُ الشَّرِيْكَيْنِ مَا لَمْ يَخُنْ أحدهما صَاحِبَهُ فَإِذَا خَانَهُ خَرَجْتُ مِنْ بَيْنِهِمَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَزَادَ رَزِيْنُ: “وَجَاءَ الشَّيْطَانُ”.

2933. (4) [2/885అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇద్దరు భాగస్వాములు పరస్పరం ద్రోహం తలపెట్ట నంత వరకు నేను వారిలో మూడో భాగస్వామి నౌతాను. వారిలో ఎవరైనా ద్రోహం చేస్తే, నేను వారి మధ్య నుండి తొలగిపోతాను” అని అల్లాహ్‌(త) ఆదేశించాడు. (అబూ దావూద్, ర’జీన్‌).  

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”షైతాన్‌ వారి మధ్య వస్తాడు.” [96]

2934 – [ 5 ] ( صحيح ) (2/885)

وَعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “أَدِّ الْأَماَنَةَ إِلَى مَنِ ائْتَمَنَكَ. وَلَا تَخُنْ مَنْ خَانَكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ.

2934. (5) [2/885దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అమానతుదారులు తమ అమానతులను అప్ప గించాలి. మీకు ద్రోహం చేసినవాడికి ద్రోహం చేయ కూడదు.” (తిర్మిజి’, అబూ దావూద్‌, దారమి)

2935 – [ 6 ] ? (2/885)

وَعَنْ جَابِرٍ قَالَ: أَرَدْتُّ الْخُرُوْجَ إِلَى خَيْبَرَ. فَأَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم. فَسَلَّمْتُ عَلَيْهِ. وَقُلْتُ: إِنِّيْ أَرَدْتُ الْخُرُوْجَ إِلَى خَيْبَرَ فَقَالَ: “إِذَا أَتَيْتُ وَكِيْلِيْ فَخُذْ مِنْهُ خَمْسَةَ عَشَرَ وَسْقًا فَإِنِ ابْتَغَى مِنْكَ آيَةً فَضَعْ يَدَكَ عَلَى تَرْقُوْتِهِ”.  رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2935. (6) [2/885-?]

జాబిర్‌ (ర) కథనం: నేను ‘ఖైబర్‌ వెళదామని నిశ్చయించుకున్నాను. దాని అనుమతి కోసం ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. నేను ప్రవక్త (స) కు సలామ్‌ చేసి, ” ‘ఖైబర్‌ వెళ్ళాలను కుంటున్నాను,’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘సరే నువ్వు ‘ఖైబర్‌ వెళ్ళు, అక్కడ నా వకీలు ఉన్నాడు. నువ్వు నా వకీలు దగ్గరకు వెళ్ళి 15 వసఖ్‌ల ఖర్జూరాలు తీసుకురా. ఒకవేళ అతను నిన్ను ఏదైనా సూచిక అడిగితే నీవు నీ చేతిని గొంతుపై పెట్టాలి,’ అని సూచించారు. (అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

2936 – [ 7 ] ( لم تتم دراسته ) (2/885)

عَنْ صُهَيْبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ثَلَاثٌ فِيْهِنَّ الْبَرَكَةُ: الْبَيْعُ إِلَى أَجَلٍ وَالْمُقَارَضَةُ وَإِخْلَاطُ الْبُرُّ بِالشَّعِيْرِ لِلْبَيْتِ لَا لِلْبَيْعِ”.  رَوَاهُ ابْنُ مَاجَهُ.

2936. (7) [2/885అపరిశోధితం]

సుహైబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”మూడు విషయాల్లో శుభం ఉంది. ఉద్దెర అమ్మకంలో, ముఖార’త్‌లో, అమ్మటానికి కాకుండా, తినటానికి యవ్వలను గోదుమలతో కలపటంలో.” [97] (ఇబ్నె మాజహ్)

2937 – [ 8 ] ( لم تتم دراسته ) (2/886)

وَعَنْ حَكِيْمِ بْنِ حَزَامٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم بَعَثَ مَعَهُ بِدِيْنَارٍ لِيَشْتَرِيَ لَهُ بِهِ أُضْحِيَةً فَاشْتَرَى كَبْشًا بِدِيْنَارٍ وَبَاعَهُ بِدِيْنَارَيْنِ فَرَجَعَ فَاشْتَرَى أَضْحِيَةً بِدِيْنَارٍ فَجَاءَ بِهَا وَبِالدِّيْنَارِ الَّذِيْ اسْتَفْضَلَ مِنَ الْأُخْرَى فَتَصَدَّقَ رَسُوْلُ اللهِ صلى بِالدِّيْنَارِ فَدَعَا لَهُ أَنْ يُّبَارَكَ لَهُ فِيْ تِجَارَتِهِ. رَوَاهُ التِّرْمِذِيُّ.

2937. (8) [2/886అపరిశోధితం]

ప్రవక్త (స) ‘హకీమ్‌ బిన్‌ ‘హి’జామ్‌ను ఒక అష్రఫీ ఇచ్చి, ఖుర్‌బానీ జంతువు కొనుక్కురమ్మని పంపారు. అతను ఒక అష్రఫీకి బదులుగా ఒక గొర్రెపోతును కొన్నారు. దారిలో మళ్ళీ దాన్ని రెండు అష్రఫీలకు అమ్మివేసారు. మళ్ళీ ఒక అష్రఫీకి ఒక గొర్రెపోతును కొన్నారు. ఆ గొర్రెపోతును లాభంగా వచ్చిన ఆ అష్రఫీని ప్రవక్త (స) వద్దకు తీసుకువచ్చారు. జరిగినదంతా చెప్పారు. ప్రవక్త (స) ఖుర్‌బానీ జంతువును తీసుకున్నారు. లాభంగా వచ్చిన ఆ అష్రఫీని దానం చేసారు. ఇంకా అతని వ్యాపారంలో శుభం కలగాలని దు’ఆ చేసారు. (తిర్మిజి’, అబూ దావూద్‌)  

=====

11- بَابُ الْغَصْبِ وَالْعَارِيَةِ

11. స్ మరియు వాడుకోనివ్వటం

1. ఇతరుల హక్కులను బలవంతంగా కొల్లగొట్ట టాన్ని, దోచుకోవటాన్ని గ’స్అంటారు. ఉదా: ఇతరుల భూములు, ఇళ్ళు, ఆస్తులు దోచుకోవటం. లేదా ఇతరుల దుస్తులు, పుస్తకాలు అధర్మంగా దొంగలించడం ఇవన్నీ దురాక్రమణ అవుతాయి. ఇవన్నీ అత్యాచారాలు. ఇవన్నీ నిషిద్ధం. అదే విధంగా దురాక్రమణ ద్వారా వచ్చిన సంపాదన కూడా నిషిద్ధమే. ఇటువంటి వ్యక్తుల ఆరాధనలు, ప్రార్థనలు ఇతరుల హక్కులను చెల్లించనిదే స్వీకరించబడవు. భూ ఆక్రమణలకు పాల్పడేవారి కోసం అనేక శిక్షలు ఉన్నాయి. అతన్ని భూమిలో కూర్చివేయటం జరుగుతుంది. అంతేకాదు తీర్పుదినంనాడు ఆ భూములకు సమానంగా మెడలో హారం వేసి తీర్పు మైదానంలోనికి రప్పించడం జరుగుతుంది.

2. ఆరియత్‌ అంటే అడిగి తీసుకొని లాభం పొందటం అంటే బదులు లేకుండా ఒక వస్తువును ఇతరులకు ఇవ్వడం. ఉదా: రెండు మూడు రోజుల కోసం ఎవరైనా మిమ్మల్ని ఖుర్‌ఆన్‌ అడిగితే మీరు ఇవ్వటం. అతను పఠించి దాని ద్వారా లాభం పొందటం. తరువాత వాగ్దానం ప్రకారం మీకు తిరిగి ఇచ్చి వేయటం. ‘ఆరియత్‌గా ఇచ్చే వ్యక్తిని ము’అయ్యిర్‌, తీసుకునే వ్యక్తిని ముస్త’యీర్‌, వస్తువును ముస్తఆర్‌, అని అంటారు. షరతు ఏమిటంటే కేవలం దాని ద్వారా లాభం పొందాలి. ముస్త’యిర్‌ యజమాని కాజాలడు. వాగ్దానం ప్రకారం ముస్త’యీర్‌ ఆ వస్తువును తిరిగి ఇచ్చివేయాలి.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

2938 – [ 1 ] ( متفق عليه ) (2/887)

عَنْ سَعِيْدِ بْنِ زَيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَخَذَ شِبْرًا مِنَ الْأَرْضِ ظُلْمًا فَإِنَّهُ يُطوَّقُهُ يَوْمَ الْقِيَامَةِ مِنْ سَبْعِ أَرْضَيْنَ”.

2938. (1) [2/887-ఏకీభవితం]

స’యీద్‌ బిన్‌ ‘జైద్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”అధర్మంగా ఇతరుల ఒక్క జానెడు భూమిని దోచుకున్నవాడికి తీర్పుదినం నాడు ఏడు భూముల భారం గల హారాన్ని మెడలో వేయడం జరుగుతుంది. [98] (బు’ఖారీ)

2939 – [ 2 ] ( صحيح ) (2/887)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَحْلُبَنَّ أَحَدٌ مَاشِيَةَ امْرِئٍ بِغَيْرِ أذْنِهِ أَيُحِبُّ أَحَدَكُمْ أَنْ يُّؤْتَى مَشْرُبَتَهُ فَتُكْسِرَ خِزَانَتُهُ فَيُنْتَقِلَ طَعَامُهُ وَإِنَّمَا يَخْزُنُ لَهُمْ ضُرُوْعُ مَوَاشِيْهِمْ أَطْعِمَاتِهِمْ”. رَوَاهُ مُسْلِمٌ .

2939. (2) [2/887దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”మీలో ఎవరూ ఇతరుల పశువుల పాలు యజమాని అనుమతి లేకుండా పితకరాదు. ఏమీ, మీలో ఎవడైనా తన దుకాణంలోకి, ఇంట్లోకి, మరొకడు వచ్చి ధనాన్ని లేదా ఆహార ధాన్యాలను ఎత్తుకుపోవటాన్ని ఇష్టపడతాడా? అదేవిధంగా పశువుల పొదుగులు వారి ఆహార కోశాగారాలు. వాటిలో పాలు నిండి ఉంటాయి. కనుక యజమాని అనుమతి లేకుండా అతని పశువుల పాలను పితకరాదు. [99]  (ముస్లిమ్‌)

2940 – [ 3 ] ( صحيح ) (2/887)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم عِنْدَ بَعْضِ نِسَائِهِ فَأَرْسَلَتْ إِحْدَى أُمَّهَاتِ الْمُؤْمِنِيْنَ بِصَحْفَةٍ فِيْهَا طَعَامٌ فَضَرَبَتِ الَّتِيْ النَّبِيُّ صلى الله عليه وسلم فِيْ بَيْتِهَا يَدَ الْخَادِمِ فَسَقَطَتِ الصَّحْفَةُ فَانْفَلَقَتْ فَجَمَعَ النَّبِيُّ صلى الله عليه وسلم فِلْقُ الصَّحْفَةِ ثُمَّ جَعَلَ يَجْمَعُ فِيْهَا الطَّعَامَ الَّذِيْ كَانَ فِيْ الصَّحْفَةِ وَيَقُوْلُ: “غَارَتْ أُمُّكُمْ “. ثُمَّ حَبَسَ الْخَادِمَ حَتَّى أُتِيَ بِصَحْفَةٍ مِّنْ عِنْدَ الَّتِيْ هُوَ فِيْ بَيْتِهَا فَدَفَعَ الصَّحْفَةَ الصَّحِيْحَةَ إِلَى الَّتِيْ كُسِرَتْ صَحْفَتُهَا وَأَمْسَكَ الْمَكْسُوْرَةَ فِيْ بَيْتِ الَّتِيْ كَسَرَتْ. رَوَاهُ الْبُخَارِيُّ.

2940. (3) [2/887దృఢం]

అనస్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) తన భార్యల్లోని ఒకరి ఇంట్లో ఉన్నారు. ఆయన మరోభార్య ఒక గిన్నెలో తినే వస్తువు ఉంచి ఆయన వద్దకు పంపారు. ప్రవక్త (స) ఉన్న ఇంట్లోని భార్య ఆ గిన్నెను చేత్తో కొట్టారు. ఆ గిన్నె సేవకురాలి చేతి నుండి క్రింద పడి ముక్కలై పోయింది. ప్రవక్త (స) ఆ ముక్కలన్నిటినీ ఒకచోట చేర్చి వాటిపై ఆ తినే పదార్థాన్ని ఉంచి, ‘మీ యజమానురాలికి పౌరుషం వచ్చింది.’ అని అన్నారు. ఆ తరువాత ఒక గిన్నెలో కూరవేసి తెచ్చి సేవకురాలికి ఇచ్చారు. విరిగిపోయిన దాన్ని ఆ ఇంట్లో ఉంచుకున్నారు. (బు’ఖారీ)

2941 – [ 4 ] ( صحيح ) (2/888)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ يَزِيْدٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم: أَنَّهُ نَهَى عَنِ النُّهْبَةِ وَالْمُثْلَةِ. رَوَاهُ الْبُخَارِيُّ .

2941. (4) [2/888దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ య’జీద్‌(ర) కథనం: ప్రవక్త(స) నుహ్బహ్ మరియు ము’స్‌హ్ నుండి వారించారు.[100](బు’ఖారీ)

2942 – [ 5 ] ( صحيح ) (2/888)

وَعَنْ جَابِرٍ قَالَ: انْكَسَفَتِ الشَّمْسُ فِيْ عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يَوْمَ مَاتَ إِبْرَاهِيْمُ بْنُ رَسُوْلِ الله صلى الله عليه وسلم فَصَلَّى بِالنَّاسِ سِتَّ رَكَعَاتٍ بِأَرْبَعِ سَجَدَاتٍ فَانْصَرَفَ وَقَدْ آضَتِ الشَّمْسُ وَقَالَ: “مَا مِنْ شَيْءٍ تُوْعَدُوْنَهُ إِلَّا قَدْ رَأَيْتُهُ فِيْ صَلَاتِيْ هَذِهِ لَقَدْ جِيْءَ بِالنَّارِ. وَذَلِكَ حِيْنَ رَأَيْتُمُوْنِيْ تَأَخَّرْتُ مَخَافَةَ أَنْ يُّصِيْبَنِيْ مِنْ لَفْحِهَا وَحَتَّى رَأَيْتُ فِيْهَا صَاحِبَ الْمِحْجَنِ يَجُرُّ قُصْبَهُ فِيْ النَّارِ. وَكَانَ يَسْرِقَ الْحَاجَّ بِمِحْجَتِهِ فَإِنْ فُطِنَ لَهُ قَالَ: إِنَّمَا تَعَلَّقَ بِمِحْجَتِيْ وَإِنْ غُفِلَ عَنْهُ ذَهَبَ بِهِ وَحَتَّى رَأَيْتُ فِيْهَا صَاحِبَةَ الْهِرَّةِ الَّتِيْ رَبَطْتُهَا فَلَمْ تُطْعِمْهَا وَلَمْ تَدَعْهَا تَأْكُلُ مِنْ خَشَاشِ الْأَرْضِ حَتَّى مَاتَتْ جَوْعًا ثُمَّ جِيْءَ بِالْجَنَّةِ وَذَلِكَ حِيْنَ رَأَيْتُمُوْنِيْ تَقَدَّمْتُ حَتَّى قُمْتُ فِيْ مَقَامِيْ وَلَقَدْ مَدَدْتُّ يَدَيّ وَأَنَا أُرِيْدُ أَنْ أَتَنَاوَلَ مِنْ ثَمْرَتِهَا لِتَنْظُرُوْا إِلَيْهِ ثُمَّ بَدَا لِيْ أَنْ لَّا أَفْعَلَ.  رَوَاهُ مُسْلِمٌ .

2942. (5) [2/888దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో సూర్యగ్రహణం సంభవించింది. అదే రోజు ప్రవక్త (స) కుమారులు ఇబ్రాహీమ్‌ మరణించారు. ప్రవక్త (స) సూర్యగ్రహణం సందర్భంగా రెండు రకా’తులు నమా’జు 6 రుకూలు 4 సజ్దాలతో చదివించారు. అంటే ప్రతి రకా’తులో మూడు రుకూ’లు, రెండు సజ్దాలు చేసారు. సూర్యగ్రహణం తొలగి పోయిన తర్వాత నమా’జును ముగించి ఇలా ప్రసంగించారు, ”మీతో వాగ్దానం చేయబడినదాన్ని మీకు హెచ్చరించబడినదాన్ని ఈ నమా’జులో నేను చూసుకున్నాను. నరకాన్ని నా ముందుకు రప్పిం చడం జరిగింది. నేను వెనక్కి తగ్గడం మీరు చూసినపుడు నరకవేడి వల్ల నేను వెనక్కి తగ్గాను. ఆ నరకంలో నేను చేతికర్ర గల ఒక వ్యక్తిని కాలుతూ ఉండడం చూసాను. నరకంలో అతడు తన ప్రేగులను ఈడ్చుకు పోతున్నాడు. అతని పేరు ‘అమ్‌ర్‌ బిన్‌ లుహై. అతని వద్ద ఒక చేతి కర్ర ఉండేది. అది ఒక వైపు వంగిఉండేది. అతడు వెళుతూ దారిలో ‘హాజీల వస్తువులను తన చేతికర్ర ద్వారా దొంగలించే వాడు. ఒకవేళ తెలిస్తే, ‘నా కర్ర అందులో చిక్కుకుంది,’ అని సాకులు వెదికేవాడు. తెలియకపోతే తీసుకొని వెళ్ళి పోయేవాడు. ఈ విధంగా అతడు ‘హాజీల సామాన్లను దొంగలించేవాడు. అయితే అతన్ని నేను నరకంలో చూసాను. అతడు తన ప్రేగులను ఈడ్చుకు పోతున్నాడు. ఇంకా నేను ఆ నరకంలోనే పిల్లి విషయపు స్త్రీని కూడా చూచాను. ఆమె పిల్లిని కట్టి పడేసింది. ఆహారం పెట్టలేదు. ఏదైనా తినటానికి కట్లు విప్పలేదు. ఆ స్థితిలోనే ఆ పిల్లి చనిపోయింది. ఆమె హృదయం కాఠిన్యం కారణంగా అల్లాహ్‌ (త), ఆ స్త్రీని నరకంలో పడవేసాడు. అందులో ఆ పిల్లి ఆమెను తన గోళ్ళతో చీల్చుతూ ఉంది. ఆ తరువాత నా ముందుకు స్వర్గం రప్పించడం జరిగింది. అది నేను ముందుకు జరిగినపుడు మీరు చూసారు. చివరికి నేను నా స్థానంలో నిలబడ్డాను. నేను నా చేతిని ముందుకు సాగదీసాను, స్వర్గంలోని ఫలాలను కోయడానికి — మీరు ఇహలోకంలోనే స్వర్గఫలాలను చూస్తారని — మళ్ళీ దాన్ని నేను తగనిపనిగా భావించాను. ఎందుకంటే ఈ విధంగా అగోచరాలపై విశ్వాసం ఉండదు. (ముస్లిమ్‌)

2943 – [ 6 ] ( متفق عليه ) (2/888)

وَعَنْ قَتَادَةَ قَالَ: سَمِعْتُ أَنَسًا يَقُوْلُ: كَانَ فَزَعٌ بِالْمَدِيْنَةِ فَاسْتَعَارَ النَّبِيُّ صلى الله عليه وسلم فَرْسًا مِّنْ أَبِيْ طَلْحَةَ. يُقَالُ لَهُ: الْمَنْدُوْبُ فَرَكِبَ فَلَمَّا رَجَعَ قَالَ: “مَا رَأَيْنَا مِنْ شَيْءٍ وَإِنْ وَّجَدْنَاهُ لَبَحْرًا”.

2943. (6) [2/888ఏకీభవితం]

ఖతాదహ్‌ (ర) కథనం: నేను అనస్‌ (ర)ను ఇలా అంటూ ఉండగా విన్నాను, ”ఒకసారి మదీనహ్లో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు — అవిశ్వాస శత్రుసైన్యము దాడి చేసిందని — అప్పుడు ప్రవక్త (స) వారి భయాన్ని దూరం చేయడానికి అబూ ‘తల్‌’హా గుర్రం — దాన్ని మన్‌దూబ్‌ అనే వారు — చాలా బలహీనమైనది. దానిపై ఎక్కి మదీనహ్ వెలుపల సంచరించి తిరిగి వచ్చి ప్రజలతో మరేం భయం లేదు, ఇంకా ఈ గుర్రం చాలా వేగంగా పరిగెత్తుతుంది,’ అని అన్నారు. అంటే ప్రవక్త (స) దానిపై స్వారీ చేసిన శుభం వల్ల దాని బలహీనత దూరమై చురుకుతనం వచ్చేసింది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

2944 – [ 7 ] ( صحيح ) (2/889)

عَنْ سَعِيْدِ بْنِ زَيْدٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ قَالَ: “مَنْ أَحْيَى أَرْضًا مَيْتَةً فَهِيَ لَهُ وَلَيْسَ لِعِرْقٍ ظَالِمٍ حَقٌّ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

2944. (7) [2/889దృఢం]

స’యీద్‌ బిన్‌ ‘జైద్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”దున్నేవాడిదే బంజరు భూమి. దానితో దుర్మార్గు లకు ఎటువంటి సంబంధం లేదు.” (అ’హ్మద్‌, తిర్మిజి’, అబూ దావూద్)

2945 – [ 8 ] ( لم تتم دراسته ) (2/889)

وَرَوَاهُ مَالِكٌ عَنْ عُرْوَةَ مُرْسَلًا. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.

2945. (8) [2/889అపరిశోధితం]

దీన్ని మాలిక్‌, ఉర్వా ద్వారా తాబయీ ప్రోక్తంగా ఉల్లేఖించారు. తిర్మిజి’ / ప్రామాణికం – ఏకోల్లేఖనంగా పరిగణించారు.[101]

2946 – [ 9 ] ( لم تتم دراسته ) (2/889)

وَعَنْ أَبِيْ حُرَّةَ الرَّقَاشِيِّ عَنْ عَمِّهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلَا تَظْلِمُوْا أَلَا لَا يَحِلُّ مَالُ امْرِئٍ إِلَّا بِطِيْبِ نَفْسٍ مِّنْهُ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ وَالدَّارَقُطْنِيِّ فِيْ الْمُجْتَبَى.

2946. (9) [2/889అపరిశోధితం]

అబూ ‘హుర్ర రఖ్ఖాషీ తన పినతండ్రిగారి ద్వారా కథనం, ”ప్రవక్త (స) ప్రవచనం, జాగ్రత్త మీరు ఎన్నడూ ఎవరిపైననూ అత్యాచారం చేయకండి, ఇతరుల ధనాన్ని అతని అనుమతి, సంతోషం లేకుండా తీసుకోకండి.” (బైహఖీ – షు’అబిల్ ఈమాన్, దారు ఖు’తునీ)

2947 – [ 10 ] ( لم تتم دراسته ) (2/889)

وَعَنْ عِمْرَانَ ابْنِ حُصَيْنٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ قَالَ: “لَا جَلَبَ وَلَا جَنَبَ وَلَا شِغَارَ فِيْ الْإِسْلَامِ وَمَنِ انْتَهَبَ نَهْبَةً فَلَيْسَ مِنًّا”. رَوَاهُ التِّرْمِذِيُّ.

2947. (10) [2/889అపరిశోధితం]

‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జలబ మరియు జనబ ఇస్లామ్‌లో ఎంత మాత్రం ధర్మసమ్మతం కావు. అదేవిధంగా ఇస్లామ్‌లో షి’గార్‌ కూడా ధర్మసమ్మతం కాదు. అనుమతి లేకుండా ఇతరుల ధనాన్ని దోచుకునే వ్యక్తి ముస్లిమ్‌ కాడు.” [102] (తిర్మిజి’)

2948 – [ 11 ] ? (2/889)

وعَنْ السائب بن يَزِيْدٍ عَنْ أَبِيْهِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا يَأْخُذُ أَحَدُكُمْ عَصَا أَخِيْهِ لَاعِبًا جَادًّا فَمَنْ أَخَذَ عَصَا أَخِيْهِ فَلْيَرُدَّهَا إِلَيْهِ” . رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَرَوَايَتُهُ إِلَى قَوْلِهِ: “جَادًا”.

2948. (11) [2/889?]

సాయిబ్‌ బిన్‌ యజీద్‌ (ర) తన తండ్రి ద్వారా ఇలా ఉల్లేఖి స్తున్నారు, ”ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరూ తన సోదరుని చేతి కర్రను ఎగతాళిగా తీసుకోరాదు. తన సోదరుని చేతి కర్ర తీసుకున్నవారు దాన్ని తిరిగి ఇచ్చివేయాలి.” (తిర్మిజి’, అబూ దావూద్‌)

2949 – [ 12 ] ( لم تتم دراسته ) (2/890)

وَعَنْ سَمُرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ وَجَدَ عَيْنَ مَالِهِ عِنْدَ رَجُلٍ فَهُوَ أَحَقُّ بِهِ وَيَتَّبِعُ الْبَيْعُ مَنْ بَاعَهُ” .رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

2949. (12) [2/890అపరిశోధితం]

సమురహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన సొత్తును ఎక్కడ చూచినా, అతడే దాన్ని పొందే హక్కుదారుడు. దాన్ని కొన్నవాడు, అమ్మేవాడి నుండి తన డబ్బును తీసుకోవాలి.” [103] (అ’హ్‌మద్‌, అబూ దావూద్‌, నసాయి’)

2950 – [ 13 ] ( لم تتم دراسته ) (2/890)

وَعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “عَلَى الْيَدِ مَا أَخَذَتْ حَتَّى تُؤَدِّيَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

2950. (13) [2/890అపరిశోధితం]

సమురహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీసుకున్నవాడు తప్పనిసరిగా తిరిగి ఇవ్వాలి.” [104] (తిర్మిజి’, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

2951 – [ 14 ] ( لم تتم دراسته ) (2/890)

وَعَنْ حَرَامِ بْنِ سَعْدِ بْنِ مُحَيِّصَةَ: أَنَّ نَاقَةَ لِّلْبَرَاءِ بْنِ عَازِبٍ دَخَلَتْ حَائِطًا فَأَفْسَدَتْ. فَقَضَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنَّ عَلَى أَهْلِ الْحَوَائِطِ حِفْظِهَا بِالنَّهَارِ. وَأَنَّ مَا أَفْسَدَتِ الْمَوَاشِيُّ بِاللَّيْلِ ضَامِنٌ عَلَى أَهْلِهَا. رَوَاهُ مَالِكٌ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

2951. (14) [2/890అపరిశోధితం]

‘హరామ్‌ బిన్‌ స’అద్‌ బిన్‌ ము’హై’సహ్ (ర) కథనం: బరా’ బిన్‌ ‘ఆ’జిబ్‌ యొక్క ఒంటె తోటలోనికి వెళ్ళి పోయింది. తోటను నష్టపరిచింది. (ఈ కేసు ప్రవక్త (స) వద్దకు వెళ్ళింది). అప్పుడు ప్రవక్త (స) ఇలా తీర్మా నించారు. ”పగలు తోట యజమానులు కాపలా కాయాలి. రాత్రిపూట పశువుల బాధ్యత వాటి యజమానులది.” [105] (మాలిక్‌, అబూ దావూద్, ఇబ్నె మాజహ్)

2952 – [ 15 ] ( لم تتم دراسته ) (2/890)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: الرِّجْلُ جُبَارٌ وَالنَّارُ جُبَارٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2952. (15) [2/890అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కాలివల్ల కలిగే నష్టం క్షమించదగినది. ఇంకా అగ్నివల్ల కలిగే నష్టం క్షమించదగినది.” [106](అబూ దావూద్‌)

2953 – [ 16 ] ( لم تتم دراسته ) (2/890)

وَعَنِ الْحَسَنِ عَنْ سَمُرَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا أَتَى أَحَدُكُمْ عَلَى مَاشِيَةٍ. فَإِنَّ كَانَ فِيْهَا صَاحِبِهَا فَلْيَسْتَأْذِنُهُ. وَإِنْ لَمْ يَكُنْ فِيْهَا فَلْيُصَوِّتْ ثَلَاثًا فَإِنْ أَجَابَهُ أَحَدٌ فَلْيَسْتَأْذِنْهُ وَإِنْ لَمْ يُجِبْهُ أَحَدٌ فَلْيَحْتَلِبْ وَلْيَشْرَبْ وَلَا يَحْمِلُ” . رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2953. (16) [2/890అపరిశోధితం]

సమురహ్‌ ద్వారా ‘హసన్‌ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ఎవరైనా ఆకలిగొన్న వ్యక్తి పాలున్న పశువుదగ్గరకు వస్తే, ఆ పశువు యజమాని అక్కడ ఉంటే అతని అనుమతితో పాలు పితికి త్రాగవచ్చును. ఒకవేళ యజమాని అక్కడ లేకపోతే మూడుసార్లు బిగ్గరగా పిలవాలి. ఎవరైనా వస్తే అతని అనుమతి తీసుకోవాలి. ఒకవేళ ఎవరూ రాకపోతే అవసరం ఉన్నంత పాలనే పితికి త్రాగాలి. కాని అక్కడి నుండి పాలను తీసుకొని వెళ్ళరాదు.(అబూ దావూద్)

2954 – [ 17 ] ( لم تتم دراسته ) (2/890)

وَعَنِ ابْنِ عُمَرَعَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ دَخَلَ حَائِطًا فَلْيَأْكُلْ وَلَا يَتَّخِذُ خُبْنَةً”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَقَالَ التِّرْمِذِيُّ هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

2954. (17) [2/890అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఎవరైనా ఆకలిగొన్న వ్యక్తి తోటలోనికి ప్రవేశిస్తే ఆకలి తీరినన్ని పళ్ళను తినవచ్చు. అక్కడి నుండి తీసుకొని వెళ్ళరాదు. అంటే కడుపునిండా తినవచ్చును. అక్కడి నుండి తీసుకొని వెళ్ళరాదు. (తిర్మిజి’ / ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)

2955 – [ 18 ] ( لم تتم دراسته ) (2/891)

وَعَنْ أُمَيَّةَ بْنِ صَفْوَانَ عَنْ أَبِيْهِ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم اسْتَعَارَ مِنْهُ أَدْرَاعَهُ يَوْمَ حُنَيْنٍ فَقَالَ: أَغَصْبًا يَا مُحَمَّدُ؟ قَالَ: “بَلْ عَارِيَّةً مَضْمُوْنَةً”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2955. (18) [2/891అపరిశోధితం]

ఉమయ్య బిన్‌ ‘సఫ్‌వాన్‌ (ర) తన తండ్రి ద్వారా కథనం: ”ప్రవక్త (స) ‘హునైన్‌ యుద్ధం సందర్భంగా ‘సఫ్‌వాన్‌ను కవచం అడిగారు. (అప్పటికి ‘సఫ్‌వాన్‌ ఇంకా ఇస్లామ్‌ స్వీకరించలేదు). దానికి ‘సఫ్‌వాన్‌ ఓ ము’హమ్మద్‌ (స)! తమరు ఈ కవచాన్ని నా నుండి బలవంతంగా తీసుకోవాలనుకుంటున్నారు. దానికి ప్రవక్త (స), ”లేదు అవసరం కోసం తీసుకుం టున్నాను. ఒకవేళ ఇదిపోతే దీని పరిహారం నేను చెల్లిస్తాను” అని అన్నారు. (అబూ దావూద్‌)

2956 – [ 19 ] ( لم تتم دراسته ) (2/891)

وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَلْعَارِّيَةُ مُؤَدَّاةٌ. وَالْمِنْحَةُ مَرْدُوْدَةٌ وَالدَّيْنُ مَقْضِيٌ وَالزَّعِيْمُ غَارِمٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ .

2956. (19) [2/891అపరిశోధితం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ”అవసరానికి తీసుకున్న వస్తువును తిరిగి ఇవ్వటం తప్పనిసరి. మరియు మనీ’హను యజమానికి తిరిగి ఇచ్చి వేయాలి. అప్పు తీర్చడం తప్పనిసరి. బాధ్యుడు పరిహారం చెల్లించాలి.” [107]  (తిర్మిజి’, అబూ దావూద్‌)

2957 – [ 20 ] ( لم تتم دراسته ) (2/891)

وَعَنْ رَافِعِ بْنِ عَمْرٍو الْغَفَّارِي قَالَ: كُنْتُ غُلَامًا أَرْمَي نَخْلَ الْأَنْصَارِ فَأُتِيَ بِيْ النَّبِيَّ صلى الله عليه وسلم فَقَالَ: “يَا غُلَامُ لَمْ تَرْمِي النَّخْلَ؟ “قُلْتُ: آكُلُ. قَالَ: “فَلَا تَرْمِ. وَكُلْ مِمَّا سَقَطَ فِيْ أَسْفَلِهَا” ثُمَّ مَسَحَ رَأْسَهُ فَقَالَ: “اللّهُمَّ أشْبَعْ بَطَنَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

 وَسَنَذْكُرُ حَدِيْثَ عَمْرِو بْنِ شُعَيْبٍ فِيْ”بَابِ اللُّقَطَةِ” إِنْ شَاءَ اللهُ تَعَالى.

2957. (20) [2/891అపరిశోధితం]

రా’ఫె బిన్‌ ‘అమ్ర్‌ ‘గిఫారీ (ర) కథనం: నేను యువకుడిగా ఉన్నప్పుడు అన్సారుల ఖర్జూరపు చెట్లపై రాళ్ళు విసిరి ఖర్జూరాలను పడగొట్టేవాడను. నన్ను పట్టుకొని ప్రవక్త (స) వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. అప్పుడు ప్రవక్త (స), ‘కుమారా! ఖర్జూరాలపై రాళ్ళు ఎందుకు విసురుతావు?’ అని అన్నారు. దానికి నేను, ‘ఖర్జూరాలు తినడానికి,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘రాళ్ళు విసిరి వాటిని రాల్చకు. ఎందుకంటే దాని వల్ల పచ్చివి, పండువి అన్నీపడతాయి. దానివల్ల నష్టం కలుగుతుంది. చెట్టు క్రింద పడిఉన్నపళ్ళను తీసుకొని తిను,’ అని ఉపదేశించి, తన చేతితో నా తలపై నిమురుతూ, ‘ఓ అల్లాహ్‌! ఇతని కడుపును నింపు,’ అని అన్నారు. (తిర్మిజి’, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ ‘హదీసు’ను ఇన్‌షా అల్లాహ్‌ బాబ్ అల్లఖ’తహ్ లో పేర్కొందుము.

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం  

2958 – [ 21 ] ( صحيح ) (2/891)

عَنْ سَالِمٍ عَنْ أَبِيْهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَخَذَ مِنَ الْأَرْضِ شَيْئًا بِغَيْرِ حَقِّهِ خُسِفَ بِهِ يَوْمَ الْقِيَامَةِ إِلَى سَبْعِ أَرْضِيْنَ”. رَوَاهُ الْبُخَارِيُّ .

2958. (21) [2/891దృఢం]

తన తండ్రి ద్వారా సాలిమ్‌ ఉల్లేఖనం: ప్రవక్త (స) ప్రవచనం, అన్యాయంగా ఇతరుల భూమిని ఆక్రమించుకున్న వ్యక్తిని తీర్పుదినం వరకు భూమి యొక్క ఏడు భూములలోనికి అణగద్రొక్కడం జరుగుతుంది. (బు’ఖారీ)

2959 – [ 22 ] ( لم تتم دراسته ) (2/892)

وَعَنْ يَعْلَى بْنِ مُرَّةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ أَخَذَ أَرْضًا بِغَيْرِ حَقِّهَا كُلِّفَ أَنْ يَّحْمِلَ تُرَابِهَا الْمَحْشَرَ”. رَوَاهُ أَحْمَدُ.

2959. (22) [2/892అపరిశోధితం]

య’అలా’ బిన్‌ ముర్రహ్ (ర) కథనం: ప్రవక్త (స) ను ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఇతరుల భూమిని అన్యాయంగా ఆక్రమించుకున్న వ్యక్తిని దాని మట్టిని తీర్పు మైదానంలోనికి తీసుకురావలసిందిగా శిక్షించడం జరుగుతుంది. (అ’హ్మద్‌)

2960 – [ 23 ] ( لم تتم دراسته ) (2/892)

وَعَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “أَيُّمَا رَجُلٍ ظَلَمَ شِبْرًا مِّنَ الْأَرْضِ كَلَّفَهُ اللهُ عَزَّ وَجَلَّ أَنْ يَّحْفِرَهُ حَتَّى يَبْلُغَ آخِرَ سَبْعِ أَرْضِيْنَ ثُمَّ يُطَوَّقُهُ إِلَى يَوْمِ الْقِيَامَةِ حَتَّى يُقْضَى بَيْنَ النَّاسِ”. رَوَاهُ أَحْمَدُ.

