మిష్కాతుల్ మసాబీహ్ – పుస్తక పరిచయం & అనుబంధాలు

విషయసూచిక

[A] ముందు మాట – డాక్టర్ సయీద్ అహ్మద్ ఉమ్రీ మదనీ
[B] తొలిపలుకులు – డాక్టర్ ‘అబ్దుల్-ర’హీం బిన్ ము’హమ్మద్ మౌలానా
[C] పీఠిక – అత్ తబ్రీ’జీ
[D] హదీసు పరిచయము & ప్రాముఖ్యత – అబ్దుస్సలామ్‌ బ‘స్తవీ
[E] ‘హదీసు‘నియమ నిబంధనలు
[F] ఈ అనువాదంలో వాడబడిన సంక్షేపాక్షరాలు (Abréviations)
[G] నా‘సిరుద్దీన్ అల్బానీ ‘హదీసు‘ల వర్గీకరణ
[H] ‘హదీసు‘వేత్తల జీవిత విశేషాలు

[A] ముందు మాట – డాక్టర్ సయీద్ అహ్మద్ ఉమ్రీ మదనీ

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

నిశ్చయంగా ఇస్లాం ధర్మానికి మూలాంకురాలు రెండే రెండు. దివ్య ఖుర్ఆన్ మరియు హదీసు. ఇవి తప్ప మూడో ప్రత్యామ్యం లేదు. ఇవి అవతరించడంలో అవిభాజ్యాలు. వాదన మరియు ఆధారం విషయంలో సమ ఉజ్జీలు.

సజ్జనులైన మన పూర్వీకుల్లోని సహాబా, తాబయీన్, తబ తాబయీన్లు ప్రతి చిన్న పెద్ద విషయంలో ఈ రెండు మూలాంకురాల వైపునకే మరలారు. ఆ సద్వర్తనుల బాట నడిచేవారు ప్రళయం వరకూ ఈ రెండింటినే ప్రతివిషయంలో ఆశ్రయిస్తుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

హదీసు సేవల్ని అందించేవారు చాలామందే ఉన్నారు. కాని హదీసుకి వెన్నుదన్నుగా నిలిచే వారు బహు అరుదు. హదీసుకి వెన్నుదన్నుగా నిలవడం అంటే జీవితాన్ని ఖుర్ఆన్ మరియు హదీసులకు ప్రతి బింబంగా మలచుకోవడమే. ధర్మానికి ఈ రెండే మూలాంకురాలు అన్న నమ్మకం మరియు విశ్వాసంతో పాటు వాటి మధ్యన ఎలాంటి వైరుధ్యం లేదని నమ్మాలి ఎందుకంటే వీటిలోని ప్రతి ఒక్కటి అల్లాహ్ తరఫు నుండి వచ్చినదే. ఒకవేళ అవి అల్లాహ్ తరఫు నుంచి కాక ఇతరుల తరఫు నుండి వచ్చి ఉంటే వాటిలోఎన్నో పరస్సర విరుద్ధమైన విషయాలు ఉండేవి.

ఈ రెండు అల్లాహ్ తరఫు నుంచి వచ్చినవి అన్నవిషయంలో ఎలాంటి సందేహంలేదు. ఈ కారణంగానే అహ్లుస్సున్నహ్ వల్ జమాఅహ్ ఏకాభిప్రాయ ప్రతిపాదన మేరకు, ఎలాంటి సమస్య పరిష్కారానికయిన ఖుర్ఆన్ మరియు హదీసుని పూర్తిగా సంప్రదించాలి. ఇందులో ఏ ఒక్క దానిని కూడా విడవరాదు.

హదీసు-ఖుర్ఆన్లో పేర్కొనబడిన వాటిని, బలపరుస్తుంది లేదా దాని ఆదేశాలను విడమరచి అయినా చెబుతుంది లేదా కొన్ని ఆదేశాల విషయంలో ప్రత్యేక స్థానం గలది అయినా అయి ఉంటుంది.

ప్రవక్త (స) సత్యమే పలికారు, హజ్రత్ మిర్దాద్ బిన్ మాదీ కర్బ్ అల్ కింది (ర) గారి కథనం: ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: “గుర్తుంచుకోండి! నాకు ఖుర్ఆన్ మరియు దానిని పోలినదే మరొకటి (హదీసు) కూడా ఇవ్వబడింది. జాగ్రత్త! ఒక కాలం రానున్నది, అప్పుడు కడుపు నిండిన (బొజ్జ గల) వాడొకడు సోఫాపై హాయిగా కొలువుదేరి – ‘‘మీకు ఖుర్ఆన్ ఒక్కటే చాలు. అందులో, ‘హలాల్’ అని చెప్పబడిన వాటిని, హలాల్ గానూ ‘హరామ్’ అని తెలుపబడిన వాటిని హరామ్ గానూ భావించండి. (అంటే, హదీసు అవసరం లేదు)’ అని అంటాడు. తస్మాత్ జాగ్రత్త! పెంపుడు గాడిద మీ కొరకు ధర్మసమ్మతం కాదు. అలాగే కోరలు గల మృగాల్లో ఏదీ ధర్మసమ్మతం కాదు. గుర్తుంచుకోండి! ఒడంబడిక చేసుకున్న వ్యక్తి  (ఇస్లామీయ పరిపాలనా పరిధిలో నివసించే ముస్లిమేతరుని) తాలూకు క్రింద పడి ఉన్న వస్తువును హస్తగతం చేసుకోకూడదు. ఆ వస్తువు అవసరం అతనికి లేదని రూఢి అయితే తప్ప. ఒక వ్యక్తి ఓ జాతి వద్దకు ఏతెంచితే అతనికి ఆ జాతి వారు అతిథి మర్యాదలు చేయాలి. వారు చేయని పక్షంలో సదరు వ్యక్తికి వారి నుండి బలవంతంగానయినా సరే అతిథి మర్యాదలు చేయించుకునే అధికారం ఉంటుంది. (అహ్మద్)

పై హదీసులో పేర్కొనబడిన సమయం వచ్చేసింది. ప్రవక్త (స) గారి హదీసుల పట్ల అమిత శ్రద్ధ చూపే వ్యక్తిని నేడు అల్లాహ్ మార్గంలో పోరాడే యోధునిగా అభివర్ణించవచ్చు. ఈ బాటను అనుసరించే వారిలో “మిష్కాతుల్ మసాబీహ్” గ్రంథ కర్త పండిత మహాశయులు, ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అత్తబ్రీజీ గారు మరియు ఆ గ్రంథానికి ఉర్దూ అనువాదకులయిన మౌలానా అబ్దుస్సలామ్ బస్తవీ గారు ఉన్నారు.

ఇక, గౌరవనీయులైన డాక్టర్ అబ్దుర్రహీమ్ గారు ఏ కృషి అయితే చేసారో, చేస్తున్నారో అది మహత్తరమైనదనే చెప్పాలి. డాక్టర్ గారు ఖుర్ఆన్ గ్రంథాన్ని తెనుగీకరించిన తర్వాత తెలుగు భాషలో పెద్ద వెలితిని గమనించారు. ఎందుకంటే, తెలుగు భాషలో, ‘బులూగ్ అల్ మరామ్-హదీసు మకరందం, అల్ లూలూ వల్ మర్జాన్-హదీసు వెలుగు’ తప్ప వేరే గ్రంథాలు అనుదించబచలేదు. ఈ యదార్థాన్ని గ్రహించిన డాక్టర్ గారు హదీసు వెలుగులతో తెలుగు ప్రజల హృదయాలను ప్రకాశమానం చేయాలన్న సదుద్దేశ్యంతో ఈ గ్రంథ అనువాదానికి పూనుకున్నారు. ఈ గ్రంథ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ప్రతి హదీసు మొదట్లో ప్రముఖ హదీసువేత్త అల్లమా అల్బానీ (ర) గారి విశ్లేషణను సయితం పేర్కొనడం జరిగింది. ఫలితంగా ప్రతి పాఠకుడు చదివే విషయంలో గానీ, అమలు పరిచే విషయంలోగానీ ఒక స్పష్టమయిన అవగాహన కలిగి ఉంటాడని, అనడంలో ఎలాంటి సందేహంలేదు. అయితే, ఇదే గ్రంథానికి సంబంధించిన కొన్ని అధ్యాయాల ఉపోద్ఘాతంలో కొన్ని బలహీన హదీసులను ఉర్దూ అనువాదకుల తరఫు నుండి ప్రస్తావించడం జరిగిందన్నది గమనార్హం. వాటని డాక్టర్ గారు అలానే ఉండనిచ్చారు. అల్లాహ్ మూల గ్రంథకర్తకు, అనువాదకులకు, ప్రచురించే వారికి ఇహ పరాల్లో మేలును చేకూర్చాలన్నది మా ప్రార్థన!

1 / 4 / 1436 H (21-1-2015 CE)                      
డాక్టర్ సయీద్ అహ్మద్ ఉమ్రీ మదనీ
జమీయత్ అహ్లె హదీస్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  అధ్ధక్ష్యులు

(‘హదీసు’ల ప్రాముఖ్యతను తెలుసుకొనుటకు ముందుమాట, తొలిపలుకు తప్పక చదవండి)

[B] తొలిపలుకులు – డాక్టర్ ‘అబ్దుల్-ర’హీం బిన్ ము’హమ్మద్ మౌలానా

సర్వ స్తోత్రాలూ అల్లాహ్‌ (త) కొరకే. మన మందరమూ ఆయన్నే స్తుతిస్తున్నాము. సహాయం కొరకు ఆయన్నే అర్థిస్తున్నాము. పాపాల క్షమాపణకు ఆయన్నే వేడుకుంటున్నాము. మన మనోకాంక్షల మరియు పాపాల నుండి అల్లాహ్‌ (త) శరణు కోరుకుంటున్నాము. అల్లాహ్‌ (త) మార్గదర్శకత్వం చూపిన వారిని ఎవ్వరూ మార్గభ్రష్టత్వానికి గురిచేయలేరు. అదేవిధంగా అల్లాహ్‌ (త) మార్గభ్రష్టత్వానికి గురిచేసిన వారికి ఎవ్వరూ మార్గదర్శకత్వం చేయలేరు. అల్లాహ్‌ (త) తప్ప ఆరాధ్యులెవరూ లేరని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఇంకా ము’హమ్మద్‌ (స) అల్లాహ్‌ (త) దాసులు మరియు ఆయన ప్రవక్త అని కూడా సాక్ష్యం ఇస్తున్నాను.

అల్లాహ్ (త) స్తోత్రం తర్వాత ప్రవక్త (స)ను పూర్తిగా అనుసరించనంతవరకు విశ్వాస మాధుర్యాన్ని చవిచూడలేము. ప్రవక్త (స) ‘హదీసు’లను పూర్తిగా అనుసరించినంతవరకే విధేయతా వాగ్దానం నెరవేరుతుంది. ప్రవక్త (స) వివరణల ద్వారానే ఖుర్‌ఆన్‌ను అనుసరించటం జరుగుతుంది. వీటిని గురించి వ్రాయబడిన పుస్తకాల్లో «మిష్కాతుల్సాబీహ్» ప్రముఖమైనది. ఇందులో వివిధ ‘హదీసు’లను చేర్చడం జరిగింది. దీన్ని సమకూర్చి, ప్రవక్త సాంప్రదాయాలను వ్యాపింపజేస్తూ, బిద్‌’అత్‌లను రూపుమాపడానికి ప్రయత్నించిన వారు, అబూ ము’హమ్మద్‌ –’హుసైన్‌ బిన్‌ మస్‌’ఊద్‌ బిన్ ము’హమ్మద్ అల్‌ ఫరాఅ’ అల్గవీ (రహ్మ). అల్లాహ్‌ (త) అతని  తరగతులను అధికం చేయుగాక. అతడు దీన్ని సమకూర్చినప్పుడు, ‘హదీసు’ల పరంపరల ధృవీకరణ, ఉల్లేఖకుల పేర్లను ప్రస్తావించలేదు. ఈ కారణంగా కొందరు ‘హదీసు’ వేత్తలు దీన్ని విమర్శించారు.

తరువాత ము’హమ్మద్ బిన్ ‘అబ్దుల్లాహ్ అల్ ఖ’తీబ్ అత్ తబ్రేజీ (రహ్మ)గారు, గవీ గారి సాబీహ్లో గుర్తులు లేని ‘హదీసు’లకు గుర్తింపు పెట్టారు. అంటే ‘హదీసు’వేత్తల, వారి పుస్తకాల పేర్లను పేర్కొన్నారు. ‘హదీసు’ ప్రారంభంలో హదీసులను ఉల్లేఖించిన ప్రవక్త (స) అనుచరుని పేరును, చివరలో ‘హదీసు’ను వ్రాసి పెట్టిన హదీసువేత్తల పేర్లను, వారి పుస్తకాల పేర్లను కూడా పేర్కొనడం జరిగింది. గవీ గారు సమకూర్చిన ఈ «అల్ సాబీహ్» కు, ‘తబ్రీజీ గారు  «మిష్కాతుల్ మసాబీహ్» అని పేరు పెట్టారు.

ఏవిధంగా గవీ గారు తమ గ్రంథాన్ని 30 పుస్తకాలలో సమకూర్చారో తబ్రేజీ గారు కూడా అలాగే చేసారు. గవీ గారు ప్రతి అధ్యాయాన్ని 2 విభాగాలలో విభజించారు. మొదటి విభాగంలో బు’ఖారీ, ముస్లిమ్‌లు పేర్కొన్న ‘హదీసు’లను లేదా వారిద్దరిలో ఒక్కరు పేర్కొన్న ‘హదీసు’లను పెట్టారు. రెండవ విభాగంలో వీరిద్దరితో పాటు ఇతరులు కూడా ఉల్లేఖించిన ‘హదీసు’లను పేర్కొన్నారు. తబ్రేజీ గారు మూడవ విభాగం అధికం చేసి ప్రవక్త (స) అనుచరులు, తాబయీన్లు పేర్కొన్న ‘హదీసు’లను కూడా చేర్చారు.

ఈ గ్రంథంలో:  1. అబూ ‘అబ్దుల్లాహ్‌ – ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మా’యీల్‌ బిన్ ఇబ్రాహీం అల్ బుఖారీ, 2. అబుల్‌ ‘హసన్‌ – అసాకిరుద్దీన్ ముస్లిమ్ బిన్‌ ‘హజ్జాజ్‌ బిన్ ముస్లిమ్‌ బిన్ వ’జ్ద్ అల్ ఖుషైరీ అన్ నషాపూరి, 3. అబూ ‘అబ్దుల్లాహ్‌ – మాలిక్బిన్‌ అనస్‌ బిన్ మాలిక్ బిన్ అబూ ఆమిర్ అల్ అస్బాహీ, 4. అబూ ‘అబ్దుల్లాహ్‌ – ము’హమ్మద్‌ బిన్‌ ఇద్రీస్‌ బిన్ అబ్బాస్ అష్-షాఫయీ అల్ ఖురషీ, 5. అబూ ‘అబ్దుల్లాహ్‌ – అహ్మద్‌ బిన్ ముహమ్మద్ బిన్‌ ‘హంబల్ అష్షైబానీ, 6. అబూ ‘ఈసా – ము’హమ్మద్‌ బిన్‌ ‘ఈసా బిన్ సూరా తిర్మిజీ‘ అస్ సులమి అల్ ఖురషీ, 7. అబూ దావూద్ – సులైమాన్‌ బిన్‌ అల్‌ అష్‌అస్ అల్ అ’జ్ది అస్సజిస్తానీ, 8. అబూ ‘అబ్దుర్ర’హ్మాన్‌ – ‘అహ్మద్‌ బిన్‌ షుఐబ్‌ బిన్ అలి బిన్ సిన్నాన్ అన్ నసాయీ, 9. అబూ ‘అబ్దుల్లాహ్‌ – ము’హమ్మద్‌ బిన్‌ య’జీద్‌ ఇబ్నె మాజహ్ అర్ రబయీ అల్‌ ఖ’జ్‌వీనీ, 10. అబూ ము’హమ్మద్‌ – ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్ ఫద్ల్ బిన్ బహ్రామ్ దార్మీ, 11. అబుల్‌ ‘హసన్‌ – ‘అలీ బిన్‌ ‘ఉమర్‌ బిన్ అహ్మద్ దార ఖుతునీ, 12. అబూ బకర్‌ – అ’హ్‌మద్‌ బిన్‌ ‘హుసైన్‌ బిన్ అలి బిన్ మూసా  అల్‌ బైహఖీ, 13. అబుల్‌ ‘హసన్‌ – జీన్ బిన్‌ ము’ఆవియహ్‌ అల్‌ అబ్‌దరీ, మొదలైన వారు సమకూర్చిన ‘హదీసు’లు ఉన్నాయి.

ప్రస్తుత కాలంలో అవిశ్వాసం, దైవ ధిక్కారం, నాస్తికత్వం, మార్గ భ్రష్టత్వం రోజురోజుకూ వ్యాపిస్తూ వృద్ధి చెందుతూ ఉన్నాయి. పరాయి వారే కాదు, ముస్లిములు కూడా వీటికి గురై తమ్ముతాము నాశనం చేసుకుంటున్నారు. ఖుర్‌ఆన్‌ను తమ కల్పిత మూఢనమ్మకాలకు అనుగుణంగా మలచుకుంటున్నారు. అంతేకాదు ప్రవక్త (స) ‘హదీసు’ల పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. వాటి ప్రామాణికతను, ప్రాముఖ్యతను నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ వీరు ఈ ‘హదీసు’ల ప్రాధాన్యత, ప్రాముఖ్యతలను తెలుసుకుంటే వీరు ఏనాడూ ఇటువంటి మహా పాపాలకు పాల్పడరు.

సత్య విశ్వాసులు, ప్రవక్త (స) ‘హదీసు’లను ఎంతమాత్రం వదలడానికి సిద్ధం కారు. ఎందుకంటే ‘హదీసు’లు దివ గ్రంథమైన ఖుర్‌ఆన్‌ యొక్క సంపూర్ణ వివరణ. ఈ ‘హదీసు’ల్లోనే ఏకత్వం, దైవ దౌత్యం, స్వర్గం, నరకం, దైవ దూతలు, జిన్నులు, పర లోకం, ప్రళయం, దైవ ప్రవక్తలు, దైవభక్తులు, పుణ్యాత్ములు, మంచీచెడులు, వివాహం, జీవితంలోని వివిధ రంగాలకు చెందిన కార్యకలాపాల గురించి, బంధువుల హక్కుల గురించి వివరించడం జరిగింది. ‘హదీసు’లను వదలివేయడం ఇస్లామ్‌ ధర్మాన్ని వదలివేయడంతో సమానంగా భావించాలి.

హదీసునిర్వచనం : ‘హదీసు’ అంటే సంభాషణ. హదీసువేత్తల భాషలో : ప్రవక్త (స) వాక్కు, కర్మ, ఉపదేశాలు మరియు ప్రవక్త (స) – తమ సమక్షంలో – సహచరుల ఆచరణలను వారించని విషయాలను ‘హదీసు’ అంటారు. ప్రవక్త (స), ఖుర్‌ఆన్‌ ప్రకారం ఆచరించేవారు. అందువల్ల ‘హదీసు’లు ఖుర్‌ఆన్‌ వివరణ మరియు వ్యాఖ్యానం అవుతాయి. ప్రవక్త (స) ‘హదీసు’లను చదివి, వాటి ప్రకారం ఆచరించటం వల్ల ఉభయ లోకాల్లోనూ  ముక్తి, సాఫల్యాలు లభిస్తాయి. ఇవి ప్రవక్త సాంప్రదాయాన్ని ప్రధాన అంశంగా చర్చిస్తాయి.

‘హదీసు’ల ప్రాముఖ్యత ఖుర్ఆనులో ఎన్నో చోట్లలో చర్చించబడింది. వాటిలో కొన్నింటిని ఇక్కడ పేర్కొంటున్నాము:

అల్లాహ్‌ఆదేశం: 1. ” ఓ విశ్వాసులారా ! మీరు అల్లాహ్‌ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి.” (అన్నిసా’, 4:59).

2. ”మరియు మేము ఏ ప్రవక్తను పంపినా – అల్లాహ్‌ అనుజ్ఞతో – (ప్రజలు) అతనిని అనుసరించాలనే పంపాము.” (అన్నిసా’, 4:64) – ఎందుకంటే ప్రవక్త (స)కు విధేయత చూపితే, అల్లాహ్‌కు విధేయత చూపినట్లే.

3. ”ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో వాస్తవంగా అతడు అల్లాహ్‌ కు విధేయత చూపినట్లే.” (అన్నిసా’, 4:80)- అందువల్ల ఖుర్‌ఆన్‌, ‘హదీసు’లను అనుసరించటం వల్లనే అల్లాహ్‌ (త) విధేయత లభిస్తుంది.

4. ”మేము విన్నాము మరియు విధేయత చూపాము. మరియు ఇలాంటి వారే సాఫల్యం పొందేవారు. అల్లాహ్‌కు మరియు ఆయన సందేశహరునికి విధేయత చూపేవారు మరియు అల్లాహ్‌కు భయపడి, ఆయన యందు భయ భక్తులు కలిగి ఉండే వారు, ఇలాంటి వారే సాఫల్యం పొందేవారు.” (అన్నూర్‌, 24:48-52)

5. ”ఓ విశ్వాసులారా ! అల్లాహ్‌ మరియు ఆయన సందేశహరుడు మీకు జీవితమిచ్చే దాని వైపునకు, మిమ్మల్ని పిలిచినపుడు దానికి సమాధానం ఇవ్వండి.” (అల్‌ అన్‌ ఫాల్‌, 8:24)

6. ‘‘ (ఓ ము’హమ్మద్‌ !) నిశ్చయంగా, మేము ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను), సత్యంతో, నీపై అవతరింపజేశాము – అల్లాహ్‌ నీకు తెలిపిన ప్రకారం – నీవు ప్రజల మధ్య తీర్పుచేయటానికి,” (అన్నిసా’, 4:105) – ‘అంటే అల్లాహ్‌ (త) ప్రవక్త(స)ను ఆదేశించినట్టు. దాని ద్వారా ప్రవక్త (స) ప్రజల్లో తీర్పుచేయాలని,’ అంటే అవి ప్రవక్త (స) ఆదేశాలు, ఆచరణలు అవుతాయి. అవే ‘హదీసు’లు.

7. ”వమా అతాకుముర్రసూలు ఫ’ఖుజూ’హు వమా న’హాకుమ్‌ అన్‌హు ఫన్‌తహూ” (అల్ హష్ర్, 59 :7) – ‘సందేశహరుడు మీకు ఇచ్చింది స్వీకరించండి మరియు నిషేధించిన దాని నుండి దూరంగా ఉండండి.’

ఇస్లామ్ను అర్థం చేసుకోవడానికి ఖుర్‌ఆన్‌ ఎంత అవసరమో, ‘హదీసు’ కూడా అంతే అవసరం. కనుక ఖుర్ఆన్‌ను అర్థం చేసుకోవటానికి ‘హదీసు’లు చాలా అవసరం. దీన్ని గురించిన కొన్ని హదీసులు:

ప్రవక్త (స) ప్రవచనం: 1. ”నా ‘హదీసు’లను విని ప్రజలకు తెలియ పరిచే వారికి అల్లాహ్‌ (త) సంతోషా నందాలు ప్రసాదించు గాక !”

2.  ”ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి ! నేను తెచ్చిన ధర్మాన్ని అనుసరించనంతవరకు మీలో ఎవరూ ముస్లిమ్‌ లు కాలేరు.”

3. ప్రవక్త (స) ప్రవచనం: 1. ”నేను మీలో రెండు విషయాలను వదలి వెళుతున్నాను. మీరు వాటిని దృఢంగా పట్టు కొని ఉన్నంత వరకు ఎంతమాత్రం మార్గభ్రష్టత్వానికి గురికారు. అవి: 1. ఖుర్‌ఆన్‌, 2. నా సాంప్రదాయం.”(అల్‌ ‘హాకిమ్‌)

4. ప్రతి కల్పితం బిద్‌’అత్‌ అవుతుంది. ప్రతి బిద్‌’అత్‌ మార్గభ్రష్టత్వానికి గురిచేస్తుంది.” (అ’హ్మద్‌, అబూ దావూద్‌, తిర్మిజి’)

5. నా’ సాంప్రదాయాన్ని ప్రేమించేవారు నన్ను ప్రేమించినట్లు. నన్ను ప్రేమించేవారు స్వర్గంలో నా సహవాసంలో ఉంటారు. (తిర్మిజి’)

ఒకవేళ ‘హదీసు’ను ఖుర్‌ఆన్‌ వివరణగా భావించకుంటే, ప్రతి వ్యక్తి ఖుర్‌ఆన్‌ వ్యాఖ్యానాన్ని తన అభిప్రాయాల ద్వారా వివరిస్తాడు. ప్రతి ఒక్కరి అభిప్రాయం సరికాదు. ఒక వాక్యం గురించి ఒకరు ఒక విధంగా భావిస్తారు. మరొకరు మరో విధంగా భావిస్తారు. దీనివల్ల అనేక అభిప్రాయభేదాలు ఏర్పడతాయి. ఖుర్‌ఆన్‌ పట్ల ఎవరికి ఎలా తోచితే అలా భావిస్తూ ఆటలా చేసుకుంటారు. వాస్తవం ఏమిటంటే ఖుర్‌ఆన్‌ ఒక దిశానిర్దేశాల ప్రామాణిక గ్రంథం. ప్రవక్త () వివరణ లేకుండా దీన్ని అర్థం చేసుకోవటం ఎంత మాత్రం సాధ్యం కాదు. ప్రవక్త (స) యొక్క ఆ ఆదేశాలను, వివరణలనే ‘హదీసు’లు అంటారు. ప్రవక్త (స) ‘హదీసు’లను అనుసరిస్తే, ఖుర్‌ఆన్‌ను అనుసరించి నట్టే. అదేవిధంగా ‘హదీసు’లను తిరస్కరిస్తే  ఖుర్‌ఆన్‌ను తిరస్కరించినట్టే.

« మిష్కాతుల్ సాబీహ్ » ప్రపంచంలో ఎన్నో ఇస్లామీ ధార్మిక పాఠశాలలో ముఖ్య హదీసు అభ్యాస గ్రంథంగా బోధించబడుతుంది. కాబట్టి దీన్ని ఎన్నో భాషల లోనికి అనువాదాలు చేయబడ్డాయి.

దీని ఉర్దూ అనువాదం చాలామంది చేసారు. వారిలో ‘అబ్దుస్సలాం బస్తవీ (రహ్మ)ఒకరు. వారు దీనికి మంచి అనువాదం మరియు వ్యాఖ్యానం వ్రాశారు. బస్తవీ గారు సందర్భాన్నిబట్టి ‘హదీసు’లను ఉల్లేఖించిన ప్రముఖ ప్రవక్త సహచరుల జీవిత విశేషాలను మరియు చారిత్రక విషయాలను కూడా వ్యాఖ్యానాలలో వివరించారు.

ఇతర భాషలలో ఎంత నేర్పున్నా, ఒక పుస్తకాన్ని – తమ మాతృభాషలో చదివితే కలిగే సంతృప్తి – ఇతర భాషలలో చదివితే దొరుకదు. కాబట్టి మేము ఈ «మిష్కాతుల్ సాబీహ్» ను బస్తవీ గారి వ్యాఖ్యానంతో సహా సులభమైన తెలుగు భాషలో అందజేయటానికి ప్రయత్నించాము.

అనువాదం చేసేటప్పుడు, రేయింబవళ్ళు, అనుక్షణం, నాకు మానసికంగా మరియు భౌతికంగా సహాయపడిన, నా భార్య, నా కుమారుడు అతని భార్య మరియు నా ముగ్గురు కుమార్తెలు, వారి భర్తలు, ఈ గ్రంథపు అనువాదాన్ని సరిదిద్దటంలో పాల్గొన్న, డాక్టర్ స’యీద్ అ’హ్మద్ ‘ఉమ్రీ మదనీ, షే’ఖ్ ము’హమ్మద్ జా’కిర్ ‘అబ్దుష్షుకూర్, షే’ఖ్ ఎస్. ఎం. రసూల్, ఈ గ్రంథాన్ని టైపు చేయడంలో సహాయపడిన షేఖ్ ము’హమ్మద్ హుసైన్, డా. అబ్దుర్ రషీద్, ఈ గ్రంథంలోని, ప్రాచీనకాలంలో వాడే – వ్రేళ్లపై లెక్కపెట్టే – సంఖ్యా విధానాన్ని, వివరించుటకు, వ్రేళ్ల డ్రాయింగ్ చేసిన నా మనుమరాలుకు మరియు ఈ గ్రంథ ప్రచురణ కొరకు ఆర్థికంగా మరియు ఇతర రూపంలో సహాయపడిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. అల్లాహ్ (త) మా అందరి శ్రమను అంగీకరించి ఇహపర లోకాలలో అందరికీ అత్యుత్తమ ప్రతిఫలం నొసంగు గాక. ఆమీన్!

ఖుర్ఆన్ ఆయాతులు వచ్చిన చోట, వాటి సూరహ్ పేరు, నం., ఆయతు నం. లు వ్రాసాము.

ఏ విషయానికి గురించయిన ‘హదీసు’ చూడాలనుకుంటే, ఈ «మిష్కాతుల్ మసాబీహ్» చాలు. ఎందుకంటే ఇందులో 13 మంది ‘హదీసు’వేత్తలు ప్రోగు పరిచిన, అనేక విషయాలకు సంబంధించిన ‘హదీసు’లున్నాయి. వాటికి, ఆ ‘హదీసు’వేత్తలదే కాక అల్బానీ గారి ధృవీకరణ కూడా’హదీసు’ మొదటలో పేర్కొనబడింది.

«మిష్కాతుల్ మసాబీహ్ » యొక్క 6294 ‘హదీసు’లు రెండు సంపుటాలలో విభజించబడ్డాయి. మొదటి సంపుటంలో 11 పుస్తకాలు (1103 పేజీలు), రెండవ సంపుటంలో 19 పుస్తకాలు (1087 పేజీలు) ఉన్నాయి.

ఈ గ్రంథంలో తప్పులు, తగ్గింపులు, హెచ్చింపులు ఏమైనా చూస్తే, వాటిని మాకు తెలియజేస్తే ముందు వచ్చే ప్రచురణలలో, వాటిని సరిదిద్దుకుంటాము, ఇన్షా అల్లాహ్! మొదటి ప్రచురణ 1436 హి (2015 క్రీ. శ.)లో అయ్యింది.

అల్లాహుత’ఆలా మాత్రమే సాఫల్యం చేకూర్చేవాడు మరియు సరైన మార్గం చూపేవాడు. ఓ అల్లాహ్ మా శ్రమను అంగీకరించు, నిశ్చయంగా నీవు మాత్రమే సర్వ శ్రవణ సమర్థుడవు, సర్వజ్ఞుడవు, ఆమీన్!

మక్కహ్ అల్-ముకర్రమహ్:                              
డాక్టర్ ‘అబ్దుల్-ర’హీం బిన్ ము’హమ్మద్ మౌలానా
01/04 /1436 H  (21-01-2015 C E)

*****

[C] పీఠికఅత్ తబ్రీ’జీ

అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్పేరుతో

సర్వస్తోత్రాలూ అల్లాహ్‌ కొరకే. మనమందరమూ ఆయన్నే స్తుతిస్తున్నాము. సహాయం కొరకు ఆయన్నే అర్థిస్తున్నాము. పాపాల క్షమాపణకు ఆయన్నే వేడుకుంటున్నాము. మన మనోకాంక్షల మరియు పాపాల నుండి అల్లాహ్‌(త)ను శరణు కోరుతున్నాము. అల్లాహ్‌(త) మార్గదర్శకత్వం చూపిన వారిని ఎవ్వరూ మార్గభ్రష్టత్వానికి గురిచేయలేరు. అదేవిధంగా అల్లాహ్‌ (త) మార్గభ్రష్టత్వానికి గురిచేసిన వారికి ఎవ్వరూ మార్గదర్శకత్వం చేయలేరు. అల్లాహ్‌(త) తప్ప ఆరాధ్యులెవరూ లేరని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ము’హమ్మద్‌ (స) అల్లాహ్‌(త) దాసులు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. విశ్వాస మార్గాలన్నీ నశించిన సమయంలో అల్లాహ్‌ (త) తన ప్రవక్తను ప్రభవింపజేశాడు. మార్గాలన్నీ మూసుకున్న తరుణంలో ఆయన (త) స్థానం తెలిసివచ్చింది.

ప్రవక్త (స) కనుమరుగైన విశ్వాస మార్గాలను స్పష్టంగా కనిపించినట్టు చేశారు. పవిత్ర వచనం ద్వారా రోగాలకు గురయిన వారికి ఆరోగ్యం ప్రసాదించారు. రుజుమార్గంపై నడిచే వారికి దాన్ని విశాలపరిచారు. సత్కార్యాల నిధులను అందరి అందుబాటులోకి తెచ్చారు. అల్లాహ్(త) స్తోత్రం తర్వాత ప్రవక్త(స)ను పూర్తిగా అనుసరించ నంత వరకు విశ్వాస మాధుర్యాన్ని చవిచూడలేము. ప్రవక్త (స) ‘హదీసు’లను పూర్తిగా అనుసరించినంత వరకే విధేయతా వాగ్దానం నెరవేరుతుంది. ప్రవక్త (స) వివరణల ద్వారానే ఖుర్‌ఆన్‌ను అనుసరించటం జరుగుతుంది. వీటిని గురించి వ్రాయబడిన పుస్తకాల్లో «మిష్కాతుల్ సాబీహ్» ప్రముఖమైనది. ఇందులో వివిధ ‘హదీసు’ లను చేర్చడం జరిగింది. దీన్ని సమకూర్చి, ప్రవక్త సాంప్రదాయాలను వ్యాపింపజేస్తూ, బిద్‌’అత్‌లను రూపు మాపడానికి ప్రయత్నించిన వారు: ముహ్యియ్ అస్సున్నహ్ – అబూ ము’హమ్మద్‌ – అల్ ‘హుసైన్‌ బిన్‌ మస్’ఊద్‌ అల్‌ ఫరాఅ’ అల్‌గవీ [433 to 516 H/1122 CE]. అల్లాహ్‌ (త) అతని తరగతులను అధికం చేయు గాక. అతను దీన్ని సమకూర్చినప్పుడు, ‘హదీసు’ల పరంపరల ధృవీకరణను, ఉల్లేఖకుల పేర్లను ప్రస్తావించ లేదు. ఈ కారణంగా కొందరు ‘హదీసు’వేత్తలు మసాబీహ్ ను విమర్శించటం జరిగింది. ఎందుకంటే ఉల్లేఖకుని పేరు, పుస్తకం పేరు ప్రస్తావించకపోతే ‘హదీసు’ ప్రామాణికమైనదా, లేదా బలహీనమైనదా అనేది తెలియదు. పుస్తకం పేరు రెఫరెన్సు లేకుండా ‘హదీసు’ను నమ్మడం చాలా కష్టం. దీన్నిబట్టి వారి విమర్శన కూడా సరైనదే. దీన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మొదటి నుండి సంకలనం చేసే ప్రయత్నం చేశాను. ఈ మహా కార్యానికి నేను అల్లాహ్‌(త)తో ఇస్తిఖారా చేశాను. ఆయన్ను ఈ పని పూర్తిచేసే భాగ్యం కోసం అర్థించాను. అనంతరం అల్లాహ్‌ (త) నాకు దీన్ని పూర్తిచేసే భాగ్యం ప్రసాదించాడు. నేను గుర్తుల్లేని ‘హదీసు’లకు గుర్తింపు పెట్టాను. అదేవిధంగా ఉల్లేఖకుల, పుస్తకాల పేర్లను పేర్కొన్నాను. ప్రతి ‘హదీసు’ను దాని స్థానంలో పెట్టాను.

