దివ్య ఖురాన్ సందేశం (text) – Draft

సూరహ్ అల్-ఫాతి’హా – 1:1 – بِسْم اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ ١

అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ 1 పేరుతో. 2

1:2 – الْحَمْدُ لِلَّـهِ رَبِّ الْعَالَمِينَ ٢

సర్వలోకాలకు ప్రభువైన 3 అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు. 4

1:3 – الرَّحْمَـٰنِ الرَّحِيمِ ٣

అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత. 5

1:4 – مَالِكِ يَوْمِ الدِّينِ ٤

తీర్పు దినానికి 6 స్వామి.7

1:5 – إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ ٥

మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము. 8

1:6 – اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ ٦

మాకు ఋజుమార్గం9 వైపునకు మార్గదర్శ కత్వం చేయి.

1:7 – صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ ٧

నీవు అనుగ్రహించినవారి10 మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి 11 గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గ భ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు.

సూరహ్ అల్-బఖరహ్ – ఈ సూరహ్ లో ఆవు యొక్క ప్రస్తావన 67-73 ఆయతులలో వచ్చింది. కావున ఇది, ఆవు ప్రస్తా వన ఉన్న సూరహ్ అని అనబడుతుంది. ఇందులో 286 ఆయతులున్నాయి. ఇది మదీనహ్ లో మొదటి 2 సంవత్సరాలలో అవతరింపజేయబడింది. ఆయత్ 255, ఆయతుల్ కుర్సీ అనబడు తుంది, ఆయత్ 281 చిట్టచివర అవతరింపజేయబడింది. ఆయత్ 282 ఆయత్ – ఆద్దేన్ అనబడుతుంది. ఇది అన్నిఆయతుల కంటే పెద్దది. ఏ ఇంట్లో ఈ సూరహ్ ప్రతిరోజూ చదువబడు తుందో, ఆ ఇంట్లో నుండి షై’తాన్ పారిపోతాడు. (’స. ముస్లిం). కొందరు ధర్మవేత్తల అభిప్రాయంలో దీనిలో వేయి వార్తలు, వేయి ఆజ్ఞలు మరియు వేయి నిషేధాజ్ఞలు ఉన్నాయి. (ఇబ్నె-కసీ‘ర్)

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 2:1 – الم ١

అలిఫ్-లామ్-మీమ్.1

2:2 – ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ ٢

ఇది (ఈ ఖుర్ఆన్) ఒక దివ్య గ్రంథం; ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. దైవభీతి 2 గలవారికి ఇది మార్గదర్శకత్వము.

2:3 – الَّذِينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ ٣

(వారికి) ఎవరైతే అగోచర యథార్థాన్నిి 3 నమా’జ్ స్థాపించ డం: అంటే, ప్రతిదినము ఐదుసార్లు నిర్ణీత సమయాలలో అల్లాహ్ (సు.త.), దైవప్రవక్త ము’హమ్మద్ (’స’అస)కు నేర్పిన విధంగా నమా’జ్ చేయడం. (’స’హీ’హ్ బు’ఖారీ, పుస్తకము-1, ’హదీస్‘ నం. 702, 703, 704, 723, 786, 787). 4 మరియు మేము ప్రసాదించిన జీవనోపాధి నుండి (మా మార్గంలో) ఖర్చుచేస్తారో; 5

2:4 – وَالَّذِينَ يُؤْمِنُونَ بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِن قَبْلِكَ وَبِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ ٤

మరియు ఎవరైతే (ఓ ము’హమ్మద్!) నీపై అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను)ై 6 మరియు నీకు వూర్వం అవతరింపజేయబడిన వాటినీ (దివ్యగ్రంథాలను) విశ్వసిస్తారో మరియు పరలోక జీవితాన్ని దృఢంగా నమ్ముతారో!

2:5 – أُولَـٰئِكَ عَلَىٰ هُدًى مِّن رَّبِّهِمْ ۖ وَأُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ٥

అలాంటివారే తమ ప్రభువు (చూపిన) సన్మార్గంలో ఉన్నవారు మరియు అలాంటివారే సాఫల్యం పొందేవారు.

2:6 – إِنَّ الَّذِينَ كَفَرُوا سَوَاءٌ عَلَيْهِمْ أَأَنذَرْتَهُمْ أَمْ لَمْ تُنذِرْهُمْ لَا يُؤْمِنُونَ ٦

నిశ్చయంగా, సత్య-తిరస్కారులను (ఓ ము’హమ్మద్!) నీవు హెచ్చరించినా, హెచ్చరించక పోయినా ఒకటే, వారు విశ్వసించేవారు కారు.

2:7 – خَتَمَ اللَّـهُ عَلَىٰ قُلُوبِهِمْ وَعَلَىٰ سَمْعِهِمْ ۖ وَعَلَىٰ أَبْصَارِهِمْ غِشَاوَةٌ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ ٧

అల్లాహ్ వారి హృదయాల మీద మరియు వారి చెవుల మీద ముద్రవేశాడు. 7 మరియు వారి కన్నుల మీద తెర పడి ఉన్నది. మరియు వారికొరకు ఘోరమైన శిక్ష ఉంది.

2:8 – وَمِنَ النَّاسِ مَن يَقُولُ آمَنَّا بِاللَّـهِ وَبِالْيَوْمِ الْآخِرِ وَمَا هُم بِمُؤْمِنِينَ ٨

మరియు ప్రజలలో కొందరు: “మేము అల్లాహ్ నూ మరియు అంతిమ దినాన్నీవిశ్వసించాము.” అని, అనేవారున్నారు. కానీ (వాస్తవానికి) వారు విశ్వసించే వారు కారు.

2:9 – يُخَادِعُونَ اللَّـهَ وَالَّذِينَ آمَنُوا وَمَا يَخْدَعُونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ ٩

వారు, తాము అల్లాహ్ నూ మరియు విశ్వసించిన వారినీ మోసగిస్తున్నారని (అనుకుం టున్నారు); కానీ వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మోసగించటం లేదు, కాని వారది గ్రహించటం లేదు!

2:10 – فِي قُلُوبِهِم مَّرَضٌ فَزَادَهُمُ اللَّـهُ مَرَضًا ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْذِبُونَ ١٠

వారి హృదయాలలో రోగముంది. 8 కాబట్టి అల్లాహ్ వారి రోగాన్ని మరింత అధికంచేశాడు. మరియు వారు అసత్యం పలుకుతూ ఉండటం వలన, వారికి బాధాకరమైన శిక్ష ఉంది.

2:11 – وَإِذَا قِيلَ لَهُمْ لَا تُفْسِدُوا فِي الْأَرْضِ قَالُوا إِنَّمَا نَحْنُ مُصْلِحُونَ ١١

మరియు: “భువిలో కల్లోలం 9 రేకెత్తించ కండి.” అని వారితో అన్నప్పుడు; వారు: “మేము సంస్కర్తలము మాత్రమే!” అని అంటారు.

2:12 – أَلَا إِنَّهُمْ هُمُ الْمُفْسِدُونَ وَلَـٰكِن لَّا يَشْعُرُونَ ١٢

జాగ్రత్త! నిశ్చయంగా, (భువిలో) కల్లోలం రేకెత్తిస్తున్నవారు వీరే, కాని వారది గ్రహించటం లేదు.

2:13 – وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا كَمَا آمَنَ النَّاسُ قَالُوا أَنُؤْمِنُ كَمَا آمَنَ السُّفَهَاءُ ۗ أَلَا إِنَّهُمْ هُمُ السُّفَهَاءُ وَلَـٰكِن لَّا يَعْلَمُونَ ١٣

మరియు: “ఇతర జనులు విశ్వసించినట్లు మీరూ విశ్వసించండి.” అని, వారితో అన్నప్పుడు, వారు: “మూర్ఖులు విశ్వసించినట్లు మేమూ విశ్వ సించాలా?” అని జవాబిస్తారు. జాగ్రత్త! వాస్తవానికి వారే మూర్ఖులు, కాని వారికది తెలియదు.

2:14 – وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَوْا إِلَىٰ شَيَاطِينِهِمْ قَالُوا إِنَّا مَعَكُمْ إِنَّمَا نَحْنُ مُسْتَهْزِئُونَ ١٤

మరియు విశ్వాసులను కలిసినపుడు, వారు: “మేము విశ్వసించాము.” అని అంటారు. కానీ, తమ షైతానుల (దుష్టనాయకుల) దగ్గర ఏకాంతంలో ఉన్నప్పుడు వారు: “నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నాము కేవలం (వారి) ఎగతాళి చేస్తున్నాము.” అని అంటారు.

2:5 – اللَّـهُ يَسْتَهْزِئُ بِهِمْ وَيَمُدُّهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ ١٥

అల్లాహ్ వారి ఎగతాళి చేస్తున్నాడు మరియు వారి తలబిరుసుతనాన్ని హెచ్చిస్తున్నాడు, (అందులో వారు) అంధులై తిరుగుతున్నారు;

2:16 – أُولَـٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الضَّلَالَةَ بِالْهُدَىٰ فَمَا رَبِحَت تِّجَارَتُهُمْ وَمَا كَانُوا مُهْتَدِينَ ١٦

ఇలాంటి వారే, సన్మార్గానికి బదులుగా దుర్మార్గాన్ని కొనుక్కున్నవారు; కాని వారి బేరం వారికి లాభదాయకం కాలేదు మరియు వారికి మార్గదర్శకత్వమూ దొరకలేదు.

2:17 – مَثَلُهُمْ كَمَثَلِ الَّذِي اسْتَوْقَدَ نَارًا فَلَمَّا أَضَاءَتْ مَا حَوْلَهُ ذَهَبَ اللَّـهُ بِنُورِهِمْ وَتَرَكَهُمْ فِي ظُلُمَاتٍ لَّا يُبْصِرُونَ ١٧

వారి ఉపమానం 10 ఇలా ఉంది: 11 ఒక వ్యక్తి అగ్నిని వెలిగించగా, అది పరిసరాలను ప్రకాశింప జేసిన తరువాత అల్లాహ్ వారి వెలుగును తీసుకొని వారిని అంధకారంలో విడిచిపెట్టడం వల్ల, వారు ఏమీ చూడలేకపోతారు.

2:18 – صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لَا يَرْجِعُونَ ١٨

(వారు) చెవిటివారు, మూగవారు, గ్రుడ్డి వారు, ఇకవారు (ఋజుమార్గానికి) మరలిరాలేరు.

2:19 – أَوْ كَصَيِّبٍ مِّنَ السَّمَاءِ فِيهِ ظُلُمَاتٌ وَرَعْدٌ وَبَرْقٌ يَجْعَلُونَ أَصَابِعَهُمْ فِي آذَانِهِم مِّنَ الصَّوَاعِقِ حَذَرَ الْمَوْتِ ۚ وَاللَّـهُ مُحِيطٌ بِالْكَافِرِينَ ١٩

లేక, (మరొక ఉపమానం): ఆకాశం నుండి ఘోరంగా వర్షం కురుస్తున్నది; చిమ్మచీకట్లలో ఉరుములు, మెరుపులు మెరుస్తున్నాయి. ఆ ఉరు ముల భీకరధ్వని విని, మృత్యుభయంచేత వారు తమ వ్రేళ్ళను చెవులలో దూర్చుకుంటున్నారు. మరియు అల్లాహ్ సత్య-తిరస్కారులను అన్ని వైపుల నుండి ఆవరించి ఉన్నాడు. 12

2:20 – يَكَادُ الْبَرْقُ يَخْطَفُ أَبْصَارَهُمْ ۖ كُلَّمَا أَضَاءَ لَهُم مَّشَوْا فِيهِ وَإِذَا أَظْلَمَ عَلَيْهِمْ قَامُوا ۚ وَلَوْ شَاءَ اللَّـهُ لَذَهَبَ بِسَمْعِهِمْ وَأَبْصَارِهِمْ ۚ إِنَّ اللَّـهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٢٠

ఆ మెరుపు వారిదృష్టిని ఇంచుమించు ఎగురవేసుకు పోయినట్లుంటుంది. ప్రతిసారి అది మెరిసినప్పుడు, వారు ముందుకు నడుస్తారు మరియు వారిపై చీకటి క్రమ్ముకొనగానే వారు ఆగి పోతారు. మరియు అల్లాహ్ కోరితే వారి వినికిడినీ మరియు వారి చూపునూ తొలగించేవాడు. 13 నిశ్చ యంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. 14

2:21 – يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ ٢١

ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్)నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తి పరులు కావచ్చు! 15

2:22 – الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّـهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ ٢٢

ఆయన (అల్లాహ్)యే మీ కొరకు భూమిని పరుపుగానూ మరియు ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురి పించి, తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను (పంటలను) ఉత్పత్తిచేశాడు! కావున ఇది తెలుసుకొని కూడా, మీరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా నిలబెట్టకండి. 16

2:23 – وَإِن كُنتُمْ فِي رَيْبٍ مِّمَّا نَزَّلْنَا عَلَىٰ عَبْدِنَا فَأْتُوا بِسُورَةٍ مِّن مِّثْلِهِ وَادْعُوا شُهَدَاءَكُم مِّن دُونِ اللَّـهِ إِن كُنتُمْ صَادِقِينَ ٢٣

మరియు మేము మా దాసుడు (ము’హ మ్మద్)పై అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) గురించి, మీకు సందేహముంటే; దాని వంటి ఒక్క సూరహ్ నైనా మీరు (రచించి) తీసుకు రండి. 17 మరియు అల్లాహ్ తప్ప మీకు ఉన్న సహాయకులను అందరినీ పిలుచుకోండి; మీరు సత్యవంతులే అయితే (ఇది చేసి చూపండి).

2:24 – فَإِن لَّمْ تَفْعَلُوا وَلَن تَفْعَلُوا فَاتَّقُوا النَّارَ الَّتِي وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ ۖ أُعِدَّتْ لِلْكَافِرِينَ ٢٤

కానీ, ఒకవేళ మీరు అలా చేయలేకపోతే – నిశ్చయంగా, మీరు అలా చేయలేరు – మానవులు మరియు రాళ్ళు ఇంధనమయ్యే ఆ నరకాగ్నికి భయపడండి. 18 అది సత్య-తిరస్కారుల కొరకే తయారు చేయబడింది.

2:25 – وَبَشِّرِ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أَنَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ كُلَّمَا رُزِقُوا مِنْهَا مِن ثَمَرَةٍ رِّزْقًا ۙ قَالُوا هَـٰذَا الَّذِي رُزِقْنَا مِن قَبْلُ ۖ وَأُتُوا بِهِ مُتَشَابِهًا ۖ وَلَهُمْ فِيهَا أَزْوَاجٌ مُّطَهَّرَةٌ ۖ وَهُمْ فِيهَا خَالِدُونَ ٢٥

మరియు విశ్వసించి, సత్కార్యాలు చేసే వారి కొరకు నిశ్చయంగా, క్రింద కాలువలు ప్రవ హించే స్వర్గవనాలు ఉంటాయనే శుభవార్తను వినిపించు. ప్రతిసారి వారికి తినటానికి ఫలాలు ఒసంగబడినపుడల్లా, వారు: “ఇవి ఇంతకుముందు మాకు ఇవ్వబడినవే!” అని అంటారు. ఎందుకంటే వారికి ఇవ్వబడేవి వాటీ పోలికగలవే. అక్కడ వారికి నిర్మల సహవాసులు (అ’జ్వాజ్) ఉంటారు. మరియు వారందులో శాశ్వతంగా ఉంటారు. (1/8)

2:25 – إِنَّ اللَّـهَ لَا يَسْتَحْيِي أَن يَضْرِبَ مَثَلًا مَّا بَعُوضَةً فَمَا فَوْقَهَا ۚ فَأَمَّا الَّذِينَ آمَنُوا فَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِن رَّبِّهِمْ ۖ وَأَمَّا الَّذِينَ كَفَرُوا فَيَقُولُونَ مَاذَا أَرَادَ اللَّـهُ بِهَـٰذَا مَثَلًا ۘ يُضِلُّ بِهِ كَثِيرًا وَيَهْدِي بِهِ كَثِيرًا ۚ وَمَا يُضِلُّ بِهِ إِلَّا الْفَاسِقِينَ ٢٦

  • నిశ్చయంగా, అల్లాహ్ దోమ లేక దానికంటే చిన్న దాని దృష్టాంతం ఇవ్వటానికి సంకోచించడు. కావున విశ్వసించిన వారు, ఇది తమ ప్రభువు తరఫునుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. కాని సత్య-తిరస్కారులు, వాటిని విని: “ఈ ఉపమా నాల ద్వారా అల్లాహ్ చెప్పదలుచుకున్నది ఏమిటీ?” అని, ప్రశ్నిస్తారు. ఈవిధంగా ఆయన ఎంతోమందిని మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు. మరియు ఎంతోమందికి సన్మార్గం కూడా చూపు తాడు. మరియు ఆయన కేవలం దుష్టులనే 19 మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు.

2:27 – الَّذِينَ يَنقُضُونَ عَهْدَ اللَّـهِ مِن بَعْدِ مِيثَاقِهِ وَيَقْطَعُونَ مَا أَمَرَ اللَّـهُ بِهِ أَن يُوصَلَ وَيُفْسِدُونَ فِي الْأَرْضِ ۚ أُولَـٰئِكَ هُمُ الْخَاسِرُونَ ٢٧

ఎవరైతే అల్లాహ్ తో స్థిరమైన ఒడంబడిక 20 చేసుకున్న పిదప దానిని భంగపరుస్తారో మరియు అల్లాహ్ స్థిరపరచమని ఆజ్ఞాపించిన దానిని త్రెంచుతారో మరియు భువిలో కల్లోలం రేకెత్తిస్తారో! ఇలాంటివారే, వాస్తవంగా నష్టపడేవారు.

2:28 – كَيْفَ تَكْفُرُونَ بِاللَّـهِ وَكُنتُمْ أَمْوَاتًا فَأَحْيَاكُمْ ۖ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ ٢٨

మీరు అల్లాహ్ పట్ల తిరస్కారవైఖరిని ఎలా అవలంబించగలరు? మరియు వాస్తవానికి ఆయనే నిర్జీవులుగా 21 ఉన్నమిమ్మల్నిసజీవులుగా చేశాడు కదా! తరువాత మీప్రాణాన్నితీసి తిరిగి మిమ్మల్ని సజీవులుగా చేసేది కూడా ఆయనే; చివరకు మీరంతా ఆయన వద్దకే మరలింప బడతారు.

2:29 – هُوَ الَّذِي خَلَقَ لَكُم مَّا فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ اسْتَوَىٰ إِلَى السَّمَاءِ فَسَوَّاهُنَّ سَبْعَ سَمَاوَاتٍ ۚ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ٢٩

ఆయనే భూమిలో నున్న సమస్తాన్నీ మీ కొరకు సృష్టించాడు; తరువాత తన దృష్టిని ఆకాశాల వైపునకు మరల్చి వాటిని సప్తాకాశాలుగా ఏర్పరిచాడు. మరియు ఆయనే ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానం గలవాడు.

2:30 – وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي جَاعِلٌ فِي الْأَرْضِ خَلِيفَةً ۖ قَالُوا أَتَجْعَلُ فِيهَا مَن يُفْسِدُ فِيهَا وَيَسْفِكُ الدِّمَاءَ وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ ۖ قَالَ إِنِّي أَعْلَمُ مَا لَا تَعْلَمُونَ ٣٠

మరియు (జ్ఞాపకంచేసుకో!) నీ ప్రభువు దేవ దూతలతో: “వాస్తవంగా నేను భూమిలో ఒక ఉత్త రాధికారిని 22 సృషించబోతున్నాను!” అని, చెప్పినపుడు వారు: “ఏమీ? నీవు భూమిలో కల్లోలం రేకెత్తించేవానిని మరియు నెత్తురుచిందించే వానిని నియమించబోతున్నావా? మేము నీ స్తోత్రం చేస్తూ, నీ పవిత్రతను కొనియాడుతూనే ఉన్నాము కదా!” అని విన్నవించుకున్నారు. దానికి ఆయన: “నిశ్చయంగా, మీకు తెలియనిది నాకు తెలుసు!” అని, అన్నాడు.

2:31 – وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَى الْمَلَائِكَةِ فَقَالَ أَنبِئُونِي بِأَسْمَاءِ هَـٰؤُلَاءِ إِن كُنتُمْ صَادِقِينَ ٣١

మరియు ఆయన (అల్లాహ్) ఆదమ్ కు సకల వస్తువుల పేర్లను నేర్పాడు, 23 ఆ పిదప వాటిని దేవదూతల ఎదుట ఉంచి: “మీరు సత్య వంతులే అయితే, వీటి పేర్లను నాకు తెలుపండి.” అని, అన్నాడు.

2:32 – قَالُوا سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ ٣٢

వారు (దేవదూతలు): “నీవు సర్వ లోపాల కు అతీతుడవు, 24 నీవు తెలిపినదే తప్ప మాకు మరేమీ తెలియదు. నిశ్చయంగా నీవే సర్వజ్ఞు డవు, 25 మహా వివేకవంతుడవు. 26 అని అన్నారు.

2:33 – قَالَ يَا آدَمُ أَنبِئْهُم بِأَسْمَائِهِمْ ۖ فَلَمَّا أَنبَأَهُم بِأَسْمَائِهِمْ قَالَ أَلَمْ أَقُل لَّكُمْ إِنِّي أَعْلَمُ غَيْبَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَأَعْلَمُ مَا تُبْدُونَ وَمَا كُنتُمْ تَكْتُمُونَ ٣٣

ఆయన (అల్లాహ్): “ఓ ఆదమ్! వీటి (ఈ వస్తువుల) పేర్లను వీరికి తెలుపు.” అని అన్నాడు. ఎపుడైతే అతను (ఆదమ్) ఆ వస్తువుల పేర్లను వారికి తెలిపాడో; ఆయన అన్నాడు: “నిశ్చయంగా నేను మాత్రమే భూమ్యాకాశాల అగోచర విషయాలను ఎరుగుదునని మీతో చెప్పలేదా? మరియు మీరు ఏది బహిర్గతంచేస్తారో మరియు ఏది దాస్తారో కూడా నాకు బాగా తెలుసు!”

2:34 – وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَىٰ وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ ٣٤

మరియు (జ్ఞాపకంచేసుకోండి) మేము దేవదూతలతో: “మీరందరూ ఆదమ్ ముందు సాష్టాంగం (సజ్దా) చేయండి.” అని ఆదేశించినపుడు, ఒక ఇబ్లీస్ 27 తప్ప, మిగతావారంతా సాష్టాంగం (సజ్దా) చేశారు; 28 అతడు నిరాకరించాడు మరియు దురహంకారానికి గురయ్యాడు మరియు సత్య- తిరస్కారులలోని వాడయ్యాడు.

2:35 – وَقُلْنَا يَا آدَمُ اسْكُنْ أَنتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَـٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ ٣٥

మరియు మేము (ఆదమ్ తో) అన్నాము: “ఓ ఆదమ్! నీవూ మరియు నీ భార్యా ఈ స్వర్గంలో నివసించండి మరియు మీరిద్దరూ మీకు ఇష్టమైనది యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు 29 దరిదాపులకు పోకండి, అలా చేస్తే మీరిద్దరూ దుర్మార్గులలో 30 చేరిన వారవుతారు!”

2:36 – فَأَزَلَّهُمَا الشَّيْطَانُ عَنْهَا فَأَخْرَجَهُمَا مِمَّا كَانَا فِيهِ ۖ وَقُلْنَا اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَمَتَاعٌ إِلَىٰ حِينٍ ٣٦

ఆ పిదప షై’తాన్ వారిద్దరినీ దాని (స్వర్గం) నుండి తప్పించి, వారిద్దరినీ వారున్న స్థితి నుండి బయటికితీశాడు. మరియు మేము (అల్లాహ్) అన్నాము: “మీరంతా ఇక్కడి నుండి దిగిపొండి; మీరు ఒకరికొకరు విరోధులవుతారు. 31 ఒక నియమిత కాలం వరకు మీరు భూమిలో ఉండి, అక్కడే జీవితం గడపవలసి ఉంటుంది.”

2:37 – فَتَلَقَّىٰ آدَمُ مِن رَّبِّهِ كَلِمَاتٍ فَتَابَ عَلَيْهِ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ ٣٧

తరువాత ఆదమ్, తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి, 32 (పశ్చాత్తాపపడి క్షమాభిక్ష కోరాడు) మరియు ఆయన (అల్లాహ్) అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించే వాడు, అపార కరుణాప్రదాత.

2:38 – قُلْنَا اهْبِطُوا مِنْهَا جَمِيعًا ۖ فَإِمَّا يَأْتِيَنَّكُم مِّنِّي هُدًى فَمَن تَبِعَ هُدَايَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ٣٨

మేము (అల్లాహ్) ఇలా అన్నాము: “మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి.” ఇక నా తరఫు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైతే నా మార్గదర్శ కత్వాన్ని అనుసరిస్తారో వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!

2:39 – وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٣٩

కాని, ఎవరైతే (మార్గదర్శకత్వాన్ని) తిర స్కరిస్తారో మరియు మా సూచన (అయాతు) లను అసత్యాలని తిరస్కరిస్తారో, అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

2:40 – يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَوْفُوا بِعَهْدِي أُوفِ بِعَهْدِكُمْ وَإِيَّايَ فَارْهَبُونِ ٤٠

ఓ ఇస్రాయీ‘ల్ సంతతివారలారా! 33 నేను మీకుచేసిన ఉపకారాన్ని జ్ఞాపకంచేసుకోండి మరియు మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి, నేనూ మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుతాను. మరియు మీరు నాకు మాత్రమే భయపడండి!

2:41 – وَآمِنُوا بِمَا أَنزَلْتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمْ وَلَا تَكُونُوا أَوَّلَ كَافِرٍ بِهِ ۖ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا وَإِيَّايَ فَاتَّقُونِ ٤١

మరియు మీ వద్ద నున్నవాటిని (తౌరాత్ / ఇంజీల్ లను) ధృవీకరిస్తూ నేను అవతరింపజేసిన దానిని (ఈ దివ్యఖుర్ఆనును) విశ్వసించండి. మరియు దీనిని తిరస్కరించేవారిలో మీరు మొట్ట మొదటి వారు కాకండి. మరియు అల్ప లాభాలకు నా సూచన (ఆయాత్)లను 34 అమ్మకండి. కేవలం నా యందే భయ-భక్తులు కలిగి ఉండండి.

2:42 – وَلَا تَلْبِسُوا الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُوا الْحَقَّ وَأَنتُمْ تَعْلَمُونَ ٤٢

మరియు సత్యాన్ని అసత్యంతో కలిపి తారుమారు చేయకండి మరియు మీకు తెలిసి ఉండి కూడా సత్యాన్ని దాచకండి. 35

2:43 – وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَارْكَعُوا مَعَ الرَّاكِعِينَ ٤٣

మరియు నమా’జ్ ను స్థాపించండి మరియు విధిదానం (’జకాత్) ఇవ్వండి మరియు (నా సాన్నిధ్యంలో వినమ్రులై) వంగే 36 (రుకూ’ఉ చేసే) వారితో పాటు మీరూ (వినమ్రులై) వంగండి (రుకూ’ఉ చేయండి). (1/4)

2:44 – أَتَأْمُرُونَ النَّاسَ بِالْبِرِّ وَتَنسَوْنَ أَنفُسَكُمْ وَأَنتُمْ تَتْلُونَ الْكِتَابَ ۚ أَفَلَا تَعْقِلُونَ ٤٤

ఏమీ? మీరు ఇతరులనైతే నీతిపరు లవమని ఆజ్ఞాపిస్తున్నారు, కాని స్వయంగా మీరే దానిని అవలంబించడం మరచిపోతున్నా రెందుకు? 37 మరియు మీరయితే గ్రంథాన్ని చదువుతున్నారు కదా! అయితే మీరెందుకు మీ బుద్ధిని ఉపయోగించరు?

2:45 – وَاسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ وَإِنَّهَا لَكَبِيرَةٌ إِلَّا عَلَى الْخَاشِعِينَ ٤٥

మరియు సహనం మరియు సమా’జ్ ద్వారా (అల్లాహ్) సహాయాన్ని అర్థించండి. నిశ్చయంగా, అది (అల్లాహ్ కు) వినమ్రులైన వారికి తప్ప, ఇతరులకు ఎంతో కష్టతరమైనది.

2:46 – الَّذِينَ يَظُنُّونَ أَنَّهُم مُّلَاقُو رَبِّهِمْ وَأَنَّهُمْ إِلَيْهِ رَاجِعُونَ ٤٦

అలాంటి వారు తాము, తమ ప్రభువును నిశ్చయంగా, కలుసుకోవలసివుందనీ మరియు ఆయన వైపునకే మరలి పోవలసి ఉందనీ నమ్ముతారు. 38

2:47 – يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَنِّي فَضَّلْتُكُمْ عَلَى الْعَالَمِينَ ٤٧

ఓఇస్రాయీ‘ల్ సంతతివారలారా! నేనుమీకు చేసినమహోపకారాన్ని జ్ఞాపకంచేసుకోండి మరియు నేను నిశ్చయంగా, మిమ్మల్ని(మీ కాలంలో) సర్వ లోకాల వారికంటే అధికంగా ఆదరించాను!

2:48 – وَاتَّقُوا يَوْمًا لَّا تَجْزِي نَفْسٌ عَن نَّفْسٍ شَيْئًا وَلَا يُقْبَلُ مِنْهَا شَفَاعَةٌ وَلَا يُؤْخَذُ مِنْهَا عَدْلٌ وَلَا هُمْ يُنصَرُونَ ٤٨

మరియు ఆ (తీర్పు) దినమునకు భయ పడండి, అప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏ విధంగానూ ఉపయోగపడలేడు; మరియు అతని నుండి ఎట్టి సిఫారసూ అంగీకరించబడదు మరియు ఎలాంటి పరిహారం కూడా తీసుకోబడదు మరియు వారికెలాంటి సహాయం కూడా చేయబడదు.

2:49 – وَإِذْ نَجَّيْنَاكُم مِّنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ يُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُم بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ ٤٩

మరియు ఫిర్’ఔన్ జాతివారి (బానిసత్వం) నుండి మేము మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వారు మిమ్మల్ని ఘోర హింసకు గురిచేస్తూ ఉండేవారు; మీ కుమారులను వధించి, మీ స్త్రీలను సజీవులుగా విడిచిపెట్టేవారు. మరియు ఇందులో మీ ప్రభువు తరఫు నుండి మీకు గొప్ప పరీక్ష ఉండెను.

2:50 – وَإِذْ فَرَقْنَا بِكُمُ الْبَحْرَ فَأَنجَيْنَاكُمْ وَأَغْرَقْنَا آلَ فِرْعَوْنَ وَأَنتُمْ تَنظُرُونَ ٥٠

మరియు మేము మీ కొరకు సముద్రాన్ని చీల్చి మిమ్మల్ని రక్షించినప్పుడు మీరు చూస్తూ ఉండగానే ఫిర్’ఔన్ జాతి వారిని ముంచివేసిన సంఘటనను (గుర్తుకు తెచ్చుకోండి). 39

2:51 – وَإِذْ وَاعَدْنَا مُوسَىٰ أَرْبَعِينَ لَيْلَةً ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِن بَعْدِهِ وَأَنتُمْ ظَالِمُونَ ٥١

ఇంకా (జ్ఞాపకం చేసుకోండి), మేము మూసాను నలభై రాత్రుల వాగ్దానం చేసి (పిలిచి నపుడు) మీరు అతను లేకపోవడం చూసి, ఆవు దూడను (ఆరాధ్యదైవంగా) చేసుకున్నారు. 40 మరియు మీరు దుర్మార్గులయ్యారు.

2:52 – ثُمَّ عَفَوْنَا عَنكُم مِّن بَعْدِ ذَٰلِكَ لَعَلَّكُمْ تَشْكُرُونَ ٥٢

అయినప్పటికీ మీరు కృతజ్ఞులవుతా రేమోనని మేము మిమ్మల్ని మన్నించాము. 41

2:53 – وَإِذْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَالْفُرْقَانَ لَعَلَّكُمْ تَهْتَدُونَ ٥٣

మరియు (జ్ఞాపకం చేసుకోండి)! మీరు సన్మార్గులవుతారేమోనని మేము మూసాకు గ్రంథాన్ని మరియు (సత్యా-సత్యాలను వేరుచేసే) 42 గీటురాయిని ప్రసాదించాము

2:54 – وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ إِنَّكُمْ ظَلَمْتُمْ أَنفُسَكُم بِاتِّخَاذِكُمُ الْعِجْلَ فَتُوبُوا إِلَىٰ بَارِئِكُمْ فَاقْتُلُوا أَنفُسَكُمْ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ عِندَ بَارِئِكُمْ فَتَابَ عَلَيْكُمْ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ ٥٤

మరియు (జ్ఞాపకం చేసుకోండి)! మూసా తన జాతివారతో ఇలా అన్న విషయాన్ని: “ఓ నాజాతి ప్రజలారా! నిశ్చయంగా, ఆవుదూడను (ఆరాధ్య దైవంగా) చేసుకొని మీకు-మీరే అన్యాయం చేసుకున్నారు. కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీ నిర్మాతను మీలోని వారిని (ఘోర పాతకులను) సంహరించండి. ఇదే మీ కొరకు – మీ సృష్టికర్త దృష్టిలో – శ్రేష్ఠమైనది.” ఆ తరువాత ఆయన (అల్లాహ్) మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు. అపార కరుణాప్రదాత. 43 (సృష్టికర్తను) వేడుకోండి.

2:55 – وَإِذْ قُلْتُمْ يَا مُوسَىٰ لَن نُّؤْمِنَ لَكَ حَتَّىٰ نَرَى اللَّـهَ جَهْرَةً فَأَخَذَتْكُمُ الصَّاعِقَةُ وَأَنتُمْ تَنظُرُونَ ٥٥

మరియు అప్పుడు మీరు అతనితో (మూసాతో) అన్న మాటలు (జ్ఞప్తికితెచ్చుకోండి): “ఓ మూసా! మేము అల్లాహ్ ను ప్రత్యక్షంగా చూడ నంతవరకు నిన్ను ఏ మాత్రం విశ్వసించము!” అదే సమయంలో మీరు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన పిడుగు మీపై విరుచుకుపడింది (మీరు చనిపోయారు).

2:56 – ثُمَّ بَعَثْنَاكُم مِّن بَعْدِ مَوْتِكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ ٥٦

ఆ పిమ్మట, మీరు కృతజ్ఞులై ఉంటా రేమోనని – మీరు చచ్చిన తరువాత – మిమ్మల్ని తిరిగి బ్రతికించాము.

2:57 – وَظَلَّلْنَا عَلَيْكُمُ الْغَمَامَ وَأَنزَلْنَا عَلَيْكُمُ الْمَنَّ وَالسَّلْوَىٰ ۖ كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ ۖ وَمَا ظَلَمُونَا وَلَـٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ ٥٧

మరియు మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము మరియు మన్న్ మరియు సల్వాలను మీ కొరకు ఆహారంగా దించాము: 44 “మేము మీకు ప్రసాదించిన శుధ్ధమయిన వస్తువు లను తినండి.” అని అన్నాము. (కాని వారు మా ఆజ్ఞలను ఉల్లంఘించారు), అయినా వారు మాకు అపకారమేమీ చేయలేదు, పైగా వారు తమకు తామే అపకారం చేసుకన్నారు.

2:58 – وَإِذْ قُلْنَا ادْخُلُوا هَـٰذِهِ الْقَرْيَةَ فَكُلُوا مِنْهَا حَيْثُ شِئْتُمْ رَغَدًا وَادْخُلُوا الْبَابَ سُجَّدًا وَقُولُوا حِطَّةٌ نَّغْفِرْ لَكُمْ خَطَايَاكُمْ ۚ وَسَنَزِيدُ الْمُحْسِنِينَ ٥٨

మరియు మేము మీతో: “ఈ నగరం (జేరుసలం) లో ప్రవేశించండి మరియు అక్కడున్న వస్తువులను మీ ఇష్టానుసారంగా, కావలసినంత తినండి మరియు నగర ద్వారంలోకి వినమ్రులై తల వంచుతూ: ‘మమ్మల్ని క్షమించు’ (’హి’త్తతున్), అంటూ, ప్రవేశించండి; మేము మీ పాపాలను క్షమిస్తాము. మరియు మేము సజ్జనులను అత్యధికంగా కరుణిస్తాము.” అని చెప్పిన మాటలను (జ్ఞప్తికి తెచ్చుకోండి)!

2:59 – فَبَدَّلَ الَّذِينَ ظَلَمُوا قَوْلًا غَيْرَ الَّذِي قِيلَ لَهُمْ فَأَنزَلْنَا عَلَى الَّذِينَ ظَلَمُوا رِجْزًا مِّنَ السَّمَاءِ بِمَا كَانُوا يَفْسُقُونَ ٥٩

కాని దుర్మార్గులైన వారు, వారికి చెప్పిన మాటను మరొక మాటతో మార్చారు. 45 కనుక, మేము దుర్మార్గం చేసిన వారిపై, వారి దౌష్ట్యాలకు ఫలితంగా, ఆకాశం నుండి ఆపదను దింపాము. 46 (3/8)

2:60 – وَإِذِ اسْتَسْقَىٰ مُوسَىٰ لِقَوْمِهِ فَقُلْنَا اضْرِب بِّعَصَاكَ الْحَجَرَ ۖ فَانفَجَرَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَيْنًا ۖ قَدْ عَلِمَ كُلُّ أُنَاسٍ مَّشْرَبَهُمْ ۖ كُلُوا وَاشْرَبُوا مِن رِّزْقِ اللَّـهِ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ ٦٠

  • మరియు (జ్ఞాపకం చేసుకోండి)! మూసా తన ప్రజలకు నీటి కొరకు ప్రార్థించినప్పుడు, మేము: “నీవు ఆ బండను నీ కర్రతో కొట్టు!” అని ఆదేశించాము. అప్పుడు దాని నుండి పన్నెండు ఊటలు ప్రవహించసాగాయి. ప్రతి తెగవారు తమ నీరుత్రాగే స్థలాన్ని కనుగొన్నారు. (అప్పుడు వారతో అన్నాము): “అల్లాహ్ మీకు ప్రసాదించిన ఆహారాన్ని తినండి త్రాగండి కానీ, భూమిలో కల్లోలం రేపుతూ దౌర్జన్యపరులుగా తిరగకండి!”

2:61 – وَإِذْ قُلْتُمْ يَا مُوسَىٰ لَن نَّصْبِرَ عَلَىٰ طَعَامٍ وَاحِدٍ فَادْعُ لَنَا رَبَّكَ يُخْرِجْ لَنَا مِمَّا تُنبِتُ الْأَرْضُ مِن بَقْلِهَا وَقِثَّائِهَا وَفُومِهَا وَعَدَسِهَا وَبَصَلِهَا ۖ قَالَ أَتَسْتَبْدِلُونَ الَّذِي هُوَ أَدْنَىٰ بِالَّذِي هُوَ خَيْرٌ ۚ اهْبِطُوا مِصْرًا فَإِنَّ لَكُم مَّا سَأَلْتُمْ ۗ وَضُرِبَتْ عَلَيْهِمُ الذِّلَّةُ وَالْمَسْكَنَةُ وَبَاءُوا بِغَضَبٍ مِّنَ اللَّـهِ ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ كَانُوا يَكْفُرُونَ بِآيَاتِ اللَّـهِ وَيَقْتُلُونَ النَّبِيِّينَ بِغَيْرِ الْحَقِّ ۗ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ ٦١

మరియు అప్పుడు మీరు: “ఓ మూసా! మేము ఒకే రకమైన ఆహారం తింటూ ఉండలేము. కావున భూమిలో ఉత్పత్తి అయ్యే ఆకుకూరలు, దోసకాయలు (కూరగాయలు), వెల్లుల్లి (గోదు మలు), ఉల్లిగడ్డలు, పప్పు దినుసులు మొదలైనవి మాకొరకు పండించమని నీ ప్రభువును ప్రార్థించు.” అని అన్నారు. దానికతను: “ఏమీ? శ్రేష్ఠమైన దానికి బదులుగా అల్పమైన దానిని కోరుకుంటు న్నారా? (అలాగయితే) మీరు ఏదైనా నగరానికి తిరిగిపొండి. నిశ్చయంగా, అక్కడ మీకు, మీరు కోరేదంతా దొరుకుతుంది!” అని అన్నాడు. మరియు వారు, తీవ్ర అవమానం మరియు దారి ద్ర్యానికి గురయ్యారు. మరియు వారు అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యారు. అదంతా వాస్తవానికి వారు, అల్లాహ్ సూచన (ఆయాత్)లను తిరస్కరించిన దాని మరియు ప్రవక్తలను యంగా చంపినదాని ఫలితం. అన్యా 47 ఇదంతా వారు చేసిన ఆజ్ఞోల్లంఘన మరియు హద్దులు మీరి ప్రవర్తించిన దాని పర్యవసానం.

2:62 – إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالنَّصَارَىٰ وَالصَّابِئِينَ مَنْ آمَنَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ وَعَمِلَ صَالِحًا فَلَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ٦٢

నిశ్చయంగా, విశ్వసించిన వారు (ముస్లింలు) కానీ, (ఇస్లాంకు పూర్వపు) యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబీయూలు 48 కానీ (ఎవరైనా సరే)! అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారికి, వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంటుంది మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరుకూడా! 49

2:63 – وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ خُذُوا مَا آتَيْنَاكُم بِقُوَّةٍ وَاذْكُرُوا مَا فِيهِ لَعَلَّكُمْ تَتَّقُونَ ٦٣

మరియు (ఓ ఇస్రాయీ‘ల్ సంతతివారలారా!) మేము ’తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి, మీ చేత చేయించిన గట్టి వాగ్దానాన్ని (జ్ఞప్తికి తెచ్చు కోండి)! అప్పుడుమేము:“మీకుప్రసాదిస్తున్నదానిని (గ్రంథాన్ని) దృఢంగా పట్టుకోండి, అందులో ఉన్న దంతా జ్ఞాపకం ఉంచుకోండి, – బహుశా మీరు భయ -భక్తులు గలవారు కావచ్చు!” అని అన్నాము.

2:64 – ثُمَّ تَوَلَّيْتُم مِّن بَعْدِ ذَٰلِكَ ۖ فَلَوْلَا فَضْلُ اللَّـهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ لَكُنتُم مِّنَ الْخَاسِرِينَ ٦٤

ఆ పిదప కూడా మీరు వెనుదిరిగి పోయారు. అయినప్పటికీ అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు ఆయన కరుణ మీపై లేకుంటే, మీరు నష్టానికి గురైనవారిలో చేరేవారు.

2:65 – وَلَقَدْ عَلِمْتُمُ الَّذِينَ اعْتَدَوْا مِنكُمْ فِي السَّبْتِ فَقُلْنَا لَهُمْ كُونُوا قِرَدَةً خَاسِئِينَ ٦٥

మరియు శనివారం (సబ్త్) శాసనం ఉల్లంఘించిన, మీ వారి గాథ మీకు బాగా తెలుసు. 50 మేము వారిని: “నీచులైన కోతులు కండి!” అని అన్నాము.

2:66 – فَجَعَلْنَاهَا نَكَالًا لِّمَا بَيْنَ يَدَيْهَا وَمَا خَلْفَهَا وَمَوْعِظَةً لِّلْمُتَّقِينَ ٦٦

ఈ విధంగా మేము, దానిని (వారి ముగిం పును) ఆ కాలం వారికీ మరియు భావీ తరాల వారికీ ఒక గుణపాఠంగానూ, దైవభీతి గలవారికి ఒక హితోపదేశంగానూ చేశాము.

2:67 – وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ إِنَّ اللَّـهَ يَأْمُرُكُمْ أَن تَذْبَحُوا بَقَرَةً ۖ قَالُوا أَتَتَّخِذُنَا هُزُوًا ۖ قَالَ أَعُوذُ بِاللَّـهِ أَنْ أَكُونَ مِنَ الْجَاهِلِينَ ٦٧

మరియు (జ్ఞాపకం చేసుకోండి) మూసా తన జాతి వారితో: “అల్లాహ్ మిమ్మల్ని: ‘ఒక ఆవును బలి ఇవ్వండి!’ 51 అని ఆజ్ఞాపిస్తున్నాడు.” అని అన్నప్పుడు వారు: “ఏమీ? నీవు మాతో పరహాస మాడుతున్నావా?” అని పలికారు. (అప్పుడు మూసా) అన్నాడు: “నేను అవివేకులతో కలిసి పోకుండా ఉండాలని, నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.”

2:68 – قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا هِيَ ۚ قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ لَّا فَارِضٌ وَلَا بِكْرٌ عَوَانٌ بَيْنَ ذَٰلِكَ ۖ فَافْعَلُوا مَا تُؤْمَرُونَ ٦٨

వారు: “అది ఎలాంటిదై ఉండాలో మాకు స్పష్టంగా తెలుపమని, నీ ప్రభువును ప్రార్థించు!” అని అన్నారు. (మూసా) అన్నాడు:“ ‘నిశ్చయంగా ఆ ఆవు ముసలిదిగానీ లేగదూడ గానీ కాకుండా, మధ్య వయస్సుగలదై ఉండాలి.’ అని, ఆయన అంటున్నాడు. కనుక ఆజ్ఞాపించిన విధంగా చేయండి.”

2:69 – قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا لَوْنُهَا ۚ قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ صَفْرَاءُ فَاقِعٌ لَّوْنُهَا تَسُرُّ النَّاظِرِينَ ٦٩

వారు: “దాని రంగు ఎలా ఉండాలో మాకు తెలుపమని నీ ప్రభువును వేడుకో!” అని, అన్నారు. (దానికి అతను) అన్నాడు: “ ‘అది మెరిసే పసుపువన్నె కలిగి, చూసే వారికి మనోహరంగా కనిపించాలి.’ అని ఆయన ఆజ్ఞ!”

2:70 – قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا هِيَ إِنَّ الْبَقَرَ تَشَابَهَ عَلَيْنَا وَإِنَّا إِن شَاءَ اللَّـهُ لَمُهْتَدُونَ ٧٠

  1. వారు ఇలా అన్నారు: “అసలు ఏ విధమైన ఆవు కావాలో నీవు నీ ప్రభువును అడిగి మాకు స్పష్టంగా తెలుపు; దానిని నిర్ణయించడంలో మాకు సందేహం కలిగింది మరియు నిశ్చయంగా, అల్లాహ్ కోరితే మేము తప్పక అలాంటి ఆవును కనుగొంటాము (మార్గదర్శకత్వం పొందుతాము).”

2:71 – قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ لَّا ذَلُولٌ تُثِيرُ الْأَرْضَ وَلَا تَسْقِي الْحَرْثَ مُسَلَّمَةٌ لَّا شِيَةَ فِيهَا ۚ قَالُوا الْآنَ جِئْتَ بِالْحَقِّ ۚ فَذَبَحُوهَا وَمَا كَادُوا يَفْعَلُونَ ٧١

అతను (మూసా) అన్నాడు: “ఆయన (అల్లాహ్) అంటున్నాడు: ‘ఆ గోవు భూమిని దున్నటానికిగానీ, పొలాలకు నీళ్ళు తోడటానికి గానీ ఉపయోగించబడకుండా ఆరోగ్యంగా ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలి.’ అని!” అప్పుడు వారన్నారు: “ఇప్పుడు నీవు సత్యం తెచ్చావు.” తరువాత వారు దానిని బలి (జి‘’బ్హ్) చేశారు, లేకపోతే వారు అలా చేసేవారని అనిపించలేదు. 52

2:72 – وَإِذْ قَتَلْتُمْ نَفْسًا فَادَّارَأْتُمْ فِيهَا ۖ وَاللَّـهُ مُخْرِجٌ مَّا كُنتُمْ تَكْتُمُونَ ٧٢

మరియు (జ్ఞాపకం చేసుకోండి), మీరు ఒక వ్యక్తిని చంపి ఆ నిందను ఒకరిపైనొకరు మోపుకో సాగారు. కాని మీరు దాస్తున్న దానిని అల్లాహ్ బయటపెట్టాడు. 53

2:73 – فَقُلْنَا اضْرِبُوهُ بِبَعْضِهَا ۚ كَذَٰلِكَ يُحْيِي اللَّـهُ الْمَوْتَىٰ وَيُرِيكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ ٧٣

కనుక మేము: “దానిని (ఆ శవాన్ని), ఆ ఆవు (మాంసపు) ఒక ముక్కతో కొట్టండి (అతడు సజీవుడవుతాడు).” అని ఆజ్ఞాపించాము. ఈ విధంగా అల్లాహ్ మృతులను బ్రతికించి, తన సూచనలను మీకు చూపుతున్నాడు బహుశా మీరు అర్థం చేసుకుంటారేమోనని!

2:74 – ثُمَّ قَسَتْ قُلُوبُكُم مِّن بَعْدِ ذَٰلِكَ فَهِيَ كَالْحِجَارَةِ أَوْ أَشَدُّ قَسْوَةً ۚ وَإِنَّ مِنَ الْحِجَارَةِ لَمَا يَتَفَجَّرُ مِنْهُ الْأَنْهَارُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَشَّقَّقُ فَيَخْرُجُ مِنْهُ الْمَاءُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَهْبِطُ مِنْ خَشْيَةِ اللَّـهِ ۗ وَمَا اللَّـهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ ٧٤

కానీ దీని తరువాత కూడా మీ హృద యాలు కఠినమైపోయాయి, అవి రాళ్ళ మాదిరిగా! కాదు, వాటికంటే కూడా కఠినంగా అయిపోయాయి. ఎందుకంటే వాస్తవానికి రాళ్ళలో కొన్ని బ్రద్దలై నప్పుడు వాటినుండి సెలయేళ్ళు ప్రవహిస్తాయి. మరియు నిశ్చయంగా, వాటిలో కొన్ని చీలిపోయి వాటి నుండి నీళ్ళు బయటికి వస్తాయి. 54 మరియు వాస్తవానికి వాటిలో మరికొన్ని అల్లాహ్ భయం వల్ల పడిపోతాయి. మరియు అల్లాహ్ మీ కర్మల పట్ల నిర్లక్ష్యంగాలేడు. (1/2)

2:75 – أَفَتَطْمَعُونَ أَن يُؤْمِنُوا لَكُمْ وَقَدْ كَانَ فَرِيقٌ مِّنْهُمْ يَسْمَعُونَ كَلَامَ اللَّـهِ ثُمَّ يُحَرِّفُونَهُ مِن بَعْدِ مَا عَقَلُوهُ وَهُمْ يَعْلَمُونَ ٧٥

  • (ఓ విశ్వాసులారా!) వారు (యూదులు) మీ సందేశాన్ని విశ్వసిస్తారని ఆశిస్తున్నారా ఏమిటీ? మరియు వాస్తవానికి వారిలో ఒక వర్గం వారు (ధర్మవేత్తలు) అల్లాహ్ ప్రవచనం (తౌరాత్) విని, అర్థంచేసుకొని కూడా, బుధ్ధిపూర్వకంగా దానిని తారుమారు చేసేవారు కదా?

2:76 – وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَا بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ قَالُوا أَتُحَدِّثُونَهُم بِمَا فَتَحَ اللَّـهُ عَلَيْكُمْ لِيُحَاجُّوكُم بِهِ عِندَ رَبِّكُمْ ۚ أَفَلَا تَعْقِلُونَ ٧٦

మరియు వారు (యూదులు) విశ్వాసులను కలిసినప్పుడు: “మేము విశ్వసించాము!” అని అంటారు. కాని వారు ఏకాంతంలో (తమ తెగ వారితో) ఒకరినొకరు కలుసుకున్నప్పుడు: “ఏమీ? అల్లాహ్ మీకు తెలిపింది వారికి (ముస్లిం లకు) తెలుపుతారా? 55 దానితో వారు (ముస్లిం లు) మీ ప్రభువు ముందు మీతో వాదులాడటానికి! మీరిది అర్థంచేసుకోలేరా ఏమిటి?” అని అంటారు.

2:77 – أَوَلَا يَعْلَمُونَ أَنَّ اللَّـهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ٧٧

ఏమీ! వారికి తెలియదా? వారు (యూదులు) దాచేది మరియు వెలిబుచ్చేది, అంతా అల్లాహ్ కు బాగా తెలుసని?

2:78 – وَمِنْهُمْ أُمِّيُّونَ لَا يَعْلَمُونَ الْكِتَابَ إِلَّا أَمَانِيَّ وَإِنْ هُمْ إِلَّا يَظُنُّونَ ٧٨

మరియు వారి (యూదుల)లో కొందరు నిరక్షరాస్యులున్నారు, వారికి గ్రంథజ్ఞానం లేదు, వారు కేవలం మూఢ విశ్వాసాలను (నమ్ముతూ), ఊహలపై మాత్రమే ఆధారపడి ఉన్నారు.

2:79 – فَوَيْلٌ لِّلَّذِينَ يَكْتُبُونَ الْكِتَابَ بِأَيْدِيهِمْ ثُمَّ يَقُولُونَ هَـٰذَا مِنْ عِندِ اللَّـهِ لِيَشْتَرُوا بِهِ ثَمَنًا قَلِيلًا ۖ فَوَيْلٌ لَّهُم مِّمَّا كَتَبَتْ أَيْدِيهِمْ وَوَيْلٌ لَّهُم مِّمَّا يَكْسِبُونَ ٧٩

కావున ఎవరైతే తమ చేతులారా ఒక పుస్తకాన్ని వ్రాసి – దాని వల్ల తుచ్ఛ మూల్యం పొందే నిమిత్తం – “ఇది అల్లాహ తరఫు నుండి వచ్చింది.” అని (ప్రజలకు) చెబుతారో, వారికి వినాశముంది. వారి చేతులు వ్రాసినందుకు, వారికి వినాశముంది మరియు వారు సంపాదించిన దానికి కూడా వారికి వినాశముంది!

2:80 – وَقَالُوا لَن تَمَسَّنَا النَّارُ إِلَّا أَيَّامًا مَّعْدُودَةً ۚ قُلْ أَتَّخَذْتُمْ عِندَ اللَّـهِ عَهْدًا فَلَن يُخْلِفَ اللَّـهُ عَهْدَهُ ۖ أَمْ تَقُولُونَ عَلَى اللَّـهِ مَا لَا تَعْلَمُونَ ٨٠

మరియు వారు (యూదులు) అంటారు: “మాకు నరకాగ్ని శిక్ష పడినా, అది కొన్ని రోజుల కొరకు మాత్రమే!” (ఓ ము’హమ్మద్!) నీవు వారి నడుగు: “ఏమీ? మీరు అల్లాహ్ నుండి వాగ్దానం పొందారా? ఎందుకంటే, అల్లాహ్ తన వాగ్దానాన్ని ఎన్నడూ భంగంచేయడు. లేదా మీకు తెలియని విషయాన్ని మీరు అల్లాహ్ కు అంటగడు తున్నారా?”

2:81 – بَلَىٰ مَن كَسَبَ سَيِّئَةً وَأَحَاطَتْ بِهِ خَطِيئَتُهُ فَأُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٨١

వాస్తవానికి, ఎవరు పాపం అర్జించారో మరియు తమ పాపం తమను చుట్టుముట్టి ఉన్నదో, అలాంటి వారు నరకవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

2:82 – وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَـٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٨٢

మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, అలాంటి వారు స్వర్గవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

2:83 – وَإِذْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ لَا تَعْبُدُونَ إِلَّا اللَّـهَ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَقُولُوا لِلنَّاسِ حُسْنًا وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ثُمَّ تَوَلَّيْتُمْ إِلَّا قَلِيلًا مِّنكُمْ وَأَنتُم مُّعْرِضُونَ ٨٣

మరియు మేము ఇస్రాయీలు సంతతి వారి నుండి ఇలా తీసుకున్న వాగ్దానం (జ్ఞప్తికి తెచ్చు కోండి): “మీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకూడదు. మరియు తల్లి-దండ్రులను, బంధువులను, అనాథులను, యాచించని పేద వారిని 56 ఆదరించాలి. మరియు ప్రజలను సహృదయంతో పలకరించాలి, నమా’జ్ ను స్థాపించాలి మరియు ’జకాత్ ఇవ్వాలి.” అటు పిమ్మట మీలో కొందరు తప్ప, మిగతా వారంతా (తమ వాగ్దానం నుండి) తిరిగిపోయారు. మీరంతా విముఖులైపోయే వారే!

2:84 – وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ لَا تَسْفِكُونَ دِمَاءَكُمْ وَلَا تُخْرِجُونَ أَنفُسَكُم مِّن دِيَارِكُمْ ثُمَّ أَقْرَرْتُمْ وَأَنتُمْ تَشْهَدُونَ ٨٤

మరియు మేము మీ నుండి తీసుకున్న మరొక వాగ్దానాన్ని (జ్ఞాపకం చేసుకోండి); మీరు మీ (తోటివారి) రక్తాన్ని చిందించగూడదని మరియు మీ వారిని, వారి ఇండ్ల నుండి పారద్రోలగూడదని! అప్పుడు మీరు దానికి ఒప్పుకున్నారు. మరియు దానికి స్వయంగా మీరేసాక్షులు.

2:85 – ثُمَّ أَنتُمْ هَـٰؤُلَاءِ تَقْتُلُونَ أَنفُسَكُمْ وَتُخْرِجُونَ فَرِيقًا مِّنكُم مِّن دِيَارِهِمْ تَظَاهَرُونَ عَلَيْهِم بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَإِن يَأْتُوكُمْ أُسَارَىٰ تُفَادُوهُمْ وَهُوَ مُحَرَّمٌ عَلَيْكُمْ إِخْرَاجُهُمْ ۚ أَفَتُؤْمِنُونَ بِبَعْضِ الْكِتَابِ وَتَكْفُرُونَ بِبَعْضٍ ۚ فَمَا جَزَاءُ مَن يَفْعَلُ ذَٰلِكَ مِنكُمْ إِلَّا خِزْيٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَيَوْمَ الْقِيَامَةِ يُرَدُّونَ إِلَىٰ أَشَدِّ الْعَذَابِ ۗ وَمَا اللَّـهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ ٨٥

ఆ తరువాత మీరే ఒకరినొకరు చంపుకునే వారు. మరియు మీరు మీలోని ఒక వర్గం వారిని వారి ఇండ్ల నుండి తరిమేవారు. మరియు వారికి అన్యాయం చేయటంలోనూ మరియు వారిపై దౌర్జన్యం చేయటంలోనూ, (వారి విరోధులకు) తోడ్పడేవారు. మరియు వారు (శతృవుల చేతిలో) ఖైదీలై మీ వద్దకు వచ్చినపుడు మీరు వారిని విమోచనాధనం ఇచ్చి విడిపించేవారు. మరియు (వాస్తవానికి) వారిని తరమటం మీకు నిషిధ్ధం చేయబడింది. ఏమి? మీరు గ్రంథంలోని కొన్ని విషయాలను విశ్వసించి, మరికొన్నింటిని తిరస్కరిస్తారా? 57 మీలో ఇలా చేసేవారికి, ఇహలోక జీవితంలో అవమానమూ మరియు పునరుత్థాన దినమున మిమ్మల్ని కఠిన శిక్షకు గురిచేయటం తప్ప మరెలాంటి ప్రతిఫలం ఉంటుంది? మరియు అల్లాహ్ మీ కర్మల విషయంలో నిర్లక్ష్యంగా లేడు.

2:86 – أُولَـٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ ۖ فَلَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنصَرُونَ ٨٦

ఇలాంటి వారే పరలోకానికి బదులుగా ఇహలోక జీవితాన్ని కొనేవారు! కావున వీరికి పడేశిక్ష తగ్గించబడదు మరియు వీరికి ఎలాంటి సహాయమూ లభించదు.

2:87 – وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَقَفَّيْنَا مِن بَعْدِهِ بِالرُّسُلِ ۖ وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنَاتِ وَأَيَّدْنَاهُ بِرُوحِ الْقُدُسِ ۗ أَفَكُلَّمَا جَاءَكُمْ رَسُولٌ بِمَا لَا تَهْوَىٰ أَنفُسُكُمُ اسْتَكْبَرْتُمْ فَفَرِيقًا كَذَّبْتُمْ وَفَرِيقًا تَقْتُلُونَ ٨٧

మరియు వాస్తవంగా మేము మూసాకు గ్రంథాన్ని (తౌరాత్ ను) ప్రసాదించాము మరియు అతని తర్వాత వరుసగా ప్రవక్తలను పంపాము. మరియు మర్యమ్ కుమారుడైన ’ఈసా కు (ఏసుకు) స్పష్టమైన సూచనలను ఇచ్చాము 58 మరియు పరిశుధ్ధాత్మ (రూ’హుల్-ఖుదుస్)తో అతనిని బలపరిచాము. 59 ఏమీ? మీ మనోవాంఛ లకు ప్రతికూలంగా ఉన్నదాన్ని తీసుకొని, ఏ ప్రవక్త అయినా మీ వద్దకు వస్తే, మీరు వారిపట్ల దురహం కారంతో ప్రవర్తించలేదా? వారిలో కొందరిని మీరు అసత్యవాదులన్నారు, మరికొందరిని చంపారు. 60

2:88 – وَقَالُوا قُلُوبُنَا غُلْفٌ ۚ بَل لَّعَنَهُمُ اللَّـهُ بِكُفْرِهِمْ فَقَلِيلًا مَّا يُؤْمِنُونَ ٨٨

  1. మరియు వారు: “మా హృదయాలు మూయ బడి ఉన్నాయి.” అని అంటారు. అలా కాదు (అది నిజం కాదు)! వారి సత్య-తిరస్కారం వలన అల్లాహ్ వారిని శపించాడు (బహిష్కరించాడు). 61 ఎందుకంటే వారు విశ్వసించేది చాలా తక్కువ.

2:89 – وَلَمَّا جَاءَهُمْ كِتَابٌ مِّنْ عِندِ اللَّـهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ وَكَانُوا مِن قَبْلُ يَسْتَفْتِحُونَ عَلَى الَّذِينَ كَفَرُوا فَلَمَّا جَاءَهُم مَّا عَرَفُوا كَفَرُوا بِهِ ۚ فَلَعْنَةُ اللَّـهِ عَلَى الْكَافِرِينَ ٨٩

మరియు ఇప్పుడు వారి వద్ద నున్న దానిని (తౌరాత్ ను) ధృవీకరించే గ్రంథం (ఈ ఖుర్ఆన్) అల్లాహ్ తరఫునుండి వారివద్దకువచ్చింది. మరియు దీనికి ముందు వారు సత్య-తిరస్కారులపై విజయం కొరకుప్రార్థంచేవారు. ఇప్పుడు సత్యమని గుర్తించబడినది (ఈగ్రంథం) వచ్చినా, వారు దానిని తిరస్కరించారు. కాబట్టి, సత్య-తిరస్కారులపై అల్లాహ్ అభిశాపం (బహిష్కారం) అవతరిస్తుంది.

2:90 – بِئْسَمَا اشْتَرَوْا بِهِ أَنفُسَهُمْ أَن يَكْفُرُوا بِمَا أَنزَلَ اللَّـهُ بَغْيًا أَن يُنَزِّلَ اللَّـهُ مِن فَضْلِهِ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۖ فَبَاءُوا بِغَضَبٍ عَلَىٰ غَضَبٍ ۚ وَلِلْكَافِرِينَ عَذَابٌ مُّهِينٌ ٩٠

అల్లాహ్ అవతరింపజేసిన సందేశాన్ని (ఖుర్ఆన్ ను) తిరస్కరించి, వారు ఎంత నీచమైన మూల్యానికి తమను తాము అమ్ముకున్నారు! అది (వారి తిరస్కారం) అల్లాహ్! తన దాసులలో, తాను కోరిన వారిపై, తన అనుగ్రహం (ఖుర్ఆన్/ ప్రవక్తృత్వం) అవతరింపజేశాడనే కక్షవల్లనే! కనుక వారు (అల్లాహ్) క్రోధం మీద మరింత క్రోధానికి గురి అయ్యారు. మరియు ఇలాంటి సత్య-తిరస్కా రులకు అవమానకరమైన శిక్ష ఉంది.

2:91 – وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا بِمَا أَنزَلَ اللَّـهُ قَالُوا نُؤْمِنُ بِمَا أُنزِلَ عَلَيْنَا وَيَكْفُرُونَ بِمَا وَرَاءَهُ وَهُوَ الْحَقُّ مُصَدِّقًا لِّمَا مَعَهُمْ ۗ قُلْ فَلِمَ تَقْتُلُونَ أَنبِيَاءَ اللَّـهِ مِن قَبْلُ إِن كُنتُم مُّؤْمِنِينَ ٩١

మరియు వారి (యూదుల) తో: “అల్లాహ్ అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి.” అని అన్నప్పుడు, వారు: “మా (ఇస్రాయీ‘ల్) వారిపై అవతరింపజేయబడిన దానిని (తౌరాత్ ను) మాత్రమే మేము విశ్వ సిస్తాము.” అని అంటారు. మరియు దాని తరువాత వచ్చినది (ఈ ఖుర్ఆన్) సత్య మైనప్పటికీ మరియు వారి వద్దనున్న దానిని (తౌరాత్ ను) ధృవపరుస్తున్నప్పటికీ, దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. (ఓ ము’హ మ్మద్) వారిని అడుగు: “మీరు (మీ వద్ద నున్న గ్రంథాన్ని) విశ్వసించేవారే అయితే ఇంతకు పూర్వం వచ్చిన అల్లాహ్ ప్రవక్తలను ఎందుకు హత్యచేస్తూ వచ్చారు?” 62

2:92 – وَلَقَدْ جَاءَكُم مُّوسَىٰ بِالْبَيِّنَاتِ ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِن بَعْدِهِ وَأَنتُمْ ظَالِمُونَ ٩٢

  • మరియు వాస్తవానికి మూసా స్పష్టమైన సూచనలను తీసుకొని మీ వద్దకు వచ్చాడు. తరువాత అతను పోగానే, మీరు ఆవుదూడ (విగ్రహాన్ని) ఆరాధ్యదైవంగా చేసుకున్నారు మరియు మీరు ఎంత దుర్మార్గులు!

2:93 – وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ خُذُوا مَا آتَيْنَاكُم بِقُوَّةٍ وَاسْمَعُوا ۖ قَالُوا سَمِعْنَا وَعَصَيْنَا وَأُشْرِبُوا فِي قُلُوبِهِمُ الْعِجْلَ بِكُفْرِهِمْ ۚ قُلْ بِئْسَمَا يَأْمُرُكُم بِهِ إِيمَانُكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ ٩٣

మరియు మేము ’తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీ నుంచి తీసుకున్న ప్రమాణాన్ని (జ్ఞాపకం చేసుకోండి): “మేము మీకు చేస్తున్న వాటిని (ఉపదేశాలను) స్థిరంగా పాటించండి మరియు జాగ్రత్తగా వినండి.” అని చెప్పాము. వారు: “మేము విన్నాము కానీ, అతిక్రమిస్తు న్నాము.” అని అన్నారు, వారి సత్య-తిరస్కారం వలన వారి హృదయాలలో ఆవుదూడ ప్రేమ నిండిపోయింది. వారితో అను: “మీరు విశ్వాసులే అయితే! ఈ చెడు చేష్టలను చేయమని మిమ్మల్ని ఆదేశించే మీ ఈ విశ్వాసం చాలా చెడ్డది”

2:94 – قُلْ إِن كَانَتْ لَكُمُ الدَّارُ الْآخِرَةُ عِندَ اللَّـهِ خَالِصَةً مِّن دُونِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِن كُنتُمْ صَادِقِينَ ٩٤

వారితో ఇలా అను: “ఒకవేళ అల్లాహ్ వద్ద నున్న పరలోక నివాసం మానవులందిరికీ కాక కేవలం, మీకు మాత్రమే ప్రత్యేకించబడి ఉంటే, 63 మీరు మీ ఈ అభిప్రాయంలో సత్యవంతులే అయితే, మీరు మరణాన్ని కోరండి!”

2:95 – وَلَن يَتَمَنَّوْهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ۗ وَاللَّـهُ عَلِيمٌ بِالظَّالِمِينَ ٩٥

కాని వారు ఎన్నటికీ దానిని (మరణాన్ని) కోరరు. ఎందుకంటే, వారు తమ చేతులారా చేసి పంపినవి (తమ కర్మలు) వారికి బాగా తెలుసు. ఈ దుర్మార్గుల విషయం అల్లాహ్ కు బాగా తెలుసు.

2:96 – وَلَتَجِدَنَّهُمْ أَحْرَصَ النَّاسِ عَلَىٰ حَيَاةٍ وَمِنَ الَّذِينَ أَشْرَكُوا ۚ يَوَدُّ أَحَدُهُمْ لَوْ يُعَمَّرُ أَلْفَ سَنَةٍ وَمَا هُوَ بِمُزَحْزِحِهِ مِنَ الْعَذَابِ أَن يُعَمَّرَ ۗ وَاللَّـهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ ٩٦

మరియు నిశ్చయంగా, జీవితం పట్ల సర్వ జనుల కంటే ఎక్కువ వ్యామోహం వారి (యూదుల) లోనే ఉందనే విషయం నీవు గ్రహిస్తావు. ఈ విషయంలో వారు ముష్రికులను కూడా మించి పోయారు. వారిలో ప్రతి ఒక్కడూ వేయి సంవత్స రాలు బ్రతకాలని కోరుతుంటాడు. కానీ దీర్ఘాయు ర్ధాయం, వారిని శిక్షనుండి తప్పించలేదు. మరియు వారు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు. 64

2:97 – قُلْ مَن كَانَ عَدُوًّا لِّجِبْرِيلَ فَإِنَّهُ نَزَّلَهُ عَلَىٰ قَلْبِكَ بِإِذْنِ اللَّـهِ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ وَهُدًى وَبُشْرَىٰ لِلْمُؤْمِنِينَ ٩٧

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: “జిబ్రీల్ పట్ల విరోధమున్న ప్రతివాడూ ఈ యథార్థాన్ని గ్రహించాలి. అల్లాహ్ ఆజ్ఞతోనే అతను ఈ ఖుర్ఆన్ ను నీ హృదయంపై అవతరింపజేశాడు. పూర్వం వచ్చినఅన్నిదివ్యగ్రంథాలను ఇదిధృవీకరిస్తున్నది మరియు విశ్వసించేవారికి ఇది సన్మార్గం చూపు తున్నది మరియు శుభవార్తను ఇస్తున్నది.” 65

2:98 – مَن كَانَ عَدُوًّا لِّلَّـهِ وَمَلَائِكَتِهِ وَرُسُلِهِ وَجِبْرِيلَ وَمِيكَالَ فَإِنَّ اللَّـهَ عَدُوٌّ لِّلْكَافِرِينَ ٩٨

“అల్లాహ్ కు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీల్ కు మరియు మీకాయీల్ కు ఎవరు శత్రువులో, నిశ్చయంగా అలాంటి సత్య- తిరస్కారులకు అల్లాహ్ శత్రువు.” 66

2:99 – وَلَقَدْ أَنزَلْنَا إِلَيْكَ آيَاتٍ بَيِّنَاتٍ ۖ وَمَا يَكْفُرُ بِهَا إِلَّا الْفَاسِقُونَ ٩٩

మరియు వాస్తనంగా, మేము నీపై స్పష్టమైన సూచనలు (ఆయాత్) అవతరింపజేశాము. మరియు అవిధేయులు తప్ప మరెవ్వరూ వాటిని తిరస్కరించరు.

2:100 – أَوَكُلَّمَا عَاهَدُوا عَهْدًا نَّبَذَهُ فَرِيقٌ مِّنْهُم ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يُؤْمِنُونَ ١٠٠

ఏమీ? వారు ఒడంబడికి చేసినపుడల్లా, వారిలో ఒక వర్గం వారు దానిని త్రోసిపుచ్చుటం జరగలేదా? వాస్తవానికి వారిలో చాలామంది విశ్వసించని వారున్నారు.

2:101 – وَلَمَّا جَاءَهُمْ رَسُولٌ مِّنْ عِندِ اللَّـهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ نَبَذَ فَرِيقٌ مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ كِتَابَ اللَّـهِ وَرَاءَ ظُهُورِهِمْ كَأَنَّهُمْ لَا يَعْلَمُونَ ١٠١

మరియు వారిదగ్గర పూర్వంనుంచే ఉన్న దానిని (దివ్యగ్రంథాన్ని) ధృవపరుస్తూ ఒక ప్రవక్త (ము’హమ్మద్) అల్లాహ్ తరఫునుండి వారి వద్దకు వచ్చినప్పుడు, గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు దానిని గురించి ఏమీ తెలియని వారిగా, అల్లాహ్ గ్రంథాన్ని తమ వీపుల వెనుకకు త్రోసివేశారు. 67

2:102 – وَاتَّبَعُوا مَا تَتْلُو الشَّيَاطِينُ عَلَىٰ مُلْكِ سُلَيْمَانَ ۖ وَمَا كَفَرَ سُلَيْمَانُ وَلَـٰكِنَّ الشَّيَاطِينَ كَفَرُوا يُعَلِّمُونَ النَّاسَ السِّحْرَ وَمَا أُنزِلَ عَلَى الْمَلَكَيْنِ بِبَابِلَ هَارُوتَ وَمَارُوتَ ۚ وَمَا يُعَلِّمَانِ مِنْ أَحَدٍ حَتَّىٰ يَقُولَا إِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْ ۖ فَيَتَعَلَّمُونَ مِنْهُمَا مَا يُفَرِّقُونَ بِهِ بَيْنَ الْمَرْءِ وَزَوْجِهِ ۚ وَمَا هُم بِضَارِّينَ بِهِ مِنْ أَحَدٍ إِلَّا بِإِذْنِ اللَّـهِ ۚ وَيَتَعَلَّمُونَ مَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ ۚ وَلَقَدْ عَلِمُوا لَمَنِ اشْتَرَاهُ مَا لَهُ فِي الْآخِرَةِ مِنْ خَلَاقٍ ۚ وَلَبِئْسَ مَا شَرَوْا بِهِ أَنفُسَهُمْ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ ١٠٢

మరియు వారు సులైమాన్ రాజ్య కాలమున, షై’తానులు పఠించే దానిని (జాల విద్యను) అనుసరించారు. సులైమాన్ సత్య- తిరస్కారి కాలేదు; కానీ నిశ్చయంగా, షై’తానులు సత్యాన్ని తిరస్కరించారు. వారు బాబీలోన్ నగర మందు హారూత్, మారూత్ అనేఇద్దరుదేవదూతల ద్వారా తేబడిన జాలవిద్యను ప్రజలకు నేర్పు చుండిరి. ఎవరికైనా ఆ విద్యను నేర్పేటప్పుడు, వారిద్దరు (దేవదూతలు) ఇలా చెప్పే వారు: “నిశ్చయంగా మేము (మానవులకు) ఒక పరీక్ష! కాబట్టి మీరు (ఈ జాలవిద్యను నేర్చుకొని) సత్య- తిరస్కారులు కాకండి.” అయినప్పటికీ వారు (ప్రజలు) భార్యా-భర్తలకు ఎడబాటు కలిగించే (జాలవిద్య) వారిద్దరి దగ్గర నేర్చుకునేవారు. మరియు అల్లాహ్ అనుమతిలేనిదే, దాని ద్యారా ఎవరికీ ఏ మాత్రం హాని కలిగించలేరు. మరియు వారు నేర్చుకునేది, వారికి నష్టం కలిగించేదే కాని లాభం కలిగించేది ఎంత మాత్రం కాదు. మరియు వాస్తవానికి దానిని (జాలవిద్యను) స్వీకరించేవానికి పరలోక సౌఖ్యాలలో ఏ మాత్రమూ భాగం లేదని వారికి బాగా తెలుసు. మరియువారు ఎంత తుచ్ఛ మైన సొమ్ముకు బదులుగా తమను తాము అమ్ము కున్నారు! ఇది వారికి తెలిస్తే ఎంత బాగుండేది!

2:103 – وَلَوْ أَنَّهُمْ آمَنُوا وَاتَّقَوْا لَمَثُوبَةٌ مِّنْ عِندِ اللَّـهِ خَيْرٌ ۖ لَّوْ كَانُوا يَعْلَمُونَ ١٠٣

మరియు వారు విశ్వసించి, దైవభీతి కలిగి ఉండినట్లయితే! నిశ్చయంగా అల్లాహ్ తరఫు నుండి వారికి ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలం లభించి ఉండేది. దీనిని వారు గ్రహిస్తే ఎంత బాగుండేది!

2:104 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقُولُوا رَاعِنَا وَقُولُوا انظُرْنَا وَاسْمَعُوا ۗ وَلِلْكَافِرِينَ عَذَابٌ أَلِيمٌ ١٠٤

ఓ విశ్వాసులారా, (మీరు ప్రవక్తతో మాట్లాడేటప్పుడు) రా’ఇనా! అని అనకండి. ఉన్”జుర్నా! అని (గౌరవంతో) అనండి 68మరియు (అతని మాటలను) శ్రధ్ధతోవినండి. మరియు సత్య-తిరస్కారులకు బాధాకరమైన శిక్ష గలదు.

2:105 – مَّا يَوَدُّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَلَا الْمُشْرِكِينَ أَن يُنَزَّلَ عَلَيْكُم مِّنْ خَيْرٍ مِّن رَّبِّكُمْ ۗ وَاللَّـهُ يَخْتَصُّ بِرَحْمَتِهِ مَن يَشَاءُ ۚ وَاللَّـهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ ١٠٥

సత్య-తిరస్కారులైన గ్రంథప్రజలకు గానీ మరియు బహుదైవారాధకులకు (ముష్రికులకు) గానీ, మీ ప్రభువు నుండి మీకు ఏదైనా మేలు అవతరించడం ఎంత మాత్రం ఇష్టంలేదు. కానీ అల్లాహ్ తాను కోరిన వారినే తన కరుణకు ప్రత్యేకించుకుంటాడు. మరియు అల్లాహ్ అనుగ్ర హించటంలో సర్వోత్తముడు. 69 (3/4)

2:106 – مَا نَنسَخْ مِنْ آيَةٍ أَوْ نُنسِهَا نَأْتِ بِخَيْرٍ مِّنْهَا أَوْ مِثْلِهَا ۗ أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّـهَ عَلَىٰ لِّ شَيْءٍ قَدِيرٌ ١٠٦

  • మేము మా ప్రవచనాలలో (ఆయాతులలో) ఒక దానిని రద్దుచేసినా లేక మర పింపజేసినా దాని స్థానంలో దానికంటే శ్రేష్ఠమైన దానిని లేక కనీసం దానితో సమానమైన దానిని తీసుకువస్తాము. ఏమీ? నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడని నీకు తెలియదా?

2:107 – أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّـهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَمَا لَكُم مِّن دُونِ اللَّـهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ ١٠٧

ఏమీ? వాస్తవానికి, భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్ కే చెందు తుందని, నీకు తెలియదా? మరియు అల్లాహ్ తప్ప మిమ్మల్ని రక్షించేవాడు గానీ 70 సహాయం చేసేవాడు గానీ మరెవ్వడూ లేడు!

2:108 – أَمْ تُرِيدُونَ أَن تَسْأَلُوا رَسُولَكُمْ كَمَا سُئِلَ مُوسَىٰ مِن قَبْلُ ۗ وَمَن يَتَبَدَّلِ الْكُفْرَ بِالْإِيمَانِ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ ١٠٨

ఏమీ? పూర్వం (యూదులచే) మూసా ప్రశ్నించబడినట్లు, మీరు కూడా మీ ప్రవక్త (ము’హమ్మద్)ను ప్రశ్నించగోరుతున్నారా? మరియు ఎవడైతే, సత్య-తిరస్కారాన్ని, విశ్వా సానికి బదులుగా స్వీకరిస్తాడో! నిశ్చయంగా, వాడే సరైన మార్గం నుండి తప్పిపోయిన వాడు.

2:109 – وَدَّ كَثِيرٌ مِّنْ أَهْلِ الْكِتَابِ لَوْ يَرُدُّونَكُم مِّن بَعْدِ إِيمَانِكُمْ كُفَّارًا حَسَدًا مِّنْ عِندِ أَنفُسِهِم مِّن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْحَقُّ ۖ فَاعْفُوا وَاصْفَحُوا حَتَّىٰ يَأْتِيَ اللَّـهُ بِأَمْرِهِ ۗ إِنَّ اللَّـهَ عَلَىٰ لِّ شَيْءٍ قَدِيرٌ ١٠٩

గ్రంథ ప్రజలలోని పలువురు – వారి మనస్సులలో ఉన్న అసూయ వల్ల – సత్యం వారికి సుస్పష్టం అయినప్పటికీ, మీరు విశ్వసించిన తరువాత, మిమ్మల్ని ఏదో ఒక విధంగా, దాని (విశ్వాస మార్గం) నుండి మరల్చి, మళ్ళీ సత్య-తిరస్కారం వైపునకు తీసుకుపోదామని కోరుతుంటారు. అయితే (వారిపట్ల) అల్లాహ్ తన ఆదేశం ఇచ్చేవరకు, మీరు (వారిని) మన్నించండి, ఉపేక్షించండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.

2:110 – وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ۚ وَمَا تُقَدِّمُوا لِأَنفُسِكُم مِّنْ خَيْرٍ تَجِدُوهُ عِندَ اللَّـهِ ۗ إِنَّ اللَّـهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ١١٠

మరియు నమా’జ్ స్థాపించండి 71 విధిదానం (’జకాత్) ఇవ్వండి. మీరు ముందుగా చేసి పంపిన మంచి కార్యాలను మీరు అల్లాహ్ దగ్గర పొందుతారు. నిశ్చయంగా, అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు.

2:111 – وَقَالُوا لَن يَدْخُلَ الْجَنَّةَ إِلَّا مَن كَانَ هُودًا أَوْ نَصَارَىٰ ۗ تِلْكَ أَمَانِيُّهُمْ ۗ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ ١١١

మరియు వారు: “యూదుడు లేదా క్రైస్త వుడుతప్ప, మరెవ్వడూ స్వర్గంలోప్రవేశించ లేడు!” అని అంటారు. ఇవి వారి అభిలాషలు మాత్రమే. వారిని ఇలా అడుగు: “మీరు సత్యవంతులే అయితే దానికి మీ నిదర్శనాలు చూపండి!”

2:112 – بَلَىٰ مَنْ أَسْلَمَ وَجْهَهُ لِلَّـهِ وَهُوَ مُحْسِنٌ فَلَهُ أَجْرُهُ عِندَ رَبِّهِ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ١١٢

వాస్తవానికి ఎవడైతే అల్లాహ్ కు విధైయుడై (ఇస్లాం స్వీకరించి) తన ముఖాన్ని (తనను-తాను) అల్లాహ్ కు అంకితం చేసుకొని, సజ్జనుడై ఉంటాడో! దానికి అతడు తన ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం పొందుతాడు. 72 మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!

2:113 – وَقَالَتِ الْيَهُودُ لَيْسَتِ النَّصَارَىٰ عَلَىٰ شَيْءٍ وَقَالَتِ النَّصَارَىٰ لَيْسَتِ الْيَهُودُ عَلَىٰ شَيْءٍ وَهُمْ يَتْلُونَ الْكِتَابَ ۗ كَذَٰلِكَ قَالَ الَّذِينَ لَا يَعْلَمُونَ مِثْلَ قَوْلِهِمْ ۚ فَاللَّـهُ يَحْكُمُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ ١١٣

మరియు యూదులు: “క్రైస్తవులవద్ద (సత్య-ధర్మమనేది) ఏమీ లేదు.” అని అంటారు. మరియు క్రైస్తవులు: “యూదుల వద్ద (సత్య- ధర్మమనేది) ఏమీ లేదు.” అని అంటారు. మరియు వారందరూ చదివేది దివ్యగ్రంథమే. ఇలాగే (దివ్యగ్రంథ) జ్ఞానంలేని వారు (బహు దైవారాధకులు) కూడా ఇదే విధంగా పలుకు తుంటారు. కావున వీరందరిలో ఉన్న అభిప్రాయ భేదాలను గురించి, అల్లాహ్ పునరుత్థాన దినమున వారి మధ్య తీర్పుచేస్తాడు.

2:114 – وَمَنْ أَظْلَمُ مِمَّن مَّنَعَ مَسَاجِدَ اللَّـهِ أَن يُذْكَرَ فِيهَا اسْمُهُ وَسَعَىٰ فِي خَرَابِهَا ۚ أُولَـٰئِكَ مَا كَانَ لَهُمْ أَن يَدْخُلُوهَا إِلَّ خَائِفِينَ ۚ لَهُمْ فِي الدُّنْيَا خِزْيٌ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ ١١٤

మరియు అల్లాహ్ మస్జిదులలో ఆయన నామ స్మరణం నిషేదించి వాటిని నాశనం చేయ టానికి పాటుపడే వారికంటే ఎక్కువ దుర్మార్గు లెవరు? అలాంటి వారు వాటి (మస్జిదుల)లో ప్రవేశించ టానికి అర్హులుకారు; వారు (ఒకవేళ ప్రవేశించినా) భయపడుతూ ప్రవేశించాలి. వారికి ఇహలోకంలో పరాభవం ఉంటుంది మరియు పరలోకంలో ఘోర శిక్ష ఉంటుంది.

2:115 – وَلِلَّـهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ۚ فَأَيْنَمَا تُوَلُّوا فَثَمَّ وَجْهُ اللَّـهِ ۚ إِنَّ اللَّـهَ وَاسِعٌ عَلِيمٌ ١١٥

మరియు తూర్పు పడమరలు అల్లాహ్ కే చెందినవి. కావున మీరు (మీముఖాలను) ఏ దిక్కు కు త్రిప్పినా మీకు అల్లాహ్ సముఖమే లభిస్తుంది. నిశ్చయంగా, అల్లాహ్, విస్తారుడు, 73సర్వజ్ఞుడు.

2:116 – وَقَالُوا اتَّخَذَ اللَّـهُ وَلَدًا ۗ سُبْحَانَهُ ۖ بَل لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ كُلٌّ لَّهُ قَانِتُونَ ١١٦

మరియు వారు: “అల్లాహ్ ఒక కుమారుణ్ణి కలిగి ఉన్నాడు (కన్నాడు).” అని అంటారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు 74 వాస్తవానికి భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఆయనకు చెందినవే. అవన్నీ ఆయనకు విధేయులై ఉన్నాయి. 75

2:117 – بَدِيعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَإِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ ١١٧

ఆయనే ఆకాశాలనూ మరియు భూమినీ ఏ నమూనా లేకుండా ఆరంభించిన (సృష్టించిన) 76 వాడు. మరియు ఆయన ఏదైనా చేయాలని నిర్ణ యించుకున్నప్పుడు దానికి కేవలం: “అయిపో!” అని ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయి పోతుంది. 77

2:118 – وَقَالَ الَّذِينَ لَا يَعْلَمُونَ لَوْلَ يُكَلِّمُنَا اللَّـهُ أَوْ تَأْتِينَا آيَةٌ ۗ كَذَٰلِكَ قَالَ الَّذِينَ مِن قَبْلِهِم مِّثْلَ قَوْلِهِمْ ۘ تَشَابَهَتْ قُلُوبُهُمْ ۗ قَدْ بَيَّنَّا الْآيَاتِ لِقَوْمٍ يُوقِنُونَ ١١٨

మరియు అజ్ఞానులు: “అల్లాహ్ మాతో ఎందుకు మాట్లాడడు? లేక మా వద్దకు ఏదైనా సూచన (ఆయత్) ఎందుకు రాదు?” అని అడుగుతారు. వారికి పూర్వంవారు కూడా ఇదే విధంగా అడిగేవారు 78 వారందరి మనస్తత్వాలు (హృదయాలు) ఒకేవిధమైనవి. వాస్తవానికి, దృఢనమ్మకం ఉన్నవారికి మేము మా సూచన (ఆయాత్)లను స్పష్టపరుస్తాము.

2:119 – إِنَّا أَرْسَلْنَاكَ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا ۖ وَلَا تُسْأَلُ عَنْ أَصْحَابِ الْجَحِيمِ ١١٩

నిశ్చయంగా, మేము నిన్ను (ఓ ము’హమ్మద్!) సత్యాన్ని ప్రసాదించి, శుభవార్త నిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము. మరియు భగభగ మండే నరకాగ్నికి గురిఅయ్యే వారినిగురించి నీవు ప్రశ్నించబడవు. 79

2:120 – وَلَن تَرْضَىٰ عَنكَ الْيَهُودُ وَلَا النَّصَارَىٰ حَتَّىٰ تَتَّبِعَ مِلَّتَهُمْ ۗ قُلْ إِنَّ هُدَى اللَّـهِ هُوَ الْهُدَىٰ ۗ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُم بَعْدَ الَّذِي جَاءَكَ مِنَ الْعِلْمِ ۙ مَا لَكَ مِنَ اللَّـهِ مِن وَلِيٍّ وَلَ نَصِيرٍ ١٢٠

మరియు యూదులైనా, క్రైస్తవులైనా నీవు వారి మతమును అనుసరించే వరకూ, వారు నీతో ప్రసన్నులు కారు. నీవు: “నిశ్చయంగా, అల్లాహ్ చూపిన మార్గమే సన్మార్గం.” అని చెప్పు. మరియు నీకు జ్ఞానం లభించిన తరువాత కూడా, నీవు వారి కోరికలను అనుసరిస్తే, అల్లాహ్ (శిక్ష) నుండి నిన్ను రక్షించే వాడు గానీ, సహాయపడే వాడు గానీ ఎవ్వడూ ఉండడు.

2:121 – الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَتْلُونَهُ حَقَّ تِلَاوَتِهِ أُولَـٰئِكَ يُؤْمِنُونَ بِهِ ۗ وَمَن يَكْفُرْ بِهِ فَأُولَـٰئِكَ هُمُ الْخَاسِرُونَ ١٢١

మేము దివ్యగ్రంథాన్ని ప్రసాదించిన వారు (యూదులు మరియు క్రైస్తవులు) దానిని (తమ గ్రంథాన్ని) కర్తవ్యంతో పఠించవలసిన విధంగా పఠిస్తే, అలాంటి వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసిస్తారు. మరియు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరించే వారే నష్టపడు వారు. 80

2:122 – يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَنِّي فَضَّلْتُكُمْ عَلَى الْعَالَمِينَ ١٢٢

ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నేను మీకు ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి మరియు నిశ్చయంగా, నేను మిమ్మల్ని (మీ కాలంలోని) సర్వలోకాల వారికంటే ఎక్కువగా ఆదరించాను.

2:123 – وَاتَّقُوا يَوْمًا لَّا تَجْزِي نَفْسٌ عَن نَّفْسٍ شَيْئًا وَلَا يُقْبَلُ مِنْهَا عَدْلٌ وَلَا تَنفَعُهَا شَفَاعَةٌ وَلَا هُمْ يُنصَرُونَ ١٢٣

మరియు ఆ (పునరుత్థాన) దినాన్ని గురించి భయభీతి కలిగి ఉండండి, ఆ నాడు ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తికి ఏమాత్రమూ ఉపయోగ పడలేడు. మరియు ఎవడి నుండీ ఎలాంటి పరిహారం స్వీకరించబడదు. మరియు ఎవడికీ సిఫారసూ లాభదాయకం కాజాలదు మరియు వారి కెలాంటి సహాయమూ లభించదు. (7/8)

2:124 – وَإِذِ ابْتَلَىٰ إِبْرَاهِيمَ رَبُّهُ بِكَلِمَاتٍ فَأَتَمَّهُنَّ ۖ قَالَ إِنِّي جَاعِلُكَ لِلنَّاسِ إِمَامًا ۖ قَالَ وَمِن ذُرِّيَّتِي ۖ قَالَ لَا يَنَالُ عَهْدِي الظَّالِمِينَ ١٢٤

  • మరియు ఇబ్రాహీమ్ ను అతని ప్రభువు (కొన్ని) ఉత్తరువులిచ్చి పరీక్షించిన విషయాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వాటి అన్నింటిలో అతను నెగ్గాడు. అప్పుడు ఆయన (అల్లాహ్): “నిశ్చ యంగా నేను నిన్ను మానవజాతికి నాయకునిగా చేస్తున్నాను.” అనిఅన్నాడు. (దానికి ఇబ్రాహీమ్): “మరి నా సంతతి వారు?” అని అడిగాడు. 81 (దానికి అల్లాహ్): “నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు.” అని జవాబిచ్చాడు. 82

2:125 – وَإِذْ جَعَلْنَا الْبَيْتَ مَثَابَةً لِّلنَّاسِ وَأَمْنًا وَاتَّخِذُوا مِن مَّقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى ۖ وَعَهِدْنَا إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ أَن طَهِّرَا بَيْتِيَ لِلطَّائِفِينَ وَالْعَاكِفِينَ وَالرُّكَّعِ السُّجُودِ ١٢٥

మరియు ఈ (క’అబహ్) గృహాన్ని మేము మానవులకు తరచుగా సందర్శించే కేంద్రం (పుణ్య స్థలం) గా మరియు శాంతి నిలయంగా చేసి; 83 ఇబ్రా హీమ్ నిలబడిన చోటును మీరు నమా’జ్ చేసే స్థలంగా చేసుకోండన్న 84 విషయాన్ని (జ్ఞాపకం చేసుకోండి). మరియు మేము ఇబ్రాహీమ్ మరియు ఇస్మా’యీల్ లకు: “నా ఈ గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కొరకూ, ఏకాంత ధ్యానం (’ఏతికాఫ్) పాటించేవారి కొరకూ, వంగే (రుకూ’ఉ చేసే) వారి కొరకూ మరియు సజ్దాలు చేసేవారి కొరకూ పరిశు ధ్ధంగా ఉంచండి.” అని నిర్దేశించాము.

