10– كِتَابُ الْمَنَاسِكِ
10. ‘హజ్జ్ ఆచరణల పుస్తకం
విషయసూచిక
0. పుస్తక పరిచయం
1. ఇ’హ్రామ్ ధరించడం తల్బియహ్ పలకడం
2. వీడ్కోలు హజ్జ్
3. మక్కా ప్రవేశం, ‘తవాఫ్
4. అరఫాత్ మైదానంలో ఆగటం
5. అరఫాత్, ముజ్ దలిఫా నుండి తిరుగు ప్రయాణం
6. జమరాతులపై కంకర్రాళ్ళు రువ్వటం
7. ఖుర్బానీ జంతువుల విషయాలు
8. తల గొరిగించుకోవటం
9. హజ్ విధులను క్రమం మార్చి ఆచరించవచ్చు
10. ఖుర్బానీ రోజు ప్రసంగం,తష్ రీఖ్ దినాలలో కంకరరాళ్ళు రువ్వటం, వీడ్కోలు తవాఫ్
11. ము’హ్రిమ్ దూరంగా ఉండవలసిన విషయాలు
12. ము’హ్రిమ్ వేటాడరాదు
13. హజ్ మార్గంలో ఆటంకం, ‘హజ్ తప్పిపోవటం
14. మక్కహ్ పవిత్రత, దానికి అల్లాహ్ (త’ఆలా) రక్షణ
15. మదీనహ్ పవిత్రత, అల్లాహ్ (త’ఆలా) రక్షణ
—
‘హజ్జ్ అంటే ముఖ్య ఉద్దేశ్యం అని అర్థం. ఇస్లామీయ పరిభాషలో ప్రత్యేక దైవారాధన కోసం ప్రత్యేక పద్ధతిలో దైవగృహాన్ని సందర్శించడానికి ‘హజ్జ్ అంటారు. ఇస్లామ్ ఐదు మూల స్తంభాల్లో ‘హజ్జ్ కూడా ఒక మూల స్తంభం. ఇది ఆర్థికంగా మరియు భౌతికంగా శక్తి ఉన్న ప్రతి ముస్లింపై విధించబడింది. దీని విధి, ప్రాముఖ్యతల గురించి ఖుర్‌ఆన్, ‘హదీసు’లలో పేర్కొనబడింది. శక్తి ఉండి కూడా, దానికి తగిన వారు ‘హజ్జ్ చేయకపోతే చాలా పెద్దనేరస్తులుగా పరిగణించబడతారు. ఇటువంటి వారు యూదునిగానో, క్రైస్తవునిగానో మరణిస్తారు. ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే విధించబడింది. ‘హజ్జ్ చేయడంవల్ల పాపాలన్ని తొలగిపోతాయి. పాపాలన్ని ఎలా తొలగిపోతాయంటే మనిషి ఆనాడే తల్లి కడుపు నుండి జన్మించి నట్లు అయిపోతాడు.
‘హజ్జ్ రకాలు: 1. ఇఫ్రాద్ 2. ఖిరాన్ 3. తమత్తు‘ఉ.
1. ఇఫ్‌రాద్: అంటే ఒంటరి వాడు అని అర్థం. ఇస్లామీయ పరిభాషలో కేవలం హజ్జ్ను సంకల్పించు కొని, దీని విధులను ఆచరించటాన్ని ఇఫ్రాద్ అంటారు. దీని విధానం ఏమిటంటే మీరు మీఖాత్ చేరి కేవలం ‘హజ్జ్ సంకల్పంతో ఇ’హ్‌రామ్ ధరించాలి (‘ఉమ్రహ్ సంకల్పం చేయకూడదు). మక్కహ్ ముకర్రమహ్ చేరి బైతుల్లాహ్ చుట్టు 7 సార్లు ప్రదక్షిణలు (‘తవాఫ్) చేసి, సఫా-మర్వాల మధ్య 7 పచార్లు (స’యీ) చేసి, శిరో ముండనం (‘హలఖ్) చేయించుకొని ఇ’హ్‌రామ్ విప్పాలి. 8 జి’ల్’హజ్జ్ నాడు మినా వెళ్ళాలి. 9వ తేదీన అరఫాత్ వెళ్ళి పగలు గడపాలి. అక్కడ ”జుహ్ర్, ‘అస్ర్ నమా’జులు కలిపి చదవాలి. దు’ఆలు చేయాలి. ఆ రోజు సూర్యాస్తమం తరువాత ము’జ్‌దలిఫహ్ వచ్చి రాత్రి గడపాలి. మ’గ్రిబ్ ‘ఇషాఅ’ నమా’జులు కలిపి చదవాలి. ముజ్‌దలిఫాలో దు’ఆలు చేయాలి. 51 కంకర రాళ్ళు ఎత్తుకోవాలి.10వ తేదీన మినా వెళ్ళాలి. మొదటి షై’తాన్ (జమరతుల్–‘అఖబహ్) కు మాత్రమే, 7 కంకరరాళ్లు రువ్వాలి. శిరోముండనం (‘హలఖ్) చేయించుకొని ఇ’హ్‌రామ్ విప్పాలి. ఆ తరువాత మక్కహ్ వెళ్ళి ‘తవాఫె ఇఫా‘దహ్ చేసి మళ్ళీ మినా తిరిగి వెళ్ళాలి. మూడు (10,11,12) రోజులు మినాలో గడపాలి. మినాలో దు’ఆలు చేస్తూ ఉండాలి. 11,12 వ తేదీలలో కూడా ”జుహ్ర్ తరువాత, మూడు షై’తాన్ (జమరాతు)లకు, ప్రతి దానికి 7 కంకరరాళ్లు రువ్వాలి. 12 వ తేదీ రోజు సూర్యాస్తమయానికి ముందు, మినా విడవాలి. 12 వ తేదీన సూర్యాస్తమయానికి ముందు, మినా విడవతేక పోతే, ఆ రాత్రి అక్కడే గడిపి, 13వ తేదీన ‘జుహ్ర్ తరువాత మూడు షై’తాన్ (జమరాతు)లకు, ప్రతి దానికి 7 కంకరరాళ్లు రువ్విన తరువాత, మినా విడిచి, మక్కహ్ వెళ్ళి ‘తవాఫె విదా‘అ చేసి ఆ తరువాత ఎప్పుడైనా తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిపోవాలి. ఇదే సంక్షిప్త ఇఫ్రాద్ ‘హజ్జ్ విధానం.
2. ఖిరాన్: అంటే రెండు వస్తువులను కలపటం అని అర్థం. ఇస్లామీయ పరిభాషలో హజ్జ్ మరియు ‘ఉమ్‌రహ్ రెంటి ఇ’హ్‌రామ్ ధరించి ఒకేసారి ‘హజ్జ్ మరియు ‘ఉమ్‌రహ్ చేయటాన్ని ఖిరాన్ అంటారు. ఎందుకంటే ‘హజ్జ్ మరియు ‘ఉమ్‌రహ్ రెండూ ఒకేసారి ఆచరించటం జరుగుతుంది. దీని పద్ధతి ఏమిటంటే, మీఖాత్ చేరి ‘హజ్జ్ మరియు ‘ఉమ్‌రాహ్‌ల సంకల్పంతో ఇ’హ్‌రామ్ ధరించాలి. మక్కహ్ వెళ్ళి ‘తవాఫ్, స‘యీ చేసి, శిరోముండనం చేయరాదు, ఇ’హ్‌రామ్ విప్పరాదు. ఇ’హ్‌రామ్‌లోనే ఉంటూ, 8వ తేదీన మినా వెళ్ళాలి. మిగిలిన పనులన్నీ ఇఫ్‌రాద్ లాగే చేయాలి.
‘హజ్జ్ ఇఫ్‌రాద్‌లో కేవలం ‘హజ్జ్ సంకల్పం చేయాలి. ఖిరాన్‌లో ‘ఉమ్రహ్, ‘హజ్జ్ రెంటి సంకల్పం చేయాలి. ఇఫ్‌రాద్‌లో ఖుర్‌బానీ తప్పనిసరి కాదు. ఖిరాన్‌లో ఖుర్‌బానీ తప్పనిసరి అవుతుంది. ఖిరాన్ మరియు తమత్తు’ఉ మక్కహ్ వాసులకు ధర్మసమ్మతం కాదు. ఖిరాన్‌లో ఒక ‘తవాఫ్ ఒక స’యీ సరిపోతుంది. ప్రవక్త (స) ఖిరాన్ చేసారు. ప్రవక్త (స) ఒక ‘తవాఫ్ మాత్రమే చేసారు. ప్రవక్త (స) ప్రవచనం, ” ‘హజ్జ్ మరియు ‘ఉమ్‌రహ్‌ల ఇ’హ్‌రామ్ ధరిస్తే, రెంటి తరఫున ఒక ‘తవాఫ్ ఒక ‘సయీ సరిపోతాయి.” (తిర్మిజి’)
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ఖిరాన్ చేసారు. ఒక ‘తవాఫ్ చేశారు. (తిర్మిజి’) ప్రవక్త (స) అనుచరులు, తాబయీన్లు ఖిరాన్‌లో ఒక ‘తవాఫ్, ఒక స’యీ చేసారు. (అల్-ము’గ్‌నీ) ఒక పెద్ద హదీసులో ‘ఆయి’షహ్ (ర) కథనం: ‘హజ్జ్ మరియు ‘ఉమ్‌రహ్‌లను కలిపి చేసినవారు ఒక ‘తవాఫ్ మాత్రమే చేసారు.
‘ఆయి’షహ్ (ర) ‘హజ్జతుల్ విదాలో ప్రవక్త(స) వెంట ఖారిన్‌గా ఉన్నారు. అప్పుడు ప్రవక్త(స) ఆమెతో నీ ‘తవాఫ్ నీ ‘హజ్జ్ మరియు ‘ఉమ్‌రహ్‌లకు సరిపోతుంది’ అని అన్నారు. అ’హ్‌మద్ బిన్ ‘హంబల్ ఖిరాన్ చేసే వారికి ఇఫ్‌రాద్‌లో ఉన్నవే సరిపోతాయని, ఖారిన్ ‘హజ్జ్ ‘ఉమ్‌రహ్‌లకు ఒక ‘తవాఫ్, ఒక స’యీ సరిపోతుందని అభిప్రాయపడ్డారు. (అల్-ముగ్‌నీ)
ఖారిన్‌పై ఖుర్‌బానీ తప్పనిసరి అవుతుంది. ఇది కృతజ్ఞతా పూర్వకంగా ఉంటుంది. పరిహారంగా మాత్రం కాదు. ఖారిన్ తన వెంట ఖుర్‌బానీ జంతువును తీసుకొని వెళ్ళాలి. మినాలో 10వ తేదీన దాన్ని జిబహ్ చేయాలి. ఖుర్‌బానీ స్తోమత లేనివారు 10 ఉపవాసాలు ఉంచాలి. 3 రోజులు మక్కహ్ లో, 7 రోజులు ఇంటికి వెళ్ళిన తర్వాత. అల్లాహ్ ఆదేశం: ”…’హజ్జ్, ‘ఉమ్‌రహ్ కలిపి చేసినవారు, తన శక్తికి తగ్గట్టు ఖుర్బానీ చేయాలి. శక్తి లేని వారు ‘హజ్జ్ కాలంలో (మక్కహ్ లో) 3 ఉపవాసాలు మరియు ఇంటికి తిరిగివచ్చిన తర్వాత 7 ఉపవాసాలు ఉండాలి. మొత్తం 10 అవుతాయి…” (సూ. బఖరహ్, 2:196)
ఖిరాన్ అందరి కోసం కాదు. ఇది కేవలం దూర ప్రాంతాల వారికే. ఖిరాన్ మక్కహ్ వాసులకు వర్తించదు. అల్లాహ్ ఆదేశం:”…ఈ ఖిరాన్, తమత్తు’ఉ మస్జిదె ‘హరామ్ వద్ద నివసించని వారికి మాత్రమే. (సూ. బఖరహ్, 2:196)
3. తమత్తుఉ: అంటే లాభం పొందటం అని అర్థం. ఇస్లామీయ పరిభాషలో మీఖాత్ చేరి కేవలం ‘ఉమ్‌రహ్ సంకల్పంతో ఇ’హ్‌రామ్ ధరించాలి. మక్కహ్ చేరి ‘ఉమ్‌రహ్ విధులు నిర్వర్తించి ఇ’హ్‌రామ్ తొలగించాలి. ఆ తరువాత మళ్ళీ 8వ తేదీన ‘హజ్జ్ ఇ’హ్‌రామ్ ధరించాలి. ‘హజ్జ్ ఇఫ్రాద్‌లోని విధులన్నీ నిర్వర్తించాలి. తమత్తు’ఉ అంటే లాభం పొందడం, ‘ఉమ్‌రహ్ మరియు ‘హజ్‌ల మధ్య ఇ’హ్‌రామ్ తొలగించి లాభం పొందగలరు. ఖారిన్ ఇలా లాభం పొందలేడు. ఎందుకంటే ఖారిన్ ఉమ్‌రహ్ నిర్వర్తించిన తరువాత ము’హ్‌రిమ్ గానే ఉంటాడు. ముతమత్తి ‘ఉమ్‌రహ్ తర్వాత ఇహ్‌రామ్ తొలగించి లాభం పొందగలడు. తమత్తు’ఉలో ముందు ‘ఉమ్‌రహ్ చేయాలి. ఆ తరువాత ‘హజ్జ్. తమత్తు’ఉ చేసే వారిపై ఖుర్‌బానీ తప్పనిసరి అవుతుంది. స్తోమత లేకుంటే ఖారిన్‌లా 10 ఉపవాసాలు పాటించాలి.
ఇ‘హ్‌రామ్: ‘హజ్ సంకల్పం దృఢంగా చేయాలి. మీఖాత్ చేరి అలంకరణలన్నింటినీ దూరంచేసి సాధారణ దుస్తుల్ని ధరించి, తల్బియ పలకటాన్ని ఇ’హ్‌రామ్ అంటారు. ఇలా చేయటం వల్ల ధర్మ సమ్మతమైన అనేక విషయాలు ఇ’హ్రామ్ స్థితిలో నిషిద్ధం అయిపోతాయి. ఈ ఆచరణవల్ల ‘హజ్జ్ లో ప్రవేశించారు. తక్‌బీరె త‘హ్‌రీమ్ ద్వారా నమా’జ్‌లో ప్రవేశించినట్లు. ఆ తరువాత సలామ్ వరకు అన్ని నిషిద్ధం అయిపోయినట్లు. ఈ విధంగా ఇ’హ్‌రామ్ ద్వారా అనేక విషయాలు నిషిద్ధం అవుతాయి. అందువల్లే దీన్ని ఇ’హ్‌రామ్ అంటారు. మూడు నెలల్లో ‘హజ్జ్ ఇ’హ్‌రామ్ ధరించ వచ్చును. షవ్వాల్, జు’ల్ ఖ’అదహ్, జు’ల్ ‘హిజ్జహ్ మొదటి తొమ్మిది దినాలు. ఈ దినాల్లో ‘హజ్ ఇహ్‌రామ్ ధరించవచ్చు.
ఇహ్‌రామ్ ఉద్దేశ్యం: చక్రవర్తి దర్బారు నియమాల్లో ఒక ప్రత్యేక నియమం ఏమిటంటే అక్కడికి వెళ్ళినప్పుడు ధరించవలసిన దుస్తులు ధరించి చక్రవర్తి సభలో ప్రవేశించాలి. ఇతర దుస్తులు ధరించి వెళ్ళడం మహాపరాధం అవుతుంది.
‘హజ్జ్ వార్షిక ఉత్సవం వంటిది. ఈ ఉత్సవంలో పాల్గొనే వారికి అల్లాహ్ (త) ఈ విధమైన దుస్తులు ధరించి రమ్మని ఆదేశించాడు. అందువల్ల ఈ దుస్తులను ధరించి వెళ్ళిటమే ఉత్తమం. ఆదేశించిన స్థితిలోనే వెళ్ళడం మంచిది. మీఖాత్ నుండే సభలోకి వెళ్లే సన్నాహాలు ప్రారంభించాలి. ఆయనకు ఇష్టమైన స్థితిలో వెళ్ళాలి. అంటే వినయ వినమ్రతలు, విధేయత, హుందాతనం మొదలైన వాటిని అనుసరించాలి. అందువల్లే అల్లాహ్ (సు.త) ఇ’హ్‌రామ్‌కు చాలా సాధారణ దుస్తులను నిర్ణయించాడు. ప్రాపంచిక చక్రవర్తుల సభలకు వెళ్ళే వారు తమ్ముతామే అనేక విధాలుగా అలంకరించుకొని వెళతారు. ఇందులో ఇస్లామీయ సమానత్వం కూడా కనబడుతుంది. పేదవాడు, ధనవంతుడు, బిచ్చగాడు, చక్రవర్తి అందరూ ఒకే దుస్తుల్లో ఉంటారు. ఈ దుస్తులు కఫన్‌ను పోలి కూడా ఉంటాయి. దీనివల్ల మానవునికి ఈ లోకం నుండి వెళ్ళినపుడు ఇటువంటి దుస్తులే లభిస్తాయని, ఇంతకన్నా మరేమీ లభించదని హెచ్చరించటం జరుగుతుంది. దీనివల్ల మానవునికి తన ప్రారంభ స్థితి, అంతిమ స్థితి గుర్తుకు వస్తాయి.
ఇ’హ్‌రామ్ ధరించే పద్ధతి: 1. క్షవరం చేయించు కోవాలి. 2. నాభిక్రింద వెంట్రుకల్ని తీయించుకోవాలి. ఆ తరువాత 3. సంపూర్ణ స్నానం చేసుకోవాలి. ప్రవక్త (స) ఇ’హ్‌రామ్‌కి ముందు స్నానం చేసుకున్నారు. (తిర్మిజి’). ప్రవక్త (స) ‘ఆయి’షహ్ (ర)ను, అస్మా’ (ర)ను ఇ’హ్‌రామ్ సమయాన స్నానం చేయమని ఆదేశించారు. (అబూ-దావూద్). 4. మగవారు వు’దూ చేసుకొని కుట్టబడిన దుస్తుల్ని తీసివేసి, ఒక దుప్పటిని నడుము నుండి కాళ్ళవరకు కట్టుకోవాలి, మరో దుప్పటిని కప్పుకోవాలి. ఇహ్‌రామ్‌లో మగవారు ఈ రెండు దుస్తుల్ని ధరించాలి. ఆ తరువాత సుగంధ పరిమళాలు పూసుకోవాలి. స్త్రీలకు వారి దుస్తులే ఇహ్రాం. ఆయిషహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇ’హ్‌రామ్ ధరించినపుడు నేను పరిమళాలు పూసేదాన్ని. ఇ’హ్‌రామ్‌కి ముందు ఇ’హ్‌రామ్ తొలగించిన తరువాత కూడా పరిమళాలు పూసేదాన్ని.” (బు’ఖారీ, ముస్లిమ్)
ఆ తరువాత ఒకవేళ ఫర్’ద్ నమా’జు అయితే ఫర్’ద్ నమా’జు చదివిన తరువాత, తల్బియహ్ చదవాలి. ఒకవేళ ఫర్’ద్ నమా’జు వేళ అవకపోతే ఇ’హ్‌రామ్ సంకల్పంతో రెండు రకాతులు నఫిల్ చదవాలి. ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ‘హజ్జ్ చేయడానికి బయలుదేరారు. జు‘ల్ ‘హులైఫలోని మస్జిద్‌లో రెండు రకాతులు నమా’జ్ చేసిన తరువాత ‘హజ్జ్ సంకల్పంతో ఇ’హ్రామ్ ధరించారు. (అబూ-దావూద్, అ’హ్మద్)
మొదటి రకాతులో సూరహ్ ఫాతిహా తర్వాత సూరతుల్ కాఫిరూన్ మరియు రెండవ రకాతులో సూరహ్ ఫాతిహా తర్వాత సూరతుల్ ఇ’ఖ్‌లాస్ పఠించాలి. నమా’జు ముగించిన తరువాత తల విప్పివేయాలి. ఇంకా మనసులో ‘హజ్జ్ ఇఫ్రాద్, ‘హజ్జ్ ఖిరాన్ లేదా ‘హజ్జ్ తమత్తుఉ సంకల్పం చేసుకోవాలి. అంటే ఒక వేళ ‘ఉమ్‌రహ్ చేయదలచితే ‘ఉమ్‌రహ్ సంకల్పం ఇలా చేయాలి. ”ఓ నా ప్రభూ! నేను ‘ఉమ్‌రహ్ చేయదలచుకున్నాను, నీవు దాన్ని స్వీకరించు. దాన్ని నా కొరకు సులభతరం చేయి.” ఒకవేళ కేవలం ‘హజ్జ్ చేయాలనుకుంటే కేవలం ‘హజ్జ్ సంకల్పం చేయాలి. ఒకవేళ ‘హజ్జ్ ‘ఉమ్‌రహ్ రెండూ కలిపి చేయాలను కుంటే రెంటి సంకల్పం చేసుకోవాలి. విధి ‘హజ్జ్ చేయాలను కుంటే ఫర్’ద్ ‘హజ్జ్ సంకల్పం చేయాలి. అదనంగా చేయాలను కుంటే అదనం అని సంకల్పం చేయాలి. సంకల్పం తప్పకుండా చేయాలి. సంకల్పం చేయకుండా ఏ ఆచరణ స్వీకరించబడదు. ఒకవేళ పురుషులైతే ఇ’హ్‌రామ్ నుండి ఖుర్‌బానీ వరకు తలవిప్పి ఉంచాలి. ప్రవక్త (స) ప్రవచనం: పురుషుని ఇ’హ్‌రామ్ తలపై ఉంది. మరియు స్త్రీ ఇహ్‌రామ్ ముఖంపై ఉంది. ఆ తరువాత బిగ్గరగా తల్‌బియహ్ పఠించాలి. వాటి పదాలు ఇవి. ప్రవక్త (స) ఈ తల్‌బియహ్‌ను పఠించేవారు.
”లబ్బయెక్ అల్లాహుమ్మ లబ్బయెక్, లబ్బయెక్ లాషరీక లక లబ్బయెక్, ఇన్నల్ హమ్‌ద వన్నీమత లకవల్‌ముల్‌క, లా షరీక లక్.” — — ‘ఓ అల్లాహ్! నేను నీ సన్నిధిలో, నీ ఆరాధన కొరకు హాజరయ్యాను. నీకు ఎవరూ సాటిలేరు. నేను నీ సన్నిధిలో హాజరయ్యాను. నిస్సందేహంగా స్తోత్రం, అనుగ్రహం అన్నీ నీవే. అధికారం నీకే సొంతం. నీకు సాటి ఎవరూ లేరు.’ (బుఖారీ, ముస్లిమ్)
”లబ్బయెక్ ఇలాహల్ హఖ్ఖి లబ్బయెక్” — ‘ఓ నా వాస్తవ ఆరాధ్యుడా! నేను నీ సన్నిధిలో హాజరయ్యాను.’ (ఇబ్నె మాజహ్)
లబ్బయెక్ ప్రాధాన్యత: ప్రవక్త (స) ప్రవచనం: ఒక ముస్లిమ్ ‘హాజీల లబ్బయెక్ శబ్దం విని అతనికి ఇరువైపుల ఉన్న చెట్లు, రాళ్లు అన్నీ లబ్బయెక్ అని పలుకుతాయి, (తిర్మిజి’). లబ్బయెక్‌ను విధి నమా’జుల తర్వాత, రాత్రీ పగలు ఎక్కుతూ దిగుతూ, బిడారం వెళుతూ ఉన్నప్పుడు, ఎల్లప్పుడూ పఠిస్తూ ఉండాలి.
ప్రవక్త (స) ప్రవచనం: నా వద్దకు జిబ్రీల్ వచ్చారు. నేను నా అనుచరులకు: ‘లా ఇలాహ ఇల్లల్లాహ్, లబ్బయెక్‌లను,’ బిగ్గరగా పఠించమని ఆదేశించమని అన్నారు. బిగ్గరగా లబ్బయెక్ పఠించబడేదే అన్నిటి కంటే ఉత్తమమైన ‘హజ్జ్.
—–
పవిత్ర ‘హరమ్‌లో ప్రవేశించే నియమాలు, దు‘ఆలు
బైతుల్లాహ్ చుట్టు కొన్ని మైళ్ళ వరకు గల పరిధిని హరమ్ అంటారు. ఇది మక్కహ్ కు అన్నివైపుల కొన్ని మైళ్ళ వరకు వ్యాపించి ఉంది. జిద్దహ్ వైపు 10 కిలోమీటర్ల వరకు ఉంది. ఇక్కడ ఎదురెదురుగా చిహ్నాలు నిర్మించబడి ఉన్నాయి. వాటి మధ్య నుండి ప్రజలు వెళతారు. ‘హరమ్‌లో యుద్ధం, పోరాటం, వేట, చెట్లను కోయటం, మొక్కలను పీకటం అన్నీ నిషిధ్ధం.
ప్రవక్త (స) ప్రవచనం: ”ఈ మక్కహ్ నగరం పవిత్ర మైనది. ఇందులో ముళ్ళు కోయటం, గడ్డి కోయటం, వేట జంతువును వెంటాడటం, క్రింద పడిఉన్న వస్తువును తీసుకోవటం నిషిద్ధం. అయితే ప్రకటించే వాడు ఎత్తగలడు, (బు’ఖారీ).
‘హజ్జతుల్ విదాఅ’ సందర్భంగా ప్రవక్త (స), ఇలా ప్రవచించారు, ”భూమ్యాకాశాలు పుట్టినప్పటి నుంచి ఈ మక్కహ్ నగరం పవిత్రమైనది. దీన్ని అల్లాహ్ ‘హరమ్‌గా నిర్ణయించాడు. ఇక్కడ హత్యలు, యుద్ధాలు, పోరాటాలు, సంగ్రామాలు అన్నీ నిషిద్ధం. ఇక్కడ వేటాడటం, ముళ్ళు కోయటం రెండూ నిషిద్ధం, (బు’ఖారీ).
‘హరమ్‌లో ప్రవేశించేటప్పుడు పఠించే దు’ఆను దేనినీ ప్రవక్త (స) ప్రవచించలేదు.
అయితే ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) ‘హరమ్‌లో ప్రవేశించినపుడు ఈ దు’ఆ పఠించేవారు: ”లా ఇలాహ ఇల్లల్లాహు, వ‘హ్‌దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షయ్‌ఇన్ ఖదీర్.” —- ‘అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యులెవరూ లేరు, ఆయన ఒకే ఒక్కడు. ఆయనకు ఎవరూ సాటిలేరు. రాజ్యం ఆయనదే, స్తోత్రమూ ఆయనదే. సమస్త విషయాలపై ఆయన అధికారం గలవాడు,’ (ముస్నద్ అ’హ్మద్).
ఆ తరువాత తరం వారిలో ఈ దు’ఆను కూడా చదివే వారున్నారు: ”అల్లాహుమ్మ హాజ‘హ్ ‘హరముక వ అమనుక ఫ‘హర్రిమ్ ల‘హ్‌మీ వదమీ వబషరీ అలన్నారి వ ఆమిన్నా అజాబక యౌమి తబ్‌అసు ‘ఇబాదక్ వజ్‌అల్‌నీ మిన్ అవ్‌లియాయిక వ అహ్‌లి తాఅతిక,” — — ‘ఓ అల్లాహ్! ఇది నీ ‘హరమ్, నీ శాంతి కేంద్రం. నా రక్తమాంసాలపై నరకాగ్నిని నిషేధించు. ఇంకా నీ శిక్ష నుండి రక్షించు. తీర్పుదినం నాడు నన్ను సజ్జనుల్లో చేర్చు,’ (ఈ’దా’హ్ అల్ ‘హజ్జహ్).
ఈ పవిత్ర ‘హరమ్‌ను చాలా గౌరవించాలి. పరస్పరం అత్యాచారం చేయరాదు. తుఫాను సమయంలోనూ పెద్ద చేప, చిన్న చేపను మింగలేదు. కనుక మానవుల్లో కూడా చిన్నలు, బలహీనులపై అత్యాచారం చేయరాదు. ఎల్లప్పుడూ వినయ విధేయతలతో మెలగాలి. ఎటువంటి అసభ్యకరమైన మాటలను, పనులను చేయరాదు.
——–
మక్కహ్ మరియు ఇతర నగరాలను చూచి ఈ దు‘ఆ పఠించాలి
”అల్లాహుమ్మ రబ్బస్సమావాతిస్సబ్’యి వమా అ”జ్‌లల్‌న, వ రబ్బల్ అర్’దీనస్సబ్’యి వమా అఖ్‌లల్‌న, వరబ్బ ష్షయా‘తీన వమా అ”జ్‌లల్‌న, వరబ్బర్రియా‘హి వమా జ‘రైన, ఫ ఇన్నా నస్‌అలుక ‘ఖైరహాజి‘హిల్ ఖర్‌యతి వ‘ఖైర అహ్లిహా వఖైర మాఫీహా వ న‘ఊజు‘బిక మిన్‌షర్రి అహ్‌లిహా వ షర్రి మాఫీహా.” — — ‘ఓ అల్లాహ్! సప్తాకాశాలకు, వాటిమధ్య ఉన్నవాటికి, సప్త భూములకు, వాటిపై ఉన్నవాటికి ప్రభువువు. ఓ అల్లాహ్! నీవు షైతానులకు వారు మార్గభ్రష్టత్వానికి గురిచేసేవారికి ప్రభువువు. ఓ అల్లాహ్! నీవు గాలులకు అవి ఎగురవేసే వాటికి ప్రభువువు. మేము నిన్ను ఈ పట్టణంలో ఉన్న శుభాన్నీ, ఈ పట్టణ వాసుల్లో ఉన్న శుభాన్ని అర్థిస్తున్నాము. అదేవిధంగా మేము నిన్ను ఈ పట్టణంలో ఉన్న చెడునుంచి ఈ పట్టణవాసులలో ఉన్న చెడు నుండి శరణు కోరుతున్నాము.” (నసాయి’)
ప్రవక్త (స) స్థానికులను చూచి ఈ దు’ఆ పఠించే వారు. మక్కహ్ ముకర్రమహ్ లో ప్రవేశించినపుడు స్నానం చేయడం ప్రవక్త (స) సాంప్రదాయం. ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) మక్కహ్ లో ప్రవేశించినపుడు ”ఫఖ్” అనే చోట స్నానం చేసారు, (తిర్మిజి’). ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ మక్కహ్ వచ్చి నపుడు సాయంత్రం అయితే ”జీ–తువా” అనే చోట రాత్రి గడిపి ఉదయం జీ–తువా బావి నీటితో స్నానం చేసి పగటిపూట మక్కహ్ లో ప్రవేశించేవారు. ఇంకా ప్రవక్త (స) ఇలాగే చేసేవారని అనేవారు, (బు’ఖారీ).
కనుక ఈ స్థలం నుండి వు’దూ, స్నానం చేసి నగరంలో పైవైపు నుండి గోరస్తాన్ ముఅల్లా నుండి బాబుస్సలామ్ ద్వారా ప్రవేశించాలి. ఈ మార్గాన్నే ‘హుజూన్ అని, సనియ్యతుల్ ‘ఉల్‌యా అని కూడా అంటారు.
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) మక్కహ్ లో ప్రవేశించినపుడు పై వైపునుండి ప్రవేశించారు. క్రింది వైపు నుండి బయటకు వెళ్ళారు. (తిర్మిజి).
పై భాగాన్ని సనియ్యతుల్ ‘ఉల్‌యా అని అంటారు. క్రింది భాగాన్ని సనియ్యతు స్సుఫ్లా అని అంటారు. మక్కహ్ నగరంలో ప్రవేశించినపుడు పఠించే దు’ఆ గురించి ఎటువంటి ప్రామాణిక ‘హదీసు’ లేదు. అయితే కొంతమంది ఈ దు’ఆను పఠించడం అభిలషణీయంగా భావిస్తారు.
”అల్లాహుమ్మ బారిక్లనా ఫీహా, అల్లాహుమ్మ బారిక్ లనా ఫీహా, అల్లాహుమ్మ బారిక్లనా ఫీహా, అల్లాహుమ్మర్’జుఖ్నా జనాహా, వహబ్బిబ్నా ఇలా అహ్‌లిహా, వ హబ్బిబ్ ‘సాలిహీ అహ్లిహా ఇలైనా.” (‘హి’స్‌ను ‘హు’సైన్). — ‘ఓ అల్లాహ్! ఈ నగరంలో మా కొరకు శుభం ప్రసాదించు. ఓ అల్లాహ్! ఈ నగరంలో మా కొరకు శుభాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ ఈ నగరంలో మా కొరకు శుభాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్! ఈ నగరానికి చెందిన పళ్ళు ఫలాలు మాకు అన్నీ అనుగ్రహించు. ఇంకా మమ్మల్ని ఈ నగర ప్రజల హృదయాల్లో, ఈ పట్టణంలోని పుణ్యాత్ములను మా హృదయాల్లో ప్రియమైనవారుగా చేయి.
సూచన: మక్కహ్ ముకర్రమహ్ చేరిన వెంటనే అన్నిటికంటే ముందు అల్లాహ్ గృహదర్శనం, ‘తవాఫ్, స’యీ చేయాలి. ప్రవక్త (స) ఇలాగే చేసారు, (తిర్మిజి’). కొంతమంది ముందు తాము బస చేస్తున్న స్థలానికి వెళ్ళి కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత బైతుల్లాహ్ దర్శనానికి వెళతారు. అయితే ఇది ప్రవక్త (స) సాంప్రదాయానికి వ్యతిరేకం.
కాబతుల్లాహ్ను చూచి ఈ దు’ఆ పఠించడం ప్రవక్త (స) సంప్రదాయం: ప్రవక్త (స) బైతుల్లాహ్‌ను చూచి రెండు చేతులు ఎత్తి ఈ దు’ఆను పఠించేవారు: ”అల్లాహుమ్మ జిద్ హాజ‘ల్ బైత తష్‌రీఫన్ వ త‘అ”జీమన్ వ తక్‌రీమన్ వ మహాబతన్ వ జిద్ మన్ షర్రఫహు వ కర్రమహూ మిమ్మన్ ‘హజ్జహు వ‘అతమరహు తష్రీఫన్ వ తక్‌రీమన్ వ బర్రన్,” (షాఫ’యీ). — ‘ఓ అల్లాహ్! నీవు ఈ పవిత్ర గృహానికి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, గౌరవాన్ని అత్యధికంగా ప్రసాదించు. దీన్ని సందర్శించిన వారికి ‘ఉమ్‌రహ్ చేసిన వారికి, ‘హజ్జ్ చేసిన వారికి పరిశుద్ధతను, గొప్పతనాన్ని, శుభాన్ని అత్యధికంగా ప్రసాదించు.’ ఈ దు’ఆను పఠించిన తర్వాత ఉభయలోకాల్లో శ్రేయస్సుకోరే ఇతర దు’ఆలు పఠించ వచ్చును. ఎందుకంటే ఇది స్వీకారయోగ్యమైన సమయం.
—–
మస్జిదె ‘హరమ్‌లో ప్రవేశించే దు‘ఆ
”అ‘ఊజుబిల్లాహిల్‌అ”జీమి వ బివజ్‌హి హిల్ కరీమి, వ సు‘ల్తానిహిల్ ఖదీమి మినష్షై‘తానిర్రజీమ్.” (మిష్‌కాత్) — ‘నేను మహోన్నతుడైన అల్లాహ్ ఆయన దయామయ ముఖవర్చస్సు, ఆయనప్రాచీన రాజ్యాధి కారంతో షై’తాన్ చెడుల నుండి శరణు కోరుతున్నాను.’
మస్జిదె హరామ్‌లో ‘మఖామె ఇబ్రాహీమ్’ వద్దకు వచ్చినప్పుడు, ఈ దు’ఆ పఠించాలి. ప్రవక్త (స) ప్రవచనం: ”మస్జిద్‌లో ప్రవేశించినపుడు ఈ దు’ఆను పఠించినవారి ప్రతి వస్తువు షైతాన్ నుండి భద్రంగా ఉంటుంది.” (అబూ-దావూద్) ఈ దు’ఆను కూడా పఠించడం ప్రవక్త సాంప్రదాయం.
”బిస్మిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి , రబ్బిగ్‌ఫిర్‌లీ జు‘నూబీ వఫ్‌త‘హ్‌లీ అబ్‌వాబ రహ్మతిక” — ‘అల్లాహ్ పేరుతో నేను ప్రవేశిస్తున్నాను. ఇంకా ఆయన ప్రవక్త (స) పై దరూద్ పంపుతున్నాను. ఓ అల్లాహ్ నువ్వు నా పాపాలను క్షమించు. ఇంకా నీ కారుణ్యద్వారాలు తెరువు.’
తల్‌బియహ్ పలకడం ఆపివేయాలి: ‘ఉమరహ్ చేసేవారు ‘హజరె అస్వద్ వద్దకు చేరి లబ్బయెక్ పలకడం మానివేయాలి. ప్రవక్త (స) ప్రవచనం: ” ‘ఉమ్‌రహ్ చేసేవారు ‘హజరె అస్వద్కు ఇస్తీలామ్ వరకు లబ్బయెక్ పలకాలి. ఇస్తీలామ్ సమయంలో లబ్బయెక్ పలకడం మానివేయాలి.
‘హజరె అస్వద్: ఇదొక నల్లరాయి. బైతుల్లాహ్‌లో తూర్పు మూలలో అమర్చబడిఉంది. దాని చుట్టూ వెండి పరిధి వృత్తా కారంగా ఉంది. ఇది ప్రపంచానికి అల్లాహ్ చేయివంటిది. దైవ ప్రేమ గలవారు దానితో కరచాలనం చేస్తారు. అంటే దైవంతో కరచాలనం చేస్తారన్నమాట. దాన్ని ముద్దుపెట్టుకున్నవారు అల్లాహ్ చేతిని ముద్దుపెట్టుకున్నట్లు. ఇది అల్లాహ్ (త) విధేయతకు, ప్రాముఖ్యతకు నిదర్శనం. ఇక్కడ తనవాడు పరాయివాడు తేలిపోతాడు. మంచివారు చెడ్డవారు తెలిసి పోతారు. దీన్ని గురించి ప్రవక్త (స) ప్రవచనం: ”హజరె అస్వద్ స్వర్గం నుండి అవతరించబడింది. ఇది పాలకంటే ఎక్కువ తెలుపుగా ఉండేది. కాని మానవ పాపాలు దాన్ని నల్లగా మార్చివేసాయి.” (తిర్మిజి’)
ప్రవక్త (స) ఈ నల్లరాయి గురించి వివరిస్తూ అల్లాహ్ సాక్షి! తీర్పుదినం నాడు అల్లాహ్ (సు. త) దాన్ని లేపుతాడు. దానికి రెండు కళ్ళు ఉంటాయి. వాటి ద్వారా అది చూస్తుంది. నోరు ఉంటుంది. దానితో అది మాట్లాడుతుంది. చిత్తశుద్ధితో దాన్ని ముట్టుకున్న వారి గురించి సాక్ష్యం ఇస్తుంది, (తిర్మిజి). ప్రవక్త (స) ప్రవచనం: ”అర్రుక్‌ను వల్ ముఖాము యా ఖూతాని మిన్‌యువాఖీతుల్ జన్నతి వలౌలా అన్నల్లాహ తమస నూరహుమా లఅజాతామా బైనల్ మష్‌రిఖి వల్‌మగ్‌రిబి.” — ‘హజరె అస్వద్ మరియు మఖామె ఇబ్రాహీమ్ స్వర్గంలోని పగడాల్లోని రెండు పగడాలు. ఒకవేళ అల్లాహ్ (త) వాటి వెలుగును తొలగించ కుంటే, వాటి వెలుగు వల్ల తూర్పు నుండి పడమర వరకు వెలుగే వెలుగు ఉండేది.
ఒక ఉల్లేఖనం ప్రకారం: హజరె అస్వద్, మఖామె ఇబ్రాహీమ్ స్వర్గంలోని పగడాల్లోని రెండు పగడాలు. ఒకవేళ అవిశ్వాసుల పాపాలు వాటిని ముట్టకుండా ఉంటే తూర్పు పడమరల మధ్య మెరుస్తూ ఉండేవి. కష్టంలో ఉన్నవారు, అంధులు, కుష్టువ్యాధి గలవారు మొదలైనవారు దాన్ని ముట్టుకుంటే స్వస్థత పొందుతారు. భూమిలో ఉన్న వస్తువులన్నిటిలో ‘హజరె అస్వద్ మాత్రమే స్వర్గం నుండి వచ్చింది, (బైహఖీ, తర్’గీబ్).
ఈ ‘హదీసు’ల ద్వారా పాపాలు తెల్లని వస్తువులను నల్లగా మారుస్తాయని తెలిసింది. దీనివల్ల మనం గుణపాఠం నేర్చుకోవాలి. పాపాత్ముల చేతులు తగిలితే తెల్లరాయి నల్లగా మారిపోతుంది. మరి పాపాత్ముల హృదయాల సంగతి ఏమవుతుంది? హృదయం సున్నితంగా ఉంటుంది. చాలా త్వరగా ప్రభావిత మౌతుంది. ‘హదీసు’లో ఇలా ఉంది: ”ఎవరైనా పాపం చేస్తే అతని హృదయంపై నల్లని మచ్చ ఏర్పడుతుంది. ఒక వేళ అతడు పశ్చాత్తాపం చెందితే, ఆ నల్లని మచ్చ చెరిగిపోతుంది. లేకుంటే అలాగే ఉంటుంది. ఆ తరువాత అతడు మరో పాపం చేస్తే, హృదయంపై మరోచోట నల్లని మచ్చ ఏర్పడుతుంది. క్షమాపణ, పశ్చాత్తాపం చెందితే అది చెరిగి పోతుంది. లేకుంటే అది అలాగే ఉంటుంది. ఈ విధంగా పాపాలు చేస్తూ హృదయమంతా నల్లగా మారిపోతుంది. ఖుర్‌ఆన్‌లో దీన్నే రా’న అని అనటం జరిగింది. ఏది ఏమైనా పాపాలను పీల్చుతూ ‘హజరె అస్వద్ నల్లగా మారిపోయింది. తాను నల్లగా మారి హృదయాలను తెల్లగా మారుస్తుంది.
ప్రవక్త (స) ప్రవచనం: ”ఇన్న ఇస్తీలా మహుమా యుహత్తానిల్ ఖతాయా” — ‘హజరె అస్వద్‌ను ముట్టు కోవటంవల్ల పాపాలు క్షమించబడతాయి,” (తర్‌గీబ్).
అంటే ‘హజరె అస్వద్ అల్లాహ్ (త) చేయివంటిది. దానిపై చేయి ఉంచడం దైవం చేతిపై చేయి ఉంచడం వంటిది. ప్రవక్త (స) ప్రవచనం, ”మన్‌ఫావజల్ హజరల్ అన్‌వద ఫకఅన్నమా యుఫావిజు‘ యదుర్రహ్మాని” —- ‘హజరె అస్వద్‌ను ఇస్తీలామ్ చేసినవారు దేవునితో కరచాలనం చేసినట్టే.’ (ఇబ్నె మాజహ్)
ఇబ్నె అబ్బాస్ అభిప్రాయం: ”ఇన్న ‘హాజర్రుక్‌నల్ అస్‌వద వహువ యమీనుల్లాహి ఫిల్ అర్’ది యుసాఫిహు బిహీ ‘ఇబాదహు ముసాఫిహ తర్రజులి అఖాహు.” — ‘ఈ ‘హజరె అస్వద్ భూమిపై అల్లాహ్ కుడిచేయి ,తన ప్రియభక్తులతో కరచాలనం చేస్తాడు. తన సోదరునితో కరచాలనం చేసి నట్టు.” (తు’హ్‌ఫతుల్ అహ్‌వ’జి’, ఇబ్నె ఖు’జైమహ్, తర్’గీబ్).
‘ఉమర్ (ర) హజరె అస్వద్‌ను ముద్దుపెట్టినపుడు ఇలా అన్నారు, ”ఇన్నీ అ‘అలము అన్నక ‘హజరున్ లాత‘దుర్రు వలా తన్‌ఫ‘ఉ, వలౌలా ఇన్నీ రఅయ్తు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వ సల్లమ్ యుఖబ్బిలుక మా ఖబ్బల్తుక,” (బు’ఖారీ) — ”నిస్సందేహంగా నీవు రాయివని నాకు తెలుసు. నీవు లాభం గానీ, నష్టంగానీ చేకూర్చలేవు. ప్రవక్త (స) నిన్ను ముద్దుపెట్టుకుంటూ ఉండగా చూసి ఉండక పోతే నేను నిన్ను ముద్దుపెట్టుకునేవాడిని కాను. ఆయన్ను అనుసరిస్తూ నేనిలా చేస్తున్నాను.”
ఇబ్నె ‘ఉమర్ (ర) ‘హజరె అస్వద్ను ముద్దు పెట్టు కున్నప్పుడు ఈ దు’ఆ పఠించేవారు. ”అల్లాహుమ్మ ఈమానమ్ బిక, వ త‘స్‌దీఖన్ బికితాబిక, వ వఫాఅన్ బిఅ‘హ్‌దిక, వ ఇత్తిబా‘అన్ లిసున్నతి నబియ్యిక ‘సల్లల్లాహు అలైహి వ సల్లమ్. (నైలుల్ అవ్‘తార్) — ‘ఓ అల్లాహ్ నేను నిన్ను విశ్వసించాను. నీగ్రంథాన్ని ధృవీకరించాను, నీ వాగ్దానానికి బద్ధుడను. నీ ప్రవక్తను అనుస రిస్తూ ఈ రాయిని ముట్టుకుంటున్నాను.’
అంటే ‘హజరె అస్వద్కు ఇస్తీలామ్ ప్రవక్తను అనుసరిస్తూ చేయడం జరిగింది. దాని ఆరాధనగా కాదు. దాన్ని దైవంగా భావించి కాదు, దాని ఆపద మొక్కులవాడుగా భావించి కాదు. లాభనష్టాలు చేకూర్చేదిగా భావించికాదు. ‘హజరె అస్వద్ యొక్క ఈ ప్రత్యేకతల వల్ల ప్రతి ఒక్కరూ దాన్ని ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ‘తవాఫ్ సమయంలో చాలా సందడిగా ఉంటుంది. చాలా సులభంగా ముద్దు పెట్టుకోవటమే మంచిది. ముట్టు కునే అవకాశం లేనప్పుడు అనవసరంగా వెళ్ళి ముద్దు పెట్టుకునే అవసరం ఏమాత్రం లేదు.
రుక్మె యమాని: ఇది బైతుల్లాహ్‌లో యమన్ (దక్షిణ) వైపుకు ఉంది. అందువల్లే దీన్ని రుక్మె యమానీ అంటారు. ఇది కూడా పవిత్రమైన స్థానం దీన్ని గురించి ప్రవక్త (స) నోట వినండి. ప్రవక్త (స) ప్రవచనం: ”అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ‘ఆఫియత ఫిద్దునియా వల్ ఆ‘ఖిరతి, రబ్బనా ఆతినా ఫిద్దునియా ‘హసనతన్ వఫిల్ ఆ‘ఖిరతి హసనతన్ వఖినా అజాబన్నార్.” —- ‘ఓ అల్లాహ్ నేను నిన్ను క్షమాపణ, ఉభయలోకాల్లో క్షేమం అర్థిస్తున్నాను. ఓ మా ప్రభూ! మాకు ప్రపంచంలో మంచిని, పరలోకంలో మంచినీ ప్రసాదించు, ఇంకా అగ్ని శిక్ష నుండి మమ్మల్ని రక్షించు.” (అ’హ్‌మద్, నైల్, తర్’గీబ్).
ప్రవక్త(స) ప్రవచనం: రుక్నెయమానీపై 70వేల మంది దూతలు నియమించబడి ఉన్నారు. ఎవరు ఈ దు’ఆను పఠిస్తే దానిపై వారు ఆమీన్ అని పలుకుతారు.
ముల్‌త‘జిమ్: ‘హజరె అస్వద్‌కి బైతుల్లాహ్ ద్వారానికి మధ్య స్థలాన్ని ముల్‌తజిమ్ అంటారు. అంటే కౌగలించుకోవటం అని అర్థం. ఇక్కడ నిలబడి రెండు చేతులు ఎత్తి బైతుల్లాహ్ గోడలకు అతుక్కుని రొమ్మును ముఖాన్ని గోడపై ఉంచి దీనావస్థను ప్రదర్థిస్తూ దు’ఆ చేయబడుతుంది. ఇది చాలా పవిత్రమైన స్థలం. ఇక్కడ దు‘ఆ స్వీకరించడం జరుగు తుంది. ప్రవక్త (స) దు’ఆ స్వీకరించబడే స్థలాన్నే ముల్‌తజిమ్ అంటారని అన్నారు. అక్కడ దు’ఆ చేస్తే అల్లాహ్ స్వీకరిస్తాడు. ఇబ్నె మాజహ్, అబూ-దావూద్‌లో ఇలా ఉంది, ప్రవక్త (స) ప్రవచనం: కష్టాల్లో ఉన్న వారు, ఆపదల్లో ఉన్నవారు ఇక్కడ దు’ఆ చేస్తే అతని ఆపదలన్నీ తొలగిపోతాయి.
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ఇబ్నె అబ్బాస్ ఆ స్థానంలో నిలబడి తన రొమ్మును, ముఖాన్ని గోడకు ఆనించి, రెండు చేతులను గోడపై పరచి ఇలా అన్నారు, ”ప్రవక్త (స) నా ఈ స్థానంలో ఈ విధంగా చేస్తూ ఉండటం చూసాను.” (అబూ-దావూద్)
అర్’జఖీ తన చరిత్రలో ఇలా వ్రాసారు: ”ఆదమ్ (అ) మక్కహ్ వచ్చి అన్నిటికంటే ముందు బైతుల్లాహ్ ‘తవాఫ్ చేసారు. ఆ తరువాత క’అబహ్ వైపు తిరిగి రెండు రక’అతులు నమా’జ్ చేసారు. ఆ తరువాత ముల్‌తజి’మ్ వద్దకు వెళ్ళి ఈ దు’ఆ పఠించారు.”
”అల్లాహుమ్మ ఇన్నక త‘అలము సిర్రీ వ అలానియ్యతీ ఫ అఖ్‌బిల్‌మ‘అజి‘రతీ వ త‘అలము మాఫీ నఫ్‌సీ వమా ‘ఇందీ, ఫ‘గ్‌ఫిర్‌లీ జు‘నూబీ, వ త‘అలము ‘హాజతీ ఫఅ‘అతినీ సుఆలీ, అల్లాహుమ్మ ఇన్నీ అస్‌అలుక ఈమానన్ యుబాషిరు ఖల్‌బీ, వయఖీనన్ ‘సాదిఖన్ ‘హత్తా అ‘అలము అన్నహూ లంయ్యు‘సీబనీ ఇల్లా మా కతబ్‌తలీ వర్రి‘దా బిమా ఖ‘దైత.” (తబ్‌రానీ) — ‘ఓ అల్లాహ్! నీకు నా అంతర్బాహ్యాలు తెలుసు. నా విన్నపాన్ని స్వీకరించు. నా హృదయంలో, నా వద్ద ఉన్నది కూడా నీకు తెలుసు. నువ్వు నా పాపాలను మన్నించు, నీకు నా అవసరం తెలుసు. నా కోరికను తీర్చు. ఓ అల్లాహ్ నేను నిన్ను ప్రగాఢ విశ్వాసాన్ని అర్థిస్తున్నాను. ఇంకా వాస్తవ నమ్మకాన్నీ అర్థిస్తున్నాను. నాకు దాన్ని గురించి పూర్తి మనశ్శాంతిని ప్రసాదించు. నీవు నా విధి వ్రాతలో వ్రాసిందే నాకు చేరుతుంది. ఇంకా నీవు నా పట్ల చేసిన తీర్పుపట్ల నేను సంతృప్తికరంగా ఉన్నాను.
ఆదమ్ (అ) ఈ దు’ఆ ముగించిన వెంటనే దివ్యవాణి అవతరించింది. ఈ దివ్యసందేశం అందింది: ”ఓ ఆదమ్! నేను నీ పాపాన్ని క్షమించాను. ఇంకా నీ సంతతిలో ఎవరు ఈ పదాలతో నన్ను ప్రార్థిస్తారో, నేను అతడి బాధలను, విచారాలను, చింతలను తొలగిస్తాను. ఇంకా అతడు పోగొట్టుకున్న దానికి బదులుగా ప్రసాదిస్తాను, అతడి హృదయం నుండి దారిద్య్రాన్ని తీసివేస్తాను. నిరపేక్షతతో అతని హృదయాన్ని నింపివేస్తాను. వ్యాపారి వ్యాపారంలో శుభాన్ని ప్రసాదిస్తాను. అతడు ప్రపంచం పట్ల పట్టించుకోడు. ప్రపంచం అతని పాదాల క్రింద ఉంటుంది.” (తబ్‌రానీ, బైహఖీ, ఇబ్నె ‘అసాకిర్ మనాసిక్, ముల్లా అలీ ఖారీ)
నవవీ అభిప్రాయం: ఈ దు’ఆను ముల్‌తజిమ్‌లో పఠించాలి. ఆ తరువాత తానుకోరింది అర్థించాలి. ”అల్లాహుమ్మ లకల్ ‘హమ్‌దు ‘హమ్‌దన్ యువాఫీ ని‘అమక వయుకాఫీ మ‘జీదక అ‘హ్‌మదుక బిజమీ‘యి మ‘హామిదిక, మా ‘అలిమ్‌తు వమాలమ్ అ‘అలమ్ అలా జమీ‘యి ని‘అమిక మా ‘అలిమ్‌తు మిన్‌హా వమాలమ్ అ‘అలమ్, వ ‘అలాకుల్లి ‘హాలిన్, అల్లాహుమ్మ ‘సల్లి ‘అలా ము‘హమ్మదిన్ వ ‘అలా ఆలి ము‘హమ్మదిన్, అల్లాహుమ్మ అ‘యిజ్’నీ మినష్షై‘తానిర్రజీమ్, వ అ‘యిజ్’నీ మిన్ కుల్లి సూయి‘న్ వఖన్ని‘యినీ బిమా ర‘జఖ్‌తనీ వబారిక్లీ ఫీహి, అల్లాహుమ్మజ్‌అల్‌నీ మిన్ అక్‌రమి వఫ్‌దిక అలైక వఅల్’జిమ్‌నీ సబీలల్ ఇస్తిఖామతి ‘హత్తా అల్‌ఖాక యా రబ్బల్ ‘ఆలమీన్.” (అజ్‌కారుల్ అబ్‌రార్) —- ‘ఓ నా మహోపకారి అల్లాహ్! స్తోత్రా లన్నిటికీ అర్హుడివి నీవే. నేను నీవు ప్రసాదించిన అనుగ్రహాలకు బదులుగా నిన్ను స్తుతిస్తున్నాను. దానికంటే అధికంగా ప్రసాదించిన దానికి బదులుగా, నాకు తెలిసిన, తెలియని అనుగ్రహా లన్నిటికీ వాటి ప్రత్యేకతలతో పాటు కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను. ఎల్లప్పుడూ నిన్నే కొనియాడు తున్నాను. ఓ శాంతిమయుడా! నీవు నీ ప్రవక్త (స), వారి కుటుంబీకులందరిపై, అతని అనుచరులపై కారుణ్యాన్నీ శాంతిని అవతరింపజేయి, ఓ మహా ప్రభూ! నీవు నన్ను షై’తాన్ నుండి, ప్రతిచెడు నుండి నీ శరణులో ఉంచు. నీవు నాకు ప్రసాదించిన వాటిపట్ల సంతృప్తిని ప్రసాదించు. శుభాన్ని ప్రసాదించు. ఓ సృష్టితాలన్నిటి ప్రభూ! నీవు నన్ను ముఖ్య అతిథిగా పరిగణించు. జీవితాంతం నన్ను రుజుమార్గంపై నిలకడగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్!
‘హతీమ్: ఇదొక చిన్న భాగం. ఇది కాబాకు వేరుగా ఉంది. అంటే బైతుల్లాహ్ ప్రాంగణం అన్నమాట. ఇది బైతుల్లాహ్లోని భాగమే.
మ‘తాఫ్: బైతుల్లాహ్ చుట్టూ ‘తవాఫ్ చేసే ప్రదేశాన్ని మ’తాఫ్ అంటారు. ఇది గృడ్డు ఆకారంలో ఉంది. పూర్వం దీని పొడవు (ఉత్తర-దక్షిణాల దూరం) 55 గజాలు, వెడల్పు (తూర్పు-పడమరల దూరం) 45 గజాలు. ఒకసారి ప్రదక్షణ 120 గజాలు ఉంటుంది. ఒక తవాఫ్‌లో 840 గజాలు చుట్టూ తిరగవలసి ఉంటుంది. 8వ హిజ్రీ నుండి ఈనాటి వరకు కేవలం విధి నమాజులు చదివినప్పుడే మ’తాఫ్ ఖాళీగా ఉంటుంది. రాత్రీ పగలు ‘తవాఫ్ జరుగుతూనే ఉంటుంది. ‘తవాఫ్ ప్రత్యేకతల గురించి రానున్న పేజీల్లో వివరిస్తాము.
మఖామె ఇబ్రాహీమ్ (అ): మఖామె ఇబ్రాహీమ్‌కి హరమ్‌లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని గురించి ఖుర్‌ఆన్‌లో ఆయతు అవతరింపజేయబడింది. ”ఇన్న అవ్వల బైతిన్ వు‘ది‘అ లిన్నాసి లల్లజీ‘ బిబక్కత ముబారకన్ వ హుదల్లిల్ ‘ఆలమీన్. ఫీహి ఆయాతుం బయ్యినాతున్, మఖాము ఇబ్రాహీము…” (సూ. ఆల ఇమ్రాన్, 3:96-97) — ‘నిశ్చయంగా, మానవ జాతి కొరకు మొట్ట మొదట నియమించబడిన (ఆరాధనా) గృహం బక్కహ్ లో (మక్కహ్ లో) ఉన్నదే, శుభాలతో నిండినది సమస్త లోకాల ప్రజలకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించేది. అందులో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఇబ్రాహీమ్ నిలిచిన స్థలం ఉంది… ‘
ఈ స్పష్టమైన నిదర్శనాల్లో ‘హజరె అస్వద్ ఒకటి. ఇది స్వర్గం నుండి వచ్చింది. మరొకటి మఖామె ఇబ్రాహీమ్. దీనిపై ఇబ్రాహీమ్ పాదాల చిహ్నాలు ఉన్నాయి. అల్లాహ్ (త) దీనిని ‘హరమ్‌గా నిర్ణయించాడు. ఇక్కడ అడవి జంతువును వేటాడరాదు. ఇక్కడ గ్రద్దలు, కాకులు కనబడవు. ఇది ఎంత పవిత్రమైన స్థలం అంటే ఇక్కడ అల్లాహ్(త) నమా’జు చేయమని ఆదేశించాడు. ఇంత గొప్ప స్థానం మరే ప్రదేశానికీ లేదు. అల్లాహ్ ఆదేశం: ”మఖామె ఇబ్రాహీమ్‌ను నమా‘జు చేసే ప్రదేశంగా చేసుకోండి.” (సూ. బఖరహ్, 2:125). మఖామె ఇబ్రాహీమ్ అన్నది ఒక రాయి పేరు. క’అబహ్ నిర్మాణం చేస్తున్నప్పుడు, ఇబ్రాహీమ్ (అ) దానిపై నిలబడ్డారు. అతని అడుగుల చిహ్నాలు దానిపై ఉన్నాయి.
మస్జిదుల్ హరామ్: ఇది ఒక గొప్ప మహత్తరమైన, పవిత్రమైన భవన నిర్మాణం. దీని మధ్య క’అబహ్ గృహం ఉంది. దీనికి నాలుగు వైపుల ద్వారాలు ఉన్నాయి. స్తంభాల మధ్య పంక్తుల క్రమం ఉంది. మధ్య విశాలమైన ప్రాంగణం ఉంది. జన వాసాల ప్రకారం క’అబహ్ నగరానికి మధ్య ఉంది. దీని తుర్కీ వారి నిర్మాణంలో 535 స్తంభాలు ఉండేవి. వీటిలో 301 పాల రాతితో నిర్మించబడినవి, 244 ఎర్రని రాతితో నిర్మించబడినవి. ప్రాచీన కాలంలో వెలుగు కోసం దీపాలు ఉండేవి. వీటిలో ‘జైతూన్ నూనె వాడబడేది. కాని ఇప్పుడు విద్యుద్దీపాలు ఉన్నాయి. ప్రస్తుత సౌదీ ప్రభుత్వ కాలంలో విస్తారణ కార్యక్రమాలు జరుగు తున్నాయి. పటిష్టమైన భవన నిర్మాణం జరుగు తున్నది. ఖుర్‌ఆన్‌లో అనేకచోట్ల దీన్ని గురించి పేర్కొనడం జరిగింది.
‘తవాఫ్ ప్రత్యేకతలు: ‘తవాఫ్ అంటే చుట్టూ తిరగటం, ప్రదక్షణ చేయటం, బైతుల్లాహ్ చుట్టూ తిరగటాన్ని ప్రదక్షిణం చేయటాన్ని ‘తవాఫ్ అంటారు. ‘తవాఫ్ 6 రకాలు. 1. ‘తవాఫె ఖుదూమ్. మక్కహ్ వచ్చి అన్నిటి కంటే ముందు చేసే ‘తవాఫ్. దీన్ని ‘తవాఫుల్ వురూద్, ‘తవాఫుల్లిఖా’, ‘తవాఫు త్తహియ్యహ్ అని కూడా అంటారు. 2. ‘తవాఫు జ్జియారహ్. దీన్ని జిల్ హిజ్జహ్ 10వ తేదీన ‘హజ్జ్ చేసేవారు చేస్తారు. ఇది హజ్‌లోని ఒక భాగం, దీన్ని ‘తవాఫె రుక్న్, తవాఫె ‘హజ్జ్ అని కూడా అంటారు. 3. ‘తవాఫె సద్‌ర్ బైతుల్లాహ్ నుండి తిరిగి వెళ్ళినప్పుడు చేస్తారు. దీన్ని ‘తవాఫుల్ విదా‘ అని కూడా అంటారు. 4. ‘తవాఫుల్ ‘ఉమ్‌రహ్ అంటే ‘ఉమ్‌రహ్‌లో చేసే ‘తవాఫ్. ఇది ‘ఉమ్‌రహ్‌లోని భాగం. 5. ‘తవాఫె న”జ్‌ర్ అంటే మొక్కు బడి’తవాఫ్. ఇది మొక్కుబడిచేసుకున్న వారిపై తప్పనిసరి. 6. ‘తవాఫు న్నఫిల్ అంటే ఎప్పుడైనా చేసే అదనపు ‘తవాఫ్.
‘తవాఫ్, ‘హజరె అస్వద్, రుక్నె యమానీ, ఇస్తీలామ్‌ల ప్రత్యేకతల గురించి అనేక ‘హదీసు’లు ఉన్నాయి. క్రింద కొన్ని ‘హదీసు’లను ఇవ్వడం జరిగింది. ప్రవక్త (స) ప్రవచనం: ”బైతుల్లాహ్ ‘తవాఫ్ చేసి రెండు రక’అతులు నమా’జు చదివితే అతనికి బానిసను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది. (ఇబ్నె మాజహ్). అదేవిధంగా మరో ప్రవచనం: 7 సార్లు బైతుల్లాహ్ ‘తవాఫ్ చేస్తే, అల్లాహ్ (త) అడుగడుగునా అతని పాపాలు క్షమిస్తాడు. అడుగడుగునా పుణ్యాలు ప్రసాదిస్తాడు. అడుగడు గునా తరగతులు ఉన్నతం చేస్తాడు. (ఇబ్నె ‘ఖు’జైమ, ఇబ్నె ‘హిబ్బాన్, తర్’గీబ్).
ఇబ్నెమాజహ్, మున్తఖా ఉల్లేఖనంలో ఇలా ఉంది. ప్రవక్త (స) ప్రవచనం: ”7 సార్లు బైతుల్లాహ్ తవాఫ్ చేసి, ‘సుబ్’హానల్లాహ్, అల్’హమ్‌దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, వలా హౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్’ అని పలికితే అతని 10 పాపాలు క్షమించబడతాయి. 10 పుణ్యాలు వ్రాయ బడతాయి, ఇంకా 10 తరగతులు ఉన్నతం చేయబడతాయి.”
ప్రవక్త (స) ప్రవచనం: అల్లాహ్ (త) రుక్నె యమానీపై 70 మంది దైవదూతలను నియమించాడు. ఇక్కడ ఈ దు’ఆ పఠిస్తే దైవదూతలు ఆమీన్ అంటారు.
”అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ ‘అఫ్వ వల్ ‘ఆఫియత ఫిద్దునియా వల్ ఆ‘ఖిరతి రబ్బనా ఆతినా ఫిద్దునియా ‘హసనతన్ వఫిల్ ఆ‘ఖిరతి ‘హసనతన్ వఖినా ‘అజాబన్నార్.” (ఇబ్నెమాజహ్, మున్తఖా) — ‘ఓ అల్లాహ్! నేను నిన్ను ఉభయలోకాల్లో క్షమాపణ, క్షేమాన్ని అర్థిస్తున్నాను. ఓ అల్లాహ్! ప్రపంచంలోనూ మంచిని ప్రసాదించు పరలోకంలోనూ మంచిని ప్రసాదించు. ఇంకా నరక శిక్ష నుండి నన్ను కాపాడు.’
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ బిన్ ఆస్ (ర) ఉల్లేఖనం: ”చక్కగా వు‘దూచేసి ‘హజరె అస్వద్‌ను ఇస్తీలామ్ చేస్తే దైవకారుణ్యంలో ప్రవేశిస్తాడు. ఇస్తీలామ్ చేసినప్పుడు, ”బిస్మిల్లాహి వల్లాహు అక్బరు. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీకలహు, వఅష్హదు అన్న ము‘హమ్మదన్ ‘అబ్‌దుహూ వ రసూ లుహు.” — — ‘నేను అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయన చాలా గొప్పవాడు, అల్లాహ్ తప్ప ఆరాధ్యులెవరూ లేరు, ము’హమ్మద్ (స) ఆయన దాసులు మరియు ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను,’ అని పలికితే అల్లాహ్ (త) కారుణ్యం అతన్ని కప్పుకుంటుంది. అదేవిధంగా బైతుల్లాహ్ ‘తవాఫ్ చేసినపుడు అల్లాహ్ (త) అతని ప్రతి అడుగుకు 70 వేల పుణ్యాలు వ్రాస్తాడు. 70 వేల పాపాలు క్షమిస్తాడు. 70 వేల తరగతులు ఉన్నతం చేస్తాడు. ఇంకా అతని కుటుంబానికి చెందిన 70మంది యొక్క సిఫారసు స్వీకరిస్తాడు. మఖామె ఇబ్రాహీమ్ వద్దకు వచ్చి చిత్తశుద్ధితో రెండు రక’అతులు నమా’జు చదివితే నలుగురు అరబ్బు బానిసలను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, ఈ రోజు పుట్టినట్లు పాపాల నుండి పరిశుద్ధుడై పోతాడు. (తర్‌గీబ్)
రమ్ల్: ‘తవాఫె ఖుదూమ్, ‘తవాఫె ‘ఉమ్‌రహ్‌లో మొదటి మూడు ప్రదక్షిణాల్లో మెల్లగా పరిగెత్తటాన్ని రమ్‌ల్ అంటారు.
ఇ‘ద్తి‘బా‘అ: తవాఫ్ సమయంలో వీరత్వాన్ని ప్రదర్శిస్తూ కుడి భుజం విప్పి ఉంచాలి. ఇ’హ్‌రామ్ దుప్పటిని చంక క్రింద నుండి తీసుకొని ఎడమ భుజంపై వేయటాన్ని ఇ’ద్’తిబా’అ, అంటారు. రమ్‌ల్ మరియు ఇ’ద్’తిబా’అ, కేవలం పురుషులకు మాత్రమే, స్త్రీలకు కాదు. దీనికి కారణం ఏమిటంటే ‘హుదైబియా ఒప్పందం తరువాత ప్రవక్త (స), అనుచరుల ‘ఉమ్‌రతుల్ ఖ’దాఅ’ చేయడానికి మక్కహ్ ముకర్రమహ్ వచ్చారు. వీరిని చూసి అవిశ్వాసులు మదీనహ్ వాతావరణం ముస్లిములను బలహీనతకు గురి చేసిందని, వీరు మాతో పోరాటం ఏమిటి? ‘తవాఫ్ కూడా చేయలేరని ఎగతాళి చేయసాగారు. ముస్లిముల ‘తవాఫ్ చూడ్డానికి వారు దారున్నద్వా మరియు ఇళ్ల పైకప్పులపై నుండి చూడసాగారు. ప్రవక్త (స)కు ఈ విషయం తెలిసి ఆయన అనుచరులకు ‘తవాఫ్‌లోని మొదటి మూడు ప్రదక్షిణలలో రమ్‌ల్, ఇ’ద్’తిబా’అ చేయమని అన్నారు. ఎందుకంటే అవిశ్వాసులకు వీరుల్లా కనబడాలని. మిగిలిన నాలుగు ప్రదక్షిణాల్లో మామూలుగా నడవాలి. అవిశ్వాసులు ముస్లిములను ఈ విధంగా పరిగెత్తుతూ చూచి తమ అనుమానాన్ని తప్పుడుగా భావించి చాలా సిగ్గుపడ్డారు. ఇంకా ”వారు లేడిలా ఎగురుతూ గెంతుతూ ఉన్నారు. మా కంటే శక్తిమంతులుగా ఉన్నారని అన్నారు. ప్రారంభంలో రమ్‌ల్ గురించి ఇలా ఆదేశించడం జరిగింది. కాని తరువాత అదొక తప్పనిసరి సాంప్రదాయంగా నిర్ణయించడం జరిగింది. అనుచరులు, ఇతర ముస్లిములు దీన్ని అనుసరించారు. ఒకసారి ‘ఉమర్ (ర) దాన్ని తొలగించాలని అనుకున్నారు. కాని బాగా ఆలోచించి ప్రవక్త (స) చేస్తూ ఉన్న దాన్ని మనం వదలకూడదని నిర్ణయించుకున్నారు. (బు’ఖారీ)
‘తవాఫె ఖుదూమ్ పద్ధతి: 1. పురుషులు వు’దూ చేసి తన ఇ’హ్‌రామ్ దుప్పటిని కుడి భుజం క్రింద నుండి తీసి ఎడమ భుజంపై వేసుకోవాలి. కుడి భుజం విప్పి ఉంచాలి. ‘హజరె అస్వద్ వద్దకు వచ్చి దాన్ని ముద్దు పెట్టుకోవాలి లేదా ఇస్తీలామ్ చేయాలి. ఇస్తిలామ్ చేసినపుడు, ”బిస్మిల్లాహి వల్లాహు అక్బర్” — అంటే,– ‘అల్లాహ్ పేరుతో తవాఫ్ చేస్తున్నాను. అల్లాహ్ గొప్పవాడు.’ ఆ తరువాత ఈ దు’ఆ పఠించాలి.
