మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
ఉర్దూ అనువాదం: సయ్యిద్ షబ్బీర్ అహ్మద్ · తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) – 30. వ్యాజ్యాల ప్రకరణం. ఇందులో 10 హదీసులు (హదీసు 1113 – 1122), 9 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి హదీసు తెలుగు అనువాదం, అరబీ మూలంతో.
⬇ డౌన్లోడ్ PDFవ్యాజ్యాల ప్రకరణం6 పేజీలు · 0.4 MB
30. వ్యాజ్యాల ప్రకరణం
كتاب الأقضيةఅధ్యాయాలు (9)
- 1 ప్రతివాది ప్రమాణం తప్పనిసరి H 1113
- 3 బాహ్య పరిస్థితుల ఆధారంగా తీర్పు H 1114
- 4 (అబూ సుఫ్యాన్ భార్య) హిందా జగడం గురించిన తీర్పు H 1115 – 1116
- 5 అనవసరమైన ప్రశ్నలు అడగడం, హక్కుల ఉల్లంఘన నిషిద్ధం H 1117
- 6 న్యాయంగా తీర్పివ్వడానికి కృషి చేసిన అధికారికి పుణ్యఫలం H 1118
- 7 న్యాయమూర్తి కోపోద్రేకాల స్థితిలో తీర్పివ్వరాదు H 1119
- 9 తప్పుడు తీర్పులు, కొత్త పోకడలు (బిదాత్) H 1120
- 10 భావ నిర్ణయ కర్తల్లో అభిప్రాయభేదాలు (సహజం) H 1121
- 11 న్యాయమూర్తి ఇరుపక్షాల మధ్య రాజీ కుదర్చడం అభిలషనీయం H 1122
1వ అధ్యాయం – ప్రతివాది ప్రమాణం తప్పనిసరి
హదీసు 1113
باب اليمين على المدعى عليه
حديث ابْنِ عَبَّاسٍ إِنَّ امْرَأَتَيْنِ كَانَتَا تَخْرِزَانِ فِي بَيْتٍ أَوْ فِي الْحُجْرَةِ، فَخَرَجَتْ إِحْداهُمَا وَقَدْ أُنْفِذَ بإِشْفًا فِي كَفِّهَا، فَادَّعَتْ عَلَى الأُخْرَى، فَرُفِعَ إِلَى ابْنِ عَبَّاسٍ، فَقَالَ ابْنُ عَبَّاسٍ: قَالَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَوْ يُعْطَى النَّاسُ بدَعْوَاهُمْ لَذَهَبَ دِمَاءُ قَوْمٍ وَأَمْوَالُهُمْ ذَكِّرُوهَا بِاللهِ، وَاقْرَءُوا عَلَيْهَا (إِنَّ الَّذِينَ يَشْتَرُونَ بِعَهْدِ اللهِ) فَذَكَّرُوهَا فَاعْتَرَفَتْ فَقَالَ ابْنُ عَبَّاسٍ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: الْيَمِينُ عَلَى الْمُدَّعَى عَلَيْهِ
أخرجه البخاري في: 65 كتاب التفسير: 3 سورة آل عمران: 3 باب إن الذين يشترون بعهد الله وأيمانهم ثمنًا قليلا
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- ఒక ఇంట్లో లేక గదిలో ఇద్దరు స్త్రీలు మేజోళ్ళు తయారు చేసే పని చేస్తుండేవారు. ఒకరోజు వారిద్దరిలో ఒక స్త్రీ చేతిలో మేజోళ్ళు కుట్టే సువ్వ (పెద్ద సూది) దిగబడింది. ఆ స్థితిలో ఆమె బయటికి వచ్చి, తన చేతిలో దిగబడిన ఈ సువ్వను ఆ రెండవ స్త్రీ గుచ్చిందని చెప్పింది. ఈ వ్యవహారం హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) దగ్గరికి వచ్చింది. ఆయన దైవప్రవక్త ﷺ ప్రవచనాన్ని తెలియజేస్తూ “కేవలం ప్రజల ఫిర్యాదులను ప్రాతిపదికగా తీసుకొని వారికి అనుకూలంగా తీర్పునిస్తే అనేకమంది ప్రజల ధన ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది” అని అన్నారు. ఆ తరువాత ఆయన ప్రజలను సంబోధిస్తూ “ఈ స్త్రీకి అల్లాహ్ ను గుర్తు చేయండి. (అంటే ఆమెలో దైవభీతి కలిగించండి), ఆమెకు ఈ దైవసూక్తి పఠించి విన్పించండి- ఎవరు అల్లాహ్ తో చేసిన ప్రమాణాలను అతి స్వల్ప మూల్యానికి అమ్ముకుంటారో (అంటే ఉల్లంఘిస్తారో) వారికి పరలోకంలో ఎలాంటి భాగం (పుణ్యఫలం) లభించదు. ప్రళయదినాన అలాంటి వారితో అల్లాహ్ మాట్లాడడు; వారివైపు కన్నెత్తి కూడా చూడడు; వారిని పరిశుద్ధపరచడు. అంతేకాదు, వారి కోసం ఘోరమైన శిక్ష కాచుకొని ఉంటుంది (3:77)” అని అన్నారు.
ఆయన చెప్పినట్లే ప్రజలు ఆ స్త్రీకి హితోపదేశం చేశారు. దాంతో ఆమె (భయపడిపోయి తానే తన చేతిలో సువ్వ గుచ్చుకున్నానని) తన నేరాన్ని ఒప్పుకుంది.