2960. (23) [2/892అపరిశోధితం]

య’అలా’ బిన్‌ ఉమయ్యహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఇతరుల జానెడు భూమినైనా అన్యాయంగా ఆక్రమించుకున్న వ్యక్తిని ఏడు భూముల భారాన్ని తన మెడలో వేసుకో వలసిందిగా అల్లాహ్‌ (త) ఆదేశించడం జరుగుతుంది. చివరికి ప్రజలమధ్య తీర్పు పూర్తయిపోతుంది.” (అ’హ్మద్‌)

=====

12- بَابُ الشُّفْعَةِ

12. విలీనం అధ్యాయం

షుఫ్‌’హ్ అంటే కలపటం, అతకటం అని అర్థం. ఇస్లామీయ పరిభాషలో ఒక భాగస్వామి యొక్క వంతు మరో భాగస్వామి వైపు మార్చడం. భాగస్వామి మరియు షుఫ్‌’హ్ ల మధ్య గల ధర్మబద్ధమైన ఏదైనా వస్తువుకు బదులు ఇవ్వటం. ఉదా: ఇద్దరు భాగస్వాముల్లో ఒకరు తన వంతు భూమిని అమ్మ గోరుతాడు. రెండవ భాగస్వామియే కొనడం అనేది ధర్మబద్ధమైన హక్కు. ఇతని అనుమతి లేకుండా ఇతరులు కొనడం ధర్మం కాదు. ఇతరులు ఇచ్చే ధరనే షఫీ ఇచ్చి తన భాగస్వామి భాగాన్ని కొని తన భాగంలో కలుపుకోవాలి. భాగస్వామి తన మరో భాగస్వామి ఉన్నప్పుడు ధర్మబద్ధంగా అతనికే అమ్మాలి. ఒకవేళ అతను లేకపోతే వేచి ఉండాలి. ఎదురుచూడాలి.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

2961 – [ 1 ] ( صحيح ) (2/893)

عَنْ جَابِرٍ قَالَ: قَضَى النَّبِيُّ صلى الله عليه وسلم بِالشُّفْعَةِ فِيْ كُلِّ مَا لَمْ يُقْسِمْ فَإِذَا وَقَعَتِ الْحُدُوْدُ وَصُرِفَتِ الطُّرُقُ فَلَا شُفْعَةَ. رَوَاهُ الْبُخَارِيُّ .

2961. (1) [2/893దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) విభజించబడకుండా ఉన్న ప్రతి వస్తువుపై షుఫ్‌’హ్ ను నిర్దేశించారు. విభజన జరిగితే ప్రతి ఒక్కరి దారులు వేరు వేరు. మరి అందులో షుఫ్‌’హ్ ఉండదు. (బు’ఖారీ)

2962 – [ 2 ] ( صحيح ) (2/893)

وَعَنْهُ قَالَ: قَضَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِالشُّفْعَةِ فِيْ كُلِّ شِرْكَةٍ لَمْ تُقْسَمْ رَبْعَةٍ أَوْ حَائِطٍ: “لَا يَحِلُّ لَهُ أَنْ يَّبِيْعَ حَتَّى يُؤْذَنَ شَرِيْكَهُ فَإِنْ شَاءَ أَخَذَ وَإِنْ شَاءَ تَرَكَ فَإِذَا بَاعَ وَلَمْ يُؤْذِنُهُ فَهُوَ أَحَقُّ بِهِ”. رَوَاهُ مُسْلِمٌ .

2962. (2) [2/893దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) భాగస్వామ్యం గల విభజించబడని ప్రతి వస్తువులో షుఫ్‌’హ్ గురించి ఆదేశించారు. అది భూమి అయినా తోట అయినా ఒక భాగస్వామి మరో భాగస్వామికి తెలియకుండా తన వంతును అమ్మటం తగదు. ఒకవేళ తెలియపరచకుండా అమ్మివేస్తే భాగస్వామియే అధిక హక్కు గలవాడు. [108]  (ముస్లిమ్‌)

2963 – [ 3 ] ( صحيح ) (2/893)

وَعَنْ أَبِيْ رَافِعٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْجَارُ أَحَقُّ بِسَقَبِهِ”. رَوَاهُ الْبُخَارِيُّ.

2963. (3) [2/893దృఢం]

అబూ రాఫె (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మిత్రుడు తన సాన్నిహిత్యం వల్ల అధిక హక్కు దారుడు. (బు’ఖారీ)

2964 – [ 4 ] ( متفق عليه ) (2/893)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَمْنَعْ جَارٌ جَارَهُ أَنْ يَغْرِزَ خَشْبَةً فِيْ جِدَارِهِ”.

2964. (4) [2/893ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పొరుగువారు తన పొరుగువారిని గోడకు మేకులు, లేదా కర్రలు కొట్టకూడదని వారించకూడదు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

2965 – [ 5 ] ( صحيح ) (2/893)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا اخْتَلَفْتُمْ فِيْ الطَّرِيْقِ جُعِلَ عِرْضُهُ سَبْعَةَ أَذْرُعٍ”. رَوَاهُ مُسْلِمٌ .

2965. (5) [2/893దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మార్గం విషయంలో అభిప్రాయభేదాలు ఏర్పడితే, మార్గం కొరకు 7 గజాల వెడల్పు భూమిని వదలి వేయండి.” [109] (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

2966 – [ 6 ] ( لم تتم دراسته ) (2/894)

عَنْ سَعِيْدِ بْنِ حُرَيْثٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يقول: “مَنْ بَاعَ مِنْكُمْ دارًا أَوْ عِقَارًا قَمِنٌ. أَنْ لَا يُبَارَكَ لَهُ إِلَّا أَنْ يَّجْعَلَهُ فِيْ مِثْلِهِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ .

2966. (6) [2/894అపరిశోధితం]

సయీద్‌ బిన్‌ హురైస్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను, ”మీలో ఎవరైనా ఇల్లు లేదా భూమి అమ్మితే దాని ధరను అటువంటి భూమిపై ఖర్చు చేయాలి. అంటే మరో భూమి లేదా ఇల్లు కొనుక్కోవాలి. ఒకవేళ మరో భూమి లేదా ఇల్లు కొనకుండా ఉంటే ఆ ధనంలో శుభం ఉండదు. (ఇబ్నె మాజహ్, దారమి)

ఎందుకంటే భూమి లేదా ఇల్లు కొనడంలో వ్యయపరచక పోతే ఆ డబ్బు ఖర్చయిపోతుంది, అదే అశుభం.

2967 – [ 7 ] ( لم تتم دراسته ) (2/894)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْجَارُ أَحَقُّ بِشُفْعَتِهِ يُنْتَظَرُ لَهَا وَإِنْ كَانَ غَائِبًا إِذَا كَانَ طَرِيْقُهُمَا وَاحِدًا”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.

2967. (7) [2/894అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, సహచరుడు షుఫ్‌’హ్ విషయంలో అందరికంటే అధికహక్కు కలిగి ఉంటాడు. ఒకవేళ అతడు లేకపోతే అతని గురించి వేచి ఉండాలి. ఇది ఎప్పుడంటే ఇద్దరి మార్గం ఒకటై ఉంటే. (అ’హ్‌మద్‌, తిర్మిజి’, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్, దారమి)

2968 – [ 8 ] ( لم تتم دراسته ) (2/894)

وَعَنِ ابْنِ عَبَّاسٍ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «الشَّرِيكُ شَفِيعٌ وَالشُّفْعَةُ فِي كل شَيْء» . رَوَاهُ التِّرْمِذِيّ قَالَ:

2968. (8) [2/894అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భాగస్వామికి అమ్మబడే భూమిలో షుఫ్‌’హ్ హక్కు ఉంది. స్థిరమైన (స్థల మార్పిడి చేయలేని / కదలని / నిశ్చలమైన) ప్రతి వస్తువులో షుఫ్‌’హ్ హక్కు ఉంది.”  (తిర్మిజి’)

2969 – [ 9 ] ( لم تتم دراسته ) (2/894)

وَقَدْ رُوِيَ عَنِ ابْنِ أَبِيْ مُلَيْكَةَ عَنِ النَّبِيَّ صلى الله عليه وسلم مُرْسَلًا وَهُوَ أَصَحُّ .

2969. (9) [2/894అపరిశోధితం]

ఇబ్ను అబీ ములైకహ్‌ కథనం కూడా ఇలాగే ఇంది. (తిర్మిజి’)

2970 – [ 10 ] ( لم تتم دراسته ) (2/894)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ جُبَيْشٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَطَعَ سِدْرَةً صَوَّبَ اللهُ رَأْسَهُ فِيْ النَّارِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَقَالَ: هَذَا الْحَدِيْثُ مُخْتَصَرَ يَعْنِيْ: مَنْ قَطَعَ سِدْرَةَ فِيْ فُلَاةٍ يَسْتَظِلُّ بِهَا ابْنُ السَّبِيْلِ وَالْبَهَائِمُ غَشْمًا وَظُلْمًا بِغَيْرِ حَقٍّ يَكُوْنُ لَهُ فِيْهَا صَوَّبَ اللهُ رَأْسَهُ فِيْ النَّارِ.

2970. (10) [2/894అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘హుబైష్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రేగి చెట్టును నరికే వారిని అల్లాహ్‌ (త) తల క్రిందులుగాచేసి నరకంలో పడవేస్తాడు.” [110] (అబూ దావూద్‌)

 ఈ ‘హదీసు’ సంక్షిప్తంగా ఉందని అబూ దావూద్‌ పేర్కొన్నారు. దీని అర్థం ఏమిటంటే ఏదైనా మైదానంలో లేక మార్గంలో రేగుచెట్టు ఉండి, బాటసారులు ఇతర జంతువులు దాని నీడపట్టున సేదతీరుతూ ఉంటే అటువంటి రేగు చెట్టును అనవసరంగా నరికినట్లైతే, అటువంటి వ్యక్తిని అల్లాహ్ నరకంలో బోర్లా పడవేస్తాడు.

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

2971 – [ 11 ] ( لم تتم دراسته ) (2/895)

عَنْ عُثْمَانَ بْنِ عَفَّانَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: إِذَا وَقَعَتِ الْحُئَدُوْدُ فِيْ الْأَرْضِ فَلَا شُفْعَةَ فِيْهَا. وَلَا شُفْعَةَ فِيْ بِئْرٍ وَّلَا فَحَلِ النَّخْلَ. رَوَاهُ مَالِكٌ.

2971. (11) [2/895అపరిశోధితం]

‘ఉస్మా’న్‌ బిన్‌ ‘అఫ్ఫాన్‌ (ర) కథనం: భాగస్వాములు తమ భూమి హద్దుల్ని వేరుచేసుకుంటే, అంటే పంచుకొని వేరైతే భాగస్వామ్య షుఫ్‌’హ్ హక్కు ఉండదు. అదేవిధంగా బావిలో, ఖర్జూరపు పురుష వృక్షాలలో షుఫ్‌’హ్ లేదు. (మాలిక్‌)

=====

13- بَابُ الْمُسَاقَاةِ وَالْمُزَارِعَةِ

13. ఖౌలు, ముసాఖాత్‌”

ము’జారిఅత్‌ అంటే ఒక వ్యక్తికి భూమి ఇవ్వటం, ఆ వ్యక్తి అందులో పంటలు పండించటం వచ్చే లాభాన్ని ఇద్దరూ నిర్థారితమైన విధంగా తమ తమ వంతు పొందటం. ఉదా: మీ వద్ద 5 ఎకరాల భూమి ఉంది. మీరు ‘జైద్‌కి ఇచ్చి వ్యవసాయం చేయమన్నారు. దాని పంటలో సగం మీది, సగం మాది అన్నారు. ‘జైద్‌ దానికి సమ్మతించి వ్యవసాయం ప్రారంభించాడు. ఆ వచ్చిన పంటలో సగం సగం ఇద్దరూ పొందండి. దీన్నే ము’ఖాబరహ్‌ అని కూడా అంటారు. కొందరు ము’ఖాబరత్‌ మరియు ము’జారఅత్‌ లో కొంత భేదం ఉందని అన్నారు. ము’జారఅత్‌ లో శ్రమ ఒక వైపు నుండి, విత్తనాలు భూమి మరొకవైపు నుండి. ము’ఖా బరత్‌లో భూమి ఒక వైపునుండి, విత్తనాలు శ్రమ మరోవైపు నుండి. ఈ విధమైన ము’జారఅత్‌ మరియు ము’ఖారబత్‌ ధర్మసమ్మతమే. ప్రవక్త (స) మరియు ఆయన అనుచరులు ము’జారఅత్‌ చేసారు. భూమిని అద్దెకు ఇవ్వడం కూడా ధర్మబద్ధమే.

అసలు ముసా’ఖాత్‌, ము’జారఅత్‌ యొక్క ఒక రకం. కేవలం వ్యత్యాసం ఏమిటంటే ముజారఅత్‌ భూమి విషయంలో జరుగుతుంది. కాని ముసాఖాత్‌ చెట్లలో జరుగుతుంది. మీరు మీ తోటను చెట్లను ఇతరులకు అప్పగించి నీవు వాటిని సంరక్షించి పండించుకోమని, దానివల్ల పండిన పండ్లు సగంమీవి సగంమావి, అని అంటే వారు ఒప్పుకొని పని ప్రారంభించారు.

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

2972 – [ 1 ] ( صحيح ) (2/896)

عَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم دَفَعَ إِلَى يَهُوْدِ خَيْبَرَنَخْلَ خَيْبَرَ وَأَرْضَهَا عَلَى أَنْ يَّعْتَمِلُوْهَا مِنْ أَمْوَالِهِمْ وَلِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم شَطْرُثَمَرِهَا. رَوَاهُ مُسْلِمٌ

وَفِيْ رِوَايَةِ الْبُخَارِيِّ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَعْطَى خَيْبَرَ الْيَهُوْدَ أَنْ يَّعْمَلُوْهَا وَيَزْرَعُوْهَا وَلَهُمْ شَطْرَ مَا يَخْرُجُ مِنْهَا.

2972. (1) [2/896దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఖైబర్‌ ఖర్జూరపు చెట్లను, భూములను యూదులకు ఇచ్చి, వ్యవసాయం వారు చేయాలని పంటలో సగం యూదులది, సగం ప్రవక్త(స)కు చెందుతుందని షరతు పెట్టారు. [111] (ముస్లిమ్‌)

బు’ఖారీలో కూడా ఇటువంటి కథనం ఉంది. ప్రవక్త (స) ఖైబర్‌ ఖర్జూరపు చెట్లను, భూములను యూదులకు ఇచ్చి, వ్యవసాయం వారు చేయాలని పంటలో సగం యూదులది, సగం ప్రవక్త (స)కు చెందు తుందని షరతు పెట్టారు.

2973 – [ 2 ] ( صحيح ) (2/896)

وَعَنْهُ قَالَ: كُنَّا نُخَابِرُ وِلَا نَرَى بِذَلِكَ بَأْسًا حَتَّى زَعَمَ رَافِعُ ابْنُ خَدِيْجٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى عَنْهَا فَتَرَكْنَاهَا مِنْ أَجْلِ ذَلِكَ. رَوَاهُ مُسْلِمٌ .

2973. (2) [2/896దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: మేము ము’ఖాబరత్‌, ము’జారఅత్‌ పరస్పరం చేసుకునే వారం. వాటిలో ఎటువంటి అభ్యంతరాన్ని భావించే వారం కాదు. అయితే ప్రవక్త (స) వీటి నుండి వారించారని రా’ఫె బిన్‌ ‘ఖదీజ్‌ తెలియపరచగా మేము వీటిని మానుకున్నాము.” [112] (ముస్లిమ్‌)

2974 – [ 3 ] ( متفق عليه ) (2/896)

وَعَنْ حَنْظَلَةَ بْنِ قَيْسٍ عَنْ رَافِعِ بْنِ خَدِيْجٍ قَالَ: أَخْبَرَنِيْ عَمَّايَ أَنَّهُمْ كَانُوْا يُكْرُوْنَ الْأَرْضَ عَلَى عَهْدِ النَّبِيَّ صلى الله عليه وسلم بِمَا يَنْبُتُ عَلَى الْأَرْبَعَاءِ أَوْ شَيْءٍ يَسْتَثْنِيْهِ صَاحِبُ الْأَرْضِ فَنَهَانَا النَّبِيُّ صلى الله عليه وسلم عَنْ ذَلِكَ فَقُلْتُ لِرَافِعٍ: فَكَيْفَ هِيَ بِالدَّرَاهِمِ وَالدَّنَانِيْرِ؟ فَقَالَ: لَيْسَ بِهَا بَأْسٌ وَكَأَنَّ الَّذِيْ نَهَي عَنْ ذَلِكَ مَا لَوْ نَظَرَ فِيْهِ ذُوُو الْفَهْمِ بِالْحَلَالِ وَالْحَرَامِ لَمْ يُجِيْزُوْهُ لِمَا فِيْهِ مِنَ الْمُخَاطِرَةِ .

2974. (3) [2/896ఏకీభవితం]

‘హన్‌”జల బిన్‌ ఖైస్‌ (ర), రా’ఫె బిన్‌ ‘ఖదీజ్‌ ద్వారా కథనం. అతను మా చిన్నాన్నలు నాకు ఇలా తెలియపరిచారు: ప్రవక్త (స) కాలంలో ప్రవక్త (స) అనుచరులు తమ భూములను అద్దెకు ఇచ్చేవారు. అయితే కాలువలకు, వాగులకు ప్రక్కన పండే పంటలకు బదులుగా, లేదా భూమి యజమాని ఎంచుకున్న పంటను మాత్రం ప్రవక్త (స) వారించారు. దానికి నేను రా’ఫె బిన్‌ ‘ఖదీజ్‌ను ‘భూములను దిర్‌హమ్‌, దీనార్లకు బదులుగా అద్దెకు ఇవ్వ వచ్చునా’ అని అడిగాను. దానికి అతను(స) ‘ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు’ అని అన్నారు.

ఉల్లేఖనకర్త అభిప్రాయం: ప్రవక్త (స) నిషేధించిన ము’జారఅత్‌ ఎటువంటిదంటే ఒకవేళ ఎవరైనా బుద్ధిమంతుడు ధర్మాధర్మాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే మోసం, ప్రమాదం ఉందని గ్రహించి వీటిని ధర్మంగా భావించడు. [113] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2975 – [ 4 ] ( متفق عليه ) (2/897)

وَعَنْ رَافِعِ بْنِ خَدِيْجٍ قَالَ: كُنَّا أَكْثَرَ أَهْلُ الْمَدِيْنَةِ حَقْلًا وَكَانَ أَحَدُنَا يُكْرِيْ أَرْضَهُ فَيَقُوْلُ: هَذِهِ الْقِطْعَةُ لِيْ وَهَذِهِ لَكَ فَرُبَّمَا أَخْرَجَتْ ذِهِ وَلَمْ تُخْرِجْ ذِهِ فَنَهَاهُمُ النَّبِيُّ صلى الله عليه وسلم .

2975. (4) [2/897ఏకీభవితం]

రా’ఫె బిన్‌ ‘ఖదీజ్‌ (ర) కథనం: మేము మదీనహ్లో అందరికంటే అధికంగా వ్యవసాయం చేసేవారం. మేము మా భూములను అద్దెకు ఇచ్చేవాళ్ళం. ఇచ్చేవారు పొలంలోని ఈ భాగం పంట మాది, ఆ భాగం పంట నీది అని అనేవారు. ఒక్కోసారి ఒక భాగంలో పంట బాగుంటుంది, మరో భాగంలోని పంట బాగుండదు. అందువల్ల ప్రవక్త (స) ఇటువంటి వ్యవసాయ ఒప్పందాన్ని నిషేధించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

2976 – [ 5 ] ( متفق عليه ) (2/897)

وَعَنْ عَمْرٍو قَالَ: قُلْتُ لِطَاوِوسٍ: لَوْ تَرَكْتَ الْمُخَابَرَةَ فَإِنَّهُمْ يَزْعَمُوْنَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى عَنْهُ قَالَ: أَيْ عَمْرُو إِنِّيْ أُعْطِيْهِمْ وَأُعِيْنُهُمْ. وَإِنَّ أَعْلَمَهُمْ أَخْبَرَنِيْ يَعْنِيْ ابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم لَمْ يَنْهَ عَنْهُ وَلَكِنَّ قَالَ: “أَنْ يَّمْنَحَ أَحَدُكُمْ أَخَاهُ خَيْرٌ لَّهُ مِنْ أَنْ يَّأْخُذَ عَلَيْهِ خَرْجًا مَّعْلُوْمًا”.

2976. (5) [2/897ఏకీభవితం]

‘అమ్ర్‌ బిన్‌ దీనార్‌ (ర) కథనం: నేను తా’ఊస్‌ తాబయీతో, ‘మీరు ము’జారఅత్‌ను మానివేస్తే బాగుండును, ఎందుకంటే ప్రవక్త (స) దీన్ని నిషేధించారని ప్రజలు చెబుతున్నారు,’ అని అన్నాను. దానికి తా’ఊస్‌, ‘ఓ ‘అమ్ర్‌ బిన్‌ దీనార్‌! నేను ప్రజలకు భూములను ము’జారఅత్‌పై ఇస్తాను. ఇంకా ఈ విషయంలో వారికి సహాయం చేస్తాను. ఎందు కంటే, గొప్ప పండితులైన ‘అబ్బాస్‌ (ర) ఇలా తెలిపారు, ”ప్రవక్త (స) ము’జారఅత్‌ను నిషేధించ లేదు, కాని మీరు అద్దెకు లేదా పంటకు బదులుగా ఇచ్చేకన్నా, ఉచితంగా ఇవ్వటం చాలా ఉత్తమం’ అని ప్రవచించారు” అని అన్నారు. (బు’ఖారీ)

అంటే డబ్బు, ధనం, పంటలో భాగం కోరకుండా ఒక ముస్లిమ్‌ సోదరునికి ఉచితంగా ఇచ్చివేయటం చాలా ఉత్తమం.

2977 – [ 6 ] ( متفق عليه ) (2/897)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ كَانَتْ لَهُ أَرْضٌ فَلْيَزْرَعْهَا أَوْ لِيَمْنَحْهَا أَخَاهُ فَإِنْ أَبَى فَلْيُمْسِكْ أَرْضَهُ”.

2977. (6) [2/897ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భూమి ఉన్నవారు స్వయంగా వారే వ్యవసాయం చేయాలి. లేదా తన సోదరునికి ఇచ్చివేయాలి. ఈ రెండు విషయాలూ కాని పక్షంలో ఆ భూమిని అలాగే ఆపి ఉంచాలి. [114] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2978 – [ 7 ] ( صحيح ) (2/897)

وَعَنْ أَبِيْ أُمَاَمَةَ وَرَأَى سِكَّةً وَّشَيْئًا مِنْ آلَةِ الْحَرْثِ فَقَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا يَدْخُلُ هَذَا بَيْتَ قَوْمٍ إِلَّا أَدْخَلَهُ الذِّلَّ”. رَوَاهُ الْبُخَارِيُّ .

2978. (7) [2/897దృఢం]

అబూ ఉమామహ్ (ర) ఒకచోట వ్యవసాయ పనిముట్లు అయిన నాగలి, పారలను చూచి, ”ఏ జాతిలో ఈ పనిముట్లు ప్రవేశిస్తాయో, ఆ జాతిని అల్లాహ్‌ (త) నీచ స్థితికి దిగజారుస్తాడని ప్రవక్త (స) ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను” అని అన్నారు.[115] (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం

2979 – [ 8 ] ( لم تتم دراسته ) (2/897)

عَنْ رَافِعِ بْنِ خَدِيْجٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ زَرَعَ فِيْ أَرْضِ قَوْمٍ بِغَيْرِ إِذْنِهِمْ فَلَيْسَ لَهُ مِنَ الزَّرْعِ شَيْءٌ وَلَهُ نَفَقَتُهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَقَالَ التِّرْمِذِيُّ:هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

2979. (8) [2/897అపరిశోధితం]

రా’ఫె బిన్‌ ‘ఖదీజ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అనుమతి లేకుండా ఇతరుల భూమిలో ఎవరైనా పంటలు పండిస్తే, ఆ పంట మొత్తం భూమి యజమానికే చెందుతుంది. అయితే కేవలం దాని ఖర్చు మాత్రమే భూమి యజమానిపై ఉంది.” [116] (తిర్మిజి’, అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

2980 – [ 9 ] ( صحيح ) (2/898)

عَنْ قَيْسِ بْنِ مُسْلِمٍ عَنْ أَبِيْ جَعْفَرٍ قَالَ: مَا بِالْمَدِيْنَةِ أَهْلُ بَيْتِ هِجْرَةٍ إِلَّا يَزْرَعُوْنَ عَلَى الثُّلُثِ وَالرُّبُعِ وَزَارَعَ عَلِيٌّ وَسَعْدُ بْنُ مَالِكٍ وَعَبْدُ اللهِ بْنُ مَسْعُوْدٍ وَعُمَرُ ابْنُ عَبْدِ الْعَزِيْزِ وَالْقَاسِمُ وَعُرْوَةُ وَآلُ أَبِيْ بَكْرٍ وَآلُ عُمَرَ وَآلُ عَلِيٌّ وَابْنُ سِيْرِيْنَ وَقَالَ عَبْدُ الرَّحْمنِ بْنُ الْأَسْوَدِ : كُنْتُ أَشَارِكُ عَبْدُ الرَّحْمنِ بْنَ يَزِيْدَ فِيْ الزَّرْعِ وَعَامِلَ عُمَرُ النَّاسَ عَلَى : إِنْ جَاءَ عُمَرُ بِالْبَذْرِ مِنْ عِنْدِهِ فَلَهُ الشَّطْرُ. وَإِنْ جَاؤُوْا بِالْبَذْرِ فَلَهُمْ كَذَا. رَوَاهُ الْبُخَارِيُّ.

2980. (9) [2/898దృఢం]

అబూ జ’అఫర్‌ ద్వారా, ఖైస్‌ బిన్‌ ముస్లిమ్‌ కథనం: మదీనహ్లో ని ముహాజిర్‌ కుటుంబాలన్నీ పంట వంతులపై ము’జారఅత్‌ వ్యవసాయం చేసేవారు. ‘అలీ (ర), స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖాస్‌ (ర), ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌, ‘ఉమర్‌ బిన్‌ ‘అబ్దుల్‌ ‘అ’జీ’జ్‌ (ర), ఖాసిమ్‌ (ర), ‘ఉర్వ (ర), అబూ బకర్‌ కుటుంబం వారు, ‘ఉమర్‌ కుటుంబం వారు, ‘అలీ (ర) కుటుంబం వారు, ఇబ్ను సీరీన్‌ వీరందరూ ము’జారఅత్‌, వ్యవసాయం చేసే వారు. ‘అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ అస్‌వద్‌ నేను ‘అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ య’జీద్‌ను వ్యవసాయంలో భాగస్వామిగా చేర్చు కునేవాడినని అనేవారు. అదేవిధంగా ‘ఉమర్‌ ప్రజలతో ఈ విధమైన షరతులతో అంటే ఒకవేళ ‘ఉమర్‌ విత్తనాలు ఇస్తే అతనికి సగం పంట లభిస్తుందని, ఇతరులు విత్తనాలు వేస్తే వారికి ఇంత పంట లభిస్తుందని వ్యవసాయం చేసేవారు. (బు’ఖారీ)

అంటే ఈ ‘హదీసు’ ద్వారా ము’జారఅత్‌ సాక్ష్యాధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

=====

14- بَابُ الْإِجَارَةِ

14. అద్దెకు ఇవ్వడం

ఇజారహ్‌ అంటే కూలి, పారితోషికం అని అర్థం. ఇస్లామీయ పరిభాషలో ఒక నిర్ణీత వస్తువుకు బదులు లాభాన్ని అమ్మడం, దాన్ని ఇతరుల యాజమాన్యంలో వదలటం. పనిచేసే వాడిని అజీర్ అంటారు. పని చేయించేవాడిని ముస్తజీర్‌ అంటారు. ఈ వ్యవహారాన్ని ఇజారహ్‌ అంటారు.

అజీర్‌ రెండు రకాలు. 1. అజీర్‌ ముష్తరక్‌: అంటే ఒకరి ప్రత్యేక పనికి పరిమితమై ఉండడు. అందరి పని తీసుకుంటాడు, అందరి పని పూర్తిచేసి ఇస్తాడు. 2. ప్రత్యేక అజీర్‌: ఒక సమయంలో ఒకరి పనేచేస్తాడు. అతని సమయంలో మరొకరి పని చేయడు. ఉదా: పనివాడు, ఉద్యోగి, అవసరమైనపుడు కూలిపని, ఉద్యోగం ధర్మసమ్మతమే. మూసా (అ) కూడా కూలి పనిచేసారు. అంతే కాక అనేక మంది అల్లాహ్‌ భక్తులు ధర్మసమ్మతమైన కూలిపని, ఉద్యోగాలు చేసారు. అధర్మమైనది ఎటువంటి పనీ చేయరాదు. అదేవిధంగా ఇల్లు, భూమి, వాహనం అద్దెకు ఇచ్చి పుచ్చుకోవడం ధర్మసమ్మతమే.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం   

2981 – [ 1 ] ( صحيح ) (2/899)

عَنْ عَبْدِ اللهِ بْنِ مُغَفَّلٍ قَالَ: زَعَمَ ثَابِتُ بْنُ الضَّحَاكِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَهَى عَنِ الْمُزَارَعَةِ وَأَمَرَ بِالْمُؤَاجَرَةِ وَقَالَ: “لَا بَأْسَ بِهَا”. رَوَاهُ مُسْلِمٌ .

2981. (1) [2/899దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ము’గప్ఫల్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) ము’జారఅత్‌ను నిషేధించారని, భూమిని అద్దెకు ఇవ్వడానికి అనుమతించారని, ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదని ప్రవచించారని సా’బిత్‌ బిన్‌ ‘దహాక్ తెలిపారు.” [117] (ముస్లిమ్‌)

2982 – [ 2 ] ( متفق عليه ) (2/899)

وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم احْتَجَمَ فَأَعْطَى الْحَجَّامَ أَجْرَهُ وَاسْتَعَطَ  .

2982. (2) [2/899ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) కొమ్ము చికిత్స (‘హిజామహ్) చేయించారు. కొమ్ము చికిత్స పెట్టేవానికి కూలి ఇచ్చారు. అదేవిధంగా ముక్కులో మందు వేయించారు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

2983 – [ 3 ] ( صحيح ) (2/899)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَا بَعَثَ اللهُ نَبِيًّا إِلَّا رَعَى الْغَنَمَ”. فَقَالَ أَصْحَابُهُ: وَأَنْتَ؟ فَقَالَ: “نَعَمْ كُنْتُ أَرْعَى عَلَى قَرَارِيْطَ لِأَهْلِ مَكَّةَ”. رَوَاهُ الْبُخَارِيُّ .

2983. (3) [2/899దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స), ‘ప్రవక్త లందరూ మేకలు కాసారు,’ అని అన్నారు. దానికి అనుచరులు, ‘తమరు కూడానా,’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ‘అవును, నేను కొన్ని ఖీరాత్‌లకు బదులు మక్కహ్ ప్రజల మేకలను కాసేవాడిని,’ అని ప్రవచించారు. [118] (బు’ఖారీ)

2984 – [ 4 ] ( صحيح ) (2/899)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قَالَ اللهُ تَعَالى: ثَلَاثَةٌ أَنَا خَصْمُهُمْ يَوْمَ الْقِيَامَةِ: رَجُلٌ أُعْطِىَ بِيْ ثُمَّ غَدَرَ وَرَجُلٌ بَاعَ حُرًّا فَأَكَلَ ثَمَنَهُ وَرَجُلٌ اسْتَأْجَرَ أَجِيْرًا فَاسْتَوْفَى مِنْهُ وَلَمْ يُعْطِهِ أَجْرَهُ”. رَوَاهُ الْبُخَارِيُّ .

2984. (4) [2/899దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్‌ ఆదేశం: ”తీర్పుదినం నాడు ముగ్గురు వ్యక్తులతో నేను స్వయంగా వాదిస్తాను. 1. నాతో వాగ్దానం, ఒప్పందం చేసి వాగ్దాన భంగం, ద్రోహం చేసిన వాడు. 2. స్వతంత్రుడ్ని అమ్మి దాని ధరను తిన్న వాడు. 3. కూలి వాడిని పెట్టి అతని చేత పని చేయించుకొని కూలి ఇవ్వని వాడు. (బు’ఖారీ)

2985 – [ 5 ] ( صحيح ) (2/899)

وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ نَفَرًا مِنْ أَصْحَابِ النَّبِيِّ صلى الله عليه وسلم مَرُّوْا بِمَاءٍ فِبْهِمْ لَدِيْغٍ أَوْ سَلِيْمٍ فَعَرَضَ لَهُمْ رَجُلٌ مِّنْ أَهْلِ الْمَاءِ فَقَالَ: هَلْ فِيْكُمْ مِنْ رَاقٍ؟ إِنَّ فِيْ الْمَاءِ لَدِيْغًا أَوْ سَلِيْمًا فَانْطَلَقَ رَجُلٌ مِّنْهُمْ فَقَرَا بِفَاتِحَةِ الْكِتَابِ عَلَى شَاءٍ. فَبَرِئَ فَجَاءَ بِالشَّاءِ إِلَى أَصْحَابِهِ فَكَرِ هُوْا ذَلِكَ وَقَالُوْا: أَخَذْتَ عَلَى كِتَابِ اللهِ أَجْرًا حَتَّى قَدِمُوا الْمَدِيْنَةَ فَقَالُوْ : يَا رَسُوْلَ اللهِ أَخَذَ عَلَى كِتَابِ اللهِ أَجْرًا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَحَقَّ مَا أَخَذْتُمْ عَلَيْهِ أَجْرًا كِتَابُ اللهِ”. رَوَاهُ الْبُخَارِيُّ وَفِيْ رِوَايَةٍ: “أَصَبْتُمْ اَقْسِمُوْا وَاضْرِبُوْا لِيْ مَعَكُمْ سَهْمًا”.

2985. (5) [2/899దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరులు కొందరు ఒక నీటి కాలువ ప్రక్కనుండి వెళుతూ ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తికి తేలు కుట్టింది. అక్కడి వారిలో ఒకరు అనుచరుల వద్దకు వచ్చి, ‘మీలో మంత్రించే వారెవరైనా ఉన్నారా మంత్రించ టానికి? ఇక్కడ ఒక వ్యక్తికి తేలు కుట్టింది,’ అని అన్నాడు. అను చరుల్లోని ఒక వ్యక్తి (అబూ స’యీద్‌ ‘ఖుద్రీ) అతని వెంట వెళ్ళారు. కొన్ని మేకలను పారితోషికంగా నిర్ణయించి సూరహ్‌ ఫాతిహా చదువుతూ అతనిపై మంత్రించి ఊదారు. అతని బాధ పూర్తిగా తగ్గిపోయింది. అతను మేకలను తీసుకొని తన మిత్రుల వద్దకు వచ్చారు. ‘ఈ మేకలు నాకు సూరహ్‌ ఫాతిహా చదివి నందుకు బదులుగా లభించాయి,’ అని అన్నారు. అతని మిత్రులు దాన్ని అసహ్యించుకున్నారు. ‘నీవు ఖుర్‌ఆన్‌ చదివి ప్రతిఫలంగా వీటిని పొందావు, మేము వీటిని ఉపయో గించము,’ అని అన్నారు. వారందరూ మదీనహ్ చేరిన తర్వాత ప్రవక్త (స)తో, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ఫలానా వ్యక్తి దైవగ్రంథం ద్వారా కూలి తీసుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘అన్నిటి కంటే అధికంగా పారితోషికం తీసుకోవటానికి తగినది దైవగ్రంథం,’ అని అన్నారు. [119](బు’ఖారీ)

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”నీవు మంచి పని చేసావు, మీరు ఈ మేకలను పంచుకోండి, నా వంతు కూడా కలుపుకోండి.”

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం 

2986 – [ 6 ] ( لم تتم دراسته ) (2/900)

عَنْ خَارِجَةَ بْنِ الصَّلَتِ عَنْ عَمِّهِ قَالَ: أَقْبَلْنَا مِنْ عِنْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَأَتَيْنَا عَلَى حَيٍّ مِّنَ الْعَرَبِ فَقَال: إِنَّا أُنَبِئْنَا أَنَّكُمْ قَدْ جِئْتُمْ مِنْ عِنْدَ هَذَا الرَّجُلُ بِخَيْرٍ فَهَلْ عِنْدَكُمْ مِنْ دَوَاءٍ أَوْ رُقْيَةٍ؟ فَإِنَّ عِنْدَنَا مَعْتُوْهًا فِيْ الْقُيُوْدِ فَقُلْنَا: نَعَمْ فَجَاؤُوْا بِمَعْتُوْهِ فِيْ الْقُيُوْدِ فَقَرَأْتُ عَلَيْهِ بِفَاتِحَةِ الْكِتَابِ ثَلَاثَةَ أَيَّامٍ غُدْوَةً وَّعَشِيَّةً أَجْمَعُ بُزَاقِي ثُمَّ أَتْفُلُ قَالَ: فَكَأَنَّمَا أَنْشِطَ مِنْ عِقَالٍ فَأَعْطُوْنِيْ جُعْلًا فَقُلْتُ: لَا حَتَّى أَسْأَلَ النَّبِيَّ صلى الله عليه وسلم فَقَالَ: “كُلْ فَلَعُمْرِيْ لَمَنْ أَكَلَ بِرُقْيَةٍ بَاطِلٍ لَقَدْ أَكَلْتَ بِرُقْيَةِ حَقٍ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ .

2986. (6) [2/900అపరిశోధితం]

తన చిన్నాన్న ద్వారా ‘ఖారిజహ్ బిన్ ‘సలత్ (ర) కథనం: మేము ప్రవక్త (స) వద్దనుండి సెలవుతీసుకొని తమతమ ప్రాంతాలకు బయలుదేరాము. మార్గంలో ఒక అరబ్‌ తెగ ఉంటుంది. అక్కడ ఒకవ్యక్తి వచ్చి మాతో, ”మీరు ఫలానా వ్యక్తి వద్ద నుండి మంచిని నేర్చుకొని వచ్చారని మాకు తెలిసింది. మీలో ఎవరి వద్దనైనా మంత్రించే విద్య ఉందా? ఎందుకంటే మా వద్ద ఒక పిచ్చివాడు, మతిస్థిమితం లేనివాడు సంకెళ్ళలో బంధించబడి ఉన్నాడు” అని అన్నాడు. దానికి మేము, ‘అవును,’ అని అన్నాము. వాళ్ళు ఆ వ్యక్తిని తీసుకువచ్చారు. ఆ వ్యక్తి సంకెళ్ళలో బంధించబడి ఉన్నాడు. నేను మూడు రోజులు ఉదయం, సాయంత్రం సూరహ్‌ ఫాతిహా పఠిస్తూ అతనిపై ఊదే వాడిని. నేను నా ఉమ్మిని నోట్లో ఉంచి సూరహ్‌ ఫాతిహా పఠించి ఆ పిచ్చి వాడిపై ఉమ్మే వాడిని. ఈ విధంగా నేను మూడు రోజులు చేసాను. మూడవ రోజు ఆ వ్యక్తి వ్యాధి తొలగిపోయింది. అతని సంకెళ్ళన్నీ విప్పివేయటం జరిగింది. ఆ తరువాత వారు నాకు పారితోషికం ఇచ్చారు. దానికి నేను ప్రవక్త (స)ను దీన్ని గురించి తెలియపరిచే వరకు దాన్ని తీసుకోనని, అన్నాను. ప్రవక్త (స)ను దాన్ని గురించి తెలియపరిచాను. ప్రవక్త (స) ”దాన్ని తీసుకొని తిను, దైవం సాక్షి! చాలామంది కల్లబొల్లి మంత్రాలు చదివి డబ్బు సంపాదించి తింటున్నారు. నీవైతే దైవ గ్రంథాన్ని, సత్యాన్ని పఠించి దాని పారితోషికాన్ని తిన్నావు” అని అన్నారు. (అ’హ్మద్‌, అబూ దావూద్‌)

2987 – [ 7 ] ( صحيح ) (2/900)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أُعْطُوْا الْأَجِيْرَأَجْرَهُ قَبْلَ أَنْ يَّجِفَّ عَرَقَهُ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

2987. (7) [2/900దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”శ్రామికునికి అతని చెమట ఆరకముందే కూలి ఇచ్చి వేయండి.” (ఇబ్నె మాజహ్)

2988 – [ 8 ] ( لم تتم دراسته ) (2/901)

وَعَنِ الْحُسَيْنِ بْنِ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لِلسَّائِلِ حَقٌّ وَإِنْ جَاءَ عَلَى فَرْسٍ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَفِيْ الْمَصَابِيْحِ: مُرْسَلٌ.

2988. (8) [2/901అపరిశోధితం]

‘హుసైన్‌ బిన్‌ ‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అర్థించేవాడు గుర్రంపై వచ్చినా సహాయం చేయడం మీ విధి. [120](అబూ దావూద్‌, అ’హ్మద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

2989 – [ 9 ] ( لم تتم دراسته ) (2/901)

عَنْ عُتْبَةَ بْنِ الْمُنْذِرِ قَالَ: كُنَّا عِنْدَ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَرَأَ: (طسم) حَتَّى بَلَّغَ قِصَّةَ مُوسَى قَالَ: «إِنَّ مُوسَى عَلَيْهِ السَّلَامُ آجَرَ نَفْسَهُ ثَمَانِ سِنِينَ أَوْ عَشْرًا عَلَى عِفَّةِ فَرْجِهِ وَطَعَامِ بَطْنِهِ» . رَوَاهُ أَحْمد وَابْن مَاجَه.

2989. (9) [2/901అపరిశోధితం]

‘ఉత్‌బహ్ బిన్‌ మున్జి’ర్‌ కథనం: మేము ప్రవక్త (స) వద్ద కూర్చొని ఉన్నాము. అకస్మాత్తుగా ప్రవక్త (స) సూరహ్‌ తా సీన్ మీమ్‌ (26) పఠించనారంభించారు. పఠిస్తూ మూసా (అ) వృత్తాంతం వరకు చేరి, మూసా (అ) 8 లేక 10 సంవత్సరాలు తన మర్మాంగాన్నీ, కడుపును నిషిద్ధాల నుండి రక్షించడానికి పని చేసారు.[121](అ’హ్మద్‌, ఇబ్నె మాజహ్)

2990 – [ 10 ] ( لم تتم دراسته ) (2/901)

وَعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ رَجُلٌ أُهْدِىَ إِلَيَّ قَوْسًا مِمَّنْ كُنْتُ أُعَلِّمُهُ الْكِتَابَ وَالْقُرْآنَ وَلَيْسَتْ بِمَالٍ. فَأَرْمَى عَلَيْهَا فِيْ سَبِيْلِ اللهِ قَالَ: “إِنْ كُنْتَ تُحِبُّ أَنْ تُطَوَّقَ طَوْقًا مِنْ نَّارٍ فَاَقْبَلَهَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

2990. (10) [2/901అపరిశోధితం]

‘ఉబాదహ్‌ బిన్‌ ‘సామిత్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ”నేను ఒక వ్యక్తికి ఖుర్‌ఆన్‌ బోధించేవాడ్ని. ఆ వ్యక్తి కానుకగా నాకు ఒక విల్లును ఇచ్చాడు. దీనితో నేను దైవమార్గంలో బాణాలు వదులుతాను” అని అన్నాను. అది విని ప్రవక్త (స), ‘తీర్పుదినం నాడు నీ మెడలో అగ్నిహారం వేయబడాలనే కోరిక ఉంటే ఈ కానుక స్వీకరించు’ అని అన్నారు. [122] (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

=====

15- بَابُ إِحْيَاءِ الْمَوَاتِ وَالشِّرْبِ

15. బంజరు భూమిని సాగుచేయటం, నీటి పంపకం

మవాత్‌ అంటే పంటలు పండించకుండా, ఇండ్లు కట్టకుండా ఖాళీగా పడిఉన్న, దానికి యజమాని కూడా లేకుండా ఉన్న భూమి. ఒకవేళ అక్కడి పాలకుని, లేదా అధికారి అనుమతితో ఎవరికీ చెందని భూమిని సాగుచేసుకున్నా, అందులో ఇల్లు కట్టుకున్నా, అందులో మొక్కలు నాటుకున్నా అది అతనికి చెందుతుంది. క్రింది ‘హదీసు’ల్లో దీన్ని గురించే వివరించడం జరిగింది.

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

2991 – [ 1 ] ( صحيح ) (2/902)

عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ عَمَرَ أَرْضًا لَيْسَتْ لِأَحَدٍ فَهُوَ أَحَقُّ”. قَالَ عُرْوَةُ: قَضَى بِهِ عُمَرُ فِيْ خِلَافَتِهِ. رَوَاهُ الْبُخَارِيُّ .

2991. (1) [2/902దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఎవరికీ చెందని, వృథాగా పడివున్న భూమిని ఎవరైనా ఉపయోగంలోనికి తెస్తే, అతడే దానికి అందరి కంటే ఎక్కువ హక్కుదారుడు. ‘ఉర్‌వహ్ (ర) కథనం: ‘ఉమర్‌ (ర) తన పరిపాలనా కాలంలో ఈ ‘హదీసు’ ప్రకారమే తీర్పు ఇచ్చారు. (బు’ఖారీ)

అంటే ఈ సిద్ధాంతం రద్దవలేదన్నమాట.

2992 – [ 2 ] ( صحيح ) (2/902)

وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ الصَّعْبَ بْنَ جَثَّامةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا حِمَى إِلَّا لِلّهِ وَرَسُوْلِهِ”. رَوَاهُ الْبُخَارِيُّ.

2992. (2) [2/902దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: స’అబ్‌ బిన్‌ జస్సా’మహ్ (ర) కథనం, ”నేను ప్రవక్త (స)ను ” ‘హిమ కేవలం అల్లాహ్‌ మరియు, ఆయన ప్రవక్తకే చెందుతుంది,” అని అంటూ ఉండగా విన్నాను.” [123]  (బు’ఖారీ)

2993 – [ 3 ] ( متفق عليه ) (2/902)

وَعَنْ عُرْوَةَ قَالَ: خَاصَمَ الزُّبَيْرُ رَجُلًا مِّنَ الْأَنْصَارِ فِيْ شِرَاجٍ مِّنَ الْحَرَّةِ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “اَسْقِ يَا زُبَيْرُ ثُمَّ أُرْسِلِ الْمَاءَ إِلَى جَارِكَ”. فَقَالَ الْأَنْصَارِيُّ: أَنْ كَانَ ابْنَ عَمَّتِكَ؟ فَتُلَوَّنَ وَجْهُهُ ثُمَّ قَالَ: “اسْقِ يَا زُبَيْرَ ثُمَّ احْبِسِ الْمَاءَ حَتَّى يَرْجِعَ إِلَى الْجَذْرِ ثُمَّ أَرْسِلِ الْمَاءَ إِلَى جَارِكَ”. فَاسْتَوْعَى النَّبِيُّ صلى الله عليه وسلم لِلزُّبَيْرِ حَقَّهُ فِيْ صَرِيْحِ الْحُكْمِ حِيْنَ أَحْفَظَهُ الْأَنْصَارِيُّ وَكَانَ أَشَارَ عَلَيْهِمَا بِأَمْرٍ لَّهُمَا فِيْهِ سَعْةٍ.

2993. (3) [2/902ఏకీభవితం]

‘ఉర్‌వహ్ (ర) కథనం: ‘జుబైర్‌ (ర) హర్రహ్ నది, కాలువ విషయంలో ఒక అ’న్సారీ వ్యక్తితో వివాద పడ్డారు. మదీనహ్ ప్రజలు దాని నీటిని తమ పొలాలకు, తోటలకు ఉపయోగించేవారు. నీటిని ప్రవహించనివ్వండి, ఆపకండి,’ అని. అ’న్సారీ; ‘నేను నీటిని ఆపి ముందు నా పొలం కోసం వినియోగించు కొని తరువాత వదలిపెడతానని,’ ‘జుబైర్‌ (ర) వాదించారు. ఈ వివాదాన్ని ఇద్దరూ ప్రవక్త (స) వద్దకు తీసు కొని వెళ్ళారు. ప్రవక్త (స) ఇద్దరి వాదన విని, ‘ఓ ‘జుబైర్‌! ముందు నీవు నీ పొలానికి నీళ్ళను వినియోగించుకో. ఆ తరువాత నీ పొరుగువాడి కోసం నీటిని వదలివెయ్యి. అతడు కూడా ఆ నీటి ద్వారా తన పొలం లేదా తోటకు నీళ్ళు అందిస్తాడు.’ అని అన్నారు. అది విన్న అన్సారీ కోపంతో, ‘ఎందుకు కాదు ‘జుబైర్‌ మీ అత్త కొడుకని, అతన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చారు.’ దానివల్ల ప్రవక్త (స) ఆగ్రహంచెంది ఆ తరువాత మళ్ళీ, ‘ఓ ‘జుబైర్‌ గట్టువరకు నీటిని నింపుకో, ఆ తరువాత నీ పొరుగువాని కొరకు వదలివెయ్యి’ అని అన్నారు. అంటే ప్రవక్త (స) ‘జుబైర్‌కు పూర్తి హక్కును ఇచ్చివేసారు. ఇది అ’న్సారీ ప్రవక్త (స)ను ఆగ్రహం కలిగించి నందువల్ల జరిగింది. ముందు ఇద్దరికీ అనుగుణంగా తీర్పు ఇచ్చారు. అందులో ఇద్దరికీ లాభం ఉండేది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

2994 – [ 4 ] ( متفق عليه ) (2/903)

عَنْ أبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَمْنَعُوْا فَضْلَ الْمَاءِ لِتَمْنَعُوْا بِهِ فَضْلَ الْكَلَأَ”.

2994. (4) [2/903ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పచ్చిక బయలును పొందే ఉద్దేశ్యంతో మిగిలి ఉన్న నీటిని ఆపకండి.” [124] (బు’ఖారీ)

2995 – [ 5 ] ( متفق عليه ) (2/903)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ثَلَاثَةٌ لَا يُكَلِّمُهُمُ اللهُ يَوْمَ الْقِيَامَةِ. وَلَا يَنْظُرُ إِلَيْهِمْ رَجُلٌ حَلَفَ عَلَى سِلْعَةٍ لَقَدْ أُعْطِيَ بِهَا أَكْثَرَ مِمَّا أُعْطِىَ وَهُوَ كَاذِبٌ وَرَجُلٌ حَلَفَ عَلَى يَمِيْنٍ كَاذِبَةٍ بَعْدَ الْعَصْرِ لِيَقْتَطِعَ بشهَا مَالَ رَجُلٍ مُّسْلِمٍ. وَرَجُلٌ مَنَعَ فَضْلَ مَاءٍ فَيَقُوْلُ اللهُ الْيَوْمَ أَمْنَعُكَ فَضْلِيْ كَمَا مَنَعْتَ فَضْلَ مَاءٍ لَمْ تَعْمَلْ يَدَاكَ”.

وَذُكِرَ حَدِيْثُ جَابِرَ فِيْ ” بَابِ الْمَنْهِيِّ عَنْهَا مِنَ الْبُيُوْعِ”

2995. (5) [2/903ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) తీర్పుదినం నాడు ముగ్గురు వ్యక్తులతో మాట్లాడడు. వారి వైపు కారుణ్య దృష్టితో చూడడు. 1. ఒక వ్యక్తి అమ్ముతాడు, కొనేవాడు ధర చెబుతాడు, అమ్మేవాడు ప్రమాణం చేసి నీవు ధర పలుకుతున్న దానికంటే ఎక్కువగా నాకు వస్తుంది అని అంటాడు. 2. ‘అ’స్ర్ తరువాత అసత్య ప్రమాణం చేసి ఒక ముస్లిమ్‌ ధనాన్ని దోచుకొనటం. 3. తన అవ సరం తీరగా మిగిలిన నీటిన ఇతరులు పొందకుండా ఆపివేయటం. దీన్ని గురించి అల్లాహ్‌ (త) తీర్పు దినం నాడు, ‘నీ అవసరం తీరగా ఇతరులు పొంద కుండా నీవు సృష్టించని నీటిని నీవు ఆపి ఉంచావు. ఈనాడు నా కారుణ్యాన్ని నీ నుండి ఆపిఉంచుతాను,’ అని అంటాడు. [125]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

2996 – [ 6 ] ( لم تتم دراسته ) (2/903)

عَنِ الْحَسَنِ عَنْ سَمُرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ أَحَاطَ حَائِطًا عَلَى الْأَرْضِ فَهُوَ لَهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

2996. (6) [2/903అపరిశోధితం]

సమురహ్‌ ద్వారా, ‘హసన్‌ బ’స్రీ కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ఎవరిదీ కాని వ్యర్థంగా పడివున్న భూమిని గోడకట్టి ఆక్రమించుకుంటే అది వారికే అవుతుంది.”[126] (అబూ దావూద్‌)

2997 – [ 7 ] ( لم تتم دراسته ) (2/903)

وَعَنْ أَسْمَاءَ بِنْتِ أَبِيْ بَكْرٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَقْطَعَ لِلزُّبَيْرِ نَخِيْلًا. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2997. (7) [2/903అపరిశోధితం]

అస్మా’ బిన్‌తె అబీ బక్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఖర్జూరపు చెట్లను ‘జుబైర్‌కు ఇచ్చివేసారు. (అబూ దావూద్‌)

 ఇవి ప్రవక్త (స)కు చెందినవి. ప్రవక్త (స) వాటిని ‘జుబైర్‌కు వారసత్వం సంపదగా ఇచ్చివేసారు.

2998 – [ 8 ] ( لم تتم دراسته ) (2/904)

وَعَنِ ابْنِ عُمَرَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أَقْطَعَ لِلزُّبَيْرِ حُضرَ فَرْسِهِ فَأَجْرَى فَرْسَهُ حَتَّى قَامَ ثُمَّ رَمَى بِسَوْطِهِ فَقَالَ: “أَعْطُوْهُ مِنْ حَيْثُ بَلَغَ السَّوْطُ “. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

2998. (8) [2/904అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) గుర్రం యొక్క ఒక పరుగంత భూమిని ‘జుబైర్‌కు వారసత్వ సంపదగా ఇచ్చివేసారు. ‘జుబైర్‌ తన గుర్రాన్ని పరిగెత్తించారు. అది పరుగెడుతూ పరుగెడుతూ ఒకచోట ఆగిపోయింది. అప్పుడు అతను తన కొరడాను విసరివేసారు. ‘కొరడా ఉన్నంత దూరం వరకు ఉన్న భూమిని అతనికి ఇచ్చివేయండి’ అని ప్రవక్త (స) ఆదేశించారు. (అబూ దావూద్‌)

2999 – [ 9 ] ( لم تتم دراسته ) (2/904)

وَعَنْ عَلْقَمَةَ بْنِ وَائِلٍ عَنْ أَبِيْهِ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أَقْطَعَهُ أَرْضًا بِحَضْرِمَوْتَ قَالَ: فَأَرْسَلَ مَعِيَ مُعَاوِيَةَ قَالَ: “أَعْطِهَا إِيَّاهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ .

2999. (9) [2/904అపరిశోధితం]

‘అల్ఖమ తన తండ్రి వాయిల్ ద్వారా  కథనం: ప్రవక్త (స) వాయిల్‌కు ‘హ’దరమౌత్‌లోని ఒక భూమిని వార సత్వం క్రింద ఇచ్చారు. వాయిల్‌ కథనం: ఆ భూమి నాకు ఇచ్చి వేయమని ప్రవక్త (స) ము’ఆవియహ్‌ను నా వెంట పంపారు. [127] (తిర్మిజి’, దారమి)

3000 – [ 10 ] ( لم تتم دراسته ) (2/904)

وَعَنْ أَبْيَضَ بْنِ حَمَّالِ الْمَأرَّبِيِّ: أَنَّهُ وَفَدَ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَاسْتَقْطَعَهُ الْمِلْحَ الَّذِيْ بِمَأْرِبَ فَأَقْطَعَهُ إِيَّاهُ فَلَمَّا وَلَّى قَالَ رَجُلٌ: يَا رَسُوْلَ اللهِ إِنَّمَا أَقْطَعْتَ لَهُ الْمَاءَ الْعِدَّ قَالَ: فَرَجَعَهُ مِنْهُ قَالَ: وَسَأَلَهُ مَاذَا يُحْمَى مِنَ الْأَرَاكِ؟ قَالَ: “مَا لَمْ تَنْلَهُ أَخْفَافُ الْإِبِلِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.

3000. (10) [2/904అపరిశోధితం]

అబ్‌య’ద్ బిన్‌ ‘హమ్మాల్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు వెళ్ళి మ’ఆరిబ్‌లో ఉన్న ఉప్పు గనులను కోరాను. ప్రవక్త (స) ఆ ఉప్పు గనుల్ని అతనికి కేటాయించారు. అతను తిరిగి వెళుతుండగా ఒక వ్యక్తి ఓ ప్రవక్తా! తమరు అతనికి సిద్ధంగా ఉన్న ప్రవహించే నీరు ఇచ్చివేసారు అని ఫిర్యాదు చేసాడు. అది విని ప్రవక్త (స) తిరిగి దాన్ని తీసుకున్నారు. ఆ తరువాత అతను ప్రవక్త (స)ను జిల్లేడు చెట్లు ఉన్న ఏ భూమి తీసుకోవాలి అని అడిగితే ప్రవక్త (స) ఒంటెలు వెళ్ళలేని భూమిని ఎంచుకోమని ఆదేశించారు.[128] (తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దారమి)

3001 – [ 11 ] ( صحيح ) (2/904)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمُسْلِمُوْنَ  شُرَكَاءَ فِيْ ثَلَاثٍ: الْمَاءِ وَالْكَلَأَ وَالنَّارِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

3001. (11) [2/904దృఢం]

ఇబ్ను ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మూడు విషయాల్లో ముస్లిములందరూ భాగ స్వాములు నీరు, గడ్డి, గ్ని. [129] (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

3002 – [ 12 ] ( لم تتم دراسته ) (2/904)

وَعَنْ أَسْمَرَ بْنِ مُضَرِّسٍ قَالَ: أَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم فَبَايَعْتُهُ فَقَالَ:”مَنْ سَبَقَ إِلَى مَاءٍ لَمْ يضسْبِقْهُ إِلَيْهِ مُسْلِمٌ فَهُوَ لَهُ . رَوَاهُ أَبُوْ دَاوُدَ.

3002. (12) [2/904అపరిశోధితం]

అస్‌మర్‌ బిన్‌ ము’దర్రిస్‌ కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళి బై’అత్‌ చేసాను. అంటే ఇస్లామ్‌ స్వీక రించాను. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”అందరి కంటే ముందు నీటి వద్దకు వెళ్ళి, నీళ్ళు నింపు కున్న వాడి నీరు, అతనిది అవుతుంది.” [130](అబూ దావూద్‌)

3003 – [ 13 ] ( ضعيف ) (2/904)

وَعَنْ طَاوُسٍ مُرْسَلًا: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ:”مَنْ أَحْيَى مَوَاتًا مِّنَ الْأَرْضِ فَهُوَ لَهُ وَعَادِيُّ الْأَرْضِ لِلّهِ وَرَسُوْلِهِ ثُمَّ هِيَ لَكُمْ مِنِّيْ “. رَوَاهُ الشَّافِعِيُّ.

3003. (13) [2/904బలహీనం]

‘తాఊస్‌ కథనం: వృథాగా పడి ఉన్న భూమిని ఉపయో గంలోనికి తెస్తే ఆభూమి అతనిదే అవుతుంది. యజమాని లేని భూమి అల్లాహ్‌ (త) మరియు ఆయన ప్రవక్తది. ఆ భూమి నా తరఫు నుండి మీకోసం ఉంది. (షాఫ’యీ)

3004 – [ 14 ] ( لم تتم دراسته ) (2/905)

وَرَوَى فِيْ “شَرْحِ السُّنَّةِ” : أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أَقْطَعَ لِعَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ الدَّوْرِ بِالْمَدِيْنَةِ وَهِيَ بَيْنَ ظَهْرَانِيْ عِمَارَةِ الْأَنْصَارِ مِنَ الْمَنَازِلِ وَالنَّخْلِ فَقَالَ بَنُوْ عَبْدِ بْنِ زُهْرَةَ : نَكِّبْ عَنَّا ابْنَ أُمِّ عَبْدٍ فَقَالَ لَهُمْ رَسُوْلُ اللهِ : “فَلِمَ ابْتَعَثَنِيْ اللهُ إِذَا ؟ إِنَّ اللهَ لَا يُقَدِّسُ أُمَّةً لَا يُؤْخَذُ لِلضَّعِيْفِ فِيْهِمْ حَقُّهُ”.

3004. (14) [2/905అపరిశోధితం]

షర’హ్ సున్నహ్‌లో ఇలా ఉంది: ”ప్రవక్త (స) ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌కు మదీనహ్లో ఒక ఇల్లు ఇచ్చారు. ఈ ఇల్లు అన్సార్ల ఇళ్ళకు వారి తోటలకు మధ్య ఉండేది. ‘అబ్ద్‌ బిన్‌ ‘జుహ్‌ర కుమారులు ప్రవక్త (స)ను ” ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ను మా నుండి దూరంగా ఉంచండి’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘ఒకవేళ నేను పేదలకు సహాయపడకుంటే మరి అల్లాహ్‌ (త) నన్ను ప్రవక్తగా ఎందుకు పంపాడు? అల్లాహ్‌ (త) పేదలకు వారి హక్కును ఇప్పించని జాతిని పరిశుద్ధపరచడు’  అని అన్నారు.

3005 – [ 15 ] ( لم تتم دراسته ) (2/905)

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ : أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَضَى فِيْ السَّيْلِ الْمَهْزُوْرِ أَنْ يُّمْسِكَ حَتَّى يَبْلُغَ الْكَعْبَيْنِ ثُمَّ يُرْسِلَ الْأَعْلَى عَلَى الْأَسْفَلِ . رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

3005. (15) [2/905అపరిశోధితం]

తన తండ్రి, తాతల ద్వారా ‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మహ్‌’జూర్‌ నీటి గురించి మాట్లాడుతూ సమీపంలో ఉన్న పొలం వాళ్ళు తన అవసరానికి తగ్గుట్టు నీటిని తన పొలానికి అందించాలి. చీలమండల వరకు నీరు నిండిపోతే పై పొలంవాడు క్రిందిపొలం వైపుకు నీళ్ళను వదలి వేయాలి. [131]  (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

3006 – [16 ] ( لم تتم دراسته ) (2/905)

وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ : أَنَّهُ كَانَتْ لَهُ عَضَدٌ مِّنْ نَخْلٍ فِيْ حَائِطِ رَجُلٍ مِّنَ الْأَنْصَارِوَمَع الرَّجُلِ أَهْلُهُ فَكَانَ سَمُرَةُ يَدْخُلُ عَلَيْهِ فَيَتَأَذَّى بِهِ فَأُتِىَ النَّبِيَّ صلى الله عليه وسلم فَذُكِرَذَلِكَ لَهُ فَطَلَبَ إِلَيْهِ النَّبِيُّ صلى الله عليه وسلم لِيَبِيْعُهُ فَأَبَى فَطَلَبَ أَنْ يُّنَاقِلَهُ فَأَبَى قَالَ:” فَهَبْهُ لَهُ وَلَكَ كَذَا”أَمْرًا رَغَّبَهُ فِيْهِ فَأَبَى فَقَالَ:”أَنْتَ مُضَارٌّ”فَقَالَ لِلْأَنْصَارِيِّ:”اذْهَبْ فَاقْطَعْ نَخْلَهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَذُكِرَ حَدِيْثُ جَابِرٍ:”مَنْ أَحْيَى أَرْضًا” فِيْ”بَابِ الْغَصْبِ”بِرَوَايَةِ سَعِيْدِ بْنِ زَيْدٍ.وَسَنَذْكُرُ حَدِيْثَ أَبِيْ صِرْمَةَ :”مَنْ ضَارَّ أَضَرَّ اللهُ بِهِ”فِيْ”بَابِ مَا يُنْهَى مِنَ التَّهَاجُرِ “.

3006. (16) [2/905అపరిశోధితం]

సమురహ్‌ బిన్‌ జున్‌దుబ్‌ (ర) కథనం: అతనికి చెందిన కొన్ని ఖర్జూరం చెట్లు ఒక అ’న్సారీ తోటలో ఉండేవి. అతడు భార్యాబిడ్డలతో తోటలోనే ఉండేవాడు. సమురహ్‌ ఆ తోటలోనికి వెళితే అన్సారీ కష్టంగా భావించేవాడు. అంటే ఇంటి వారిని తెరచాటున ఉంచవలసి వచ్చేది. అతడు ప్రవక్త (స) వద్దకు వచ్చి ఫిర్యాదు చేసాడు. ప్రవక్త (స) సమురహ్‌ను పిలిపించి ‘నువ్వు నీ చెట్లను అ’న్సారీకి అమ్మివేయి’ అన్నారు. సమురహ్‌ దానికి నిరాకరించాడు. ఆ తరువాత ప్రవక్త (స) ఆ చెట్లకు బదులు మరోచోట చెట్లు తీసుకోమని అన్నారు. దానికీ అతడు నిరాకరించాడు. దానికి ప్రవక్త (స) నీకు అమ్మడం ఇష్టం లేకపోతే ఆ చెట్లను అ’న్సారీకి కానుకగా ఇచ్చివేయి. నీకు స్వర్గంలో ఫలానా ప్రతిఫలం లభిస్తుందని అన్నారు. సమురహ్‌ దానికి కూడా నిరాకరించాడు. ప్రవక్త (స) సమురహ్‌తో నీవు ఇతరులకు హానిచేకూర్చే వ్యక్తివి అని చీవాట్లు పెట్టి అ’న్సారీ వ్యక్తితో, ‘నీవు వెళ్ళి అతని చెట్లన్నిటినీ నరికి పారవేయి,’ అని ఆదేశించారు. (అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ     మూడవ విభాగం

3007 – [ 17 ] ( ضعيف ) (2/906)

عَنْ عَائِشَةَ أَنَّهَا قَالَتْ: يَا رَسُوْلَ اللهِ مَا الشَّيْءُ الَّذِيْ لَا يَحِلُّ مَنْعُهُ؟ قَالَ: “اَلْمَاءُ وَالْمِلْحُ وَالنَّارُ” قَالَتْ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ هَذَا الْمَاءُ قَدْ عَرَفْنَاهُ فَمَا بَالَ الْمِلْحِ وَالنَّارِ؟ قَالَ: “يَا حُمَيْرَاءُ مَنْ أَعْطَى نَارًا فَكَأَنَّمَا تَصَدَّقَ بِجَمِيْعِ مَا أَنْضَجَتْ تِلْكَ النَّارُ وَمَنْ أَعْطَى مِلْحًا فَكَأَنَّمَا تَصَدَّقَ بِجَمِيْعٍ مَا طَيَّبَتْ تِلْكَ الْمِلْحُ وَمَنْ سَقَى مُسْلِمًا شَرْبَةً مِنْ مَّاءٍ حَيْثُ يُوْجِدُ الْمَاءُ فَكَأَنَّمَا أَعْتَقَ رَقْبَةً وَمَنْ سَقَى مُسْلِمًا شُرْبَةً مِّنْ مَّاءٍ حَيْثُ لَا يُوْجِدُ الْمَاءُ فَكَأَنَّمَا أَحْيَاهَا”. رَوَاهُ ابْنُ مَاجَهُ .

3007. (17) [2/906బలహీనం]

‘ఆయి’షహ్‌ (ర) ప్రవక్త (స)ను ‘ఏ విషయాల పట్ల తిరస్కరించడం ధర్మం కాదు’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ‘నీరు, ఉప్పు, అగ్ని,‘ అని అన్నారు. దానికి ‘ఆయి’షహ్‌ (ర) ‘ఓ ప్రవక్తా! నీటిని గురించి అయితే నాకు తెలుసు, దాన్ని ఇవ్వక పోతే ప్రజలకు, జంతువులకు చాలాబాధ కలుగు తుంది. కాని అగ్ని మరియు ఉప్పుల సంగతి అర్థం కావటం లేదు’ అని విన్నవించుకుంది. దానికి ప్రవక్త (స) ‘ఓ హుమైరా’! అగ్ని ఇస్తే అగ్నివల్ల వండిన వస్తువులన్నిటినీ సదఖా చేసినట్లవుతుంది. అదే విధంగా ఉప్పు ఇచ్చిన వాడు ఉప్పుతో తయారుచేసిన వస్తువులన్నిటినీ సదఖా చేసినట్లవు తుంది. నీళ్ళు దొరికిన చోట ముస్లిమ్‌కు గుక్కెడు నీరు త్రాపించిన వాడికి ఒక బానిసను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది. నీళ్ళు దొరకని చోట నీళ్ళు త్రాపిస్తే అతడు అతన్ని బ్రతికించినట్లే అని ప్రవచించారు. (ఇబ్నె మాజహ్)

హుమైరా’, ‘ఆయి’షహ్‌ (ర) బిరుదు. ఎందుకంటే ఆమె తెల్లగా అందంగా ఉండేది. ఎర్రగా ఉండేది. ప్రేమ గా ప్రవక్త (స) ఆమెను ‘హుమైరా’ అని పిలిచేవారు.

=====

16- بَابُ الْعَطَايَا

16. కానుకలు

ఎవరికైనా ఏదైనా వస్తువును ప్రతిఫలం లేకుండా ప్రేమగా ఇవ్వటాన్ని కట్నం, కానుక అంటారు. ఇలా ఇవ్వటం వల్ల పుణ్యం, ప్రతిఫలం లభిస్తుంది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు క్రింద పొందుపరచ బడ్డాయి.

اَلْفَصْلُ الْأَوَّلُ     మొదటి విభాగం

3008 – [ 1 ] ( متفق عليه ) (2/907)

عَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا أَنَّ عُمَرَ أَصَابَ أَرْضًا بِخَيْبَرَ فَأَتَى النَّبِيَّ صلى الله عليه وسلم فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ أَصَبْتُ أَرْضًا بِخَيْبَرَ لَمْ أَصِبْ مَالًا قَطُّ أَنْفَسَ عِنْدِيْ مِنْهُ. فَمَا تَأْمُرُنِيْ بِهِ؟ قَالَ: “إِنْ شِئْتَ حَبَسْتَ أَصْلَهَا وَتَصَدَّقْتَ بِهَا”. فَتَصَدَّقَ بِهَا عُمَرُ: أَنَّهُ لَا يُبَاعُ أَصْلُهَا وَلَا يُوْهَبُ وَلَا يُوْرَثُ وَتَصَدَّقَ بِهَا فِيْ الْفُقَرَاءِ وَفِيْ الْقُرْبَى وَفِي الرِّقَابِ وَفِيْ سَبِيْلِ اللهِ وَابْنِ السَّبِيْلِ وَالضَّيْفِ. لَا جُنَاحَ عَلَى مَنْ وَلِيَهَا أَنْ يَّأْكُلَ مِنْهَا بِالْمَعْرُوْفِ. أَوْ يطعِمَ غَيْرَ مُتَمَوّلٍ. قَالَ ابْنُ سَيْرِيْنَ: غَيْرَ مَتأثِلٍ مَالًا.

3008. (1) [2/907ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: మా తండ్రి గారు ‘ఉమర్‌ (ర)కు ఖైబర్‌లో ఒక భూమి లభించింది. అతడు (ర), ప్రవక్త (స) వద్దకు వచ్చి, ”ఓ ప్రవక్తా ‘ఖైబర్‌ యుద్ధ ధనం నుండి నాకు ఒక భూమి లభించింది. అది చాలా మంచి మరియు సారవంత మైన భూమి, ఇటువంటిది నాకు ఇంతకు ముందు ఎన్నడూ లభించలేదు. దాన్ని గురించి తమరి ఆదేశం ఏమిటి?” అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ”నీకిష్టమైతే ఆ భూమిని అల్లాహ్‌ (త) కోసం దానం చేయి. దాని రాబడి, పంటను ‘సదఖహ్ చేయి” అని అన్నారు. వెంటనే ‘ఉమర్‌ (ర) ఆ భూమిని అల్లాహ్  మార్గంలో ఇచ్చి వేసారు. దాని రాబడిని ‘సదఖహ్ చేసి వేసారు. ‘ఉమర్‌(ర) ఈ భూమి గురించి మాట్లాడుతూ, ‘ఇది అల్లాహ్‌ (త) మార్గంలోని భూమి దీన్ని అమ్మరాదు, దీన్ని కాను కగా ఇవ్వరాదు, దీన్ని వారసత్వ సంపదగా కూడా ఇవ్వరాదు. దీని రాబడిని పేదలకు అగత్య పరులకు, దైవమార్గంలో పనిచేసే వారికి, బాటసారులకు అతిధు లకు ఖర్చు చేయాలి. బానిసలను విడుదలచేయించ టానికి కూడా దాన్ని ఉపయోగించాలి. ఆ భూమి సంరక్షకుడు ఒకవేళ పేదవాడైతే అవసరం ఉన్నంత వరకు ప్రభుత్వ చట్టం ప్రకారం దాని నుండి జీవనో పాధిని పొందగలడు. తన బంధుమిత్రులకు తినిపించ గలడు. అయితే ధనం కూడబెట్టేవాడై ఉండకూడదు. లేదా ధనవంతులుకాని తన సోదరులకు ఇవ్వ గలడు.[132] (బు’ఖారీ, ముస్లిమ్‌)

3009 – [ 2 ] ( متفق عليه ) (2/907)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “الْعُمْرَى جَائِزَةٌ”.