”అల్లాహుమ్మ ఈమానన్ బిక వత‘స్‌దీఖన్ బికితా బిక వ వఫా‘అన్ బి ‘అహ్‌దిక వఇత్తిబా‘అన్ లి సున్నతి నబియ్యిక సల్లల్లాహు అలైహి వ సల్లమ్” — ‘ఓ అల్లాహ్ నేను నిన్ను విశ్వసించి, నీ గ్రంథాన్ని ధృవీకరించి, నీ వాగ్దానానికి బద్ధుడనై, నీ ప్రవక్త (స)ను అనుసరిస్తూ ఇస్తీలామ్ చేస్తున్నాను.’ (నైలుల్ అవ్’తార్)
ఇలా పఠించి బైతుల్లాహ్‌ను తన ఎడమ వైపు ఉంచి ‘తవాఫ్ ప్రారంభించాలి. రుక్నెయమానీ వరకు భుజాలు ఎగురేస్తూ నడవాలి. ఈ దు’ఆను మెల్లమెల్లగా పఠిస్తూ ఉండాలి. దాన్ని క్రింద పేర్కొనడం జరిగింది.
”సుబ్హానల్లాహి, వల్ ‘హమ్దులిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బరు, వలా ‘హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్.” — — ‘అల్లాహ్ పరిశుద్ధుడు స్తోత్రం ఆయనకే. ఆయన తప్ప ఆరాధ్యు లెవరూ లేరు. ఆయన గొప్పవాడు. శక్తి యుక్తులు ఏమాత్రం లేవు కాని అల్లాహ్ వల్లే.’ (ఇబ్నె మాజహ్, మున్‌తఖా, నైలుల్ అవ్’తార్).
రుక్నె యమానీ వరకు ఈ దు’ఆ పఠిస్తూ ఉండండి. రుక్నె యమానీ వద్దకు చేరి ఈ దు’ఆను పఠించండి.
”అల్లాహుమ్మ ఖన్ని‘ఇనీ బిమా రజఖ్‌తనీ వబారిక్ లీ ఫీహి వ అ‘ఖ్‌లిఫ్ ‘అలాకుల్లి ‘గాయిబతిన్ లీ బి‘ఖైరిన్.” — ‘ఓ అల్లాహ్! నీవు నాకు ప్రసాదించిన వాటిపై సంతృప్తిని ప్రసాదించు. అందులో శుభం ప్రసాదించు. ఇంకా నా భార్యాబిడ్డలు, రహస్యాలపై మంచిగా పర్యవేక్షించు.’
”అల్లాహుమ్మ ఇన్నీ అ‘ఊజు‘బిక మినష్షక్కి వ ష్షిర్‌కి వన్నిఫాఖి వష్షిఖాఖి వసూయిల్ అ‘ఖ్‌లాఖి.” — ‘ఓ నా ప్రభూ! నేను నిన్ను అనుమానం నుండి, షిర్క్ నుండి కాపట్యం నుండి, వ్యతిరేకత నుండి, చెడు గుణాల నుండి శరణుకోరుతున్నాను.’ (నైలుల్ అవ్’తార్)
ప్రవక్త (స) పైన పేర్కొన్న రెండు దు’ఆలను పఠించేవారు. (నైల్)
రుక్నెయమానీ దు‘ఆ: ఈ మూలను కేవలం చేత్తో తాకాలి.
ప్రవక్త (స) ప్రవచనం: ఈ స్థానంలో 70 మంది దైవదూతలు నియమించబడి ఉన్నారు. క్రింది దు’ఆ పఠించబడినపుడు వారు ఆమీన్ అని అంటారు. రుక్నె యమానీపై ఇస్తిలామ్ తర్వాత ఈ దు’ఆను రెండు మూలల మధ్య పఠించండి. ప్రవక్త (స) దీన్ని ఈ ప్రదేశంలో పఠించారు. ఆ దు’ఆ ఇది:
”అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ ‘అఫ్వ వల్ ‘ఆఫియత ఫిద్దునియా వల్ ఆ‘ఖిరతి, రబ్బనా ఆతినా ఫిద్దునియా ‘హసనతన్ వఫిల్ ఆ‘ఖిరతి ‘హసనతన్ వఖినా‘అజా‘బన్నార్.” — ‘ఓఅల్లాహ్! నేను, నిన్ను ఉభయ లోకాల్లోనూ క్షమాపణను, క్షేమాన్నీ అర్థిస్తున్నాను. ఓ మా ప్రభూ! మాకు ఇహలోకంలో మంచినీ, పరలోకంలోనూ మంచిని ప్రసాదించు, ఇంకా మమ్మల్ని అగ్ని శిక్ష నుండి రక్షించు.’ (అహ్మద్, అబూ దావూద్)
ఈ దు’ఆను పఠిస్తూ ‘హజరె అస్వద్ వద్దకు రండి. ఇప్పుడు ఒక ప్రదక్షణ పూర్తయ్యింది. ఒకవేళ ‘హజరె అస్వద్‌ను ముద్దుపెట్టుకునే అవకాశం ఉంటే ముద్దు పెట్టుకోండి. లేకపోతే ఇస్తీలామ్ మరియు చేత్తో, కర్రతో సైగచేసి వెనుకటి దు’ఆలను పఠిస్తూ రెండవ ప్రదక్షిణ ప్రారంభించండి. ఇందులో కూడా వీరత్వాన్ని ప్రదర్శించండి. పేర్కొన్న దు’ఆలను పఠించండి. మూడవ ప్రదక్షిణ కూడా ఈ విధంగానే చేయండి. ఆ తరువాత రమ్‌ల్, ఇ’ద్తి’బా’అ చేయకండి. ఈ విధంగా ఏడు ప్రదక్షిణాలు పూర్తిచేస్తే ఒక ‘తవాఫ్ పూర్తవుతుంది. ‘హజరె అస్వద్ నుండి ‘తవాఫ్ ప్రారంభించి, ‘హజరె అస్వద్ దగ్గరే ముగించండి. ఒకవేళ హజరె అస్వద్‌కి ముద్దుపెట్టుకోవటం సాధ్యం అయితే ముద్దుపెట్టుకోండి. లేకపోతే ఇస్తీలామ్ చేసి మఖామె ఇబ్రాహీమ్ వైపునకు రండి.
తవాఫ్ యొక్క రెండు రక‘అతులు: ”వత్తఖిజూ’ మిమ్మఖామి ఇబ్రాహీమ” పఠిస్తూ మఖామె ఇబ్రాహీమ్ వద్దకు రండి. మఖామె ఇబ్రాహీమ్‌ను తనకి బైతుల్లాహ్‌కి మధ్య ఉంచి తవాఫ్‌కి చెందిన రెండు రకాతులు ఆచరించండి. మొదటి రకాతులో సూరతుల్ ఫాతిహా తరువాత అల్-కాఫిరూన్ (109), రెండవ రకాతులో సూరహ్ ఫాతిహా తరువాత సూరతుల్ అల్-ఇ’ఖ్‌లాస్ (112) పఠించండి. (బు’ఖారీ)
సలామ్ తరువాత దు’ఆ: సలామ్ చేసిన తర్వాత ఎంతో వినయ వినమ్రతలతో తన గురించి తన కుటుంబాన్ని గురించి దు’ఆ చేయండి. ఎందుకంటే ఇది స్వీకార ప్రదేశం. ఇంతకు మించి దీని గురించి మరేదీ ప్రామాణిక ‘హదీసు’ లేదు. ఖుర్‌ఆన్ ‘హదీసు’ల్లో నుండి మీరు కోరిన దు’ఆలను పఠించ వచ్చును. కాని తబ్‌రానీ, బైహఖీల ఉల్లేఖనాల ద్వారా ఆదమ్ (అ) ‘తవాఫ్ రెండు రకాతుల తర్వాత ఈ క్రింది దు’ఆను పఠించారని, అల్లాహ్ దాన్ని స్వీకరించాడని తెలుస్తుంది.
”అల్లాహుమ్మ ఇన్నక త‘అలము సిర్రీ వ ‘అలానియతీ ఫఅఖ్‌బిల్ మ‘అజి‘రతి, వత‘అలము ‘హాజతీ ఫా‘తినీ సువాలీ వత‘అలము మాఫీ నఫ్‌సీ ఫ‘గ్‌ఫిర్‌లీ జు‘నూబీ. అల్లాహుమ్మ ఇన్నీ అస్‌అలుక ఈమానన్ యుబాషిరు ఖల్‌బీ వ యఖీనన్ ‘సాదిఖన్ ‘హత్తా ఆలమ అన్నహు లా ‘యుసీబనీ ఇల్లా మా కతబ్‌తలీ వరి‘దన్ బిమా ఖసమ్‌త లీ యా అర్’హమర్రా‘హిమీన్.” —- ‘ఓ నా ప్రభూ! నీకు నా అంతర్బాహ్యాలు అన్నీ తెలుసు. నా క్షమాపణను స్వీకరించు. నా పరిస్థితి నీకు తెలుసు, నా కోరిక తీర్చు. నీకు నా హృదయ రహస్యాలు తెలుసు. నా తప్పులను క్షమించు. ఓ అల్లాహ్! నేను నిన్ను హృదయంలో నాటుకు పోయే విశ్వాసాన్ని అర్థిస్తున్నాను. నీవు నాకు గట్టి నమ్మకాన్ని ప్రసాదించు. దానివల్ల నీవు రాసిందే నాకు లభిస్తుందని తెలుసు కుంటాను. నీవు నాకు రాసిన విధి పట్ల నేను సంతృప్తికరంగా ఉన్నాను. నీవే అందరికంటే అధికంగా కరుణించేవాడవు.’
దు’ఆ పఠించిన తర్వాత మళ్ళీ ‘హజరె అస్వద్ వద్దకు రండి. దాన్ని ముద్దుపెట్టుకొని లేదా ఇస్తీలామ్ చేసి ‘జమ్’జమ్ నీటి వద్దకు వచ్చి ‘జమ్’జమ్ నీరు త్రాగండి. త్రాగిన తర్వాత సయీ కొరకు వెళ్ళండి.
సూచన: 1. ఇది ‘తవాఫ్ ఖుదూమ్ గురించి. ఇందులో రమ్‌ల్ మరియు ఇ’ద్తి’బా’అ ఉంది. ఇందులో తప్ప మరి దేనిలోనూ రమ్‌ల్, ఇ’ద్తి’బా’అ చేయకూడదు. స్త్రీలు తవాఫె ఖుదూమ్‌లో రమ్‌ల్, ఇ’ద్తి’బా’అ చేయకూడదు. మిగతా ‘తవాఫ్ అంతా పురుషుల్లాగే చేయాలి. సాధ్యమయినంత వరకు పురుషులకు దూరంగా ఉండి ‘తవాఫ్ చేయాలి. పురుషులు కూడా వారిని తల్లి, కూతురు,చెల్లిలా భావించి చెడు దృష్టితో చూడకూడదు. ఇది దైవ సన్నిధి. చూపులు సైగలు చేసే ప్రదేశం కాదు. దీనివల్ల పుణ్యాలు వ్యర్థం అవుతాయి.
2. ముస్త’హా”దహ్ స్త్రీ మరియు బవాసీర్ మరియు సిల్‌సిలుల్ బౌలి గలవారు ‘తవాఫ్, నమా’జు చేయ వచ్చు. అయితే రుతు స్రావం, జన్మమిచ్చిన స్త్రీ, ఈ స్థితులలో బైతుల్లాహ్ ‘తవాఫ్ చేయకూడదు. నమా’జు చేయకూడదు. ఇవి తప్ప మిగతా ‘హాజీలు చేసే పనులన్నీ చేయవచ్చును. స్త్రీలు ఈ స్థితుల నుండి పరిశుద్ధులైన తర్వాత ‘తవాఫ్ చేయాలి. (బు’ఖారీ)
3. వ్యాధిగ్రస్తులు, వికలాంగులు ‘తవాఫ్ చేయలేక పోతే, వారిని పట్టుకొని మీతో వాహనంపై కూర్చోబెట్టి ‘తవాఫ్, స’యీ చేయించవచ్చును. (మిష్‌కాత్)
4. జన సందడివల్ల ఒకవేళ ‘హజరె అస్వద్‌కి ముద్దు పెట్టటం సాధ్యం కాకపోతే, దాని ముందు నిలబడి దు’ఆ పఠించండి. లేకపోతే చేత్తో లేదా కర్రతో తాకి చేతిని లేదా కర్రను ముద్దు పెట్టుకోండి. అది సాధ్యం కాకపోతే దూరం నుండే దాని వైపు చేత్తో లేదా కర్రతో సైగచేసి దాన్ని ముద్దుపెట్టుకోండి. (మిష్కాత్)
‘హజరె అస్వద్‌ను ముద్దుపెట్టుకోవటానికి చాలా సేపు వరకు అక్కడ నిలబడటం, ప్రజల కుమ్ములాట, తొక్కిసలాటలో పాల్గొనడం, జనసందడిలో దూరి ప్రజలకు కష్టపెట్టి దాన్ని ముద్దుకోవటం పుణ్యం కాదు. షరీ’అత్‌లో చాలా సౌకర్యం ఉంది. ఆ సౌలభ్యాన్ని వినియోగించుకోవాలి. దాన్ని గురించి పైన పేర్కొనడం జరిగింది. ‘హజరె అస్వద్ వద్ద ఎల్లప్పుడూ జనసందడి ఉండనే ఉంటుంది.
5. స్త్రీలు ఆ సందడిలో ప్రవేశించరాదు, ఇక్కడ చాలా అప్రమత్తంగా ఉండాలి. దూరం నుండి ఇస్తీలామ్ చేయటమే మంచిది.
6. ‘తవాఫ్‌లో సాంప్రదాయక దు’ఆలు చదవటం ప్రవక్త సాంప్రదాయం. కొందరు ‘తవాఫ్ చేస్తున్నప్పుడు అసత్య కల్పిత దు’ఆలను పఠిస్తూ ఉంటారు. మొదటి సారి ఈ దు’ఆ అని, రెండవసారి ఈ దు’ఆ అని. ఇదంతా మహా పాపం. ‘తవాఫ్‌లో, ”సుబ్హా నల్లాహ్, అల్హమ్దు లిల్లాహి, వలా ఇలాహ ఇల్ల ల్లాహు” అంతే కాదు, ఖుర్‌ఆన్ మరియు ‘హదీసు’ లోని దు’ఆలను అత్యధికంగా పఠిస్తూ ఉండాలి.
7. ‘తవాఫ్ చేస్తున్నప్పుడు ఫ’ర్ద్నమా’జుకు జమా’అత్ నిలబడితే, ‘తవాఫ్ను ఆపి నమాజులో కలసిపోవాలి. నమా’జు తర్వాత ఎక్కడి నుండి వదిలారో అక్కడి నుండి పూర్తిచేసు కోవాలి. ఒకవేళ తవాఫ్ మధ్య కాలకృత్యాల అవసరం ఏర్పడితే ‘తవాఫ్ వదలి వెళ్ళి వాటిని ముగించుకొని తిరిగి వచ్చి ‘తవాఫ్ పూర్తిచేసుకోవాలి.
8. ‘తవాఫ్ 7 ప్రదక్షిణాల్లో ఒకవేళ హెచ్చుతగ్గుల అనుమానం వస్తే, ఏ అనుమానం అధికంగా ఉంటే దాన్ని అనుసరిస్తూ ఆచరించాలి. నమా’జు విషయంలో చేసినట్లు.
9. పరిశుభ్రమైన చెప్పులు ధరించి ‘తవాఫ్ చేయవచ్చును.
10. ‘తవాఫ్‌లో రెండు మూలలు, ‘హజరె అస్వద్, రుక్నె యమానీలను ముట్టుకోవాలి. రెండు షామీ మూలలను ముట్టరాదు.
11. బైతుల్లాహ్ గోడలకు సమీపంగా ‘తవాఫ్ చేయాలి. జన సందడి వల్ల దూరంగా ఉండి కూడా చేయవచ్చును.
12. ఖారిన్ ‘హజ్జ్ ‘ఉమ్‌రహ్‌లతో ఇహ్‌రామ్ ధరించిన వారు రెంటికీ ఒక ‘తవాఫ్, ఒక స’యీ మాత్రమే చేయాలి. రెండేసి ‘తవాఫ్, రెండేసి స’యీలు అవసరం లేదు. (బు’ఖారీ)
13. కొందరు అమాయకులు ‘తవాఫ్ రెండు రకాతుల నమా’జ్ చదివిన తర్వాత మఖామె ఇబ్రాహీమ్ జాలీలను పట్టుకొని దు’ఆలు చేస్తూ ఉంటారు. ఇది కల్పితం. బిద్’అత్ అవుతుంది. ఇలా ఎంతమాత్రం చేయరాదు.
స‘యీ ఉద్దేశ్యం: ‘హాజిరహ్ (అ) నీళ్ళు వెదుకుతూ ఇలా చేసారు. అల్లాహ్ (త)కు ‘హాజిరహ్ యొక్క ఈ ఆచరణ చాలా నచ్చింది. దీన్ని ‘హజ్‌లోని ఒక భాగంగా చేసివేసాడు. ‘హాజిరహ్ యొక్క ఈ సాంప్రదాయం ఎల్ల కాలం నిలిచి ఉండాలని, ఆమె పడిన కష్టాలు, నష్టాలు అందరికీ తెలియాలని అప్పుడు ఇస్లాంకు కేంద్రం మక్కహ్ పరిస్థితి ఎలా ఉండేదో తెలుస్తుందని. ఆనాడు ఆమె హృదయంలో ఎంత తపన ఉండేదో ఈనాడు కూడా అంతే తపన ఉంటే సాఫల్యం సిద్ధిస్తుందని. ప్రవక్త (స) స’యీ దైవస్మరణ కోసం నియమించబడిందని ప్రవచించారు. ”ఇన్నమా జు‘యిల‘త్తవాఫు బిల్ బైతి వ బిస్సఫా‘ వల్ మర్‌వతి వరమ్‌అల్‌జిమారి లి ఇఖామతి జి‘క్‌రిల్లాహిత‘ఆలా.” — ‘తవాఫ్ మరియు స’యీ, రమ్‌అల్ జమరాత్, దైవధ్యానం కోసం నియమించ బడ్డాయి.’ (అహ్మద్, అబూ-దావూద్)
ప్రవక్త (స) స్వయంగా తాను ఆచరించి చూపారు. ఇలా అన్నారు, ”కుతిబ ‘అలైకుముస్స‘అయు ఫస్’అవ్.” (అహ్మద్) — ‘మీపై స’యీ విధించడం జరిగింది. స’యీ చేయండి.’
స’యీ చేయకుండా ‘హజ్ పూర్తికాదు, ‘ఉమ్‌రహ్ పూర్తి కాదు. ప్రవక్త (స) ప్రవచనం: ”మా అతమ్మల్లాహు ‘హజ్జ ఇమ్‌రయిన్ వలా ‘ఉమ్‌రతహు లమ్ య‘తుఫ్ బైన ‘స్సఫా వల్‌మర్‌వతి.” (ముస్లిమ్) —- ‘సయీ చేయకుండా అల్లాహ్ (త) ‘హజ్ ‘ఉమ్‌రహ్‌లను స్వీకరించడు.’
స‘యీ పద్ధతి: ‘తవాఫ్ ఖుదూమ్‌ను ముగించిన తర్వాత మళ్ళీ ‘హజరె అస్వద్‌ను ఇస్తీలామ్ చేయాలి. ఇది స’యీని ప్రారంభించే ఇస్తీలామ్. స’యీ కొరకు బయలుదేరినపుడు ఇంతకు ముందు పేర్కొన్న దు’ఆలనే పఠించాలి. ‘సఫా కొండపై వెళ్ళిన తర్వాత ”ఇన్న‘స్సఫా వల్ మర్‌వత మిన్‌ష‘ఆ యిరిల్లాహి” (సూ. అల్ బఖరహ్, 2:158) అని పఠించండి. అంటే సఫా-మర్వాలు అల్లాహ్ నిదర్శనాలు. ఆ తర్వాత, ”అబ్‌ద‘ఉ బిమా బదఅ‘ల్లాహు” పఠించండి. అంటే ‘అల్లాహ్ (త) ప్రారంభించిన దాన్నుండి నేను ప్రారంభిస్తున్నాను.’ ఇలా పలికి మెట్లనుండి ‘సఫా కొండపై బైతుల్లాహ్ కనబడేవరకు ఎక్కండి. ప్రవక్త (స) ఇలాగే చేసారు (అబూ-దావూద్). ఆ తరువాత ఖిబ్లా వైపు తిరిగి రెండు చేతులను ఎత్తి మొదటి మూడు సార్లు ‘అల్లాహు అక్బర్’ అని పలికి ఈ దు’ఆ పఠించాలి. ప్రవక్త (స) దీన్ని ఇక్కడ పఠించారు. (ముస్లిమ్)
”లా ఇలాహ ఇల్లల్లాహు వ‘హ్‌దహు లాషరీక లహు లహుల్ ముల్కు వలహుల్ ‘హమ్దు వహువ ‘అలాకుల్లి షయ్‌ఇన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లల్లాహు వ‘హ్‌దహు ,అన్‌జ‘జ వ‘అదహు వ న‘సర ‘అబ్‌దహు వ హ‘జమల్ అహ్‌జా‘బ వ‘హ్‌దహు.” — ‘అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యులెవరూ లేరు. ఆయన ఒకే ఒక్కడు. ఆయనకు ఎవరూ సాటిలేరు. ఆయన రాజ్యానికి రారాజు. స్తోత్రం ఆయనకే చెల్లు. ఆయన ప్రతి విషయంపై శక్తి గలవాడు. ఆయన తప్ప ఆరాధ్యు లెవరూ లేరు. ఆయన ఒకే ఒక్కడు. ఆయన తన వాగ్దానాన్ని పూర్తిచేసాడు. తన దాసునికి సహాయం చేసాడు. ఆయన ఒక్కడే అవిశ్వాసుల సైన్యాన్ని తరిమి వేసాడు.’ (ముస్లిమ్)
ఈ దు’ఆను పఠించిన తరువాత దరూద్ పఠించాలి. తన గురించి, తన బంధుమిత్రుల గురించి దు’ఆ చేయండి. ఇది స్వీకారయోగ్యమైన స్థలం. మళ్ళీ తిరిగి రావడానికి ముందు చేతులెత్తి ‘సఫాపై క్రింది దు’ఆ పఠించి చేతులతో ముఖాన్ని తుడుచుకోవాలి. ఆ దు’ఆ ఇది:
”అల్లాహుమ్మ ఇన్నక ఖుల్‌త ఉద్’ఊనీ అస్తజిబ్‌లకుమ్, వ ఇన్నక లా తు‘ఖ్‌లిఫుల్ మీ‘ఆద్, ఇన్నీ అస్అలుక కమా హదైతనీ లిల్ ఇస్లామి అన్‌లా తున్’జిఅహు మిన్నీ ‘హత్తా తవఫ్ఫానీ వ అనా ముస్లిమ్.” — ‘ఓ నా ప్రభూ! నీవు దు’ఆ స్వీకరిస్తావని వాగ్దానం చేసావు. నీవువాగ్దానాన్ని భంగం చేయవు. నీవు నాకు ఇస్లామ్ భాగ్యం ప్రసాదించినట్లే, చావును కూడా నన్ను ఇస్లామ్ స్థితిలోనే ఇవ్వు.’ (మువ’త్తా ఇమామ్ మాలిక్)
ఆ తర్వాత ‘సఫా నుండి దిగి మర్వా వైపు ఈ దు’ఆను పఠిస్తూ నడవండి:
‘‘రబ్బి‘గ్‌ఫిర్ వర్’హమ్, వ అఫ్ వతకర్రమ్ ఇన్నక అన్‌తల్ అ‘అ‘జ్జుల్ అక్‌రము.” —- ‘ఓ నా ప్రభూ! నా తప్పులను క్షమించు, నా స్థితిపై దయచూపు, నీవే గౌరవం ఘనతలు గలవాడవు.’ (తబారానీ)
”రబ్బి‘గ్‌ఫిర్ వర్’హమ్ వ తజావ‘జ్ అమ్మా త‘అలము ఇన్నక అన్‌తల్ అ‘అజ్జుల్ అక్‌రము. రబ్బనా ఆతినా ఫిద్దునియా ‘హసనతన్ వఫిల్ ఆ‘ఖిరతి ‘హసనతన్ వఖినా ‘అ‘జాబన్నార్.” (ఈ’దాహ్) — ‘ఓ నా ప్రభూ! నీవు నా తప్పులను క్షమించు, నా స్థితిపై దయచూపు. నీకుతెలిసిన నా పాపాలన్నీ క్షమించు. నీవే గౌరవ ఘనతలు గలవాడవు. ఓ మా ప్రభూ! మాకు ఇహ లోకంలోనూ మంచిని ప్రసాదించు. మరియు పరలోకం లోనూ మంచిని ప్రసాదించు.’
పచ్చ చిహ్నాల మధ్య పరుగెత్తుట: ఈ దు’ఆను మరియు ఖుర్‌ఆన్ ‘హదీసు’ల్లో ఉన్న ఇటువంటి దు’ఆలను పఠిస్తూ మర్‌వహ్ వైపు మెల్లమెల్లగా నడవండి. ‘సఫా మర్వాల మధ్య మర్వాకు వెళుతూ ఎడమ ప్రక్క రెండు పచ్చచిహ్నాలు ఉన్నాయి. వీటిని పచ్చ మైలురాళ్ళు అంటారు. వాటిలో మొదటి దానికి సమీపిస్తే 5-6 గజాల దూరం ఉంటే మెల్లగా పరిగెత్తటం ప్రారంభించండి. రెండవ చిహ్నం వద్దకు చేరగానే పరుగెత్తటం ఆపివేయండి. ఆతరువాత సాధారణంగా నడవండి. చివరికి మర్వాను చేరుకోండి. మర్వాపై బైతుల్లాహ్ కనబడేవరకు ఎక్కండి. మర్వాపై ఎక్కేటప్పుడు, ”ఇన్న‘స్సఫా వల్ మర్‌వత మిన్‌ష‘ఆ యిరిల్లాహి” (సూ. అల్ బఖరహ్, 2:158) అని పఠించండి. కుడివైపు తిరిగి బైతుల్లాహ్ వైపు తిరిగి నిలబడండి. సఫాలో పఠించిన దు’ఆలను పఠించండి. చాలాసేపు వరకు దు’ఆలో నిమగ్నమయి ఉండండి. ఎందుకంటే ఇక్కడ దు’ఆ స్వీకరించబడు తుంది. ‘సఫా నుండి మర్వా వరకు ఒక ప్రదక్షిణ అవుతుంది. మళ్ళీ మర్వా నుండి దిగి, ”రబ్బి‘గ్‌ఫిర్ వర్’హమ్” దు’ఆ, అంతా పఠిస్తూ సాధారణంగా నడవండి. పచ్చ చిహ్నం రాగానే మెల్లగా పరుగెత్తటం ప్రారంభించండి. రెండవ చిహ్నం వద్ద పరుగెత్తటం ఆపివేయండి. సాధారణంగా నడుస్తూ దు’ఆలు పఠిస్తూ ‘సఫాపై చేరండి. ‘సఫాపై ఎక్కేటప్పుడు కూడా, ”ఇన్న’స్సఫా వల్ మర్‌వత మిన్‌ష’ఆయిరిల్లాహి” (సూ. అల్ బఖరహ్, 2:158) దు’ఆను పఠించండి. ఇప్పుడు 2 ప్రదక్షిణలు అయ్యాయి. మళ్ళీ ‘సఫా నుండి మర్వా వరకు 3, మర్వా నుండి ‘సఫా వరకు 4 ప్రదక్షిణలు అవుతాయి. మళ్ళీ ‘సఫా నుండి మర్వా వరకు 5, మర్వా నుండి ‘సఫా వరకు 6 మరియు ‘సఫా నుండి మర్వావరకు 7 ప్రదక్షిణాలు పైవిధంగా చేయండి. మెల్లగా పరుగెత్తవలసిన చోట పరుగెత్తి, తరువాత సాధారణంగా నడచి దు’ఆలచోట దు’ఆలు పఠించి స’యీ 7 ప్రదక్షిణాలు పూర్తిచేయండి.
స‘యీ తర్వాత: స’యీని పూర్తి చేసిన తర్వాత ఒకవేళ ‘ఉమ్‌రహ్ ఇ’హ్‌రామ్ అయితే తల గీయించు కోండి లేదా వెంట్రుకలు చిన్నవి చేయించి ఇ’హ్‌రామ్ తొలగించండి. ఒకవేళ ఖారిన్ అయితే (లేక ముఫ్రిద్ యెక్క తవాఫె ఖుదూమ్ మరియు ‘హజ్జ్ సయీ’ అయితే) తల గీయించటం గానీ, వెంట్రుకలు కత్తిరించ టం గానీ చేయకండి. మీ ఇహ్‌రామ్‌ను కొనసాగించండి. 10వ తేదీన రమీ, జు‘బ‘హ్, తలగీయించటం, మొద లైనవి చేసి ఇ’హ్‌రామ్ తొలగించండి. స’యీ తర్వాత మస్జిద్‌లో రెండు రక’అతులు నమా’జ్ చేయడం అభిలష ణీయం. అబూ దర్దా (ర) కథనం: ప్రవక్త (స) స’యీ ముగించి బైతుల్లాహ్ వద్దకు వెళ్ళి మతాఫ్‌కి ఒక మూల రెండు రక’అతులు నమా’జు చదవడం నేను చూసాను. (అ’హ్మద్, ఇబ్నె మాజహ్, ఇబ్నె ‘హిబ్బాన్).
‘హలఖ్ ఖస్‌ర్‌ల ప్రాముఖ్యత: ‘హలఖ్, ఖ’స్‌ర్‌లు కూడా ‘హజ్, ‘ఉమ్‌రహ్‌లోని కార్యాలే. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఆదేశం: ”వాస్తవానికి అల్లాహ్ తన ప్రవక్తకు, అతని స్వప్నాన్ని నిజం చేసి చూపాడు. అల్లాహ్ కోరితే, మీరు తప్పక శాంతి భద్రతలతో మీ తలలను పూర్తిగా గొరిగించుకొని లేదా తల వెంట్రుకలను కత్తిరించుకొని మస్జిద్ అల్’హరామ్‌లోకి భయపడ కుండా ప్రవేశిస్తారు.” (సూ. అల్ ఫత్‌హ్, 48:27)
ప్రవక్త (స) తల గీయించుకునే వారి కోసం మూడు సార్లు, తలవెంట్రుకలు చిన్నవి చేసుకున్నవారికోసం ఒక సారి దు’ఆ చేసారు: ”ఓ అల్లాహ్ తల గీయించు కున్న వారిని క్షమించు, వెంట్రుకలు కత్తిరించు కున్న వారికి కూడా.” (బు’ఖారీ). ఇంకా ఇలా ప్రవచించారు: ”తల గీయించుకుంటే ప్రతి వెంట్రుకకు బదులు ఒక పుణ్యం లభిస్తుంది. ఒకపాపం క్షమించబడుతుంది.” (తర్‌గీబ్). ఇంకా ఇలా ప్రవచించారు, ”తల గీయించటం వల్ల క్రిందపడిన ప్రతి వెంట్రుకకు బదులు తీర్పుదినం నాడు వెలుగు లభిస్తుంది.” (తర్’గీబ్)
స‘యీ తర్వాత ఏమి చేయాలి? స’యీ ముగించిన తర్వాత ముతమత్తి ఇ’హ్రామ్ ను తొలగించాలి. ఖారిన్ అయితే (లేక ముఫ్రిద్ యెక్క తవాఫె ఖుదూమ్ మరియు ‘హజ్జ్ సయీ’ అయితే) ఇహ్‌రామ్‌ను కొనసా గించాలి.
జమ్‌జమ్ నీరు: స’యీ మరియు క్షవరం ముగించిన తర్వాత ‘జమ్’జమ్ నీటి బుగ్గ వద్దకు వచ్చి ‘జమ్’జమ్ నీరు త్రాగాలి. కడుపునిండా త్రాగాలి. ప్రవక్త (స) ప్రవచనం: మనకూ కపటులకు తేడా ఏమిటంటే కపటులకు ప్రక్కటెముకలు నిలదొక్కవు. ముస్లిముల ప్రక్కటెముకలు నిలదొక్కు కుంటాయి. (ఇబ్నె మాజహ్) ‘జమ్’జమ్ నీటి ప్రాముఖ్యత గురించి అనేక ‘హదీసు’లు ఉన్నాయి. కొన్ని ‘హదీసు’లను క్రింద పేర్కొంటున్నాము. ప్రవక్త (స) ప్రవచనం, ” ‘జమ్ ‘జమ్ నీరు ఏ ఉద్దేశ్యంతో తాగితే, అది పూర్తవుతుంది. ఒకవేళ మీరు ఆరోగ్యం పొందాలని త్రాగితే మీకు ఆరోగ్యం లభిస్తుంది. ఒకవేళ మీరు ఆకలికి త్రాగితే మీ ఆకలి తీరుతుంది. దాహానికి త్రాగితే మీ దాహం తీరుతుంది. దీన్ని జిబ్రీ’ల్(అ) త్రవ్వారు. ఇస్మా’యీల్ (అ) గురించి (దారు ఖు’తునీ). ‘జమ్ ‘జమ్ నీరు చాలా శుభకరమైనది. ఆకలిగొన్న వారికి భోజనం వంటిది. వ్యాధిగ్రస్తులకు స్వస్థతవంటిది. (అబూదావూద్, నైల్)
జమ్ జమ్ త్రాగే విధానం: ‘జమ్’జమ్ నీటిని ఖిబ్లా వైపు తిరిగి నిలబడి మూడు శ్వాసల్లో త్రాగాలి. ప్రతిసారి ”బిస్మిల్లాహ్ చివర అల్’హమ్దులిల్లాహ్” అని పలకాలి. ఎంత త్రాగాలంటే ప్రక్కటెముకలు ఇరుగ్గా అయిపోవాలి. కపటులు ఈ విధంగా త్రాగరు. (దారు ఖు’తనీ). త్రాగినపుడు ఈ దు’ఆ పఠించాలి. ఇబ్నె ‘అబ్బాస్ ‘జమ్ ‘జమ్ నీరు త్రాగినపుడు ఈ దు’ఆను పఠించేవారు.
”అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫి‘అన్ వ రి‘జ్‌ఖన్ వాసి‘అన్ వ షిఫాఅ‘న్ మిన్‌కుల్లి దాయిన్.” — ‘ఓ అల్లాహ్! నేను నిన్ను లాభం చేకూర్చే జ్ఞానాన్ని, విశాల ఉపాధిని, రోగాలన్నిటి నుండి స్వస్థతను అర్థిస్తున్నాను.’
దు‘ఆ స్వీకరించబడే స్థానాలు: సామూహిక నమా’జ్ తర్వాత, అదనపు ‘తవాఫుల తర్వాత దు’ఆ స్వీకరించబడుతుంది. ఇది ఆరాధనకు మూలం వంటిది. దు’ఆ ఎక్కడైనా చేయవచ్చు. అయితే బైతుల్లాహ్‌లో మాత్రం అది స్వీకరించబడుతుంది. క్రింద వాటిని పేర్కొనడం జరిగింది. దు’ఆ స్వీకరించబడే స్థానాల్లో భయభక్తులతో దు’ఆ చేయాలి.
1. ‘తవాఫ్ చేస్తున్నప్పుడు, 2. ‘హజరె అస్వద్ వద్ద, 3. రుక్నె యమానీ వద్ద, 4. ముల్‌త’జిమ్ వద్ద, 5. బైతుల్లాహ్ లోపల, 6. ‘హరమ్‌లో అర్ధ రాత్రిపూట, 7. బైతుల్లా పైనుండి నీళ్ళు పడేచోట (మీజాబె ర’హ్మత్), 8. ‘హరమ్‌లో మధ్యాహ్నం వేళ, 9. ‘జమ్’జమ్ నీటి బుగ్గ వద్ద, 10. ‘హరమ్‌లో సూర్యాస్తమయం సమయాన, 11. మఖామె ఇబ్రాహీమ్ వద్ద, 12. స’యీ’ సమయాన ‘సఫా మర్వాలపై, ‘సఫా మర్వాల మధ్య, 13. ‘అరఫాత్‌లో, 14. ముజ్‌దలిఫాలో, 15. మినాలో, 16. మష్’అరిల్ ‘హరామ్‌లో, 17. జమరాత్ల వద్ద. ఇవన్నీ దు’ఆ స్వీకరించబడే స్థానాలు. అరబ్బీలో లేదా తన భాషలో వినయ వినమ్రతలతో దీనావస్థలో దు’ఆ చేయాలి. ఇటువంటి అవకాశాలు రోజూ రావు.
ముల్‌త‘జిమ్: ఇది దు’ఆ స్వీకరించబడే స్థానాల్లోని ఒక స్థానం. ముల్‌త’జిమ్‌లో దు’ఆల పట్ల ప్రత్యేక శ్రద్ధా భక్తులు కలిగి ఉండాలి. ఇది ‘హజరె అస్వద్ మరియు క’అబహ్ ద్వారానికి మధ్యఉంది. ఇక్కడనిలబడి రెండు చేతులు ఎత్తి బైతుల్లాహ్ గోడకు అంటుకొని, ముఖాన్ని గోడపై ఉంచి ఏడ్చి ఏడ్చి దు’ఆ చేయాలి. భయభక్తులతో పశ్చాత్తాపం, క్షమాపణలు కోరాలి. ఇక్కడ దు’ఆ స్వీకరించబడుతుంది. ప్రవక్త (స) ప్రవచనం: ”ఆపదలకు, కష్టాలకు గురయినవారు ఇక్కడ దు’ఆ చేస్తే అతనికి క్షేమం లభిస్తుంది.” (అబూ దావూద్)
ప్రవక్త (స), అనుచరులు ముల్‌త’జిమ్‌ను కౌగలించుకొని రొమ్ములను గోడపై పరచి చేతులను చాచి దు’ఆ చేసేవారు. (అబూ దావూద్ – ‘జాదుల్ మ‘ఆద్) ఇక్కడ క్రింద పేర్కొన్న దు’ఆ పఠించాలి.
”అల్లాహుమ్మ లకల్’హమ్‌దు, ‘హమ్‌దన్ యువాఫీ నిఅమక, వయుకాఫీ మ‘జీదక, అ‘హ్‌మదుక బిజమీ‘ఇ మ‘హామిదిక, మా ‘అలిమ్‌తు వమాలమ్ ‘ఆలమ్. వ ‘అలా కుల్లి ‘హాలిన్. అల్లాహుమ్మ ‘సల్లి వసల్లిమ్, ‘అలా ము‘హమ్మదిన్ వ ‘అలా ఆలి ము‘హమ్మదిన్. అల్లాహుమ్మ అ‘ఇజ్’నీ మినష్శై‘తా నిర్రజీమ్. వ అ‘ఇజ్‌నీ మిన్‌కుల్లి సూఇ‘న్, వ ఖన్ని‘అనీ బిమా ర‘జఖ్‌తనీ, వ బారిక్‌లీ ఫీహి. అల్లాహుమ్మజ్‌అల్‌నీ మిన్ అక్‌రిమి వఫ్‌దిక అలైక. వ అల్’జిమ్‌నీ సబీలల్ ఇస్తిఖామతి ‘హత్తా అల్‌ఖాక యా రబ్బల్ ఆలమీన్.” — — ‘ఓ అల్లాహ్! స్తోత్రాలన్నీ నీ కొరకే. అవి నీ అనుగ్రహాలకు, ఇంకా నీ ఇతర అనుగ్రహాలకు సమానంగా ఉన్నాయి. నాకు తెలిసిన అనుగ్రహాలను స్తుతిస్తున్నాను. ఎల్లప్పుడూ నిన్నే స్తుతిస్తున్నాను. ఓ అల్లాహ్! నీ ప్రవక్త ము’హమ్మద్ (స)పై, వారి కుటుంబంవారిపై దరూద్ వసలామ్ అవతరింపజేయి. ఓ ప్రభూ! నన్ను షై’తాన్ నుండి రక్షించు ఇంకా అన్ని రకాల చెడులనుండి రక్షించు. ఇంకా నీవు నాకు ప్రసాదించిన వాటి వల్ల సంతృప్తిని, శుభాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్! నన్ను నీ ప్రత్యేక అతిథిగా పరిగణించు. చివరి క్షణం వరకు రుజుమార్గంపై స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు.” (అజ్’కారె నవవీ)
ఇదేకాక ఖుర్‌ఆన్ ‘హదీసు’లో మీకు అనుగుణంగా ఉన్న దు’ఆలను పఠించండి. మీ దు’ఆల్లో ఈ నిమిత్త మాత్రుణ్ని కూడా గుర్తుంచండి. కృతజ్ఞతలు. మీకు ఎలాంటి నష్టం లేదు.
మినావైపు బయలుదేరుట: ఒకవేళ మీరు తమత్తు’ఉ ఇ’హ్‌రామ్ ధరించి ఉండి ‘ఉమ్‌రహ్ కొరకు ఇ’హ్‌రామ్ తొలగించి ఉంటే, లేక ముఫ్రిద్ అయితే జి’ల్’హిజ్జ 8న ఎక్కడున్నా ఉదయం స్నానంచేసి వు’దూ చేసి ఇ’హ్‌రామ్ ధరించి రెండు రక’అతులు నమా’జు చదవండి. ఒకవేళ ఖారిన్ అయి ఇ’హ్రామ్ లో ఉంటే మళ్ళీ ఇ’హ్‌రామ్ ధరించే అవసరం లేదు. ఇప్పుడు మీరు మీ ముఅల్లిం (‘హజ్ గైడ్) వెంట, సామాన్లను తీసుకొని లబ్బయెక్ పలు కుతూ మినా వైపు వెళ్ళండి. మినా చేరి అక్కడ మీ కోసం ఏర్పాటు చేయబడిన ప్రదేశంలో బస చేయండి. చోటు పొందటానికి తగాదాలుపడకండి. ఎక్కడ ఎవరు ముందు ఆక్రమించుకుంటే, ఆ చోటు వారిదే. ప్రవక్త (స) ప్రవచనం: ”మినా లిమన్ సబఖ,” (తిర్మిజి’).- ‘మినాలో ఎవరు ముందు వెళితే అది వారిదే, ఎవరూ అతన్ని అక్కడినుండి తొలగించ రాదు.
మినాలోని మూడు పనులు సాంప్రదాయబద్ధమైనవి. 1. ”జుహ్‌ర్, ‘అ’స్ర్, మ’గ్‌రిబ్, ‘ఇషా, ఫజ్‌ర్ నమాజులు మినాలో చదవాలి, 2. జి’ల్’హిజ్జహ్ 8 మరియు 9 మధ్య రాత్రి మినాలో గడపాలి, 3. జి’ల్’హిజ్జహ్ 9వ తేదీన సూర్యుడు ఉదయించిన తర్వాత మినా నుండి ‘అరఫాత్ వైపు బయలుదేరాలి. మినాలో ”జుహ్‌ర్, ‘అస్‌ర్ మరియు ‘ఇషాల ఖ’స్‌ర్ చేయాలి. మ’గ్‌రిబ్, ఫజ్‌ర్‌లను పూర్తిగా చదవాలి. ఈ ఐదు నమా’జులను వీలైతే మస్జిద్‌లో చదవాలి. జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) వాహనంపై మినా వచ్చారు. ”జుహ్‌ర్, ‘అ’స్ర్, మ’గ్‌రిబ్, ‘ఇషా మరియు ఫజ్‌ర్‌ల నమా’జులు మినాలో చదివారు.
9న ‘అరఫాత్ వైపు బయలుదేరాలి: 9వ తేదీన సూర్యుడు పూర్తిగా ఉదయించిన తర్వాత కొండలపై దాని వెలుగు పడగానే మినా నుండి ‘అరఫాత్‌కు బయలుదేరాలి. మినా నుండి వెళుతూ ఈ దు’ఆను పఠించాలి.
”అల్లాహుమ్మజ్‌అల్‌హా ‘ఖైర ‘గద్‌వతిన్ ‘గదౌతుహా, వ అఖ్‌రబహా ఇలా రి‘ద్వానిక వ అబ్’అదహా మిన్ స‘ఖ‘తిక, అల్లాహుమ్మ ఇలైక తవజ్జహ్‌తు, వవజ్‌హకల్ కరీమ అరత్తు, ఫజ్అల్ ‘హజ్జీ మబ్‌రూరన్ వ స‘యీ మష్‌కూరన్ వ జ‘న్‌బీ మ‘గ్‌ఫూరన్ యా అర్’హమర్రా‘హిమీన్.” — ‘ఓ నా ప్రభూ! నా ఉదయాన్ని మంచి ఉదయంగా, నీ ప్రీతి చేకూర్చేదిగా, నీ ఆగ్రహాన్ని దూరం చేసేదిగా చేయి. ఓ అల్లాహ్! నేను నీ ప్రీతిని పొందటానికి నీ వైపు మరలాను. ఓ అందరికంటే అధికంగా కరుణించేవాడా! నువ్వు నా ‘హజ్‌ను మంచి ‘హజ్‌గా, స్వీకరించబడే ‘హజ్‌గా, నా స’యీని స్వీకరించబడే స’యీగా చేయి. నా పాపాలను క్షమించు. (రి’హ్‌లతుస్సిద్దీఖ్)
ఈ దు’ఆను, ఇతర దు’ఆలను పఠిస్తూ తహ్‌లీల్, తస్‌బీ’హ్, తక్‌బీర్, తల్‌బియహ్ పలుకుతూ నడవండి. మినాకు కొంత ముందుకు వెళితే ము’జ్‌దలిఫా వస్తుంది. తరువాత తిన్నగా ‘అరఫాత్‌కు వెళ్ళిపోండి. మధ్య ఆగకండి.
నమిరహ్: అరఫాత్‌కి ముందు ఒక మైదానాన్ని నమిరహ్ అంటారు. ఇక్కడ ఒక మస్జిద్ ఉంది. దాన్ని మస్జిదె ఆదమ్ లేదా మస్జిదె ఇబ్రాహీమ్ మరియు మస్జిదె నమిరహ్ అంటారు. మీరు జిబ్ మార్గం ద్వారా వచ్చి అక్కడే దిగండి. షామియానా లేదా మరేదైనా నీడ ఏర్పాటు చేసి దానిక్రింద కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. స్నానం, వు’దూ చేసుకోవాలి. ఏదైనా తినాలి, సూర్యుడు వాలగానే ”జుహ్‌ర్, ‘అ’స్‌ర్ నమాజులను కలిపి సామూహికంగా మస్జిదె నమిరహ్‌లో చదవాలి. ఇక్కడముందు ప్రసంగం అవుతుంది. దాన్ని వినండి, ఆ తరువాత నమా’జు సామూహికంగా కలిపి ఖ’స్‌ర్ చేయాలి. ఆ తరువాత ‘అరఫాత్‌కు వెళ్ళాలి.
‘అరఫాత్ చేరిన తర్వాత: అరఫాత్ ఒక విశాలమైన మైదానం. అందులో లక్షలాది మంది ఏకం కాగలరు. మక్కహ్ ముకర్రమహ్ నుండి 15 మైళ్ళ దూరంలో ఉంది. ఇక్కడకు వచ్చి బస చేయడం తప్పనిసరి విధి. ‘అరఫాలో బస చేయడం ‘హజ్ విధుల్లో ఒక ముఖ్యమైన విధి. ప్రవక్త ప్రవచనం: ” ‘అరఫాలో బసచేయటమే ‘హజ్.” ‘అరఫాలో బసచేయనివారి ‘హజ్ అవదు. ఇది ఇబ్రాహీమ్ (అ) జ్ఞాపకార్థం. ప్రవక్త (స) ప్రవచనం: ‘మీరు మీ మీ స్థానాల్లో ఉండండి. ఎందుకంటే మీ తండ్రి ఇబ్రాహీమ్ (అ) వారసత్వ భూమిపై ఉన్నారు.’ (అబూ దావూద్, తిర్మిజి’)
ఈ పవిత్ర మైదానంలో మీరు మీ పాపాల పట్ల క్షమాపణ కోరండి. మిమ్మల్ని మీరు ‘హష్‌ర్ మైదానంలో ఉన్నట్లు ఊహించండి. అందువల్లే దానికి ‘అరఫాత్ అనే పేరు పెట్టబడింది. ప్రపంచ ‘హాజీ లందరూ ఒకచోట చేరి పరస్పరం కలుసుకుంటారు. పరిచయం చేసు కుంటారు. దాన్ని తీర్పు మైదానంగా భావించి అల్లాహ్ ముందు అక్కడ నిలబడే సామర్థ్యాన్ని జనింపజేస్తారు.
‘అరఫాత్ దినం, ‘అరఫాత్ మైదానం విశిష్ఠత: ‘అరఫహ్ అంటే జి’ల్’హిజ్జ 9వ తేదీకి చాలా ప్రత్యేకత ఉంది. ప్రవక్త (స) ప్రవచనం: ”అల్లాహ్ వద్ద ‘అరఫహ్ దినానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అల్లాహ్ (త) ప్రాపంచిక ఆకాశంపై అవతరిస్తాడు. భూవాసుల గురించి ఆకాశవాసులలో గర్వం ప్రదర్శిస్తాడు. ‘నా దాసులను చూడండి. దూర ప్రాంతాల నుండి దుమ్ము ధూళితో ఇక్కడకు వచ్చారు. నా కారుణ్యాన్ని కోరుతున్నారు. ఇంకా నా శిక్షను చూడ లేదు.’ 9వ తేదీన అల్లాహ్ (త) అనేకమందిని నరకం నుండి విడుదల చేస్తాడు. (బ’జ్జార్, ఇబ్నె ‘ఖు’జైమహ్)
‘అరఫహ్ రోజు ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”ప్రజలారా! ఇక్కడ మీరు హాజరయినందుకు అల్లాహ్ (త) దైవదూతలపై గర్విస్తాడు. ఇంకా ఇలా అంటాడు, ”మీ పాపాలను క్షమిస్తున్నాను. కాని దాసుల హక్కులను కాదు, పుణ్యాత్ముల పొరపాట్లను క్షమిస్తున్నాను. పుణ్యాల అభ్యర్థనను పూర్తిచేస్తాను. అల్లాహ్ పేరుతో ము’జ్‌దలిఫహ్ పదండి. ము’జ్‌దలిఫహ్లో కూడా అల్లాహ్ (త) పుణ్యాత్ములను క్షమిస్తాడు. ఇంకా వారి సిఫారసును స్వీకరిస్తాడు. దైవకారుణ్యం అందరినీ ఆవరించు కుంటుంది. భూమిపై ఆయన క్షమాపణ వ్యాపిస్తుంది. ఇంకా ఎవరు తన నోటిని చేతిని తన అధీనంలో ఉంచుతారో వారిని కారుణ్యం చుట్టుకుంటుంది. ఇబ్లీసు మరియు అతని సంతతి ‘అరఫాత్ కొండల పైకెక్కి ‘హాజీలను చూచి నిరాశ చెందుతూ, ఆందోళనకు గురై కేకలు వేస్తుంటారు. (తర్‌గీబ్)
అనస్ బిన్ మాలిక్ (ర) కథనం: ”ప్రవక్త (స) ‘అరఫాత్ మైదానంలో విడిదిచేసారు. సూర్యాస్తమ యానికి ముందు బిలాల్‌ను ప్రజలను నిశ్శబ్దంగా ఉండమను అని ప్రవక్త (స) ఆదేశించారు. బిలాల్ నిలబడి ప్రజలను మౌనంగా ఉండండని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”ప్రజలారా! ఇప్పుడిప్పుడే జిబ్రీ’ల్ (అ) వచ్చారు. అల్లాహ్ సలామ్ నాకు అందించారు. ఇంకా ఇలా అన్నారు, ‘అల్లాహ్ (త) ‘అరఫాత్‌లో ఉన్నవారందరినీ క్షమించివేసాడు.’ ” అప్పుడు ఉమర్ (ర), ‘కేవలం అనుచరులకు మాత్రమేనా లేక ముస్లిమ్ సమాజంలోని వారందరికీనా?’ అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త (స), ”ఇది మీకు మీ తరువాత తీర్పుదినంవరకు వచ్చే వారందరికీను.” కొంత మంది అభిప్రాయం, ” ‘అరఫాత్ మైదానానికి తూర్పున నోమాన్ లోయ ఉంది. అక్కడ అల్లాహ్ (త) మొట్ట మొదటి దినం నాడు మనందరితో ‘నేను మీ ప్రభువును కానా?’ అని అన్నాడు. మనమందరం సమాధానంగా ‘ఎందుకు కారు, నిస్సందేహంగా తమరు మా ప్రభువులు,’ అని అన్నాము.
‘అరఫాత్లోని ప్రత్యేక దు‘ఆలు: ‘అరఫాత్‌లో హాజరవడం కేవలం దు’ఆల కోసమే అని అర్థమవు తుంది. దీన్ని గురించి మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం. దు’ఆలను విస్మరించకండి. ఖుర్‌ఆన్ ‘హదీసు’లలో మీకు అనుగుణంగా ఉన్న దు’ఆలను పఠించండి. అయితే కొన్ని దు’ఆలు అరఫాత్‌కి ప్రత్యేకించబడి ఉన్నాయి. వాటిని గురించి ఈ క్రింద పేర్కొనడం జరిగింది. ప్రవక్త (స) ప్రవచనం: ‘అరఫహ్ నాడు చేసే దు‘ఆ అన్నిటి కంటే అత్యుత్తమమైనది.’ (తిర్మిజి’, అ’హ్మద్)
‘అరఫాత్‌లో ప్రవక్తల అత్యుత్తమమైన దు’ఆలు: ప్రవక్త (స) ప్రవచనం: ‘దు’ఆలలో అన్నిటికంటే అత్యుత్తమమైన దు’ఆలు ‘అరఫహ్ నాటి దు’ఆలు, నేనూ నాకంటే ముందు గతించిన ప్రవక్తలందరి దు‘ఆలలో అన్నిటి కంటే ఉత్తమమైన దు‘ఆ ఇది.
”లాఇలాహ ఇల్లల్లాహు వ‘హ్‌దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్’హమ్దు వహువ అలా కుల్లి షయ్‌ఇన్ ఖదీర్.” — — ‘అల్లాహ్ (త) తప్ప ఇతరు లెవ్వరూ వాస్తవ ఆరాధ్యులు లేరు. ఆయన ఒకే ఒక్కడు. ఆయనకు ఎవరూ సాటిలేరు. రాజ్యం ఆయనదే, స్తోత్రం ఆయన కొరకే, ఆయన సర్వశక్తులు గలవాడు.’ (తిర్మిజి’)
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (ర) కథనం: ‘ప్రవక్త (స) ప్రవ చనం: ముస్లిముల్లోని ఎవరైనా ‘అరఫాత్‌లో సాయంత్రం వేళ ఖిబ్లా వైపు తిరిగి 100 సార్లు ఈ దు’ఆను, 100 సార్లు సూరహ్ ఇఖ్‌లాస్‌ను, 100 సార్లు దరూద్‌ను పఠిస్తే ఈ దు’ఆ పఠించిన వారి కొరకు అల్లాహ్ (త) ఓ నా దూతలారా! ఈ దాసునికి ఏ ప్రతిఫలం లభించాలి? ఇతడు నా స్తోత్రం పలికాడు, తస్బీహ్, త’హ్‌లీల్, తక్‌బీర్, త’అ”జీమ్‌లను స్తుతించాడు, నా ప్రవక్త (స)పై దరూద్ పఠించాడు, ఓ నా దూతలారా! మీరు సాక్షిగా ఉండండి. నేను ఇతన్ని క్షమించివేసాను. అతని సిఫారసును స్వీకరించాను. ఒకవేళ అతడు ‘అరఫాత్ వాళ్ళందరి గురించి సిఫారసుచేసినా అతని సిఫారసు స్వీకరించేవాడ్ని. (తర్’గీబ్)
”లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ ‘హమ్దు యుహ్‌యీ వయుమీతు వహువ అలా కుల్లి షయ్‌ఇన్ ఖదీర్.”— ‘అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యులెవరూ లేరు, ఆయన ఒకే ఒక్కడు. ఆయనకు ఎవరూ సాటిలేరు, రాజ్యం ఆయనదే, స్తోత్రం ఆయనకే సొంతం, ఆయనే జీవం పోస్తాడు, జీవం తీస్తాడు. ఆయన సమస్త విషయాలపై శక్తిగలవాడు.’
”అల్లాహుమ్మ సల్లిఅలా ము‘హమ్మదిన్ కమా సల్లైత ‘అలా ఇబ్రాహీమ వ ‘అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక ‘హమీదుమ్మజీదున్ వ అలైనా మఅహుమ్.” — ‘ఓ అల్లాహ్! ఇబ్రాహీమ్ (అ) పై కారుణ్యం అవతరింపజేసి నట్లు ముహమ్మద్ (స)పై, ఆయన కుటుంబంపై కూడా కారుణ్యం కురిపించు. వారితో పాటు మాపైకూడా కారుణ్యం కురిపించు.’ (బైహఖీ)
ఆ తరువాత ఈ క్రింది దు’ఆలను చిత్తశుద్ధితో పఠించాలి:
”లా ఇలాహ ఇల్లల్లాహు వ‘హ్‌దహు లా షరీకలహు లహుల్ ముల్కు వలహుల్ ‘హమ్దు వహువ అలాకుల్లి షయ్‌ఇన్ ఖదీర్. అల్లాహుమ్మజ్’అల్ ఫీ ఖల్‌బీ నూరన్ వ ఫీ సమ్’యీ నూరన్ వ ఫీ బ‘సరీ నూరన్. అల్లాహుమ్మ ష్‌రహ్‌లీ ‘సద్‌రీ వయస్సిర్‌లీ అమ్‌రీ అ‘ఊజుబిక మిన్ వసావిసి ‘సద్‌రీ వ షత్తాతిల్ అమ్‌రి వ ఫిత్‌నతిల్ ఖబ్‌రి. అల్లాహుమ్మ ఇన్నీ అ‘ఊజుబిక మిన్ షర్రి మా యలిజు ఫిల్లైలి వ షర్రి మా యలిజు ఫిన్నహారి వ షర్రి మా తహబ్బు బిహిర్రియా‘హు వ షర్రి బి వాఇఖిద్దహ్రి.” (‘తబ్‌రానీ, ‘హి’స్‌ను ‘హు’సైన్) — ‘అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యులెవరూ లేరు, ఆయన ఒకే ఒక్కడు. ఆయనకు ఎవరూ సాటిలేరు, రాజ్యం ఆయనదే, స్తోత్రం కూడా ఆయనదే. సమస్త విషయాలపై ఆయన శక్తి గలవాడు. ఓ అల్లాహ్! నీవు నా హృదయంలో, చెవిలో, కళ్ళల్లో వెలుగు ప్రసాదింపజేయి. ఓ అల్లాహ్! నా హృదయాన్ని వికసింపజేయి. ఇంకా నా పనులను నా కొరకు సులభతరం చేయి, ఓ అల్లాహ్! హృదయాల చెడు ఆలోచనల నుండి, చెడు పనుల చెడు ఫలితాల నుండి, సమాధి కల్లోలాల నుండి నేను నీ శరణు కోరుతున్నాను. ఓ అల్లాహ్! నీ ద్వారా రాత్రీ పగలు మరియు గాలుల చెడునుండి, కాలం యొక్క చెడునుండి నీ శరణు కోరుతున్నాను. (‘తబ్‌రానీ, ‘హి’స్‌ను ‘హు’సైన్)
—–
ప్రవక్త (స) దు‘ఆలు
”అల్లాహుమ్మ లకల్ ‘హమ్దు కల్లజీ తఖూలు వ ఖైరన్ మిమ్మా నఖూలు, అల్లాహుమ్మ లక ‘సలాతీ, వ నుసుకీ వమ‘హ్‌యాయ వ మమాతీ, వ ఇలైక మఆబీ వలక రబ్బి తురాసీ‘, అల్లాహుమ్మ ఇన్నీ అ‘ఊజుబిక మిన్ అజా‘బిల్ ఖబ్‌రి వ వస్‌వసతి‘స్సద్‌రి వ షత్తాతిల్ అమ్‌రి. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ‘ఖైరి మా తజీఉ బిహిర్రీ‘హు వ అ‘ఊజుబిక మిన్ షర్రిమా తజీఉ‘ బిహిర్రీ‘హు.” — — ‘ఓ నా ప్రభూ! నీవు పోగిడినట్లే ఉంది నీ గొప్పతనం. మేము చేసిందాని కంటే ఉన్నతంగా ఉంది. ఓ నా ప్రభూ! నా నమా’జు, నా త్యాగం, నా జీవితం, నా మరణం, నా ధనం అన్నీ నీ కోసమే, ఇంకా నా నివాసం కూడా నీవద్దనే ఉంది. ఓ నాప్రభూ! సమాధి శిక్షనుండి, హృదయాల దురాలోచనలనుండి కర్మల చెడునుండి నేను నీ శరణు కోరుతున్నాను. ఓ అల్లాహ్! గాలుల చెడునుండి నేను నీ శరణు కోరుతున్నాను.’ (తిర్మిజి’)
ప్రవక్త (స) ‘అరఫాత్ మైదానంలో అత్యధికంగా పఠించే దు’ఆ ఇది.
”అల్లాహుమ్మ ఇన్నక తస్మ‘ఉ కలామీ వ త‘అలము మకానీ వ త‘అలము సిర్రీ వ ‘అలానియతీ లా య‘ఖ్‌ఫా అలైక షయ్‌ఉన్ మిన్ అమ్‌రీ. వ అనల్ బాయి‘సుల్ ఫఖీరుల్ ముస్త‘గీసు‘ల్ ముస్తజీరుల్ వజ్‌లుల్ ముష్‌ఫిఖుల్ ముఖిర్రుల్ ము‘అతరిఫు బి జ‘న్‌బీ, అస్‌అలుక మస్‌అ‘లతల్ మిస్కీని. వఅబ్‌తహిలు ఇలైక ఇబ్‌తిహాలల్ ముజ్’నిబిజ్జ‘లీలి. వ అద్’ఊక దు‘ఆ అల్ ‘ఖాయిఫి‘ద్ధరీరి మన్ ఖ‘ద‘అత్ లక రఖ్‌బతుహు వ ఫా‘దత్‌లక ‘అయ్నాహు వ న‘హిల లక జసదుహు వ ర‘గిమ లక అన్ఫుహు. అల్లా హుమ్మ లా తజ్’అల్నీ బిదు‘ఆ‘ఇక, రబ్బి షఖియ్యన్ వకున్‌బీ రఊ‘ఫన్ ర‘హీమన్ యా ‘ఖైరల్ మస్’ఊలీన యా ‘ఖైరల్ ము‘అ‘తీన, యా అర్’హమ ర్రా‘హిమీన వల్’హమ్దులిల్లాహి రబ్బిల్ ‘ఆలమీన్.” (‘తబ్‌రానీ, మజ్‌మ’ఉ’జ్జవాయి’ద్) — ‘ఓ అల్లాహ్! నీవు నా ప్రతిమాట వింటున్నావు. నా నివాసం, నా అంతర్బా హ్యాలను గురించి నీకు బాగా తెలుసు. నా ఏ విషయం నీ నుండి దాగిలేదు. నేను నీ సన్నిధిలో ఒక దరిద్రునిగా, బిచ్చగానిగా, ఫిర్యాదు చేసేవానిగా, శరణుకోరేవానిగా, భయపడేవానిగా, తప్పును ఒప్పుకునేవానిగా, అగత్యపరునిగా నిన్ను అర్థిస్తున్నాను. ఇంకా నేనొక అవమానానికి గురైన పాపాత్మునిగా నీ సన్ని ధిలో విలవిలలాడు తున్నాను. నేను నిన్ను భయపడే ఆపదలకు గురైన వాడిగా మొరపెట్టుకుంటున్నాను. నా మెడ నీ ముందు వంగి ఉంది, నా కన్నీళ్ళు నీ కోసం పారుతున్నాయి. నా శరీరం నీ కొరకు అవమా నానికి గురయింది. నా ముక్కు నీ కొరకు తెగి పోయింది. ఓ అందరికన్నా అధికంగా ఇచ్చేవాడా! ఓ అందరికంటే అధికంగా కరుణించే వాడా! నా వంటి అర్థించేవాడిని ఉత్త చేతులతో పంపకు, నా పట్ల ఉదారంగా, దయనీయంగా వ్యవహరించు. స్తోత్రాలన్నీ అల్లాహ్ కొరకే. ఆయనే సర్వలోకాలకు ప్రభువు. ఓ అల్లాహ్! నా ఈ విన్నపాన్ని స్వీకరించు.’
ప్రవక్త (స) ప్రవచనం: ”అరఫాత్‌లో ఈ దు’ఆను అత్యధికంగా పఠించండి, ”రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతన్ వ ఫిల్ ఆఖిరతి హసనతన్ వఖినా అజా బన్నార్.” —- ‘ఓ మా ప్రభూ! మాకు ఇహలోకం లోనూ మంచిని ప్రసాదించు, పరలోకంలోనూ మంచిని ప్రసాదించు. ఇంకా మమ్మల్ని నరక శిక్ష నుండి కాపాడు.’
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) ‘అరఫాత్‌లో ‘అ’స్‌ర్, ”జుహ్‌ర్ నమా’జుల తర్వాత రెండు చేతులు ఎత్తి మూడు సార్లు ”అల్లాహు అక్బర్ వ లిల్లాహిల్ ‘హమ్‌దు” మరియు మూడుసార్లు ”లా ఇలాహ ఇల్లల్లాహు వ‘హ్‌దహు లా షరీక లహు లహుల్ ముల్‌కు వల హుల్ ‘హమ్‌దు” అని పలుకుతారు. ఇంకా, ”అల్లాహు మ్మజ్‘అల్ హు ‘హజ్జన్ మబ్రూరన్ వ జంబన్ మ‘గ్ఫూరన్.” — ‘ఓ అల్లాహ్ నా ‘హజ్ ను స్వీకరించు, ఇంకా నా పాపాలను మన్నించు.’ (ఇబ్నె అబీ షైబహ్)
ఇలా పలికి రెండు చేతులతో ముఖాన్ని తుడుచు కునే వారు. ప్రవక్త (స) ‘అరఫాత్ మైదానంలో ఈ దు’ఆను పఠించేవారు. ఇంకా ఈ దు’ఆలే కాక ఇంకా అనేక దు’ఆలను మేము ఇస్లామీ వ”జాయిఫ్‌లో వివరంగా పొందుపరిచాము.
—–
అరఫాత్ నుండి తిరిగి వెళ్ళటం
”జుహ్‌ర్ తరువాత నుండి సూర్యాస్తమయం వరకు అరఫాత్ మైదానంలో గడిపి అల్లాహ్ స్మరణ, అల్లాహ్ ధ్యానం, దు’ఆలను పఠించిన తరువాత సూర్యాస్తమయం అయిన తర్వాత ము’జ్‌దలిఫహ్ వైపు వెళ్ళండి. సూర్యాస్తమయం అయిన వెంటనే అక్కడి నుండి కదలకండి, ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”అజ్ఞాన కాలంలో ప్రజలు ‘అరఫాత్ మైదానం నుండి సూర్యాస్తమయం అవకముందే బయలుదేరేవారు. అదేవిధంగా ము’జ్దలిఫహ్ నుండి సూర్యోదయం తరువాత బయలుదేరేవారు. మనం ‘అరఫాత్ మైదానం నుండి సూర్యాస్తమయం తరువాత బయలుదేరుతాం. ము’జ్దలిఫహ్ నుండి సూర్యోదయానికి ముందు వెళ్ళిపోదాము. మనం అవిశ్వాసులు మరియు విగ్రహారాధకుల వక్రమార్గానికి వ్యతిరేకంగా సరైన మార్గం చూపబడ్డాము. (బైహఖీ)
ము‘జ్‌దలిఫహ్: మినా మరియు ‘అరఫాత్‌లకు మధ్య ఉంది. ఇది ‘హరమ్ సరిహద్దులోపల ఉంది. ఇక్కడ అజ్ఞాన కాలంలో అరబ్బులు తమ తాత ముత్తాతల ఘనకార్యాలను చెప్పుకొని గర్వపడే వారు. దీన్ని మష్‌అరిల్ ‘హరామ్ అని కూడా అంటారు. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఆదేశం:’…అరఫాత్ నుండి బయలు దేరిన తరువాత మష్అరిల్ ‘హరామ్ (ముజ్’దలిఫా) వద్ద (ఆగి) అల్లాహ్‌ను స్మరించండి. మరియు ఆయన మీకు బోధించిన విధంగా ఆయనను స్మరించండి, వాస్తవానికి మీరు పూర్వం మార్గభ్రష్టులుగా ఉండేవారు.’ (సూ. బఖరహ్, 2:198)
అల్లాహ్ స్మరణలో ఉభయలోకాల అనుగ్రహాలన్ని లభిస్తాయి. ప్రాచీన ‘హజ్ కాలంలో ఇక్కడ ఒక బజారు తగులుతుండేది. ఆహార సామాగ్రి, ఇతర సామాగ్రి కూడా లభించేవి. దీన్ని జమహ్ మరియు మష్‌అరుల్ ‘హరామ్ అని కూడా అంటారు. మష్‌అరుల్ ‘హరామ్ కొండను ఖజ’హ్ కొండ అని కూడా అంటారు.
ము‘జ్‌దలిఫహ్లో నమా‘జు: ము’జ్‌దలిఫహ్ చేరిన తర్వాత ఎక్కడ చోటు దొరికితే అక్కడే నివాసం ఏర్పరచుకోండి. అన్నిటికంటే ముందు అజా’న్ తక్‌బీర్ చెప్పించి ముందు మ’గ్‌రిబ్ నమా’జును సామూహికంగా ఆచరించండి. మళ్ళీ రెండవ ఇఖామత్ తర్వాత ‘ఇషా నమా’జును ఖ’స్‌ర్ చేసి సామూహికంగా ఆచరించండి. ఇక్కడ ఈ రెండు నమా’జులను ఒకచోట చేర్చి ఆచరించాలి.