ఈ గ్రంథంలో:  1. అబూ ‘అబ్దుల్లాహ్‌ – ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మా’యీల్‌ బిన్ ఇబ్రాహీం అల్ బుఖారీ, 2. అబుల్‌ ‘హసన్‌ – అసాకిరుద్దీన్ ముస్లిమ్ బిన్‌ ‘హజ్జాజ్‌ బిన్ ముస్లిమ్‌ బిన్ వ’జ్ద్ అల్ ఖుషైరీ అన్ నషాపూరి, 3. అబూ ‘అబ్దుల్లాహ్‌ – మాలిక్బిన్‌ అనస్‌ బిన్ మాలిక్ బిన్ అబూ ఆమిర్ అల్అస్బాహీ, 4. అబూ ‘అబ్దుల్లాహ్‌ – ము’హమ్మద్‌ బిన్‌ ఇద్రీస్‌ బిన్ అబ్బాస్ అష్-షాఫయీ అల్ ఖురషీ, 5. అబూ ‘అబ్దుల్లాహ్‌ – అహ్మద్‌ బిన్ ముహమ్మద్ బిన్‌ ‘హంబల్ అష్షైబానీ, 6. అబూ ‘ఈసా – ము’హమ్మద్‌ బిన్‌ ‘ఈసా బిన్ సూరా తిర్మిజీ‘ అస్ సులమి అల్ ఖురషీ, 7. అబూ దావూద్ – సులైమాన్‌ బిన్‌ అల్‌ అష్‌అస్ అల్ అ’జ్ది అస్సజిస్తానీ, 8. అబూ ‘అబ్దుర్ర’హ్మాన్‌ – ‘అహ్మద్‌ బిన్‌ షుఐబ్‌ బిన్ అలి బిన్ సిన్నాన్ అన్ నసాయీ, 9. అబూ ‘అబ్దుల్లాహ్‌ – ము’హమ్మద్‌ బిన్‌ య’జీద్‌ ఇబ్నె మాజహ్ అర్ రబయీ అల్‌ ఖ’జ్‌వీనీ, 10. అబూ ము’హమ్మద్‌ – ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్ ఫద్ల్ బిన్ బహ్రామ్ దార్మీ, 11. అబుల్‌ ‘హసన్‌ – ‘అలీ బిన్‌ ‘ఉమర్‌ బిన్ అహ్మద్ దార ఖుతునీ, 12. అబూ బకర్‌ – అ’హ్‌మద్‌ బిన్‌ ‘హుసైన్‌ బిన్ అలి బిన్ మూసా  అల్‌ బైహఖీ, 13. అబుల్‌ ‘హసన్‌ – జీన్ బిన్‌ ము’ఆవియహ్‌ అల్‌ అబ్‌దరీ, మొదలైన వారు సమకూర్చిన ‘హదీసు’లు ఉన్నాయి. వీరి పేర్లను ‘హదీసు’ల చివరలో పేర్కొన్నాము.  దానికి తోడుగా వారి పుస్తకం పేరును కూడా పేర్కొన్నాము. మధ్యలో ఉన్న పరంపరను వదలివేశాము. ప్రారంభంలో ‘హదీసు’లను వివరించిన ప్రవక్త (స) సహచరుల పేర్లను, చివరలో తమ గ్రంథంలో ‘హదీసు’ను ఉల్లేఖించిన హదీసువేత్తల పేర్లను మాత్రమే పేర్కొన్నాము.

ఏ విధంగా గవీ గారు తమ ఈ «సాబీహ్» పుస్తకాన్ని అధ్యాయాల ప్రకారం విభజించారో నేను కూడా ఆ విధంగానే విభజించాను. ఒక అధ్యాయాన్ని గవీ గారు 2 విభాగాలుగా విభజించారు. నేను 3 విభాగం చేర్చాను. మొదటి విభాగంలో బు’ఖారీ, ముస్లిమ్‌ పేర్కొన్న ‘హదీసు’లు లేదా వారిద్దరిలో ఒక్కరు పేర్కొన్న ‘హదీసు’లను పేర్కొన్నాను. ఎందుకంటే వీరిద్దరూ ఇతరుల కంటే ప్రాధాన్యత గలవారు. రెండవ విభాగంలో వీరిద్దరితో పాటు ఇతరులు కూడా ఉల్లేఖించిన ‘హదీసు’లను పేర్కొనడం జరిగింది. మూడవ విభాగంలో ప్రవక్త (స) అనుచరులు, తాబయీన్లు పేర్కొన్న ‘హదీసు’లను పేర్కొనడం జరిగింది. అయితే ఇందులో ‘హదీసు’ షరతులను కూడా దృష్టిలో పెట్టుకోవటం జరిగింది.

ఒకవేళ సాబీహ్లో ఉన్న ‘హదీసు’ మిష్కాత్లో లభించకపోతే, ఆ ‘హదీసు’ ఒకటి కంటే ఎక్కువ సార్లు వచ్చినందువల్ల దాన్ని తొలగించాను అని భావించాలి. అదేవిధంగా మిష్కాత్లో లేని, లేదా మసాబీహ్లో దాని భాగం లేని ‘హదీసు’లు ఉంటే – అంటే హెచ్చుతగ్గులు ఉంటే – అవసరార్థం అలా చేయడం జరిగింది. ఒక్కోక్క చోట ‘హదీసు’ను సంక్షిప్తంగా పేర్కొనడం జరిగింది. కొన్నిచోట్లలో పూర్తి ‘హదీసు’ను పేర్కొనడం జరిగింది. ఒకవేళ మీకు రెండు భాగాల్లో తేడా కనబడితే, అంటే మొదటి భాగంలో బు’ఖారీ, ముస్లిమ్‌లను వదలి ఇతర ‘హదీసు’ వేత్తల ‘హదీసు’లు ఉంటే, అదేవిధంగా రెండవ భాగంలో ఒకవేళ బు’ఖారీ ముస్లింల ‘హదీసు’లు ఉంటే, వీరిద్దరి ‘హదీసు’లను హుమైదీ పుస్తకం నుండి మరియు జామిఉల్ఉసూల్ నుండి పరిశీలించిన తర్వాత పేర్కొనడం జరిగింది. ఒకవేళ తేడా ఉంటే అది వివిధ మార్గాల ద్వారా ధృవీకరణ పరంపరల వల్ల ఉంటుంది. లేదా సాబీహ్ కూర్పరి పేర్కొన్న మార్గం నాకు తెలియకపోవచ్చు.

మీకు నా ఈ పుస్తకం మిష్కాతుల్ సాబీహ్లో, సాబీహ్ పేర్కొన్న అనేక పదాలు లభిస్తాయి. ఇందులో జరిగిన పొరపాట్లను అతని మీద కాక నాపై నెట్టివేయాలి. అల్లాహ్‌ (త) వారికి ఉభయలోకాల్లో సాఫల్యం ప్రసాదించు గాక. పరిశీలనలో నేను నా శక్తి మేరకు కృషిచేశాను. ఎటువంటి లోపం ఉంచలేదు. అభిప్రాయ భేదాల్ని ఉన్నవి ఉన్నట్లుగానే పేర్కొన్నాను.

అదేవిధంగా సాబీహ్ కూర్పరి కొన్ని ‘హదీసు’లను ‘గరీబ్‌ లేదా ‘దయీఫ్‌లని సూచించారు. నేను నా సంకలనం మిష్కాతుల్ సాబీహ్లో దానికి కారణాలు పేర్కొన్నాను. అదేవిధంగా ‘హదీసు’ నియమ నిబంధనల ప్రకారం సూచించని ‘హదీసు’లను నేను కూడా సూచించలేదు. కాని కొన్నిచోట్లలో ప్రత్యేక సందర్భంగా ఆ ‘హదీసు’ను గురించి కొంత పేర్కొన్నాను. అదేవిధంగా కొన్ని ‘హదీసు’ల తర్వాత రెఫరెన్సుగానీ, పుస్తకం పేరు గానీ పేర్కొన లేదు. ఎందుకంటే ‘హదీసు’వేత్తను గురించి తెలియనందువల్ల అలా జరిగింది. ఒకవేళ మీకు తెలిస్తే వ్రాయండి. అల్లాహ్‌ (త) మీకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు.

నేను ఈ పుస్తకం పేరు ”మిష్కాతుల్సాబీహ్” పెట్టాను. ఇంకా ఈ పుస్తకం పూర్తికావాలని, నాకు సరైన మార్గం చూపాలని, తప్పులు, పొరపాట్ల నుండి నన్ను రక్షించమని, నా సమస్యలను సులభతరం చేయమని, ఉభయలోకాల్లో ఈ కూర్పు ద్వారా లాభం చేకూర్చమని నేను అల్లాహ్‌(త)ను ప్రార్థిస్తున్నాను. కార్యసాధకుడైన అల్లాహ్‌(త)యే నాకు చాలు. సత్కార్యాలు చేసే, పాపాల నుండి దూరంగా ఉండే భాగ్యం అల్లాహ్‌ (త) వల్లనే లభిస్తుంది. ఆయనే అందరి కంటే గొప్పవాడు మరియు వివేకవంతుడూను.

కూర్పరి
ము’హమ్మద్ బిన్ ‘అబ్దుల్లాహ్ అల్ ఖ’తీబ్ అత్ తబ్రీ’జీ (మరణం 741 H /1341 CE)

*****

[D] హదీసు పరిచయము & ప్రాముఖ్యతఅబ్దుస్సలామ్‌ బస్తవీ

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్

ప్రవక్త (స) ‘హదీసు’ల సేవకుడు అబ్దుస్సలామ్స్తవీ ముస్లిమ్‌ సోదరులకు విన్నవించుకునేది ఏమనగా ప్రస్తుత కాలంలో అవిశ్వాసం, దైవ ధిక్కారం, నాస్తికత్వం, మార్గభ్రష్టత్వం రోజురోజుకూ వ్యాపిస్తూ వృద్ధి చెందుతూ ఉన్నాయి. పరాయి వారే కాదు, ముస్లిములు కూడా వీటికి గురై తమ్ముతాము నాశనం చేసుకుంటున్నారు. ఖుర్‌ఆన్‌ను తమ కల్పిత మూఢ నమ్మకాలకు అనుగుణంగా మలచుకుంటున్నారు. అంతే కాదు ప్రవక్త (స) ‘హదీసు’ల పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. వాటి ప్రామాణికతను, ప్రాముఖ్యతను నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వేళ వీరు ఈ ‘హదీసు’ల ప్రాధాన్యత, ప్రాముఖ్యతలను తెలుసు కుంటే ఏనాడూ ఇటువంటి మహా పాపాలకు పాల్పడరు. ఇందులో చాలా సులభమైన పద్ధతిలో ‘హదీసు’లను అనువదించడం వివరించడం జరిగింది. అల్లాహుత’ఆలా మనందరికీ ‘హదీసు’లను అర్థం చేసుకునే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్‌!

—–

హదీసుఅంటే ఏమిటి ?

‘హదీసు’లను వదలి వేసిన వ్యక్తి తన కర్మలను, తన కృషి ప్రయత్నాలను వ్యర్థం చేసుకున్నట్టే. ముస్లిములు ‘హదీసు’లను తిరస్కరించవచ్చా? సత్యవిశ్వాసులు, ప్రవక్త (స) ‘హదీసు’లను ఎంతమాత్రం వదలడానికి సిద్ధం కారు. ఎందుకంటే ‘హదీసు’లు అల్లాహ్ గ్రంథమైన ఖుర్‌ఆన్‌ యొక్క సంపూర్ణ వివరణ. ఈ ‘హదీసు’ల్లోనే ఏకత్వం, దైవ దౌత్యం, స్వర్గం, నరకం, దైవ దూతలు, జిన్నులు, పర లోకం, ప్రళయం, దైవ ప్రవక్తలు, దైవ భక్తులు, పుణ్యాత్ములు, మంచీచెడులు, వివాహం, జీవితం లోని వివిధ రంగాలకు చెందిన కార్యకలాపాల గురించి, బంధువుల హక్కులను గురించి వివరించబడి ఉంది. ‘హదీసు’లను వదలివేయడం ఇస్లామ్‌ ధర్మాన్ని వదలి వేయడంతో సమానంగా భావించాలి.

హదీసునిర్వచనం : ‘హదీసు’ అంటే సంభాషణ అని అర్థం. ‘హదీసు’వేత్తల భాషలో ప్రవక్త (స) వాక్కు, కర్మ, ఉపదేశాలను ‘హదీసు’ అంటారు. ప్రవక్త (స), ఖుర్‌ఆన్‌ ప్రకారం ఆచరించే వారు. అందువల్ల ‘హదీసు’లు ఖుర్ఆన్‌ వివరణ మరియు వ్యాఖ్యానం అవుతాయి. ప్రవక్త (స) ‘హదీసు’లను చదవటం వల్ల, వాటి ప్రకారం ఆచరించటం వల్ల ఉభయ లోకాల్లోనూ  ముక్తి, సాఫల్యాలు లభిస్తాయి. ఇవి ప్రవక్త సాంప్రదాయాన్ని ప్రధాన అంశంగా చర్చిస్తాయి.

ఆచరణా పరంగా ఖుర్‌ఆన్‌, ప్రవక్త సాంప్రదాయం రెండూ సమానమైనవే. అంటే ఒకే వస్తువుకు రెండు పేర్లు. క్రింది ఆయాతులలో ‘హదీసు’ అనే పదం ఉపయోగించబడింది. అంటే ఖుర్‌ఆన్‌లో ‘హదీసు’ అనే పదం ఉపయోగించటం దాని ప్రాముఖ్యతను విశద పరుస్తుంది. అల్లాహ్‌ ఆదేశం:

1.”…కాని వారికి ఏదైనా కీడు కలిగితే : ‘ఓ ము’హ మ్మద్‌ ! ఇది నీ వల్ల జరిగింది,’ అని అంటారు. వారితో అను, అంతా అల్లాహ్తరఫు నుండే వస్తుంది.’ ఈ జనులకు ఏమయింది? వారు ఏ విషయాన్ని కూడా ఎందుకు అర్థం చేసుకోలేక పోతున్నారు?” (అన్నిసా, 4:78)

2. ”అల్లాహ్‌ ! ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఆయన మీ అందరినీ పునరుత్థాన దినమున సమావేశపరుస్తాడు. అది (రావటంలో) ఏ మాత్రం సందేహం లేదు. మరియు అల్లాహ్‌ వాక్కు కంటే మరెవరి (వాక్కు) సత్యమైనది?” (అన్నిసా’, 4:87)

3. ”వాస్తవానికి, వారి గాథలలో బుద్ధిమంతులకు ఒక గుణపాఠం ఉంది. ఇది (ఈ ఖుర్‌ఆన్‌) కల్పిత గాథ కాదు. కాని ఇది ఇంతవరకు వచ్చిన గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవీకరిస్తుంది. మరియు ప్రతి విషయాన్ని వివరిస్తుంది. మరియు ఇది విశ్వసించే వారికి మార్గదర్శిని మరియు కారుణ్యం కూడాను.” (యూసుఫ్‌, 12:111)

4. ”ఏమీ ? వారు ‘ఇతనే దీనిని (ఈ సందేశాన్ని) కల్పించుకున్నాడు,’ అని అంటున్నారా? అలా కాదు, వారు అసలు విశ్వసించదలచుకోలేదు! వారు సత్య వంతులే అయితే దీనివంటి ఒక వచనాన్ని (రచించి) తెమ్మను. (అత్తూర్‌, 52 : 3334)

5. ”…నిశ్చయంగా, ఈ ఖుర్‌ఆన్‌ దివ్యమైనది. సురక్షితమైన గ్రంథంలో ఉన్నది. దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు. ఇది సర్వ లోకాల ప్రభువు తరఫు నుండి అవతరింపజేయబడింది. ఏమీ? మీరు ఈ సందేశాన్ని తేలికగా తీసు కొంటున్నారా?” (అల్‌ వాఖిఅహ్‌, 56 : 75 – 81)

6. ”అల్లాహ్‌ సర్వ శ్రేష్ఠమైన బోధనను ఒక గ్రంథ రూపంలో అవతరింపజేసాడు. దానిలో ఒకే రకమైన (వచనాలను) మాటిమాటికీ ఎన్నో విధాలుగా (విశదీకరించాడు). తమ ప్రభువుకు భయపడేవారి శరీరాలు (చర్మాలు) దానితో (ఆ పఠనంతో) గజగజ వణుకుతాయి. కాని తరువాత వారి చర్మాలు మరియు వారి హృదయాలు అల్లాహ్‌ ధ్యానం వల్ల మెత్తబడతాయి. ఇది అల్లాహ్‌ మార్గదర్శకత్వం. ఆయన దీనితో తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఏ వ్యక్తిని అల్లాహ్‌ మార్గ భ్రష్టత్వంలో వదులుతాడో అతనికి మార్గదర్శకుడు ఎవ్వరూ ఉండడు.” (అజ్జుమర్‌, 39:23)

7. ”ఇదివరకు వచ్చిన హెచ్చరిక చేసే వారివలే, ఇతను (ము’హమ్మద్‌) కూడా హెచ్చరిక చేసేవాడు మాత్రమే ! రానున్న ఘడియ సమీపంలోనే ఉన్నది. అల్లాహ్‌ తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మీరు ఈ సందేశాన్ని చూచి ఆశ్చర్యపడుతున్నారా? ఏమిటి?”  (అన్నజ్మ్‌, 53 : 56 – 59)

ఈ ఆయాతులలో ‘హదీస్‌’ అనే పదం దైవ గ్రంథాన్ని సూచిస్తుంది. ‘హదీసు’ల్లో కూడా ఈ పదానికి దైవ గ్రంథం అనే పేర్కొనడం జరిగింది. ప్రవక్త (స) ప్రసంగాల్లో తరచూ ఉత్తమమైన ‘హదీసు’ దైవ గ్రంథం అని పేర్కొనే వారు. అదేవిధంగా ప్రవక్త (స) ప్రవచనాన్ని కూడా ‘హదీసు’ అని అంటారు.

ప్రవక్త (స) ప్రవచనం: ”నా ‘హదీసు’లను విని ప్రజలకు తెలియపరిచే వారికి అల్లాహ్‌ సంతోషా నందాలు ప్రసాదించు గాక!”

దీనివల్ల ఖుర్‌ఆన్‌ను, ప్రవక్త(స) ప్రవచనాల్ని ‘హదీస్’ అంటారు. ఈ రెంటినీ విశ్వసించడం, వీటి ఆదేశాలను పాలించడం తప్పనిసరి. ఖుర్‌ఆన్‌ ఆదేశాల్ని పాలించి నట్లే, ‘హదీసు’ ఉపదేశాల్ని కూడా పాలించాలి. అల్లాహ్‌ను విశ్వసించినట్లే, ప్రవక్త (స)నూ విశ్వసించాలి.

అల్లాహ్‌ఆదేశం:1. ”ఓ విశ్వాసులారా ! మీరు అల్లాహ్‌ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి.” (అన్నిసా’, 4:59).

2. ”మరియు మేము ఏ ప్రవక్తను పంపినా – అల్లాహ్‌ అనుజ్ఞతో – (ప్రజలు) అతనిని అనుసరించాలనే పంపాము.” (అన్నిసా’, 4:64) – ఎందుకంటే ప్రవక్త (స) కు విధేయత చూపితే, అల్లాహ్‌కు విధేయత చూపినట్లే.

3. ”ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో వాస్తవంగా అతడు అల్లాహ్‌ కు విధేయత చూపినట్లే.” (అన్ని సా’,4:80)-అందువల్ల ఖుర్‌ఆన్‌, ‘హదీసు’లను అనుసరించటం వల్లనే అల్లాహ్‌ (త) విధేయత లభిస్తుంది.

ఖుర్ఆన్లోహదీస్‌’ ప్రస్తావన

ఖుర్‌ఆన్‌, ‘హదీసు’లు రెండూ దైవ వాక్కులే. ఎందుకంటే ‘హదీసు’ కూడా అల్లాహ్‌ తరఫు నుండే అవతరించింది. అల్లాహ్‌ ఆదేశం:

1. ” మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు. అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్య జ్ఞానం (హీ) మాత్రమే.” (అన్నజ్మ్‌, 53:3-4)

2. ”(ఓ ప్రవక్తా!) ఇలా అను: ‘మీకు నిజంగా అల్లాహ్‌ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్నే అనుసరించండి. అప్పుడు అల్లాహ్‌ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను క్షమిస్తాడు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు. అపార కరుణా ప్రదాత.'(ఇంకా) ఇలా అను:’అల్లాహ్‌కు మరియు సందేశహరునికి విధేయులై ఉండండి.’  ఒకవేళ వారు కాదంటే! ‘నిశ్చయంగా అల్లాహ్‌ సత్యతిరస్కారులను ప్రేమించడు,’ అని తెలుసుకోవాలి.” (ఆల ఇమ్రాన్‌, 3:3132)

3. ”ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులుగా ఉండండి. మరియు మీరు (అతని సందేశాలను) వింటూ కూడా, అతని (ప్రవక్త) నుండి మరలిపోకండి.” (అల్‌ అన్‌ఫాల్‌, 8:20)

4. ”ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌కు విధేయులై ఉండండి. మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి. మరియు మీలో అధికారం అప్పగించబడిన వారికి కూడా! మీ మధ్య ఏ విషయంలోనైనా అభిప్రాయభేదం కలిగితే మీరు అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని, విశ్వసించే వారే అయితే, ఆ విషయాన్ని అల్లాహ్‌కు మరియు ప్రవక్తకు నివేదించండి. ఇదే సరైన పద్ధతి మరియు ఫలితాన్ని బట్టి కూడా ఉత్తమమైనది.” (అన్నిసా, 4:59)

‘హదీసు’ను గౌరవించటం ప్రవక్త(స)ను గౌరవించి నట్లే. ప్రవక్త (స)ను గౌరవించటం, అల్లాహ్‌ను గౌరవించి నట్లే. ప్రవక్త (స) ముందు బిగ్గరగా, అసభ్యంగా మాట్లాడరాదు.

ఈ ఆయాతులలో ఖుర్‌ఆన్‌తో పాటు ‘హదీసు’కు కూడా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది.

ఖుర్ఆన్వివరణలో హదీసు ప్రాధాన్యత

ఖుర్‌ఆన్‌లోని కొన్ని వాక్యాలకు ప్రవక్త (స) ‘హదీసు’ ద్వారానే వివరణ లభిస్తుంది. ఉదాహరణకు: ”అఖీముస్సలాహ్‌” ఖుర్‌ఆన్‌లో నమా’జు గురించి ఆదేశించబడింది. కాని దాని పద్ధతి లేదు. దీని పద్ధతి వివరంగా ‘హదీసు’లో ఉంది. ”సల్లూ కమా రఅయ్‌తు మూనీ ఉసల్లీ” (బు’ఖారీ) అంటే నేను నమా’జు చేస్తూ ఉండగా చూసినట్లే, మీరూ నమా’జ్‌ చేయండి. అదేవిధంగా ఖుర్‌ఆన్‌లో ‘జకాత్‌ ఇవ్వండి అని ఉంది. దాని పద్ధతి, నియమ నిబంధనలు అన్నీ ‘హదీసు’ల్లో ఉన్నాయి. అదేవిధంగా ఖుర్‌ఆన్‌లో ఉపవాసం గురించి ఉంది. కాని దాని వివరణ, పద్ధతి, నియమ నిబంధనలు లేవు. అవన్నీ ‘హదీసు’ల్లో ఉన్నాయి. అదేవిధంగా ‘హజ్జ్ కూడా. ఇంకా నికా’హ్‌, ‘తలాఖ్‌, వ్యాపారం మొదలైన వాటి వివరాలు కూడా ‘హదీసు’ల్లోనే ఉన్నాయి. ప్రవక్త (స) అనుచరులైన ‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హుసైన్‌ (ర)ను ఇలా ప్రశ్నించటం జరిగింది. ”మీరు వివరించే ‘హదీసు’ల మూలాలు ఖుర్‌ఆన్‌లో లేవే” అని. అది విని ‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హుసైన్‌ ఆగ్రహానికి గురై, ఆ వ్యక్తితో, ‘నువ్వు ఖుర్‌ఆన్‌లో ‘జకాత్‌ గురించి 200 దిర్‌హమ్‌లు ఉంటే ప్రతి 40 దిర్‌హమ్‌లకు ఒక దిర్‌హమ్‌ ఇవ్వాలని, అదే విధంగా మేకల్లో ప్రతి నలభై మేకలకు 1 మేక చెల్లించాలని, ఒంటెల్లో కూడా ఇలాగే ఇవ్వాలని ఖుర్‌ఆన్‌లో ఉన్నాయా?’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘ఈ వివరాలు ఖుర్‌ఆన్‌లో లేవు,’ అని అన్నాడు. మరి నీవు ఎక్కడి నుండి నేర్చుకున్నావు? నీవు మా నుండి నేర్చుకున్నావు. మేము ప్రవక్త (స) ద్వారా నేర్చుకున్నాము. ఇలా అనేక విషయాల గురించి చర్చించారు. (అబూ దావూద్‌ – కితాబు’జ్జకాత్‌ 225/1)

దీని వల్ల తెలిసిందేమిటంటే, ఖుర్‌ఆన్‌లో కొన్నిచోట్ల ఆదేశాలను సంక్షిప్తంగా పేర్కొనడం జరిగింది. ప్రవక్త (స) ‘హదీసు’ల్లో దాని వివరణ ఉంది.

ఈ వాక్యాల ద్వారా ‘హదీసు’ ఖుర్‌ఆన్‌ వివరణ అని అర్థం అయ్యింది. ఏ విధంగా ఖుర్‌ఆన్‌ ప్రధానమైనదో ‘హదీసు’ కూడా ప్రధానమైనదే.

హదీసువివేక పూరితమైనది

ఖుర్‌ఆన్‌లో ‘హదీసు’ వివేకంగా పేర్కొనబడింది.

అల్లాహ్‌ ఆదేశం: ”ఆయనే ఆ నిరక్షరాస్యులైన వారిలో నుండి ఒక సందేశహరుణ్ణి లేపాడు. అతను వారికి ఆయన సూచనలను చదివి వినిపిస్తున్నాడు. మరియు వారిని సరిదిద్దుతున్నాడు. మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు. మరియు వాస్తవానికి వారు, అంతకు పూర్వం స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉండే వారు. (అల్‌ జుము’అహ్‌, 62:2)

ఈ ఆయతులో గ్రంథం అంటే ఖుర్‌ఆన్‌, వివేకం అంటే ప్రవక్త (స) సాంప్రదాయం అని సూచించడం జరిగింది.

ఖునూజీ, ఫవాయిదుల్‌ ఫవాయిద్‌ 171వ పేజీలో దైలమీ ద్వారా ఈ ప్రామాణిక ‘హదీసు’ను పేర్కొన్నారు. ”అంటే ‘హదీసు’ లేకుండా ఖుర్‌ఆన్‌ను అర్థం చేసుకోవడం, గ్రహించడం అసాధ్యం. ఎవరు నా ‘హదీసు’ను చదివి అర్థం చేసుకొని, దాన్ని గుర్తుంచుకుంటే, అతడు ఖుర్‌ఆన్‌ అనుచరుడుగా పరిగణించబడతాడు. ఇంకా ” ‘హదీసు’ ఖుర్‌ఆన్‌ నుండి వేరు కాదు,” అని కూడా ఉంది. ఈ రెండు ఒక దాని పట్ల ఒకటి తప్పనిసరి విషయాలు. ‘హదీసు’ పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించిన వ్యక్తి ఇహ పరాలు నాశనం అవుతాయి. నన్ను అనుసరించమని, నా ఉపదేశాల ప్రకారం ఆచరించమని అల్లాహ్‌ ఆదేశించి ఉన్నాడు. నా సాంప్రదాయం పట్ల సంతృప్తికరంగా ఉన్న వ్యక్తి ఖుర్‌ఆన్‌ పట్ల సంతృప్తికరంగా ఉన్నట్టే. నా ‘హదీసు’ను స్వీకరించిన వ్యక్తి ఖుర్‌ఆన్‌ను స్వీకరించినట్టే. ”ప్రవక్త (స) ఇచ్చినదాన్ని తీసుకోండి, వారించిన వాటికి దూరంగా ఉండండి” అని అల్లాహ్‌ ఆదేశించి ఉన్నాడు.

ప్రవక్త (స) ప్రవచనం: నా ‘హదీసు’లను అనుసరించిన వాడు నా అనుచర సమాజంలోని వాడు. నా ‘హదీసు’లను తిరస్కరించిన వ్యక్తితో నాకు ఎలాంటి సంబంధం లేదు.

ఈ ‘హదీసు’ ద్వారా ఖుర్‌ఆన్‌, ‘హదీసు’లు రెండూ షరీ’అత్‌ మూలాలు అని స్పష్టంగా తెలియపర్చటం జరిగింది. ఇంకా ప్రతి ముస్లిమ్‌ ఈ రెంటినీ తప్పనిసరిగా అనుసరించాలి. ‘హదీసు’ను తిరస్కరిస్తే, ఖుర్‌ఆన్‌ను కూడా తిరస్కరించినట్టే. అల్లాహ్‌ (త) తన ప్రవక్తపై ఖుర్‌ఆన్‌ ‘హదీసు’లను రెంటినీ అవతరింపజేసాడు. ఖుర్‌ఆన్‌లో అనేక చోట్లలో గ్రంథంతో పాటు వివేకం అని కూడా పేర్కొనడం జరిగింది.

సుయూతీ ”మిఫ్‌తాహుల్‌ జన్నహ్‌”లో ఇలా పేర్కొన్నారు, ”ఖుర్‌ఆన్‌లో కొన్నిచోట్ల ‘హదీసు’ ద్వారానే అర్థం చేసుకోవటం, ఆచరించటం సాధ్యం. అంటే ప్రవక్త (స) సాంప్రదాయం ఖుర్‌ఆన్‌ను స్పష్టంగా వివరిస్తుంది.”

ప్రవక్త (స)పై దైవ వాణి అవతరించేది. అయితే జిబ్రీల్‌ (అ), ప్రవక్త (స) వద్దకు ప్రవక్త సాంప్రదాయాన్ని తీసుకువచ్చే వారు. అది దాన్ని స్పష్టంగా వివరించేది.

షాతిబీ, అల్‌జాయీ పదాలను వివరిస్తూ ఇలా పేర్కొన్నారు, ”ఖుర్‌ఆన్‌ వాక్యాల్లో అనేక విధాలుగా గ్రహించటం జరిగింది. అంటే దేన్ని ఉద్దేశించటం జరిగిందో సరిగా అర్థం అయ్యేది కాదు. ‘హదీసు’ దాన్ని ఇది అని నిర్దేశించేది. అంటే ప్రవక్త (స) సాంప్రదాయం అల్లాహ్‌ ఆదేశాలకు వ్యాఖ్యానం, వివరంగా పనిచేసింది.

ఖుర్‌ఆన్‌ ‘హదీసు’లు మూలం, వివరణగా తమ పాత్ర పోషిస్తున్నాయి. ఇవి పరస్పరం వ్యతిరేకం కావు. ఖుర్‌ఆన్‌ మూలం. ‘హదీసు’ దాని వివరణ. అందువల్లే ఖుర్‌ఆన్‌లో ”మేము నీ వద్దకు గ్రంథాన్ని అవతరింప జేసాము, వారికోసం ఆదేశించిన వాటిని స్పష్టంగా వివరించటానికి.” ప్రవక్త (స) యొక్క విధులు, బాధ్యతలనే మనం ‘హదీసు’ అంటాం.

షాతిబీ, ‘హదీసు’ అసలు ఖుర్‌ఆన్‌ యొక్క స్పష్టమైన, వివరమైన రూపం అని, దాని వ్యాఖ్యానం అని పేర్కొన్నారు. ఖుర్‌ఆన్‌ నమా’జు గురించి ఆదేశిస్తే, ‘హదీసు’ దాన్ని స్పష్టంగా విశదపరచి వ్యాఖ్యానించింది. అంటే చేతులు ఎలా ఎత్తాలి, ఎలా కట్టుకోవాలి. ఎందుకంటే ఆచరించటానికి ఇవన్నీ తప్పనిసరి.

ప్రవక్త (స) రెండు విధాలుగా ప్రజలకు బోధించేవారు. ముందు దైవాదేశాలను ప్రజలకు వినిపించేవారు. ఆ తర్వాత వాటిని విశదపరచి, వాటి గురించి స్పష్టమైన సూచనలు ఇచ్చేవారు. ఖుర్‌ఆన్‌ అవతరించినపుడు అరబ్బీ భాషా పండితులు, ప్రవీణులు ఉండేవారు. కాని ఖుర్‌ఆన్‌లోని కొన్ని ఆయతుల గురించి వివరంగా తెలుసుకోవటానికి ప్రవక్త (స) సన్నిధికి వచ్చేవారు. ఉదాహరణకు కొన్ని ఆయతులు:

1. ఎవరైతే విశ్వసించి, తమ విశ్వాసాన్ని అత్యాచారం తో కలుషితం చేయరో! అలాంటి వారికే శాంతి భద్రతలు ఉన్నాయి. మరియు వారే సన్మార్గంపై ఉన్నారు. (అల్‌ అన్‌ ఆమ్‌, 6:82)

ఈ ఆయతు అవతరించినపుడు ప్రవక్త (స) అనుచరులు సందేహానికి గురై, ప్రవక్త (స)ను దాని వివరణ కోరగా, ప్రవక్త (స) ఇక్కడ అత్యాచారం అంటే సాటి కల్పించటం అని వివరించారు. అదేవిధంగా సాటి కల్పించటం చాలా నీచ అత్యాచారం. అని బు’ఖారీ, ముస్లిమ్‌లో ఉంది. దీన్ని గురించి కూడా అనుచరులు సందేహానికి గురయ్యారు. ప్రవక్త (స) వారి సందేహానికి సంతృప్తికరమైన సమాధానం ఇచ్చారు.

హదీసుఅవసరం

ఇస్లామ్‌ను అర్థం చేసుకోవడానికి ఖుర్‌ఆన్‌ ఎంత అవసరమో, ‘హదీసు’ కూడా అంతే అవసరం. కనుక ఖుర్‌ఆన్‌ను అర్థం చేసుకోవటానికి ‘హదీసు’ చాలా అవసరం.

ఒకవేళ ‘హదీసు’ను ఖుర్‌ఆన్‌ వివరణగా భావించ కుంటే, ప్రతి వ్యక్తి ఖుర్‌ఆన్‌ వ్యాఖ్యానాన్ని తన అభిప్రాయాల ద్వారా వివరిస్తాడు. ప్రతి ఒక్కరి అభిప్రాయం సరికాదు. ఒక ఆయతు గురించి ఒకరు ఒక విధంగా భావిస్తారు. మరొకరు మరో విధంగా భావిస్తారు. దీని వల్ల అనేక అభిప్రాయభేదాలు ఏర్పడతాయి. ఖుర్‌ఆన్‌ పట్ల ఎవరికి ఎలా తోచితే అలా భావిస్తూ ఆటలా చేసుకుంటారు. వాస్తవం ఏమిటంటే ఖుర్‌ఆన్‌ ఒక దిశా నిర్దేశాల ప్రామాణిక గ్రంథం. ప్రవక్త(స) వివరణ లేకుండా దీన్ని అర్థం చేసుకోవటం ఎంత మాత్రం సాధ్యం కాదు. ప్రవక్త (స) యొక్క ఆ ఆదేశాలనే ‘హదీసు’లు అంటారు. ప్రవక్త (స) ‘హదీసు’లను అనుసరిస్తే, ఖుర్‌ఆన్‌ను అనుసరించినట్టే. అదేవిధంగా ‘హదీసు’లను తిరస్కరిస్తే  ఖుర్‌ఆన్‌ను తిరస్కరించినట్టే.

