దివ్య ఖురాన్ సందేశం (text) – Draft

సూరహ్ అల్-ఫాతి’హా – 1:1 – بِسْم اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ ١

అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ 1 పేరుతో. 2

1:2 – الْحَمْدُ لِلَّـهِ رَبِّ الْعَالَمِينَ ٢

సర్వలోకాలకు ప్రభువైన 3 అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు. 4

1:3 – الرَّحْمَـٰنِ الرَّحِيمِ ٣

అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత. 5

1:4 – مَالِكِ يَوْمِ الدِّينِ ٤

తీర్పు దినానికి 6 స్వామి.7

1:5 – إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ ٥

మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము. 8

1:6 – اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ ٦

మాకు ఋజుమార్గం9 వైపునకు మార్గదర్శ కత్వం చేయి.

1:7 – صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ ٧

నీవు అనుగ్రహించినవారి10 మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి 11 గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గ భ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు.

సూరహ్ అల్-బఖరహ్ – ఈ సూరహ్ లో ఆవు యొక్క ప్రస్తావన 67-73 ఆయతులలో వచ్చింది. కావున ఇది, ఆవు ప్రస్తా వన ఉన్న సూరహ్ అని అనబడుతుంది. ఇందులో 286 ఆయతులున్నాయి. ఇది మదీనహ్ లో మొదటి 2 సంవత్సరాలలో అవతరింపజేయబడింది. ఆయత్ 255, ఆయతుల్ కుర్సీ అనబడు తుంది, ఆయత్ 281 చిట్టచివర అవతరింపజేయబడింది. ఆయత్ 282 ఆయత్ – ఆద్దేన్ అనబడుతుంది. ఇది అన్నిఆయతుల కంటే పెద్దది. ఏ ఇంట్లో ఈ సూరహ్ ప్రతిరోజూ చదువబడు తుందో, ఆ ఇంట్లో నుండి షై’తాన్ పారిపోతాడు. (’స. ముస్లిం). కొందరు ధర్మవేత్తల అభిప్రాయంలో దీనిలో వేయి వార్తలు, వేయి ఆజ్ఞలు మరియు వేయి నిషేధాజ్ఞలు ఉన్నాయి. (ఇబ్నె-కసీ‘ర్)

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 2:1 – الم ١

అలిఫ్-లామ్-మీమ్.1

2:2 – ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ ٢

ఇది (ఈ ఖుర్ఆన్) ఒక దివ్య గ్రంథం; ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. దైవభీతి 2 గలవారికి ఇది మార్గదర్శకత్వము.

2:3 – الَّذِينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ ٣

(వారికి) ఎవరైతే అగోచర యథార్థాన్నిి 3 నమా’జ్ స్థాపించ డం: అంటే, ప్రతిదినము ఐదుసార్లు నిర్ణీత సమయాలలో అల్లాహ్ (సు.త.), దైవప్రవక్త ము’హమ్మద్ (’స’అస)కు నేర్పిన విధంగా నమా’జ్ చేయడం. (’స’హీ’హ్ బు’ఖారీ, పుస్తకము-1, ’హదీస్‘ నం. 702, 703, 704, 723, 786, 787). 4 మరియు మేము ప్రసాదించిన జీవనోపాధి నుండి (మా మార్గంలో) ఖర్చుచేస్తారో; 5

2:4 – وَالَّذِينَ يُؤْمِنُونَ بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِن قَبْلِكَ وَبِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ ٤

మరియు ఎవరైతే (ఓ ము’హమ్మద్!) నీపై అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను)ై 6 మరియు నీకు వూర్వం అవతరింపజేయబడిన వాటినీ (దివ్యగ్రంథాలను) విశ్వసిస్తారో మరియు పరలోక జీవితాన్ని దృఢంగా నమ్ముతారో!

2:5 – أُولَـٰئِكَ عَلَىٰ هُدًى مِّن رَّبِّهِمْ ۖ وَأُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ٥

అలాంటివారే తమ ప్రభువు (చూపిన) సన్మార్గంలో ఉన్నవారు మరియు అలాంటివారే సాఫల్యం పొందేవారు.

2:6 – إِنَّ الَّذِينَ كَفَرُوا سَوَاءٌ عَلَيْهِمْ أَأَنذَرْتَهُمْ أَمْ لَمْ تُنذِرْهُمْ لَا يُؤْمِنُونَ ٦

నిశ్చయంగా, సత్య-తిరస్కారులను (ఓ ము’హమ్మద్!) నీవు హెచ్చరించినా, హెచ్చరించక పోయినా ఒకటే, వారు విశ్వసించేవారు కారు.

2:7 – خَتَمَ اللَّـهُ عَلَىٰ قُلُوبِهِمْ وَعَلَىٰ سَمْعِهِمْ ۖ وَعَلَىٰ أَبْصَارِهِمْ غِشَاوَةٌ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ ٧

అల్లాహ్ వారి హృదయాల మీద మరియు వారి చెవుల మీద ముద్రవేశాడు. 7 మరియు వారి కన్నుల మీద తెర పడి ఉన్నది. మరియు వారికొరకు ఘోరమైన శిక్ష ఉంది.

2:8 – وَمِنَ النَّاسِ مَن يَقُولُ آمَنَّا بِاللَّـهِ وَبِالْيَوْمِ الْآخِرِ وَمَا هُم بِمُؤْمِنِينَ ٨

మరియు ప్రజలలో కొందరు: “మేము అల్లాహ్ నూ మరియు అంతిమ దినాన్నీవిశ్వసించాము.” అని, అనేవారున్నారు. కానీ (వాస్తవానికి) వారు విశ్వసించే వారు కారు.

2:9 – يُخَادِعُونَ اللَّـهَ وَالَّذِينَ آمَنُوا وَمَا يَخْدَعُونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ ٩

వారు, తాము అల్లాహ్ నూ మరియు విశ్వసించిన వారినీ మోసగిస్తున్నారని (అనుకుం టున్నారు); కానీ వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మోసగించటం లేదు, కాని వారది గ్రహించటం లేదు!

2:10 – فِي قُلُوبِهِم مَّرَضٌ فَزَادَهُمُ اللَّـهُ مَرَضًا ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْذِبُونَ ١٠

వారి హృదయాలలో రోగముంది. 8 కాబట్టి అల్లాహ్ వారి రోగాన్ని మరింత అధికంచేశాడు. మరియు వారు అసత్యం పలుకుతూ ఉండటం వలన, వారికి బాధాకరమైన శిక్ష ఉంది.

2:11 – وَإِذَا قِيلَ لَهُمْ لَا تُفْسِدُوا فِي الْأَرْضِ قَالُوا إِنَّمَا نَحْنُ مُصْلِحُونَ ١١

మరియు: “భువిలో కల్లోలం 9 రేకెత్తించ కండి.” అని వారితో అన్నప్పుడు; వారు: “మేము సంస్కర్తలము మాత్రమే!” అని అంటారు.

2:12 – أَلَا إِنَّهُمْ هُمُ الْمُفْسِدُونَ وَلَـٰكِن لَّا يَشْعُرُونَ ١٢

జాగ్రత్త! నిశ్చయంగా, (భువిలో) కల్లోలం రేకెత్తిస్తున్నవారు వీరే, కాని వారది గ్రహించటం లేదు.

2:13 – وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا كَمَا آمَنَ النَّاسُ قَالُوا أَنُؤْمِنُ كَمَا آمَنَ السُّفَهَاءُ ۗ أَلَا إِنَّهُمْ هُمُ السُّفَهَاءُ وَلَـٰكِن لَّا يَعْلَمُونَ ١٣

మరియు: “ఇతర జనులు విశ్వసించినట్లు మీరూ విశ్వసించండి.” అని, వారితో అన్నప్పుడు, వారు: “మూర్ఖులు విశ్వసించినట్లు మేమూ విశ్వ సించాలా?” అని జవాబిస్తారు. జాగ్రత్త! వాస్తవానికి వారే మూర్ఖులు, కాని వారికది తెలియదు.

2:14 – وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَوْا إِلَىٰ شَيَاطِينِهِمْ قَالُوا إِنَّا مَعَكُمْ إِنَّمَا نَحْنُ مُسْتَهْزِئُونَ ١٤

మరియు విశ్వాసులను కలిసినపుడు, వారు: “మేము విశ్వసించాము.” అని అంటారు. కానీ, తమ షైతానుల (దుష్టనాయకుల) దగ్గర ఏకాంతంలో ఉన్నప్పుడు వారు: “నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నాము కేవలం (వారి) ఎగతాళి చేస్తున్నాము.” అని అంటారు.

2:5 – اللَّـهُ يَسْتَهْزِئُ بِهِمْ وَيَمُدُّهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ ١٥

అల్లాహ్ వారి ఎగతాళి చేస్తున్నాడు మరియు వారి తలబిరుసుతనాన్ని హెచ్చిస్తున్నాడు, (అందులో వారు) అంధులై తిరుగుతున్నారు;

2:16 – أُولَـٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الضَّلَالَةَ بِالْهُدَىٰ فَمَا رَبِحَت تِّجَارَتُهُمْ وَمَا كَانُوا مُهْتَدِينَ ١٦

ఇలాంటి వారే, సన్మార్గానికి బదులుగా దుర్మార్గాన్ని కొనుక్కున్నవారు; కాని వారి బేరం వారికి లాభదాయకం కాలేదు మరియు వారికి మార్గదర్శకత్వమూ దొరకలేదు.

2:17 – مَثَلُهُمْ كَمَثَلِ الَّذِي اسْتَوْقَدَ نَارًا فَلَمَّا أَضَاءَتْ مَا حَوْلَهُ ذَهَبَ اللَّـهُ بِنُورِهِمْ وَتَرَكَهُمْ فِي ظُلُمَاتٍ لَّا يُبْصِرُونَ ١٧

వారి ఉపమానం 10 ఇలా ఉంది: 11 ఒక వ్యక్తి అగ్నిని వెలిగించగా, అది పరిసరాలను ప్రకాశింప జేసిన తరువాత అల్లాహ్ వారి వెలుగును తీసుకొని వారిని అంధకారంలో విడిచిపెట్టడం వల్ల, వారు ఏమీ చూడలేకపోతారు.

2:18 – صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لَا يَرْجِعُونَ ١٨

(వారు) చెవిటివారు, మూగవారు, గ్రుడ్డి వారు, ఇకవారు (ఋజుమార్గానికి) మరలిరాలేరు.

2:19 – أَوْ كَصَيِّبٍ مِّنَ السَّمَاءِ فِيهِ ظُلُمَاتٌ وَرَعْدٌ وَبَرْقٌ يَجْعَلُونَ أَصَابِعَهُمْ فِي آذَانِهِم مِّنَ الصَّوَاعِقِ حَذَرَ الْمَوْتِ ۚ وَاللَّـهُ مُحِيطٌ بِالْكَافِرِينَ ١٩

లేక, (మరొక ఉపమానం): ఆకాశం నుండి ఘోరంగా వర్షం కురుస్తున్నది; చిమ్మచీకట్లలో ఉరుములు, మెరుపులు మెరుస్తున్నాయి. ఆ ఉరు ముల భీకరధ్వని విని, మృత్యుభయంచేత వారు తమ వ్రేళ్ళను చెవులలో దూర్చుకుంటున్నారు. మరియు అల్లాహ్ సత్య-తిరస్కారులను అన్ని వైపుల నుండి ఆవరించి ఉన్నాడు. 12

2:20 – يَكَادُ الْبَرْقُ يَخْطَفُ أَبْصَارَهُمْ ۖ كُلَّمَا أَضَاءَ لَهُم مَّشَوْا فِيهِ وَإِذَا أَظْلَمَ عَلَيْهِمْ قَامُوا ۚ وَلَوْ شَاءَ اللَّـهُ لَذَهَبَ بِسَمْعِهِمْ وَأَبْصَارِهِمْ ۚ إِنَّ اللَّـهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٢٠

ఆ మెరుపు వారిదృష్టిని ఇంచుమించు ఎగురవేసుకు పోయినట్లుంటుంది. ప్రతిసారి అది మెరిసినప్పుడు, వారు ముందుకు నడుస్తారు మరియు వారిపై చీకటి క్రమ్ముకొనగానే వారు ఆగి పోతారు. మరియు అల్లాహ్ కోరితే వారి వినికిడినీ మరియు వారి చూపునూ తొలగించేవాడు. 13 నిశ్చ యంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. 14

2:21 – يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ ٢١

ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్)నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తి పరులు కావచ్చు! 15

2:22 – الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّـهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ ٢٢

ఆయన (అల్లాహ్)యే మీ కొరకు భూమిని పరుపుగానూ మరియు ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురి పించి, తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను (పంటలను) ఉత్పత్తిచేశాడు! కావున ఇది తెలుసుకొని కూడా, మీరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా నిలబెట్టకండి. 16

2:23 – وَإِن كُنتُمْ فِي رَيْبٍ مِّمَّا نَزَّلْنَا عَلَىٰ عَبْدِنَا فَأْتُوا بِسُورَةٍ مِّن مِّثْلِهِ وَادْعُوا شُهَدَاءَكُم مِّن دُونِ اللَّـهِ إِن كُنتُمْ صَادِقِينَ ٢٣

మరియు మేము మా దాసుడు (ము’హ మ్మద్)పై అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) గురించి, మీకు సందేహముంటే; దాని వంటి ఒక్క సూరహ్ నైనా మీరు (రచించి) తీసుకు రండి. 17 మరియు అల్లాహ్ తప్ప మీకు ఉన్న సహాయకులను అందరినీ పిలుచుకోండి; మీరు సత్యవంతులే అయితే (ఇది చేసి చూపండి).

2:24 – فَإِن لَّمْ تَفْعَلُوا وَلَن تَفْعَلُوا فَاتَّقُوا النَّارَ الَّتِي وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ ۖ أُعِدَّتْ لِلْكَافِرِينَ ٢٤

కానీ, ఒకవేళ మీరు అలా చేయలేకపోతే – నిశ్చయంగా, మీరు అలా చేయలేరు – మానవులు మరియు రాళ్ళు ఇంధనమయ్యే ఆ నరకాగ్నికి భయపడండి. 18 అది సత్య-తిరస్కారుల కొరకే తయారు చేయబడింది.

2:25 – وَبَشِّرِ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أَنَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ كُلَّمَا رُزِقُوا مِنْهَا مِن ثَمَرَةٍ رِّزْقًا ۙ قَالُوا هَـٰذَا الَّذِي رُزِقْنَا مِن قَبْلُ ۖ وَأُتُوا بِهِ مُتَشَابِهًا ۖ وَلَهُمْ فِيهَا أَزْوَاجٌ مُّطَهَّرَةٌ ۖ وَهُمْ فِيهَا خَالِدُونَ ٢٥

మరియు విశ్వసించి, సత్కార్యాలు చేసే వారి కొరకు నిశ్చయంగా, క్రింద కాలువలు ప్రవ హించే స్వర్గవనాలు ఉంటాయనే శుభవార్తను వినిపించు. ప్రతిసారి వారికి తినటానికి ఫలాలు ఒసంగబడినపుడల్లా, వారు: “ఇవి ఇంతకుముందు మాకు ఇవ్వబడినవే!” అని అంటారు. ఎందుకంటే వారికి ఇవ్వబడేవి వాటీ పోలికగలవే. అక్కడ వారికి నిర్మల సహవాసులు (అ’జ్వాజ్) ఉంటారు. మరియు వారందులో శాశ్వతంగా ఉంటారు. (1/8)

2:25 – إِنَّ اللَّـهَ لَا يَسْتَحْيِي أَن يَضْرِبَ مَثَلًا مَّا بَعُوضَةً فَمَا فَوْقَهَا ۚ فَأَمَّا الَّذِينَ آمَنُوا فَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِن رَّبِّهِمْ ۖ وَأَمَّا الَّذِينَ كَفَرُوا فَيَقُولُونَ مَاذَا أَرَادَ اللَّـهُ بِهَـٰذَا مَثَلًا ۘ يُضِلُّ بِهِ كَثِيرًا وَيَهْدِي بِهِ كَثِيرًا ۚ وَمَا يُضِلُّ بِهِ إِلَّا الْفَاسِقِينَ ٢٦

  • నిశ్చయంగా, అల్లాహ్ దోమ లేక దానికంటే చిన్న దాని దృష్టాంతం ఇవ్వటానికి సంకోచించడు. కావున విశ్వసించిన వారు, ఇది తమ ప్రభువు తరఫునుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. కాని సత్య-తిరస్కారులు, వాటిని విని: “ఈ ఉపమా నాల ద్వారా అల్లాహ్ చెప్పదలుచుకున్నది ఏమిటీ?” అని, ప్రశ్నిస్తారు. ఈవిధంగా ఆయన ఎంతోమందిని మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు. మరియు ఎంతోమందికి సన్మార్గం కూడా చూపు తాడు. మరియు ఆయన కేవలం దుష్టులనే 19 మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు.

2:27 – الَّذِينَ يَنقُضُونَ عَهْدَ اللَّـهِ مِن بَعْدِ مِيثَاقِهِ وَيَقْطَعُونَ مَا أَمَرَ اللَّـهُ بِهِ أَن يُوصَلَ وَيُفْسِدُونَ فِي الْأَرْضِ ۚ أُولَـٰئِكَ هُمُ الْخَاسِرُونَ ٢٧

ఎవరైతే అల్లాహ్ తో స్థిరమైన ఒడంబడిక 20 చేసుకున్న పిదప దానిని భంగపరుస్తారో మరియు అల్లాహ్ స్థిరపరచమని ఆజ్ఞాపించిన దానిని త్రెంచుతారో మరియు భువిలో కల్లోలం రేకెత్తిస్తారో! ఇలాంటివారే, వాస్తవంగా నష్టపడేవారు.

2:28 – كَيْفَ تَكْفُرُونَ بِاللَّـهِ وَكُنتُمْ أَمْوَاتًا فَأَحْيَاكُمْ ۖ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ ٢٨

మీరు అల్లాహ్ పట్ల తిరస్కారవైఖరిని ఎలా అవలంబించగలరు? మరియు వాస్తవానికి ఆయనే నిర్జీవులుగా 21 ఉన్నమిమ్మల్నిసజీవులుగా చేశాడు కదా! తరువాత మీప్రాణాన్నితీసి తిరిగి మిమ్మల్ని సజీవులుగా చేసేది కూడా ఆయనే; చివరకు మీరంతా ఆయన వద్దకే మరలింప బడతారు.

2:29 – هُوَ الَّذِي خَلَقَ لَكُم مَّا فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ اسْتَوَىٰ إِلَى السَّمَاءِ فَسَوَّاهُنَّ سَبْعَ سَمَاوَاتٍ ۚ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ٢٩

ఆయనే భూమిలో నున్న సమస్తాన్నీ మీ కొరకు సృష్టించాడు; తరువాత తన దృష్టిని ఆకాశాల వైపునకు మరల్చి వాటిని సప్తాకాశాలుగా ఏర్పరిచాడు. మరియు ఆయనే ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానం గలవాడు.

2:30 – وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي جَاعِلٌ فِي الْأَرْضِ خَلِيفَةً ۖ قَالُوا أَتَجْعَلُ فِيهَا مَن يُفْسِدُ فِيهَا وَيَسْفِكُ الدِّمَاءَ وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ ۖ قَالَ إِنِّي أَعْلَمُ مَا لَا تَعْلَمُونَ ٣٠

మరియు (జ్ఞాపకంచేసుకో!) నీ ప్రభువు దేవ దూతలతో: “వాస్తవంగా నేను భూమిలో ఒక ఉత్త రాధికారిని 22 సృషించబోతున్నాను!” అని, చెప్పినపుడు వారు: “ఏమీ? నీవు భూమిలో కల్లోలం రేకెత్తించేవానిని మరియు నెత్తురుచిందించే వానిని నియమించబోతున్నావా? మేము నీ స్తోత్రం చేస్తూ, నీ పవిత్రతను కొనియాడుతూనే ఉన్నాము కదా!” అని విన్నవించుకున్నారు. దానికి ఆయన: “నిశ్చయంగా, మీకు తెలియనిది నాకు తెలుసు!” అని, అన్నాడు.

2:31 – وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَى الْمَلَائِكَةِ فَقَالَ أَنبِئُونِي بِأَسْمَاءِ هَـٰؤُلَاءِ إِن كُنتُمْ صَادِقِينَ ٣١

మరియు ఆయన (అల్లాహ్) ఆదమ్ కు సకల వస్తువుల పేర్లను నేర్పాడు, 23 ఆ పిదప వాటిని దేవదూతల ఎదుట ఉంచి: “మీరు సత్య వంతులే అయితే, వీటి పేర్లను నాకు తెలుపండి.” అని, అన్నాడు.

2:32 – قَالُوا سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ ٣٢

వారు (దేవదూతలు): “నీవు సర్వ లోపాల కు అతీతుడవు, 24 నీవు తెలిపినదే తప్ప మాకు మరేమీ తెలియదు. నిశ్చయంగా నీవే సర్వజ్ఞు డవు, 25 మహా వివేకవంతుడవు. 26 అని అన్నారు.

2:33 – قَالَ يَا آدَمُ أَنبِئْهُم بِأَسْمَائِهِمْ ۖ فَلَمَّا أَنبَأَهُم بِأَسْمَائِهِمْ قَالَ أَلَمْ أَقُل لَّكُمْ إِنِّي أَعْلَمُ غَيْبَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَأَعْلَمُ مَا تُبْدُونَ وَمَا كُنتُمْ تَكْتُمُونَ ٣٣

ఆయన (అల్లాహ్): “ఓ ఆదమ్! వీటి (ఈ వస్తువుల) పేర్లను వీరికి తెలుపు.” అని అన్నాడు. ఎపుడైతే అతను (ఆదమ్) ఆ వస్తువుల పేర్లను వారికి తెలిపాడో; ఆయన అన్నాడు: “నిశ్చయంగా నేను మాత్రమే భూమ్యాకాశాల అగోచర విషయాలను ఎరుగుదునని మీతో చెప్పలేదా? మరియు మీరు ఏది బహిర్గతంచేస్తారో మరియు ఏది దాస్తారో కూడా నాకు బాగా తెలుసు!”

2:34 – وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَىٰ وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ ٣٤

మరియు (జ్ఞాపకంచేసుకోండి) మేము దేవదూతలతో: “మీరందరూ ఆదమ్ ముందు సాష్టాంగం (సజ్దా) చేయండి.” అని ఆదేశించినపుడు, ఒక ఇబ్లీస్ 27 తప్ప, మిగతావారంతా సాష్టాంగం (సజ్దా) చేశారు; 28 అతడు నిరాకరించాడు మరియు దురహంకారానికి గురయ్యాడు మరియు సత్య- తిరస్కారులలోని వాడయ్యాడు.

2:35 – وَقُلْنَا يَا آدَمُ اسْكُنْ أَنتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَـٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ ٣٥

మరియు మేము (ఆదమ్ తో) అన్నాము: “ఓ ఆదమ్! నీవూ మరియు నీ భార్యా ఈ స్వర్గంలో నివసించండి మరియు మీరిద్దరూ మీకు ఇష్టమైనది యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు 29 దరిదాపులకు పోకండి, అలా చేస్తే మీరిద్దరూ దుర్మార్గులలో 30 చేరిన వారవుతారు!”

2:36 – فَأَزَلَّهُمَا الشَّيْطَانُ عَنْهَا فَأَخْرَجَهُمَا مِمَّا كَانَا فِيهِ ۖ وَقُلْنَا اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَمَتَاعٌ إِلَىٰ حِينٍ ٣٦

ఆ పిదప షై’తాన్ వారిద్దరినీ దాని (స్వర్గం) నుండి తప్పించి, వారిద్దరినీ వారున్న స్థితి నుండి బయటికితీశాడు. మరియు మేము (అల్లాహ్) అన్నాము: “మీరంతా ఇక్కడి నుండి దిగిపొండి; మీరు ఒకరికొకరు విరోధులవుతారు. 31 ఒక నియమిత కాలం వరకు మీరు భూమిలో ఉండి, అక్కడే జీవితం గడపవలసి ఉంటుంది.”

2:37 – فَتَلَقَّىٰ آدَمُ مِن رَّبِّهِ كَلِمَاتٍ فَتَابَ عَلَيْهِ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ ٣٧

తరువాత ఆదమ్, తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి, 32 (పశ్చాత్తాపపడి క్షమాభిక్ష కోరాడు) మరియు ఆయన (అల్లాహ్) అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించే వాడు, అపార కరుణాప్రదాత.

2:38 – قُلْنَا اهْبِطُوا مِنْهَا جَمِيعًا ۖ فَإِمَّا يَأْتِيَنَّكُم مِّنِّي هُدًى فَمَن تَبِعَ هُدَايَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ٣٨

మేము (అల్లాహ్) ఇలా అన్నాము: “మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి.” ఇక నా తరఫు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైతే నా మార్గదర్శ కత్వాన్ని అనుసరిస్తారో వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!

2:39 – وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٣٩

కాని, ఎవరైతే (మార్గదర్శకత్వాన్ని) తిర స్కరిస్తారో మరియు మా సూచన (అయాతు) లను అసత్యాలని తిరస్కరిస్తారో, అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

2:40 – يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَوْفُوا بِعَهْدِي أُوفِ بِعَهْدِكُمْ وَإِيَّايَ فَارْهَبُونِ ٤٠

ఓ ఇస్రాయీ‘ల్ సంతతివారలారా! 33 నేను మీకుచేసిన ఉపకారాన్ని జ్ఞాపకంచేసుకోండి మరియు మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి, నేనూ మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుతాను. మరియు మీరు నాకు మాత్రమే భయపడండి!

2:41 – وَآمِنُوا بِمَا أَنزَلْتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمْ وَلَا تَكُونُوا أَوَّلَ كَافِرٍ بِهِ ۖ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا وَإِيَّايَ فَاتَّقُونِ ٤١

మరియు మీ వద్ద నున్నవాటిని (తౌరాత్ / ఇంజీల్ లను) ధృవీకరిస్తూ నేను అవతరింపజేసిన దానిని (ఈ దివ్యఖుర్ఆనును) విశ్వసించండి. మరియు దీనిని తిరస్కరించేవారిలో మీరు మొట్ట మొదటి వారు కాకండి. మరియు అల్ప లాభాలకు నా సూచన (ఆయాత్)లను 34 అమ్మకండి. కేవలం నా యందే భయ-భక్తులు కలిగి ఉండండి.

2:42 – وَلَا تَلْبِسُوا الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُوا الْحَقَّ وَأَنتُمْ تَعْلَمُونَ ٤٢

మరియు సత్యాన్ని అసత్యంతో కలిపి తారుమారు చేయకండి మరియు మీకు తెలిసి ఉండి కూడా సత్యాన్ని దాచకండి. 35

2:43 – وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَارْكَعُوا مَعَ الرَّاكِعِينَ ٤٣

మరియు నమా’జ్ ను స్థాపించండి మరియు విధిదానం (’జకాత్) ఇవ్వండి మరియు (నా సాన్నిధ్యంలో వినమ్రులై) వంగే 36 (రుకూ’ఉ చేసే) వారితో పాటు మీరూ (వినమ్రులై) వంగండి (రుకూ’ఉ చేయండి). (1/4)

2:44 – أَتَأْمُرُونَ النَّاسَ بِالْبِرِّ وَتَنسَوْنَ أَنفُسَكُمْ وَأَنتُمْ تَتْلُونَ الْكِتَابَ ۚ أَفَلَا تَعْقِلُونَ ٤٤

ఏమీ? మీరు ఇతరులనైతే నీతిపరు లవమని ఆజ్ఞాపిస్తున్నారు, కాని స్వయంగా మీరే దానిని అవలంబించడం మరచిపోతున్నా రెందుకు? 37 మరియు మీరయితే గ్రంథాన్ని చదువుతున్నారు కదా! అయితే మీరెందుకు మీ బుద్ధిని ఉపయోగించరు?

2:45 – وَاسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ وَإِنَّهَا لَكَبِيرَةٌ إِلَّا عَلَى الْخَاشِعِينَ ٤٥

మరియు సహనం మరియు సమా’జ్ ద్వారా (అల్లాహ్) సహాయాన్ని అర్థించండి. నిశ్చయంగా, అది (అల్లాహ్ కు) వినమ్రులైన వారికి తప్ప, ఇతరులకు ఎంతో కష్టతరమైనది.

2:46 – الَّذِينَ يَظُنُّونَ أَنَّهُم مُّلَاقُو رَبِّهِمْ وَأَنَّهُمْ إِلَيْهِ رَاجِعُونَ ٤٦

అలాంటి వారు తాము, తమ ప్రభువును నిశ్చయంగా, కలుసుకోవలసివుందనీ మరియు ఆయన వైపునకే మరలి పోవలసి ఉందనీ నమ్ముతారు. 38

2:47 – يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَنِّي فَضَّلْتُكُمْ عَلَى الْعَالَمِينَ ٤٧

ఓఇస్రాయీ‘ల్ సంతతివారలారా! నేనుమీకు చేసినమహోపకారాన్ని జ్ఞాపకంచేసుకోండి మరియు నేను నిశ్చయంగా, మిమ్మల్ని(మీ కాలంలో) సర్వ లోకాల వారికంటే అధికంగా ఆదరించాను!

2:48 – وَاتَّقُوا يَوْمًا لَّا تَجْزِي نَفْسٌ عَن نَّفْسٍ شَيْئًا وَلَا يُقْبَلُ مِنْهَا شَفَاعَةٌ وَلَا يُؤْخَذُ مِنْهَا عَدْلٌ وَلَا هُمْ يُنصَرُونَ ٤٨

మరియు ఆ (తీర్పు) దినమునకు భయ పడండి, అప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏ విధంగానూ ఉపయోగపడలేడు; మరియు అతని నుండి ఎట్టి సిఫారసూ అంగీకరించబడదు మరియు ఎలాంటి పరిహారం కూడా తీసుకోబడదు మరియు వారికెలాంటి సహాయం కూడా చేయబడదు.

2:49 – وَإِذْ نَجَّيْنَاكُم مِّنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ يُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُم بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ ٤٩

మరియు ఫిర్’ఔన్ జాతివారి (బానిసత్వం) నుండి మేము మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వారు మిమ్మల్ని ఘోర హింసకు గురిచేస్తూ ఉండేవారు; మీ కుమారులను వధించి, మీ స్త్రీలను సజీవులుగా విడిచిపెట్టేవారు. మరియు ఇందులో మీ ప్రభువు తరఫు నుండి మీకు గొప్ప పరీక్ష ఉండెను.

2:50 – وَإِذْ فَرَقْنَا بِكُمُ الْبَحْرَ فَأَنجَيْنَاكُمْ وَأَغْرَقْنَا آلَ فِرْعَوْنَ وَأَنتُمْ تَنظُرُونَ ٥٠

మరియు మేము మీ కొరకు సముద్రాన్ని చీల్చి మిమ్మల్ని రక్షించినప్పుడు మీరు చూస్తూ ఉండగానే ఫిర్’ఔన్ జాతి వారిని ముంచివేసిన సంఘటనను (గుర్తుకు తెచ్చుకోండి). 39

2:51 – وَإِذْ وَاعَدْنَا مُوسَىٰ أَرْبَعِينَ لَيْلَةً ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِن بَعْدِهِ وَأَنتُمْ ظَالِمُونَ ٥١

ఇంకా (జ్ఞాపకం చేసుకోండి), మేము మూసాను నలభై రాత్రుల వాగ్దానం చేసి (పిలిచి నపుడు) మీరు అతను లేకపోవడం చూసి, ఆవు దూడను (ఆరాధ్యదైవంగా) చేసుకున్నారు. 40 మరియు మీరు దుర్మార్గులయ్యారు.

2:52 – ثُمَّ عَفَوْنَا عَنكُم مِّن بَعْدِ ذَٰلِكَ لَعَلَّكُمْ تَشْكُرُونَ ٥٢

అయినప్పటికీ మీరు కృతజ్ఞులవుతా రేమోనని మేము మిమ్మల్ని మన్నించాము. 41

2:53 – وَإِذْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَالْفُرْقَانَ لَعَلَّكُمْ تَهْتَدُونَ ٥٣

మరియు (జ్ఞాపకం చేసుకోండి)! మీరు సన్మార్గులవుతారేమోనని మేము మూసాకు గ్రంథాన్ని మరియు (సత్యా-సత్యాలను వేరుచేసే) 42 గీటురాయిని ప్రసాదించాము

2:54 – وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ إِنَّكُمْ ظَلَمْتُمْ أَنفُسَكُم بِاتِّخَاذِكُمُ الْعِجْلَ فَتُوبُوا إِلَىٰ بَارِئِكُمْ فَاقْتُلُوا أَنفُسَكُمْ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ عِندَ بَارِئِكُمْ فَتَابَ عَلَيْكُمْ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ ٥٤

మరియు (జ్ఞాపకం చేసుకోండి)! మూసా తన జాతివారతో ఇలా అన్న విషయాన్ని: “ఓ నాజాతి ప్రజలారా! నిశ్చయంగా, ఆవుదూడను (ఆరాధ్య దైవంగా) చేసుకొని మీకు-మీరే అన్యాయం చేసుకున్నారు. కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీ నిర్మాతను మీలోని వారిని (ఘోర పాతకులను) సంహరించండి. ఇదే మీ కొరకు – మీ సృష్టికర్త దృష్టిలో – శ్రేష్ఠమైనది.” ఆ తరువాత ఆయన (అల్లాహ్) మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు. అపార కరుణాప్రదాత. 43 (సృష్టికర్తను) వేడుకోండి.

2:55 – وَإِذْ قُلْتُمْ يَا مُوسَىٰ لَن نُّؤْمِنَ لَكَ حَتَّىٰ نَرَى اللَّـهَ جَهْرَةً فَأَخَذَتْكُمُ الصَّاعِقَةُ وَأَنتُمْ تَنظُرُونَ ٥٥

మరియు అప్పుడు మీరు అతనితో (మూసాతో) అన్న మాటలు (జ్ఞప్తికితెచ్చుకోండి): “ఓ మూసా! మేము అల్లాహ్ ను ప్రత్యక్షంగా చూడ నంతవరకు నిన్ను ఏ మాత్రం విశ్వసించము!” అదే సమయంలో మీరు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన పిడుగు మీపై విరుచుకుపడింది (మీరు చనిపోయారు).

2:56 – ثُمَّ بَعَثْنَاكُم مِّن بَعْدِ مَوْتِكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ ٥٦

ఆ పిమ్మట, మీరు కృతజ్ఞులై ఉంటా రేమోనని – మీరు చచ్చిన తరువాత – మిమ్మల్ని తిరిగి బ్రతికించాము.

2:57 – وَظَلَّلْنَا عَلَيْكُمُ الْغَمَامَ وَأَنزَلْنَا عَلَيْكُمُ الْمَنَّ وَالسَّلْوَىٰ ۖ كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ ۖ وَمَا ظَلَمُونَا وَلَـٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ ٥٧

మరియు మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము మరియు మన్న్ మరియు సల్వాలను మీ కొరకు ఆహారంగా దించాము: 44 “మేము మీకు ప్రసాదించిన శుధ్ధమయిన వస్తువు లను తినండి.” అని అన్నాము. (కాని వారు మా ఆజ్ఞలను ఉల్లంఘించారు), అయినా వారు మాకు అపకారమేమీ చేయలేదు, పైగా వారు తమకు తామే అపకారం చేసుకన్నారు.

2:58 – وَإِذْ قُلْنَا ادْخُلُوا هَـٰذِهِ الْقَرْيَةَ فَكُلُوا مِنْهَا حَيْثُ شِئْتُمْ رَغَدًا وَادْخُلُوا الْبَابَ سُجَّدًا وَقُولُوا حِطَّةٌ نَّغْفِرْ لَكُمْ خَطَايَاكُمْ ۚ وَسَنَزِيدُ الْمُحْسِنِينَ ٥٨

మరియు మేము మీతో: “ఈ నగరం (జేరుసలం) లో ప్రవేశించండి మరియు అక్కడున్న వస్తువులను మీ ఇష్టానుసారంగా, కావలసినంత తినండి మరియు నగర ద్వారంలోకి వినమ్రులై తల వంచుతూ: ‘మమ్మల్ని క్షమించు’ (’హి’త్తతున్), అంటూ, ప్రవేశించండి; మేము మీ పాపాలను క్షమిస్తాము. మరియు మేము సజ్జనులను అత్యధికంగా కరుణిస్తాము.” అని చెప్పిన మాటలను (జ్ఞప్తికి తెచ్చుకోండి)!

2:59 – فَبَدَّلَ الَّذِينَ ظَلَمُوا قَوْلًا غَيْرَ الَّذِي قِيلَ لَهُمْ فَأَنزَلْنَا عَلَى الَّذِينَ ظَلَمُوا رِجْزًا مِّنَ السَّمَاءِ بِمَا كَانُوا يَفْسُقُونَ ٥٩

కాని దుర్మార్గులైన వారు, వారికి చెప్పిన మాటను మరొక మాటతో మార్చారు. 45 కనుక, మేము దుర్మార్గం చేసిన వారిపై, వారి దౌష్ట్యాలకు ఫలితంగా, ఆకాశం నుండి ఆపదను దింపాము. 46 (3/8)

2:60 – وَإِذِ اسْتَسْقَىٰ مُوسَىٰ لِقَوْمِهِ فَقُلْنَا اضْرِب بِّعَصَاكَ الْحَجَرَ ۖ فَانفَجَرَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَيْنًا ۖ قَدْ عَلِمَ كُلُّ أُنَاسٍ مَّشْرَبَهُمْ ۖ كُلُوا وَاشْرَبُوا مِن رِّزْقِ اللَّـهِ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ ٦٠

  • మరియు (జ్ఞాపకం చేసుకోండి)! మూసా తన ప్రజలకు నీటి కొరకు ప్రార్థించినప్పుడు, మేము: “నీవు ఆ బండను నీ కర్రతో కొట్టు!” అని ఆదేశించాము. అప్పుడు దాని నుండి పన్నెండు ఊటలు ప్రవహించసాగాయి. ప్రతి తెగవారు తమ నీరుత్రాగే స్థలాన్ని కనుగొన్నారు. (అప్పుడు వారతో అన్నాము): “అల్లాహ్ మీకు ప్రసాదించిన ఆహారాన్ని తినండి త్రాగండి కానీ, భూమిలో కల్లోలం రేపుతూ దౌర్జన్యపరులుగా తిరగకండి!”

2:61 – وَإِذْ قُلْتُمْ يَا مُوسَىٰ لَن نَّصْبِرَ عَلَىٰ طَعَامٍ وَاحِدٍ فَادْعُ لَنَا رَبَّكَ يُخْرِجْ لَنَا مِمَّا تُنبِتُ الْأَرْضُ مِن بَقْلِهَا وَقِثَّائِهَا وَفُومِهَا وَعَدَسِهَا وَبَصَلِهَا ۖ قَالَ أَتَسْتَبْدِلُونَ الَّذِي هُوَ أَدْنَىٰ بِالَّذِي هُوَ خَيْرٌ ۚ اهْبِطُوا مِصْرًا فَإِنَّ لَكُم مَّا سَأَلْتُمْ ۗ وَضُرِبَتْ عَلَيْهِمُ الذِّلَّةُ وَالْمَسْكَنَةُ وَبَاءُوا بِغَضَبٍ مِّنَ اللَّـهِ ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ كَانُوا يَكْفُرُونَ بِآيَاتِ اللَّـهِ وَيَقْتُلُونَ النَّبِيِّينَ بِغَيْرِ الْحَقِّ ۗ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ ٦١

మరియు అప్పుడు మీరు: “ఓ మూసా! మేము ఒకే రకమైన ఆహారం తింటూ ఉండలేము. కావున భూమిలో ఉత్పత్తి అయ్యే ఆకుకూరలు, దోసకాయలు (కూరగాయలు), వెల్లుల్లి (గోదు మలు), ఉల్లిగడ్డలు, పప్పు దినుసులు మొదలైనవి మాకొరకు పండించమని నీ ప్రభువును ప్రార్థించు.” అని అన్నారు. దానికతను: “ఏమీ? శ్రేష్ఠమైన దానికి బదులుగా అల్పమైన దానిని కోరుకుంటు న్నారా? (అలాగయితే) మీరు ఏదైనా నగరానికి తిరిగిపొండి. నిశ్చయంగా, అక్కడ మీకు, మీరు కోరేదంతా దొరుకుతుంది!” అని అన్నాడు. మరియు వారు, తీవ్ర అవమానం మరియు దారి ద్ర్యానికి గురయ్యారు. మరియు వారు అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యారు. అదంతా వాస్తవానికి వారు, అల్లాహ్ సూచన (ఆయాత్)లను తిరస్కరించిన దాని మరియు ప్రవక్తలను యంగా చంపినదాని ఫలితం. అన్యా 47 ఇదంతా వారు చేసిన ఆజ్ఞోల్లంఘన మరియు హద్దులు మీరి ప్రవర్తించిన దాని పర్యవసానం.

2:62 – إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالنَّصَارَىٰ وَالصَّابِئِينَ مَنْ آمَنَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ وَعَمِلَ صَالِحًا فَلَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ٦٢

నిశ్చయంగా, విశ్వసించిన వారు (ముస్లింలు) కానీ, (ఇస్లాంకు పూర్వపు) యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబీయూలు 48 కానీ (ఎవరైనా సరే)! అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారికి, వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంటుంది మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరుకూడా! 49

2:63 – وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ خُذُوا مَا آتَيْنَاكُم بِقُوَّةٍ وَاذْكُرُوا مَا فِيهِ لَعَلَّكُمْ تَتَّقُونَ ٦٣

మరియు (ఓ ఇస్రాయీ‘ల్ సంతతివారలారా!) మేము ’తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి, మీ చేత చేయించిన గట్టి వాగ్దానాన్ని (జ్ఞప్తికి తెచ్చు కోండి)! అప్పుడుమేము:“మీకుప్రసాదిస్తున్నదానిని (గ్రంథాన్ని) దృఢంగా పట్టుకోండి, అందులో ఉన్న దంతా జ్ఞాపకం ఉంచుకోండి, – బహుశా మీరు భయ -భక్తులు గలవారు కావచ్చు!” అని అన్నాము.

2:64 – ثُمَّ تَوَلَّيْتُم مِّن بَعْدِ ذَٰلِكَ ۖ فَلَوْلَا فَضْلُ اللَّـهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ لَكُنتُم مِّنَ الْخَاسِرِينَ ٦٤

ఆ పిదప కూడా మీరు వెనుదిరిగి పోయారు. అయినప్పటికీ అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు ఆయన కరుణ మీపై లేకుంటే, మీరు నష్టానికి గురైనవారిలో చేరేవారు.

2:65 – وَلَقَدْ عَلِمْتُمُ الَّذِينَ اعْتَدَوْا مِنكُمْ فِي السَّبْتِ فَقُلْنَا لَهُمْ كُونُوا قِرَدَةً خَاسِئِينَ ٦٥

మరియు శనివారం (సబ్త్) శాసనం ఉల్లంఘించిన, మీ వారి గాథ మీకు బాగా తెలుసు. 50 మేము వారిని: “నీచులైన కోతులు కండి!” అని అన్నాము.

2:66 – فَجَعَلْنَاهَا نَكَالًا لِّمَا بَيْنَ يَدَيْهَا وَمَا خَلْفَهَا وَمَوْعِظَةً لِّلْمُتَّقِينَ ٦٦

ఈ విధంగా మేము, దానిని (వారి ముగిం పును) ఆ కాలం వారికీ మరియు భావీ తరాల వారికీ ఒక గుణపాఠంగానూ, దైవభీతి గలవారికి ఒక హితోపదేశంగానూ చేశాము.

2:67 – وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ إِنَّ اللَّـهَ يَأْمُرُكُمْ أَن تَذْبَحُوا بَقَرَةً ۖ قَالُوا أَتَتَّخِذُنَا هُزُوًا ۖ قَالَ أَعُوذُ بِاللَّـهِ أَنْ أَكُونَ مِنَ الْجَاهِلِينَ ٦٧

మరియు (జ్ఞాపకం చేసుకోండి) మూసా తన జాతి వారితో: “అల్లాహ్ మిమ్మల్ని: ‘ఒక ఆవును బలి ఇవ్వండి!’ 51 అని ఆజ్ఞాపిస్తున్నాడు.” అని అన్నప్పుడు వారు: “ఏమీ? నీవు మాతో పరహాస మాడుతున్నావా?” అని పలికారు. (అప్పుడు మూసా) అన్నాడు: “నేను అవివేకులతో కలిసి పోకుండా ఉండాలని, నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.”

2:68 – قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا هِيَ ۚ قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ لَّا فَارِضٌ وَلَا بِكْرٌ عَوَانٌ بَيْنَ ذَٰلِكَ ۖ فَافْعَلُوا مَا تُؤْمَرُونَ ٦٨

వారు: “అది ఎలాంటిదై ఉండాలో మాకు స్పష్టంగా తెలుపమని, నీ ప్రభువును ప్రార్థించు!” అని అన్నారు. (మూసా) అన్నాడు:“ ‘నిశ్చయంగా ఆ ఆవు ముసలిదిగానీ లేగదూడ గానీ కాకుండా, మధ్య వయస్సుగలదై ఉండాలి.’ అని, ఆయన అంటున్నాడు. కనుక ఆజ్ఞాపించిన విధంగా చేయండి.”

2:69 – قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا لَوْنُهَا ۚ قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ صَفْرَاءُ فَاقِعٌ لَّوْنُهَا تَسُرُّ النَّاظِرِينَ ٦٩

వారు: “దాని రంగు ఎలా ఉండాలో మాకు తెలుపమని నీ ప్రభువును వేడుకో!” అని, అన్నారు. (దానికి అతను) అన్నాడు: “ ‘అది మెరిసే పసుపువన్నె కలిగి, చూసే వారికి మనోహరంగా కనిపించాలి.’ అని ఆయన ఆజ్ఞ!”

2:70 – قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا هِيَ إِنَّ الْبَقَرَ تَشَابَهَ عَلَيْنَا وَإِنَّا إِن شَاءَ اللَّـهُ لَمُهْتَدُونَ ٧٠

  1. వారు ఇలా అన్నారు: “అసలు ఏ విధమైన ఆవు కావాలో నీవు నీ ప్రభువును అడిగి మాకు స్పష్టంగా తెలుపు; దానిని నిర్ణయించడంలో మాకు సందేహం కలిగింది మరియు నిశ్చయంగా, అల్లాహ్ కోరితే మేము తప్పక అలాంటి ఆవును కనుగొంటాము (మార్గదర్శకత్వం పొందుతాము).”

2:71 – قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ لَّا ذَلُولٌ تُثِيرُ الْأَرْضَ وَلَا تَسْقِي الْحَرْثَ مُسَلَّمَةٌ لَّا شِيَةَ فِيهَا ۚ قَالُوا الْآنَ جِئْتَ بِالْحَقِّ ۚ فَذَبَحُوهَا وَمَا كَادُوا يَفْعَلُونَ ٧١

అతను (మూసా) అన్నాడు: “ఆయన (అల్లాహ్) అంటున్నాడు: ‘ఆ గోవు భూమిని దున్నటానికిగానీ, పొలాలకు నీళ్ళు తోడటానికి గానీ ఉపయోగించబడకుండా ఆరోగ్యంగా ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలి.’ అని!” అప్పుడు వారన్నారు: “ఇప్పుడు నీవు సత్యం తెచ్చావు.” తరువాత వారు దానిని బలి (జి‘’బ్హ్) చేశారు, లేకపోతే వారు అలా చేసేవారని అనిపించలేదు. 52

2:72 – وَإِذْ قَتَلْتُمْ نَفْسًا فَادَّارَأْتُمْ فِيهَا ۖ وَاللَّـهُ مُخْرِجٌ مَّا كُنتُمْ تَكْتُمُونَ ٧٢

మరియు (జ్ఞాపకం చేసుకోండి), మీరు ఒక వ్యక్తిని చంపి ఆ నిందను ఒకరిపైనొకరు మోపుకో సాగారు. కాని మీరు దాస్తున్న దానిని అల్లాహ్ బయటపెట్టాడు. 53

2:73 – فَقُلْنَا اضْرِبُوهُ بِبَعْضِهَا ۚ كَذَٰلِكَ يُحْيِي اللَّـهُ الْمَوْتَىٰ وَيُرِيكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ ٧٣

కనుక మేము: “దానిని (ఆ శవాన్ని), ఆ ఆవు (మాంసపు) ఒక ముక్కతో కొట్టండి (అతడు సజీవుడవుతాడు).” అని ఆజ్ఞాపించాము. ఈ విధంగా అల్లాహ్ మృతులను బ్రతికించి, తన సూచనలను మీకు చూపుతున్నాడు బహుశా మీరు అర్థం చేసుకుంటారేమోనని!

2:74 – ثُمَّ قَسَتْ قُلُوبُكُم مِّن بَعْدِ ذَٰلِكَ فَهِيَ كَالْحِجَارَةِ أَوْ أَشَدُّ قَسْوَةً ۚ وَإِنَّ مِنَ الْحِجَارَةِ لَمَا يَتَفَجَّرُ مِنْهُ الْأَنْهَارُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَشَّقَّقُ فَيَخْرُجُ مِنْهُ الْمَاءُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَهْبِطُ مِنْ خَشْيَةِ اللَّـهِ ۗ وَمَا اللَّـهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ ٧٤

కానీ దీని తరువాత కూడా మీ హృద యాలు కఠినమైపోయాయి, అవి రాళ్ళ మాదిరిగా! కాదు, వాటికంటే కూడా కఠినంగా అయిపోయాయి. ఎందుకంటే వాస్తవానికి రాళ్ళలో కొన్ని బ్రద్దలై నప్పుడు వాటినుండి సెలయేళ్ళు ప్రవహిస్తాయి. మరియు నిశ్చయంగా, వాటిలో కొన్ని చీలిపోయి వాటి నుండి నీళ్ళు బయటికి వస్తాయి. 54 మరియు వాస్తవానికి వాటిలో మరికొన్ని అల్లాహ్ భయం వల్ల పడిపోతాయి. మరియు అల్లాహ్ మీ కర్మల పట్ల నిర్లక్ష్యంగాలేడు. (1/2)

2:75 – أَفَتَطْمَعُونَ أَن يُؤْمِنُوا لَكُمْ وَقَدْ كَانَ فَرِيقٌ مِّنْهُمْ يَسْمَعُونَ كَلَامَ اللَّـهِ ثُمَّ يُحَرِّفُونَهُ مِن بَعْدِ مَا عَقَلُوهُ وَهُمْ يَعْلَمُونَ ٧٥

  • (ఓ విశ్వాసులారా!) వారు (యూదులు) మీ సందేశాన్ని విశ్వసిస్తారని ఆశిస్తున్నారా ఏమిటీ? మరియు వాస్తవానికి వారిలో ఒక వర్గం వారు (ధర్మవేత్తలు) అల్లాహ్ ప్రవచనం (తౌరాత్) విని, అర్థంచేసుకొని కూడా, బుధ్ధిపూర్వకంగా దానిని తారుమారు చేసేవారు కదా?

2:76 – وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَا بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ قَالُوا أَتُحَدِّثُونَهُم بِمَا فَتَحَ اللَّـهُ عَلَيْكُمْ لِيُحَاجُّوكُم بِهِ عِندَ رَبِّكُمْ ۚ أَفَلَا تَعْقِلُونَ ٧٦

మరియు వారు (యూదులు) విశ్వాసులను కలిసినప్పుడు: “మేము విశ్వసించాము!” అని అంటారు. కాని వారు ఏకాంతంలో (తమ తెగ వారితో) ఒకరినొకరు కలుసుకున్నప్పుడు: “ఏమీ? అల్లాహ్ మీకు తెలిపింది వారికి (ముస్లిం లకు) తెలుపుతారా? 55 దానితో వారు (ముస్లిం లు) మీ ప్రభువు ముందు మీతో వాదులాడటానికి! మీరిది అర్థంచేసుకోలేరా ఏమిటి?” అని అంటారు.

2:77 – أَوَلَا يَعْلَمُونَ أَنَّ اللَّـهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ٧٧

ఏమీ! వారికి తెలియదా? వారు (యూదులు) దాచేది మరియు వెలిబుచ్చేది, అంతా అల్లాహ్ కు బాగా తెలుసని?

2:78 – وَمِنْهُمْ أُمِّيُّونَ لَا يَعْلَمُونَ الْكِتَابَ إِلَّا أَمَانِيَّ وَإِنْ هُمْ إِلَّا يَظُنُّونَ ٧٨

మరియు వారి (యూదుల)లో కొందరు నిరక్షరాస్యులున్నారు, వారికి గ్రంథజ్ఞానం లేదు, వారు కేవలం మూఢ విశ్వాసాలను (నమ్ముతూ), ఊహలపై మాత్రమే ఆధారపడి ఉన్నారు.

2:79 – فَوَيْلٌ لِّلَّذِينَ يَكْتُبُونَ الْكِتَابَ بِأَيْدِيهِمْ ثُمَّ يَقُولُونَ هَـٰذَا مِنْ عِندِ اللَّـهِ لِيَشْتَرُوا بِهِ ثَمَنًا قَلِيلًا ۖ فَوَيْلٌ لَّهُم مِّمَّا كَتَبَتْ أَيْدِيهِمْ وَوَيْلٌ لَّهُم مِّمَّا يَكْسِبُونَ ٧٩

కావున ఎవరైతే తమ చేతులారా ఒక పుస్తకాన్ని వ్రాసి – దాని వల్ల తుచ్ఛ మూల్యం పొందే నిమిత్తం – “ఇది అల్లాహ తరఫు నుండి వచ్చింది.” అని (ప్రజలకు) చెబుతారో, వారికి వినాశముంది. వారి చేతులు వ్రాసినందుకు, వారికి వినాశముంది మరియు వారు సంపాదించిన దానికి కూడా వారికి వినాశముంది!

2:80 – وَقَالُوا لَن تَمَسَّنَا النَّارُ إِلَّا أَيَّامًا مَّعْدُودَةً ۚ قُلْ أَتَّخَذْتُمْ عِندَ اللَّـهِ عَهْدًا فَلَن يُخْلِفَ اللَّـهُ عَهْدَهُ ۖ أَمْ تَقُولُونَ عَلَى اللَّـهِ مَا لَا تَعْلَمُونَ ٨٠

మరియు వారు (యూదులు) అంటారు: “మాకు నరకాగ్ని శిక్ష పడినా, అది కొన్ని రోజుల కొరకు మాత్రమే!” (ఓ ము’హమ్మద్!) నీవు వారి నడుగు: “ఏమీ? మీరు అల్లాహ్ నుండి వాగ్దానం పొందారా? ఎందుకంటే, అల్లాహ్ తన వాగ్దానాన్ని ఎన్నడూ భంగంచేయడు. లేదా మీకు తెలియని విషయాన్ని మీరు అల్లాహ్ కు అంటగడు తున్నారా?”

2:81 – بَلَىٰ مَن كَسَبَ سَيِّئَةً وَأَحَاطَتْ بِهِ خَطِيئَتُهُ فَأُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٨١

వాస్తవానికి, ఎవరు పాపం అర్జించారో మరియు తమ పాపం తమను చుట్టుముట్టి ఉన్నదో, అలాంటి వారు నరకవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

2:82 – وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَـٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٨٢

మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, అలాంటి వారు స్వర్గవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

2:83 – وَإِذْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ لَا تَعْبُدُونَ إِلَّا اللَّـهَ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَقُولُوا لِلنَّاسِ حُسْنًا وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ثُمَّ تَوَلَّيْتُمْ إِلَّا قَلِيلًا مِّنكُمْ وَأَنتُم مُّعْرِضُونَ ٨٣

మరియు మేము ఇస్రాయీలు సంతతి వారి నుండి ఇలా తీసుకున్న వాగ్దానం (జ్ఞప్తికి తెచ్చు కోండి): “మీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకూడదు. మరియు తల్లి-దండ్రులను, బంధువులను, అనాథులను, యాచించని పేద వారిని 56 ఆదరించాలి. మరియు ప్రజలను సహృదయంతో పలకరించాలి, నమా’జ్ ను స్థాపించాలి మరియు ’జకాత్ ఇవ్వాలి.” అటు పిమ్మట మీలో కొందరు తప్ప, మిగతా వారంతా (తమ వాగ్దానం నుండి) తిరిగిపోయారు. మీరంతా విముఖులైపోయే వారే!

2:84 – وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ لَا تَسْفِكُونَ دِمَاءَكُمْ وَلَا تُخْرِجُونَ أَنفُسَكُم مِّن دِيَارِكُمْ ثُمَّ أَقْرَرْتُمْ وَأَنتُمْ تَشْهَدُونَ ٨٤

మరియు మేము మీ నుండి తీసుకున్న మరొక వాగ్దానాన్ని (జ్ఞాపకం చేసుకోండి); మీరు మీ (తోటివారి) రక్తాన్ని చిందించగూడదని మరియు మీ వారిని, వారి ఇండ్ల నుండి పారద్రోలగూడదని! అప్పుడు మీరు దానికి ఒప్పుకున్నారు. మరియు దానికి స్వయంగా మీరేసాక్షులు.

2:85 – ثُمَّ أَنتُمْ هَـٰؤُلَاءِ تَقْتُلُونَ أَنفُسَكُمْ وَتُخْرِجُونَ فَرِيقًا مِّنكُم مِّن دِيَارِهِمْ تَظَاهَرُونَ عَلَيْهِم بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَإِن يَأْتُوكُمْ أُسَارَىٰ تُفَادُوهُمْ وَهُوَ مُحَرَّمٌ عَلَيْكُمْ إِخْرَاجُهُمْ ۚ أَفَتُؤْمِنُونَ بِبَعْضِ الْكِتَابِ وَتَكْفُرُونَ بِبَعْضٍ ۚ فَمَا جَزَاءُ مَن يَفْعَلُ ذَٰلِكَ مِنكُمْ إِلَّا خِزْيٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَيَوْمَ الْقِيَامَةِ يُرَدُّونَ إِلَىٰ أَشَدِّ الْعَذَابِ ۗ وَمَا اللَّـهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ ٨٥

ఆ తరువాత మీరే ఒకరినొకరు చంపుకునే వారు. మరియు మీరు మీలోని ఒక వర్గం వారిని వారి ఇండ్ల నుండి తరిమేవారు. మరియు వారికి అన్యాయం చేయటంలోనూ మరియు వారిపై దౌర్జన్యం చేయటంలోనూ, (వారి విరోధులకు) తోడ్పడేవారు. మరియు వారు (శతృవుల చేతిలో) ఖైదీలై మీ వద్దకు వచ్చినపుడు మీరు వారిని విమోచనాధనం ఇచ్చి విడిపించేవారు. మరియు (వాస్తవానికి) వారిని తరమటం మీకు నిషిధ్ధం చేయబడింది. ఏమి? మీరు గ్రంథంలోని కొన్ని విషయాలను విశ్వసించి, మరికొన్నింటిని తిరస్కరిస్తారా? 57 మీలో ఇలా చేసేవారికి, ఇహలోక జీవితంలో అవమానమూ మరియు పునరుత్థాన దినమున మిమ్మల్ని కఠిన శిక్షకు గురిచేయటం తప్ప మరెలాంటి ప్రతిఫలం ఉంటుంది? మరియు అల్లాహ్ మీ కర్మల విషయంలో నిర్లక్ష్యంగా లేడు.

2:86 – أُولَـٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ ۖ فَلَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنصَرُونَ ٨٦

ఇలాంటి వారే పరలోకానికి బదులుగా ఇహలోక జీవితాన్ని కొనేవారు! కావున వీరికి పడేశిక్ష తగ్గించబడదు మరియు వీరికి ఎలాంటి సహాయమూ లభించదు.

2:87 – وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَقَفَّيْنَا مِن بَعْدِهِ بِالرُّسُلِ ۖ وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنَاتِ وَأَيَّدْنَاهُ بِرُوحِ الْقُدُسِ ۗ أَفَكُلَّمَا جَاءَكُمْ رَسُولٌ بِمَا لَا تَهْوَىٰ أَنفُسُكُمُ اسْتَكْبَرْتُمْ فَفَرِيقًا كَذَّبْتُمْ وَفَرِيقًا تَقْتُلُونَ ٨٧

మరియు వాస్తవంగా మేము మూసాకు గ్రంథాన్ని (తౌరాత్ ను) ప్రసాదించాము మరియు అతని తర్వాత వరుసగా ప్రవక్తలను పంపాము. మరియు మర్యమ్ కుమారుడైన ’ఈసా కు (ఏసుకు) స్పష్టమైన సూచనలను ఇచ్చాము 58 మరియు పరిశుధ్ధాత్మ (రూ’హుల్-ఖుదుస్)తో అతనిని బలపరిచాము. 59 ఏమీ? మీ మనోవాంఛ లకు ప్రతికూలంగా ఉన్నదాన్ని తీసుకొని, ఏ ప్రవక్త అయినా మీ వద్దకు వస్తే, మీరు వారిపట్ల దురహం కారంతో ప్రవర్తించలేదా? వారిలో కొందరిని మీరు అసత్యవాదులన్నారు, మరికొందరిని చంపారు. 60

2:88 – وَقَالُوا قُلُوبُنَا غُلْفٌ ۚ بَل لَّعَنَهُمُ اللَّـهُ بِكُفْرِهِمْ فَقَلِيلًا مَّا يُؤْمِنُونَ ٨٨

  1. మరియు వారు: “మా హృదయాలు మూయ బడి ఉన్నాయి.” అని అంటారు. అలా కాదు (అది నిజం కాదు)! వారి సత్య-తిరస్కారం వలన అల్లాహ్ వారిని శపించాడు (బహిష్కరించాడు). 61 ఎందుకంటే వారు విశ్వసించేది చాలా తక్కువ.

2:89 – وَلَمَّا جَاءَهُمْ كِتَابٌ مِّنْ عِندِ اللَّـهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ وَكَانُوا مِن قَبْلُ يَسْتَفْتِحُونَ عَلَى الَّذِينَ كَفَرُوا فَلَمَّا جَاءَهُم مَّا عَرَفُوا كَفَرُوا بِهِ ۚ فَلَعْنَةُ اللَّـهِ عَلَى الْكَافِرِينَ ٨٩

మరియు ఇప్పుడు వారి వద్ద నున్న దానిని (తౌరాత్ ను) ధృవీకరించే గ్రంథం (ఈ ఖుర్ఆన్) అల్లాహ్ తరఫునుండి వారివద్దకువచ్చింది. మరియు దీనికి ముందు వారు సత్య-తిరస్కారులపై విజయం కొరకుప్రార్థంచేవారు. ఇప్పుడు సత్యమని గుర్తించబడినది (ఈగ్రంథం) వచ్చినా, వారు దానిని తిరస్కరించారు. కాబట్టి, సత్య-తిరస్కారులపై అల్లాహ్ అభిశాపం (బహిష్కారం) అవతరిస్తుంది.

2:90 – بِئْسَمَا اشْتَرَوْا بِهِ أَنفُسَهُمْ أَن يَكْفُرُوا بِمَا أَنزَلَ اللَّـهُ بَغْيًا أَن يُنَزِّلَ اللَّـهُ مِن فَضْلِهِ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۖ فَبَاءُوا بِغَضَبٍ عَلَىٰ غَضَبٍ ۚ وَلِلْكَافِرِينَ عَذَابٌ مُّهِينٌ ٩٠

అల్లాహ్ అవతరింపజేసిన సందేశాన్ని (ఖుర్ఆన్ ను) తిరస్కరించి, వారు ఎంత నీచమైన మూల్యానికి తమను తాము అమ్ముకున్నారు! అది (వారి తిరస్కారం) అల్లాహ్! తన దాసులలో, తాను కోరిన వారిపై, తన అనుగ్రహం (ఖుర్ఆన్/ ప్రవక్తృత్వం) అవతరింపజేశాడనే కక్షవల్లనే! కనుక వారు (అల్లాహ్) క్రోధం మీద మరింత క్రోధానికి గురి అయ్యారు. మరియు ఇలాంటి సత్య-తిరస్కా రులకు అవమానకరమైన శిక్ష ఉంది.

2:91 – وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا بِمَا أَنزَلَ اللَّـهُ قَالُوا نُؤْمِنُ بِمَا أُنزِلَ عَلَيْنَا وَيَكْفُرُونَ بِمَا وَرَاءَهُ وَهُوَ الْحَقُّ مُصَدِّقًا لِّمَا مَعَهُمْ ۗ قُلْ فَلِمَ تَقْتُلُونَ أَنبِيَاءَ اللَّـهِ مِن قَبْلُ إِن كُنتُم مُّؤْمِنِينَ ٩١

మరియు వారి (యూదుల) తో: “అల్లాహ్ అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి.” అని అన్నప్పుడు, వారు: “మా (ఇస్రాయీ‘ల్) వారిపై అవతరింపజేయబడిన దానిని (తౌరాత్ ను) మాత్రమే మేము విశ్వ సిస్తాము.” అని అంటారు. మరియు దాని తరువాత వచ్చినది (ఈ ఖుర్ఆన్) సత్య మైనప్పటికీ మరియు వారి వద్దనున్న దానిని (తౌరాత్ ను) ధృవపరుస్తున్నప్పటికీ, దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. (ఓ ము’హ మ్మద్) వారిని అడుగు: “మీరు (మీ వద్ద నున్న గ్రంథాన్ని) విశ్వసించేవారే అయితే ఇంతకు పూర్వం వచ్చిన అల్లాహ్ ప్రవక్తలను ఎందుకు హత్యచేస్తూ వచ్చారు?” 62

2:92 – وَلَقَدْ جَاءَكُم مُّوسَىٰ بِالْبَيِّنَاتِ ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِن بَعْدِهِ وَأَنتُمْ ظَالِمُونَ ٩٢

  • మరియు వాస్తవానికి మూసా స్పష్టమైన సూచనలను తీసుకొని మీ వద్దకు వచ్చాడు. తరువాత అతను పోగానే, మీరు ఆవుదూడ (విగ్రహాన్ని) ఆరాధ్యదైవంగా చేసుకున్నారు మరియు మీరు ఎంత దుర్మార్గులు!

2:93 – وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ خُذُوا مَا آتَيْنَاكُم بِقُوَّةٍ وَاسْمَعُوا ۖ قَالُوا سَمِعْنَا وَعَصَيْنَا وَأُشْرِبُوا فِي قُلُوبِهِمُ الْعِجْلَ بِكُفْرِهِمْ ۚ قُلْ بِئْسَمَا يَأْمُرُكُم بِهِ إِيمَانُكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ ٩٣

మరియు మేము ’తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీ నుంచి తీసుకున్న ప్రమాణాన్ని (జ్ఞాపకం చేసుకోండి): “మేము మీకు చేస్తున్న వాటిని (ఉపదేశాలను) స్థిరంగా పాటించండి మరియు జాగ్రత్తగా వినండి.” అని చెప్పాము. వారు: “మేము విన్నాము కానీ, అతిక్రమిస్తు న్నాము.” అని అన్నారు, వారి సత్య-తిరస్కారం వలన వారి హృదయాలలో ఆవుదూడ ప్రేమ నిండిపోయింది. వారితో అను: “మీరు విశ్వాసులే అయితే! ఈ చెడు చేష్టలను చేయమని మిమ్మల్ని ఆదేశించే మీ ఈ విశ్వాసం చాలా చెడ్డది”

2:94 – قُلْ إِن كَانَتْ لَكُمُ الدَّارُ الْآخِرَةُ عِندَ اللَّـهِ خَالِصَةً مِّن دُونِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِن كُنتُمْ صَادِقِينَ ٩٤

వారితో ఇలా అను: “ఒకవేళ అల్లాహ్ వద్ద నున్న పరలోక నివాసం మానవులందిరికీ కాక కేవలం, మీకు మాత్రమే ప్రత్యేకించబడి ఉంటే, 63 మీరు మీ ఈ అభిప్రాయంలో సత్యవంతులే అయితే, మీరు మరణాన్ని కోరండి!”

2:95 – وَلَن يَتَمَنَّوْهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ۗ وَاللَّـهُ عَلِيمٌ بِالظَّالِمِينَ ٩٥

కాని వారు ఎన్నటికీ దానిని (మరణాన్ని) కోరరు. ఎందుకంటే, వారు తమ చేతులారా చేసి పంపినవి (తమ కర్మలు) వారికి బాగా తెలుసు. ఈ దుర్మార్గుల విషయం అల్లాహ్ కు బాగా తెలుసు.

2:96 – وَلَتَجِدَنَّهُمْ أَحْرَصَ النَّاسِ عَلَىٰ حَيَاةٍ وَمِنَ الَّذِينَ أَشْرَكُوا ۚ يَوَدُّ أَحَدُهُمْ لَوْ يُعَمَّرُ أَلْفَ سَنَةٍ وَمَا هُوَ بِمُزَحْزِحِهِ مِنَ الْعَذَابِ أَن يُعَمَّرَ ۗ وَاللَّـهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ ٩٦

మరియు నిశ్చయంగా, జీవితం పట్ల సర్వ జనుల కంటే ఎక్కువ వ్యామోహం వారి (యూదుల) లోనే ఉందనే విషయం నీవు గ్రహిస్తావు. ఈ విషయంలో వారు ముష్రికులను కూడా మించి పోయారు. వారిలో ప్రతి ఒక్కడూ వేయి సంవత్స రాలు బ్రతకాలని కోరుతుంటాడు. కానీ దీర్ఘాయు ర్ధాయం, వారిని శిక్షనుండి తప్పించలేదు. మరియు వారు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు. 64

2:97 – قُلْ مَن كَانَ عَدُوًّا لِّجِبْرِيلَ فَإِنَّهُ نَزَّلَهُ عَلَىٰ قَلْبِكَ بِإِذْنِ اللَّـهِ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ وَهُدًى وَبُشْرَىٰ لِلْمُؤْمِنِينَ ٩٧

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: “జిబ్రీల్ పట్ల విరోధమున్న ప్రతివాడూ ఈ యథార్థాన్ని గ్రహించాలి. అల్లాహ్ ఆజ్ఞతోనే అతను ఈ ఖుర్ఆన్ ను నీ హృదయంపై అవతరింపజేశాడు. పూర్వం వచ్చినఅన్నిదివ్యగ్రంథాలను ఇదిధృవీకరిస్తున్నది మరియు విశ్వసించేవారికి ఇది సన్మార్గం చూపు తున్నది మరియు శుభవార్తను ఇస్తున్నది.” 65

2:98 – مَن كَانَ عَدُوًّا لِّلَّـهِ وَمَلَائِكَتِهِ وَرُسُلِهِ وَجِبْرِيلَ وَمِيكَالَ فَإِنَّ اللَّـهَ عَدُوٌّ لِّلْكَافِرِينَ ٩٨

“అల్లాహ్ కు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీల్ కు మరియు మీకాయీల్ కు ఎవరు శత్రువులో, నిశ్చయంగా అలాంటి సత్య- తిరస్కారులకు అల్లాహ్ శత్రువు.” 66

2:99 – وَلَقَدْ أَنزَلْنَا إِلَيْكَ آيَاتٍ بَيِّنَاتٍ ۖ وَمَا يَكْفُرُ بِهَا إِلَّا الْفَاسِقُونَ ٩٩

మరియు వాస్తనంగా, మేము నీపై స్పష్టమైన సూచనలు (ఆయాత్) అవతరింపజేశాము. మరియు అవిధేయులు తప్ప మరెవ్వరూ వాటిని తిరస్కరించరు.

2:100 – أَوَكُلَّمَا عَاهَدُوا عَهْدًا نَّبَذَهُ فَرِيقٌ مِّنْهُم ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يُؤْمِنُونَ ١٠٠

ఏమీ? వారు ఒడంబడికి చేసినపుడల్లా, వారిలో ఒక వర్గం వారు దానిని త్రోసిపుచ్చుటం జరగలేదా? వాస్తవానికి వారిలో చాలామంది విశ్వసించని వారున్నారు.

2:101 – وَلَمَّا جَاءَهُمْ رَسُولٌ مِّنْ عِندِ اللَّـهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ نَبَذَ فَرِيقٌ مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ كِتَابَ اللَّـهِ وَرَاءَ ظُهُورِهِمْ كَأَنَّهُمْ لَا يَعْلَمُونَ ١٠١

మరియు వారిదగ్గర పూర్వంనుంచే ఉన్న దానిని (దివ్యగ్రంథాన్ని) ధృవపరుస్తూ ఒక ప్రవక్త (ము’హమ్మద్) అల్లాహ్ తరఫునుండి వారి వద్దకు వచ్చినప్పుడు, గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు దానిని గురించి ఏమీ తెలియని వారిగా, అల్లాహ్ గ్రంథాన్ని తమ వీపుల వెనుకకు త్రోసివేశారు. 67

2:102 – وَاتَّبَعُوا مَا تَتْلُو الشَّيَاطِينُ عَلَىٰ مُلْكِ سُلَيْمَانَ ۖ وَمَا كَفَرَ سُلَيْمَانُ وَلَـٰكِنَّ الشَّيَاطِينَ كَفَرُوا يُعَلِّمُونَ النَّاسَ السِّحْرَ وَمَا أُنزِلَ عَلَى الْمَلَكَيْنِ بِبَابِلَ هَارُوتَ وَمَارُوتَ ۚ وَمَا يُعَلِّمَانِ مِنْ أَحَدٍ حَتَّىٰ يَقُولَا إِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْ ۖ فَيَتَعَلَّمُونَ مِنْهُمَا مَا يُفَرِّقُونَ بِهِ بَيْنَ الْمَرْءِ وَزَوْجِهِ ۚ وَمَا هُم بِضَارِّينَ بِهِ مِنْ أَحَدٍ إِلَّا بِإِذْنِ اللَّـهِ ۚ وَيَتَعَلَّمُونَ مَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ ۚ وَلَقَدْ عَلِمُوا لَمَنِ اشْتَرَاهُ مَا لَهُ فِي الْآخِرَةِ مِنْ خَلَاقٍ ۚ وَلَبِئْسَ مَا شَرَوْا بِهِ أَنفُسَهُمْ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ ١٠٢

మరియు వారు సులైమాన్ రాజ్య కాలమున, షై’తానులు పఠించే దానిని (జాల విద్యను) అనుసరించారు. సులైమాన్ సత్య- తిరస్కారి కాలేదు; కానీ నిశ్చయంగా, షై’తానులు సత్యాన్ని తిరస్కరించారు. వారు బాబీలోన్ నగర మందు హారూత్, మారూత్ అనేఇద్దరుదేవదూతల ద్వారా తేబడిన జాలవిద్యను ప్రజలకు నేర్పు చుండిరి. ఎవరికైనా ఆ విద్యను నేర్పేటప్పుడు, వారిద్దరు (దేవదూతలు) ఇలా చెప్పే వారు: “నిశ్చయంగా మేము (మానవులకు) ఒక పరీక్ష! కాబట్టి మీరు (ఈ జాలవిద్యను నేర్చుకొని) సత్య- తిరస్కారులు కాకండి.” అయినప్పటికీ వారు (ప్రజలు) భార్యా-భర్తలకు ఎడబాటు కలిగించే (జాలవిద్య) వారిద్దరి దగ్గర నేర్చుకునేవారు. మరియు అల్లాహ్ అనుమతిలేనిదే, దాని ద్యారా ఎవరికీ ఏ మాత్రం హాని కలిగించలేరు. మరియు వారు నేర్చుకునేది, వారికి నష్టం కలిగించేదే కాని లాభం కలిగించేది ఎంత మాత్రం కాదు. మరియు వాస్తవానికి దానిని (జాలవిద్యను) స్వీకరించేవానికి పరలోక సౌఖ్యాలలో ఏ మాత్రమూ భాగం లేదని వారికి బాగా తెలుసు. మరియువారు ఎంత తుచ్ఛ మైన సొమ్ముకు బదులుగా తమను తాము అమ్ము కున్నారు! ఇది వారికి తెలిస్తే ఎంత బాగుండేది!

2:103 – وَلَوْ أَنَّهُمْ آمَنُوا وَاتَّقَوْا لَمَثُوبَةٌ مِّنْ عِندِ اللَّـهِ خَيْرٌ ۖ لَّوْ كَانُوا يَعْلَمُونَ ١٠٣

మరియు వారు విశ్వసించి, దైవభీతి కలిగి ఉండినట్లయితే! నిశ్చయంగా అల్లాహ్ తరఫు నుండి వారికి ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలం లభించి ఉండేది. దీనిని వారు గ్రహిస్తే ఎంత బాగుండేది!

2:104 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقُولُوا رَاعِنَا وَقُولُوا انظُرْنَا وَاسْمَعُوا ۗ وَلِلْكَافِرِينَ عَذَابٌ أَلِيمٌ ١٠٤

ఓ విశ్వాసులారా, (మీరు ప్రవక్తతో మాట్లాడేటప్పుడు) రా’ఇనా! అని అనకండి. ఉన్”జుర్నా! అని (గౌరవంతో) అనండి 68మరియు (అతని మాటలను) శ్రధ్ధతోవినండి. మరియు సత్య-తిరస్కారులకు బాధాకరమైన శిక్ష గలదు.

2:105 – مَّا يَوَدُّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَلَا الْمُشْرِكِينَ أَن يُنَزَّلَ عَلَيْكُم مِّنْ خَيْرٍ مِّن رَّبِّكُمْ ۗ وَاللَّـهُ يَخْتَصُّ بِرَحْمَتِهِ مَن يَشَاءُ ۚ وَاللَّـهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ ١٠٥

సత్య-తిరస్కారులైన గ్రంథప్రజలకు గానీ మరియు బహుదైవారాధకులకు (ముష్రికులకు) గానీ, మీ ప్రభువు నుండి మీకు ఏదైనా మేలు అవతరించడం ఎంత మాత్రం ఇష్టంలేదు. కానీ అల్లాహ్ తాను కోరిన వారినే తన కరుణకు ప్రత్యేకించుకుంటాడు. మరియు అల్లాహ్ అనుగ్ర హించటంలో సర్వోత్తముడు. 69 (3/4)

2:106 – مَا نَنسَخْ مِنْ آيَةٍ أَوْ نُنسِهَا نَأْتِ بِخَيْرٍ مِّنْهَا أَوْ مِثْلِهَا ۗ أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّـهَ عَلَىٰ لِّ شَيْءٍ قَدِيرٌ ١٠٦

  • మేము మా ప్రవచనాలలో (ఆయాతులలో) ఒక దానిని రద్దుచేసినా లేక మర పింపజేసినా దాని స్థానంలో దానికంటే శ్రేష్ఠమైన దానిని లేక కనీసం దానితో సమానమైన దానిని తీసుకువస్తాము. ఏమీ? నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడని నీకు తెలియదా?

2:107 – أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّـهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَمَا لَكُم مِّن دُونِ اللَّـهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ ١٠٧

ఏమీ? వాస్తవానికి, భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్ కే చెందు తుందని, నీకు తెలియదా? మరియు అల్లాహ్ తప్ప మిమ్మల్ని రక్షించేవాడు గానీ 70 సహాయం చేసేవాడు గానీ మరెవ్వడూ లేడు!

2:108 – أَمْ تُرِيدُونَ أَن تَسْأَلُوا رَسُولَكُمْ كَمَا سُئِلَ مُوسَىٰ مِن قَبْلُ ۗ وَمَن يَتَبَدَّلِ الْكُفْرَ بِالْإِيمَانِ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ ١٠٨

ఏమీ? పూర్వం (యూదులచే) మూసా ప్రశ్నించబడినట్లు, మీరు కూడా మీ ప్రవక్త (ము’హమ్మద్)ను ప్రశ్నించగోరుతున్నారా? మరియు ఎవడైతే, సత్య-తిరస్కారాన్ని, విశ్వా సానికి బదులుగా స్వీకరిస్తాడో! నిశ్చయంగా, వాడే సరైన మార్గం నుండి తప్పిపోయిన వాడు.

2:109 – وَدَّ كَثِيرٌ مِّنْ أَهْلِ الْكِتَابِ لَوْ يَرُدُّونَكُم مِّن بَعْدِ إِيمَانِكُمْ كُفَّارًا حَسَدًا مِّنْ عِندِ أَنفُسِهِم مِّن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْحَقُّ ۖ فَاعْفُوا وَاصْفَحُوا حَتَّىٰ يَأْتِيَ اللَّـهُ بِأَمْرِهِ ۗ إِنَّ اللَّـهَ عَلَىٰ لِّ شَيْءٍ قَدِيرٌ ١٠٩

గ్రంథ ప్రజలలోని పలువురు – వారి మనస్సులలో ఉన్న అసూయ వల్ల – సత్యం వారికి సుస్పష్టం అయినప్పటికీ, మీరు విశ్వసించిన తరువాత, మిమ్మల్ని ఏదో ఒక విధంగా, దాని (విశ్వాస మార్గం) నుండి మరల్చి, మళ్ళీ సత్య-తిరస్కారం వైపునకు తీసుకుపోదామని కోరుతుంటారు. అయితే (వారిపట్ల) అల్లాహ్ తన ఆదేశం ఇచ్చేవరకు, మీరు (వారిని) మన్నించండి, ఉపేక్షించండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.

2:110 – وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ۚ وَمَا تُقَدِّمُوا لِأَنفُسِكُم مِّنْ خَيْرٍ تَجِدُوهُ عِندَ اللَّـهِ ۗ إِنَّ اللَّـهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ١١٠

మరియు నమా’జ్ స్థాపించండి 71 విధిదానం (’జకాత్) ఇవ్వండి. మీరు ముందుగా చేసి పంపిన మంచి కార్యాలను మీరు అల్లాహ్ దగ్గర పొందుతారు. నిశ్చయంగా, అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు.

2:111 – وَقَالُوا لَن يَدْخُلَ الْجَنَّةَ إِلَّا مَن كَانَ هُودًا أَوْ نَصَارَىٰ ۗ تِلْكَ أَمَانِيُّهُمْ ۗ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ ١١١

మరియు వారు: “యూదుడు లేదా క్రైస్త వుడుతప్ప, మరెవ్వడూ స్వర్గంలోప్రవేశించ లేడు!” అని అంటారు. ఇవి వారి అభిలాషలు మాత్రమే. వారిని ఇలా అడుగు: “మీరు సత్యవంతులే అయితే దానికి మీ నిదర్శనాలు చూపండి!”

2:112 – بَلَىٰ مَنْ أَسْلَمَ وَجْهَهُ لِلَّـهِ وَهُوَ مُحْسِنٌ فَلَهُ أَجْرُهُ عِندَ رَبِّهِ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ١١٢

వాస్తవానికి ఎవడైతే అల్లాహ్ కు విధైయుడై (ఇస్లాం స్వీకరించి) తన ముఖాన్ని (తనను-తాను) అల్లాహ్ కు అంకితం చేసుకొని, సజ్జనుడై ఉంటాడో! దానికి అతడు తన ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం పొందుతాడు. 72 మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!

2:113 – وَقَالَتِ الْيَهُودُ لَيْسَتِ النَّصَارَىٰ عَلَىٰ شَيْءٍ وَقَالَتِ النَّصَارَىٰ لَيْسَتِ الْيَهُودُ عَلَىٰ شَيْءٍ وَهُمْ يَتْلُونَ الْكِتَابَ ۗ كَذَٰلِكَ قَالَ الَّذِينَ لَا يَعْلَمُونَ مِثْلَ قَوْلِهِمْ ۚ فَاللَّـهُ يَحْكُمُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ ١١٣

మరియు యూదులు: “క్రైస్తవులవద్ద (సత్య-ధర్మమనేది) ఏమీ లేదు.” అని అంటారు. మరియు క్రైస్తవులు: “యూదుల వద్ద (సత్య- ధర్మమనేది) ఏమీ లేదు.” అని అంటారు. మరియు వారందరూ చదివేది దివ్యగ్రంథమే. ఇలాగే (దివ్యగ్రంథ) జ్ఞానంలేని వారు (బహు దైవారాధకులు) కూడా ఇదే విధంగా పలుకు తుంటారు. కావున వీరందరిలో ఉన్న అభిప్రాయ భేదాలను గురించి, అల్లాహ్ పునరుత్థాన దినమున వారి మధ్య తీర్పుచేస్తాడు.

2:114 – وَمَنْ أَظْلَمُ مِمَّن مَّنَعَ مَسَاجِدَ اللَّـهِ أَن يُذْكَرَ فِيهَا اسْمُهُ وَسَعَىٰ فِي خَرَابِهَا ۚ أُولَـٰئِكَ مَا كَانَ لَهُمْ أَن يَدْخُلُوهَا إِلَّ خَائِفِينَ ۚ لَهُمْ فِي الدُّنْيَا خِزْيٌ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ ١١٤

మరియు అల్లాహ్ మస్జిదులలో ఆయన నామ స్మరణం నిషేదించి వాటిని నాశనం చేయ టానికి పాటుపడే వారికంటే ఎక్కువ దుర్మార్గు లెవరు? అలాంటి వారు వాటి (మస్జిదుల)లో ప్రవేశించ టానికి అర్హులుకారు; వారు (ఒకవేళ ప్రవేశించినా) భయపడుతూ ప్రవేశించాలి. వారికి ఇహలోకంలో పరాభవం ఉంటుంది మరియు పరలోకంలో ఘోర శిక్ష ఉంటుంది.

2:115 – وَلِلَّـهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ۚ فَأَيْنَمَا تُوَلُّوا فَثَمَّ وَجْهُ اللَّـهِ ۚ إِنَّ اللَّـهَ وَاسِعٌ عَلِيمٌ ١١٥

మరియు తూర్పు పడమరలు అల్లాహ్ కే చెందినవి. కావున మీరు (మీముఖాలను) ఏ దిక్కు కు త్రిప్పినా మీకు అల్లాహ్ సముఖమే లభిస్తుంది. నిశ్చయంగా, అల్లాహ్, విస్తారుడు, 73సర్వజ్ఞుడు.

2:116 – وَقَالُوا اتَّخَذَ اللَّـهُ وَلَدًا ۗ سُبْحَانَهُ ۖ بَل لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ كُلٌّ لَّهُ قَانِتُونَ ١١٦

మరియు వారు: “అల్లాహ్ ఒక కుమారుణ్ణి కలిగి ఉన్నాడు (కన్నాడు).” అని అంటారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు 74 వాస్తవానికి భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఆయనకు చెందినవే. అవన్నీ ఆయనకు విధేయులై ఉన్నాయి. 75

2:117 – بَدِيعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَإِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ ١١٧

ఆయనే ఆకాశాలనూ మరియు భూమినీ ఏ నమూనా లేకుండా ఆరంభించిన (సృష్టించిన) 76 వాడు. మరియు ఆయన ఏదైనా చేయాలని నిర్ణ యించుకున్నప్పుడు దానికి కేవలం: “అయిపో!” అని ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయి పోతుంది. 77

2:118 – وَقَالَ الَّذِينَ لَا يَعْلَمُونَ لَوْلَ يُكَلِّمُنَا اللَّـهُ أَوْ تَأْتِينَا آيَةٌ ۗ كَذَٰلِكَ قَالَ الَّذِينَ مِن قَبْلِهِم مِّثْلَ قَوْلِهِمْ ۘ تَشَابَهَتْ قُلُوبُهُمْ ۗ قَدْ بَيَّنَّا الْآيَاتِ لِقَوْمٍ يُوقِنُونَ ١١٨

మరియు అజ్ఞానులు: “అల్లాహ్ మాతో ఎందుకు మాట్లాడడు? లేక మా వద్దకు ఏదైనా సూచన (ఆయత్) ఎందుకు రాదు?” అని అడుగుతారు. వారికి పూర్వంవారు కూడా ఇదే విధంగా అడిగేవారు 78 వారందరి మనస్తత్వాలు (హృదయాలు) ఒకేవిధమైనవి. వాస్తవానికి, దృఢనమ్మకం ఉన్నవారికి మేము మా సూచన (ఆయాత్)లను స్పష్టపరుస్తాము.

2:119 – إِنَّا أَرْسَلْنَاكَ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا ۖ وَلَا تُسْأَلُ عَنْ أَصْحَابِ الْجَحِيمِ ١١٩

నిశ్చయంగా, మేము నిన్ను (ఓ ము’హమ్మద్!) సత్యాన్ని ప్రసాదించి, శుభవార్త నిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము. మరియు భగభగ మండే నరకాగ్నికి గురిఅయ్యే వారినిగురించి నీవు ప్రశ్నించబడవు. 79

2:120 – وَلَن تَرْضَىٰ عَنكَ الْيَهُودُ وَلَا النَّصَارَىٰ حَتَّىٰ تَتَّبِعَ مِلَّتَهُمْ ۗ قُلْ إِنَّ هُدَى اللَّـهِ هُوَ الْهُدَىٰ ۗ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُم بَعْدَ الَّذِي جَاءَكَ مِنَ الْعِلْمِ ۙ مَا لَكَ مِنَ اللَّـهِ مِن وَلِيٍّ وَلَ نَصِيرٍ ١٢٠

మరియు యూదులైనా, క్రైస్తవులైనా నీవు వారి మతమును అనుసరించే వరకూ, వారు నీతో ప్రసన్నులు కారు. నీవు: “నిశ్చయంగా, అల్లాహ్ చూపిన మార్గమే సన్మార్గం.” అని చెప్పు. మరియు నీకు జ్ఞానం లభించిన తరువాత కూడా, నీవు వారి కోరికలను అనుసరిస్తే, అల్లాహ్ (శిక్ష) నుండి నిన్ను రక్షించే వాడు గానీ, సహాయపడే వాడు గానీ ఎవ్వడూ ఉండడు.

2:121 – الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَتْلُونَهُ حَقَّ تِلَاوَتِهِ أُولَـٰئِكَ يُؤْمِنُونَ بِهِ ۗ وَمَن يَكْفُرْ بِهِ فَأُولَـٰئِكَ هُمُ الْخَاسِرُونَ ١٢١

మేము దివ్యగ్రంథాన్ని ప్రసాదించిన వారు (యూదులు మరియు క్రైస్తవులు) దానిని (తమ గ్రంథాన్ని) కర్తవ్యంతో పఠించవలసిన విధంగా పఠిస్తే, అలాంటి వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసిస్తారు. మరియు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరించే వారే నష్టపడు వారు. 80

2:122 – يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَنِّي فَضَّلْتُكُمْ عَلَى الْعَالَمِينَ ١٢٢

ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నేను మీకు ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి మరియు నిశ్చయంగా, నేను మిమ్మల్ని (మీ కాలంలోని) సర్వలోకాల వారికంటే ఎక్కువగా ఆదరించాను.

2:123 – وَاتَّقُوا يَوْمًا لَّا تَجْزِي نَفْسٌ عَن نَّفْسٍ شَيْئًا وَلَا يُقْبَلُ مِنْهَا عَدْلٌ وَلَا تَنفَعُهَا شَفَاعَةٌ وَلَا هُمْ يُنصَرُونَ ١٢٣

మరియు ఆ (పునరుత్థాన) దినాన్ని గురించి భయభీతి కలిగి ఉండండి, ఆ నాడు ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తికి ఏమాత్రమూ ఉపయోగ పడలేడు. మరియు ఎవడి నుండీ ఎలాంటి పరిహారం స్వీకరించబడదు. మరియు ఎవడికీ సిఫారసూ లాభదాయకం కాజాలదు మరియు వారి కెలాంటి సహాయమూ లభించదు. (7/8)

2:124 – وَإِذِ ابْتَلَىٰ إِبْرَاهِيمَ رَبُّهُ بِكَلِمَاتٍ فَأَتَمَّهُنَّ ۖ قَالَ إِنِّي جَاعِلُكَ لِلنَّاسِ إِمَامًا ۖ قَالَ وَمِن ذُرِّيَّتِي ۖ قَالَ لَا يَنَالُ عَهْدِي الظَّالِمِينَ ١٢٤

  • మరియు ఇబ్రాహీమ్ ను అతని ప్రభువు (కొన్ని) ఉత్తరువులిచ్చి పరీక్షించిన విషయాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వాటి అన్నింటిలో అతను నెగ్గాడు. అప్పుడు ఆయన (అల్లాహ్): “నిశ్చ యంగా నేను నిన్ను మానవజాతికి నాయకునిగా చేస్తున్నాను.” అనిఅన్నాడు. (దానికి ఇబ్రాహీమ్): “మరి నా సంతతి వారు?” అని అడిగాడు. 81 (దానికి అల్లాహ్): “నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు.” అని జవాబిచ్చాడు. 82

2:125 – وَإِذْ جَعَلْنَا الْبَيْتَ مَثَابَةً لِّلنَّاسِ وَأَمْنًا وَاتَّخِذُوا مِن مَّقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى ۖ وَعَهِدْنَا إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ أَن طَهِّرَا بَيْتِيَ لِلطَّائِفِينَ وَالْعَاكِفِينَ وَالرُّكَّعِ السُّجُودِ ١٢٥

మరియు ఈ (క’అబహ్) గృహాన్ని మేము మానవులకు తరచుగా సందర్శించే కేంద్రం (పుణ్య స్థలం) గా మరియు శాంతి నిలయంగా చేసి; 83 ఇబ్రా హీమ్ నిలబడిన చోటును మీరు నమా’జ్ చేసే స్థలంగా చేసుకోండన్న 84 విషయాన్ని (జ్ఞాపకం చేసుకోండి). మరియు మేము ఇబ్రాహీమ్ మరియు ఇస్మా’యీల్ లకు: “నా ఈ గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కొరకూ, ఏకాంత ధ్యానం (’ఏతికాఫ్) పాటించేవారి కొరకూ, వంగే (రుకూ’ఉ చేసే) వారి కొరకూ మరియు సజ్దాలు చేసేవారి కొరకూ పరిశు ధ్ధంగా ఉంచండి.” అని నిర్దేశించాము.

2:126 – وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَـٰذَا بَلَدًا آمِنًا وَارْزُقْ أَهْلَهُ مِنَ الثَّمَرَاتِ مَنْ آمَنَ مِنْهُم بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ ۖ قَالَ وَمَن كَفَرَ فَأُمَتِّعُهُ قَلِيلًا ثُمَّ أَضْطَرُّهُ إِلَىٰ عَذَابِ النَّارِ ۖ وَبِئْسَ الْمَصِيرُ ١٢٦

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్: “ఓ నా ప్రభూ! ఈ నగరాన్ని (మక్కహ్ ను) శాంతియుతమైన నగరంగా చేసి, ఇందు నివసించే వారిలో, అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారికి అన్నిరకాల ఫలాలను జీవనో పాధిగా నొసంగు.” అని ప్రార్థించినప్పుడు, (అల్లాహ్): “మరియు ఎవడు సత్య-తిరస్కారి అవుతాడో అతనికి నేను ఆనందించటానికి కొంతకాలం విడిచిపెడ్తాను. తరువాత అతనిని నరకాగ్నిలోకి బలవంతంగా త్రోసివేస్తాను. అది ఎంత దుర్భరమైన గమ్యస్థానం!” అని అన్నాడు.

2:127 – وَإِذْ يَرْفَعُ إِبْرَاهِيمُ الْقَوَاعِدَ مِنَ الْبَيْتِ وَإِسْمَاعِيلُ رَبَّنَا تَقَبَّلْ مِنَّا ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ ١٢٧

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్ మరియు ఇస్మా’యీల్ ఈ గృహపు (క’అబహ్) పునాదులను ఎత్తేటపుడు (ఈ విధంగా ప్రార్థించారు): “ఓ మా ప్రభూ! మా ఈసేవను స్వీకరించు. నిశ్చయంగా నీవు మాత్రమే సర్వం వినేవాడవు, 85 సర్వజ్ఞుడవు. 86

2:128 – رَبَّنَا وَاجْعَلْنَا مُسْلِمَيْنِ لَكَ وَمِن ذُرِّيَّتِنَا أُمَّةً مُّسْلِمَةً لَّكَ وَأَرِنَا مَنَاسِكَنَا وَتُبْ عَلَيْنَا ۖ إِنَّكَ أَنتَ التَّوَّابُ الرَّحِيمُ ١٢٨

“ఓ మా ప్రభూ! మమ్మల్ని నీకు విధేయులుగా (ముస్లింలుగా) చేయి మరియు మా సంతతి నుండి ఒక సంఘాన్ని నీకు విధేయులుగా (ముస్లింలుగా) ఉండునట్లు చేయి. మరియు మాకు, మా ఆరాధనా రీతులను (మనాసిక్ లను) తెలుపు మరియు మా పశ్చాత్తాపాన్ని అంగీక రించు. నిశ్చయంగా నీవే పశ్చాత్తాపాన్ని అంగీక రించేవాడవు, అపార కరుణాప్రదాతవు.

2:129 – رَبَّنَا وَابْعَثْ فِيهِمْ رَسُولًا مِّنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِكَ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَيُزَكِّيهِمْ ۚ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ ١٢٩

“ఓ మా ప్రభూ! వీరిలో నుండి నీ సందేశా లను చదివి వినిపించుటకునూ, నీ గ్రంథాన్ని నేర్పు టకునూ, దివ్యజ్ఞానాన్ని బోధించుటకునూ మరియు వారిని పరిశుధ్ధులుగా మార్చుటకునూ ఒకసందేశహరుణ్ణి పంపు 87 నిశ్చయంగా, నీవే సర్వ శక్తిమంతుడవు, 88 మహా వివేకవంతుడవు.”

2:130 – وَمَن يَرْغَبُ عَن مِّلَّةِ إِبْرَاهِيمَ إِلَّا مَن سَفِهَ نَفْسَهُ ۚ وَلَقَدِ اصْطَفَيْنَاهُ فِي الدُّنْيَا ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ ١٣٠

మరియు ఇబ్రాహీమ్ మతం నుండి విముఖుడయ్యే వాడెవడు, తనను తాను అవివేకిగా చేసుకొనువాడు తప్ప? వాస్తవానికి మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) ఈ లోకంలో ఎన్నుకున్నాము. మరియు నిశ్చయంగా అతను పరలోకంలో సద్వర్తనులతో పాటు ఉంటాడు.

2:131 – إِذْ قَالَ لَهُ رَبُّهُ أَسْلِمْ ۖ قَالَ أَسْلَمْتُ لِرَبِّ الْعَالَمِينَ ١٣١

అతని ప్రభువు అతనితో: “(మాకు) విధేయుడవుగా (ముస్లింగా) ఉండు.” అని అన్నప్పుడు అతను: “నేను సర్వలోకాల ప్రభువునకు విధేయుడను (ముస్లింను) అయి పోయాను.” అని జవాబిచ్చాడు.

2:132 – وَوَصَّىٰ بِهَا إِبْرَاهِيمُ بَنِيهِ وَيَعْقُوبُ يَا بَنِيَّ إِنَّ اللَّـهَ اصْطَفَىٰ لَكُمُ الدِّينَ فَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ ١٣٢

మరియు ఇబ్రాహీమ్ తన సంతానాన్ని దీనిలోనే (ఈ ఇస్లాం మార్గంలోనే) నడవండని బోధించాడు. మరియు య’అఖూబ్ కూడా తన (సంతానంతో అన్నాడు): “నా బిడ్డలారా! నిశ్చ యంగా అల్లాహ్ మీ కొరకు ఈ ధర్మాన్నే నియ మించి ఉన్నాడు. కావున మీరు అల్లాహ్ కు విధే యులు (ముస్లింలు) కాకుండా మరణించకండి!” 89

2:133 – أَمْ كُنتُمْ شُهَدَاءَ إِذْ حَضَرَ يَعْقُوبَ الْمَوْتُ إِذْ قَالَ لِبَنِيهِ مَا تَعْبُدُونَ مِن بَعْدِي قَالُوا نَعْبُدُ إِلَـٰهَكَ وَإِلَـٰهَ آبَائِكَ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ إِلَـٰهًا وَاحِدًا وَنَحْنُ لَهُ مُسْلِمُونَ ١٣٣

ఏమీ? య’అఖూబ్ కు మరణం సమీపించి నప్పుడు, మీరు అక్కడ ఉన్నారా? 90 అప్పుడ తను తన కుమారులతో: “నా తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు?” అని అడిగినప్పుడు. వార న్నారు: “నీ ఆరాధ్య దైవం మరియు నీ పూర్వికు లగు ఇబ్రాహీమ్, ఇస్మా’యీల్ మరియు ఇస్’హాఖ్ ల ఆరాధ్య దైవమైన ఆ ఏకైక 91 దేవుణ్ణి (అల్లాహ్ నే), మేము ఆరాధిస్తాము మరియు మేము ఆయ నకే విధేయులమై (ముస్లింలమై) ఉంటాము.”

2:134 – تِلْكَ أُمَّةٌ قَدْ خَلَتْ ۖ لَهَا مَا كَسَبَتْ وَلَكُم مَّا كَسَبْتُمْ ۖ وَلَا تُسْأَلُونَ عَمَّا كَانُوا يَعْمَلُونَ ١٣٤

అది ఒక గతించిన సమాజం. దాని కర్మల ఫలితం దానికి మరియు మీ కర్మలది మీకు. మరియు వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి మీరు ప్రశ్మించబడరు.

2:135 – وَقَالُوا كُونُوا هُودًا أَوْ نَصَارَىٰ تَهْتَدُوا ۗ قُلْ بَلْ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۖ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ ١٣٥

మరియు వారంటారు: “మీరు యూదు లుగా లేదా క్రైస్తవులుగా ఉంటేనే మీకు మార్గ దర్శకత్వం లభిస్తుంది!” వారితో అను: “వాస్తవానికి, మేము (అనుసరించేది) ఇబ్రాహీమ్ మతం, ఏకైకదైవ సిధ్ధాంతం (’హనీఫా). మరియు అతను బహుదైవారాధకుడు కాడు.” 92

2:136 – قُولُوا آمَنَّا بِاللَّـهِ وَمَا أُنزِلَ إِلَيْنَا وَمَا أُنزِلَ إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَمَا أُوتِيَ النَّبِيُّونَ مِن رَّبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّنْهُمْ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ ١٣٦

(ఓ ముస్లింలారా!) మీరు ఇలా అనండి: “మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన సందేశాలను మరియు ఇబ్రాహీమ్ ఇస్మా’యీల్, ఇస్’హాఖ్, య’అఖూబ్ మరియు అతని సంతతి వారికి ఇవ్వబడిన వాటినీ మరియు మూసా, ’ఈసా మరియు ఇతర ప్రవక్త లందరికీ వారి ప్రభువు తరఫు నుండి ఇవ్వబడిన వాటినీ (సందేశాలను) విశ్వసిస్తాము. వారిలో ఏ ఒక్కరి పట్లా మేము భేదభావం చూపము. మేము ఆయనకు విధేయులం (ముస్లింలం) అయ్యాము.”

2:137 – فَإِنْ آمَنُوا بِمِثْلِ مَا آمَنتُم بِهِ فَقَدِ اهْتَدَوا ۖ وَّإِن تَوَلَّوْا فَإِنَّمَا هُمْ فِي شِقَاقٍ ۖ فَسَيَكْفِيكَهُمُ اللَّـهُ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ ١٣٧

వారు కూడా మీరు విశ్వసించినట్లు విశ్వ సిస్తే, వారు సన్మార్గం పొందిన వారవుతారు. ఒకవేళ వారు తిరిగిపోతే, విరోధం వహించిన వారవుతారు. (వారి నుండి రక్షించటానికి) మీకు అల్లాహ్ చాలు. ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

2:138 – صِبْغَةَ اللَّـهِ ۖ وَمَنْ أَحْسَنُ مِنَ اللَّـهِ صِبْغَةً ۖ وَنَحْنُ لَهُ عَابِدُونَ ١٣٨

(వారితో ఇలా అను): “(మీరు) అల్లాహ్ రంగును (ధర్మాన్ని) స్వీకరించండి. మరియు అల్లాహ్ కంటే మంచి రంగు (ధర్మం) ఎవరిది? మరియు మేము ఆయనను మాత్రమే ఆరాధించే వారము.” 93

2:139 – قُلْ أَتُحَاجُّونَنَا فِي اللَّـهِ وَهُوَ رَبُّنَا وَرَبُّكُمْ وَلَنَا أَعْمَالُنَا وَلَكُمْ أَعْمَالُكُمْ وَنَحْنُ لَهُ مُخْلِصُونَ ١٣٩

(ఓ ము’హమ్మద్!) వారితో అను: “ఏమీ? అల్లాహ్ విషయంలో మీరు మాతో వాదిస్తారా? (వాస్తవానికి) ఆయన మా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. మా కర్మలు మాకు మరియు మీ కర్మలు మీకు. మరియు మేము ఆయనకు మాత్రమే మనఃపూర్వకంగా విధేయులమయ్యాము.”

2:140 – أَمْ تَقُولُونَ إِنَّ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطَ كَانُوا هُودًا أَوْ نَصَارَىٰ ۗ قُلْ أَأَنتُمْ أَعْلَمُ أَمِ اللَّـهُ ۗ وَمَنْ أَظْلَمُ مِمَّن كَتَمَ شَهَادَةً عِندَهُ مِنَ اللَّـهِ ۗ وَمَا اللَّـهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ ١٤٠

లేక మీరు: “నిశ్చయంగా ఇబ్రాహీమ్, ఇస్మా’యీల్, ఇస్’హాఖ్, య’అఖూబ్ మరియు వారి సంతతి వారంతా యూదులు మరియు క్రైస్తవులు.” అని అంటారా? ఇంకా ఇలా అను: “ఏమీ మీకు బాగా తెలుసా? లేక అల్లాహ్ కు (బాగా తెలుసా)? అల్లాహ్ వద్ద నుండి తన వద్దకు వచ్చిన సాక్ష్యాన్ని దాచే వాని కంటే ఎక్కువ దుర్మార్గుడెవడు? మరియు మీ కర్మల నుండి, అల్లాహ్ నిర్లక్ష్యంగా లేడు!”

2:141 – تِلْكَ أُمَّةٌ قَدْ خَلَتْ ۖ لَهَا مَا كَسَبَتْ وَلَكُم مَّا كَسَبْتُمْ ۖ وَلَا تُسْأَلُونَ عَمَّا كَانُوا يَعْمَلُونَ ١٤١

“ఇప్పుడు ఆ సంఘం గతించి పోయింది. అది చేసింది దానికి మరియు మీరు చేసింది మీకు. వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి మీరు ప్రశ్నించబడరు.” 94

2:142 – سَيَقُولُ السُّفَهَاءُ مِنَ النَّاسِ مَا وَلَّاهُمْ عَن قِبْلَتِهِمُ الَّتِي كَانُوا عَلَيْهَا قُل لِّلَّـهِ وَالْمَغْرِبُ يَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ١٤٢

[(*)] ప్రజలలోని కొందరు మూఢజనులు ఇలా అంటారు: ”వీరిని (ముస్లింలను) ఇంత వరకు వీరు అనుసరిస్తూవచ్చిన, ఖిబ్లానుండి త్రిప్పింది ఏమిటీ?” 95 వారితో ఇలా అను: ”తూర్పు మరియు పడమరలు అల్లాహ్‌కే చెందినవి. ఆయన తాను కోరిన వారికి బుజుమార్గం వైపునకు మార్గ దర్శకత్వం చేస్తాడు.”

2:143 – وَكَذَٰلِكَ جَعَلْنَاكُمْ أُمَّةً وَسَطًا لِّتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ وَيَكُونَ الرَّسُولُ عَلَيْكُمْ شَهِيدًا وَمَا جَعَلْنَا الْقِبْلَةَ الَّتِي كُنتَ عَلَيْهَا إِلَّا لِنَعْلَمَ مَن يَتَّبِعُ الرَّسُولَ مِمَّن يَنقَلِبُ عَلَىٰ عَقِبَيْهِ وَإِن كَانَتْ لَكَبِيرَةً إِلَّا عَلَى الَّذِينَ هَدَى اللَّـهُ وَمَا كَانَ اللَّـهُ لِيُضِيعَ إِيمَانَكُمْ إِنَّ اللَّـهَ بِالنَّاسِ لَرَءُوفٌ رَّحِيمٌ ١٤٣

మరియు మీరు ప్రజలకు సాక్షులుగా ఉండ టానికి మరియు సందేశహరుడు (ము’హమ్మద్‌) మీకు సాక్షిగా ఉండటానికి 96 మేము మిమ్మల్ని ఒక మధ్యస్థ (ఉత్తమ మరియు న్యాయశీలమైన) సమాజంగా చేశాము. మరియు ఎవరు సందేశ హరుణ్ణి అనుసరిస్తారో మరియు ఎవరు తమ మడ మల మీద వెనుదిరిగిపోతారో అనేది పరిశీలించ డానికి, నీవు పూర్వం అనుసరించే ఖిబ్లా (బైతుల్‌ – మఖ్దిస్‌)ను, ఖిబ్లాగా చేసి ఉన్నాము. మరియు ఇది వాస్తవానికి అల్లాహ్‌ మార్గదర్శకత్వం చూపిన వారికి తప్ప, ఇతరులకు భారమైనది. మరియు అల్లాహ్‌ మీ విశ్వాసాన్ని (బైతుల్‌-మఖ్దిస్‌ వైపునకు చేసిన నమా’జులను) ఎన్నడూ వృథాచేయడు 97 నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రజల పట్ల కనికరుడు, అపార కరుణాప్రదాత.

2:144 – قَدْ نَرَىٰ تَقَلُّبَ وَجْهِكَ فِي السَّمَاءِ فَلَنُوَلِّيَنَّكَ قِبْلَةً تَرْضَاهَا فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ وَحَيْثُ مَا كُنتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ وَإِنَّ الَّذِينَ أُوتُوا الْكِتَابَ لَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِن رَّبِّهِمْ وَمَا اللَّـهُ بِغَافِلٍ عَمَّا يَعْمَلُونَ ١٤٤

(ఓ ప్రవక్తా!) వాస్తవానికి మేము, నీవు పలుమార్లు నీ ముఖాన్ని ఆకాశం వైపునకు ఎత్తడం చూశాము. కావున మేము నిన్ను నీవు కోరిన ఖిబ్లా వైపునకు త్రిప్పుతున్నాము. కావున, నీవు మస్జిద్‌ అల్‌ -‘హరామ్‌ వైపునకు నీ ముఖాన్ని త్రిప్పుకో! ఇకపై మీరంతా ఎక్కడున్నా సరే (నమా’జ్‌ చేసేటప్పుడు), మీ ముఖాలను ఆవైపునకే త్రిప్పుకోండి. మరియు నిశ్చయంగా, గ్రంథం గలవారికి ఇది తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమని బాగా తెలుసు 98 మరియు అల్లాహ్‌ వారి కర్మల గురించి నిర్లక్ష్యంగా లేడు.

2:145 – وَلَئِنْ أَتَيْتَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ بِكُلِّ آيَةٍ مَّا تَبِعُوا قِبْلَتَكَ وَمَا أَنتَ بِتَابِعٍ قِبْلَتَهُمْ وَمَا بَعْضُهُم بِتَابِعٍ قِبْلَةَ بَعْضٍ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُم مِّن بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ إِنَّكَ إِذًا لَّمِنَ الظَّالِمِينَ ١٤٥

మరియు నీవు గ్రంథ ప్రజలకు ఎన్ని సూచనలు (ఆయాత్‌) చూపినా, వారు నీ ఖిబ్లాను అనుసరించరు. మరియు నీవు కూడా వారి ఖిబ్లాను అనుసరించలేవు. మరియు వారిలో ఒక వర్గం వారు, మరొక వర్గం వారి ఖిబ్లాను అనుసరించరు 99 మరియు నీవు ఈ జ్ఞానం పొందిన తరువాత కూడా వారి మనోవాంఛలను అనుసరిస్తే! నిశ్చయంగా, నీవు దుర్మార్గులలో చేరిన వాడవవుతావు.

2:146 – الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْرِفُونَهُ كَمَا يَعْرِفُونَ أَبْنَاءَهُمْ ۖ وَإِنَّ فَرِيقًا مِّنْهُمْ لَيَكْتُمُونَ الْحَقَّ وَهُمْ يَعْلَمُونَ ١٤٦

మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు తమ కుమారులను ఏవిధంగా గుర్తిస్తారో ఇతనిని (ము’హమ్మద్‌ను) కూడా ఆవిధంగా గుర్తిస్తారు. మరియు వాస్తవానికి వారిలోని ఒక వర్గంవారు తెలిసి కూడా సత్యాన్ని దాస్తున్నారు. 100

2:147 – الْحَقُّ مِن رَّبِّكَ ۖ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ ١٤٧

(నిస్సందేహంగా!) ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కావున నీవు సందేహించే వారిలో ఏ మాత్రం చేరకు!

2:148 – وَلِكُلٍّ وِجْهَةٌ هُوَ مُوَلِّيهَا ۖ فَاسْتَبِقُوا الْخَيْرَاتِ ۚ أَيْنَ مَا تَكُونُوا يَأْتِ بِكُمُ اللَّـهُ جَمِيعًا ۚ إِنَّ اللَّـهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١٤٨

మరియు ప్రతి ఒక (సంఘం) ఒక దిశ వైపునకు ముఖం త్రిప్పుతుంది. 101 కావున మీరు మంచిపనులు చేయటానికి త్వరపడండి. మీరెక్కడున్నా సరే, అల్లాహ్‌ మీ అందరినీ (తీర్పుదినంనాడు తన సన్నిధిలోకి) రప్పిస్తాడు. నిశ్చయంగా! అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.

2:149 – وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۖ وَإِنَّهُ لَلْحَقُّ مِن رَّبِّكَ ۗ وَمَا اللَّـهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ ١٤٩

మరియు నీవు ఎక్కడికి బయలుదేరినా సరే! నీ ముఖాన్ని (నమా’జ్‌లో) మస్జిద్‌ అల్‌- ‘హరామ్‌ వైపునకే త్రిప్పుకో. మరియు నిశ్చయంగా, ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. మరియు అల్లాహ్‌ మీ కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు.

2:150 – وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۚ وَحَيْثُ مَا كُنتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَيْكُمْ حُجَّةٌ إِلَّا الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِي وَلِأُتِمَّ نِعْمَتِي عَلَيْكُمْ وَلَعَلَّكُمْ تَهْتَدُونَ ١٥٠

మరియు నీవు ఎక్కడికి బయలుదేరినా సరే! నీ ముఖాన్ని (నమా’జ్‌లో) మస్జిద్‌ అల్‌- ‘హరామ్‌ వైపునకే త్రిప్పుకో. మరియు మీరెక్క డున్నా సరే, మీ ముఖాలను దాని వైపునకే త్రిప్పు కోండి. దీని వల్ల మీకు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజలకు అవకాశం దొరుకదు. కాని వారిలో దుర్మార్గులైనవారు (ఎలాంటి పరిస్థితులలోనూ ఊరుకోరు) అందుకని వారికి భయపడకండి, నాకే భయపడండి! మరియు ఈ విధంగా నేను మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేయటానికి. మరియు బహుశా, ఈ విధంగానైనా మీరు మార్గదర్శకత్వం పొందవచ్చు!

2:151 – كَمَا أَرْسَلْنَا فِيكُمْ رَسُولًا مِّنكُمْ يَتْلُو يَتْلُو عَلَيْكُمْ آيَاتِنَا وَيُزَكِّيكُمْ وَيُعَلِّمُكُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَيُعَلِّمُكُم مَّا لَمْ تَكُونُوا تَعْلَمُونَ ١٥١

ఈ విధంగా మేము మీ వారిలో నుండియే – మా సూచనలను మీ ఎదుట వినిపించటానికి మరియు మిమ్మల్ని సంస్కరించటానికి మరియు మీకు గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధించటానికి మరియు మీకు తెలియని విషయాలు నేర్పటానికి – ఒక ప్రవక్త (ము’హమ్మద్‌) ను మీ వద్దకు పంపాము.

2:152 – فَاذْكُرُونِي أَذْكُرْكُمْ وَاشْكُرُوا لِ وَلَا تَكْفُرُونِ ١٥٢

కావున మీరు నన్నే స్మరించండి, నేను కూడా మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. మరియు నాకు కృతజ్ఞులై ఉండండి మరియు నాకు కృతఘ్నులు కాకండి. 102

2:153 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ إِنَّ اللَّـهَ مَعَ الصَّابِرِينَ ١٥٣

ఓ విశ్వాసులారా! సహనం మరియు నమా’జ్‌ ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయంగా అల్లాహ్‌ సహనం గలవారితో ఉంటాడు. 103

2:154 – وَلَا تَقُولُوا لِمَن يُقْتَلُ فِي سَبِيلِ اللَّـهِ أَمْوَاتٌ ۚ بَلْ أَحْيَاءٌ وَلَـٰكِن لَّا تَشْعُرُونَ ١٥٤

మరియు అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని ‘మృతులు,’ అనకండి! 104 వాస్తవానికి వారు సజీవులు. కాని మీరది గ్రహించజాలరు.

2:155 – وَلَنَبْلُوَنَّكُم بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ ۗ وَبَشِّرِ الصَّابِرِينَ ١٥٥

మరియు నిశ్చయంగా మేము, మిమ్మల్ని భయ-ప్రమాదాలకు, ఆకలి బాధలకు, ధన, ప్రాణ, ఫల (ఆదాయాల) నష్టానికీ గురిచేసి పరీక్షిస్తాము. మరియు (ఇలాంటి పరిస్థితులలో) మనఃస్థైర్యంతో ఉండేవారికి శుభవార్తనివ్వు.

2:156 – الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّـهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ ١٥٦

ఎవరైతే విపత్కరమైన పరిస్థితి ఏర్పడి నప్పుడు: ”నిశ్చయంగా, మేము అల్లాహ్‌కే చెందిన వారము! మరియు మేము ఆయన వైపునకే మరలి పోతాము!” అని అంటారో!

2:157 – أُولَـٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَـٰئِكَ هُمُ الْمُهْتَدُونَ ١٥٧

అలాంటి వారికి వారి ప్రభువు నుండి అను గ్రహాలు 105 మరియు కరుణ ఉంటాయి. మరియు వారే సన్మార్గం పొందినవారు. 106 (1/8)

2:158 – إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِن شَعَائِرِ اللَّـهِ فَمَنْ حَجَّ الْبَيْتَ أَوِ اعْتَمَرَ فَلَا جُنَاحَ عَلَيْهِ أَن يَطَّوَّفَ بِهِمَا ۚ وَمَن تَطَوَّعَ خَيْرًا فَإِنَّ اللَّـهَ شَاكِرٌ عَلِيمٌ ١٥٨

  • నిశ్చయంగా, ‘సఫా మరియు మర్వాలు అల్లాహ్‌ చూపిన చిహ్నాలు. 107 కావున ఎవడు (క’అబహ్) గృహానికి ‘హజ్జ్‌ లేక ‘ఉమ్రా కొరకు పోతాడో, 108 అతడు ఈ రెంటి మధ్య పచార్లు (స’యీ) చేస్తే, అతనికి ఎట్టి దోషం లేదు. మరియు ఎవడైనా స్వేచ్ఛాపూర్వకంగా మంచి కార్యం చేస్తే! నిశ్చయంగా, అల్లాహ్‌ కృతజ్ఞతలను ఆమోదించే వాడు, 109 సర్వజ్ఞుడు.

2:159 – إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلْنَا مِنَ الْبَيِّنَاتِ وَالْهُدَىٰ مِن بَعْدِ مَا بَيَّنَّاهُ لِلنَّاسِ فِي الْكِتَابِ ۙ أُولَـٰئِكَ يَلْعَنُهُمُ اللَّـهُ وَيَلْعَنُهُمُ اللَّاعِنُونَ ١٥٩

నిశ్చయంగా, ఎవరైతే మేము అవతరింప జేసిన స్పష్టమైన బోధనలను, మార్గదర్శకత్వా లను – ప్రజల కొరకు దివ్యగ్రంథంలో స్పష్టపరచిన పిదప కూడా – దాచుతారో! వారిని అల్లాహ్‌ తప్పక శపిస్తాడు (బహిష్కరిస్తాడు). మరియు శపించగలవారు కూడా వారిని శపిస్తారు. 110

2:160 – إِلَّا الَّذِينَ تَابُوا وَأَصْلَحُوا وَبَيَّنُوا فَأُولَـٰئِكَ أَتُوبُ عَلَيْهِمْ ۚ وَأَنَا التَّوَّابُ الرَّحِيمُ ١٦٠

కాని ఎవరైతే పశ్చాత్తాపపడతారో మరియు తమ నడవడికను సంస్కరించుకుంటారో మరియు సత్యాన్ని వెల్లడిస్తారో, అలాంటి వారి పశ్చాత్తాపాన్ని నేను అంగీకరిస్తాను. మరియు నేను మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడను, 111 అపార కరుణాప్రదాతను.

2:161 – إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارٌ أُولَـٰئِكَ عَلَيْهِمْ لَعْنَةُ اللَّـهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ ١٦١

నిశ్చయంగా, ఎవరైతే సత్యతిరస్కారులై, ఆ తిరస్కారంలోనే మృతిచెందుతారో, అలాంటి వారిపై అల్లాహ్‌ యొక్క శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు దేవదూతల మరియు సర్వ మానవుల యొక్క శాపముంటుంది.

2:162 – خَالِدِينَ فِيهَا ۖ لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ ١٦٢

అందులో (ఆ శాపగ్రస్త స్థితిలోనే నరకంలో) వారు శాశ్వతంగా ఉంటారు. వారి శిక్షను తగ్గించటం కానీ మరియు వారికి మళ్ళీ వ్యవధి ఇవ్వటం కానీ జరుగదు.

2:163 – وَإِلَـٰهُكُمْ إِلَـٰهٌ وَاحِدٌ ۖ لَّا إِلَـٰهَ إِلَّا هُوَ الرَّحْمَـٰنُ الرَّحِيمُ ١٦٣

మరియు మీ ఆరాధ్యదైవం కేవలం ఆ అద్వితీయుడు 112 (అల్లాహ్‌) మాత్రమే. ఆయన తప్ప! మరొక ఆరాధ్యదేవుడు లేడు, అనంత కరుణా మయుడు, అపార కరుణాప్రదాత.

2:164 – إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَالْفُلْكِ الَّتِي تَجْرِي فِي الْبَحْرِ بِمَا يَنفَعُ النَّاسَ وَمَا أَنزَلَ اللَّـهُ مِنَ السَّمَاءِ مِن مَّاءٍ فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَبَثَّ فِيهَا مِن كُلِّ دَابَّةٍ وَتَصْرِيفِ الرِّيَاحِ وَالسَّحَابِ الْمُسَخَّرِ بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ ١٦٤

నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టిలోనూ, రేయింబవళ్ళ మార్పులోనూ, ప్రజలకు ఉపయోగ కరమైన వాటిని తీసుకొని, సముద్రంలో పయనించే ఓడలలోనూ మరియు అల్లాహ్‌ ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి దాని ద్వారా నిర్జీవమైన భూమికి ప్రాణం పోసి, అందులో వివిధరకాల జీవరాసులను వర్థిల్లజేయటంలోనూ; మరియు వాయువులు మరియు మేఘాలు, భూమ్యాకాశాల మధ్య నియమబద్ధంగా చేసే సంచారాల మార్పుల లోనూ, బుధ్ధిమంతులకు ఎన్నో సంకేతాలు ఉన్నాయి. 113

2:165 – وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّـهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّـهِ ۖ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّـهِ ۗ وَلَوْ يَرَى الَّذِينَ ظَلَمُوا إِذْ يَرَوْنَ الْعَذَابَ أَنَّ الْقُوَّةَ لِلَّـهِ جَمِيعًا وَأَنَّ اللَّـهَ شَدِيدُ الْعَذَابِ ١٦٥

అయినా ఈ మానవులలో కొందరు ఇతరు లను, అల్లాహ్‌కు సాటిగా కల్పించుకుని, అల్లాహ్‌ ను ప్రేమించ వలసిన విధంగా వారిని ప్రేమిస్తారు. కాని విశ్వాసులు అందరికంటే అత్యధికంగా అల్లాహ్‌నే ప్రేమిస్తారు. మరియు ఈ దుర్మార్గం చేస్తున్నవారు ప్రత్యక్షంగా చూడగలిగితే! ఆ శిక్షను చూసి నప్పుడు, వారు నిశ్చయంగా, సర్వశక్తి కేవలం అల్లాహ్‌కే చెందుతుంది. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ చాలా కఠినంగా శిక్షించేవాడు, (అని తెలుసుకునేవారు). 114

2:166 – إِذْ تَبَرَّأَ الَّذِينَ اتُّبِعُوا مِنَ الَّذِينَ اتَّبَعُوا وَرَأَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْأَسْبَابُ ١٦٦

అప్పుడు (ఆ రోజు) వారు (ఆ సాటిగా కల్పించబడినవారు) తమను అనుసరించిన వారితో తమకు ఎలాంటి సంబంధం లేదంటారు. మరియు వారంతా తమ శిక్షను చూసుకుంటారు. మరియు వారి మధ్య ఉన్న సంబంధాలన్నీ తెగిపోతాయి.

2:167 – وَقَالَ الَّذِينَ اتَّبَعُوا لَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّأَ مِنْهُمْ كَمَا تَبَرَّءُوا مِنَّا ۗ كَذَٰلِكَ يُرِيهِمُ اللَّـهُ أَعْمَالَهُمْ حَسَرَاتٍ عَلَيْهِمْ ۖ وَمَا هُم بِخَارِجِينَ مِنَ النَّارِ ١٦٧

మరియు ఆ అనుసరించిన వారు అంటారు: ”మాకు ప్రపంచ జీవితంలోకి మళ్ళీ తిరిగిపోయే అవకాశం లభిస్తే – వీరు ఈ రోజు మమ్మల్ని త్యజించినట్లు – మేము కూడా వీరిని త్యజిస్తాము!” ఈ విధంగా (ప్రపంచంలో) వారు చేసిన కర్మలను అల్లాహ్‌ వారికి చూపించినప్పుడు, అది వారికి ఎంతో బాధాకరంగా ఉంటుంది. కాని వారు నరకాగ్ని నుండి ఏ విధంగానూ బయట పడలేరు.

2:168 – يَا أَيُّهَا النَّاسُ كُلُوا مِمَّا فِي الْأَرْضِ حَلَالًا طَيِّبًا وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ ١٦٨

ఓ ప్రజలారా! భూమిలోనున్న ధర్మ సమ్మ తమైన పరిశుద్ధమైన వాటినే తినండి. మరియు షై’తాన్‌ అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా అతడు మీకు బహిరంగ శత్రువు.

2:169 – إِنَّمَا يَأْمُرُكُم بِالسُّوءِ وَالْفَحْشَاءِ وَأَن تَقُولُوا عَلَى اللَّـهِ مَا لَا تَعْلَمُونَ ١٦٩

నిశ్చయంగా, అతడు (షై’తాన్‌)మిమ్మల్ని దుష్కార్యాలు మరియు అశ్లీలమైన పనులు చేయటానికి మరియు అల్లాహ్‌ను గురించి మీకు తెలియని మాటలు పలుకటానికి ప్రేరేపిస్తుంటాడు.

2:170 – وَإِذَا قِيلَ لَهُمُ اتَّبِعُوا مَا أَنزَلَ اللَّـهُ قَالُوا بَلْ نَتَّبِعُ مَا أَلْفَيْنَا عَلَيْهِ آبَاءَنَا ۗ أَوَلَوْ كَانَ آبَاؤُهُمْ لَا يَعْقِلُونَ شَيْئًا وَلَا يَهْتَدُونَ ١٧٠

మరియు వారితో: ”అల్లాహ్‌ అవతరింప జేసిన వాటిని (ఆదేశాలను) అనుసరించండి!” అని అన్నప్పుడు. వారు: ”అలా కాదు, మేము మా తండ్రి-తాతలు అవలంబిస్తూవచ్చిన పధ్ధతినే అనుసరిస్తాము.” అని సమాధానమిస్తారు. ఏమీ? వారి తండ్రి-తాతలు ఎలాంటి జ్ఞానంలేనివారై నప్పటికినీ మరియు సన్మార్గం పొందనివారు అయి నప్పటికినీ (వీరు, వారినే అనుసరిస్తారా)?

2:171 – وَمَثَلُ الَّذِينَ كَفَرُوا كَمَثَلِ الَّذِي يَنْعِقُ بِمَا لَا يَسْمَعُ إِلَّا دُعَاءً وَنِدَاءً ۚ صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لَ يَعْقِلُونَ ١٧١

మరియు సత్య-తిరస్కారుల ఉపమానం, వాటి (ఆ పశువుల) వలే ఉంది; అవి అతని (కాపరి) అరుపులు వింటాయే (కానీ ఏమీ అర్థంచేసుకో లేవు), అరుపులు మరియు కేకలు వినడం తప్ప. వారు చెవిటివారు, మూగవారు మరియు గ్రుడ్డివారు, కాబట్టి వారు ఏమీ అర్థం చేసుకోలేరు! 115

2:172 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ وَاشْكُرُوا لِلَّـهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ ١٧٢

ఓ విశ్వాసులారా! మీరు నిజంగానే కేవలం ఆయన (అల్లాహ్‌)నే ఆరాధించేవారు అయితే; మేము మీకు జీవనోపాధిగా ఇచ్చిన పరిశుధ్ధ (ధర్మసమ్మత)మైన వస్తువులనే తినండి మరియు అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపండి. 116

2:173 – إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنزِيرِ وَمَا أُهِلَّ بِهِ لِغَيْرِ اللَّـهِ ۖ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٧٣

నిశ్చయంగా, ఆయన మీ కొరకు చచ్చిన జంతువు, రక్తం, పందిమాంసం మరియు అల్లాహ్‌ తప్ప ఇతరుల కొరకు జి’బ్‌’హ్‌ చేయబడిన దానిని (తినటాన్ని) నిషేధించి ఉన్నాడు. 117 కాని ఎవరైనా గత్యంతరం లేక, దుర్నీతితో కాకుండా, హద్దు మీరకుండా (తిన్నట్లైతే) అట్టివానిపై ఎలాంటి దోషంలేదు! 118 నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, 119 అపార కరుణాప్రదాత.

2:174 – إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلَ اللَّـهُ مِنَ الْكِتَابِ وَيَشْتَرُونَ بِهِ ثَمَنًا قَلِيلًا ۙ أُولَـٰئِكَ مَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ إِلَّا النَّارَ وَلَا يُكَلِّمُهُمُ اللَّـهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ١٧٤

నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్‌ గ్రంథంలో అవతరింపజేసిన సందేశాలను దాచి, దానికి బదు లుగా అల్పలాభం పొందుతారో అలాంటి వారు తమ కడుపులను కేవలం అగ్నితో నింపుకుంటు న్నారు మరియు అల్లాహ్‌ పునరుత్థాన దినమున వారితో మాట్లాడడు మరియు వారిని శుధ్ధపరచడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

2:175 – أُولَـٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الضَّلَالَةَ بِالْهُدَىٰ وَالْعَذَابَ بِالْمَغْفِرَةِ ۚ فَمَا أَصْبَرَهُمْ عَلَى النَّارِ ١٧٥

ఇలాంటి వారే సన్మార్గానికి బదులుగా దుర్మార్గాన్ని మరియు క్షమాపణకు బదులుగా శిక్షను ఎన్నుకున్నవారు. ఎంత సహనముంది వీరికి, నరకాగ్ని శిక్షను భరించటానికి!

2:176 – ذَٰلِكَ بِأَنَّ اللَّـهَ نَزَّلَ الْكِتَابَ بِالْحَقِّ ۗ وَإِنَّ الَّذِينَ اخْتَلَفُوا فِي الْكِتَابِ لَفِي شِقَاقٍ بَعِيدٍ ١٧٦

ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్‌ ఈ గ్రంథాన్ని సత్యంతో అవతరింప జేశాడు. మరియు నిశ్చయంగా ఈ గ్రంథం (ఖుర్‌ఆన్‌) గురించి భిన్నాభిప్రాయాలు గలవారు, ఘోర అంతఃకలహంలో ఉన్నారు! 120 (1/4)

2:177 – لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَـٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ وَآتَى الْمَالَ عَلَىٰ حُبِّهِ ذَوِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينَ وَابْنَ السَّبِيلِ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَالْمُوفُونَ بِعَهْدِهِمْ إِذَا عَاهَدُوا ۖ وَالصَّابِرِينَ فِي الْبَأْسَاءِ وَالضَّرَّاءِ وَحِينَ الْبَأْسِ ۗ أُولَـٰئِكَ الَّذِينَ صَدَقُوا ۖ وَأُولَـٰئِكَ هُمُ الْمُتَّقُونَ ١٧٧

  • వినయ-విధేయత (ధర్మనిష్ఠా పరత్వం) 121 అంటే మీరు మీ ముఖాలను తూర్పు దిక్కునకో, లేక పడమర దిక్కునకో చేయటం కాదు; 122 కాని వినయ-విధేయత (ధర్మనిష్ఠా పరత్వం) అంటే అల్లాహ్‌ ను, అంతిమదినాన్ని, దేవదూతలను, ప్రతి దివ్యగ్రంథాన్ని మరియు ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించడం; మరియు ధనంపై ప్రేమ కలిగి ఉండి కూడా, దానిని బంధువుల కొరకు అనాథుల కొరకు, యాచించని పేదల 123 కొరకు, బాటసారుల కొరకు, యాచకుల కొరకు మరియు బానిసలను 124 విడిపించడానికి వ్యయపరచడం. మరియు నమా’జ్‌ను స్థాపించడం, ‘జకాత్‌ ఇవ్వడం మరియు వాగ్దానం చేసినప్పుడు తమ వాగ్దానాన్ని పూర్తిచేయడం. మరియు దురవస్థలో మరియు ఆపత్కాలాలలో మరియు యుధ్ధ సమయాలలో స్థైర్యం కలిగి ఉండటం. ఇలాంటివారే సత్యవంతులు మరియు ఇలాంటి వారే దైవభీతి గలవారు.

2:178 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الْقِصَاصُ فِي الْقَتْلَى ۖ الْحُرُّ بِالْحُرِّ وَالْعَبْدُ بِالْعَبْدِ وَالْأُنثَىٰ بِالْأُنثَىٰ ۚ فَمَنْ عُفِيَ لَ مِنْ أَخِيهِ شَيْءٌ فَاتِّبَاعٌ بِالْمَعْرُوفِ وَأَدَاءٌ إِلَيْهِ بِإِحْسَانٍ ۗ ذَٰلِكَ تَخْفِيفٌ مِّن رَّبِّكُمْ وَرَحْمَةٌ ۗ فَمَنِ اعْتَدَىٰ بَعْدَ ذَٰلِكَ فَلَهُ عَذَابٌ أَلِيمٌ ١٧٨

ఓ విశ్వాసులారా! హత్య విషయంలో మీ కొరకు న్యాయప్రతీకారం (ఖి’సా’స్‌) నిర్ణయించ బడింది. ఆ హత్య చేసినవాడు, స్వేచ్ఛగలవాడైతే ఆ స్వేచ్ఛాపరుణ్ణి, బానిస అయితే ఆ బానిసను, స్త్రీ అయితే ఆ స్త్రీని (వధించాలి). 125 ఒకవేళ హతుని సోదరులు (కుటుంబీకులు) హంతకుణ్ణి కనికరించదలిస్తే, ధర్మయుక్తంగా రక్తశుల్క నిర్ణయం జరగాలి. 126 హంతకుడు రక్తధనాన్ని, ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు తరఫు నుండి మీకు లభించే సౌకర్యం, కారుణ్యం. దీని తర్వాత కూడా ఈ హద్దులను అతిక్రమించే వానికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

2:179 – وَلَكُمْ فِي الْقِصَاصِ حَيَاةٌ يَا أُولِي الْأَلْبَابِ لَعَلَّكُمْ تَتَّقُونَ ١٧٩

ఓ బుద్ధిమంతులారా! న్యాయప్రతీకారం (ఖి’సా’స్‌)లో మీకు ప్రాణరక్షణ ఉంది, దీనివల్ల మీరు దైవభీతి గలవారు అవుతారు. 127

2:180 – كُتِبَ عَلَيْكُمْ إِذَا حَضَرَ أَحَدَكُمُ الْمَوْتُ إِن تَرَكَ خَيْرًا الْوَصِيَّةُ لِلْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ بِالْمَعْرُوفِ ۖ حَقًّا عَلَى الْمُتَّقِينَ ١٨٠

మీలో ఎవరికైనా మరణకాలం సమీపించి నప్పుడు అతడు, ఆస్తిపాస్తులు గలవాడైతే, అతడు తన తల్లి-దండ్రుల కొరకు మరియు సమీప బంధువుల కొరకు ధర్మసమ్మతమైన మరణ శాసనం (వీలునామా) వ్రాయాలి. 128 ఇది దైవభీతి గలవారి విద్యుక్త ధర్మం.

2:181 – فَمَن بَدَّلَهُ بَعْدَ مَا سَمِعَهُ فَإِنَّمَا إِثْمُهُ عَلَى الَّذِينَ يُبَدِّلُونَهُ ۚ إِنَّ اللَّـهَ سَمِيعٌ عَلِيمٌ ١٨١

ఇక దానిని (వీలునామాను) విన్నవారు, తరువాత ఒకవేళ దానిని మార్చితే, దాని పాపమంతా నిశ్చయంగా, ఆ మార్చిన వారిపైననే ఉంటుంది. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. 129

2:182 – فَمَنْ خَافَ مِن مُّوصٍ جَنَفًا أَوْ إِثْمًا فَأَصْلَحَ بَيْنَهُمْ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٨٢

కాని వీలునామా చేసిన వ్యక్తి పక్షపాతమో, లేదా అన్యాయమో చేశాడనే భయం ఎవనికైనా ఉంటే అతడు ఈ వ్యవహారంతో సంబంధమున్న వారందరి మధ్య రాజీకుదిరిస్తే అందులో ఎలాంటి దోషం లేదు. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

2:183 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ ١٨٣

ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది 130 – ఏ విధంగానైతే మీ పూర్వీకులకు విధిగా నిర్ణయించబడి ఉండెనో – బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని!

2:184 – أَيَّامًا مَّعْدُودَاتٍ ۚ فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ ۚ وَعَلَى الَّذِينَ يُطِيقُونَهُ فِدْيَةٌ طَعَامُ مِسْكِينٍ ۖ فَمَن تَطَوَّعَ خَيْرًا فَهُوَ خَيْرٌ لَّهُ ۚ وَأَن تَصُومُوا خَيْرٌ لَّكُمْ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ ١٨٤

ఇది (ఈ ఉపవాసం) నిర్ణయించబడిన రోజులకు మాత్రమే. కానీ, మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే, లేక ప్రయాణంలో ఉంటే, వేరే దినాలలో (ఆ ఉపవాసాలు) పూర్తిచేయాలి. కాని దానిని పూర్తిచేయటం దుర్భరమైన వారు పరిహారంగా, ఒక పేదవానికి భోజనం పెట్టాలి. 131 కాని ఎవరైనా సహృదయంతో ఇంకా ఎక్కువ మేలు చేయదలిస్తే, అది అతని మేలుకే! కాని మీరు తెలుసుకో గలిగితే, ఉపవాసం ఉండటమే, మీకు ఎంతో ఉత్తమమైనది.

2:185 – شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ ۚ فَمَن شَهِدَ مِنكُمُ الشَّهْرَ فَلْيَصُمْهُ ۖ وَمَن كَانَ مَرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ ۗ يُرِيدُ اللَّـهُ بِكُمُ الْيُسْرَ وَلَا يُرِيدُ بِكُمُ الْعُسْرَ وَلِتُكْمِلُوا الْعِدَّةَ وَلِتُكَبِّرُوا اللَّـهَ عَلَىٰ مَا هَدَاكُمْ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ ١٨٥

రమ’దాన్‌ నెల! అందులో దివ్య ఖుర్‌ఆన్‌ మానవులకు మార్గదర్శకత్వంగా, అవతరింప జేయబడింది! 132 మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యా-సత్యాలను వేర్పరచే, స్పష్టమైన ఉపదేశాలున్నాయి. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా (విధిగా) ఉపవాస ముండాలి. కాని వ్యాధిగ్రస్తుడైనవాడు, లేక ప్రయా ణంలో ఉన్నవాడు, (ఆ ఉపవాసాలను) వేరే దినా లలో పూర్తిచేయాలి. అల్లాహ్‌ మీకు సౌలభ్యం చేయగోరుతున్నాడే కానీ, మిమ్మల్ని కష్టపెట్ట దలచుకోలేదు. ఇది మీరు ఉపవాసదినాల సంఖ్యను పూర్తిచేయగలగటానికి మరియు మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్‌ మహ నీయతను (ఘనతను) కొనియాడటానికి మరియు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి!

2:186 – وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ ۖ فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ يَرْشُدُونَ ١٨٦

మరియు నా దాసులు, నన్ను గురించి నిన్ను అడిగితే: ”నేను (వారికి) అతి సమీపంలోనే ఉన్నాను. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును విని, జవాబిస్తాను 133 కాబట్టి వారు సరైన మార్గం పొందటానికి, నా ఆజ్ఞలను అనుసరించాలి మరియు నా యందు విశ్వాసం కలిగి ఉండాలి.” అని, చెప్పు. 134

2:187 – أُحِلَّ لَكُمْ لَيْلَةَ الصِّيَامِ الرَّفَثُ إِلَ نِسَائِكُمْ ۚ هُنَّ لِبَاسٌ لَّكُمْ وَأَنتُمْ لِبَاسٌ لَّهُنَّ ۗ عَلِمَ اللَّـهُ أَنَّكُمْ كُنتُمْ تَخْتَانُونَ أَنفُسَكُمْ فَتَابَ عَلَيْكُمْ وَعَفَا عَنكُمْ ۖ فَالْآنَ بَاشِرُوهُنَّ وَابْتَغُوا مَا كَتَبَ اللَّـهُ لَكُمْ ۚ وَكُلُوا وَاشْرَبُوا حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ ۖ ثُمَّ أَتِمُّوا الصِّيَامَ إِلَى اللَّيْلِ ۚ وَلَا تُبَاشِرُوهُنَّ وَأَنتُمْ عَاكِفُونَ فِي الْمَسَاجِدِ ۗ تِلْكَ حُدُودُ اللَّـهِ فَلَا تَقْرَبُوهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّـهُ آيَاتِهِ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَّقُونَ ١٨٧

ఉపవాసపు రాత్రులందు మీకు మీ భార్య లతో రతిక్రీడ (రఫస్‌’) ధర్మసమ్మతం చేయ బడింది. వారు మీ వస్త్రాలు, మీరు వారి వస్త్రాలు. వాస్తవానికి మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం అల్లాహ్‌కు తెలుసు. కావున ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు మరియు మిమ్మల్ని మన్నించాడు. ఇక నుండి మీరు మీ భార్యలతో సంభోగం (బాషిర్‌) చేయండి మరియు అల్లాహ్‌ మీ కొరకు వ్రాసిన దానిని కోరండి. మరియు ఉదయకాలపు తెల్లని రేఖలు రాత్రి నల్లచారల నుండి స్పష్టపడే వరకు, మీరు తినండి, త్రాగండి. ఆ తరువాత చీకటి పడేవరకూ మీ ఉపవాసాన్ని పూర్తిచెయ్యండి. కాని మస్జిద్‌లలో ఏ’తెకాఫ్‌ పాటించేటప్పుడు, మీరు మీ స్త్రీలతో సంభోగించకండి 135 ఇవి అల్లాహ్‌ ఏర్పరచిన హద్దులు, కావున ఉల్లంఘించే (ఉద్దేశంతో) వీటిని సమీపించకండి. ఈ విధంగా అల్లాహ్‌ తన ఆజ్ఞలను ప్రజలకు స్పష్టం చేస్తున్నాడు. బహుశా వారు భయ-భక్తులు కలిగి ఉంటారని!

2:188 – وَلَا تَأْكُلُوا أَمْوَالَكُم بَيْنَكُم بِالْبَاطِلِ وَتُدْلُوا بِهَا إِلَى الْحُكَّامِ لِتَأْكُلُوا فَرِيقًا مِّنْ أَمْوَالِ النَّاسِ بِالْإِثْمِ وَأَنتُمْ تَعْلَمُونَ ١٨٨

మరియు మీరు ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా కబళించకండి మరియు బుధ్ధి పూర్వకంగా, అక్రమమైనరీతిలో, ఇతరుల ఆస్తిలో కొంత భాగం తినే దురుద్దేశంతో, న్యాయాధి కారులకు లంచాలు ఇవ్వకండి. (3/8)

2:189 – يَسْأَلُونَكَ عَنِ الْأَهِلَّةِ ۖ قُلْ هِيَ مَوَاقِيتُ لِلنَّاسِ وَالْحَجِّ ۗ وَلَيْسَ الْبِرُّ بِأَن تَأْتُوا الْبُيُوتَ مِن ظُهُورِهَا وَلَـٰكِنَّ الْبِرَّ مَنِ اتَّقَىٰ ۗ وَأْتُوا الْبُيُوتَ مِنْ أَبْوَابِهَا ۚ وَاتَّقُوا اللَّـهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ ١٨٩

  • (ఓ ప్రవక్తా!) వారు నిన్ను మారే చంద్రుని (రూపాలను) గురించి అడుగుతున్నారు. నీవు వారితో ఇలా అను: ”అవి ప్రజలకు కాలగణనను మరియు ‘హజ్జ్‌ దినాలను తెలియజేస్తాయి.” మీరు మీ ఇళ్ళలోకి వాటి వెనుక భాగం నుండి ప్రవేశించడం ఋజువర్తన (బిర్ర్‌) కాదు, దైవభీతి కలిగి ఉండటమే ఋజువర్తన (బిర్ర్‌). కనుక మీరు ఇండ్లలో వాటి ద్వారాల నుండియే ప్రవేశించండి. మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లాహ్ యందు భయ-భక్తులు కలిగి ఉండండి.

2:190 – وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّـهِ الَّذِينَ يُقَاتِلُونَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّـهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ ١٩٠

మరియు మీతో, పోరాడేవారితో, మీరు అల్లాహ్‌ మార్గంలో పోరాడండి, కాని హద్దులను అతిక్రమించకండి. నిశ్చయంగా, అల్లాహ్‌ హద్దులను అతిక్రమించే వారిని ప్రేమించడు 136

2:191 – وَاقْتُلُوهُمْ حَيْثُ ثَقِفْتُمُوهُمْ وَأَخْرِجُوهُم مِّنْ حَيْثُ أَخْرَجُوكُمْ ۚ وَالْفِتْنَةُ أَشَدُّ أَشَدُّ الْقَتْلِ ۚ وَلَا تُقَاتِلُوهُمْ عِندَ الْمَسْجِدِ الْحَرَامِ حَتَّىٰ يُقَاتِلُوكُمْ فِيهِ ۖ فَإِن قَاتَلُوكُمْ فَاقْتُلُوهُمْ ۗ كَذَٰلِكَ جَزَاءُ الْكَافِرِينَ ١٩١

వారు, మీకు ఎక్కడ ఎదురైతే అక్కడనే వారిని చంపండి. మరియు వారు మిమ్మల్ని ఎచ్చటి నుండి తరిమివేశారో, మీరు కూడా వారిని అచ్చటి నుండి తరిమివేయండి. మరియు సత్య ధర్మానికి అడ్డుగా నిలవటం (ఫిత్నా) 137 చంపటం కంటే ఘోరమైనది. మస్జిద్‌ అల్‌-‘హరామ్‌ వద్ద వారు మీతో యుధ్ధం చేయనంత వరకు మీరు వారితో అక్కడ యుధ్ధం చేయకండి. 138

2:192 – فَإِنِ انتَهَوْا فَإِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٩٢

కానీ, వారు (యుధ్ధం చేయటం) మాను కుంటే (మీరు కూడా మానుకోండి). ఎందుకంటే నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

2:193 – وَقَاتِلُوهُمْ حَتَّىٰ لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ لِلَّـهِ ۖ فَإِنِ انتَهَوْا فَلَا عُدْوَانَ إِلَّا عَلَى الظَّالِمِينَ ١٩٣

మరియు ఫిత్నా 139 ముగిసిపోయే వరకు మరియు అల్లాహ్‌ ధర్మం మాత్రమే స్థాపించబడే వరకు మీరు వారితో యుధ్ధం చేస్తూ ఉండండి. ఒకవేళ వారు మానుకుంటే, దుర్మార్గులతో తప్ప ఇతరులతో పోరాడకండి. 140

2:194 – الشَّهْرُ الْحَرَامُ بِالشَّهْرِ الْحَرَامِ وَالْحُرُمَاتُ قِصَاصٌ ۚ فَمَنِ اعْتَدَىٰ عَلَيْكُمْ فَاعْتَدُوا عَلَيْهِ بِمِثْلِ مَا اعْتَدَىٰ عَلَيْكُمْ ۚ وَاتَّقُوا اللَّـهَ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ مَعَ الْمُتَّقِينَ ١٩٤

నిషిధ్ధమాసానికి బదులు నిషిధ్ధమాసమే మరియు నిషిద్ధస్థలాలలో న్యాయ ప్రతీకారం (ఖి’సా’స్‌) తీసుకో వచ్చు. 141 కాబట్టి మీపై ఎవరైనా దాడిచేస్తే, మీరు కూడా వారిపై అదే విధంగా దాడిచేయండి. మరియు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ భయ-భక్తులు గలవారికి తోడుగా ఉంటాడని తెలుసుకోండి.

2:195 – وَأَنفِقُوا فِي سَبِيلِ اللَّـهِ وَلَا تُلْقُوا بِأَيْدِيكُمْ إِلَى التَّهْلُكَةِ ۛ وَأَحْسِنُوا ۛ إِنَّ اللَّـهَ يُحِبُّ الْمُحْسِنِينَ ١٩٥

మరియు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. మరియు మీ చేతులారా మిమ్మల్ని మీరు వినాశంలో పడవేసుకోకండి; మేలుచేయండి. నిశ్చయంగా, అల్లాహ్‌ మేలు చేసేవారిని ప్రేమిస్తాడు

2:196 – وَأَتِمُّوا الْحَجَّ وَالْعُمْرَةَ لِلَّـهِ ۚ فَإِنْ أُحْصِرْتُمْ فَمَا اسْتَيْسَرَ مِنَ الْهَدْيِ ۖ وَلَا تَحْلِقُوا رُءُوسَكُمْ حَتَّىٰ يَبْلُغَ الْهَدْيُ مَحِلَّهُ ۚ فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوْ بِهِ أَذًى مِّن رَّأْسِهِ فَفِدْيَةٌ مِّن صِيَامٍ أَوْ صَدَقَةٍ أَوْ نُسُكٍ ۚ فَإِذَا أَمِنتُمْ فَمَن تَمَتَّعَ بِالْعُمْرَةِ إِلَى الْحَجِّ فَمَا اسْتَيْسَرَ مِنَ الْهَدْيِ ۚ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ ثَلَاثَةِ أَيَّامٍ فِي الْحَجِّ وَسَبْعَةٍ إِذَا رَجَعْتُمْ ۗ تِلْكَ عَشَرَةٌ كَامِلَةٌ ۗ ذَٰلِكَ لِمَن لَّمْ يَكُنْ أَهْلُهُ حَاضِرِي الْمَسْجِدِ الْحَرَامِ ۚ وَاتَّقُوا اللَّـهَ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ شَدِيدُ الْعِقَابِ ١٩٦

మరియు అల్లాహ్‌ (ప్రసన్నత) కొరకు ‘హజ్జ్‌ మరియు ‘ఉమ్రా పూర్తిచేయండి. 142 మీకు వాటిని పూర్తిచేయటానికి ఆటంకం కలిగినట్లైతే, మీరు ఇవ్వదలుచుకున్న బలి (ఖుర్బానీ) ఇవ్వండి. 143 బలి జంతువు దాని గమ్యస్థానానికి చేరనంత వరకు మీరు శిరోముండనం చేసుకోకండి. 144 కానీ, మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడై ఉంటే లేదా అతని తలకు బాధ ఉంటే (శిరో ముండనం చేసుకొని) దానికి పరిహారంగా (మూడు రోజులు) ఉపవాసం ఉండాలి. లేదా దాన-ధర్మాలు చేయాలి (ఆరుగురు నిరు పేదలకు భోజనం పెట్టాలి), లేదా బలి ఇవ్వాలి. కాని శాంతి భద్రతలు ఉన్న సమయాలలో ఎవడైనా ‘హజ్జె తమత్తు 145 చేయదలచుకుంటే, అతడు తనశక్తిమేరకు బలి 146 ఇవ్వాలి. కాని ఎవడైతే ఖుర్బానీ ఇవ్వలేడో ‘హజ్జ్‌ కాలంలో మూడు దినాలు మరియు (ఇంటికి) తిరిగివచ్చిన పిమ్మట ఏడు దినాలు ఉపవాసం ఉండాలి, ఈ విధంగా మొత్తం పది దినాలు ఉపవాసాలు ఉండాలి. ఇది మస్జిద్‌ అల్‌-‘హరామ్‌ దగ్గర నివసించని వారికి మాత్రమే. మరియు అల్లాహ్‌ యెడల భయ-భక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ శిక్ష విధించటంలో చాలా కఠినుడు, అని తెలుసుకోండి.

2:197 – الْحَجُّ أَشْهُرٌ مَّعْلُومَاتٌ ۚ فَمَن فَرَضَ فِيهِنَّ الْحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوقَ وَلَا جِدَالَ فِي الْحَجِّ ۗ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ يَعْلَمْهُ اللَّـهُ ۗ وَتَزَوَّدُوا فَإِنَّ خَيْرَ الزَّادِ التَّقْوَىٰ ۚ وَاتَّقُونِ يَا أُولِي الْأَلْبَابِ ١٩٧

‘హజ్జ్‌ నియమిత నెలలలోనే జరుగు తుంది. ఈ నిర్ణీత మాసాలలో ‘హజ్జ్‌ చేయటానికి సంకల్పించిన వ్యక్తి ‘హజ్జ్‌ (ఇ’హ్రామ్‌)లో వున్న సమయంలో (భార్యతో) రతిక్రీడ (రఫ’స్‌)కు, దుష్టకార్యాలకు మరియు కలహాలకు దూరంగా ఉండాలి. మీరు చేసే మంచిపనులన్నీ అల్లాహ్‌కు తెలుసు. (‘హజ్జ్ యాత్రకు) కావలసిన వస్తు సామాగ్రిని తీసుకు వెళ్ళండి. దైవభీతియే నిశ్చయంగా, అన్నిటికంటే ఉత్తమమైన సామగ్రి. కనుక ఓ బుధ్ధిమంతులారా! కేవలం నా యందే భయ-భక్తులు కలిగి ఉండండి.

2:198 – لَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَبْتَغُوا فَضْلًا مِّن رَّبِّكُمْ ۚ فَإِذَا أَفَضْتُم مِّنْ عَرَفَاتٍ فَاذْكُرُوا اللَّـهَ عِندَ الْمَشْعَرِ v الْحَرَامِ ۖ وَاذْكُرُوهُ كَمَا هَدَاكُمْ وَإِن كُنتُم مِّن قَبْلِهِ لَمِنَ الضَّالِّينَ ١٩٨

(‘హజ్జ్‌ యాత్రలో) మీరు మీ ప్రభువు అనుగ్రహాలు అన్వేషిస్తే 147 అందులో దోషంలేదు. ‘అరఫాత్‌ 148 నుండి బయలుదేరిన తరువాత మష్‌అరిల్‌ ‘హరామ్‌ (ముజ్‌’దలిఫా) 149 వద్ద (ఆగి) అల్లాహ్‌ను స్మరించండి. మరియు ఆయన మీకు బోధించిన విధంగా ఆయనను స్మరించండి, వాస్తవానికి మీరు పూర్వం మార్గభ్రష్టులుగా ఉండేవారు.

2:199 – ثُمَّ أَفِيضُوا مِنْ حَيْثُ أَفَاضَ النَّاسُ وَاسْتَغْفِرُوا اللَّـهَ ۚ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٩٩

తరువాత ప్రజలంతా ఎక్కడి నుండి వెళ్తారో అక్కడి నుండి మీరూ వెళ్ళండి. అల్లాహ్‌తో క్షమాభిక్ష వేడుకోండి. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

2:200 – فَإِذَا قَضَيْتُم مَّنَاسِكَكُمْ فَاذْكُرُوا اللَّـهَ كَذِكْرِكُمْ آبَاءَكُمْ أَوْ أَشَدَّ ذِكْرًا ۗ فَمِنَ النَّاسِ مَن يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا وَمَا لَهُ فِي الْآخِرَةِ مِنْ خَلَاقٍ ٢٠٠

ఇక మీ (‘హజ్జ్‌) విధులను 150 పూర్తిచేసిన తరువాత, మీరు మీ తండ్రి-తాతలను (పూర్వం) స్మరించే విధంగా, ఇంకా దానికంటే అధికంగా అల్లాహ్‌ను స్మరించండి. కాని వారిలో కొందరు: ”ఓ మా ప్రభూ! మాకు ఈ లోకంలో (అన్నీ) ప్రసాదించు!” అని ప్రార్థిస్తారు. అలాంటి వారికి పరలోకంలో ఎలాంటి భాగం ఉండదు.

2:201 – وَمِنْهُم مَّن يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ ٢٠١

వారిలో మరికొందరు: ”ఓ మా ప్రభూ! మాకు ఇహలోకంలో మంచిని మరియు పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు మరియు మమ్మల్ని నరకాగ్నినుండి కాపాడు!” అని ప్రార్థిస్తారు. 0

2:202 – أُولَـٰئِكَ لَهُمْ نَصِيبٌ مِّمَّا كَسَبُوا ۚ وَاللَّـهُ سَرِيعُ الْحِسَابِ ٢٠٢

అలాంటి వారు తమ సంపాదనకు అను గుణంగా (ఉభయలోకాలలో) తమ వాటాను పొందు తారు. మరియు అల్లాహ్‌ లెక్క తీసుకోవటంలో అతిశీఘ్రుడు. (1/2)

2:203 – وَاذْكُرُوا اللَّـهَ فِي أَيَّامٍ مَّعْدُودَاتٍ ۚ فَمَن تَعَجَّلَ فِي يَوْمَيْنِ فَلَا إِثْمَ عَلَيْهِ وَمَن تَأَخَّرَ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ لِمَنِ اتَّقَىٰ ۗ وَاتَّقُوا وَاعْلَمُوا أَنَّكُمْ إِلَيْهِ تُحْشَرُونَ ٢٠٣

  • మరియు నియమిత రోజులలో అల్లాహ్‌ను స్మరించండి. 151 ఎవడైనా త్వరగా రెండు రోజులలోనే వెళ్ళిపోయినా, అతనిపై ఎలాంటి దోషంలేదు. మరెవడైనా నిదానించి (పదమూడవ తేదీవరకు) నిలిచిపోయినా, అతనిపై ఎలాంటి దోషంలేదు, 152 వాడికి, ఎవడైతే దైవభీతి కలిగిఉంటాడో! మరియు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా, మీరంతా ఆయన సన్నిధిలో హాజరు చేయబడుతారనేది తెలుసుకోండి.

2:204 – وَمِنَ النَّاسِ مَن يُعْجِبُكَ قَوْلُهُ فِي الْحَيَاةِ الدُّنْيَا وَيُشْهِدُ اللَّـهَ عَلَىٰ مَا فِي قَلْبِهِ وَهُوَ أَلَدُّ الْخِصَامِ ٢٠٤

మరియు ప్రజలలో నుండి ఒక వ్యక్తి మాటలు ఇహలోక జీవితంలో నీకు సంతోషం కలుగ జేయవచ్చు; మరియు తన సంకల్పశుధ్ధిని తెలుప డానికి అతడు అల్లాహ్‌ను సాక్షిగా నిలబెట్టవచ్చు! కాని, వాస్తవానికి, అతడు ఘోరమైన జగడాలమారి కావచ్చు! 153

2:205 – وَإِذَا تَوَلَّىٰ سَعَىٰ فِي الْأَرْضِ لِيُفْسِدَ فِيهَا وَيُهْلِكَ الْحَرْثَ وَالنَّسْلَ ۗ وَاللَّـهُ لَا يُحِبُّ الْفَسَادَ ٢٠٥

మరియు (ఓ ము’హమ్మద్‌!) అతడు (నీ వద్ద నుండి) తిరిగిపోయి లోకంలో కల్లోలం రేకెత్తించ టానికి, పంట పొలాలను మరియు పశువులను నాశనం చేయటానికి పాటుపడవచ్చు. మరియు అల్లాహ్‌ కల్లోలాన్ని ఏ మాత్రం ప్రేమించడు.

2:206 – وَإِذَا قِيلَ لَهُ اتَّقِ اللَّـهَ أَخَذَتْهُ الْعِزَّةُ بِالْإِثْمِ ۚ فَحَسْبُهُ جَهَنَّمُ ۚ وَلَبِئْسَ الْمِهَادُ ٢٠٦

మరియు: ”అల్లాహ్‌ యందు భయ-భక్తు లు కలిగి ఉండు.” అని అతనితో అన్నప్పుడు, అహంభావం అతనిని మరింత పాపానికే ప్రేరే పిస్తుంది. కావున నరకమే అలాంటివానికి తగిన స్థలం. మరియు అది ఎంతచెడ్డ విరామస్థలం!

2:207 – وَمِنَ النَّاسِ مَن يَشْرِي نَفْسَهُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّـهِ ۗ وَاللَّـهُ رَءُوفٌ بِالْعِبَادِ ٢٠٧

మరియు మానవులలోనే – అల్లాహ్‌ సంతోషం పొందటానికి – తన పూర్తిజీవితాన్ని అంకితం చేసేవాడూ ఉన్నాడు. మరియు అల్లాహ్‌ తనదాసుల యెడల చాల కనికరుడు. 154

2:208 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا ادْخُلُوا فِي السِّلْمِ كَافَّةً وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ ٢٠٨

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ విధేయతలో (ఇస్లాంలో) సంపూర్ణంగా ప్రవేశించండి. మరియు షై’తాను అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు!

2:209 – فَإِن زَلَلْتُم مِّن بَعْدِ مَا جَاءَتْكُمُ الْبَيِّنَاتُ فَاعْلَمُوا أَنَّ اللَّـهَ عَزِيزٌ حَكِيمٌ ٢٠٩

మీ వద్దకు స్పష్టమైన హితోపదేశాలు వచ్చిన పిదప కూడా, మీరు తప్పటడుగు వేస్తే! నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు అని తెలుసుకోండి.

2:210 – هَلْ يَنظُرُونَ إِلَّا أَن يَأْتِيَهُمُ اللَّـهُ فِي ظُلَلٍ مِّنَ الْغَمَامِ وَالْمَلَائِكَةُ وَقُضِيَ الْأَمْرُ ۚ وَإِلَى اللَّـهِ تُرْجَعُ الْأُمُورُ ٢١٠

ఏమీ? అల్లాహ్‌ స్వయంగా దేవదూతలతో పాటు, మేఘాల ఛాయలలో ప్రత్యక్షం కావాలని వారు నిరీక్షిస్తున్నారా? కానీ, అప్పటికే ప్రతి విషయపు తీర్పు జరిగి ఉంటుంది. మరియు సమస్త విషయాలు (తీర్పు కొరకు) అల్లాహ్‌ దగ్గరికే మరలింపబడతాయి!

2:211 – سَلْ بَنِي إِسْرَائِيلَ كَمْ آتَيْنَاهُم مِّنْ آيَةٍ بَيِّنَةٍ ۗ وَمَن يُبَدِّلْ نِعْمَةَ اللَّـهِ مِن بَعْدِ مَا جَاءَتْهُ فَإِنَّ اللَّـهَ شَدِيدُ الْعِقَابِ ٢١١

మేము ఎన్ని స్పష్టమైన సూచన (ఆయాత్‌)లను వారికి చూపించామో ఇస్రాయీ’ల్‌ సంతతి వారిని అడగండి! 155 మరియు ఎవడు అల్లాహ్‌ యొక్క అనుగ్రహాలను పొందిన తరువాత, వాటిని తారుమారు చేస్తాడో! నిశ్చయంగా, అల్లాహ్‌ అలాంటి వారిని శిక్షించటంలో ఎంతో కఠినుడు.

2:212 – زُيِّنَ لِلَّذِينَ كَفَرُوا الْحَيَاةُ الدُّنْيَا وَيَسْخَرُونَ مِنَ الَّذِينَ آمَنُوا ۘ وَالَّذِينَ اتَّقَوْا فَوْقَهُمْ يَوْمَ الْقِيَامَةِ ۗ وَاللَّـهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ ٢١٢

సత్య-తిరస్కారులకు ఇహలోక జీవితం మనోహరమైనదిగా చేయబడింది. కావున వారు విశ్వాసులతో పరిహాసాలాడుతుంటారు, కానీ పునరుత్థాన దినమున, దైవభీతి గలవారే వారి కంటే ఉన్నత స్థానంలో ఉంటారు. మరియు అల్లాహ్‌, తాను కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు.

2:213 – كَانَ النَّاسُ أُمَّةً وَاحِدَةً فَبَعَثَ اللَّـهُ النَّبِيِّينَ مُبَشِّرِينَ وَمُنذِرِينَ وَأَنزَلَ مَعَهُمُ الْكِتَابَ بِالْحَقِّ لِيَحْكُمَ بَيْنَ النَّاسِ فِيمَا اخْتَلَفُوا فِيهِ ۚ وَمَا اخْتَلَفَ فِيهِ إِلَّا الَّذِينَ أُوتُوهُ مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ بَغْيًا بَيْنَهُمْ ۖ فَهَدَى اللَّـهُ الَّذِينَ آمَنُوا لِمَا اخْتَلَفُوا فِيهِ مِنَ الْحَقِّ بِإِذْنِهِ ۗ وَاللَّـهُ يَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ٢١٣

పూర్వం, మానవులంతా ఒకే ఒక సమా జంగా ఉండేవారు 156 అప్పుడు అల్లాహ్‌ వారికి శుభవార్తలు ఇవ్వటానికి మరియు హెచ్చరికలు చేయటానికి ప్రవక్తలను పంపాడు. మరియు మాన వులలో ఏర్పడిన భేదాలను పరిష్కరించటానికి, ఆయన గ్రంథాన్ని సత్యంతో వారి ద్వారా అవత రింపజేశాడు. మరియు అది (దివ్యగ్రంథం) ఇవ్వ బడినవారు, స్పష్టమైన హితోపదేశాలు పొందిన తరువాత కూడా, పరస్పర ద్వేషాలవల్ల భేదాభి ప్రాయాలు పుట్టించుకున్నారు. కాని అల్లాహ్‌ తన ఆజ్ఞతో, విశ్వాసులకు వారు వివాదాలాడుతున్న విషయంలో సత్యమార్గాన్ని చూపాడు. మరియు అల్లాహ్‌ తానుకోరిన వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.

2:214 – أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَأْتِكُم مَّثَلُ الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُم ۖ مَّسَّتْهُمُ الْبَأْسَاءُ وَالضَّرَّاءُ وَزُلْزِلُوا حَتَّىٰ يَقُولَ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ مَتَىٰ نَصْرُ اللَّـهِ ۗ أَلَا إِنَّ نَصْرَ اللَّـهِ قَرِيبٌ ٢١٤

ఏమీ? మీరు (సులభంగా) స్వర్గంలో ప్రవే శించగలమని భావిస్తున్నారా? మీ పూర్వీకులు సహించినటువంటి (కష్టాలు) మీరూ సహించనిదే! వారిపై దురవస్థలు, రోగబాధలు విరుచుకు పడ్డాయి మరియు వారు కుదిపివేయబడ్డారు, చివరకు అప్పటి సందేశహరుడు మరియు విశ్వాసులైన అతని సహచరులు: ”అల్లాహ్‌ సహాయం ఇంకా ఎప్పుడొస్తుంది?” అని వాపోయారు. అదిగో! నిశ్చయంగా, అల్లాహ్‌ సహాయం సమీపంలోనే ఉంది! 157

2:215 – يَسْأَلُونَكَ مَاذَا يُنفِقُونَ ۖ قُلْ مَا أَنفَقْتُم مِّنْ خَيْرٍ فَلِلْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ ۗ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّـهَ بِهِ عَلِيمٌ ٢١٥

(ఓ ము’హమ్మద్‌!) వారు (ప్రజలు) నిన్ను అడుగుతున్నారు: ”మేము ఏమి ఖర్చు చేయాలి?” అని. వారితో అను: ”మీరు మంచిది ఏది ఖర్చుచేసినా సరే, అది మీ తల్లి-దండ్రుల, బంధువుల, అనాథుల, యాచించని పేదల (మసాకీన్‌) మరియు బాటసారుల కొరకు ఖర్చు చేయాలి. మరియు మీరు ఏ మంచిపని చేసినా అది అల్లాహ్‌కు తప్పక తెలుస్తుంది.” 158

2:216 – كُتِبَ عَلَيْكُمُ الْقِتَالُ وَهُوَ كُرْهٌ لَّكُمْ ۖ وَعَسَىٰ أَن تَكْرَهُوا شَيْئًا وَهُوَ خَيْرٌ لَّكُمْ ۖ وَعَسَىٰ أَن تُحِبُّوا شَيْئًا وَهُوَ شَرٌّ لَّكُمْ ۗ وَاللَّـهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ ٢١٦

మీకు అసహ్యకరమైనా! (ధర్మ) యుధ్ధం చేయటం మీకు విధిగా నిర్ణయించబడింది. 159 మరియు మీకు నచ్చని విషయమే మీకు మేలైనది కావచ్చు మరియు మీకు నచ్చే విషయమే మీకు హానికరమైనది కావచ్చు! మరియు అల్లాహ్‌కు అంతా తెలుసు, కాని మీకు ఏమీ తెలియదు.

2:217 – يَسْأَلُونَكَ عَنِ الشَّهْرِ الْحَرَامِ قِتَالٍ فِيهِ ۖ قُلْ فِيهِ كَبِيرٌ ۖ وَصَدٌّ عَن سَبِيلِ اللَّـهِ وَكُفْرٌ بِهِ وَالْمَسْجِدِ الْحَرَامِ وَإِخْرَاجُ أَهْلِهِ مِنْهُ أَكْبَرُ عِندَ اللَّـهِ ۚ وَالْفِتْنَةُ أَكْبَرُ مِنَ الْقَتْلِ ۗ وَلَا يَزَالُونَ يُقَاتِلُونَكُمْ حَتَّىٰ يَرُدُّوكُمْ عَن دِينِكُمْ إِنِ اسْتَطَاعُوا ۚ وَمَن يَرْتَدِدْ مِنكُمْ عَن دِينِهِ فَيَمُتْ وَهُوَ كَافِرٌ فَأُولَـٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۖ وَأُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٢١٧

వారు నిషిధ్ధ మాసాలలో యుధ్ధం చేయటాన్ని గురించి నిన్ను అడుగు తున్నారు 160 వారితో ఇలా అను: ”వాటిలో యుధ్ధం చేయటం మహా అపరాధం. కానీ (ప్రజలను) అల్లాహ్‌ మార్గాన్ని అవలంబించటం నుండి అవరోధాలు కలిగించటం మరియు ఆయన (అల్లాహ్‌)ను తిరస్కరించటం మరియు (ప్రజలను) మస్జిద్‌ అల్‌-‘హరామ్‌ను దర్శించకుండా ఆటంక పరచడం మరియు అక్కడివారిని దాని నుండి వెడలగొట్టటం అల్లాహ్‌ దృష్టిలో అంతకంటే మహా అపరాధం. పీడన (ఫిత్నా), రక్తపాతం కంటే ఘోరమైనది. 161 వారికి సాధ్యమే అయితే మిమ్మల్ని మీ ధర్మం నుండి మళ్ళించ గలిగే వరకూ వారు మీతో యుధ్ధం చేయడం మానరు. మరియు మీలో ఎవరైనా మతభ్రష్టులై సత్య-తిరస్కారులుగా మరణిస్తే, అలాంటి వారి మంచి పనులన్నీ ఇహపరలోకాలలో రెండింటి లోనూ వృథా అవుతాయి. మరియు అలాంటి వారు నరకాగ్నివాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.”

2:218 – إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّـهِ أُولَـٰئِكَ يَرْجُونَ رَحْمَتَ اللَّـهِ ۚ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٢١٨

నిశ్చయంగా, విశ్వసించిన వారు మరియు (అల్లాహ్‌ మార్గంలో తమ జన్మ భూమిని విడిచి) వలస పోయేవారు మరియు అల్లాహ్‌ మార్గంలో ధర్మ పోరాటం చేసేవారు; ఇలాంటి వారే! అల్లాహ్‌ కారుణ్యం ఆశించటానికి అర్హులు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. (5/8)

2:219 – يَسْأَلُونَكَ عَنِ الْخَمْرِ وَالْمَيْسِرِ ۖ قُلْ فِيهِمَا إِثْمٌ كَبِيرٌ وَمَنَافِعُ لِلنَّاسِ وَإِثْمُهُمَا أَكْبَرُ مِن نَّفْعِهِمَا ۗ وَيَسْأَلُونَكَ مَاذَا يُنفِقُونَ قُلِ الْعَفْوَ ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّـهُ لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُونَ ٢١٩

  • (ఓ ప్రవక్తా!) వారు, మద్యపానాన్ని మరియు జూదాన్ని గురించి నిన్ను ప్రశ్నిస్తు న్నారు. 162 నీవు ఈ విధంగా సమాధానమివ్వు: ”ఈ రెండింటిలోనూ ఎంతో హాని (పాపం) ఉంది. వాటిలో ప్రజలకు కొన్నిలాభాలు కూడా ఉన్నాయి కాని వాటి హాని (పాపం) వాటి లాభాల కంటే ఎంతో అధికమైనది.” మరియు వారిలా అడుగు తున్నారు: ”మేము (అల్లాహ్‌ మార్గంలో) ఏమి ఖర్చుపెట్టాలి?” నీవు ఇలా సమాధానమివ్వు: ”మీ (నిత్యావసరాలకుపోగా) మిగిలేది.” 163 మీరు ఆలోచించటానికి, అల్లాహ్‌ ఈ విధంగా తన సూచన (ఆయాత్‌)లను మీకు విశదీ కరిస్తున్నాడు –

2:220 – فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۗ وَيَسْأَلُونَكَ عَنِ الْيَتَامَىٰ ۖ قُلْ إِصْلَاحٌ لَّهُمْ خَيْرٌ ۖ وَإِن تُخَالِطُوهُمْ فَإِخْوَانُكُمْ ۚ وَاللَّـهُ يَعْلَمُ الْمُفْسِدَ مِنَ الْمُصْلِحِ ۚ وَلَوْ شَاءَ اللَّـهُ لَأَعْنَتَكُمْ ۚ إِنَّ اللَّـهَ عَزِيزٌ حَكِيمٌ ٢٢٠

ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ – మరియు అనాథులను గురించి వారు నిన్ను అడుగుతున్నారు. నీవు ఇలా సమాధానమివ్వు: ”వారి సంక్షేమానికి తోడ్పడటమే మేలైనది.” మరియు మీరు వారితో కలిసి మెలిసి 164 ఉంటే (తప్పులేదు), వారు మీ సోదరులే! మరియు చెరచేవాడెవడో, సవరించేవాడెవడో అల్లాహ్‌కు బాగా తెలుసు. మరియు అల్లాహ్‌ కోరితే మిమ్మల్ని కష్టపెట్టి ఉండేవాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

2:221 – وَلَا تَنكِحُوا الْمُشْرِكَاتِ حَتَّىٰ يُؤْمِنَّ ۚ وَلَأَمَةٌ مُّؤْمِنَةٌ خَيْرٌ مِّن مُّشْرِكَةٍ وَلَوْ أَعْجَبَتْكُمْ ۗ وَلَا تُنكِحُوا الْمُشْرِكِينَ حَتَّىٰ يُؤْمِنُوا ۚ وَلَعَبْدٌ مُّؤْمِنٌ خَيْرٌ مِّن مُّشْرِكٍ وَلَوْ أَعْجَبَكُمْ ۗ أُولَـٰئِكَ يَدْعُونَ إِلَى النَّارِ ۖ وَاللَّـهُ يَدْعُو إِلَى الْجَنَّةِ وَالْمَغْفِرَةِ بِإِذْنِهِ ۖ وَيُبَيِّنُ آيَاتِهِ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ ٢٢١

మరియు ముష్రిక్‌ స్త్రీలు, విశ్వసించనంత వరకు, మీరు వారిని వివాహమాడకండి, ముష్రిక్‌ స్త్రీ మీకు ఎంత నచ్చినా, ఆమెకంటే విశ్వాసురాలైన ఒక బానిసస్త్రీ ఎంతో మేలైనది 165 మరియు ముష్రిక్‌ పురుషులు విశ్వసించనంత వరకు మీ స్త్రీలతో వారి వివాహం చేయించకండి. మరియు ముష్రిక్‌ పురుషుడు మీకు ఎంత నచ్చినా, అతడి కంటే విశ్వాసి అయిన ఒక బానిస ఎంతో మేలైన వాడు. ఇలాంటి వారు (ముష్రికీన్‌) మిమ్మల్ని అగ్ని వైపునకు ఆహ్వానిస్తున్నారు. కాని అల్లాహ్‌! తన అనుమతితో, మిమ్మల్ని స్వర్గం వైపునకు మరియు క్షమాభిక్ష పొందటానికి పిలుస్తున్నాడు. మరియు ఈ విధంగా ఆయన తన సూచనలను ప్రజలకు – బహుశా వారు గుణపాఠం నేర్చు కుంటారని – స్పష్టంగా తెలుపుతున్నాడు.

2:222 – وَيَسْأَلُونَكَ عَنِ الْمَحِيضِ ۖ قُلْ هُوَ أَذًى فَاعْتَزِلُوا النِّسَاءَ فِي الْمَحِيضِ ۖ وَلَا تَقْرَبُوهُنَّ حَتَّىٰ يَطْهُرْنَ ۖ فَإِذَا تَطَهَّرْنَ فَأْتُوهُنَّ مِنْ حَيْثُ أَمَرَكُمُ اللَّـهُ ۚ إِنَّ اللَّـهَ يُحِبُّ التَّوَّابِينَ وَيُحِبُّ الْمُتَطَهِّرِينَ ٢٢٢

మరియు వారు నిన్ను స్త్రీల ఋతుకాలం గురించి అడుగుతున్నారు. నీవు వారికి ఇలా తెలుపు: ”అదొక అపరిశుద్ధ (హానికరమైన) స్థితి. కనుక ఋతుకాలంలో స్త్రీలతో (సంభోగానికి) దూరంగా ఉండండి 166 వారు పరిశుద్ధులు కానంత వరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్దులు అయిన తరువాత అల్లాహ్‌ ఆదేశించిన చోటు నుండి మీరు వారివద్దకుపోవచ్చు.” 167 నిశ్చయంగా అల్లాహ్‌ పశ్చాత్తాపపడే వారిని ప్రేమిస్తాడు మరియు పరిశుధ్ధులుగా ఉండేవారిని ప్రేమిస్తాడు.

2:223 – نِسَاؤُكُمْ حَرْثٌ لَّكُمْ فَأْتُوا حَرْثَكُمْ أَنَّىٰ شِئْتُمْ ۖ وَقَدِّمُوا لِأَنفُسِكُمْ ۚ وَاتَّقُوا اللَّـهَ وَاعْلَمُوا أَنَّكُم مُّلَاقُوهُ ۗ وَبَشِّرِ الْمُؤْمِنِينَ ٢٢٣

మీ భార్యలు మీకు పంటపొలాల వంటి వారు, కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు. 168 మరియు మీ స్వయం కొరకు (సత్కార్యాలు) చేసి పంపండి (మీకు మంచి సంతానం కొరకు ప్రార్థించండి). మరియు అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు నిశ్చయంగా, ఆయనను కలుసుకోవలసి ఉందని తెలుసుకోండి. మరియు విశ్వాసులకు శుభవార్తలను వినిపించు.

2:224 – وَلَا تَجْعَلُوا اللَّـهَ عُرْضَةً لِّأَيْمَانِكُمْ أَن تَبَرُّوا وَتَتَّقُوا وَتُصْلِحُوا بَيْنَ النَّاسِ ۗ وَاللَّـهُ سَمِيعٌ عَلِيمٌ ٢٢٤

మరియు మీరు అల్లాహ్‌ (పేరుతో) చేసే ప్రమాణాలు మిమ్మల్ని సన్మార్గం నుండి, దైవభీతి నుండి మరియు ప్రజలలో శాంతి స్థాపించటం నుండి ఆటంకపరిచేవిగా కానివ్వకండి 169 మరియు అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

2:225 – لَّا يُؤَاخِذُكُمُ بِاللَّغْوِ فِي أَيْمَانِكُمْ وَلَـٰكِن يُؤَاخِذُكُم بِمَا كَسَبَتْ قُلُوبُكُمْ ۗ وَاللَّـهُ غَفُورٌ حَلِيمٌ ٢٢٥

మీరు అనాలోచితంగా చేసే ప్రమాణాలను గురించి అల్లాహ్‌ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు హృదయపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన తప్పకుండా మిమ్మల్ని పట్టుకుంటాడు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, సహనశీలుడు 170

2:226 – لِّلَّذِينَ يُؤْلُونَ مِن نِّسَائِهِمْ تَرَبُّصُ أَرْبَعَةِ أَشْهُرٍ ۖ فَإِن فَاءُوا فَإِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ٢٢٦

ఎవరైతే తమ భార్యలతో (సంభోగించము అని) ప్రమాణంచేస్తారో, వారికి నాలుగు నెలల వ్యవధి ఉంది. 171 కాని వారు తమ దాంపత్య జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తే! నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

2:227 – وَإِنْ عَزَمُوا الطَّلَاقَ فَإِنَّ اللَّـهَ سَمِيعٌ عَلِيمٌ ٢٢٧

కాని వారు విడాకులకే నిర్ణయించుకుంటే! నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వంవినేవాడు, సర్వజ్ఞుడు. 172

2:228 – وَالْمُطَلَّقَاتُ يَتَرَبَّصْنَ بِأَنفُسِهِنَّ ثَلَاثَةَ قُرُوءٍ ۚ وَلَا يَحِلُّ لَهُنَّ أَن يَكْتُمْنَ مَا خَلَقَ اللَّـهُ فِي أَرْحَامِهِنَّ إِن كُنَّ يُؤْمِنَّ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ ۚ وَبُعُولَتُهُنَّ أَحَقُّ بِرَدِّهِنَّ فِي ذَٰلِكَ إِنْ أَرَادُوا إِصْلَاحًا ۚ وَلَهُنَّ مِثْلُ الَّذِي عَلَيْهِنَّ بِالْمَعْرُوفِ ۚ وَلِلرِّجَالِ عَلَيْهِنَّ دَرَجَةٌ ۗ وَاللَّـهُ عَزِيزٌ حَكِيمٌ ٢٢٨

మరియు విడాకులివ్వబడిన స్త్రీలు మూడు ఋతువుల వరకు (మరొకనితో పెండ్లి చేసుకోకుండా) వేచి ఉండాలి. 173 మరియు వారు అల్లాహ్‌ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాసమున్నవారే అయితే, అల్లాహ్‌ వారి గర్భాలలో సృష్టించిన దానిని దాచటం వారికి ధర్మసమ్మతం కాదు. 174 మరియు వారిభర్తలు దాంపత్య సంబంధాలను సరిదిద్దుకోవటానికి సిధ్ధంగా ఉంటే! ఈ నిరీక్షణ కాలంలో వారిని తమ భార్యలుగా తిరిగి స్వీకరించే హక్కు వారికి ఉంది. మరియు వారికి (స్త్రీలకు) వారి (భర్తల)పై ధర్మ సమ్మతమైన హక్కులున్నాయి, ఏ విధంగానైతే వారికి (భర్తలకు) వారిపై ఉన్నాయో. కాని పురుషులకు స్త్రీలపై (కర్తవ్య) ఆధిక్యత ఉంది 175 మరియు అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

2:229 – الطَّلَاقُ مَرَّتَانِ ۖ فَإِمْسَاكٌ بِمَعْرُوفٍ أَوْ تَسْرِيحٌ بِإِحْسَانٍ ۗ وَلَا يَحِلُّ لَكُمْ أَن تَأْخُذُوا مِمَّا آتَيْتُمُوهُنَّ شَيْئًا إِلَّا أَن يَخَافَا أَلَّا يُقِيمَا حُدُودَ اللَّـهِ ۖ فَإِنْ خِفْتُمْ أَلَّا يُقِيمَا حُدُودَ اللَّـهِ فَلَا جُنَاحَ عَلَيْهِمَا فِيمَا افْتَدَتْ بِهِ ۗ تِلْكَ حُدُودُ اللَّـهِ فَلَا تَعْتَدُوهَا ۚ وَمَن يَتَعَدَّ حُدُودَ اللَّـهِ فَأُولَـٰئِكَ هُمُ الظَّالِمُونَ ٢٢٩

విడాకులు రెండుసార్లే! ఆ తర్వాత (భార్యను) సహృదయంతో తమవద్ద ఉండ నివ్వాలి, లేదా ఆమెను మంచితనంతో సాగ నంపాలి. 176 మరియు సాగనంపేటప్పుడు మీరు వారికిచ్చిన వాటి నుండి ఏమైనా తిరిగి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అల్లాహ్‌ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేము అనే భయం ఆ ఇద్దరికీ ఉంటే తప్ప! కాని అల్లాహ్‌ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమనే భయం ఆ దంపతులకు ఉంటే స్త్రీ పరిహారమిచ్చి (విడాకులు / ఖులా’ తీసుకుంటే) అందులో వారికి ఎలాంటి దోషంలేదు. 177 ఇవి అల్లాహ్‌ విధించిన హద్దులు, కావున వీటిని అతిక్రమించకండి. మరియు ఎవరైతే అల్లాహ్‌ విధించిన హద్దులను అతిక్రమిస్తారో, అలాంటి వారే దుర్మార్గులు 178

2:230 – فَإِن طَلَّقَهَا فَلَا تَحِلُّ لَهُ مِن بَعْدُ حَتَّىٰ تَنكِحَ زَوْجًا غَيْرَهُ ۗ فَإِن طَلَّقَهَا فَلَا جُنَاحَ عَلَيْهِمَا أَن يَتَرَاجَعَا إِن ظَنَّا أَن يُقِيمَا حُدُودَ اللَّـهِ ۗ وَتِلْكَ حُدُودُ اللَّـهِ يُبَيِّنُهَا لِقَوْمٍ يَعْلَمُونَ ٢٣٠

ఒకవేళ అతడు (మూడవసారి) విడాకు లిస్తే, ఆ తర్వాత ఆ స్త్రీ అతనికి ధర్మసమ్మతం కాదు, ఆమె వివాహం వేరే పురుషునితో జరిగితే తప్ప! ఒకవేళ అతడు (రెండవ భర్త) ఆమెకు విడాకులిస్తే! అప్పుడు ఉభయులూ (మొదటి భర్త, ఈ స్త్రీ) తాము అల్లాహ్‌ హద్దులకు లోబడి ఉండగలమని భావిస్తే వారు పునర్వివాహం చేసుకోవటంలో దోషం లేదు. మరియు ఇవి అల్లాహ్‌ నియమించిన హద్దులు. వీటిని ఆయన గ్రహించే వారికి స్పష్టపరుస్తున్నాడు.

2:231 – وَإِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَبَلَغْنَ أَجَلَهُنَّ فَأَمْسِكُوهُنَّ بِمَعْرُوفٍ أَوْ سَرِّحُوهُنَّ بِمَعْرُوفٍ ۚ وَلَا تُمْسِكُوهُنَّ ضِرَارًا لِّتَعْتَدُوا ۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ فَقَدْ ظَلَمَ نَفْسَهُ ۚ وَلَا تَتَّخِذُوا آيَاتِ اللَّـهِ هُزُوًا ۚ وَاذْكُرُوا نِعْمَتَ اللَّـهِ عَلَيْكُمْ وَمَا أَنزَلَ عَلَيْكُم مِّنَ الْكِتَابِ وَالْحِكْمَةِ يَعِظُكُم بِهِ ۚ وَاتَّقُوا اللَّـهَ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ٢٣١

మరియు మీరు స్త్రీలకు విడాకులిచ్చి నప్పుడు, వారి కొరకు నిర్ణయింపబడిన గడువు (‘ఇద్దత్‌) సమీపిస్తే వారిని సహృదయంతో మీవద్ద ఉంచుకోండి, లేదా సహృదయంతో విడిచిపెట్టండి. కేవలం వారికి బాధకలిగించే మరియు పీడించే ఉద్దేశ్యంతో వారిని ఉంచుకోకండి. మరియు ఆ విధంగా చేసేవాడు వాస్తవానికి తనకు తానే అన్యాయం చేసుకున్నట్లు. మరియు అల్లాహ్‌ ఆదేశాలను (ఆయాత్‌ లను) పరిహాసంగా తీసుకోకండి. మరియు అల్లాహ్‌ మీకు చేసిన అనుగ్రహాన్ని మరియు మీపై అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు వివేకాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన (అల్లాహ్‌) మీకు ఈ విధంగా బోధిస్తున్నాడు. మరియు అల్లాహ్‌ యందు భయ- భక్తులు కలిగి ఉండండి మరియు నిశ్చయంగా, అల్లాహ్‌కు ప్రతి విషయం గురించి బాగా తెలుసని తెలుసుకోండి. మరియు మీరు మీ బిడ్డలకు వేరే స్త్రీ ద్వారా పాలు ఇప్పించే ఏర్పాటు చేయదలిస్తే, మీపై ఎలాంటి దోషంలేదు. కాని మీరు ఆమెకు (తల్లికి) ఇవ్వ వలసింది ధర్మసమ్మతంగా చెల్లించాలి. అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. మరియు మీరు చేసేదంతా నిశ్చయంగా, అల్లాహ్‌ చూస్తున్నాడని తెలుసుకోండి. 0

2:232 – وَإِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَبَلَغْنَ أَجَلَهُنَّ فَلَا تَعْضُلُوهُنَّ أَن يَنكِحْنَ أَزْوَاجَهُنَّ إِذَا تَرَاضَوْا بَيْنَهُم بِالْمَعْرُوفِ ۗ ذَٰلِكَ يُوعَظُ بِهِ مَن كَانَ مِنكُمْ يُؤْمِنُ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ ۗ ذَٰلِكُمْ أَزْكَىٰ لَكُمْ وَأَطْهَرُ ۗ وَاللَّـهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ ٢٣٢

మరియు మీరు మీ స్త్రీలకు (మొదటిసారి లేక రెండవసారి) విడాకులిస్తే, వారు తమ నిరీక్షణా వ్యవధిని (‘ఇద్దత్‌ను) పూర్తి చేసిన తరువాత, తమ (మొదటి) భర్తలను ధర్మసమ్మతంగా పరస్పర అంగీకారంతో వివాహం చేసుకోదలిస్తే, మీరు వారిని ఆటంకపరచకండి. మీలో ఎవరికి అల్లాహ్‌ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాస ముందో, వారికి ఈ బోధనచేయబడుతోంది. ఇది మీకు నిష్కళంకమైనది మరియు నిర్మలమైనది. మరియు అల్లాహ్‌కు అంతా తెలుసు, కాని మీకు ఏమీ తెలియదు. (3/4)

2:233 – وَالْوَالِدَاتُ يُرْضِعْنَ أَوْلَادَهُنَّ حَوْلَيْنِ كَامِلَيْنِ ۖ لِمَنْ أَرَادَ أَن يُتِمَّ الرَّضَاعَةَ ۚ وَعَلَى الْمَوْلُودِ لَهُ رِزْقُهُنَّ وَكِسْوَتُهُنَّ بِالْمَعْرُوفِ ۚ لَا تُكَلَّفُ نَفْسٌ إِلَّا وُسْعَهَا ۚ لَا تُضَارَّ وَالِدَةٌ بِوَلَدِهَا وَلَا مَوْلُودٌ لَّهُ بِوَلَدِهِ ۚ وَعَلَى الْوَارِثِ مِثْلُ ذَٰلِكَ ۗ فَإِنْ أَرَادَا فِصَالًا عَن تَرَاضٍ مِّنْهُمَا وَتَشَاوُرٍ فَلَا جُنَاحَ عَلَيْهِمَا ۗ وَإِنْ أَرَدتُّمْ أَن تَسْتَرْضِعُوا أَوْلَادَكُمْ فَلَا جُنَاحَ عَلَيْكُمْ إِذَا سَلَّمْتُم مَّا آتَيْتُم بِالْمَعْرُوفِ ۗ وَاتَّقُوا اللَّـهَ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ٢٣٣

  • (విడాకుల తరువాత) పూర్తి రెండు సంవత్సరాల పాల గడువు పూర్తిచేయవలెనని (తల్లి-దండ్రులు) కోరినట్లయితే, తల్లులు తమ పిల్లలకు పాలివ్వాలి. బిడ్డ తండ్రిపై, వారికి తగు రీతిగా భోజనం మరియు వస్త్రాలిచ్చి పోషించ వలసిన బాధ్యత ఉంటుంది. శక్తికి మించిన భారం ఏ వ్యక్తిపై కూడా మోపబడదు. తల్లి తనబిడ్డ వలన కష్టాలకు గురికాకూడదు. మరియు తండ్రికూడా తన బిడ్డవలన (కష్టాలకు గురికాకూడదు). మరియు (పాలిచ్చే తల్లిని పోషించేబాధ్యత తండ్రిపై ఉన్నట్లు తండ్రి చనిపోతే) అతని వారసులపై కూడా ఉంటుంది. మరియు (తల్లి-దండ్రులు) ఇరువురు సంప్రదించుకొని పరస్పర అంగీకారంతో (రెండు సంవత్సరాలు పూర్తికాక ముందే) బిడ్డచేత పాలు విడిపిస్తే, వారిరువురికి ఎలాంటి దోషంలేదు. 0

2:234 – وَالَّذِينَ يُتَوَفَّوْنَ مِنكُمْ وَيَذَرُونَ أَزْوَاجًا يَتَرَبَّصْنَ بِأَنفُسِهِنَّ أَرْبَعَةَ أَشْهُرٍ وَعَشْرًا ۖ فَإِذَا بَلَغْنَ أَجَلَهُنَّ فَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا فَعَلْنَ فِي أَنفُسِهِنَّ بِالْمَعْرُوفِ ۗ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ ٢٣٤

మరియు మీలో ఎవరైనా మరణించి, భార్యలను వదలి పోయినట్లైతే! (అలాంటి విధవలు) నాలుగు నెలల పది రోజులు (రెండవ పెండ్లి చేసుకోకుండా) వేచిఉండాలి. 179 వారి గడువు పూర్తి అయిన తరువాత వారు తమకు ఉచిత మైనది, ధర్మసమ్మతంగా చేసుకుంటే మీపై దోషంలేదు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును.

2:235 – وَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا عَرَّضْتُم بِهِ مِنْ خِطْبَةِ النِّسَاءِ أَوْ أَكْنَنتُمْ فِي أَنفُسِكُمْ ۚ عَلِمَ اللَّـهُ أَنَّكُمْ سَتَذْكُرُونَهُنَّ وَلَـٰكِن لَّا تُوَاعِدُوهُنَّ سِرًّا إِلَّا أَن تَقُولُوا قَوْلًا مَّعْرُوفًا ۚ وَلَا تَعْزِمُوا عُقْدَةَ النِّكَاحِ حَتَّىٰ يَبْلُغَ الْكِتَابُ أَجَلَهُ ۚ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ يَعْلَمُ مَا فِي أَنفُسِكُمْ فَاحْذَرُوهُ ۚ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ غَفُورٌ حَلِيمٌ ٢٣٥

మరియు మీరు (వితంతువు లేక మూడు విడాకులు పొందిన స్త్రీలతో) వివాహం చేసుకో వాలనే సంకల్పాన్ని (వారి నిరీక్షణాకాలంలో) పరోక్షంగా తెలిపినా లేక దానిని మీ మనస్సులలో గోప్యంగా ఉంచినా మీపై దోషంలేదు. మీరు వారితో (వివాహమాడటం గురించి) ఆలోచిస్తున్నారని అల్లాహ్‌కు తెలుసు, కానీ వారితో రహస్యంగా ఎలాంటి ఒప్పందం చేసుకోకండి. అయితే మీ రేదైనా మాట్లాడదలచుకుంటే, ధర్మసమ్మతమైన రీతిలో మాట్లాడుకోండి. మరియు నిరీక్షణా వ్యవధి పూర్తయ్యేంత వరకు వివాహం చేసుకోకండి. నిశ్చయంగా, మీ మనస్సులలో ఉన్నదంతా అల్లాహ్‌కు తెలుసని తెలుసుకొని, ఆయనకు భయపడండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, సహనశీలుడు (శాంత స్వభావుడు) అని తెలుసుకోండి.

2:236 – لَّا جُنَاحَ عَلَيْكُمْ إِن طَلَّقْتُمُ النِّسَاءَ مَا لَمْ تَمَسُّوهُنَّ أَوْ تَفْرِضُوا لَهُنَّ فَرِيضَةً ۚ وَمَتِّعُوهُنَّ عَلَى الْمُوسِعِ قَدَرُهُ وَعَلَى الْمُقْتِرِ قَدَرُهُ مَتَاعًا بِالْمَعْرُوفِ ۖ حَقًّا عَلَى الْمُحْسِنِينَ ٢٣٦

మీరు మీ స్త్రీలను ముట్టుకోకముందే, లేక వారి మహ్ర్‌ నిర్ణయం కాక పూర్వమే, వారికి విడాకులిస్తే, అది పాపం కాదు. మరియు వారికి కొంత పారితోషికంగా తప్పకుండా ఇవ్వండి. మరియు ధనవంతుడు తన శక్తిమేరకు, పేదవాడు తన స్థితిని బట్టి ధర్మసమ్మతమైనవిధంగా పారి తోషికం ఇవ్వాలి. ఇది సజ్జనులైన వారి విద్యుక్త ధర్మం.

2:237 – وَإِن طَلَّقْتُمُوهُنَّ مِن قَبْلِ أَن تَمَسُّوهُنَّ وَقَدْ فَرَضْتُمْ لَهُنَّ فَرِيضَةً فَنِصْفُ مَا فَرَضْتُمْ إِلَّا أَن يَعْفُونَ أَوْ يَعْفُوَ الَّذِي بِيَدِهِ عُقْدَةُ النِّكَاحِ ۚ وَأَن تَعْفُوا أَقْرَبُ لِلتَّقْوَىٰ ۚ وَلَا تَنسَوُا الْفَضْلَ بَيْنَكُمْ ۚ إِنَّ اللَّـهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ٢٣٧

మరియు మీరు తాకక పూర్వమే మీ స్త్రీలకు విడాకులిస్తే మరియు వాస్తవానికి అప్పటికే వారి మహ్ర్‌ (వధుకట్నం) నిర్ణయించబడి ఉంటే, సగం మహ్ర్‌ చెల్లించండి, కానీ స్త్రీ క్షమించి విడిచిపెడ్తే, లేదా వివాహసంబంధ అధికారం ఎవని చేతిలో ఉందో అతడు (భర్త) గానీ క్షమించి విడిచిపెట్టగోరితే తప్ప! 180 మరియు క్షమించటమే దైవభీతికి సన్నిహితమైనది. మరియు మీరు పరస్పర వ్యవహారాలలో ఔదార్యం చూపటం మరచిపోవద్దు. నిశ్చయంగా, అల్లాహ్‌ మీరు చేసేదంతా చూస్తున్నాడు.

2:238 – حَافِظُوا عَلَى الصَّلَوَاتِ وَالصَّلَاةِ الْوُسْطَىٰ وَقُومُوا لِلَّـهِ قَانِتِينَ ٢٣٨

మీరు మీ నమా’జ్‌లను కాపాడుకోండి మరియు (ముఖ్యంగా) మధ్య నమా’జ్‌ను 181 మరియు అల్లాహ్‌ సన్నిధానంలో వినయ- విధేయతలతో నిలబడండి.

2:239 – فَإِنْ خِفْتُمْ فَرِجَالًا أَوْ رُكْبَانًا ۖ فَإِذَا أَمِنتُمْ فَاذْكُرُوا اللَّـهَ كَمَا عَلَّمَكُم مَّا لَمْ تَكُونُوا تَعْلَمُونَ ٢٣٩

మీరు ప్రమాదస్థితిలో ఉన్నప్పుడు నడుస్తూ గానీ, స్వారీచేస్తూగానీ, నమా’జ్‌ చేయ వచ్చు. 182 కాని మీకు శాంతి-భద్రతలు లభించి నప్పుడు, ఆయన మీకు నేర్పినట్లు అల్లాహ్‌ను స్మరించండి. ఎందుకంటే ఈ పద్దతి ఇంతకు పూర్వం మీకు తెలియదు.

2:240 – وَالَّذِينَ يُتَوَفَّوْنَ مِنكُمْ وَيَذَرُونَ أَزْوَاجًا وَصِيَّةً لِّأَزْوَاجِهِم مَّتَاعًا إِلَى الْحَوْلِ غَيْرَ إِخْرَاجٍ ۚ فَإِنْ خَرَجْنَ فَلَا جُنَاحَ عَلَيْكُمْ فِي مَا فَعَلْنَ فِي أَنفُسِهِنَّ مِن مَّعْرُوفٍ ۗ وَاللَّـهُ عَزِيزٌ حَكِيمٌ ٢٤٠

మరియు మీలో మరణించిన వారు భార్యలను వదలిపోతే, వారు తమ భార్యలకు ఒక సంవత్సరపు భరణపు ఖర్చులు ఇవ్వాలనీ, వారిని ఇంటి నుండి వెడలగొట్టవద్దనీ వీలునామా వ్రాయాలి. 183 కానీ వారు తమంతట-తామే వెళ్ళి పోయి, తమ విషయంలో ధర్మసమ్మతంగా ఏమి చేసినా మీపై పాపంలేదు. మరియు అల్లాహ్‌ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

2:241 – وَلِلْمُطَلَّقَاتِ مَتَاعٌ بِالْمَعْرُوفِ ۖ حَقًّا عَلَى الْمُتَّقِينَ ٢٤١

మరియు విడాకులివ్వబడినస్త్రీలకు ధర్మ ప్రకారంగా భరణపు ఖర్చులు ఇవ్వాలి. ఇది దైవభీతి గలవారి విధి.

2:242 – كَذَٰلِكَ يُبَيِّنُ اللَّـهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ ٢٤٢

ఈ విధంగా అల్లాహ్‌ తన ఆజ్ఞలను (ఆయత్‌లను) మీకు స్పష్టంగా తెలుపుతున్నాడు. బహుశా మీరు అర్థం చేసుకుంటారని. (7/8)

2:243 – أَلَمْ تَرَ إِلَى الَّذِينَ خَرَجُوا دِيَارِهِمْ وَهُمْ أُلُوفٌ حَذَرَ الْمَوْتِ فَقَالَ لَهُمُ اللَّـهُ مُوتُوا ثُمَّ أَحْيَاهُمْ ۚ إِنَّ اللَّـهَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَشْكُرُونَ ٢٤٣

ఏమీ? మృత్యుభయంతో, వేల సంఖ్యలో ప్రజలు తమ ఇండ్లను వదలిపోయింది నీకు తెలియదా? అప్పుడు అల్లాహ్‌ వారితో: ”మరణించండి!” అని అన్నాడు కాని, తరువాత వారిని బ్రతికించాడు 184 నిశ్చయంగా, అల్లాహ్‌ మానవుల పట్ల అత్యంత అనుగ్రహం గలవాడు, కాని చాలామంది కృతజ్ఞతలు చూపరు.

2:244 – وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّـهِ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ سَمِيعٌ عَلِيمٌ ٢٤٤

మరియు మీరు అల్లాహ్‌ మార్గంలో యుధ్ధం చేయండి మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు, అని తెలుసుకోండి.

2:245 – مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّـهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ أَضْعَافًا كَثِيرَةً ۚ وَاللَّـهُ يَقْبِضُ وَيَبْسُطُ وَإِلَيْهِ تُرْجَعُونَ ٢٤٥

అల్లాహ్‌కు మంచిరుణం ఇచ్చేవాడు, మీలో ఎవడు? 185 ఎందుకంటే ఆయన దానిని ఎన్నోరెట్లు అధికంచేసి తిరిగిఇస్తాడు. అల్లాహ్‌ మాత్రమే (సంపదలను) తగ్గించేవాడూ మరియు హెచ్చించే వాడూను మరియు మీరంతా ఆయన వైపునకే మరలి పోవలసి ఉంది.

2:246 – أَلَمْ تَرَ إِلَى الْمَلَإِ مِن بَنِي إِسْرَائِيلَ مِن بَعْدِ مُوسَىٰ إِذْ قَالُوا لِنَبِيٍّ لَّهُمُ ابْعَثْ لَنَا مَلِكًا نُّقَاتِلْ فِي سَبِيلِ اللَّـهِ ۖ قَالَ هَلْ عَسَيْتُمْ إِن كُتِبَ عَلَيْكُمُ الْقِتَالُ أَلَّا تُقَاتِلُوا ۖ قَالُوا وَمَا لَنَا أَلَّا نُقَاتِلَ فِي سَبِيلِ اللَّـهِ وَقَدْ أُخْرِجْنَا مِن دِيَارِنَا وَأَبْنَائِنَا ۖ فَلَمَّا كُتِبَ عَلَيْهِمُ الْقِتَالُ تَوَلَّوْا إِلَّا قَلِيلًا مِّنْهُمْ ۗ وَاللَّـهُ عَلِيمٌ بِالظَّالِمِينَ ٢٤٦

ఏమీ? మూసా (నిర్యాణం) తరువాత ఇస్రాయీ’లు సంతతి నాయకులు, తమ ఒక ప్రవక్తతో: ”నీవు మా కొరకు ఒక రాజును నియమించు, మేము అల్లాహ్‌ మార్గంలో యుధ్ధం (జిహాద్‌) చేస్తాము.” అని పలికిన సంగతి నీకు తెలియదా? 186 దానికి అతను: ”ఒకవేళ యుధ్ధం చేయమని ఆదేశిస్తే, మీరు యుద్ధం చేయటానికి నిరాకరించరు కదా?” అని అన్నాడు. దానికి వారు: ”మేము మరియు మా సంతానం, మా ఇండ్ల నుండి గెంటివేయబడ్డాము కదా! అలాంటప్పుడు మేము అల్లాహ్‌ మార్గంలో ఎందుకు యుధ్ధం చేయము?” అని జవాబిచ్చారు. కాని యుధ్ధం చేయండని ఆజ్ఞాపించగానే, వారిలో కొందరు తప్ప, అందరూ వెన్నుచూపారు. మరియు అల్లాహ్‌కు ఈ దుర్మార్గులను గురించి బాగా తెలుసు.

2:247 – وَقَالَ لَهُمْ نَبِيُّهُمْ إِنَّ اللَّـهَ قَدْ بَعَثَ لَكُمْ طَالُوتَ مَلِكًا ۚ قَالُوا أَنَّىٰ يَكُونُ لَهُ الْمُلْكُ عَلَيْنَا وَنَحْنُ أَحَقُّ بِالْمُلْكِ مِنْهُ وَلَمْ يُؤْتَ سَعَةً مِّنَ الْمَالِ ۚ قَالَ إِنَّ اللَّـهَ اصْطَفَاهُ عَلَيْكُمْ وَزَادَهُ بَسْطَةً فِي الْعِلْمِ وَالْجِسْمِ ۖ وَاللَّـهُ يُؤْتِي مُلْكَهُ مَن يَشَاءُ ۚ وَاللَّـهُ وَاسِعٌ عَلِيمٌ ٢٤٧

మరియు వారి ప్రవక్త (సామ్యూల్‌) వారితో: ”నిశ్చయంగా, అల్లాహ్‌ మీ కొరకు ‘తాలూత్‌ను (సౌల్‌ను) రాజుగా నియమించాడు.” అని అన్నాడు. దానికి వారు అన్నారు: ”మాపై రాజ్యం చేసే హక్కు అతనికి ఎలా సంక్రమిస్తుంది? వాస్తవానికి, రాజ్యం చేసే హక్కు, అతని కంటే ఎక్కువ, మాకే ఉంది. మరియు అతను అత్యధిక ధనసంపత్తులున్నవాడునూ కాడు.” (దానికి వారి ప్రవక్త) అన్నాడు: ”నిశ్చయంగా, అల్లాహ్‌ మీలో అతనిని ఎన్నుకొని అతనికి బుద్ధిబలాన్నీ, శారీరక బలాన్నీ సమృధ్ధిగా ప్రసాదించాడు. మరియు అల్లాహ్‌ తాను కోరిన వారికి తన రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్‌ విస్తారుడు, 187 సర్వజ్ఞుడు.”

2:248 – وَقَالَ لَهُمْ نَبِيُّهُمْ إِنَّ آيَةَ مُلْكِهِ أَن يَأْتِيَكُمُ التَّابُوتُ فِيهِ سَكِينَةٌ مِّن رَّبِّكُمْ وَبَقِيَّةٌ مِّمَّا تَرَكَ آلُ مُوسَىٰ وَآلُ هَارُونَ تَحْمِلُهُ الْمَلَائِكَةُ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ ٢٤٨

మరియు వారితో వారి ప్రవక్త (సామ్యూల్‌) ఇలా అన్నాడు: ”నిశ్చయంగా, అతని ఆధి పత్యానికి లక్షణం ఏమిటంటే, అతని ప్రభుత్వ కాలంలో ఆ పెట్టె (తాబూత్‌) మీకు తిరిగి లభిస్తుంది. అందులో మీకు మీ ప్రభువు తరఫు నుండి, మనశ్శాంతి లభిస్తుంది. మరియు అందులో మూసా సంతతి మరియు హారూన్‌ సంతతివారు వదలి వెళ్ళిన పవిత్ర అవశేషాలు, దేవదూతల ద్వారా మీకు లభిస్తాయి. మీరు విశ్వసించిన వారే అయితే! నిశ్చయంగా, ఇందులో మీకు ఒక గొప్ప సూచన ఉంది.”

2:249 – فَلَمَّا فَصَلَ طَالُوتُ بِالْجُنُودِ قَالَ إِنَّ اللَّـهَ مُبْتَلِيكُم بِنَهَرٍ فَمَن شَرِبَ مِنْهُ فَلَيْسَ مِنِّي وَمَن لَّمْ يَطْعَمْهُ فَإِنَّهُ مِنِّي إِلَّا مَنِ اغْتَرَفَ غُرْفَةً بِيَدِهِ ۚ فَشَرِبُوا مِنْهُ إِلَّا قَلِيلًا مِّنْهُمْ فَلَمَّا جَاوَزَهُ هُوَ وَالَّذِينَ آمَنُوا مَعَهُ قَالُوا لَا طَاقَةَ لَنَا الْيَوْمَ بِجَالُوتَ وَجُنُودِهِ ۚ قَالَ الَّذِينَ يَظُنُّونَ أَنَّهُم مُّلَاقُو اللَّـهِ كَم مِّن فِئَةٍ قَلِيلَةٍ غَلَبَتْ فِئَةً كَثِيرَةً بِإِذْنِ اللَّـهِ ۗ وَاللَّـهُ مَعَ الصَّابِرِينَ ٢٤٩

ఆ పిదప ‘తాలూత్‌ (సౌల్‌) తన సైన్యంతో బయలుదేరుతూ అన్నాడు: ”నిశ్చయంగా, అల్లాహ్‌ ఒక నది 188 ద్వారా మిమ్మల్ని పరీక్షించ బోతున్నాడు. దాని నుండి నీరు త్రాగినవాడు నావాడు కాడు. మరియు నది నీటిని రుచిచూడని వాడు నిశ్చయంగా నావాడు, కాని చేతితో గుక్కెడు త్రాగితే ఫర్వాలేదు.” అయితే వారిలో కొందరు తప్ప అందరూ దాని నుండి (కడుపునిండా నీరు) త్రాగారు. అతను మరియు అతని వెంట విశ్వాసులు ఆ నదిని దాటిన తరువాత వారన్నారు: ”జాలూత్‌తో మరియు అతని సైన్యంతో పోరాడే శక్తి ఈరోజు మాలో లేదు.” (కానీ ఒక రోజున) అల్లాహ్‌ను కలవడం తప్పదని భావించిన వారన్నారు: ”అల్లాహ్‌ అనుమతితో, ఒక చిన్న వర్గం ఒక పెద్ద వర్గాన్ని జయించటం ఎన్నోసార్లు జరిగింది. మరియు అల్లాహ్‌ స్థైర్యం గలవారితోనే ఉంటాడు.”

2:250 – وَلَمَّا بَرَزُوا لِجَالُوتَ وَجُنُودِهِ قَالُوا رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَثَبِّتْ أَقْدَامَنَا وَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ ٢٥٠

జాలూత్‌ (గోలియత్‌) మరియు అతని సైన్యాన్ని ఎదుర్కోవటానికి బయలుదేరి, వారు: ”ఓ మా ప్రభూ! మాకు (ధైర్య) స్థైర్యాలను ప్రసాదించు, మా పాదాలను స్థిరంగా నిలుపు. మరియు సత్య-తిరస్కారులకు విరుధ్ధంగా (పోరాడ టానికి) మాకు సహాయపడు.” అని ప్రార్థించారు.

2:251 – فَهَزَمُوهُم بِإِذْنِ اللَّـهِ وَقَتَلَ دَاوُودُ جَالُوتَ وَآتَاهُ اللَّـهُ الْمُلْكَ وَالْحِكْمَةَ وَعَلَّمَهُ مِمَّا يَشَاءُ ۗ وَلَوْلَا دَفْعُ اللَّـهِ النَّاسَ بَعْضَهُم بِبَعْضٍ لَّفَسَدَتِ الْأَرْضُ وَلَـٰكِنَّ اللَّـهَ ذُو فَضْلٍ عَلَى الْعَالَمِينَ ٢٥١

ఆ తరువాత వారు, అల్లాహ్‌ అనుమతితో వారిని (సత్య-తిరస్కారులను) ఓడించారు, మరియు దావూద్‌, జాలూతును సంహ రించాడు. 189 మరియు అల్లాహ్‌ అతనికి (దావూద్‌కు) రాజ్యాధికారం మరియు జ్ఞానం ప్రసాదించి, తాను కోరిన విషయాలను అతనికి బోధించాడు. ఈ విధంగా అల్లాహ్‌ ప్రజలను, ఒకరి నుండి మరొకరిని కాపాడకుంటే, భూమిలో కల్లోలం వ్యాపించి ఉండేది, కానీ అల్లాహ్‌ సమస్తలోకాల మీద ఎంతో అనుగ్రహం గలవాడు. 190

2:252 – تِلْكَ آيَاتُ اللَّـهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۚ وَإِنَّكَ لَمِنَ الْمُرْسَلِينَ ٢٥٢

ఇవన్నీ అల్లాహ్‌ సందేశాలు వాటిని మేము యథాతథంగా నీకు వినిపిస్తున్నాము. మరియు (ఓ ము’హమ్మద్‌!) నిశ్చయంగా, నీవు (మా) సందేశ హరులలో ఒకడవు. 191

2:253 – تِلْكَ الرُّسُلُ فَضَّلْنَا بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ ۘ مِّنْهُم مَّن كَلَّمَ اللَّـهُ ۖ وَرَفَعَ بَعْضَهُمْ دَرَجَاتٍ ۚ وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنَاتِ وَأَيَّدْنَاهُ بِرُوحِ الْقُدُسِ ۗ وَلَوْ شَاءَ اللَّـهُ مَا اقْتَتَلَ الَّذِينَ مِن بَعْدِهِم مِّن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ وَلَـٰكِنِ اخْتَلَفُوا فَمِنْهُم مَّنْ آمَنَ وَمِنْهُم مَّن كَفَرَ ۚ وَلَوْ شَاءَ اللَّـهُ مَا اقْتَتَلُوا وَلَـٰكِنَّ اللَّـهَ يَفْعَلُ مَا يُرِيدُ ٢٥٣

[(*)] ఆ సందేశహరులు! మేము వారిలో కొందరికి మరికొందరిపై ఆధిక్యత నిచ్చాము. 192 వారిలో కొందరితో అల్లాహ్‌ (నేరుగా) మాట్లా డాడు 193 మరికొందరిని (గౌరవనీయమైన) ఉన్నత స్థానాలకు ఎత్తాడు. మరియు మర్యమ్‌ కుమారుడు ‘ఈసా (ఏసు) కు మేము స్పష్టమైన సూచనలు ప్రసాదించి, అతనిని పరిశుద్ధాత్మ (జిబ్రీల్‌) సహాయంతో బలపరిచాము. మరియు – అల్లాహ్‌ తలుచుకుంటే – ఈ ప్రవక్తల తరువాత వచ్చిన ప్రజలు, వారికి స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కూడా పరస్పరం కలహించు కునేవారు కాదు. కానీ, వారు పరస్పర విభేదాలకు లోనయ్యారు, కావున వారిలో కొందరు విశ్వాసు లయ్యారు మరికొందరు సత్య-తిరస్కారులు అయ్యారు. మరియు అల్లాహ్‌ తలుచుకుంటే వారు పరస్పరం కలహించుకునేవారు కాదు, కాని అల్లాహ్‌ తాను కోరిందే చేస్తాడు. 194

2:254 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا بَيْعٌ فِيهِ وَلَا خُلَّةٌ وَلَا شَفَاعَةٌ ۗ وَالْكَافِرُونَ هُمُ الظَّالِمُونَ ٢٥٤

ఓ విశ్వాసులారా! ఏ బేరం గానీ, స్నేహం గానీ, సిఫారసు గానీ పనికిరాని దినం రాక ముందే, 195 మేము మీకు ప్రసాదించిన జీవనోపాధి నుండి (మా మార్గంలో) ఖర్చుపెట్టండి. మరియు సత్య-తిరస్కారులు, వారే! దుర్మార్గులు.

2:255 – اللَّـهُ لَا إِلَـٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ ۚ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ ۚ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۖ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ ۖ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا ۚ وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ ٢٥٥

అల్లాహ్‌! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. 196 ఆయన సజీవుడు, 197 విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు 198 ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో – ఆయన అనుజ్ఞ లేకుండా – సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందు ఉన్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. 199 మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ 200 ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు, 201 సర్వోత్తముడు.

2:256 – لَا إِكْرَاهَ فِي الدِّينِ ۖ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ ۚ فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّـهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا ۗ وَاللَّـهُ سَمِيعٌ عَلِيمٌ ٢٢٨

ధర్మం విషయంలో బలవంతం లేదు. 202 వాస్తవానికి సన్మార్గం (రుష్ద్‌), దుర్మార్గం నుండి సుస్పష్టం చేయబడింది. కావున కల్పిత దైవాన్ని (‘తా’గూత్‌ను) 203 తిరస్కరించి, అల్లాహ్‌ను విశ్వసించినవాడు, సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆధారాన్ని పట్టుకున్నట్లే. మరియు అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

2:257 – اللَّـهُ وَلِيُّ الَّذِينَ آمَنُوا يُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۖ وَالَّذِينَ كَفَرُوا أَوْلِيَاؤُهُمُ الطَّاغُوتُ يُخْرِجُونَهُم مِّنَ النُّورِ إِلَى الظُّلُمَاتِ ۗ أُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٢٥٧

అల్లాహ్‌ విశ్వసించిన వారి సంరక్షకుడు, ఆయన వారిని చీకటి నుండి తీసి వెలుగులోకి తెస్తాడు. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారి రక్షకులు కల్పితదైవాలు (‘తా’గూత్‌); అవి వారిని వెలుగు నుండి తీసి చీకటిలోనికి తీసుకొనిపోతాయి. అలాంటి వారు నరకాగ్నివాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

2:258 – أَلَمْ تَرَ إِلَى الَّذِي حَاجَّ إِبْرَاهِيمَ فِي رَبِّهِ أَنْ آتَاهُ اللَّـهُ الْمُلْكَ إِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّيَ الَّذِي يُحْيِي وَيُمِيتُ قَالَ أَنَا أُحْيِي وَأُمِيتُ ۖ قَالَ إِبْرَاهِيمُ فَإِنَّ اللَّـهَ يَأْتِي بِالشَّمْسِ مِنَ الْمَشْرِقِ فَأْتِ بِهَا مِنَ الْمَغْرِبِ فَبُهِتَ الَّذِي كَفَرَ ۗ وَاللَّـهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ ٢٥٨

ఏమీ? అల్లాహ్‌ (తన అనుగ్రహంతో) సామ్రాజ్యం ఇచ్చిన తరువాత, ఇబ్రాహీమ్‌తో అతని ప్రభువు (అల్లాహ్‌)ను గురించి వాదించిన వ్యక్తి (నమ్‌రూద్‌) విషయం నీకు తెలియదా? ఇబ్రాహీమ్‌: ”జీవన్మరణాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయో! ఆయనే నా ప్రభువు.” అని అన్నప్పుడు. అతడు: ”చావు-బ్రతుకులు రెండూ నా అధీనంలోనే ఉన్నాయి.” అని అన్నాడు. అప్పుడు ఇబ్రాహీమ్‌: ”సరే! అల్లాహ్‌ సూర్యుణ్ణి తూర్పునుండి ఉదయింపజేస్తాడు; అయితే నీవు (సూర్యుణ్ణి) పడమర నుండి ఉదయింపజెయ్యి.” అని అన్నాడు. దానితో ఆ సత్య-తిరస్కారి చికాకు పడ్డాడు. మరియు అల్లాహ్‌ దుర్మార్గం అవలం బించిన ప్రజలకు సన్మార్గం చూపడు.

2:259 – أَوْ كَالَّذِي مَرَّ عَلَىٰ قَرْيَةٍ وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا قَالَ أَنَّىٰ يُحْيِي هَـٰذِهِ اللَّـهُ بَعْدَ مَوْتِهَا ۖ فَأَمَاتَهُ اللَّـهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهُ ۖ قَالَ كَمْ لَبِثْتَ ۖ قَالَ لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ ۖ قَالَ بَل لَّبِثْتَ مِائَةَ عَامٍ فَانظُرْ إِلَىٰ طَعَامِكَ وَشَرَابِكَ لَمْ يَتَسَنَّهْ ۖ وَانظُرْ إِلَىٰ حِمَارِكَ وَلِنَجْعَلَكَ آيَةً لِّلنَّاسِ ۖ وَانظُرْ إِلَى الْعِظَامِ كَيْفَ نُنشِزُهَا ثُمَّ نَكْسُوهَا لَحْمًا ۚ فَلَمَّا تَبَيَّنَ لَهُ قَالَ أَعْلَمُ أَنَّ اللَّـهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٢٥٩

లేక! ఒక వ్యక్తి 204 ఇండ్ల కప్పులన్నీ కూలిపోయి, పాడుపడిన (తలక్రిందులై బోర్లాపడిన) నగరం మీదుగా పోతూ: ”వాస్తవానికి! నశించి పోయిన ఈ నగరానికి అల్లాహ్‌ తిరిగి ఏ విధంగా జీవం పోయగలడు? ” అని అన్నాడు. అప్పుడు అల్లాహ్‌ అతనిని మరణింపజేసి నూరు సంవత్స రాల తరువాత తిరిగి బ్రతికింపజేసి: ”ఈ స్థితిలో నీవు ఎంతకాలముంటివి?” అని అడిగాడు. అతడు: ”ఒక దినమో, లేక ఒక దినములో కొంత భాగమో!” అని అన్నాడు. దానికి ఆయన: ”కాదు, నీవు ఇక్కడ, ఈ (మరణించిన) స్థితిలో, నూరు సంవత్సరాలు ఉంటివి. ఇక నీ అన్నపానీయాల వైపు చూడు, వాటిలో ఏమార్పూ లేదు. ఇంకా నీవు నీ గాడిదను కూడా చూడు! మేము ప్రజల కొరకు నిన్ను దృష్టాంతంగా చేయదలిచాము. ఇక ఆ (గాడిద) ఎముకలను చూడు, ఏ విధంగా వాటిని ఉధ్ధరించి తిరిగి వాటిపై మాంసం కప్పుతామో!” అని అన్నాడు. ఇవి అతనికి స్పష్టంగా తెలిసిన తరువాత అతడు: ”నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడని నాకు (ఇప్పుడు) తెలిసింది!” అని అన్నాడు.

2:260 – وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ أَرِنِي كَيْفَ تُحْيِي الْمَوْتَىٰ ۖ قَالَ أَوَلَمْ تُؤْمِن ۖ قَالَ بَلَىٰ وَلَـٰكِن لِّيَطْمَئِنَّ قَلْبِي ۖ قَالَ فَخُذْ أَرْبَعَةً مِّنَ الطَّيْرِ فَصُرْهُنَّ إِلَيْكَ ثُمَّ اجْعَلْ عَلَىٰ كُلِّ جَبَلٍ مِّنْهُنَّ جُزْءًا ثُمَّ ادْعُهُنَّ يَأْتِينَكَ سَعْيًا ۚ وَاعْلَمْ أَنَّ اللَّـهَ عَزِيزٌ حَكِيمٌ ٢٦٠

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్‌: ”ఓ నా ప్రభూ! నీవు మృతులను ఎలా సజీవులుగా చేస్తావో నాకు చూపు!” అని అన్నప్పుడు. (అల్లాహ్‌) అన్నాడు: ”ఏమీ? నీకు విశ్వాసం లేదా? ”దానికి (ఇబ్రాహీమ్‌): ”ఉంది, కానీ నా మనస్సు తృప్తి కొరకు అడుగుతున్నాను!” అని అన్నాడు. అపుడు (అల్లాహ్‌): ”నాలుగు పక్షులను తీసుకో, వాటిని బాగా మచ్చికచేసుకో! తరువాత (వాటిని కోసి) ఒక్కొక్క దాని, ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క కొండపై పెట్టిరా, మళ్ళీ వాటిని రమ్మని పిలువు, అవి నీ వద్దకు ఎగురుకుంటూ వస్తాయి. కాబట్టి నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు అని తెలుసుకో!” అని అన్నాడు.

2:261 – مَّثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّـهِ كَمَثَلِ حَبَّةٍ أَنبَتَتْ سَبْعَ سَنَابِلَ فِي كُلِّ سُنبُلَةٍ مِّائَةُ حَبَّةٍ ۗ وَاللَّـهُ يُضَاعِفُ لِمَن يَشَاءُ ۗ وَاللَّـهُ وَاسِعٌ عَلِيمٌ ٢٦١

అల్లాహ్‌ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసేవారి ఉపమానం: ఆ విత్తనంవలే ఉంటుంది, దేనినుండి అయితే ఏడు వెన్నులు పుట్టి ప్రతి వెన్నులో నూరేసి గింజలు ఉంటాయో! మరియు అల్లాహ్‌ తాను కోరిన వారికి హెచ్చుగా నొసంగు తాడు. మరియు అల్లాహ్‌ విస్తారుడు, సర్వజ్ఞుడు.

2:262 – الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّـهِ ثُمَّ لَا يُتْبِعُونَ مَا أَنفَقُوا مَنًّا وَلَا أَذًى ۙ لَّهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ٢٦٢

ఎవరైతే, అల్లాహ్‌ మార్గంలో తమ ధనాన్ని వ్యయంచేసి, ఆ తరువాత తాము చేసిన ఉపకారాన్ని చెప్పుకుంటూ మరియు వారిని బాధిస్తూ ఉండరో, అలాంటి వారి ప్రతిఫలం, వారి ప్రభువు వద్ద ఉంది 205 మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా! (1/8)

2:263 – قَوْلٌ مَّعْرُوفٌ وَمَغْفِرَةٌ خَيْرٌ مِّن صَدَقَةٍ يَتْبَعُهَا أَذًى ۗ وَاللَّـهُ غَنِيٌّ حَلِيمٌ ٢٦٣

  • మనస్సును గాయపరిచే దానం కంటే, మృదుభాషణ మరియు క్షమాగుణం ఎంతో మేలైనవి. 206 మరియు అల్లాహ్‌ స్వయం సమృద్ధుడు, 207 సహనశీలుడు.

2:264 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُم بِالْمَنِّ وَالْأَذَىٰ كَالَّذِي يُنفِقُ مَالَهُ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ ۖ فَمَثَلُهُ كَمَثَلِ صَفْوَانٍ عَلَيْهِ تُرَابٌ فَأَصَابَهُ وَابِلٌ فَتَرَكَهُ صَلْدًا ۖ لَّا يَقْدِرُونَ عَلَىٰ شَيْءٍ مِّمَّا كَسَبُوا ۗ وَاللَّـهُ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ ٢٦٤

ఓ విశ్వాసులారా! (కేవలం) పరులకు చూపటానికి, తన ధనం ఖర్చుచేస్తూ అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించని వాని మాదిరిగా! మీరూ చేసిన మేలును చెప్పుకొని (ఉపకారం పొందిన వారిని) కష్టపెట్టి, మీ దాన-ధర్మాలను వ్యర్థ పరచుకోకండి. ఇలాంటి వాని పోలిక మట్టి కప్పు కున్న ఒక నున్ననిబండపై భారీవర్షం కురిసి (మట్టి కొట్టుకుపోగా) అది ఉత్తగా మిగిలిపోయినట్లుగా ఉంటుంది. 208 ఇలాంటి వారు తాము సంపాదించిన దాని నుండి ఏమీ చేయలేరు. మరియు అల్లాహ్‌ సత్య-తిరస్కారులకు సన్మార్గం చూపడు

2:265 – وَمَثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّـهِ وَتَثْبِيتًا مِّنْ أَنفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ أَصَابَهَا وَابِلٌ فَآتَتْ أُكُلَهَا ضِعْفَيْنِ فَإِن لَّمْ يُصِبْهَا وَابِلٌ فَطَلٌّ ۗ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ٢٦٥

మరియు అల్లాహ్‌ ప్రీతిపొందే ఉద్దేశంతో మరియు ఆత్మ స్థిరత్వంతో ధనాన్ని ఖర్చు చేసే వారి పోలిక: మెట్ట భూమిపై నున్న ఒక తోటవలె ఉంటుంది. దానిపై భారీవర్షం కురిసినపుడు అది రెండింతల ఫలమునిస్తుంది. భారీవర్షం కాక చినుకులు (కురిసినా దానికి చాలు). మరియు అల్లాహ్, మీరు చేసేదంతా చూస్తున్నాడు.

2:266 – أَيَوَدُّ أَحَدُكُمْ أَن تَكُونَ لَهُ جَنَّةٌ مِّن نَّخِيلٍ وَأَعْنَابٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ لَهُ فِيهَا مِن كُلِّ الثَّمَرَاتِ وَأَصَابَهُ الْكِبَرُ وَلَهُ ذُرِّيَّةٌ ضُعَفَاءُ فَأَصَابَهَا إِعْصَارٌ فِيهِ نَارٌ فَاحْتَرَقَتْ ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّـهُ لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُونَ ٢٦٦

ఏమీ? మీలో ఎవరికైనా ఖర్జూరపు మరియు ద్రాక్ష వనాలుండి, వాటి క్రిందినుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ, సర్వవిధాల ఫలాలు లభిస్తూ వుండి, అతనికి ముసలితనం వచ్చి, బలహీనులైన పిల్లలున్న సంకట సమయంలో ఆ తోట మంటలుగల సుడిగాలి వీచి కాలిపోవటం, ఎవరికైనా సమ్మతమేనా? మీరు ఆలోచించటానికి, ఈ విధంగా అల్లాహ్‌ తన సూచన (ఆయాత్‌) లను మీకు విశదీకరిస్తున్నాడు. 209

2:267 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِن طَيِّبَاتِ مَا كَسَبْتُمْ وَمِمَّا أَخْرَجْنَا لَكُم مِّنَ الْأَرْضِ ۖ وَلَا تَيَمَّمُوا الْخَبِيثَ مِنْهُ تُنفِقُونَ وَلَسْتُم بِآخِذِيهِ إِلَّا أَن تُغْمِضُوا فِيهِ ۚ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ غَنِيٌّ حَمِيدٌ ٢٦٧

ఓ విశ్వాసులారా! మీరు సంపాదించిన దాని నుండి మరియు మేము మీ కొరకు భూమి నుండి ఉత్పత్తి చేసిన వాటి నుండి, మేలైన వాటినే (అల్లాహ్‌ మార్గంలో) ఖర్చు పెట్టండి. ఏ వస్తువుల నైతే మీరు కండ్లుమూసుకునే గానీ తీసుకోరో, అలాంటి చెడ్డ వస్తువులను (ఇతరులపై) ఖర్చు చేయటానికి ఉద్దేశించకండి. మరియు అల్లాహ్‌ స్వయం సమృద్ధుడు, ప్రశంసనీయుడని 210 తెలుసుకోండి

2:268 – الشَّيْطَانُ يَعِدُكُمُ الْفَقْرَ وَيَأْمُرُكُم بِالْفَحْشَاءِ ۖ وَاللَّـهُ يَعِدُكُم مَّغْفِرَةً مِّنْهُ وَفَضْلًا ۗ وَاللَّـهُ وَاسِعٌ عَلِيمٌ ٢٦٨

షై’తాన్‌ దారిద్ర్య ప్రమాదం చూపి (భయ పెట్టి), మిమ్మల్ని నీచకార్యాలు చేయటానికి ప్రేరేపిస్తుంటాడు. కాని అల్లాహ్‌ తనవైపు నుండి మిమ్మల్ని క్షమిస్తానని, అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరియు అల్లాహ్‌ విస్తారుడు, 211 సర్వజ్ఞుడు

2:269 – يُؤْتِي الْحِكْمَةَ مَن يَشَاءُ ۚ وَمَن يُؤْتَ الْحِكْمَةَ فَقَدْ أُوتِيَ خَيْرًا كَثِيرًا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ ٍ ٢٦٩

ఆయన తాను కోరిన వారికి వివేకాన్ని ప్రసా దిస్తాడు. 212 మరియు వివేకం పొందినవాడు, వాస్త వంగా సర్వసంపదలను పొందినవాడే! కాని బుధ్ధి మంతులు తప్ప వేరే వారు దీనిని గ్రహించలేరు.

2:270 – وَمَا أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍ فَإِنَّ اللَّـهَ يَعْلَمُهُ ۗ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ ٢٧٠

మరియు, మీరు (ఇతరులపై) ఏమి ఖర్చు చేసినా, లేక ఏ మొక్కుబడి చేసుకున్నా, నిశ్చయంగా, అల్లాహ్‌కు అంతా తెలుస్తుంది. 213 మరియు దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు.

2:271 – إِن تُبْدُوا الصَّدَقَاتِ فَنِعِمَّا هِيَ ۖ وَإِن تُخْفُوهَا وَتُؤْتُوهَا الْفُقَرَاءَ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۚ وَيُكَفِّرُ عَنكُم مِّن سَيِّئَاتِكُمْ ۗ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ ٢٧١

మీరు బహిరంగంగా దానాలు చేయటం మంచిదే! కాని, గుప్తంగా నిరుపేదలకు ఇస్తే! అది మీకు అంతకంటే మేలైనది. మరియు ఆయన మీ ఎన్నో పాపాలను (దీని వల్ల) రద్దుచేస్తాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు. (1/4)

2:272 – لَّيْسَ عَلَيْكَ هُدَاهُمْ وَلَـٰكِنَّ اللَّـهَ يَهْدِي مَن يَشَاءُ ۗ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ فَلِأَنفُسِكُمْ ۚ وَمَا تُنفِقُونَ إِلَّا ابْتِغَاءَ وَجْهِ اللَّـهِ ۚ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ يُوَفَّ إِلَيْكُمْ وَأَنتُمْ لَا تُظْلَمُونَ ٢٧٢

  • (ఓ ప్రవక్తా!) వారిని సన్మార్గాన్ని అవలం బించేటట్లు చేయటం నీ బాధ్యత కాదు. కాని, అల్లాహ్‌ తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. మరియు మీరు మంచి మార్గంలో ఖర్చుచేసేది మీ (మేలు) కొరకే. మీరు ఖర్చుచేసేది అల్లాహ్‌ ప్రీతిని పొందటానికే అయిఉండాలి. మీరు మంచి మార్గంలో ఏమి ఖర్చుచేసినా, దాని ఫలితం మీకు పూర్తిగా లభిస్తుంది మరియు మీకు ఎలాంటి అన్యాయం జరుగదు.

2:273 – لِلْفُقَرَاءِ الَّذِينَ أُحْصِرُوا فِي سَبِيلِ اللَّـهِ لَا يَسْتَطِيعُونَ ضَرْبًا فِي الْأَرْضِ يَحْسَبُهُمُ الْجَاهِلُ أَغْنِيَاءَ مِنَ التَّعَفُّفِ تَعْرِفُهُم بِسِيمَاهُمْ لَا يَسْأَلُونَ النَّاسَ إِلْحَافًا ۗ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّـهَ بِهِ عَلِيمٌ ٢٧٣

అల్లాహ్‌ మార్గంలో నిమగ్నులైన కారణంగా (తమ జీవనోపాధి కొరకు) భూమిలో తిరిగే అవకాశం లేక, లేమికి గురిఅయ్యే పేదవారు (ధనసహాయానికి అర్హులు). ఎరుగని మనిషి వారి అడగకపోవటాన్ని చూసి, వారు ధనవంతులని భావించవచ్చు! (కాని) వారి ముఖచిహ్నాలు చూసి నీవు వారిని గుర్తించగలవు. వారు ప్రజలను పట్టుబట్టి అడిగేవారు కారు. మరియు మీరు మంచి కొరకు ఏమి ఖర్చు చేసినా అది అల్లాహ్‌కు తప్పక తెలుస్తుంది.

2:274 – الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُم بِاللَّيْلِ وَالنَّهَارِ سِرًّا وَعَلَانِيَةً فَلَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ٢٧٤

ఎవరైతే తమ సంపదను (అల్లాహ్‌ మార్గంలో) రేయింబవళ్ళు బహిరంగంగానూ మరియు రహస్యంగానూ ఖర్చుచేస్తారో, వారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువువద్ద పొందుతారు. మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా! 214

2:275 – الَّذِينَ يَأْكُلُونَ الرِّبَا لَا يَقُومُونَ إِلَّا كَمَا يَقُومُ الَّذِي يَتَخَبَّطُهُ الشَّيْطَانُ مِنَ الْمَسِّ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا إِنَّمَا الْبَيْعُ مِثْلُ الرِّبَا ۗ وَأَحَلَّ اللَّـهُ الْبَيْعَ وَحَرَّمَ الرِّبَا ۚ فَمَن جَاءَهُ مَوْعِظَةٌ مِّن رَّبِّهِ فَانتَهَىٰ فَلَهُ مَا سَلَفَ وَأَمْرُهُ إِلَى اللَّـهِ ۖ وَمَنْ عَادَ فَأُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٢٧٥

ఎవరైతే వడ్డీ తింటారో! 215 వారి స్థితి (పునరుత్థాన దినమున) షై’తాన్‌ తాకడం వల్ల భ్రమపరచబడిన వ్యక్తి స్థితివలె ఉంటుంది. ఇది ఎందుకంటే! వారు: ”వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే!” అని చెప్పడం. కాని అల్లాహ్‌ వ్యాపా రాన్ని ధర్మసమ్మతం (‘హలాల్‌) చేశాడు మరియు వడ్డీని నిషిధ్ధం (‘హరామ్‌) చేశాడు. కనుక తన ప్రభువు చేసిన ఈ హితబోధ అందిన వ్యక్తి మున్ముందు వడ్డీ తినటం త్యజిస్తే, అతడు పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతని వ్యవహారమంతా అల్లాహ్‌కే చెందుతుంది. (ఈ ఆదేశం తరువాత ఈ దుర్వ్యవహారానికి) పాల్పడేవారు నరకవాసు లవుతారు, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు.

2:276 – يَمْحَقُ اللَّـهُ الرِّبَا وَيُرْبِي الصَّدَقَاتِ ۗ وَاللَّـهُ لَا يُحِبُّ كُلَّ كَفَّارٍ أَثِيمٍ ٢٧٦

అల్లాహ్‌ వడ్డీ (ఆదాయాన్ని) నశింప జేస్తాడు మరియు దాన-ధర్మాలు (చేసేవారికి) వృధ్ధినొసంగుతాడు. మరియు సత్య-తిరస్కా రుడు (కృతఘ్నుడు), పాపిష్ఠుడు అయిన వ్యక్తిని అల్లాహ్‌ ప్రేమించడు.

2:277 – إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ لَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ٢٧٧

నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసే వారికీ మరియు నమా’జ్‌ స్థాపించేవారికీ, ‘జకాత్‌ ఇచ్చేవారికీ, తమ ప్రభువు వద్ద తగిన ప్రతిఫలం లభిస్తుంది మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!

2:278 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّـهَ وَذَرُوا مَا بَقِيَ مِنَ الرِّبَا إِن كُنتُم مُّؤْمِنِينَ ٢٧٨

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి మరియు మీరు (నిజంగా) విశ్వాసులే అయితే, మీకు రావలసిన వడ్డీని విడిచిపెట్టండి. 216

2:279 – فَإِن لَّمْ تَفْعَلُوا فَأْذَنُوا بِحَرْبٍ مِّنَ اللَّـهِ وَرَسُولِهِ ۖ وَإِن تُبْتُمْ فَلَكُمْ رُءُوسُ أَمْوَالِكُمْ لَا تَظْلِمُونَ وَلَا تُظْلَمُونَ ٢٧٩

కాని, ఒకవేళ మీరు అలా చేయకపోతే! అల్లాహ్‌ మరియు ఆయన సందేశహరుని తరఫు నుండి యుద్ధ ప్రకటన ఉందని తెలుసుకోండి. 217 కాని మీరు పశ్చాత్తాపపడితే (వడ్డీ వదలుకుంటే), మీ అసలు సొమ్ము మీకు లభిస్తుంది. మీరు (ఇతరులకు) అన్యాయం చేయకండి మరియు మీకూ అన్యాయం జరుగదు.

2:280 – وَإِن كَانَ ذُو عُسْرَةٍ فَنَظِرَةٌ إِلَىٰ مَيْسَرَةٍ ۚ وَأَن تَصَدَّقُوا خَيْرٌ لَّكُمْ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ ٢٨٠

మరియు (మీ బాకీదారుడు ఆర్థిక) ఇబ్బందులలో ఉంటే, అతని పరిస్థితి, కుదిరే వరకూ గడువు నివ్వండి. ఒకవేళ మీరు దానమని వదిలిపెడితే అది మీకు ఎంతో మేలైనది, ఇది మీకు తెలిస్తే (ఎంత బాగుండేది)! 218

2:281 – وَاتَّقُوا يَوْمًا تُرْجَعُونَ فِيهِ إِلَى اللَّـهِ ۖ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ ٢٨١

మరియు మీరు తిరిగి అల్లాహ్‌ సమక్షానికి చేరుకోబోయే ఆ దినానికి భయపడండి. అప్పుడు ప్రతి వ్యక్తికి తన కర్మల ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారికెలాంటి అన్యాయం జరుగదు. 219

2:282 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا تَدَايَنتُم بِدَيْنٍ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى فَاكْتُبُوهُ ۚ وَلْيَكْتُب بَّيْنَكُمْ كَاتِبٌ بِالْعَدْلِ ۚ وَلَا يَأْبَ كَاتِبٌ أَن يَكْتُبَ كَمَا عَلَّمَهُ اللَّـهُ ۚ فَلْيَكْتُبْ وَلْيُمْلِلِ الَّذِي عَلَيْهِ الْحَقُّ وَلْيَتَّقِ اللَّـهَ رَبَّهُ وَلَا يَبْخَسْ مِنْهُ شَيْئًا ۚ فَإِن كَانَ الَّذِي عَلَيْهِ الْحَقُّ سَفِيهًا أَوْ ضَعِيفًا أَوْ لَا يَسْتَطِيعُ أَن يُمِلَّ هُوَ فَلْيُمْلِلْ وَلِيُّهُ بِالْعَدْلِ ۚ وَاسْتَشْهِدُوا شَهِيدَيْنِ مِن رِّجَالِكُمْ ۖ فَإِن لَّمْ يَكُونَا رَجُلَيْنِ فَرَجُلٌ وَامْرَأَتَانِ مِمَّن تَرْضَوْنَ مِنَ الشُّهَدَاءِ أَن تَضِلَّ إِحْدَاهُمَا فَتُذَكِّرَ إِحْدَاهُمَا الْأُخْرَىٰ ۚ وَلَا يَأْبَ الشُّهَدَاءُ إِذَا مَا دُعُوا ۚ وَلَا تَسْأَمُوا أَن تَكْتُبُوهُ صَغِيرًا أَوْ كَبِيرًا إِلَىٰ أَجَلِهِ ۚ ذَٰلِكُمْ أَقْسَطُ عِندَ اللَّـهِ وَأَقْوَمُ لِلشَّهَادَةِ وَأَدْنَىٰ أَلَّا تَرْتَابُوا ۖ إِلَّا أَن تَكُونَ تِجَارَةً حَاضِرَةً تُدِيرُونَهَا بَيْنَكُمْ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَلَّا تَكْتُبُوهَا ۗ وَأَشْهِدُوا إِذَا تَبَايَعْتُمْ ۚ وَلَا يُضَارَّ كَاتِبٌ وَلَا شَهِيدٌ ۚ وَإِن تَفْعَلُوا فَإِنَّهُ فُسُوقٌ بِكُمْ ۗ وَاتَّقُوا اللَّـهَ ۖ وَيُعَلِّمُكُمُ اللَّـهُ ۗ وَاللَّـهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ٢٨٢

ఓ విశ్వాసులారా! మీరు పరస్పరం ఒక నిర్ణీత కాలం కొరకు అప్పు తీసుకున్నప్పుడు, దానిని వ్రాసిపెట్టుకోండి. 220 మరియు మీలో పత్రం వ్రాసేవాడు, న్యాయంగా వ్రాయాలి. మరియు వ్రాసే వాడు నిరాకరించకుండా, అల్లాహ్‌ నేర్పినట్లు వ్రాయాలి. ఋణగ్రహీత అల్లాహ్‌కు భయపడి, నిర్ణీత షరతులను తగ్గించకుండా, చెప్పి వ్రాయించాలి. ఋణగ్రహీత అల్పజ్ఞాని లేక సామర్థ్యం లేనివాడు లేక బలహీనుడు మరియు తాను చెప్పి వ్రాయించలేని వాడైతే, అతని సంరక్షకుడు న్యాయంగా వ్రాయించాలి. మరియు మీలో ఇద్దరు మగ వారిని సాక్ష్యమివ్వటానికి సాక్షులుగా ఉంచుకోండి. ఇద్దరు పురుషులు దొరకని పక్షమున ఒక పురుషుడు మరియు మీకు సమ్మత మైన ఇద్దరు స్త్రీలను సాక్షులుగా తీసుకోండి. (ఎందుకంటే) వారిలో ఒకామె మరచిపోతే, రెండవ స్త్రీ ఆమెకు జ్ఞాపకం చేయించవచ్చు. మరియు పిలువబడినప్పుడు సాక్షులు, సాక్ష్యమివ్వటానికి నిరాకరించకూడదు. మరియు వ్యవహారం చిన్న దైనా పెద్దదైనా దానిని గడువు నిర్ణయంతో పాటు వ్రాసిపెట్టటానికి అశ్రధ్ధ చూపకూడదు. అల్లాహ్‌ దృష్టిలో ఇది న్యాయసమ్మతమైనది మరియు స్థిరమైన సాక్ష్యంగా తోడ్పడుతుంది మరియు ఏవిధమైన సందేహాలకు అవకాశం లేకుండా చేస్తుంది. కాని, మీరు అప్పటి కప్పుడు ఇచ్చి-పుచ్చుకునే (సాధారణ) లావాదేవీలు చేస్తున్నపుడు వ్రాయ కున్నా దోషంలేదు. కాని, వ్యాపార వ్యవహారాలు నిర్ణయంచేటప్పుడు సాక్షులను పెట్టుకోండి. కాని వ్రాసేవానికి గానీ, సాక్షులకు గానీ ఏ విధమైన హాని జరుగ కూడదు. ఒకవేళ అలా జరిగితే! నిశ్చయంగా, అది మీకు పాపం. మరియు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. మరియు ఇది అల్లాహ్‌ మీకు నేర్పుతున్నాడు. మరియు అల్లాహ్‌కు ప్రతిదాని జ్ఞానం ఉంది. (3/8)

2:283 – وَإِن كُنتُمْ عَلَىٰ سَفَرٍ وَلَمْ تَجِدُوا كَاتِبًا فَرِهَانٌ مَّقْبُوضَةٌ ۖ فَإِنْ أَمِنَ بَعْضُكُم بَعْضًا فَلْيُؤَدِّ الَّذِي اؤْتُمِنَ أَمَانَتَهُ وَلْيَتَّقِ اللَّـهَ رَبَّهُ ۗ وَلَا تَكْتُمُوا الشَّهَادَةَ ۚ وَمَن يَكْتُمْهَا فَإِنَّهُ آثِمٌ قَلْبُهُ ۗ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ عَلِيمٌ ٢٨٣

  • మరియు మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, (పత్రం) వ్రాసేవాడు దొరకని పక్షంలో సొమ్మును కుదువ పెట్టుకోవచ్చు. 221 మీకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే నమ్మకంగా ఇచ్చిన దానిని (అప్పును) తిరిగి అతడు వాపసు చేయాలి. మరియు తన ప్రభువైన అల్లాహ్ యందు భయ- భక్తులు కలిగి ఉండాలి. మరియు మీరు సాక్ష్యాన్ని (ఎన్నడూ) దాచకండి. మరియు (సాక్ష్యాన్ని) దాచేవాని హృదయం పాపభరితమైనది. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.

2:284 – لِّلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَإِن تُبْدُوا مَا فِي أَنفُسِكُمْ أَوْ تُخْفُوهُ يُحَاسِبْكُم بِهِ اللَّـهُ ۖ فَيَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۗ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٢٨٤

ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న దంతా అల్లాహ్‌దే! మీరు మీ మనస్సులలో ఉన్నది, వెలుబుచ్చినా లేక దాచినా అల్లాహ్‌ మీ నుంచి దాని లెక్క తీసుకుంటాడు. 222 మరియు ఆయన తాను కోరినవానిని క్షమిస్తాడు మరియు తాను కోరినవానిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.

2:285 – آمَنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ بِاللَّـهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ ٢٨٥

ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసిం చాడు 223 మరియు (అదేవిధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారంటారు: ”మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేద భావాలను చూపము. మరియు మేము (ఆదేశం) విన్నాము మరియు దానిని శిరసావహించాము, నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, ఓ మా ప్రభూ! మా గమ్యస్థానం నీ వైపుకే ఉంది.

2:286 – لَا يُكَلِّفُ اللَّـهُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۚ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا اكْتَسَبَتْ ۗ رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِن نَّسِينَا أَوْ أَخْطَأْنَا ۚ رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِن قَبْلِنَا ۚ رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهِ ۖ وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا ۚ أَنتَ مَوْلَانَا فَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ ٢٨٦

”అల్లాహ్‌, ఏ ప్రాణి పైననూ దాని శక్తికి మించిన భారం వేయడు. తాను సంపాదించిన దాని (పుణ్య) ఫలితం దానికి లభిస్తుంది మరియు తాను చేసిన దుష్కర్మల శిక్ష అది అనుభవిస్తుంది. ఓ మా ప్రభూ! మేము మరచినా లేక తప్పుచేసినా మమ్మల్ని పట్టకు! ఓ మా ప్రభూ! పూర్వం వారిపై మోపినట్టి భారం మాపై మోపకు. ఓ మా ప్రభూ! మేము సహించలేని భారం మాపై వేయకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు మరియు మమ్మల్ని కరుణించు. నీవే మా సంరక్షకుడవు, కావున సత్య-తిరస్కారులకు విరుధ్ధంగా మాకు విజయము (సహాయము) నొసంగు.”

— – సూరహ్ ఆల ఇమ్రాన్ – ఆల ‘ఇమ్రాన్‌: ఇమ్రాన్‌ పరివారం. ఈ విషయాలు (33-35) ఆయత్‌లలో ఉన్నాయి. ఇది మదీనహ్ లో అవతరింపజేయబడిన రెండవ లేక మూడవ సూరహ్‌. ఇందులో 200 ఆయాతులున్నాయి. దీని మొదటి 83 ఆయాతులలో నజ్‌రాన్‌ నుండి 9వ హిజ్రీలో వచ్చిన క్రైస్తవ రాయబారులతో జరిగిన వాదోపవాదాల వివరాలున్నాయి. ఇందులో 2వ హి. రమ’దాన్‌ నెలలో జరిగిన బద్ర్‌ యుద్ధం 121-148 ఆయాత్‌లలో మరియు 3వ హి. షవ్వాల్‌ నెలలో జరిగిన ఉ’హుద్‌ యుద్ధం యొక్క విషయాలు 149-180 ఆయాత్‌లలో ఉన్నాయి.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 3:1 – الم ١

అలిఫ్‌-లామ్‌-మీమ్‌.

3:2 – اللَّـهُ لَا إِلَـٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ٢

అల్లాహ్‌! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు (నిత్యుడు) విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు. 1

3:3 – نَزَّلَ عَلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ وَأَنزَلَ التَّوْرَاةَ وَالْإِنجِيلَ ٣

ఆయన, సత్యమైన ఈ దివ్యగ్రంథాన్ని (ఓ ము’హమ్మద్‌!) నీపై అవతరింపజేశాడు. ఇది పూర్వం అవతరింపజేయబడిన గ్రంథాలలోనుండి (మిగిలి ఉన్న సత్యాన్ని) ధృవపరుస్తోంది. 2 మరియు ఆయనే తౌరాత్‌ ను మరియు ఇంజీలును 3 అవతరింపజేశాడు –

3:4 – مِن قَبْلُ هُدًى لِّلنَّاسِ وَأَنزَلَ الْفُرْقَانَ ۗ إِنَّ الَّذِينَ كَفَرُوا بِآيَاتِ اللَّـهِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۗ وَاللَّـهُ عَزِيزٌ ذُو انتِقَامٍ ٤

దీనికి ముందు ప్రజలకు సన్మార్గం చూప టానికి. మరియు (సత్యాసత్యాలను విశదీకరించే) ఈ గీటురాయిని కూడా అవతరింపజేశాడు. ٤ నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్‌ ఆజ్ఞలను తిరస్క రిస్తారో వారికి కఠినశిక్ష ఉంటుంది. మరియు అల్లాహ్‌ సర్వశక్తిమంతుడు, ప్రతీకారం తీర్చుకోగలవాడు.

3:5 – إِنَّ اللَّـهَ لَا يَخْفَىٰ عَلَيْهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ ٥

నిశ్చయంగా, భూమిలో గానీ మరియు ఆకాశా లలో గానీ, అల్లాహ్‌కు గోప్యంగా ఉన్నది ఏదీలేదు.

3:6 – هُوَ الَّذِي يُصَوِّرُكُمْ فِي الْأَرْحَامِ كَيْفَ يَشَاءُ ۚ لَا إِلَـٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ ٦

ఆయన తన ఇష్టానుసారంగా మిమ్మల్ని (మాతృ) గర్భాలలో తీర్చిదిద్దుతాడు 5 ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

3:7 – هُوَ الَّذِي أَنزَلَ عَلَيْكَ الْكِتَابَ مِنْهُ آيَاتٌ مُّحْكَمَاتٌ هُنَّ أُمُّ الْكِتَابِ وَأُخَرُ مُتَشَابِهَاتٌ ۖ فَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِمْ زَيْغٌ فَيَتَّبِعُونَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَاءَ الْفِتْنَةِ وَابْتِغَاءَ تَأْوِيلِهِ ۗ وَمَا يَعْلَمُ تَأْوِيلَهُ إِلَّا اللَّـهُ ۗ وَالرَّاسِخُونَ فِي الْعِلْمِ يَقُولُونَ آمَنَّا بِهِ كُلٌّ مِّنْ عِندِ رَبِّنَا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ ٧

ఆయన (అల్లాహ్‌)యే నీపై (ఓ ము’హ మ్మద్‌!) ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) అవతరింప జేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ము’హ్‌కమాత్‌) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్‌) ఉన్నాయి 6 కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు, సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను అపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటపడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్‌కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ పరిపక్వ జ్ఞానం గలవారు:”మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!” అని అంటారు. జ్ఞాన వంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.

3:8 – رَبَّنَا لَا تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً ۚ إِنَّكَ أَنتَ الْوَهَّابُ ٨

(వారు ఇలా అంటారు): ”ఓ మా ప్రభూ! మాకు సన్మార్గం చూపిన తరువాత మా హృదయాలను వక్రమార్గం వైపునకు పోనివ్వకు. మరియు మాపై నీ కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా, నీవే సర్వప్రదుడవు. 7

3:9 – رَبَّنَا إِنَّكَ جَامِعُ النَّاسِ لِيَوْمٍ لَّا رَيْبَ فِيهِ ۚ إِنَّ اللَّـهَ لَا يُخْلِفُ الْمِيعَادَ ٩

”ఓ మా ప్రభూ! నిశ్చయంగా, నీవే మానవు లందరినీ, నిస్సందేహంగా రాబోయే, ఆ దినమున సమావేశపరచేవాడవు. 8 నిశ్చయంగా, అల్లాహ్‌ తన వాగ్దానాన్ని భంగంచేయడు.”

3:10 – إِنَّ الَّذِينَ كَفَرُوا لَن تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُم مِّنَ اللَّـهِ شَيْئًا ۖ وَأُولَـٰئِكَ هُمْ وَقُودُ النَّارِ ١٠

  1. నిశ్చయంగా, సత్య-తిరస్కారులైనవారికి వారి ధనంగానీ, వారి సంతానంగానీ, అల్లాహ్‌కు ప్రతికూలంగా ఏ మాత్రం పనికిరావు. మరియు ఇలాంటి వారే నరకాగ్నికి ఇంధనమయ్యేవారు.

3:11 – كَدَأْبِ آلِ فِرْعَوْنَ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَذَّبُوا بِآيَاتِنَا فَأَخَذَهُمُ اللَّـهُ بِذُنُوبِهِمْ ۗ وَاللَّـهُ شَدِيدُ الْعِقَابِ ١١

వారి ముగింపు ఫిర్‌’ఔను జాతి మరియు వారికి ముందున్నవారివలే ఉంటుంది. వారు మా సూచన (ఆజ్ఞ)లను తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్‌ వారి పాపాల ఫలితంగా, వారిని పట్టుకున్నాడు. మరియు అల్లాహ్‌ శిక్ష విధించటంలో చాలా కఠినుడు.

3:12 – قُل لِّلَّذِينَ كَفَرُوا سَتُغْلَبُونَ وَتُحْشَرُونَ إِلَىٰ جَهَنَّمَ ۚ وَبِئْسَ الْمِهَادُ ١٢

(ఓ ప్రవక్తా!) సత్యాన్ని తిరస్కరించిన వారితో అను: ”మీరు త్వరలోనే లొంగదీయబడి నరకంలో జమచేయబడతారు. మరియు అది అతి చెడ్డ విరామ స్థలము!”

3:13 – قَدْ كَانَ لَكُمْ آيَةٌ فِي فِئَتَيْنِ الْتَقَتَا ۖ فِئَةٌ تُقَاتِلُ فِي سَبِيلِ اللَّـهِ وَأُخْرَىٰ كَافِرَةٌ يَرَوْنَهُم مِّثْلَيْهِمْ رَأْيَ الْعَيْنِ ۚ وَاللَّـهُ يُؤَيِّدُ بِنَصْرِهِ مَن يَشَاءُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِّأُولِي الْأَبْصَارِ ١٣

వాస్తవానికి (బద్ర్‌ యుధ్ధరంగంలో) మార్కొ నిన ఆ రెండు వర్గాలలో మీకు ఒక సూచన ఉంది. ఒక వర్గం అల్లాహ్‌ మార్గంలో పోరాడేది మరియు రెండవది సత్య-తిరస్కారులది. వారు (విశ్వా సులు) వారిని (సత్య-తిరస్కారులను) రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు తమకళ్ళారాచూశారు. మరియు అల్లాహ్‌ తానుకోరిన వారిని తన సహాయంతో (విజ యంతో) బలపరుస్తాడు. నిశ్చయంగా, దూరదృష్టి గలవారికి ఇందులో ఒక గుణపాఠముంది. 9

3:14 – زُيِّنَ لِلنَّاسِ حُبُّ الشَّهَوَاتِ مِنَ النِّسَاءِ وَالْبَنِينَ وَالْقَنَاطِيرِ الْمُقَنطَرَةِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ وَالْخَيْلِ الْمُسَوَّمَةِ وَالْأَنْعَامِ وَالْحَرْثِ ۗ ذَٰلِكَ مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا ۖ وَاللَّـهُ عِندَهُ حُسْنُ الْمَآبِ ١٤

స్త్రీలు, సంతానం మరియు కూర్చిపెట్టిన వెండి బంగారురాసులు, మేలుజాతి గుర్రాలు, పశువులు పొలాలు మొదలైన మనోహరమైన వస్తువుల ప్రేమ ప్రజలకు ఆకర్షణీయంగా చేయ బడింది. 10 ఇదంతా ఇహలోక జీవనభోగం. కానీ, అసలైన గమ్యస్థానం అల్లాహ్‌ వద్దనే ఉంది. (1/2)

3:15 – قُلْ أَؤُنَبِّئُكُم بِخَيْرٍ مِّن ذَٰلِكُمْ ۚ لِلَّذِينَ اتَّقَوْا عِندَ رَبِّهِمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَأَزْوَاجٌ مُّطَهَّرَةٌ وَرِضْوَانٌ مِّنَ اللَّـهِ ۗ وَاللَّـهُ بَصِيرٌ بِالْعِبَادِ ١٥

  • ఇలా చెప్పు: ”ఏమీ? వాటికంటే ఉత్తమ మైన వాటిని నేను మీకు తెలుపనా? దైవభీతి గలవారికి, వారి ప్రభువు వద్ద స్వర్గవనాలుంటాయి. వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు మరియు వారికి అక్కడ పవిత్ర సహవాసులు (అ’జ్వాజ్‌) ఉంటారు మరియు వారికి అల్లాహ్‌ ప్రసన్నత లభిస్తుంది.” మరియు అల్లాహ్‌ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు.

3:16 – الَّذِينَ يَقُولُونَ رَبَّنَا إِنَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَقِنَا عَذَابَ النَّارِ ١٦

ఎవరైతే: ”ఓ మా ప్రభూ! మేము నిశ్చయంగా, విశ్వసించాము, కావున మా తప్పులను క్షమించు మరియు నరకాగ్నినుండి మమ్మల్ని తప్పించు.” అని పలుకుతారో!

3:17 – الصَّابِرِينَ وَالصَّادِقِينَ وَالْقَانِتِينَ وَالْمُنفِقِينَ وَالْمُسْتَغْفِرِينَ بِالْأَسْحَارِ ١٧

(అలాంటి వారే!) సహనశీలురు, సత్య వంతులు మరియు వినయ-విధేయతలు గల వారు, దానపరులు మరియు వేకువజామున 11 తమ పాపాలకు క్షమాపణ వేడుకునేవారు.

3:18 – شَهِدَ اللَّـهُ أَنَّهُ لَا إِلَـٰهَ إِلَّا هُوَ وَالْمَلَائِكَةُ وَأُولُو الْعِلْمِ قَائِمًا بِالْقِسْطِ ۚ لَا إِلَـٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ ١٨

నిశ్చయంగా ఆయన తప్ప మరొక ఆరాధ్య నీయుడు లేడని, అల్లాహ్‌, దేవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు; ఆయనే న్యాయ పరిరక్షకుడు. 12 ఆయన తప్ప మరొక ఆరాధ్య నీయుడు లేడు! ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

3:19 – إِنَّ الدِّينَ عِندَ اللَّـهِ الْإِسْلَامُ ۗ وَمَا اخْتَلَفَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْعِلْمُ بَغْيًا بَيْنَهُمْ ۗ وَمَن يَكْفُرْ بِآيَاتِ اللَّـهِ فَإِنَّ اللَّـهَ سَرِيعُ الْحِسَابِ ١٩

నిశ్చయంగా, అల్లాహ్‌కు సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహ్‌కు విధేయులవటం (ఇస్లాం) మాత్రమే 13 కాని పూర్వగ్రంథప్రజలు పరస్పర ఈర్ష్యతో, వారికి జ్ఞానం లభించిన తరువాతనే భేదాభిప్రాయాలకు లోనయ్యారు. మరియు ఎవరైతే అల్లాహ్‌ సూచనలను తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్‌ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు (అని తెలుసుకోవాలి).

3:20 – فَإِنْ حَاجُّوكَ فَقُلْ أَسْلَمْتُ وَجْهِيَ لِلَّـهِ وَمَنِ اتَّبَعَنِ ۗ وَقُل لِّلَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْأُمِّيِّينَ أَأَسْلَمْتُمْ ۚ فَإِنْ أَسْلَمُوا فَقَدِ اهْتَدَوا ۖ وَّإِن تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ ۗ وَاللَّـهُ بَصِيرٌ بِالْعِبَادِ ٢٠

  1. (ఓ ప్రవక్తా!) వారు నీతో వివాదమాడితే ఇట్లను: ”నేనూ మరియు నా అనుచరులు అల్లాహ్‌ ప్రీతి పొందటానికి ఆయనకు సంపూర్ణంగా విధేయులం (ముస్లిములం) అయ్యాము.” మరియు గ్రంథప్రజలతో మరియు నిరక్ష్యరాస్యు లతో (చదువురాని అరబ్బులతో): ”ఏమీ? మీరు కూడా విధేయులయ్యారా?” అని అడుగు. వారు విధేయులైతే సన్మార్గం పొందినవారవుతారు. కాని ఒకవేళ వారు వెనుదిరిగితే, నీ బాధ్యత కేవలం సందేశాన్ని అందజేయటం మాత్రమే! మరియు అల్లాహ్‌ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు. 14

3:21 – إِنَّ الَّذِينَ يَكْفُرُونَ بِآيَاتِ اللَّـهِ وَيَقْتُلُونَ النَّبِيِّينَ بِغَيْرِ حَقٍّ وَيَقْتُلُونَ الَّذِينَ يَأْمُرُونَ بِالْقِسْطِ مِنَ النَّاسِ فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ ٢١

నిశ్చయంగా, అల్లాహ్‌ ఆదేశాలను (ఆయా తులను) తిరస్కరించే వారికి మరియు ఆయన ప్రవక్తలను అన్యాయంగా చంపేవారికి మరియు న్యాయసమ్మతంగా వ్యవహరించమని బోధించే ప్రజలను చంపే వారికి, బాధాకరమైన శిక్ష ఉన్నదని తెలియజెయ్యి.

3:22 – أُولَـٰئِكَ الَّذِينَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ ٢٢

అలాంటి వారి కర్మలు ఇహలోకమందును మరియు పరలోకమందును వృథా అవుతాయి. మరియు వారికి సహాయకులు ఎవ్వరూ ఉండరు.

3:23 – أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يُدْعَوْنَ إِلَىٰ كِتَابِ اللَّـهِ لِيَحْكُمَ بَيْنَهُمْ ثُمَّ يَتَوَلَّىٰ فَرِيقٌ مِّنْهُمْ وَهُم مُّعْرِضُونَ ٢٣

ఏమీ? గ్రంథంలోని కొంత భాగం పొందిన వారి పరిస్థితిఎలాఉందో నీవుగమనించలేదా?వారిమధ్య తీర్పు చేయటానికి, ‘అల్లాహ్‌ గ్రంథం వైపునకు రండి,’ అని వారిని ఆహ్వానించినపుడు, వారిలోని ఒక వర్గంవారు విముఖులై, వెనుదిరిగి పోతారు.

3:24 – ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لَن تَمَسَّنَا النَّارُ إِلَّا أَيَّامًا مَّعْدُودَاتٍ ۖ وَغَرَّهُمْ فِي دِينِهِم مَّا كَانُوا يَفْتَرُونَ ٢٤

వారు అలా చేయటానికి కారణం వారు: ”నరకాగ్ని కొన్నిదినాలు మాత్రమే మమ్మల్ని తాకుతుంది.” అని అనటం. మరియు వారు కల్పించుకున్న అపోహయే వారిని తమ ధర్మ విషయంలో మోసపుచ్చింది. 15

3:25 – فَكَيْفَ إِذَا جَمَعْنَاهُمْ لِيَوْمٍ لَّا رَيْبَ فِيهِ وَوُفِّيَتْ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ ٢٥

నిస్సందేహంగా, రాబోయే ఆ (పునరుత్థాన) దినమున, మేము వారిని సమావేశపరిచినపుడు, వారి స్థితి ఎలా ఉంటుందో (ఆలోచించారా?) మరియు ప్రతి జీవికి తాను చేసిన కర్మల ఫలితం పూర్తిగా నొసంగబడుతుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.

3:26 – قُلِ اللَّـهُمَّ مَالِكَ الْمُلْكِ تُؤْتِي الْمُلْكَ مَن تَشَاءُ وَتَنزِعُ الْمُلْكَ مِمَّن تَشَاءُ وَتُعِزُّ مَن تَشَاءُ وَتُذِلُّ مَن تَشَاءُ ۖ بِيَدِكَ الْخَيْرُ ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٢٦

ఇలా అను: ”ఓ అల్లాహ్‌, విశ్వ సామ్రాజ్యాధి పతి! 16 నీవు ఇష్టపడిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారిని రాజ్యాధి కారం నుండి తొలగిస్తావు మరియు నీవు ఇష్టపడిన వారికి గౌరవాన్ని (శక్తిని) ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారిని పరాభవం పాలుచేస్తావు. నీ చేతిలోనే 17 మేలున్నది. నిశ్చయంగా, నీవు ప్రతిదీ చేయగల సమర్థుడవు.

3:27 – تُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَتُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ ۖ وَتُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَتُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ ۖ وَتَرْزُقُ مَن تَشَاءُ بِغَيْرِ حِسَابٍ ٢٧

”నీవు రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తావు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింపజేస్తావు. మరియు నీవు సజీవులను నిర్జీవులనుండి తీస్తావు మరియు నిర్జీవులను సజీవులనుండి తీస్తావు. మరియు నీవు కోరినవారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తావు.”

3:28 – ا يَتَّخِذِ الْمُؤْمِنُونَ الْكَافِرِينَ أَوْلِيَاءَ مِن دُونِ الْمُؤْمِنِينَ ۖ وَمَن يَفْعَلْ ذَٰلِكَ فَلَيْسَ مِنَ اللَّـهِ فِي شَيْءٍ إِلَّا أَن تَتَّقُوا مِنْهُمْ تُقَاةً ۗ وَيُحَذِّرُكُمُ اللَّـهُ نَفْسَهُ ۗ وَإِلَى اللَّـهِ الْمَصِيرُ ٢٨

విశ్వాసులు – తమ తోటి విశ్వాసులను విడిచి – సత్య-తిరస్కారులను స్నేహితులుగా చేసుకోరాదు. అలా చేసేవారికి అల్లాహ్‌తో ఏ విధమైన సంబంధం లేదు. కాని, వారి దౌర్జన్యానికి భీతిపరులైతే తప్ప! అల్లాహ్‌ (ఆయనకే భీతిపరులై ఉండమని) మిమ్మల్ని స్వయంగా హెచ్చరిస్తున్నాడు. 18 మరియు అల్లాహ్‌ వైపుకే మీ మరలింపు ఉంది.

3:29 – قُلْ إِن تُخْفُوا مَا فِي صُدُورِكُمْ أَوْ تُبْدُوهُ يَعْلَمْهُ اللَّـهُ ۗ وَيَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٢٩

వారితో ఇలా అను: ”మీరు మీ హృదయాలలో ఉన్నది దాచినా వెలిబుచ్చినా, అది అల్లాహ్‌కు తెలుస్తుంది. మరియు భూమ్యాకాశాలలో ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.”

3:30 – يَوْمَ تَجِدُ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ مِنْ خَيْرٍ مُّحْضَرًا وَمَا عَمِلَتْ مِن سُوءٍ تَوَدُّ لَوْ أَنَّ بَيْنَهَا وَبَيْنَهُ أَمَدًا بَعِيدًا ۗ وَيُحَذِّرُكُمُ اللَّـهُ نَفْسَهُ ۗ وَاللَّـهُ رَءُوفٌ بِالْعِبَادِ ٣٠

ఆ రోజు ప్రతిప్రాణి తాను చేసిన మంచిని మరియు తాను చేసిన చెడును ప్రత్యక్షంగా చూసు కున్నప్పుడు, తనకు మరియు దానికి మధ్య దూర ముంటే, ఎంత బాగుండేదని ఆశిస్తుంది. మరియు అల్లాహ్‌ (తనకే భీతిపరులై ఉండమని) మిమ్మల్ని స్వయంగా హెచ్చరిస్తున్నాడు. మరియు అల్లాహ్‌ తన దాసులఎడల ఎంతో కనికరుడు.

3:31 – قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّـهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّـهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٣١

(ఓ ప్రవక్తా!) ఇలా అను: ”మీకు (నిజంగా) అల్లాహ్‌ పట్ల ప్రేమఉంటే మీరు నన్ను అనుసరిం చండి. (అప్పుడు) అల్లాహ్‌ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.”

3:32 – قُلْ أَطِيعُوا اللَّـهَ وَالرَّسُولَ ۖ فَإِن تَوَلَّوْا فَإِنَّ اللَّـهَ لَا يُحِبُّ الْكَافِرِينَ ٣٢

(ఇంకా) ఇలా అను: ”అల్లాహ్‌కు మరియు సందేశహరునికి విధేయులై ఉండండి. ”వారు కాదంటే! నిశ్చయంగా, అల్లాహ్‌ సత్య- తిరస్కారులను ప్రేమించడు, (అని తెలుసు కోవాలి). 19 (5/8)

3:33 – إِنَّ اللَّـهَ اصْطَفَىٰ آدَمَ وَنُوحًا وَآلَ إِبْرَاهِيمَ وَآلَ عِمْرَانَ عَلَى الْعَالَمِينَ ٣٣

  • నిశ్చయంగా అల్లాహ్‌ ఆదమ్‌ను, నూ’హ్‌ ను ఇబ్రాహీమ్‌ సంతతివారిని మరియు ‘ఇమ్రాన్‌ సంతతివారిని (ఆ యా కాలపు) సర్వలోకాల (ప్రజల)పై ప్రాధాన్యత నిచ్చి ఎన్నుకున్నాడు. 20

3:34 – ذُرِّيَّةً بَعْضُهَا مِن بَعْضٍ ۗ وَاللَّـهُ سَمِيعٌ عَلِيمٌ ٣٤

వారంతా ఒకే పరంపరకు చెందిన వారు. మరియు అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

3:35 – إِذْ قَالَتِ امْرَأَتُ عِمْرَانَ رَبِّ إِنِّي نَذَرْتُ لَكَ مَا فِي بَطْنِي مُحَرَّرًا فَتَقَبَّلْ مِنِّي ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ ٣٥

‘ఇమ్రాన్‌ భార్య ప్రార్థించింది (జ్ఞాపకం చేసుకోండి): ”ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నేను నా గర్భము నందున్న శిశువును నీ సేవకు 21 అంకితం చేయటానికి మొక్కుకున్నాను, కావున నా నుండి దీనిని తప్పక స్వీకరించు. నిశ్చయంగా, నీవే సర్వం వినేవాడవు, సర్వజ్ఞుడవు.”

3:36 – فَلَمَّا وَضَعَتْهَا قَالَتْ رَبِّ إِنِّي وَضَعْتُهَا أُنثَىٰ وَاللَّـهُ أَعْلَمُ بِمَا وَضَعَتْ وَلَيْسَ الذَّكَرُ كَالْأُنثَىٰ ۖ وَإِنِّي سَمَّيْتُهَا مَرْيَمَ وَإِنِّي أُعِيذُهَا بِكَ وَذُرِّيَّتَهَا مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ ٣٦

తరువాత ఆమె ఆడ శిశువు (మర్యమ్‌)ను ప్రసవించినప్పుడు, ఆమె ఇలా విన్నవించు కున్నది: ”ఓ నా ప్రభూ! నేను ఆడ శిశువును ప్రసవించాను” – ఆమె ప్రసవించినదేమిటో అల్లాహ్‌కు బాగా తెలుసు మరియు బాలుడు బాలిక వంటివాడు కాడు – ”మరియు నేను ఈమెకు మర్యమ్‌ అని పేరు పెట్టాను. 22 మరియు నేను ఈమెను మరియు ఈమె సంతానాన్ని శపించ (బహిష్కరించ) బడిన షై’తాన్‌ నుండి రక్షించటానికి, నీ శరణు వేడుకుంటున్నాను!” 23

3:37 – فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُولٍ حَسَنٍ وَأَنبَتَهَا نَبَاتًا حَسَنًا وَكَفَّلَهَا زَكَرِيَّا ۖ كُلَّمَا دَخَلَ عَلَيْهَا زَكَرِيَّا الْمِحْرَابَ وَجَدَ عِندَهَا رِزْقًا ۖ قَالَ يَا مَرْيَمُ أَنَّىٰ لَكِ هَـٰذَا ۖ قَالَتْ هُوَ مِنْ عِندِ اللَّـهِ ۖ إِنَّ اللَّـهَ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ ٣٧

ఆ తరువాత ఆ బాలికను, ఆమె ప్రభువు ఆదరంతో స్వీకరించి, ఆమెను ఒక మంచి స్త్రీగా పెంచాడు మరియు ఆమెను ‘జకరియ్యా సంరక్షణలో ఉంచాడు. 24 ‘జకరియ్యా ఆమె గదికి పోయినప్పుడల్లా, ఆమె వద్ద (ఏవో కొన్ని) భోజన పదార్థాలను చూసి, ఆమెను ఇలా అడిగేవాడు: ”ఓ మర్యమ్‌, ఇది నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చింది?” ఆమె ఇలా జవాబిచ్చేది: ”ఇది అల్లాహ్ వద్దనుండి వచ్చింది.” నిశ్చయంగా, అల్లాహ్‌ తాను కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు.

3:38 – هُنَالِكَ دَعَا زَكَرِيَّا رَبَّهُ ۖ قَالَ رَبِّ هَبْ لِي مِن لَّدُنكَ ذُرِّيَّةً طَيِّبَةً ۖ إِنَّكَ سَمِيعُ الدُّعَاءِ ٣٨

అప్పుడు ‘జకరియ్యా తన ప్రభువును ప్రార్థించాడు. అతను ఇలా విన్నవించుకున్నాడు: ”ఓ నా ప్రభూ! నీ కనికరంతో నాకు కూడా ఒక మంచి సంతానాన్ని ప్రసాదించు. నిశ్చయంగా, నీవే ప్రార్థనలను వినేవాడవు.”

3:39 – فَنَادَتْهُ الْمَلَائِكَةُ وَهُوَ قَائِمٌ يُصَلِّي فِي الْمِحْرَابِ أَنَّ اللَّـهَ يُبَشِّرُكَ بِيَحْيَىٰ مُصَدِّقًا بِكَلِمَةٍ مِّنَ اللَّـهِ وَسَيِّدًا وَحَصُورًا وَنَبِيًّا مِّنَ الصَّالِحِينَ ٣٩

  1. తరువాత అతను (‘జకరియ్యా) తన గదిలో నిలబడి నమా’జ్‌ చేస్తున్నప్పుడు దేవదూతలు: ”నిశ్చయంగా, అల్లాహ్‌ నీకు య’హ్యా యొక్క శుభవార్తను ఇస్తున్నాడు. అతను, అల్లాహ్‌ వాక్కును ధృవపరుస్తాడు. 25 అతను మంచి నాయకుడు మరియు మనోనిగ్రహం గల ప్రవక్త అయి సద్వర్తనులలో చేరిన వాడవుతాడు.” అని వినిపించారు.

3:40 – قَالَ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي غُلَامٌ وَقَدْ بَلَغَنِيَ الْكِبَرُ وَامْرَأَتِي عَاقِرٌ ۖ قَالَ كَذَٰلِكَ اللَّـهُ يَفْعَلُ مَا يَشَاءُ ٤٠

అతను (‘జకరియ్యా) ఇలా అన్నాడు: ”ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు, నాకు ముసలితనం వచ్చింది మరియు నా భార్య నేమో గొడ్రాలు!” ఆయన అన్నాడు: ”అలాగే జరుగుతుంది. అల్లాహ్‌ తాను కోరింది చేస్తాడు.” 26

3:41 – قَالَ رَبِّ اجْعَل لِّي آيَةً ۖ قَالَ آيَتُكَ أَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلَاثَةَ أَيَّامٍ إِلَّا رَمْزًا ۗ وَاذْكُر رَّبَّكَ كَثِيرًا وَسَبِّحْ بِالْعَشِيِّ وَالْإِبْكَارِ ٤١

అతను (‘జకరియ్యా) ఇలా మనవి చేసు కున్నాడు: ”ఓ నా ప్రభూ! నా కొరకు ఏదైనా సూచన నియమించు.” ఆయన జవాబిచ్చాడు: ”నీకు సూచన ఏమిటంటే, నీవు మూడురోజుల వరకు సైగలతో తప్ప ప్రజలతో మాట్లాడ లేవు. నీవు ఎక్కువగా నీ ప్రభువును స్మరించు. మరియు సాయంకాలమునందును మరియు ఉదయము నందును ఆయన పవిత్రతను కొనియాడు.”

3:42 – وَإِذْ قَالَتِ الْمَلَائِكَةُ يَا مَرْيَمُ إِنَّ اللَّـهَ اصْطَفَاكِ وَطَهَّرَكِ وَاصْطَفَاكِ عَلَىٰ نِسَاءِ الْعَالَمِينَ ٤٢

మరియు దేవదూతలు: ”ఓ మర్యమ్‌! నిశ్చయంగా, అల్లాహ్‌ నిన్నుఎన్నుకున్నాడు. మరియు నిన్ను పరిశుధ్ధపరిచాడు. మరియు (నీ కాలపు) సర్వలోకాలలోని స్త్రీలలో నిన్నుఎన్ను కున్నాడు.” అని అన్న విషయం (జ్ఞాపకం చేసుకోండి).

3:43 – يَا مَرْيَمُ اقْنُتِي لِرَبِّكِ وَاسْجُدِي وَارْكَعِي مَعَ الرَّاكِعِينَ ٤٣

(వారింకా ఇలా అన్నారు): ”ఓ మర్యమ్‌! నీవు నీ ప్రభువుకు విధేయురాలుగా ఉండు. (ఆయన సాన్నిధ్యంలో) సాష్టాంగం (సజ్దా) చెయ్యి. మరియు వంగే (రుకూ’ఉ చేసే) 27 వారితోకలిసి వంగు (రుకూ’ఉ చెయ్యి).”

3:44 – ذَٰلِكَ مِنْ أَنبَاءِ الْغَيْبِ نُوحِيهِ إِلَيْكَ ۚ وَمَا كُنتَ لَدَيْهِمْ إِذْ يُلْقُونَ أَقْلَامَهُمْ أَيُّهُمْ يَكْفُلُ مَرْيَمَ وَمَا كُنتَ لَدَيْهِمْ إِذْ يَخْتَصِمُونَ ٤٤

(ఓ ప్రవక్తా!) ఇవన్నీ అగోచరమైన వార్తలు. వాటిని మేము నీకు దివ్యజ్ఞానం (వ’హీ) ద్వారా తెలుపుతున్నాము. మర్యమ్‌ సంరక్షకుడు ఎవరు కావాలని, వారు (ఆలయ సేవకులు) తమ కలములను విసిరినపుడు, నీవు వారిదగ్గర లేవు మరియు వారు వాదించుకున్నప్పుడు కూడా నీవు వారి దగ్గర లేవు. 28

3:45 – إِذْ قَالَتِ الْمَلَائِكَةُ يَا مَرْيَمُ إِنَّ اللَّـهَ يُبَشِّرُكِ بِكَلِمَةٍ مِّنْهُ اسْمُهُ الْمَسِيحُ عِيسَى ابْنُ مَرْيَمَ وَجِيهًا فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمِنَ الْمُقَرَّبِينَ ٤٥

దేవదూతలు ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): ”ఓ మర్యమ్‌! నిశ్చయంగా, అల్లాహ్‌! నీకు తన వాక్కును గురించి శుభవార్తను ఇస్తున్నాడు. 29 అతని పేరు: ”మసీ’హ్‌ ‘ఈసా ఇబ్నె మర్యమ్‌.’ అతను ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ గౌరవనీయుడైనవాడై మరియు (అల్లాహ్‌) సామీప్యం పొందిన వారిలో ఒకడై ఉంటాడు.

3:46 – وَيُكَلِّمُ النَّاسَ فِي الْمَهْدِ وَكَهْلًا وَمِنَ الصَّالِحِينَ ٤٦

”మరియు అతను ప్రజలతో ఉయ్యాలలో ఉండగానే మాట్లాడుతాడు మరియు పెద్దవాడైన తరువాత కూడా (మాట్లాడుతాడు) మరియు సత్పురుషులలో ఒకడై ఉంటాడు.” 30

3:47 – قَالَتْ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي وَلَدٌ وَلَمْ يَمْسَسْنِي بَشَرٌ ۖ قَالَ كَذَٰلِكِ اللَّـهُ يَخْلُقُ مَا يَشَاءُ ۚ إِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ ٤٧

ఆమె (మర్యమ్‌) ఇలా అన్నది: ”ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? ఏ పురుషుడు కూడా నన్ను ముట్టలేదే?” ఇలా సమాధానమిచ్చాడు: ”అల్లాహ్ తాను కోరింది ఇదే విధంగా సృష్టిస్తాడు. ఆయన ఒక పని చేయాలని నిర్ణయించినపుడు కేవలం దానిని: ‘అయిపో!’ అని అంటాడు, అంతే అది అయిపోతుంది.”

3:48 – وَيُعَلِّمُهُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَالتَّوْرَاةَ وَالْإِنجِيلَ ٤٨

మరియు ఆయన (అల్లాహ్‌) అతనికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని మరియు తౌరాతు ను మరియు ఇంజీలును నేర్పుతాడు.

3:49 – وَرَسُولًا إِلَىٰ بَنِي إِسْرَائِيلَ أَنِّي قَدْ جِئْتُكُم بِآيَةٍ مِّن رَّبِّكُمْ ۖ أَنِّي أَخْلُقُ لَكُم مِّنَ الطِّينِ كَهَيْئَةِ الطَّيْرِ فَأَنفُخُ فِيهِ فَيَكُونُ طَيْرًا بِإِذْنِ اللَّـهِ ۖ وَأُبْرِئُ الْأَكْمَهَ وَالْأَبْرَصَ وَأُحْيِي الْمَوْتَىٰ بِإِذْنِ اللَّـهِ ۖ وَأُنَبِّئُكُم بِمَا تَأْكُلُونَ وَمَا تَدَّخِرُونَ فِي بُيُوتِكُمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ ٤٩

మరియు అతనిని ఇస్రాయీ’ల్‌ సంతతి వారి వైపుకు సందేశహరునిగా పంపుతాడు. (అతను ఇలా అంటాడు): ”నిశ్చయంగా, నేను మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు సూచన (ఆయత్‌) తీసుకొనివచ్చాను. నిశ్చయంగా, నేను మీ కొరకు మట్టితో పక్షిఆకారంలో ఒక బొమ్మను తయారుచేసి దానిలో శ్వాసను ఊదుతాను! అప్పుడది అల్లాహ్‌ ఆజ్ఞతో పక్షి అవుతుంది. మరియు నేను అల్లాహ్‌ ఆజ్ఞతో పుట్టుగ్రుడ్డిని, 31 కుష్ఠురోగిని బాగుచేస్తాను మరియు మృతుణ్ణి బ్రతికిస్తాను. మరియు మీరు తినేది, ఇండ్లలో కూడబెట్టేది మీకు తెలుపుతాను. మీరు విశ్వాసులే అయితే! నిశ్చయంగా, ఇందులో మీకు ఒక గొప్ప సూచన (ఆయత్‌) ఉంది.

3:50 – وَمُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيَّ مِنَ التَّوْرَاةِ وَلِأُحِلَّ لَكُم بَعْضَ الَّذِي حُرِّمَ عَلَيْكُمْ ۚ وَجِئْتُكُم بِآيَةٍ مِّن رَّبِّكُمْ فَاتَّقُوا اللَّـهَ وَأَطِيعُونِ ٥٠

”మరియు నేను, ప్రస్తుతం తౌరాత్‌లో (మిగిలి ఉన్న సత్యాన్ని) ధృవపరచటానికి మరియు పూర్వం మీకు నిషేధింపబడిన (‘హరామ్‌ చేయబడిన) కొన్ని వస్తువులను ధర్మసమ్మతం (హలాల్‌) చేయటానికి (వచ్చాను) 32 మరియు నేను మీ ప్రభువు తరఫునుండి మీ వద్దకు అద్భుత సూచనలు (ఆయాత్‌) తీసుకొని వచ్చాను, కావున మీరు అల్లాహ్ యందు భయ-భక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి!

3:51 – إِنَّ اللَّـهَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۗ هَـٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ ٥١

”నిశ్చయంగా, అల్లాహ్ నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను, కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గము.” (3/4)

3:52 – فَلَمَّا أَحَسَّ عِيسَىٰ مِنْهُمُ الْكُفْرَ قَالَ مَنْ أَنصَارِي إِلَى اللَّـهِ ۖ قَالَ الْحَوَارِيُّونَ نَحْنُ أَنصَارُ اللَّـهِ آمَنَّا بِاللَّـهِ وَاشْهَدْ بِأَنَّا مُسْلِمُونَ ٥٢

  • ‘ఈసా వారిలో సత్య-తిరస్కారాన్ని కను గొని ఇలా ప్రశ్నించాడు: ”అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు?” (అప్పు డతని) శిష్యులు 33 ఇలా జవాబిచ్చారు: ”మేము నీకు అల్లాహ్ మార్గంలో సహాయకులముగా ఉంటాము. మేము అల్లాహ్‌ను విశ్వసించాము మరియు మేము అల్లాకు విధేయులము (ముస్లిం లము) అయ్యామని, నీవు మాకు సాక్షిగా ఉండు.

3:53 – رَبَّنَا آمَنَّا بِمَا أَنزَلْتَ وَاتَّبَعْنَا الرَّسُولَ فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ ٥٣

”ఓ మా ప్రభూ! నీవు అవతరింపజేసిన సందేశాన్ని మేము విశ్వసించాము మరియు మేము ఈ సందేశహరుణ్ణి అనుసరించాము. కావున మమ్మల్ని సాక్షులలో వ్రాసుకో!”

3:54 – وَمَكَرُوا وَمَكَرَ اللَّـهُ ۖ وَاللَّـهُ خَيْرُ الْمَاكِرِينَ ٥٤

మరియు వారు (ఇస్రాయీ’ల్‌ సంతతిలోని అవిశ్వాసులు, ఈసాకు విరుద్ధంగా) కుట్రలు చేశారు. మరియు అల్లాహ్ (వారి కుట్రలకు విరుధ్ధంగా) పన్నాగాలు పన్నాడు. ఎత్తులు వేయటంలో అల్లాహ్ అత్యుత్తముడు!

3:55 – إِذْ قَالَ اللَّـهُ يَا عِيسَىٰ إِنِّي مُتَوَفِّيكَ وَرَافِعُكَ إِلَيَّ وَمُطَهِّرُكَ مِنَ الَّذِينَ كَفَرُوا وَجَاعِلُ الَّذِينَ اتَّبَعُوكَ فَوْقَ الَّذِينَ كَفَرُوا إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۖ ثُمَّ إِلَيَّ مَرْجِعُكُمْ فَأَحْكُمُ بَيْنَكُمْ فِيمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ ٥٥

(జ్ఞాపకం చేసుకోండి) అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: ”ఓ ‘ఈసా! నేను నిన్ను తీసు కుంటాను మరియు నిన్ను నా వైపునకు ఎత్తు కుంటాను మరియు సత్య-తిరస్కారుల నుండి నిన్ను శుధ్ధపరుస్తాను మరియు నిన్ను అనుస రించిన వారిని, పునరుత్థానదినం వరకు సత్య- తిరస్కారులకు పైచేయిగా ఉండేటట్లు చేస్తాను. 34 చివరకు మీరంతా నా వద్దకే మరలి రావలసి ఉంది. అప్పుడు నేను మీ మధ్య తలెత్తిన విభేదాలను గురించి తీర్పుచేస్తాను.

3:56 – فَأَمَّا الَّذِينَ كَفَرُوا فَأُعَذِّبُهُمْ عَذَابًا شَدِيدًا فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ ٥٦

”ఇక సత్య-తిరస్కారులకు ఇహలోకంలో మరియు పరలోకంలోనూ కఠినమైన శిక్ష విధిస్తాను. మరియు వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు.”

3:57 – وَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ ۗ وَاللَّـهُ لَا يُحِبُّ الظَّالِمِينَ ٥٧

మరియు విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి (అల్లాహ్‌) పరిపూర్ణ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ దుర్మార్గులు అంటే ఇష్టపడడు.

3:58 – ذَٰلِكَ نَتْلُوهُ عَلَيْكَ مِنَ الْآيَاتِ وَالذِّكْرِ الْحَكِيمِ ٥٨

(ఓ ము’హమ్మద్‌!) మేము నీకు ఈ సూచన (ఆయాత్‌)లను వినిపిస్తున్నాము. మరియు ఇవి వివేకంతో నిండిన ఉపదేశాలు.

3:59 – إِنَّ مَثَلَ عِيسَىٰ عِندَ اللَّـهِ كَمَثَلِ آدَمَ ۖ خَلَقَهُ مِن تُرَابٍ ثُمَّ قَالَ لَهُ كُن فَيَكُونُ ٥٩

నిశ్చయంగా, అల్లాహ్ దృష్టిలో ‘ఈసా ఉపమానం, ఆదమ్‌ ఉపమానం వంటిదే. ఆయన (ఆదమ్‌ను) మట్టితో సృజించి: ”అయిపో!” అని అన్నాడు. అంతే అతను అయిపోయాడు. 35

3:60 – الْحَقُّ مِن رَّبِّكَ فَلَا تَكُن مِّنَ الْمُمْتَرِينَ ٦٠

ఈ సత్యం నీ ప్రభువు తరఫు నుండి వచ్చింది, కావున నీవు శంకించేవారిలో చేరిన వాడవు కావద్దు.

3:61 – فَمَنْ حَاجَّكَ فِيهِ مِن بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ فَقُلْ تَعَالَوْا نَدْعُ أَبْنَاءَنَا وَأَبْنَاءَكُمْ وَنِسَاءَنَا وَنِسَاءَكُمْ وَأَنفُسَنَا وَأَنفُسَكُمْ ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَل لَّعْنَتَ اللَّـهِ عَلَى الْكَاذِبِينَ ٦١

ఈ జ్ఞానం నీకు అందిన తర్వాత కూడా ఎవడైనా నీతో అతనిని (‘ఈసాను) గురించి వివాదానికి దిగితే, ఇలా అను: ”రండి! మేము మరియు మీరు కలిసి, మా కుమారులను మరియు మీ కుమారులను; మా స్త్రీలను మరియు మీ స్త్రీలను పిలుచుకొని, అందరమూ కలిసి: ‘అసత్యం పలికే వారిపై అల్లాహ్ శాపం (బహిష్కారం) పడుగాక!’ అని హృదయ పూర్వకంగా ప్ర్రార్థిద్దాము.” 36

3:62 – إِنَّ هَـٰذَا لَهُوَ الْقَصَصُ الْحَقُّ ۚ وَمَا مِنْ إِلَـٰهٍ إِلَّا اللَّـهُ ۚ وَإِنَّ اللَّـهَ لَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ٦٢

నిశ్చయంగా ఇదే (‘ఈసానుగురించిన) సత్య గాథ.మరియు అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

3:63 – فَإِن تَوَلَّوْا فَإِنَّ اللَّـهَ عَلِيمٌ بِالْمُفْسِدِينَ ٦٣

ఒకవేళ వారు వెనుదిరిగితే! నిశ్చయంగా, అల్లాహ్‌కు కల్లోలం రేకెత్తించే వారిని గురించి బాగా తెలుసు.

3:64 – قُلْ يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْا إِلَىٰ كَلِمَةٍ سَوَاءٍ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا نَعْبُدَ إِلَّا اللَّـهَ وَلَا نُشْرِكَ بِهِ شَيْئًا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًا مِّن دُونِ اللَّـهِ ۚ فَإِن تَوَلَّوْا فَقُولُوا اشْهَدُوا بِأَنَّا مُسْلِمُونَ ٦٤

ఇలా అను: ”ఓ గ్రంథ ప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ధర్మ విషయం (ఉత్తరువు) వైపునకు రండి, అది ఏమిటంటే: ‘మనం అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములను ఎవ్వరినీ నిలబెట్టకూడదు మరియు అల్లాహ్ తప్ప, మన వారిలోనుండి ఎవ్వరినీ ప్రభువులుగా చేసుకోరాదు.” 37 వారు (సమ్మతించక) తిరిగిపోతే: ”మేము నిశ్చయంగా అల్లాహ్‌కు విధేయులము (ముస్లింలము), దీనికి మీరు సాక్షులుగా ఉండండి.” అని పలుకు. 38

3:65 – يَا أَهْلَ الْكِتَابِ لِمَ تُحَاجُّونَ فِي إِبْرَاهِيمَ وَمَا أُنزِلَتِ التَّوْرَاةُ وَالْإِنجِيلُ إِلَّا مِن بَعْدِهِ ۚ أَفَلَا تَعْقِلُونَ ٦٥

ఓ గ్రంథ ప్రజలారా! ఇబ్రాహీమ్‌ (ధర్మాన్ని) గురించి మీరు ఎందుకు వాదులాడుతున్నారు? తౌరాతు మరియు ఇంజీల్‌లు అతని తరువాతనే అవతరించాయి కదా! ఇది మీరు అర్థం చేసుకోలేరా?

3:66 – هَا أَنتُمْ هَـٰؤُلَاءِ حَاجَجْتُمْ فِيمَا لَكُم بِهِ عِلْمٌ فَلِمَ تُحَاجُّونَ فِيمَا لَيْسَ لَكُم بِهِ عِلْمٌ ۚ وَاللَّـهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ ٦٦

అవును, మీరే వారు! తెలిసివున్న విషయాలను గురించి వాదులాడిన వారు. అయితే మీకేమీ తెలియని విషయాలను గురించి ఎందుకు వాదులాడుతున్నారు? మరియు అల్లాహ్‌కు అంతా తెలుసు, కానీ మీకు ఏమీ తెలియదు.

3:67 – مَا كَانَ إِبْرَاهِيمُ يَهُودِيًّا وَلَا نَصْرَانِيًّا وَلَـٰكِن كَانَ حَنِيفًا مُّسْلِمًا وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ ٦٧

ఇబ్రాహీమ్‌ యూదుడూ కాడు మరియు క్రైస్తవుడూ కాడు! కాని అతను ఏకదైవ సిధ్ధాంతంపై ఉన్నవాడు (‘హనీఫ్‌), అల్లాహ్‌కు విధేయుడు (ముస్లిం) మరియు అతడు ఏ మాత్రం (అల్లాహ్‌ కు) సాటి కల్పించేవాడు (ముష్రిక్‌) కాడు. 39

3:68 – إِنَّ أَوْلَى النَّاسِ بِإِبْرَاهِيمَ لَلَّذِينَ اتَّبَعُوهُ وَهَـٰذَا النَّبِيُّ وَالَّذِينَ آمَنُوا ۗ وَاللَّـهُ وَلِيُّ الْمُؤْمِنِينَ ٦٨

నిశ్చయంగా, ఇబ్రాహీమ్‌తో దగ్గరి సంబంధం గలవారంటే, అతనిని అనుసరించేవారు మరియు ఈ ప్రవక్త (ము’హమ్మద్‌) మరియు (ఇతనిని) విశ్వసించిన వారు. మరియు అల్లాహ్‌యే విశ్వాసుల సంరక్షకుడు. 40

3:69 – وَدَّت طَّائِفَةٌ مِّنْ أَهْلِ الْكِتَابِ لَوْ يُضِلُّونَكُمْ وَمَا يُضِلُّونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ ٦٩

గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు, మిమ్మల్ని మార్గభ్రష్టులు చేయాలని కోరు తున్నారు. కాని వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మార్గభ్రష్టులు చేయటం లేదు, కాని వారది గ్రహించటం లేదు.

3:70 – يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَكْفُرُونَ بِآيَاتِ اللَّـهِ وَأَنتُمْ تَشْهَدُونَ ٧٠

”ఓ గ్రంథప్రజలారా! మీరు అల్లాహ్ సూచన (ఆయాత్‌)లను ఎందుకు తిరస్కరిస్తున్నారు? మరియు వాటికి మీరే సాక్షులుగా ఉన్నారు కదా!”

3:71 – يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَلْبِسُونَ الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُونَ الْحَقَّ وَأَنتُمْ تَعْلَمُونَ ٧١

”ఓ గ్రంథ ప్రజలారా! తెలిసిఉండి కూడా మీరు సత్యాన్ని అసత్యంతో ఎందుకు కప్పిపుచ్చు తున్నారు? మరియు మీకు తెలిసిఉండి కూడా సత్యాన్ని ఎందుకు దాస్తున్నారు?” 41

3:72 – وَقَالَت طَّائِفَةٌ مِّنْ أَهْلِ الْكِتَابِ آمِنُوا بِالَّذِي أُنزِلَ عَلَى الَّذِينَ آمَنُوا وَجْهَ النَّهَارِ وَاكْفُرُوا آخِرَهُ لَعَلَّهُمْ يَرْجِعُونَ ٧٢

మరియు గ్రంథ ప్రజలలోని కొందరు (పర స్పరం ఇలా చెప్పుకుంటారు):”(ఈప్రవక్తను) విశ్వ సించినవారి (ముస్లింల) పై అవతరింపజేయబడిన దానిని ఉదయం విశ్వసించండి మరియు సాయంత్రం తిరస్కరించండి. (ఇలా చేస్తే) బహుశా, వారు కూడా (తమ విశ్వాసం నుండి) తిరిగి పోతారేమో!”

3:73 – وَلَا تُؤْمِنُوا إِلَّا لِمَن تَبِعَ دِينَكُمْ قُلْ إِنَّ الْهُدَىٰ هُدَى اللَّـهِ أَن يُؤْتَىٰ أَحَدٌ مِّثْلَ مَا أُوتِيتُمْ أَوْ يُحَاجُّوكُمْ عِندَ رَبِّكُمْ ۗ قُلْ إِنَّ الْفَضْلَ بِيَدِ اللَّـهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۗ وَاللَّـهُ وَاسِعٌ عَلِيمٌ ٧٣

మరియు (పరస్పరం ఇలా చెప్పు కుంటారు): ”మీ ధర్మాన్ని అనుసరించేవారిని తప్ప మరెవ్వరినీ నమ్మకండి.” (ఓ ప్రవక్తా!) నీవు వారితో అను: ”నిశ్చయంగా, అల్లాహ్ మార్గ దర్శకత్వమే సరైన మార్గదర్శకత్వం.” (వారు ఇంకా ఇలా అంటారు): ”మీకు ఇవ్వబడి నటువంటిది ఇంకెవరికైనా ఇవ్వబడుతుందని, లేక వారు మీ ప్రభువు సమక్షంలో మీతో వాదిస్తారని, (నమ్మకండి).” వారితో అను: ”నిశ్చయంగా, అనుగ్రహం అల్లాహ్ చేతిలోనే ఉంది; ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ విస్తారుడు, సర్వజ్ఞుడు.” 42

3:74 – يَخْتَصُّ بِرَحْمَتِهِ مَن يَشَاءُ ۗ وَاللَّـهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ ٧٤

ఆయన తాను కోరిన వారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు. మరియు అల్లాహ్ దాతృత్వంలో సర్వోత్తముడు. (7/8)

3:75 – وَمِنْ أَهْلِ الْكِتَابِ مَنْ إِن تَأْمَنْهُ بِقِنطَارٍ يُؤَدِّهِ إِلَيْكَ وَمِنْهُم مَّنْ إِن تَأْمَنْهُ بِدِينَارٍ لَّا يُؤَدِّهِ إِلَيْكَ إِلَّا مَا دُمْتَ عَلَيْهِ قَائِمًا ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لَيْسَ عَلَيْنَا فِي الْأُمِّيِّينَ سَبِيلٌ وَيَقُولُونَ عَلَى اللَّـهِ الْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ ٧٥

  • మరియు గ్రంథప్రజలలో ఎలాంటి వాడున్నాడంటే: నీవు అతనికి ధనరాసులు ఇచ్చినా అతడు వాటిని నమ్మకంగా నీకు తిరిగి అప్పగిస్తాడు. మరొకడు వారిలో ఎలాంటి వాడంటే: నీవతన్ని నమ్మి ఒక్కదీనారు ఇచ్చినా అతడు దానిని – నీవతని వెంటబడితేనే కానీ – నీకు తిరిగి ఇవ్వడు. ఇలాంటి వారు ఏమంటారంటే: ”నిరక్షరాస్యుల (యూదులు కానివారి) పట్ల ఎలా వ్యవహరించినా మాపై ఎలాంటి దోషంలేదు.” మరియు వారు తెలిసి ఉండి కూడా అల్లాహ్‌ను గురించి అబద్ధాలాడుతున్నారు. 43

3:76 – بَلَىٰ مَنْ أَوْفَىٰ بِعَهْدِهِ وَاتَّقَىٰ فَإِنَّ اللَّـهَ يُحِبُّ الْمُتَّقِينَ ٧٦

వాస్తవానికి, ఎవడు తన ఒప్పందాన్ని పూర్తి చేసి దైవభీతి కలిగి ఉంటాడో; అలాంటి దైవభీతి గలవారిని నిశ్చయంగా, అల్లాహ్ ప్రేమిస్తాడు.

3:77 – إِنَّ الَّذِينَ يَشْتَرُونَ بِعَهْدِ اللَّـهِ وَأَيْمَانِهِمْ ثَمَنًا قَلِيلًا أُولَـٰئِكَ لَا خَلَاقَ لَهُمْ فِي الْآخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ اللَّـهُ وَلَا يَنظُرُ إِلَيْهِمْ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ٧٧

నిశ్చయంగా, ఎవరైతే తాము అల్లాహ్ తో చేసిన ఒప్పందాన్ని మరియు తమ ప్రమాణాలను స్వల్పలాభాలకు అమ్ముకుంటారో, అలాంటి వారికి పరలోక జీవితంలో ఎలాంటి భాగం ఉండదు మరియు పునరుత్థాన దినమున అల్లాహ్ వారితో మాట్లాడడు మరియు వారివైపు కూడా చూడడు మరియు వారిని పరిశుద్ధులుగాచేయడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

3:78 – وَإِنَّ مِنْهُمْ لَفَرِيقًا يَلْوُونَ أَلْسِنَتَهُم بِالْكِتَابِ لِتَحْسَبُوهُ مِنَ الْكِتَابِ وَمَا هُوَ مِنَ الْكِتَابِ وَيَقُولُونَ هُوَ مِنْ عِندِ اللَّـهِ وَمَا هُوَ مِنْ عِندِ اللَّـهِ وَيَقُولُونَ عَلَى اللَّـهِ الْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ ٧٨

మరియు మీరు అది గ్రంథంలోనిదని భావించాలని, వాస్తవానికి వారిలో కొందరు తమ నాలుకలను త్రిప్పి గ్రంథాన్ని చదువుతారు, కాని (నిజానికి) అది గ్రంథంలోనిది కాదు; మరియు వారు: ”అది అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది.” అని అంటారు, కాని అది (నిజానికి) అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది కాదు మరియు వారు తెలిసి కూడా అల్లాహ్‌పై అబద్ధాలు పలుకుతున్నారు.

3:79 – مَا كَانَ لِبَشَرٍ أَن يُؤْتِيَهُ اللَّـهُ الْكِتَابَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ثُمَّ يَقُولَ لِلنَّاسِ كُونُوا عِبَادًا لِّي مِن دُونِ اللَّـهِ وَلَـٰكِن كُونُوا رَبَّانِيِّينَ بِمَا كُنتُمْ تُعَلِّمُونَ الْكِتَابَ وَبِمَا كُنتُمْ تَدْرُسُونَ ٧٩

ఏ మానవునికైనా అల్లాహ్ అతనికి గ్రంథాన్ని, వివేకాన్ని మరియు ప్రవక్తపదవిని ప్రసాదించిన తర్వాత అతడు ప్రజలతో: ”మీరు అల్లాహ్‌కు బదులుగా నన్ను ప్రార్థించండి.” అని అనటం తగినది కాదు, 44 కాని వారితో: ”మీరు ఇతరులకు బోధించే మరియు మీరు చదివే గ్రంథాల అనుసారంగా ధర్మవేత్తలు (రబ్బా- నియ్యూన్‌) కండి.” అని అనటం (భావింపదగినది);

3:80 – وَلَا يَأْمُرَكُمْ أَن تَتَّخِذُوا الْمَلَائِكَةَ وَالنَّبِيِّينَ أَرْبَابًا ۗ أَيَأْمُرُكُم بِالْكُفْرِ بَعْدَ إِذْ أَنتُم مُّسْلِمُونَ ٨٠

మరియు మీరు దేవదూతలనో, లేదా ప్రవక్తలనో ప్రభువులుగా చేసుకోండని అతను మిమ్మల్ని ఎన్నడూ ఆజ్ఞాపించడు. అయితే! అలాంటప్పుడు మీరు అల్లాహ్‌కు విధేయులు (ముస్లింలు) అయిన తరువాత మిమ్మల్ని సత్య-తిరస్కారులు కమ్మని ఆదేశించగలడా? 45

3:81 – وَإِذْ أَخَذَ اللَّـهُ مِيثَاقَ النَّبِيِّينَ لَمَا آتَيْتُكُم مِّن كِتَابٍ وَحِكْمَةٍ ثُمَّ جَاءَكُمْ رَسُولٌ مُّصَدِّقٌ لِّمَا مَعَكُمْ لَتُؤْمِنُنَّ بِهِ وَلَتَنصُرُنَّهُ ۚ قَالَ أَأَقْرَرْتُمْ وَأَخَذْتُمْ عَلَىٰ ذَٰلِكُمْ إِصْرِي ۖ قَالُوا أَقْرَرْنَا ۚ قَالَ فَاشْهَدُوا وَأَنَا مَعَكُم مِّنَ الشَّاهِدِينَ ٨١

మరియు అల్లాహ్ ప్రవక్తల నుండి తీసు కున్న గట్టి ప్రమాణాన్ని 46 (జ్ఞాపకం చేసుకోండి): ”నేను మీకు ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించిన తరువాత, ఒక సందేశహరుడు (ము’హమ్మద్‌) వచ్చి (మీ గ్రంథాలలో నుండి మిగిలివున్న) సత్యాన్ని ధృవపరిస్తే, మీరు అతని (ధర్మాన్ని) విశ్వసించి, అతనికి సహాయం చేయవలసి ఉంటుంది.” అని చెప్పి ఇలా ప్రశ్నించాడు: ”ఏమి? మీరు దీనికి అంగీకరిస్తారా? మరియు నా ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తారా?” వారన్నారు: ”మేము అంగీకరిస్తాము.” అప్పుడు ఆయన అన్నాడు: ”అయితే, మీరు దీనికి సాక్షులుగా ఉండండి. మరియు నేను కూడా మీతోపాటు సాక్షిగా ఉంటాను.

3:82 – فَمَن تَوَلَّىٰ بَعْدَ ذَٰلِكَ فَأُولَـٰئِكَ هُمُ الْفَاسِقُونَ ٨٢

”ఇకపై ఎవరు తమ వాగ్దానం నుండి మరలుతారో, వారే దుష్టులు (ఫాసిఖూన్‌).”

3:83 – أَفَغَيْرَ دِينِ اللَّـهِ يَبْغُونَ وَلَهُ أَسْلَمَ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَإِلَيْهِ يُرْجَعُونَ ٨٣

ఏమీ? వీరు అల్లాహ్ ధర్మం కాక వేరే ధర్మాన్ని అవలంబించగోరుతున్నారా? మరియు భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఇష్టం ఉన్నా, ఇష్టం లేకున్నా ఆయనకే విధేయులై (ముస్లింలై) ఉన్నాయి! మరియు ఆయన వైపునకే అందరూ మరలింపబడతారు. 47

3:84 – قُلْ آمَنَّا بِاللَّـهِ وَمَا أُنزِلَ عَلَيْنَا وَمَا أُنزِلَ عَلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَالنَّبِيُّونَ مِن رَّبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّنْهُمْ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ ٨٤

(ఓ ప్రవక్తా!) ఇలా అను: ”మేము అల్లాహ్‌ను విశ్వసించాము; మరియు మాపై అవతరింపజేయ బడినదానిని మరియు ఇబ్రాహీమ్‌, ఇస్మా’యీల్‌, ఇస్‌’హాఖ్‌, య’అఖూబ్‌లపై మరియు అతని సంతానంపై అవతరింపజేయబడినవాటిని కూడా (విశ్వసించాము). ఇంకా మూసా, ‘ఈసా మరియు ఇతర ప్రవక్తలపై వారి ప్రభువు తరఫునుండి (అవత రింపజేయబడిన వాటిని కూడా విశ్వసించాము). మేము వారి మధ్య ఎలాంటి విచక్షణచేయము. మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము.”

3:85 – وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ ٨٥

మరియు ఎవడైనా అల్లాహ్‌కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడే వారిలో చేరుతాడు 48

3:86 – كَيْفَ يَهْدِي اللَّـهُ قَوْمًا كَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ وَشَهِدُوا أَنَّ الرَّسُولَ حَقٌّ وَجَاءَهُمُ الْبَيِّنَاتُ ۚ وَاللَّـهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ ٨٦

అల్లాహ్ వారికి ఎలా సన్మార్గం చూప గలడు? ఏ జాతివారైతే, విశ్వాసం పొందిన తరువాత – మరియు నిశ్చయంగా, సందేశ హరుడు సత్యవంతుడే, అని సాక్ష్యమిచ్చిన తరువాత మరియు వారివద్దకు స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కూడా – సత్య-తిరస్కారం అవలంబించారో! మరియు అల్లాహ్ దుర్మార్గులైన వారికి సన్మార్గం చూపడు. అల్లాహ్ దుర్మార్గులైన వారికి సన్మార్గం చూపడు.

3:87 – أُولَـٰئِكَ جَزَاؤُهُمْ أَنَّ عَلَيْهِمْ لَعْنَةَ اللَّـهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ ٨٧

అలాంటి వారి శిక్ష, నిశ్చయంగా, అల్లాహ్ మరియు దేవదూతల మరియు సర్వమానవుల శాపం వారిపై పడటమే!

3:88 – خَالِدِينَ فِيهَا لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ ٨٨

అందులో (నరకంలో) వారు శాశ్వతంగా ఉంటారు. వారి శిక్ష ఏమాత్రం తగ్గించబడదు మరియు వారికి వ్యవధి కూడా ఇవ్వబడదు.

3:89 – إِلَّا الَّذِينَ تَابُوا مِن بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوا فَإِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ٨٩

కానీ, ఇక మీదట ఎవరైతే పశ్చాత్తాపపడి, తమ నడవడికను సరిదిద్దుకుంటారో! అలాంటి వారి యెడల నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. 49

3:90 – إِنَّ الَّذِينَ كَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ ثُمَّ ازْدَادُوا كُفْرًا لَّن تُقْبَلَ تَوْبَتُهُمْ وَأُولَـٰئِكَ هُمُ الضَّالُّونَ ٩٠

(అయితే) నిశ్చయంగా, విశ్వసించిన తరువాత ఎవరు సత్య-తిరస్కారవైఖరిని అవలం బిస్తారో మరియు తమ సత్య-తిరస్కార వైఖరిని పెంచుకుంటారో, వారి పశ్చాత్తాపం ఏ మాత్రం అంగీకరించబడదు మరియు అలాంటివారే మార్గభ్రష్టులైన వారు 50

3:91 – إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارٌ فَلَن يُقْبَلَ مِنْ أَحَدِهِم مِّلْءُ الْأَرْضِ ذَهَبًا وَلَوِ افْتَدَىٰ بِهِ ۗ أُولَـٰئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ ٩١

నిశ్చయంగా, ఎవరైతే సత్య-తిరస్కారులై, ఆ సత్య-తిరస్కార స్థితిలోనే మృతిచెందుతారో! వారు భూగోళమంత బంగారం పాపపరిహారంగా ఇవ్వదలచినా అది అంగీకరించబడదు. అలాంటి వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. మరియు వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు. 51

3:92 – لَن تَنَالُوا الْبِرَّ حَتَّىٰ تُنفِقُوا مِمَّا تُحِبُّونَ ۚ وَمَا تُنفِقُوا مِن شَيْءٍ فَإِنَّ اللَّـهَ بِهِ عَلِيمٌ ٩٢

[*] మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు (అల్లాహ్‌ మార్గంలో) ఖర్చుపెట్టనంత వరకు మీరు పుణ్యాత్ములు (ధర్మనిష్ఠాపరులు) కాలేరు. 52 మరియు మీరు ఏమి ఖర్చుపెట్టినా అది అల్లాహ్ కు తప్పక తెలుస్తుంది.

3:93 – لُّ الطَّعَامِ كَانَ حِلًّا لِّبَنِي إِسْرَائِيلَ إِلَّا مَا حَرَّمَ إِسْرَائِيلُ عَلَىٰ نَفْسِهِ مِن قَبْلِ أَن تُنَزَّلَ التَّوْرَاةُ ۗ قُلْ فَأْتُوا بِالتَّوْرَاةِ فَاتْلُوهَا إِن كُنتُمْ صَادِقِينَ ٩٣

(*) ఆహార పదార్థాలన్నీ ఇస్రాయీ’ల్‌ సంతతి వారికి ధర్మసమ్మతమైనవిగానే ఉండేవి. కాని, తౌరాత్‌ అవతరణకు పూర్వం ఇస్రాయీ’ల్‌ (య’అఖూబ్‌) తనకు తాను కొన్నివస్తువులను నిషేధించుకున్నాడు. వారితో ఇట్లను: ”మీరు సత్యవంతులే అయితే, తౌరాత్‌ను తీసుకొనిరండి మరియు దానిని చదవండి.” 53

3:94 – فَمَنِ افْتَرَىٰ عَلَى اللَّـهِ الْكَذِبَ مِن بَعْدِ ذَٰلِكَ فَأُولَـٰئِكَ هُمُ الظَّالِمُونَ ٩٤

కావున దీని తర్వాత కూడా ఎవడైనా అబద్ధాన్ని కల్పించి దానిని అల్లాహ్‌కు ఆపాదిస్తే, అలాంటి వారు, వారే దుర్మార్గులు.

3:95 – قُلْ صَدَقَ اللَّـهُ ۗ فَاتَّبِعُوا مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ ٩٥

ఇలా అను: ”అల్లాహ్ సత్యం పలికాడు. కనుక మీరు ఏకదైవ సిద్ధాంతం (సత్య-ధర్మం) అయిన ఇబ్రాహీమ్‌ ధర్మాన్నే అనుసరించండి. మరియు అతను అల్లాహ్‌కు సాటి కల్పించేవాడు (ముష్రిక్‌) కాడు.”

3:96 – إِنَّ أَوَّلَ بَيْتٍ وُضِعَ لِلنَّاسِ لَلَّذِي بِبَكَّةَ مُبَارَكًا وَهُدًى لِّلْعَالَمِينَ ٩٦

నిశ్చయంగా, మానవ జాతి కొరకు మొట్ట మొదట నియమించబడిన (ఆరాధనా) గృహం బక్కహ్ (మక్కహ్)లో ఉన్నదే, శుభాలతో నిండినది సమస్తలోకాల ప్రజలకు మార్గదర్శ కత్వాన్ని ప్రసాదించేది. 54

3:97 – فِيهِ آيَاتٌ بَيِّنَاتٌ مَّقَامُ إِبْرَاهِيمَ ۖ وَمَن دَخَلَهُ كَانَ آمِنًا ۗ وَلِلَّـهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا ۚ وَمَن كَفَرَ فَإِنَّ اللَّـهَ غَنِيٌّ عَنِ الْعَالَمِينَ ٩٧

అందులో స్పష్టమైన సంకేతాలున్నాయి. ఇబ్రాహీమ్‌ నిలిచిన స్థలం ఉంది. మరియు దానిలో ప్రవేశించినవాడు అభయం (రక్షణ) పొందుతాడు 55 మరియు అక్కడికి పోవటానికి, శక్తిగలవారికి ఆ గృహయాత్ర (‘హిజ్జుల్‌ బైత్) అల్లాహ్ (ప్రసన్నత) కొరకు చేయటం, విధిగా చేయబడింది. 56 ఎవరు దీనిని తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ సమస్త లోకాలవారి అవసరంలేని, స్వయం సమృద్ధుడు (అని తెలుసుకోవాలి).

3:98 – قُلْ يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَكْفُرُونَ بِآيَاتِ اللَّـهِ وَاللَّـهُ شَهِيدٌ عَلَىٰ مَا تَعْمَلُونَ ٩٨

ఇలా అను: ”ఓ గ్రంథప్రజలారా! మీరు అల్లాహ్ సందేశాలను ఎందుకు తిరస్క రిస్తున్నారు? మరియు మీరు చేసే కర్మలన్నింటికీ అల్లాహ్ సాక్షిగా 57 ఉన్నాడు!”

3:99 – قُلْ يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَصُدُّونَ عَن سَبِيلِ اللَّـهِ مَنْ آمَنَ تَبْغُونَهَا عِوَجًا وَأَنتُمْ شُهَدَاءُ ۗ وَمَا اللَّـهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ ٩٩

  1. ఇంకా ఇలా అను: ”ఓ గ్రంథ ప్రజలారా! మీరు దానికి (సత్యమార్గానికి) సాక్ష్యులుగా ఉండి కూడా అది వక్రమార్గమని చూపదలచి, విశ్వసించిన వారిని అల్లాహ్ మార్గంపై నడవకుండా ఎందుకు ఆటంకపరుస్తున్నారు? 58 మరియు అల్లాహ్ మీ కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు.”

3:100 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تُطِيعُوا فَرِيقًا مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ يَرُدُّوكُم بَعْدَ إِيمَانِكُمْ كَافِرِينَ ١٠٠

ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు గ్రంథ ప్రజలలో కొందరి (మాటలు విని) వారిని అనుస రిస్తే! వారు మిమ్మల్ని, విశ్వసించిన తరువాత కూడా సత్య-తిరస్కారులుగా మార్చివేస్తారు.

3:101 – وَكَيْفَ تَكْفُرُونَ وَأَنتُمْ تُتْلَىٰ عَلَيْكُمْ آيَاتُ اللَّـهِ وَفِيكُمْ رَسُولُهُ ۗ وَمَن يَعْتَصِم بِاللَّـهِ فَقَدْ هُدِيَ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ١٠١

మరియు అల్లాహ్ సందేశాలు మీకు చదివి వినిపించబడుతూ ఉన్నప్పుడు మరియు ఆయన సందేశహరుడు మీలో ఉన్నప్పుడు; మీరు ఎలా సత్య-తిరస్కారులు కాగలరు? మరియు మీలో ఎవడు స్థిరంగా అల్లాహ్ ను ఆశ్రయిస్తాడో, అతడు నిశ్చయంగా, బుజుమార్గం వైపునకు మార్గదర్శ కత్వం పొందినవాడే!

3:102 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّـهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ ١٠٢

ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు కర్తవ్య పాలనగా అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు అల్లాహ్‌కు విధేయులు (ముస్లింలు)గా ఉన్న స్థితిలో తప్ప మరణించకండి!

3:103 – وَاعْتَصِمُوا بِحَبْلِ اللَّـهِ جَمِيعًا وَلَا تَفَرَّقُوا ۚ وَاذْكُرُوا نِعْمَتَ اللَّـهِ عَلَيْكُمْ إِذْ كُنتُمْ أَعْدَاءً فَأَلَّفَ بَيْنَ قُلُوبِكُمْ فَأَصْبَحْتُم بِنِعْمَتِهِ إِخْوَانًا وَكُنتُمْ عَلَىٰ شَفَا حُفْرَةٍ مِّنَ النَّارِ فَأَنقَذَكُم مِّنْهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّـهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَهْتَدُونَ ١٠٣

మీరందరూ కలసి అల్లాహ్ త్రాడు (ఖుర్‌ ఆన్‌) ను గట్టిగా పట్టుకోండి. మరియు విభేదాలలో పడకండి. 59 అల్లాహ్ మీ యెడల చూపిన అనుగ్రహా లను జ్ఞాపకం చేసుకోండి; మీరు ఒకరికొకరు శత్రువు లుగా ఉండేవారు, ఆయన మీ హృదయాలను కలిపాడు. ఆయన అనుగ్రహం వల్లనే మీరు పర స్పరం సోదరులయ్యారు. మరియు మీరు అగ్ని గుండంఒడ్డున నిలబడినప్పుడు ఆయన మిమ్మల్ని దాని నుండి రక్షించాడు. ఈ విధంగా అల్లాహ్ తన సూచనలను మీకు స్పష్టం చేస్తున్నాడు, బహుశా మీరు మార్గదర్శకత్వం పొందుతారని!

3:104 – وَلْتَكُن مِّنكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ ۚ وَأُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ١٠٤

మీలో ఒక వర్గం, (ప్రజలను) మంచి మార్గం వైపునకు పిలిచేదిగా, ధర్మాన్ని (మంచిని) ఆదే శించేదిగా (బోధించేదిగా) మరియు అధర్మాన్ని (చెడును) నిషేధించేదిగా (నిరోధించేదిగా) ఉండాలి 60 మరియు అలాంటివారు, వారే సాఫల్యం పొందేవారు.

3:105 – وَلَا تَكُونُوا كَالَّذِينَ تَفَرَّقُوا وَاخْتَلَفُوا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْبَيِّنَاتُ ۚ وَأُولَـٰئِكَ لَهُمْ عَذَابٌ عَظِيمٌ ١٠٥

స్పష్టమైన ఉపదేశాలను పొందిన తరువాత కూడా ఎవరైతే, (వేర్వేరు తెగలుగా) చీలిపోయారో మరియు విభేదాలకు గురిఅయ్యారో, వారి మాదిరిగా మీరూ కావద్దు. 61 మరియు అలాంటి వారికి ఘోరశిక్ష ఉంటుంది.

3:106 – يَوْمَ تَبْيَضُّ وُجُوهٌ وَتَسْوَدُّ وُجُوهٌ ۚ فَأَمَّا الَّذِينَ اسْوَدَّتْ وُجُوهُهُمْ أَكَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ ١٠٦

ఆ (తీర్పు) దినమున కొందరి ముఖాలు (సంతోషంతో) ప్రకాశిస్తూ ఉంటాయి. మరికొందరి ముఖాలు (దుఃఖంతో) నల్లబడి ఉంటాయి. ఇక ఎవరి ముఖాలు నల్లబడి ఉంటాయో వారితో: ”మీరు విశ్వసించిన తరువాత సత్య-తిరస్కారులు అయ్యారు కదా? కాబట్టి మీరు సత్యాన్ని తిరస్కరించినందుకు ఈ శిక్షను అనుభవించండి.” (అని అనబడుతుంది).

3:107 – وَأَمَّا الَّذِينَ ابْيَضَّتْ وُجُوهُهُمْ فَفِي رَحْمَةِ اللَّـهِ هُمْ فِيهَا خَالِدُونَ ١٠٧

ఇక ఎవరి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయో వారు అల్లాహ్ కారుణ్యంలో (స్వర్గంలో) ఉంటారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

3:108 – تِلْكَ آيَاتُ اللَّـهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۗ وَمَا اللَّـهُ يُرِيدُ ظُلْمًا لِّلْعَالَمِينَ ١٠٨

(ఓ ప్రవక్తా!) ఇవి అల్లాహ్ సూక్తులు (ఆయాత్‌) మేము వాటిని యథా-తథంగా నీకు వినిపిస్తున్నాము. మరియు అల్లాహ్ సర్వలోకాల వారికి అన్యాయం చేయగోరడు.

3:109 – وَلِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَإِلَى اللَّـهِ تُرْجَعُ الْأُمُورُ ١٠٩

మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. మరియు వ్యవహారాలన్నీ (తీర్పు కొరకు) అల్లాహ్ వైపునకే మరలింపబడతాయి.

3:110 – كُنتُمْ خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنَّاسِ تَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَتَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَتُؤْمِنُونَ بِاللَّـهِ ۗ وَلَوْ آمَنَ أَهْلُ الْكِتَابِ لَكَانَ خَيْرًا لَّهُم ۚ مِّنْهُمُ الْمُؤْمِنُونَ وَأَكْثَرُهُمُ الْفَاسِقُونَ ١١٠

మీరే (విశ్వాసులే) మానవజాతి (హితం) కొరకు నిలబెట్టబడిన ఉత్తమ సమాజం వారు. మీరు ధర్మాన్ని ఆదేశించే (బోధించే) వారు మరియు అధర్మాన్ని నిషేధించే (నిరోధించే) వారు మరియు మీరు అల్లాహ్ యందు విశ్వాసం కలిగి ఉన్నవారు. 62 మరియు ఒకవేళ గ్రంథ ప్రజలు విశ్వసిస్తే, వారికే మేలై ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు. 63 కాని అత్యధికులు అవిధేయులే (ఫాసిఖూన్‌).

3:111 – لَن يَضُرُّوكُمْ إِلَّا أَذًى ۖ وَإِن يُقَاتِلُوكُمْ يُوَلُّوكُمُ الْأَدْبَارَ ثُمَّ لَا يُنصَرُونَ ١١١

వారు మిమ్మల్ని కొంత వరకు బాధించటం తప్ప, మీకు ఏ విధమైన హాని కలిగించజాలరు. మరియు వారు మీతో యుధ్ధం చేసినట్లయితే, మీకు వీపు చూపించి పారిపోతారు, తరువాత వారికెలాంటి సహాయం లభించదు.

3:112 – ضُرِبَتْ عَلَيْهِمُ الذِّلَّةُ أَيْنَ مَا ثُقِفُوا إِلَّا بِحَبْلٍ مِّنَ اللَّـهِ وَحَبْلٍ مِّنَ النَّاسِ وَبَاءُوا بِغَضَبٍ مِّنَ اللَّـهِ وَضُرِبَتْ عَلَيْهِمُ الْمَسْكَنَةُ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَانُوا يَكْفُرُونَ بِآيَاتِ اللَّـهِ وَيَقْتُلُونَ الْأَنبِيَاءَ بِغَيْرِ حَقٍّ ۚ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ ١١٢

వారు ఎక్కడున్నా, అవమానానికే గురి చేయబడతారు, అల్లాహ్ శరణులోనో లేక మానవుల అభయంలోనో ఉంటేనే తప్ప; వారు అల్లాహ్ ఆగ్రహానికి గురిఅయ్యారు మరియు వారు అధోగతికి చేరారు. ఇది వారు అల్లాహ్ సూచనలను తిరస్కరించినందుకు మరియు అన్యాయంగా ప్రవక్తలను చంపినందుకు. ఇది వారి ఆజ్ఞోల్లంఘన మరియు హద్దులుమీరి ప్రవర్తించిన దాని పర్యవసానం. 64 (1/8)

3:113 – لَيْسُوا سَوَاءً ۗ مِّنْ أَهْلِ الْكِتَابِ أُمَّةٌ قَائِمَةٌ يَتْلُونَ آيَاتِ اللَّـهِ آنَاءَ اللَّيْلِ وَهُمْ يَسْجُدُونَ ١١٣

  • వారందరూ ఒకే రకమైనవారు కారు. గ్రంథ ప్రజలలో కొందరు సరైన మార్గంలో ఉన్న వారున్నారు; వారు రాత్రి వేళలందు అల్లాహ్ సూక్తులను (ఆయాత్‌లను) పఠిస్తుంటారు మరియు సాష్టాంగం (సజ్దా) చేస్తుంటారు.

3:114 – يُؤْمِنُونَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَأُولَـٰئِكَ مِنَ الصَّالِحِينَ ١١٤

వారు అల్లాహ్‌ను మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. మరియు ధర్మాన్ని ఆదేశిస్తారు (బోధిస్తారు) మరియు అధర్మాన్ని నిషేధిస్తారు (నిరోధిస్తారు) మరియు మంచి పనులు చేయటంలో పోటీపడతారు మరియు ఇలాంటి వారే సత్పురుషులలోని వారు.

3:115 – وَمَا يَفْعَلُوا مِنْ خَيْرٍ فَلَن يُكْفَرُوهُ ۗ وَاللَّـهُ عَلِيمٌ بِالْمُتَّقِينَ ١١٥

మరియు వారు ఏ మంచిపని చేసినా అది వృథా చేయబడదు. మరియు దైవభీతిగల వారెవరో అల్లాహ్‌కు బాగా తెలుసు. 65

3:116 – إِنَّ الَّذِينَ كَفَرُوا لَن تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُم مِّنَ اللَّـهِ شَيْئًا ۖ وَأُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۚ هُمْ فِيهَا خَالِدُونَ ١١٦

నిశ్చయంగా, సత్య-తిరస్కారానికి పాల్ప డిన వారికి, వారి సంపద గానీ, వారి సంతానం గానీ, అల్లాహ్ ముందు ఏమీ పనికిరావు. మరియు అలాంటి వారు నరకాగ్నివాసులే. అందు వారు శాశ్వతంగా ఉంటారు.

3:117 – مَثَلُ مَا يُنفِقُونَ فِي هَـٰذِهِ الْحَيَاةِ الدُّنْيَا كَمَثَلِ رِيحٍ فِيهَا صِرٌّ أَصَابَتْ حَرْثَ قَوْمٍ ظَلَمُوا أَنفُسَهُمْ فَأَهْلَكَتْهُ ۚ وَمَا ظَلَمَهُمُ اللَّـهُ وَلَـٰكِنْ أَنفُسَهُمْ يَظْلِمُونَ ١١٧

వారు ఈ ఇహలోక జీవితంలో చేస్తున్న ధన వ్యయాన్ని, తమకు తాము అన్యాయం చేసుకున్న వారి పొలాలపై వీచి వాటిని సమూలంగా నాశనం చేసే, మంచు గాలితో పోల్చ వచ్చు. మరియు అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు. కానీ వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. 66

3:118 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا بِطَانَةً مِّن دُونِكُمْ لَا يَأْلُونَكُمْ خَبَالًا وَدُّوا مَا عَنِتُّمْ قَدْ بَدَتِ الْبَغْضَاءُ مِنْ أَفْوَاهِهِمْ وَمَا تُخْفِي صُدُورُهُمْ أَكْبَرُ ۚ قَدْ بَيَّنَّا لَكُمُ الْآيَاتِ ۖ إِن كُنتُمْ تَعْقِلُونَ ١١٨

  1. ఓ విశ్వాసులారా! మీరు మీ వారిని (విశ్వాసులను) తప్ప, ఇతరులను మీ సన్నిహిత స్నేహితులుగా చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాన్నైనా ఉపయోగించు కోవటానికి వెనుకాడరు. వారు మిమ్మల్ని ఇబ్బందిలో చూడగోరుతున్నారు. మరియు వారి ఈర్ష్య వారి నోళ్ళ నుండి బయటపడుతున్నది, కాని వారి హృదయాలలో దాచుకున్నది దానికంటే తీవ్రమైనది. వాస్తవానికి మేము ఈ సూచనలను మీకు స్పష్టంచేశాము. మీరు అర్థంచేసుకో గలిగితే (ఎంత బాగుండేది)! 67

3:119 – هَا أَنتُمْ أُولَاءِ تُحِبُّونَهُمْ وَلَا يُحِبُّونَكُمْ وَتُؤْمِنُونَ بِالْكِتَابِ كُلِّهِ وَإِذَا لَقُوكُمْ قَالُوا آمَنَّا وَإِذَا خَلَوْا عَضُّوا عَلَيْكُمُ الْأَنَامِلَ مِنَ الْغَيْظِ ۚ قُلْ مُوتُوا بِغَيْظِكُمْ ۗ إِنَّ اللَّـهَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ١١٩

అవును! మీరైతే వారిని ప్రేమిస్తున్నారు. కాని వారు మిమ్మల్ని ప్రేమించటం లేదు. మరియు మీరు దివ్య గ్రంథాలన్నింటినీ విశ్వసిస్తున్నారు. వారు మీతో కలసినపుడు: ”మేము విశ్వసించాము.” అని అంటారు. కాని వేరుగా ఉన్నప్పుడు, మీ ఎడల ఉన్న క్రోధావేశం వల్ల తమ వ్రేళ్ళను కొరుక్కుంటారు. వారితో: ”మీ క్రోధావేశంలో మీరే మాడి చావండి, నిశ్చయంగా, హృదయాలలో దాగి ఉన్నదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.” అని అను.

3:120 – إِن تَمْسَسْكُمْ حَسَنَةٌ تَسُؤْهُمْ وَإِن تُصِبْكُمْ سَيِّئَةٌ يَفْرَحُوا بِهَا ۖ وَإِن تَصْبِرُوا وَتَتَّقُوا لَا يَضُرُّكُمْ كَيْدُهُمْ شَيْئًا ۗ إِنَّ اللَّـهَ بِمَا يَعْمَلُونَ مُحِيطٌ ١٢٠

మీకేదైనా మేలు కలిగితే వారికది దుఃఖం కలిగిస్తుంది మరియు మీకేదైనా కీడు కలిగితే వారికది సంతోషం కలిగిస్తుంది. మరియు మీరు సహనం వహించి దైవభీతి కలిగి ఉంటే, వారి కుట్ర మీకెలాంటి నష్టం కలిగించ జాలదు. నిశ్చయంగా, అల్లాహ్ వారు చేసే దాని నంతా పరివేష్టించి ఉన్నాడు.

3:121 – وَإِذْ غَدَوْتَ مِنْ أَهْلِكَ تُبَوِّئُ الْمُؤْمِنِينَ مَقَاعِدَ لِلْقِتَالِ ۗ وَاللَّـهُ سَمِيعٌ عَلِيمٌ ١٢١

మీకేదైనా మేలు కలిగితే వారికది దుఃఖం కలిగిస్తుంది మరియు మీకేదైనా కీడు కలిగితే వారికది సంతోషం కలిగిస్తుంది. మరియు మీరు సహనం వహించి దైవభీతి కలిగి ఉంటే, వారి కుట్ర మీకెలాంటి నష్టం కలిగించ జాలదు. నిశ్చయంగా, అల్లాహ్ వారు చేసే దాని నంతా పరివేష్టించి ఉన్నాడు. 68

3:122 – إِذْ هَمَّت طَّائِفَتَانِ مِنكُمْ أَن تَفْشَلَا وَاللَّـهُ وَلِيُّهُمَا ۗ وَعَلَى اللَّـهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ ١٢٢

అప్పుడు మీలోని రెండువర్గాల వారు పిరికి తనం చూపబోయారు; మరియు అల్లాహ్ వారికి సంరక్షకుడుగా ఉన్నాడు. 69 మరియు విశ్వ సించిన వారు అల్లాహ్ యందే నమ్మకం ఉంచుకోవాలి.

3:123 – وَلَقَدْ نَصَرَكُمُ اللَّـهُ بِبَدْرٍ وَأَنتُمْ أَذِلَّةٌ ۖ فَاتَّقُوا اللَّـهَ لَعَلَّكُمْ تَشْكُرُونَ ١٢٣

బద్ర్‌ (యుధ్ధం) నందు మీరు బలహీను లుగా ఉన్నప్పుడు అల్లాహ్ మీకు సహాయం (మిమ్మల్ని విజేతలుగా) చేశాడు. కాబట్టి మీరు కృతజ్ఞతాపరులై అల్లాహ్ యందు భయ-భక్తులు కలిగి ఉండండి!

3:124 – إِذْ تَقُولُ لِلْمُؤْمِنِينَ أَلَن يَكْفِيَكُمْ أَن يُمِدَّكُمْ رَبُّكُم بِثَلَاثَةِ آلَافٍ مِّنَ الْمَلَائِكَةِ مُنزَلِينَ ١٢٤

(ఓ ప్రవక్తా!) నీవు విశ్వాసులతో: ”ఏమీ? మీ ప్రభువు, ఆకాశం నుండి మూడువేల దేవదూత లను దింపి మీకు సహాయం చేస్తున్నది చాలదా?” అని అడిగిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి!)

3:125 – بَلَىٰ ۚ إِن تَصْبِرُوا وَتَتَّقُوا وَيَأْتُوكُم مِّن فَوْرِهِمْ هَـٰذَا يُمْدِدْكُمْ رَبُّكُم بِخَمْسَةِ آلَافٍ مِّنَ الْمَلَائِكَةِ مُسَوِّمِينَ ١٢٥

అవును! ఒకవేళ మీరు సహనం వహించి దైవభీతి కలిగివుంటే, శత్రువు వచ్చి అకస్మాత్తుగా మీపై పడినా, మీ ప్రభువు ఐదువేల ప్రత్యేక చిహ్నాలు గల దేవదూతలను పంపి మీకు సహాయం చేయవచ్చు! 70

3:126 – وَمَا جَعَلَهُ اللَّـهُ إِلَّا بُشْرَىٰ لَكُمْ وَلِتَطْمَئِنَّ قُلُوبُكُم بِهِ ۗ وَمَا النَّصْرُ إِلَّا مِنْ عِندِ اللَّـهِ الْعَزِيزِ الْحَكِيمِ ١٢٦

అల్లాహ్ మీకు ఈ విషయాన్ని తెలిపింది, మీకు శుభవార్త ఇవ్వటానికి మరియు మీ హృదయాలకు తృప్తి కలుగజేయటానికి మాత్రమే. మరియు సర్వశక్తిమంతుడు మహా వివేకవంతుడైన అల్లాహ్ తప్ప, ఇతరుల నుండి సహాయం (విజయం) రాజాలదు కదా!

3:127 – لِيَقْطَعَ طَرَفًا مِّنَ الَّذِينَ كَفَرُوا أَوْ يَكْبِتَهُمْ فَيَنقَلِبُوا خَائِبِينَ ١٢٧

ఆయన ఇదంతా సత్య-తిరస్కారంపై నడిచే వారిని కొందరిని నశింపజేయటానికి, లేదా వారు ఘోర పరాజయం పొంది ఆశాభంగంతో వెనుదిరిగి పోవటానికి (చేశాడు).

3:128 – لَيْسَ لَكَ مِنَ الْأَمْرِ شَيْءٌ أَوْ يَتُوبَ عَلَيْهِمْ أَوْ يُعَذِّبَهُمْ فَإِنَّهُمْ ظَالِمُونَ ١٢٨

(ఓ ప్రవక్తా!) ఈ విషయమునందు నీ కెలాంటి అధికారం లేదు. 71 ఆయన (అల్లాహ్‌) వారిని క్షమించవచ్చు, లేదా వారిని శిక్షించవచ్చు. ఎందుకంటే నిశ్చయంగా, వారు దుర్మార్గులు.

3:129 – وَلِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۚ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ١٢٩

మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందు తుంది. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

3:130 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَأْكُلُوا الرِّبَا أَضْعَافًا مُّضَاعَفَةً ۖ وَاتَّقُوا اللَّـهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ ١٣٠

ఓ విశ్వాసులారా! ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినకండి. మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లాహ్ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. 72

3:131 – وَاتَّقُوا النَّارَ الَّتِي أُعِدَّتْ لِلْكَافِرِينَ ١٣١

మరియు సత్య-తిరస్కారుల కొరకు సిధ్ధం చేయబడిన నరకాగ్నికి భీతిపరులై ఉండండి.

3:132 – وَأَطِيعُوا اللَّـهَ وَالرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ ١٣٢

మరియు మీరు కరుణింపబడటానికి అల్లాహ్‌కు మరియు సందేశహరునికి విధేయులై ఉండండి. 73 (1/4)

3:133 – وَسَارِعُوا إِلَىٰ مَغْفِرَةٍ مِّن رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا السَّمَاوَاتُ وَالْأَرْضُ أُعِدَّتْ لِلْمُتَّقِينَ ١٣٣

  • మరియు మీ ప్రభువు క్షమాభిక్ష కొరకు మరియు స్వర్గవాసం కొరకు ఒకరితోనొకరు పోటీ పడండి; అది భూమ్యాకాశాలంత విశాలమైనది; అది దైవభీతిగల వారికై సిధ్ధపరచబడింది.

3:134 – الَّذِينَ يُنفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ ۗ وَاللَّـهُ يُحِبُّ الْمُحْسِنِينَ ١٣٤

(వారి కొరకు) ఎవరైతే కలిమిలోనూ మరియు లేమిలోనూ (అల్లాహ్‌ మార్గంలో) ఖర్చుచేస్తారో మరియు తమ కోపాన్ని నిగ్రహించు కుంటారో మరియు ప్రజలను క్షమిస్తారో! అల్లాహ్‌ సజ్జనులను ప్రేమిస్తాడు. 74

3:135 – وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنفُسَهُمْ ذَكَرُوا اللَّـهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ وَمَن يَغْفِرُ الذُّنُوبَ إِلَّا اللَّـهُ وَلَمْ يُصِرُّوا عَلَىٰ مَا فَعَلُوا وَهُمْ يَعْلَمُونَ ١٣٥

మరియు వారు, ఎవరైతే, అశ్లీలపనులు చేసినా, లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్‌ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్‌ తప్ప, పాపాలను క్షమించగలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన (తప్పులను) బుధ్ధిపూర్వకంగా మూర్ఖపుపట్టుతో మళ్ళీ చేయరు! 75

3:136 – أُولَـٰئِكَ جَزَاؤُهُم مَّغْفِرَةٌ مِّن رَّبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ ١٣٦

ఇలాంటి వారి ప్రతిఫలం, వారి ప్రభువు నుండి క్షమాభిక్ష మరియు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సత్కార్యాలు చేసే వారికి ఎంత శ్రేష్ఠమైన ప్రతిఫలం ఉంది!

3:137 – قَدْ خَلَتْ مِن قَبْلِكُمْ سُنَنٌ فَسِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ ١٣٧

మీకు పూర్వం ఇలాంటి ఎన్నో సంప్రదాయాలు (తరాలు) గడిచిపోయాయి. సత్యాన్ని తిరస్కరించిన వారి గతి ఏమయిందో మీరు భూమిలో సంచారం చేసి చూడండి.

3:138 – هَـٰذَا بَيَانٌ لِّلنَّاسِ وَهُدًى وَمَوْعِظَةٌ لِّلْمُتَّقِينَ ١٣٨

ఇది (ఈ ఖుర్‌ఆన్‌) ప్రజల కొరకు ఒక స్పష్టమైన వ్యాఖ్యానం మరియు దైవభీతి గల వారికి మార్గదర్శకత్వం మరియు హితోపదేశం.

3:139 – وَلَا تَهِنُوا وَلَا تَحْزَنُوا وَأَنتُمُ الْأَعْلَوْنَ إِن كُنتُم مُّؤْمِنِينَ ١٣٩

కాబట్టి మీరు బలహీనత కనబరచకండి మరియు దుఃఖపడకండి మరియు మీరు విశ్వా సులే అయితే, మీరే తప్పక ప్రాబల్యం పొందుతారు.

3:140 – إِن يَمْسَسْكُمْ قَرْحٌ فَقَدْ مَسَّ الْقَوْمَ قَرْحٌ مِّثْلُهُ ۚ وَتِلْكَ الْأَيَّامُ نُدَاوِلُهَا بَيْنَ النَّاسِ وَلِيَعْلَمَ اللَّـهُ الَّذِينَ آمَنُوا وَيَتَّخِذَ مِنكُمْ شُهَدَاءَ ۗ وَاللَّـهُ لَا يُحِبُّ الظَّالِمِينَ ١٤٠

ఒకవేళ ఇప్పుడు మీరు గాయపడితే, వాస్తవానికి ఆ జాతివారు (మీ విరోధులు) కూడా ఇదేవిధంగా గాయపడ్డారు. 76 మరియు మేము ఇలాంటి దినాలను ప్రజల మధ్య త్రిప్పుతూ ఉంటాము. మరియు అల్లాహ్‌, మీలో నిజమైన విశ్వాసులెవ్వరో చూడటానికీ మరియు (సత్య స్థాపనకు) తమ ప్రాణాలను త్యాగం చేయగల వారిని ఎన్నుకోవటానికీ ఇలా చేస్తూ ఉంటాడు. మరియు అల్లాహ్‌ దుర్మార్గులను ప్రేమించడు.

3:141 – وَلِيُمَحِّصَ اللَّـهُ الَّذِينَ آمَنُوا وَيَمْحَقَ الْكَافِرِينَ ١٤١

మరియు అల్లాహ్‌ విశ్వాసులను పరిశుధ్ధు లుగా 77 చేయటానికీ మరియు సత్య-తిరస్కారు లను అణచివేయటానికీ (ఈ విధంగా చేస్తాడు).

3:142 – أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَعْلَمِ اللَّـهُ الَّذِينَ جَاهَدُوا مِنكُمْ وَيَعْلَمَ الصَّابِرِينَ ١٤٢

ఏమీ? మీలో ఆయన మార్గంలో ప్రాణాలు తెగించి పోరాడేవారు (ధర్మయోధులు) ఎవరో, అల్లాహ్‌ చూడకముందే మరియు సహనంచూపే వారు ఎవరో చూడకముందే, మీరు స్వర్గంలో ప్రవేశించగలరని భావిస్తున్నారా? 78

3:143 – وَلَقَدْ كُنتُمْ تَمَنَّوْنَ الْمَوْتَ مِن قَبْلِ أَن تَلْقَوْهُ فَقَدْ رَأَيْتُمُوهُ وَأَنتُمْ تَنظُرُونَ ١٤٣

మరియు వాస్తవానికి, మీరు (అల్లాహ్‌ మార్గంలో) మరణించాలని కోరుచుంటిరి! 79 అది, మీరుదానినిప్రత్యక్షంగా చూడకముందటి విషయం; కాని, మీరు దానిని ఎదురు చూస్తుండగానే, వాస్త వానికి ఇప్పుడు అది మీ ముందుకు వచ్చేసింది.

3:144 – وَمَا مُحَمَّدٌ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِن قَبْلِهِ الرُّسُلُ ۚ أَفَإِن مَّاتَ أَوْ قُتِلَ انقَلَبْتُمْ عَلَىٰ أَعْقَابِكُمْ ۚ وَمَن يَنقَلِبْ عَلَىٰ عَقِبَيْهِ فَلَن يَضُرَّ اللَّـهَ شَيْئًا ۗ وَسَيَجْزِي اللَّـهُ الشَّاكِرِينَ ١٤٤

మరియు ము’హమ్మద్‌ 80 కేవలం ఒక సందేశహరుడు మాత్రమే! వాస్తవానికి అతనికి పూర్వం అనేక సందేశహరులు గడచిపోయారు. 81 ఏమీ? ఒకవేళ అతను మరణిస్తే, లేక హత్య చేయబడితే, మీరు వెనుకంజవేసి మరలిపోతారా? మరియు వెనుకంజవేసి మరలిపోయేవాడు అల్లాహ్‌ కు ఏ మాత్రం నష్టం కలిగించలేడు. మరియు కృతజ్ఞతాపరులైన వారికి అల్లాహ్‌ తగిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

3:145 – وَمَا كَانَ لِنَفْسٍ أَن تَمُوتَ إِلَّا بِإِذْنِ اللَّـهِ كِتَابًا مُّؤَجَّلًا ۗ وَمَن يُرِدْ ثَوَابَ الدُّنْيَا نُؤْتِهِ مِنْهَا وَمَن يُرِدْ ثَوَابَ الْآخِرَةِ نُؤْتِهِ مِنْهَا ۚ وَسَنَجْزِي الشَّاكِرِينَ ١٤٥

అల్లాహ్‌ అనుమతి లేనిదే, ఏప్రాణి కూడా మరణించజాలదు, దానికి ఒక నియమిత కాలం వ్రాయబడి ఉంది. మరియు ఎవడైతే ఈ ప్రపంచ సుఖాన్ని కోరుకుంటాడో, మేము అతనికది నొసంగుతాము మరియు ఎవడు పరలోక సుఖాన్ని కోరుకుంటాడో అతనికది నొసంగు తాము. మరియు మేము కృతజ్ఞులైన వారికి తగిన ప్రతిఫలాన్ని ప్రసాదించగలము.

3:146 – وَكَأَيِّن مِّن نَّبِيٍّ قَاتَلَ مَعَهُ رِبِّيُّونَ كَثِيرٌ فَمَا وَهَنُوا لِمَا أَصَابَهُمْ فِي سَبِيلِ اللَّـهِ وَمَا ضَعُفُوا وَمَا اسْتَكَانُوا ۗ وَاللَّـهُ يُحِبُّ الصَّابِرِينَ ١٤٦

మరియు ఎందరో ప్రవక్తలు మరియు వారితో కలిసి ఎంతో మంది ధర్మవేత్తలు / దైవభక్తులు (రిబ్బీయ్యూన్‌) ధర్మ-యుద్ధాలు చేశారు, అల్లాహ్‌ మార్గంలో ఎదురైన కష్టాలకు వారు ధైర్యం విడువలేదు మరియు బలహీనత కనబరచలేదు మరియు వారికి (శత్రువులకు) లోబడనూ లేదు. మరియు అల్లాహ్‌ ఆపదలలో సహనం వహించే వారిని ప్రేమిస్తాడు.

3:147 – وَمَا كَانَ قَوْلَهُمْ إِلَّا أَن قَالُوا رَبَّنَا اغْفِرْ لَنَا ذُنُوبَنَا وَإِسْرَافَنَا فِي أَمْرِنَا وَثَبِّتْ أَقْدَامَنَا وَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ ١٤٧

మరియు వారి ప్రార్థన కేవలం: ”ఓ మా ప్రభూ! మా పాపాలను, మా వ్యవహారాలలో మేము మితిమీరి పోయిన వాటిని క్షమించు మరియు మా పాదాలకు స్థైర్యాన్ని ప్రసాదించు మరియు సత్య- తిరస్కారులకు ప్రతికూలంగా మాకు విజయాన్ని ప్రసాదించు.” అని పలకటం మాత్రమే!

3:148 – فَآتَاهُمُ اللَّـهُ ثَوَابَ الدُّنْيَا وَحُسْنَ ثَوَابِ الْآخِرَةِ ۗ وَاللَّـهُ يُحِبُّ الْمُحْسِنِينَ ١٤٨

కావున అల్లాహ్‌ వారికి ఇహలోకంలో తగిన ఫలితాన్ని మరియు పరలోకంలో ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించాడు. మరియు అల్లాహ్‌ సజ్జనులను ప్రేమిస్తాడు.

3:149 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تُطِيعُوا الَّذِينَ كَفَرُوا يَرُدُّوكُمْ عَلَىٰ أَعْقَابِكُمْ فَتَنقَلِبُوا خَاسِرِينَ ١٤٩

ఓ విశ్వాసులారా! మీరు సత్య- తిరస్కారుల సలహాలను పాటిస్తే, వారు మిమ్మల్ని వెనుకకు (అవిశ్వాసం వైపునకు) మరలిస్తారు. అప్పుడు మీరే నష్టపడిన వారవుతారు.

3:150 – بَلِ اللَّـهُ مَوْلَاكُمْ ۖ وَهُوَ خَيْرُ النَّاصِرِينَ ١٥٠

వాస్తవానికి! అల్లాహ్‌యే మీ సంరక్షకుడు. మరియు ఆయనే అత్యుత్తమ సహాయకుడు.

3:151 – سَنُلْقِي فِي قُلُوبِ الَّذِينَ كَفَرُوا الرُّعْبَ بِمَا أَشْرَكُوا بِاللَّـهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ سُلْطَانًا ۖ وَمَأْوَاهُمُ النَّارُ ۚ وَبِئْسَ مَثْوَى الظَّالِمِينَ ١٥١

ఆయన ఏ విధమైన ప్రమాణం అవతరింప జేయనిదే అల్లాహ్‌కు సాటికల్పించినందుకు, మేము సత్యతిరస్కారులహృదయాలలో ఘోరభయాన్ని కల్పిస్తాము. వారి ఆశ్రయం నరకాగ్నియే! అది దుర్మార్గులకు లభించే, అతిచెడ్డ నివాసం.

3:152 – وَلَقَدْ صَدَقَكُمُ اللَّـهُ وَعْدَهُ إِذْ تَحُسُّونَهُم بِإِذْنِهِ ۖ حَتَّىٰ إِذَا فَشِلْتُمْ وَتَنَازَعْتُمْ فِي الْأَمْرِ وَعَصَيْتُم مِّن بَعْدِ مَا أَرَاكُم مَّا تُحِبُّونَ ۚ مِنكُم مَّن يُرِيدُ الدُّنْيَا وَمِنكُم مَّن يُرِيدُ الْآخِرَةَ ۚ ثُمَّ صَرَفَكُمْ عَنْهُمْ لِيَبْتَلِيَكُمْ ۖ وَلَقَدْ عَفَا عَنكُمْ ۗ وَاللَّـهُ ذُو فَضْلٍ عَلَى الْمُؤْمِنِينَ ١٥٢

  1. మరియు వాస్తవానికి అల్లాహ్‌ మీకు చేసిన, తన వాగ్దానాన్ని సత్యపరచాడు, ఎప్పుడైతే మీరు ఆయన అనుమతితో, వారిని (సత్య-తిరస్కారు లను) చంపుతూ ఉన్నారో! 82 తరువాత మీరు పిరికితనాన్ని ప్రదర్శించి, మీ కర్తవ్య విషయంలో పరస్పర విబేధాలకు గురి అయ్యి – ఆయన (అల్లాహ్‌) మీకు, మీరు వ్యామోహపడుతున్న దానిని చూపగానే – (మీ నాయకుని) ఆజ్ఞలను ఉల్లంఘించారు. 83 (ఎందుకంటే) మీలో కొందరు ఇహలోకాన్ని కోరేవారున్నారు మరియు మీలో కొందరు పరలోకాన్ని కోరేవారున్నారు. తరువాత మిమ్మల్ని పరీక్షించటానికి ఆయన (అల్లాహ్‌) మీరు మీ విరోధులను ఓడించకుండా చేశాడు. 84 మరియు వాస్తవానికి ఇపుడు ఆయన మిమ్మల్ని క్షమించాడు. మరియు అల్లాహ్‌ విశ్వాసుల పట్ల ఎంతో అనుగ్రహుడు. (3/8)

3:153 – إِذْ تُصْعِدُونَ وَلَا تَلْوُونَ عَلَىٰ أَحَدٍ وَالرَّسُولُ يَدْعُوكُمْ فِي أُخْرَاكُمْ فَأَثَابَكُمْ غَمًّا بِغَمٍّ لِّكَيْلَا تَحْزَنُوا عَلَىٰ مَا فَاتَكُمْ وَلَا مَا أَصَابَكُمْ ۗ وَاللَّـهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ ١٥٣

  • (జ్ఞాపకం చేసుకోండి!) ఎప్పుడయితే మీరు పారిపోతూ ఉన్నారో మరియు వెనుకకు కూడా తిరిగి ఎవరినీ చూడకుండా ఉన్నారో మరియు ప్రవక్త మీ వెనుక నుండి, మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడో! అప్పుడు (మీ ఈ వైఖరికి) ప్రతిఫలంగా (అల్లాహ్) మీకు దుఃఖం మీద దుఃఖం కలుగ జేశాడు; మీరు ఏదైనా పోగొట్టుకున్నా, లేదా మీకు ఏదైనా ఆపద కలిగినా మీరు చింతించ కుండా ఉండేందుకు. మరియు మీ కర్మలన్నింటినీ అల్లాహ్‌ బాగా ఎరుగును.

3:154 – ثُمَّ أَنزَلَ عَلَيْكُم مِّن بَعْدِ الْغَمِّ أَمَنَةً نُّعَاسًا يَغْشَىٰ طَائِفَةً مِّنكُمْ ۖ وَطَائِفَةٌ قَدْ أَهَمَّتْهُمْ أَنفُسُهُمْ يَظُنُّونَ بِاللَّـهِ غَيْرَ الْحَقِّ ظَنَّ الْجَاهِلِيَّةِ ۖ يَقُولُونَ هَل لَّنَا مِنَ الْأَمْرِ مِن شَيْءٍ ۗ قُلْ إِنَّ الْأَمْرَ كُلَّهُ لِلَّـهِ ۗ يُخْفُونَ فِي أَنفُسِهِم مَّا لَا يُبْدُونَ لَكَ ۖ يَقُولُونَ لَوْ كَانَ لَنَا مِنَ الْأَمْرِ شَيْءٌ مَّا قُتِلْنَا هَاهُنَا ۗ قُل لَّوْ كُنتُمْ فِي بُيُوتِكُمْ لَبَرَزَ الَّذِينَ كُتِبَ عَلَيْهِمُ الْقَتْلُ إِلَىٰ مَضَاجِعِهِمْ ۖ وَلِيَبْتَلِيَ اللَّـهُ مَا فِي صُدُورِكُمْ وَلِيُمَحِّصَ مَا فِي قُلُوبِكُمْ ۗ وَاللَّـهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ١٥٥

అప్పుడు ఈ దుఃఖం తరువాత ఆయన (అల్లాహ్‌) మీపై శాంతి భద్రతలను అవతరింప జేశాడు; దానివల్ల మీలో కొందరికి కునుకుపాటు ఆవరించింది. కాని మరికొందరు – కేవలం స్వంత ప్రాణాలకు ప్రాముఖ్యతనిచ్చేవారు, అల్లాహ్‌ను గురించి పామరులవంటి తప్పుడు ఊహలు చేసే వారు – ఇలా అన్నారు: ”ఏమి? ఈ వ్యవహారంలో మాకు ఏమైనా భాగముందా?” వారితో ఇలా అను: ”నిశ్చయంగా, సమస్త వ్యవహారాలపై సర్వాధికారం అల్లాహ్‌దే!” వారు తమ హృదయాలలో దాచుకున్న దానిని నీకు వ్యక్తం చేయటం లేదు. వారు ఇంకా ఇలా అన్నారు: ”మాకు అధికారమే ఉండి వుంటే, మేము ఇక్కడ చంపబడి ఉండేవారం కాదు.” వారికి ఇలా జవా బివ్వు: ”ఒకవేళ మీరు మీ ఇళ్ళలోనే ఉండి వున్నప్పటికీ, మరణం వ్రాయబడి ఉన్నవారు స్వయంగా తమ వధ్య స్థానాలకు తరలి వచ్చేవారు.” మరియు అల్లాహ్‌ మీ గుండెలలో దాగివున్న దానిని పరీక్షించటానికి మరియు మీ హృదయాలను పరిశుధ్ధపరచటానికి ఇలా చేశాడు. మరియు హృదయాలలో (దాగి) ఉన్నదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.

3:55 – إِنَّ الَّذِينَ تَوَلَّوْا مِنكُمْ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ إِنَّمَا اسْتَزَلَّهُمُ الشَّيْطَانُ بِبَعْضِ مَا كَسَبُوا ۖ وَلَقَدْ عَفَا اللَّـهُ عَنْهُمْ ۗ إِنَّ اللَّـهَ غَفُورٌ حَلِيمٌ ١٥٥

రెండుసైన్యాలు (‘ఉహుద్‌ యుధ్ధానికి) తల బడిన దినమున, వాస్తవానికి మీలో వెన్ను చూపిన వారిని – వారు చేసుకున్నవాటికి (కర్మలకు) ఫలి తంగా –షై’తానువారిపాదాలనుజార్చాడు.అయినా వాస్తవానికి అల్లాహ్‌ వారిని క్షమించాడు. నిశ్చయంగా అల్లాహ్‌ క్షమాశీలుడు, సహనశీలుడు.

3:156 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَكُونُوا كَالَّذِينَ كَفَرُوا وَقَالُوا لِإِخْوَانِهِمْ إِذَا ضَرَبُوا فِي الْأَرْضِ أَوْ كَانُوا غُزًّى لَّوْ كَانُوا عِندَنَا مَا مَاتُوا وَمَا قُتِلُوا لِيَجْعَلَ اللَّـهُ ذَٰلِكَ حَسْرَةً فِي قُلُوبِهِمْ ۗ وَاللَّـهُ يُحْيِي وَيُمِيتُ ۗ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ١٥٦

ఓ విశ్వాసులారా! మీరు సత్య-తిరస్కా రుల మాదిరిగా ప్రవర్తించకండి; వారు తమ సోదరులు ఎప్పుడైనా ప్రయాణంలో ఉంటే, లేదా యుధ్ధంలో ఉంటే, (అక్కడ వారు ఏదైనా ప్రమా దానికి గురిఅయితే) వారిని గురించి ఇలా అనే వారు: ”ఒకవేళ వారు మాతో పాటు ఉండి వుంటే చనిపోయేవారు కాదు మరియు చంపబడే వారునూ కాదు!” వాటిని (ఈ విధమైన మాటలను) అల్లాహ్‌ వారి హృదయ ఆవేదనకు కారణాలుగా చేస్తాడు. మరియు అల్లాహ్‌యే జీవనమిచ్చేవాడు. మరియు మరణమిచ్చేవాడు మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్‌ చూస్తున్నాడు. 85

3:157 – وَلَئِن قُتِلْتُمْ فِي سَبِيلِ اللَّـهِ أَوْ مُتُّمْ لَمَغْفِرَةٌ مِّنَ اللَّـهِ وَرَحْمَةٌ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ ١٥٧

మరియు మీరు అల్లాహ్‌ మార్గంలో చంప బడినా లేదా మరణించినా మీకు లభించే అల్లాహ్‌ క్షమాభిక్ష మరియు కారుణ్యం, నిశ్చయంగా, మీరు కూడబెట్టే వాటి అన్నిటికంటే ఎంతో ఉత్తమమైనవి.

3:158 – وَلَئِن مُّتُّمْ أَوْ قُتِلْتُمْ لَإِلَى اللَّـهِ تُحْشَرُونَ ١٥٨

మరియు మీరు మరణించినా లేదా చంప బడినా, మీరందరూ అల్లాహ్‌ సమక్షంలో సమావేశ పరచబడతారు.

3:159 – فَبِمَا رَحْمَةٍ مِّنَ اللَّـهِ لِنتَ لَهُمْ ۖ وَلَوْ كُنتَ فَظًّا غَلِيظَ الْقَلْبِ لَانفَضُّوا مِنْ حَوْلِكَ ۖ فَاعْفُ عَنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمْ وَشَاوِرْهُمْ فِي الْأَمْرِ ۖ فَإِذَا عَزَمْتَ فَتَوَكَّلْ عَلَى اللَّـهِ ۚ إِنَّ اللَّـهَ يُحِبُّ الْمُتَوَكِّلِينَ ١٥٩

(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ యొక్క అపార కారుణ్యం వల్లనే నీవు వారిపట్ల మృదు హృదయు డవయ్యావు. నీవే గనక క్రూరుడవు, కఠిన హృద యుడవు అయివుంటే, వారందరూ నీ చుట్టు ప్రక్కల నుండి దూరంగా పారిపోయే వారు. కావున నీవు వారిని మన్నించు, వారి క్షమాపణ కొరకు (అల్లాహ్‌ను) ప్రార్థించు మరియు వ్యవహారాలలో వారిని సంప్రదించు. 86 ఆ పిదప నీవు కార్యానికి సిధ్ధమైనపుడు అల్లాహ్‌పై ఆధారపడు. నిశ్చయంగా అల్లాహ్‌ తనపై ఆధారపడేవారిని ప్రేమిస్తాడు.

3:160 – إِن يَنصُرْكُمُ اللَّـهُ فَلَا غَالِبَ لَكُمْ ۖ وَإِن يَخْذُلْكُمْ فَمَن ذَا الَّذِي يَنصُرُكُم مِّن بَعْدِهِ ۗ وَعَلَى اللَّـهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ ١٦٠

ఒకవేళ మీకు అల్లాహ్‌ సహాయమే ఉంటే, మరెవ్వరూ మీపై ఆధిక్యాన్ని పొందజాలరు. మరియు ఆయనే మిమ్మల్ని త్యజిస్తే, ఆయన తప్ప మీకు సహాయం చేయగల వాడెవడు? మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్‌ పైననే నమ్మకం ఉంచుకుంటారు!

3:161 – وَمَا كَانَ لِنَبِيٍّ أَن يَغُلَّ ۚ وَمَن يَغْلُلْ يَأْتِ بِمَا غَلَّ يَوْمَ الْقِيَامَةِ ۚ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ ١٦١

మరియు ఏ ప్రవక్త కూడా విజయధనం (బూటీ) కొరకు నమ్మకద్రోహానికి పాల్పడడు. మరియు నమ్మకద్రోహానికి పాల్పడిన వాడు పునరుత్థాన దినమున తన నమ్మకద్రోహంతో పాటు హాజరవుతాడు. అప్పుడు ప్రతి ప్రాణికి తాను అర్జించిన దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు. 87

3:62 – أَفَمَنِ اتَّبَعَ رِضْوَانَ اللَّـهِ كَمَن بَاءَ بِسَخَطٍ مِّنَ اللَّـهِ وَمَأْوَاهُ جَهَنَّمُ ۚ وَبِئْسَ الْمَصِيرُ ١٦٢

ఏమీ? అల్లాహ్‌ అభీష్టం ప్రకారం నడిచే వ్యక్తి అల్లాహ్‌ ఆగ్రహానికి గురయ్యేవాడితో సమాను డవుతాడా? మరియు నరకమే వాని ఆశ్రయము. మరియు అది అతి చెడ్డ గమ్యస్థానం! 88

3:163 – هُمْ دَرَجَاتٌ عِندَ اللَّـهِ ۗ وَاللَّـهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ ١٦٣

అల్లాహ్‌ దృష్టిలో వారు వేర్వేరు స్థానాలలో ఉన్నారు. మరియు వారు చేసేదంతా అల్లాహ్‌ చూస్తున్నాడు.

3:164 – لَقَدْ مَنَّ اللَّـهُ عَلَى الْمُؤْمِنِينَ إِذْ بَعَثَ فِيهِمْ رَسُولًا مِّنْ أَنفُسِهِمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِن كَانُوا مِن قَبْلُ لَفِي ضَلَالٍ مُّبِينٍ ١٦٤

వాస్తవానికి అల్లాహ్‌ విశ్వాసులకు మహోప కారం చేశాడు; వారి నుండియే వారి మధ్య ఒక ప్రవక్త (ము’హమ్మద్)ను లేపాడు; అతను, ఆయన (అల్లాహ్) సందేశాలను (ఆయాత్) వారికి వినిపిస్తున్నాడు. 89 మరియు వారి జీవితాలను సంస్కరించి పావనం చేస్తు న్నాడు; మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు; 90 మరియు వాస్తవానికి వారు ఇంతకు ముందు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి వున్నారు.

3:165 – أَوَلَمَّا أَصَابَتْكُم مُّصِيبَةٌ قَدْ أَصَبْتُم مِّثْلَيْهَا قُلْتُمْ أَنَّىٰ هَـٰذَا ۖ قُلْ هُوَ مِنْ عِندِ أَنفُسِكُمْ ۗ إِنَّ اللَّـهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١٦٥

ఏమయింది? మీకొక చిన్న ఆపదే కదా కలిగింది! వాస్తవానికి మీరు, వారికి (మీ శత్రువులకు బద్ర్‌లో) ఇంతకు రెట్టింపు ఆపద కలిగించారు కదా! 91 అయితే ఇప్పుడు: ”ఇది ఎక్కడి నుంచి వచ్చిందీ?” అని అంటున్నారా? వారితో ఇలా అను: ”ఇది మీరు స్వయంగా తెచ్చుకున్నదే!” 92 నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.

3:166 – وَمَا أَصَابَكُمْ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ فَبِإِذْنِ اللَّـهِ وَلِيَعْلَمَ الْمُؤْمِنِينَ ١٦٦

మరియు (ఉ’హుద్‌ యుధ్ధరంగంలో) రెండు సైన్యాలు ఎదుర్కొన్నప్పుడు, మీకు కలిగిన కష్టం, అల్లాహ్‌ అనుమతితోనే కలిగింది మరియు అది నిజమైన విశ్వాసులెవరో చూడటానికి –

3:167 – وَلِيَعْلَمَ الَّذِينَ نَافَقُوا ۚ وَقِيلَ لَهُمْ تَعَالَوْا قَاتِلُوا فِي سَبِيلِ اللَّـهِ أَوِ ادْفَعُوا ۖ قَالُوا لَوْ نَعْلَمُ قِتَالًا لَّاتَّبَعْنَاكُمْ ۗ هُمْ لِلْكُفْرِ يَوْمَئِذٍ أَقْرَبُ مِنْهُمْ لِلْإِيمَانِ ۚ يَقُولُونَ بِأَفْوَاهِهِم مَّا لَيْسَ فِي قُلُوبِهِمْ ۗ وَاللَّـهُ أَعْلَمُ بِمَا يَكْتُمُونَ ١٦٧

మరియు కపట-విశ్వాసులు ఎవరో చూడటానికి. మరియు వారితో (కపట- విశ్వాసులతో): ”రండి అల్లాహ్‌ మార్గంలో యుద్ధం చేయండి, లేదా కనీసం మిమ్మల్నిమీరు రక్షించు కోండి!” 93 అనిఅన్నప్పుడు వారు: ”ఒకవేళమాకు యుధ్ధం జరుగుతుందని తెలిసివుంటే, మేము తప్పకుండా మీతో పాటు వచ్చి ఉండే వారం.” అని జవాబిచ్చారు. ఆ రోజు వారు విశ్వా సాని కంటే అవిశ్వాసానికి దగ్గరగా ఉన్నారు. 94 మరియు వారు తమహృదయాలలో లేని మాటలను తమనోళ్ళతో పలుకుతూఉన్నారు. మరియు వారు దాస్తున్నది అల్లాహ్‌కు బాగా తెలుసు.

3:168 – الَّذِينَ قَالُوا لِإِخْوَانِهِمْ وَقَعَدُوا لَوْ أَطَاعُونَا مَا قُتِلُوا ۗ قُلْ فَادْرَءُوا عَنْ أَنفُسِكُمُ الْمَوْتَ إِن كُنتُمْ صَادِقِينَ ١٦٨

అలాంటి వారు తమ ఇండ్లలో కూర్చొని ఉండి (చంపబడిన) తమ సోదరులను గురించి ఇలా అన్నారు: ”వారు గనక మా మాట వినిఉంటే చంపబడి ఉండేవారు కాదు!” నీవు వారితో: ”మీరు సత్యవంతులే అయితే, మీకు మరణం రాకుండా మిమ్మల్నిమీరు తప్పించుకోండి!” అని చెప్పు.

3:169 – وَلَا تَحْسَبَنَّ الَّذِينَ قُتِلُوا فِي سَبِيلِ اللَّـهِ أَمْوَاتًا ۚ بَلْ أَحْيَاءٌ عِندَ رَبِّهِمْ يُرْزَقُونَ ١٦٩

మరియు అల్లాహ్‌ మార్గంలో చంపబడిన వారిని మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులై, తమ ప్రభువు వద్ద జీవనోపాధి పొందుతున్నారు. 95

3:170 – فَرِحِينَ بِمَا آتَاهُمُ اللَّـهُ مِن فَضْلِهِ وَيَسْتَبْشِرُونَ بِالَّذِينَ لَمْ يَلْحَقُوا بِهِم مِّنْ خَلْفِهِمْ أَلَّا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ١٧٠

అల్లాహ్‌ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానితో (ప్రాణత్యాగంతో) వారు సంతోషంతో ఉప్పొంగిపోతారు. 1 మరియు వారిని కలువక, వెనుక (బ్రతికి) ఉన్నవారి కొరకు (ఇవ్వబడిన శుభవార్తతో) వారు సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా! (1/2)

3:171 – يَسْتَبْشِرُونَ بِنِعْمَةٍ مِّنَ اللَّـهِ وَفَضْلٍ وَأَنَّ اللَّـهَ لَا يُضِيعُ أَجْرَ الْمُؤْمِنِينَ ١٧١

  • వారు అల్లాహ్‌ అనుగ్రహానికి, దాతృత్వానికి సంతోషపడుతూ ఉంటారు. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ విశ్వాసుల ప్రతిఫలాన్ని వ్యర్థం కానివ్వడు.

3:172 – الَّذِينَ اسْتَجَابُوا لِلَّـهِ وَالرَّسُولِ مِن بَعْدِ مَا أَصَابَهُمُ الْقَرْحُ ۚ لِلَّذِينَ أَحْسَنُوا مِنْهُمْ وَاتَّقَوْا أَجْرٌ عَظِيمٌ ١٧٢

ఎవరైతే గాయపడిన తరువాత కూడా అల్లాహ్‌ మరియు సందేశహరుని (ఆజ్ఞలను) పాటిస్తారో; 97 వారిలో ఎవరైతే, సత్కార్యాలు చేశారో, మరియు దైవభీతి కలిగి ఉన్నారో, వారికి గొప్ప ప్రతిఫలం ఉంది.

3:173 – الَّذِينَ قَالَ لَهُمُ النَّاسُ إِنَّ النَّاسَ قَدْ جَمَعُوا لَكُمْ فَاخْشَوْهُمْ فَزَادَهُمْ إِيمَانًا وَقَالُوا حَسْبُنَا اللَّـهُ وَنِعْمَ الْوَكِيلُ ١٧٣

వారితో (విశ్వాసులతో) ప్రజలు: ”వాస్త వానికి మీకు వ్యతిరేకంగా పెద్ద జనసమూహాలు కూర్చబడి ఉన్నాయి కావున మీరు వారికి భయ పడండి.” అని అన్నప్పుడు, వారివిశ్వాసం మరింత అధికమేఅయింది. మరియు వారు: ”మాకు అల్లాహ్‌ యే చాలు మరియు ఆయనే సర్వోత్తమ మైన కార్యసాధకుడు.” 98 అని అన్నారు. 99

3:174 – فَانقَلَبُوا بِنِعْمَةٍ مِّنَ اللَّـهِ وَفَضْلٍ لَّمْ يَمْسَسْهُمْ سُوءٌ وَاتَّبَعُوا رِضْوَانَ اللَّـهِ ۗ وَاللَّـهُ ذُو فَضْلٍ عَظِيمٍ ١٧٤

ఈ విధంగా వారు అల్లాహ్‌ ఉపకారాలు మరియు అనుగ్రహాలతో (యుధ్ధ రంగం నుండి) తిరిగి వచ్చారు, వారికెలాంటి హాని కలుగలేదు మరియు వారు అల్లాహ్‌ అభీష్టాన్నీ అనుస రించారు. మరియు అల్లాహ్‌ ఎంతో అనుగ్రహుడు, సర్వోత్తముడు.

3:175 – إِنَّمَا ذَٰلِكُمُ الشَّيْطَانُ يُخَوِّفُ أَوْلِيَاءَهُ فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِن كُنتُم مُّؤْمِنِينَ ١٧٥

నిశ్చయంగా షై’తానే తన మిత్రుల గురించి మీలో భయం పుట్టిస్తాడు. కావున మీరు వారికి భయపడకండి. మరియు మీరు విశ్వాసులే అయితే, కేవలం నాకే (అల్లాహ్‌కే) భయపడండి.

3:176 – وَلَا يَحْزُنكَ الَّذِينَ يُسَارِعُونَ فِي الْكُفْرِ ۚ إِنَّهُمْ لَن يَضُرُّوا اللَّـهَ شَيْئًا ۗ يُرِيدُ اللَّـهُ أَلَّا يَجْعَلَ لَهُمْ حَظًّا فِي الْآخِرَةِ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ ١٧٦

మరియు సత్య-తిరస్కారం కొరకు పోటీ చేసే వారు నిన్ను ఖేదానికి గురిచేయనివ్వరాదు. నిశ్చయంగా, వారు అల్లాహ్‌కు ఎలాంటి నష్టం కలిగించలేరు. పరలోక సుఖంలో అల్లాహ్‌ వారికెలాంటి భాగం ఇవ్వదలచుకోలేదు. మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది.

3:177 – إِنَّ الَّذِينَ اشْتَرَوُا الْكُفْرَ بِالْإِيمَانِ لَن يَضُرُّوا اللَّـهَ شَيْئًا وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ١٧٧

నిశ్చయంగా విశ్వాసానికి బదులుగా సత్య-తిరస్కారాన్ని కొనేవారు అల్లాహ్‌కు ఎలాంటి నష్టం కలిగించలేరు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

3:178 – وَلَا يَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا أَنَّمَا نُمْلِي لَهُمْ خَيْرٌ لِّأَنفُسِهِمْ ۚ إِنَّمَا نُمْلِي لَهُمْ لِيَزْدَادُوا إِثْمًا ۚ وَلَهُمْ عَذَابٌ مُّهِينٌ ١٧٨

మరియు వాస్తవానికి మేము ఇస్తున్న ఈ వ్యవధిని సత్య-తిరస్కారులు తమకు మేలైనదిగా భావించకూడదు. మరియు వాస్తవానికి, మేము ఇస్తున్న ఈ వ్యవధి వారి పాపాలు అధికమవ టానికే! 100 మరియు వారికి అవమానకరమైన శిక్ష ఉంటుంది.

3:179 – مَّا كَانَ اللَّـهُ لِيَذَرَ الْمُؤْمِنِينَ عَلَىٰ مَا أَنتُمْ عَلَيْهِ حَتَّىٰ يَمِيزَ الْخَبِيثَ مِنَ الطَّيِّبِ ۗ وَمَا كَانَ اللَّـهُ لِيُطْلِعَكُمْ عَلَى الْغَيْبِ وَلَـٰكِنَّ اللَّـهَ يَجْتَبِي مِن رُّسُلِهِ مَن يَشَاءُ ۖ فَآمِنُوا بِاللَّـهِ وَرُسُلِهِ ۚ وَإِن تُؤْمِنُوا وَتَتَّقُوا فَلَكُمْ أَجْرٌ عَظِيمٌ ١٧٩

అల్లాహ్‌ విశ్వాసులను, మీరు (సత్య- తిరస్కారులు) ఇప్పుడు ఉన్నస్థితిలో, ఏ మాత్రమూ ఉండనివ్వడు. చివరకు ఆయన దుష్టులను సత్పురుషుల నుండి తప్పకుండా వేరుచేస్తాడు. మరియు అగోచర విషయాలను మీకు తెలపడం అల్లాహ్‌ విధానం కాదు, కాని అల్లాహ్‌ తన ప్రవక్తలలో నుండి తాను కోరిన వారిని ఎన్నుకుంటాడు. 101 కావున మీరు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మరియు ఒకవేళ మీరు విశ్వసించి, దైవభీతి కలిగి ఉంటే, మీకు గొప్ప ప్రతిఫలం ఉంటుంది.

3:180 – وَلَا يَحْسَبَنَّ الَّذِينَ يَبْخَلُونَ بِمَا آتَاهُمُ اللَّـهُ مِن فَضْلِهِ هُوَ خَيْرًا لَّهُم ۖ بَلْ هُوَ شَرٌّ لَّهُمْ ۖ سَيُطَوَّقُونَ مَا بَخِلُوا بِهِ يَوْمَ الْقِيَامَةِ ۗ وَلِلَّـهِ مِيرَاثُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ ١٨٠

అల్లాహ్‌ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానిలో లోభం వహించే వారు, తమకది (లోభమే) మేలైనదని భావించరాదు, వాస్తవానికి అది వారి కొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభత్వంతో కూడబెట్టినదంతా, తీర్పుదినమున వారి మెడలచుట్టు కట్టబడుతుంది. 102 మరియు భూమ్యాకాశాల వారసత్వం అల్లాహ్‌కే చెందుతుంది. మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్‌ ఎరుగును.

3:181 – لَّقَدْ سَمِعَ اللَّـهُ قَوْلَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّـهَ فَقِيرٌ وَنَحْنُ أَغْنِيَاءُ ۘ سَنَكْتُبُ مَا قَالُوا وَقَتْلَهُمُ الْأَنبِيَاءَ بِغَيْرِ حَقٍّ وَنَقُولُ ذُوقُوا عَذَابَ الْحَرِيقِ ١٨١

”నిశ్చయంగా, అల్లాహ్‌ పేదవాడు మరియు మేము ధనవంతులము.” 103 అని చెప్పేవారి మాటలను వాస్తవంగా అల్లాహ్‌ విన్నాడు. వారు పలుకుతున్నది మరియు అన్యాయంగా ప్రవక్త లను వధించినది మేము వ్రాసిపెడుతున్నాము. మరియు (పునరుత్థాన దినమున) వారితో మేము ఇలా అంటాము: ”దహించే అగ్ని శిక్షను రుచి చూడండి!”

3:182 – ذَٰلِكَ بِمَا قَدَّمَتْ أَيْدِيكُمْ وَأَنَّ اللَّـهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ ١٨٢

ఇది మీ చేతులారా మీరు చేసి పంపుకున్న కర్మల ఫలితం. నిశ్చయంగా, అల్లాహ్‌ తన దాసులకు ఎలాంటి అన్యాయం చేసేవాడు కాడు!

3:183 – الَّذِينَ قَالُوا إِنَّ اللَّـهَ عَهِدَ إِلَيْنَا أَلَّا نُؤْمِنَ لِرَسُولٍ حَتَّىٰ يَأْتِيَنَا بِقُرْبَانٍ تَأْكُلُهُ النَّارُ ۗ قُلْ قَدْ جَاءَكُمْ رُسُلٌ مِّن قَبْلِي بِالْبَيِّنَاتِ وَبِالَّذِي قُلْتُمْ فَلِمَ قَتَلْتُمُوهُمْ إِن كُنتُمْ صَادِقِينَ ١٨٣

”అగ్ని (ఆకాశం నుండి దిగివచ్చి) బలి (ఖుర్బానీ)ని మా సమక్షంలో తిననంత వరకు మేము ఎవరినీ ప్రవక్తగా స్వీకరించగూడదని అల్లాహ్‌ మాతో వాగ్దానం తీసుకున్నాడు.” అని పలికేవారితో (యూదులతో) ఇలా అను: ”వాస్త వానికి నాకు పూర్వం మీ వద్దకు చాలా మంది ప్రవక్తలు స్పష్టమైన ఎన్నో నిదర్శనాలను తీసుకు వచ్చారు; మరియు మీరు ప్రస్తావించే ఈ నిదర్శనాన్నికూడా! మీరు సత్యవంతులే అయితే, మీరు వారిని ఎందుకు హత్యచేశారు?” 104

3:184 – فَإِن كَذَّبُوكَ فَقَدْ كُذِّبَ رُسُلٌ مِّن قَبْلِكَ جَاءُوا بِالْبَيِّنَاتِ وَالزُّبُرِ وَالْكِتَابِ الْمُنِيرِ ١٨٤

(ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు నిన్ను అసత్య వాదుడవని తిరస్కరిస్తే, నీవు (ఆశ్చర్యపడకు); వాస్తవానికి నీకు ముందు ప్రత్యక్ష నిదర్శనాలను, ‘స’హీఫా (‘జుబుర్‌) లను మరియు జ్యోతిని ప్రసాదించే గ్రంథాన్ని తీసుకువచ్చిన చాలా మంది ప్రవక్తలు కూడా అసత్యవాదులని తిరస్కరించ బడ్డారు.

3:185 – كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ ۗ وَإِنَّمَا تُوَفَّوْنَ أُجُورَكُمْ يَوْمَ الْقِيَامَةِ ۖ فَمَن زُحْزِحَ عَنِ النَّارِ وَأُدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ ۗ وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ ١٨٥

ప్రతి ప్రాణి చావును చవిచూస్తుంది. మరియు నిశ్చయంగా, తీర్పుదినమున మీ కర్మల ఫలితం మీకు పూర్తిగా ఇవ్వబడుతుంది. కావున ఎవడు నరకాగ్ని నుండి తప్పించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడతాడో! వాస్తవానికి, వాడే సఫలీ కృతుడు. మరియు ఇహలోక జీవితం కేవలం మోసపుచ్చే సుఖానుభవం మాత్రమే! (5/8)

3:186 – لَتُبْلَوُنَّ فِي أَمْوَالِكُمْ وَأَنفُسِكُمْ وَلَتَسْمَعُنَّ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ وَمِنَ الَّذِينَ أَشْرَكُوا أَذًى كَثِيرًا ۚ وَإِن تَصْبِرُوا وَتَتَّقُوا فَإِنَّ ذَٰلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ ١٨٦

  • నిశ్చయంగా మీరు, మీ ధన-ప్రాణాలతో పరీక్షింపబడతారు; మరియు నిశ్చయంగా, మీకు పూర్వం గ్రంథం ప్రసాదించబడినవారి నుండి మరియు అల్లాహ్‌కు భాగస్వాములు (సాటి) కల్పించిన వారి నుండి, మీరు అనేక వేదన కలిగించే మాటలు వింటుంటారు. కానీ, ఒకవేళ మీరు ఓర్పువహించి, దైవభీతి కలిగిఉంటే! నిశ్చయంగా, అది ఎంతో సాహసంతో కూడిన కార్యం. 105

3:187 – وَإِذْ أَخَذَ اللَّـهُ مِيثَاقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ لَتُبَيِّنُنَّهُ لِلنَّاسِ وَلَا تَكْتُمُونَهُ فَنَبَذُوهُ وَرَاءَ ظُهُورِهِمْ وَاشْتَرَوْا بِهِ ثَمَنًا قَلِيلًا ۖ فَبِئْسَ مَا يَشْتَرُونَ ١٨٧

మరియు అల్లాహ్‌, గ్రంథప్రజలతో: ”దీనిని (దైవప్రవక్త ము’హమ్మద్‌ రానున్నాడు అనే సత్యాన్ని) ప్రజలకు తెలియజేయండి మరియు దానిని దాచకండి.” అని, చేయించిన ప్రమాణాన్ని, (జ్ఞాపకం చేసుకోండి). కాని వారు దానిని తమ వీపులవెనుక పడవేసి దానికి బదులుగా స్వల్ప మూల్యాన్ని పొందారు, వారి ఈ వ్యాపారం ఎంత నీచమైనది!

3:188 – لَا تَحْسَبَنَّ الَّذِينَ يَفْرَحُونَ بِمَا أَتَوا وَّيُحِبُّونَ أَن يُحْمَدُوا بِمَا لَمْ يَفْعَلُوا فَلَا تَحْسَبَنَّهُم بِمَفَازَةٍ مِّنَ الْعَذَابِ ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ١٨٨

ఎవరైతే తాము చేసిన పనికి సంతోష పడుతూ, తాము చేయనిపనికి ప్రశంసలు లభిస్తాయని కోరుతారో, వారు శిక్ష నుండి తప్పించు కోగలరని నీవు భావించకు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

3:189 – وَلِلَّـهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١٨٩

మరియు భూమ్యాకాశాల సామ్రాజ్యాధి పత్యం కేవలం అల్లాహ్‌కే చెందినది. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.

3:190 – إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ لَآيَاتٍ لِّأُولِي الْأَلْبَابِ ١٩٠

నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలో మరియు రేయింబవళ్ళ అనుక్రమంలో (ఒకదాని తరువాత ఒకటి రావడం) మరియు వాటి హెచ్చు తగ్గులలో, బుధ్ధిమంతుల కొరకు ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి;

3:191 – الَّذِينَ يَذْكُرُونَ اللَّـهَ قِيَامًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِهِمْ وَيَتَفَكَّرُونَ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبَّنَا مَا خَلَقْتَ هَـٰذَا بَاطِلًا سُبْحَانَكَ فَقِنَا عَذَابَ النَّارِ ١٩١

ఎవరైతే నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా, అన్నివేళలా అల్లాహ్‌ను స్మరిస్తారో, భూమ్యాకాశాల నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తారో! (వారు ఇలా ప్రార్థిస్తారు): ”ఓ మా ప్రభూ! నీవు దీనిని (ఈ విశ్వాన్ని) వ్యర్థంగా సృష్టించలేదు, నీవు సర్వలోపాలకు అతీతుడవు, మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు. 106

3:192 – رَبَّنَا إِنَّكَ مَن تُدْخِلِ النَّارَ فَقَدْ أَخْزَيْتَهُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ ١٩٢

”ఓ మా ప్రభూ! నీవు ఎవడిని నరకాగ్నిలో పడవేస్తావో వాస్తవంగా వానిని నీవు అవమాన పరిచావు. మరియు దుర్మార్గులకు సహాయకులు ఎవ్వరూ ఉండరు.

3:193 – رَّبَّنَا إِنَّنَا سَمِعْنَا مُنَادِيًا يُنَادِي لِلْإِيمَانِ أَنْ آمِنُوا بِرَبِّكُمْ فَآمَنَّا ۚ رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّئَاتِنَا وَتَوَفَّنَا مَعَ الْأَبْرَارِ ١٩٣

”ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము: ‘మీ ప్రభువును విశ్వసించండి.’ అని విశ్వాసంవైపుకు పిలిచే అతని (ము’హమ్మద్‌) యొక్క పిలుపువిని, విశ్వసించాము. ఓమాప్రభూ! మాపాపాలనుక్షమించు మరియు మాలో ఉన్న చెడులను మా నుండి తొలగించు మరియు పుణ్యాత్ములతో (ధర్మ నిష్ఠాపరులతో) మమ్మల్ని మరణింపజెయ్యి!

3:194 – رَبَّنَا وَآتِنَا مَا وَعَدتَّنَا عَلَىٰ رُسُلِكَ وَلَا تُخْزِنَا يَوْمَ الْقِيَامَةِ ۗ إِنَّكَ لَا تُخْلِفُ الْمِيعَادَ ١٩٤

”ఓ మా ప్రభూ! మరియు నీ ప్రవక్తల ద్వారా నీవు మాకు చేసిన వాగ్దానాలను పూర్తిచేయి మరియు తీర్పు దినమున మమ్మల్ని అవమానపరచకు. నిశ్చయంగా, నీవు నీ వాగ్దానాలను భంగంచేయవు.”

3:195 – فَاسْتَجَابَ لَهُمْ رَبُّهُمْ أَنِّي لَا أُضِيعُ عَمَلَ عَامِلٍ مِّنكُم مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ ۖ بَعْضُكُم مِّن بَعْضٍ ۖ فَالَّذِينَ هَاجَرُوا وَأُخْرِجُوا مِن دِيَارِهِمْ وَأُوذُوا فِي سَبِيلِي وَقَاتَلُوا وَقُتِلُوا لَأُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَأُدْخِلَنَّهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ثَوَابًا مِّنْ عِندِ اللَّـهِ ۗ وَاللَّـهُ عِندَهُ حُسْنُ الثَّوَابِ ١٩٥

అప్పుడు సమాధానంగా వారి ప్రభువు, వారితో ఇలా అంటాడు: ”మీలో పురుషులు గానీ, స్త్రీలు గానీ చేసిన కర్మలను నేను వ్యర్థం కానివ్వను. మీరందరూ ఒకరికొకరు (సమానులు). 107 కనుక నా కొరకు, తమ దేశాన్ని విడిచిపెట్టి వలసపోయిన వారు, తమ గృహాల నుండి తరిమి వేయబడి (నిరాశ్రయులై, దేశ దిమ్మరులై), నా మార్గంలో పలు కష్టాలుపడిన వారు మరియు నా కొరకు పోరాడిన వారు మరియు చంపబడిన వారు; నిశ్చయంగా, ఇలాంటి వారందరి చెడులను వారి నుండి తుడిచివేస్తాను. మరియు నిశ్చయంగా, వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాను; ఇది అల్లాహ్‌ వద్ద వారికి లభించే ప్రతిఫలం. మరియు అల్లాహ్‌! ఆయన వద్దనే ఉత్తమ ప్రతిఫలం ఉంది.”

3:196 – لَا يَغُرَّنَّكَ تَقَلُّبُ الَّذِينَ كَفَرُوا فِي الْبِلَادِ ١٩٦

(ఓ ప్రవక్తా!) దేశాలలో సత్య-తిరస్కారుల సంచారం, నిన్ను మోసంలో పడవేయకూడదు! 108

3:197 – مَتَاعٌ قَلِيلٌ ثُمَّ مَأْوَاهُمْ جَهَنَّمُ ۚ وَبِئْسَ الْمِهَادُ ١٩٧

ఇది వారికి కొద్దిపాటి సుఖం మాత్రమే! తరువాత వారి ఆశ్రయం నరకమే. మరియు అది అతి అధ్వాన్నమైన నివాసస్థలము.

3:198 – لَـٰكِنِ الَّذِينَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا نُزُلًا مِّنْ عِندِ اللَّـهِ ۗ وَمَا عِندَ اللَّـهِ خَيْرٌ لِّلْأَبْرَارِ ١٩٨

కాని ఎవరైతే తమ ప్రభువునందు భయ- భక్తులు కలిగి ఉంటారో, వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలుంటాయి. అందులో వారు అల్లాహ్‌ ఆతిథ్యం పొందుతూ శాశ్వతంగా ఉంటారు. మరియు పుణ్యాత్ములకు (ధర్మనిష్ఠాపరులకు) అల్లాహ్‌ దగ్గర ఉన్నదే ఎంతో శ్రేష్ఠమైనది!

3:199 – وَإِنَّ مِنْ أَهْلِ الْكِتَابِ لَمَن يُؤْمِنُ بِاللَّـهِ وَمَا أُنزِلَ إِلَيْكُمْ وَمَا أُنزِلَ إِلَيْهِمْ خَاشِعِينَ لِلَّـهِ لَا يَشْتَرُونَ بِآيَاتِ اللَّـهِ ثَمَنًا قَلِيلًا ۗ أُولَـٰئِكَ لَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ ۗ إِنَّ اللَّـهَ سَرِيعُ الْحِسَابِ ١٩٩

మరియు నిశ్చయంగా, గ్రంథప్రజలలో, కొందరు అల్లాహ్‌ను విశ్వసిస్తారు. మరియు వారు మీకు అవతరింపజేయబడిన దానిని మరియు వారికి అవతరింపజేయబడిన దానిని (సందేశాన్ని) విశ్వసించి, అల్లాహ్‌కు వినమ్రులై, అల్లాహ్‌ సూక్తులను స్వల్పమైన మూల్యానికి అమ్ము కోరు. 109 అలాంటి వారికి వారి ప్రభువు వద్ద ప్రతి ఫలం ఉంది. నిశ్చయంగా, అల్లాహ్‌ లెక్క తీసుకోవటంలో అతిశీఘ్రుడు.

3:200 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اصْبِرُوا وَصَابِرُوا وَرَابِطُوا وَاتَّقُوا اللَّـهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ ٢٠٠

ఓ విశ్వాసులారా! సహనం వహించండి, మరియు (మిథ్యావాదుల ముందు) స్థైర్యాన్ని చూపండి. మరియు (మాటువేసి ఉండవలసిన చోట) స్థిరంగా ఉండండి. మరియు అల్లాహ్‌ పట్ల భయ-భక్తులు కలిగి ఉండండి, అప్పడే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు! 110 (3/4)

— – సూరహ్ అన్-నిసా‘ – నిసాఉ’న్‌: స్త్రీలు. ఈ సూరహ్ లో ఎన్నో ఆయతులు స్త్రీల హక్కులు, వారసత్వం, వివాహ సంబంధాలు మొదలైన వాటిని గురించి ఉన్నాయి. ఇది పూర్తిగా మదీనహ్లో అవతరింప జేయబడింది. ఇది ఉ’హుద్‌ యుధ్ధం తరువాత అవతరింపజేయబడింది, బహుశా 4వ హిజ్రీలో, అల్‌-అ’హ్‌’జాబ్‌ (33) మరియు అల్‌-ముమ్‌త’హినహ్‌ (60) సూరాహ్‌ల తరువాత. ఇందులో 5 ఆయతులు ఎంతో ఘనత గలవి ఉన్నాయి. అవి 31, 40, 48, 64 మరియు 110లు. 176 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 4:1 – يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً ۚ وَاتَّقُوا اللَّـهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ ۚ إِنَّ اللَّـهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا ١

  • ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయ-భక్తులు కలిగిఉండండి. ఆయన మిమ్మల్ని ఒకేప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట (హవ్వా)ను సృష్టించాడు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింప జేశాడు. మరియు ఆ అల్లాహ్‌ యందు భయ- భక్తులు కలిగి ఉండండి, ఎవరి ద్వారా (పేరుతో) నైతే మీరు మీ పరస్పర (హక్కులను) కోరుతారో; మరియు మీ బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి). 1 నిశ్చయంగా, అల్లాహ్‌ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని 2

4:2 – وَآتُوا الْيَتَامَىٰ أَمْوَالَهُمْ ۖ وَلَا تَتَبَدَّلُوا الْخَبِيثَ بِالطَّيِّبِ ۖ وَلَا تَأْكُلُوا أَمْوَالَهُمْ إِلَىٰ أَمْوَالِكُمْ ۚ إِنَّهُ كَانَ حُوبًا كَبِيرًا ٢

మరియు అనాథుల ఆస్తిపాస్తులను వారికి తిరిగి ఇవ్వండి. మరియు (మీ) చెడ్డ వస్తువులను (వారి) మంచి వస్తువులతో మార్చకండి. మరియు వారి ఆస్తులను మీ ఆస్తులతో కలిపి తినివేయకండి. నిశ్చయంగా, ఇది గొప్ప నేరం (పాపం).

4:3 – وَإِنْ خِفْتُمْ أَلَّا تُقْسِطُوا فِي الْيَتَامَىٰ فَانكِحُوا مَا طَابَ لَكُم مِّنَ النِّسَاءِ مَثْنَىٰ وَثُلَاثَ وَرُبَاعَ ۖ فَإِنْ خِفْتُمْ أَلَّا تَعْدِلُوا فَوَاحِدَةً أَوْ مَا مَلَكَتْ أَيْمَانُكُمْ ۚ ذَٰلِكَ أَدْنَىٰ أَلَّا تَعُولُوا ٣

మరియు అనాథ బాలికలకు న్యాయం చేయలేమనే భయం మీకు ఉంటే, మీకు నచ్చిన (ఇతర) స్త్రీలను ఇద్దరిని గానీ, ముగ్గురినిగానీ, నలుగురినిగానీ వివాహంచేసుకోండి. అయితే వారితో న్యాయంగా వ్యవహరించలేమనే భయం మీకు ఉంటే, ఒకామెను మాత్రమే; 3 లేదా మీ స్వాధీనంలో నున్న వారిని (బానిస స్త్రీలను దాంపత్యంలోకి) తీసుకోండి. 4 ఒకే వైపునకు మొగ్గ కుండా (అన్యాయవర్తన నుండి దూరంగా ఉండ టానికి) ఇదే సముచితమైన మార్గం.

4:4 – وَآتُوا النِّسَاءَ صَدُقَاتِهِنَّ نِحْلَةً ۚ فَإِن طِبْنَ لَكُمْ عَن شَيْءٍ مِّنْهُ نَفْسًا فَكُلُوهُ هَنِيئًا مَّرِيئًا ٤

మరియు స్త్రీలకు వారి మహ్ర్ (వధుకట్నం) సహృదయంతో ఇవ్వండి. కాని వారు తమంతట తామే సంతోషంగా కొంత భాగాన్ని మీకు విడిచి పెడితే, దానిని సంతోషంగా స్వేచ్ఛగా అనుభవించండి (తినండి).

4:5 – وَلَا تُؤْتُوا السُّفَهَاءَ أَمْوَالَكُمُ الَّتِي جَعَلَ اللَّـهُ لَكُمْ قِيَامًا وَارْزُقُوهُمْ فِيهَا وَاكْسُوهُمْ وَقُولُوا لَهُمْ قَوْلًا مَّعْرُوفًا ٥

మరియు అల్లాహ్‌ మీకు నిర్వహించటానికి అప్పగించిన ఆస్తులను, అవివేకులుగా ఉన్నప్పుడు (అనాథులకు) అప్పగించకండి. 5 దాని నుండి వారికి అన్న-వస్త్రాలు ఇస్తూ ఉండండి. మరియు వారితో వాత్సల్యంతో మాట్లాడండి.

4:6 – وَابْتَلُوا الْيَتَامَىٰ حَتَّىٰ إِذَا بَلَغُوا النِّكَاحَ فَإِنْ آنَسْتُم مِّنْهُمْ رُشْدًا فَادْفَعُوا إِلَيْهِمْ أَمْوَالَهُمْ ۖ وَلَا تَأْكُلُوهَا إِسْرَافًا وَبِدَارًا أَن يَكْبَرُوا ۚ وَمَن كَانَ غَنِيًّا فَلْيَسْتَعْفِفْ ۖ وَمَن كَانَ فَقِيرًا فَلْيَأْكُلْ بِالْمَعْرُوفِ ۚ فَإِذَا دَفَعْتُمْ إِلَيْهِمْ أَمْوَالَهُمْ فَأَشْهِدُوا عَلَيْهِمْ ۚ وَكَفَىٰ بِاللَّـهِ حَسِيبًا ٦

మరియు వివాహ యోగ్యమైన వయస్సు వచ్చే వరకూ మీరు అనాథులను పరీక్షించండి, ఇక వారిలో మీకు యోగ్యత కనిపించినప్పుడు, వారి ఆస్తులను వారికి అప్పగించండి. మరియు వారు పెరిగి పెద్దవారు అవుతారనే తలంపుతో దానిని (వారి ఆస్తిని) త్వరపడి అపరిమితంగా తినకండి. మరియు అతడు (సంరక్షకుడు) సంపన్నుడైతే, వారి సొమ్ముకు దూరంగా ఉండాలి. కాని అతడు పేదవాడైతే, దాని నుండి ధర్మసమ్మతంగా తినాలి. ఇక వారి ఆస్తిని, వారికి అప్పగించేటప్పుడు దానికి సాక్షులను పెట్టుకోండి. మరియు లెక్కతీసుకోవ టానికి 6 అల్లాహ్ చాలు!

4:7 – لِّلرِّجَالِ نَصِيبٌ مِّمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ وَلِلنِّسَاءِ نَصِيبٌ مِّمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ مِمَّا قَلَّ مِنْهُ أَوْ كَثُرَ ۚ نَصِيبًا مَّفْرُوضًا ٧

పురుషులకు వారి తల్లి-దండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపోయిన దానిలో (ఆస్తిలో) భాగముంది మరియు స్త్రీలకు కూడా వారి తల్లి-దండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచి పోయిన దానిలో భాగముంది; 7 అది తక్కువైనా సరే, లేదా ఎక్కువైనా సరే. అది (అల్లాహ్‌) విధిగా నియమించిన భాగం.

4:8 – وَإِذَا حَضَرَ الْقِسْمَةَ أُولُو الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينُ فَارْزُقُوهُم مِّنْهُ وَقُولُوا لَهُمْ قَوْلًا مَّعْرُوفًا ٨

మరియు (ఆస్తి) పంపకంజరిగేటప్పుడు ఇతర బంధువులుగానీ, అనాథులు గానీ, పేదవారు గానీ ఉంటే, దాని నుండి వారికి కూడా కొంత ఇవ్వండి 8 మరియు వారితో వాత్సల్యంగా మాట్లాడండి.

4:9 – وَلْيَخْشَ الَّذِينَ لَوْ تَرَكُوا مِنْ خَلْفِهِمْ ذُرِّيَّةً ضِعَافًا خَافُوا عَلَيْهِمْ فَلْيَتَّقُوا اللَّـهَ وَلْيَقُولُوا قَوْلًا سَدِيدًا ٩

మరియు (పంపకం చేసేటప్పుడు, పంపకం చేసేవారు), ఒకవేళ తామే తమ పిల్లలను నిస్సహాయులుగా విడిచిపోతే, ఏవిధంగా వారిని గురించి భయపడతారో, అదేవిధంగా భయ పడాలి. వారు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండి, యుక్తమైన మాటలనే పలకాలి.

4:10 – إِنَّ الَّذِينَ يَأْكُلُونَ أَمْوَالَ الْيَتَامَىٰ ظُلْمًا إِنَّمَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ نَارًا ۖ وَسَيَصْلَوْنَ سَعِيرًا ١٠

నిశ్చయంగా, అన్యాయంగా అనాథుల ఆస్తులను, తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. మరియు వారు సమీపంలోనే భగభగమండే నరకాగ్నిలో కాల్చబడతారు.

4:11 – يُوصِيكُمُ اللَّـهُ فِي أَوْلَادِكُمْ ۖ لِلذَّكَرِ مِثْلُ حَظِّ الْأُنثَيَيْنِ ۚ فَإِن كُنَّ نِسَاءً فَوْقَ اثْنَتَيْنِ فَلَهُنَّ ثُلُثَا مَا تَرَكَ ۖ وَإِن كَانَتْ وَاحِدَةً فَلَهَا النِّصْفُ ۚ وَلِأَبَوَيْهِ لِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ مِمَّا تَرَكَ إِن كَانَ لَهُ وَلَدٌ ۚ فَإِن لَّمْ يَكُن لَّهُ وَلَدٌ وَوَرِثَهُ أَبَوَاهُ فَلِأُمِّهِ الثُّلُثُ ۚ فَإِن كَانَ لَهُ إِخْوَةٌ فَلِأُمِّهِ السُّدُسُ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصِي بِهَا أَوْ دَيْنٍ ۗ آبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ لَا تَدْرُونَ أَيُّهُمْ أَقْرَبُ لَكُمْ نَفْعًا ۚ فَرِيضَةً مِّنَ اللَّـهِ ۗ إِنَّ اللَّـهَ كَانَ عَلِيمًا حَكِيمًا ١١

మీ సంతాన వారసత్వాన్ని గురించి అల్లాహ్‌ మీకు ఈ విధంగా ఆదేశిస్తున్నాడు: ఒక పురుషుని (భాగం) ఇద్దరుస్త్రీల భాగాలకు సమానంగా ఉండాలి. 9 ఒకవేళ ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ స్త్రీ (సంతానం మాత్రమే) ఉంటే, వారికి విడిచిన ఆస్తిలో మూడింట-రెండు భాగాలు ఉంటాయి. మరియు ఒకవేళ ఒకే ఆడపిల్ల ఉంటే అర్ధ-భాగానికి ఆమె హక్కు దారురాలు. 10 మరియు (మృతుడు) సంతానం కలవాడైతే, అతని తల్లి-దండ్రులో ప్రతి ఒక్కరికీ విడిచిన ఆస్తిలో ఆరో-భాగం లభిస్తుంది. ఒకవేళ అతనికి సంతానం లేకుంటే, అతని తల్లిదండ్రులు మాత్రమే వారసులుగా ఉంటే, అప్పుడు తల్లికి మూడో భాగం. 11 మృతునికి సోదర సోదరీమణులు ఉంటే, తల్లికి ఆరో-భాగం. 12 (ఈ పంపకమంతా) మృతుని అప్పులు తీర్చి, అతని వీలునామాపై అమలు జరిపిన తరువాతనే జరగాలి. మీ తల్లిదండ్రులు మరియు మీ సంతానంలో ప్రయోజనంరీత్యా, మీకు ఎవరు ఎక్కువ సన్నిహితులో, మీకు తెలియదు. ఇది అల్లాహ్‌ నియమించిన విధానం. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు. (7/8)

4:12 – وَلَكُمْ نِصْفُ مَا تَرَكَ أَزْوَاجُكُمْ إِن لَّمْ يَكُن لَّهُنَّ وَلَدٌ ۚ فَإِن كَانَ لَهُنَّ وَلَدٌ فَلَكُمُ الرُّبُعُ مِمَّا تَرَكْنَ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصِينَ بِهَا أَوْ دَيْنٍ ۚ وَلَهُنَّ الرُّبُعُ مِمَّا تَرَكْتُمْ إِن لَّمْ يَكُن لَّكُمْ وَلَدٌ ۚ فَإِن كَانَ لَكُمْ وَلَدٌ فَلَهُنَّ الثُّمُنُ مِمَّا تَرَكْتُم ۚ مِّن بَعْدِ وَصِيَّةٍ تُوصُونَ بِهَا أَوْ دَيْنٍ ۗ وَإِن كَانَ رَجُلٌ يُورَثُ كَلَالَةً أَوِ امْرَأَةٌ وَلَهُ أَخٌ أَوْ أُخْتٌ فَلِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ ۚ فَإِن كَانُوا أَكْثَرَ مِن ذَٰلِكَ فَهُمْ شُرَكَاءُ فِي الثُّلُثِ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصَىٰ بِهَا أَوْ دَيْنٍ غَيْرَ مُضَارٍّ ۚ وَصِيَّةً مِّنَ اللَّـهِ ۗ وَاللَّـهُ عَلِيمٌ حَلِيمٌ ١٢

మరియు మీ భార్యలకు సంతానం లేని పక్షంలో, 13 వారు విడిచిపోయిన దానిలో మీకు అర్ధ భాగం. కాని ఒకవేళ వారికి సంతానం ఉంటే, వారు విడిచిపోయిన దానిలో నాలుగో-భాగం మీది. (ఇదంతా) వారు వ్రాసిపోయిన వీలునామాపై అమలు జరిపి, వారి అప్పులు తీర్చిన తరువాత. 14 మరియు మీకు సంతానం లేని పక్షంలో మీరు విడిచి పోయిన దానిలో వారికి (మీ భార్యలకు) నాలుగో-భాగం. కాని ఒకవేళ మీకు సంతానం ఉంటే, మీరు విడిచిన దానిలో వారికి ఎనిమిదో-భాగం. 15 ఇదంతా మీరు వ్రాసిన వీలునామా పై అమలు జరిగి, మీ అప్పులు తీర్చిన తరువాత. మరియు ఒకవేళ మరణించిన పురుషుడు లేక స్త్రీ కలాల అయి (తండ్రి, కొడుకు లేక మనమడు లేకుండా) ఒక సోదరుడు మరియు ఒక సోదరి మాత్రమే ఉంటే, వారిలో ప్రతి ఒక్కరికీ ఆరో-భాగం. కాని ఒకవేళ వారు (సోదర- సోదరీమణులు) ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే, వారంతా మూడో-భాగానికి వారసులవుతారు. 16 ఇదంతా మృతుడు వ్రాసిన వీలునామాపై అమలు జరిగి అప్పులు తీర్చిన తరువాత, ఎవ్వరికీ నష్టం కలుగజేయకుండా జరగాలి 17 ఇది అల్లాహ్‌ నుండి వచ్చిన ఆదేశం. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, సహనశీలుడు (శాంత స్వభావుడు).

4:13 – تِلْكَ حُدُودُ اللَّـهِ ۚ وَمَن يُطِعِ اللَّـهَ وَرَسُولَهُ يُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ ١٣

ఇవి అల్లాహ్‌ (విధించిన) హద్దులు. ఎవరైతే అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారో, వారిని ఆయన క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. మరియు ఇదే గొప్ప సాఫల్యం (విజయం).

4:14 – وَمَن يَعْصِ اللَّـهَ وَرَسُولَهُ وَيَتَعَدَّ حُدُودَهُ يُدْخِلْهُ نَارًا خَالِدًا فِيهَا وَلَهُ عَذَابٌ مُّهِينٌ ١٤

మరియు ఎవడైతే, అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు అవిధేయుడై, ఆయన నియమా లను ఉల్లంఘిస్తాడో! అలాంటి వాడు నరకాగ్నిలోకి త్రోయబడతాడు అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు. మరియు అతడికి అవమానకరమైన శిక్ష ఉంటుంది.

4:15 – وَاللَّاتِي يَأْتِينَ الْفَاحِشَةَ مِن نِّسَائِكُمْ فَاسْتَشْهِدُوا عَلَيْهِنَّ أَرْبَعَةً مِّنكُمْ ۖ فَإِن شَهِدُوا فَأَمْسِكُوهُنَّ فِي الْبُيُوتِ حَتَّىٰ يَتَوَفَّاهُنَّ الْمَوْتُ أَوْ يَجْعَلَ اللَّـهُ لَهُنَّ سَبِيلً ١٥

మరియు మీ స్త్రీలలో ఎవరైనా వ్యభిచారా నికి పాల్పడితే, వారికి వ్యతిరేకంగా, మీలో నుండి నలుగురి సాక్ష్యం తీసుకోండి. వారు (నలుగురు) సాక్ష్యమిస్తే, వారు మరణించేవరకైనా, లేదా వారి కొరకు అల్లాహ్‌ ఏదైనా మార్గం చూపించే వరకైనా వారిని ఇండ్లలో నిర్బంధించండి 18

4:16 – وَاللَّذَانِ يَأْتِيَانِهَا مِنكُمْ فَآذُوهُمَا ۖ فَإِن تَابَا وَأَصْلَحَا فَأَعْرِضُوا عَنْهُمَا ۗ إِنَّ اللَّـهَ كَانَ تَوَّابًا رَّحِيمًا ١٦

మరియు మీలో ఏ ఇద్దరూ (స్త్రీలు గానీ, పురుషులు గానీ) దీనికి (వ్యభిచారానికి) పాల్పడితే వారిద్దరినీ శిక్షించండి. వారు పశ్చాత్తాపపడి తమ ప్రవర్తనను సవరించుకుంటే వారిని విడిచిపెట్టండి. నిశ్చయంగా, అల్లాహ్‌యే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణాప్రదాత. 19

4:17 – إِنَّمَا التَّوْبَةُ عَلَى اللَّـهِ لِلَّذِينَ يَعْمَلُونَ السُّوءَ بِجَهَالَةٍ ثُمَّ يَتُوبُونَ مِن قَرِيبٍ فَأُولَـٰئِكَ يَتُوبُ اللَّـهُ عَلَيْهِمْ ۗ وَكَانَ اللَّـهُ عَلِيمًا حَكِيمًا ١٧

నిశ్చయంగా, పశ్చాత్తాపాన్ని అంగీక రించటం అల్లాహ్‌కే చెందినది. ఎవరైతే అజ్ఞానం వల్ల పాపం చేసి, వెనువెంటనే పశ్చాత్తాపపడతారో! అలాంటివారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్‌ స్వీకరిస్తాడు. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు మహా వివేచనాపరుడు.

4:18 – وَلَيْسَتِ التَّوْبَةُ لِلَّذِينَ يَعْمَلُونَ السَّيِّئَاتِ حَتَّىٰ إِذَا حَضَرَ أَحَدَهُمُ الْمَوْتُ قَالَ إِنِّي تُبْتُ الْآنَ وَلَا الَّذِينَ يَمُوتُونَ وَهُمْ كُفَّارٌ ۚ أُولَـٰئِكَ أَعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًا ١٨

మరియు వారిలో ఒకడు, మరణం ఆసన్న మయ్యే వరకూ పాపకార్యాలు చేస్తూవుండి: ”ఇప్పుడు నేను పశ్చాత్తాపపడుతున్నాను!” అని అంటే, అలాంటి వారి పశ్చాత్తాపం మరియు మరణించేవరకు సత్య-తిరస్కారులుగా ఉన్నవారి (పశ్చాత్తాపం) స్వీకరించబడవు 20 అలాంటి వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిధ్ధపరచి ఉంచాము.

4:19 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا يَحِلُّ لَكُمْ أَن تَرِثُوا النِّسَاءَ كَرْهًا ۖ وَلَا تَعْضُلُوهُنَّ لِتَذْهَبُوا بِبَعْضِ مَا آتَيْتُمُوهُنَّ إِلَّا أَن يَأْتِينَ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ ۚ وَعَاشِرُوهُنَّ بِالْمَعْرُوفِ ۚ فَإِن كَرِهْتُمُوهُنَّ فَعَسَىٰ أَن تَكْرَهُوا شَيْئًا وَيَجْعَلَ اللَّـهُ فِيهِ خَيْرًا كَثِيرًا ١٩

ఓ విశ్వాసులారా! మీరు బలవంతంగా స్త్రీలకు వారసులు కావటం మీకు ధర్మసమ్మతం కాదు. మరియు మీరు వారికిచ్చిన దాని (మహ్ర్‌) నుండి కొంత తీసుకోవటానికి వారిని ఇబ్బందిలో పెట్టకండి, వారు నిస్సందేహంగా వ్యభిచారానికి పాల్పడితే తప్ప 21 మరియు మీరు వారితో గౌరవంతో సహవాసం చేయండి. ఒకవేళ మీకు, వారు నచ్చకపోతే! బహుశా మీకు ఒక విషయం నచ్చకపోవచ్చు, కాని అందులోనే అల్లాహ్‌ ఎంతో మేలు ఉంచి ఉండవచ్చు!

4:20 – وَإِنْ أَرَدتُّمُ اسْتِبْدَالَ زَوْجٍ مَّكَانَ زَوْجٍ وَآتَيْتُمْ إِحْدَاهُنَّ قِنطَارًا فَلَا تَأْخُذُوا مِنْهُ شَيْئًا ۚ أَتَأْخُذُونَهُ بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا ٢٠

మరియు ఒకవేళ మీరు ఒక భార్యను విడనాడి వేరొకామెను పెండ్లి చేసుకోవాలని సంకల్పించుకుంటే! మరియు మీరు ఆమెకు ఒక పెద్ద ధనరాశిని ఇచ్చి ఉన్నా సరే, దాని నుండి ఏ మాత్రం తిరిగి తీసుకోకండి. ఏమీ? ఆమెపై అపనింద మోపి, ఘోరపాపానికి పాల్పడి, దాన్ని తిరిగి తీసుకుంటారా?

4:21 – وَكَيْفَ تَأْخُذُونَهُ وَقَدْ أَفْضَىٰ بَعْضُكُمْ إِلَىٰ بَعْضٍ وَأَخَذْنَ مِنكُم مِّيثَاقًا غَلِيظًا ٢١

మరియు మీరు పరస్పరం దాంపత్య సుఖం అనుభవించిన తరువాత, వారు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తరువాత, మీరు దానిని (మహ్ర్‌ను) ఎలా తిరిగి తీసుకోగలరు?

4:22 – وَلَا تَنكِحُوا مَا نَكَحَ آبَاؤُكُم مِّنَ النِّسَاءِ إِلَّا مَا قَدْ سَلَفَ ۚ إِنَّهُ كَانَ فَاحِشَةً وَمَقْتًا وَسَاءَ سَبِيلًا ٢٢

మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు వివాహమాడకండి. ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. నిశ్చయంగా, ఇది అసభ్యకర మైనది (సిగ్గుమాలినది), జుగుప్సాకరమైనది మరియు చెడు మార్గము.

4:23 – حُرِّمَتْ عَلَيْكُمْ أُمَّهَاتُكُمْ وَبَنَاتُكُمْ وَأَخَوَاتُكُمْ وَعَمَّاتُكُمْ وَخَالَاتُكُمْ وَبَنَاتُ الْأَخِ وَبَنَاتُ الْأُخْتِ وَأُمَّهَاتُكُمُ اللَّاتِي أَرْضَعْنَكُمْ وَأَخَوَاتُكُم مِّنَ الرَّضَاعَةِ وَأُمَّهَاتُ نِسَائِكُمْ وَرَبَائِبُكُمُ اللَّاتِي فِي حُجُورِكُم مِّن نِّسَائِكُمُ اللَّاتِي دَخَلْتُم بِهِنَّ فَإِن لَّمْ تَكُونُوا دَخَلْتُم بِهِنَّ فَلَا جُنَاحَ عَلَيْكُمْ وَحَلَائِلُ أَبْنَائِكُمُ الَّذِينَ مِنْ أَصْلَابِكُمْ وَأَن تَجْمَعُوا بَيْنَ الْأُخْتَيْنِ إِلَّا مَا قَدْ سَلَفَ ۗ إِنَّ اللَّـهَ كَانَ غَفُورًا رَّحِيمًا ٢٣

మీకు ఈ స్త్రీలు నిషేధించబడ్డారు. 22 మీతల్లులు, మీ కుమార్తెలు, మీ సోదరీమణులు, మీ మేనత్తలు, మీతల్లి సోదరీమణులు (పిన-తల్లులు), మీ సోదరుల కుమార్తెలు, మీ సోదరీమణుల కుమార్తెలు, మీకు పాలిచ్చిన తల్లులు (దాదులు) మీతో పాటు పాలుత్రాగిన సోదరీమణులు, మీ భార్యల-తల్లులు; మీ సంరక్షణలో ఉన్న మీ భార్యల-కుమార్తెలు – ఏ భార్యలతోనైతే మీరు సంభోగించారో – కాని మీరు వారితో సంభోగించక ముందు (వారికి విడాకులిచ్చి వారి కూతుళ్లను పెండ్లాడితే) తప్పు లేదు; మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమారుల భార్యలు మరియు ఏక కాలంలో అక్కాచెల్లెళ్ళను ఇద్దరినీ చేర్చటం (భార్యలుగా చేసుకోవటం నిషిద్ధం); కాని ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగి పోయింది. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

4:24 – وَالْمُحْصَنَاتُ مِنَ النِّسَاءِ إِلَّا مَا مَلَكَتْ أَيْمَانُكُمْ ۖ كِتَابَ اللَّـهِ عَلَيْكُمْ ۚ وَأُحِلَّ لَكُم مَّا وَرَاءَ ذَٰلِكُمْ أَن تَبْتَغُوا بِأَمْوَالِكُم مُّحْصِنِينَ غَيْرَ مُسَافِحِينَ ۚ فَمَا اسْتَمْتَعْتُم بِهِ مِنْهُنَّ فَآتُوهُنَّ أُجُورَهُنَّ فَرِيضَةً ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا تَرَاضَيْتُم بِهِ مِن بَعْدِ الْفَرِيضَةِ ۚ إِنَّ اللَّـهَ كَانَ عَلِيمًا حَكِيمًا ٢٤

మరియు ఇతరుల వివాహబంధంలో ఉన్న స్త్రీలు – (ధర్మయుధ్ధంలో) మీ చేతికి చిక్కిన బానిస స్త్రీలు తప్ప – (మీరు వివాహమాడటానికి నిషేధించబడ్డారు). ఇది అల్లాహ్‌ మీకు విధించిన అనుశాసనం. మరియు వీరు తప్ప మిగతా స్త్రీలంతా మీకు వివాహమాడటానికి ధర్మ సమ్మతం చేయబడ్డారు. మీరు వారికి తగిన మహ్ర్‌ (వధుకట్నం) ఇచ్చి వ్యభిచారంగా కాకుండా వివాహబంధంలో తీసుకోవటానికి కోర వచ్చు. కావున మీరు దాంపత్యసుఖాన్ని అనుభ వించాలనుకున్న వారికి వారి మహ్ర్‌ (వధుకట్నం) విధిగా చెల్లించండి. కాని మహ్ర్‌ (వధుకట్నం) ఒప్పందం జరిగిన తరువాత పరస్పర అంగీ కారంతో మీ మధ్య ఏమైనా రాజీ కుదిరితే, అందులో దోషం లేదు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

4:25 – وَمَن لَّمْ يَسْتَطِعْ مِنكُمْ طَوْلًا أَن يَنكِحَ الْمُحْصَنَاتِ الْمُؤْمِنَاتِ فَمِن مَّا مَلَكَتْ أَيْمَانُكُم مِّن فَتَيَاتِكُمُ الْمُؤْمِنَاتِ ۚ وَاللَّـهُ أَعْلَمُ بِإِيمَانِكُم ۚ بَعْضُكُم مِّن بَعْضٍ ۚ فَانكِحُوهُنَّ بِإِذْنِ أَهْلِهِنَّ وَآتُوهُنَّ أُجُورَهُنَّ بِالْمَعْرُوفِ مُحْصَنَاتٍ غَيْرَ مُسَافِحَاتٍ وَلَا مُتَّخِذَاتِ أَخْدَانٍ ۚ فَإِذَا أُحْصِنَّ فَإِنْ أَتَيْنَ بِفَاحِشَةٍ فَعَلَيْهِنَّ نِصْفُ مَا عَلَى الْمُحْصَنَاتِ مِنَ الْعَذَابِ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِيَ الْعَنَتَ مِنكُمْ ۚ وَأَن تَصْبِرُوا خَيْرٌ لَّكُمْ ۗ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٢٥

మరియు మీలో ఎవరికైనా స్వతంత్రులైన ముస్లింస్త్రీలను వివాహంచేసుకునే స్తోమత లేకుంటే అప్పుడు మీ స్వాధీనంలో ఉన్న ముస్లిం లైనటు వంటి బానిసస్త్రీలను వివాహమాడవచ్చు.మరియు అల్లాహ్‌ కు మీవిశ్వాసం గురించితెలుసు. మీరంతా ఒకేఒక వర్గానికి చెందినవారు 23 (ఒకరికొకరు సంబంధించిన వారు), అందువల్ల వారి సంరక్షకుల అనుమతితో వారితో వివాహం చేసుకొని ధర్మ ప్రకారంగా వారి మహ్ర్‌ (వధుకట్నం) ఇవ్వండి. ఇది వారిని వివాహబంధంలో సురక్షితంగా ఉంచ టానికి, స్వేచ్ఛా కామ-క్రీడలకు దిగకుండా ఉంచ టానికి మరియు దొంగచాటు సంబంధాలు ఏర్పరచు కోకుండాఉంచటానికి (ఆదేశించబడింది). వారు (ఆ బానిసస్త్రీలు) వివాహబంధంలో రక్షణ పొందిన తరువాత కూడా వ్యభిచారానికి పాల్పడితే స్వతంత్రులైన స్త్రీలకు విధించే శిక్షలోని సగం శిక్ష వారికి విధించండి. 24 ఇది మీలో పాపభీతి గల వారికి వర్తిస్తుంది. ఒకవేళ మీరు నిగ్రహం పాటిస్తే అది మీకే మంచిది. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు. అపార కరుణాప్రదాత.

4:26 – يُرِيدُ اللَّـهُ لِيُبَيِّنَ لَكُمْ وَيَهْدِيَكُمْ سُنَنَ الَّذِينَ مِن قَبْلِكُمْ وَيَتُوبَ عَلَيْكُمْ ۗ وَاللَّـهُ عَلِيمٌ حَكِيمٌ ٢٦

అల్లాహ్‌ మీకు (ధర్మ-అధర్మాలను) స్పష్టం చేయాలనీ మరియు మీ కంటే పూర్వం ఉన్న (సత్పురుషుల) మార్గం వైపునకు, మీకు మార్గ దర్శకత్వం చేయాలనీ మరియు మీ పశ్చాత్తా పాన్ని అంగీకరించాలనీ కోరుతున్నాడు. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

4:27 – وَاللَّـهُ يُرِيدُ أَن يَتُوبَ عَلَيْكُمْ وَيُرِيدُ الَّذِينَ يَتَّبِعُونَ الشَّهَوَاتِ أَن تَمِيلُوا مَيْلًا عَظِيمًا ٢٧

మరియు అల్లాహ్‌ మీ పశ్చాత్తాపాన్ని అంగీక రించగోరుతున్నాడు. కాని తమ మనోవాంఛలను అనుసరిస్తున్నవారు, మీరు (సన్మార్గం నుండి) చాలా దూరంగా వైదొలగాలని కోరుతున్నారు.

4:28 – يُرِيدُ اللَّـهُ أَن يُخَفِّفَ عَنكُمْ ۚ وَخُلِقَ الْإِنسَانُ ضَعِيفًا ٢٨

అల్లాహ్‌ మీ భారాన్ని తగ్గించ గోరు తున్నాడు. మరియు (ఎందుకంటే) మానవుడు బలహీనుడిగా సృష్టించబడ్డాడు.

4:29 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَأْكُلُوا أَمْوَالَكُم بَيْنَكُم بِالْبَاطِلِ إِلَّا أَن تَكُونَ تِجَارَةً عَن تَرَاضٍ مِّنكُمْ ۚ وَلَا تَقْتُلُوا أَنفُسَكُمْ ۚ إِنَّ اللَّـهَ كَانَ بِكُمْ رَحِيمًا ٢٩

ఓవిశ్వాసులారా! మీరు ఒకరి సొమ్మునొకరు అన్యాయంగా తినకండి, పరస్పర అంగీకారంతో చేసే వ్యాపారం వల్ల వచ్చేది (లాభం) తప్ప. 25 మరియు మీరు ఒకరినొకరు చంపుకోకండి 26 నిశ్చ యంగా, అల్లాహ్‌ మీ యెడల అపార కరుణాప్రదాత.

4:30 – وَمَن يَفْعَلْ ذَٰلِكَ عُدْوَانًا وَظُلْمًا فَسَوْفَ نُصْلِيهِ نَارًا ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّـهِ يَسِيرًا ٣٠

మరియు ఎవడు ద్వేషంతో మరియు దుర్మార్గంతో అలాచేస్తాడో, వానిని మేము నరకాగ్నిలో పడవేస్తాము. మరియు అది అల్లాహ్‌ కు ఎంతో సులభం.

4:31 – إِن تَجْتَنِبُوا كَبَائِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَنُدْخِلْكُم مُّدْخَلًا كَرِيمًا ٣١

ఒకవేళ మీకు నిషేధించబడినటువంటి మహా పాపాలకు మీరు దూరంగా ఉంటే, మేము మీ చిన్నచిన్న దోషాలను మన్నించి, మిమ్మల్ని గౌరవ స్థానాల్లోకి ప్రవేశింపజేస్తాము. 27

4:32 – وَلَا تَتَمَنَّوْا مَا فَضَّلَ اللَّـهُ بِهِ بَعْضَكُمْ عَلَىٰ بَعْضٍ ۚ لِّلرِّجَالِ نَصِيبٌ مِّمَّا اكْتَسَبُوا ۖ وَلِلنِّسَاءِ نَصِيبٌ مِّمَّا اكْتَسَبْنَ ۚ وَاسْأَلُوا اللَّـهَ مِن فَضْلِهِ ۗ إِنَّ اللَّـهَ كَانَ بِكُلِّ شَيْءٍ عَلِيمًا ٣٢

మరియు అల్లాహ్‌ మీలో కొందరికి మరి కొందరిపై ఇచ్చిన ఘనతను మీరు ఆశించకండి. పురుషులకు తాము సంపాదించిన దానికి తగినట్లుగా ఫలితం ఉంటుంది. మరియు స్త్రీలకు తాము సంపాదించిన దానికి తగినట్లుగా ఫలితం ఉంటుంది. మరియు అల్లాహ్‌ అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ కు ప్రతిదాని పరిజ్ఞానం ఉంది.

4:33 – وَلِكُلٍّ جَعَلْنَا مَوَالِيَ مِمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ ۚ وَالَّذِينَ عَقَدَتْ أَيْمَانُكُمْ فَآتُوهُمْ نَصِيبَهُمْ ۚ إِنَّ اللَّـهَ كَانَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدًا ٣٣

మరియు తల్లి-దండ్రులు మరియు దగ్గరి బంధువులు, వదలి పోయిన ప్రతి వ్యక్తి (ఆస్తి)కి మేము వారసులను నియమించివున్నాము. మరియు మీరు ఎవరితో ప్రమాణ పూర్వక ఒప్పందాలు చేసుకొని ఉన్నారో! వారి భాగాన్ని వారికి ఇచ్చివేయండి. నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రతిదానికి సాక్షిగా ఉంటాడు. 28

4:34 – الرِّجَالُ قَوَّامُونَ عَلَى النِّسَاءِ بِمَا فَضَّلَ اللَّـهُ بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ وَبِمَا أَنفَقُوا مِنْ أَمْوَالِهِمْ ۚ فَالصَّالِحَاتُ قَانِتَاتٌ حَافِظَاتٌ لِّلْغَيْبِ بِمَا حَفِظَ اللَّـهُ ۚ وَاللَّاتِي تَخَافُونَ نُشُوزَهُنَّ فَعِظُوهُنَّ وَاهْجُرُوهُنَّ فِي الْمَضَاجِعِ وَاضْرِبُوهُنَّ ۖ فَإِنْ أَطَعْنَكُمْ فَلَا تَبْغُوا عَلَيْهِنَّ سَبِيلًا ۗ إِنَّ اللَّـهَ كَانَ عَلِيًّا كَبِيرًا ٣٤

పురుషులు స్త్రీలపై నిర్వాహకులు (ఖవ్వామూన్‌), 29 ఎందుకంటే అల్లాహ్‌ కొందరికి మరి కొందరిపై ఘనతనిచ్చాడు మరియు వారు (పురుషులు) తమ సంపదలో నుండి వారిపై (స్త్రీలపై) ఖర్చుచేస్తారు. కావున సుగుణవంతులైన స్త్రీలు విధేయవతులై ఉండి, భర్తలు లేనప్పుడు, అల్లాహ్‌ కాపాడమని ఆజ్ఞాపించిన దానిని (శీలమును) కాపాడుకుంటారు. కానీ అవిధేయత చూపుతారని మీకు భయముంటే, వారికి (మొదట) నచ్చజెప్పండి, (తరువాత) పడకలో వేరుగా ఉంచండి, (ఆ తరువాత కూడా వారు విధేయులు కాకపోతే) వారిని (మెల్లగా) కొట్టండి. 30 కాని వారు మీకు విధేయులై ఉంటే! వారిని నిందించటానికి మార్గం వెతకకండి. నిశ్చయంగా, అల్లాహ్‌ మహోన్నతుడు, మహనీయుడు. 31

4:35 – وَإِنْ خِفْتُمْ شِقَاقَ بَيْنِهِمَا فَابْعَثُوا حَكَمًا مِّنْ أَهْلِهِ وَحَكَمًا مِّنْ أَهْلِهَا إِن يُرِيدَا إِصْلَاحًا يُوَفِّقِ اللَّـهُ بَيْنَهُمَا ۗ إِنَّ اللَّـهَ كَانَ عَلِيمًا خَبِيرًا ٣٥

మరియు వారిద్దరి (భార్యా-భర్తల) మధ్య సంబంధాలు తెగిపోతాయనే భయం మీకు కలిగితే, అతని (భర్త) బంధువుల నుండి ఒక మధ్యవర్తిని మరియు ఆమె (భార్య) బంధువుల నుండి ఒక మధ్యవర్తిని నియమించండి. వారిద్దరూ సంధి చేసుకోగోరితే అల్లాహ్‌ వారి మధ్య ఐకమత్యం చేకూర్చవచ్చు! నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, సర్వం తెలిసిన వాడు. (1/8)

4:36 – وَاعْبُدُوا اللَّـهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا ۖ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَبِذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَالْجَارِ ذِي الْقُرْبَىٰ وَالْجَارِ الْجُنُبِ وَالصَّاحِبِ بِالْجَنبِ وَابْنِ السَّبِيلِ وَمَا مَلَكَتْ أَيْمَانُكُمْ ۗ إِنَّ اللَّـهَ لَا يُحِبُّ مَن كَانَ مُخْتَالًا فَخُورًا ٣٦

మరియు మీరు అల్లాహ్‌ నే ఆరాధించండి మరియు ఎవ్వరినీ ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి. మరియు తల్లి-దండ్రులతో, దగ్గరి బంధువులతో, అనాథులతో నిరుపేదలతో, బంధువులైన పొరుగువారితో, అపరిచితులైన పొరుగు వారితో, 32 ప్రక్కనున్న మిత్రులతో, బాటసారులతో మరియు మీ ఆధీనంలో ఉన్న బానిసలతో అందరితోనూ ఉదారస్వభావంతో వ్యవహరించండి 33 నిశ్చయంగా అల్లాహ్‌ గర్వి తుణ్ణి, బడాయీలు చెప్పుకునేవాణ్ణి ప్రేమించడు. 34

4:37 – الَّذِينَ يَبْخَلُونَ وَيَأْمُرُونَ النَّاسَ بِالْبُخْلِ وَيَكْتُمُونَ مَا آتَاهُمُ اللَّـهُ مِن فَضْلِهِ ۗ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ عَذَابًا مُّهِينًا ٣٧

ఎవరైతే తాము లోభులై, ఇతరులకు లోభం నేర్పుతారో వారినీ మరియు అల్లాహ్‌ తన అనుగ్రహంతో ఇచ్చిన దానిని దాచిపెట్టేవారినీ (అల్లాహ్‌ ప్రేమించడు). 35 మరియు మేము సత్య-తిరస్కారుల కొరకు అవమానకరమైన శిక్షను సిధ్ధపరచి ఉంచాము.

4:38 – وَالَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُونَ بِاللَّـهِ وَلَا بِالْيَوْمِ الْآخِرِ ۗ وَمَن يَكُنِ الشَّيْطَانُ لَهُ قَرِينًا فَسَاءَ قَرِينًا ٣٨

మరియు వారికి, ఎవరైతే ప్రజలకు చూప టానికి తమ సంపదను ఖర్చుపెడతారో మరియు అల్లాహ్‌ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించరో! మరియు ఎవడైతే షై’తాన్‌ను తన స్నేహితునిగా (ఖరీనున్‌గా) చేసుకుంటాడో! 36 అతడు ఎంత నీచమైన స్నేహితుడు.

4:39 – وَمَاذَا عَلَيْهِمْ لَوْ آمَنُوا بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَنفَقُوا مِمَّا رَزَقَهُمُ اللَّـهُ ۚ وَكَانَ اللَّـهُ بِهِمْ عَلِيمًا ٣٩

మరియు వారు ఒకవేళ అల్లాహ్‌ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించి అల్లాహ్‌ వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఇతరులపై ఖర్చుచేసి ఉంటే వారికేమయ్యేది? మరియు అల్లాహ్‌ కు, వారిని గురించి బాగా తెలుసు.

4:40 – إِنَّ اللَّـهَ لَا يَظْلِمُ مِثْقَالَ ذَرَّةٍ ۖ وَإِن تَكُ حَسَنَةً يُضَاعِفْهَا وَيُؤْتِ مِن لَّدُنْهُ أَجْرًا عَظِيمًا ٤٠

నిశ్చయంగా, అల్లాహ్‌ ఎవరికీ రవ్వంత (పరమాణువంత) అన్యాయం కూడా చేయడు 37 ఒక సత్కార్యముంటే ఆయన దానిని రెండింతలు చేస్తాడు; మరియు తన తరఫు నుండి గొప్ప ప్రతిఫలాన్ని కూడా ప్రసాదిస్తాడు.

4:41 – فَكَيْفَ إِذَا جِئْنَا مِن كُلِّ أُمَّةٍ بِشَهِيدٍ وَجِئْنَا بِكَ عَلَىٰ هَـٰؤُلَاءِ شَهِيدًا ٤١

మేము (ప్రతిఫలదినమున) ప్రతి సమాజం నుండి ఒకసాక్షిని తెచ్చి మరియు (ఓ ప్రవక్తా!) నిన్ను వీరికి సాక్షిగా నిలబెట్టినప్పుడు ఎలా ఉంటుంది?

4:42 – يَوْمَئِذٍ يَوَدُّ الَّذِينَ كَفَرُوا وَعَصَوُا الرَّسُولَ لَوْ تُسَوَّىٰ بِهِمُ الْأَرْضُ وَلَا يَكْتُمُونَ اللَّـهَ حَدِيثًا ٤٢

ఆ (ప్రతిఫల) దినమున, ప్రవక్త మాటను తిరస్కరించి, అతనికి అవిధేయత చూపిన వారంతా; తాము భూమిలో పూడ్చబడితే ఎంత బాగుండేదని కోరుతారు! కానీ, వారు అల్లాహ్‌ ముందు ఏ విషయాన్ని దాచలేరు. 38

4:43 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقْرَبُوا الصَّلَاةَ وَأَنتُمْ سُكَارَىٰ حَتَّىٰ تَعْلَمُوا مَا تَقُولُونَ وَلَا جُنُبًا إِلَّا عَابِرِي سَبِيلٍ حَتَّىٰ تَغْتَسِلُوا ۚ وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ ۗ إِنَّ اللَّـهَ كَانَ عَفُوًّا غَفُورًا ٤٣

ఓ విశ్వాసులారా! మీరు మత్తులో ఉంటే 39 మీరు పలికేది గ్రహించనంత వరకు, మరియు మీకు ఇంద్రియస్ఖలనం (జునుబున్) అయిఉంటే –స్నానం చేయనంత వరకు, నమా’జ్‌ సమీపానికి వెళ్లకండి; కాని నడుస్తూ (మస్జిద్‌) నుండి దాటవలసివస్తే తప్ప. 40 కాని ఒకవేళ మీరు రోగపీడితులై ఉంటే, లేదా ప్రయాణంలో వుంటే, లేక మల-మూత్ర విసర్జన చేసివుంటే, లేక స్త్రీలతో సంభోగం చేసి ఉంటే – మీకు నీళ్ళు దొరక్కపోతే – పరిశుధ్ధమైన మట్టిని చేతులతో స్పర్శించి, ఆ చేతులతో మీ ముఖాలను మరియు మీ చేతులను తుడుచు కోండి (తయమ్మమ్‌ చేయండి). 41 నిశ్చయంగా, అల్లాహ్ తప్పులనుమన్నించేవాడు క్షమించేవాడు.

4:44 – أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يَشْتَرُونَ الضَّلَالَةَ وَيُرِيدُونَ أَن تَضِلُّوا السَّبِيلَ ٤٤

ఏమీ? గ్రంథ జ్ఞానంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని గురించి నీకు తెలియదా (చూడ లేదా)? వారు మార్గభ్రష్టత్వాన్ని కొనుక్కుం టున్నారు మరియు మీరు కూడా సన్మార్గం నుండి తప్పిపోవాలని కోరుతున్నారు.

4:45 – وَاللَّـهُ أَعْلَمُ بِأَعْدَائِكُمْ ۚ وَكَفَىٰ بِاللَّـهِ وَلِيًّا وَكَفَىٰ بِاللَّـهِ نَصِيرًا ٤٥

మరియు అల్లాహ్‌ మీ శత్రువులను బాగా ఎరుగును. కావున మీ రక్షకుడుగా అల్లాహ్‌ యే చాలు మరియు మీకు సహాయకుడుగా కూడా అల్లాహ్‌ యే చాలు!

4:46 – مِّنَ الَّذِينَ هَادُوا يُحَرِّفُونَ الْكَلِمَ عَن مَّوَاضِعِهِ وَيَقُولُونَ سَمِعْنَا وَعَصَيْنَا وَاسْمَعْ غَيْرَ مُسْمَعٍ وَرَاعِنَا لَيًّا بِأَلْسِنَتِهِمْ وَطَعْنًا فِي الدِّينِ ۚ وَلَوْ أَنَّهُمْ قَالُوا سَمِعْنَا وَأَطَعْنَا وَاسْمَعْ وَانظُرْنَا لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَقْوَمَ وَلَـٰكِن لَّعَنَهُمُ اللَّـهُ بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلًا ٤٦

యూదులలో కొందరు పదాలను వాటి సంద ర్భాల నుండి తారుమారు చేసి అంటారు: ‘మేము (నీ మాటలను) విన్నాము మరియు ఉల్లం ఘించాము (సమి’అనా వ’అ’సయ్‌నా).’ అనీ; మరియు: ‘విను! నీ మాట వినకబోవుగాక! (వస్‌మ’అ’గైర ముస్‌మ’ఇన్‌). 42 అనీ; మరియు ‘(ఓ ము’హమ్మద్‌!) నీవు మా మాట విను. (రా’ఇనా)’ అనీ 43 తమ నాలుకలను మెలిత్రిప్పి సత్య ధర్మాన్ని ఎగతాళి చేసే ఉద్దేశ్యంతో అంటారు. కాని అలా కాకుండా: ‘విన్నాము విధే యుల మయ్యాము. (సమి’అనా వ అ’త ‘అనా).’ అనీ; మరియు: ‘మమ్మల్ని విను మరియు మా దిక్కు చూడు / మాకు వ్యవధి నివ్వు (వస్‌మ’అ వన్‌”జుర్‌నా),’ అనీ, అని ఉంటే వారికే మేలై ఉండేది మరియు ఉత్తమమైన పద్దతిగా ఉండేది. కాని వారి సత్య-తిరస్కారవైఖరి వల్ల అల్లాహ్‌ వారిని శపించాడు (బహిష్కరించాడు). కావున వారిలో కొందరు మాత్రమే విశ్వసించేవారు ఉన్నారు.

4:47 – يَا أَيُّهَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ آمِنُوا بِمَا نَزَّلْنَا مُصَدِّقًا لِّمَا مَعَكُم مِّن قَبْلِ أَن نَّطْمِسَ وُجُوهًا فَنَرُدَّهَا عَلَىٰ أَدْبَارِهَا أَوْ نَلْعَنَهُمْ كَمَا لَعَنَّا أَصْحَابَ السَّبْتِ ۚ وَكَانَ أَمْرُ اللَّـهِ مَفْعُولًا ٤٧

ఓ గ్రంథప్రజలారా! మీవద్ద ఉన్న గ్రంథాన్ని ధృవపరుస్తూ, మేము అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్‌ఆన్‌ ను) విశ్వసించండి, మేము మీ ముఖాలను వికృతం చేసి వాటిని వెనక్కి త్రిప్పక ముందే (నాశనం చేయకముందే). లేక మేము సబ్త్‌ వారిని శపించినట్లుగా (బహిష్కరించినట్లుగా) మిమ్మల్ని కూడా శపించక (బహిష్కరించక) ముందే (దీనిని విశ్వసించండి). 44 ఎందుకంటే! అల్లాహ్‌ ఆజ్ఞ తప్పకుండా నిర్వహించబడుతుంది.

4:48 – إِنَّ اللَّـهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ ۚ وَمَن يُشْرِكْ بِاللَّـهِ فَقَدِ افْتَرَىٰ إِثْمًا عَظِيمًا ٤٨

నిశ్చయంగా, అల్లాహ్‌ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏమాత్రమూ క్షమించడు. 45 మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్‌ కు భాగస్వాములను కల్పించినవాడే, వాస్తవానికి మహా పాపం చేసిన వాడు!

4:49 – أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يُزَكُّونَ أَنفُسَهُم ۚ بَلِ اللَّـهُ يُزَكِّي مَن يَشَاءُ وَلَا يُظْلَمُونَ فَتِيلًا ٤٩

ఏమీ? తమను తాము పవిత్రులమని చెప్పుకునే వారిని (యూదులు మరియు క్రైస్తవు లను) గురించి నీకు తెలియదా (చూడలేదా)? 46 వాస్తవానికి, అల్లాహ్‌ తాను కోరినవారికి మాత్రమే పవిత్రతను ప్రసాదిస్తాడు. 47 మరియు వారికి ఖర్జూర-బీజపు చీలికలోని పొరఅంత అన్యాయం కూడా చేయబడదు. 48

4:50 – انظُرْ كَيْفَ يَفْتَرُونَ عَلَى اللَّـهِ الْكَذِبَ ۖ وَكَفَىٰ بِهِ إِثْمًا مُّبِينًا ٥٠

చూడండి! వారు అల్లాహ్‌ ను గురించి ఏ విధమైన అబద్దాన్ని కల్పిస్తున్నారో? మరియు స్పష్టమైన పాపం, అని చెప్పటానికి ఇది చాలు.

4:51 – أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يُؤْمِنُونَ بِالْجِبْتِ وَالطَّاغُوتِ وَيَقُولُونَ لِلَّذِينَ كَفَرُوا هَـٰؤُلَاءِ أَهْدَىٰ مِنَ الَّذِينَ آمَنُوا سَبِيلً ٥١

ఏమీ? గ్రంథ జ్ఞానంలో కొంతభాగం ఇవ్వ బడిన వారిని గురించి నీకు తెలియదా? వారు జిబ్త్ 49 మరియు ‘తా’గూత్‌ లలో 50 విశ్వాస ముంచుతున్నారు. వారు సత్య-తిరస్కారులను గురించి: ”విశ్వాసులకంటే, వీరే సరైనమార్గంలో ఉన్నారు.” అని అంటారు.

4:52 – أُولَـٰئِكَ الَّذِينَ لَعَنَهُمُ اللَّـهُ ۖ وَمَن يَلْعَنِ اللَّـهُ فَلَن تَجِدَ لَهُ نَصِيرًا ٥٢

ఇలాంటివారే, అల్లాహ్‌ శాపానికి (బహిష్కా రానికి) గురి అయినవారు. మరియు అల్లాహ్‌ శపించినవాడికి సహాయపడేవాడిని ఎవ్వడినీ నీవు పొందలేవు.

4:53 – أَمْ لَهُمْ نَصِيبٌ مِّنَ الْمُلْكِ فَإِذًا لَّا يُؤْتُونَ النَّاسَ نَقِيرًا ٥٣

లేదా వారికి రాజ్యపాలనలో భాగం ఉందా? ఒకవేళ ఉండి ఉంటే, వారు ప్రజలకు ఖర్జూరపు బీజపు చీలిక 51 అంత భాగం కూడా ఇచ్చేవారు కాదు.

4:54 – أَمْ يَحْسُدُونَ النَّاسَ عَلَىٰ مَا آتَاهُمُ اللَّـهُ مِن فَضْلِهِ ۖ فَقَدْ آتَيْنَا آلَ إِبْرَاهِيمَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَآتَيْنَاهُم مُّلْكًا عَظِيمًا ٥٤

లేదా! అల్లాహ్‌ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన (సౌభాగ్యాన్ని) చూసి వారు ఈర్ష్యపడు తున్నారా? వాస్తవానికి (ఇంతకు ముందు) మేము ఇబ్రాహీమ్‌ కుటుంబంవారికి, గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించాము. మరియు వారికి గొప్ప సామ్రాజ్యాన్ని కూడా ప్రదానం చేశాము.

4:55 – فَمِنْهُم مَّنْ آمَنَ بِهِ وَمِنْهُم مَّن صَدَّ عَنْهُ ۚ وَكَفَىٰ بِجَهَنَّمَ سَعِيرًا ٥٥

కాని వారిలో కొందరు అతనిని (ప్రవక్తను) విశ్వసించినవారు ఉన్నారు, మరికొందరు అతని నుండి విముఖులైనవారూ ఉన్నారు. మరియు వారికి దహించే నరకాగ్నియే చాలు! 52

4:56 – إِنَّ الَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا سَوْفَ نُصْلِيهِمْ نَارًا كُلَّمَا نَضِجَتْ جُلُودُهُم بَدَّلْنَاهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا الْعَذَابَ ۗ إِنَّ اللَّـهَ كَانَ عَزِيزًا حَكِيمًا ٥٦

నిశ్చయంగా, ఎవరు మా సూచనలను తిరస్కరించారో! వారిని మేము మున్ముందు నరకాగ్నిలో పడవేస్తాము. ప్రతిసారి వారి చర్మాలు కాలిపోయినపుడల్లా వాటికి బదులుగా – వారు బాధను బాగా రుచిచూడటానికి – వేరే చర్మాలతో మార్చుతాము. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు మహా వివేచనాపరుడు.

4:57 – وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَنُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ لَّهُمْ فِيهَا أَزْوَاجٌ مُّطَهَّرَةٌ ۖ وَنُدْخِلُهُمْ ظِلًّا ظَلِيلًا ٥٧

మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారిని మేము క్రింద కాలువలు ప్రవహించే వనాలలో ప్రవేశింపజేస్తాము;వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. అందు వారికి పవిత్ర సహవా సులు (అ’జ్వాజ్‌) ఉంటారు. మరియు మేము వారిని దట్టమైననీడలలో ప్రవేశింపజేస్తాము 53 (1/4)

4:58 – إِنَّ اللَّـهَ يَأْمُرُكُمْ أَن تُؤَدُّوا الْأَمَانَاتِ إِلَىٰ أَهْلِهَا وَإِذَا حَكَمْتُم بَيْنَ النَّاسِ أَن تَحْكُمُوا بِالْعَدْلِ ۚ إِنَّ اللَّـهَ نِعِمَّا يَعِظُكُم بِهِ ۗ إِنَّ اللَّـهَ كَانَ سَمِيعًا بَصِيرًا ٥٨

  • పూచీ (అమానాత్‌ )లను తప్పక వాటికి అర్హులైనవారికి అప్పగించండనీ మరియు ప్రజలమధ్య తీర్పు చేసేటప్పుడు న్యాయంగా తీర్పుచేయండనీ, అల్లాహ్‌ మిమ్మల్ని ఆజ్ఞా పిస్తున్నాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ ఎంత ఉత్తమ మైన హితబోధ చేస్తున్నాడు! నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.

4:59 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّـهَ وَأَطِيعُوا الرَّسُولَ وَأُولِي الْأَمْرِ مِنكُمْ ۖ فَإِن تَنَازَعْتُمْ فِي شَيْءٍ فَرُدُّوهُ إِلَى اللَّـهِ وَالرَّسُولِ إِن كُنتُمْ تُؤْمِنُونَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ ۚ ذَٰلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلًا ٥٩

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశ హరునికి విధేయులై ఉండండి మరియు మీలో అధికారం అప్పగించబడినవారికి కూడా! మీ మధ్య ఏవిషయంలోనైనా అభిప్రాయభేదంకలిగితే – మీరు అల్లాహ్‌ ను అంతిమదినాన్ని విశ్వసించేవారే అయితే – ఆ విషయాన్ని అల్లాహ్‌ కు మరియు ప్రవక్తకు నివేదించండి. 54 ఇదే సరైన పధ్ధతి మరియు ఫలితాన్నిబట్టి కూడా ఉత్తమమైనది.

4:60 – أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يَزْعُمُونَ أَنَّهُمْ آمَنُوا بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِن قَبْلِكَ يُرِيدُونَ أَن يَتَحَاكَمُوا إِلَى الطَّاغُوتِ وَقَدْ أُمِرُوا أَن يَكْفُرُوا بِهِ وَيُرِيدُ الشَّيْطَانُ أَن يُضِلَّهُمْ ضَلَالًا بَعِيدًا ٦٠

(ఓ ప్రవక్తా!) ఏమీ? నీ వద్దకు పంపబడిన దానిని మరియు నీ కంటే పూర్వం పంపబడిన దానిని మేము విశ్వసించామని పలికే వారిని (కపట-విశ్వాసులను) నీవు ఎరుగవా (చూడ లేదా)? తిరస్కరించండని ఆదేశించబడినా, వారు తమ (వ్యవహారాల) పరిష్కారాలకు ‘తా’గూత్‌ 55 వద్దకే పోవాలని కోరుతూ ఉంటారు. మరియు షై’తాన్‌ వారిని, త్రోవతప్పించి, దుర్మార్గంలో అతి దూరంగా తీసుకొనిపోవాలని కోరుతుంటాడు.

4:61 – وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَىٰ مَا أَنزَلَ اللَّـهُ وَإِلَى الرَّسُولِ رَأَيْتَ الْمُنَافِقِينَ يَصُدُّونَ عَنكَ صُدُودًا ٦١

మరియు వారితో: ”అల్లాహ్‌ అవతరింప జేసిన వాటి (ఆదేశాల) వైపునకు మరియు ప్రవక్త వైపునకు రండి.” అని చెప్పినపుడు, నీవు ఆ కపటవిశ్వాసులను విముఖులై (నీ వైపునకు రాకుండా) తొలిగిపోవటాన్ని చూస్తావు!

4:62 – فَكَيْفَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ثُمَّ جَاءُوكَ يَحْلِفُونَ بِاللَّـهِ إِنْ أَرَدْنَا إِلَّا إِحْسَانًا وَتَوْفِيقًا ٦٢

అయితే వారు తమ చేతులారా చేసుకున్న (దుష్కార్యాల) ఫలితంగా వారికి బాధ కలిగి నపుడు, వారు నీ దగ్గరకు వచ్చి అల్లాహ్ పేర ప్రమాణాలు చేస్తూ: ”మేము మేలు చేయాలనీ మరియు ఐకమత్యం చేకూర్చాలనీ మాత్రమే ప్రయత్నించాము.” అని అంటారు. 56

4:63 – أُولَـٰئِكَ الَّذِينَ يَعْلَمُ اللَّـهُ مَا فِي قُلُوبِهِمْ فَأَعْرِضْ عَنْهُمْ وَعِظْهُمْ وَقُل لَّهُمْ فِي أَنفُسِهِمْ قَوْلًا بَلِيغًا ٦٣

అలాంటి వారినీ (కపటవిశ్వాసులను)! వారి హృదయాలలోఉన్నదీ అల్లాహ్‌ ఎరుగును, కావున వారి నుండి ముఖం త్రిప్పుకో, వారికి ఉపదేశం చెయ్యి మరియు వారిని గురించి వారి హృదయాలు ప్రభావితమయ్యే మాటపలుకు.

4:64 – وَمَا أَرْسَلْنَا مِن رَّسُولٍ إِلَّا لِيُطَاعَ بِإِذْنِ اللَّـهِ ۚ وَلَوْ أَنَّهُمْ إِذ ظَّلَمُوا أَنفُسَهُمْ جَاءُوكَ فَاسْتَغْفَرُوا اللَّـهَ وَاسْتَغْفَرَ لَهُمُ الرَّسُولُ لَوَجَدُوا اللَّـهَ تَوَّابًا رَّحِيمًا ٦٤

మరియు మేము ఏ ప్రవక్తను పంపినా – అల్లాహ్‌ అనుజ్ఞతో – (ప్రజలు) అతనిని అనుస రించాలనే పంపాము. మరియు ఒకవేళ వారు తమకు తాము అన్యాయం చేసుకున్నప్పుడు, నీ వద్దకు వచ్చి, వారు అల్లాహ్‌ యొక్క క్షమాభిక్ష కోరినప్పుడు – ప్రవక్త కూడా వారికై అల్లాహ్‌ యొక్క క్షమాభిక్షకొరకు వేడుకొన్నప్పుడు – వారు అల్లాహ్‌ ను నిశ్చయంగా క్షమించేవాడు గానూ మరియు కరుణాప్రదాతగానూ పొందుతారు.

4:65 – فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوا فِي أَنفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا تَسْلِيمًا ٦٥

అలాకాదు, నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయ నిర్ణేతగా స్వీకరించనంతవరకు మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ నిర్ణయంచేసినా దానిని గురించి వారి మనస్సులలో ఏమాత్రం సంకోచం లేకుండా దానికి (యథాతథంగా) శిరసావహించనంత వరకు, వారు (నిజమైన) విశ్వాసులు కాలేరు! 57

4:66 – وَلَوْ أَنَّا كَتَبْنَا عَلَيْهِمْ أَنِ اقْتُلُوا أَنفُسَكُمْ أَوِ اخْرُجُوا مِن دِيَارِكُم مَّا فَعَلُوهُ إِلَّا قَلِيلٌ مِّنْهُمْ ۖ وَلَوْ أَنَّهُمْ فَعَلُوا مَا يُوعَظُونَ بِهِ لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَشَدَّ تَثْبِيتًا ٦٦

మరియు ఒకవేళ వాస్తవానికి మేము వారిని: ”మీ ప్రాణాల బలి ఇవ్వండి లేదా మీ ఇల్లూ వాకిళ్ళను విడిచి వెళ్ళండి!” అని ఆజ్ఞాపించి (విధిగా చేసి) ఉంటే, వారిలో కొందరు మాత్రమే అలా చేసి ఉండేవారు. ఒకవేళ వారికి ఉపదేశించి నట్లు వారు చేసి ఉంటే, నిశ్చయంగా, అది వారికే శ్రేయస్కరమైనదిగా మరియు వారి (విశ్వాసాన్ని) దృఢపరిచేదిగా ఉండేది.

4:67 – وَإِذًا لَّآتَيْنَاهُم مِّن لَّدُنَّا أَجْرًا عَظِيمًا ٦٧

మరియు అప్పుడు వారికి మేము, మా వైపు నుండి గొప్ప ప్రతిఫలం ఇచ్చి ఉండేవారం.

4:68 – وَلَهَدَيْنَاهُمْ صِرَاطًا مُّسْتَقِيمًا ٦٨

మరియు మేము వారికి బుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేసి ఉండేవారం.

4:69 – وَمَن يُطِعِ اللَّـهَ وَالرَّسُولَ فَأُولَـٰئِكَ مَعَ الَّذِينَ أَنْعَمَ اللَّـهُ عَلَيْهِم مِّنَ النَّبِيِّينَ وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ ۚ وَحَسُنَ أُولَـٰئِكَ رَفِيقًا ٦٩

మరియు ఎవరు అల్లాహ్‌ కు మరియు ప్రవక్తకు విధేయులై ఉంటారో, అలాంటి వారు అల్లాహ్‌ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ, సత్య వంతులతోనూ, (అల్లాహ్‌) ధర్మం కొరకు ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల (షహీదుల) తోనూ, సద్వర్తనులతోనూ చేరి ఉంటారు. మరియు అలాంటి వారి సాంగత్యం ఎంతో మేలైనది! 58

4:70 – ذَٰلِكَ الْفَضْلُ مِنَ اللَّـهِ ۚ وَكَفَىٰ بِاللَّـهِ عَلِيمًا ٧٠

అల్లాహ్‌ నుండి లభించే అనుగ్రహం ఇలాంటిదే. మరియు (యథార్థం) తెలుసు కోవటానికి అల్లాహ్‌ చాలు.

4:71 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا خُذُوا حِذْرَكُمْ فَانفِرُوا ثُبَاتٍ أَوِ انفِرُوا جَمِيعًا ٧١

ఓ విశ్వాసులారా! మీరు (అన్ని విధాలుగా యుద్ధానికి సిద్ధమై) తగిన జాగ్రత్తలు వహించండి! 59 మీరు (యుధ్ధానికి) జట్లుగానో, లేదా అందరూ కలిసియో బయలుదేరండి.

4:72 – وَإِنَّ مِنكُمْ لَمَن لَّيُبَطِّئَنَّ فَإِنْ أَصَابَتْكُم مُّصِيبَةٌ قَالَ قَدْ أَنْعَمَ اللَّـهُ عَلَيَّ إِذْ لَمْ أَكُن مَّعَهُمْ شَهِيدًا ٧٢

మరియు వాస్తవానికి మీలో వెనుక ఉండి పోయేవాడు ఉన్నాడు, ఒకవేళ మీకు ఏమైనా ఆపదవస్తే అప్పుడు వాడు: ”వాస్తవానికి అల్లాహ్‌ నన్ను అనుగ్రహించాడు, అందుకే నేను కూడా వారితోపాటు లేను!” అని అంటాడు.

4:73 – وَلَئِنْ أَصَابَكُمْ فَضْلٌ مِّنَ اللَّـهِ لَيَقُولَنَّ كَأَن لَّمْ تَكُن بَيْنَكُمْ وَبَيْنَهُ مَوَدَّةٌ يَا لَيْتَنِي كُنتُ مَعَهُمْ فَأَفُوزَ فَوْزًا عَظِيمًا ٧٣

మరియు ఒకవేళ మీకు అల్లాహ్‌ తరఫు నుండి అనుగ్రహమే లభిస్తే! 60 మీకూ అతనికి మధ్య ఏ విధమైన అనురాగబంధమే లేనట్లుగా: ”అయ్యో! నేను కూడా వారితో పాటు ఉండిఉంటే నాకు కూడా గొప్ప విజయ ఫలితం లభించిఉండేది కదా!” అని తప్పక అంటాడు. (3/8)

4:74 – فَلْيُقَاتِلْ فِي سَبِيلِ اللَّـهِ الَّذِينَ يَشْرُونَ الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ ۚ وَمَن يُقَاتِلْ فِي سَبِيلِ اللَّـهِ فَيُقْتَلْ أَوْ يَغْلِبْ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا ٧٤

కావున ఇహలోక జీవితాన్ని పరలోక జీవిత (సుఖానికి) బదులుగా అమ్మిన వారు (విశ్వాసులు) అల్లాహ్‌ మార్గంలో పోరాడాలి. మరియు అల్లాహ్‌ మార్గంలో పోరాడినవాడు, చంప బడినా, లేదా విజేయుడైనా, మేము తప్పకుండా అతనికి గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించగలము.

4:75 – وَمَا لَكُمْ لَا تُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّـهِ وَالْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ الَّذِينَ يَقُولُونَ رَبَّنَا أَخْرِجْنَا مِنْ هَـٰذِهِ الْقَرْيَةِ الظَّالِمِ أَهْلُهَا وَاجْعَل لَّنَا مِن لَّدُنكَ وَلِيًّا وَاجْعَل لَّنَا مِن لَّدُنكَ نَصِيرًا ٧٥

మరియు మీకేమయింది, మీరెందుకు అల్లాహ్‌ మార్గంలో మరియు నిస్సహాయులై అణచి వేయబడిన పురుషుల, స్త్రీల మరియు పిల్లల కొరకు, పోరాడటం లేదు? 61 వారు: ”మా ప్రభూ! దౌర్జన్యపరులైన ఈ నగరవాసుల నుండి మాకు విమోచనం కలిగించు. నీ వద్ద నుండి మా కొరకు ఒక సంరక్షకుణ్ణి నియమించు. మరియు నీ వద్దనుండి మా కొరకు ఒక సహాయకుణ్ణి ఏర్పాటు చేయి!” అని వేడుకొంటున్నారు.

4:76 – الَّذِينَ آمَنُوا يُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّـهِ ۖ وَالَّذِينَ كَفَرُوا يُقَاتِلُونَ فِي سَبِيلِ الطَّاغُوتِ فَقَاتِلُوا أَوْلِيَاءَ الشَّيْطَانِ ۖ إِنَّ كَيْدَ الشَّيْطَانِ كَانَ ضَعِيفًا ٧٦

విశ్వసించిన వారు, అల్లాహ్‌ మార్గంలో పోరాడుతారు. మరియు సత్య-తిరస్కారులు ‘తా’గూత్‌ మార్గంలో పోరాడుతారు; 62 కావున మీరు (ఓ విశ్వాసులారా!) షై’తాను అనుచరులకు విరుధ్ధంగా పోరాడండి. నిశ్చయంగా, షై’తాను కుట్ర బలహీనమైనదే!

4:77 – أَلَمْ تَرَ إِلَى الَّذِينَ قِيلَ لَهُمْ كُفُّوا أَيْدِيَكُمْ وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ فَلَمَّا كُتِبَ عَلَيْهِمُ الْقِتَالُ إِذَا فَرِيقٌ مِّنْهُمْ يَخْشَوْنَ النَّاسَ كَخَشْيَةِ اللَّـهِ أَوْ أَشَدَّ خَشْيَةً ۚ وَقَالُوا رَبَّنَا لِمَ كَتَبْتَ عَلَيْنَا الْقِتَالَ لَوْلَا أَخَّرْتَنَا إِلَىٰ أَجَلٍ قَرِيبٍ ۗ قُلْ مَتَاعُ الدُّنْيَا قَلِيلٌ وَالْآخِرَةُ خَيْرٌ لِّمَنِ اتَّقَىٰ وَلَا تُظْلَمُونَ فَتِيلًا ٧٧

”మీ చేతులను ఆపుకోండి, నమా’జ్‌ ను స్థాపించండి, విధిదానం (‘జకాత్‌) ఇవ్వండి.” అని చెప్పబడినవారిని నీవుచూడలేదా? యుధ్ధం చేయ మని వారిని ఆదేశించినప్పుడు, వారిలో కొందరు అల్లాహ్‌ కు భయపడవలసిన విధంగా మానవు లకు భయపడుతున్నారు. కాదు! అంతకంటే ఎక్కువగానే భయపడుతున్నారు. వారు: ”ఓ మా ప్రభూ! యుధ్ధం చేయమని ఈ ఆజ్ఞను మా కొరకు ఎందుకు విధించావు? మాకు ఇంకా కొంత వ్యవధిఎందుకివ్వలేదు?” అనిఅంటారు 63 వారితో ఇలా అను: ”ఇహలోకసుఖం తుచ్ఛమైనది మరియు దైవభీతి గలవారికి పరలోక సుఖమే ఉత్తమమైనది. మరియు మీకు ఖర్జూర-బీజపు చీలికలోని పొర (ఫతీల) అంత అన్యాయం కూడా జరుగదు.

4:78 – أَيْنَمَا تَكُونُوا يُدْرِككُّمُ الْمَوْتُ وَلَوْ كُنتُمْ فِي بُرُوجٍ مُّشَيَّدَةٍ ۗ وَإِن تُصِبْهُمْ حَسَنَةٌ يَقُولُوا هَـٰذِهِ مِنْ عِندِ اللَّـهِ ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ يَقُولُوا هَـٰذِهِ مِنْ عِندِكَ ۚ قُلْ كُلٌّ مِّنْ عِندِ اللَّـهِ ۖ فَمَالِ هَـٰؤُلَاءِ الْقَوْمِ لَا يَكَادُونَ يَفْقَهُونَ حَدِيثًا ٧٨

”మీరు ఎక్కడున్నాసరే! మీకు చావు వచ్చి తీరుతుంది మరియు మీరు గొప్ప కోట బురుజు లలో ఉన్నా చావు రాక తప్పదు.” (అని పలుకు). మరియు వారికి ఏమైనా మేలు కలిగితే: ”ఇది అల్లాహ్‌ తరఫునుండి వచ్చింది.” అని అంటారు, కాని వారికేదైనా కీడు గలిగితే: ”(ఓ ము’హమ్మద్‌!) ఇది నీ వల్ల జరిగింది.” అని అంటారు. వారితో అను: ”అంతా అల్లాహ్‌ తరఫు నుండే (వస్తుంది)!” ఈ జనులకు ఏమయింది? వారు ఏ విషయాన్ని కూడా ఎందుకు అర్థం చేసుకోలేక పోతున్నారు?

4:79 – مَّا أَصَابَكَ مِنْ حَسَنَةٍ فَمِنَ اللَّـهِ ۖ وَمَا أَصَابَكَ مِن سَيِّئَةٍ فَمِن نَّفْسِكَ ۚ وَأَرْسَلْنَاكَ لِلنَّاسِ رَسُولًا ۚ وَكَفَىٰ بِاللَّـهِ شَهِيدًا ٧٩

(ఓ మానవుడా!) నీకు ఏ మేలు జరిగినా అది అల్లాహ్‌ అనుగ్రహం వల్లనే 64 మరియు నీకు ఏ కీడు జరిగినా అది నీ స్వంత (కర్మల) ఫలితమే! 65 మరియు (ఓ ము’హమ్మద్‌!) మేము నిన్ను మానవులకు సందేశహరునిగా చేసి పంపాము. మరియు దీనికి అల్లాహ్‌ సాక్ష్యమే చాలు.

4:80 – مَّن يُطِعِ الرَّسُولَ فَقَدْ أَطَاعَ اللَّـهَ ۖ وَمَن تَوَلَّىٰ فَمَا أَرْسَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا ٨٠

ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో వాస్తవంగా అతడు అల్లాహ్‌ కు విధేయత చూపి నట్లే. 66 మరియు కాదని వెనుదిరిగిపోతే వారిని అదుపులో ఉంచటానికి (కావలివానిగా) మేము నిన్నుపంపలేదు.

4:81 – وَيَقُولُونَ طَاعَةٌ فَإِذَا بَرَزُوا مِنْ عِندِكَ بَيَّتَ طَائِفَةٌ مِّنْهُمْ غَيْرَ الَّذِي تَقُولُ ۖ وَاللَّـهُ يَكْتُبُ مَا يُبَيِّتُونَ ۖ فَأَعْرِضْ عَنْهُمْ وَتَوَكَّلْ عَلَى اللَّـهِ ۚ وَكَفَىٰ بِاللَّـهِ وَكِيلًا ٨١

మరియు వారు (నీ సమక్షంలో): ”మేము విధేయుల మయ్యాము.” అని పలుకుతారు. కాని నీ వద్ద నుండి వెళ్ళిపోయిన తరువాత వారిలో కొందరు రాత్రివేళలో నీవు చెప్పినదానికి విరుధ్ధంగా సంప్రదింపులు జరుపుతారు. మరియు వారి రహస్య సంప్రదింపులన్నీ అల్లాహ్‌ వ్రాస్తున్నాడు. కనుక నీవు వారినుండి ముఖం త్రిప్పుకో మరియు అల్లాహ్‌ పై ఆధారపడి ఉండు. మరియు కార్యసాధకుడిగా అల్లాహ్‌ చాలు!

4:82 – أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ ۚ وَلَوْ كَانَ مِنْ عِندِ غَيْرِ اللَّـهِ لَوَجَدُوا فِيهِ اخْتِلَافًا كَثِيرًا ٨٢

ఏమీ? వారు ఖుర్‌ఆన్‌ను గురించి ఆలో చించరా? ఒకవేళ ఇది అల్లాహ్‌ తరఫునుండి గాక ఇతరుల తరఫునుండి వచ్చివుంటే, అందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలను చూసే వారు కదా! 67

4:83 – وَإِذَا جَاءَهُمْ أَمْرٌ مِّنَ الْأَمْنِ أَوِ الْخَوْفِ أَذَاعُوا بِهِ ۖ وَلَوْ رَدُّوهُ إِلَى الرَّسُولِ وَإِلَىٰ أُولِي الْأَمْرِ مِنْهُمْ لَعَلِمَهُ الَّذِينَ يَسْتَنبِطُونَهُ مِنْهُمْ ۗ وَلَوْلَا فَضْلُ اللَّـهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ لَاتَّبَعْتُمُ الشَّيْطَانَ إِلَّا قَلِيلً ٨٣

మరియు వారు (ప్రజల గురించి) ఏదైనా శాంతివార్త గానీ లేదా భయవార్త గానీ వినినప్పుడు దానిని వ్యాపింపజేస్తారు. అలా చేయకుండా వారు దానిని సందేశహరునికో, లేదా వారిలో నిర్ణయాధి కారం గలవారికో తెలియజేసి ఉంటే! దానిని విచారించగలవారు, వారి నుండి దానిని విని అర్థంచేసుకునే వారు. మరియు ఒకవేళ మీపై అల్లాహ్‌ అనుగ్రహం మరియు ఆయన కారుణ్యమే లేకుంటే మీలో కొందరు తప్ప మిగతా వారందరూ షై’తాన్‌ను అనుసరించి ఉండే వారు.

4:84 – فَقَاتِلْ فِي سَبِيلِ اللَّـهِ لَا تُكَلَّفُ إِلَّا نَفْسَكَ ۚ وَحَرِّضِ الْمُؤْمِنِينَ ۖ عَسَى اللَّـهُ أَن يَكُفَّ بَأْسَ الَّذِينَ كَفَرُوا ۚ وَاللَّـهُ أَشَدُّ بَأْسًا وَأَشَدُّ تَنكِيلً ٨٤

కావున నీవు అల్లాహ్‌ మార్గంలో యుద్ధం చెయ్యి. నీవు నీ మట్టుకే బాధ్యుడవు. మరియు విశ్వాసులను (యుద్ధానికి) ప్రోత్సహించు. అల్లాహ్‌ సత్య-తిరస్కారుల శక్తిని అణచవచ్చు! మరియు అల్లాహ్‌ అంతులేని శక్తి గలవాడు మరియు శిక్షించటంలో చాలా కఠినుడు!

4:85 – مَّن يَشْفَعْ شَفَاعَةً حَسَنَةً يَكُن لَّهُ نَصِيبٌ مِّنْهَا ۖ وَمَن يَشْفَعْ شَفَاعَةً سَيِّئَةً يَكُن لَّهُ كِفْلٌ مِّنْهَا ۗ وَكَانَ اللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ مُّقِيتًا ٨٥

మంచి విషయం కొరకు సిపారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. మరియు చెడు విషయం కొరకు సిఫారసు చేసేవాడు దానికి బాధ్యత వహిస్తాడు. మరియు అల్లాహ్‌ ప్రతిదానిపై అధికారం గలవాడు. 68

4:86 – وَإِذَا حُيِّيتُم بِتَحِيَّةٍ فَحَيُّوا بِأَحْسَنَ مِنْهَا أَوْ رُدُّوهَا ۗ إِنَّ اللَّـهَ كَانَ عَلَىٰ كُلِّ شَيْءٍ حَسِيبًا ٨٦

మరియు మీకు ఎవరైనా సలాం చేస్తే, దానికి మీరు అంతకంటే ఉత్తమమైనరీతిలో ప్రతి సలాం చెయ్యండి, లేదా కనీసం అవే పదాలు తిరిగి పలకండి (అదే విధంగానైనా చెయ్యండి). 69 నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రతి దానిని పరిగణించ గలవాడు. 70

4:87 – اللَّـهُ لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۚ لَيَجْمَعَنَّكُمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ ۗ وَمَنْ أَصْدَقُ مِنَ اللَّـهِ حَدِيثًا ٨٧

అల్లాహ్‌! ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఆయన మిమ్మల్ని అందరినీ పునరుత్థాన దినమున సమావేశపరుస్తాడు. అది (రావటంలో) ఏ మాత్రంసందేహంలేదు. మరియు అల్లాహ్‌ వాక్కు కంటే మరెవరి (వాక్కు) సత్యమైనది? (1/2)

4:88 – فَمَا لَكُمْ فِي الْمُنَافِقِينَ فِئَتَيْنِ وَاللَّـهُ أَرْكَسَهُم بِمَا كَسَبُوا ۚ أَتُرِيدُونَ أَن تَهْدُوا مَنْ أَضَلَّ اللَّـهُ ۖ وَمَن يُضْلِلِ اللَّـهُ فَلَن تَجِدَ لَهُ سَبِيلًا ٨٨

(ఓ విశ్వాసులారా!) మీకేమయింది, కపట విశ్వాసుల విషయంలో మీరు రెండు వర్గాలుగా చీలి పోయారు. 71 అల్లాహ్‌ వారి కర్మల ఫలితంగా, వారిని వారి పూర్వ (అవిశ్వాస) స్థితికి మరలించాడు. ఏమీ? అల్లాహ్‌ మార్గభ్రష్టులుగా చేసిన వారికి మీరు సన్మార్గం చూపదలచారా? వాస్తవానికి, అల్లాహ్‌ మార్గభ్రష్టత్వంలో పడవేసిన వానికి నీవు (ఋజు) మార్గం చూపలేవు. 72

4:89 – وَدُّوا لَوْ تَكْفُرُونَ كَمَا كَفَرُوا فَتَكُونُونَ سَوَاءً ۖ فَلَا تَتَّخِذُوا مِنْهُمْ أَوْلِيَاءَ حَتَّىٰ يُهَاجِرُوا فِي سَبِيلِ اللَّـهِ ۚ فَإِن تَوَلَّوْا فَخُذُوهُمْ وَاقْتُلُوهُمْ حَيْثُ وَجَدتُّمُوهُمْ ۖ وَلَا تَتَّخِذُوا مِنْهُمْ وَلِيًّا وَلَا نَصِيرًا ٨٩

మరియు వారు సత్య-తిరస్కారులైనట్లే మీరు కూడా సత్య-తిరస్కారులై, వారితో సమానులై పోవాలని వారు కోరుతున్నారు. కావున అల్లాహ్‌ మార్గంలో వారు వలసపోనంత (హిజ్రత్‌ చేయనంత) వరకు, వారిలో ఎవ్వరినీ మీరు స్నేహితులుగా చేసుకోకండి. ఒకవేళ వారు వెనుదిరిగితే, మీరు వారిని ఎక్కడ దొరికితే అక్కడే పట్టుకొని వధించండి. మరియు వారిలో ఎవ్వరినీ మీ స్నేహితులుగా, సహాయకులుగా చేసుకోకండి.

4:90 – إِلَّا الَّذِينَ يَصِلُونَ إِلَىٰ قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُم مِّيثَاقٌ أَوْ جَاءُوكُمْ حَصِرَتْ صُدُورُهُمْ أَن يُقَاتِلُوكُمْ أَوْ يُقَاتِلُوا قَوْمَهُمْ ۚ وَلَوْ شَاءَ اللَّـهُ لَسَلَّطَهُمْ عَلَيْكُمْ فَلَقَاتَلُوكُمْ ۚ فَإِنِ اعْتَزَلُوكُمْ فَلَمْ يُقَاتِلُوكُمْ وَأَلْقَوْا إِلَيْكُمُ السَّلَمَ فَمَا جَعَلَ اللَّـهُ لَكُمْ عَلَيْهِمْ سَبِيلً ٩٠

కాని, మీరు ఎవరితోనైతే ఒడంబడిక చేసుకొని ఉన్నారో, అలాంటివారితో కలసిపోయిన వారు గానీ, లేదా ఎవరైతే – తమ హృదయాలలో – మీతోగానీ, లేక తమ జాతివారితోగానీ యుధ్ధం చేయటానికి సంకటపడుతూ మీ వద్దకువస్తారో, అలాంటి వారిని గానీ, (మీరు వధించకండి). మరియు ఒకవేళ అల్లాహ్‌ కోరితే వారికి మీపై ఆధిక్యత ఇచ్చి ఉండేవాడు మరియు వారు మీతో యుద్దం చేసి ఉండేవారు. కావున వారు మీ నుండి మరలిపోతే, మీతో యుధ్ధంచేయక, మీతో సంధి చేసుకోవటానికి అంగీకరిస్తే (వారిపై దాడిచేయ టానికి) అల్లాహ్‌ మీకు దారి చూపలేదు.

4:91 – سَتَجِدُونَ آخَرِينَ يُرِيدُونَ أَن يَأْمَنُوكُمْ وَيَأْمَنُوا قَوْمَهُمْ كُلَّ مَا رُدُّوا إِلَى الْفِتْنَةِ أُرْكِسُوا فِيهَا ۚ فَإِن لَّمْ يَعْتَزِلُوكُمْ وَيُلْقُوا إِلَيْكُمُ السَّلَمَ وَيَكُفُّوا أَيْدِيَهُمْ فَخُذُوهُمْ وَاقْتُلُوهُمْ حَيْثُ ثَقِفْتُمُوهُمْ ۚ وَأُولَـٰئِكُمْ جَعَلْنَا لَكُمْ عَلَيْهِمْ سُلْطَانًا مُّبِينًا ٩١

మరొక రకమైన వారిని మీరు చూస్తారు; వారు మీ నుండి శాంతి పొందాలని మరియు తమ జాతివారితో కూడా శాంతి పొందాలని కోరు తుంటారు. కాని, సమయం దొరికినప్పుడల్లా వారు (తమ మాట నుండి) మరలిపోయి ఉపద్రవానికి పూనుకుంటారు. అలాంటి వారు మీతో (పోరాడటం) మానుకోకపోతే, మీతో సంధి చేసుకోవ టానికి అంగీకరించకపోతే, తమ చేతులను (మీతో యుధ్ధం చేయటం నుండి) ఆపుకోకపోతే! వారెక్కడ దొరికితే అక్కడ పట్టుకోండి మరియు సంహరించండి. మరియు ఇలా ప్రవర్తించటానికి మేము మీకు స్పష్టమైన అధికారం ఇస్తున్నాము.

4:92 – وَمَا كَانَ لِمُؤْمِنٍ أَن يَقْتُلَ مُؤْمِنًا إِلَّا خَطَأً ۚ وَمَن قَتَلَ مُؤْمِنًا خَطَأً فَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ وَدِيَةٌ مُّسَلَّمَةٌ إِلَىٰ أَهْلِهِ إِلَّا أَن يَصَّدَّقُوا ۚ فَإِن كَانَ مِن قَوْمٍ عَدُوٍّ لَّكُمْ وَهُوَ مُؤْمِنٌ فَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ۖ وَإِن كَانَ مِن قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُم مِّيثَاقٌ فَدِيَةٌ مُّسَلَّمَةٌ إِلَىٰ أَهْلِهِ وَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ۖ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ تَوْبَةً مِّنَ اللَّـهِ ۗ وَكَانَ اللَّـهُ عَلِيمًا حَكِيمًا ٩٢

మరియు – పొరపాటుగాతప్ప – ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చంపటం తగనిపని (నిషిద్ధం). మరియు ఒక విశ్వాసిని పొరపాటుగా చంపినవాడు (దానికి పరిహారంగా) అతడు ఒక విశ్వాసి బానిసకు విముక్తి కలిగించాలి మరియు హతుని కుటుంబీ కులకు (వారసులకు) రక్తపరిహారం (దియత్‌) కూడా చెల్లించాలి. వారు క్షమిస్తే అది వారికి దానం (సదఖహ్) అవుతుంది! 73 కాని ఒకవేళ వధింప బడినవాడు విశ్వాసి అయి, మీ శత్రువులలో చేరిన వాడై ఉంటే, ఒక విశ్వాస బానిసకు విముక్తి కలిగించాలి. ఒకవేళ (వధింపబడిన వాడు) – మీరు ఒడంబడిక చేసుకొనివున్న జనులకు చెందిన వాడైతే – రక్తపరిహారం అతని కుటుంబీకులకు (వారసులకు) ఇవ్వాలి. మరియు ఒక విశ్వాస (ముస్లిం) బానిసకు విముక్తి కలిగించాలి. (బానిసకు విముక్తికలిగించే) శక్తిలేనివాడు, వరుసగా రెండు నెలలు ఉపవాసాలుండాలి. అల్లాహ్‌ ముందు పశ్చాత్తాపపడటానికి (ఇదే సరైనపద్దతి). అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

4:93 – وَمَن يَقْتُلْ مُؤْمِنًا مُّتَعَمِّدًا فَجَزَاؤُهُ جَهَنَّمُ خَالِدًا فِيهَا وَغَضِبَ اللَّـهُ عَلَيْهِ وَلَعَنَهُ وَأَعَدَّ لَهُ عَذَابًا عَظِيمًا ٩٣

మరియు ఎవడైతే ఒకవిశ్వాసిని బుద్ధి పూర్వకంగా చంపుతాడో అతని ప్రతీకారం నరకమే! అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు 74 మరియు అతనిపై అల్లాహ్‌ ఆగ్రహం మరియు శాపం (బహి ష్కారం) ఉంటుంది మరియు ఆయన (అల్లాహ్‌) అతనికొరకు ఘోరమైన శిక్షను సిధ్ధపరిచాడు.

4:94 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا ضَرَبْتُمْ فِي سَبِيلِ اللَّـهِ فَتَبَيَّنُوا وَلَا تَقُولُوا لِمَنْ أَلْقَىٰ إِلَيْكُمُ السَّلَامَ لَسْتَ مُؤْمِنًا تَبْتَغُونَ عَرَضَ الْحَيَاةِ الدُّنْيَا فَعِندَ اللَّـهِ مَغَانِمُ كَثِيرَةٌ ۚ كَذَٰلِكَ كُنتُم مِّن قَبْلُ فَمَنَّ اللَّـهُ عَلَيْكُمْ فَتَبَيَّنُوا ۚ إِنَّ اللَّـهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا ٩٤

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌ మార్గంలో (జిహాద్‌కు) బయలుదేరినప్పుడు వివేచనతో వ్యవహరించండి. (శాంతిని ఆశించి మీవైపునకు) సలాం చేస్తూ వచ్చే వానిని – ప్రాపంచిక ప్రయోజ నాలను పొందగోరి – ”నీవు విశ్వాసివి (ముస్లింవు) కావు.” 75 అని (త్వరపడి) అనకండి. అల్లాహ్‌ దగ్గర మీ కొరకు విజయధనాలు అత్యధికంగా వున్నాయి. దీనికి పూర్వం మీరు కూడా ఇదే స్థితిలో ఉండే వారు కదా! ఆ తరువాత అల్లాహ్‌ మిమ్మల్ని అనుగ్రహించాడు, కావున సముచిత మైన పరిశీలన చేయండి. నిశ్చయంగా, అల్లాహ్‌! మీరు చేసేదంతా బాగా ఎరుగును.

4:95 – لَّا يَسْتَوِي الْقَاعِدُونَ مِنَ الْمُؤْمِنِينَ غَيْرُ أُولِي الضَّرَرِ وَالْمُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّـهِ بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ ۚ فَضَّلَ اللَّـهُ الْمُجَاهِدِينَ بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ عَلَى الْقَاعِدِينَ دَرَجَةً ۚ وَكُلًّا وَعَدَ اللَّـهُ الْحُسْنَىٰ ۚ وَفَضَّلَ اللَّـهُ الْمُجَاهِدِينَ عَلَى الْقَاعِدِينَ أَجْرًا عَظِيمًا ٩٥

ఎలాంటి కారణం లేకుండా, ఇంటివద్ద కూర్చుండి పోయే విశ్వాసులు మరియు అల్లాహ్‌ మార్గంలో తమ ధనాన్ని మరియు తమ ప్రాణాన్ని వినియోగించి ధర్మయుధ్ధం (జిహాద్‌) చేసే విశ్వాసు లతో సరిసమానులు కాజాలరు. తమ ధనాన్ని, ప్రాణాన్ని వినియోగించి ధర్మయుధ్ధం (జిహాద్‌) చేసేవారి స్థానాన్ని అల్లాహ్‌! ఇంట్లో కూర్చుండి పోయేవారి స్థానంకంటే ఉన్నతంచేశాడు. మరియు అల్లాహ్‌ ప్రతిఒక్కరికి ఉత్తమ ఫలితపు వాగ్దానం చేశాడు. కానీ, అల్లాహ్‌ ధర్మయుధ్ధం (జిహాద్‌) చేసిన వారికి ఇంట్లో కూర్చున్న వారికంటే ఎంతో గొప్ప ప్రతిఫలమిచ్చి, ఆధిక్యత నిచ్చాడు.

4:96 – دَرَجَاتٍ مِّنْهُ وَمَغْفِرَةً وَرَحْمَةً ۚ وَكَانَ اللَّـهُ غَفُورًا رَّحِيمًا ٩٦

వారి కొరకు, ఆయన తరఫునుండి ఉన్నత స్థానాలు, క్షమాభిక్ష మరియు కారుణ్యాలు కూడా ఉంటాయి. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

4:97 – إِنَّ الَّذِينَ تَوَفَّاهُمُ الْمَلَائِكَةُ ظَالِمِي أَنفُسِهِمْ قَالُوا فِيمَ كُنتُمْ ۖ قَالُوا كُنَّا مُسْتَضْعَفِينَ فِي الْأَرْضِ ۚ قَالُوا أَلَمْ تَكُنْ أَرْضُ اللَّـهِ وَاسِعَةً فَتُهَاجِرُوا فِيهَا ۚ فَأُولَـٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَسَاءَتْ مَصِيرًا ٩٧

నిశ్చయంగా, తమకు తాము (తమ ఆత్మలకు) అన్యాయం చేసుకుంటూ ఉండేవారి ప్రాణాలను తీసే దేవదూతలు వారితో: ”మీరు ఏ స్థితిలో ఉండేవారు?” అని అడిగితే, వారు: ”మేము భూమిలో బలహీనులముగా నిస్సహాయులముగా ఉండేవారము!” అని జవాబిస్తారు. దానికి (దేవదూతలు): ”ఏమీ? మీరు వలసపోవటానికి అల్లాహ్‌ భూమి విశాలంగా లేకుండెనా?” అని అడుగుతారు. ఇలాంటివారి శరణం నరకమే. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం! 76

4:98 – إِلَّا الْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ لَا يَسْتَطِيعُونَ حِيلَةً وَلَا يَهْتَدُونَ سَبِيلً ٩٨

కాని, నిజంగానే నిస్సహాయులై, వలస పోవటానికి ఏ సాధనా సంపత్తీ, ఎలాంటి మార్గంలేని పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు తప్ప!

4:99 – فَأُولَـٰئِكَ عَسَى اللَّـهُ أَن يَعْفُوَ عَنْهُمْ ۚ وَكَانَ اللَّـهُ عَفُوًّا غَفُورًا ٩٩

కావున ఇటువంటి వారిని, అల్లాహ్‌ మన్నించవచ్చు! ఎందు కంటే, అల్లాహ్‌ మన్నించే వాడు, క్షమాశీలుడు. (5/8)

4:100 – وَمَن يُهَاجِرْ فِي سَبِيلِ اللَّـهِ يَجِدْ فِي الْأَرْضِ مُرَاغَمًا كَثِيرًا وَسَعَةً ۚ وَمَن يَخْرُجْ مِن بَيْتِهِ مُهَاجِرًا إِلَى اللَّـهِ وَرَسُولِهِ ثُمَّ يُدْرِكْهُ الْمَوْتُ فَقَدْ وَقَعَ أَجْرُهُ عَلَى اللَّـهِ ۗ وَكَانَ اللَّـهُ غَفُورًا رَّحِيمًا ١٠٠

మరియు అల్లాహ్‌ మార్గంలో వలస పోయేవాడు భూమిలో కావలసినంత స్థలాన్ని, సౌకర్యాలను పొందుతాడు. మరియు ఎవడు తన ఇంటిని వదలి, అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త కొరకు, వలసపోవటానికి బయలుదేరిన తరువాత అతనికి చావువస్తే! నిశ్చయంగా, అతని ప్రతిఫలం అల్లాహ్‌ వద్ద స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

4:101 – وَإِذَا ضَرَبْتُمْ فِي الْأَرْضِ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَقْصُرُوا مِنَ الصَّلَاةِ إِنْ خِفْتُمْ أَن يَفْتِنَكُمُ الَّذِينَ كَفَرُوا ۚ إِنَّ الْكَافِرِينَ كَانُوا لَكُمْ عَدُوًّا مُّبِينًا ١٠١

మరియు మీరు భూమిలో ప్రయాణం చేసే టపుడు నమాజులను సంక్షిప్తం (ఖ’స్ర్‌) చేస్తే, అది పాపం కాదు. (అంతే గాక) సత్య-తిరస్కారులు మిమ్మల్ని వేధిస్తారు అనే భయం మీకు కలిగి నపుడు కూడా! ఎందుకంటే, సత్య-తిరస్కారులు నిశ్చయంగా, మీకు బహిరంగ శత్రువులు.

4:102 – وَإِذَا كُنتَ فِيهِمْ فَأَقَمْتَ لَهُمُ الصَّلَاةَ فَلْتَقُمْ طَائِفَةٌ مِّنْهُم مَّعَكَ وَلْيَأْخُذُوا أَسْلِحَتَهُمْ فَإِذَا سَجَدُوا فَلْيَكُونُوا مِن وَرَائِكُمْ وَلْتَأْتِ طَائِفَةٌ أُخْرَىٰ لَمْ يُصَلُّوا فَلْيُصَلُّوا مَعَكَ وَلْيَأْخُذُوا حِذْرَهُمْ وَأَسْلِحَتَهُمْ ۗ وَدَّ الَّذِينَ كَفَرُوا لَوْ تَغْفُلُونَ عَنْ أَسْلِحَتِكُمْ وَأَمْتِعَتِكُمْ فَيَمِيلُونَ عَلَيْكُم مَّيْلَةً وَاحِدَةً ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ إِن كَانَ بِكُمْ أَذًى مِّن مَّطَرٍ أَوْ كُنتُم مَّرْضَىٰ أَن تَضَعُوا أَسْلِحَتَكُمْ ۖ وَخُذُوا حِذْرَكُمْ ۗ إِنَّ اللَّـهَ أَعَدَّ لِلْكَافِرِينَ عَذَابًا مُّهِينًا ١٠٢

మరియు నీవు (ఓ ప్రవక్తా!) వారి (ముస్లిం ల) మధ్య ఉండి (పోరాటం జరుగుతూ ఉండగా) నమా’జ్‌ చేయించడానికి వారితో నిలబడితే, వారి లోని ఒక వర్గం నీతోపాటు నిలబడాలి. మరియు వారు అస్త్రధారులై ఉండాలి. వారు తమ సజ్‌దాను పూర్తిచేసుకొని వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇంకా నమా’జ్‌ చేయని రెండోవర్గం వచ్చి నీతోపాటు నమా’జ్‌ చేయాలి. వారు కూడా జాగరూకులై ఉండి, తమ ఆయుధాలను ధరించి ఉండాలి. ఎందుకంటే, మీరు మీ ఆయుధాల పట్ల, మరియు మీ సామగ్రి పట్ల, ఏ కొద్ది అజాగ్రత్త వహించినా మీపై ఒక్కసారిగా విరుచుకుపడాలని సత్యతిరస్కారులు కాచుకొని ఉంటారు. అయితే వర్షం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటే! లేదా మీరు అస్వస్థులైతే, మీరు మీ ఆయుధాలను దించిపెట్టడం పాపం కాదు. అయినా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. నిశ్చయంగా అల్లాహ్‌ సత్య-తిరస్కారుల కొరకు అవమాన కరమైన శిక్షను సిధ్ధపరచి ఉంచాడు. 78

4:103 – فَإِذَا قَضَيْتُمُ الصَّلَاةَ فَاذْكُرُوا اللَّـهَ قِيَامًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِكُمْ ۚ فَإِذَا اطْمَأْنَنتُمْ فَأَقِيمُوا الصَّلَاةَ ۚ إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى الْمُؤْمِنِينَ كِتَابًا مَّوْقُوتًا ١٠٣

ఇక నమా’జ్‌ను పూర్తిచేసిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా, అల్లాహ్‌ను స్మరిస్తూ ఉండండి. కాని శాంతి-భద్రతలు నెలకొన్న తరువాత నమా’జ్‌ను స్థాపించండి. నిశ్చయంగా, నమా’జ్‌ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించటానికి విధిగా నియమించబడింది.

4:104 – وَلَا تَهِنُوا فِي ابْتِغَاءِ الْقَوْمِ ۖ إِن تَكُونُوا تَأْلَمُونَ فَإِنَّهُمْ يَأْلَمُونَ كَمَا تَأْلَمُونَ ۖ وَتَرْجُونَ مِنَ اللَّـهِ مَا لَا يَرْجُونَ ۗ وَكَانَ اللَّـهُ عَلِيمًا حَكِيمًا ١٠٤

మరియు శత్రువులను వెంబడించటంలో బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు బాధపడుతున్నట్లతే, నిశ్చయంగా వారు కూడా – మీరు బాధపడుతున్నట్లే – బాధపడుతున్నారు. మరియు మీరు అల్లాహ్‌ నుండి వారు ఆశించలేని దానిని ఆశిస్తున్నారు. మరియు వాస్తవానికి, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

4:105 – إِنَّا أَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ لِتَحْكُمَ بَيْنَ النَّاسِ بِمَا أَرَاكَ اللَّـهُ ۚ وَلَا تَكُن لِّلْخَائِنِينَ خَصِيمًا ١٠٥

(ఓ ము’హమ్మద్‌!) నిశ్చయంగా మేము ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను), సత్యంతో నీపై అవతరింపజేశాము – అల్లాహ్‌ నీకు తెలిపిన ప్రకారం – నీవు ప్రజల మధ్య తీర్పుచేయటానికి. మరియు నీవు విశ్వాస-ఘాతకుల పక్షమున వాదించేవాడవు కావద్దు.

4:106 – وَاسْتَغْفِرِ اللَّـهَ ۖ إِنَّ اللَّـهَ كَانَ غَفُورًا رَّحِيمًا ١٠٦

మరియు అల్లాహ్‌ ను క్షమాభిక్షకొరకు ప్రార్థించు. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. 79

4:107 – وَلَا تُجَادِلْ عَنِ الَّذِينَ يَخْتَانُونَ أَنفُسَهُمْ ۚ إِنَّ اللَّـهَ لَا يُحِبُّ مَن كَانَ خَوَّانًا أَثِيمًا ١٠٧

మరియు ఆత్మద్రోహం చేసుకునే వారి పక్షమున నీవు వాదించకు. నిశ్చయంగా, అల్లాహ్‌ విశ్వాసఘాతకుణ్ణి, పాపిని ప్రేమించడు.

4:108 – يَسْتَخْفُونَ مِنَ النَّاسِ وَلَا يَسْتَخْفُونَ مِنَ اللَّـهِ وَهُوَ مَعَهُمْ إِذْ يُبَيِّتُونَ مَا لَا يَرْضَىٰ مِنَ الْقَوْلِ ۚ وَكَانَ اللَّـهُ بِمَا يَعْمَلُونَ مُحِيطًا ١٠٨

వారు (తమ దుష్కర్మలను) మానవుల నుండి దాచగలరు, కాని అల్లాహ్ నుండి దాచలేరు. ఎందుకంటే ఆయనకు (అల్లాహ్‌ కు) సమ్మతంలేని విషయాలను గురించి వారు రాత్రులలో రహస్య సమాలోచనలు చేసేటప్పుడు కూడా ఆయన వారితో ఉంటాడు. మరియు వారి సకల చర్యలను అల్లాహ్‌ పరివేష్టించి ఉన్నాడు.

4:109 – هَا أَنتُمْ هَـٰؤُلَاءِ جَادَلْتُمْ عَنْهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا فَمَن يُجَادِلُ اللَّـهَ عَنْهُمْ يَوْمَ الْقِيَامَةِ أَم مَّن يَكُونُ عَلَيْهِمْ وَكِيلً ١٠٩

అవును, మీరే! వారి (ఈ అపరాధుల) పక్షమున ఇహలోక జీవితంలోనైతే వాదించారు. అయితే! తీర్పు దినమున వారి పక్షమున అల్లాహ్‌ తో ఎవడు వాదించగలడు? లేదా వారికి ఎవడు రక్షకుడు కాగలడు?

4:110 – وَمَن يَعْمَلْ سُوءًا أَوْ يَظْلِمْ نَفْسَهُ ثُمَّ يَسْتَغْفِرِ اللَّـهَ يَجِدِ اللَّـهَ غَفُورًا رَّحِيمًا ١١٠

మరియు పాపం చేసినవాడు, లేదా తనకు తాను అన్యాయం చేసుకున్నవాడు, 80 తరువాత అల్లాహ్‌ ను క్షమాభిక్షకై వేడుకుంటే అలాంటివాడు, అల్లాహ్‌ ను క్షమాశీలుడుగా, అపార కరుణా ప్రదాతగా పొందగలడు!

4:111 – وَمَن يَكْسِبْ إِثْمًا فَإِنَّمَا يَكْسِبُهُ عَلَىٰ نَفْسِهِ ۚ وَكَانَ اللَّـهُ عَلِيمًا حَكِيمًا ١١١

కాని ఎవడైనా పాపాన్ని అర్జిస్తే, దాని (ఫలితం) అతడే స్వయంగా భరిస్తాడు. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

4:112 – وَمَن يَكْسِبْ خَطِيئَةً أَوْ إِثْمًا ثُمَّ يَرْمِ بِهِ بَرِيئًا فَقَدِ احْتَمَلَ بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا ١١٢

మరియు ఎవడు అపరాధంగానీ, లేదా పాపంగానీ చేసి, తరువాత దానిని ఒక అమాయ కునిపై మోపుతాడో! వాస్తవానికి, అలాంటివాడు తీవ్రమైన అపనిందను మరియు ఘోరపాపాన్ని తనమీద మోపుకున్నవాడే!

4:113 – وَلَوْلَا فَضْلُ اللَّـهِ عَلَيْكَ وَرَحْمَتُهُ لَهَمَّت طَّائِفَةٌ مِّنْهُمْ أَن يُضِلُّوكَ وَمَا يُضِلُّونَ إِلَّا أَنفُسَهُمْ ۖ وَمَا يَضُرُّونَكَ مِن شَيْءٍ ۚ وَأَنزَلَ اللَّـهُ عَلَيْكَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَعَلَّمَكَ مَا لَمْ تَكُن تَعْلَمُ ۚ وَكَانَ فَضْلُ اللَّـهِ عَلَيْكَ عَظِيمًا ١١٣

మరియు (ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ అనుగ్రహం మరియు ఆయన కారుణ్యమే నీపై లేకుంటే, వారి లోని ఒక వర్గంవారు నిన్ను మార్గభ్రష్టత్వానికి గురి చేయగోరారు. కాని వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మార్గభ్రష్టులుగా చేయలేరు. మరియు వారు నీకెలాంటి హానీచేయలేరు. మరియు అల్లాహ్‌ నీపై ఈ గ్రంథాన్ని మరియు వివేకాన్ని అవతరింపజేశాడు. మరియు నీకు తెలియని విషయాలను నీకు నేర్పాడు. 81 మరియు నీపై ఉన్న అల్లాహ్‌ అనుగ్రహం చాలా గొప్పది. (3/4)

4:114 – لَّا خَيْرَ فِي كَثِيرٍ مِّن نَّجْوَاهُمْ إِلَّا مَنْ أَمَرَ بِصَدَقَةٍ أَوْ مَعْرُوفٍ أَوْ إِصْلَاحٍ بَيْنَ النَّاسِ ۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّـهِ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا ١١٤

  • వారుచేసే రహస్యసమావేశాలలో చాలా మట్టుకు ఏ మేలు లేదు. కాని ఎవరైనా దాన ధర్మాలు చేయటానికి, సత్కార్యాలు (మ’అరూఫ్) చేయటానికి లేదా ప్రజల మధ్య సంధి చేకూర్చ టానికి (సమాలోచనలు) చేస్తే తప్ప! ఎవడు అల్లాహ్‌ ప్రీతికొరకు ఇలాంటి పనులు చేస్తాడో, అతనికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము.

4:115 – وَمَن يُشَاقِقِ الرَّسُولَ مِن بَعْدِ مَا تَبَيَّنَ لَهُ الْهُدَىٰ وَيَتَّبِعْ غَيْرَ سَبِيلِ الْمُؤْمِنِينَ نُوَلِّهِ مَا تَوَلَّىٰ وَنُصْلِهِ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا ١١٥

మరియు తనకు సన్మార్గం స్పష్టంగా తెలిసినపిదప కూడా, ఎవడు ప్రవక్తకు వ్యతిరేకంగా పోయి విశ్వాసుల మార్గంగాక వేరే మార్గాన్ని అనుసరిస్తాడో! అతడు అవలంబించిన త్రోవ వైపునకే, అతనిని మరల్చుతాము మరియు వానిని నరకంలో కాల్చుతాము. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం. 82

4:116 – إِنَّ اللَّـهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ ۚ وَمَن يُشْرِكْ بِاللَّـهِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا ١١٦

నిశ్చయంగా, అల్లాహ్‌ తనకు సాటి కల్పించటాన్ని (షిర్కును) ఏ మాత్రం క్షమించడు, కాని ఆయన దానిని విడిచి (ఇతర ఏ పాపాన్నైనా) తాను కోరిన వానికి క్షమిస్తాడు! అల్లాహ్‌ తో భాగస్వాములను కల్పించేవాడు, వాస్తవానికి మార్గ భ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలాదూరం పోయినట్లే!

4:117 – إِن يَدْعُونَ مِن دُونِهِ إِلَّا إِنَاثًا وَإِن يَدْعُونَ إِلَّا شَيْطَانًا مَّرِيدًا ١١٧

ఆయనను (అల్లాహ్‌ ను) వదలి, వారు స్త్రీ (దేవత) లను ప్రార్థిస్తున్నారు. 83 మరియు వారు కేవలం తిరుగుబాటుదారుడైన షై’తాన్‌నే ప్రార్థిస్తున్నారు. 84

4:118 – لَّعَنَهُ اللَّـهُ ۘ وَقَالَ لَأَتَّخِذَنَّ مِنْ عِبَادِكَ نَصِيبًا مَّفْرُوضًا ١١٨

అల్లాహ్‌ అతన్ని శపించాడు (బహిష్క రించాడు). మరియు అతడు (షై’తాన్‌) ఇలా అన్నాడు: ”నేను నిశ్చయంగా, నీ దాసులలో నుండి ఒక నియమిత భాగాన్ని తీసుకుంటాను.

4:119 – وَلَأُضِلَّنَّهُمْ وَلَأُمَنِّيَنَّهُمْ وَلَآمُرَنَّهُمْ فَلَيُبَتِّكُنَّ آذَانَ الْأَنْعَامِ وَلَآمُرَنَّهُمْ فَلَيُغَيِّرُنَّ خَلْقَ اللَّـهِ ۚ وَمَن يَتَّخِذِ الشَّيْطَانَ وَلِيًّا مِّن دُونِ اللَّـهِ فَقَدْ خَسِرَ خُسْرَانًا مُّبِينًا ١١٩

”మరియు నిశ్చయంగా, నేను వారిని మార్గ భ్రష్టులుగా చేస్తాను; మరియు వారికి తప్పక తప్పుడు ఆశలు కలిగిస్తాను; మరియు నేను వారిని ఆజ్ఞాపిస్తాను; దాని ప్రకారం వారు తప్పక పశువుల చెవులను చీల్చుతారు; మరియు నేను వారిని ఆజ్ఞాపిస్తాను; దాని ప్రకారం వారు తప్పక అల్లాహ్‌ సృష్టిలో మార్పులు చేస్తారు.” 85 మరియు ఎవడు అల్లాహ్‌ కు బదులుగా షై’తాన్‌ను తన రక్షకునిగా చేసుకుంటాడో! వాస్తవానికి వాడే స్పష్టమైన నష్టానికి గురి అయినవాడు!

4:120 – يَعِدُهُمْ وَيُمَنِّيهِمْ ۖ وَمَا يَعِدُهُمُ الشَّيْطَانُ إِلَّا غُرُورًا ١٢٠

అతడు(షై’తాన్‌) వారికి వాగ్దానంచేస్తాడు మరియు వారిలో విపరీత కోరికలను రేపుతాడు. కాని, ‘షై’తాన్‌ వారికి చేసేవాగ్దానాలు మోసపుచ్చేవి మాత్రమే!

4:121 – أُولَـٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ وَلَا يَجِدُونَ عَنْهَا مَحِيصًا ١٢١

అలాంటి వారి ఆశ్రయం నరకమే; మరియు వారికి దాని నుండి తప్పించుకునే మార్గమే ఉండదు.

4:122 – وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَنُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ وَعْدَ اللَّـهِ حَقًّا ۚ وَمَنْ أَصْدَقُ مِنَ اللَّـهِ قِيلً ١٢٢

మరియు ఎవరైతే విశ్వసించి సత్కా ర్యాలు చేస్తారో! మేము వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాము; అందులో వారు శాశ్వతంగా కలకాలముంటారు. అల్లాహ్‌ వాగ్దానం సత్యమైనది. మరియు పలుకు లలో అల్లాహ్‌ కంటే ఎక్కువ సత్యవంతుడెవడు?

4:123 – لَّيْسَ بِأَمَانِيِّكُمْ وَلَا أَمَانِيِّ أَهْلِ الْكِتَابِ ۗ مَن يَعْمَلْ سُوءًا يُجْزَ بِهِ وَلَا يَجِدْ لَهُ مِن دُونِ اللَّـهِ وَلِيًّا وَلَا نَصِيرًا ١٢٣

మీ కోరికల ప్రకారంగా గానీ, లేదా గ్రంథ ప్రజల కోరికల ప్రకారంగా గానీ (మోక్షం) లేదు! పాపం చేసిన వానికి దానికి తగిన శిక్ష ఇవ్వబడు తుంది; మరియు వాడు, అల్లాహ్‌ తప్ప మరొక రక్షకుడినిగానీ, సహాయకుడినిగానీ పొందలేడు!

4:124 – وَمَن يَعْمَلْ مِنَ الصَّالِحَاتِ مِن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَأُولَـٰئِكَ يَدْخُلُونَ الْجَنَّةَ وَلَا يُظْلَمُونَ نَقِيرًا ١٢٤

మరియు సత్కార్యాలు చేసేవాడు పురుషుడైనా, లేక స్త్రీ అయినా, ఆ వ్యక్తి విశ్వాసి అయిఉంటే, అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు వారికి ఖర్జూరపు-బీజపు చీలిక (నఖీరా) అంత అన్యాయం కూడా జరుగదు.

4:125 – وَمَنْ أَحْسَنُ دِينًا مِّمَّنْ أَسْلَمَ وَجْهَهُ لِلَّـهِ وَهُوَ مُحْسِنٌ وَاتَّبَعَ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۗ وَاتَّخَذَ اللَّـهُ إِبْرَاهِيمَ خَلِيلًا ١٢٥

మరియు తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్‌ కు సమర్పించుకొని (ముస్లిం అయి) సజ్జనుడై, ఇబ్రాహీమ్‌ అనుసరించిన, ఏకదైవ సిధ్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) అనుసరించే వాని కంటే ఉత్తముడైన విశ్వాసి (ధార్మికుడు) ఎవడు? మరియు అల్లాహ్! ఇబ్రాహీమ్‌ను తన స్నేహితునిగా చేసుకున్నాడు.

4:126 – وَلِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَكَانَ اللَّـهُ بِكُلِّ شَيْءٍ مُّحِيطًا ١٢٦

మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్‌ కు చెందినదే. మరియు వాస్తవానికి అల్లాహ్‌ ప్రతి దానిని పరివేష్టించి ఉన్నాడు.

4:127 – وَيَسْتَفْتُونَكَ فِي النِّسَاءِ ۖ قُلِ اللَّـهُ يُفْتِيكُمْ فِيهِنَّ وَمَا يُتْلَىٰ عَلَيْكُمْ فِي الْكِتَابِ فِي يَتَامَى النِّسَاءِ اللَّاتِي لَا تُؤْتُونَهُنَّ مَا كُتِبَ لَهُنَّ وَتَرْغَبُونَ أَن تَنكِحُوهُنَّ وَالْمُسْتَضْعَفِينَ مِنَ الْوِلْدَانِ وَأَن تَقُومُوا لِلْيَتَامَىٰ بِالْقِسْطِ ۚ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّـهَ كَانَ بِهِ عَلِيمًا ١٢٧

మరియు వారు నిన్ను స్త్రీల వ్యవహారంలో గల ధార్మిక తీర్పు (ఫత్వా)ను గురించి అడుగు తున్నారు. వారితో ఇలా అను: ”అల్లాహ్‌ వారిని (స్త్రీలను) గురించి ధార్మిక తీర్పు ఇస్తున్నాడు: ‘అనాథ స్త్రీలను, వారి కొరకు నిర్ణయించబడిన హక్కు (మహ్ర్‌)ను మీరు వారికివ్వక, వారిని పెండ్లాడగోరుతున్న విషయాన్ని గురించీ మరియు బలహీనులైన బిడ్డలను గురించీ మరియు అనాథపిల్లల విషయంలోనూ న్యాయంగా వ్యవహరించాలని, ఈ గ్రంథంలో మీకు తెలుప బడుతోంది.’ 87 మరియు మీరు ఏ మంచిపని చేసినా అది అల్లాహ్‌ కు తప్పకుండా తెలుస్తుంది.”

4:128 – وَإِنِ امْرَأَةٌ خَافَتْ مِن بَعْلِهَا نُشُوزًا أَوْ إِعْرَاضًا فَلَا جُنَاحَ عَلَيْهِمَا أَن يُصْلِحَا بَيْنَهُمَا صُلْحًا ۚ وَالصُّلْحُ خَيْرٌ ۗ وَأُحْضِرَتِ الْأَنفُسُ الشُّحَّ ۚ وَإِن تُحْسِنُوا وَتَتَّقُوا فَإِنَّ اللَّـهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا ١٢٨

మరియు ఒకవేళ స్త్రీ తన భర్త, అనాదరణతో ప్రవర్తిస్తాడేమోనని, లేదా విముఖు డవుతాడేమోనని, భయపడితే! వారిద్దరూ తమ మధ్య రాజీ చేసుకుంటే! వారిపై ఎలాంటి దోషంలేదు. రాజీ పడటం ఎంతో ఉత్తమమైనది. మరియు మానవుల మనస్సులలో పేరాస ఇమిడి వున్నది. మీరు సజ్జనులై, దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే నిశ్చయంగా, అల్లాహ్‌ మీ కర్మలన్నింటినీ బాగా ఎరుగును.

4:129 – وَلَن تَسْتَطِيعُوا أَن تَعْدِلُوا بَيْنَ النِّسَاءِ وَلَوْ حَرَصْتُمْ ۖ فَلَا تَمِيلُوا كُلَّ الْمَيْلِ فَتَذَرُوهَا كَالْمُعَلَّقَةِ ۚ وَإِن تُصْلِحُوا وَتَتَّقُوا فَإِنَّ اللَّـهَ كَانَ غَفُورًا رَّحِيمًا ١٢٩

మరియు మీరు ఎంతకోరినా, మీ భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ చేతకాని పని. కనుక ఒక భార్య వైపునకు ఎక్కువగా మొగ్గి, మరొకామెను డోలాయమాన స్థితిలో వదలకండి. మీరు మీ ప్రవర్తనను సరిజేసుకొని దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

4:130 – وَإِن يَتَفَرَّقَا يُغْنِ اللَّـهُ كُلًّا مِّن سَعَتِهِ ۚ وَكَانَ اللَّـهُ وَاسِعًا حَكِيمًا ١٣٠

కాని ఒకవేళ వారు (దంపతులు) విడిపోతే! అల్లాహ్‌ తన దాతృత్వంతో వారిలో ప్రతి ఒక్కరినీ, స్వయం సమృధ్ధులుగా చేయవచ్చు! మరియు అల్లాహ్‌! సర్వోపగతుడు, మహా వివేచనాపరుడు.

4:131 – وَلِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَلَقَدْ وَصَّيْنَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ وَإِيَّاكُمْ أَنِ اتَّقُوا اللَّـهَ ۚ وَإِن تَكْفُرُوا فَإِنَّ لِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَكَانَ اللَّـهُ غَنِيًّا حَمِيدًا ١٣١

మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా, అల్లాహ్‌ కు చెందినదే. మరియు వాస్తవానికి మేము అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండమని, పూర్వం గ్రంథం ఇచ్చిన వారికీ మరియు మీకూ ఆజ్ఞా పించాము. మరియు ఒకవేళ మీరు తిరస్కరిస్తే భూమ్యాకాశాలలో ఉన్నదంతా నిశ్చయంగా, అల్లాహ్‌కే చెందినది. మరియు అల్లాహ్‌ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు.

4:132 – وَلِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَكَفَىٰ بِاللَّـهِ وَكِيلًا ١٣٢

మరియు ఆకాశాలలోనూ మరియు భూమి లోనూ ఉన్నదంతా అల్లాహ్‌ కే చెందుతుంది. మరియు కార్య సాధకుడిగా అల్లాహ్‌ చాలు!

4:133 – إِن يَشَأْ يُذْهِبْكُمْ أَيُّهَا النَّاسُ وَيَأْتِ بِآخَرِينَ ۚ وَكَانَ اللَّـهُ عَلَىٰ ذَٰلِكَ قَدِيرًا ١٣٣

ఓ మానవులారా! ఆయన కోరితే, మిమ్మల్ని అంతంచేసి ఇతరులను తేగలడు. మరియు వాస్తవానికి, అల్లాహ్‌ ఇలా చేయగల సమర్థుడు. 88

4:134 – مَّن كَانَ يُرِيدُ ثَوَابَ الدُّنْيَا فَعِندَ اللَّـهِ ثَوَابُ الدُّنْيَا وَالْآخِرَةِ ۚ وَكَانَ اللَّـهُ سَمِيعًا بَصِيرًا ١٣٤

ఎవడు ఇహలోక ఫలితాన్ని కోరుతాడో, (వానికదే దొరుకుతుంది). కాని (కేవలం) అల్లాహ్‌ వద్దనే, ఇహలోక మరియు పరలోక ఫలితా లున్నాయి. మరియు అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. (7/8)

4:135 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا قَوَّامِينَ بِالْقِسْطِ شُهَدَاءَ لِلَّـهِ وَلَوْ عَلَىٰ أَنفُسِكُمْ أَوِ الْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ ۚ إِن يَكُنْ غَنِيًّا أَوْ فَقِيرًا فَاللَّـهُ أَوْلَىٰ بِهِمَا ۖ فَلَا تَتَّبِعُوا الْهَوَىٰ أَن تَعْدِلُوا ۚ وَإِن تَلْوُوا أَوْ تُعْرِضُوا فَإِنَّ اللَّـهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا ١٣٥

  • ఓ విశ్వాసులారా! మీరు న్యాయం కొరకు స్థిరంగా నిలబడి, అల్లాహ్‌ కొరకే సాక్ష్య మివ్వండి. మరియు మీ సాక్ష్యం మీకుగానీ, మీ తల్లి-దండ్రులకుగానీ, మీ బంధువులకుగానీ, విరుధ్ధంగా ఉన్నా సరే. వాడు ధనవంతుడైనా లేక పేదవాడైనా సరే! (మీకంటే ఎక్కువ) అల్లాహ్‌ వారిద్దరి మేలు కోరేవాడు. కావున మీరు మీ మనోవాంఛలను అనుసరిస్తే న్యాయం చేయక పోవచ్చు. 89 మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించినా, లేక దానిని నిరాకరించినా! నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును.

4:136 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا آمِنُوا بِاللَّـهِ وَرَسُولِهِ وَالْكِتَابِ الَّذِي نَزَّلَ عَلَىٰ رَسُولِهِ وَالْكِتَابِ الَّذِي أَنزَلَ مِن قَبْلُ ۚ وَمَن يَكْفُرْ بِاللَّـهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا ١٣٦

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరునిపై (ము’హమ్మద్‌పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి. 90 అల్లాహ్‌ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమదినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే!

4:137 – إِنَّ الَّذِينَ آمَنُوا ثُمَّ كَفَرُوا ثُمَّ آمَنُوا ثُمَّ كَفَرُوا ثُمَّ ازْدَادُوا كُفْرًا لَّمْ يَكُنِ اللَّـهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ سَبِيلًا ١٣٧

నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించిన తరు వాత తిరస్కరించి, మళ్ళీ విశ్వసించి, ఆ తరువాత తిరస్కరించి; ఆ తిరస్కారంలోనే పురోగమిస్తారో! అలాంటి వారిని అల్లాహ్‌ ఎన్నటికీ క్షమించడు. మరియు వారికి సన్మార్గం వైపునకు దారి చూపడు!

4:138 – بَشِّرِ الْمُنَافِقِينَ بِأَنَّ لَهُمْ عَذَابًا أَلِيمًا ١٣٨

కపట-విశ్వాసులకు, నిశ్చయంగా! బాధా కరమైన శిక్ష ఉందని తెలుపు.

4:139 – الَّذِينَ يَتَّخِذُونَ الْكَافِرِينَ أَوْلِيَاءَ مِن دُونِ الْمُؤْمِنِينَ ۚ أَيَبْتَغُونَ عِندَهُمُ الْعِزَّةَ فَإِنَّ الْعِزَّةَ لِلَّـهِ جَمِيعًا ١٣٩

ఎవరైతే విశ్వాసులను వదలి సత్యతిరస్కా రులను తమ స్నేహితులుగా చేసుకుంటారో! అలాంటివారు, వారి (అవిశ్వాసుల) నుండి గౌర వాన్ని పొందగోరుతున్నారా? కానీ నిశ్చయంగా, గౌరవమంతా కేవలం అల్లాహ్‌ కే చెందినది. 91

4:140 – وَقَدْ نَزَّلَ عَلَيْكُمْ فِي الْكِتَابِ أَنْ إِذَا سَمِعْتُمْ آيَاتِ اللَّـهِ يُكْفَرُ بِهَا وَيُسْتَهْزَأُ بِهَا فَلَا تَقْعُدُوا مَعَهُمْ حَتَّىٰ يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ ۚ إِنَّكُمْ إِذًا مِّثْلُهُمْ ۗ إِنَّ اللَّـهَ جَامِعُ الْمُنَافِقِينَ وَالْكَافِرِينَ فِي جَهَنَّمَ جَمِيعًا ١٤٠

మరియు వాస్తవానికి, (అల్లాహ్‌) మీ కొరకు ఈగ్రంథంలో (ఈవిధమైన ఆజ్ఞ) అవతరింపజేశాడు: ”ఒకవేళ మీరు అల్లాహ్‌ సూక్తులను గురించి తిర స్కారాన్ని మరియు పరిహాసాన్ని వింటే! అలా చేసే వారు, (ఆ సంభాషణ వదలి) ఇతర సంభాషణ ప్రారంభించనంత వరకు మీరు వారితో కలిసి కూర్చోకండి!” అలాచేస్తే నిశ్చయంగా మీరు కూడా వారిలాంటి వారే! నిశ్చయంగా అల్లాహ్‌ కపట-విశ్వాసులను మరియు సత్య-తిరస్కారు లను, అందరినీ నరకంలో జమచేస్తాడు.

4:141 – الَّذِينَ يَتَرَبَّصُونَ بِكُمْ فَإِن كَانَ لَكُمْ فَتْحٌ مِّنَ اللَّـهِ قَالُوا أَلَمْ نَكُن مَّعَكُمْ وَإِن كَانَ لِلْكَافِرِينَ نَصِيبٌ قَالُوا أَلَمْ نَسْتَحْوِذْ عَلَيْكُمْ وَنَمْنَعْكُم مِّنَ الْمُؤْمِنِينَ ۚ فَاللَّـهُ يَحْكُمُ بَيْنَكُمْ يَوْمَ الْقِيَامَةِ ۗ وَلَن يَجْعَلَ اللَّـهُ لِلْكَافِرِينَ عَلَى الْمُؤْمِنِينَ سَبِيلًا ١٤١

వారు (కపట-విశ్వాసులు) మీ విషయంలో నిరీక్షిస్తున్నారు. ఒకవేళ మీకు అల్లాహ్‌ తరఫు నుండి. విజయం లభిస్తే! వారు (మీతో) అంటారు: ”ఏమీ? మేము మీతో కలిసిలేమా?” కాని ఒకవేళ సత్య-తిరస్కారులదే పైచేయి అయితే (వారితో) అంటారు: ”ఏమీ? మీతో గెలిచే శక్తి మాకు లేక పోయిందా? అయినా మేముమిమ్మల్ని విశ్వాసుల నుండి కాపాడలేదా?” కాని అల్లాహ్‌ పునరుత్థాన దినమున మీ మధ్య తీర్పుచేస్తాడు. మరియు అల్లాహ్‌! ఎన్నటికీ సత్య-తిరస్కారులకు విశ్వాసులపై (విజయం పొందే) మార్గంచూపడు. 92

4:142 – إِنَّ الْمُنَافِقِينَ يُخَادِعُونَ اللَّـهَ وَهُوَ خَادِعُهُمْ وَإِذَا قَامُوا إِلَى الصَّلَاةِ قَامُوا كُسَالَىٰ يُرَاءُونَ النَّاسَ وَلَا يَذْكُرُونَ اللَّـهَ إِلَّا قَلِيلً ١٤٢

నిశ్చయంగా ఈ కపటవిశ్వాసులు అల్లాహ్‌ ను మోసగించగోరుతున్నారు. కాని ఆయనే వారిని మోసంలో పడవేశాడు. 93 మరియు ఒకవేళ వారు నమా’జ్‌ కొరకు నిలిచినా శ్రద్ధాహీనులై కేవలం ప్రజలకు చూపటానికే నిలుస్తారు. 94 మరియు వారు అల్లాహ్‌ ను స్మరించేది చాల తక్కువ!

4:143 – مُّذَبْذَبِينَ بَيْنَ ذَٰلِكَ لَا إِلَىٰ هَـٰؤُلَاءِ وَلَا إِلَىٰ هَـٰؤُلَاءِ ۚ وَمَن يُضْلِلِ اللَّـهُ فَلَن تَجِدَ لَهُ سَبِيلً ١٤٣

వారు (విశ్వాస-అవిశ్వాసాల) మధ్య ఊగిసలాడుతున్నారు. వారు పూర్తిగా ఇటు (విశ్వాసులు) కాకుండా పూర్తిగా అటు (సత్య-తిర స్కారులు) కాకుండా ఉన్నారు. మరియు ఎవడి నైతే అల్లాహ్‌ మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడో అలాంటి వాడికి నీవు (సరైన) మార్గం చూపలేవు. 95

4:144 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الْكَافِرِينَ أَوْلِيَاءَ مِن دُونِ الْمُؤْمِنِينَ ۚ أَتُرِيدُونَ أَن تَجْعَلُوا لِلَّـهِ عَلَيْكُمْ سُلْطَانًا مُّبِينًا ١٤٤

ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసులను వదలి సత్య-తిరస్కారులను, మీ స్నేహితులుగా చేసుకోకండి. ఏమీ? మీరు, మీకే వ్యతిరేకంగా, అల్లాహ్‌ కు స్పష్టమైన ప్రమాణం ఇవ్వదలచు కున్నారా?

4:145 – إِنَّ الْمُنَافِقِينَ فِي الدَّرْكِ الْأَسْفَلِ مِنَ النَّارِ وَلَن تَجِدَ لَهُمْ نَصِيرًا ١٤٥

నిశ్చయంగా కపట-విశ్వాసులు నరకంలో అట్టడుగు అంతస్తులో పడిఉంటారు. 96 మరియు వారికి సహాయం చేయగల వాడిని ఎవ్వడినీ నీవు పొందజాలవు.

4:146 – إِلَّا الَّذِينَ تَابُوا وَأَصْلَحُوا وَاعْتَصَمُوا بِاللَّـهِ وَأَخْلَصُوا دِينَهُمْ لِلَّـهِ فَأُولَـٰئِكَ مَعَ الْمُؤْمِنِينَ ۖ وَسَوْفَ يُؤْتِ اللَّـهُ الْمُؤْمِنِينَ أَجْرًا عَظِيمًا ١٤٦

కాని ఎవరైతే, పశ్చాత్తాపపడి, తమను తాము సంస్కరించుకొని, అల్లాహ్‌ ను గట్టిగా నమ్ముకొని తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం అల్లాహ్‌ కొరకే ప్రత్యేకించుకుంటారో, అలాంటి వారే విశ్వాసులతో కలిసిమెలసి ఉంటారు 97 మరియు త్వరలోనే అల్లాహ్‌ విశ్వాసులందరికీ గొప్ప ప్రతి ఫలాన్ని ప్రసాదించగలడు.

4:147 – مَّا يَفْعَلُ اللَّـهُ بِعَذَابِكُمْ إِن شَكَرْتُمْ وَآمَنتُمْ ۚ وَكَانَ اللَّـهُ شَاكِرًا عَلِيمًا ١٤٧

మీరు కృతజ్ఞులై, విశ్వాసులై ఉంటే అల్లాహ్‌ మిమ్మల్ని నిష్కారణంగా ఎందుకు శిక్షిస్తాడు? మరియు అల్లాహ్‌ కృతజ్ఞతలను ఆమోదించే వాడు, 98 సర్వజ్ఞుడు.

4:148 – لَّا يُحِبُّ اللَّـهُ الْجَهْرَ بِالسُّوءِ مِنَ الْقَوْلِ إِلَّا مَن ظُلِمَ ۚ وَكَانَ اللَّـهُ سَمِيعًا عَلِيمًا ١٤٨

[(*)] అన్యాయానికి గురి అయిన వాడు తప్ప! చెడును బహిరంగంగా పలుకటాన్ని అల్లాహ్‌ ఇష్టపడడు. 99 మరియు అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

4:149 – إِن تُبْدُوا خَيْرًا أَوْ تُخْفُوهُ أَوْ تَعْفُوا عَن سُوءٍ فَإِنَّ اللَّـهَ كَانَ عَفُوًّا قَدِيرًا ١٤٩

మీరు మేలును బహిరంగంగా చెప్పినా లేక దానిని దాచినా! 100 లేక చెడును క్షమించినా! నిశ్చయంగా, అల్లాహ్‌ మన్నించేవాడు, 101 సర్వ సమర్థుడు.

4:150 – إِنَّ الَّذِينَ يَكْفُرُونَ بِاللَّـهِ وَرُسُلِهِ وَيُرِيدُونَ أَن يُفَرِّقُوا بَيْنَ اللَّـهِ وَرُسُلِهِ وَيَقُولُونَ نُؤْمِنُ بِبَعْضٍ وَنَكْفُرُ بِبَعْضٍ وَيُرِيدُونَ أَن يَتَّخِذُوا بَيْنَ ذَٰلِكَ سَبِيلً ١٥٠

నిశ్చయంగా అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించేవారూ మరియు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూప గోరేవారూ (అంటే అల్లాహ్‌ను విశ్వసించి, ప్రవక్త లను తిరస్కరించేవారూ) మరియు: ”మేము కొందరు ప్రవక్తలను విశ్వసిస్తాము, మరి కొందరిని తిరస్కరిస్తాము.” అని అనేవారూ మరియు (విశ్వాస-అవిశ్వాసాలకు) మధ్య మార్గాన్ని కల్పించగోరే వారూ –

4:151 – أُولَـٰئِكَ هُمُ الْكَافِرُونَ حَقًّا ۚ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ عَذَابًا مُّهِينًا ١٥١

ఇలాంటివారే – నిస్సందేహంగా సత్య- తిరస్కారులు. మరియు సత్య-తిరస్కారుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిధ్ధపరచి ఉంచాము.

4:152 – وَالَّذِينَ آمَنُوا بِاللَّـهِ وَرُسُلِهِ وَلَمْ يُفَرِّقُوا بَيْنَ أَحَدٍ مِّنْهُمْ أُولَـٰئِكَ سَوْفَ يُؤْتِيهِمْ أُجُورَهُمْ ۗ وَكَانَ اللَّـهُ غَفُورًا رَّحِيمًا ١٥٢

మరియు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తలందరినీ విశ్వసిస్తూ, వారి (ప్రవక్తల) మధ్య భేదభావాలు చూపని వారికి ఆయన (అల్లాహ్‌) వారిప్రతిఫలాన్ని తప్పకప్రసాదించగలడు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

4:153 – يَسْأَلُكَ أَهْلُ الْكِتَابِ أَن تُنَزِّلَ عَلَيْهِمْ كِتَابًا مِّنَ السَّمَاءِ ۚ فَقَدْ سَأَلُوا مُوسَىٰ أَكْبَرَ مِن ذَٰلِكَ فَقَالُوا أَرِنَا اللَّـهَ جَهْرَةً فَأَخَذَتْهُمُ الصَّاعِقَةُ بِظُلْمِهِمْ ۚ ثُمَّ اتَّخَذُوا الْعِجْلَ مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ فَعَفَوْنَا عَن ذَٰلِكَ ۚ وَآتَيْنَا مُوسَىٰ سُلْطَانًا مُّبِينًا ١٥٣

(ఓ ప్రవక్తా!) గ్రంథ ప్రజలు నిన్ను ఆకాశం నుండి వారిపై ఒక గ్రంథాన్ని అవతరింపజేయమని, అడుగుతున్నారని (ఆశ్చర్యపడకు). వాస్తవానికి వారు మూసాను ఇంతకంటే దారుణమైన దానిని కోరుతూ: ”అల్లాహ్‌ను మాకు ప్రత్యక్షంగా చూపించు!” అని అడిగారు. అప్పుడు వారి దుర్మార్గానికి ఫలితంగా వారిపై పిడుగు విరుచుకు పడింది 102 స్పష్టమైన సూచనలు లభించిన తరువాతనే వారు ఆవుదూడను (ఆరాధ్యదైవంగా) చేసుకున్నారు. అయినా దానికి మేము వారిని క్షమించాము. మరియు మూసాకు మేము స్పష్టమైన అధికారమిచ్చాము.

4:154 – وَرَفَعْنَا فَوْقَهُمُ الطُّورَ بِمِيثَاقِهِمْ وَقُلْنَا لَهُمُ ادْخُلُوا الْبَابَ سُجَّدًا وَقُلْنَا لَهُمْ لَا تَعْدُوا فِي السَّبْتِ وَأَخَذْنَا مِنْهُم مِّيثَاقًا غَلِيظًا ١٥٤

మరియు మేమువారిపై ‘తూర్‌ పర్వతాన్ని ఎత్తి ప్రమాణం తీసుకున్నాము. మేము వారితో: ”సాష్టాంగపడుతూ (వంగుతూ) ద్వారంలో ప్రవే శించండి.” అని అన్నాము. 103 మరియు: ”శని వారపు (సబ్త్‌) శాసనాన్ని ఉల్లంఘించకండి.” అని కూడా వారితోఅన్నాము. మరియు మేము వారితో దృఢమైన ప్రమాణం కూడా తీసుకున్నాము. 104

4:155 – فَبِمَا نَقْضِهِم مِّيثَاقَهُمْ وَكُفْرِهِم بِآيَاتِ اللَّـهِ وَقَتْلِهِمُ الْأَنبِيَاءَ بِغَيْرِ حَقٍّ وَقَوْلِهِمْ قُلُوبُنَا غُلْفٌ ۚ بَلْ طَبَعَ اللَّـهُ عَلَيْهَا بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلً ١٥٥

కాని వారు తాము చేసిన ప్రమాణాలను భంగం చేయటం వలన మరియు అల్లాహ్‌ సూక్తు లను తిరస్కరించటం వలన మరియు ప్రవక్తలను అన్యాయంగా చంపటం వలన! మరియు: ”మా హృదయాలు పొరలతో కప్పబడిఉన్నాయి.” 105 అని అనటంవలన (మేము వారిని శిక్షించాము). అంతే కాదు, వారి సత్య-తిరస్కారం వలన, అల్లాహ్‌ వారి హృదయాలపై ముద్రవేసి ఉన్నాడు; కాబట్టి వారు విశ్వసించినా కొంత మాత్రమే!

4:156 – وَبِكُفْرِهِمْ وَقَوْلِهِمْ عَلَىٰ مَرْيَمَ بُهْتَانًا عَظِيمًا ١٥٦

మరియు వారి సత్యతిరస్కారం వలన మరియు వారు మర్యమ్‌ పై మోపిన మహా అపనింద వలన; 106

4:157 – وَقَوْلِهِمْ إِنَّا قَتَلْنَا الْمَسِيحَ عِيسَى ابْنَ مَرْيَمَ رَسُولَ اللَّـهِ وَمَا قَتَلُوهُ وَمَا صَلَبُوهُ وَلَـٰكِن شُبِّهَ لَهُمْ ۚ وَإِنَّ الَّذِينَ اخْتَلَفُوا فِيهِ لَفِي شَكٍّ مِّنْهُ ۚ مَا لَهُم بِهِ مِنْ عِلْمٍ إِلَّا اتِّبَاعَ الظَّنِّ ۚ وَمَا قَتَلُوهُ يَقِينًا ١٥٧

మరియు వారు: ”నిశ్చయంగా, మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు, మర్యమ్‌ కుమా రుడైన, ‘ఈసా-మసీ’హ్‌ ను (ఏసు-క్రీస్తును) చంపాము.” అని అన్నందుకు. 107 మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువపై ఎక్కించనూ లేదు, కాని, వారు భ్రమకు గురిచేయ బడ్డారు. 108 నిశ్చయంగా, ఈ విషయాన్ని గురించి అభిప్రాయభేదం ఉన్నవారు దీనినిగురించి సంశయ గ్రస్తులైఉన్నారు. ఈవిషయంగురించి వారికి నిశ్చిత జ్ఞానంలేదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తు న్నారు. నిశ్చయంగా, వారు అతనిని చంపలేదు.

4:158 – بَل رَّفَعَهُ اللَّـهُ إِلَيْهِ ۚ وَكَانَ اللَّـهُ عَزِيزًا حَكِيمًا ١٥٨

వాస్తవానికి, అల్లాహ్‌ అతనిని (‘ఈసాను) తనవైపునకు ఎత్తుకున్నాడు. 109 మరియు అల్లాహ్‌ సర్వశక్తిసంపన్నుడు, మహా వివేకవంతుడు.

4:159 – وَإِن مِّنْ أَهْلِ الْكِتَابِ إِلَّا لَيُؤْمِنَنَّ بِهِ قَبْلَ مَوْتِهِ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكُونُ عَلَيْهِمْ شَهِيدًا ١٥٩

మరియు గ్రంథ ప్రజలలో ఎవడు కూడా అతనిని (‘ఈసాను), అతని మరణానికి పూర్వం 110 (అతను, అల్లాహ్‌ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని), విశ్వసించకుండా ఉండడు. మరియు పునరుత్థానదినమున అతను (‘ఈసా) వారిపై సాక్షిగా ఉంటాడు. 111

4:160 – فَبِظُلْمٍ مِّنَ الَّذِينَ هَادُوا حَرَّمْنَا عَلَيْهِمْ طَيِّبَاتٍ أُحِلَّتْ لَهُمْ وَبِصَدِّهِمْ عَن سَبِيلِ اللَّـهِ كَثِيرًا ١٦٠

యూదులకు వారు చేసిన ఘోర దుర్మార్గా లకు ఫలితంగానూ మరియు వారు, అనేకులను అల్లాహ్‌ మార్గంపై నడువకుండా ఆటంకపరుస్తూ ఉన్నందువలననూ, మేము ధర్మసమ్మతమైన అనేక పరిశుద్ధ వస్తువులను వారికి నిషేధించాము; 112

4:161 – وَأَخْذِهِمُ الرِّبَا وَقَدْ نُهُوا عَنْهُ وَأَكْلِهِمْ أَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ ۚ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ مِنْهُمْ عَذَابًا أَلِيمًا ١٦١

మరియు వాస్తవానికి, వారికి నిషేధింప బడినా; వారు వడ్డీని తీసుకోవటం వలననూ మరియు వారు అధర్మంగా ఇతరుల సొమ్మును తినటం వలననూ. మరియు వారిలో అవిశ్వాసు లైన వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిధ్ధపరచి ఉంచాము.

4:162 – لَّـٰكِنِ الرَّاسِخُونَ فِي الْعِلْمِ مِنْهُمْ وَالْمُؤْمِنُونَ يُؤْمِنُونَ بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِن قَبْلِكَ ۚ وَالْمُقِيمِينَ الصَّلَاةَ ۚ وَالْمُؤْتُونَ الزَّكَاةَ وَالْمُؤْمِنُونَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ أُولَـٰئِكَ سَنُؤْتِيهِمْ أَجْرًا عَظِيمًا ١٦٢

కాని వారిలో పరిపూర్ణమైన జ్ఞానం గలవారు మరియు విశ్వాసులైనవారు, 113 నీపై అవతరింప జేయబడిన దానిని మరియు నీకు పూర్వం అవతరింపజేయబడిన వాటిని విశ్వసిస్తారు. వారు నమా’జ్‌ విధిగా సలుపుతారు, విధిదానం (‘జకాత్‌) చెల్లిస్తారు మరియు అల్లాహ్‌ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాసం కలిగి ఉంటారు; ఇలాంటి వారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. (1/8)

4:163 – إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَىٰ نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ ۚ وَأَوْحَيْنَا إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَعِيسَىٰ وَأَيُّوبَ وَيُونُسَ وَهَارُونَ وَسُلَيْمَانَ ۚ وَآتَيْنَا دَاوُودَ زَبُورًا ١٦٣

  • (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నూ’హ్‌కు మరియు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలకు సందేశం (వ’హీ) పంపినట్లు, నీకు కూడా సందేశం పంపాము. మరియు మేము ఇబ్రాహీమ్‌, ఇస్మా’యీల్‌, ఇస్‌’హాఖ్‌, య’అఖూబ్‌లకు మరియు అతని సంతతి వారికి మరియు ‘ఈసా, అయ్యూబ్‌, యూనుస్‌, హారూన్‌ మరియు సులైమాన్‌లకు కూడా దివ్యజ్ఞానం (వ’హీ) పంపాము. 114 మరియు మేము దావూద్‌కు ‘జబూర్‌ 115 (గ్రంథాన్ని( ప్రసాదించాము.

4:164 – وَرُسُلًا قَدْ قَصَصْنَاهُمْ عَلَيْكَ مِن قَبْلُ وَرُسُلًا لَّمْ نَقْصُصْهُمْ عَلَيْكَ ۚ وَكَلَّمَ اللَّـهُ مُوسَىٰ تَكْلِيمًا ١٦٤

మరియు వాస్తవంగా, మేము పంపిన ప్రవక్తలలో కొందరి గాథలను నీకు తెలిపాము మరియు ఇతర ప్రవక్తలను గురించి మేము నీకు తెలుపలేదు. 116

4:165 – رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّـهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ ۚ وَكَانَ اللَّـهُ عَزِيزًا حَكِيمًا ١٦٥

(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చే వారిగా మరియు హెచ్చరికలు చేసేవారిగా పంపాము. 117 ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్‌కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగలకూడదని! 118 మరియు అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.

4:166 – لَّـٰكِنِ اللَّـهُ يَشْهَدُ بِمَا أَنزَلَ إِلَيْكَ ۖ أَنزَلَهُ بِعِلْمِهِ ۖ وَالْمَلَائِكَةُ يَشْهَدُونَ ۚ وَكَفَىٰ بِاللَّـهِ شَهِيدًا ١٦٦

కాని (ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ నీపై అవతరింప జేసిన దానికి (ఖుర్‌ఆనుకు) సాక్ష్యమిస్తున్నాడు. ఆయన దానిని తన జ్ఞానంతో అవతరింపజేశాడు. మరియు దేవదూతలు కూడా దీనికి సాక్ష్యమిస్తు న్నారు. మరియు ఉత్తమసాక్షిగా అల్లాహ్‌యే చాలు.

4:167 – إِنَّ الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّـهِ قَدْ ضَلُّوا ضَلَالًا بَعِيدًا ١٦٧

నిశ్చయంగా, ఎవరైతే సత్య-తిరస్కారులై, ఇతరులను అల్లాహ్‌ మార్గం వైపుకు రాకుండా నిరోధిస్తున్నారో వాస్తవానికి వారు మార్గభ్రష్టులై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయారు!

4:168 – إِنَّ الَّذِينَ كَفَرُوا وَظَلَمُوا لَمْ يَكُنِ اللَّـهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ طَرِيقًا ١٦٨

నిశ్చయంగా, ఎవరైతే సత్య-తిరస్కారులై, అక్రమానికి పాల్పడతారో, వారిని అల్లాహ్‌ ఏ మాత్రమూ క్షమించడూ మరియు వారికి ఋజు మార్గం వైపునకు మార్గదర్శకత్వమూ చేయడు.

4:169 – إِلَّا طَرِيقَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّـهِ يَسِيرًا ١٦٩

వారికి కేవలం నరకమార్గం మాత్రమే చూపు తాడు. అందులో వారు శాశ్వతంగా కలకాలం ఉంటారు. మరియు ఇది అల్లాహ్‌కు ఎంతో సులభం.

4:170 – يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُمُ الرَّسُولُ بِالْحَقِّ مِن رَّبِّكُمْ فَآمِنُوا خَيْرًا لَّكُمْ ۚ وَإِن تَكْفُرُوا فَإِنَّ لِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَكَانَ اللَّـهُ عَلِيمًا حَكِيمًا ١٧٠

ఓ మానవులారా! వాస్తవంగా మీ ప్రభువు తరఫునుండి, సత్యాన్ని తీసుకొని మీ వద్దకు ఈ సందేశహరుడు వచ్చివున్నాడు, కావున అతని మీద విశ్వాసం కలిగి ఉండండి, ఇదే మీకు మేలైనది. మరియు మీరు గనక తిరస్కరిస్తే! నిశ్చయంగా భూమ్యాకాశాలలో ఉన్నదంతా అల్లాహ్‌కే చెందినదని తెలుసుకోండి. 119 మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

4:171 – يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ وَلَا تَقُولُوا عَلَى اللَّـهِ إِلَّا الْحَقَّ ۚ إِنَّمَا الْمَسِيحُ عِيسَى ابْنُ مَرْيَمَ رَسُولُ اللَّـهِ وَكَلِمَتُهُ أَلْقَاهَا إِلَىٰ مَرْيَمَ وَرُوحٌ مِّنْهُ ۖ فَآمِنُوا بِاللَّـهِ وَرُسُلِهِ ۖ وَلَا تَقُولُوا ثَلَاثَةٌ ۚ انتَهُوا خَيْرًا لَّكُمْ ۚ إِنَّمَا اللَّـهُ إِلَـٰهٌ وَاحِدٌ ۖ سُبْحَانَهُ أَن يَكُونَ لَهُ وَلَدٌ ۘ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَكَفَىٰ بِاللَّـهِ وَكِيلًا ١٧١

ఓగ్రంథప్రజలారా! మీరు మీధర్మ విషయం లో హద్దులు మీరి ప్రవర్తించకండి. 120 మరియు అల్లాహ్‌ను గురించి సత్యంతప్ప వేరేమాట పలుక కండి. నిశ్చయంగా మర్యమ్‌ కుమారుడైన ‘ఈసా మసీ’హ్‌ (ఏసుక్రీస్తు), అల్లాహ్‌ యొక్క సందేశ హరుడు మరియు ఆయన (అల్లాహ్‌) మర్యమ్‌ వైపునకు పంపిన, ఆయన (అల్లాహ్‌) యొక్క ఆజ్ఞ (కలిమ) 121 మరియు ఆయన (అల్లాహ్‌) తరఫు నుండి వచ్చిన ఒక ఆత్మ (రూ’హ్‌). కావున మీరు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వ సించండి. మరియు (ఆరాధ్యదైవాలు): ”ముగ్గురు!” అని అనకండి 122 అదిమానుకోండి, మీకే మేలైనది! నిశ్చయంగా, అల్లాహ్‌ ఒక్కడే ఆరాధ్యదైవం. ఆయ నకు కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు కార్యకర్తగా అల్లాహ్‌ మాత్రమే చాలు.

4:172 – لَّن يَسْتَنكِفَ الْمَسِيحُ أَن يَكُونَ عَبْدًا لِّلَّـهِ وَلَا الْمَلَائِكَةُ الْمُقَرَّبُونَ ۚ وَمَن يَسْتَنكِفْ عَنْ عِبَادَتِهِ وَيَسْتَكْبِرْ فَسَيَحْشُرُهُمْ إِلَيْهِ جَمِيعًا ١٧٢

తాను, అల్లాహ్‌కు దాసుడననే విషయాన్ని మసీ’హ్‌ (క్రీస్తు) ఎన్నడూ ఉపేక్షించ లేదు. మరియు ఆయన (అల్లాహ్‌)కు సన్ని హితంగా ఉండే దేవదూతలు కూడాను. మరియు ఎవరు ఆయన (అల్లాహ్‌) దాస్యాన్ని ఉపేక్షించి, గర్వం ప్రదర్శిస్తారో వారందరినీ ఆయన తన ముందు సమావేశపరుస్తాడు.

4:173 – فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ وَيَزِيدُهُم مِّن فَضْلِهِ ۖ وَأَمَّا الَّذِينَ اسْتَنكَفُوا وَاسْتَكْبَرُوا فَيُعَذِّبُهُمْ عَذَابًا أَلِيمًا وَلَا يَجِدُونَ لَهُم مِّن دُونِ اللَّـهِ وَلِيًّا وَلَا نَصِيرًا ١٧٣

కానీ, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారికి ఆయన వారి ప్రతిఫలాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు మరియు తన అనుగ్రహంతో మరింత అధికంగా ఇస్తాడు. ఇక ఆయనను నిరాకరించి, గర్వం వహించే వారికి బాధాకరమైన శిక్ష విధిస్తాడు; 123 మరియు వారు తమ కొరకు – అల్లాహ్‌ తప్ప – ఇతర రక్షించేవాడిని గానీ, సహాయపడేవాడిని గానీ పొందలేరు.

4:174 – يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُم بُرْهَانٌ مِّن رَّبِّكُمْ وَأَنزَلْنَا إِلَيْكُمْ نُورًا مُّبِينًا ١٧٤

ఓ మానవులారా! మీ ప్రభువు నుండి మీకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది. మరియు మేము మీపై స్పష్టమైన జ్యోతిని (ఈ ఖుర్‌ఆన్‌ను) అవతరింపజేశాము.

4:175 – فَأَمَّا الَّذِينَ آمَنُوا بِاللَّـهِ وَاعْتَصَمُوا بِهِ فَسَيُدْخِلُهُمْ فِي رَحْمَةٍ مِّنْهُ وَفَضْلٍ وَيَهْدِيهِمْ إِلَيْهِ صِرَاطًا مُّسْتَقِيمًا ١٧٥

కావున ఎవరు అల్లాహ్‌ను విశ్వసించి, ఆయననే దృఢంగా నమ్ముకుంటారో, వారిని ఆయన తన కారుణ్యానికి మరియు అనుగ్రహానికి పాత్రులుగా చేసుకొని తనవద్దకు చేరే ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.

4:176 – يَسْتَفْتُونَكَ قُلِ اللَّـهُ يُفْتِيكُمْ فِي الْكَلَالَةِ ۚ إِنِ امْرُؤٌ هَلَكَ لَيْسَ لَهُ وَلَدٌ وَلَهُ أُخْتٌ فَلَهَا نِصْفُ مَا تَرَكَ ۚ وَهُوَ يَرِثُهَا إِن لَّمْ يَكُن لَّهَا وَلَدٌ ۚ فَإِن كَانَتَا اثْنَتَيْنِ فَلَهُمَا الثُّلُثَانِ مِمَّا تَرَكَ ۚ وَإِن كَانُوا إِخْوَةً رِّجَالًا وَنِسَاءً فَلِلذَّكَرِ مِثْلُ حَظِّ الْأُنثَيَيْنِ ۗ يُبَيِّنُ اللَّـهُ لَكُمْ أَن تَضِلُّوا ۗ وَاللَّـهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ١٧٦

వారు నిన్ను (కలాలను) గురించి ధార్మిక శాసనం (ఫత్వా) అడుగుతున్నారు. అల్లాహ్‌ మీకు, కలాలను 124 గురించి, ఈ విధంగా ధార్మిక శాసనం ఇస్తున్నాడని చెప్పు: ”ఒక పురుషుడు మరణించి, అతనికి సంతానం లేకుండా ఒక సోదరి 125 మాత్రమే ఉంటే, అతడు విడిచిన ఆస్తిలో ఆమెకు సగంవాటా లభిస్తుంది. పిల్లలు లేక చనిపోయిన సోదరి మొత్తం ఆస్తికి, అతడు (ఆమె నిజ సోదరుడు) వారసు డవుతాడు. అతనికి (మృతునికి) ఇద్దరు సోదరీమణులుంటే, వారిద్దరికీ అతడు వదలిన ఆస్తిలో మూడింట-రెండు వంతుల భాగం లభిస్తుంది. ఒకవేళ సోదర సోదరీమణులు (అనేకులుంటే) ప్రతి పురుషునికి ఇద్దరు స్త్రీల భాగానికి సమానంగా వాటా లభిస్తుంది. మీరు దారి తప్పకుండా ఉండటానికి అల్లాహ్‌ మీకు అంతా స్పష్టంగా తెలుపుతున్నాడు. మరియు అల్లాహ్‌కు ప్రతివిషయం గురించి బాగా తెలుసు.” (1/4)

సూరహ్ అల్-మాఇ‘దహ్ – ఇది చివర అవతరింపజేయబడిన మదనీ సూరాహ్‌లలో ఒకటి. ఈ సూరహ్‌ అల్‌-మాఇ’దహ్‌ 3వ ఆయత్‌లోని: ”ఈనాడు నేను మీధర్మాన్ని మీకొరకు పరిపూర్ణంచేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను మరియు మీ కొరకు అల్లాహ్‌కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను.” అనే భాగం 10వ హిజ్రీలో ‘హజ్జ్‌ రోజు అవతరింపజేయబడింది. ఇది ఈ సూరహ్‌ లోని అతి ముఖ్య అంశం. హాబిల్‌ (Abel) ను ఖాబిల్‌ (Cain) హత్యచేసింది, 27-43 ఆయత్‌ లలో వివరించబడింది. ‘ఈసా(‘అ.స.) యొక్క అద్భుతక్రియలు 109-120ఆయత్‌లలో ఉన్నాయి. దీని పేరు అల్‌ -మాఇ’దహ్, అంటే ‘ఆహారంతో నిండిన పళ్ళెం,’ ఉర్దూలో ‘దస్తర్‌ఖాన్‌’ అనబడు తుంది. ఇది 112వ ఆయత్‌లో నుండి తీసుకోబడింది. ఇందులో 120 ఆయతులు ఉన్నాయి.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 5:1 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَوْفُوا بِالْعُقُودِ ۚ أُحِلَّتْ لَكُم بَهِيمَةُ الْأَنْعَامِ إِلَّا مَا يُتْلَىٰ عَلَيْكُمْ غَيْرَ مُحِلِّي الصَّيْدِ وَأَنتُمْ حُرُمٌ ۗ إِنَّ اللَّـهَ يَحْكُمُ مَا يُرِيدُ ١

ఓ విశ్వాసులారా! ఒప్పందాలను పాటించండి. 1 మీ కొరకు పచ్చిక మేసే చతుష్పాద పశువులన్నీ 2 (తినటానికి) ధర్మసమ్మతం (‘హలాల్‌) చేయబడ్డాయి; మీకు తెలుపబడిన పశువులు తప్ప! మీరు ఇ’హ్రామ్‌ స్థితిలో ఉన్న ప్పుడు వేటాడటం మీకు ధర్మసమ్మతం కాదు. 3 నిశ్చయంగా, అల్లాహ్‌ తాను కోరింది శాసిస్తాడు.

5:2 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُحِلُّوا شَعَائِرَ اللَّـهِ وَلَا الشَّهْرَ الْحَرَامَ وَلَا الْهَدْيَ وَلَا الْقَلَائِدَ وَلَا آمِّينَ الْبَيْتَ الْحَرَامَ يَبْتَغُونَ فَضْلًا مِّن رَّبِّهِمْ وَرِضْوَانًا ۚ وَإِذَا حَلَلْتُمْ فَاصْطَادُوا ۚ وَلَا يَجْرِمَنَّكُمْ شَنَآنُ قَوْمٍ أَن صَدُّوكُمْ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ أَن تَعْتَدُوا ۘ وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَالْعُدْوَانِ ۚ وَاتَّقُوا اللَّـهَ ۖ إِنَّ اللَّـهَ شَدِيدُ الْعِقَابِ ٢

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ (నియమించిన) చిహ్నాలను 4 మరియు నిషిధ్ధమాసాలను 5 ఉల్లం ఘించకండి. మరియు బలిపశువులకు మరియు మెడలలో పట్టీలు ఉన్న పశువులకు (హాని చేయకండి). 6 మరియు తమ ప్రభువు అను గ్రహాన్ని మరియు ప్రీతిని కోరుతూ పవిత్ర గృహానికి (క’అబహ్ కు) పోయే వారిని (ఆటంకపరచకండి). కానీ ఇ’హ్రామ్‌ స్థితి ముగిసిన తరువాత మీరు వేటాడవచ్చు. మిమ్మల్ని పవిత్ర మస్జిద్‌ (మస్జిద్‌ అల్‌-‘హరామ్‌)ను సందర్శించకుండా నిరోధించిన వారిపట్ల గల విరోధంవలన వారితో హద్దులుమీరి ప్రవర్తించకండి. మరియు పుణ్యకార్యాలు మరియు దైవభీతి విషయాలలో, ఒకరికొకరు తోడ్పడండి. మరియు పాపకార్యాలలో గానీ, దౌర్జన్యాలలో గానీ తోడ్పడకండి. అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ శిక్ష విధించటంలో చాల కఠినుడు.

5:3 – حُرِّمَتْ عَلَيْكُمُ الْمَيْتَةُ وَالدَّمُ وَلَحْمُ الْخِنزِيرِ وَمَا أُهِلَّ لِغَيْرِ اللَّـهِ بِهِ وَالْمُنْخَنِقَةُ وَالْمَوْقُوذَةُ وَالْمُتَرَدِّيَةُ وَالنَّطِيحَةُ وَمَا أَكَلَ السَّبُعُ إِلَّا مَا ذَكَّيْتُمْ وَمَا ذُبِحَ عَلَى النُّصُبِ وَأَن تَسْتَقْسِمُوا بِالْأَزْلَامِ ۚ ذَٰلِكُمْ فِسْقٌ ۗ الْيَوْمَ يَئِسَ الَّذِينَ كَفَرُوا مِن دِينِكُمْ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِ ۚ الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا ۚ فَمَنِ اضْطُرَّ فِي مَخْمَصَةٍ غَيْرَ مُتَجَانِفٍ لِّإِثْمٍ ۙ فَإِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ٣

(సహజంగా) మరణించింది, రక్తం, పంది మాంసం మరియు అల్లాహ్‌ తప్ప ఇతరుల కొరకు (ఇతరుల పేరుతో) వధింప (జి’బ్‌’హ్‌ చేయ) బడినది, గొంతుపిసికి ఊపిరాడక, దెబ్బ తగిలి, ఎత్తు నుండి పడి, కొమ్ము తగిలి మరియు క్రూరమృగం నోటపడి చచ్చిన (పశువు / పక్షి) అన్నీ, మీకు తినటానికి నిషిధ్ధం (‘హరామ్‌) చేయ బడ్డాయి. కాని (క్రూరమృగం నోటపడిన దానిని) చావకముందే మీరు జి’బ్‌’హ్‌ చేసినట్లైతే అది నిషిధ్ధం కాదు. మరియు బలిపీఠం మీద వధించ బడినది 7 మరియు బాణాల ద్వారా శకునం చూడటం నిషేధింపబడ్డాయి. ఇవన్నీ ఘోరపాపాలు (ఫిస్‌ఖున్‌). ఈ నాడు సత్య-తిరస్కారులు, మీ ధర్మం గురించి పూర్తిగా ఆశలు వదలుకున్నారు. కనుక మీరు వారికి భయపడకండి, నాకే భయ పడండి. ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్‌కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను. 8 ఎవడైనా ఆకలికి ఓర్చుకోలేక, పాపానికి పూనుకోక, 9 (నిషిధ్ధమైన వస్తువులను తిన్నట్లైతే)! నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

5:4 – يَسْأَلُونَكَ مَاذَا أُحِلَّ لَهُمْ ۖ قُلْ أُحِلَّ لَكُمُ الطَّيِّبَاتُ ۙ وَمَا عَلَّمْتُم مِّنَ الْجَوَارِحِ مُكَلِّبِينَ تُعَلِّمُونَهُنَّ مِمَّا عَلَّمَكُمُ اللَّـهُ ۖ فَكُلُوا مِمَّا أَمْسَكْنَ عَلَيْكُمْ وَاذْكُرُوا اسْمَ اللَّـهِ عَلَيْهِ ۖ وَاتَّقُوا اللَّـهَ ۚ إِنَّ اللَّـهَ سَرِيعُ الْحِسَابِ ٤

వారు (ప్రజలు) తమ కొరకు ఏది ధర్మ సమ్మతం (‘హలాల్‌) అని నిన్ను అడుగు తున్నారు. నీవు ఇలా అను: ”పరిశుధ్ధ వస్తువు లన్నీ మీ కొరకు ధర్మసమ్మతం (‘హలాల్‌) చేయబడ్డాయి. మరియు మీకు అల్లాహ్‌ నేర్పిన విధంగా మీరు వేటశిక్షణ ఇచ్చిన జంతువులు 10 మీ కొరకు పట్టినవి కూడా! కావున అవి మీ కొరకు పట్టుకున్నవాటిని మీరు తినండి కాని దానిపై అల్లాహ్‌ పేరును ఉచ్చరించండి. 11 అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ లెక్క తీసుకోవటంలో అతిశీఘ్రుడు.”

5:5 – الْيَوْمَ أُحِلَّ لَكُمُ الطَّيِّبَاتُ ۖ وَطَعَامُ الَّذِينَ أُوتُوا الْكِتَابَ حِلٌّ لَّكُمْ وَطَعَامُكُمْ حِلٌّ لَّهُمْ ۖ وَالْمُحْصَنَاتُ مِنَ الْمُؤْمِنَاتِ وَالْمُحْصَنَاتُ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ إِذَا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ مُحْصِنِينَ غَيْرَ مُسَافِحِينَ وَلَا مُتَّخِذِي أَخْدَانٍ ۗ وَمَن يَكْفُرْ بِالْإِيمَانِ فَقَدْ حَبِطَ عَمَلُهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ ٥

ఈ నాడు మీ కొరకు పరిశుధ్ధమైన వస్తువు లన్నీ ధర్మసమ్మతం (‘హలాల్‌) చేయబడ్డాయి. మరియు గ్రంథప్రజల ఆహారం 12 మీకు ధర్మ సమ్మతమైనది. మరియు మీ ఆహారం వారికి ధర్మ సమ్మతమైనది. మరియు సుశీలురు అయిన విశ్వాస (ముస్లిం) స్త్రీలు గానీ మరియు సుశీలురు అయిన పూర్వ గ్రంథప్రజల స్త్రీలు గానీ, 13 మీరు వారికి వారి మహ్ర్ ను (వధుకట్నం) చెల్లించి, న్యాయ బద్ధంగా వారితో వివాహజీవితం గడపండి. కాని వారితో స్వేచ్ఛా కామక్రీడలు గానీ, లేదా దొంగ చాటు సంబంధాలు గానీ ఉంచుకోకండి. ఎవడు విశ్వాసమార్గాన్ని తిరస్కరిస్తాడో అతని కర్మలు వ్యర్థమవుతాయి. మరియు అతడు పరలోకంలో నష్టంపొందేవారిలో చేరుతాడు.

5:6 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا قُمْتُمْ إِلَى الصَّلَاةِ فَاغْسِلُوا وُجُوهَكُمْ وَأَيْدِيَكُمْ إِلَى الْمَرَافِقِ وَامْسَحُوا بِرُءُوسِكُمْ وَأَرْجُلَكُمْ إِلَى الْكَعْبَيْنِ ۚ وَإِن كُنتُمْ جُنُبًا فَاطَّهَّرُوا ۚ وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُم مِّنْهُ ۚ مَا يُرِيدُ اللَّـهُ لِيَجْعَلَ عَلَيْكُم مِّنْ حَرَجٍ وَلَـٰكِن يُرِيدُ لِيُطَهِّرَكُمْ وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ ٦

ఓ విశ్వాసులారా! మీరు నమా’జ్‌కు లేచి నపుడు, మీ ముఖాలను, మరియు మీ చేతులను మోచేతులవరకు కడుక్కోండి. మరియు మీ తల లను (తడిచేతులతో) తుడుచుకోండి. మరియు మీ కాళ్ళను చీలమండల వరకు కడుక్కోండి. 14 మరియు మీకు ఇంద్రియ స్ఖలనం (జునుబ్‌) అయి ఉంటే, స్నానం (‘గుస్ల్‌) చేయండి. మరియు మీరు అస్వస్థులై ఉన్నా, లేక ప్రయాణంలో ఉన్నా, లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకొని ఉన్నా, లేక మీరు స్త్రీలతో కలిసి (సంభోగం చేసి) ఉన్నా, అప్పుడు మీకు నీరు లభించని పక్షంలో పరిశుభ్ర మైన మట్టితో తయమ్మమ్‌ చేయండి. అంటే, మీ ముఖాలను మరియు మీ చేతులను, దానితో (పరిశుభ్రమైన మట్టిపై స్పర్శించిన చేతులతో), రుద్దుకోండి. 15 మిమ్మల్ని కష్టపెట్టాలనేది అల్లాహ్‌ అభిమతం కాదు. మీరు కృతజ్ఞులు కావాలని ఆయన, మిమ్మల్ని శుద్ధపరచి మీపై తన అనుగ్రహాన్ని పూర్తిచేయ గోరుతున్నాడు.

5:7 – وَاذْكُرُوا نِعْمَةَ اللَّـهِ عَلَيْكُمْ وَمِيثَاقَهُ الَّذِي وَاثَقَكُم بِهِ إِذْ قُلْتُمْ سَمِعْنَا وَأَطَعْنَا ۖ وَاتَّقُوا اللَّـهَ ۚ إِنَّ اللَّـهَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ٧

మరియు మీకు అల్లాహ్‌ చేసిన అనుగ్రహాన్ని మరియు ఆయన మీ నుండి తీసుకున్నదృఢమైన ప్రమాణాన్ని జ్ఞాపకంచేసుకోండి. అప్పుడు మీరు: ”మేము విన్నాము మరియు విధేయులమయ్యా ము.” అని అన్నారు. మరియు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా హృద యాలలో ఉన్నదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.

5:8 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا قَوَّامِينَ لِلَّـهِ شُهَدَاءَ بِالْقِسْطِ ۖ وَلَا يَجْرِمَنَّكُمْ شَنَآنُ قَوْمٍ عَلَىٰ أَلَّا تَعْدِلُوا ۚ اعْدِلُوا هُوَ أَقْرَبُ لِلتَّقْوَىٰ ۖ وَاتَّقُوا اللَّـهَ ۚ إِنَّ اللَّـهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ ٨

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌ కొరకు న్యా యంగా సాక్ష్యమివ్వటానికి స్థిరంగా నిలబడండి. 16 ఇతరుల పట్ల మీకున్న ద్వేషానికిలోనై, మీరు న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి, అది దైవభక్తికి సమీపమైనది. మరియు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. నిశ్చ యంగా మీరు చేసేదంతా అల్లాహ్‌ ఎరుగును.

5:9 – وَعَدَ اللَّـهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۙ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ ٩

మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉన్నాయని అల్లాహ్‌ వాగ్దానం చేశాడు.

5:10 – وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَـٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ ١٠

మరియు ఎవరైతే సత్య-తిరస్కారానికి పాల్పడి, మా సూచనలను అబద్ధాలని తిరస్కరిస్తారో! అలాంటి వారు భగభగ మండే నరకాగ్ని వాసులవుతారు.

5:11 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا نِعْمَتَ اللَّـهِ عَلَيْكُمْ إِذْ هَمَّ قَوْمٌ أَن يَبْسُطُوا إِلَيْكُمْ أَيْدِيَهُمْ فَكَفَّ أَيْدِيَهُمْ عَنكُمْ ۖ وَاتَّقُوا اللَّـهَ ۚ وَعَلَى اللَّـهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ ١١

ఓ విశ్వాసులారా! ఒక జాతి వారు (మీకు హాని చేయ సంకల్పించి) తమ చేతులను మీ వైపునకు చాచి నపుడు, అల్లాహ్‌ వారి చేతులను మీ నుండి తొలగించి మీకు చేసిన అనుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు విశ్వాసులు అల్లాహ్‌ పైననే నమ్మకముంచుకుంటారు. (3/8)

5:12 – وَلَقَدْ أَخَذَ اللَّـهُ مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ وَبَعَثْنَا مِنْهُمُ اثْنَيْ عَشَرَ نَقِيبًا ۖ وَقَالَ اللَّـهُ إِنِّي مَعَكُمْ ۖ لَئِنْ أَقَمْتُمُ الصَّلَاةَ وَآتَيْتُمُ الزَّكَاةَ وَآمَنتُم بِرُسُلِي وَعَزَّرْتُمُوهُمْ وَأَقْرَضْتُمُ اللَّـهَ قَرْضًا حَسَنًا لَّأُكَفِّرَنَّ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَلَأُدْخِلَنَّكُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۚ فَمَن كَفَرَ بَعْدَ ذَٰلِكَ مِنكُمْ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ ١٢

మరియు వాస్తవానికి అల్లాహ్‌ ఇస్రా’యీ లు సంతతి వారి నుండి దృఢమైన ప్రమాణాన్ని తీసుకున్నాడు. మరియు మేము వారిలో నుండి పన్నెండు మందిని (కనాన్‌కు) పోవటానికి నాయ కులుగా నియమించాము. 17 మరియు అల్లాహ్‌ వారితో ఇలా అన్నాడు: ”ఒకవేళ మీరు నమా’జ్‌ స్థిరంగా సలుపుతూ, విధిదానం (‘జకాత్‌) చెల్లిస్తూ మరియు నా ప్రవక్తలను విశ్వసించి వారికి తోడ్పడుతూ, అల్లాహ్‌కు మంచి రుణాన్ని ఇస్తూ వుంటే! నిశ్చయంగా, నేను మీకు తోడుగా ఉంటాను. మరియు నిశ్చయంగా, నేను మీ నుండి మీ పాపాలను తొలగిస్తాను మరియు నిశ్చయంగా మిమ్మల్ని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాను. కానీ, దీని తరువాత మీలో ఎవడు సత్య-తిరస్కార వైఖరిని అవలం బిస్తాడో! అతడు వాస్తవంగా, సరైన మార్గం నుండి తప్పిపోయిన వాడే!”

5:13 – فَبِمَا نَقْضِهِم مِّيثَاقَهُمْ لَعَنَّاهُمْ وَجَعَلْنَا قُلُوبَهُمْ قَاسِيَةً ۖ يُحَرِّفُونَ الْكَلِمَ عَن مَّوَاضِعِهِ ۙ وَنَسُوا حَظًّا مِّمَّا ذُكِّرُوا بِهِ ۚ وَلَا تَزَالُ تَطَّلِعُ عَلَىٰ خَائِنَةٍ مِّنْهُمْ إِلَّا قَلِيلًا مِّنْهُمْ ۖ فَاعْفُ عَنْهُمْ وَاصْفَحْ ۚ إِنَّ اللَّـهَ يُحِبُّ الْمُحْسِنِينَ ١٣

ఆ పిదప వారు తాము చేసిన ఒడంబడికను భంగం చేసినందుకు, మేము వారిని శపించాము (బహిష్కరించాము) మరియు వారి హృదయా లను కఠినంచేశాము. వారు పదాలను తారుమారు చేసి వాటి అర్థాన్ని, సందర్భాన్ని పూర్తిగా మార్చి వేసేవారు. 18 వారికి ఇవ్వబడిన బోధనలలో అధిక భాగాన్ని మరచిపోయారు. అనుదినం వారిలో ఏ కొందరో తప్ప, పలువురు చేసే ద్రోహాన్ని గురించి నీకు తెలుస్తూనే ఉంది. కనుక వారిని మన్నించు మరియు వారి చేష్టలను ఉపేక్షించు. నిశ్చయంగా, అల్లాహ్‌ సజ్జనులను ప్రేమిస్తాడు.

5:14 – وَمِنَ الَّذِينَ قَالُوا إِنَّا نَصَارَىٰ أَخَذْنَا مِيثَاقَهُمْ فَنَسُوا حَظًّا مِّمَّا ذُكِّرُوا بِهِ فَأَغْرَيْنَا بَيْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۚ وَسَوْفَ يُنَبِّئُهُمُ اللَّـهُ بِمَا كَانُوا يَصْنَعُونَ ١٤

”మేము క్రైస్తవులము.” అని అనేవారి నుంచి కూడా మేము దృఢమైన ప్రమాణం తీసు కున్నాము; కాని వారు తమకు ఇవ్వబడిన బోధనలలో అధిక భాగాన్ని మరచిపోయారు; కావున తీర్పుదినం వరకు వారి మధ్య విరోధాన్ని మరియు ద్వేషాన్ని కల్గించాము. మరియు త్వరలోనే అల్లాహ్‌ వారు చేస్తూ వచ్చిన కర్మలను గురించి వారికి తెలియజేస్తాడు.

5:15 – يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ كَثِيرًا مِّمَّا كُنتُمْ تُخْفُونَ مِنَ الْكِتَابِ وَيَعْفُو عَن كَثِيرٍ ۚ قَدْ جَاءَكُم مِّنَ اللَّـهِ نُورٌ وَكِتَابٌ مُّبِينٌ ١٥

ఓ గ్రంథ ప్రజలారా! వాస్తవంగా మా ప్రవక్త (ము’హమ్మద్‌) మీ వద్దకు వచ్చివున్నాడు; మీరు కప్పిపుచ్చుతూ ఉన్న గ్రంథం (బైబిల్‌) లోని ఎన్నో విషయాలను అతను మీకు బహిర్గతం చేస్తున్నాడు; మరియు ఎన్నో విషయాలను ఉపేక్షిస్తున్నాడు. వాస్తవంగా మీ కొరకు అల్లాహ్‌ తరఫు నుండి ఒక జ్యోతి మరియు స్పష్టమైన గ్రంథం (ఈ ఖుర్‌ఆన్‌) వచ్చివున్నది. 19

5:16 – يَهْدِي بِهِ اللَّـهُ مَنِ اتَّبَعَ رِضْوَانَهُ سُبُلَ السَّلَامِ وَيُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ بِإِذْنِهِ وَيَهْدِيهِمْ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ١

దాని ద్వారా అల్లాహ్‌! తన ప్రీతిని పొందగోరే వారికి శాంతి పథాలను చూపుతాడు మరియు తన ఆజ్ఞతో వారిని అంధకారం నుండి వెలుగులోకి తెచ్చి వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.

5:17 – لَّقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّـهَ هُوَ الْمَسِيحُ ابْنُ مَرْيَمَ ۚ قُلْ فَمَن يَمْلِكُ مِنَ اللَّـهِ شَيْئًا إِنْ أَرَادَ أَن يُهْلِكَ الْمَسِيحَ ابْنَ مَرْيَمَ وَأُمَّهُ وَمَن فِي الْأَرْضِ جَمِيعًا ۗ وَلِلَّـهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۚ يَخْلُقُ مَا يَشَاءُ ۚ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١٧

”నిశ్చయంగా, మర్యమ్‌ కుమారుడైన మసీ’హ్‌ (క్రీస్తు) యే అల్లాహ్‌!” అని అనేవారు నిస్సందేహంగా! సత్య-తిరస్కారులు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: ”అల్లాహ్‌ గనక మర్యమ్‌ కుమారుడైన మసీ’హ్‌ (క్రీస్తు) ను అతని తల్లిని మరియు భూమిపై ఉన్న వారందరినీ, నాశనం చేయగోరితే, ఆయనను ఆపగల శక్తి ఎవరికిఉంది? మరియు ఆకాశాలలోను, భూమిలోను మరియు వాటిమధ్యఉన్న సమస్తం మీద ఆధిపత్యం అల్లాహ్‌ దే. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.” 20

5:18 – وَقَالَتِ الْيَهُودُ وَالنَّصَارَىٰ نَحْنُ أَبْنَاءُ اللَّـهِ وَأَحِبَّاؤُهُ ۚ قُلْ فَلِمَ يُعَذِّبُكُم بِذُنُوبِكُم ۖ بَلْ أَنتُم بَشَرٌ مِّمَّنْ خَلَقَ ۚ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۚ وَلِلَّـهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ وَإِلَيْهِ الْمَصِيرُ ١٨

మరియు యూదులు మరియు క్రైస్తవులు ఇలా అంటారు: ”మేము అల్లాహ్‌ సంతానం మరియు ఆయనకు ప్రియమైన వారము.” 21 (వారితో) ఇలా అను: ”అయితే, ఆయన మీ పాపాలకు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? అలాకాదు, మీరు కూడ ఆయన పుట్టించిన మానవులలో ఒకరు మాత్రమే! ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు ఆకాశాలలో భూమిలో మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్‌దే. మరియు ఆయన వైపునకే (అందరికీ) మరలిపోవలసి ఉంది.”

5:19 – يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ عَلَىٰ فَتْرَةٍ مِّنَ الرُّسُلِ أَن تَقُولُوا مَا جَاءَنَا مِن بَشِيرٍ وَلَا نَذِيرٍ ۖ فَقَدْ جَاءَكُم بَشِيرٌ وَنَذِيرٌ ۗ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١٩

ఓ గ్రంథ ప్రజలారా! ప్రవక్తలు రావటం, ఆగి పోయిన కొంతకాలం తరువాత, మీకు అంతా స్పష్టంగా తెలుపటానికి, వాస్తవంగా మా సందేశ హరుడు (ము’హమ్మద్‌) మీ వద్దకు వచ్చాడు. మీరు: ”మా వద్దకు శుభవార్తలు వినిపించేవాడు మరియు హెచ్చరికలు చేసేవాడు ఎవ్వడూ రాలేదు.” అని అనకూడదని. నిస్సందేహంగా ఇప్పుడు మీకు శుభవార్తలు వినిపించేవాడు మరియు హెచ్చరికలు చేసేవాడు వచ్చివున్నాడు. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.

5:20 – وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ اذْكُرُوا نِعْمَةَ اللَّـهِ عَلَيْكُمْ إِذْ جَعَلَ فِيكُمْ أَنبِيَاءَ وَجَعَلَكُم مُّلُوكًا وَآتَاكُم مَّا لَمْ يُؤْتِ أَحَدًا مِّنَ الْعَالَمِينَ ٢٠

మరియు మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నది (జ్ఞాపకంచేసుకోండి): ”నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి; ఆయన మీలో నుండి ప్రవక్తలను ఆవిర్భవింపజేశాడు మరియు మిమ్మల్ని సార్వ భౌములుగా చేశాడు. 22 మరియు (ఆ కాలంలో) ప్రపంచంలో ఎవ్వరికీ ప్రసాదించని వాటిని (అనుగ్రహాలను) మీకు ప్రసాదించాడు.

5:21 – يَا قَوْمِ ادْخُلُوا الْأَرْضَ الْمُقَدَّسَةَ الَّتِي كَتَبَ اللَّـهُ لَكُمْ وَلَا تَرْتَدُّوا عَلَىٰ أَدْبَارِكُمْ فَتَنقَلِبُوا خَاسِرِينَ ٢١

”నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ మీ కొరకు వ్రాసి ఉంచిన పవిత్ర భూమి (ఫలస్తీన్‌) లో ప్రవేశిం చండి. వెనుకకు మరలిరాకండి, అలాచేస్తే నష్టపడి తిరిగి రాగలరు.”

5:22 – قَالُوا يَا مُوسَىٰ إِنَّ فِيهَا قَوْمًا جَبَّارِينَ وَإِنَّا لَن نَّدْخُلَهَا حَتَّىٰ يَخْرُجُوا مِنْهَا فَإِن يَخْرُجُوا مِنْهَا فَإِنَّا دَاخِلُونَ ٢٢

(అప్పుడు) వారన్నారు: ”ఓ మూసా! నిశ్చయంగా, అందులో బలిష్ఠులైన ప్రజలు (అమాలేకీయులు) ఉన్నారు. మరియు వారు అక్కడి నుండి వెళ్ళిపోనంత వరకు, మేము అందులో ఏ మాత్రమూ ప్రవేశించము; ఒక వేళ వారు వెళ్ళిపోతే మేము తప్పక ప్రవేశిస్తాము.”

5:23 – قَالَ رَجُلَانِ مِنَ الَّذِينَ يَخَافُونَ أَنْعَمَ اللَّـهُ عَلَيْهِمَا ادْخُلُوا عَلَيْهِمُ الْبَابَ فَإِذَا دَخَلْتُمُوهُ فَإِنَّكُمْ غَالِبُونَ ۚ وَعَلَى اللَّـهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ ٢٣

(అప్పుడు) భయపడేవారిలోనుండి అల్లాహ్‌ అనుగ్రహం పొందిన ఇద్దరు వ్యక్తులు అన్నారు: ”ద్వారం నుండి పోయి వారిపై దాడిచేయండి. 23 మీరు లోనికి ప్రవేశించారంటే నిశ్చయంగా, విజయం మీదే! మీరు వాస్తవానికి విశ్వసించిన వారే అయితే! అల్లాహ్‌పైననే నమ్మకం ఉంచుకోండి.”

5:24 – قَالُوا يَا مُوسَىٰ إِنَّا لَن نَّدْخُلَهَا أَبَدًا مَّا دَامُوا فِيهَا ۖ فَاذْهَبْ أَنتَ وَرَبُّكَ فَقَاتِلَا إِنَّا هَاهُنَا قَاعِدُونَ ٢٤

వారన్నారు: ”ఓ మూసా! వారు అందు ఉన్నంత వరకు మేము అందులో ఎన్నటికీ ప్రవేశించము. కావున నీవు మరియు నీ ప్రభువు పోయి పోరాడండి, మేము నిశ్చయంగా, ఇక్కడే కూర్చుని ఉంటాము.”

5:25 – قَالَ رَبِّ إِنِّي لَا أَمْلِكُ إِلَّا نَفْسِي وَأَخِي ۖ فَافْرُقْ بَيْنَنَا وَبَيْنَ الْقَوْمِ الْفَاسِقِينَ ٢٥

(దానికి మూసా) అన్నాడు: ”ఓ నా ప్రభూ! నాకు నాపై మరియు నా సోదరునిపై మాత్రమే అధి కారం గలదు. కావున నీవు మా మధ్య మరియు ఈ అవిధేయుల మధ్య తీర్పుచేయి (మమ్మల్ని ఈ అవిధేయుల నుండి దూరం చేయి).”

5:26 – قَالَ فَإِنَّهَا مُحَرَّمَةٌ عَلَيْهِمْ ۛ أَرْبَعِينَ سَنَةً ۛ يَتِيهُونَ فِي الْأَرْضِ ۚ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْفَاسِقِينَ ٢٦

(అల్లాహ్‌) అన్నాడు: ”ఇక నిశ్చయంగా, ఆ భూమి వారి కొరకు నలభై-సంవత్సరాల వరకు నిషేధింపబడింది. వారు దేశదిమ్మరులై ఈ భూమిలో తిరుగుతూ ఉంటారు. 24 కావున అవిధేయులైన జనులను గురించి నీవు చింతించకు.” (1/2)

5:27 – وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ ابْنَيْ آدَمَ بِالْحَقِّ إِذْ قَرَّبَا قُرْبَانًا فَتُقُبِّلَ مِنْ أَحَدِهِمَا وَلَمْ يُتَقَبَّلْ مِنَ الْآخَرِ قَالَ لَأَقْتُلَنَّكَ ۖ قَالَ إِنَّمَا يَتَقَبَّلُ اللَّـهُ مِنَ الْمُتَّقِينَ ٢٧

మరియు వారికి ఆదమ్‌ యొక్క ఇద్దరు కుమారుల 25 (హాబిల్‌ మరియు ఖాబిల్‌ల) యథార్థ కథను వినిపించు. వారిద్దరు (అల్లాహ్‌కు) బలి (ఖుర్బాని) ఇచ్చినప్పుడు ఒకని (హాబీల్‌) బలి (ఖుర్బాని) స్వీకరించబడింది మరియు రెండవ వాని (ఖాబీల్‌) బలి (ఖుర్బాని) స్వీకరించ బడలేదు. (ఖాబీల్‌) అన్నాడు: ”నిశ్చయంగా నేను నిన్ను చంపుతాను.” (దానికి హాబీల్‌) అన్నాడు: ”నిశ్చయంగా, అల్లాహ్‌ భయ-భక్తులు గలవారి (బలినే) స్వీకరిస్తాడు.

5:28 – لَئِن بَسَطتَ إِلَيَّ يَدَكَ لِتَقْتُلَنِي مَا أَنَا بِبَاسِطٍ يَدِيَ إِلَيْكَ لِأَقْتُلَكَ ۖ إِنِّي أَخَافُ اللَّـهَ رَبَّ الْعَالَمِينَ ٢٨

ఒకవేళ నీవు నన్ను చంపటానికి నీచేయి నావైపుకు ఎత్తినా! నేను నిన్ను చంపటానికి నాచేయి నీవైపుకు ఎత్తను. (ఎందుకంటే) నిశ్చయంగా, నేను సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్‌కు భయపడుతున్నాను.

5:29 – إِنِّي أُرِيدُ أَن تَبُوءَ بِإِثْمِي وَإِثْمِكَ فَتَكُونَ مِنْ أَصْحَابِ النَّارِ ۚ وَذَٰلِكَ جَزَاءُ الظَّالِمِينَ ٢٩

నీవు నీ పాపంతో సహా, నా పాపాన్ని కూడా భరించి నరకవాసులలో ఒకడవు కావాలని నా కోరిక. మరియు ఇదే దుర్మార్గుల ప్రతిఫలం.”

5:30 – فَطَوَّعَتْ لَهُ نَفْسُهُ قَتْلَ أَخِيهِ فَقَتَلَهُ فَأَصْبَحَ مِنَ الْخَاسِرِينَ ٣٠

చివరికి అతడి మనస్సు అతడిని (తన సోదరుని) హత్యకు పురికొల్పింది, కావున అతడు తన సోదరుణ్ణి (హాబిల్‌ను) చంపి నష్టం పొందినవారిలో చేరి పోయాడు.

5:31 – فَبَعَثَ اللَّـهُ غُرَابًا يَبْحَثُ فِي الْأَرْضِ لِيُرِيَهُ كَيْفَ يُوَارِي سَوْءَةَ أَخِيهِ ۚ قَالَ يَا وَيْلَتَىٰ أَعَجَزْتُ أَنْ أَكُونَ مِثْلَ هَـٰذَا الْغُرَابِ فَأُوَارِيَ سَوْءَةَ أَخِي ۖ فَأَصْبَحَ مِنَ النَّادِمِينَ ٣١

అప్పుడు అల్లాహ్‌ ఒక కాకిని పంపాడు; అది నేలను త్రవ్వి అతని సోదరుని శవాన్ని ఎలా దాచాలో చూపించింది. అతడు (ఖాబిల్‌): ”అయ్యో, నాపాడుగాను! నేను ఈ కాకిపాటి వాణ్ణి కూడా కాలేకపోయాను! నా సోదరుని శవాన్ని దాచే (ఉపాయం) వెతకలేక పోయాను కదా!” అని వాపోయాడు. అప్పుడతడు పశ్చాత్తాపపడే వారిలో చేరిపోయాడు.

5:32 – مِنْ أَجْلِ ذَٰلِكَ كَتَبْنَا عَلَىٰ بَنِي إِسْرَائِيلَ أَنَّهُ مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا ۚ وَلَقَدْ جَاءَتْهُمْ رُسُلُنَا بِالْبَيِّنَاتِ ثُمَّ إِنَّ كَثِيرًا مِّنْهُم بَعْدَ ذَٰلِكَ فِي الْأَرْضِ لَمُسْرِفُونَ ٣٢

ఈ కారణం వల్లనే మేము ఇస్రా’యీల్‌ సంతతి వారికి ఈ ఉత్తరువు ఇచ్చాము: ”నిశ్చయంగా – ఒకవ్యక్తి(హత్యకు) బదులుగాగానీ లేదా భూమిలో కల్లోలం వ్యాపింపజేసినందుకు గానీ, గాక – ఎవడైనా ఒక వ్యక్తిని (అన్యాయంగా) చంపితే, అతడు సర్వ మానవజాతిని చంపినట్లే. మరియు ఎవడైనా ఒక మానవుని ప్రాణాన్ని కాపాడితే, అతడు సర్వ మానవజాతి ప్రాణాలను కాపాడినట్లే!” మరియు వాస్తవానికి, వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని మా ప్రవక్తలు వచ్చారు, అయినా వాస్తవానికి వారిలో పలువురు భూమిలో అక్రమాలు చేసేవార.ు.

5:33 – إِنَّمَا جَزَاءُ الَّذِينَ يُحَارِبُونَ اللَّـهَ وَرَسُولَهُ وَيَسْعَوْنَ فِي الْأَرْضِ فَسَادًا أَن يُقَتَّلُوا أَوْ يُصَلَّبُوا أَوْ تُقَطَّعَ أَيْدِيهِمْ وَأَرْجُلُهُم مِّنْ خِلَافٍ أَوْ يُنفَوْا مِنَ الْأَرْضِ ۚ ذَٰلِكَ لَهُمْ خِزْيٌ فِي الدُّنْيَا ۖ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ ١

నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్‌తో మరియు ఆయన ప్రవక్తతో పోరాడుతారో మరియు ధరణిలో కల్లోలం రేకెత్తించటానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారికి మరణశిక్ష విధించాలి; లేదా శిలువపై ఎక్కించాలి; లేదా వారి అభిముఖపక్షాల కాళ్ళు చేతులను నరికించాలి; లేదా వారిని దేశబహి ష్క్రుతుల్ని చేయాలి. ఇది వారికి ఇహలోకంలో గల అవమానం. మరియు వారికి పరలోకంలో కూడా ఘోరశిక్ష ఉంటుంది –

5:34 – إِلَّا الَّذِينَ تَابُوا مِن قَبْلِ أَن تَقْدِرُوا عَلَيْهِمْ ۖ فَاعْلَمُوا أَنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ٣٤

మీరు స్వాధీనపరచుకోక ముందు పశ్చాత్తాప పడేవారు తప్ప! కావున మీరు నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత, అని తెలుసుకోండి.

5:35 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّـهَ وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ وَجَاهِدُوا فِي سَبِيلِهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ ٣٥

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ యందు భయ- భక్తులు కలిగి ఉండండి. మరియు ఆయన సాన్నిధ్యానికి చేరే మార్గాన్ని అన్వేషించండి. 26 మరియు ఆయన మార్గంలో నిరంతరం కృషిచేస్తే, మీరు సాఫల్యం పొందవచ్చు 27

5:36 – إِنَّ الَّذِينَ كَفَرُوا لَوْ أَنَّ لَهُم مَّا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ مَعَهُ لِيَفْتَدُوا بِهِ مِنْ عَذَابِ يَوْمِ الْقِيَامَةِ مَا تُقُبِّلَ مِنْهُمْ ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ٣٦

నిశ్చయంగా, సత్య-తిరస్కారులైన వారు తీర్పుదినాన గల శిక్ష నుండి తప్పించుకోవటానికి – వారి వద్ద ఉంటే – భూమిలో ఉన్న సమస్తాన్ని, దానితోపాటు మరి అంత (ధనాన్ని) కూడా, విమోచనాధనంగా ఇవ్వగోరుతారు కాని అది స్వీకరించబడదు. మరియు వారికి అతి బాధాకరమైన శిక్ష ఉంటుంది. 28

5:37 – يُرِيدُونَ أَن يَخْرُجُوا مِنَ النَّارِ وَمَا هُم بِخَارِجِينَ مِنْهَا ۖ وَلَهُمْ عَذَابٌ مُّقِيمٌ ٣٧

వారు నరకాగ్ని నుండి బయటికి రాగోరు తారు, కాని వారు దానినుండి బయటికి రాజాలరు. మరియు వారికి ఎడతెగని శిక్ష ఉంటుంది. 29

5:38 – وَالسَّارِقُ وَالسَّارِقَةُ فَاقْطَعُوا أَيْدِيَهُمَا جَزَاءً بِمَا كَسَبَا نَكَالًا مِّنَ اللَّـهِ ۗ وَاللَّـهُ عَزِيزٌ حَكِيمٌ ٣٨

మరియు పురుషుడు దొంగ అయినా, లేదా స్త్రీ దొంగ అయినా, వారి చేతులను నరికివేయండి. ఇది వారి కర్మలకు గుణపాఠంగా, అల్లాహ్‌ నిర్ణయించిన ప్రతిఫలం (శిక్ష). 30 మరియు అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.

5:39 – فَمَن تَابَ مِن بَعْدِ ظُلْمِهِ وَأَصْلَحَ فَإِنَّ اللَّـهَ يَتُوبُ عَلَيْهِ ۗ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ٣٩

ఎవడు నేరం చేసిన తరువాత పశ్చాత్తాప పడి తనను తాను సవరించుకుంటాడో! నిశ్చయంగా, అల్లాహ్‌ అలాంటి వాని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

5:40 – أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّـهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ يُعَذِّبُ مَن يَشَاءُ وَيَغْفِرُ لِمَن يَشَاءُ ۗ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٤٠

ఏమీ? నిశ్చయంగా, భూమ్యాకాశాలపై ఆధి పత్యం అల్లాహ్‌దేనని నీకు తెలియదా? ఆయన తాను కోరిన వారిని శిక్షిస్తాడు మరియు తాను కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయ గల సమర్థుడు. (5/8)

5:41 – يَا أَيُّهَا الرَّسُولُ لَا يَحْزُنكَ الَّذِينَ يُسَارِعُونَ فِي الْكُفْرِ مِنَ الَّذِينَ قَالُوا آمَنَّا بِأَفْوَاهِهِمْ وَلَمْ تُؤْمِن قُلُوبُهُمْ ۛ وَمِنَ الَّذِينَ هَادُوا ۛ سَمَّاعُونَ لِلْكَذِبِ سَمَّاعُونَ لِقَوْمٍ آخَرِينَ لَمْ يَأْتُوكَ ۖ يُحَرِّفُونَ الْكَلِمَ مِن بَعْدِ مَوَاضِعِهِ ۖ يَقُولُونَ إِنْ أُوتِيتُمْ هَـٰذَا فَخُذُوهُ وَإِن لَّمْ تُؤْتَوْهُ فَاحْذَرُوا ۚ وَمَن يُرِدِ اللَّـهُ فِتْنَتَهُ فَلَن تَمْلِكَ لَهُ مِنَ اللَّـهِ شَيْئًا ۚ أُولَـٰئِكَ الَّذِينَ لَمْ يُرِدِ اللَّـهُ أَن يُطَهِّرَ قُلُوبَهُمْ ۚ لَهُمْ فِي الدُّنْيَا خِزْيٌ ۖ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ ٤١

ఓ ప్రవక్తా! సత్య-తిరస్కారంలోకి పరు గులు తీసే వారి వల్ల నీవు దుఃఖపడకు. అలాంటి వారు: ”మేము విశ్వసించాము.” అని తమ నోటితో మాత్రమే అంటారు, కాని వారి హృదయాలు విశ్వసించలేదు. మరియు యూదులలో కొందరు అసత్యాలను కుతూహలంతో వినేవారున్నారు మరియు నీ వద్దకు ఎన్నడూరాని ఇతర ప్రజలకు (అందజేయటానికి) మీ మాటలు వినేవారు న్నారు. వారు పదాల-అర్థాలను మార్చి, వాటి సందర్భాలకు భిన్నంగా తీసుకుని ఇలా అంటారు: ”మీకు ఈ విధమైన (సందేశం) ఇస్తేనే స్వీకరించండి మరియు ఇలాంటిది ఇవ్వక పోతే, జాగ్రత్త పడండి!” మరియు అల్లాహ్‌ ఎవరిని పరీక్షించదలచాడో (తప్పుదారిలో వదలదలచాడో) వారిని అల్లాహ్‌ నుండి తప్పించటానికి నీవు ఏమీ చేయలేవు. ఎవరి హృదయాలను అల్లాహ్‌ పరిశుధ్ధపరచ గోరలేదో అలాంటివారు వీరే. వారికి ఇహలోకంలో అవమానం ఉంటుంది. మరియు వారికి పరలోకంలో ఘోర శిక్ష ఉంటుంది.

5:42 – سَمَّاعُونَ لِلْكَذِبِ أَكَّالُونَ لِلسُّحْتِ ۚ فَإِن جَاءُوكَ فَاحْكُم بَيْنَهُمْ أَوْ أَعْرِضْ عَنْهُمْ ۖ وَإِن تُعْرِضْ عَنْهُمْ فَلَن يَضُرُّوكَ شَيْئًا ۖ وَإِنْ حَكَمْتَ فَاحْكُم بَيْنَهُم بِالْقِسْطِ ۚ إِنَّ اللَّـهَ يُحِبُّ الْمُقْسِطِينَ ٤٢

వారు అబద్ధాన్ని వినేవారు మరియు నిషిధ్ధమైన దానిని తినేవారు. కావున వారు నీ వద్దకు (న్యాయానికి) వస్తే, నీవు (ఇష్టపడితే) వారి మధ్య తీర్పుచేయి, లేదా ముఖం త్రిప్పుకో. నీవు వారి నుండి విముఖుడవైతే వారు నీకేమీ హాని చేయలేరు. నీవు వారి మధ్య తీర్పుచేస్తే, న్యాయంగా మాత్రమే తీర్పుచేయి. నిశ్చయంగా, అల్లాహ్‌ న్యాయబద్ధులైన వారిని ప్రేమిస్తాడు.

5:43 – وَكَيْفَ يُحَكِّمُونَكَ وَعِندَهُمُ التَّوْرَاةُ فِيهَا حُكْمُ اللَّـهِ ثُمَّ يَتَوَلَّوْنَ مِن بَعْدِ ذَٰلِكَ ۚ وَمَا أُولَـٰئِكَ بِالْمُؤْمِنِينَ ٤٣

మరియు – అల్లాహ్‌ ఉత్తరువులు ఉన్న తౌరాత్‌ గ్రంథం వారి వద్ద ఉన్నప్పటికీ – వారు తీర్పుకొరకు, నీ వద్దకు ఎందుకు వస్తున్నారు? ఆ తరువాత కూడా వారు దాని నుండి తిరిగి పోతున్నారు. మరియు ఇలాంటి వారు (నిజానికి) విశ్వసించినవారు కారు.

5:44 – إِنَّا أَنزَلْنَا التَّوْرَاةَ فِيهَا هُدًى وَنُورٌ ۚ يَحْكُمُ بِهَا النَّبِيُّونَ الَّذِينَ أَسْلَمُوا لِلَّذِينَ هَادُوا وَالرَّبَّانِيُّونَ وَالْأَحْبَارُ بِمَا اسْتُحْفِظُوا مِن كِتَابِ اللَّـهِ وَكَانُوا عَلَيْهِ شُهَدَاءَ ۚ فَلَا تَخْشَوُا النَّاسَ وَاخْشَوْنِ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّـهُ فَأُولَـٰئِكَ هُمُ الْكَافِرُونَ ٤٤

నిశ్చయంగా, మేము తౌరాత్‌ను (మూసాపై) అవతరింపజేశాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి. అల్లాహ్‌కు విధేయు లైన (ముస్లింలైన) ప్రవక్తలు దానిని అనుసరించి, యూదులమధ్య తీర్పుచేస్తూ ఉండేవారు. 31 అదేవిధంగా ధర్మవేత్తలు (రబ్బానియ్యూన్‌) మరియు యూద మతాచారులు (అ’హ్‌బార్‌లు) కూడా (తీర్పుచేస్తూ ఉండేవారు). ఎందుకంటే వారు అల్లాహ్‌ గ్రంథానికి రక్షకులుగా మరియు దానికి సాక్షులుగా నియమింపబడి ఉండేవారు. కావున మీరు (యూదులారా) మానవులకు భయపడకండి. నాకే భయపడండి. నా సూక్తులను (ఆయాత్‌లను) స్వల్పలాభాలకు అమ్ముకోకండి. మరియు ఎవరు అల్లాహ్‌ అవతరింపజేసిన (శాసనం) ప్రకారం తీర్పుచేయరో, అలాంటివారే సత్య-తిరస్కారులు.

5:45 – وَكَتَبْنَا عَلَيْهِمْ فِيهَا أَنَّ النَّفْسَ بِالنَّفْسِ وَالْعَيْنَ بِالْعَيْنِ وَالْأَنفَ بِالْأَنفِ وَالْأُذُنَ بِالْأُذُنِ وَالسِّنَّ بِالسِّنِّ وَالْجُرُوحَ قِصَاصٌ ۚ فَمَن تَصَدَّقَ بِهِ فَهُوَ كَفَّارَةٌ لَّهُ ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّـهُ فَأُولَـٰئِكَ هُمُ الظَّالِمُونَ ٤٥

మరియు ఆ గ్రంథం (తౌరాత్‌)లో వారికి మేము: ”ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పన్నుకు బదులు పన్ను మరియు గాయాలకు బదులుగా సరి సమానమైన ప్రతీకారం వ్రాశాము.” 32 కాని ఎవరైనా దానిని క్షమిస్తే, అది అతనికి పాప-పరిహారం (కఫ్ఫారా)! మరియు ఎవరు అల్లాహ్‌ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పుచేయరో అలాంటివారు! వారే దుర్మార్గులు. 33

5:46 – وَقَفَّيْنَا عَلَىٰ آثَارِهِم بِعِيسَى ابْنِ مَرْيَمَ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَاةِ ۖ وَآتَيْنَاهُ الْإِنجِيلَ فِيهِ هُدًى وَنُورٌ وَمُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَاةِ وَهُدًى وَمَوْعِظَةً لِّلْمُتَّقِينَ ٤٦

మరియు మేము వారి (ఆ ప్రవక్తల) అడుగు జాడలను (ఆసా’రిహిమ్‌) అనుసరించేవాడు మరియు తౌరాత్‌లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరచే వాడయిన, మర్యమ్‌ కుమారుడు, ‘ఈసా (ఏసు)ను పంపాము. 34 మేము అతనికి ఇంజీల్‌ గ్రంథాన్ని ప్రసాదించాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి మరియు అది తౌరాత్‌లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవీకరిస్తుంది మరియు దైవభీతి గలవారికి మార్గదర్శకత్వం మరియు హితోపదేశం కూడా!

5:47 – وَلْيَحْكُمْ أَهْلُ الْإِنجِيلِ بِمَا أَنزَلَ اللَّـهُ فِيهِ ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّـهُ فَأُولَـٰئِكَ هُمُ الْفَاسِقُونَ ٤٧

మరియు ఇంజీల్‌ గ్రంథప్రజలను, అల్లాహ్‌! ఆ గ్రంథంలో అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పుచేయమను. మరియు ఎవరు అల్లాహ్‌ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పుచేయరో అలాంటివారు, వారే అవిధేయులు (దుష్టులు). 35

5:48 – وَأَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ الْكِتَابِ وَمُهَيْمِنًا عَلَيْهِ ۖ فَاحْكُم بَيْنَهُم بِمَا أَنزَلَ اللَّـهُ ۖ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ عَمَّا جَاءَكَ مِنَ الْحَقِّ ۚ لِكُلٍّ جَعَلْنَا مِنكُمْ شِرْعَةً وَمِنْهَاجًا ۚ وَلَوْ شَاءَ اللَّـهُ لَجَعَلَكُمْ أُمَّةً وَاحِدَةً وَلَـٰكِن لِّيَبْلُوَكُمْ فِي مَا آتَاكُمْ ۖ فَاسْتَبِقُوا الْخَيْرَاتِ ۚ إِلَى اللَّـهِ مَرْجِعُكُمْ جَمِيعًا فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ ٤٨

మరియు (ఓ ప్రవక్తా!) మేము ఈ గ్రంథాన్ని నీపై సత్యంతో అవతరింపజేశాము. ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరు స్తుంది. మరియు వాటిలో ఉన్న సత్యా-సత్యా లను పరిష్కరిస్తుంది. 36 కావున నీవు, అల్లాహ్‌ అవతరింపజేసిన ఈ శాసనం ప్రకారం వారి మధ్య తీర్పుచెయ్యి. మరియు నీ వద్దకు వచ్చిన సత్యాన్ని విడిచి వారి కోరికలను అనుస రించకు 37 మీలో ప్రతి ఒక్క సంఘానికి ఒక ధర్మ శాసనాన్ని మరియు ఒక జీవనమార్గాన్ని నియ మించిఉన్నాము. ఒకవేళ అల్లాహ్‌ తలుచుకుంటే, మిమ్మల్ని అంతా ఒకే-ఒక సంఘంగా రూపొందించి ఉండేవాడు. కాని మీకు ఇచ్చిన దానితో (ధర్మంతో) మిమ్మల్ని పరీక్షించటానికి (ఇలా చేశాడు). కావున మీరు మంచిపనులు చేయటంలో ఒకరితోనొకరు పోటీపడండి. అల్లాహ్‌ వద్దకే మీరందరూ మరలి పోవలసి వుంది. అప్పుడు ఆయన మీకున్న భేదాభిప్రాయాలను గురించి మీకు తెలియజేస్తాడు.

5:49 – وَأَنِ احْكُم بَيْنَهُم بِمَا أَنزَلَ اللَّـهُ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ وَاحْذَرْهُمْ أَن يَفْتِنُوكَ عَن بَعْضِ مَا أَنزَلَ اللَّـهُ إِلَيْكَ ۖ فَإِن تَوَلَّوْا فَاعْلَمْ أَنَّمَا يُرِيدُ اللَّـهُ أَن يُصِيبَهُم بِبَعْضِ ذُنُوبِهِمْ ۗ وَإِنَّ كَثِيرًا مِّنَ النَّاسِ لَفَاسِقُونَ ٤٩

మరియు (ఓ ప్రవక్తా!) నీవు అల్లాహ్‌ అవతరింపజేసిన శాసనం ప్రకారం వారిమధ్య తీర్పు చెయ్యి మరియు వారి వ్యర్థకోరికలను అనుస రించకు. అల్లాహ్‌ నీపై అవతరింపజేసిన కొన్ని శాసనాల నుండి వారు నిన్ను తప్పించకుండా జాగ్రత్తగా ఉండు. ఒకవేళ వారు వెనుదిరిగిపోతే, అల్లాహ్‌ వారిని, వారి కొన్ని పాపాలకు శిక్షించదల చాడని తెలుసుకో. మరియు నిశ్చయంగా ప్రజలలో అనేకులు అవిధేయతకు పాల్పడే వారున్నారు.

5:50 – أَفَحُكْمَ الْجَاهِلِيَّةِ يَبْغُونَ ۚ وَمَنْ أَحْسَنُ مِنَ اللَّـهِ حُكْمًا لِّقَوْمٍ يُوقِنُونَ ٥٠

ఏమీ? వారు అజ్ఞానకాలపు తీర్పును కోరు తున్నారా? కాని ఆయన (అల్లాహ్)పై నమ్మకం గలవారికి అల్లాహ్‌ కంటే మంచి తీర్పు చేయగల వాడెవడు? 38 (3/4)

5:51 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الْيَهُودَ وَالنَّصَارَىٰ أَوْلِيَاءَ ۘ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ وَمَن يَتَوَلَّهُم مِّنكُمْ فَإِنَّهُ مِنْهُمْ ۗ إِنَّ اللَّـهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ ٥١

  • ఓ విశ్వాసులారా! యూదులను మరియు క్రైస్తవులను మిత్రులుగా చేసుకోకండి. వారు ఒకరి కొకరు స్నేహితులు. 39 మీలో ఎవడు వారితో స్నేహం చేస్తాడో వాస్తవానికి అతడు వారిలో చేరిన వాడవుతాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ దుర్మార్గు లకు మార్గదర్శకత్వం చేయడు.

5:52 – فَتَرَى الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ يُسَارِعُونَ فِيهِمْ يَقُولُونَ نَخْشَىٰ أَن تُصِيبَنَا دَائِرَةٌ ۚ فَعَسَى اللَّـهُ أَن يَأْتِيَ بِالْفَتْحِ أَوْ أَمْرٍ مِّنْ عِندِهِ فَيُصْبِحُوا عَلَىٰ مَا أَسَرُّوا فِي أَنفُسِهِمْ نَادِمِينَ ٥٢

కావున ఎవరి హృదయాలలో రోగం (కాపట్యం) ఉందో వారు, వారి సాంగత్యం కొరకు పోటీపడుతున్నది నీవు చూస్తున్నావు. వారు: ”మాపై ఏదైనా ఆపద రాగలదని మేము భయపడు తున్నాము.” అని అంటారు. బహుశా అల్లాహ్‌ (విశ్వాసులకు) విజయాన్ని గానీ, లేదా తన దిక్కు నుండి ఏదైనా అవకాశాన్ని గానీ కలిగించ వచ్చు! అప్పుడు వారు తమ మనస్సులలో దాచి ఉంచిన దానికి పశ్చాత్తాపపడతారు.

5:53 – وَيَقُولُ الَّذِينَ آمَنُوا أَهَـٰؤُلَاءِ الَّذِينَ أَقْسَمُوا بِاللَّـهِ جَهْدَ أَيْمَانِهِمْ ۙ إِنَّهُمْ لَمَعَكُمْ ۚ حَبِطَتْ أَعْمَالُهُمْ فَأَصْبَحُوا خَاسِرِينَ ٥٣

మరియు విశ్వాసులు (పరస్పరం ఇలా అనుకుంటారు): ”ఏమీ? వాస్తవానికి మేము మీతోనే ఉన్నామని, అల్లాహ్‌ పేరుతో కఠోర ప్రమాణాలు చేసి, నమ్మకం కలిగించేవారు వీరేనా?” వారి (కపట-విశ్వాసుల) కర్మలన్నీ వ్యర్థమై, వారు నష్టపడిన వారవుతారు!

5:54 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَن يَرْتَدَّ مِنكُمْ عَن دِينِهِ فَسَوْفَ يَأْتِي اللَّـهُ بِقَوْمٍ يُحِبُّهُمْ وَيُحِبُّونَهُ أَذِلَّةٍ عَلَى الْمُؤْمِنِينَ أَعِزَّةٍ عَلَى الْكَافِرِينَ يُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّـهِ وَلَا يَخَافُونَ لَوْمَةَ لَائِمٍ ۚ ذَٰلِكَ فَضْلُ اللَّـهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّـهُ وَاسِعٌ عَلِيمٌ ٥٤

ఓ విశ్వాసులారా! మీలో ఎవడైనా తన ధర్మం (ఇస్లాం) నుండి వైదొలగితే, అల్లాహ్‌ త్వర లోనే ఇతర ప్రజలను తేగలడు. ఆయన వారిని ప్రేమిస్తాడు మరియు వారు ఆయన (అల్లాహ్‌)ను ప్రేమిస్తారు. 40 వారు విశ్వాసుల పట్ల మృదువుగా, సత్య తిరస్కారులపట్ల కఠినంగా ప్రవర్తించేవారునూ అల్లాహ్‌ మార్గంలో ధర్మపోరాటం చేసేవారునూ మరియు నిందించేవారి నిందలకు భయపడని వారునూ, అయిఉంటారు. ఇది అల్లాహ్‌ అనుగ్రహం, ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్‌ సర్వోపగతుడు, సర్వజ్ఞుడు.

5:55 – إِنَّمَا وَلِيُّكُمُ اللَّـهُ وَرَسُولُهُ وَالَّذِينَ آمَنُوا الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُمْ رَاكِعُونَ ٥٥

నిశ్చయంగా, మీ స్నేహితులు, అల్లాహ్‌! ఆయన ప్రవక్త మరియు విశ్వసించిన వారు – ఎవరైతే నమా’జ్‌ స్థాపిస్తారో, విధిదానం (‘జకాత్‌) ఇస్తూ ఉంటారో మరియు వారు (అల్లాహ్‌ ముందు) వంగుతూ (రుకూ’ఉ చేస్తూ) ఉంటారో –

5:56 – وَمَن يَتَوَلَّ اللَّـهَ وَرَسُولَهُ وَالَّذِينَ آمَنُوا فَإِنَّ حِزْبَ اللَّـهِ هُمُ الْغَالِبُونَ ٥٦

మరియు ఎవరు అల్లాహ్‌, ఆయన ప్రవక్త మరియు విశ్వసించినవారి వైపునకు మరలుతారో! నిశ్చయంగా, వారే అల్లాహ్‌ పక్షానికి చెందినవారు, వారే విజయం సాధించేవారు. 41

5:57 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الَّذِينَ اتَّخَذُوا دِينَكُمْ هُزُوًا وَلَعِبًا مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ وَالْكُفَّارَ أَوْلِيَاءَ ۚ وَاتَّقُوا اللَّـهَ إِن كُنتُم مُّؤْمِنِينَ ٥٧

ఓ విశ్వాసులారా! మీ ధర్మాన్ని ఎగతాళిగా నవ్వులాటగా పరిగణించేవారు పూర్వగ్రంథ ప్రజ లైనా, లేదా సత్య-తిరస్కారులైనా, వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. మరియు మీరు విశ్వాసులే అయితే అల్లాహ్‌ యందు భయ- భక్తులు కలిగి ఉండండి.

5:58 – وَإِذَا نَادَيْتُمْ إِلَى الصَّلَاةِ اتَّخَذُوهَا هُزُوًا وَلَعِبًا ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْقِلُونَ ٥٨

మరియు మీరు నమా’జ్‌ కొరకు పిలుపు (అజా’న్‌) ఇస్తే, వారు దానిని ఎగతాళిగా నవ్వులాటగా తీసుకుంటారు. అది ఎందుకంటే వాస్తవానికి వారు బుధ్ధిహీనులైన జనులు! 42

5:59 – قُلْ يَا أَهْلَ الْكِتَابِ هَلْ تَنقِمُونَ مِنَّا إِلَّا أَنْ آمَنَّا بِاللَّـهِ وَمَا أُنزِلَ إِلَيْنَا وَمَا أُنزِلَ مِن قَبْلُ وَأَنَّ أَكْثَرَكُمْ فَاسِقُونَ ٥٩

వారితో ఇలా అను: ”ఓ గ్రంథప్రజలారా! 43 ఏమీ? మేము అల్లాహ్‌ను మరియు ఆయన మాపై అవతరింపజేసిన మరియు మాకు పూర్వం అవతరింపజేసిన (గ్రంథాలను) విశ్వసించామనే, మీరు మమ్మల్ని పీడిస్తున్నారా? మరియు నిశ్చయంగా, మీలో చాలా మంది అవిధేయులు (దుష్టులు) ఉన్నారు!”

5:60 – قُلْ هَلْ أُنَبِّئُكُم بِشَرٍّ مِّن ذَٰلِكَ مَثُوبَةً عِندَ اللَّـهِ ۚ مَن لَّعَنَهُ اللَّـهُ وَغَضِبَ عَلَيْهِ وَجَعَلَ مِنْهُمُ الْقِرَدَةَ وَالْخَنَازِيرَ وَعَبَدَ الطَّاغُوتَ ۚ أُولَـٰئِكَ شَرٌّ مَّكَانًا وَأَضَلُّ عَن سَوَاءِ السَّبِيلِ ٦٠

ఇలా అను: ”ఏమీ? అల్లాహ్‌ తరఫు నుండి ఎవరికి, దీనికంటే, హీనమైన ప్రతిఫలం దొరుకు తుందో మీకు తెలుపనా? వారే, ఎవరినైతే అల్లాహ్‌ శపించాడో (బహిష్కరించాడో) మరియు ఎవరైతే ఆయన ఆగ్రహానికి గురి అయ్యారో! మరియు వారిలో కొందరు, ఎవరినైతే ఆయన కోతులుగా మరియు పందులుగా మార్చాడో! 44 మరియు వారు ఎవరైతే కల్పితదైవాల(తాగూత్‌ల) దాస్యం చేస్తారో. అలాంటి వారు (పునరుత్థానదినమున) ఎంతో హీనస్థితిలోఉంటారు మరియు వారు ఋజు మార్గం నుండి చాలాదూరం వెళ్లిపోయినవారే!”

5:61 – وَإِذَا جَاءُوكُمْ قَالُوا آمَنَّا وَقَد دَّخَلُوا بِالْكُفْرِ وَهُمْ قَدْ خَرَجُوا بِهِ ۚ وَاللَّـهُ أَعْلَمُ بِمَا كَانُوا يَكْتُمُونَ ٦١

మరియువారు (కపటవిశ్వాసులు) నీవద్దకు వచ్చినపుడు: ”మేము విశ్వసించాము.” అని అంటారు. కాని వాస్తవానికి వారు సత్య-తిరస్కారం తోనే వస్తారు మరియు దాని (సత్య-తిరస్కారం) తోనే తిరిగిపోతారు కూడాను. మరియు వారు ఏమి దాస్తున్నారో అల్లాహ్‌కు బాగా తెలుసు.

5:62 – وَتَرَىٰ كَثِيرًا مِّنْهُمْ يُسَارِعُونَ فِي الْإِثْمِ وَالْعُدْوَانِ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَعْمَلُونَ ٦٢

మరియు వారిలోఅనేకులను పాపంమరియు దౌర్జన్యం చేయటానికి మరియు నిషిధ్ధమైనవి తిన టానికి చురుకుగా పాల్గొనటాన్ని నీవు చూస్తావు. వారు చేస్తున్న పనులు ఎంత నీచమైనవి!

5:63 – لَوْلَا يَنْهَاهُمُ الرَّبَّانِيُّونَ وَالْأَحْبَارُ عَن قَوْلِهِمُ الْإِثْمَ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَصْنَعُونَ ٦٣

వారి ధర్మవేత్తలు (రబ్బానియ్యూన్‌) మరియు మతాచారులు (అ’హబార్‌) వారిని, పాపపు మాటలు పలకటం నుండి మరియు నిషిధ్ధ మైన వాటిని తినటం నుండి ఎందుకు వారించరు? వారు చేసే కార్యాలు ఎంత నీచమైనవి!

5:64 – وَقَالَتِ الْيَهُودُ يَدُ اللَّـهِ مَغْلُولَةٌ ۚ غُلَّتْ أَيْدِيهِمْ وَلُعِنُوا بِمَا قَالُوا ۘ بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ يُنفِقُ كَيْفَ يَشَاءُ ۚ وَلَيَزِيدَنَّ كَثِيرًا مِّنْهُم مَّا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ طُغْيَانًا وَكُفْرًا ۚ وَأَلْقَيْنَا بَيْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۚ كُلَّمَا أَوْقَدُوا نَارًا لِّلْحَرْبِ أَطْفَأَهَا اللَّـهُ ۚ وَيَسْعَوْنَ فِي الْأَرْضِ فَسَادًا ۚ وَاللَّـهُ لَا يُحِبُّ الْمُفْسِدِينَ ٦٤

మరియు యూదులు: ”అల్లాహ్‌ చేతులకు సంకెళ్ళు పడిఉన్నాయి.” అని అంటారు. 46 వారి చేతులకే సంకెళ్ళు వేయబడు గాక! మరియు వారు పలికిన దానికి వారు శపించబడు గాక! వాస్తవానికి ఆయన (అల్లాహ్‌) రెండు చేతులు విస్తరింపబడి ఉన్నాయి; ఆయన (తన అనుగ్రహాలను) తాను కోరినట్లు ఖర్చుచేస్తాడు. మరియు (ఓ ప్రవక్తా!) నీ ప్రభువుతరఫునుండి నీపై అవతరింపజేయబడిన (ఈ గ్రంథం) నిశ్చయంగా వారిలో చాలామందికి తలబిరుసుతనం మరియు సత్య-తిరస్కారాన్ని మాత్రమే పెంచుతున్నది. మరియు మేము వారి మధ్య విరోధాన్ని మరియు ద్వేషాన్ని, తీర్పుదినం వరకు ఉండేటట్లుచేశాము. వారు యుద్ధజ్వాల లను ప్రజ్వలింపజేసినపుడల్లా, అల్లాహ్‌ దానిని చల్లార్చాడు. మరియు వారు భూమిలో కల్లోలం రేకెత్తించటానికి పాటుపడుతున్నారు. మరియు అల్లాహ్‌ కల్లోలం రేకెత్తించేవారిని ప్రేమించడు.

5:65 – وَلَوْ أَنَّ أَهْلَ الْكِتَابِ آمَنُوا وَاتَّقَوْا لَكَفَّرْنَا عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَأَدْخَلْنَاهُمْ جَنَّاتِ النَّعِيمِ ٦٥

మరియు వాస్తవానికి గ్రంథప్రజలు విశ్వ సించి, దైవభీతి కలిగివుంటే! నిశ్చయంగా, మేము వారి పాపాలను తొలగించి, వారిని శ్రేష్ఠమైన స్వర్గవనాలలో ప్రవేశింపజేసి ఉండేవారము.

5:66 – وَلَوْ أَنَّهُمْ أَقَامُوا التَّوْرَاةَ وَالْإِنجِيلَ وَمَا أُنزِلَ إِلَيْهِم مِّن رَّبِّهِمْ لَأَكَلُوا مِن فَوْقِهِمْ وَمِن تَحْتِ أَرْجُلِهِم ۚ مِّنْهُمْ أُمَّةٌ مُّقْتَصِدَةٌ ۖ وَكَثِيرٌ مِّنْهُمْ سَاءَ مَا يَعْمَلُونَ ٦٦

మరియు వాస్తవానికి వారు తౌరాత్‌ను, ఇంజీల్‌ను మరియు వారి ప్రభువు తరఫునుండి వారిపై (ఇప్పుడు) అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్‌ఆన్‌ను) ఆచరించి ఉండినట్లైతే, వారి కొరకు వారిపై (ఆకాశం) నుండి మరియు కాళ్ళ క్రింది నుండి (భూమి నుండి) జీవనోపాధి పొందేవారు. 47 వారిలో కొందరు సరైనమార్గాన్ని అవలంబించేవారున్నారు. 48 కాని వారిలో అనేకులు చేసేవి చెడు (పాప) కార్యాలే! (7/8)

5:67 – يَا أَيُّهَا الرَّسُولُ بَلِّغْ مَا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ ۖ وَإِن لَّمْ تَفْعَلْ فَمَا بَلَّغْتَ رِسَالَتَهُ ۚ وَاللَّـهُ يَعْصِمُكَ مِنَ النَّاسِ ۗ إِنَّ اللَّـهَ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ ٦٧

ఓ ప్రవక్తా! నీవు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన దానిని తెలియ జేయి. 49 మరియు నీ వట్లు చేయకపోతే, ఆయన సందేశాన్ని పూర్తిగా తెలియజేయనివాడవు అవుతావు. మరియు అల్లాహ్‌ మానవుల నుండి నిన్ను కాపాడుతాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ సత్య- తిరస్కారులైనప్రజలకు మార్గదర్శకత్వం చేయడు.

5:68 – قُلْ يَا أَهْلَ الْكِتَابِ لَسْتُمْ عَلَىٰ شَيْءٍ حَتَّىٰ تُقِيمُوا التَّوْرَاةَ وَالْإِنجِيلَ وَمَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ ۗ وَلَيَزِيدَنَّ كَثِيرًا مِّنْهُم مَّا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ طُغْيَانًا وَكُفْرًا ۖ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْكَافِرِينَ ٦٨

ఇలా అను: ”ఓ గ్రంథప్రజలారా! మీరు తౌరా త్‌ను, ఇంజీల్‌ను మరియు మీ ప్రభువు తరఫు నుండి మీపై అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్‌ఆన్‌ను) ఆచరించనంతవరకు, మీరు అసలు దేని (ఏ సత్యమార్గం) మీద కూడా ఉండనట్లే!” మరియు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింప జేయబడిన (ఈ గ్రంథం) వాస్తవానికి వారిలోని అనే కుల తలబిరుసుతనాన్ని మరియు సత్య-తిరస్కా రాన్ని మాత్రమే పెంచుతుంది. 50 కావున నీవు సత్య-తిరస్కార ప్రజలను గురించి విచారించకు.

5:69 – إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالصَّابِئُونَ وَالنَّصَارَىٰ مَنْ آمَنَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ وَعَمِلَ صَالِحًا فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ٦٩

నిశ్చయంగా, ఈ (గ్రంథాన్ని) విశ్వసించిన వారు (ముస్లింలు) మరియు యూదులు మరియు ‘సాబియూ’లు మరియు క్రైస్తవులు, ఎవరైనా సరే అల్లాహ్‌ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించి, సత్కార్యాలు చేస్తే వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా. 51

5:70 – لَقَدْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ وَأَرْسَلْنَا إِلَيْهِمْ رُسُلًا ۖ كُلَّمَا جَاءَهُمْ رَسُولٌ بِمَا لَا تَهْوَىٰ أَنفُسُهُمْ فَرِيقًا كَذَّبُوا وَفَرِيقًا يَقْتُلُونَ ٧٠

వాస్తవానికి మేము ఇస్రాయీ’ల్‌ సంతతి వారి నుండి ఒక గట్టి ప్రమాణాన్ని తీసుకున్నాము మరియు వారి వద్దకు ప్రవక్తలను పంపాము. కాని ఏ ప్రవక్త అయినా వారి మనోవాంఛలకు వ్యతిరేకమైన దానిని తెచ్చినపుడల్లా, వారు కొందరిని అసత్య వాదులని తిరస్కరించారు, మరి కొందరిని హత్యచేశారు.

5:71 – وَحَسِبُوا أَلَّا تَكُونَ فِتْنَةٌ فَعَمُوا وَصَمُّوا ثُمَّ تَابَ اللَّـهُ عَلَيْهِمْ ثُمَّ عَمُوا وَصَمُّوا كَثِيرٌ مِّنْهُمْ ۚ وَاللَّـهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ ٧١

మరియు తమ కెలాంటి శిక్ష (ఫిత్నా) పడదని తలచి, వారు గ్రుడ్డివారుగా, చెవిటివారుగా అయిపోయారు. ఆ పిదప అల్లాహ్‌ వారి పశ్చాత్తా పాన్ని అంగీకరించాడు. ఆ తరువాత కూడ వారిలో అనేకులు తిరిగి గ్రుడ్డివారుగా, చెవిటివారుగా అయిపోయారు. మరియు వారు చేసేదంతా అల్లాహ్‌ చూస్తున్నాడు.

5:72 – لَقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّـهَ هُوَ الْمَسِيحُ ابْنُ مَرْيَمَ ۖ وَقَالَ الْمَسِيحُ يَا بَنِي إِسْرَائِيلَ اعْبُدُوا اللَّـهَ رَبِّي وَرَبَّكُمْ ۖ إِنَّهُ مَن يُشْرِكْ بِاللَّـهِ فَقَدْ حَرَّمَ اللَّـهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ ٧٢

”నిశ్చయంగా, మర్యమ్‌ కుమారుడు మసీ’హ్ (క్రీస్తు) యే అల్లాహ్‌!” అని పలికేవారు వాస్తవంగా సత్యతిరస్కారులు! మరియు మసీ’హ్ (క్రీస్తు) ఇలాఅన్నాడు: ”ఓఇస్రా’యీల్‌ సంతతి వారలారా! నా ప్రభువు మరియు మీ ప్రభువైన అల్లాహ్‌నే ఆరాధించండి.” 52 వాస్తవానికి ఇతరులను అల్లాహ్‌కు భాగ-స్వాములుగా చేసేవారికి, నిశ్చయంగా అల్లాహ్‌ స్వర్గాన్ని నిషేధించాడు. మరియు వారి ఆశ్రయం నరకాగ్నియే! మరియు దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు.

5:73 – لَّقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّـهَ ثَالِثُ ثَلَاثَةٍ ۘ وَمَا مِنْ إِلَـٰهٍ إِلَّا إِلَـٰهٌ وَاحِدٌ ۚ وَإِن لَّمْ يَنتَهُوا عَمَّا يَقُولُونَ لَيَمَسَّنَّ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ عَذَابٌ أَلِيمٌ ٧٣

”నిశ్చయంగా, అల్లాహ్‌ ముగ్గురిలో మూడవ వాడు!” అని అనేవారు వాస్తవానికి సత్య- తిరస్కారులే 53 మరియు ఒకేఒక్క ఆరాధ్య దేవుడు (అల్లాహ్‌) తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు. మరియు వారు తమ ఈ మాటలను మానుకోకపోతే, వారిలో సత్య-తిరస్కారులైన వారికి బాధా కరమైన శిక్ష పడుతుంది.

5:74 – أَفَلَا يَتُوبُونَ إِلَى اللَّـهِ وَيَسْتَغْفِرُونَهُ ۚ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٧٤

వారెందుకు అల్లాహ్‌ వైపునకు పశ్చాత్తా పంతో మరలి ఆయనను క్షమాభిక్ష కొరకు వేడుకోరు? మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

5:75 – مَّا الْمَسِيحُ ابْنُ مَرْيَمَ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِن قَبْلِهِ الرُّسُلُ وَأُمُّهُ صِدِّيقَةٌ ۖ كَانَا يَأْكُلَانِ الطَّعَامَ ۗ انظُرْ كَيْفَ نُبَيِّنُ لَهُمُ الْآيَاتِ ثُمَّ انظُرْ أَنَّىٰ يُؤْفَكُونَ ٧٥

మర్యమ్‌ కుమారుడు మసీ’హ్ (క్రీస్తు) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అతనికి పూర్వం కూడా అనేక ప్రవక్తలు గతించారు. మరియు అతని తల్లి సత్యవతి (‘సిద్దీఖహ్‌). వారిద్దరూ ఆహారం తినేవారు. 54 చూడండి! మేము వారికి ఈ సూచనలను ఏ విధంగా స్పష్టపరిచామో! అయినా చూడండి! 55

5:76 – قُلْ أَتَعْبُدُونَ مِن دُونِ اللَّـهِ مَا لَا يَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا نَفْعًا ۚ وَاللَّـهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ ٧٦

ఇలా అను: ”ఏమీ? మీరు అల్లాహ్‌ను వదిలి మీకు నష్టంగానీ, లాభంగానీ చేసే అధికారం లేని దానిని ఆరాధిస్తారా? మరియు కేవలం అల్లాహ్‌ మాత్రమే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.”

5:77 – قُلْ يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ غَيْرَ الْحَقِّ وَلَا تَتَّبِعُوا أَهْوَاءَ قَوْمٍ قَدْ ضَلُّوا مِن قَبْلُ وَأَضَلُّوا كَثِيرًا وَضَلُّوا عَن سَوَاءِ السَّبِيلِ ٧٧

(ఇంకా) ఇలా అను: ”ఓ గ్రంథప్రజలారా! మీ ధర్మం విషయంలో మీరు అధర్మంగా హద్దులు మీరి ప్రవర్తించకండి. 56 మరియు ఇంతకు పూర్వం మార్గభ్రష్టులైనవారి కోరికలను అనుసరించకండి. వారు అనేక ఇతరులను కూడా మార్గభ్రష్టులుగా చేశారు మరియు వారు కూడ ఋజుమార్గం నుండి తప్పిపోయారు.”

5:78 – لُعِنَ الَّذِينَ كَفَرُوا مِن بَنِي إِسْرَائِيلَ عَلَىٰ لِسَانِ دَاوُودَ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۚ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ ٧٨

ఇస్రాయీ’ల్‌ సంతతి వారిలో అవిశ్వాస మార్గం అవలంబించిన వారు, దావూద్‌ మరియు మర్యమ్‌ కుమారుడు ‘ఈసా (ఏసు) నాలుకతో (నోటితో) శపించబడ్డారు 57 ఇది వారు అవిధే యులై హద్దులు మీరి ప్రవర్తించిన దాని ఫలితం.

5:79 – انُوا لَا يَتَنَاهَوْنَ عَن مُّنكَرٍ فَعَلُوهُ ۚ لَبِئْسَ مَا كَانُوا يَفْعَلُونَ ٧٩

వారు, తాము చేసే, అసభ్యకరమైన కార్యాల నుండి ఒకరినొకరు నిరోధించుకోలేదు. వారు చేసే పనులన్నీ ఎంతో నీచమైనవి.

5:80 – تَرَىٰ كَثِيرًا مِّنْهُمْ يَتَوَلَّوْنَ الَّذِينَ كَفَرُوا ۚ لَبِئْسَ مَا قَدَّمَتْ لَهُمْ أَنفُسُهُمْ أَن سَخِطَ اللَّـهُ عَلَيْهِمْ وَفِي الْعَذَابِ هُمْ خَالِدُونَ ٨٠

వారిలో అనేకులు సత్య-తిరస్కారులతో మైత్రి చేసుకోవటాన్ని, నీవు చూస్తున్నావు. వారు తమకొరకు ముందుగాచేసి పంపుకున్న నీచకర్మల వలన అల్లాహ్‌కు వారిపై కోపం కలిగింది మరియు వారు నరకబాధలో శాశ్వతంగా ఉంటారు.

5:81 – وَلَوْ كَانُوا يُؤْمِنُونَ بِاللَّـهِ وَالنَّبِيِّ وَمَا أُنزِلَ إِلَيْهِ مَا اتَّخَذُوهُمْ أَوْلِيَاءَ وَلَـٰكِنَّ كَثِيرًا مِّنْهُمْ فَاسِقُونَ ٨١

ఒకవేళ వారు అల్లాహ్‌నూ, ప్రవక్తనూ మరియు అతనిపై అవతరింపజేయబడిన దానిని (నిజంగానే) విశ్వసించి ఉంటే! వారిని (సత్య- తిరస్కారులను) తమ మిత్రులుగా చేసుకొని ఉండేవారు కాదు, కాని వారిలో అనేకులు అవిధేయులున్నారు.

5:82 – لَتَجِدَنَّ أَشَدَّ النَّاسِ عَدَاوَةً لِّلَّذِينَ آمَنُوا الْيَهُودَ وَالَّذِينَ أَشْرَكُوا ۖ وَلَتَجِدَنَّ أَقْرَبَهُم مَّوَدَّةً لِّلَّذِينَ آمَنُوا الَّذِينَ قَالُوا إِنَّا نَصَارَىٰ ۚ ذَٰلِكَ بِأَنَّ مِنْهُمْ قِسِّيسِينَ وَرُهْبَانًا وَأَنَّهُمْ لَا يَسْتَكْبِرُونَ ٨٢

నిశ్చయంగా, విశ్వాసులపట్ల (ముస్లింల పట్ల) విరోధ విషయంలో నీవు యూదులను మరియు బహు దైవారాధకులను (ముష్రికీన్‌లను), అందరికంటే కఠినులుగా కనుగొంటావు. మరియు విశ్వాసులపట్ల మైత్రి విషయంలో: ”నిశ్చయంగా, మేము క్రైస్తవులము.” అని, అన్న వారిని అత్యంత సన్నిహితులుగా పొందుతావు. ఇది ఎందుకంటే వారిలో మతగురువులు / విద్వాంసులు (ఖిస్సీ సీన్‌) మరియు మునులు (రుహ్‌బాన్) ఉన్నారు మరియు నిశ్చయంగా, వారు గర్వించరు.

5:83 – وَإِذَا سَمِعُوا مَا أُنزِلَ إِلَى الرَّسُولِ تَرَىٰ أَعْيُنَهُمْ تَفِيضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوا مِنَ الْحَقِّ ۖ يَقُولُونَ رَبَّنَا آمَنَّا فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ ٨٣

మరియు వారు (కొందరు క్రైస్తవులు) ప్రవక్తపై అవతరింపజేయబడిన దానిని (ఈ గ్రంథాన్ని) విన్నప్పుడు, సత్యాన్ని తెలుసు కున్నందుకు, వారి కళ్ళ నుండి కన్నీళ్ళు కారటం నీవు చూస్తావు. 58 వారు ఇలా అంటారు: ”ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము. కావున మమ్మల్ని సాక్ష్యం ఇచ్చేవారిలో వ్రాసుకో!

5:84 – وَمَا لَنَا لَا نُؤْمِنُ بِاللَّـهِ وَمَا جَاءَنَا مِنَ الْحَقِّ وَنَطْمَعُ أَن يُدْخِلَنَا رَبُّنَا مَعَ الْقَوْمِ الصَّالِحِينَ ٨٤

”మరియు మేము అల్లాహ్‌ను మరియు మా వద్దకు వచ్చిన సత్యాన్ని విశ్వసించకుండా ఉండ టానికి మాకేమైంది? మా ప్రభువు మమ్మల్ని సద్వ ర్తనులతో చేర్చాలని మేముకోరుకుంటున్నాము.”

5:85 – فَأَثَابَهُمُ اللَّـهُ بِمَا قَالُوا جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَاءُ الْمُحْسِنِينَ ٨٥

కావున వారు పలికిన దానికి ఫలితంగా, అల్లాహ్‌ వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలను ప్రసాదించాడు. వారందులో శాశ్వతంగా ఉంటారు. మరియు సజ్జనులకు లభించే ప్రతిఫలం ఇదే!

5:86 – وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَـٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ ٨٦

మరియు ఎవరైతే సత్య-తిరస్కారులై మా సూచన (ఆయాత్‌)లను అబద్ధాలన్నారో, అలాంటివారు భగభగ మండే నరకాగ్ని వాసులవుతారు.

5:87 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُحَرِّمُوا طَيِّبَاتِ مَا أَحَلَّ اللَّـهُ لَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّـهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ ٨٧

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ మీకు ధర్మ సమ్మతం చేసిన పరిశుధ్ధ వస్తువులను నిషిధ్ధం చేసుకోకండి మరియు హద్దులు మీరకండి. నిశ్చయంగా, అల్లాహ్‌ హద్దులు మీరిపోయేవారిని ప్రేమించడు. 59

5:88 – وَكُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّـهُ حَلَالًا طَيِّبًا ۚ وَاتَّقُوا اللَّـهَ الَّذِي أَنتُم بِهِ مُؤْمِنُونَ ٨٨

మరియు అల్లాహ్‌ మీకు జీవనోపాధిగా ప్రసా దించిన వాటిలో ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన పదార్థాలను తినండి. మీరు విశ్వసించిన అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి.

5:89 – لَا يُؤَاخِذُكُمُ اللَّـهُ بِاللَّغْوِ فِي أَيْمَانِكُمْ وَلَـٰكِن يُؤَاخِذُكُم بِمَا عَقَّدتُّمُ الْأَيْمَانَ ۖ فَكَفَّارَتُهُ إِطْعَامُ عَشَرَةِ مَسَاكِينَ مِنْ أَوْسَطِ مَا تُطْعِمُونَ أَهْلِيكُمْ أَوْ كِسْوَتُهُمْ أَوْ تَحْرِيرُ رَقَبَةٍ ۖ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ ثَلَاثَةِ أَيَّامٍ ۚ ذَٰلِكَ كَفَّارَةُ أَيْمَانِكُمْ إِذَا حَلَفْتُمْ ۚ وَاحْفَظُوا أَيْمَانَكُمْ ۚ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّـهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَشْكُرُونَ ٨٩

మీరు ఉద్దేశం లేకుండానే చేసిన ప్రమాణా లను గురించి అల్లాహ్‌ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు బుద్ధిపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని (తప్పకుండా) పట్టు కుంటాడు. కావున దానికి (ఇలాంటి ప్రమాణ భంగానికి) పరిహారంగా మీరు మీ ఇంటి వారికి పెట్టే, మధ్య రకమైన ఆహారం పది మంది పేదలకు పెట్టాలి. లేదా వారికి వస్త్రాలు ఇవ్వాలి. లేదా ఒక బానిసకు స్వాతంత్ర్యం ఇప్పించాలి. ఎవడికి ఈశక్తి లేదో! అతడు మూడుదినాలు ఉపవాసం ఉండాలి. మీరు ప్రమాణం చేసి భంగపరిస్తే, ఇది దానికి పరి హారం (కఫ్ఫారా). 50 మీ ప్రమాణాలను కాపాడు కోండి. మీరు కృతజ్ఞులై ఉండటానికి అల్లాహ్‌ తన ఆజ్ఞలను ఈవిధంగా మీకు విశదపరుస్తున్నాడు 61

5:90 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّمَا الْخَمْرُ وَالْمَيْسِرُ وَالْأَنصَابُ وَالْأَزْلَامُ رِجْسٌ مِّنْ عَمَلِ الشَّيْطَانِ فَاجْتَنِبُوهُ لَعَلَّكُمْ تُفْلِحُونَ ٩٠

ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, మద్య పానం, జూదం, బలిపీఠం మీద బలిఇవ్వటం (అ’న్సాబ్‌) మరియు శకునానికై బాణాల ప్రయోగం (అ’జ్లామ్‌) ఇవన్నీ కేవలం అసహ్య కరమైన షై’తాన్‌ చేష్టలు, కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి.

5:91 – إِنَّمَا يُرِيدُ الشَّيْطَانُ أَن يُوقِعَ بَيْنَكُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ فِي الْخَمْرِ وَالْمَيْسِرِ وَيَصُدَّكُمْ عَن ذِكْرِ اللَّـهِ وَعَنِ الصَّلَاةِ ۖ فَهَلْ أَنتُم مُّنتَهُونَ ٩١

నిశ్చయంగా, షై’తాన్‌ మద్యపానం మరియు జూదం ద్వారా మీ మధ్య విరోధాలు మరియు విద్వేషాలు రేకెత్తించాలని మరియు మిమ్మల్ని అల్లాహ్‌ ధ్యానం నుండి మరియు నమా’జ్‌ నుండి తొలగించాలని కోరుతున్నాడు. అయితే మీరిప్పుడైనా మానుకోరా?

5:92 – وَأَطِيعُوا اللَّـهَ وَأَطِيعُوا الرَّسُولَ وَاحْذَرُوا ۚ فَإِن تَوَلَّيْتُمْ فَاعْلَمُوا أَنَّمَا عَلَىٰ رَسُولِنَا الْبَلَاغُ الْمُبِينُ ٩٢

మరియు మీరు అల్లాహ్‌కు విధేయులై ఉండండి మరియు ప్రవక్తను అనుసరించండి. జాగ్రత్త! మీరు ఒకవేళ తిరిగిపోతే! నిశ్చయంగా, మా ప్రవక్త బాధ్యత కేవలం (మా ఆజ్ఞలను) మీకు స్పష్టంగా అందజేయటం మాత్రమే అని తెలుసుకోండి.

5:93 – لَيْسَ عَلَى الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جُنَاحٌ فِيمَا طَعِمُوا إِذَا مَا اتَّقَوا وَّآمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ثُمَّ اتَّقَوا وَّآمَنُوا ثُمَّ اتَّقَوا وَّأَحْسَنُوا ۗ وَاللَّـهُ يُحِبُّ الْمُحْسِنِينَ ٩٣

విశ్వసించి సత్కార్యాలు చేసేవారిపై, (ఇంతకు ముందు) వారు తిన్న (త్రాగిన) దాన్ని గురించి దోషం లేదు; ఒకవేళ వారు దైవభీతి కలిగి ఉండి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తూఉంటే, ఇంకా దైవభీతి కలిగి ఉండి విశ్వాసులైతే, ఇంకా దైవభీతి కలిగి ఉండి సజ్జనులైతే! మరియు అల్లాహ్‌ సజ్జనులను ప్రేమిస్తాడు.

5:94 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَيَبْلُوَنَّكُمُ اللَّـهُ بِشَيْءٍ مِّنَ الصَّيْدِ تَنَالُهُ أَيْدِيكُمْ وَرِمَاحُكُمْ لِيَعْلَمَ اللَّـهُ مَن يَخَافُهُ بِالْغَيْبِ ۚ فَمَنِ اعْتَدَىٰ بَعْدَ ذَٰلِكَ فَلَهُ عَذَابٌ أَلِيمٌ ٩٤

ఓ విశ్వాసులారా! (మీరు ఇ’హ్రామ్‌ స్థితిలో ఉన్నప్పుడు) – మీ ఇంద్రియాలకు అగోచరమైన అల్లాహ్‌కు ఎవరు భయపడతారో చూడటానికి –అల్లాహ్‌ మీ చేతులకు మరియు మీ బల్లెములకు అందుబాటులో ఉన్న కొన్ని వేట (జంతువుల) ద్వారా మిమ్మల్ని పరీక్షకు గురిచేస్తాడు. కావున ఈ (హెచ్చరిక) తరువాతకూడా ఎవడుహద్దులను అతిక్రమిస్తాడో, వాడికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

5:95 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقْتُلُوا الصَّيْدَ وَأَنتُمْ حُرُمٌ ۚ وَمَن قَتَلَهُ مِنكُم مُّتَعَمِّدًا فَجَزَاءٌ مِّثْلُ مَا قَتَلَ مِنَ النَّعَمِ يَحْكُمُ بِهِ ذَوَا عَدْلٍ مِّنكُمْ هَدْيًا بَالِغَ الْكَعْبَةِ أَوْ كَفَّارَةٌ طَعَامُ مَسَاكِينَ أَوْ عَدْلُ ذَٰلِكَ صِيَامًا لِّيَذُوقَ وَبَالَ أَمْرِهِ ۗ عَفَا اللَّـهُ عَمَّا سَلَفَ ۚ وَمَنْ عَادَ فَيَنتَقِمُ اللَّـهُ مِنْهُ ۗ وَاللَّـهُ عَزِيزٌ ذُو انتِقَامٍ ٩٥

ఓ విశ్వాసులారా! మీరు ఇ’హ్రామ్‌ స్థితిలో ఉన్నప్పుడు వేటాడకండి. 64 మీలో ఎవరైనా బుద్ధి పూర్వకంగా వేటచేస్తే, అతడు చంపిన జంతువుతో సరితూగే ఒక పశువును పరిహారంగా సమర్పించు కోవాలి. దానిని (ఆ పశువును) మీలో న్యాయ వర్తులైన ఇద్దరు వ్యక్తులు నిర్ణయించాలి. పశువును ఖుర్బానీ కొరకు క’అబహ్ వద్దకు చేర్చాలి. లేదా దానికి పరిహారంగా కొందరు పేదలకు భోజనం పెట్టాలి, లేదా దానికి పరిహారంగా – తాను చేసిన దాని ప్రతిఫలాన్ని చవి చూడటానికి – ఉపవాసముండాలి. గడిచిపోయిన దానిని అల్లాహ్‌ మన్నించాడు. కాని ఇక ముందు ఎవరైనా మళ్ళీ అలా చేస్తే అల్లాహ్‌ అతనికి ప్రతీకారం చేస్తాడు. మరియు అల్లాహ్‌ సర్వ శక్తి సంపన్నుడు, ప్రతీకారం చేయగలవాడు.

5:96 – أُحِلَّ لَكُمْ صَيْدُ الْبَحْرِ وَطَعَامُهُ مَتَاعًا لَّكُمْ وَلِلسَّيَّارَةِ ۖ وَحُرِّمَ عَلَيْكُمْ صَيْدُ الْبَرِّ مَا دُمْتُمْ حُرُمًا ۗ وَاتَّقُوا اللَّـهَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ ٩٦

సముద్ర జంతువులను వేటాడటం మరియు వాటిని తినటం, 65 జీవనోపాధిగా మీకూ (స్థిరనివాసులకూ) మరియు ప్రయాణీకులకూ ధర్మ సమ్మతం చేయబడింది. కానీ, మీరు ఇ’హ్రామ్‌ స్థితిలో ఉన్నంత వరకూ భూమిపై వేటాడటం మీకు నిషేధింపబడింది. కావున మీరు (పునరు త్థానదినమున) ఎవరి ముందు అయితే సమావేశ పరచబడతారో ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. (1/8)

5:97 – جَعَلَ اللَّـهُ الْكَعْبَةَ الْبَيْتَ الْحَرَامَ قِيَامًا لِّلنَّاسِ وَالشَّهْرَ الْحَرَامَ وَالْهَدْيَ وَالْقَلَائِدَ ۚ ذَٰلِكَ لِتَعْلَمُوا أَنَّ اللَّـهَ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَأَنَّ اللَّـهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ٩٧

అల్లాహ్‌ పవిత్ర గృహం అయిన క’అబహ్ ను మానవజాతి కొరకు, సురక్షితమైన శాంతి నిల యంగా (బైతుల్‌ ‘హరామ్‌గా) చేశాడు 66 మరియు పవిత్ర మాసాన్ని మరియు బలి (హద్‌య) పశువులను మరియు మెడలలో పట్టాలువేసి క’అబహ్‌కు ఖుర్బానీ కొరకు తేబడే పశువులను (ఖలాఇ’దలను) కూడా నియమించాడు. ఇది ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్నదంతా నిశ్చయంగా, అల్లాహ్‌ ఎరుగునని, మీరు తెలుసు కోవాలని! మరియు నిశ్చయంగా అల్లాహ్‌కు ప్రతి ఒక్క విషయం గురించి బాగా తెలుసు.

5:98 – اعْلَمُوا أَنَّ اللَّـهَ شَدِيدُ الْعِقَابِ وَأَنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ٩٨

నిశ్చయంగా, అల్లాహ్‌ శిక్ష విధించటంలో కఠినుడని తెలుసుకోండి మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

5:99 – مَّا عَلَى الرَّسُولِ إِلَّا الْبَلَاغُ ۗ وَاللَّـهُ يَعْلَمُ مَا تُبْدُونَ وَمَا تَكْتُمُونَ ٩٩

సందేశహరుని బాధ్యత కేవలం (అల్లాహ్‌ సందేశాలను) మీకు అందజేయటమే! మరియు మీరు వెలిబుచ్చేది మరియు దాచేది అంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.

5:100 – قُل لَّا يَسْتَوِي الْخَبِيثُ وَالطَّيِّبُ وَلَوْ أَعْجَبَكَ كَثْرَةُ الْخَبِيثِ ۚ فَاتَّقُوا اللَّـهَ يَا أُولِي الْأَلْبَابِ لَعَلَّكُمْ تُفْلِحُونَ ١٠٠

(ఓ ప్రవక్తా!) ఇలా అను: ”చెడు వస్తువుల ఆధిక్యత నీకు ఎంతనచ్చినా! చెడు మరియు మంచివస్తువులు సరిసమానంకాజాలవు. 67 కావున ఓ బుధ్ధిమంతులారా! మీరు సాఫల్యం పొందాలంటే అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండండి.”

5:101 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَسْأَلُوا عَنْ أَشْيَاءَ إِن تُبْدَ لَكُمْ تَسُؤْكُمْ وَإِن تَسْأَلُوا عَنْهَا حِينَ يُنَزَّلُ الْقُرْآنُ تُبْدَ لَكُمْ عَفَا اللَّـهُ عَنْهَا ۗ وَاللَّـهُ غَفُورٌ حَلِيمٌ ١٠١

ఓ విశ్వాసులారా! వ్యక్తపరిస్తే మీకు బాధ కలిగించెడు విషయాలను గురించి, మీరు ప్రశ్నించ కండి. ఖుర్‌ఆన్‌ అవతరింపజేయబడేటప్పుడు, మీరు వాటిని గురించి ప్రశ్నిస్తే! అవి మీకు విశదపరచబడవచ్చు! వాటి కొరకు (ఇంతవరకు మీరు చేసిన ప్రశ్నల కొరకు) అల్లాహ్‌ మిమ్మల్ని మన్నించాడు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, సహనశీలుడు.

5:102 – قَدْ سَأَلَهَا قَوْمٌ مِّن قَبْلِكُمْ ثُمَّ أَصْبَحُوا بِهَا كَافِرِينَ ١٠٢

వాస్తవానికి మీకు పూర్వం ఒక జాతివారు ఇటు వంటి ప్రశ్నలనే అడిగారు. తరువాత వాటి (ఆ ప్రశ్నల) కారణంగానే వారు సత్యతిరస్కారానికి గురి అయ్యారు. 68

5:103 – مَا جَعَلَ اللَّـهُ مِن بَحِيرَةٍ وَلَا سَائِبَةٍ وَلَا وَصِيلَةٍ وَلَا حَامٍ ۙ وَلَـٰكِنَّ الَّذِينَ كَفَرُوا يَفْتَرُونَ عَلَى اللَّـهِ الْكَذِبَ ۖ وَأَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ ١٠٣

అల్లాహ్‌ బ’హీరహ్‌ను గానీ, సాయి’బహ్‌ ను గానీ, వ’సీలహ్‌ను గానీ లేక ‘హామ్‌ను గానీ నియమించ లేదు. 69 కాని సత్య-తిరస్కారులు అల్లాహ్‌పై అబద్ధాలు కల్పిస్తున్నారు. మరియు వారిలో చాలా మంది బుద్ధిహీనులే!

5:104 – وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَىٰ مَا أَنزَلَ اللَّـهُ وَإِلَى الرَّسُولِ قَالُوا حَسْبُنَا مَا وَجَدْنَا عَلَيْهِ آبَاءَنَا ۚ أَوَلَوْ كَانَ آبَاؤُهُمْ لَا يَعْلَمُونَ شَيْئًا وَلَا يَهْتَدُونَ ١٠٤

ఓ విశ్వాసులారా! మీ స్వయానికి మీరు బాధ్యత వహించండి. మీరు సన్మార్గంలో ఉంటే, మార్గభ్రష్టులైన వారు, మీకు ఎలాంటి హాని చేయలేరు. 70 మీరంతా అల్లాహ్‌ వైపునకే మరలి పోవలసి వుంది. అప్పుడు ఆయన మీరేమేమి చేస్తూ ఉండేవారో మీకు తెలియజేస్తాడు.

5:105 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا عَلَيْكُمْ أَنفُسَكُمْ ۖ لَا يَضُرُّكُم مَّن ضَلَّ إِذَا اهْتَدَيْتُمْ ۚ إِلَى اللَّـهِ مَرْجِعُكُمْ جَمِيعًا فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ١٠٥

ఓ విశ్వాసులారా! మీలో ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైతే, మీరు వీలునామా వ్రాసే టప్పుడు, మీలో న్యాయవర్తులైన ఇద్దరు వ్యక్తు లను సాక్షులుగాతీసుకోండి. ఒకవేళ మీరు ప్రయాణ స్థితిలో ఉండి, అక్కడ మీకు మరణ ఆపద సంభ విస్తే, మీ వారు (ముస్లింలు లేకుంటే) ఇతరులను ఎవరినైనా ఇద్దరిని (సాక్షులుగా) తీసుకోవచ్చు. ఆ ఇద్దరినీ నమా’జ్‌ తరువాత ఆపుకోండి. మీకు సందేహముంటే, వారిద్దరూ అల్లాహ్‌పై ప్రమాణం చేసి ఇలా అనాలి: ”మా దగ్గరి బంధువుకొరకైనా సరే, మేము స్వార్థం కొరకు మా సాక్ష్యాన్ని అమ్మము. మేము అల్లాహ్‌ కొరకు ఇచ్చే సాక్ష్యాన్ని దాచము. మేము ఆవిధంగా చేస్తే నిశ్చయంగా, పాపాత్ము లలో లెక్కింపబడుదుము గాక!”

5:106 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا شَهَادَةُ بَيْنِكُمْ إِذَا حَضَرَ أَحَدَكُمُ الْمَوْتُ حِينَ الْوَصِيَّةِ اثْنَانِ ذَوَا عَدْلٍ مِّنكُمْ أَوْ آخَرَانِ مِنْ غَيْرِكُمْ إِنْ أَنتُمْ ضَرَبْتُمْ فِي الْأَرْضِ فَأَصَابَتْكُم مُّصِيبَةُ الْمَوْتِ ۚ تَحْبِسُونَهُمَا مِن بَعْدِ الصَّلَاةِ فَيُقْسِمَانِ بِاللَّـهِ إِنِ ارْتَبْتُمْ لَا نَشْتَرِي بِهِ ثَمَنًا وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ ۙ وَلَا نَكْتُمُ شَهَادَةَ اللَّـهِ إِنَّا إِذًا لَّمِنَ الْآثِمِينَ ١٠٦

కాని, ఆ తరువాత ఆ ఇద్దరు (సాక్షులు) పాపం చేశారని తెలిస్తే! అప్పుడు మొదటి ఇద్దరి (సాక్ష్యం) వలన హక్కును కోల్పోయిన వారి (బంధువుల)లో నుండి ఇద్దరు మొదటి వారిద్దరికి బదులుగా నిలబడి అల్లాహ్‌పై శపథం చేసి ఇలా అనాలి: ”మా సాక్ష్యం వీరిరువురి సాక్ష్యం కంటే ఎక్కువ హక్కుగలది (సత్యమైనది). మరియు మేము ఏ విధమైన అక్రమానికి పాల్పడలేదు. మేము ఆవిధంగా చేస్తే నిశ్చయంగా, అన్యాయ పరులలో చేరిపోదుము గాక!”

5:107 – فَإِنْ عُثِرَ عَلَىٰ أَنَّهُمَا اسْتَحَقَّا إِثْمًا فَآخَرَانِ يَقُومَانِ مَقَامَهُمَا مِنَ الَّذِينَ اسْتَحَقَّ عَلَيْهِمُ الْأَوْلَيَانِ فَيُقْسِمَانِ بِاللَّـهِ لَشَهَادَتُنَا أَحَقُّ مِن شَهَادَتِهِمَا وَمَا اعْتَدَيْنَا إِنَّا إِذًا لَّمِنَ الظَّالِمِينَ ١٠٧

ఇది (ఈ పద్ధతి) ప్రజలు నిజమైన సాక్ష్యం ఇవ్వటానికి లేదా వారి ప్రమాణాలను, తరువాత తీసుకొనబడే ప్రమాణాలు ఖండిస్తాయని వారిని భయపెట్టటానికి ఉత్తమమైనది. అల్లాహ్ యందు భయ-భక్తులు కలిగి ఉండి, (ఆయన ఆదేశాలను) వినండి. మరియు అల్లాహ్‌ అవిధేయులకు సన్మార్గం చూపడు. (1/4)

5:108 – ذَٰلِكَ أَدْنَىٰ أَن يَأْتُوا بِالشَّهَادَةِ عَلَىٰ وَجْهِهَا أَوْ يَخَافُوا أَن تُرَدَّ أَيْمَانٌ بَعْدَ أَيْمَانِهِمْ ۗ وَاتَّقُوا اللَّـهَ وَاسْمَعُوا ۗ وَاللَّـهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ ١٠٨

ఆ రోజు అల్లాహ్‌ ప్రవక్తలందరిని సమా వేశపరచి: ”మీకేమి జవాబు ఇవ్వబడింది?” అని అడిగితే! వారు: ”మాకు యథార్థ జ్ఞానం లేదు! నిశ్చయంగా, నీవు మాత్రమే సర్వ అగోచర విష యాల జ్ఞానం గలవాడవు.” అని పలుకుతారు 71

5:109 – يَوْمَ يَجْمَعُ اللَّـهُ الرُّسُلَ فَيَقُولُ مَاذَا أُجِبْتُمْ ۖ قَالُوا لَا عِلْمَ لَنَا ۖ إِنَّكَ أَنتَ عَلَّامُ الْغُيُوبِ ١٠٩

(జ్ఞాపకముంచుకోండి!) అప్పుడు (పునరు త్థాన దినమున), అల్లాహ్‌: ”ఓ మర్యమ్‌ కుమా రుడా! ‘ఈసా (ఏసు) నేను నీకు మరియు నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకంచేసుకో! నేను పరిశుద్ధాత్మ (రూ’హుల్‌ ఖుదుస్) 72 ద్వారా నిన్ను బలపరిచాను, నీవు ఉయ్యాలలోనూ మరియు యుక్త వయస్సులోనూ ప్రజలతో మాట్లాడేవాడివి. మరియు నేను గ్రంథాన్ని మరియు వివేకాన్ని, తౌరాతును మరియు ఇంజీలు ను నీకు నేర్పాను. 73 మరియు నీవు నా ఆజ్ఞతో పక్షిఆకారం గల మట్టి బొమ్మను తయారు చేసి, దానిలో ఊదినపుడు, నా ఆజ్ఞతో అది పక్షిగా మారిపోయేది. మరియు నీవు పుట్టుగ్రుడ్డిని మరియు కుష్ఠురోగిని నా ఆజ్ఞతో బాగుచేసేవాడివి. మరియు నీవు నా ఆజ్ఞతో మృతులను లేపే వాడివి. 74 మరియు నీవు స్పష్టమైన సూచన లతో ఇస్రాయీ’లు సంతతివారి వద్దకు వచ్చి నపుడు, 75 వారిలోని సత్య-తిరస్కారులు: ‘ఇది స్పష్టమైన మాయా జాలం తప్ప మరేమీ కాదు!’ ” అని అన్నారు. అప్పుడు నేను వారి కుట్ర నుండి నిన్ను కాపాడాను!

5:110 – إِذْ قَالَ اللَّـهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ اذْكُرْ نِعْمَتِي عَلَيْكَ وَعَلَىٰ وَالِدَتِكَ إِذْ أَيَّدتُّكَ بِرُوحِ الْقُدُسِ تُكَلِّمُ النَّاسَ فِي الْمَهْدِ وَكَهْلًا ۖ وَإِذْ عَلَّمْتُكَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَالتَّوْرَاةَ وَالْإِنجِيلَ ۖ وَإِذْ تَخْلُقُ مِنَ الطِّينِ كَهَيْئَةِ الطَّيْرِ بِإِذْنِي فَتَنفُخُ فِيهَا فَتَكُونُ طَيْرًا بِإِذْنِي ۖ وَتُبْرِئُ الْأَكْمَهَ وَالْأَبْرَصَ بِإِذْنِي ۖ وَإِذْ تُخْرِجُ الْمَوْتَىٰ بِإِذْنِي ۖ وَإِذْ كَفَفْتُ بَنِي إِسْرَائِيلَ عَنكَ إِذْ جِئْتَهُم بِالْبَيِّنَاتِ فَقَالَ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ إِنْ هَـٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ ١١٠

మరియు నేను, (‘ఈసా) శిష్యుల (‘హవారి య్యూన్‌ల) మనస్సులలో ఇలా మాట వేసినప్పుడు: 76 ”నన్ను మరియు నా ప్రవక్తను విశ్వసించండి.” వారన్నారు: ”మేము విశ్వ సించాము మరియు మేము ముస్లింలము అయ్యాము అనే మాటకు సాక్షిగా ఉండు!”

5:111 – وَإِذْ أَوْحَيْتُ إِلَى الْحَوَارِيِّينَ أَنْ آمِنُوا بِي وَبِرَسُولِي قَالُوا آمَنَّا وَاشْهَدْ بِأَنَّنَا مُسْلِمُونَ ١١١

(జ్ఞాపకం చేసుకోండి!) ఆ శిష్యులు (‘హవా రియ్యూన్‌): ”ఓ మర్యమ్‌ కుమారుడవైన ‘ఈసా (ఏసూ) ఏమీ? నీప్రభువు మాకొరకు ఆకాశంనుండి ఆహారంతో నిండిన ఒకపళ్ళెం దింపగలడా?” అని అడిగారు! 77 దానికి (‘ఈసా): ”మీరు వాస్త వానికి విశ్వాసులే అయితే, అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి!” అని అన్నాడు.

5:112 – إِذْ قَالَ الْحَوَارِيُّونَ يَا عِيسَى ابْنَ مَرْيَمَ هَلْ يَسْتَطِيعُ رَبُّكَ أَن يُنَزِّلَ عَلَيْنَا مَائِدَةً مِّنَ السَّمَاءِ ۖ قَالَ اتَّقُوا اللَّـهَ إِن كُنتُم مُّؤْمِنِينَ ١١٢

వారు: ”వాస్తవానికి, మేము దానినుండి తిని, మా హృదయాలను తృప్తిపరచుకోవటానికి మరియు నీవు మాతో సత్యం పలికావని తెలుసుకోవటానికి మరియు దానిని గురించి మేము సాక్షులుగా ఉండటానికి, మేమిలా కోరుతున్నాము!” అని అన్నారు.

5:113 – قَالُوا نُرِيدُ أَن نَّأْكُلَ مِنْهَا وَتَطْمَئِنَّ قُلُوبُنَا وَنَعْلَمَ أَن قَدْ صَدَقْتَنَا وَنَكُونَ عَلَيْهَا مِنَ الشَّاهِدِينَ ١١٣

దానికి మర్యమ్‌ కుమారుడు ‘ఈసా (ఏసు): ”ఓ అల్లాహ్‌! మా ప్రభూ! ఆకాశం నుండి ఆహారంతో నిండిన ఒక పళ్ళాన్ని మా కొరకు అవతరింపజేయి (దింపు); అది మాకు మొదటి వాని నుండి చివరివాని వరకు పండుగగా ఉండాలి; అది నీ తరఫు నుండి ఒక సూచనగా ఉండాలి. మాకు ఆహారాన్ని ప్రసాదించు. నీవే అత్యుత్తమ మైన ఉపాధి ప్రదాతవు!” అని ప్రార్థించాడు.

5:114 – قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ اللَّـهُمَّ رَبَّنَا أَنزِلْ عَلَيْنَا مَائِدَةً مِّنَ السَّمَاءِ تَكُونُ لَنَا عِيدًا لِّأَوَّلِنَا وَآخِرِنَا وَآيَةً مِّنكَ ۖ وَارْزُقْنَا وَأَنتَ خَيْرُ الرَّازِقِينَ ١١٤

(అప్పుడు) అల్లాహ్‌: ”నిశ్చయంగా, నేను దానిని మీపై అవతరింపజేస్తాను (దింపుతాను). కాని, దాని తరువాత కూడా మీలో ఎవడైనా సత్య-తిరస్కారానికి పాల్పడితే! నిశ్చయంగా, వానికి నేను ఇంతవరకు సర్వలోకాలలో ఎవ్వడికీ విధించని శిక్షను విధిస్తాను!” అని అన్నాడు.

5:115 – قَالَ اللَّـهُ إِنِّي مُنَزِّلُهَا عَلَيْكُمْ ۖ فَمَن يَكْفُرْ بَعْدُ مِنكُمْ فَإِنِّي أُعَذِّبُهُ عَذَابًا لَّا أُعَذِّبُهُ أَحَدًا مِّنَ الْعَالَمِينَ ١١٥

మరియు (జ్ఞాపకముంచుకోండి!)అప్పుడు (పునరుత్థాన దినమున), అల్లాహ్‌: ”ఓ మర్యమ్‌ కుమారుడా! ‘ఈసా (ఏసు) ఏమీ? నీవు ప్రజలతో: ‘అల్లాహ్‌కు బదులుగా నన్నూమరియు నా తల్లినీ ఆరాధ్యులుగా చేసుకోండి!’ అని చెప్పావా?” అని ప్రశ్నించగా! దానికి అతను (‘ఈసా) అంటాడు: ”నీవు సర్వలోపాలకు అతీతుడవు. నాకు పలక టానికి అర్హతలేని మాటను నేను పలకటం తగిన పని కాదు. ఒకవేళ నేను అలా చెప్పిఉంటే నీకు తప్పక తెలిసి ఉండేది. నా మనస్సులో ఉన్నది నీకు తెలుసు, కాని నీ మనస్సులో ఉన్నది నాకు తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వ అగోచర విషయాలు తెలిసినవాడవు!

5:116 – وَإِذْ قَالَ اللَّـهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَـٰهَيْنِ مِن دُونِ اللَّـهِ ۖ قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ ۚ إِن كُنتُ قُلْتُهُ فَقَدْ عَلِمْتَهُ ۚ تَعْلَمُ مَا فِي نَفْسِي وَلَا أَعْلَمُ مَا فِي نَفْسِكَ ۚ إِنَّكَ أَنتَ عَلَّامُ الْغُيُوبِ ١١٦

”నీవు ఆదేశించింది తప్ప, నేను మరేమీ వారికి చెప్పలేదు, అంటే: ‘నా ప్రభువు మరియు మీ ప్రభువు అయిన అల్లాహ్‌నే ఆరాధించండి.’ అని. నేను వారి మధ్య ఉన్నంత వరకు వారికి సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత నీవే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. మరియు నీవే ప్రతిదానికి సాక్షివి! 79

5:117 – مَا قُلْتُ لَهُمْ إِلَّا مَا أَمَرْتَنِي بِهِ أَنِ اعْبُدُوا اللَّـهَ رَبِّي وَرَبَّكُمْ ۚ وَكُنتُ عَلَيْهِمْ شَهِيدًا مَّا دُمْتُ فِيهِمْ ۖ فَلَمَّا تَوَفَّيْتَنِي كُنتَ أَنتَ الرَّقِيبَ عَلَيْهِمْ ۚ وَأَنتَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ ١١٧

”నీవు ఆదేశించింది తప్ప, నేను మరేమీ వారికి చెప్పలేదు, అంటే: ‘నా ప్రభువు మరియు మీ ప్రభువు అయిన అల్లాహ్‌నే ఆరాధించండి.’ అని. నేను వారి మధ్య ఉన్నంత వరకు వారికి సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత నీవే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. 78 మరియు నీవే ప్రతిదానికి సాక్షివి! 79

5:118 – إِن تُعَذِّبْهُمْ فَإِنَّهُمْ عِبَادُكَ ۖ وَإِن تَغْفِرْ لَهُمْ فَإِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ ١١٨

”ఒకవేళ నీవు వారినిశిక్షించదలిస్తే వారు నీ దాసులే! మరియు నీవు వారిని క్షమించదలిస్తే! నీవు సర్వ శక్తిమంతుడవు మహా వివేచనా పరుడవు!”

5:119 – قَالَ اللَّـهُ هَـٰذَا يَوْمُ يَنفَعُ الصَّادِقِينَ صِدْقُهُمْ ۚ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ رَّضِيَ اللَّـهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ ١١٩

అప్పుడుఅల్లాహ్‌ ఇలాసెలవిచ్చాడు: ”ఈ రోజు సత్యవంతులకు వారిసత్యం లాభదాయక మవుతుంది. వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు లభిస్తాయి. అక్కడ వారు శాశ్వతంగా కలకాలం ఉంటారు. అల్లాహ్‌ వారిపట్ల ప్రసన్ను డవుతాడు మరియు వారు ఆయనతో ప్రసన్ను లవుతారు. ఇదే గొప్ప విజయం (సాఫల్యం)!”

5:120 – لِلَّـهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا فِيهِنَّ ۚ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١٢٠

ఆకాశాలపైననూ, భూమిపైననూ మరియు వాటిలో నున్న సమస్తం పైననూ, సామ్రాజ్యాధి పత్యం అల్లాహ్‌దే! మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్థుడు (అన్నింటిపై అధికారం గలవాడు).

సూరహ్‌ అల్‌-అన్‌’ఆమ్‌ – ఈ సూరహ్‌ చివరి మక్కహ్ కాలంలో అవతరింపజేయబడింది. అన్‌’ఆమున్‌: పశువులు. 162- 163వ ఆయతులలో ఉన్న ప్రార్థన ఎంతో మహత్త్వమైనది. 50వ ఆయత్‌ ఎంతో ముఖ్య మైనది: ”(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: ‘నా వద్ద అల్లాహ్‌ కోశాగారాలున్నాయని గానీ, లేదా నాకు అగోచర జ్ఞానమున్నదని గానీ , నేను మీతో అనడంలేదు. లేదా నేను దేవదూతనని కూడా అనడంలేదు. కాని నేను కేవలం నాపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానాన్ని (వహీని) మాత్రమే అనుసరిస్తున్నాను.’ ” 165 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 136వ ఆయత్‌ లో ఉంది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 6:1 – الْحَمْدُ لِلَّـهِ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَجَعَلَ الظُّلُمَاتِ وَالنُّورَ ۖ ثُمَّ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ يَعْدِلُونَ ١

ఆకాశాలను మరియు భూమిని సృష్టించి; చీకట్లను మరియు వెలుగును నెలకొలిపిన అల్లాహ్‌ మాత్రమే సర్వ స్తోత్రాలకు అర్హుడు. అయినా సత్య-తిరస్కారులు (ఇతరులను) తమ ప్రభువుకు సమానులుగా పరిగణిస్తున్నారు.

6:2 – هُوَ الَّذِي خَلَقَكُم مِّن طِينٍ ثُمَّ قَضَىٰ أَجَلًا ۖ وَأَجَلٌ مُّسَمًّى عِندَهُ ۖ ثُمَّ أَنتُمْ تَمْتَرُونَ ٢

ఆయనే మిమ్మల్ని మట్టితో సృష్టించి, ఆ తరువాత మీకు ఒక గడువు నియమించాడు. 1 ఆయన దగ్గర మరొక నిర్ణీతగడువు కూడా ఉంది. 2

6:3 – وَهُوَ اللَّـهُ فِي السَّمَاوَاتِ وَفِي الْأَرْضِ ۖ يَعْلَمُ سِرَّكُمْ وَجَهْرَكُمْ وَيَعْلَمُ مَا تَكْسِبُونَ ٣

మరియు ఆయన! అల్లాహ్‌యే, ఆకాశాల లోనూ మరియు భూమిలోనూ (ఆరాధ్యుడు). మీరు దాచేది మరియు వెలిబుచ్చేది, అంతా ఆయనకు తెలుసు మరియు మీరు అర్జించేది (మంచి-చెడు) అంతా ఆయనకు బాగా తెలుసు. 3

6:4 – وَمَا تَأْتِيهِم مِّنْ آيَةٍ مِّنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ ٤

అయినా వారి ప్రభువు సూచనల నుండి వారి వద్దకు ఏ సూచన వచ్చినా దానికి వారు విముఖతే చూపేవారు!

6:5 – فَقَدْ كَذَّبُوا بِالْحَقِّ لَمَّا جَاءَهُمْ ۖ فَسَوْفَ يَأْتِيهِمْ أَنبَاءُ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ٥

వాస్తవానికి, ఇప్పుడు వారు తమ వద్దకు వచ్చిన సత్యాన్ని (ఈ దివ్యగ్రంథాన్ని) కూడా అసత్యమని తిరస్కరించారు. 4 కాబట్టి వారు పరిహసించేదాని (ప్రతిఫలాన్ని) గురించిన వార్త వారికి త్వరలోనే రానున్నది.

6:6 – أَلَمْ يَرَوْا كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّن قَرْنٍ مَّكَّنَّاهُمْ فِي الْأَرْضِ مَا لَمْ نُمَكِّن لَّكُمْ وَأَرْسَلْنَا السَّمَاءَ عَلَيْهِم مِّدْرَارًا وَجَعَلْنَا الْأَنْهَارَ تَجْرِي مِن تَحْتِهِمْ فَأَهْلَكْنَاهُم بِذُنُوبِهِمْ وَأَنشَأْنَا مِن بَعْدِهِمْ قَرْنًا آخَرِينَ ٦

ఏమీ? వారు చూడలేదా (వారికి తెలి యదా)? వారికి పూర్వం ఎన్నోతరాలను మేము నాశనం చేశాము. మేము మీకు ఇవ్వని ఎన్నో బల సంపదల నిచ్చి వారిని భువిలో స్థిరపరిచాము; మరియు వారిపై మేము ఆకాశం నుండి ధారా పాతంగా వర్షాలు కురిపించాము; మరియు క్రింద నదులను ప్రవహింపజేశాము; చివరకు వారు చేసిన పాపాలకుఫలితంగా వారిని నాశనంచేశాము; మరియు వారిస్థానంలో ఇతర తరాలవారిని లేపాము.

6:7 – وَلَوْ نَزَّلْنَا عَلَيْكَ كِتَابًا فِي قِرْطَاسٍ فَلَمَسُوهُ بِأَيْدِيهِمْ لَقَالَ الَّذِينَ كَفَرُوا إِنْ هَـٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ ٧

మరియు (ఓ ప్రవక్తా!) ఒకవేళ మేము చర్మ పత్రంపై 5 వ్రాయబడిన గ్రంథాన్ని నీపై అవత రింపజేసినా, అప్పుడు వారు దానిని తమ చేతులతో తాకి చూసినా! సత్య-తిరస్కారులు: ”ఇది స్పష్టమైన మాయాజాలం మాత్రమే!” అని అనే వారు. 6

6:8 – وَقَالُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ مَلَكٌ ۖ وَلَوْ أَنزَلْنَا مَلَكًا لَّقُضِيَ الْأَمْرُ ثُمَّ لَا يُنظَرُونَ ٨

మరియు వారు: ”ఇతనివద్దకు (ప్రవక్త వద్దకు) ఒక దైవదూత ఎందుకు దింపబడలేదు?” అని అడుగుతారు. మరియు ఒకవేళ మేము దైవదూతనే పంపిఉంటే! వారి తీర్పు వెంటనే జరిగి ఉండేది. ఆ తరువాత వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడి ఉండేది కాదు. 7

6:9 – وَلَوْ جَعَلْنَاهُ مَلَكًا لَّجَعَلْنَاهُ رَجُلًا وَلَلَبَسْنَا عَلَيْهِم مَّا يَلْبِسُونَ ٩

మరియు ఒకవేళ మేము దైవదూతను అవతరింపజేసినా, అతనిని మేము మానవ రూపం లోనే అవతరింప జేసి ఉండేవారం. మరియు వారు ఇపుడు ఏ సంశయంలో పడి ఉన్నారో! వారిని ఆసంశయానికే గురిచేసి ఉండేవారం.

6:10 – وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّن قَبْلِكَ فَحَاقَ بِالَّذِينَ سَخِرُوا مِنْهُم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ١٠

మరియు వాస్తవానికి నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలను ఎగతాళి చేయటం జరిగింది, కావున పరిహసించేవారు దేనిని గురించి ఎగతాళి చేసేవారో అదే వారిని చుట్టుకున్నది.

6:11 – قُلْ سِيرُوا فِي الْأَرْضِ ثُمَّ انظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ ١١

ఇలా అను: ”మీరు భూమిలో సంచారంచేసి, సత్య-తిరస్కారుల ముగింపు ఎలా జరిగిందో చూడండి!”

6:12 – قُل لِّمَن مَّا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ قُل لِّلَّـهِ ۚ كَتَبَ عَلَىٰ نَفْسِهِ الرَّحْمَةَ ۚ لَيَجْمَعَنَّكُمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ ۚ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُونَ ١٢

వారిని అడుగు: ”ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఎవరికి చెందినది?” అని. (నీవే) జవాబివ్వు: ”(అంతా) అల్లాహ్ దే!” ఆయన కరుణించటాన్ని, తనపై తాను (కర్తవ్యంగా) విధించుకున్నాడు. 8 నిశ్చయంగా, ఆయన పునరుత్థాన దినమున మీ అందరినీ సమావేశపరుస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరైతే తమను తాము నష్టానికి గురిచేసు కున్నారో, అలాంటి వారే విశ్వసించరు! (3/8)

6:13 – وَلَهُ مَا سَكَنَ فِي اللَّيْلِ وَالنَّهَارِ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ ١٣

మరియు రేయింబవళ్ళలో ఉన్నదంతా ఆయనకు చెందినదే. మరియు ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

6:14 – قُلْ أَغَيْرَ اللَّـهِ أَتَّخِذُ وَلِيًّا فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَهُوَ يُطْعِمُ وَلَا يُطْعَمُ ۗ قُلْ إِنِّي أُمِرْتُ أَنْ أَكُونَ أَوَّلَ مَنْ أَسْلَمَ ۖ وَلَا تَكُونَنَّ مِنَ الْمُشْرِكِينَ ١٤

ఓ ము’హమ్మద్‌!) ఇలా అను: ”ఏమీ? ఆకాశాల మరియు భూమి సృష్టికి మూలా ధారుడు 9 అయిన అల్లాహ్‌ను కాదని నేను మరెవరినైనా ఆరాధ్యునిగా 10 చేసుకోవాలా? మరియు ఆయనే అందరికి ఆహారమిస్తున్నాడు మరియు ఆయన కెవ్వడూ ఆహారమివ్వడు.” (ఇంకా) ఇలా అను: ”నిశ్చయంగా, అందరి కంటే ముందు నేను ఆయనకు (అల్లాహ్‌కు) విధేయు డను (ముస్లింను) కావాలని మరియు ఆయనకు (అల్లాహ్‌కు) సాటి కల్పించే వారిలో చేరకూడదనీ ఆదేశించబడ్డాను!”

6:15 – قُلْ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ ١٥

(ఇంకా) ఇలా అను: ”నిశ్చయంగా, నేను నా ప్రభువుకు అవిధేయుడనైతే నిశ్చయంగా, రాబోయే ఆ గొప్పదినపు శిక్ష నుండి భయపడు తున్నాను!”

6:16 – مَّن يُصْرَفْ عَنْهُ يَوْمَئِذٍ فَقَدْ رَحِمَهُ ۚ وَذَٰلِكَ الْفَوْزُ الْمُبِينُ ١٦

ఆ రోజు దాని (ఆ శిక్ష నుండి) తప్పించు కున్న వాడిని, వాస్తవంగా! ఆయన (అల్లాహ్‌) కరుణించినట్లే. మరియు అదే స్పష్టమైన విజయం (సాఫల్యం). 11

6:17 – وَإِن يَمْسَسْكَ اللَّـهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يَمْسَسْكَ بِخَيْرٍ فَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١٧

మరియు అల్లాహ్‌ నీకు ఏదైనా హాని కలిగిస్తే! ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలుచేస్తే! ఆయనే ప్రతిదీ చేయగల సమర్థుడు.

6:18 – وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهِ ۚ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ ١٨

మరియు ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) 12 గలవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసిన వాడు. 13

6:19 – قُلْ أَيُّ شَيْءٍ أَكْبَرُ شَهَادَةً ۖ قُلِ اللَّـهُ ۖ شَهِيدٌ بَيْنِي وَبَيْنَكُمْ ۚ وَأُوحِيَ إِلَيَّ هَـٰذَا الْقُرْآنُ لِأُنذِرَكُم بِهِ وَمَن بَلَغَ ۚ أَئِنَّكُمْ لَتَشْهَدُونَ أَنَّ مَعَ اللَّـهِ آلِهَةً أُخْرَىٰ ۚ قُل لَّا أَشْهَدُ ۚ قُلْ إِنَّمَا هُوَ إِلَـٰهٌ وَاحِدٌ وَإِنَّنِي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ ١٩

(ఓ ము’హమ్మద్‌! వారిని) అడుగు: ”అన్నిటి కంటే గొప్పసాక్ష్యం ఏది?” ఇలా అను: ”నాకూ మరియు మీకూ మధ్య అల్లాహ్‌ సాక్షిగా ఉన్నాడు. మరియు మిమ్మల్ని మరియు ఇది (ఈ సందేశం) అందిన వారిని అందరినీ హెచ్చరించటానికి, ఈ ఖుర్‌ఆన్‌ నాపై అవతరింప జేయబడింది.” ఏమీ? వాస్తవానికి అల్లాహ్‌తో పాటు ఇంకా ఇతర ఆరాధ్య దైవాలు ఉన్నారని మీరు నిశ్చయంగా సాక్ష్యమివ్వగలరా? ఇలా అను: ”నేనైతే అలాంటి సాక్ష్యమివ్వను!” ఇంకా ఇలా అను: ”నిశ్చయంగా, ఆయన (అల్లాహ్‌) ఒక్కడే ఆరాధ్య దేవుడు. మరియు నిశ్చయంగా, మీరు ఆయనకు సాటికల్పిస్తున్న దాని నుండి నాకు ఎలాంటి సంబంధం లేదు!”

6:20 – الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْرِفُونَهُ كَمَا يَعْرِفُونَ أَبْنَاءَهُمُ ۘ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُونَ ٢٠

ఎవరికైతే మేము గ్రంథాన్ని ప్రసాదించామో! వారు తమ పుత్రులను గుర్తించినట్లు, ఇతనిని (ము’హమ్మదును) కూడా గుర్తిస్తారు. ఎవరైతే, తమను తాము నష్టానికి గురిచేసుకుంటారో అలాంటి వారే విశ్వసించరు.

6:21 – وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّـهِ كَذِبًا أَوْ كَذَّبَ بِآيَاتِهِ ۗ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ ٢١

మరియు అల్లాహ్‌పై అసత్యం కల్పించే వాని కంటే! లేదా, అల్లాహ్‌ సూచనలను తిరస్కరించే వానికంటే, ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? నిశ్చ యంగా దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందరు.

6:22 – وَيَوْمَ نَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ نَقُولُ لِلَّذِينَ أَشْرَكُوا أَيْنَ شُرَكَاؤُكُمُ الَّذِينَ كُنتُمْ تَزْعُمُونَ ٢٢

మరియు ఆ రోజు మేము వారందరినీ సమావేశపరుస్తాము. ఆ తరువాత (అల్లాహ్‌కు) సాటికల్పించే (షిర్కుచేసే) వారితో: ”మీరు (దైవాలుగా) భావించిన (అల్లాహ్‌కు సాటి కల్పించిన) ఆ భాగస్వాములు ఇప్పుడు ఎక్క డున్నారు?” అని అడుగుతాము.

6:23 – ثُمَّ لَمْ تَكُن فِتْنَتُهُمْ إِلَّا أَن قَالُوا وَاللَّـهِ رَبِّنَا مَا كُنَّا مُشْرِكِينَ ٢٣

అప్పుడు వారికి: ”మా ప్రభువైన అల్లాహ్‌ సాక్షిగా! మేము ఆయనకు (అల్లాహ్‌కు) సాటి కల్పించేవారము (ముష్రికీన్‌) కాదు!” అని చెప్పడం తప్ప మరొక సాకు దొరకదు.

6:24 – انظُرْ كَيْفَ كَذَبُوا عَلَىٰ أَنفُسِهِمْ ۚ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ ٢٤

చూడండి! వారు తమను గురించి తామే ఏవిధంగా అబద్ధాలు కల్పించుకున్నారో! మరియు ఏ విధంగా వారు కల్పించుకున్నవి (బూటక దైవాలు) మాయమై పోయాయో!

6:25 – وَمِنْهُم مَّن يَسْتَمِعُ إِلَيْكَ ۖ وَجَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا ۚ وَإِن يَرَوْا كُلَّ آيَةٍ لَّا يُؤْمِنُوا بِهَا ۚ حَتَّىٰ إِذَا جَاءُوكَ يُجَادِلُونَكَ يَقُولُ الَّذِينَ كَفَرُوا إِنْ هَـٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ ٢٥

మరియు (ఓ ప్రవక్తా!) వారిలో కొందరు నీ (మాటలు) వింటున్నట్లు (నటించే) వారున్నారు. మరియు వారు దానిని అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసివున్నాము మరియు వారి చెవులకు చెవుడు పట్టించి వున్నాము. 14 మరియు వారు ఏ అద్భుత సంకేతాన్ని చూసినా దానిని విశ్వసించరు. చివరకు వారు నీ వద్దకు వచ్చి, నీతో వాదులాడే టప్పుడు, వారిలో సత్యాన్ని తిరస్కరించేవారు: ”ఇవి కేవలం పూర్వీకుల కట్టుకథలు మాత్రమే!” అని అంటారు.

6:26 – وَهُمْ يَنْهَوْنَ عَنْهُ وَيَنْأَوْنَ عَنْهُ ۖ وَإِن يُهْلِكُونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ ٢٦

మరియు వారు ఇతరులను అతని (ప్రవక్త) నుండి ఆపుతారు. మరియు స్వయంగా తాము కూడా అతనికి దూరంగా ఉంటారు. మరియు ఈ విధంగా వారు తమకు తామే నాశనం చేసు కుంటున్నారు. కాని వారది గ్రహించటం లేదు!

6:27 – وَلَوْ تَرَىٰ إِذْ وُقِفُوا عَلَى النَّارِ فَقَالُوا يَا لَيْتَنَا نُرَدُّ وَلَا نُكَذِّبَ بِآيَاتِ رَبِّنَا وَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ ٢٧

మరియు వారిని నరకం ముందు నిలబెట్టబడినపుడు, నీవు చూడగలిగితే (ఎంత బాగుండేది)! వారు ఇలా అంటారు: ”అయ్యో మా పాడుగాను! మేము తిరిగి (పూర్వ జీవితంలోకి) పంపబడితే, మా ప్రభువు సూచనలను, అసత్యాలని తిరస్కరించకుండా విశ్వాసులలో చేరిపోయేవారం కదా!” 15

6:28 – بَلْ بَدَا لَهُم مَّا كَانُوا يُخْفُونَ مِن قَبْلُ ۖ وَلَوْ رُدُّوا لَعَادُوا لِمَا نُهُوا عَنْهُ وَإِنَّهُمْ لَكَاذِبُونَ ٢٨

  1. (వారు ఇలా అనటానికి కారణం), వాస్తవానికి వారు ఇంతవరకు దాచినదంతా వారికి బహిర్గతం కావటమే! మరియు ఒకవేళ వారిని (గత జీవితంలోకి) తిరిగి పంపినా, వారికి నిషేధించ బడినవాటినే వారు తిరిగిచేస్తారు. నిశ్చయంగా, వారు అసత్యవాదులు!

6:29 – وَقَالُوا إِنْ هِيَ إِلَّا حَيَاتُنَا الدُّنْيَا وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ ٢٩

మరియు వారు: ”మాకు ఇహలోక జీవితం తప్ప మరొక (జీవితం) లేదు మరియు మేము తిరిగి లేపబడము (మాకు పునరుత్థానం లేదు)!” అని అంటారు.

6:30 – وَلَوْ تَرَىٰ إِذْ وُقِفُوا عَلَىٰ رَبِّهِمْ ۚ قَالَ أَلَيْسَ هَـٰذَا بِالْحَقِّ ۚ قَالُوا بَلَىٰ وَرَبِّنَا ۚ قَالَ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ ٣٠

మరియు ఒకవేళ వారిని, తమ ప్రభువు ముందు నిలబెట్టబడినప్పుడు, నీవు చూడగలిగితే (ఎంత బాగుండేది)! ఆయన (అల్లాహ్) అంటాడు: ”ఏమీ? ఇది (పునరుత్థానం) నిజం కాదా?” వారు జవాబిస్తారు: ”అవును (నిజమే) మా ప్రభువు సాక్షిగా!” అప్పుడు ఆయన: ”అయితే మీరు మీ సత్య-తిరస్కారానికి ఫలితంగా శిక్షను అనుభవించండి!” అని అంటాడు.

6:31 – قَدْ خَسِرَ الَّذِينَ كَذَّبُوا بِلِقَاءِ اللَّـهِ ۖ حَتَّىٰ إِذَا جَاءَتْهُمُ السَّاعَةُ بَغْتَةً قَالُوا يَا حَسْرَتَنَا عَلَىٰ مَا فَرَّطْنَا فِيهَا وَهُمْ يَحْمِلُونَ أَوْزَارَهُمْ عَلَىٰ ظُهُورِهِمْ ۚ أَلَا سَاءَ مَا يَزِرُونَ ٣١

వాస్తవంగా, అల్లాహ్‌ను కలుసుకోవటాన్ని అబద్ధంగా పరిగణించేవారే నష్టానికి గురిఅయిన వారు! 16 చివరకు అకస్మాత్తుగా అంతిమ ఘడియ వారిపైకి వచ్చినపుడు వారు: ”అయ్యో మా దౌర్భాగ్యం! దీని విషయంలో మేమెంత అశ్రధ్ధ వహించాము కదా! అని వాపోతారు. (ఎందుకంటే) వారు తమ (పాపాల) బరువును తమ వీపులపై మోసుకొని ఉంటారు. అయ్యో! వారు మోసే భారం ఎంత దుర్భరమైనది కదా!

6:32 – وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا لَعِبٌ وَلَهْوٌ ۖ وَلَلدَّارُ الْآخِرَةُ خَيْرٌ لِّلَّذِينَ يَتَّقُونَ ۗ أَفَلَا تَعْقِلُونَ ٣٢

మరియు ఇహలోక జీవితం ఒక ఆట మరియు ఒక కాలక్షేపము మాత్రమే! మరియు దైవభీతి గలవారికి పరలోకవాసమే అత్యంత శ్రేష్ఠమైనది. ఏమీ? మీరు అర్థం చేసుకోలేరా?

6:33 – قَدْ نَعْلَمُ إِنَّهُ لَيَحْزُنُكَ الَّذِي يَقُولُونَ ۖ فَإِنَّهُمْ لَا يُكَذِّبُونَكَ وَلَـٰكِنَّ الظَّالِمِينَ بِآيَاتِ اللَّـهِ يَجْحَدُونَ ٣٣

(ఓ ప్రవక్తా!) వాస్తవానికి వారుపలుకుతున్న మాటల వలన నీకు దుఃఖము కలుగుతున్నదని మాకు బాగా తెలుసు. కానీ నిశ్చయంగా వారు అసత్యుడవని తిరస్కరించేది నిన్ను కాదు! వాస్తవానికి ఆ దుర్మార్గులు అల్లాహ్‌ సూచన (ఆయాత్‌) లను తిరస్కరిస్తున్నారు 17

6:34 – وَلَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّن قَبْلِكَ فَصَبَرُوا عَلَىٰ مَا كُذِّبُوا وَأُوذُوا حَتَّىٰ أَتَاهُمْ نَصْرُنَا ۚ وَلَا مُبَدِّلَ لِكَلِمَاتِ اللَّـهِ ۚ وَلَقَدْ جَاءَكَ مِن نَّبَإِ الْمُرْسَلِينَ ٣٤

మరియు వాస్తవంగా, నీకు పూర్వం చాలా మంది ప్రవక్తలు, అసత్యవాదులని తిరస్కరించ బడ్డారు. కాని వారు, ఆ తిరస్కారానికి మరియు తమకు కలిగిన హింసలకు – వారికి మా సహాయం అందేవరకు – సహనం వహించారు. 18 మరియు అల్లాహ్‌ మాటలను ఎవ్వరూ మార్చలేరు. మరియు వాస్తవానికి, పూర్వపు ప్రవక్తల కొన్ని సమాచారాలు ఇదివరకే నీకు అందాయి.

6:35 – وَإِن كَانَ كَبُرَ عَلَيْكَ إِعْرَاضُهُمْ فَإِنِ اسْتَطَعْتَ أَن تَبْتَغِيَ نَفَقًا فِي الْأَرْضِ أَوْ سُلَّمًا فِي السَّمَاءِ فَتَأْتِيَهُم بِآيَةٍ ۚ وَلَوْ شَاءَ اللَّـهُ لَجَمَعَهُمْ عَلَى الْهُدَىٰ ۚ فَلَا تَكُونَنَّ مِنَ الْجَاهِلِينَ ٣٥

మరియు (ఓ ము’హమ్మద్‌!) వారి విముఖత నీకు భరించనిదైతే నీలో శక్తి ఉంటే, భూమిలో ఒక సొరంగం వెదకి, లేదా ఆకాశంలో ఒక నిచ్చెనవేసి, వారి కొరకు ఏదైనా అద్భుత సూచన తీసుకురా! మరియు అల్లాహ్‌ కోరితే వారందరినీ సన్మార్గం వైపునకు తెచ్చి ఉండేవాడు! కావున నీవు అజ్ఞానులలో చేరకు. (1/2)

6:36 – إِنَّمَا يَسْتَجِيبُ الَّذِينَ يَسْمَعُونَ ۘ وَالْمَوْتَىٰ يَبْعَثُهُمُ اللَّـهُ ثُمَّ إِلَيْهِ يُرْجَعُونَ ٣٦

<నిశ్చయంగా, ఎవరైతే (శ్రద్ధతో) వింటారో, వారే (సత్య సందేశాన్ని) స్వీకరిస్తారు. ఇక మృతులు (సత్య-తిరస్కారులు) – అల్లాహ్‌ వారిని పునరుత్థరింపజేసినప్పుడు – (ప్రతిఫలం కొరకు) ఆయన వద్దకే రప్పింపబడతారు.

6:37 – وَقَالُوا لَوْلَا نُزِّلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ ۚ قُلْ إِنَّ اللَّـهَ قَادِرٌ عَلَىٰ أَن يُنَزِّلَ آيَةً وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ ٣٧

మరియు వారు: ”ఇతనిపై (ప్రవక్తపై) ఇతని ప్రభువు తరఫు నుండి ఏదైనా అద్భుత సూచన ఎందుకు అవతరింపజేయబడలేదు?” అని అంటారు. ఇలా అను: ”నిశ్చయంగా, అల్లాహ్‌! ఎలాంటి అద్భుత సూచననైనా అవతరింపజేయ గల శక్తి కలిగి ఉన్నాడు, కాని వారిలో అనేకులకు ఇది తెలియదు.”

6:38 – وَمَا مِن دَابَّةٍ فِي الْأَرْضِ وَلَا طَائِرٍ يَطِيرُ بِجَنَاحَيْهِ إِلَّا أُمَمٌ أَمْثَالُكُم ۚ مَّا فَرَّطْنَا فِي الْكِتَابِ مِن شَيْءٍ ۚ ثُمَّ إِلَىٰ رَبِّهِمْ يُحْشَرُونَ ٣٨

మరియు భూమిపై సంచరించే ఏ జంతువు గానీ, లేక తన రెండు రెక్కలతో ఎగిరే ఏ పక్షి గానీ, మీలాంటి సంఘజీవులుగా లేకుండా లేవు! మేము గ్రంథంలో ఏ కొరతా చేయలేదు. 19 తరువాత వారందరూ తమ ప్రభువు వద్దకు మరలింప బడతారు.

6:39 – وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا صُمٌّ وَبُكْمٌ فِي الظُّلُمَاتِ ۗ مَن يَشَإِ اللَّـهُ يُضْلِلْـهُ وَمَن يَشَأْ يَجْعَلْهُ عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ٣٩

మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారు, చెవిటివారు మరియు మూగవారు, అంధకారంలో పడిపోయినవారు! అల్లాహ్‌ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు మరియు తాను కోరిన వారిని ఋజుమార్గంలో ఉంచుతాడు. 20

6:40 – قُلْ أَرَأَيْتَكُمْ إِنْ أَتَاكُمْ عَذَابُ اللَّـهِ أَوْ أَتَتْكُمُ السَّاعَةُ أَغَيْرَ اللَّـهِ تَدْعُونَ إِن كُنتُمْ صَادِقِينَ ٤٠

వారితో అను: ”ఏమీ? మీరు సత్యవంతులే అయితే ఆలోచించి (చెప్పండి!) ఒకవేళ మీపై అల్లాహ్‌ శిక్ష వచ్చి పడినా, లేదా అంతిమ ఘడియ వచ్చినా! మీరు అల్లాహ్‌ను తప్ప ఇతరులను ఎవరినైనా పిలుస్తారా?

6:41 – بَلْ إِيَّاهُ تَدْعُونَ فَيَكْشِفُ مَا تَدْعُونَ إِلَيْهِ إِن شَاءَ وَتَنسَوْنَ مَا تُشْرِكُونَ ٤١

”అలా కానేరదు! మీరు ఆయననే (అల్లాహ్‌ నే) పిలుస్తారు. ఆయన కోరితే ఆ ఆపదను మీపై నుండి తొలగిస్తాడు. అప్పుడు మీరు ఆయనకు సాటికల్పించే వారిని మరచిపోతారు!”

6:42 – وَلَقَدْ أَرْسَلْنَا إِلَىٰ أُمَمٍ مِّن قَبْلِكَ فَأَخَذْنَاهُم بِالْبَأْسَاءِ وَالضَّرَّاءِ لَعَلَّهُمْ يَتَضَرَّعُونَ ٤٢

మరియు వాస్తవానికి మేము, నీకు పూర్వం (ఓ ము’హమ్మద్‌!) అనేక జాతులవారి వద్దకు ప్రవక్తలను పంపాము. ఆ పిదప వారు వినమ్రు లవటానికి, మేము వారిపై ఇబ్బందులను మరియు కష్టాలను కలుగజేశాము.

6:43 – فَلَوْلَا إِذْ جَاءَهُم بَأْسُنَا تَضَرَّعُوا وَلَـٰكِن قَسَتْ قُلُوبُهُمْ وَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ مَا كَانُوا يَعْمَلُونَ ٤٣

పిదప మా తరఫునుండి వారిపైఆపద వచ్చి నపుడు కూడా వారెందుకు వినమ్రులు కాలేదు? కాని వారిహృదయాలు మరింత కఠినమయ్యాయి మరియు షై’తాన్‌ వారు చేసే కర్మలన్నింటినీ వారికి మంచివిగా కనబడేటట్లు చేశాడు.

6:44 – فَلَمَّا نَسُوا مَا ذُكِّرُوا بِهِ فَتَحْنَا عَلَيْهِمْ أَبْوَابَ كُلِّ شَيْءٍ حَتَّىٰ إِذَا فَرِحُوا بِمَا أُوتُوا أَخَذْنَاهُم بَغْتَةً فَإِذَا هُم مُّبْلِسُونَ ٤٤

ఆ పిదప వారికి చేయబడిన బోధనను వారు మరచిపోగా, మేము వారి కొరకు సకల (భోగ-భాగ్యాల) ద్వారాలను తెరిచాము, చివరకు వారు తమకు ప్రసాదించబడిన ఆనందాలలో నిమగ్నులై ఉండగా, మేము వారిని అకస్మాత్తుగా (శిక్షించటానికి) పట్టుకున్నాము, అప్పుడు వారు నిరాశులయ్యారు.

6:45 – فَقُطِعَ دَابِرُ الْقَوْمِ الَّذِينَ ظَلَمُوا ۚ وَالْحَمْدُ لِلَّـهِ رَبِّ الْعَالَمِينَ ٤٥

ఈ విధంగా దుర్మార్గానికి పాల్పడినవారు సమూలంగా నిర్మూలించబడ్డారు. మరియు సర్వ లోకాలకు పోషకుడైన అల్లాహ్‌ మాత్రమే సర్వ స్తోత్రాలకు అర్హుడు.

6:46 – قُلْ أَرَأَيْتُمْ إِنْ أَخَذَ اللَّـهُ سَمْعَكُمْ وَأَبْصَارَكُمْ وَخَتَمَ عَلَىٰ قُلُوبِكُم مَّنْ إِلَـٰهٌ غَيْرُ اللَّـهِ يَأْتِيكُم بِهِ ۗ انظُرْ كَيْفَ نُصَرِّفُ الْآيَاتِ ثُمَّ هُمْ يَصْدِفُونَ ٤٦

ఇలా అను: ”ఏమీ? మీరు ఆలోచించారా (చెప్పండి)? అల్లాహ్‌ మీ వినికిడినీ మరియు మీ చూపునూ పోగొట్టి, మీ హృదయాలపై ముద్రవేస్తే! అల్లాహ్‌ తప్ప ఏ దేవుడైనా వాటిని మీకు తిరిగి ఇవ్వగలడా?” చూడు! మేము ఏ విధంగా మా సూచనలను వారికి తెలుపుతున్నామో! అయినా వారు (వాటి నుండి) తప్పించుకొని పోతున్నారు.

6:47 – قُلْ أَرَأَيْتَكُمْ إِنْ أَتَاكُمْ عَذَابُ اللَّـهِ بَغْتَةً أَوْ جَهْرَةً هَلْ يُهْلَكُ إِلَّا الْقَوْمُ الظَّالِمُونَ ٤٧

ఇలా అను: ”ఏమీ? మీరు ఆలోచించారా (చెప్పండి)? అల్లాహ్‌ శిక్ష మీపై (రాత్రివేళ) అకస్మాత్తుగా గానీ, లేక (పగటి వేళ) బహిరంగంగా గానీ వచ్చిపడితే, దుర్మార్గులు తప్ప ఇతరులు నాశనం చేయబడతారా?” 21

6:48 – وَمَا نُرْسِلُ الْمُرْسَلِينَ إِلَّا مُبَشِّرِينَ وَمُنذِرِينَ ۖ فَمَنْ آمَنَ وَأَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ٤٨

మరియు మేము ప్రవక్తలను కేవలం శుభవార్తలు ఇచ్చేవారుగా మరియు హెచ్చరికలు చేసేవారుగా మాత్రమే పంపుతాము. కావున ఎవరైతే విశ్వసించి (తమ నడవడికను) సరిదిద్దు కుంటారో, అలాంటి వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!

6:49 – وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا يَمَسُّهُمُ الْعَذَابُ بِمَا كَانُوا يَفْسُقُونَ ٤٩

కాని మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారికి, తమ అవిధేయతకు ఫలితంగా తప్పకుండా శిక్ష పడుతుంది. 22

6:50 – قُل لَّا أَقُولُ لَكُمْ عِندِي خَزَائِنُ اللَّـهِ وَلَا أَعْلَمُ الْغَيْبَ وَلَا أَقُولُ لَكُمْ إِنِّي مَلَكٌ ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰ إِلَيَّ ۚ قُلْ هَلْ يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ ۚ أَفَلَا تَتَفَكَّرُونَ ٥٠

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: ”నా వద్ద అల్లాహ్‌ కోశాగారాలు ఉన్నాయనిగానీ లేదానాకు అగోచర జ్ఞానమున్నదనిగానీ, నేను మీతో అన డంలేదు. లేదా నేను దేవదూతనని కూడా అనడం లేదు. కాని నేను కేవలం నాపై అవతరింపజేయ బడిన దివ్యజ్ఞానాన్ని (వ’హీని) మాత్రమే అనుస రిస్తున్నాను.” 23 వారిని ఇలా అడుగు: ”ఏమీ? అంధుడూ మరియు దృష్టిగలవాడు సమానులా? అయితే మీరెందుకు ఆలోచించరు?”

6:51 – وَأَنذِرْ بِهِ الَّذِينَ يَخَافُونَ أَن يُحْشَرُوا إِلَىٰ رَبِّهِمْ ۙ لَيْسَ لَهُم مِّن دُونِهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ لَّعَلَّهُمْ يَتَّقُونَ ٥١

మరియు తమ ప్రభువు సన్నిధిలో సమా వేశపరచబడతారని భయపడే వారికి ఆయన తప్ప వేరే రక్షించేవాడు గానీ, సిఫారసు చేసేవాడు గానీ ఉండడని, దీని (ఈ ఖుర్‌ఆన్‌) ద్వారా హెచ్చరించు, బహుశా వారు దైవభీతి గలవారు అవుతారేమో!

6:52 – وَلَا تَطْرُدِ الَّذِينَ يَدْعُونَ رَبَّهُم بِالْغَدَاةِ وَالْعَشِيِّ يُرِيدُونَ وَجْهَهُ ۖ مَا عَلَيْكَ مِنْ حِسَابِهِم مِّن شَيْءٍ وَمَا مِنْ حِسَابِكَ عَلَيْهِم مِّن شَيْءٍ فَتَطْرُدَهُمْ فَتَكُونَ مِنَ الظَّالِمِينَ ٥٢

మరియు ఎవరైతే తమ ప్రభువును ఉదయం మరియు సాయంత్రం ప్రార్థిస్తూ, ఆయన ముఖాన్ని 24 (చూడ) గోరుతున్నారో, వారిని నీవు దూరంచేయకు. వారి లెక్క కొరకు నీవు ఎంత మాత్రమూ జవాబుదారుడవు కావు. మరియు నీ లెక్క కొరకు వారూ జవాబుదారులు కారు. కావున నీవు వారిని దూరంచేస్తే నీవు దుర్మార్గులలో చేరిన వాడవవుతావు.

6:53 – وَكَذَٰلِكَ فَتَنَّا بَعْضَهُم بِبَعْضٍ لِّيَقُولُوا أَهَـٰؤُلَاءِ مَنَّ اللَّـهُ عَلَيْهِم مِّن بَيْنِنَا ۗ أَلَيْسَ اللَّـهُ بِأَعْلَمَ بِالشَّاكِرِينَ ٥٣

మరియు ఈ విధంగా, మేము వారిలోని కొందరిని మరికొందరి ద్వారా పరీక్షకు గురి చేశాము. వారు (విశ్వాసులను చూసి): ”ఏమీ? మా అందరిలో, వీరినేనా అల్లాహ్‌ అనుగ్ర హించింది?” 25 అని అంటారు. ఏమీ? ఎవరు కృతజ్ఞులో అల్లాహ్‌కు తెలియదా? 26

6:54 – وَإِذَا جَاءَكَ الَّذِينَ يُؤْمِنُونَ بِآيَاتِنَا فَقُلْ سَلَامٌ عَلَيْكُمْ ۖ كَتَبَ رَبُّكُمْ عَلَىٰ نَفْسِهِ الرَّحْمَةَ ۖ أَنَّهُ مَنْ عَمِلَ مِنكُمْ سُوءًا بِجَهَالَةٍ ثُمَّ تَابَ مِن بَعْدِهِ وَأَصْلَحَ فَأَنَّهُ غَفُورٌ رَّحِيمٌ ٥٤

మరియు మా సూచనలను విశ్వసించిన వారు నీవద్దకు వచ్చినపుడు నీవు వారితో ఇలా అను: ”మీకు శాంతి కలుగు గాక (సలాం)! మీ ప్రభువు కరుణించటమే తనపై విధిగా నిర్ణయించు కున్నాడు. నిశ్చయంగా, మీలో ఎవరైనా అజ్ఞానం వల్ల తప్పుచేసి, ఆ తరువాత పశ్చాత్తాపపడి సరి దిద్దుకుంటే! నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.”

6:55 – وَكَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ وَلِتَسْتَبِينَ سَبِيلُ الْمُجْرِمِينَ ٥٥

మరియు పాపుల మార్గం స్పష్టపడటానికి మేము ఈ విధంగా మా సూచనలను వివరంగా తెలుపుతున్నాము.

6:56 – قُلْ إِنِّي نُهِيتُ أَنْ أَعْبُدَ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّـهِ ۚ قُل لَّا أَتَّبِعُ أَهْوَاءَكُمْ ۙ قَدْ ضَلَلْتُ إِذًا وَمَا أَنَا مِنَ الْمُهْتَدِينَ ٥٦

ఇలా అను: ”నిశ్చయంగా అల్లాహ్‌ను వదిలి, మీరు ప్రార్థించే ఈ ఇతరులను (కల్పిత దైవాలను) ఆరాధించటం నుండి నేను వారించ బడ్డాను.” మరియు ఇలా అను: ”నేను మీ కోరికలను అనుసరించను. (అలా చేస్తే!) వాస్త వానికి నేనూ మార్గభ్రష్టుడను అవుతాను. మరియు నేను సన్మార్గం చూపబడిన వారిలో ఉండను.”

6:57 – قُلْ إِنِّي عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّي وَكَذَّبْتُم بِهِ ۚ مَا عِندِي مَا تَسْتَعْجِلُونَ بِهِ ۚ إِنِ الْحُكْمُ إِلَّا لِلَّـهِ ۖ يَقُصُّ الْحَقَّ ۖ وَهُوَ خَيْرُ الْفَاصِلِينَ ٥٧

ఇలా అను: ”నిశ్చయంగా నేను నా ప్రభువు తరఫు నుండి లభించిన స్పష్టమైన ప్రమాణంపై ఉన్నాను. మీరు దానిని అబద్ధమని నిరాక రించారు. మీరు తొందరపెట్టే విషయం నాదగ్గర లేదు. నిర్ణయాధికారం కేవలం అల్లాహ్‌కే ఉంది. ఆయన సత్యాన్ని తెలుపుతున్నాడు. మరియు ఆయనే సర్వోత్తమమైన న్యాయాధికారి!” 27

6:58 – قُل لَّو