ప్రవక్త (స) ము’జ్‌దలిఫహ్లోనికి వచ్చారు. ఒక అజా’న్ మరియు రెండు ఇఖామతులతో మ’గ్‌రిబ్ మరియు ‘ఇషా నమా’జులను ఆచరించారు. ఆ రెంటి మధ్య ఏమీ చదవలేదు. కనుక వెనుకా ముందూ ఏమీ ఆచరించకండి. వి’త్‌ర్‌ను అప్పుడైనా చదవవచ్చు లేదా తహజ్జుద్ సమయంలో అయినా చదవవచ్చు. ము’జ్‌దలిఫహ్లో రాత్రి గడపటం తప్పనిసరి. ఎక్కడ చోటు దొరికితే అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోండి. అయితే వచ్చేపోయే మార్గంలో, ము‘హస్సిర్ లోయలో బసచేయకండి. రాత్రి సాధ్యమైనన్ని అత్యధికంగా దు’ఆలు, అల్లాహ్ స్మరణ చేయండి. ఇక్కడ దు’ఆ స్వీకరించబడుతుంది. ఈ రాత్రి మేల్కొని దైవారాధనలో నిమగ్నమయి ఉంటే హృదయం వెలుగుతో నిండిపోతుంది. స్వర్గం తప్పని సరి అవుతుంది. ఒక ‘హదీసు’లో ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”చిత్తశుద్ధితో, సత్సంకల్పంతో రెండు పండుగల రాత్రుల్లో ఆరాధనలో నిమగ్నమయి ఉండే వారి హృదయం ఇతరుల హృదయాలు నశించేరోజు నశించదు.” (ఇబ్నె మాజహ్)
”ఐదు రాత్రులు మేల్కొని ఉండే వారి కొరకు స్వర్గం తప్పని సరి అయిపోతుంది. 1. జి’ల్ ‘హిజ్జహ్ 8వ తేదీ రాత్రి, 2. 9వ తేదీ రాత్రి, 3. ఖుర్‌బానీ 10వ రాత్రి, 4. లైల తుల్ ఖద్‌ర్, 5. ష’అబాన్ 15వ తేదీ రాత్రి.” (తర్’గీబ్)
ము‘జ్‌దలిఫహ్లో రాత్రి గడుపుట: ము’జ్‌దలి ఫహ్లో రాత్రి గడపటం తప్పనిసరి. అయితే స్త్రీలు, పిల్లలు, బలహీనులు మినహాయించ బడ్డారు. వారు రాత్రి చివరి భాగంలో కొంత సేపు మష్‌అరిల్ ‘హరామ్ వద్ద దైవస్మరణ దు’ఆలు చేసి మినా వెళ్ళి పోవచ్చును. మినా చేరి సూర్యుడు ఉదయించిన తర్వాత రమీ చేసి ఇ’హ్‌రామ్ తొలగించాలి. స్త్రీలు సూర్యోదయానికి ముందు ఉదయాన్నే రమీ చేయ గలరు. (బు’ఖారీ)
ప్రవక్త(స) సౌద(ర)కు, ఇతర బలహీనులకు, పిల్లలకు రాత్రిసమయాన వచ్చే అనుమతి ఇచ్చారు. (అ’హ్‌మద్)
ము‘జ్‌దలిఫహ్లో ఫజ్‌ర్ నమా‘జు: రాత్రి జాగరణ చేసిన తర్వాత ము’జ్‌దలిఫహ్లో ఫజ్‌ర్ నమా’జు సమయం కాగానే అజా’న్ మరియు ఇఖా మత్‌తో ఆచరించాలి. మష్‌అరిల్ ‘హరామ్ వద్దకు వచ్చి దైవస్మరణలో నిమగ్నమవ్వాలి. (ముస్లిమ్)
జాబిర్ (ర) ఉల్లేఖనం: ప్రవక్త (స) ము’జ్‌దలిఫహ్ వచ్చారు. ఒక అజా’న్ మరియు రెండు ఇఖామత్‌లతో మ’గ్‌రిబ్, ‘ఇషా నమా’జులు ఆచరించారు. ఈ రెండు నమా’జుల మధ్య సున్నతులు చదవలేదు. ఆ తరువాత ప్రవక్త (స) పండుకున్నారు. చివరికి తెల్లవారిపోయింది. తెల్లవారగానే అజా’న్, ఇఖామత్ లతో ఫజ్‌ర్ నమా’జు చదివారు. ఆ తరువాత ఆడ ఒంటెపై ఎక్కి మష్‌అరిల్ ‘హరామ్ వద్దకు వెళ్ళారు. ఖిబ్లా వైపు తిరిగి అల్లాహ్ (త)ను ప్రార్థించారు. ఇంకా ”అల్లాహు అక్బరు లా ఇలాహ ఇల్లల్లాహు” ఇంకా దేవుని ఏకత్వం స్తుతిస్తూ ఉన్నారు. చివరికి వెలుగు వ్యాపించింది. ఆ తరువాత సూర్యోదయానికి ముందు బయలుదేరారు. ము‘హస్సిర్ లోయలోకి వచ్చి ఒంటెను కొద్ది వేగం పెంచారు. మధ్య మార్గం ద్వారా జమ్‌రతుల్ ‘అఖబహ్ వద్దకు వచ్చారు. 7 కంకరరాళ్ళు కొట్టారు. ప్రతి కంకరరాయితో ”అల్లాహు అక్బర్” అని పలికేవారు. ఆ తరువాత ఖుర్‌బానీ కమేలాకు చేరుకున్నారు. (ముస్లిమ్)
మష్‌అరుల్ హరామ్ వద్ద అల్లాహ్ స్మరణ: ము’జ్‌దలిఫహ్ పవిత్ర మైదానంలో ఒక మస్జిద్ (స్తంభం ఉంది, దాని ప్రక్కన ఒక పరిధి కంచె వేయబడి) ఉంది. దాన్ని మష్‌అరిల్ ‘హరామ్ అంటారు. మీరు దానివద్ద వాహనంపై లేదా నిలబడి ఖిబ్లావైపు ముఖంచేసి అల్లాహ్ ను స్మరించండి. అల్లాహ్ ఏకత్వాన్ని కొనియాడండి. బాగా వెలుతురు వ్యాపించేవరకు తక్‌బీర్లు, తస్‌బీహ్‌లు పఠించండి. మరియు ”లా ఇలాహ ఇల్లల్లాహు వ‘హ్‌దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ ‘హమ్దు వహువ అలాకుల్లి షయ్‌ఇన్ ఖదీర్” పఠిస్తూ ఉండండి. జాబిర్ (ర) కథనం, ప్రవక్త (స) మష్‌అరిల్ ‘హరామ్ వద్దకు వచ్చారు. అక్కడ దు’ఆ చేసారు. ఇంకా తక్‌బీర్లు, తహ్‌లీల్లు మరియు తమ్హీద్‌లు పలికారు. (ము’గ్‌నీ)
ఇక్కడ దు’ఆ స్వీకరించబడుతుంది. ప్రవక్త (స) ‘అర ఫాత్‌లో అత్యాచారాల కోసం మరియు దాసుల హక్కుల క్షమాపణ కొరకు దు’ఆ చేసారు. కాని ప్రవక్త (స) దు’ఆ స్వీకరించ బడలేదు. మష్‌అరిల్ ‘హరామ్‌లో కూడా ఈ దు’ఆనే చేసారు. ఇక్కడ స్వీకరించబడింది. ‘అబ్బాస్ మర్‌దాస్ (ర) కథనం: ప్రవక్త (స) తన అనుచర సమాజం కొరకు ‘అరఫాత్లో సాయంత్రం వేళ దు’ఆ చేసారు. అయితే దాసుల హక్కులు తప్ప మిగతా పాపాలన్నిటినీ నేను క్షమించానని అల్లాహ్ తరఫున సమాధానం లభించింది. అప్పుడు ప్రవక్త (స) ఇలా విన్నవించు కున్నారు, ”ఓ నా ప్రభూ! ఒకవేళ నీవు కోరితే బాధితులను స్వర్గంలో ప్రవేశింప జేయగలవు, అత్యాచారిని క్షమించగలవు. ‘అరఫాత్ సాయంత్రం ఈ దు’ఆ స్వీకరించబడలేదు. ము’జ్‌దలిఫహ్ ఉదయం మళ్ళీ ప్రవక్త (స) ఈ దు’ఆను పఠించారు. అప్పుడు స్వీకరించబడింది. (ఇబ్నె మాజహ్, తర్’గీబ్)
ము’జ్దలిఫహ్ నుండి 70 కంకరరాళ్ళు ఏరు కొనండి, లేదా అంతకంటే కొన్ని ఎక్కువ ఏరుకున్నా ఫరవాలేదు.
ము’జ్‌దలిఫహ్ మరియు మినాల మధ్య ముహస్సిర్ అనే మైదానం ఉంది. దీని వెడల్పు 545 గజాలు. ఇది మట్టి రంగు కలిగి ఉంది. ఇక్కడి నుండి తొందరగా వెళ్ళిపోండి. ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. బైతుల్లాహ్‌ను పడగొట్టడానికి అబరహ్ వస్తున్నప్పుడు దైవాదేశంతో పిచ్చుకలు తమ ముక్కుల్లో కంకర రాళ్లను తీసుకొని అతనిపై, అతని సైన్యంపై విసిరివేసి వాళ్ళను అంతమొందించడం జరిగింది ఇక్కడే. ఈ సంఘటన ఖుర్‌ఆన్‌లో సూరతుల్ ఫీల్ (105)లో పేర్కొనబడింది.
మీరు లబ్బయెక్ పలుకుతూ, ”అల్లాహుఅక్బర్” అని పలుకుతూ తిన్నగా జమ్‌రతుల్’ఉఖ్‌బహ్ వద్దకు రండి. ఇది మినా చివరిలో బైతుల్లాహ్ వైపు ఉన్న ఒక స్తంభం. జాబిర్ (ర) కథనం, ”ప్రవక్త(స) ముహస్సిర్ లోయలో వాహనం వేగాన్ని పెంచారు. ఒకవేళ కాలి నడకన అయితే అక్కడి నుండి తొందరగా వెళ్ళిపోండి. ‘జాదుల్ మ’ఆద్‌లో ఇలా ఉంది, ప్రవక్త (స) మధ్య మార్గాన మినా వచ్చారు. జమ్రతుల్ ‘ఉఖ్‌బహ్ కు రమీ చేసారు.
జి‘ల్ ‘హిజ్జహ్ 10వ తేదీ: జి’ల్ ‘హిజ్జహ్ 10వ తేదీన ము’జ్దలిఫహ్ నుండి మినా చేరి రమీ, జు‘బ‘హ్,‘హలఖ్ చేసి మక్కహ్ ముకర్రమహ్ వెళ్ళి ‘తవాఫె ఇఫా’దహ్ చేయాలి.
రమీ జిమార్: రమీ అంటే కంకరరాళ్ళను విసరటం. జిమార్ జమరహ్‌కి బహువచనం. జమరహ్ కంకర రాయిని అంటారు. ఎందుకంటే జమ్‌రహ్ ‘ఉఖ్‌బహ్, వు‘స్తా, ఊలాపై కంకర రాళ్ళను విసరటం జరుగు తుంది. అందువల్ల వాటిని జమరాత్ లేదా జిమార్ అంటారు. మినా మధ్య మార్గంలో ఈ మూడు స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఎత్తుగా స్తంభాలు నిర్మించబడి ఉన్నాయి. ఈ మూడింటినీ జమరాత్ లేదా జిమార్ అంటారు. వేరువేరుగా ఒక్కొక్క దాన్ని జమ్‌రహ్ అంటారు. వీటిలో మక్కహ్ వైపు ఉన్నదాన్ని జమర తుల్ ‘ఉఖ్‌బహ్ లేక జమ్‌రతుల్ కుబ్‌రా లేక జమ్‌రతుల్ ‘ఉ’ఖ్‌రా అంటారు. మధ్య దాన్ని జమర తుల్ వుస్’తా అంటారు. ఇంకా మూడవది, మస్జిదె ఖీఫ్ కు దగ్గరగా ఉన్నదాన్ని జమరతుల్ ఊలా అంటారు. ఈ జమరాత్‌లపై కంకరరాళ్ళు విసరడాన్ని గురించి ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”ఇబ్రాహీమ్ (అ) ‘హజ్ విధులు నిర్వర్తించడానికి వచ్చినపుడు జమరతుల్ ‘ఉఖ్‌బహ్ వద్ద షై’తాన్ కనిపించాడు. ఇబ్రాహీమ్ (అ) వాడికి 7 కంకరరాళ్ళు కొట్టారు. చివరికి వాడు భూమిలో దిగబడి పోయాడు. ఆ తరువాత అతను ముందుకు సాగారు, జమరతుల్ వుస్తా వద్ద షై’తాన్ మళ్ళీ కనబడ్డాడు. అక్కడ కూడా అతడికి 7 కంకరరాళ్ళు కొట్టారు. చివరికి వాడు భూమిలో దిగబడి పోయాడు. అతడు ఇంకా ముందుకు పోసాగారు. జమరతుల్ ఊలా వద్ద షై’తాన్ మళ్ళీ కనబడ్డాడు. ఇబ్రాహీమ్ (అ) మళ్ళీ వాడికి 7 కంకరరాళ్ళు కొట్టారు. చివరికి వాడు భూమిలోకి దిగబడిపోయాడు. ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం, ”షైతాన్‌ను కొడుతూ ఉండండి, మీ తండ్రి ఇబ్రాహీమ్ ధర్మంపై నడుస్తూ ఉండండి.” (‘స. ఇబ్నె ఖుజైమహ్)
కొందరు రమీని తప్పనిసరిగా భావిస్తారు. మాలికియ్యహ్ వద్ద రమీ జమ్‌రహ్ ‘ఉఖ్‌బహ్, ‘హజ్ విధుల్లోని ఒక విధి. దాన్ని వదిలితే ‘హజ్జ్ రద్దవుతుంది. (నైలుల్ అవ్’తార్). పదవ తేదీన కేవలం జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్కు రమీ అవుతుంది. జమ్రతుల్ వుస్తా, జమ్రతుల్ ఊలాకు అవదు. మినాలో బక్రీదు పండుగ నమా’జు చదవడం జరగదు. జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్కు రమీ చేయడం రెండు పండుగ రక’అతులకు సమానంగా భావించాలి. కంకరరాళ్ళు కొట్టే సమయం 10 జి’ల్ ‘హిజ్జహ్ సూర్యోదయం తరువాత నుండి సూర్యుడు వాలే వరకు ఉంటుంది. వీలవకపోతే పొద్దువాలిన తరువాత కూడా కొట్టవచ్చును. ప్రవక్త (స) మధ్యాహ్నం వేళ కంకర రాళ్ళు కొట్టారు. జాబిర్ (ర) కథనం, ”ప్రవక్త (స) జి’ల్’హిజ్జహ్ 10వ తేదీన జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్పై మధ్యాహ్నం వేళ కంకరరాళ్ళు కొట్టారు. తరువాతి తేదీల్లో పొద్దువాలిన తర్వాత.” (బు’ఖారీ)
ఇంకా ఖురైష్ యువకులతో, ”సూర్యుడు ఉదయించక ముందు కంకరరాళ్ళు కొట్టటం ప్రారం భించకండి” అని ఉపదేశించారు. (అబూదావూద్). స్త్రీలు ఫజ్‌ర్‌కు ముందే కంకరరాళ్ళు కొట్టగలరు. ఉమ్మెసలమహ్ కొట్టినట్లు. (అబూ దావూద్).
జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్ను కొట్టినపుడు లబ్బయెక్‌ను ఆపివేయాలి. ‘ఉఖ్‌బహ్ను వాహనం పైనుండి కూడా కంకర రాళ్ళు కొట్టవచ్చు. అయితే ఇతరులకు దానివల్ల ఆటంకం కలుగరాదు. మిగతా జమరాత్‌లను నిలబడి కొడితే మంచిది. అయితే కుడిచేత్తో రమీ చేయాలి. ఎడమచేత్తో రమీ చేయడం ప్రవక్త సాంప్రదాయానికి విరుద్ధం. రమీ చేసినపుడు చేతిని చంక కనబడి నట్లు ఎత్తాలి. ఇబ్నె మస్‌ఊద్ జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్ను దాని దగ్గరకుకు వచ్చి బైతుల్లాహ్‌ను ఎడమ వైపు మినాను కుడి వైపు ఉంచి 7 కంకరరాళ్ళు, ప్రతి కంకర రాయితో ”అల్లాహు అక్బర్” పలుకుతూ పోయారు. ఇంకా ఇలా అన్నారు, ”ప్రవక్త (స) రమీ ఈవిధంగా చేసారు. ఆ వెంటనే సూరహ్ బఖరహ్ అవతరించబడింది. (బు’ఖారీ). ప్రవక్త (స) జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్ వరకు లబ్బయెక్ పలుకుతూ ఉన్నారు. (బు’ఖారీ)
కంకరరాళ్ళు కొట్టే పద్ధతి: జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్ వద్దకు వెళ్ళి లబ్బయెక్ పలకటం మానివేయండి. దాని ముందు క్రింద నిలబడండి. బైతుల్లాహ్‌ను ఎడమ వైపు, మినాకు కుడివైపు ఉంచి బొటనవ్రేలిపై కంకర రాయి ఉంచి, చూపుడు వేలుతో 7 కంకరరాళ్ళు వేరు వేరుగా గురిచూసి జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్ను కొట్టండి. ఒకవేళ ఇది కష్టంగా ఉంటే బొటన వేలు, చూపుడు వేలుతో పట్టుకొని కొట్టండి. మొదటి కంకరరాయి విసిరినపుడు లబ్బయెక్ పలకడం మానివేయండి. కంకరరాయి విసరడానికి ముందు ఈ దు’ఆ పఠించండి.
”బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ ర‘గ్మన్ లిష్షై‘తాని, వ రి‘దన్ లిర్ర‘హ్మాని, అల్లాహుమ్మజ్‘అల్ హు ‘హజ్జన్ మబ్రూరన్ వ జ‘న్ బన్ మ‘గ్ఫూరన్ వస‘అయన్ మష్కూరన్.” — ‘అల్లాహ్ పేరుతో కంకరరాయి విసురుతున్నాను. అల్లాహ్‌యే గొప్పవాడు. షై’తాన్ అవమానం పాలయ్యాడు. అల్లాహ్ సంతృప్తిచెందాడు. ఓ అల్లాహ్ ‘హజ్‌ను స్వీకరించు. పాపాలను క్షమించు, మా ఈ ప్రయత్నాన్ని ఫలవంతం చేయి.’ (నైల్, ఫత్’హుల్‌బారీ)
ఖుర్బానీ దు‘ఆ: రమీ జిమార్ తర్వాత ఖుర్‌బానీ చేసేచోట వచ్చి ఖుర్‌బానీ చేసినపుడు ఈ దు’ఆ పఠించాలి.
”ఇన్నీ వజ్జహ్తు వజ్ హియ లిల్లజీ‘ ఫ‘తర స్సమావాతి వల్అ‘ర్ద ‘హనీఫన్ ,వమా అనా మినల్ ముష్రికీన్. ఇన్న ‘సలాతీ వ నుసుకీ వ మ‘హ్యాయ వ మమాతీ, లిల్లాహి రబ్బిల్‘ఆలమీన్. లా షరీక లహూ, వబిజా‘లిక ఉమిర్తు వ అనా మినల్ ముస్లిమీన్. అల్లా హుమ్మ తఖబ్బల్ మిన్నీ కమా తఖబ్బల్త మిన్ ‘ఖలీ లిక ఇబ్రాహీమ, వ మిన్ ‘హబీబిక ము‘హమ్మదిన్ ‘సల్లల్లాహు ‘అలైహి వ సల్లమ్, బిస్మిల్లాహి వల్లాహు అక్బర్.” — ‘నేను నా ముఖాన్ని ఏకాగ్రతతో భూమ్యాకాశాల సృష్టికర్త వైపునకు మరల్చాను. నేను అవిశ్వాసులలోనివాడిని కాను. నా నమా’జు, నా ఖుర్బానీ, నా జీవన్మరణాలు సకలలోకాల ప్రభువు అయిన అల్లాహ్ కోసమే. ఆయనకు సాటి ఎవరూ లేరు. ఈ విషయమే నాకు ఆదేశించబడింది. నేను ముస్లిములలోని ఒకడిని.’
అల్లాహ్! నీవు నీ మిత్రుడు ఇబ్రాహీమ్ (అ) మరియు నీ ప్రియ ప్రవక్త ము’హమ్మద్ (స) నుండి స్వీకరించినట్లుగానే నానుండి స్వీకరించు. అల్లాహ్ పేరుతో దీనిని జిబహ్ చేస్తున్నాను. అల్లాహ్ చాలా గొప్పవాడు. (బు’ఖారీ, ముస్లిమ్)
ప్రవక్త (స) ఈ దు’ఆను కూడా పఠించేవారు:
”అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్ ము‘హమ్మదిన్ వ ఆలి ము‘హమ్మదిన్ వ మిన్ ఉమ్మతి ము‘హమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లమ్.” — ‘ఓ అల్లాహ్! ము’హమ్మద్, ము’హమ్మద్ కుటుంబం, ము’హమ్మద్ అనుచర సంఘం తరఫున స్వీకరించు.’ (ముస్లిమ్)
క్షవరం చేయించుకొని ఇ’హ్‌రామ్ తొలగించండి: ఖుర్‌బానీ చేసిన తర్వాత క్షవరం చేయించుకోండి. దాని సాంప్రదాయ మైన పద్ధతి ఏమిటంటే ఖిబ్లావైపు తిరిగి కూర్చోండి. తన కుడివైపు నుండి తల గీయించడం లేదా కత్తిరించడం ప్రారంభించండి. తల గీయించటాన్ని ‘హలఖ్ కత్తిరించటాన్ని ఖ’స్‌ర్ అంటారు. రెండూ ధర్మ సమ్మతమే. అయితే గీయించడం ఉత్తమం. ప్రవక్త (స) ఈ సందర్భంగా తలగీయించుకునే వారికొరకు మూడు సార్లు కారుణ్య దు’ఆ చేసారు. మరియు కత్తిరించుకునే వారి కోసం ఒకసారి దు’ఆ చేసారు. (ముస్లిమ్)
స్త్రీలు తలగీయించరాదు. తమ తల వెంట్రుకల నుండి కొంత భాగం కత్తిరించుకుంటే చాలు. ప్రవక్త (స) స్త్రీలు తల గీయించటం తప్పనిసరి కాదు, కత్తిరించు కుంటే సరిపోతుంది అని సెలవిచ్చారు. (అబూ దావూద్)
ఇప్పుడు మీరు ఇ’హ్‌రామ్ తొలగించండి. స్నానం చేయండి, సుగంధ పరిమళాలు పూసుకోండి. ఇ’హ్రామ్ స్థితిలో నిషిద్ధమైనవన్నీ ఇప్పుడు ధర్మ సమ్మతం అయిపోయాయి. అయితే ‘తవాఫె ఇఫా’దహ్ చేయనంత వరకు భార్యతో సంభోగం చేయలేరు. ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్ని రమీ చేసివేస్తే, స్త్రీలు తప్ప మిగిలినవన్నీ ధర్మసమ్మతం అయిపోతాయి. ఒకవేళ ఎవరైనా బట్ట తలవారైతే తలపై బొత్తిగా వెంట్రుకలు లేకపోతే తలపై మంగలి కత్తితో గీసివేస్తే సరిపోతుంది. (ముగ్‌నీ)
ఈ రోజు క్షవరం చేయించడానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి వెంట్రుకకు బదులు ఒక పుణ్యం లభిస్తుంది. ఒక పాపం క్షమించబడుతుంది. ప్రవక్త (స) ప్రవచనం: మీరు తల గీయిస్తే ప్రతి వెంట్రుకకు బదులు ఒక పుణ్యం లభిస్తుంది. ఒక పాపం క్షమించబడు తుంది. (తర్’గీబ్) ఈ వెంట్రుక తీర్పుదినం నాడు వెలుగుగా తయారవుతుంది. ఉబాదహ్ బిన్ సామిత్ ‘హదీసు’లో ఇలా ప్రవచించారు, ”గీయించటం వల్ల నీ తలనుండి క్రిందపడిన ప్రతివెంట్రుకకు బదులు తీర్పుదినం నాడు వెలుగు లభిస్తుంది. (తర్’గీబ్)
‘తవాఫె ఇఫా‘దహ్ కొరకు మక్కహ్ వెళ్ళండి: రమీ, ఖుర్‌బానీ, క్షవరం మొదలైనవి చేసిన తర్వాత ‘తవాఫె ఇఫా’దహ్ కొరకు మక్కహ్ ముకర్రమహ్ వెళ్ళండి. బాబ్ బనీ షీబ ద్వారా ప్రవేశించి తిన్నగా ‘హజరె అస్వద్ వద్దకు రండి. ‘హజరె అస్వద్ దు’ఆ పఠించి దాని ఇస్తీలామ్ చేయండి. ముద్దుపెట్టుకోండి. మళ్ళీ ‘తవాఫ్ దు’ఆ పఠిస్తూ ఇంతకు ముందులా ‘తవాఫ్ ప్రారంభించండి. 7 ప్రదక్షిణాలు పూర్తిచేసి రెండు రకాతులు నమా’జు ‘తవాఫ్ మఖామె ఇబ్రా హీమ్ వద్ద చేయండి. ఒకవేళ మీరు ముతమత్తి అయితే నమా’జు తర్వాత ‘సఫా మర్‌వహ్‌ల స’యీ చేయండి. ఎందుకంటే ముతమత్తిపై ‘తవాఫె ఇఫా’దహ్ తర్వాత స’యీ చేయాలి. ఒకవేళ మీరు ఖారిన్ మరియు ముఫ్‌రిద్ అయితే ప్రారంభంలో ‘తవాఫె ఖుదూమ్ తర్వాత ‘సఫా మర్వాల మధ్య సయీ చేసి ఉంటే ఇప్పుడు ఏకగ్రీవంగా ‘సఫా మర్వాల సయీ అవసరం లేదు. మరియు ‘తవాఫె ఇఫా’దహ్లో రమ్‌ల్ మరియు ఇ’ద్’తిబా’అ కూడా చేయకూడదు. ఎందు కంటే ‘హలఖ్ మరియు జు’బహ్ తరువాత ఇ’హ్‌రామ్ తొలగించి ఉన్నారు. అయితే మక్కాహ్ వాసులపై ‘తవాఫె ఇఫా’దహ్లో రమల్ మరియు ఇ’ద్’తిబా’అ మరియు ‘సఫా మర్వాల సయీ తప్పనిసరి.
‘తవాఫె ‘జియారత్ చేసి మళ్ళీ మినా తిరిగి వెళ్ళాలి:
‘తవాఫె ‘జియారత్ తరువాత మినా తిరిగి వెళ్ళాలి. ”జుహ్‌ర్ నమా’జు మక్కహ్లో చదవకపోతే మినా వెళ్ళి చదవండి. ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం, ప్రవక్త (స) ఖుర్‌బానీ రోజు ‘తవాఫె ఇఫా’దహ్ చేసారు. మళ్ళీ మక్కహ్ నుండి మినా తిరిగి వెళ్ళారు. ”జుహ్‌ర్ నమా’జు మినాలో ఆచరించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
యౌమున్నహర్ తరువాత మినాలో మూడు (11, 12, 13 తేదీల) రాత్రులు గడపటం తప్పనిసరి. అకారణంగా ప్రత్యేకంగా మక్కహ్లో రాత్రి గడిపే అవసరం లేదు. ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం, ప్రవక్త (స) మక్కహ్లో ఎవరికీ రాత్రిగడిపే అనుమతి ఇవ్వ లేదు. ఇబ్నె’అబ్బాస్ తప్ప, ఎందుకంటే అతనికి ‘హాజీలకు ‘జమ్’జమ్ నీరు త్రాపించే బాధ్యత ఇవ్వ బడింది. (ఇబ్నె మాజహ్)
పదవ తేదీ వరుసక్రమ కార్యాలు: యౌము న్నహర్‌లో ము’జ్దలిఫహ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత మినాలో ముందు రమీ ఆ తరువాత ఖుర్బానీ, ఆ తరువాత క్షవరం దాని తర్వాత మక్కహ్లో ‘తవాఫె ఇఫా‘దహ్ ఆ తరువాత మినాలో రాత్రి గడపటం. ప్రవక్త (స) వీటిని ఈ వరుస క్రమంలోనే ఆచరించారు. (అబూ దావూద్)
ప్రతి పని క్రమంగా ప్రవక్త సాంప్రదాయాని అనుగుణంగా చేయాలి. ఒకవేళ తెలియక, మరచి ఈ పనులు నిర్వర్తించటంలో క్రమం తప్పితే మరేం ఫర్వాలేదు. ఎటు వంటి పాపమూ అంటుకోదు. (ముస్లిమ్, దార ఖు’తనీ)
ఎందుకంటే ‘హజ్జ్ లో అనేక ‘హజ్జ్ కార్యాలు నెరవేర్చబడతాయి. అందువల్ల దీన్ని ‘హజ్జె అక్బర్ అంటారు. (బు’ఖారీ). అంటే ఇ’హ్‌రామ్ ధరించి బైతుల్లాహ్ వెళ్ళటం, బైతుల్లాహ్ నుండి మినా, మినా నుండి అరఫాత్, అరఫాత్ నుండి ము’జ్‌దలిఫహ్, ముజ్‌దలిఫహ్ నుండి మినా, మినాలో రమీ, న’హ్‌ర్, ‘హలఖ్, మక్కహ్లో ‘తవాఫె ఇఫా’దహ్, మినాలో రాత్రులు గడుపుట వీటన్నిటి పేరే ‘హజ్జె అక్బర్. ‘ఉమ్‌రహ్‌ను ‘హజ్జె అస్’గర్ అంటారు.
అయ్యామె తష్‌రీఖ్ ప్రవచనాలు: 11 నుండి 13 వ తేదీ వరకు అయ్యామె తష్‌రీఖ్ అంటారు. ఈ దినాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి దైవ ఆతిథ్య దినాలు. అంటే అల్లాహ్ (త) ఈ దినాల్లో తన దాసులకు ఆతిథ్యం ఇస్తాడు. అందువల్ల ఈ దినాల్లో ఉపవాసం ఉండ కూడదు. ఇవి తినే, త్రాగే, దైవధ్యానంలో గడిపే దినాలు. ప్రవక్త (స) ప్రవచనం: తష్‌రీఖ్ దినాలు తినే త్రాగే, దైవాన్ని స్మరించే దినాలు. (ముస్లిమ్)
ఈ దినాల్లో రోజూ మినాలో సూర్యుడు వాలిన తర్వాత ”జుహ్‌ర్ నమా’జుకు ముందు మూడు షైతానులకు కంకర రాళ్ళు కొట్టాలి. ‘ఆయి’షహ్ (ర) కథనం, ”ప్రవక్త (స) ”జుహ్‌ర్ నమా’జు వరకు తవాఫె ఇఫా’దహ్ను పూర్తిచేసుకున్నారు. ఆ తరువాత మినా వచ్చి, అయ్యామె తష్‌రీఖ్‌లో మినాలోనే ఉన్నారు. సూర్యుడు వాలిన తర్వాత జమరాత్‌లపై రమీ చేశారు. ప్రతి జమ్‌రహ్‌కు 7 కంకరరాళ్ళు, ప్రతి కంకర రాయితో ‘అల్లాహు అక్బర్’ అని పలికి కొట్టారు. మొదటి మరియు రెండవ జమ్‌రహ్‌ల వద్ద నిలబడి దు’ఆలు చేసారు. మూడవ జమ్‌రహ్‌వద్ద రమీచేసి అక్కడ ఆగరు.(అబూ దావూద్)
1. జమ్‌రహ్ ఊలా: ఇది మినా వైపు నుండి మొదటి స్తంభం. దీన్ని మొదటి షై’తాన్ అంటారు. ఇది మస్జిదె ఖీఫ్ వైపు బజారులో ఉంది. 11వ తేదీన దీన్నుండే కంకరరాళ్ళు కొట్టటం ప్రారంభిస్తారు. కంకరరాళ్ళు కొట్టినపుడు బైతుల్లాహ్‌ను ఎడమవైపు మినాను కుడివైపు ఉంచాలి. ‘అల్లాహు అక్బర్’ అని పలికి కంకరరాయిని విసరాలి. 7 కంకరరాళ్ళు అయిపోతే ఖిబ్లా వైపు తిరిగి కొన్ని అడుగులు ముందుకు వెళ్ళాలి. ఖిబ్లా వైపు తిరిగి నిలబడి రెండు చేతులు ఎత్తి తస్‌బీహ్, తహ్‌లీల్, తహ్’మీద్, తక్‌బీర్ పలకాలి. దు’ఆ చేయాలి. ఒకవేళ అంత సేపు నిలబడ లేక పోతే మీకు సాధ్యమైనంత సేపు చేయాలి. (బు’ఖారీ)
2. జమ్‌రతుల్ వుస్తా: ఇది మధ్య స్తంభం. జమ్‌రతుల్ ఊలాను కంకరరాళ్ళు కొట్టినట్లు జమ్‌రతుల్ వుస్తాను కూడా కొట్టండి. జమ్‌రతుల్ ఊలా వద్ద దైవస్మరణ, ప్రవచనాల దు’ఆలు చేసినట్లు ఇక్కడ కూడా చేయండి.
3. జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్: ఇది బైతుల్లాహ్ వైపు ఉంది. దీన్ని పెద్ద షై‘తాన్ అని కూడా అంటారు. దీనికి కూడా 7 కంకరరాళ్ళు కొట్టండి. కాని ఇక్కడ ఆగకండి. స్త్రీలకు పురుషులకు రమీ ఆదేశాలు సమానమైనవే. అయితే స్త్రీలు రాత్రివేళ రమీ చేయడం ఉత్తమం. ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: సూర్యుడు వాలిన తర్వాత ప్రవక్త (స) రమీ చేసేవారు. (అహ్మద్, ఇబ్నె మాజహ్)
సాలిమ్ తన తండ్రి ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ ద్వారా ఉల్లేఖిస్తున్నారు: అతను అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ 7 కంకర రాళ్ళతో రమీ చేసేవారు. ప్రతి కంకరరాయితో అల్లాహు అక్బర్ అని పలికేవారు. ఆ తరువాత కొంత ముందుకు పోయి ఖిబ్లా వైపు తిరిగి రెండు చేతులను ఎత్తి చాలాసేపు వరకు దు’ఆ చేసేవారు. ఆ తరువాత మధ్య జమ్‌రహ్‌కి రమీ చేసేవారు. ఆ తరువాత జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్కి రమీ చేసేవారు. ఇక్కడ ఆగేవారు కాదు. ఇంకా ప్రవక్త (స)ను ఇలాగే చేస్తూ ఉండగా చూసానని చెప్పే వారు. (బు’ఖారీ)
అన్నీ కలిపి 70 కంకర రాళ్ళు అవుతాయి. 10వ తేదీన సూర్యుడు ఉదయించిన తరువాత పెద్ద షై’తాన్‌కు 7 కంకర రాళ్ళు కొట్టాలి. 11, 12, 13 తేదీల్లో సూర్యుడు వాలిన తర్వాత ప్రతి జమరహ్‌కు ఏడేసి అంటే ప్రతిరోజూ 21 కంకర రాళ్ళు కొట్టాలి. ఇవన్నీ కలిపి 70 అవుతాయి. అయ్యామె తష్‌రీఖ్ మూడు రోజుల్లో కంకరరాళ్ళు కొట్టాలి. ఒకవేళ ఎవరైనా ఏదైనా కారణం వల్ల అసహాయత వల్ల రెండు రోజుల కంకర రాళ్ళు ఒక రోజులోనే కొట్టి తిరిగి వెళ్ళిపోతే దానికి కూడా అనుమతి ఉంది. అల్లాహ్ ఆదేశం: ”…ఎవడైనా త్వరగా రెండు రోజులలోనే వెళ్ళి పోయినా, అతనిపై ఎలాంటి దోషంలేదు. మరెవడైనా నిదానించి (13వ తేదీ వరకు) నిలిచి పోయినా, అతనిపై ఎలాంటి దోషం లేదు…” (సూ. అల్ బఖరహ్, 2:203)
ము‘హ‘స్సిబ్‌లో దిగటం: ము’హస్సిబ్ అనేది ఒక మైదానం పేరు. ఇది రెండు కొండల మధ్య ఉంది. దీన్ని అ’బ్తహ్ మరియు ‘ఖీఫ్ బనీ కనాన మరియు ‘హ’స్‌బా అని కూడా అంటారు. ఇక్కడ ఇప్పుడు జనవాసాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం దీన్ని ము’ఆబ్దహ్ అంటారు. ఎందుకంటే ఈ ప్రదేశంలోనే ఖురైషులు ప్రవక్త (స) మరియు బనూ ‘హాషిమ్‌ల పట్ల సహాయ నిరాకరణ ఒప్పందం జరిగింది. ‘హజ్జతుల్ విదా’ సందర్భంగా ఇక్కడే బసచేసారు. (బు’ఖారీ)
ఇక్కడ బస చేయడం ‘హజ్జ్ విధుల్లో లేదు. ప్రవక్త (స) మినా నుండి వెళ్ళినప్పుడు ముహస్సిబ్‌లో బస చేసేవారు. ఇక్కడ నుండి వెళ్ళడం సులభతరంగా ఉండేది. అనస్ (ర) కథనం, ”ప్రవక్త (స) ”జుహ్‌ర్ ‘అ’స్ర్ మ’గ్‌రిబ్ ‘ఇషా నమా’జులు ము’హ’స్సిబ్‌లో చదివారు. ఆ తరువాత ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తరువాత వాహనంపై ఎక్కి బైతుల్లాహ్ వెళ్ళి ‘తవాఫ్ చేసారు. (బు’ఖారీ)
కనుక ఈ ప్రదేశంలో బసచేయడం ”జుహ్‌ర్, ‘అ’స్ర్ మ’గ్‌రిబ్ ‘ఇషా నమా’జులు ఆచరించడం ప్రవక్త సాంప్రదాయం. కాని ఒకవేళ ఎవరైనా బస చేయకపోతే, మరేం ఫర్వాలేదు. ఏం పాపం కాదు. ‘హజ్‌లో ఎటువంటి మార్పు రాదు. ‘ఆయి’షహ్ (ర) కథనం, ము’హ’స్సిబ్‌లో బసచేయటం తప్పనిసరి కాదు. చేయకపోతే నష్టం ఏమీ లేదు. అయితే ప్రవక్త (స) ఇక్కడి నుండి ప్రయాణం సౌలభ్యం కోసం ఇక్కడ బసచేసారు. (ముస్లిమ్)
మినా మరియు ము‘హ‘స్సిబ్‌ల నుండి మక్కహ్ ప్రయాణం:
రమీ మొదలైనవి, ము’హ’స్సిబ్‌లో బసచేసి మక్కహ్ వెళ్ళాలి. ఇక్కడ నివసించడాన్ని ఉభయ లోకాల మహా భాగ్యంగా భావించాలి. నమా’జులు, ఉపవాసాలు, దానధర్మాలు ఇతర పుణ్యకార్యాలు అత్యధికంగా చేయండి. అదనపు ‘తవాఫులు అత్యధి కంగా చేయండి. ఖుర్‌ఆన్ పఠనం చేయండి. మక్కహ్ వాసులను చెడుదృష్టితో చూడకండి. వారి అధర్మ కార్యాల వల్ల వారిని గురించి చెడుగా మాట్లాడకండి. వారిని గురించి పరోక్షంగా పలకడం చాడీలు వ్యాపింప చేయడం మంచిది కాదు. వారిని గౌరవించండి, అభిమానించండి. వారిపట్ల మంచిగా ప్రవర్తించండి.
బైతుల్లాహ్లో ప్రవేశించటం: లంచం ఇవ్వకుండా ఇతరులకు హాని చేయకుండా లోపలికి ప్రవేశించడం ధర్మసమ్మతమే. ప్రవక్త (స) క’అబహ్లో ప్రవేశించారు. కాని భవిష్యత్తులో జనసందోహం గురించి ఊహించి ఇలా అన్నారు: ”ప్రవేశించకుంటే బాగుండేది, నా తరువాత నా అనుచర సంఘానికి చాలా కష్టతరంగా ఉంటుంది.” (తిర్మిజి’)
అయితే లంచం ఇచ్చి ఇతరులకు బాధ కలిగించి ప్రవేశించడం మంచిది కాదు. ‘ఉమర్ బిన్ ‘అబ్దుల్ ‘అ’జీ’జ్ క’అబహ్లోకి ప్రవేశించి ఇలా దు’ఆ చేసేవారు.
”అల్లాహుమ్మ ఇన్నక వ‘అద్ త అల్ అమాన లి దాఖిలీ బైతిక వ అంత ‘ఖైరు మనుజూలిన్ బిహీ. అల్లా హుమ్మ ఫజ్అల్ అమానీ అన్ తక్ ఫియనీ మఊ‘న తద్దునియా వ కుల్ల హౌలిన్ దూనల్ జన్నతి ‘హత్తా అబ్ లు‘గహా బిర‘హ్మతిక.” —- ‘ఓ అల్లాహ్! నీవు నీ గృహంలో ప్రవేశించేవారి కోసం అభయ వాగ్దానం చేసి ఉన్నావు. నీవు నీ అతిథులను అందరికంటే అధికంగా గౌరవించేవాడివి. నాకు అభయం ప్రసాదించు. ఓ అల్లాహ్! నన్ను ఈ ప్రాపంచిక కష్టనష్టాల నుండి రక్షించు. నీ దయవల్ల నేను స్వర్గంలో ప్రవేశించగలను.’ (ఈ’దా’హ్)
నవవీ దు‘ఆయే మాసూరాను దాని స్థానంలో పేర్కొన్నారు.
”యారబ్బి అతయ్ తుక మిన్ షుఫ్పతిన్ బయీదతిన్ ముఅమ్మిలన్ మ‘అరూఫక తు‘గ్ నీనీ బిహీ, అన్ మ‘అరూఫిన్ మిన్ సివాక, యా మ‘అరూఫన్ బిల్ ఖైర్.” — — ‘ఓ అల్లాహ్! నేను నీ అనుగ్రహాల పట్ల ఆశతో ఉన్నాను. నేను చాలా దూరం నుండి వచ్చి ఉన్నాను. నేను ఇతరుల దయా దాక్షిణ్యాల పట్ల నిరపేక్షాభావం కలిగి ఉండేటట్లు నాకు అనుగ్రహాలు, ప్రసాదాలు ప్రసాదించు. ‘ (అజ్’కార్)
ప్రవక్త (స) మక్కహ్ విజయం నాడు బైతుల్లాహ్‌లో ప్రవేశించి బైతుల్లాహ్‌లోని రెండు స్తంభాలకు తగిలి ఉన్న ద్వారం మధ్య కూర్చొని దైవస్తోత్రం, దైవస్మరణ చేసి క్షమాపణ కోరారు. ఆ తరువాత లేచి దానిపై రొమ్ము, చెంపలు పెట్టి చాలాసేపు వరకు దైవ స్తోత్రాన్ని, ధ్యానాన్ని, తహ్‌లీల్‌ని, తస్‌బీహ్‌ని చేసారు. ఆ తరువాత క’అబహ్ వైపు తిరిగి రెండు రక’అతులు నమా’జు చేసారు. తరువాత బయటకు వచ్చారు.
‘తవాఫె విదా‘అ: విదా’ అంటే వీడ్కోలుపలుకుట. ‘హజ్జ్ తర్వాత బైతుల్లాహ్ నుండి తిరుగు ప్రయాణం చేసినపుడు వీడ్కోలు పలికేటప్పుడు చేసే ‘తవాఫ్‌ను ‘తవాఫె విదా’ అంటారు. ఇది ఇతరులపై తప్పనిసరి. మక్కహ్ వాసులపై కాదు. ఈ ‘తవాఫ్‌లో రమ్‌ల్ ,ఇ’ద్’తిబా’అ చేయరాదు. దీని తర్వాత స’యీ కూడా లేదు. ‘తవాఫ్ తర్వాత ‘తవాఫ్ యొక్క రెండు రక’అతులు మఖామె ఇబ్రాహీమ్ వెనుక ఆచరించండి. ఇంకా ముల్‌త’జిమ్ వద్దకు వచ్చి దాన్ని కౌగలించు కొని రొమ్ము భాగాన్ని కుడిచెంపలను దానికి తగిలించి కుడిచేయి పైకి ఎత్తి బైతుల్లాహ్ తెరను పట్టుకొని భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో అత్యధికంగా దు’ఆలు చేయాలి. ఇది చివరి సమయం అడగ వలసిందల్లా అడగండి. ఎందుకంటే ఈ అదృష్టం మరెప్పుడు కలుగుతుందో లేదో తెలియదు. దు’ఆ చేసిన తర్వాత సంతృప్తి చెందండి. ఆ తరువాత ఇబ్రాహీమ్ ద్వారం నుండి బయటకువచ్చి తిరుగు ప్రయాణం చేయండి.
ముఖ్యసూచన: కొందరు తిరిగి వచ్చేటప్పుడు వెనుక అడుగులు వేస్తూ వెళ్తారు. ఇది ప్రవక్త (స) సాంప్రదాయానికి వ్యతిరేకం. ప్రవక్త (స) గానీ, అనుచరులు గానీ ఇలా చేయలేదు. ఇతర మస్జిదుల నుండి తిరిగి వెళ్ళినట్లు ఇక్కడి నుండి కూడా తిరిగి వెళ్ళండి. ‘తవాఫె విదా’అ చేయకుండా తిరిగి వెళ్ళ కండి. ప్రాచీనకాలంలో ప్రజలు ‘హజ్ చేసిన తర్వాత అటూ ఇటూ వెళ్ళేవారు. ‘తవాఫె విదా’అ చేసేవారు కాదు. అందువల్ల ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”ఎవరూ తిరిగి వెళ్ళేటప్పుడు ‘తవాఫె విదా’అ చేయ కుండా వెళ్ళరాదు. అయితే బహిష్ఠు స్థితిలో ఉన్న స్త్రీ ‘తవాఫ్ చేయకుండా వెళ్ళవచ్చు. (బు’ఖారీ)
ఇబ్నె ‘అబ్బాస్ ‘హదీసు’లో ఇలా ఉంది. ప్రవక్త (స) బహిష్టు స్థితిలోఉన్న స్త్రీకి ‘తవాఫె విదా’అ చేయకుండా వెళ్ళే అనుమతి ఇచ్చారు. అయితే ఆమె యౌమున్నహర్‌లో ‘తవాఫె ఇఫా’ద చేసి ఉండాలి. (‘అహ్మద్). ఒకవేళ ‘తవాఫె విదా’అ చేసి ఉండి, ఆ తరువాత ఏ కారణంగానైనా మక్కాలో కొన్ని రోజులు ఉంటే, వెళ్ళేటపుడు మళ్ళీ ‘తవాఫె విదా’అ చేసుకోవాలి. ‘తవాఫ్ విదా’అ చేయకుండా మక్కహ్ నుండి బయలుదేరి ‘హరమ్‌లో ఉంటే వెనుకకు వచ్చేయండి, ‘తవాఫె విదా’అ చేసి తిరిగి వెళ్ళండి.
శుభప్రసాదాలు (బరకాత్): ‘జమ్’జమ్ నీటిని శుభంగా భావించి తీసుకొని వెళ్ళటం ప్రవక్త (స) సాంప్రదాయం. ప్రవక్త (స) ప్రవచనం, ” ‘జమ్’జమ్ నీరు శుభకరమైనది. ఆకలిగొన్న వారికి అన్నం వంటిది. వ్యాధిగ్రస్తులకు స్వస్థత వంటిది. ప్రపంచంలో ఉన్న నీళ్ళన్నింటిలోనూ ఇది శ్రేష్ఠమైనది. ప్రవక్త (స) ఉపదేశం: ఏ సంకల్పంతో ‘జమ్’జమ్ నీరు త్రాగితే అది నెరవేరుతుంది. మరో ప్రవచనం: భూమిపై ఉన్న నీళ్ళన్నింటిలోనూ ‘జమ్’జమ్ నీరు శ్రేష్ఠమైనది. ప్రవక్త (స) ఈ నీటిని శుభంగా భావించి తీసుకు వెళ్ళేవారు. ‘ఆయి’షహ్ (ర) కథనం, ఆమె స్వయంగా ‘జమ్ ‘జమ్ నీరు తీసుకువచ్చేవారు. ప్రవక్త (స) కూడా ‘జమ్ ‘జమ్ నీరు తీసుకువచ్చేవారని చెప్పారు. (తిర్మిజి’)
కనుక ‘జమ్’జమ్ నీటిని తీసుకువెళ్ళడం ప్రవక్త సాంప్రదాయం. ఇంకా తస్‌బీ’హ్, రుమాల్, సుర్మ మొదలైన వాటిని శుభంగా భావించి తీసుకొని వెళ్ళడం ధర్మసమ్మతం కాదు. అయితే కానుకలు, సంతోష సూచకాలుగా భావించి తీసుకొని వెళితే ఎటువంటి అభ్యంతరం లేదు.
‘జమ్’జమ్ నీరు త్రాగినపుడు పఠించే దు‘ఆ: దీన్ని గురించి ప్రవక్త (స) ద్వారా ఎటువంటి దు’ఆ లేదు. అయితే ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అబ్బాస్ (ర) ‘జమ్ ‘జమ్ నీరు త్రాగిన తర్వాత ఈ దు’ఆ పఠించేవారు.
”అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ‘ఇల్మన్ నాఫి‘అన్ వ రి‘జ్ఖన్న్ వాసి‘అన్ వ షిఫాఅ‘న్ మిన్ కుల్లి దా‘ఇన్.” — — ‘ఓ అల్లాహ్ నేను నిన్ను లాభం చే కూర్చే జ్ఞానాన్ని విశాలమైన ఉపాధిని, రోగాలన్నిటి నుండి స్వస్థతను అర్థిస్తున్నాను.’ (ముస్తద్‌రక్, హాకిమ్)
మస్జిదె నబవీ మరియు ప్రవక్త (స) సమాధిని సందర్శించటం
మస్జిదె నబవీని సందర్శించటం ఇస్లామీయ సాంప్రదాయం. అక్కడకు వెళ్ళి ప్రవక్త (స) సమాధిని దర్శించటం పుణ్యకార్యం. మదీనహ్ వాసులను చూచి మక్కహ్ వాసులను చూచి పఠించిన దు’ఆనే పఠించాలి. ఈ దు’ఆ కూడా ఇస్లామీయ సాంప్రదాయం లోనిదే. ”ఆయిబూన తాయిబూన ‘ఆబిదూన లిరబ్బినా ‘హామిదూన్.” — — ‘మేము తిరిగి మరలేవారం. పశ్చాత్తాపం చెందేవారం, మా ప్రభువు గొప్పతనాన్ని స్తుతించేవారం.’ (ముస్లిమ్)
మస్జిదె నబవీలో ప్రవేశించినపుడు సాధారణంగా మస్జిదుల్లో ప్రవేశించినపుడు పఠించే దు’ఆనే పఠించాలి. తహియ్యతుల్ మస్జిద్ రెండు రకాతులు చదవాలి. మస్జిద్ నుండి బయటకు వెళ్ళినపుడు ఆ దు’ఆనే పఠించాలి. మస్జిదె నబవీలో నిరాటంకంగా 40 నమా’జులు చదివేవారు నరకం, సమాధి శిక్ష మరియు కాపట్యం నుండి రక్షించబడతారు. (ముస్సద్ అ’హ్మద్).
ప్రవక్త (స) సమాధిని సందర్శించి నపుడు దరూద్ మరియు సలామ్ చదవాలి. ప్రవక్త (స) మనకు నేర్పిన పదాలనే చదవాలి.
”అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వర‘హ్మ తుల్లాహి వ బరకాతుహూ.” —- ‘ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ శాంతి మరియు కారుణ్యం, మరియు ఆయన శుభాలు కురియుగాక!’ (బు’ఖారీ, ముస్లిమ్)
”అల్లాహుమ్మ ‘సల్లి ‘అలా ము‘హమ్మదిన్ వ‘అలా ఆలి ము‘హ మ్మదిన్ కమా ‘సల్లైత ‘అలా ఇబ్రాహీమ వ‘అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక ‘హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ ‘అలా ము‘హ మ్మదిన్ వ ‘అలా ఆలి ము‘హమ్మదిన్ కమా బారక్‌త ‘అలా ఇబ్రాహీమ వ ‘అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక ‘హమీదుమ్మజీద్.” — ‘ఓ అల్లాహ్! ఏవిధంగా నీవు ఇబ్రాహీమ్ (అ)ను, అతని అనుచరుల్ని కరుణించావో అదేవిధంగా ము’హమ్మద్ (స)ను అతని అనుచరుల్ని కరుణించు. నిస్సందేహంగా నీవే మహత్తర గుణ సంపత్తులు కలవాడవు. ఓ అల్లాహ్! ఏవిధంగా నీవు ఇబ్రాహీమ్ (అ)కు, అతని అనుచరులకు శుభాలు ప్రసాదించావో అదే విధంగా ము’హమ్మద్ (స)కు అతని అనుచరులకు శుభాలు ప్రసాదించు, నిస్సందేహంగా నీవే మహత్తరమైన గుణ సంపదలు, ఘనతలు గలవాడవు. (‘స’హా’హ్ సిత్తహ్)
పైన ‘హజ్జ్ విధానాన్ని గురించి వివరంగా పేర్కొనడం జరిగింది. ఇప్పుడు క్రింద పేర్కొన్న ‘హదీసు’లలో దాని సాక్ష్యాధారాలను, ప్రాముఖ్యతను చదవండి.
=====
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2505 – [ 1 ] ( صحيح ) (2/772)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: خَطَبَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “يَا أَيُّهَا النَّاسُ قَدْ فُرِضَ عَلَيْكُمْ الْحَجُّ فَحُجُّوْا” .فَقَالَ رَجُلٌ: أَكُلَّ عَامٍ يَا رَسُوْلَ اللهِ؟ فَسَكَتَ حَتَّى قَالَهَا ثَلَاثًا. فَقَالَ: “لَوْ قُلْتُ نَعَمْ لَوَجَبَتْ وَلَمَا اسْتَطَعْتُمْ”. ثُمَّ قَالَ: ذَرُوْنِيْ مَا تَرَكْتُكُمْ فَإِنَّمَا هَلَكَ مَنْ كَانَ قَبْلَكُمْ بِكَثْرَةِ سُؤَالِهِمْ وَاخْتِلَافِهِمْ عَلَى أَنْبِيَائِهِمْ فَإِذَا أَمَرْتُكُمْ بِشَيْءٍ فَأَتُوْا مِنْهُ مَا اسْتَطَعْتُمْ وَإِذَا نُهِيْتُكُمْ عَنْ شَيْءٍ فَدَعُوْهُ”. روَاهُ مُسْلِمٌ.
2505. (1) [2/772 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం, దైవ ప్రవక్త (స)మాకు ఉపన్యాసం ఇస్తూ, ”ప్రజలారా! మీపై ‘హజ్జ్ యాత్ర విధిగా నిర్ణయించబడింది. కనుక మీరు ‘హజ్జ్ చేయండి,” అన్నారు. ఇంతలో ఒక వ్యక్తి ”ప్రతి సంవత్సరం చేయాలా దైవప్రవక్తా?” అని అడిగాడు. అందుకు దైవప్రవక్త (స) మౌనం వహించారు. ఆ వ్యక్తి అదే ప్రశ్న మూడుసార్లు అడిగాడు. అప్పుడు దైవప్రవక్త (స), ”నేను గనక, ”ఔను” అంటే దాన్ని మీరు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. కాని మీలో ఆ శక్తి లేదు,” ఇంకా ”ఏ విషయాలనయితే నేను మీకు చెప్పకుండా వదిలేస్తున్నానో వాటిని గురించి మీరు నన్ను అడక్కండి. నిస్సందేహంగా మీకు పూర్వం గతించిన జాతులు ఈ విధంగా అనవసర ప్రశ్నలు వేయటం మూలంగా, తమ ప్రవక్తలతో విభేదించటం మూలంగానే నాశనమయి పోయాయి. కనుక నేను మీకు దేన్నిగురించయినా ఆదేశించినపుడు మీరు మీ శక్తిమేరకు దాన్ని ఆచరించండి. ఒకవేళ ఏదయినా చేయకూడదని వారిస్తే దానిని వదిలేయండి, అని అన్నారు. [1] (ముస్లిమ్)
2506 – [ 2 ] ( متفق عليه ) (2/772)
وَعَنْهُ قَالَ: سُئْلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: أَيُّ الْعَمَلِ أَفْضَلُ؟ قَالَ: “إِيْمَانُ بِاللهِ وَرَسُوْلِهِ”. قِيْلَ: ثُمَّ مَاذَا؟ قَالَ: “اَلْجِهَادُ فِيْ سَبِيْلِ اللهِ“. قِيْلَ: ثُمَّ مَاذَا؟ قَالَ: “حَجٌّ مَبْرُوْرٌ”.
2506. (2) [2/772–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: దైవప్రవక్త (స) ను, ”ఆచరణలన్నిటిలోకెల్లా శ్రేష్ఠమైనది ఏది?” అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త(స) సమాధానం ఇస్తూ, ”అల్లాహ్‌ను, దైవప్రవక్తను విశ్వసించటం,” అని అన్నారు. ‘ఆ తర్వాత ఏది?’ అని అడిగితే, ”అల్లాహ్ మార్గంలో పోరాడటం,” అని చెప్పారు. ‘ఆ తర్వాత ఏది?’ అని అడిగితే, ”స్వీకరించబడిన (మబ్రూర్), ‘హజ్జ్ ” అని చెప్పారు, దైవప్రవక్త (స).[2] (బు’ఖారీ, ముస్లిమ్)
2507 – [ 3 ] ( متفق عليه ) (2/772)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ حَجَّ لِلّهِ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ رَجَعَ كَيَوْمِ وَّلَدَتْهُ أُمُّهُ”.
2507. (3) [2/772–ఏకీభవితం]
ప్రవక్త (స) ప్రవచిస్తూ ఉండగా తాను విన్నానని అబూ హురైరహ్ తెలియజేశారు: ఎవరయితే చిత్తశుధ్ధితో, లైంగిక విషయాలకు పాల్పడకుండా, దైవ అవిధేయతకు ఒడిగట్ట కుండా జాగ్రత్తపడుతూ ‘హజ్జ్ చేస్తాడో అతడు ఆ రోజే తల్లి గర్భం నుండి పుట్టినట్టు తిరిగి వస్తాడు. (బు’ఖారీ, ముస్లిమ్)
2508 – [ 4 ] ( متفق عليه ) (2/772)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْعُمْرَةُ إِلَى الْعُمْرَةِ كَفَّارَةٌ لِمَا بَيْنَهُمَا. وَالْحَجُّ الْمَبْرُوْرُ لَيْسَ لَهُ جَزَاءٌ إِلَّا الْجَنَّةَ”.
2508. (4) [2/772–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఒక ‘ఉమ్‌రహ్ నుండి మరో ‘ఉమ్‌రహ్ వరకు వాటి మధ్య పాపాలకు పరిహారం అవుతుంది. మబ్రూర్ ‘హజ్జ్కు ప్రతిఫలం స్వర్గం తప్ప మరేమీ కాదు. (బు’ఖారీ, ముస్లిమ్)
2509 – [ 5 ] ( متفق عليه ) (2/772)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ عُمْرَةً فِيْ رَمَضَانَ تَعْدِلُ حَجَّةً“.
2509. (5) [2/772–ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: దైవప్రవక్త (స) ”రమ’దాన్ మాసంలో చేసే ‘ఉమ్‌రహ్, ‘హజ్జ్ కు సమానం.” అని ప్రవచించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2510 – [ 6 ] ( صحيح ) (2/773)
وَعَنْهُ قَالَ: إِنَّ النَّبِيَّ صلى الله عليه وسلم لَقِيَ رَكْبًا بِالْرَّوْحَاءِ فَقَالَ: “مَنِ الْقَوْمُ؟” قَالُوْا: اَلْمُسْلِمُوْنَ. فَقَالُوْا مَنْ أَنْتَ؟ قَالَ: “رَسُوْلُ اللهِ”. فَرَفَعَتْ إِلَيْهِ امْرَأَةٌ صَبِيًّا فَقَالَتْ: أَلِهَذَا حَجّ؟ قَالَ: “نَعَمْ وَلَكِ أَجْر” .رَوَاهُ مُسْلِمٌ.
2510. (6) [2/773–దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ఒకసారి దైవప్రవక్త (స) రౌ‘హా‘ ప్రాంతంలో ఒక బాటసారుల బృందాన్ని కలిసారు. ఆయన వారిని ఉద్దేశించి, ”ఎవరు మీరు?” అని అడిగారు. దానికి వారు సమాధానమిస్తూ, ”మేము ముస్లిములము. మీరెవరు?” అని అడిగారు. ”నేను దైవప్రవక్తను,” అని సమాధానమిచ్చారు ప్రవక్త (స). ఇంతలో ఒక మహిళ ఒక అబ్బాయిని ఎత్తి చూపుతూ, ”ఇతని ‘హజ్జ్ ఉందా?” అని విన్నవించుకుంది. దానికి ప్రవక్త (స) ”అవును. దాని పుణ్యం నీకు లభిస్తుంది.” అని అన్నారు. [3] (ముస్లిమ్)
2511 – [ 7 ] ( متفق عليه ) (2/773)
وَعَنْهُ قَالَ: إِنَّ امْرَأَةً مِنْ خَثْعَمَ قَالَتْ: يَا رَسُوْلَ اللهِ إِنَّ فَرِيْضَةَ اللهِ عِبَادِةِ فِيْ الْحَجِّ أَدْرَكَتْ أَبِيْ شَيْخًا كَبِيْرًا لَا يَثْبُتُ عَلَى الرَّاحِلَةِ أَفَأَحُجُّ عَنْهُ؟ قَالَ: “نَعَمْ” ذَلِكَ حَجَّةُ الْوِدَاعِ .
2511. (7) [2/773–ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ఒక స్త్రీ ప్రవక్త (స) దగ్గరకు వచ్చి, ”ప్రవక్తా! అల్లాహ్(త) తన దాసులపై విధిగా చేసిన ‘హజ్జ్ మా నాన్నగారికి తప్పనిసరి అయినప్పటికీ అతడు వృద్ధాప్యానికి చేరుకున్నారు. వాహనం మీద సరిగా కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి అతడి తరఫున నేను ‘హజ్జ్ చేయవచ్చునా?” అని విన్నవించుకుంది. అందుకు ప్రవక్త (స), ”చేయవచ్చు” అని సమాధానం ఇచ్చారు. ఈ సంఘటన ‘హజ్జతుల్ విదా’లో సంభవించింది. [4] (బు’ఖారీ, ముస్లిమ్)
2512 – [ 8 ] ( متفق عليه ) (2/773)
وَعَنْهُ قَالَ: أَتَى رَجُلُ النَّبِيَّ صلى الله عليه وسلم. فَقَالَ: إِنَّ أُخْتِيْ نَذَرَتْ أَنْ تَحُجَّ وَإِنَّهَا مَاتَتْ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “لَوْ كَانَ عَلَيْهَا دَيْنٌ أَكُنْتَ قَاضِيَهُ؟” قَالَ: نَعَمْ. قَالَ: “فَاقْضِ دَيْنَ اللهِ فَهُوَ أَحَقُّ بِالْقَضَاءِ”.
2512. (8) [2/773–ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ”నా సోదరి ‘హజ్జ్ చేద్దామని మొక్కు కుంది. కాని ఆమె మొక్కుబడి తీర్చుకోవడానికి ముందే చనిపోయింది,” అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స), ”ఒకవేళ ఆమెపై రుణం ఉంటే నీవు దాన్ని తీర్చవా?” అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, ‘అవును,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) అల్లాహ్(త) బాకీ కూడా తీర్చివెయ్యి. ఎందుకంటే దాన్ని తీర్చటం అంత కన్నా చాలా అవసరం, అదే సరైనది.” [5] (బు’ఖారీ, ముస్లిమ్)
2513 – [ 9 ] ( متفق عليه ) (2/773)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَخْلونَّ رَجُلٌ بِامْرَأَةٍ وَّلَا تُسَافِرَنَّ امْرَأَةٌ إِلَّا وَمَعَهَا مُحْرَمٌ”. فَقَالَ رَجُلٌ: يَا رَسُوْلَ اللهِ اكْتُتِبْتُ فِيْ غَزْوَةِ كَذَا وَكَذَا. وَخَرَجَتِ امْرَأَتِيْ حَاجَّةً. قَالَ: “اذْهَبْ فَاحْجُجْ مَعَ امْرَأَتِكَ“.
2513. (9) [2/773–ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”ఏ పర పురుషుడు పర స్త్రీ వెంట ఏకాంతంగా గడపరాదు. అదేవిధంగా ఏ స్త్రీ కూడా మహ్రమ్ తన వెంట లేకుండా ప్రయాణం చేయరాదు.” అది విని ఒక వ్యక్తి, ”ఓ అల్లాహ్ ప్రవక్తా! నా పేరు యుద్ధంలో వ్రాయబడి ఉంది. ఇటు నా భార్య ‘హజ్జ్కు బయలుదేరింది, అని విన్నవించు కున్నాడు. అప్పుడు ప్రవక్త (స), ”నువ్వు నీ భార్యతో వెళ్ళు. ఆమెకు ‘హజ్జ్ చేయించు,” అని అన్నారు. [6] (బు’ఖారీ, ముస్లిమ్)
2514 – [ 10 ] ( متفق عليه ) (2/773)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: اسْتَأْذَنْتُ النَّبِيَّ صلى الله عليه وسلم فِيْ الْجِهَادِ. فَقَالَ: “جِهَادُكُنَّ الْحَجُّ”.
2514. (10) [2/773–ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ”నేను ప్రవక్త (స) ను జిహాద్‌లో పాల్గొనడానికి అనుమతి కోరాను. దానికి ప్రవక్త (స) మీ జిహాద్ ‘హజ్జ్ అని అన్నారు. అంటే ‘హజ్జ్ చేయటం వల్ల జిహాద్ పుణ్యం లభిస్తుంది. (బు’ఖారీ, ముస్లిమ్)
2515 – [ 11 ] ( متفق عليه ) (2/773)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُسَافِرُ امْرَأَةٌ مَسِيْرَةَ يَوْمٍ وَّلَيْلَةٍ إِلَّا وَمَعَهَا ذُوْ مَحْرَمٍ“.
2515. (11) [2/773–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్త్రీ మహ్రమ్ లేకుండా ఒక రాత్రి ఒక పగటి ప్రయాణం చేయ కూడదు.” (బు’ఖారీ, ముస్లిమ్)
2516 – [ 12 ] ( متفق عليه ) (2/773)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: وَقَّتَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِأَهْلِ الْمَدِيْنَةِ: ذَا الْحُلَيْفَةِ وَلِأَهْلِ الشَّامِ: الْجُحْفَةَ وَلِأَهْلِ نَجْدٍ: قَرْنَ الْمَنَازِلَ وَلِأَهْلِ الْيَمَنِ: يَلَمْلَمَ. فَهُنَّ لَهُنَّ وَلِمَنْ أَتَي عَلَيْهِنَّ مِنْ غَيْرِ أَهْلِهِنَّ لِمَنْ كَانَ يُرِيْدُ الْحَجَّ وَالْعُمْرَةَ فَمَنْ كَانَ دُوْنَهُنَّ فَمُهَلُّهُ مِنْ أَهْلِهِ وَكَذَاكَ وَكَذَاكَ حَتَّى أَهْلُ مَكَّةُ يُهِلُّوْنَ مِنْهَا.
2516. (12) [2/773–ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) మదీనహ్ వాసులకు జు‘ల్’హులైఫహ్, సిరియా వాసులకు జు‘హ్‌ఫహ్, నజ్‌ద్ వాసులకు ఖర్‌నుల్ మనా‘జిల్, యమన్ వాసులకు యలమ్లమ్ లను, మీఖాత్ లుగా నిర్ణయించారు. ఇంకా ఇలా అన్నారు, ”ఈ నిర్ణీత స్థానాలు దూర ప్రాంతాల నుండి వచ్చేవారికి. అయితే ఈ నిర్ణీత స్థానాలపై ఉండే వారికి, ఈ పరిధిలోపల ఉండేవారు. చివరికి మక్కహ్ వాసులు కూడా తమ ఇంటి వద్దనుండే ఇ’హ్‌రామ్ ధరించాలి. [7] (బు’ఖారీ, ముస్లిమ్)
2517 – [ 13 ] ( صحيح ) (2/774)
وَعَنْ جَابِرٍعَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مُهَلُّ أَهْلِ الْمَدِيْنَةِ مِنْ ذِي الْحُلَيْفَةِ وَالطَّرِيْقُ الْآخَرُ الْجُحْفَةُ وَمُهَلُّ أَهْلِ الْعِرَاقِ مِنْ ذَاتِ عِرْقٍ وَمُهَلُّ أَهْلِ نَجْدٍ قَرْنٌ وَمُهَلُّ أَهْلِ الْيَمَنِ يَلَمْلَمُ” . رَوَاهُ مُسْلِمٌ .
2517. (13) [2/774–దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) మదీనహ్ వారు ‘ఇహ్‌రామ్ ధరించే చోటు ‘జుల్’హులైఫహ్ అని, మరో మార్గంలో జు’హ్‌ఫహ్ అని, ఇరాఖ్‌వారు ఇహ్‌రామ్ ధరించే చోటు, జా’తు ‘ఇర్‌ఖ్ అని, నజ్‌ద్ వారు ఇహ్‌రామ్ ధరించేచోటు ఖర్‌న్ అని, యమన్ వారు ఇహ్‌రామ్ ధరించేచోటు యలమ్‌లమ్ అని నిర్ణయించారు. (ముస్లిమ్)
2518 – [ 14 ] ( متفق عليه ) (2/774)
وَعَنْ أَنَسٍ قَالَ: اعْتَمَرَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَرْبَعَ عُمَرٍ كُلُّهُنَّ فِيْ ذِيْ الْقَعْدَةِ إِلَّا الَّتِيْ كَانَتْ مَعَ حَجَّتِهِ عُمْرَةً مِّنَ الْحُدَيْبِيَّةِ فِيْ ذِيْ الْقَعْدَةِ وَعُمَرَةً مِّنَ الْعَامِ الْمُقْبِلٍ فِيْ ذِي الْقَعْدَةِ وَعُمَرَةً مِّنَ الْجِعِرَّانَةِ حَيْثُ قَسَّمَ غَنَائِمَ حُنَيْنٍ فِيْ ذِيْ الْقَعْدَةِ وَعُمْرَةً مَعَ حَجّتِهِ”.
2518. (14) [2/774–ఏకీభవితం]
అనస్ (ర) కథనం, ప్రవక్త (స) 4 ‘ఉమ్రహ్లు చేసారు. మూడు జు’ల్ఖ’అదహ్‌లో చేసారు. అయితే తన ‘హజ్జ్తో పాటు చేసిన ‘ఉమ్‌రహ్‌ను జి’ల్ ‘హిజ్జహ్ నెలలో చేసారు. 4 ‘ఉమ్‌రహ్‌ల వివరాలు: ఒక ‘ఉమ్‌రహ్ ‘హుదైబియహ్ నుండి దీన్ని జి’ల్ ఖ’అదహ్‌మాసంలో చేసారు. 2వది ‘హుదైబియా తరువాతి సంవత్సరం జి’ల్ ఖ’అదహ్ మాసంలో చేసారు. 3వది ‘ఉమ్రహ్ జీ’రానహ్ నుండి చేసారు. ఇక్కడ ‘హునైన్ యుద్ధధనం పంచబడింది. దీన్ని కూడా జి’ల్ ఖ’అదహ్‌లో చేసారు. 4వ ‘ఉమ్‌రహ్ తన ‘హజ్జ్తో పాటు జి’ల్’హిజ్జ్ మాసంలో చేసారు.[8] (బు’ఖారీ, ముస్లిమ్)
2519 – [ 15 ] ( صحيح ) (2/774)
وَعَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ قَالَ: اعْتَمَرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ ذِيْ الْقَعْدَةِ قَبْلَ أَنْ يَّحُجَّ مَرَّتَيْنِ. رَوَاهُ الْبُخَارِيُّ.
2519. (15) [2/774–దృఢం]
బరా’బిన్ ‘ఆజి’బ్ (ర) కథనం: ప్రవక్త (స) జి’ల్ఖ’అదహ్ మాసంలో ‘హజ్జ్ కు ముందు రెండు ‘ఉమ్‌రహ్‌లు చేసారు. [9] (బు’ఖారీ)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2520 – [ 16 ] ( لم تتم دراسته ) (2/774)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا أَيُّهَا النَّاسُ إِنَّ اللهَ كَتَبَ عَلَيْكُمُ الْحَجَّ“. فَقَامَ الْأَقْرَعُ بْنُ حَابِسٍ فَقَالَ: أَفِيْ كُلِّ عَامٍ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “لَوْ قُلْتُهَا نَعَمْ، لَوَجَبَتْ وَلَوْ وَجَبَتْ لَمْ تَعْمَلُوْا بِهَا وَلَمْ تَسْتَطِيْعُوْا وَالْحَجُّ مَرَّةً فَمَنْ زَادَ فَتَطَوُّعٌ“. رَوَاهُ أَحْمَدُ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ.
2520. (16) [2/774–అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ”ప్రజలారా! అల్లాహ్ (త) మీపై ‘హజ్జ్ విధిగా చేసాడు,” అని అన్నారు. అఖ్‌ర బిన్ ‘హాబిస్ (ర) నిలబడి, ఓ అల్లాహ్ ప్రవక్తా! ప్రతి సంవత్సరం తప్పనిసరి విధిగా చేయబడిందా? అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రవక్త (స) ‘ఒకవేళ నేను అవునని అంటే ప్రతి సంవత్సరం ‘హజ్జ్ విధి అయిపోతుంది. దాన్ని మీరు చేయలేరు. దాని శక్తీ మీకులేదు.’ ‘హజ్జ్ ఒకేసారి విధి చేయ బడింది. దానికి మించి చేస్తే అది అదనపు (నఫిల్) ‘హజ్జ్ అవుతుంది. (అ’హ్మద్, నసాయి’, దారమి)
2521 – [ 17 ] ( لم تتم دراسته ) (2/775)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ مَّلَكَ زَادًا وَّرَاحِلَةً تُبَلِّغُهُ إِلَى بَيْتِ اللهِ وَلَمْ يَحُجَّ فَلَا عَلَيْهِ أَنْ يَّمُوْتَ يَهُوْدِيًّا أَوْ نَصْرَانِيًّا وَذَلِكَ أَنَّ اللهَ تَبَارَكَ وَتَعَالى يَقُوْلُ: (وَلِلّهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيْلًا3: 97). رَوَاهُ التِّرْمِذِيُّ
وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ. وَفِيْ إِسْنَادِهِ مَقَالٌ وَهِلَالُ بْنُ عَبْدِ اللهِ مَجْهُوْلٌ وَالْحَارِثُ يَضَعَّفُ فِيْ الْحَدِيْثِ.
2521. (17) [2/775–అపరిశోధితం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణ ఖర్చులు, వాహనం, ఆరోగ్యం స్తోమత ఉండి కూడా ‘హజ్జ్ చేయని వాడు క్రైస్తవుడిగా లేదా యూదుడిగా మర ణించి నట్లు. ఇలా ఎందుకంటే అల్లాహ్ (త) ఖుర్‌ఆన్ లో ఆదేశించాడు, ”అల్లాహ్ కోసం దైవగృహాన్ని సందర్శిం చటం విధి అయింది. అక్కడి వరకు వెళ్ళే స్తోమత ఉన్నవారికే అంటే ‘హజ్జ్ ఖర్చులను ప్రయాణాన్ని భరించే వారిపై తప్పనిసరి విధి.” [10]
తిర్మిజి దీన్ని ఏకోల్లేఖనంగా పేర్కొన్నారు. ఇంకా దీని ప్రామాణికత చర్చనీయ అంశంగా ఉంది. ఇందులో హిలాల్ బిన్ అబ్దుల్లాహ్, ‘హారిస్’ కథకులపై విమర్శలు ఉన్నాయి.
2522 – [ 18 ] ( لم تتم دراسته ) (2/775)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: لَا صَرُوْرَةَ فِيْ الْإِسْلَامِ”. روَاهُ أَبُوْ دَاوُدَ.
2522. (18) [2/775–అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇస్లామ్‌లో ‘సరూరత్ లేదు.” [11](అబూ దావూద్)
2523 – [ 19 ] ( لم تتم دراسته ) (2/775)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَرَادَ الْحَجَّ فَلْيُعَجِّلْ“. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ.
2523. (19) [2/775–అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ‘హజ్జ్ సంకల్పం చేసుకున్నవారు సాధ్యమైనంత తొందరగా ‘హజ్జ్ చేసుకోవాలి అని ప్రవచించారు. [12] (అబూ దావూద్, దారమి)
2524 – [ 20 ] ( صحيح ) (2/775)
وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَابِعُوْا بَيْنَ الْحَجِّ وَالْعُمْرَةِ فَإِنَّهُمَا يَنْفِيَانِ الْفَقْرَ وَالذُّنُوْبَ كَمَا يَنْفِي الْكِيْرُ خَبَثَ الْحَدِيْدِ وَالذَّهَبِ وَالْفِضَّةِ وَلَيْسَ لِلْحَجَّةِ الْمَبْرُوْرَةِ ثَوَابٌ إِلَّا الْجَنَّةَ“. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ.
2524. (20) [2/775–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”మీరు ‘హజ్జ్, ‘ఉమ్‌రహ్‌లను ఒకేసారి చేయండి. రెంటినీ కలిపి చేయండి అంటే ఒక దాని తర్వాత ఒకటి చేయండి. అంటే ‘హజ్జ్ ఖిరాన్ చేయండి. లేదా ముందు ‘హజ్జ్ చేసి, ఆ తర్వాత ‘ఉమ్‌రహ్ చేయండి. లేదా ముందు ‘ఉమ్‌రహ్ చేసి తరువాత ‘హజ్జ్ చేయండి. ఈ పరంపరను కొనసాగించండి. ఎందుకంటే ఈ రెండూ దారిద్య్రాన్ని, పాపాలను – అగ్ని, బంగారాన్ని వెండిని శుభ్రపరచి నట్లు – శుభ్రం చేస్తాయి. ‘హజ్జె మఖ్బూల్కు ప్రతిఫలం కేవలం స్వర్గమే. (తిర్మిజి’, నసాయి’)
2525 – [ 21 ] ( لم تتم دراسته ) (2/775)
وَرَوَاهُ أَحْمَدُ وَابْنُ مَاجَهُ عَنْ عُمَرَ إِلَى قَوْلِهِ: “خَبَثَ الْحَدِيْدِ”.
2525. (21) [2/775–అపరిశోధితం]
‘ఉమర్ (ర) కథనం: (అ’హ్మద్, ఇబ్నె మాజహ్)
2526 – [ 22 ] ( لم تتم دراسته ) (2/776)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ مَا يُوْجِبُ الْحَجَّ؟ فَقّالَ: “الزَّادُ وَالرَّاحِلَةُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.
2526. (22) [2/776–అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ఒక వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి, ”ఓ అల్లాహ్ ప్రవక్తా! ఏ విషయం ‘హజ్జ్ను తప్పనిసరి చేస్తుంది,” అని విన్నవించు కున్నాడు. ప్రవక్త (స) సమాధానం ఇస్తూ, ”రాను పోను ఖర్చులు, వాహనం, తిరిగి వచ్చేవరకు భార్యాబిడ్డల ఖర్చులు ఇతర ఖర్చులు కలిగి ఉండటం,” అని అన్నారు. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
2527 – [ 23 ] ( حسن ) (2/776)
وَعَنْهُ قَالَ: سَأَلَ رَجُلٌ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ: مَا الْحَاجُّ؟ قَالَ: “الشَّعِثُ النتَّفِلُ”. فَقَامَ آخَرُ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ أَيُّ الْحَجِّ أَفْضَلُ؟ قَالَ: “الْعَجُّ وَالثَّجُّ”. فَقَامَ آخَرُ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ مَا السَّبِيْلُ؟ قَالَ: “زَادٌ وَّرَاحِلَةٌ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.
وَرَوَى ابْنُ مَاجَهُ فِيْ سُنَنِهِ إِلَّا أَنَّهُ لَمْ يَذْكُرِ الْفَصْلُ الْأَخِيْرَ.
2527. (23) [2/776–ప్రామాణికం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ఒక వ్యక్తి ప్రవక్త (స)ను, ” ‘హజ్జ్ ప్రత్యేకత ఏమిటి? అంటే ‘హాజీ ప్రత్యేక చిహ్నం ఏమిటి?” అని ప్రశ్నించాడు. ప్రవక్త (స) ”అతని తల ధూళితో నిండి ఉండడం, అంటే అలంకరణకు దూరంగా ఉండటం,” అని అన్నారు. మరోవ్యక్తి నిలబడి, ”ఓ అల్లాహ్ ప్రవక్తా! ‘హజ్జ్లో ఏ ఆచరణ అన్నిటికంటే ఉత్తమమైనది?” అని ప్రశ్నించాడు. ప్రవక్త (స) సమాధానం ఇస్తూ, ”లబ్బయెక్ అని బిగ్గరగా పలకడం, ఖుర్‌బానీ చేయడం,” అని అన్నారు. మూడవ వ్యక్తి నిలబడి, ”ఓ అల్లాహ్ ప్రవక్తా! సబీల్ అంటే ఏమిటి?” అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స), ”వాహనం మరియు ప్రయాణ ఖర్చులు,” అని అన్నారు. [13] (షర్‌హుస్సున్నహ్, ఇబ్నె మాజహ్)
2528 – [ 24 ] ( لم تتم دراسته ) (2/776)
وَعَنْ أَبِيْ رَزِيْنٍ الْعَقْيْلِيِّ أَنَّهُ أَتَى النَّبِيَّ صلى الله عليه وسلم فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَّ أَبِيْ شَيْخٌ كَبِيْرٌ لَا يَسْتَطِيْعُ الْحَجَّ وَلَا الْعُمْرَةَ وَلَا الظَّعْنَ قَالَ: “حُجَّ عَنْ أَبِيْكَ وَاعْتَمِرْ“. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ، وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ.
2528. (24) [2/776–అపరిశోధితం]
అబూ ర’జీన్ ‘ఉఖైలీ (ర) కథనం: వీరు ప్రవక్త (స) వద్దకు వచ్చి,”ఓ అల్లాహ్ ప్రవక్తా! మా తండ్రిగారు చాలా వృద్ధులు. ‘హజ్జ్, ‘ఉమ్‌రహ్ రెండూ చేయ లేరు. వాహనంపై కూర్చో లేరు,” అని విన్నవించు కున్నాడు. అప్పుడు ప్రవక్త (స), ”నీ తండ్రి తరఫున నువ్వు ‘హజ్జ్, ‘ఉమ్‌రహ్ చేయి,” అని అన్నారు. (తిర్మిజి’-ప్రామాణికం-దృఢం,అబూ-దావూద్, నసాయి’)
2529 – [ 25 ] ( صحيح ) (2/776)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم سَمِعَ رَجُلًا يَقُوْلُ لَبَّيْكَ عَنْ شُبْرُمَةَ قَالَ: “مَنْ شُبْرُمَةَ” قَالَ: أَخُ لِّيْ أَوْ قَرِيْبٌ لِّيْ قَالَ: “أَحَجَجْتَ عَنْ نَفْسِكَ؟” قَالَ: لَا. قَالَ: “حُجَّ عَنْ نَفْسِكَ. ثُمَّ حُجَّ عَنْ شُبْرُمَةَ”. روَاهُ الشَّافِعِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
2529. (25) [2/776–దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక వ్యక్తిని ”షుబ్‌రుమహ్ తరపున హాజరయ్యాను. ఇప్పుడు అతని తరఫున ‘హజ్జ్ చేస్తున్నాను.” అని అంటూ ఉండగా విన్నారు, ”షుబ్‌రుమహ్ ఎవరని,” అడిగారు. దానికి ఆ వ్యక్తి, ”నా సోదరుడు లేదా దగ్గరి బంధువు,” అని అన్నాడు. ప్రవక్త (స), ”నీవు ‘హజ్జ్ చేసావా?” అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, ”లేదు,” అని సమాధానం ఇచ్చాడు. ప్రవక్త (స), ”ముందు నీ ‘హజ్జ్ చేసుకో, ఆ తరువాత షుబ్‌రుమహ్ తరఫున ‘హజ్జ్ చేయి,” అని అన్నారు. [14] (షాఫయీ’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
2530 – [ 26 ] ( لم تتم دراسته ) (2/776)
وَعَنْهُ قَالَ: وَقَّتَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِأَهْلِ الْمَشْرِقِ الْعَقِيْقَ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.
2530. (26) [2/776–అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) తూర్పు వైపు ఉన్న వారి కొరకు అఖీఖ్ను మీఖాత్‌గా నిర్ణయించారు. అంటే తూర్పున ఉన్నవారు అఖీఖ్‌లో ఇ’హ్‌రామ్ ధరిస్తారు. (తిర్మిజి’, అబూ దావూద్)
2531 – [ 27 ] ( لم تتم دراسته ) (2/777)
وَعَنْ عَائِشَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَقَّتَ لِأَهْلِ الْعِرَاقِ ذَاتَ عِرْقٍ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.
2531. (27) [2/777-అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఇరాఖ్ వారి కోసం జా‘తు ఇర్‌ఖ్‌ను మీఖాత్‌గా నిర్ణయించారు. అంటే వారు జాతు ఇర్‌ఖ్ నుండి ‘హజ్జ్ లేదా ‘ఉమ్‌రహ్‌ల ఇ’హ్‌రామ్ ధరిస్తారు. (అబూ దావూద్, నసాయి’)
2532 – [ 28 ] ( ضعيف ) (2/777)
وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ أَهَلَّ بِحَجَّةٍ أَوْ عُمْرَةٍ مِّنَ الْمَسْجِدِ الْأَقْصَى إِلَى الْمَسْجِدِ الْحَرَامِ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ وَمَا تَأَخَّرَ أَوْ وَجَبَتْ لَهُ الْجَنَّةُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
2532. (28) [2/777–బలహీనం]
ఉమ్మె సలమహ్ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా విన్నాను, ”బైతుల్ ముఖద్దస్ నుండి బైతుల్లాహ్ వరకు ‘హజ్జ్ లేదా ‘ఉమ్‌రహ్ సంకల్పంతో ఇ’హ్‌రామ్ ధరిస్తే అతని వెనుకా ముందూ పాపాలన్నీ క్షమించ బడతాయి. అతని కొరకు స్వర్గం తప్పనిసరి అయిపోతుంది. (అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
2533 – [ 29 ] ( صحيح ) (2/777)
عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ أَهْلُ الْيَمَنِ يَحُجُّوْنَ فَلَا يَتَزَوَّدُوْنَ وَيَقُوْلُوْنَ: نَحْنُ الْمُتَوَكِّلُوْنَ. فَإِذَا قَدِمُوْا مَكَّةَ سَأَلُوْا النَّاسَ فَأَنْزَلَ اللهُ تَعَالى: (وَتَزَوَّدُوْا فَإِنَّ خَيْرَ الزَّادِ التَّقْوَى، 2: 197). رَوَاهُ الْبُخَارِيُّ.
2533. (29) [2/777–దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: యమన్ నుండి ప్రజలు ‘హజ్జ్ చేయడానికి వచ్చేవారు. తమతో పాటు ఆహార సామాగ్రి తీసుకొని వచ్చేవారు కాదు. ఇంకా మేము అల్లాహ్(త)నే నమ్ముకున్నాం అని అనేవారు. వారు మక్కా వచ్చి బిచ్చమెత్తుకునే వారు. ప్రజలను అడిగే వారు, అప్పుడు అల్లాహ్ (త) ఈ వాక్యాన్ని అవతరింపజేసాడు. ”…(‘హజ్జ్ యాత్రకు) కావలసిన వస్తుసామాగ్రిని తీసుకువెళ్ళండి. దైవభీతియే నిశ్చయంగా, అన్నిటికంటే ఉత్తమమైన సామగ్రి…” (సూ. అల్ బఖరహ్, 2:197) అంటే బిచ్చమెత్తటం, అడుక్కోవటం మంచిది కాదు. [15] (బు’ఖారీ)
2534 – [ 30 ] ( صحيح ) (2/777)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ عَلَى النِّسَاءِ جِهَادٌ؟ قَالَ: “نَعَمْ. عَلَيْهِنَّ جِهَادٌ .لَا قِتَالَ فِيْهِ: الْحَجُّ وَالْعُمْرَةُ“. رَوَاهُ ابْنُ مَاجَهُ.
2534. (30) [2/777–దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ”ఓ అల్లాహ్ ప్రవక్తా! స్త్రీలపై జిహాద్ విధించబడిందా?” అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ”వారిపై ఎలాంటి జిహాద్ విధించబడిందంటే అందులో యుద్ధం, రక్తపాతం, వివాదంలేదు. అది ‘హజ్జ్ మరియు ‘ఉమ్‌రహ్. అంటే వారు ‘హజ్జ్ మరియు ‘ఉమ్‌రహ్ ఆచరిస్తే వారికి జిహాద్ పుణ్యం లభిస్తుంది, అని ప్రవచించారు. (ఇబ్నె మాజహ్)
2535 – [ 31 ] ( ضعيف ) (2/777)
وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ لَمْ يَمْنَعُهُ مِنَ الْحَجِّ حَاجَةٌ ظَاهِرَةٌ أَوْ سُلْطَانٌ جَائِرٌ أَوْ مَرَضٌ حَابِسٌ فَمَاتَ وَلَمْ يَحُجَّ فَلْيَمُتْ إِنْ شَاءَ يَهُوْدِيًّا وَإِنْ شَاءَ نَصْرَانِيًّا”. رَوَاهُ الدَّارَمِيُّ.
2535. (31) [2/777 –బలహీనం]
అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: అనివార్య కారణం గానీ, దౌర్జన్యపరుడైన పరిపాలకుడు గానీ, భయంకరమైన వ్యాధి గానీ లేనప్పటికీ, ‘హజ్జ్ చేయకుండా మరణించే వ్యక్తి, యూదునిగా మరణించినా లేదా క్రైస్తవునిగా మరణించినా మరణించ నివ్వండి. [16] (దారమి)
2536 – [ 32 ] ( لم تتم دراسته ) (2/778)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ قَالَ: “اَلْحَاجُّ وَالْعُمَّارُ وَفْدُ اللهِ إِنْ دَعَوْهُ أَجَابَهُمْ وَإِنِ اسْتَغْفَرُوْهُ غَفَرَ لَهُمْ“. رَوَاهُ ابْنُ مَاجَهُ.
2536. (32) [2/778– అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘హజ్జ్ మరియు ‘ఉమ్‌రహ్ చేసేవారు అల్లాహ్ (త) అతిథులు. వారు దు’ఆ చేస్తే అల్లాహ్ (త) వారి దు’ఆ స్వీకరిస్తాడు. వారు క్షమాపణ కోరితే అల్లాహ్ (త) వారిని క్షమిస్తాడు. (ఇబ్నె మాజహ్)
2537 – [ 33 ] ( حسن ) (2/778)
وَعَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “وَفْدُ اللهِ ثَلَاثَةٌ الْغَازِيْ وَالْحَاجُّ وَالْمُعْتَمِرُ”. رَوَاهُ النَّسَائِيُّ وَالْبَيْهِقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.
2537. (33) [2/778– ప్రామాణికం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా అంటూఉండగా నేను విన్నాను. ”ఈ ముగ్గురు అల్లాహ్ అతిథులు. జిహాద్ చేసేవారు, ‘హజ్జ్చేసేవారు, ‘ఉమ్‌రహ్ చేసేవారు.” (నసాయి’, బైహఖీ–షు’అబిల్ ఈమాన్)
2538 – [ 34 ] ( ضعيف ) (2/778)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا لَقِيْتَ الْحَاجَّ فَسَلِّمْ عَلَيْهِ وَصَافِحْهُ وَمُرْهُ أَنْ يَّسْتَغْفِرَ لَكَ قَبْلَ أَنْ يَدْخُلَ بَيْتَهُ فَإِنَّهُ مَغْفُوْرٌ لَّهُ”. رَوَاهُ أَحْمَدُ .
2538. (34) [2/778 –బలహీనం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మీరు ‘హాజీని కలిసినపుడు, అతనికి సలామ్ చేయండి. కరచాలనం చేయండి, అతడు తన ఇంటిలోనికి ప్రవేశించటానికి ముందు మీ క్షమాపణ గురించి ప్రార్థించమని అతన్ని కోరండి. ఎందుకంటే అతడు పరిశుద్ధుడై ఉన్నాడు. [17] (అ’హ్మద్)
2539 – [ 35 ] ( لم تتم دراسته ) (2/778)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ خَرَجَ حَاجًّا أَوْ مُعْتَمِرًا أَوْ غَازِيًا ثُمَّ مَاتَ فِيْ طَرِيْقِهِ. كَتَبَ اللهُ لَهُ أَجْرَ الْغَازِيْ وَالْحَاجِّ وَالْمُعْتَمِرِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ .
2539. (35) [2/778 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఎవరైనా ‘హజ్జ్ లేదా, ‘ఉమ్‌రహ్ లేదా జిహాద్ కోసం ఇంటి నుండి బయలుదేరి దారిలో మరణిస్తే, అల్లాహ్ (త) అతనికి జిహాద్, ‘హజ్జ్, ‘ఉమ్‌రహ్ చేసినంత పుణ్యం ప్రసాదిస్తాడు. [18] (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)
=====
1- بَابُ الْإِحْرَامِ وَالتَّلْبِيَةِ
1. ఇ’హ్రామ్ ధరించడం తల్బియహ్ పలకడం
ఇహ్‌రామ్ రకాలు: ఇ’హ్‌రామ్ నాలుగు రకాలు. 1. ఇఫ్‌రాద్ అంటే కేవలం ‘హజ్ ఇ’హ్రామ్ ధరించడం. కేవలం ‘హజ్ ఇ’హ్‌రామ్ ధరించే వారిని ముఫ్‌రిద్ అంటారు. 2. తమత్త‘ఉ అంటే ‘హజ్ కాలంలో ముందు ‘ఉమ్‌రహ్ చేసి ఇ’హ్‌రామ్ తొలగించి, ఆ తరువాత ‘హజ్ ఇ’హ్‌రామ్ ధరించి ‘హజ్ చేసేవారిని ముతమత్తి’అ అంటారు. 3. ఖిరాన్ అంటే ‘హజ్ మరియు ‘ఉమ్‌రహ్ రెంటికీ ఒకసారి ఇ’హ్‌రామ్ ధరించే వారిని ఖారిన్ అంటారు. 4. ‘హజ్ కాలంలో కాకుండా ఇతర సమయాల్లో ‘ఉమ్‌రహ్ ఇ’హ్‌రామ్ ధరించేవారిని ము‘అతమిర్ అంటారు. ఇవన్నీ ధర్మసమ్మతమైనవే. ప్రవక్త (స) మరియు ప్రవక్త అనుచరులు వీటిని ఆచరించారు. ‘ఆయి’షహ్ (ర) కథనం, ” ‘హజ్జతుల్ విదా’లో మేము ప్రవక్త (స) వెంట ‘హజ్ కోసం బయలు దేరాము. అప్పుడు ప్రవక్త (స) ఇలా ప్రవచించారు. కోరిన వారు ‘హజ్, ‘ఉమ్‌రహ్ రెంటి ఇ’హ్‌రామ్ ధరించండి. కోరినవారు కేవలం ‘హజ్ ఇ’హ్‌రామ్ ధరించండి. కోరినవారు ఉమ్‌రహ్ ఇ’హ్‌రామ్ ధరించండి. ప్రవక్త (స) ‘హజ్ ఇ’హ్రామ్ ధరించారు. కొందరు ‘హజ్, ‘ఉమ్‌రహ్ రెంటి ఇ’హ్రామ్ ధరించారు. మరికొందరు కేవలం ‘ఉమ్‌రహ్ ఇ’హ్రామ్ ధరించారు. నేను కూడా ‘ఉమ్‌రహ్ ఇ’హ్‌రామ్ ధరించాను.”
ఇహ్‌రామ్ దుస్తులు: పురుషుల ఇ’హ్‌రామ్ పరిశుభ్రమైన తెల్లని రెండు దుప్పట్లు, చెప్పులు, ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”లుంగీ లభించని పక్షంలో పైజామా ధరించండి. చెప్పులు లభించకపోతే బూట్లు ధరించండి.”
అయితే ఇ’హ్‌రామ్ దుస్తులు తెల్లగా ఉండటం శ్రేష్ఠం. ఎందుకంటే ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”దుస్తుల్లో అన్నిటికంటే తెల్లని దుస్తులు శ్రేష్ఠమైనవి.” సజీవులకు ధరించండి, మృతులకు కూడా తెల్లని దుస్తుల్లోనే కఫన్ సమకూర్చండి. ఒకవేళ ఒకే వస్త్రంలో ఇ’హ్‌రామ్ ధరిస్తే అది మొత్తం శరీరాన్ని కప్పి ఉంచగలిగితే అలా చేయవచ్చును. లభించనిపక్షంలో మరీ అనుమతి ఉంది. పురుషులు ఇ’హ్రామ్ స్థితిలో ఇటువంటి దుస్తులు ధరించకూడదు: కుర్తా, పైజామా, పగిడీ, కోట్, సగం కోట్, కట్‌బనీన్, టోపీ, గ్లౌజులు, సాక్సులు, కాషాయ రంగు దుస్తులు.
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ఒక వ్యక్తి ప్రవక్త (స)ను ము‘హ్రిమ్ ఏ దుస్తులు ధరించగలడు అని ప్రశ్నించాడు. ప్రవక్త (స), ”కుర్తా, పైజామా ధరించరాదు. మొలతాడు కట్టరాదు, కోట్ ధరించరాదు, మేజోళ్ళు ధరించరాదు, చెప్పులు లభించని పక్షంలో బూట్లు ధరించ వచ్చు, కాషాయ రంగు దుస్తులు ధరించరాదు,” అని ప్రవచించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
స్త్రీల ఇ’హ్‌రామ్ దుస్తులే. అంటే వారు, కుర్తా, పైజామా, కోటు, లంగా, సాక్సులు, బూట్లు, లుంగీ, దుప్పటి ఆభరణాలు మొదలైనవి ధరించవచ్చును. కాషాయరంగు దుస్తులు ధరించరాదు. ముఖాన్ని పెదాలను దాచకూడదు.
జాబిర్ (ర) కథనం, ” ‘ఆయి’షహ్ (ర) ఇ’హ్రామ్ స్థితిలో ఆభరణాలు, నల్లబట్ట, గులాబీ బట్టను, సాక్సులు ధరించటంలో ఏమీ అభ్యంతరం అనుకోలేదు. ఇబ్రాహీమ్ కథనం: ము’హ్రిమ్ ఇ’హ్రామ్ స్థితిలో దుస్తులు మార్చగలడు. (బు’ఖారీ). ఇ’హ్రామ్ స్థితిలో స్త్రీ ముఖం దాచరాదు కాని పర పురుషులు ఎదురైతే పైటల (ఘూంఘట్) ద్వారా కప్పుకోవాలి. వారు వెళ్ళిపోగానే దాన్ని ఎత్తివేయాలి.
‘ఆయి’షహ్ (ర) కథనం, ”బాటసారుల బృందం మా ప్రక్క నుండి వెళ్ళినపుడు మేము ప్రవక్త (స) వెంట ఇ’హ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు పరాయి పురుషులు మా ముందు నుండి వెళ్ళినపుడు పైటల ద్వారా ముఖాలను కప్పుకునేవారం, వాళ్ళు వెళ్ళిపోగానే పైటలను తీసివేసే వారం. (అబూ దావూద్)
బహిష్టు, ప్రసవదశలో ఉన్న స్త్రీలు స్నానం చేసి నమా’జు చదవకుండా లబ్బయెక్, లబ్బయెక్ అని పలుకుతూ ఉండాలి. ఇంకా ‘హాజీ చేయవలసిన వాటిన్నటినీ చేయాలి. అయితే బైతుల్లాహ్ ‘తవాఫ్ చేయకూడదు. పరిశుద్ధులైన తర్వాత చేయాలి. ప్రవక్త (స) ప్రవచనం: బహిష్టు, ప్రసవ దశల వల్ల రక్త స్రావం గల స్త్రీలు మీఖాత్‌కు చేరి స్నానం చేసి ఇ’హ్‌రామ్ ధరించాలి. ‘తవాఫ్ తప్ప మిగిలిన కార్యాలన్నీ నిర్వర్తించాలి. ‘ఆయి’షహ్ (ర)కు, అస్మా’ (ర)కు, ప్రవక్త(స) ఈ విధంగానే ఆదేశించారు. (ముస్లిమ్, అబూ దావూద్, ము’గ్ని).
స్త్రీలు ఇ’హ్‌రామ్‌లో, 1. గ్లౌజులు, ధరించరాదు. ప్రవక్త (స) స్త్రీలకు గ్లౌజులు ఇ’హ్రామ్ స్థితిలో నిషేధించారు, (అబూ దావూద్). 2. ముఖాన్ని కప్పరాదు. (గైరు మహ్రం వారి ముందు ముఖం కప్పుకోవచ్చు) ఎందుకంటే ప్రవక్త (స) ‘ఇహ్‌రామ్ స్థితిలో స్త్రీలను ముఖం విప్పిఉంచాలని ఆదేశించారు, (ముగ్‌నీ). 3. కాషాయ (ఎర్ర) రంగు దుస్తులు ధరించరాదు. ప్రవక్త (స) స్త్రీలను ఇ’హ్రామ్ స్థితిలో గ్లౌజులు, ముఖం కప్పుకోవటాన్ని (గైరు మహ్రం వారి ముందు ముఖం కప్పుకోవచ్చు). కాషాయ రంగు దుస్తులు ధరించటాన్ని వారించారు. అయితే పట్టు వస్త్రాలు, ఊలు వస్త్రాలు, కాటన్ వస్త్రాలు పైజామా మరియు సాక్సులు దరించవచ్చని అనుమతి ఇచ్చారు. (అబూ దావూద్). 4. వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించ రాదు. 5. అడవి జంతువులను వేటాడ రాదు. 6. నికా’హ్ చేసుకోరాదు, చేయించరాదు. 7. సంభోగం, సంభోగ కారణాలు, ఇతర కలహాల వివాదాల విషయాలు మాట్లాడరాదు. 8. బిగ్గరగా లబ్బయెక్ పలుకరాదు. మెల్లమెల్లగా పలకాలి, (నైల్, ము’గ్‌నీ). 9. సుగంధ పరిమళాలు, సుర్మ ఉపయోగించరాదు. 10. ‘తవాఫ్‌లో ఇ’ద్’తిబా’అ రమ్‌ల్ చేయరాదు. 11. పేళ్ళను చంపరాదు.
ఇ‘హ్రామ్ స్థితిలో పురుషుల నిషిద్ధాలు: ఇహ్‌రామ్ స్థితిలో పురుషులు ఈ పనులకు పాల్పడటం ధర్మసమ్మతం కాదు: 1. సంభోగం చేయటం, ముద్దుపెట్టుకోవటం, కలహం చేయటం నిషిద్ధం. అల్లాహ్ ఆదేశం: ” ‘హజ్జ్ నియమిత నెలలలోనే జరుగుతుంది. ఈనిర్ణీత మాసాలలో ‘హజ్జ్ చేయటానికి సంకల్పించిన వ్యక్తి ‘హజ్జ్ (ఇ’హ్రామ్)లో వున్న సమయంలో (భార్యతో) రతిక్రీడ (రఫ’స్)కు, దుష్ట కార్యాలకు మరియు కలహాలకు దూరంగా ఉండాలి…” (సూ. అల్ బఖరహ్, 2:197)
2. తనదైనా, ఇతరులదైనా నికా’హ్ చేయరాదు. నికా’హ్ సందేశమూ ఇవ్వరాదు. ప్రవక్త (స) ప్రవచనం, ”ము’హ్‌రిమ్ ఇతరులదైనా, తనదైనా నికా’హ్ చేయరాదు. నికా’హ్ సందేశమూ ఇవ్వరాదు.”
3. అడవి జంతువులను వేటాడరాదు, వేటాడేవారికి సహాయమూ చేయరాదు. దాని వైపు సైగకూడా చేయరాదు. అల్లాహ్ ఆదేశం: ”ఓ విశ్వాసులారా! ఇ’హ్రామ్ స్థితిలో వేటాడకండి…” (సూ. అల్ మాఇ’దహ్, 5:95). ”…కానీ, మీరు ఇ’హ్రామ్ స్థితిలో ఉన్నంతవరకూ భూమిపై వేటాడటం మీకు నిషేధించబడింది…” (సూ. అల్ మాఇ’దహ్, 5:96). ప్రవక్త (స) సైగ చేయడం, సహాయం చేయటాన్ని కూడా నిషేధించారు. (బుఖారీ, ముస్లిమ్). ఎందుకంటే ఇలా చేయటం కూడా వేటాడినట్టే అవుతుంది. అబూ ఖతాదహ్ అడవి గాడిదను వేటాడి తెచ్చినపుడు ప్రవక్త (స) తన అనుచరులతో మీరు అబూ ఖతాదాను వేటాడమని ఆదేశించారా లేక సైగచేసారా? అని అన్నారు. (ముస్లిమ్)
ఒకవేళ ము’హ్రిమ్ కాని వ్యక్తికి వేటమాంసం తినిపించాలనే ఉద్దేశ్యం ఉంటే దాని మాంసం ము’హ్‌రిమ్ తినకూడదు. ప్రవక్త (స) ‘స’అబ్ బిన్ జసా’మహ్ వేట కానుకను ఈ కారణం గానే తిప్పి పంపించివేసారు. ప్రవక్త (స) అప్పుడు ము’హ్రిమ్గా ఉన్నారు. (బు’ఖారీ)
4. ఇహ్‌రామ్ స్థితిలో సుగంధ పరిమళాలు పూసుకోవడం ధర్మసమ్మతం కాదు. ఒక వ్యక్తి ఇ’హ్రామ్ స్థితిలో మరణిస్తే అతని గురించి ప్రవక్త (స), ”అతనికి సుగంధ పరిమళాలు పూయకండి ఎందుకంటే తీర్పుదినం నాడు అతడు లబ్బయెక్ అంటూ లేస్తాడు,” అని అన్నారు. (ముస్లిమ్)
5. కాషాయరంగు దుస్తులు, సుగంధపరిమళాలు పూసిన దుస్తులు ధరించడం ధర్మసమ్మతంకాదు. (ము’గ్‌నీ)
6. వెంట్రుకలు గీయించడం, కత్తిరించడం, గోర్లు కత్తి రించడం ధర్మసమ్మతకం కాదు. అల్లాహ్ ఆదేశం: ”ఖుర్‌బానీ చేసే వరకు మీ తల వెంట్రుకలను గీయించకండి. అయితే అత్యవసర పరిస్థితిలో ఒకవేళ ఎవరైనా గీయించుకుంటే పరిహారం చెల్లించాలి.” క’అబ్ బిన్ ‘ఉజ్‌రహ్ తలలో అత్యధికంగా పేళ్ళు ఉండెను. అప్పుడు ప్రవక్త (స) నువ్వు తల గీయించుకో. దానికి బదులుగా మూడు రోజులు ఉపవాసాలు ఉండు లేదా ఆరుగురు పేదలకు అన్నం పెట్టు లేదా ఒక మేక జిబహ్ చేయి అని ఆదేశించారు. ఖుర్‌ఆన్‌లో దీన్ని గురించే పేర్కొనడం జరిగింది.
ము‘హ్‌రిమ్ చేయగల పనులు: 1. ము’హ్రిమ్ అవసరమైతే స్నానం చేయగలడు. తలను నీటితో శుభ్ర పరచగలడు. అబూ అయ్యూబ్ (ర) ఇ’హ్రామ్ స్థితిలో తల కడుక్కునేవారు, (బు’ఖారీ). అయితే తల శుభ్ర పరచడంలో వెంట్రుకలు రాల కుండా జాగ్రత్తపడాలి. 2. అదేవిధంగా కొమ్ము చికిత్స చేయించుకోవచ్చును. ప్రవక్త (స) ఇ’హ్రామ్ స్థితిలో కొమ్ము చికిత్స చేయించుకున్నారు, (బు’ఖారీ). 3. ప్రమాదకరమైన జంతువులను చంపటంలో ఎటువంటి అభ్యంతరం లేదు. గ్రద్దలు, కాకులు, పాము, తేలు, సింహం, పులి, తోడేలు మొదలైనవి. ప్రవక్త (స) ప్రవచనం: ‘హరమ్‌లో ఇ’హ్రామ్ స్థితిలో పైన పేర్కొన్న హానికరమైన జంతువులను చంపటంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎలుక, కాకి, గ్రద్ద, తేలు, క్రూరమృగాలు వేటాడే కుక్కలు, సింహం మొదలైనవి. 4. తీరిక వేళల్లో వ్యాపారం చేయడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. అల్లాహ్ ఆదేశం: ”(‘హజ్జ్ యాత్రలో) మీరు (వ్యాపారం ద్వారా) మీ ప్రభువు అనుగ్రహాలు అన్వేషిస్తే అందులో దోషం లేదు. (సూ. అల్ బఖరహ్, 2:198). 5. సువాసన లేని నూనె ఉపయోగించవచ్చును. ‘అబ్దుల్లాహ్ (ర) కథనం, ప్రవక్త (స) ఇ’హ్రామ్ స్థితిలో సువాసన లేని ‘జైతూన్ నూనె ఉపయోగించే వారు, (తిర్మిజి’). 6. సువాసన లేని, రంగరించి మందుగా ఉపయోగించటంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రవక్త (స) కళ్ళనొప్పితో బాధపడుతున్న వ్యక్తిని మందు రంగరించి రాయమని అనుమతి ఇచ్చారు, (ముస్లిమ్). 7. ఇహ్‌రామ్ దుస్తులను ఉతకడం, మార్చడం, శీతాకాలంలో తలను వదలి శరీరంపై కుట్టబడని దుస్తులు ధరించడం, వేసవిలో వేడినుండి రక్షణ పొందటానికి గొడుగు ఉపయోగించటం ధర్మసమ్మతమే. ఉమ్మె ‘హుసైన్ కథనం: ‘ఇ’హ్రామ్ స్థితిలో ఉసామాను, బిలాల్‌ను నేను చూసాను. వారిలో ఒకరు ప్రవక్త (స) ఒంటె కళ్ళాన్ని పట్టుకొని ఉన్నారు. రెండవ వ్యక్తి దుప్పటితో ప్రవక్త (స)కు నీడ కల్పిస్తున్నాడు, (మున్తఖా, ముస్లిమ్). 8. అత్యవసర పరిస్థితుల్లో ఆయుధాలు తమ దగ్గర ఉంచవచ్చును, (బు’ఖారీ, ముంతఖా’). 9. ఒకవేళ ము’హ్‌రిమ్, సహాయ సహకారాలు, సైగలు లేకుండా ఇ’హ్రామ్ స్థితిలో లేని వ్యక్తి అడవిలో తన కోసం వేటాడి, అందులో నుండి కానుకగా ము’హ్‌రిమ్‌కి ఇస్తే ము’హ్‌రిమ్ ఆ మాంసాన్ని తినవచ్చును. అబూ ఖతాదహ్ వేటాడి ప్రవక్త (స)కు ఇచ్చారు. ప్రవక్త (స) దాన్ని స్వీకరించారు, (బు’ఖారీ). 10. సముద్రం, నదులలో వేటాడం ధర్మసమ్మతమే. అల్లాహ్ ఆదేశం: సముద్రపు వేట మీకు ధర్మసమ్మతం చేయబడింది.
యుక్త వయస్సుకు చేరని, మతి స్థిమితం లేనివారి, స్పృహలేనివారి ఇ‘హ్‌రామ్: వారిపై ‘హజ్ విధికాదు. ఒకవేళ చేస్తే ‘హజ్జ్ స్వీకరించబడుతుంది. ఒకవేళ యుక్త వయస్సుకు చేరని యువకుడు బుద్ధిమంతుడైతే తాను స్వయంగా ఇ’హ్‌రామ్ ధరించాలి. ‘హజ్జ్ కార్యాలన్నీ నిర్వర్తించాలి. ఒకవేళ ఇంకా తెలివితేటలు రాకుండా ఉంటే, అతని తరఫున అతని సంరక్షకుడు ఇ’హ్‌రామ్ ధరించి ‘హజ్జ్ చేయించాలి. ఒక స్త్రీ ప్రవక్త (స) ను ‘ఈ అబ్బాయి ‘హజ్జ్ చేయవచ్చునా?’ అని ప్రశ్నించింది. దానికి ప్రవక్త (స) అవును, పుణ్యం నీకు లభిస్తుంది అని సమాధానం ఇచ్చారు. (ముస్లిమ్)
మతిస్థిమితం లేని వ్యక్తికి కూడా ఈ ఆదేశమే వర్తిస్తుంది. ఒకవేళ ఇ’హ్‌రామ్ సమయంలో స్పృహ కోల్పోతే, అతని మిత్రులు అతని తరఫున ఇ’హ్‌రామ్ సంకల్పంతో తల్‌బియహ్ మొదలైన వాటిని పఠించాలి. (ము’గ్‌నీ)
స్పృహ వచ్చిన తరువాత అతడు స్వయంగా ‘హజ్ విధులన్నీ నిర్వర్తించాలి. అర్థనారీశ్వరులు ఒకవేళ పురుషునిలా ఉంటే పురుషుల్లా, స్త్రీల్లా ఉంటే మహిళల్లా ఇ’హ్‌రామ్ దుస్తులు ధరించాలి.
ఇ‘హ్‌రామ్ ఉద్దేశం: ‘హజ్జ్ మరియు ‘ఉమ్‌రహ్ ల ఇ’హ్‌రామ్ నమా’జులోని తక్‌బీరె త’హ్రీమ్ ల వంటిది. నమా’జుకు ‘అల్లాహ్ అక్బర్’ అని భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలో ప్రారంభించినట్లు. ఆ సమయం నుండి అనేక విషయలు నిషిద్ధమౌతాయి. అదేవిధంగా ఇ’హ్‌రామ్ ధరించటం వల్ల ‘హజ్ తప్ప మిగతా విషయాలన్నీ నిషిద్ధమౌతాయి. ఇంకా ఇందులో సమానత్వం ఉట్టిపడుతుంది. ఇందులో పేద గొప్ప అందరూ అల్లాహ్(త) సన్నిధిలో ఒకే రకమైన దుస్తుల్లో ఉంటారు. ఒకరికి ఇంకొకరిపై ఆధిక్యత గర్వం ప్రదర్శించే అవకాశం ఎంతమాత్రం లభించదు.
లబ్బయెక్: లబ్బయెక్ అంటే నీ సన్నిధిలో హాజరయ్యాను. ఇది ఇబ్రాహీమ్ (అ) పిలుపు. దీనికి సమాధానంగా అదృష్టవంతులు అల్లాహ్(త) సన్నిధిలో హాజరవడానికి వెళతారు. అక్కడకు చేరిన వారందరూ ఇలాగే పలుకుతారు. ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా ముస్లిమ్ లబ్బయెక్ అని పలికినపుడు అతనికి కుడి ప్రక్క, ఎడమప్రక్క రాళ్ళురెప్పలు, చెట్లు అన్నీ కూడా ‘లబ్బయెక్,’ అని పలుకుతాయి. అదేవిధంగా భూమి లోపలి వరకు ఈ పరంపర ఉంటుంది. ఇది ‘హజ్ చిహ్నం. దీనివల్ల ‘హజ్ గొప్పతనం రెట్టింపు అయిపోతుంది. దైవదూతలు, అల్లాహ్ (త) కూడా లబ్బయెక్‌కు సమాధానం ఇస్తారు. కన్జుల్’ఉమ్మాల్‌లో ఇలా ఉంది, ”మూసా (అ) లబ్బయెక్ అని పలికినపుడు దానికి సమాధానంగా అల్లాహ్ లబ్బయెక్ అని పలికేవాడు.” ఒక ‘హదీసు’లో ఇలా ఉంది, ”ప్రవక్త (స) మూసా (అ) లబ్బయెక్ గురించి ఇలా ప్రవచించారు, ”మూసా (అ) తన చెవిలో చూపుడు వేలు పెట్టి లబ్బయెక్ అని పలుకుతూ ఈ మైదానం గుండా వెళ్ళారు. అదేవిధంగా యూనుస్ (అ) ఎర్ర ఒంటెపై ఎక్కి ఈ మైదానం గుండా లబ్బయెక్ అని పలుకుతూ వెళ్ళారు.” (ఇబ్నె మాజహ్, ముస్లిమ్)
ఈ లబ్బయెక్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ” ‘హాజీ సూర్యాస్తమయం వరకు లబ్బయెక్ పలుకుతూ ఉంటే, అతని పాపాలన్నీ తొలగిపోతాయి. ఫలితంగా తల్లి గర్భం నుండి పుట్టిన బిడ్డలా తయారవుతాడు.” (అ’హ్మద్, ఇబ్నె మాజహ్)
లబ్బయక్ పలకటంలోని రహస్యం: ఇస్లామీయ సైన్యం ‘హాజీల నినాదం లబ్బయక్. ఇ’హ్‌రామ్ ధరించి నప్పటి నుండి ‘హాజీ ఇ’హ్‌రామ్ తొలగించే వరకు వినయ విధేయతలతో, భక్తి శ్రద్ధలతో తప్పనిసరిగా లబ్బయక్ పలకడం జరుగుతుంది. ఈ పదాలను ఇంతకు ముందు పేర్కొనడం జరిగింది. దీని అర్థాన్ని గమనిస్తే అనేక విషయాలు వెల్లడి అవుతాయి.
1. దైవసన్నిధిలో అనేకసార్లు హాజరవుతానని అనేకసార్లు ఒప్పుకోవటం. 2. దేవుని ఏకత్వాన్ని సమ్మతించడం. 3. అనుగ్రహాలన్నీ దైవం తరఫునుండే అని ఒప్పుకోవడం. 4. దైవాధికారమే చెల్లుతుందని స్వీకరించటం. వాస్తవ చక్రవర్తి కేవలం అల్లాహ్ మాత్రమే. ఒక ‘హదీసు’లో ”బిగ్గరగా లబ్బయెక్ పలకడం ‘హజ్ చిహ్నం” అని ప్రవచించబడింది. (ఇబ్నె మాజహ్) ఇ’హ్‌రామ్‌లో షరతు పెట్టనక్కర లేదు. కాని ఒకవేళ ఇ’హ్‌రామ్ ధరించినపుడు షరతు పెట్టుకుంటే అది ధర్మసమ్మతమే. ప్రవక్త (స) ‘దుబా’అహ్ బిన్‌తె ‘జుబైర్‌ను, ”నీవు ‘హజ్ ఇ’హ్‌రామ్ ధరించు. ఇంకా ఓ అల్లాహ్! నీవు నన్ను ఎక్కడ ఆపివేస్తే అక్కడే నేను ఇ’హ్‌రామ్‌ను తొలగించి వేస్తాను అని షరతు పెట్టు,” అని హితబోధ చేసారు. (బు’ఖారీ, ముస్లిమ్)
ఇ’హ్‌రామ్ ధరించినపుడు ఎవరైనా, ”ఫలానా వ్యక్తి లాంటి నియ్యత్ తో నేను ఇ’హ్‌రామ్ ధరిస్తు న్నాను” అని అంటే ఇలా అనవచ్చును. ‘అలీ (ర) ఇ’హ్‌రామ్ ధరించినపుడు ”నేను ప్రవక్త (స) లాంటి నియ్యత్ తో ఇ’హ్‌రామ్ ధరిస్తున్నాను,” అని అన్నారు. (నసాయి’, నైల్). ప్రవక్త (స) అతని ఇ’హ్‌రామ్‌ను సరైనదిగా ఆమోదించారు. అబూ మూసా కూడా ఇటువంటి ఇ’హ్‌రామ్‌నే ధరించారు. (నైల్). ప్రవక్త (స) దాన్ని సరైనదిగా ఆమోదించారు. ‘ఉమ్ రహ్ ఇ’హ్రామ్ ధరించారు. కొంతసేపు తర్వాత దానికి తోడు ‘హజ్ ఇ’హ్‌రామ్ కూడా ధరించారు. (బు’ఖారీ)
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2540 – [ 1 ] ( متفق عليه ) (2/779)
عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كُنْتُ أُطَيِّبُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم لِإِحْرَامِهِ قَبْلَ أَنْ يُّحْرِمَ وَلِحِلِّهِ قَبْلَ أَنْ يَّطُوْفَ بِالْبَيْتِ بِطِيْبٍ فِيْهِ مِسْكٌ كَأَنِّيْ أَنْظُرُ إِلَى وَبِيْصِ الطِّيْبِ فِيْ مَفَارِقِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَهُوَ مُحْرِمٌ.
2540. (1) [2/779–ఏకీభవితం]
‘ఆయి’షహ్(ర) కథనం: ప్రవక్త (స)కు ఇ’హ్‌రామ్ ధరించేటప్పుడు, ఇ’హ్‌రామ్‌కు ముందు, ఇ’హ్‌రామ్ తొలగించినపుడు, ‘తవాఫ్‌కు ముందు నేను సువాసన ద్రవ్యాలను పూసేదాన్ని. అంటే నేను ప్రవక్త (స) పాపటిలో సువాసన యొక్క మెరుపు ఆయన ఇ’హ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు చూస్తున్నాను. (బు’ఖారీ, ముస్లిమ్)
2541 – [ 2 ] ( متفق عليه ) (2/779)
وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم: يُهِلُّ مُلَبِّدًا يَقُوْلُ: “لَبَّيْكَ اللّهُمَّ لَبَّيْكَ، لَبَّيْكَ لَا شَرِيْكَ لَكَ لَبَّيْكَ، إِنَّ الْحَمْدَ وَالنِّعْمَةَ لَكَ وَالْمُلْكَ، لَا شَرِيْكَ لَكَ”. لَا يَزِيْدُ عَلَى هَؤُلَاءِ الْكَلِمَاتِ.
2541. (2) [2/779- ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను లబ్బయె’క్‌ను బిగ్గరగా పఠిస్తూ ఉండటం విన్నాను. ఆ సమయంలో ప్రవక్త (స) తన తలకు జిగురు వంటి వస్తువు రాసివున్నారు. ”లబ్బయి’క్, అల్లాహుమ్మ లబ్బయి’క్, లబ్బయి’క్ లాషరీక లక లబ్బయి’క్, ఇన్నల్ ‘హమ్‌దహ్ వన్ని’అమత లక వల్ముల్క్, లా షరీక లక్.” ఈ పదాలకు మించి ఏమీ చదివేవారు కారు.[19] (బు’ఖారీ, ముస్లిమ్)
2542 – [ 3 ] ( متفق عليه ) (2/779)
وَعَنْهُ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا دخَلَ رِجْلَهُ فِيْ الْغَرْزِ وَاسْتَوَتْ بِهِ نَاقَتُهُ قَائِمَةً. أَهَلَّ مِنْ عِنْدِ مَسْجِدِ ذِي الْحُلَيْفَةِ .
2542. (3) [2/779 –ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) వాహనంపై ఎక్కినపుడు తనకాలిని రికాబులో పెట్టారు. ప్రవక్త (స) ఒంటె అతన్ని తీసుకొని నిలబ డింది. ప్రవక్త (స) జు‘ల్ ‘హులైఫహ్ నుండి ‘ఉమ్‌రహ్ ఇ’హ్‌రామ్ (దీక్ష) పూనారు. [20] (బు’ఖారీ, ముస్లిమ్)
2543 – [ 4 ] ( صحيح ) (2/780)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيْ قَالَ: خَرَجْنَا مَعَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. نَصْرَخُ بِالْحَجِّ صُرَاخًا. رَوَاهُ مُسْلِمٌ.
2543. (4) [2/780– దృఢం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట ‘హజ్జ్ కోసం బయలుదేరాము. దారిలో లబ్బయె’క్ అని బిగ్గరగా పలుకుతూ ఉన్నాం. (ముస్లిమ్)
2544 – [ 5 ] ( صحيح ) (2/780)
وَعَنْ أَنَسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كُنْتُ رَدِيْفَ أَبِيْ طَلْحَةَ وَإِنَّهُمْ لَيَصْرَخُوْنَ بِهِمَا جَمِيْعًا: اَلْحَجُّ وَالْعُمْرَةِ. رَوَاهُ الْبُخَارِيُّ.
2544. (5) [2/780– దృఢం]
అనస్ (ర) కథనం: నేను వాహనంపై అబూ ‘తల్’హా వెనుక కూర్చున్నాను. ప్రవక్త (స) అనుచరులు ‘హజ్జ్, ‘ఉమ్‌రహ్ కోసం బిగ్గరగా గొంతెత్తి లబ్బయి’క్ అని పలుకు తున్నారు. (బు’ఖారీ)
2445 – [ 6 ] ( متفق عليه ) (2/780)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: خَرَجْنَا مَعَ رَسُوْلِ الله صلى الله عليه وسلم عَامَ حَجَّةِ الْوَدَاعِ فَمِنَّا مَنْ أَهَلَّ بِعُمْرَةٍ وَّمِنَّا مَنْ أَهَلَّ بِحَجٍّ وَّعُمْرَةٍ وَمِنَّا مَنْ أَهَلَّ بِالْحَجِّ. وَأَهَلَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِالْحَجِّ. فَأَمَّا مِنْ أَهَلَّ بِعُمْرَةٍ فَحَلَّ. وَأَمَّا مَنْ أَهَلَّ بِالْحَجِّ أَوْ جَمَعَ الْحَجُّ وَالْعُمْرَةَ فَلَمْ يَحِلُّوْا حَتَّى كَانَ يَوْمُ النَّحْرِ.
2545. (6) [2/780– ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట ‘హజ్జతుల్ విదా’ అంటే చివరి ‘హజ్జ్ కోసం బయలు దేరాము. మాలో కొందరు ‘ఉమ్‌రహ్ ఇ’హ్రామ్ ధరించారు. కొందరు ‘ఉమ్‌రహ్ మరియు ‘హజ్జ్ ఇ’హ్రామ్ ధరించారు. కొందరు కేవలం ‘హజ్జ్ ఇ’హ్రామ్ ధరించారు. ప్రవక్త (స) ‘హజ్జ్ ఇ’హ్రామ్ ధరించారు. కేవలం ‘ఉమ్‌రహ్ ఇ’హ్‌రామ్ ధరించిన వారు ‘తవాఫ్ మరియు సయీ’ చేసిన తర్వాత ఇ’హ్రామ్ తొలగించారు. ‘హజ్జ్ లేదా ‘హజ్జ్ ‘ఉమ్‌రహ్ ఇ’హ్‌రామ్ ధరించినవారు ఇ’హ్‌రామ్ తొలగించలేదు. చివరికి 10వ తేదీన ఇ’హ్రామ్ తొలగించారు. అంటే బలి (ఖుర్బానీ) రోజు ఇ’హ్రామ్ తొలగించారు. [21] (బు’ఖారీ)
2546 – [ 7 ] ( متفق عليه ) (2/780)
وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: تَمَتَّعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ حَجَّةِ الْوَدَاعِ بِالْعُمْرَةِ إِلَى الْحَجِّ بَدَأَ فَأَهَلَّ بِالْعُمْرَةِ ثُمَّ أَهَلَّ بِالْحَجِّ.
2546. (7) [2/780 –ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్(ర) కథనం: ప్రవక్త (స) ‘హజ్జ తుల్ విదా’లో ‘ఉమ్‌రహ్‌ను ‘హజ్జ్తో కలిపి ఆచరించి లాభంపొందారు. అంటే మొట్ట మొదట ‘ఉమ్‌రహ్ చేసారు. ఆ తరువాత ‘హజ్జ్ చేసారు. (బు’ఖారీ, ముస్లిమ్)
——–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2547 – [ 8 ] ( لم تتم دراسته ) (2/780)
عَنْ زَيْدِ بْنِ ثَابِتٍ أَنَّهُ رَأَى النَّبِيُّ صلى الله عليه وسلم تَجَرَّدَ لِإِهْلَالِهِ وَاغْتَسَلَ. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارِمِيُّ.
2547. (8) [2/780–అపరిశోధితం]
‘జైద్ బిన్ సా’బిత్ (ర) కథనం: అతను ప్రవక్త (స)ను ఇలా చూసారు, ”ప్రవక్త (స) ఇ’హ్‌రామ్ స్నానం చేయ టానికి ఇతర దుస్తులను తీసివేసి కేవలం లుంగీ కట్టుకొని ఇ’హ్‌రామ్ స్నానం చేసారు.” (తిర్మిజి’, దారమి)
2548 – [ 9 ] ( لم تتم دراسته ) (2/780)
وَعَنِ ابْنِ عُمَرَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم لَبَّدَ رَأْسَهُ بِالْغِسْلِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2548. (9) [2/780–అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) తన తలవెంట్రుకలను తలను శుభ్రపరిచే వస్తువుల ద్వారా శీకకాయలాంటి పదార్థంతో నొక్కి ఉంచారు, దుమ్ము ధూళినుండి సురక్షితంగా ఉండాలని. (అబూ దావూద్)
2549 – [ 10 ] ( صحيح ) (2/781)
وَعَنْ خَلَّادِ بْنِ السَّائِبِ عَنْ أَبِيْهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَتَانِيْ جِبْرِيْلُ فَأَمَرَنِيْ أَنْ آمُرَ أَصْحَابِيْ أَنْ يَّرْفَعُوْا أَصْوَاتَهُمْ بِالْإِهْلَالِ أَوِ التَّلْبِيَةِ”. رَوَاهُ مَالِكٌ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ .
2549. (10) [2/781–దృఢం]
‘ఖల్లాద్ బిన్ సాయి’బ్ (ర) తన తండ్రిద్వారా ఇలా పేర్కొన్నారు, ”ప్రవక్త (స) ప్రవచనం, ”నా వద్దకు జిబ్రీల్ (అ) వచ్చారు. ఇ’హ్‌రామ్ ధరించినపుడు బిగ్గరగా లబ్బయి’క్ పలకమని నేను నా అనుచరులకు ఆదేశించాలని నన్ను ఆదేశించారు.” (మాలిక్, తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’, ఇబ్నె మాజ, దారమి)
2550 – [ 11 ] ( صحيح ) (2/781)
وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ مُّسْلِمٍ يُلَبِّيْ إِلَّا لَبَّى مَنْ عَنْ يَّمِيْنِهِ وَشِمَالِهِ، مِنْ حَجَرٍأَوْ شَجَرٍأَوْ مَدَرٍ حَتَّى تَنْقَطِعَ الْأَرْضُ مِنْ ههُنَا وَهَهُنَا”. روَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.
2550. (11) [2/781-దృఢం]
సహ్‌ల్ బిన్ స’అద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్ ‘హజ్జ్లో లబ్బయి’క్ బిగ్గరగా పలికితే, అతనికి ఇరువైపుల ఉన్న చెట్లు, రాళ్ళు, మట్టి పెడ్డలు మొదలైనవన్నీ లబ్బయి’క్ అని పలుకుతాయి. చివరికి అతనికి లబ్బయి’క్ శబ్దం అటూ ఇటూ అన్నివైపులా వ్యాపిస్తుంది. అంటే అతని లబ్బయి’క్ శబ్దంతో పాటు ప్రపంచంలోని అన్ని వస్తువులు లబ్బయి’క్ పలకటం ప్రారంభిస్తాయి.” (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
2551 – [ 12 ] ( متفق عليه ) (2/781)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَرْكَعُ بِذِيْ الْحَلَيْفَةِ رَكْعَتَيْنِ ثُمَّ إِذَا اسْتَوَتْ بِهِ النَّاقَةُ قَائِمَةً عِنْدَ مَسْجِدِ ذِيْ الْحُلَيْفَةِ أَهَلَّ بِهُؤَلَاءِ الْكَلِمَاتِ وَيَقُوْلُ: “لَبَّيْكَ اَللّهُمَّ لَبَّيْكَ، لَبَّيْكَ وَسَعْدَيْكَ وَالْخَيْرُ فِيْ يَدَيْكَ، لَبَّيْكَ وَالرَّغْبَاءُ إِلَيْكَ وَالْعَمَلُ”. مُتَّفَقٌ عَلَيْهِ وَلَفْظُهُ لِمُسْلِمٍ
2551. (12) [2/781– ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) జు‘ల్ ‘హులైఫహ్ ప్రాంతంలో రెండురకా’తులు నమా’జు ఆచరించి తనవాహనంకూర్చున్న ప్రదేశానికి వచ్చారు. మస్జిద్ జు’ల్ ‘హులైఫహ్ కు సమీపంగా ప్రవక్త (స) ఆడ ఒంటె ప్రవక్త (స)ను తీసుకొని తిన్నగా నిలబడిన వెంటనే ఈ వచనాల ద్వారా ఇ’హ్రామ్ ధరించారు. ఇంకా ఇలా అన్నారు, ”లబ్బయి’క్, అల్లాహుమ్మలబ్బయి’క్, లబ్బయి’క్ వ స’అదైక, వల్ ఖైరుఫీ యదైక లబ్బయి’క్ వర్రగ్‌బాఉ ఇలైక వల్‌అమలు.” — ‘ఓ అల్లాహ్! నేను నీ సన్నిధిలో హాజరయ్యాను. సౌభాగ్యం పొందటానికి వచ్చి ఉన్నాను. మంచి అంతా నీ చేతుల్లోనే ఉంది. నేను నీ సన్నిధిలో హాజరయ్యాను, ప్రీతి సంతోషం శ్రద్ధా భక్తులన్నీ నీవైపే ఉన్నాయి. కార్యాలన్నీ నీ కొరకే.” [22] (బు’ఖారీ, ముస్లిమ్)
2552 – [ 13 ] ( لم تتم دراسته ) (2/781)
وَعَنْ عُمَارَةَ بْنِ خُزَيْمَةَ بْنِ ثَابِتٍ عَنْ أَبِيْهِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ كَانَ إِذَا فَرَغَ مِنْ تَلْبِيَتِهِ سَأَلَ اللهُ رِضْوَانَهُ وَالْجَنَّةَ وَاسْتَعْفَاهُ بِرَحْمَتِهِ مِنَ النَّارِ. رَوَاهُ الشَّافِعِيُّ.
2552. (13) [2/781–అపరిశోధితం]
‘ఉమారహ్ బిన్ ‘ఖుజైమహ్ తన తండ్రి ‘ఖుజైమహ్ ద్వారా ఉల్లేఖిస్తున్నారు. అతడి కథనం: ప్రవక్త (స) లబ్బయి’క్ అని పలికిన తర్వాత దైవప్రీతిని, స్వర్గాన్ని అర్థించారు, అల్లాహ్ కారుణ్యం ద్వారా నరకం నుండి శరణు కోరారు. అంటే ఇలా అన్నారు,
”అల్లాహుమ్మ ఇన్నీఅస్‌అలుకరి‘ద్వానకవల్ జన్న త వఅ‘ఊజుబిర‘హ్‌మతికమినన్నారి.” (షాఫయీ)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
2553 – [ 14 ] ( صحيح ) (2/782)
عَنْ جَابِرٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم لَمَّا أَرَادَ الْحَجَّ أَذَّنَ فِيْ النَّاسِ فَاجْتَمَعُوْا فَلَمَّا أَتَى الْبَيْدَاءَ أَحْرَمَ. رَوَاهُ الْبُخَارِيُّ
2553. (14) [2/782– దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ‘హజ్ద్ సంకల్పం చేసిన తర్వాత ప్రజల్లో ప్రకటన చేయించారు. ప్రజలందరూ వచ్చిన తర్వాత ప్రవక్త (స) బైదా‘లో ఇ’హ్రామ్ ధరించారు.[23] (బు’ఖారీ)
2554 – [ 15 ] ( صحيح ) (2/782)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ الْمُشْرِكُوْنَ يَقُوْلُوْنَ: “لَبَّيْكَ لَا شَرِيْكَ لَكَ“. فَيَقُوْلُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَيْلَكُمْ قَدٍ قَدٍ” إِلَّا شَرِيْكًا هُوَ لَكَ تَمْلِكُهُ وَمَا مَلَكَ. يَقُوْلُوْنَ هَذَا وَهُمْ يَطُوْفُوْنَ بِالْبَيْتِ. رَوَاهُ مُسْلِمٌ.
2554. (15) [2/782– దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: అవిశ్వాసులు తమ ‘హజ్జ్లోని తల్‌బియహ్ పలికనపుడు ఇలా అనేవారు. ”లబ్బయి’క్ లా షరీక లక” అంటే – ‘ఓ మా ప్రభూ! నేను నీ సన్నిధిలో హాజరై ఉన్నాను. నీకు సాటి ఎవరూ లేరు’. ఇది విని ప్రవక్త (స) మీ పాడుగాను మీరు ఈ మాత్రమే పలకండి, ”లబ్బయిక్ లా షరీక లక” మరేమీ పలకకండి,’ అని అన్నారు. అయితే అవిశ్వాసులు దీనితో పాటు, ”ఇల్లా షరీకన్ హువ లక తమ్‌లికుహు వమా మలక”- ‘కాని నీకు సాటి అయిన ఆ ఒక్కడు తప్ప నీవు అతని ప్రభువువు. కాని ఆ సాటి గలవాడు నీకు ప్రభువు కాడు. అవిశ్వాసులు ఈ వచనాలను బైతుల్లాహ్‌లో ‘తవాఫ్ చేస్తున్నపుడు పఠించేవారు.” [24] (ముస్లిమ్)
=====
2- بَابُ قِصَّةِ حَجَّةِ الْوَدَاعِ
2. వీడ్కోలు ‘హజ్జ్
విదా‘అ అంటే వీడ్కోలు పలకటం. ఇది ప్రవక్త(స) యొక్క చివరి ‘హజ్. ఈ ‘హజ్ లో కొన్ని అసాధారణ సంఘటనలు చొటు చేసుకున్నాయి, వీడ్కోలు పలికే వారి మాటల్లా అనిపించాయి. అందువల్ల ఈ ‘హజ్ ను ‘హజ్జతుల్ విదా‘అ అంటారు. ప్రవక్త (స) ఈ ‘హజ్ లో అందరికి వీడ్కోలు పలికారు. హిజ్రత్ తరువాత ప్రవక్త (స) ఒక్క ‘హజ్ చేసారు. అందులో ‘హజ్ కు సంబం ధించిన విషయాలన్నిటినీ బొధించారు. ఇంకా నా నుండి ‘హజ్జ్ విషయాలను నేర్చుకోండి, వచ్చే సంవత్సరం కలుసుకోవడం సాధ్యం కాకపోవచ్చు అని అనేకసార్లు అన్నారు. అందుకే ఈ ‘హజ్ కు చాలా ప్రాధాన్యత ఉంది.
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2555 – [ 1 ] ( صحيح ) (2/783)
عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللهِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مَكَثَ بِالْمَدِيْنَةِ تِسْعَ سِنِيْنَ لَمْ يَحُجَّ ثُمَّ أَذِنَ فِيْ النَّاسِ بِالْحَجِّ فِيْ الْعَاشِرَةِ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم حَاجٌ فَقَدِمَ الْمَدِيْنَةَ بَشَرٌ كَثِيْرٌ فَخَرَجْنَا مَعَهُ حَتَّى إِذَا أَتَيْنَا ذَا الْحُلَيْفَةَ. فَوَلَدَتْ أَسْمَاءُ بِنْتُ عُمَيْسٍ، مُحَمَّدَ بْنَ أَبِيْ بَكْرٍ فَأَرْسَلَتْ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: كَيْفَ أَصْنَعُ؟ قَالَ: “اغْتَسِلِيْ وَاسْتَثْقِرِيْ بِثَوْبٍ وَأَحْرِمِيْ“. فَصَلّى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ الْمَسْجِدِ ثُمَّ رَكِبَ الْقَصْوَاءِ حَتَّى إِذَا اسْتَوَتْ بِهِ نَاقَتُهُ عَلَى الْبَيْدَاءِ أَهَلَّ بِالتَّوْحِيْدِ. “لَبَّيْكَ اَللّهُمَّ لَبَّيْكَ، لَبَّيْكَ لَا شَرِيْكَ لَكَ لَبَّيْكَ، إِنَّ الْحَمْدَ وَالنِّعْمَةَ لَكَ وَالْمُلْكَ، لَا شَرِيْكَ لَكَ“. قَالَ جَابِرٌ: لَسْنَا نَنْوِيْ إِلَّا الْحَجَّ لَسْنَا نَعْرِفُ الْعُمْرَةَ حَتَّى إِذَا أَتَيْنَا الْبَيْتَ مَعَهُ اسْتَلَمَ الرُّكْنَ فَطَافَ سَبْعًا. فَرَمَلَ ثَلَاثًا. وَمَشَى أَرْبَعًا. ثُمَّ تَقَدَّمَ إِلَى مَقَامِ إِبْرَاهِيْمَ فَقَرَأَ: (وَاتَّخِذُوْا مِنْ مَّقَامِ إِبْرَاهِيْمَ مُصَلّى، 2: 125) فَصَلّى رَكْعَتَيْنِ. فَجَعَلَ الْمَقَامَ بَيْنَهُ وَبَيْنَ الْبَيْتَ وَفِيْ رِوَايَةٍ: أَنَّهُ قَرَأَ فِي الرَّكْعَتَيْنِ : (قُلْ يَا أَيُّهَا الْكَافِرُوْنَ -109 وَ قُلْ هُوَ اللهُ أَحَدٌ-112) ثُمَّ رَجَعَ إِلَى الرُّكْنِ فَاسْتَلَمَهُ ثُمَّ خَرَجَ مِنَ الْبَابِ إِلَى الصَّفَا فَلَمَّا دَنَا مِنَ الصَّفَا قَرَأَ :(إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِنْ شَعَائِرِ اللهِ-2: 158) أَبْدَأُ بِمَا بَدَأَ اللهُ بِهِ فَبَدَأَ بِالصَّفَا فَرَقَي عَلَيْهِ حَتَّى رَأَى الْبَيْتَ فَاسْتَقْبَلَ الْقِبْلَةَ فَوَحَّدَ اللهَ وَكَبَّرَهُ. وَقَالَ : “لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيْرٌ. لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ أَنْجَزَ وَعْدَهُ وَنَصَرَ عَبْدَهُ وَهَزَمَ الْأَحْزَابَ وَحْدَهُ“. ثُمَّ دَعَا بَيْنَ ذَلِكَ. قَالَ مِثْلَ هَذَا ثَلَاثَ مَرَّاتٍ ثُمَّ نَزَلَ وَمَشَى إِلَى الْمَرْوَةِ حَتَّى انْصَبَّتْ قَدَمَاهُ فِيْ بَطْنِ الْوَادِيْ ثُمَّ سَعَى حَتَّى إِذَا صَعِدَنتا مَشَى حَتَّى أَتَى الْمَرْوَةَ فَفَعَلَ عَلَى الْمَرْوَةِ كَمَا فَعَلَ عَلَى الصَّفَا حَتَّى إِذَا كَانَ آخِرُ طَوَافٍ عَلَى الْمَرْوَةَ نَادَى وَهُوَ عَلَى الْمَرْوَةِ وَالنَّاسُ تَحْتَهُ فَقَالَ: “لَوْ أَنِّيْ اسْتَقْبَلْتُ مِنْ أَمْرِيْ مَا اسْتَدْبَرْتُ لَمْ أَسُقِ الْهَدْيَ وَجَعَلْتُهَا عُمْرَةً فَمَنْ كَانَ مِنْكُمْ لَيْسَ مَعَهُ هَدْيٌ فَلْيَحِلَّ وَلْيَجْعَلْهَا عُمْرَةً”. فَقَامَ سُرَاقَةُ بْنُ مَالِكِ بْنُ جُعْشُمٍ. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ أَلِعَامِنَا هَذَا أَمْ لِأَبَدٍ؟ فَشَبَّكَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَصَابِعَهُ وَاحِدَةً فِيْ الْأُخْرَى. وَقَالَ: “دَخَلَتِ الْعُمْرَةُ فِي الْحَجِّ مَرَّتَيْنِ لَا بَلْ لِأَبَدٍ أَبَدٍ“. وَقَدِمَ عَلِيٌّ مِّنَ الْيَمَنِ بِبدُنِ النَّبِيِّ صلى الله عليه وسلم. فَقَالَ لَهُ: “مَاذَا قُلْتَ حِيْنَ فَرَضْتَ الْحَجَّ؟ “قَالَ: قُلْتُ: اَللّهُمَّ إِنِّيْ أُهِلُّ بِمَا أَهَلَّ بِهِ رَسُوْلُكَ قَالَ: “فَإِنَّ مَعِيَ الْهَدْيَ فَلَا تَحِلَّ”. قَالَ: فَكَانَ جَمَاعَةُ الْهَدْيِ الَّذِيْ قَدِمَ بِهِ عَلَيٌ مِّنَ الْيَمَنِ وَالَّذِيْ أَتَى بِهِ النَّبِيُّ صلى الله عليه وسلم مائة. قَالَ: فَحَلَّ النَّاسُ كُلُّهُمْ وَقَصَّرُوْا إِلَّا النَّبِيَّ صلى الله عليه وسلم وَمَنْ كَانَ مَعَهُ من هَدْيٌ فَلَمَّا كَانَ يَوْمُ التَّرْوِيَةِ تَوَجَّهُوْا إِلَى مِنَى فَأَهَلُّوْا بِالْحَجِّ وَرَكِبَ النَّبِيَّ صلى الله عليه وسلم فَصَلَّى بِهَا الظُّهْرَ وَالْعَصْرَ وَالْمَغْرِبَ وَالْعِشَاءَ وَالْفَجْرَ ثُمَّ مَكَثَ قَلِيْلًا حَتَّى طَلَعَتِ الشَّمْسُ وَأَمَرَ بِقُبَّةٍ مِّنْ شَعْرٍ تُضْرَبُ لَهُ بِنَمِرَةَ فَسَارَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَلَا تَشُكُّ قُرَيْشٌ إِلَّا أَنَّهُ وَاقِفٌ عِنْدَ الْمَشْعَرِ الْحَرَامِ كَمَا كَانَتْ قُرَيْشٌ تَصْنَعُ فِي الْجَاهِلِيَّةِ فَأَجَاَزَ رَسُوْلُ اللهِ صَلَّى حَتَّى أَتَى عَرَفَةَ فَوَجَدَ الْقُبَّةَ قَدْ ضُرِبَتْ لَهُ بِنَمِرَةَ فَنَزَلَ بِهَا حَتَّى إِذَا زَاغَتِ الشَّمْسُ أَمَرَ بِالْقَصْوَاءِ فَرُحِلَتْ لَهُ فَأَتَى بَطْنَ الْوَادِيْ فَخَطَبَ النَّاسُ وَقَالَ: “إِنَّ دِمَاءَكُمْ وَأَمْوَالَكُمْ حَرَامٌ عَلَيْكُمْ كَحُرْمَةِ يَوْمِكُمْ هَذَا فِيْ شَهْرِكُمْ هَذَا فِيْ بَلَدِكُمْ هَذَا أَلَا كُلُّ شَيْءٍ مِنْ أَمْرِ الْجَاهِلِيَّةِ تَحْتَ قَدَمِيُّ مَوْضُوْعٌ وَدِمَاءُ الْجَاهِلِيَّةِ مَوْضُوْعَةٌ. وَإِنَّ أَوَّلَ دَمٍ أَضَعُ مِنْ دِمَائِنَا دَمَ ابْنُ رَبِيْعَةَ بْنِ الْحَارِثِ وَكَانَ مُسْتَرْضَعًا فِيْ بَنِيْ سَعْدٍ فَقَتَلَهُ هُذَيْلٌ وَرِبَا الْجَاهِلِيَّةِ مَوْضُوْعٌ وَأَوَّلُ رِبًا أَضَعُ مِنْ رِبَانَا رِبَا عَبَّاسِ بْنِ عَبْدِ الْمُطَّلِبِ فَإِنَّهُ مَوْضُوْعٌ كُلُّهُ. فَاتَقُّوْا اللهَ فِيْ النِّسَاءِ فَإِنَّكُمْ أَخَذْتُمُوْهُنَّ بِأَمَانِ اللهِ وَاسْتَحْلَلْتُمْ فُرُوْجَهُنَّ بِكَلِمَةِ اللهِ وَلَكُمْ عَلَيْهِنَّ أَنَّ لَا يُوْطِئْنَ فُرُشَكُمْ أَحَدًا تَكْرَهُوْنَهُ. فَإِنَّ فَعَلْنَ ذَلِكَ فَاضْرِبُوْهُنَّ ضَرْبًا غَيْرَ مُبَرِّحٍ وَلَهُنَّ عَلَيْكُمْ رِزْقُهُنَّ وَكِسْوَتُهُنَّ بِالْمَعْرُوْفِ. وَقَدْ تَرَكْتُ فِيْكُمْ مَا لَنْ تَضِلُّوْا بَعْدَهُ. إِنِ اعْتَصَمْتُمْ بِهِ كِتَابُ اللهِ وَأَنْتُمْ تَسْأَلُوْنَ عَنِيْ فَمَا أَنْتُمْ قَائِلُوْنَ؟” قَالُوْا: “نَشْهَدُ أَنَّكَ قَدْ بَلَّغْتَ وَأَدَّيْتَ وَنَصَحْتَ“. فَقَالَ بِأصْبَعِهِ السَّبَّابَةِ يَرْفَعُهَا إِلَى السَّمَاءِ وَيَنْكُتُهَا إِلَى النَّاسِ: “اَللّهُمَّ اشْهَدْ اللّهُمَّ اشْهَدْ” ثَلَاثَ مَرَّاتٍ. ثُمَّ أَذَّنَ بِلَالٌ ثُمَّ أَقَامَ فَصَلّى الظُّهْرَ ثُمَّ أَقَامَ فَصَلّى الْعَصْرَ. وَلَمْ يُصَلِّ بَيْنَهُمَا شَيْئًا. ثُمَّ رَكِبَ حَتّى أَتَى الْمَوْقِفَ فَجَعَلَ بَطْنَ نَاقَتِهِ الْقَصْوَاءِ إِلَى الصَّخْرَاتِ وَجَعَلَ حَبْلَ الْمُشَاةِ بَيْنَ يَدَيْهِ وَاسْتَقْبَلَ الْقِبْلَةَ فَلَمْ يَزَلْ وَاقِفًا حَتَّى غَرَبَتِ الشَّمْسُ. اوَذَهَبَتِ الصُّفْرَةُ قَلِيْلًا حَتَّى غَابَ الْقُرْصُ وَأَرْدَفَ أُسَامَةَ وَدَفَعَ حَتَّى أَتَى الْمُزْدَلِفَةَ فَصَلّى بِهَا الْمَغْرِبَ وَالْعِشَاءَ بِأَذَانٍ وَّاحِدٍ وَّإِقَامَتَيْنِ. وَلَمْ يُسَبِّحْ بَيْنَهُمَا شَيْئًا ثُمَّ اضْطَجَعَ حَتَّى طَلَعَ الْفَجْرُ فَصَلّى الْفَجْرُ حَيْنَ تَبَيَّنَ لَهُ الصُّبْحُ بِأَذَانٍ وَّإِقَامَةٍ ثُمَّ رَكِبَ الْقَصْوَاءَ حَتَّى أَتَى الْمَشْعَرَ الْحَرَامَ فَاسْتَقْبَلَ الْقِبْلَةَ فَدَعَاهُ وَكَبَّرَهُ وَهَلَّلَهُ وَوَحَّدَهُ فَلَمْ يَزَلْ وَاقِفًا حَتَّى أَسْفَرَ جِدًا فَدَفَعَ قَبْلَ أَنْ تَطْلُعَ الشَّمْسُ وَأَرْدَفَ الْفَضْلَ بْنَ عَبَّاسٍ حَتَّى أَتَى بَطَنَ مُحَسِّرٍ فَحَرَّكَ قَلِيْلًا ثُمَّ سَلَكَ الطَّرِيْقَ الْوُسْطَى الَّتِيْ تَخْرُجُ عَلَى الْجَمْرَةِ الْكُبْرَى حَتَّى أَتَى الْجَمْرَةَ الَّتِيْ عِنْدَ الشَّجَرَةِ فَرَمَاهَا بِسَبْعِ حَصَيَاتٍ يُكَبِّرُ مَعَ كُلِّ حَصَاةٍ مِّنْهَا مِثْلَ حَصَى الْخَذْفِ رَمَى مِنْ بَطْنِ الْوَادِيْ ثُمَّ انْصَرَفَ إِلَى الْمَنْحَرِ فَنَحَرَ ثَلَاثًا وَّسِتِيْنَ بَدَنَةً بِيَدِهِ ثُمَّ أَعْطَى عَلِيًّا فَنَحَرَ مَا غَبَرَ وَأَشْرَكَهُ فِيْ هَدِيْهِ ثُمَّ أَمَرَ مِنْ كُلِّ بَدَنَةٍ بِبَضْعَةٍ. فَجُعِلَتْ فِيْ قِدْرٍ فَطُبِخَتْ فَأَكَلًا مِنْ لَحْمِهَا وَشَرِبَا مِنْ مَرَقِهَا ثُمَّ رَكِبَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَأَفَاضَ إِلَى الْبَيْتِ فَصَلّى بِمَكَّةَ الظُّهْرَ فَأَتَى عَلَى بَنِيْ عَبْدِ الْمُطَّلِبِ يَسْقُوْنَ عَلَى زَمْزَمَ فَقَالَ: “انْزِعُوْا بَنِيْ عَبْدِ الْمُطَّلِبِ فَلَوْلَا أَنْ يَّغْلِبَكُمْ النَّاسُ عَلَى سِقَايَتِكُمْ لَنَزَعْتُ مَعَكُمْ“. فَنَاوَلُوْهُ دَلْوًا فَشَرِبَ مِنْهُ. رَوَاهُ مُسْلِمٌ.
2555. (1) [2/783–దృఢం]
జాబిర్ బిన్ ‘అబ్దుల్లాహ్ (ర) కథనం: ప్రవక్త (స) వలస వెళ్ళిన తర్వాత మదీనహ్ లో 9 సంవత్సరాలు ఉన్నారు. ఈ కాలంలో ప్రవక్త (స) ‘హజ్జ్ చేయలేదు. ఆ తరువాత 10వ సంవత్సరం ప్రవక్త (స) ప్రజల్లో ‘హజ్జ్ గురించి, ఇంకా ప్రవక్త (స) ఈ సంవత్సరం ‘హజ్జ్ కు వెళుతున్నారని ప్రకటించారు. ఈ వార్త వినగానే ప్రవక్త (స) అనుచరులు పెద్ద సంఖ్యలో ప్రవక్త (స) వద్దకు తరలివచ్చారు. ఆ తర్వాత మేము ప్రవక్త (స) వెంట మదీనహ్ నుండి బయలుదేరాము. మేము జు’ల్ ‘హులైఫహ్ చేరిన వెంటనే అస్మా బిన్‌తె ‘ఉమైస్, ము’హమ్మద్ బిన్ అబీ బక్‌ర్‌ను ప్రసవించింది. అంటే అస్మా’ బిన్‌తె ‘ఉమైస్ గర్భవతిగా ఉన్నప్పుడు మా వెంట ‘హజ్జ్కు బయలుదేరింది. ఆమె జు’ల్ ‘హులైఫహ్ చేరిన తర్వాత అతనిని ప్రసవించింది. అతనికి ము’హ మ్మద్ బిన్ అబీ-బక్‌ర్ అనే పేరు పెట్టటం జరిగింది.
అస్మా’ (ర) అబూ బక్‌ర్ (ర) భార్య. ము’హమ్మద్ అబూ బక్‌ర్ కుమారులు జన్మించారు. ఆమె ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తిని ఇటువంటి సమయంలో నేనేమి చేయాలి కనుగొనమని పంపింది. దానికి ప్రవక్త (స) ఆమెను స్నానం చేయమని ఒక గుడ్డతో లంగోట్ కట్టుకోని ఇ’హ్‌రామ్ ధరించ మని చెప్పి పంపించారు. ప్రవక్త (స) జు’ల్’హులైఫహ్ మస్జిద్‌లో నమా’జు చేసారు. ఆ తరువాత ఖ’స్వా ఆడ ఒంటెపై కూర్చున్నారు. అది ప్రవక్త (స)ను తీసుకొని తిన్నగా బైదా’ కొండపై ఎక్కింది. అప్పుడు ప్రవక్త (స) బిగ్గరగా తల్‌బియ పలకడం ప్రారంభించారు.
”లబ్బయి‘క్ అల్లాహుమ్మ లబ్బయి‘క్, లబ్బ యి‘క్‌లా షరీకలక లబ్బయి‘క్, ఇన్నల్ ‘హమ్‌దహ్ వన్ని‘అమత లక వల్ముల్క్, లా షరీక లక్” —- ‘నేను హాజరయ్యాను ఓ అల్లాహ్! నేను హాజ రయ్యాను, నేను హాజరయ్యాను, నీకు సాటి ఎవరూ లేరు. స్తోత్రాలన్నీ నీ కొరకే. అనుగ్రహాలు నీవే, రాజ్యం అంతా నీదే. ఇందులో ఇతరుల భాగస్వామ్యం లేదు.’
జాబిర్ (ర) కథనం: మేము కేవలం ‘హజ్జ్ సంకల్పం చేసాము. ‘హజ్జ్ కాలంలో ‘ఉమ్‌రహ్ అంటే మాకు ఏమీ తెలియదు. మేము ప్రవక్త (స) వెంట బైతు ల్లాహ్‌లో ప్రవేశించాము. ప్రవక్త (స) ‘హజరె అస్వద్‌ను ముద్దుపెట్టుకున్నారు. బైతుల్లాహ్ చుట్టు 7 సార్లు ప్రదక్షిణాలు చేసారు. మొదటి మూడు ప్రదక్షిణాల్లో రమ్‌ల్ చేసారు. అంటే భుజాలు ఎగురవేసుకుంటూ వేగంగా నడిచారు. మిగిలిన నాలుగు ప్రదక్షిణాల్లో నిదానంగా తన అలవాటు ప్రకారం నడిచారు. ఆ తరువాత మఖామె ఇబ్రాహీమ్ వద్దకు వచ్చి, ”వత్త‘ఖిజూ‘ మిన్ మఖామి ఇబ్రాహీమ ము‘సల్లా” (సూ. అల్ బఖరహ్, 2:125) పఠించారు. మఖామె ఇబ్రాహీమ్‌ను తనకు బైతుల్లాహ్‌కు మధ్య ఉంచి. మరో ఉల్లేఖనంలో మఖామె ఇబ్రాహీమ్ దగ్గర రెండు రక’అతులు చదివారు. వాటిలో సూరహ్ అల్-కాఫిరూన్ (109) మరియు సూరహ్ అల్-ఇఖ్లాస్ (112) లను పఠించారు. ఆ తరువాత మఖామె ఇబ్రాహీమ్ నుండి తిరిగి వచ్చి ‘హజరె అస్వద్ వద్దకు వచ్చారు. దాన్ని ముద్దుపెట్టు కున్నారు. ఆ తరువాత మళ్ళీ మస్జిద్‌లోని ‘సఫా ద్వారం నుండి బయటకు వచ్చి ‘సఫా కొండపైకి వచ్చారు. ‘సఫా కొండ సమీపానికి చేరగానే, ”ఇన్న ‘స్సఫా వల్ మర్‌వత మిన్ ష‘ఆయిరిల్లాహి” (సూ. అల్ బఖరహ్, 2:158) పఠించి ‘అల్లాహ్ దేన్నుండి ప్రారంభించాడో నేనూ దాన్నుండే ప్రారంభిస్తున్నాను.’ అని అన్నారు.
ప్రవక్త (స) ‘సఫా నుండి సయీ’ ప్రారంభించారు. ‘సఫా కొండపైకి ఎక్కారు. చివరికి బైతుల్లాహ్‌ను చూశారు. ఖిబ్లావైపు తిరిగి నిలబడి దేవుని ఏకత్వాన్ని కొనియాడారు. ఆయన గొప్పతనాన్ని స్తుతించారు. ఇంకా ఇలా అన్నారు.
”లా ఇలాహ ఇల్లల్లాహు వ‘హ్‌దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ ‘హమ్దు. వహువ ‘అలా కుల్లి షయ్‌ఇన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లల్లాహు వ‘హ్‌దహు అన్‌జ‘జ వ‘అదహు, వ న‘సర ‘అబ్‌దహు వ ‘హ‘జమల్ అ‘హ్‌జా‘బ వ‘హ్‌దహు.” — ‘అల్లాహ్ (త) తప్ప ఆరాధ్యులెవరూ లేరు. ఆయన ఒకే ఒక్కడు. ఆయనకు సాటి ఎవరూ లేరు. రాజ్యం ఆయనదే, స్తోత్రం ఆయనదే ఆయన సర్వశక్తులు గలవాడు. అల్లాహ్ (త) తప్ప ఆరాధ్యులెవరూ లేరు. ఆయన తన వాగ్దానం పూర్తిచేసాడు. ఇంకా ఆయన తన దాసునికి సహాయం చేసాడు. ఆయన ఒక్కడే అవిశ్వాసుల సైన్యాన్ని ఓడించాడు.’
వీటితో పాటు ఇంకా అనేక దు’ఆలు ఉన్నాయి. ఇలా మూడుసార్లు అన్నారు. ఆ తరువాత ‘సఫా నుండి క్రిందికి దిగారు. మర్వా వైపు బయలుదేరారు. చివరికి ఆయన తన రెండు పాదాలు లోయక్రిందికి వచ్చినప్పుడు, పరుగెత్తసాగారు. మర్వాపై వెళ్ళినపుడు మెల్లమెల్లగా నడిచారు. చివరికి మర్వా కొండపైకి చేరుకున్నారు. ప్రవక్త (స) ‘సఫాపై చేసినట్లే మర్వాపై చేసారు. ప్రవక్త (స) మర్వా కొండపై చివరి ప్రదక్షిణలో చేరి మర్వాపై ఎక్కారు. ప్రజలు క్రింద నిలబడ్డారు. అప్పుడు ప్రవక్త (స) ప్రజలతో తరువాత తెలిసిన విషయం నాకు ముందే తెలిపి ఉంటే నేను ఖుర్‌బానీ జంతువును వెంట తెచ్చేవాడ్నికాను. ‘హజ్ద్, ‘ఉమ్‌రహ్ చేసేవాడ్ని అంటే తమత్తు’ఉ చేసేవాడ్ని. మీలో ఎవరి దగ్గర ఖుర్‌బానీ లేదో వారు ఇహ్‌రామ్ తొలగించి ‘ఉమ్‌రాహ్ పూర్తిచేసుకోండి, అని అన్నారు. అది విన్న సురాఖహ్ బిన్ మాలిక్ బిన్ జు’అషుమ్, ‘అల్లాహ్ ప్రవక్తా! ఈ ఆదేశం ఈ ఒక్క సంవత్సరమేనా లేక శాశ్వతంగానా’ అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త (స) తన ఒక చేతివేళ్ళను మరో చేతివేళ్ళలో వేసి, ” ‘ఉమ్‌రహ్ ‘హజ్జ్లో విలీనమయి పోయింది,” అని అన్నారు. ఈ విధంగా రెండు సార్లు అన్నారు. ఇంకా ఈ అనుమతి కేవలం ఈ ఒక్క సంవత్సరానికే కాదు. ఇది అందరికీ వర్తిస్తుంది. ‘అలీ (ర) యమన్ దేశం నుండి ప్రవక్త (స) కోసం తన వెంట ఖుర్‌బానీ జంతువును తెచ్చారు. ఎందుకంటే అప్పుడు ‘అలీ యమన్ గవర్నర్‌గా ఉండేవారు. యమన్ నుండి ‘హజ్జ్ చేయడానికి వచ్చారు. ప్రవక్త (స) ‘అలీని నీవు ఇ’హ్‌రామ్ ధరించినపుడు ఏమన్నావు? ఏమని సంకల్పం చేసావు?’ అని అడి గారు. దానికి ‘అలీ (ర) ఓ అల్లాహ్ ప్రవక్తా! ఇ’హ్‌రామ్ ధరించినపుడు నేను ”ఓ అల్లాహ్! నీ ప్రవక్త సంకల్పం చేసిన విధంగా నేను సంకల్పం చేస్తున్నాను,” అని పలికానని చెప్పారు. అప్పుడు ప్రవక్త (స) నా వెంట కూడా ఖుర్‌బానీ జంతువు ఉంది నేను ఖిరాన్ ఇ‘హ్‌రామ్ ధరించాను. నువ్వు కూడా ఖారిన్‌గా ఉండు. ‘హజ్జ్ కార్యాలు చేయనంత వరకు ఇ’హ్‌రామ్ తొలగించవద్దు. ఇ’హ్‌రామ్‌లోనే ఉండు. ఉల్లేఖనకర్త కథనం: ప్రవక్త (స) తెచ్చిన జంతువులు ‘అలీ యమన్ నుండి తెచ్చిన జంతువులు అన్నీ కలిపి 100 ఉండేవి. జాబిర్ (ర) కథనం: చాలామంది ‘ఉమ్‌రహ్ చేసి ఇ’హ్రామ్ తొలగించారు. తమ తలలను గీయించుకున్నారు. అంటే ‘ఉమ్‌రహ్ విధులను పూర్తి చేసారు. కాని ప్రవక్త (స) ఇంకా తమ వెంట ఖుర్‌బానీ జంతువును తెచ్చినవారు ఇ’హ్‌రామ్ తొలగించ లేదు. వారు ఇంకా ఇ’హ్‌రామ్‌లోనే ఉన్నారు. జి’ల్’హిజ్జ 8వ తేదీనాడు మినా వైపు వెళ్ళే సమయం వచ్చి నపుడు ‘ఉమ్‌రహ్ చేసి ఉన్నవారు ‘హజ్జ్ ఇ’హ్‌రామ్ ధరించి మినావైపు బయలు దేరారు. ఇటు ప్రవక్త (స) ఆడ ఒంటెపై కూర్చొని మినా చేరారు. అక్కడ ప్రవక్త (స) ”జుహ్‌ర్, ‘అ’స్ర్, మ’గ్‌రిబ్, ‘ఇషా’, ఫజ్‌ర్ అంటే 5 నమా ‘జులు మినాలో చదివించారు. 9వ తేదీన మినాలో ఫజ్‌ర్ నమా’జు తర్వాత కొద్దిసేపు ఆగారు. సూర్యుడు బాగా పైకి వచ్చాడు. ప్రవక్త (స) ‘అరఫాత్‌కు తగిలి ఉన్న నమిరహ్ లోయలో టెంట్ వేయమని ఆదేశించారు.
ఈ టెంట్ వెంట్రుకలు ఉన్న చర్మంతో వేసారు. ప్రవక్త (స) మినా నుండి బయలుదేరారు. ప్రవక్త (స) మష్’అరిల్ హరామ్ ముజ్’దలిఫహ్లో విశ్రాంతి తీసుకుంటారని అవిశ్వాసులు భావించారు. అజ్ఞాన కాలంలో ఖురైషులు మినా నుండి బయలు దేరి ముజ్’దలిఫహ్లో విడిది చేసేవారు. ‘అరఫాత్ వెళ్ళేవారు కారు. కాని ప్రవక్త (స) మినా నుండి ముజ్’దలిఫాలో ఆగకుండా ఇంకా ముందుకు వెళ్ళి ‘అరఫాత్ మైదానం చేరుకున్నారు. ప్రవక్త (స) నమిరహ్ లోయలో తన కోసం టెంట్ వేసి ఉండటం చూసారు. అప్పుడు సూర్యుడు వాలి ఉన్నాడు. ప్రవక్త (స)ఖస్వ ఆడ ఒంటెను తెమ్మని ఆదేశించారు. ఆ ఒంటెను ప్రవక్త (స) వద్దకు తెప్పించడం జరిగింది. ప్రవక్త (స) దానిపై ఎక్కి నమిరహ్ లోయలోకి వెళ్ళారు. అందరి ముందు ప్రసంగించారు. దాని పదాలు ఇలా ఉన్నాయి.
”మీ ప్రాణాలు, మీ ధనం మీపై నిషేధించబడ్డాయి. ఏ విధంగా ఈ దినం ఈ నెల, ఈ నగరంలో నిషేధించ బడ్డాయో, అంటే ఈ నెలలో, ఈనగరం మక్కహ్ ముకర్రమహ్ లో మరియు ‘హరమ్‌లో హత్యలు మొదలైనవి నిషేధించబడ్డాయో. అదేవిధంగా శాశ్వతంగా ఎక్కడైనా అనవసరంగా హత్యలు, దోపిడీలు నిషేధించబడ్డాయి. గుర్తుంచుకోండి. అజ్ఞాన కాలపు ఆచారాలన్నీ నా పాదాలక్రింద నలిపివేయ బడ్డాయి. అంటే అజ్ఞానకాలానికి చెందిన మూఢా చారాలు పద్ధతులు ఇప్పుడు ఇస్లామ్‌లో ఎంతమాత్రం ధర్మసమ్మతం కావు. వాటికి ఎటువంటి విలువలేదు. అవన్నీ రద్దుచేయబడ్డాయి. అదే విధంగా అజ్ఞానకాలపు హత్యలు క్షమించబడ్డాయి. అంటే అజ్ఞాన కాలంలో ఒకరు మరొకరిని హత్యచేస్తే, ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవడం జరుగదు. ప్రతిఫలం లేదు. పరిహారమూ లేదు. అందరికంటే ముందు నేను క్షమిస్తున్నాను. హత్య ఇబ్ను రబీ’అ బిన్ ‘హారిస్’ది. ఇతడు ఒక చిన్న పసివాడు. ఇతడు బనీ స’అద్ తెగలో పాలు త్రాగేవాడు. అతడ్ని ‘హుజై’ల్ తెగవాడు హత్య చేసాడు. ఇప్పుడు నేనతడి హత్యను క్షమిస్తున్నాను. అతడి హంతకుడి నుండి పరిహారం తీసుకోను. ప్రతిఫలం తీసుకోను. అదేవిధంగా అజ్ఞానకాలపు వడ్డీని విడిచిపెడు తున్నాను. అంటే ఆ వడ్డీ సొమ్ము ఇప్పుడు తీసుకో బడదు. అందరి కంటే ముందు నా కుటుంబం వడ్డీ సొమ్మును చిన్నాన్న ‘అబ్బాస్ వడ్డీ సొమ్మును విడిచి పెడుతున్నాను. ఇదంతా దేవునిపై వదులు తున్నాను. మీ భార్యల పట్ల అల్లాహ్‌కు భయ పడుతూ ఉండండి. ఎందుకంటే మీరు అల్లాహ్ రక్షణ, ప్రమాణాల ద్వారా వారిని స్వీకరించారు. ఇంకా అల్లాహ్ వచనాల ద్వారా అంటే ఆమోదం, స్వీకరణ ద్వారా మీరు వారిని ధర్మసమ్మతం చేసుకున్నారు. మీ హక్కు వారిపై ఏమిటంటే మీ ఇంటిలోనికి మీకు ఇష్టం లేనివారిని రానీయ రాదు. ఒకవేళ వారు అలా చేస్తే ప్రమాదకరమైన విధంగా కాకుండా కొట్టవచ్చును. స్త్రీల హక్కు మీపై ఏమిటంటే వారిని క్షేమంగా ఉంచండి. మంచిగా తినిపించండి. దుస్తులు తొడి గించండి. ప్రజలారా!మీలో కొన్నివిషయాలు వదలి వెళుతున్నాను. ఒకవేళ మీరు వాటిని దృఢంగా పట్టుకొని ఉంటే మీరు ఎంతమాత్రం మార్గభ్రష్టత్వానికి గురికారు. అది అల్లాహ్ గ్రంథం ఖుర్‌ఆన్. ఒకవేళ తీర్పు దినంనాడు నా గురించి అడిగితే మీరేం సమాధానం ఇస్తారు?’ అని అన్నారు ప్రవక్త (స). దానికి ప్రవక్త (స) అనుచరులు, ‘తమరు దైవాదేశాలన్నింటినీ అందజేసారని తమ బాధ్యతను నిర్వర్తించారని చెబుతాం’ అని అన్నారు. ఆతరువాత ప్రవక్త(స) తనచూపుడువేలును ఆకాశం వైపు ఎత్తి మూడుసార్లు ఇలా అన్నారు, ”ఓ అల్లాహ్ నీవు సాక్షిగా ఉండు,” అని అన్నారు.
ఆ తరువాత బిలాల్ (ర) అజా’న్ ఇచ్చారు. ఇఖా మత్ పలికారు. ప్రవక్త (స) ”జుహ్‌ర్ నమా’జు చది వారు. మళ్ళీ రెండవసారి ఇఖామత్ పలికారు. ‘అ’సర్ నమా’జు చదివారు. ఈ రెండు నమా’జుల మధ్య ఎటువంటి నఫిల్ మరియు సున్నత్ నమా’జు చదవ లేదు. ఆ తరువాత ప్రవక్త (స) వాహనంపై ఎక్కి ‘అర ఫాత్ మైదానంలోనికి విచ్చేశారు. ప్రవక్త (స) తన ఆడ ఒంటె ఖస్వా కడుపును రాళ్ళు ఉన్న వైపుచేసి, ముషాత్ కొండను తన ముందు ఉన్నట్టు చేసారు. ఈ విధంగా ఖిబ్లా వైపు తిరిగి నిలబడ్డారు. సూర్యాస్త మయం వరకు నిర్విరామంగా నిలబడ్డారు. ఈ మధ్య దైవస్మరణ చేస్తూ ఉన్నారు. చివరికి సూర్యుడు అస్తమించాడు. దాని తరువాత ఆకాశంలో ఉన్న పసుపు పచ్చరంగు కూడా పోయింది. సూర్య గోళాకారం కూడా పూర్తిగా అదృశ్యమయింది. ‘ఉసా మహ్ బిన్ ‘జైద్‌ను తన వాహనంపై కూర్చో బెట్టుకొని ముందుకు సాగారు. చివరికి ము’జ్‌దలిఫా చేరు కున్నారు. ఇక్కడ ప్రవక్త (స) మ’గ్‌రిబ్, ఇషా’లను ఒక అ’జాన్ రెండు ఇఖామత్‌ల ద్వారా ఆచరించారు. ఈ రెండు నమా’జుల మధ్య నఫిల్ గానీ, సున్నత్‌గానీ చదవలేదు. ఆ తరువాత విశ్రాంతి తీసుకున్నారు. చివరికి ఉషోదయకాలం అయి పోయింది. ఉషోదయ కాలం తర్వాత ప్రవక్త (స) అజా’న్ మరియు ఇఖామత్‌లతో ఫజ్‌ర్ నమా’జు ఆచరించారు. ఆ తరువాత ఖ’స్వా ఆడ ఒంటెపై కూర్చుని మష్’అరిల్ ‘హరామ్‌లోనికి వచ్చారు. (ఇది ముజ్‌దలిఫాలోని ప్రత్యేక స్థానం, ఇప్పుడు అక్కడ ఒక మస్జిద్ ఉంది) ఆ తరువాత ఖిబ్లావైపు నిలబడి దు’ఆ చేసారు.
అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు అని పలికిన తరువాత దేవుని ఏకత్వాన్ని కొనియాడారు. ప్రవక్త (స) నిర్విరామంగా నిలబడ్డారు. చివరికి తెల్లవారి అన్ని వైపుల వెలుగు వ్యాపించింది. ఆ తరువాత సూర్యుడు ఉదయించడానికి కొన్ని నిమిషాల ముందు ము‘జ్‌దలిఫా నుండి బయలుదేరారు.
ఫ’ద్ల్ బిన్ ‘అబ్బాస్ (ర)ను తన వెనుక వాహనంపై కూర్చో బెట్టుకొని ము’హ’స్సిర్ లోయలోనికి ప్రవేశించారు. ప్రవక్త (స) ఇక్కడ తన వాహనవేగాన్ని పెంచి జమరతుల్ ‘అఖబహ్కు వెళ్ళే మధ్య మార్గం గుండా ముందుకు సాగారు. పెద్ద జమ్‌రహ్ వద్దకు చేరి, (అక్కడ ఒక వృక్షం ఉంది / ఇప్పుడు లేదు), దానికి 7 కంకర రాళ్ళు రువ్వారు. ప్రతి కంకర రాయితో పాటు ‘అల్లాహు అక్బర్ ‘ అని పలుకుతూఉన్నారు. ఈ కంకర రాయి శనగ గింజంత ఉండేది. కంకరరాళ్ళు విసిరిన తర్వాత కమేలా లోనికి వచ్చారు. ఇక్కడ తన చేతులతో 63 ఒంటెల ఖుర్‌బానీ చేసారు. 100లో మిగిలిన ఒంటెలను ‘అలీ (ర)కి అప్పజెప్పారు. ‘అలీ (ర) మిగిలిన 37 ఒంటెల ఖుర్‌బానీ చేసారు. ప్రవక్త (స) తన ఖుర్‌బానీ జంతువులలో ‘అలీ (ర)ను కూడా చేర్చు కున్నారు. (100 ఒంటెల ఖుర్‌బానీ తర్వాత) ప్రతి జంతువు నుండి ఒక ముక్క మాంసం కోసి తెమ్మని ఆదేశించారు. ఒక్కొక్క ముక్క కోసి తీసుకురావటం జరిగింది. ఒక గిన్నెలో వేసి ఆ మాంసాన్ని వండడం జరిగింది. ప్రవక్త (స), ‘అలీ (ర) ఆ మాంసపు కూరను ఆరగించారు. ఆ తరువాత ప్రవక్త (స) వాహనంపై కూర్చొని మక్కహ్ వచ్చారు. బైతుల్లాహ్ చుట్టూ ‘తవాఫె ఇఫాదహ్ చేసారు. ప్రవక్త (స) ”జుహ్‌ర్ నమా ‘జును మక్కహ్ లో ఆచరించారు. ఆతరువాత ‘అబ్దుల్ ము’త్తలిబ్ సంతానం అంటే తన చిన్నాన్న వారి సంతానం వద్దకు వచ్చారు. వీరు ‘జమ్’జమ్‌నీటినితోడి ప్రజలకు త్రాపిస్తున్నారు. ప్రవక్త (స) ఇది చూచి వారితో ఓ ‘అబ్దుల్ ముత్తలిబ్ కుటుంబ సభ్యులారా! మీరు ‘జమ్’జమ్ నీటిని తోడి ప్రజలకు త్రాపిస్తూ ఉండండి. నీళ్ళు త్రాపించటంలో ప్రజలు మీపై విరుచుకు పడతారనే భయం నాకు లేకపోతే నేనూ మీతో పాటు ‘జమ్’జమ్ నీరు తోడి త్రాపించేవాడిని’ అని అన్నారు. ఆ తరువాత ము’త్తలిబ్ కుటుంబం వారు ప్రవక్త (స) కు ఒక చేద ‘జమ్’జమ్ నీరు ఇచ్చారు. ప్రవక్త (స) తాను త్రాగినన్ని నీళ్ళు త్రాగారు. (ముస్లిమ్)
2556 – [ 2 ] ( متفق عليه ) (2/787)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: خَرَجْنَا مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ حَجَّةِ الْوَدَاعِ فَمِنَّا مَنْ أَهَلَّ بِعُمْرَةٍ وَمِنَّا مَنْ أَهَلَّ بِحَجٍّ فَلَمَّا قَدِمْنَا مَكَّةَ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَهَلَّ بِعُمْرَةٍ وَلَمْ يُهْدِ فَلْيَحْلِلْ. وَمَنْ أَحْرَمَ بِعُمْرَةٍ وَأَهْدَى فَلْيُهِلَّ بِالْحَجِّ مَعَ الْعُمْرَةٍ. ثُمَّ لَا يَحِلَّ حَتَّى يَحِلُّ مِنْهَا“.
وَفِيْ رِوَايَةٍ: “فَلَا يَحِلَّ حَتَّى يَحِلَّ بِنَحْرِ هَدْيِهِ. وَمَنْ أَهَلَّ بِحَجٍّ فَلْيُتِمَّ حَجَّهُ“. قَالَتْ: فَحِضْتُ وَلَمْ أَطُفْ بِالْبَيْتِ وَلَا بَيْنَ الصَّفَا وَالْمَرْوَةِ فَلَمْ أَزَلْ حَائِضًا حَتَّى كَانَ يَوْمُ عَرَفَةَ وَلَمْ أَهْلِلْ إِلَّا بِعُمْرَةٍ فَأَمَرَنِي النَّبِيُّ صلى الله عليه وسلم. أَنْ أَنْقُضَ رَأْسِيْ وَأَمْتَشِطَ وَأُهِلَّ بِالْحَجِّ وَأَتْرُكَ الْعُمْرَةَ فَفَعَلْتُ حَتَّى قَضَيْتُ حَجِّيْ بَعَثَ مَعِيْ عَبْدَ الرَّحْمَنِ بْنِ أَبِيْ بَكْرٍ. وَأَمَرَنِيْ أَنْ أَعْتَمِرَ مَكَانَ عُمْرَتِيْ مِنَ التَّنْعِيْمِ قَالَتْ: فَطَافَ الَّذِيْنَ كَانُوْا أَهَلُّوْا بِالْعُمْرَةِ بِالْبَيْتِ وَبَيْنَ الصَّفَا وَالْمَرْوَةَ ثُمَّ حَلُّوْا ثُمَّ طَافُوْا طوافاً بَعْدَ أَنْ رَجَعُوْا مِنْ مِنَّى وَأَمَّا الَّذِيْنَ جَمَعُوا الْحَجَّ وَالْعُمْرَةَ فَإِنَّمَا طَافُوْا طَوَافًا وَّاحِدًا.
2556. (2) [2/787– ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: మేము హజ్జతుల్ విదా’అలో ప్రవక్త (స) వెంట బయలుదేరాము. మాలో కొందరు ‘ఉమ్‌రహ్ ఇ’హ్రామ్ ధరించారు. మరి కొందరు ‘హజ్ ఇ’హ్రామ్ ధరించారు. మేమంతా మక్కహ్ చేరిన తర్వాత ప్రవక్త (స) ‘ఉమ్రహ్ ఇ’హ్‌రామ్ ధరించి ఖుర్‌బానీ జంతువును తమవెంట తీసుకురానివారు ఇ’హ్‌రామ్ తొలగించాలని, ‘ఉమ్‌రహ్ ఇ’హ్‌రామ్ ధరించి ఖుర్‌బానీ జంతువును తన వెంట తీసుకువచ్చిన వారు ‘ఉమ్‌రహ్‌తో పాటు ‘హజ్ ఇ’హ్‌రామ్‌ను కూడా ధరించాలి. అంటే ఇహ్‌రామ్ తొలగించరాదు. అంటే ‘హజ్ చేయనంత వరకు ఇ’హ్‌రామ్ తొలగించరాదు.” అని అన్నారు.
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఖుర్‌బానీ జంతువును తమ వెంట తెచ్చిన వారు ఖుర్‌బానీ చేయనంత వరకు ఇ’హ్‌రామ్ తొలగించరాదు, కేవలం ‘హజ్ ఇ’హ్‌రామ్ ధరించిన వారు తమ ‘హజ్ పూర్తి చేసుకోవాలి.” అని అన్నారు. ‘ఆయి’షహ్ కథనం: ”నేను బహిష్టు స్థితికి గురయ్యాను. బైతుల్లాహ్ ‘తవాఫ్ చేయలేదు. ‘సఫా మర్వాల మధ్య స’యీ కూడా చేయలేదు. నేను 9వ తేదీ వరకు బహిష్టు స్థితిలో ఉన్నాను. అంతకు ముందు నేను ‘ఉమ్‌రహ్ ఇహ్‌రామ్ ధరించి ఉన్నాను. ప్రవక్త (స) నన్ను నా తల వెంట్రుకలను విప్పివేయమని, తల దువ్వు కోమని ఆదేశించారు. అంటే ‘ఉమ్‌రహ్ ఇ’హ్‌రామ్‌ను రద్దుచేసి ‘హజ్ ఇ’హ్‌రామ్‌ను ధరించమని ఆదేశించారు. నేను అలాగే చేసాను. నేను నా ‘హజ్ కార్యాలన్నీ నిర్వర్తించిన తర్వాత ప్రవక్త (స) నా సోదరుడు ‘అబ్దుర్ర’హ్మాన్ బిన్ అబీ బక్‌ర్‌ను నా వెంట పంపారు. ఇంకా నన్ను నా ‘ఉమ్‌రహ్ కు బదులు మరో ‘ఉమ్రహ్ కొరకు తన్’యీమ్ ప్రదేశం నుండి ఇ’హ్రామ్ ధరించమని ఆదేశించారు. నేను అలాగే చేసాను.” ‘ఆయి’షహ్ (ర) కథనం: ‘ఉమ్‌రహ్ ఇ’హ్‌రామ్ ధరించిన వారు బైతుల్లాహ్ ‘తవాఫ్‌చేసి, ‘సఫా మర్వాల స’యీ చేసి ఇ’హ్రామ్ తొలగించారు. ఆ తర్వాత వారు మినా నుండి తిరిగి వచ్చిన తర్వాత మరో ‘తవాఫ్ చేసారు. ‘హజ్ మరియు ‘ఉమ్‌రహ్ ఇ’హ్‌రామ్ ధరించినవారు కేవలం ఒక ‘తవాఫ్ మాత్రమే చేసారు. [25] (బు’ఖారీ, ముస్లిమ్)
2557 – [ 3 ] ( متفق عليه ) (2/787)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: تَمَتَّعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ حَجَّةِ الْوَدَاعِ بِالْعُمْرَةِ إِلَى الْحَجِّ فَسَاقَ مَعَهُ الْهَدْيَ مِنْ ذِي الْحُلَيْفَةِ وَبَدَأَ فَأَهَلَّ بِالْعُمْرَةِ ثُمَّ أَهَلَّ بِالْحَجِّ فَتَمَتَّعَ النَّاُس مَعَ النَّبِيَّ صلى الله عليه وسلم بِالْعُمْرَةِ إِلَى الْحَجِّ . فَكَانَ مِنَ النَّاسِ مَنْ أَهْدَى وَمِنْهُمْ مَنْ لَمْ يُهْدِ فَلَمَّا قَدِمَ النَّبِيُّ صلى الله عليه وسلم مَكَّةَ قَالَ لِلنَّاسِ: “مَنْ كَانَ مِنْكُمْ أَهْدَى فَإِنَّهُ لَا يَحِلُّ مِنْ شَيْءٍ حَرُمَ مِنْهُ حَتَّى يَقْضِيَ حَجَّهُ وَمَنْ لَمْ يَكُنْ مِنْكُمْ أَهْدَى فَلْيَطُفْ بِالْبَيْتِ وَبِالصَّفَا وَ الْمَرْوَةِ وَلْيُقَصِّرْوَلْيَحْلِلْ ثُمَّ لِيُهِلَّ بِالْحَجِّ وَلْيُهِدْ فَمَنْ لَمْ يَجِدْ هَدْيًا فَلْيَصُمْ ثَلَاثَةَ أَيَّامٍ فِيْ الْحَجِّ وَسَبْعَةً إِذَا رَجَعَ إِلَى أَهْلِهِ”. فَطَافَ حِيْنَ قَدِمَ مَكَّةَ وَاسْتَلَمَ الرُّكْنَ أَوَّلَ شَيْءٍ ثُمَّ خَبِّ ثَلَاثَةَ أَطْوَافٍ وَمَشَى أَرْبَعًا فَرَكَعَ حِيْنَ قَضَى طَوَافَهُ بَالْبَيْتِ عِنْدَ الْمَقَامِ رَكْعَتَيْنِ ثُمَّ سَلَّمَ فَانْصَرَفَ فَأَتَى الصَّفَا فَطَافَ بِالصَّفَا وَالْمَرْوَةِ سَبْعَةَ أَطْوَافٍ ثُمَّ لَمْ يَحِلَّ مِنْ شَيْءٍ حَرُمَ مِنْهُ حَتَّى قَضَى حَجَّهُ وَنَحَرَهَدْيَهُ يَوْمَ النَّحْرِ وَ أَفَاضَ فَطَافَ بِالْبَيْتِ ثُمَّ حَلَّ مِنْ كُلِّ شَيْءٍ حَرُمَ مِنْهُ وَفَعَلَ مِثْلَ مَا فَعَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مَنْ سَاقَ الْهَدْيَ مِنَ النَّاسِ .
2557. (3) [2/787– ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ‘హజ్జతుల్ విదా‘లో, ‘ఉమ్‌రహ్ మరియు ‘హజ్జ్లను ఒకే ఇహ్రాంతో చేసి లాభం పొందారు. అంటే ప్రవక్త (స) ఒకే ఇహ్రాంతో, ముందు ‘ఉమ్‌రహ్ ఆ తరువాత ‘హజ్జ్ చేసారు. జు‘ల్’హులైఫహ్ నుండి తమ వెంట ఖుర్‌బానీ జంతువును తీసుకొని బయలుదేరారు. ప్రజలు ప్రవక్త (స) వెంట ‘హజ్జ్ మరియు ‘ఉమ్‌రహ్‌ను కలిపి ఆచరించి లాభం పొందారు. కొందరు తమవెంట ఖుర్బానీ జంతువును తీసుకువచ్చారు. కొందరు తీసుకు రాలేదు. ప్రవక్త (స) మక్కహ్ చేరిన తర్వాత ప్రజలతో, ”ఖుర్‌బానీ జంతువును తెచ్చిన వారు ‘హజ్జ్ పూర్తయ్యే వరకు ఇ’హ్‌రామ్ తొలగించరాదని, మరియు తమ వెంట ఖుర్‌బానీ జంతువును తీసుకురాని వారు బైతుల్లాహ్ ‘తవాఫ్ చేసి ‘సఫా మర్వాల సయీ’ చేసి, తల వెంట్రుకలు గీయించి ఇ’హ్‌రామ్ తొలగించాలి,” అని (అంటే ‘హజ్జె తమత్త‘ఉ చేయాలని) అన్నారు. ”ఆ తరువాత మళ్ళీ ‘హజ్జ్ ఇ’హ్‌రామ్ ధరించి ఖుర్‌బానీ జంతువును తీసుకొని వెళ్ళి 10వ తేదీన జి’బ’హ్‌చేయాలి. ఖుర్బానీ జంతువు లభించని వారు ‘హజ్జ్ కాలంలో 3 ఉపవాసాలు, ఇంటికి వెళ్ళి 7 ఉపవాసాలు అంటే మొత్తం 10 ఉపవాసాలు ఉండాలి,” అని అన్నారు. ప్రవక్త (స) మక్కహ్ లో ప్రవేశించిన తర్వాత అన్నిటి కంటే ముందు ‘తవాఫ్ చేసారు. అంటే అన్నిటికంటే ముందు ‘హజరె అస్వద్‌ను ముద్దుపెట్టు కున్నారు. ఆ తరువాత ‘తవాఫ్‌లోని మొదటి మూడు ప్రదక్షిణాల్లో వేగంగా నడిచారు (రమల్ చేసారు). మిగిలిన 4 ప్రదక్షణాల్లో సాధారణంగా నడిచారు. ‘తవాఫ్‌ను పూర్తిచేసిన తర్వాత మఖామె ఇబ్రాహీమ్ వద్దకు వచ్చి రెండు రకాతులు నమా’జ్ చదివారు. నమా’జు ముగించిన తర్వాత ‘సఫా కొండవైపు బయలు దేరారు. ‘సఫా-మర్వాల మధ్య 7 ప్రదక్షిణాలు చేసారు. ఆ తరువాత ఇ’హ్‌రామ్ తొలగించ కుండా ‘హజ్జ్ చేసారు. ఖుర్బానీ రోజు ఖుర్బానీ చేసారు. 10వ తేదీన తవాఫె ఇఫా’దహ్ చేసి. ‘హలాల్ అయ్యారు. అదేవిధంగా తమ వెంట ఖుర్‌బానీ జంతువును తీసుకొని వచ్చిన వారు కూడా ప్రవక్త (స) చేసినట్లే చేసారు.” [26] (బు’ఖారీ, ముస్లిమ్)
2558 – [ 4 ] ( صحيح ) (2/788)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَذِهِ عُمْرَةٌ اسْتَمْتَعْنَا بِهَا فَمَنْ لَمْ يَكُنْ عِنْدَهُ الْهَدْيُ فَلْيَحِلَّ الْحِلَّ كُلَّهُ. فَإِنَّ الْعُمْرَةَ قَدْ دَخَلَتْ فِيْ الْحَجِّ إِلَى يَوْمِ الْقِيَامَةِ“. رَوَاهُ مُسْلِمٌ.
2558. (4) [2/788 –దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ‘హజ్జతుల్ విదా’లో ఇలా ప్రవచించారు, ”ఇది ‘ఉమ్‌రహ్. మేము దీని ద్వారా లాభం పొందాము. ఖుర్‌బానీ జంతువు తీసుకు రాని వారు ఇ’హ్‌రామ్ తొలగించాలి. ఎందు కంటే ‘హజ్ కాలంలో ‘ఉమ్‌రహ్ చేయడం తీర్పుదినం వరకు నిర్ణయించడం జరిగింది. [27] (ముస్లిమ్)
—–
هَذَا الْبَابُ خَالٍ عَنِ الْفَصْلِ الثَّانِيْ.
ఇందులో రెండవ విభాగం లేదు
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
2559 – [ 5 ] ( صحيح ) (2/788)
عَنْ عَطَاءٍ قَالَ: سَمِعْتُ جَابِرَ بْنَ عَبْدِ اللهِ فِيْ نَاسٍ مَعِيَ قَالَ: أَهْلَلْنَا أَصْحَابَ مُحَمَّدٍ بِالْحَجِّ خَالِصًا وَحْدَهُ. قَالَ عَطَاءٌ: قَالَ جَابِرٌ: فَقَدِمَ النَّبِيُّ صلى الله عليه وسلم صُبْحَ رَابِعَةٍ مَضَتْ مِنْ ذِيْ الْحَجَّةِ فَأَمَرَنَا أَنْ نَحِلَّ. قَالَ عَطَاءُ: قَالَ:”حُلُّوْا وَأَصِيْبُوْا النِّسَاءَ“. قَالَ عَطَاءٌ: وَلَمْ يَعْزِمْ عَلَيْهِمْ وَلَكِنْ أَحَلَّهُنَّ لَهُمْ فَقُلْنَا لَمَّا لَمْ يَكُنْ بَيْنَنَا وَبَيْنَ عَرْفَةَ إِلَّا خَمْسَ. أَمَرَنَا أَنْ نُفْضِيَ إِلَى نِسَائِنَا فَنَأْتِيَ عَرَفَةَ تَقْطُرُ مَذَاكِيْرُنَا الْمَنِيَّ. قَالَ: يقُولُ جابرُ بيَده كأَنِّي أنظُر إلى قوله بيدِه يحركها. قال فقام النبيُّ صلى الله عليه و سلم غينا. فقال: “قَدْ عَلِمْتُمْ أَنِّيْ أَتْقَاكُمْ لِلّهِ وَأَصْدَقُكُمْ وَأَبَرُّكُمْ وَلَوْلَا هَدْيِيْ لَحَلَلْتُ كَمَا تَحِلوْنَ وَلَوْ اِسْتَقْبَلْتُ مِنْ أَمْرِي مَا اسْتَدْبَرْتُ لَمْ اَسْقِ الْهَدْيَ فَحِلُّوْا”. فَحَلَلْنَا وَسَمِعْنَا وَأَطَعْنَا. قَالَ عَطَاءٌ: قَالَ جَابِرٌ: فَقَدِمَ عَليٌّ مِنْ سِعَايَتِهِ فَقَالَ: بِمَ أَهْلَلْتَ؟ قَالَ بِمَا أَهَلَّ بِهِ النَّبِيُّ صلى الله عليه وسلم. فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فَأَهْدِ وَامْكُثْ حَرَامًا”. قَالَ: وَأَهْدَى لَهُ عَلِيٌّ هَدْيًا. فَقَالَ سُرَاقَةُ بْنُ مَالِكٍ بْنُ جُعشُمٍ: يَا رَسُوْلَ اللهِ أَلِعَامِنَا هَذَا أَمْ لِاَبَدٍ؟ قَالَ: “لِأَبَدٍ“. رَوَاهُ مُسْلِمٌ.
2559. (5) [2/788 –దృఢం]
‘అ’తా’ (ర) కథనం: నా వెంట కొంతమంది ఉన్నారు. వారిలో జాబిర్ బిన్ ‘అబ్దుల్లాహ్‌ను, ఇలా అంటూ ఉండగా నేనువిన్నాను, ”మేము అంటే ప్రవక్త (స) అనుచరులు ‘హజ్జ్ ఇ’హ్‌రామ్ మాత్రమే ధరించాము.” అప్పుడు ‘అ’తా’ ఇలా అన్నారు, జాబిర్ కథనం: ”జి’ల్ ‘హిజ్జహ్ 4వ తేదీ ఉదయం ప్రవక్త (స) మక్కహ్ విచ్చేసి ఇ’హ్‌రామ్ తొలగించమని మమ్మల్ని ఆదేశించారు. అది విన్న ‘అ’తా,’ ‘అందరూ ఇ’హ్‌రామ్ తొలగించండి, స్త్రీల వద్దకు కూడా వెళ్ళండి, వారితో సంభోగం కూడా చేయండి,’ అని అన్నారని భావించాడు. ‘అ’తా’ ఇలా అన్నారు, ”ప్రవక్త (స) స్త్రీల వద్దకు వెళ్ళమని చెప్పింది ఆదేశంగా కాదని, వాళ్ళు కూడా ధర్మసమ్మతం అయిపోతారని తెలియజేయటానికే,’ అని చెప్పారు. ఈ ఆదేశం విని మేము ఆశ్చర్యం వ్యక్తపరిచాము. మాలో మేము మినాకు ‘అరఫాత్‌కు మధ్య కేవలం 5 రోజులు మాత్రమే ఉన్నాయి కాని ప్రవక్త (స) స్త్రీలతో సంభోగం చేసిన తరువాతనే ‘అరఫాత్‌కు వెళ్ళమని ఆదేశించారు. అయితే అజ్ఞానకాలంలో దీన్ని చెడుగా భావించేవారు. ‘అ’తా’ ఇలా చెప్పినప్పుడు, జాబిర్ (ర) తన చేతిని కదుపుతూ మర్మాంగము నుండి వీర్యము కారటాన్ని గురించి సైగ చేసారు. అప్పుడు నేను అతని చేతి వైపు చూస్తున్నాను అని అన్నారు. జాబిర్ ఇలా అన్నారు, ”మా ఆశ్చర్యాన్ని గురించి ప్రవక్త (స)కు తెలిసింది. ప్రవక్త (స) మా మధ్య ప్రసంగిస్తూ, ‘నేను మీ అందరి కంటే అల్లాహ్‌కు భయపడేవాడను, మీ అందరికంటే సత్య వంతుడను, మీ అందరికంటే సజ్జనుడను,’ అని మీ అందరికీ తెలుసు. ఒకవేళ నా వెంట ఖుర్‌బానీ జంతువు లేకుండా ఉంటే ఇంకా నేను ఖిరాన్ సంకల్పం చేసి ఉండకపోతే మీలాగే నేను కూడా ఇహ్‌రామ్ తొలగించే వాడిని. నాకు తరువాత తెలిసిన విషయం ముందు తెలిసి ఉంటే నేను నా వెంట ఖుర్‌బానీ జంతువును తీసుకొని వచ్చేవాడిని కాదు. సరే, మీరు ఇహ్‌రామ్ తొలగించండి,’ అని అన్నారు. మేమందరం ఇహ్‌రామ్ తొలగించాం. ప్రవక్త (స) ఆదేశాన్ని విన్నాం, పాలించాం. ‘అ’తా’ ఇలా అన్నారు. జాబిర్ ఇలా అన్నారు, ” ‘అలీ తన ప్రాంతం నుండి తిరిగి వచ్చారు. అంటే ‘అలీ యమన్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అక్కడి నుండి ‘హజ్జ్ చేయడానికి మక్కహ్ వచ్చారు. ప్రవక్త (స) ‘అలీ (ర)తో. ‘నీవు ఎలాంటి ఇ’హ్‌రామ్ ధరించావు, అని ప్రశ్నించారు. దానికి ‘అలీ(ర) సమాధానం ఇస్తూ, ‘ప్రవక్త (స) ధరించిన విధంగానే నేనూ ఇహ్‌రామ్ ధరించాను,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) అతన్ని, ‘ఖుర్‌బానీ జంతువును నీ వెంట ఉంచు ఇహ్‌రామ్‌లోనే ఉండు. ఎందుకంటే నేను ఖారిన్ నీవు కూడా ఖారిన్‌వే’ అని అన్నారు. జాబిర్ ఇలా అన్నారు, ” ‘అలీ(ర) ప్రవక్త (స) కోసం ఖుర్‌బానీ జంతువును తీసుకొని వచ్చారు. సురాఖహ్ బిన్ మాలిక్ బిన్ జు’అషుమ్ ప్రవక్త(స)తో, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ఈ ఆదేశం కేవలం మా కోసం ఈ సంవత్సరం మాత్రమేనా లేక ఇది శాశ్వత ఆదేశమా?’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త(స), ‘ఇది శాశ్వతమైన ఆదేశం,’ అని అన్నారు. [28] (ముస్లిమ్)
2560 – [ 6 ] ( صحيح ) (2/789)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا أَنَّهَا قَالَتْ: قَدِمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِأَرْبَعٍ مَضِيْنَ مِنْ ذِي الْحَجَّةِ أَوْ خَمْسٍ فدَخَلَ عَلَيَّ وَهُوَ غَضْبَانٌ فَقُلْتُ: مَنْ أَغْضَبَكَ يَا رَسُوْلَ اللهِ أَدْخَلَهُ اللهُ النَّارَ.قَالَ: “أَوْ مَا شَعُرْتَ أَنِّيْ أَمَرْتُ النَّاسَ بِأَمْرٍ فَإِذَا هُمْ يَتَرَدَّدُوْنَ وَلَوْ أَنِّيْ اسْتَقْبَلْتُ مِنْ أَمْرِيْ مَا اسْتَدْبَرْتُ مَا سُقْتُ الْهَدْيَ مَعِيَ حَتَّى أَشْتَرِيَهُ ثُمَّ أُحِلُّ كَمَا حَلُّوْا“. رَوَاهُ مُسْلِمٌ.
2560. (6) [2/789 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) జి’ల్ ‘హిజ్జహ్ 4 లేదా 5వ తేదీన నా వద్దకు వచ్చారు. ఆ సమయంలో ప్రవక్త (స) కోపంతో నిండి ఉన్నారు. అప్పుడు నేను, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! మీకు కోపం తెప్పించిన వారిని అల్లాహ్ (త) నరకంలో వేయుగాక!’ అని విన్నవించుకున్నాను. అప్పుడు ప్రవక్త (స), ” ‘ఆయి’షహ్ (ర) నీకీ సంగతి తెలియదా! నేను ప్రజలకు ఒక పనిచేయమని ఆదేశిస్తే వారు దానిలో సందిగ్ధంలో పడిపోయారు. అంటే నేను వారిని ‘ఉమ్‌రహ్ చేసిన తర్వాత ఇ’హ్‌రామ్ తొలగించమని ఆదేశించాను. ఒకవేళ నాకు తర్వాత తెలిసిన పర్యవసానం ముందే తెలిసి ఉంటే నేను నా వెంట ఖుర్‌బానీ జంతువును తీసుకొని వచ్చేవాడిని కాను. ఇక్కడి నుండే కొనుక్కునే వాడిని మరియు ఇతరులు ఇహ్‌రామ్ తొలగించి నట్లు ఇహ్‌రామ్ తొలగించే వాడిని,’ అని అన్నారు. [29] (ముస్లిమ్)
=====
3- بَابٌ دُخُوْلِ مَكَّةَ وَالطَّوَافُ
3. మక్కహ్ ప్రవేశం మరియు ‘తవాఫ్
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2561 – [ 1 ] ( متفق عليه ) (2/790)
عَنْ نَافِعٍ قَالَ: إِنَّ ابْنَ عُمَرَ كَانَ لَا يَقْدَمُ مَكَّةَ إِلَّا بَاتَ بِذِيْ طُوى حَتَّى يُصْبِحَ وَيَغْتَسِلُ وَيُصِلّيَ فَيَدْخُلَ مَكةَ نَهَارًا. وَإِذَا نَفَرَ مِنْهَا مَرَّ بِذِيْ طُوّى وَبَاتَ بِهَا حَتَّى يُصْبِحَ وَيَذْكُرُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَفْعَلُ ذَلِكَ.
2561. (1) [2/790–ఏకీభవితం]
నా’ఫె (ర) కథనం: ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ మక్కహ్ వచ్చినపుడు రాత్రి జీ‘ ‘తువాలో గడిపి ఉదయం అక్కడే స్నానం చేసి ఫజ్‌ర్ నమా’జు ఆచరించి పగటి పూట మక్కహ్ లో ప్రవేశించేవారు. అదేవిధంగా ‘హజ్జ్ చేసి తిరిగి జీ’ ‘తువా మార్గాన వెళ్ళినపుడు అక్కడ రాత్రి గడిపి తెల్లవారిన తర్వాత అక్కడి నుండి బయలు దేరేవారు. అంతేకాదు, ప్రవక్త (స) కూడా ఇలాగే చేసేవారని కూడా చెప్పేవారు. [30] (బు’ఖారీ, ముస్లిమ్)
2562 – [ 2 ] ( متفق عليه ) (2/790)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: إِنَّ النَّبِيَّ صلى الله عليه وسلم لَمَّا جَاءَ إِلَى مَكَّةَ دَخَلَهَا مِنْ أَعْلَاهَا وَخَرَجَ مِنْ أَسْفَلِهَا.
2562. (2) [2/790–ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ‘హజ్జతుల్ విదా’లో మక్కహ్ వచ్చినపుడు ఎత్తు ప్రాంతం వైపు నుండి అంటే జీ‘ ‘తువా వైపు నుండి ప్రవేశించారు. తిరిగి వెళ్ళి నపుడు మక్కహ్ పల్లపు ప్రాంతం వైపు నుండి వెళ్ళారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2563 – [ 3 ] ( متفق عليه ) (2/790)
وَعَنْ عُرْوَةَ بْنِ الزُّبَيْرِ قَالَ: قَدْ حَجَّ النَّبِيُّ صلى الله عليه وسلم فَأَخْبَرَتْنِيْ عَائِشَةَ أَنَّ أَوَّلَ شَيْءٍ بَدَأَ بِهِ حِيْنَ قَدِمَ مَكَّةَ أَنَّهُ تَوَضَّأَ ثُمَّ طَافَ بِالْبَيْتِ ثُمَّ لَمْ تَكُنْ عُمْرَةٌ ثُمَّ حَجَّ أَبُوْ بَكْرٍ فَكَانَ أَوَّلُ شَيْءٍ بَدَأَ بِهِ الطَّوَافُ بِالْبَيْتِ ثُمَّ لَمْ تَكُنْ عُمْرَةٌ ثُمَّ عُمَرُ ثُمَّ عُثْمَانُ مِثْلَ ذَلِكَ.
2563. (3) [2/790–ఏకీభవితం]
‘ఉర్‌వహ్ బిన్ ‘జుబైర్ (ర) కథనం: ప్రవక్త (స) ‘హజ్జతుల్ విదా’ ఆచరించారు. ‘ఆయి’షహ్ (ర) నాతో ఇలా అన్నారు, ”ప్రవక్త (స) మక్కహ్లో ప్రవేశించిన తర్వాత అన్నిటి కంటే ముందు వు’దూ చేసారు. ఆ తరువాత బైతుల్లాహ్ ‘తవాఫ్ చేసారు. ఇంకా ‘ఉమ్‌రహ్ అవలేదు. అంటే ప్రవక్త (స) తన ‘హజ్జ్ను రద్దుచేసి ‘ఉమ్‌రహ్ చేయలేదు. పైగా ‘ఉమ్‌రహ్‌ను ‘హజ్జ్ను, కొనసాగించారు. అంటే ‘హజ్జ్ మరియు ‘ఉమ్‌రహ్ రెండూ కలిపిచేసారు. ప్రవక్త (స) తరువాత అబూ బకర్ (ర) ‘హజ్జ్ చేసారు. మక్కహ్లో వచ్చిన తర్వాత అన్నిటికంటే ముందు బైతుల్లాహ్ ‘తవాఫ్ చేసారు. ఆ తరువాత ‘ఉమ్‌రహ్ ఇంకా కాలేదు. అంటే ‘హజ్జ్ను వదలి ‘ఉమ్‌రహ్ చేయలేదు. పైగా ‘హజ్జ్ మరియు ‘ఉమ్‌రహ్ రెంటినీ ఒకేసారి చేసారు. ఆ తరువాత ‘ఉమర్, ‘ఉస్మాన్ మొదలైనవారు కూడా ఈ విధంగానే చేసారు. [31] (బు’ఖారీ, ముస్లిమ్)
2564 – [ 4 ] ( متفق عليه ) (2/790)
وَعَنِ ابْنِ عُمَرَرَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا طَافَ فِيْ الْحَجِّ أَوِالْعُمْرَةِ مَا يَقْدُمُ سَعَى ثَلَاثَةَ أَطْوَافٍ وَّ مَشَى أَرْبَعَةً ثُمَّ سَجَدَ سَجْدَتَيْنِ ثُمَّ يَطُوْفُ بَيْنَ الصَّفَا وَالْمَرْوَةِ.
2564. (4) [2/790– ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్(ర) కథనం: ప్రవక్త (స) ‘హజ్జ్ ‘ఉమ్‌రహ్‌ల ‘తవాఫ్ చేసినపుడు మొదటి 3 ప్రదక్షిణల్లో వేగంగా నడిచేవారు. మిగిలిన 4 ప్రదక్షిణల్లో మామూ లుగా నడిచేవారు. ‘తవాఫ్ ముగించిన మఖామె ఇబ్రాహీమ్ దగ్గర రెండు రక’అతులు సునన్ తులు ఆచరించేవారు. ఆతరువాత ‘సఫా మర్వాల మధ్య స’యీ’ చేసేవారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2565 – [ 5 ] ( صحيح ) (2/791)
وَعَنْهُ قَالَ: رَمَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنَ الْحَجَرِ إلى الحجري ثَلَاثًا. وَمَشَى أَرْبَعًا وَكَانَ يَسْعَى بِبَطْنِ الْمَسِيْلِ إِذَا طَافَ بَيْنَ الصَّفَا وَالْمَرْوَةِ. رَوَاهُ مُسْلِمٌ.
2565. (5) [2/791–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ‘హజరె అస్వద్ నుండి ‘హజరె అస్వద్ వరకు, మొదటి 3 ప్రదక్షిణల్లో పరుగెత్తారు (వేగంగా నడి చారు). మిగిలిన 4 ప్రదక్షిణల్లో మెల్లగా మామూలుగా నడిచారు. మరియు ‘సఫా మర్వాల మధ్య స’యీ చేసినపుడు ఆకుపచ్చని చిహ్నాల మధ్య వేగంగా నడిచారు. (ముస్లిమ్)
2566 – [ 6 ] ( صحيح ) (2/791)
وَعَنْ جَابِرٍ قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم لَمَّا قَدِمَ مَكَّةَ أَتَى الْحَجَرَ فَاسْتَلَمَهُ ثُمَّ مَشَى عَلى يَمِيْنِهِ فَرَمَلَ ثَلَاثًا وَمَشَى أَرْبَعًا. رَوَاهُ مُسْلِمٌ.
2566. (6) [2/791- దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) మక్కహ్ విచ్చేసి ‘తవాఫ్ ప్రారంభించినపుడు ‘హజరె అస్వద్ను ముద్దు పెట్టుకున్నారు. ఇంకా తన కుడివైపు నుండి ‘తవాఫ్ ప్రారంభించారు. ‘తవాఫ్‌లోని మొదటి 3 ప్రదక్షిణాల్లో వేగంగా మిగిలిన 4 ప్రదక్షిణల్లో మెల్లగా నడిచారు. (ముస్లిమ్)
2567 – [ 7 ] ( صحيح ) (2/791)
وَعَنِ الزُّبَيْرِ بْنِ عَرَبِيٍّ قَالَ: سَأَلَ رَجُلٌ ابْنَ عُمَرَ عَنِ اسْتِلَامِ الْحَجَرِ فَقَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَسْتَلِمُهُ وَيُقَبِّلُهُ. رَوَاهُ الْبُخَارِيُّ.
2567. (7) [2/791–దృఢం]
‘జుబైర్ బిన్ ‘అరబీ (ర) కథనం: ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్‌ను ఒక వ్యక్తి ‘హజరె అస్వద్‌ను ముద్దుపెట్టు కోవటం గురించి ప్రశ్నించాడు. ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ సమాధానం ఇస్తూ, ”ప్రవక్త (స) ‘హజరె అస్వద్‌ను చేత్తో తాకుతూ, ముద్దుపెట్టు కుంటూ ఉండగా నేను చూసాను,” అని సమాధానం ఇచ్చారు. (బు’ఖారీ)
2568 – [ 8 ] ( متفق عليه ) (2/791)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: لَمْ أَرَ النَّبِيَّ صلى الله عليه وسلم يَسْتَلِمُ مِنَ الْبَيْتِ إِلَّا الرُّكْنَيْنِ الْيَمَانِيَّيِّنِ.
2568. (8) [2/791–ఏకీభవితం]
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ను నేను కేవలం ‘హజరె అస్వద్ మరియు రుక్నె యమానీలను ఇస్తీలామ్ చేస్తూ ఉండగా చూసాను. [32] (బు’ఖారీ, ముస్లిమ్)
2569 – [ 9 ] (متفق عليه) (2/791)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: طَافَ النَّبِيُّ صلى الله عليه وسلم فِيْ حَجَّةِ الْوَدَاعِ عَلَى بَعِيْرٍ يَّسْتَلِمُ الرُّكْنَ بِمِحْجَنٍ.
2569. (9) [2/791– ఏకీభవితం]
ఇబ్నె అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ‘హజ్జతుల్ విదా‘లో ఒంటెపై కూర్చొని ‘తవాఫ్ చేసారు. ఇంకా ‘హజరె అస్వద్‌ను చేతికర్ర ద్వారా ఇస్తీలామ్ చేసారు.[33] (బు’ఖారీ, ముస్లిమ్)
2570 – [ 10 ] ( صحيح ) (2/791)
وَعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم طَافَ بِالْبَيْتِ عَلَى بَعِيْرٍ كُلَّمَا أَتَى عَلَى الرُّكْنَ أَشَارَ إِلَيْهِ بِشَيْءٍ فِيْ يَدِهِ وَكَبَّرَ. رَوَاهُ الْبُخَارِيُّ.
2570. (10) [2/791–దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ఒంటెపై కూర్చొని ‘తవాఫ్ చేసారు. ‘హజరె అస్వద్ వద్దకు వచ్చినపుడు తన చేతిలో ఉన్న బెత్తంతో ‘హజరె అస్వద్ వైపు సైగచేసి దాన్ని ముద్దుపెట్టుకొని ‘అల్లాహు అక్బర్’ అని అన్నారు. (బు’ఖారీ)
2571 – [ 11 ] ( صحيح ) (2/791)
وَعَنْ أَبِيْ الطُّفَيْلِ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَطُوْفُ بِالْبَيْتِ وَيَسْتَلِمُ الرُّكْنَ بِمِحْجَنٍ مَعَهُ وَيُقبِّلُ الْمِحْجَنَ. رَوَاهُ مُسْلِمٌ.
2571. (11) [2/791–దృఢం]
ఆబుత్తుఫైల్ (ర) కథనం: ప్రవక్త (స) ను బైతుల్లాహ్ ‘తవాఫ్ చేస్తూ ఉండగా, ‘హజరె అస్వద్ వైపు బెత్తంతో సైగచేసి బెత్తాన్ని ముద్దుపెట్టుకుంటూ ఉండగా నేను చూసాను. (ముస్లిమ్)
2572 – [ 12 ] ( متفق عليه ) (2/791)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: خَرَجْنَا مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم لَا نَذْكُرُ إِلَّا الْحَجَّ فَلَمَّا كُنَّا بِسَرَفٍ طَمِثْتُ فَدَخَلَ النَّبِيُّ صلى الله عليه وسلم وَأَنَا أَبْكِيْ فَقَالَ: “لَعَلَّكِ نَفِسْتِ؟” قُلْتُ: نَعَمْ قَالَ: “فَإِنَّ ذَلِكَ شَيْءٌ كَتَبَهُ اللهُ عَلَى بِنَاتِ آدَمَ فَافْعَلِيْ مَا يَفْعَلُ الْحَاجُّ غَيْرَ أَنْ لَا تَطُوْفِيْ بِالْبَيْتِ حَتَّى تَطْهُرِيْ”.
2572. (12) [2/791 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: మేము కేవలం ‘హజ్జ్ సంకల్పంతో ప్రవక్త (స) వెంట బయలుదేరాము. ‘హజ్జ్ ఇ’హ్‌రామ్ ధరించాము. మేము ‘సరిఫ్ ప్రాంతం చేరిన వెంటనే నాకు బహిష్టు స్థితి ప్రారంభ మైంది. ప్రవక్త (స) నా వద్దకు వచ్చారు. ఇటు నేను బహిష్టు స్థితి ప్రారంభమయి నందుకు ఏడుస్తున్నాను. ప్రవక్త (స), ‘నీకు బహిష్టు స్థితి ప్రారంభమయినట్టుంది,’ అని అడిగారు. నేను, ‘అవునని,’ అన్నాను. ప్రవక్త (స), ”మరేం ఫర్వాలేదు. అల్లాహ్ (త) బహిష్టు స్థితిని స్త్రీలందరిపై విధించాడు. ‘హాజీలు చేసే పనులన్నిటినీ నువ్వూ చేయి. కాని బైతుల్లాహ్ ‘తవాఫ్ మాత్రం పరిశుద్ధత పొందనంత వరకు చేయకు,” అని ఓదార్చారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2573 – [ 13 ] ( متفق عليه ) (2/792)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: بَعَثَنِيْ أَبُوْ بَكْرٍ فِيْ الْحَجَّةِ الَّتِيْ أَمَّرَهُ النَّبِيُّ صلى الله عليه وسلم عَلَيْهَا قَبْلَ حَجَّةِ الْوِدَاعِ يَوْمَ النَّحْرِ فِيْ رَهْطٍ أَمَرَهُ أَنْ يُّؤَذِّنَ فِيْ النَّاسِ: “أَلَا لَا يَحُجَّ بَعْدَ الْعَامِ مُشْرِكٌ وَلَا يَطُوْفَنَّ بِالْبَيْتِ عُرْيَانٌ”.
2573. (13) [2/792 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక ‘హజ్జ్లో అబూ బకర్‌ను ‘హజ్జ్ నాయకునిగా నియమించి పంపారు. అది ‘హజ్జతుల్ విదాకి ఒక సంవత్సరం ముందు ‘హజ్జ్. అబూ బకర్ నన్ను ఖుర్‌బానీ (10వ) తేదీన ఇలా ప్రకటించమని పంపారు, ”ఈ సంవత్సరం తరువాత ఇక ముందు ఏ అవిశ్వాసి ‘హజ్జ్ చేయలేడు, నగ్నంగా బైతుల్లాహ్ ‘తవాఫ్ కూడా చేయలేడు.” [34] (బు’ఖారీ, ముస్లిమ్)
—–
الْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2574 – [ 14 ] ( لم تتم دراسته ) (2/792)
عَنِ الْمُهَاجِرِ الْمَكِّيْ قَالَ: سُئِلَ جَابِرٌ عَنِ الرَّجُلِ يَرَى الْبَيْتَ يَرْفَعُ يَدَيْهِ. فَقَالَ قَدْ حَجَجْنَا مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم فَلَمْ نَكُنْ نَّفْعَلُهُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.
2574. (4) [2/792–అపరిశోధితం]
ముహాజిర్ మక్కీహ్ కథనం: జాబిర్ (ర)ను ”ఎవరైనా బైతుల్లాహ్‌ను చూచి తన రెండు చేతులు ఎత్తాలా లేదా?” అని ప్రశ్నించడం జరిగింది. జాబిర్ (ర) సమాధానం ఇస్తూ, ”మేము ప్రవక్త (స) వెంట వెళ్ళి ‘హజ్జ్ చేసాము కాని అలా చేయలేదు,” అని సమాధానం ఇచ్చారు. (తిర్మిజి’, అబూ దావూద్)
అంటే బైతుల్లాహ్ (క’అబహ్)ను చూచినప్పుడు చేతులు ఎత్తే అవసరం లేదు.
2575 – [ 15 ] ( لم تتم دراسته ) (2/792)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: أَقْبَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَدَخَلَ مَكَّةَ فَأَقْبَلَ إِلَى الْحَجَرِفَاسْتَلَمَهُ ثُمَّ طَافَ بِالْبَيْتِ ثُمَّ أَتَى الصَّفَا فَعَلَاهُ حَتَّى يَنْظُرَ إِلَى الْبَيْتِ فَرَفَعَ يَدَيْهِ فَجَعَلَ يَذْكُرُ اللهَ مَا شَاءَ وَيَدْعُوْ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2575. (15) [2/792 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ‘హజ్జ్ కోసం వచ్చారు. మక్కహ్లో ప్రవేశించి ‘హజరె అస్వద్ వైపు తిరిగి దాన్ని ముద్దుపెట్టుకున్నారు. ఆ తర్వాత బైతుల్లాహ్ ‘తవాఫ్ చేసారు. ఆ తరువాత ‘సఫా పైకి వచ్చారు. కొంత ఎత్తుకు ఎక్కి బైతుల్లాహ్ వైపు చూడసాగారు. దు’ఆ కోసం రెండు చేతులు ఎత్తారు. అల్లాహ్ ధ్యానంలో అంటే తక్‌బీర్, త’హ్‌లీల్ మొదలైనవి చేస్తూ ఉన్నారు. తమకు తోచిన విధంగా దు’ఆ చేసారు. (అబూ దావూద్)
2576 – [ 16 ] ( صحيح ) (2/792)
وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “الطَّوَافُ حَوْلَ الْبَيْتِ مِثْلَ الصَّلَاةِ إِلَّا أَنَّكُمْ تَتَكَلَّمُوْنَ فِيْهِ فَمَنْ تَكَلَّمَ فِيْهِ فَلَا يَتَكَلَّمَنَّ إِلَّا بِخَيْرٍ“. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ وَذَكَرَ التِّرْمِذِيُّ جَمَاعَةً وَقَّفُوْهُ عَلَى ابْنِ عَبَّاسٍ.
2576. (16) [2/792 –దృఢం]
ఇబ్నె అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: బైతుల్లాహ్ కు ‘తవాఫ్ చేయడం నమా’జ్ వంటిది, అయితే మీరు ‘తవాఫ్‌లో మాట్లాడవచ్చు. ఏం మాట్లాడినా మంచి విషయాలే మాట్లాడాలి.” [35] (తిర్మిజి’, నసాయి’, దారమి)
2577 – [ 17 ] ( صحيح ) (2/792)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “نَزَّلَ الْحَجَرُ الْأَسْوَدُ مِنَ الْجَنَّةِ وَهُوَ أَشَدُّ بَيَاضًا مِّنَ اللَّبَنِ فَسَوَّدَتْهُ خَطَايَا بَنِيْ آدَمَ” .رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ .
2577. (17) [2/792– దృఢం]
ఇబ్నె అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”హజరె అస్వద్ స్వర్గం నుండి వచ్చినపుడు పాలకంటే తెల్లగా ఉండేది. కాని మానవుల పాపాలు దాన్ని నల్లగా మార్చివేసాయి.” [36] (అ’హ్మద్, తిర్మిజి’ / ప్రామాణికం-దృఢం)
2578 – [ 18 ] ( صحيح ) (2/793)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ الْحَجَرِ : “وَاللهِ لَيَبْعَثَنَّهُ اللهُ يَوْمَ الْقِيَامَةِ لَهُ عَيْنَانِ يُبْصِرُ بِهِمَا وَلِسَانٌ يَنْطِقُ بِهِ يَشْهَدُ عَلَى مَن اسْتَلَمَهُ بِحَقٍّ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.
2578. (18) [2/793–దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ‘హజరె అస్వద్ గురించి మాట్లాడుతూ అల్లాహ్ సాక్షి! తీర్పు దినం నాడు అల్లాహ్ (త) దాన్ని లేపినపుడు దానికి రెండు కళ్ళుంటాయి. వాటి ద్వారా అది చూస్తుంది. దానికి నోరు ఉంటుంది. చిత్తశుద్ధితో ముద్దు పెట్టుకున్న వారి గురించి సాక్ష్యం ఇస్తుంది. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దారమి)
2579 – [ 19 ] ( لم تتم دراسته ) (2/793)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ الرُّكْنَ وَالْمَقَامَ يَاقُوْتَتَانِ مِنْ يَاقُوْتِ الْجَنَّةِ طَمَسَ اللهُ نُوْرَهُمَا وَلَوْ لَمْ يَطْمِسْ نُوْرَهُمَا لَأَضَاءَ مَا بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
2579. (19) [2/793 –అపరిశోధితం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ” ‘హజరె అస్వద్ మరియు మఖామె ఇబ్రాహీమ్ స్వర్గంలోని ముత్యాల్లోని రెండు ముత్యాలు. అల్లాహ్ (త) వాటి వెలుగును హరించి వేసాడు. ఒకవేళ వాటి వెలుగు హరించకుండా ఉంటే తూర్పు పడమరల వరకు వెలుగు ఉండేది. (తిర్మిజి’)
2580 – [ 20 ] ( صحيح ) (2/793)
وَعَنْ عُبَيْدِ بْنِ عُمَيْرٍ: أَنَّ ابْنَ عُمَرَ كَانَ يُزَاحِمُ عَلَى الرُّكْنَيْنِ زِحَامًا مَا رَأَيْتُ أَحَدًا مِّنْ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يُزَاحِمُ عَلَيْهِ قَالَ: إِنْ أَفْعَلْ فَإِنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ مَسْحَهُمَا كَفَّارَةٌ لِلْخَطَايَا” .وَسَمِعْتُهُ يَقُوْلُ: “مَنْ طَافَ بِهَذَا الْبَيْتِ أُسْبُوْعًا فَأحْصَاهُ كَانَ كَعِتْقِ رَقَبَةٍ”. وَسَمِعْتُهُ يَقُوْلُ: “لَا يَضَعُ قَدْمًا وَلَا يَرْفَعُ أُخْرَى إِلَّا حَطَّ اللهُ عَنْهُ بِهَا خَطِيْئَةً وَكَتَبَ لَهُ بِهَا حَسَنَةً“. رَوَاهُ التِّرْمِذِيُّ.
2580. (20) [2/793 -దృఢం]
‘ఉబైద్ బిన్ ‘ఉమైర్ (ర) కథనం: ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ రెంటిని అంటే ‘హజరె అస్వద్ మరియు రుక్నె యమానీలను ముద్దుపెట్టుకోవటానికి ప్రజల జన సమూహంలో దూసుకు పోయేవారు. ప్రవక్త అనుచరుల్లో ఇతరుల్ని ఈ విధంగా దూసుకుపోవడం నేను చూడలేదు. అంటే రెంటినీ ముద్దు పెట్టుకునే వారు. ప్రజల సందడిలో దూసుకుపోవటానికి అతను కష్టాన్ని శ్రమను లెక్కచేసేవారుకారు. ఇంకా, ”నేనిలా చేస్తున్నా నంటే ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఎందుకంటే ప్రవక్త (స)ను కూడా ఈ విధంగా చేయడం నేను చూసి ఉన్నాను.” ప్రవక్త (స), ”ఈ రెంటినీ ముట్టుకోవటం, తాకటం పాపాల పరిహారం,” అని అన్నారు. ‘ఇంకా ప్రవక్త (స) ఈ బైతుల్లాహ్ చుట్టు 7 ప్రదక్షణల ‘తవాఫ్ చేసిన వారికి ఒక బానిసను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుందని, ‘హాజీ ‘హజ్జ్ కోసం అడుగు ముందుకు వేసినా, లేదా ‘తవాఫ్ కోసం అడుగు ముందుకు వేసినా అల్లాహ్ (త) అతని పాపాలను క్షమిస్తాడు. ఇంకా అతని ఖాతాలో పుణ్యాలు చేర్చుతాడు,’ అని ప్రవచించారని” అన్నారు. (తిర్మిజి’)
2581 – [ 21 ] ( لم تتم دراسته ) (2/793)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ السَّائِبِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ مَا بَيْنَ الرُّكْنَيْنِ: (رَبَّنَا آتِنَا فِيْ الدُّنْيَا حَسَنَةً وَّفِيْ الْآخِرَةِ حَسَنَةً وَّقِنَا عَذَابَ النَّارِ2: 201) رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2581. (21) [2/793 –అపరిశోధితం]
బిన్ సాయి’బ్ (ర) కథనం: ప్రవక్త (స)ను ‘హజరె అస్వద్ మరియు రుక్నె యమానీల మధ్య ఈ దు’ఆ పఠిస్తూ ఉండటం, నేను విన్నాను.
”రబ్బనా ఆతినా ఫిద్దునియా ‘హసనతన్ వ ఫిల్ ఆ‘ఖిరతి ‘హసనతన్ వఖినా ‘అజాబన్నార్.” (సూ. అల్ బఖరహ్, 2:201) — ‘ఓ అల్లాహ్! మాకు ప్రపంచం లోనూ మంచిని ప్రసాదించు, పరలోకంలోనూ మంచిని ప్రసాదించు. ఇంకా నరకశిక్ష నుండి మమ్మల్ని రక్షించు.” (అబూ దావూద్)
అంటే ‘తవాఫ్ చేసినపుడు ప్రవక్త (స) రుక్నె యమానీ మరియు ‘హజరె అస్వద్‌ల మధ్య ఈ దు’ఆను పఠించేవారు.
2582 – [ 22 ] ( لم تتم دراسته ) (2/793)
وَعَنْ صَفِيَّةَ بِنْتَ شَيْبَةَ قَالَتْ: أَخْبَرَتْنِيْ بِنْتُ أَبِيْ تُجْرَاةً قَالَتْ: دَخَلْتُ مَعَ نِسْوَةٍ مِّنْ قُرَيْشٍ دَارَآلِ أَبِيْ حُسَيْنٍ نَنْظُرُ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَهُوَ يَسْعَى بَيْنَ الصَّفَا وَالْمَرْوَةِ فَرَأَيْتُهُ يَسْعَى وَإِنَّ مِئْزَرَهُ لِيَدُوْرُمِنْ شِدَّةِ السعْيِ وَسَمِعْتُهُ يَقُوْلُ: “اِسْعُوْا فَإِنَّ اللهَ كَتَبَ عَلَيْكُمُ السَّعْيِ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَةِ وَرَوَاهُ أَحْمَدُ مَعَ اخْتِلَافٍ .
2582. (22) [2/793– అపరిశోధితం]
‘సఫియ్య బిన్‌తె షయ్‌బహ్ కథనం: నాకు అబీ తుజ్‌రాహ్ కూతురు ఇలా తెలిపింది, ”నేను కొంతమంది ఖురైష్ మహిళల వెంట ‘హుసైన్ కుటుంబం వారి ఇంటికి ప్రవక్త (స)ను ‘సఫా మర్వాల మధ్య సయీ’ చేస్తూ ఉండగా చూద్దామని వెళ్లాను. అక్కడ నేను ప్రవక్త (స)ను స’యీ చేస్తూ ఉండగా చూసాను. ప్రవక్త (స) వేగంగా నడవటం వల్ల ఆయన లుంగీ తిరుగుతూ ఉంది. ఇంకా ప్రవక్త(స), ”ప్రజలారా! స’యీ చేయండి, ఎందుకంటే అల్లాహ్ (త) స’యీని మీపై విధించాడు,” అని అన్నారు. [37] (షర్’హు స్సున్నహ్, అ’హ్మద్)
2583 – [ 23 ] ( لم تتم دراسته ) (2/794)
وَعَنْ قَدَامَةَ بْنِ عَبْدِ اللهِ بْنِ عَمَّارٍ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَسْعَى بَيْنَ الصَّفَا وَالْمَرْوَةِ عَلَى بَعِيْرٍ لَا ضَرْبَ وَلَا طَرْدَ وَلَا إِلَيْكَ إِلَيْكَ. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.
2583. (23) [2/794 –అపరిశోధితం]
ఖుదామహ్ బిన్ ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్మార్ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ‘సఫా మర్వాల మధ్య ఒంటెపై కూర్చొని స’యీ చేస్తూ ఉండగా చూసాను. అందులో ప్రవక్త (స) వేగంగా నడవటానికి ఒంటెను కొట్టనూ లేదు. తోలనూ లేదు. ప్రక్కకు జరగండి పిల్లలూ, ప్రక్కకు జరగండి పిల్లలూ అని అననూ లేదు. (షర’హుస్సున్నహ్)
2584 – [ 24 ] ( لم تتم دراسته ) (2/794)
وَعَنْ يَعْلَى بْنِ أُمَيَّةَ قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم طَافَ بِالْبَيْتِ مُضْطَبِعًا بِبُرْدٍ أَخْضَرَ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَالدُّارَمِيُّ.
2584. (24) [2/794- అపరిశోధితం]
య’అలా బిన్ ఉ’మయ్య (ర) కథనం: ప్రవక్త (స) బైతుల్లాహ్ ‘తవాఫ్ ఒక ఆకుపచ్చని వస్త్రం కప్పుకొని ఇ’ద్’తి బ’అతో చేసారు. [38] (తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్, దారమి)
2585 – [ 25 ] ( لم تتم دراسته ) (2/794)
وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَأَصْحَابَهُ اعْتَمَرُوْا مِنَ الْجِعِرَّانَةِ فَرَمَلُوْا بِالْبَيْتِ ثَلَاثًا وَجَعَلُوْا أَرْدِيتَهُمْ تَحْتَ آبَاطِهِمْ ثُمَّ قَذَفُوْهَا عَلَى عَوَاتِقِهِمُ الْيُسْرَى. روَاهُ أَبُوْ دَاوُدَ.
2585. (25) [2/794– అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) జి‘అర్రానహ్ నుండి ‘ఉమ్‌రహ్ చేసారు. బైతుల్లాహ్ ‘తవాఫ్‌లో మొదటి 3 ప్రదక్షిణల్లో రమ్‌ల్ చేసారు. ఇంకా తన దుప్పటిని కుడిచంక క్రింది నుండి తీసి ఎడమ భుజంపై వేసుకున్నారు. (అబూ దావూద్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
2586 – [ 26 ] ( متفق عليه ) (2/794)
عَنِ ابْنِ عُمَرَ قَالَ: مَا تَرَكْنَا اسْتِلَامَ هَذَيْنِ الرُّكْنَيْنِ: الْيَمَانِيِّ وَالْحَجَرِ فِيْ شِدَّةٍ وَلَا رَخَاءٍ مُنْذُ رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَسْتَلِمُهُمَا.
2586. (26) [2/794– ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: మేము, ప్రవక్త (స) ‘హజరె అస్వద్ రుక్నె యమానీలను ఇస్తీలామ్ చేస్తూ ఉండగా చూసినప్పటి నుండి ఆ రెంటి ఇస్తీలామ్ చేయడం వదల లేదు. (బు’ఖారీ, ముస్లిమ్)
2587 – [ 27 ] ( متفق عليه ) (2/795)
وَفِيْ رِوَايَةٍ لَهُمَا: قَالَ نَافِعٌ: رَأَيْتُ ابْنَ عُمَرَ يَسْتَلِمُ الْحَجَرَ بِيَدِهِ ثُمَّ قَبَّلَ يَدَهُ وَقَالَ: مَا تَرَكْتُهُ مُنْذُ رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَفْعَلُهُ.
2587. (27) [2/795- ఏకీభవితం]
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: నాఫె (ర) కథనం, ” ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) ‘హజరె అస్వద్‌ను తన చేత్తో ఇస్తీలామ్ చేసి, తన చేతిని ముద్దుపెట్టుకోవటం చూసాను. ఇంకా, ‘ప్రవక్త (స)ను ఇలా చేస్తూ ఉండగా చూసాను, అందువల్ల నేను కూడా ఇలాగే చేస్తున్నాను, ఎప్పుడు ఇలా చేయడం మానను” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2588 – [ 28 ] ( متفق عليه ) (2/795)
وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: شَكَوْتُ إِلَى رَسُوْلِ الله صلى الله عليه وسلم أَنِّيْ أَشْتَكِيْ. فَقَالَ: “طُوْفِيْ مِنْ وَّرَاءِ النَّاسِ وَأَنْتَ رَاكِبَةٌ” فَطُفْتُ وَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ إِلَى جَنْبِ الْبَيْتِ يَقْرَأُ بِ (الطُّوْرِ وَكِتَابٍ مَّسْطُوْرٍ-52).
2588. (28) [2/795– ఏకీభవితం]
ఉమ్మె సలమహ్ (ర) కథనం: నేను ‘హజ్జ్లో నా వ్యాధిని గురించి ప్రవక్త(స)ను విన్నవించుకున్నాను. అది విన్న ప్రవక్త (స), ‘నువ్వు వాహనంపై ఎక్కి ప్రజల్ని అనుసరిస్తూ బైతుల్లాహ్ ‘తవాఫ్ చేసుకో’ అని అన్నారు. నేను అలాగే ‘తవాఫ్ చేసాను. నేను ‘తవాఫ్ చేస్తున్నప్పుడు ప్రవక్త (స) బైతుల్లాహ్‌కు ఒక మూలలో నమా’జు చేస్తున్నారు. అందులో సూరహ్ ‘తూర్ (52) పఠించారు.” (బు’ఖారీ, ముస్లిమ్)
2589 – [ 29 ] ( متفق عليه ) (2/795)
وَعَنْ عَابِسِ بْنِ رَبِيْعَةَ قَالَ: رَأَيْتُ عُمَرَ يُقَبِّلُ الْحَجَرَ وَيَقُوْلُ: إِنِّيْ لَأَعْلَمُ أَنَّكَ حَجَرٌ مَا تَنْفَعُ وَلَا تَضُرُّ. وَلَوْلَا أَنِّيْ رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يُقَبّلُ مَا قَبَّلْتُكَ.
2589. (29) [2/795 –ఏకీభవితం]
‘ఆబిస్ బిన్ రబీ’అహ్ (ర) కథనం: నేను ‘ఉమర్ (ర) ను ‘హజరె అస్వద్‌కు ముద్దుపెట్టుకుంటూ ఉండగా, ఇంకా, ”ఓ ‘హజరె అస్వద్ నిస్సందేహంగా నీవు రాయివి, నీవు ఎవ్వరికీ లాభనష్టాలు చేకూర్చలేవని నాకు తెలుసు. ఒకవేళ నేను ప్రవక్త (స) నిన్ను ముద్దుపెట్టుకుంటూ ఉండగా చూసి ఉండకపోతే, నేను, నీకు ఎన్నడూ ముద్దు పెట్టుకునే వాడిని కాను,” అని అనటం చూసాను. [39] (బు’ఖారీ, ముస్లిమ్)
2590 – [ 30 ] ( ضعيف ) (2/795)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “وُكِّلَ بِهِ سَبْعُوْنَ مَلَكًا”.يَعْنِيْ الرُّكْنَ الْيَمَانِيَ” .فَمَنْ قَالَ: “اَللّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْعَفْوَ وَالْعَافِيَةَ فِي الدُّنْيَا وَالْآخِرَةِ. رَبَّنَا آتِنَا فِيْ الدُّنْيَا حَسَنَةً وَّ فِيْ الْآخرَةِ حَسَنَةً وَّقِنَا عَذَابَ النَّارِ“، قَالُوْا: آمِيْنَ“. رَوَاهُ ابْنُ مَاجَهُ
2590. (30) [2/795– బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, రుక్నె యమానీపై 70 వేల మంది దైవదూతలు నియమించబడ్డారు. ఎవరు ఈ దు’ఆ పఠిస్తే వారి పట్ల ‘ఆమీన్’ అని అంటారు. ఆ దు’ఆ ఇది:
”అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్‘అఫ్వ వల్ ‘ఆఫియత ఫిద్దునియా వల్ఆ‘ఖిరహ్. రబ్బనా ఆతినా ఫిద్దునియా ‘హసనతన్ వఫిల్ఆ‘ఖిరతి ‘హసనతన్ వఖినా ‘అజా బన్నార్.” — — ‘ఓ అల్లాహ్ నేను నిన్ను క్షమాపణ మరియు ఉభయ లోకాల క్షేమాన్ని అర్థిస్తున్నాను. ఓ నా ప్రభూ! నీవు మాకు ఇహలోకం లోనూ మంచిని ప్రసాదించు మరియు పరలోకంలోనూ మంచిని ప్రసాదించు మరియు అగ్ని శిక్ష నుండి మమ్మల్ని కాపాడు.’ (ఇబ్నె మాజహ్)
2591 – [ 31 ] ( لم تتم دراسته ) (2/795)
وَعَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ طَافَ بِالْبَيْتِ سَبْعًا وَلَا يَتَكَلَّمُ إِلَّا ب: “سُبْحَانَ اللهِ، وَالْحَمْدُ لِلّهِ، وَلَا إِلَهَ إِلَّا اللهُ وَاللهُ أَكْبَرُ، وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ“. مُحِيَتْ عَنْهُ عَشْرُسَيِّئَاتٍ وَكُتِبَ لَهُ عَشْرُحَسَنَاتٍ وَ رُفِعَ لَهُ عَشْرُدَرَجَاتٍ. وَمَنْ طَافَ فَتَكَلَّمَ وَهُوَ فِيْ تِلْكَ الْحَالِ خَاضَ فِيْ الرَّحْمَةِ بِرِجْلَيْهِ كَخَائِضِ الْمَاءِ بِرِجْلَيْهِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.
2591. (31) [2/795– అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా బైతుల్లాహ్ చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి, అందులో కేవలం,
”సుబ్’హానల్లాహ్, వల్’హమ్‌దులిల్లాహ్ వ లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వలా ‘హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్.” అని పఠిస్తే, అతని 10 సంవత్సరాల పాపాలు క్షమించబడతాయి. 10 పుణ్యాలు లిఖించబడతాయి. 10 తరగతులు ఉన్నతం చేయబడతాయి. అదేవిధంగా ఎవరైనా ‘తవాఫ్‌లో ఈ వచనాలే పలికి ఉంటే, అతడు నీటిలో తన రెండు కాళ్ళు ముంచినట్లు కారుణ్య సముద్రంలో మునిగి పోతాడు. (ఇబ్నె మాజహ్)
=====
4- بَابُ الْوُقُوْفِ بِعَرَفَةَ
4. అరఫాత్ మైదానంలో ఆగటం
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2592 – [ 1 ] ( متفق عليه ) (2/796)
عَنْ مُحَمَّدِ بْنِ أَبِيْ بَكْر الثَّقَفِيِّ أَنَّهُ سَأَلَ أَنَسُ بْنَ مَالِكٍ وَهُمَا غَادِيَانِ مِنْ مِّنى إِلَى عَرْفَةَ: “كَيْفَ كُنْتُمْ تَصْنَعُوْنَ فِيْ هَذَا الْيَوْمَ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم؟“ فَقَالَ: كَانَ يُهِلُّ مِنَّا الْمُهِلُّ فَلَا يُنْكَرُ عَلَيْهِ وَيُكَبِّرُ الْمُكَبِّرُ مِنَّا فَلَا يُنْكَرُ عَلَيْهِ.
2592. (1) [2/795 –ఏకీభవితం]
ము’హమ్మద్ బిన్ అబీ బక్‌ర్ స’ఖఫీ మరియు అనస్ బిన్ మాలిక్ ఇద్దరూ ఉదయం పూట మినా నుండి అరఫాత్ వెళుతున్నారు. అప్పుడు ము’హమ్మద్ బిన్ అబీ బక్‌ర్ స’ఖఫీ, అనస్ బిన్ మాలిక్‌ను, ”మీరు ఈ రోజున ప్రవక్త (స) వెంట ఏం చేసేవారు,” అని ప్రశ్నించారు. దానికి అతను సమాధానం ఇస్తూ, ‘మాలో కొందరు లబ్బయి’క్, లబ్బయి’క్ అని అంటూ ఉంటారు. వారిని వారించడం జరుగదు. మరి కొందరు “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని అనేవారు. వారినీ వారించడం జరగలేదు,” అని అన్నారు. [40] (బు’ఖారీ, ముస్లిమ్)
2593 – [ 2 ] ( صحيح ) (2/796)
وَعَنْ جَابِرٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “نَحَرْتُ هَهُنَا وَمِنى كُلُّهَا مَنْحَرٌ فَانْحَرُوْا فِيْ رِحَالِكُمْ. وَوَقَفْتُ هَهُنَا وَعَرَفَةُ كُلُّهَا مَوْقِفٌ. وَوَقَفْتُ هَهُنَا وَجَمْعٌ كُلُّهَا مَوْقِفٌ“. رَوَاهُ مُسْلِمٌ.
2593. (2) [2/796 –దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”నేను ఈ ప్రదేశంలో ఖుర్‌బానీ చేసాను, మినాలో ఎక్కడైనా ఖుర్బానీ చేయవచ్చును. కనుక మీరు మీ షామియానాల్లో ఖుర్‌బానీ చేసుకోవచ్చు. అయితే నేను ఈ ప్రదేశంలో ఆగాను, ‘అరఫాత్‌మైదానంలో ఎక్కడైనా ఆగవచ్చును. నేను ఈ ప్రదేశంలో విడిదిచేసాను. అయితే ముజ్’దలిఫా మైదానంలో ఎక్కడైనా విడిది చేయవచ్చును.” (ముస్లిమ్)
2594 – [ 3 ] ( صحيح ) (2/796)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَا مِنْ يَوْمٍ أَكْثَرَمِنْ أَنْ يُّعْتِقَ اللهُ فِيْهِ عَبْدًا مِّنَ النَّارِمِنْ يَوْمِ عَرَفَةَ وَإِنَّهُ لَيَدْنُوْ ثُمَّ يُبَاهِيْ بِهِمُ الْمَلَائِكَةً فَيَقُوْلُ: مَا أَرَادَ هَؤُلَاءِ”. رَوَاهُ مُسْلِمٌ.
2594. (3) [2/796– దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ‘అరఫాత్ నాడు అల్లాహ్ (త) అనేకమందిని నరకం నుండి విడుదల చేస్తాడు. ఈ విధంగా ఇతర దినాల్లో విడుదల చేయడు. ఈ రోజు అల్లాహ్ (త) తన దాసులకు దగ్గరౌతాడు. వీరి గురించి దైవదూతల్లో గర్వంగా చెప్పుకుంటాడు. ఇంకా ఈ ‘హజ్జ్ చేసిన వారు ఏం కోరుకుంటున్నారు, అంటే వీరు కోరుతున్నవన్నీ ప్రసాదిస్తాను, ఇంకా, ‘వీరిని క్షమించివేస్తాను, ‘ అని అంటాడు. (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2595 – [ 4 ] ( صحيح ) (2/797)
عَنْ عَمْرِو بْنِ عَبْدِ اللهِ بْنِ صَفْوَانَ عَنْ خَالٍ يَقَالُ لَهُ يَزِيْدُ بْنُ شَيْبَانَ قَالَ: كُنَّا فِيْ مَوْقِفٍ لَّنَا بِعَرَفَةَ يُبَاعِدُهُ عَمْرٌو مِّنْ مَّوْقِفِ الْإِمَامِ جِدًّا فَأَتَانَا ابْنُ مِرْبَعِ الْأَنْصَارِيُّ فَقَالَ: إِنِّيْ رَسُوْلُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. يَقُوْلُ لَكُمْ: “قِفُوْا عَلَى مَشَاعِرِكُمْ فَإِنَّكُمْ عَلَى إِرْثٍ مِنْ إِرْثِ أَبِيْكُمْ إِبْرَاهِيْمَ عَلَيْهِ السَّلَامُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.
2595. (4) [2/797– దృఢం]
‘అమ్ర్ బిన్ ‘అబ్దుల్లాహ్ బిన్ ‘సఫ్వాన్ తన మామ గారైన య’జీద్ బిన్ షైబాన్ ద్వారా పేర్కొన్నారు: మేము ‘అరఫాత్‌లో మా స్థానంలో నిలబడి ఉన్నాం. ‘అమ్ర్ ఉల్లేఖన కర్త, ‘వీరు ఇమామ్ నిలబడి ఉన్న ప్రదేశానికి దూరంగా నిలబడి ఉన్నారు,’ అని అన్నారు. అదే సమయంలో మా వద్దకు ఇబ్ను మిర్బ’అ అ’న్సారీ వచ్చి నేను ప్రవక్త (స) సందేశహరునిగా మీ వద్దకు వచ్చాను. ప్రవక్త (స), ‘మీరు ‘అరఫాత్‌లో ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండని, ఎందుకంటే మీరు మీ తండ్రి ఇబ్రాహీమ్ (అ) వారసత్వ సంపదపై ఉన్నారని,’ అన్నారు,” అని చెప్పారు. [41] (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’, ఇబ్నె మాజహ్)
2596 – [ 5 ] ( لم تتم دراسته ) (2/797)
وَعَنْ جَابِرٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “كُلُّ عَرَفَةَ مَوْقِفٌ وَكُلُّ مِنى مَنْحَرٌ وَكُلُّ الْمُزْدَلِفَةِ مَوْقِفٌ وَكُلُّ فِجَاجِ مَكَّةَ طَرِيْقٌ وَمَنْحَرٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ.
2596. (5) [2/797– అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ” ‘అరఫాత్ మైదానమంతా ఆగే, వేచి ఉండే చోటు, మినా మైదానమంతా ఖుర్‌బానీ చేసే చోటు, ము’జ్‌దలిఫహ్ మైదానమంతా విడిది చేసే చోటు. మక్కహ్ లోని ఏ వీధిలో నైనా ఖుర్బానీ చేయ వచ్చును. అంటే మక్కహ్ లో మార్గాల్లో ఎక్కడైనా ఖుర్బానీ చేయవచ్చును. (అబూ దావూద్, దారమి)
2597 – [ 6 ] ( لم تتم دراسته ) (2/797)
وَعَنْ خَالِدِ بْنِ هَوْذَةَ قَالَ: رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَخْطُبُ النَّاسَ يَوْمَ عَرَفَةَ عَلَى بَعِيْرٍقَائِمًا فِيْ الرِّكَابَيْنِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2597. (6) [2/797 –అపరిశోధితం]
‘ఖాలిద్ బిన్ హౌజ’హ్ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ‘అరఫాత్ మైదానంలో ‘అరఫహ్ నాడు ఒంటెపై కూర్చొని ప్రజల ముందు ప్రసంగిస్తూ ఉండగా చూచాను. అప్పుడు ప్రవక్త (స) ఒంటెపై పాదపీటలపై నిలుచొని ఉన్నారు. [42] (అబూ దావూద్)
2598 – [ 7 ] ( صحيح ) (2/797)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “خَيْرُالدُّعَاءِ دُعَاءُ يَوْمِ عَرَفَةَ وَخَيْرُمَا قُلْتُ أَنَا وَالنَّبِيُّوْنَ مِنْ قَبْلِيْ: “لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيْرٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
2598. (7) [2/797– దృఢం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి, తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అన్నిటి కంటే అత్యుత్తమమైన దు’ఆ ‘అరఫహ్ నాటి దు’ఆ. ఇంకా అన్నిటి కంటే ఉత్తమమైన దు’ఆ నేను చేసినది, నా కంటే ముందు దైవప్రవక్తలందరూ చేసిన దుఆ. అది :
”లా ఇలాహ ఇల్లల్లాహు వ‘హ్‌దహు లా షరీక లహూ లహుల్ ముల్‌కు వల హుల్ ‘హమ్‌దు వహువ ‘అలాకుల్లి షయ్‌ఇన్ ఖదీర్.”(తిర్మిజి’)
2599 – [ 8 ] ( صحيح ) (2/798)
وَرَوَى مَالِكٌ عَنْ طَلْحَةَ بْنِ عُبَيْدِ اللهِ إِلَى قَوْلِهِ: “لَا شَرِيْكَ لَهُ“.
2599. (8) [2/798 –దృఢం]
ఈ ‘హదీసే’, ‘త’ల్ హ బిన్ ‘ఉబైదుల్లాహ్ (ర) ద్వారా కూడా ఉల్లేఖించబడింది. (మాలిక్)
2600 – [ 9 ] ( ضعيف ) (2/798)
لِإِرْسَالِهِ وَعَنْ طَلْحَةَ بْنِ عُبَيْدِ اللهِ بْنِ كَرِيْزٍ. أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَا رُئِيَ الشَّيْطَانُ يَوْمًا هُوَ فِيْهِ أَصْغَرُ وَلَا أَدْحَرَ وَلَا أَحْقَرَ وَلَا أَغْيَظَ مِنْهُ فِيْ يَوْمٍ عَرَفَةَ وَمَا ذَاكَ إِلَّا لِمَا يَرَى مِنْ تَنَزُّلِ الرَّحْمَةِ وَتَجَاوُزِ اللهِ عَنِ الذُّنُوْبِ الْعِظَامِ إِلَّا مَا رُئِيَ يَوْمَ بَدْرٍ“. فَقِيْلَ: مَا رُئِيَ يَوْمَ بَدْرٍ؟ قَالَ:”فَإِنَّهُ قَدْ رَأَى جِبْرِيْلَ يَزَعُ الْمَلَائِكَةَ”. رَوَاهُ مَالِكٌ مُرْسَلًا وَفِيْ شَرْحِ السُّنَّةِ بِلَفْظِ الْمَصَابِيْحِ.
2600. (9) [2/798 – బలహీనం]
‘తల్’హా బిన్ ‘ఉబేదుల్లాహ్ బిన్ కరీ’జ్ కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ‘అరఫహ్ నాడు షై’తాన్ నీచ అవమానానికి గురయినట్లు, తన్ను తాను హీనంగా భావించినట్లు, చాలా కోపానికి గురియినట్లు ఇతర దినాల్లో జరుగదు. అంటే ‘అరఫహ్ నాడు చాలా నీచ అవమానానికి గురయినట్లు కనబడింది. ఎందుకంటే ఆ రోజు షై’తాన్ అల్లాహ్ (త) కారుణ్యం అవతరిస్తూ ఉండగా చూస్తాడు. ఇంకా అల్లాహ్ (త) క్షమాపణను పెద్దపెద్ద పాపాల క్షమాభిక్షను చూచి భరించలేడు. అయితే ఇంతకు ముందు బద్ర్ యుద్ధం నాడు కూడా నీచ పరాభవానికి గురయినట్లు కనబడింది. అప్పుడు జిబ్రీల్ (అ) శత్రువులతో యుద్ధం చేయటానికి పంక్తు లను సరిచేస్తున్నప్పుడు కూడా షై’తాన్ నీచ అవమా నానికి గురయ్యాడు. (మువ’త్తా, షర్’హుస్సున్నహ్ – తాబయీ ప్రోక్తం)
2601 – [10 ] ( لم تتم دراسته ) (2/798)
وَعَنْ جَابِرٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا كَانَ يَوْمُ عَرَفَةَ . إِنَّ اللهَ يَنْزِلُ إِلَى السَّمَاءِ الدُّنْيَا فَيُبَاهِيْ بِهِمُ الْمَلَائِكَةَ فَيَقُوْلُ: انْظُرُوْا إِلَى عِبَادِيْ أَتَوْنِيْ شُعْثًا غًبْرًا ضَاجِّيْنَ مِنْ كُلِّ فَجّ عَمِيْقِ. أُشْهِدُكُمْ أَنِّيْ قَدْ غَفَرْتُ لَهُمْ فَيَقُوْلُ الْمَلَائِكَةُ: يَا رَبِّ فُلَانٌ كَانَ يُرَهِّقُ وَفُلَانٌ وَفُلَانَةٌ قَالَ: يَقُوْلُ اللهُ عَزَّ وَجَلَّ: قَدْ غَفَرْتُ لَهُمْ”. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فَمَا مِنْ يَوْمٍ أَكْثَرَ عَتِيْقًا مِّنَ النَّارِ مِنْ يَوْمِ عَرَفَةَ“. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.
2601. (10) [2/798– అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ (త) ‘అరఫహ్ నాడు ఇహలోక ఆకాశంపై అవతరిస్తాడు. తన హాజీలను గురించి దైవదూతల మధ్య గర్వపడుతూ ఇలా అంటాడు, ”నా ఈ దాసులను చూడండి! మాసిన వెంట్రు కలతో ధూళితో నిండిన శరీరంతో దూర ప్రాంతాల నుండి లబ్బయి’క్ పలుకుతూ, కేకలు వేస్తూ నా సన్నిధిలో హాజర య్యారు. నేను మిమ్మల్ని సాక్షిగా నిలబెడు తున్నాను! నేను వీరందరినీ క్షమించివేసాను.” అది విని దైవదూతలు, ”ఓ అల్లాహ్! ఫలానా వ్యక్తి ఈ పాపం చేసేవాడు, ఫలానా స్త్రీ ఈ పాపానికి పాల్పడేది, తమరు వారిని కూడా క్షమించారా?” అని విన్నవించు కుంటే, అల్లాహ్(త) ”నేనువారిని కూడా క్షమించాను,” అని అంటాడు. ప్రవక్త (స), ” ‘అరఫహ్ దినం కంటే అధిక సంఖ్యలో ఇతర ఏదినాల్లో కూడా అల్లాహ్ ఇంత పెద్ద సంఖ్యలో నరకం నుండి ప్రజలను విడుదల చేయడు,” అని ప్రవచించారు. (షర’హ్ సున్నహ్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
2602 – [ 11 ] ( متفق عليه ) (2/799)
عَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ قُرْيَشٌ وَمَنْ دَانَ دِيْنَهَا يَقِفُوْنَ بِالْمُزْدَلفَةِ وَكَانُوْا يُسَمُّوْنَ الْحُمْسَ. فَكَانَ سَائِرُ الْعَرَبِ يَقِفُوْنَ بِعرِفَةِ. فَلَمَّا جَاءَ الْإِسْلَامُ أَمَرَ اللهُ تَعَالى نَبِيَّهُ صَلى الله عليه وسلم أَنْ يَّأْتِيَ عَرَفَاتٍ فَيَقِفَ بِهَا ثُمَّ يَفِيْضَ مِنْهَا فَذَلَكَ قَوْلُهُ عَزَّ وَجَلَّ: (ثُمَّ أَفِيْضُوْا مِنْ حَيْثُ أَفَاضَ النَّاسُ– 2: 199). متفق عليه.
2602. (11) [2/799 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ఖురైషులు వారి మిత్ర వర్గాల వారు ము‘జ్‌దలిఫాలోనే విడిది చేసేవారు (‘అరఫాత్ వెళ్ళేవారు కాదు) దానికి ‘హుమ్స– అంటే వీరత్వం -అనే పేరు పెట్టారు. ఇతర అరబ్బులు ముందు ‘అరఫహ్లో విడిది చేసి (సూర్యాస్తమయానికి ముందు) అరఫహ్ నుండి బయలు దేరి, ము’జ్ దలిఫహ్ లో రాత్రి గడిపి, (సూర్యుడు ఉదయించిన తరువాత మినా వైపుకు పోయేవారు). ఇస్లామ్ వచ్చిన తర్వాత అల్లాహ్ (త) తన ప్రవక్తను, ”అందరూ వచ్చి ముందు ‘అరఫహ్లో ఆగి (సూర్యాస్తమయం వరకు) వేచి ఉండి, ఆ తరువాత అక్కడి నుండి ము’జ్‌దలిఫహ్ కు వెళ్ళి అక్కడ (రాత్రి) బసచేసి అక్కడి నుండి (ఉషోదయం తరువాత, కానీ సూర్యుడు కనపించక ముందు) మినా / మక్కహ్ వైపుకు పొండి” అని ఆదేశించాడు. అల్లాహ్ (త) ఆదేశం, ”ప్రజలు ఎక్కడి నుండి వెళతారో, మీరూ అక్కడి నుండే వెళ్ళండి.” (సూ. అల్ బఖరహ్, 2:199)కి అర్థం ఇదే. [43] (బు’ఖారీ, ముస్లిమ్)
2603 – [ 12 ] ( ضعيف ) (2/799)
وَعَنْ عَبَّاسِ بْنِ مِرْدَاسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم دَعَا لِأُمَّتِهِ عَشِيَّةَ عَرَفَةَ بِالْمَغْفِرَةِ فَأُجِيْبَ: “إِنِّيْ قَدْ غَفَرْتُ لَهُمْ مَا خَلَا الْمَظَالِمَ فَإِنِّيْ آخِذٌ لِّلْمَظْلُوْمِ مِنْهُ”. قَالَ: “أَيْ رَبِّ إِنْ شِئْتَ أَعْطَيْتَ الْمَظْلُوْمَ مِنَ الْجَنَّةِ وَغَفَرْتَ لِلظَّالِمِ”. فَلَمْ يُجَبْ عَشِيَّتَهُ فَلَمَّا أَصْبَحَ بِالْمُزْدَلِفَةِ أَعَادَ الدُّعَاءَ فَأُجِيْبَ إِلَى مَا سَأَلَ. قَالَ: فَضَحِكَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. أَوْ قَالَ تَبَسَّمَ. فَقَالَ لَهُ أَبُوْ بَكْرٍ وَعُمَرُ: بِأَبِيْ أَنْتَ وَأُمِّيْ إِنَّ هَذِهِ لَسَاعَةٌ مَا كُنْتَ تَضْحَكُ فِيْهَا فَمَا الَّذِيْ أَضْحَكَكَ. أَضْحَكَ اللهُ سِنَّكَ؟ قَالَ: “إِنَّ عَدُوَّ اللهِ إِبْلِيْسَ لَمَّا عَلِمَ أَنَّ اللهَ عَزَّ وَجَلَّ قَدْ اسْتَجَابَ دُعَائِيْ وَغَفَرَ لِأُمَّتِيْ أَخَذَ التُّرَابَ فَجَعَلَ يَحْثُوْهُ عَلَى رَأْسِهِ. وَيَدْعُوْ بِالْوَيْلِ وَالثُّبُوْرِ. فَأَضْحَكَنِيْ مَا رَأَيْتُ مِنْ جَزَعِهِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ وَرَوَى الْبَيْهَقِيُّ فِيْ كِتَابِ الْبَعْثِ وَالنُّشُوْرِ نَحْوَهُ.
2603. (12) [2/799 -బలహీనం]
‘అబ్బాస్ బిన్ మిర్‌దాస్ కథనం: ప్రవక్త(స) ‘అరఫహ్ నాడు అంటే జి’ల్ ‘హిజ్జహ్ 9వ తేదీన సాయంత్రం తన అనుచర సమాజ క్షమాపణ కోసం ప్రార్థించారు. ఇది స్వీకరించబడింది. అంటే, అల్లాహ్ (త), ”అత్యా చారాలు, దాసుల హక్కులు తప్ప మిగిలిన పాపాలన్నిటినీ క్షమించివేసాను – అయితే బాధితుని తరఫున అత్యాచారితో ప్రతీకారం తీర్చుకుంటాను,” అని అన్నాడు. ప్రవక్త (స) ఇలా ప్రార్థించారు, ”ఓ నా ప్రభూ! ఒకవేళ నీవు కోరితే బాధితుడ్ని స్వర్గంలో ప్రవేశింప జేయగలవు. అత్యాచారిని క్షమిం గలవు.” కాని ఈ ప్రార్థన ‘అరఫహ్ సాయంత్రం స్వీకరించబడ లేదు. ము’జ్‌దలిఫహ్ చేరిన తర్వాత ప్రవక్త (స) ఉద యం మళ్ళీ ఇదేవిధంగా దు’ఆ చేసారు. అల్లాహ్ (త), ప్రవక్త (స) దు’ఆను స్వీకరించాడు. అంటే అత్యాచారి పాపాన్ని పశ్చా త్తాపం తర్వాత క్షమించి వేస్తాడు. ఇది తెలిసి ప్రవక్త (స) నవ్వసాగారు లేక చిరునవ్వు నవ్వారు. అది చూసి అబూ బక్ర్, ‘ఉమర్ (ర) ఇలా విన్నవించుకున్నారు, ”మా తల్లి దండ్రులు మీ కోసం త్యాగం గాను. ఓ అల్లాహ్ ప్రవక్తా! ఇది నవ్వే సమయం కాదు, మరి మీ నవ్వుకు కారణం ఏమిటి? తమకు అల్లాహ్ (త) ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంచుగాక! – అంటే అల్లాహ్ (త) ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచు గాక – అన్నారు.” ప్రవక్త (స) సమాధానం ఇస్తూ, ”అల్లాహ్ శత్రువు షైతాన్, అల్లాహ్ (త) నా దు’ఆ స్వీకరించాడని, నా అనుచర సమాజ పాపాలను క్షమించివేసాడని తెలిసి మట్టి తన తలపై వేసుకో సాగాడు. చింతించి పారిపోయాడు. వాడి మతి స్థిమితం తప్పటంచూసి నాకునవ్వువచ్చింది,” అని అన్నారు. (ఇబ్నె మాజహ్, బైహఖీ-బ’అసి వన్నషూర్)
=====
5- بَابُ الدَّفْعِ مِنْ عَرَفَةَ وَالْمُزْدَلِفَةِ
5. అరఫాత్, ము’జ్దలిఫహ్ నుండి తిరుగు ప్రయాణం
దీని వివరాలన్నీ కితాబుల్ ‘హజ్జ్ ప్రారంభంలో పేర్కొనడం జరిగింది. ఇక్కడ కేవలం ‘హదీసు’ల అనువాదం ఇవ్వబడుతోంది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2604 – [ 1 ] ( متفق عليه ) (2/801)
عَنْ هِشَّامِ بْنِ عُرْوَةَ عَنْ أَبِيْهِ قَالَ: سُئِلَ أُسَامَةُ بْنُ زَيْدٍ: كَيْفَ كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَسِيْرُ فِيْ حَجَّةِ الْوَدَاعِ حِيْن دَفَعَ؟ قَالَ: كَانَ يَسِيْرُ الْعَنَقَ فَإِذَا وَجَدَ فَجْوَةً نَّصَّ.
2604. (1) [2/801 –ఏకీభవితం]
హిషామ్ బిన్ ‘ఉర్‌వ తన తండ్రి ‘ఉర్‌వ ద్వారా కథనం: ఉసామా బిన్ ‘జైద్‌ను ప్రవక్త (స),” ‘హజ్జతుల్ వదా’అలో ‘అరఫాత్ నుండి తిరుగు ప్రయాణంలో ఎలా వచ్చారు,” అని ప్రశ్నించడం జరిగింది. దానికి అతను, ”ప్రవక్త(స), ”ఒంటెను మెల్లగా తోలేవారు, మార్గం విశాలంగా ఉన్నచోట, వాహనాన్ని పరిగెత్తించేవారు అని సమాధానం ఇచ్చారు. [44] (బు’ఖారీ, ముస్లిమ్)
2605 – [ 2 ] ( صحيح ) (2/801)
وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّهُ دَفَعَ مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم يَوْمَ عَرَفَةَ فَسَمِعَ النَّبِيُّ صلى الله عليه وسلم وَرَاءَهُ زَجْرًا شَدِيْدًا وَضَرْبًا لِلْإِبْلِ فَأَشَارَ بِسَوْطِهِ إِلَيْهِمْ. وَقَالَ: “يَا أَيُّهَا النَّاسُ عَلَيْكُمْ بِالسَّكِيْنَةِ فَإِنَّ الْبِرَّ لَيْسَ بِالْإِيْضَاعِ“. رَوَاهُ الْبُخَارِيُّ.
2605. (2) [2/801 –దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: అతను ప్రవక్త (స) వెంట ‘అరఫహ్ నాడు బయలుదేరారు. ప్రవక్త (స) తన వెనుక శబ్దాలు కేకలు అరుపులు ఒంటెలను గట్టిగా కొట్టడం విన్నారు. ప్రవక్త (స) తన కొరడాతో వారివైపు సైగ చేస్తూ, ”ప్రజలారా! నిదానంగా శాంతంగా కదలండి ఎందుకంటే వేగంగా పరుగెత్తించడం వల్ల ఎటువంటి లాభము లేదు,” అని అన్నారు. (బు’ఖారీ)
2606 – [ 3 ] ( متفق عليه ) (2/801)
وَعَنْهُ أَنَّ أُسَامَةَ بْنَ زَيْدٍ كَانَ رِدْفَ النَّبِيِّ صلى الله عليه وسلم مِنْ عَرَفَةَ إِلَى الْمُزْدَلَفَةِ ثُمَّ أَرْدَفَ الْفَضْلَ مِنَ الْمُزْدَلِفَةِ إِلَى مِنَى فَكِلَاهُمَا قَالَ: لَمْ يَزَلِ النَّبِيُّ صلى الله عليه وسلم يُلَبِّيْ حَتَّى رَمَى جَمْرَةَ الْعَقَبَةِ.
2606. (3) [2/801 –ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ‘అరఫహ్ నాడు ప్రవక్త (స) ‘అరఫహ్ మైదానం నుండి ము’జ్‌దలిఫహ్ వైపు బయలు దేరారు. వాహనంపై తమ వెనుక ఉసామా బిన్ ‘జైద్‌ను కూర్చోబెట్టుకున్నారు. అయితే ము’జ్ దలిఫహ్ నుండి మినా వైపు బయలుదేరి నపుడు వాహనంపై తమ వెనుక ఫ’దల్ బిన్ ‘అబ్బాస్‌ను కూర్చోబెట్టుకున్నారు. వీరిద్దరూ, ప్రవక్త (స) ఈ ‘హజ్జ్లో నిత్యం లబ్బయి’క్ లబ్బయి’క్ అని పలుకుతూ ఉన్నారు. చివరికి ప్రవక్త (స) జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్కు రమీ చేసారు. అంటే జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్ రమీ వరకు ప్రవక్త (స) లబ్బయి‘క్ అని పలుకుతూ ఉన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) లబ్బయి’క్ పలకటం ఆపివేసారు అని పేర్కొన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2607 – [ 4 ] ( صحيح ) (2/801)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: جَمَعَ النَّبِيُّ صلى الله عليه وسلم الْمَغْرِبَ وَالْعِشَاءَ بِجَمْعٍ كُلُّ وَاحِدَةٍ مِّنْهُمَا بِإِقَامَةٍ وَلَمْ يُسَبِّحْ بَيْنَهُمَا وَلَا عَلَى إِثْرِ كُلِّ وَاحِدَةٍ مِّنْهُمَا. رَوَاهُ الْبُخَارِيُّ .
2607. (4) [2/801–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ‘హజ్జతుల్ విదా’లో ము‘జ్‌దలిఫహ్ లో మ‘గ్‌రిబ్, ‘ఇషా‘లను ఒకే సమయంలో ఆచరించారు. అయితే ప్రతి నమా’జుకు ఇఖామత్ పలుకబడింది. ఈ రెండు నమా’జుల మధ్య ఎటువంటి నఫిల్ నమా’జు చదవలేదు. కేవలం మ’గ్‌రిబ్ మూడు రకాతులు, ఇషా రెండు రకాతులు మాత్రమే చదివారు. (బు’ఖారీ)
2608 – [ 5 ] ( متفق عليه ) (2/802)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: مَا رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم صَلّى صَلَاةً إِلَّا لِمِيْقَاتِهَا إِلَّا صَلَاتَيْنِ: صَلَاةَ الْمَغْرِبِ وَالْعِشَاءِ بِجَمْعٍ وَصَلّى الْفَجْرَ يَوْمَئِذٍ قَبْلَ مِيْقَاتِهَا . متفق عليه.
2608. (5) [2/802 –ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ఏనాడూ ఏ నమా’జునూ దాని సమయం కంటే ఆలస్యంగా చదవటం చూడలేదు. వాస్తవం ఏమిటంటే ప్రతి నమా’జును దాని నిర్ణీత సమయంలో ఆచరించే వారు. కాని ఈ రెండు నమా’జులను అంటే మ’గ్‌రిబ్, ‘ఇషా’ నమా’జులను ము’జ్‌దలిఫహ్ లో ఒకేసారి ఆచరించారు. అంటే మ’గ్‌రిబ్ నమా’జును ‘ఇషా’ సమయంలో ఆచరించారు. దీన్ని జమ్’అ బైనస్సలాతైన్ అంటారు. కాని ఫజ్ర్ నమా‘జును దాని నిర్ణీత సమయం కంటే ముందుగా ఆచరించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2609 – [ 6 ] ( متفق عليه ) (2/802)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: أَنَا مِمَّنْ قَدَّمَ النَّبِيُّ صلى الله عليه وسلم لَيْلَةَ الْمُزْدَلِفَةِ فِيْ ضَعَفَةِ أَهْلِهِ.
2609. (6) [2/802 –ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ము’జ్‌దలిఫహ్ రాత్రికి రాత్రే తన కుటుంబంలోని బలహీనులను మినా పంపివేసారు. నేను కూడా వారిలో ఉన్నాను. [45] (బు’ఖారీ, ముస్లిమ్)
2610 – [ 7 ] ( صحيح ) (2/802)
وَعَنِ الْفَضْلِ بْنِ عَبَّاسٍ وَكَانَ رَدِيْفَ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ قَالَ فِيْ عَشِيَّةِ عَرَفَةَ وَغَدَاةِ جَمْعٍ لِلنَّاسِ حِيْنَ دَفَعُوْا: “عَلَيْكُمْ بِالسَّكِيْنَةِ “وَهُوَ كَافٌّ نَاقَتَهُ حَتَّى دَخَلَ مُحَسَّرًا وَهُوَ مِنْ مِنَى قَالَ: “عَلَيْكُمْ بِحَصَى الْخَذْفِ الَّذِيْ يُرْمَى بِهِ الْجَمْرَةُ”. وَقَالَ: لَمْ يَزَلْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُلَبِّيْ حَتَّى رَمَى الْجَمْرَةَ. رَوَاهُ مُسْلِمٌ.
2610. (7) [2/802 –దృఢం]
ఫ’ద్ల్ బిన్ ‘అబ్బాస్ కథనం: అతను వాహనంపై ప్రవక్త (స) వెనుక కూర్చుని ఉన్నారు. ప్రవక్త (స) ‘అరఫాత్ సాయంత్రం, ము’జ్‌దలిఫహ్ ఉదయం ప్రజలు తమ వాహనాలను వేగంగా తోలటం చూసారు. అప్పుడు ప్రవక్త(స), ”ప్రజలారా! తిరుగు ప్రయాణంలో ప్రశాంతంగా, నిశ్చింతగా అంటే మెల్లమెల్లగా నిదానంగా నడవండి”. అని అన్నారు. ఆ సమయంలో ప్రవక్త (స) తన వాహనాన్ని వేగంగా నడవకుండా ఆపి ఉంచారు. ఆ తరువాత ప్రవక్త (స) ముందుకు సాగి ము‘హస్సిర్ మైదానంలో ప్రవేశించారు. ఇది మినా మైదానంలోని భాగమే. ప్రవక్త (స) ప్రజలతో, ‘ఈ ము’హస్సిర్ మైదానం నుండి చిన్న చిన్న కంకరరాళ్ళు ఏరు కొని వెళ్ళటమే సౌకర్యంగా ఉంటుంది. వీటి ద్వారా జమ్‌రహ్లను కొట్టవచ్చును,’ అని అన్నారు. ప్రవక్త (స) నిరాటంకంగా జమ్‌రహ్‌ను రమీ చేసే వరకు లబ్బయి’క్ అని పలుకుతూ ఉన్నారని ఉల్లేఖనకర్త పేర్కొన్నారు. [46] (ముస్లిమ్)
2611 – [ 8 ] ( لم تتم دراسته ) (2/802)
وَعَنْ جَابِرٍ قَالَ: أَفَاضَ النَّبِيُّ صلى الله عليه وسلم مِنْ جَمْعٍ وَّعَلَيْهِ السَّكِيْنَةُ وَأَمَرَهُمْ بِالسَّكِيْنَةِ وَأَوْضَعَ فِيْ وَادٍي مُحَسَّرٍ. وَأَمَرَهُمْ أَنْ يَّرْمُوْا بِمِثْلِ حَصَى الْخَذْفِ وَقَالَ: “لَعَلِّيْ لَا أَرَاكُمْ بَعْدَ عَامِيْ هَذَا”. لَمْ أَجِدْ هَذَا الْحَدِيْثَ فِيْ الصَّحِيْحَيْنِ إِلَّا فِيْ جَامِعِ التِّرْمِذِيُّ مَعَ تَقْدِيْمٍ وَّتَأْخِيْرٍ.
2611. (8) [2/802 –అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ము’జ్దలిఫహ్ నుండి మినా వెళ్ళినపుడు నిదానంగా ప్రశాంతంగా బయలుదేరారు. ప్రజలకు కూడా నిదానంగా ప్రశాంతంగా వెళ్ళమని ఆదేశించారు. అయితే ప్రవక్త (స) ము’హస్సిర్ లోయలోనికి చేరగానే తన వాహన వేగాన్ని పెంచారు. ఎందు కంటే, అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవాలని. మినా మైదానం లోనికి చేరగానే, ”అందరూ చిన్న (శనగ గింజంత) కంకర రాళ్ళను విసరాలి,” అని ఆదేశించారు. ఇంకా, ”నా నుండి ‘హజ్ద్ ఆదేశాలను నేర్చుకోండి, దీని తర్వాత వచ్చే సంవత్సరం మీతో కలుస్తానో లేదో తెలియదు,” అని అన్నారు. (తిర్మిజి’)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2612 – [ 9 ] ( لم تتم دراسته ) (2/803)
وَعَنْ مُحَمّدِ بْنِ قَيْسِ بْنِ مَخْرَمَةَ قَالَ: خَطَبَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “إِنَّ أَهْلَ الْجَاهِلَيَّةِ كَانُوْا يَدْفَعُوْنَ مِنْ عَرَفَةَ حِيْنَ تَكُوْنُ الشَّمْسُ كَأَنَّهَا عَمَائِمُ الرِّجَالِ فِيْ وُجُوْهِهِمْ قَبْلَ أَنْ تَغْرُبَ. وَمِنَ الْمُزْدَلِفَةِ بَعْدَ أَنْ تَطْلُعَ الشَّمْسُ حِيْنَ تَكُوْنُ كَأَنَّهَا عَمَائِمُ الرِّجَالِ فِيْ وُجُوْهِهِمْ. وَإِنَّا لَا نَدْفَعُ مِنْ عَرَفَةَ حَتَّى تَغْرُبَ الشَّمْسُ ونَدْفَعُ مِنَ الْمُزْدَلِفَةِ قَبْلَ أَنْ تَطْلُعَ الشَّمْسُ هَدْيُنَا مُخَالِفٌ لِهَدْيِ عَبَدَةِ الْأَوْثَانِ وَالشِّرْكِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ وَقَالَ فِيْهِ: خَطَبَنَا وَسَاقَهُ بِنَحْوِهِ.
2612. (9) [2/803– అపరిశోధితం]
ము’హమ్మద్ బిన్ ఖైస్ బిన్ మ’ఖ్‌రమహ్ (ర) కథనం: ప్రవక్త (స) తన ప్రసంగంలో ఇలా ప్రవచించారు, ”అజ్ఞాన కాలంలో ప్రజలు ‘అరఫాత్ నుండి సూర్యుడు ప్రజల తలలపై వారి ముఖాలపై అమామ ఉన్నట్టు అంటే సూర్యాస్తమయానికి ముందే ‘అరఫాత్ నుండి బయలు దేరేవారు. అదే విధంగా ము’జ్దలిఫహ్ నుండి కూడా సూర్యుడు వారి నెత్తిన అంటే వారి ముఖాలపై అమామ ఉన్నట్టు అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత బయలుదేరేవారు. అయితే ముస్లిములు ‘అరఫహ్ నుండి సూర్యాస్తమయం తర్వాత బయలుదేరుతారు. మరియు ము’జ్‌దలిఫా నుండి సూర్యోదయానికి ముందు బయలుదేరుతారు. మన పద్ధతి అవిశ్వాసుల పద్ధతికి వ్యతిరేకంగా ఉంటుంది. (బైహఖీ – షు’అబిల్ ఈమాన్)
2613 – [ 10 ] ( صحيح ) (2/803)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَدَّمَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَيْلَةَ الْمُزْدَلِفَةِ أُغَيْلِمَةَ بَنِيْ عَبْدِ الْمُطَّلِبِ عَلَى حُمُرَاتٍ فَجَعَلَ يَلْطَحُ أَفَخَاذُنَا وَيَقُوْلُ: “أُبَيْنِيَّ لَا تَرْمُوْا الْجَمْرَةَ حَتَّى تَطْلُعَ الشَّمْسُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَه.
2613. (10) [2/803– దృఢం]
ఇబ్నె అబ్బాస్ (ర) కథనం: ము’జ్‌దలిఫహ్ రాత్రి ప్రవక్త (స) మమ్మల్ని అంటే ‘అబ్దుల్ ముత్తలిబ్ సంతానాన్ని గాడిదలపై ఎక్కించి పంపివేసారు. వీడ్కోలు పలికి నపుడు ప్రవక్త (స) ఎంతో ప్రేమ పూర్వకంగా మా తొడలపై చేయి పెట్టి తడుతూ, ”ఓ పిల్లలారా! సూర్యుడు పూర్తిగా ఉదయించనంత వరకు జమరాహ్ల రమీ చేయకండి. అంటే సూర్యోదయం పూర్తి అయిన తర్వాతనే రమీ చేయాలి,” అని అన్నారు. (అబూ దావూద్, నసాయి’, ఇబ్నె మాజహ్)
2614 – [ 11 ] ( لم تتم دراسته ) (2/803)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: أَرْسَلَ النَّبِيُّ صلى الله عليه وسلم بِأُمِّ سَلَمَةَ لَيْلَةَ النَّحْرِ فَرَمَتِ الْجَمْرَةَ قَبْلَ الْفَجْرِ ثُمَّ مَضَتْ فَأَفَاضَتْ وَكَانَ ذَلِكَ الْيَوْمُ الْيَوْمُ الَّذِيْ يَكُوْنُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عِنْدَهَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2614. (11) [2/803 –అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) 10వ తేదీ రాత్రి ఉమ్మె సలమహ్ను రాత్రి సమయంలోనే మినాకు పంపి వేసారు. ఆమె ఉషోదయానికి ముందే జమరహ్లను కంకర రాళ్ళుకొట్టారు. ఆ తరువాత అక్కడి నుండి బయలుదేరి మక్కహ్ వచ్చి ‘తవాఫె ఇఫా’దహ్ చేసారు. అప్పుడు ప్రవక్త (స) ఆమె వద్ద ఉన్నారు. అది ఆమె వంతుదినం.[47] (అబూ దావూద్)
2615 – [ 12 ] (?) (2/804)
وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِىَ اللهُ عَنْهُمَا قَالَ يُلَبِّىْ الْمُقِيْمُ اَوِالْمُعْتَمِرُ حَتَّى يَسْتَلِمَ الْحَجَرَ. رَوَاهُ اَبُوْ دَاؤُدَ وَقَالَ وَرَوَى مَوْقُوْفًا عَلَى ابْنِ عَبَّاسٍ .
2615. (12) [2/804 –? ]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: స్థిరనివాసి లేదా ‘ఉమ్‌రహ్ చేసేవారు ‘హజరె అస్వద్‌ను ఇస్తీలామ్ చేసేవరకు లబ్బయి’క్ పలుకుతూ ఉండాలి. ఇస్తీలామ్ తర్వాత లబ్బయి’క్ పలకటం మానివేయాలి. ఈ ఆదేశం కేవలం ‘ఉమ్‌రహ్ చేసేవారికే. (అబూ దావూద్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
2616 – [ 13 ] ( لم تتم دراسته ) (2/804)
عَنْ يَعْقُوْبَ بْنِ عَاصِمِ بْنِ عُرْوَةَ أَنَّهُ سَمِعَ الشَّرِيْدَ يَقُوْلُ: أَفَضْتُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَمَا مَسَّتْ قَدَمَاهُ الْأَرْضَ حَتَّى أَتَى جَمْعًا. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2616. (13) [2/804– అపరిశోధితం]
య’అఖూబ్ బిన్ ‘ఆ’సిమ్ బిన్ ‘ఉర్‌వహ్ (ర) కథనం: అతను, ప్రవక్త (స) అనుచరులైన షరీద్‌ను ఇలా అంటూ ఉండగా విన్నారు, ”ప్రవక్త (స) వెంట నేనూ ‘అరఫాత్ నుండి తిరిగి వచ్చాను. ము’జ్‌దలిఫహ్ చేరుకునే వరకు, ప్రవక్త (స) అడుగు భూమిపై పడలేదు. [48] (అబూ దావూద్)
2617 – [ 14 ] ( صحيح ) (2/804)
وَعَنِ ابْنِ شِهَابٍ قَالَ: أَخْبَرَنِيْ سَالِمٌ أَنَّ الْحَجَّاجَ بْنَ يُوْسُفَ عَامَ نَزَلَ بِابْنِ الزُّبَيْرٍ. سَأَلَ عَبْدَ اللهِ: كَيْفَ نَصْنَعُ فِيْ الْمَوْقِفِ يَوْمَ عَرَفَةَ؟ فَقَالَ سَالِمٌ إِنْ كُنْتَ تُرِيْدُ السُّنَّةَ فَهَجِّرْ بِالصَّلَاةِ يَوْمَ عَرَفَةَ. فَقَالَ عَبْدُ اللهِ بْنُ عُمَرَ: صَدَقَ إِنَّهُمْ كَانُوْا يَجْمَعُوْنَ بَيْنَ الظُّهْرِ وَالْعَصْرِ فِيْ السُنَّةِ. فَقُلْتُ لِسَالِمٍ: أَفَعَلَ ذَلِكَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم؟ فَقَالَ سَالِمٌ: وَهَلْ يَتَّبَعُوْنَ فِيْ ذَلِكَ إِلَّا سُنَّتَهُ؟ رَوَاهُ الْبُخَارِيُّ.
2617. (14) [2/804 –దృఢం]
ఇబ్నె షిహాబ్ కథనం: సాలిమ్ బిన్ ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ నాకు ఇలా తెలియజేసారు,” ‘హజ్జాజ్ బిన్ యూసుఫ్ అబ్దుల్లాహ్ బిన్ ‘జుబైర్‌ను, అతని మిత్రు లను హతమార్చిన సంవత్సరం, అతడు ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర)ను, ” ‘అరఫహ్లో వేచి ఉండే రోజు ఏ ఏ పనులు చేయాలి,” అని ప్రశ్నించాడు. సాలిమ్ సమాధానం ఇస్తూ, ”ఒకవేళ నీవు ప్రవక్త సాంప్రదా యాన్ని అనుసరించాలనుకుంటే ‘అరఫహ్ నాడు ”జుహ్‌ర్, ‘అ‘స్‌ర్ నమా‘జులను కలిపి త్వరగా చదువు అని అన్నారు. ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) అతని మాటను ధృవీకరిస్తూ, ”ప్రవక్త (స) అనుచరులు ప్రవక్త సాంప్రదాయాన్ని అనుస స్తూ ‘అరఫహ్లో ”జుహ్‌ర్, ‘అ‘స్‌ర్‌లను కలిపి ఒకేసారిచదివేవారు,” అని అన్నారు. ఇబ్నుషిహాబ్ కథనం: నేను సాలిమ్‌ను ప్రవక్త (స), ”ఈ రోజు ఇలాగే చేసారా,” అని అడిగాను . దానికి సాలిమ్, ”ప్రజలు ప్రవక్త (స) సాంప్రదాయాన్ని అనుసరిస్తూ, ఇలా చేసారు,” అని అన్నారు. [49] (బు’ఖారీ)
=====
6- بَابُ رَمْيِ الْجِمَارِ
6. జమరాతుల పై కంకర్రాళ్ళు రువ్వటం
రమ్యి జిమార్: రమీ అంటే కంకరరాయి విసరడం. జిమార్, జమరాత్, జమ్‌రకి బహువచనాలు, అంటే నిర్ణీత స్తంభాలు. జమ్‌ర అంటే కంకరరాయి. ఎందుకంటే జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్, జమ్‌రత్ వుస్తా, జమ్‌రతుల్ ఊ‘లాకు కంకరరాళ్ళు విసరడం జరుగుతుంది. అందువల్ల వీటిని కూడా జమరాత్ లేదా జిమార్ అని అంటారు. మినా మార్గ మధ్యలో ఈ మూడు ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో ఎత్తైన రాతి స్తంభాలు నిలబెట్టబడి ఉన్నాయి. ఈ మూడింటిని జమరాత్ లేదా జిమార్ అంటారు. ప్రతి ఒక్కదాన్ని వేర్వేరుగా జమ్‌రహ్ అంటారు. వీటిలో మక్కహ్ వైపు ఉన్న దాన్ని జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్ మరియు జమ్‌రతుల్ కుబ్‌రా మరియు జమ్‌రతుల్ ఉఖ్‌రా’ అంటారు. మధ్య ఉన్న దాన్ని జమ్‌రతుల్ వుస్‌తా అంటారు. మస్జిదె ఖీఫ్‌కి దగ్గర ఉన్నదాన్ని జమ్‌రతుల్ ఊ’లా అంటారు. ఈ జమరాత్‌లపై కంకరరాళ్ళు విసరడం గురించి ప్రవక్త(స) ఇలా ప్రవచించారు, ”ఇబ్రాహీమ్ (అ) ‘హజ్జ్ విధులను నిర్వర్తించడానికి వచ్చారు. అప్పుడు జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్ వద్ద షై’తాన్ కనబడ్డాడు. ఇబ్రాహీమ్ (అ) వాడికి 7 కంకరరాళ్ళు కొట్టారు. చివరికి వాడు భూమిలో దిగబడి పోయాడు. ఆ తరువాత ఇబ్రాహీమ్ కొంత ముందుకు నడిచారు. జమరతుల్ వుస్‌తహ్ వద్ద షై’తాన్ మళ్ళీ కనబడ్డాడు. అక్కడ కూడా ఇబ్రాహీమ్ (అ) వాడికి 7 కంకర రాళ్ళు కొట్టారు, వాడు భూమిలోకి దిగబడి పోయాడు. మళ్ళీ ఇబ్రాహీమ్ (అ) ముందుకు నడిచారు. మళ్ళీ జమరతుల్ ఊ’లా వద్ద షై’తాన్ కనబడ్డాడు. ఇబ్రాహీమ్ (అ) 7 కంకర రాళ్ళు తీసుకొని కొట్టారు. మళ్ళీ షై’తాన్ భూమిలోకి దిగబడిపోయాడు. ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ”షై’తాన్‌ను కొడుతూ ఉండండి. మీ తండ్రి ఇబ్రాహీమ్ (అ) ధర్మాన్ని అనుస రిస్తూ ఉండండి. (‘స’హీ’హ్ ఇబ్నె ‘ఖుజైమహ్)
కొందరు రమీని తప్పనిసరిగా భావిస్తారు. మాలికీలు రమీ జమ్‌రత్ ఉఖ్‌బ ‘హజ్జ్ విధుల్లో ఒక విధి, దీన్ని నిర్వర్తించక పోతే ‘హజ్జ్ రద్దుచేయబడుతుంది అంటారు. (నైలుల్ అవ్‌తార్)
10వ తేదీన కేవలం జమ్‌రత్ ‘ఉఖ్‌బహ్ కు రమీ చేయబడతుంది. జమ్‌రతు వుస్‌తహ్, జమ్‌రతు ‘ఊలాకు జరుగదు. మినాలో బక్రీదు (‘ఈదుల్ అ‘ద్హా) పండుగ నమా’జు చదవబడదు. జమ్‌రత్ ‘ఉఖ్‌బహ్ రమీ పండుగ రెండు రకాతులకు సరిసమానంగా భావించాలి. కంకరరాళ్ళు కొట్టే సమయం జి’ల్ ‘హిజ్జహ్ 10వ తేదీ సూర్యోదయం తరువాత నుండి సూర్యుడు వాలే వరకు ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సూర్యుడు వాలిన తర్వాత కూడా కొట్టవచ్చును. ప్రవక్త (స) మధ్యాహ్నం వేళ కంకరరాళ్ళు కొట్టారు. జాబిర్ (ర) కథనం, ప్రవక్త (స) జి’ల్ ‘హిజ్జహ్ 10న జమ్‌రత్ ‘ఉఖ్‌బహ్ కు కంకరరాళ్ళు కొట్టారు. తరువాతి తేదీల్లో సూర్యుడు వాలిన తరువాత. (బు’ఖారీ)
ప్రవక్త (స) ఖురైష్ యువకులను, ”సూర్యుడు ఉదయించి తర్వాత కంకరరాళ్ళు కొట్టాలి. స్త్రీలు సూర్యోదయానికి ముందే కంకరరాళ్ళు కొట్ట వచ్చును, ఉమ్మె సలమహ్ చేసినట్లు” అని అన్నారు. (తిర్మిజి’, అబూ దావూద్)
అయితే రమీ జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్ చేసినపుడు లబ్బయి‘క్ ఆపివేయాలి. జమ్‌రత్ ‘ఉఖ్‌బహ్ను వాహనంపై కూర్చొని కొట్టవచ్చు. అయితే ఇతరులకు హాని కలిగించరాదు. మిగిలిన జమరాహ్లను నిలబడి కొట్టటం మంచిది. కుడిచేత్తో రమీ చేయాలి. ఎడమచేత్తో రమీ చేయడం ప్రవక్త (స) సాంప్రదాయానికి వ్యతిరేకం. రమీ చేసేటప్పుడు చంక కనబడినట్లు చేతులు ఎత్తాలి. ఇబ్నె మస్’ఊద్ జమ్‌రహ్ ‘ఉఖ్‌బహ్ వద్దకు చేరి బైతుల్లాహ్‌ను ఎడమ వైపు మినాను కుడి వైపు ఉంచి 7 కంకరరాళ్ళు కొట్టారు. ప్రతి రాయితో ‘అల్లాహు అక్బర్ ‘ అని పలుకుతూ ఉండేవారు. ఇంకా ఈ విధంగానే ప్రవక్త (స) చేసేవారని అనేవారు. ఆ వెంటనే సూరహ్ బఖరహ్ అవత రించింది. (బు’ఖారీ)
ప్రవక్త (స) జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్ వరకు లబ్బయి’క్, పలికే వారు. (బు’ఖారీ)
కంకరరాళ్ళు కొట్టే పద్ధతి: జమ్‌రహ్ ‘ఉఖ్‌బహ్ వద్దకు వెళ్ళిన తర్వాత లబ్బయి’క్ పలకడం మానివేయాలి. దాని ముందు పల్లపు ప్రాంతంలో నిలబడాలి. బైతుల్లాహ్‌ను ఎడమ వైపు మరియు మినాను కుడివైపు ఉంచి బొటన వేలి గోరుపై కంకరరాయి ఉంచి చూపుడు వేలుతో 7 కంకరరాళ్ళు వేరు వేరుగా కొట్టాలి. ఒకవేళ ఇలా కొట్టటం కష్టంగా ఉంటే వేలుతో పట్టుకొని కొట్టాలి. మొదటి కంకరరాయిపై లబ్బయి’క్ పలకటం ఆపివేయాలి. ప్రతి కంకర రాయిని కొట్టటానికి ముందు ఈ దు’ఆ పఠించాలి.
”బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ ర‘గ్‌మన్ లి ష్షై‘తాని, వరి‘దన్ లిర్ర‘హ్మాని అల్లాహుమ్మజ్ అల్ హు ‘హజ్జన్ వ మబ్రూరన్ వ జ‘న్‌బన్ మ‘గ్ ఫూరన్ వ స‘అయన్ మష్కూరన్.” — ‘అల్లాహ్ పేరుతో కంకరరాయి కొడుతున్నాను. అల్లాహ్ అందరికంటే గొప్పవాడు, షై’తాన్ నీచ అవ మానానికి గురవు గాక! అల్లాహ్ సంతృప్తిచెందుగాక, ఓ అల్లాహ్! ‘హజ్జ్ను స్వీకరించు, తప్పులను క్షమించు, మా ప్రయత్నాలను గుర్తించు. (నైలుల్ అవ్‌తార్, ఫత్’హుల్ బారీ)
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2618 – [ 1 ] ( صحيح ) (2/805)
عَنْ جَابِرٍ قَالَ: رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَرْمِيْ عَلَى رَاحِلَتِهِ يَوْمَ النَّحْرِ وَيَقُوْلُ: “لِتَأْخُذُوْا مَنَاسِكَكُمْ فَإِنِّيْ لَا أَدْرِيْ لَعَلِّيْ لَا أَحُجُّ بَعْدَ حَجَّتِيْ هَذِهِ”. رَوَاهُ مُسْلِمٌ .
2618. (1) [2/805 –దృఢం]
జాబిర్ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను జి’ల్ హిజ్జహ్ 10వ తేదీన తన వాహనంపై కూర్చొని, ”కంకర రాళ్ళు కొట్టటం, నానుండి ‘హజ్జ్ ఆదేశాలు నేర్చుకోండి, ఎందు కంటే దీని తరువాత వచ్చే సంవత్సరం నేను ‘హజ్జ్ చేస్తానో చెయ్యనో, చెప్పలేను,” అని అనటం చూసాను.[50](ముస్లిమ్)
2619 – [ 2 ] ( صحيح ) (2/805)
وَعَنْهُ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم رَمَى الْجَمْرَةَ بِمِثْلِ حَصَى الْخَذْفِ . رَوَاهُ مُسْلِمٌ.
2619. (2) [2/805– దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) చిన్న చిన్న కంకర రాళ్ళు విసురుతుండగా నేను చూసాను. (ముస్లిమ్)
2620 – [ 3 ] ( متفق عليه ) (2/805)
وَعَنْهُ قَالَ: رَمَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم الْجَمْرَةَ يَوْمَ النَّحْرِ ضُحىً. وَأَمَّا بَعْدَ ذَلِكَ فَإِذَا زَالَتِ الشَّمْسُ.
2620. (3) [2/805 –ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) యౌము న్న‘హర్‌లో చాష్త్ (‘దుహా‘) వేళ రమీచేసారు. ఆ తరువాత దినాల్లో సూర్యుడు వాలిన తర్వాత రమీ చేసారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2621 – [ 4 ] ( متفق عليه ) (2/805)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ: أَنَّهُ انْتَهَى إِلَى الْجَمْرَةِ الْكُبْرَى فَجَعَلَ الْبَيْتَ عَنْ يَّسَارِهِ وَمَنَى عَنْ يَّمِيْنِهِ وَرَمَى بِسَبْعِ حَصَيَاتٍ يُكَبِّرُ مَعَ كُلِّ حَصَاةٍ. ثُمَّ قَالَ: هَكَذَا رَمَى الَّذِيْ أُنْزِلَتْ عَلَيْهِ سُوْرَةُ الْبَقْرَةِ.
2621. (4) [2/805 –ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: అతను జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్ వద్దకు వెళ్ళి బైతుల్లాహ్ ఎడమ వైపు ఉన్నట్లు, మినా కుడి ప్రక్క ఉన్నట్లు నిలబడి 7 కంకర రాళ్ళు కొట్టారు, కొట్టినపుడు ప్రతి కంకరరాయితో పాటు ‘అల్లాహు అక్బర్ ‘ అని పలికారు. ఆ తరువాత ప్రజలతో, ‘సూరహ్ బఖరహ్ అవతరించబడిన వ్యక్తి కూడ అంటే ప్రవక్త (స) కూడా ఈవిధంగానే కంకరరాళ్ళు కొట్టారు,’ అని అన్నారు.[51] (బు’ఖారీ, ముస్లిమ్)
2622 – [ 5 ] ( صحيح ) (2/805)
وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْاِسْتِجْمَارُ تَوٌّ وَرَمْيُ الْجَمَارِ تَوٌّ وَالسَّعْيُ بَيْنَ الصَّفَا وَالْمَرْوَةِ تَوٌّ وَالطَّوَافُ تَوٌّ وَإِذَا اسْتَجْمَرَ أَحَدُكُمْ فَلْيَسْتَجْمِرْ بَتَوٍّ”. رَوَاهُ مُسْلِمٌ .
2622. (5) [2/805 –దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనాలు, ”మల మూత్ర విసర్జన కోసం బేసి సంఖ్యలో మట్టి పెడ్డలను ఉపయోగించాలి. (3, 5, 7) అదేవిధంగా షై’తాన్‌ను కొట్టడానికి కూడా బేసి కంకరరాళ్ళు ఉపయోగించాలి. (7) అదేవిధంగా సఫా మర్వాల మధ్య సయీ కూడా బేసిసార్లు స’యీ చేయాలి. (7). అదేవిధంగా బైతుల్లాహ్ ‘తవాఫ్ కూడా బేసి అంటే 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అదేవిధంగా మీలో ఎవరైనా ధూపం తీసుకుంటే బేసి సంఖ్యలో తీసువాలి. అంటే (3, 5, 7 సార్లు). (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2623 – [ 6 ] ( صحيح ) (2/806)
عَنْ قَدَامَةَ بْنِ عَبْدِ اللهِ بْنِ عَمَّارٍ قَالَ: رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه و سلم يَرْمِي الْجَمْرَةَ يَوْمَ النَّحْرِعَلَى نَاقَةٍ صَهْبَاءَ لَيْسَ ضَرْبٌ وَلَا طَرْدٌ وَلَيْسَ قِيْلُ: إِلَيْكَ إِلَيْكَ. رَوَاهُ الشَّافِعِيُّ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ .
2623. (6) [2/806 –దృఢం]
ఖుదామహ్ బిన్ ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్మార్ (ర) కథనం: నేను ఖుర్‌బానీ రోజున ప్రవక్త (స)ను ‘సహ్‌బా’ అంటే ఎరుపు, తెలుపు రంగు ఆడఒంటెపై కూర్చొని కంకరరాళ్ళు కొడుతుండగా చూసాను. అక్కడ జంతు వులను కొట్టటం గానీ, తోలటం గానీ, ‘ప్రక్కకు జర గండి పిల్లలూ,’ అని అనటం గానీ జరగలేదు. (షాఫ’యీ, తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్, దారమి,)
2624 – [ 7 ] ( ضعيف ) (2/806)
وَعَنْ عَائِشَةَ عَنِ النَّبِيّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّمَا جَعَلَ رَمْيُ الْجِمَارِ وَالسَّعْيُ بَيْنَ الصَّفَا وَالْمَرْوَةِ لِإِقَامَةِ ذِكْرِ اللهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ .
2624. (7) [2/805 –బలహీనం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: జమ్‌రాత్ ల రమీ మరియు ‘సఫా మర్వాల మధ్య స’యీ అల్లాహ్ స్మరణ కోసం నియమించబడ్డాయి. (దారమి, తిర్మిజి’ – ప్రామాణికం – దృఢం)
2625 – [ 8 ] ( لم تتم دراسته ) (2/806)
وَعَنْهَا قَالَتْ: قُلْنَا: يَا رَسُوْلَ اللهِ أَلَا نَبْنِيْ لَكَ بِنَاءً يُظِلُّكَ بِمِنًى؟ قَالَ: “لَا مِنّى مُنَاخُ مَنْ سَبَقَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ .
2625. (8) [2/806 –అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: మేము ప్రవక్త (స)ను ”ఓ అల్లాహ్ ప్రవక్తా! తమరు విశ్రాంతి తీసుకోవడానికి మినాలో ఏదైన కుటీరం లాంటిది నిర్మిద్దాం.” అని విన్నవించుకున్నాం. దానికి ప్రవక్త (స) ”వద్దు, మినాలో ముందు వెళ్ళి, తన ఒంటెను కూర్చో బెట్టుకున్నవారిదే, ఆచోటు.” అంటే మినాలో ఎవరికీ ఏ ప్రత్యేక స్థానం లేదు. అంటే ముందు వెళ్ళి ఎవరు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటే ఆ స్థలం వారిదే అవుతుంది.” అని ప్రవచించారు. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దారమి)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
2626 – [ 9 ] ( صحيح ) (2/806)
عَنْ نَافِعٍ قَالَ: إِنَّ ابْنَ عُمَرَ كَانَ يَقِفُ عِنْدَ الْجَمْرَتَيْنِ الْأَوْلَيَيْنِ وُقُوْفًا طَوِيْلًا يُكَبِّرُ اللهَ وَيُسَبِّحُهُ وَيَحْمَدُهُ وَيَدْعُوْ اللهَ وَلَا يَقِفُ عِنْدَ جَمْرَةِ الْعَقَبةِ. رَوَاهُ مَالِكٌ.
2626. (9) [2/806– దృఢం]
నా’ఫె (ర) కథనం: ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ జమ్‌రతుల్ ఊలా, జమ్‌రవుస్తా వద్ద చాలాసేపు వరకు ఆగి ‘అల్లాహు అక్బరు సుబ్‌హానల్లాహ్, అల్ హమ్దులిల్లాహ్,’ అని పలుకుతూ దు’ఆ చేస్తూ ఉండేవారు, జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్ వద్ద ఆగేవారు కారు.[52] (మువ’త్తా ఇమామ్ మాలిక్)
=====
7- بَابُ الْهَدْيِ
7. ఖుర్‌బానీ జంతువుల విషయాలు
‘హజ్జ్లో ‘హాజీ తన వెంట తీసుకొని వెళ్ళే జంతు వును హదీ అంటారు. ఇవి మూడు రకాలు. 1. మేక, గొర్రె, పొట్టేలు, 2. ఆవు, ఎద్దు, గేదె, 3. ఒంటె. కనిష్ట పరిమితి మేక. అత్యధిక పరిమితి ఒంటె. ఖుర్‌బానీ జంతువుకు చెందిన మాంసం నిరుపేదలకు ఇవ్వటం ఉత్తమం. తమత్తు’ఉ ఖిరాన్‌కు చెందిన మాంసం అయితే దాన్నుండి కొంతమాంసం తీసుకోవచ్చును . దాని ప్రేగులను, చర్మాన్ని పేదల్లో దానం చేసివేయాలి. హదీ చిహ్నంగా ఒంటె మెడలో చెప్పుల హారం వేయడం ప్రవక్త సాంప్రదాయం. దీన్నితఖ్లీద్ అంటారు. అయితే షి‘ఆర్ చేయడం కూడా ప్రవక్త సాంప్రదాయమే. అంటే ఖుర్‌బానీ ఒంటె కుడి భుజం చర్మాన్ని చీల్చి వేయడం మాంసం తెగిపోకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ హదీ జంతువు మార్గం మధ్యలో మరణ సమయం ఆసన్న మయితే దాన్ని అక్కడే జి’బ’హ్ చేయాలి. దాని రక్తంతో హారాన్ని రంగరించాలి. దాని శిఖరంపై చిహ్నంగా ఏదైనా తగిలించాలి. ధనవంతులు దాన్నుండి ఏమీ తినకుండా ఉండటానికి. ఎందుకంటే ఇది పేదవారి హక్కు. వీటన్నిటి గురించి క్రింద ‘హదీసు’ల్లో పేర్కొనడం జరిగింది.
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2627 – [ 1 ] ( صحيح ) (2/807)
عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: صَلّى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِذِيْ الْحُلَيْفَةِ ثُمَّ دَعَا بِنَاقَتِهِ فَأَشْعَرَهَا فِيْ صَفْحَةِ سِنَامِهَا الْأَيْمَنِ وَسَلَتُ الدَّمَ عَنْهَا وَقَلَّدَهَا نَعْلَيْنِ ثُمَّ رَكِبَ رَاحِلَتَهُ فَلَمَّا اسْتَوَتْ بِهِ عَلَى الْبَيْدَاءِ أَهَلَّ بِالْحَجِّ. رَوَاهُ مُسْلِمٌ.
2627. (1) [2/807 –దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ‘హజ్జ్కు వెళుతూ జు’ల్ ‘హులైఫహ్లో ”జుహ్‌ర్ నమా’జు చదివారు. ఆ తరువాత తన ఖుర్‌బానీ జంతువును తెప్పించారు. చిహ్నంగా దాని వీపుపై కుడివైపు ఒక మూల కొంత చీల్చారు. ఆ రక్తం అక్కడే తుడిచి వేసారు. ఇంకా దానిమెడలో చెప్పుల హారాన్ని వేసారు. ఆ తరువాత తన వాహనంపై కూర్చున్నారు. ఆయన ఒంటె ఆయన్ను తీసుకొని బైదా‘ చేరగానే ప్రవక్త (స) లబ్బ యిక్ అని బిగ్గరగా పలకసాగారు. [53] (బు’ఖారీ, ముస్లిమ్)
2628 – [ 2 ] ( متفق عليه ) (2/807)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: أَهْدَى النَّبِيُّ صلى الله عليه وسلم مَرَّةً إِلَى الْبَيْتِ غَنَمًا فَقَلَّدَهَا.
2628. (2) [2/807–ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ఒకసారి ప్రవక్త (స) ఖుర్‌బానీ మేకలను బైతుల్లాహ్‌కు పంపారు, వాటి మెడలో హారాలు వేసారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2629 – [ 3 ] ( صحيح ) (2/807)
وَعَنْ جَابِرٍ قَالَ: ذَبَحَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ عَائِشَةَ بَقَرَةً يَّوْمَ النَّحْرِ. رَوَاهُ مُسْلِمٌ.
2629. (3) [2/807–దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ఖుర్‌బానీ నాడు ‘ఆయి ‘షహ్ (ర) తరఫున ఒక ఆవు ఖుర్‌బానీ ఇచ్చారు. (ముస్లిమ్)
2630 – [ 4 ] ( صحيح ) (2/807)
وَعَنْهُ قَالَ: نَحَرَ النَّبِيُّ صلى الله عليه وسلم عَنْ نِّسَائِهِ بَقَرَةً فِيْ حَجَّتِهِ . رَوَاهُ مُسْلِمٌ.
2630. (4) [2/807–దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) తన ‘హజ్జతుల్ విదా ‘అలో తన భార్యల తరఫున ఆవు ఖుర్‌బానీ ఇచ్చారు. (ముస్లిమ్)
2631 – [ 5 ] ( متفق عليه ) (2/807)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: فَتَلْتُ قَلَائِدَ بُدْنِ النَّبِيِّ صلى الله عليه وسلم بِيَدَيَّ ثُمَّ قَلَّدَهَا وَأَشْعَرَهَا وَأَهَدَاهَا فَمَا حَرُمَ عَلَيْهِ كَانَ أُحِلَّ لَهُ.
2631. (5) [2/807–ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) యొక్క ఖుర్‌బానీ జంతువుల హారాల త్రాడును నేను నా చేతులతో తయరు చేసాను. ఆ తరువాత ప్రవక్త (స) ఆ హారాలను జంతువుల మెడలో వేసారు. ఆ తరువాత వాటిని షి’ఆర్ చేసారు. అంటే ఒంటె వీపు కుడి ప్రక్క శిఖరం క్రింద చర్మం చీల్చివేసారు. ఆ జంతువులను వెళుతున్న ‘హాజీల వెంట మక్కహ్ పంపి వేసారు. ఆ జంతువులను పంపటం వల్ల ప్రవక్త (స) ధర్మసమ్మతమైనవేవీ నిషిద్ధం కాలేదు. అంటే ఖుర్‌బానీ జంతువులను పంపటం వల్ల ప్రవక్త (స) ము’హ్‌రిమ్ కాలేదు. (బు’ఖారీ, ముస్లిమ్)
2632 – [ 6 ] ( متفق عليه ) (2/808)
وَعَنْهَا قَالَتْ: فَتَلْتُ قَلَائِدَهَا مِنْ عِهْنٍ كَانَ عِنْدِيْ ثُمَّ بَعَثَ بِهَا مَعَ أَبِيْ .
2632. (6) [2/808–ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఖుర్‌బానీ జంతువుల హారాలను నా దగ్గర ఉన్న ఒంటె ఉన్నితో నేను తయారు చేసాను. ఆ తరువాత ప్రవక్త (స) ఆ ఖుర్‌బానీ జంతువులను మా తండ్రిగారు అయిన అబూ బకర్ వెంట మక్కహ్ పంపించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2633 – [ 7 ] ( متفق عليه ) (2/808)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم رَأَى رَجُلًا يَّسُوْقُ بَدَنَةً فَقَالَ: “اِرْكَبْهَا”. فَقَالَ: إِنَّهَا بَدَنَةٌ. قَالَ: “ارْكَبْهَا”. فَقَالَ: إِنَّهَا بَدَنَةٌ. قَالَ: “ارْكَبْهَا وَيْلَكَ” فِيْ الثَّانِيَةِ أَوْ الثَّالِثَةِ.
2633. (7) [2/808–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక వ్యక్తిని చూసారు. అతడు తన ఖుర్‌బానీ జంతువును తోలుతూ తీసుకువెళుతున్నాడు. ప్రవక్త (స) అతన్ని ఉద్దేశించి, ‘నువ్వు దానిపై ఎక్కికూర్చో,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘ఇది ఖుర్‌బానీ జంతువు, నేను దానిపై ఎలా కూర్చోగలను?’ అని అన్నాడు. ప్రవక్త (స) మళ్ళీ, ‘నువ్వు దానిపై ఎక్కికూర్చో,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి మళ్ళీ ‘ఇది ఖుర్‌బానీ జంతువు, దీనిపై నేనెలా కూర్చోగలను?’ అని అన్నాడు. ప్రవక్త (స) రెండవసారి లేదా మూడవసారి చాలా విచారించవలసిన విషయం, ‘నువ్వు దానిపై ఎక్కికూర్చో,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2634 – [ 8 ] ( صحيح ) (2/808)
وَعَنْ أَبِيْ الزُبَيْرِقَالَ: سَمِعْتُ جَابِرَبْنَ عَبْدِ اللهِ سُئِلَ عَنْ رُكُوْبِ الْهَدْيِ فَقَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: “اِرْكَبْهَا بِالْمَعْرُوْفِ إِذَا أُلْجِئْتَ إِلَيْهَا حَتَّى تَجِدَ ظَهْرًا”. رَوَاهُ مُسْلِمٌ.
2634. (8) [2/808 –దృఢం]
అబూ ‘జుబైర్ (ర) కథనం: నేను జాబిర్ బిన్ ‘అబ్దుల్లాహ్ ద్వారా ఇలా విన్నాను. ఖుర్‌బానీ జంతువులపై ఎక్కి కూర్చోవటాన్ని గురించి అతన్ని ప్రశ్నించడం జరిగింది. అంటే, ‘హాజీ తన వెంట తీసుకువెళుతున్న ఖుర్‌బానీ జంతువుపై ఎక్కి కూర్చోవటం ధర్మసమ్మతమా కాదా?’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి అతడు, సమాధానం ఇస్తూ, ‘ప్రవక్త (స)ను అత్యవసర పరిస్థితుల్లో మంచి తనంతో మరో వాహనం లభించనంతవరకు దానిపై కూర్చొని ప్రయాణించవచ్చునని ప్రవచిస్తూ ఉండగా నేను విన్నానని’ సమాధానం ఇచ్చారు. [54] (ముస్లిమ్)
2635 – [ 9 ] ( صحيح ) (2/808)
وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: بَعَثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم سِتَّةَ عَشَرَ بَدَنَةً مَعَ رَجُلٍ وَّأَمَّرَهُ فِيْهَا. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ كَيْفَ أَصْنَعُ بِمَا أُبْدِعَ عَلَيَّ مِنْهَا؟ قَالَ: “انْحَرْهَا ثُمَّ اصْبَغْ نَعْلَيْهَا فِيْ دَمِهَا ثُمَّ اجْعَلْهَا عَلَى صَفْحَتِهَا وَلَا تَأْكُلْ مِنْهَا أَنْتَ وَلَا أَحَدٌ مِّنْ أَهْلِ رُفْقَتِكَ“. رَوَاهُ مُسْلِمٌ .
2635. (9) [2/808 – దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) 16 ఒంటెలను మక్కహ్ లో ఖుర్‌బానీ చేయటానికి ఒక వ్యక్తి వెంట మక్కహ్ పంపారు. ఇంకా అతన్ని నాయకుడిగా నియమించారు. అంటే నువ్వు ఈ ఒంటెలను కాపాడుతూ ఉండమని, మక్కహ్ చేరిన తర్వాత నా తరఫు నుండి ఖుర్‌బానీ చేయాలని ఆదేశించారు. దానికి ఆ వ్యక్తి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ఈ ఒంటెల్లో ఏదైనా ఒంటె వ్యాధివల్ల లేదా ఇతర కారణాల వల్ల నడవలేకపోతే లేదా అలసిపోయి కూర్చుండి పోతే లేదా దారిలో చనిపోయే పరిస్థితి ఏర్పడితే నేను ఏం చేయాలి,’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స) ఇటువంటి పరిస్థితిలో నువ్వు దాన్ని అక్కడే జి’బ’హ్ చేసివేయి. దాని రక్తంతో దాని మెడలో హారంగా ఉన్న చెప్పులను రక్తంలో ముంచి దాని వీపుపై గుర్తువేయాలి. అంటే చీల్చివేయాలి దాన్నుండి నీవుగానీ నీ స్నేహితులు గానీ తినరాదు అని ప్రవచించారు.[55] (ముస్లిమ్)
2636 – [ 10 ] ( صحيح ) (2/808)
وَعَنْ جَابِرٍ قَالَ: نَحَرْنَا مَعَ رَسُوْلِ اللهِ عَامَ الْحُدَيْبِيَّةِ الْبَدَنَةَ عَنْ سَبْعَةٍ وَالْبَقَرَةَ عَنْ سَبْعَةٍ. رَوَاهُ مُسْلِمٌ.
2636. (10) [2/808– దృఢం]
జాబిర్ (ర) కథనం: ‘హుదైబియా సంవత్సరం ప్రవక్త (స) వెంట మేము ఒక ఒంటెను 7 గురు వ్యక్తుల తరఫున, ఒక ఆవును 7 గురు వ్యక్తుల తరఫున ఖుర్‌బానీ ఇచ్చాము. [56] (ముస్లిమ్)
2637 – [ 11 ] ( متفق عليه ) (2/808)
وَعَنِ ابْنِ عُمَرَ: أَنَّهُ أَتَى عَلَى رَجُلٍ قَدْ أَنَاخَ بَدَنَتَهُ يَنْحَرُهَا قَالَ: ابْعَثْهَا قِيَامًا مُّقَيَّدَةً سُنَّةَ مُحَمَّدٍ صلى الله عليه وسلم.
2637. (11) [2/808– ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: అతను ఒక వ్యక్తి వద్దకు వెళ్ళారు. ఆ వ్యక్తి తన ఒంటెను కూర్చోబెట్టి న’హ్‌ర్ చేస్తున్నాడు. అప్పుడు అతను ఆ వ్యక్తితో, ‘నువ్వు ఈ ఒంటెను నిలబెట్టి దాని కాళ్ళు కట్టివేసి న’హ్‌ర్ చేయి. ఎందు కంటే ఇదే ప్రవక్త (స) సాంప్రదాయం అని అన్నారు. [57] (బు’ఖారీ, ముస్లిమ్)
2638 – [ 12 ] ( متفق عليه ) (2/809)
وَعَنْ عَلِيٍّ رضي الله عَنْهُ قَالَ: أَمَرَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ أَقُوْمَ عَلَى بُدْنِهِ وَأَنْ أَتَصَدَّقَ بِلَحْمِهَا وَجُلُوْدِهَا وَأَجِلَّتِهَا وَأَنْ لَّا أُعْطِيَ الْجَزَّارَ مِنْهَا قَالَ: “نَحْنُ نُعْطِيْهِ مِنْ عِنْدَنَا”.
2638. (12) [2/809- ఏకీభవితం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను అతని (స), ఖుర్‌బానీ ఒంటెలను ఖుర్‌బానీ చేయమని, ఖుర్‌బానీ తర్వాత వాటి మాంసాన్ని చర్మాన్ని, ప్రేగులను దానం చేయమని అందులో నుండి కసాయికి పారితోషికం ఇవ్వవద్దని, అతనికి తన వద్ద నుండి పారితోషికం ఇవ్వమని ఆదేశించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2639 – [ 13 ] ( متفق عليه ) (2/809)
وَعَنْ جَابِرٍ قَالَ: كُنَّا لَا نَأْكُلُ مِنْ لُحُوْمِ بُدْنِنَا فَوْقَ ثَلَاثٍ فَرَخَّصَ لَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “كُلُوْا وَتَزَوَّدُوْا”. فَأَكَلْنَا وَتَزَوَّدْنَا.
2639. (13) [2/809– ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: మేము మా ఖుర్‌బానీ మాంసాన్ని మూడు రోజులకు మించి తినేవారము కాము. ఆ తరువాత ప్రవక్త (స) మమ్మల్ని మీరు మాంసాన్ని ఆహార సామగ్రిగా మూడు రోజుల కంటే ఎక్కువ దినాలు ఉంచి తినవచ్చును అని ఆదేశించారు. అప్పటి నుండి మేము ఖుర్‌బానీ మాంసాన్ని మూడు రోజులకంటే ఎక్కువ దినాలు ఉంచి తినేవారం. [58] (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2640 – [ 14 ] ( لم تتم دراسته ) (2/809)
عَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أَهْدَى عَامَ الْحُدَيْبِيَةِ فِيْ هَدَايَا رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم جَمَلًا كَانَ لِأَبِيْ جَهْلٍ فِيْ رَأْسِهِ بُرَةٌ مِّنْ فِضَّةٍ وَفِيْ رِوَايَةٍ مِّنْ ذَهَبٍ يَغِيْظُ بِذَلِكَ الْمُشْرِكِيْنَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2640. (14) [2/809–అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ‘హుదైబియా ఒప్పందం జరిగిన సంవత్సరం ప్రవక్త (స) ఖుర్‌బానీ ఒంటెలను తన వెంట తీసుకు వెళ్ళారు. వాటిలో అబూ జహల్ ఒంటె కూడా ఉండేది. అది బద్ర్ యుద్ధంలో యుద్ధ ధనం రూపంలో ప్రవక్త (స) వంతులోకి వచ్చింది. ఆ ఒంటె ముక్కులో ఒక వెండి ముక్కుపుడక ఉండేది. మరో ఉల్లేఖనం ప్రకారం బంగారం ముక్కు పుడక ఉండేది. దీని ఉద్దేశం ఏమిటంటే ఆ ఒంటెను చూసి అవిశ్వాసుల కోపం కట్టలు త్రెంచుకుంటుందని. [59] (అబూ దావూద్)
2641 – [ 15 ] ( لم تتم دراسته ) (2/809)
وَعَنْ نَّاجِيَةَ الْخُزَاعِيِّ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ كَيْفَ أَصْنَعُ بِمَا عَطِبَ مِنَ الْبُدْنِ؟ قَالَ: “انْحَرْهَا ثُمَّ اغْمِسْ نَعْلَهَا فِيْ دَمِهَا ثُمَّ خَلَّ بَيْنَ النَّاسِ وَبَيْنَهَا فَيَأْكُلُوْنَهَا“. رَوَاهُ مَالِكٌ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.
2641. (15) [2/809 –అపరిశోధితం]
నాజియ ‘ఖు’జా’యీ (ర) కథనం: నేను ప్రవక్త (స) ను, ‘ఖుర్‌బానీ కొరకు నేను నా వెంట తీసుకు వెళుతున్న ఒంటె ఒకవేళ అది దారిలో చనిపోయే భయం ఉంటే నేను ఏం చేయాలి?’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘నువ్వు దాన్ని న’హ్‌ర్ చేసివెయ్యి, దాని మెడలో ఉన్న చెప్పుల హారాన్ని రక్తం పట్టించు, ఇంకా చిహ్నంగా దాని కుహరంపై ఒక గంటుపెట్టు. ఆ తరువాత దాన్ని ప్రజల మధ్య వదలి వెయ్యి. మీ స్నేహితులు తప్ప ఇతర పేద ప్రజలు తింటారు’ అని అన్నారు. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
2642 – [ 16 ] ( لم تتم دراسته ) (2/809)
وَرَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ عَنْ نَاجِيَةَ الْأَسْلَمِيِّ.
2642. (16) [2/810–అపరిశోధితం]
దారమి, అబూ దావూద్, ఈ ‘హదీసు’ను, నాజియహ్ అస్లమి ద్వారా ఉల్లేఖించారు.
2643 – [ 17 ] ( صحيح ) (2/810)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ قُرْطٍ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه و سلم قَالَ: “إِنَّ أَعْظَمَ الْأَيَّامِ عِنْدَ اللهِ يَوْمَ النَّحْرِثُمَّ يَوْمُ الْقَرِّ”. قَالَ ثَوْرٌ: وَ هُوَ الْيَوْمُ الثَّانِيْ. قَالَ: وَقُرِّبَ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم بَدَنَاتٌ خَمْسٌ أَوْ سِتٌّ فَطَفِقْنَ يَزْدَلِفْنَ إِلَيْهِ بِأَيَّتِهِنَّ يَبْدَأُ قَالَ: فَلَمَّا وَجَبَتْ جُنُوْبُهَا. قَالَ فَتَكَلَّمَ بِكَلِمَةٍ خَفِيَّةٍ لَمْ أَفْهَمْهَا فَقُلْتُ: مَا قَالَ؟ قَالَ: “مَنْ شَاءَ اِقْتَطَعَ“. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَذُكِرَ حَدِيْثُا ابْنِ عَبَّاسٍ وَجَابِرٍ فِيْ بَابِ الْأَضْحِيَةِ.
2643. (17) [2/810 –దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ఖు’ర్త్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ వద్ద దినాల్లోకెల్లా జి’ల్’హిజ్జహ్ 10వ తేదీ ఖుర్‌బానీ దినం అన్నిటికంటే గొప్పదినం. ఆ తరువాత ఖర్ దినం. ఉల్లేఖనకర్త సౌ’రీ, ఖర్ అంటే ఖుర్‌బానీ రెండవ దినం అంటే 11వ తేదీ,’ అని అన్నారు. ఉల్లేఖనకర్త కథనం: ప్రవక్త (స) ముందుకు ఖుర్‌బానీ చేయటానికి 5 లేక 6 ఒంటెలు రప్పించ బడ్డాయి. ఈ ఒంటెలు వాటంతట అవే ప్రవక్త (స)కు దగ్గర రాసాగాయి. అన్నిటికంటే ముందు దేన్ని జి’బహ్ చేయాలో తెలియలేదు. ప్రతి ఒంటె ప్రవక్త (స) ముందు తనను జి’బహ్ చేయాలనే కోరుకుంటుంది. ఉల్లేఖనకర్త కథనం: న’హ్‌ర్ చేసిన తర్వాత ఈ ఒంటెలు పడిపోగానే ప్రవక్త (స) మెల్లగా ఏదో అన్నారు, అది నాకు అర్థం కాలేదు. దగ్గరున్న వ్యక్తితో ప్రవక్త (స) ఏమన్నారని అడిగాను. దానికి ఆ వ్యక్తి ప్రవక్త (స),’ఈ జంతువుల మాంసం నుండి ఎవరికి ఎంత కావాలో కోసుకోండి’ అని అన్నారని చెప్పాడు. (అబూ దావూద్)
—–
الفَصْل الثَّالِث మూడవ విభాగం
2644 – [ 18 ] ( متفق عليه ) (2/810)
عَنْ سَلَمَةَ بْنِ الْأَكْوَعِ قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “مَنْ ضَحَّى مِنْكُمْ فَلَا يُصْبِحَنَّ بَعْدَ ثَالِثَةٍ وَفِيْ بَيْتِهِ مِنْهُ شَيْءٌ”. فَلَمَّا كَانَ الْعَامُ الْمُقْبِلُ قَالُوْا: يَا رَسُوْلَ اللهِ نَفْعَلُ كَمَا فَعَلْنَا الْعَامَ الْمَاضِيَ؟ قَالَ: “كُلُوْا وَأَطْعِمُوْا وَادَّخِرُوْا فَإِنَّ ذَلِكَ الْعَامَ كَانَ بِالنَّاسِ جُهْدٌ فَأَرَدْتُّ أَنْ تُعِيْنُوْا فِيْهِمْ”.
2644. (18) [2/810 –ఏకీభవితం]
సలమహ్ బిన్ అక్వ’అ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”మీలో ఎవరైనా ఖుర్‌బానీ చేస్తే, తన ఖుర్ బానీ మాంసం నుండి మూడు రోజులకు మించి తన ఇంట్లో ఉంచరాదు. అంటే ప్రజల్లో పంచివేయాలి. మరో సంవత్సరం వచ్చింది. అప్పుడు ప్రజలు ప్రవక్త (స)ను, ‘ఈ సంవ్సరం కూడా మేము ఆవిధంగానే అంటే గత సంవత్సరం చేసినట్లు చేయాలా?’ అంటే ఖుర్‌బానీ మాంసాన్ని మూడు రోజులకు మించి ఉంచకూడదా?’ అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘మీరు తినండి, తినిపించండి, ఆహార సామాగ్రిగా చేసి ఉంచు కోండి. ఎందుకంటే గత సంవత్సరం ప్రజలు కరవు కాట కాలకు గురయ్యారు. అందువల్ల మీరు మాంసాన్నంతా ప్రజల్లో పంచివేసి ఈ విధంగా వారికి సహాయం చేయడం సబబుగా ఉంటుందని భావించాను.’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2645 – [ 19 ] ( لم تتم دراسته ) (2/810)
وَعَنْ نُبَيْشَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ كُنَّا نَهْيْنَاكُمْ عَنْ لُحُوْمِهَا أَنْ تَأْكُلُوْهَا فَوْقَ ثَلَاثٍ لِكَيْ تَسَعَكُمْ. جَاءَ اللهُ بِالسَّعَةِ فَكُلُوْا وَادَّخِرُوْا وَأَتَجِرُوْا. أَلَا وَإِنَّ هَذِهَ الْأَيَّامَ أَيَّامُ أَكْلٍ وَّشَرْبٍ وَذِكْرِ اللهِ” . رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2645. (19) [2/810 –అపరిశోధితం]
నుబైషహ్ (ర) కథనం: ప్రవక్త (స) ”గత సంవత్సరం నేను మూడు రోజులకు మించి ఖుర్‌బానీ మాంసాన్ని తినటాన్ని నిషేధించాను. దానికి కారణం మాంసం ద్వారా పేదలకు సహాయం జరుగుతుందని. ఇప్పుడు అల్లాహ్ (త) ఆ కష్టాన్ని, ఆందోళనను దూరంచేసాడు. ఇప్పుడు ఒకవేళ మీరు కోరితే మూడు రోజులకు మించి ఉంచండి, దానధర్మాలు చేయండి. ఎందుకంటే ఈ ఖుర్‌బానీ దినాలు తినే, త్రాగే, దైవాన్ని స్మరించే దినాలు.” అని అన్నారు. (అబూ దావూద్)
=====
8-بَابُ الْحَلقِ
8. తల గొరిగించుకోవటం
ఖుర్‌బానీ చేసిన తరువాత ఇ’హ్‌రామ్ తొలగించడానికి తల వెంట్రుకలు గీయించటం లేదా కత్తిరించటం తప్పనిసరి. దీని సాంప్రదాయపద్ధతి ఏమిటంటే ఖిబ్లా వైపు తిరిగి కూర్చోవాలి. తన కుడి వైపు నుండి తల వెంట్రుకలను గీయించటం లేదా కత్తిరించటం ప్రారంభించాలి. తల వెంట్రుకలు గీయించటాన్ని ‘హలఖ్ అంటారు, కత్తిరించటాన్ని ఖ‘స్‌ర్ అంటారు. ఈ రెండూ ధర్మసమ్మతమే. కాని గీయించటమే ఉత్తమం. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ (త) ఆదేశం, ”..అల్లాహ్ కోరితే, మీరు తప్పక శాంతి యుతంగా మీ తలలను పూర్తిగా గొరిగించు కొని లేదా తల వెంట్రు కలను కత్తిరించుకొని, మస్జిద్ అల్ ‘హరామ్ లోకి భయపడకుండా ప్రవేశించేవారు…” (సూ. అల్ ఫ’త్హ్, 48:27)
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2646 – [ 1 ] ( متفق عليه ) (2/812)
عَنِ ابْنِ عُمَرَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم حَلَقَ رَأْسَهُ فِيْ حَجَّةِ الْوَدَاعِ وَأُنَاسٌ مِّنْ أَصْحَابِهِ وَقَصَّرَ بَعْضُهُمْ.
2646. (1) [2/812– ఏకీభవితం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ఇంకా అతని(స) అనుచరుల్లోని కొందరు ‘హజ్జతుల్ విదాలో తలగీయించారు. మరి కొందరు తల వెంట్రుకలు కత్తిరించు కున్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2647 – [ 2 ] ( متفق عليه ) (2/812)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ لِيْ مُعَاوِيَةُ: إِنِّيْ قَصَّرْتُ مِنْ رَأْسِ النَّبِيَّ صلى الله عليه وسلم عِنْدَ الْمَرْوَةِ بِمِشْقَصٍ.
2647. (2) [2/812– ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: నాతో ము’ఆ వియహ్ (ర) ఇలా అన్నారు, ”నేను ప్రవక్త (స) తలవెంట్రుకలను బాణం ముందు భాగం ద్వారా మర్వా కొండపై కత్తిరించాను. [60] (బు’ఖారీ, ముస్లిమ్)
2648 – [ 3 ] ( متفق عليه ) (2/812)
وَعَنِ ابْنِ عُمَرَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ فِيْ حَجَّةِ الْوَدَاعِ: “اَللّهُمَّ ارْحَمِ الْمُحَلِّقِيْنَ”. قَالُوْا: وَالْمُقَصِّرِيْنَ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “اللّهُمَّ ارْحَمَ الْمُحَلِّقِيْنَ”. قَالُوْا: وَالْمُقَصِّرِيْنَ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “وَالْمُقَصِّرِيْنَ” .متفق عليه.
2648. (3) [2/812 –ఏకీభవితం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ‘హజ్జతుల్ విదా’లో, ”ఓ అల్లాహ్! తలగీయించుకున్న వారిని కరుణించు.” అని ప్రార్థించారు. అప్పుడు ప్రజలు, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా, కత్తిరించుకున్న వారిని గురించి కూడా ప్రార్ధించండి,’ అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త(స) ‘ఓ అల్లాహ్! తల గీయించుకున్న వారిని కరుణించు,’ అని ప్రార్థించారు. మరల ప్రజలు, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా, కత్తిరించుకున్న వారిని గురించి కూడా ప్రార్ధించండి,’ అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘ఓ అల్లాహ్! కత్తిరించుకున్నవారిని కూడా కరుణించు’ అని ప్రార్ధించారు. [61] (బు’ఖారీ, ముస్లిమ్)
2649 – [ 4 ] ( صحيح ) (2/812)
وَعَنْ يَحْيَى بْنِ الْحُصَيْنِ عَنْ جَدَّتِهِ أَنَّهَا سَمِعَتِ النَّبِيَّ صلى الله عليه وسلم فِيْ حَجَّةِ الْوَدَاعِ دَعَا لِلْمُحَلِّقِيْنَ ثَلَاثًا وَلِلمْقَصِّرِيْنَ مَرَّةً وَّاحِدَةً. رَوَاهُ مُسْلِمٌ.
2649. (4) [2/812 –దృఢం]
య’హ్‌యా బిన్ ‘హు’సైన్ తన నానమ్మ ద్వారా ఉల్లేఖిస్తున్నారు: అతని నానమ్మ ‘హజ్జతుల్ విదాలో ప్రవక్త (స) తల గీయించుకునేవారి కొరకు మూడు సార్లు, కత్తిరించుకునేవారి కొరకు ఒకసారి దు’ఆ చేసినట్లు విన్నారు. [62] (ముస్లిమ్)
2650 – [ 5 ] ( متفق عليه ) (2/812)
وَعَنْ أَنَسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أَتَى مِنّى فَأَتَى الْجَمْرَةَ فَرَمَاهَا ثُمَّ أَتَى مَنْزِلَهُ بِمِنى وَنَحَرَ نُسُكَهُ ثُمَّ دَعَا بِالْحَلَّاقِ وَنَاوَلَ الْحَالِقَ شِقَّهِ الْأَيْمَنَ فحلَّقه ثُمَّ دَعَا أَبَا طَلْحَةَ الْأَنْصَارِيَّ فَأَعْطَاهُ إِيَّاهُ ثُمَّ نَاوَلَ الشِّقَّ الْأَيْسَرَ فَقَالَ: “احْلِقْ” فَحَلَقَهُ فَأَعْطَاهُ طَلْحَةَ فَقَالَ: “اقْسِمْهُ بَيْنَ النَّاسِ”.
2650. (5) [2/812– ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) మినాలో వచ్చిన తర్వాత ముందు జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్ వద్దకు వెళ్ళారు. దానికి కంకరరాళ్ళు కొట్టారు. ఆ తరువాత మినాలోని తన నివాస స్థలంలో ఒంటె ఖుర్బానీ ఇచ్చారు. ఆ తరువాత మంగలిని పిలిపించి తన తల వెంట్రుకలను కుడి వైపునుండి గీయమన్నారు. ఆ మంగలి కుడివైపు గీసాడు. ఆ తరువాత ప్రవక్త (స) అబూ ‘తల్’హా అన్సారీని పిలిపించారు. అతను రాగానే గీసిన వెంట్రుకలను అతనికి ఇచ్చారు. ఆ తరువాత ఎడమవైపు తిరిగారు. మంగలిఎడమవైపు ఉన్న వెంట్రు కలను గీసాడు. ప్రవక్త (స) ఆ వెంట్రుకలను కూడా అబూ ‘తల్’హాకు ఇచ్చి, ‘ఈ వెంట్రుకలను ప్రజల్లో పంచిపెట్టు,’ అని అన్నారు.[63] (బు’ఖారీ, ముస్లిమ్)
2651 – [ 6 ] ( متفق عليه ) (2/813)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كُنْتُ أُطَيِّبُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَبْلَ أَنْ يُّحْرِمَ وَيَوْمَ النَّحْرِ قَبْلَ أَنْ يَّطُوْفَ بِالْبَيْتِ بِطِيْبٍ فِيْهِ مِسْكٌ.
2651. (6) [2/813 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) కు ఇ’హ్‌రామ్ ధరించటానికి ముందు సువాసన ద్రవ్యాలు రాసేదాన్ని అదేవిధంగా ఖుర్‌బానీరోజు బైతుల్లాహ్ ‘తవాఫ్ చేయడానికి ముందు సువాసన ద్రవ్యాలు రాసేదాన్ని. వాటిలో కస్తూరి కూడా ఉండేది. (బు’ఖారీ, ముస్లిమ్)
2652 – [ 7 ] ( صحيح ) (2/813)
وَعَنِ ابْنِ عُمَرَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَفَاضَ يَوْمَ النَّحْرِ ثُمَّ رَجَعَ فَصَلَّى الظُّهْرَ بِمِنَى. رَوَاهُ مُسْلِمٌ.
2652. (7) [2/813 –దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్’ఉమర్(ర)కథనం: ప్రవక్త (స) జు’ల్ ‘హిజ్జహ్ పదవ తేదీన మక్కహ్ లో ప్రవేశించి ‘తహఫె ఇఫా’దహ్ చేసారు. ఆ తరువాత మినా తిరిగి వచ్చి ”జుహ్‌ర్ నమా’జును మినాలోఆచరించారు. (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2653 – [ 8 ] ( لم تتم دراسته ) (2/813)
عَنْ عَلِيٍّ وَعَائِشَةَ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَا: نَهَى رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَنْ تَحْلِقَ الْمَرْأَةُ رَأْسَهَا. رَوَاهُ التِّرْمِذِيُّ .
2653. (8) [2/813– అపరిశోధితం]
‘అలీ (ర), ‘ఆయి’షహ్ (ర)ల కథనం: ప్రవక్త (స) స్త్రీలను తలగీయించటాన్నుండి వారించారు. (తిర్మిజి’)
2654 – [ 9 ] ( لم تتم دراسته ) (2/813)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيْسَ عَلَى النِّسَاءِ الْحَلْقُ إِنَّمَا عَلَى النِّسَاءِ التَّقْصِيْرُ”. روَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ .
2654. (9) [2/813– అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్త్రీలు తలవెంట్రుకలు గీయించటం ధర్మసమ్మతం కాదు. వారు తల వెంట్రుకలు కత్తిరించుకుంటే సరిపోతుంది.” [64] (తిర్మిజి’, అబూ దావూద్, దారమి)
—–
هَذَا الْبَابُ خَالٍ مِّنَ الْفَصْلِ الثَّالِثُ
ఇందులో మూడవ విభాగం లేదు
=====
9- بَابُ فِيْ التَّحْلل بَابٌ فِىْ تَقْدِيْمِ وَتَأْخِيْرِ بَعْضِ الْمَنَاسِكِ
9. హజ్ విధులను క్రమం మార్చి ఆచరించవచ్చు
యౌమున్న’హర్‌లో ‘అరఫాత్ నుండి తిరిగి వచ్చిన తరువాత మినాలో ముందు రమీ ఆ తరువాత ఖుర్బానీ, ఆ తరువాత క్షవరం, ఆ తరువాత మక్కహ్లో ‘తవాఫె ఇఫా’దహ్, ఆ తరువాత మినాలో రాత్రి గడపటం, ప్రవక్త (స) వీటిని ఈ క్రమంలోనే ఆచరించారు. (అబూ దావూద్)
ప్రతి విధిని వరుస క్రమంలో ప్రవక్త (స) సంప్రదాయానికి అనుగుణంగా నిర్వర్తించాలి. కాని ఒకవేళ మతిమరుపు వల్ల వరుసక్రమానికి వ్యతిరేకంగా జరిగితే మరేం ఫర్వాలేదు. ‘హదీసు’ల ప్రకారం పండితుల అభిప్రాయం ఇదే.
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2655 – [ 1 ] ( متفق عليه ) (2/814)
عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه و سلم وَقَفَ فِيْ حَجَّةِ الْوَدَاعِ بِمِنَى لِلنَّاسِ يَسْأَلُوْنَهُ فَجَاءَهُ رَجُلٌ فَقَالَ: لَمْ أَشْعُرْفَحَلَقْتُ قَبْلَ أَنْ أَذْبَحَ. فَقَالَ: “اذْبَحْ وَلَا حَرَجَ”. فَجَاءَ آخَرَفَقَالَ: لَمْ أَشْعُرْ فَنَحَرْتُ قَبْلَ أَنْ أَرْمِيْ. فَقَالَ: “ارْمِ وَلَا حَرَجَ”. فَمَا سُئِلَ النَّبِيُّ صلى الله عليه وسلم عَنْ شَيْءٍ قُدِّمَ وَلَا أُخِّرَ إِلَّا قَالَ: “افْعَلْ وَلَاحَرَجَ”.
وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ: أَتَاهُ رَجُلٌ فَقَالَ: حَلَقْتُ قَبْلَ أَنْ أَرْمِيَ. قَالَ: “ارْمِ وَلَا حَرَجَ“. وَأَتَاهُ آخَرُ فَقَالَ: أَفَضْتُ إِلَى الْبَيْتِ قَبْلَ أَنْ أَرْمِيَ. قَالَ: “اِرْمِ وَلَا حَرَجَ”.
2655. (1) [2/814–ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ బిన్ ‘ఆస్ (ర) కథనం: ప్రవక్త (స) ‘హజ్జతుల్ విదా’అలో అందరిముందు మినాలో నిలబడ్డారు. ప్రజలు తనను ‘హజ్జ్కు సంబంధించిన ప్రధాన విషయాలను అడిగి తెలుసు కుంటారని, అదేవి ధంగా ప్రజలు వచ్చి అడిగే వారు, ప్రవక్త (స) వారి ప్రశ్న లకు సమాధానాలు ఇచ్చేవారు. ఒకవ్యక్తి వచ్చి ప్రవక్త (స)ను, ‘తెలియక ఖుర్‌బానీకి ముందు తలగీయించు కున్నాను. ఏం చేయాలి.’ – అంటే ముందు ఖుర్‌బానీ చేసి ఆ తరువాత తల గీయించు కోవలసింది. కనుక క్రమం తప్పాను. మరచి ముందు నేను తలగీయించు కున్నాను,’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘ఇప్పుడు నువ్వు వెళ్ళి ఖుర్‌బానీ చెయ్యి. వరుస క్రమం వ్యతి రేకతవల్ల మరేం ఫర్వలేదు,’ అని అన్నారు. ఆ తరువాత మరోవ్యక్తి వచ్చి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! నేను కంకరరాళ్ళు కొట్టడానికి ముందు, ఖుర్‌బానీ చేసాను. నేను ముందు కంకర రాళ్ళు కొట్టవలసింది. ఆ తరువాత ఖుర్‌బానీ చేయవలసింది. కాని నేను మరచి పోయి ఖుర్‌బానీ చేసివేసాను,’ అని విన్న వించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘నువ్వు వెళ్ళి కంకరరాళ్ళు కొట్టు, జరిగిన దానికి పాపమేమీ చుట్టు కోదులే,’ అని అన్నారు. సారాంశం ఏమిటంటే వెనుకా ముందు జరిగిన దానిని గురించి ప్రశ్నించిన వారికి సమాధానంగా ప్రవక్త (స), ‘మరేం ఫర్వాలేదు,’ అని మాత్రమే చెప్పారు. (బు’ఖారీ, ముస్లిమ్).
ముస్లిమ్‌లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ఒక వ్యక్తి వచ్చి, ‘కంకరరాళ్ళు కొట్టడానికి ముందు తల గీయించుకున్నాను,’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స) నువ్వు కంకరరాళ్ళు కొట్టు, జరిగిందానికి పాపం ఏమీ లేదులే,’ అని అన్నారు. మరోక వ్యక్తి వచ్చి, కంకరరాళ్ళు కొట్టడానికి ముందు బైతుల్లాహ్ తవాఫ్ చేసాను అని అంటే, ప్రవక్త (స), ‘నువ్వు కంకరరాళ్ళు కొట్టు ముందూ వెనుకా జరిగిందానికి మరేం పాపం లేదులే,’ అని అన్నారు.
2656 – [ 2 ] ( صحيح ) (2/814)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يُسْأَلُ يَوْمَ النَّحْرِ بِمَنى فَيَقُوْلُ: “لَا حرج” .فَسَأَلَهُ رَجُلُ فَقَالَ: رَمَيْتث بَعْدَ مَاأَمْسَيْتُ. فَقَالَ: “لَا حَرَجَ”. رَوَاهُ الْبُخَارِيُّ.
2656. (2) [2/814– దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అబ్బాస్ (ర) కథనం: ఖుర్‌బానీ రోజు మినాలో ప్రవక్త (స)ను వివిధ విషయాలను గురించి ప్రశ్నించడం, అంటే ముందూ వెనుకా జరిగిందని విన్నవించుకోవడం జరిగింది. ప్రతిదానికి, ‘దీన్ని చేయి మరేంఫర్వాలేదు,’ అని అన్నారు. ఒక వ్యక్తి వచ్చి ‘నేను సాయంత్రం రమీ చేసాను దాని అసలు సమయం ఉదయం ఉంది,’ అని విన్నవించుకోగా ప్రవక్త (స), ‘మరేం ఫర్వాలేదు,’ అని అన్నారు. (బు’ఖారీ)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2657 – [ 3 ] ( لم تتم دراسته ) (2/815)
عَنْ عَلِيٍّ قَالَ: أَتَاهُ رَجُلٌ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ أَفَضْتُ قَبْلَ أَنْ أَحْلِقَ فَقَالَ: “احْلِقْ أَوْ قَصِّرْ وَلَا حَرَجَ”. وَجَاءَ آخَرُ فَقَالَ: ذَبَحْتُ قَبْلَ أَنْ أَرْمِيَ. قَالَ: “ارْمِ وَلَا حَرَجَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
2657. (3) [2/815– అపరిశోధితం]
‘అలీ (ర) కథనం: ఒక వ్యక్తి వచ్చి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! నేను తల గీయించటానికి ముందు ‘తవాఫె ఇఫా’దహ్ చేసాను.’ దానికి ప్రవక్త (స), ‘నువ్వు తల గీయించుకో లేదా తలవెంట్రుకలు కత్తిరించుకో. క్రమం తప్పితే మరేం ఫర్వాలేదు,’ అని అన్నారు. మరో వ్యక్తి వచ్చి, ‘కంకరరాళ్ళు కొట్టడానికి ముందు ఖర్‌బానీ చేసాను,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘ఇప్పుడు వెళ్ళి కంకరరాళ్ళు కొట్టు, క్రమం తప్పిన దానికి మరేం పాపం లేదులే,’ అని సమాధానం ఇచ్చారు. (తిర్మిజి’)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
2658 – [ 4 ] ( لم تتم دراسته ) (2/815)
عَنْ أُسَامَةَ بْنِ شَرِيْكَ قَالَ: خَرَجْتُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم حَاجًا فَكَانَ النَّاسُ يَأْتُوْنَهُ فَمَنْ قَائِلٍ: يَا رَسُوْلَ اللهِ سَعَيْتُ قَبْلَ أَنْ أَطُوْفَ أَوْ أَخَّرْتُ شَيْئًا أَوْ قَدَّمْتُ شَيْئًا فَكَانَ يَقُوْلُ: “لَا حَرَجَ إِلَّا عَلَى رَجُلٍ اقْتَرَضَ عِرْضَ مُسْلِمٍ وَهُوَ ظَالِمٌ فَذَلِكَ الَّذِيْ حَرَجَ وَهَلَكَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2658. (4) [2/815 –అపరిశోధితం]
ఉసామా బిన్ షరీక్ (ర) కథనం: నేను ప్రవక్త (స) వెంట ‘హజ్జ్ చేయడానికి బయలుదేరాను. దారిలో ప్రజలు ‘హజ్జ్ విషయాలను గురించి తెలుసుకోవడానికి ప్రవక్త (స) వద్దకు వస్తూ ఉన్నారు. వారిలో కొందరు, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! నేను ‘తవాఫ్ చేయడానికి ముందే ‘సఫా మర్వాల స’యీ చేసాను.’ లేదా, ‘ఫలానా పనిని నేను తరువాత నిర్వర్తించాను. దాన్ని ముందు చేయ వలసింది.’ లేదా, ‘ఫలానా పనిని నేను ముందుచేసాను దాన్ని తరువాత చేయవలసింది,’ అని విన్నవించు కునేవారు. దానికి ప్రవక్త (స) అందరికీ, ‘ఇందులో ఎటువంటి పాపం లేదు,’ అని అనేవారు. అయితే అత్యా చారం, అగౌరవం పాలుచేయటం, శీలం దోచుకోవటం మొదలైన వాటికి మాత్రం ఇది మహా పాపం, దీనికి శిక్ష తప్పనిసరి,’ అని అనేవారు. (అబూ దావూద్).
=====
10- بَابُ خُطْبَةِ يَوْمِ النَّحْرِ وَرَمْيِ أَيَّامِ التَّشْرِيْقِ وَالتَّوْدِيْعِ
10. ఖుర్‌బానీరోజు ప్రసంగం, తష్‌రీఖ్ దినాలలో కంకర్రాళ్ళు రవ్వటం, వీడ్కోలు ‘తవాఫ్
జి’ల్-‘హిజ్జహ్ 10వ తేదీన ము’జ్దలిఫహ్ నుండి మినా చేరిన తర్వాత అన్నిటికంటే ముందు కంకరరాళ్ళు కొట్టాలి, ఆ తరువాత ఖుర్‌బానీ చేయాలి, ఆ తరువాత తలగీయించుకోవాలి. ఆ తరువాత మక్కహ్ వెళ్ళి ‘తవాఫె ఇఫా’దహ్ చేయాలి. దీన్ని గురించి పైన పేర్కొనడం జరిగింది.
జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్ పై కంకరరాళ్ళు విసిరిన తర్వాత, మినా మైదానంలో ఇమాముల్ ‘హజ్జ్ ప్రసంగం చేస్తాడు. తౌ’హీద్ మరియు సున్నత్‌లకు అనుగుణంగా యౌమున్న’హర్ ప్రత్యేకతలను మరియు ఖుర్‌బానీ నియమాలను ప్రత్యేకతలను ఇంకా ‘హజ్‌కు సంబంధించిన మరియు ఖుర్‌బానీ నియమాలను ప్రత్యేకతలను ఇంకా ‘హజ్జ్కు సంబంధించిన ఇతర ఆదేశాలను గురించి ప్రసంగం చేస్తాడు. మీరు ఈ ప్రసంగం వినడానికి తప్పకుండా వెళ్ళండి. ప్రశాంతంగా ప్రసంగం వినండి, అది మీకు అర్థం అయినా అవకపోయినా సరే.
ప్రవక్త (స) రమీ జిమార్ తర్వాత ప్రభావ పూరితమైన ప్రసంగం చేసారు. ఇందులో షరీ’అత్ ఆదేశాలను పేర్కొ న్నారు. హితబోధనలను హితోపదేశాలను వినిపిం చారు. అయితే వాటిలో అధికశాతం ‘అరఫాత్‌లో ప్రసం గంలో చెప్పినవే ఉన్నాయి. వీటిని మళ్ళీ ఎందుకు చెప్పడం జరిగిందంటే అక్కడ విననివారు ఇక్కడ వింటారని. అక్కడ విని ఉంటే మరీ బాగా గుర్తుంటా యని. కొన్ని క్రొత్త విషయాలు కూడా ప్రవచించారు.
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2659 – [ 1 ] ( متفق عليه ) (2/816)
عَنْ أَبِيْ بَكْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: خَطَبْنَا النَّبِيُّ صلى الله عليه وسلم يَوْمَ النَّحْرِ قَالَ: “إِنَّ الزَّمَانَ قَدْ اسْتَدَارَ كَهَيْئَتِهِ يَوْمَ خَلْقَ اللهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ السَّنَةُ اثْنَا عَشَرَ شَهْرًا مِّنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ثَلَاثٌ مُّتَوَالِيَاتٌ ذُوْ الْقَعْدَةِ وذُو الْحَجَّةِ وَالْمُحَرَّمُ وَرَجَبُ مُضَرَ الَّذِيْ بَيْنَ جُمَادَى وَشَعْبَانَ”. وَقَالَ: “أَيُّ شَهْرٍ هَذَا؟”قُلْنَا: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ فَسَكَتَ حَتَّى ظَنَنَّا أَنَّهُ سَيُسَمِّيَهِ بِغَيْرِ اِسْمِهِ فَقَالَ:” أَلَيْسَ ذَا الْحَجَّةِ؟” قُلْنَا: بَلَى. قَالَ: “أَيُّ بَلَدٍ هَذَا؟”قُلْنَا: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ فَسَكَتَ حَتَّى ظَنَنَّا أَنَّهُ سَيُسَمِّيْهِ بِغَيْرِ اِسْمِهِ قَالَ: “أَلَيْسَ الْبَلَدَةُ؟ ” قُلْنَا: بَلَى. قَالَ”فَأَيُّ يَوْمٍ هَذَا؟” قُلْنَا: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ فَسَكَتَ حَتَّى ظَنَنَّا أَنَّهُ سَيُسَمِّيْهِ بِغَيْرِ اسْمِهِ. قَالَ: “أَلَيْسَ يَوْمُ النَّحْر؟” قُلْنَا: بَلَى. قَالَ: “فَإِنَّ دِمَاءَكُمْ وَأَمْوَالُكُمْ وَأَعْرَاضَكُمْ عَلَيْكُمْ حَرَامٌ كَحُرْمَةِ يَوْمِكُمْ هَذَا فِيْ بَلَدِكُمْ هَذَا فِيْ شَهْرِكُمْ هَذَا وَسَتَلْقَوْنَ رَبَّكُمْ فَيَسْأَلُكُمْ عَنْ أَعْمَالِكُمْ أَلَا فَلَا تَرْجِعُوْا بَعْدِيْ ضَلَالًا يَّضْرِبُ بَعْضُكُمْ رِقَابَ بَعْضٍ أَلَا هَلْ بَلَّغْتُ؟” قَالُوْا: نَعَمْ. قَالَ: “اَللّهُمَّ اشْهَدْ. فَلْيُبَلِّغِ الشَّاهِدُ الْغَائِبَ فَرُبَّ مُبَلَّغٍ أَوْعَى مِنْ سَامِعٍ”.
2659. (1) [2/816–ఏకీభవితం]
అబూ బక్రహ్ (ర) కథనం: ప్రవక్త (స) యౌము న్న’హర్‌లో మా ముందు ఈ విధంగా ప్రసంగించారు. ”కాలం తిరిగి తిరిగి మళ్ళీ అల్లాహ్ (త) భూమ్యాకా శాలను సృష్టించిన బిందువు పైకి వచ్చేసింది. సంవత్స రానికి 12నెలలు, వీటిలో 4గౌరవనీయమైనవి. మూడు వరుసగా జు’ల్ ఖ’అదహ్, జు’ల్ ‘హజ్జహ్, ము’హర్రమ్ (11, 12, 01) మరియు ఒకటి వేరుగా ఉంది, అంటే రజబ్ (7) ము’దర్ నెల. ఇది జమాదిస్సానీ మరియు ష’అబాన్‌ల మధ్య ఉంది. ఆ తరువాత ప్రవక్త (స), ”ఇది ఏ నెల,’ అని అక్కడున్న వారిని అడిగారు. దానికి మేము అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకే తెలుసు అని అన్నాము. అది విన్న ప్రవక్త (స) మౌనం వహించారు. తమరు దానికి ఏదైనా వేరు పేరు పెడతారని మేము అనుకున్నాం. ఆ తరువాత ప్రవక్త (స), ‘ఇది జు’ల్-హజ్జహ్ కాదా?’ అని అడిగారు. దానికి మేము ‘అవును,’ అని అన్నాము. ఆ తరువాత ప్రవక్త (స) మళ్ళీ, ‘ఇది ఏ నగరం,’ అని అడిగారు. దానికి మేము, ‘అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే తెలుసు,’ అని అన్నాము. ప్రవక్త (స) మళ్ళీ మౌనం వహించారు. చివరికి మేము ప్రవక్త (స) దానికి వేరే పేరు పెడతారని భావించాం. ప్రవక్త (స), ‘ఇది మక్కహ్ నగరం కాదా?’ అని అన్నారు. దానికి మేము, ‘అవును,’ అని అన్నాము. ఆ తరువాత ప్రవక్త (స) మమ్మల్ని, ‘ఇది ఏ దినం,’ అని అడిగారు. దానికి మేము, ‘అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే అంతా తెలుసు,’ అని అన్నాము. ప్రవక్త (స) మౌనం వహించారు. దానికి వేరే పేరు పెడతారని భావించాం. ప్రవక్త(స),’ఇది ఖుర్‌బానీ దినం కాదా?’ అని అన్నారు. దానికి మేము, ‘అవును,’ అని అన్నాము.
ఆ తరువాత ప్రవక్త (స) ఇలా ప్రసంగించారు: ”మీ రక్తం, మీ ధనం, మీ గౌరవమర్యాదలు ఈనాడు మీపై ఈ రోజు ఈ నగరం, ఈ నెలలో హత్యలు, యుద్ధాలు, దోపిడీలు, అగౌరవ పర్చడం నిషేధించబడినట్లు నిషే ధించబడ్డాయి. అతి త్వరలో మీరు దైవంతో కలుసు కుంటారు. ఆయన మిమ్మల్ని కర్మల గురించి ప్రశ్నిస్తాడు. కనుక మీరు అప్రమత్తంగా ఉండండి. నా తరువాత మీరు మార్గభ్రష్టత్వానికి గురి కాకూడదు. మీరు పరస్పరం హత్యలకు, దోపిడీలకు పాల్పడ కండి. గుర్తుంచు కోండి,” ”దైవాదేశాలను నేను మీకు అందజేసానా?” అని అన్నారు. దానికి ప్రజలు, ‘అవును,’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స), ”ఓ అల్లాహ్! నీవు సాక్షిగా ఉండు,” అని అన్నారు. ఆ తరువాత, ”ఇక్కడ ఉన్నవారు ఇక్కడ లేని వారికి ఈ సందేశాన్ని అందజేయాలి. ఎందుకంటే నా సందేశం అందజేయబడినవారు విన్నవారి కంటే చాలా బాగా గుర్తుంచుకుంటారు.” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2660 – [ 2 ] ( صحيح ) (2/817)
وَعَنْ وَبِرَةَ قَالَ: سَأَلْتُ ابْنَ عُمَرَ: مَتَى أَرْمِي الْجِمَارَ؟ قَالَ: إِذَا رمَى إِمَامُكَ فَارْمِهِ. فَأَعَدْتُّ عَلَيْهِ الْمَسْأَلَةَ. فَقَالَ: كُنَّا نَتَحَيَّنُ فَإِذَا زَالَتِ الشَّمْسُ رَمَيْنَا. رَوَاهُ الْبُخَارِيُّ .
2660. (2) [2/817–దృఢం]
వబిరహ్ (ర) కథనం: నేను ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర)ను, ‘నేను కంకరరాళ్ళు ఎప్పుడు కొట్టాలి,’ అని అడిగాను. దానికి అతను, ‘మీ ఇమాము కొట్టినపుడు నువ్వు కూడా కొట్టు,’ అని సమాధానం ఇచ్చారు. నేను మళ్ళీ అదే ప్రశ్న అడిగాను. దానికి అతను, ‘మేము కంకరరాళ్ళు కొట్టటానికి వేచి ఉండేవాళ్ళం. సూర్యుడు వాలిన తర్వాత కంకరరాళ్ళు కొట్టే వాళ్ళం,’ అని అన్నారు. [65] (బు’ఖారీ)
2661 – [ 3 ] ( صحيح ) (2/817)
وَعَنْ سَالِمٍ عَنِ ابْنِ عُمَرَ: أَنَّهُ كَانَ يَرْمِيْ جَمْرَةَ الدُّنْيَا بِسَبْعِ حَصَيَاتٍ يُّكَبِّرُ عَلَى إِثْرِ كُلِّ حَصَاةٍ ثُمَّ يَتَقَدَّمُ حَتَّى يُسْهِلَ فَيَقُوْمُ مُسْتَقْبِلَ الْقِبْلَةِ طَوِيْلًا وَيَدْعُوْ وَيَرْفَعُ يَدَيْهِ ثُمَّ يَرْمِيْ الْوَسْطَى بِسَبْعِ حَصَيَاتٍ يُكَبِّرُ كُلَّمَا رَمَى بِحَصَاةٍ ثُمَّ يَأْخُذُ بِذَاتِ الشِّمَالِ فَيُسْهِلُ وَيَقُوْمُ مُسْتَقْبِلَ الْقِبْلَةِ ثُمَّ يَدْعُوْ وَيَرْفَعُ يَدَيْهِ وَيَقُوْمُ طَوِيْلًا ثُمَّ يَرْمِيْ جَمْرَةَ ذَاتِ الْعَقَبَةِ مِنْ بَطْنِ الْوَادِيْ بِسَبْعِ حَصَيَاتٍ يُّكَبِّرُ عِنْدَ كُلِّ حَصَاةٍ وَلَا يَقِفُ عِنْدَهَا ثُمَّ يَنْصَرِفُ فَيَقُوْلُ: هَكَذَا رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَفْعَلُهُ. رَوَاهُ الْبُخَارِيُّ.
2661. (3) [2/817–దృఢం]
తన తండ్రి ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ ద్వారా సాలిమ్ కథనం: ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ జమ్‌రతుల్ ఊ’లాకు 7 కంకరరాళ్ళు కొట్టేవారు. ప్రతి కంకరరాయితో పాటు ‘అల్లాహు అక్బర్,’ పలికి ముందుకు సాగేవారు, మెత్తని నేలపైకి వెళ్ళి ఖిబ్లా వైపు తిరిగి చాలాసేపు వరకు నిలబడి దు’ఆ చేసేవారు. దు’ఆలో తన రెండు చేతులను ఎత్తేవారు. ఆ తరువాత జమ్‌రతుల్ వుస్తహ్ను 7 కంకరరాళ్ళు కొట్టే వారు. ప్రతి కంకర రాయితో పాటు ‘అల్లాహు అక్బర్ ‘, పలికేవారు. ఆ తరువాత ఎడమ వైపునకు కొద్దిగా ముందుకు పోయి మెత్తని నేలపైకి వెళ్ళి ఖిబ్లా వైపు నిలబడి చాలాసేపు వరకు దు’ఆ చేసేవారు. దు’ఆలో చేతులను ఎత్తేవారు. చాలా సేపు వరకు నిలబడి ఉండేవారు. ఆ తరువాత అక్కడి నుండి బయలుదేరి జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్ వద్దకు వచ్చి పల్లపు ప్రాంతంలో నిలబడి 7 కంకరరాళ్ళు కొట్టేవారు. ప్రతి కంకర రాయితో ‘అల్లాహు అక్బర్ ‘ అని పలికేవారు. అయితే ఇక్కడ ఆగేవారు కారు. కంకర రాళ్ళు కొట్టి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయేవారు. ఇంకా ప్రవక్త (స) ను ఇలాగే చేస్తూ ఉండగా చూసానని,’ అన్నారు. (బు’ఖారీ)
2662 – [ 4 ] ( متفق عليه ) (2/817)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: اِسْتَأْذَنَ الْعَبَّاسُ بْنُ عَبْدِ الْمُطَّلِبِ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَنْ يَّبِيْتَ بِمَكَّةَ لَيَالِيَ مِنَى مِّنْ أَجْلِ سِقَايَتِهِ فَأَذِنَ لَهُ.
2662. (4) [2/817–ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్(ర) కథనం: ‘అబ్బాస్ బిన్ ‘అబ్దుల్ ము’త్తలిబ్ ప్రవక్త (స)ను మినాలో రాత్రి జాగ రణ చేసే రాత్రుల్లో మక్కహ్ లో ఉండే అనుమతి ఇవ్వ మని తద్వారా ప్రజలకు ‘జమ్’జమ్ నీరు త్రాపించి గలనని విన్నవించుకున్నారు. ప్రవక్త (స) అతనికి దానికి అనుమతించారు. [66] (బు’ఖారీ, ముస్లిమ్)
2663 – [ 5 ] ( صحيح ) (2/817)
وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم جَاءَ إِلَى السِّقَايَةِ فَاسْتَسْقَى. فَقَالَ الْعَبَّاسُ: يَا فَضْلُ اذْهَبْ إِلَى أُمِّكَ فَأَتِ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم بِشَرَابٍ مِّنْ عِنْدَهَا. فَقَالَ: “اِسْقِنِيْ” .فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَّهُمْ يَجْعَلُوْنَ أَيْدِيْهِمْ فِيْهِ قَالَ: “اِسْقِنِيْ”. فَشَرِبَ مِنْهُ ثُمَّ أَتَى زَمْزَمَ وَهُمْ يَسْقُوْنَ وَيَعْمَلُوْنَ فِيْهَا. فَقَالَ: “اعْمَلُوْا فَإِنَّكُمْ عَلَى عَمَلٍ صَالِحٍ“. ثُمَّ قَالَ: “لَوْلَا أَنْ تُغْلَبُوْا لَنَزَلْتُ حَتَّى أَضَعَ الْحَبْلَ عَلَى هَذِهِ“. وَأَشَارَ إِلَى عَاتِقِهِ. رَوَاهُ الْبُخَارِيُّ
2663. (5) [2/817–దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ‘జమ్’జమ్ టాంకు వద్దకు వచ్చారు. అది ‘జమ్ ‘జమ్ నీటితో నిండి ఉండేది. ప్రవక్త (స) ‘జమ్’జమ్ నీరు త్రాగుతాననే కోరిక వెలిబుచ్చారు. ‘అబ్బాస్ (ర) తన కుమారుడు ఫ‘దల్‌తో ‘నువ్వు నీ తల్లి దగ్గరకు వెళ్ళి ఆమె దగ్గర నుండి ప్రవక్త (స) కొరకు త్రాగడానికి నీళ్ళు తీసుకు రా,’ అని అన్నారు. అది విన్న ప్రవక్త (స), ‘నాకు ఈ టాంకులో ఉన్న నీరే త్రాపించండి,’ అని అన్నారు. దానికి ‘అబ్బాస్ (ర), ‘ఓ అల్లాహ్ ప్రవక్తా (స)! ప్రజలు ఈ టాంక్‌లో తమ చేతులను ముంచుతూ ఉంటారు. కొందరి చేతులు పరిశుభ్రంగా ఉండవు. అందువల్ల మీరు ఈ నీరు త్రాగడం బాగుండలేదు,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘నాకు ఇక్కడి నుండే త్రాపించండి,’ అని అన్నారు. ప్రవక్త (స) కడుపునిండా నీళ్ళు త్రాగారు. ఆ తరువాత ‘జమ్’జమ్ బావి వద్దకు వచ్చారు. అక్కడ ప్రజలు ‘జమ్’జమ్ నీటిని తోడి ప్రజలకు త్రాపిస్తున్నారు. ప్రవక్త (స) అది చూచి, ‘మీరు ఒక మంచి పనిలో నిమగ్నమయి ఉన్నారు. దీన్ని ఇలాగే చేస్తూ ఉండండి. ఆ తరువాత ప్రవక్త (స) ఒకవేళ నేను తోడటం వల్ల ప్రజలు ‘జమ్’జమ్ నీరు తోడే సాంప్రదాయాన్ని అమలు చేస్తారనే భయం లేకపోతే నేను కూడా త్రాడు పట్టి ‘జమ్’జమ్ నీరు తోడేవాడిని. ప్రజలకు త్రాపించేవాడిని,’ అని అన్నారు. (బు’ఖారీ)
2664 – [ 6 ] ( صحيح ) (2/818)
وَعَنْ أَنَسٍ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم صَلَّى الظُّهْرَ وَالْعَصْرَ وَالْمَغْرِبَ وَالْعِشَاءَ ثُمَّ رَقَدَ رَقْدَةً بِالْمُحَصَّبِ ثُمَّ رَكِبَ إِلَى الْبَيْتِ فَطَافَ بِهِ. رَوَاهُ الْبُخَارِيُّ.
2664. (6) [2/818 దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ”జుహ్‌ర్, ‘అ’స్ర్, మ’గ్‌రిబ్, ‘ఇషా’ నమా’జులు చదివారు. ఆ తరువాత ము’హ’స్సబ్‌లో కొంతసేపు నిద్రపోయారు. ఆ తరువాత అక్కడి నుండి వాహనం ఎక్కి బైతుల్లాహ్ వచ్చి ‘తవాఫె విదా’అ చేసారు. [67] (బు’ఖారీ)
2665 – [ 7 ] ( متفق عليه ) (2/818)
وَعَنْ عَبْدِ الْعَزِيْزِ بْنِ رُفَيْعٍ قَالَ: سَأَلْتُ أَنَسَ بْنَ مَالِكٍ. قُلْتُ: أَخْبِرْنِيْ بِشَيْءٍ عَقلْتَهُ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: أَيْنَ صَلَّى الظُّهْرَ يَوْمَ التَّرْوِيَةِ؟ قَالَ: بِمِنَّى. قُلْتُ: فَأَيْنَ صَلَّى الْعَصْرَ يَوْمَ النَّفَرِ؟ قَالَ: بِالْأَبْطَحِ. ثُمَّ قَالَ افْعَلْ كَمَا يَفْعَلُ أُمَرَاؤُكَ.
2665. (7) [2/818– ఏకీభవితం]
‘అబ్దుల్ ‘అ’జీ’జ్ బిన్ రుఫయ్’ఇ (ర) కథనం: నేను అనస్ బిన్ మాలిక్‌ను మీరు ప్రవక్త (స)నుండి నేర్చుకున్న దాన్ని దేన్నయినా నాకు ఉపదేశించండి. అంటే ప్రవక్త (స) 8వ తేదీన ”జుహ్‌ర్ నమా’జు ఎక్కడ చదివారు. అని విన్నవించుకున్నాను. దానికి అతను (ర) మినాలో అన్నారు. ఆ తరువాత మళ్ళీ ‘హజ్జ్ నుండి తిరుగు ప్రయాణంలో 13వ తేదీన ‘అ’స్‌ర్ నమా’జు ఎక్కడ చదివారు అని అడిగాను. దానికి అతను(ర), ”అబ్’త‘హ ప్రాంతంలో” అని చెప్పి మీ ఇమాము ఎలా చేస్తే అలా చేయండి,’ అని అన్నారు. [68] (బు’ఖారీ, ముస్లిమ్)
2666 – [ 8 ] ( متفق عليه ) (2/818)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: نُزُوْلُ الْأَبْطَحِ لَيْسَ بِسُنَّةِ إِنَّمَا نَزَلَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِأَنَّهُ كَانَ أَسْمَحَ لِخُرُوْجِهِ إِذَا خَرَجَ .
2666. (8) [2/818– ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: అబ్’త’హ్ ప్రాంతంలో విడిది చేయడం ప్రవక్త సాంప్రదాయం కాదు. అంటే ‘హజ్జ్ విధి కాదు. ప్రవక్త (స) అక్కడ ఎందుకు విడిది చేసే వారంటే అటు నుండి మదీనహ్ వైపు రావటంలో సౌకర్యం ఉండేది. (బు’ఖారీ, ముస్లిమ్)
2667 – [ 9 ] ( لم تتم دراسته ) (2/818)
وَعَنْهَا قَالَتْ: أَحْرَمْتُ مِنَ التَّنْعِيْمِ بِعُمْرَةٍ فَدَخَلْتُ فَقَضَيْتُ عُمْرَتِيْ وَانْتَظَرَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِالْأَبْطَحِ حَتَّى فَرَغْتُ فَأَمَرَ النَّاسَ بِالرَّحِيْلِ فَخَرَجَ فَمَرَّ بِالْبَيْتِ فَطَافَ بِهِ قَبْلَ صَلَاةِ الصُّبْحِ ثُمَّ خَرَجَ إِلَى الْمَدِيْنَةِ. هَذَا الْحَدِيْثُ مَا وَجَدْتُّهُ بِرِوَايَةِ الشَّيْخَيْنِ بَلْ بِرَوَايَةِ أَبِيْ دَاوُدَ مَعَ اخْتِلَافٍ يَسِيْرٍ فِيْ آخِرِهِ.
2667. (9) [2/818– అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: నేను తన్’యీమ్ ప్రాంతం నుండి ‘ఉమ్‌రహ్ ఇ’హ్‌రామ్ ధరించాను. ఆ తరువాత నేను మక్కహ్ లో ప్రవేశించాను. ‘ఉమ్‌రహ్ చేసాను. ఇటు ప్రవక్త (స) అబ్’త‘హ ప్రదేశంలో నా గురించి ఎదురు చూస్తున్నారు. చివరికి నేను ‘ఉమ్‌రహ్ పూర్తి చేసాను. ప్రవక్త (స) ప్రజలను బయలుదేరమని ఆదేశించారు. అతను (స) బయలుదేరి బైతుల్లాహ్ చేరారు. ఫజ్‌ర్ నమా’జుకు ముందు బైతుల్లాహ్ ‘తవాఫ్ విదా‘అ చేసారు. ఆ తరువాత మదీనహ్కు బయలు దేరారు.
ఈ ‘హదీసు’ బు’ఖారీ, ముస్లిమ్‌లో లభించలేదని, అబూ దావూద్‌లో మామూలు వ్యత్యాసంతో లభిం చిం దని మిష్‌కాత్ సంకలనకర్త పేర్కొన్నారు.
2668 – [ 10 ] ( متفق عليه ) (2/819)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ النَّاسُ يَنْصَرِفُوْنَ فِيْ كُلِّ وَجْهٍ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَنْفِرَنَّ أَحَدُكُمْ حَتَّى يَكُوْنَ آخِرُ عَهْدِهِ بِالْبَيْتِ إِلَّا أَنَّهُ خُفِّفَ عَنِ الْحَائِضِ”.
2668. (10) [2/819– ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ‘హజ్జ్ నిర్వర్తించిన తర్వాత ప్రజలు అటూ ఇటూ వెళ్ళసాగారు. అప్పుడు ప్రవక్త (స) మీలో ఎవరూ బైతుల్లాహ్‌ను కలుసుకోనంత వరకు తన ఇంటికి వెళ్ళడానికి మక్కహ్ వెలుపలకు వెళ్ళరాదు. అంటే వీడ్కోలు ‘తవాఫ్ చేసుకోవాలి. అయితే బహిష్టు స్థితిలో ఉన్న స్త్రీలను మినహాయించడం జరిగింది. అంటే ఒకవేళ బహిష్టు, ప్రసవదశల వల్ల స్త్రీలు ‘తవాఫె వి‘దా చేయకపోతే మరేం ఫర్వాలేదు.[69](బు’ఖారీ, ముస్లిమ్)
2669 – [ 11 ] ( متفق عليه ) (2/819)
وَعَنْ عَائِشَةَ قَالَتْ : حَاضَتْ صَفِيَّةُ لَيْلَةَ النَّفَرِ فَقَالَتْ : ما أَرَانِيْ إِلَّا حَابِسَتَكُمْ . قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم : “عَقْرَى حَلْقَى أَطَافَتْ يَوْمَ النَّحْرِ؟ ” قِيْلَ : نَعَمْ. قَالَ : ” فَانْفِرِيْ.“
2669. (11) [2/819–ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ‘సఫియ్య తిరుగు ప్రయాణం చేసే రోజు బహిష్టుకు గురయ్యారు. అంటే 13వ తేదీన తిరుగు ప్రయాణమై మదీనహ్ రావలసి ఉంది. అప్పుడు ఆమె బహిష్టుకు గురయ్యారు. ‘ఆయి’షహ్ (ర) ” ‘సఫియ్య అందరినీ ఆపివేస్తుందని నా అనుమానం” అని అన్నారు. అది విని ప్రవక్త (స), ‘ఆమె పాడుగాను ఆమె 10వ తేదీన ‘తవాఫ్ చేయలేదా,’ అని అన్నారు. ‘అవును ఆమె ‘తవాఫ్ చేసింది,’ అని విన్నవించుకోవడం జరిగింది. అప్పుడు ప్రవక్త (స), ‘ఇక ఆమె వెళ్ళవచ్చు,’ అని అన్నారు.[70](బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2670 – [ 12 ] ( لم تتم دراسته ) (2/819)
عَنْ عَمْرِو بْنِ الْأَحْوَصِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ فِيْ حَجَّةِ الْوَدَاعِ: “أَيُّ يَوْمٍ هَذَا؟” قَالُوْا:يَوْمُ الحجِّ الاكبر. قَالَ: “فَإِنَّ دِمَاءَكُمْ وَأَمْوَالَكُمْ وَأَعْرَاضَكُمْ بَيْنَكُمْ حَرَامٌ كَحُرْمَةِ يَوْمِكُمْ هَذَا فِيْ بَلَدِكُمْ هَذَا أَلَا لَا يَجْنِيْ جَانٍ إلاعَلَى نَفْسِهِ ألَا لا يَجْنِيْ جَانٍ عَلَى وَلَدِهِ وَلَا مَوْلُوْدٌ عَلَى وَالِدِهِ أَلَا وَإِنَّ الشَّيْطَانَ قَدْ أَيِسَ أَنْ يُّعْبَدَ فِيْ بَلَدِكُمْ هَذَا أَبَدًا وَلَكِنْ سَتَكُوْنُ لَهُ طَاعَةٌ فِيْمَا تَحْتَقِرُوْنَ مِنْ أَعْمَالِكُمْ فَسَيَرْضَى بِهِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالتِّرْمِذِيُّ وَصَحَّحَهُ.
2670. (12) [2/819–అపరిశోధితం]
‘అమ్ర్ బిన్ అ’హ్‌వ’స్ (ర) కథనం: ‘హజ్జతుల్ విదా’అలో నేను ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా విన్నాను. ”ఈ రోజు ఏ దినం” అని ప్రశ్నించారు. దానికి ప్రజలు, ‘ఈ రోజు ‘హజ్జ్ గొప్పదినం. అంటే 9వ తేదీ.’ ఆ తరువాత ప్రవక్త (స) ”మీ ప్రాణాలు, మీ ధనం, మీ గౌరవ మర్యాదలు, మీ మధ్య ఈ దినం, ఈ నగరంలాగే గౌరవ ప్రదమైనవి. గుర్తుంచుకోండి! ఎవరూ ఎటువంటి దౌర్జన్యంచేసినా దానిశిక్ష అతనిపైనే పడుతుంది. ఇంకా తండ్రి దౌర్జన్యం చేస్తే తండ్రినే శిక్షించడం జరుగుతుంది. కొడుకును కాదు. అదే విధంగా కొడుకు దౌర్జన్యం చేస్తే తండ్రిని కాదు, కొడుకునే శిక్షించడం జరుగుతుంది. ఇటు వంటి ఆచారం అజ్ఞాన కాలంలో ఉండేది. ఇక ఈ నగరంలో షై’తాన్ తన పూజ ఎన్నడూ జరగదని నిరాశ చెందాడు. అంటే తీర్పుదినం వరకు మక్కహ్ నుండి విగ్రహా రాధనను తొలగించడం జరిగింది. అయితే ప్రజలు షై’తాన్‌ను అనుసరిస్తారు. మీరు కూడా కొన్ని పనులను చిన్నవిగా భావించి చేస్తారు. వాటిలో షై’తాన్ విధేయత ఉంటుంది. షై’తాన్ వాటి పట్ల సంతోషిస్తాడు. ఉదా: అసత్యం పలకటం, అసత్య సాక్ష్యం ఇవ్వటం, శత్రుత్వం, కల్మషం, మోసం మొదలైనవి. వీటిని మీరు చిన్నవిగా భావిస్తారు. కాని షై’తాన్ వీటివల్ల చాలా సంతోషిస్తాడు. అంటే ఈవిధంగా అనేకమంది షై’తాన్‌ను అనుసరిస్తారు. అంటే సాటి కల్పించటం అవిశ్వాసం తప్ప మిగిలిన పాపకార్యాల్లో ప్రజలు చిక్కుకుంటారు. వీటివల్ల షై’తాన్ వారిని రెచ్చ గొట్టటానికి అవకాశం లభిస్తుంది. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
2671 – [ 13 ] ( لم تتم دراسته ) (2/819)
وَعَنْ رَافِعِ بْنِ عَمْرٍو وَالْمُزَنِيِّ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَخْطُبُ النَّاسَ بِمِنّى حِيْنَ ارْتَفَعَ الضُّحَى عَلَى بَغْلَةٍ شَهْبَاءَ وَ عَلِيٌّ يُعَبِّرُ عَنْهُ وَالنَّاسُ بَيْنَ قَائِمٍ وَقَاعِدٍ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2671. (13) [2/819–అపరిశోధితం]
రా’ఫె బిన్ ‘అమ్ర్, ము’జనీ (ర) కథనం: నేను ప్రవక్త (స) ను మినాలో బాగా పొద్దెక్కిన తర్వాత ప్రజల ముందు ప్రసంగిస్తూ ఉండగా చూచాను. ప్రవక్త (స) షహ్‌బా’ కంచర గాడిదపై కూర్చొని ఉన్నారు. అంటే దాని వెంట్రుకలు ఎరుపు తెలుపుగా ఉన్నాయి. ‘అలీ (ర) ప్రవక్త (స) ప్రసంగాన్ని ప్రజల ముందు వల్లించే వారు. ఆ సమయంలో కొంతమంది నిలబడి ఉన్నారు. మరికొంతమంది కూర్చొని ఉన్నారు. (అబూ దావూద్)
2672 – [ 14 ] ( لم تتم دراسته ) (2/820)
وَعَنْ عَائِشَةَ وَابْنُ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمْ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَخَّرَ طَوَافَ الزِّيَارَةِ يَوْمَ النَّحْرِ إِلَى اللَّيْلِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
2672. (14) [2/820–అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) మరియు ఇబ్నె ‘అబ్బాస్‌ల కథనం: ప్రవక్త (స) ‘తవాఫె ‘జియారత్ కోసం యౌము న్న’హర్ రాత్రి వరకు వేచి ఉన్నారు. అంటే రాత్రి చేసారు.[71] (తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
2673 – [ 15 ] ( لم تتم دراسته ) (2/820)
وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم لَمْ يَرْمُلْ فِيْ السَّبْعِ الَّذِيْ أَفَاضَ فِيْهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
2673. (15) [2/820–అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ‘తవాఫె ‘జియారత్‌లో 7 ప్రదక్షిణల్లోనూ రమ్‌ల్ చేయలేదు. [72] (అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
2674 – [ 16 ] ( لم تتم دراسته ) (2/820)
وَعَنْ عَائِشَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا رَمَى أَحَدُكُمْ جَمْرَةَ الْعَقَبَةِ فَقَدْ حَلَّ لَهُ كُلُّ شَيْءٍ إِلَّا النِّسَاءَ“. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ وَقَالَ: إِسْنَادُهُ ضَعِيْفٌ.
2674. (16) [2/820–అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”మీలో ఎవరైనా జమ్‌రతుల్ ‘అఖబహ్కు రమీ చేస్తే, అతనికి భార్య తప్ప మిగిలినవన్నీ ధర్మసమ్మతం అయి పోతాయి. (షర్హ్ సున్నహ్ – బ’గవీ – బలహీన ఆధారాలు).
2675 – [ 17 ] ( لم تتم دراسته ) (2/820)
وَفِيْ رِوَايَةِ أَحْمَدَ وَالنَّسَائِيِّ عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: ” إِذَا رَمَى الْجَمَرَةَ فَقَدْ حَلَّ لَهُ كُلُّ شَيْءٍ إِلَّا النِّسَاءَ”.
2675. (17) [2/820–అపరిశోధితం]
మరొక ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం ద్వారా, అ’హ్మద్ మరియు నసాయీ’ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ప్రవక్త (స) ప్రవచనం, ‘జమరహ్ ను కంకరరాళ్ళు కొట్టిన తరువాత, స్త్రీ తప్ప, మిగతా విషయాలన్నీ ధర్మసమ్మత మయిపోతాయి.’
2676 – [ 18 ](?) (2/820)
وَعَنْهَا قَالَتْ: أَفَاضَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنْ آخِرِ يَوْمِهِ حِيْنَ صَلَّى الظّهرَ ثُمَّ رَجَعَ إِلَى مِنّى فَمَكَثَ بِهَا لَيَالِيَ أَيَّامِ التَّشْرِيْقِ يَرْمِي الْجَمْرَةَ إِذَا زَالَتِ الشَّمْسُ كُلُّ جَمْرَةٍ بِسَبْعِ حَصَيَّاتٍ يُكَبِّرُ مَعَ كُلِّ حَصَاةٍ وَيَقِفُ عِنْدَ الْأَوْلَى وَالثَّانِيَةِ فَيُطِيْلُ الْقِيَامَ وَيَتَضَرَّعُ وَيَرْمِي الثَّالِثَةَ فَلَا يَقِفُ عِنْدَهَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2676. (18) [2/820–?]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఖుర్‌బానీ రోజు చివరి సమయంలో ”జుహ్‌ర్ నమా’జు ఆచరించి ‘తవాఫె ఇఫా’దహ్ చేసారు. ఆ తరువాత మక్కహ్ నుండి మినా తిరిగి వచ్చారు. మినాలో తష్‌రీఖ్ దినాల వరకు ఉన్నారు. ఈ దినాల్లో సూర్యుడు వాలిన తర్వాత ప్రతి జమ్‌రహ్‌పై 7 కంకరరాళ్ళు కొడుతూ ఉన్నారు. ప్రతి కంకరరాయితో ‘అల్లాహు అక్బర్,‘ అని పలుకుతూ ఉన్నారు. అయితే జమ్‌రతుల్ ఊలా, జమ్‌ర తుస్సానియలపై కంకరరాళ్ళు కొట్టిన తర్వాత చాలా సేపు వరకు నిలబడి వినయ, వినమ్రతలతో దు’ఆ చేస్తూ ఉన్నారు. కాని జమ్‌రతుల్ ‘ఉఖ్‌బపై కంకర రాళ్ళు విసిరి వెంటనే అక్కడి నుండి ముందుకు సాగిపోయే వారు. (అబూ దావూద్)
2677 – [ 19 ] ( لم تتم دراسته ) (2/820)
وَعَنْ أَبِي الْبَدَّاحِ بْنِ عَاصِمِ بْنِ عَدِيٍّ عَنْ أَبِيْهِ قَالَ: رَخَّصَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِرِعَاءِ الْإِبْلِ فِيْ الْبَيْتُوْتَةِ: أَنْ يَّرْمُوْا يَوْمَ النَّحْرِ ثُمَّ يَجْمَعُوْا رَمْيَ يَوْمِيْنَ بَعْدَ يَوْمِ النَّحْرِفَيَرْمُوْهُ فِيْ أَحَدِهِمَا. رَوَاهُ مَالِكٌ وَالتِّرْمِذِيُّ وَالنِّسَائِيُّ وَقَالَ التِّرْمِذِيُّ : هَذَا حَدِيْثٌ صَحِيْحٌ.
2677. (19) [2/820–అపరిశోధితం]
అబుల్ బద్దా’హ్ బిన్ ‘ఆసిమ్ బిన్ ‘అదీ తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) ఒంటెల కాపరులకు రాత్రి మినాలో గడిపే అవసరం లేదని, 10వ తేదీన జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్పై కంకరరాళ్ళు కొట్టి, యౌమున్న’హర్ తర్వాత రెండురోజుల కంకరరాళ్ళు ఒకే రోజు చేసుకోవాలని ప్రవచించారు, అంటే రెండు రోజుల కంకరరాళ్ళు ఒకేరోజులో కొట్టాలి. ఖుర్‌బానీ రెండవ రోజైనా లేదా మూడవ రోజైనా చేయవచ్చు. [73] (తిర్మిజి’ – దృఢం, నసాయి’, మాలిక్)
—–
هَذَا الْبَابُ خَالٍ عَنِ الْفَصْلِ الثَّالِثُ
ఇందులో మూడవ విభాగం లేదు
=====
11- بَابُ مَا يَجْتَنِبُهُ الْمُحْرِمُ
11. ము’హ్రిమ్ దూరంగా ఉండవలసిన విషయాలు
‘హజ్జ్ ఇ’హ్‌రామ్ ధరించిన తర్వాత ము’హ్‌రిమ్‌కు కొన్ని కట్టుబాట్లు తప్పనిసరి అవుతాయి. ఇ’హ్‌రామ్‌కు వ్యతిరేకంగా పాల్పడరాదు. స్త్రీ పురుషు లిరువురికీ ఈ కట్టుబాట్లు సరిసమానంగా ఉంటాయి. కొన్ని విషయాల్లో ఇద్దరూ సమానులే. మరికొన్ని విషయాల్లో ఇద్దరిలో తేడా ఉంది.
ఇ’హ్రామ్ స్థితిలో పురుషులు ఈ పనులు చేయ రాదు: 1. భార్యతో సంభోగం చేయరాదు. 2. ముద్దు పెట్టు కోరాదు. 3. కలహాలు జగడాలు చేయరాదు. 4. తన లేదా ఇతరుల నికా’హ్ చేయరాదు. 5. అడవి జంతువులను వేటాడరాదు. 6. సుగంధ ద్రవ్యాలు ఉపయోగించరాదు. 7. తల వెంట్రుకలను కత్తిరించ రాదు, గీయించుకోరాదు. 8. గోళ్ళు కత్తిరించరాదు. 9. పేళ్ళను చంపరాదు. 10. కమీ’జు, పైజామా ధరించ రాదు. 11. పగిడీ ధరించరాదు. 12. టోపీ ధరించరాదు. 13. తల కప్పరాదు. 14. మేజోళ్ళు (సాక్సులు), చేతి మేజోళ్ళు – తొడుగులు (గ్లౌజులు) ధరించరాదు.
ఇహ్‌రామ్ స్థితిలో స్త్రీలు ఈ పనులు చేయరాదు: 1. ముఖం కప్పరాదు. 2. గోళ్ళు కత్తిరించరాదు. 3. తల వెంట్రుకలు గీయించరాదు. 4. అడవి జంతువులను వేటాడరాదు. 5. నికా’హ్ చేయరాదు, చేయించరాదు. 6. సంభోగం, దానికి గురిచేసే వాటికి దూరంగా ఉండాలి. 7. జగడాలు, కలహాలు చేయరాదు. 8. స్త్రీలు లబ్బయిక్ అని, బిగ్గరగా పలుకరాదు. వీటి గురించి క్రింది ‘హదీసు’లో పేర్కొనడం జరిగింది.
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2678 – [ 1 ] ( متفق عليه ) (2/821)
عَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ: أَنَّ رَجُلًا سَأَلَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم: مَا يَلْبَسُ المُحْرِمُ مِنَ الثِّيَابِ؟ فَقَالَ: “لَا تَلْبَسُوْا الْقُمُصَ وَلَا الْعَمَائِمَ وَلَا السَّرَاوِيْلَاتِ وَلَا الْبَرَانِسَ وَلَا الْخِفَافَ إِلَّا أَحَدٌ لَا يَجِدُ نَعْلَيْنِ فَيَلْبَسُ خُفَّيْنِ وَلْيَقْطَعُهُمَا أَسْفَلَ الْكَعْبَيْنِ وَلَا تَلْبَسُوْا مِنَ الثِّيَابِ شَيْئًا مَسَّهُ زَعْفَرَانٌ وَلَا وَرْسٌ”. مُتَّفَقٌ عَلَيْهِ
وَزَادَ الْبُخَارِيُّ فِيْ رِوَايَةٍ: “وَلَا تَنْتَقِبُ الْمَرْأَةِ الْمُحرِمَةُ وَلَا تَلْبَسُ الْقُفَّازَيْنِ”.
2678. (1) [2/821–ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ఒక వ్యక్తి ప్రవక్త (స)ను ఇ’హ్‌రామ్‌లో ఎటువంటి దుస్తులు ధరించ వచ్చని ప్రశ్నించాడు. ప్రవక్త (స) ము’హ్‌రిమ్ కమీ’జు, పగిడి, పైజామా, టోపీ మొదలైనవి ధరించరాదని, శరీరాన్ని తలతో పాటు పూర్తిగా కప్పరాదని, బూట్లు ధరించరాదని, ఒకవేళ చెప్పులు లేకపోతే బూట్లను చీలమండల వరకు కోసి తొడగ వచ్చును. అదే విధంగా కాషాయ రంగు వస్తువులు సుగంధ పరిమళాలు గల దుస్తులు ధరించరాదని ప్రవచించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
బు’ఖారీ ఉల్లేఖనంలో ఇలా ఉంది: ఇ’హ్రామ్ స్థితిలో ఉన్న స్త్రీలు ముఖాన్ని కప్పరాదు, చేతి గ్లౌజులు ధరించరాదు, అని ఉంది.
2679 – [ 2 ] ( متفق عليه ) (2/821)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَخْطُبُ وَهُوَ يَقُوْلُ: “إِذَا لَمْ يَجِدِ الْمُحْرِمُ نَعْلَيْنِ لَبِسَ خُفَّيْنِ وَإِذَا لَمْ يَجِدْ إِزَارًا لَّبِسَ سَرَاوِيْلَ”.
2679. (2) [2/821–ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ప్రసంగంలో ఇలా అంటూ ఉండగా విన్నాను, ”ము’హ్‌రిమ్‌కు చెప్పులు లభించని పక్షంలో బూట్లు చీల మండల వరకు కత్తిరించి ధరించవచ్చును. అదే విధంగా లుంగీ లభించని పక్షంలో పైజామా ధరించ వచ్చును.” (బు’ఖారీ, ముస్లిమ్)
2680 – [ 3 ] ( متفق عليه ) (2/821)
وَعَنْ يَعْلَى بْنِ أُمَيَّةَ قَال: كُنَّا عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم بِالْجِعِرَّانَةِ إِذْ جَاءَ رَجُلٌ أَعْرَابِيٌّ عَلَيْهِ جُبَّةٌ وَهُوَ مُتَضَمِّخٌ بِالْخُلُوْقِ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ أَحْرَمْتُ بِالْعُمْرَةِ وَهَذِهِ عَلَيَّ.فَقَالَ: “أَمَا الطِّيْبُ الَّذِيْ بِكَ فَاغْسِلْهُ ثَلَاثَ مَرَّاتٍ وَأَمَّا الْجُبَّةُ فَانْزِعْهَا ثُمَّ اصْنَعْ فِيْ عُمْرَتِكَ كَمَا تَصْنَعُ فِيْ حَجِّكَ”.
2680. (3) [2/821–ఏకీభవితం]
య’అలా బిన్ ‘ఉమయ్యహ్ (ర) కథనం: మేము జి’ఇర్రానహ్ ప్రాంతంలో ప్రవక్త (స) వద్ద కూర్చొని ఉన్నాము. ఒక బదూ’ వచ్చాడు. అతడు ఇ’హ్రామ్ స్థితిలో సువాస నలతో కూడిన జుబ్బ ధరించి ఉన్నాడు. ఆ వ్యక్తి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! నేను ‘ఉమ్ రహ్ ఇ’హ్‌రామ్ ధరించి ఉన్నాను. నేను ఈ జుబ్బను ధరించి ఉన్నాను, దీనికి సువాసనలు కూడా పూసి ఉన్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి,’ అని విన్న వించుకున్నాడు. ప్రవక్త(స) సమాధానం ఇస్తూ, ”సువా సనను మూడు సార్లు కడిగివేయి, జుబ్బను విప్పి వేయి, నీవు ‘హజ్జ్లో చేయ వలసిందే ఇ’హ్‌రామ్‌లో చేయి” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2681 – [ 4 ] ( صحيح ) (2/822)
وَعَنْ عُثْمَانَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَنْكِحُ الْمُحْرِمُ وَلَا يُنْكِحُ وَلَا يَخْطُبُ“. رَوَاهُ مُسْلِمٌ.
2681. (4) [2/822–దృఢం]
‘ఉస్మాన్ (ర) కథనం: ము’హ్రిమ్ వ్యక్తి నికా’హ్ చేసుకో రాదు, చేయించరాదు. వివాహ సందేశం కూడా పంపరాదు. (ముస్లిమ్)
2682 – [ 5 ] ( متفق عليه ) (2/822)
وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم تَزَوَّجَ مَيْمُوْنَةَ وَهُوَ مُحْرِمٌ.
2682. (5) [2/822–ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ఇ’హ్రామ్ స్థితిలో మైమూనహ్‌తో నికా’హ్ చేసారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2683 – [ 6 ] ( صحيح ) (2/822)
وَعَنْ يَزِيْدَ بْنِ الْأَصَمِّ، ابْنِ أُخْتِ مَيْمُوْنَةَ عَنْ مَيْمُوْنَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم تَزَوَّجَهَا وَهُوَ حَلَالٌ. رَوَاهُ مُسْلِمٌ.
قَالَ الشَّيْخُ الْإِمَامُ مُحْيِ السُّنَّةِ رَحِمَهُ اللهُ: وَالْأَكْثَرُوْنَ عَلَى أَنَّهُ تَزَوَّجَهَا حَلَالًا وَ ظَهَرَأَمْرُ تَزْوِيْجِهَا وَهُوَ مُحْرِمٌ ثُمَّ بَنَى بِهَا وَهُوَ حَلَالٌ بِسَرِفَ فِيْ طَرِيْقِ مَكَّةَ .
2683. (6) [2/822–దృఢం]
య’జీద్ బిన్ అ’సమ్, మైమూనహ్ చెల్లెలు కొడుకు, మైమూనహ్ ద్వారా కథనం: ప్రవక్త (స) మైమూనహ్తో నికా’హ్ చేసారు. అప్పుడు ప్రవక్త (స) ఇ’హ్రామ్ స్థితిలో లేరు. (ముస్లిమ్)
ఇమామ్ ము’హ్‌యుస్సున్నహ్ (రహ్మ) మరియు ఇతర ధార్మిక పండితుల్లో అత్యధికులు, ప్రవక్త (స) మైమూనహ్ (ర) తో ఇ’హ్‌రామ్‌లో లేని స్థితిలో పెళ్ళి చేసుకున్నారని, అయితే అతని (స) పెళ్ళి విషయం ఇ’హ్‌రామ్ ధరించిన తర్వాత అందరికీ తెలిసిందని, ఆ తరువాత అతను (స) తన భార్యతో ఇ’హ్‌రామ్‌లో లేని స్థితిలో సంభోగం చేసారని, ఆ స్థలం మక్కహ్ మార్గంలో ఉన్న సరిఫ్ అని అభిప్రాయ పడ్డారు. [74]
2684 – [ 7 ] ( متفق عليه ) (2/822)
وَعَنْ أَبِيْ أَيُّوْبَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَغْسِلُ رَأْسَهُ وَهُوَ مُحْرِمٌ.
2684. (7) [2/822–ఏకీభవితం]
అబూ అయ్యూబ్ (ర) కథనం: ఇ’హ్రామ్ స్థితిలో ప్రవక్త (స) తన తలను కడుక్కునేవారు.[75] (బు’ఖారీ).
2685 – [ 8 ] ( متفق عليه ) (2/822)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: احْتَجَمَ النَّبِيُّ صلى الله عليه وسلم وَهُوَ مُحْرِمٌ.
2685. (8) [2/822–ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ఇ’హ్రామ్ స్థితిలో కొమ్ము (హిజామహ్) చేయించుకున్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2686 – [ 9 ] ( صحيح ) (2/822)
وَعَنْ عُثْمَانَ حَدَّثَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ الرَّجُلِ إِذَا اشْتَكَى عَيْنَيْهِ وَهُوَ مُحْرِمٌ ضَمَّدَهُمَا بِالصَّبِرِ. رَوَاهُ مُسْلِمٌ.
2686. (9) [2/822–దృఢం]
‘ఉస్మాన్ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇ’హ్రామ్ స్థితిలో ఉన్న ఒక వ్యక్తి తన కళ్ళు నొప్పిగా ఉన్నాయని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స) మందు రాసుకోమని అనుమతి ఇచ్చారు. [76] (ముస్లిమ్)
2687 – [ 10 ] ( صحيح ) (2/822)
وَعَنْ أُمِّ الْحُصَيْنِ قَالَتْ: رَأَيْتُ أُسَامَةَ وَبِلَالًا وَأَحَدُهُمَا آخِذٌ بِخِطَامِ نَاقَةِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. وَالْآخَرُ رَافِعٌ ثَوْبَهُ يَسْتُرُهُ مِنَ الْحَرِّ حَتَّى رَمَى جَمْرَةَ الْعَقَبَةِ . رَوَاهُ مُسْلِمٌ.
2687. (10) [2/822–దృఢం]
ఉమ్ముల్ ‘హు’సైన్ (ర) కథనం: నేను ఉసామహ్ను మరియు బిలాల్‌ను చూచాను. వారిలో ఒకరు ప్రవక్త (స) యొక్క ఒంటె కళ్ళాన్ని పట్టుకొని ఉన్నారు. మరొకరు ప్రవక్త (స) తలపై వస్త్రం ద్వారా నీడ కల్పిస్తున్నారు, ప్రవక్త (స)పై ఎండ పడకుండా ఉండటానికి చివరికి ప్రవక్త (స) జమ్‌రతుల్ ‘ఉఖ్‌బహ్ను రమీ చేసుకున్నారు. [77] (ముస్లిమ్)
2688 – [ 11 ] ( متفق عليه ) (2/823)
وَعَنْ كَعْبِ بْنِ عُجْرَةِ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم مَرَّ بِهِ وَهُوَ بِالْحُدَيْبِيَةِ قَبْلَ أَنْ يَّدْخُلَ مَكَّةَ وَهُوَ مُحْرِمٌ وَهُوَ يُوْقِدُ تَحْتَ قِدْرٍ وَالْقَمْلُ تَتَهَافَتُ عَلَى وَجْهِهِ فَقَالَ: “أَتُؤْذِيْكُهُوَ اُمُّكَ؟”. قَالَ: نَعَمْ. قَالَ: “فَاحْلِقْ رَأْسَكَ وَأَطْعِمْ فَرَقًا بَيْنَ سِتَّةٍ مَسَاكِيْنَ”. وَالْفَرَقُ: ثَلَاثَةُ آصُعٍ: “أَوْ صُمْ ثَلَاثَةَ أَيَّامٍ أَوِانْسُكْ نَسِيْكَةً”.
2688. (11) [2/823–ఏకీభవితం]
క’అబ్ బిన్ ‘ఉజ్‌రహ్ (ర) కథనం: ప్రవక్త(స) అతని ప్రక్క నుండి వెళ్ళారు. అప్పుడతను హుదైబియహ్లో ఉన్నారు. ఇంకా మక్కలో ప్రవేశించలేదు. అప్పుడతను ము’హ్రిమ్గా ఉన్నారు. పొయ్యిమీద గిన్నె ఉంది. క్రింద మంట పెడుతున్నారు. అతని తలలోని పేలు అతని ముఖంపై పడుతున్నాయి. అది చూచి ప్రవక్త (స) అతన్ని ఉద్దేశించి, ”నీ తలలోని పేలు నీకు బాధ పెడుతున్నాయా?” అని అన్నారు. దానికి అతను, ‘అవును,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు నీ తల వెంట్రుకలను గీయించుకో, దానికి బదులు ఒక ఫర్‌ఖ్ ఆహార ధాన్యాలు, 6 గురు పేదల్లో పంచిపెట్టు,’ అని అన్నారు . ఒక ఫర్‌ఖ్ 3 ‘సా’అలు అవుతుంది. (ఒక ‘సా’అ 2 ½ సేర్లు అవుతుంది. అంటే సుమారు 10 ½ సేర్లు అవుతాయి). లేదా 3 ఉపవాసాలు ఉండు. లేదా ఒక మేక ఖుర్బానీ ఇవ్వు అని ఉపదేశించారు.[78] (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2689 – [ 12 ] ( لم تتم دراسته ) (2/823)
عَنِ ابْنِ عُمَرَ: أَنَّهُ سَمِعَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَنْهِىَ النِّسَاءَ فِيْ إِحْرَامِهِنَّ عَنِ الْقُفَّازَيْنِ وَالنِّقَابِ وَمَا مَسَّ الْوَرْسُ وَالزَّعْفَرَانُ مِنَ الثِّيَابِ وَلْتَلْبَسْ بَعْدَ ذَلِكَ مَا أَحَبَّتْ مِنْ أَلْوَانِ الثِّيَابِ مُعْصَفْرٍ أَوْخَزٍّ أَوْ حُلِيٍّ أَوْ سَرَواِيْلَ أَوْ قَمِيْصٍ أَوْ خُفٍّ . رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2689. (12) [2/823 –అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా విన్నాను, ”ప్రవక్త (స) స్త్రీలను ఇ’హ్రామ్ స్థితిలో గ్లౌజులుధరించటాన్నుండి, ముఖం కప్పుకోవటాన్నుండి, కాషాయరంగు దుస్తులు ధరించ టాన్నుండి వారించేవారు. ఇ’హ్‌రామ్ దుస్తులు తొల గించిన తర్వాత తనకిష్టమైన దుస్తుల్ని ధరించ వచ్చును. అంటే రంగురంగుల దుస్తులు, అల్లికలు గలవి, పట్టుదుస్తులు, ఆభరణాలు, కమీ’జు, పైజామా, సాక్సులు, బూట్లు మొదలైనవి. (అబూ దావూద్)
2690 – [ 13 ] ( صحيح ) (2/823)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ الرُّكْبَانُ يَمُرُّوْنَ بِنَا وَنَحْنُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مُحْرِمَاتٌ فَإِذَا جَاذُوْا بِنَا سَدَلَتْ إِحْدَانَا جِلْبَابَهَا مِنْ رَّأسِهَا عَلَى وَجْهِهَا فَإِذَا جَاوَزْوَنَا كَشَفنَاهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَلِاِبْنِ مَاجَهُ مَعْنَاهُ.
2690. (13) [2/823–– దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ”మేము స్త్రీలు ఇ’హ్రామ్ స్థితిలో ప్రవక్త (స) వెంట ఉండేవారం. మా ప్రక్కనుండి బిడారాలు వెళ్ళేవి. వాళ్ళు మా ప్రక్క నుండి వెళ్ళి నప్పుడు మేము మా దుప్పట్లను మా ముఖాలపై వేసుకునే వారం, వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ మా దుప్పట్లను దించుకునే వారం. (అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
2691 – [ 14 ] ( لم تتم دراسته ) (2/823)
وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَدَّهِنُ بِالزَّيْتِ وَهُوَ مُحْرِمٌ غَيْرَ الْمُقَنَّتِ يَعْنِيْ غَيْرَ الْمُطَيَّبِ. رَوَاهُ التِّرْمِذِيُّ.
2691. (14) [2/823– అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ము’హ్‌రిమ్‌గా ఉన్నప్పుడు సువాసన లేని ‘జైతూన్ నూనె వినియో గించే వారు. [79] (తిర్మిజి’)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
2692 – [ 15 ] (?) (2/824)
عَنْ نَافِعٍ أَنَّ ابْنَ عُمَرَ وَجَدَ الْقُرَّ فَقَالَ: أَلْقِ عَلَيَّ ثَوْبًا نَافِعُ فَأَلْقَيْتُ عَلَيْهِ بُرْنُسًا فَقَالَ: تُلْقِيْ عَلَيَّ هَذَا وَقَدْ نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يَّلْبَسَهُ الْمُحْرِمُ؟ رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2692. (15) [2/824–?]
నా’ఫె (ర) కథనం: ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్‌కు చలి తగల సాగింది. అతను నన్ను, ‘ఓ నా’ఫె బట్టకప్పు’ అని అన్నారు. నేను అతనిపై వర్షంలో ఉపయోగించే దుప్పటి కప్పాను. దానికి అతను నీవు నాపై ఎలాంటి వస్త్రం వేసావంటే, ప్రవక్త (స) ము’హ్‌రిమ్‌ను అటువంటి వస్త్రం ధరించరాదని వారించారు.[80] (అబూ దావూద్)
2693 – [ 16 ] ( متفق عليه ) (2/824)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَالِكِ بْنِ بُحَيْنَةَ قَالَ: احْتَجَمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَهُوَ مُحْرِمٌ بِلَحْيِ جَمَلٍ مِّنْ طَرِيْقِ مَكَّةَ فِيْ وَسَطِ رَأْسِهِ.
2693. (16) [2/824– ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మాలిక్ (ర) కథనం: ప్రవక్త (స) ఇ’హ్రామ్ స్థితిలో తన తల మధ్య కొమ్ము చేయించు కున్నారు. ఇది మక్కహ్ మార్గంలో ఉన్న ల‘హ్‌యి జమల్ ప్రదేశంలో జరిగింది. (బు’ఖారీ, ముస్లిమ్)
2694 – [ 17 ] ( لم تتم دراسته ) (2/824)
وَعَنْ أَنَسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: احْتَجَمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَهُوَ مُحْرِمٌ عَلَى ظَهْرِ الْقَدَمِ مِنْ وَّجَعٍ كَانَ بِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.
2694. (17) [2/824– అపరిశోధితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) పాదాల కింద చాలా నొప్పిగా ఉండేది. అందువల్ల ప్రవక్త (స) కొమ్ము చేయించు కున్నారు. (అబూ దావూద్, నసాయి’)
2695 – [ 18 ] (?) (2/824)
وَعَنْ أَبِيْ رَافِعٍ قَالَ: تَزَوَّجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مَيْمُوْنَةَ وَهُوَ حَلَالٌ وَبَنَى بِهَا وَهُوَ حَلَالٌ وَكُنْتُ أَنَا الرَّسُوْلَ بَيْنَهُمَا. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ.
2695. (18) [2/824–?]
అబూ రా’ఫె (ర) కథనం: ప్రవక్త (స) ము’హ్‌రిమ్‌గా లేనప్పుడు మైమూనహ్ (ర) తో నికా’హ్ చేసుకున్నారు. అంటే ఇ’హ్రామ్ స్థితిలో లేరు. ఆ తరువాత శోభనం జరిగింది. నేను వారిద్దరి మధ్య రాయబారిగా ఉన్నాను. (అ’హ్మద్, తిర్మిజి’)
=====
12- بَابُ الْمُحْرِمُ يَجْتَنِبُ الصَّيْدَ
12. ము’హ్రిమ్ వేటాడరాదు
అంటే ఇ’హ్రామ్ స్థితిలో అడవి జంతువులను వేటాడ రాదు, వేటాడేవారికి సహాయమూ చేయరాదు. అడవి జంతువువైపు సైగకూడా చేయరాదు. అయితే సముద్రపు వేట చేయవచ్చును. అల్లాహ్ ఆదేశం: ”ఓ విశ్వాసులారా! మీరు ఇ’హ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేటాడకండి. మీలో ఎవరైనా బుధ్ధి పూర్వకంగా వేటచేస్తే, అతడు చంపిన జంతువుతో సరితూగే ఒక పశువును పరిహారంగా సమర్పించుకోవాలి. దానిని (ఆ పశువును) మీలో న్యాయ వర్తులైన ఇద్దరు వ్యక్తులు నిర్ణయించాలి. పశువును ఖుర్బానీ కొరకు క‘అబహ్ వద్దకు చేర్చాలి. లేదా దానికి పరిహారంగా కొందరు పేదలకు భోజనం పెట్టాలి, లేదా దానికి పరిహారంగా – తాను చేసిన దాని ప్రతిఫలాన్ని చవిచూడటానికి – ఉపవాసముండాలి. గడిచిపోయిన దానిని అల్లాహ్ మన్నించాడు. కాని ఇక ముందు ఎవరైనా మళ్ళీ అలా చేస్తే అల్లాహ్ అతనికి ప్రతీకారం చేస్తాడు. మరియు అల్లాహ్ సర్వ శక్తి సంపన్నుడు, ప్రతీకారం చేయగలవాడు. సముద్ర జంతువులను వేటాడటం మరియు వాటిని తినటం, జీవనోపాధిగా మీకూ (స్థిర నివాసులకూ) మరియు ప్రయాణీకులకూ ధర్మ సమ్మతం చేయబడింది. కానీ, మీరు ఇ’హ్రామ్ స్థితిలో ఉన్నంతవరకూ భూమిపై వేటాడటం మీకు నిషేధించబడింది. కావున మీరు (పునరుత్థాన దినమున) ఎవరి ముందు అయితే సమావేశ పరచబడతారో ఆ అల్లాహ్ యందు భయ భక్తులు కలిగి ఉండండి.” (సూ. అల్ మాయిదహ్, 5:95–96)
అంటే ఇ’హ్రామ్ స్థితిలో ఎటువంటి అడవి జంతు వునైనా వేటాడకండి. ఒకవేళ వేటాడితే తగిన పరి హారం చెల్లించటం తప్పనిసరి. అవి మూడు రకాలు.
1. వేటాడిన జంతువులాంటిదే ఏదైనా జంతువును జిబ’హ్ చేసి పేదవారిలో పంచివేయాలి. అవి రెండు రకాలు. (1) ఆ జంతువు గురించి ఇద్దరు ముస్లిమ్ న్యాయనిర్ణేతలు ఈ జంతువు వేటాడిన జంతువులా ఉందని నిర్ణయించాలి. అంటే లేడికి బదులు మేక, నిప్పుకోడికి బదులు ఒంటె, పావురానికి బదులు కోడి మొదలైనవి. (2) ఆ ఖుర్‌బానీ జంతువును కానుకగా క’అబహ్కు పంపాలి. ‘హరమ్‌లో జిబ’హ్ చేసి అక్కడి నిరుపేదలకు పంచటానికి.
2. ఒకవేళ దానిలాంటి జంతువు లభించకపోతే, దాని ధరకు సమానమైన ఆహారధాన్యాలు కొని పేదలకు పంచిపెట్టాలి. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ప్రతి ఒక్క పేదవాని తరఫున ఉపవాసం పాటించాలి. ఉదా: జింకను వేటాడారు. ఒక జింక ఖరీదు 5 రూపాయాలు అయింది. 5 రూపాయల ఆహార ధాన్యాలు 75 సేర్లు అవుతాయి. ఈ ప్రకారం 30 మంది పేదలకు పంచిపెట్టాలి. ఆహార ధాన్యాలు పంచిపెడితే ఉపవాసం ఉండనక్కర లేదు. ఈ పరిహారం ఎందుకంటే తాను చేసిన దానిని రుచి చూడటానికి. అయితే సముద్రపు వేట చేయ వచ్చును. కాని భూమిపై సంచరించే జంతు వులను వేటాడటం నిషిద్ధం. పొరపాటువల్ల అడవి జంతువు వేటకు గురయినా పైన పేర్కొన్న పరిహారాన్నే చెల్లించాలి.
ఒకవేళ ఇ’హ్రామ్ స్థితిలో అనుకోకుండా ఏదైనా ఆపద వస్తే అంటే యుద్ధం, కల్లోలం, దెబ్హ, వ్యాధి మొద లైన వాటి వల్ల మక్కహ్ వరకు వెళ్ళలేకపోతే ఒక జంతు వును అల్లాహ్ పేర జిబ’హ్ చేసి ఇ’హ్‌రామ్ తొలగించాలి. ఆతరువాత తిరిగి ఇంటిదారి పట్టాలి. మరుసటి సంవత్సర ఆటంకాలు లేకుంటే ‘హజ్జ్ చేయాలి. ప్రవక్త (స) ‘హుదైబియాలో చేసినట్లు. (బు’ఖారీ)
మరో ఆదేశం: ” మరియు అల్లాహ్ (ప్రసన్నత) కొరకు ‘హజ్జ్ మరియు ‘ఉమ్రహ్ పూర్తిచేయండి. మీకు అక్కడ చేరటానికి (వాటిని పూర్తిచేయటానికి) ఆటంకం కలిగినట్లైతే, మీరు ఇవ్వ దలుచుకున్న బలి (ఖుర్బానీ) ఇవ్వండి. బలి జంతువు దాని గమ్యస్థానానికి చేరనంత వరకు మీరు శిరోముండనం చేసుకోకండి… ” (సూ. అల్ బఖరహ్, 2:196)
అదేవిధంగా ఇ’హ్రామ్ స్థితిలో చనిపోతే అతన్ని రేగి ఆకుల నీటితో స్నానం చేయించి, ఇ’హ్‌రామ్ దుస్తుల్లోనే అతనికి కఫన్ సమకూర్చాలి. తలను, ముఖాన్ని కప్పరాదు. సువాసన పులమరాదు. ఎందుకంటే తీర్పుదినం నాడు అతడు లబ్బయిక్ అంటూ తిరిగిలేస్తాడు.
ఒకవేళ ఎవరైనా ఇ’హ్రామ్ స్థితిలో తన భార్యతో సంభో గం చేసివేస్తే, అతని ‘హజ్జ్ రద్దవుతుంది. అతడు మళ్ళీ సంవత్సరం ‘హజ్జ్ చేయాలి. అయితే సరైన నిర్ణయం ఏమిటంటే అతడు పరిహారం చెల్లిస్తే సరిపోతుంది. ‘హజ్జ్ స్వీకరించబడుతుంది. వివరాలు రౌ’దతున్నదియ్య లో చూడండి.
‘హజ్జ్ విధుల్లో ఒక ముఖ్యమైన విధి ‘అరఫాత్లో ఉండటం. ఒకవేళ ఇది జరగకపోతే ‘హజ్జ్ నెరవేరదు. ప్రవక్త (స) ప్రవచనం, ”అరఫాత్లో ఉండటమే ‘హజ్జ్. ము‘జ్‌దలిఫహ్ రాత్రి, సూర్యోదయానికి ముందు అరఫాత్ కు వచ్చిన వారి ‘హజ్జ్ పూర్తవుతుంది.”
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2696 – [ 1 ] ( متفَقُ عليه ) (2/825)
عَنِ الصَّعْبِ بْنِ جَثَامَةَ أَنَّهُ أَهْدَى لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم حِمَارًا وَحْشِيًا وَهُوَ بِالْأَبْوَاءِ اَوْ بِوَدَّانَ. فَرَدَّ عَلَيْهِ فَلَمَّا رَأَى مَا فِيْ وَجْهِهِ قَالَ: “إِنَّا لَمْ نَرُدَّهُ عَلَيْكَ إِلَّا أَنَّا حُرُمٌ”.
2696. (1) [2/825 –ఏకీభవితం]
‘స’అబ్ బిన్ జస్సా’మహ్ (ర) కథనం: అతడు అబ్వా‘ లేదా వద్దాన్ ప్రాంతంలో అడవి గాడిదను వేటాడి ప్రవక్త (స) కు కానుకగా ఇచ్చారు. ప్రవక్త (స) దాన్ని తిరిగి ఇచ్చి వేసారు. ప్రవక్త (స) అతన్ని విచారించడం చూసి అతన్ని ఓదార్చటానికి, ‘మేము మీ కానుకను తిరస్కరించటం లేదు. మేము ము’హ్‌రిమ్‌గా ఉన్నాం. అందువల్ల మేము అడవి జంతువుల వేట మాంసం తినకూడదు,’ అని అన్నారు. [81] (బు’ఖారీ, ముస్లిమ్)
దీని వివరణ కొరకు ‘హ. 2700 చూడండి.
2697 – [ 2 ] ( متفق عليه ) (2/825)
وَعَنْ أَبِيْ قَتَادَةَ أَنَّهُ خَرَجَ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَتَخَلَّفَ مَعَ بَعْضِ أَصْحَابِهِ وَهُمْ مُحْرِمُوْنَ وَهُوَ غَيْرُ مُحْرِمٍ فَرَأَوْا حٍمَارًا وَ حْشِيًّا قَبْلَ أَنْ يَّرَاهُ فَمَا رَأَوْهُ تَرَكُوْهُ حَتَّى رَآهُ أَبُو قَتَادَةَ فَرَكِبَ فَرْسًا لَهُ فَسَأَلَهُمْ أَنْ يُّنَاوِلُوْهُ سَوْطَهُ فَأَبَوْا فَتَنَاوَلَهُ فَحَمَلَ عَلَيْهِ فَعَقَرَهُ ثُمَّ أَكَلَ فَأَكَلُوْا فَنَدِمُوْا. فَلَمَّا أَدْرَكُوْا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم سَأَلُوْهُ. قَالَ: “هَلْ مَعَكُمْ مِنْهُ شَيْءٌ؟ “قَالُوْا: مَعَنَا رِجْلُهُ. فَأَخَذَهَا النَّبِيُّ صلى الله عليه وسلم فَأَكَلَهَا.
وَفِيْ رِوَايَةٍ لَهُمَا: فَلَمَّا أَتَوْا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أَمِنْكُمْ أَحَدٌ أَمَرَهُ أَنْ يَّحْمِلَ عَلَيْهَا ؟ أَوْ أَشَارَ إِلَيْهَا ؟” قَالُوْا:لَا قَالَ: “فَكُلُوْا مَا بَقِيَ مِنْ لَّحْمِهَا”.
2697. (2) [2/825 –ఏకీభవితం]
అబూ ఖతాదహ్ కథనం: హుదైబియా సంవత్సరం ప్రవక్త (స) వెంట బయలుదేరారు. తన కొంత మంది స్నేహితులతో పాటు వెనుక ఉండిపోయారు. అబూ ఖతాదహ్ స్నేహితులందరూ ఇ’హ్రామ్ ధరించారు. అబూ ఖతాదహ్ ఇంకా ఇ’హ్‌రామ్ ధరించలేదు. అతని మిత్రులు దారిలో అడవి గాడిదను చూచారు. అయితే దాన్ని అబూ ఖతాదహ్ చూడలేదు. అతని మిత్రులు ఇ’హ్‌రామ్ వల్ల ఆ వేటను వదలివేసారు. వేటాడలేదు. చివరికి అబూ ఖతాదహ్ ఆ అడవి గాడిదను చూడనే చూచారు. వేటాడటానికి తన గుర్రంపైకి ఎక్కారు. కొరడా తీసుకోవడం మర్చి పోయారు. తన స్నేహితులతో, ‘నా కొరడా తీసి ఇవ్వండి,’ అని అన్నారు. వారు దానికి తిరస్క రించారు. అబూ ఖతాదహ్ స్వయంగా గుర్రంపై నుండి దిగి కొరడా తీసుకున్నారు. వేటకు వెళ్ళి వేటాడారు. దాన్ని చంపివేసారు. ఆ తరువాత దాని మాంసాన్ని అబూ ఖతాదహ్ కూడా తిన్నారు. అతని స్నేహితులు కూడా తిన్నారు. అయ