‘హాఫి”జ్‌ ఇబ్నె కసీ’ర్‌: ”ప్రవక్త సాంప్రదాయాన్ని, ‘హదీసు’లను దృఢంగా పట్టుకోండి. ఎందుకంటే ఈ ‘హదీసు’లు ఖుర్‌ఆన్‌ వివరణ మరియు వ్యాఖ్యానాలు.” అని అన్నారు .

అదేవిధంగా షాఫయీ తన పుస్తకంలో ఇలా అభిప్రాయపడ్డారు: ”ప్రవక్త (స) ఏమి ఆదేశించినా, ఖుర్‌ఆన్‌ను అర్థం చేసుకొని ఆదేశిస్తారు. ఎందుకంటే అల్లాహ్‌ ఖుర్ఆన్లో ”మేము నీపై సత్యం ద్వారా గ్రంథాన్ని అవతరింపజేసాము. దాని ద్వారా నీవు ప్రజల్లో తీర్పుచేయాలని,”  అంటే – ‘అల్లాహ్‌ ప్రవక్త (స) ను ఆదేశించినట్టు. దాని ద్వారా ప్రవక్త (స) ప్రజల్లో తీర్పుచేయాలని, అంటే అవి ప్రవక్త (స) ఆదేశాలు, ఆచరణలు అవుతాయి. దాని పేరే ‘హదీసు’. ఇంకా ”నీవు చేసే తీర్పు దైవ తీర్పుగా ఉంటుంది.” అల్లాహ్‌ ఆదేశం, ”ప్రవక్త(స)కు విధేయత చూపిన వాడు అల్లాహ్‌కు విధేయత చూపినట్టే.”

ప్రవక్త (స) కు, విధేయత అంటే ప్రవక్త (స) ఆదేశాలను, ఉపదేశాలను, ఆచరణలను అనుసరించటం. వీటినే మనం ‘హదీసు’లు అంటాం. ప్రవక్త (స) కు విధేయత చూపకుంటే అల్లాహ్‌కు విధేయత చూపలేము. ఎందుకంటే ఇందులో ఒకరి విధేయత మరొకరి విధేయతలో తప్పనిసరిగా చేర్చబడి ఉంది. ఖుర్‌ఆన్‌లో అనేక చోట్లలో ప్రవక్త (స)కు విధేయత గురించి నొక్కి వక్కాణించడం జరిగింది.

1. ”ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి.” (అన్నిసా’, 4:59).

2. ”మరియు మేము ఏ ప్రవక్తను పంపినా – అల్లాహ్‌ అనుజ్ఞతో – (ప్రజలు) అతనిని అనుసరించాలనే పంపాము.” (అన్నిసా’, 4:64)

అల్లాహ్‌కు విధేయత చూపటం, ఆయన ప్రవక్తకు విధేయత చూపటం రెండూ తప్పనిసరి విషయాలే. అంటే అల్లాహ్‌ (త) ఆదేశాలను, ప్రవక్త (స) ఉపదేశాలనూ పాటించాలి.

ఇబ్నుల్‌ ఖయ్యీమ్‌ అభిప్రాయం: ‘హదీసు’లను పరిశీలిస్తే, మూడు రకాల ‘హదీసు’లు కనిపిస్తాయి. 1. కొన్నిటిలో ఖుర్‌ఆన్‌లో ఉన్నట్టే ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. 2. కొన్నిటిలో సంక్షిప్త పదానికి వివరణ ఉంది. ఈ రెండు రకాల్లో ప్రవక్త (స) విధేయత ప్రత్యేకంగా అవసరం లేదు. 3. కొన్ని ‘హదీసు’ల్లో ఖుర్‌ఆన్‌ మౌనం వహించిన ఆదేశాల గురించి పేర్కొనడం జరిగింది. ఈ ఆదేశాలను పాటించటానికే ”అతీ ఉల్లాహ వర్రసూల” అనే ఆదేశం ఇవ్వబడింది. ఒకవేళ ఈ మూడవ ఆదేశం స్పష్టంగా ఇవ్వకుండా ఉంటే ప్రవక్త విధేయతకు అర్థమే ఉండదు. సారాంశం ఏమిటంటే, అన్ని ఆదేశాలను పాలించినప్పుడే ఈ ఆయతుపై అమలుచేయడం జరుగుతుంది. ఖుర్‌ఆన్‌ ప్రవక్త (స) విధేయతను అల్లాహ్‌ విధేయతగా పేర్కొంది. ప్రవక్త (స) విధేయత ఒక విధంగా అల్లాహ్‌ విధేయత అవుతుంది.

హదీసులు కూడా ఖుర్ఆన్మాదిరిగానే అవతరించబడ్డాయి

ఖుర్‌ఆన్‌, ‘హదీసు’లు రెండూ ధార్మిక మూలాలే. రెండూ అల్లాహ్‌ వద్ద నుండి వచ్చినవే. ఇబ్నె కసీ’ర్‌ ఇలా అభిప్రాయపడుతున్నారు: ”ఖుర్‌ఆన్‌ దైవ వాణి ద్వారా అవతరించబడుతుంది, ‘హదీసు’ పఠించబడదు.

హా’జిమీ తన పుస్తకం నాసిఖ్‌, మన్‌సూఖ్‌లో ఇలా పేర్కొన్నారు: అంటే జిబ్రీల్‌ (అ) ‘హదీసు’ను తీసుకొని ఆకాశం నుండి దిగేవారు. ఇంకా ప్రవక్త (స) కు నేర్పే వారు. ప్రవక్త (స) యొక్క ప్రతి ఆదేశం, ప్రతి ‘హదీసు’ దైవ వాణి అవుతుంది. (ఇన్‌తహా – 24వ పేజీ)

ముస్నద్‌ దార్మీలో ఇలా ఉంది: ‘హస్సాన్‌ (ర) కథనం: జిబ్రీల్‌ (అ) ఖుర్‌ఆన్‌ తీసుకొని ప్రవక్త (స)పై అవతరింపజేసినట్టే, ‘హదీసు’ తీసుకొని కూడా అవత రింపజేసేవారు.(ఫత్‌హుల్‌ బారీ – 29, 670 పేజీలు)

షాఫయీ తన పుస్తకం ”అల్‌ ఉమ్ము”లో ఇలా పేర్కొన్నారు: అంటే ప్రవక్త (స) అల్లాహ్‌ ఆదేశం లేనిదే ఎటువంటి ధార్మిక ఆదేశం ఇవ్వలేదు. రెండు విధాలుగా ఇవ్వడం జరిగింది. ఒకటి పఠనా దైవవాణి ద్వారా లేదా ‘హదీసు’ ద్వారా. సూరహ్‌ నిసా’ (4)లో అల్లాహ్‌ తన ప్రవక్త నుద్దేశించి, ”అల్లాహ్‌ నీపై గ్రంథాన్ని మరియు వివేకాన్ని అవతరింపజేసాడు. గ్రంథం అంటే ఖుర్‌ఆన్‌, వివేకం అంటే ‘హదీసు’. దీన్ని సమర్థిస్తూ ఒక సేవకుని సంఘటన ఉంది. అతడు తన యజమాని భార్యతో వ్యభిచారం చేసాడు. అతని కేసు ప్రవక్త (స) న్యాయస్థానంలోనికి వచ్చింది. అప్పుడు ప్రవక్త (స) ‘నేను అల్లాహ్‌ గ్రంథం ప్రకారం తీర్పు చేస్తాను’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) తీర్పు ఇచ్చి, దాన్ని అమలు జరిపారు. అది ఖుర్‌ఆన్‌లో లేదు, ‘హదీసు’లో ఉంది. దీనివల్ల దైవ గ్రంథం అంటే పఠించబడని దైవవాణి అని స్పష్టంగా తెలుస్తుంది. ‘హదీసు’లను పరిశీలిస్తే, ప్రవక్త (స)ను ఒక విషయం గురించి ప్రశ్నిస్తే, తనకు తెలిసి ఉంటే వెంటనే సమాధానం ఇచ్చేవారు. లేదంటే దైవవాణి కోసం ఎదురు చూసి, దైవవాణి వచ్చిన తర్వాత సమాధానం ఇచ్చేవారు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కొన్నింటిని పరిశీలిద్దాం.

1. ఒక వ్యక్తి ప్రవక్త (స)ను ప్రపంచంలో అల్లాహ్‌కు అన్నింటికంటే ప్రీతికరమైన ప్రదేశం ఏది అని అడిగాడు. దానికి ప్రవక్త (స) ”నాకు  తెలియదు. జిబ్రీల్‌ను అడిగి చెబుతాను,” అని అన్నారు. జిబ్రీల్‌ (అ) వచ్చిన తర్వాత అతన్ని అడిగారు. దానికి జిబ్రీల్‌ కూడా నాకు తెలియదు అని, తెలుసుకోవడానికి ఆకాశంపై ఎక్కి అల్లాహ్‌ను అడిగి తెలుసుకొని వచ్చి, ‘అన్నింటికంటే ఉత్తమమైన ప్రదేశాలు మస్జిదులు, అన్నింటికంటే నీచమైన ప్రదేశాలు బజారులు’ అని అన్నారు. ఈ సంఘటన ద్వారా ‘హదీసు’ కూడా దైవవాణి అని తెలుస్తుంది. ఇది జిబ్రీల్‌ ద్వారా ప్రవక్త (స)కు చేరేది. (అహ్మద్‌, తబ్‌రానీ, ఇబ్నె హిబ్బాన్‌)

2. ‘హజ్జ్ లో సుగంధ పరిమళాలు ఉపయోగించ రాదు. ఒక అనుచరుడు తెలియక ఉమ్‌రహ్‌ ఇ’హ్‌రామ్‌ స్థితిలో సుగంధ పరిమళాలు పులుముకున్నాడు. చొక్కా కూడా ధరించాడు. ఇప్పుడు ఏమి చేయాలని ప్రవక్త (స)ను విన్నవించుకున్నాడు. కాని ప్రవక్త (స)కు కూడా దాన్ని గురించి తెలియదు. దైవవాణి వచ్చిన తర్వాత సువాసనను కడిగి వేయమని చొక్కా తీసివేయమని సమాధానం ఇచ్చారు. (బు’ఖారీ)

ఇటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. బు’ఖారీ ఈ విషయంలో ఒక అధ్యాయాన్ని పేర్కొన్నారు. అంటే ప్రవక్త (స)కు తెలియని విషయం గురించి అడగడం జరిగితే, నాకు తెలియదని చెప్పేవారు లేదా సమాధానం ఇచ్చే వారు కాదు. దైవవాణి వచ్చిన తర్వాత సమాధానం ఇచ్చేవారు.

హదీసుప్రత్యేకతలు (దాయల్)

ప్రవక్త(స)కు మానవులందరిపై ప్రత్యేక స్థానం ఉన్నట్టు, ప్రవక్త(స) బోధనలకు కూడా మానవులందరి మాటలపై ప్రత్యేక స్థానం ఉంది. ‘హదీసు’ జ్ఞానం ప్రవక్త (స) ఉనికి నుండి వచ్చినదే. ఎందుకంటే ప్రవక్త(స) అల్లాహ్‌ ప్రవక్త. ప్రవక్త (స) ఆదేశాలు, ఆచరణలనే ‘హదీసు’లు అంటారు. వీటిని చదివి, ఆచరిస్తే ఉభయ లోకాల్లో సాఫల్యం లభిస్తుంది. ఖుర్‌ఆన్‌ తర్వాత ‘హదీసు’కే గొప్ప స్థానం ఉంది. ‘హదీసు’లను అనుసరించే వారికి గొప్ప గొప్ప స్థానాలు లభిస్తాయి.

అబూ ము’హమ్మద్‌ ఇజ్‌దీ మి’స్‌రీ తన పుస్తకంలో ఇలా పేర్కొన్నారు: ‘హదీసు’ విద్యకు చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. దానికి సహాయ సహకారాలు అందించే వారు ఉన్నత స్థానాలు పొందుతారు. అసంపూర్ణ వ్యక్తి, ‘హదీసు’ విద్యను నేర్చుకొని పరిపూర్ణుడవుతాడు. ఇంకా అందవికారుడు అంద గాడుగా తయారవుతాడు. 1. ‘హదీసు’ విద్య యొక్క మహత్మ్యం రహస్యం ఏమీ కాదు. నిస్సందేహంగా అది జ్ఞాన సముద్రం. దీనివల్ల గౌరవం లభిస్తుంది. 2. ఇందులో అనేక వజ్రాలు, ముత్యాలు ఉన్నాయి. 3. ఎన్నో గొప్ప గొప్ప విద్యలు ఉన్నాయి. ‘హదీసు’ విద్య నేర్చుకునేవారు, ఆచరించేవారు అల్లాహ్‌ ధర్మ సేవకులు, సహాయకులూను.

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘హసన్‌ షీరా’జీ ‘హదీసు’ మరియు ‘హదీసు’లను అనుసరించేవారి గురించి ఇలా పేర్కొన్నారు. ‘ఓ మనిషి నీవు ‘హదీసు’ను అనుసరించే వారితో ఉండు. ఎందుకంటే వారు రుజ మార్గంపై ఉన్నారు. వెలుగు కేవలం ‘హదీసు’ను అనుసరించే వారిలోనే ఉంది. మిగిలిన వారిలో చీకటి రాత్రుల చీకటి ఉంది. సృష్టి రాసుల్లో కెల్లా ఉత్తములు ‘హదీసు’లను అనుసరించే వారే. కల్పితాలకు గురయ్యేవారే అంధులు. ‘హదీసు’లను వదలిన వారు తమ ఆచరణలన్నింటినీ వృథా చేసుకుంటారు. ఒక వ్యక్తి ముస్లిమయి ‘హదీసు’లను వదలగలడా?

హదీసుప్రాధాన్యతను హదీసునోట వినండి

ఇర్‌బా’జ్‌ బిన్‌ సారియ (ర) కథనం: ప్రవక్త (స) ఒక రోజు మాకు నమా’జు చదివించారు. నమా’జు తర్వాత మా వైపు తిరిగి ఎటువంటి ప్రసంగం చేశారంటే, మా కళ్ళంట అశ్రువులు రాల సాగాయి, హృదయాలు కంపించసాగాయి. ఒక వ్యక్తి లేచి, ‘ఓ ప్రవక్తా! ఈ ప్రసంగం ప్రయాణంపై వెళుతున్న వ్యక్తి తన వారికి హిత బోధ చేసినట్లు ఉంది. మాకేదైనా హిత బోధ చేయండి’ అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స), ”నేను మీకు చేసే హిత బోధ ఏమిటంటే, అల్లాహ్‌కు భయపడుతూ ఉండాలి, ముస్లిమ్‌ పాలకునికి విధే యులై ఉండాలి. ఒకవేళ మీపై నల్ల జాతి వ్యక్తి పాలకుడైనా సరే, నా తరువాత బ్రతికుండేవారు అనేక భేదాభిప్రాయాలు చూస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో నా సాంప్రదాయాన్ని, ‘హదీసు’ను దృఢంగా పట్టుకొని ఉండండి. నా తరువాత ‘ఖలీఫాలను అంటిపెట్టుకుని ఉండండి. పళ్ళతో గట్టిగా పట్టుకొని ఉండండి. కల్పితాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రతి కల్పితం బిద్‌’అత్‌ అవుతుంది. ప్రతి బిద్‌’అత్‌ మార్గభ్రష్టత్వానికి గురి చేస్తుంది.” (అహ్మద్‌, అబూ దావూద్‌, తిర్మిజి’)

ప్రవక్త (స) ప్రవచనం: ”నేను మీలో రెండు విషయాలను వదలి వెళుతున్నాను. మీరు వాటిని దృఢంగా పట్టుకొని ఉన్నంత వరకు ఎంతమాత్రం మార్గ భ్రష్టత్వానికి గురికారు. అవి: 1. ఖుర్‌ఆన్‌ 2. నా సాంప్రదాయం.” (అల్‌ ‘హాకిమ్‌)

ఈ రెండే మార్గదర్శకాలు. ఈ రెండే సూర్యచంద్రులు. ఈ రెంటిపై నడచి వారెవరూ మార్గభ్రష్టత్వానికి గురి కారు. అభిప్రాయభేదాలు ఏర్పడినప్పుడు ప్రవక్త (స) సాంప్రదాయాన్ని అనుసరించేవారికి 100 అమర వీరుల పుణ్యం లభిస్తుంది.

ప్రవక్త (స) ప్రవచనం: ‘అనుచర సమాజంలో కల్లోల కాలంలో నా సాంప్రదాయాన్ని అనుసరించేవారికి 100 మంది అమర వీరుల పుణ్యం లభిస్తుంది. (బైహఖీ)

అదేవిధంగా ప్రవక్త (స) ‘హదీసు’లను, సాంప్రదాయాలను ప్రేమించేవారు స్వర్గంలో ప్రవక్త (స) సహవాసంలో ఉంటారు. ప్రవక్త (స) ప్రవచనం: నా’ సాంప్రదాయాన్ని ప్రేమించేవారు నన్ను ప్రేమించినట్టు. నన్ను ప్రేమించే వారు స్వర్గంలో నా సహవాసంలో ఉంటారు. (తిర్మిజి’)

అబుల్‌ అ’హ్‌సన్‌ (ర) కథనం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) ప్రతి గురువారం నిలబడి బిగ్గరగా ”ప్రజలారా! రెండే విషయాలు ఉన్నాయి. 1. దైవ గ్రంథం 2. ఉత్తమ ఆచరణ. అన్నింటికంటే సత్యమైనది దైవ గ్రంథం. అన్నిటి కంటే ఉత్తమమైన ఆచరణ ప్రవక్త (స) సాంప్రదాయం. (జామి ఉల్‌ బయాన్‌, అల్‌ ఇల్మ్‌ వ ఫ’ద్లుహు)

ప్రవక్త (స) ఆచరణ ‘హదీసు’ల ద్వారానే తెలుస్తుంది. ‘హదీసు’ను అనుసరించటం ఖుర్‌ఆన్‌ను అనుసరించటం అవుతుంది. దీన్ని గురించి ఒక సంఘటన ఉంది. ఇబ్రాహీమ్‌ బిన్‌ అల్‌ ఖమహ్‌ కథనం: అసద్‌ తెగకు చెందిన ఒక స్త్రీ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ వద్దకు వచ్చి, ‘మీరు సవరాలు వేసేవాళ్ళను వేయించుకునే వాళ్ళను శపిస్తున్నారట, నేను ఖుర్ఆన్‌ అంతా చదివాను కాని ఖుర్‌ఆన్‌లో ఇలాంటిది ఎక్కడా లేదే! మీ భార్య కూడా దీనికి గురి కాకుండా ఉండదు అని నా అనుమానం’ అని చెప్పింది. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌, ‘నువ్వు మా ఇంటికి వెళ్ళి చూసుకో’ అని చెప్పారు. ఆమె వెళ్ళింది. కాని ఆమెకు ఆ విషయం కనబడలేదు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ ఆమెతో, ”నా భార్య దీనికి పాల్పడి ఉంటే, నేను ఆమె ముఖం చూసే వాడిని కాను. ఖుర్‌ఆన్‌లో ఎక్కడా లేదని నువ్వు అంటున్నావు. కాని ఈ ఆయతు నీవు చూడలేదా? ”వమా అతాకుముర్రసూలు ఫ’ఖుజూ’హు వమా న’హాకుమ్‌ అన్‌హు ఫన్‌తహూ’ ‘(అల్ హష్ర్, 59:7) – ‘…మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు అతను మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి…’ అని అన్నారు. దానికి ఆమె, ‘ఈ ఆయతు చదివాను,’ అని చెప్పింది. అప్పుడు ‘అబ్దుల్లాహ్‌, ‘చాలు, నోరు మూసుకో, ప్రవక్త (స) దీన్ని శపించారు’ అని అన్నారు.

హదీసుసాఫల్యానికి మార్గం

దైవ ప్రీతి కోరుకునే వారికి ‘హదీసు’ సరైన మార్గం. సుఫియాన్‌ ఇలా పేర్కొన్నారు: ‘భూమిపై ‘హదీసు’ విద్యకంటే ఉత్తమమైన విద్య మరొకటి లేదు. దైవ ప్రీతిని పొందగోరే వారికి ఇది ఎంతో ఉపయోగకరమైనది.’ (తారీఖు బ’గ్‌దాద్‌ / 83)

‘హదీసు’ ఎంతో ఉత్తమమైన ఆరాధన, తస్‌బీహ్‌ కంటే ఉన్నతమైనది. వకీ అభిప్రాయం: ‘హదీసు’కంటే గొప్ప ఆరాధన లేదు. నేను ‘హదీసు’ను తస్‌బీ’హ్‌కంటే ఉత్తమంగా భావిస్తున్నాను. అలా కాకుంటే నేను చెప్పేవాడిని కాను.’

హదీసువిద్య నమాజు వంటిది: ము’హమ్మద్‌ బిన్‌ ‘ఉమర్‌ బిన్‌’అ’తా కథనం: ‘మూసా బిన్‌ యసార్‌ మాకు ‘హదీసు’ బోధిస్తున్నారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) అతనితో, నీవు ‘హదీసు’ బోధన ముగించితే, సలామ్‌ పలుకు, ఎందుకంటే నీవు నమా’జ్‌లో ఉన్నావు. అంటే ఏవిధంగా నమా’జుకు పుణ్యం లభిస్తుందో, దీనికీ పుణ్యం లభిస్తుంది.’ అని అన్నారు .

‘హదీసు’ విద్యాభ్యాసం అదనపు నమా’జు కంటే ఉత్తమమైనది. వకీ అభిప్రాయం: ‘ఒకవేళ నాకు అదనపు నమా’జులు ‘హదీసు’కంటే ఉత్తమమైనవి అని తెలిస్తే నేను ‘హదీసు’లను ఉల్లేఖించను. అంటే నా వద్ద అదనపు నమా’జు కంటే ‘హదీసు’ బోధన ఉత్తమం. (తారీఖు బ’గ్‌దాద్‌ / 84)

హదీసుప్రచారం విశిష్ఠత

ప్రవక్త (స) ప్రవచనం: ‘మా ‘హదీసు’లను విని గుర్తుచేసుకొని, అలాగే ఇతరులకు అందజేసేవారికి అల్లాహ్ సుఖసంతోషాలు ప్రసాదించు గాక!’

‘హదీసు’ విద్య నేర్పించే, నేర్చుకునేవారు ప్రవక్త (స) వారసులు: ‘హదీసు’ను అనుసరించే వారే ప్రవక్త (స) అసలైన వారసులు. ప్రవక్త (స) వీరి గురించి ప్రత్యేకంగా దు’ఆ చేశారు.

‘అలీ (ర) కథనం: ఒకసారి ప్రవక్త (స) మా ఇంటికి వచ్చి, ”ఓ అల్లాహ్‌! నీవు నా వారసులపై కనికరించు,” అని ప్రార్థించారు. దానికి అక్కడున్న వారు, ”ఓ ప్రవక్తా! తమరి వారసులు ఎవరు?” అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స) ”నా తరువాత వచ్చేవారు, నా ‘హదీసు’లను, నా సాంప్రదాయాలను ప్రజలకు బోధించే వారు, వ్యాపింపజేసే వారు,” అని ప్రవచించారు. (షర్‌ఫు అస్‌’హాబిల్‌ ‘హదీస్‌’/32)

మరో ‘హదీసు’లో ఇలా ఉంది: ”ప్రాచీన ప్రవక్తల మరియు నా యొక్క వారసులు ఖుర్‌ఆన్‌ మరియు నా ‘హదీసు’లను కేవలం అల్లాహ్‌ ప్రీతి కోసం వ్యాఖ్యానిస్తారు, బోధిస్తారు.” (షరఫ్‌ / 32)

ఇస్‌’హాఖ్‌ బిన్‌ మూసా ‘హాతిమ్‌ అభిప్రాయం: ‘ఈ అనుచర సమాజంలో అల్లాహ్‌ ‘హదీసు’ వారికి ఇచ్చిన గౌరవం మరెవరికీ ఇవ్వలేదు. అల్లాహ్‌ స్వయంగా తన గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు: ”మేము మాకు ప్రియమైన, ధర్మం యొక్క సేవా, గౌరవాలను ప్రసాదిస్తాము. అనంతరం ధార్మిక గౌరవం ఈ బృందానికే లభించింది. ఇతరులకు ఇటువంటి గౌరవం లభించలేదు. వీరు ‘హదీసు’లను బోధిస్తే, అందరూ వాటిని స్వీకరిస్తారు.” (షరఫు అస్‌హాబిల్‌ హదీస్‌ /32)

‘హదీసు’ను ఆచరించేవారు, దరూద్‌ షరీఫ్‌ను అధికంగా పఠించడం వల్ల అందరికంటే ప్రవక్త (స)కు దగ్గరగా ఉంటారు.

ఇబ్నెమస్‌’ఊద్‌(ర) కథనం: తీర్పు దినం నాడు అందరికంటే అధికంగా నాపై దరూద్‌ పంపేవారు అందరి కంటే నాకు చేరువగా ఉంటారు. (తారీఖు బగ్‌దాద్‌ / 36)

అబూ న’యీమ్‌ ఈ ‘హదీసు’ను గురించి వ్యాఖ్యానిస్తూ ‘హదీసు’ విద్యను బోధించేవారు, ‘హదీసు’లను వ్యాఖ్యానించేవారు చాలా గొప్ప విశిష్ఠతకు అర్హులు. ఎందుకంటే ఇతరులెవ్వరూ ‘హదీసు’ పండితుల కంటే దరూద్‌ పఠించడంలో ఎక్కువ కారు.

అబూ బకర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ఎవరైనా నా నుండి ఏదైనా విషయం రాసి, దానితో పాటు నాపై దరూద్‌ కూడా రాస్తే, ఆ పుస్తకం చదవ బడినంత వరకు అతనికి పుణ్యం లభిస్తూ ఉంటుంది.”

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”ఏదైనా పుస్తకంలో నాపై దరూద్‌ రాసి ఉంటే, నా పేరు ఆ పుస్తకంలో ఉన్నంత వరకు దైవ దూతలు అతని క్షమాపణ గురించి దు’ఆ చేస్తూ ఉంటారు” అని సెలవిచ్చారు.

అబుల్‌ ఖాసిమ్‌ అబ్దుల్లాహ్‌ మురూజీ కథనం: నేనూ మా తండ్రిగారూ ఇద్దరం కలసి రాత్రిపూట ఒక చోట కూర్చొని ‘హదీసు’ల్లో పోటీలు పడేవారం. ఒకసారి అక్కడ వెలుగుతో కూడిన స్తంభం కనబడింది. అది ఆకాశం అంత ఎత్తుగా ఉంది. ‘ఎందుకలా ఏర్పడింది?’ అని ప్రశ్నించడం జరిగింది. ఎదురెదురుగా కూర్చొని ‘హదీసు’లను ఉచ్చరించినపుడు వారి నోటినుండి వెలు వడే దరూద్‌ శబ్దం వల్ల ఏర్పడిందని సమాధానం ఇవ్వబడింది. (షర్‌ఫు అస్‌’హాబిల్‌ ‘హదీస్‌’, తారీఖ్ బగ్‌దాద్‌)

హదీసును అనుసరించేవారు స్వర్గ వాసులు

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పు దినం నాడు ‘హదీసు’ను అనుసరించేవారి వెంట వెలుగు ఉంటుంది. అల్లాహ్‌ వారితో, మీరు ఎల్లప్పుడూ ప్రవక్త (స) పై దరూద్‌ వ్రాసేవారు. అంటే ప్రతి ‘హదీస్‌’తో పాటు, ‘ ‘సల్లల్లాహు ‘అలైహి వ సల్లమ్‌,’ వ్రాసే వారు. కనుక దరూద్‌ షరీఫ్‌ శుభం మూలంగా మీరు స్వర్గంలో ప్రవేశించండి” అని ఆదేశిస్తాడు.

ఆ తర్వాత సఖావీ అనేక ‘హదీసు’వేత్తల స్వప్నాల గురించి ప్రస్తావిస్తూ, ”చాలామంది ‘హదీసు’వేత్తలకు, ప్రతి ‘హదీసు’తో పాటు, ”సల్లల్లాహు ‘అలైహి వ సల్లమ్’ వ్రాసి నందువల్ల విముక్తి లభించింది,” అని పేర్కొన్నారు.

హదీసుఅనుసరించేవారి కోసం భవిష్యవాణి

ప్రవక్త (స) ప్రవచనం: రాబోయే సంతతిలోని ఉత్తములు ఖుర్‌ఆన్‌, ‘హదీసు’ విద్యను నేర్చుకొని, హద్దులను అతిక్రమించేవారి మార్పులు, చేర్పులను తొలగిస్తారు. దుర్మార్గుల కల్పితాలు, మార్పులు చేర్పులను దూరం చేస్తారు. ఈ భవిష్యవాణి ‘హదీసు’ వేత్తలపై నిజమయింది.

హదీసులను గురించి అడిగేవారిని గౌరవించమని ప్రవక్త () ఆదేశం

అబూ హారూన్‌ అల్‌ అజ్‌దీ కథనం: మేము అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) వద్దకు వచ్చినప్పుడు, అతడు సంతోషించి, స్వాగతం! ‘మీ కోసం ప్రవక్త (స) హితబోధ చేసి ఉన్నారు.’ దానికి మేము, ‘ప్రవక్త (స) ఏమి హితబోధ చేశారు,’ అని అడిగాము. దానికి అతను ప్రవక్త (స) మాతో ”నా తరువాత ప్రజలు ‘హదీసు’లు తెలుసుకోవటానికి మీ దగ్గరకు వస్తారు, వారిపట్ల సున్నితంగా, గౌరవంగా, సంతోషంగా వ్యవహరించాలి. ఇంకా వారికి ‘హదీసు’లు వినిపించాలి, ఇంకా మీ వద్దకు అన్ని వైపుల నుండి, సుదూర ప్రాంతాల నుండి ‘హదీసు’లు నేర్చుకోవడానికి వస్తారు. వారి పట్ల శ్రేయోభిలాషిగా వ్యవహరించాలి,’ అని ఉపదేశించారు” అని అన్నారు.

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) ‘హదీసు’ విద్యార్థులను చూసి అమాంతంగా ప్రవక్త (స) హితబోధ వల్ల మీకు స్వాగతం! మిమ్మల్ని మా సమావేశాల్లో చోటివ్వమని, మీకు ‘హదీసు’లు నేర్పమని ఆదేశించడం జరిగింది. మీరు మా వారసులు, అహ్లె ‘హదీసు’లు, మా తర్వాత పాలకులు.

ఉభయ లోకాల సాఫల్యం హదీసువినడం, వ్రాయడం వల్ల సిద్ధిస్తుంది

సహల్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ జాహిద్‌ అభిప్రాయం: ఉభయ లోకాల సాఫల్యాన్ని కోరుకునేవారు, ‘హదీసు’లు వ్రాస్తూ ఉండాలి. అందులో ఉభయ లోకాల సాఫల్యం ఉంది. ఇంకా అందులో తన జీవితాన్ని గడిపితే, దానివల్ల ఇహ లోకం కోరుకుంటే ఇహ లోకం లభిస్తుంది, పర లోకం కోరుకుంటే పర లోకం లభిస్తుంది. ‘హదీసు’లను వ్రాస్తే ఇహ లోకంలో గౌరవం లభిస్తుంది. అదేవిధంగా పర లోకం కోరుకునే వారికి పర లోకం లభిస్తుందని సుఫియాన్‌ సౌరీ అభిప్రాయపడ్డారు.

అ’హ్‌మద్‌ బిన్‌ మన్‌సూర్‌ షీరా’జీ పలికిన కవిత్వాల అనువాదం: ప్రజలారా! ‘హదీసు’ను దృఢంగా పట్టుకోండి. దాని వంటి వస్తువు మరొకటి లేదు. ఎందుకంటే ధర్మం అంటే అర్థం శ్రేయోభిలాష. అందువల్ల నేను మీ కోసం మంచిని బహిర్గతం చేశాను. సాధారణంగా మేము ఉల్లేఖనాల్లో ధర్మ జ్ఞానం, ఆదేశాలు, అర్థాలు గ్రహించాము. రాత్రివేళ ‘హదీసు’లను నేర్చుకోవడం చాలా మంచిది. విద్యను గుర్తుచేసుకోవడంలోనే అధిక లాభం ఉంది. ‘హదీసు’లను నేర్చుకున్నవాడు ఉభయ లోకాల సాఫల్యం పొందినట్టే. ప్రజలారా! ఉల్లేఖనాలను దృఢంగా పట్టుకోండి. (షర్‌ఫు అస్‌హాబిల్‌ ‘హదీస్‌’)

హదీసువారు ఇన్షాఅల్లాహ్ప్రళయం వరకు వర్థిల్లుతారు

ప్రవక్త (స) ప్రవచనం: నా అనుచర సమాజంలో ఒక వర్గానికి ఎప్పుడూ సహాయం లభిస్తూ ఉంటుంది. వారికి కీడు తలపెట్ట గోరే వారు, వారికి ఏమాత్రం నష్టం చేకూర్చ లేరు, చివరికి ప్రళయం సంభవిస్తుంది. (తిర్మిజి’)

య’జీద్‌ బిన్‌ హారూన్‌ కథనం: ఒకవేళ దీని అర్థం అహ్లె ‘హదీసు’లు కాకుండా మరొకరయితే మాత్రం నాకు తెలియదు. ఇబ్నె ముబారక్‌ ఈ ‘హదీసు’ గురించి వివరిస్తూ అహ్లె’హదీసు’లే అని అన్నారు. అ’హ్‌మద్‌ బిన్‌ హంబల్‌ అయితే, ‘అహ్లె’హదీసు’లు తప్ప మరెవరూ ఎంతమాత్రం కారు,’ అని అన్నారు. అ’హ్మద్‌ బిన్‌ సినాన్‌ ఈ ‘హదీసు’ గురించి ప్రస్తావిస్తూ, ”వీరు అహ్లె ‘హదీసు’లే,” అని అన్నారు. అదేవిధంగా ‘అలీ బిన్‌ మదీనీ, ”ఈ ‘హదీసు’ అహ్లె ‘హదీసు’లకే వర్తిస్తుంది,” అని అన్నారు. బు’ఖారీ కూడా, ”ఇది ‘హదీసు’ వారి బృందమే,” అని అన్నారు.

హదీసుకోసం ప్రయాణం

అంటే ‘హదీసు’ విద్య నేర్చుకోవటానికి చేసే ప్రయాణం. ఇది చాలా శుభకరమైన ప్రయాణం. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా ఆదేశించాడు: ”ప్రతి తెగ నుండి ధార్మిక విద్య నేర్చుకోవడానికి ఒక బృందం ఎందుకు సిద్ధం కాలేదు. తిరిగి వచ్చి తమ తెగ వారికి నేర్పేవారు కదా!”

ప్రవక్త (స) ఈ శుభకరమైన ప్రయాణం గురించి ఇలా ప్రశంసించారు: ”ధార్మిక విద్య కోసం బయలుదేరే వ్యక్తికి అల్లాహ్‌ స్వర్గ మార్గం సుగమం చేస్తాడు.” (తిర్మిజి’)

ఇబ్రాహీమ్‌ బిన్‌ అద్‌’హమ్‌ ఇలా అభిప్రాయపడ్డారు: ”అల్లాహ్‌ ఈ అనుచర సమాజం పైనుండి కష్టాలను అస్‌’హాబుల్‌ ‘హదీస్‌’ శుభం వల్ల తొలగిస్తాడు.”