3009. (2) [2/907ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఉమ్ రా ధర్మసమ్మతమేనని ప్రవచించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3010 – [ 3 ] ( صحيح ) (2/907)

وَعَنْ جَابِرٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ الْعُمْرَى مِيْرَاثٌ لِأَهْلِهَا”. رَوَاهُ مُسْلِمٌ.

3010. (3) [2/907దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ” ఉమ్‌రా ఇవ్వ బడిన వారందరికీ అది వారసత్వ సంపద” అని ప్రవచించారు. (ముస్లిమ్‌)

3011 – [ 4 ] ( متفق عليه ) (2/908)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَيُّمَا رَجُلٍ أَعْمَرَ عُمْرَى لَهُ وَلِعَفِبِهِ فَإِنَّهَا الَّذِيْ أَعْطِيَهَا لَا تَرْجِعُ إِلَى الّذِيْ أَعْطَاهَا لِأَنَّهُ أَعْطَى عطاءً وَقَعَتْ فِيْهِ الْمَوَارِيْثُ”.

3011. (4) [2/908ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: ‘ఉమ్‌రా చేయబడిన వాడు యజమాని అయిపోయాడు, అతడి భార్యాబిడ్డలు కూడా వారసులు అయిపోయారు. ఎందుకంటే ఇవ్వబడినవాడిదే అయిపోతుంది ఉమ్‌రా ఇచ్చే వాడికి తిరిగి దక్కదు. ఎందుకంటే ఇది ఎలాంటి కానుక అంటే ఇందులో వారసత్వం కొనసాగుతుంది అని ప్రవక్త (స) ప్రవచించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

3012 – [ 5 ] ( متفق عليه ) (2/908)

وَعَنْهُ قَالَ: إِنَّمَا الْعُمْرِى الَّتِيْ أَجَازَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يَّقُوْلَ: هِيَ لِعَقِبِكَ. فَأَمَّا إِذَا قَالَ: هِيَ لَكَ مَا عِشْتَ فَإِنَّهَا تَرْجِعُ إِلَى صَاحِبِهَا.

3012. (5) [2/908ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) అనుమతి ఇచ్చిన ఉమ్‌రా ఈ విధంగా ఉంటుంది. ఇచ్చే వ్యక్తి ఈ ఉమ్‌రా నీ కోసం, నీ వారసుల కోసం అని పలికితే, అది అతనికే చెందుతుంది. అదేవిధంగా ఇచ్చే వ్యక్తి నీవు బ్రతికున్నంత కాలం ఈ ఉమ్‌రా నీ కోసం అని అంటే అతని మరణానంతరం ఈ ఉమ్‌రా అసలు యజమానికి చెందుతుంది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ    రెండవ విభాగం

3013 – [ 6 ] ( لم تتم دراسته ) (2/908)

عَنْ جَابِرٍعَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ:”لَا تُرْقِبُوْا وَلَا تُعْمِرُوْا فَمَنْ أُرْقِبَ شَيْئًا أَوْ أُعْمِرَ فَهِيَ لِوَرَثَتِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ

3013. (6) [2/907అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, రఖ్‌బా చేయకండి లేదా ఉమ్రా’ చేయకండి. ఎవరికోసం రఖ్‌బా లేదా ‘ఉమ్‌రా చేయబడతాయో అది అతని వారసుల కోసం అవుతుంది. [133] (అబూ దావూద్‌)

3014- [ 7 ] ( لم تتم دراسته ) (2/908)

وَعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “الْعُمْرى جَائِزَةٌ لِأَهْلِهَا وَالرُّقْبَى جَائِزَةٌ لِأَهْلِهَا”.رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

3014. (7) [2/908అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”శాశ్వతంగా ఇవ్వబడిన వారి కొరకు ఉమ్‌రా ధర్మ సమ్మతం. అదేవిధంగా రుఖ్‌బాగా ఇవ్వబడిన వారికొరకు రుఖ్‌బా కూడా ధర్మ సమ్మతం. (అ’హ్మద్, తిర్మిజి’, అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం  

3015 – [ 8 ] ( صحيح ) (2/908)

عَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَمْسِكُوْا أَمْوَالَكُمْ عَلَيْكُمْ لَا تُفْسِدُوْهَا فَإِنَّهُ مَنْ أَعْمَرَ عُمْرَى فَهِيَ لِلَّذِيْ أُعْمِرَ حَيًّا وَّمَيِّتًا وَلِعَقَبِهِ”. رَوَاهُ مُسْلِمٌ  

3015. (8) [2/908దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ ధనసంపదలను భద్రపరచి ఉంచండి. వృథా చేయకండి. ఎందుకంటే ఎవరైనా ఉమ్‌రా చేస్తే, అది శాశ్వతంగా ఉమ్‌రా చేయబడిన వ్యక్తిదే అయి పోతుంది. అతని మరణానంతరం అతని వారసులకు చెందుతుంది.” (ముస్లిమ్‌)

=====

17- بَابٌ فِىْ الْهِبَةِ وَالْهَدْيَةِ

17. సమర్పితం, బహుమానం

హిబహ్ అంటే ప్రోత్సాహకాలు. ఇస్లామీయ పరి భాషలో లాభం పొందే వస్తువును ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు ఇచ్చివేయడం. ఇచ్చే వారిని వాహిబ్‌, ఇవ్వబడే వ్యక్తిని మూహిబ్‌లహు ఇంకా ఇవ్వబడే వస్తువును మౌహూబ్‌ అంటారు. ఆ వస్తువు ఇచ్చిన తర్వాత ఇవ్వబడిన వ్యక్తి యజమాని అయిపోతాడు. అయితే ఇచ్చేవ్యక్తి బుద్ధి, జ్ఞానం, యుక్త వయస్సుకు చేరి ఉండాలి. యుక్త వయస్సుకు చేరని బుద్ధీజ్ఞానం లేని వ్యక్తి హిబహ్ చేయడం ధర్మం కాదు. భూమి, ఇల్లు, తోట మొదలైనవి ఇచ్చివేయడం ధర్మమే, బంధువులకూ, బంధువులు కాని వారికీ ఇవ్వ వచ్చును. తూచే, కొలిచే వస్తువులను అధీనం లోనికి తీసుకోవడం తప్పనిసరి. ఒకవేళ ఎవరైనా తన సంతానానికి కానుక ఇవ్వాలనుకుంటే పిల్లలందరికీ సరిసమానంగా ఇవ్వాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా హెచ్చుతగ్గులు చేయరాదు. కానుకల్లో అందరి హక్కు సరిసమానంగా ఉంది. దీన్ని గురించి క్రింద పేర్కొనబడింది.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

3016 – [ 1 ] ( صحيح ) (2/909)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ عُرِضَ عَلَيْهِ رَيْحَانٌ فَلَا يَرُدُّهُ. فَإِنَّهُ خَفِيْفُ الْمَحْمَلِ طَيِّبُ الرِّيْحَ”. رَوَاهُ مُسْلِمٌ .

3016. (1) [2/909దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరికైనా పరిమళభరితమైన పువ్వు ఇస్తే, దాన్ని తీసుకోవాలి. నిరాకరించరాదు. ఎందుకంటే అది చాలా సున్నితమైన సువాసనగల పువ్వు.” (ముస్లిమ్‌)

3017 – [ 2 ] ( صحيح ) (2/909)

وَعَنْ أَنَسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ لَا يَرُدُّ الطِّيْبَ. رَوَاهُ الْبُخَارِيُّ .

3017. (2) [2/909దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) సువాసన గల వస్తు వులను తీసుకోవటానికి నిరాకరించేవారు కాదు. అంటే ఎవరైనా ప్రవక్త (స)కు సువాసనగల వస్తువు ఇస్తే తీసుకునేవారు, నిరాకరించేవారు కాదు. (బు’ఖారీ)

3018 – [ 3 ] ( صحيح ) (2/909)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْعَائِدُ فِيْ هِبَتِهِ كَالْكَلْبِ يَعُوْدُ فِيْ قَيْئِهِ لَيْسَ لَنَا مَثَلُ السَّوْءِ”. رَوَاهُ الْبُخَارِيُّ .

3018. (3) [2/909దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కానుకలు ఇచ్చి తిరిగి తీసుకునేవాడు వాంతిచేసి నాకే కుక్క వంటివాడు.” [134](బు’ఖారీ)

3019 – [ 4 ] ( متفق عليه ) (2/909)

وَعَنِ النُّعْمَانِ بْنِ بَشِيْرٍ أَنَّ أَبَاهُ أُتِىَ بِهِ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: إِنِّيْ نَحَلْتُ ابْنِيْ هَذَا غُلَامًا فَقَالَ: “أَكُلَّ وَلَدِكَ نَحَلْتَ مِثْلَهُ؟” قَالَ: لَا قَالَ: “فَأَرْجِعْهُ”.

 وَفِيْ رِوَايَةٍ: أَنَّهُ قَالَ: “أَيَسُرُّكَ أَنْ يَّكُوْنُوْا إِلَيْكَ فِي الْبَرِّ سَوَاءً؟” قَالَ: بَلَى قَالَ: “فَلَا إِذَنْ”.

وَفِيْ رِوَايَةٍ: أَنَّهُ قَالَ: أَعْطَانِيْ أَبِيْ عَطِيَّةً. فَقَالَتْ عَمْرَةُ بِنْتُ رَوَاحَةَ: لَا أَرْضَى حَتَّى تُشْهِدَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَأُتِىَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: إِنِّيْ أَعْطَيْتُ ابْنِيْ مِنْ عُمْرَةَ بِنْتِ رَوَاحَةَ عَطِيَّةً. فَأَمَرْتَنِيْ أَنْ أُشْهِدَكَ يَا رَسُوْلَ اللهِ قَالَ: “أَعْطَيْتَ سَائِرَ وَلَدِكَ مِثْلَ هَذَا؟” قَالَ: لَا. قَالَ: “فَاتَّقُوْا اللهَ وَاعْدِلُوْا بَيْنَ أَوْلَادِكُمْ “. قَالَ: فَرَجَعَ فَرَدَّ عَطِيَّتَهُ.

وَفِيْ رِوَايَةٍ: أَنَّهُ قَالَ: “لَا أُشْهَدُ عَلَى جَوْرٍ”.

3019. (4) [2/909ఏకీభవితం]

నో’మాన్‌ బిన్‌ బషీర్‌ కథనం: అతని తండ్రి అతన్ని తీసుకొని ప్రవక్త (స) వద్దకు వచ్చి, ”నేను ఈ నా కుమారునికి సేవకోసం ఒక బానిసను ఇచ్చాను.” అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘కొడుకులందరికీ ఇలా ఇచ్చావా?’ అని అడిగారు. దానికి అతడు, ‘లేదు,’ అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ప్రవక్త (స) ”నువ్వు ఈ బానిసను తిరిగి తీసుకో” అని ప్రవచించారు.

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ‘నీ కుమారులందరూ నీ పట్ల మంచి చేయడంలో సమానంగా పాల్గొనడం నీకు ఇష్టం లేదా? అంటే నీవు అందరిపట్ల సమానంగా ప్రవర్తిస్తే, ఈ విషయం నీకు మంచిదనిపిస్తుంది?’ అని అన్నారు. దానికి అతడు, ‘అవును,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘అలాంటప్పుడు ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వక పోవడం నీకు తగదు,’ అని అన్నారు.

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”మా తండ్రిగారు నాకు ఒక వస్తువు ఇచ్చారు. దానికి ‘ఉమ్‌రహ్‌ బిన్‌తె రవా’హ అంటే నా తల్లి మా తండ్రిగారితో ప్రవక్త (స)తో ఈ విషయాన్ని గురించి ప్రస్తావించే వరకు నేను ఈ విషయంపట్ల సంతోషంగా ఉండను అని అన్నది. అప్పుడు మా తండ్రిగారు నన్ను తీసుకొని ప్రవక్త (స) వద్దకు వచ్చి, నేను ఉమ్‌రహ్‌ బిన్తె రవాహ కుమారునికి ఒకవస్తువు ఇచ్చాను. ఆమె నాతో మీకీ విషయం తెలియజేయమని చెప్పింది, అని అన్నారు. దానికి ప్రవక్త (స) పిల్లలందరికీ ఇలా ఇచ్చావా? అని అడిగారు. దానికి అతను లేదు అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ప్రవక్త (స) నువ్వు దైవానికి భయపడు, పిల్లలందరిపట్ల న్యాయంగా వ్యవహ రించు. నో’మాన్‌ కథనం: ప్రవక్త (స) ఆదేశం విని మా తండ్రి గారు ఇచ్చిన కానుకను తీసుకున్నారు.

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”ప్రవక్త (స) అన్యాయానికి నేను సాక్షిగా ఉండను,” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ    రెండవ విభాగం 

3020 – [ 5 ] ( لم تتم دراسته ) (2/910)

عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَرْجِعُ أَحَدٌ فِيْ هَيْبَتِهِ إِلَّا الْوَالِدُ مِنْ وَلَدِهِ”. رَوَاهُ النَّسَائِيُّ وَابْنُ مَاجَهُ .

3020. (5) [2/910అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కానుకలు ఇచ్చి తిరిగి తీసుకోరాదు. అయితే తండ్రి తన కుమారునికి కానుకగా ఇచ్చింది తిరిగి తీసుకోగలడు.” (నసాయి’, ఇబ్నె మాజహ్)

3021 – [ 6 ] ( لم تتم دراسته ) (2/910)

وَعَنِ ابْنِ عُمَرَ وَابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “لَا يَحِلُّ لِلرَّجُلِ أَنْ يُّعْطِيَ عَطِيَّةً ثُمَّ يَرْجِعَ فِيْهَا إِلَّا الْوَالِدَ فِيْمَا يُعْطِيْ وَلَدَهُ وَمَثَلُ الَّذِيْ يُعْطِيَ الْعَطِيَّةَ ثُمَّ يَرْجِعُ فِيْهَا كَمَثَلِ الْكَلْبِ أَكَلَ حَتَّى إِذَا شَبِعَ قَاءَ ثُمَّ عاَدَ فِيْ قَيْئِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَصَحَّحَهُ التِّرْمِذِيُّ .

3021. (6) [2/910అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌, ఇబ్ను ‘అబ్బాస్‌ల కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కానుకగా ఇచ్చి తిరిగి తీసుకోవటం ధర్మసమ్మతం కాదు, అయితే తండ్రి తన కుమారునికి ఇచ్చింది. తిరిగి తీసుకోగలడు. కానుకను ఇచ్చి తిరిగి తీసుకున్నవాడు కడుపు నిండా తిని, వాంతిచేసి నాకిన కుక్కవంటి వాడు.” (అబూ దావూద్‌, తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్)

3022 – [ 7 ] ( لم تتم دراسته ) (2/910)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ: أَنَّ أَعْرَابِيًّا أُهْدَى لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم بُكْرَةً فَعَوَّضَهُ مِنْهَا سِتَّ بَكْراتٍ. فَتَسَخُّطَ فَبَلَغَ ذَلِكَ النَّبِيَّ صلى الله عليه وسلم فَحَمِدَ اللهَ وَأَثْنَى عَلَيْهِ ثُمَّ قَالَ: “إِنَّ فُلَانًا أُهْدَى إِلَيَّ نَاقَةً فَعَوَّضْتُهُ مِنْهَا سِتَّ بَكَرَاتٍ فَظَلَّ سَاخِطًا لَقَدْ هَمَمْتُ أَنْ لَا أَقْبَلَ هَدِيَّةً إِلَّا مِنْ قُرَشِيٍّ أَوْ أَنْصَارِيٍّ أَوْ ثَقَفِيٍّ أَوْ دَوْسِيٍّ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

3022. (7) [2/910అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ఒక పల్లెవాసి ప్రవక్త (స)కు యుక్తవయస్సుకు చెందిన ఒక ఆడఒంటె కానుకగా ఇచ్చాడు. దాన్ని ప్రవక్త (స) స్వీకరించారు. ఆ కానుకకు బదులుగా ప్రవక్త (స) 6 యుక్త వయస్సుకు చెందిన ఆడఒంటెలను ఆయనకు ఇచ్చారు. అప్పటికీ ఆ వ్యక్తి సంతోషం వ్యక్తం చేయలేదు. ఈ వార్త ప్రవక్త (స)కు అందింది. అప్పుడు ప్రవక్త (స) ఇలా ప్రసంగం చేసారు. మొదట అల్లాహ్ ను స్తుతించారు. ఆ తరువాత, ”ఫలానా వ్యక్తి నాకు కానుకగా ఒక ఆడ ఒంటె ఇచ్చాడు. దానికి బదులుగా నేను 6 ఆడ ఒంటెలు తిరిగి ఇచ్చాను. అయినప్పటికీ ఆ వ్యక్తి సంతృప్తి చెందలేదు. ఇకముందు నేను కేవలం ఖురైషీ, అ’న్సారీ, స’ఖఫీ, దౌసీ తెగలవారి నుండే కానుకలు తీసుకుంటాను. వారు తప్ప ఇతరులెవ్వరి కానుకలు స్వీకరించకూడదని నిశ్చయించుకున్నాను” అని అన్నారు. (తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’)

వీరినే ప్రత్యేకంగా ఎందుకు పేర్కొనడం జరిగిందంటే, ఈ తెగలవారు దాతృత్వగుణం కలిగి ఉంటారు. వీరిలో అత్యాశ ఉండేది కాదు.

3023 – [ 8 ] ( لم تتم دراسته ) (2/910)

وَعَنْ جَابِرٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ أُعْطِيَ عَطَاءً فَوَجَدَ فَلْيَجْزِ بِهِ. وَمَنْ لَمْ يَجِدْ فَلْيُثْنِ. فَإِنَّ مَنِ أثْنَى فَقَدْ شَكَرَ .وَمَنْ كَتَمَ فَقَدْ كَفَرَوَمَنْ تَحَلّى بِمَا لَمْ يُعْطَ كَانَ كَلَابِسَ ثُوْبَيْ زُوْرٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

3023. (8) [2/910అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఎవరికైనా కానుక ఇవ్వబడితే, తన దగ్గర ఏదైనా వస్తువు ఉంటే కానుకకు బదులుగా దాన్ని ఇచ్చివేయాలి, ఒకవేళ ఏదీ లేక పోతే కానుక ఇచ్చిన వారిని ప్రశంసించి, అతనికి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఒకరిని పొగడినవాడు అతనికి కృతజ్ఞతలు తెలిపినట్లే. అయితే కానుకకు బదులు ఇవ్వకుండా లేదా అతన్ని పొగడకుండా ఉన్నవాడు అతని పట్ల కృతఘ్నతకు పాల్పడ్డాడు, అంటే తనకు తగనిపని చేసాడు. అదే విధంగా తనకు తగనివిధంగా తన్నుతాను అలంకరించుకున్నవాడు, లేదా అటువంటివస్తువు లేనివాడు రెండు అధర్మదుస్తులు ధరించినట్టే. [135] (తిర్మిజి’, అబూ దావూద్‌)

3024 – [ 9 ] ( صحيح ) (2/911)

وَعَنْ أُسَامَةَ بْنِ زَيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صُنِعَ إِلَيْهِ مَعْرُوْفٌ. فَقَالَ لِفَاعِلِهِ: جَزَاكَ اللهُ خَيْرًا. فَقَدْ أَبْلَغَ فِيْ الثَّنَاءِ”. رَوَاهُ التِّرْمذِيُّ.

3024. (9) [2/911దృఢం]

ఉసామహ్ బిన్ ‘జైద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఉపకారం చేయబడినవారు ఉపకారికి జ’జాకల్లాహు ‘ఖైరన్‌ అని అంటే అతన్ని చాలా గొప్పగా పొగిడినట్లే.” [136] (తిర్మిజి’)

3025 – [ 10 ] ( صحيح ) (2/911)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ لَمْ يَشْكُرِ النَّاسَ لَمْ يَشْكَرِ اللهَ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ.

3025. (10) [2/911దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మానవులకు కృతజ్ఞతలు తెలుపనివాడు, దైవానికీ కృతజ్ఞతలు తెలపనట్లే.” [137] (అ’హ్మద్‌, తిర్మిజి’)

3026 – [ 11 ] ( صحيح ) (2/911)

وَعَنْ أَنَسٍ قَالَ: لَمَّا قَدِمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم اَلْمَدِيْنَةَ أَتَاهُ الْمُهَاجِرُوْنَ فَقَالُوْا: يَا رَسُوْلَ اللهِ مَا رَأَيْنَا قَوْمًا أَبْذَلَ مِنْ كَثِيْرٍ .وَلَا أَحْسَنَ مُوَاسَاةً مِنْ قَلِيْلٍ مِنْ قَوْمٍ نَزَلَنَا بَيْنَ أَظْهُرِهِمْ: لَقَدْ كَفَوْنَا الْمَؤُوْنَةَ. وَأشْرَكونَا فِيْ الْمَهْنَةِ حَتَّى لَقَدْ خِفْنَا أَنْ يَّذْهَبُوْا بِالْأَجْرِكُلِّهِ. فَقَالَ: “لَا مَا دَعَوْتُمْ اللهُ لَهُمْ وَأَثْنَيْتُمْ عَلَيْهِمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَصَحَّحَهُ .

3026. (11) [2/911దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మదీనహ్ వచ్చిన తర్వాత ముహాజిరీన్లు ప్రవక్త(స) వద్దకు వచ్చి, ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! మేమందరం వచ్చి ఎవరివద్ద అయితే ఉన్నామో వారు, అంటే అ’న్సార్లకంటే మంచి జాతిని మేము చూడలేదు. వీరు ముహాజిరీన్లపై తమ ధనాన్ని అధికంగా ఖర్చుచేస్తున్నారు. దయా సానుభూతి కలిగి ఉన్నారు. వీరిలో కొందరు పేద వారైనా సరే చాలా విశాల హృదయంతో వ్యవహ రిస్తున్నారు. వారు మమ్మల్ని శ్రమ, కష్టానికి దూరంగా ఉంచారు. లాభంలో మాత్రం భాగస్వాములుగా చేర్చు కున్నారు. మా పుణ్యం కూడా వీరే దోచుకుంటా రేమోనని మాకు భయంగా ఉంది,” అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ‘కాదు, మీరు వారి గురించి ప్రార్థిస్తున్నంత కాలం, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నంత వరకు మీకు పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. వారి సానుభూతికి బదులుగా వారికి పుణ్యంలభిస్తుంది.” (తిర్మిజి’ –  దృఢం)

3027 – [ 12 ] ( ضعيف ) (2/911)

وَعَنْ عَائِشَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “تَهَادُوْا فَإِنَّ الْهَدِيَّةَ تَذْهَبُ الضَّغَائِنَ”. رَوَاهُ  التِّرْمِذِيُّ.

3027. (12) [2/911బలహీనం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మీరు పరస్పరం ఒకరికి ఇంకొకరు కానుకలు, కట్నాలు పంపుతూ ఉండండి. ఎందుకంటే కట్నకానుకలు పంపడం వల్ల ఈర్ష్యా-ద్వేషాలు దూరమవుతాయి.

3028 – [ 13 ] ( ضعيف ) (2/912)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “تَهَادَوْا فَإِنَّ الْهَدِيَّةَ تُذْهِبُ وَحْرَ الصَدْرٍ وَلَا تَحْقِرَنَّ جَارَةٌ لِّجَارَتِهَا. وَلو شِقَّ فِرْسِنِ شَاةٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

3028. (13) [2/912బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: పరస్పరం కట్నాలు కానుకలు పంపుతూ ఉండండి. ఎందుకంటే ఈ కానుకలు ఇచ్చిపుచ్చుకోవటం హృదయ కాలుష్యాన్ని దూరం చేస్తుంది. శతృ త్వాన్ని తొలగిస్తుంది. ఇరుగువారు, పొరుగు వారికి కానుకలు పంపడం చిన్నదిగా భావించరాదు. అది మేక కాలిగిట్ట అయినా సరే. [138] (తిర్మిజి’)

3029 – [ 14 ] ( لم تتم دراسته ) (2/912)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ثَلَاثٌ لَا تُرَدُّ الْوَسَائِدُ وَالدُّهْنُ وَاللَّبَنُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ قِيْلَ: أَرَادَ بِالدُّهْنِ الطِّيْبَ.

3029. (14) [2/912అపరిశోధితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఈ మూడు వస్తువులను తిప్పి పంపరాదు. 1. తలగడ, 2. నూనె, 3. పాలు. [139] (తిర్మిజి’)

3030- [ 15 ] ( لم تتم دراسته ) (2/912)

وَعَنْ أَبِيْ عُثْمَانَ النَّهَدِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أُعْطِيَ أَحَدُكُمْ الرَّيْحَانَ فَلَا يَرُدُّهُ فَإِنَّهُ خَرَجَ مِنَ الْجَنَّةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ مُرْسَلًا.

3030. (15) [2/912అపరిశోధితం]

అబూ ‘ఉస్మా’న్‌ నహ్‌దీ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీకు ఎవరైనా సువాసనగల పువ్వుఇస్తే దాన్ని తిరస్కరించకండి. ఎందుకంటే అది స్వర్గం నుండి వెలువడింది. [140]  (తిర్మిజి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం  

3031 – [16 ] ( صحيح ) (2/913)

عَنْ جَابِرٍ قَالَ: قَالَتِ امْرَأَةُ بَشِيْرٍ: إنْحَلِ ابْنِيْ غُلَامَكَ وَأَشْهِدْ لِيْ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَأَتَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ: إِنَّ ابْنَةَ فُلَانٍ سَأَلَتْنِيْ إِنْ أَنْحَلَ ابْنَهَا غُلَامِيْ. وَقَالَتْ: أَشْهِدْ لِيْ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ: “أَلَهُ إِخْوَةٌ؟” قَالَ: نَعَمْ. قَالَ:”أَفَكُلَّهُمْ أَعْطَيْتُهُمْ مَثَلَ مَا أَعْطَيْتَهُ؟” قَالَ: لَا. قَالَ: “فَلَيْسَ يَصْلَحُ هَذَا وَإِنِّيْ لَا أَشْهَدُ إِلَّا عَلَى حَقٌّ”. رَوَاهُ مُسْلِمٌ .

3031. (16) [2/913-దృఢం]

జాబిర్‌ (ర) కథనం: బషీర్‌ భార్య బషీర్‌తో, ‘మీరు నా కుమారుడు లుఖ్‌మాన్‌కు ఒక బానిసను ఇవ్వండి, దాన్ని గురించి ప్రవక్త (స)కు తెలియ జేయండి,’ అని అన్నది. బషీర్‌ ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘నా భార్య నాతో ఆమె కుమారునికి ఒక బానిసను ఇచ్చి, దాన్ని గురించి మిమ్మల్ని సాక్షిగా పెట్టుకోమని చెప్పింది,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘అతనికి సోదరులు ఉన్నారా?’ అని అడిగారు. దానికి అతడు, ‘అవును,’ అని సమాధానం ఇచ్చాడు. ప్రవక్త (స), ‘అతనికిచ్చినట్టు అందరికీ ఇచ్చావా?’ అని అడిగారు. దానికి అతడు, ‘లేదు,’ అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ప్రవక్త(స), ‘ఇలా చేయడం తగని పని, నేను న్యాయం ధర్మంపైనే సాక్షిగా ఉంటాను, అధర్మం, అన్యాయానికి సాక్షిగా ఉండను,’ అని అన్నారు . (ముస్లిమ్‌)

3032 – [ 17 ] ( لم تتم دراسته ) (2/913)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم إِذَا أُتِيَ بِبَاكُوْرَةِ الْفَاكِهَةِ وَضَعَهَا عَلَى عَيْنَيْهِ وَعَلَى شَفَتَيْهِ وَقَالَ: “اَللّهُمَّ كَمَا أَرَيْتَنَا أَوَّلَهُ فَأُرِنَا آخِرَهُ”. ثُمَّ يُعْطِيْهَا مَنْ يَّكُوْنَ عِنْدَهُ مِنَ الصِّبْيَانِ. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ.

3032. (17) [2/913అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఏదైనా క్రొత్త ఫలం తీసుకురావడం జరిగినపుడు, దాన్ని తన కళ్ళకు, పెదాలకు అద్దుకుంటారు. ఇంకా ఇలా అంటారు, అల్లాహుమ్మ కమా అరైతనా అవ్వలహు ఫఅరినా ఖిహు” — ‘ఓ అల్లాహ్ (త)! వీటి మొదటి పండును చూపినట్లు చివరి పండును కూడా చూపెట్టు,’ అని పలికి అక్కడున్న పిల్లల్లో ఒకరికి ఇచ్చివేయడం నేను చూచాను. [141] (బైహఖీ -ద’అవాతుల్ కబీర్)

=====

18- بَابُ اللُّقْطَةِ

18. దొరికిన వస్తువులు

క్రిందపడిన వస్తువును ఎత్తుకోవటాన్ని లుఖ్‌హ్ అంటారు. దాని యజమాని ఎవరో తెలియకుండా ఉండాలి. ఎక్కడైనా ఏదైనా వస్తువు దొరికి, దాని యజమాని జాడ తెలియకుండా ఉంటే, అది నశించే భయం ఉంటే, దాన్ని భద్రపరచి దాని యజమాని వరకు చేరవేసే ఉద్దేశ్యంతో దాన్ని ఎత్తుకోవడం ధర్మమే. ఈ వస్తువు నాకు దొరికిందని ఇద్దరిని సాక్షులుగా చేసుకోవాలి. తనపై అభాండాలు రాకుండా, తనలో దురుద్దేశం జనించకుండా ఉండటానికి ఒక సంవత్సరం వరకు నాకు ఒక వస్తువు దొరికిందని, దాని చిహ్నం చూపెట్టి తన వద్ద నుండి తీసుకోమని ప్రకటిస్తూ ఉండాలి. అలా జరిగితే దాన్ని ఇచ్చివేయాలి. ఎవరూ రాకపోతే దాన్ని ఉపయో గించు కోగలడు. ఎప్పుడైనా పోగొట్టుకున్నవాడు వస్తే ఆ వస్తువు ఉంటే ఇచ్చివేయాలి లేదా దాని ఖరీదును ఇయ్యాలి. వస్తువు అతని వద్ద అమానతుగా ఉంది. అమానతు తిరిగి ఇవ్వడం తప్పనిసరి.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ    మొదటి విభాగం

3033 – [ 1 ] ( متفق عليه ) (2/914)

عَنْ زَيْدِ بْنِ خَالِدٍ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَسَأَلَهُ عَنِ اللُّقَطَةِ فَقَالَ: “اعْرِفْ عِفَاصَهَا وَوِكَاءَهَا ثُمَّ عَرِّفْهَا سَنَةً. فَإِنْ جَاءَ صَاحِبُهَا وَإِلَّا فَشَأْنَكَ بِهَا”. قَالَ: فَضَالَّةٌ الْغَنَمِ؟ قَالَ: “هِيَ لَكَ أَوْ لِأَخِيْكَ أَوْ لِلذِّئْبِ”. قَالَ: فَضَالَةُ الْإِبِلِ؟ قَالَ: “مَالَكَ وَلَهَا؟ مَعَهَا سِقَاؤُهَا وَحِذَاؤُهَا تَرِدُ الْمَاءَ وَتَأْكُلُ الشَّجَرَ حَتَّى يَلْقَاهَا رَبُّهَا”. مُتَّفَقٌ عَلَيْهِ.

وَفِيْ رِوَايَةٍ لِّمُسْلِمٍ: فَقَالَ: “عَرِفْهَا سَنَةً. ثُمَّ اعْرِفْ وِكَاءَهَا وَعِفَاصَهَا. ثُمَّ اسْتَنْفِقْ بِهَا. فَإِنْ جَاءَ رَبُّهَا فَأدِّهَا إِلَيْهِ”.

3033. (1) [2/914ఏకీభవితం]

‘జైద్‌ బిన్‌ ‘ఖాలిద్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి క్రిందపడి ఉన్న వస్తువుల గురించి అడిగాడు. దానికి ప్రవక్త (స), ‘నువ్వు దాని మూతను గట్టిగా బిగించి ఉంచు, సంవత్సరం వరకు దాన్ని గురించి ప్రకటించు. దాని యజమాని వస్తే దాన్ని అతనికి ఇచ్చివేయి. రాకపోతే దాన్ని నీ కోసం ఉపయోగించుకో,’ అని అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ తప్పిపోయిన మేకను గురించి ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స), ‘అది నీది కాగలదు, నీ సోదరునిది కాగలదు, తోడేలుది కాగలదు,’ అని అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ తప్పిపోయిన ఒంటె గురించి అడిగాడు. దానికి ప్రవక్త (స), ‘తప్పిపోయిన ఒంటెను తీసుకొని ఏం చేసుకుంటావు? దానికి తోడు దాని నీటిసంచి ఉంది, దానితోడు దానిమేజోడు ఉంది. అది నీటి దగ్గరకు వచ్చి నీళ్ళు త్రాగివేస్తుంది. చెట్ల ఆకులను తినివేస్తుంది. చివరికి దాని యజమాని వచ్చి దాన్ని తీసుకుపోతాడు.’ [142] (బు’ఖారీ, ముస్లిమ్‌)

3034 – [ 2 ] ( صحيح ) (2/914)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ آوَى ضَالَّةً فَهُوَ ضَالٌّ مَا لَمْ يُعَرِّفْهَا”. رَوَاهُ مُسْلِمٌ .

3034. (2) [2/914దృఢం]

‘జైద్‌ బిన్‌ ‘ఖాలిద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, పడిఉన్న వస్తువును ఎత్తుకొని, దాన్ని ఎవరికీ తెలియ పరచకుండా ఉంచుకున్నవాడు మూర్ఖుడు. అయితే దాన్ని ఎత్తుకొని ప్రకటించేవాడు మాత్రం కాదు. (ముస్లిమ్‌)

3035 – [ 3 ] ( صحيح ) (2/914)

وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ عُثْمَانَ التَّيْمِيِّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَهَى عَنْ لُقْطَةِ الْحَاجِّ. رَوَاهُ مُسْلِمٌ .

3035. (3) [2/914దృఢం]

‘అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ ‘ఉస్మా’న్‌ (ర) కథనం: ప్రవక్త (స) అటూ ఇటూ క్రిందపడి ఉన్న ‘హాజీల వస్తువులను ఎత్తరాదని వారించారు.

ఎందుకంటే ‘హాజీలు కొన్ని రోజులు మాత్రమే మక్కలో ఉంటారు. సంవత్సరం వరకు ప్రకటించడం కష్టం.

—–

اَلْفَصْلُ الثَّانِيْ    రెండవ విభాగం

3036 – [ 4 ] ( حسن ) (2/915)

عَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أَنَّهُ سُئِلَ عَنِ الثَّمَرِ الْمُعَلَّقِ فَقَالَ: “مَنْ أَصَابَ مِنْهُ مِنْ ذِيْ حَاجَّةٍ غَيْرَ مُتَّخِذٍ خُبْنَةً. فَلَا شَيْءَ عَلَيْهِ. وَمَنْ خَرَجَ بِشَيْءٍ مِنْهُ فَعَلَيْهِ غُرَامَةُ مِثْلِيْهِ وَالْعُقُوْبَةُ وَمَنْ سَرَقَ مِنْهُ شَيْئًا بَعْدَ أَنْ يُّؤْوِيَهُ الْجَرِيْنَ فَبَلَغَ ثَمَنُ الْمَجَنِّ فَعَلَيْهِ الْقَطْعُ”. وَذَكَرَ فِيْ ضَالَّةِ الْإِبِلِ وَالْغَنَمِ كَمَا ذَكَرَ غَيْرُهُ. قَالَ: وَسُئِلَ عَنِ اللُّقَطَةِ فَقَالَ: “مَا كَانَ مِنْهَا فِيْ الطَّرِيْقِ الْمِيْتَاءِ وَالْقَرْيَةِ الْجَامِعَةِ فَعَرِّفْهَا سَنَةً فَإِنْ جَاءَ صَاحِبُهَا فَادْفَعَهَا إِلَيْهِ. وَإِنْ لَمْ يَأْتِ فَهُوَ لَكَ. وَمَا كَانَ فِيْ الْخَرَابِ الْعَادِيِّ فَفِيْهِ وَفِيْ الرِّكَازِ الْخُمُسُ”. رَوَاهُ النَّسَائِيُّ وَرَوَى أَبُوْ دَاوُدَ عَنْهُ مِنْ قَوْلِهِ: وَسُئِلَ عَنِ اللُّقْطَةِ إِلَى آخِرِهِ.