ఆ తరువాత హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) దైవప్రవక్త ప్రవచనం ఒక దాన్ని ఇలా పేర్కొన్నారు: “ప్రతివాది తప్పనిసరిగా ప్రమాణం చేయవలసి ఉంటుంది”★.
(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం- తఫ్సీర్, 3వ సూరా- ఆలి ఇమ్రాన్- ఇన్నల్లజీన యష్తరూన్ బి అహ్ దిల్లాహి వ అయిమానిహిమ్ సమనన్ ఖలీలా)
★ మరో ఉల్లేఖనంలో రుజువు చేసే, సాక్ష్యం చూపే బాధ్యత వాదిపై ఉంటుందని ఉంది. ఒక వేళ వాది (తనకు జరిగిన అన్యాయానికి) రుజువు లేక సాక్ష్యం చూపలేని పక్షంలో అప్పుడు ప్రతివాది చేత (అన్యాయం చేయలేదని) ప్రమాణం చేయించవలసి ఉంటుంది. అతను ప్రమాణం చేస్తే తీర్పు అతనికి అనుకూలంగా ఇవ్వబడుతుంది. ఒకవేళ అతను ప్రమాణం చేయడానికి నిరాకరిస్తే వ్యాజ్యం రుజువయినట్లే (అంటే అతనే నేరస్థుడిగా రుజువవుతాడన్న మాట). ఈ హదీసు వ్యవహారాల్లో ఓ ముఖ్యమైన న్యాయ సూత్రాన్ని అందజేస్తోంది. ఇస్లామీయ షరీఅత్ ప్రకారం ఇచ్చే తీర్పులన్నీ ఈ హదీసు మీదే ఆధారపడి ఉంటాయి. పోతే ప్రతివాది చేత ఎలాంటి పరిస్థితిలో ప్రమాణం చేయించాలి అనే విషయంలో ఫిఖ్కావేత్తల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. ఇమాం షాఫయి (రహిమహుల్లాహ్) , అధిక సంఖ్యాక ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం వాది, ప్రతివాదుల మధ్య ఎలాంటి సంబంధం ఉన్నా లేకపోయినా, ఎలాంటి వ్యాజ్యంలోనయినా సరే వాది సాక్ష్యం చూపలేని పక్షంలో ప్రతివాది చేత తప్పకుండా ప్రమాణం చేయించాలి. ఇమాం మాలిక్ (రహిమహుల్లాహ్), మదీనా ఫిఖ్కావేత్తల అభిప్రాయం ప్రకారం వాది, ప్రతివాదుల మధ్య (పూర్వం నుంచి ) ఏదైనా వ్యాపారాది సంబంధాలు ఉండి ఉంటేనే ప్రతివాది చేత ప్రమాణం చేయించాలి. లేకుంటే ప్రతి నీచుడూ మంచివాడిపై వ్యాజ్యం వేసి, బలవంతంగా అతని చేత ప్రమాణం చేయిస్తూ అతడ్ని వేధించే ప్రమాదం ఉంటుంది. కాని ఈ అభిప్రాయానికి హదీసులో, ధర్మవేత్తల ఏకాభిప్రాయం (ఇజ్మా) లో ఎలాంటి ఆధారం లేదు. (ఇమామ్ నవవీ – రహ్మలై).
మహా ప్రవక్త మహితోక్తులు|30. వ్యాజ్యాల ప్రకరణం|హదీసు 1113
3వ అధ్యాయం- బాహ్య పరిస్థితుల ఆధారంగా తీర్పు
హదీసు 1114
باب الحكم بالظاهر واللحن بالحجة
حديث أُمِّ سَلَمَةَ، زَوْجِ النَبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنَّهُ سَمِعَ خُصُومَةً بِبَابِ حُجْرَتِهِ، فَخَرَجَ إِلَيْهِمْ، فَقَالَ: إِنَّمَا أَنَا بَشَرٌ، وَإِنَّه يَأْتِينِي الْخَصْمُ، فَلَعَلَّ بَعْضَكُمْ أَنْ يَكونَ أَبْلَغَ مِنْ بَعْضٍ، فَأَحْسِبُ أَنَّهُ صَدَقَ فَأَقْضِيَ لَهُ بِذلِكَ؛ فَمَنْ قَضَيْتُ لَهُ بِحَقِّ مُسْلِمٍ فَإِنَّمَا هِيَ قِطْعَةٌ مِنَ النَّارِ فَلْيَأْخُذْهَا أَوْ فَلْيَتْرُكْهَا
أخرجه البخاري في: 46 كتاب المظالم: 16 باب إثم من خاصم في باطل وهو يعلمه
హజ్రత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త ﷺ ఓ రోజు తమ ఇంటి సమీపంలో ఎవరో పోట్లాడుకోవడం విని బయటికి వచ్చారు. ఆయన (వారిని ఉద్దేశించి) ఇలా అన్నారు: “గుర్తుంచుకోండి! నేను కూడా మానవమాత్రుడ్నే. అందువల్ల నా దగ్గరికి ఏదైనా వ్యవహారం తీర్పు కోసం వస్తే, ఒక వర్గం తన ప్రత్యర్థి వర్గం కన్నా ఎక్కువ వాక్చాతుర్యం కలవాడై ఉంటే అతని మాటలు విని నేను అతను నిజమే చెబుతున్నాడని భావించి అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎప్పుడైనా ఇలా జరిగితే, (అంటే) ఉభయవర్గాల్లో ఒకతని పక్షాన ధర్మం ఉన్నప్పటికీ నేను రెండవ వ్యక్తికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగితే గుర్తుంచుకోండి – నా తీర్పు వల్ల లభించిన (ఐహిక) ప్రయోజనం (పరలోకంలో) అగ్నికణంగా పరిణమిస్తుంది. ఇక ఇష్టమయిన వారు ఈ నరకాగ్నిని తీసుకోవచ్చు; లేదా ఈ నరకాగ్నిని వదలి దీనికి దూరంగా ఉండవచ్చు.★
(సహీహ్ బుఖారీ:- 46వ ప్రకరణం- ముజాలిమ్, 16వ అధ్యాయం- ఇస్ము మన్ ఖాసమఫీబాతిలిన్ వహువ యాలముహు)
★ ఈ హదీసుని బట్టి న్యాయాధిపతి ఇచ్చిన తీర్పు వల్ల వాస్తవం మారదని అసత్యం సత్యం కాజాలదని, హలాల్ హరామ్‌గా, హరామ్ హలాల్‌గా మారదని అధిక సంఖ్యాక ధర్మవేత్తలు నిర్ణయానికి వచ్చారు. ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) , ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) , ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్)ల అభిప్రాయం కూడా ఇదే. కాని ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) అభిప్రాయం ప్రకారం న్యాయాధికారి తీర్పుతో ఉపస్థ ధర్మసమ్మతమవుతుంది; సొమ్ము ధర్మ సమ్మతం కాజాలదు. అంటే, ఒక వ్యక్తి ఫలానా స్త్రీతో తన వివాహమయిందని న్యాయస్థానంలో వ్యాజ్యం వేసి, అందుకు సాక్ష్యం కూడా చూపిస్తే లేదా ప్రతివాది ( ఆ స్త్రీ) ప్రమాణం చేయడానికి నిరాకరిస్తే, దాని ఆధారంగా న్యాయాధికారి ఆ వ్యక్తికి అనుకూలంగా తీర్పిస్తే నిజానికి వారిద్దరి వివాహం కాకపోయినా ఆ స్త్రీ అతని ధర్మపత్నిగా పరిగణించబడుతుందన్న మాట. ఆమెతో అతను సంభోగించడం ధర్మ సమ్మతమవుతుందన్న మాట! ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) గారి ఈ అభిప్రాయం హేతువు రీత్యా సమంజసమయినప్పటికీ హదీసు బాహ్యభావానికి, అనేక మంది ధర్మవేత్తల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంది. దీనికి భిన్నంగా న్యాయాధికారి గనక సాక్ష్యాలు, ఆధారాలతో లేదా ప్రతివాది ప్రమాణం చేయని కారణంగా ఒకరి ఆస్తిని వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా మరొకరి ఆస్తిగా పరిగణిస్తూ తీర్పు ఇస్తే, వాదికి ఇహలోకంలో గాకపోయినా పరలోకంలో మాత్రం తప్పకుండా శిక్ష పడుతుంది. ఈ తీర్పు తప్పయిపోతే, ఆస్తి అసలు యజమానిదే అవుతుంది. ప్రతివాది దౌర్జన్యపరుడిగా, దురాక్రమణదారుడిగా పరిగణించబడతాడు.
మహా ప్రవక్త మహితోక్తులు|30. వ్యాజ్యాల ప్రకరణం|హదీసు 1114
4వ అధ్యాయం- (అబూ సుఫ్యాన్ భార్య) హిందా జగడం గురించిన తీర్పు
హదీసు 1115
باب قضية هند
حديث عَائِشَةَ، أَنَّ هِنْدَ بِنْتَ عُتْبَةَ، قَالَتْ: يَا رَسُولَ اللهِ إِنَّ أَبَا سُفْيَانَ رَجُلٌ شَحِيحٌ، وَلَيْسَ يُعْطِينِي مَا يَكْفِينِي وَوَلَدِي، إِلاَّ مَا أَخَذْتُ مِنْهُ وَهُوَ لاَ يَعْلَمُ فَقَالَ: خُذِي مَا يَكْفِيكِ وَوَلَدَكِ بِالْمَعْرُوفِ
أخرجه البخاري في: 69 كتاب النفقات: 9 باب إذا لم ينفق الرجل فللمرأة أن تأخذ بغير علمه ما يكفيها وولدها بالمعروف
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- హిందా బిన్తె ఉత్బా (రదియల్లాహు అన్హు) ఓసారి దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి ఇలా అన్నది: “దైవప్రవక్తా! (నా భర్త) అబూ సుఫ్యాన్ పిసినారి మనిషి. నా పోషణకు, నా పిల్లల పోషణకు సరిపడినంత కూడా డబ్బు ఇవ్వడు. అందుచేత నేనతనికి తెలియకుండా అతని డబ్బు నుండి కొంత తీసుకొని ఎలాగో సంసారం నెట్టుకొస్తున్నాను” దైవప్రవక్త ﷺ ఈ సంగతి విని “నీవతని సంపద నుండి నీ పోషణకు, నీ పిల్లల పోషణకు సరిపడినంత డబ్బు ధర్మయుక్తంగా తీసుకోవచ్చు. (అంతకంటే మించి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు)” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ:- 69వ ప్రకరణం-నఫఖాత్, 9వ అధ్యాయం- ఇజాలమ్ యున్ఫిఖ్రిజులు ఫలిల్ మర్ అతి అన్తఖుజ బిగైరి ఇల్మిహీ మా యక్‌ఫీహా వ వలదహా బిల్ మారూఫ్)
మహా ప్రవక్త మహితోక్తులు|30. వ్యాజ్యాల ప్రకరణం|హదీసు 1115
హదీసు 1116
حديث عَائِشَةَ، قَالَتْ: جَاءَتْ هِنْدُ بِنْتُ عُتْبَةَ، قَالَتْ: يَا رَسُولَ اللهِ مَا كَانَ عَلَى ظَهْرِ الأَرْضِ مِنْ أَهْلِ خِبَاءٍ، أَحَبُّ إِلَيَّ أَنْ يَذِلُّوا مِنْ أَهْلِ خِبَائِكَ، ثُمَّ مَا أَصْبَحَ الْيَوْمَ عَلَى ظَهْرِ الأَرْضِ أَهْلُ خِبَاءٍ أَحَبَّ إِلَيَّ أَنْ يَعِزُّوا مِنْ أَهْلِ خِبائِكَ، قَالَ: وَأَيْضًا وَالَّذِي نَفْسِي بِيَدِهِ قَالَتْ: يَا رَسُولَ اللهِ إِنَّ أَبَا سُفْيَانَ رَجُلٌ مِسِّيكٌ، فَهَلْ عَلَيَّ حَرَجٌ أَنْ أُطْعِمَ مِنَ الَّذِي لَهُ عِيَالَنَا قَالَ: لاَ أُرَاهُ إِلاَّ بِالْمَعْرُوفِ
أخرجه البخاري في: 63 كتاب مناقب الأنصار: 23 باب ذكر هند بنت عتبة
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- (అబూ సుఫ్యాన్ భార్య) హిందా బిన్తె ఉత్బా (రదియల్లాహు అన్హు) ఒక రోజు దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి ఇలా అన్నది: “దైవ ప్రవక్తా! (ఒకప్పుడు) యావత్తు ప్రపంచంలో ఏ ఒక్క కుటుంబంలోని సభ్యులు కూడా (మీ కుటుంబ సభ్యుల కంటే) ఎక్కువ అవమానం అప్రతిష్ఠల పాలు కావడం నాకు ఇష్టమయ్యేది కాదు. కాని ఈ రోజు యావత్తు ప్రపంచంలో మీ కుటుంబ సభ్యులే ఇతర కుటుంబాల సభ్యుల కన్నా ఎక్కువ గౌరవ మర్యాదలు పొందడం నాకు ప్రియమైన విషయం”. దైవప్రవక్త ﷺ ఈ మాటలు విని “నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తిమంతుని సాక్షి! `నీ యీ ప్రేమాభిమానాలు మరింత అధికమవుతాయి” అని అన్నారు.
ఆ తరువాత హిందా (రదియల్లాహు అన్హు) ఇలా అన్నది: “దైవప్రవక్తా! (నా భర్త) అబూసుఫ్యాన్ పిసినిగొట్టు మనిషి. అలాంటప్పుడు నేను (అతని అనుమతి లేకుండా) అతని సంపద నుండి నా పోషణ కోసం, అబూసుఫ్యాన్ పిల్లల పోషణ కోసం కొంత డబ్బు తీసుకోవచ్చా?” దానికి దైవప్రవక్త ﷺ సమాధానమిస్తూ “ధర్మయుక్తంగా చేసే ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు చేయడాన్ని నేను ధర్మసమ్మతంగా భావించడం లేదు” అని అన్నారు.★ .
(సహీహ్ బుఖారీ:- 63వ ప్రకరణం-మనాఖిబుల్ అన్సార్, 23వ అధ్యాయం – జిక్రుహింద్ బిన్తె ఉత్బా)
★ ఒకరి హక్కులు నిర్వహించే బాధ్యత మరొకరిపై ఉన్నప్పుడు అతనా బాధ్యత నిర్వహించకపోతే, రెండవ వ్యక్తికి చట్టపరంగా తన హక్కు పొందడం సాధ్యపడని పక్షంలో అతను మొదటి వ్యక్తి అనుమతి లేకుండా అతని సంపద నుండి తన హక్కు పొందడం ధర్మసమ్మతమేనని ఈ హదీసు ద్వారా రూఢి అవుతుంది. సలఫీ ధర్మవేత్తల అభిప్రాయం కూడా ఇదే. కాని ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్), ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) ల దృష్టిలో ఇలా చేయడం ధర్మసమ్మతం కాదు.
ఈ హదీసుని బట్టి అవసరమయినప్పుడు పర స్త్రీ చెప్పే మాటలు వినడం కూడా ధర్మ సమ్మతమేనని తెలుస్తోంది. అయితే ఆమె భర్త దీన్ని అపార్థం చేసుకోకూడదు.
అలాగే (న్యాయాధికారి దగ్గర) ప్రతివాది లేకపోయినా తీర్పునివ్వడం ధర్మసమ్మతమేనని కూడా ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. కాకపోతే ఈ విషయం గురించి ధర్మవేత్తల్లో కొంత భేదాభిప్రాయం ఉంది. ఇమామ్ అబూహనీఫా (రహిమహుల్లాహ్), కూఫా ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం ఎదుట ప్రతివాది లేకుండా తీర్పునివ్వడం ధర్మసమ్మతం కాదు. ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) అధిక సంఖ్యాక ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం మానవ హక్కుల్లో ధర్మసమ్మతమేగాని, దైవ హక్కుల్లో ధర్మసమ్మతం కాదు. (ఇమాం నవవీ – రహ్మలై)
మహా ప్రవక్త మహితోక్తులు|30. వ్యాజ్యాల ప్రకరణం|హదీసు 1116
5వ అధ్యాయం- అనవసరమైన ప్రశ్నలు అడగడం, హక్కుల ఉల్లంఘన నిషిద్ధం
హదీసు 1117
باب النهي عن كثرة المسائل من غير حاجة والنهي عن منع وهات، وهو الامتناع من أداء حق لزمه، أو طلب ما لا يستحقه
حديث الْمُغِيرَةِ بْنِ شُعْبَةَ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ اللهَ حَرَّمَ عَلَيْكُمْ عُقُوقَ الأُمَّهَاتِ، وَوَأْدَ الْبَنَاتِ، وَمَنعَ وَهَاتِ، وَكَرِهَ لَكُمْ قِيلَ وَقَالَ، وَكَثْرَةَ السُّؤَالِ، وَإِضَاعَةَ الْمَالِ
أخرجه البخاري في: 43 كتاب الاستقراض: 19 باب ما ينهى عن إضاعة المال
హజ్రత్ ముగైరా బిన్ షాబా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: అల్లాహ్ ఈ విషయాలను మీకు నిషేధించాడు – (1) మాతృమూర్తులకు అవిధేయత చూపడం, (2) స్త్రీ సంతానాన్ని సజీవ సమాధి చేయడం, (3) మీపై ఉన్న ఇతరుల హక్కుల్ని నెరవేర్చకుండా మీకు లేని హక్కులను గురించి ఇతరుల్ని డిమాండ్ చేయడం, అలాగే (1) వ్యర్థ ప్రేలాపనలు, (2) అక్కరకు రాని ప్రశ్నలు వేయడం (3) ధన దుర్వినియోగం కూడా అల్లాహ్ కు అప్రియమైనవి.
(సహీహ్ బుఖారీ:- 43వ ప్రకరణం – ఇస్త్రిఖాజ్, 19వ అధ్యాయం- మా యున్నా అన్ ఇజా అతిల్ మాల్)
మహా ప్రవక్త మహితోక్తులు|30. వ్యాజ్యాల ప్రకరణం|హదీసు 1117
6వ అధ్యాయం- న్యాయంగా తీర్పివ్వడానికి కృషి చేసిన అధికారికి పుణ్యఫలం
హదీసు 1118
باب بيان أجر الحاكم إِذا اجتهد فأصاب أو أخطأ
حديث عَمْرِو بْنِ الْعَاصِ، أَنَّهُ سَمِعَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: إِذَا حَكَمَ الْحَاكِمُ فَاجْتَهَدَ ثُمَّ أَصَابَ فَلَهُ أَجْرَانِ، وَإِذَا حَكَمَ فَاجْتَهَدَ ثُمَّ أَخْطَأَ فَلَهُ أَجْرٌ
أخرجه البخاري في: 96 كتاب الاعتصام: 21 باب أجر الحاكم إذا اجتهد فأصاب أو أخطأ
హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- న్యాయాధికారి ఏదైనా వ్యవహారంలో శక్తివంచన లేకుండా న్యాయంగా తీర్పివ్వడానికి కృషి చేసినప్పుడు ఆ తీర్పు సరయినదయి ఉంటే అతనికి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ఒకవేళ ఎంత కృషి చేసినా తప్పుడు తీర్పు జరిగిపోతే అప్పుడు కూడా అతనికి ఒకింత పుణ్యఫలం తప్పకుండా లభిస్తుంది.(1)
(సహీహ్ బుఖారీ:- 96వ ప్రకరణం- ఏతిసామ్, 21వ అధ్యాయం – అజ్రుల్ హాకిమి ఇజజ్తహద ఫ అసాబ అల్ అఖ్తఅ)
(1) ఇమాం నవవీ (రహిమహుల్లాహ్) అభిప్రాయం ప్రకారం న్యాయాధికారి ఆజ్ఞాపించే, తీర్పునిచ్చే సామర్ధ్యం కలిగి ఉండటంతో పాటు అతను ధర్మవేత్త (ఆలిమ్) కూడా అయి ఉండాలి. ధర్మజ్ఞానం లేని అధికారి తీర్పివ్వడం ధర్మ సమ్మతం కాదు. ఒకవేళ అలాంటి న్యాయాధికారి ఆజ్ఞ జారీ చేస్తే లేదా తీర్పిస్తే అతను పాపాత్ముడవుతాడు; అతని తీర్పు సరయినదయినప్పటికీ అతను అల్లాహ్ దృష్టిలో పాపిగానే పరిగణించబడతాడు. అదే విధంగా ధర్మవిద్యాపారంగతుడు (ముజ్తహిద్) చిత్తశుద్ధితో తన శక్తి మేరకు బుద్ధి జ్ఞానాలను ఉపయోగించి ఏదైనా సమస్య విషయమై తీర్పిచ్చినప్పుడు ఆ తీర్పు తప్పయిపోయినప్పటికీ అతనికి ఒక యూనిట్ పుణ్యఫలం మాత్రం తప్పకుండా లభిస్తుంది. దానిక్కారణం అతను నిజాయితీగా న్యాయాన్ని, పుణ్యాన్ని అన్వేషించడానికి కృషి చేయడమే. ఇది ఆ కృషి ఫలితమే.
ఈ హదీసుని బట్టి ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్), ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహిమహుల్లాహ్), ఇమామ్ దావూద్ జాహిరి (రహిమహుల్లాహ్), ఇమామ్ సుఫ్యాన్ సౌరీ (రహిమహుల్లాహ్), ఇమామ్ ఔజాయి (రహిమహుల్లాహ్), ఇమామ్ ఇస్‌హాఖ్ బిన్ రాహూయా (రహిమహుల్లాహ్), ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్), ఇమామ్ అష్‌హబ్ (రహిమహుల్లాహ్), ఇమామ్ సహ్‌నూన్ (రహిమహుల్లాహ్), ఇమామ్ ఇబ్నె ముబారక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ షిబర్మ (రహిమహుల్లాహ్), ఇమామ్ అబూ యాలా (రహిమహుల్లాహ్), ఇమామ్ వకీ (రహిమహుల్లాహ్), ఇమామ్ అబూ యూసుఫ్ (రహిమహుల్లాహ్), ఇమామ్ ముహమ్మద్ (రహిమహుల్లాహ్), ఇమామ్ జఫర్ (రహిమహుల్లాహ్), ఇమామ్ ముజ్నీ (రహిమహుల్లాహ్), ఇమామ్ తహావి (రహిమహుల్లాహ్), ఇమామ్ అబూసౌర్ (రహిమహుల్లాహ్), ఇమామ్ ఇబ్నె మంజర్( రహ్మలై), ఇమామ్ లైస్ బిన్ సాద్ (రహిమహుల్లాహ్), ఇమామ్ ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్), ఇమామ్ ఇబ్నె జరీర్ తబ్రి (రహిమహుల్లాహ్), ఇమామ్ షోకానీ (రహిమహుల్లాహ్), ఇమామ్ ఇబ్నె ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) వగైరా పూర్వపు ధర్మ విద్యా పారంగతులకు వారు సూచించిన ప్రతి సమస్యా పరిష్కారానికి, ప్రతి తీర్పుకూ గాను ఒక యూనిట్ పుణ్యఫలం తప్పకుండా లభిస్తుంది. వారు చేసిన కృషిలో తప్పుడు పరిష్కారం లేదా తీర్పు జరిగినప్పటికీ, వారి వల్ల పొరపాటు జరిగిపోయినప్పటికీ వారికీ పుణ్యఫలం తప్పకుండా లభిస్తుంది. వారిలో ప్రతి ఒక్కరూ కేవలం దైవ ప్రసన్నత కోసం సమస్యల్ని పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు; కష్టపడి పని చేశారు. అందువల్ల ముస్లింలు వారి పట్ల సదా కృతజ్ఞులయి ఉండాలి. వారిని గురించి ఎంత మాత్రం కువిమర్శలు చేయకూడదు. వారందరి చిత్తశుద్ధి, శ్రమ, కృషి, అన్వేషణలకు గాను అల్లాహ్ వారికి పుణ్యఫలం ప్రసాదించుగాక. తథాస్తు. (అనువాదకుడు)
మహా ప్రవక్త మహితోక్తులు|30. వ్యాజ్యాల ప్రకరణం|హదీసు 1118
7వ అధ్యాయం – న్యాయమూర్తి కోపోద్రేకాల స్థితిలో తీర్పివ్వరాదు
హదీసు 1119
باب كراهة قضاء القاضي وهو غضبان
حديث أَبِي بَكْرَةَ، أَنَّهُ كَتَبَ إِلَى ابْنِهِ، وَكَانَ بِسِجِسْتَانَ، بِأَنْ لاَ تَقْضِيَ بَيْنَ اثْنَيْنِ وَأَنْتَ غَضْبَانُ، فَإِنِّي سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: لاَ يَقْضِيَنَّ حَكَمٌ بَيْنَ اثْنَيْنِ وَهُوَ غَضْبَانُ
أخرجه البخاري في: 93 كتاب الأحكام: 13 باب هل يقضي الحاكم أو يفتي وهو غضبان
హజ్రత్ అబూబక్రహ్ (రదియల్లాహు అన్హు) సజస్తాన్‌లో (న్యాయమూర్తి హోదాలో) ఉన్న తన కుమారునికి ఇలా ఉత్తరం రాశారు: తీర్పరి కోపంగా ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వివాదం గురించి తీర్పివ్వడం అతనికి తగదని దైవప్రవక్త ﷺ ప్రవచిస్తుండగా నేను విన్నాను. అందువల్ల నీవు కోపంగా ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం గురించి ఎన్నటికీ తీర్పివ్వకు.(2)
(సహీహ్ బుఖారీ:- 93వ ప్రకరణం- అహ్కాం, 13వ అధ్యాయం-హల్ యఖ్జిల్ హాకిము అవ్ యుఫ్తి వహువ గజ్‌బాన్?)
(2) ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఇలా రాస్తున్నారు – కోపతాపాలే కాకుండా, ఏ విధమైన మానసిక ఒత్తిడికి, ఆవేశానికి లోనయి ఉన్నా వ్యవహారాలను పరిష్కరించడం, తీర్పులివ్వడం మానెయ్యాలి. ఉదాహరణకు: ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు; తీవ్రమైన విచారంతో, హద్దులు మీరిన సంతోషంతో ఉన్నప్పుడు. ఇలాంటి భావోద్రేకాల స్థితిలో మనిషికి ఒక్కోసారి మానసిక సమతౌల్యం సరిగా ఉండదు. అదీగాక ఆ స్థితిలో అతని దృష్టి వేరే విషయాల వైపుకు పోతుంది. తీర్పివ్వవలసిన వ్యవహారం మీద పూర్తిగా మానసిక ఏకాగ్రత ఉండదు. అయితే న్యాయాధికారి ఒకవేళ అలాంటి స్థితిలో ఏదైనా వ్యవహారంలో తీర్పివ్వడం జరిగితే అది సరయిన తీర్పుగానే భావించబడుతుంది. కారణం దైవప్రవక్త ﷺ హర్రా సెలయేరు వ్యవహారాన్ని కోప స్థితిలో పరిష్కరించడమే.
మహా ప్రవక్త మహితోక్తులు|30. వ్యాజ్యాల ప్రకరణం|హదీసు 1119
9వ అధ్యాయం- తప్పుడు తీర్పులు, కొత్త పోకడలు (బిదాత్)
హదీసు 1120
باب نقض الأحكام الباطلة ورد محدثات الأمور
حديث عَائِشَةَ، قَالَتْ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هذَا مَا لَيْسَ فِيهِ فَهُوَ رَدٌّ
أخرجه البخاري في: 53 كتاب الصلح: 5 باب إذا اصطلحوا على صلح جور فهو مردود
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- ఎవరైనా మన ధర్మంలో (ఖుర్ ఆన్ – హదీసులలో) లేని కొత్త విషయాన్ని ప్రవేశపెడ్తే అది త్రోసిపుచ్చదగినది. (అంటే అది అధర్మమయినది, అంగీకారయోగ్యం కానిది).(1)
(సహీహ్ బుఖారీ:- 53వ ప్రకరణం- సులహ్, 5వ అధ్యాయం- ఇజస్ తలహూ అలాసుల్హి జౌరిన్ ఫహువమర్దూద్).
(1) దైవగ్రంధంలో ప్రవక్త సంప్రదాయంలో లేని ప్రమాణ రహితమైన ప్రతి విషయమూ గర్హనీయమైనదే. పనికి మాలినదే. దానికి దూరంగా ఉండాలి. దాన్ని ఆచరించకూడదు. అది పైకి ఎంత మంచి విషయంగా కనిపించినా సరే దాని జోలికి పోకూడదు. మంచి చెడులు, తప్పొప్పులను గురించి నిర్ణయించే అధికారం అల్లాహ్ కు, ఆయన ప్రవక్త ﷺకు మాత్రమే ఉంది. ఇతరులెవరికీ లేదు. కొందరు తమకు తోచిన విధంగా, తమ కిష్టమైన రీతిలో ధర్మంలో చేర్చే నూతన పోకడలన్నిటికీ (బిద్అత్ విషయాలన్నిటికీ) ఈ హదీసు గొడ్డలి పెట్టు వంటిది. (అనువాదకుడు)
మహా ప్రవక్త మహితోక్తులు|30. వ్యాజ్యాల ప్రకరణం|హదీసు 1120
10వ అధ్యాయం(2) – భావ నిర్ణయ కర్తల్లో అభిప్రాయభేదాలు (సహజం)
హదీసు 1121
باب بيان اختلاف المجتهدين
حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّهُ سَمِعَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: كَانَتِ امْرَأَتَانِ مَعَهُمَا ابْنَاهُمَا، جَاءَ الذِّئْب فَذَهَبَ بِابْنِ إِحْدَاهُمَا، فَقَالَتْ صَاحِبَتُهَا إِنَّمَا ذَهَبَ بِابْنِكِ، وَقَالَتِ الأُخْرَى إِنَّمَا ذَهَبَ بِابْنِكِ؛ فَتَحَاكَمَتَا إِلَى دَاوُدَ، فَقَضى بِهِ لِلْكُبْرَى؛ فَخَرَجَتَا عَلَى سُلَيْمَانَ بْنِ دَاوُدَ، فَأَخْبَرَتَاهُ فَقَالَ: ائْتُونِي بِالسِّكِّينِ أَشُقُّهُ بَيْنَهُمَا، فَقَالَتِ الصُغْرَى: لاَ تَفْعَلْ، يَرْحَمُكَ اللهُ، هُوَ ابْنُهَا فَقَضى بِهِ لِلصُّغْرَى
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 40 باب قول الله تعالى ووهبنا لداود سليمان
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు:- ఇద్దరు స్త్రీలు తమ తమ బిడ్డలను ఎత్తుకొని ఎక్కడికో వెళ్తున్నారు. దారిలో ఒక తోడేలు వచ్చి ఆ ఇద్దరు స్త్రీలలో ఒకామె పిల్లవాడ్ని ఎత్తుకెళ్ళింది. అప్పుడు వారిద్దరిలో ఒక స్త్రీ “తోడేలు నీ బిడ్డను ఎత్తుకెళ్ళింద”ని అన్నది. రెండవ స్త్రీ “నా బిడ్డను కాదు, నీ బిడ్డనే ఎత్తు కెళ్ళింద”ని అన్నది. చివరికి వీళ్ళిద్దరు హజ్రత్ దావూద్ (అలైహిస్సలాం) గారి న్యాయస్థానానికి వెళ్ళి ఆయన ముందు తమ జగడాన్ని నివేదించుకున్నారు. హజ్రత్ దావూద్ (అలైహిస్సలాం) అంతా విని వాళ్ళిద్దరిలో (వయసులో) పెద్ద మహిళకు అనుకూలంగా తీర్పిచ్చారు: (అంటే సజీవంగా ఉన్న పిల్లవాడు పెద్దామెదని, తోడేలు ఎత్తుకెళ్ళిన బిడ్డ చిన్నామెదని తీర్పు చెప్పారు).