హదీసువిద్య విశిష్ఠత

ఖుర్‌ఆన్‌, ‘హదీసు’ల విద్య అభ్యసించటం చాలా అదృష్ట సూచకం. ప్రవక్త (స) ప్రవచనం, ”ధార్మిక విద్యను నేర్చుకోవటానికి బయలుదేరే వ్యక్తికి, మేము స్వర్గ మార్గాన్ని సుగమం చేసి వేస్తాము.” (బైహఖీ)

అదేవిధంగా ధార్మిక విద్య అభ్యసిస్తూ మరణిస్తే అతనికి ప్రవక్త స్థానానికి కేవలం ఒక్క మెట్టు మాత్రమే తేడా ఉంటుంది. ప్రవక్త (స) ప్రవచనం: ధార్మిక విద్య అభ్యసిస్తూ మరణిస్తే అతనికి, ప్రవక్త స్థానానికి కేవలం ఒక్క స్థానమే తేడా ఉంటుంది. (దార్మీ)

అంటే  దీనివల్ల ధార్మిక విద్య విశిష్ఠత తెలుస్తుంది. ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ”రాత్రి కొంత సేపు ధార్మిక విద్య నేర్చుకోవటం రాత్రంతా ఆరాధన చేయటంకన్నా ఉత్తమమైనది.”

అల్‌ఖమహ్‌ అభిప్రాయం: ”ధార్మిక విద్య గురించి చర్చించుకుంటూ ఉండండి. ఎందుకంటే విద్య చర్చించడం వల్ల అభివృద్ధి చెందుతుంది.” (జామిఉల్‌ బయాన్‌, అల్‌ ‘ఇల్‌మ్‌ వ ఫ’ద్లుహు)

హదీసులను కంఠస్తం చేయడానికి గల ప్రాధాన్యత

‘హదీసు’లను కంఠస్తం చేసేవాడు తీర్పు దినం నాడు పండితుడు, కోవిదుడుగా లేపబడతాడు. ఇంకా ప్రవక్త (స) సిఫారసు అతనికి లభిస్తుంది.

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజంలో 40 ‘హదీసు’లు కంఠస్తం చేసేవారిని నేను తీర్పు దినం నాడు సిఫారసు చేస్తాను.” (షర్‌ఫు అస్‌’హాబిల్‌ ‘హదీస్‌’ / 29)

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”నా అనుచర సమాజం లో 40 హదీసులను కంఠస్తం చేసుకున్నవారిని అల్లాహ్‌ తీర్పు దినం నాడు పండితునిగా, ధార్మిక వేత్తగా లేపుతాడు.”

ప్రవక్త (స) ప్రవచనం: ”నా ‘హదీసు’లను విని కంఠస్తం చేసుకొని ఇతరులకు తెలియపరిచే వ్యక్తిని అల్లాహ్‌ సుఖసంతోషాలు ప్రసాదించుగాక!”

అందువల్లే ప్రవక్త (స) అనుచరులు ‘హదీసు’లను చాలా అధికంగా కంఠస్తం చేసేవారు. అంతేకాదు కంఠస్తం చేసి ప్రవక్త (స) తప్పులను సరిదిద్దాలని ప్రవక్త (స)కు అప్పజెప్పేవారు. ఉదాహరణకు బరా’ బిన్‌ ‘ఆ’జిబ్‌ సంఘటన ఉంది. బరా’ బిన్‌ ‘ఆ’జిబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నాతో ఇలా అన్నారు, ”నీవు నిద్ర పోయినపుడు వు’దూ చేసుకో, కుడి ప్రక్క పండుకొని దు’ఆ చదివి పడుకో. ఒకవేళ నిద్రలో నీవు మరణిస్తే, ఇస్లామ్‌పైనే మరణం సంభవిస్తుంది. ఆ దు ఇది: ”అల్లాహుమ్మ అస్‌లమ్‌తు వజ్‌హియ ఇలైక వ ఫవ్వజ్‌తు అమ్‌రీ ఇలైక, వ అల్‌జాతు బిజహ్‌రీ ఇలైక ర’గబతహు వ రహీనహు, లా మల్‌జఅ వలా మన్‌జఅ మిన్‌క ఇల్లా ఇలైక, అల్లాహుమ్మ ఆమిన్‌తు బి కితాబిక అల్లజీ అన్‌’జల్‌త వ నబియ్యకల్లజీ అర్‌సల్‌త.” (బుఖారీ) – ‘ఓ అల్లాహ్‌! నేను నా ప్రాణాన్ని, నా శరీరాన్ని నీకు అప్పజెప్పాను. నా కార్యాలను కూడా నీకు అప్పజెప్పాను. నా వీపును నీ వైపు వంచాను. ఆశతోనైనా, భయంతోనైనా. నీ శిక్ష నుండి ఎవరూ శరణు ఇవ్వలేరు. ఓ అల్లాహ్‌! నీవు అవతరించిన గ్రంథాన్ని, నీవు పంపిన ప్రవక్తను విశ్వసించాను.’

బరా’ బిన్‌ ‘ఆ’జిబ్‌ (ర) కథనం: మళ్ళీ నేను ఈ దు’ఆను ప్రవక్త (స)కు వినిపించాను. అప్పుడు నేను ”ఆమన్‌తు నబియ్యకల్లజీ అర్‌సల్‌త”కు బదులు రసూలున్‌ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స) అలా కాదు, ”వనబియ్యకల్లజీ అర్‌సల్‌త” అని అన్నారు.

ఈ ఉల్లేఖనం ద్వారా అనుచరులు ప్రవక్త (స) ముందు ‘హదీసు’లను ప్రవక్త (స)కు అప్పజెప్పేవారని, తమ తప్పులను సరిదిద్దుకునే వారని తెలుస్తుంది. అంతేకాదు, ప్రవక్త (స) ‘హదీసు’లను కంఠస్తం చేసుకో మని గుచ్చి చెప్పేవారు. ‘అబ్దుల్‌ ఖైస్‌ బృందంతో ఇలా అన్నారు, ”ఈ ‘హదీసు’లను కంఠస్తం చేసుకోండి. మీ జాతి వారిలోకి వెళ్ళి వాటిని గురించి ప్రచారం చేయండి.” (బు’ఖారీ)

‘అలీ (ర) కథనం: ‘హదీసు’లను వల్లిస్తూ ఉండండి, కంఠస్తం చేసి వాటిని గురించి చర్చిస్తూ ఉండండి. లేకుంటే ‘హదీసు’ విద్య నశిస్తుంది. (జామిఉల్‌ ‘ఇల్మ్‌)

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ” ‘హదీసు’ లను పఠిస్తూ, చదువుతూ, కంఠస్తం చేస్తూ ఉండండి. వాటి వల్లే అవి గుర్తుంటాయి.” (మారిఫతు ‘ఉలూమిల్‌ ‘హదీస్‌’ – హాకిమ్‌)

అబూ హురైరహ్‌ (ర) ‘హదీసు’లను కంఠస్తం చేసే వారు. ఇతరులు కంఠస్తం చేయలేని విషయాలను అబూ హురైరహ్‌ (ర) కంఠస్తం చేసేవారు. (బు’ఖారీ)

హదీసులను వ్రాయటానికి ప్రాధాన్యత

అ’హ్‌మద్‌ బిన్‌ హంబల్‌ కథనం: ఒక వ్యక్తి అదనపు నమాజుల్లో, అదనపు ఉపవాసాల్లో నిమగ్నమయి ఉన్నాడు. మరో వ్యక్తి ‘హదీసు’లు వ్రాయడంలో నిమగ్నమయి ఉన్నాడు. వీరిద్దరిలో ఎవరు ఉత్తములు అని ప్రశ్నించడం జరిగింది. దానికి అతడు, ” ‘హదీసు’లను వ్రాసేవాడు,” అని సమాధానం ఇచ్చాడు. (తారీ’ఖ్ బ’గ్‌దాద్‌)

అబూ బకర్‌ అ’హ్మద్‌ బిన్‌ ‘అలీ, ” ‘హదీసు’ విద్యను అభ్యసించటం అదనపు ఆరాధనలకంటే ఉత్తమ మైనది,” అని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా య’హ్‌యా బిన్‌ యమాన్‌, ” ‘హదీసు’ విద్యనభ్యసించటం ఆరాధన మరియు శుభ సూచకం,” అని అభిప్రాయ పడ్డారు. (తారీఖ్ బ’గ్‌దాద్‌, షర్‌ఫుఅస్‌’హాబిల్‌ ‘హదీస్‌’)

హదీసు ద్వారా ఆరోగ్య ప్రాప్తి

దైవ గ్రంథమైన ఖుర్‌ఆన్‌ ద్వారా స్వస్థత లభించినట్టే, ‘హదీసు’ల ద్వారా కూడా స్వస్థత లభిస్తుంది. ఖుర్‌ఆన్‌ ‘హదీసు’లు రెంటివల్లనూ ప్రాపంచిక శుభాలు, పరలోక సాఫల్యాలు ప్రాప్తం అవుతాయి. ఎన్నిసార్లు ప్రయత్నించడం జరిగింది. రమాదీ అస్వస్థతకు గురైతే ‘హదీసు’ చదివేవాళ్ళను పిలిపించేవారు. వారు వస్తే ‘హదీసు’లు చదివి వినిపించమని చెప్పేవారు. (…/61)

హదీసు చర్చ

 ‘అలీ (ర) కథనం: ‘హదీసు’లను సంరక్షిస్తూ ఉండండి. ‘హదీసు’లను చర్చిస్తూ ఉండండి. ఒకవేళ ఇలా చేయకపోతే ‘హదీసు’ విద్య నశిస్తుంది. అదే విధంగా ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: ‘హదీసు’లను చర్చించుకుంటూ ఉండండి. ‘హదీసు’లను నేర్పుతూ, నేర్చుకుంటూ ఉంటేనే అవి నిరంతరం వర్థిల్లుతూ ఉంటాయి. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ కథనం: ‘హదీసు’ లను బోధిస్తూ, చర్చిస్తూ ఉండండి. అలా చేయకపోతే ‘హదీసు’ విద్య నశిస్తుంది. అదేవిధంగా ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) మీరు మా నుండి ‘హదీసు’లు వింటే పరస్పరం వాటిని వల్లించడం, చర్చించడం చేసుకుంటూ ఉండండి అని హితబోధ చేశారు. అదేవిధంగా అబూ స’యీద్‌ ‘ఖుద్రీ(ర), ” ‘హదీసు’లను వల్లిస్తూ, చర్చిస్తూ ఉండండి. ఎందుకంటే ఒక ‘హదీసు’ మరో ‘హదీసు’ను గుర్తు చేస్తుంది,” అని అన్నారు. అబూ ఉమామా బాహిలీ (ర) ”ప్రవక్త (స) ఈ జ్ఞాన సభల ద్వారా ప్రవక్త (స) అల్లాహ్‌ ఆదేశాలను అందజేశారు. మీరు కూడా వాటిని మా నుండి విని ఇతరులకు అందజేయండి. సలీమ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: మేము తరచూ అబూ ఉమామ బాహిలీ (ర) వద్ద కూర్చొనే వారం. ఆయన మాకు ప్రవక్త (స) ‘హదీసు’లను వినిపించేవారు. ఆ తరువాత, ‘బాగా అర్థం చేసుకోండి. ఇంకా ఏ విధంగా మీకు అందజేయ బడ్డాయో మీరు కూడా ఇతరులకు అందజేయండి.’

అల్‌ఖమహ్‌ (ర) కథనం: ‘హదీసు’లను గురించి చర్చించుకుంటూ ఉండండి. పరస్పరం నేర్పించడం, నేర్చుకోవటం వల్లే అవి గుర్తుంటాయి. అదేవిధంగా తల్ఖ్‌ బిన్‌ హబీబ్‌ కూడా ‘హదీసు’లను గురించి చర్చించుకుంటూ ఉండమని, ఒక ‘హదీసు’ మరో ‘హదీసు’ను గుర్తుచేస్తుందని అన్నారు. అదేవిధంగా అబుల్‌ ఆలియహ్‌ ”మీరెప్పుడైనా ప్రవక్త (స) ‘హదీసు’ బోధిస్తే దాన్ని బాగా గుర్తుంచుకోండి” అని పేర్కొన్నారు. అదేవిధంగా ‘ఉమర్‌ బిన్‌ ‘అబ్దుల్‌ ‘అ’జీ’జ్‌ హిమ్స్‌ గవర్నరుకు ఉత్తరం వ్రాస్తూ ” ‘హదీసు’ పండితులకు మంచి జీతాలు నిర్ణయించమని, వారు ఖుర్‌ఆన్‌, ‘హదీసు’ల విద్య నుండి మరో విషయం వైపు ఆలోచించకూడదని” పేర్కొన్నారు. (తారీఖు బ’గ్‌దాద్‌, ‘షరఫు అస్‌’హాబిల్‌ ‘హదీస్‌’)

హదీసువిద్యను అభ్యసించమని బలవంతంగా తమ పిల్లల్ని ప్రోత్సహించాలి

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ దావూద్‌ (ర) కథనం: ”మనిషి తన పిల్లల్ని ‘హదీసు’లు వినేటట్లు చేయాలి. ధార్మిక విద్య ఖుర్‌ఆన్‌ ‘హదీసు’ల్లో ఉంది. ‘హదీసు’ పర లోకం కోరుకునే వారికి సాఫల్య మార్గంగా పనికి వస్తుంది.”

ఇబ్రాహీమ్‌ బిన్‌ అద్‌హమ్‌ కథనం: మా నాన్నగారు నన్ను, ”కుమారా! ‘హదీసు’లను నేర్చుకో మరియు వాటిని కంఠస్తం చేయి, ఒక్కొక్క ‘హదీసు’కు ఒక దిర్‌హమ్‌ ఇస్తాను.” అని అన్నారు. అనంతరం నేను అనేక ‘హదీసు’లను కంఠస్తం చేశాను.

హదీసులను వినడం, వ్రాయడం, ఉభయ లోకాల సాఫల్యానికి సూచకం

సహల్‌ బిన్‌ స’అద్‌ ‘జాహిద్‌ కథనం: ఉభయ లోకాల సాఫల్యాన్ని కోరుకునే వారు ‘హదీసు’లను వ్రాస్తూ ఉండాలి. ఎందుకంటే, అందులో ఉభయ లోకాల సాఫల్యం ఉంది. అదేవిధంగా ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ దావూద్‌ కథనం: ‘హదీసు’ ద్వారా ఇహ లోకం కోరుకునే వారికి ఇహ లోకం లభిస్తుంది, పర లోకం కోరుకునే వారికి పర లోకం లభిస్తుంది. అదేవిధంగా సుఫియాన్‌ సౌ’రీ కథనం:” ‘హదీసు’లను వినేవారికి ఇహ లోకంలో గౌరవం లభిస్తుంది. పర లోకంలో సాఫల్యం సిద్ధిస్తుంది.

హదీసును అనుసరించేవారికి శుభవార్తలు

 హు”జైఫా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దైవ దౌత్యం నాతో అంతమయ్యింది. అయితే శుభవార్తలు ఇంకా సత్య స్వప్నాలు ఉన్నాయి. అదేవిధంగా ‘ఉబాదహ్‌ బిన్‌ సా’మిత్‌ (ర) ప్రవక్త(స)ను ”విశ్వసించి దైవ భీతి గల వారు, వారి కోసం ఉభయ లోకాల్లోనూ శుభ వార్తలు ఉన్నాయి,” అనే వాక్యం గురించి ప్రశ్నించారు. ప్రవక్త (స) ”ముస్లిములు చూచే సత్య స్వప్నాలు,” అని అన్నారు.

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ఎవరైనా తన పుస్తకంలో ‘సల్లల్లాహు అలైహి సల్లమ్‌’ వ్రాస్తే, అది పుస్తకంలో ఉన్నంత వరకు దైవ దూతలు అతని క్షమాపణ కొరకు వేడుకుంటూ ఉంటారు.

*****

[E] ‘హదీసునియమ నిబంధనలు

హదీసు: ‘హదీసు’ అంటే సంభాషణ, కాని ‘హదీసు’వేత్తల పరిభాషలో ఉపదేశం, ఆచరణ, సంతృప్తి మొదలైన వాటిని ‘హదీసు’ అంటారు

హదీసువల్ల లాభం: ఉభయ లోకాల్లో సాఫల్యం లభిస్తుంది.

హదీసునియమ నిబంధనలు: ఇది ఎటువంటి విద్య అంటే దీనిద్వారా ఉల్లేఖకుని వివరాలు, ఆ ‘హదీసు’ను స్వీకరించాలా, తిరస్కరించాలా అనేవి తెలుస్తాయి.

హదీసునియమ నిబంధనల ముఖ్య ఉద్దేశ్యం: (ఉల్లేఖకుని ‘హదీసు’ను పరికించటం, పరీక్షించటం)

తఖ్రీర్‌: అంటే ప్రవక్త (స) ఏదైనా సంఘటన జరిగి, ప్రవక్త (స) దాన్ని చూసినా, విన్నా, దాన్ని వారించనూ లేదు, చేయమని ఆదేశించనూ లేదు , మౌనం వహించారు.

హదీసు ఖౌలీ, ఫేలీ, తఖ్రీరీ: ప్రవక్త (స) ఉపదేశాలను ‘హదీసె’ ఖౌలీ, ఆయన ఆచరణను ‘హదీసె’ ఫే’అలీ, ఆయన మౌనాన్ని ‘హదీసె’ తఖ్‌రీరీ అని అంటారు.

హదీసుమరియు ఖబర్‌: ఈ రెంటి అర్థం ఒక్కటే, అయితే కొందరు కొంచెం తేడా ఉందని అంటారు.

హదీసురకాలు

ప్రామాణికమైన ‘హదీసు’ను ‘హదీసె’ మర్ఫూ‘అ అంటారు. ప్రవక్త (స) వరకు పరంపర ఉన్న ‘హదీసు’ను హదీసె మర్‌ఫూ అంటారు. అదేవిధంగా ‘స’హాబీ వరకు ఉన్న హదీసును మౌఖూఫ్ అంటారు. అదేవిధంగా తాబయీ వరకు ఉన్న ‘హదీసు’ను మఖ్తూ అంటారు. మౌఖూఫ్‌ మరియు మఖ్‌తూలను ‘సర్అని కూడా అంటారు. ఒక్కోసారి మౌదూ ‘హదీసు’ను కూడా ‘సర్ అంటారు.

హాబీ తాబయీ

విశ్వాసిగా ప్రవక్త (స)ను కలిసి విశ్వాసిగానే మరణించిన వారు ‘స’హాబీ. విశ్వాసిగా ప్రవక్త (స) అనుచరుడ్ని కలసి విశ్వాసిగానే మరణించిన వ్యక్తి తాబయీ.

హదీసు మూలం మరియు ధృవీకరణ

‘హదీసు’ను ఉల్లేఖించే వ్యక్తిని రావీ మరియు నాఖిల్ అంటారు. ‘హదీసు’లోని ప్రధాన భాగాన్ని మతనె (మూలం) ‘హదీస్‌’ అంటారు. ప్రధాన భాగం తరువాత ఉల్లేఖకుల భాగాన్ని సనదె (ధృవీకరణ) ‘హదీస్‌’ అంటారు.

హదీసురకాలు: ‘హదీసు’ ఉల్లేఖకుల ప్రకారం ‘హదీసులు’ ఆరు రకాలు. 1. ‘హదీసె’ ముత్తసిల్‌, 2. ‘హదీసె’ మున్‌ఖతీ, 3. ‘హదీసె’ మ’అజల్‌, 4. ‘హదీసె’ ము’అల్లఖ్‌, 5. ‘హదీసె’ ముర్సల్‌, 6. హదీసె ముద్‌లస్‌

1. హదీసెముత్తసిల్‌: పరంపరలో ఉల్లేఖకులందరూ పేర్కొనబడి ఎవ్వరూ తప్పిపోకుండా ఉండే ‘హదీసు’.

2. హదీసెమున్ఖతీ: పరంపరలో కేవలం ఒకేఒక్క ఉల్లేఖకుడు తప్పి పరంపర తెగిపోతుంది.

3. హదీసె‘అజల్‌: పరంపరలో 2 లేదా అంతకంటే ఎక్కువ ఉల్లేఖకులు ఒకేచోట తప్పిపోయే ‘హదీసు’.

4. హదీసెముఅల్లఖ్‌: ప్రారంభంలోనే ఉల్లేఖకులు తప్పిపోవడం, ఉల్లేఖకులను ప్రస్తావించకుండా’హదీసు’ ను ప్రస్తావించటం. వీటిని త’ఆలీఖాత్‌ అంటారు.

5. హదీసెముర్సల్‌: పరంపరలో చివరి నుండి తాబయీ తప్పిపోవటం. అంటే తాబియీ ప్రవక్త (స) అనుచరుని పేరు ప్రస్తావించకుండా ప్రవక్త (స) ప్రవచనం అని అనడం.

6. హదీసెముద్లస్‌: అంటే ‘హదీసు’వేత్త తన (గురువుగారి పేరు ప్రస్తావించకుండా, గురువుగారి గురువు గారి పేరును ప్రస్తావించటం. తద్‌లీస్‌ అంటే దాచటం, దాచే వారిని ముద్‌లిస్‌ అంటారు. ఎందుకంటే అతను తన గురువుగారిని చూశాడు. ఇటువంటి ‘హదీసు’ను ముద్‌లస్‌ అంటారు. పరంపరలో ఎక్కడైనా ఉల్లేఖకుణ్ణి వదలివేస్తే, ఇటువంటి ‘హదీసు’ను ముద్‌లస్‌ అంటారు.

అనేక మార్గాల ద్వారా ప్రామాణికతగల హదీసురకాలు

ఈ విధంగా నాలుగు రకాలు: 1. ముతవాతిర్‌, 2. మష్‌హూర్‌, 3. ‘అ’జీ’జ్‌, 4. ‘గరీబ్‌.

1. హదీసుముతవాతిర్‌: ప్రతి తరంలో అధికంగా ఉండే ఉల్లేఖకులు గల ‘హదీసు’. దీనికి ఐదు షరతులు ఉన్నాయి. 1. ప్రామాణికతలు అధికంగా ఉండాలి, 2. వీరు సత్యవంతులై ఉండాలి, 3. ఈ సంఖ్య మొదటి నుండి చివరి వరకు ఉండాలి, 4. వార్త సత్యమైనదై ఉండాలి, 5. వార్త వాస్తవమైనదిగా ఉండాలి, ఊహించినది కాకూడదు. ఈ ఐదు విషయాలు ఒకచోట చేరితే ఆ వార్త ముతవాతిర్‌ అనబడుతుంది.

2. హదీసెమష్హూర్‌: ప్రతీ తరంలో కనీసం ముగ్గురు ఉల్లేఖకులు ఉండాలి. ముతవాతిర్‌ ఐదు షరతుల్లో నాలుగు షరతులు ఉండి, ఐదవ షరతు లేకపోతే అది ‘హదీసె’ మష్‌హూర్‌ అవుతుంది. కొందరు మష్‌హూర్‌ను ముస్తఫీ’ద్ గా పిలుస్తారు. మరికొందరు ఈ రెంటిలో తేడా ఉందని అంటారు. అదేమిటంటే ముస్తఫీ’ద్ లో ఉల్లేఖకుల సంఖ్య మొదటి నుండి చివరి వరకు సమానంగా ఉంటుంది. మష్‌హూర్‌లో తప్పనిసరి కాదు.

3. హదీసెజీజ్‌: ప్రతి తరంలో ఉల్లేఖకులు కనీసం ఇద్దరు ఉండాలి. ఒకవేళ ఏదైనా తరంలో ఎక్కువైనా ఫర్వాలేదు.

4. హదీసెగరీబ్‌: అంటే ప్రతి తరంలో ఒక్క ఉల్లేఖకుడు ఉంటాడు, అతనికి మరో భాగస్వామి ఉండరు. అందువల్ల దీన్ని ‘గరీబ్‌ లేదా ఫర్ద్‌ అంటారు. ‘గరీబ్‌ రెండు రకాలు: ఫర్ద్‌ ము’త్‌లఖ్‌, ఫర్ద్‌ నసబీ. ‘గరీబ్‌ ముత్‌లఖ్‌, ‘గరీబ్‌ నసబీ.

ధృవీకరణలో ‘స’హాబీ ద్వారా ఉల్లేఖించే వ్యక్తి ఒక్కడే ఉంటాడు. ఫర్దె నసబీలో దీని ధృవీకరణలో ‘స’హాబీ నుండి ఉల్లేఖించే వ్యక్తి ఉండడు. తరువాత దాన్ని ఉల్లేఖించే వ్యక్తి ఒక్కడే ఉంటాడు.

హాద్వార్తలు:

ముతవాతిర్‌ వదలి మష్హూర్‌, ‘అ’జీ’జ్‌, ‘గరీబ్‌ మూడింటినీ ఆ’హాద్‌ వార్తలు అంటారు. ఖబర్‌ వా’హిద్‌ అంటే ఒకే వ్యక్తి ఉల్లేఖించినది. అయితే ‘హదీసు’వేత్తల పరిభాషలో ముతవాతిర్‌ షరతులు లేనివి. ముతవాతిర్‌ ద్వారా నమ్మకమైన జ్ఞానం లభిస్తుంది. అది కేవలం మర్‌దూద్‌ కాకుండా మఖ్‌బూల్‌ అవుతుంది. కాని అఖ్‌జార్‌ ఆ’హాద్‌ మఖ్‌బూల్‌ కాదు, మర్‌దూద్‌ కూడా కాదు.

అందువల్ల దాన్ని ఆచరించడం దాని ఉల్లేఖకునిపై ఆధారపడి ఉంటుంది. ఉల్లేఖకుల గుణగణాలు ఉన్నత మైనవిగా ఉంటే, వారిని సత్య వంతులుగా భావించి దాన్ని ఆచరించటం తప్పనిసరిగా భావించడం జరుగుతుంది. ఒకవేళ వారిలో చెడ్డ గుణాలు ఉంటే, వారిని అసత్య వంతులుగా భావించి దాన్ని ఆచరించటం జరుగదు.

ఖబరె వాహిద్మఖ్బూల్‌:

ఖబరె వాహిద్‌ మఖ్‌బూల్‌ 4 రకాలు: 1. సహీ లిజాతిహీ, 2. సహీ లిగైరిహీ, 3. హసన్‌ లిజాతిహి, 4. హసన్‌ లిగైరిహి.

ఒకవేళ ఖబరె వాహిద్‌ మఖ్‌బూల్‌లో ఉన్న ఉత్తమ గుణాలు చాలా అధికంగా ఉంటే దాన్ని ‘స’హీ’హ్ లిజాతిహీ అంటారు.

ఒకవేళ ఉత్తమ గుణాలు కలిగి లేదు, కాని అనేక విధాలుగా సమర్థించడం జరిగినందున అది ‘స’హీ’హ్ లి’గైరిహి అవుతుంది. ఒకవేళ అలా జరగకపోతే ‘హసన్‌ లి’జాతిహి అవుతుంది. ఒకవేళ అది స్వీకార యోగ్యంగా ఉంటే ‘హసన్‌ లి’గైరిహి అవుతుంది. వీటిని సంక్షిప్తంగా పేర్కొనడం జరిగింది. ఇంకా వీటిని వివరంగా కూడా పేర్కొనడం జరిగింది.

1. హీహ్ లిజాతిహీ: ఈ ‘హదీసు’ యొక్క ఉల్లేఖకు లందరూ న్యాయశీలురు, సంపూర్ణ జ్ఞాపకశక్తి గల వారు అయి ఉండాలి. అది ధృవీకరణ పరంపర కలిగి ఉండాలి. న్యాయశీలి వ్యక్తి దైవభక్తి, భీతి నిస్పాక్షిక భావం కలిగి ఉండాలి. షిర్క్‌, పాపాలు, బిద్‌అత్‌లు ఇతర చెడు కార్యాలకు దూరంగా ఉండటమే దైవభీతి అవుతుంది.

జబ్త్‌ రెండు రకాలు 1. జబ్త్‌ ఖల్బీ 2. జబ్త్‌ కితాబీ

(1) జబ్త్ఖల్బీ: విన్న విషయాన్ని బాగా గుర్తుంచు కోవాలి. ఎప్పుడైనా దాన్ని వివరించే శక్తి కలిగి ఉండాలి.

(2) జబ్తె కితాబీ: పుస్తకం ద్వారా విని దాన్ని సరిదిద్దు కున్న తరువాత దాన్ని భద్రంగా ఉంచుకోవాలి. ముత్తసిల్‌ అంటే ధృవీకరణ ఉల్లేఖకులు తమ గురువుల ద్వారా  విని ఉండాలి. మధ్య ఎవరూ తొలగించబడి ఉండకూడదు.

ముఅల్లల్‌: డిక్షనరీలో అనారోగ్యం అంటారు. ‘హదీసు’ వేత్తల పరిభాషలో రహస్య లోపం లేనిది అని అర్థం. డిక్షనరీలో షాజ్ అంటే ఒంటరి అని అంటారు. ‘హదీసు’వేత్తల పరిభాషలో ప్రామాణిక ఉల్లేఖకుడు మరో న్యాయశీలి, జ్ఞాపకశక్తి, అతనికంటే ఉన్నతుడైన వ్యక్తికి వ్యతిరేకంగా ఉండటం.

ఎందుకంటే ‘స’హీ’హ్ లి’జాతిహీ న్యాయ శీలత, జ్ఞాపక శక్తి మొదలైన వాటిపై ఆధారపడి ఉంది. అయితే ఈ గుణాలు అధికంగా, ఒక మోస్తరుగా, తక్కువగా ఉండే అవకాశం ఉంది. కనుక ‘స’హీ’హ్ లి’జాతిహీలో కూడా భేదాలు ఉంటాయి. ఉల్లేఖకులు ఉన్నత గుణాలు కలిగి ఉంటే అది ‘స’హీ’హ్ లి’జాతిహీ, ఉత్తమ గుణాలు అధికంగా ఉండని ‘హదీసు’ కంటే అది ప్రామాణికంగా ఉంటుంది.

అదేవిధంగా ఉల్లేఖకుల జ్ఞాపకశక్తి అసంపూర్ణంగా ఉండి, మిగిలిన షరతులు ‘స’హీ’హ్ లి’జాతిహీకి చెందినవి ఉంటే అది ‘హసన్‌ లి’జాతిహీ అవుతుంది. ‘హసన్‌ లి’జాతిహీకి ‘స’హీ’హ్ లి’జాతిహీ కంటే తక్కువ స్థానం ఉంది. అయితే ‘స’హీ’హ్ లి’జాతిహీలో వివిధ దశలు ఉన్నట్లే, ‘హసన్‌ లి’జాతిహీలో కూడా వివిధ దశలు ఉన్నాయి.

2. హదీసె హీ‘హ్ లిగైరిహీ: ‘హసన్‌ లి’జాతిహినే ‘స’హీ’హ్ లిగైరిహీ అంటారు. అయితే దీని ధృవీకరణ అనేక మార్గాల ద్వార ఉండాలి. దీనివల్ల అనేక మార్గాల ద్వారా శక్తి లభిస్తుంది. జ్ఞాపకశక్తి వల్ల ఉన్న లోపాన్ని వీటి ద్వారా దూరం చేయడం జరుగుతుంది. ఇంకా దానికి ప్రామాణికత లభిస్తుంది. ‘హసన్‌ లి ‘జాతిహీ అనేక మార్గాల ద్వారా ‘స’హీ’హ్ లి’గైరిహీ అయినట్టు. అదేవిధంగా ‘హసన్‌ లి’జాతిహీగా ఉన్నది అనేక మార్గాలద్వారా ‘స’హీ’హ్ లిగైరిహీ అనబడుతుంది.

‘స’హీ’హ్ లి’జాతిహీ మరియు ‘హసన్‌ లి’జాతిహీలో తేడా ఉందనేది వాస్తవం. ఎందుకంటే ‘స’హీ’హ్ లి’జాతి హీలో ఉల్లేఖకుని జ్ఞాపకశక్తి పరిపూర్ణంగా ఉంటుంది. ‘హసన్‌ లి’జాతిహీలో అసంపూర్ణంగా ఉంటుంది.

మున్కర్‌, అరూఫ్‌:

ఒకవేళ బలహీనమైన ఉల్లేఖకుడు ప్రామాణిక ఉల్లేఖకుడ్ని వ్యతిరేకిస్తే , అటువంటి ‘హదీసు’ను మున్‌కర్‌, ప్రతిపక్షంలో ఉన్న ‘హదీసును మ’అరూఫ్‌ అంటారు.

ఖబ్‌రె వా’హిద్‌ మఖ్‌బూల్‌ యొక్క రెండవ రకం.

ఇందులో ము’హ్‌కమ్‌ ముఖ్‌తలిఫల్‌ ‘హదీస్‌’ నాసిఖ్‌ మన్‌సూఖ్‌, ముతవఖ్ఖఫ్‌ ఫీహ్‌ అనే నాలుగు రకాలు ఉన్నాయి. వ్యతిరేకంగా లేని దాన్ని ము’హ్‌కమ్‌ అంటారు. ఒకవేళ దానికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని ము’ఖ్‌తలిఫుల్‌ ‘హదీస్‌’ అంటారు. రెండు ‘హదీసు’లు వ్యతిరేకంగా ఉండి, ఒకటి ముందు మరొకటి వెనుక ఉంటే, ముందు దాన్ని మన్‌సూఖ్‌, తరువాతి దాన్ని నాసిఖ్‌ అంటారు. ఒకవేళ ఒక దాన్ని మరొక దానిపై ప్రాముఖ్యం ఇవ్వలేని పక్షంలో వాటిని ముతవఖ్ఖఫ్‌ఫీహ్‌ అంటారు.

ఖబరె మర్దూద్‌:

రెండు విధాలుగా తిరస్కరించబడుతుంది. 1. దాని ధృవీకరణలో ఒక ఉల్లేఖకుడు, లేదా అనేక ఉల్లేఖకులు తప్పితే, 2. లేదా దాని ఉల్లేఖకుల్లో ఎవరైనా విమర్శించ బడినప్పుడు. ఉల్లేఖకులు విమర్శించబడే 5 విషయాలు న్యాయ శీలతకు సంబంధించినవి, 5 జ్ఞాపక క్తికి చెందినవి. అవన్నీ వరుసగా పేర్కొనబడటం జరిగింది. 1. అసత్యం: ఉల్లేఖించిన వ్యక్తి అసత్యవంతుడైతే, అతడు ప్రవక్త (స)పై అసత్యం పలికితే, ఇటువంటి వ్యక్తి ఉల్లేఖనను మౌ’దూ అంటారు. అదేవిధంగా ఎల్లప్పుడూ అసత్యం పలికే వ్యక్తి యొక్క ఉల్లేఖనాన్ని మత్‌రూక్‌ అంటారు. ఒకవేళ ఉల్లేఖకుడు ఎప్పుడూ, తప్పులు చేసే వాడైతే, అటువంటి వ్యక్తి ‘హదీసు’ను మున్‌కర్‌ అంటారు. అదేవిధంగా తప్పులు, పొర పాట్లు, ఏమరు పాటుకు గురి అయ్యే ఉల్లేఖకుణ్ణి మున్‌ కర్‌ అంటారు. అదేవిధంగా ఉల్లేఖకునిలో అసత్యంతో పాటు పాపాలు కూడా చోటుచేసుకుంటే అతని ఉల్లేఖనాన్ని కూడా మున్‌కర్‌ అంటారు. అదేవిధంగా ఉల్లేఖకునిలో అను మానం ఉంటే అతని ‘హదీసు’ను ము’అల్లల్‌ అంటారు. అయితే ‘హదీసె’ ము’అల్లల్‌ను గుర్తించడం చాలా కష్టం. దీన్ని ‘హదీసు’ నిపుణులే గుర్తించ గలరు. ఉల్లేఖకుని సత్యతను తిరస్కరించటం. ఒక్కోసారి ధృవీకరణను లేదా మూలాన్ని తిరస్కరించటం జరుగుతుంది.

ముద్రజ్‌: ఉల్లేఖకుడు ఒక ఉద్దేశ్యంతో ‘హదీసు’లో తన అభిప్రాయాన్ని కూడా చేర్చితే, అతని ఉల్లేఖనం వాస్తవానికి వ్యతిరేకం అయిపోతుంది. దీన్ని ముద్‌రజ్‌ అంటారు.