3036. (4) [2/915ప్రామమాణికం]

తన తండ్రి మరియు తన తాతల ద్వారా ‘అమ్ర్ బిన్ షు’ఐబ్‌ (ర) కథనం: ప్రవక్త(స)ను, ‘చెట్టుపై ఉన్న కాయలను కోయవచ్చునా లేదా’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ”దారిద్య్రానికి గురియై ఆకలిగా ఉన్నవాడు తన అవసరం మేరకు తిన గలడు. కాని అక్కడి నుండి తీసుకుపోలేడు. అయితే తిని, అక్కడి నుండి మూటకట్టుకొని తన వెంట తీసుకు వెళితే మాత్రం పళ్లకు రెండింతలు పరిహారం చెల్లించవలసి ఉంటుంది. అతనికి శిక్షించడం కూడా జరుగుతుంది. ఒకవేళ పండ్లను దొంగిలించితే, అవి ఒక ఢాలుకు సమానంగా ఉంటే, అంటే 12 అణాలకు సమానంగా ఉంటే అతని చేయి నరకడం జరుగుతుంది.” ఆ తరువాత ఉల్లేఖన కర్త, తప్పి పోయిన ఒంటె, తప్పిపోయిన మేక గురించి అడిగాడు. ఇతర ఉల్లేఖనకర్తలు పేర్కొన్నట్టు. ఆ తరువాత కథనం: ప్రవక్త (స)ను క్రిందపడి ఉన్న వస్తువును గురించి ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త(స)  ప్రజలు వచ్చేపోయే మార్గంలో పడి ఉన్న, జనవాసాల్లో పడి ఉన్న దాన్ని ఎత్తుకొని, ఒక సంవత్సరం వరకు ప్రకటించాలి. దాని యజమాని వస్తే ఇచ్చివేయాలి. ఒకవేళ యజమాని రాకపోతే ఆ వస్తువు మీదవుతుంది. మీరు దానివల్ల లాభం పొందగలరు. ఒకవేళ జనవాసానికి దూరంగా క్రిందపడి ఉన్నా, నిధులు లభించినా 5వంతు అల్లాహ్‌ మార్గంలో ఖర్చుచేయాలి. దొరికిన వారికి 4 వంతులు లభిస్తాయి. ఐదవవంతు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయాలి. (నసాయి’, అబూ దావూద్‌)

3037 – [ 5 ] ( لم تتم دراسته ) (2/915)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ: أَنَّ عَلِيَّ بْنَ أَبِيْ طَالِبٍ رَضِيَ اللهُ عَنْهُ وَجَدَ دِيْنَارًا فَأُتِىَ بِهِ. فَاطِمَةَ رَضِيَ اللهُ عَنْهَا فَسَأَلَ عَنْهُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَذَا رِزْقُ اللهِ”. فَأَكَلَ مِنْهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. وَأَكَلَ عَلِيٌّ وَفَاطِمَةُ رَضِيَ اللهُ عَنْهُمَا. فَلَمَّا كَانَ بَعْدَ ذَلِكَ أَتَتِ امْرَأَةٌ تَنْشُدُ الدِّيْنَارَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا عَلِيٌّ أَدِّ الدِّيْنَارَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

3037. (5) [2/915అపరిశోధితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ‘అలీ (ర)కు ఒక అష్రఫీ దొరికింది. దాన్ని  పాతిమహ్(ర) వద్దకు తీసుకు వెళ్ళారు. ఆ తరువాత ‘అలీ (ర) దాన్ని గురించి ప్రవక్త (స)ను విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘ఇది అల్లాహ్‌ ఉపాధి,’ అని అన్నారు. దీన్ని ప్రవక్త (స), ‘అలీ (ర) మరియు ఫా’తిమహ్ (ర) కలసితిన్నారు. అంటే దాని ద్వారా ఆహార ధాన్యాలు కొని అందరూ పంచుకున్నారు. ఆ తరువాత ఒక స్త్రీ ఆ అష్రఫీని వెదుకుతూ వచ్చింది. ప్రవక్త (స) ‘అలీని ఆ స్త్రీకి అష్రఫీ ఇవ్వమని ఆదేశించారు. (అబూ దావూద్‌)

3038 – [ 6 ] ( لم تتم دراسته ) (2/916)

وَعَنِ الْجَارُوْدِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ضَالَّةُ الْمُسْلِمِ حَرَقُ النَّارِ”. رَوَاهُ أَلدارمي.

3038. (6) [2/916అపరిశోధితం]

జారూద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముస్లిం పోగొట్టుకున్న వస్తువు అగ్నిజ్వాల వంటిది.” [143] (దారమి)

3039 – [ 7 ] ( لم تتم دراسته ) (2/916)

وَعَنْ عِيَاضِ بْنِ حِمَارٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ وَجَدَ لُقَطَةً فَلْيُشْهِدْ ذَوا عَدْلٍ أَوْ ذَوِيْ عَدْلٍ. وَلَا يَكْتُمْ وَلَا يَغِيْبْ. فَإِنْ وَجَدَ صَاحِبَهَا فَلْيَرُدَّهَا عَلَيْهِ. وَإِلَّا فَهُوَ مَالُ الله يَؤْتِيْهِ مَنْ يَشَاءُ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ .

3039. (7) [2/916అపరిశోధితం]

‘ఇయా’ద్ బిన్‌ ‘హిమార్‌ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”క్రిందపడి ఉన్న వస్తువును ఎత్తిన వ్యక్తి ఇద్దరు సజ్జనులను సాక్షులుగా ఉంచుకోవాలి. దాన్ని దాచిపెట్టుకోకూడదు. దాన్ని అదృశ్యం చేయ కూడదు. ఒకవేళ దాని యజమాని వస్తే అతనికి ఇచ్చి వేయాలి. యజమాని రాకపోతే అది అల్లాహ్‌ ధనం ఎవరికైనా ఇవ్వవచ్చు. (అ’హ్మద్‌, అబూ దావూద్‌, దారమి)

3040 – [ 8 ] ( لم تتم دراسته ) (2/916)

وَعَنْ جَابِرٍقَالَ: رَخَّصَ لَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِي الْعَصَا وَالسَّوْطِ وَالْحَبَلِ وَأَشْبَاهِهِ يَلَّتْقِطُهُ الرَّجُلُ يَنْتَفِعُ بِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَذُكِرَ حَدِيْثُ الْمِقْدَامِ بْنِ مَعْدِيْ كَرَبٍ: “أَلَا لَا يَحِلُّ” فِيْ “بَابِ الْاِعْتِصَامِ”.

3040. (8) [2/916అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) చేతికర్ర, చెత్త, తాడు మొదలైన వస్తువులను ఎత్తవచ్చని అనుమతి ఇచ్చారు. ఎందుకంటే మనిషి వాటి ద్వారా లాభం పొందగలడు. [144]  (అబూ దావూద్‌)

هَذَا الْبَابُ خَالٍ عَنِ الْفَصْلِ الثَّالِثْ

ఇందులో మూడవ విభాగం లేదు

*****

m

[1]) వివరణ-2759: దావూద్‌ (అ) తన కాలంలో దైవ ప్రవక్తగా, రాజుగా ఉండేవారు. అతని (అ) ధనాగారం అంతా బంగారం, వెండి, ముత్యాలు, రత్నాలు, వజ్రా లతో నిండి ఉండేది. కాని దాని నుండి తన భార్యాబిడ్డల కోసం ఒక్క పైస కూడా తీసేవారు కాదు. తన చేతి సంపా దనతో ఉపాధి సంపాదించేవారు. ఇనుపకవచాలు తయారుచేసి అమ్మేవారు. అంతేకాదు పరిశుద్ధ సంకల్పం కలిగి ఉండేవారు. అందువల్లే అల్లాహ్‌ (త) ఇనుమును అతని చేతిలో క్రొవ్వులా చేసివేసాడు. తాను కోరిన విధంగా దాన్ని మలచేవారు. దీన్ని గురించి ఖుర్‌ఆన్‌లో సూరహ్‌ సబా (34), సూరహ్‌ అంబియాలలో (21) ఉంది.

[2]) వివరణ-2762: అంటే మనసులో దైవభీతి, దైవభక్తి ఉండాలి. ఒకవేళ దైవభీతివల్ల నిషేధించబడిన, అనుమానాస్పదమైన విషయాలకు దూరంగా ఉంటే పుణ్యాత్ముడుగా పరిగణించబడతాడు, ఒకవేళ దైవభీతి లేకుండా నిషిద్ధ విషయాలకు, అనుమానాస్పద విషయాలకూ పాల్పడితే పాపాత్ముడుగా పరిగణించ బడతాడు. అసలైన దైవభీతి అనుమానాస్పద విషయా లకూ దూరంగా ఉండటమే. ప్రవక్త (స) ప్రవచనం, ”దాసుడు నిషిద్ధ విషయాలకు దూరంగా ఉండటానికి కొన్ని ధర్మసమ్మతమైన విషయాలకు కూడా దూరంగా ఉండనంతవరకు దైవభీతిపరుడుగా పరిగణించబడడు.” అంటే కొన్ని ధర్మసమ్మతమైన విషయాలకు కూడా దూరంగా ఉంటే అధర్మ విషయాల నుండి దూరంగా ఉండ గలడు. ఈ స్థాయికి చేరిన దాసుడు దైవభీతి పరునిగా పరిగణించబడతాడు. ధర్మంలో అన్నిటికంటే గొప్ప దైవభీతి ఇదే. ప్రవక్త (స) ప్రవచనం, ”ధర్మంలో అన్నిటి కంటే గొప్పది దైవభీతి.”  అబూ-బకర్‌ (ర) నిషేధించ బడిన, అనుమానాస్పదమైన విషయాలకు చాలా దూరంగా ఉండేవారు. ‘హదీసు’ గ్రంథాల్లో, జీవిత చరిత్రల పుస్తకాల్లో ఇలా ఉంది. అబూ-బకర్‌ (ర) వద్ద ఒక బానిస ఉండేవాడు. అతడు రోజూ పనిచేసి కూలి డబ్బులు తెచ్చేవాడు. అతనిపై నిర్ణయించబడిన డబ్బుల్ని అబూ-బకర్‌ (ర)కు ఇచ్చేవాడు. ఒకసారి సంపాదించి తెచ్చాడు. అబూ-బకర్‌ (ర) అందులో నుండి కొంత తిన్నారు. అప్పుడు ఆ బానిస మీరు ఇప్పుడు తిన్నది ఏమిటో మీకు తెలుసా? అని అడిగాడు. దానికి అబూ బకర్‌ ఏమిటి? అని అడిగారు. దానికి ఆ బానిస ”అజ్ఞాన కాలంలో నేనుజ్యోతిష్యునిగా కల్పించి చెప్పాను. దానికి ఆ వ్యక్తి ఈ నాడు ప్రతిఫలం చెల్లించాడు. మీరు తిన్నది అదే” అని అన్నాడు. అది విన్న అబూ-బకర్‌ (ర) తననోటిలో వేళ్ళు వేసి వాంతి చేసారు. అంటే తిన్నదంతా బయటకు తీసారు. (బు’ఖారీ) 

అధర్మసంపాదన తనకడుపులో ఉండరాదని, తిన్నదంతా తీసివేసారు. దీనివల్ల తెలిసిన విషయం ఏమిటంటే ఒక వేళ పొరపాటున లేదా మరచి అధర్మ సంపాదన లేదా అనుమానాస్పదమైన వస్తువులను తింటే, తెలిసిన తరువాత వాంతిచేసి బయటకు తీసివేయాలి. అదే విధంగా ‘ఉమర్‌ (ర) ప్రఖ్యాత సంఘటన. ఒకసారి ‘ఉమర్‌ (ర)కు పాలు ఇవ్వడం జరిగింది. పాలు త్రాగిన తర్వాత అవి ప్రత్యేక రుచిని కలిగిఉండటం గమనించారు. వాటిని గురించి అడగగా అవి సదఖా ఒంటె పాలు అని తెలిసింది. అది విని ఉమర్‌ (ర) తన నోటిలో చేయివేసి పాలన్నీ బయటకు తీసివేసారు. (మువ’త్తా) ఇహ్యా ఉల్‌’ఉలూమ్లో ఇటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. ఉదాహరణకు, కొన్ని సంఘటనలు క్రింద పేర్కొంటాం. ‘ఆయి’షహ్‌ (ర) ”మీరు అత్యుత్తమమైన ఆరాధన నుండి ఏమరుపాటుకు గురై ఉన్నారు. అదేమి టంటే నిషిద్ధాలకు దూరంగా ఉండటం,” అని అన్నారు. అదేవిధంగా ఇబ్నె ‘ఉమర్‌ (ర) ”ఒకవేళ మీరు నమా’జు చదువుతూ విల్లులా వంగిపోయినా, ఉపవాసాలు  ఉంటూ బలహీనులైపోయినా అల్లాహ్‌ (త) మీ సత్కార్యాలను  నిషిద్ధాలకు దూరంగా ఉండనంత వరకు స్వీకరించడు,” అని అన్నారు. అదేవిధంగా ‘సుఫియాన్‌ ‘సౌరీ (ర), ”అల్లాహ్‌ (త) విధేయతలో అధర్మ సంపాదనను ఖర్చుచేసినవారి ఉపమానం ఒక వ్యక్తి తన దుస్తులను మూత్రంతో పరిశుద్ధ పరచినట్లుంది. వాస్తవం ఏమిటంటే దుస్తులు పరిశుభ్రమైన నీటితోనే శుభ్రపరచబడతాయి. అదేవిధంగా పాపాలు కేవలం ధర్మ సంపాదనతోనే దూరమవుతాయి,” అని అన్నారు. య’హ్‌యా బిన్‌ మ’ఆజ్‌ (ర), ‘విధేయత దేవుని విధి, దాని తాళం దు’ఆ. ఆ తాళం చెవుల పళ్ళు ధర్మసంపాదన’ అని న్నారు. ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) ”ఎవరి కడుపులో అధర్మ సంపాదన ఉంటుందో వారి నమా’జును అల్లాహ్‌ (త) స్వీకరించడు” అని అన్నారు. అదే విధంగా సహల్‌ తస్తరీ ”ఒక వ్యక్తిలో నాలుగు గుణాలు ఉండనంతవరకు విశ్వాస లోతువరకు చేరలేడు. అవి ‘విధులు నిర్వర్తించుట, ధర్మసంపాదన, అంతర్బాహ్యాల నిషిద్ధాలకు దూరంగా ఉండుట, చివరి ఘడియ వరకు వీటిపై నిలకడగా ఉండుట’ అని అన్నారు. ఇంకా ‘ఎవరైనా సత్యసంధుల చిహ్నాలు తనపై బహిర్గతం కావాలని కోరితే కేవలం ధర్మ సంపాదనే తినాలి. ఇంకా ప్రవక్త సంప్రదాయాన్నే అనుసరించాలి’ అని అన్నారు. ‘ఎవరైనా నలభై రోజుల వరకు అనుమానాస్పద విషయాలను తింటే అతని హృదయం నల్లగా మారిపోతుంది.’ ఈ వాక్యానికి అర్థం ఇదే. ”ఎంతమాత్రం కాదు, వారు చేస్తూ ఉండినదే వారి హృదయాలను అధిగమించింది. అంటే వారి హృద యానికి తుప్పుపట్టింది” అని కూడా వ్యాఖ్యా నించడం జరిగింది.  ఇబ్నె ముబారక్‌ ఇలా అన్నారు, ”అనుమా నాస్పదమైన ఒక్క దిర్‌హమ్‌ తిరిగి ఇచ్చి వేయటం నా అభిప్రాయంలో ఒక లక్ష నుండి ఆరులక్షల దిర్‌హమ్‌ల వరకు దానంచేయటం కన్నాగొప్పది.” మన పూర్వీకుల ల్లోని మహా పురుషులు ఒక వ్యక్తి అధర్మమైన ఒక ముద్ద తింటాడు. దానివల్ల అతని హృదయం చర్మంలా మారి పోతుంది. మళ్ళీ తన పాత స్థితికి రాదు అని వ్యక్తం చేసే వారు. సహల్‌ తస్తరీ(ర) ఇలా అంటున్నారు, ”అధర్మ సంపాదన తినేవాడి అవయవాలు అవిధేయతకు పాల్పడ తాయి. కాని ఈ సంగతి అతనికి తెలియనే తెలియదు. అదేవిధంగా ధర్మసంపాదన తినేవాడి అవయవాలు విధేయత చూపుతాయి. దాన ధర్మాలు చేసే భాగ్యం కలుగుతుంది’ అని అన్నారు. ఒక మహా భక్తుడు ఇలా అన్నాడు, ”ఒక వ్యక్తి ధర్మ సంపాదన లోని ఒక ముద్ద తింటే అతని వెనుకటి పాపాలు క్షమించబడతాయి. ఎవరైనా ధర్మసంపాదన అన్వేషణలో తన్ను తాను హీనదృష్టికి గురిచేసుకుంటే అతని పాపాలు చెట్టునుండి ఆకులు రాలినట్లు రాలిపోతాయి. అనుమానాస్పద విషయాలనుండి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి.

ఒకసారి అదీ బిన్‌ ‘హాతిమ్‌ (ర) ప్రవక్త (స)ను ”నేను వేట కుక్కల ద్వారా వేటాడుతాను. ఒక్కోసారి వేట కుక్కతో పాటు మరో కుక్క కూడా చేరిపోతుంది. అది వేటను చంపి వేస్తుంది. ఏ కుక్క చంపిందో తెలియదు అని విన్నవించు కున్నాను. దానికి ప్రవక్త (స) నీ వేట కుక్క వేటాడిందాన్ని, ఆ కుక్క బిస్మిల్లాహ్‌ అని వదలి ఉంటే దాని వేట ధర్మసమ్మతం. దాన్ని మీరు తినగలరు. అయితే రెండు కుక్కలూ వేటాడి, ఆ వేట చనిపోతే, దాన్ని తినకండి. ఎందుకంటే ఏ కుక్క వేటాడిందో మీకు తెలియదు అని అన్నారు. (బు’ఖారీ) అనుమానం వల్ల నిషేధించడం జరిగింది. దైవభీతి అంటే ఇదే. మన పూర్వీకుల్లోని విశ్వాస పరిపూర్ణులు అనుమానాస్పద విషయాలకు చాలా దూరంగా ఉండేవారు. ఇ’హ్‌యా ఉల్‌ ‘ఉలూమ్‌లో ఇలా ఉంది: అలీ బిన్‌ మాబద్‌ ఇలా అంటున్నారు, ”ఒకసారి నేను అద్దె ఇంట్లో ఉండేవాడిని. ఒకసారి నేను ఉత్తరం వ్రాసాను. గోడ నుండి కొంత మట్టి తీసి దాన్ని ఇంకిపోయినట్లు చేద్దామని అనుకున్నాను. కాని ఆ గోడ నాది కాదు అని ఆలోచించాను. ఆ తరువాత ఈ మాత్రం మట్టి తీస్తే ఏమయిపోతుంది అనే ఆలోచన వచ్చింది. కొంతమట్టిని తీసి వ్రాసిన ప్రతిపై వేసాను. రాత్రి స్వప్నంలో ఒక వ్యక్తి ‘సోదరా! తీర్పుదినం నాడు తెలిసిపోతుంది ఈ మాత్రం మట్టి తీస్తే ఏమయిపోతుందని’ అని అన్నాడు.

[3]) వివరణ-2763: శిక్షణలేని కుక్కను అమ్మటం, కొనటం మంచిది కాదు. దాని ఖరీదు తీసుకోవడం అపరిశుద్ధ మైనది. వ్యభిచార స్త్రీ సంపాదన నిషేధించబడింది. చెడు రక్తం తీసేవాడు కూలి తీసుకోవడం అపరిశుద్ధమైనది. అయితే ఒక ‘హదీసు’లో దీన్ని అనుమతించబడింది.

[4]) వివరణ-2764: ‘హుల్‌వాన్‌ ‘హలావత్‌ నుండి వచ్చింది. దీని అర్థం తీపికరమైనది. జ్యోతిష్కుడు అంటే అగోచరాల గురించి తెలియపరుస్తానని వాదించేవాడు. వాస్తవం ఏమిటంటే అగోచరజ్ఞానం కేవలం అల్లాహ్‌(త)కు మాత్రమే ఉంది. కొందరు అమాయకులు జ్యోతిష్కుల వద్దకు వెళ్ళి అగోచర విషయాలను గురించి అడుగుతారు. వారు తమకు తోచింది చెబుతారు. ఒక్కోసారి వాళ్ళు చెప్పింది జరుగుతుంది. దానికి వారు వారికి ప్రోత్సాహకాలు ఇచ్చుకుంటారు. అంటే పారితోషికం. ఈ పారితోషికం నిషిద్ధం. వ్యభిచార స్త్రీ సంపాదనలా.

[5]) వివరణ-2766: ఈ ‘హదీసు’ ద్వారా మద్యపానం అమ్మటం, కొనటం రెండూ నిషిద్ధమే, చచ్చిన జంతువును కొనటం అమ్మటం కూడా నిషిద్ధమే. అదేవిధంగా పందిని కొనటం, అమ్మటం కూడా నిషిద్ధమే. విగ్రహాల వ్యాపారం కూడా నిషిద్ధమే. మృతజంతువుల క్రొవ్వు ఉపయో గించడం కూడా నిషిద్ధమే. దాన్ని అమ్మి ఆ సొమ్మును తినటం కూడా నిషిద్ధమే అని తెలిసింది.

[6]) వివరణ-2767: అంటే నిషిద్ధ వస్తువును అమ్మి ఆ డబ్బును తినటం కూడా నిషిద్ధమే.

[7]) వివరణ-2768: అంటే కుక్కల పిల్లుల వ్యాపారం నిషిద్ధం.

[8]) వివరణ-2769: అబూ ‘తయ్బహ్‌ బనీ బయాజహ్కు బానిసలు. వారు ఇతని ద్వారా సంపాదించేవారు. ప్రతిరోజూ ఇంత సంపాదించమని, ఇంత ఇవ్వమని చెప్పే వారు. అది అతనికి చాలా భారంగా ఉండేది. ప్రవక్త (స) అతని తరఫు నుండి సిఫారసు చేస్తూ అతని నుండి తీసుకుంటున్న సొమ్ము కొంత తగ్గించమని చెప్పారు. ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే కొమ్ము చికిత్సకు తగిన ప్రతిఫలం ఇవ్వవచ్చు. ఇవ్వ కూడదని ఉన్న ‘హదీసు’ను ఈ ‘హదీసు’ రద్దుచేస్తుంది.

[9]) వివరణ-2773: అనుమానానికి గురిచేసే వాటిని వదిలి స్పష్టంగా ఉన్నవాటిని అవలంబించాలి. ఎల్లప్పుడూ సత్యం పలకాలి. ఎందుకంటే సత్యం పలికితే మనశ్శాంతి లభిస్తుంది. అదేవిధంగా అసత్యానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అసత్యం వల్ల మనస్సు అశాంతికి, అనుమానానికి, సంకోచానికి గురవుతుంది.

[10]) వివరణ-2775: అంటే అనుమతించబడిన రుచి కరమైన వాటిని కూడా వదలివేస్తేనే నిషిద్ధ విషయాలకు దూరంగా ఉండటం జరుగుతుంది. దాసుడు ఈ స్థానానికి చేరితే దైవభీతిపరుల్లో చేరుతాడు. ధర్మంలో అన్నిటి కంటే గొప్ప విషయం దైవభీతే.

[11]) వివరణ-2778: ఇస్లామ్‌ ప్రారంభంలో ప్రవక్త (స) వారించారు. కాని ఆ తరువాత దాన్ని గురించి అనుమతించారు. ఒక సందర్భంలో కొమ్ముచికిత్స చేసినవాడికి ప్రతిఫలం కూడా ఇచ్చారు.

[12]) వివరణ-2780: అంటే ఆడేపాడే, వాయించే, కాలక్షేపం, ఆటపాటల వస్తువులను కొని ప్రజలను దైవధ్యానం నుండి మల్లించే, మార్గభ్రష్టత్వానికి గురిచేసే వారు అవిధేయులు. ప్రస్తుత కాలంలో రేడియో, టీవీలు వీటికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అల్లాహ్‌ (త) మనందరినీ వీటి చెడునుండి కాపాడు గాక! ఆమీన్‌.

[13]) వివరణ-2781: అంటే దైవవిధులు నిర్వర్తించిన తర్వాత ధర్మబద్ధంగా సంపాదించడం తప్పనిసరి విధి. ఎందుకంటే ఆరాధనలన్నీ ధర్మ సంపాదనపైననే ఆధారపడి ఉన్నాయి. సంపాదన ధర్మసమ్మతమైతేనే ఆరాధనలు స్వీకరించబడతాయి. అక్రమసంపాదన తింటే ఆరాధనలు స్వీకరించబడవు.

[14]) వివరణ-2783: అంటే వృత్తులన్నిటిలో ఈ వృత్తి ధర్మ సమ్మతమైన మార్గాల్లో గొప్పది. తన చేత్తో సంపా దించి తినటం. ఉదా: వ్యవసాయం చేయటం, తన చేత్తో రాసి సంపాదించడం ఇంకా దగా మోసం లేని వ్యాపారం.

[15]) వివరణ-2784: ప్రాచీనకాలంలో సాధారణంగా ప్రజలు పాలు అమ్మేవారు కారు. దానధర్మాలు చేసేవారు. పేదలకు, అగత్యపరులకు ఇచ్చివేసేవారు. అమ్మి డబ్బులు తీసుకోవటం సబబుగా భావించేవారు కాదు. మిఖ్‌దామ్‌ బిన్‌ మ’అదీ కర్‌బ్‌ పాలను తన బానిసరాలికి ఇచ్చిపంపి అమ్మేవారు. డబ్బులు తాను వసూలు చేసేవారు. అందువల్ల ప్రజలు ఆశ్చర్యంగా వారి పట్ల అభ్యంతరాలు తెలిపేవారు. మిఖ్‌దామ్‌ బిన్‌ మ’అదీ కర్‌బ్‌ ‘ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు, ఇది ధర్మసమ్మతమైన వ్యాపారం, దీని ద్వారా డబ్బులు సంపాదించడం ధర్మం,’ అని అన్నారు. ఎందుకంటే ఈ కాలంలో వ్యాపారాలన్నీ ఈ ధనం పైనే ఆధారపడి ఉన్నాయి. ధర్మ సంపాదన ద్వారా వచ్చిన ధనం అన్నిటికంటే చాలా లాభదాయకమైనది. అందువల్ల పాల వ్యాపారం మంచిదే. అయితే పాలలో నీళ్ళు కలిపి అమ్మటం ఎంతమాత్రం ధర్మసమ్మతం కాదు.

[16]) వివరణ-2785: అంటే ఒక వైపు నుండి ఉపాధి అందుతూ ఉన్నప్పుడు, ఆ మార్గాన్ని, సాధనాన్ని అనవసరంగా వదలకూడదు. అయితే అటునుండి ఏదైనా నష్టం, కష్టం వాటిల్లితే ఉపాధి అందడంలో కష్టంగా ఉంటే ఆ ప్రదేశాన్ని వదలివేయాలి.

[17]) వివరణ-2786: ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ఒకవేళ ఎవరైనా అధర్మ, అనుమానాస్పద వస్తువులు తిని, ఆ తరువాత తెలిసి వాంతి ద్వారా తీసి వేయాలి. అధర్మ సంపాదన కడుపులో ఉంచరాదు.

[18]) వివరణ-2789: ప్రవక్త (స) ప్రవచనం, ఉదా: ఒకవ్యక్తి 10 దిర్‌హమ్‌లలో (రూపాయలలో) బట్టలుకొంటాడు. ఒక వేళ వాటిలో 1 దిర్‌హమ్‌ (ఒక రూపాయి) కూడా అధర్మ సంపాదన అయితే, ఆ దుస్తులు ధరించి నమా’జు చేస్తే అల్లాహ్‌ (త) ఆ దుస్తులు అతని శరీరంపై ఉన్నంత  వరకు అతని నమా’జును స్వీకరించడు.

[19]) వివరణ-2790: అంటే ఇటువంటి వ్యక్తిని అల్లాహ్‌ కరుణిస్తాడని తెలిపారు లేదా దీవించారు.

[20]) వివరణ-2793: అంటే అసత్య ప్రమాణం చేయటం వల్ల సరకు అమ్ముడవుతుంది. కాని శుభం నశిస్తుంది. అందువల్ల అసత్య ప్రమాణం చేసి సరకును అమ్మరాదు. సత్యం వల్ల శుభం కలుగుతుంది. ఎటువంటి వ్యవహారంలోనూ అసత్యానికి, మోసానికి పాల్పడకండి.

[21]) వివరణ-2794: అంటే ప్రమాణాల వల్ల కొనుగోలు దారు ప్రమాణాలు నమ్మి సరకు కొంటాడు. అమ్మకాలు బాగుంటాయి. కాని దానివల్ల శుభం జరగదు.

[22]) వివరణ-2801: ఖియారె మజ్లిస్ గురించి ఇంతకు ముందు పేర్కొనడం జరిగింది. ఈ హదీసు ద్వారా కూడా అమ్మేవారికి, కొనేవారికి ఇద్దరూ వేరవనంత వరకు అధికారం ఉంది. వాళ్ళు కోరితే వ్యవహారం కొనసాగించ గలరు లేదా వ్యవహారం రద్దు చేయగలరు. ధార్మిక పండితుల అభిప్రాయం ఇదే. ఇదే ఉత్తమం.

[23]) వివరణ-2802: అంటే ఇద్దరూ సత్యం పలికి, నీతి నిజాయితీగా వ్యవహరిస్తే, వారి వ్యవహారంలో శుభం కలుగుతుంది. వారి వ్యవహారంలో అసత్యం, మోసం, లోపాల్ని కప్పిపుచ్చటం ఉంటే శుభం ఉండదు.

[24]) వివరణ-2803: లాఖలాబతహ్ అంటే ఈ వ్యవహారంలో ఎలాంటి మోసం లేదు అని అర్థం. అంటే ఒకవేళ నువ్వు ఈ బేరంలో మోసగిస్తే ఈ బేరం అవదు. నేను వ్యవహారాన్ని రద్దుచేస్తాను. లేదా నాకు రద్దుచేసే అధికారం ఉంది.

[25]) వివరణ-2804: ఇఖాలహ్ అంటే వ్యవహారాన్ని రద్దు చేయడం, అంటే వ్యవహారం చేసిన వ్యక్తి రెండవ వ్యక్తికి వ్యవహారం రద్దుచేసే అధికారం ఉండకూడదని సమావేశం మార్చివేయడం.

[26]) వివరణ-2805: అమ్మేవారు, కొనేవారు తమ ఇష్ట పూర్వకంగా అమ్మాలి, కొనాలి. అనంతరం సంతృప్తి కరంగా ఉండాలి. ఈ వ్యవహారం ఒకరికి ఇష్టం మరొకరికి ఇష్టం లేకపోతే అది సరైన వ్యవహారం కాదు. ఇద్దరికి ఇష్టపూర్వకంగా అయితే వ్యవహారం సరిగ్గా ఉంటుంది.

[27]) వివరణ-2807: వడ్డీ ఇవ్వటం, పుచ్చుకోవటం మహా పాపం. వడ్డీ ఇచ్చేవాడు, తీసుకునేవాడు ఇద్దరూ శాపగ్రస్తులే. దాన్ని వ్రాసేవాడూ, సాక్ష్యం ఇచ్చేవాడూ ఇద్దరూ శాపగ్రస్తులే.

[28]) వివరణ-2808: అంటే గోదుమలకు బదులు గోదు మలు అమ్మినా కొన్నా, నగదుగా, సరిసమానంగా ఉండాలి. అంటే ఒక కిలో గోధుమలకు బదులు ఒకకిలో గోధుమలు అమ్మవచ్చును, కొనవచ్చును. ఒకకిలో ఇచ్చి ఒకటిన్నర తీసుకోవటం వడ్డీ అవుతుంది. అదే విధంగా మిగతా విషయాల్లోనూ, ఇటువంటి షరతే ఒకే రకమైన ఆహార ధాన్యాలు ఉంటే సరిసమానంగా వెంటనే ఇవ్వాలి. వేర్వేరుగా ఉంటే హెచ్చుతగ్గులు చేయవచ్చును. అయితే వెనువెంటనే ఇవ్వాలి. అప్పుగా కాకూడదు.

[29]) వివరణ-2812: అంటే అమ్మేవాడు కొనేవాడిని, ‘ఇది తీసుకో’ అని అనాలి. అదేవిధంగా కొనేవాడు, అమ్మే వాడిని ‘ఇది తీసుకో’ అని అనాలి. ఇందులో అరువు ఉండరాదు.

[30]) వివరణ-2813: వస్తువులు రెండు విధాలుగా ఉంటాయి. రెండు విధాలుగా కొనబడతాయి, అమ్మ బడతాయి. కొలవటం జరుగుతుంది. లేదా తూయటం జరుగుతుంది. ఖర్జూరాలు కొనేటప్పుడు ఒక సేరు ఖర్జూరాలు ఇస్తే ఒక సేరు ఖర్జూరాలు మాత్రమే ఇవ్వాలి. అదేవిధంగా రెండుసేర్లు నాసిరకం ఖర్జూరాలు ఇచ్చి ఒక సేరు మంచిరకం ఖర్జూరాలు తీసుకోవడం వడ్డీ అవుతుంది. నాసిరకం ఖర్జూరాలు అమ్మి ఆ డబ్బుతో నాణ్య మైన ఖర్జూరాలు కొనుక్కోవాలి.

[31]) వివరణ-2814: అవ్వహ్ఈ పదం నొప్పి, దుఃఖ సమయాల్లో పలకటం జరుగుతుంది. చాలా విచారకరం! ఇది వడ్డీయే.

[32]) వివరణ-2815: ఈ ‘హదీసు’ ద్వారా ఒక బానిసకు బదులు ఇద్దరు బానిసల అమ్మకాలు చేయడం ధర్మ సమ్మతమని తెలిసింది. అదేవిధంగా ఒక జంతువుకు బదులు రెండు జంతువులను అమ్మడం, కొనడం ధర్మ సమ్మతం అని తెలిసింది. ఇందులో ఎలాంటి వడ్డీలేదు.

[33]) వివరణ-2816: అంటే రెండు క్వింటళ్ళ ఖర్జూరాల కుప్పకు బదులు మరో ఎన్ని క్వింటళ్ళు ఉందో తెలియని ఖర్జూరాల కుప్పను అమ్మడంగానీ కొనడం గానీ జరగరాదు. ఖర్జూరాలు ఎక్కువ ఉండవచ్చు, తక్కువ ఉండవచ్చు. సరకు రెండువైపుల ఒకేరకంగా ఉన్నప్పుడు సరిసమానంగా ఉండాలి. లేదు గనుక అమ్మడంగాని కొనడంగాని తగదు. అమ్మడానికి సరి సమానంగా, వెనువెంటనే ఇరువురు పొందడం జరగాలి.

[34]) వివరణ-2817: ఇది బంగారు హారం. ఇందులో వజ్రాలు కూడా ఉండేవి. అష్రఫీలంటే బంగారమే. బంగా  రాన్ని బంగారంతో అమ్మాలంటే రెండు సరిసమానంగా ఉండాలి. హెచ్చు-తగ్గులు ఉంటే అది వడ్డీ అవుతుంది. అంటే హారం 12 అష్రఫీల కంటే అధికంగా ఉన్నందువల్ల ప్రవక్త (స) బంగారానికి బదులు బంగారాన్ని హెచ్చు తగ్గులతో అమ్మరాదు, కొనరాదు. బంగారాన్ని వేరుచేసి బంగారాన్ని బంగారంతో సరిసమానంగా వెనువెంటనే అమ్మవచ్చు, కొనవచ్చు. ఇది వడ్డీ అవదు.

[35]) వివరణ-2818: ఇది ప్రవక్త (స) భవిష్యవాణి. సరిగ్గా నిజమైతీరింది. ప్రస్తుత కాలంలో పరిస్థితి ఇలాగే ఉంది. చాలామంది వడ్డీ వ్యాపారంలో పీకల వరకు మునిగి ఉన్నారు. అది బేంక్‌ ద్వారా అయినా పోస్టాఫీస్‌ ద్వారా అయినా, మరోవిధంగా అయినా సరే. వడ్డీకి దూరంగా ఉండాలనుకున్న వారిపై కూడా దాని ప్రభావం ఎంతో కొంత పడుతూనే ఉంది.

[36]) వివరణ-2820: ఎందుకంటే పండు ఖర్జూరాలు ఎండి తక్కువయినపుడు ఖర్జూరాలను ఖర్జూరాలకు బదులు అమ్మరాదు కొనరాదు. రెండూ ఎండు ఖర్జూరాలు అయి, సరిసమానంగా ఉన్నా, పండు ఖర్జూరాలయి సరి సమానంగా ఉన్నా వెనువెంటనే అయితే, అమ్మ వచ్చును, కొనవచ్చును.

[37]) వివరణ-2821: అంటే 10 కిలోల మాంసానికి బదులు మేకను కొనటం, మేకలో మాంసం 10 కిలోల కంటే తక్కువ ఉండవచ్చు, ఎక్కువ ఉండవచ్చు. ఈ హెచ్చుతగ్గులవల్ల ఇది ధర్మసమ్మతం కాదు.

[38]) వివరణ-2823: మొదటి ‘హదీసు’లో జంతువును జంతువుకు బదులుగా అరువు ఇవ్వటాన్ని గురించి వారించారు. ఈ ‘హదీసు’లో ఒక ఒంటెను రెండు ఒంటెల రుణానికి బదులు తీసుకున్నారు. ఈరెండు ‘హదీసు’ల్లో వ్యతిరేకత కనబడుతుంది. రెండవ ‘హదీసు’ రద్దు చేయబడింది. మొదటిది కొనసాగుతుంది. అంటే మొదట అరువుగా కొనే అనుమతి ఉండేది. తరువాత వారించడం జరిగింది. అబ్దుల్లాహ్‌ ‘హదీసు’ బలహీనమైనది. సముర బిన్‌ జున్‌దుబ్‌ ‘హదీసు’ బలమైనది. అందువల్ల దీన్ని అనుసరించడం జరిగింది.

[39]) వివరణ-2824: పండితుల అభిప్రాయం: ఉసా’మహ్ ‘హదీసు’ రుణంలో వడ్డీ ఉంది. ఇది రద్దు చేయబడింది. రెండవ ‘హదీసు’ కొనసాగుతోంది. నగదులో వడ్డీ లేదు. అంటే రెండు వైపుల ఒకేరకమైన వస్తువులుండి సరిసమానంగా ఉండి వెనువెంటనే ఇచ్చి పుచ్చు కోవడాలు జరిగితే ఇందులో ఎలాంటి వడ్డీ లేదు.

[40]) వివరణ-2825: వడ్డీ తీసుకోవడం, ఇవ్వడం నిషేధం. ఉద్దేశ్యపూర్వకంగా తినటం కూడా నిషేధమే. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఆదేశం: ”ఓ విశ్వాసులారా! మీరు నిజంగా విశ్వాసులే అయితే అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండండి. మీకు రావలసిన వడ్డీని విడిచిపెట్టండి. కాని, ఒకవేళ మీరు అలా చేయకపోతే, అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స)తో యుద్ధానికి సిద్ధంకండి. (సూ. అల్‌ బఖరహ్‌, 2:278279) ఈ ఆయతులో వడ్డీ తీసుకోవటాన్ని గురించి కఠినంగా హెచ్చరించడం జరిగింది. ‘హదీసు’లో ఒక్కోసారి వడ్డీ తీసుకోవటం 36 సార్లు వ్యభిచారం చేయటం కంటే మహాపాపం అని ఉంది. ఈ ‘హదీసు’ ఉల్లేఖన కర్త ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ హన్‌’జలహ్‌ (ర). ఇతనికి తఖీ, గసీలుల్మలాయికహ్ మొదలైన బిరుదులు ఉన్నాయి. అంటే ఇతన్ని దైవదూతలు స్నానం చేయించారు. దీని కారణం ఉ’హుద్‌ యుద్ధ సందర్భంగా యుద్ధంలో చేరడానికి ప్రకటించడం జరిగింది. అప్పుడు ఇతను తన భార్యతో సంభోగం చేస్తున్నారు. జిహాద్‌ పిలుపు విని వెంటనే నిలబడ్డారు. కరవాలం తీసుకొని యుద్ధ మైదానంలో దూసుకుపోయారు. అతనికి స్నానం చేసే అవకాశం కూడా దొరకలేదు. అవిశ్వాసులతో పోరాడుతూ వీరమరణం పొందారు. దైవదూతలు అతనికి స్నానం చేయించారు. ప్రవక్త (స) అతని భార్యను ఒక వ్యక్తిని పంపి అసలు విషయం ఏమిటని అడగమన్నారు. ఆమె పైవిధంగా పేర్కొన్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘అందుకే దైవదూతలు అతనికి స్నానం చేయించారు’ అని అన్నారు. ఈ సంఘటన వల్ల ఒకవేళ అపరిశుద్ధ స్థితిలో వీరమరణం పొందితే ప్రజలకు తెలిస్తే అతన్ని స్నానం చేయించాలి. ఒకవేళ అపరిశుద్ధస్థితిలో లేకపోతే స్నానం చేయించే పనిలేదు. ఎందుకంటే వీరమరణం పొందిన వారిని స్నానం చేయించడం జరుగదు.

[41]) వివరణ-2829: అంటే వడ్డీ తీసుకునేవాడు, ఇచ్చే వాడూ, దాన్ని వ్రాసే వాడూ శాపగ్రస్తులు. అదేవిధంగా దానధర్మాలు చేయనివారు కూడా శాపగ్రస్తులే. అదేవిధంగా ఎవరైనా చనిపోతే ఏడ్వటం పెడ బొబ్బలు పెట్టటం ధర్మసమ్మతం కాదు.

[42]) వివరణ-2834: ముజాబనహ్ అంటే పళ్ళు కోయటం. ఇక్కడ ము’జాబనహ్ అంటే చెట్టుపై ఉన్న ఖర్జూరాలను ఎండు ఖర్జూరాలకు బదులు అమ్మటం. వడ్డీ అనుమానమే, దీని నిషేధానికి కారణం. ఎందుకంటే రెండువైపుల ఖర్జూరాలు హెచ్చుతగ్గులు కావచ్చు. ఒకేరకమైన ఆహార పదార్ధాలను హెచ్చుతగ్గులతో అమ్మడం ధర్మం కాదు. ఖర్జూరాలైనా, ద్రాక్ష అయినా అమ్మేది, కొనేది రెండూ ఒకేవిధంగా ఉండాలి. అదేవిధంగా గోధుమలను ఇంకా పంటలో ఉన్న గోధుమ గుత్తులకు బదులుగా అమ్మరాదు. దీన్ని ముహఖలహ్ అంటారు. ఇది కూడా ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే ఇందులో కూడా హెచ్చుతగ్గులు సాధ్యం అవుతాయి. ఇందులో వడ్డీ ఏర్పడవచ్చు.

[43]) వివరణ-2835: ఇంకా కోయబడకుండా పొలంలో ఉన్న గోదుమలను ఎండు గోదుమలకు బదులుగా అమ్మటం. ఖర్జూరాలు, ద్రాక్ష మొదలైనవి. ము’ఖాబరహ్‌ – ఖుబ్రహ్ నుండి వచ్చింది. అంటే భాగం అని అర్థం. కొందరు దీన్ని ‘ఖైబర్‌ నుండి వచ్చింది అని భావిస్తున్నారు. ఎందుకంటే ప్రవక్త (స) ‘ఖైబర్‌ ప్రజలతో ఇటువంటి ఒప్పందమే చేసారు. అంటే సగం పంట మీది సగం పంట మాది అని. మరికొందరు దీన్ని సాగు భూమిగా పేర్కొన్నారు. ము’ఖాబరహ్‌ అన్నా, ముజా రఅహ్ అన్నా ఒకటే అర్థం. కాని ముజారఅత్లో నష్టం యజమానిది అవుతుంది. ముఖాబరహ్లో నష్టం రైతుది వుతుంది.

సారాంశం: యజమాని తన భూమిని ఈ షరతుపై మరో వ్యక్తికి ఇస్తాడు. అతడు దున్నుతాడు, విత్తనాలు నాటుతాడు. పండిన పంటలో మూడవ వంతు లేదా, సగ-భాగం యజమానికి ఇవ్వాలి. మిగిలింది తాను తీసుకోవాలి. ఒక ప్రత్యేక రూపంలో దీన్ని నిషేధించడం జరిగింది. సామాన్యంగా కాదు. ఈ ము’ఖాబరహ్నే హిందీలో బటాయి అంటారు. ‘హదీసు’వేత్తలు ఈ విధమైన ము’ఖాబరహ్ ను నిషేధించారు. భూయజమాని భూమి ఇచ్చినపుడు కాలువల ప్రక్క, నదుల ప్రక్క పండే పంట నేను తీసుకుంటాను, వేరే చోట పండే పంట నీవు తీసుకో అని అంటాడు. ఈవిధంగా ఒక్కోసారి లాభం, భూమి యజమానికి లాభం కలుగుతుంది. ఒక్కోసారి నష్టం కలుగుతుంది. అదేవిధంగా రైతుకు కూడా లాభం, నష్టం కలుగుతుంది. రా’ఫె బిన్‌ ‘ఖదీజ్‌ (ర)ను ప్రశ్నిస్తే అతను (ర) సమాధానం ఇస్తూ, ‘భూమిని వెండి, బంగారాలకు బదులు ఇవ్వటం ఎటువంటి అభ్యంతరం లేదు,’ అని అన్నారు. ప్రవక్త (స) కాలంలో ప్రజలు నదులు కాలువల ప్రక్కన పండే పంటకు బదులుగా లేదా వేరేచోట పంటపై భూమి అద్దెకు తీసుకునే వారు. ఒక్కోసారి ఇది నాశనం అవుతుంది. వేరేది మిగులు తుంది. ఒక్కోసారి ఇది నశిస్తుంది. అది మిగిలిపోతుంది. కొందరికి అద్దె ఏమీ లభించదు. మిగిలింది మాత్రమే లభిస్తుంది. అందువల్లే ప్రవక్త (స) దాన్ని నిషేధించారు. కాని దీనికి బదులుగా ఏదైనా నిర్ణీత చెలామణిలో ఉన్న రూపాయి, అష్‌రఫీలు, ఆహార ధాన్యాలు మొదలైనవి నిర్ణయించుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. (ముస్లిమ్). బు’ఖారీ దీన్ని తన పుస్తకం బుఖారీ షరీఫ్‌లో అధ్యాయంగా పేర్కొన్నారు.

సగం లేదా అంతకంటే ఎక్కువ తక్కువ పంటపై బటాయీ చేయటం. దీన్ని ఖైస్‌ అబూ జాఫర్‌ ద్వారా పేర్కొ న్నారు. మదీనహ్లోని ముహాజిర్లందరూ మూడవ వంతు లేదా నాల్గవ వంతుపై వ్యవసాయం చేసేవారు. ‘అలీ (ర), స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖాస్‌, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌, ‘ఉమర్‌ బిన్‌ ‘అబ్దుల్‌ ‘అ’జీ’జ్‌, ఖాసిమ్‌, ‘ఉర్‌వహ్‌, అబూ బకర్‌ కుటుంబం వారు, ‘ఉమర్‌ కుటుంబం వారు, ‘అలీ కుటుంబం వారు ఇబ్నె సీరీన్‌ అందరూ దీన్ని అనుస రించే వారు. ‘అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ అస్వద్‌ ఇలా అంటు న్నారు, ”నేను అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ య’జీద్‌ పంటలో భాగస్వామిగా ఉండేవాడ్ని. ‘ఉమర్‌ కూడా ప్రజలతో దీన్ని అనుసరించే వారు. ఇందులో ఎటువంటి అభ్యం తరం లేదని, భూమి ఒకరిదైతే శ్రమ ఒకరిది. పంటలో సగం, సగం పంచుకోవాలి అని అభిప్రాయపడ్డారు. ”జుహ్‌రీ కూడా దీన్నే అనుసరించారు.

బు’ఖారీలో ఇలా ఉంది. రా’ఫె బిన్‌ ‘ఖదీజ్‌ (ర) ఇలా అంటున్నారు: ”మదీనహ్లో అందరికంటే మాకు ఎక్కువ భూములు ఉండేవి. మేము భూములను అద్దెకు ఇచ్చేవాళ్ళం. అయితే షరతు ఏమిటంటే ఒక నిర్ణీత పంట మేము తీసుకుంటాము. ఒక్కోసారి మా వంతు పంట నాశనం అయ్యేది. ఒక్కోసారి మరొకరి పంట నాశనమయ్యేది. అందువల్లే దీన్ని వారించడం జరిగింది. అయితే వెండి బంగారాలకు బదులుగా ఇచ్చే సంప్రదాయం ఉండేది కాదు. అయితే ము’జారఅత్‌లోని ప్రత్యేక విధానంలోని మాత్రమే నిషేధించడం జరిగింది. నాల్గవ వంతు, మూడవ వంతు, సగం నిర్ణయించబడితే ఇది ధర్మసమ్మతం అవుతుంది. ప్రవక్త (స) ‘ఖైబర్‌ భూములను ము’జారఅత్‌గా ఇచ్చారు. ప్రవక్త (స) అనుచరులు కూడా ఇలా చేసేవారు. బు’ఖారీలో అనేకచోట్ల దీన్ని గురించి పేర్కొనడం జరిగింది.

[44]) వివరణ-2836: ము’హాఖలహ్‌, ము’జాబనహ్‌, ము’ఖారబహ్‌ను గురించి ఇంతకు ముందే పేర్కొనడం జరిగింది. ముఆవమహ్ అంటే ఎవరైనా తన తోటలోని పళ్ళను లేదా పంటను మూడు నాలుగు సంవత్సరాలు ముందే అమ్మడం నిషేధించడం జరిగింది. ఎందుకంటే ఇందులో మోసం ఉంది. రాబోయే సంవత్సరం పండక పోవచ్చు. సున్యా అంటే మినహాయింపు అంటే ఎవరైనా తోట అమ్మి కొన్ని చెట్లను మినహాయించాడు కాని చెట్లను నిర్ణయించలేదు. దీనివల్ల వివాదం తలెత్త వచ్చు. అదేవిధంగా రాయ అంటే కానుక, ప్రోత్సాహ కాలు. ఇక్కడ అర్థం ఏమిటంటే తోట యజమాని తన చెట్లలో నుండి కొన్ని చెట్లను పేదవానికి ఇచ్చాడు. ఆ చెట్లపై పళ్ళు ఉన్నాయి. వాటిని ఆ పేదవాడు ఎవరికైనా, లేదా యజమానికే ఎండు పళ్ళకు బదులు అమ్మడం. ప్రవక్త (స) దీన్ని ధర్మసమ్మతంగా చేసాడు. దీనివల్ల పేదలకు లాభం కలుగుతుంది. మరికొందరు ‘ఉరాయా అంటే ఇలా పేర్కొన్నారు. నగదు డబ్బులేని పేదవాడు తన కోసం, తన కుటుంబం కోసం ఆహార నిమిత్తం ఎండు ఖర్జూరాలకు బదులు చెట్లపై ఉన్న పండు ఖర్జూరాలు కొనుక్కుంటే అది ధర్మమే. అయితే అవి 5 వసఖ్‌లకు మించరాదు. ఒక వసఖ్‌ 60 సాఅలు అవుతాయి. దీన్నే ముజాబన అంటారు. దీన్ని నిషేధించడం జరిగింది. కాని ‘ఉరాయాను ప్రవక్త (స) అనుమతించారు.

[45]) వివరణ-2840: అంటే ఒకవేళ పచ్చికాయలు అమ్మి ఉండి ఏదైనా ఆపద వస్తే దానివల్ల కాయలు నాశనం అయినా, రాలినా అమ్మినవాడు కొన్నవాడి నుండి దేనికి బదులు డబ్బు తీసుకుంటాడు. ఎందుకంటే కొన్నవాడికి ఏమీ దక్కలేదు.

[46]) వివరణ-2841: అంటే ఎవరైనా పచ్చికాయలుగా ఉన్నప్పుడు తోటను కొన్నాడు. తుఫాను గాలి వల్ల కాయలు రాలిపోయాయి. అమ్మినవారు నష్టానికి తగ్గట్టు ధరను తగ్గించాలి. ధర తీసుకొని ఉంటే అందులో నుండి కొన్నవారికి తిరిగి ఇచ్చి వేయాలి. దీనివల్ల కొన్నవారికి నష్టం తప్పుతుంది. అదేవిధంగా కొన్ని సంవత్సరాల బేరం అంటే కొన్ని సంవత్సరాల పంటను ముందుగానే అమ్మివేయటం. ఇటువంటి బేరం ధర్మసమ్మతం కాదు. ఎవరైనా 10 సంవత్సరాల పంటను 10 వేలకు అమ్ముతున్నాను అని పలికి కొనేవారు 10 వేలు ఇచ్చి కొనుక్కుంటే ఈ పది సంవత్సరాల్లో కరవుతాండ వించవచ్చు, తుఫాను గాలులూ రావచ్చు, పంటలకు నష్టం కలిగించవచ్చు. అందువల్లే ప్రవక్త (స) దీన్నుండి వారించారు. దీన్ని గురించి ఇంతకుముందు కూడా పేర్కొనడం జరిగింది.

[47]) వివరణ-2843: అంటే కొన్న ఆ సరకును మరోచోటుకి మార్చుకొని, తన అధీనంలోకి తీసుకొని ఇతరులకు అమ్మాలి. తన అధీనంలోనికి తీసుకోవడానికి ముందు అమ్మరాదు. అది స్థలమార్పిడి చేయదగినదైనా, చేయదగనిదైనా సరే.

[48]) వివరణ-2845: అంటే సరకులు కొన్నచోటే మరొక వ్యక్తికి అమ్మరాదు. ముందు దాన్ని మరోచోటుకి మార్చుకొని దాన్ని కొలుచుకోవాలి.

[49]) వివరణ-2847: ముసిర్రాత్ సర్రున్‌ నుండి వచ్చింది. అంటే ఆడ జంతువు పొదుములో సంచి కట్టడం. అది బిడ్డకు పాలు త్రాగించకుండా ఉండడానికి. కొందరు మోసం చేయడానికి అనేక రోజుల వరకు పొదుగుపై సంచి కట్టి పాలను ఆపి ఉంచుతారు. కొనేవారు అమ్మేవారిని ఎన్ని పాలు వస్తాయి అని అడిగితే అమ్మేవాడు ఎక్కువ పాలు వస్తాయి అని అంటాడు. అతడు దాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకొని వెళ్ళి పాలు పితికితే చెప్పిన దానికన్నా తక్కువ పాలు వచ్చినట్టు తెలుస్తుంది. అంటే అతడు మోసంచేసాడు. ఒకవేళ ఎవరైనా ఇటువంటి పాలిచ్చే జంతువు కొంటే అతినికి రెండు అధికారాలు ఉన్నాయి. అతనికి ఇష్టమైతే దాన్ని ఉంచుకోవాలి. ఇష్టం లేకపోతే దాన్ని తిరిగి ఇచ్చివేయాలి. తన డబ్బు వాపసు తీసుకోవాలి. దాని పాలు త్రాగినందుకు బదులుగా ఒక సాఅ ఖర్జూరం ఇవ్వాలి.

[50]) వివరణ-2848: జల్బ్ రెండు విషయాల్లో జరుగుతుంది. ఒకటి జకాత్‌లో రెండు గుర్రప్పందాల్లో. జకాత్‌లోని జల్‌బ్‌ ఎలా అంటే తహ్సీల్దారు ఒక ప్రాంతంలో ఉండి జంతువుల యజమానులను తమ జంతువులను తీసుకొని తన వద్దకు రమ్మని అంటాడు. జంతువుల యజమానులకు కష్టం కలుగుతుంది. స్వయంగా తహ్‌సీల్‌దారు జంతువులు ఉన్నచోటికి వెళ్ళి గుర్రం వెంట ఒక వ్యక్తిని నియమించి ఉంచుతాడు. అతడు దాన్ని తోలుతూ ఉంటే అది ముందుకు సాగుతుంది. ఇక్కడ జల్‌బ్‌ అంటే సరకులను బజారుకు తెచ్చే వ్యాపార బృందం. ప్రవక్త (స) ఆదేశానికి అర్థం ఏమిటంటే వ్యాపార బృందంతో ముందుకు వెళ్ళి కలవరాదు. వారిని పట్టణంలోనికి రానివ్వండి. బజారు రేటు ప్రకారం వారిని అమ్మనివ్వండి. ఆ తరువాత వారినుండి కొనండి. ఎందుకంటే ఇందులో ఒక్కోసారి రైతులకు నష్టం కలుగుతుంది. ఒక్కోసారి వ్యాపారులకు నష్టం కలుగుతుంది.

[51]) వివరణ-2849: అంటే సరకులు అమ్మటానికి బజారు లోనికి వచ్చే వర్తకులు, బజారులోని వ్యాపారులు ముందుగానే వారిని కలిసి అమ్మడంగానీ కొనడంగానీ చేయరాదు. వారు బజారులోనికి వచ్చేవరకు ఆగాలి. వారు బజారు రేటుకు అమ్మాలి, కొనాలి.

[52]) వివరణ-2850: నవవీ ఇలా తెలిపారు: ”ఇది ఎలా ఉందంటే ఒక వ్యక్తి మరో వ్యక్తితో నీవు బేరం ఆడిందాన్ని రద్దు చేసివేయి. అటువంటి దాన్నే నేను నీకు అంతకంటే తక్కువ ఖరీదుకు ఇస్తాను. లేదా అంతకంటే మంచి వస్తువును ఆ ధరకే ఇస్తాను అని అంటాడు. ఇలా అనడం తగదు, ఇది నిషిద్ధం. అదేవిధంగా ఒకరు బేరమాడు తుండగా తాను బేరమాడటం నిషిద్ధం. దీని ఉదాహరణ ఎలా ఉందంటే ఒక వ్యక్తి మరో వ్యక్తితో నీవు అమ్మిన వస్తువు అమ్మకాన్ని రద్దుచేయి, నేను నీ నుండి అంత కంటే ఎక్కువ ఖరీదుకు కొంటాను అని అనటం. అదే విధంగా ఒకరు పెళ్ళి సందేశం ఇస్తున్నప్పుడు, తాను కూడా పెళ్ళి సందేశం ఇవ్వడం అంటే ఒక వ్యక్తి ఒక స్త్రీకి పెళ్ళి సందేశం పంపాడు. ఆమె దానికి సమ్మితించింది. అటువంటప్పుడు మరొకరు కూడా ఆమెకు పెళ్ళి సందేశం పంపరాదు. అయితే మొదటి వ్యక్తి తన సందేశం రద్దు చేసి రెండవ వ్యక్తికి అనుమతి ఇస్తే రెండవ వ్యక్తి సందేశం పంపవచ్చు.

[53]) వివరణ-2851: ఇది ఎలాగంటే, అమ్మేవారు, కొనే వారు ఒకధరపై రాజీపడ్డారు. మూడవవ్యక్తి వారి మధ్యలో కలుగ జేసుకొని ధరను పెంచి వారిద్దరినీ విడదీయరాదు.

[54]) వివరణ-2852: అంటే రైతులు తమ సరకులను బజారులో అమ్మకానికి తెస్తే పట్టణవాసులు బ్రోకర్లుగా మారి వారి సరకులను అమ్మించరాదు. వారిని సరకులను బజారుకు తేనివ్వండి. వారిని వదలి వేయండి. వారు తమ ఇష్టం వచ్చినట్లు అమ్ము కుంటారు. దీనివల్ల ఎల్లప్పుడూ పట్టణంలో సరకుల అధిక నిల్వలు ఉంటాయి. దీనివల్ల పట్టణవాసులకు లాభం కలుగుతుంది. ఎందుకంటే దలాలులు సరకులను అధిక ధరలకు అమ్ముతారు. దీనివల్ల పట్టణవాసులు కష్టాలకు గురవుతారు.

[55]) వివరణ-2853: ములామసహ్, మునాబజ’హ్ అనేక విధాలుగా ఉన్నాయి. ‘హదీసు’లో ఉన్న ఒక విధా నాన్నే పేర్కొనడం జరిగింది. అయితే నవవీ (ర) ముస్లిమ్‌ వివరణలో దీని మూడు రకాలను పేర్కొ న్నారు. ఒక రకం ఏమిటంటే అమ్మేవాడు ఒక వస్త్రాన్ని మడత పెట్టి లేదా చీకటిలో తీసుకొనివస్తే కొనేవాడు దాన్ని ముట్టు కుంటాడు. అమ్మేవాడు నేను ఈ వస్త్రాన్ని ఒక షరతుపై నీకు అమ్ముతున్నాను అదేమిటంటే, నీవు ముట్టుకుంటే నీవు చూచినట్లే. ఆ తరువాత నీవు చూస్తే నీకు ఏమాత్రం అధికారం ఉండదు. రెండవది ఏమిటంటే నీవు ముట్టుకుంటే నీవు కొనుకున్నట్టే అని అమ్మేవాడు కొనేవాడితో అనటం. మూడవది ఏమిటంటే సభలో ముట్టుకుంటే ఆ తరువాత ఎటువంటి అధికారం ఉండదు. ఈ మూడు రకాలు నిషిద్ధమైనవే.

అదేవిధంగా మునాబజ’హ్కు కూడా మూడు అర్థాలు ఉన్నాయి. ఒక రకం ఏమిటంటే వస్త్రాన్ని విసరటాన్ని బేరం అయిందని భావించటం. ఇది ఇమామ్‌ షాఫయి (ర) అభిప్రాయం. రెండవది ఏమిటంటే విసరటం వల్ల అధికారం నశిస్తుంది. మూడవది ఏమిటంటే విసరటం అంటే కంకరరాయి విసరటం అంటే కొనేవారు కంకరరాయిని అమ్మేవారి అనుమతితో ఏదైనా వస్తువుపై విసరటం వల్ల దేనిపై పడితే దాన్ని తీసుకోవ టం తప్పనిసరి అవుతుంది. అది చిన్నదైనా పెద్దదైనా సరే. ఇవన్నీ అజ్ఞానకాలపు వ్యాపార విధానాలు. ఇవన్నీ అప్పటి జూదం. అందువల్లే ప్రవక్త (స) వారించారు. అదేవిధంగా ప్రవక్త (స) రెండు విధాల దుస్తులు ధరించటాన్ని ‘హదీసు’లో వివరించడం జరిగింది. మరోవిధం ఏమిటంటే ఒక వ్యక్తి తన శరీరాన్నంతా బట్టతో పూర్తిగా కప్పుకోవటం. తలనుండి పాదాల వరకు పూర్తిగా కప్పుకోవటం. మరికొందరు ఒక వ్యక్తి శరీరమంతా కప్పి ఉంచినా మర్మాంగం బహిర్గతం అవటం అని అభిప్రాయపడ్డారు. ఈ రెండు విధానాలూ నిషిద్ధమైనవే. మరో దుస్తులు ఏమిటంటే ఒకే వస్త్రాన్ని ధరించి కూర్చుంటే మర్మాంగం బహిర్గతం అవటం. మర్మాంగం కనబడకుండా ధరిస్తే ధరించవచ్చు.

[56]) వివరణ-2854: నవవీ (ర) ముస్లిమ్‌ వివరణలో ఇలా పేర్కొన్నారు. ”కంకరరాయి బేరానికి మూడు అర్థాలు ఉన్నాయి. 1. అమ్మేవాడు ఈ కంకరరాయి పడిన సరకంతా నేను నీకు అమ్మాను అని పలకటం. 2. ఇందులో అమ్మేవాడు నేను కంకరరాయి విసిరేవరకూ నీకు అధికారం ఉంది. ఆ తరువాత అధికారం లేదు అని అనటం. 3. అమ్మేవాడు ఈ వస్త్రంపై నేను కంకరరాయి కొడితే అది అమ్మడం అయినట్టే అని పలకటం. కాని మోసపూరితమైన బేరం మరీ విపరీతమైనది. వ్యాపార అధ్యాయంలో అనేక విధాలు సూచనలు ఉన్నాయి. ఉదా: పారిపోయి వచ్చిన బానిస గురించి నీటిలోని చేపల గురించి, పొదుగులో ఉన్న పాలు గురించి, గర్భంలో ఉన్న బిడ్డను గురించి, ఎగురుతున్న పక్షి గురించి, నిర్థారించబడని సంచి, వస్త్రం, మేక మొదలైనవి. ఇవన్నీ రద్దు చేయదగినవే. ఎందుకంటే వీటన్నిటిలో మోసం ఉంది.

[57]) వివరణ-2855: ‘హబ్‌లుల్‌ ‘హబ్‌ల్‌ వివరణ అబ్దు ల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) వివరించినట్లుగానే ఉంది. మరికొందరు దీన్ని ఈ విధంగా పేర్కొన్నారు. గర్భం ధరించి ఉన్న ఒంటె బిడ్డను కన్న తరువాత, ఆ బిడ్డ పెరిగి పెద్దదై గర్భవతియై బిడ్డను కన్న తర్వాత దాన్ని కొనడం లేదా అమ్మడం. అందువల్ల ప్రవక్త (స) దీన్ని నిషేధించారు. ఎందుకంటే ఇందులో మోసం ఉంది. ఆ ఒంటె బిడ్డను కంటుందో లేదో తెలియదు. మగ బిడ్డ కంటుందో లేక ఆడ బిడ్డ కంటుందో కూడా తెలియదు. దీన్ని బైనతా జున్నతాజ్‌ అంటారు. అజ్ఞాన కాలంలో ఈ విధంగా బేరాలు జరిగేవి.

[58]) వివరణ-2856: అంటే మగ జంతువును ఆడ జంతువుపై ఎక్కించటానికి ప్రతిఫలాన్ని నిషేధించారు. అస్బ్అంటే మగ జంతువు యొక్క వీర్యం. అంటే మగ జంతువును ఆడ జంతువుపై ఎక్కించి దాని వీర్యాన్ని కొనటం లేదా అమ్మటాన్ని నిషేధించారు. ఎందుకంటే ఇందులో నిర్థారణ జరుగదు. నిర్థారణ లేని వ్యాపారం ధర్మసమ్మతం కాదు.

[59]) వివరణ-2857: మగ జంతువును ఆడ జంతువుపై ఎక్కించటాన్ని గురించి ఇంతకు ముందు పేర్కొనటం జరిగింది. మిగిలిన నీటిని అమ్మటం గురించి క్రింద పేర్కొనటం జరుగుతుంది. భూమిని గురించి ఇంతకు ముందు పేర్కొనడం జరిగింది.

[60]) వివరణ-2858: నవవీ ముస్లిమ్‌ వివరణలో ఈ ‘హదీసు’ గురించి ఇలా పేర్కొన్నారు, ”మరో ఉల్లేఖ నంలో ఇలా ఉంది, ”అధికంగా నీరు ఉంచటాన్ని వారించారు. దీనివల్ల అత్యధికంగా పచ్చగడ్డి ఆగి ఉంటుంది. మరో ఉల్లేఖనంలో మిగిలిగిన నీటిని అమ్మ రాదని దానివల్ల మిగిలిన పచ్చగడ్డి అమ్మబడుతుందని ఉంది. దీని అర్థం ఏమిటంటే, అడవిలో ఒక వ్యక్తి వద్ద బావి ఉంది. దాని నుండి అవసరానికి మించిన నీరు వస్తుంది. ఆ అడవిలో గడ్డి కూడా ఉంది. అయితే నీరు మాత్రం ఆ బావిలో తప్ప మరెక్కడా లభించదు. కాపరులు కూడా ఆ బావి నుండి తప్ప వారు తమ జంతువులను ఆ అడవిలో మేపలేరు. ఇప్పుడు ఆ బావి యజమాని నీరు ఇవ్వక పోయినా, లేదా దానికి ప్రతిఫలం తీసుకున్నా, గడ్డిమేసి నందుకు కూడా ప్రతిఫలం తీసుకున్నా ఇది నిషిద్ధమే. అయితే మన సోదర విద్వాంసులు మాత్రం అవసరానికి మించి నీళ్ళు ఉంటే ఉచితంగా ఇవ్వాలి అంటారు. అయితే ఈ క్రింది షరతు లతో 1. అక్కడ నీళ్ళు ఉండరాదు. 2. జంతువులకు త్రాపించటానికి ఇవ్వాలి. వ్యవసాయానికి కాదు. 3. యజమానికి దాని అవసరం ఉండకూడదు. అయితే సరైన అబిప్రాయం ఏమిటంటే తన భూమిలో బావి లేదా ఊట త్రవ్వితే నీళ్ళు అతని సొత్తు అవుతుంది. అయితే కొందరు నీళ్ళు అతని సొత్తు అవదు. నీళ్ళు అతని పాత్రల్లో తీసుకుంటే అతని సొత్తు అవుతుంది అని అంటారు. ఇదే సరేన అభిప్రాయం.

[61]) వివరణ-2861: ఇది ఎలాగంటే ఒక వ్యక్తి అమ్ముతూ ఇదంతా అమ్మాను కాని ఏమీ అమ్మలేదు అని అంటాడు. అంటే ఇది నిర్థారించబడిలేదు. ఎంత అమ్మాడో, ఎంత అమ్మలేదో తెలియదు. దీనివల్ల వివాదం తలెత్తుతుంది. అందువల్లే దీన్ని నిషేధించారు. నిర్థారించితే ఇలా చేయవచ్చును.

[62]) వివరణ-2862: అంటే పచ్చి ద్రాక్షను అమ్మరాదు. అవి పండి నల్లగా మారిపోవాలి. అదేవిధంగా పచ్చి ఆహార ధాన్యాలను కూడా కోతకు వచ్చేవరకు అమ్మటాన్ని నిషేధించారు.

[63]) వివరణ-2863: అంటే రెండు వైపుల అరువు వ్యవహారం కూడదన్నారు. ఇది ఎలాగంటే, ఒక వ్యక్తి ఏదైనా వస్తువు అరువుగా కొన్నాడు. తాను చెప్పిన సమయం పూర్తవగానే దాని వెల ఇవ్వలేకపోయి, దాని ధర మరికొంత పెంచి మరికొంత గడువు తీసుకుని, అంటే అరువుకు బదులు అరువు వ్యవహారం అయింది. ఇరుపక్షాల్లో ఏ ఒక్కరికీ నగదు లభించలేదు. అంటే అరువు ఇవ్వటంలో ఆలస్యం అయింది.

[64]) వివరణ-2864: బై ‘ఉర్‌బాన్‌ అంటే, కొనేవారు అమ్మే వారికి బయానాగా కొంతసొమ్ము చెల్లిస్తారు. ఒకవేళ నేను ఇది తీసుకోకపోతే ఆ సొమ్ము అమ్మేవాడిది అయిపోతుంది. ఒకవేళ నేను తీసుకుంటే బైఆనా ధరలో తీసివేయడం జరుగుతుంది అని పలకడం. దాన్ని ”బైఆనా” హిందీలో ”సాయి” అంటారు.

[65]) వివరణ-2865: బైము’ద్’తర్‌ అంటే ఒకరి నుండి బలవంతంగా కొనటం. అంటే ఫలానా వస్తువును నాకు అమ్మివేయి లేకపోతే నేను నిన్ను చంపివేస్తాను అని అనటం. ఈ విధంగా భయపెట్టి ఏదైనా వస్తువు కొంటే ఆ బేరం రద్దవుతుంది. ఎందుకంటే నిస్సహాయస్థితిలో, ఇష్టం లేకుండా అమ్మడం నిషేధించడం జరిగింది. బై’గరర్‌ గురించి ఇంతకు ముందు పేర్కొనటం జరిగింది.

[66]) వివరణ-2868: ఒక బేరంలో రెండు బేరాలు అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఒకవేళ నీవు నగదుకొంటే ఈ వస్త్రాన్ని నీకు 10 రూపాయలకు అమ్ముతాను, ఒకవేళ అరువుగా కొంటే 15 రూపాయల్లో అమ్ముతాను, నీవు నీ వస్త్రాన్ని 10 రూపాయలకు నాకు అమ్మాలి అని షరతు పెట్టటం.

[67]) వివరణ-2870: సల్‌ఫ్‌ మరియు బేరాన్ని కలిపి వ్యవహారం చేయరాదు. ఉదా: ఒక వ్యక్తి మరోవ్యక్తితో ఈ బానిసను 1000 రూపాయలకు నీకు అమ్ముతున్నాను, షరతు ఏమిటంటే ఫలానా సరకులకు నా నుండి 1000 రూపాయల బైసలమ్ చేయాలి. లేదా 1000 రూపాయలు అప్పుగా ఇవ్వాలి. ఎందుకంటే మొదటి పద్ధతిలో బేరంలో ఒక షరతు తగిలింది. రెండవ పద్ధతిలో షరతు కాక అప్పు ఇచ్చేవారు లాభం పొందారు. అప్పు ఇచ్చి లాభం పొందగోరడం వడ్డీ అవుతుంది. వ్యాపారంలో రెండు షరతులు సరైన పద్ధతి కాదు. అంటే ఒక వ్యవహారంలో రెండు వ్యవహారాలు చేయడం తగదు. దీన్ని గురించి ఇంతకు ముందు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా తన అధీనంలో రాని వస్తువును అమ్మి లాభం పొందడం ధర్మం కాదు. నేటి వ్యాపారుల్లో ఈ అలవాటు ఉంది. సరకులు కొనుక్కుంటారు. అయితే ఇది నోటితోనే జరుగుతుంది. అంతేకాదు తన అధీనంలోనికి రాకముందే లాభానికి ఇతరులకు అమ్మివేస్తారు. ఆ వ్యక్తి మరో వ్యక్తికి అమ్మివేస్తాడు. వ్యాపారుల పరిభాషలో దీన్ని సట్ట అంటారు. దీని కారణంగా వేలమంది నష్టాలకు గురవుతున్నారు. ఇదీ ఒక రకమైన జూదమే. దీన్ని ప్రవక్త (స) నిషేధించారు.

[68]) వివరణ-2871: దిర్హమ్లు వెండితో చేయబడి ఉంటాయి.దీనార్లు బంగారంతో చేయబడి ఉంటాయి. బంగారం తీసుకున్నప్పుడు బంగారానికి బదులు బంగారం తీసుకోవాలి. ప్రవక్త (స) ఇది ధర్మం అని అన్నారు. అయితే ఆ రోజు మార్కెట్టు ధరప్రకారం ఉండాలి. నగదుగా అమ్మకం చేయాలి. సర్‌ఫ్‌ వ్యాపారంలో చేసినట్లు, అప్పుగా కాదు.

[69]) వివరణ-2872: అదా ప్రవక్త (స) అనుచరుల్లోని ఒకరు. ఇతడు ప్రవక్త (స) నుండి ఒక బానిసను కొన్నారు. అప్పుడు ప్రవక్త (స) ఒక వ్యాపార పత్రం వ్రాయించారు. ఆ విషయమే పై ‘హదీసు’లో పేర్కొనడం జరిగింది. అందులో ఈ బానిసలో ఎటువంటి లోపంగానీ, అనైతికతగానీ, లోపంగానీ లేదని ఉంది. ఈ ‘హదీసు’లో కొనేవారు అదా బిన్‌ ఖాలిద్‌, అమ్మేవారు ప్రవక్త (స) అని తెలుస్తుంది.

బు’ఖారీలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) అదా బిన్‌ ‘ఖాలిద్‌ నుండి కొన్నారు. అంటే ఇవి రెండు సంఘటనలని తెలుస్తుంది.

[70]) వివరణ-2873: ఇది సంక్షిప్తమైన ‘హదీసు’. అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్లలో ఈ ‘హదీసు’ను పూర్తిగా వివరించటం జరిగింది. అనస్‌ (ర) కథనం, ”అవసరం ఉండి ఒక అ’న్సారీ ప్రవక్త (స) వద్దకు వచ్చి తన అవస రాన్ని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స) మీ ఇంట్లో ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. దానికి ఆ వ్యక్తి ఒక కంబళి ఉంది. దాని కొంతభాగాన్ని పరచుకుంటాను, కొంతభాగాన్ని కప్పుకుంటాను. ఒక కప్పు కూడా ఉంది. దాంతో నేను నీళ్ళు త్రాగుతాను. అప్పుడు ప్రవక్త (స) వెళ్ళి ఆ రెంటిని తీసుకు రా అని అన్నారు. అతడు తీసుకొని వచ్చాడు. అప్పుడు ప్రవక్త (స) వాటిని తన చేతిలోనికి తీసుకొని ఈ రెంటినీ ఎవరు కొంటారు అని అన్నారు. ఒక వ్యక్తి ఒక దిర్‌హమ్‌ అంటే నాలుగు అణాలకు కొటాను అని అన్నాడు. ప్రవక్త (స) మళ్ళీ ఇంతకంటే అధికంగా ఎవరైనా ఇస్తారా అని అన్నారు. మరో వ్యక్తి రెండు దిర్‌హమ్‌లకు అంటే ఒక అర్థ రూపాయికి కొంటాను అని అన్నాడు. ప్రవక్త (స) 8 అణాలలో రెంటిని అమ్మివేసారు. ఆ వచ్చిన డబ్బును అతని చేతిలో పెట్టి ఇలా అన్నారు. 4 అణాల ఆహార ధాన్యాలను ఇంట్లో వేయి. పావలాతో గొడ్డలి కొని తెచ్చుకో అని అన్నారు. ఆ వ్యక్తి అలాగే కొని తెచ్చాడు. ప్రవక్త (స) స్వయంగా తన చేతులతో దాన్ని అమర్చి ‘అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి బజారులో అమ్ముకో, 15 రోజుల వరకు నా వద్దకు రాకు’ అని అన్నారు. ఆ వ్యక్తి వెళ్ళిపోయి అడవి నుండి కట్టెలు కొట్టి తెచ్చి బజారులో అమ్మేవాడు. ఈ విధంగా అతనికి రెండున్నర రూపాయలు లభించాయి. వాటిలో నుండి కొంత డబ్బుతో ఆహార ధాన్యాలు, కొన్ని వస్త్రాలు కొన్నాడు. ప్రవక్త (స) చేతి సంపాదన బిచ్చమెత్తు కోవటం కంటే ఎంతో ఉన్నతమైనది, ఎందుకంటే బిచ్చమెత్తు కొనేవారి ముఖాలపై అర్థింపు చిహ్నం ఉంటుంది. వాటి ద్వారా తీర్పుదినం నాడు పోల్చుకోబడతారు, వీరు బిచ్చమెత్తు కునేవారని. ముగ్గురు వ్యక్తులు అర్థించగలరు: 1. దారి ద్య్రం క్రింద పడవేసి పూర్తిగా నష్టపోయిన వ్యక్తి, 2. అప్పుల వల్ల పూర్తిగా దారిద్య్రానికి గురైన వ్యక్తి, 3. హత్యా పరిహారం బాధ్యత తనపై వేసుకున్న వ్యక్తి. ఆ బాధ్యత ఆందోళనకు గురిచేసిన వ్యక్తి. (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

[71]) వివరణ-2875: అంటే మగ ఖర్జూరాల పువ్వులను ఆడ ఖర్జూరాల పువ్వులపై వేయటం, దాని వల్ల ఆడ పువ్వులు గర్భాన్ని ధరిస్తాయి. దైవకృపవల్ల అత్యధికంగా పళ్ళు పండుతాయి. ఒకవేళ ఎవరైనా ఇటువంటి ఖర్జూరాలతోట కొంటే ఆ సంవత్సరం పండిన పండ్లు అమ్మేవారికి లభిస్తాయి. కొనేవారు షరతు పెడితే వారికి లభిస్తాయి. అదేవిధంగా ధన వంతుడైన బానిస కూడా. అంటే బానిస ధనం అమ్మేవాడిది అవుతుంది. అయితే కొనేవారు ధనం కూడా నాదౌతుందని షరతు పెట్టకుంటే.

[72]) వివరణ-2876: జాబిర్‌ (ర) తన ఒంటెను ప్రవక్త (స) కోరికపై ప్రయాణంలోనే ప్రవక్త (స)కు అమ్మివేసారు. అంటే ప్రయాణంలో అమ్మటం, కొనటం, అప్పు తీసుకోవటం ధర్మసమ్మతం అన్నమాట. ఈ ఉల్లేఖనం ద్వారా ఒక ఊఖియకి అమ్మారని, ఇతర ఉల్లేఖనాల ద్వారా 2 ఊఖియాలకు అమ్మారని, మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా 5 ఊఖియాల బంగారం, వెండి కూడా ఉంటుంది. అంటే ఊఖియా అంటే బంగారం ఊఖియా అని అర్థం. 5 ఊఖియాలు అంటే వెండి ఊఖియాలు అని అర్థం. ప్రవక్త (స) ఒక్కసారి కొట్టటం వల్ల చాలా వేగంగా నడవసాగింది. దీనికి ముందు జాబిర్‌ దాని బలహీనత వల్ల దాన్ని అడవిలోనే వదలిపోవాలని అనుకున్నారు. ప్రవక్త (స) మహిమవల్లనే అది ప్రవక్త (స) ఒకసారి కొట్టగానే వేగంగా పరిగెత్తసాగింది. కొనుగోలు, అమ్మకం విషయంలో షరతుపెట్టుకోవచ్చని, ఈ హదీసు ద్వారా తెలిసింది. మాలిక్‌, అహ్‌మద్‌ బిన్‌ హంబల్‌ వద్ద ఇటు వంటి షరతులు పెట్టుకోవచ్చు. షాఫియీ, అబూ హనీఫాల వద్ద ఇటువంటి షరతులు పెట్టరాదు.

మరో విషయం ఏమిటంటే, అసలు ప్రవక్త (స) కు కొనే ఉద్దేశం లేదు. ఉపకారం చేసే ఉద్దేశంతో అలా చేసారు. అందువల్లే ఇంటికి వచ్చిన తర్వాత ఒంటె ఖరీదును కూడా ఇచ్చారు. ఒంటెను కూడా తిరిగి ఇచ్చేసారు. లేదా ప్రయాణంలో జాబిర్‌ (ర) తన దుస్థితిని విన్నవించు కుంటే ప్రవక్త (స) ఇలా చేసి ఉంటారు. దానధర్మాల విషయంలో ప్రవక్త (స) ఒక చిన్న ఉపమానం ఇది. ఈ హదీసు ద్వారా తెలిసిన మరో విషయం ఏమిటంటే కొనేవారు ఒకవేళ తన సంతోషంతో ధరకంటే అధికంగా ఇస్తే తీసుకోవచ్చును.

[73]) వివరణ-2877: బరీరహ్ ఒక బానిసరాలి పేరు. ఇంతకుముందు ఈమె ఒక యూదుని వద్ద ఉండేది. ఈమె తన యజమానులతో ప్రతి నెల ఇంత ఇస్తాను. మొత్తం పూర్తి అవగానే నేను విడుదల అయిపోతాను. యజమాని ఒప్పుకొని ఈ విధంగా చేస్తే ఆమె విడుదల చేయబడుతుంది. బరీరహ్ తన యజమానులతో 9 ఊఖియాలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒప్పందం మొత్తాన్ని ఇచ్చే ఏ  మార్గమూ లేకుండా పోయింది. చేసేదిలేక ‘ఆయి’షహ్‌ (ర) వద్దకు వెళ్ళి, ‘మీరు గనక సహాయం చేస్తే నా యజమానులకు మొత్తాన్ని ఇచ్చి విడుదల అవుతాను’ అని విన్నవించు కుంది. అప్పుడు ‘ఆయి’షహ్‌ (ర) ‘నీవు కోరితే నేను ఒకేసారి ఆ మొత్తాన్ని ఇచ్చి విడిపించి నిన్ను విడుదల చేయగలను. అయితే వలా’ నాకు చెందాలి’ అని అన్నారు. వలా’ అంటే ఒక హక్కు. ఒకవేళ బానిస లేక బానిసరాలు చనిపోతే వారి ధనానికి వారిని విడుదల చేసినవారు వారసులౌతారు. ప్రవక్త (స) ఈ హక్కును కానుకగా ఇవ్వటాన్ని, అమ్మటాన్ని నిషేధించారు. దీన్ని గురించి రాబోవు పేజీల్లో పేర్కొనడం జరుగుతుంది. బరీరహ్ వెళ్ళి తన యజమానులతో ఈ విషయాన్ని పెట్టారు. కాని ఆమె యజమానులు వలా’ ఇవ్వటాన్ని నిరాకరించారు. ఈ విషయం తెలిసిన ప్రవక్త (స) తన ప్రసంగంలో వలా’ విడుదల చేసిన వారికే లభిస్తుందని బహిరంగంగా ప్రకటించారు. ఖుర్‌ఆన్‌ ‘హదీసు’లో లేని షరతులు ఎంత మాత్రం చెల్లదని తేల్చి చెప్పేసారు.

[74]) వివరణ-2878: ఎందుకంటే వలా’ అంటే ధనం కాదు. అది బానిసకు అతన్ని విడుదల చేసినవారికీ మధ్య గల సంబంధం. దాన్ని అమ్మటంగానీ, కానుకగా ఇవ్వటం గానీ తగదు. ఉదా: తండ్రీ కొడుకుల మధ్య ఒక సంబంధం ఉంటుంది. ఇది ఒక రకమైన బంధుత్వం, బానిసకు అతన్ని విడుదల చేసినవారికీ మధ్య ఉంటుంది.

[75]) వివరణ-2880: అంటే అమ్మేవారు కొనేవారి మధ్య ధరలో షరతుల్లో భేదాభిప్రాయం ఏర్పడితే, వారి వద్ద సాక్షులూ లేకపోతే, ఇటువంటి పరిస్థితిలో అమ్మేవారి వాదనకు ప్రామాణికత ఉంటుంది. కొనేవారు అమ్మేవారి అభిప్రాయానికి అనుగుణంగా బేరాన్ని కొనసాగించ వచ్చు. లేదా రద్దు చేయవచ్చు.

[76]) వివరణ-2881: ఏదైనా వ్యవహారాన్ని రద్దు చేయటాన్ని ఇఖాల అంటారు. అంటే ఒకవ్యక్తి ఒక వస్తువు కొన్నాడు, లేదా అమ్మాడు. వ్యవహారం ముగిసిన తర్వాత ఇందులో నష్టం ఉందని, ఆ వస్తువు నచ్చలేదని కొన్నవ్యక్తికి తెలిసి అమ్మిన వ్యక్తితో దయచేసి ఈ వ్యవహారాన్ని రద్దుచేసి వేయండి. నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చివేయండి అని అంటే, అమ్మిన వ్యక్తి తన ముస్లిమ్‌ సోదరున్ని లాభం చేకూర్చడానికి ఆ వ్యవహారాన్ని రద్దుచేస్తే, తీర్పుదినం నాడు అల్లాహ్‌ (త) దానికి బదులుగా అతని పాపాలను క్షమిస్తాడు.

[77]) వివరణ-2886: అంటే వాహనంగా ఉపయోగపడే జంతువు లేదా పాలిచ్చే జంతువు తాకట్టు ఉంచబడితే దాని సంరక్షణ బాధ్యతలు, ఖర్చులకు బదులుగా దాన్ని వాహనంగా ఉపయోగించగలడు, దాని పాలు త్రాగ గలడు. అయితే తన ఖర్చులకు సమానంగానే ఉపయోగించాలి. ఖర్చులకు మించి ఉపయోగిస్తే తాకట్టు ఉంచిన వ్యక్తికి తిరిగి ఇచ్చివేయాలి. ఒకవేళ ఖర్చులకు మించి లాభం పొందితే, అది వడ్డీ అవుతుంది. ఇది నిషిద్ధం. ఎందుకంటే అరువుకు బదులు పొదిన లాభం వడ్డీ అవుతుంది. లాభనష్టాలు తాకట్టు ఉంచిన వాడివి. అంటే ఆ జంతువు బిడ్డనిచ్చినా, ఆ జంతువు చనిపోయినా జంతువు యజమానిదే బాధ్యత.

[78]) వివరణ-2888: అంటే తాకట్టు ఉంచడం వల్ల వస్తువు యజమాని అధికారం కోల్పోడు. అతని అధీనంలోనే ఉంటుంది. దానివల్ల లాభం కలిగినా, నష్టం కలిగినా యజమానిదే.

[79]) వివరణ-2889: అంటే కొలపాత్ర మదీనహ్ వారిది  ప్రామాణికమైనది. ‘జకాత్‌ విషయంలో ఏ ముద్‌, ‘సా’అలతో ‘జకాత్‌, ఫిత్‌రహ్‌ ఇచ్చేవారో వాటి ద్వారానే ప్రవక్త (స) తర్వాత కూడా ఇవ్వబడుతుంది. ప్రవక్త (స) కాలంలో ఒక సా సుమారు 2 ½  సేర్లు ఉండేది. ఒక ముద్‌ ‘సాఅకు 1/4 వంతు (4’సాఅ’లు=ముద్‌) ఉండేది. అయితే మక్కహ్ వారి తూనికకు ప్రామాణికత ఉంది.

[80]) వివరణ-2890: వ్యవహారాల్లో కొలతలకు, తూని కలకు చాలా ప్రాధాన్యత ఉంది. కొలతలు, తూనికలు సరిగా ఉంటే ప్రతివ్యక్తి సంతోషిస్తాడు. అల్లాహ్‌ (త) కూడా సంతోషిస్తాడు. హెచ్చుతగ్గుల వల్ల ప్రజలు అసహ్యించు కుంటారు. తూనికలు, కొలతల అసలు ఉద్దేశం ప్రతి ఒక్కరికీ వారి హక్కు పూర్తిగా ఇప్పించటమే. ఎటువంటి అన్యాయం జరక్కుండా ఉండటమే. ఖుర్‌ఆన్‌లో దీన్ని గురించి ప్రత్యేకంగా పేర్కొనటం జరిగింది. అల్లాహ్‌ ఆదేశం: ”మరియు ఆయనే ఖగోళాన్ని పైకెత్తి ఉంచాడు మరియు ఆయనే త్రాసును నెలకొల్పాడు. తద్వారా మీరు తూకంలో మోసానికి పాల్పడ కూడదని!  మరియు న్యాయంగా తూకం చేయండి మరియు తూకంలో తగ్గించకండి. (సూ. అర్రహ్మాన్‌, 55:7–9)

ఈ తూనికవల్లే మానవుని వాక్కర్మలు ఒకటిగా ఉంటాయి. వీటివల్లే విశ్వ వ్యవస్థ పటిష్ఠంగా ఉంటుంది. కొలతల్లో, తూనికల్లో హెచ్చుతగ్గులు చేయడం వాస్తవంగా ఇతరుల హక్కులను కొల్లగొట్టడమే. కొందరు ఇచ్చేటప్పుడు తగ్గిస్తారు. తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకుంటారు. ఇటువంటి వారు ఇతరుల ఆస్తులకు అన్యాయంగా ఆక్రమణకు పాల్పడతారు. ప్రాచీన జాతుల్లో షు’ఐబ్‌ (అ) జాతి ఒకటి. ఈ జాతి వ్యాపారం చేసేది. షు’ఐబ్‌ (అ) ఈ జాతిని సంస్కరణ గురించే పంపడం జరిగింది. ప్రత్యేకంగా కొలతల, తూనికల గురించి హితబోధచేసేవారు. అల్లాహ్‌ ఆదేశం: ”అతను వారితో అన్నాడు: ‘నా జాతి ప్రజలారా! అల్లాహ్‌నే ఆరాధించండి, మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు. వాస్తవంగా, మీ వద్దకు, మీ ప్రభువు దగ్గర నుండి స్పష్టమైన (మార్గదర్శకత్వం) వచ్చి వున్నది. కొలిచేటప్పడు మరియు తూచేటప్పుడు పూర్తిగా ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిపై సంస్కరణ జరిగిన తరువాత కల్లోలాన్ని రేకెత్తించకండి. మీరు విశ్వాసులే అయితే, ఇదే మీకు మేలైనది.’ ” (సూ. అల్‌ అ’అరాఫ్‌, 7:85)

సూరహ్‌ హూద్‌(11)లోనూ ఈ విధంగానే పేర్కొనడం జరిగింది: ”…అతను అన్నాడు: ‘ఓ నాజాతి ప్రజలారా! మీరు అల్లాహ్‌నే ఆరాధించండి. ఆయనతప్ప  మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. కొలతల్లోమరియు తూనికల్లో తగ్గించి ఇవ్వకండి. నేను నిశ్చయంగా, మిమ్మల్ని (ఇప్పుడు) మంచి స్థితిలో చూస్తున్నాను; కాని వాస్తవానికి మీపై ఆ రోజు చుట్టుముట్టబోయే శిక్షను గురించి నేను భయపడుతున్నాను.

మరియు ఓ నా జాతి ప్రజలారా! మీరు న్యాయంగా మరియు సరిగ్గా కొలవండి మరియు తూకంచేయండి. మరియు ప్రజలకు వారి వస్తువులను తక్కువజేసి ఇవ్వకండి. మరియు భూమిలో అనర్థాన్ని, కల్లోలాన్నివ్యాపింపజేయకండి. ‘మీరు విశ్వాసులే అయితే, (ప్రజలకు వారి హక్కు ఇచ్చిన తరువాత) అల్లాహ్‌ మీ కొరకు మిగిల్చినదే మీకు మేలైనది. మరియు నేను మీ రక్షకుడను కాను.’ ” (సూ. హూద్‌, 11:84-86)

సూరహ్‌ షూరాలో(26) కూడా ఈ అంశాలే పేర్కొనడం జరిగింది. సూరహ్‌ అల్ అన్‌ ఆమ్‌(6)లో అందరినీ ఉద్దేశించి పూర్తిగా తూచండి, కొలవండి అని ఆదేశించడం జరిగింది. సూరహ్‌ బనీ ఇస్రాయీల్‌(17)లో చేసిన హితబోధల్లో ఇటువంటి బోధనలు కూడా ఉన్నాయి. అల్లాహ్‌ ఆదేశం: ”మరియు మీరు కొలిచి ఇచ్చేటప్పుడు కొలత పాత్ర నిండుగా కొలిచి ఇవ్వండి. మరియు (తూచి ఇచ్చేటప్పుడు) త్రాసుతో సమానంగా తూకం చేయండి. ఇదే మంచి పద్ధతి మరియు (ఇదే) చివరకు మంచి ఫలితం ఇస్తుంది..” (సూ. అల్-ఇస్రా’, 17:35)

తూనికల్లో, కొలతల్లో హెచ్చుతగ్గులు చేసేవారికి మంచి జరుగదు. ప్రపంచలోనూ వారి ధనం నాశనం అవుతుంది. పరలోకంలోనూ వారికి కఠినమైన శిక్ష పడుతుంది. సూరహ్‌ ముతప్ఫిఫీన్‌(83)లో ఇలా ఆదేశించడం జరిగింది: ”తూనికల్లో, కొలతల్లో తగ్గించి ఇచ్చేవారికి వినాశనం ఉంది. వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు.” (అల్‌ ముతఫ్ఫిఫీన్‌, 83:1-3)

ఎందుకంటే తూనికల్లో, కొలతల్లో ప్రజలకు మోసం జరుగు తుంది. వారి హక్కుల్లో ద్రోహం జరుగుతుంది. సరిగా తూయటం, కొలవటం అమానతు వంటిది. అమానతులో ఖియానత్‌ చేసేవారికి కఠిన శిక్షలు ఉన్నాయి. ప్రపంచంలో కరువుకు గురవుతారు. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ఓ ముహాజిరులారా! మీరు ఐదు విషయాలకు గురయితే మీకు ఎటువంటి మంచి లభించదు. మీరు వాటికి గురికావటం నుండి నేను అల్లాహ్(త)ను శరణుకోరుతున్నాను. 1. ఏ జాతిలో విచ్చలవిడిగా అశ్లీలం వ్యాపిస్తుందో, సిగ్గు లజ్జ లేకుండా పోతుందో ఆ జాతి ప్లేగు మరియు ఇతర ప్రమాదకరమైన రోగాలకు, అంతకు ముందులేని వ్యాధులకు గురవు తుంది. 2. ప్రజలు తూనికల్లో కొలతల్లో హెచ్చుతగ్గులు చేస్తే కరవుకాటకాలకు కఠిన హృదయులైన పాలకుల అత్యాచారాలకు గురవుతారు. 3. ‘జకాత్‌ ఇవ్వడం మానివేస్తే ఆకాశం నుండి వర్షం పడటం ఆగిపోతుంది. ఒకవేళ జంతువులే లేకపోతే ఒక్క చుక్క వర్షం కూడా పడి ఉండేది కాదు. 4. అల్లాహ్‌(త) మరియు ఆయన ప్రవక్త (స) ఆదేశాలను హీనదృష్టితో చూచేవారిని శత్రువులకు గురిచేస్తారు. వారు వీరి ధనసంపదలను దోచుకుంటారు. 5. అదేవిధంగా పండితులు, నాయకులు అల్లాహ్‌ గ్రంథం ప్రకారం తీర్పులు చేయకపోతే పరస్పర పోరాటాలు ఉద్భవిస్తాయి. (ఇబ్నె మాజహ్, తర్‌’గీబ్‌ తర్‌’హీబ్‌) మరో ఉల్లేఖనంలో ఉంది, ”తూనికల్లో, కొలతల్లో హెచ్చుతగ్గులు చేసే జాతిపై అల్లాహ్‌ (త) ఉపాధిని ఆపివేస్తాడు.” (తర్‌’గీబ్‌)

[81]) వివరణ-2891: అంటే తన అధీనంలోనికి రాకుండా ఇతరులకు అమ్మరాదు, కానుకగా ఇవ్వరాదు. సలమ్‌ ఒప్పందంలో నిర్థారించబడిన వస్తువునే తీసుకోవాలి. దానికి బదులు మరో వస్తువు తీసుకోరాదు.

[82]) వివరణ-2893: బయట నుండి ఆహార ధాన్యాలు తెచ్చి అమ్మేవారికి ఉపాధి ప్రసాదించడం జరుగుతుంది. వారి ఉపాధిలో శుభం ప్రసాదించబడుతుంది. ఎందు కంటే అతడు దైవ సృష్టితాలను సంరక్షిస్తాడు. వారి కష్టాలను దూరం చేస్తాడు. ఆహార ధాన్యాలను ఆపేవాడు శాపానికి గురవుతాడు. దైవకారుణ్యానికీ దూరం అవుతాడు. ఎందుకంటే అతడు తన లాభమే కోరుకుంటాడు. సృష్టితాలన్నీ తమ అవసరాలను తీర్చుకోవాలని అల్లాహ్‌ (త) ఆహార ధాన్యాలను సృష్టించాడు. పెట్టుబడి దారులు తమ స్వలాభం కోసం ఆహార ధాన్యాలను ఆపిఉంచి, అవసరార్థులను ఆందోళనకు గురిచేసేందుకు, కష్టాలకు గురిచేసేందుకు కాదు.

[83]) వివరణ-2899: జైద్ తన గుర్రాన్ని 100 రూ.లకు బక్‌ర్‌కు అమ్మివేసాడు. ‘జైద్‌ బక్‌ర్‌ నుండి గుర్రం ఖరీదు ఇంకా వసూలు చేయలేదు. బక్‌ర్‌ దారిద్య్రానికి గురయ్యాడు. ఒకవేళ అటువంటి గుర్రమే బక్‌ర్‌ వద్ద ఉంటే ఆ గుర్రాన్ని తీసుకునే మొదటి హక్కుదారుడు ‘జైద్‌ ఒక్కడే. అందులో నుండి ఇతర అప్పు ఇచ్చిన వాళ్ళకు ఏమీ లభించదు. అటువంటి గుర్రం లేని పక్షంలో అప్పుకు అనుగుణంగా అతనికీ కొంత లభిస్తుంది. ఒకవేళ అప్పు ఉన్న వాడి వద్ద ఏమీ లేకపోతే, అప్పు ఇచ్చిన వారు కొంత గడువు ఇవ్వాలి లేదా మొత్తం క్షమించివేయాలి. అతన్ని హింసించడం మంచిది కాదు. ఇటువంటి దరిద్రుడికి ‘జకాత్‌, దాన ధర్మాల ధనాన్ని ఇచ్చి సహాయ సహకారాలు అందించడం తప్పనిసరి. ఒకవేళ ప్రజల ధనాన్ని అప్పుగా తీసుకొని వ్యర్థం చేస్తూ ఉంటే, పాలకుడు వాడికి అప్పు ఇవ్వకుండా చేయగలడు. అంటే ప్రజల్లో అతనికి అప్పు ఇవ్వవద్దని ప్రకటించగలడు.

[84]) వివరణ-2900: ఈ ‘హదీసు’ ద్వారా అప్పుల పాలయిన వ్యక్తికి ఉపకారం, సహాయం చేయడం తప్పనిసరి అని తెలిసింది. అదేవిధంగా అప్పు తీసుకున్న వ్యక్తి నష్టాలకు గురై, నిస్సహాయతకు గురై అప్పు చెల్లించలేకపోతే, అప్పు ఇచ్చిన వ్యక్తి అతని అప్పును క్షమించివేయాలి.

[85]) వివరణ-2904: అనవసరంగా అప్పు తీసుకోరాదు. అవసరం ఉండి తీసుకుంటే నిర్ణీత సమయానికి తీర్చే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అప్పు తీసుకున్నవారు కష్టాల్లో ఉంటే అతనికి మరికొంత గడువు ఇవ్వాలి లేదా అప్పును క్షమించివేయాలి. ఇటువంటి వ్యక్తికి గొప్ప శుభవార్త ఉంది, పై ‘హదీసు’లలో పేర్కొన్నట్టు.

[86]) వివరణ-2905: ఏడవ సంవత్సరం తగిలిన ఒంటెను యుక్త వయస్సులో ఉన్న ఒంటె అంటారు. 7 సంవత్సరాలు నిండిన ఒంటెను ఉత్తమ ఒంటెగా భావించే వారు. అందువల్ల ఆ ఉత్తమ ఒంటెనే ఇచ్చివేయమని ప్రవక్త (స) ఆదేశించారు. అంటే జంతువులను కూడా అప్పుగా ఇచ్చి పుచ్చుకోవడాలు చేయవచ్చును. ఇందులో ఎటువంటి వడ్డీ లేదు.

[87]) వివరణ-2907: ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ముహీల్ మరియు ముహ్తాల్ ల అంగీకారం అప్పగించటానికి సరిపోతుంది. ముహ్తాల్ అలైహి యొక్క అంగీకారం తప్పనిసరికాదు. కొందరు ఇదికూడా తప్పని సరి అని అభిప్రాయపడుతున్నారు. అయితే హక్కులో ఇద్దరూ సమానంగా ఉండాలి. అప్ప గించటం ప్రత్యేక వస్తువులో జరగాలి. అప్పగించటం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అప్పు ఒకరి నుండి మరొ కరికి మారిపోతుంది. ముహీల్ పైనుండి ముహ్తాల్ అప్పు భారం, ముహ్తాల్ అలైహి పైనుండి ముహీల్ అప్పు భారం తొలగిపోతాయి. ఆ తరువాత ఒకవేళ ముహ్తాల్ అలైహి అప్పు తీర్చటంలో ఆలస్యంచేసినా లేదా దారిద్ర్యానికి గురయి అప్పు తీర్చలేక పోతే ముహాల్, ముహీల్ ను విచారించటం, ధర్మంకాదు. అతని నుండి అప్పు తీసుకో లేడు. ఒకవేళ ముహీల్, తనకు ఎటువంటి బాకీలేని వ్యక్తికి అప్పు అప్పగిస్తే, ముహ్తాల్ అలైహి ఉపకారంగా స్వీకరిస్తే, ఇది ధర్మసమ్మతమే. అయితే అతనికి స్వీకరించే, నిరాకరించే హక్కు ఉంది. ముహ్తాల్ అలైహి అప్పుతీర్చలేకపోతే, ముహీల్ ను అడగటం ధర్మమే.

సారాంశము: అప్పును ఒకరినుండి మరొకరికి అప్పజెప్పడం: అప్పును, అప్పజెప్పిన అప్పుదారుని ముహీల్ అంటారు. అప్పు ఎవరికోసం అప్పజెప్ప బడిందో వాడిని ముహ్తాల్ లహూ (ముహ్తాల్) అంటారు. అప్పు ఎవరికి అప్పజెప్పబడిందో వాడిని ముహ్తాల్ అలైహి అంటారు. ఉదా: ఉమర్ ‘జైద్ కు బాకీ ఉన్నాడు. ఖాలిద్ ‘ఉమర్ కు బాకీ ఉన్నాడు. ‘ఉమర్ తన అప్పును ‘ఖాలిద్ కు అప్పజెప్పుతాడు. అంటే ‘ఖాలిద్ తో, ”నువ్వు నా (‘ఉమర్) తరపున ‘జైద్ కు నా అప్పును తీర్చివేయి,” అని మరియు ‘జైద్ తో, ”నా (‘ఉమర్) అప్పును ‘ఖాలిద్ నుండి వసూలు చేసుకో” అని అంటాడు. అంటే ఉమర్ ముహీల్ అయ్యాడు. జైద్ ముహాల్ అయ్యాడు. ఖాలిద్ ముహాల్ అలైహి లేదా ముహ్తాల్ అలైహి అయ్యాడు. అత్యవసర పరిస్ధితుల్లో దీన్ని ధర్మసమ్మతం చేయబడింది.

[88]) వివరణ-2909: ఇది ఇస్లామ్‌ ప్రారంభంలోని సంఘటన. అప్పటికి ఇంకా బైతుల్‌ మాల్‌ ప్రారంభం కాలేదు. అప్పుడు హెచ్చరికగా అప్పుపడిన వారి జనా’జహ్ నమా’జు చదివించబడేది కాదు. బైతుల్‌ మాల్‌ స్థాపించిన తర్వాత అప్పు పడిన వారి జనా’జహ్ నమా’జు కూడా చదవడం జరిగేది. అతని అప్పును బైతుల్‌ మాల్‌ తరఫున తీర్చబడేది.

[89]) వివరణ-2910: అంటే అప్పును తీర్చే ఉద్దేశంతో అప్పు తీసుకుంటే అల్లాహ్‌ (త) అతనికి సహాయం చేస్తాడు. ప్రపంచంలోనే అతని అప్పును తీర్చివేస్తాడు. లేదా పరలోకంలో అతనికి శిక్షించడం జరుగదు. అయితే ప్రజల ధనాన్ని కొల్లగొట్టటానికి అప్పు చేసే వ్యక్తిని అతని దురుద్దేశం ఫలితంగా అల్లాహ్‌ అతన్ని నాశనం చేస్తాడు. ఇది ఇహలోకంలోనైనా లేదా పరలోకంలోనైనా.

[90]) వివరణ-2911: ఈ ‘హదీసు’ ద్వారా అల్లాహ్‌ (త) తన హక్కును క్షమిస్తాడని, కాని దాసుల హక్కులను క్షమించడని, దాసులు క్షమించనంత వరకు తాను క్షమించడని తెలిసింది.

[91]) వివరణ-2923: అంటే పరస్పర విషయాల్లో ఒప్పందాలు మంచి పనే. అయితే మంచిని చెడు, చెడును మంచి చేసే షరతులు కాకూడదు. ఉదా: ఎటువంటి ఒప్పందాలంటే నేను నా భార్యతో సంభోగం చేయను లేదా సారా త్రాగుతూ ఉంటాను లేదా రెండవ పెళ్ళి చేసుకోను మొదలైనవి.

[92]) వివరణ-2924:ముస్నద్‌ అబూయ’అలలో ఇలా ఉంది ప్రవక్త (స) ఆ పైజామాను 4 దిర్‌హమ్‌లలో కొన్నారు. ఈ ‘హదీసు’ ద్వారా ప్రవక్త (స) పైజామా కొన్నారని, తొడిగేవారని ఉంది. ధరకంటే అధికంగా ఇవ్వదలచుకుంటే ఇవ్వవచ్చు. అది ఉపకారం అవుతుంది.

[93]) వివరణ-2930: అందువల్లే అతనికి ఎప్పుడూ శుభం కలిగేది. అయితే వ్యాపారంలో భాగస్వాములుగా చేర్చు కోవడం ధర్మమేనని ఈ ‘హదీసు’ ద్వారా తెలిసింది.

[94]) వివరణ-2931: అంటే ముహాజిరీన్లు తమ ఇల్లూ వాకిలీ, ఆస్తులు మొదలైనవి వదలి మక్కహ్ నుండి మదీనహ్ వలస వెళ్ళినప్పుడు, అన్సార్లు వారిని ఆదరించి చేర్చుకున్నారు. మా ఖర్జూరపు తోటలను మాకు మా సోదరులు ముహాజిరీన్ల మధ్య పంచి వేయండని ప్రవక్త (స)ను కోరారు. దానికి ప్రవక్త (స), ‘నేను వాటిని పంచను, ఎందుకంటే వీరికి వ్యవసాయం తెలియదు. అంతేకాదు వీరు తోటలకు కాపలా కాయలేరు కూడా. కనుక అన్నీ మీరే చేయండి. వీరు శ్రమించలేరు. పంట పండిన తర్వాత ఇద్దరూ పంచుకు తినండి,’ అని అన్నారు. దాన్ని వారు స్వీకరించారు.

[95]) వివరణ-2932: ఈ ‘హదీసు’ ద్వారా వకీలు నియమించ వచ్చని తెలిసింది.

[96]) వివరణ-2933: అంటే అల్లాహ్‌ (త) తన దయా కారుణ్యాల ద్వారా ఆ ఇద్దరు భాగస్వాముల మధ్య ఉంటాడు. ఫలితంగా వారి మధ్య కారుణ్య శుభాలు వారిద్దరూ పరస్పరం ద్రోహం తలపెట్టనంతవరకు ఉంటాయి. వారిలో ఎవరైనా ద్రోహం తలపెడితే దైవకారుణ్యం వారి మధ్య నుండి తొలగిపోతుంది. షైతాన్‌ వారి మధ్య ప్రత్యక్షమవుతాడు.