ఆ తరువాత ఆ మహిళలిద్దరు, దావూద్ (అలైహిస్సలాం) కుమారుడు సులైమాన్ (అలైహిస్సలాం) దగ్గరి కెళ్ళి జరిగిన సంగతి చెప్పి తమకు న్యాయం చేకూర్చమని అభ్యర్థించారు. అప్పుడు హజ్రత్ సులైమాన్ (అలైహిస్సలాం) వారితో “అయితే ఓ కత్తి తెచ్చివ్వండి నాకు. నేనీ పిల్లవాడ్ని రెండు ముక్కలుగా చేసి మీరిద్దరికీ చెరో ముక్క ఇచ్చేస్తాను” అని అన్నారు. చిన్నామె ఈ మాటలు వినగానే (కంగారుపడుతూ) ‘వద్దు వద్దు. అలా చేయకండి. అల్లాహ్ మిమ్మల్ని కరుణించుగాక! ఈ పిల్లవాడు ఆమె బిడ్డే అని నేను ఒప్పుకుంటున్నాను” అని అన్నది. అప్పుడు హజ్రత్ సులైమాన్ (అలైహిస్సలాం) పిల్లవాడు చిన్నామె కొడుకని తీర్పిచ్చారు.
(సహీహ్ బుఖారీ – 60వ ప్రకరణం- అంబియా, 40వ అధ్యాయం- ఖౌలిల్లాహి తఆలా (వవహబ్నాలిదావూద సులైమాన్)
(2) ధర్మంలో ఇజ్తెహాద్ చేసే వారిని (షరీయత్ సూత్రాల అన్వయింపుకై పాటుబడేవారిని) ఉద్దేశించి అనువాదకుడు తెలుగులో ప్రవేశపెట్టిన కొత్త పదం ఇది. కాగా ఇజ్తెహాద్ చేసే వ్యక్తిని అరబీలో ముజ్తహిద్ అంటారు. సంకలనకర్త
మహా ప్రవక్త మహితోక్తులు|30. వ్యాజ్యాల ప్రకరణం|హదీసు 1121
11వ అధ్యాయం- న్యాయమూర్తి ఇరుపక్షాల మధ్య రాజీ కుదర్చడం అభిలషనీయం
హదీసు 1122
باب استحباب إِصلاح الحاكم بين الخصمين
حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: اشْتَرَى رَجُلٌ مِنْ رَجُلٍ عَقَارًا لَهُ، فَوَجَدَ الرَّجُلُ الَّذِي اشْتَرَى الْعَقَارَ فِي عَقَارِهِ جَرَّةً فِيهَا ذَهَبٌ، فَقَالَ لَهُ الَّذِي اشْتَرَى الْعَقَارَ: خذْ ذَهَبَكَ مِنِّي، إِنَّمَا اشْتَرَيْتُ مِنْكَ الأَرْضَ وَلَمْ أَبْتَعْ مِنْكَ الذَّهَبَ وَقَالَ الَّذِي لَهُ الأَرْضُ: إِنَّمَا بِعْتُكَ الأَرْضَ وَمَا فِيهَا؛ فَتَحَاكَمَا إِلَى رَجُلٍ فَقَالَ الَّذِي تَحَاكَمَا إِلَيْهِ: أَلَكُمَا وَلَدٌ قَالَ أَحَدُهُمَا: لِي غُلاَمٌ، وَقَالَ الآخَرُ: لِي جَارِيَةٌ؛ قَالَ: أَنْكِحُوا الْغُلاَمَ الْجَارِيَةَ، وَأَنْفِقُوا عَلَى أَنْفُسِهِمَا مِنْهُ وَتَصَدَّقَا
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 54 باب حدثنا أبو اليمان
హజ్రత్ అబూహరైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- ఒక వ్యక్తి మరొక వ్యక్తి దగ్గర కొంత భూమి కొన్నాడు. ఆ భూమిలో బంగారం ఉన్న ఒక లంక బిందె దొరికింది. దాంతో భూమి కొన్నవాడు అమ్మినవాడితో “ఇదిగో ఈ బంగారం నీదే తీసుకో. నేను నీ దగ్గర భూమి మాత్రమే కొన్నాను, బంగారం కొనలేదు కదా!” అని అన్నాడు. కాని భూమి అమ్మినవాడు (అందుకు తిరస్కరిస్తూ) “నేను నీకు భూమిని, అందులో ఉన్న సమస్తాన్నీ అమ్మివేశాను. (కనుక ఈ బంగారంతో నాకెలాంటి సంబంధం లేదు)” అని అన్నాడు.
చివరికి వీళ్ళిద్దరు తమ తగాదాను పరిష్కరించుకోవడానికి ఒకతని దగ్గరకు వెళ్ళారు. అతను వారిద్దరితో “మీ ఇద్దరికీ సంతానం ఉందా?” అని అడిగాడు. ఇద్దరిలో ఒకతను “నాకొక కొడుకు న్నాడ”ని అన్నాడు. రెండవతను “నా కొక కూతురున్నద”ని చెప్పాడు. అప్పుడు తీర్పరి ఇలా తీర్పిచ్చాడు- “అయితే మీరిద్దరూ మీ మీ పిల్లలకు పరస్పరం పెళ్ళి చేసి ఈ బంగారాన్ని వాళ్ళిద్దరి కోసం ఖర్చు చేయండి, అందులో కొంత దైవమార్గంలో కూడా ఖర్చుపెట్టండి.”
(సహీహ్ బుఖారీ:- 68వ ప్రకరణం- అంబియా, 54 అధ్యాయం – హద్దసనా అబుల్ యమాన్)
మహా ప్రవక్త మహితోక్తులు|30. వ్యాజ్యాల ప్రకరణం|హదీసు 1122
You must be logged in to post a comment.