ముద్‌రజ్‌ రకాలు: (1) ముద్‌రజుస్సనద్‌ (2) ముద్‌రజుల్‌ మతన్‌.

(1) ముద్రజుస్సనద్‌: ధృవీకరణలో మార్పులు, చేర్పులు జరిగి అది ఇతర ధృవీకరణలకు వేరుగా ఉంటే దాన్ని ముద్‌రజుస్సనద్‌ అంటారు.

(2) ముద్రజుల్మతన్‌: మూలంలో మార్పులు, చేర్పులు జరిగి ఇతర మూలాల్లో అది లేకపోతే దాన్ని ముద్‌రజుల్‌ మతన్‌ అంటారు. దీన్ని మఖ్‌లూబ్‌ కూడా అంటారు.

జీద్ఫీ ముత్తసిల్అసానీద్‌: ‘హదీసు’ ధృవీకరణలో ఉల్లేఖకుని పేరు చేర్చి, ఇది ప్రామాణిక ‘హదీసు’లో లేకపోతే దాన్ని మ’జీద్‌ ఫీ ముతసిలిల్‌ అసానీద్‌ అంటారు.

ఇజ్తిరాబ్: ‘హదీసు’లో వాస్తవ ఉల్లేఖకునికి బదులు మరొకరిని చేర్చితే, ఒక ఉల్లేఖకుడు వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని ఇజ్‌తిరాబ్‌ అంటారు. ఇవి కూడా రెండు రకాలు ఉన్నాయి.

అదేవిధంగా ఉల్లేఖన కర్త బిద్అతీ అయితే అతని ఉల్లేఖనం స్వీకరించడం జరుగదు. బిద్‌అతీ రెండు రకాలు. 1. బిద్‌అత్‌ ముకఫ్ఫరహ్‌ 2. బిద్‌అత్‌ గైర్‌ ముకఫ్ఫరహ్‌. బిద్‌అత్‌ ముకఫ్ఫరహ్‌ ఉల్లేఖనం పూర్తిగా తిరస్కరించ బడుతుంది.

10. బలహీనమైన జ్ఞాపకశక్తి.

—–

ధృవీకరణ (అస్నాద్‌)

‘హదీసు’ ఉల్లేఖకుల పరంపరను సనద్‌ మరియు అస్‌నాద్‌ అంటారు. ధర్మంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. మరో విధంగా చెప్పాలంటే దీనిపైనే ఆధారపడి ఉంది. ము’హమ్మద్‌ బిన్‌ సీరీన్‌ ”ప్రాచీన కాలంలో ‘హదీసు’ల పరంపర గురించి ప్రజలను అడిగేవారు కారు. ఎందుకంటే అందరూ సత్య వంతులే గనుక. కాని ఇప్పుడు బిద్‌అత్‌ల కల్లోలం ప్రారంభమయ్యింది. అప్పుడు ప్రజలు మీ ధృవీకరణ తీసుకురమ్మని కోరడం జరిగింది. ఒకవేళ అహ్లె సున్నత్‌తో సంబంధం ఉంటే ఉల్లేఖన స్వీకరించడం జరుగుతుంది. ఒకవేళ బిద్‌అత్‌లతో సంబంధం ఉంటే ఉల్లేఖనం స్వీకరించడం జరుగదు. (ముఖద్దమ్‌ ముస్లిమ్‌)

హదీసును పేర్కొనే పదాలు:

పదాలు పేర్కొనడానికి 8 తరగతులు ఉన్నాయి:

1. సమీతు వ హద్దసనీ, 2. అఖ్‌బరనీ వ ఖర’అతు అలైహి, 3. ఖర’అహ్ అలైహి వ అనా అస్‌మ’ఉ, 4. అన్‌బ’అనీ, 5. నావలనీ, 6. షా ఫహనీ బిల్‌ ఇజా’జ, 7. కతబ ఇలయ్య బిల్‌ ఇజా’జ, 8. అన్‌ వ గైరిహీ

హదీసుఉల్లేఖకులు (రావీలు)

‘హదీసు’ను పేర్కొనే వ్యక్తిని రావీ అంటారు. రావీకి బహువచనం రువాతులు. అంటే ఉల్లేఖకుల పేర్లలో, బిరుదుల్లో ఒక్కోసారి అనుమానాలు తలెత్తుతాయి. ‘హదీసు’ విద్యలో వీటిపట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి.

1. అనేకమంది ఉల్లేఖకుల పేర్లు, బిరుదులు, వంశాలు ఒకేలా ఉంటే దాన్ని ముత్తఫిఖ్‌ మరియు అంటారు.

2. ముతఫర్రిఖ్‌, ఒకవేళ అనేక పేర్లు లేఖనంలో ఒకేలా ఉన్నా, ఉచ్చారణలో వేర్వేరుగా ఉంటాయి.

హదీసుపుస్తకాల రకాలు

‘హదీసు’వేత్తల పరిభాషలో కొన్ని పుస్తకాల పేర్లు జామె, ముస్నద్‌, సునన్‌, ము’అజమ్‌, ముఫ్రద్‌, ముస్త’ఖ్‌రజ్‌ మొదలైన పేర్లు ఉన్నాయి. క్రింద సౌకర్యం కోసం పేర్కొనడం జరిగింది. అల్‌ జామి’ఉ లిల్‌ బు’ఖారీ, జామి’ఉ తిర్మిజీ’ మొదలైనవి. సునన్‌ అంటే ‘హదీసు’ లను అధ్యాయాలుగా, పుస్తకాలుగా పేర్కొనడం. అబ్‌వాబుస్సలాత్‌, కితాబు’స్సలాత్‌, కితాబు’జ్జకాత్‌ మొదలైనవి. సుననె అబూదావూద్‌ వ నసాయి.

అల్‌ మసానీద్‌: ఇందులో ‘హదీసు’లను ప్రవక్త (స) అనుచరుల క్రమంలో పేర్కొనడం జరుగుతుంది. ముస్నదె అ’హ్మద్‌, ముస్నదె ఇబ్నె’హమీద్‌.

అల్‌ మ’ఆజిమ్‌: ఇందులో ‘హదీసు’లను ‘హదీసు’ వేత్తల వరుస క్రమంలో పేర్కొనడం జరుగుతుంది. మ’అజమ్‌ తబ్‌రానీ అస్సగీర్‌, అల్‌ అల్‌సతుల్‌ కబీర్‌.

అల్‌ అత్‌రాఫ్‌: ఇందులో ‘హదీసు’లను సంక్షిప్తంగా పేర్కొనడం జరుగుతుంది. దానివల్ల హదీసు మొత్తం అర్థం అవుతుంది. దీనితోపాటు ప్రత్యేక పుస్తకాల ధృవీకరణలను కూడా పేర్కొనడం జరుగుతుంది. ఉదా: అల్‌ అత్‌రాఫ్‌ లి’సి’హా సిత్త.

అల్‌ అజ్‌’జా: ఇందులో ఒకే వ్యక్తి యొక్క ఉల్లేఖనాలను గురించి, ఒకే ఒక్క విషయాన్ని గురించి చర్చించడం జరుగుతుంది. ఉదా: జు’జ్‌ఉల్‌ బు’ఖారీ ఫిల్‌ ఖిరాఅతి వ రఫ్‌ఉల్‌ యదైని వ ‘గైరిహిమ.

ముస్త’ఖ్‌రజాత్‌: ఇతర పుస్తకాల ‘హదీసు’లను పరిశీలించి ఒక పుస్తకంగా క్రమంగా పేర్కొనడం

అల్‌ ముస్తద్‌రక్‌: అసలు పుస్తకంలో అందులో లేని ‘హదీసు’లను చేర్చటం. ‘సి’హా సిత్త లేదా ఉమ్మ’హాతు సిత్త మొదలైనవి. కాని క్రింద పేర్కొనబడిన పుస్తకాలు చాలా ప్రఖ్యాతమైనవి. ఆరు పుస్తకాల సమూహాన్ని ‘సి’హాసిత్త అంటారు.

1. ‘స’హీ’హ్ బు’ఖారీ, 2. ‘స’హీ’హ్ ముస్లిమ్‌, 3. తిర్మిజి’, 4. అబూ దావూద్‌, 5. నసాయి, 6. ఇబ్నె మాజహ్ లేదా మువత్తా ఇమామ్‌ మాలిక్‌.

ముత్తఫఖున్‌ అలైహి: బు’ఖారీ, ముస్లిమ్‌ ఇద్దరూ పేర్కొన్న ‘హదీసు’లను ముత్తఫఖున్‌ అలైహి అంటారు.

ఖుర్‌ఆన్‌ తర్వాత అన్నిటి కంటే సత్యమైన గ్రంథం బు’ఖారీ. ఆ తరువాత ముస్లిమ్‌, ఆ తరువాత అబూ దావూద్‌, తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్.

హదీసువేత్తల బిరుదులు

‘హదీసు’వేత్తల పరిభాషలో ‘హదీసు’వేత్తలకు ”అల్‌ ‘హాఫిజ్‌” లేదా ”అల్‌ ‘హుజ్జహ్‌” లేదా ”అల్‌ ‘హాకిమ్‌” అనే బిరుదులతో గుర్తుచేసుకోవటం జరుగుతుంది. వాటి అర్థం:

1. అల్‌ ము’హద్దిస్‌: అన్ని విధాలా ‘హదీసు’ను గురించి తెలిసిన వ్యక్తి.

2. అల్‌ ‘హాఫిజ్‌ ఫిల్‌ ‘హదీస్‌’: లక్ష ‘హదీసు’లు గుర్తున్న వ్యక్తి.

3. అల్‌ ‘హుజ్జహ్‌: 3 లక్షల ‘హదీసు’లు గుర్తున్న వ్యక్తి.

4. అల్‌ ‘హాకిమ్‌: ‘హదీసు’ల మూలాలు, పరంపరలు ధృవీకరణలు, తేదీలు మొదలైన వన్నీ గుర్తున్న వ్యక్తి.

—–

హదీసువేత్తల తరాలు (తబ్ఖ్)

హదీసువేత్తల పరిభాషలో ”తబ్‌ఖ” అనే పదం తరచూ ఉపయోగించటం జరుగుతుంది. ఫలానా ఉల్లేఖన కర్త ఫలానా తరానికి చెందిన వాడని. ‘హదీసు’ విద్యార్థులు మొట్టమొదట తరం గురించి తెలుసు కోవటం చాలా అవసరం. తరం అంటే ఒకే పండితుని ద్వారా ఉల్లేఖించే సమకాలీన బృందం. ఇబ్నె’హజర్‌ తఖ్‌రీబుత్తహ్‌’జీబ్‌లోని ముందుమాటలో 12 తరాలుగా విభజించారు. 1. ప్రవక్త (స) అనుచరులు, 2. తాబయీన్‌, 3. ముతవస్సిత్‌ తాబియీన్‌, 4. కిబార్‌ తాబియీన్‌, 5. ప్రవక్త (స) అనుచరుల ద్వారా ఉల్లేఖించిన వారు, 6. ప్రవక్త (స)ను కలవని వారు, 7. కిబార్‌ ఇత్తిబాయి తాబియీన్‌, 8. ముతవస్సితీన్‌ ఇత్తిబాయి తాబియీన్‌, 9. అసాగిరె ఇత్తిబాయి తాబియీన్‌, 10. ఇత్తిబాయి తాబియీన్‌ల ద్వారా ఉల్లేఖించేవారు, 11. ఇత్తిబాయి తాబియీన్‌ల ద్వారా ఉల్లేఖించే ముతవస్సితీన్‌, 12. అసాగిరె ఇత్తిబాయి తాబియీన్‌.

1. సహాబీ అంటే విశ్వాసిగా ప్రవక్త (స)ను కలిసి, విశ్వాసిగానే మరణించిన వ్యక్తి.

2. తాబయీ అంటే విశ్వాసిగా ప్రవక్త (స) అనుచరులను కలసి విశ్వాసిగానే మరణించిన వ్యక్తి.

3. తబె తాబయీ అంటే విశ్వాస స్థితిలో తాబయీను కలసి విశ్వాసిగానే మరణించిన వ్యక్తి.

4. ముఖజ్‌రమీన్‌ అంటే అజ్ఞాన కాలం, ఇస్లామ్‌ రెండు కాలాలను చూచి ప్రవక్త (స)ను చూడలేని వ్యక్తి. అంటే వృద్ధ తాబియీన్లు.

*****

[F] ఈ అనువాదంలో వాడబడిన సంక్షేపాక్షరాలు (Abréviations)

  1. (త):త’ఆలా: సర్వలోపాలకు అతీతుడు, అత్యున్నతుడు!
  2. (‘స): ‘సల్లల్లాహు ‘అలైహి వ సల్లం:  దైవ ప్రవక్త ము’హమ్మద్ పై శాంతి మరియు శుభాలు వర్షించు గాక!
  3. (‘అ స): ‘అలైహి సలాం: అతనికి శాంతి కలుగు గాక!
  4. (‘అలైహిమ్ స): ‘అలైహిమ్ సలాం: వారికి శాంతి కలుగు గాక!
  5. (ర): ర’దిఅల్లాహు ‘అన్ హు: అతనితో అల్లాహు త’ఆలా ప్రసన్నుడవు గాక!
  6. (ర’ది. ‘అన్హుమ్): ర’దిఅల్లాహు ‘అన్హుమ్: వారితో అల్లాహుత’ఆలా ప్రసన్నుడవు గాక!
  7. (ర. ‘అన్హా): ర’దిఅల్లాహు ‘అన్ హా: ఆమెతో అల్లాహుత’ఆలా ప్రసన్నుడవు గాక!
  8. (ర’హ్మ): ర’హిమహు అల్లాహ్: అతనిని అల్లాహుత’ఆలా కరుణించు గాక!
  9. (ర ‘అలైహిమ్): ర’హ్మతుల్లాహి ‘అలైహిమ్: వారిని అల్లాహుత’ఆలా కరుణించు గాక!
  10. (చూ): చూడండి
  11. (‘స): ‘స’హీ’హ్
  12. (‘హ): ‘హదీస్’
  13. (నం): నంబరు
  14. (వ్యా): వ్యాఖ్యానం
  15. (అ): అధ్యాయం
  16. (‘స బు): జామె ‘స’హీ’హ్  బు’ఖారీ
  17. (‘స ము): ‘స’హీ’హ్  ముస్లిం
  18. (తి): జామె తిర్మిజి’
  19. (అ-దా): సునన్ అబూ దావూద్
  20. (న): సునన్ నసాయి’
  21. (ఇ-మా): సునన్ ఇబ్నె మాజహ్
  22. (మా): మువత్తా మాలిక్ బిన్ అనస్
  23. (షా): ముస్నద్ షాఫ’యీ
  24. (ము అ): ముస్నద్ అ’హ్మద్ బిన్ హంబల్
  25. (దా ఖు): సునన్ దారఖుత్ని
  26. (బై): సునన్ అల్ కుబ్రా, బైహఖీ
  27. (దా): దార్మి
  28. (ర): రజీన్

***

* అల్లాహుత’ఆలా అత్యుత్తమ పేర్ల వివరణ కొరకు చూ. మిష్కాతుల్ మ’సాబీ’హ్ (హదీసు దీపాలు) సంపుటం- I, పుస్తకం-9, అధ్యాయం-2, ’హ. 2288, నోటు-31, పేజీ-808.

*****

[G] నా’సిరుద్దీన్ అల్బానీ ‘హదీసు’ల వర్గీకరణ

వివరణతెలుగుعربيالرقم
దీన్ని బు’ఖారి, ముస్లింలు ఇద్దరూ పేర్కొన్నారుఏకీభవితంمُتَّفَقٌ عَلَيْه / ముత్తఫఖున్ ‘అలైహ్1
 ఇది దృఢమైన ‘హదీసు’దృఢంصَحِيح /  ‘స’హీ’హ్2
దీని ఆధారాలు దృఢమైనవిఆధారాలు దృఢమైనవిأسناده صَحِيح /ఇస్నాదుహూ హీహ్3
ఇతర సాక్షి’హదీసు’లచే దృఢమైనదిగా పేర్కొనబడిందిసాక్షులచే దృఢంصحيح لشواهده /హీహ్ లిషవాహిదిహీ4
దీని ఉల్లేఖకులు మరుపుకు లోనయ్యేవారుప్రామాణికంحَسَن /‘హసన్5
ఇతర ప్రామాణిక హదీసుచే “ప్రామాణికం”గా ఖరారైందిపరా ప్రామాణికంحَسَن لغيره / హసన్ లి గైరిహీ’6
ఇతర సాక్షి హదీసులచే “ప్రామాణికం”గా పేర్కొనబడిందిసాక్షులచే ప్రామాణికంحسن بشواهدهహసన్ బి షవాహిదిహీ /7
దీనికి ముందటి దాని వల్ల ప్రామాణికంగా పేర్కొనబడిందిపూర్వ ప్రామాణికంحسن بما قبله హసన్ బిమా కబ్లహూ / 8
‘హదీసు’వేత్త దృష్టిలో ఆమోదించదగిన ఆధారమున్నది.ఆమోదయోగ్యంجيد /  జయ్యిద్9
దీని ఆధారాలు ‘హదీసు’వేత్త దృష్టిలో ఆమోదించదగినవిఆధారాలు ఆమోదయోగ్యంإسْنَاده جيد / ఇస్నాదుహూ జయ్యిద్10
ఒక ఉల్లేఖకుడు మాత్రమే ఉల్లేఖించినదిఏకోల్లేఖనంغَرِيب / ‘గరీబ్11
ఆధార పరంపర నేరుగా ప్రవక్త (స) వద్దకు చేరుకుంటుంది.ప్రవక్త ప్రోక్తంمَرفُوع / మర్పూ12
ఆధార పరంపర సహచరుని వద్ద ఆగిపోతే, అతని మీద నమ్మకంతో అతని ‘హదీసు’ను గ్రహిస్తారు.సహచరుని ప్రోక్తంموٌقُوف / మౌఖూప్13
తాబియీ తనకు పైన ఉన్న సహచరుని పేరు ప్రస్తావించ కుండా నేరుగా ప్రవక్త నుంచి ఉల్లేఖించినది.తాబియీ ప్రోక్తంمُرْسَل /   ముర్సల్14
దృఢమైన తాబియీ ఉల్లేఖనందృఢ తాబియీ ప్రోక్తంصَحِيح مُرْسَل / సహీహ్ ముర్సల్15
పరంపర బలహీనమైనా కొందరు దీన్ని ప్రాణికమైనదన్నారుబలహీనం – కొందరిచే ప్రామాణికంضعيف بعضهم يحسنه / ‘దయీఫ్ బ’అదహుమ్ య’హ్సనుహు16
దీని పరంపర బలహీనమైనదిఆధారాలు బలహీనంإسْنَاده ضَعِيف ఇస్‍నాదుహూ ‘దయీప్ /17
ఇది బలహీనమైనదిబలహీనంضَعِيف /  ‘దయీప్18
ఇది చాలా బలహీనమైనదిఅతి బలహీనంضَعِيف جدًّا / ‘దయీఫు జిద్దన్19
‘హదీసు’వేత్తకు ఆధారాలు దొరకలేదునిరాధారితంلا أصل له / లా అస్‍ల లహూ20
దీని పరిశోధన కాలేక పోయిందిఅపరిశోధితంلم تَتِم دَرَاست లమ్ తతిమ్మ్ దిరాసహ్ /21
ఉల్లేఖకుల వివరాలు తెలియవుఅస్పష్టంمَجْهُول /     మజ్‍హూల్22
ఇది పూర్తిగా కల్పితమైనదికల్పితంمَوْضُوع /   మౌ’దూ’అ23
ఇందులో ఎలాంటి సత్యం లేదుఅసత్యంباطل /  బాతిల్24
దీని పరంపర మధ్యలో లింకు తెగిపోయిందిలుప్త ఆధారంمُنقَطَع /  మున్ ఖతీ’అ25
దృఢ ఉల్లేఖకులు కాక మరో దృఢ ఉల్లేఖకుని ‘హదీసు’అరుదుشَاذ /  షాజ్26
బలహీన ఉల్లేఖకుడు అనేకమంది దృఢ ఉల్లేఖకులకు విరుద్ధంగా ఉటంకించిన ‘హదీసు’తిరస్కృతంمُنْكَر/  ముంకర్27
దీని ఆధారాలు అసంతృప్తికరమైనవిఆధారాలు అసంతృప్తికరంأسناده لين /  ఇస్నాదుహూ లీనున్ 28
నమ్మటానికి వీల్లేనంత బలహీనమైన ‘హదీసు’అత్యంత బలహీనంواه / వాహ్29
రద్దు చేయబడిన ఆదేశం కలిగి వున్న ‘హదీసు’రద్దు అయినదిمنسُوخ /మన్‍సూ’ఖ్30

*****

[H] ‘హదీసువేత్తల జీవిత విశేషాలు

‘హదీసు’వేత్తల సంక్షిప్త జీవిత గాథలను బస్తవీ గారు ”రియాదుల్ముహద్దిసీన్”లో పేర్కొన్నారు. ఇక్కడ కేవలం రచయిత తన ముందుమాటలో పేర్కొన్న ‘హదీసు’వేత్తలను గురించి పేర్కొనబడింది.

—–

ఇమామ్ ముహమ్మద్బిన్ఇస్మాయీల్బిన్ఇబ్రాహీమ్ బుఖారీ (రహ్మ)

బు’ఖారీ పేరు, ముహమ్మద్‌ – అబూ అబ్దుల్లాహ్. బిరుదు ఇమాముల్‌ ము’హద్దిసీ’న్‌, అమీరుల్‌ ము’హద్దిసీ’న్‌. ఇతని వంశ పరంపర ముహమ్మద్బిన్ఇస్మాయీల్బిన్ఇబ్రాహీమ్బిన్అల్ముగీరహ్.

జన్మం, ఖరసాన్ సమర్ఖంద్, ఇప్పటి ఉజ్బెకిస్తాన్, 13-10-194 హిజ్రీ (19-7-810 క్రీ.శ.). మరణం, 1-10-256 హి (1-9-870 క్రీ.శ.), 60 సం. వయస్సులో సమర్ఖందులో. ఇతను అబ్బాసీయ పరిపాలనా కాలంలో ఉన్నారు. ఇతని శిక్షకులు, అహ్మద్ బిన్ హంబల్, అలీ బిన్ మదీనీ, ఇస్హాఖ్ బిన్ రహ్వే. ఇతని శిశ్యులు ముస్లిం బిన్ హజ్జాజ్, ఇబ్నె అబీ ఆసిం. సహీహ్ బుఖారీ ఇతని ముఖ్య పుస్తకం.

బు’ఖారీ తండ్రి పేరు ఇస్మా’యీల్‌, బిరుదు అబుల్‌ ‘హసన్‌. ఇతను మలిక్ బిన్ అనస్ శిశ్యులు. ఇతను చాలా పెద్ద ‘హదీసు’వేత్త. ఇస్మా’యీల్‌ చాలా పరిశుద్ధులు మరియు ధర్మ సంపాదకులు. ఒకసారి మాట్లాడుతూ ‘నా సంపాదనలో ఒక్క దిర్‌హమ్‌ అయినా అధర్మ సంపాదన లేదు,’ అని అన్నారు. (అస్‌’ఖలానీ)

బు’ఖారీలో ఎన్నో గొప్ప గుణాలు ఉండేవి. ఇవే కాక మరో గొప్పతనం ఏమిటంటే, తండ్రి కొడుకులు ఇద్దరూ ‘హదీసు’వేత్తలే. బు’ఖారీ తల్లి చాలా భక్తురాలు, మహత్మ్యాలు కలిగి ఉండేది. ఎల్లప్పుడూ దైవాన్ని ప్రార్థించడం, దైవ భీతితో కన్నీళ్ళు కార్చటం, దీనంగా మొర పెట్టుకోవటం చేసేది. బు’ఖారీ కళ్ళు చిన్నతనంలోనే అస్వస్థతకు గురయ్యాయి. దృష్టి క్రమంగా పోసాగింది. వైద్యులు ఇక నయం కాదని చేతులెత్తేశారు. బు’ఖారీ తల్లి ఇబ్రాహీమ్‌ (అ)ను కలలో చూశారు. ‘నీ ప్రార్థన మరియు ఏడ్వటం వల్ల అల్లాహ్‌ నీ కొడుకు కళ్ళకు స్వస్థత ప్రసాదించాడు,’ అని అతను అంటున్నారు. ఉదయం లేచి చూసే సరికి బు’ఖారీ కళ్ళు నయం అయి ఉన్నాయి. కంటి చూపు తిరిగి వచ్చి ఉంది. అయితే అంతకు ముందు కంటి చూపు ఎందుకు పోయిందో కారణం తెలియలేదు. కంటి చూపు తిరిగి వచ్చిన తర్వాత వెన్నెల రాత్రుల్లో కూర్చొని ”తారీఖ్కబీర్” అనే పుస్తకం వ్రాశారు.

బాల్యం, విద్యాభ్యాసం, శిక్షణ, గురువులు: బు’ఖారాలో 194 హిజ్రీ శకంలో రమ’దాన్‌ 13వ తేదీన జుమ’అహ్ నమా’జ్‌ తర్వాత జన్మించారు. బు’ఖారీ గురించి చాలా తక్కువ విషయాలు తెలిసినా, అతని విద్యాభ్యాసం, శిక్షణ జరిగిన తీరు చాలా ఉత్తమ మైనదని తెలుస్తుంది. ఎందుకంటే అతని తండ్రి కూడా ఒక ‘హదీసు’వేత్తే. అతని తండ్రి ఇస్మా’యీల్‌ బాల్యం లోనే మరణించారు. అందువల్ల తల్లి సంరక్షణా బాధ్యతలు తనపై ఎత్తుకున్నారు. కొంత వయస్సు పెరిగిన తర్వాత ‘హదీసు’ విద్య నేర్చుకోవాలనే కోరిక కలిగింది. ఎందుకంటే వారిది ‘హదీసు’వేత్తల కుటుంబం.

ము’హమ్మద్‌ బిన్‌ అబీ ‘హాతిమ్‌ వర్రాఖ్‌ కథనం: బు’ఖారీ ఇలా అంటూ ఉండగా నేను విన్నాను: ”నేనింకా బడిలో ఉండగానే ‘హదీసు’ విద్య నేర్చుకోవాలనే కోరిక నాకు కలిగింది.” వర్రాఖ్‌ బు’ఖారీని ”మీకు ‘హదీసు’ విద్య నేర్చుకోవాలని కోరిక కలిగినప్పుడు మీ వయస్సు ఎంత” అని అడిగితే ”అప్పుడు నా వయస్సు 10 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ ఉంటుంది” అని సమాధానం ఇచ్చారు. అప్పటి నుండే బు’ఖారీ ‘హదీసు’వేత్తల సభలలో పాల్గొన సాగారు.

ప్రారంభదశలోనే ఒక సంఘటన జరిగింది. బు’ఖారా లోని ప్రఖ్యాత పండితులు దా’ఖలీ అలవాటు ప్రకారం ‘హదీసు’లను బోధిస్తున్నారు. అప్పుడు ఆ సభలో బు’ఖారీ కూడా ఉన్నారు. దా’ఖలీ ఒక ‘హదీసు’ ప్రామాణికతను పేర్కొంటూ, ”సుఫియాన్‌ అన్‌ అబి’జ్జుబేర్‌ అన్‌ ఇబ్రాహీమ్‌” అని అన్నారు. బు’ఖారీ అది విని, ”అన్న అబా’జ్జుబేర్‌ లమ్‌ యరౌ ఇబ్రాహీమ్‌” – అంటే ‘అబు ‘జ్జుబేర్‌ ఇబ్రాహీమ్‌ ద్వారా ఉల్లేఖించ లేదు,’ అని అన్నారు. అప్పుడు బు’ఖారీ వయస్సు 11 సంవత్సరాలు.

బుఖారీ అప్రమత్తత: అజ్‌లోనీ బు’ఖారీ అప్రమత్తత గురించి, ఉపద్రవాలకు దూరంగా ఉండటాన్ని గురించి ఒక సంఘటన పేర్కొన్నారు. ”బు’ఖారీ తన విద్యాభ్యాసం రోజుల్లో ఒకసారి సముద్ర ప్రయాణం చేశారు. ఓడపై ఎక్కారు. అతని వద్ద 1000 అష్రఫీలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి బు’ఖారీకి సేవలు చేసి, చాలా గౌరవభావం వ్యక్తం చేశాడు. బు’ఖారీతో చాలా కలివిడిగా ప్రవర్తించ సాగాడు. బు’ఖారీ కూడా అతన్ని తన శ్రేయోభిలాషిగా భావించసాగారు. చివరికి తన వద్ద 1000 అష్రఫీలు ఉన్నాయని కూడా అతనికి తెలుపడం జరిగింది.

ఒక రోజు బు’ఖారీ మిత్రుడు నిద్రలేచి ఏడ్వటం పెడబొబ్బలు పెట్టటం, తల మొత్తుకోవడం చేశాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపడ సాగారు. అసలే ఏమయిందని అడగారు.’ ప్రజలు అంతగా అడుగు తుంటే, ఆ వ్యక్తి నా దగ్గర 1000 అష్రఫీల సంచి ఉండేది. అది పోయింది అని ఏడువసాగాడు. ప్రజలు పడవలో ఉన్న వారందరినీ సోదా చేశారు. బు’ఖారీ ఎవరికీ తెలియకుండా తన అష్రఫీల సంచిని సముద్రంలో పారవేశారు. ఆ తరువాత బు’ఖారీని కూడా సోదా చేయడం జరిగింది. ఎవరి వద్దా అది దొరక్కపోయే సరికి, వారు ఆ వ్యక్తినే చీవాట్లు పెట్టారు.

ప్రజలందరూ ఓడనుండి దిగారు. ఆ వ్యక్తి ఏకాంతంలో బు’ఖారీని కలిశాడు. ‘తమరు ఆ అష్రఫీల సంచి ఏం చేశారు?’ అని అడిగాడు. బు’ఖారీ, ‘ఆ సంచిని సముద్రంలో పారవేసాను,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘ఇంత పెద్ద మొత్తాన్ని పారవేయటానికి మీ మనసెలా ఒప్పింది,’ అని అడిగాడు. ”నీకు బుద్ధుందా? నా జీవితమంతా ప్రవక్త (స) ‘హదీసు’లను రాయడంలోనే గడచి పోయింది. నాకు ప్రజల్లో గౌరవ ఆదరణలు ఉన్నాయి. మరి నాపై దొంగతనం నింద రావటాన్ని నేనెలా భరించగలను? జీవితమంతా శ్రమించి సంపాదించిన నీతి నిజాయితీని కొన్ని అష్రఫీలకు ఎలా బలి చేయగలను,” అని సమాధానం ఇచ్చారు.

సద్గుణాలు, అలవాట్లు, ప్రవర్తన: బు’ఖారీకి వారసత్వంలో తండ్రి ఆస్తి అధిక మొత్తంలో లభించింది. అతని తండ్రి గారిది చాలా పెద్ద వ్యాపారం. సాధారణంగా వ్యాపారుల్లో అనేక అవకతవకలు, లోటు పాట్లు జరుగుతుంటాయి. అందువల్ల వ్యాపారం చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. బు’ఖారీ తండ్రి ఇస్మా’యీల్‌ తన మరణ సమయంలో తన ప్రత్యేక శిష్యుడైన అబూ హఫ్స్‌తో, ‘నేను నా ధనంలో ఒక్క దిర్‌హమ్‌ కూడా అధర్మమైనదిగా ఎరుగను.’ అని అన్నారు. అది విన్న అబూ హఫ్స్‌ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇస్మా’యీల్‌ వ్యాపారంలో చాలా అప్రమత్తంగా ఉండే వారు. ఇస్మా’యీల్‌ తన మరణ సమయంలో అబూ హఫ్స్‌తో నా వారసునికి సహాయ సహకారాలు అందించాలి, అతన్ని విడిచి వెళ్ళిపోకూడదు, కష్టాల్లో అతని నుండి సహాయం పొందు,’ అని హితవు చేశారు.

‘హదీసు’వేత్త ముహమ్మద్‌ బిన్‌ అబీ హాతిమ్‌ కథనం: బు’ఖారీ ఆ ధనాన్ని వ్యాపారంలో పెట్టారు. ఎటువంటి చింత లేకుండా ధార్మిక సేవలో నిమగ్నమై పోయారు. అల్లాహ్‌ అతన్ని ఎటువంటి కష్టాలకు, ఆపదలకు గురి కాకుండా సంరక్షించాడు.

స్వభావంలో ఎంతో నమ్రత, సున్నితత్వం, కారుణ్య గుణం ఉండేది. ఒకసారి వ్యాపార భాగస్వామి 25 వేల దిర్‌హమ్‌లు నొక్కేశాడు. శిష్యులు, ‘అప్పు తీసుకున్న వాడు వచ్చాడు, అతన్నుండి అప్పు వసూలు చేసుకోండి, ‘ అని అన్నారు. దానికి బు’ఖారీ, ‘అప్పు వాడిని ఇబ్బంది పెట్టడం సబబు కాదు’ అని అన్నారు.

బు’ఖారీ తన వ్యాపార లాభాలతో పండితులను, విద్యార్థులను సంరక్షించాలని ప్రయత్నించేవారు. ప్రతి నెల తన ఆదాయంలో నుండి 500 దిర్‌హమ్‌లు దీనికి కేటాయించే వారు. పండితులకు, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహించేవారు. అన్న పానీయాల విషయంలో భోగ, విలాసాలకు దూరంగా ఉండేవారు. బు’ఖారీ గుమస్తా అయిన ము’హమ్మద్‌ బిన్‌ అబీ ‘హాతిమ్‌ కథనం: ఒకసారి విద్యార్జనా కాలంలో ఆదమ్‌ బిన్‌ అబీ అయాస్‌ వద్దకు వెళ్ళే ప్రయాణంలో ప్రయాణ సామగ్రి అంతా అయి పోయింది. కొన్ని రోజుల వరకు ఆకులు అలములు తిని గడిపారు. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు, ఎవరినీ ఏదీ అడగలేదు. బు’ఖారీ దైవ భీతి, దైవభక్తి, దయ, న్యాయం, ధర్మం మొదలైన ఉత్తమ గుణాలు కలిగి ఉండేవారు.

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ము’హమ్మద్‌ అస్సియార్‌ఫీ కథనం: నేను ఒకసారి ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మా’యీల్‌ ఇంటికి వెళ్ళాను. అతని సేవకురాలు అతని ప్రక్క నుండి వెళ్ళింది. ఆమె కాలు తగిలి సిరా పడిపోయింది. వెంటనే బు’ఖారీ ఆగ్రహం చెంది, ‘ఎలా నడుస్తున్నావు?’ అని అన్నారు. దానికి సేవకురాలు, ‘దారిలేకపోతే ఎలా నడిచేది? ‘ అని చెప్పింది. అది విని బు’ఖారీ ఆగ్రహం చెందడానికి బదులు, ”పో నిన్ను నేను విడుదల చేసి వేశాను,” అని అన్నారు. అప్పుడు నేను ”ఆమె మిమ్మల్ని కోపం తెప్పించింది. తమరు కోప్పడటానికి బదులు ఆమెను విడుదల చేసి వేశారా?” అని అడిగాను. దానికి బు’ఖారీ, ”ఆమె చేసినదానికి నన్ను నేను సంతృప్తి పరచుకున్నాను.” అంటే బు’ఖారీ ఆమెను చీవాట్లు పెట్టే బదులు తన్ను తాను చీవాట్లు పెట్టుకున్నారు.

ఒకసారి బు’ఖారీ తండ్రిగారి శిష్యుడైన అబూ ‘హఫ్‌స్‌ కొంత సరుకును బు’ఖారీ వద్దకు పంపారు. కొంత మంది వ్యాపారులు సాయంత్రం వచ్చి 5000 రుసుము ఇచ్చి సరుకు తీసుకొని వెళతామని అన్నారు. దానికి బు’ఖారీ ‘ఇప్పుడు వెళ్ళిపోండి, ఉదయం రండి, ఇచ్చి తీసుకు వెళ్ళండి’ అని అన్నారు. మరుసటి రోజు ఉదయం కొందరు వ్యాపారులు వచ్చి, 5వేలకు బదులు 10 వేలు ఇచ్చి సరకు తీసుకు వెళతామన్నారు. కాని బు’ఖారీ తరువాత వచ్చిన వ్యాపారులను రాత్రి వచ్చిన వ్యాపారికి అమ్మాలని నిశ్చయించుకున్నాను అని చెప్పి వాళ్ళను పంపి వేశారు. అనంతరం మొదట వచ్చిన వ్యాపారులకు ఆ సరకును అమ్మివేశారు. ఈ విధంగా డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వక తన వాగ్దానానికి ప్రాధాన్యత ఇచ్చారు.

‘హదీసు’వేత్తల నాయకుడు బగ్దాద్‌ పట్టణం చేరుకున్నారు. బగ్దాద్‌ బనీఅబ్బాస్ పరిపాలనా కాలంలో ఇస్లామీయ విద్యకు కేంద్రంగా మారిపోయింది. హారూన్‌, మామూన్‌ వంటి మహారాజులు దీని అభి వృద్ధికి కృషి చేశారు. బగ్దాద్‌ గొప్ప గొప్ప పండితులకు, ధార్మిక వేత్తలకు నిలయంగా మారింది. బు’ఖారీ పేరు ప్రఖ్యాతులు బగ్దాద్‌ వరకు వ్యాపించాయి.

బు’ఖారీ బగ్దాద్‌ వచ్చారు. అతని రాక మామూలు విషయం కాదు. అతన్ని పరీక్షించటానికి బగ్దాద్‌ నగర పండితులు, ‘హదీసు’వేత్తలందరూ ఏకమయ్యారు. వంద ‘హదీసు’లను వాటి సాక్ష్యాధారాలను కలగా పులగం చేసి, బహిరంగంగా ప్రజల ముందు పరీక్షించడానికి ఏర్పాటు చేశారు. నగరంలోని మహా విద్యావంతులందరూ ఏకమయ్యారు. అతని ముందు నిర్దేశించిన వ్యక్తులు ‘హదీసు’లు చదవసాగారు. బు’ఖారీ, ”నాకు తెలియదు” అని అన్నారు. ఈ విధంగా అనేక మంది వ్యక్తులు కలగాపులగం చేసిన, మార్పులు చేర్పులు చేసిన ‘హదీసు’లు చదవగా బు’ఖారీ కేవలం, ”నాకు తెలియదనే” సమాధానం ఇచ్చారు. ఈవిధంగా నిర్ణయించిన ‘హదీసు’లన్నీ అయిపోయాయి. బు’ఖారీని ఎరుగని వారు, బు’ఖారీ ఓడిపోయారని భావించారు. కాని అతన్ని గురించి తెలిసిన వారు బు’ఖారీ మా ఎత్తు తెలుసుకున్నారు అని గ్రహించారు. బు’ఖారీ వెంటనే నిలబడి వారు కలగాపులగం చేసి, మార్పులు చేర్పులు చేసి చదివిన ‘హదీసు’లను సరైన రీతిలో ఏమాత్రం తప్పు లేకుండా చదివి వినిపించారు. ఈ విధంగా వారు వినిపించిన ‘హదీసు’ఇలన్నింటినీ వారికి ఎలాంటి తప్పులు లేకుండా వినిపించారు. అది చూసి బగ్దాద్‌ ప్రజానీకం ఆశ్చర్య పడకుండా ఉండలేక పోయారు. ఇంకా వారి గొప్పతనాన్ని స్వీకరించారు.

మరణం: బు’ఖారీ 13 రోజులు తక్కువ 62 సంవత్సరాల వయస్సులో ‘ఈదుల్‌ ఫి’త్ర్‌ నాడు రాత్రి 256 హిజ్రీ శకంలో మరణించారు. మరణించిన తరువాత కూడా శరీరం నుండి చెమట వస్తూనే ఉంది. చివరికి స్నానం చేయించి కఫన్‌ చుట్టు వేయడం జరిగింది. కొంతమంది సమర్‌ఖంద్‌ తీసుకువెళదామని కోరారు. ఇంకా ఖనన ప్రదేశం విషయంలో కూడా భేదాభిప్రాయాలు తలెత్తాయి. కాని తరువాత అక్కడే ఖననం చేయాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ‘ఈదుల్‌ ఫి’త్ర్‌ నాడు ”జుహర్‌ నమా’జు తర్వాత ఖననం చేయబడ్డారు.

వర్రాఖ్‌ కథనం: బు’ఖారీ తన మరణానికి ముందు తనను ప్రవక్త (స) సాంప్రదాయం ప్రకారం 3 వస్త్రాల్లో ఖననం చేయాలని ఉపదేశించారు.

ఖతీబ్‌ అబ్దుల్‌ వా’హిద్‌ బిన్‌ ఆదమ్‌ అత్తవాల్‌ లేసీ యొక్క సంఘటన పేర్కొన్నారు, ”నేను ప్రవక్త (స)ను తన సహచరుల బృందం వెంట ఒకచోట వేచి ఉన్నారు. ఎవరి గురించో ఎదురుచూస్తున్నారు. నేను సలామ్‌ చేసి, ‘ఎవరి గురించి ఎదురుచూస్తున్నారు’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘నేను ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మాయీ’ల్‌ గురించి ఎదురుచూస్తున్నాను,’ అని సమాధానం ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత బు’ఖారీ మరణ వార్త నాకు తెలిసింది. అప్పుడు నేను కల సమయాన్ని, మరణ సమయాన్ని కలిపి చూశాను. ఆ రెండూ ఒకే సమయం, ఒకే దినంగా నిర్థారించాను. ఎందుకంటే షరీఅత్‌లో సత్యమైన స్వప్నాలు దైవ దౌత్యంలోని 46వ భాగంగా నిర్థారించటం జరిగింది. బు’ఖారీ మరణంపై పండితులందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.

బుఖారీ రచనలు: అత్తారీ’ఖుల్‌ కబీర్‌, అత్తారీఖుల్‌ అవ్ సత్‌, అత్తారీఖ్ అస్సగీర్, అల్‌ జామిఉల్‌ కబీర్‌, ఖల్‌ఖు అఫ్‌ఆలిల్‌ ఇబాద్‌, కితాబుద్దుఅఫాయిల్‌ అస్సగీర్, అల్‌ ముస్నదుల్‌ కబీర్‌, అత్తఫ్‌సీరుల్‌ కబీర్‌,   కితాబుల్‌ హిబహ్, అసామిస్సహాబహ్, కితాబుల్‌ విజ్‌దాన్‌, కితాబుల్‌ మబ్‌సూత్‌, కితాబుల్‌ ఇలల్‌, కితాబుల్‌ కినా, కితాబుల్‌ ఫవాయిద్‌, అల్‌ అదబుల్‌ ముఫ్రద్‌, జుజ్‌ఉరఫ్‌ఉల్‌ యదైన్‌, బిర్రుల్‌ వాలిదైన్‌, కితాబుల్‌ అష్‌రిబహ్, ఖ’దాయస్సహాబహ్ వత్తాబియీన్‌, కితాబుర్రిఖాఖ్‌, అల్‌ జామిఉస్సగీర్‌ ఫిల్‌ ‘హదీస్’, జు’జ్‌ఉ ఖిరాఅతి ‘ఖల్‌ఫల్‌ ఇమామ్‌ మొదలైనవి.

సహీ బుఖారీ ఆదరణ, దాని గొప్పతనం: బు’ఖారీ రచనల్లో అల్జామిఉస్సహీహ్‌” ఈనాడు ‘స’హీ’హ్ బు’ఖారీ పేరుతో ప్రాచుర్యంలో ఉంది. ప్రపంచంలోని ఇస్లామీయ ప్రాంతాలన్నింటిలో దీన్ని ప్రచురించడం జరిగింది. బు’ఖారీకి ‘హదీసు’వేత్తల నాయకుడిగా బిరుదు ఇచ్చే కారణాల్లో ఈ పుస్తకం కూడా ఒక కారణమే. దైవ గ్రంథం ఖుర్‌ఆన్‌ తరువాత ఏ పండితుని పుస్తకానికీ ఈ స్థానం లభించలేదు.

హీహ్ బుఖారీ రాయాలనే ఆలోచన: ఇస్‌’హాఖ్‌ బిన్‌ రాహ్‌వియహ్‌ బు’ఖారీని ‘స’హీ’హ్‌ బు’ఖారీ రాయ మని కోరారు. ఇబ్రాహీమ్‌ బిన్‌ మాఖల్‌ నసఫీ కథనం: బు’ఖారీ ఇలా అన్నారు, ”ఒకరోజు మేము ఇస్‌’హాఖ్‌ బిన్‌ రాహ్‌వియహ్‌ వద్ద కూర్చొని ఉన్నాము. అప్పుడతను, ”నువ్వు ప్రవక్త (స) ప్రామాణిక ‘హదీసు’లను ఒకచోట చేర్చితే బాగుండు,” అని అన్నారు. ఆ మాట నా మనసులో నాటుకుంది. నేను అప్పటి నుండే ‘స’హీ’హ్ బు’ఖారీని వ్రాయడం ప్రారంభించాను.

మరో కారణం ఏమిటంటే, బు’ఖారీ ప్రవక్త (స)ను కలలో చూశారు. ”నేను ప్రవక్త(స) సన్నిధిలో నిలబడి నా చేతిలో ఉన్న విసనకర్రతో ప్రవక్త (స)పై నుండి ఈగ లను తోలుతున్నాను.” మేల్కొన్న తరువాత పండితులతో దాని పరమార్థాన్ని గురించి అడిగాను. దానికి వారు, ‘ప్రవక్త (స)పై కల్పించిన అసత్య ‘హదీసు’లను నీవు తొలగిస్తావు,’ అని పరమార్థం తెలిపారు. ఎందుకంటే సత్య స్వప్నాలు దైవ దౌత్యంలోని 46వ భాగం అని ఉంది. ప్రవక్త (స)ను కలలో చూసిన వారు నిజంగా కలలో చూశారు. ఈకల కూడా మరింత కుతూహలాన్ని, ఉత్సాహాన్ని నింపింది. ఈవిధంగా ”జామె’ ‘స’హీ’హ్‌” రచనలో బు’ఖారీ నిమగ్నం అయిపోయారు.

రచనా సమయం మరియు సరళి: ‘స’హీ’హ్ బు’ఖారీని, బు’ఖారీ ఎప్పుడు మరియు ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు. ఎలా రచించారు. రచించిన తరువాత, ఎవరి ముందు ప్రవేశపెట్టారు. ప్రతి విషయంపై చర్చించారు.

వర్రాఖ్‌ కథనం: బు’ఖారీ ఇలా అన్నారు, ”నేను జామె’ ‘స’హీ’హ్‌ను మూడుసార్లు రచించాను. అంటే దాన్ని మూడుసార్లు సరిదిద్దాను.”

అబుల్‌ ‘హైస’మ్‌ కష్‌మిహ్నీ కథనం: నేను ఫర్‌బరీ ద్వారా ఇలా విన్నాను, అతను ఇలా అన్నారు. బు’ఖారీ కథనం: నేను ఏ ‘హదీసు’నూ స్నానం చేసి రెండు రకాతులు చదవనంత వరకు అల్‌ జామి’ఉ’స్స’హీ’హ్‌లో చేర్చలేదు.

మరో ఉల్లేఖనంలో ఇలా కూడా ఉంది: ”దాన్ని నేను మస్జిదె ‘హరామ్‌లో రచించాను. ఇంకా ప్రతి ‘హదీసు’పై రెండు రకాతుల నమా’జు చదివి ఇస్తిఖారా చేసేవాడిని. దానిపట్ల పూర్తి నమ్మకం కలిగిన తరువాతనే ‘అల్‌ జామి’ఉ’స్స’హీ’హ్‌’లో చేర్చేవాడిని దీన్ని నేను నా సాఫల్యం కోసం వ్రాశాను. 6 లక్షల ‘హదీసు’ల్లో ప్రామాణికమైన ‘హదీసు’లను ఎంచి వ్రాశాను.”

ఇబ్నె అదీ తన గురువుల బృందం ద్వారా ఇలా పేర్కొన్నారు: బు’ఖారీ అల్‌ జామి’ఉ’స్స’హీ’హ్‌ యొక్క అధ్యాయాలన్నిటినీ ప్రవక్త (స) గది మరియు మెంబర్ల మధ్య కూర్చొని, ప్రతి అధ్యాయానికి ముందు రెండు రకాతులు నమా’జు చదివి వ్రాసేవారు.

వర్రాఖ్‌ కథనం: నేను బు’ఖారీ వెంట ఉన్నాను. నేను బు’ఖారీని కితాబుత్తఫ్‌సీర్‌ వ్రాస్తూ ఉండగా చూశాను. రాత్రి 15, 20 సార్లు లేచి దీపం వెలిగించి ‘హదీసు’లపై గుర్తుపెట్టి పడుకునేవారు. దీన్ని బట్టి బు’ఖారీ ఎల్లప్పుడూ, ప్రతి చోట తన ధ్యానం అంతా దానిపైనే పెట్టే వారు. ఒక ‘హదీసు’ పట్ల పూర్తి నమ్మకం కలగగానే దానిపై గుర్తు పెట్టేవారు. ఇక అధ్యాయాలను బు’ఖారీ ఒకసారి ‘హరమ్‌లో మరోసారి ప్రవక్త (స) గదికి మెంబరుకు మధ్య సంకలనం చేసేవారు. ఈ అధ్యాయాలలో ‘హదీసు’లను సంకలనం చేసినపుడు ముందు స్నానం చేసి నమా’జు చదివి ఇస్తిఖారా చేసేవారు.

అబూ జ’అఫర్‌ అఖీలీ కథనం: బు’ఖారీ, ‘స’హీ’హ్ బు’ఖారీని రచించి, ఆనాటి గొప్ప పండితులు అంటే అహ్మద్‌ బిన్‌హంబల్, ‘అలీ బిన్‌ మదీనీ, య’హ్‌యా బిన్‌ ము’యీన్‌ మొదలైన వారి ముందు పెట్టారు. అందరూ చాలా మెచ్చుకున్నారు. ఇంకా ప్రశంసించారు. దాని ప్రామాణికతను మెచ్చుకున్నారు. కాని నాలుగు ‘హదీసు’ల పట్ల అభ్యంతరం తెలిపారు. ఈ నాలుగు ‘హదీసు’ల విషయంలో కూడా బు’ఖారీ అభి ప్రాయం సరైనదిగా తేలింది. ఆ నాలుగు ‘హదీసు’లు కూడా ప్రామాణికమైనవిగా తేలాయి. (సీరతుల్‌ బు’ఖారీ)

—–

ఇమామ్ ముస్లిమ్బిన్హజ్జాజ్బిన్దర్ద్బిన్కూషాజ్ (రహ్మ)

పేరు, వంశం, జననం: పేరు ముస్లిమ్‌, పిలిచే పేరు అబుల్హసన్, బిరుదు అసాకిరుద్దీన్‌, హిజ్రీ శకం 206 లో, నేషాపూర్లో జన్మించారు. వంశ పరంపర, ముస్లిమ్బిన్హజ్జాజ్బిన్దర్ద్బిన్కూషాజ్, ముస్లిమ్‌ వంశ పరంపర ఖషీర్‌ తెగకు చెందినది. అందువల్ల అతన్ని ఖషీరీ అంటారు. ఇంకా అతని సొంత ఊరు నేషాపూర్‌. ‘హదీసు’ విద్యలో ఆరితేరిన గొప్ప పండితులు. ఇతని విద్యా జ్ఞానాలు, కంఠస్తం, నిజాయితీ గురించి పండితు లందరూ ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. ముస్లిమ్‌ ‘ఇరాఖ్‌, ‘హిజా’జ్‌, షామ్‌, బగ్దాద్‌ మొదలైన ప్రాంతాల వైపు ప్రయాణం చేశారు. ‘హదీసు’ విద్య విషయంలో ఈ ప్రాంతాలకు అనేక సార్లు పర్యటించడం జరిగింది. అదే విధంగా బగ్దాద్‌ అనేక సార్లు వెళ్ళడం జరిగింది. ఒకసారి బగ్దాద్‌లో బోధించడం కూడా జరిగింది. చివరి సారిగా 259హిజ్రీ శకంలో బగ్దాద్‌ వెళ్ళారు. ఇతనికి అనేక మంది గురువులు ఉన్నారు. యహ్‌యా బిన్‌ యహ్‌యా, అహ్మద్‌ బిన్‌హంబల్, ఇస్‌హాఖ్‌ ఇబ్నె రాహ్‌వయ్‌, అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌లమహ్‌, ముహమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్‌ అల్‌బుఖారీ మొదలైన వారున్నారు. దీన్ని ముస్లిమ్‌ గర్వంగా భావిస్తారు.

శిష్యులు: కూడా అనేకమంది ఉన్నారు. అబూ హాతిమ్‌ రాజీ, అబూ ఈసా తిర్మిజీ‘, అబూ బకర్‌ బిన్‌ ఖుజైమహ్, యహ్‌యా బిన్‌ సాయిదహ్‌, అబూ అవాన్‌ మొదలైనవారు. చాలా గొప్ప పండితులు వీళ్ళందరూ. ముస్లిమ్‌ సంతృప్తికరమైన స్వభావం కలిగి ఉండేవారు. అందువల్లే ఎవరినీ ఏదీ అడిగేవారు కాదు, ఏనాడూ ఎవరినీ గురించీ పరోక్షంగా నిందించలేదు, ఎవరినీ కొట్టలేదు. ఎవరినీ తిట్టలేదు. ‘హదీసు’లను గుర్తించడంలో తన తోటివారి కంటే ముందడుగు వేశారు. కొన్ని విషయాల్లో బు’ఖారీని కూడా అధిగమించారు.

మరణం: 261 హిజ్రీ శకంలో 25 రజబ్ నాడు నేషాపూర్లోని నసీర్‌ ఆబాద్‌లో 55 సంవత్సరాల వయస్సులో మరణించారు. అతని మరణ వృత్తాంతం చాలా ఆశ్చర్యకరమైనది. ఒకరోజు సభలో కొందరు ఒక ‘హదీసు’ గురించి అడిగారు. అనుకోకుండా ఆ ‘హదీసు’ అతనికి గుర్తుకు రాలేదు. ఇంటికి వచ్చి గ్రంథాల్లో, పుస్తకాల్లో వెతకసాగారు. ముందు ఖర్జూరాల బుట్ట ఒకటి ఉంది. ఒక్కొక్క ఖర్జూరం తింటూ ‘హదీసు’ను వెతకసాగారు. ‘హదీసు’ వెతకడంలో నిమగ్నం అయిపోయి, బుట్టలో ఉన్న ఖర్జూరాలన్నీ తినేసారు. అతనికి ఏమాత్రం తెలియలేదు. ఈ కారణంగానే అతను మరణించారు. (తహ్‌జీబుత్తహ్‌జీబ్‌)

అబూ ‘హాతిమ్‌ రా’జీ ముస్లిమ్‌ మరణానంతరం అతన్ని కలలో చూసి ‘ఎలా ఉన్నారు’ అని అడిగారు. దానికి ముస్లిమ్‌ ‘అల్లాహ్‌ నాకు స్వర్గం ప్రసాదించాడు’ అని సమాధానం ఇచ్చారు. అల్లాహ్‌ మనందరికి కూడా స్వర్గం ప్రసాదించుగాక! ఆమీన్‌.

రచనలు: ముస్లిమ్‌ రచనల గురించి ‘హాకిమ్‌ ఇలా వ్రాస్తున్నారు: ”ముస్లిమ్‌ రచనల్లో ముస్నద్‌ కబీర్‌ ఒకటి, కితాబుల్‌ అస్మా, కితాబుత్తమీ’జ్‌, కితాబుల్‌ ఇలల్‌, కితాబుల్‌ విజ్‌దాన్‌, కితాబుల్‌ అఫ్‌రాజ్‌, కితాబుల్‌ ఖిరాన్‌, కితాబుసవాలా అహ్‌మద్‌ బిన్‌ హంబల్‌, కితాబు ‘హదీసి’ అమ్ర్‌ బిన్‌ షుఐబ్‌, కితాబుల్‌ ఇన్‌తిఫా బి ఇహా బిస్సిబా, కితాబు మషాయిఖి ఇమామ్‌ మాలిక్‌, కితాబు మషాయిఖి సౌరీ, కితాబు మషాయిఖి షూబీ, కితాబు మన్‌ లైసలహు ఇల్లా రఅల్‌ వాహిద్‌, కితాబుల్‌ ముహ్‌ఖరీన్‌, కితాబు అల్‌వాది సహాబిహి, కితాబు అన్‌హామిల్‌ ము’హద్దిసీన్‌, కితాబుత్తబఖాత్‌, కితాబు అఫ్‌రాదిష్షామీన్‌.

ఇవి ముస్లిమ్‌ ప్రఖ్యాత రచనలు. వీటిలో అనేకం ప్రచురించబడ్డాయి. వీటిని సంక్షిప్తంగా తజ్‌కిరతుల్‌ ‘హుఫ్ఫా”జ్‌ ద్వారా పేర్కొనడం జరిగింది. వీటి వివరాలు ముతవ్వలాద్‌లో లభిస్తాయి. ముస్లిమ్‌ రచనల్లో ‘స’హీ’హ్ ముస్లిమ్‌ గురించి ముస్లిమ్‌ సమాజంలో అందరికీ తెలిసిందే. కొన్ని విషయాల్లో ముస్లిమ్‌ బు’ఖారీని అధిగమించారు. ‘స’హీ’హ్ ముస్లిమ్‌కు బు’ఖారీపై ప్రాముఖ్యత ఇవ్వడం కూడా కొంతవరకు వాస్తవమే. మ’గ్‌రిబ్‌లోని కొందరు పండితులు ‘స’హీ’హ్ బు’ఖారీపై ‘స’హీ’హ్ ముస్లిమ్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే బు’ఖారీలో లేని కొన్ని నియమ నిబంధనలు ముస్లిమ్‌లో ఉన్నాయి.

ఇబ్ను ‘సలా’హ్‌ అభిప్రాయం: బు’ఖారీ, ముస్లిమ్‌లో ఉన్న ‘హదీసు’లన్నీ ప్రామాణికమైనవే. వీరి ప్రామాణి కతపై ముస్లిమ్‌ సమాజమంతా ఏకాభిప్రాయం కలిగి ఉంది. ముస్లిమ్‌లో అన్నీ కలిపి 7,275 ‘హదీసు’లు ఉన్నాయి. ఒకేసారి పేర్కొనబడినవి 4000 ఉన్నాయి. ”నేనీ ‘హదీసు’లను 2 లక్షల ‘హదీసు’ల్లో నుండి ఎన్నుకున్నాను” అని ముస్లిమ్‌ అన్నారు. ఇంకా, ”ప్రజలందరూ 200 సంవత్సరాల వరకు ‘హదీసు’లు వ్రాసినా, నా పుస్తకం పట్లనే నమ్మకం కలిగి ఉంటారు,” అని అన్నారు. అదేవిధంగా ముస్లిమ్‌ నుండి ప్రవక్త (స) వరకు మధ్య నలుగురు ఉల్లేఖన కర్తలు ఉన్నదే ముస్లిమ్‌ వద్ద ప్రామాణిక ఉల్లేఖనం. అదేవిధంగా బు’ఖారీ వద్ద ముగ్గురు ఉల్లేఖన కర్తలు ఉన్న ‘హదీసు’ ప్రామాణికమైనది. ముస్లిమ్‌ ‘హదీసు’ వృత్తిలో అనేక పుస్తకాలు రచించారు. అయితే ‘స’హీ’హ్ ముస్లిమ్‌ అన్నిటి కంటే పేరు ప్రఖ్యాతులు పొందింది. ‘స’హీ’హ్ ముస్లిమ్‌ యొక్క అనేక వివరణలు ఉన్నాయి.

—–

ఇమామ్ మాలిక్బిన్అనస్ (రహ్మ)

మాలిక్‌ బిన్‌ అనస్‌ బిన్ మాలిక్ బిన్ అబూ ఆమిర్ అల్ అస్బాహీ, 93 హిజ్రీ (711క్రీ. శ) లో జన్మించారు. ఇంకా 179 హిజ్రీ (7-11-795 క్రీ. శ)లో మరణించారు. ఇతనికి ఇమాము దారుల్‌ హిజ్రత్‌ అనే బిరుదు కూడా ఉంది. పొడవుగా, దృఢంగా, పొడవైన ముక్కు, అందంగా, వెడల్పు గల నుదురు, తలపై తక్కువ వెంట్రుకలు, దట్టమైన గడ్డం, కేవలం పెదాలపై ఉన్న వెంట్రుకలను కత్తిరించేవారు. రెండు వైపుల వెంట్రుకలను వదలివేసే వారు.

మాలిక్‌ బిన్‌ అనస్‌ తబె తాబయీన్ తరానికి చెందిన వారు. ఇతని గురువుల సంఖ్య 900 ఉండేది. వీరిలో 300 తాబయీన్లు, 600 తబె తాబయీన్లు. ఉల్లేఖనాల మధ్య వ్యక్తుల పరిశీలనలో మాలిక్‌కు మించిన వారెవరూ లేరు. మాలిక్‌కు ‘హదీసు’లోని ఏదైనా భాగంలో అనుమానం వస్తే మొత్తం ‘హదీసు’నే వదలి వేసేవారు. తూర్పూ పడమరల మధ్య ప్రవక్త (స) ‘హదీసు’ల విషయంలో మాలిక్‌ కంటే నమ్మకమైన వ్యక్తి మరొకరు లేరు. అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక కాలం రాబోతున్నది. ప్రజలు సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. కాని, మదీనహ్ పండితుని కంటే గొప్ప పండితుడు దొరకడు.” (తిర్మిజి’, ‘స’హీ’హ్‌) సుఫియాన్‌ బిన్‌ ఉయైన వారు మాలిక్‌ బిన్‌ అనస్‌ అని భావిస్తున్నారు.

ఖల్‌ఫ్‌ బిన్‌ ‘ఉమర్‌ కథనం: నేను ఇమామ్‌ మాలిక్‌ వద్ద కూర్చొని ఉన్నాను. ఇంతలో మదీనహ్ ఖారీ ఇబ్నె కసీర్ ఇమామ్‌ మాలిక్‌కు ఒక పత్రం ఇచ్చారు. ఇమాముగారు దాన్ని చదివి, తన జానీమాజ్‌ క్రింద ఉంచుకున్నారు. అతను నిలబడ్డారు. అతనితో పాటు నేను కూడా నిలబడ్డాను. కూర్చోమని అన్నారు. ఇంకా ఆ పత్రం నాకు ఇచ్చారు. అందులో ఒక స్వప్నం గురించి ఇలా వ్రాసి ఉంది: ”ప్రజలు ప్రవక్త (స) ను చుట్టుముట్టి ఉన్నారు. ప్రవక్త(స)ను ఏదో అర్థిస్తున్నారు. అప్పుడు, ప్రవక్త (స), ‘నేను ఈ మెంబరు క్రింద ఒక పెద్ద గుప్త నిధిని దాచి ఉంచాను. దీన్ని మీకు పంచి పెట్టమని మాలిక్‌కు చెప్పాను, అందువల్ల మీరందరూ మాలిక్‌ వద్దకు వెళ్ళండి. ప్రజలు అక్కడి నుండి తిరిగి వచ్చి ‘మాలిక్‌ పంచిపెడతారా లేదా’ అని అన్నారు. మరొకరు ‘అతడు తనకు ఆదేశించబడింది తప్పకుండా చేస్తాడు’ అని అన్నారు. ఈ కల వల్ల మాలిక్‌ ఎంత ప్రభావితు లయ్యారంటే, అతడు ఏడుస్తూనే ఉన్నారు. అతడు ఏడుస్తూ ఉండగానే నేను వెళ్ళిపోయాను.”

అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ మహ్‌దీ కథనం: మేము మాలిక్‌ వద్దే ఉన్నాము. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి, ‘నేను 6 నెలల దూరం నుండి ఒక ప్రశ్న అడగాలని వచ్చాను’ అని అన్నాడు. ‘ఏమిటా ప్రశ్న’ అని అడిగారు. అతను చెప్పాడు. అప్పుడు మాలిక్‌ బిన్‌ అనస్‌, ‘దీన్ని గురించి నాకు సరిగ్గా తెలియదు,’ అని అన్నారు. అప్పుడా వ్యక్తి ఆశ్చర్యపడి, ‘మరి మా ఊరి వారితో ఏమనాలి’ అని అడిగాడు. దానికి మాలిక్‌ బిన్‌ అనస్‌ ‘తనకు తెలియదని అన్నారని చెప్పు’ అని అన్నారు. అప్పుడా వ్యక్తి అతని చెల్లెలితో ‘ఇతను ఇంట్లో ఏం చేస్తారు’ అని అడిగాడు. దానికి ఆమె ఖుర్‌ఆన్‌ పఠన సభలో రాజులు, అధికారులు అందరూ ఉంటారు. కాని సభ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది అని సమాధానం ఇచ్చారు.” (తహ్‌జీబుల్‌ అస్మా)

‘హదీసు’వేత్తల మధ్య అన్నిటి కంటే ప్రామాణికమైన ఉల్లేఖనం ఒక చర్చనీయాంశంగా ఉంది. అయితే నాఫె ద్వారా మాలిక్‌, ఇబ్నె ‘ఉమర్‌ ద్వారా నాఫె ఉన్న ఉల్లేఖనం అన్నిటి కంటే ప్రామాణికమైన ఉల్లేఖనంగా భావించబడుతుంది. ”జుహ్‌రీ కూడా ఇతని గురువుల్లో ఒకరు. అతడు కూడా ఇతని ద్వారా లాభం పొందేవారు. లైస్, ఇబ్నె ముబారక్, షాఫయీ ముహమ్మద్వంటి ప్రఖ్యాత పండితులు ఇతని శిష్యులే. షాఫయీ: ‘ఒక వేళ మాలిక్‌, సుఫియాన్‌ ఉండక పోతే హిజా’జ్‌ విద్య అంతమైపోయేది’ అని అనేవారు. ఇతని కంఠస్తం శక్తి ఎలా ఉండేదంటే ఏదైనా విషయం ఒకసారి వింటే చాలు మరెప్పుడూ మరచిపోయేవారు కాదు. ‘హదీసు’లు ఉల్లేఖించడానికి కూర్చున్నప్పుడు వు’దూ చేసి, మంచి బట్టలు ధరించి, సుగంధ పరిమళాలు పూసుకొని, దువ్వుకొని ఉండేవారు. ప్రజలు ఆ అలంకరణ గురించి అడిగితే ప్రవక్త (స) ‘హదీసు’ల గౌరవం కోసం అలా చేస్తున్నానని అన్నారు.

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అల్‌ ముబారక్‌ కథనం: ఒకసారి మాలిక్‌ ‘హదీసు’ బోధన ప్రారంభించారు. మధ్యలో అతని ముఖ వర్చస్సు మారసాగింది. కాని అతడు బోధను ముగించలేదు. తప్పులూ దొర్లలేదు. ముగించిన తర్వాత అడిగితే, ‘హదీసు’ బోధన మధ్యలో తేలు సుమారు 10 సార్లు కుట్టిందని తెలిపారు. ఇంకా ఇదంతా నేను అంత శక్తి నా కుంది అని చేయలేదు. ప్రవక్త (స) ‘హదీసు’లకు అంతరాయం కలుగ కూడదని అలా చేశాను. షాఫయీ తన చరిత్రలో ఇలా వ్రాస్తున్నారు, ”మాలిక్‌ ప్రవక్త (స)ను చాలా అధికంగా ప్రేమించేవారు. చివరికి వృద్ధాప్యంలో కూడా మదీనహ్ లో వాహనంపై ఎక్కేవారు కారు. ఇంకా, ప్రవక్త (స) శరీరం ఉన్న ప్రాంతంలో నేను వాహనంపై ఎక్కలేను అని అనేవారు.

మాలిక్‌ బిన్‌ అనస్‌ యొక్క సభ ఎప్పుడూ ఖరీదైన  చాపలతో విలాసవంతమైన దిండులతో ముస్తాబై ఉండేది. సభ మధ్యలో ప్రత్యేక కుర్చీ ఉండేది. ‘హదీసు’లను బోధించేటప్పుడు అక్కడ కూర్చునే వారు. అక్కడ కూడ శిష్యుల కోసం విసనకర్రలు ఉండేవి. సభ ప్రారంభ సమయంలో సువాసన పరిమళాలు వెదజల్లబడేవి. సభా ప్రాంగణంలో ఒక చెత్త రవ్వ కూడా కనబడేది కాదు. ‘హదీసు’లను బోధించేటప్పుడు ముందు వు’దూ లేదా గుసుల్‌ చేసి ఖరీదైన దుస్తులు ధరించి, తల దువ్వుకొని, సువాసన పులుముకొని వచ్చేవారు.

శిష్యులందరూ వినయ విధేయతలతో తలలు వంచుకొని కూర్చునే వారు. చివరికి అబూహనీఫా కూడా ఈ సభలోకి వచ్చి కూర్చునే వారు. ఆయన కూడా వినయ విధేయతలతో కూర్చునే వారు. సభలో మాలిక్‌ బిన్‌ అనస్‌ గౌరవం, ఆదరణ ఉట్టి పడేది. అందరూ నిశ్శబ్దంగా ఉండేవారు. షాఫయీ కథనం: మేము పుస్తకాల ప్రతులను శబ్దం అవుతుందేమో నన్న భయంతో తిరగవేసే వాళ్ళం కాము. ఆయన గౌరవం, నిశ్శబ్దం దృష్ట్యా ఆ సభ చక్రవర్తుల సభగా ఉండేది. విద్యార్థులు, పండితులు, అధికారులు, పాలకులు, బాటసారులు అందరూ వచ్చిపోయేవారు.

ఆయనకు ఎటువంటి అధికారం లేకపోయినా, పాలకులు వచ్చి ఆయన ముందు తలలు వంచి కూర్చునే వారు. షాఫయీ ఒకసారి తన విద్యాభ్యాసం కోసం మదీనహ్ గవర్నరును తన గురించి సిఫారసు చేయడానికి రమ్మంటే, అతడు అక్కడ నా మాట ఎలా చెల్లుతుంది అని అన్నాడు. హారూన్రషీద్ మదీనహ్ వచ్చినపుడు మాలిక్‌ను మువత్తా చదివి వినిపించ మని కోరాడు. అప్పుడు మాలిక్‌ తన సభలోకి వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాని మాలిక్‌ తన ఇంట్లో సభలో ఉన్నారు. ఆ తరువాత వచ్చి హారూన్‌ రషీద్‌ అడిగితే, ”విద్య మన దగ్గరకు రాదు, మనం విద్య దగ్గరకు వెళ్ళాలి” అని అన్నారు. చివరికి మాలిక్‌ సభలో హారూన్‌ రషీద్‌ కూర్చోవలసి వచ్చింది.

శిష్యులు, లాభం పొందేవారు: మాలిక్‌ ద్వారా ఎంతో మంది ఉల్లేఖించారు, వారిని లెక్క పెట్టటం సాధ్యం కాదు, అని ‘జహ్‌బీ పేర్కొన్నారు. పాండిత్యం పట్టా పొందిన వారు కూడా మాలిక్‌ సభలో శిష్యులుగా చేరే వారు. చివరికి ఆయన గురువులు కూడా ఆయన సభలో శిష్యులుగా కూర్చునే వారు. నాకు విద్య నేర్పి మళ్ళీ నాకు అడిగే అవసరం రానటువంటి వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు అని మాలిక్‌ పేర్కొన్నారు.

మాలిక్‌ శిష్యుల్లో షాఫయీ, ముహమ్మద్, అబూ యూసుఫ్, ఇబ్ను ఖాసిమ్ మాలికీ ప్రముఖులు. ఆది వారం నాడు అనారోగ్యానికి గురయ్యారు. సుమారు 3 వారాలు అనారోగ్యంతో ఉన్నారు. వ్యాధి ఏమాత్రం తగ్గలేదు. ఇది అతని చివరి సమయం అని అందరూ తెలుసుకున్నారు. మదీనహ్ కు చెందిన పండితులు, పాలకులు, మాలిక్‌ను చివరి సారిగా చూడటానికి హాజరయ్యారు. సేవకులు కూడా కంటతడి పెట్టారు. శిష్యులు కాక ‘హదీసు’ మరియు ఫిఖహ్‌కు చెందిన 160 మంది పండితులు, అతని చుట్టూ కూర్చొని కంటతడి పెట్టారు.

చలనం తగ్గుతూ పోయింది. కళ్ళంట నీళ్ళు కారుతున్నాయి. ప్రత్యేక శిష్యులైన ఖఅబనీ అప్పుడే వచ్చారు. పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అప్పుడు మాలిక్‌ నేను ఏడ్వక పోతే మరెవరు ఏడుస్తారు. నాకు ప్రతి ఖియాస్‌ ఫత్వాపై ఒక్కొక్క కొరడా దెబ్బ కొట్టి నేను ఫత్వా ఇవ్వకుండా ఉంటే బాగుణ్ణు అని మాట్లాడుతూనే ఉన్నారు. ఇంతలో ప్రాణం పోయింది.

మాలిక్‌ బిన్‌ అనస్‌ ప్రామాణిక ఉల్లేఖనాల ప్రకారం 93 హిజ్రీలో జన్మించారు. ఇంకా 11 రబీ ఉల్‌ అవ్వల్‌ 179 హిజ్రీ శకంలో మరణించారు. 86 సంవత్సరాలు వయస్సు పొందారు. 117 హిజ్రీ శకంలో విద్యాబోధన ప్రారంభించారు. 62 సంవత్సరాల వరకు ధార్మిక సేవలో నిమగ్నమయి ఉన్నారు. జనాజాలో ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. మదీనహ్ గవర్నర్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ము’హమ్మద్‌ హాష్మీ కాలినడకనే పాల్గొన్నారు. శవాన్ని ఎత్తినవారిలో కూడా ఉన్నారు. మదీనహ్ లో ఒక ప్రఖ్యాత స్మశాన వాటిక ఉంది (బఖీ’). ఇక్కడ పుణ్యాత్ములే ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ‘ఆయి’షహ్‌ (ర), ‘ఉస్మాన్‌ (ర), ‘హసన్‌ (ర), ఫాతిమహ్ (ర), ఖననం చేయబడి ఉన్నారు. అనంతరం మాలిక్‌ బిన్‌ అనస్‌ను కూడా ఇక్కడే ఖననం చేయడం జరిగింది.

—–

ఇమామ్ ముహమ్మద్బిన్ఇద్రీస్అష్షాఫయీ (రహ్మ)

ఇతను అబూ ‘అబ్దుల్లాహ్‌ముహమ్మద్బిన్ఇద్రీస్బిన్‌ ‘అబ్బాస్బిన్‌ ‘ఉస్మాన్బిన్షాఫె బిన్సాయిబ్బిన్ఉబైద్బిన్అబ్ద్యజీద్హాషిమ్బిన్‌ ‘అబ్దుల్ముత్తలిబ్ఇబ్నెఅబ్దు మునాఫ్ఖురైషీ మరియు ము’త్తలిబీ. షాఫె యవ్వనంలో ప్రవక్త (స)ను కలిసారు. ఇతని తండ్రి సాయిబ్ బద్ర్‌ యుద్ధంలో పట్టుబడ్డారు.. ఇతను బనీ హాషిమ్ నాయకులు. పరిహారం చెల్లించి విడుదల అయ్యారు. ఆ తరువాత ఇస్లామ్‌ స్వీకరించారు.

షాఫయీ, గజ్జహ్, అస్ఖలాన్ అనే ప్రాంతంలో 150 హిజ్రీ (767 క్రీ. శ.) లో జన్మించారు. 2 సంవత్సరాల వయస్సులో మక్కహ్ రావడం జరిగింది. కొందరు షాఫయీ, అస్ఖలాన్లో జన్మించారని అంటారు. ఇది అబూ హనీఫామరణించిన సంవత్సరం. మరికొందరు అబూ హనీఫా మరణించిన రోజే జన్మించారని అంటారు. జన్మించిన దినం గురించి కొన్ని ఉల్లేఖనాల్లో మాత్రమే ఉందని, అయితే ఆ సంవత్సరమే జన్మించిన విషయం మాత్రం ప్రాచుర్యంలో ఉందని బైహఖీ పేర్కొన్నారు. అదేవిధంగా షాఫయీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అతని తల్లిగారు ఒక నక్షత్రాన్ని కలలో చూశారు. అది అతని కడుపు నుండి బయటకు వచ్చి ముక్కలు ముక్కలు అయిపోయింది. దాని ముక్కలు ప్రతి పట్టణంలో పడ్డాయి. స్వప్న పరమార్థాన్ని చెప్పిన వారు, మీకు ఒక మహా ధార్మిక పండితుడు జన్మిస్తాడని అన్నారు. 

షాఫ’యీ కథనం: నేను స్వప్నంలో ప్రవక్త (స)ను దర్శించాను. ప్రవక్త (స) నాతో, ‘అబ్బాయీ! నీవెవరవు?’ అని అడిగారు. దానికి నేను ‘మీ వంశంలో వాడినే’ అని అన్నాను. ప్రవక్త (స), ‘దగ్గరకు రా’ అని అన్నారు. నేను దగ్గరయ్యాను. ప్రవక్త (స) తన ఉమ్మిని చేతిలోకి తీసుకున్నారు. నేను నా నోటిని తెరిచాను. ప్రవక్త (స) తన ఉమ్మిని నా పెదాలపై, నాలుకపై, ముఖంపై పులిమి ‘అల్లాహ్‌ నీలో శుభం ప్రసాదించుగాక!’ అని దీవించారు.

అదేవిధంగా షాఫయీ మరో కథనం: నేను బాల్యంలో ప్రవక్త(స)ను మక్కహ్ లో వెలుగుతో నిండిన వ్యక్తిలా హరమ్‌లో ప్రజలకు నమా’జ్‌ చదివిస్తూ ఉండటం చూశాను. నమా’జు ముగించిన తర్వాత ప్రజల వైపు తిరిగి కూర్చున్నారు. వారికి బోధించసాగారు. నేను అతనితో, ‘ప్రవక్తా! నాకూ బోధించండి’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స) తన చంకలో నుండి ఒక తూనిక తీసి నాకిచ్చి, ‘ఇది నీది’ అని అన్నారు. అక్కడ ఎవరో స్వప్నాల పరమార్థం చెప్పే వ్యక్తి ఉంటే, నేనతన్ని అడిగాను. దానికతను, ”నీవు ఒక మహా పండితుడ వవుతావు, ఇంకా నీవు ప్రవక్త సాంప్రదాయంపై స్థిరంగా ఉంటావు, ఎందుకంటే మస్జిదె ‘హరామ్‌ ఇమామ్‌ ఇమాములందరి కంటే గొప్పవాడు గనుక. ఇక తూనిక విషయం ఏమిటంటే, నీవు విషయాల వాస్తవం వరకు వెళతావు” అని అన్నారు.

ప్రజల కథనం: షాఫయీ ప్రారంభంలో అశ్రద్ధకు గురయ్యారు. అతన్ని పాఠశాలలో చేర్పించినపుడు అతని బంధువుల వద్ద గురువుకు ఇవ్వడానికి ఏమీ లేదు. ఆ పాఠశాల గురువు అతని పట్ల అశ్రద్ధగా వ్యవహరించే వాడు. కాని ఆ గురువు ఇతర విద్యార్థులకు ఏదైనా విషయం నేర్పడానికి నోటితో పలకగానే దాన్ని కంఠస్తం చేసుకునే వారు. గురువుగారు తన స్థానం నుండి వెళ్ళగానే షాఫయీ పిల్లలకు ఆ విషయాలు నేర్పే వారు. గురువు గారు దీన్ని పసి గట్టారు. షాఫయీ విద్యార్థులకు తనకంటే ఎక్కువ లాభం చేకూర్చడం గ్రహించారు. ఇక ఆ గురువుగారు పారితోషికం అడగటం మానివేసాడు. ఇది ఇలాగే కొనసాగింది. చివరికి 9 సంవత్సరాల వయస్సులో షాఫయీ ఖుర్‌ఆన్‌ విద్యను నేర్చుకున్నారు.

షాఫయీ’ కథనం: నేను ఖుర్‌ఆన్‌ పూర్తయిన తర్వాత మస్జిద్‌లో ప్రవేశించాను. పండితుల సభలో కూర్చోవటం ప్రారంభించాను. ‘హదీసు’లను, సమస్యలను కంఠస్తం చేసుకునేవాడిని. నా ఇల్లు ఖీఫ్వీధి, మక్కహ్ లో ఉండేది. మేము ఎంత పేదవార మంటే కాగితాలు కూడా కొనలేని పరిస్థితి. అందువల్ల నేను దుమ్ములను ఏరి వాటిపై వ్రాసుకునేవాడిని. మొట్టమొదట నేను ఫిఖహ్‌ విద్య ముస్లిమ్బిన్‌ ‘ఖాలిద్ వద్ద నేర్చుకున్నాను. అప్పుడే నాకు మాలిక్బిన్అనస్ అనే ఒక గొప్ప పండితులు ఉన్నారని తెలిసింది. నేనతని వద్దకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. అనంతరం మక్కహ్ లోని ఒక వ్యక్తి వద్ద నుండి మువత్తా అడిగితీసుకొని దాన్ని కంఠస్తం చేసుకున్నాను. ఆ తరువాత మక్కహ్ పాలకుని వద్దకు వెళ్ళాను. అతనితో మదీనహ్ పాలకునికి, మాలిక్‌ గారికి రెండు ఉత్తరాలు వ్రాయించుకున్నాను. మదీనహ్ చేరి మదీనహ్ పాలకునికి ఇచ్చాను. ఒకవేళ నువ్వు నా మదీనహ్ నుండి మక్కహ్ వరకు కాలి నడకన వెళ్ళమంటే అది నాకు చాలా సులభం గాని, మాలిక్‌ వద్దకు వెళ్ళడం చాలా కష్టం’ అని అన్నాడు. అప్పుడు నేను అతన్ని పిలుచు కుంటే బాగుంటుంది,” అని అన్నాను. దానికి ఆ పాలకుడు ఇది అంతకంటే కష్టమైన పని. ఒకవేళ వెళ్ళి అతని కడప ముందు నిలబడితే అతన్ని కలుసుకోవచ్చు అని ఇద్దరం వాహనం ఎక్కి ఆయన వద్దకు వెళ్ళాం.

ఒక వ్యక్తి ముందడుగు వేసి తలుపు తట్టాడు. నేను కష్టాలు పడిన తరువాత మాలిక్‌ బయటకు వచ్చి కూర్చున్నారు. మదీనహ్ పాలకుడు మక్కహ్ పాలకుని ఉత్తరం అతనికి ఇచ్చాడు. ఉత్తరం చదివిన తరువాత ప్రజలు సిఫారసుద్వారా విద్య నేర్చుకోవా లనుకుంటున్నారు?” అని అన్నారు. ”నీ పేరేమిటి?” అని అడిగారు. ”నేను ముహమ్మద్,” అని అన్నాను. అప్పుడు అతను ‘ఓ ముహమ్మద్‌! దైవానికి భయపడు, పాపాలకు దూరంగా ఉండు. అతి త్వరలో నీ గొప్పతనం బహిర్గతం అవుతుంది. అల్లాహ్‌ నీ హృదయంలో ఒక వెలుగు నింపి ఉంచాడు. దాన్ని దైవ ధిక్కారం ద్వారా ఆర్పివేయకు’ అని పలికి రేపు వచ్చినపుడు మువత్తా చదివే వారినెవరినైనా తీసుకు రా,” అని అన్నారు. అప్పుడు నేను చూడకుండా చదువుకోగలను అని అన్నాను. ఆ తరువాత రెండవ రోజు వచ్చి చదవటం ప్రారంభించాను. ఈవిధంగా అతని వద్ద విద్య ప్రారంభించాను. కొన్ని రోజుల్లోనే నేను మువత్తా పూర్తి చేసుకున్నాను. ఆ తరువాత మాలిక్‌ మరణం వరకు మదీనహ్ లోనే ఉన్నాను.

షాఫయీ మాలిక్‌ ద్వారా ఏదైనా వ్రాస్తే ఇది మా గురువు గారు మాలిక్అభిప్రాయం అని అనేవారు. అబ్దుల్లాహ్బిన్అహ్మద్బిన్హంబల్, ”నేను మా నాన్నగారితో ఈ షాఫయీ ఎవరు? ఎందుకంటే తరచూ తమరు ఆయన్ను గురించి ప్రార్థిస్తూ ఉంటారు” అని అన్నాను. దానికి మా నాన్నగారు, కుమారా! షాఫయీ పగటి సూర్యునిలా ఉండేవారు. ప్రజల కోసం అతడు శాంతి, క్షేమాలుగా ఉండేవారు.

షాఫయీ అనేక ప్రత్యేకతలు కలిగి ఉండేవారు. తూర్పు పడమరల్లో అందరికంటే గొప్ప పండితులుగా ఖ్యాతి గడించారు. అల్లాహ్‌ అనేక విద్యలు ఆయనకు ప్రసాదించాడు. అతనికి ముందు అతని తరువాత ఎవరికీ అంతటి గౌరవం లభించలేదు. షాఫయీ, మాలిక్ బిన్‌ అనస్‌, సుఫియాన్ బిన్‌ ఉయైన, ముస్లిమ్ బిన్‌ ఖాలిద్‌, ముహమ్మద్ బిన్ హసన్ షైబాని, అబూ హనీఫా, ఇంకా అనేకమంది పండితుల ద్వారా ఉల్లేఖించారు. ఇతని ద్వారా అహ్మద్‌ బిన్‌ హంబల్, అబూ సౌర్, ఇబ్రాహీమ్‌ బిన్‌ ఖాలిద్‌, అబూ ఇబ్రాహీమ్ ముజునీ, రబీ బిన్‌ సులైమ్‌ మురాదీ మొదలైనవారు ఉల్లేఖించారు. షాఫయీ 195 హిజ్రీ శకంలో బగ్దాద్ వెళ్ళారని అనేకమంది ఉల్లేఖించారు. అక్కడ రెండు సంవత్సరాలు ఉన్నారు. ఆ తరువాత మక్కహ్ వచ్చారు. కొన్ని నెలల తర్వాత ఈజిప్టు వెళ్ళారు. అక్కడ జుమ’అహ్ రాత్రి ఇషా సమయాన కన్నుమూశారు. శుక్రవారం నాడు, ఖననం చేయబడ్డారు. 30 రజబ్‌, 204 హిజ్రీ (20-1-820 క్రీ.శ.)లో 54 సంవత్సరాల వయస్సులో ఈజిప్ట్ లో మరణించారు.

రచనలు. 1. రిసాలహ్, 2. ఉసూల్ అల్ ఫిఖ్హ్, 3. కితాబ్ అల్ ఉమ్మ్, 4. ముస్నద్ షాఫయీ.

హారూన్ అర్రషీద్, అతని కుమారుడు హారూన్ అల్ అమీన్ – అబ్బాసీ రాజుల కాలంలో ఉన్నారు.

—–

అహ్మద్బిన్హంబల్అష్షైబానీ (రహ్మ)

అబూ అబ్దుల్లాహ్ – అహ్మద్‌ బిన్ ముహమ్మద్ బిన్‌ హంబల్‌ అష్షైబానీ 164 హిజ్రీ (780 క్రీ. శ.)లో బగ్దాద్‌లో జన్మించారు. 241 హిజ్రీ (855 క్రీ.శ.) లో 77 సంవత్సరాల వయస్సులో బగ్దాద్‌లోనే మరణించారు. ఫిఖహ్‌, ‘హదీసు’ భక్తి, ఆరాధనాల్లో చాలా ఖ్యాతి గడించారు. న్యాయం ధర్మం విషయంలో ప్రామాణి కతగా వ్యవహరించే వారు. ఇతను అబూ యూసుఫ్ గారి శిశ్యులు. బగ్దాద్‌లోనే విద్యాభ్యాసం పొందారు. ‘హదీసు’ పండితుల వద్ద ‘హదీసు’ విద్య పొందారు. ఆ తరువాత కూఫా, బస్రా, మక్కహ్, మదీనహ్, యమన్‌, సిరియా మొదలైన ప్రాంతాలను సందర్శించారు. ఆ కాలానికి చెందిన పండితులను ఒకచోట చేర్చారు. అ’హ్మద్‌ బిన్‌ హంబల్‌, య’జీద్‌ బిన్‌ హారూన్‌, యహ్‌యా బిన్‌ సయీద్‌ ఖుతాన్‌, సుఫియాన్ బిన్‌ ఉయైన, ము’హమ్మద్‌ బిన్‌ ఇద్రీస్‌ షాఫయీ, అబ్దుర్రజ్జాఖ్‌ బిన్‌ ఇల్‌హామ్‌ మొదలైన వారి ద్వారా ‘హదీసు’లు విన్నారు. ఇతని ఇద్దరు కుమారులు సాలిహ్‌, ‘అబ్దుల్లాహ్‌, చిన్నాన్న కొడుకు హంబల్‌ బిన్‌ ఇస్‌హాఖ్‌, ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మా’యీల్‌ బుఖారీ, ముస్లిమ్ బిన్‌ హజ్జాజ్‌ నేషాపూరీ, అబూ దావూద్ సఖ్తియానీ ఇంకా అనేకమంది ఇతని ద్వారా ఉల్లేఖించారు. విశేషం ఏమిటంటే కితాబుస్సదఖాత్‌ చివరిలో ఒక ‘హదీసు’ తప్ప బు’ఖారీ తన’స’హీ’హ్ బు’ఖారీలో దేనిని పేర్కొన లేదు. అదేవిధంగా అ’హ్మద్‌ బిన్‌ హుసైన్‌తిర్మిజి‘ కూడా ఇతని ద్వారా మరో ‘హదీసు’ ఉల్లేఖించారు.

అదేవిధంగా ఇతను ఎన్నో ప్రత్యేకతలు గల వ్యక్తి. ఇస్లామీయ విద్యల్లో ప్రముఖ స్థానం గల వ్యక్తి. అనేక దేశాల్లో ఇతని సూచనలను అనుసరించటం జరుగుతుంది. ఇతనికి అనేక ‘హదీసు’లు చాలా అధిక సంఖ్యలో గుర్తు ఉండేవి. అబూ జ’ర్‌అ కథనం ప్రకారం అ’హ్మద్‌ బిన్‌ హంబల్‌కు 10 లక్షల ‘హదీసు’లు గుర్తు ఉండేవి. అబూ దావూద్‌ సఖ్తియానీ కథనం ప్రకారం అతని సభల్లో పరలోకం గురించి చర్చలు జరిగేవి.

రబీ బిన్‌ సులైమాన్‌ కథనం: షాఫ’యీ ఈజిప్టు వెళ్ళారు. నన్ను ఈ ఉత్తరం అ’హ్మద్‌కు ఇచ్చి వేయమని అన్నారు. నేను ఉత్తరం తీసుకొని బగ్దాద్ వెళ్ళాను. ఫజర్‌ నమా’జులో అతన్ని కలసి ఉత్తరం ఇచ్చాను. ఇది షాఫయీ గారి ఉత్తరం అని చెప్పాను. దానికి అతను నువ్వు దీన్ని చూశావా అని అన్నారు.

సైమూన్‌ బిన్‌ అస్‌బ కథనం: నేను బగ్దాద్‌లో ఉన్నాను. నేను కేకలు విన్నాను. ‘ఈ శబ్దం ఏమిటి?’ అని అన్నాను. దానికి ప్రజలు, ”అ’హ్మద్‌ బిన్‌ హంబల్‌ను శిక్షించడం జరుగుతుంది,” అని అన్నారు. అతనికి కొరడాతో కొడుతుంటే ”బిస్మిల్లాహ్‌, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్‌, ఖుర్‌ఆన్‌ దైవ గ్రంథం అని, సృష్టితం కాదని అంటున్నారు. కొరడా దెబ్బలకు అతని పైజామా జార సాగింది. అప్పుడతను ఆకాశం వైపు చూసి, ”ఓ అల్లాహ్‌! నేను నీ ఉత్తమమైన పేర్లు ద్వారా అర్థిస్తున్నాను. నన్ను నగ్నత్వం నుండి కాపాడు” అని ప్రార్థించారు. పైజామా జారకుండా ఉండిపోయింది.

—–

ఇమామ్ ముహమ్మద్బిన్ఈసా బిన్సూరా తిర్మిజి (రహ్మ)

తిర్మిజి హిజ్రీ శకం 209లో జన్మించారు. పేరు ముహమ్మద్‌, అబూ ఈసా కునియత్‌. అతని వంశ పరంపర ముహమ్మద్‌ బిన్‌ ఈసా బిన్‌ సూరా బిన్‌ మూసా బిన్‌ అజ్జిహాక్‌ అస్సల్‌ము అజ్జురీర్‌ అల్‌ బూగీ అత్తిర్మిజీ‘. తిర్మిజీ తాతగారు మురూజీ ప్రాంతానికి చెందినవారు. కొన్ని కారణాల వల్ల తిర్మిజీ‘లో వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. సూరా అతని తాతగారి పేరు. తిర్మిజి’ వంశ పరంపర బనూ సులైమ్కు చేరుతుంది. ఇది బనీ గీలాన్ తెగలోని ఒక శాఖ. తిర్మిజి’ తండ్రిగారి పేరు ‘ఈసా. తిర్మిజీ’కి చాలామంది గురువులు ఉన్నారు. బు’ఖారీ, ముస్లిమ్‌, అబూ దావూద్‌, ఖతీబ్ బిన్‌ స’యీద్‌, ‘అలీ బిన్‌ ‘హాజర్‌, ము’హమ్మద్‌ బిన్‌ బష్షార్‌ మొదలైన వారందరూ తిర్మిజి’ గురువులు. తిర్మిజి’ యొక్క పాండిత్యం జామె తిర్మిజీ’ ద్వారా తెలుసుకోవచ్చు. బ’స్రా, కూఫా, వాసిత్‌, రే, ‘ఖురాసాన్‌, హిజా’జ్‌ మొదలైన ప్రాంతాలన్నీ తిర్మిజీ’ ప్రయాణ కేంద్రాలే.

తిర్మిజీ’ విశాల హృదయులు, జ్ఞాన సంపన్నులు, ఆలోచనా శక్తి, బుద్ధి వివేకాల గురించి వేరే చెప్పనక్కరలేదు లేదు. పై గుణాలన్నిటి గురించి జామె తిర్మిజీ’ ద్వారా తెలుసుకోవచ్చు. జామె తిర్మిజీ’ చదవడం వల్ల ‘హదీసు’వేత్తల నిష్పక్షపాతం, విశాల జ్ఞానం గురించి తెలుసుకోవచ్చు. ‘హదీసు’వేత్తలు సమస్యల్లో దూర దృష్టితో వ్యవహరించే వారు. అన్నీ కోణాల నుండి సమస్యలను పరికించేవారు. తిర్మిజీ’ ‘హదీసు’లు, వాటి వివరణలు  చదివే వారికి  మనశ్శాంతిని ప్రసాదిస్తాయి.

ఇతని శిష్యులు కూడా అనేకమంది ఉన్నారు. కొందరు చరిత్రకారులు తిర్మిజీ’ దైవ భీతివల్ల చాలా ఏడ్చేవారని, దీనివల్ల కళ్ళు దృష్టి కోల్పోయారని పేర్కొన్నారు. మరికొందరు తిర్మిజీ’ పుట్టుగ్రుడ్డివారని పేర్కొన్నారు. తిర్మిజీ’ 279 హిజ్రీ శకంలో, 70 సంవత్సరాలలో, మరణించారు. తిర్మిజీ’ రచనల్లో జామె తిర్మిజీ’, కితాబుల్‌ ఇలల్‌, షమాయిలె తిర్మిజీ’, ప్రఖ్యాతమైనవి. ఇవి అన్ని ప్రాంతాల్లో ప్రచురించబడ్డాయి. జామె తిర్మిజి 11 వందల సంవత్సరాల నుండి పాఠ్యాంశాలుగా కొనసాగుతూ వస్తుంది. జామె తిర్మిజీ’లో వివిధ పందాలు, స’హా బాలు తాబయీన్లు, ప్రామాణికతపై విమర్శలు, ‘హదీసు’ల్లో బలహీనతలు, కారణాలు, ప్రామాణిక ‘హదీసు’లు, అసత్య ‘హదీసు’లు మొదలైన వాటిలో ప్రత్యేక స్థానం ఉంది. ఇవి ఇతర పుస్తకాల్లో లేవు.

తిర్మిజీ’ కథనం: నేను జామె తిర్మిజిని రచించి ‘హిజా’జ్‌, ‘ఇరాఖ్‌, ఖురాసాన్‌ పండితుల ముందు పెట్టాను. మరో విష యం ఏమిటంటే, తిర్మిజి’ ‘హదీసు’ల పరంపర విషయంలో మోసపోకూడదని ‘హదీసు’వేత్తలు హెచ్చరించి ఉన్నారు. ఆ ప్రామాణిక గ్రంథాలలో బు’ఖారీ, ముస్లిమ్‌ తర్వాత 3 వ స్థానం తిర్మిజీ’కే ఇవ్వడం జరిగింది. దీనిపై ‘హదీసు ‘వేత్త లందరూ ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. కాని సుననె దార్మీ, సుననె అబూ దావూద్, సుననె నసాయి, జామె తిర్మిజీ విషయంలో పరస్పరం ప్రాధాన్యత ఇవ్వడం కష్టమే.

తిర్మిజీ’యొక్క పుస్తకం ”కితాబుల్‌ ఇలల్‌” ఒక గొప్ప పుస్తకం. ఇదీ ‘హదీసు’ విద్యార్థులకు చాలా అవసర మైనది. దీని అధిక భాగం బు’ఖారీ నుండి పొందినదే. దీన్ని తిర్మిజి’ స్వయంగా రచించారు.

షమాయిలె తిర్మిజీ: ప్రవక్త (స) దిన క్రియలు, భోజన, పానీయాలు, జీవనం, సలామ్‌, సంభాషణ, వస్త్రధారణ, సాక్సులు, ప్రజల పట్ల ప్రవర్తన, సద్గుణాలపై ఆధారపడి ఉన్నది. ప్రతి ముస్లిమ్‌ ఈ పుస్తకం చదివి ఆ ఉత్తమ గుణాలను అలవరచుకోవాలి. ఎందుకంటే ఈ గుణాలు ఒక ముస్లిమ్‌లో తప్పనిసరిగా ఉండాలి.

—–

ఇమామ్ అబూ దావూద్సులైమాన్బిన్అల్‌-అష్అస్ (రహ్మ)

ఇతను హిజ్రీ శకం 202లో జన్మించారు. 275 హిజ్రీ శకం షవ్వాల్‌ 14వ తేదీన బస్రాలో మరణించారు. అనేక సార్లు బగ్దాద్ వచ్చారు. చివరి సారిగా 271 హిజ్రీ శకంలో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇతను ‘అబ్దు ల్లాహ్‌ బిన్‌ మస్‌ లమహ్‌, ఖు’తుబీ, య’హ్‌యా బిన్‌ ము’యీన్‌, అహ్మద్బిన్హంబల్‌, ఇంకా ఇతర ‘హదీసు’వేత్తల నుండి ‘హదీసు’ లు సేకరించారు. ఇతన్నుండి ఇతని కుమారులు అబ్దుల్లాహ్‌, అబ్దుర్రహ్మాన్‌ నేషాపూరీ, అహ్మద్‌ బిన్‌ ముహమ్మద్‌ ఖిలాల్‌ మొదలైనవారు ‘హదీసు’లు సేకరించారు. అబూ దావూద్‌ స్రాలో నివాసమేర్పరచు కున్నారు. బగ్దాద్ వచ్చి అక్కడ తన రచన సుననె అబూ దావూద్ ను ఉల్లేఖించారు. అక్కడి ప్రజలు ఆ పుస్తకాన్ని అతని నుండి కాపీ కొట్టారు. దాన్ని అహ్మద్‌ బిన్‌ హంబల్‌ ముందు పెట్టారు. దాన్ని పరిశీలించి అతను చాలా ప్రశంసించారు. పొగిడారు. చాలా గొప్ప కార్యం అని ప్రోత్సహించారు.

నేను ప్రవక్త (స) నుండి పొందిన 5 లక్షల హదీసులను చేర్చాను. వాటిలో ఈ పుస్తకం కొరకు 4,800 ‘హదీసు’లను ఎన్నుకున్నాను. ఇందులో నేను మూడు రకాల హదీసులను పేర్కొన్నాను. వీటిలో ఒక మనిషి  కొరకు నాలుగు ‘హదీసు’లు సరిపోతాయి. 1. ప్రవక్త (స) ప్రవచనం, ”సత్కార్యాలు సంకల్పంపై ఆధారపడి ఉన్నాయి. 2. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటమే మనిషి గొప్పతనం. 3. మనిషి తన కోసం కోరిందే తన ముస్లిమ్‌ సోదరునికి కోసం కోరనంత వరకు నిజమైన విశ్వాసి కాలేడు. 4. ధర్మ సమ్మతాలు, నిషిద్ధాలు స్పష్టంగా ఉన్నాయి. వీటి మధ్య కొన్ని అనుమానాస్పద విషయాలు ఉన్నాయి. అబూ దావూద్‌ తన కాలంలో అందరి కంటే గొప్ప పండితులు. ఇతని కాలంలో ఇతని కంటే గొప్ప విద్యావకాశాలు పొందలేక పోయారు అని అబూ బకర్‌ ఖిలాల్‌ అభిప్రాయపడ్డారు.

అ’హ్మద్‌ బిన్‌ ముబర్‌జరీ అభిప్రాయం ప్రకారం ప్రవక్త (స) హదీసులను కంఠస్తం చేసేవారిలో, దాని లోటు పాటులు, లోపాలు, ప్రామాణికతలను గుర్తుంచుకునే వారిలో ప్రముఖులు, గొప్ప దైవభక్తులు, అబూ దావూద్‌ ఒక చేయి వదులుగా మరొకటి ఇరుకుగా ఉండేది.

—–

ఇమామ్ అహ్మద్బిన్ షుఐబ్ బిన్ అలి నసాయి (రహ్మ)

నసాయి’ హిజ్రీ శకం 215H (829G)లో జన్మించారు. పేరు అహ్మద్, కునియత్‌ – అబూ అబ్దుర్రహ్మాన్‌ ప్రఖ్యాత బిరుదు నసాయి. ఇతని వంశ పరంపర అహ్మద్బిన్షుఐబ్బిన్అలీ బిన్బహ్ర్బిన్సనాన్బిన్దీనార్, నాసా పట్టణంలో జన్మించారు. నసాయి ప్రాథమిక విద్య ఇక్కడే జరిగింది. 230 హిజ్రీ శకంలో 15 సంవత్సరాల వయస్సులో తన ఊరు వదలి విద్యార్జన కోసం ప్రయాణం ప్రారంభించారు. అన్నిటి కంటే ముందు బల్‌ఖలో ఉన్న ఖుతైబహ్‌ వద్దకు వెళ్ళారు. అక్కడ  విద్య నభ్యసించిన  తరువాత హిజాజ్‌, సిరియా, ఈజిప్టు, జీరాల వైపు ప్రయాణం చేశారు. చాలాకాలం వరకు ఈజిప్టులో నివసించారు. అతనికి అతని రచనలకు పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఈజిప్టులోనే. ప్రామాణిక విమర్శలో అందరికంటే గొప్ప పండితులుగా భావించబడేవారు. నసాయి చాలా దృఢంగా ఉండే వారు. ముఖం గులాబీ పువ్వులా ఎర్రగా ఉండేది. అతని శరీరంలో రక్త ప్రవాహం చాలా వేగంగా ఉండేది. కొందరు పండితులు కంఠస్తంలో ముస్లిమ్‌కు సమానులని భావిస్తారు.

నసాయి గురువుల్లో బుఖారీ, అబూ దావూద్ సజిస్తానీ, ఖుతైబ బిన్‌ సయీద్‌, ఇస్‌హాఖ్‌ బిన్‌ రాహ్‌వై, అలీ బిన్‌ ‘హజర్‌, సులైమాన్‌ బిన్‌ అష్‌అస్‌, ము’హమ్మద్‌ బిన్‌ బష్షార్‌ మొదలైన మహా పండితులున్నారు. అదేవిధంగా శిష్యులు కూడా తక్కువ లేరు. అబూ జ’అఫర్‌ తహానీ, అబుల్‌ ఖాసిమ్‌, తబ్రానీ, అబూ బషర్‌ దూలాబీ, అబూ బకర్‌ బిన్‌ సిన్నీ మొదలైన వారందరూ శిష్యులే.

ఒకసారి తర్‌తూన్‌ వెళ్ళినపుడు, అక్కడ ‘హదీసు’ సమ్మేళనం జరిగింది. అతన్నుండి నేర్చుకోవటం జరిగింది. ఇందులో అబ్దుల్లాహ్ అంటే అ’హ్మద్‌ బిన్‌ హంబల్‌ కుమారులు కూడా పాల్గొన్నారు. తన చివరి కాలంలో 302హిజ్రీ శకంలో ఈజిప్టు నుండి బయలుదేరి దిమిష్క్ చేరారు. అక్కడ ఖవారిజ్ కల్లోలంలో చిక్కు కున్నారు. అతన్ని ‘అలీ మరియు ము’ఆవియహ్‌లలో ఎవరు గొప్ప అని ప్రశ్నించడం జరిగింది. దానికి అతను ‘అలీ(ర) అని అన్నారు. దానికి వారు ఆగ్రహం చెందారు. కొట్టటం ప్రారంభించారు. కొంత ప్రాణం ఉండగా రమ్ తీసుకొని వెళ్ళారు. హిజ్రీ శకం 304 (915 G)లో వీర మరణం పొందారు. అక్కడే ఖననం చేయబడ్డారు. కొందరు చరిత్రకారులు అతన్ని మక్కహ్ తీసుకువెళ్ళారని, సఫా మర్వాల మధ్య ఖననం చేసారని పేర్కొన్నారు. ఇతని రచనల్లో సుననె నసాయి పేరు ప్రఖ్యాతులు గడించింది. ఇంకా అనేక రచనలు ఉన్నాయి. సయ్యిద్‌ జలాలుద్దీన్‌ కథనం ప్రకారం నసాయీ ముందు ఒక పెద్ద పుస్తకం తయారు చేశారు. దాని పేరు అస్సున నుల్కుబ్రా. దీన్ని ఒక ప్రత్యేక పంథాలో వ్రాయడం జరిగింది. అప్పటి పాలకుడు, ‘ఇందులో అన్నీ ప్రామాణిక ‘హదీసు’లు ఉన్నాయా?’ అని అడిగాడు. దానికి అతను, ‘లేదు’ అన్నారు. దానికి ఆ పాలకుడు ప్రామాణిక ‘హదీసు’లన్నిటినీ ఒక చోట సంకలనం చేయమని కోరాడు. అప్పుడు అల్ముజ్తబామిన్సుననుల్కుబ్రా అనే పుస్తకాన్ని సంకలనం చేశారు. ఇప్పుడు అదే సుననె నసాయిగా ప్రాచుర్యంలో ఉంది.

సుననె నసాయిలో ‘హదీసు’ ప్రామాణికతపై చాలా తక్కువగా చర్చించటం జరిగింది. ‘హదీసు’వేత్తలు దానికి అనేక వివరణలు వ్రాసారు. అందులో ఒకటి సిరాజుద్దీన్‌ ఇబ్నుల్‌ ముల్‌ఖిన్‌. దీన్ని కష్‌ఫుజ్జునూన్‌ రచయిత పేర్కొన్నారు. అభిప్రాయాలను ‘హదీసు’ల ద్వారా ఎదుర్కొన్న వారిలో నసాయీ కూడా ఒకరు.

—–

హాఫిజ్‌ ముహమ్మద్బిన్జీద్ ఇబ్నె మాజహ్ (రహ్మ)

‘హాఫిజ్‌ అబూ ‘అబ్దుల్లాహ్‌ –ముహమ్మద్బిన్జీద్ఇబ్నె మాజా ఈరాన్లో ఖజ్దీన్ పట్టణంలో హిజ్రీ శకం 209లో జన్మించారు. మాజహ్అతని తల్లి. ఆమె పేరుతోనే పిలవటం జరిగింది. అయితే కొందరు చరిత్రకారులు తండ్రి పేరని, మరికొందరు తాతగారి పేరుగా పేర్కొన్నారు. ఇతను రబీఅ బిన్నజార్ తెగకు చెందినవారు. అందువల్లే అతను రబీయీ అని పిలువబడతారు.

ధార్మిక విద్య ప్రత్యేకంగా అంటే ‘హదీసు’ విద్యలో సమయం గడిపేవారు. ఈ విద్య కోసం ఖురాసాన్‌, ఇరాఖ్‌, ‘హిజా’జ్‌, షామ్‌, మరియు ఈజిప్టు పండితుల వద్ద విద్యాభ్యాసం పొందారు. ‘హదీసు’లు సేకరించడంలో చాలా శ్రమించారు. ఇవే కాక అనేక ప్రాంతాలకు ‘హదీసు’లను సేకరించడానికి వెళ్ళడం జరిగింది. ఇతను విద్య నేర్చుకున్న పండితుల్లో జబ్బారహ్‌ బిన్‌ అల్ముఫ్లిస్, ఇబ్రాహీమ్‌ బిన్‌ అల్‌ మున్జిర్, ఇబ్నె నమిర్మరియు హిషామ్‌ బిన్‌ హిమార్ మొదలైన వారున్నారు. ప్రత్యేకంగా అబూ బకర్‌ బిన్‌ షైబహ్ పేరు కూడా ఇతని ప్రధాన గురువుల చిట్టాలో ఉంది. ‘హదీసు’ విద్యలో ఇబ్నె మాజహ్ మహా పండితులు, నిపుణులు.

తనకు గుర్తున్న ‘హదీసు’ల్లో 4000 ‘హదీసు’లను ఒక పుస్తకంగా సంకలనం చేశారు. అది 1500 అధ్యాయాలతో కూడిన 32 పుస్తకాల ద్వారా తయారు చేయబడింది. ఈ పుస్తకాన్ని తన గురువు పద్ధతిలోనే సంకలనం చేశారు. అయితే గురువుగారు ‘స’హాబాల ఫత్వాలను పేర్కొన్నారు. కాని ఇతను ఈ విషయంలో అతన్ని అనుకరించలేదు.

ఇతని పుస్తకాన్ని ‘హదీసు’వేత్తలు 6 స్థానం కల్పించారు. కొన్ని ‘హదీసు’ల విషయంలో వారికి అభ్యంతరం ఉంది.

6వ శతాబ్దం ప్రారంభం నుండి ఇప్పటి వరకు ‘హదీసు’వేత్తలు ఈ పుస్తకాన్ని సిహాసిత్తలో చేర్చటం, దీన్ని అనేక విధాలుగా ఉపయోగించటం, ప్రచురణ వల్ల దీనికి ప్రాముఖ్యత ఉందని తెలుస్తుంది. అయితే కొన్ని ప్రత్యేకతల వల్ల దీనికి ఇతర పుస్తకాలపై ప్రాధాన్యత కూడా లభించింది. ఇబ్నెహజర్ ఈ పుస్తకాన్ని గురించి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఇది చాలా ఉత్తమంగా, అనేక అధ్యాయాలపై ఆధారపడి ఉందని ప్రశంసించారు. ఈ పుస్తకం విషయంలో సేవలందించిన వారిలో షమ్‌సుద్దీన్‌ జహ్‌బీ, ‘హాఫిజ్‌ ఇబ్నె రజబ్‌ ‘హంబలీ, ‘హాఫి”జ్‌ ‘ఉమర్‌ బిన్‌ ‘అలీ అల్‌ ముల్ఖిన్‌ అష్షాఫయీ, అష్షైబ్‌ అద్దమీరీ, ‘హాఫిజ్‌ అబూ సీరీ, ‘హాఫిజ్‌ ఇబ్నుల్‌ అజమీ, హాఫిజ్జలాలుద్దీన్సుయూతీ మొదలైనవారు.

అదేవిధంగా ఈ పుస్తకం ద్వారా లాభం పొందినవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అతని శిష్యుల్లో అబుల్‌ ‘హసన్‌ త్తాన్, ‘ఈసా అల్‌ బహ్రీ మొదలైన వారున్నారు. చరిత్ర పుస్తకాల్లో ఇబ్నె మాజహ్ గురించి అంత ఎక్కువగా వివరా లేమీ లభించలేదు. కాని ‘హదీసు’ విద్యలో అతను వదలి వెళ్ళిన గ్రంథాల ఆస్తి అతన్ని గుర్తుంచేలా చేస్తుంది. ఇబ్నె మాజహ్ సునన్‌తో పాటు మరో రెండు పుస్తకాలు కూడా రచించారు. ఒకటి ఖుర్‌ఆన్‌ వ్యాఖ్యానంలో, మరొకటి చరిత్రలో.

అతను ఈ రెండు పుస్తకాల్లోనూ విలువైన వివరాలు పొందుపరిచారు. చరిత్ర పుస్తకాల్లో ప్రవక్త (స) అనుచరుల కాలం నుండి తన కాలం వరకు గల పరిస్థితులను పొందుపరిచారు. వ్యాఖ్యాన పుస్తకంలో వ్యాఖ్యానానికి సంబంధించిన విలువైన వివరాలు పొందుపరిచారు. ఇబ్నె మాజహ్ జీవిత వివరాలు చరిత్ర పుస్తకాల్లో చాలా తక్కువగా లభిస్తాయి. అతని ఘనకార్యాల ముందు అతని జీవిత వివరాలు అంత ప్రాముఖ్యమైన వేమీ కావు. అందువల్ల చరిత్రకారులు అతని ధార్మిక విద్యా ఘనకార్యాలపైనే దృష్టి సారించారు. చివరిగా అతను 64 సంవత్సరాల వయస్సులో తన నివాస పట్టణమైన ఖజ్దీన్లో హిజ్రీ శకం 273లో మరణించారు.

—–

అబ్దుల్లాహ్బిన్అబ్దుర్రహ్మాన్బిన్అల్ద్ల్బిన్బహ్రామ్దార్మీ (రహ్మ)

అబ్దుల్లాహ్‌ బిన్‌ ముబారక్‌ మరణించిన సంవత్సరం అంటే హిజ్రీ శకం 181లో దార్మీ సమర్ఖంద్లో జన్మించారు. దార్మీ అనేది ఒక జాతి పేరు. దార్మీ నిజాయితీ, విద్య, వివేకం, ఆరాధనల్లో ఆదర్శంగా ఉండేవారు. ‘హదీసు’ విద్య కోసం ఇస్లామీయ దేశాలకు ప్రయాణం చేశారు. ఇబ్నె అబీ ‘హాతిమ్‌, దార్మీ తన కాలంలో ఒక గొప్ప పండితులని తన తండ్రిగారు చెప్పే వారని అభి ప్రాయం వ్యక్తం చేశారు. ముస్లిమ్‌, తిర్మిజి‘, అబూ దావూద్‌, హ్మద్మొదలైన వారి సంతానంలాంటి ‘హదీసు’ పండితులు ఇతని వద్ద విద్య నేర్చుకున్నారు. నసాయి కూడా ఇతని ద్వారా ఉల్లేఖించారని హాఫిజ్‌ జహ్‌బీ అభిప్రాయపడ్డారు. ఖురాసాన్లో నలుగురు వ్యక్తులు ‘హదీసు’లను కంఠస్తం చేసేవారున్నారని, అబూ జ’ర్‌ అర్రాజీ, ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్, అ’హ్మద్‌ కుమారులు పేర్కొన్నారు.

ముస్నద్దార్మీ ఇతని ప్రముఖ రచనల్లో ఒకటి. దీన్ని ముస్నద్‌ అని అనడం ‘హదీసు’వేత్తల సాంప్రదాయానికి వ్యతిరేకం. ఈ పుస్తకంలో సులాసియాత్‌ ఇతర పుస్తకాలన్నిటి కంటే అధికంగా ఉన్నాయి. ఈ పుస్తకం 3557 ‘హదీసు’లతో కూడి ఉంది. అరఫా నాడు దార్మీ మరణించారు. ఈదుల్‌ అ’ద్హా నాడు ఖననం చేయబడ్డారు. బు’ఖారీ ఇతని  మరణవార్త విని విచారంతో తల దించుకున్నారు. కళ్ళంట అశ్రువులు రాలాయి.

ఈ సంవత్సరమే నేషాపూర్‌ ‘హదీసు’వేత్త అబ్దుర్ర’హ్మాన్‌ మరియు వాసిత్‌కు చెందిన ము’హమ్మద్‌ బిన్‌ హరబ్‌ నసాయీ మరియు దిమిష్క్‌కు చెందిన మూసా బిన్‌ ఆమిర్‌ మరియు గ్రోకరామియకు చెందిన వ్యవస్థాపకులు ముహమ్మద్‌ బిన్‌ కిరామ్‌ మొదలైన వారు మరణించారు. (తజ్‌కిరతుల్‌ ‘హుఫ్ఫాజ్‌ 2/105) బుస్తానుల్‌ ము’హద్దిసీన్‌.

—–

అలీ బిన్ఉమర్దారు ఖుతునీ (రహ్మ)

దారు ఖుతునీ హిజ్రీ శకం 306 (918CE)లో జన్మించారు. హిజ్రీ శకం 385 (995CE)లో మరణించారు. దార ఖుతున్బగ్దాద్లో ఒక పెద్ద ప్రాంతం పేరు. దార ఖుతునీ ఇక్కడే ఉండే వారు. ‘హదీసు’ విద్య కోసం కూఫా, స్రా, సిరియా, వాసిత్‌, ఈజిప్టు మొదలైన ఇస్లామీయ దేశాలు ప్రయాణం చేశారు. షాఫయీ మార్గాన్ని అనుసరించారు. ‘హాకిమ్‌ నిషాపూరీ, అబుల్ హసన్ ఇస్ఫహానీ, ‘అబ్దుల్‌ ‘గనీ, మున్‌జిరీ, రాజీ, ఫవాయిద్‌, అబూ నయీమ్‌ మొదలైన వారందరూ ఇతని శిష్యులు. ‘హదీసు’ పరిశీలనలో గొప్ప పండితులు. తన ప్రత్యేక దృష్టి కలిగి ఉండేవారు. ఖతీబ్‌ మరియు ‘హాకిమ్‌ వీరిని ఎంతో గౌరవించేవారు. అదేవిధంగా అరబీ గ్రామర్లో కూడా పట్టు ఉండేది. అతని జ్ఞాపకశక్తి ఎలా ఉండేదంటే తన యవ్వనంలో ఇస్మా’యీల్‌ సఫ్ఫార్‌ క్లాసులో కూర్చొని ఏదో వ్రాస్తూ ఉన్నారు, ”ఈ విధంగా అయితే నీ వినడం చెల్లదని, ఇటు వ్రాస్తున్నావు, అటు వింటున్నావు” అని  ఎవరో అన్నారు. అప్పుడు దారు ఖు’తునీ ‘ఇప్పటి వరకు గురువుగారు ఎన్ని ‘హదీసు’లు చెప్పారో గుర్తుందా?’ అని అడిగారు. దానికి అతను ‘లేదు’ అని అన్నారు. అప్పుడు దారు ఖుతునీ ’18 ‘హదీసు’లు’ అని పలికి ఒక్కొక్కటిగా వినిపించటం ప్రారంభించారు. ఇది విని అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

అబుల్‌ ‘హసన్‌ బైదావీ ఒక వ్యక్తిని తీసుకొని దారు ఖు’తునీ వద్దకు వచ్చారు. ”ఈ వ్యక్తి చాలా దూరం నుండి ‘హదీసు’ విద్య నేర్చుకోవడానికి వచ్చాడు. ఇతనికి కూడా కొన్ని ‘హదీసు’లు బోధించండి” అని అన్నారు.

దారు ఖు’తునీ గొప్ప విద్యావంతులు అనడానికి ఒక సంఘటన ఉంది: ఒకసారి దారు ఖుతునీ నమా’జులో నిమగ్నమయి ఉన్నారు. విద్యార్థుల్లో ఒకరు ‘నుసైర్‌’ను ‘బషీర్‌’ అని చదివారు. దారు ఖు’తునీ అది విని ‘సుబ్‌’హా నల్లాహ్‌’ అని అన్నారు. అతడు తన్ను తాను సరిదిద్దు కుంటాడని, కాని ఆ వ్యక్తి మరోసారి ‘యుసైర్‌’ అని చదివాడు. తన్ను తాను సరిదిద్దుకోక పోవటం చూసి, ”నూన్‌ వల్‌ ఖలమి వమా యస్తురూన్‌” చదవటం ప్రారంభించారు. అంటే ఆ ఉల్లేఖన కర్త పేరు నూన్‌తో ప్రారంభమవుతుందని తెలుపటానికి. అదేవిధంగా ఒక వ్యక్తి అమ్ర్‌ బిన్‌ షుఐబ్‌ను అమ్ర్‌ బిన్‌ స’యీద్‌ అని చదవటం జరిగింది. ఇక్కడ కూడా దారు ఖుతునీ సుబ్‌’హానల్లాహ్‌ అనడం జరిగింది. కాని ఆ వ్యక్తి వినక పోయినప్పటికీ దారు ఖు’తునీ ”యా షుఐబ్‌ అసలాతక తామురుక” అని చదివారు. కితాబు సునన్ దారఖుత్ని వ్రాసారు.

‘హాఫిజ్‌ అబూ నస్ర్‌ మాకూలా కథనం: నేను కలలో దైవ దూతలను దారు ఖుతునీ గురించి అడుగుతున్నాను. దానికి వారు స్వర్గంలో అతనికి ఇమాము అని బిరుదు లభించిందని అన్నారు. బాబ్ ‘హర్బ్‌లో మ’అరూఫ్‌ కర్‌ఖీ వద్ద వీరి సమాధి ఉంది. (తజ్‌కిరహ్‌ 3/186, ఇబ్ను ఖల్‌కా 1/331)

—–

అహ్మద్బిన్హుసైన్అల్బైహఖీ (రహ్మ)

సుననె బైహఖీ యొక్క రచయిత అహ్మద్‌ బిన్‌ హుసైన్‌, షాబాన్‌ నెల హిజ్రీ శకం 384లో బైహఖీ ప్రాంతంలో జన్మించారు. తన కాలంలో ప్రఖ్యాత ‘హదీసు’ వేత్త మరియు ధార్మిక వేత్త. వీరు 1000 వరకు పుస్తకాలు రచించారని ప్రతీతి. వీటిలో ముఖ్యమైనవి కితాబు మబ్‌సూత్‌, కితాబుస్సునన్, కితాబు ఆదాబ్‌, కితాబు ఫ’దాయిలు సహాబహ్, కితాబు ఫ’దాయిలి అల్‌ఖాత్‌, కితాబు షుఅబిల్ఈమాన్ మొదలైనవి.

చరిత్రకారుల ప్రకారం వీరి రచనల ద్వారా ముస్లి ములు లాభం పొందిన 7 పండితుల్లో బైహఖీ ఒకరు. వీరు నేషాపూర్లో హిజ్రీ శకం 486లో మరణించారు.

—–

జీన్బిన్ముఆవియహ్అబ్దరీ (రహ్మ)

రజీన్బిన్ముఆవియహ్ పుట్టిన తేదీ తెలియలేదు. వీరు అబ్దుద్దార్ తెగకు చెందినవారు. ఇది ఖురైష్ తెగల్లోని ఒకటి. వీరు హిజ్రీ శకం 520లో మరణించారు.

—–

ఇమామ్ హుసైన్బిన్మస్ఊద్ గవీ

ముహ్యిస్సున్నహ్ (రహ్మ)

ఇతని కునియత్‌ అబూ ముహమ్మద్‌. పేరు హుసైన్, తండ్రి పేరు మస్‌’ఊద్‌. వీరు ఖురాసాన్లోని బాగ్షూర్ గ్రామానికి చెందినవారు. వీరు చాలా గొప్ప పండితులు. ‘హదీసు’వేత్త, వ్యాఖ్యాన కర్త, దైవభక్తులు. వీరు ఎండు రొట్టెలపై కాలం గడిపేవారు. ప్రఖ్యాత మఆలిము త్తన్జీల్ను వీరే రచించారు. ‘హదీసు’లో షర్హు స్సున్నహ్‌, తఫ్సీర్ బగవి, రచించారు.  ప్రవక్త (స)ను కలలో చూశారు. ప్రవక్త (స) ఇలా దీవించారు, ”అల్లాహ్‌ నీకు దీర్ఘాయుష్షు ప్రసాదించు గాక! నీవు నా సాంప్రదాయాన్ని సజీవ పరచినట్టు.” అందువల్లే వీరికి ముహ్యుస్సున్నహ్ అనే బిరుదు లభించింది. మరొక బిరుదు – రుక్నెదీన్.  మసాబీహ్ ను 1.2 విభాగాలలో విభజించారు. ఇది 11 పుస్తకాల నుండి సంకలనం చేశారు. వీరు హిజ్రీ శకం 516 H / 1122 CE లో మరణించారు.

—–

ఇమామ్ముహమ్మద్బిన్అబ్దుల్లాహ్అల్ తీబ్అత్ తబ్రేజీ (రహ్మ)

మసాబీహ్‌లో రెఫరెన్సులు ఉండేవి కావు. పండితులు దీన్ని పెద్ద లోపంగా భావించేవారు. ఈ లోపాలను సరిదిద్దటానికి అబ్దుల్లాహ్తీబ్తబ్రేజీ ప్రత్యేకంగా కృషి చేశారు. 737 హిజ్రీ శకంలో లోపాలన్నీ సరిదిద్ది, 3 విభాగం పెంచారు. దీని పేరు  ”మిష్కాతుల్మసాబీహ్” పెట్టారు. దీన్ని ముస్లిములు విశాల హృదయంతో ఆదరించి స్వీకరించారు. ప్రపంచంలోని ఇస్లామీయ విద్యాలయాల్లో దీన్ని పాఠ్యపుస్తకంగా స్థానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేకమంది పండితులు దీని వివరణలు కూడా వ్రాశారు. 1.ముల్లా అలీ ఖారీ, మిర్ఖాతుల్మసాబీహ్ అనే పేరుతో వ్రాశారు. 2. షాహ్అబ్దుల్హఖ్ముహద్దిస్దెహెల్వీ అరబీలో ”షరహ్ లమ్ ఆతిత్తన్‌ఖీ’హ్‌”ను వ్రాశారు. 3. ఫారసీలో ”అష్షిఅతు ల్లమఆత్” వ్రాశారు. ఆధునిక యుగంలో 4. ఉబేదుల్లా ముబారక్పురీ మిర్ఆతుల్మసాబీహ్‌” అనే పేరుతో వివరణ వ్రాశారు. 5. ము’హమ్మద్‌ ఖు’తుబుద్దీన్‌ ము’హమ్మద్‌ ముహ్‌యిద్దీన్‌ దహెల్వీ మజాహెర్‌ హఖ్ అనే పేరుతో ఉర్దూలో మిష్కాత్‌ అనువాదం వ్రాశారు. 6. నిమిత్త మాత్రుడు అబ్దుస్సలామ్బిన్ యాద్ అలీ బస్తవీఅన్వారుల్మసాబీహ్” అనే పేరుతో దీని అనువాదం, వివరణ వ్రాశారు. అల్లాహ్‌ మనందరి కృషిని స్వీకరించుగాక! ఆమీన్‌.

—–

అబ్దుస్సలామ్స్తవీ (రహ్మ)

(మిష్కాతుల్సాబీహ్ఉర్దూ అనువాదకులు)

అబ్దుస్సలామ్బిన్షేఖ్యాద్ అలీ బిన్షేఖ్ఖుదా ఖ్ష్బిన్షేఖ్జుహూర్ యొక్క పూర్వీకులు ఫైజాబాద్కు చెందినవారు. 1857లో ఫైజాబాద్‌ నుండి బస్తీ జిల్లాలోని బిషన్పూర్కు వలసపోయారు. ఇక్కడ నివాస మేర్పరచుకున్నారు. వీరు హిజ్రీ శకం 1327లో బిషన్పూర్లో జన్మించారు. ప్రాథమిక విద్యకోసం నేపాల్ వెళ్ళి పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. తల్లిదండ్రులతో పాటు కలకత్తా వెళ్ళారు. 15 రోజుల తర్వాత తండ్రిగారు చనిపోయారు. కేవలం తల్లిగారే మిగిలారు. అప్పుడు వారి వయస్సు 10 సంవత్సరాలు. మిల్లులో పనిచేయ సాగారు. పగలంతా పనిచేసి సాయంత్రం వీధి వారి వద్ద ఉర్దూ చదవసాగారు. 11 సంవత్సరం వరకు ఇలాగే గడిపారు. మళ్ళీ తన సొంత ఊరు వచ్చారు. ఆ తరువాత ఢిల్లీ వెళ్ళి తన విద్యాభ్యాసం ప్రారంభించారు. ఈ విధంగా అనేక ప్రాంతాలలో విద్యాభ్యాసం జరిగింది.

ఢిల్లీలో 8వ జమాఅత్‌ వరకు విద్యాభ్యాసం పొందారు. ఆ తరువాత దేవ్బంద్లో విద్యాభ్యాసం పొందారు. ఆ తరువాత ఢిల్లీ వచ్చారు. ఆ తరువాత మౌల్వీ ఫాజిల్‌ (పంజాబ్‌) పాసయ్యారు. ఆ తరువాత హిజ్రీ శకం 1349లో షవ్వాల్‌ నెలలో మద్‌రసహ్ ”దారుల్‌ ‘హదీస్‌’ వల్‌ ఖుర్‌ఆన్‌,” మద్‌రసహ్ ”హాజీ ‘అలీ జాన్‌”లో ఉపాధ్యాయునిగా సేవలు ప్రారంభించారు. అల్‌ హమ్‌దులిల్లాహ్‌ 16 సంవత్సరాల వరకు దర్సె’హదీస్‌’ ఇస్తూ ఉన్నారు.

వివాహం: హిజ్రీ శకం 1350లో ఖుర్బాన్‌ ‘అలీ గారి కుమార్తె షాహ్‌బానుతో వివాహం జరిగింది. హిజ్రీ శకం 1354లో ము’హమ్మద్‌ యాఖూబ్‌ ‘అలీ (నేపాల్‌)గారి ఉమ్మె మహ్‌మూదహ్ కుమార్తెతో పెళ్ళి జరిగింది.

సంతానం : మొదటి భార్యతో ‘అబ్దుర్రషీద్‌, ‘అబ్దుల్‌ ‘హలీమ్‌ సానీ, అబ్దుల్‌ ‘అ’జీ’జ్‌ ‘అబ్దుల్‌ మన్నాన్‌. ఆమినహ్‌, ‘అబ్దుల్‌ ‘హలీమ్‌ నెల తర్వాత, ‘అబ్దుల్‌ ‘అ’జీ’జ్ 2 సంవత్సరాల తర్వాత మరణించారు.

రెండవ భార్య ద్వారా ‘అబ్దుల్‌ ‘హయ్యి, ‘అబ్దుల్‌ ‘హన్నాన్‌, మ’హ్‌మూదహ్‌, మస్’ఊదహ్‌. ‘అబ్దు స్సమద్‌ 25 రోజుల తర్వాత, ‘హమీదహ్ 2 సంవత్సరాల తర్వాత మరణించారు.

దేశవిభజన: హిజ్రీ శకం 1366 వరకు ”హాజీ ‘అలీ జాన్‌”లో దర్సె ‘హదీస్‌’ కొనసాగుతూ ఉండేది. కాని హిజ్రీ శకం 1366లో కల్లోలం వల్ల తిరిగి స్వగ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. ఆగస్టు 15, 1947 స్వాతంత్య్రం లభించింది. 100 సంవత్సరాల తర్వాత స్వాతంత్య్రం లభించినందుకు తమ సోదరుల రక్తంతో హోలీ ఆడటం జరిగింది. స్వాతంత్య్రం మత్తులో హద్దుమీరి ప్రవర్తించారు. కళ్ళపై తెరలు క్రమ్ముకున్నాయి. ఇతరుల కోసం తయారుచేసిన ఆయుధాలను తమ సోదరులపైనే ఉపయోగించసాగారు. ఎటు చూసినా విప్లవం వర్థిల్లాలి అనే నినాదాలే వినపడ సాగాయి. ఢిల్లీ భారత రాజధాని. అందువల్ల ఇక్కడ కూడా హత్యలూ, లూటీలు జరుగుతాయని ఎంత మాత్రం అనుమానం రాలేదు. వివిధ ప్రాంతాలను రంగు రంగుల లైట్లతో అలంకరించడం జరిగింది. మా కార్యాలయం చాందినీ చౌక్‌ ప్రక్కనే ఉన్న ఘంటా హౌస్‌ ప్రక్కన మస్జిదె ‘హాజీ ‘అలీ జాన్‌ ఉత్తరాన ఉన్న గదిలో ఉండేది. ఈ 17 సంవత్సరాల కాలంలో చదువు చెప్పటంతోపాటు రచనలు కూడా వ్రాశాను. అనేక అంశాలపై చాలా పుస్తకాలు రచించాను. కొన్ని ప్రచురించ బడ్డాయి, మరికొన్ని పుస్తకాలు ఇప్పటి వరకు ప్రచురణకు నోచుకోలేదు.

1. ఇబ్నె మాజహ్ ‘అరబీ వివరణ, 2. అస్సిమ్‌ సాముల్‌ బారీ అలా ఉన్నఖి జారిహిల్‌ బు’ఖారీ, 3. ఖైరుల్‌ ముతాయిద్‌ఫీ మసాయి లిర్రజాఅ, 4. అల్ల యిబ్‌ బిల్‌ షత్‌రంజ్‌, 5. హుఖూఖుజ్జౌజైన్‌, 6. ఇంకా అనేక వివిధ అంశాలపై గల పుస్తకాలు వీటన్నిటినీ 1947 కల్లోలంలో ధ్వంసం చేయడం జరిగింది. దీనివల్ల నేను చాలా విచారానికి గురయ్యాను.

స్వగ్రామం తిరుగు ప్రయాణం: మూడు నెలలు బిక్కు బిక్కుమని గడిపిన తర్వాత స్వగ్రామం తిరుగు ప్రయాణంలో అనేక విలువైన వస్తువులు ధ్వంసం అయ్యాయి. నానా కష్టాలు పడిన తర్వాత స్వగ్రామం చేరుకున్నాము. 27 సంవత్సరాలు ఢిల్లీలో ఉండటం వల్ల ఇంటిని ఇతరులు ఆక్రమించుకొని ఉన్నారు. అందువల్ల బంధువుల వద్దకు వెళ్ళాము. కాని వారు కూడా అసభ్యంగా ప్రవర్తించి, గాయంపై ఉప్పుచల్లే విధంగా ప్రవర్తించారు. ఈ చేదు గుర్తులు ఇంకా మరచి పోకముందే ‘హమీదహ్, ‘అబ్దుల్‌ ‘అ’జీమ్‌ ఒకరి తరువాత ఒకరు మరణించారు. ఇటు పనిలేదు, వ్యాధులు, బంధువుల చేదు మాటలతో దెప్పి  పొడవటం మరీ అధికం అయ్యాయి. పరిస్థితి ఎలా ఉండేదంటే, నేనొకచోట, పిల్లలు ఒకచోట. కొంతమంది బస్తీలో మరికొంతమంది నేపాల్లో అనేక కష్టాల తర్వాత ఒక పాడుపడిన ఇల్లు కొని దాన్ని రిపేరు చేయించి అందులో ఉంచాను. ఆ తర్వాత ఢిల్లీ నుండి అనేక ఉత్తరాలు వచ్చాయి. కాని అనేక అసహాయతల వల్ల వెళ్ళ లేక పొయాను. పరిస్థితులు సద్దు మణిగిన తర్వాత 1948 ఢిల్లీ వచ్చాను. ”రియా’దుల్‌ ‘ఉలూమ్‌,” మఛలీవాలాన్‌లో దర్సె ‘హదీసు’ ప్రారంభమయింది. అల్‌’హమ్‌దులిల్లాహ్‌ హిజ్రీ శకం 1344 నుండి 1378 వరకు ఈ పరంపర కొనసాగింది. మిగిలిన జీవితం కూడా దైవ సేవలోనే గడిపే భాగ్యం ప్రసాదించాలని అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాను. ఆమీన్‌.

రచనలు: విద్యాబోధన, సమావేశాలు తరువాత మిగిలిన సమయంలో అనేక పుస్తకాలు వ్రాశాను. అవన్నీ ప్రచురించడం జరిగింది. ఆదరించడం జరిగింది. 1. ఇస్లామీ సీరత్‌, 2. ఇస్లామీ పర్దా, 3. ఇస్లామీ అఖాయిద్‌, 4. ఇస్లామీ వజాయిఫ్, 5. బలాగుల్‌ ముబీన్‌ యొక్క అనువాదం మిస్‌బాహుల్‌ మూమినీన్‌, 6. కష్‌ఫుల్‌ ముల్‌హిమ్‌, 7. ఖవాతీనె జన్నత్‌, 8. ఇస్లామీ తౌహీద్, 9. హలాల్‌ కమాయీ, 10. అఖ్‌లాఖ్‌ నామ, 11. కలిమయె తయ్యిబ విశేషాలు, 12. ఈమాన్‌ ముఫస్సిల్‌, 13. కితాబుల్‌ జుము’అహ్‌, 14. ఇస్లామీ తాలీమ్‌, 15. రిసాల ఉసూలెహదీస్‌’, 16. ఫ’దాయిలె ‘హదీస్‌’, 17. ఫ’దాజాయిలె ఖుర్‌ఆన్‌, 18. నోటిపై నిఘా, 19. మిష్‌కాతుల్‌ మసాబీహ్‌ అనువాదం అన్వారుల్మసాబీహ్, 20. మాసపత్రిక ”అల్‌ ఇస్లామ్‌” 21. పరోక్ష నింద మొదలైనవి.

హజ్‌: చాలాకాలంగా ‘హజ్‌కు వెళ్ళాలని, అల్లాహ్‌ గృహం దర్శనం చేసుకోవాలని కోరికగా ఉండేది. అల్లాహ్‌ దయవల్ల హిజ్రీ శకం 1368లో ఈ భాగ్యం కలిగింది. హిజ్రీ 1368 జుల్‌ ఖఅదహ్‌లో ఢిల్లీ ”రియా’దుల్‌ ‘ఉలూమ్‌” నుండి బయలుదేరాను. ముహమ్మదీ నౌక ద్వారా జిల్‌ హిజ్జహ్‌ 4న జిద్దహ్‌ చేరుకున్నాము. జిల్‌హిజ్జహ్‌ 6న మక్కహ్ ముకర్రమహ్ చేరి అల్లాహ్‌ గృహాన్ని దర్శించు కున్నాను. 8న మినా, 9న అరఫాత్‌, 10న రాత్రి ముజ్’దలిఫా మరియు మినాలో ఉన్నాను. ఈ విధంగా ‘హజ్‌ విధులు నిర్వర్తించాను. క్రీ.శ. 1949 నవంబర్‌ 8న తవాఫె విదా చేసి మదీనహ్ కు బయలుదేరాను. అక్కడకు చేరిన తర్వాత చాలా సంతోషం కలిగింది. చాలా కాలంగా మనసులోని కోరిక తీరిందని చాలా సంతోషించాను. ఆ తరువాత క్షేమంగా జిద్దహ్‌ వచ్చి, అక్కడి నుండి అక్బరీ నౌక ద్వారా ముంబయి చేరుకొని అక్కడి నుండి ఢిల్లీ చేరు కున్నాను. ఈ విధంగా నా ‘హజ్‌ యాత్ర పూర్తయ్యింది. వచ్చిన తర్వాత విధుల్లో నిమగ్నం అయిపోయాను. ఆ తరువాత మరోసారి క్రీ.శ. 1958లో ‘హజ్‌కు వెళ్ళాను. అల్లాహ్‌ దయవల్ల మరోసారి బైతుల్లాహ్‌ దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది.

—–

ముహమ్మద్ నాసిరుద్దీన్ అల్బానీ (రహ్మ)

ముహమ్మద్ నాసిరుద్దీన్ అల్బానీ గారు ఈ కాలపు ప్రముఖ ‘హదీసు’వేత్తలలో ఒకరు. వీరు 2-10-1914 లో షోదర్ అనే అల్బానియా గ్రామంలో జన్మించారు. డెమాస్కస్, సీరియాకు వలస పోయారు. ఇతను మొదట హనఫి ఫిఖ్ ను అనుసరించారు. తరువాత సలఫి అఖీదహ్ పై ఉన్నారు. 60 సంవత్సరాలు ‘హదీసు’ విద్యను బోధించారు. ఇస్లామిక్ యూనివర్సిటీ మదీనహ్ మునవ్వరహ్ లో కూడా ‘అబ్దుల్ ‘అ’జీ’జ్ బిన్బా’జ్ ఆహ్వానంతో, కొన్ని సంవత్సరాలు ‘హదీసు’ విద్యను బోధించారు. డెమాస్కస్ లో అ’జ్ ‘జుహీరియా లైబ్రరీలో కూడా పని చేసారు.

ఖ’తర్, ఈజిప్ట్, కువైత్, యూ.ఏ.యీ., జోర్డాన్ బేరూత్, దేశాలలో ‘హదీసు’ విద్యను బోధించారు. మక్కహ్ ముకర్రమహ్ లో కొన్ని సంవత్సరాలు ఇస్లామిక్ లా విభాగంలో కూడా పని చేసారు. చివరి కాలంలో జోర్డాన్ లో 1999లో, 89 సంవత్సరాల వయస్సులో మరణించారు.

ఈయన కొన్ని ప్రచురణలు. (1) తర్గీబ్ వ తర్హీబ్, (2) తస్ఫియహ్ వ తర్బియహ్, (3) ‘స’హీ’హ్ వ ‘దయీఫ్ సునన్ – అబూ దావూద్, (4) ‘స’హీ’హ్ వ ‘దయీఫ్ సునన్ – తిర్మిజి’, (5) ‘స’హీ’హ్ వ ‘దయీఫ్ సునన్ – ఇబ్నె మాజహ్, (6) సిల్సితుల్ అ’హాదీస్’ ‘దయాఫహ్ [14 సంపుటాలు], (7) సిల్సితుల్ అ’హాదీస్’ ‘స’హీ’హహ్ [11 సంపుటాలు] మొదలైనవి.

ఈయనకు 1999 లో ఇస్లామిక్ స్టడీస్ లో కింగ్ ఫైసల్ ఇంటర్నేషనల్ అవార్డ్ కూడా పురస్కరించబడింది.

*****

%d bloggers like this: