మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
ఉర్దూ అనువాదం: సయ్యిద్ షబ్బీర్ అహ్మద్ · తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) – 10. సలాతుల్ కుసూఫ్ ప్రకరణం. ఇందులో 11 హదీసులు (హదీసు 520 – 530), 4 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి హదీసు తెలుగు అనువాదం, అరబీ మూలంతో.
⬇ డౌన్లోడ్ PDFసలాతుల్ కుసూఫ్ ప్రకరణం5 పేజీలు · 0.3 MB
10. సలాతుల్ కుసూఫ్ ప్రకరణం
كتاب صلاة الكسوفఅధ్యాయాలు (4)
- 1 కుసూఫ్ నమాజు గురించి H 520 – 522
- 2 కుసూఫ్ నమాజులో సమాధి శిక్షను గుర్తుకు తెచ్చుకోవడం H 523
- 3 కుసూఫ్ నమాజులో దైవప్రవక్త ﷺకు స్వర్గ నరకాలు కన్పించడం H 524 – 525
- 5 కుసూఫ్ నమాజు కోసం నమాజు సిద్ధంగా ఉందని పిలుపునివ్వడం H 526 – 530
1వ అధ్యాయం – కుసూఫ్ నమాజు గురించి
హదీసు 520
باب صلاة الكسوف
حديث عَائِشَةَ، قَالَتْ: خَسَفَتِ الشَّمْسُ فِي عَهْدِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَصَلَّى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِالنَّاسِ، فَقَامَ فأَطَالَ الْقِيَامَ، ثُمَّ رَكَعَ فَأَطَالَ الرُّكُوعَ، ثُمَّ قَامَ فَأَطَالَ الْقِيَامَ، وَهُوَ دُونَ الْقِيَامِ الأَوَّلِ، ثُمَّ رَكَعَ فَأَطَالَ الرُّكُوعَ وَهُوَ دُونَ الرُّكُوعِ الأَوَّلِ، ثُمَّ سَجَدَ فَأَطَالَ السُّجُودَ، ثُمَّ فَعَلَ فِي الرَّكْعَةِ الثَّانِيَةِ مِثْلَ مَا فَعَلَ فِي الأُولَى، ثُمَّ انْصَرَفَ وَقَدِ انْجَلَتِ الشَّمْسُ، فَخَطَبَ النَّاسَ، فَحَمِدَ اللهَ وَأَثْنَى عَلَيْهِ، ثُمَّ قَالَ: إِنَّ الشَّمْسَ وَالْقَمَرَ آيَتَانِ مِنْ آياتِ اللهِ، لاَ يَنْخَسِفَانِ لِمَوْتِ أَحَدٍ وَلاَ لِحَيَاتِهِ، فَإِذَا رَأَيْتُمْ ذلِكَ فَادْعُوا اللهَ وَكَبِّرُوا وَصَلُّوا وَتَصَدَّقُوا ثُمَّ قَالَ: يَا أُمَّةَ مُحَمَّدٍ مَا مِنْ أَحَدٍ أَغْيَرُ مِنَ اللهِ أَنْ يَزْنِىَ عَبْدُهُ أَوْ تَزْنِىَ أَمَتُهُ، يَا أُمَّةَ مُحَمَّدٍ وَاللهِ لَوْ تَعْلَمُونَ مَا أَعْلَمُ لَضَحِكْتُمْ قَلِيلاً وَلَبَكَيْتُمْ كَثِيرًا
أخرجه البخاري في: 16 كتاب الكسوف: 2 باب الصدقة في الكسوف
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త ﷺ కాలంలో ఓసారి సూర్యగ్రహణం పట్టితే ఆయన (కుసూఫ్) నమాజు చేయించారు. ఆ నమాజులో ఆయన చాలా సేపటిదాకా (ఖుర్ఆన్ పఠిస్తూ) నిలబడ్డారు. రుకూ కూడా సుదీర్ఘంగానే ఉండింది. తరువాత మళ్ళీ చాలా సేపటిదాకా నిల్చున్నారు.అయితే మొదటిసారి కన్నా ఈ సారి కొంచెం తక్కువసేపు నిలబడ్డారు. అలాగే తిరిగి రుకూ చేశారు. అయితే మొదటి రుకూ కన్నా కొంచెం తక్కువసేపు చేశారు. ఆ తరువాత సుదీర్ఘంగా సజ్దా చేశారు. అదే విధంగా ఆయన రెండవ రకాతులో కూడా చేశారు. ఆ తరువాత సలాం చేసి నమాజు పూర్తి చేశారు. ఆ సమయానికి సూర్యుడు పూర్తిగా గ్రహణం వీడాడు.
ఆ తరువాత ఖుత్బా (ఉపన్యాసం) ఇచ్చారు. అందులో ఆయన దైవస్తోత్రం తరువాత ఇలా అన్నారు: “సూర్యచంద్రులిద్దరూ అల్లాహ్ (ఔన్నత్యానికి) నిదర్శనాలు. ఎవరో చనిపోవడం వల్లనో, పుట్టడం వల్లనో సూర్యచంద్రగ్రహణాలు పట్టవు. అందువల్ల సూర్యగ్రహణంగాని, చంద్రగ్రహణం గాని పట్టితే మీరు అల్లాహ్ ను ప్రార్థించండి. అల్లాహ్ మహిమ, ఔన్నత్యాలను కీర్తించండి. నమాజు చేయండి. దానధర్మాలు చేయండి.”
ఆ తరువాత దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు: “ముహమ్మద్ అనుచర సమాజం ప్రజలారా! అల్లాహ్ దాసుడు లేక దాసి ఎవరైనా వ్యభిచారానికి పాల్పడటం జరిగితే, వారి సిగ్గుమాలిన పని పట్ల అందరికన్నా ఎక్కువ అల్లాహ్ కే పౌరుషం వస్తుంది. ముహమ్మద్ అనుచర సమాజం ప్రజలారా! అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. నేను ఎరిగిన విషయాలు మీరు గనుక ఎరిగి ఉంటే మీరు తప్పకుండా తక్కువగా నవ్వుతారు, ఎక్కువగా ఏడుస్తారు.”