2:126 – وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَـٰذَا بَلَدًا آمِنًا وَارْزُقْ أَهْلَهُ مِنَ الثَّمَرَاتِ مَنْ آمَنَ مِنْهُم بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ ۖ قَالَ وَمَن كَفَرَ فَأُمَتِّعُهُ قَلِيلًا ثُمَّ أَضْطَرُّهُ إِلَىٰ عَذَابِ النَّارِ ۖ وَبِئْسَ الْمَصِيرُ ١٢٦

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్: “ఓ నా ప్రభూ! ఈ నగరాన్ని (మక్కహ్ ను) శాంతియుతమైన నగరంగా చేసి, ఇందు నివసించే వారిలో, అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారికి అన్నిరకాల ఫలాలను జీవనో పాధిగా నొసంగు.” అని ప్రార్థించినప్పుడు, (అల్లాహ్): “మరియు ఎవడు సత్య-తిరస్కారి అవుతాడో అతనికి నేను ఆనందించటానికి కొంతకాలం విడిచిపెడ్తాను. తరువాత అతనిని నరకాగ్నిలోకి బలవంతంగా త్రోసివేస్తాను. అది ఎంత దుర్భరమైన గమ్యస్థానం!” అని అన్నాడు.

2:127 – وَإِذْ يَرْفَعُ إِبْرَاهِيمُ الْقَوَاعِدَ مِنَ الْبَيْتِ وَإِسْمَاعِيلُ رَبَّنَا تَقَبَّلْ مِنَّا ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ ١٢٧

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్ మరియు ఇస్మా’యీల్ ఈ గృహపు (క’అబహ్) పునాదులను ఎత్తేటపుడు (ఈ విధంగా ప్రార్థించారు): “ఓ మా ప్రభూ! మా ఈసేవను స్వీకరించు. నిశ్చయంగా నీవు మాత్రమే సర్వం వినేవాడవు, 85 సర్వజ్ఞుడవు. 86

2:128 – رَبَّنَا وَاجْعَلْنَا مُسْلِمَيْنِ لَكَ وَمِن ذُرِّيَّتِنَا أُمَّةً مُّسْلِمَةً لَّكَ وَأَرِنَا مَنَاسِكَنَا وَتُبْ عَلَيْنَا ۖ إِنَّكَ أَنتَ التَّوَّابُ الرَّحِيمُ ١٢٨

“ఓ మా ప్రభూ! మమ్మల్ని నీకు విధేయులుగా (ముస్లింలుగా) చేయి మరియు మా సంతతి నుండి ఒక సంఘాన్ని నీకు విధేయులుగా (ముస్లింలుగా) ఉండునట్లు చేయి. మరియు మాకు, మా ఆరాధనా రీతులను (మనాసిక్ లను) తెలుపు మరియు మా పశ్చాత్తాపాన్ని అంగీక రించు. నిశ్చయంగా నీవే పశ్చాత్తాపాన్ని అంగీక రించేవాడవు, అపార కరుణాప్రదాతవు.

2:129 – رَبَّنَا وَابْعَثْ فِيهِمْ رَسُولًا مِّنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِكَ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَيُزَكِّيهِمْ ۚ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ ١٢٩

“ఓ మా ప్రభూ! వీరిలో నుండి నీ సందేశా లను చదివి వినిపించుటకునూ, నీ గ్రంథాన్ని నేర్పు టకునూ, దివ్యజ్ఞానాన్ని బోధించుటకునూ మరియు వారిని పరిశుధ్ధులుగా మార్చుటకునూ ఒకసందేశహరుణ్ణి పంపు 87 నిశ్చయంగా, నీవే సర్వ శక్తిమంతుడవు, 88 మహా వివేకవంతుడవు.”

2:130 – وَمَن يَرْغَبُ عَن مِّلَّةِ إِبْرَاهِيمَ إِلَّا مَن سَفِهَ نَفْسَهُ ۚ وَلَقَدِ اصْطَفَيْنَاهُ فِي الدُّنْيَا ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ ١٣٠

మరియు ఇబ్రాహీమ్ మతం నుండి విముఖుడయ్యే వాడెవడు, తనను తాను అవివేకిగా చేసుకొనువాడు తప్ప? వాస్తవానికి మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) ఈ లోకంలో ఎన్నుకున్నాము. మరియు నిశ్చయంగా అతను పరలోకంలో సద్వర్తనులతో పాటు ఉంటాడు.

2:131 – إِذْ قَالَ لَهُ رَبُّهُ أَسْلِمْ ۖ قَالَ أَسْلَمْتُ لِرَبِّ الْعَالَمِينَ ١٣١

అతని ప్రభువు అతనితో: “(మాకు) విధేయుడవుగా (ముస్లింగా) ఉండు.” అని అన్నప్పుడు అతను: “నేను సర్వలోకాల ప్రభువునకు విధేయుడను (ముస్లింను) అయి పోయాను.” అని జవాబిచ్చాడు.

2:132 – وَوَصَّىٰ بِهَا إِبْرَاهِيمُ بَنِيهِ وَيَعْقُوبُ يَا بَنِيَّ إِنَّ اللَّـهَ اصْطَفَىٰ لَكُمُ الدِّينَ فَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ ١٣٢

మరియు ఇబ్రాహీమ్ తన సంతానాన్ని దీనిలోనే (ఈ ఇస్లాం మార్గంలోనే) నడవండని బోధించాడు. మరియు య’అఖూబ్ కూడా తన (సంతానంతో అన్నాడు): “నా బిడ్డలారా! నిశ్చ యంగా అల్లాహ్ మీ కొరకు ఈ ధర్మాన్నే నియ మించి ఉన్నాడు. కావున మీరు అల్లాహ్ కు విధే యులు (ముస్లింలు) కాకుండా మరణించకండి!” 89

2:133 – أَمْ كُنتُمْ شُهَدَاءَ إِذْ حَضَرَ يَعْقُوبَ الْمَوْتُ إِذْ قَالَ لِبَنِيهِ مَا تَعْبُدُونَ مِن بَعْدِي قَالُوا نَعْبُدُ إِلَـٰهَكَ وَإِلَـٰهَ آبَائِكَ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ إِلَـٰهًا وَاحِدًا وَنَحْنُ لَهُ مُسْلِمُونَ ١٣٣

ఏమీ? య’అఖూబ్ కు మరణం సమీపించి నప్పుడు, మీరు అక్కడ ఉన్నారా? 90 అప్పుడ తను తన కుమారులతో: “నా తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు?” అని అడిగినప్పుడు. వార న్నారు: “నీ ఆరాధ్య దైవం మరియు నీ పూర్వికు లగు ఇబ్రాహీమ్, ఇస్మా’యీల్ మరియు ఇస్’హాఖ్ ల ఆరాధ్య దైవమైన ఆ ఏకైక 91 దేవుణ్ణి (అల్లాహ్ నే), మేము ఆరాధిస్తాము మరియు మేము ఆయ నకే విధేయులమై (ముస్లింలమై) ఉంటాము.”

2:134 – تِلْكَ أُمَّةٌ قَدْ خَلَتْ ۖ لَهَا مَا كَسَبَتْ وَلَكُم مَّا كَسَبْتُمْ ۖ وَلَا تُسْأَلُونَ عَمَّا كَانُوا يَعْمَلُونَ ١٣٤

అది ఒక గతించిన సమాజం. దాని కర్మల ఫలితం దానికి మరియు మీ కర్మలది మీకు. మరియు వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి మీరు ప్రశ్మించబడరు.

2:135 – وَقَالُوا كُونُوا هُودًا أَوْ نَصَارَىٰ تَهْتَدُوا ۗ قُلْ بَلْ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۖ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ ١٣٥

మరియు వారంటారు: “మీరు యూదు లుగా లేదా క్రైస్తవులుగా ఉంటేనే మీకు మార్గ దర్శకత్వం లభిస్తుంది!” వారితో అను: “వాస్తవానికి, మేము (అనుసరించేది) ఇబ్రాహీమ్ మతం, ఏకైకదైవ సిధ్ధాంతం (’హనీఫా). మరియు అతను బహుదైవారాధకుడు కాడు.” 92

2:136 – قُولُوا آمَنَّا بِاللَّـهِ وَمَا أُنزِلَ إِلَيْنَا وَمَا أُنزِلَ إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَمَا أُوتِيَ النَّبِيُّونَ مِن رَّبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّنْهُمْ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ ١٣٦

(ఓ ముస్లింలారా!) మీరు ఇలా అనండి: “మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన సందేశాలను మరియు ఇబ్రాహీమ్ ఇస్మా’యీల్, ఇస్’హాఖ్, య’అఖూబ్ మరియు అతని సంతతి వారికి ఇవ్వబడిన వాటినీ మరియు మూసా, ’ఈసా మరియు ఇతర ప్రవక్త లందరికీ వారి ప్రభువు తరఫు నుండి ఇవ్వబడిన వాటినీ (సందేశాలను) విశ్వసిస్తాము. వారిలో ఏ ఒక్కరి పట్లా మేము భేదభావం చూపము. మేము ఆయనకు విధేయులం (ముస్లింలం) అయ్యాము.”

2:137 – فَإِنْ آمَنُوا بِمِثْلِ مَا آمَنتُم بِهِ فَقَدِ اهْتَدَوا ۖ وَّإِن تَوَلَّوْا فَإِنَّمَا هُمْ فِي شِقَاقٍ ۖ فَسَيَكْفِيكَهُمُ اللَّـهُ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ ١٣٧

వారు కూడా మీరు విశ్వసించినట్లు విశ్వ సిస్తే, వారు సన్మార్గం పొందిన వారవుతారు. ఒకవేళ వారు తిరిగిపోతే, విరోధం వహించిన వారవుతారు. (వారి నుండి రక్షించటానికి) మీకు అల్లాహ్ చాలు. ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

2:138 – صِبْغَةَ اللَّـهِ ۖ وَمَنْ أَحْسَنُ مِنَ اللَّـهِ صِبْغَةً ۖ وَنَحْنُ لَهُ عَابِدُونَ ١٣٨

(వారితో ఇలా అను): “(మీరు) అల్లాహ్ రంగును (ధర్మాన్ని) స్వీకరించండి. మరియు అల్లాహ్ కంటే మంచి రంగు (ధర్మం) ఎవరిది? మరియు మేము ఆయనను మాత్రమే ఆరాధించే వారము.” 93

2:139 – قُلْ أَتُحَاجُّونَنَا فِي اللَّـهِ وَهُوَ رَبُّنَا وَرَبُّكُمْ وَلَنَا أَعْمَالُنَا وَلَكُمْ أَعْمَالُكُمْ وَنَحْنُ لَهُ مُخْلِصُونَ ١٣٩

(ఓ ము’హమ్మద్!) వారితో అను: “ఏమీ? అల్లాహ్ విషయంలో మీరు మాతో వాదిస్తారా? (వాస్తవానికి) ఆయన మా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. మా కర్మలు మాకు మరియు మీ కర్మలు మీకు. మరియు మేము ఆయనకు మాత్రమే మనఃపూర్వకంగా విధేయులమయ్యాము.”

2:140 – أَمْ تَقُولُونَ إِنَّ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطَ كَانُوا هُودًا أَوْ نَصَارَىٰ ۗ قُلْ أَأَنتُمْ أَعْلَمُ أَمِ اللَّـهُ ۗ وَمَنْ أَظْلَمُ مِمَّن كَتَمَ شَهَادَةً عِندَهُ مِنَ اللَّـهِ ۗ وَمَا اللَّـهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ ١٤٠

లేక మీరు: “నిశ్చయంగా ఇబ్రాహీమ్, ఇస్మా’యీల్, ఇస్’హాఖ్, య’అఖూబ్ మరియు వారి సంతతి వారంతా యూదులు మరియు క్రైస్తవులు.” అని అంటారా? ఇంకా ఇలా అను: “ఏమీ మీకు బాగా తెలుసా? లేక అల్లాహ్ కు (బాగా తెలుసా)? అల్లాహ్ వద్ద నుండి తన వద్దకు వచ్చిన సాక్ష్యాన్ని దాచే వాని కంటే ఎక్కువ దుర్మార్గుడెవడు? మరియు మీ కర్మల నుండి, అల్లాహ్ నిర్లక్ష్యంగా లేడు!”

2:141 – تِلْكَ أُمَّةٌ قَدْ خَلَتْ ۖ لَهَا مَا كَسَبَتْ وَلَكُم مَّا كَسَبْتُمْ ۖ وَلَا تُسْأَلُونَ عَمَّا كَانُوا يَعْمَلُونَ ١٤١

“ఇప్పుడు ఆ సంఘం గతించి పోయింది. అది చేసింది దానికి మరియు మీరు చేసింది మీకు. వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి మీరు ప్రశ్నించబడరు.” 94

2:142 – سَيَقُولُ السُّفَهَاءُ مِنَ النَّاسِ مَا وَلَّاهُمْ عَن قِبْلَتِهِمُ الَّتِي كَانُوا عَلَيْهَا قُل لِّلَّـهِ وَالْمَغْرِبُ يَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ١٤٢

[(*)] ప్రజలలోని కొందరు మూఢజనులు ఇలా అంటారు: ”వీరిని (ముస్లింలను) ఇంత వరకు వీరు అనుసరిస్తూవచ్చిన, ఖిబ్లానుండి త్రిప్పింది ఏమిటీ?” 95 వారితో ఇలా అను: ”తూర్పు మరియు పడమరలు అల్లాహ్‌కే చెందినవి. ఆయన తాను కోరిన వారికి బుజుమార్గం వైపునకు మార్గ దర్శకత్వం చేస్తాడు.”

2:143 – وَكَذَٰلِكَ جَعَلْنَاكُمْ أُمَّةً وَسَطًا لِّتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ وَيَكُونَ الرَّسُولُ عَلَيْكُمْ شَهِيدًا وَمَا جَعَلْنَا الْقِبْلَةَ الَّتِي كُنتَ عَلَيْهَا إِلَّا لِنَعْلَمَ مَن يَتَّبِعُ الرَّسُولَ مِمَّن يَنقَلِبُ عَلَىٰ عَقِبَيْهِ وَإِن كَانَتْ لَكَبِيرَةً إِلَّا عَلَى الَّذِينَ هَدَى اللَّـهُ وَمَا كَانَ اللَّـهُ لِيُضِيعَ إِيمَانَكُمْ إِنَّ اللَّـهَ بِالنَّاسِ لَرَءُوفٌ رَّحِيمٌ ١٤٣

మరియు మీరు ప్రజలకు సాక్షులుగా ఉండ టానికి మరియు సందేశహరుడు (ము’హమ్మద్‌) మీకు సాక్షిగా ఉండటానికి 96 మేము మిమ్మల్ని ఒక మధ్యస్థ (ఉత్తమ మరియు న్యాయశీలమైన) సమాజంగా చేశాము. మరియు ఎవరు సందేశ హరుణ్ణి అనుసరిస్తారో మరియు ఎవరు తమ మడ మల మీద వెనుదిరిగిపోతారో అనేది పరిశీలించ డానికి, నీవు పూర్వం అనుసరించే ఖిబ్లా (బైతుల్‌ – మఖ్దిస్‌)ను, ఖిబ్లాగా చేసి ఉన్నాము. మరియు ఇది వాస్తవానికి అల్లాహ్‌ మార్గదర్శకత్వం చూపిన వారికి తప్ప, ఇతరులకు భారమైనది. మరియు అల్లాహ్‌ మీ విశ్వాసాన్ని (బైతుల్‌-మఖ్దిస్‌ వైపునకు చేసిన నమా’జులను) ఎన్నడూ వృథాచేయడు 97 నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రజల పట్ల కనికరుడు, అపార కరుణాప్రదాత.

2:144 – قَدْ نَرَىٰ تَقَلُّبَ وَجْهِكَ فِي السَّمَاءِ فَلَنُوَلِّيَنَّكَ قِبْلَةً تَرْضَاهَا فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ وَحَيْثُ مَا كُنتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ وَإِنَّ الَّذِينَ أُوتُوا الْكِتَابَ لَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِن رَّبِّهِمْ وَمَا اللَّـهُ بِغَافِلٍ عَمَّا يَعْمَلُونَ ١٤٤

(ఓ ప్రవక్తా!) వాస్తవానికి మేము, నీవు పలుమార్లు నీ ముఖాన్ని ఆకాశం వైపునకు ఎత్తడం చూశాము. కావున మేము నిన్ను నీవు కోరిన ఖిబ్లా వైపునకు త్రిప్పుతున్నాము. కావున, నీవు మస్జిద్‌ అల్‌ -‘హరామ్‌ వైపునకు నీ ముఖాన్ని త్రిప్పుకో! ఇకపై మీరంతా ఎక్కడున్నా సరే (నమా’జ్‌ చేసేటప్పుడు), మీ ముఖాలను ఆవైపునకే త్రిప్పుకోండి. మరియు నిశ్చయంగా, గ్రంథం గలవారికి ఇది తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమని బాగా తెలుసు 98 మరియు అల్లాహ్‌ వారి కర్మల గురించి నిర్లక్ష్యంగా లేడు.

2:145 – وَلَئِنْ أَتَيْتَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ بِكُلِّ آيَةٍ مَّا تَبِعُوا قِبْلَتَكَ وَمَا أَنتَ بِتَابِعٍ قِبْلَتَهُمْ وَمَا بَعْضُهُم بِتَابِعٍ قِبْلَةَ بَعْضٍ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُم مِّن بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ إِنَّكَ إِذًا لَّمِنَ الظَّالِمِينَ ١٤٥

మరియు నీవు గ్రంథ ప్రజలకు ఎన్ని సూచనలు (ఆయాత్‌) చూపినా, వారు నీ ఖిబ్లాను అనుసరించరు. మరియు నీవు కూడా వారి ఖిబ్లాను అనుసరించలేవు. మరియు వారిలో ఒక వర్గం వారు, మరొక వర్గం వారి ఖిబ్లాను అనుసరించరు 99 మరియు నీవు ఈ జ్ఞానం పొందిన తరువాత కూడా వారి మనోవాంఛలను అనుసరిస్తే! నిశ్చయంగా, నీవు దుర్మార్గులలో చేరిన వాడవవుతావు.

2:146 – الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْرِفُونَهُ كَمَا يَعْرِفُونَ أَبْنَاءَهُمْ ۖ وَإِنَّ فَرِيقًا مِّنْهُمْ لَيَكْتُمُونَ الْحَقَّ وَهُمْ يَعْلَمُونَ ١٤٦

మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు తమ కుమారులను ఏవిధంగా గుర్తిస్తారో ఇతనిని (ము’హమ్మద్‌ను) కూడా ఆవిధంగా గుర్తిస్తారు. మరియు వాస్తవానికి వారిలోని ఒక వర్గంవారు తెలిసి కూడా సత్యాన్ని దాస్తున్నారు. 100

2:147 – الْحَقُّ مِن رَّبِّكَ ۖ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ ١٤٧

(నిస్సందేహంగా!) ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కావున నీవు సందేహించే వారిలో ఏ మాత్రం చేరకు!

2:148 – وَلِكُلٍّ وِجْهَةٌ هُوَ مُوَلِّيهَا ۖ فَاسْتَبِقُوا الْخَيْرَاتِ ۚ أَيْنَ مَا تَكُونُوا يَأْتِ بِكُمُ اللَّـهُ جَمِيعًا ۚ إِنَّ اللَّـهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١٤٨

మరియు ప్రతి ఒక (సంఘం) ఒక దిశ వైపునకు ముఖం త్రిప్పుతుంది. 101 కావున మీరు మంచిపనులు చేయటానికి త్వరపడండి. మీరెక్కడున్నా సరే, అల్లాహ్‌ మీ అందరినీ (తీర్పుదినంనాడు తన సన్నిధిలోకి) రప్పిస్తాడు. నిశ్చయంగా! అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.

2:149 – وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۖ وَإِنَّهُ لَلْحَقُّ مِن رَّبِّكَ ۗ وَمَا اللَّـهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ ١٤٩

మరియు నీవు ఎక్కడికి బయలుదేరినా సరే! నీ ముఖాన్ని (నమా’జ్‌లో) మస్జిద్‌ అల్‌- ‘హరామ్‌ వైపునకే త్రిప్పుకో. మరియు నిశ్చయంగా, ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. మరియు అల్లాహ్‌ మీ కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు.

2:150 – وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۚ وَحَيْثُ مَا كُنتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَيْكُمْ حُجَّةٌ إِلَّا الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِي وَلِأُتِمَّ نِعْمَتِي عَلَيْكُمْ وَلَعَلَّكُمْ تَهْتَدُونَ ١٥٠

మరియు నీవు ఎక్కడికి బయలుదేరినా సరే! నీ ముఖాన్ని (నమా’జ్‌లో) మస్జిద్‌ అల్‌- ‘హరామ్‌ వైపునకే త్రిప్పుకో. మరియు మీరెక్క డున్నా సరే, మీ ముఖాలను దాని వైపునకే త్రిప్పు కోండి. దీని వల్ల మీకు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజలకు అవకాశం దొరుకదు. కాని వారిలో దుర్మార్గులైనవారు (ఎలాంటి పరిస్థితులలోనూ ఊరుకోరు) అందుకని వారికి భయపడకండి, నాకే భయపడండి! మరియు ఈ విధంగా నేను మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేయటానికి. మరియు బహుశా, ఈ విధంగానైనా మీరు మార్గదర్శకత్వం పొందవచ్చు!

2:151 – كَمَا أَرْسَلْنَا فِيكُمْ رَسُولًا مِّنكُمْ يَتْلُو يَتْلُو عَلَيْكُمْ آيَاتِنَا وَيُزَكِّيكُمْ وَيُعَلِّمُكُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَيُعَلِّمُكُم مَّا لَمْ تَكُونُوا تَعْلَمُونَ ١٥١

ఈ విధంగా మేము మీ వారిలో నుండియే – మా సూచనలను మీ ఎదుట వినిపించటానికి మరియు మిమ్మల్ని సంస్కరించటానికి మరియు మీకు గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధించటానికి మరియు మీకు తెలియని విషయాలు నేర్పటానికి – ఒక ప్రవక్త (ము’హమ్మద్‌) ను మీ వద్దకు పంపాము.

2:152 – فَاذْكُرُونِي أَذْكُرْكُمْ وَاشْكُرُوا لِ وَلَا تَكْفُرُونِ ١٥٢

కావున మీరు నన్నే స్మరించండి, నేను కూడా మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. మరియు నాకు కృతజ్ఞులై ఉండండి మరియు నాకు కృతఘ్నులు కాకండి. 102

2:153 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ إِنَّ اللَّـهَ مَعَ الصَّابِرِينَ ١٥٣

ఓ విశ్వాసులారా! సహనం మరియు నమా’జ్‌ ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయంగా అల్లాహ్‌ సహనం గలవారితో ఉంటాడు. 103

2:154 – وَلَا تَقُولُوا لِمَن يُقْتَلُ فِي سَبِيلِ اللَّـهِ أَمْوَاتٌ ۚ بَلْ أَحْيَاءٌ وَلَـٰكِن لَّا تَشْعُرُونَ ١٥٤

మరియు అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని ‘మృతులు,’ అనకండి! 104 వాస్తవానికి వారు సజీవులు. కాని మీరది గ్రహించజాలరు.

2:155 – وَلَنَبْلُوَنَّكُم بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ ۗ وَبَشِّرِ الصَّابِرِينَ ١٥٥

మరియు నిశ్చయంగా మేము, మిమ్మల్ని భయ-ప్రమాదాలకు, ఆకలి బాధలకు, ధన, ప్రాణ, ఫల (ఆదాయాల) నష్టానికీ గురిచేసి పరీక్షిస్తాము. మరియు (ఇలాంటి పరిస్థితులలో) మనఃస్థైర్యంతో ఉండేవారికి శుభవార్తనివ్వు.

2:156 – الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّـهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ ١٥٦

ఎవరైతే విపత్కరమైన పరిస్థితి ఏర్పడి నప్పుడు: ”నిశ్చయంగా, మేము అల్లాహ్‌కే చెందిన వారము! మరియు మేము ఆయన వైపునకే మరలి పోతాము!” అని అంటారో!

2:157 – أُولَـٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَـٰئِكَ هُمُ الْمُهْتَدُونَ ١٥٧

అలాంటి వారికి వారి ప్రభువు నుండి అను గ్రహాలు 105 మరియు కరుణ ఉంటాయి. మరియు వారే సన్మార్గం పొందినవారు. 106 (1/8)

2:158 – إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِن شَعَائِرِ اللَّـهِ فَمَنْ حَجَّ الْبَيْتَ أَوِ اعْتَمَرَ فَلَا جُنَاحَ عَلَيْهِ أَن يَطَّوَّفَ بِهِمَا ۚ وَمَن تَطَوَّعَ خَيْرًا فَإِنَّ اللَّـهَ شَاكِرٌ عَلِيمٌ ١٥٨

  • నిశ్చయంగా, ‘సఫా మరియు మర్వాలు అల్లాహ్‌ చూపిన చిహ్నాలు. 107 కావున ఎవడు (క’అబహ్) గృహానికి ‘హజ్జ్‌ లేక ‘ఉమ్రా కొరకు పోతాడో, 108 అతడు ఈ రెంటి మధ్య పచార్లు (స’యీ) చేస్తే, అతనికి ఎట్టి దోషం లేదు. మరియు ఎవడైనా స్వేచ్ఛాపూర్వకంగా మంచి కార్యం చేస్తే! నిశ్చయంగా, అల్లాహ్‌ కృతజ్ఞతలను ఆమోదించే వాడు, 109 సర్వజ్ఞుడు.

2:159 – إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلْنَا مِنَ الْبَيِّنَاتِ وَالْهُدَىٰ مِن بَعْدِ مَا بَيَّنَّاهُ لِلنَّاسِ فِي الْكِتَابِ ۙ أُولَـٰئِكَ يَلْعَنُهُمُ اللَّـهُ وَيَلْعَنُهُمُ اللَّاعِنُونَ ١٥٩

నిశ్చయంగా, ఎవరైతే మేము అవతరింప జేసిన స్పష్టమైన బోధనలను, మార్గదర్శకత్వా లను – ప్రజల కొరకు దివ్యగ్రంథంలో స్పష్టపరచిన పిదప కూడా – దాచుతారో! వారిని అల్లాహ్‌ తప్పక శపిస్తాడు (బహిష్కరిస్తాడు). మరియు శపించగలవారు కూడా వారిని శపిస్తారు. 110

2:160 – إِلَّا الَّذِينَ تَابُوا وَأَصْلَحُوا وَبَيَّنُوا فَأُولَـٰئِكَ أَتُوبُ عَلَيْهِمْ ۚ وَأَنَا التَّوَّابُ الرَّحِيمُ ١٦٠

కాని ఎవరైతే పశ్చాత్తాపపడతారో మరియు తమ నడవడికను సంస్కరించుకుంటారో మరియు సత్యాన్ని వెల్లడిస్తారో, అలాంటి వారి పశ్చాత్తాపాన్ని నేను అంగీకరిస్తాను. మరియు నేను మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడను, 111 అపార కరుణాప్రదాతను.

2:161 – إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارٌ أُولَـٰئِكَ عَلَيْهِمْ لَعْنَةُ اللَّـهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ ١٦١

నిశ్చయంగా, ఎవరైతే సత్యతిరస్కారులై, ఆ తిరస్కారంలోనే మృతిచెందుతారో, అలాంటి వారిపై అల్లాహ్‌ యొక్క శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు దేవదూతల మరియు సర్వ మానవుల యొక్క శాపముంటుంది.

2:162 – خَالِدِينَ فِيهَا ۖ لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ ١٦٢

అందులో (ఆ శాపగ్రస్త స్థితిలోనే నరకంలో) వారు శాశ్వతంగా ఉంటారు. వారి శిక్షను తగ్గించటం కానీ మరియు వారికి మళ్ళీ వ్యవధి ఇవ్వటం కానీ జరుగదు.

2:163 – وَإِلَـٰهُكُمْ إِلَـٰهٌ وَاحِدٌ ۖ لَّا إِلَـٰهَ إِلَّا هُوَ الرَّحْمَـٰنُ الرَّحِيمُ ١٦٣

మరియు మీ ఆరాధ్యదైవం కేవలం ఆ అద్వితీయుడు 112 (అల్లాహ్‌) మాత్రమే. ఆయన తప్ప! మరొక ఆరాధ్యదేవుడు లేడు, అనంత కరుణా మయుడు, అపార కరుణాప్రదాత.

2:164 – إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَالْفُلْكِ الَّتِي تَجْرِي فِي الْبَحْرِ بِمَا يَنفَعُ النَّاسَ وَمَا أَنزَلَ اللَّـهُ مِنَ السَّمَاءِ مِن مَّاءٍ فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَبَثَّ فِيهَا مِن كُلِّ دَابَّةٍ وَتَصْرِيفِ الرِّيَاحِ وَالسَّحَابِ الْمُسَخَّرِ بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ ١٦٤

నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టిలోనూ, రేయింబవళ్ళ మార్పులోనూ, ప్రజలకు ఉపయోగ కరమైన వాటిని తీసుకొని, సముద్రంలో పయనించే ఓడలలోనూ మరియు అల్లాహ్‌ ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి దాని ద్వారా నిర్జీవమైన భూమికి ప్రాణం పోసి, అందులో వివిధరకాల జీవరాసులను వర్థిల్లజేయటంలోనూ; మరియు వాయువులు మరియు మేఘాలు, భూమ్యాకాశాల మధ్య నియమబద్ధంగా చేసే సంచారాల మార్పుల లోనూ, బుధ్ధిమంతులకు ఎన్నో సంకేతాలు ఉన్నాయి. 113

2:165 – وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّـهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّـهِ ۖ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّـهِ ۗ وَلَوْ يَرَى الَّذِينَ ظَلَمُوا إِذْ يَرَوْنَ الْعَذَابَ أَنَّ الْقُوَّةَ لِلَّـهِ جَمِيعًا وَأَنَّ اللَّـهَ شَدِيدُ الْعَذَابِ ١٦٥

అయినా ఈ మానవులలో కొందరు ఇతరు లను, అల్లాహ్‌కు సాటిగా కల్పించుకుని, అల్లాహ్‌ ను ప్రేమించ వలసిన విధంగా వారిని ప్రేమిస్తారు. కాని విశ్వాసులు అందరికంటే అత్యధికంగా అల్లాహ్‌నే ప్రేమిస్తారు. మరియు ఈ దుర్మార్గం చేస్తున్నవారు ప్రత్యక్షంగా చూడగలిగితే! ఆ శిక్షను చూసి నప్పుడు, వారు నిశ్చయంగా, సర్వశక్తి కేవలం అల్లాహ్‌కే చెందుతుంది. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ చాలా కఠినంగా శిక్షించేవాడు, (అని తెలుసుకునేవారు). 114

2:166 – إِذْ تَبَرَّأَ الَّذِينَ اتُّبِعُوا مِنَ الَّذِينَ اتَّبَعُوا وَرَأَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْأَسْبَابُ ١٦٦

అప్పుడు (ఆ రోజు) వారు (ఆ సాటిగా కల్పించబడినవారు) తమను అనుసరించిన వారితో తమకు ఎలాంటి సంబంధం లేదంటారు. మరియు వారంతా తమ శిక్షను చూసుకుంటారు. మరియు వారి మధ్య ఉన్న సంబంధాలన్నీ తెగిపోతాయి.

2:167 – وَقَالَ الَّذِينَ اتَّبَعُوا لَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّأَ مِنْهُمْ كَمَا تَبَرَّءُوا مِنَّا ۗ كَذَٰلِكَ يُرِيهِمُ اللَّـهُ أَعْمَالَهُمْ حَسَرَاتٍ عَلَيْهِمْ ۖ وَمَا هُم بِخَارِجِينَ مِنَ النَّارِ ١٦٧

మరియు ఆ అనుసరించిన వారు అంటారు: ”మాకు ప్రపంచ జీవితంలోకి మళ్ళీ తిరిగిపోయే అవకాశం లభిస్తే – వీరు ఈ రోజు మమ్మల్ని త్యజించినట్లు – మేము కూడా వీరిని త్యజిస్తాము!” ఈ విధంగా (ప్రపంచంలో) వారు చేసిన కర్మలను అల్లాహ్‌ వారికి చూపించినప్పుడు, అది వారికి ఎంతో బాధాకరంగా ఉంటుంది. కాని వారు నరకాగ్ని నుండి ఏ విధంగానూ బయట పడలేరు.

2:168 – يَا أَيُّهَا النَّاسُ كُلُوا مِمَّا فِي الْأَرْضِ حَلَالًا طَيِّبًا وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ ١٦٨

ఓ ప్రజలారా! భూమిలోనున్న ధర్మ సమ్మ తమైన పరిశుద్ధమైన వాటినే తినండి. మరియు షై’తాన్‌ అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా అతడు మీకు బహిరంగ శత్రువు.

2:169 – إِنَّمَا يَأْمُرُكُم بِالسُّوءِ وَالْفَحْشَاءِ وَأَن تَقُولُوا عَلَى اللَّـهِ مَا لَا تَعْلَمُونَ ١٦٩

నిశ్చయంగా, అతడు (షై’తాన్‌)మిమ్మల్ని దుష్కార్యాలు మరియు అశ్లీలమైన పనులు చేయటానికి మరియు అల్లాహ్‌ను గురించి మీకు తెలియని మాటలు పలుకటానికి ప్రేరేపిస్తుంటాడు.

2:170 – وَإِذَا قِيلَ لَهُمُ اتَّبِعُوا مَا أَنزَلَ اللَّـهُ قَالُوا بَلْ نَتَّبِعُ مَا أَلْفَيْنَا عَلَيْهِ آبَاءَنَا ۗ أَوَلَوْ كَانَ آبَاؤُهُمْ لَا يَعْقِلُونَ شَيْئًا وَلَا يَهْتَدُونَ ١٧٠

మరియు వారితో: ”అల్లాహ్‌ అవతరింప జేసిన వాటిని (ఆదేశాలను) అనుసరించండి!” అని అన్నప్పుడు. వారు: ”అలా కాదు, మేము మా తండ్రి-తాతలు అవలంబిస్తూవచ్చిన పధ్ధతినే అనుసరిస్తాము.” అని సమాధానమిస్తారు. ఏమీ? వారి తండ్రి-తాతలు ఎలాంటి జ్ఞానంలేనివారై నప్పటికినీ మరియు సన్మార్గం పొందనివారు అయి నప్పటికినీ (వీరు, వారినే అనుసరిస్తారా)?

2:171 – وَمَثَلُ الَّذِينَ كَفَرُوا كَمَثَلِ الَّذِي يَنْعِقُ بِمَا لَا يَسْمَعُ إِلَّا دُعَاءً وَنِدَاءً ۚ صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لَ يَعْقِلُونَ ١٧١

మరియు సత్య-తిరస్కారుల ఉపమానం, వాటి (ఆ పశువుల) వలే ఉంది; అవి అతని (కాపరి) అరుపులు వింటాయే (కానీ ఏమీ అర్థంచేసుకో లేవు), అరుపులు మరియు కేకలు వినడం తప్ప. వారు చెవిటివారు, మూగవారు మరియు గ్రుడ్డివారు, కాబట్టి వారు ఏమీ అర్థం చేసుకోలేరు! 115

2:172 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ وَاشْكُرُوا لِلَّـهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ ١٧٢

ఓ విశ్వాసులారా! మీరు నిజంగానే కేవలం ఆయన (అల్లాహ్‌)నే ఆరాధించేవారు అయితే; మేము మీకు జీవనోపాధిగా ఇచ్చిన పరిశుధ్ధ (ధర్మసమ్మత)మైన వస్తువులనే తినండి మరియు అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపండి. 116

2:173 – إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنزِيرِ وَمَا أُهِلَّ بِهِ لِغَيْرِ اللَّـهِ ۖ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٧٣

నిశ్చయంగా, ఆయన మీ కొరకు చచ్చిన జంతువు, రక్తం, పందిమాంసం మరియు అల్లాహ్‌ తప్ప ఇతరుల కొరకు జి’బ్‌’హ్‌ చేయబడిన దానిని (తినటాన్ని) నిషేధించి ఉన్నాడు. 117 కాని ఎవరైనా గత్యంతరం లేక, దుర్నీతితో కాకుండా, హద్దు మీరకుండా (తిన్నట్లైతే) అట్టివానిపై ఎలాంటి దోషంలేదు! 118 నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, 119 అపార కరుణాప్రదాత.

2:174 – إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلَ اللَّـهُ مِنَ الْكِتَابِ وَيَشْتَرُونَ بِهِ ثَمَنًا قَلِيلًا ۙ أُولَـٰئِكَ مَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ إِلَّا النَّارَ وَلَا يُكَلِّمُهُمُ اللَّـهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ١٧٤

నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్‌ గ్రంథంలో అవతరింపజేసిన సందేశాలను దాచి, దానికి బదు లుగా అల్పలాభం పొందుతారో అలాంటి వారు తమ కడుపులను కేవలం అగ్నితో నింపుకుంటు న్నారు మరియు అల్లాహ్‌ పునరుత్థాన దినమున వారితో మాట్లాడడు మరియు వారిని శుధ్ధపరచడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

2:175 – أُولَـٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الضَّلَالَةَ بِالْهُدَىٰ وَالْعَذَابَ بِالْمَغْفِرَةِ ۚ فَمَا أَصْبَرَهُمْ عَلَى النَّارِ ١٧٥

ఇలాంటి వారే సన్మార్గానికి బదులుగా దుర్మార్గాన్ని మరియు క్షమాపణకు బదులుగా శిక్షను ఎన్నుకున్నవారు. ఎంత సహనముంది వీరికి, నరకాగ్ని శిక్షను భరించటానికి!

2:176 – ذَٰلِكَ بِأَنَّ اللَّـهَ نَزَّلَ الْكِتَابَ بِالْحَقِّ ۗ وَإِنَّ الَّذِينَ اخْتَلَفُوا فِي الْكِتَابِ لَفِي شِقَاقٍ بَعِيدٍ ١٧٦

ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్‌ ఈ గ్రంథాన్ని సత్యంతో అవతరింప జేశాడు. మరియు నిశ్చయంగా ఈ గ్రంథం (ఖుర్‌ఆన్‌) గురించి భిన్నాభిప్రాయాలు గలవారు, ఘోర అంతఃకలహంలో ఉన్నారు! 120 (1/4)

2:177 – لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَـٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ وَآتَى الْمَالَ عَلَىٰ حُبِّهِ ذَوِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينَ وَابْنَ السَّبِيلِ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَالْمُوفُونَ بِعَهْدِهِمْ إِذَا عَاهَدُوا ۖ وَالصَّابِرِينَ فِي الْبَأْسَاءِ وَالضَّرَّاءِ وَحِينَ الْبَأْسِ ۗ أُولَـٰئِكَ الَّذِينَ صَدَقُوا ۖ وَأُولَـٰئِكَ هُمُ الْمُتَّقُونَ ١٧٧

  • వినయ-విధేయత (ధర్మనిష్ఠా పరత్వం) 121 అంటే మీరు మీ ముఖాలను తూర్పు దిక్కునకో, లేక పడమర దిక్కునకో చేయటం కాదు; 122 కాని వినయ-విధేయత (ధర్మనిష్ఠా పరత్వం) అంటే అల్లాహ్‌ ను, అంతిమదినాన్ని, దేవదూతలను, ప్రతి దివ్యగ్రంథాన్ని మరియు ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించడం; మరియు ధనంపై ప్రేమ కలిగి ఉండి కూడా, దానిని బంధువుల కొరకు అనాథుల కొరకు, యాచించని పేదల 123 కొరకు, బాటసారుల కొరకు, యాచకుల కొరకు మరియు బానిసలను 124 విడిపించడానికి వ్యయపరచడం. మరియు నమా’జ్‌ను స్థాపించడం, ‘జకాత్‌ ఇవ్వడం మరియు వాగ్దానం చేసినప్పుడు తమ వాగ్దానాన్ని పూర్తిచేయడం. మరియు దురవస్థలో మరియు ఆపత్కాలాలలో మరియు యుధ్ధ సమయాలలో స్థైర్యం కలిగి ఉండటం. ఇలాంటివారే సత్యవంతులు మరియు ఇలాంటి వారే దైవభీతి గలవారు.

2:178 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الْقِصَاصُ فِي الْقَتْلَى ۖ الْحُرُّ بِالْحُرِّ وَالْعَبْدُ بِالْعَبْدِ وَالْأُنثَىٰ بِالْأُنثَىٰ ۚ فَمَنْ عُفِيَ لَ مِنْ أَخِيهِ شَيْءٌ فَاتِّبَاعٌ بِالْمَعْرُوفِ وَأَدَاءٌ إِلَيْهِ بِإِحْسَانٍ ۗ ذَٰلِكَ تَخْفِيفٌ مِّن رَّبِّكُمْ وَرَحْمَةٌ ۗ فَمَنِ اعْتَدَىٰ بَعْدَ ذَٰلِكَ فَلَهُ عَذَابٌ أَلِيمٌ ١٧٨

ఓ విశ్వాసులారా! హత్య విషయంలో మీ కొరకు న్యాయప్రతీకారం (ఖి’సా’స్‌) నిర్ణయించ బడింది. ఆ హత్య చేసినవాడు, స్వేచ్ఛగలవాడైతే ఆ స్వేచ్ఛాపరుణ్ణి, బానిస అయితే ఆ బానిసను, స్త్రీ అయితే ఆ స్త్రీని (వధించాలి). 125 ఒకవేళ హతుని సోదరులు (కుటుంబీకులు) హంతకుణ్ణి కనికరించదలిస్తే, ధర్మయుక్తంగా రక్తశుల్క నిర్ణయం జరగాలి. 126 హంతకుడు రక్తధనాన్ని, ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు తరఫు నుండి మీకు లభించే సౌకర్యం, కారుణ్యం. దీని తర్వాత కూడా ఈ హద్దులను అతిక్రమించే వానికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

2:179 – وَلَكُمْ فِي الْقِصَاصِ حَيَاةٌ يَا أُولِي الْأَلْبَابِ لَعَلَّكُمْ تَتَّقُونَ ١٧٩

ఓ బుద్ధిమంతులారా! న్యాయప్రతీకారం (ఖి’సా’స్‌)లో మీకు ప్రాణరక్షణ ఉంది, దీనివల్ల మీరు దైవభీతి గలవారు అవుతారు. 127

2:180 – كُتِبَ عَلَيْكُمْ إِذَا حَضَرَ أَحَدَكُمُ الْمَوْتُ إِن تَرَكَ خَيْرًا الْوَصِيَّةُ لِلْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ بِالْمَعْرُوفِ ۖ حَقًّا عَلَى الْمُتَّقِينَ ١٨٠

మీలో ఎవరికైనా మరణకాలం సమీపించి నప్పుడు అతడు, ఆస్తిపాస్తులు గలవాడైతే, అతడు తన తల్లి-దండ్రుల కొరకు మరియు సమీప బంధువుల కొరకు ధర్మసమ్మతమైన మరణ శాసనం (వీలునామా) వ్రాయాలి. 128 ఇది దైవభీతి గలవారి విద్యుక్త ధర్మం.

2:181 – فَمَن بَدَّلَهُ بَعْدَ مَا سَمِعَهُ فَإِنَّمَا إِثْمُهُ عَلَى الَّذِينَ يُبَدِّلُونَهُ ۚ إِنَّ اللَّـهَ سَمِيعٌ عَلِيمٌ ١٨١

ఇక దానిని (వీలునామాను) విన్నవారు, తరువాత ఒకవేళ దానిని మార్చితే, దాని పాపమంతా నిశ్చయంగా, ఆ మార్చిన వారిపైననే ఉంటుంది. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. 129

2:182 – فَمَنْ خَافَ مِن مُّوصٍ جَنَفًا أَوْ إِثْمًا فَأَصْلَحَ بَيْنَهُمْ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٨٢

కాని వీలునామా చేసిన వ్యక్తి పక్షపాతమో, లేదా అన్యాయమో చేశాడనే భయం ఎవనికైనా ఉంటే అతడు ఈ వ్యవహారంతో సంబంధమున్న వారందరి మధ్య రాజీకుదిరిస్తే అందులో ఎలాంటి దోషం లేదు. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

2:183 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ ١٨٣

ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది 130 – ఏ విధంగానైతే మీ పూర్వీకులకు విధిగా నిర్ణయించబడి ఉండెనో – బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని!

2:184 – أَيَّامًا مَّعْدُودَاتٍ ۚ فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ ۚ وَعَلَى الَّذِينَ يُطِيقُونَهُ فِدْيَةٌ طَعَامُ مِسْكِينٍ ۖ فَمَن تَطَوَّعَ خَيْرًا فَهُوَ خَيْرٌ لَّهُ ۚ وَأَن تَصُومُوا خَيْرٌ لَّكُمْ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ ١٨٤

ఇది (ఈ ఉపవాసం) నిర్ణయించబడిన రోజులకు మాత్రమే. కానీ, మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే, లేక ప్రయాణంలో ఉంటే, వేరే దినాలలో (ఆ ఉపవాసాలు) పూర్తిచేయాలి. కాని దానిని పూర్తిచేయటం దుర్భరమైన వారు పరిహారంగా, ఒక పేదవానికి భోజనం పెట్టాలి. 131 కాని ఎవరైనా సహృదయంతో ఇంకా ఎక్కువ మేలు చేయదలిస్తే, అది అతని మేలుకే! కాని మీరు తెలుసుకో గలిగితే, ఉపవాసం ఉండటమే, మీకు ఎంతో ఉత్తమమైనది.

2:185 – شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ ۚ فَمَن شَهِدَ مِنكُمُ الشَّهْرَ فَلْيَصُمْهُ ۖ وَمَن كَانَ مَرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ ۗ يُرِيدُ اللَّـهُ بِكُمُ الْيُسْرَ وَلَا يُرِيدُ بِكُمُ الْعُسْرَ وَلِتُكْمِلُوا الْعِدَّةَ وَلِتُكَبِّرُوا اللَّـهَ عَلَىٰ مَا هَدَاكُمْ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ ١٨٥

రమ’దాన్‌ నెల! అందులో దివ్య ఖుర్‌ఆన్‌ మానవులకు మార్గదర్శకత్వంగా, అవతరింప జేయబడింది! 132 మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యా-సత్యాలను వేర్పరచే, స్పష్టమైన ఉపదేశాలున్నాయి. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా (విధిగా) ఉపవాస ముండాలి. కాని వ్యాధిగ్రస్తుడైనవాడు, లేక ప్రయా ణంలో ఉన్నవాడు, (ఆ ఉపవాసాలను) వేరే దినా లలో పూర్తిచేయాలి. అల్లాహ్‌ మీకు సౌలభ్యం చేయగోరుతున్నాడే కానీ, మిమ్మల్ని కష్టపెట్ట దలచుకోలేదు. ఇది మీరు ఉపవాసదినాల సంఖ్యను పూర్తిచేయగలగటానికి మరియు మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్‌ మహ నీయతను (ఘనతను) కొనియాడటానికి మరియు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి!

2:186 – وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ ۖ فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ يَرْشُدُونَ ١٨٦

మరియు నా దాసులు, నన్ను గురించి నిన్ను అడిగితే: ”నేను (వారికి) అతి సమీపంలోనే ఉన్నాను. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును విని, జవాబిస్తాను 133 కాబట్టి వారు సరైన మార్గం పొందటానికి, నా ఆజ్ఞలను అనుసరించాలి మరియు నా యందు విశ్వాసం కలిగి ఉండాలి.” అని, చెప్పు. 134

2:187 – أُحِلَّ لَكُمْ لَيْلَةَ الصِّيَامِ الرَّفَثُ إِلَ نِسَائِكُمْ ۚ هُنَّ لِبَاسٌ لَّكُمْ وَأَنتُمْ لِبَاسٌ لَّهُنَّ ۗ عَلِمَ اللَّـهُ أَنَّكُمْ كُنتُمْ تَخْتَانُونَ أَنفُسَكُمْ فَتَابَ عَلَيْكُمْ وَعَفَا عَنكُمْ ۖ فَالْآنَ بَاشِرُوهُنَّ وَابْتَغُوا مَا كَتَبَ اللَّـهُ لَكُمْ ۚ وَكُلُوا وَاشْرَبُوا حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ ۖ ثُمَّ أَتِمُّوا الصِّيَامَ إِلَى اللَّيْلِ ۚ وَلَا تُبَاشِرُوهُنَّ وَأَنتُمْ عَاكِفُونَ فِي الْمَسَاجِدِ ۗ تِلْكَ حُدُودُ اللَّـهِ فَلَا تَقْرَبُوهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّـهُ آيَاتِهِ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَّقُونَ ١٨٧

ఉపవాసపు రాత్రులందు మీకు మీ భార్య లతో రతిక్రీడ (రఫస్‌’) ధర్మసమ్మతం చేయ బడింది. వారు మీ వస్త్రాలు, మీరు వారి వస్త్రాలు. వాస్తవానికి మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం అల్లాహ్‌కు తెలుసు. కావున ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు మరియు మిమ్మల్ని మన్నించాడు. ఇక నుండి మీరు మీ భార్యలతో సంభోగం (బాషిర్‌) చేయండి మరియు అల్లాహ్‌ మీ కొరకు వ్రాసిన దానిని కోరండి. మరియు ఉదయకాలపు తెల్లని రేఖలు రాత్రి నల్లచారల నుండి స్పష్టపడే వరకు, మీరు తినండి, త్రాగండి. ఆ తరువాత చీకటి పడేవరకూ మీ ఉపవాసాన్ని పూర్తిచెయ్యండి. కాని మస్జిద్‌లలో ఏ’తెకాఫ్‌ పాటించేటప్పుడు, మీరు మీ స్త్రీలతో సంభోగించకండి 135 ఇవి అల్లాహ్‌ ఏర్పరచిన హద్దులు, కావున ఉల్లంఘించే (ఉద్దేశంతో) వీటిని సమీపించకండి. ఈ విధంగా అల్లాహ్‌ తన ఆజ్ఞలను ప్రజలకు స్పష్టం చేస్తున్నాడు. బహుశా వారు భయ-భక్తులు కలిగి ఉంటారని!

2:188 – وَلَا تَأْكُلُوا أَمْوَالَكُم بَيْنَكُم بِالْبَاطِلِ وَتُدْلُوا بِهَا إِلَى الْحُكَّامِ لِتَأْكُلُوا فَرِيقًا مِّنْ أَمْوَالِ النَّاسِ بِالْإِثْمِ وَأَنتُمْ تَعْلَمُونَ ١٨٨

మరియు మీరు ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా కబళించకండి మరియు బుధ్ధి పూర్వకంగా, అక్రమమైనరీతిలో, ఇతరుల ఆస్తిలో కొంత భాగం తినే దురుద్దేశంతో, న్యాయాధి కారులకు లంచాలు ఇవ్వకండి. (3/8)

2:189 – يَسْأَلُونَكَ عَنِ الْأَهِلَّةِ ۖ قُلْ هِيَ مَوَاقِيتُ لِلنَّاسِ وَالْحَجِّ ۗ وَلَيْسَ الْبِرُّ بِأَن تَأْتُوا الْبُيُوتَ مِن ظُهُورِهَا وَلَـٰكِنَّ الْبِرَّ مَنِ اتَّقَىٰ ۗ وَأْتُوا الْبُيُوتَ مِنْ أَبْوَابِهَا ۚ وَاتَّقُوا اللَّـهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ ١٨٩

  • (ఓ ప్రవక్తా!) వారు నిన్ను మారే చంద్రుని (రూపాలను) గురించి అడుగుతున్నారు. నీవు వారితో ఇలా అను: ”అవి ప్రజలకు కాలగణనను మరియు ‘హజ్జ్‌ దినాలను తెలియజేస్తాయి.” మీరు మీ ఇళ్ళలోకి వాటి వెనుక భాగం నుండి ప్రవేశించడం ఋజువర్తన (బిర్ర్‌) కాదు, దైవభీతి కలిగి ఉండటమే ఋజువర్తన (బిర్ర్‌). కనుక మీరు ఇండ్లలో వాటి ద్వారాల నుండియే ప్రవేశించండి. మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లాహ్ యందు భయ-భక్తులు కలిగి ఉండండి.

2:190 – وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّـهِ الَّذِينَ يُقَاتِلُونَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّـهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ ١٩٠

మరియు మీతో, పోరాడేవారితో, మీరు అల్లాహ్‌ మార్గంలో పోరాడండి, కాని హద్దులను అతిక్రమించకండి. నిశ్చయంగా, అల్లాహ్‌ హద్దులను అతిక్రమించే వారిని ప్రేమించడు 136

2:191 – وَاقْتُلُوهُمْ حَيْثُ ثَقِفْتُمُوهُمْ وَأَخْرِجُوهُم مِّنْ حَيْثُ أَخْرَجُوكُمْ ۚ وَالْفِتْنَةُ أَشَدُّ أَشَدُّ الْقَتْلِ ۚ وَلَا تُقَاتِلُوهُمْ عِندَ الْمَسْجِدِ الْحَرَامِ حَتَّىٰ يُقَاتِلُوكُمْ فِيهِ ۖ فَإِن قَاتَلُوكُمْ فَاقْتُلُوهُمْ ۗ كَذَٰلِكَ جَزَاءُ الْكَافِرِينَ ١٩١

వారు, మీకు ఎక్కడ ఎదురైతే అక్కడనే వారిని చంపండి. మరియు వారు మిమ్మల్ని ఎచ్చటి నుండి తరిమివేశారో, మీరు కూడా వారిని అచ్చటి నుండి తరిమివేయండి. మరియు సత్య ధర్మానికి అడ్డుగా నిలవటం (ఫిత్నా) 137 చంపటం కంటే ఘోరమైనది. మస్జిద్‌ అల్‌-‘హరామ్‌ వద్ద వారు మీతో యుధ్ధం చేయనంత వరకు మీరు వారితో అక్కడ యుధ్ధం చేయకండి. 138

2:192 – فَإِنِ انتَهَوْا فَإِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٩٢

కానీ, వారు (యుధ్ధం చేయటం) మాను కుంటే (మీరు కూడా మానుకోండి). ఎందుకంటే నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

2:193 – وَقَاتِلُوهُمْ حَتَّىٰ لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ لِلَّـهِ ۖ فَإِنِ انتَهَوْا فَلَا عُدْوَانَ إِلَّا عَلَى الظَّالِمِينَ ١٩٣

మరియు ఫిత్నా 139 ముగిసిపోయే వరకు మరియు అల్లాహ్‌ ధర్మం మాత్రమే స్థాపించబడే వరకు మీరు వారితో యుధ్ధం చేస్తూ ఉండండి. ఒకవేళ వారు మానుకుంటే, దుర్మార్గులతో తప్ప ఇతరులతో పోరాడకండి. 140

2:194 – الشَّهْرُ الْحَرَامُ بِالشَّهْرِ الْحَرَامِ وَالْحُرُمَاتُ قِصَاصٌ ۚ فَمَنِ اعْتَدَىٰ عَلَيْكُمْ فَاعْتَدُوا عَلَيْهِ بِمِثْلِ مَا اعْتَدَىٰ عَلَيْكُمْ ۚ وَاتَّقُوا اللَّـهَ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ مَعَ الْمُتَّقِينَ ١٩٤

నిషిధ్ధమాసానికి బదులు నిషిధ్ధమాసమే మరియు నిషిద్ధస్థలాలలో న్యాయ ప్రతీకారం (ఖి’సా’స్‌) తీసుకో వచ్చు. 141 కాబట్టి మీపై ఎవరైనా దాడిచేస్తే, మీరు కూడా వారిపై అదే విధంగా దాడిచేయండి. మరియు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ భయ-భక్తులు గలవారికి తోడుగా ఉంటాడని తెలుసుకోండి.

2:195 – وَأَنفِقُوا فِي سَبِيلِ اللَّـهِ وَلَا تُلْقُوا بِأَيْدِيكُمْ إِلَى التَّهْلُكَةِ ۛ وَأَحْسِنُوا ۛ إِنَّ اللَّـهَ يُحِبُّ الْمُحْسِنِينَ ١٩٥

మరియు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. మరియు మీ చేతులారా మిమ్మల్ని మీరు వినాశంలో పడవేసుకోకండి; మేలుచేయండి. నిశ్చయంగా, అల్లాహ్‌ మేలు చేసేవారిని ప్రేమిస్తాడు

2:196 – وَأَتِمُّوا الْحَجَّ وَالْعُمْرَةَ لِلَّـهِ ۚ فَإِنْ أُحْصِرْتُمْ فَمَا اسْتَيْسَرَ مِنَ الْهَدْيِ ۖ وَلَا تَحْلِقُوا رُءُوسَكُمْ حَتَّىٰ يَبْلُغَ الْهَدْيُ مَحِلَّهُ ۚ فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوْ بِهِ أَذًى مِّن رَّأْسِهِ فَفِدْيَةٌ مِّن صِيَامٍ أَوْ صَدَقَةٍ أَوْ نُسُكٍ ۚ فَإِذَا أَمِنتُمْ فَمَن تَمَتَّعَ بِالْعُمْرَةِ إِلَى الْحَجِّ فَمَا اسْتَيْسَرَ مِنَ الْهَدْيِ ۚ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ ثَلَاثَةِ أَيَّامٍ فِي الْحَجِّ وَسَبْعَةٍ إِذَا رَجَعْتُمْ ۗ تِلْكَ عَشَرَةٌ كَامِلَةٌ ۗ ذَٰلِكَ لِمَن لَّمْ يَكُنْ أَهْلُهُ حَاضِرِي الْمَسْجِدِ الْحَرَامِ ۚ وَاتَّقُوا اللَّـهَ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ شَدِيدُ الْعِقَابِ ١٩٦

మరియు అల్లాహ్‌ (ప్రసన్నత) కొరకు ‘హజ్జ్‌ మరియు ‘ఉమ్రా పూర్తిచేయండి. 142 మీకు వాటిని పూర్తిచేయటానికి ఆటంకం కలిగినట్లైతే, మీరు ఇవ్వదలుచుకున్న బలి (ఖుర్బానీ) ఇవ్వండి. 143 బలి జంతువు దాని గమ్యస్థానానికి చేరనంత వరకు మీరు శిరోముండనం చేసుకోకండి. 144 కానీ, మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడై ఉంటే లేదా అతని తలకు బాధ ఉంటే (శిరో ముండనం చేసుకొని) దానికి పరిహారంగా (మూడు రోజులు) ఉపవాసం ఉండాలి. లేదా దాన-ధర్మాలు చేయాలి (ఆరుగురు నిరు పేదలకు భోజనం పెట్టాలి), లేదా బలి ఇవ్వాలి. కాని శాంతి భద్రతలు ఉన్న సమయాలలో ఎవడైనా ‘హజ్జె తమత్తు 145 చేయదలచుకుంటే, అతడు తనశక్తిమేరకు బలి 146 ఇవ్వాలి. కాని ఎవడైతే ఖుర్బానీ ఇవ్వలేడో ‘హజ్జ్‌ కాలంలో మూడు దినాలు మరియు (ఇంటికి) తిరిగివచ్చిన పిమ్మట ఏడు దినాలు ఉపవాసం ఉండాలి, ఈ విధంగా మొత్తం పది దినాలు ఉపవాసాలు ఉండాలి. ఇది మస్జిద్‌ అల్‌-‘హరామ్‌ దగ్గర నివసించని వారికి మాత్రమే. మరియు అల్లాహ్‌ యెడల భయ-భక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ శిక్ష విధించటంలో చాలా కఠినుడు, అని తెలుసుకోండి.

2:197 – الْحَجُّ أَشْهُرٌ مَّعْلُومَاتٌ ۚ فَمَن فَرَضَ فِيهِنَّ الْحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوقَ وَلَا جِدَالَ فِي الْحَجِّ ۗ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ يَعْلَمْهُ اللَّـهُ ۗ وَتَزَوَّدُوا فَإِنَّ خَيْرَ الزَّادِ التَّقْوَىٰ ۚ وَاتَّقُونِ يَا أُولِي الْأَلْبَابِ ١٩٧

‘హజ్జ్‌ నియమిత నెలలలోనే జరుగు తుంది. ఈ నిర్ణీత మాసాలలో ‘హజ్జ్‌ చేయటానికి సంకల్పించిన వ్యక్తి ‘హజ్జ్‌ (ఇ’హ్రామ్‌)లో వున్న సమయంలో (భార్యతో) రతిక్రీడ (రఫ’స్‌)కు, దుష్టకార్యాలకు మరియు కలహాలకు దూరంగా ఉండాలి. మీరు చేసే మంచిపనులన్నీ అల్లాహ్‌కు తెలుసు. (‘హజ్జ్ యాత్రకు) కావలసిన వస్తు సామాగ్రిని తీసుకు వెళ్ళండి. దైవభీతియే నిశ్చయంగా, అన్నిటికంటే ఉత్తమమైన సామగ్రి. కనుక ఓ బుధ్ధిమంతులారా! కేవలం నా యందే భయ-భక్తులు కలిగి ఉండండి.

2:198 – لَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَبْتَغُوا فَضْلًا مِّن رَّبِّكُمْ ۚ فَإِذَا أَفَضْتُم مِّنْ عَرَفَاتٍ فَاذْكُرُوا اللَّـهَ عِندَ الْمَشْعَرِ v الْحَرَامِ ۖ وَاذْكُرُوهُ كَمَا هَدَاكُمْ وَإِن كُنتُم مِّن قَبْلِهِ لَمِنَ الضَّالِّينَ ١٩٨

(‘హజ్జ్‌ యాత్రలో) మీరు మీ ప్రభువు అనుగ్రహాలు అన్వేషిస్తే 147 అందులో దోషంలేదు. ‘అరఫాత్‌ 148 నుండి బయలుదేరిన తరువాత మష్‌అరిల్‌ ‘హరామ్‌ (ముజ్‌’దలిఫా) 149 వద్ద (ఆగి) అల్లాహ్‌ను స్మరించండి. మరియు ఆయన మీకు బోధించిన విధంగా ఆయనను స్మరించండి, వాస్తవానికి మీరు పూర్వం మార్గభ్రష్టులుగా ఉండేవారు.

2:199 – ثُمَّ أَفِيضُوا مِنْ حَيْثُ أَفَاضَ النَّاسُ وَاسْتَغْفِرُوا اللَّـهَ ۚ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٩٩

తరువాత ప్రజలంతా ఎక్కడి నుండి వెళ్తారో అక్కడి నుండి మీరూ వెళ్ళండి. అల్లాహ్‌తో క్షమాభిక్ష వేడుకోండి. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

2:200 – فَإِذَا قَضَيْتُم مَّنَاسِكَكُمْ فَاذْكُرُوا اللَّـهَ كَذِكْرِكُمْ آبَاءَكُمْ أَوْ أَشَدَّ ذِكْرًا ۗ فَمِنَ النَّاسِ مَن يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا وَمَا لَهُ فِي الْآخِرَةِ مِنْ خَلَاقٍ ٢٠٠

ఇక మీ (‘హజ్జ్‌) విధులను 150 పూర్తిచేసిన తరువాత, మీరు మీ తండ్రి-తాతలను (పూర్వం) స్మరించే విధంగా, ఇంకా దానికంటే అధికంగా అల్లాహ్‌ను స్మరించండి. కాని వారిలో కొందరు: ”ఓ మా ప్రభూ! మాకు ఈ లోకంలో (అన్నీ) ప్రసాదించు!” అని ప్రార్థిస్తారు. అలాంటి వారికి పరలోకంలో ఎలాంటి భాగం ఉండదు.

2:201 – وَمِنْهُم مَّن يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ ٢٠١

వారిలో మరికొందరు: ”ఓ మా ప్రభూ! మాకు ఇహలోకంలో మంచిని మరియు పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు మరియు మమ్మల్ని నరకాగ్నినుండి కాపాడు!” అని ప్రార్థిస్తారు. 0

2:202 – أُولَـٰئِكَ لَهُمْ نَصِيبٌ مِّمَّا كَسَبُوا ۚ وَاللَّـهُ سَرِيعُ الْحِسَابِ ٢٠٢

అలాంటి వారు తమ సంపాదనకు అను గుణంగా (ఉభయలోకాలలో) తమ వాటాను పొందు తారు. మరియు అల్లాహ్‌ లెక్క తీసుకోవటంలో అతిశీఘ్రుడు. (1/2)

2:203 – وَاذْكُرُوا اللَّـهَ فِي أَيَّامٍ مَّعْدُودَاتٍ ۚ فَمَن تَعَجَّلَ فِي يَوْمَيْنِ فَلَا إِثْمَ عَلَيْهِ وَمَن تَأَخَّرَ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ لِمَنِ اتَّقَىٰ ۗ وَاتَّقُوا وَاعْلَمُوا أَنَّكُمْ إِلَيْهِ تُحْشَرُونَ ٢٠٣

  • మరియు నియమిత రోజులలో అల్లాహ్‌ను స్మరించండి. 151 ఎవడైనా త్వరగా రెండు రోజులలోనే వెళ్ళిపోయినా, అతనిపై ఎలాంటి దోషంలేదు. మరెవడైనా నిదానించి (పదమూడవ తేదీవరకు) నిలిచిపోయినా, అతనిపై ఎలాంటి దోషంలేదు, 152 వాడికి, ఎవడైతే దైవభీతి కలిగిఉంటాడో! మరియు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా, మీరంతా ఆయన సన్నిధిలో హాజరు చేయబడుతారనేది తెలుసుకోండి.

2:204 – وَمِنَ النَّاسِ مَن يُعْجِبُكَ قَوْلُهُ فِي الْحَيَاةِ الدُّنْيَا وَيُشْهِدُ اللَّـهَ عَلَىٰ مَا فِي قَلْبِهِ وَهُوَ أَلَدُّ الْخِصَامِ ٢٠٤

మరియు ప్రజలలో నుండి ఒక వ్యక్తి మాటలు ఇహలోక జీవితంలో నీకు సంతోషం కలుగ జేయవచ్చు; మరియు తన సంకల్పశుధ్ధిని తెలుప డానికి అతడు అల్లాహ్‌ను సాక్షిగా నిలబెట్టవచ్చు! కాని, వాస్తవానికి, అతడు ఘోరమైన జగడాలమారి కావచ్చు! 153

2:205 – وَإِذَا تَوَلَّىٰ سَعَىٰ فِي الْأَرْضِ لِيُفْسِدَ فِيهَا وَيُهْلِكَ الْحَرْثَ وَالنَّسْلَ ۗ وَاللَّـهُ لَا يُحِبُّ الْفَسَادَ ٢٠٥

మరియు (ఓ ము’హమ్మద్‌!) అతడు (నీ వద్ద నుండి) తిరిగిపోయి లోకంలో కల్లోలం రేకెత్తించ టానికి, పంట పొలాలను మరియు పశువులను నాశనం చేయటానికి పాటుపడవచ్చు. మరియు అల్లాహ్‌ కల్లోలాన్ని ఏ మాత్రం ప్రేమించడు.

2:206 – وَإِذَا قِيلَ لَهُ اتَّقِ اللَّـهَ أَخَذَتْهُ الْعِزَّةُ بِالْإِثْمِ ۚ فَحَسْبُهُ جَهَنَّمُ ۚ وَلَبِئْسَ الْمِهَادُ ٢٠٦

మరియు: ”అల్లాహ్‌ యందు భయ-భక్తు లు కలిగి ఉండు.” అని అతనితో అన్నప్పుడు, అహంభావం అతనిని మరింత పాపానికే ప్రేరే పిస్తుంది. కావున నరకమే అలాంటివానికి తగిన స్థలం. మరియు అది ఎంతచెడ్డ విరామస్థలం!

2:207 – وَمِنَ النَّاسِ مَن يَشْرِي نَفْسَهُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّـهِ ۗ وَاللَّـهُ رَءُوفٌ بِالْعِبَادِ ٢٠٧

మరియు మానవులలోనే – అల్లాహ్‌ సంతోషం పొందటానికి – తన పూర్తిజీవితాన్ని అంకితం చేసేవాడూ ఉన్నాడు. మరియు అల్లాహ్‌ తనదాసుల యెడల చాల కనికరుడు. 154

2:208 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا ادْخُلُوا فِي السِّلْمِ كَافَّةً وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ ٢٠٨

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ విధేయతలో (ఇస్లాంలో) సంపూర్ణంగా ప్రవేశించండి. మరియు షై’తాను అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు!

2:209 – فَإِن زَلَلْتُم مِّن بَعْدِ مَا جَاءَتْكُمُ الْبَيِّنَاتُ فَاعْلَمُوا أَنَّ اللَّـهَ عَزِيزٌ حَكِيمٌ ٢٠٩

మీ వద్దకు స్పష్టమైన హితోపదేశాలు వచ్చిన పిదప కూడా, మీరు తప్పటడుగు వేస్తే! నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు అని తెలుసుకోండి.

2:210 – هَلْ يَنظُرُونَ إِلَّا أَن يَأْتِيَهُمُ اللَّـهُ فِي ظُلَلٍ مِّنَ الْغَمَامِ وَالْمَلَائِكَةُ وَقُضِيَ الْأَمْرُ ۚ وَإِلَى اللَّـهِ تُرْجَعُ الْأُمُورُ ٢١٠

ఏమీ? అల్లాహ్‌ స్వయంగా దేవదూతలతో పాటు, మేఘాల ఛాయలలో ప్రత్యక్షం కావాలని వారు నిరీక్షిస్తున్నారా? కానీ, అప్పటికే ప్రతి విషయపు తీర్పు జరిగి ఉంటుంది. మరియు సమస్త విషయాలు (తీర్పు కొరకు) అల్లాహ్‌ దగ్గరికే మరలింపబడతాయి!

2:211 – سَلْ بَنِي إِسْرَائِيلَ كَمْ آتَيْنَاهُم مِّنْ آيَةٍ بَيِّنَةٍ ۗ وَمَن يُبَدِّلْ نِعْمَةَ اللَّـهِ مِن بَعْدِ مَا جَاءَتْهُ فَإِنَّ اللَّـهَ شَدِيدُ الْعِقَابِ ٢١١

మేము ఎన్ని స్పష్టమైన సూచన (ఆయాత్‌)లను వారికి చూపించామో ఇస్రాయీ’ల్‌ సంతతి వారిని అడగండి! 155 మరియు ఎవడు అల్లాహ్‌ యొక్క అనుగ్రహాలను పొందిన తరువాత, వాటిని తారుమారు చేస్తాడో! నిశ్చయంగా, అల్లాహ్‌ అలాంటి వారిని శిక్షించటంలో ఎంతో కఠినుడు.

2:212 – زُيِّنَ لِلَّذِينَ كَفَرُوا الْحَيَاةُ الدُّنْيَا وَيَسْخَرُونَ مِنَ الَّذِينَ آمَنُوا ۘ وَالَّذِينَ اتَّقَوْا فَوْقَهُمْ يَوْمَ الْقِيَامَةِ ۗ وَاللَّـهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ ٢١٢

సత్య-తిరస్కారులకు ఇహలోక జీవితం మనోహరమైనదిగా చేయబడింది. కావున వారు విశ్వాసులతో పరిహాసాలాడుతుంటారు, కానీ పునరుత్థాన దినమున, దైవభీతి గలవారే వారి కంటే ఉన్నత స్థానంలో ఉంటారు. మరియు అల్లాహ్‌, తాను కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు.

2:213 – كَانَ النَّاسُ أُمَّةً وَاحِدَةً فَبَعَثَ اللَّـهُ النَّبِيِّينَ مُبَشِّرِينَ وَمُنذِرِينَ وَأَنزَلَ مَعَهُمُ الْكِتَابَ بِالْحَقِّ لِيَحْكُمَ بَيْنَ النَّاسِ فِيمَا اخْتَلَفُوا فِيهِ ۚ وَمَا اخْتَلَفَ فِيهِ إِلَّا الَّذِينَ أُوتُوهُ مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ بَغْيًا بَيْنَهُمْ ۖ فَهَدَى اللَّـهُ الَّذِينَ آمَنُوا لِمَا اخْتَلَفُوا فِيهِ مِنَ الْحَقِّ بِإِذْنِهِ ۗ وَاللَّـهُ يَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ٢١٣

పూర్వం, మానవులంతా ఒకే ఒక సమా జంగా ఉండేవారు 156 అప్పుడు అల్లాహ్‌ వారికి శుభవార్తలు ఇవ్వటానికి మరియు హెచ్చరికలు చేయటానికి ప్రవక్తలను పంపాడు. మరియు మాన వులలో ఏర్పడిన భేదాలను పరిష్కరించటానికి, ఆయన గ్రంథాన్ని సత్యంతో వారి ద్వారా అవత రింపజేశాడు. మరియు అది (దివ్యగ్రంథం) ఇవ్వ బడినవారు, స్పష్టమైన హితోపదేశాలు పొందిన తరువాత కూడా, పరస్పర ద్వేషాలవల్ల భేదాభి ప్రాయాలు పుట్టించుకున్నారు. కాని అల్లాహ్‌ తన ఆజ్ఞతో, విశ్వాసులకు వారు వివాదాలాడుతున్న విషయంలో సత్యమార్గాన్ని చూపాడు. మరియు అల్లాహ్‌ తానుకోరిన వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.

2:214 – أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَأْتِكُم مَّثَلُ الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُم ۖ مَّسَّتْهُمُ الْبَأْسَاءُ وَالضَّرَّاءُ وَزُلْزِلُوا حَتَّىٰ يَقُولَ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ مَتَىٰ نَصْرُ اللَّـهِ ۗ أَلَا إِنَّ نَصْرَ اللَّـهِ قَرِيبٌ ٢١٤

ఏమీ? మీరు (సులభంగా) స్వర్గంలో ప్రవే శించగలమని భావిస్తున్నారా? మీ పూర్వీకులు సహించినటువంటి (కష్టాలు) మీరూ సహించనిదే! వారిపై దురవస్థలు, రోగబాధలు విరుచుకు పడ్డాయి మరియు వారు కుదిపివేయబడ్డారు, చివరకు అప్పటి సందేశహరుడు మరియు విశ్వాసులైన అతని సహచరులు: ”అల్లాహ్‌ సహాయం ఇంకా ఎప్పుడొస్తుంది?” అని వాపోయారు. అదిగో! నిశ్చయంగా, అల్లాహ్‌ సహాయం సమీపంలోనే ఉంది! 157

2:215 – يَسْأَلُونَكَ مَاذَا يُنفِقُونَ ۖ قُلْ مَا أَنفَقْتُم مِّنْ خَيْرٍ فَلِلْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ ۗ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّـهَ بِهِ عَلِيمٌ ٢١٥

(ఓ ము’హమ్మద్‌!) వారు (ప్రజలు) నిన్ను అడుగుతున్నారు: ”మేము ఏమి ఖర్చు చేయాలి?” అని. వారితో అను: ”మీరు మంచిది ఏది ఖర్చుచేసినా సరే, అది మీ తల్లి-దండ్రుల, బంధువుల, అనాథుల, యాచించని పేదల (మసాకీన్‌) మరియు బాటసారుల కొరకు ఖర్చు చేయాలి. మరియు మీరు ఏ మంచిపని చేసినా అది అల్లాహ్‌కు తప్పక తెలుస్తుంది.” 158

2:216 – كُتِبَ عَلَيْكُمُ الْقِتَالُ وَهُوَ كُرْهٌ لَّكُمْ ۖ وَعَسَىٰ أَن تَكْرَهُوا شَيْئًا وَهُوَ خَيْرٌ لَّكُمْ ۖ وَعَسَىٰ أَن تُحِبُّوا شَيْئًا وَهُوَ شَرٌّ لَّكُمْ ۗ وَاللَّـهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ ٢١٦

మీకు అసహ్యకరమైనా! (ధర్మ) యుధ్ధం చేయటం మీకు విధిగా నిర్ణయించబడింది. 159 మరియు మీకు నచ్చని విషయమే మీకు మేలైనది కావచ్చు మరియు మీకు నచ్చే విషయమే మీకు హానికరమైనది కావచ్చు! మరియు అల్లాహ్‌కు అంతా తెలుసు, కాని మీకు ఏమీ తెలియదు.

2:217 – يَسْأَلُونَكَ عَنِ الشَّهْرِ الْحَرَامِ قِتَالٍ فِيهِ ۖ قُلْ فِيهِ كَبِيرٌ ۖ وَصَدٌّ عَن سَبِيلِ اللَّـهِ وَكُفْرٌ بِهِ وَالْمَسْجِدِ الْحَرَامِ وَإِخْرَاجُ أَهْلِهِ مِنْهُ أَكْبَرُ عِندَ اللَّـهِ ۚ وَالْفِتْنَةُ أَكْبَرُ مِنَ الْقَتْلِ ۗ وَلَا يَزَالُونَ يُقَاتِلُونَكُمْ حَتَّىٰ يَرُدُّوكُمْ عَن دِينِكُمْ إِنِ اسْتَطَاعُوا ۚ وَمَن يَرْتَدِدْ مِنكُمْ عَن دِينِهِ فَيَمُتْ وَهُوَ كَافِرٌ فَأُولَـٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۖ وَأُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٢١٧

వారు నిషిధ్ధ మాసాలలో యుధ్ధం చేయటాన్ని గురించి నిన్ను అడుగు తున్నారు 160 వారితో ఇలా అను: ”వాటిలో యుధ్ధం చేయటం మహా అపరాధం. కానీ (ప్రజలను) అల్లాహ్‌ మార్గాన్ని అవలంబించటం నుండి అవరోధాలు కలిగించటం మరియు ఆయన (అల్లాహ్‌)ను తిరస్కరించటం మరియు (ప్రజలను) మస్జిద్‌ అల్‌-‘హరామ్‌ను దర్శించకుండా ఆటంక పరచడం మరియు అక్కడివారిని దాని నుండి వెడలగొట్టటం అల్లాహ్‌ దృష్టిలో అంతకంటే మహా అపరాధం. పీడన (ఫిత్నా), రక్తపాతం కంటే ఘోరమైనది. 161 వారికి సాధ్యమే అయితే మిమ్మల్ని మీ ధర్మం నుండి మళ్ళించ గలిగే వరకూ వారు మీతో యుధ్ధం చేయడం మానరు. మరియు మీలో ఎవరైనా మతభ్రష్టులై సత్య-తిరస్కారులుగా మరణిస్తే, అలాంటి వారి మంచి పనులన్నీ ఇహపరలోకాలలో రెండింటి లోనూ వృథా అవుతాయి. మరియు అలాంటి వారు నరకాగ్నివాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.”

2:218 – إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّـهِ أُولَـٰئِكَ يَرْجُونَ رَحْمَتَ اللَّـهِ ۚ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٢١٨

నిశ్చయంగా, విశ్వసించిన వారు మరియు (అల్లాహ్‌ మార్గంలో తమ జన్మ భూమిని విడిచి) వలస పోయేవారు మరియు అల్లాహ్‌ మార్గంలో ధర్మ పోరాటం చేసేవారు; ఇలాంటి వారే! అల్లాహ్‌ కారుణ్యం ఆశించటానికి అర్హులు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. (5/8)

2:219 – يَسْأَلُونَكَ عَنِ الْخَمْرِ وَالْمَيْسِرِ ۖ قُلْ فِيهِمَا إِثْمٌ كَبِيرٌ وَمَنَافِعُ لِلنَّاسِ وَإِثْمُهُمَا أَكْبَرُ مِن نَّفْعِهِمَا ۗ وَيَسْأَلُونَكَ مَاذَا يُنفِقُونَ قُلِ الْعَفْوَ ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّـهُ لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُونَ ٢١٩

  • (ఓ ప్రవక్తా!) వారు, మద్యపానాన్ని మరియు జూదాన్ని గురించి నిన్ను ప్రశ్నిస్తు న్నారు. 162 నీవు ఈ విధంగా సమాధానమివ్వు: ”ఈ రెండింటిలోనూ ఎంతో హాని (పాపం) ఉంది. వాటిలో ప్రజలకు కొన్నిలాభాలు కూడా ఉన్నాయి కాని వాటి హాని (పాపం) వాటి లాభాల కంటే ఎంతో అధికమైనది.” మరియు వారిలా అడుగు తున్నారు: ”మేము (అల్లాహ్‌ మార్గంలో) ఏమి ఖర్చుపెట్టాలి?” నీవు ఇలా సమాధానమివ్వు: ”మీ (నిత్యావసరాలకుపోగా) మిగిలేది.” 163 మీరు ఆలోచించటానికి, అల్లాహ్‌ ఈ విధంగా తన సూచన (ఆయాత్‌)లను మీకు విశదీ కరిస్తున్నాడు –

2:220 – فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۗ وَيَسْأَلُونَكَ عَنِ الْيَتَامَىٰ ۖ قُلْ إِصْلَاحٌ لَّهُمْ خَيْرٌ ۖ وَإِن تُخَالِطُوهُمْ فَإِخْوَانُكُمْ ۚ وَاللَّـهُ يَعْلَمُ الْمُفْسِدَ مِنَ الْمُصْلِحِ ۚ وَلَوْ شَاءَ اللَّـهُ لَأَعْنَتَكُمْ ۚ إِنَّ اللَّـهَ عَزِيزٌ حَكِيمٌ ٢٢٠

ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ – మరియు అనాథులను గురించి వారు నిన్ను అడుగుతున్నారు. నీవు ఇలా సమాధానమివ్వు: ”వారి సంక్షేమానికి తోడ్పడటమే మేలైనది.” మరియు మీరు వారితో కలిసి మెలిసి 164 ఉంటే (తప్పులేదు), వారు మీ సోదరులే! మరియు చెరచేవాడెవడో, సవరించేవాడెవడో అల్లాహ్‌కు బాగా తెలుసు. మరియు అల్లాహ్‌ కోరితే మిమ్మల్ని కష్టపెట్టి ఉండేవాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

2:221 – وَلَا تَنكِحُوا الْمُشْرِكَاتِ حَتَّىٰ يُؤْمِنَّ ۚ وَلَأَمَةٌ مُّؤْمِنَةٌ خَيْرٌ مِّن مُّشْرِكَةٍ وَلَوْ أَعْجَبَتْكُمْ ۗ وَلَا تُنكِحُوا الْمُشْرِكِينَ حَتَّىٰ يُؤْمِنُوا ۚ وَلَعَبْدٌ مُّؤْمِنٌ خَيْرٌ مِّن مُّشْرِكٍ وَلَوْ أَعْجَبَكُمْ ۗ أُولَـٰئِكَ يَدْعُونَ إِلَى النَّارِ ۖ وَاللَّـهُ يَدْعُو إِلَى الْجَنَّةِ وَالْمَغْفِرَةِ بِإِذْنِهِ ۖ وَيُبَيِّنُ آيَاتِهِ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ ٢٢١

మరియు ముష్రిక్‌ స్త్రీలు, విశ్వసించనంత వరకు, మీరు వారిని వివాహమాడకండి, ముష్రిక్‌ స్త్రీ మీకు ఎంత నచ్చినా, ఆమెకంటే విశ్వాసురాలైన ఒక బానిసస్త్రీ ఎంతో మేలైనది 165 మరియు ముష్రిక్‌ పురుషులు విశ్వసించనంత వరకు మీ స్త్రీలతో వారి వివాహం చేయించకండి. మరియు ముష్రిక్‌ పురుషుడు మీకు ఎంత నచ్చినా, అతడి కంటే విశ్వాసి అయిన ఒక బానిస ఎంతో మేలైన వాడు. ఇలాంటి వారు (ముష్రికీన్‌) మిమ్మల్ని అగ్ని వైపునకు ఆహ్వానిస్తున్నారు. కాని అల్లాహ్‌! తన అనుమతితో, మిమ్మల్ని స్వర్గం వైపునకు మరియు క్షమాభిక్ష పొందటానికి పిలుస్తున్నాడు. మరియు ఈ విధంగా ఆయన తన సూచనలను ప్రజలకు – బహుశా వారు గుణపాఠం నేర్చు కుంటారని – స్పష్టంగా తెలుపుతున్నాడు.

2:222 – وَيَسْأَلُونَكَ عَنِ الْمَحِيضِ ۖ قُلْ هُوَ أَذًى فَاعْتَزِلُوا النِّسَاءَ فِي الْمَحِيضِ ۖ وَلَا تَقْرَبُوهُنَّ حَتَّىٰ يَطْهُرْنَ ۖ فَإِذَا تَطَهَّرْنَ فَأْتُوهُنَّ مِنْ حَيْثُ أَمَرَكُمُ اللَّـهُ ۚ إِنَّ اللَّـهَ يُحِبُّ التَّوَّابِينَ وَيُحِبُّ الْمُتَطَهِّرِينَ ٢٢٢

మరియు వారు నిన్ను స్త్రీల ఋతుకాలం గురించి అడుగుతున్నారు. నీవు వారికి ఇలా తెలుపు: ”అదొక అపరిశుద్ధ (హానికరమైన) స్థితి. కనుక ఋతుకాలంలో స్త్రీలతో (సంభోగానికి) దూరంగా ఉండండి 166 వారు పరిశుద్ధులు కానంత వరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్దులు అయిన తరువాత అల్లాహ్‌ ఆదేశించిన చోటు నుండి మీరు వారివద్దకుపోవచ్చు.” 167 నిశ్చయంగా అల్లాహ్‌ పశ్చాత్తాపపడే వారిని ప్రేమిస్తాడు మరియు పరిశుధ్ధులుగా ఉండేవారిని ప్రేమిస్తాడు.

2:223 – نِسَاؤُكُمْ حَرْثٌ لَّكُمْ فَأْتُوا حَرْثَكُمْ أَنَّىٰ شِئْتُمْ ۖ وَقَدِّمُوا لِأَنفُسِكُمْ ۚ وَاتَّقُوا اللَّـهَ وَاعْلَمُوا أَنَّكُم مُّلَاقُوهُ ۗ وَبَشِّرِ الْمُؤْمِنِينَ ٢٢٣

మీ భార్యలు మీకు పంటపొలాల వంటి వారు, కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు. 168 మరియు మీ స్వయం కొరకు (సత్కార్యాలు) చేసి పంపండి (మీకు మంచి సంతానం కొరకు ప్రార్థించండి). మరియు అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు నిశ్చయంగా, ఆయనను కలుసుకోవలసి ఉందని తెలుసుకోండి. మరియు విశ్వాసులకు శుభవార్తలను వినిపించు.

2:224 – وَلَا تَجْعَلُوا اللَّـهَ عُرْضَةً لِّأَيْمَانِكُمْ أَن تَبَرُّوا وَتَتَّقُوا وَتُصْلِحُوا بَيْنَ النَّاسِ ۗ وَاللَّـهُ سَمِيعٌ عَلِيمٌ ٢٢٤

మరియు మీరు అల్లాహ్‌ (పేరుతో) చేసే ప్రమాణాలు మిమ్మల్ని సన్మార్గం నుండి, దైవభీతి నుండి మరియు ప్రజలలో శాంతి స్థాపించటం నుండి ఆటంకపరిచేవిగా కానివ్వకండి 169 మరియు అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

2:225 – لَّا يُؤَاخِذُكُمُ بِاللَّغْوِ فِي أَيْمَانِكُمْ وَلَـٰكِن يُؤَاخِذُكُم بِمَا كَسَبَتْ قُلُوبُكُمْ ۗ وَاللَّـهُ غَفُورٌ حَلِيمٌ ٢٢٥

మీరు అనాలోచితంగా చేసే ప్రమాణాలను గురించి అల్లాహ్‌ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు హృదయపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన తప్పకుండా మిమ్మల్ని పట్టుకుంటాడు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, సహనశీలుడు 170

2:226 – لِّلَّذِينَ يُؤْلُونَ مِن نِّسَائِهِمْ تَرَبُّصُ أَرْبَعَةِ أَشْهُرٍ ۖ فَإِن فَاءُوا فَإِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ٢٢٦

ఎవరైతే తమ భార్యలతో (సంభోగించము అని) ప్రమాణంచేస్తారో, వారికి నాలుగు నెలల వ్యవధి ఉంది. 171 కాని వారు తమ దాంపత్య జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తే! నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

2:227 – وَإِنْ عَزَمُوا الطَّلَاقَ فَإِنَّ اللَّـهَ سَمِيعٌ عَلِيمٌ ٢٢٧

కాని వారు విడాకులకే నిర్ణయించుకుంటే! నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వంవినేవాడు, సర్వజ్ఞుడు. 172

2:228 – وَالْمُطَلَّقَاتُ يَتَرَبَّصْنَ بِأَنفُسِهِنَّ ثَلَاثَةَ قُرُوءٍ ۚ وَلَا يَحِلُّ لَهُنَّ أَن يَكْتُمْنَ مَا خَلَقَ اللَّـهُ فِي أَرْحَامِهِنَّ إِن كُنَّ يُؤْمِنَّ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ ۚ وَبُعُولَتُهُنَّ أَحَقُّ بِرَدِّهِنَّ فِي ذَٰلِكَ إِنْ أَرَادُوا إِصْلَاحًا ۚ وَلَهُنَّ مِثْلُ الَّذِي عَلَيْهِنَّ بِالْمَعْرُوفِ ۚ وَلِلرِّجَالِ عَلَيْهِنَّ دَرَجَةٌ ۗ وَاللَّـهُ عَزِيزٌ حَكِيمٌ ٢٢٨

మరియు విడాకులివ్వబడిన స్త్రీలు మూడు ఋతువుల వరకు (మరొకనితో పెండ్లి చేసుకోకుండా) వేచి ఉండాలి. 173 మరియు వారు అల్లాహ్‌ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాసమున్నవారే అయితే, అల్లాహ్‌ వారి గర్భాలలో సృష్టించిన దానిని దాచటం వారికి ధర్మసమ్మతం కాదు. 174 మరియు వారిభర్తలు దాంపత్య సంబంధాలను సరిదిద్దుకోవటానికి సిధ్ధంగా ఉంటే! ఈ నిరీక్షణ కాలంలో వారిని తమ భార్యలుగా తిరిగి స్వీకరించే హక్కు వారికి ఉంది. మరియు వారికి (స్త్రీలకు) వారి (భర్తల)పై ధర్మ సమ్మతమైన హక్కులున్నాయి, ఏ విధంగానైతే వారికి (భర్తలకు) వారిపై ఉన్నాయో. కాని పురుషులకు స్త్రీలపై (కర్తవ్య) ఆధిక్యత ఉంది 175 మరియు అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

2:229 – الطَّلَاقُ مَرَّتَانِ ۖ فَإِمْسَاكٌ بِمَعْرُوفٍ أَوْ تَسْرِيحٌ بِإِحْسَانٍ ۗ وَلَا يَحِلُّ لَكُمْ أَن تَأْخُذُوا مِمَّا آتَيْتُمُوهُنَّ شَيْئًا إِلَّا أَن يَخَافَا أَلَّا يُقِيمَا حُدُودَ اللَّـهِ ۖ فَإِنْ خِفْتُمْ أَلَّا يُقِيمَا حُدُودَ اللَّـهِ فَلَا جُنَاحَ عَلَيْهِمَا فِيمَا افْتَدَتْ بِهِ ۗ تِلْكَ حُدُودُ اللَّـهِ فَلَا تَعْتَدُوهَا ۚ وَمَن يَتَعَدَّ حُدُودَ اللَّـهِ فَأُولَـٰئِكَ هُمُ الظَّالِمُونَ ٢٢٩

విడాకులు రెండుసార్లే! ఆ తర్వాత (భార్యను) సహృదయంతో తమవద్ద ఉండ నివ్వాలి, లేదా ఆమెను మంచితనంతో సాగ నంపాలి. 176 మరియు సాగనంపేటప్పుడు మీరు వారికిచ్చిన వాటి నుండి ఏమైనా తిరిగి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అల్లాహ్‌ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేము అనే భయం ఆ ఇద్దరికీ ఉంటే తప్ప! కాని అల్లాహ్‌ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమనే భయం ఆ దంపతులకు ఉంటే స్త్రీ పరిహారమిచ్చి (విడాకులు / ఖులా’ తీసుకుంటే) అందులో వారికి ఎలాంటి దోషంలేదు. 177 ఇవి అల్లాహ్‌ విధించిన హద్దులు, కావున వీటిని అతిక్రమించకండి. మరియు ఎవరైతే అల్లాహ్‌ విధించిన హద్దులను అతిక్రమిస్తారో, అలాంటి వారే దుర్మార్గులు 178

2:230 – فَإِن طَلَّقَهَا فَلَا تَحِلُّ لَهُ مِن بَعْدُ حَتَّىٰ تَنكِحَ زَوْجًا غَيْرَهُ ۗ فَإِن طَلَّقَهَا فَلَا جُنَاحَ عَلَيْهِمَا أَن يَتَرَاجَعَا إِن ظَنَّا أَن يُقِيمَا حُدُودَ اللَّـهِ ۗ وَتِلْكَ حُدُودُ اللَّـهِ يُبَيِّنُهَا لِقَوْمٍ يَعْلَمُونَ ٢٣٠

ఒకవేళ అతడు (మూడవసారి) విడాకు లిస్తే, ఆ తర్వాత ఆ స్త్రీ అతనికి ధర్మసమ్మతం కాదు, ఆమె వివాహం వేరే పురుషునితో జరిగితే తప్ప! ఒకవేళ అతడు (రెండవ భర్త) ఆమెకు విడాకులిస్తే! అప్పుడు ఉభయులూ (మొదటి భర్త, ఈ స్త్రీ) తాము అల్లాహ్‌ హద్దులకు లోబడి ఉండగలమని భావిస్తే వారు పునర్వివాహం చేసుకోవటంలో దోషం లేదు. మరియు ఇవి అల్లాహ్‌ నియమించిన హద్దులు. వీటిని ఆయన గ్రహించే వారికి స్పష్టపరుస్తున్నాడు.

