మహా ప్రవక్త మహితోక్తులు – 43. స్వప్న ప్రకరణం

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
ఉర్దూ అనువాదం: సయ్యిద్ షబ్బీర్ అహ్మద్ · తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

అల్-లూలు వల్ మర్జాన్ – మహా ప్రవక్త మహితోక్తులు (అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ) – అరబీ, తెలుగు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) – 43. స్వప్న ప్రకరణం. ఇందులో 12 హదీసులు (హదీసు 1456 – 1467), 3 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి హదీసు తెలుగు అనువాదం, అరబీ మూలంతో.

⬇ డౌన్లోడ్ PDFస్వప్న ప్రకరణం6 పేజీలు · 0.4 MB

43. స్వప్న ప్రకరణం

كتاب الرؤيا
అధ్యాయాలు (3)
  1. 1 కలలో దైవప్రవక్త ﷺను చూడటం H 1461
  2. 3 కలల గూడార్థం (స్వప్న భావం) H 1462
  3. 4 దైవప్రవక్త ﷺ కలలు H 1463 – 1467
1456

హదీసు 1456

حديث أَبِي قَتَادَةَ، قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: الرُّؤْيَا مِنَ اللهِ وَالْحُلُمُ مِنَ الشَّيْطَانِ، فَإِذَا رَأَى أَحَدُكُمْ شَيْئًا يَكْرَهُهُ فَلْيَنْفِثْ، حِينَ يَسْتَيْقِظ، ثَلاَثَ مَرَّاتٍ، وَيَتَعَوّذْ مِنْ شَرِّهَا، فَإِنَّهَا لاَ تَضُرُّهُ

أخرجه البخاري في: 76 كتاب الطب: 39 باب النفث في الرقية

హజ్రత్ అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు:- మంచి కలలు అల్లాహ్ తరపున వస్తాయి, చెడ్డ కలలు షైతాన్ తరపున వస్తాయి. కనుక ఎవరికైనా కలలో ఏదైనా చెడు విషయం కన్పిస్తే మేల్కొన్న వెంటనే అతను థూథూ అని చెప్పి షైతాన్ బారి నుండి అల్లాహ్ ను శరణు వేడుకోవాలి. అలా చేస్తే ఆ కల వల్ల అతనికి ఎలాంటి నష్టం వాటిల్లదు.

(సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం – తిబ్, 39వ అధ్యాయం – అన్నఫ్సి ఫిర్రుఖ్యా)

మహా ప్రవక్త మహితోక్తులు|43. స్వప్న ప్రకరణం|హదీసు 1456

1457

హదీసు 1457

حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِذَا اقْتَرَبَ الزَّمَان لَمْ تَكَدْ تَكْذِبُ رُؤْيَا الْمُؤْمِنِ، وَرُؤْيَا الْمُؤْمِنِ جُزْءٌ مِنْ سِتَّةٍ وَأَرْبَعِينَ جُزْءًا مِنَ النُّبُوَّةِ

أخرجه البخاري في: 91 كتاب التعبير: 26 باب القيد في المنام

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు:- కాలం మధ్యస్తం అయినప్పుడు (అంటే రాత్రి, పగలు సరి సమానమయినప్పుడు) విశ్వాసికి వచ్చే కలలు సాధారణంగా అసత్యమైనవి కాజాలవు.★ ప్రవక్తృత్వపు (నబువ్వత్) నలభై ఆరు భాగాలలో విశ్వాసికి వచ్చే కల కూడా ఒక భాగమే.

(సహీహ్ బుఖారీ:- 91వ ప్రకరణం – తాబీర్, 26వ అధ్యాయం – అల్ ఖైదు ఫిల్ మనామ్)

★ దీనికి మరొక అర్థం-ప్రళయకాల సమీపంలో విశ్వాసి కనే కలలు సాధారణంగా అసత్యం కాజాలవు. (సంకలనకర్త)

మహా ప్రవక్త మహితోక్తులు|43. స్వప్న ప్రకరణం|హదీసు 1457

1458

హదీసు 1458

حديث عُبَادَة بْنِ الصَّامِتِ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: رُؤْيَا الْمُؤْمِنِ جُزْءٌ مِنْ سِتَّةٍ وَأَرْبَعِينَ جُزْءًا مِنَ النُّبُوَّةِ

أخرجه البخاري في: 91 كتاب التعبير: 4 باب الرؤيا الصالحة جزء من ستة وأربعين جزءًا من النبوة

హజ్రత్ ఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా తెలియజేశారు:- ప్రవక్తృత్వపు (నబువ్వత్) నలభై ఆరు భాగాలలో ఒక భాగం విశ్వాసికి వచ్చే కల.

(సహీహ్ బుఖారీ:- 91వ ప్రకరణం – తాబీర్, 4వ అధ్యాయం – అర్రూయస్సాలిహతు జుజ్‌వుఁమ్మిన్ సిత్తతిఁవ్వ అర్బయీన జుజ్ అమ్మినన్నుబువ్వతి)

మహా ప్రవక్త మహితోక్తులు|43. స్వప్న ప్రకరణం|హదీసు 1458

1459

హదీసు 1459

حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: رُؤْيَا الْمُؤْمِنِ جُزْءٌ مِنْ سِتَّةٍ وَأَرْبَعِين جُزْءًا مِنَ النُّبُوَّةِ

أخرجه البخاري في: 91 كتاب التعبير: 10 باب من رأى النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ في المنام

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- విశ్వాసికి వచ్చే కల ప్రవక్తృత్వపు నలభై ఆరు భాగాలలో ఒక భాగం.

(సహీహ్ బుఖారీ:- 91వ ప్రకరణం – తాబీర్, 10వ అధ్యాయం – మన్‌ర అన్న బియ్య ﷺ ఫిల్ మనామ్)

మహా ప్రవక్త మహితోక్తులు|43. స్వప్న ప్రకరణం|హదీసు 1459

1460

హదీసు 1460

حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: رُؤْيَا الْمُؤْمِنِ جُزْءٌ مِنْ سِتَّةٍ وَأَرْبَعِينَ جُزْءًا مِنَ النُّبُوَّةِ

أخرجه البخاري في: 91 كتاب التعبير: 4 باب الرؤيا الصالحة جزء من ستة وأربعين جزءًا من النبوة

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు:- విశ్వాసికి వచ్చే కల నబువ్వత్‌కు చెందిన నలభై ఆరు భాగాలలో ఒక భాగం అవుతుంది.

(సహీహ్ బుఖారీ:- 91వ ప్రకరణం – తాబీర్, 4వ అధ్యాయం – అర్రూయస్సాలిహతు జుజ్‌వుఁమ్మిన్ సిత్తతిఁవ్వ అర్బయీన జుజ్ అమ్మినన్నుబువ్వతి)

మహా ప్రవక్త మహితోక్తులు|43. స్వప్న ప్రకరణం|హదీసు 1460

1వ అధ్యాయం – కలలో దైవప్రవక్త ﷺను చూడటం

1461

హదీసు 1461

باب قول النبيّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ من رآني في المنام فقد رآني

حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: مَنْ رَآنِي فِي الْمَنَامِ فَسَيَرَانِي فِي الْيَقَظَةِ، وَلاَ يَتَمَثَّلُ الشَّيْطَانُ بِي

أخرجه البخاري في: 91 كتاب التعبير: 10 باب من رأى النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ في المنام

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలిపారు:- నన్ను కలలో చూసినవాడు త్వరలోనే (ప్రళయదినాన) జాగృదావస్థలో కూడా నన్ను చూస్తాడు. (అంటే నన్ను గుర్తుపడతాడు) షైతాన్ నా రూపంలో (కలలోకి) రాలేడు.

(సహీహ్ బుఖారీ:- 91వ ప్రకరణం – తాబీర్, 10వ అధ్యాయం – మన్‌ర అన్నబియ్య ﷺ ఫిల్ మనామ్)

మహా ప్రవక్త మహితోక్తులు|43. స్వప్న ప్రకరణం|హదీసు 1461

3వ అధ్యాయం – కలల గూడార్థం (స్వప్న భావం)

1462

హదీసు 1462

باب في تأويل الرؤيا

حديث ابْنِ عَبَّاسٍ، أَنَّ رَجُلاً أَتى رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: إِنِّي رَأَيْتُ اللَّيْلَةَ فِي الْمَنَامِ ظُلَّةً تَنْطُفُ السَّمْنَ وَالْعَسَلَ، فَأَرَى النَّاسَ يَتَكَفَّفُونَ مِنْهَا فَالْمُسْتَكْثِرُ وَالْمُسْتَقِلُّ وَإِذَا سَبَبٌ وَاصِلٌ مِنَ الأَرْضِ إِلَى السَّمَاءِ، فَأَرَاكَ أَخَذْتَ بِهِ فَعَلَوْتَ، ثُمَّ أَخَذَ بِهِ رَجُلٌ آخَرُ فَعَلاَ بِهِ، ثُمَّ أَخَذَ بِهِ رَجُلٌ آخَرُ فَعَلاَ بِهِ، ثُمَ أَخَذَ بِهِ رَجُلٌ آخَرُ فَانْقَطَعَ ثُمَّ وُصِلَ فَقَالَ أَبُو بَكْرٍ: يَا رَسُولَ اللهِ بِأَبى أَنْتَ، وَاللهِ لَتَدَعَنِّي فَأَعْبُرَهَا فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: اعْبُرْ قَالَ: أَمَّا الظُّلَّةُ فَالإِسْلاَمُ، وَأَمَّا الَّذِي يَنْطُفُ مِنَ الْعَسَلِ وَالسَّمْنِ فَالْقُرْآن، حَلاَوَتُهُ تَنْطِفُ فَالْمُسْتَكْثِرُ مِنَ الْقُرْآنِ وَالْمُسْتَقِلُّ وَأَمَّا السَّبَبُ الْوَاصِلُ مِنَ السَّمَاءِ إِلَى الأَرْضِ فَالْحَقُّ الَّذِي أَنْتَ عَلَيْهِ؛ تَأْخُذُ بِهِ فَيُعْلِيكَ اللهُ، ثُمَّ يَأْخُذُ بِهِ رَجُلٌ مِنْ بَعْدِكَ فَيَعْلُو بِهِ، ثُمَّ يَأْخُذُ رَجُلٌ آخَرُ فَيَعْلُو بِهِ ثُمَّ يَأْخُذُ رَجُلٌ آخَرُ فَيَنْقَطِعُ بِهِ، ثُمَّ يُوَصَّل لَهُ فَيَعْلُو بِهِ فَأَخْبِرْنِي، يَا رَسُولَ اللهِ، بِأَبِي أَنْتَ، أَصَبْتُ أَمْ أَخْطَاْتُ قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَصَبْتَ بَعْضًا وأَخطَأْتَ بَعْضًا قَالَ: فَوَاللهِ لَتُحَدِّثنِي بِالَّذِي أَخْطَأْتُ قَالَ: لاَ تُقْسِمْ

أخرجه البخاري في: 91 كتاب التعبير: 47 باب من لم ير الرؤيا لأول عابر إذا لم يصب

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి ఇలా విన్నవించుకున్నాడు. – “దైవప్రవక్తా! రాత్రి నేను ఒక కల గన్నాను. ఆ కలలో ఒక మబ్బు తునక కన్పించింది. అందులో నుంచి నెయ్యి, తేనె బొట్లు బొట్లుగా కారుతున్నాయి. ప్రజలు వాటిని తమ దోసిళ్ళలో పడ్తున్నారు. కొందరు ఎక్కువ తీసుకున్నారు, మరికొందరు తక్కువ తీసుకున్నారు. ఆ తరువాత నేను నింగి నుండి నేల దాకా ఒక పెద్ద త్రాడు వ్రేలాడుతూ ఉండటం చూశాను. మీరా త్రాటిని పట్టుకొని ఆకాశంలోకి వెళ్ళిపోయారు, ఆ తరువాత మరొక వ్యక్తి ఆ త్రాటిని పట్టుకున్నాడు. అతను కూడా దాని సహాయంతో ఆకాశంలోకి పోయాడు. ఆ తరువాత మరొక వ్యక్తి ఆ త్రాటిని పట్టుకున్నాడు. అతను కూడా ఆ త్రాటి మీదుగా ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత మరొక వ్యక్తి వచ్చి పట్టుకున్నాడు. అప్పుడు ఆ త్రాడు కాస్తా తెగిపోయింది. అయితే అంతలోనే అది మళ్ళీ కలిసిపోయింది”.

హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) ఈ కల విని “దైవప్రవక్తా! నా తల్లిదండ్రులు మీ కోసం సమర్పితం! నేనీ కల గూడార్థం చెబుతాను, అనుమతివ్వండి” అని అన్నారు. దానికి దైవప్రవక్త ﷺ “అలాగే చెప్పు” అన్నారు. అప్పుడు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) ఇలా చెప్పారు – “ఇతను కలలో చూసిన మబ్బు తునక ‘ఇస్లాం ధర్మం’. ఆ మబ్బు తునక నుండి కారుతుండిన నెయ్యి, తేనెలు దివ్య ఖుర్‌ఆన్. అంటే ఖుర్‌ఆన్ నుండి అమృత వాక్కులు వెలువడుతున్నాయన్న మాట. కొందరు ఖుర్‌ఆన్‌ని ఎక్కువగా నేర్చుకున్నారు. మరికొందరు తక్కువగా నేర్చుకున్నారు. నింగి నుండి నేల దాకా వ్రేలాడుతున్న త్రాడు సత్య సంధత. దానిపై మీరు స్థిరంగా ఉన్నారు. ఈ సత్యాన్ని దృఢంగా పట్టుకోవడం వల్ల అల్లాహ్ మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చాడు. మీ తరువాత మరొక వ్యక్తి ఆ త్రాటిని పట్టుకుంటాడు. అతను కూడా దాని సహాయంతో ఉన్నత శిఖరాలకు చేరుతాడు. ఆ తరువాత మరొకడు ఆ త్రాటిని పట్టుకుంటాడు. అతను కూడా ఉన్నత శిఖరాలకు చేరుతాడు. ఆ తరువాత మరొకడు కూడా ఆ త్రాటిని పట్టుకొని ఉన్నత శిఖరాలకు చేరుతాడు. ఆ తరువాత మరొకడు పట్టుకోగానే ఆ త్రాడు తెగిపోతుంది. అయితే అది మళ్ళీ కలసిపోతుంది. అతను కూడా ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు. దైవప్రవక్తా! నా తల్లిదండ్రులు మీ కోసం సమర్పితం! నేను చెప్పిన ఈ గూడార్థం సరైనదో కాదో కాస్త చెప్పండి.”

దానికి దైవప్రవక్త సమాధానమిస్తూ “కొంత భాగం సరైనదే. కాని కొంత భాగం తప్పయి పోయింది” అని అన్నారు. “అయితే అల్లాహ్ సాక్షిగా చెప్పండి. నేను ఈ కల గూడార్థం చెప్పడంలో ఏమేమి పొరపాట్లు చేశానో చెప్పండి” అని అడిగారు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు). దైవప్రవక్త ﷺ ఈ మాట విని “ప్రమాణం విషయాన్ని ప్రస్తావించకు” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 91వ ప్రకరణం – తాబీర్, 47వ అధ్యాయం – మఁల్లమ్ యరర్రుయాలి అవ్వలి ఆబిర్ ఇజాలమ్ యసుబ్)

మహా ప్రవక్త మహితోక్తులు|43. స్వప్న ప్రకరణం|హదీసు 1462

4వ అధ్యాయం – దైవప్రవక్త ﷺ కలలు

1463

హదీసు 1463

باب رؤيا النبيّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

حديث ابْنِ عُمَرَ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: أَرَانِي أَتَسَوَّكُ بِسِوَاكٍ، فَجَاءَنِي رَجُلاَنِ أَحَدُهُمَا أَكْبَرُ مِنَ الآخَرِ فَنَاوَلْتُ السِّوَاكَ الأَصْغَرَ مِنْهُمَا، فَقِيلَ لِي كَبِّرْ، فَدَفَعْتُهُ إِلَى الأَكْبَرِ مِنْهُمَا

أخرجه البخاري في: 4 كتاب الوضوء: 74 باب دفع السواك إلى الأكبر

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు:- నేను మిస్వాక్ (బ్రష్) చేస్తున్నట్లు కలగన్నాను. అప్పుడు నా దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకడు పెద్దవాడు. నేనా మిస్వాక్‌ని చిన్న వాడికిచ్చాను. అయితే పెద్దవాడికిచ్చేయమని నాకు చెప్పబడింది. అందుచేత నేను మిస్వాక్‌ని పెద్దవాడికి ఇచ్చివేశాను.

(సహీహ్ బుఖారీ:- 4వ ప్రకరణం – వుజూ, 74వ అధ్యాయం – దఫ్‌యిస్సివాకి ఇలల్ అక్బర్)

మహా ప్రవక్త మహితోక్తులు|43. స్వప్న ప్రకరణం|హదీసు 1463

1464

హదీసు 1464

حديث أَبِي مُوسى، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: رَأَيْتُ فِي الْمَنَامِ أَنِّي أُهَاجِرُ مِنْ مَكَّةَ إِلَى أَرْضٍ بِهَا نَخْلٌ، فَذَهَبَ وَهَلِي إِلَى أَنَّهَا الْيَمَامَةُ أَوْ هَجَرُ فَإِذَا هِيَ الْمَدِينَةُ، يَثْرِبُ وَرَأَيْتُ فِي رُؤْيَايَ هذِهِ أَنِّي هَزَزْتُ سَيْفًا فَانْقَطَعَ صَدْرُهُ، فَإِذَا هُوَ مَا أُصِيبَ مِنَ الْمُؤْمِنِينَ، يَوْمَ أُحُدٍ ثُمَّ هَزَزْتُهُ بِأُخْرَى، فَعَادَ أَحْسَنَ مَا كَانَ، فَإِذَا هُوَ مَا جَاءَ اللهُ بِهِ مِنَ الْفَتْحِ وَاجْتِمَاعِ الْمُؤْمِنِينَ وَرَأَيْتُ فِيهَا بَقَرًا، وَاللهُ خَيْرٌ، فَإِذَا هُمُ الْمُؤْمِنُونَ يَوْمَ أُحُدٍ، وَإِذَا الْخَيْرُ مَا جَاءَ اللهُ، مِنَ الْخَيْرِ، وَثَوَابِ الصِّدْقِ الَّذِي آتَانَا اللهُ بَعْدَ يَوْمِ بَدْرٍ

أخرجه البخاري في: 61 كتاب المناقب: 25 باب علامات النبوة في الإسلام

హజ్రత్ అబూ మూసా అష్‌అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా తెలియజేశారు:- నేనొక కలగన్నాను. అందులో నేను మక్కా నుండి ఖర్జూరపు తోటలున్న ప్రాంతానికి వలసపోతున్నాను. నేనప్పుడు అది యమామా లేక హజర్ అయి ఉంటుందని భావించాను. కాని అది మదీనా (యస్రిబ్) అయ్యింది. ఆ కలలోనే నేనొక ఖడ్గం తిప్పాను. అయితే అది మధ్యగా విరిగిపోయింది. ఇది ఉహుద్ యుద్ధంలో ముస్లింపై వచ్చిపడిన ఆపద. తరువాత నేను ఆ ఖడ్గాన్నే తిప్పితే అది పూర్వం కంటే కూడా ఎంతో మెరుగైపోయింది. ఇది అల్లాహ్ మనకు ప్రసాదించిన (అంతిమ) విజయం. అప్పుడు ముస్లింలు సమైక్యమయి సంఘటితమయ్యారు. నేను కలలో ఆవుల్ని కూడా చూశాను. అల్లాహ్ చేసే ప్రతి పనీ మంచిదే. ఈ ఆవులు ఉహుద్ యుద్ధంలో అమరవీరులయి పోయిన ముస్లింలు అన్నమాట. అల్లాహ్ చేసే ప్రతి పనీ మంచిదే. ఇది బద్ర్ యుద్ధం తరువాత ఇప్పటి వరకు అల్లాహ్ మనకు ప్రసాదించిన సత్యతా ప్రతిఫలం.

(సహీహ్ బుఖారీ:- 61వ ప్రకరణం – మనాఖిబ్, 25వ అధ్యాయం – అలామాతిన్నుబువ్వతి ఫిల్ ఇస్లాం)

మహా ప్రవక్త మహితోక్తులు|43. స్వప్న ప్రకరణం|హదీసు 1464

1465

హదీసు 1465

حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: قَدِمَ مُسَيْلِمَةُ الْكَذَّابُ عَلَى عَهْدِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَجَعَلَ يَقُولُ: إِنْ جَعَلَ لِي مُحَمَّدٌ مِنْ بَعْدِهِ تَبِعْتُهُ وَقَدِمَهَا فِي بَشَرٍ كَثِيرٍ مِنْ قَوْمِه فَأَقْبَلَ إِلَيْهِ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَمَعَهُ ثَابِتُ بْنُ قَيْسِ بْنِ شَمَّاسٍ وَفِي يَدِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قِطْعَةُ جَرِيدٍ، حَتَّى وَقَفَ عَلَى مُسَيْلِمَةَ، فِي أَصْحَابِهِ فَقَالَ: لَوْ سَأَلْتَنِي هذِهِ الْقِطْعَةَ مَا أَعْطَيْتُكَهَا وَلَنْ تَعْدُوَ أَمْرَ اللهِ فِيكَ؛ وَلَئِنْ أَدْبَرْتَ لَيَعْقِرَنَّكَ اللهُ وَإِنِّي لأَرَاكَ الَّذِي أُرِيتُ فِيه مَا رَأَيْتُ وَهذَا ثَابِتٌ يُجِيبُكَ عَنِّي ثُمَّ انْصَرَفَ عَنْه قَالَ ابْنُ عَبَّاسٍ: فَسَأَلْتُ عَنْ قَوْلِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّكَ أُرَى الَّذِي أُرِيتُ فِيهِ مَا رَأَيْتُ

హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- దైవప్రవక్త ﷺ కాలంలో (బూటకపు ప్రవక్త) ముసైలిమా కిజ్జాబ్ మదీనా వచ్చి “ముహమ్మద్ ﷺ గనక తన తదనంతరం నన్ను తన ప్రతినిధి (వారసుడి)గా నిర్ణయిస్తే నేనాయనకు విధేయుణ్ణయిపోవడానికి సిద్ధంగా ఉన్నాను” అని చెప్పసాగాడు. ముసైలిమా తన వెంట తన జాతికి చెందిన అనేకమంది జనాన్ని తెచ్చుకున్నాడు. దైవప్రవక్త ﷺ అతని దగ్గరికి వెళ్ళారు (మాట్లాడటానికి). ఆయన వెంట సాబిత్ బిన్ ఖైస్ బిన్ షమ్మాస్ (రదియల్లాహు అన్హు) కూడా ఉన్నారు. దైవప్రవక్త ﷺ చేతిలో ఓ కర్ర ముక్క ఉంది. ఆయన ముసైలిమా, అతని అనుచరుల దగ్గరికి వచ్చి “ముసైలిమా నీవు నన్ను (ఇలాంటి) ఓ కర్ర ముక్క అడిగినా నేను నీకు ఇవ్వను. అల్లాహ్ నీ కోసం నిర్ణయించిన దాన్నుండి నీవు ఏ మాత్రం తప్పించుకోలేవు. నీవు నా నుండి ముఖం తిప్పుకున్నావు. అందుచేత అల్లాహ్ నిన్ను (త్వరలోనే) అంతమొందిస్తాడు. నీవు నా కలలో ఎలా కన్పించావో ఇప్పుడు నేను నిన్ను అదేవిధంగా చూస్తున్నాను. (ఇంకేమైనా ఉంటే) ఈయన సాబిత్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) నా తరపున నీకు జవాబిస్తారు” అని అన్నారు. దైవప్రవక్త ﷺ ఇలా మాట్లాడిన తరువాత అక్కడ్నుంచి వెళ్ళిపోయారు.

(సహీహ్ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజి, 70వ అధ్యాయం – వఫ్ది బనీ హనీఫా)

మహా ప్రవక్త మహితోక్తులు|43. స్వప్న ప్రకరణం|హదీసు 1465

1466

హదీసు 1466

فَأَخْبَرَنِي أَبُو هُرَيْرَةَ: أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: بَيْنَا أَنَا نَائِمٌ، رَأَيْتُ فِي يَدَيّ سِوَارَيْنِ مِنْ ذَهَبٍ فَأَهَمَّنِي شَأْنُهُمَا، فَأُوحِيَ إِلَيَّ فِي الْمَنَامِ أَنِ انْفُخْهُمَا، فَنَفَخْتُهُمَا فَطَارَا، فَأَوَّلْتُهُمَا كَذَّابَيْنِ يَخْرُجَانِ بَعْدِي؛ أَحَدُهُمَا الْعَنْسِيُّ، وَالآخَرُ مُسَيْلِمَةُ

أخرجه البخاري في: 64 كتاب المغازي: 70 باب وفد بني حنيفة

హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) నాకీ విధంగా తెలియజేశారు – “నేను కలలో నా రెండు చేతులకు రెండు బంగారు మురుగులు ధరించి ఉన్నట్లు చూశాను. వాటిని చూసి నాకెంతో బాధ కలిగింది. తరువాత వాటిపై ఊదేయమని అల్లాహ్ నాకు దివ్య సంకేతం (వహీ) ద్వారా తెలియజేశాడు. నేనలాగే ఊదాను. దాంతో ఆ బంగారు మురుగులు రెండూ ఎగిరిపోయాయి. ఈ కల ద్వారా నేను గ్రహించిందేమిటంటే నా తరువాత ఇద్దరు అసత్య వాదులు (బూటకపు ప్రవక్తలు) తిరుగుబాటు చేస్తారు. వారిలో ఒకడు అబుల్ అస్వద్ అనసి; రెండోవాడు ముసైలిమా కిజ్జాబ్”.★

(సహీహ్ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజి, 70వ అధ్యాయం – వఫ్ది బనీ హనీఫా)

★ అబుల్ అస్వద్ అనసి అనేవాడు సనా (ప్రాంతం)లో దైవప్రవక్త ﷺ జీవిత కాలంలోనే తనను తాను దైవప్రవక్తనని ప్రకటించుకున్నాడు. ఆ కాలంలోనే అతను హతమార్చబడ్డాడు. ముసైలిమా కిజ్జాబ్ అనేవాడు యమామా (ప్రాంతం) లో తనను తాను దైవప్రవక్తనని ప్రకటించుకున్నాడు. ఇతను ముహమ్మద్ మహనీయుని దైవదౌత్యంలో భాగస్తుణ్ణని చెప్పుకునేవాడు. ఈ విధంగా అతను పైకి ముహమ్మద్ ﷺ సందేశాన్ని వ్యతిరేకించేవాడు కాదు. చివరికితను కూడా హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ పాలనా కాలంలో ముస్లింల చేత హతమార్చబడ్డాడు. (ఇమామ్ నవవీ-రహ్మలై)

మహా ప్రవక్త మహితోక్తులు|43. స్వప్న ప్రకరణం|హదీసు 1466

1467

హదీసు 1467

حديث سَمُرَةُ بْنُ جُنْدُبٍ رَضِيَ اللهُ عَنْهُ، قَالَ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِمَّا يُكْثِرُ أَنْ يَقُولَ لِأَصْحَابِهِ: " هَلْ رَأَى أَحَدٌ مِنْكُمْ مِنْ رُؤْيَا " قَالَ: فَيَقُصُُّ عَلَيْهِ مَنْ شَاءَ اللهُ أَنْ يَقُصَّ وَإِنَّهُ قَالَ، ذَاتَ غَدَاةٍ: إِنَّهُ أَتَانِي، اللَيْلَةَ، آتِيَانِ، وَإِنَّهُمَا ابْتَعَثَانِي، وَإِنَّهُمَا قَالاَ لِي: انْطَلِقْ وَإِنِّي انْطَلَقْتُ مَعَهُمَا، وَإِنَّا أَتَيْنَا عَلَى رَجُلٍ مُضْطَجِعٍ، وَإِذَا آخَرُ قَائِمٌ عَلَيْهِ بِصَخْرَةٍ، وَإِذَا هُوَ يَهْوِي بِالصَّخْرَةِ لِرَأْسِهِ، فَيَثْلَغُ رَأْسَهُ فَيَتَهَدْهَدُ الْحَجَرُ ههُنَا، فَيَتْبَعُ الْحَجَرَ، فَيَاْخُذُهُ، فَلاَ يَرْجِعُ إِلَيْهِ حَتَّى يَصِحَّ رَأْسُهُ كَمَا كَانَ ثُمَّ يَعُودُ عَلَيْهِ فَيَفْعَلُ بِهِ مِثْلَ مَا فَعَلَ الْمَرَّةَ الأُولَى قَالَ: قُلْتُ لَهُمَا: سُبْحَانَ اللهِ مَا هذَانِ قَالَ: قَالاَ لِي: انْطَلِقْ قَالَ: فَانْطَلَقْنَا، فَأَتَيْنَا عَلَى رَجُلٍ مُسْتَلْقٍ لِقَفَاهُ، وَإِذَا آخَرُ قَائِمٌ عَلَيْهِ، بِكَلُّوبٍ مِنْ حَدِيدٍ، وَإِذَا هُوَ يَأْتِي أَحَدَ شِقَّيْ وَجْهِهِ فَيُشَرْشِرُ شِدْقَهُ إِلَى قَفَاهُ، وَمِنْخَرَهُ إِلَى قَفَاهُ، وَعَيْنَهُ إِلَى قَفَاهُ قَالَ: ثُمَّ يَتَحَوَّلُ إِلَى الْجَانِبِ الآخَرِ، فَيَفْعَلُ بِهِ مِثْلَ مَا فَعَلَ بِالْجَانِبِ الأَوَّلِ، فَمَا يَفْرُغُ مِنْ ذلِكَ الْجَانِبِ حَتَّى يَصِحَّ ذَلِكَ الْجَانِبُ كَمَا كَانَ، ثُمَّ يَعُودُ عَلَيْهِ فَيَفْعَلُ مِثْلَ مَا فَعَلَ الْمَرَّةَ الأُولى قَالَ: قُلْتُ سُبْحَانَ اللهِ مَا هذَانِ قَالَ: قَالاَ لِي: انْطَلِقْ فَانْطَلَقْنَا، فَأَتَيْنَا عَلَى مِثْلِ التَّنُّورِ، فَإِذَا فِيهِ لَغَطٌ وَأَصْوَاتٌ قَالَ: فَاطَّلَعْنَا فِيهِ، فَإِذَا فِيهِ رِجَالٌ وَنِسَاءٌ عُرَاةٌ، وَإِذَا هُمْ يَأْتِيهِمْ لَهَبٌ مِنْ أَسْفَلَ مِنْهُمْ، فَإِذَا أَتاهُمْ ذَلِكَ اللهَبُ ضَوْضوْا قَالَ: قُلْتُ لَهُمَا: مَا هؤُلاَءِ قَالَ: قَالاَ لِي: انْطَلِقْ، انْطَلِقْ قَالَ: فَانْطَلَقْنَا، فَأَتَيْنَا عَلَى نَهَرٍ أَحْمَرَ مِثْلِ الدَّمِ، وَإِذَا فِي النَّهَرِ رَجُلٌ سَابِحٌ يَسْبح، وَإِذَا عَلَى شَطِّ النَّهَرِ رَجُلٌ قَدْ جَمَعَ عِنْدَهُ حِجَارَةً كَثِيرَةً، وَإِذَا ذَلِكَ السَّابِحُ يَسْبَحُ مَا يَسْبَحُ ثُمَّ يَأْتِي ذَلِكَ الَّذِي قَدْ جَمَعَ عِنْدَهُ الْحِجَارَةَ فَيَفْغَرُ لَهُ فَاهُ، فَيُلْقِمُهُ حَجَرًا، فَيَنْطَلِقُ يَسْبَحُ ثُمَّ يَرْجِعُ إِلَيْهِ كُلَّمَا رَجَعَ إِلَيْهِ فَغَرَ لَهُ فَاهُ فَأَلْقَمَهُ حَجَرًا قَالَ: قُلْتُ لَهُمَا: مَا هذَانِ قَالَ: قَالاَ لِي: انْطَلِقْ، انْطَلِقْ قَالَ: فَانْطَلَقْنَا، فَأَتَيْنَا عَلَى رَجُلٍ كَرِيهِ الْمَرْآةِ، كَأَكْرَهِ مَا أَنْتَ رَاءٍ رَجُلاً، مَرْآةً؛ وَإِذَا عِنْدَهُ نَارٌ يَحُشُّهَا وَيَسْعى حَوْلَهَا قَالَ: قُلْتُ لَهُمَا: مَا هذَا قَالَ: قَالاَ لِي: انْطَلِقْ، انْطَلِقْ فَانْطَلَقْنَا، فَأَتَيْنَا عَلَى رَوْضَةٍ مُعْتَمَّةٍ، فِيهَا مِنْ كُلِّ نَوْرِ الرَّبِيعِ، وَإِذَا بَيْنَ ظَهْرَيِ الرَّوْضَةِ رَجُلٌ طُوِيلٌ لاَ أَكَادُ أَرَى رَأْسَهُ طُولاً فِي السَّمَاءِ، وَإِذَا حَوْلَ الرَّجُلِ مِنْ أَكْثَرِ وِلْدَانٍ رَأَيْتُهُمْ قَطُّ قَالَ: قُلْتُ لَهُمَا: مَا هذَا مَا هؤُلاَءِ قَالَ: قَالاَ لِي: انْطَلِقْ، انْطَلِقْ قَالَ: فَانْطَلَقْنَا فَانْتَهَيْنَا إِلَى رَوْضَةٍ عَظِيمَةٍ؛ لَمْ أَرَ رَوْضَةً قَطُّ أَعْظَمَ مِنْهَا وَلاَ أَحْسَنَ قَالَ: قَالاَ لِي: ارْقَ فِيهَا قَالَ: فَارْتَقَيْنَا فِيهَا فَانْتَهَيْنَا إِلَى مَدِينَةٍ مَبْنِيَّةٍ، بِلَبِنِ ذَهَبٍ وَلَبِنِ فِضَّةٍ، فَأَتَيْنَا بَابَ الْمَدِينَةِ، فَاسْتَفْتَحْنَا، فَفُتِحَ لَنَا، فَدَخَلْنَاهَا، فَتَلَقَّانَا فِيهَا رِجَالٌ، شَطْرٌ مِنْ خَلْقِهِمْ كَأَحْسَنِ مَا أَنْتَ رَاءٍ، وَشَطْرٌ كَأَقْبَحِ مَا أَنْتَ رَاءٍ قَالَ: قَالاَ لَهُمُ: اذهَبُوا فَقَعُوا فِي ذلِكَ النَّهَرِ قَالَ: وَإِذَا نَهَرٌ مُعْتَرِضٌ يَجْرِي كَأَنَّ مَاءَهُ الْمَحْضُ فِي الْبَيَاضِ فَذَهَبُوا فَوَقَعُوا فِيهِ ثُمَّ رَجَعُوا إِلَيْنَا، قَد ذَهَبَ ذَلِكَ السُّوءُ عَنْهُمْ فَصَارُوا فِي أَحْسَنِ صُورَةٍ قَالَ: قَالاَ لِي: هذِهِ جَنَّةُ عَدْنٍ، وَهذَا مَنْزِلكَ قَالَ: فسَمَا بَصَرِي صُعُدًا، فَإِذَا قَصْرٌ مِثْلُ الرَّبَابَةِ الْبَيْضَاءِ قَالَ: قَالاَ لِي: هذَاكَ مَنْزِلُكَ قَالَ: قُلْتُ لَهُمَا: بَارَكَ اللهُ فِيكُمَا، ذَرَانِي فَأَدْخلَهُ قَالاَ: أَمَّا الآنَ فَلاَ وَأَنْتَ دَاخِلُهُ قَالَ: قُلْتُ لَهُمَا: فَإِنِّي قَدْ رَأَيْتُ مَنْذُ اللَّيْلَةِ عَجَبًا فَمَا هذَا الَّذِي رَأَيْتُ قَالَ: قَالاَ لِي: أَمَا إِنّا سَنُخْبِرُكَ أَمَّا الرَّجُلُ الأَوَّلُ الَّذِي أَتَيْتَ عَلَيْهِ يُثْلَغُ رَأْسُهُ بِالْحَجَرِ، فَإِنَّهُ الرَّجُلُ يَأْخُذُ الْقُرْآنَ فَيَرْفِضُهُ، وَيَنَامُ عَنِ الصَّلاَةِ الْمَكْتُوبَةِ وَأَمَّا الرَّجُلُ الَّذِي أَتَيْتَ عَلَيْهِ يُشَرْشَرُ شِدْقُهُ إِلَى قَفَاهُ، وَمَنْخِرُهُ إِلَى قَفَاهُ، وَعَيْنُهُ إِلَى قَفَاهُ، فَإِنَّهُ الرَّجُلُ يَغْدُو مِنْ بَيْتِهِ فَيَكْذِبُ الْكَذْبَةَ تَبْلُغُ الآفَاقَ وَأَمَّا الرِّجَالُ وَالنِّسَاءُ الْعُرَاةُ، الَّذِينَ فِي مِثْلِ بِنَاءِ التَّنُّورِ، فَإِنَّهُمُ الزُّنَاةُ وَالزَّوَانِي وَأَمَّا الرَّجُلُ الَّذِي أَتَيْتَ عَلَيْهِ يَسْبَحُ فِي النَّهَرِ وَيُلْقَمُ الْحَجَرَ، فَإِنَّهُ آكِلُ الرِّبَا وَأَمَّا الرَّجُلُ الْكَرِيهُ الْمَرْآةِ، الَّذِي عِنْدَ النَّارِ، يَحُشُّهَا وَيَسْعى حَوْلَهَا، فَإِنَّهُ مَالِكٌ، خَازِنُ جَهَنَّمَ وَأَمَّا الرَّجُلُ الطَّوِيلُ الَّذِي فِي الرَّوْضَةِ فَإِنَّهُ إِبْرَاهِيمُ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَمَّا الْوِلْدَانُ الَّذِينَ حَوْلَهُ فَكُلُّ مَوْلُودٍ مَاتَ عَلَى الْفِطْرَةِ قَالَ: فَقَالَ بَعْضُ الْمُسْلِمِينَ: يَا رَسُولَ اللهِ وَأَوْلاَدُ الْمُشْرِكِينَ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَوْلاَدُ الْمُشْرِكِينَ وَأَمَّا الْقَوْمُ الَّذِينَ كَانُوا، شَطْرٌ مِنْهُمْ حَسَنًا وَشَطْرٌ مِنْهُمْ قَبِيحًا، فَإِنَّهُمْ قَوْمٌ خَلَطُوا عَمَلاً صَالِحًا وَآخَرَ سَيِّئًا، تَجَاوَزَ اللهُ عَنْهُمْ

أخرجه البخاري في: 91 كتاب التعبير: 48 باب تعبير الرؤيا بعد صلاة الصبح

హజ్రత్ సమురా బిన్ జున్దుబ్ (రదియల్లాహు అన్హు) కథనం:- సాధారణంగా దైవప్రవక్త ﷺ తమ అనుచరుల్ని “మీలోఎవరైనా ఏదైనా కలగన్నారా?” అని అడుగుతారు. అల్లాహ్ తలచిన వ్యక్తి తాను కన్న కలను గురించి దైవప్రవక్త ﷺకు తెలియజేస్తాడు. ఓ రోజు ఉదయం దైవప్రవక్త ﷺ ఇలా చెప్పారు – “రాత్రి కలలో నా దగ్గరకు ఇద్దరు దైవదూతలు వచ్చారు. వారు నన్ను లేపి నిలబెట్టి ‘పదండి’ అన్నారు. నేను వారి వెంట బయలుదేరాను. మేము ఒక వ్యక్తి దగ్గరకు చేరుకున్నాము. అతను పడుకొని ఉన్నాడు. అతని దగ్గర మరొక వ్యక్తి ఒక రాయి ఎత్తుకొని నిలబడ్డాడు. చూస్తే అంతలో ఆ వ్యక్తి ఆ రాతితో పడుకున్న వ్యక్తి తలమీద విసరి కొట్టాడు. దాంతో అతని తల పగిలిపోతుంది. ఆ రాయి అతనికి తగిలి దొర్లుకుంటూ దూరాన పడిపోతుంది. ఆ వ్యక్తి మళ్ళీ ఆ రాతి వెంటబడి దాన్ని ఎత్తుకుంటాడు. దాన్ని తీసుకొని అతను తిరిగొచ్చేలోగా పడుకున్న వాడి తల తిరిగి అతుక్కుపోయి యధాతథంగా ఉంటుంది. ఆ వ్యక్తి మళ్ళీ ఆ రాతిని అతనిపై విసరి కొడ్తాడు. నేనీ దృశ్యం చూసి ఆశ్చర్యపోతూ “సుబ్‌హానల్లాహ్! వీరిద్దరు ఎవరు? వీళ్ళ వ్యవహారం ఏమిటీ?” అని అడిగాను. ఆ దైవదూతలిద్దరు “(తరువాత చెప్తాం) ముందుకు నడవండి” అన్నారు.

మేము (ముగ్గురం) ముందుకు నడిచాము. కొంతదూరం వెళ్ళి ఒక వ్యక్తి దగ్గరకు చేరుకున్నాము. అతను వెల్లకిలా పడుకొని ఉన్నాడు. మరొక వ్యక్తి ఒక ఇనుప కొక్కెం తీసుకొని అతని తలవైపు నిల్చున్నాడు. అతనా కొక్క్యాన్ని ఆ వ్యక్తి ముఖంలో ఒకవైపున గుచ్చి ఒక చెంప, ఒక ముక్కు రంధ్రం, ఒక కన్ను చీరిపోయేలా ముచ్చలిగుంత దాకా లాగేస్తాడు. ఆ తరువాత అతను ఆ వ్యక్తి ముఖం రెండో వైపుకు వెళ్తాడు. అటువైపు ముఖ భాగాన్ని కూడా అతను అదే విధంగా చీరేస్తాడు. ఆ పని ముగుస్తుందో లేదో ఇటు వైపు ముఖ భాగం పూర్వంలా యధాతథంగా మారిపోయి ఉంటుంది. ఆ వ్యక్తి మళ్ళీ అతని ముఖాన్ని ఇది వరకటి లాగే చీరేస్తాడు.

ఇది చూసి నేను ఆశ్చర్యపోతూ “సుబ్‌హానల్లాహ్! వీరిద్దరు ఎవరు? వీరి వ్యవహారం ఏమిటి?” అని అడిగాను. దానికి దైవదూత లిద్దరు “(తరువాత చెప్తాం) పదండి ముందుకు” అన్నారు. మేము (ముగ్గురం) అక్కడ్నుంచి ముందుకు సాగాము. కాస్సేపటికి కుంపటి లాంటి ఓ పెద్ద గొయ్యి దగ్గరకు చేరుకున్నాము. అక్కడ మాకు రకరకాల అరుపులు, పెడబొబ్బలు విన్పించసాగాయి. మేమా గొయ్యిలోకి తొంగి చూస్తే కొందరు స్త్రీలు, పురుషులు నగ్నంగా కన్పించారు. వారి కాళ్ళ క్రింద నుంచి ఒక అగ్ని జ్వాల పైకి వస్తుంటుంది. ఆ అగ్నిజ్వాలపైకి వచ్చినప్పుడల్లా వారు ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టేవారు. అది చూసి నేను “వీరెవరూ, వీరి వ్యవహారం ఏమిటి?” అని అడిగాను. దానికి దైవదూతలు “(తరువాత చెప్తాం) పదండి ముందుకు” అన్నారు.

ఆ తరువాత మేము ముందుకు నడచి ఒక నది దగ్గరకు చేరుకున్నాము. అది రక్తం మాదిరిగా నిగనిగలాడుతూ ఎర్రగా ఉంది. ఆ నెత్తుటి నదిలో ఒక వ్యక్తి ఈదుతున్నాడు. నది ఒడ్డు మీద మరొక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని దగ్గర ఎన్నో రాళ్ళు గుట్టగా పడి ఉన్నాయి. ఈదుతున్న వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డు మీద నిలబడిన వ్యక్తి దగ్గరికి వచ్చి నోరు తెరుస్తాడు. ఒడ్డు మీది వ్యక్తి అతని నోట్లోకి ఒక రాయి విసురుతాడు. అతను ఈదుకుంటూ వెళ్ళిపోతాడు. కాస్సేపటికి మళ్ళీ వచ్చి నోరు తెరుస్తాడు. ఒడ్డు మీదున్న వ్యక్తి అతని నోట్లోకి రాయి విసరగానే తిరిగి వెళ్ళిపోతాడు. నేనీ విచిత్రం చూసి “వీరిద్దరు ఎవరు? వీరి వ్యవహారం ఏమిటి?” అని అడిగాను దైవదూతల్ని. దానికి వారు “(తరువాత చెప్తాం) ముందుకు నడవండి” అన్నారు.

అక్కడ్నుంచి మేము మళ్ళీ ముందుకు సాగి అత్యంత భయంకరాకారుడయిన ఒక కురూపి దగ్గరకు చేరుకున్నాము. అంతటి భయంకర కురూపిని మీరెప్పుడూ చూసి ఉండరు. అతని ముందు ఓ అగ్ని గుండం ఉంది. అతనా అగ్నిని ప్రజ్వలింపజేస్తూ దాని చుట్టూ తిరుగుతున్నాడు. నేను దైవదూతల్ని అడిగాను “ఇతనెవరు, ఏమిటీ విశేషం?” అని. దానికి వారు “(తరువాత చెప్తాం) ముందుకు నడవండి” అన్నారు.

మేము ముందుకు సాగి ఒక తోటలోకి ప్రవేశించాము. అందులో పచ్చటి వృక్షాలు దట్టంగా ఉన్నాయి. వాటికి రకరకాల పూలు పూసి ఉన్నాయి. ఆ తోట మధ్యలో ఒక పొడవైన వ్యక్తి ఉన్నాడు. అతను ఎంత పొడుగ్గా ఉన్నాడంటే నేనెంత ప్రయత్నించినా అతని తలను చూడలేకపోయాను. అతని చుట్టూ ఎంతోమంది పిల్లలు ఉన్నారు. అంతమందిని నేనెన్నడూ చూడలేదు. నేను నా సహచరుల్ని “ఈ వ్యక్తి ఎవరు? ఈ పిల్లల సంగతేమిటి?” అని అడిగాను. దానికి వారు “(తరువాత చెప్తాం) ముందుకు పదండి” అన్నారు. అక్కడ్నుంచి మేము ముందుకు నడచి మరొక తోటలోకి చేరుకున్నాము. అది ఎంతో అందమైన తోట. అంతటి అందమైన తోటను నేనెప్పుడూ చూడలేదు. వారిద్దరు నాతో “పైకి వెళ్ళండి” అన్నారు. మేమా తోటలో పైకి ఎక్కిపోయాము. చివరికి ఒక పట్టణం దగ్గరికి చేరుకున్నాము. అది వెండి బంగారు ఇటుకలతో నిర్మించబడిన పట్టణం. మేమా పట్టణ ముఖద్వారం దగ్గరికి వెళ్ళి తలుపు తెరవండని అడిగాము. తలుపు తెరవబడింది. మేము లోపలికి ప్రవేశించాము. అక్కడ మాకు కొందరు విచిత్రమైన మనుషులు కన్పించారు. వారి దేహాలు సగం వీలైనంత మహా అందంగా, సగం పరమ అందవికారంగా ఉన్నాయి. నాతో పాటున్న దైవదూతలు అక్కడి జనంతో “ఆ నదిలోకి వెళ్ళండి” అని అన్నారు. మాకు సమీపంలో ఒక నది ప్రవహిస్తూ ఉంది. దాని నీరు స్వచ్ఛమైన పాలవలె తెల్లగా ఉంది. ఆ వ్యక్తులు వెళ్ళి నదిలోకి దిగారు. కాస్సేపటికి వారు నది నుండి బయటపడి మా దగ్గరకు తిరిగొచ్చారు. చూస్తే వారి శరీరాల అందవిహీనత పోయి వారు పూర్తిగా పరమ సౌందర్యవంతులుగా మారిపోయారు.

నన్ను పిలుచుకు వచ్చిన దైవదూతలు నాతో మాట్లాడుతూ “ఇది శాశ్వత స్వర్గోద్యాన వనం. ఇదే మీ నిలయం (స్వగృహం)” అని చెప్పారు. నేను అటువైపు తలపైకెత్తి చూస్తే మేఘమాలికలా మెరసిపోతున్న ఒక శ్వేత భవనం కన్పించింది. “ఇది మీ భవనం” అన్నారు దైవదూతలు. నేను వారితో “అల్లాహ్ మీకు శుభం చేకూర్చుగాక! నాకా భవనంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వండి” అని అన్నాను. దానికి వారు “అప్పుడే కాదు (ఇంకా దాని సమయం రాలేదు). మొత్తానికి మీరు అందులో తప్పకుండా ప్రవేశిస్తారు” అని అన్నారు. “సరే, నేనీ రాత్రి చిత్ర విచిత్ర విశేషాలు చూశాను. ఇక వాటిని గురించి వివరించండి” అని అడిగాను నేను. అప్పుడు వారు వినండి అంటూ ఇలా చెప్పారు –

“మొట్టమొదట మీరు తల పగల గొట్టబడుతున్న వ్యక్తిని చూశారు. అతను ఖుర్‌ఆన్ విద్య నేర్చుకున్నాడు గాని, దాన్ని ఆచరణలో పెట్టలేదు. ఫర్జ్ నమాజు పట్లఅశ్రద్ధ వహించేవాడు. ఆ తరువాత మీరు చూసిన రెండవ వ్యక్తి, అంటే ముచ్చలిగుంత దాకా చెంప, ముక్కు, కళ్ళు, చీల్చబడుతున్న వాడు ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరి, లేనిపోని పుకార్లు లేవనెత్తి లోకమంతా వ్యాపింప జేస్తుండేవాడు. ఆ తరువాత మీరు కుంపటిలో కాలిపోతున్న నగ్న స్త్రీ పురుషుల్ని చూశారు. వీరు వ్యభిచారానికి పాల్పడినవారు. (నెత్తుటి) నదిలో ఈదుతూ రాళ్ళు తింటున్న వాడు (ప్రపంచంలో ఉండగా) వడ్డీ తిన్నవాడు. అగ్నిని రాజేస్తూ దాని చుట్టు తిరుగుతూ మీకు కనిపించిన భయంకర కురూపి నరక పాలకుడైన మాలిక్. మీరు ఒక తోటలో ఎంతో పొడవైన వ్యక్తిని చూశారు. ఆయన హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం). ఆయన చుట్టూ గుమిగూడి ఉన్న పిల్లలు, ప్రకృతి ధర్మం (ఇస్లాం)పై చనిపోయిన వారు….”

హదీసు ఉల్లేఖకుని కథనం – కొందరు ప్రవక్త అనుచరులు “దైవప్రవక్తా! బహుదైవారాధకుల పిల్లలు ఎక్కడుంటారు?” అని అడిగారు. దానికి దైవప్రవక్త ﷺ “బహుదైవారాధకుల పిల్లలు కూడా అక్కడే ఉంటారు” అని అన్నారు.

పోతే, అర్ధ దేహం అందంగా, అర్ధదేహం అంద వికారంగా ఉన్నవారు – వీరు కొన్ని సత్కర్మలు ఆచరించారు. వాటితో పాటు కొన్ని దుష్కర్మలకు పాల్పడి వాటిని కలుషితం చేశారు. అయితే అల్లాహ్ వారిని క్షమించి వేశాడు.”

(సహీహ్ బుఖారీ:- 91వ ప్రకరణం – తాబీర్, 48వ అధ్యాయం- తాబిరిర్రూయాబాద సలాతిస్సుబ్‌హి)

మహా ప్రవక్త మహితోక్తులు|43. స్వప్న ప్రకరణం|హదీసు 1467