మహా ప్రవక్త మహితోక్తులు – 9. ఇస్తిస్ఖా నమాజు ప్రకరణం

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
ఉర్దూ అనువాదం: సయ్యిద్ షబ్బీర్ అహ్మద్ · తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

అల్-లూలు వల్ మర్జాన్ – మహా ప్రవక్త మహితోక్తులు (అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ) – అరబీ, తెలుగు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) – 9. ఇస్తిస్ఖా నమాజు ప్రకరణం. ఇందులో 5 హదీసులు (హదీసు 515 – 519), 4 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి హదీసు తెలుగు అనువాదం, అరబీ మూలంతో.

⬇ డౌన్లోడ్ PDFఇస్తిస్ఖా నమాజు ప్రకరణం2 పేజీలు · 0.1 MB

9. ఇస్తిస్ఖా నమాజు ప్రకరణం

كتاب صلاة الاستسقاء
అధ్యాయాలు (4)
  1. 1 వర్షం కోసం ప్రార్ధన చేసేటప్పుడు చేతులు పైకెత్తుట H 516
  2. 2 వర్షం కోసం అల్లాహ్ ను ప్రార్ధించడం H 517
  3. 3 తుఫాను సూచనలు కనిపిస్తే అల్లాహ్ శరణు కోరాలి, సాధారణ వర్షం అయితే సంతోషం వ్యక్తపరచాలి H 518
  4. 4 తూర్పు, పడమర గాలులను గురించి ప్రవక్త ప్రవచనం H 519
515

హదీసు 515

حديث عَبْدِ اللهِ بْنِ زَيْدٍ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ اسْتَسْقَى فَقَلَبَ رِدَاءَهُ

أخرجه البخاري في: 15 كتاب الاستسقاء: 4 باب تحويل الرداء في الاستسقاء

హజ్రత్ అబ్దుల్లా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త ﷺ ఓసారి వర్షం కోసం అల్లాహ్ ను ప్రార్థించినపుడు తమ దుప్పటిని తిరగేసి కప్పుకున్నారు.

[సహీహ్ బుఖారీ : 15వ ప్రకరణం – ఇస్తిస్ఖా, 4వ అధ్యాయం – తహ్‌లీ లిర్రిదాయి ఫిల్ ఇస్తిస్ఖా]

మహా ప్రవక్త మహితోక్తులు|9. ఇస్తిస్ఖా నమాజు ప్రకరణం|హదీసు 515

1వ అధ్యాయం – వర్షం కోసం ప్రార్ధన చేసేటప్పుడు చేతులు పైకెత్తుట

516

హదీసు 516

باب رفع اليدين بالدعاء في الاستسقاء

حديث أَنَسِ بْنِ مَالِكٍ قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لاَ يَرْفَعُ يَدَيْهِ فِي شَيْءٍ مِنْ دُعَائِهِ إِلاَّ فِي الاِسْتِسْقَاءِ، وَإِنَّهُ يَرْفَعُ حَتَّى يُرَى بَيَاضُ إِبْطَيْهِ

أخرجه البخاري في: 15 كتاب الاستسقاء: 22 باب رفع الإمام يده في الاستسقاء

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త ﷺ వర్షం కోసం ప్రార్థన చేసేటప్పుడు తప్ప, మరే సందర్భంలోనూ ప్రార్థన (దుఆ) చేసేటప్పుడు చేతులు పైకెత్తేవారు కాదు. వర్షం కోసం ప్రార్ధన చేసేటప్పుడు ఆయన తన చేతుల్ని చంకలోని తెలుపుదనం కన్పించేటంతగా పైకి ఎత్తేవారు.

[సహీహ్ బుఖారీ : 15వ ప్రకరణం – ఇస్తిస్ఖా, 22వ అధ్యాయం – రఫ్ అల్ ఇమామి యదహూఫిల్ ఇస్తిస్ఖా]

మహా ప్రవక్త మహితోక్తులు|9. ఇస్తిస్ఖా నమాజు ప్రకరణం|హదీసు 516

2వ అధ్యాయం – వర్షం కోసం అల్లాహ్ ను ప్రార్ధించడం

517

హదీసు 517

باب الدعاء في الاستسقاء

حديث أَنَسِ بْنِ مَالِكٍ قَالَ: أَصَابَتِ النَّاسَ سَنَةٌ عَلَى عَهْدِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَبَيْنَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَخْطُبُ فِي يَوْمِ جُمُعَةٍ، قَامَ أَعْرَابِيٌّ، فَقَالَ: يَا رَسُولَ اللهِ هَلَكَ الْمَالُ، وَجَاعَ الْعِيَالُ، فَادْعُ اللهَ لَنَا فَرَفَعَ يَدَيْهِ، وَمَا نَرَى فِي السَّماءِ قَزَعَةً، فَوَالَّذِي نَفْسِي بِيَدِهِ مَا وَضَعَهَا حَتَّى ثَارَ السَّحَابُ أَمْثَالَ الْجِبَالِ ثُمَّ لَمْ يَنْزِلْ عَنْ مِنْبَرِهِ حَتَّى رَأَيْتُ الْمَطَرَ يَتَحَادَرُ عَلَى لِحْيَتِهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَمُطِرْنَا يَوْمَنَا ذلِكَ، وَمِنَ الْغَدِ، وَبَعْدَ الْغَدِ، وَالَّذِي يَلِيهِ، حَتَّى الْجُمُعَةِ الأُخْرَى فَقَامَ ذلِكَ الأَعْرَابِيُّ، أَوْ قَالَ غَيْرُهُ، فَقَالَ: يَا رَسُولَ اللهِ تَهَدَّمَ الْبِنَاءُ، وَغَرِقَ الْمَالُ، فَادْعُ اللهَ لَنَا فَرَفَعَ يَدَيْهِ، فَقَالَ: اللهُمَّ حَوَالَيْنَا وَلاَ عَلَيْنَا فَمَا يُشِيرُ بِيَدِهِ إِلَى نَاحِيَةٍ مِنَ السَّحَابِ إِلاَّ انْفَرَجَتْ وَصَارَتِ الْمَدينَةُ مِثْلَ الْجَوْبَةِ، وَسَالَ الْوَادِي قَنَاةُ شَهْرًا، وَلَمْ يَجِىءْ أَحَدٌ مِنْ نَاحِيَةٍ إِلاَّ حَدَّثَ بِالْجَوْدِ

أخرجه البخاري في: 11 كتاب الجمعة: 35 باب الاستسقاء في الخطبة يوم الجمعة

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త ﷺ కాలంలో ఒకసారి కరువు వచ్చింది. అందువల్ల ఒక శుక్రవారం దైవప్రవక్త ﷺ జుమా ఖుత్బా (ఉపన్యాసం) ఇస్తుంటే ఒక గ్రామీణుడు లేచి “దైవప్రవక్తా! మా పశుసంపద నాశనమయ్యింది. మా భార్యా పిల్లలు ఆకలితో చస్తున్నారు. మా శ్రేయస్సు కోసం మీరు అల్లాహ్ ను ప్రార్థించండి” అని విన్నవించుకున్నాడు. అప్పుడు దైవప్రవక్త ﷺ చేతులు పైకెత్తి దుఆ (ప్రార్థన) చేయడానికి ఉపక్రమించారు.

ఆ సమయాన ఆకాశంలో మచ్చుకు ఒక మబ్బుతునక కూడా లేదు. కాని నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్ష్యం! ఆ మరుక్షణమే కొండల్లాంటి మేఘ మాలికలు నలువైపులనుంచీ కమ్ముకురావడం మొదలయింది, అవి పూర్తిగా ఆవరించనంతవరకు దైవప్రవక్త ﷺ తమ చేతుల్ని క్రిందికి దించలేదు. దైవప్రవక్త ﷺ వేదిక నుండి క్రిందికి దిగారో లేదో ఆయన గడ్డం వెంట్రుకలపై చిటపట చినుకులు పడటం నేను చూశాను. ఆ రోజు రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. మరునాడు, ఆ మరుసటి రోజు, ఆ తర్వాత కూడా ఏకధాటిగా కురుస్తూనే పోయింది. ఆ విధంగా చివరికి రెండవ శుక్రవారం వచ్చింది.

మళ్ళీ ఆ గ్రామీణుడే (లేక మరో గ్రామీణుడో) లేచి నిలబడి “దైవప్రవక్తా! మా ఇండ్లు పడిపోయాయి. మా పశుసంపద మునిగిపోయింది. కాస్త మా కోసం అల్లాహ్ ను ప్రార్థించండి” అని విన్నవించుకున్నాడు. అందువల్ల దైవప్రవక్త ﷺ మళ్ళీ చేతులెత్తి “అల్లాహ్! మా చుట్టు ప్రక్కల మాత్రమే వర్షం కురిపించు, మా మీద కురిపించకు” అని ప్రార్థించారు. ఈ విధంగా ఆయన ఎటువైపు సూచన చేశారో అటువైపు మేఘాలు విడిపోనారంభించాయి.

(ఇలా మబ్బులు మెల్లిమెల్లిగా విడిపోయి) చివరికి మదీనా పట్టణం (వర్షం కురియని) ఒక వలయంగా మిగిలిపోయింది. ఖినాతా కాలువ ఒక నెల రోజుల పాటు ప్రవహించింది. చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి వచ్చే ప్రతి వ్యక్తి అక్కడ కుంభవృష్టి కురిసిందన్న వార్తలు మోసుకొచ్చేవాడు.

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – జుమా, 35వ అధ్యాయం – అల్ ఇస్తిస్ఖాయి ఫిల్ ఖుత్బతి యౌముల్ జుముఆ]

మహా ప్రవక్త మహితోక్తులు|9. ఇస్తిస్ఖా నమాజు ప్రకరణం|హదీసు 517

3వ అధ్యాయం – తుఫాను సూచనలు కనిపిస్తే అల్లాహ్ శరణు కోరాలి, సాధారణ వర్షం అయితే సంతోషం వ్యక్తపరచాలి

518

హదీసు 518

باب التعوذ عند رؤية الريح والغيم، والفرح بالمطر

حديث عَائِشَةَ، قَالَتْ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، إِذَا رَأَى مَخِيلَةً فِي السَّمَاءِ أَقْبَلَ وَأَدْبَرَ، وَدَخَلَ وَخَرَجَ، وَتَغَيَّرَ وَجْهُهُ فَإِذَا أَمْطَرَتِ السَّمَاءُ سُرِّيَ عَنْهُ، فَعَرَّفَتْهُ عَائِشَةُ ذلِكَ فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَا أَدْرِي، لَعَلَّهُ كَمَا قَالَ قَوْمٌ (فَلَمَّا رَأَوْهُ عَارِضًا مُسْتَقْبِلَ أَوْدِيَتِهِمْ) الآية

أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 5 باب ما جاء في قوله (وهو الذي أرسل الرياح بُشْراً بين يدى رحمته)

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త ﷺ ఆకాశంలో ఏదైనా అసాధారణ వస్తువు చూస్తే, ఉదాహరణకు మబ్బు లేక మెరుపు చూస్తే ఆయన ముఖ కవళికలు మారిపోతాయి. (ఎంతో ఆందోళన చెందుతూ) ఒకసారి ముందుకు, మరొకసారి వెనక్కి అడుగువేస్తారు. ఒకసారి లోపలికి, మరొకసారి బయటికి నడుస్తారు. అయితే వర్షం కురవగానే, ఆయన భయాందోళనలు దూరమయిపోతాయి.

ఒకసారి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ప్రవక్త ﷺ గారి ఈ పరిస్థితి చూసి కారణం ఏమిటని అడిగితే ఆయన ఇలా సమాధానమిచ్చారు:- ఆద్ జాతి గురించి దివ్యఖుర్ఆన్‌లో వచ్చినట్లు మన మీద కూడా విధివశాత్తు అలాంటి ఆపద ఏదైనా వస్తుందేమోనని నేను భయపడుతున్నాను. ఖుర్ఆన్‌లో (ఆ సంఘటన) ఇలా ప్రస్తావించబడింది; “వారు దాన్ని (మేఘాన్ని) తమ లోయలవైపు రావడం చూసి ‘ఈ మేఘం మనకు పుష్కలంగా వర్షం కురిపిస్తుందని’ అన్నారు. (సంతోషంతో చంకలు కొట్టుకుంటూ) కాదు. ఇది (వర్షం కాదు) మీరు తొందరపెడుతున్న విషయం (శిక్ష) ఇది. ఇదొక పెనుతుఫాను. (మీ కొరకు) బాధాకరమైన శిక్ష ముంచుకొస్తోంది” (అహ్‌ఖాఫ్-24)

[సహీహ్ బుఖారీ : 59వ ప్రకరణం – బదాయిల్ ఖల్ఖ్, 5వ అధ్యాయం – మాజాయి ఫీ ఖౌలిహీ వహువల్లజీ అర్సలర్రీహా….]

మహా ప్రవక్త మహితోక్తులు|9. ఇస్తిస్ఖా నమాజు ప్రకరణం|హదీసు 518

4వ అధ్యాయం – తూర్పు, పడమర గాలులను గురించి ప్రవక్త ప్రవచనం

519

హదీసు 519

باب في ريح الصبا بالدبور

حديث ابْنِ عَبَّاسٍ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: نُصِرْتُ بِالصَّبَا وَأُهْلِكَتْ عَادٌ بِالدَّبُورِ

أخرجه البخاري في: 15 كتاب الاستسقاء: 26 باب قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نصرت بالصبا

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “తూర్పు గాలి ద్వారా నాకు సహాయం చేయబడింది. పడమర గాలి ద్వారా ఆద్ జాతి నాశనం చేయబడింది.”★

[సహీహ్ బుఖారీ : 15వ ప్రకరణం – ఇస్తిస్ఖా, 26వ అధ్యాయం – ఖౌలిన్నబీ ﷺ నుస్రతిబిస్సబా]

★ తూర్పుగాలి ద్వారా నాకు సహాయం చేయబడింది అంటే, అహ్జాబ్ యుద్ధంలో అల్లాహ్ సహాయం లభించిందని అర్థం. ఈ యుద్ధంలో పన్నెండు వేల మంది బహుదైవారాధకులు మదీనా పట్టణాన్ని దిగ్బంధించారు. అప్పుడు ఓ రోజు రాత్రి ఎముకలు కొరకే చలితో పాటు తూర్పు దిక్కు నుంచి తీవ్రమైన ఈదురుగాలులు వీచడంతో వారి శిబిరాలన్నీ నేలమట్టమయ్యాయి. దాంతో వారు ముస్లింలతో యుద్ధం చేయకుండానే వెనుతిరిగి వెళ్ళిపోయారు. అదే విధంగా పూర్వం ఆద్‌జాతి ప్రజలకు హజ్రత్ హూద్ ప్రవక్త (అలైహిస్సలాం)ను తిరస్కరించడంతో వారిపై దైవాగ్రహం విరుచుకుపడింది. అల్లాహ్ పడమర నుండి తీవ్రమైన తుఫాను గాలి పంపి ఆ జాతిని సర్వనాశనం చేశాడు.

మహా ప్రవక్త మహితోక్తులు|9. ఇస్తిస్ఖా నమాజు ప్రకరణం|హదీసు 519