2:231 – وَإِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَبَلَغْنَ أَجَلَهُنَّ فَأَمْسِكُوهُنَّ بِمَعْرُوفٍ أَوْ سَرِّحُوهُنَّ بِمَعْرُوفٍ ۚ وَلَا تُمْسِكُوهُنَّ ضِرَارًا لِّتَعْتَدُوا ۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ فَقَدْ ظَلَمَ نَفْسَهُ ۚ وَلَا تَتَّخِذُوا آيَاتِ اللَّـهِ هُزُوًا ۚ وَاذْكُرُوا نِعْمَتَ اللَّـهِ عَلَيْكُمْ وَمَا أَنزَلَ عَلَيْكُم مِّنَ الْكِتَابِ وَالْحِكْمَةِ يَعِظُكُم بِهِ ۚ وَاتَّقُوا اللَّـهَ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ٢٣١

మరియు మీరు స్త్రీలకు విడాకులిచ్చి నప్పుడు, వారి కొరకు నిర్ణయింపబడిన గడువు (‘ఇద్దత్‌) సమీపిస్తే వారిని సహృదయంతో మీవద్ద ఉంచుకోండి, లేదా సహృదయంతో విడిచిపెట్టండి. కేవలం వారికి బాధకలిగించే మరియు పీడించే ఉద్దేశ్యంతో వారిని ఉంచుకోకండి. మరియు ఆ విధంగా చేసేవాడు వాస్తవానికి తనకు తానే అన్యాయం చేసుకున్నట్లు. మరియు అల్లాహ్‌ ఆదేశాలను (ఆయాత్‌ లను) పరిహాసంగా తీసుకోకండి. మరియు అల్లాహ్‌ మీకు చేసిన అనుగ్రహాన్ని మరియు మీపై అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు వివేకాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన (అల్లాహ్‌) మీకు ఈ విధంగా బోధిస్తున్నాడు. మరియు అల్లాహ్‌ యందు భయ- భక్తులు కలిగి ఉండండి మరియు నిశ్చయంగా, అల్లాహ్‌కు ప్రతి విషయం గురించి బాగా తెలుసని తెలుసుకోండి. మరియు మీరు మీ బిడ్డలకు వేరే స్త్రీ ద్వారా పాలు ఇప్పించే ఏర్పాటు చేయదలిస్తే, మీపై ఎలాంటి దోషంలేదు. కాని మీరు ఆమెకు (తల్లికి) ఇవ్వ వలసింది ధర్మసమ్మతంగా చెల్లించాలి. అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. మరియు మీరు చేసేదంతా నిశ్చయంగా, అల్లాహ్‌ చూస్తున్నాడని తెలుసుకోండి. 0

2:232 – وَإِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَبَلَغْنَ أَجَلَهُنَّ فَلَا تَعْضُلُوهُنَّ أَن يَنكِحْنَ أَزْوَاجَهُنَّ إِذَا تَرَاضَوْا بَيْنَهُم بِالْمَعْرُوفِ ۗ ذَٰلِكَ يُوعَظُ بِهِ مَن كَانَ مِنكُمْ يُؤْمِنُ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ ۗ ذَٰلِكُمْ أَزْكَىٰ لَكُمْ وَأَطْهَرُ ۗ وَاللَّـهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ ٢٣٢

మరియు మీరు మీ స్త్రీలకు (మొదటిసారి లేక రెండవసారి) విడాకులిస్తే, వారు తమ నిరీక్షణా వ్యవధిని (‘ఇద్దత్‌ను) పూర్తి చేసిన తరువాత, తమ (మొదటి) భర్తలను ధర్మసమ్మతంగా పరస్పర అంగీకారంతో వివాహం చేసుకోదలిస్తే, మీరు వారిని ఆటంకపరచకండి. మీలో ఎవరికి అల్లాహ్‌ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాస ముందో, వారికి ఈ బోధనచేయబడుతోంది. ఇది మీకు నిష్కళంకమైనది మరియు నిర్మలమైనది. మరియు అల్లాహ్‌కు అంతా తెలుసు, కాని మీకు ఏమీ తెలియదు. (3/4)

2:233 – وَالْوَالِدَاتُ يُرْضِعْنَ أَوْلَادَهُنَّ حَوْلَيْنِ كَامِلَيْنِ ۖ لِمَنْ أَرَادَ أَن يُتِمَّ الرَّضَاعَةَ ۚ وَعَلَى الْمَوْلُودِ لَهُ رِزْقُهُنَّ وَكِسْوَتُهُنَّ بِالْمَعْرُوفِ ۚ لَا تُكَلَّفُ نَفْسٌ إِلَّا وُسْعَهَا ۚ لَا تُضَارَّ وَالِدَةٌ بِوَلَدِهَا وَلَا مَوْلُودٌ لَّهُ بِوَلَدِهِ ۚ وَعَلَى الْوَارِثِ مِثْلُ ذَٰلِكَ ۗ فَإِنْ أَرَادَا فِصَالًا عَن تَرَاضٍ مِّنْهُمَا وَتَشَاوُرٍ فَلَا جُنَاحَ عَلَيْهِمَا ۗ وَإِنْ أَرَدتُّمْ أَن تَسْتَرْضِعُوا أَوْلَادَكُمْ فَلَا جُنَاحَ عَلَيْكُمْ إِذَا سَلَّمْتُم مَّا آتَيْتُم بِالْمَعْرُوفِ ۗ وَاتَّقُوا اللَّـهَ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ٢٣٣

  • (విడాకుల తరువాత) పూర్తి రెండు సంవత్సరాల పాల గడువు పూర్తిచేయవలెనని (తల్లి-దండ్రులు) కోరినట్లయితే, తల్లులు తమ పిల్లలకు పాలివ్వాలి. బిడ్డ తండ్రిపై, వారికి తగు రీతిగా భోజనం మరియు వస్త్రాలిచ్చి పోషించ వలసిన బాధ్యత ఉంటుంది. శక్తికి మించిన భారం ఏ వ్యక్తిపై కూడా మోపబడదు. తల్లి తనబిడ్డ వలన కష్టాలకు గురికాకూడదు. మరియు తండ్రికూడా తన బిడ్డవలన (కష్టాలకు గురికాకూడదు). మరియు (పాలిచ్చే తల్లిని పోషించేబాధ్యత తండ్రిపై ఉన్నట్లు తండ్రి చనిపోతే) అతని వారసులపై కూడా ఉంటుంది. మరియు (తల్లి-దండ్రులు) ఇరువురు సంప్రదించుకొని పరస్పర అంగీకారంతో (రెండు సంవత్సరాలు పూర్తికాక ముందే) బిడ్డచేత పాలు విడిపిస్తే, వారిరువురికి ఎలాంటి దోషంలేదు. 0

2:234 – وَالَّذِينَ يُتَوَفَّوْنَ مِنكُمْ وَيَذَرُونَ أَزْوَاجًا يَتَرَبَّصْنَ بِأَنفُسِهِنَّ أَرْبَعَةَ أَشْهُرٍ وَعَشْرًا ۖ فَإِذَا بَلَغْنَ أَجَلَهُنَّ فَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا فَعَلْنَ فِي أَنفُسِهِنَّ بِالْمَعْرُوفِ ۗ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ ٢٣٤

మరియు మీలో ఎవరైనా మరణించి, భార్యలను వదలి పోయినట్లైతే! (అలాంటి విధవలు) నాలుగు నెలల పది రోజులు (రెండవ పెండ్లి చేసుకోకుండా) వేచిఉండాలి. 179 వారి గడువు పూర్తి అయిన తరువాత వారు తమకు ఉచిత మైనది, ధర్మసమ్మతంగా చేసుకుంటే మీపై దోషంలేదు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును.

2:235 – وَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا عَرَّضْتُم بِهِ مِنْ خِطْبَةِ النِّسَاءِ أَوْ أَكْنَنتُمْ فِي أَنفُسِكُمْ ۚ عَلِمَ اللَّـهُ أَنَّكُمْ سَتَذْكُرُونَهُنَّ وَلَـٰكِن لَّا تُوَاعِدُوهُنَّ سِرًّا إِلَّا أَن تَقُولُوا قَوْلًا مَّعْرُوفًا ۚ وَلَا تَعْزِمُوا عُقْدَةَ النِّكَاحِ حَتَّىٰ يَبْلُغَ الْكِتَابُ أَجَلَهُ ۚ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ يَعْلَمُ مَا فِي أَنفُسِكُمْ فَاحْذَرُوهُ ۚ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ غَفُورٌ حَلِيمٌ ٢٣٥

మరియు మీరు (వితంతువు లేక మూడు విడాకులు పొందిన స్త్రీలతో) వివాహం చేసుకో వాలనే సంకల్పాన్ని (వారి నిరీక్షణాకాలంలో) పరోక్షంగా తెలిపినా లేక దానిని మీ మనస్సులలో గోప్యంగా ఉంచినా మీపై దోషంలేదు. మీరు వారితో (వివాహమాడటం గురించి) ఆలోచిస్తున్నారని అల్లాహ్‌కు తెలుసు, కానీ వారితో రహస్యంగా ఎలాంటి ఒప్పందం చేసుకోకండి. అయితే మీ రేదైనా మాట్లాడదలచుకుంటే, ధర్మసమ్మతమైన రీతిలో మాట్లాడుకోండి. మరియు నిరీక్షణా వ్యవధి పూర్తయ్యేంత వరకు వివాహం చేసుకోకండి. నిశ్చయంగా, మీ మనస్సులలో ఉన్నదంతా అల్లాహ్‌కు తెలుసని తెలుసుకొని, ఆయనకు భయపడండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, సహనశీలుడు (శాంత స్వభావుడు) అని తెలుసుకోండి.

2:236 – لَّا جُنَاحَ عَلَيْكُمْ إِن طَلَّقْتُمُ النِّسَاءَ مَا لَمْ تَمَسُّوهُنَّ أَوْ تَفْرِضُوا لَهُنَّ فَرِيضَةً ۚ وَمَتِّعُوهُنَّ عَلَى الْمُوسِعِ قَدَرُهُ وَعَلَى الْمُقْتِرِ قَدَرُهُ مَتَاعًا بِالْمَعْرُوفِ ۖ حَقًّا عَلَى الْمُحْسِنِينَ ٢٣٦

మీరు మీ స్త్రీలను ముట్టుకోకముందే, లేక వారి మహ్ర్‌ నిర్ణయం కాక పూర్వమే, వారికి విడాకులిస్తే, అది పాపం కాదు. మరియు వారికి కొంత పారితోషికంగా తప్పకుండా ఇవ్వండి. మరియు ధనవంతుడు తన శక్తిమేరకు, పేదవాడు తన స్థితిని బట్టి ధర్మసమ్మతమైనవిధంగా పారి తోషికం ఇవ్వాలి. ఇది సజ్జనులైన వారి విద్యుక్త ధర్మం.

2:237 – وَإِن طَلَّقْتُمُوهُنَّ مِن قَبْلِ أَن تَمَسُّوهُنَّ وَقَدْ فَرَضْتُمْ لَهُنَّ فَرِيضَةً فَنِصْفُ مَا فَرَضْتُمْ إِلَّا أَن يَعْفُونَ أَوْ يَعْفُوَ الَّذِي بِيَدِهِ عُقْدَةُ النِّكَاحِ ۚ وَأَن تَعْفُوا أَقْرَبُ لِلتَّقْوَىٰ ۚ وَلَا تَنسَوُا الْفَضْلَ بَيْنَكُمْ ۚ إِنَّ اللَّـهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ٢٣٧

మరియు మీరు తాకక పూర్వమే మీ స్త్రీలకు విడాకులిస్తే మరియు వాస్తవానికి అప్పటికే వారి మహ్ర్‌ (వధుకట్నం) నిర్ణయించబడి ఉంటే, సగం మహ్ర్‌ చెల్లించండి, కానీ స్త్రీ క్షమించి విడిచిపెడ్తే, లేదా వివాహసంబంధ అధికారం ఎవని చేతిలో ఉందో అతడు (భర్త) గానీ క్షమించి విడిచిపెట్టగోరితే తప్ప! 180 మరియు క్షమించటమే దైవభీతికి సన్నిహితమైనది. మరియు మీరు పరస్పర వ్యవహారాలలో ఔదార్యం చూపటం మరచిపోవద్దు. నిశ్చయంగా, అల్లాహ్‌ మీరు చేసేదంతా చూస్తున్నాడు.

2:238 – حَافِظُوا عَلَى الصَّلَوَاتِ وَالصَّلَاةِ الْوُسْطَىٰ وَقُومُوا لِلَّـهِ قَانِتِينَ ٢٣٨

మీరు మీ నమా’జ్‌లను కాపాడుకోండి మరియు (ముఖ్యంగా) మధ్య నమా’జ్‌ను 181 మరియు అల్లాహ్‌ సన్నిధానంలో వినయ- విధేయతలతో నిలబడండి.

2:239 – فَإِنْ خِفْتُمْ فَرِجَالًا أَوْ رُكْبَانًا ۖ فَإِذَا أَمِنتُمْ فَاذْكُرُوا اللَّـهَ كَمَا عَلَّمَكُم مَّا لَمْ تَكُونُوا تَعْلَمُونَ ٢٣٩

మీరు ప్రమాదస్థితిలో ఉన్నప్పుడు నడుస్తూ గానీ, స్వారీచేస్తూగానీ, నమా’జ్‌ చేయ వచ్చు. 182 కాని మీకు శాంతి-భద్రతలు లభించి నప్పుడు, ఆయన మీకు నేర్పినట్లు అల్లాహ్‌ను స్మరించండి. ఎందుకంటే ఈ పద్దతి ఇంతకు పూర్వం మీకు తెలియదు.

2:240 – وَالَّذِينَ يُتَوَفَّوْنَ مِنكُمْ وَيَذَرُونَ أَزْوَاجًا وَصِيَّةً لِّأَزْوَاجِهِم مَّتَاعًا إِلَى الْحَوْلِ غَيْرَ إِخْرَاجٍ ۚ فَإِنْ خَرَجْنَ فَلَا جُنَاحَ عَلَيْكُمْ فِي مَا فَعَلْنَ فِي أَنفُسِهِنَّ مِن مَّعْرُوفٍ ۗ وَاللَّـهُ عَزِيزٌ حَكِيمٌ ٢٤٠

మరియు మీలో మరణించిన వారు భార్యలను వదలిపోతే, వారు తమ భార్యలకు ఒక సంవత్సరపు భరణపు ఖర్చులు ఇవ్వాలనీ, వారిని ఇంటి నుండి వెడలగొట్టవద్దనీ వీలునామా వ్రాయాలి. 183 కానీ వారు తమంతట-తామే వెళ్ళి పోయి, తమ విషయంలో ధర్మసమ్మతంగా ఏమి చేసినా మీపై పాపంలేదు. మరియు అల్లాహ్‌ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

2:241 – وَلِلْمُطَلَّقَاتِ مَتَاعٌ بِالْمَعْرُوفِ ۖ حَقًّا عَلَى الْمُتَّقِينَ ٢٤١

మరియు విడాకులివ్వబడినస్త్రీలకు ధర్మ ప్రకారంగా భరణపు ఖర్చులు ఇవ్వాలి. ఇది దైవభీతి గలవారి విధి.

2:242 – كَذَٰلِكَ يُبَيِّنُ اللَّـهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ ٢٤٢

ఈ విధంగా అల్లాహ్‌ తన ఆజ్ఞలను (ఆయత్‌లను) మీకు స్పష్టంగా తెలుపుతున్నాడు. బహుశా మీరు అర్థం చేసుకుంటారని. (7/8)

2:243 – أَلَمْ تَرَ إِلَى الَّذِينَ خَرَجُوا دِيَارِهِمْ وَهُمْ أُلُوفٌ حَذَرَ الْمَوْتِ فَقَالَ لَهُمُ اللَّـهُ مُوتُوا ثُمَّ أَحْيَاهُمْ ۚ إِنَّ اللَّـهَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَشْكُرُونَ ٢٤٣

ఏమీ? మృత్యుభయంతో, వేల సంఖ్యలో ప్రజలు తమ ఇండ్లను వదలిపోయింది నీకు తెలియదా? అప్పుడు అల్లాహ్‌ వారితో: ”మరణించండి!” అని అన్నాడు కాని, తరువాత వారిని బ్రతికించాడు 184 నిశ్చయంగా, అల్లాహ్‌ మానవుల పట్ల అత్యంత అనుగ్రహం గలవాడు, కాని చాలామంది కృతజ్ఞతలు చూపరు.

2:244 – وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّـهِ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ سَمِيعٌ عَلِيمٌ ٢٤٤

మరియు మీరు అల్లాహ్‌ మార్గంలో యుధ్ధం చేయండి మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు, అని తెలుసుకోండి.

2:245 – مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّـهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ أَضْعَافًا كَثِيرَةً ۚ وَاللَّـهُ يَقْبِضُ وَيَبْسُطُ وَإِلَيْهِ تُرْجَعُونَ ٢٤٥

అల్లాహ్‌కు మంచిరుణం ఇచ్చేవాడు, మీలో ఎవడు? 185 ఎందుకంటే ఆయన దానిని ఎన్నోరెట్లు అధికంచేసి తిరిగిఇస్తాడు. అల్లాహ్‌ మాత్రమే (సంపదలను) తగ్గించేవాడూ మరియు హెచ్చించే వాడూను మరియు మీరంతా ఆయన వైపునకే మరలి పోవలసి ఉంది.

2:246 – أَلَمْ تَرَ إِلَى الْمَلَإِ مِن بَنِي إِسْرَائِيلَ مِن بَعْدِ مُوسَىٰ إِذْ قَالُوا لِنَبِيٍّ لَّهُمُ ابْعَثْ لَنَا مَلِكًا نُّقَاتِلْ فِي سَبِيلِ اللَّـهِ ۖ قَالَ هَلْ عَسَيْتُمْ إِن كُتِبَ عَلَيْكُمُ الْقِتَالُ أَلَّا تُقَاتِلُوا ۖ قَالُوا وَمَا لَنَا أَلَّا نُقَاتِلَ فِي سَبِيلِ اللَّـهِ وَقَدْ أُخْرِجْنَا مِن دِيَارِنَا وَأَبْنَائِنَا ۖ فَلَمَّا كُتِبَ عَلَيْهِمُ الْقِتَالُ تَوَلَّوْا إِلَّا قَلِيلًا مِّنْهُمْ ۗ وَاللَّـهُ عَلِيمٌ بِالظَّالِمِينَ ٢٤٦

ఏమీ? మూసా (నిర్యాణం) తరువాత ఇస్రాయీ’లు సంతతి నాయకులు, తమ ఒక ప్రవక్తతో: ”నీవు మా కొరకు ఒక రాజును నియమించు, మేము అల్లాహ్‌ మార్గంలో యుధ్ధం (జిహాద్‌) చేస్తాము.” అని పలికిన సంగతి నీకు తెలియదా? 186 దానికి అతను: ”ఒకవేళ యుధ్ధం చేయమని ఆదేశిస్తే, మీరు యుద్ధం చేయటానికి నిరాకరించరు కదా?” అని అన్నాడు. దానికి వారు: ”మేము మరియు మా సంతానం, మా ఇండ్ల నుండి గెంటివేయబడ్డాము కదా! అలాంటప్పుడు మేము అల్లాహ్‌ మార్గంలో ఎందుకు యుధ్ధం చేయము?” అని జవాబిచ్చారు. కాని యుధ్ధం చేయండని ఆజ్ఞాపించగానే, వారిలో కొందరు తప్ప, అందరూ వెన్నుచూపారు. మరియు అల్లాహ్‌కు ఈ దుర్మార్గులను గురించి బాగా తెలుసు.

2:247 – وَقَالَ لَهُمْ نَبِيُّهُمْ إِنَّ اللَّـهَ قَدْ بَعَثَ لَكُمْ طَالُوتَ مَلِكًا ۚ قَالُوا أَنَّىٰ يَكُونُ لَهُ الْمُلْكُ عَلَيْنَا وَنَحْنُ أَحَقُّ بِالْمُلْكِ مِنْهُ وَلَمْ يُؤْتَ سَعَةً مِّنَ الْمَالِ ۚ قَالَ إِنَّ اللَّـهَ اصْطَفَاهُ عَلَيْكُمْ وَزَادَهُ بَسْطَةً فِي الْعِلْمِ وَالْجِسْمِ ۖ وَاللَّـهُ يُؤْتِي مُلْكَهُ مَن يَشَاءُ ۚ وَاللَّـهُ وَاسِعٌ عَلِيمٌ ٢٤٧

మరియు వారి ప్రవక్త (సామ్యూల్‌) వారితో: ”నిశ్చయంగా, అల్లాహ్‌ మీ కొరకు ‘తాలూత్‌ను (సౌల్‌ను) రాజుగా నియమించాడు.” అని అన్నాడు. దానికి వారు అన్నారు: ”మాపై రాజ్యం చేసే హక్కు అతనికి ఎలా సంక్రమిస్తుంది? వాస్తవానికి, రాజ్యం చేసే హక్కు, అతని కంటే ఎక్కువ, మాకే ఉంది. మరియు అతను అత్యధిక ధనసంపత్తులున్నవాడునూ కాడు.” (దానికి వారి ప్రవక్త) అన్నాడు: ”నిశ్చయంగా, అల్లాహ్‌ మీలో అతనిని ఎన్నుకొని అతనికి బుద్ధిబలాన్నీ, శారీరక బలాన్నీ సమృధ్ధిగా ప్రసాదించాడు. మరియు అల్లాహ్‌ తాను కోరిన వారికి తన రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్‌ విస్తారుడు, 187 సర్వజ్ఞుడు.”

2:248 – وَقَالَ لَهُمْ نَبِيُّهُمْ إِنَّ آيَةَ مُلْكِهِ أَن يَأْتِيَكُمُ التَّابُوتُ فِيهِ سَكِينَةٌ مِّن رَّبِّكُمْ وَبَقِيَّةٌ مِّمَّا تَرَكَ آلُ مُوسَىٰ وَآلُ هَارُونَ تَحْمِلُهُ الْمَلَائِكَةُ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ ٢٤٨

మరియు వారితో వారి ప్రవక్త (సామ్యూల్‌) ఇలా అన్నాడు: ”నిశ్చయంగా, అతని ఆధి పత్యానికి లక్షణం ఏమిటంటే, అతని ప్రభుత్వ కాలంలో ఆ పెట్టె (తాబూత్‌) మీకు తిరిగి లభిస్తుంది. అందులో మీకు మీ ప్రభువు తరఫు నుండి, మనశ్శాంతి లభిస్తుంది. మరియు అందులో మూసా సంతతి మరియు హారూన్‌ సంతతివారు వదలి వెళ్ళిన పవిత్ర అవశేషాలు, దేవదూతల ద్వారా మీకు లభిస్తాయి. మీరు విశ్వసించిన వారే అయితే! నిశ్చయంగా, ఇందులో మీకు ఒక గొప్ప సూచన ఉంది.”

2:249 – فَلَمَّا فَصَلَ طَالُوتُ بِالْجُنُودِ قَالَ إِنَّ اللَّـهَ مُبْتَلِيكُم بِنَهَرٍ فَمَن شَرِبَ مِنْهُ فَلَيْسَ مِنِّي وَمَن لَّمْ يَطْعَمْهُ فَإِنَّهُ مِنِّي إِلَّا مَنِ اغْتَرَفَ غُرْفَةً بِيَدِهِ ۚ فَشَرِبُوا مِنْهُ إِلَّا قَلِيلًا مِّنْهُمْ فَلَمَّا جَاوَزَهُ هُوَ وَالَّذِينَ آمَنُوا مَعَهُ قَالُوا لَا طَاقَةَ لَنَا الْيَوْمَ بِجَالُوتَ وَجُنُودِهِ ۚ قَالَ الَّذِينَ يَظُنُّونَ أَنَّهُم مُّلَاقُو اللَّـهِ كَم مِّن فِئَةٍ قَلِيلَةٍ غَلَبَتْ فِئَةً كَثِيرَةً بِإِذْنِ اللَّـهِ ۗ وَاللَّـهُ مَعَ الصَّابِرِينَ ٢٤٩

ఆ పిదప ‘తాలూత్‌ (సౌల్‌) తన సైన్యంతో బయలుదేరుతూ అన్నాడు: ”నిశ్చయంగా, అల్లాహ్‌ ఒక నది 188 ద్వారా మిమ్మల్ని పరీక్షించ బోతున్నాడు. దాని నుండి నీరు త్రాగినవాడు నావాడు కాడు. మరియు నది నీటిని రుచిచూడని వాడు నిశ్చయంగా నావాడు, కాని చేతితో గుక్కెడు త్రాగితే ఫర్వాలేదు.” అయితే వారిలో కొందరు తప్ప అందరూ దాని నుండి (కడుపునిండా నీరు) త్రాగారు. అతను మరియు అతని వెంట విశ్వాసులు ఆ నదిని దాటిన తరువాత వారన్నారు: ”జాలూత్‌తో మరియు అతని సైన్యంతో పోరాడే శక్తి ఈరోజు మాలో లేదు.” (కానీ ఒక రోజున) అల్లాహ్‌ను కలవడం తప్పదని భావించిన వారన్నారు: ”అల్లాహ్‌ అనుమతితో, ఒక చిన్న వర్గం ఒక పెద్ద వర్గాన్ని జయించటం ఎన్నోసార్లు జరిగింది. మరియు అల్లాహ్‌ స్థైర్యం గలవారితోనే ఉంటాడు.”

2:250 – وَلَمَّا بَرَزُوا لِجَالُوتَ وَجُنُودِهِ قَالُوا رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَثَبِّتْ أَقْدَامَنَا وَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ ٢٥٠

జాలూత్‌ (గోలియత్‌) మరియు అతని సైన్యాన్ని ఎదుర్కోవటానికి బయలుదేరి, వారు: ”ఓ మా ప్రభూ! మాకు (ధైర్య) స్థైర్యాలను ప్రసాదించు, మా పాదాలను స్థిరంగా నిలుపు. మరియు సత్య-తిరస్కారులకు విరుధ్ధంగా (పోరాడ టానికి) మాకు సహాయపడు.” అని ప్రార్థించారు.

2:251 – فَهَزَمُوهُم بِإِذْنِ اللَّـهِ وَقَتَلَ دَاوُودُ جَالُوتَ وَآتَاهُ اللَّـهُ الْمُلْكَ وَالْحِكْمَةَ وَعَلَّمَهُ مِمَّا يَشَاءُ ۗ وَلَوْلَا دَفْعُ اللَّـهِ النَّاسَ بَعْضَهُم بِبَعْضٍ لَّفَسَدَتِ الْأَرْضُ وَلَـٰكِنَّ اللَّـهَ ذُو فَضْلٍ عَلَى الْعَالَمِينَ ٢٥١

ఆ తరువాత వారు, అల్లాహ్‌ అనుమతితో వారిని (సత్య-తిరస్కారులను) ఓడించారు, మరియు దావూద్‌, జాలూతును సంహ రించాడు. 189 మరియు అల్లాహ్‌ అతనికి (దావూద్‌కు) రాజ్యాధికారం మరియు జ్ఞానం ప్రసాదించి, తాను కోరిన విషయాలను అతనికి బోధించాడు. ఈ విధంగా అల్లాహ్‌ ప్రజలను, ఒకరి నుండి మరొకరిని కాపాడకుంటే, భూమిలో కల్లోలం వ్యాపించి ఉండేది, కానీ అల్లాహ్‌ సమస్తలోకాల మీద ఎంతో అనుగ్రహం గలవాడు. 190

2:252 – تِلْكَ آيَاتُ اللَّـهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۚ وَإِنَّكَ لَمِنَ الْمُرْسَلِينَ ٢٥٢

ఇవన్నీ అల్లాహ్‌ సందేశాలు వాటిని మేము యథాతథంగా నీకు వినిపిస్తున్నాము. మరియు (ఓ ము’హమ్మద్‌!) నిశ్చయంగా, నీవు (మా) సందేశ హరులలో ఒకడవు. 191

2:253 – تِلْكَ الرُّسُلُ فَضَّلْنَا بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ ۘ مِّنْهُم مَّن كَلَّمَ اللَّـهُ ۖ وَرَفَعَ بَعْضَهُمْ دَرَجَاتٍ ۚ وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنَاتِ وَأَيَّدْنَاهُ بِرُوحِ الْقُدُسِ ۗ وَلَوْ شَاءَ اللَّـهُ مَا اقْتَتَلَ الَّذِينَ مِن بَعْدِهِم مِّن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ وَلَـٰكِنِ اخْتَلَفُوا فَمِنْهُم مَّنْ آمَنَ وَمِنْهُم مَّن كَفَرَ ۚ وَلَوْ شَاءَ اللَّـهُ مَا اقْتَتَلُوا وَلَـٰكِنَّ اللَّـهَ يَفْعَلُ مَا يُرِيدُ ٢٥٣

[(*)] ఆ సందేశహరులు! మేము వారిలో కొందరికి మరికొందరిపై ఆధిక్యత నిచ్చాము. 192 వారిలో కొందరితో అల్లాహ్‌ (నేరుగా) మాట్లా డాడు 193 మరికొందరిని (గౌరవనీయమైన) ఉన్నత స్థానాలకు ఎత్తాడు. మరియు మర్యమ్‌ కుమారుడు ‘ఈసా (ఏసు) కు మేము స్పష్టమైన సూచనలు ప్రసాదించి, అతనిని పరిశుద్ధాత్మ (జిబ్రీల్‌) సహాయంతో బలపరిచాము. మరియు – అల్లాహ్‌ తలుచుకుంటే – ఈ ప్రవక్తల తరువాత వచ్చిన ప్రజలు, వారికి స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కూడా పరస్పరం కలహించు కునేవారు కాదు. కానీ, వారు పరస్పర విభేదాలకు లోనయ్యారు, కావున వారిలో కొందరు విశ్వాసు లయ్యారు మరికొందరు సత్య-తిరస్కారులు అయ్యారు. మరియు అల్లాహ్‌ తలుచుకుంటే వారు పరస్పరం కలహించుకునేవారు కాదు, కాని అల్లాహ్‌ తాను కోరిందే చేస్తాడు. 194

2:254 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا بَيْعٌ فِيهِ وَلَا خُلَّةٌ وَلَا شَفَاعَةٌ ۗ وَالْكَافِرُونَ هُمُ الظَّالِمُونَ ٢٥٤

ఓ విశ్వాసులారా! ఏ బేరం గానీ, స్నేహం గానీ, సిఫారసు గానీ పనికిరాని దినం రాక ముందే, 195 మేము మీకు ప్రసాదించిన జీవనోపాధి నుండి (మా మార్గంలో) ఖర్చుపెట్టండి. మరియు సత్య-తిరస్కారులు, వారే! దుర్మార్గులు.

2:255 – اللَّـهُ لَا إِلَـٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ ۚ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ ۚ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۖ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ ۖ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا ۚ وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ ٢٥٥

అల్లాహ్‌! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. 196 ఆయన సజీవుడు, 197 విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు 198 ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో – ఆయన అనుజ్ఞ లేకుండా – సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందు ఉన్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. 199 మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ 200 ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు, 201 సర్వోత్తముడు.

2:256 – لَا إِكْرَاهَ فِي الدِّينِ ۖ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ ۚ فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّـهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا ۗ وَاللَّـهُ سَمِيعٌ عَلِيمٌ ٢٢٨

ధర్మం విషయంలో బలవంతం లేదు. 202 వాస్తవానికి సన్మార్గం (రుష్ద్‌), దుర్మార్గం నుండి సుస్పష్టం చేయబడింది. కావున కల్పిత దైవాన్ని (‘తా’గూత్‌ను) 203 తిరస్కరించి, అల్లాహ్‌ను విశ్వసించినవాడు, సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆధారాన్ని పట్టుకున్నట్లే. మరియు అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

2:257 – اللَّـهُ وَلِيُّ الَّذِينَ آمَنُوا يُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۖ وَالَّذِينَ كَفَرُوا أَوْلِيَاؤُهُمُ الطَّاغُوتُ يُخْرِجُونَهُم مِّنَ النُّورِ إِلَى الظُّلُمَاتِ ۗ أُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٢٥٧

అల్లాహ్‌ విశ్వసించిన వారి సంరక్షకుడు, ఆయన వారిని చీకటి నుండి తీసి వెలుగులోకి తెస్తాడు. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారి రక్షకులు కల్పితదైవాలు (‘తా’గూత్‌); అవి వారిని వెలుగు నుండి తీసి చీకటిలోనికి తీసుకొనిపోతాయి. అలాంటి వారు నరకాగ్నివాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

2:258 – أَلَمْ تَرَ إِلَى الَّذِي حَاجَّ إِبْرَاهِيمَ فِي رَبِّهِ أَنْ آتَاهُ اللَّـهُ الْمُلْكَ إِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّيَ الَّذِي يُحْيِي وَيُمِيتُ قَالَ أَنَا أُحْيِي وَأُمِيتُ ۖ قَالَ إِبْرَاهِيمُ فَإِنَّ اللَّـهَ يَأْتِي بِالشَّمْسِ مِنَ الْمَشْرِقِ فَأْتِ بِهَا مِنَ الْمَغْرِبِ فَبُهِتَ الَّذِي كَفَرَ ۗ وَاللَّـهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ ٢٥٨

ఏమీ? అల్లాహ్‌ (తన అనుగ్రహంతో) సామ్రాజ్యం ఇచ్చిన తరువాత, ఇబ్రాహీమ్‌తో అతని ప్రభువు (అల్లాహ్‌)ను గురించి వాదించిన వ్యక్తి (నమ్‌రూద్‌) విషయం నీకు తెలియదా? ఇబ్రాహీమ్‌: ”జీవన్మరణాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయో! ఆయనే నా ప్రభువు.” అని అన్నప్పుడు. అతడు: ”చావు-బ్రతుకులు రెండూ నా అధీనంలోనే ఉన్నాయి.” అని అన్నాడు. అప్పుడు ఇబ్రాహీమ్‌: ”సరే! అల్లాహ్‌ సూర్యుణ్ణి తూర్పునుండి ఉదయింపజేస్తాడు; అయితే నీవు (సూర్యుణ్ణి) పడమర నుండి ఉదయింపజెయ్యి.” అని అన్నాడు. దానితో ఆ సత్య-తిరస్కారి చికాకు పడ్డాడు. మరియు అల్లాహ్‌ దుర్మార్గం అవలం బించిన ప్రజలకు సన్మార్గం చూపడు.

2:259 – أَوْ كَالَّذِي مَرَّ عَلَىٰ قَرْيَةٍ وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا قَالَ أَنَّىٰ يُحْيِي هَـٰذِهِ اللَّـهُ بَعْدَ مَوْتِهَا ۖ فَأَمَاتَهُ اللَّـهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهُ ۖ قَالَ كَمْ لَبِثْتَ ۖ قَالَ لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ ۖ قَالَ بَل لَّبِثْتَ مِائَةَ عَامٍ فَانظُرْ إِلَىٰ طَعَامِكَ وَشَرَابِكَ لَمْ يَتَسَنَّهْ ۖ وَانظُرْ إِلَىٰ حِمَارِكَ وَلِنَجْعَلَكَ آيَةً لِّلنَّاسِ ۖ وَانظُرْ إِلَى الْعِظَامِ كَيْفَ نُنشِزُهَا ثُمَّ نَكْسُوهَا لَحْمًا ۚ فَلَمَّا تَبَيَّنَ لَهُ قَالَ أَعْلَمُ أَنَّ اللَّـهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٢٥٩

లేక! ఒక వ్యక్తి 204 ఇండ్ల కప్పులన్నీ కూలిపోయి, పాడుపడిన (తలక్రిందులై బోర్లాపడిన) నగరం మీదుగా పోతూ: ”వాస్తవానికి! నశించి పోయిన ఈ నగరానికి అల్లాహ్‌ తిరిగి ఏ విధంగా జీవం పోయగలడు? ” అని అన్నాడు. అప్పుడు అల్లాహ్‌ అతనిని మరణింపజేసి నూరు సంవత్స రాల తరువాత తిరిగి బ్రతికింపజేసి: ”ఈ స్థితిలో నీవు ఎంతకాలముంటివి?” అని అడిగాడు. అతడు: ”ఒక దినమో, లేక ఒక దినములో కొంత భాగమో!” అని అన్నాడు. దానికి ఆయన: ”కాదు, నీవు ఇక్కడ, ఈ (మరణించిన) స్థితిలో, నూరు సంవత్సరాలు ఉంటివి. ఇక నీ అన్నపానీయాల వైపు చూడు, వాటిలో ఏమార్పూ లేదు. ఇంకా నీవు నీ గాడిదను కూడా చూడు! మేము ప్రజల కొరకు నిన్ను దృష్టాంతంగా చేయదలిచాము. ఇక ఆ (గాడిద) ఎముకలను చూడు, ఏ విధంగా వాటిని ఉధ్ధరించి తిరిగి వాటిపై మాంసం కప్పుతామో!” అని అన్నాడు. ఇవి అతనికి స్పష్టంగా తెలిసిన తరువాత అతడు: ”నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడని నాకు (ఇప్పుడు) తెలిసింది!” అని అన్నాడు.

2:260 – وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ أَرِنِي كَيْفَ تُحْيِي الْمَوْتَىٰ ۖ قَالَ أَوَلَمْ تُؤْمِن ۖ قَالَ بَلَىٰ وَلَـٰكِن لِّيَطْمَئِنَّ قَلْبِي ۖ قَالَ فَخُذْ أَرْبَعَةً مِّنَ الطَّيْرِ فَصُرْهُنَّ إِلَيْكَ ثُمَّ اجْعَلْ عَلَىٰ كُلِّ جَبَلٍ مِّنْهُنَّ جُزْءًا ثُمَّ ادْعُهُنَّ يَأْتِينَكَ سَعْيًا ۚ وَاعْلَمْ أَنَّ اللَّـهَ عَزِيزٌ حَكِيمٌ ٢٦٠

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్‌: ”ఓ నా ప్రభూ! నీవు మృతులను ఎలా సజీవులుగా చేస్తావో నాకు చూపు!” అని అన్నప్పుడు. (అల్లాహ్‌) అన్నాడు: ”ఏమీ? నీకు విశ్వాసం లేదా? ”దానికి (ఇబ్రాహీమ్‌): ”ఉంది, కానీ నా మనస్సు తృప్తి కొరకు అడుగుతున్నాను!” అని అన్నాడు. అపుడు (అల్లాహ్‌): ”నాలుగు పక్షులను తీసుకో, వాటిని బాగా మచ్చికచేసుకో! తరువాత (వాటిని కోసి) ఒక్కొక్క దాని, ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క కొండపై పెట్టిరా, మళ్ళీ వాటిని రమ్మని పిలువు, అవి నీ వద్దకు ఎగురుకుంటూ వస్తాయి. కాబట్టి నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు అని తెలుసుకో!” అని అన్నాడు.

2:261 – مَّثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّـهِ كَمَثَلِ حَبَّةٍ أَنبَتَتْ سَبْعَ سَنَابِلَ فِي كُلِّ سُنبُلَةٍ مِّائَةُ حَبَّةٍ ۗ وَاللَّـهُ يُضَاعِفُ لِمَن يَشَاءُ ۗ وَاللَّـهُ وَاسِعٌ عَلِيمٌ ٢٦١

అల్లాహ్‌ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసేవారి ఉపమానం: ఆ విత్తనంవలే ఉంటుంది, దేనినుండి అయితే ఏడు వెన్నులు పుట్టి ప్రతి వెన్నులో నూరేసి గింజలు ఉంటాయో! మరియు అల్లాహ్‌ తాను కోరిన వారికి హెచ్చుగా నొసంగు తాడు. మరియు అల్లాహ్‌ విస్తారుడు, సర్వజ్ఞుడు.

2:262 – الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّـهِ ثُمَّ لَا يُتْبِعُونَ مَا أَنفَقُوا مَنًّا وَلَا أَذًى ۙ لَّهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ٢٦٢

ఎవరైతే, అల్లాహ్‌ మార్గంలో తమ ధనాన్ని వ్యయంచేసి, ఆ తరువాత తాము చేసిన ఉపకారాన్ని చెప్పుకుంటూ మరియు వారిని బాధిస్తూ ఉండరో, అలాంటి వారి ప్రతిఫలం, వారి ప్రభువు వద్ద ఉంది 205 మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా! (1/8)

2:263 – قَوْلٌ مَّعْرُوفٌ وَمَغْفِرَةٌ خَيْرٌ مِّن صَدَقَةٍ يَتْبَعُهَا أَذًى ۗ وَاللَّـهُ غَنِيٌّ حَلِيمٌ ٢٦٣

  • మనస్సును గాయపరిచే దానం కంటే, మృదుభాషణ మరియు క్షమాగుణం ఎంతో మేలైనవి. 206 మరియు అల్లాహ్‌ స్వయం సమృద్ధుడు, 207 సహనశీలుడు.

2:264 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُم بِالْمَنِّ وَالْأَذَىٰ كَالَّذِي يُنفِقُ مَالَهُ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ ۖ فَمَثَلُهُ كَمَثَلِ صَفْوَانٍ عَلَيْهِ تُرَابٌ فَأَصَابَهُ وَابِلٌ فَتَرَكَهُ صَلْدًا ۖ لَّا يَقْدِرُونَ عَلَىٰ شَيْءٍ مِّمَّا كَسَبُوا ۗ وَاللَّـهُ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ ٢٦٤

ఓ విశ్వాసులారా! (కేవలం) పరులకు చూపటానికి, తన ధనం ఖర్చుచేస్తూ అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించని వాని మాదిరిగా! మీరూ చేసిన మేలును చెప్పుకొని (ఉపకారం పొందిన వారిని) కష్టపెట్టి, మీ దాన-ధర్మాలను వ్యర్థ పరచుకోకండి. ఇలాంటి వాని పోలిక మట్టి కప్పు కున్న ఒక నున్ననిబండపై భారీవర్షం కురిసి (మట్టి కొట్టుకుపోగా) అది ఉత్తగా మిగిలిపోయినట్లుగా ఉంటుంది. 208 ఇలాంటి వారు తాము సంపాదించిన దాని నుండి ఏమీ చేయలేరు. మరియు అల్లాహ్‌ సత్య-తిరస్కారులకు సన్మార్గం చూపడు

2:265 – وَمَثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّـهِ وَتَثْبِيتًا مِّنْ أَنفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ أَصَابَهَا وَابِلٌ فَآتَتْ أُكُلَهَا ضِعْفَيْنِ فَإِن لَّمْ يُصِبْهَا وَابِلٌ فَطَلٌّ ۗ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ٢٦٥

మరియు అల్లాహ్‌ ప్రీతిపొందే ఉద్దేశంతో మరియు ఆత్మ స్థిరత్వంతో ధనాన్ని ఖర్చు చేసే వారి పోలిక: మెట్ట భూమిపై నున్న ఒక తోటవలె ఉంటుంది. దానిపై భారీవర్షం కురిసినపుడు అది రెండింతల ఫలమునిస్తుంది. భారీవర్షం కాక చినుకులు (కురిసినా దానికి చాలు). మరియు అల్లాహ్, మీరు చేసేదంతా చూస్తున్నాడు.

2:266 – أَيَوَدُّ أَحَدُكُمْ أَن تَكُونَ لَهُ جَنَّةٌ مِّن نَّخِيلٍ وَأَعْنَابٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ لَهُ فِيهَا مِن كُلِّ الثَّمَرَاتِ وَأَصَابَهُ الْكِبَرُ وَلَهُ ذُرِّيَّةٌ ضُعَفَاءُ فَأَصَابَهَا إِعْصَارٌ فِيهِ نَارٌ فَاحْتَرَقَتْ ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّـهُ لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُونَ ٢٦٦

ఏమీ? మీలో ఎవరికైనా ఖర్జూరపు మరియు ద్రాక్ష వనాలుండి, వాటి క్రిందినుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ, సర్వవిధాల ఫలాలు లభిస్తూ వుండి, అతనికి ముసలితనం వచ్చి, బలహీనులైన పిల్లలున్న సంకట సమయంలో ఆ తోట మంటలుగల సుడిగాలి వీచి కాలిపోవటం, ఎవరికైనా సమ్మతమేనా? మీరు ఆలోచించటానికి, ఈ విధంగా అల్లాహ్‌ తన సూచన (ఆయాత్‌) లను మీకు విశదీకరిస్తున్నాడు. 209

2:267 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِن طَيِّبَاتِ مَا كَسَبْتُمْ وَمِمَّا أَخْرَجْنَا لَكُم مِّنَ الْأَرْضِ ۖ وَلَا تَيَمَّمُوا الْخَبِيثَ مِنْهُ تُنفِقُونَ وَلَسْتُم بِآخِذِيهِ إِلَّا أَن تُغْمِضُوا فِيهِ ۚ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ غَنِيٌّ حَمِيدٌ ٢٦٧

ఓ విశ్వాసులారా! మీరు సంపాదించిన దాని నుండి మరియు మేము మీ కొరకు భూమి నుండి ఉత్పత్తి చేసిన వాటి నుండి, మేలైన వాటినే (అల్లాహ్‌ మార్గంలో) ఖర్చు పెట్టండి. ఏ వస్తువుల నైతే మీరు కండ్లుమూసుకునే గానీ తీసుకోరో, అలాంటి చెడ్డ వస్తువులను (ఇతరులపై) ఖర్చు చేయటానికి ఉద్దేశించకండి. మరియు అల్లాహ్‌ స్వయం సమృద్ధుడు, ప్రశంసనీయుడని 210 తెలుసుకోండి

2:268 – الشَّيْطَانُ يَعِدُكُمُ الْفَقْرَ وَيَأْمُرُكُم بِالْفَحْشَاءِ ۖ وَاللَّـهُ يَعِدُكُم مَّغْفِرَةً مِّنْهُ وَفَضْلًا ۗ وَاللَّـهُ وَاسِعٌ عَلِيمٌ ٢٦٨

షై’తాన్‌ దారిద్ర్య ప్రమాదం చూపి (భయ పెట్టి), మిమ్మల్ని నీచకార్యాలు చేయటానికి ప్రేరేపిస్తుంటాడు. కాని అల్లాహ్‌ తనవైపు నుండి మిమ్మల్ని క్షమిస్తానని, అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరియు అల్లాహ్‌ విస్తారుడు, 211 సర్వజ్ఞుడు

2:269 – يُؤْتِي الْحِكْمَةَ مَن يَشَاءُ ۚ وَمَن يُؤْتَ الْحِكْمَةَ فَقَدْ أُوتِيَ خَيْرًا كَثِيرًا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ ٍ ٢٦٩

ఆయన తాను కోరిన వారికి వివేకాన్ని ప్రసా దిస్తాడు. 212 మరియు వివేకం పొందినవాడు, వాస్త వంగా సర్వసంపదలను పొందినవాడే! కాని బుధ్ధి మంతులు తప్ప వేరే వారు దీనిని గ్రహించలేరు.

2:270 – وَمَا أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍ فَإِنَّ اللَّـهَ يَعْلَمُهُ ۗ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ ٢٧٠

మరియు, మీరు (ఇతరులపై) ఏమి ఖర్చు చేసినా, లేక ఏ మొక్కుబడి చేసుకున్నా, నిశ్చయంగా, అల్లాహ్‌కు అంతా తెలుస్తుంది. 213 మరియు దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు.

2:271 – إِن تُبْدُوا الصَّدَقَاتِ فَنِعِمَّا هِيَ ۖ وَإِن تُخْفُوهَا وَتُؤْتُوهَا الْفُقَرَاءَ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۚ وَيُكَفِّرُ عَنكُم مِّن سَيِّئَاتِكُمْ ۗ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ ٢٧١

మీరు బహిరంగంగా దానాలు చేయటం మంచిదే! కాని, గుప్తంగా నిరుపేదలకు ఇస్తే! అది మీకు అంతకంటే మేలైనది. మరియు ఆయన మీ ఎన్నో పాపాలను (దీని వల్ల) రద్దుచేస్తాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు. (1/4)

2:272 – لَّيْسَ عَلَيْكَ هُدَاهُمْ وَلَـٰكِنَّ اللَّـهَ يَهْدِي مَن يَشَاءُ ۗ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ فَلِأَنفُسِكُمْ ۚ وَمَا تُنفِقُونَ إِلَّا ابْتِغَاءَ وَجْهِ اللَّـهِ ۚ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ يُوَفَّ إِلَيْكُمْ وَأَنتُمْ لَا تُظْلَمُونَ ٢٧٢

  • (ఓ ప్రవక్తా!) వారిని సన్మార్గాన్ని అవలం బించేటట్లు చేయటం నీ బాధ్యత కాదు. కాని, అల్లాహ్‌ తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. మరియు మీరు మంచి మార్గంలో ఖర్చుచేసేది మీ (మేలు) కొరకే. మీరు ఖర్చుచేసేది అల్లాహ్‌ ప్రీతిని పొందటానికే అయిఉండాలి. మీరు మంచి మార్గంలో ఏమి ఖర్చుచేసినా, దాని ఫలితం మీకు పూర్తిగా లభిస్తుంది మరియు మీకు ఎలాంటి అన్యాయం జరుగదు.

2:273 – لِلْفُقَرَاءِ الَّذِينَ أُحْصِرُوا فِي سَبِيلِ اللَّـهِ لَا يَسْتَطِيعُونَ ضَرْبًا فِي الْأَرْضِ يَحْسَبُهُمُ الْجَاهِلُ أَغْنِيَاءَ مِنَ التَّعَفُّفِ تَعْرِفُهُم بِسِيمَاهُمْ لَا يَسْأَلُونَ النَّاسَ إِلْحَافًا ۗ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّـهَ بِهِ عَلِيمٌ ٢٧٣

అల్లాహ్‌ మార్గంలో నిమగ్నులైన కారణంగా (తమ జీవనోపాధి కొరకు) భూమిలో తిరిగే అవకాశం లేక, లేమికి గురిఅయ్యే పేదవారు (ధనసహాయానికి అర్హులు). ఎరుగని మనిషి వారి అడగకపోవటాన్ని చూసి, వారు ధనవంతులని భావించవచ్చు! (కాని) వారి ముఖచిహ్నాలు చూసి నీవు వారిని గుర్తించగలవు. వారు ప్రజలను పట్టుబట్టి అడిగేవారు కారు. మరియు మీరు మంచి కొరకు ఏమి ఖర్చు చేసినా అది అల్లాహ్‌కు తప్పక తెలుస్తుంది.

2:274 – الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُم بِاللَّيْلِ وَالنَّهَارِ سِرًّا وَعَلَانِيَةً فَلَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ٢٧٤

ఎవరైతే తమ సంపదను (అల్లాహ్‌ మార్గంలో) రేయింబవళ్ళు బహిరంగంగానూ మరియు రహస్యంగానూ ఖర్చుచేస్తారో, వారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువువద్ద పొందుతారు. మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా! 214

2:275 – الَّذِينَ يَأْكُلُونَ الرِّبَا لَا يَقُومُونَ إِلَّا كَمَا يَقُومُ الَّذِي يَتَخَبَّطُهُ الشَّيْطَانُ مِنَ الْمَسِّ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا إِنَّمَا الْبَيْعُ مِثْلُ الرِّبَا ۗ وَأَحَلَّ اللَّـهُ الْبَيْعَ وَحَرَّمَ الرِّبَا ۚ فَمَن جَاءَهُ مَوْعِظَةٌ مِّن رَّبِّهِ فَانتَهَىٰ فَلَهُ مَا سَلَفَ وَأَمْرُهُ إِلَى اللَّـهِ ۖ وَمَنْ عَادَ فَأُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٢٧٥

ఎవరైతే వడ్డీ తింటారో! 215 వారి స్థితి (పునరుత్థాన దినమున) షై’తాన్‌ తాకడం వల్ల భ్రమపరచబడిన వ్యక్తి స్థితివలె ఉంటుంది. ఇది ఎందుకంటే! వారు: ”వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే!” అని చెప్పడం. కాని అల్లాహ్‌ వ్యాపా రాన్ని ధర్మసమ్మతం (‘హలాల్‌) చేశాడు మరియు వడ్డీని నిషిధ్ధం (‘హరామ్‌) చేశాడు. కనుక తన ప్రభువు చేసిన ఈ హితబోధ అందిన వ్యక్తి మున్ముందు వడ్డీ తినటం త్యజిస్తే, అతడు పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతని వ్యవహారమంతా అల్లాహ్‌కే చెందుతుంది. (ఈ ఆదేశం తరువాత ఈ దుర్వ్యవహారానికి) పాల్పడేవారు నరకవాసు లవుతారు, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు.

2:276 – يَمْحَقُ اللَّـهُ الرِّبَا وَيُرْبِي الصَّدَقَاتِ ۗ وَاللَّـهُ لَا يُحِبُّ كُلَّ كَفَّارٍ أَثِيمٍ ٢٧٦

అల్లాహ్‌ వడ్డీ (ఆదాయాన్ని) నశింప జేస్తాడు మరియు దాన-ధర్మాలు (చేసేవారికి) వృధ్ధినొసంగుతాడు. మరియు సత్య-తిరస్కా రుడు (కృతఘ్నుడు), పాపిష్ఠుడు అయిన వ్యక్తిని అల్లాహ్‌ ప్రేమించడు.

2:277 – إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ لَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ٢٧٧

నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసే వారికీ మరియు నమా’జ్‌ స్థాపించేవారికీ, ‘జకాత్‌ ఇచ్చేవారికీ, తమ ప్రభువు వద్ద తగిన ప్రతిఫలం లభిస్తుంది మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!

2:278 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّـهَ وَذَرُوا مَا بَقِيَ مِنَ الرِّبَا إِن كُنتُم مُّؤْمِنِينَ ٢٧٨

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి మరియు మీరు (నిజంగా) విశ్వాసులే అయితే, మీకు రావలసిన వడ్డీని విడిచిపెట్టండి. 216

2:279 – فَإِن لَّمْ تَفْعَلُوا فَأْذَنُوا بِحَرْبٍ مِّنَ اللَّـهِ وَرَسُولِهِ ۖ وَإِن تُبْتُمْ فَلَكُمْ رُءُوسُ أَمْوَالِكُمْ لَا تَظْلِمُونَ وَلَا تُظْلَمُونَ ٢٧٩

కాని, ఒకవేళ మీరు అలా చేయకపోతే! అల్లాహ్‌ మరియు ఆయన సందేశహరుని తరఫు నుండి యుద్ధ ప్రకటన ఉందని తెలుసుకోండి. 217 కాని మీరు పశ్చాత్తాపపడితే (వడ్డీ వదలుకుంటే), మీ అసలు సొమ్ము మీకు లభిస్తుంది. మీరు (ఇతరులకు) అన్యాయం చేయకండి మరియు మీకూ అన్యాయం జరుగదు.

2:280 – وَإِن كَانَ ذُو عُسْرَةٍ فَنَظِرَةٌ إِلَىٰ مَيْسَرَةٍ ۚ وَأَن تَصَدَّقُوا خَيْرٌ لَّكُمْ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ ٢٨٠

మరియు (మీ బాకీదారుడు ఆర్థిక) ఇబ్బందులలో ఉంటే, అతని పరిస్థితి, కుదిరే వరకూ గడువు నివ్వండి. ఒకవేళ మీరు దానమని వదిలిపెడితే అది మీకు ఎంతో మేలైనది, ఇది మీకు తెలిస్తే (ఎంత బాగుండేది)! 218

2:281 – وَاتَّقُوا يَوْمًا تُرْجَعُونَ فِيهِ إِلَى اللَّـهِ ۖ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ ٢٨١

మరియు మీరు తిరిగి అల్లాహ్‌ సమక్షానికి చేరుకోబోయే ఆ దినానికి భయపడండి. అప్పుడు ప్రతి వ్యక్తికి తన కర్మల ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారికెలాంటి అన్యాయం జరుగదు. 219

2:282 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا تَدَايَنتُم بِدَيْنٍ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى فَاكْتُبُوهُ ۚ وَلْيَكْتُب بَّيْنَكُمْ كَاتِبٌ بِالْعَدْلِ ۚ وَلَا يَأْبَ كَاتِبٌ أَن يَكْتُبَ كَمَا عَلَّمَهُ اللَّـهُ ۚ فَلْيَكْتُبْ وَلْيُمْلِلِ الَّذِي عَلَيْهِ الْحَقُّ وَلْيَتَّقِ اللَّـهَ رَبَّهُ وَلَا يَبْخَسْ مِنْهُ شَيْئًا ۚ فَإِن كَانَ الَّذِي عَلَيْهِ الْحَقُّ سَفِيهًا أَوْ ضَعِيفًا أَوْ لَا يَسْتَطِيعُ أَن يُمِلَّ هُوَ فَلْيُمْلِلْ وَلِيُّهُ بِالْعَدْلِ ۚ وَاسْتَشْهِدُوا شَهِيدَيْنِ مِن رِّجَالِكُمْ ۖ فَإِن لَّمْ يَكُونَا رَجُلَيْنِ فَرَجُلٌ وَامْرَأَتَانِ مِمَّن تَرْضَوْنَ مِنَ الشُّهَدَاءِ أَن تَضِلَّ إِحْدَاهُمَا فَتُذَكِّرَ إِحْدَاهُمَا الْأُخْرَىٰ ۚ وَلَا يَأْبَ الشُّهَدَاءُ إِذَا مَا دُعُوا ۚ وَلَا تَسْأَمُوا أَن تَكْتُبُوهُ صَغِيرًا أَوْ كَبِيرًا إِلَىٰ أَجَلِهِ ۚ ذَٰلِكُمْ أَقْسَطُ عِندَ اللَّـهِ وَأَقْوَمُ لِلشَّهَادَةِ وَأَدْنَىٰ أَلَّا تَرْتَابُوا ۖ إِلَّا أَن تَكُونَ تِجَارَةً حَاضِرَةً تُدِيرُونَهَا بَيْنَكُمْ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَلَّا تَكْتُبُوهَا ۗ وَأَشْهِدُوا إِذَا تَبَايَعْتُمْ ۚ وَلَا يُضَارَّ كَاتِبٌ وَلَا شَهِيدٌ ۚ وَإِن تَفْعَلُوا فَإِنَّهُ فُسُوقٌ بِكُمْ ۗ وَاتَّقُوا اللَّـهَ ۖ وَيُعَلِّمُكُمُ اللَّـهُ ۗ وَاللَّـهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ٢٨٢

ఓ విశ్వాసులారా! మీరు పరస్పరం ఒక నిర్ణీత కాలం కొరకు అప్పు తీసుకున్నప్పుడు, దానిని వ్రాసిపెట్టుకోండి. 220 మరియు మీలో పత్రం వ్రాసేవాడు, న్యాయంగా వ్రాయాలి. మరియు వ్రాసే వాడు నిరాకరించకుండా, అల్లాహ్‌ నేర్పినట్లు వ్రాయాలి. ఋణగ్రహీత అల్లాహ్‌కు భయపడి, నిర్ణీత షరతులను తగ్గించకుండా, చెప్పి వ్రాయించాలి. ఋణగ్రహీత అల్పజ్ఞాని లేక సామర్థ్యం లేనివాడు లేక బలహీనుడు మరియు తాను చెప్పి వ్రాయించలేని వాడైతే, అతని సంరక్షకుడు న్యాయంగా వ్రాయించాలి. మరియు మీలో ఇద్దరు మగ వారిని సాక్ష్యమివ్వటానికి సాక్షులుగా ఉంచుకోండి. ఇద్దరు పురుషులు దొరకని పక్షమున ఒక పురుషుడు మరియు మీకు సమ్మత మైన ఇద్దరు స్త్రీలను సాక్షులుగా తీసుకోండి. (ఎందుకంటే) వారిలో ఒకామె మరచిపోతే, రెండవ స్త్రీ ఆమెకు జ్ఞాపకం చేయించవచ్చు. మరియు పిలువబడినప్పుడు సాక్షులు, సాక్ష్యమివ్వటానికి నిరాకరించకూడదు. మరియు వ్యవహారం చిన్న దైనా పెద్దదైనా దానిని గడువు నిర్ణయంతో పాటు వ్రాసిపెట్టటానికి అశ్రధ్ధ చూపకూడదు. అల్లాహ్‌ దృష్టిలో ఇది న్యాయసమ్మతమైనది మరియు స్థిరమైన సాక్ష్యంగా తోడ్పడుతుంది మరియు ఏవిధమైన సందేహాలకు అవకాశం లేకుండా చేస్తుంది. కాని, మీరు అప్పటి కప్పుడు ఇచ్చి-పుచ్చుకునే (సాధారణ) లావాదేవీలు చేస్తున్నపుడు వ్రాయ కున్నా దోషంలేదు. కాని, వ్యాపార వ్యవహారాలు నిర్ణయంచేటప్పుడు సాక్షులను పెట్టుకోండి. కాని వ్రాసేవానికి గానీ, సాక్షులకు గానీ ఏ విధమైన హాని జరుగ కూడదు. ఒకవేళ అలా జరిగితే! నిశ్చయంగా, అది మీకు పాపం. మరియు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. మరియు ఇది అల్లాహ్‌ మీకు నేర్పుతున్నాడు. మరియు అల్లాహ్‌కు ప్రతిదాని జ్ఞానం ఉంది. (3/8)

2:283 – وَإِن كُنتُمْ عَلَىٰ سَفَرٍ وَلَمْ تَجِدُوا كَاتِبًا فَرِهَانٌ مَّقْبُوضَةٌ ۖ فَإِنْ أَمِنَ بَعْضُكُم بَعْضًا فَلْيُؤَدِّ الَّذِي اؤْتُمِنَ أَمَانَتَهُ وَلْيَتَّقِ اللَّـهَ رَبَّهُ ۗ وَلَا تَكْتُمُوا الشَّهَادَةَ ۚ وَمَن يَكْتُمْهَا فَإِنَّهُ آثِمٌ قَلْبُهُ ۗ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ عَلِيمٌ ٢٨٣

  • మరియు మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, (పత్రం) వ్రాసేవాడు దొరకని పక్షంలో సొమ్మును కుదువ పెట్టుకోవచ్చు. 221 మీకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే నమ్మకంగా ఇచ్చిన దానిని (అప్పును) తిరిగి అతడు వాపసు చేయాలి. మరియు తన ప్రభువైన అల్లాహ్ యందు భయ- భక్తులు కలిగి ఉండాలి. మరియు మీరు సాక్ష్యాన్ని (ఎన్నడూ) దాచకండి. మరియు (సాక్ష్యాన్ని) దాచేవాని హృదయం పాపభరితమైనది. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.

2:284 – لِّلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَإِن تُبْدُوا مَا فِي أَنفُسِكُمْ أَوْ تُخْفُوهُ يُحَاسِبْكُم بِهِ اللَّـهُ ۖ فَيَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۗ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٢٨٤

ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న దంతా అల్లాహ్‌దే! మీరు మీ మనస్సులలో ఉన్నది, వెలుబుచ్చినా లేక దాచినా అల్లాహ్‌ మీ నుంచి దాని లెక్క తీసుకుంటాడు. 222 మరియు ఆయన తాను కోరినవానిని క్షమిస్తాడు మరియు తాను కోరినవానిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.

2:285 – آمَنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ بِاللَّـهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ ٢٨٥

ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసిం చాడు 223 మరియు (అదేవిధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారంటారు: ”మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేద భావాలను చూపము. మరియు మేము (ఆదేశం) విన్నాము మరియు దానిని శిరసావహించాము, నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, ఓ మా ప్రభూ! మా గమ్యస్థానం నీ వైపుకే ఉంది.

2:286 – لَا يُكَلِّفُ اللَّـهُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۚ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا اكْتَسَبَتْ ۗ رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِن نَّسِينَا أَوْ أَخْطَأْنَا ۚ رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِن قَبْلِنَا ۚ رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهِ ۖ وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا ۚ أَنتَ مَوْلَانَا فَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ ٢٨٦

”అల్లాహ్‌, ఏ ప్రాణి పైననూ దాని శక్తికి మించిన భారం వేయడు. తాను సంపాదించిన దాని (పుణ్య) ఫలితం దానికి లభిస్తుంది మరియు తాను చేసిన దుష్కర్మల శిక్ష అది అనుభవిస్తుంది. ఓ మా ప్రభూ! మేము మరచినా లేక తప్పుచేసినా మమ్మల్ని పట్టకు! ఓ మా ప్రభూ! పూర్వం వారిపై మోపినట్టి భారం మాపై మోపకు. ఓ మా ప్రభూ! మేము సహించలేని భారం మాపై వేయకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు మరియు మమ్మల్ని కరుణించు. నీవే మా సంరక్షకుడవు, కావున సత్య-తిరస్కారులకు విరుధ్ధంగా మాకు విజయము (సహాయము) నొసంగు.”

— – సూరహ్ ఆల ఇమ్రాన్ – ఆల ‘ఇమ్రాన్‌: ఇమ్రాన్‌ పరివారం. ఈ విషయాలు (33-35) ఆయత్‌లలో ఉన్నాయి. ఇది మదీనహ్ లో అవతరింపజేయబడిన రెండవ లేక మూడవ సూరహ్‌. ఇందులో 200 ఆయాతులున్నాయి. దీని మొదటి 83 ఆయాతులలో నజ్‌రాన్‌ నుండి 9వ హిజ్రీలో వచ్చిన క్రైస్తవ రాయబారులతో జరిగిన వాదోపవాదాల వివరాలున్నాయి. ఇందులో 2వ హి. రమ’దాన్‌ నెలలో జరిగిన బద్ర్‌ యుద్ధం 121-148 ఆయాత్‌లలో మరియు 3వ హి. షవ్వాల్‌ నెలలో జరిగిన ఉ’హుద్‌ యుద్ధం యొక్క విషయాలు 149-180 ఆయాత్‌లలో ఉన్నాయి.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 3:1 – الم ١

అలిఫ్‌-లామ్‌-మీమ్‌.

3:2 – اللَّـهُ لَا إِلَـٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ٢

అల్లాహ్‌! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు (నిత్యుడు) విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు. 1

3:3 – نَزَّلَ عَلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ وَأَنزَلَ التَّوْرَاةَ وَالْإِنجِيلَ ٣

ఆయన, సత్యమైన ఈ దివ్యగ్రంథాన్ని (ఓ ము’హమ్మద్‌!) నీపై అవతరింపజేశాడు. ఇది పూర్వం అవతరింపజేయబడిన గ్రంథాలలోనుండి (మిగిలి ఉన్న సత్యాన్ని) ధృవపరుస్తోంది. 2 మరియు ఆయనే తౌరాత్‌ ను మరియు ఇంజీలును 3 అవతరింపజేశాడు –

3:4 – مِن قَبْلُ هُدًى لِّلنَّاسِ وَأَنزَلَ الْفُرْقَانَ ۗ إِنَّ الَّذِينَ كَفَرُوا بِآيَاتِ اللَّـهِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۗ وَاللَّـهُ عَزِيزٌ ذُو انتِقَامٍ ٤

దీనికి ముందు ప్రజలకు సన్మార్గం చూప టానికి. మరియు (సత్యాసత్యాలను విశదీకరించే) ఈ గీటురాయిని కూడా అవతరింపజేశాడు. ٤ నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్‌ ఆజ్ఞలను తిరస్క రిస్తారో వారికి కఠినశిక్ష ఉంటుంది. మరియు అల్లాహ్‌ సర్వశక్తిమంతుడు, ప్రతీకారం తీర్చుకోగలవాడు.

3:5 – إِنَّ اللَّـهَ لَا يَخْفَىٰ عَلَيْهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ ٥

నిశ్చయంగా, భూమిలో గానీ మరియు ఆకాశా లలో గానీ, అల్లాహ్‌కు గోప్యంగా ఉన్నది ఏదీలేదు.

3:6 – هُوَ الَّذِي يُصَوِّرُكُمْ فِي الْأَرْحَامِ كَيْفَ يَشَاءُ ۚ لَا إِلَـٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ ٦

ఆయన తన ఇష్టానుసారంగా మిమ్మల్ని (మాతృ) గర్భాలలో తీర్చిదిద్దుతాడు 5 ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

3:7 – هُوَ الَّذِي أَنزَلَ عَلَيْكَ الْكِتَابَ مِنْهُ آيَاتٌ مُّحْكَمَاتٌ هُنَّ أُمُّ الْكِتَابِ وَأُخَرُ مُتَشَابِهَاتٌ ۖ فَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِمْ زَيْغٌ فَيَتَّبِعُونَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَاءَ الْفِتْنَةِ وَابْتِغَاءَ تَأْوِيلِهِ ۗ وَمَا يَعْلَمُ تَأْوِيلَهُ إِلَّا اللَّـهُ ۗ وَالرَّاسِخُونَ فِي الْعِلْمِ يَقُولُونَ آمَنَّا بِهِ كُلٌّ مِّنْ عِندِ رَبِّنَا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ ٧

ఆయన (అల్లాహ్‌)యే నీపై (ఓ ము’హ మ్మద్‌!) ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) అవతరింప జేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ము’హ్‌కమాత్‌) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్‌) ఉన్నాయి 6 కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు, సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను అపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటపడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్‌కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ పరిపక్వ జ్ఞానం గలవారు:”మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!” అని అంటారు. జ్ఞాన వంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.

3:8 – رَبَّنَا لَا تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً ۚ إِنَّكَ أَنتَ الْوَهَّابُ ٨

(వారు ఇలా అంటారు): ”ఓ మా ప్రభూ! మాకు సన్మార్గం చూపిన తరువాత మా హృదయాలను వక్రమార్గం వైపునకు పోనివ్వకు. మరియు మాపై నీ కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా, నీవే సర్వప్రదుడవు. 7

3:9 – رَبَّنَا إِنَّكَ جَامِعُ النَّاسِ لِيَوْمٍ لَّا رَيْبَ فِيهِ ۚ إِنَّ اللَّـهَ لَا يُخْلِفُ الْمِيعَادَ ٩

”ఓ మా ప్రభూ! నిశ్చయంగా, నీవే మానవు లందరినీ, నిస్సందేహంగా రాబోయే, ఆ దినమున సమావేశపరచేవాడవు. 8 నిశ్చయంగా, అల్లాహ్‌ తన వాగ్దానాన్ని భంగంచేయడు.”

3:10 – إِنَّ الَّذِينَ كَفَرُوا لَن تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُم مِّنَ اللَّـهِ شَيْئًا ۖ وَأُولَـٰئِكَ هُمْ وَقُودُ النَّارِ ١٠

  1. నిశ్చయంగా, సత్య-తిరస్కారులైనవారికి వారి ధనంగానీ, వారి సంతానంగానీ, అల్లాహ్‌కు ప్రతికూలంగా ఏ మాత్రం పనికిరావు. మరియు ఇలాంటి వారే నరకాగ్నికి ఇంధనమయ్యేవారు.

3:11 – كَدَأْبِ آلِ فِرْعَوْنَ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَذَّبُوا بِآيَاتِنَا فَأَخَذَهُمُ اللَّـهُ بِذُنُوبِهِمْ ۗ وَاللَّـهُ شَدِيدُ الْعِقَابِ ١١

వారి ముగింపు ఫిర్‌’ఔను జాతి మరియు వారికి ముందున్నవారివలే ఉంటుంది. వారు మా సూచన (ఆజ్ఞ)లను తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్‌ వారి పాపాల ఫలితంగా, వారిని పట్టుకున్నాడు. మరియు అల్లాహ్‌ శిక్ష విధించటంలో చాలా కఠినుడు.

3:12 – قُل لِّلَّذِينَ كَفَرُوا سَتُغْلَبُونَ وَتُحْشَرُونَ إِلَىٰ جَهَنَّمَ ۚ وَبِئْسَ الْمِهَادُ ١٢

(ఓ ప్రవక్తా!) సత్యాన్ని తిరస్కరించిన వారితో అను: ”మీరు త్వరలోనే లొంగదీయబడి నరకంలో జమచేయబడతారు. మరియు అది అతి చెడ్డ విరామ స్థలము!”

3:13 – قَدْ كَانَ لَكُمْ آيَةٌ فِي فِئَتَيْنِ الْتَقَتَا ۖ فِئَةٌ تُقَاتِلُ فِي سَبِيلِ اللَّـهِ وَأُخْرَىٰ كَافِرَةٌ يَرَوْنَهُم مِّثْلَيْهِمْ رَأْيَ الْعَيْنِ ۚ وَاللَّـهُ يُؤَيِّدُ بِنَصْرِهِ مَن يَشَاءُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِّأُولِي الْأَبْصَارِ ١٣

వాస్తవానికి (బద్ర్‌ యుధ్ధరంగంలో) మార్కొ నిన ఆ రెండు వర్గాలలో మీకు ఒక సూచన ఉంది. ఒక వర్గం అల్లాహ్‌ మార్గంలో పోరాడేది మరియు రెండవది సత్య-తిరస్కారులది. వారు (విశ్వా సులు) వారిని (సత్య-తిరస్కారులను) రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు తమకళ్ళారాచూశారు. మరియు అల్లాహ్‌ తానుకోరిన వారిని తన సహాయంతో (విజ యంతో) బలపరుస్తాడు. నిశ్చయంగా, దూరదృష్టి గలవారికి ఇందులో ఒక గుణపాఠముంది. 9

3:14 – زُيِّنَ لِلنَّاسِ حُبُّ الشَّهَوَاتِ مِنَ النِّسَاءِ وَالْبَنِينَ وَالْقَنَاطِيرِ الْمُقَنطَرَةِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ وَالْخَيْلِ الْمُسَوَّمَةِ وَالْأَنْعَامِ وَالْحَرْثِ ۗ ذَٰلِكَ مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا ۖ وَاللَّـهُ عِندَهُ حُسْنُ الْمَآبِ ١٤

స్త్రీలు, సంతానం మరియు కూర్చిపెట్టిన వెండి బంగారురాసులు, మేలుజాతి గుర్రాలు, పశువులు పొలాలు మొదలైన మనోహరమైన వస్తువుల ప్రేమ ప్రజలకు ఆకర్షణీయంగా చేయ బడింది. 10 ఇదంతా ఇహలోక జీవనభోగం. కానీ, అసలైన గమ్యస్థానం అల్లాహ్‌ వద్దనే ఉంది. (1/2)

3:15 – قُلْ أَؤُنَبِّئُكُم بِخَيْرٍ مِّن ذَٰلِكُمْ ۚ لِلَّذِينَ اتَّقَوْا عِندَ رَبِّهِمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَأَزْوَاجٌ مُّطَهَّرَةٌ وَرِضْوَانٌ مِّنَ اللَّـهِ ۗ وَاللَّـهُ بَصِيرٌ بِالْعِبَادِ ١٥

  • ఇలా చెప్పు: ”ఏమీ? వాటికంటే ఉత్తమ మైన వాటిని నేను మీకు తెలుపనా? దైవభీతి గలవారికి, వారి ప్రభువు వద్ద స్వర్గవనాలుంటాయి. వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు మరియు వారికి అక్కడ పవిత్ర సహవాసులు (అ’జ్వాజ్‌) ఉంటారు మరియు వారికి అల్లాహ్‌ ప్రసన్నత లభిస్తుంది.” మరియు అల్లాహ్‌ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు.

3:16 – الَّذِينَ يَقُولُونَ رَبَّنَا إِنَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَقِنَا عَذَابَ النَّارِ ١٦

ఎవరైతే: ”ఓ మా ప్రభూ! మేము నిశ్చయంగా, విశ్వసించాము, కావున మా తప్పులను క్షమించు మరియు నరకాగ్నినుండి మమ్మల్ని తప్పించు.” అని పలుకుతారో!

3:17 – الصَّابِرِينَ وَالصَّادِقِينَ وَالْقَانِتِينَ وَالْمُنفِقِينَ وَالْمُسْتَغْفِرِينَ بِالْأَسْحَارِ ١٧

(అలాంటి వారే!) సహనశీలురు, సత్య వంతులు మరియు వినయ-విధేయతలు గల వారు, దానపరులు మరియు వేకువజామున 11 తమ పాపాలకు క్షమాపణ వేడుకునేవారు.

3:18 – شَهِدَ اللَّـهُ أَنَّهُ لَا إِلَـٰهَ إِلَّا هُوَ وَالْمَلَائِكَةُ وَأُولُو الْعِلْمِ قَائِمًا بِالْقِسْطِ ۚ لَا إِلَـٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ ١٨

నిశ్చయంగా ఆయన తప్ప మరొక ఆరాధ్య నీయుడు లేడని, అల్లాహ్‌, దేవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు; ఆయనే న్యాయ పరిరక్షకుడు. 12 ఆయన తప్ప మరొక ఆరాధ్య నీయుడు లేడు! ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

3:19 – إِنَّ الدِّينَ عِندَ اللَّـهِ الْإِسْلَامُ ۗ وَمَا اخْتَلَفَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْعِلْمُ بَغْيًا بَيْنَهُمْ ۗ وَمَن يَكْفُرْ بِآيَاتِ اللَّـهِ فَإِنَّ اللَّـهَ سَرِيعُ الْحِسَابِ ١٩

నిశ్చయంగా, అల్లాహ్‌కు సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహ్‌కు విధేయులవటం (ఇస్లాం) మాత్రమే 13 కాని పూర్వగ్రంథప్రజలు పరస్పర ఈర్ష్యతో, వారికి జ్ఞానం లభించిన తరువాతనే భేదాభిప్రాయాలకు లోనయ్యారు. మరియు ఎవరైతే అల్లాహ్‌ సూచనలను తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్‌ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు (అని తెలుసుకోవాలి).

3:20 – فَإِنْ حَاجُّوكَ فَقُلْ أَسْلَمْتُ وَجْهِيَ لِلَّـهِ وَمَنِ اتَّبَعَنِ ۗ وَقُل لِّلَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْأُمِّيِّينَ أَأَسْلَمْتُمْ ۚ فَإِنْ أَسْلَمُوا فَقَدِ اهْتَدَوا ۖ وَّإِن تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ ۗ وَاللَّـهُ بَصِيرٌ بِالْعِبَادِ ٢٠

  1. (ఓ ప్రవక్తా!) వారు నీతో వివాదమాడితే ఇట్లను: ”నేనూ మరియు నా అనుచరులు అల్లాహ్‌ ప్రీతి పొందటానికి ఆయనకు సంపూర్ణంగా విధేయులం (ముస్లిములం) అయ్యాము.” మరియు గ్రంథప్రజలతో మరియు నిరక్ష్యరాస్యు లతో (చదువురాని అరబ్బులతో): ”ఏమీ? మీరు కూడా విధేయులయ్యారా?” అని అడుగు. వారు విధేయులైతే సన్మార్గం పొందినవారవుతారు. కాని ఒకవేళ వారు వెనుదిరిగితే, నీ బాధ్యత కేవలం సందేశాన్ని అందజేయటం మాత్రమే! మరియు అల్లాహ్‌ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు. 14

3:21 – إِنَّ الَّذِينَ يَكْفُرُونَ بِآيَاتِ اللَّـهِ وَيَقْتُلُونَ النَّبِيِّينَ بِغَيْرِ حَقٍّ وَيَقْتُلُونَ الَّذِينَ يَأْمُرُونَ بِالْقِسْطِ مِنَ النَّاسِ فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ ٢١

నిశ్చయంగా, అల్లాహ్‌ ఆదేశాలను (ఆయా తులను) తిరస్కరించే వారికి మరియు ఆయన ప్రవక్తలను అన్యాయంగా చంపేవారికి మరియు న్యాయసమ్మతంగా వ్యవహరించమని బోధించే ప్రజలను చంపే వారికి, బాధాకరమైన శిక్ష ఉన్నదని తెలియజెయ్యి.

3:22 – أُولَـٰئِكَ الَّذِينَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ ٢٢

అలాంటి వారి కర్మలు ఇహలోకమందును మరియు పరలోకమందును వృథా అవుతాయి. మరియు వారికి సహాయకులు ఎవ్వరూ ఉండరు.

3:23 – أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يُدْعَوْنَ إِلَىٰ كِتَابِ اللَّـهِ لِيَحْكُمَ بَيْنَهُمْ ثُمَّ يَتَوَلَّىٰ فَرِيقٌ مِّنْهُمْ وَهُم مُّعْرِضُونَ ٢٣

ఏమీ? గ్రంథంలోని కొంత భాగం పొందిన వారి పరిస్థితిఎలాఉందో నీవుగమనించలేదా?వారిమధ్య తీర్పు చేయటానికి, ‘అల్లాహ్‌ గ్రంథం వైపునకు రండి,’ అని వారిని ఆహ్వానించినపుడు, వారిలోని ఒక వర్గంవారు విముఖులై, వెనుదిరిగి పోతారు.

3:24 – ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لَن تَمَسَّنَا النَّارُ إِلَّا أَيَّامًا مَّعْدُودَاتٍ ۖ وَغَرَّهُمْ فِي دِينِهِم مَّا كَانُوا يَفْتَرُونَ ٢٤

వారు అలా చేయటానికి కారణం వారు: ”నరకాగ్ని కొన్నిదినాలు మాత్రమే మమ్మల్ని తాకుతుంది.” అని అనటం. మరియు వారు కల్పించుకున్న అపోహయే వారిని తమ ధర్మ విషయంలో మోసపుచ్చింది. 15

3:25 – فَكَيْفَ إِذَا جَمَعْنَاهُمْ لِيَوْمٍ لَّا رَيْبَ فِيهِ وَوُفِّيَتْ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ ٢٥

నిస్సందేహంగా, రాబోయే ఆ (పునరుత్థాన) దినమున, మేము వారిని సమావేశపరిచినపుడు, వారి స్థితి ఎలా ఉంటుందో (ఆలోచించారా?) మరియు ప్రతి జీవికి తాను చేసిన కర్మల ఫలితం పూర్తిగా నొసంగబడుతుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.

3:26 – قُلِ اللَّـهُمَّ مَالِكَ الْمُلْكِ تُؤْتِي الْمُلْكَ مَن تَشَاءُ وَتَنزِعُ الْمُلْكَ مِمَّن تَشَاءُ وَتُعِزُّ مَن تَشَاءُ وَتُذِلُّ مَن تَشَاءُ ۖ بِيَدِكَ الْخَيْرُ ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٢٦

ఇలా అను: ”ఓ అల్లాహ్‌, విశ్వ సామ్రాజ్యాధి పతి! 16 నీవు ఇష్టపడిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారిని రాజ్యాధి కారం నుండి తొలగిస్తావు మరియు నీవు ఇష్టపడిన వారికి గౌరవాన్ని (శక్తిని) ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారిని పరాభవం పాలుచేస్తావు. నీ చేతిలోనే 17 మేలున్నది. నిశ్చయంగా, నీవు ప్రతిదీ చేయగల సమర్థుడవు.

3:27 – تُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَتُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ ۖ وَتُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَتُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ ۖ وَتَرْزُقُ مَن تَشَاءُ بِغَيْرِ حِسَابٍ ٢٧

”నీవు రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తావు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింపజేస్తావు. మరియు నీవు సజీవులను నిర్జీవులనుండి తీస్తావు మరియు నిర్జీవులను సజీవులనుండి తీస్తావు. మరియు నీవు కోరినవారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తావు.”

3:28 – ا يَتَّخِذِ الْمُؤْمِنُونَ الْكَافِرِينَ أَوْلِيَاءَ مِن دُونِ الْمُؤْمِنِينَ ۖ وَمَن يَفْعَلْ ذَٰلِكَ فَلَيْسَ مِنَ اللَّـهِ فِي شَيْءٍ إِلَّا أَن تَتَّقُوا مِنْهُمْ تُقَاةً ۗ وَيُحَذِّرُكُمُ اللَّـهُ نَفْسَهُ ۗ وَإِلَى اللَّـهِ الْمَصِيرُ ٢٨

విశ్వాసులు – తమ తోటి విశ్వాసులను విడిచి – సత్య-తిరస్కారులను స్నేహితులుగా చేసుకోరాదు. అలా చేసేవారికి అల్లాహ్‌తో ఏ విధమైన సంబంధం లేదు. కాని, వారి దౌర్జన్యానికి భీతిపరులైతే తప్ప! అల్లాహ్‌ (ఆయనకే భీతిపరులై ఉండమని) మిమ్మల్ని స్వయంగా హెచ్చరిస్తున్నాడు. 18 మరియు అల్లాహ్‌ వైపుకే మీ మరలింపు ఉంది.

3:29 – قُلْ إِن تُخْفُوا مَا فِي صُدُورِكُمْ أَوْ تُبْدُوهُ يَعْلَمْهُ اللَّـهُ ۗ وَيَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٢٩

వారితో ఇలా అను: ”మీరు మీ హృదయాలలో ఉన్నది దాచినా వెలిబుచ్చినా, అది అల్లాహ్‌కు తెలుస్తుంది. మరియు భూమ్యాకాశాలలో ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.”

3:30 – يَوْمَ تَجِدُ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ مِنْ خَيْرٍ مُّحْضَرًا وَمَا عَمِلَتْ مِن سُوءٍ تَوَدُّ لَوْ أَنَّ بَيْنَهَا وَبَيْنَهُ أَمَدًا بَعِيدًا ۗ وَيُحَذِّرُكُمُ اللَّـهُ نَفْسَهُ ۗ وَاللَّـهُ رَءُوفٌ بِالْعِبَادِ ٣٠

ఆ రోజు ప్రతిప్రాణి తాను చేసిన మంచిని మరియు తాను చేసిన చెడును ప్రత్యక్షంగా చూసు కున్నప్పుడు, తనకు మరియు దానికి మధ్య దూర ముంటే, ఎంత బాగుండేదని ఆశిస్తుంది. మరియు అల్లాహ్‌ (తనకే భీతిపరులై ఉండమని) మిమ్మల్ని స్వయంగా హెచ్చరిస్తున్నాడు. మరియు అల్లాహ్‌ తన దాసులఎడల ఎంతో కనికరుడు.

3:31 – قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّـهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّـهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٣١

(ఓ ప్రవక్తా!) ఇలా అను: ”మీకు (నిజంగా) అల్లాహ్‌ పట్ల ప్రేమఉంటే మీరు నన్ను అనుసరిం చండి. (అప్పుడు) అల్లాహ్‌ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.”

3:32 – قُلْ أَطِيعُوا اللَّـهَ وَالرَّسُولَ ۖ فَإِن تَوَلَّوْا فَإِنَّ اللَّـهَ لَا يُحِبُّ الْكَافِرِينَ ٣٢

(ఇంకా) ఇలా అను: ”అల్లాహ్‌కు మరియు సందేశహరునికి విధేయులై ఉండండి. ”వారు కాదంటే! నిశ్చయంగా, అల్లాహ్‌ సత్య- తిరస్కారులను ప్రేమించడు, (అని తెలుసు కోవాలి). 19 (5/8)

3:33 – إِنَّ اللَّـهَ اصْطَفَىٰ آدَمَ وَنُوحًا وَآلَ إِبْرَاهِيمَ وَآلَ عِمْرَانَ عَلَى الْعَالَمِينَ ٣٣

  • నిశ్చయంగా అల్లాహ్‌ ఆదమ్‌ను, నూ’హ్‌ ను ఇబ్రాహీమ్‌ సంతతివారిని మరియు ‘ఇమ్రాన్‌ సంతతివారిని (ఆ యా కాలపు) సర్వలోకాల (ప్రజల)పై ప్రాధాన్యత నిచ్చి ఎన్నుకున్నాడు. 20

3:34 – ذُرِّيَّةً بَعْضُهَا مِن بَعْضٍ ۗ وَاللَّـهُ سَمِيعٌ عَلِيمٌ ٣٤

వారంతా ఒకే పరంపరకు చెందిన వారు. మరియు అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

3:35 – إِذْ قَالَتِ امْرَأَتُ عِمْرَانَ رَبِّ إِنِّي نَذَرْتُ لَكَ مَا فِي بَطْنِي مُحَرَّرًا فَتَقَبَّلْ مِنِّي ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ ٣٥

‘ఇమ్రాన్‌ భార్య ప్రార్థించింది (జ్ఞాపకం చేసుకోండి): ”ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నేను నా గర్భము నందున్న శిశువును నీ సేవకు 21 అంకితం చేయటానికి మొక్కుకున్నాను, కావున నా నుండి దీనిని తప్పక స్వీకరించు. నిశ్చయంగా, నీవే సర్వం వినేవాడవు, సర్వజ్ఞుడవు.”

3:36 – فَلَمَّا وَضَعَتْهَا قَالَتْ رَبِّ إِنِّي وَضَعْتُهَا أُنثَىٰ وَاللَّـهُ أَعْلَمُ بِمَا وَضَعَتْ وَلَيْسَ الذَّكَرُ كَالْأُنثَىٰ ۖ وَإِنِّي سَمَّيْتُهَا مَرْيَمَ وَإِنِّي أُعِيذُهَا بِكَ وَذُرِّيَّتَهَا مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ ٣٦

తరువాత ఆమె ఆడ శిశువు (మర్యమ్‌)ను ప్రసవించినప్పుడు, ఆమె ఇలా విన్నవించు కున్నది: ”ఓ నా ప్రభూ! నేను ఆడ శిశువును ప్రసవించాను” – ఆమె ప్రసవించినదేమిటో అల్లాహ్‌కు బాగా తెలుసు మరియు బాలుడు బాలిక వంటివాడు కాడు – ”మరియు నేను ఈమెకు మర్యమ్‌ అని పేరు పెట్టాను. 22 మరియు నేను ఈమెను మరియు ఈమె సంతానాన్ని శపించ (బహిష్కరించ) బడిన షై’తాన్‌ నుండి రక్షించటానికి, నీ శరణు వేడుకుంటున్నాను!” 23

3:37 – فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُولٍ حَسَنٍ وَأَنبَتَهَا نَبَاتًا حَسَنًا وَكَفَّلَهَا زَكَرِيَّا ۖ كُلَّمَا دَخَلَ عَلَيْهَا زَكَرِيَّا الْمِحْرَابَ وَجَدَ عِندَهَا رِزْقًا ۖ قَالَ يَا مَرْيَمُ أَنَّىٰ لَكِ هَـٰذَا ۖ قَالَتْ هُوَ مِنْ عِندِ اللَّـهِ ۖ إِنَّ اللَّـهَ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ ٣٧

ఆ తరువాత ఆ బాలికను, ఆమె ప్రభువు ఆదరంతో స్వీకరించి, ఆమెను ఒక మంచి స్త్రీగా పెంచాడు మరియు ఆమెను ‘జకరియ్యా సంరక్షణలో ఉంచాడు. 24 ‘జకరియ్యా ఆమె గదికి పోయినప్పుడల్లా, ఆమె వద్ద (ఏవో కొన్ని) భోజన పదార్థాలను చూసి, ఆమెను ఇలా అడిగేవాడు: ”ఓ మర్యమ్‌, ఇది నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చింది?” ఆమె ఇలా జవాబిచ్చేది: ”ఇది అల్లాహ్ వద్దనుండి వచ్చింది.” నిశ్చయంగా, అల్లాహ్‌ తాను కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు.

3:38 – هُنَالِكَ دَعَا زَكَرِيَّا رَبَّهُ ۖ قَالَ رَبِّ هَبْ لِي مِن لَّدُنكَ ذُرِّيَّةً طَيِّبَةً ۖ إِنَّكَ سَمِيعُ الدُّعَاءِ ٣٨

అప్పుడు ‘జకరియ్యా తన ప్రభువును ప్రార్థించాడు. అతను ఇలా విన్నవించుకున్నాడు: ”ఓ నా ప్రభూ! నీ కనికరంతో నాకు కూడా ఒక మంచి సంతానాన్ని ప్రసాదించు. నిశ్చయంగా, నీవే ప్రార్థనలను వినేవాడవు.”

3:39 – فَنَادَتْهُ الْمَلَائِكَةُ وَهُوَ قَائِمٌ يُصَلِّي فِي الْمِحْرَابِ أَنَّ اللَّـهَ يُبَشِّرُكَ بِيَحْيَىٰ مُصَدِّقًا بِكَلِمَةٍ مِّنَ اللَّـهِ وَسَيِّدًا وَحَصُورًا وَنَبِيًّا مِّنَ الصَّالِحِينَ ٣٩

  1. తరువాత అతను (‘జకరియ్యా) తన గదిలో నిలబడి నమా’జ్‌ చేస్తున్నప్పుడు దేవదూతలు: ”నిశ్చయంగా, అల్లాహ్‌ నీకు య’హ్యా యొక్క శుభవార్తను ఇస్తున్నాడు. అతను, అల్లాహ్‌ వాక్కును ధృవపరుస్తాడు. 25 అతను మంచి నాయకుడు మరియు మనోనిగ్రహం గల ప్రవక్త అయి సద్వర్తనులలో చేరిన వాడవుతాడు.” అని వినిపించారు.

3:40 – قَالَ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي غُلَامٌ وَقَدْ بَلَغَنِيَ الْكِبَرُ وَامْرَأَتِي عَاقِرٌ ۖ قَالَ كَذَٰلِكَ اللَّـهُ يَفْعَلُ مَا يَشَاءُ ٤٠

అతను (‘జకరియ్యా) ఇలా అన్నాడు: ”ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు, నాకు ముసలితనం వచ్చింది మరియు నా భార్య నేమో గొడ్రాలు!” ఆయన అన్నాడు: ”అలాగే జరుగుతుంది. అల్లాహ్‌ తాను కోరింది చేస్తాడు.” 26

3:41 – قَالَ رَبِّ اجْعَل لِّي آيَةً ۖ قَالَ آيَتُكَ أَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلَاثَةَ أَيَّامٍ إِلَّا رَمْزًا ۗ وَاذْكُر رَّبَّكَ كَثِيرًا وَسَبِّحْ بِالْعَشِيِّ وَالْإِبْكَارِ ٤١

అతను (‘జకరియ్యా) ఇలా మనవి చేసు కున్నాడు: ”ఓ నా ప్రభూ! నా కొరకు ఏదైనా సూచన నియమించు.” ఆయన జవాబిచ్చాడు: ”నీకు సూచన ఏమిటంటే, నీవు మూడురోజుల వరకు సైగలతో తప్ప ప్రజలతో మాట్లాడ లేవు. నీవు ఎక్కువగా నీ ప్రభువును స్మరించు. మరియు సాయంకాలమునందును మరియు ఉదయము నందును ఆయన పవిత్రతను కొనియాడు.”

3:42 – وَإِذْ قَالَتِ الْمَلَائِكَةُ يَا مَرْيَمُ إِنَّ اللَّـهَ اصْطَفَاكِ وَطَهَّرَكِ وَاصْطَفَاكِ عَلَىٰ نِسَاءِ الْعَالَمِينَ ٤٢

మరియు దేవదూతలు: ”ఓ మర్యమ్‌! నిశ్చయంగా, అల్లాహ్‌ నిన్నుఎన్నుకున్నాడు. మరియు నిన్ను పరిశుధ్ధపరిచాడు. మరియు (నీ కాలపు) సర్వలోకాలలోని స్త్రీలలో నిన్నుఎన్ను కున్నాడు.” అని అన్న విషయం (జ్ఞాపకం చేసుకోండి).

3:43 – يَا مَرْيَمُ اقْنُتِي لِرَبِّكِ وَاسْجُدِي وَارْكَعِي مَعَ الرَّاكِعِينَ ٤٣

(వారింకా ఇలా అన్నారు): ”ఓ మర్యమ్‌! నీవు నీ ప్రభువుకు విధేయురాలుగా ఉండు. (ఆయన సాన్నిధ్యంలో) సాష్టాంగం (సజ్దా) చెయ్యి. మరియు వంగే (రుకూ’ఉ చేసే) 27 వారితోకలిసి వంగు (రుకూ’ఉ చెయ్యి).”

3:44 – ذَٰلِكَ مِنْ أَنبَاءِ الْغَيْبِ نُوحِيهِ إِلَيْكَ ۚ وَمَا كُنتَ لَدَيْهِمْ إِذْ يُلْقُونَ أَقْلَامَهُمْ أَيُّهُمْ يَكْفُلُ مَرْيَمَ وَمَا كُنتَ لَدَيْهِمْ إِذْ يَخْتَصِمُونَ ٤٤

(ఓ ప్రవక్తా!) ఇవన్నీ అగోచరమైన వార్తలు. వాటిని మేము నీకు దివ్యజ్ఞానం (వ’హీ) ద్వారా తెలుపుతున్నాము. మర్యమ్‌ సంరక్షకుడు ఎవరు కావాలని, వారు (ఆలయ సేవకులు) తమ కలములను విసిరినపుడు, నీవు వారిదగ్గర లేవు మరియు వారు వాదించుకున్నప్పుడు కూడా నీవు వారి దగ్గర లేవు. 28

3:45 – إِذْ قَالَتِ الْمَلَائِكَةُ يَا مَرْيَمُ إِنَّ اللَّـهَ يُبَشِّرُكِ بِكَلِمَةٍ مِّنْهُ اسْمُهُ الْمَسِيحُ عِيسَى ابْنُ مَرْيَمَ وَجِيهًا فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمِنَ الْمُقَرَّبِينَ ٤٥

దేవదూతలు ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): ”ఓ మర్యమ్‌! నిశ్చయంగా, అల్లాహ్‌! నీకు తన వాక్కును గురించి శుభవార్తను ఇస్తున్నాడు. 29 అతని పేరు: ”మసీ’హ్‌ ‘ఈసా ఇబ్నె మర్యమ్‌.’ అతను ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ గౌరవనీయుడైనవాడై మరియు (అల్లాహ్‌) సామీప్యం పొందిన వారిలో ఒకడై ఉంటాడు.

3:46 – وَيُكَلِّمُ النَّاسَ فِي الْمَهْدِ وَكَهْلًا وَمِنَ الصَّالِحِينَ ٤٦

”మరియు అతను ప్రజలతో ఉయ్యాలలో ఉండగానే మాట్లాడుతాడు మరియు పెద్దవాడైన తరువాత కూడా (మాట్లాడుతాడు) మరియు సత్పురుషులలో ఒకడై ఉంటాడు.” 30

3:47 – قَالَتْ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي وَلَدٌ وَلَمْ يَمْسَسْنِي بَشَرٌ ۖ قَالَ كَذَٰلِكِ اللَّـهُ يَخْلُقُ مَا يَشَاءُ ۚ إِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ ٤٧

ఆమె (మర్యమ్‌) ఇలా అన్నది: ”ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? ఏ పురుషుడు కూడా నన్ను ముట్టలేదే?” ఇలా సమాధానమిచ్చాడు: ”అల్లాహ్ తాను కోరింది ఇదే విధంగా సృష్టిస్తాడు. ఆయన ఒక పని చేయాలని నిర్ణయించినపుడు కేవలం దానిని: ‘అయిపో!’ అని అంటాడు, అంతే అది అయిపోతుంది.”

3:48 – وَيُعَلِّمُهُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَالتَّوْرَاةَ وَالْإِنجِيلَ ٤٨

మరియు ఆయన (అల్లాహ్‌) అతనికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని మరియు తౌరాతు ను మరియు ఇంజీలును నేర్పుతాడు.

3:49 – وَرَسُولًا إِلَىٰ بَنِي إِسْرَائِيلَ أَنِّي قَدْ جِئْتُكُم بِآيَةٍ مِّن رَّبِّكُمْ ۖ أَنِّي أَخْلُقُ لَكُم مِّنَ الطِّينِ كَهَيْئَةِ الطَّيْرِ فَأَنفُخُ فِيهِ فَيَكُونُ طَيْرًا بِإِذْنِ اللَّـهِ ۖ وَأُبْرِئُ الْأَكْمَهَ وَالْأَبْرَصَ وَأُحْيِي الْمَوْتَىٰ بِإِذْنِ اللَّـهِ ۖ وَأُنَبِّئُكُم بِمَا تَأْكُلُونَ وَمَا تَدَّخِرُونَ فِي بُيُوتِكُمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ ٤٩

మరియు అతనిని ఇస్రాయీ’ల్‌ సంతతి వారి వైపుకు సందేశహరునిగా పంపుతాడు. (అతను ఇలా అంటాడు): ”నిశ్చయంగా, నేను మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు సూచన (ఆయత్‌) తీసుకొనివచ్చాను. నిశ్చయంగా, నేను మీ కొరకు మట్టితో పక్షిఆకారంలో ఒక బొమ్మను తయారుచేసి దానిలో శ్వాసను ఊదుతాను! అప్పుడది అల్లాహ్‌ ఆజ్ఞతో పక్షి అవుతుంది. మరియు నేను అల్లాహ్‌ ఆజ్ఞతో పుట్టుగ్రుడ్డిని, 31 కుష్ఠురోగిని బాగుచేస్తాను మరియు మృతుణ్ణి బ్రతికిస్తాను. మరియు మీరు తినేది, ఇండ్లలో కూడబెట్టేది మీకు తెలుపుతాను. మీరు విశ్వాసులే అయితే! నిశ్చయంగా, ఇందులో మీకు ఒక గొప్ప సూచన (ఆయత్‌) ఉంది.

3:50 – وَمُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيَّ مِنَ التَّوْرَاةِ وَلِأُحِلَّ لَكُم بَعْضَ الَّذِي حُرِّمَ عَلَيْكُمْ ۚ وَجِئْتُكُم بِآيَةٍ مِّن رَّبِّكُمْ فَاتَّقُوا اللَّـهَ وَأَطِيعُونِ ٥٠

”మరియు నేను, ప్రస్తుతం తౌరాత్‌లో (మిగిలి ఉన్న సత్యాన్ని) ధృవపరచటానికి మరియు పూర్వం మీకు నిషేధింపబడిన (‘హరామ్‌ చేయబడిన) కొన్ని వస్తువులను ధర్మసమ్మతం (హలాల్‌) చేయటానికి (వచ్చాను) 32 మరియు నేను మీ ప్రభువు తరఫునుండి మీ వద్దకు అద్భుత సూచనలు (ఆయాత్‌) తీసుకొని వచ్చాను, కావున మీరు అల్లాహ్ యందు భయ-భక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి!

3:51 – إِنَّ اللَّـهَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۗ هَـٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ ٥١

”నిశ్చయంగా, అల్లాహ్ నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను, కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గము.” (3/4)

3:52 – فَلَمَّا أَحَسَّ عِيسَىٰ مِنْهُمُ الْكُفْرَ قَالَ مَنْ أَنصَارِي إِلَى اللَّـهِ ۖ قَالَ الْحَوَارِيُّونَ نَحْنُ أَنصَارُ اللَّـهِ آمَنَّا بِاللَّـهِ وَاشْهَدْ بِأَنَّا مُسْلِمُونَ ٥٢

  • ‘ఈసా వారిలో సత్య-తిరస్కారాన్ని కను గొని ఇలా ప్రశ్నించాడు: ”అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు?” (అప్పు డతని) శిష్యులు 33 ఇలా జవాబిచ్చారు: ”మేము నీకు అల్లాహ్ మార్గంలో సహాయకులముగా ఉంటాము. మేము అల్లాహ్‌ను విశ్వసించాము మరియు మేము అల్లాకు విధేయులము (ముస్లిం లము) అయ్యామని, నీవు మాకు సాక్షిగా ఉండు.

3:53 – رَبَّنَا آمَنَّا بِمَا أَنزَلْتَ وَاتَّبَعْنَا الرَّسُولَ فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ ٥٣

”ఓ మా ప్రభూ! నీవు అవతరింపజేసిన సందేశాన్ని మేము విశ్వసించాము మరియు మేము ఈ సందేశహరుణ్ణి అనుసరించాము. కావున మమ్మల్ని సాక్షులలో వ్రాసుకో!”

3:54 – وَمَكَرُوا وَمَكَرَ اللَّـهُ ۖ وَاللَّـهُ خَيْرُ الْمَاكِرِينَ ٥٤

మరియు వారు (ఇస్రాయీ’ల్‌ సంతతిలోని అవిశ్వాసులు, ఈసాకు విరుద్ధంగా) కుట్రలు చేశారు. మరియు అల్లాహ్ (వారి కుట్రలకు విరుధ్ధంగా) పన్నాగాలు పన్నాడు. ఎత్తులు వేయటంలో అల్లాహ్ అత్యుత్తముడు!

3:55 – إِذْ قَالَ اللَّـهُ يَا عِيسَىٰ إِنِّي مُتَوَفِّيكَ وَرَافِعُكَ إِلَيَّ وَمُطَهِّرُكَ مِنَ الَّذِينَ كَفَرُوا وَجَاعِلُ الَّذِينَ اتَّبَعُوكَ فَوْقَ الَّذِينَ كَفَرُوا إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۖ ثُمَّ إِلَيَّ مَرْجِعُكُمْ فَأَحْكُمُ بَيْنَكُمْ فِيمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ ٥٥

(జ్ఞాపకం చేసుకోండి) అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: ”ఓ ‘ఈసా! నేను నిన్ను తీసు కుంటాను మరియు నిన్ను నా వైపునకు ఎత్తు కుంటాను మరియు సత్య-తిరస్కారుల నుండి నిన్ను శుధ్ధపరుస్తాను మరియు నిన్ను అనుస రించిన వారిని, పునరుత్థానదినం వరకు సత్య- తిరస్కారులకు పైచేయిగా ఉండేటట్లు చేస్తాను. 34 చివరకు మీరంతా నా వద్దకే మరలి రావలసి ఉంది. అప్పుడు నేను మీ మధ్య తలెత్తిన విభేదాలను గురించి తీర్పుచేస్తాను.

3:56 – فَأَمَّا الَّذِينَ كَفَرُوا فَأُعَذِّبُهُمْ عَذَابًا شَدِيدًا فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ ٥٦

”ఇక సత్య-తిరస్కారులకు ఇహలోకంలో మరియు పరలోకంలోనూ కఠినమైన శిక్ష విధిస్తాను. మరియు వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు.”

3:57 – وَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ ۗ وَاللَّـهُ لَا يُحِبُّ الظَّالِمِينَ ٥٧

మరియు విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి (అల్లాహ్‌) పరిపూర్ణ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ దుర్మార్గులు అంటే ఇష్టపడడు.

3:58 – ذَٰلِكَ نَتْلُوهُ عَلَيْكَ مِنَ الْآيَاتِ وَالذِّكْرِ الْحَكِيمِ ٥٨

(ఓ ము’హమ్మద్‌!) మేము నీకు ఈ సూచన (ఆయాత్‌)లను వినిపిస్తున్నాము. మరియు ఇవి వివేకంతో నిండిన ఉపదేశాలు.

3:59 – إِنَّ مَثَلَ عِيسَىٰ عِندَ اللَّـهِ كَمَثَلِ آدَمَ ۖ خَلَقَهُ مِن تُرَابٍ ثُمَّ قَالَ لَهُ كُن فَيَكُونُ ٥٩

నిశ్చయంగా, అల్లాహ్ దృష్టిలో ‘ఈసా ఉపమానం, ఆదమ్‌ ఉపమానం వంటిదే. ఆయన (ఆదమ్‌ను) మట్టితో సృజించి: ”అయిపో!” అని అన్నాడు. అంతే అతను అయిపోయాడు. 35

3:60 – الْحَقُّ مِن رَّبِّكَ فَلَا تَكُن مِّنَ الْمُمْتَرِينَ ٦٠

ఈ సత్యం నీ ప్రభువు తరఫు నుండి వచ్చింది, కావున నీవు శంకించేవారిలో చేరిన వాడవు కావద్దు.

3:61 – فَمَنْ حَاجَّكَ فِيهِ مِن بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ فَقُلْ تَعَالَوْا نَدْعُ أَبْنَاءَنَا وَأَبْنَاءَكُمْ وَنِسَاءَنَا وَنِسَاءَكُمْ وَأَنفُسَنَا وَأَنفُسَكُمْ ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَل لَّعْنَتَ اللَّـهِ عَلَى الْكَاذِبِينَ ٦١

ఈ జ్ఞానం నీకు అందిన తర్వాత కూడా ఎవడైనా నీతో అతనిని (‘ఈసాను) గురించి వివాదానికి దిగితే, ఇలా అను: ”రండి! మేము మరియు మీరు కలిసి, మా కుమారులను మరియు మీ కుమారులను; మా స్త్రీలను మరియు మీ స్త్రీలను పిలుచుకొని, అందరమూ కలిసి: ‘అసత్యం పలికే వారిపై అల్లాహ్ శాపం (బహిష్కారం) పడుగాక!’ అని హృదయ పూర్వకంగా ప్ర్రార్థిద్దాము.” 36

3:62 – إِنَّ هَـٰذَا لَهُوَ الْقَصَصُ الْحَقُّ ۚ وَمَا مِنْ إِلَـٰهٍ إِلَّا اللَّـهُ ۚ وَإِنَّ اللَّـهَ لَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ٦٢

నిశ్చయంగా ఇదే (‘ఈసానుగురించిన) సత్య గాథ.మరియు అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

3:63 – فَإِن تَوَلَّوْا فَإِنَّ اللَّـهَ عَلِيمٌ بِالْمُفْسِدِينَ ٦٣

ఒకవేళ వారు వెనుదిరిగితే! నిశ్చయంగా, అల్లాహ్‌కు కల్లోలం రేకెత్తించే వారిని గురించి బాగా తెలుసు.

3:64 – قُلْ يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْا إِلَىٰ كَلِمَةٍ سَوَاءٍ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا نَعْبُدَ إِلَّا اللَّـهَ وَلَا نُشْرِكَ بِهِ شَيْئًا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًا مِّن دُونِ اللَّـهِ ۚ فَإِن تَوَلَّوْا فَقُولُوا اشْهَدُوا بِأَنَّا مُسْلِمُونَ ٦٤

ఇలా అను: ”ఓ గ్రంథ ప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ధర్మ విషయం (ఉత్తరువు) వైపునకు రండి, అది ఏమిటంటే: ‘మనం అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములను ఎవ్వరినీ నిలబెట్టకూడదు మరియు అల్లాహ్ తప్ప, మన వారిలోనుండి ఎవ్వరినీ ప్రభువులుగా చేసుకోరాదు.” 37 వారు (సమ్మతించక) తిరిగిపోతే: ”మేము నిశ్చయంగా అల్లాహ్‌కు విధేయులము (ముస్లింలము), దీనికి మీరు సాక్షులుగా ఉండండి.” అని పలుకు. 38

3:65 – يَا أَهْلَ الْكِتَابِ لِمَ تُحَاجُّونَ فِي إِبْرَاهِيمَ وَمَا أُنزِلَتِ التَّوْرَاةُ وَالْإِنجِيلُ إِلَّا مِن بَعْدِهِ ۚ أَفَلَا تَعْقِلُونَ ٦٥

ఓ గ్రంథ ప్రజలారా! ఇబ్రాహీమ్‌ (ధర్మాన్ని) గురించి మీరు ఎందుకు వాదులాడుతున్నారు? తౌరాతు మరియు ఇంజీల్‌లు అతని తరువాతనే అవతరించాయి కదా! ఇది మీరు అర్థం చేసుకోలేరా?

3:66 – هَا أَنتُمْ هَـٰؤُلَاءِ حَاجَجْتُمْ فِيمَا لَكُم بِهِ عِلْمٌ فَلِمَ تُحَاجُّونَ فِيمَا لَيْسَ لَكُم بِهِ عِلْمٌ ۚ وَاللَّـهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ ٦٦

అవును, మీరే వారు! తెలిసివున్న విషయాలను గురించి వాదులాడిన వారు. అయితే మీకేమీ తెలియని విషయాలను గురించి ఎందుకు వాదులాడుతున్నారు? మరియు అల్లాహ్‌కు అంతా తెలుసు, కానీ మీకు ఏమీ తెలియదు.

3:67 – مَا كَانَ إِبْرَاهِيمُ يَهُودِيًّا وَلَا نَصْرَانِيًّا وَلَـٰكِن كَانَ حَنِيفًا مُّسْلِمًا وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ ٦٧

ఇబ్రాహీమ్‌ యూదుడూ కాడు మరియు క్రైస్తవుడూ కాడు! కాని అతను ఏకదైవ సిధ్ధాంతంపై ఉన్నవాడు (‘హనీఫ్‌), అల్లాహ్‌కు విధేయుడు (ముస్లిం) మరియు అతడు ఏ మాత్రం (అల్లాహ్‌ కు) సాటి కల్పించేవాడు (ముష్రిక్‌) కాడు. 39

3:68 – إِنَّ أَوْلَى النَّاسِ بِإِبْرَاهِيمَ لَلَّذِينَ اتَّبَعُوهُ وَهَـٰذَا النَّبِيُّ وَالَّذِينَ آمَنُوا ۗ وَاللَّـهُ وَلِيُّ الْمُؤْمِنِينَ ٦٨

నిశ్చయంగా, ఇబ్రాహీమ్‌తో దగ్గరి సంబంధం గలవారంటే, అతనిని అనుసరించేవారు మరియు ఈ ప్రవక్త (ము’హమ్మద్‌) మరియు (ఇతనిని) విశ్వసించిన వారు. మరియు అల్లాహ్‌యే విశ్వాసుల సంరక్షకుడు. 40

3:69 – وَدَّت طَّائِفَةٌ مِّنْ أَهْلِ الْكِتَابِ لَوْ يُضِلُّونَكُمْ وَمَا يُضِلُّونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ ٦٩

గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు, మిమ్మల్ని మార్గభ్రష్టులు చేయాలని కోరు తున్నారు. కాని వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మార్గభ్రష్టులు చేయటం లేదు, కాని వారది గ్రహించటం లేదు.

3:70 – يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَكْفُرُونَ بِآيَاتِ اللَّـهِ وَأَنتُمْ تَشْهَدُونَ ٧٠

”ఓ గ్రంథప్రజలారా! మీరు అల్లాహ్ సూచన (ఆయాత్‌)లను ఎందుకు తిరస్కరిస్తున్నారు? మరియు వాటికి మీరే సాక్షులుగా ఉన్నారు కదా!”

3:71 – يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَلْبِسُونَ الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُونَ الْحَقَّ وَأَنتُمْ تَعْلَمُونَ ٧١

”ఓ గ్రంథ ప్రజలారా! తెలిసిఉండి కూడా మీరు సత్యాన్ని అసత్యంతో ఎందుకు కప్పిపుచ్చు తున్నారు? మరియు మీకు తెలిసిఉండి కూడా సత్యాన్ని ఎందుకు దాస్తున్నారు?” 41

3:72 – وَقَالَت طَّائِفَةٌ مِّنْ أَهْلِ الْكِتَابِ آمِنُوا بِالَّذِي أُنزِلَ عَلَى الَّذِينَ آمَنُوا وَجْهَ النَّهَارِ وَاكْفُرُوا آخِرَهُ لَعَلَّهُمْ يَرْجِعُونَ ٧٢

మరియు గ్రంథ ప్రజలలోని కొందరు (పర స్పరం ఇలా చెప్పుకుంటారు):”(ఈప్రవక్తను) విశ్వ సించినవారి (ముస్లింల) పై అవతరింపజేయబడిన దానిని ఉదయం విశ్వసించండి మరియు సాయంత్రం తిరస్కరించండి. (ఇలా చేస్తే) బహుశా, వారు కూడా (తమ విశ్వాసం నుండి) తిరిగి పోతారేమో!”

3:73 – وَلَا تُؤْمِنُوا إِلَّا لِمَن تَبِعَ دِينَكُمْ قُلْ إِنَّ الْهُدَىٰ هُدَى اللَّـهِ أَن يُؤْتَىٰ أَحَدٌ مِّثْلَ مَا أُوتِيتُمْ أَوْ يُحَاجُّوكُمْ عِندَ رَبِّكُمْ ۗ قُلْ إِنَّ الْفَضْلَ بِيَدِ اللَّـهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۗ وَاللَّـهُ وَاسِعٌ عَلِيمٌ ٧٣

మరియు (పరస్పరం ఇలా చెప్పు కుంటారు): ”మీ ధర్మాన్ని అనుసరించేవారిని తప్ప మరెవ్వరినీ నమ్మకండి.” (ఓ ప్రవక్తా!) నీవు వారితో అను: ”నిశ్చయంగా, అల్లాహ్ మార్గ దర్శకత్వమే సరైన మార్గదర్శకత్వం.” (వారు ఇంకా ఇలా అంటారు): ”మీకు ఇవ్వబడి నటువంటిది ఇంకెవరికైనా ఇవ్వబడుతుందని, లేక వారు మీ ప్రభువు సమక్షంలో మీతో వాదిస్తారని, (నమ్మకండి).” వారితో అను: ”నిశ్చయంగా, అనుగ్రహం అల్లాహ్ చేతిలోనే ఉంది; ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ విస్తారుడు, సర్వజ్ఞుడు.” 42

3:74 – يَخْتَصُّ بِرَحْمَتِهِ مَن يَشَاءُ ۗ وَاللَّـهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ ٧٤

ఆయన తాను కోరిన వారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు. మరియు అల్లాహ్ దాతృత్వంలో సర్వోత్తముడు. (7/8)

3:75 – وَمِنْ أَهْلِ الْكِتَابِ مَنْ إِن تَأْمَنْهُ بِقِنطَارٍ يُؤَدِّهِ إِلَيْكَ وَمِنْهُم مَّنْ إِن تَأْمَنْهُ بِدِينَارٍ لَّا يُؤَدِّهِ إِلَيْكَ إِلَّا مَا دُمْتَ عَلَيْهِ قَائِمًا ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لَيْسَ عَلَيْنَا فِي الْأُمِّيِّينَ سَبِيلٌ وَيَقُولُونَ عَلَى اللَّـهِ الْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ ٧٥

  • మరియు గ్రంథప్రజలలో ఎలాంటి వాడున్నాడంటే: నీవు అతనికి ధనరాసులు ఇచ్చినా అతడు వాటిని నమ్మకంగా నీకు తిరిగి అప్పగిస్తాడు. మరొకడు వారిలో ఎలాంటి వాడంటే: నీవతన్ని నమ్మి ఒక్కదీనారు ఇచ్చినా అతడు దానిని – నీవతని వెంటబడితేనే కానీ – నీకు తిరిగి ఇవ్వడు. ఇలాంటి వారు ఏమంటారంటే: ”నిరక్షరాస్యుల (యూదులు కానివారి) పట్ల ఎలా వ్యవహరించినా మాపై ఎలాంటి దోషంలేదు.” మరియు వారు తెలిసి ఉండి కూడా అల్లాహ్‌ను గురించి అబద్ధాలాడుతున్నారు. 43

3:76 – بَلَىٰ مَنْ أَوْفَىٰ بِعَهْدِهِ وَاتَّقَىٰ فَإِنَّ اللَّـهَ يُحِبُّ الْمُتَّقِينَ ٧٦

వాస్తవానికి, ఎవడు తన ఒప్పందాన్ని పూర్తి చేసి దైవభీతి కలిగి ఉంటాడో; అలాంటి దైవభీతి గలవారిని నిశ్చయంగా, అల్లాహ్ ప్రేమిస్తాడు.

3:77 – إِنَّ الَّذِينَ يَشْتَرُونَ بِعَهْدِ اللَّـهِ وَأَيْمَانِهِمْ ثَمَنًا قَلِيلًا أُولَـٰئِكَ لَا خَلَاقَ لَهُمْ فِي الْآخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ اللَّـهُ وَلَا يَنظُرُ إِلَيْهِمْ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ٧٧

నిశ్చయంగా, ఎవరైతే తాము అల్లాహ్ తో చేసిన ఒప్పందాన్ని మరియు తమ ప్రమాణాలను స్వల్పలాభాలకు అమ్ముకుంటారో, అలాంటి వారికి పరలోక జీవితంలో ఎలాంటి భాగం ఉండదు మరియు పునరుత్థాన దినమున అల్లాహ్ వారితో మాట్లాడడు మరియు వారివైపు కూడా చూడడు మరియు వారిని పరిశుద్ధులుగాచేయడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

3:78 – وَإِنَّ مِنْهُمْ لَفَرِيقًا يَلْوُونَ أَلْسِنَتَهُم بِالْكِتَابِ لِتَحْسَبُوهُ مِنَ الْكِتَابِ وَمَا هُوَ مِنَ الْكِتَابِ وَيَقُولُونَ هُوَ مِنْ عِندِ اللَّـهِ وَمَا هُوَ مِنْ عِندِ اللَّـهِ وَيَقُولُونَ عَلَى اللَّـهِ الْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ ٧٨

మరియు మీరు అది గ్రంథంలోనిదని భావించాలని, వాస్తవానికి వారిలో కొందరు తమ నాలుకలను త్రిప్పి గ్రంథాన్ని చదువుతారు, కాని (నిజానికి) అది గ్రంథంలోనిది కాదు; మరియు వారు: ”అది అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది.” అని అంటారు, కాని అది (నిజానికి) అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది కాదు మరియు వారు తెలిసి కూడా అల్లాహ్‌పై అబద్ధాలు పలుకుతున్నారు.

3:79 – مَا كَانَ لِبَشَرٍ أَن يُؤْتِيَهُ اللَّـهُ الْكِتَابَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ثُمَّ يَقُولَ لِلنَّاسِ كُونُوا عِبَادًا لِّي مِن دُونِ اللَّـهِ وَلَـٰكِن كُونُوا رَبَّانِيِّينَ بِمَا كُنتُمْ تُعَلِّمُونَ الْكِتَابَ وَبِمَا كُنتُمْ تَدْرُسُونَ ٧٩

ఏ మానవునికైనా అల్లాహ్ అతనికి గ్రంథాన్ని, వివేకాన్ని మరియు ప్రవక్తపదవిని ప్రసాదించిన తర్వాత అతడు ప్రజలతో: ”మీరు అల్లాహ్‌కు బదులుగా నన్ను ప్రార్థించండి.” అని అనటం తగినది కాదు, 44 కాని వారితో: ”మీరు ఇతరులకు బోధించే మరియు మీరు చదివే గ్రంథాల అనుసారంగా ధర్మవేత్తలు (రబ్బా- నియ్యూన్‌) కండి.” అని అనటం (భావింపదగినది);

3:80 – وَلَا يَأْمُرَكُمْ أَن تَتَّخِذُوا الْمَلَائِكَةَ وَالنَّبِيِّينَ أَرْبَابًا ۗ أَيَأْمُرُكُم بِالْكُفْرِ بَعْدَ إِذْ أَنتُم مُّسْلِمُونَ ٨٠

మరియు మీరు దేవదూతలనో, లేదా ప్రవక్తలనో ప్రభువులుగా చేసుకోండని అతను మిమ్మల్ని ఎన్నడూ ఆజ్ఞాపించడు. అయితే! అలాంటప్పుడు మీరు అల్లాహ్‌కు విధేయులు (ముస్లింలు) అయిన తరువాత మిమ్మల్ని సత్య-తిరస్కారులు కమ్మని ఆదేశించగలడా? 45

3:81 – وَإِذْ أَخَذَ اللَّـهُ مِيثَاقَ النَّبِيِّينَ لَمَا آتَيْتُكُم مِّن كِتَابٍ وَحِكْمَةٍ ثُمَّ جَاءَكُمْ رَسُولٌ مُّصَدِّقٌ لِّمَا مَعَكُمْ لَتُؤْمِنُنَّ بِهِ وَلَتَنصُرُنَّهُ ۚ قَالَ أَأَقْرَرْتُمْ وَأَخَذْتُمْ عَلَىٰ ذَٰلِكُمْ إِصْرِي ۖ قَالُوا أَقْرَرْنَا ۚ قَالَ فَاشْهَدُوا وَأَنَا مَعَكُم مِّنَ الشَّاهِدِينَ ٨١

మరియు అల్లాహ్ ప్రవక్తల నుండి తీసు కున్న గట్టి ప్రమాణాన్ని 46 (జ్ఞాపకం చేసుకోండి): ”నేను మీకు ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించిన తరువాత, ఒక సందేశహరుడు (ము’హమ్మద్‌) వచ్చి (మీ గ్రంథాలలో నుండి మిగిలివున్న) సత్యాన్ని ధృవపరిస్తే, మీరు అతని (ధర్మాన్ని) విశ్వసించి, అతనికి సహాయం చేయవలసి ఉంటుంది.” అని చెప్పి ఇలా ప్రశ్నించాడు: ”ఏమి? మీరు దీనికి అంగీకరిస్తారా? మరియు నా ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తారా?” వారన్నారు: ”మేము అంగీకరిస్తాము.” అప్పుడు ఆయన అన్నాడు: ”అయితే, మీరు దీనికి సాక్షులుగా ఉండండి. మరియు నేను కూడా మీతోపాటు సాక్షిగా ఉంటాను.

3:82 – فَمَن تَوَلَّىٰ بَعْدَ ذَٰلِكَ فَأُولَـٰئِكَ هُمُ الْفَاسِقُونَ ٨٢

”ఇకపై ఎవరు తమ వాగ్దానం నుండి మరలుతారో, వారే దుష్టులు (ఫాసిఖూన్‌).”

3:83 – أَفَغَيْرَ دِينِ اللَّـهِ يَبْغُونَ وَلَهُ أَسْلَمَ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَإِلَيْهِ يُرْجَعُونَ ٨٣

ఏమీ? వీరు అల్లాహ్ ధర్మం కాక వేరే ధర్మాన్ని అవలంబించగోరుతున్నారా? మరియు భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఇష్టం ఉన్నా, ఇష్టం లేకున్నా ఆయనకే విధేయులై (ముస్లింలై) ఉన్నాయి! మరియు ఆయన వైపునకే అందరూ మరలింపబడతారు. 47

3:84 – قُلْ آمَنَّا بِاللَّـهِ وَمَا أُنزِلَ عَلَيْنَا وَمَا أُنزِلَ عَلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَالنَّبِيُّونَ مِن رَّبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّنْهُمْ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ ٨٤

(ఓ ప్రవక్తా!) ఇలా అను: ”మేము అల్లాహ్‌ను విశ్వసించాము; మరియు మాపై అవతరింపజేయ బడినదానిని మరియు ఇబ్రాహీమ్‌, ఇస్మా’యీల్‌, ఇస్‌’హాఖ్‌, య’అఖూబ్‌లపై మరియు అతని సంతానంపై అవతరింపజేయబడినవాటిని కూడా (విశ్వసించాము). ఇంకా మూసా, ‘ఈసా మరియు ఇతర ప్రవక్తలపై వారి ప్రభువు తరఫునుండి (అవత రింపజేయబడిన వాటిని కూడా విశ్వసించాము). మేము వారి మధ్య ఎలాంటి విచక్షణచేయము. మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము.”

3:85 – وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ ٨٥

మరియు ఎవడైనా అల్లాహ్‌కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడే వారిలో చేరుతాడు 48

3:86 – كَيْفَ يَهْدِي اللَّـهُ قَوْمًا كَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ وَشَهِدُوا أَنَّ الرَّسُولَ حَقٌّ وَجَاءَهُمُ الْبَيِّنَاتُ ۚ وَاللَّـهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ ٨٦

అల్లాహ్ వారికి ఎలా సన్మార్గం చూప గలడు? ఏ జాతివారైతే, విశ్వాసం పొందిన తరువాత – మరియు నిశ్చయంగా, సందేశ హరుడు సత్యవంతుడే, అని సాక్ష్యమిచ్చిన తరువాత మరియు వారివద్దకు స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కూడా – సత్య-తిరస్కారం అవలంబించారో! మరియు అల్లాహ్ దుర్మార్గులైన వారికి సన్మార్గం చూపడు. అల్లాహ్ దుర్మార్గులైన వారికి సన్మార్గం చూపడు.

3:87 – أُولَـٰئِكَ جَزَاؤُهُمْ أَنَّ عَلَيْهِمْ لَعْنَةَ اللَّـهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ ٨٧

అలాంటి వారి శిక్ష, నిశ్చయంగా, అల్లాహ్ మరియు దేవదూతల మరియు సర్వమానవుల శాపం వారిపై పడటమే!

3:88 – خَالِدِينَ فِيهَا لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ ٨٨

అందులో (నరకంలో) వారు శాశ్వతంగా ఉంటారు. వారి శిక్ష ఏమాత్రం తగ్గించబడదు మరియు వారికి వ్యవధి కూడా ఇవ్వబడదు.

3:89 – إِلَّا الَّذِينَ تَابُوا مِن بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوا فَإِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ٨٩

కానీ, ఇక మీదట ఎవరైతే పశ్చాత్తాపపడి, తమ నడవడికను సరిదిద్దుకుంటారో! అలాంటి వారి యెడల నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. 49

3:90 – إِنَّ الَّذِينَ كَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ ثُمَّ ازْدَادُوا كُفْرًا لَّن تُقْبَلَ تَوْبَتُهُمْ وَأُولَـٰئِكَ هُمُ الضَّالُّونَ ٩٠

(అయితే) నిశ్చయంగా, విశ్వసించిన తరువాత ఎవరు సత్య-తిరస్కారవైఖరిని అవలం బిస్తారో మరియు తమ సత్య-తిరస్కార వైఖరిని పెంచుకుంటారో, వారి పశ్చాత్తాపం ఏ మాత్రం అంగీకరించబడదు మరియు అలాంటివారే మార్గభ్రష్టులైన వారు 50

3:91 – إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارٌ فَلَن يُقْبَلَ مِنْ أَحَدِهِم مِّلْءُ الْأَرْضِ ذَهَبًا وَلَوِ افْتَدَىٰ بِهِ ۗ أُولَـٰئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ ٩١

నిశ్చయంగా, ఎవరైతే సత్య-తిరస్కారులై, ఆ సత్య-తిరస్కార స్థితిలోనే మృతిచెందుతారో! వారు భూగోళమంత బంగారం పాపపరిహారంగా ఇవ్వదలచినా అది అంగీకరించబడదు. అలాంటి వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. మరియు వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు. 51

3:92 – لَن تَنَالُوا الْبِرَّ حَتَّىٰ تُنفِقُوا مِمَّا تُحِبُّونَ ۚ وَمَا تُنفِقُوا مِن شَيْءٍ فَإِنَّ اللَّـهَ بِهِ عَلِيمٌ ٩٢

[*] మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు (అల్లాహ్‌ మార్గంలో) ఖర్చుపెట్టనంత వరకు మీరు పుణ్యాత్ములు (ధర్మనిష్ఠాపరులు) కాలేరు. 52 మరియు మీరు ఏమి ఖర్చుపెట్టినా అది అల్లాహ్ కు తప్పక తెలుస్తుంది.

3:93 – لُّ الطَّعَامِ كَانَ حِلًّا لِّبَنِي إِسْرَائِيلَ إِلَّا مَا حَرَّمَ إِسْرَائِيلُ عَلَىٰ نَفْسِهِ مِن قَبْلِ أَن تُنَزَّلَ التَّوْرَاةُ ۗ قُلْ فَأْتُوا بِالتَّوْرَاةِ فَاتْلُوهَا إِن كُنتُمْ صَادِقِينَ ٩٣

(*) ఆహార పదార్థాలన్నీ ఇస్రాయీ’ల్‌ సంతతి వారికి ధర్మసమ్మతమైనవిగానే ఉండేవి. కాని, తౌరాత్‌ అవతరణకు పూర్వం ఇస్రాయీ’ల్‌ (య’అఖూబ్‌) తనకు తాను కొన్నివస్తువులను నిషేధించుకున్నాడు. వారితో ఇట్లను: ”మీరు సత్యవంతులే అయితే, తౌరాత్‌ను తీసుకొనిరండి మరియు దానిని చదవండి.” 53

3:94 – فَمَنِ افْتَرَىٰ عَلَى اللَّـهِ الْكَذِبَ مِن بَعْدِ ذَٰلِكَ فَأُولَـٰئِكَ هُمُ الظَّالِمُونَ ٩٤

కావున దీని తర్వాత కూడా ఎవడైనా అబద్ధాన్ని కల్పించి దానిని అల్లాహ్‌కు ఆపాదిస్తే, అలాంటి వారు, వారే దుర్మార్గులు.

3:95 – قُلْ صَدَقَ اللَّـهُ ۗ فَاتَّبِعُوا مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ ٩٥

ఇలా అను: ”అల్లాహ్ సత్యం పలికాడు. కనుక మీరు ఏకదైవ సిద్ధాంతం (సత్య-ధర్మం) అయిన ఇబ్రాహీమ్‌ ధర్మాన్నే అనుసరించండి. మరియు అతను అల్లాహ్‌కు సాటి కల్పించేవాడు (ముష్రిక్‌) కాడు.”

3:96 – إِنَّ أَوَّلَ بَيْتٍ وُضِعَ لِلنَّاسِ لَلَّذِي بِبَكَّةَ مُبَارَكًا وَهُدًى لِّلْعَالَمِينَ ٩٦

నిశ్చయంగా, మానవ జాతి కొరకు మొట్ట మొదట నియమించబడిన (ఆరాధనా) గృహం బక్కహ్ (మక్కహ్)లో ఉన్నదే, శుభాలతో నిండినది సమస్తలోకాల ప్రజలకు మార్గదర్శ కత్వాన్ని ప్రసాదించేది. 54

3:97 – فِيهِ آيَاتٌ بَيِّنَاتٌ مَّقَامُ إِبْرَاهِيمَ ۖ وَمَن دَخَلَهُ كَانَ آمِنًا ۗ وَلِلَّـهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا ۚ وَمَن كَفَرَ فَإِنَّ اللَّـهَ غَنِيٌّ عَنِ الْعَالَمِينَ ٩٧

అందులో స్పష్టమైన సంకేతాలున్నాయి. ఇబ్రాహీమ్‌ నిలిచిన స్థలం ఉంది. మరియు దానిలో ప్రవేశించినవాడు అభయం (రక్షణ) పొందుతాడు 55 మరియు అక్కడికి పోవటానికి, శక్తిగలవారికి ఆ గృహయాత్ర (‘హిజ్జుల్‌ బైత్) అల్లాహ్ (ప్రసన్నత) కొరకు చేయటం, విధిగా చేయబడింది. 56 ఎవరు దీనిని తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ సమస్త లోకాలవారి అవసరంలేని, స్వయం సమృద్ధుడు (అని తెలుసుకోవాలి).

3:98 – قُلْ يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَكْفُرُونَ بِآيَاتِ اللَّـهِ وَاللَّـهُ شَهِيدٌ عَلَىٰ مَا تَعْمَلُونَ ٩٨

ఇలా అను: ”ఓ గ్రంథప్రజలారా! మీరు అల్లాహ్ సందేశాలను ఎందుకు తిరస్క రిస్తున్నారు? మరియు మీరు చేసే కర్మలన్నింటికీ అల్లాహ్ సాక్షిగా 57 ఉన్నాడు!”

3:99 – قُلْ يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَصُدُّونَ عَن سَبِيلِ اللَّـهِ مَنْ آمَنَ تَبْغُونَهَا عِوَجًا وَأَنتُمْ شُهَدَاءُ ۗ وَمَا اللَّـهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ ٩٩

  1. ఇంకా ఇలా అను: ”ఓ గ్రంథ ప్రజలారా! మీరు దానికి (సత్యమార్గానికి) సాక్ష్యులుగా ఉండి కూడా అది వక్రమార్గమని చూపదలచి, విశ్వసించిన వారిని అల్లాహ్ మార్గంపై నడవకుండా ఎందుకు ఆటంకపరుస్తున్నారు? 58 మరియు అల్లాహ్ మీ కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు.”

3:100 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تُطِيعُوا فَرِيقًا مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ يَرُدُّوكُم بَعْدَ إِيمَانِكُمْ كَافِرِينَ ١٠٠

ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు గ్రంథ ప్రజలలో కొందరి (మాటలు విని) వారిని అనుస రిస్తే! వారు మిమ్మల్ని, విశ్వసించిన తరువాత కూడా సత్య-తిరస్కారులుగా మార్చివేస్తారు.

3:101 – وَكَيْفَ تَكْفُرُونَ وَأَنتُمْ تُتْلَىٰ عَلَيْكُمْ آيَاتُ اللَّـهِ وَفِيكُمْ رَسُولُهُ ۗ وَمَن يَعْتَصِم بِاللَّـهِ فَقَدْ هُدِيَ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ١٠١

మరియు అల్లాహ్ సందేశాలు మీకు చదివి వినిపించబడుతూ ఉన్నప్పుడు మరియు ఆయన సందేశహరుడు మీలో ఉన్నప్పుడు; మీరు ఎలా సత్య-తిరస్కారులు కాగలరు? మరియు మీలో ఎవడు స్థిరంగా అల్లాహ్ ను ఆశ్రయిస్తాడో, అతడు నిశ్చయంగా, బుజుమార్గం వైపునకు మార్గదర్శ కత్వం పొందినవాడే!

3:102 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّـهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ ١٠٢

ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు కర్తవ్య పాలనగా అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు అల్లాహ్‌కు విధేయులు (ముస్లింలు)గా ఉన్న స్థితిలో తప్ప మరణించకండి!

3:103 – وَاعْتَصِمُوا بِحَبْلِ اللَّـهِ جَمِيعًا وَلَا تَفَرَّقُوا ۚ وَاذْكُرُوا نِعْمَتَ اللَّـهِ عَلَيْكُمْ إِذْ كُنتُمْ أَعْدَاءً فَأَلَّفَ بَيْنَ قُلُوبِكُمْ فَأَصْبَحْتُم بِنِعْمَتِهِ إِخْوَانًا وَكُنتُمْ عَلَىٰ شَفَا حُفْرَةٍ مِّنَ النَّارِ فَأَنقَذَكُم مِّنْهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّـهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَهْتَدُونَ ١٠٣

మీరందరూ కలసి అల్లాహ్ త్రాడు (ఖుర్‌ ఆన్‌) ను గట్టిగా పట్టుకోండి. మరియు విభేదాలలో పడకండి. 59 అల్లాహ్ మీ యెడల చూపిన అనుగ్రహా లను జ్ఞాపకం చేసుకోండి; మీరు ఒకరికొకరు శత్రువు లుగా ఉండేవారు, ఆయన మీ హృదయాలను కలిపాడు. ఆయన అనుగ్రహం వల్లనే మీరు పర స్పరం సోదరులయ్యారు. మరియు మీరు అగ్ని గుండంఒడ్డున నిలబడినప్పుడు ఆయన మిమ్మల్ని దాని నుండి రక్షించాడు. ఈ విధంగా అల్లాహ్ తన సూచనలను మీకు స్పష్టం చేస్తున్నాడు, బహుశా మీరు మార్గదర్శకత్వం పొందుతారని!

3:104 – وَلْتَكُن مِّنكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ ۚ وَأُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ١٠٤

మీలో ఒక వర్గం, (ప్రజలను) మంచి మార్గం వైపునకు పిలిచేదిగా, ధర్మాన్ని (మంచిని) ఆదే శించేదిగా (బోధించేదిగా) మరియు అధర్మాన్ని (చెడును) నిషేధించేదిగా (నిరోధించేదిగా) ఉండాలి 60 మరియు అలాంటివారు, వారే సాఫల్యం పొందేవారు.

3:105 – وَلَا تَكُونُوا كَالَّذِينَ تَفَرَّقُوا وَاخْتَلَفُوا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْبَيِّنَاتُ ۚ وَأُولَـٰئِكَ لَهُمْ عَذَابٌ عَظِيمٌ ١٠٥

స్పష్టమైన ఉపదేశాలను పొందిన తరువాత కూడా ఎవరైతే, (వేర్వేరు తెగలుగా) చీలిపోయారో మరియు విభేదాలకు గురిఅయ్యారో, వారి మాదిరిగా మీరూ కావద్దు. 61 మరియు అలాంటి వారికి ఘోరశిక్ష ఉంటుంది.

3:106 – يَوْمَ تَبْيَضُّ وُجُوهٌ وَتَسْوَدُّ وُجُوهٌ ۚ فَأَمَّا الَّذِينَ اسْوَدَّتْ وُجُوهُهُمْ أَكَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ ١٠٦

ఆ (తీర్పు) దినమున కొందరి ముఖాలు (సంతోషంతో) ప్రకాశిస్తూ ఉంటాయి. మరికొందరి ముఖాలు (దుఃఖంతో) నల్లబడి ఉంటాయి. ఇక ఎవరి ముఖాలు నల్లబడి ఉంటాయో వారితో: ”మీరు విశ్వసించిన తరువాత సత్య-తిరస్కారులు అయ్యారు కదా? కాబట్టి మీరు సత్యాన్ని తిరస్కరించినందుకు ఈ శిక్షను అనుభవించండి.” (అని అనబడుతుంది).

3:107 – وَأَمَّا الَّذِينَ ابْيَضَّتْ وُجُوهُهُمْ فَفِي رَحْمَةِ اللَّـهِ هُمْ فِيهَا خَالِدُونَ ١٠٧

ఇక ఎవరి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయో వారు అల్లాహ్ కారుణ్యంలో (స్వర్గంలో) ఉంటారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

3:108 – تِلْكَ آيَاتُ اللَّـهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۗ وَمَا اللَّـهُ يُرِيدُ ظُلْمًا لِّلْعَالَمِينَ ١٠٨

(ఓ ప్రవక్తా!) ఇవి అల్లాహ్ సూక్తులు (ఆయాత్‌) మేము వాటిని యథా-తథంగా నీకు వినిపిస్తున్నాము. మరియు అల్లాహ్ సర్వలోకాల వారికి అన్యాయం చేయగోరడు.

3:109 – وَلِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَإِلَى اللَّـهِ تُرْجَعُ الْأُمُورُ ١٠٩

మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. మరియు వ్యవహారాలన్నీ (తీర్పు కొరకు) అల్లాహ్ వైపునకే మరలింపబడతాయి.

3:110 – كُنتُمْ خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنَّاسِ تَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَتَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَتُؤْمِنُونَ بِاللَّـهِ ۗ وَلَوْ آمَنَ أَهْلُ الْكِتَابِ لَكَانَ خَيْرًا لَّهُم ۚ مِّنْهُمُ الْمُؤْمِنُونَ وَأَكْثَرُهُمُ الْفَاسِقُونَ ١١٠

మీరే (విశ్వాసులే) మానవజాతి (హితం) కొరకు నిలబెట్టబడిన ఉత్తమ సమాజం వారు. మీరు ధర్మాన్ని ఆదేశించే (బోధించే) వారు మరియు అధర్మాన్ని నిషేధించే (నిరోధించే) వారు మరియు మీరు అల్లాహ్ యందు విశ్వాసం కలిగి ఉన్నవారు. 62 మరియు ఒకవేళ గ్రంథ ప్రజలు విశ్వసిస్తే, వారికే మేలై ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు. 63 కాని అత్యధికులు అవిధేయులే (ఫాసిఖూన్‌).

3:111 – لَن يَضُرُّوكُمْ إِلَّا أَذًى ۖ وَإِن يُقَاتِلُوكُمْ يُوَلُّوكُمُ الْأَدْبَارَ ثُمَّ لَا يُنصَرُونَ ١١١

వారు మిమ్మల్ని కొంత వరకు బాధించటం తప్ప, మీకు ఏ విధమైన హాని కలిగించజాలరు. మరియు వారు మీతో యుధ్ధం చేసినట్లయితే, మీకు వీపు చూపించి పారిపోతారు, తరువాత వారికెలాంటి సహాయం లభించదు.

3:112 – ضُرِبَتْ عَلَيْهِمُ الذِّلَّةُ أَيْنَ مَا ثُقِفُوا إِلَّا بِحَبْلٍ مِّنَ اللَّـهِ وَحَبْلٍ مِّنَ النَّاسِ وَبَاءُوا بِغَضَبٍ مِّنَ اللَّـهِ وَضُرِبَتْ عَلَيْهِمُ الْمَسْكَنَةُ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَانُوا يَكْفُرُونَ بِآيَاتِ اللَّـهِ وَيَقْتُلُونَ الْأَنبِيَاءَ بِغَيْرِ حَقٍّ ۚ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ ١١٢

వారు ఎక్కడున్నా, అవమానానికే గురి చేయబడతారు, అల్లాహ్ శరణులోనో లేక మానవుల అభయంలోనో ఉంటేనే తప్ప; వారు అల్లాహ్ ఆగ్రహానికి గురిఅయ్యారు మరియు వారు అధోగతికి చేరారు. ఇది వారు అల్లాహ్ సూచనలను తిరస్కరించినందుకు మరియు అన్యాయంగా ప్రవక్తలను చంపినందుకు. ఇది వారి ఆజ్ఞోల్లంఘన మరియు హద్దులుమీరి ప్రవర్తించిన దాని పర్యవసానం. 64 (1/8)

3:113 – لَيْسُوا سَوَاءً ۗ مِّنْ أَهْلِ الْكِتَابِ أُمَّةٌ قَائِمَةٌ يَتْلُونَ آيَاتِ اللَّـهِ آنَاءَ اللَّيْلِ وَهُمْ يَسْجُدُونَ ١١٣

  • వారందరూ ఒకే రకమైనవారు కారు. గ్రంథ ప్రజలలో కొందరు సరైన మార్గంలో ఉన్న వారున్నారు; వారు రాత్రి వేళలందు అల్లాహ్ సూక్తులను (ఆయాత్‌లను) పఠిస్తుంటారు మరియు సాష్టాంగం (సజ్దా) చేస్తుంటారు.

3:114 – يُؤْمِنُونَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَأُولَـٰئِكَ مِنَ الصَّالِحِينَ ١١٤

వారు అల్లాహ్‌ను మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. మరియు ధర్మాన్ని ఆదేశిస్తారు (బోధిస్తారు) మరియు అధర్మాన్ని నిషేధిస్తారు (నిరోధిస్తారు) మరియు మంచి పనులు చేయటంలో పోటీపడతారు మరియు ఇలాంటి వారే సత్పురుషులలోని వారు.

3:115 – وَمَا يَفْعَلُوا مِنْ خَيْرٍ فَلَن يُكْفَرُوهُ ۗ وَاللَّـهُ عَلِيمٌ بِالْمُتَّقِينَ ١١٥

మరియు వారు ఏ మంచిపని చేసినా అది వృథా చేయబడదు. మరియు దైవభీతిగల వారెవరో అల్లాహ్‌కు బాగా తెలుసు. 65

3:116 – إِنَّ الَّذِينَ كَفَرُوا لَن تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُم مِّنَ اللَّـهِ شَيْئًا ۖ وَأُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۚ هُمْ فِيهَا خَالِدُونَ ١١٦

నిశ్చయంగా, సత్య-తిరస్కారానికి పాల్ప డిన వారికి, వారి సంపద గానీ, వారి సంతానం గానీ, అల్లాహ్ ముందు ఏమీ పనికిరావు. మరియు అలాంటి వారు నరకాగ్నివాసులే. అందు వారు శాశ్వతంగా ఉంటారు.

3:117 – مَثَلُ مَا يُنفِقُونَ فِي هَـٰذِهِ الْحَيَاةِ الدُّنْيَا كَمَثَلِ رِيحٍ فِيهَا صِرٌّ أَصَابَتْ حَرْثَ قَوْمٍ ظَلَمُوا أَنفُسَهُمْ فَأَهْلَكَتْهُ ۚ وَمَا ظَلَمَهُمُ اللَّـهُ وَلَـٰكِنْ أَنفُسَهُمْ يَظْلِمُونَ ١١٧

వారు ఈ ఇహలోక జీవితంలో చేస్తున్న ధన వ్యయాన్ని, తమకు తాము అన్యాయం చేసుకున్న వారి పొలాలపై వీచి వాటిని సమూలంగా నాశనం చేసే, మంచు గాలితో పోల్చ వచ్చు. మరియు అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు. కానీ వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. 66

3:118 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا بِطَانَةً مِّن دُونِكُمْ لَا يَأْلُونَكُمْ خَبَالًا وَدُّوا مَا عَنِتُّمْ قَدْ بَدَتِ الْبَغْضَاءُ مِنْ أَفْوَاهِهِمْ وَمَا تُخْفِي صُدُورُهُمْ أَكْبَرُ ۚ قَدْ بَيَّنَّا لَكُمُ الْآيَاتِ ۖ إِن كُنتُمْ تَعْقِلُونَ ١١٨

  1. ఓ విశ్వాసులారా! మీరు మీ వారిని (విశ్వాసులను) తప్ప, ఇతరులను మీ సన్నిహిత స్నేహితులుగా చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాన్నైనా ఉపయోగించు కోవటానికి వెనుకాడరు. వారు మిమ్మల్ని ఇబ్బందిలో చూడగోరుతున్నారు. మరియు వారి ఈర్ష్య వారి నోళ్ళ నుండి బయటపడుతున్నది, కాని వారి హృదయాలలో దాచుకున్నది దానికంటే తీవ్రమైనది. వాస్తవానికి మేము ఈ సూచనలను మీకు స్పష్టంచేశాము. మీరు అర్థంచేసుకో గలిగితే (ఎంత బాగుండేది)! 67

3:119 – هَا أَنتُمْ أُولَاءِ تُحِبُّونَهُمْ وَلَا يُحِبُّونَكُمْ وَتُؤْمِنُونَ بِالْكِتَابِ كُلِّهِ وَإِذَا لَقُوكُمْ قَالُوا آمَنَّا وَإِذَا خَلَوْا عَضُّوا عَلَيْكُمُ الْأَنَامِلَ مِنَ الْغَيْظِ ۚ قُلْ مُوتُوا بِغَيْظِكُمْ ۗ إِنَّ اللَّـهَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ١١٩

అవును! మీరైతే వారిని ప్రేమిస్తున్నారు. కాని వారు మిమ్మల్ని ప్రేమించటం లేదు. మరియు మీరు దివ్య గ్రంథాలన్నింటినీ విశ్వసిస్తున్నారు. వారు మీతో కలసినపుడు: ”మేము విశ్వసించాము.” అని అంటారు. కాని వేరుగా ఉన్నప్పుడు, మీ ఎడల ఉన్న క్రోధావేశం వల్ల తమ వ్రేళ్ళను కొరుక్కుంటారు. వారితో: ”మీ క్రోధావేశంలో మీరే మాడి చావండి, నిశ్చయంగా, హృదయాలలో దాగి ఉన్నదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.” అని అను.

3:120 – إِن تَمْسَسْكُمْ حَسَنَةٌ تَسُؤْهُمْ وَإِن تُصِبْكُمْ سَيِّئَةٌ يَفْرَحُوا بِهَا ۖ وَإِن تَصْبِرُوا وَتَتَّقُوا لَا يَضُرُّكُمْ كَيْدُهُمْ شَيْئًا ۗ إِنَّ اللَّـهَ بِمَا يَعْمَلُونَ مُحِيطٌ ١٢٠

మీకేదైనా మేలు కలిగితే వారికది దుఃఖం కలిగిస్తుంది మరియు మీకేదైనా కీడు కలిగితే వారికది సంతోషం కలిగిస్తుంది. మరియు మీరు సహనం వహించి దైవభీతి కలిగి ఉంటే, వారి కుట్ర మీకెలాంటి నష్టం కలిగించ జాలదు. నిశ్చయంగా, అల్లాహ్ వారు చేసే దాని నంతా పరివేష్టించి ఉన్నాడు.

3:121 – وَإِذْ غَدَوْتَ مِنْ أَهْلِكَ تُبَوِّئُ الْمُؤْمِنِينَ مَقَاعِدَ لِلْقِتَالِ ۗ وَاللَّـهُ سَمِيعٌ عَلِيمٌ ١٢١

మీకేదైనా మేలు కలిగితే వారికది దుఃఖం కలిగిస్తుంది మరియు మీకేదైనా కీడు కలిగితే వారికది సంతోషం కలిగిస్తుంది. మరియు మీరు సహనం వహించి దైవభీతి కలిగి ఉంటే, వారి కుట్ర మీకెలాంటి నష్టం కలిగించ జాలదు. నిశ్చయంగా, అల్లాహ్ వారు చేసే దాని నంతా పరివేష్టించి ఉన్నాడు. 68

3:122 – إِذْ هَمَّت طَّائِفَتَانِ مِنكُمْ أَن تَفْشَلَا وَاللَّـهُ وَلِيُّهُمَا ۗ وَعَلَى اللَّـهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ ١٢٢

అప్పుడు మీలోని రెండువర్గాల వారు పిరికి తనం చూపబోయారు; మరియు అల్లాహ్ వారికి సంరక్షకుడుగా ఉన్నాడు. 69 మరియు విశ్వ సించిన వారు అల్లాహ్ యందే నమ్మకం ఉంచుకోవాలి.

3:123 – وَلَقَدْ نَصَرَكُمُ اللَّـهُ بِبَدْرٍ وَأَنتُمْ أَذِلَّةٌ ۖ فَاتَّقُوا اللَّـهَ لَعَلَّكُمْ تَشْكُرُونَ ١٢٣

బద్ర్‌ (యుధ్ధం) నందు మీరు బలహీను లుగా ఉన్నప్పుడు అల్లాహ్ మీకు సహాయం (మిమ్మల్ని విజేతలుగా) చేశాడు. కాబట్టి మీరు కృతజ్ఞతాపరులై అల్లాహ్ యందు భయ-భక్తులు కలిగి ఉండండి!

3:124 – إِذْ تَقُولُ لِلْمُؤْمِنِينَ أَلَن يَكْفِيَكُمْ أَن يُمِدَّكُمْ رَبُّكُم بِثَلَاثَةِ آلَافٍ مِّنَ الْمَلَائِكَةِ مُنزَلِينَ ١٢٤

(ఓ ప్రవక్తా!) నీవు విశ్వాసులతో: ”ఏమీ? మీ ప్రభువు, ఆకాశం నుండి మూడువేల దేవదూత లను దింపి మీకు సహాయం చేస్తున్నది చాలదా?” అని అడిగిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి!)

3:125 – بَلَىٰ ۚ إِن تَصْبِرُوا وَتَتَّقُوا وَيَأْتُوكُم مِّن فَوْرِهِمْ هَـٰذَا يُمْدِدْكُمْ رَبُّكُم بِخَمْسَةِ آلَافٍ مِّنَ الْمَلَائِكَةِ مُسَوِّمِينَ ١٢٥

అవును! ఒకవేళ మీరు సహనం వహించి దైవభీతి కలిగివుంటే, శత్రువు వచ్చి అకస్మాత్తుగా మీపై పడినా, మీ ప్రభువు ఐదువేల ప్రత్యేక చిహ్నాలు గల దేవదూతలను పంపి మీకు సహాయం చేయవచ్చు! 70

3:126 – وَمَا جَعَلَهُ اللَّـهُ إِلَّا بُشْرَىٰ لَكُمْ وَلِتَطْمَئِنَّ قُلُوبُكُم بِهِ ۗ وَمَا النَّصْرُ إِلَّا مِنْ عِندِ اللَّـهِ الْعَزِيزِ الْحَكِيمِ ١٢٦

అల్లాహ్ మీకు ఈ విషయాన్ని తెలిపింది, మీకు శుభవార్త ఇవ్వటానికి మరియు మీ హృదయాలకు తృప్తి కలుగజేయటానికి మాత్రమే. మరియు సర్వశక్తిమంతుడు మహా వివేకవంతుడైన అల్లాహ్ తప్ప, ఇతరుల నుండి సహాయం (విజయం) రాజాలదు కదా!

3:127 – لِيَقْطَعَ طَرَفًا مِّنَ الَّذِينَ كَفَرُوا أَوْ يَكْبِتَهُمْ فَيَنقَلِبُوا خَائِبِينَ ١٢٧

ఆయన ఇదంతా సత్య-తిరస్కారంపై నడిచే వారిని కొందరిని నశింపజేయటానికి, లేదా వారు ఘోర పరాజయం పొంది ఆశాభంగంతో వెనుదిరిగి పోవటానికి (చేశాడు).

3:128 – لَيْسَ لَكَ مِنَ الْأَمْرِ شَيْءٌ أَوْ يَتُوبَ عَلَيْهِمْ أَوْ يُعَذِّبَهُمْ فَإِنَّهُمْ ظَالِمُونَ ١٢٨

(ఓ ప్రవక్తా!) ఈ విషయమునందు నీ కెలాంటి అధికారం లేదు. 71 ఆయన (అల్లాహ్‌) వారిని క్షమించవచ్చు, లేదా వారిని శిక్షించవచ్చు. ఎందుకంటే నిశ్చయంగా, వారు దుర్మార్గులు.

3:129 – وَلِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۚ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ١٢٩

మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందు తుంది. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

3:130 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَأْكُلُوا الرِّبَا أَضْعَافًا مُّضَاعَفَةً ۖ وَاتَّقُوا اللَّـهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ ١٣٠

ఓ విశ్వాసులారా! ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినకండి. మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లాహ్ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. 72

3:131 – وَاتَّقُوا النَّارَ الَّتِي أُعِدَّتْ لِلْكَافِرِينَ ١٣١

మరియు సత్య-తిరస్కారుల కొరకు సిధ్ధం చేయబడిన నరకాగ్నికి భీతిపరులై ఉండండి.

3:132 – وَأَطِيعُوا اللَّـهَ وَالرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ ١٣٢

మరియు మీరు కరుణింపబడటానికి అల్లాహ్‌కు మరియు సందేశహరునికి విధేయులై ఉండండి. 73 (1/4)

3:133 – وَسَارِعُوا إِلَىٰ مَغْفِرَةٍ مِّن رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا السَّمَاوَاتُ وَالْأَرْضُ أُعِدَّتْ لِلْمُتَّقِينَ ١٣٣

  • మరియు మీ ప్రభువు క్షమాభిక్ష కొరకు మరియు స్వర్గవాసం కొరకు ఒకరితోనొకరు పోటీ పడండి; అది భూమ్యాకాశాలంత విశాలమైనది; అది దైవభీతిగల వారికై సిధ్ధపరచబడింది.

3:134 – الَّذِينَ يُنفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ ۗ وَاللَّـهُ يُحِبُّ الْمُحْسِنِينَ ١٣٤

(వారి కొరకు) ఎవరైతే కలిమిలోనూ మరియు లేమిలోనూ (అల్లాహ్‌ మార్గంలో) ఖర్చుచేస్తారో మరియు తమ కోపాన్ని నిగ్రహించు కుంటారో మరియు ప్రజలను క్షమిస్తారో! అల్లాహ్‌ సజ్జనులను ప్రేమిస్తాడు. 74

3:135 – وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنفُسَهُمْ ذَكَرُوا اللَّـهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ وَمَن يَغْفِرُ الذُّنُوبَ إِلَّا اللَّـهُ وَلَمْ يُصِرُّوا عَلَىٰ مَا فَعَلُوا وَهُمْ يَعْلَمُونَ ١٣٥

మరియు వారు, ఎవరైతే, అశ్లీలపనులు చేసినా, లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్‌ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్‌ తప్ప, పాపాలను క్షమించగలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన (తప్పులను) బుధ్ధిపూర్వకంగా మూర్ఖపుపట్టుతో మళ్ళీ చేయరు! 75

3:136 – أُولَـٰئِكَ جَزَاؤُهُم مَّغْفِرَةٌ مِّن رَّبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ ١٣٦

ఇలాంటి వారి ప్రతిఫలం, వారి ప్రభువు నుండి క్షమాభిక్ష మరియు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సత్కార్యాలు చేసే వారికి ఎంత శ్రేష్ఠమైన ప్రతిఫలం ఉంది!

3:137 – قَدْ خَلَتْ مِن قَبْلِكُمْ سُنَنٌ فَسِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ ١٣٧

మీకు పూర్వం ఇలాంటి ఎన్నో సంప్రదాయాలు (తరాలు) గడిచిపోయాయి. సత్యాన్ని తిరస్కరించిన వారి గతి ఏమయిందో మీరు భూమిలో సంచారం చేసి చూడండి.

3:138 – هَـٰذَا بَيَانٌ لِّلنَّاسِ وَهُدًى وَمَوْعِظَةٌ لِّلْمُتَّقِينَ ١٣٨

ఇది (ఈ ఖుర్‌ఆన్‌) ప్రజల కొరకు ఒక స్పష్టమైన వ్యాఖ్యానం మరియు దైవభీతి గల వారికి మార్గదర్శకత్వం మరియు హితోపదేశం.

3:139 – وَلَا تَهِنُوا وَلَا تَحْزَنُوا وَأَنتُمُ الْأَعْلَوْنَ إِن كُنتُم مُّؤْمِنِينَ ١٣٩

కాబట్టి మీరు బలహీనత కనబరచకండి మరియు దుఃఖపడకండి మరియు మీరు విశ్వా సులే అయితే, మీరే తప్పక ప్రాబల్యం పొందుతారు.

3:140 – إِن يَمْسَسْكُمْ قَرْحٌ فَقَدْ مَسَّ الْقَوْمَ قَرْحٌ مِّثْلُهُ ۚ وَتِلْكَ الْأَيَّامُ نُدَاوِلُهَا بَيْنَ النَّاسِ وَلِيَعْلَمَ اللَّـهُ الَّذِينَ آمَنُوا وَيَتَّخِذَ مِنكُمْ شُهَدَاءَ ۗ وَاللَّـهُ لَا يُحِبُّ الظَّالِمِينَ ١٤٠

ఒకవేళ ఇప్పుడు మీరు గాయపడితే, వాస్తవానికి ఆ జాతివారు (మీ విరోధులు) కూడా ఇదేవిధంగా గాయపడ్డారు. 76 మరియు మేము ఇలాంటి దినాలను ప్రజల మధ్య త్రిప్పుతూ ఉంటాము. మరియు అల్లాహ్‌, మీలో నిజమైన విశ్వాసులెవ్వరో చూడటానికీ మరియు (సత్య స్థాపనకు) తమ ప్రాణాలను త్యాగం చేయగల వారిని ఎన్నుకోవటానికీ ఇలా చేస్తూ ఉంటాడు. మరియు అల్లాహ్‌ దుర్మార్గులను ప్రేమించడు.

3:141 – وَلِيُمَحِّصَ اللَّـهُ الَّذِينَ آمَنُوا وَيَمْحَقَ الْكَافِرِينَ ١٤١

మరియు అల్లాహ్‌ విశ్వాసులను పరిశుధ్ధు లుగా 77 చేయటానికీ మరియు సత్య-తిరస్కారు లను అణచివేయటానికీ (ఈ విధంగా చేస్తాడు).

3:142 – أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَعْلَمِ اللَّـهُ الَّذِينَ جَاهَدُوا مِنكُمْ وَيَعْلَمَ الصَّابِرِينَ ١٤٢

ఏమీ? మీలో ఆయన మార్గంలో ప్రాణాలు తెగించి పోరాడేవారు (ధర్మయోధులు) ఎవరో, అల్లాహ్‌ చూడకముందే మరియు సహనంచూపే వారు ఎవరో చూడకముందే, మీరు స్వర్గంలో ప్రవేశించగలరని భావిస్తున్నారా? 78

3:143 – وَلَقَدْ كُنتُمْ تَمَنَّوْنَ الْمَوْتَ مِن قَبْلِ أَن تَلْقَوْهُ فَقَدْ رَأَيْتُمُوهُ وَأَنتُمْ تَنظُرُونَ ١٤٣

మరియు వాస్తవానికి, మీరు (అల్లాహ్‌ మార్గంలో) మరణించాలని కోరుచుంటిరి! 79 అది, మీరుదానినిప్రత్యక్షంగా చూడకముందటి విషయం; కాని, మీరు దానిని ఎదురు చూస్తుండగానే, వాస్త వానికి ఇప్పుడు అది మీ ముందుకు వచ్చేసింది.

3:144 – وَمَا مُحَمَّدٌ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِن قَبْلِهِ الرُّسُلُ ۚ أَفَإِن مَّاتَ أَوْ قُتِلَ انقَلَبْتُمْ عَلَىٰ أَعْقَابِكُمْ ۚ وَمَن يَنقَلِبْ عَلَىٰ عَقِبَيْهِ فَلَن يَضُرَّ اللَّـهَ شَيْئًا ۗ وَسَيَجْزِي اللَّـهُ الشَّاكِرِينَ ١٤٤

మరియు ము’హమ్మద్‌ 80 కేవలం ఒక సందేశహరుడు మాత్రమే! వాస్తవానికి అతనికి పూర్వం అనేక సందేశహరులు గడచిపోయారు. 81 ఏమీ? ఒకవేళ అతను మరణిస్తే, లేక హత్య చేయబడితే, మీరు వెనుకంజవేసి మరలిపోతారా? మరియు వెనుకంజవేసి మరలిపోయేవాడు అల్లాహ్‌ కు ఏ మాత్రం నష్టం కలిగించలేడు. మరియు కృతజ్ఞతాపరులైన వారికి అల్లాహ్‌ తగిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

3:145 – وَمَا كَانَ لِنَفْسٍ أَن تَمُوتَ إِلَّا بِإِذْنِ اللَّـهِ كِتَابًا مُّؤَجَّلًا ۗ وَمَن يُرِدْ ثَوَابَ الدُّنْيَا نُؤْتِهِ مِنْهَا وَمَن يُرِدْ ثَوَابَ الْآخِرَةِ نُؤْتِهِ مِنْهَا ۚ وَسَنَجْزِي الشَّاكِرِينَ ١٤٥

అల్లాహ్‌ అనుమతి లేనిదే, ఏప్రాణి కూడా మరణించజాలదు, దానికి ఒక నియమిత కాలం వ్రాయబడి ఉంది. మరియు ఎవడైతే ఈ ప్రపంచ సుఖాన్ని కోరుకుంటాడో, మేము అతనికది నొసంగుతాము మరియు ఎవడు పరలోక సుఖాన్ని కోరుకుంటాడో అతనికది నొసంగు తాము. మరియు మేము కృతజ్ఞులైన వారికి తగిన ప్రతిఫలాన్ని ప్రసాదించగలము.

3:146 – وَكَأَيِّن مِّن نَّبِيٍّ قَاتَلَ مَعَهُ رِبِّيُّونَ كَثِيرٌ فَمَا وَهَنُوا لِمَا أَصَابَهُمْ فِي سَبِيلِ اللَّـهِ وَمَا ضَعُفُوا وَمَا اسْتَكَانُوا ۗ وَاللَّـهُ يُحِبُّ الصَّابِرِينَ ١٤٦

మరియు ఎందరో ప్రవక్తలు మరియు వారితో కలిసి ఎంతో మంది ధర్మవేత్తలు / దైవభక్తులు (రిబ్బీయ్యూన్‌) ధర్మ-యుద్ధాలు చేశారు, అల్లాహ్‌ మార్గంలో ఎదురైన కష్టాలకు వారు ధైర్యం విడువలేదు మరియు బలహీనత కనబరచలేదు మరియు వారికి (శత్రువులకు) లోబడనూ లేదు. మరియు అల్లాహ్‌ ఆపదలలో సహనం వహించే వారిని ప్రేమిస్తాడు.

3:147 – وَمَا كَانَ قَوْلَهُمْ إِلَّا أَن قَالُوا رَبَّنَا اغْفِرْ لَنَا ذُنُوبَنَا وَإِسْرَافَنَا فِي أَمْرِنَا وَثَبِّتْ أَقْدَامَنَا وَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ ١٤٧

మరియు వారి ప్రార్థన కేవలం: ”ఓ మా ప్రభూ! మా పాపాలను, మా వ్యవహారాలలో మేము మితిమీరి పోయిన వాటిని క్షమించు మరియు మా పాదాలకు స్థైర్యాన్ని ప్రసాదించు మరియు సత్య- తిరస్కారులకు ప్రతికూలంగా మాకు విజయాన్ని ప్రసాదించు.” అని పలకటం మాత్రమే!

3:148 – فَآتَاهُمُ اللَّـهُ ثَوَابَ الدُّنْيَا وَحُسْنَ ثَوَابِ الْآخِرَةِ ۗ وَاللَّـهُ يُحِبُّ الْمُحْسِنِينَ ١٤٨

కావున అల్లాహ్‌ వారికి ఇహలోకంలో తగిన ఫలితాన్ని మరియు పరలోకంలో ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించాడు. మరియు అల్లాహ్‌ సజ్జనులను ప్రేమిస్తాడు.

3:149 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تُطِيعُوا الَّذِينَ كَفَرُوا يَرُدُّوكُمْ عَلَىٰ أَعْقَابِكُمْ فَتَنقَلِبُوا خَاسِرِينَ ١٤٩

ఓ విశ్వాసులారా! మీరు సత్య- తిరస్కారుల సలహాలను పాటిస్తే, వారు మిమ్మల్ని వెనుకకు (అవిశ్వాసం వైపునకు) మరలిస్తారు. అప్పుడు మీరే నష్టపడిన వారవుతారు.

3:150 – بَلِ اللَّـهُ مَوْلَاكُمْ ۖ وَهُوَ خَيْرُ النَّاصِرِينَ ١٥٠

వాస్తవానికి! అల్లాహ్‌యే మీ సంరక్షకుడు. మరియు ఆయనే అత్యుత్తమ సహాయకుడు.

3:151 – سَنُلْقِي فِي قُلُوبِ الَّذِينَ كَفَرُوا الرُّعْبَ بِمَا أَشْرَكُوا بِاللَّـهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ سُلْطَانًا ۖ وَمَأْوَاهُمُ النَّارُ ۚ وَبِئْسَ مَثْوَى الظَّالِمِينَ ١٥١

ఆయన ఏ విధమైన ప్రమాణం అవతరింప జేయనిదే అల్లాహ్‌కు సాటికల్పించినందుకు, మేము సత్యతిరస్కారులహృదయాలలో ఘోరభయాన్ని కల్పిస్తాము. వారి ఆశ్రయం నరకాగ్నియే! అది దుర్మార్గులకు లభించే, అతిచెడ్డ నివాసం.

3:152 – وَلَقَدْ صَدَقَكُمُ اللَّـهُ وَعْدَهُ إِذْ تَحُسُّونَهُم بِإِذْنِهِ ۖ حَتَّىٰ إِذَا فَشِلْتُمْ وَتَنَازَعْتُمْ فِي الْأَمْرِ وَعَصَيْتُم مِّن بَعْدِ مَا أَرَاكُم مَّا تُحِبُّونَ ۚ مِنكُم مَّن يُرِيدُ الدُّنْيَا وَمِنكُم مَّن يُرِيدُ الْآخِرَةَ ۚ ثُمَّ صَرَفَكُمْ عَنْهُمْ لِيَبْتَلِيَكُمْ ۖ وَلَقَدْ عَفَا عَنكُمْ ۗ وَاللَّـهُ ذُو فَضْلٍ عَلَى الْمُؤْمِنِينَ ١٥٢

  1. మరియు వాస్తవానికి అల్లాహ్‌ మీకు చేసిన, తన వాగ్దానాన్ని సత్యపరచాడు, ఎప్పుడైతే మీరు ఆయన అనుమతితో, వారిని (సత్య-తిరస్కారు లను) చంపుతూ ఉన్నారో! 82 తరువాత మీరు పిరికితనాన్ని ప్రదర్శించి, మీ కర్తవ్య విషయంలో పరస్పర విబేధాలకు గురి అయ్యి – ఆయన (అల్లాహ్‌) మీకు, మీరు వ్యామోహపడుతున్న దానిని చూపగానే – (మీ నాయకుని) ఆజ్ఞలను ఉల్లంఘించారు. 83 (ఎందుకంటే) మీలో కొందరు ఇహలోకాన్ని కోరేవారున్నారు మరియు మీలో కొందరు పరలోకాన్ని కోరేవారున్నారు. తరువాత మిమ్మల్ని పరీక్షించటానికి ఆయన (అల్లాహ్‌) మీరు మీ విరోధులను ఓడించకుండా చేశాడు. 84 మరియు వాస్తవానికి ఇపుడు ఆయన మిమ్మల్ని క్షమించాడు. మరియు అల్లాహ్‌ విశ్వాసుల పట్ల ఎంతో అనుగ్రహుడు. (3/8)

3:153 – إِذْ تُصْعِدُونَ وَلَا تَلْوُونَ عَلَىٰ أَحَدٍ وَالرَّسُولُ يَدْعُوكُمْ فِي أُخْرَاكُمْ فَأَثَابَكُمْ غَمًّا بِغَمٍّ لِّكَيْلَا تَحْزَنُوا عَلَىٰ مَا فَاتَكُمْ وَلَا مَا أَصَابَكُمْ ۗ وَاللَّـهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ ١٥٣

  • (జ్ఞాపకం చేసుకోండి!) ఎప్పుడయితే మీరు పారిపోతూ ఉన్నారో మరియు వెనుకకు కూడా తిరిగి ఎవరినీ చూడకుండా ఉన్నారో మరియు ప్రవక్త మీ వెనుక నుండి, మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడో! అప్పుడు (మీ ఈ వైఖరికి) ప్రతిఫలంగా (అల్లాహ్) మీకు దుఃఖం మీద దుఃఖం కలుగ జేశాడు; మీరు ఏదైనా పోగొట్టుకున్నా, లేదా మీకు ఏదైనా ఆపద కలిగినా మీరు చింతించ కుండా ఉండేందుకు. మరియు మీ కర్మలన్నింటినీ అల్లాహ్‌ బాగా ఎరుగును.

3:154 – ثُمَّ أَنزَلَ عَلَيْكُم مِّن بَعْدِ الْغَمِّ أَمَنَةً نُّعَاسًا يَغْشَىٰ طَائِفَةً مِّنكُمْ ۖ وَطَائِفَةٌ قَدْ أَهَمَّتْهُمْ أَنفُسُهُمْ يَظُنُّونَ بِاللَّـهِ غَيْرَ الْحَقِّ ظَنَّ الْجَاهِلِيَّةِ ۖ يَقُولُونَ هَل لَّنَا مِنَ الْأَمْرِ مِن شَيْءٍ ۗ قُلْ إِنَّ الْأَمْرَ كُلَّهُ لِلَّـهِ ۗ يُخْفُونَ فِي أَنفُسِهِم مَّا لَا يُبْدُونَ لَكَ ۖ يَقُولُونَ لَوْ كَانَ لَنَا مِنَ الْأَمْرِ شَيْءٌ مَّا قُتِلْنَا هَاهُنَا ۗ قُل لَّوْ كُنتُمْ فِي بُيُوتِكُمْ لَبَرَزَ الَّذِينَ كُتِبَ عَلَيْهِمُ الْقَتْلُ إِلَىٰ مَضَاجِعِهِمْ ۖ وَلِيَبْتَلِيَ اللَّـهُ مَا فِي صُدُورِكُمْ وَلِيُمَحِّصَ مَا فِي قُلُوبِكُمْ ۗ وَاللَّـهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ١٥٥

అప్పుడు ఈ దుఃఖం తరువాత ఆయన (అల్లాహ్‌) మీపై శాంతి భద్రతలను అవతరింప జేశాడు; దానివల్ల మీలో కొందరికి కునుకుపాటు ఆవరించింది. కాని మరికొందరు – కేవలం స్వంత ప్రాణాలకు ప్రాముఖ్యతనిచ్చేవారు, అల్లాహ్‌ను గురించి పామరులవంటి తప్పుడు ఊహలు చేసే వారు – ఇలా అన్నారు: ”ఏమి? ఈ వ్యవహారంలో మాకు ఏమైనా భాగముందా?” వారితో ఇలా అను: ”నిశ్చయంగా, సమస్త వ్యవహారాలపై సర్వాధికారం అల్లాహ్‌దే!” వారు తమ హృదయాలలో దాచుకున్న దానిని నీకు వ్యక్తం చేయటం లేదు. వారు ఇంకా ఇలా అన్నారు: ”మాకు అధికారమే ఉండి వుంటే, మేము ఇక్కడ చంపబడి ఉండేవారం కాదు.” వారికి ఇలా జవా బివ్వు: ”ఒకవేళ మీరు మీ ఇళ్ళలోనే ఉండి వున్నప్పటికీ, మరణం వ్రాయబడి ఉన్నవారు స్వయంగా తమ వధ్య స్థానాలకు తరలి వచ్చేవారు.” మరియు అల్లాహ్‌ మీ గుండెలలో దాగివున్న దానిని పరీక్షించటానికి మరియు మీ హృదయాలను పరిశుధ్ధపరచటానికి ఇలా చేశాడు. మరియు హృదయాలలో (దాగి) ఉన్నదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.

3:55 – إِنَّ الَّذِينَ تَوَلَّوْا مِنكُمْ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ إِنَّمَا اسْتَزَلَّهُمُ الشَّيْطَانُ بِبَعْضِ مَا كَسَبُوا ۖ وَلَقَدْ عَفَا اللَّـهُ عَنْهُمْ ۗ إِنَّ اللَّـهَ غَفُورٌ حَلِيمٌ ١٥٥

రెండుసైన్యాలు (‘ఉహుద్‌ యుధ్ధానికి) తల బడిన దినమున, వాస్తవానికి మీలో వెన్ను చూపిన వారిని – వారు చేసుకున్నవాటికి (కర్మలకు) ఫలి తంగా –షై’తానువారిపాదాలనుజార్చాడు.అయినా వాస్తవానికి అల్లాహ్‌ వారిని క్షమించాడు. నిశ్చయంగా అల్లాహ్‌ క్షమాశీలుడు, సహనశీలుడు.

3:156 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَكُونُوا كَالَّذِينَ كَفَرُوا وَقَالُوا لِإِخْوَانِهِمْ إِذَا ضَرَبُوا فِي الْأَرْضِ أَوْ كَانُوا غُزًّى لَّوْ كَانُوا عِندَنَا مَا مَاتُوا وَمَا قُتِلُوا لِيَجْعَلَ اللَّـهُ ذَٰلِكَ حَسْرَةً فِي قُلُوبِهِمْ ۗ وَاللَّـهُ يُحْيِي وَيُمِيتُ ۗ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ١٥٦

ఓ విశ్వాసులారా! మీరు సత్య-తిరస్కా రుల మాదిరిగా ప్రవర్తించకండి; వారు తమ సోదరులు ఎప్పుడైనా ప్రయాణంలో ఉంటే, లేదా యుధ్ధంలో ఉంటే, (అక్కడ వారు ఏదైనా ప్రమా దానికి గురిఅయితే) వారిని గురించి ఇలా అనే వారు: ”ఒకవేళ వారు మాతో పాటు ఉండి వుంటే చనిపోయేవారు కాదు మరియు చంపబడే వారునూ కాదు!” వాటిని (ఈ విధమైన మాటలను) అల్లాహ్‌ వారి హృదయ ఆవేదనకు కారణాలుగా చేస్తాడు. మరియు అల్లాహ్‌యే జీవనమిచ్చేవాడు. మరియు మరణమిచ్చేవాడు మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్‌ చూస్తున్నాడు. 85

3:157 – وَلَئِن قُتِلْتُمْ فِي سَبِيلِ اللَّـهِ أَوْ مُتُّمْ لَمَغْفِرَةٌ مِّنَ اللَّـهِ وَرَحْمَةٌ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ ١٥٧

మరియు మీరు అల్లాహ్‌ మార్గంలో చంప బడినా లేదా మరణించినా మీకు లభించే అల్లాహ్‌ క్షమాభిక్ష మరియు కారుణ్యం, నిశ్చయంగా, మీరు కూడబెట్టే వాటి అన్నిటికంటే ఎంతో ఉత్తమమైనవి.

3:158 – وَلَئِن مُّتُّمْ أَوْ قُتِلْتُمْ لَإِلَى اللَّـهِ تُحْشَرُونَ ١٥٨

మరియు మీరు మరణించినా లేదా చంప బడినా, మీరందరూ అల్లాహ్‌ సమక్షంలో సమావేశ పరచబడతారు.

3:159 – فَبِمَا رَحْمَةٍ مِّنَ اللَّـهِ لِنتَ لَهُمْ ۖ وَلَوْ كُنتَ فَظًّا غَلِيظَ الْقَلْبِ لَانفَضُّوا مِنْ حَوْلِكَ ۖ فَاعْفُ عَنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمْ وَشَاوِرْهُمْ فِي الْأَمْرِ ۖ فَإِذَا عَزَمْتَ فَتَوَكَّلْ عَلَى اللَّـهِ ۚ إِنَّ اللَّـهَ يُحِبُّ الْمُتَوَكِّلِينَ ١٥٩

(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ యొక్క అపార కారుణ్యం వల్లనే నీవు వారిపట్ల మృదు హృదయు డవయ్యావు. నీవే గనక క్రూరుడవు, కఠిన హృద యుడవు అయివుంటే, వారందరూ నీ చుట్టు ప్రక్కల నుండి దూరంగా పారిపోయే వారు. కావున నీవు వారిని మన్నించు, వారి క్షమాపణ కొరకు (అల్లాహ్‌ను) ప్రార్థించు మరియు వ్యవహారాలలో వారిని సంప్రదించు. 86 ఆ పిదప నీవు కార్యానికి సిధ్ధమైనపుడు అల్లాహ్‌పై ఆధారపడు. నిశ్చయంగా అల్లాహ్‌ తనపై ఆధారపడేవారిని ప్రేమిస్తాడు.

3:160 – إِن يَنصُرْكُمُ اللَّـهُ فَلَا غَالِبَ لَكُمْ ۖ وَإِن يَخْذُلْكُمْ فَمَن ذَا الَّذِي يَنصُرُكُم مِّن بَعْدِهِ ۗ وَعَلَى اللَّـهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ ١٦٠

ఒకవేళ మీకు అల్లాహ్‌ సహాయమే ఉంటే, మరెవ్వరూ మీపై ఆధిక్యాన్ని పొందజాలరు. మరియు ఆయనే మిమ్మల్ని త్యజిస్తే, ఆయన తప్ప మీకు సహాయం చేయగల వాడెవడు? మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్‌ పైననే నమ్మకం ఉంచుకుంటారు!

3:161 – وَمَا كَانَ لِنَبِيٍّ أَن يَغُلَّ ۚ وَمَن يَغْلُلْ يَأْتِ بِمَا غَلَّ يَوْمَ الْقِيَامَةِ ۚ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ ١٦١

మరియు ఏ ప్రవక్త కూడా విజయధనం (బూటీ) కొరకు నమ్మకద్రోహానికి పాల్పడడు. మరియు నమ్మకద్రోహానికి పాల్పడిన వాడు పునరుత్థాన దినమున తన నమ్మకద్రోహంతో పాటు హాజరవుతాడు. అప్పుడు ప్రతి ప్రాణికి తాను అర్జించిన దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు. 87

3:62 – أَفَمَنِ اتَّبَعَ رِضْوَانَ اللَّـهِ كَمَن بَاءَ بِسَخَطٍ مِّنَ اللَّـهِ وَمَأْوَاهُ جَهَنَّمُ ۚ وَبِئْسَ الْمَصِيرُ ١٦٢

ఏమీ? అల్లాహ్‌ అభీష్టం ప్రకారం నడిచే వ్యక్తి అల్లాహ్‌ ఆగ్రహానికి గురయ్యేవాడితో సమాను డవుతాడా? మరియు నరకమే వాని ఆశ్రయము. మరియు అది అతి చెడ్డ గమ్యస్థానం! 88

3:163 – هُمْ دَرَجَاتٌ عِندَ اللَّـهِ ۗ وَاللَّـهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ ١٦٣

అల్లాహ్‌ దృష్టిలో వారు వేర్వేరు స్థానాలలో ఉన్నారు. మరియు వారు చేసేదంతా అల్లాహ్‌ చూస్తున్నాడు.

3:164 – لَقَدْ مَنَّ اللَّـهُ عَلَى الْمُؤْمِنِينَ إِذْ بَعَثَ فِيهِمْ رَسُولًا مِّنْ أَنفُسِهِمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِن كَانُوا مِن قَبْلُ لَفِي ضَلَالٍ مُّبِينٍ ١٦٤

వాస్తవానికి అల్లాహ్‌ విశ్వాసులకు మహోప కారం చేశాడు; వారి నుండియే వారి మధ్య ఒక ప్రవక్త (ము’హమ్మద్)ను లేపాడు; అతను, ఆయన (అల్లాహ్) సందేశాలను (ఆయాత్) వారికి వినిపిస్తున్నాడు. 89 మరియు వారి జీవితాలను సంస్కరించి పావనం చేస్తు న్నాడు; మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు; 90 మరియు వాస్తవానికి వారు ఇంతకు ముందు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి వున్నారు.

3:165 – أَوَلَمَّا أَصَابَتْكُم مُّصِيبَةٌ قَدْ أَصَبْتُم مِّثْلَيْهَا قُلْتُمْ أَنَّىٰ هَـٰذَا ۖ قُلْ هُوَ مِنْ عِندِ أَنفُسِكُمْ ۗ إِنَّ اللَّـهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١٦٥

ఏమయింది? మీకొక చిన్న ఆపదే కదా కలిగింది! వాస్తవానికి మీరు, వారికి (మీ శత్రువులకు బద్ర్‌లో) ఇంతకు రెట్టింపు ఆపద కలిగించారు కదా! 91 అయితే ఇప్పుడు: ”ఇది ఎక్కడి నుంచి వచ్చిందీ?” అని అంటున్నారా? వారితో ఇలా అను: ”ఇది మీరు స్వయంగా తెచ్చుకున్నదే!” 92 నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.

3:166 – وَمَا أَصَابَكُمْ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ فَبِإِذْنِ اللَّـهِ وَلِيَعْلَمَ الْمُؤْمِنِينَ ١٦٦

మరియు (ఉ’హుద్‌ యుధ్ధరంగంలో) రెండు సైన్యాలు ఎదుర్కొన్నప్పుడు, మీకు కలిగిన కష్టం, అల్లాహ్‌ అనుమతితోనే కలిగింది మరియు అది నిజమైన విశ్వాసులెవరో చూడటానికి –

3:167 – وَلِيَعْلَمَ الَّذِينَ نَافَقُوا ۚ وَقِيلَ لَهُمْ تَعَالَوْا قَاتِلُوا فِي سَبِيلِ اللَّـهِ أَوِ ادْفَعُوا ۖ قَالُوا لَوْ نَعْلَمُ قِتَالًا لَّاتَّبَعْنَاكُمْ ۗ هُمْ لِلْكُفْرِ يَوْمَئِذٍ أَقْرَبُ مِنْهُمْ لِلْإِيمَانِ ۚ يَقُولُونَ بِأَفْوَاهِهِم مَّا لَيْسَ فِي قُلُوبِهِمْ ۗ وَاللَّـهُ أَعْلَمُ بِمَا يَكْتُمُونَ ١٦٧

మరియు కపట-విశ్వాసులు ఎవరో చూడటానికి. మరియు వారితో (కపట- విశ్వాసులతో): ”రండి అల్లాహ్‌ మార్గంలో యుద్ధం చేయండి, లేదా కనీసం మిమ్మల్నిమీరు రక్షించు కోండి!” 93 అనిఅన్నప్పుడు వారు: ”ఒకవేళమాకు యుధ్ధం జరుగుతుందని తెలిసివుంటే, మేము తప్పకుండా మీతో పాటు వచ్చి ఉండే వారం.” అని జవాబిచ్చారు. ఆ రోజు వారు విశ్వా సాని కంటే అవిశ్వాసానికి దగ్గరగా ఉన్నారు. 94 మరియు వారు తమహృదయాలలో లేని మాటలను తమనోళ్ళతో పలుకుతూఉన్నారు. మరియు వారు దాస్తున్నది అల్లాహ్‌కు బాగా తెలుసు.

3:168 – الَّذِينَ قَالُوا لِإِخْوَانِهِمْ وَقَعَدُوا لَوْ أَطَاعُونَا مَا قُتِلُوا ۗ قُلْ فَادْرَءُوا عَنْ أَنفُسِكُمُ الْمَوْتَ إِن كُنتُمْ صَادِقِينَ ١٦٨

అలాంటి వారు తమ ఇండ్లలో కూర్చొని ఉండి (చంపబడిన) తమ సోదరులను గురించి ఇలా అన్నారు: ”వారు గనక మా మాట వినిఉంటే చంపబడి ఉండేవారు కాదు!” నీవు వారితో: ”మీరు సత్యవంతులే అయితే, మీకు మరణం రాకుండా మిమ్మల్నిమీరు తప్పించుకోండి!” అని చెప్పు.

3:169 – وَلَا تَحْسَبَنَّ الَّذِينَ قُتِلُوا فِي سَبِيلِ اللَّـهِ أَمْوَاتًا ۚ بَلْ أَحْيَاءٌ عِندَ رَبِّهِمْ يُرْزَقُونَ ١٦٩

మరియు అల్లాహ్‌ మార్గంలో చంపబడిన వారిని మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులై, తమ ప్రభువు వద్ద జీవనోపాధి పొందుతున్నారు. 95

3:170 – فَرِحِينَ بِمَا آتَاهُمُ اللَّـهُ مِن فَضْلِهِ وَيَسْتَبْشِرُونَ بِالَّذِينَ لَمْ يَلْحَقُوا بِهِم مِّنْ خَلْفِهِمْ أَلَّا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ١٧٠

అల్లాహ్‌ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానితో (ప్రాణత్యాగంతో) వారు సంతోషంతో ఉప్పొంగిపోతారు. 1 మరియు వారిని కలువక, వెనుక (బ్రతికి) ఉన్నవారి కొరకు (ఇవ్వబడిన శుభవార్తతో) వారు సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా! (1/2)

3:171 – يَسْتَبْشِرُونَ بِنِعْمَةٍ مِّنَ اللَّـهِ وَفَضْلٍ وَأَنَّ اللَّـهَ لَا يُضِيعُ أَجْرَ الْمُؤْمِنِينَ ١٧١

  • వారు అల్లాహ్‌ అనుగ్రహానికి, దాతృత్వానికి సంతోషపడుతూ ఉంటారు. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ విశ్వాసుల ప్రతిఫలాన్ని వ్యర్థం కానివ్వడు.

3:172 – الَّذِينَ اسْتَجَابُوا لِلَّـهِ وَالرَّسُولِ مِن بَعْدِ مَا أَصَابَهُمُ الْقَرْحُ ۚ لِلَّذِينَ أَحْسَنُوا مِنْهُمْ وَاتَّقَوْا أَجْرٌ عَظِيمٌ ١٧٢

ఎవరైతే గాయపడిన తరువాత కూడా అల్లాహ్‌ మరియు సందేశహరుని (ఆజ్ఞలను) పాటిస్తారో; 97 వారిలో ఎవరైతే, సత్కార్యాలు చేశారో, మరియు దైవభీతి కలిగి ఉన్నారో, వారికి గొప్ప ప్రతిఫలం ఉంది.

3:173 – الَّذِينَ قَالَ لَهُمُ النَّاسُ إِنَّ النَّاسَ قَدْ جَمَعُوا لَكُمْ فَاخْشَوْهُمْ فَزَادَهُمْ إِيمَانًا وَقَالُوا حَسْبُنَا اللَّـهُ وَنِعْمَ الْوَكِيلُ ١٧٣

వారితో (విశ్వాసులతో) ప్రజలు: ”వాస్త వానికి మీకు వ్యతిరేకంగా పెద్ద జనసమూహాలు కూర్చబడి ఉన్నాయి కావున మీరు వారికి భయ పడండి.” అని అన్నప్పుడు, వారివిశ్వాసం మరింత అధికమేఅయింది. మరియు వారు: ”మాకు అల్లాహ్‌ యే చాలు మరియు ఆయనే సర్వోత్తమ మైన కార్యసాధకుడు.” 98 అని అన్నారు. 99

3:174 – فَانقَلَبُوا بِنِعْمَةٍ مِّنَ اللَّـهِ وَفَضْلٍ لَّمْ يَمْسَسْهُمْ سُوءٌ وَاتَّبَعُوا رِضْوَانَ اللَّـهِ ۗ وَاللَّـهُ ذُو فَضْلٍ عَظِيمٍ ١٧٤

ఈ విధంగా వారు అల్లాహ్‌ ఉపకారాలు మరియు అనుగ్రహాలతో (యుధ్ధ రంగం నుండి) తిరిగి వచ్చారు, వారికెలాంటి హాని కలుగలేదు మరియు వారు అల్లాహ్‌ అభీష్టాన్నీ అనుస రించారు. మరియు అల్లాహ్‌ ఎంతో అనుగ్రహుడు, సర్వోత్తముడు.

3:175 – إِنَّمَا ذَٰلِكُمُ الشَّيْطَانُ يُخَوِّفُ أَوْلِيَاءَهُ فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِن كُنتُم مُّؤْمِنِينَ ١٧٥

నిశ్చయంగా షై’తానే తన మిత్రుల గురించి మీలో భయం పుట్టిస్తాడు. కావున మీరు వారికి భయపడకండి. మరియు మీరు విశ్వాసులే అయితే, కేవలం నాకే (అల్లాహ్‌కే) భయపడండి.

3:176 – وَلَا يَحْزُنكَ الَّذِينَ يُسَارِعُونَ فِي الْكُفْرِ ۚ إِنَّهُمْ لَن يَضُرُّوا اللَّـهَ شَيْئًا ۗ يُرِيدُ اللَّـهُ أَلَّا يَجْعَلَ لَهُمْ حَظًّا فِي الْآخِرَةِ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ ١٧٦

మరియు సత్య-తిరస్కారం కొరకు పోటీ చేసే వారు నిన్ను ఖేదానికి గురిచేయనివ్వరాదు. నిశ్చయంగా, వారు అల్లాహ్‌కు ఎలాంటి నష్టం కలిగించలేరు. పరలోక సుఖంలో అల్లాహ్‌ వారికెలాంటి భాగం ఇవ్వదలచుకోలేదు. మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది.

3:177 – إِنَّ الَّذِينَ اشْتَرَوُا الْكُفْرَ بِالْإِيمَانِ لَن يَضُرُّوا اللَّـهَ شَيْئًا وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ١٧٧

నిశ్చయంగా విశ్వాసానికి బదులుగా సత్య-తిరస్కారాన్ని కొనేవారు అల్లాహ్‌కు ఎలాంటి నష్టం కలిగించలేరు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

3:178 – وَلَا يَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا أَنَّمَا نُمْلِي لَهُمْ خَيْرٌ لِّأَنفُسِهِمْ ۚ إِنَّمَا نُمْلِي لَهُمْ لِيَزْدَادُوا إِثْمًا ۚ وَلَهُمْ عَذَابٌ مُّهِينٌ ١٧٨

మరియు వాస్తవానికి మేము ఇస్తున్న ఈ వ్యవధిని సత్య-తిరస్కారులు తమకు మేలైనదిగా భావించకూడదు. మరియు వాస్తవానికి, మేము ఇస్తున్న ఈ వ్యవధి వారి పాపాలు అధికమవ టానికే! 100 మరియు వారికి అవమానకరమైన శిక్ష ఉంటుంది.

3:179 – مَّا كَانَ اللَّـهُ لِيَذَرَ الْمُؤْمِنِينَ عَلَىٰ مَا أَنتُمْ عَلَيْهِ حَتَّىٰ يَمِيزَ الْخَبِيثَ مِنَ الطَّيِّبِ ۗ وَمَا كَانَ اللَّـهُ لِيُطْلِعَكُمْ عَلَى الْغَيْبِ وَلَـٰكِنَّ اللَّـهَ يَجْتَبِي مِن رُّسُلِهِ مَن يَشَاءُ ۖ فَآمِنُوا بِاللَّـهِ وَرُسُلِهِ ۚ وَإِن تُؤْمِنُوا وَتَتَّقُوا فَلَكُمْ أَجْرٌ عَظِيمٌ ١٧٩

అల్లాహ్‌ విశ్వాసులను, మీరు (సత్య- తిరస్కారులు) ఇప్పుడు ఉన్నస్థితిలో, ఏ మాత్రమూ ఉండనివ్వడు. చివరకు ఆయన దుష్టులను సత్పురుషుల నుండి తప్పకుండా వేరుచేస్తాడు. మరియు అగోచర విషయాలను మీకు తెలపడం అల్లాహ్‌ విధానం కాదు, కాని అల్లాహ్‌ తన ప్రవక్తలలో నుండి తాను కోరిన వారిని ఎన్నుకుంటాడు. 101 కావున మీరు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మరియు ఒకవేళ మీరు విశ్వసించి, దైవభీతి కలిగి ఉంటే, మీకు గొప్ప ప్రతిఫలం ఉంటుంది.

3:180 – وَلَا يَحْسَبَنَّ الَّذِينَ يَبْخَلُونَ بِمَا آتَاهُمُ اللَّـهُ مِن فَضْلِهِ هُوَ خَيْرًا لَّهُم ۖ بَلْ هُوَ شَرٌّ لَّهُمْ ۖ سَيُطَوَّقُونَ مَا بَخِلُوا بِهِ يَوْمَ الْقِيَامَةِ ۗ وَلِلَّـهِ مِيرَاثُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ ١٨٠

అల్లాహ్‌ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానిలో లోభం వహించే వారు, తమకది (లోభమే) మేలైనదని భావించరాదు, వాస్తవానికి అది వారి కొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభత్వంతో కూడబెట్టినదంతా, తీర్పుదినమున వారి మెడలచుట్టు కట్టబడుతుంది. 102 మరియు భూమ్యాకాశాల వారసత్వం అల్లాహ్‌కే చెందుతుంది. మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్‌ ఎరుగును.

3:181 – لَّقَدْ سَمِعَ اللَّـهُ قَوْلَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّـهَ فَقِيرٌ وَنَحْنُ أَغْنِيَاءُ ۘ سَنَكْتُبُ مَا قَالُوا وَقَتْلَهُمُ الْأَنبِيَاءَ بِغَيْرِ حَقٍّ وَنَقُولُ ذُوقُوا عَذَابَ الْحَرِيقِ ١٨١

”నిశ్చయంగా, అల్లాహ్‌ పేదవాడు మరియు మేము ధనవంతులము.” 103 అని చెప్పేవారి మాటలను వాస్తవంగా అల్లాహ్‌ విన్నాడు. వారు పలుకుతున్నది మరియు అన్యాయంగా ప్రవక్త లను వధించినది మేము వ్రాసిపెడుతున్నాము. మరియు (పునరుత్థాన దినమున) వారితో మేము ఇలా అంటాము: ”దహించే అగ్ని శిక్షను రుచి చూడండి!”

3:182 – ذَٰلِكَ بِمَا قَدَّمَتْ أَيْدِيكُمْ وَأَنَّ اللَّـهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ ١٨٢

ఇది మీ చేతులారా మీరు చేసి పంపుకున్న కర్మల ఫలితం. నిశ్చయంగా, అల్లాహ్‌ తన దాసులకు ఎలాంటి అన్యాయం చేసేవాడు కాడు!

3:183 – الَّذِينَ قَالُوا إِنَّ اللَّـهَ عَهِدَ إِلَيْنَا أَلَّا نُؤْمِنَ لِرَسُولٍ حَتَّىٰ يَأْتِيَنَا بِقُرْبَانٍ تَأْكُلُهُ النَّارُ ۗ قُلْ قَدْ جَاءَكُمْ رُسُلٌ مِّن قَبْلِي بِالْبَيِّنَاتِ وَبِالَّذِي قُلْتُمْ فَلِمَ قَتَلْتُمُوهُمْ إِن كُنتُمْ صَادِقِينَ ١٨٣

”అగ్ని (ఆకాశం నుండి దిగివచ్చి) బలి (ఖుర్బానీ)ని మా సమక్షంలో తిననంత వరకు మేము ఎవరినీ ప్రవక్తగా స్వీకరించగూడదని అల్లాహ్‌ మాతో వాగ్దానం తీసుకున్నాడు.” అని పలికేవారితో (యూదులతో) ఇలా అను: ”వాస్త వానికి నాకు పూర్వం మీ వద్దకు చాలా మంది ప్రవక్తలు స్పష్టమైన ఎన్నో నిదర్శనాలను తీసుకు వచ్చారు; మరియు మీరు ప్రస్తావించే ఈ నిదర్శనాన్నికూడా! మీరు సత్యవంతులే అయితే, మీరు వారిని ఎందుకు హత్యచేశారు?” 104

3:184 – فَإِن كَذَّبُوكَ فَقَدْ كُذِّبَ رُسُلٌ مِّن قَبْلِكَ جَاءُوا بِالْبَيِّنَاتِ وَالزُّبُرِ وَالْكِتَابِ الْمُنِيرِ ١٨٤

(ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు నిన్ను అసత్య వాదుడవని తిరస్కరిస్తే, నీవు (ఆశ్చర్యపడకు); వాస్తవానికి నీకు ముందు ప్రత్యక్ష నిదర్శనాలను, ‘స’హీఫా (‘జుబుర్‌) లను మరియు జ్యోతిని ప్రసాదించే గ్రంథాన్ని తీసుకువచ్చిన చాలా మంది ప్రవక్తలు కూడా అసత్యవాదులని తిరస్కరించ బడ్డారు.

3:185 – كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ ۗ وَإِنَّمَا تُوَفَّوْنَ أُجُورَكُمْ يَوْمَ الْقِيَامَةِ ۖ فَمَن زُحْزِحَ عَنِ النَّارِ وَأُدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ ۗ وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ ١٨٥

ప్రతి ప్రాణి చావును చవిచూస్తుంది. మరియు నిశ్చయంగా, తీర్పుదినమున మీ కర్మల ఫలితం మీకు పూర్తిగా ఇవ్వబడుతుంది. కావున ఎవడు నరకాగ్ని నుండి తప్పించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడతాడో! వాస్తవానికి, వాడే సఫలీ కృతుడు. మరియు ఇహలోక జీవితం కేవలం మోసపుచ్చే సుఖానుభవం మాత్రమే! (5/8)

3:186 – لَتُبْلَوُنَّ فِي أَمْوَالِكُمْ وَأَنفُسِكُمْ وَلَتَسْمَعُنَّ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ وَمِنَ الَّذِينَ أَشْرَكُوا أَذًى كَثِيرًا ۚ وَإِن تَصْبِرُوا وَتَتَّقُوا فَإِنَّ ذَٰلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ ١٨٦

  • నిశ్చయంగా మీరు, మీ ధన-ప్రాణాలతో పరీక్షింపబడతారు; మరియు నిశ్చయంగా, మీకు పూర్వం గ్రంథం ప్రసాదించబడినవారి నుండి మరియు అల్లాహ్‌కు భాగస్వాములు (సాటి) కల్పించిన వారి నుండి, మీరు అనేక వేదన కలిగించే మాటలు వింటుంటారు. కానీ, ఒకవేళ మీరు ఓర్పువహించి, దైవభీతి కలిగిఉంటే! నిశ్చయంగా, అది ఎంతో సాహసంతో కూడిన కార్యం. 105

3:187 – وَإِذْ أَخَذَ اللَّـهُ مِيثَاقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ لَتُبَيِّنُنَّهُ لِلنَّاسِ وَلَا تَكْتُمُونَهُ فَنَبَذُوهُ وَرَاءَ ظُهُورِهِمْ وَاشْتَرَوْا بِهِ ثَمَنًا قَلِيلًا ۖ فَبِئْسَ مَا يَشْتَرُونَ ١٨٧

మరియు అల్లాహ్‌, గ్రంథప్రజలతో: ”దీనిని (దైవప్రవక్త ము’హమ్మద్‌ రానున్నాడు అనే సత్యాన్ని) ప్రజలకు తెలియజేయండి మరియు దానిని దాచకండి.” అని, చేయించిన ప్రమాణాన్ని, (జ్ఞాపకం చేసుకోండి). కాని వారు దానిని తమ వీపులవెనుక పడవేసి దానికి బదులుగా స్వల్ప మూల్యాన్ని పొందారు, వారి ఈ వ్యాపారం ఎంత నీచమైనది!

3:188 – لَا تَحْسَبَنَّ الَّذِينَ يَفْرَحُونَ بِمَا أَتَوا وَّيُحِبُّونَ أَن يُحْمَدُوا بِمَا لَمْ يَفْعَلُوا فَلَا تَحْسَبَنَّهُم بِمَفَازَةٍ مِّنَ الْعَذَابِ ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ١٨٨

ఎవరైతే తాము చేసిన పనికి సంతోష పడుతూ, తాము చేయనిపనికి ప్రశంసలు లభిస్తాయని కోరుతారో, వారు శిక్ష నుండి తప్పించు కోగలరని నీవు భావించకు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

3:189 – وَلِلَّـهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١٨٩

మరియు భూమ్యాకాశాల సామ్రాజ్యాధి పత్యం కేవలం అల్లాహ్‌కే చెందినది. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.

3:190 – إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ لَآيَاتٍ لِّأُولِي الْأَلْبَابِ ١٩٠

నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలో మరియు రేయింబవళ్ళ అనుక్రమంలో (ఒకదాని తరువాత ఒకటి రావడం) మరియు వాటి హెచ్చు తగ్గులలో, బుధ్ధిమంతుల కొరకు ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి;

3:191 – الَّذِينَ يَذْكُرُونَ اللَّـهَ قِيَامًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِهِمْ وَيَتَفَكَّرُونَ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبَّنَا مَا خَلَقْتَ هَـٰذَا بَاطِلًا سُبْحَانَكَ فَقِنَا عَذَابَ النَّارِ ١٩١

ఎవరైతే నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా, అన్నివేళలా అల్లాహ్‌ను స్మరిస్తారో, భూమ్యాకాశాల నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తారో! (వారు ఇలా ప్రార్థిస్తారు): ”ఓ మా ప్రభూ! నీవు దీనిని (ఈ విశ్వాన్ని) వ్యర్థంగా సృష్టించలేదు, నీవు సర్వలోపాలకు అతీతుడవు, మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు. 106

3:192 – رَبَّنَا إِنَّكَ مَن تُدْخِلِ النَّارَ فَقَدْ أَخْزَيْتَهُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ ١٩٢

”ఓ మా ప్రభూ! నీవు ఎవడిని నరకాగ్నిలో పడవేస్తావో వాస్తవంగా వానిని నీవు అవమాన పరిచావు. మరియు దుర్మార్గులకు సహాయకులు ఎవ్వరూ ఉండరు.

3:193 – رَّبَّنَا إِنَّنَا سَمِعْنَا مُنَادِيًا يُنَادِي لِلْإِيمَانِ أَنْ آمِنُوا بِرَبِّكُمْ فَآمَنَّا ۚ رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّئَاتِنَا وَتَوَفَّنَا مَعَ الْأَبْرَارِ ١٩٣

”ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము: ‘మీ ప్రభువును విశ్వసించండి.’ అని విశ్వాసంవైపుకు పిలిచే అతని (ము’హమ్మద్‌) యొక్క పిలుపువిని, విశ్వసించాము. ఓమాప్రభూ! మాపాపాలనుక్షమించు మరియు మాలో ఉన్న చెడులను మా నుండి తొలగించు మరియు పుణ్యాత్ములతో (ధర్మ నిష్ఠాపరులతో) మమ్మల్ని మరణింపజెయ్యి!

3:194 – رَبَّنَا وَآتِنَا مَا وَعَدتَّنَا عَلَىٰ رُسُلِكَ وَلَا تُخْزِنَا يَوْمَ الْقِيَامَةِ ۗ إِنَّكَ لَا تُخْلِفُ الْمِيعَادَ ١٩٤

”ఓ మా ప్రభూ! మరియు నీ ప్రవక్తల ద్వారా నీవు మాకు చేసిన వాగ్దానాలను పూర్తిచేయి మరియు తీర్పు దినమున మమ్మల్ని అవమానపరచకు. నిశ్చయంగా, నీవు నీ వాగ్దానాలను భంగంచేయవు.”

3:195 – فَاسْتَجَابَ لَهُمْ رَبُّهُمْ أَنِّي لَا أُضِيعُ عَمَلَ عَامِلٍ مِّنكُم مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ ۖ بَعْضُكُم مِّن بَعْضٍ ۖ فَالَّذِينَ هَاجَرُوا وَأُخْرِجُوا مِن دِيَارِهِمْ وَأُوذُوا فِي سَبِيلِي وَقَاتَلُوا وَقُتِلُوا لَأُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَأُدْخِلَنَّهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ثَوَابًا مِّنْ عِندِ اللَّـهِ ۗ وَاللَّـهُ عِندَهُ حُسْنُ الثَّوَابِ ١٩٥

అప్పుడు సమాధానంగా వారి ప్రభువు, వారితో ఇలా అంటాడు: ”మీలో పురుషులు గానీ, స్త్రీలు గానీ చేసిన కర్మలను నేను వ్యర్థం కానివ్వను. మీరందరూ ఒకరికొకరు (సమానులు). 107 కనుక నా కొరకు, తమ దేశాన్ని విడిచిపెట్టి వలసపోయిన వారు, తమ గృహాల నుండి తరిమి వేయబడి (నిరాశ్రయులై, దేశ దిమ్మరులై), నా మార్గంలో పలు కష్టాలుపడిన వారు మరియు నా కొరకు పోరాడిన వారు మరియు చంపబడిన వారు; నిశ్చయంగా, ఇలాంటి వారందరి చెడులను వారి నుండి తుడిచివేస్తాను. మరియు నిశ్చయంగా, వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాను; ఇది అల్లాహ్‌ వద్ద వారికి లభించే ప్రతిఫలం. మరియు అల్లాహ్‌! ఆయన వద్దనే ఉత్తమ ప్రతిఫలం ఉంది.”

3:196 – لَا يَغُرَّنَّكَ تَقَلُّبُ الَّذِينَ كَفَرُوا فِي الْبِلَادِ ١٩٦

(ఓ ప్రవక్తా!) దేశాలలో సత్య-తిరస్కారుల సంచారం, నిన్ను మోసంలో పడవేయకూడదు! 108

3:197 – مَتَاعٌ قَلِيلٌ ثُمَّ مَأْوَاهُمْ جَهَنَّمُ ۚ وَبِئْسَ الْمِهَادُ ١٩٧

ఇది వారికి కొద్దిపాటి సుఖం మాత్రమే! తరువాత వారి ఆశ్రయం నరకమే. మరియు అది అతి అధ్వాన్నమైన నివాసస్థలము.

3:198 – لَـٰكِنِ الَّذِينَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا نُزُلًا مِّنْ عِندِ اللَّـهِ ۗ وَمَا عِندَ اللَّـهِ خَيْرٌ لِّلْأَبْرَارِ ١٩٨

కాని ఎవరైతే తమ ప్రభువునందు భయ- భక్తులు కలిగి ఉంటారో, వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలుంటాయి. అందులో వారు అల్లాహ్‌ ఆతిథ్యం పొందుతూ శాశ్వతంగా ఉంటారు. మరియు పుణ్యాత్ములకు (ధర్మనిష్ఠాపరులకు) అల్లాహ్‌ దగ్గర ఉన్నదే ఎంతో శ్రేష్ఠమైనది!

3:199 – وَإِنَّ مِنْ أَهْلِ الْكِتَابِ لَمَن يُؤْمِنُ بِاللَّـهِ وَمَا أُنزِلَ إِلَيْكُمْ وَمَا أُنزِلَ إِلَيْهِمْ خَاشِعِينَ لِلَّـهِ لَا يَشْتَرُونَ بِآيَاتِ اللَّـهِ ثَمَنًا قَلِيلًا ۗ أُولَـٰئِكَ لَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ ۗ إِنَّ اللَّـهَ سَرِيعُ الْحِسَابِ ١٩٩

మరియు నిశ్చయంగా, గ్రంథప్రజలలో, కొందరు అల్లాహ్‌ను విశ్వసిస్తారు. మరియు వారు మీకు అవతరింపజేయబడిన దానిని మరియు వారికి అవతరింపజేయబడిన దానిని (సందేశాన్ని) విశ్వసించి, అల్లాహ్‌కు వినమ్రులై, అల్లాహ్‌ సూక్తులను స్వల్పమైన మూల్యానికి అమ్ము కోరు. 109 అలాంటి వారికి వారి ప్రభువు వద్ద ప్రతి ఫలం ఉంది. నిశ్చయంగా, అల్లాహ్‌ లెక్క తీసుకోవటంలో అతిశీఘ్రుడు.

3:200 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اصْبِرُوا وَصَابِرُوا وَرَابِطُوا وَاتَّقُوا اللَّـهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ ٢٠٠

ఓ విశ్వాసులారా! సహనం వహించండి, మరియు (మిథ్యావాదుల ముందు) స్థైర్యాన్ని చూపండి. మరియు (మాటువేసి ఉండవలసిన చోట) స్థిరంగా ఉండండి. మరియు అల్లాహ్‌ పట్ల భయ-భక్తులు కలిగి ఉండండి, అప్పడే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు! 110 (3/4)

— – సూరహ్ అన్-నిసా‘ – నిసాఉ’న్‌: స్త్రీలు. ఈ సూరహ్ లో ఎన్నో ఆయతులు స్త్రీల హక్కులు, వారసత్వం, వివాహ సంబంధాలు మొదలైన వాటిని గురించి ఉన్నాయి. ఇది పూర్తిగా మదీనహ్లో అవతరింప జేయబడింది. ఇది ఉ’హుద్‌ యుధ్ధం తరువాత అవతరింపజేయబడింది, బహుశా 4వ హిజ్రీలో, అల్‌-అ’హ్‌’జాబ్‌ (33) మరియు అల్‌-ముమ్‌త’హినహ్‌ (60) సూరాహ్‌ల తరువాత. ఇందులో 5 ఆయతులు ఎంతో ఘనత గలవి ఉన్నాయి. అవి 31, 40, 48, 64 మరియు 110లు. 176 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 4:1 – يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً ۚ وَاتَّقُوا اللَّـهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ ۚ إِنَّ اللَّـهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا ١

  • ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయ-భక్తులు కలిగిఉండండి. ఆయన మిమ్మల్ని ఒకేప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట (హవ్వా)ను సృష్టించాడు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింప జేశాడు. మరియు ఆ అల్లాహ్‌ యందు భయ- భక్తులు కలిగి ఉండండి, ఎవరి ద్వారా (పేరుతో) నైతే మీరు మీ పరస్పర (హక్కులను) కోరుతారో; మరియు మీ బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి). 1 నిశ్చయంగా, అల్లాహ్‌ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని 2

4:2 – وَآتُوا الْيَتَامَىٰ أَمْوَالَهُمْ ۖ وَلَا تَتَبَدَّلُوا الْخَبِيثَ بِالطَّيِّبِ ۖ وَلَا تَأْكُلُوا أَمْوَالَهُمْ إِلَىٰ أَمْوَالِكُمْ ۚ إِنَّهُ كَانَ حُوبًا كَبِيرًا ٢

మరియు అనాథుల ఆస్తిపాస్తులను వారికి తిరిగి ఇవ్వండి. మరియు (మీ) చెడ్డ వస్తువులను (వారి) మంచి వస్తువులతో మార్చకండి. మరియు వారి ఆస్తులను మీ ఆస్తులతో కలిపి తినివేయకండి. నిశ్చయంగా, ఇది గొప్ప నేరం (పాపం).

4:3 – وَإِنْ خِفْتُمْ أَلَّا تُقْسِطُوا فِي الْيَتَامَىٰ فَانكِحُوا مَا طَابَ لَكُم مِّنَ النِّسَاءِ مَثْنَىٰ وَثُلَاثَ وَرُبَاعَ ۖ فَإِنْ خِفْتُمْ أَلَّا تَعْدِلُوا فَوَاحِدَةً أَوْ مَا مَلَكَتْ أَيْمَانُكُمْ ۚ ذَٰلِكَ أَدْنَىٰ أَلَّا تَعُولُوا ٣

మరియు అనాథ బాలికలకు న్యాయం చేయలేమనే భయం మీకు ఉంటే, మీకు నచ్చిన (ఇతర) స్త్రీలను ఇద్దరిని గానీ, ముగ్గురినిగానీ, నలుగురినిగానీ వివాహంచేసుకోండి. అయితే వారితో న్యాయంగా వ్యవహరించలేమనే భయం మీకు ఉంటే, ఒకామెను మాత్రమే; 3 లేదా మీ స్వాధీనంలో నున్న వారిని (బానిస స్త్రీలను దాంపత్యంలోకి) తీసుకోండి. 4 ఒకే వైపునకు మొగ్గ కుండా (అన్యాయవర్తన నుండి దూరంగా ఉండ టానికి) ఇదే సముచితమైన మార్గం.

4:4 – وَآتُوا النِّسَاءَ صَدُقَاتِهِنَّ نِحْلَةً ۚ فَإِن طِبْنَ لَكُمْ عَن شَيْءٍ مِّنْهُ نَفْسًا فَكُلُوهُ هَنِيئًا مَّرِيئًا ٤

మరియు స్త్రీలకు వారి మహ్ర్ (వధుకట్నం) సహృదయంతో ఇవ్వండి. కాని వారు తమంతట తామే సంతోషంగా కొంత భాగాన్ని మీకు విడిచి పెడితే, దానిని సంతోషంగా స్వేచ్ఛగా అనుభవించండి (తినండి).

4:5 – وَلَا تُؤْتُوا السُّفَهَاءَ أَمْوَالَكُمُ الَّتِي جَعَلَ اللَّـهُ لَكُمْ قِيَامًا وَارْزُقُوهُمْ فِيهَا وَاكْسُوهُمْ وَقُولُوا لَهُمْ قَوْلًا مَّعْرُوفًا ٥

మరియు అల్లాహ్‌ మీకు నిర్వహించటానికి అప్పగించిన ఆస్తులను, అవివేకులుగా ఉన్నప్పుడు (అనాథులకు) అప్పగించకండి. 5 దాని నుండి వారికి అన్న-వస్త్రాలు ఇస్తూ ఉండండి. మరియు వారితో వాత్సల్యంతో మాట్లాడండి.

4:6 – وَابْتَلُوا الْيَتَامَىٰ حَتَّىٰ إِذَا بَلَغُوا النِّكَاحَ فَإِنْ آنَسْتُم مِّنْهُمْ رُشْدًا فَادْفَعُوا إِلَيْهِمْ أَمْوَالَهُمْ ۖ وَلَا تَأْكُلُوهَا إِسْرَافًا وَبِدَارًا أَن يَكْبَرُوا ۚ وَمَن كَانَ غَنِيًّا فَلْيَسْتَعْفِفْ ۖ وَمَن كَانَ فَقِيرًا فَلْيَأْكُلْ بِالْمَعْرُوفِ ۚ فَإِذَا دَفَعْتُمْ إِلَيْهِمْ أَمْوَالَهُمْ فَأَشْهِدُوا عَلَيْهِمْ ۚ وَكَفَىٰ بِاللَّـهِ حَسِيبًا ٦

మరియు వివాహ యోగ్యమైన వయస్సు వచ్చే వరకూ మీరు అనాథులను పరీక్షించండి, ఇక వారిలో మీకు యోగ్యత కనిపించినప్పుడు, వారి ఆస్తులను వారికి అప్పగించండి. మరియు వారు పెరిగి పెద్దవారు అవుతారనే తలంపుతో దానిని (వారి ఆస్తిని) త్వరపడి అపరిమితంగా తినకండి. మరియు అతడు (సంరక్షకుడు) సంపన్నుడైతే, వారి సొమ్ముకు దూరంగా ఉండాలి. కాని అతడు పేదవాడైతే, దాని నుండి ధర్మసమ్మతంగా తినాలి. ఇక వారి ఆస్తిని, వారికి అప్పగించేటప్పుడు దానికి సాక్షులను పెట్టుకోండి. మరియు లెక్కతీసుకోవ టానికి 6 అల్లాహ్ చాలు!

4:7 – لِّلرِّجَالِ نَصِيبٌ مِّمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ وَلِلنِّسَاءِ نَصِيبٌ مِّمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ مِمَّا قَلَّ مِنْهُ أَوْ كَثُرَ ۚ نَصِيبًا مَّفْرُوضًا ٧

పురుషులకు వారి తల్లి-దండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపోయిన దానిలో (ఆస్తిలో) భాగముంది మరియు స్త్రీలకు కూడా వారి తల్లి-దండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచి పోయిన దానిలో భాగముంది; 7 అది తక్కువైనా సరే, లేదా ఎక్కువైనా సరే. అది (అల్లాహ్‌) విధిగా నియమించిన భాగం.

4:8 – وَإِذَا حَضَرَ الْقِسْمَةَ أُولُو الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينُ فَارْزُقُوهُم مِّنْهُ وَقُولُوا لَهُمْ قَوْلًا مَّعْرُوفًا ٨

మరియు (ఆస్తి) పంపకంజరిగేటప్పుడు ఇతర బంధువులుగానీ, అనాథులు గానీ, పేదవారు గానీ ఉంటే, దాని నుండి వారికి కూడా కొంత ఇవ్వండి 8 మరియు వారితో వాత్సల్యంగా మాట్లాడండి.

4:9 – وَلْيَخْشَ الَّذِينَ لَوْ تَرَكُوا مِنْ خَلْفِهِمْ ذُرِّيَّةً ضِعَافًا خَافُوا عَلَيْهِمْ فَلْيَتَّقُوا اللَّـهَ وَلْيَقُولُوا قَوْلًا سَدِيدًا ٩

మరియు (పంపకం చేసేటప్పుడు, పంపకం చేసేవారు), ఒకవేళ తామే తమ పిల్లలను నిస్సహాయులుగా విడిచిపోతే, ఏవిధంగా వారిని గురించి భయపడతారో, అదేవిధంగా భయ పడాలి. వారు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండి, యుక్తమైన మాటలనే పలకాలి.

4:10 – إِنَّ الَّذِينَ يَأْكُلُونَ أَمْوَالَ الْيَتَامَىٰ ظُلْمًا إِنَّمَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ نَارًا ۖ وَسَيَصْلَوْنَ سَعِيرًا ١٠

నిశ్చయంగా, అన్యాయంగా అనాథుల ఆస్తులను, తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. మరియు వారు సమీపంలోనే భగభగమండే నరకాగ్నిలో కాల్చబడతారు.

4:11 – يُوصِيكُمُ اللَّـهُ فِي أَوْلَادِكُمْ ۖ لِلذَّكَرِ مِثْلُ حَظِّ الْأُنثَيَيْنِ ۚ فَإِن كُنَّ نِسَاءً فَوْقَ اثْنَتَيْنِ فَلَهُنَّ ثُلُثَا مَا تَرَكَ ۖ وَإِن كَانَتْ وَاحِدَةً فَلَهَا النِّصْفُ ۚ وَلِأَبَوَيْهِ لِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ مِمَّا تَرَكَ إِن كَانَ لَهُ وَلَدٌ ۚ فَإِن لَّمْ يَكُن لَّهُ وَلَدٌ وَوَرِثَهُ أَبَوَاهُ فَلِأُمِّهِ الثُّلُثُ ۚ فَإِن كَانَ لَهُ إِخْوَةٌ فَلِأُمِّهِ السُّدُسُ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصِي بِهَا أَوْ دَيْنٍ ۗ آبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ لَا تَدْرُونَ أَيُّهُمْ أَقْرَبُ لَكُمْ نَفْعًا ۚ فَرِيضَةً مِّنَ اللَّـهِ ۗ إِنَّ اللَّـهَ كَانَ عَلِيمًا حَكِيمًا ١١

మీ సంతాన వారసత్వాన్ని గురించి అల్లాహ్‌ మీకు ఈ విధంగా ఆదేశిస్తున్నాడు: ఒక పురుషుని (భాగం) ఇద్దరుస్త్రీల భాగాలకు సమానంగా ఉండాలి. 9 ఒకవేళ ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ స్త్రీ (సంతానం మాత్రమే) ఉంటే, వారికి విడిచిన ఆస్తిలో మూడింట-రెండు భాగాలు ఉంటాయి. మరియు ఒకవేళ ఒకే ఆడపిల్ల ఉంటే అర్ధ-భాగానికి ఆమె హక్కు దారురాలు. 10 మరియు (మృతుడు) సంతానం కలవాడైతే, అతని తల్లి-దండ్రులో ప్రతి ఒక్కరికీ విడిచిన ఆస్తిలో ఆరో-భాగం లభిస్తుంది. ఒకవేళ అతనికి సంతానం లేకుంటే, అతని తల్లిదండ్రులు మాత్రమే వారసులుగా ఉంటే, అప్పుడు తల్లికి మూడో భాగం. 11 మృతునికి సోదర సోదరీమణులు ఉంటే, తల్లికి ఆరో-భాగం. 12 (ఈ పంపకమంతా) మృతుని అప్పులు తీర్చి, అతని వీలునామాపై అమలు జరిపిన తరువాతనే జరగాలి. మీ తల్లిదండ్రులు మరియు మీ సంతానంలో ప్రయోజనంరీత్యా, మీకు ఎవరు ఎక్కువ సన్నిహితులో, మీకు తెలియదు. ఇది అల్లాహ్‌ నియమించిన విధానం. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు. (7/8)

4:12 – وَلَكُمْ نِصْفُ مَا تَرَكَ أَزْوَاجُكُمْ إِن لَّمْ يَكُن لَّهُنَّ وَلَدٌ ۚ فَإِن كَانَ لَهُنَّ وَلَدٌ فَلَكُمُ الرُّبُعُ مِمَّا تَرَكْنَ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصِينَ بِهَا أَوْ دَيْنٍ ۚ وَلَهُنَّ الرُّبُعُ مِمَّا تَرَكْتُمْ إِن لَّمْ يَكُن لَّكُمْ وَلَدٌ ۚ فَإِن كَانَ لَكُمْ وَلَدٌ فَلَهُنَّ الثُّمُنُ مِمَّا تَرَكْتُم ۚ مِّن بَعْدِ وَصِيَّةٍ تُوصُونَ بِهَا أَوْ دَيْنٍ ۗ وَإِن كَانَ رَجُلٌ يُورَثُ كَلَالَةً أَوِ امْرَأَةٌ وَلَهُ أَخٌ أَوْ أُخْتٌ فَلِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ ۚ فَإِن كَانُوا أَكْثَرَ مِن ذَٰلِكَ فَهُمْ شُرَكَاءُ فِي الثُّلُثِ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصَىٰ بِهَا أَوْ دَيْنٍ غَيْرَ مُضَارٍّ ۚ وَصِيَّةً مِّنَ اللَّـهِ ۗ وَاللَّـهُ عَلِيمٌ حَلِيمٌ ١٢

మరియు మీ భార్యలకు సంతానం లేని పక్షంలో, 13 వారు విడిచిపోయిన దానిలో మీకు అర్ధ భాగం. కాని ఒకవేళ వారికి సంతానం ఉంటే, వారు విడిచిపోయిన దానిలో నాలుగో-భాగం మీది. (ఇదంతా) వారు వ్రాసిపోయిన వీలునామాపై అమలు జరిపి, వారి అప్పులు తీర్చిన తరువాత. 14 మరియు మీకు సంతానం లేని పక్షంలో మీరు విడిచి పోయిన దానిలో వారికి (మీ భార్యలకు) నాలుగో-భాగం. కాని ఒకవేళ మీకు సంతానం ఉంటే, మీరు విడిచిన దానిలో వారికి ఎనిమిదో-భాగం. 15 ఇదంతా మీరు వ్రాసిన వీలునామా పై అమలు జరిగి, మీ అప్పులు తీర్చిన తరువాత. మరియు ఒకవేళ మరణించిన పురుషుడు లేక స్త్రీ కలాల అయి (తండ్రి, కొడుకు లేక మనమడు లేకుండా) ఒక సోదరుడు మరియు ఒక సోదరి మాత్రమే ఉంటే, వారిలో ప్రతి ఒక్కరికీ ఆరో-భాగం. కాని ఒకవేళ వారు (సోదర- సోదరీమణులు) ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే, వారంతా మూడో-భాగానికి వారసులవుతారు. 16 ఇదంతా మృతుడు వ్రాసిన వీలునామాపై అమలు జరిగి అప్పులు తీర్చిన తరువాత, ఎవ్వరికీ నష్టం కలుగజేయకుండా జరగాలి 17 ఇది అల్లాహ్‌ నుండి వచ్చిన ఆదేశం. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, సహనశీలుడు (శాంత స్వభావుడు).

4:13 – تِلْكَ حُدُودُ اللَّـهِ ۚ وَمَن يُطِعِ اللَّـهَ وَرَسُولَهُ يُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ ١٣

ఇవి అల్లాహ్‌ (విధించిన) హద్దులు. ఎవరైతే అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారో, వారిని ఆయన క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. మరియు ఇదే గొప్ప సాఫల్యం (విజయం).

4:14 – وَمَن يَعْصِ اللَّـهَ وَرَسُولَهُ وَيَتَعَدَّ حُدُودَهُ يُدْخِلْهُ نَارًا خَالِدًا فِيهَا وَلَهُ عَذَابٌ مُّهِينٌ ١٤

మరియు ఎవడైతే, అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు అవిధేయుడై, ఆయన నియమా లను ఉల్లంఘిస్తాడో! అలాంటి వాడు నరకాగ్నిలోకి త్రోయబడతాడు అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు. మరియు అతడికి అవమానకరమైన శిక్ష ఉంటుంది.

4:15 – وَاللَّاتِي يَأْتِينَ الْفَاحِشَةَ مِن نِّسَائِكُمْ فَاسْتَشْهِدُوا عَلَيْهِنَّ أَرْبَعَةً مِّنكُمْ ۖ فَإِن شَهِدُوا فَأَمْسِكُوهُنَّ فِي الْبُيُوتِ حَتَّىٰ يَتَوَفَّاهُنَّ الْمَوْتُ أَوْ يَجْعَلَ اللَّـهُ لَهُنَّ سَبِيلً ١٥

మరియు మీ స్త్రీలలో ఎవరైనా వ్యభిచారా నికి పాల్పడితే, వారికి వ్యతిరేకంగా, మీలో నుండి నలుగురి సాక్ష్యం తీసుకోండి. వారు (నలుగురు) సాక్ష్యమిస్తే, వారు మరణించేవరకైనా, లేదా వారి కొరకు అల్లాహ్‌ ఏదైనా మార్గం చూపించే వరకైనా వారిని ఇండ్లలో నిర్బంధించండి 18

4:16 – وَاللَّذَانِ يَأْتِيَانِهَا مِنكُمْ فَآذُوهُمَا ۖ فَإِن تَابَا وَأَصْلَحَا فَأَعْرِضُوا عَنْهُمَا ۗ إِنَّ اللَّـهَ كَانَ تَوَّابًا رَّحِيمًا ١٦

మరియు మీలో ఏ ఇద్దరూ (స్త్రీలు గానీ, పురుషులు గానీ) దీనికి (వ్యభిచారానికి) పాల్పడితే వారిద్దరినీ శిక్షించండి. వారు పశ్చాత్తాపపడి తమ ప్రవర్తనను సవరించుకుంటే వారిని విడిచిపెట్టండి. నిశ్చయంగా, అల్లాహ్‌యే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణాప్రదాత. 19

4:17 – إِنَّمَا التَّوْبَةُ عَلَى اللَّـهِ لِلَّذِينَ يَعْمَلُونَ السُّوءَ بِجَهَالَةٍ ثُمَّ يَتُوبُونَ مِن قَرِيبٍ فَأُولَـٰئِكَ يَتُوبُ اللَّـهُ عَلَيْهِمْ ۗ وَكَانَ اللَّـهُ عَلِيمًا حَكِيمًا ١٧

నిశ్చయంగా, పశ్చాత్తాపాన్ని అంగీక రించటం అల్లాహ్‌కే చెందినది. ఎవరైతే అజ్ఞానం వల్ల పాపం చేసి, వెనువెంటనే పశ్చాత్తాపపడతారో! అలాంటివారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్‌ స్వీకరిస్తాడు. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు మహా వివేచనాపరుడు.

4:18 – وَلَيْسَتِ التَّوْبَةُ لِلَّذِينَ يَعْمَلُونَ السَّيِّئَاتِ حَتَّىٰ إِذَا حَضَرَ أَحَدَهُمُ الْمَوْتُ قَالَ إِنِّي تُبْتُ الْآنَ وَلَا الَّذِينَ يَمُوتُونَ وَهُمْ كُفَّارٌ ۚ أُولَـٰئِكَ أَعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًا ١٨

మరియు వారిలో ఒకడు, మరణం ఆసన్న మయ్యే వరకూ పాపకార్యాలు చేస్తూవుండి: ”ఇప్పుడు నేను పశ్చాత్తాపపడుతున్నాను!” అని అంటే, అలాంటి వారి పశ్చాత్తాపం మరియు మరణించేవరకు సత్య-తిరస్కారులుగా ఉన్నవారి (పశ్చాత్తాపం) స్వీకరించబడవు 20 అలాంటి వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిధ్ధపరచి ఉంచాము.

4:19 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا يَحِلُّ لَكُمْ أَن تَرِثُوا النِّسَاءَ كَرْهًا ۖ وَلَا تَعْضُلُوهُنَّ لِتَذْهَبُوا بِبَعْضِ مَا آتَيْتُمُوهُنَّ إِلَّا أَن يَأْتِينَ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ ۚ وَعَاشِرُوهُنَّ بِالْمَعْرُوفِ ۚ فَإِن كَرِهْتُمُوهُنَّ فَعَسَىٰ أَن تَكْرَهُوا شَيْئًا وَيَجْعَلَ اللَّـهُ فِيهِ خَيْرًا كَثِيرًا ١٩

ఓ విశ్వాసులారా! మీరు బలవంతంగా స్త్రీలకు వారసులు కావటం మీకు ధర్మసమ్మతం కాదు. మరియు మీరు వారికిచ్చిన దాని (మహ్ర్‌) నుండి కొంత తీసుకోవటానికి వారిని ఇబ్బందిలో పెట్టకండి, వారు నిస్సందేహంగా వ్యభిచారానికి పాల్పడితే తప్ప 21 మరియు మీరు వారితో గౌరవంతో సహవాసం చేయండి. ఒకవేళ మీకు, వారు నచ్చకపోతే! బహుశా మీకు ఒక విషయం నచ్చకపోవచ్చు, కాని అందులోనే అల్లాహ్‌ ఎంతో మేలు ఉంచి ఉండవచ్చు!

4:20 – وَإِنْ أَرَدتُّمُ اسْتِبْدَالَ زَوْجٍ مَّكَانَ زَوْجٍ وَآتَيْتُمْ إِحْدَاهُنَّ قِنطَارًا فَلَا تَأْخُذُوا مِنْهُ شَيْئًا ۚ أَتَأْخُذُونَهُ بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا ٢٠

మరియు ఒకవేళ మీరు ఒక భార్యను విడనాడి వేరొకామెను పెండ్లి చేసుకోవాలని సంకల్పించుకుంటే! మరియు మీరు ఆమెకు ఒక పెద్ద ధనరాశిని ఇచ్చి ఉన్నా సరే, దాని నుండి ఏ మాత్రం తిరిగి తీసుకోకండి. ఏమీ? ఆమెపై అపనింద మోపి, ఘోరపాపానికి పాల్పడి, దాన్ని తిరిగి తీసుకుంటారా?

4:21 – وَكَيْفَ تَأْخُذُونَهُ وَقَدْ أَفْضَىٰ بَعْضُكُمْ إِلَىٰ بَعْضٍ وَأَخَذْنَ مِنكُم مِّيثَاقًا غَلِيظًا ٢١

మరియు మీరు పరస్పరం దాంపత్య సుఖం అనుభవించిన తరువాత, వారు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తరువాత, మీరు దానిని (మహ్ర్‌ను) ఎలా తిరిగి తీసుకోగలరు?

4:22 – وَلَا تَنكِحُوا مَا نَكَحَ آبَاؤُكُم مِّنَ النِّسَاءِ إِلَّا مَا قَدْ سَلَفَ ۚ إِنَّهُ كَانَ فَاحِشَةً وَمَقْتًا وَسَاءَ سَبِيلًا ٢٢

మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు వివాహమాడకండి. ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. నిశ్చయంగా, ఇది అసభ్యకర మైనది (సిగ్గుమాలినది), జుగుప్సాకరమైనది మరియు చెడు మార్గము.

4:23 – حُرِّمَتْ عَلَيْكُمْ أُمَّهَاتُكُمْ وَبَنَاتُكُمْ وَأَخَوَاتُكُمْ وَعَمَّاتُكُمْ وَخَالَاتُكُمْ وَبَنَاتُ الْأَخِ وَبَنَاتُ الْأُخْتِ وَأُمَّهَاتُكُمُ اللَّاتِي أَرْضَعْنَكُمْ وَأَخَوَاتُكُم مِّنَ الرَّضَاعَةِ وَأُمَّهَاتُ نِسَائِكُمْ وَرَبَائِبُكُمُ اللَّاتِي فِي حُجُورِكُم مِّن نِّسَائِكُمُ اللَّاتِي دَخَلْتُم بِهِنَّ فَإِن لَّمْ تَكُونُوا دَخَلْتُم بِهِنَّ فَلَا جُنَاحَ عَلَيْكُمْ وَحَلَائِلُ أَبْنَائِكُمُ الَّذِينَ مِنْ أَصْلَابِكُمْ وَأَن تَجْمَعُوا بَيْنَ الْأُخْتَيْنِ إِلَّا مَا قَدْ سَلَفَ ۗ إِنَّ اللَّـهَ كَانَ غَفُورًا رَّحِيمًا ٢٣

మీకు ఈ స్త్రీలు నిషేధించబడ్డారు. 22 మీతల్లులు, మీ కుమార్తెలు, మీ సోదరీమణులు, మీ మేనత్తలు, మీతల్లి సోదరీమణులు (పిన-తల్లులు), మీ సోదరుల కుమార్తెలు, మీ సోదరీమణుల కుమార్తెలు, మీకు పాలిచ్చిన తల్లులు (దాదులు) మీతో పాటు పాలుత్రాగిన సోదరీమణులు, మీ భార్యల-తల్లులు; మీ సంరక్షణలో ఉన్న మీ భార్యల-కుమార్తెలు – ఏ భార్యలతోనైతే మీరు సంభోగించారో – కాని మీరు వారితో సంభోగించక ముందు (వారికి విడాకులిచ్చి వారి కూతుళ్లను పెండ్లాడితే) తప్పు లేదు; మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమారుల భార్యలు మరియు ఏక కాలంలో అక్కాచెల్లెళ్ళను ఇద్దరినీ చేర్చటం (భార్యలుగా చేసుకోవటం నిషిద్ధం); కాని ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగి పోయింది. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

4:24 – وَالْمُحْصَنَاتُ مِنَ النِّسَاءِ إِلَّا مَا مَلَكَتْ أَيْمَانُكُمْ ۖ كِتَابَ اللَّـهِ عَلَيْكُمْ ۚ وَأُحِلَّ لَكُم مَّا وَرَاءَ ذَٰلِكُمْ أَن تَبْتَغُوا بِأَمْوَالِكُم مُّحْصِنِينَ غَيْرَ مُسَافِحِينَ ۚ فَمَا اسْتَمْتَعْتُم بِهِ مِنْهُنَّ فَآتُوهُنَّ أُجُورَهُنَّ فَرِيضَةً ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا تَرَاضَيْتُم بِهِ مِن بَعْدِ الْفَرِيضَةِ ۚ إِنَّ اللَّـهَ كَانَ عَلِيمًا حَكِيمًا ٢٤

మరియు ఇతరుల వివాహబంధంలో ఉన్న స్త్రీలు – (ధర్మయుధ్ధంలో) మీ చేతికి చిక్కిన బానిస స్త్రీలు తప్ప – (మీరు వివాహమాడటానికి నిషేధించబడ్డారు). ఇది అల్లాహ్‌ మీకు విధించిన అనుశాసనం. మరియు వీరు తప్ప మిగతా స్త్రీలంతా మీకు వివాహమాడటానికి ధర్మ సమ్మతం చేయబడ్డారు. మీరు వారికి తగిన మహ్ర్‌ (వధుకట్నం) ఇచ్చి వ్యభిచారంగా కాకుండా వివాహబంధంలో తీసుకోవటానికి కోర వచ్చు. కావున మీరు దాంపత్యసుఖాన్ని అనుభ వించాలనుకున్న వారికి వారి మహ్ర్‌ (వధుకట్నం) విధిగా చెల్లించండి. కాని మహ్ర్‌ (వధుకట్నం) ఒప్పందం జరిగిన తరువాత పరస్పర అంగీ కారంతో మీ మధ్య ఏమైనా రాజీ కుదిరితే, అందులో దోషం లేదు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

4:25 – وَمَن لَّمْ يَسْتَطِعْ مِنكُمْ طَوْلًا أَن يَنكِحَ الْمُحْصَنَاتِ الْمُؤْمِنَاتِ فَمِن مَّا مَلَكَتْ أَيْمَانُكُم مِّن فَتَيَاتِكُمُ الْمُؤْمِنَاتِ ۚ وَاللَّـهُ أَعْلَمُ بِإِيمَانِكُم ۚ بَعْضُكُم مِّن بَعْضٍ ۚ فَانكِحُوهُنَّ بِإِذْنِ أَهْلِهِنَّ وَآتُوهُنَّ أُجُورَهُنَّ بِالْمَعْرُوفِ مُحْصَنَاتٍ غَيْرَ مُسَافِحَاتٍ وَلَا مُتَّخِذَاتِ أَخْدَانٍ ۚ فَإِذَا أُحْصِنَّ فَإِنْ أَتَيْنَ بِفَاحِشَةٍ فَعَلَيْهِنَّ نِصْفُ مَا عَلَى الْمُحْصَنَاتِ مِنَ الْعَذَابِ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِيَ الْعَنَتَ مِنكُمْ ۚ وَأَن تَصْبِرُوا خَيْرٌ لَّكُمْ ۗ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٢٥

మరియు మీలో ఎవరికైనా స్వతంత్రులైన ముస్లింస్త్రీలను వివాహంచేసుకునే స్తోమత లేకుంటే అప్పుడు మీ స్వాధీనంలో ఉన్న ముస్లిం లైనటు వంటి బానిసస్త్రీలను వివాహమాడవచ్చు.మరియు అల్లాహ్‌ కు మీవిశ్వాసం గురించితెలుసు. మీరంతా ఒకేఒక వర్గానికి చెందినవారు 23 (ఒకరికొకరు సంబంధించిన వారు), అందువల్ల వారి సంరక్షకుల అనుమతితో వారితో వివాహం చేసుకొని ధర్మ ప్రకారంగా వారి మహ్ర్‌ (వధుకట్నం) ఇవ్వండి. ఇది వారిని వివాహబంధంలో సురక్షితంగా ఉంచ టానికి, స్వేచ్ఛా కామ-క్రీడలకు దిగకుండా ఉంచ టానికి మరియు దొంగచాటు సంబంధాలు ఏర్పరచు కోకుండాఉంచటానికి (ఆదేశించబడింది). వారు (ఆ బానిసస్త్రీలు) వివాహబంధంలో రక్షణ పొందిన తరువాత కూడా వ్యభిచారానికి పాల్పడితే స్వతంత్రులైన స్త్రీలకు విధించే శిక్షలోని సగం శిక్ష వారికి విధించండి. 24 ఇది మీలో పాపభీతి గల వారికి వర్తిస్తుంది. ఒకవేళ మీరు నిగ్రహం పాటిస్తే అది మీకే మంచిది. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు. అపార కరుణాప్రదాత.

4:26 – يُرِيدُ اللَّـهُ لِيُبَيِّنَ لَكُمْ وَيَهْدِيَكُمْ سُنَنَ الَّذِينَ مِن قَبْلِكُمْ وَيَتُوبَ عَلَيْكُمْ ۗ وَاللَّـهُ عَلِيمٌ حَكِيمٌ ٢٦

అల్లాహ్‌ మీకు (ధర్మ-అధర్మాలను) స్పష్టం చేయాలనీ మరియు మీ కంటే పూర్వం ఉన్న (సత్పురుషుల) మార్గం వైపునకు, మీకు మార్గ దర్శకత్వం చేయాలనీ మరియు మీ పశ్చాత్తా పాన్ని అంగీకరించాలనీ కోరుతున్నాడు. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

4:27 – وَاللَّـهُ يُرِيدُ أَن يَتُوبَ عَلَيْكُمْ وَيُرِيدُ الَّذِينَ يَتَّبِعُونَ الشَّهَوَاتِ أَن تَمِيلُوا مَيْلًا عَظِيمًا ٢٧

మరియు అల్లాహ్‌ మీ పశ్చాత్తాపాన్ని అంగీక రించగోరుతున్నాడు. కాని తమ మనోవాంఛలను అనుసరిస్తున్నవారు, మీరు (సన్మార్గం నుండి) చాలా దూరంగా వైదొలగాలని కోరుతున్నారు.

4:28 – يُرِيدُ اللَّـهُ أَن يُخَفِّفَ عَنكُمْ ۚ وَخُلِقَ الْإِنسَانُ ضَعِيفًا ٢٨

అల్లాహ్‌ మీ భారాన్ని తగ్గించ గోరు తున్నాడు. మరియు (ఎందుకంటే) మానవుడు బలహీనుడిగా సృష్టించబడ్డాడు.

4:29 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَأْكُلُوا أَمْوَالَكُم بَيْنَكُم بِالْبَاطِلِ إِلَّا أَن تَكُونَ تِجَارَةً عَن تَرَاضٍ مِّنكُمْ ۚ وَلَا تَقْتُلُوا أَنفُسَكُمْ ۚ إِنَّ اللَّـهَ كَانَ بِكُمْ رَحِيمًا ٢٩

ఓవిశ్వాసులారా! మీరు ఒకరి సొమ్మునొకరు అన్యాయంగా తినకండి, పరస్పర అంగీకారంతో చేసే వ్యాపారం వల్ల వచ్చేది (లాభం) తప్ప. 25 మరియు మీరు ఒకరినొకరు చంపుకోకండి 26 నిశ్చ యంగా, అల్లాహ్‌ మీ యెడల అపార కరుణాప్రదాత.

4:30 – وَمَن يَفْعَلْ ذَٰلِكَ عُدْوَانًا وَظُلْمًا فَسَوْفَ نُصْلِيهِ نَارًا ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّـهِ يَسِيرًا ٣٠

మరియు ఎవడు ద్వేషంతో మరియు దుర్మార్గంతో అలాచేస్తాడో, వానిని మేము నరకాగ్నిలో పడవేస్తాము. మరియు అది అల్లాహ్‌ కు ఎంతో సులభం.

4:31 – إِن تَجْتَنِبُوا كَبَائِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَنُدْخِلْكُم مُّدْخَلًا كَرِيمًا ٣١

ఒకవేళ మీకు నిషేధించబడినటువంటి మహా పాపాలకు మీరు దూరంగా ఉంటే, మేము మీ చిన్నచిన్న దోషాలను మన్నించి, మిమ్మల్ని గౌరవ స్థానాల్లోకి ప్రవేశింపజేస్తాము. 27

4:32 – وَلَا تَتَمَنَّوْا مَا فَضَّلَ اللَّـهُ بِهِ بَعْضَكُمْ عَلَىٰ بَعْضٍ ۚ لِّلرِّجَالِ نَصِيبٌ مِّمَّا اكْتَسَبُوا ۖ وَلِلنِّسَاءِ نَصِيبٌ مِّمَّا اكْتَسَبْنَ ۚ وَاسْأَلُوا اللَّـهَ مِن فَضْلِهِ ۗ إِنَّ اللَّـهَ كَانَ بِكُلِّ شَيْءٍ عَلِيمًا ٣٢

మరియు అల్లాహ్‌ మీలో కొందరికి మరి కొందరిపై ఇచ్చిన ఘనతను మీరు ఆశించకండి. పురుషులకు తాము సంపాదించిన దానికి తగినట్లుగా ఫలితం ఉంటుంది. మరియు స్త్రీలకు తాము సంపాదించిన దానికి తగినట్లుగా ఫలితం ఉంటుంది. మరియు అల్లాహ్‌ అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ కు ప్రతిదాని పరిజ్ఞానం ఉంది.

4:33 – وَلِكُلٍّ جَعَلْنَا مَوَالِيَ مِمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ ۚ وَالَّذِينَ عَقَدَتْ أَيْمَانُكُمْ فَآتُوهُمْ نَصِيبَهُمْ ۚ إِنَّ اللَّـهَ كَانَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدًا ٣٣

మరియు తల్లి-దండ్రులు మరియు దగ్గరి బంధువులు, వదలి పోయిన ప్రతి వ్యక్తి (ఆస్తి)కి మేము వారసులను నియమించివున్నాము. మరియు మీరు ఎవరితో ప్రమాణ పూర్వక ఒప్పందాలు చేసుకొని ఉన్నారో! వారి భాగాన్ని వారికి ఇచ్చివేయండి. నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రతిదానికి సాక్షిగా ఉంటాడు. 28

4:34 – الرِّجَالُ قَوَّامُونَ عَلَى النِّسَاءِ بِمَا فَضَّلَ اللَّـهُ بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ وَبِمَا أَنفَقُوا مِنْ أَمْوَالِهِمْ ۚ فَالصَّالِحَاتُ قَانِتَاتٌ حَافِظَاتٌ لِّلْغَيْبِ بِمَا حَفِظَ اللَّـهُ ۚ وَاللَّاتِي تَخَافُونَ نُشُوزَهُنَّ فَعِظُوهُنَّ وَاهْجُرُوهُنَّ فِي الْمَضَاجِعِ وَاضْرِبُوهُنَّ ۖ فَإِنْ أَطَعْنَكُمْ فَلَا تَبْغُوا عَلَيْهِنَّ سَبِيلًا ۗ إِنَّ اللَّـهَ كَانَ عَلِيًّا كَبِيرًا ٣٤

పురుషులు స్త్రీలపై నిర్వాహకులు (ఖవ్వామూన్‌), 29 ఎందుకంటే అల్లాహ్‌ కొందరికి మరి కొందరిపై ఘనతనిచ్చాడు మరియు వారు (పురుషులు) తమ సంపదలో నుండి వారిపై (స్త్రీలపై) ఖర్చుచేస్తారు. కావున సుగుణవంతులైన స్త్రీలు విధేయవతులై ఉండి, భర్తలు లేనప్పుడు, అల్లాహ్‌ కాపాడమని ఆజ్ఞాపించిన దానిని (శీలమును) కాపాడుకుంటారు. కానీ అవిధేయత చూపుతారని మీకు భయముంటే, వారికి (మొదట) నచ్చజెప్పండి, (తరువాత) పడకలో వేరుగా ఉంచండి, (ఆ తరువాత కూడా వారు విధేయులు కాకపోతే) వారిని (మెల్లగా) కొట్టండి. 30 కాని వారు మీకు విధేయులై ఉంటే! వారిని నిందించటానికి మార్గం వెతకకండి. నిశ్చయంగా, అల్లాహ్‌ మహోన్నతుడు, మహనీయుడు. 31

4:35 – وَإِنْ خِفْتُمْ شِقَاقَ بَيْنِهِمَا فَابْعَثُوا حَكَمًا مِّنْ أَهْلِهِ وَحَكَمًا مِّنْ أَهْلِهَا إِن يُرِيدَا إِصْلَاحًا يُوَفِّقِ اللَّـهُ بَيْنَهُمَا ۗ إِنَّ اللَّـهَ كَانَ عَلِيمًا خَبِيرًا ٣٥

మరియు వారిద్దరి (భార్యా-భర్తల) మధ్య సంబంధాలు తెగిపోతాయనే భయం మీకు కలిగితే, అతని (భర్త) బంధువుల నుండి ఒక మధ్యవర్తిని మరియు ఆమె (భార్య) బంధువుల నుండి ఒక మధ్యవర్తిని నియమించండి. వారిద్దరూ సంధి చేసుకోగోరితే అల్లాహ్‌ వారి మధ్య ఐకమత్యం చేకూర్చవచ్చు! నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, సర్వం తెలిసిన వాడు. (1/8)

4:36 – وَاعْبُدُوا اللَّـهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا ۖ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَبِذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَالْجَارِ ذِي الْقُرْبَىٰ وَالْجَارِ الْجُنُبِ وَالصَّاحِبِ بِالْجَنبِ وَابْنِ السَّبِيلِ وَمَا مَلَكَتْ أَيْمَانُكُمْ ۗ إِنَّ اللَّـهَ لَا يُحِبُّ مَن كَانَ مُخْتَالًا فَخُورًا ٣٦

మరియు మీరు అల్లాహ్‌ నే ఆరాధించండి మరియు ఎవ్వరినీ ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి. మరియు తల్లి-దండ్రులతో, దగ్గరి బంధువులతో, అనాథులతో నిరుపేదలతో, బంధువులైన పొరుగువారితో, అపరిచితులైన పొరుగు వారితో, 32 ప్రక్కనున్న మిత్రులతో, బాటసారులతో మరియు మీ ఆధీనంలో ఉన్న బానిసలతో అందరితోనూ ఉదారస్వభావంతో వ్యవహరించండి 33 నిశ్చయంగా అల్లాహ్‌ గర్వి తుణ్ణి, బడాయీలు చెప్పుకునేవాణ్ణి ప్రేమించడు. 34

4:37 – الَّذِينَ يَبْخَلُونَ وَيَأْمُرُونَ النَّاسَ بِالْبُخْلِ وَيَكْتُمُونَ مَا آتَاهُمُ اللَّـهُ مِن فَضْلِهِ ۗ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ عَذَابًا مُّهِينًا ٣٧

ఎవరైతే తాము లోభులై, ఇతరులకు లోభం నేర్పుతారో వారినీ మరియు అల్లాహ్‌ తన అనుగ్రహంతో ఇచ్చిన దానిని దాచిపెట్టేవారినీ (అల్లాహ్‌ ప్రేమించడు). 35 మరియు మేము సత్య-తిరస్కారుల కొరకు అవమానకరమైన శిక్షను సిధ్ధపరచి ఉంచాము.

4:38 – وَالَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُونَ بِاللَّـهِ وَلَا بِالْيَوْمِ الْآخِرِ ۗ وَمَن يَكُنِ الشَّيْطَانُ لَهُ قَرِينًا فَسَاءَ قَرِينًا ٣٨

మరియు వారికి, ఎవరైతే ప్రజలకు చూప టానికి తమ సంపదను ఖర్చుపెడతారో మరియు అల్లాహ్‌ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించరో! మరియు ఎవడైతే షై’తాన్‌ను తన స్నేహితునిగా (ఖరీనున్‌గా) చేసుకుంటాడో! 36 అతడు ఎంత నీచమైన స్నేహితుడు.

4:39 – وَمَاذَا عَلَيْهِمْ لَوْ آمَنُوا بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَنفَقُوا مِمَّا رَزَقَهُمُ اللَّـهُ ۚ وَكَانَ اللَّـهُ بِهِمْ عَلِيمًا ٣٩

మరియు వారు ఒకవేళ అల్లాహ్‌ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించి అల్లాహ్‌ వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఇతరులపై ఖర్చుచేసి ఉంటే వారికేమయ్యేది? మరియు అల్లాహ్‌ కు, వారిని గురించి బాగా తెలుసు.

4:40 – إِنَّ اللَّـهَ لَا يَظْلِمُ مِثْقَالَ ذَرَّةٍ ۖ وَإِن تَكُ حَسَنَةً يُضَاعِفْهَا وَيُؤْتِ مِن لَّدُنْهُ أَجْرًا عَظِيمًا ٤٠

నిశ్చయంగా, అల్లాహ్‌ ఎవరికీ రవ్వంత (పరమాణువంత) అన్యాయం కూడా చేయడు 37 ఒక సత్కార్యముంటే ఆయన దానిని రెండింతలు చేస్తాడు; మరియు తన తరఫు నుండి గొప్ప ప్రతిఫలాన్ని కూడా ప్రసాదిస్తాడు.

4:41 – فَكَيْفَ إِذَا جِئْنَا مِن كُلِّ أُمَّةٍ بِشَهِيدٍ وَجِئْنَا بِكَ عَلَىٰ هَـٰؤُلَاءِ شَهِيدًا ٤١

మేము (ప్రతిఫలదినమున) ప్రతి సమాజం నుండి ఒకసాక్షిని తెచ్చి మరియు (ఓ ప్రవక్తా!) నిన్ను వీరికి సాక్షిగా నిలబెట్టినప్పుడు ఎలా ఉంటుంది?

4:42 – يَوْمَئِذٍ يَوَدُّ الَّذِينَ كَفَرُوا وَعَصَوُا الرَّسُولَ لَوْ تُسَوَّىٰ بِهِمُ الْأَرْضُ وَلَا يَكْتُمُونَ اللَّـهَ حَدِيثًا ٤٢

ఆ (ప్రతిఫల) దినమున, ప్రవక్త మాటను తిరస్కరించి, అతనికి అవిధేయత చూపిన వారంతా; తాము భూమిలో పూడ్చబడితే ఎంత బాగుండేదని కోరుతారు! కానీ, వారు అల్లాహ్‌ ముందు ఏ విషయాన్ని దాచలేరు. 38

4:43 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقْرَبُوا الصَّلَاةَ وَأَنتُمْ سُكَارَىٰ حَتَّىٰ تَعْلَمُوا مَا تَقُولُونَ وَلَا جُنُبًا إِلَّا عَابِرِي سَبِيلٍ حَتَّىٰ تَغْتَسِلُوا ۚ وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ ۗ إِنَّ اللَّـهَ كَانَ عَفُوًّا غَفُورًا ٤٣

ఓ విశ్వాసులారా! మీరు మత్తులో ఉంటే 39 మీరు పలికేది గ్రహించనంత వరకు, మరియు మీకు ఇంద్రియస్ఖలనం (జునుబున్) అయిఉంటే –స్నానం చేయనంత వరకు, నమా’జ్‌ సమీపానికి వెళ్లకండి; కాని నడుస్తూ (మస్జిద్‌) నుండి దాటవలసివస్తే తప్ప. 40 కాని ఒకవేళ మీరు రోగపీడితులై ఉంటే, లేదా ప్రయాణంలో వుంటే, లేక మల-మూత్ర విసర్జన చేసివుంటే, లేక స్త్రీలతో సంభోగం చేసి ఉంటే – మీకు నీళ్ళు దొరక్కపోతే – పరిశుధ్ధమైన మట్టిని చేతులతో స్పర్శించి, ఆ చేతులతో మీ ముఖాలను మరియు మీ చేతులను తుడుచు కోండి (తయమ్మమ్‌ చేయండి). 41 నిశ్చయంగా, అల్లాహ్ తప్పులనుమన్నించేవాడు క్షమించేవాడు.

4:44 – أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يَشْتَرُونَ الضَّلَالَةَ وَيُرِيدُونَ أَن تَضِلُّوا السَّبِيلَ ٤٤

ఏమీ? గ్రంథ జ్ఞానంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని గురించి నీకు తెలియదా (చూడ లేదా)? వారు మార్గభ్రష్టత్వాన్ని కొనుక్కుం టున్నారు మరియు మీరు కూడా సన్మార్గం నుండి తప్పిపోవాలని కోరుతున్నారు.

4:45 – وَاللَّـهُ أَعْلَمُ بِأَعْدَائِكُمْ ۚ وَكَفَىٰ بِاللَّـهِ وَلِيًّا وَكَفَىٰ بِاللَّـهِ نَصِيرًا ٤٥

మరియు అల్లాహ్‌ మీ శత్రువులను బాగా ఎరుగును. కావున మీ రక్షకుడుగా అల్లాహ్‌ యే చాలు మరియు మీకు సహాయకుడుగా కూడా అల్లాహ్‌ యే చాలు!

4:46 – مِّنَ الَّذِينَ هَادُوا يُحَرِّفُونَ الْكَلِمَ عَن مَّوَاضِعِهِ وَيَقُولُونَ سَمِعْنَا وَعَصَيْنَا وَاسْمَعْ غَيْرَ مُسْمَعٍ وَرَاعِنَا لَيًّا بِأَلْسِنَتِهِمْ وَطَعْنًا فِي الدِّينِ ۚ وَلَوْ أَنَّهُمْ قَالُوا سَمِعْنَا وَأَطَعْنَا وَاسْمَعْ وَانظُرْنَا لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَقْوَمَ وَلَـٰكِن لَّعَنَهُمُ اللَّـهُ بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلًا ٤٦

యూదులలో కొందరు పదాలను వాటి సంద ర్భాల నుండి తారుమారు చేసి అంటారు: ‘మేము (నీ మాటలను) విన్నాము మరియు ఉల్లం ఘించాము (సమి’అనా వ’అ’సయ్‌నా).’ అనీ; మరియు: ‘విను! నీ మాట వినకబోవుగాక! (వస్‌మ’అ’గైర ముస్‌మ’ఇన్‌). 42 అనీ; మరియు ‘(ఓ ము’హమ్మద్‌!) నీవు మా మాట విను. (రా’ఇనా)’ అనీ 43 తమ నాలుకలను మెలిత్రిప్పి సత్య ధర్మాన్ని ఎగతాళి చేసే ఉద్దేశ్యంతో అంటారు. కాని అలా కాకుండా: ‘విన్నాము విధే యుల మయ్యాము. (సమి’అనా వ అ’త ‘అనా).’ అనీ; మరియు: ‘మమ్మల్ని విను మరియు మా దిక్కు చూడు / మాకు వ్యవధి నివ్వు (వస్‌మ’అ వన్‌”జుర్‌నా),’ అనీ, అని ఉంటే వారికే మేలై ఉండేది మరియు ఉత్తమమైన పద్దతిగా ఉండేది. కాని వారి సత్య-తిరస్కారవైఖరి వల్ల అల్లాహ్‌ వారిని శపించాడు (బహిష్కరించాడు). కావున వారిలో కొందరు మాత్రమే విశ్వసించేవారు ఉన్నారు.

4:47 – يَا أَيُّهَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ آمِنُوا بِمَا نَزَّلْنَا مُصَدِّقًا لِّمَا مَعَكُم مِّن قَبْلِ أَن نَّطْمِسَ وُجُوهًا فَنَرُدَّهَا عَلَىٰ أَدْبَارِهَا أَوْ نَلْعَنَهُمْ كَمَا لَعَنَّا أَصْحَابَ السَّبْتِ ۚ وَكَانَ أَمْرُ اللَّـهِ مَفْعُولًا ٤٧

ఓ గ్రంథప్రజలారా! మీవద్ద ఉన్న గ్రంథాన్ని ధృవపరుస్తూ, మేము అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్‌ఆన్‌ ను) విశ్వసించండి, మేము మీ ముఖాలను వికృతం చేసి వాటిని వెనక్కి త్రిప్పక ముందే (నాశనం చేయకముందే). లేక మేము సబ్త్‌ వారిని శపించినట్లుగా (బహిష్కరించినట్లుగా) మిమ్మల్ని కూడా శపించక (బహిష్కరించక) ముందే (దీనిని విశ్వసించండి). 44 ఎందుకంటే! అల్లాహ్‌ ఆజ్ఞ తప్పకుండా నిర్వహించబడుతుంది.

4:48 – إِنَّ اللَّـهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ ۚ وَمَن يُشْرِكْ بِاللَّـهِ فَقَدِ افْتَرَىٰ إِثْمًا عَظِيمًا ٤٨

నిశ్చయంగా, అల్లాహ్‌ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏమాత్రమూ క్షమించడు. 45 మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్‌ కు భాగస్వాములను కల్పించినవాడే, వాస్తవానికి మహా పాపం చేసిన వాడు!

4:49 – أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يُزَكُّونَ أَنفُسَهُم ۚ بَلِ اللَّـهُ يُزَكِّي مَن يَشَاءُ وَلَا يُظْلَمُونَ فَتِيلًا ٤٩

ఏమీ? తమను తాము పవిత్రులమని చెప్పుకునే వారిని (యూదులు మరియు క్రైస్తవు లను) గురించి నీకు తెలియదా (చూడలేదా)? 46 వాస్తవానికి, అల్లాహ్‌ తాను కోరినవారికి మాత్రమే పవిత్రతను ప్రసాదిస్తాడు. 47 మరియు వారికి ఖర్జూర-బీజపు చీలికలోని పొరఅంత అన్యాయం కూడా చేయబడదు. 48

4:50 – انظُرْ كَيْفَ يَفْتَرُونَ عَلَى اللَّـهِ الْكَذِبَ ۖ وَكَفَىٰ بِهِ إِثْمًا مُّبِينًا ٥٠

చూడండి! వారు అల్లాహ్‌ ను గురించి ఏ విధమైన అబద్దాన్ని కల్పిస్తున్నారో? మరియు స్పష్టమైన పాపం, అని చెప్పటానికి ఇది చాలు.

4:51 – أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يُؤْمِنُونَ بِالْجِبْتِ وَالطَّاغُوتِ وَيَقُولُونَ لِلَّذِينَ كَفَرُوا هَـٰؤُلَاءِ أَهْدَىٰ مِنَ الَّذِينَ آمَنُوا سَبِيلً ٥١

ఏమీ? గ్రంథ జ్ఞానంలో కొంతభాగం ఇవ్వ బడిన వారిని గురించి నీకు తెలియదా? వారు జిబ్త్ 49 మరియు ‘తా’గూత్‌ లలో 50 విశ్వాస ముంచుతున్నారు. వారు సత్య-తిరస్కారులను గురించి: ”విశ్వాసులకంటే, వీరే సరైనమార్గంలో ఉన్నారు.” అని అంటారు.

4:52 – أُولَـٰئِكَ الَّذِينَ لَعَنَهُمُ اللَّـهُ ۖ وَمَن يَلْعَنِ اللَّـهُ فَلَن تَجِدَ لَهُ نَصِيرًا ٥٢

ఇలాంటివారే, అల్లాహ్‌ శాపానికి (బహిష్కా రానికి) గురి అయినవారు. మరియు అల్లాహ్‌ శపించినవాడికి సహాయపడేవాడిని ఎవ్వడినీ నీవు పొందలేవు.

4:53 – أَمْ لَهُمْ نَصِيبٌ مِّنَ الْمُلْكِ فَإِذًا لَّا يُؤْتُونَ النَّاسَ نَقِيرًا ٥٣

లేదా వారికి రాజ్యపాలనలో భాగం ఉందా? ఒకవేళ ఉండి ఉంటే, వారు ప్రజలకు ఖర్జూరపు బీజపు చీలిక 51 అంత భాగం కూడా ఇచ్చేవారు కాదు.

4:54 – أَمْ يَحْسُدُونَ النَّاسَ عَلَىٰ مَا آتَاهُمُ اللَّـهُ مِن فَضْلِهِ ۖ فَقَدْ آتَيْنَا آلَ إِبْرَاهِيمَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَآتَيْنَاهُم مُّلْكًا عَظِيمًا ٥٤

లేదా! అల్లాహ్‌ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన (సౌభాగ్యాన్ని) చూసి వారు ఈర్ష్యపడు తున్నారా? వాస్తవానికి (ఇంతకు ముందు) మేము ఇబ్రాహీమ్‌ కుటుంబంవారికి, గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించాము. మరియు వారికి గొప్ప సామ్రాజ్యాన్ని కూడా ప్రదానం చేశాము.

4:55 – فَمِنْهُم مَّنْ آمَنَ بِهِ وَمِنْهُم مَّن صَدَّ عَنْهُ ۚ وَكَفَىٰ بِجَهَنَّمَ سَعِيرًا ٥٥

కాని వారిలో కొందరు అతనిని (ప్రవక్తను) విశ్వసించినవారు ఉన్నారు, మరికొందరు అతని నుండి విముఖులైనవారూ ఉన్నారు. మరియు వారికి దహించే నరకాగ్నియే చాలు! 52

4:56 – إِنَّ الَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا سَوْفَ نُصْلِيهِمْ نَارًا كُلَّمَا نَضِجَتْ جُلُودُهُم بَدَّلْنَاهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا الْعَذَابَ ۗ إِنَّ اللَّـهَ كَانَ عَزِيزًا حَكِيمًا ٥٦

నిశ్చయంగా, ఎవరు మా సూచనలను తిరస్కరించారో! వారిని మేము మున్ముందు నరకాగ్నిలో పడవేస్తాము. ప్రతిసారి వారి చర్మాలు కాలిపోయినపుడల్లా వాటికి బదులుగా – వారు బాధను బాగా రుచిచూడటానికి – వేరే చర్మాలతో మార్చుతాము. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు మహా వివేచనాపరుడు.

4:57 – وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَنُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ لَّهُمْ فِيهَا أَزْوَاجٌ مُّطَهَّرَةٌ ۖ وَنُدْخِلُهُمْ ظِلًّا ظَلِيلًا ٥٧

మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారిని మేము క్రింద కాలువలు ప్రవహించే వనాలలో ప్రవేశింపజేస్తాము;వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. అందు వారికి పవిత్ర సహవా సులు (అ’జ్వాజ్‌) ఉంటారు. మరియు మేము వారిని దట్టమైననీడలలో ప్రవేశింపజేస్తాము 53 (1/4)

4:58 – إِنَّ اللَّـهَ يَأْمُرُكُمْ أَن تُؤَدُّوا الْأَمَانَاتِ إِلَىٰ أَهْلِهَا وَإِذَا حَكَمْتُم بَيْنَ النَّاسِ أَن تَحْكُمُوا بِالْعَدْلِ ۚ إِنَّ اللَّـهَ نِعِمَّا يَعِظُكُم بِهِ ۗ إِنَّ اللَّـهَ كَانَ سَمِيعًا بَصِيرًا ٥٨

  • పూచీ (అమానాత్‌ )లను తప్పక వాటికి అర్హులైనవారికి అప్పగించండనీ మరియు ప్రజలమధ్య తీర్పు చేసేటప్పుడు న్యాయంగా తీర్పుచేయండనీ, అల్లాహ్‌ మిమ్మల్ని ఆజ్ఞా పిస్తున్నాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ ఎంత ఉత్తమ మైన హితబోధ చేస్తున్నాడు! నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.

4:59 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّـهَ وَأَطِيعُوا الرَّسُولَ وَأُولِي الْأَمْرِ مِنكُمْ ۖ فَإِن تَنَازَعْتُمْ فِي شَيْءٍ فَرُدُّوهُ إِلَى اللَّـهِ وَالرَّسُولِ إِن كُنتُمْ تُؤْمِنُونَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ ۚ ذَٰلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلًا ٥٩

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశ హరునికి విధేయులై ఉండండి మరియు మీలో అధికారం అప్పగించబడినవారికి కూడా! మీ మధ్య ఏవిషయంలోనైనా అభిప్రాయభేదంకలిగితే – మీరు అల్లాహ్‌ ను అంతిమదినాన్ని విశ్వసించేవారే అయితే – ఆ విషయాన్ని అల్లాహ్‌ కు మరియు ప్రవక్తకు నివేదించండి. 54 ఇదే సరైన పధ్ధతి మరియు ఫలితాన్నిబట్టి కూడా ఉత్తమమైనది.

4:60 – أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يَزْعُمُونَ أَنَّهُمْ آمَنُوا بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِن قَبْلِكَ يُرِيدُونَ أَن يَتَحَاكَمُوا إِلَى الطَّاغُوتِ وَقَدْ أُمِرُوا أَن يَكْفُرُوا بِهِ وَيُرِيدُ الشَّيْطَانُ أَن يُضِلَّهُمْ ضَلَالًا بَعِيدًا ٦٠

(ఓ ప్రవక్తా!) ఏమీ? నీ వద్దకు పంపబడిన దానిని మరియు నీ కంటే పూర్వం పంపబడిన దానిని మేము విశ్వసించామని పలికే వారిని (కపట-విశ్వాసులను) నీవు ఎరుగవా (చూడ లేదా)? తిరస్కరించండని ఆదేశించబడినా, వారు తమ (వ్యవహారాల) పరిష్కారాలకు ‘తా’గూత్‌ 55 వద్దకే పోవాలని కోరుతూ ఉంటారు. మరియు షై’తాన్‌ వారిని, త్రోవతప్పించి, దుర్మార్గంలో అతి దూరంగా తీసుకొనిపోవాలని కోరుతుంటాడు.

4:61 – وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَىٰ مَا أَنزَلَ اللَّـهُ وَإِلَى الرَّسُولِ رَأَيْتَ الْمُنَافِقِينَ يَصُدُّونَ عَنكَ صُدُودًا ٦١

మరియు వారితో: ”అల్లాహ్‌ అవతరింప జేసిన వాటి (ఆదేశాల) వైపునకు మరియు ప్రవక్త వైపునకు రండి.” అని చెప్పినపుడు, నీవు ఆ కపటవిశ్వాసులను విముఖులై (నీ వైపునకు రాకుండా) తొలిగిపోవటాన్ని చూస్తావు!

4:62 – فَكَيْفَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ثُمَّ جَاءُوكَ يَحْلِفُونَ بِاللَّـهِ إِنْ أَرَدْنَا إِلَّا إِحْسَانًا وَتَوْفِيقًا ٦٢

అయితే వారు తమ చేతులారా చేసుకున్న (దుష్కార్యాల) ఫలితంగా వారికి బాధ కలిగి నపుడు, వారు నీ దగ్గరకు వచ్చి అల్లాహ్ పేర ప్రమాణాలు చేస్తూ: ”మేము మేలు చేయాలనీ మరియు ఐకమత్యం చేకూర్చాలనీ మాత్రమే ప్రయత్నించాము.” అని అంటారు. 56

4:63 – أُولَـٰئِكَ الَّذِينَ يَعْلَمُ اللَّـهُ مَا فِي قُلُوبِهِمْ فَأَعْرِضْ عَنْهُمْ وَعِظْهُمْ وَقُل لَّهُمْ فِي أَنفُسِهِمْ قَوْلًا بَلِيغًا ٦٣

అలాంటి వారినీ (కపటవిశ్వాసులను)! వారి హృదయాలలోఉన్నదీ అల్లాహ్‌ ఎరుగును, కావున వారి నుండి ముఖం త్రిప్పుకో, వారికి ఉపదేశం చెయ్యి మరియు వారిని గురించి వారి హృదయాలు ప్రభావితమయ్యే మాటపలుకు.

4:64 – وَمَا أَرْسَلْنَا مِن رَّسُولٍ إِلَّا لِيُطَاعَ بِإِذْنِ اللَّـهِ ۚ وَلَوْ أَنَّهُمْ إِذ ظَّلَمُوا أَنفُسَهُمْ جَاءُوكَ فَاسْتَغْفَرُوا اللَّـهَ وَاسْتَغْفَرَ لَهُمُ الرَّسُولُ لَوَجَدُوا اللَّـهَ تَوَّابًا رَّحِيمًا ٦٤

మరియు మేము ఏ ప్రవక్తను పంపినా – అల్లాహ్‌ అనుజ్ఞతో – (ప్రజలు) అతనిని అనుస రించాలనే పంపాము. మరియు ఒకవేళ వారు తమకు తాము అన్యాయం చేసుకున్నప్పుడు, నీ వద్దకు వచ్చి, వారు అల్లాహ్‌ యొక్క క్షమాభిక్ష కోరినప్పుడు – ప్రవక్త కూడా వారికై అల్లాహ్‌ యొక్క క్షమాభిక్షకొరకు వేడుకొన్నప్పుడు – వారు అల్లాహ్‌ ను నిశ్చయంగా క్షమించేవాడు గానూ మరియు కరుణాప్రదాతగానూ పొందుతారు.

4:65 – فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوا فِي أَنفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا تَسْلِيمًا ٦٥

అలాకాదు, నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయ నిర్ణేతగా స్వీకరించనంతవరకు మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ నిర్ణయంచేసినా దానిని గురించి వారి మనస్సులలో ఏమాత్రం సంకోచం లేకుండా దానికి (యథాతథంగా) శిరసావహించనంత వరకు, వారు (నిజమైన) విశ్వాసులు కాలేరు! 57

4:66 – وَلَوْ أَنَّا كَتَبْنَا عَلَيْهِمْ أَنِ اقْتُلُوا أَنفُسَكُمْ أَوِ اخْرُجُوا مِن دِيَارِكُم مَّا فَعَلُوهُ إِلَّا قَلِيلٌ مِّنْهُمْ ۖ وَلَوْ أَنَّهُمْ فَعَلُوا مَا يُوعَظُونَ بِهِ لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَشَدَّ تَثْبِيتًا ٦٦

మరియు ఒకవేళ వాస్తవానికి మేము వారిని: ”మీ ప్రాణాల బలి ఇవ్వండి లేదా మీ ఇల్లూ వాకిళ్ళను విడిచి వెళ్ళండి!” అని ఆజ్ఞాపించి (విధిగా చేసి) ఉంటే, వారిలో కొందరు మాత్రమే అలా చేసి ఉండేవారు. ఒకవేళ వారికి ఉపదేశించి నట్లు వారు చేసి ఉంటే, నిశ్చయంగా, అది వారికే శ్రేయస్కరమైనదిగా మరియు వారి (విశ్వాసాన్ని) దృఢపరిచేదిగా ఉండేది.