[సహీహ్ బుఖారీ : 16వ ప్రకరణం – కుసూఫ్, 2వ అధ్యాయం – అస్సదఖాతి ఫిల్ కుసూఫ్]
మహా ప్రవక్త మహితోక్తులు|10. సలాతుల్ కుసూఫ్ ప్రకరణం|హదీసు 520
హదీసు 521
حديث عَائِشَةَ، زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَتْ: خَسَفَتِ الشَّمْسُ فِي حَيَاةِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَخَرَجَ إِلَى الْمَسْجِدِ، فَصَفَّ النَّاسُ وَرَاءَهُ، فَكَبَّرَ، فَاقْتَرَأَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قِرَاءَةً طَوِيلَةً، ثُمَّ كَبَّرَ، فَرَكَع رُكوعًا طَوِيلاً، ثُمَّ قَالَ: سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ، فَقَامَ وَلَمْ يَسْجُدْ، وَقَرَأَ قِرَاءَةً طَوِيلَةً، هِيَ أَدْنَى مِنَ الْقِرَاءَةِ الأُولَى، ثُمَّ كَبَّرَ وَرَكَعَ رُكُوعًا طَوِيلاً، وَهُوَ أَدْنَى مِنَ الرُّكوعِ الأَوَّلِ؛ ثُمَّ قَالَ: سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ، رَبَّنَا وَلَكَ الْحَمْدُ ثُمَّ سَجَدَ، ثُمَّ قَالَ فِي الرَّكْعَةِ الآخِرَةِ مِثْلَ ذلِكَ، فَاسْتَكْمَلَ أَرْبَعَ رَكْعَاتٍ فِي أَرْبَعِ سَجَدَاتٍ، وَانْجَلَتِ الشَّمْسُ قَبْلَ أَنْ يَنْصَرِفَ؛ ثُمَّ قَامَ فَأَثْنَى عَلَى اللهِ بِمَا هُوَ أَهْلُهُ، ثُمَّ قَالَ: هُمَا آيَتَانِ مِنْ آيَاتِ اللهِ لاَ يَخْسِفَانِ لِمَوْتِ أَحَدٍ وَلاَ لِحَيَاتِهِ، فَإِذَا رَأَيْتُمُوهُمَا فَافْزَعُوا إِلَى الصَّلاَةِ
أخرجه البخاري في: 16 كتاب الكسوف: 4 باب خطبة الإمام في الكسوف
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త ﷺ కాలంలో ఒకసారి సూర్యగ్రహణం పట్టితే, ఆయన మస్జిద్ వెళ్ళారు. ప్రజలు కూడా వెళ్ళి ఆయన వెనక బారులు తీరి నిలబడ్డారు. అప్పుడు దైవప్రవక్త ﷺ అల్లాహు ,అక్బర్ అని పలికి (నమాజులో) ఖుర్ఆన్ పఠనం ప్రారంభించారు. సుదీర్ఘ పఠనం గావించారు. ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలికి రుకూలోకి వెళ్ళారు. రుకూలో చాలాసేపు ఉన్నారు. తరువాత సమి అల్లాహులిమన్ హమిదా అని పలుకుతూ పైకి లేచి నిల్చున్నారు. సజ్దాలోకి పోలేదు. మళ్ళీ సుదీర్ఘ పఠనం గావించారు. అయితే మొదటిసారి పఠనం కన్నా ఈ సారి కొంచెం తక్కువ. ఆ తరువాత అల్లాహు అక్బర్ అంటూ రుకూలోకి పోయారు. రుకూలో చాలాసేపు ఉన్నారు. అయితే మొదటి రుకూ కన్నా కొంచెం తక్కువ సేపు ఉన్నారు. ఆ తరువాత సమి అల్లాహులిమన్ హమిదా, రబ్బనా లకల్ హమ్ద్ అని పలికారు. ఆ తరువాత సజ్దా చేశారు. అదే విధంగా రెండవ రకాతులో కూడా చేశారు. ఇలా మొత్తం నాలుగు రుకూలు, నాలుగు సజ్దాలు చేశారు. ఆయన సలాం చేసి నమాజు ముగించక ముందే గ్రహణం పూర్తిగా వీడిపోయి సూర్యుడు ప్రకాశించసాగాడు. ఆ తరువాత దైవప్రవక్త ﷺ నిలబడి ఖుత్బా (ఉపన్యాసం) ఇచ్చారు. అందులో దైవస్తోత్రం తరువాత ఇలా అన్నారు: “సూర్యచంద్రులిద్దరూ అల్లాహ్ (ఔన్నత్యానికి) నిదర్శనాలు. అంతేగాని ఎవరో చావడం వల్లనో, పుట్టడం వల్లనో (సూర్యచంద్రులకు) గ్రహణం పట్టదు. అందువల్ల మీరు వారిద్దరిలో ఎవరికైనా గ్రహణం పట్టడం చూస్తే వెంటనే నమాజు చేయడానికి (మస్జిదుకు) పరుగెత్తండి.”
[సహీహ్ బుఖారీ : 16వ ప్రకరణం – కుసూఫ్, 4వ అధ్యాయం – ఖుత్బతిల్ ఇమామి ఫిల్ కుసూఫ్]
మహా ప్రవక్త మహితోక్తులు|10. సలాతుల్ కుసూఫ్ ప్రకరణం|హదీసు 521
హదీసు 522
حديث عَائِشَةَ، قَالَتْ: خَسَفَتِ الشَّمْسُ، فَقَامَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَرَأَ سُورَةً طَوِيلَةً، ثُمَّ رَكَعَ فَأَطَالَ، ثُمَّ رَفَعَ رَأْسَهُ، ثُمَّ اسْتَفْتَحَ بِسُورَةٍ أُخْرَى ثُمَّ رَكَعَ حَتَّى قَضَاهَا وَسَجَدَ، ثُمَّ فَعَلَ ذلِكَ فِي الثَّانِيَةِ، ثُمَّ قَالَ: إِنَّهُمَا آيَتَانِ مِنْ آيَاتِ اللهِ، فَإِذَا رَأَيْتُمْ ذلِكَ فَصَلُّوا حَتَّى يُفْرَجَ عَنْكُمْ لَقَدْ رَأَيْتُ فِي مَقَامِي هذَا كُلَّ شَيْءٍ وُعِدْتُهُ، حَتَّى لَقَدْ رَأَيْتُنِي أُرِيدُ أَنْ آخُذَ قِطْفًا مِنَ الْجَنَّةِ، حِينَ رَأَيْتُمُونَي جَعَلْتُ أَتَقَدَّمُ، وَلَقَدْ رَأَيْتُ جَهَنَّمَ يَحْطِمُ بَعْضُهَا بَعْضًا، حِينَ رَأَيْتُمُونِي تَأَخَّرْتُ، وَرَأَيْتُ فِيهَا عَمْرَو بْنَ لُحَيٍّ، وَهُوَ الَّذِي سَيَّبَ السَّوَائِبَ
أخرجه البخاري في: 21 كتاب العمل في الصلاة: 11 باب إذا تفلتت الدابة في الصلاة
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- ఒకసారి సూర్యగ్రహణం పట్టితే దైవప్రవక్త ﷺ (నమాజు చేయడానికి) నిలబడి ఒక సుదీర్ఘమైన సూరా పఠించారు. తరువాత రుకూ చేశారు. సుదీర్ఘమైన రుకూ. రుకూ నుండి లేచి నిలబడి మరొక సూరా పఠించారు. ఆ తరువాత మళ్ళీ రుకూ చేశారు. రుకూ పూర్తి చేసి సజ్దా చేశారు. రెండవ రకాతులో కూడా అంతా ఇలాగే చేశారు. తరువాత నమాజు ముగించి ఇలా ప్రసంగించారు.
“సూర్యచంద్రులు అల్లాహ్ నిదర్శనాలలో రెండు నిదర్శనాలు. అందువల్ల మీరు సూర్యచంద్రులకు గ్రహణం పట్టడం చూస్తే (కుసూఫ్) నమాజు చేయండి. దీని ద్వారా అల్లాహ్ మీ కష్టాలు దూరం చేస్తాడు. ఈ రోజు నేను నా నమాజు సందర్భంలో నాకు వాగ్దానం చేయబడిన వాటన్నిటినీ చూశాను. చివరికి నేను స్వర్గవనంలోని ఒక పండ్ల గుత్తిని తీసుకుందామని అనుకుంటున్నట్లు అనుభూతి కూడా చెందాను. అప్పుడు నేను ముందుకు అడుగేయడం మీరు గమనించి ఉంటారు. అలాగే నరకంలోని ఒక భాగం మరొక భాగాన్ని మింగి వేస్తూ ఉండటం కూడా నేను చూశాను. అప్పుడు నేను కాస్త వెనక్కి జరగడం కూడా మీరు గమనించి ఉంటారు. నేను నరకంలో అమ్ర్‌బిన్ లుహయ్యీని కూడా చూశాను. అతను (అరేబియాలో) దేవతల పేర ఆంబోతును వదలిపెట్టే ఆచారాన్ని సృష్టించాడు.”
[సహీహ్ బుఖారీ : 21వ ప్రకరణం – అల్‌అమల్ ఫిస్సలాత్, 11వ అధ్యాయం – ఇజన్ ఫలత అద్దాబ్బతు ఫిస్సలాత్]
మహా ప్రవక్త మహితోక్తులు|10. సలాతుల్ కుసూఫ్ ప్రకరణం|హదీసు 522
2వ అధ్యాయం – కుసూఫ్ నమాజులో సమాధి శిక్షను గుర్తుకు తెచ్చుకోవడం
హదీసు 523
باب ذكر عذاب القبر في صلاة الخسوف
حديث عَائِشَةَ، زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ؛ أَنَّ يَهُودِيَّةً جَاءَتْ تَسْأَلُهَا، فَقَالَتْ لَهَا: أَعَاذَكِ اللهُ مِنْ عَذَابِ الْقَبْرِ فَسَأَلَتْ عَائَشَةُ، رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَيُعَذَّبُ النَّاسُ فِي قُبُورِهِمْ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: عَائِذًا بِاللهِ مِنْ ذلِكَ ثُمَّ رَكِبَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ذَاتَ غَدَاةٍ مَرْكَبًا، فَخَسَفَتِ الشَّمْسُ، فَرَجَعَ ضُحًى، فَمَرَّ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، بَيْنَ ظَهْرَانَي الْحُجَرِ، ثُمَّ قَامَ يُصَلِّي، وَقَامَ النَّاسُ وَرَاءَهُ، فَقَامَ قِيَامًا طَوِيلاً، ثُمَّ رَكَعَ رُكوعًا طَويلاً، ثُمَّ رَفَعَ فَقَامَ قِيَامًا طَويلاً، وَهُوَ دُونَ الْقِيَامِ الأَوَّلِ، ثُمَّ رَكَعَ رُكوعًا طَويلاً، وَهُوَ دُونَ الرُّكوعِ الأَوَّلِ، ثُمَّ رَفَعَ فَسَجَدَ، ثُمَّ قَامَ، فَقَامَ قِيَامًا طَويلاً، وَهُوَ دُونَ الْقِيَامِ الأَوَّلِ، ثُمَّ رَكَعَ رُكوعًا طَويلاً، وَهُوَ دُونَ الرَّكوعِ الأَوَّلِ، ثُمَّ قَامَ قِيَامًا طَويلاً، وَهُوَ دُونَ الْقِيَامِ الأَوَّلِ، ثُمَّ رَكَعَ رُكوعًا طَويلاً، وَهُوَ دُونَ الرُّكُوعِ الأَوَّلِ، ثُمَّ رَفَعَ فَسَجَدَ وَانْصَرَفَ، فَقَالَ مَا شَاءَ اللهُ أَنْ يَقُولَ، ثُمَّ أَمَرَهُمْ أَنْ يَتَعَوَّذوا مِنْ عَذَابِ الْقَبْرِ
أخرجه البخاري في: 16 كتاب الكسوف: 7 باب التعوذ من عذاب القبر في الكسوف
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- ఓసారి ఒక యూద స్త్రీ (సహాయం) అర్థించడానికి నా దగ్గరకు వచ్చింది. ఆమె నాతో అవి ఇవి మాట్లాడుతూ “అల్లాహ్ మిమ్మల్ని సమాధి శిక్ష నుండి కాపాడుగాక!” అని అన్నది. నేనీ విషయం దైవప్రవక్త ﷺ ముందు ప్రస్తావిస్తూ “మానవులకు సమాధిలో కూడా శిక్ష ఉంటుందా?” అని అడిగాను. దానికాయన “(ఔను) అల్లాహ్ ఈ శిక్ష నుండి అందరినీ కాపాడుగాక!” అని అన్నారు.
ఆ తరువాత ఒక రోజు ఉదయం ఆయన ఒంటె ఎక్కి ఎక్కడికో బయలుదేరారు. కాస్సేపటికి సూర్యగ్రహణం పట్టింది. ఆయన ‘చాష్త్’ వేళకు తిరిగి వచ్చారు. పూరి పాకల వెనకాల నడుస్తూ (మస్జిదుకు చేరుకొని) నమాజు చేయడానికి నిల్చున్నారు. ప్రజలు కూడ వచ్చి ఆయన వెనుక నిలబడ్డారు. దైవప్రవక్త ﷺ ఆ నమాజులో సుదీర్ఘ పఠనం గావించారు. తరువాత రుకూ కూడ సుదీర్ఘంగానే చేశారు. రుకూ నుండి లేచి నిలబడి తిరిగి సుదీర్ఘ పఠనం గావించారు. అయితే మొదటి పఠనం కన్నా కొంచెం తక్కువ. మళ్ళీ రుకూ చేశారు. ఈ రుకూ కూడ మొదటి రుకూ కన్నా కొంచెం తక్కువ. తరువాత లేచి నిలబడి సజ్దాలోనికి పోయారు. సజ్దా నుండి లేచి నిలబడి సుదీర్ఘ పఠనం చేశారు. అయితే మొదటి పఠనం కన్నా కాస్త సంగ్రహం చేశారు. ఆ తరువాత సుదీర్ఘమైన రుకూ చేశారు. కాని మొదటి రుకూ కన్నా కాస్త సంక్షిప్తంగా చేశారు. మళ్ళీ సుదీర్ఘ పఠనం గావించారు. ఇది మొదటిదానికన్నా కాస్త తక్కువ. తరువాత రుకూ చేశారు. ఈ రుకూ కూడ మొదటి రుకూల కన్నా కొంచెం సంక్షిప్తం. రుకూ నుండి లేచి నిలబడి సజ్దాలోనికి పోయారు. ఆ తరువాత సలాం చేసి నమాజు ముగించారు. ఆ తరువాత (ఖుత్బాలో) చెప్పవలసిన విషయాలు చెప్పారు. దాని తరువాత ప్రజల్ని ఉద్దేశించి “సమాధి శిక్ష నుండి అల్లాహ్ ను శరణు కోరండి” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 16వ ప్రకరణం – కుసూఫ్, 7వ అధ్యాయం – అత్తవ్వూజు మిన్ అజాబిల్ ఖుబూరి ఫిల్ కుసూఫ్]
మహా ప్రవక్త మహితోక్తులు|10. సలాతుల్ కుసూఫ్ ప్రకరణం|హదీసు 523
3వ అధ్యాయం – కుసూఫ్ నమాజులో దైవప్రవక్త ﷺకు స్వర్గ నరకాలు కన్పించడం
హదీసు 524
باب ما عرض على النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ في صلاة الكسوف من أمر الجنة والنار
حديث أَسْمَاءَ قَالَتْ: أَتَيْتُ عَائِشَةَ وَهِيَ تُصَلِّي، فَقُلْتُ مَا شَأْنُ النَّاسِ فَأَشَارَتْ إِلَى السَّمَاءِ، فَإِذَا النَّاسُ قِيَامٌ، فَقَالَتْ: سُبْحَانَ اللهِ قُلْتُ: آيَةٌ فَأَشَارَتْ بِرَأْسِهَا أَيْ نَعَمْ فَقُمْتُ حَتَّى تَجَلاَّنِي الْغَشْيُ، فَجَعَلْتُ أَصُبُّ عَلَى رَأْسِي الْمَاءَ، فَحَمِدَ اللهَ، عَزَّ وَجَلَّ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَأَثْنَى عَلَيْهِ، ثُمَّ قَالَ: مَا مِنْ شَيْءٍ لَمْ أَكُنْ أُرِيتُهُ إِلاَّ رَأَيْتُهُ فِي مَقَامِي، حَتَّى الْجَنَّةُ وَالنَّارُ، فَأُوحِيَ إِلَيَّ أَنَّكُمْ تُفْتَنونَ فِي قُبُورِكُمْ مِثْلَ أَوْ قَرِيبَ (قَالَ الرَّاوِي: لاَ أَدْرِي أَيَّ ذلِكَ قَالَتْ أَسْمَاءُ) مِنْ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَّالِ، يُقَالُ مَا عِلْمُكَ بِهذَا الرَّجُلِ فَأَمَّا الْمُؤْمِنُ أَوِ الْمُوقِنُ (لاَ أَدْرِي بِأَيِّهِمَا قَالَتْ أَسْمَاءُ) فَيَقُولُ هُوَ مُحَمَّدٌ رَسُولُ اللهِ، جَاءَنَا بِالْبَيِّنَاتِ وَالْهُدَى، فَأَجَبْنَا وَاتَّبَعْنَا، هُوَ مُحَمَّدٌ (ثَلاَثًا) ؛ فَيُقَالُ: نَمْ صَالِحًا، قَدْ عَلِمْنَا إِنْ كُنْتَ لَمُوقِنًا بِهِ؛ وَأَمَّا المُنَافِقُ أَوِ المُرْتَابُ (لاَ أَدْرِي أَيَّ ذلِكَ قَالَتْ أَسْمَاءُ) فَيَقُولُ: لاَ أَدْرِي، سَمِعْتُ النَّاسَ يَقُولُونَ شَيْئًا فَقُلْتُهُ
أخرجه البخاري في: 3 كتاب العلم: 24 باب من أجاب الفتيا بإرشاد اليد والرأس
హజ్రత్ అస్మా(రదియల్లాహు అన్హా) కథనం:- నేను ఓసారి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) దగ్గరకు వెళ్ళాను. ఆ సమయంలో ఆమె నమాజు చదువుతూ ఉన్నారు. (నమాజు ముగిసిన తరువాత) నేనామెను “ప్రజలకు ఏమయింది (ఈ వేళ గుమికూడుతున్నారు)?” అని అడిగాను. ఆమె చేత్తో ఆకాశం వైపు చూపించారు. (అప్పుడు సూర్యగ్రహణం పట్టి ఉంది). ఆ తరువాత ప్రజలు (నమాజు కోసం) నిలబడటం కన్పించింది. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) “సుబ్‌హానల్లాహ్”! అన్నారు. నేను (ఆశ్చర్యంతో) “ఏదైనా సూచన ఉందా?” అని అడిగాను. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఔనంటూ తల ఊపారు. ఆ తరువాత నేను కూడ నమాజు చేయడానికి నిలబడ్డాను. అది చాలా సుదీర్ఘ పఠనం కావడం వల్ల నాకు కళ్ళు తిరగడం మొదలెట్టింది. అందుచేత నేను నా తల మీద కొంచెం నీళ్ళు చల్లుకున్నాను.
నమాజు ముగిసిన తరువాత దైవప్రవక్త ﷺ దైవస్తోత్రం చేసి ఇలా ప్రసంగించారు: “నాకిప్పటి దాకా చూపించబడని వాటన్నిటినీ ఈ రోజు నేనీ స్థలంలో నిలబడి చూశాను. చివరికి స్వర్గ నరకాలు కూడ చూశాను. సమాధిలో పరీక్ష జరుగుతుందని వహీ ద్వారా నాకు తెలియజేయబడింది. అది దజ్జాల్ ఉపద్రవం లాంటి పరీక్ష. లేక ఇంచుమించు అలాంటి పరీక్ష. (హజ్రత్ అస్మా (రదియల్లాహు అన్హా) ఏమన్నారో హదీసు ఉల్లేఖకునికి సరిగ్గా గుర్తులేదు) (ఆ పరీక్ష ఇలా ఉంటుంది) “ఈ వ్యక్తి (ముహమ్మద్ ప్రవక్త)ని గురించి నీకేమయినా తెలుసా?” అని ప్రశ్నిస్తారు. అతను విశ్వసించినవాడయితే లేక నమ్మినవాడయితే (హజ్రత్ అస్మా(రదియల్లాహు అన్హా) ఏమన్నారో హదీసు ఉల్లేఖకునికి సరిగ్గా జ్ఞాపకం లేదు) “ఈయన హజ్రత్ ముహమ్మద్ ﷺ. అల్లాహ్ ప్రవక్త. ఈయన మా దగ్గరకు అల్లాహ్ సందేశం, స్పష్టమైన నిదర్శనాలు తీసుకువచ్చారు. మేము ఆయన పిలుపును అంగీకరించి ఆయనకు విధేయులమైపోయాము” అని అంటాడు. ఈ విధంగా అతను మూడుసార్లు సమాధానం ఇస్తాడు. ఆ తరువాత “సరే ఇక హాయిగా పడుకో. నువ్వు ఈయన్ని విశ్వసించిన వాడవని మాకు తెలుసు” అని అతనికి చెప్పడం జరుగుతుంది. అదే కపట విశ్వాసి అయితే లేక అనుమానపు రోగి అయితే (హజ్రత్ అస్మా(రదియల్లాహు అన్హా) ఏమన్నారో హదీసు ఉల్లేఖకునికి సరిగా గుర్తులేదు) “ఈయనెవరో నాకు తెలియదు. జనం చెప్పుకుంటున్నదేదో విని అది మాత్రమే నేను చెప్పాను” అని అంటాడు.
[సహీహ్ బుఖారీ : 3వ ప్రకరణం – అల్ ఇల్మ్ – 24వ అధ్యాయం – మన్ అజాబల్ ఫితయా….]
మహా ప్రవక్త మహితోక్తులు|10. సలాతుల్ కుసూఫ్ ప్రకరణం|హదీసు 524
హదీసు 525
حديث عَبْدِ اللهِ بْنِ عَبَّاسٍ قَالَ: انْخَسَفَتِ الشَّمْسُ عَلَى عَهْدِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَصَلَّى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَامَ قِيَامًا طَوِيلاً نحْوًا مِنْ قِرَاءَةِ سُورَةِ الْبَقَرَةِ؛ ثُمَّ رَكَعَ رُكُوعًا طَويلاً، ثُمَّ رَفَعَ فَقَامَ قِيَامًا طَويلاً، وَهُوَ دُونَ الْقِيَامِ الأَوَّلِ، ثُمَّ رَكَعَ ركوعًا طَويلاً وَهُوَ دُونَ الرُّكوعِ الأَوَّلِ ثُمَّ سَجَدَ، ثُمَّ قَامَ قِيَامًا طَويلاً، وَهُوَ دُونَ الْقِيَامِ الأَوَّلِ، ثُمَّ رَكَعَ رُكُوعًا طَويلاً، وَهُوَ دُونَ الرُّكُوعِ الأَوَّلِ، ثُمَّ رَفَعَ فَقَامَ قِيَامًا طَويِلاً، وَهُوَ دُونَ الْقِيَامِ الأَوَّلِ، ثُمَّ رَكَعَ رُكوعًا طَوِيلاً، وَهُوَ دُونَ الرُّكُوعِ الأَوَّلِ، ثُمَّ سَجَدَ، ثُمَّ انْصَرَفَ وَقَدْ تَجَلَّتِ الشَّمْسُ، فَقَالَ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ الشَّمْسَ وَالْقَمَرَ آيَتَانِ مِنْ آيَاتِ اللهِ، لاَ يَخْسِفَانِ لِمَوْتِ أَحَدٍ وَلاَ لِحَيَاتِهِ، فَإِذَا رَأَيْتُمْ ذلِكَ فَاذْكُرُوا اللهَ قَالُوا: يَا رَسُولَ اللهِ رَأَيْنَاكَ تَنَاوَلْتَ شَيْئًا فِي مَقَامِكَ، ثُمَّ رَأَيْنَاكَ كَعْكَعْتَ؛ فَقَالَ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنِّي رَأَيْتُ الْجَنَّةَ فَتَنَاوَلْتُ عُنْقُودًا، وَلَوْ أَصَبْتُهُ لأَكَلْتُمْ مِنْهُ مَا بَقِيَتِ الدُّنْيَا، وَأُرِيتُ النَّارَ فَلَمْ أَرَ مَنْظَرًا كَالْيَوْمِ قَطُّ أَفْظَعَ، وَرَأَيْتُ أَكْثَرَ أَهْلِهَا النِّسَاءَ قَالُوا: بِمَ يَا رَسُولَ اللهِ قَالَ: بِكُفْرِهِنَّ قِيلَ: يَكْفُرْنَ بِاللهِ قَالَ: يَكْفُرْنَ الْعَشِيرَ، وَيَكْفُرْنَ الإِحْسَانَ، لَوْ أَحْسَنْتَ إِلَى إِحْدَاهُنَّ الدَّهْرَ كُلَّهُ، ثُمَّ رَأَتْ مِنْكَ شَيْئًا، قَالَتْ: مَا رَأَيْتُ مِنْكَ خَيْرًا قَطُّ
أخرجه البخاري في: 16 كتاب الكسوف: 9 باب صلاة الكسوف في جماعة
హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- దైవప్రవక్త ﷺ కాలంలో ఓ సారి సూర్యగ్రహణం పట్టితే ఆయన (కుసూఫ్) నమాజు చేయించారు. అందులో ఆయన బఖరా సూరా పఠనమంత సుదీర్ఘ పఠనం గావించారు. తర్వాత సుదీర్ఘమైన రుకూ చేశారు. రుకూ నుండి లేచి నిలబడి తిరిగి సుదీర్ఘ పఠనం గావించారు. అయితే మొదటి పఠనం కన్నా కొంచెం తక్కువ. ఆ తరువాత మళ్ళీ సుదీర్ఘమైన రుకూ చేశారు. ఈ రుకూ కూడ మొదటి రుకూ కన్నా కొంచెం తక్కువ. దాని తరువాత సజ్దా చేశారు. ఆ తరువాత మళ్ళీ లేచి నిలబడి సుదీర్ఘ పఠనం గావించారు. అయితే మొదటి పఠనం కన్నా కాస్త సంగ్రహం. తరువాత మళ్ళీ సుదీర్ఘమైన రుకూ చేశారు. ఈ రుకూ కూడ మొదటి దానికన్నా కాస్త సంక్షిప్తం. ఆ తరువాత లేచి నిలబడి సుదీర్ఘ పఠనం గావించారు. ఈ పఠనం కూడ మొదటి పఠనాల కన్నా కాస్త సంక్షిప్తంగా ఉండింది. తర్వాత మళ్ళీ సుదీర్ఘమైన రుకూ చేశారు. ఇది కూడా గత రుకూల కన్నా కొంచెం తక్కువ. ఆ తరువాత సజ్దా చేశారు. తరువాత సలాం చేసి నమాజు ముగించారు. అప్పటికి సూర్యుడు పూర్తిగా గ్రహణం వీడి ప్రకాశించాడు. ఆ తరువాత ఆయన ఇలా ప్రవచించారు:
“సూర్యచంద్రులిద్దరూ అల్లాహ్ నిదర్శనాలలో రెండు నిదర్శనాలు. అంతేగాని ఈ గ్రహణం ఒకరి జీవన్మరణాల కారణంగా పట్టదు. అంచేత మీరెప్పుడైనా గ్రహణం పట్టడం చూస్తే అల్లాహ్ ను స్మరించండి. (అంటే నమాజు చేయండి).
అప్పుడు ప్రజలు “దైవప్రవక్తా! మీరు మీ స్థానంలో నిలబడే ఏదో వస్తువుని అందుకున్నట్లు మేము చూశాము. ఆ తరువాత మీరు వెనక్కి జరగడం కూడ మేము గమనించాము” అని అన్నారు. దానికి దైవప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారు :
“నేను స్వర్గం చూశాను. అందులో నుండి ఒక పండ్ల గుత్తి తీసుకుందామనుకున్నాను. దాన్ని గనక నేనప్పుడు తీసుకొని ఉంటే మీరా పండ్లను ప్రళయం దాకా తింటూనే ఉంటారు (అయిపోయేవి కావు). నాకు నరకం కూడ చూపించబడింది. ఈ రోజు నేను చూసినంతటి భీకర దృశ్యం ఇదివరకెన్నడూ చూడలేదు. నేను నరకంలో స్త్రీలు ఎక్కువమంది ఉండటం చూశాను.”
ప్రజలు ఈ మాట విని “దైవప్రవక్తా! దానికి కారణం ఏమిటి?” అని అడిగారు. అందుకు దైవప్రవక్త ﷺ “వారి తిరస్కార వైఖరే దానికి కారణం” అని అన్నారు. “ఏమిటి స్త్రీలు అల్లాహ్ ను తిరస్కరిస్తారా?” అని అడిగారు ప్రజలు మళ్ళీ. “వారు తమ భర్తలకు కృతఘ్నురాళ్ళయిపోతారు. చేసిన మేలు మరచి ప్రవర్తిస్తారు. మీరు ఆమె పట్ల జీవితాంతం మంచిగా మసలుకున్నాసరే, ఎప్పుడైనా కాస్త మీ వల్ల హెచ్చుతగ్గులు జరిగితే చాలు – నీ వల్ల నా కసలు మేలే జరుగలేదు అంటుంది ఆమె” అని అన్నారు దైవప్రవక్త ﷺ.
[సహీహ్ బుఖారీ : 16వ ప్రకరణం – కుసూఫ్, 9వ అధ్యాయం – సలాతిల్ కుసూఫి ఫీజమాఅత్]
మహా ప్రవక్త మహితోక్తులు|10. సలాతుల్ కుసూఫ్ ప్రకరణం|హదీసు 525
5వ అధ్యాయం – కుసూఫ్ నమాజు కోసం నమాజు సిద్ధంగా ఉందని పిలుపునివ్వడం
హదీసు 526
باب ذكر النداء بصلاة الكسوف، الصلاة جامعة
حديث عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ قَالَ: لَمَّا كَسَفَتِ الشَّمْسُ عَلَى عَهْدِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، نُودِيَ: إِنَّ الصَّلاَةَ جَامِعَةٌ، فَرَكَعَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَكْعَتَيْنِ فِي سَجْدَةٍ، ثُمَّ قَامَ فَرَكَعَ رَكْعَتَيْنِ فِي سَجْدَةٍ، ثُمَّ جَلَسَ، ثُمَّ جُلِّيَ عَنِ الشَّمْسِ قَالَ: وَقَالَتْ عَائِشَةُ: مَا سَجَدْتُ سُجُودًا قَطُّ كَانَ أَطْوَلَ مِنْهَا
أخرجه البخاري في: 16 كتاب الكسوف: 8 باب طول السجود في الكسوف
హజ్రత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త ﷺ కాలంలో ఒకసారి సూర్యగ్రహణం పట్టితే “అన్నస్సలాత్ జామిఆ”(నమాజు సిద్ధంగా వుంది) అని ప్రజలను పిలవడం జరిగింది. ఆ తరువాత దైవప్రవక్త ﷺ రెండు రకాతులు నమాజు చేశారు. ప్రతి రకాతులోనూ రెండేసి సార్లు రుకూ చేశారు. తర్వాత సూర్య గ్రహణం వీడేవరకు కూర్చున్నారు. విశ్వాసుల మాతృమూర్తి (హదీసు ఉల్లేఖకుని కథనం ప్రకారం) ఆయిషా (రదియల్లాహు అన్హా) ఆ విషయం ప్రస్తావిస్తూ “ఆ సజ్దా అంతటి సుదీర్ఘమైన సజ్దాను నేను ఎన్నడూ చూడలేదు” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 16వ ప్రకరణం – కుసూఫ్, 8వ అధ్యాయం – తూలిస్సుజూది ఫిల్ కుసూఫ్]
మహా ప్రవక్త మహితోక్తులు|10. సలాతుల్ కుసూఫ్ ప్రకరణం|హదీసు 526
హదీసు 527
حديث أَبِي مَسْعُودٍ قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ الشَّمْسَ وَالْقَمَرَ لاَ يَنْكَسِفَانِ لِمَوْتِ أَحَدٍ مِنَ النَّاسِ، وَلكِنَّهُمَا آيَتَانِ مِنْ آيَاتِ اللهِ، فَإِذَا رَأَيْتُمُوهُمَا فَقُومُوا فَصَلُّوا
أخرجه البخاري في: 16 كتاب الكسوف: 1 باب الصلاة في كسوف الشمس
హజ్రత్ అబూ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “సూర్యచంద్రగ్రహణాలు ఏ ఒక్కరి మరణం, పుట్టుకలకు కారణభూతం కాజాలవు. సూర్యచంద్రులు అల్లాహ్ నిదర్శనాలలో రెండు నిదర్శనాలు. అందువల్ల మీరు సూర్యగ్రహణం గాని, చంద్రగ్రహణం గాని పట్టడం చూస్తే లేచి నమాజు చేయండి.”
[సహీహ్ బుఖారీ : 16వ ప్రకరణం – కుసూఫ్, 1వ అధ్యాయం – అస్సలాతి ఫీ కుసూఫిష్షమ్స్]
మహా ప్రవక్త మహితోక్తులు|10. సలాతుల్ కుసూఫ్ ప్రకరణం|హదీసు 527
హదీసు 528
حديث أَبِي مُوسَى قَالَ: خَسَفَتِ الشَّمْسُ، فَقَامَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَزِعًا، يَخْشَى أَنْ تَكُونَ السَّاعَةُ؛ فَأَتَى الْمَسْجِدَ فَصَلّى بِأَطْوَلِ قِيَامٍ وَرُكُوعٍ وَسُجُودٍ رَأَيْتُهُ قَطُّ يَفْعَلُهُ، وَقَالَ: هذِهِ الآيَاتُ الَّتِي يُرْسِلُ اللهُ، لاَ تَكُونُ لِمَوْتِ أَحَدٍ وَلاَ لِحَيَاتِهِ، وَلكِنْ يُخَوِّفُ اللهُ بِهِ عِبَادَهُ، فَإِذَا رَأَيْتُمْ شَيْئًا مِنْ ذلِكَ فَافْزَعُوا إِلَى ذِكْرِ اللهِ وَدُعَائِهِ وِاسْتِغْفَارِهِ
أخرجه البخاري في: 16 كتاب الكسوف: 14 باب الذكر في الكسوف
హజ్రత్ అబూమూసా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త ﷺ కాలంలో ఓసారి సూర్యగ్రహణం పట్టితే ‘ప్రళయం రాదు కదా’ అని ఆయన ఆందోళన చెందుతూ, మస్జిద్‌కు వెళ్ళి (కుసూఫ్) నమాజు చేశారు. అందులో ఖుర్ఆన్ పఠనం, రుకూ, సజ్దాలు నేనిదివరకెన్నడూ చూడనంత సుదీర్ఘంగా జరిగాయి. (తర్వాత) దైవప్రవక్త ﷺ ఇలా ప్రసంగించారు. “ఇవి (సూర్యచంద్రగ్రహణాలు) అల్లాహ్ పంపుతున్న నిదర్శనాలు. అంతేగాని ఏ ఒక్కరి చావు పుట్టుకలకు కారణభూతం కాజాలవు. ఈ నిదర్శనాల ద్వారా అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు. అందువల్ల మీరు ఇలాంటి నిదర్శనాలేమైనా చూస్తే వెంటనే అల్లాహ్ స్మరణ (నమాజు) వైపుకు పరుగెత్తండి, ఆయన్ని వేడుకోండి, పాప మన్నింపు కోరండి.”
[సహీహ్ బుఖారీ : 16వ ప్రకరణం – కుసూఫ్, 14వ అధ్యాయం – అజ్జిక్రి ఫిల్‌కుసూఫ్]
మహా ప్రవక్త మహితోక్తులు|10. సలాతుల్ కుసూఫ్ ప్రకరణం|హదీసు 528
హదీసు 529
حديث ابْنِ عُمَرَ، أَنَّهُ كَانَ يُخْبِرُ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ الشَّمْسَ وَالْقَمَرَ لاَ يَخْسِفَانِ لِمَوْتِ أَحَدٍ وَلاَ لِحَيَاتِهِ، وَلكِنَّهُمَا آيَتَانِ مِنْ آيَاتِ اللهِ، فَإِذَا رَأَيْتُمُوهُمَا فَصَلُّوا
أخرجه البخاري في: 16 كتاب الكسوف: 1 باب الصلاة في كسوف الشمس
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు :- సూర్యచంద్రగ్రహణాలు ఏ ఒక్కరి చావు పుట్టుకలకు కారణభూతం కాజాలవు. సూర్యచంద్రులు అల్లాహ్ నిదర్శనాలలో రెండు నిదర్శనాలు. అందువల్ల మీరు సూర్యచంద్రగ్రహణాలు చూస్తే నమాజు చేయండి.
[సహీహ్ బుఖారీ : 16వ ప్రకరణం – కుసూఫ్, 1వ అధ్యాయం – అస్సలాతు ఫీకుసూఫిష్షమ్]
మహా ప్రవక్త మహితోక్తులు|10. సలాతుల్ కుసూఫ్ ప్రకరణం|హదీసు 529
హదీసు 530
حديث الْمُغِيرَةِ بْنِ شُعْبَةَ، قَالَ: كَسَفَتِ الشَّمْسِ عَلَى عَهْدِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَوْمَ مَاتَ إِبْرَاهِيمُ؛ فَقَالَ النَّاسُ: كَسَفَتِ الشَّمْسُ لِمَوْتِ إِبْرَاهِيمَ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ الشَّمْسَ وَالْقَمَرَ لاَ يَنْكَسِفَانِ لِمَوْتِ أَحَدٍ وَلاَ لِحَيَاتِهِ، فَإِذَا رَأَيْتُمْ فَصَلُّوا وَادْعُوا اللهَ
أخرجه البخاري في: 16 كتاب صلاة الكسوف: 1 باب الصلاة في كسوف الشمس
హజ్రత్ ముగైరా బిన్ షాబ(రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త ﷺ కాలంలో ఆయన కుమారుడు ఇబ్రాహీం (రదియల్లాహు అన్హు) చనిపోయిన రోజు సూర్యగ్రహణం పట్టింది. దాంతో జనం ‘ఇబ్రాహీం (రదియల్లాహు అన్హు) చనిపోవడం వల్లనే సూర్యగ్రహణం పట్టిందని’ చెప్పుకోసాగారు. దైవప్రవక్త ﷺ ఈ మాటలు విని “ ఏ ఒక్కరి చావు పుట్టుకల కారణంగా సూర్యచంద్రగ్రహణాలు సంభవించవు. మీరొక వేళ సూర్యచంద్రగ్రహణాలు పట్టడం చూస్తే నమాజు చేయండి” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 16వ ప్రకరణం – కుసూఫ్, 1వ అధ్యాయం – అస్సలాతి ఫీ కుసూఫిష్షమ్స్]
మహా ప్రవక్త మహితోక్తులు|10. సలాతుల్ కుసూఫ్ ప్రకరణం|హదీసు 530
You must be logged in to post a comment.