[97]) వివరణ-2936: ముఖారజత్అంటే ముజారబత్. వ్యాపారం చేయటానికి ఒక వ్యక్తికి డబ్బు ఇవ్వటం లాభాన్ని ఇద్దరూ పంచుకోవటం. ఉదా: మీరు జైద్కి వ్యాపారం చేయమని 100 రూపాయలు ఇచ్చారు. డబ్బు మీది. వ్యాపారం చేసేవాడు ‘జైద్‌. దానివల్ల వచ్చే లాభాన్ని మీరిద్దరూ చెరిసగం లేదా 3/4 లేదా 1/3 పంచుకుంటారు. ఈ వ్యవహారాన్ని ముజారబత్‌ అంటారు. డబ్బు ఇచ్చే వ్యక్తికి ”రబ్బుల్మాల్”, వ్యాపారం చేసేవారిని ”ముజారిబ్” అంటారు. షరతులతో కూడుకున్న ఇటువంటి వ్యవహారం ధర్మసమ్మతమే. 1. ముందు ఇవ్వవలసిన నిర్ణీత పెట్టుబడిని ఇంత ఇస్తానని తెలియపరచాలి. 2. ఆ డబ్బును ముజారిబ్కి ఇచ్చి వేయాలి. తన వద్ద ఉంచకూడదు. 3. ఇంత కాలం లాభం మాదని ఇంత మీదని ముందే నిర్ణయించుకోవాలి. 4. ప్రతి నెల నాకు ఇంత లాభంగా లభిస్తూ ఉండాలని మిగతాది ముజారిబ్‌ది అని అంటే అది వడ్డీ అవుతుంది. అది నిషిద్ధం. 5. ఒకవేళ లాభనష్టాల్లో ఇద్దరూ భాగ స్వాములైతే ఈ వ్యవహారం రద్దవుతుంది. నష్టం పెట్టుబడి దారునిది అవుతుంది. లాభంలో ఇద్దరూ భాగస్వాములౌతారు. కష్టపడేవానిది కష్టం వరకే బాధ్యత. నష్టంవస్తే అది పెట్టుబడిదారునిదే అవుతుంది. 6. పెట్టుబడిదారుడు ఏ వ్యాపారానికి డబ్బు ఇస్తే ఆ వ్యాపారమే చేయాలి. పెట్టుబడి దారుని అనుమతి లేకుండా మరో వ్యాపారం చేయకూడదు. అతని ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. ‘హకీమ్‌ బిన్‌ హిజామ్‌ ఉల్లేఖనం ద్వారా తెలిపినట్లు ఉండాలి. (దారు ఖుతునీ, బులూగుల్‌మరామ్‌)

ఒకవేళ ఈ వ్యవహా రంలో కొంత నష్టం వస్తే, ఆ నష్టాన్ని లాభం ద్వారా పూర్తిచేయాలి. అంతకూ పూర్తి కాకపోతే పెట్టుబడి ద్వారా పూర్తి చేయాలి. ఈ ముజారబత్‌ వల్ల చాలా శుభం కలుగుతుంది, పై ‘హదీసు’ ప్రకారంగా.

[98]) వివరణ-2938: భూమిలో ఏడు పొరలు ఉన్నాయి. జానెడు భూమిని ఆక్రమించుకున్నవాడు ఏడు పొరల భూమిని ఆక్రమించు కున్నట్టే. కనుక తీర్పుదినం నాడు ఏడు పొరల బరువుగల కంఠహారాన్ని అతని మెడలో వేయడం జరుగుతుంది. మరో ‘హదీసు’లో, ” ‘ఆ మట్టి నంతా ఎత్తుకురమ్మని’ ఆదేశించడం జరుగుతుంది” అని ఉంది. మరికొందరు అతన్ని ఏడు పొరల వరకు అణగ ద్రొక్కడం జరుగుతుందని వ్యాఖ్యానించారు. తీర్పు దినం నాడు లేపబడినపుడు అతని మెడలో ఆ భూమి బరువు కంఠాహారంగా అతని మెడలో ఉంటుంది. భూమిలో ఏడు పొరలు ఉన్నాయని ఈ ‘హదీసు’ ద్వారా తెలిసింది.

[99]) వివరణ-2939: అయితే ఒకవేళ ఎవరైనా ఆకలి దప్పికలతో అలమటిస్తూ ఉండి, అనుమతి ఇచ్చేవారు ఎవరూ లేకపోయినప్పుడు ప్రాణం రక్షించుకోవడానికి అనుమతి లేకుండా పితికి త్రాగడం సమంజసమే.

[100]) వివరణ-2941: నుహ్బహ్ అంటే దోచుకోవటం, అంటే ముస్లిముల ధనాన్ని దోచుకోవటాన్ని లేదా అవిశ్వాసుల ధనాన్ని పోరాడకుండా దోచుకోవటాన్ని వారించారు. అదేవిధంగా ముస్లహ్ అంటే చెవులు, ముక్కు కోసి ముఖాన్ని అందవికారంగా చేయడం.

[101]) వివరణ -2945: అంటే ఒక వ్యక్తి బంజరు భూమిని సేద్యం చేసాడు. మరోవ్యక్తి అందులో విత్తనాలు నాటాడు. అయితే ఇతనికి ఆ భూమిలో ఎటువంటి హక్కు లేదు. కనుక అతని పంట పీకి పారవేయటం జరుగుతుంది. మొదటి వ్యక్తిపై ఎటువంటి పరిహార భారం పడదు.

[102]) వివరణ-2947: జలబ రెండు విషయాల్లో జరుగు తుంది. ఒకటి ‘జకాత్‌లో, రెండు గుర్రపు పందాల షరతుల్లో. ‘జకాత్‌లో జలబ ఎలా అంటే, తాసీల్దారు ఒక ప్రాంతంలో దిగి పశువుల యజమానులను తమ తమ జంతువులను తన వద్దకు తీసుకురమ్మని ఆదేశించడం. ప్రవక్త (స) దీన్ని వారించారు. ఎందుకంటే ఈ విధంగా పశువుల యజమానులకు కష్టం కలుగుతుంది. తాసీల్దారు స్వయంగా వారి వద్దకు వెళ్ళి ‘జకాత్‌ వసూలు చేయాలి. షరతుల్లో  జలబ ఏమిటంటే తన గుర్రం వెనుక ఒక వ్యక్తిని నియమించటం అతడు దాన్ని ముందుకు తోలుతూ ఉంటాడు, అన్నిటికంటే ముందుకు అది పోవాలని. అదేవిధంగా జకాత్లో జలబ ఏమిటంటే ధనవంతుడు ధనాన్ని తన స్థానం నుండి దూరంగా తీసుకు పోవడం, తాసీల్దారు అక్కడకు వచ్చి ‘జకాత్‌ వసూలు చేయాలని. ఎందుకంటే ఈ విధంగా తాసీల్లారుకు చాలా కష్టం కలుగుతుంది. గుర్రపు పందాలలో జలబ ఏమిటంటే తన గుర్రం ప్రక్కన మరో ఖాళీ గుర్రాన్ని ఉంచడం, తాను కూర్చున్న గుర్రం అలసి పోతే దాన్ని వదలి ఖాళీగా ఉన్న గుర్రంపై కూర్చోవడం. అది అన్నిటికంటే ముందు పోవటానికి. ఇందులో మోసం ఉంది. కనుక ఇది నిషిద్ధం. అదేవిధంగా షిగార్అనేది అజ్ఞాన కాలంలోని ఒక విధమైన నికా’హ్‌. అదేమిటంటే ఒక వ్యక్తి మరో వ్యక్తితో నువ్వు నీ కూతురు లేదా చెల్లెలుతో నా నికా’హ్‌ చేసివెయ్యి, దానికి బదులుగా నేను నా చెల్లెలు లేదా కూతురుతో నీపెళ్ళి చేసివేస్తాను. ఇదే మహర్‌గా నిర్ణయించబడుతుంది అని ఒప్పందం కుదుర్చుకోవటం.

[103]) వివరణ-2949: అంటే ఒకరి వస్తువు పోయింది లేదా దొంగిలించబడింది. దాన్ని పొందినవాడు లేదా దొంగిలించిన వాడు మరొక వ్యక్తికి దాన్ని అమ్మివేసాడు. ఆ వస్తువు యజమాని దాన్ని చూస్తే, అతడు దాన్ని తీసుకోవచ్చు. అయితే కొన్న వ్యక్తి అమ్మినవ్యక్తి నుండి తన ధరను తీసుకోవాలి.

[104]) వివరణ-2950: చేయి అంటే తీసుకున్నవాడు. అంటే ఏదైనా వస్తువును తాత్కాలికంగా తీసుకున్న వాడు లేదా ఒకరి అమానతు ఉంచబడినవాడు లేదా దోచుకున్నవాడు దాన్ని తిరిగి ఇచ్చివేయడం, తప్పనిసరి.

[105]) వివరణ-2951: అంటే పగలు ఒకరి జంతువు మరొకరి పొలాన్ని లేదా తోటను నష్టపరిస్తే జంతువు యజమాని దానికి బాధ్యుడు కాడు. ఎందుకంటే పగలు కాపలా కాయడం పొలాల, తోటల యజమానుల బాధ్యత. వారు తమ బాధ్యత నిర్వర్తించక పోవటం వల్ల నష్టం కలిగింది. రాత్రిపూట జంతువుల బాధ్యత వాటి యజమానులది. ఒకవేళ రాత్రిపూట ఒకరి జంతువు మరొకరి తోటను లేదా పొలాన్ని నష్టపరిస్తే దానికి జంతువు యజమాని బాధ్యుడు. అతడు పరిహారం చెల్లించాలి.

[106]) వివరణ-2952: ఒకవేళ యజమాని ప్రమేయం లేకుండా జంతువు కాళ్శవల్ల ఎవరికైనా నష్టం కలిగితే జంతువు యజమానికి పరిహారం వర్తించదు. అది క్షమించదగ్గది. అదేవిధంగా ఎవరైనా వండటానికి పొయ్యి వెలిగిస్తే అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఎటువంటి ఉద్దేశ్యం లేకుండా నిప్పు రవ్వ ఎగిరి ఇతరులకు నష్టం కలిగితే పొయ్యి వెలిగించిన వారిపై పరిహారం వర్తించదు.

[107]) వివరణ-2956: అంటే ఒకరు అవసరానికి మరొకరి వద్ద నుండి ఏదైనా వస్తువు తీసుకుంటే అతని వస్తువును తిరిగి ఇచ్చి వేయాలి. ఒకవేళ ఎవరైనా మరొకరికి కేవలం పాలు త్రాగటానికి పాలిచ్చే జంతువును ఇస్తే పాలు ఇచ్చినంత కాలం పాలు త్రాగి జంతువును తిరిగి ఇచ్చివేయాలి.

[108]) వివరణ-2962: షుఫ్‌’హ్ రెండు రకాలు. భాగస్వామ్య షుఫ్‌’హ్ అంటే ఒక ఇంటిలో ఇద్దరు భాగ స్వాములు ఉన్నారు. వారిలో ఒకరు తన వంతు అమ్మ గోరితే రెండవ భాగస్వామి తప్ప మరెవరూ తీసుకో లేరు. రెండవది మిత్రత్వ షుఫ్‌’హ్, అంటే ఒక ఇల్లు అమ్మ బడితే దాన్ని కొనడంలో మిత్రులకు ఎక్కువ హక్కు ఉంది. షాష’యీ (రహ్మ) ప్రకారం భాగస్వామ్యంలో షుఫ్‌’హ్ ఉంది. మిత్రత్వంలో షుఫ్‌’హ్ లేదు.

[109]) వివరణ-2965: అంటే మధ్యలో భూమి ఖాళీగా ఉంది. కొందరు అక్కడ ఇల్లు కట్టాలని కోరుతున్నారు. మార్గానికి 7 గజాల వెడల్పు భూమిని వదలివేయాలి. వచ్చేపోయే వారికి ఆటంకం కలగకుండా ఉండటానికి.

[110]) వివరణ-2970: రేగిచెట్టు అడవిలో, మార్గంలో ఉండి, ప్రయాణీకులు, ఇతర జంతువులు ఆ చెట్టు నీడద్వారా లాభం పొందుతూ ఉంటే, విశ్రాంతి పొందుతూ ఉంటే, అనవసరంగా అధర్మంగా ఎవరైనా ఆ చెట్టును నరికివేస్తే అల్లాహ్‌ (త) వారిని తలక్రిందులుగా నరకంలో పడ వేస్తాడు. లేదా ఆచెట్టు హరమ్‌లోఉంటే హరమ్‌లోచెట్లను కోయటం నిషిద్ధం. అయితే ఈ హదీసుకు షుఫ్అకు ఎటు వంటి సంబంధం లేదు. వాస్తవం అల్లాహ్(త)కే తెలుసు.

[111]) వివరణ-2972: మదీనహ్కు సమీపంలో ఖైబర్‌ అనే పట్టణం ఉంది. ఇక్కడ యూదులు ఉండేవారు. ఖైబర్‌ జయించబడింది. అక్కడి తోటలపై, భూములపై ప్రవక్త (స)కు ఆధిపత్యం లభించింది. అప్పుడు ప్రవక్త (స) వారితో మీరిక్కడి నుండి వెళ్ళిపోండని ఆదేశించారు. దానికి వారు మమ్మల్ని ఇక్కడే ఉండనియ్యండి, వ్యవసాయం, వృక్ష సంరక్షణ గురించి మాకు బాగా తెలుసు అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) సరే అయితే మీరు వ్యవసాయం చేయండి దాని సగభాగం మీది, సగభాగం మాది అని ఒప్పందం కుదుర్చు కున్నారు. దీన్నే ముజారఅత్మరియు ముసాఖాత్ అంటారు. ఈ ‘హదీసు’ ద్వారా ఈ రెండూ ధర్మసమ్మతమే అని తెలిసింది.

[112]) వివరణ-2973: ముఖాబరత్ను ముజారఅత్ అని కూడా అంటారు. వీటిని గురించి పైన పేర్కొనడం జరిగింది. ముజారఅత్ ధర్మసమ్మతమే, అయితే దీన్ని గురించి వచ్చిన నిషేధాజ్ఞ ఇందులోని ఒక ప్రత్యేక రకానికి వర్తిస్తుంది. దాన్ని గురించిన ‘హదీసు’ను క్రింద పేర్కొనడం జరిగింది.

[113]) వివరణ-2974: అంటే మోసం, దగా ఉన్న ముజారఅత్‌ ధర్మసమ్మతం కాదు. దగా, మోసం, లేనిది ధర్మసమ్మతం. ధనానికి బదులు లేదా పంటలో వంతులకు బదులు, మోసం ఉన్నది అంటే భూమి యజమాని ఈ భాగం పంట నాది, ఆ భాగం పంట నీది అని అంటే ఇందులో మోసం, నష్టం ఉంది. కనుక ఇటువంటి వ్యవసాయం ధర్మసమ్మతం కాదు.

[114]) వివరణ-2977: అంటే భూమి యజమాని తాను స్వయంగా వ్యవసాయం చేయాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా తాను వ్యవసాయం చేయలేకపోతే తన ముస్లిమ్‌ సోదరునికి తాత్కాలికంగా లేదా కానుకగా ఇచ్చేయాలి. ఇదీ సాధ్యం కాకపోతే తన భూమిని ఆపి ఉంచాలి. అయితే వ్యవసాయం చేయకుండా ఆపి ఉంచడం మంచిది కాదు. అందువల్ల ఎవరికైనా వ్యవసాయం చేయడానికి ఇచ్చివేయడం మంచిది.

[115]) వివరణ-2978: అంటే రైతులపై ప్రభుత్వం పన్నులు విధిస్తుంది. సమయానికి ఇవ్వకపోతే వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. అధికారులు వారిని హింసిస్తారు. అవమానపరుస్తారు. లేదా వ్యవసాయంలో నిమగ్నమై ఉండటంవల్ల వీరు జిహాద్‌కు దూరమౌతారు. శత్రువులు వారిని అధిగమిస్తారు. వారిని శిక్షిస్తారు. వారిపై అత్యాచారాలు చేస్తారు. ఇంకా అల్పులుగా చేసి ఉంచుతారు.

[116]) వివరణ-2979: అంటే ఒకవేళ సాజిద్‌ యొక్క భూమిలో అతని అనుమతి లేకుండా మాజిద్‌ విత్తనాలు నాటాడు. పంట పండింది. అయితే ఆ పంట మొత్తం సాజిద్‌కు చెందుతుంది. మాజిద్‌కు చెందదు. అయితే మాజిద్‌ పంట పండించటంలో అయిన విత్తనాలు ఇతర ఖర్చులు భూమి యజమాని సాజిద్‌ మాజిద్‌కు చెల్లించాలి.

[117]) వివరణ-2981: ఈ ‘హదీసు’లో ముజారఅత్ అంటే ఒక ప్రత్యేకమైన ముజారఅత్ నుండి వారించడం జరిగింది. దీన్ని గురించి పైన పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మువాజరహ్ అంటే భూమిని రూపాయలకు బదులు అద్దెకు ఇవ్వటం. ఎందుకంటే ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు.

[118]) వివరణ-2983: ఖీరాత్ అంటే సంగం దానిఖ్‌కి సమానం. ఇది ఐదు జొన్నగింజలంత బరువు ఉంటుంది. అంటే చాలా అల్పమైన కూలిపై మేకలు మేపే వాడిని. ఈ ‘హదీసు’ ద్వారా కూలిపని చేయవచ్చని నిరూపించ బడింది.

[119]) వివరణ-2985: మంత్రించి, వైద్యం చేసి పారితోషికం తీసుకోవటం ధర్మసమ్మతమని అదేవిధంగా ఖుర్‌ఆన్‌ బోధించి, నేర్పించి జీతం తీసుకోవటం ధర్మసమ్మతమని ఈ ‘హదీసు’ ద్వారా నిరూపించబడింది.

[120]) వివరణ-2988: అంటే ఒకవేళ ఎవరైనా బిచ్చగాడు గుర్రంపై మీ వద్దకు వస్తే అతనికి బిచ్చం ఇచ్చివేయండి, వుత్తిచేతులతో పంపకండి. అంటే చేయిచాచి మిమ్మల్ని బిచ్చం అడుగుతున్నాడు. ఇది ముర్‌సల్‌ ‘హదీసు’.

  1. [121]) వివరణ-2989: మూసా (అ) ఈజిప్టు నుండి వలసివెళ్ళి మద్యన్చేరుకున్నారు. అక్కడ ఒక బావి ముందు నీటి టాంకీ వద్ద జన సందడిగా ఉంది. అక్కడ జంతువులకు నీళ్ళు త్రాపిస్తున్నారు. వారికి కొంత దూరంలో ఇద్దరు అమ్మాయిలు తమ జంతువులను నీళ్ళు త్రాపించడానికి ఆపి ఉన్నారు. అప్పుడు మూసా (అ) వారిని మీరు మీ పశువులను ఎందుకు ఆపి ఉన్నారు అని ప్రశ్నించారు. దానికి వారు మేము నీళ్లను తోడలేము. అందువల్ల వీరందరూ తమ తమ పశువు లకు నీళ్ళు త్రాపించివెళ్ళిపోతే మిగిలిన నీళ్ళను మా మేకలకు త్రాపించడానికి వేచి ఉన్నాం. మా తండ్రి గారున్నారు, కాని చాలా ముసలివారు అని అన్నారు. అప్పుడు మూసా (అ) తాను స్వయంగా నీళ్ళు తోడి వారి పశువులకు త్రాపించారు. ‘ఉమర్‌ బిన్‌ ఖ’త్తాబ్‌ (ర) కథనం: ఆ బావిపై ఒక రాతిమూత ఉండేది. దాన్ని 10 మంది కలసి ఎత్తి వేసేవారు. తొలగించేవారు. కాని మూసా (అ) ఒక్కరే దాన్ని తొలగించి, చేదతో ఒకేసారి నీళ్ళు తీసారు. అందులో అల్లాహ్‌ (త) శుభం ప్రసాదించగా వారి పశువులన్నీ ఆ నీటి ద్వారానే కడుపు నింపుకున్నాయి. ఆ తరువాత ఆకలి దప్పికలతో ఉన్న మూసా (అ) ఒక చెట్టు నీడలో కూర్చుండి పోయారు. ఈజిప్టు నుండి మద్‌యన్‌ వరకు ప్రయాణంచేసి అలసిపోయి ఉన్నారు. కాళ్ళు వాచిపోయాయి. తినటానికి ఏమీ లేదు. చెట్ల ఆకులు తింటూ గడిపారు. కడుపులో ఏమీ లేదు. ఆకలితో అలమటిస్తున్నారు. అల్లాహ్‌ (త) అతని వృత్తాంతాన్ని ఈవిధంగా ఖుర్‌ఆన్‌లో పేర్కొన్నాడు: ”ఇక అతను మద్యన్ లోని ఒక బావి వద్దకు చేరుకున్నప్పుడు; అక్కడ చాలా మంది ప్రజలు తమతమ పశువులకు నీరు త్రాగించటాన్ని మరియు వారికి దూరంగా ఒక ప్రక్కన ఇద్దరు స్త్రీలు తమ పశువు లను ఆపుతూ ఉండటాన్ని చూశాడు. (మూసా) ఆ స్త్రీలను అడిగాడు: “మీరిద్దరి చిక్కుఏమిటి?” వారిద్ద రన్నారు: “ఈ పశువుల కాపరులంతా పోయే వరకు మేము (మా పశువులకు) నీరు  త్రాపలేము. మరియు మా తండ్రి చాలా వృధ్ధుడు.” అప్పుడు అతను వారిద్దరి పశువులకు నీరు త్రాపాడు. తరువాత నీడలోకి పోయి ఇలా ప్రార్థించాడు: “ఓ నా ప్రభూ! నీవు నాపై ఏ మేలును అవతరింపజేసినా, నేను దాని ఆవశ్యకత గలవాడనే!.” (సూ. అల్ ఖసస్‌, 28:2324)  మూసా (అ) వారి మేకలకు నీళ్ళు త్రాపించిన తర్వాత వాళ్ళు తమ మేకలను తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. వారి తండ్రి సమయానికి ముందు తిరిగి రావటాన్ని గురించి అడిగారు. వారు జరిగిన విషయమంతా వివరించారు. వెంటనే వారిలో ఒకరిని పంపి అతన్ని పిలిపించాడు. ఆమె మూసా (అ) వద్దకు వచ్చి తన తండ్రిగారి సందేశాన్ని వినిపించి ఆయన వెంట, ఆయనకు తెరచాటున నడుస్తూ ఇంటికి చేరుకున్నారు. ఆయన తన వృత్తాంతం అంతా వినిపించారు. దానికి ఆయన మరేం భయం లేదు, ఈ ప్రాంతం వారి రాజ్య పరిధులకు వెలుపల ఉంది అని అతన్ని ఓదార్చారు. కొందరు వ్యాఖ్యాన కర్తల ప్రకారం ఇతను షుఐబ్అలైహిస్సలామ్‌, మద్‌యన్‌ వారి వైపు ప్రవక్తగా పంపబడ్డారు. ఇదే సరైన అభిప్రాయం.

ఇద్దరు కుమార్తెల్లో ఒకరు తన తండ్రిని అతన్ని మేకల కాపరిగా పెట్టుకోమని, అతడు బలవంతుడు మరియు అమానతుదారు అని సూచించారు. తండ్రి ఈ రెండు విషయాలు నీకెలాగ తెలుసు అని ప్రశ్నించాడు. దానికి ఆమె పదిమంది కలసి ఎత్త గలిగిన దాన్ని అతను ఒక్కడే ఎత్తాడు. దానివల్ల అతని శక్తి గురించి తెలిసింది. అతన్ని నేను తీసుకొని వస్తున్నప్పుడు అతని అమానతు గురించి తెలిసింది అని చెప్పింది. ఇది విన్న వెంటనే తండ్రి మూసా (అ)తో ఒకవేళ మీకు ఇష్టమైతే మీరు ఇక్కడ 8 సంవత్సరాల వరకు మా మేకలు కాయడానికి, బదులు మా ఇద్దరు కుమార్తెల్లో ఒకరితో మీ వివాహం చేసివేస్తాను. రెండు సంవత్సరాలు మీకిష్టం అయితే ఉండవచ్చు అని అన్నారు. మూసా (అ) ఈ షరతుకు ఒప్పుకున్నారు.

[122]) వివరణ-2990: బు’ఖారీలోని ‘హదీస్‌’ ద్వారా ఖుర్‌ఆన్‌ పఠించి పారితోషికం తీసుకోవటం ధర్మ సమ్మతమని తెలిసింది. ఈ ‘హదీసు’ ద్వారా అధర్మం అని తెలుస్తుంది. అంటే ఇస్లామ్‌ ప్రారంభంలో ఖుర్‌ఆన్‌ పఠనానికి బదులుగా ప్రతిఫలం తీసుకోవటాన్ని వారించడం జరిగింది. ఆ తరువాత ఈ నిషేధాజ్ఞ రద్దయి పోయింది. ప్రతిఫలం తీసుకునే అనుమతి ఇవ్వబడింది.

[123]) వివరణ-2992: హిమ అంటే ఆపటం, రక్షించటం, సహాయపడటం, దూరంగా ఉండటం అని అర్థం. ‘హదీసు’లో హిమ అంటే పచ్చిక మైదానాన్ని రక్షించటం అని అర్థం. అంటే పచ్చిక బయలును ఆక్రమించటం ఎవరికీ ధర్మసమ్మతం కాదు. అది కేవలం అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు ధర్మసమ్మతం అవుతుంది. లేదా వారి ప్రతినిధులది లేదా పాలకులది అవుతుంది. అజ్ఞాన కాలంలో ప్రతివర్గానికి చెందిన నాయకుడు హిమ చేసేవాడు. కుక్క అరిస్తే దాని శబ్దం ఎక్కడి వరకు వెళు తుందో అక్కడి వరకు ఉన్న భూమంతా తన జంతువుల కోసం సొంతం చేసుకునేవాడు. అందులో ఇతరు లెవ్వరూ తమ జంతువులను మేపేవారు కారు. ప్రవక్త (స) ఈ అధర్మ ఆచారాన్ని ఖండించి నిషేధించారు. పచ్చిక బయలులో ప్రతి వ్యక్తి తన జంతువులను మేపుకోవచ్చు. అయితే అల్లామ్‌ మరియు ఆయన ప్రవక్త కొరకు పచ్చిక మైదానం భద్రపరచుకోవచ్చు. ఉదా: జిహాద్‌ గుర్రాలు, జంతువులు, జకాత్‌ జంతువుల కొరకు ఉమర్‌(ర) నఖీ మైదానాన్ని ఇటువంటి జంతువుల కొరకు కేటాయించారు.

[124]) వివరణ-2994: అంటే అడవిలో ఒక బావి ఉంది. దాని చుట్టూ పచ్చిక బయలు ఉంది. కాని ఆ బావి యజమాని తన అవసరానంతరం మిగిలి ఉన్న నీటిని తీసుకోనివ్వటం లేదు. పశువులకు నీరు దొరక్కపోతే, అక్కడ మేపడానికి ఎవరూ తమ జంతువులను తీసుకురారు. ఫలితంగా అక్కడి పచ్చిక బయలు కూడా తన పశువుల కోసం మిగిలి ఉంటుంది.

[125]) వివరణ-2995: అసత్య ప్రమాణం చేసి సరకును అమ్మడం నిషిద్ధం. అదేవిధంగా అసత్య ప్రమాణంచేసి ఇతరుల ధనాన్ని దోచుకోవటం కూడా నిషిద్ధమే. అదేవిధంగా మిగిలిన నీటిని అవసరం ఉన్న వారికి అందకుండా చేయటం కూడా నిషిద్ధమే.

[126]) వివరణ-2996: ఎవరికీ చెందని, వ్యర్థంగా పడి ఉన్న భూమిపై గోడ కట్టి ఆక్రమించుకుంటే అది అతనిదే అవుతుంది.

[127]) వివరణ-2999: రమౌత్ ఒక పట్టణం పేరు. వాయిల్‌ బిన్‌ ‘హజర్‌ అక్కడి నివాసులు. ప్రవక్త (స) ఒక ప్రత్యేక స్థలాన్ని అతనికి కేటాయించారు.

[128]) వివరణ-3000: మఆరిబు ఒక ప్రాంతం పేరు. అక్కడ ఉప్పుగను లుండేవి. అందులో అందరికీ భాగస్వామ్యం ఉండేది. గుర్తుచేయగా ప్రవక్త (స) దాన్ని తిరిగి తీసుకున్నారు. ఎందుకంటే అందులో అందరికీ హక్కు ఉంది. ప్రవహించే నీటిపై అందరికీ హక్కు ఉన్నట్లు, దాన్ని ఒకరికి సొంతం చేయడం సరికాదు. ఆ తరువాత అబ్‌యజ్‌ బిన్‌ హమ్మాల్‌ అడవిలోని ఏ భూమిని తీసుకోవాలి అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) ఒంటెలు మేత కోసం ఎక్కడి వరకు వెళతాయో అక్కడి వరకు వదలి ఆ తరువాత భూమి తీసుకోవచ్చునని ఆదేశించారు. ఎందుకంటే దానిపై ఎవరికీ హక్కు ఉండదు. ఇంకా అది వృథాగా ఉంటుంది, పాలకుని అనుమతితో దాన్ని ఉపయోగించవచ్చును.

[129]) వివరణ-3001: అంటే సహజ నీరు నదులు, కాలువల్లో అందరికీ హక్కు ఉంది. అదేవిధంగా అడవిలోని ఎవరికీ చెందని భూమిలోని గడ్డిపై అందరికీ హక్కు ఉంది. అదేవిధంగా ఒకచోట మంటలు వెలుగుతున్నాయి. ప్రతి వ్యక్తి దాన్నుండి తన దీపం వెలిగించుకోగలడు. వారించే అధికారం లేదు. ఎందుకంటే దానవల్ల ఎవరికీ నష్టం వాటిల్లదు.

[130]) వివరణ-3002: అంటే అందరికీ హక్కు ఉన్న నీటి వద్దకు ముందు వెళ్ళి నింపుకుంటే ఆ నీరు అతని దౌతుంది. దాన్ని ఎవరూ లాక్కోలేరు.

[131]) వివరణ-3005: మహ్‌జూర్‌ ఒక లోయపేరు. అక్కడి నుండి నీళ్ళు ప్రవహించేవి. రైతులు ఆ నీటిని తమ పొలాలకు, తోటలకు అందించేవారు. కొందరి పొలాలు దగ్గరగా ఉండేవి. మరికొందరివి దూరంగా ఉండేవి. అందువల్ల ప్రవక్త (స) దగ్గరున్న వారు ముందు తమ పొలాలకు నీళ్ళు అందించాలని, ఆ తరువాత ఆ నీటిని వదలివేయాలని, దానివల్ల ఇతరులు కూడా తమ తమ పొలాలకు నీటిని తోడుకుంటారని తీర్పుఇచ్చారు.

[132]) వివరణ-3008: ఈ ‘హదీసు’ ద్వారా భూమిని  అల్లాహ్ (త) మార్గంలో ధర్మం చేయవచ్చని తెలిసింది. దీని రాబడిని ‘హదీసు’లో పేర్కొన్న వారిపైనే ఖర్చు చేయాలి.

[133]) వివరణ-3013: ఉమ్రా అంటే ఒక వస్తువును ఒకరికి ఇచ్చివేయడం. అదేవిధంగా రుఖ్బా అంటే అతని జీవితకాలం వరకే ఇవ్వడం, అతని మరణానంతరం అది యజమానికే చెందుతుందని షరతు పెట్టటం. అజ్ఞాన కాలంలో ఇలా చేసే వారు. ఇస్లామ్‌ దీన్ని ఖండించి, రద్దుచేసి, ఇప్పుడు ఎవరైనా ఉమ్రాచేసినా, రుఖ్బా చేసినా ఆ వస్తువు కానుకగా ఇవ్వబడిన వ్యక్తిదే అయిపోతుంది. అతని తర్వాత అతని వారసులకు చెందుతుంది. ఇచ్చిన వారికిగానీ అతని వారసులకుగాని తిరిగి చెందదు. కొందరు ఉమ్రా మరియు రుఖ్‌బాలను వర్గీకరించారు. రుఖ్బా అంటే ఒక వ్యక్తి మరొకరికి ఇచ్చి ఒకవేళ నేను ముందు చనిపోతే, ఈ వస్తువు నీదీ, నీ వారసులది, ఒకవేళ ముందు నువ్వు మరణిస్తే ఇది నా సొంతం అవుతుంది అని షరతు పెట్టటం. రుఖ్బా అని దీన్ని ఎందుకంటారంటే ఇందులోని ప్రతి ఒక్కరూ మరొకరి మరణానికి ఎదురుచూస్తూ ఉంటారు.

[134]) వివరణ-3018: కానుకగా ఇచ్చి తీసుకోవడం ధర్మ సమ్మతం కాదని ఈ ‘హదీసు’ ద్వారా తెలిసింది. అయితే తండ్రి తన సంతానానికి ఇచ్చిన కానుక తిరిగి తీసుకోగలడు. దీన్ని గురించి క్రింద పేర్కొనడం జరిగింది.

[135]) వివరణ-3023: ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి. ఇవ్వడానికి లేకపోతే ఉపకారిని పొగడాలి. ఈ పొగడడం అతని పట్ల కృతజ్ఞత అవుతుంది. ఉపకారి యొక్క ఉపకారాన్ని కప్పిపుచ్చినవాడు అతని పట్ల కృతఘ్నతకు పాల్పడ్డాడు. తనకు తగని పని చేసినవాడు అవుతాడు. ఉదా: పండితుల దుస్తులు ధరించి తన్ను పండితునిగా ప్రదర్శించడం.

[136]) వివరణ-3024: ఉపకారికి అతను చేసిన ఉపకారానికి బదులు ఈ దు’ఆ జజాకల్లాహు ఖైరన్ (అల్లాహ్‌ మీకు దీని కంటే మంచి వస్తువు ప్రసాదించుగాక) అని పలికితే అతనికి తగ్గట్టు ప్రశంసించాడు, అతని హక్కును నెరవేర్చాడు.”

[137]) వివరణ-3025: అంటే ఎవరికైనా ఎవరైనా ఉపకారం చేస్తే, ఉపకారానికి బదులు వారికి కృతజ్ఞతలు తెలుపటం తప్పనిసరి. అతనికి కృతజ్ఞతలు తెలిపితే దైవానికీ కృతజ్ఞతలు తెలిపినట్లు అవుతుంది. ఎందుకంటే అతడు అనుగ్రహాన్ని గుర్తించాడు. ఉపకారికి కృతజ్ఞతలు తెలుపనివాడు దైవంపట్ల అవిధేయతకు పాల్పడ్డాడు. ఈ అవిధేయతే కృతఘ్నత అవుతుంది.

[138]) వివరణ-3028: అంటే ఇరుగువారు పొరుగువారికి తప్పకుండా కానుకలు పంపుతూ ఉండాలి. అది మామూలు వస్తువైనాసరే. మామూలు వస్తువు పంపినా ఇరుగు, పొరుగు వారు దాన్ని స్వీకరించాలి. నిరాకరించరాదు. తిరిగి పంపరాదు.

[139]) వివరణ-3029: అంటే అతిధిగా ఎవరైనాసరే, ఆతిథ్యం ఇచ్చేవారు అతిథికి తలగడ లేదా సువాసన లేదా పాలు ఇస్తే వాటిని తిప్పి పంపరాదు.

[140]) వివరణ-3030: అంటే సువాసన స్వర్గం నుండి వచ్చింది. అందువల్ల దాన్నితిరస్కరించడం ధర్మంకాదు.

[141]) వివరణ-3032: క్రొత్త ఫలం అల్లాహ్‌ (త) అనుగ్రహం. ప్రవక్త (స) దాని ప్రాధాన్యతను గుర్తిస్తూ దాన్ని తన కళ్ళకు, పెదాలకు అద్దుకున్నారు. ఆ తరువాత ఈ ఫలాన్ని ఇహలోకంలో చూపినట్టు పరలోకంలో కూడా మాకు చూపెట్టు అని ప్రార్థించారు.

[142]) వివరణ-3033: అంటే పడిఉన్న వస్తువులను జాగ్రత్తగా భద్రపరచి ఉంచాలి. దాని యజమాని వచ్చి చిహ్నాలు చెబితే అతనికి తిరిగి ఇచ్చివేయాలి. తప్పిపోయిన మేకను కూడా భద్రపరచే ఉద్దేశంతో దాన్ని పట్టుకొని ఉంచుకోవాలి. అతడు పట్టుకోకపోతే, మరో వ్యక్తి పట్టుకుంటాడు లేదా తోడేలు తినివేస్తుంది. అయితే ఒంటెను పట్టుకునే అవసరం లేదు. ఎందుకంటే అది పెద్ద జంతువు. ఒకరోజు త్రాగితే వారం రోజుల నీరు దాని శరీరంలో ఉంటుంది. దాని కడుపు ముష్క్‌, దానికి తోడు దాని చెప్పులు అంటే పెద్దపెద్ద కాళ్ళు. అది అడవిలోనికి వెళ్ళి ఆకులుతిని తన కడుపు నింపుకోగలదు. అది ఎక్క డికీ పోదు. అందువల్ల దాన్ని పట్టుకునే అవసరం లేదు.

[143]) వివరణ-3038: అంటే పడిపోయిన ముస్లిమ్‌ యొక్క వస్తువును తీసుకొని, ప్రకటించి ముస్లిములకు ఇవ్వ కుండా దాన్ని దాచిపెట్టి ఉంచుకున్న వ్యక్తి నరకంలోనికి పోతాడు.

[144]) వివరణ-3040: అంటే దారిలో చేతికర్ర, చెత్త, త్రాడు దానివంటి సాధారణ వస్తువులు పడిఉంటే దాన్ని తీసు కోగలడు. ఏమాత్రం ప్రకటించకుండా లాభం పొందగలడు. అంటే సాధారణ వస్తువుల గురించి ప్రకటించకూడదని తెలుస్తుంది. అదేవిధంగా మిఖ్‌దామ్‌ బిన్‌ మ’అదీ కర్బ్‌ యొక్క ‘హదీసు’, ”అలా లా యహిల్లును బాబుల్‌ ఈతిసామ్‌”లో పేర్కొనడం జరిగింది.

***

%d bloggers like this: