మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
ఉర్దూ అనువాదం: సయ్యిద్ షబ్బీర్ అహ్మద్ · తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) – 42. కవితా ప్రకరణం. ఇందులో 2 హదీసులు (హదీసు 1454 – 1455) ఉన్నాయి. ప్రతి హదీసు తెలుగు అనువాదం, అరబీ మూలంతో.
⬇ డౌన్లోడ్ PDFకవితా ప్రకరణం1 పేజీలు · 23 KB
42. కవితా ప్రకరణం
كتاب الشعرహదీసు 1454
حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَصْدَقُ كَلِمَةٍ قَالَهَا الشَّاعِر، كَلِمَةُ لَبِيدٍ أَلاَ كُلُّ شَيْءٍ مَا خَلاَ اللهَ بَاطِلُ وَكَادَ أُمَيَّةُ بْنُ أَبِي الصَّلْتِ أَنْ يُسْلِمَ
أخرجه البخاري في: 78 كتاب الأدب: 90 باب ما يجوز من الشعر والرجز والحداء وما يكره منه
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలిపారు:- కవులు చెప్పిన కవితలన్నిటిలో అతి శ్రేష్ఠమైన కవిత ఇది – “ప్రతీదీ నశించిపోయేదే పరాత్పరుడు తప్ప”.
కవి ఉమీత బిన్ అబూ సల్త్ ఇస్లాం స్వీకరణకు దగ్గరగా వచ్చాడు. (కాని అతను అల్లాహ్ ఏకత్వంతో కూడిన కవితలు చెప్పినప్పటికీ అతనికి ఇస్లాం స్వీకార భాగ్యం లభించలేదు).
(సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – అదబ్, 90వ అధ్యాయం – మాయజౌజు మినష్షిఅరి…)
మహా ప్రవక్త మహితోక్తులు|42. కవితా ప్రకరణం|హదీసు 1454
హదీసు 1455
حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لأَنْ يَمْتَلِىءَ جَوفُ رَجُلٍ قَيْحًا يَرِيهِ، خَيْرٌ مِنْ أَنْ يَمْتَلِىءَ شِعْرًا
أخرجه البخاري في: 78 كتاب الأدب: 92 باب ما يكره أن يكون الغالب على الإنسان الشعر حتى يصده عن ذكر الله والعلم والقرآن
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు:- (అసభ్య) కవితలతో కడుపు నింపుకోవడం కన్నా చీముతో కడుపు నింపుకోవడం ఎంతో శ్రేష్ఠమైనది.
(సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – అదబ్, 92వ అధ్యాయం – మా యుక్రహు అయ్యఁకూనల్ గాలిబ్ అలల్ ఇన్సాన్ అష్రియర్….)
మహా ప్రవక్త మహితోక్తులు|42. కవితా ప్రకరణం|హదీసు 1455
You must be logged in to post a comment.