4:67 – وَإِذًا لَّآتَيْنَاهُم مِّن لَّدُنَّا أَجْرًا عَظِيمًا ٦٧

మరియు అప్పుడు వారికి మేము, మా వైపు నుండి గొప్ప ప్రతిఫలం ఇచ్చి ఉండేవారం.

4:68 – وَلَهَدَيْنَاهُمْ صِرَاطًا مُّسْتَقِيمًا ٦٨

మరియు మేము వారికి బుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేసి ఉండేవారం.

4:69 – وَمَن يُطِعِ اللَّـهَ وَالرَّسُولَ فَأُولَـٰئِكَ مَعَ الَّذِينَ أَنْعَمَ اللَّـهُ عَلَيْهِم مِّنَ النَّبِيِّينَ وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ ۚ وَحَسُنَ أُولَـٰئِكَ رَفِيقًا ٦٩

మరియు ఎవరు అల్లాహ్‌ కు మరియు ప్రవక్తకు విధేయులై ఉంటారో, అలాంటి వారు అల్లాహ్‌ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ, సత్య వంతులతోనూ, (అల్లాహ్‌) ధర్మం కొరకు ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల (షహీదుల) తోనూ, సద్వర్తనులతోనూ చేరి ఉంటారు. మరియు అలాంటి వారి సాంగత్యం ఎంతో మేలైనది! 58

4:70 – ذَٰلِكَ الْفَضْلُ مِنَ اللَّـهِ ۚ وَكَفَىٰ بِاللَّـهِ عَلِيمًا ٧٠

అల్లాహ్‌ నుండి లభించే అనుగ్రహం ఇలాంటిదే. మరియు (యథార్థం) తెలుసు కోవటానికి అల్లాహ్‌ చాలు.

4:71 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا خُذُوا حِذْرَكُمْ فَانفِرُوا ثُبَاتٍ أَوِ انفِرُوا جَمِيعًا ٧١

ఓ విశ్వాసులారా! మీరు (అన్ని విధాలుగా యుద్ధానికి సిద్ధమై) తగిన జాగ్రత్తలు వహించండి! 59 మీరు (యుధ్ధానికి) జట్లుగానో, లేదా అందరూ కలిసియో బయలుదేరండి.

4:72 – وَإِنَّ مِنكُمْ لَمَن لَّيُبَطِّئَنَّ فَإِنْ أَصَابَتْكُم مُّصِيبَةٌ قَالَ قَدْ أَنْعَمَ اللَّـهُ عَلَيَّ إِذْ لَمْ أَكُن مَّعَهُمْ شَهِيدًا ٧٢

మరియు వాస్తవానికి మీలో వెనుక ఉండి పోయేవాడు ఉన్నాడు, ఒకవేళ మీకు ఏమైనా ఆపదవస్తే అప్పుడు వాడు: ”వాస్తవానికి అల్లాహ్‌ నన్ను అనుగ్రహించాడు, అందుకే నేను కూడా వారితోపాటు లేను!” అని అంటాడు.

4:73 – وَلَئِنْ أَصَابَكُمْ فَضْلٌ مِّنَ اللَّـهِ لَيَقُولَنَّ كَأَن لَّمْ تَكُن بَيْنَكُمْ وَبَيْنَهُ مَوَدَّةٌ يَا لَيْتَنِي كُنتُ مَعَهُمْ فَأَفُوزَ فَوْزًا عَظِيمًا ٧٣

మరియు ఒకవేళ మీకు అల్లాహ్‌ తరఫు నుండి అనుగ్రహమే లభిస్తే! 60 మీకూ అతనికి మధ్య ఏ విధమైన అనురాగబంధమే లేనట్లుగా: ”అయ్యో! నేను కూడా వారితో పాటు ఉండిఉంటే నాకు కూడా గొప్ప విజయ ఫలితం లభించిఉండేది కదా!” అని తప్పక అంటాడు. (3/8)

4:74 – فَلْيُقَاتِلْ فِي سَبِيلِ اللَّـهِ الَّذِينَ يَشْرُونَ الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ ۚ وَمَن يُقَاتِلْ فِي سَبِيلِ اللَّـهِ فَيُقْتَلْ أَوْ يَغْلِبْ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا ٧٤

కావున ఇహలోక జీవితాన్ని పరలోక జీవిత (సుఖానికి) బదులుగా అమ్మిన వారు (విశ్వాసులు) అల్లాహ్‌ మార్గంలో పోరాడాలి. మరియు అల్లాహ్‌ మార్గంలో పోరాడినవాడు, చంప బడినా, లేదా విజేయుడైనా, మేము తప్పకుండా అతనికి గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించగలము.

4:75 – وَمَا لَكُمْ لَا تُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّـهِ وَالْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ الَّذِينَ يَقُولُونَ رَبَّنَا أَخْرِجْنَا مِنْ هَـٰذِهِ الْقَرْيَةِ الظَّالِمِ أَهْلُهَا وَاجْعَل لَّنَا مِن لَّدُنكَ وَلِيًّا وَاجْعَل لَّنَا مِن لَّدُنكَ نَصِيرًا ٧٥

మరియు మీకేమయింది, మీరెందుకు అల్లాహ్‌ మార్గంలో మరియు నిస్సహాయులై అణచి వేయబడిన పురుషుల, స్త్రీల మరియు పిల్లల కొరకు, పోరాడటం లేదు? 61 వారు: ”మా ప్రభూ! దౌర్జన్యపరులైన ఈ నగరవాసుల నుండి మాకు విమోచనం కలిగించు. నీ వద్ద నుండి మా కొరకు ఒక సంరక్షకుణ్ణి నియమించు. మరియు నీ వద్దనుండి మా కొరకు ఒక సహాయకుణ్ణి ఏర్పాటు చేయి!” అని వేడుకొంటున్నారు.

4:76 – الَّذِينَ آمَنُوا يُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّـهِ ۖ وَالَّذِينَ كَفَرُوا يُقَاتِلُونَ فِي سَبِيلِ الطَّاغُوتِ فَقَاتِلُوا أَوْلِيَاءَ الشَّيْطَانِ ۖ إِنَّ كَيْدَ الشَّيْطَانِ كَانَ ضَعِيفًا ٧٦

విశ్వసించిన వారు, అల్లాహ్‌ మార్గంలో పోరాడుతారు. మరియు సత్య-తిరస్కారులు ‘తా’గూత్‌ మార్గంలో పోరాడుతారు; 62 కావున మీరు (ఓ విశ్వాసులారా!) షై’తాను అనుచరులకు విరుధ్ధంగా పోరాడండి. నిశ్చయంగా, షై’తాను కుట్ర బలహీనమైనదే!

4:77 – أَلَمْ تَرَ إِلَى الَّذِينَ قِيلَ لَهُمْ كُفُّوا أَيْدِيَكُمْ وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ فَلَمَّا كُتِبَ عَلَيْهِمُ الْقِتَالُ إِذَا فَرِيقٌ مِّنْهُمْ يَخْشَوْنَ النَّاسَ كَخَشْيَةِ اللَّـهِ أَوْ أَشَدَّ خَشْيَةً ۚ وَقَالُوا رَبَّنَا لِمَ كَتَبْتَ عَلَيْنَا الْقِتَالَ لَوْلَا أَخَّرْتَنَا إِلَىٰ أَجَلٍ قَرِيبٍ ۗ قُلْ مَتَاعُ الدُّنْيَا قَلِيلٌ وَالْآخِرَةُ خَيْرٌ لِّمَنِ اتَّقَىٰ وَلَا تُظْلَمُونَ فَتِيلًا ٧٧

”మీ చేతులను ఆపుకోండి, నమా’జ్‌ ను స్థాపించండి, విధిదానం (‘జకాత్‌) ఇవ్వండి.” అని చెప్పబడినవారిని నీవుచూడలేదా? యుధ్ధం చేయ మని వారిని ఆదేశించినప్పుడు, వారిలో కొందరు అల్లాహ్‌ కు భయపడవలసిన విధంగా మానవు లకు భయపడుతున్నారు. కాదు! అంతకంటే ఎక్కువగానే భయపడుతున్నారు. వారు: ”ఓ మా ప్రభూ! యుధ్ధం చేయమని ఈ ఆజ్ఞను మా కొరకు ఎందుకు విధించావు? మాకు ఇంకా కొంత వ్యవధిఎందుకివ్వలేదు?” అనిఅంటారు 63 వారితో ఇలా అను: ”ఇహలోకసుఖం తుచ్ఛమైనది మరియు దైవభీతి గలవారికి పరలోక సుఖమే ఉత్తమమైనది. మరియు మీకు ఖర్జూర-బీజపు చీలికలోని పొర (ఫతీల) అంత అన్యాయం కూడా జరుగదు.

4:78 – أَيْنَمَا تَكُونُوا يُدْرِككُّمُ الْمَوْتُ وَلَوْ كُنتُمْ فِي بُرُوجٍ مُّشَيَّدَةٍ ۗ وَإِن تُصِبْهُمْ حَسَنَةٌ يَقُولُوا هَـٰذِهِ مِنْ عِندِ اللَّـهِ ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ يَقُولُوا هَـٰذِهِ مِنْ عِندِكَ ۚ قُلْ كُلٌّ مِّنْ عِندِ اللَّـهِ ۖ فَمَالِ هَـٰؤُلَاءِ الْقَوْمِ لَا يَكَادُونَ يَفْقَهُونَ حَدِيثًا ٧٨

”మీరు ఎక్కడున్నాసరే! మీకు చావు వచ్చి తీరుతుంది మరియు మీరు గొప్ప కోట బురుజు లలో ఉన్నా చావు రాక తప్పదు.” (అని పలుకు). మరియు వారికి ఏమైనా మేలు కలిగితే: ”ఇది అల్లాహ్‌ తరఫునుండి వచ్చింది.” అని అంటారు, కాని వారికేదైనా కీడు గలిగితే: ”(ఓ ము’హమ్మద్‌!) ఇది నీ వల్ల జరిగింది.” అని అంటారు. వారితో అను: ”అంతా అల్లాహ్‌ తరఫు నుండే (వస్తుంది)!” ఈ జనులకు ఏమయింది? వారు ఏ విషయాన్ని కూడా ఎందుకు అర్థం చేసుకోలేక పోతున్నారు?

4:79 – مَّا أَصَابَكَ مِنْ حَسَنَةٍ فَمِنَ اللَّـهِ ۖ وَمَا أَصَابَكَ مِن سَيِّئَةٍ فَمِن نَّفْسِكَ ۚ وَأَرْسَلْنَاكَ لِلنَّاسِ رَسُولًا ۚ وَكَفَىٰ بِاللَّـهِ شَهِيدًا ٧٩

(ఓ మానవుడా!) నీకు ఏ మేలు జరిగినా అది అల్లాహ్‌ అనుగ్రహం వల్లనే 64 మరియు నీకు ఏ కీడు జరిగినా అది నీ స్వంత (కర్మల) ఫలితమే! 65 మరియు (ఓ ము’హమ్మద్‌!) మేము నిన్ను మానవులకు సందేశహరునిగా చేసి పంపాము. మరియు దీనికి అల్లాహ్‌ సాక్ష్యమే చాలు.

4:80 – مَّن يُطِعِ الرَّسُولَ فَقَدْ أَطَاعَ اللَّـهَ ۖ وَمَن تَوَلَّىٰ فَمَا أَرْسَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا ٨٠

ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో వాస్తవంగా అతడు అల్లాహ్‌ కు విధేయత చూపి నట్లే. 66 మరియు కాదని వెనుదిరిగిపోతే వారిని అదుపులో ఉంచటానికి (కావలివానిగా) మేము నిన్నుపంపలేదు.

4:81 – وَيَقُولُونَ طَاعَةٌ فَإِذَا بَرَزُوا مِنْ عِندِكَ بَيَّتَ طَائِفَةٌ مِّنْهُمْ غَيْرَ الَّذِي تَقُولُ ۖ وَاللَّـهُ يَكْتُبُ مَا يُبَيِّتُونَ ۖ فَأَعْرِضْ عَنْهُمْ وَتَوَكَّلْ عَلَى اللَّـهِ ۚ وَكَفَىٰ بِاللَّـهِ وَكِيلًا ٨١

మరియు వారు (నీ సమక్షంలో): ”మేము విధేయుల మయ్యాము.” అని పలుకుతారు. కాని నీ వద్ద నుండి వెళ్ళిపోయిన తరువాత వారిలో కొందరు రాత్రివేళలో నీవు చెప్పినదానికి విరుధ్ధంగా సంప్రదింపులు జరుపుతారు. మరియు వారి రహస్య సంప్రదింపులన్నీ అల్లాహ్‌ వ్రాస్తున్నాడు. కనుక నీవు వారినుండి ముఖం త్రిప్పుకో మరియు అల్లాహ్‌ పై ఆధారపడి ఉండు. మరియు కార్యసాధకుడిగా అల్లాహ్‌ చాలు!

4:82 – أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ ۚ وَلَوْ كَانَ مِنْ عِندِ غَيْرِ اللَّـهِ لَوَجَدُوا فِيهِ اخْتِلَافًا كَثِيرًا ٨٢

ఏమీ? వారు ఖుర్‌ఆన్‌ను గురించి ఆలో చించరా? ఒకవేళ ఇది అల్లాహ్‌ తరఫునుండి గాక ఇతరుల తరఫునుండి వచ్చివుంటే, అందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలను చూసే వారు కదా! 67

4:83 – وَإِذَا جَاءَهُمْ أَمْرٌ مِّنَ الْأَمْنِ أَوِ الْخَوْفِ أَذَاعُوا بِهِ ۖ وَلَوْ رَدُّوهُ إِلَى الرَّسُولِ وَإِلَىٰ أُولِي الْأَمْرِ مِنْهُمْ لَعَلِمَهُ الَّذِينَ يَسْتَنبِطُونَهُ مِنْهُمْ ۗ وَلَوْلَا فَضْلُ اللَّـهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ لَاتَّبَعْتُمُ الشَّيْطَانَ إِلَّا قَلِيلً ٨٣

మరియు వారు (ప్రజల గురించి) ఏదైనా శాంతివార్త గానీ లేదా భయవార్త గానీ వినినప్పుడు దానిని వ్యాపింపజేస్తారు. అలా చేయకుండా వారు దానిని సందేశహరునికో, లేదా వారిలో నిర్ణయాధి కారం గలవారికో తెలియజేసి ఉంటే! దానిని విచారించగలవారు, వారి నుండి దానిని విని అర్థంచేసుకునే వారు. మరియు ఒకవేళ మీపై అల్లాహ్‌ అనుగ్రహం మరియు ఆయన కారుణ్యమే లేకుంటే మీలో కొందరు తప్ప మిగతా వారందరూ షై’తాన్‌ను అనుసరించి ఉండే వారు.

4:84 – فَقَاتِلْ فِي سَبِيلِ اللَّـهِ لَا تُكَلَّفُ إِلَّا نَفْسَكَ ۚ وَحَرِّضِ الْمُؤْمِنِينَ ۖ عَسَى اللَّـهُ أَن يَكُفَّ بَأْسَ الَّذِينَ كَفَرُوا ۚ وَاللَّـهُ أَشَدُّ بَأْسًا وَأَشَدُّ تَنكِيلً ٨٤

కావున నీవు అల్లాహ్‌ మార్గంలో యుద్ధం చెయ్యి. నీవు నీ మట్టుకే బాధ్యుడవు. మరియు విశ్వాసులను (యుద్ధానికి) ప్రోత్సహించు. అల్లాహ్‌ సత్య-తిరస్కారుల శక్తిని అణచవచ్చు! మరియు అల్లాహ్‌ అంతులేని శక్తి గలవాడు మరియు శిక్షించటంలో చాలా కఠినుడు!

4:85 – مَّن يَشْفَعْ شَفَاعَةً حَسَنَةً يَكُن لَّهُ نَصِيبٌ مِّنْهَا ۖ وَمَن يَشْفَعْ شَفَاعَةً سَيِّئَةً يَكُن لَّهُ كِفْلٌ مِّنْهَا ۗ وَكَانَ اللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ مُّقِيتًا ٨٥

మంచి విషయం కొరకు సిపారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. మరియు చెడు విషయం కొరకు సిఫారసు చేసేవాడు దానికి బాధ్యత వహిస్తాడు. మరియు అల్లాహ్‌ ప్రతిదానిపై అధికారం గలవాడు. 68

4:86 – وَإِذَا حُيِّيتُم بِتَحِيَّةٍ فَحَيُّوا بِأَحْسَنَ مِنْهَا أَوْ رُدُّوهَا ۗ إِنَّ اللَّـهَ كَانَ عَلَىٰ كُلِّ شَيْءٍ حَسِيبًا ٨٦

మరియు మీకు ఎవరైనా సలాం చేస్తే, దానికి మీరు అంతకంటే ఉత్తమమైనరీతిలో ప్రతి సలాం చెయ్యండి, లేదా కనీసం అవే పదాలు తిరిగి పలకండి (అదే విధంగానైనా చెయ్యండి). 69 నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రతి దానిని పరిగణించ గలవాడు. 70

4:87 – اللَّـهُ لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۚ لَيَجْمَعَنَّكُمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ ۗ وَمَنْ أَصْدَقُ مِنَ اللَّـهِ حَدِيثًا ٨٧

అల్లాహ్‌! ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఆయన మిమ్మల్ని అందరినీ పునరుత్థాన దినమున సమావేశపరుస్తాడు. అది (రావటంలో) ఏ మాత్రంసందేహంలేదు. మరియు అల్లాహ్‌ వాక్కు కంటే మరెవరి (వాక్కు) సత్యమైనది? (1/2)

4:88 – فَمَا لَكُمْ فِي الْمُنَافِقِينَ فِئَتَيْنِ وَاللَّـهُ أَرْكَسَهُم بِمَا كَسَبُوا ۚ أَتُرِيدُونَ أَن تَهْدُوا مَنْ أَضَلَّ اللَّـهُ ۖ وَمَن يُضْلِلِ اللَّـهُ فَلَن تَجِدَ لَهُ سَبِيلًا ٨٨

(ఓ విశ్వాసులారా!) మీకేమయింది, కపట విశ్వాసుల విషయంలో మీరు రెండు వర్గాలుగా చీలి పోయారు. 71 అల్లాహ్‌ వారి కర్మల ఫలితంగా, వారిని వారి పూర్వ (అవిశ్వాస) స్థితికి మరలించాడు. ఏమీ? అల్లాహ్‌ మార్గభ్రష్టులుగా చేసిన వారికి మీరు సన్మార్గం చూపదలచారా? వాస్తవానికి, అల్లాహ్‌ మార్గభ్రష్టత్వంలో పడవేసిన వానికి నీవు (ఋజు) మార్గం చూపలేవు. 72

4:89 – وَدُّوا لَوْ تَكْفُرُونَ كَمَا كَفَرُوا فَتَكُونُونَ سَوَاءً ۖ فَلَا تَتَّخِذُوا مِنْهُمْ أَوْلِيَاءَ حَتَّىٰ يُهَاجِرُوا فِي سَبِيلِ اللَّـهِ ۚ فَإِن تَوَلَّوْا فَخُذُوهُمْ وَاقْتُلُوهُمْ حَيْثُ وَجَدتُّمُوهُمْ ۖ وَلَا تَتَّخِذُوا مِنْهُمْ وَلِيًّا وَلَا نَصِيرًا ٨٩

మరియు వారు సత్య-తిరస్కారులైనట్లే మీరు కూడా సత్య-తిరస్కారులై, వారితో సమానులై పోవాలని వారు కోరుతున్నారు. కావున అల్లాహ్‌ మార్గంలో వారు వలసపోనంత (హిజ్రత్‌ చేయనంత) వరకు, వారిలో ఎవ్వరినీ మీరు స్నేహితులుగా చేసుకోకండి. ఒకవేళ వారు వెనుదిరిగితే, మీరు వారిని ఎక్కడ దొరికితే అక్కడే పట్టుకొని వధించండి. మరియు వారిలో ఎవ్వరినీ మీ స్నేహితులుగా, సహాయకులుగా చేసుకోకండి.

4:90 – إِلَّا الَّذِينَ يَصِلُونَ إِلَىٰ قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُم مِّيثَاقٌ أَوْ جَاءُوكُمْ حَصِرَتْ صُدُورُهُمْ أَن يُقَاتِلُوكُمْ أَوْ يُقَاتِلُوا قَوْمَهُمْ ۚ وَلَوْ شَاءَ اللَّـهُ لَسَلَّطَهُمْ عَلَيْكُمْ فَلَقَاتَلُوكُمْ ۚ فَإِنِ اعْتَزَلُوكُمْ فَلَمْ يُقَاتِلُوكُمْ وَأَلْقَوْا إِلَيْكُمُ السَّلَمَ فَمَا جَعَلَ اللَّـهُ لَكُمْ عَلَيْهِمْ سَبِيلً ٩٠

కాని, మీరు ఎవరితోనైతే ఒడంబడిక చేసుకొని ఉన్నారో, అలాంటివారితో కలసిపోయిన వారు గానీ, లేదా ఎవరైతే – తమ హృదయాలలో – మీతోగానీ, లేక తమ జాతివారితోగానీ యుధ్ధం చేయటానికి సంకటపడుతూ మీ వద్దకువస్తారో, అలాంటి వారిని గానీ, (మీరు వధించకండి). మరియు ఒకవేళ అల్లాహ్‌ కోరితే వారికి మీపై ఆధిక్యత ఇచ్చి ఉండేవాడు మరియు వారు మీతో యుద్దం చేసి ఉండేవారు. కావున వారు మీ నుండి మరలిపోతే, మీతో యుధ్ధంచేయక, మీతో సంధి చేసుకోవటానికి అంగీకరిస్తే (వారిపై దాడిచేయ టానికి) అల్లాహ్‌ మీకు దారి చూపలేదు.

4:91 – سَتَجِدُونَ آخَرِينَ يُرِيدُونَ أَن يَأْمَنُوكُمْ وَيَأْمَنُوا قَوْمَهُمْ كُلَّ مَا رُدُّوا إِلَى الْفِتْنَةِ أُرْكِسُوا فِيهَا ۚ فَإِن لَّمْ يَعْتَزِلُوكُمْ وَيُلْقُوا إِلَيْكُمُ السَّلَمَ وَيَكُفُّوا أَيْدِيَهُمْ فَخُذُوهُمْ وَاقْتُلُوهُمْ حَيْثُ ثَقِفْتُمُوهُمْ ۚ وَأُولَـٰئِكُمْ جَعَلْنَا لَكُمْ عَلَيْهِمْ سُلْطَانًا مُّبِينًا ٩١

మరొక రకమైన వారిని మీరు చూస్తారు; వారు మీ నుండి శాంతి పొందాలని మరియు తమ జాతివారితో కూడా శాంతి పొందాలని కోరు తుంటారు. కాని, సమయం దొరికినప్పుడల్లా వారు (తమ మాట నుండి) మరలిపోయి ఉపద్రవానికి పూనుకుంటారు. అలాంటి వారు మీతో (పోరాడటం) మానుకోకపోతే, మీతో సంధి చేసుకోవ టానికి అంగీకరించకపోతే, తమ చేతులను (మీతో యుధ్ధం చేయటం నుండి) ఆపుకోకపోతే! వారెక్కడ దొరికితే అక్కడ పట్టుకోండి మరియు సంహరించండి. మరియు ఇలా ప్రవర్తించటానికి మేము మీకు స్పష్టమైన అధికారం ఇస్తున్నాము.

4:92 – وَمَا كَانَ لِمُؤْمِنٍ أَن يَقْتُلَ مُؤْمِنًا إِلَّا خَطَأً ۚ وَمَن قَتَلَ مُؤْمِنًا خَطَأً فَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ وَدِيَةٌ مُّسَلَّمَةٌ إِلَىٰ أَهْلِهِ إِلَّا أَن يَصَّدَّقُوا ۚ فَإِن كَانَ مِن قَوْمٍ عَدُوٍّ لَّكُمْ وَهُوَ مُؤْمِنٌ فَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ۖ وَإِن كَانَ مِن قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُم مِّيثَاقٌ فَدِيَةٌ مُّسَلَّمَةٌ إِلَىٰ أَهْلِهِ وَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ۖ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ تَوْبَةً مِّنَ اللَّـهِ ۗ وَكَانَ اللَّـهُ عَلِيمًا حَكِيمًا ٩٢

మరియు – పొరపాటుగాతప్ప – ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చంపటం తగనిపని (నిషిద్ధం). మరియు ఒక విశ్వాసిని పొరపాటుగా చంపినవాడు (దానికి పరిహారంగా) అతడు ఒక విశ్వాసి బానిసకు విముక్తి కలిగించాలి మరియు హతుని కుటుంబీ కులకు (వారసులకు) రక్తపరిహారం (దియత్‌) కూడా చెల్లించాలి. వారు క్షమిస్తే అది వారికి దానం (సదఖహ్) అవుతుంది! 73 కాని ఒకవేళ వధింప బడినవాడు విశ్వాసి అయి, మీ శత్రువులలో చేరిన వాడై ఉంటే, ఒక విశ్వాస బానిసకు విముక్తి కలిగించాలి. ఒకవేళ (వధింపబడిన వాడు) – మీరు ఒడంబడిక చేసుకొనివున్న జనులకు చెందిన వాడైతే – రక్తపరిహారం అతని కుటుంబీకులకు (వారసులకు) ఇవ్వాలి. మరియు ఒక విశ్వాస (ముస్లిం) బానిసకు విముక్తి కలిగించాలి. (బానిసకు విముక్తికలిగించే) శక్తిలేనివాడు, వరుసగా రెండు నెలలు ఉపవాసాలుండాలి. అల్లాహ్‌ ముందు పశ్చాత్తాపపడటానికి (ఇదే సరైనపద్దతి). అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

4:93 – وَمَن يَقْتُلْ مُؤْمِنًا مُّتَعَمِّدًا فَجَزَاؤُهُ جَهَنَّمُ خَالِدًا فِيهَا وَغَضِبَ اللَّـهُ عَلَيْهِ وَلَعَنَهُ وَأَعَدَّ لَهُ عَذَابًا عَظِيمًا ٩٣

మరియు ఎవడైతే ఒకవిశ్వాసిని బుద్ధి పూర్వకంగా చంపుతాడో అతని ప్రతీకారం నరకమే! అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు 74 మరియు అతనిపై అల్లాహ్‌ ఆగ్రహం మరియు శాపం (బహి ష్కారం) ఉంటుంది మరియు ఆయన (అల్లాహ్‌) అతనికొరకు ఘోరమైన శిక్షను సిధ్ధపరిచాడు.

4:94 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا ضَرَبْتُمْ فِي سَبِيلِ اللَّـهِ فَتَبَيَّنُوا وَلَا تَقُولُوا لِمَنْ أَلْقَىٰ إِلَيْكُمُ السَّلَامَ لَسْتَ مُؤْمِنًا تَبْتَغُونَ عَرَضَ الْحَيَاةِ الدُّنْيَا فَعِندَ اللَّـهِ مَغَانِمُ كَثِيرَةٌ ۚ كَذَٰلِكَ كُنتُم مِّن قَبْلُ فَمَنَّ اللَّـهُ عَلَيْكُمْ فَتَبَيَّنُوا ۚ إِنَّ اللَّـهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا ٩٤

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌ మార్గంలో (జిహాద్‌కు) బయలుదేరినప్పుడు వివేచనతో వ్యవహరించండి. (శాంతిని ఆశించి మీవైపునకు) సలాం చేస్తూ వచ్చే వానిని – ప్రాపంచిక ప్రయోజ నాలను పొందగోరి – ”నీవు విశ్వాసివి (ముస్లింవు) కావు.” 75 అని (త్వరపడి) అనకండి. అల్లాహ్‌ దగ్గర మీ కొరకు విజయధనాలు అత్యధికంగా వున్నాయి. దీనికి పూర్వం మీరు కూడా ఇదే స్థితిలో ఉండే వారు కదా! ఆ తరువాత అల్లాహ్‌ మిమ్మల్ని అనుగ్రహించాడు, కావున సముచిత మైన పరిశీలన చేయండి. నిశ్చయంగా, అల్లాహ్‌! మీరు చేసేదంతా బాగా ఎరుగును.

4:95 – لَّا يَسْتَوِي الْقَاعِدُونَ مِنَ الْمُؤْمِنِينَ غَيْرُ أُولِي الضَّرَرِ وَالْمُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّـهِ بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ ۚ فَضَّلَ اللَّـهُ الْمُجَاهِدِينَ بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ عَلَى الْقَاعِدِينَ دَرَجَةً ۚ وَكُلًّا وَعَدَ اللَّـهُ الْحُسْنَىٰ ۚ وَفَضَّلَ اللَّـهُ الْمُجَاهِدِينَ عَلَى الْقَاعِدِينَ أَجْرًا عَظِيمًا ٩٥

ఎలాంటి కారణం లేకుండా, ఇంటివద్ద కూర్చుండి పోయే విశ్వాసులు మరియు అల్లాహ్‌ మార్గంలో తమ ధనాన్ని మరియు తమ ప్రాణాన్ని వినియోగించి ధర్మయుధ్ధం (జిహాద్‌) చేసే విశ్వాసు లతో సరిసమానులు కాజాలరు. తమ ధనాన్ని, ప్రాణాన్ని వినియోగించి ధర్మయుధ్ధం (జిహాద్‌) చేసేవారి స్థానాన్ని అల్లాహ్‌! ఇంట్లో కూర్చుండి పోయేవారి స్థానంకంటే ఉన్నతంచేశాడు. మరియు అల్లాహ్‌ ప్రతిఒక్కరికి ఉత్తమ ఫలితపు వాగ్దానం చేశాడు. కానీ, అల్లాహ్‌ ధర్మయుధ్ధం (జిహాద్‌) చేసిన వారికి ఇంట్లో కూర్చున్న వారికంటే ఎంతో గొప్ప ప్రతిఫలమిచ్చి, ఆధిక్యత నిచ్చాడు.

4:96 – دَرَجَاتٍ مِّنْهُ وَمَغْفِرَةً وَرَحْمَةً ۚ وَكَانَ اللَّـهُ غَفُورًا رَّحِيمًا ٩٦

వారి కొరకు, ఆయన తరఫునుండి ఉన్నత స్థానాలు, క్షమాభిక్ష మరియు కారుణ్యాలు కూడా ఉంటాయి. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

4:97 – إِنَّ الَّذِينَ تَوَفَّاهُمُ الْمَلَائِكَةُ ظَالِمِي أَنفُسِهِمْ قَالُوا فِيمَ كُنتُمْ ۖ قَالُوا كُنَّا مُسْتَضْعَفِينَ فِي الْأَرْضِ ۚ قَالُوا أَلَمْ تَكُنْ أَرْضُ اللَّـهِ وَاسِعَةً فَتُهَاجِرُوا فِيهَا ۚ فَأُولَـٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَسَاءَتْ مَصِيرًا ٩٧

నిశ్చయంగా, తమకు తాము (తమ ఆత్మలకు) అన్యాయం చేసుకుంటూ ఉండేవారి ప్రాణాలను తీసే దేవదూతలు వారితో: ”మీరు ఏ స్థితిలో ఉండేవారు?” అని అడిగితే, వారు: ”మేము భూమిలో బలహీనులముగా నిస్సహాయులముగా ఉండేవారము!” అని జవాబిస్తారు. దానికి (దేవదూతలు): ”ఏమీ? మీరు వలసపోవటానికి అల్లాహ్‌ భూమి విశాలంగా లేకుండెనా?” అని అడుగుతారు. ఇలాంటివారి శరణం నరకమే. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం! 76

4:98 – إِلَّا الْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ لَا يَسْتَطِيعُونَ حِيلَةً وَلَا يَهْتَدُونَ سَبِيلً ٩٨

కాని, నిజంగానే నిస్సహాయులై, వలస పోవటానికి ఏ సాధనా సంపత్తీ, ఎలాంటి మార్గంలేని పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు తప్ప!

4:99 – فَأُولَـٰئِكَ عَسَى اللَّـهُ أَن يَعْفُوَ عَنْهُمْ ۚ وَكَانَ اللَّـهُ عَفُوًّا غَفُورًا ٩٩

కావున ఇటువంటి వారిని, అల్లాహ్‌ మన్నించవచ్చు! ఎందు కంటే, అల్లాహ్‌ మన్నించే వాడు, క్షమాశీలుడు. (5/8)

4:100 – وَمَن يُهَاجِرْ فِي سَبِيلِ اللَّـهِ يَجِدْ فِي الْأَرْضِ مُرَاغَمًا كَثِيرًا وَسَعَةً ۚ وَمَن يَخْرُجْ مِن بَيْتِهِ مُهَاجِرًا إِلَى اللَّـهِ وَرَسُولِهِ ثُمَّ يُدْرِكْهُ الْمَوْتُ فَقَدْ وَقَعَ أَجْرُهُ عَلَى اللَّـهِ ۗ وَكَانَ اللَّـهُ غَفُورًا رَّحِيمًا ١٠٠

మరియు అల్లాహ్‌ మార్గంలో వలస పోయేవాడు భూమిలో కావలసినంత స్థలాన్ని, సౌకర్యాలను పొందుతాడు. మరియు ఎవడు తన ఇంటిని వదలి, అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త కొరకు, వలసపోవటానికి బయలుదేరిన తరువాత అతనికి చావువస్తే! నిశ్చయంగా, అతని ప్రతిఫలం అల్లాహ్‌ వద్ద స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

4:101 – وَإِذَا ضَرَبْتُمْ فِي الْأَرْضِ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَقْصُرُوا مِنَ الصَّلَاةِ إِنْ خِفْتُمْ أَن يَفْتِنَكُمُ الَّذِينَ كَفَرُوا ۚ إِنَّ الْكَافِرِينَ كَانُوا لَكُمْ عَدُوًّا مُّبِينًا ١٠١

మరియు మీరు భూమిలో ప్రయాణం చేసే టపుడు నమాజులను సంక్షిప్తం (ఖ’స్ర్‌) చేస్తే, అది పాపం కాదు. (అంతే గాక) సత్య-తిరస్కారులు మిమ్మల్ని వేధిస్తారు అనే భయం మీకు కలిగి నపుడు కూడా! ఎందుకంటే, సత్య-తిరస్కారులు నిశ్చయంగా, మీకు బహిరంగ శత్రువులు.

4:102 – وَإِذَا كُنتَ فِيهِمْ فَأَقَمْتَ لَهُمُ الصَّلَاةَ فَلْتَقُمْ طَائِفَةٌ مِّنْهُم مَّعَكَ وَلْيَأْخُذُوا أَسْلِحَتَهُمْ فَإِذَا سَجَدُوا فَلْيَكُونُوا مِن وَرَائِكُمْ وَلْتَأْتِ طَائِفَةٌ أُخْرَىٰ لَمْ يُصَلُّوا فَلْيُصَلُّوا مَعَكَ وَلْيَأْخُذُوا حِذْرَهُمْ وَأَسْلِحَتَهُمْ ۗ وَدَّ الَّذِينَ كَفَرُوا لَوْ تَغْفُلُونَ عَنْ أَسْلِحَتِكُمْ وَأَمْتِعَتِكُمْ فَيَمِيلُونَ عَلَيْكُم مَّيْلَةً وَاحِدَةً ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ إِن كَانَ بِكُمْ أَذًى مِّن مَّطَرٍ أَوْ كُنتُم مَّرْضَىٰ أَن تَضَعُوا أَسْلِحَتَكُمْ ۖ وَخُذُوا حِذْرَكُمْ ۗ إِنَّ اللَّـهَ أَعَدَّ لِلْكَافِرِينَ عَذَابًا مُّهِينًا ١٠٢

మరియు నీవు (ఓ ప్రవక్తా!) వారి (ముస్లిం ల) మధ్య ఉండి (పోరాటం జరుగుతూ ఉండగా) నమా’జ్‌ చేయించడానికి వారితో నిలబడితే, వారి లోని ఒక వర్గం నీతోపాటు నిలబడాలి. మరియు వారు అస్త్రధారులై ఉండాలి. వారు తమ సజ్‌దాను పూర్తిచేసుకొని వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇంకా నమా’జ్‌ చేయని రెండోవర్గం వచ్చి నీతోపాటు నమా’జ్‌ చేయాలి. వారు కూడా జాగరూకులై ఉండి, తమ ఆయుధాలను ధరించి ఉండాలి. ఎందుకంటే, మీరు మీ ఆయుధాల పట్ల, మరియు మీ సామగ్రి పట్ల, ఏ కొద్ది అజాగ్రత్త వహించినా మీపై ఒక్కసారిగా విరుచుకుపడాలని సత్యతిరస్కారులు కాచుకొని ఉంటారు. అయితే వర్షం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటే! లేదా మీరు అస్వస్థులైతే, మీరు మీ ఆయుధాలను దించిపెట్టడం పాపం కాదు. అయినా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. నిశ్చయంగా అల్లాహ్‌ సత్య-తిరస్కారుల కొరకు అవమాన కరమైన శిక్షను సిధ్ధపరచి ఉంచాడు. 78

4:103 – فَإِذَا قَضَيْتُمُ الصَّلَاةَ فَاذْكُرُوا اللَّـهَ قِيَامًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِكُمْ ۚ فَإِذَا اطْمَأْنَنتُمْ فَأَقِيمُوا الصَّلَاةَ ۚ إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى الْمُؤْمِنِينَ كِتَابًا مَّوْقُوتًا ١٠٣

ఇక నమా’జ్‌ను పూర్తిచేసిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా, అల్లాహ్‌ను స్మరిస్తూ ఉండండి. కాని శాంతి-భద్రతలు నెలకొన్న తరువాత నమా’జ్‌ను స్థాపించండి. నిశ్చయంగా, నమా’జ్‌ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించటానికి విధిగా నియమించబడింది.

4:104 – وَلَا تَهِنُوا فِي ابْتِغَاءِ الْقَوْمِ ۖ إِن تَكُونُوا تَأْلَمُونَ فَإِنَّهُمْ يَأْلَمُونَ كَمَا تَأْلَمُونَ ۖ وَتَرْجُونَ مِنَ اللَّـهِ مَا لَا يَرْجُونَ ۗ وَكَانَ اللَّـهُ عَلِيمًا حَكِيمًا ١٠٤

మరియు శత్రువులను వెంబడించటంలో బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు బాధపడుతున్నట్లతే, నిశ్చయంగా వారు కూడా – మీరు బాధపడుతున్నట్లే – బాధపడుతున్నారు. మరియు మీరు అల్లాహ్‌ నుండి వారు ఆశించలేని దానిని ఆశిస్తున్నారు. మరియు వాస్తవానికి, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

4:105 – إِنَّا أَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ لِتَحْكُمَ بَيْنَ النَّاسِ بِمَا أَرَاكَ اللَّـهُ ۚ وَلَا تَكُن لِّلْخَائِنِينَ خَصِيمًا ١٠٥

(ఓ ము’హమ్మద్‌!) నిశ్చయంగా మేము ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను), సత్యంతో నీపై అవతరింపజేశాము – అల్లాహ్‌ నీకు తెలిపిన ప్రకారం – నీవు ప్రజల మధ్య తీర్పుచేయటానికి. మరియు నీవు విశ్వాస-ఘాతకుల పక్షమున వాదించేవాడవు కావద్దు.

4:106 – وَاسْتَغْفِرِ اللَّـهَ ۖ إِنَّ اللَّـهَ كَانَ غَفُورًا رَّحِيمًا ١٠٦

మరియు అల్లాహ్‌ ను క్షమాభిక్షకొరకు ప్రార్థించు. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. 79

4:107 – وَلَا تُجَادِلْ عَنِ الَّذِينَ يَخْتَانُونَ أَنفُسَهُمْ ۚ إِنَّ اللَّـهَ لَا يُحِبُّ مَن كَانَ خَوَّانًا أَثِيمًا ١٠٧

మరియు ఆత్మద్రోహం చేసుకునే వారి పక్షమున నీవు వాదించకు. నిశ్చయంగా, అల్లాహ్‌ విశ్వాసఘాతకుణ్ణి, పాపిని ప్రేమించడు.

4:108 – يَسْتَخْفُونَ مِنَ النَّاسِ وَلَا يَسْتَخْفُونَ مِنَ اللَّـهِ وَهُوَ مَعَهُمْ إِذْ يُبَيِّتُونَ مَا لَا يَرْضَىٰ مِنَ الْقَوْلِ ۚ وَكَانَ اللَّـهُ بِمَا يَعْمَلُونَ مُحِيطًا ١٠٨

వారు (తమ దుష్కర్మలను) మానవుల నుండి దాచగలరు, కాని అల్లాహ్ నుండి దాచలేరు. ఎందుకంటే ఆయనకు (అల్లాహ్‌ కు) సమ్మతంలేని విషయాలను గురించి వారు రాత్రులలో రహస్య సమాలోచనలు చేసేటప్పుడు కూడా ఆయన వారితో ఉంటాడు. మరియు వారి సకల చర్యలను అల్లాహ్‌ పరివేష్టించి ఉన్నాడు.

4:109 – هَا أَنتُمْ هَـٰؤُلَاءِ جَادَلْتُمْ عَنْهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا فَمَن يُجَادِلُ اللَّـهَ عَنْهُمْ يَوْمَ الْقِيَامَةِ أَم مَّن يَكُونُ عَلَيْهِمْ وَكِيلً ١٠٩

అవును, మీరే! వారి (ఈ అపరాధుల) పక్షమున ఇహలోక జీవితంలోనైతే వాదించారు. అయితే! తీర్పు దినమున వారి పక్షమున అల్లాహ్‌ తో ఎవడు వాదించగలడు? లేదా వారికి ఎవడు రక్షకుడు కాగలడు?

4:110 – وَمَن يَعْمَلْ سُوءًا أَوْ يَظْلِمْ نَفْسَهُ ثُمَّ يَسْتَغْفِرِ اللَّـهَ يَجِدِ اللَّـهَ غَفُورًا رَّحِيمًا ١١٠

మరియు పాపం చేసినవాడు, లేదా తనకు తాను అన్యాయం చేసుకున్నవాడు, 80 తరువాత అల్లాహ్‌ ను క్షమాభిక్షకై వేడుకుంటే అలాంటివాడు, అల్లాహ్‌ ను క్షమాశీలుడుగా, అపార కరుణా ప్రదాతగా పొందగలడు!

4:111 – وَمَن يَكْسِبْ إِثْمًا فَإِنَّمَا يَكْسِبُهُ عَلَىٰ نَفْسِهِ ۚ وَكَانَ اللَّـهُ عَلِيمًا حَكِيمًا ١١١

కాని ఎవడైనా పాపాన్ని అర్జిస్తే, దాని (ఫలితం) అతడే స్వయంగా భరిస్తాడు. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

4:112 – وَمَن يَكْسِبْ خَطِيئَةً أَوْ إِثْمًا ثُمَّ يَرْمِ بِهِ بَرِيئًا فَقَدِ احْتَمَلَ بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا ١١٢

మరియు ఎవడు అపరాధంగానీ, లేదా పాపంగానీ చేసి, తరువాత దానిని ఒక అమాయ కునిపై మోపుతాడో! వాస్తవానికి, అలాంటివాడు తీవ్రమైన అపనిందను మరియు ఘోరపాపాన్ని తనమీద మోపుకున్నవాడే!

4:113 – وَلَوْلَا فَضْلُ اللَّـهِ عَلَيْكَ وَرَحْمَتُهُ لَهَمَّت طَّائِفَةٌ مِّنْهُمْ أَن يُضِلُّوكَ وَمَا يُضِلُّونَ إِلَّا أَنفُسَهُمْ ۖ وَمَا يَضُرُّونَكَ مِن شَيْءٍ ۚ وَأَنزَلَ اللَّـهُ عَلَيْكَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَعَلَّمَكَ مَا لَمْ تَكُن تَعْلَمُ ۚ وَكَانَ فَضْلُ اللَّـهِ عَلَيْكَ عَظِيمًا ١١٣

మరియు (ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ అనుగ్రహం మరియు ఆయన కారుణ్యమే నీపై లేకుంటే, వారి లోని ఒక వర్గంవారు నిన్ను మార్గభ్రష్టత్వానికి గురి చేయగోరారు. కాని వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మార్గభ్రష్టులుగా చేయలేరు. మరియు వారు నీకెలాంటి హానీచేయలేరు. మరియు అల్లాహ్‌ నీపై ఈ గ్రంథాన్ని మరియు వివేకాన్ని అవతరింపజేశాడు. మరియు నీకు తెలియని విషయాలను నీకు నేర్పాడు. 81 మరియు నీపై ఉన్న అల్లాహ్‌ అనుగ్రహం చాలా గొప్పది. (3/4)

4:114 – لَّا خَيْرَ فِي كَثِيرٍ مِّن نَّجْوَاهُمْ إِلَّا مَنْ أَمَرَ بِصَدَقَةٍ أَوْ مَعْرُوفٍ أَوْ إِصْلَاحٍ بَيْنَ النَّاسِ ۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّـهِ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا ١١٤

  • వారుచేసే రహస్యసమావేశాలలో చాలా మట్టుకు ఏ మేలు లేదు. కాని ఎవరైనా దాన ధర్మాలు చేయటానికి, సత్కార్యాలు (మ’అరూఫ్) చేయటానికి లేదా ప్రజల మధ్య సంధి చేకూర్చ టానికి (సమాలోచనలు) చేస్తే తప్ప! ఎవడు అల్లాహ్‌ ప్రీతికొరకు ఇలాంటి పనులు చేస్తాడో, అతనికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము.

4:115 – وَمَن يُشَاقِقِ الرَّسُولَ مِن بَعْدِ مَا تَبَيَّنَ لَهُ الْهُدَىٰ وَيَتَّبِعْ غَيْرَ سَبِيلِ الْمُؤْمِنِينَ نُوَلِّهِ مَا تَوَلَّىٰ وَنُصْلِهِ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا ١١٥

మరియు తనకు సన్మార్గం స్పష్టంగా తెలిసినపిదప కూడా, ఎవడు ప్రవక్తకు వ్యతిరేకంగా పోయి విశ్వాసుల మార్గంగాక వేరే మార్గాన్ని అనుసరిస్తాడో! అతడు అవలంబించిన త్రోవ వైపునకే, అతనిని మరల్చుతాము మరియు వానిని నరకంలో కాల్చుతాము. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం. 82

4:116 – إِنَّ اللَّـهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ ۚ وَمَن يُشْرِكْ بِاللَّـهِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا ١١٦

నిశ్చయంగా, అల్లాహ్‌ తనకు సాటి కల్పించటాన్ని (షిర్కును) ఏ మాత్రం క్షమించడు, కాని ఆయన దానిని విడిచి (ఇతర ఏ పాపాన్నైనా) తాను కోరిన వానికి క్షమిస్తాడు! అల్లాహ్‌ తో భాగస్వాములను కల్పించేవాడు, వాస్తవానికి మార్గ భ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలాదూరం పోయినట్లే!

4:117 – إِن يَدْعُونَ مِن دُونِهِ إِلَّا إِنَاثًا وَإِن يَدْعُونَ إِلَّا شَيْطَانًا مَّرِيدًا ١١٧

ఆయనను (అల్లాహ్‌ ను) వదలి, వారు స్త్రీ (దేవత) లను ప్రార్థిస్తున్నారు. 83 మరియు వారు కేవలం తిరుగుబాటుదారుడైన షై’తాన్‌నే ప్రార్థిస్తున్నారు. 84

4:118 – لَّعَنَهُ اللَّـهُ ۘ وَقَالَ لَأَتَّخِذَنَّ مِنْ عِبَادِكَ نَصِيبًا مَّفْرُوضًا ١١٨

అల్లాహ్‌ అతన్ని శపించాడు (బహిష్క రించాడు). మరియు అతడు (షై’తాన్‌) ఇలా అన్నాడు: ”నేను నిశ్చయంగా, నీ దాసులలో నుండి ఒక నియమిత భాగాన్ని తీసుకుంటాను.

4:119 – وَلَأُضِلَّنَّهُمْ وَلَأُمَنِّيَنَّهُمْ وَلَآمُرَنَّهُمْ فَلَيُبَتِّكُنَّ آذَانَ الْأَنْعَامِ وَلَآمُرَنَّهُمْ فَلَيُغَيِّرُنَّ خَلْقَ اللَّـهِ ۚ وَمَن يَتَّخِذِ الشَّيْطَانَ وَلِيًّا مِّن دُونِ اللَّـهِ فَقَدْ خَسِرَ خُسْرَانًا مُّبِينًا ١١٩

”మరియు నిశ్చయంగా, నేను వారిని మార్గ భ్రష్టులుగా చేస్తాను; మరియు వారికి తప్పక తప్పుడు ఆశలు కలిగిస్తాను; మరియు నేను వారిని ఆజ్ఞాపిస్తాను; దాని ప్రకారం వారు తప్పక పశువుల చెవులను చీల్చుతారు; మరియు నేను వారిని ఆజ్ఞాపిస్తాను; దాని ప్రకారం వారు తప్పక అల్లాహ్‌ సృష్టిలో మార్పులు చేస్తారు.” 85 మరియు ఎవడు అల్లాహ్‌ కు బదులుగా షై’తాన్‌ను తన రక్షకునిగా చేసుకుంటాడో! వాస్తవానికి వాడే స్పష్టమైన నష్టానికి గురి అయినవాడు!

4:120 – يَعِدُهُمْ وَيُمَنِّيهِمْ ۖ وَمَا يَعِدُهُمُ الشَّيْطَانُ إِلَّا غُرُورًا ١٢٠

అతడు(షై’తాన్‌) వారికి వాగ్దానంచేస్తాడు మరియు వారిలో విపరీత కోరికలను రేపుతాడు. కాని, ‘షై’తాన్‌ వారికి చేసేవాగ్దానాలు మోసపుచ్చేవి మాత్రమే!

4:121 – أُولَـٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ وَلَا يَجِدُونَ عَنْهَا مَحِيصًا ١٢١

అలాంటి వారి ఆశ్రయం నరకమే; మరియు వారికి దాని నుండి తప్పించుకునే మార్గమే ఉండదు.

4:122 – وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَنُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ وَعْدَ اللَّـهِ حَقًّا ۚ وَمَنْ أَصْدَقُ مِنَ اللَّـهِ قِيلً ١٢٢

మరియు ఎవరైతే విశ్వసించి సత్కా ర్యాలు చేస్తారో! మేము వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాము; అందులో వారు శాశ్వతంగా కలకాలముంటారు. అల్లాహ్‌ వాగ్దానం సత్యమైనది. మరియు పలుకు లలో అల్లాహ్‌ కంటే ఎక్కువ సత్యవంతుడెవడు?

4:123 – لَّيْسَ بِأَمَانِيِّكُمْ وَلَا أَمَانِيِّ أَهْلِ الْكِتَابِ ۗ مَن يَعْمَلْ سُوءًا يُجْزَ بِهِ وَلَا يَجِدْ لَهُ مِن دُونِ اللَّـهِ وَلِيًّا وَلَا نَصِيرًا ١٢٣

మీ కోరికల ప్రకారంగా గానీ, లేదా గ్రంథ ప్రజల కోరికల ప్రకారంగా గానీ (మోక్షం) లేదు! పాపం చేసిన వానికి దానికి తగిన శిక్ష ఇవ్వబడు తుంది; మరియు వాడు, అల్లాహ్‌ తప్ప మరొక రక్షకుడినిగానీ, సహాయకుడినిగానీ పొందలేడు!

4:124 – وَمَن يَعْمَلْ مِنَ الصَّالِحَاتِ مِن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَأُولَـٰئِكَ يَدْخُلُونَ الْجَنَّةَ وَلَا يُظْلَمُونَ نَقِيرًا ١٢٤

మరియు సత్కార్యాలు చేసేవాడు పురుషుడైనా, లేక స్త్రీ అయినా, ఆ వ్యక్తి విశ్వాసి అయిఉంటే, అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు వారికి ఖర్జూరపు-బీజపు చీలిక (నఖీరా) అంత అన్యాయం కూడా జరుగదు.

4:125 – وَمَنْ أَحْسَنُ دِينًا مِّمَّنْ أَسْلَمَ وَجْهَهُ لِلَّـهِ وَهُوَ مُحْسِنٌ وَاتَّبَعَ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۗ وَاتَّخَذَ اللَّـهُ إِبْرَاهِيمَ خَلِيلًا ١٢٥

మరియు తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్‌ కు సమర్పించుకొని (ముస్లిం అయి) సజ్జనుడై, ఇబ్రాహీమ్‌ అనుసరించిన, ఏకదైవ సిధ్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) అనుసరించే వాని కంటే ఉత్తముడైన విశ్వాసి (ధార్మికుడు) ఎవడు? మరియు అల్లాహ్! ఇబ్రాహీమ్‌ను తన స్నేహితునిగా చేసుకున్నాడు.

4:126 – وَلِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَكَانَ اللَّـهُ بِكُلِّ شَيْءٍ مُّحِيطًا ١٢٦

మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్‌ కు చెందినదే. మరియు వాస్తవానికి అల్లాహ్‌ ప్రతి దానిని పరివేష్టించి ఉన్నాడు.

4:127 – وَيَسْتَفْتُونَكَ فِي النِّسَاءِ ۖ قُلِ اللَّـهُ يُفْتِيكُمْ فِيهِنَّ وَمَا يُتْلَىٰ عَلَيْكُمْ فِي الْكِتَابِ فِي يَتَامَى النِّسَاءِ اللَّاتِي لَا تُؤْتُونَهُنَّ مَا كُتِبَ لَهُنَّ وَتَرْغَبُونَ أَن تَنكِحُوهُنَّ وَالْمُسْتَضْعَفِينَ مِنَ الْوِلْدَانِ وَأَن تَقُومُوا لِلْيَتَامَىٰ بِالْقِسْطِ ۚ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّـهَ كَانَ بِهِ عَلِيمًا ١٢٧

మరియు వారు నిన్ను స్త్రీల వ్యవహారంలో గల ధార్మిక తీర్పు (ఫత్వా)ను గురించి అడుగు తున్నారు. వారితో ఇలా అను: ”అల్లాహ్‌ వారిని (స్త్రీలను) గురించి ధార్మిక తీర్పు ఇస్తున్నాడు: ‘అనాథ స్త్రీలను, వారి కొరకు నిర్ణయించబడిన హక్కు (మహ్ర్‌)ను మీరు వారికివ్వక, వారిని పెండ్లాడగోరుతున్న విషయాన్ని గురించీ మరియు బలహీనులైన బిడ్డలను గురించీ మరియు అనాథపిల్లల విషయంలోనూ న్యాయంగా వ్యవహరించాలని, ఈ గ్రంథంలో మీకు తెలుప బడుతోంది.’ 87 మరియు మీరు ఏ మంచిపని చేసినా అది అల్లాహ్‌ కు తప్పకుండా తెలుస్తుంది.”

4:128 – وَإِنِ امْرَأَةٌ خَافَتْ مِن بَعْلِهَا نُشُوزًا أَوْ إِعْرَاضًا فَلَا جُنَاحَ عَلَيْهِمَا أَن يُصْلِحَا بَيْنَهُمَا صُلْحًا ۚ وَالصُّلْحُ خَيْرٌ ۗ وَأُحْضِرَتِ الْأَنفُسُ الشُّحَّ ۚ وَإِن تُحْسِنُوا وَتَتَّقُوا فَإِنَّ اللَّـهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا ١٢٨

మరియు ఒకవేళ స్త్రీ తన భర్త, అనాదరణతో ప్రవర్తిస్తాడేమోనని, లేదా విముఖు డవుతాడేమోనని, భయపడితే! వారిద్దరూ తమ మధ్య రాజీ చేసుకుంటే! వారిపై ఎలాంటి దోషంలేదు. రాజీ పడటం ఎంతో ఉత్తమమైనది. మరియు మానవుల మనస్సులలో పేరాస ఇమిడి వున్నది. మీరు సజ్జనులై, దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే నిశ్చయంగా, అల్లాహ్‌ మీ కర్మలన్నింటినీ బాగా ఎరుగును.

4:129 – وَلَن تَسْتَطِيعُوا أَن تَعْدِلُوا بَيْنَ النِّسَاءِ وَلَوْ حَرَصْتُمْ ۖ فَلَا تَمِيلُوا كُلَّ الْمَيْلِ فَتَذَرُوهَا كَالْمُعَلَّقَةِ ۚ وَإِن تُصْلِحُوا وَتَتَّقُوا فَإِنَّ اللَّـهَ كَانَ غَفُورًا رَّحِيمًا ١٢٩

మరియు మీరు ఎంతకోరినా, మీ భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ చేతకాని పని. కనుక ఒక భార్య వైపునకు ఎక్కువగా మొగ్గి, మరొకామెను డోలాయమాన స్థితిలో వదలకండి. మీరు మీ ప్రవర్తనను సరిజేసుకొని దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

4:130 – وَإِن يَتَفَرَّقَا يُغْنِ اللَّـهُ كُلًّا مِّن سَعَتِهِ ۚ وَكَانَ اللَّـهُ وَاسِعًا حَكِيمًا ١٣٠

కాని ఒకవేళ వారు (దంపతులు) విడిపోతే! అల్లాహ్‌ తన దాతృత్వంతో వారిలో ప్రతి ఒక్కరినీ, స్వయం సమృధ్ధులుగా చేయవచ్చు! మరియు అల్లాహ్‌! సర్వోపగతుడు, మహా వివేచనాపరుడు.

4:131 – وَلِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَلَقَدْ وَصَّيْنَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ وَإِيَّاكُمْ أَنِ اتَّقُوا اللَّـهَ ۚ وَإِن تَكْفُرُوا فَإِنَّ لِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَكَانَ اللَّـهُ غَنِيًّا حَمِيدًا ١٣١

మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా, అల్లాహ్‌ కు చెందినదే. మరియు వాస్తవానికి మేము అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండమని, పూర్వం గ్రంథం ఇచ్చిన వారికీ మరియు మీకూ ఆజ్ఞా పించాము. మరియు ఒకవేళ మీరు తిరస్కరిస్తే భూమ్యాకాశాలలో ఉన్నదంతా నిశ్చయంగా, అల్లాహ్‌కే చెందినది. మరియు అల్లాహ్‌ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు.

4:132 – وَلِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَكَفَىٰ بِاللَّـهِ وَكِيلًا ١٣٢

మరియు ఆకాశాలలోనూ మరియు భూమి లోనూ ఉన్నదంతా అల్లాహ్‌ కే చెందుతుంది. మరియు కార్య సాధకుడిగా అల్లాహ్‌ చాలు!

4:133 – إِن يَشَأْ يُذْهِبْكُمْ أَيُّهَا النَّاسُ وَيَأْتِ بِآخَرِينَ ۚ وَكَانَ اللَّـهُ عَلَىٰ ذَٰلِكَ قَدِيرًا ١٣٣

ఓ మానవులారా! ఆయన కోరితే, మిమ్మల్ని అంతంచేసి ఇతరులను తేగలడు. మరియు వాస్తవానికి, అల్లాహ్‌ ఇలా చేయగల సమర్థుడు. 88

4:134 – مَّن كَانَ يُرِيدُ ثَوَابَ الدُّنْيَا فَعِندَ اللَّـهِ ثَوَابُ الدُّنْيَا وَالْآخِرَةِ ۚ وَكَانَ اللَّـهُ سَمِيعًا بَصِيرًا ١٣٤

ఎవడు ఇహలోక ఫలితాన్ని కోరుతాడో, (వానికదే దొరుకుతుంది). కాని (కేవలం) అల్లాహ్‌ వద్దనే, ఇహలోక మరియు పరలోక ఫలితా లున్నాయి. మరియు అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. (7/8)

4:135 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا قَوَّامِينَ بِالْقِسْطِ شُهَدَاءَ لِلَّـهِ وَلَوْ عَلَىٰ أَنفُسِكُمْ أَوِ الْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ ۚ إِن يَكُنْ غَنِيًّا أَوْ فَقِيرًا فَاللَّـهُ أَوْلَىٰ بِهِمَا ۖ فَلَا تَتَّبِعُوا الْهَوَىٰ أَن تَعْدِلُوا ۚ وَإِن تَلْوُوا أَوْ تُعْرِضُوا فَإِنَّ اللَّـهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا ١٣٥

  • ఓ విశ్వాసులారా! మీరు న్యాయం కొరకు స్థిరంగా నిలబడి, అల్లాహ్‌ కొరకే సాక్ష్య మివ్వండి. మరియు మీ సాక్ష్యం మీకుగానీ, మీ తల్లి-దండ్రులకుగానీ, మీ బంధువులకుగానీ, విరుధ్ధంగా ఉన్నా సరే. వాడు ధనవంతుడైనా లేక పేదవాడైనా సరే! (మీకంటే ఎక్కువ) అల్లాహ్‌ వారిద్దరి మేలు కోరేవాడు. కావున మీరు మీ మనోవాంఛలను అనుసరిస్తే న్యాయం చేయక పోవచ్చు. 89 మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించినా, లేక దానిని నిరాకరించినా! నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును.

4:136 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا آمِنُوا بِاللَّـهِ وَرَسُولِهِ وَالْكِتَابِ الَّذِي نَزَّلَ عَلَىٰ رَسُولِهِ وَالْكِتَابِ الَّذِي أَنزَلَ مِن قَبْلُ ۚ وَمَن يَكْفُرْ بِاللَّـهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا ١٣٦

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరునిపై (ము’హమ్మద్‌పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి. 90 అల్లాహ్‌ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమదినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే!

4:137 – إِنَّ الَّذِينَ آمَنُوا ثُمَّ كَفَرُوا ثُمَّ آمَنُوا ثُمَّ كَفَرُوا ثُمَّ ازْدَادُوا كُفْرًا لَّمْ يَكُنِ اللَّـهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ سَبِيلًا ١٣٧

నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించిన తరు వాత తిరస్కరించి, మళ్ళీ విశ్వసించి, ఆ తరువాత తిరస్కరించి; ఆ తిరస్కారంలోనే పురోగమిస్తారో! అలాంటి వారిని అల్లాహ్‌ ఎన్నటికీ క్షమించడు. మరియు వారికి సన్మార్గం వైపునకు దారి చూపడు!

4:138 – بَشِّرِ الْمُنَافِقِينَ بِأَنَّ لَهُمْ عَذَابًا أَلِيمًا ١٣٨

కపట-విశ్వాసులకు, నిశ్చయంగా! బాధా కరమైన శిక్ష ఉందని తెలుపు.

4:139 – الَّذِينَ يَتَّخِذُونَ الْكَافِرِينَ أَوْلِيَاءَ مِن دُونِ الْمُؤْمِنِينَ ۚ أَيَبْتَغُونَ عِندَهُمُ الْعِزَّةَ فَإِنَّ الْعِزَّةَ لِلَّـهِ جَمِيعًا ١٣٩

ఎవరైతే విశ్వాసులను వదలి సత్యతిరస్కా రులను తమ స్నేహితులుగా చేసుకుంటారో! అలాంటివారు, వారి (అవిశ్వాసుల) నుండి గౌర వాన్ని పొందగోరుతున్నారా? కానీ నిశ్చయంగా, గౌరవమంతా కేవలం అల్లాహ్‌ కే చెందినది. 91

4:140 – وَقَدْ نَزَّلَ عَلَيْكُمْ فِي الْكِتَابِ أَنْ إِذَا سَمِعْتُمْ آيَاتِ اللَّـهِ يُكْفَرُ بِهَا وَيُسْتَهْزَأُ بِهَا فَلَا تَقْعُدُوا مَعَهُمْ حَتَّىٰ يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ ۚ إِنَّكُمْ إِذًا مِّثْلُهُمْ ۗ إِنَّ اللَّـهَ جَامِعُ الْمُنَافِقِينَ وَالْكَافِرِينَ فِي جَهَنَّمَ جَمِيعًا ١٤٠

మరియు వాస్తవానికి, (అల్లాహ్‌) మీ కొరకు ఈగ్రంథంలో (ఈవిధమైన ఆజ్ఞ) అవతరింపజేశాడు: ”ఒకవేళ మీరు అల్లాహ్‌ సూక్తులను గురించి తిర స్కారాన్ని మరియు పరిహాసాన్ని వింటే! అలా చేసే వారు, (ఆ సంభాషణ వదలి) ఇతర సంభాషణ ప్రారంభించనంత వరకు మీరు వారితో కలిసి కూర్చోకండి!” అలాచేస్తే నిశ్చయంగా మీరు కూడా వారిలాంటి వారే! నిశ్చయంగా అల్లాహ్‌ కపట-విశ్వాసులను మరియు సత్య-తిరస్కారు లను, అందరినీ నరకంలో జమచేస్తాడు.

4:141 – الَّذِينَ يَتَرَبَّصُونَ بِكُمْ فَإِن كَانَ لَكُمْ فَتْحٌ مِّنَ اللَّـهِ قَالُوا أَلَمْ نَكُن مَّعَكُمْ وَإِن كَانَ لِلْكَافِرِينَ نَصِيبٌ قَالُوا أَلَمْ نَسْتَحْوِذْ عَلَيْكُمْ وَنَمْنَعْكُم مِّنَ الْمُؤْمِنِينَ ۚ فَاللَّـهُ يَحْكُمُ بَيْنَكُمْ يَوْمَ الْقِيَامَةِ ۗ وَلَن يَجْعَلَ اللَّـهُ لِلْكَافِرِينَ عَلَى الْمُؤْمِنِينَ سَبِيلًا ١٤١

వారు (కపట-విశ్వాసులు) మీ విషయంలో నిరీక్షిస్తున్నారు. ఒకవేళ మీకు అల్లాహ్‌ తరఫు నుండి. విజయం లభిస్తే! వారు (మీతో) అంటారు: ”ఏమీ? మేము మీతో కలిసిలేమా?” కాని ఒకవేళ సత్య-తిరస్కారులదే పైచేయి అయితే (వారితో) అంటారు: ”ఏమీ? మీతో గెలిచే శక్తి మాకు లేక పోయిందా? అయినా మేముమిమ్మల్ని విశ్వాసుల నుండి కాపాడలేదా?” కాని అల్లాహ్‌ పునరుత్థాన దినమున మీ మధ్య తీర్పుచేస్తాడు. మరియు అల్లాహ్‌! ఎన్నటికీ సత్య-తిరస్కారులకు విశ్వాసులపై (విజయం పొందే) మార్గంచూపడు. 92

4:142 – إِنَّ الْمُنَافِقِينَ يُخَادِعُونَ اللَّـهَ وَهُوَ خَادِعُهُمْ وَإِذَا قَامُوا إِلَى الصَّلَاةِ قَامُوا كُسَالَىٰ يُرَاءُونَ النَّاسَ وَلَا يَذْكُرُونَ اللَّـهَ إِلَّا قَلِيلً ١٤٢

నిశ్చయంగా ఈ కపటవిశ్వాసులు అల్లాహ్‌ ను మోసగించగోరుతున్నారు. కాని ఆయనే వారిని మోసంలో పడవేశాడు. 93 మరియు ఒకవేళ వారు నమా’జ్‌ కొరకు నిలిచినా శ్రద్ధాహీనులై కేవలం ప్రజలకు చూపటానికే నిలుస్తారు. 94 మరియు వారు అల్లాహ్‌ ను స్మరించేది చాల తక్కువ!

4:143 – مُّذَبْذَبِينَ بَيْنَ ذَٰلِكَ لَا إِلَىٰ هَـٰؤُلَاءِ وَلَا إِلَىٰ هَـٰؤُلَاءِ ۚ وَمَن يُضْلِلِ اللَّـهُ فَلَن تَجِدَ لَهُ سَبِيلً ١٤٣

వారు (విశ్వాస-అవిశ్వాసాల) మధ్య ఊగిసలాడుతున్నారు. వారు పూర్తిగా ఇటు (విశ్వాసులు) కాకుండా పూర్తిగా అటు (సత్య-తిర స్కారులు) కాకుండా ఉన్నారు. మరియు ఎవడి నైతే అల్లాహ్‌ మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడో అలాంటి వాడికి నీవు (సరైన) మార్గం చూపలేవు. 95

4:144 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الْكَافِرِينَ أَوْلِيَاءَ مِن دُونِ الْمُؤْمِنِينَ ۚ أَتُرِيدُونَ أَن تَجْعَلُوا لِلَّـهِ عَلَيْكُمْ سُلْطَانًا مُّبِينًا ١٤٤

ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసులను వదలి సత్య-తిరస్కారులను, మీ స్నేహితులుగా చేసుకోకండి. ఏమీ? మీరు, మీకే వ్యతిరేకంగా, అల్లాహ్‌ కు స్పష్టమైన ప్రమాణం ఇవ్వదలచు కున్నారా?

4:145 – إِنَّ الْمُنَافِقِينَ فِي الدَّرْكِ الْأَسْفَلِ مِنَ النَّارِ وَلَن تَجِدَ لَهُمْ نَصِيرًا ١٤٥

నిశ్చయంగా కపట-విశ్వాసులు నరకంలో అట్టడుగు అంతస్తులో పడిఉంటారు. 96 మరియు వారికి సహాయం చేయగల వాడిని ఎవ్వడినీ నీవు పొందజాలవు.

4:146 – إِلَّا الَّذِينَ تَابُوا وَأَصْلَحُوا وَاعْتَصَمُوا بِاللَّـهِ وَأَخْلَصُوا دِينَهُمْ لِلَّـهِ فَأُولَـٰئِكَ مَعَ الْمُؤْمِنِينَ ۖ وَسَوْفَ يُؤْتِ اللَّـهُ الْمُؤْمِنِينَ أَجْرًا عَظِيمًا ١٤٦

కాని ఎవరైతే, పశ్చాత్తాపపడి, తమను తాము సంస్కరించుకొని, అల్లాహ్‌ ను గట్టిగా నమ్ముకొని తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం అల్లాహ్‌ కొరకే ప్రత్యేకించుకుంటారో, అలాంటి వారే విశ్వాసులతో కలిసిమెలసి ఉంటారు 97 మరియు త్వరలోనే అల్లాహ్‌ విశ్వాసులందరికీ గొప్ప ప్రతి ఫలాన్ని ప్రసాదించగలడు.

4:147 – مَّا يَفْعَلُ اللَّـهُ بِعَذَابِكُمْ إِن شَكَرْتُمْ وَآمَنتُمْ ۚ وَكَانَ اللَّـهُ شَاكِرًا عَلِيمًا ١٤٧

మీరు కృతజ్ఞులై, విశ్వాసులై ఉంటే అల్లాహ్‌ మిమ్మల్ని నిష్కారణంగా ఎందుకు శిక్షిస్తాడు? మరియు అల్లాహ్‌ కృతజ్ఞతలను ఆమోదించే వాడు, 98 సర్వజ్ఞుడు.

4:148 – لَّا يُحِبُّ اللَّـهُ الْجَهْرَ بِالسُّوءِ مِنَ الْقَوْلِ إِلَّا مَن ظُلِمَ ۚ وَكَانَ اللَّـهُ سَمِيعًا عَلِيمًا ١٤٨

[(*)] అన్యాయానికి గురి అయిన వాడు తప్ప! చెడును బహిరంగంగా పలుకటాన్ని అల్లాహ్‌ ఇష్టపడడు. 99 మరియు అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

4:149 – إِن تُبْدُوا خَيْرًا أَوْ تُخْفُوهُ أَوْ تَعْفُوا عَن سُوءٍ فَإِنَّ اللَّـهَ كَانَ عَفُوًّا قَدِيرًا ١٤٩

మీరు మేలును బహిరంగంగా చెప్పినా లేక దానిని దాచినా! 100 లేక చెడును క్షమించినా! నిశ్చయంగా, అల్లాహ్‌ మన్నించేవాడు, 101 సర్వ సమర్థుడు.

4:150 – إِنَّ الَّذِينَ يَكْفُرُونَ بِاللَّـهِ وَرُسُلِهِ وَيُرِيدُونَ أَن يُفَرِّقُوا بَيْنَ اللَّـهِ وَرُسُلِهِ وَيَقُولُونَ نُؤْمِنُ بِبَعْضٍ وَنَكْفُرُ بِبَعْضٍ وَيُرِيدُونَ أَن يَتَّخِذُوا بَيْنَ ذَٰلِكَ سَبِيلً ١٥٠

నిశ్చయంగా అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించేవారూ మరియు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూప గోరేవారూ (అంటే అల్లాహ్‌ను విశ్వసించి, ప్రవక్త లను తిరస్కరించేవారూ) మరియు: ”మేము కొందరు ప్రవక్తలను విశ్వసిస్తాము, మరి కొందరిని తిరస్కరిస్తాము.” అని అనేవారూ మరియు (విశ్వాస-అవిశ్వాసాలకు) మధ్య మార్గాన్ని కల్పించగోరే వారూ –

4:151 – أُولَـٰئِكَ هُمُ الْكَافِرُونَ حَقًّا ۚ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ عَذَابًا مُّهِينًا ١٥١

ఇలాంటివారే – నిస్సందేహంగా సత్య- తిరస్కారులు. మరియు సత్య-తిరస్కారుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిధ్ధపరచి ఉంచాము.

4:152 – وَالَّذِينَ آمَنُوا بِاللَّـهِ وَرُسُلِهِ وَلَمْ يُفَرِّقُوا بَيْنَ أَحَدٍ مِّنْهُمْ أُولَـٰئِكَ سَوْفَ يُؤْتِيهِمْ أُجُورَهُمْ ۗ وَكَانَ اللَّـهُ غَفُورًا رَّحِيمًا ١٥٢

మరియు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తలందరినీ విశ్వసిస్తూ, వారి (ప్రవక్తల) మధ్య భేదభావాలు చూపని వారికి ఆయన (అల్లాహ్‌) వారిప్రతిఫలాన్ని తప్పకప్రసాదించగలడు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

4:153 – يَسْأَلُكَ أَهْلُ الْكِتَابِ أَن تُنَزِّلَ عَلَيْهِمْ كِتَابًا مِّنَ السَّمَاءِ ۚ فَقَدْ سَأَلُوا مُوسَىٰ أَكْبَرَ مِن ذَٰلِكَ فَقَالُوا أَرِنَا اللَّـهَ جَهْرَةً فَأَخَذَتْهُمُ الصَّاعِقَةُ بِظُلْمِهِمْ ۚ ثُمَّ اتَّخَذُوا الْعِجْلَ مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ فَعَفَوْنَا عَن ذَٰلِكَ ۚ وَآتَيْنَا مُوسَىٰ سُلْطَانًا مُّبِينًا ١٥٣

(ఓ ప్రవక్తా!) గ్రంథ ప్రజలు నిన్ను ఆకాశం నుండి వారిపై ఒక గ్రంథాన్ని అవతరింపజేయమని, అడుగుతున్నారని (ఆశ్చర్యపడకు). వాస్తవానికి వారు మూసాను ఇంతకంటే దారుణమైన దానిని కోరుతూ: ”అల్లాహ్‌ను మాకు ప్రత్యక్షంగా చూపించు!” అని అడిగారు. అప్పుడు వారి దుర్మార్గానికి ఫలితంగా వారిపై పిడుగు విరుచుకు పడింది 102 స్పష్టమైన సూచనలు లభించిన తరువాతనే వారు ఆవుదూడను (ఆరాధ్యదైవంగా) చేసుకున్నారు. అయినా దానికి మేము వారిని క్షమించాము. మరియు మూసాకు మేము స్పష్టమైన అధికారమిచ్చాము.

4:154 – وَرَفَعْنَا فَوْقَهُمُ الطُّورَ بِمِيثَاقِهِمْ وَقُلْنَا لَهُمُ ادْخُلُوا الْبَابَ سُجَّدًا وَقُلْنَا لَهُمْ لَا تَعْدُوا فِي السَّبْتِ وَأَخَذْنَا مِنْهُم مِّيثَاقًا غَلِيظًا ١٥٤

మరియు మేమువారిపై ‘తూర్‌ పర్వతాన్ని ఎత్తి ప్రమాణం తీసుకున్నాము. మేము వారితో: ”సాష్టాంగపడుతూ (వంగుతూ) ద్వారంలో ప్రవే శించండి.” అని అన్నాము. 103 మరియు: ”శని వారపు (సబ్త్‌) శాసనాన్ని ఉల్లంఘించకండి.” అని కూడా వారితోఅన్నాము. మరియు మేము వారితో దృఢమైన ప్రమాణం కూడా తీసుకున్నాము. 104

4:155 – فَبِمَا نَقْضِهِم مِّيثَاقَهُمْ وَكُفْرِهِم بِآيَاتِ اللَّـهِ وَقَتْلِهِمُ الْأَنبِيَاءَ بِغَيْرِ حَقٍّ وَقَوْلِهِمْ قُلُوبُنَا غُلْفٌ ۚ بَلْ طَبَعَ اللَّـهُ عَلَيْهَا بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلً ١٥٥

కాని వారు తాము చేసిన ప్రమాణాలను భంగం చేయటం వలన మరియు అల్లాహ్‌ సూక్తు లను తిరస్కరించటం వలన మరియు ప్రవక్తలను అన్యాయంగా చంపటం వలన! మరియు: ”మా హృదయాలు పొరలతో కప్పబడిఉన్నాయి.” 105 అని అనటంవలన (మేము వారిని శిక్షించాము). అంతే కాదు, వారి సత్య-తిరస్కారం వలన, అల్లాహ్‌ వారి హృదయాలపై ముద్రవేసి ఉన్నాడు; కాబట్టి వారు విశ్వసించినా కొంత మాత్రమే!

4:156 – وَبِكُفْرِهِمْ وَقَوْلِهِمْ عَلَىٰ مَرْيَمَ بُهْتَانًا عَظِيمًا ١٥٦

మరియు వారి సత్యతిరస్కారం వలన మరియు వారు మర్యమ్‌ పై మోపిన మహా అపనింద వలన; 106

4:157 – وَقَوْلِهِمْ إِنَّا قَتَلْنَا الْمَسِيحَ عِيسَى ابْنَ مَرْيَمَ رَسُولَ اللَّـهِ وَمَا قَتَلُوهُ وَمَا صَلَبُوهُ وَلَـٰكِن شُبِّهَ لَهُمْ ۚ وَإِنَّ الَّذِينَ اخْتَلَفُوا فِيهِ لَفِي شَكٍّ مِّنْهُ ۚ مَا لَهُم بِهِ مِنْ عِلْمٍ إِلَّا اتِّبَاعَ الظَّنِّ ۚ وَمَا قَتَلُوهُ يَقِينًا ١٥٧

మరియు వారు: ”నిశ్చయంగా, మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు, మర్యమ్‌ కుమా రుడైన, ‘ఈసా-మసీ’హ్‌ ను (ఏసు-క్రీస్తును) చంపాము.” అని అన్నందుకు. 107 మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువపై ఎక్కించనూ లేదు, కాని, వారు భ్రమకు గురిచేయ బడ్డారు. 108 నిశ్చయంగా, ఈ విషయాన్ని గురించి అభిప్రాయభేదం ఉన్నవారు దీనినిగురించి సంశయ గ్రస్తులైఉన్నారు. ఈవిషయంగురించి వారికి నిశ్చిత జ్ఞానంలేదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తు న్నారు. నిశ్చయంగా, వారు అతనిని చంపలేదు.

4:158 – بَل رَّفَعَهُ اللَّـهُ إِلَيْهِ ۚ وَكَانَ اللَّـهُ عَزِيزًا حَكِيمًا ١٥٨

వాస్తవానికి, అల్లాహ్‌ అతనిని (‘ఈసాను) తనవైపునకు ఎత్తుకున్నాడు. 109 మరియు అల్లాహ్‌ సర్వశక్తిసంపన్నుడు, మహా వివేకవంతుడు.

4:159 – وَإِن مِّنْ أَهْلِ الْكِتَابِ إِلَّا لَيُؤْمِنَنَّ بِهِ قَبْلَ مَوْتِهِ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكُونُ عَلَيْهِمْ شَهِيدًا ١٥٩

మరియు గ్రంథ ప్రజలలో ఎవడు కూడా అతనిని (‘ఈసాను), అతని మరణానికి పూర్వం 110 (అతను, అల్లాహ్‌ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని), విశ్వసించకుండా ఉండడు. మరియు పునరుత్థానదినమున అతను (‘ఈసా) వారిపై సాక్షిగా ఉంటాడు. 111

4:160 – فَبِظُلْمٍ مِّنَ الَّذِينَ هَادُوا حَرَّمْنَا عَلَيْهِمْ طَيِّبَاتٍ أُحِلَّتْ لَهُمْ وَبِصَدِّهِمْ عَن سَبِيلِ اللَّـهِ كَثِيرًا ١٦٠

యూదులకు వారు చేసిన ఘోర దుర్మార్గా లకు ఫలితంగానూ మరియు వారు, అనేకులను అల్లాహ్‌ మార్గంపై నడువకుండా ఆటంకపరుస్తూ ఉన్నందువలననూ, మేము ధర్మసమ్మతమైన అనేక పరిశుద్ధ వస్తువులను వారికి నిషేధించాము; 112

4:161 – وَأَخْذِهِمُ الرِّبَا وَقَدْ نُهُوا عَنْهُ وَأَكْلِهِمْ أَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ ۚ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ مِنْهُمْ عَذَابًا أَلِيمًا ١٦١

మరియు వాస్తవానికి, వారికి నిషేధింప బడినా; వారు వడ్డీని తీసుకోవటం వలననూ మరియు వారు అధర్మంగా ఇతరుల సొమ్మును తినటం వలననూ. మరియు వారిలో అవిశ్వాసు లైన వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిధ్ధపరచి ఉంచాము.

4:162 – لَّـٰكِنِ الرَّاسِخُونَ فِي الْعِلْمِ مِنْهُمْ وَالْمُؤْمِنُونَ يُؤْمِنُونَ بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِن قَبْلِكَ ۚ وَالْمُقِيمِينَ الصَّلَاةَ ۚ وَالْمُؤْتُونَ الزَّكَاةَ وَالْمُؤْمِنُونَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ أُولَـٰئِكَ سَنُؤْتِيهِمْ أَجْرًا عَظِيمًا ١٦٢

కాని వారిలో పరిపూర్ణమైన జ్ఞానం గలవారు మరియు విశ్వాసులైనవారు, 113 నీపై అవతరింప జేయబడిన దానిని మరియు నీకు పూర్వం అవతరింపజేయబడిన వాటిని విశ్వసిస్తారు. వారు నమా’జ్‌ విధిగా సలుపుతారు, విధిదానం (‘జకాత్‌) చెల్లిస్తారు మరియు అల్లాహ్‌ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాసం కలిగి ఉంటారు; ఇలాంటి వారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. (1/8)

4:163 – إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَىٰ نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ ۚ وَأَوْحَيْنَا إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَعِيسَىٰ وَأَيُّوبَ وَيُونُسَ وَهَارُونَ وَسُلَيْمَانَ ۚ وَآتَيْنَا دَاوُودَ زَبُورًا ١٦٣

  • (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నూ’హ్‌కు మరియు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలకు సందేశం (వ’హీ) పంపినట్లు, నీకు కూడా సందేశం పంపాము. మరియు మేము ఇబ్రాహీమ్‌, ఇస్మా’యీల్‌, ఇస్‌’హాఖ్‌, య’అఖూబ్‌లకు మరియు అతని సంతతి వారికి మరియు ‘ఈసా, అయ్యూబ్‌, యూనుస్‌, హారూన్‌ మరియు సులైమాన్‌లకు కూడా దివ్యజ్ఞానం (వ’హీ) పంపాము. 114 మరియు మేము దావూద్‌కు ‘జబూర్‌ 115 (గ్రంథాన్ని( ప్రసాదించాము.

4:164 – وَرُسُلًا قَدْ قَصَصْنَاهُمْ عَلَيْكَ مِن قَبْلُ وَرُسُلًا لَّمْ نَقْصُصْهُمْ عَلَيْكَ ۚ وَكَلَّمَ اللَّـهُ مُوسَىٰ تَكْلِيمًا ١٦٤

మరియు వాస్తవంగా, మేము పంపిన ప్రవక్తలలో కొందరి గాథలను నీకు తెలిపాము మరియు ఇతర ప్రవక్తలను గురించి మేము నీకు తెలుపలేదు. 116

4:165 – رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّـهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ ۚ وَكَانَ اللَّـهُ عَزِيزًا حَكِيمًا ١٦٥

(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చే వారిగా మరియు హెచ్చరికలు చేసేవారిగా పంపాము. 117 ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్‌కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగలకూడదని! 118 మరియు అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.

4:166 – لَّـٰكِنِ اللَّـهُ يَشْهَدُ بِمَا أَنزَلَ إِلَيْكَ ۖ أَنزَلَهُ بِعِلْمِهِ ۖ وَالْمَلَائِكَةُ يَشْهَدُونَ ۚ وَكَفَىٰ بِاللَّـهِ شَهِيدًا ١٦٦

కాని (ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ నీపై అవతరింప జేసిన దానికి (ఖుర్‌ఆనుకు) సాక్ష్యమిస్తున్నాడు. ఆయన దానిని తన జ్ఞానంతో అవతరింపజేశాడు. మరియు దేవదూతలు కూడా దీనికి సాక్ష్యమిస్తు న్నారు. మరియు ఉత్తమసాక్షిగా అల్లాహ్‌యే చాలు.

4:167 – إِنَّ الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّـهِ قَدْ ضَلُّوا ضَلَالًا بَعِيدًا ١٦٧

నిశ్చయంగా, ఎవరైతే సత్య-తిరస్కారులై, ఇతరులను అల్లాహ్‌ మార్గం వైపుకు రాకుండా నిరోధిస్తున్నారో వాస్తవానికి వారు మార్గభ్రష్టులై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయారు!

4:168 – إِنَّ الَّذِينَ كَفَرُوا وَظَلَمُوا لَمْ يَكُنِ اللَّـهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ طَرِيقًا ١٦٨

నిశ్చయంగా, ఎవరైతే సత్య-తిరస్కారులై, అక్రమానికి పాల్పడతారో, వారిని అల్లాహ్‌ ఏ మాత్రమూ క్షమించడూ మరియు వారికి ఋజు మార్గం వైపునకు మార్గదర్శకత్వమూ చేయడు.

4:169 – إِلَّا طَرِيقَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّـهِ يَسِيرًا ١٦٩

వారికి కేవలం నరకమార్గం మాత్రమే చూపు తాడు. అందులో వారు శాశ్వతంగా కలకాలం ఉంటారు. మరియు ఇది అల్లాహ్‌కు ఎంతో సులభం.

4:170 – يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُمُ الرَّسُولُ بِالْحَقِّ مِن رَّبِّكُمْ فَآمِنُوا خَيْرًا لَّكُمْ ۚ وَإِن تَكْفُرُوا فَإِنَّ لِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَكَانَ اللَّـهُ عَلِيمًا حَكِيمًا ١٧٠

ఓ మానవులారా! వాస్తవంగా మీ ప్రభువు తరఫునుండి, సత్యాన్ని తీసుకొని మీ వద్దకు ఈ సందేశహరుడు వచ్చివున్నాడు, కావున అతని మీద విశ్వాసం కలిగి ఉండండి, ఇదే మీకు మేలైనది. మరియు మీరు గనక తిరస్కరిస్తే! నిశ్చయంగా భూమ్యాకాశాలలో ఉన్నదంతా అల్లాహ్‌కే చెందినదని తెలుసుకోండి. 119 మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

4:171 – يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ وَلَا تَقُولُوا عَلَى اللَّـهِ إِلَّا الْحَقَّ ۚ إِنَّمَا الْمَسِيحُ عِيسَى ابْنُ مَرْيَمَ رَسُولُ اللَّـهِ وَكَلِمَتُهُ أَلْقَاهَا إِلَىٰ مَرْيَمَ وَرُوحٌ مِّنْهُ ۖ فَآمِنُوا بِاللَّـهِ وَرُسُلِهِ ۖ وَلَا تَقُولُوا ثَلَاثَةٌ ۚ انتَهُوا خَيْرًا لَّكُمْ ۚ إِنَّمَا اللَّـهُ إِلَـٰهٌ وَاحِدٌ ۖ سُبْحَانَهُ أَن يَكُونَ لَهُ وَلَدٌ ۘ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَكَفَىٰ بِاللَّـهِ وَكِيلًا ١٧١

ఓగ్రంథప్రజలారా! మీరు మీధర్మ విషయం లో హద్దులు మీరి ప్రవర్తించకండి. 120 మరియు అల్లాహ్‌ను గురించి సత్యంతప్ప వేరేమాట పలుక కండి. నిశ్చయంగా మర్యమ్‌ కుమారుడైన ‘ఈసా మసీ’హ్‌ (ఏసుక్రీస్తు), అల్లాహ్‌ యొక్క సందేశ హరుడు మరియు ఆయన (అల్లాహ్‌) మర్యమ్‌ వైపునకు పంపిన, ఆయన (అల్లాహ్‌) యొక్క ఆజ్ఞ (కలిమ) 121 మరియు ఆయన (అల్లాహ్‌) తరఫు నుండి వచ్చిన ఒక ఆత్మ (రూ’హ్‌). కావున మీరు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వ సించండి. మరియు (ఆరాధ్యదైవాలు): ”ముగ్గురు!” అని అనకండి 122 అదిమానుకోండి, మీకే మేలైనది! నిశ్చయంగా, అల్లాహ్‌ ఒక్కడే ఆరాధ్యదైవం. ఆయ నకు కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు కార్యకర్తగా అల్లాహ్‌ మాత్రమే చాలు.

4:172 – لَّن يَسْتَنكِفَ الْمَسِيحُ أَن يَكُونَ عَبْدًا لِّلَّـهِ وَلَا الْمَلَائِكَةُ الْمُقَرَّبُونَ ۚ وَمَن يَسْتَنكِفْ عَنْ عِبَادَتِهِ وَيَسْتَكْبِرْ فَسَيَحْشُرُهُمْ إِلَيْهِ جَمِيعًا ١٧٢

తాను, అల్లాహ్‌కు దాసుడననే విషయాన్ని మసీ’హ్‌ (క్రీస్తు) ఎన్నడూ ఉపేక్షించ లేదు. మరియు ఆయన (అల్లాహ్‌)కు సన్ని హితంగా ఉండే దేవదూతలు కూడాను. మరియు ఎవరు ఆయన (అల్లాహ్‌) దాస్యాన్ని ఉపేక్షించి, గర్వం ప్రదర్శిస్తారో వారందరినీ ఆయన తన ముందు సమావేశపరుస్తాడు.

4:173 – فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ وَيَزِيدُهُم مِّن فَضْلِهِ ۖ وَأَمَّا الَّذِينَ اسْتَنكَفُوا وَاسْتَكْبَرُوا فَيُعَذِّبُهُمْ عَذَابًا أَلِيمًا وَلَا يَجِدُونَ لَهُم مِّن دُونِ اللَّـهِ وَلِيًّا وَلَا نَصِيرًا ١٧٣

కానీ, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారికి ఆయన వారి ప్రతిఫలాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు మరియు తన అనుగ్రహంతో మరింత అధికంగా ఇస్తాడు. ఇక ఆయనను నిరాకరించి, గర్వం వహించే వారికి బాధాకరమైన శిక్ష విధిస్తాడు; 123 మరియు వారు తమ కొరకు – అల్లాహ్‌ తప్ప – ఇతర రక్షించేవాడిని గానీ, సహాయపడేవాడిని గానీ పొందలేరు.

4:174 – يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُم بُرْهَانٌ مِّن رَّبِّكُمْ وَأَنزَلْنَا إِلَيْكُمْ نُورًا مُّبِينًا ١٧٤

ఓ మానవులారా! మీ ప్రభువు నుండి మీకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది. మరియు మేము మీపై స్పష్టమైన జ్యోతిని (ఈ ఖుర్‌ఆన్‌ను) అవతరింపజేశాము.

4:175 – فَأَمَّا الَّذِينَ آمَنُوا بِاللَّـهِ وَاعْتَصَمُوا بِهِ فَسَيُدْخِلُهُمْ فِي رَحْمَةٍ مِّنْهُ وَفَضْلٍ وَيَهْدِيهِمْ إِلَيْهِ صِرَاطًا مُّسْتَقِيمًا ١٧٥

కావున ఎవరు అల్లాహ్‌ను విశ్వసించి, ఆయననే దృఢంగా నమ్ముకుంటారో, వారిని ఆయన తన కారుణ్యానికి మరియు అనుగ్రహానికి పాత్రులుగా చేసుకొని తనవద్దకు చేరే ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.

4:176 – يَسْتَفْتُونَكَ قُلِ اللَّـهُ يُفْتِيكُمْ فِي الْكَلَالَةِ ۚ إِنِ امْرُؤٌ هَلَكَ لَيْسَ لَهُ وَلَدٌ وَلَهُ أُخْتٌ فَلَهَا نِصْفُ مَا تَرَكَ ۚ وَهُوَ يَرِثُهَا إِن لَّمْ يَكُن لَّهَا وَلَدٌ ۚ فَإِن كَانَتَا اثْنَتَيْنِ فَلَهُمَا الثُّلُثَانِ مِمَّا تَرَكَ ۚ وَإِن كَانُوا إِخْوَةً رِّجَالًا وَنِسَاءً فَلِلذَّكَرِ مِثْلُ حَظِّ الْأُنثَيَيْنِ ۗ يُبَيِّنُ اللَّـهُ لَكُمْ أَن تَضِلُّوا ۗ وَاللَّـهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ١٧٦

వారు నిన్ను (కలాలను) గురించి ధార్మిక శాసనం (ఫత్వా) అడుగుతున్నారు. అల్లాహ్‌ మీకు, కలాలను 124 గురించి, ఈ విధంగా ధార్మిక శాసనం ఇస్తున్నాడని చెప్పు: ”ఒక పురుషుడు మరణించి, అతనికి సంతానం లేకుండా ఒక సోదరి 125 మాత్రమే ఉంటే, అతడు విడిచిన ఆస్తిలో ఆమెకు సగంవాటా లభిస్తుంది. పిల్లలు లేక చనిపోయిన సోదరి మొత్తం ఆస్తికి, అతడు (ఆమె నిజ సోదరుడు) వారసు డవుతాడు. అతనికి (మృతునికి) ఇద్దరు సోదరీమణులుంటే, వారిద్దరికీ అతడు వదలిన ఆస్తిలో మూడింట-రెండు వంతుల భాగం లభిస్తుంది. ఒకవేళ సోదర సోదరీమణులు (అనేకులుంటే) ప్రతి పురుషునికి ఇద్దరు స్త్రీల భాగానికి సమానంగా వాటా లభిస్తుంది. మీరు దారి తప్పకుండా ఉండటానికి అల్లాహ్‌ మీకు అంతా స్పష్టంగా తెలుపుతున్నాడు. మరియు అల్లాహ్‌కు ప్రతివిషయం గురించి బాగా తెలుసు.” (1/4)

సూరహ్ అల్-మాఇ‘దహ్ – ఇది చివర అవతరింపజేయబడిన మదనీ సూరాహ్‌లలో ఒకటి. ఈ సూరహ్‌ అల్‌-మాఇ’దహ్‌ 3వ ఆయత్‌లోని: ”ఈనాడు నేను మీధర్మాన్ని మీకొరకు పరిపూర్ణంచేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను మరియు మీ కొరకు అల్లాహ్‌కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను.” అనే భాగం 10వ హిజ్రీలో ‘హజ్జ్‌ రోజు అవతరింపజేయబడింది. ఇది ఈ సూరహ్‌ లోని అతి ముఖ్య అంశం. హాబిల్‌ (Abel) ను ఖాబిల్‌ (Cain) హత్యచేసింది, 27-43 ఆయత్‌ లలో వివరించబడింది. ‘ఈసా(‘అ.స.) యొక్క అద్భుతక్రియలు 109-120ఆయత్‌లలో ఉన్నాయి. దీని పేరు అల్‌ -మాఇ’దహ్, అంటే ‘ఆహారంతో నిండిన పళ్ళెం,’ ఉర్దూలో ‘దస్తర్‌ఖాన్‌’ అనబడు తుంది. ఇది 112వ ఆయత్‌లో నుండి తీసుకోబడింది. ఇందులో 120 ఆయతులు ఉన్నాయి.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 5:1 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَوْفُوا بِالْعُقُودِ ۚ أُحِلَّتْ لَكُم بَهِيمَةُ الْأَنْعَامِ إِلَّا مَا يُتْلَىٰ عَلَيْكُمْ غَيْرَ مُحِلِّي الصَّيْدِ وَأَنتُمْ حُرُمٌ ۗ إِنَّ اللَّـهَ يَحْكُمُ مَا يُرِيدُ ١

ఓ విశ్వాసులారా! ఒప్పందాలను పాటించండి. 1 మీ కొరకు పచ్చిక మేసే చతుష్పాద పశువులన్నీ 2 (తినటానికి) ధర్మసమ్మతం (‘హలాల్‌) చేయబడ్డాయి; మీకు తెలుపబడిన పశువులు తప్ప! మీరు ఇ’హ్రామ్‌ స్థితిలో ఉన్న ప్పుడు వేటాడటం మీకు ధర్మసమ్మతం కాదు. 3 నిశ్చయంగా, అల్లాహ్‌ తాను కోరింది శాసిస్తాడు.

5:2 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُحِلُّوا شَعَائِرَ اللَّـهِ وَلَا الشَّهْرَ الْحَرَامَ وَلَا الْهَدْيَ وَلَا الْقَلَائِدَ وَلَا آمِّينَ الْبَيْتَ الْحَرَامَ يَبْتَغُونَ فَضْلًا مِّن رَّبِّهِمْ وَرِضْوَانًا ۚ وَإِذَا حَلَلْتُمْ فَاصْطَادُوا ۚ وَلَا يَجْرِمَنَّكُمْ شَنَآنُ قَوْمٍ أَن صَدُّوكُمْ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ أَن تَعْتَدُوا ۘ وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَالْعُدْوَانِ ۚ وَاتَّقُوا اللَّـهَ ۖ إِنَّ اللَّـهَ شَدِيدُ الْعِقَابِ ٢

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ (నియమించిన) చిహ్నాలను 4 మరియు నిషిధ్ధమాసాలను 5 ఉల్లం ఘించకండి. మరియు బలిపశువులకు మరియు మెడలలో పట్టీలు ఉన్న పశువులకు (హాని చేయకండి). 6 మరియు తమ ప్రభువు అను గ్రహాన్ని మరియు ప్రీతిని కోరుతూ పవిత్ర గృహానికి (క’అబహ్ కు) పోయే వారిని (ఆటంకపరచకండి). కానీ ఇ’హ్రామ్‌ స్థితి ముగిసిన తరువాత మీరు వేటాడవచ్చు. మిమ్మల్ని పవిత్ర మస్జిద్‌ (మస్జిద్‌ అల్‌-‘హరామ్‌)ను సందర్శించకుండా నిరోధించిన వారిపట్ల గల విరోధంవలన వారితో హద్దులుమీరి ప్రవర్తించకండి. మరియు పుణ్యకార్యాలు మరియు దైవభీతి విషయాలలో, ఒకరికొకరు తోడ్పడండి. మరియు పాపకార్యాలలో గానీ, దౌర్జన్యాలలో గానీ తోడ్పడకండి. అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ శిక్ష విధించటంలో చాల కఠినుడు.

5:3 – حُرِّمَتْ عَلَيْكُمُ الْمَيْتَةُ وَالدَّمُ وَلَحْمُ الْخِنزِيرِ وَمَا أُهِلَّ لِغَيْرِ اللَّـهِ بِهِ وَالْمُنْخَنِقَةُ وَالْمَوْقُوذَةُ وَالْمُتَرَدِّيَةُ وَالنَّطِيحَةُ وَمَا أَكَلَ السَّبُعُ إِلَّا مَا ذَكَّيْتُمْ وَمَا ذُبِحَ عَلَى النُّصُبِ وَأَن تَسْتَقْسِمُوا بِالْأَزْلَامِ ۚ ذَٰلِكُمْ فِسْقٌ ۗ الْيَوْمَ يَئِسَ الَّذِينَ كَفَرُوا مِن دِينِكُمْ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِ ۚ الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا ۚ فَمَنِ اضْطُرَّ فِي مَخْمَصَةٍ غَيْرَ مُتَجَانِفٍ لِّإِثْمٍ ۙ فَإِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ٣

(సహజంగా) మరణించింది, రక్తం, పంది మాంసం మరియు అల్లాహ్‌ తప్ప ఇతరుల కొరకు (ఇతరుల పేరుతో) వధింప (జి’బ్‌’హ్‌ చేయ) బడినది, గొంతుపిసికి ఊపిరాడక, దెబ్బ తగిలి, ఎత్తు నుండి పడి, కొమ్ము తగిలి మరియు క్రూరమృగం నోటపడి చచ్చిన (పశువు / పక్షి) అన్నీ, మీకు తినటానికి నిషిధ్ధం (‘హరామ్‌) చేయ బడ్డాయి. కాని (క్రూరమృగం నోటపడిన దానిని) చావకముందే మీరు జి’బ్‌’హ్‌ చేసినట్లైతే అది నిషిధ్ధం కాదు. మరియు బలిపీఠం మీద వధించ బడినది 7 మరియు బాణాల ద్వారా శకునం చూడటం నిషేధింపబడ్డాయి. ఇవన్నీ ఘోరపాపాలు (ఫిస్‌ఖున్‌). ఈ నాడు సత్య-తిరస్కారులు, మీ ధర్మం గురించి పూర్తిగా ఆశలు వదలుకున్నారు. కనుక మీరు వారికి భయపడకండి, నాకే భయ పడండి. ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్‌కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను. 8 ఎవడైనా ఆకలికి ఓర్చుకోలేక, పాపానికి పూనుకోక, 9 (నిషిధ్ధమైన వస్తువులను తిన్నట్లైతే)! నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

5:4 – يَسْأَلُونَكَ مَاذَا أُحِلَّ لَهُمْ ۖ قُلْ أُحِلَّ لَكُمُ الطَّيِّبَاتُ ۙ وَمَا عَلَّمْتُم مِّنَ الْجَوَارِحِ مُكَلِّبِينَ تُعَلِّمُونَهُنَّ مِمَّا عَلَّمَكُمُ اللَّـهُ ۖ فَكُلُوا مِمَّا أَمْسَكْنَ عَلَيْكُمْ وَاذْكُرُوا اسْمَ اللَّـهِ عَلَيْهِ ۖ وَاتَّقُوا اللَّـهَ ۚ إِنَّ اللَّـهَ سَرِيعُ الْحِسَابِ ٤

వారు (ప్రజలు) తమ కొరకు ఏది ధర్మ సమ్మతం (‘హలాల్‌) అని నిన్ను అడుగు తున్నారు. నీవు ఇలా అను: ”పరిశుధ్ధ వస్తువు లన్నీ మీ కొరకు ధర్మసమ్మతం (‘హలాల్‌) చేయబడ్డాయి. మరియు మీకు అల్లాహ్‌ నేర్పిన విధంగా మీరు వేటశిక్షణ ఇచ్చిన జంతువులు 10 మీ కొరకు పట్టినవి కూడా! కావున అవి మీ కొరకు పట్టుకున్నవాటిని మీరు తినండి కాని దానిపై అల్లాహ్‌ పేరును ఉచ్చరించండి. 11 అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ లెక్క తీసుకోవటంలో అతిశీఘ్రుడు.”

5:5 – الْيَوْمَ أُحِلَّ لَكُمُ الطَّيِّبَاتُ ۖ وَطَعَامُ الَّذِينَ أُوتُوا الْكِتَابَ حِلٌّ لَّكُمْ وَطَعَامُكُمْ حِلٌّ لَّهُمْ ۖ وَالْمُحْصَنَاتُ مِنَ الْمُؤْمِنَاتِ وَالْمُحْصَنَاتُ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ إِذَا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ مُحْصِنِينَ غَيْرَ مُسَافِحِينَ وَلَا مُتَّخِذِي أَخْدَانٍ ۗ وَمَن يَكْفُرْ بِالْإِيمَانِ فَقَدْ حَبِطَ عَمَلُهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ ٥

ఈ నాడు మీ కొరకు పరిశుధ్ధమైన వస్తువు లన్నీ ధర్మసమ్మతం (‘హలాల్‌) చేయబడ్డాయి. మరియు గ్రంథప్రజల ఆహారం 12 మీకు ధర్మ సమ్మతమైనది. మరియు మీ ఆహారం వారికి ధర్మ సమ్మతమైనది. మరియు సుశీలురు అయిన విశ్వాస (ముస్లిం) స్త్రీలు గానీ మరియు సుశీలురు అయిన పూర్వ గ్రంథప్రజల స్త్రీలు గానీ, 13 మీరు వారికి వారి మహ్ర్ ను (వధుకట్నం) చెల్లించి, న్యాయ బద్ధంగా వారితో వివాహజీవితం గడపండి. కాని వారితో స్వేచ్ఛా కామక్రీడలు గానీ, లేదా దొంగ చాటు సంబంధాలు గానీ ఉంచుకోకండి. ఎవడు విశ్వాసమార్గాన్ని తిరస్కరిస్తాడో అతని కర్మలు వ్యర్థమవుతాయి. మరియు అతడు పరలోకంలో నష్టంపొందేవారిలో చేరుతాడు.

5:6 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا قُمْتُمْ إِلَى الصَّلَاةِ فَاغْسِلُوا وُجُوهَكُمْ وَأَيْدِيَكُمْ إِلَى الْمَرَافِقِ وَامْسَحُوا بِرُءُوسِكُمْ وَأَرْجُلَكُمْ إِلَى الْكَعْبَيْنِ ۚ وَإِن كُنتُمْ جُنُبًا فَاطَّهَّرُوا ۚ وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُم مِّنْهُ ۚ مَا يُرِيدُ اللَّـهُ لِيَجْعَلَ عَلَيْكُم مِّنْ حَرَجٍ وَلَـٰكِن يُرِيدُ لِيُطَهِّرَكُمْ وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ ٦

ఓ విశ్వాసులారా! మీరు నమా’జ్‌కు లేచి నపుడు, మీ ముఖాలను, మరియు మీ చేతులను మోచేతులవరకు కడుక్కోండి. మరియు మీ తల లను (తడిచేతులతో) తుడుచుకోండి. మరియు మీ కాళ్ళను చీలమండల వరకు కడుక్కోండి. 14 మరియు మీకు ఇంద్రియ స్ఖలనం (జునుబ్‌) అయి ఉంటే, స్నానం (‘గుస్ల్‌) చేయండి. మరియు మీరు అస్వస్థులై ఉన్నా, లేక ప్రయాణంలో ఉన్నా, లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకొని ఉన్నా, లేక మీరు స్త్రీలతో కలిసి (సంభోగం చేసి) ఉన్నా, అప్పుడు మీకు నీరు లభించని పక్షంలో పరిశుభ్ర మైన మట్టితో తయమ్మమ్‌ చేయండి. అంటే, మీ ముఖాలను మరియు మీ చేతులను, దానితో (పరిశుభ్రమైన మట్టిపై స్పర్శించిన చేతులతో), రుద్దుకోండి. 15 మిమ్మల్ని కష్టపెట్టాలనేది అల్లాహ్‌ అభిమతం కాదు. మీరు కృతజ్ఞులు కావాలని ఆయన, మిమ్మల్ని శుద్ధపరచి మీపై తన అనుగ్రహాన్ని పూర్తిచేయ గోరుతున్నాడు.

5:7 – وَاذْكُرُوا نِعْمَةَ اللَّـهِ عَلَيْكُمْ وَمِيثَاقَهُ الَّذِي وَاثَقَكُم بِهِ إِذْ قُلْتُمْ سَمِعْنَا وَأَطَعْنَا ۖ وَاتَّقُوا اللَّـهَ ۚ إِنَّ اللَّـهَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ٧

మరియు మీకు అల్లాహ్‌ చేసిన అనుగ్రహాన్ని మరియు ఆయన మీ నుండి తీసుకున్నదృఢమైన ప్రమాణాన్ని జ్ఞాపకంచేసుకోండి. అప్పుడు మీరు: ”మేము విన్నాము మరియు విధేయులమయ్యా ము.” అని అన్నారు. మరియు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా హృద యాలలో ఉన్నదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.

5:8 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا قَوَّامِينَ لِلَّـهِ شُهَدَاءَ بِالْقِسْطِ ۖ وَلَا يَجْرِمَنَّكُمْ شَنَآنُ قَوْمٍ عَلَىٰ أَلَّا تَعْدِلُوا ۚ اعْدِلُوا هُوَ أَقْرَبُ لِلتَّقْوَىٰ ۖ وَاتَّقُوا اللَّـهَ ۚ إِنَّ اللَّـهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ ٨

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌ కొరకు న్యా యంగా సాక్ష్యమివ్వటానికి స్థిరంగా నిలబడండి. 16 ఇతరుల పట్ల మీకున్న ద్వేషానికిలోనై, మీరు న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి, అది దైవభక్తికి సమీపమైనది. మరియు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. నిశ్చ యంగా మీరు చేసేదంతా అల్లాహ్‌ ఎరుగును.

5:9 – وَعَدَ اللَّـهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۙ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ ٩

మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉన్నాయని అల్లాహ్‌ వాగ్దానం చేశాడు.

5:10 – وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَـٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ ١٠

మరియు ఎవరైతే సత్య-తిరస్కారానికి పాల్పడి, మా సూచనలను అబద్ధాలని తిరస్కరిస్తారో! అలాంటి వారు భగభగ మండే నరకాగ్ని వాసులవుతారు.

5:11 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا نِعْمَتَ اللَّـهِ عَلَيْكُمْ إِذْ هَمَّ قَوْمٌ أَن يَبْسُطُوا إِلَيْكُمْ أَيْدِيَهُمْ فَكَفَّ أَيْدِيَهُمْ عَنكُمْ ۖ وَاتَّقُوا اللَّـهَ ۚ وَعَلَى اللَّـهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ ١١

ఓ విశ్వాసులారా! ఒక జాతి వారు (మీకు హాని చేయ సంకల్పించి) తమ చేతులను మీ వైపునకు చాచి నపుడు, అల్లాహ్‌ వారి చేతులను మీ నుండి తొలగించి మీకు చేసిన అనుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు విశ్వాసులు అల్లాహ్‌ పైననే నమ్మకముంచుకుంటారు. (3/8)

5:12 – وَلَقَدْ أَخَذَ اللَّـهُ مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ وَبَعَثْنَا مِنْهُمُ اثْنَيْ عَشَرَ نَقِيبًا ۖ وَقَالَ اللَّـهُ إِنِّي مَعَكُمْ ۖ لَئِنْ أَقَمْتُمُ الصَّلَاةَ وَآتَيْتُمُ الزَّكَاةَ وَآمَنتُم بِرُسُلِي وَعَزَّرْتُمُوهُمْ وَأَقْرَضْتُمُ اللَّـهَ قَرْضًا حَسَنًا لَّأُكَفِّرَنَّ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَلَأُدْخِلَنَّكُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۚ فَمَن كَفَرَ بَعْدَ ذَٰلِكَ مِنكُمْ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ ١٢

మరియు వాస్తవానికి అల్లాహ్‌ ఇస్రా’యీ లు సంతతి వారి నుండి దృఢమైన ప్రమాణాన్ని తీసుకున్నాడు. మరియు మేము వారిలో నుండి పన్నెండు మందిని (కనాన్‌కు) పోవటానికి నాయ కులుగా నియమించాము. 17 మరియు అల్లాహ్‌ వారితో ఇలా అన్నాడు: ”ఒకవేళ మీరు నమా’జ్‌ స్థిరంగా సలుపుతూ, విధిదానం (‘జకాత్‌) చెల్లిస్తూ మరియు నా ప్రవక్తలను విశ్వసించి వారికి తోడ్పడుతూ, అల్లాహ్‌కు మంచి రుణాన్ని ఇస్తూ వుంటే! నిశ్చయంగా, నేను మీకు తోడుగా ఉంటాను. మరియు నిశ్చయంగా, నేను మీ నుండి మీ పాపాలను తొలగిస్తాను మరియు నిశ్చయంగా మిమ్మల్ని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాను. కానీ, దీని తరువాత మీలో ఎవడు సత్య-తిరస్కార వైఖరిని అవలం బిస్తాడో! అతడు వాస్తవంగా, సరైన మార్గం నుండి తప్పిపోయిన వాడే!”

5:13 – فَبِمَا نَقْضِهِم مِّيثَاقَهُمْ لَعَنَّاهُمْ وَجَعَلْنَا قُلُوبَهُمْ قَاسِيَةً ۖ يُحَرِّفُونَ الْكَلِمَ عَن مَّوَاضِعِهِ ۙ وَنَسُوا حَظًّا مِّمَّا ذُكِّرُوا بِهِ ۚ وَلَا تَزَالُ تَطَّلِعُ عَلَىٰ خَائِنَةٍ مِّنْهُمْ إِلَّا قَلِيلًا مِّنْهُمْ ۖ فَاعْفُ عَنْهُمْ وَاصْفَحْ ۚ إِنَّ اللَّـهَ يُحِبُّ الْمُحْسِنِينَ ١٣

ఆ పిదప వారు తాము చేసిన ఒడంబడికను భంగం చేసినందుకు, మేము వారిని శపించాము (బహిష్కరించాము) మరియు వారి హృదయా లను కఠినంచేశాము. వారు పదాలను తారుమారు చేసి వాటి అర్థాన్ని, సందర్భాన్ని పూర్తిగా మార్చి వేసేవారు. 18 వారికి ఇవ్వబడిన బోధనలలో అధిక భాగాన్ని మరచిపోయారు. అనుదినం వారిలో ఏ కొందరో తప్ప, పలువురు చేసే ద్రోహాన్ని గురించి నీకు తెలుస్తూనే ఉంది. కనుక వారిని మన్నించు మరియు వారి చేష్టలను ఉపేక్షించు. నిశ్చయంగా, అల్లాహ్‌ సజ్జనులను ప్రేమిస్తాడు.

5:14 – وَمِنَ الَّذِينَ قَالُوا إِنَّا نَصَارَىٰ أَخَذْنَا مِيثَاقَهُمْ فَنَسُوا حَظًّا مِّمَّا ذُكِّرُوا بِهِ فَأَغْرَيْنَا بَيْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۚ وَسَوْفَ يُنَبِّئُهُمُ اللَّـهُ بِمَا كَانُوا يَصْنَعُونَ ١٤

”మేము క్రైస్తవులము.” అని అనేవారి నుంచి కూడా మేము దృఢమైన ప్రమాణం తీసు కున్నాము; కాని వారు తమకు ఇవ్వబడిన బోధనలలో అధిక భాగాన్ని మరచిపోయారు; కావున తీర్పుదినం వరకు వారి మధ్య విరోధాన్ని మరియు ద్వేషాన్ని కల్గించాము. మరియు త్వరలోనే అల్లాహ్‌ వారు చేస్తూ వచ్చిన కర్మలను గురించి వారికి తెలియజేస్తాడు.

5:15 – يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ كَثِيرًا مِّمَّا كُنتُمْ تُخْفُونَ مِنَ الْكِتَابِ وَيَعْفُو عَن كَثِيرٍ ۚ قَدْ جَاءَكُم مِّنَ اللَّـهِ نُورٌ وَكِتَابٌ مُّبِينٌ ١٥

ఓ గ్రంథ ప్రజలారా! వాస్తవంగా మా ప్రవక్త (ము’హమ్మద్‌) మీ వద్దకు వచ్చివున్నాడు; మీరు కప్పిపుచ్చుతూ ఉన్న గ్రంథం (బైబిల్‌) లోని ఎన్నో విషయాలను అతను మీకు బహిర్గతం చేస్తున్నాడు; మరియు ఎన్నో విషయాలను ఉపేక్షిస్తున్నాడు. వాస్తవంగా మీ కొరకు అల్లాహ్‌ తరఫు నుండి ఒక జ్యోతి మరియు స్పష్టమైన గ్రంథం (ఈ ఖుర్‌ఆన్‌) వచ్చివున్నది. 19

5:16 – يَهْدِي بِهِ اللَّـهُ مَنِ اتَّبَعَ رِضْوَانَهُ سُبُلَ السَّلَامِ وَيُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ بِإِذْنِهِ وَيَهْدِيهِمْ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ١

దాని ద్వారా అల్లాహ్‌! తన ప్రీతిని పొందగోరే వారికి శాంతి పథాలను చూపుతాడు మరియు తన ఆజ్ఞతో వారిని అంధకారం నుండి వెలుగులోకి తెచ్చి వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.

5:17 – لَّقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّـهَ هُوَ الْمَسِيحُ ابْنُ مَرْيَمَ ۚ قُلْ فَمَن يَمْلِكُ مِنَ اللَّـهِ شَيْئًا إِنْ أَرَادَ أَن يُهْلِكَ الْمَسِيحَ ابْنَ مَرْيَمَ وَأُمَّهُ وَمَن فِي الْأَرْضِ جَمِيعًا ۗ وَلِلَّـهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۚ يَخْلُقُ مَا يَشَاءُ ۚ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١٧

”నిశ్చయంగా, మర్యమ్‌ కుమారుడైన మసీ’హ్‌ (క్రీస్తు) యే అల్లాహ్‌!” అని అనేవారు నిస్సందేహంగా! సత్య-తిరస్కారులు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: ”అల్లాహ్‌ గనక మర్యమ్‌ కుమారుడైన మసీ’హ్‌ (క్రీస్తు) ను అతని తల్లిని మరియు భూమిపై ఉన్న వారందరినీ, నాశనం చేయగోరితే, ఆయనను ఆపగల శక్తి ఎవరికిఉంది? మరియు ఆకాశాలలోను, భూమిలోను మరియు వాటిమధ్యఉన్న సమస్తం మీద ఆధిపత్యం అల్లాహ్‌ దే. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.” 20

5:18 – وَقَالَتِ الْيَهُودُ وَالنَّصَارَىٰ نَحْنُ أَبْنَاءُ اللَّـهِ وَأَحِبَّاؤُهُ ۚ قُلْ فَلِمَ يُعَذِّبُكُم بِذُنُوبِكُم ۖ بَلْ أَنتُم بَشَرٌ مِّمَّنْ خَلَقَ ۚ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۚ وَلِلَّـهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ وَإِلَيْهِ الْمَصِيرُ ١٨

మరియు యూదులు మరియు క్రైస్తవులు ఇలా అంటారు: ”మేము అల్లాహ్‌ సంతానం మరియు ఆయనకు ప్రియమైన వారము.” 21 (వారితో) ఇలా అను: ”అయితే, ఆయన మీ పాపాలకు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? అలాకాదు, మీరు కూడ ఆయన పుట్టించిన మానవులలో ఒకరు మాత్రమే! ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు ఆకాశాలలో భూమిలో మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్‌దే. మరియు ఆయన వైపునకే (అందరికీ) మరలిపోవలసి ఉంది.”

5:19 – يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ عَلَىٰ فَتْرَةٍ مِّنَ الرُّسُلِ أَن تَقُولُوا مَا جَاءَنَا مِن بَشِيرٍ وَلَا نَذِيرٍ ۖ فَقَدْ جَاءَكُم بَشِيرٌ وَنَذِيرٌ ۗ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١٩

ఓ గ్రంథ ప్రజలారా! ప్రవక్తలు రావటం, ఆగి పోయిన కొంతకాలం తరువాత, మీకు అంతా స్పష్టంగా తెలుపటానికి, వాస్తవంగా మా సందేశ హరుడు (ము’హమ్మద్‌) మీ వద్దకు వచ్చాడు. మీరు: ”మా వద్దకు శుభవార్తలు వినిపించేవాడు మరియు హెచ్చరికలు చేసేవాడు ఎవ్వడూ రాలేదు.” అని అనకూడదని. నిస్సందేహంగా ఇప్పుడు మీకు శుభవార్తలు వినిపించేవాడు మరియు హెచ్చరికలు చేసేవాడు వచ్చివున్నాడు. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.

5:20 – وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ اذْكُرُوا نِعْمَةَ اللَّـهِ عَلَيْكُمْ إِذْ جَعَلَ فِيكُمْ أَنبِيَاءَ وَجَعَلَكُم مُّلُوكًا وَآتَاكُم مَّا لَمْ يُؤْتِ أَحَدًا مِّنَ الْعَالَمِينَ ٢٠

మరియు మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నది (జ్ఞాపకంచేసుకోండి): ”నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి; ఆయన మీలో నుండి ప్రవక్తలను ఆవిర్భవింపజేశాడు మరియు మిమ్మల్ని సార్వ భౌములుగా చేశాడు. 22 మరియు (ఆ కాలంలో) ప్రపంచంలో ఎవ్వరికీ ప్రసాదించని వాటిని (అనుగ్రహాలను) మీకు ప్రసాదించాడు.

5:21 – يَا قَوْمِ ادْخُلُوا الْأَرْضَ الْمُقَدَّسَةَ الَّتِي كَتَبَ اللَّـهُ لَكُمْ وَلَا تَرْتَدُّوا عَلَىٰ أَدْبَارِكُمْ فَتَنقَلِبُوا خَاسِرِينَ ٢١

”నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ మీ కొరకు వ్రాసి ఉంచిన పవిత్ర భూమి (ఫలస్తీన్‌) లో ప్రవేశిం చండి. వెనుకకు మరలిరాకండి, అలాచేస్తే నష్టపడి తిరిగి రాగలరు.”

5:22 – قَالُوا يَا مُوسَىٰ إِنَّ فِيهَا قَوْمًا جَبَّارِينَ وَإِنَّا لَن نَّدْخُلَهَا حَتَّىٰ يَخْرُجُوا مِنْهَا فَإِن يَخْرُجُوا مِنْهَا فَإِنَّا دَاخِلُونَ ٢٢

(అప్పుడు) వారన్నారు: ”ఓ మూసా! నిశ్చయంగా, అందులో బలిష్ఠులైన ప్రజలు (అమాలేకీయులు) ఉన్నారు. మరియు వారు అక్కడి నుండి వెళ్ళిపోనంత వరకు, మేము అందులో ఏ మాత్రమూ ప్రవేశించము; ఒక వేళ వారు వెళ్ళిపోతే మేము తప్పక ప్రవేశిస్తాము.”

5:23 – قَالَ رَجُلَانِ مِنَ الَّذِينَ يَخَافُونَ أَنْعَمَ اللَّـهُ عَلَيْهِمَا ادْخُلُوا عَلَيْهِمُ الْبَابَ فَإِذَا دَخَلْتُمُوهُ فَإِنَّكُمْ غَالِبُونَ ۚ وَعَلَى اللَّـهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ ٢٣

(అప్పుడు) భయపడేవారిలోనుండి అల్లాహ్‌ అనుగ్రహం పొందిన ఇద్దరు వ్యక్తులు అన్నారు: ”ద్వారం నుండి పోయి వారిపై దాడిచేయండి. 23 మీరు లోనికి ప్రవేశించారంటే నిశ్చయంగా, విజయం మీదే! మీరు వాస్తవానికి విశ్వసించిన వారే అయితే! అల్లాహ్‌పైననే నమ్మకం ఉంచుకోండి.”

5:24 – قَالُوا يَا مُوسَىٰ إِنَّا لَن نَّدْخُلَهَا أَبَدًا مَّا دَامُوا فِيهَا ۖ فَاذْهَبْ أَنتَ وَرَبُّكَ فَقَاتِلَا إِنَّا هَاهُنَا قَاعِدُونَ ٢٤

వారన్నారు: ”ఓ మూసా! వారు అందు ఉన్నంత వరకు మేము అందులో ఎన్నటికీ ప్రవేశించము. కావున నీవు మరియు నీ ప్రభువు పోయి పోరాడండి, మేము నిశ్చయంగా, ఇక్కడే కూర్చుని ఉంటాము.”

5:25 – قَالَ رَبِّ إِنِّي لَا أَمْلِكُ إِلَّا نَفْسِي وَأَخِي ۖ فَافْرُقْ بَيْنَنَا وَبَيْنَ الْقَوْمِ الْفَاسِقِينَ ٢٥

(దానికి మూసా) అన్నాడు: ”ఓ నా ప్రభూ! నాకు నాపై మరియు నా సోదరునిపై మాత్రమే అధి కారం గలదు. కావున నీవు మా మధ్య మరియు ఈ అవిధేయుల మధ్య తీర్పుచేయి (మమ్మల్ని ఈ అవిధేయుల నుండి దూరం చేయి).”

5:26 – قَالَ فَإِنَّهَا مُحَرَّمَةٌ عَلَيْهِمْ ۛ أَرْبَعِينَ سَنَةً ۛ يَتِيهُونَ فِي الْأَرْضِ ۚ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْفَاسِقِينَ ٢٦

(అల్లాహ్‌) అన్నాడు: ”ఇక నిశ్చయంగా, ఆ భూమి వారి కొరకు నలభై-సంవత్సరాల వరకు నిషేధింపబడింది. వారు దేశదిమ్మరులై ఈ భూమిలో తిరుగుతూ ఉంటారు. 24 కావున అవిధేయులైన జనులను గురించి నీవు చింతించకు.” (1/2)

5:27 – وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ ابْنَيْ آدَمَ بِالْحَقِّ إِذْ قَرَّبَا قُرْبَانًا فَتُقُبِّلَ مِنْ أَحَدِهِمَا وَلَمْ يُتَقَبَّلْ مِنَ الْآخَرِ قَالَ لَأَقْتُلَنَّكَ ۖ قَالَ إِنَّمَا يَتَقَبَّلُ اللَّـهُ مِنَ الْمُتَّقِينَ ٢٧

మరియు వారికి ఆదమ్‌ యొక్క ఇద్దరు కుమారుల 25 (హాబిల్‌ మరియు ఖాబిల్‌ల) యథార్థ కథను వినిపించు. వారిద్దరు (అల్లాహ్‌కు) బలి (ఖుర్బాని) ఇచ్చినప్పుడు ఒకని (హాబీల్‌) బలి (ఖుర్బాని) స్వీకరించబడింది మరియు రెండవ వాని (ఖాబీల్‌) బలి (ఖుర్బాని) స్వీకరించ బడలేదు. (ఖాబీల్‌) అన్నాడు: ”నిశ్చయంగా నేను నిన్ను చంపుతాను.” (దానికి హాబీల్‌) అన్నాడు: ”నిశ్చయంగా, అల్లాహ్‌ భయ-భక్తులు గలవారి (బలినే) స్వీకరిస్తాడు.

5:28 – لَئِن بَسَطتَ إِلَيَّ يَدَكَ لِتَقْتُلَنِي مَا أَنَا بِبَاسِطٍ يَدِيَ إِلَيْكَ لِأَقْتُلَكَ ۖ إِنِّي أَخَافُ اللَّـهَ رَبَّ الْعَالَمِينَ ٢٨

ఒకవేళ నీవు నన్ను చంపటానికి నీచేయి నావైపుకు ఎత్తినా! నేను నిన్ను చంపటానికి నాచేయి నీవైపుకు ఎత్తను. (ఎందుకంటే) నిశ్చయంగా, నేను సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్‌కు భయపడుతున్నాను.

5:29 – إِنِّي أُرِيدُ أَن تَبُوءَ بِإِثْمِي وَإِثْمِكَ فَتَكُونَ مِنْ أَصْحَابِ النَّارِ ۚ وَذَٰلِكَ جَزَاءُ الظَّالِمِينَ ٢٩

నీవు నీ పాపంతో సహా, నా పాపాన్ని కూడా భరించి నరకవాసులలో ఒకడవు కావాలని నా కోరిక. మరియు ఇదే దుర్మార్గుల ప్రతిఫలం.”

5:30 – فَطَوَّعَتْ لَهُ نَفْسُهُ قَتْلَ أَخِيهِ فَقَتَلَهُ فَأَصْبَحَ مِنَ الْخَاسِرِينَ ٣٠

చివరికి అతడి మనస్సు అతడిని (తన సోదరుని) హత్యకు పురికొల్పింది, కావున అతడు తన సోదరుణ్ణి (హాబిల్‌ను) చంపి నష్టం పొందినవారిలో చేరి పోయాడు.

5:31 – فَبَعَثَ اللَّـهُ غُرَابًا يَبْحَثُ فِي الْأَرْضِ لِيُرِيَهُ كَيْفَ يُوَارِي سَوْءَةَ أَخِيهِ ۚ قَالَ يَا وَيْلَتَىٰ أَعَجَزْتُ أَنْ أَكُونَ مِثْلَ هَـٰذَا الْغُرَابِ فَأُوَارِيَ سَوْءَةَ أَخِي ۖ فَأَصْبَحَ مِنَ النَّادِمِينَ ٣١

అప్పుడు అల్లాహ్‌ ఒక కాకిని పంపాడు; అది నేలను త్రవ్వి అతని సోదరుని శవాన్ని ఎలా దాచాలో చూపించింది. అతడు (ఖాబిల్‌): ”అయ్యో, నాపాడుగాను! నేను ఈ కాకిపాటి వాణ్ణి కూడా కాలేకపోయాను! నా సోదరుని శవాన్ని దాచే (ఉపాయం) వెతకలేక పోయాను కదా!” అని వాపోయాడు. అప్పుడతడు పశ్చాత్తాపపడే వారిలో చేరిపోయాడు.

5:32 – مِنْ أَجْلِ ذَٰلِكَ كَتَبْنَا عَلَىٰ بَنِي إِسْرَائِيلَ أَنَّهُ مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا ۚ وَلَقَدْ جَاءَتْهُمْ رُسُلُنَا بِالْبَيِّنَاتِ ثُمَّ إِنَّ كَثِيرًا مِّنْهُم بَعْدَ ذَٰلِكَ فِي الْأَرْضِ لَمُسْرِفُونَ ٣٢

ఈ కారణం వల్లనే మేము ఇస్రా’యీల్‌ సంతతి వారికి ఈ ఉత్తరువు ఇచ్చాము: ”నిశ్చయంగా – ఒకవ్యక్తి(హత్యకు) బదులుగాగానీ లేదా భూమిలో కల్లోలం వ్యాపింపజేసినందుకు గానీ, గాక – ఎవడైనా ఒక వ్యక్తిని (అన్యాయంగా) చంపితే, అతడు సర్వ మానవజాతిని చంపినట్లే. మరియు ఎవడైనా ఒక మానవుని ప్రాణాన్ని కాపాడితే, అతడు సర్వ మానవజాతి ప్రాణాలను కాపాడినట్లే!” మరియు వాస్తవానికి, వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని మా ప్రవక్తలు వచ్చారు, అయినా వాస్తవానికి వారిలో పలువురు భూమిలో అక్రమాలు చేసేవార.ు.

5:33 – إِنَّمَا جَزَاءُ الَّذِينَ يُحَارِبُونَ اللَّـهَ وَرَسُولَهُ وَيَسْعَوْنَ فِي الْأَرْضِ فَسَادًا أَن يُقَتَّلُوا أَوْ يُصَلَّبُوا أَوْ تُقَطَّعَ أَيْدِيهِمْ وَأَرْجُلُهُم مِّنْ خِلَافٍ أَوْ يُنفَوْا مِنَ الْأَرْضِ ۚ ذَٰلِكَ لَهُمْ خِزْيٌ فِي الدُّنْيَا ۖ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ ١

నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్‌తో మరియు ఆయన ప్రవక్తతో పోరాడుతారో మరియు ధరణిలో కల్లోలం రేకెత్తించటానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారికి మరణశిక్ష విధించాలి; లేదా శిలువపై ఎక్కించాలి; లేదా వారి అభిముఖపక్షాల కాళ్ళు చేతులను నరికించాలి; లేదా వారిని దేశబహి ష్క్రుతుల్ని చేయాలి. ఇది వారికి ఇహలోకంలో గల అవమానం. మరియు వారికి పరలోకంలో కూడా ఘోరశిక్ష ఉంటుంది –

5:34 – إِلَّا الَّذِينَ تَابُوا مِن قَبْلِ أَن تَقْدِرُوا عَلَيْهِمْ ۖ فَاعْلَمُوا أَنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ٣٤

మీరు స్వాధీనపరచుకోక ముందు పశ్చాత్తాప పడేవారు తప్ప! కావున మీరు నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత, అని తెలుసుకోండి.

5:35 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّـهَ وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ وَجَاهِدُوا فِي سَبِيلِهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ ٣٥

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ యందు భయ- భక్తులు కలిగి ఉండండి. మరియు ఆయన సాన్నిధ్యానికి చేరే మార్గాన్ని అన్వేషించండి. 26 మరియు ఆయన మార్గంలో నిరంతరం కృషిచేస్తే, మీరు సాఫల్యం పొందవచ్చు 27

5:36 – إِنَّ الَّذِينَ كَفَرُوا لَوْ أَنَّ لَهُم مَّا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ مَعَهُ لِيَفْتَدُوا بِهِ مِنْ عَذَابِ يَوْمِ الْقِيَامَةِ مَا تُقُبِّلَ مِنْهُمْ ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ٣٦

నిశ్చయంగా, సత్య-తిరస్కారులైన వారు తీర్పుదినాన గల శిక్ష నుండి తప్పించుకోవటానికి – వారి వద్ద ఉంటే – భూమిలో ఉన్న సమస్తాన్ని, దానితోపాటు మరి అంత (ధనాన్ని) కూడా, విమోచనాధనంగా ఇవ్వగోరుతారు కాని అది స్వీకరించబడదు. మరియు వారికి అతి బాధాకరమైన శిక్ష ఉంటుంది. 28

5:37 – يُرِيدُونَ أَن يَخْرُجُوا مِنَ النَّارِ وَمَا هُم بِخَارِجِينَ مِنْهَا ۖ وَلَهُمْ عَذَابٌ مُّقِيمٌ ٣٧

వారు నరకాగ్ని నుండి బయటికి రాగోరు తారు, కాని వారు దానినుండి బయటికి రాజాలరు. మరియు వారికి ఎడతెగని శిక్ష ఉంటుంది. 29

5:38 – وَالسَّارِقُ وَالسَّارِقَةُ فَاقْطَعُوا أَيْدِيَهُمَا جَزَاءً بِمَا كَسَبَا نَكَالًا مِّنَ اللَّـهِ ۗ وَاللَّـهُ عَزِيزٌ حَكِيمٌ ٣٨

మరియు పురుషుడు దొంగ అయినా, లేదా స్త్రీ దొంగ అయినా, వారి చేతులను నరికివేయండి. ఇది వారి కర్మలకు గుణపాఠంగా, అల్లాహ్‌ నిర్ణయించిన ప్రతిఫలం (శిక్ష). 30 మరియు అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.

5:39 – فَمَن تَابَ مِن بَعْدِ ظُلْمِهِ وَأَصْلَحَ فَإِنَّ اللَّـهَ يَتُوبُ عَلَيْهِ ۗ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ٣٩

ఎవడు నేరం చేసిన తరువాత పశ్చాత్తాప పడి తనను తాను సవరించుకుంటాడో! నిశ్చయంగా, అల్లాహ్‌ అలాంటి వాని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

5:40 – أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّـهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ يُعَذِّبُ مَن يَشَاءُ وَيَغْفِرُ لِمَن يَشَاءُ ۗ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٤٠

ఏమీ? నిశ్చయంగా, భూమ్యాకాశాలపై ఆధి పత్యం అల్లాహ్‌దేనని నీకు తెలియదా? ఆయన తాను కోరిన వారిని శిక్షిస్తాడు మరియు తాను కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయ గల సమర్థుడు. (5/8)

5:41 – يَا أَيُّهَا الرَّسُولُ لَا يَحْزُنكَ الَّذِينَ يُسَارِعُونَ فِي الْكُفْرِ مِنَ الَّذِينَ قَالُوا آمَنَّا بِأَفْوَاهِهِمْ وَلَمْ تُؤْمِن قُلُوبُهُمْ ۛ وَمِنَ الَّذِينَ هَادُوا ۛ سَمَّاعُونَ لِلْكَذِبِ سَمَّاعُونَ لِقَوْمٍ آخَرِينَ لَمْ يَأْتُوكَ ۖ يُحَرِّفُونَ الْكَلِمَ مِن بَعْدِ مَوَاضِعِهِ ۖ يَقُولُونَ إِنْ أُوتِيتُمْ هَـٰذَا فَخُذُوهُ وَإِن لَّمْ تُؤْتَوْهُ فَاحْذَرُوا ۚ وَمَن يُرِدِ اللَّـهُ فِتْنَتَهُ فَلَن تَمْلِكَ لَهُ مِنَ اللَّـهِ شَيْئًا ۚ أُولَـٰئِكَ الَّذِينَ لَمْ يُرِدِ اللَّـهُ أَن يُطَهِّرَ قُلُوبَهُمْ ۚ لَهُمْ فِي الدُّنْيَا خِزْيٌ ۖ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ ٤١

ఓ ప్రవక్తా! సత్య-తిరస్కారంలోకి పరు గులు తీసే వారి వల్ల నీవు దుఃఖపడకు. అలాంటి వారు: ”మేము విశ్వసించాము.” అని తమ నోటితో మాత్రమే అంటారు, కాని వారి హృదయాలు విశ్వసించలేదు. మరియు యూదులలో కొందరు అసత్యాలను కుతూహలంతో వినేవారున్నారు మరియు నీ వద్దకు ఎన్నడూరాని ఇతర ప్రజలకు (అందజేయటానికి) మీ మాటలు వినేవారు న్నారు. వారు పదాల-అర్థాలను మార్చి, వాటి సందర్భాలకు భిన్నంగా తీసుకుని ఇలా అంటారు: ”మీకు ఈ విధమైన (సందేశం) ఇస్తేనే స్వీకరించండి మరియు ఇలాంటిది ఇవ్వక పోతే, జాగ్రత్త పడండి!” మరియు అల్లాహ్‌ ఎవరిని పరీక్షించదలచాడో (తప్పుదారిలో వదలదలచాడో) వారిని అల్లాహ్‌ నుండి తప్పించటానికి నీవు ఏమీ చేయలేవు. ఎవరి హృదయాలను అల్లాహ్‌ పరిశుధ్ధపరచ గోరలేదో అలాంటివారు వీరే. వారికి ఇహలోకంలో అవమానం ఉంటుంది. మరియు వారికి పరలోకంలో ఘోర శిక్ష ఉంటుంది.

5:42 – سَمَّاعُونَ لِلْكَذِبِ أَكَّالُونَ لِلسُّحْتِ ۚ فَإِن جَاءُوكَ فَاحْكُم بَيْنَهُمْ أَوْ أَعْرِضْ عَنْهُمْ ۖ وَإِن تُعْرِضْ عَنْهُمْ فَلَن يَضُرُّوكَ شَيْئًا ۖ وَإِنْ حَكَمْتَ فَاحْكُم بَيْنَهُم بِالْقِسْطِ ۚ إِنَّ اللَّـهَ يُحِبُّ الْمُقْسِطِينَ ٤٢

వారు అబద్ధాన్ని వినేవారు మరియు నిషిధ్ధమైన దానిని తినేవారు. కావున వారు నీ వద్దకు (న్యాయానికి) వస్తే, నీవు (ఇష్టపడితే) వారి మధ్య తీర్పుచేయి, లేదా ముఖం త్రిప్పుకో. నీవు వారి నుండి విముఖుడవైతే వారు నీకేమీ హాని చేయలేరు. నీవు వారి మధ్య తీర్పుచేస్తే, న్యాయంగా మాత్రమే తీర్పుచేయి. నిశ్చయంగా, అల్లాహ్‌ న్యాయబద్ధులైన వారిని ప్రేమిస్తాడు.

5:43 – وَكَيْفَ يُحَكِّمُونَكَ وَعِندَهُمُ التَّوْرَاةُ فِيهَا حُكْمُ اللَّـهِ ثُمَّ يَتَوَلَّوْنَ مِن بَعْدِ ذَٰلِكَ ۚ وَمَا أُولَـٰئِكَ بِالْمُؤْمِنِينَ ٤٣

మరియు – అల్లాహ్‌ ఉత్తరువులు ఉన్న తౌరాత్‌ గ్రంథం వారి వద్ద ఉన్నప్పటికీ – వారు తీర్పుకొరకు, నీ వద్దకు ఎందుకు వస్తున్నారు? ఆ తరువాత కూడా వారు దాని నుండి తిరిగి పోతున్నారు. మరియు ఇలాంటి వారు (నిజానికి) విశ్వసించినవారు కారు.

5:44 – إِنَّا أَنزَلْنَا التَّوْرَاةَ فِيهَا هُدًى وَنُورٌ ۚ يَحْكُمُ بِهَا النَّبِيُّونَ الَّذِينَ أَسْلَمُوا لِلَّذِينَ هَادُوا وَالرَّبَّانِيُّونَ وَالْأَحْبَارُ بِمَا اسْتُحْفِظُوا مِن كِتَابِ اللَّـهِ وَكَانُوا عَلَيْهِ شُهَدَاءَ ۚ فَلَا تَخْشَوُا النَّاسَ وَاخْشَوْنِ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّـهُ فَأُولَـٰئِكَ هُمُ الْكَافِرُونَ ٤٤

నిశ్చయంగా, మేము తౌరాత్‌ను (మూసాపై) అవతరింపజేశాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి. అల్లాహ్‌కు విధేయు లైన (ముస్లింలైన) ప్రవక్తలు దానిని అనుసరించి, యూదులమధ్య తీర్పుచేస్తూ ఉండేవారు. 31 అదేవిధంగా ధర్మవేత్తలు (రబ్బానియ్యూన్‌) మరియు యూద మతాచారులు (అ’హ్‌బార్‌లు) కూడా (తీర్పుచేస్తూ ఉండేవారు). ఎందుకంటే వారు అల్లాహ్‌ గ్రంథానికి రక్షకులుగా మరియు దానికి సాక్షులుగా నియమింపబడి ఉండేవారు. కావున మీరు (యూదులారా) మానవులకు భయపడకండి. నాకే భయపడండి. నా సూక్తులను (ఆయాత్‌లను) స్వల్పలాభాలకు అమ్ముకోకండి. మరియు ఎవరు అల్లాహ్‌ అవతరింపజేసిన (శాసనం) ప్రకారం తీర్పుచేయరో, అలాంటివారే సత్య-తిరస్కారులు.

5:45 – وَكَتَبْنَا عَلَيْهِمْ فِيهَا أَنَّ النَّفْسَ بِالنَّفْسِ وَالْعَيْنَ بِالْعَيْنِ وَالْأَنفَ بِالْأَنفِ وَالْأُذُنَ بِالْأُذُنِ وَالسِّنَّ بِالسِّنِّ وَالْجُرُوحَ قِصَاصٌ ۚ فَمَن تَصَدَّقَ بِهِ فَهُوَ كَفَّارَةٌ لَّهُ ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّـهُ فَأُولَـٰئِكَ هُمُ الظَّالِمُونَ ٤٥

మరియు ఆ గ్రంథం (తౌరాత్‌)లో వారికి మేము: ”ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పన్నుకు బదులు పన్ను మరియు గాయాలకు బదులుగా సరి సమానమైన ప్రతీకారం వ్రాశాము.” 32 కాని ఎవరైనా దానిని క్షమిస్తే, అది అతనికి పాప-పరిహారం (కఫ్ఫారా)! మరియు ఎవరు అల్లాహ్‌ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పుచేయరో అలాంటివారు! వారే దుర్మార్గులు. 33

5:46 – وَقَفَّيْنَا عَلَىٰ آثَارِهِم بِعِيسَى ابْنِ مَرْيَمَ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَاةِ ۖ وَآتَيْنَاهُ الْإِنجِيلَ فِيهِ هُدًى وَنُورٌ وَمُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَاةِ وَهُدًى وَمَوْعِظَةً لِّلْمُتَّقِينَ ٤٦

మరియు మేము వారి (ఆ ప్రవక్తల) అడుగు జాడలను (ఆసా’రిహిమ్‌) అనుసరించేవాడు మరియు తౌరాత్‌లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరచే వాడయిన, మర్యమ్‌ కుమారుడు, ‘ఈసా (ఏసు)ను పంపాము. 34 మేము అతనికి ఇంజీల్‌ గ్రంథాన్ని ప్రసాదించాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి మరియు అది తౌరాత్‌లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవీకరిస్తుంది మరియు దైవభీతి గలవారికి మార్గదర్శకత్వం మరియు హితోపదేశం కూడా!

5:47 – وَلْيَحْكُمْ أَهْلُ الْإِنجِيلِ بِمَا أَنزَلَ اللَّـهُ فِيهِ ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّـهُ فَأُولَـٰئِكَ هُمُ الْفَاسِقُونَ ٤٧

మరియు ఇంజీల్‌ గ్రంథప్రజలను, అల్లాహ్‌! ఆ గ్రంథంలో అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పుచేయమను. మరియు ఎవరు అల్లాహ్‌ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పుచేయరో అలాంటివారు, వారే అవిధేయులు (దుష్టులు). 35

5:48 – وَأَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ الْكِتَابِ وَمُهَيْمِنًا عَلَيْهِ ۖ فَاحْكُم بَيْنَهُم بِمَا أَنزَلَ اللَّـهُ ۖ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ عَمَّا جَاءَكَ مِنَ الْحَقِّ ۚ لِكُلٍّ جَعَلْنَا مِنكُمْ شِرْعَةً وَمِنْهَاجًا ۚ وَلَوْ شَاءَ اللَّـهُ لَجَعَلَكُمْ أُمَّةً وَاحِدَةً وَلَـٰكِن لِّيَبْلُوَكُمْ فِي مَا آتَاكُمْ ۖ فَاسْتَبِقُوا الْخَيْرَاتِ ۚ إِلَى اللَّـهِ مَرْجِعُكُمْ جَمِيعًا فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ ٤٨

మరియు (ఓ ప్రవక్తా!) మేము ఈ గ్రంథాన్ని నీపై సత్యంతో అవతరింపజేశాము. ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరు స్తుంది. మరియు వాటిలో ఉన్న సత్యా-సత్యా లను పరిష్కరిస్తుంది. 36 కావున నీవు, అల్లాహ్‌ అవతరింపజేసిన ఈ శాసనం ప్రకారం వారి మధ్య తీర్పుచెయ్యి. మరియు నీ వద్దకు వచ్చిన సత్యాన్ని విడిచి వారి కోరికలను అనుస రించకు 37 మీలో ప్రతి ఒక్క సంఘానికి ఒక ధర్మ శాసనాన్ని మరియు ఒక జీవనమార్గాన్ని నియ మించిఉన్నాము. ఒకవేళ అల్లాహ్‌ తలుచుకుంటే, మిమ్మల్ని అంతా ఒకే-ఒక సంఘంగా రూపొందించి ఉండేవాడు. కాని మీకు ఇచ్చిన దానితో (ధర్మంతో) మిమ్మల్ని పరీక్షించటానికి (ఇలా చేశాడు). కావున మీరు మంచిపనులు చేయటంలో ఒకరితోనొకరు పోటీపడండి. అల్లాహ్‌ వద్దకే మీరందరూ మరలి పోవలసి వుంది. అప్పుడు ఆయన మీకున్న భేదాభిప్రాయాలను గురించి మీకు తెలియజేస్తాడు.

5:49 – وَأَنِ احْكُم بَيْنَهُم بِمَا أَنزَلَ اللَّـهُ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ وَاحْذَرْهُمْ أَن يَفْتِنُوكَ عَن بَعْضِ مَا أَنزَلَ اللَّـهُ إِلَيْكَ ۖ فَإِن تَوَلَّوْا فَاعْلَمْ أَنَّمَا يُرِيدُ اللَّـهُ أَن يُصِيبَهُم بِبَعْضِ ذُنُوبِهِمْ ۗ وَإِنَّ كَثِيرًا مِّنَ النَّاسِ لَفَاسِقُونَ ٤٩

మరియు (ఓ ప్రవక్తా!) నీవు అల్లాహ్‌ అవతరింపజేసిన శాసనం ప్రకారం వారిమధ్య తీర్పు చెయ్యి మరియు వారి వ్యర్థకోరికలను అనుస రించకు. అల్లాహ్‌ నీపై అవతరింపజేసిన కొన్ని శాసనాల నుండి వారు నిన్ను తప్పించకుండా జాగ్రత్తగా ఉండు. ఒకవేళ వారు వెనుదిరిగిపోతే, అల్లాహ్‌ వారిని, వారి కొన్ని పాపాలకు శిక్షించదల చాడని తెలుసుకో. మరియు నిశ్చయంగా ప్రజలలో అనేకులు అవిధేయతకు పాల్పడే వారున్నారు.

5:50 – أَفَحُكْمَ الْجَاهِلِيَّةِ يَبْغُونَ ۚ وَمَنْ أَحْسَنُ مِنَ اللَّـهِ حُكْمًا لِّقَوْمٍ يُوقِنُونَ ٥٠

ఏమీ? వారు అజ్ఞానకాలపు తీర్పును కోరు తున్నారా? కాని ఆయన (అల్లాహ్)పై నమ్మకం గలవారికి అల్లాహ్‌ కంటే మంచి తీర్పు చేయగల వాడెవడు? 38 (3/4)

5:51 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الْيَهُودَ وَالنَّصَارَىٰ أَوْلِيَاءَ ۘ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ وَمَن يَتَوَلَّهُم مِّنكُمْ فَإِنَّهُ مِنْهُمْ ۗ إِنَّ اللَّـهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ ٥١

  • ఓ విశ్వాసులారా! యూదులను మరియు క్రైస్తవులను మిత్రులుగా చేసుకోకండి. వారు ఒకరి కొకరు స్నేహితులు. 39 మీలో ఎవడు వారితో స్నేహం చేస్తాడో వాస్తవానికి అతడు వారిలో చేరిన వాడవుతాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ దుర్మార్గు లకు మార్గదర్శకత్వం చేయడు.

5:52 – فَتَرَى الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ يُسَارِعُونَ فِيهِمْ يَقُولُونَ نَخْشَىٰ أَن تُصِيبَنَا دَائِرَةٌ ۚ فَعَسَى اللَّـهُ أَن يَأْتِيَ بِالْفَتْحِ أَوْ أَمْرٍ مِّنْ عِندِهِ فَيُصْبِحُوا عَلَىٰ مَا أَسَرُّوا فِي أَنفُسِهِمْ نَادِمِينَ ٥٢

కావున ఎవరి హృదయాలలో రోగం (కాపట్యం) ఉందో వారు, వారి సాంగత్యం కొరకు పోటీపడుతున్నది నీవు చూస్తున్నావు. వారు: ”మాపై ఏదైనా ఆపద రాగలదని మేము భయపడు తున్నాము.” అని అంటారు. బహుశా అల్లాహ్‌ (విశ్వాసులకు) విజయాన్ని గానీ, లేదా తన దిక్కు నుండి ఏదైనా అవకాశాన్ని గానీ కలిగించ వచ్చు! అప్పుడు వారు తమ మనస్సులలో దాచి ఉంచిన దానికి పశ్చాత్తాపపడతారు.

5:53 – وَيَقُولُ الَّذِينَ آمَنُوا أَهَـٰؤُلَاءِ الَّذِينَ أَقْسَمُوا بِاللَّـهِ جَهْدَ أَيْمَانِهِمْ ۙ إِنَّهُمْ لَمَعَكُمْ ۚ حَبِطَتْ أَعْمَالُهُمْ فَأَصْبَحُوا خَاسِرِينَ ٥٣

మరియు విశ్వాసులు (పరస్పరం ఇలా అనుకుంటారు): ”ఏమీ? వాస్తవానికి మేము మీతోనే ఉన్నామని, అల్లాహ్‌ పేరుతో కఠోర ప్రమాణాలు చేసి, నమ్మకం కలిగించేవారు వీరేనా?” వారి (కపట-విశ్వాసుల) కర్మలన్నీ వ్యర్థమై, వారు నష్టపడిన వారవుతారు!

5:54 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَن يَرْتَدَّ مِنكُمْ عَن دِينِهِ فَسَوْفَ يَأْتِي اللَّـهُ بِقَوْمٍ يُحِبُّهُمْ وَيُحِبُّونَهُ أَذِلَّةٍ عَلَى الْمُؤْمِنِينَ أَعِزَّةٍ عَلَى الْكَافِرِينَ يُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّـهِ وَلَا يَخَافُونَ لَوْمَةَ لَائِمٍ ۚ ذَٰلِكَ فَضْلُ اللَّـهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّـهُ وَاسِعٌ عَلِيمٌ ٥٤

ఓ విశ్వాసులారా! మీలో ఎవడైనా తన ధర్మం (ఇస్లాం) నుండి వైదొలగితే, అల్లాహ్‌ త్వర లోనే ఇతర ప్రజలను తేగలడు. ఆయన వారిని ప్రేమిస్తాడు మరియు వారు ఆయన (అల్లాహ్‌)ను ప్రేమిస్తారు. 40 వారు విశ్వాసుల పట్ల మృదువుగా, సత్య తిరస్కారులపట్ల కఠినంగా ప్రవర్తించేవారునూ అల్లాహ్‌ మార్గంలో ధర్మపోరాటం చేసేవారునూ మరియు నిందించేవారి నిందలకు భయపడని వారునూ, అయిఉంటారు. ఇది అల్లాహ్‌ అనుగ్రహం, ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్‌ సర్వోపగతుడు, సర్వజ్ఞుడు.

5:55 – إِنَّمَا وَلِيُّكُمُ اللَّـهُ وَرَسُولُهُ وَالَّذِينَ آمَنُوا الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُمْ رَاكِعُونَ ٥٥

నిశ్చయంగా, మీ స్నేహితులు, అల్లాహ్‌! ఆయన ప్రవక్త మరియు విశ్వసించిన వారు – ఎవరైతే నమా’జ్‌ స్థాపిస్తారో, విధిదానం (‘జకాత్‌) ఇస్తూ ఉంటారో మరియు వారు (అల్లాహ్‌ ముందు) వంగుతూ (రుకూ’ఉ చేస్తూ) ఉంటారో –

5:56 – وَمَن يَتَوَلَّ اللَّـهَ وَرَسُولَهُ وَالَّذِينَ آمَنُوا فَإِنَّ حِزْبَ اللَّـهِ هُمُ الْغَالِبُونَ ٥٦

మరియు ఎవరు అల్లాహ్‌, ఆయన ప్రవక్త మరియు విశ్వసించినవారి వైపునకు మరలుతారో! నిశ్చయంగా, వారే అల్లాహ్‌ పక్షానికి చెందినవారు, వారే విజయం సాధించేవారు. 41

5:57 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الَّذِينَ اتَّخَذُوا دِينَكُمْ هُزُوًا وَلَعِبًا مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ وَالْكُفَّارَ أَوْلِيَاءَ ۚ وَاتَّقُوا اللَّـهَ إِن كُنتُم مُّؤْمِنِينَ ٥٧

ఓ విశ్వాసులారా! మీ ధర్మాన్ని ఎగతాళిగా నవ్వులాటగా పరిగణించేవారు పూర్వగ్రంథ ప్రజ లైనా, లేదా సత్య-తిరస్కారులైనా, వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. మరియు మీరు విశ్వాసులే అయితే అల్లాహ్‌ యందు భయ- భక్తులు కలిగి ఉండండి.

5:58 – وَإِذَا نَادَيْتُمْ إِلَى الصَّلَاةِ اتَّخَذُوهَا هُزُوًا وَلَعِبًا ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْقِلُونَ ٥٨

మరియు మీరు నమా’జ్‌ కొరకు పిలుపు (అజా’న్‌) ఇస్తే, వారు దానిని ఎగతాళిగా నవ్వులాటగా తీసుకుంటారు. అది ఎందుకంటే వాస్తవానికి వారు బుధ్ధిహీనులైన జనులు! 42

5:59 – قُلْ يَا أَهْلَ الْكِتَابِ هَلْ تَنقِمُونَ مِنَّا إِلَّا أَنْ آمَنَّا بِاللَّـهِ وَمَا أُنزِلَ إِلَيْنَا وَمَا أُنزِلَ مِن قَبْلُ وَأَنَّ أَكْثَرَكُمْ فَاسِقُونَ ٥٩

వారితో ఇలా అను: ”ఓ గ్రంథప్రజలారా! 43 ఏమీ? మేము అల్లాహ్‌ను మరియు ఆయన మాపై అవతరింపజేసిన మరియు మాకు పూర్వం అవతరింపజేసిన (గ్రంథాలను) విశ్వసించామనే, మీరు మమ్మల్ని పీడిస్తున్నారా? మరియు నిశ్చయంగా, మీలో చాలా మంది అవిధేయులు (దుష్టులు) ఉన్నారు!”

5:60 – قُلْ هَلْ أُنَبِّئُكُم بِشَرٍّ مِّن ذَٰلِكَ مَثُوبَةً عِندَ اللَّـهِ ۚ مَن لَّعَنَهُ اللَّـهُ وَغَضِبَ عَلَيْهِ وَجَعَلَ مِنْهُمُ الْقِرَدَةَ وَالْخَنَازِيرَ وَعَبَدَ الطَّاغُوتَ ۚ أُولَـٰئِكَ شَرٌّ مَّكَانًا وَأَضَلُّ عَن سَوَاءِ السَّبِيلِ ٦٠

ఇలా అను: ”ఏమీ? అల్లాహ్‌ తరఫు నుండి ఎవరికి, దీనికంటే, హీనమైన ప్రతిఫలం దొరుకు తుందో మీకు తెలుపనా? వారే, ఎవరినైతే అల్లాహ్‌ శపించాడో (బహిష్కరించాడో) మరియు ఎవరైతే ఆయన ఆగ్రహానికి గురి అయ్యారో! మరియు వారిలో కొందరు, ఎవరినైతే ఆయన కోతులుగా మరియు పందులుగా మార్చాడో! 44 మరియు వారు ఎవరైతే కల్పితదైవాల(తాగూత్‌ల) దాస్యం చేస్తారో. అలాంటి వారు (పునరుత్థానదినమున) ఎంతో హీనస్థితిలోఉంటారు మరియు వారు ఋజు మార్గం నుండి చాలాదూరం వెళ్లిపోయినవారే!”

5:61 – وَإِذَا جَاءُوكُمْ قَالُوا آمَنَّا وَقَد دَّخَلُوا بِالْكُفْرِ وَهُمْ قَدْ خَرَجُوا بِهِ ۚ وَاللَّـهُ أَعْلَمُ بِمَا كَانُوا يَكْتُمُونَ ٦١

మరియువారు (కపటవిశ్వాసులు) నీవద్దకు వచ్చినపుడు: ”మేము విశ్వసించాము.” అని అంటారు. కాని వాస్తవానికి వారు సత్య-తిరస్కారం తోనే వస్తారు మరియు దాని (సత్య-తిరస్కారం) తోనే తిరిగిపోతారు కూడాను. మరియు వారు ఏమి దాస్తున్నారో అల్లాహ్‌కు బాగా తెలుసు.

5:62 – وَتَرَىٰ كَثِيرًا مِّنْهُمْ يُسَارِعُونَ فِي الْإِثْمِ وَالْعُدْوَانِ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَعْمَلُونَ ٦٢

మరియు వారిలోఅనేకులను పాపంమరియు దౌర్జన్యం చేయటానికి మరియు నిషిధ్ధమైనవి తిన టానికి చురుకుగా పాల్గొనటాన్ని నీవు చూస్తావు. వారు చేస్తున్న పనులు ఎంత నీచమైనవి!

5:63 – لَوْلَا يَنْهَاهُمُ الرَّبَّانِيُّونَ وَالْأَحْبَارُ عَن قَوْلِهِمُ الْإِثْمَ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَصْنَعُونَ ٦٣

వారి ధర్మవేత్తలు (రబ్బానియ్యూన్‌) మరియు మతాచారులు (అ’హబార్‌) వారిని, పాపపు మాటలు పలకటం నుండి మరియు నిషిధ్ధ మైన వాటిని తినటం నుండి ఎందుకు వారించరు? వారు చేసే కార్యాలు ఎంత నీచమైనవి!

5:64 – وَقَالَتِ الْيَهُودُ يَدُ اللَّـهِ مَغْلُولَةٌ ۚ غُلَّتْ أَيْدِيهِمْ وَلُعِنُوا بِمَا قَالُوا ۘ بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ يُنفِقُ كَيْفَ يَشَاءُ ۚ وَلَيَزِيدَنَّ كَثِيرًا مِّنْهُم مَّا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ طُغْيَانًا وَكُفْرًا ۚ وَأَلْقَيْنَا بَيْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۚ كُلَّمَا أَوْقَدُوا نَارًا لِّلْحَرْبِ أَطْفَأَهَا اللَّـهُ ۚ وَيَسْعَوْنَ فِي الْأَرْضِ فَسَادًا ۚ وَاللَّـهُ لَا يُحِبُّ الْمُفْسِدِينَ ٦٤

మరియు యూదులు: ”అల్లాహ్‌ చేతులకు సంకెళ్ళు పడిఉన్నాయి.” అని అంటారు. 46 వారి చేతులకే సంకెళ్ళు వేయబడు గాక! మరియు వారు పలికిన దానికి వారు శపించబడు గాక! వాస్తవానికి ఆయన (అల్లాహ్‌) రెండు చేతులు విస్తరింపబడి ఉన్నాయి; ఆయన (తన అనుగ్రహాలను) తాను కోరినట్లు ఖర్చుచేస్తాడు. మరియు (ఓ ప్రవక్తా!) నీ ప్రభువుతరఫునుండి నీపై అవతరింపజేయబడిన (ఈ గ్రంథం) నిశ్చయంగా వారిలో చాలామందికి తలబిరుసుతనం మరియు సత్య-తిరస్కారాన్ని మాత్రమే పెంచుతున్నది. మరియు మేము వారి మధ్య విరోధాన్ని మరియు ద్వేషాన్ని, తీర్పుదినం వరకు ఉండేటట్లుచేశాము. వారు యుద్ధజ్వాల లను ప్రజ్వలింపజేసినపుడల్లా, అల్లాహ్‌ దానిని చల్లార్చాడు. మరియు వారు భూమిలో కల్లోలం రేకెత్తించటానికి పాటుపడుతున్నారు. మరియు అల్లాహ్‌ కల్లోలం రేకెత్తించేవారిని ప్రేమించడు.

5:65 – وَلَوْ أَنَّ أَهْلَ الْكِتَابِ آمَنُوا وَاتَّقَوْا لَكَفَّرْنَا عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَأَدْخَلْنَاهُمْ جَنَّاتِ النَّعِيمِ ٦٥

మరియు వాస్తవానికి గ్రంథప్రజలు విశ్వ సించి, దైవభీతి కలిగివుంటే! నిశ్చయంగా, మేము వారి పాపాలను తొలగించి, వారిని శ్రేష్ఠమైన స్వర్గవనాలలో ప్రవేశింపజేసి ఉండేవారము.

5:66 – وَلَوْ أَنَّهُمْ أَقَامُوا التَّوْرَاةَ وَالْإِنجِيلَ وَمَا أُنزِلَ إِلَيْهِم مِّن رَّبِّهِمْ لَأَكَلُوا مِن فَوْقِهِمْ وَمِن تَحْتِ أَرْجُلِهِم ۚ مِّنْهُمْ أُمَّةٌ مُّقْتَصِدَةٌ ۖ وَكَثِيرٌ مِّنْهُمْ سَاءَ مَا يَعْمَلُونَ ٦٦

మరియు వాస్తవానికి వారు తౌరాత్‌ను, ఇంజీల్‌ను మరియు వారి ప్రభువు తరఫునుండి వారిపై (ఇప్పుడు) అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్‌ఆన్‌ను) ఆచరించి ఉండినట్లైతే, వారి కొరకు వారిపై (ఆకాశం) నుండి మరియు కాళ్ళ క్రింది నుండి (భూమి నుండి) జీవనోపాధి పొందేవారు. 47 వారిలో కొందరు సరైనమార్గాన్ని అవలంబించేవారున్నారు. 48 కాని వారిలో అనేకులు చేసేవి చెడు (పాప) కార్యాలే! (7/8)

5:67 – يَا أَيُّهَا الرَّسُولُ بَلِّغْ مَا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ ۖ وَإِن لَّمْ تَفْعَلْ فَمَا بَلَّغْتَ رِسَالَتَهُ ۚ وَاللَّـهُ يَعْصِمُكَ مِنَ النَّاسِ ۗ إِنَّ اللَّـهَ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ ٦٧

ఓ ప్రవక్తా! నీవు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన దానిని తెలియ జేయి. 49 మరియు నీ వట్లు చేయకపోతే, ఆయన సందేశాన్ని పూర్తిగా తెలియజేయనివాడవు అవుతావు. మరియు అల్లాహ్‌ మానవుల నుండి నిన్ను కాపాడుతాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ సత్య- తిరస్కారులైనప్రజలకు మార్గదర్శకత్వం చేయడు.

5:68 – قُلْ يَا أَهْلَ الْكِتَابِ لَسْتُمْ عَلَىٰ شَيْءٍ حَتَّىٰ تُقِيمُوا التَّوْرَاةَ وَالْإِنجِيلَ وَمَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ ۗ وَلَيَزِيدَنَّ كَثِيرًا مِّنْهُم مَّا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ طُغْيَانًا وَكُفْرًا ۖ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْكَافِرِينَ ٦٨

ఇలా అను: ”ఓ గ్రంథప్రజలారా! మీరు తౌరా త్‌ను, ఇంజీల్‌ను మరియు మీ ప్రభువు తరఫు నుండి మీపై అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్‌ఆన్‌ను) ఆచరించనంతవరకు, మీరు అసలు దేని (ఏ సత్యమార్గం) మీద కూడా ఉండనట్లే!” మరియు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింప జేయబడిన (ఈ గ్రంథం) వాస్తవానికి వారిలోని అనే కుల తలబిరుసుతనాన్ని మరియు సత్య-తిరస్కా రాన్ని మాత్రమే పెంచుతుంది. 50 కావున నీవు సత్య-తిరస్కార ప్రజలను గురించి విచారించకు.

5:69 – إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالصَّابِئُونَ وَالنَّصَارَىٰ مَنْ آمَنَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ وَعَمِلَ صَالِحًا فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ٦٩

నిశ్చయంగా, ఈ (గ్రంథాన్ని) విశ్వసించిన వారు (ముస్లింలు) మరియు యూదులు మరియు ‘సాబియూ’లు మరియు క్రైస్తవులు, ఎవరైనా సరే అల్లాహ్‌ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించి, సత్కార్యాలు చేస్తే వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా. 51

5:70 – لَقَدْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ وَأَرْسَلْنَا إِلَيْهِمْ رُسُلًا ۖ كُلَّمَا جَاءَهُمْ رَسُولٌ بِمَا لَا تَهْوَىٰ أَنفُسُهُمْ فَرِيقًا كَذَّبُوا وَفَرِيقًا يَقْتُلُونَ ٧٠

వాస్తవానికి మేము ఇస్రాయీ’ల్‌ సంతతి వారి నుండి ఒక గట్టి ప్రమాణాన్ని తీసుకున్నాము మరియు వారి వద్దకు ప్రవక్తలను పంపాము. కాని ఏ ప్రవక్త అయినా వారి మనోవాంఛలకు వ్యతిరేకమైన దానిని తెచ్చినపుడల్లా, వారు కొందరిని అసత్య వాదులని తిరస్కరించారు, మరి కొందరిని హత్యచేశారు.

5:71 – وَحَسِبُوا أَلَّا تَكُونَ فِتْنَةٌ فَعَمُوا وَصَمُّوا ثُمَّ تَابَ اللَّـهُ عَلَيْهِمْ ثُمَّ عَمُوا وَصَمُّوا كَثِيرٌ مِّنْهُمْ ۚ وَاللَّـهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ ٧١

మరియు తమ కెలాంటి శిక్ష (ఫిత్నా) పడదని తలచి, వారు గ్రుడ్డివారుగా, చెవిటివారుగా అయిపోయారు. ఆ పిదప అల్లాహ్‌ వారి పశ్చాత్తా పాన్ని అంగీకరించాడు. ఆ తరువాత కూడ వారిలో అనేకులు తిరిగి గ్రుడ్డివారుగా, చెవిటివారుగా అయిపోయారు. మరియు వారు చేసేదంతా అల్లాహ్‌ చూస్తున్నాడు.

5:72 – لَقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّـهَ هُوَ الْمَسِيحُ ابْنُ مَرْيَمَ ۖ وَقَالَ الْمَسِيحُ يَا بَنِي إِسْرَائِيلَ اعْبُدُوا اللَّـهَ رَبِّي وَرَبَّكُمْ ۖ إِنَّهُ مَن يُشْرِكْ بِاللَّـهِ فَقَدْ حَرَّمَ اللَّـهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ ٧٢

”నిశ్చయంగా, మర్యమ్‌ కుమారుడు మసీ’హ్ (క్రీస్తు) యే అల్లాహ్‌!” అని పలికేవారు వాస్తవంగా సత్యతిరస్కారులు! మరియు మసీ’హ్ (క్రీస్తు) ఇలాఅన్నాడు: ”ఓఇస్రా’యీల్‌ సంతతి వారలారా! నా ప్రభువు మరియు మీ ప్రభువైన అల్లాహ్‌నే ఆరాధించండి.” 52 వాస్తవానికి ఇతరులను అల్లాహ్‌కు భాగ-స్వాములుగా చేసేవారికి, నిశ్చయంగా అల్లాహ్‌ స్వర్గాన్ని నిషేధించాడు. మరియు వారి ఆశ్రయం నరకాగ్నియే! మరియు దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు.

5:73 – لَّقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّـهَ ثَالِثُ ثَلَاثَةٍ ۘ وَمَا مِنْ إِلَـٰهٍ إِلَّا إِلَـٰهٌ وَاحِدٌ ۚ وَإِن لَّمْ يَنتَهُوا عَمَّا يَقُولُونَ لَيَمَسَّنَّ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ عَذَابٌ أَلِيمٌ ٧٣

”నిశ్చయంగా, అల్లాహ్‌ ముగ్గురిలో మూడవ వాడు!” అని అనేవారు వాస్తవానికి సత్య- తిరస్కారులే 53 మరియు ఒకేఒక్క ఆరాధ్య దేవుడు (అల్లాహ్‌) తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు. మరియు వారు తమ ఈ మాటలను మానుకోకపోతే, వారిలో సత్య-తిరస్కారులైన వారికి బాధా కరమైన శిక్ష పడుతుంది.

5:74 – أَفَلَا يَتُوبُونَ إِلَى اللَّـهِ وَيَسْتَغْفِرُونَهُ ۚ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٧٤

వారెందుకు అల్లాహ్‌ వైపునకు పశ్చాత్తా పంతో మరలి ఆయనను క్షమాభిక్ష కొరకు వేడుకోరు? మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

5:75 – مَّا الْمَسِيحُ ابْنُ مَرْيَمَ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِن قَبْلِهِ الرُّسُلُ وَأُمُّهُ صِدِّيقَةٌ ۖ كَانَا يَأْكُلَانِ الطَّعَامَ ۗ انظُرْ كَيْفَ نُبَيِّنُ لَهُمُ الْآيَاتِ ثُمَّ انظُرْ أَنَّىٰ يُؤْفَكُونَ ٧٥

మర్యమ్‌ కుమారుడు మసీ’హ్ (క్రీస్తు) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అతనికి పూర్వం కూడా అనేక ప్రవక్తలు గతించారు. మరియు అతని తల్లి సత్యవతి (‘సిద్దీఖహ్‌). వారిద్దరూ ఆహారం తినేవారు. 54 చూడండి! మేము వారికి ఈ సూచనలను ఏ విధంగా స్పష్టపరిచామో! అయినా చూడండి! 55

5:76 – قُلْ أَتَعْبُدُونَ مِن دُونِ اللَّـهِ مَا لَا يَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا نَفْعًا ۚ وَاللَّـهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ ٧٦

ఇలా అను: ”ఏమీ? మీరు అల్లాహ్‌ను వదిలి మీకు నష్టంగానీ, లాభంగానీ చేసే అధికారం లేని దానిని ఆరాధిస్తారా? మరియు కేవలం అల్లాహ్‌ మాత్రమే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.”

5:77 – قُلْ يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ غَيْرَ الْحَقِّ وَلَا تَتَّبِعُوا أَهْوَاءَ قَوْمٍ قَدْ ضَلُّوا مِن قَبْلُ وَأَضَلُّوا كَثِيرًا وَضَلُّوا عَن سَوَاءِ السَّبِيلِ ٧٧

(ఇంకా) ఇలా అను: ”ఓ గ్రంథప్రజలారా! మీ ధర్మం విషయంలో మీరు అధర్మంగా హద్దులు మీరి ప్రవర్తించకండి. 56 మరియు ఇంతకు పూర్వం మార్గభ్రష్టులైనవారి కోరికలను అనుసరించకండి. వారు అనేక ఇతరులను కూడా మార్గభ్రష్టులుగా చేశారు మరియు వారు కూడ ఋజుమార్గం నుండి తప్పిపోయారు.”

5:78 – لُعِنَ الَّذِينَ كَفَرُوا مِن بَنِي إِسْرَائِيلَ عَلَىٰ لِسَانِ دَاوُودَ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۚ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ ٧٨

ఇస్రాయీ’ల్‌ సంతతి వారిలో అవిశ్వాస మార్గం అవలంబించిన వారు, దావూద్‌ మరియు మర్యమ్‌ కుమారుడు ‘ఈసా (ఏసు) నాలుకతో (నోటితో) శపించబడ్డారు 57 ఇది వారు అవిధే యులై హద్దులు మీరి ప్రవర్తించిన దాని ఫలితం.

5:79 – انُوا لَا يَتَنَاهَوْنَ عَن مُّنكَرٍ فَعَلُوهُ ۚ لَبِئْسَ مَا كَانُوا يَفْعَلُونَ ٧٩

వారు, తాము చేసే, అసభ్యకరమైన కార్యాల నుండి ఒకరినొకరు నిరోధించుకోలేదు. వారు చేసే పనులన్నీ ఎంతో నీచమైనవి.

5:80 – تَرَىٰ كَثِيرًا مِّنْهُمْ يَتَوَلَّوْنَ الَّذِينَ كَفَرُوا ۚ لَبِئْسَ مَا قَدَّمَتْ لَهُمْ أَنفُسُهُمْ أَن سَخِطَ اللَّـهُ عَلَيْهِمْ وَفِي الْعَذَابِ هُمْ خَالِدُونَ ٨٠

వారిలో అనేకులు సత్య-తిరస్కారులతో మైత్రి చేసుకోవటాన్ని, నీవు చూస్తున్నావు. వారు తమకొరకు ముందుగాచేసి పంపుకున్న నీచకర్మల వలన అల్లాహ్‌కు వారిపై కోపం కలిగింది మరియు వారు నరకబాధలో శాశ్వతంగా ఉంటారు.

5:81 – وَلَوْ كَانُوا يُؤْمِنُونَ بِاللَّـهِ وَالنَّبِيِّ وَمَا أُنزِلَ إِلَيْهِ مَا اتَّخَذُوهُمْ أَوْلِيَاءَ وَلَـٰكِنَّ كَثِيرًا مِّنْهُمْ فَاسِقُونَ ٨١

ఒకవేళ వారు అల్లాహ్‌నూ, ప్రవక్తనూ మరియు అతనిపై అవతరింపజేయబడిన దానిని (నిజంగానే) విశ్వసించి ఉంటే! వారిని (సత్య- తిరస్కారులను) తమ మిత్రులుగా చేసుకొని ఉండేవారు కాదు, కాని వారిలో అనేకులు అవిధేయులున్నారు.

5:82 – لَتَجِدَنَّ أَشَدَّ النَّاسِ عَدَاوَةً لِّلَّذِينَ آمَنُوا الْيَهُودَ وَالَّذِينَ أَشْرَكُوا ۖ وَلَتَجِدَنَّ أَقْرَبَهُم مَّوَدَّةً لِّلَّذِينَ آمَنُوا الَّذِينَ قَالُوا إِنَّا نَصَارَىٰ ۚ ذَٰلِكَ بِأَنَّ مِنْهُمْ قِسِّيسِينَ وَرُهْبَانًا وَأَنَّهُمْ لَا يَسْتَكْبِرُونَ ٨٢

నిశ్చయంగా, విశ్వాసులపట్ల (ముస్లింల పట్ల) విరోధ విషయంలో నీవు యూదులను మరియు బహు దైవారాధకులను (ముష్రికీన్‌లను), అందరికంటే కఠినులుగా కనుగొంటావు. మరియు విశ్వాసులపట్ల మైత్రి విషయంలో: ”నిశ్చయంగా, మేము క్రైస్తవులము.” అని, అన్న వారిని అత్యంత సన్నిహితులుగా పొందుతావు. ఇది ఎందుకంటే వారిలో మతగురువులు / విద్వాంసులు (ఖిస్సీ సీన్‌) మరియు మునులు (రుహ్‌బాన్) ఉన్నారు మరియు నిశ్చయంగా, వారు గర్వించరు.

5:83 – وَإِذَا سَمِعُوا مَا أُنزِلَ إِلَى الرَّسُولِ تَرَىٰ أَعْيُنَهُمْ تَفِيضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوا مِنَ الْحَقِّ ۖ يَقُولُونَ رَبَّنَا آمَنَّا فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ ٨٣

మరియు వారు (కొందరు క్రైస్తవులు) ప్రవక్తపై అవతరింపజేయబడిన దానిని (ఈ గ్రంథాన్ని) విన్నప్పుడు, సత్యాన్ని తెలుసు కున్నందుకు, వారి కళ్ళ నుండి కన్నీళ్ళు కారటం నీవు చూస్తావు. 58 వారు ఇలా అంటారు: ”ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము. కావున మమ్మల్ని సాక్ష్యం ఇచ్చేవారిలో వ్రాసుకో!

5:84 – وَمَا لَنَا لَا نُؤْمِنُ بِاللَّـهِ وَمَا جَاءَنَا مِنَ الْحَقِّ وَنَطْمَعُ أَن يُدْخِلَنَا رَبُّنَا مَعَ الْقَوْمِ الصَّالِحِينَ ٨٤

”మరియు మేము అల్లాహ్‌ను మరియు మా వద్దకు వచ్చిన సత్యాన్ని విశ్వసించకుండా ఉండ టానికి మాకేమైంది? మా ప్రభువు మమ్మల్ని సద్వ ర్తనులతో చేర్చాలని మేముకోరుకుంటున్నాము.”

5:85 – فَأَثَابَهُمُ اللَّـهُ بِمَا قَالُوا جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَاءُ الْمُحْسِنِينَ ٨٥

కావున వారు పలికిన దానికి ఫలితంగా, అల్లాహ్‌ వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలను ప్రసాదించాడు. వారందులో శాశ్వతంగా ఉంటారు. మరియు సజ్జనులకు లభించే ప్రతిఫలం ఇదే!

5:86 – وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَـٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ ٨٦

మరియు ఎవరైతే సత్య-తిరస్కారులై మా సూచన (ఆయాత్‌)లను అబద్ధాలన్నారో, అలాంటివారు భగభగ మండే నరకాగ్ని వాసులవుతారు.

5:87 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُحَرِّمُوا طَيِّبَاتِ مَا أَحَلَّ اللَّـهُ لَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّـهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ ٨٧

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ మీకు ధర్మ సమ్మతం చేసిన పరిశుధ్ధ వస్తువులను నిషిధ్ధం చేసుకోకండి మరియు హద్దులు మీరకండి. నిశ్చయంగా, అల్లాహ్‌ హద్దులు మీరిపోయేవారిని ప్రేమించడు. 59

5:88 – وَكُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّـهُ حَلَالًا طَيِّبًا ۚ وَاتَّقُوا اللَّـهَ الَّذِي أَنتُم بِهِ مُؤْمِنُونَ ٨٨

మరియు అల్లాహ్‌ మీకు జీవనోపాధిగా ప్రసా దించిన వాటిలో ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన పదార్థాలను తినండి. మీరు విశ్వసించిన అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి.

5:89 – لَا يُؤَاخِذُكُمُ اللَّـهُ بِاللَّغْوِ فِي أَيْمَانِكُمْ وَلَـٰكِن يُؤَاخِذُكُم بِمَا عَقَّدتُّمُ الْأَيْمَانَ ۖ فَكَفَّارَتُهُ إِطْعَامُ عَشَرَةِ مَسَاكِينَ مِنْ أَوْسَطِ مَا تُطْعِمُونَ أَهْلِيكُمْ أَوْ كِسْوَتُهُمْ أَوْ تَحْرِيرُ رَقَبَةٍ ۖ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ ثَلَاثَةِ أَيَّامٍ ۚ ذَٰلِكَ كَفَّارَةُ أَيْمَانِكُمْ إِذَا حَلَفْتُمْ ۚ وَاحْفَظُوا أَيْمَانَكُمْ ۚ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّـهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَشْكُرُونَ ٨٩

మీరు ఉద్దేశం లేకుండానే చేసిన ప్రమాణా లను గురించి అల్లాహ్‌ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు బుద్ధిపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని (తప్పకుండా) పట్టు కుంటాడు. కావున దానికి (ఇలాంటి ప్రమాణ భంగానికి) పరిహారంగా మీరు మీ ఇంటి వారికి పెట్టే, మధ్య రకమైన ఆహారం పది మంది పేదలకు పెట్టాలి. లేదా వారికి వస్త్రాలు ఇవ్వాలి. లేదా ఒక బానిసకు స్వాతంత్ర్యం ఇప్పించాలి. ఎవడికి ఈశక్తి లేదో! అతడు మూడుదినాలు ఉపవాసం ఉండాలి. మీరు ప్రమాణం చేసి భంగపరిస్తే, ఇది దానికి పరి హారం (కఫ్ఫారా). 50 మీ ప్రమాణాలను కాపాడు కోండి. మీరు కృతజ్ఞులై ఉండటానికి అల్లాహ్‌ తన ఆజ్ఞలను ఈవిధంగా మీకు విశదపరుస్తున్నాడు 61

5:90 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّمَا الْخَمْرُ وَالْمَيْسِرُ وَالْأَنصَابُ وَالْأَزْلَامُ رِجْسٌ مِّنْ عَمَلِ الشَّيْطَانِ فَاجْتَنِبُوهُ لَعَلَّكُمْ تُفْلِحُونَ ٩٠

ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, మద్య పానం, జూదం, బలిపీఠం మీద బలిఇవ్వటం (అ’న్సాబ్‌) మరియు శకునానికై బాణాల ప్రయోగం (అ’జ్లామ్‌) ఇవన్నీ కేవలం అసహ్య కరమైన షై’తాన్‌ చేష్టలు, కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి.

5:91 – إِنَّمَا يُرِيدُ الشَّيْطَانُ أَن يُوقِعَ بَيْنَكُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ فِي الْخَمْرِ وَالْمَيْسِرِ وَيَصُدَّكُمْ عَن ذِكْرِ اللَّـهِ وَعَنِ الصَّلَاةِ ۖ فَهَلْ أَنتُم مُّنتَهُونَ ٩١

నిశ్చయంగా, షై’తాన్‌ మద్యపానం మరియు జూదం ద్వారా మీ మధ్య విరోధాలు మరియు విద్వేషాలు రేకెత్తించాలని మరియు మిమ్మల్ని అల్లాహ్‌ ధ్యానం నుండి మరియు నమా’జ్‌ నుండి తొలగించాలని కోరుతున్నాడు. అయితే మీరిప్పుడైనా మానుకోరా?

5:92 – وَأَطِيعُوا اللَّـهَ وَأَطِيعُوا الرَّسُولَ وَاحْذَرُوا ۚ فَإِن تَوَلَّيْتُمْ فَاعْلَمُوا أَنَّمَا عَلَىٰ رَسُولِنَا الْبَلَاغُ الْمُبِينُ ٩٢

మరియు మీరు అల్లాహ్‌కు విధేయులై ఉండండి మరియు ప్రవక్తను అనుసరించండి. జాగ్రత్త! మీరు ఒకవేళ తిరిగిపోతే! నిశ్చయంగా, మా ప్రవక్త బాధ్యత కేవలం (మా ఆజ్ఞలను) మీకు స్పష్టంగా అందజేయటం మాత్రమే అని తెలుసుకోండి.

5:93 – لَيْسَ عَلَى الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جُنَاحٌ فِيمَا طَعِمُوا إِذَا مَا اتَّقَوا وَّآمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ثُمَّ اتَّقَوا وَّآمَنُوا ثُمَّ اتَّقَوا وَّأَحْسَنُوا ۗ وَاللَّـهُ يُحِبُّ الْمُحْسِنِينَ ٩٣

విశ్వసించి సత్కార్యాలు చేసేవారిపై, (ఇంతకు ముందు) వారు తిన్న (త్రాగిన) దాన్ని గురించి దోషం లేదు; ఒకవేళ వారు దైవభీతి కలిగి ఉండి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తూఉంటే, ఇంకా దైవభీతి కలిగి ఉండి విశ్వాసులైతే, ఇంకా దైవభీతి కలిగి ఉండి సజ్జనులైతే! మరియు అల్లాహ్‌ సజ్జనులను ప్రేమిస్తాడు.

5:94 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَيَبْلُوَنَّكُمُ اللَّـهُ بِشَيْءٍ مِّنَ الصَّيْدِ تَنَالُهُ أَيْدِيكُمْ وَرِمَاحُكُمْ لِيَعْلَمَ اللَّـهُ مَن يَخَافُهُ بِالْغَيْبِ ۚ فَمَنِ اعْتَدَىٰ بَعْدَ ذَٰلِكَ فَلَهُ عَذَابٌ أَلِيمٌ ٩٤

ఓ విశ్వాసులారా! (మీరు ఇ’హ్రామ్‌ స్థితిలో ఉన్నప్పుడు) – మీ ఇంద్రియాలకు అగోచరమైన అల్లాహ్‌కు ఎవరు భయపడతారో చూడటానికి –అల్లాహ్‌ మీ చేతులకు మరియు మీ బల్లెములకు అందుబాటులో ఉన్న కొన్ని వేట (జంతువుల) ద్వారా మిమ్మల్ని పరీక్షకు గురిచేస్తాడు. కావున ఈ (హెచ్చరిక) తరువాతకూడా ఎవడుహద్దులను అతిక్రమిస్తాడో, వాడికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

5:95 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقْتُلُوا الصَّيْدَ وَأَنتُمْ حُرُمٌ ۚ وَمَن قَتَلَهُ مِنكُم مُّتَعَمِّدًا فَجَزَاءٌ مِّثْلُ مَا قَتَلَ مِنَ النَّعَمِ يَحْكُمُ بِهِ ذَوَا عَدْلٍ مِّنكُمْ هَدْيًا بَالِغَ الْكَعْبَةِ أَوْ كَفَّارَةٌ طَعَامُ مَسَاكِينَ أَوْ عَدْلُ ذَٰلِكَ صِيَامًا لِّيَذُوقَ وَبَالَ أَمْرِهِ ۗ عَفَا اللَّـهُ عَمَّا سَلَفَ ۚ وَمَنْ عَادَ فَيَنتَقِمُ اللَّـهُ مِنْهُ ۗ وَاللَّـهُ عَزِيزٌ ذُو انتِقَامٍ ٩٥

ఓ విశ్వాసులారా! మీరు ఇ’హ్రామ్‌ స్థితిలో ఉన్నప్పుడు వేటాడకండి. 64 మీలో ఎవరైనా బుద్ధి పూర్వకంగా వేటచేస్తే, అతడు చంపిన జంతువుతో సరితూగే ఒక పశువును పరిహారంగా సమర్పించు కోవాలి. దానిని (ఆ పశువును) మీలో న్యాయ వర్తులైన ఇద్దరు వ్యక్తులు నిర్ణయించాలి. పశువును ఖుర్బానీ కొరకు క’అబహ్ వద్దకు చేర్చాలి. లేదా దానికి పరిహారంగా కొందరు పేదలకు భోజనం పెట్టాలి, లేదా దానికి పరిహారంగా – తాను చేసిన దాని ప్రతిఫలాన్ని చవి చూడటానికి – ఉపవాసముండాలి. గడిచిపోయిన దానిని అల్లాహ్‌ మన్నించాడు. కాని ఇక ముందు ఎవరైనా మళ్ళీ అలా చేస్తే అల్లాహ్‌ అతనికి ప్రతీకారం చేస్తాడు. మరియు అల్లాహ్‌ సర్వ శక్తి సంపన్నుడు, ప్రతీకారం చేయగలవాడు.

5:96 – أُحِلَّ لَكُمْ صَيْدُ الْبَحْرِ وَطَعَامُهُ مَتَاعًا لَّكُمْ وَلِلسَّيَّارَةِ ۖ وَحُرِّمَ عَلَيْكُمْ صَيْدُ الْبَرِّ مَا دُمْتُمْ حُرُمًا ۗ وَاتَّقُوا اللَّـهَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ ٩٦

సముద్ర జంతువులను వేటాడటం మరియు వాటిని తినటం, 65 జీవనోపాధిగా మీకూ (స్థిరనివాసులకూ) మరియు ప్రయాణీకులకూ ధర్మ సమ్మతం చేయబడింది. కానీ, మీరు ఇ’హ్రామ్‌ స్థితిలో ఉన్నంత వరకూ భూమిపై వేటాడటం మీకు నిషేధింపబడింది. కావున మీరు (పునరు త్థానదినమున) ఎవరి ముందు అయితే సమావేశ పరచబడతారో ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. (1/8)

5:97 – جَعَلَ اللَّـهُ الْكَعْبَةَ الْبَيْتَ الْحَرَامَ قِيَامًا لِّلنَّاسِ وَالشَّهْرَ الْحَرَامَ وَالْهَدْيَ وَالْقَلَائِدَ ۚ ذَٰلِكَ لِتَعْلَمُوا أَنَّ اللَّـهَ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَأَنَّ اللَّـهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ٩٧

అల్లాహ్‌ పవిత్ర గృహం అయిన క’అబహ్ ను మానవజాతి కొరకు, సురక్షితమైన శాంతి నిల యంగా (బైతుల్‌ ‘హరామ్‌గా) చేశాడు 66 మరియు పవిత్ర మాసాన్ని మరియు బలి (హద్‌య) పశువులను మరియు మెడలలో పట్టాలువేసి క’అబహ్‌కు ఖుర్బానీ కొరకు తేబడే పశువులను (ఖలాఇ’దలను) కూడా నియమించాడు. ఇది ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్నదంతా నిశ్చయంగా, అల్లాహ్‌ ఎరుగునని, మీరు తెలుసు కోవాలని! మరియు నిశ్చయంగా అల్లాహ్‌కు ప్రతి ఒక్క విషయం గురించి బాగా తెలుసు.

5:98 – اعْلَمُوا أَنَّ اللَّـهَ شَدِيدُ الْعِقَابِ وَأَنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ٩٨

నిశ్చయంగా, అల్లాహ్‌ శిక్ష విధించటంలో కఠినుడని తెలుసుకోండి మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

5:99 – مَّا عَلَى الرَّسُولِ إِلَّا الْبَلَاغُ ۗ وَاللَّـهُ يَعْلَمُ مَا تُبْدُونَ وَمَا تَكْتُمُونَ ٩٩

సందేశహరుని బాధ్యత కేవలం (అల్లాహ్‌ సందేశాలను) మీకు అందజేయటమే! మరియు మీరు వెలిబుచ్చేది మరియు దాచేది అంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.

5:100 – قُل لَّا يَسْتَوِي الْخَبِيثُ وَالطَّيِّبُ وَلَوْ أَعْجَبَكَ كَثْرَةُ الْخَبِيثِ ۚ فَاتَّقُوا اللَّـهَ يَا أُولِي الْأَلْبَابِ لَعَلَّكُمْ تُفْلِحُونَ ١٠٠

(ఓ ప్రవక్తా!) ఇలా అను: ”చెడు వస్తువుల ఆధిక్యత నీకు ఎంతనచ్చినా! చెడు మరియు మంచివస్తువులు సరిసమానంకాజాలవు. 67 కావున ఓ బుధ్ధిమంతులారా! మీరు సాఫల్యం పొందాలంటే అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండండి.”

5:101 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَسْأَلُوا عَنْ أَشْيَاءَ إِن تُبْدَ لَكُمْ تَسُؤْكُمْ وَإِن تَسْأَلُوا عَنْهَا حِينَ يُنَزَّلُ الْقُرْآنُ تُبْدَ لَكُمْ عَفَا اللَّـهُ عَنْهَا ۗ وَاللَّـهُ غَفُورٌ حَلِيمٌ ١٠١

ఓ విశ్వాసులారా! వ్యక్తపరిస్తే మీకు బాధ కలిగించెడు విషయాలను గురించి, మీరు ప్రశ్నించ కండి. ఖుర్‌ఆన్‌ అవతరింపజేయబడేటప్పుడు, మీరు వాటిని గురించి ప్రశ్నిస్తే! అవి మీకు విశదపరచబడవచ్చు! వాటి కొరకు (ఇంతవరకు మీరు చేసిన ప్రశ్నల కొరకు) అల్లాహ్‌ మిమ్మల్ని మన్నించాడు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, సహనశీలుడు.

5:102 – قَدْ سَأَلَهَا قَوْمٌ مِّن قَبْلِكُمْ ثُمَّ أَصْبَحُوا بِهَا كَافِرِينَ ١٠٢

వాస్తవానికి మీకు పూర్వం ఒక జాతివారు ఇటు వంటి ప్రశ్నలనే అడిగారు. తరువాత వాటి (ఆ ప్రశ్నల) కారణంగానే వారు సత్యతిరస్కారానికి గురి అయ్యారు. 68

5:103 – مَا جَعَلَ اللَّـهُ مِن بَحِيرَةٍ وَلَا سَائِبَةٍ وَلَا وَصِيلَةٍ وَلَا حَامٍ ۙ وَلَـٰكِنَّ الَّذِينَ كَفَرُوا يَفْتَرُونَ عَلَى اللَّـهِ الْكَذِبَ ۖ وَأَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ ١٠٣

అల్లాహ్‌ బ’హీరహ్‌ను గానీ, సాయి’బహ్‌ ను గానీ, వ’సీలహ్‌ను గానీ లేక ‘హామ్‌ను గానీ నియమించ లేదు. 69 కాని సత్య-తిరస్కారులు అల్లాహ్‌పై అబద్ధాలు కల్పిస్తున్నారు. మరియు వారిలో చాలా మంది బుద్ధిహీనులే!

5:104 – وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَىٰ مَا أَنزَلَ اللَّـهُ وَإِلَى الرَّسُولِ قَالُوا حَسْبُنَا مَا وَجَدْنَا عَلَيْهِ آبَاءَنَا ۚ أَوَلَوْ كَانَ آبَاؤُهُمْ لَا يَعْلَمُونَ شَيْئًا وَلَا يَهْتَدُونَ ١٠٤

ఓ విశ్వాసులారా! మీ స్వయానికి మీరు బాధ్యత వహించండి. మీరు సన్మార్గంలో ఉంటే, మార్గభ్రష్టులైన వారు, మీకు ఎలాంటి హాని చేయలేరు. 70 మీరంతా అల్లాహ్‌ వైపునకే మరలి పోవలసి వుంది. అప్పుడు ఆయన మీరేమేమి చేస్తూ ఉండేవారో మీకు తెలియజేస్తాడు.

5:105 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا عَلَيْكُمْ أَنفُسَكُمْ ۖ لَا يَضُرُّكُم مَّن ضَلَّ إِذَا اهْتَدَيْتُمْ ۚ إِلَى اللَّـهِ مَرْجِعُكُمْ جَمِيعًا فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ١٠٥

ఓ విశ్వాసులారా! మీలో ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైతే, మీరు వీలునామా వ్రాసే టప్పుడు, మీలో న్యాయవర్తులైన ఇద్దరు వ్యక్తు లను సాక్షులుగాతీసుకోండి. ఒకవేళ మీరు ప్రయాణ స్థితిలో ఉండి, అక్కడ మీకు మరణ ఆపద సంభ విస్తే, మీ వారు (ముస్లింలు లేకుంటే) ఇతరులను ఎవరినైనా ఇద్దరిని (సాక్షులుగా) తీసుకోవచ్చు. ఆ ఇద్దరినీ నమా’జ్‌ తరువాత ఆపుకోండి. మీకు సందేహముంటే, వారిద్దరూ అల్లాహ్‌పై ప్రమాణం చేసి ఇలా అనాలి: ”మా దగ్గరి బంధువుకొరకైనా సరే, మేము స్వార్థం కొరకు మా సాక్ష్యాన్ని అమ్మము. మేము అల్లాహ్‌ కొరకు ఇచ్చే సాక్ష్యాన్ని దాచము. మేము ఆవిధంగా చేస్తే నిశ్చయంగా, పాపాత్ము లలో లెక్కింపబడుదుము గాక!”

5:106 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا شَهَادَةُ بَيْنِكُمْ إِذَا حَضَرَ أَحَدَكُمُ الْمَوْتُ حِينَ الْوَصِيَّةِ اثْنَانِ ذَوَا عَدْلٍ مِّنكُمْ أَوْ آخَرَانِ مِنْ غَيْرِكُمْ إِنْ أَنتُمْ ضَرَبْتُمْ فِي الْأَرْضِ فَأَصَابَتْكُم مُّصِيبَةُ الْمَوْتِ ۚ تَحْبِسُونَهُمَا مِن بَعْدِ الصَّلَاةِ فَيُقْسِمَانِ بِاللَّـهِ إِنِ ارْتَبْتُمْ لَا نَشْتَرِي بِهِ ثَمَنًا وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ ۙ وَلَا نَكْتُمُ شَهَادَةَ اللَّـهِ إِنَّا إِذًا لَّمِنَ الْآثِمِينَ ١٠٦

కాని, ఆ తరువాత ఆ ఇద్దరు (సాక్షులు) పాపం చేశారని తెలిస్తే! అప్పుడు మొదటి ఇద్దరి (సాక్ష్యం) వలన హక్కును కోల్పోయిన వారి (బంధువుల)లో నుండి ఇద్దరు మొదటి వారిద్దరికి బదులుగా నిలబడి అల్లాహ్‌పై శపథం చేసి ఇలా అనాలి: ”మా సాక్ష్యం వీరిరువురి సాక్ష్యం కంటే ఎక్కువ హక్కుగలది (సత్యమైనది). మరియు మేము ఏ విధమైన అక్రమానికి పాల్పడలేదు. మేము ఆవిధంగా చేస్తే నిశ్చయంగా, అన్యాయ పరులలో చేరిపోదుము గాక!”

5:107 – فَإِنْ عُثِرَ عَلَىٰ أَنَّهُمَا اسْتَحَقَّا إِثْمًا فَآخَرَانِ يَقُومَانِ مَقَامَهُمَا مِنَ الَّذِينَ اسْتَحَقَّ عَلَيْهِمُ الْأَوْلَيَانِ فَيُقْسِمَانِ بِاللَّـهِ لَشَهَادَتُنَا أَحَقُّ مِن شَهَادَتِهِمَا وَمَا اعْتَدَيْنَا إِنَّا إِذًا لَّمِنَ الظَّالِمِينَ ١٠٧

ఇది (ఈ పద్ధతి) ప్రజలు నిజమైన సాక్ష్యం ఇవ్వటానికి లేదా వారి ప్రమాణాలను, తరువాత తీసుకొనబడే ప్రమాణాలు ఖండిస్తాయని వారిని భయపెట్టటానికి ఉత్తమమైనది. అల్లాహ్ యందు భయ-భక్తులు కలిగి ఉండి, (ఆయన ఆదేశాలను) వినండి. మరియు అల్లాహ్‌ అవిధేయులకు సన్మార్గం చూపడు. (1/4)

5:108 – ذَٰلِكَ أَدْنَىٰ أَن يَأْتُوا بِالشَّهَادَةِ عَلَىٰ وَجْهِهَا أَوْ يَخَافُوا أَن تُرَدَّ أَيْمَانٌ بَعْدَ أَيْمَانِهِمْ ۗ وَاتَّقُوا اللَّـهَ وَاسْمَعُوا ۗ وَاللَّـهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ ١٠٨

ఆ రోజు అల్లాహ్‌ ప్రవక్తలందరిని సమా వేశపరచి: ”మీకేమి జవాబు ఇవ్వబడింది?” అని అడిగితే! వారు: ”మాకు యథార్థ జ్ఞానం లేదు! నిశ్చయంగా, నీవు మాత్రమే సర్వ అగోచర విష యాల జ్ఞానం గలవాడవు.” అని పలుకుతారు 71

5:109 – يَوْمَ يَجْمَعُ اللَّـهُ الرُّسُلَ فَيَقُولُ مَاذَا أُجِبْتُمْ ۖ قَالُوا لَا عِلْمَ لَنَا ۖ إِنَّكَ أَنتَ عَلَّامُ الْغُيُوبِ ١٠٩

(జ్ఞాపకముంచుకోండి!) అప్పుడు (పునరు త్థాన దినమున), అల్లాహ్‌: ”ఓ మర్యమ్‌ కుమా రుడా! ‘ఈసా (ఏసు) నేను నీకు మరియు నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకంచేసుకో! నేను పరిశుద్ధాత్మ (రూ’హుల్‌ ఖుదుస్) 72 ద్వారా నిన్ను బలపరిచాను, నీవు ఉయ్యాలలోనూ మరియు యుక్త వయస్సులోనూ ప్రజలతో మాట్లాడేవాడివి. మరియు నేను గ్రంథాన్ని మరియు వివేకాన్ని, తౌరాతును మరియు ఇంజీలు ను నీకు నేర్పాను. 73 మరియు నీవు నా ఆజ్ఞతో పక్షిఆకారం గల మట్టి బొమ్మను తయారు చేసి, దానిలో ఊదినపుడు, నా ఆజ్ఞతో అది పక్షిగా మారిపోయేది. మరియు నీవు పుట్టుగ్రుడ్డిని మరియు కుష్ఠురోగిని నా ఆజ్ఞతో బాగుచేసేవాడివి. మరియు నీవు నా ఆజ్ఞతో మృతులను లేపే వాడివి. 74 మరియు నీవు స్పష్టమైన సూచన లతో ఇస్రాయీ’లు సంతతివారి వద్దకు వచ్చి నపుడు, 75 వారిలోని సత్య-తిరస్కారులు: ‘ఇది స్పష్టమైన మాయా జాలం తప్ప మరేమీ కాదు!’ ” అని అన్నారు. అప్పుడు నేను వారి కుట్ర నుండి నిన్ను కాపాడాను!

5:110 – إِذْ قَالَ اللَّـهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ اذْكُرْ نِعْمَتِي عَلَيْكَ وَعَلَىٰ وَالِدَتِكَ إِذْ أَيَّدتُّكَ بِرُوحِ الْقُدُسِ تُكَلِّمُ النَّاسَ فِي الْمَهْدِ وَكَهْلًا ۖ وَإِذْ عَلَّمْتُكَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَالتَّوْرَاةَ وَالْإِنجِيلَ ۖ وَإِذْ تَخْلُقُ مِنَ الطِّينِ كَهَيْئَةِ الطَّيْرِ بِإِذْنِي فَتَنفُخُ فِيهَا فَتَكُونُ طَيْرًا بِإِذْنِي ۖ وَتُبْرِئُ الْأَكْمَهَ وَالْأَبْرَصَ بِإِذْنِي ۖ وَإِذْ تُخْرِجُ الْمَوْتَىٰ بِإِذْنِي ۖ وَإِذْ كَفَفْتُ بَنِي إِسْرَائِيلَ عَنكَ إِذْ جِئْتَهُم بِالْبَيِّنَاتِ فَقَالَ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ إِنْ هَـٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ ١١٠

మరియు నేను, (‘ఈసా) శిష్యుల (‘హవారి య్యూన్‌ల) మనస్సులలో ఇలా మాట వేసినప్పుడు: 76 ”నన్ను మరియు నా ప్రవక్తను విశ్వసించండి.” వారన్నారు: ”మేము విశ్వ సించాము మరియు మేము ముస్లింలము అయ్యాము అనే మాటకు సాక్షిగా ఉండు!”

5:111 – وَإِذْ أَوْحَيْتُ إِلَى الْحَوَارِيِّينَ أَنْ آمِنُوا بِي وَبِرَسُولِي قَالُوا آمَنَّا وَاشْهَدْ بِأَنَّنَا مُسْلِمُونَ ١١١

(జ్ఞాపకం చేసుకోండి!) ఆ శిష్యులు (‘హవా రియ్యూన్‌): ”ఓ మర్యమ్‌ కుమారుడవైన ‘ఈసా (ఏసూ) ఏమీ? నీప్రభువు మాకొరకు ఆకాశంనుండి ఆహారంతో నిండిన ఒకపళ్ళెం దింపగలడా?” అని అడిగారు! 77 దానికి (‘ఈసా): ”మీరు వాస్త వానికి విశ్వాసులే అయితే, అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి!” అని అన్నాడు.

5:112 – إِذْ قَالَ الْحَوَارِيُّونَ يَا عِيسَى ابْنَ مَرْيَمَ هَلْ يَسْتَطِيعُ رَبُّكَ أَن يُنَزِّلَ عَلَيْنَا مَائِدَةً مِّنَ السَّمَاءِ ۖ قَالَ اتَّقُوا اللَّـهَ إِن كُنتُم مُّؤْمِنِينَ ١١٢

వారు: ”వాస్తవానికి, మేము దానినుండి తిని, మా హృదయాలను తృప్తిపరచుకోవటానికి మరియు నీవు మాతో సత్యం పలికావని తెలుసుకోవటానికి మరియు దానిని గురించి మేము సాక్షులుగా ఉండటానికి, మేమిలా కోరుతున్నాము!” అని అన్నారు.

5:113 – قَالُوا نُرِيدُ أَن نَّأْكُلَ مِنْهَا وَتَطْمَئِنَّ قُلُوبُنَا وَنَعْلَمَ أَن قَدْ صَدَقْتَنَا وَنَكُونَ عَلَيْهَا مِنَ الشَّاهِدِينَ ١١٣

దానికి మర్యమ్‌ కుమారుడు ‘ఈసా (ఏసు): ”ఓ అల్లాహ్‌! మా ప్రభూ! ఆకాశం నుండి ఆహారంతో నిండిన ఒక పళ్ళాన్ని మా కొరకు అవతరింపజేయి (దింపు); అది మాకు మొదటి వాని నుండి చివరివాని వరకు పండుగగా ఉండాలి; అది నీ తరఫు నుండి ఒక సూచనగా ఉండాలి. మాకు ఆహారాన్ని ప్రసాదించు. నీవే అత్యుత్తమ మైన ఉపాధి ప్రదాతవు!” అని ప్రార్థించాడు.

5:114 – قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ اللَّـهُمَّ رَبَّنَا أَنزِلْ عَلَيْنَا مَائِدَةً مِّنَ السَّمَاءِ تَكُونُ لَنَا عِيدًا لِّأَوَّلِنَا وَآخِرِنَا وَآيَةً مِّنكَ ۖ وَارْزُقْنَا وَأَنتَ خَيْرُ الرَّازِقِينَ ١١٤

(అప్పుడు) అల్లాహ్‌: ”నిశ్చయంగా, నేను దానిని మీపై అవతరింపజేస్తాను (దింపుతాను). కాని, దాని తరువాత కూడా మీలో ఎవడైనా సత్య-తిరస్కారానికి పాల్పడితే! నిశ్చయంగా, వానికి నేను ఇంతవరకు సర్వలోకాలలో ఎవ్వడికీ విధించని శిక్షను విధిస్తాను!” అని అన్నాడు.

5:115 – قَالَ اللَّـهُ إِنِّي مُنَزِّلُهَا عَلَيْكُمْ ۖ فَمَن يَكْفُرْ بَعْدُ مِنكُمْ فَإِنِّي أُعَذِّبُهُ عَذَابًا لَّا أُعَذِّبُهُ أَحَدًا مِّنَ الْعَالَمِينَ ١١٥

మరియు (జ్ఞాపకముంచుకోండి!)అప్పుడు (పునరుత్థాన దినమున), అల్లాహ్‌: ”ఓ మర్యమ్‌ కుమారుడా! ‘ఈసా (ఏసు) ఏమీ? నీవు ప్రజలతో: ‘అల్లాహ్‌కు బదులుగా నన్నూమరియు నా తల్లినీ ఆరాధ్యులుగా చేసుకోండి!’ అని చెప్పావా?” అని ప్రశ్నించగా! దానికి అతను (‘ఈసా) అంటాడు: ”నీవు సర్వలోపాలకు అతీతుడవు. నాకు పలక టానికి అర్హతలేని మాటను నేను పలకటం తగిన పని కాదు. ఒకవేళ నేను అలా చెప్పిఉంటే నీకు తప్పక తెలిసి ఉండేది. నా మనస్సులో ఉన్నది నీకు తెలుసు, కాని నీ మనస్సులో ఉన్నది నాకు తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వ అగోచర విషయాలు తెలిసినవాడవు!

5:116 – وَإِذْ قَالَ اللَّـهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَـٰهَيْنِ مِن دُونِ اللَّـهِ ۖ قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ ۚ إِن كُنتُ قُلْتُهُ فَقَدْ عَلِمْتَهُ ۚ تَعْلَمُ مَا فِي نَفْسِي وَلَا أَعْلَمُ مَا فِي نَفْسِكَ ۚ إِنَّكَ أَنتَ عَلَّامُ الْغُيُوبِ ١١٦

”నీవు ఆదేశించింది తప్ప, నేను మరేమీ వారికి చెప్పలేదు, అంటే: ‘నా ప్రభువు మరియు మీ ప్రభువు అయిన అల్లాహ్‌నే ఆరాధించండి.’ అని. నేను వారి మధ్య ఉన్నంత వరకు వారికి సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత నీవే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. మరియు నీవే ప్రతిదానికి సాక్షివి! 79

5:117 – مَا قُلْتُ لَهُمْ إِلَّا مَا أَمَرْتَنِي بِهِ أَنِ اعْبُدُوا اللَّـهَ رَبِّي وَرَبَّكُمْ ۚ وَكُنتُ عَلَيْهِمْ شَهِيدًا مَّا دُمْتُ فِيهِمْ ۖ فَلَمَّا تَوَفَّيْتَنِي كُنتَ أَنتَ الرَّقِيبَ عَلَيْهِمْ ۚ وَأَنتَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ ١١٧

”నీవు ఆదేశించింది తప్ప, నేను మరేమీ వారికి చెప్పలేదు, అంటే: ‘నా ప్రభువు మరియు మీ ప్రభువు అయిన అల్లాహ్‌నే ఆరాధించండి.’ అని. నేను వారి మధ్య ఉన్నంత వరకు వారికి సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత నీవే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. 78 మరియు నీవే ప్రతిదానికి సాక్షివి! 79

5:118 – إِن تُعَذِّبْهُمْ فَإِنَّهُمْ عِبَادُكَ ۖ وَإِن تَغْفِرْ لَهُمْ فَإِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ ١١٨

”ఒకవేళ నీవు వారినిశిక్షించదలిస్తే వారు నీ దాసులే! మరియు నీవు వారిని క్షమించదలిస్తే! నీవు సర్వ శక్తిమంతుడవు మహా వివేచనా పరుడవు!”

5:119 – قَالَ اللَّـهُ هَـٰذَا يَوْمُ يَنفَعُ الصَّادِقِينَ صِدْقُهُمْ ۚ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ رَّضِيَ اللَّـهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ ١١٩

అప్పుడుఅల్లాహ్‌ ఇలాసెలవిచ్చాడు: ”ఈ రోజు సత్యవంతులకు వారిసత్యం లాభదాయక మవుతుంది. వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు లభిస్తాయి. అక్కడ వారు శాశ్వతంగా కలకాలం ఉంటారు. అల్లాహ్‌ వారిపట్ల ప్రసన్ను డవుతాడు మరియు వారు ఆయనతో ప్రసన్ను లవుతారు. ఇదే గొప్ప విజయం (సాఫల్యం)!”

5:120 – لِلَّـهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا فِيهِنَّ ۚ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١٢٠

ఆకాశాలపైననూ, భూమిపైననూ మరియు వాటిలో నున్న సమస్తం పైననూ, సామ్రాజ్యాధి పత్యం అల్లాహ్‌దే! మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్థుడు (అన్నింటిపై అధికారం గలవాడు).

సూరహ్‌ అల్‌-అన్‌’ఆమ్‌ – ఈ సూరహ్‌ చివరి మక్కహ్ కాలంలో అవతరింపజేయబడింది. అన్‌’ఆమున్‌: పశువులు. 162- 163వ ఆయతులలో ఉన్న ప్రార్థన ఎంతో మహత్త్వమైనది. 50వ ఆయత్‌ ఎంతో ముఖ్య మైనది: ”(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: ‘నా వద్ద అల్లాహ్‌ కోశాగారాలున్నాయని గానీ, లేదా నాకు అగోచర జ్ఞానమున్నదని గానీ , నేను మీతో అనడంలేదు. లేదా నేను దేవదూతనని కూడా అనడంలేదు. కాని నేను కేవలం నాపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానాన్ని (వహీని) మాత్రమే అనుసరిస్తున్నాను.’ ” 165 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 136వ ఆయత్‌ లో ఉంది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 6:1 – الْحَمْدُ لِلَّـهِ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَجَعَلَ الظُّلُمَاتِ وَالنُّورَ ۖ ثُمَّ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ يَعْدِلُونَ ١

ఆకాశాలను మరియు భూమిని సృష్టించి; చీకట్లను మరియు వెలుగును నెలకొలిపిన అల్లాహ్‌ మాత్రమే సర్వ స్తోత్రాలకు అర్హుడు. అయినా సత్య-తిరస్కారులు (ఇతరులను) తమ ప్రభువుకు సమానులుగా పరిగణిస్తున్నారు.

6:2 – هُوَ الَّذِي خَلَقَكُم مِّن طِينٍ ثُمَّ قَضَىٰ أَجَلًا ۖ وَأَجَلٌ مُّسَمًّى عِندَهُ ۖ ثُمَّ أَنتُمْ تَمْتَرُونَ ٢

ఆయనే మిమ్మల్ని మట్టితో సృష్టించి, ఆ తరువాత మీకు ఒక గడువు నియమించాడు. 1 ఆయన దగ్గర మరొక నిర్ణీతగడువు కూడా ఉంది. 2

6:3 – وَهُوَ اللَّـهُ فِي السَّمَاوَاتِ وَفِي الْأَرْضِ ۖ يَعْلَمُ سِرَّكُمْ وَجَهْرَكُمْ وَيَعْلَمُ مَا تَكْسِبُونَ ٣

మరియు ఆయన! అల్లాహ్‌యే, ఆకాశాల లోనూ మరియు భూమిలోనూ (ఆరాధ్యుడు). మీరు దాచేది మరియు వెలిబుచ్చేది, అంతా ఆయనకు తెలుసు మరియు మీరు అర్జించేది (మంచి-చెడు) అంతా ఆయనకు బాగా తెలుసు. 3

6:4 – وَمَا تَأْتِيهِم مِّنْ آيَةٍ مِّنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ ٤

అయినా వారి ప్రభువు సూచనల నుండి వారి వద్దకు ఏ సూచన వచ్చినా దానికి వారు విముఖతే చూపేవారు!

6:5 – فَقَدْ كَذَّبُوا بِالْحَقِّ لَمَّا جَاءَهُمْ ۖ فَسَوْفَ يَأْتِيهِمْ أَنبَاءُ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ٥

వాస్తవానికి, ఇప్పుడు వారు తమ వద్దకు వచ్చిన సత్యాన్ని (ఈ దివ్యగ్రంథాన్ని) కూడా అసత్యమని తిరస్కరించారు. 4 కాబట్టి వారు పరిహసించేదాని (ప్రతిఫలాన్ని) గురించిన వార్త వారికి త్వరలోనే రానున్నది.

6:6 – أَلَمْ يَرَوْا كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّن قَرْنٍ مَّكَّنَّاهُمْ فِي الْأَرْضِ مَا لَمْ نُمَكِّن لَّكُمْ وَأَرْسَلْنَا السَّمَاءَ عَلَيْهِم مِّدْرَارًا وَجَعَلْنَا الْأَنْهَارَ تَجْرِي مِن تَحْتِهِمْ فَأَهْلَكْنَاهُم بِذُنُوبِهِمْ وَأَنشَأْنَا مِن بَعْدِهِمْ قَرْنًا آخَرِينَ ٦

ఏమీ? వారు చూడలేదా (వారికి తెలి యదా)? వారికి పూర్వం ఎన్నోతరాలను మేము నాశనం చేశాము. మేము మీకు ఇవ్వని ఎన్నో బల సంపదల నిచ్చి వారిని భువిలో స్థిరపరిచాము; మరియు వారిపై మేము ఆకాశం నుండి ధారా పాతంగా వర్షాలు కురిపించాము; మరియు క్రింద నదులను ప్రవహింపజేశాము; చివరకు వారు చేసిన పాపాలకుఫలితంగా వారిని నాశనంచేశాము; మరియు వారిస్థానంలో ఇతర తరాలవారిని లేపాము.

6:7 – وَلَوْ نَزَّلْنَا عَلَيْكَ كِتَابًا فِي قِرْطَاسٍ فَلَمَسُوهُ بِأَيْدِيهِمْ لَقَالَ الَّذِينَ كَفَرُوا إِنْ هَـٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ ٧

మరియు (ఓ ప్రవక్తా!) ఒకవేళ మేము చర్మ పత్రంపై 5 వ్రాయబడిన గ్రంథాన్ని నీపై అవత రింపజేసినా, అప్పుడు వారు దానిని తమ చేతులతో తాకి చూసినా! సత్య-తిరస్కారులు: ”ఇది స్పష్టమైన మాయాజాలం మాత్రమే!” అని అనే వారు. 6

6:8 – وَقَالُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ مَلَكٌ ۖ وَلَوْ أَنزَلْنَا مَلَكًا لَّقُضِيَ الْأَمْرُ ثُمَّ لَا يُنظَرُونَ ٨

మరియు వారు: ”ఇతనివద్దకు (ప్రవక్త వద్దకు) ఒక దైవదూత ఎందుకు దింపబడలేదు?” అని అడుగుతారు. మరియు ఒకవేళ మేము దైవదూతనే పంపిఉంటే! వారి తీర్పు వెంటనే జరిగి ఉండేది. ఆ తరువాత వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడి ఉండేది కాదు. 7

6:9 – وَلَوْ جَعَلْنَاهُ مَلَكًا لَّجَعَلْنَاهُ رَجُلًا وَلَلَبَسْنَا عَلَيْهِم مَّا يَلْبِسُونَ ٩

మరియు ఒకవేళ మేము దైవదూతను అవతరింపజేసినా, అతనిని మేము మానవ రూపం లోనే అవతరింప జేసి ఉండేవారం. మరియు వారు ఇపుడు ఏ సంశయంలో పడి ఉన్నారో! వారిని ఆసంశయానికే గురిచేసి ఉండేవారం.

6:10 – وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّن قَبْلِكَ فَحَاقَ بِالَّذِينَ سَخِرُوا مِنْهُم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ١٠

మరియు వాస్తవానికి నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలను ఎగతాళి చేయటం జరిగింది, కావున పరిహసించేవారు దేనిని గురించి ఎగతాళి చేసేవారో అదే వారిని చుట్టుకున్నది.

6:11 – قُلْ سِيرُوا فِي الْأَرْضِ ثُمَّ انظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ ١١

ఇలా అను: ”మీరు భూమిలో సంచారంచేసి, సత్య-తిరస్కారుల ముగింపు ఎలా జరిగిందో చూడండి!”

6:12 – قُل لِّمَن مَّا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ قُل لِّلَّـهِ ۚ كَتَبَ عَلَىٰ نَفْسِهِ الرَّحْمَةَ ۚ لَيَجْمَعَنَّكُمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ ۚ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُونَ ١٢

వారిని అడుగు: ”ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఎవరికి చెందినది?” అని. (నీవే) జవాబివ్వు: ”(అంతా) అల్లాహ్ దే!” ఆయన కరుణించటాన్ని, తనపై తాను (కర్తవ్యంగా) విధించుకున్నాడు. 8 నిశ్చయంగా, ఆయన పునరుత్థాన దినమున మీ అందరినీ సమావేశపరుస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరైతే తమను తాము నష్టానికి గురిచేసు కున్నారో, అలాంటి వారే విశ్వసించరు! (3/8)

6:13 – وَلَهُ مَا سَكَنَ فِي اللَّيْلِ وَالنَّهَارِ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ ١٣

మరియు రేయింబవళ్ళలో ఉన్నదంతా ఆయనకు చెందినదే. మరియు ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

6:14 – قُلْ أَغَيْرَ اللَّـهِ أَتَّخِذُ وَلِيًّا فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَهُوَ يُطْعِمُ وَلَا يُطْعَمُ ۗ قُلْ إِنِّي أُمِرْتُ أَنْ أَكُونَ أَوَّلَ مَنْ أَسْلَمَ ۖ وَلَا تَكُونَنَّ مِنَ الْمُشْرِكِينَ ١٤

ఓ ము’హమ్మద్‌!) ఇలా అను: ”ఏమీ? ఆకాశాల మరియు భూమి సృష్టికి మూలా ధారుడు 9 అయిన అల్లాహ్‌ను కాదని నేను మరెవరినైనా ఆరాధ్యునిగా 10 చేసుకోవాలా? మరియు ఆయనే అందరికి ఆహారమిస్తున్నాడు మరియు ఆయన కెవ్వడూ ఆహారమివ్వడు.” (ఇంకా) ఇలా అను: ”నిశ్చయంగా, అందరి కంటే ముందు నేను ఆయనకు (అల్లాహ్‌కు) విధేయు డను (ముస్లింను) కావాలని మరియు ఆయనకు (అల్లాహ్‌కు) సాటి కల్పించే వారిలో చేరకూడదనీ ఆదేశించబడ్డాను!”

6:15 – قُلْ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ ١٥

(ఇంకా) ఇలా అను: ”నిశ్చయంగా, నేను నా ప్రభువుకు అవిధేయుడనైతే నిశ్చయంగా, రాబోయే ఆ గొప్పదినపు శిక్ష నుండి భయపడు తున్నాను!”

6:16 – مَّن يُصْرَفْ عَنْهُ يَوْمَئِذٍ فَقَدْ رَحِمَهُ ۚ وَذَٰلِكَ الْفَوْزُ الْمُبِينُ ١٦

ఆ రోజు దాని (ఆ శిక్ష నుండి) తప్పించు కున్న వాడిని, వాస్తవంగా! ఆయన (అల్లాహ్‌) కరుణించినట్లే. మరియు అదే స్పష్టమైన విజయం (సాఫల్యం). 11

6:17 – وَإِن يَمْسَسْكَ اللَّـهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يَمْسَسْكَ بِخَيْرٍ فَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١٧

మరియు అల్లాహ్‌ నీకు ఏదైనా హాని కలిగిస్తే! ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలుచేస్తే! ఆయనే ప్రతిదీ చేయగల సమర్థుడు.

6:18 – وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهِ ۚ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ ١٨

మరియు ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) 12 గలవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసిన వాడు. 13

6:19 – قُلْ أَيُّ شَيْءٍ أَكْبَرُ شَهَادَةً ۖ قُلِ اللَّـهُ ۖ شَهِيدٌ بَيْنِي وَبَيْنَكُمْ ۚ وَأُوحِيَ إِلَيَّ هَـٰذَا الْقُرْآنُ لِأُنذِرَكُم بِهِ وَمَن بَلَغَ ۚ أَئِنَّكُمْ لَتَشْهَدُونَ أَنَّ مَعَ اللَّـهِ آلِهَةً أُخْرَىٰ ۚ قُل لَّا أَشْهَدُ ۚ قُلْ إِنَّمَا هُوَ إِلَـٰهٌ وَاحِدٌ وَإِنَّنِي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ ١٩

(ఓ ము’హమ్మద్‌! వారిని) అడుగు: ”అన్నిటి కంటే గొప్పసాక్ష్యం ఏది?” ఇలా అను: ”నాకూ మరియు మీకూ మధ్య అల్లాహ్‌ సాక్షిగా ఉన్నాడు. మరియు మిమ్మల్ని మరియు ఇది (ఈ సందేశం) అందిన వారిని అందరినీ హెచ్చరించటానికి, ఈ ఖుర్‌ఆన్‌ నాపై అవతరింప జేయబడింది.” ఏమీ? వాస్తవానికి అల్లాహ్‌తో పాటు ఇంకా ఇతర ఆరాధ్య దైవాలు ఉన్నారని మీరు నిశ్చయంగా సాక్ష్యమివ్వగలరా? ఇలా అను: ”నేనైతే అలాంటి సాక్ష్యమివ్వను!” ఇంకా ఇలా అను: ”నిశ్చయంగా, ఆయన (అల్లాహ్‌) ఒక్కడే ఆరాధ్య దేవుడు. మరియు నిశ్చయంగా, మీరు ఆయనకు సాటికల్పిస్తున్న దాని నుండి నాకు ఎలాంటి సంబంధం లేదు!”

6:20 – الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْرِفُونَهُ كَمَا يَعْرِفُونَ أَبْنَاءَهُمُ ۘ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُونَ ٢٠

ఎవరికైతే మేము గ్రంథాన్ని ప్రసాదించామో! వారు తమ పుత్రులను గుర్తించినట్లు, ఇతనిని (ము’హమ్మదును) కూడా గుర్తిస్తారు. ఎవరైతే, తమను తాము నష్టానికి గురిచేసుకుంటారో అలాంటి వారే విశ్వసించరు.

6:21 – وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّـهِ كَذِبًا أَوْ كَذَّبَ بِآيَاتِهِ ۗ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ ٢١

మరియు అల్లాహ్‌పై అసత్యం కల్పించే వాని కంటే! లేదా, అల్లాహ్‌ సూచనలను తిరస్కరించే వానికంటే, ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? నిశ్చ యంగా దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందరు.

6:22 – وَيَوْمَ نَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ نَقُولُ لِلَّذِينَ أَشْرَكُوا أَيْنَ شُرَكَاؤُكُمُ الَّذِينَ كُنتُمْ تَزْعُمُونَ ٢٢

మరియు ఆ రోజు మేము వారందరినీ సమావేశపరుస్తాము. ఆ తరువాత (అల్లాహ్‌కు) సాటికల్పించే (షిర్కుచేసే) వారితో: ”మీరు (దైవాలుగా) భావించిన (అల్లాహ్‌కు సాటి కల్పించిన) ఆ భాగస్వాములు ఇప్పుడు ఎక్క డున్నారు?” అని అడుగుతాము.

6:23 – ثُمَّ لَمْ تَكُن فِتْنَتُهُمْ إِلَّا أَن قَالُوا وَاللَّـهِ رَبِّنَا مَا كُنَّا مُشْرِكِينَ ٢٣

అప్పుడు వారికి: ”మా ప్రభువైన అల్లాహ్‌ సాక్షిగా! మేము ఆయనకు (అల్లాహ్‌కు) సాటి కల్పించేవారము (ముష్రికీన్‌) కాదు!” అని చెప్పడం తప్ప మరొక సాకు దొరకదు.

6:24 – انظُرْ كَيْفَ كَذَبُوا عَلَىٰ أَنفُسِهِمْ ۚ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ ٢٤

చూడండి! వారు తమను గురించి తామే ఏవిధంగా అబద్ధాలు కల్పించుకున్నారో! మరియు ఏ విధంగా వారు కల్పించుకున్నవి (బూటక దైవాలు) మాయమై పోయాయో!

6:25 – وَمِنْهُم مَّن يَسْتَمِعُ إِلَيْكَ ۖ وَجَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا ۚ وَإِن يَرَوْا كُلَّ آيَةٍ لَّا يُؤْمِنُوا بِهَا ۚ حَتَّىٰ إِذَا جَاءُوكَ يُجَادِلُونَكَ يَقُولُ الَّذِينَ كَفَرُوا إِنْ هَـٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ ٢٥

మరియు (ఓ ప్రవక్తా!) వారిలో కొందరు నీ (మాటలు) వింటున్నట్లు (నటించే) వారున్నారు. మరియు వారు దానిని అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసివున్నాము మరియు వారి చెవులకు చెవుడు పట్టించి వున్నాము. 14 మరియు వారు ఏ అద్భుత సంకేతాన్ని చూసినా దానిని విశ్వసించరు. చివరకు వారు నీ వద్దకు వచ్చి, నీతో వాదులాడే టప్పుడు, వారిలో సత్యాన్ని తిరస్కరించేవారు: ”ఇవి కేవలం పూర్వీకుల కట్టుకథలు మాత్రమే!” అని అంటారు.

6:26 – وَهُمْ يَنْهَوْنَ عَنْهُ وَيَنْأَوْنَ عَنْهُ ۖ وَإِن يُهْلِكُونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ ٢٦

మరియు వారు ఇతరులను అతని (ప్రవక్త) నుండి ఆపుతారు. మరియు స్వయంగా తాము కూడా అతనికి దూరంగా ఉంటారు. మరియు ఈ విధంగా వారు తమకు తామే నాశనం చేసు కుంటున్నారు. కాని వారది గ్రహించటం లేదు!

6:27 – وَلَوْ تَرَىٰ إِذْ وُقِفُوا عَلَى النَّارِ فَقَالُوا يَا لَيْتَنَا نُرَدُّ وَلَا نُكَذِّبَ بِآيَاتِ رَبِّنَا وَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ ٢٧

మరియు వారిని నరకం ముందు నిలబెట్టబడినపుడు, నీవు చూడగలిగితే (ఎంత బాగుండేది)! వారు ఇలా అంటారు: ”అయ్యో మా పాడుగాను! మేము తిరిగి (పూర్వ జీవితంలోకి) పంపబడితే, మా ప్రభువు సూచనలను, అసత్యాలని తిరస్కరించకుండా విశ్వాసులలో చేరిపోయేవారం కదా!” 15

6:28 – بَلْ بَدَا لَهُم مَّا كَانُوا يُخْفُونَ مِن قَبْلُ ۖ وَلَوْ رُدُّوا لَعَادُوا لِمَا نُهُوا عَنْهُ وَإِنَّهُمْ لَكَاذِبُونَ ٢٨

  1. (వారు ఇలా అనటానికి కారణం), వాస్తవానికి వారు ఇంతవరకు దాచినదంతా వారికి బహిర్గతం కావటమే! మరియు ఒకవేళ వారిని (గత జీవితంలోకి) తిరిగి పంపినా, వారికి నిషేధించ బడినవాటినే వారు తిరిగిచేస్తారు. నిశ్చయంగా, వారు అసత్యవాదులు!

6:29 – وَقَالُوا إِنْ هِيَ إِلَّا حَيَاتُنَا الدُّنْيَا وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ ٢٩

మరియు వారు: ”మాకు ఇహలోక జీవితం తప్ప మరొక (జీవితం) లేదు మరియు మేము తిరిగి లేపబడము (మాకు పునరుత్థానం లేదు)!” అని అంటారు.

6:30 – وَلَوْ تَرَىٰ إِذْ وُقِفُوا عَلَىٰ رَبِّهِمْ ۚ قَالَ أَلَيْسَ هَـٰذَا بِالْحَقِّ ۚ قَالُوا بَلَىٰ وَرَبِّنَا ۚ قَالَ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ ٣٠

మరియు ఒకవేళ వారిని, తమ ప్రభువు ముందు నిలబెట్టబడినప్పుడు, నీవు చూడగలిగితే (ఎంత బాగుండేది)! ఆయన (అల్లాహ్) అంటాడు: ”ఏమీ? ఇది (పునరుత్థానం) నిజం కాదా?” వారు జవాబిస్తారు: ”అవును (నిజమే) మా ప్రభువు సాక్షిగా!” అప్పుడు ఆయన: ”అయితే మీరు మీ సత్య-తిరస్కారానికి ఫలితంగా శిక్షను అనుభవించండి!” అని అంటాడు.

6:31 – قَدْ خَسِرَ الَّذِينَ كَذَّبُوا بِلِقَاءِ اللَّـهِ ۖ حَتَّىٰ إِذَا جَاءَتْهُمُ السَّاعَةُ بَغْتَةً قَالُوا يَا حَسْرَتَنَا عَلَىٰ مَا فَرَّطْنَا فِيهَا وَهُمْ يَحْمِلُونَ أَوْزَارَهُمْ عَلَىٰ ظُهُورِهِمْ ۚ أَلَا سَاءَ مَا يَزِرُونَ ٣١

వాస్తవంగా, అల్లాహ్‌ను కలుసుకోవటాన్ని అబద్ధంగా పరిగణించేవారే నష్టానికి గురిఅయిన వారు! 16 చివరకు అకస్మాత్తుగా అంతిమ ఘడియ వారిపైకి వచ్చినపుడు వారు: ”అయ్యో మా దౌర్భాగ్యం! దీని విషయంలో మేమెంత అశ్రధ్ధ వహించాము కదా! అని వాపోతారు. (ఎందుకంటే) వారు తమ (పాపాల) బరువును తమ వీపులపై మోసుకొని ఉంటారు. అయ్యో! వారు మోసే భారం ఎంత దుర్భరమైనది కదా!

6:32 – وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا لَعِبٌ وَلَهْوٌ ۖ وَلَلدَّارُ الْآخِرَةُ خَيْرٌ لِّلَّذِينَ يَتَّقُونَ ۗ أَفَلَا تَعْقِلُونَ ٣٢

మరియు ఇహలోక జీవితం ఒక ఆట మరియు ఒక కాలక్షేపము మాత్రమే! మరియు దైవభీతి గలవారికి పరలోకవాసమే అత్యంత శ్రేష్ఠమైనది. ఏమీ? మీరు అర్థం చేసుకోలేరా?

6:33 – قَدْ نَعْلَمُ إِنَّهُ لَيَحْزُنُكَ الَّذِي يَقُولُونَ ۖ فَإِنَّهُمْ لَا يُكَذِّبُونَكَ وَلَـٰكِنَّ الظَّالِمِينَ بِآيَاتِ اللَّـهِ يَجْحَدُونَ ٣٣

(ఓ ప్రవక్తా!) వాస్తవానికి వారుపలుకుతున్న మాటల వలన నీకు దుఃఖము కలుగుతున్నదని మాకు బాగా తెలుసు. కానీ నిశ్చయంగా వారు అసత్యుడవని తిరస్కరించేది నిన్ను కాదు! వాస్తవానికి ఆ దుర్మార్గులు అల్లాహ్‌ సూచన (ఆయాత్‌) లను తిరస్కరిస్తున్నారు 17

6:34 – وَلَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّن قَبْلِكَ فَصَبَرُوا عَلَىٰ مَا كُذِّبُوا وَأُوذُوا حَتَّىٰ أَتَاهُمْ نَصْرُنَا ۚ وَلَا مُبَدِّلَ لِكَلِمَاتِ اللَّـهِ ۚ وَلَقَدْ جَاءَكَ مِن نَّبَإِ الْمُرْسَلِينَ ٣٤

మరియు వాస్తవంగా, నీకు పూర్వం చాలా మంది ప్రవక్తలు, అసత్యవాదులని తిరస్కరించ బడ్డారు. కాని వారు, ఆ తిరస్కారానికి మరియు తమకు కలిగిన హింసలకు – వారికి మా సహాయం అందేవరకు – సహనం వహించారు. 18 మరియు అల్లాహ్‌ మాటలను ఎవ్వరూ మార్చలేరు. మరియు వాస్తవానికి, పూర్వపు ప్రవక్తల కొన్ని సమాచారాలు ఇదివరకే నీకు అందాయి.

6:35 – وَإِن كَانَ كَبُرَ عَلَيْكَ إِعْرَاضُهُمْ فَإِنِ اسْتَطَعْتَ أَن تَبْتَغِيَ نَفَقًا فِي الْأَرْضِ أَوْ سُلَّمًا فِي السَّمَاءِ فَتَأْتِيَهُم بِآيَةٍ ۚ وَلَوْ شَاءَ اللَّـهُ لَجَمَعَهُمْ عَلَى الْهُدَىٰ ۚ فَلَا تَكُونَنَّ مِنَ الْجَاهِلِينَ ٣٥

మరియు (ఓ ము’హమ్మద్‌!) వారి విముఖత నీకు భరించనిదైతే నీలో శక్తి ఉంటే, భూమిలో ఒక సొరంగం వెదకి, లేదా ఆకాశంలో ఒక నిచ్చెనవేసి, వారి కొరకు ఏదైనా అద్భుత సూచన తీసుకురా! మరియు అల్లాహ్‌ కోరితే వారందరినీ సన్మార్గం వైపునకు తెచ్చి ఉండేవాడు! కావున నీవు అజ్ఞానులలో చేరకు. (1/2)

6:36 – إِنَّمَا يَسْتَجِيبُ الَّذِينَ يَسْمَعُونَ ۘ وَالْمَوْتَىٰ يَبْعَثُهُمُ اللَّـهُ ثُمَّ إِلَيْهِ يُرْجَعُونَ ٣٦

<నిశ్చయంగా, ఎవరైతే (శ్రద్ధతో) వింటారో, వారే (సత్య సందేశాన్ని) స్వీకరిస్తారు. ఇక మృతులు (సత్య-తిరస్కారులు) – అల్లాహ్‌ వారిని పునరుత్థరింపజేసినప్పుడు – (ప్రతిఫలం కొరకు) ఆయన వద్దకే రప్పింపబడతారు.

6:37 – وَقَالُوا لَوْلَا نُزِّلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ ۚ قُلْ إِنَّ اللَّـهَ قَادِرٌ عَلَىٰ أَن يُنَزِّلَ آيَةً وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ ٣٧

మరియు వారు: ”ఇతనిపై (ప్రవక్తపై) ఇతని ప్రభువు తరఫు నుండి ఏదైనా అద్భుత సూచన ఎందుకు అవతరింపజేయబడలేదు?” అని అంటారు. ఇలా అను: ”నిశ్చయంగా, అల్లాహ్‌! ఎలాంటి అద్భుత సూచననైనా అవతరింపజేయ గల శక్తి కలిగి ఉన్నాడు, కాని వారిలో అనేకులకు ఇది తెలియదు.”

6:38 – وَمَا مِن دَابَّةٍ فِي الْأَرْضِ وَلَا طَائِرٍ يَطِيرُ بِجَنَاحَيْهِ إِلَّا أُمَمٌ أَمْثَالُكُم ۚ مَّا فَرَّطْنَا فِي الْكِتَابِ مِن شَيْءٍ ۚ ثُمَّ إِلَىٰ رَبِّهِمْ يُحْشَرُونَ ٣٨

మరియు భూమిపై సంచరించే ఏ జంతువు గానీ, లేక తన రెండు రెక్కలతో ఎగిరే ఏ పక్షి గానీ, మీలాంటి సంఘజీవులుగా లేకుండా లేవు! మేము గ్రంథంలో ఏ కొరతా చేయలేదు. 19 తరువాత వారందరూ తమ ప్రభువు వద్దకు మరలింప బడతారు.

6:39 – وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا صُمٌّ وَبُكْمٌ فِي الظُّلُمَاتِ ۗ مَن يَشَإِ اللَّـهُ يُضْلِلْـهُ وَمَن يَشَأْ يَجْعَلْهُ عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ٣٩

మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారు, చెవిటివారు మరియు మూగవారు, అంధకారంలో పడిపోయినవారు! అల్లాహ్‌ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు మరియు తాను కోరిన వారిని ఋజుమార్గంలో ఉంచుతాడు. 20

6:40 – قُلْ أَرَأَيْتَكُمْ إِنْ أَتَاكُمْ عَذَابُ اللَّـهِ أَوْ أَتَتْكُمُ السَّاعَةُ أَغَيْرَ اللَّـهِ تَدْعُونَ إِن كُنتُمْ صَادِقِينَ ٤٠

వారితో అను: ”ఏమీ? మీరు సత్యవంతులే అయితే ఆలోచించి (చెప్పండి!) ఒకవేళ మీపై అల్లాహ్‌ శిక్ష వచ్చి పడినా, లేదా అంతిమ ఘడియ వచ్చినా! మీరు అల్లాహ్‌ను తప్ప ఇతరులను ఎవరినైనా పిలుస్తారా?

6:41 – بَلْ إِيَّاهُ تَدْعُونَ فَيَكْشِفُ مَا تَدْعُونَ إِلَيْهِ إِن شَاءَ وَتَنسَوْنَ مَا تُشْرِكُونَ ٤١

”అలా కానేరదు! మీరు ఆయననే (అల్లాహ్‌ నే) పిలుస్తారు. ఆయన కోరితే ఆ ఆపదను మీపై నుండి తొలగిస్తాడు. అప్పుడు మీరు ఆయనకు సాటికల్పించే వారిని మరచిపోతారు!”

6:42 – وَلَقَدْ أَرْسَلْنَا إِلَىٰ أُمَمٍ مِّن قَبْلِكَ فَأَخَذْنَاهُم بِالْبَأْسَاءِ وَالضَّرَّاءِ لَعَلَّهُمْ يَتَضَرَّعُونَ ٤٢

మరియు వాస్తవానికి మేము, నీకు పూర్వం (ఓ ము’హమ్మద్‌!) అనేక జాతులవారి వద్దకు ప్రవక్తలను పంపాము. ఆ పిదప వారు వినమ్రు లవటానికి, మేము వారిపై ఇబ్బందులను మరియు కష్టాలను కలుగజేశాము.

6:43 – فَلَوْلَا إِذْ جَاءَهُم بَأْسُنَا تَضَرَّعُوا وَلَـٰكِن قَسَتْ قُلُوبُهُمْ وَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ مَا كَانُوا يَعْمَلُونَ ٤٣

పిదప మా తరఫునుండి వారిపైఆపద వచ్చి నపుడు కూడా వారెందుకు వినమ్రులు కాలేదు? కాని వారిహృదయాలు మరింత కఠినమయ్యాయి మరియు షై’తాన్‌ వారు చేసే కర్మలన్నింటినీ వారికి మంచివిగా కనబడేటట్లు చేశాడు.

6:44 – فَلَمَّا نَسُوا مَا ذُكِّرُوا بِهِ فَتَحْنَا عَلَيْهِمْ أَبْوَابَ كُلِّ شَيْءٍ حَتَّىٰ إِذَا فَرِحُوا بِمَا أُوتُوا أَخَذْنَاهُم بَغْتَةً فَإِذَا هُم مُّبْلِسُونَ ٤٤

ఆ పిదప వారికి చేయబడిన బోధనను వారు మరచిపోగా, మేము వారి కొరకు సకల (భోగ-భాగ్యాల) ద్వారాలను తెరిచాము, చివరకు వారు తమకు ప్రసాదించబడిన ఆనందాలలో నిమగ్నులై ఉండగా, మేము వారిని అకస్మాత్తుగా (శిక్షించటానికి) పట్టుకున్నాము, అప్పుడు వారు నిరాశులయ్యారు.

6:45 – فَقُطِعَ دَابِرُ الْقَوْمِ الَّذِينَ ظَلَمُوا ۚ وَالْحَمْدُ لِلَّـهِ رَبِّ الْعَالَمِينَ ٤٥

ఈ విధంగా దుర్మార్గానికి పాల్పడినవారు సమూలంగా నిర్మూలించబడ్డారు. మరియు సర్వ లోకాలకు పోషకుడైన అల్లాహ్‌ మాత్రమే సర్వ స్తోత్రాలకు అర్హుడు.

6:46 – قُلْ أَرَأَيْتُمْ إِنْ أَخَذَ اللَّـهُ سَمْعَكُمْ وَأَبْصَارَكُمْ وَخَتَمَ عَلَىٰ قُلُوبِكُم مَّنْ إِلَـٰهٌ غَيْرُ اللَّـهِ يَأْتِيكُم بِهِ ۗ انظُرْ كَيْفَ نُصَرِّفُ الْآيَاتِ ثُمَّ هُمْ يَصْدِفُونَ ٤٦

ఇలా అను: ”ఏమీ? మీరు ఆలోచించారా (చెప్పండి)? అల్లాహ్‌ మీ వినికిడినీ మరియు మీ చూపునూ పోగొట్టి, మీ హృదయాలపై ముద్రవేస్తే! అల్లాహ్‌ తప్ప ఏ దేవుడైనా వాటిని మీకు తిరిగి ఇవ్వగలడా?” చూడు! మేము ఏ విధంగా మా సూచనలను వారికి తెలుపుతున్నామో! అయినా వారు (వాటి నుండి) తప్పించుకొని పోతున్నారు.

6:47 – قُلْ أَرَأَيْتَكُمْ إِنْ أَتَاكُمْ عَذَابُ اللَّـهِ بَغْتَةً أَوْ جَهْرَةً هَلْ يُهْلَكُ إِلَّا الْقَوْمُ الظَّالِمُونَ ٤٧

ఇలా అను: ”ఏమీ? మీరు ఆలోచించారా (చెప్పండి)? అల్లాహ్‌ శిక్ష మీపై (రాత్రివేళ) అకస్మాత్తుగా గానీ, లేక (పగటి వేళ) బహిరంగంగా గానీ వచ్చిపడితే, దుర్మార్గులు తప్ప ఇతరులు నాశనం చేయబడతారా?” 21

6:48 – وَمَا نُرْسِلُ الْمُرْسَلِينَ إِلَّا مُبَشِّرِينَ وَمُنذِرِينَ ۖ فَمَنْ آمَنَ وَأَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ٤٨

మరియు మేము ప్రవక్తలను కేవలం శుభవార్తలు ఇచ్చేవారుగా మరియు హెచ్చరికలు చేసేవారుగా మాత్రమే పంపుతాము. కావున ఎవరైతే విశ్వసించి (తమ నడవడికను) సరిదిద్దు కుంటారో, అలాంటి వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!

6:49 – وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا يَمَسُّهُمُ الْعَذَابُ بِمَا كَانُوا يَفْسُقُونَ ٤٩

కాని మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారికి, తమ అవిధేయతకు ఫలితంగా తప్పకుండా శిక్ష పడుతుంది. 22

6:50 – قُل لَّا أَقُولُ لَكُمْ عِندِي خَزَائِنُ اللَّـهِ وَلَا أَعْلَمُ الْغَيْبَ وَلَا أَقُولُ لَكُمْ إِنِّي مَلَكٌ ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰ إِلَيَّ ۚ قُلْ هَلْ يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ ۚ أَفَلَا تَتَفَكَّرُونَ ٥٠

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: ”నా వద్ద అల్లాహ్‌ కోశాగారాలు ఉన్నాయనిగానీ లేదానాకు అగోచర జ్ఞానమున్నదనిగానీ, నేను మీతో అన డంలేదు. లేదా నేను దేవదూతనని కూడా అనడం లేదు. కాని నేను కేవలం నాపై అవతరింపజేయ బడిన దివ్యజ్ఞానాన్ని (వ’హీని) మాత్రమే అనుస రిస్తున్నాను.” 23 వారిని ఇలా అడుగు: ”ఏమీ? అంధుడూ మరియు దృష్టిగలవాడు సమానులా? అయితే మీరెందుకు ఆలోచించరు?”

6:51 – وَأَنذِرْ بِهِ الَّذِينَ يَخَافُونَ أَن يُحْشَرُوا إِلَىٰ رَبِّهِمْ ۙ لَيْسَ لَهُم مِّن دُونِهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ لَّعَلَّهُمْ يَتَّقُونَ ٥١

మరియు తమ ప్రభువు సన్నిధిలో సమా వేశపరచబడతారని భయపడే వారికి ఆయన తప్ప వేరే రక్షించేవాడు గానీ, సిఫారసు చేసేవాడు గానీ ఉండడని, దీని (ఈ ఖుర్‌ఆన్‌) ద్వారా హెచ్చరించు, బహుశా వారు దైవభీతి గలవారు అవుతారేమో!

6:52 – وَلَا تَطْرُدِ الَّذِينَ يَدْعُونَ رَبَّهُم بِالْغَدَاةِ وَالْعَشِيِّ يُرِيدُونَ وَجْهَهُ ۖ مَا عَلَيْكَ مِنْ حِسَابِهِم مِّن شَيْءٍ وَمَا مِنْ حِسَابِكَ عَلَيْهِم مِّن شَيْءٍ فَتَطْرُدَهُمْ فَتَكُونَ مِنَ الظَّالِمِينَ ٥٢

మరియు ఎవరైతే తమ ప్రభువును ఉదయం మరియు సాయంత్రం ప్రార్థిస్తూ, ఆయన ముఖాన్ని 24 (చూడ) గోరుతున్నారో, వారిని నీవు దూరంచేయకు. వారి లెక్క కొరకు నీవు ఎంత మాత్రమూ జవాబుదారుడవు కావు. మరియు నీ లెక్క కొరకు వారూ జవాబుదారులు కారు. కావున నీవు వారిని దూరంచేస్తే నీవు దుర్మార్గులలో చేరిన వాడవవుతావు.

6:53 – وَكَذَٰلِكَ فَتَنَّا بَعْضَهُم بِبَعْضٍ لِّيَقُولُوا أَهَـٰؤُلَاءِ مَنَّ اللَّـهُ عَلَيْهِم مِّن بَيْنِنَا ۗ أَلَيْسَ اللَّـهُ بِأَعْلَمَ بِالشَّاكِرِينَ ٥٣

మరియు ఈ విధంగా, మేము వారిలోని కొందరిని మరికొందరి ద్వారా పరీక్షకు గురి చేశాము. వారు (విశ్వాసులను చూసి): ”ఏమీ? మా అందరిలో, వీరినేనా అల్లాహ్‌ అనుగ్ర హించింది?” 25 అని అంటారు. ఏమీ? ఎవరు కృతజ్ఞులో అల్లాహ్‌కు తెలియదా? 26

6:54 – وَإِذَا جَاءَكَ الَّذِينَ يُؤْمِنُونَ بِآيَاتِنَا فَقُلْ سَلَامٌ عَلَيْكُمْ ۖ كَتَبَ رَبُّكُمْ عَلَىٰ نَفْسِهِ الرَّحْمَةَ ۖ أَنَّهُ مَنْ عَمِلَ مِنكُمْ سُوءًا بِجَهَالَةٍ ثُمَّ تَابَ مِن بَعْدِهِ وَأَصْلَحَ فَأَنَّهُ غَفُورٌ رَّحِيمٌ ٥٤

మరియు మా సూచనలను విశ్వసించిన వారు నీవద్దకు వచ్చినపుడు నీవు వారితో ఇలా అను: ”మీకు శాంతి కలుగు గాక (సలాం)! మీ ప్రభువు కరుణించటమే తనపై విధిగా నిర్ణయించు కున్నాడు. నిశ్చయంగా, మీలో ఎవరైనా అజ్ఞానం వల్ల తప్పుచేసి, ఆ తరువాత పశ్చాత్తాపపడి సరి దిద్దుకుంటే! నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.”

6:55 – وَكَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ وَلِتَسْتَبِينَ سَبِيلُ الْمُجْرِمِينَ ٥٥

మరియు పాపుల మార్గం స్పష్టపడటానికి మేము ఈ విధంగా మా సూచనలను వివరంగా తెలుపుతున్నాము.

6:56 – قُلْ إِنِّي نُهِيتُ أَنْ أَعْبُدَ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّـهِ ۚ قُل لَّا أَتَّبِعُ أَهْوَاءَكُمْ ۙ قَدْ ضَلَلْتُ إِذًا وَمَا أَنَا مِنَ الْمُهْتَدِينَ ٥٦

ఇలా అను: ”నిశ్చయంగా అల్లాహ్‌ను వదిలి, మీరు ప్రార్థించే ఈ ఇతరులను (కల్పిత దైవాలను) ఆరాధించటం నుండి నేను వారించ బడ్డాను.” మరియు ఇలా అను: ”నేను మీ కోరికలను అనుసరించను. (అలా చేస్తే!) వాస్త వానికి నేనూ మార్గభ్రష్టుడను అవుతాను. మరియు నేను సన్మార్గం చూపబడిన వారిలో ఉండను.”

6:57 – قُلْ إِنِّي عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّي وَكَذَّبْتُم بِهِ ۚ مَا عِندِي مَا تَسْتَعْجِلُونَ بِهِ ۚ إِنِ الْحُكْمُ إِلَّا لِلَّـهِ ۖ يَقُصُّ الْحَقَّ ۖ وَهُوَ خَيْرُ الْفَاصِلِينَ ٥٧

ఇలా అను: ”నిశ్చయంగా నేను నా ప్రభువు తరఫు నుండి లభించిన స్పష్టమైన ప్రమాణంపై ఉన్నాను. మీరు దానిని అబద్ధమని నిరాక రించారు. మీరు తొందరపెట్టే విషయం నాదగ్గర లేదు. నిర్ణయాధికారం కేవలం అల్లాహ్‌కే ఉంది. ఆయన సత్యాన్ని తెలుపుతున్నాడు. మరియు ఆయనే సర్వోత్తమమైన న్యాయాధికారి!” 27

6:58 – قُل لَّوْ أَنَّ عِندِي مَا تَسْتَعْجِلُونَ بِهِ لَقُضِيَ الْأَمْرُ بَيْنِي وَبَيْنَكُمْ ۗ وَاللَّـهُ أَعْلَمُ بِالظَّالِمِينَ ٥٨

ఇలా అను: ”ఒకవేళ వాస్తవానికి మీరు తొందరపెట్టే విషయం (శిక్ష) నా ఆధీనంలో ఉండి నట్లయితే, నాకూ-మీకూ మధ్య తీర్పు ఎప్పుడో జరిగిపోయి ఉండేది. మరియు అల్లాహ్‌కు దుర్మార్గులను గురించి బాగా తెలుసు.” (5/8)

6:59 – وَعِندَهُ مَفَاتِحُ الْغَيْبِ لَا يَعْلَمُهَا إِلَّا هُوَ ۚ وَيَعْلَمُ مَا فِي الْبَرِّ وَالْبَحْرِ ۚ وَمَا تَسْقُطُ مِن وَرَقَةٍ إِلَّا يَعْلَمُهَا وَلَا حَبَّةٍ فِي ظُلُمَاتِ الْأَرْضِ وَلَا رَطْبٍ وَلَا يَابِسٍ إِلَّا فِي كِتَابٍ مُّبِينٍ ٥٩

  • మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్‌) వద్దనే ఉన్నాయి. వాటిని, ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు భూమిలోనూ, సముద్రంలోనూ ఉన్న దంతా ఆయనకు తెలుసు. మరియు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకుకూడా రాలదు. మరియు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజ, అది పచ్చిది కానీ, ఎండినది కానీ, అంతా స్పష్టంగా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది. 28

6:60 – وَهُوَ الَّذِي يَتَوَفَّاكُم بِاللَّيْلِ وَيَعْلَمُ مَا جَرَحْتُم بِالنَّهَارِ ثُمَّ يَبْعَثُكُمْ فِيهِ لِيُقْضَىٰ أَجَلٌ مُّسَمًّى ۖ ثُمَّ إِلَيْهِ مَرْجِعُكُمْ ثُمَّ يُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ٦٠

మరియు ఆయనే రాత్రివేళ (మీరు నిద్ర పోయినపుడు) మీ ఆత్మలను తీసుకుంటాడు (స్వాధీన పరచుకుంటాడు) 29 మరియు పగటి వేళ మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. ఆ పిదప నిర్ణీత గడువు, పూర్తిఅయ్యే వరకు దానిలో (పగటి వేళలో) మిమ్మల్ని తిరిగి లేపుతాడు. ఆ తరువాత ఆయన వైపునకే మీ మరలింపు ఉంది, అప్పుడు (పునరుత్థాన దినమున) ఆయన మీరు చేస్తూ ఉన్న కర్మలన్నీ మీకు తెలుపుతాడు. 30

6:61 – وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهِ ۖ وَيُرْسِلُ عَلَيْكُمْ حَفَظَةً حَتَّىٰ إِذَا جَاءَ أَحَدَكُمُ الْمَوْتُ تَوَفَّتْهُ رُسُلُنَا وَهُمْ لَا يُفَرِّطُونَ ٦١

ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) 31 గలవాడు. మరియు ఆయన మీపై కనిపెట్టుకొని ఉండే వారిని పంపుతాడు. చివరకు మీలో ఒకనికి చావు సమయం వచ్చినపుడు, మేము పంపిన దూతలు అతనిని మరణింపజేస్తారు మరియు వారెప్పుడూ అశ్రధ్ధ చూపరు. 32

6:62 – ثُمَّ رُدُّوا إِلَى اللَّـهِ مَوْلَاهُمُ الْحَقِّ ۚ أَلَا لَهُ الْحُكْمُ وَهُوَ أَسْرَعُ الْحَاسِبِينَ ٦٢

తరువాత వారు, వారి నిజమైన 33 సంరక్ష కుడు అల్లాహ్‌ సన్నిధిలోకి చేర్చబడతారు. తెలు సుకోండి! సర్వన్యాయాధికారం ఆయనదే! మరియు లెక్క తీసుకోవటంలో ఆయన అతి శీఘ్రుడు!

6:63 – قُلْ مَن يُنَجِّيكُم مِّن ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ تَدْعُونَهُ تَضَرُّعًا وَخُفْيَةً لَّئِنْ أَنجَانَا مِنْ هَـٰذِهِ لَنَكُونَنَّ مِنَ الشَّاكِرِينَ ٦٣

” ‘మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడితే మేమెంతో కృతజ్ఞులమవుతాము.’ అని మీరు వినమ్రులై రహస్యంగా వేడుకున్నప్పుడు! భూమి మరియు సముద్రాల చీకట్ల నుండి మిమ్మల్ని కాపాడేది ఎవరు?” అని వారిని అడుగు.

6:64 – قُلِ اللَّـهُ يُنَجِّيكُم مِّنْهَا وَمِن كُلِّ كَرْبٍ ثُمَّ أَنتُمْ تُشْرِكُونَ ٦٤

”అల్లాహ్‌ మాత్రమే మిమ్మల్ని దాని నుండి మరియు ప్రతి విపత్తు నుండి కాపాడుతున్నాడు. అయినా మీరు ఆయనకు సాటి (భాగస్వాములు) కల్పిస్తున్నారు!” అని వారికి చెప్పు.

6:65 – قُلْ هُوَ الْقَادِرُ عَلَىٰ أَن يَبْعَثَ عَلَيْكُمْ عَذَابًا مِّن فَوْقِكُمْ أَوْ مِن تَحْتِ أَرْجُلِكُمْ أَوْ يَلْبِسَكُمْ شِيَعًا وَيُذِيقَ بَعْضَكُم بَأْسَ بَعْضٍ ۗ انظُرْ كَيْفَ نُصَرِّفُ الْآيَاتِ لَعَلَّهُمْ يَفْقَهُونَ ٦٥

ఇలా అను: ”ఆయన మీ పైనుండి గానీ, లేదా మీ పాదాల క్రిందినుండి గానీ, మీపై ఆపద అవతరింపజేయగల సామర్థ్యం కలిగి ఉన్నాడు; మరియు మిమ్మల్ని తెగలు తెగలుగా చేసి, పరస్పర కలహాల రుచి చూపగలిగే (శక్తి కూడా) కలిగి ఉన్నాడు.” 34 చూడు! బహుశా వారు (సత్యాన్ని) గ్రహిస్తారేమోనని, మేము ఏ విధంగా మా సూచనలను వివిధ రూపాలలో వివరిస్తున్నామో!

6:66 – وَكَذَّبَ بِهِ قَوْمُكَ وَهُوَ الْحَقُّ ۚ قُل لَّسْتُ عَلَيْكُم بِوَكِيلٍ ٦٦

మరియు ఇది (ఈ ఖుర్‌ఆన్‌) సత్యమైనది అయినా నీ జాతివారు దీనిని అబధ్ధమని నిరాక రించారు. వారితో ఇలా అను: ”నేను మీ కొరకు బాధ్యుడను (కార్యసాధకుడను) కాను!” 35

6:67 – لِّكُلِّ نَبَإٍ مُّسْتَقَرٌّ ۚ وَسَوْفَ تَعْلَمُونَ ٦٧

ప్రతి వార్తకు (విషయానికి) ఒక గడువు నియమింపబడి ఉంది. మరియు త్వరలోనే మీరిది తెలుసుకోగలరు.

6:68 – وَإِذَا رَأَيْتَ الَّذِينَ يَخُوضُونَ فِي آيَاتِنَا فَأَعْرِضْ عَنْهُمْ حَتَّىٰ يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ ۚ وَإِمَّا يُنسِيَنَّكَ الشَّيْطَانُ فَلَا تَقْعُدْ بَعْدَ الذِّكْرَىٰ مَعَ الْقَوْمِ الظَّالِمِينَ ٦٨

మరియు మా సూచన (ఆయాతు)లను గురించి వారు వృథా మాటలు (దూషణలు) చేస్తూ ఉండటం నీవు చూస్తే, వారు తమ ప్రసంగం మార్చే వరకు నీవు వారినుండి దూరంగానే ఉండు. మరియు ఒకవేళ షై’తాన్‌ నిన్ను మరపింపజేస్తే! జ్ఞప్తికి వచ్చిన తరువాత అలాంటి దుర్మార్గులైన వారితో కలసి కూర్చోకు. 36

6:69 – وَمَا عَلَى الَّذِينَ يَتَّقُونَ مِنْ حِسَابِهِم مِّن شَيْءٍ وَلَـٰكِن ذِكْرَىٰ لَعَلَّهُمْ يَتَّقُونَ ٦٩

మరియు దైవభీతి గలవారు, వారి (అవిశ్వాసుల) లెక్కకు ఏమాత్రం బాధ్యులుకారు. కాని వారికి హితోపదేశం చేయటం, (విశ్వాసుల ధర్మం). బహుశా, వారు కూడా దైవభీతి గలవారు కావచ్చు!

6:70 – وَذَرِ الَّذِينَ اتَّخَذُوا دِينَهُمْ لَعِبًا وَلَهْوًا وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا ۚ وَذَكِّرْ بِهِ أَن تُبْسَلَ نَفْسٌ بِمَا كَسَبَتْ لَيْسَ لَهَا مِن دُونِ اللَّـهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ وَإِن تَعْدِلْ كُلَّ عَدْلٍ لَّا يُؤْخَذْ مِنْهَا ۗ أُولَـٰئِكَ الَّذِينَ أُبْسِلُوا بِمَا كَسَبُوا ۖ لَهُمْ شَرَابٌ مِّنْ حَمِيمٍ وَعَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْفُرُونَ ٧٠

మరియు తమ ధర్మాన్ని ఒక ఆటగా మరియు కాలక్షేపంగా భావించేవారిని నీవు వదలి పెట్టు. మరియు ఇహలోక జీవితం వారిని మోస పుచ్చింది. ఏ వ్యక్తిగానీ తన కర్మల ఫలితంగా నాశనం చేయబడకుండా ఉండటానికి దీని (ఈ ఖుర్‌ఆన్‌) ద్వారా హితోపదేశం చెయ్యి. అల్లాహ్‌ తప్ప, అతనికి రక్షించేవాడు గానీ, సిఫారసు చేసే వాడు గానీ, ఎవ్వడూ ఉండడు. మరియు అతడు ఎలాంటి పరిహారం ఇవ్వదలచుకున్నా అది అంగీకరించబడదు. ఇలాంటివారే తమ కర్మల ఫలితంగా నాశనం చేయబడేవారు. వారికి తమ సత్య-తిరస్కారానికి ఫలితంగా, త్రాగటానికి సల సలకాగే నీరు మరియు బాధాకరమైన శిక్ష గలవు.

6:71 – قُلْ أَنَدْعُو مِن دُونِ اللَّـهِ مَا لَا يَنفَعُنَا وَلَا يَضُرُّنَا وَنُرَدُّ عَلَىٰ أَعْقَابِنَا بَعْدَ إِذْ هَدَانَا اللَّـهُ كَالَّذِي اسْتَهْوَتْهُ الشَّيَاطِينُ فِي الْأَرْضِ حَيْرَانَ لَهُ أَصْحَابٌ يَدْعُونَهُ إِلَى الْهُدَى ائْتِنَا ۗ قُلْ إِنَّ هُدَى اللَّـهِ هُوَ الْهُدَىٰ ۖ وَأُمِرْنَا لِنُسْلِمَ لِرَبِّ الْعَالَمِينَ ٧١

(ఓ ము’హమ్మద్‌!) వారితో అను: ”ఏమీ? అల్లాహ్‌ ను వదలి మాకు లాభంగానీ, నష్టంగానీ కలిగించలేని వారిని మేము ప్రార్థించాలా?మరియు అల్లాహ్‌ మార్గదర్శకత్వం దొరికిన తరువాతకూడా మా మడమలపై వెనుదిరిగి పోవాలా? అతనివలే ఎవడైతే తన సహచరులు సన్మార్గం వైపుకు పిలుస్తూ ‘మా వైపుకు రా!’ అంటున్నా – షై’తాన్‌ మోసపుచ్చటం వలన – భూమిలో ఏమీ తోచకుండా తిరిగుతాడో?” 37 వారితో అను: ”నిశ్చయంగా అల్లాహ్‌ మార్గదర్శకత్వమే నిజమైన మార్గదర్శకత్వము. 38 మరియు మేము సర్వ లోకాల ప్రభువుకు విధేయులముగా (ముస్లిం లముగా) ఉండాలని ఆజ్ఞాపించబడ్డాము;

6:72 – وَأَنْ أَقِيمُوا الصَّلَاةَ وَاتَّقُوهُ ۚ وَهُوَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ ٧٢

”మరియు నమా’జ్‌ను స్థాపించమని మరియు ఆయన యందు భయ-భక్తులు కలిగి ఉండమని కూడా. 39 మరియు మీరంతా ఆయన (అల్లాహ్‌) సమక్షంలో జమచేయబడతారు.”

6:73 – وَهُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۖ وَيَوْمَ يَقُولُ كُن فَيَكُونُ ۚ قَوْلُهُ الْحَقُّ ۚ وَلَهُ الْمُلْكُ يَوْمَ يُنفَخُ فِي الصُّورِ ۚ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ ۚ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ ٧٣

మరియు ఆకాశాలను మరియు భూమిని నిజానికి 40 సృష్టించింది ఆయనే! మరియు ఆ రోజు ఆయన: ”అయిపో!” అని అనగానే, అది అయిపోతుంది. ఆయన మాటే సత్యం! మరియు బాకా (‘సూర్‌) ఊదబడే రోజు, 41 సార్వభౌమాధి కారం ఆయనదే. ఆయనే అగోచర మరియు గోచర విషయాలన్నీ తెలిసినవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు. (3/4)

6:74 – وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ آزَرَ أَتَتَّخِذُ أَصْنَامًا آلِهَةً ۖ إِنِّي أَرَاكَ وَقَوْمَكَ فِي ضَلَالٍ مُّبِينٍ ٧٤

(జ్ఞాపకం చేసుకోండి!) ఇబ్రాహీమ్‌ తన తండ్రి ఆ’జర్‌తో ఇలా అన్న విషయం: ”ఏమీ? నీవు విగ్రహాలను ఆరాధ్యదైవాలుగా చేసు కుంటున్నావా? నిశ్చయంగా నేను, నిన్ను మరియు నీ జాతి వారిని స్పష్టమైన మార్గ భ్రష్టత్వంలో ఉన్నవారిగా చూస్తున్నాను!” 42

6:75 – وَكَذَٰلِكَ نُرِي إِبْرَاهِيمَ مَلَكُوتَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلِيَكُونَ مِنَ الْمُوقِنِينَ ٧٥

మరియు ఈ విధంగా దృఢ నమ్మకం ఉన్న వారిలో చేరాలని, మేము ఇబ్రాహీమ్‌కు భూమ్యా కాశాలపై ఉన్న మా సామ్రాజ్య వ్యవస్థను చూపించాము.

6:76 – فَلَمَّا جَنَّ عَلَيْهِ اللَّيْلُ رَأَىٰ كَوْكَبًا ۖ قَالَ هَـٰذَا رَبِّي ۖ فَلَمَّا أَفَلَ قَالَ لَا أُحِبُّ الْآفِلِينَ ٧٦

ఆ పిదప రాత్రి చీకటి అతనిపై క్రమ్ము కున్నప్పుడు, అతను ఒక నక్షత్రాన్ని చూసి: ”ఇది నా ప్రభువు!” అని అన్నాడు. కాని, అది అస్తమించగానే: ”అస్తమించే వాటిని నేను ప్రేమించను!” అని అన్నాడు.

6:77 – فَلَمَّا رَأَى الْقَمَرَ بَازِغًا قَالَ هَـٰذَا رَبِّي ۖ فَلَمَّا أَفَلَ قَالَ لَئِن لَّمْ يَهْدِنِي رَبِّي لَأَكُونَنَّ مِنَ الْقَوْمِ الضَّالِّينَ ٧٧

ఆ తరువాత ఉదయించే చంద్రుణ్ణి చూసి: ”ఇది నా ప్రభువు!” అని అన్నాడు. కాని అది అస్త మించగానే, ఒక వేళ నా ప్రభువు నాకు సన్మార్గం చూపకపోతే నేను నిశ్చయంగా, మార్గభ్రష్టులైన వారిలో చేరిపోయేవాడను!” అని అన్నాడు.

6:78 – فَلَمَّا رَأَى الشَّمْسَ بَازِغَةً قَالَ هَـٰذَا رَبِّي هَـٰذَا أَكْبَرُ ۖ فَلَمَّا أَفَلَتْ قَالَ يَا قَوْمِ إِنِّي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ ٧٨

ఆ తరువాత ఉదయించే సూర్యుణ్ణి చూసి: ”ఇది నా ప్రభువు, ఇది అన్నిటికంటే పెద్దగా ఉంది!” అని అన్నాడు. కాని అదికూడా అస్తమించ గానే: ”ఓ నాజాతి ప్రజలారా మీరు అల్లాహ్‌కు సాటి (భాగస్వామ్యము) కల్పించే దానితో వాస్త వంగా నాకెలాంటి సంబంధంలేదు!” అనిఅన్నాడు.

6:79 – إِنِّي وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا ۖ وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ ٧٩

(ఇంకా ఇలా అన్నాడు): ”నిశ్చయంగా నేను ఏకదైవ సిద్ధాంతం (సత్యధర్మం) పాటించేవాడనై, నాముఖాన్ని భూమ్యాకాశాల సృష్టికి మూలాధారి అయిన ఆయన (అల్లాహ్‌) వైపునకే త్రిప్పుకుంటు న్నాను. మరియు నేను అల్లాహ్‌కు సాటి (భాగ స్వాములను) కల్పించేవారిలో చేరినవాడను కాను.”

6:80 – وَحَاجَّهُ قَوْمُهُ ۚ قَالَ أَتُحَاجُّونِّي فِي اللَّـهِ وَقَدْ هَدَانِ ۚ وَلَا أَخَافُ مَا تُشْرِكُونَ بِهِ إِلَّا أَن يَشَاءَ رَبِّي شَيْئًا ۗ وَسِعَ رَبِّي كُلَّ شَيْءٍ عِلْمًا ۗ أَفَلَا تَتَذَكَّرُونَ ٨٠

మరియు అతని జాతివారు అతనితో వాదులాటకు దిగగా! అతను వారితో అన్నాడు: ”ఏమీ? మీరు నాతో అల్లాహ్‌ విషయంలో వాదిస్తున్నారా? వాస్తవానికి ఆయనే నాకు సన్మార్గం చూపించాడు. మరియు మీరు ఆయనకు సాటి (భాగస్వాములుగా) కల్పించిన వాటికి నేను భయపడను. నా ప్రభువు ఇచ్ఛలేనిది (ఏదీ సంభవించదు). నా ప్రభువు సకల వస్తువులను (తన) జ్ఞానంతో ఆవరించివున్నాడు. ఏమీ? మీరిది గ్రహించలేరా?

6:81 – وَكَيْفَ أَخَافُ مَا أَشْرَكْتُمْ وَلَا تَخَافُونَ أَنَّكُمْ أَشْرَكْتُم بِاللَّـهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ عَلَيْكُمْ سُلْطَانًا ۚ فَأَيُّ الْفَرِيقَيْنِ أَحَقُّ بِالْأَمْنِ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ ٨١

”మరియు మీరు అల్లాహ్‌కు సాటి (భాగ స్వాములు)గా కల్పించిన వాటికి నేనెలా భయపడాలి? వాస్తవానికి, ఆయన మీకు ఏ విధమైన ప్రమాణం ఇవ్వనిదే, మీరు అల్లాహ్‌కు సాటి (భాగస్వాములను) కల్పించి కూడా భయపడటం లేదే? కావున ఈ రెండు పక్షాల వారిలో ఎవరు శాంతి పొందటానికి అర్హులో! మీకు తెలిస్తే చెప్పండి?”

6:82 – الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَـٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُم مُّهْتَدُونَ ٨٢

ఎవరైతే విశ్వసించి, తమ విశ్వాసాన్ని షిర్క్‌తో 43 కలుషితం చేయరో! అలాంటి వారికే శాంతి ఉంది. మరియు వారే సన్మార్గంలో ఉన్నవారు.

6:83 – وَتِلْكَ حُجَّتُنَا آتَيْنَاهَا إِبْرَاهِيمَ عَلَىٰ قَوْمِهِ ۚ نَرْفَعُ دَرَجَاتٍ مَّن نَّشَاءُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ ٨٣

మరియు ఇదే మా వాదన, దానిని మేము ఇబ్రాహీమ్‌కు, తన జాతి వారికి వ్యతిరేకంగా ఇచ్చాము. మేము కోరినవారికి ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాము. 44 నిశ్చయంగా, నీ ప్రభువు మహా వివేచనాపరుడు, సర్వజ్ఞుడు (జ్ఞానసంపన్నుడు).

6:84 – وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ ۚ كُلًّا هَدَيْنَا ۚ وَنُوحًا هَدَيْنَا مِن قَبْلُ ۖ وَمِن ذُرِّيَّتِهِ دَاوُودَ وَسُلَيْمَانَ وَأَيُّوبَ وَيُوسُفَ وَمُوسَىٰ وَهَارُونَ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ ٨٤

మరియు మేము అతనికి (ఇబ్రాహీమ్‌కు) ఇస్‌’హాఖ్‌ మరియు య’అఖూబ్‌లను ప్రసా దించాము 45 ప్రతి ఒక్కరికీ సన్మార్గం చూపాము. అంతకు పూర్వం నూ’హ్‌కు సన్మార్గం చూపాము. మరియు అతని సంతతిలోని వారైన దావూద్‌, సులైమాన్‌, అయ్యూబ్‌, యూసుఫ్‌, మూసా మరియు హారూన్‌లకు మేము (సన్మార్గం చూపాము). మరియు ఈ విధంగా మేము సజ్జను లకు తగిన ప్రతిఫలం ఇస్తాము.

6:85 – وَزَكَرِيَّا وَيَحْيَىٰ وَعِيسَىٰ وَإِلْيَاسَ ۖ كُلٌّ مِّنَ الصَّالِحِينَ ٨٥

మరియు ‘జకరియ్యా, య’హ్యా, ‘ఈసా మరియు ఇల్యాస్‌లకు 46 కూడా (సన్మార్గం చూపాము). వారిలో ప్రతి ఒక్కరూ సద్వర్తనులే!

6:86 – وَإِسْمَاعِيلَ وَالْيَسَعَ وَيُونُسَ وَلُوطًا ۚ وَكُلًّا فَضَّلْنَا عَلَى الْعَالَمِينَ ٨٦

మరియు ఇస్మా’యీల్‌, అల్‌-యస’అ, యూనుస్‌ మరియు లూ’త్‌లకు 47 కూడా (సన్మార్గం చూపాము). ప్రతి ఒక్కరికీ (వారి కాలపు) సర్వలోకాల వాసులపై ఘనతను ప్రసాదించాము.

6:87 – وَمِنْ آبَائِهِمْ وَذُرِّيَّاتِهِمْ وَإِخْوَانِهِمْ ۖ وَاجْتَبَيْنَاهُمْ وَهَدَيْنَاهُمْ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ٨٧

మరియు వారిలో నుండి కొందరి తండ్రి-తాతలకు, వారి సంతానానికి మరియు వారి సోదరులకు కూడా మేము (సన్మార్గం చూపాము). మేము వారిని (మా సేవ కొరకు) ఎన్నుకొని, వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాము.

6:88 – ذَٰلِكَ هُدَى اللَّـهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ ٨٨

ఇదే అల్లాహ్‌ మార్గదర్శకత్వం. దీని ద్వారా ఆయన తన దాసులలో తాను కోరినవారికి సన్మార్గంచూపుతాడు. ఒకవేళ వారు అల్లాహ్‌కు సాటి (భాగస్వాములను) కల్పిస్తే, వారు చేసిన సత్కార్యాలన్నీ వృథా అయిపోయేవి! 48

6:89 – أُولَـٰئِكَ الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ۚ فَإِن يَكْفُرْ بِهَا هَـٰؤُلَاءِ فَقَدْ وَكَّلْنَا بِهَا قَوْمًا لَّيْسُوا بِهَا بِكَافِرِينَ ٨٩

వీరే, మేము గ్రంథాన్ని, వివేకాన్ని మరియు ప్రవక్త పదవిని ప్రసాదించినవారు. కాని వారు దీనిని (గ్రంథాన్ని / ప్రవక్త పదవిని) తిరస్కరించి నందుకు! వాస్తవానికి మేము, దీనిని ఎన్నడూ తిరస్కరించని ఇతర ప్రజలను, దీనికి కార్య కర్తలుగా నియమించాము. 49

6:90 – أُولَـٰئِكَ الَّذِينَ هَدَى اللَّـهُ ۖ فَبِهُدَاهُمُ اقْتَدِهْ ۗ قُل لَّا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا ۖ إِنْ هُوَ إِلَّا ذِكْرَىٰ لِلْعَالَمِينَ ٩٠

ఇలాంటి వారే అల్లాహ్‌ మార్గదర్శకత్వం పొందిన వారు. కావున నీవు వారిమార్గాన్నే అనుసరించు. వారితో ఇలా అను: ”నేను దీనికి బదులుగా మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగను. ఇది కేవలం సర్వలోకాల (వారి) కొరకు ఒక హితోపదేశం మాత్రమే.”

6:91 – وَمَا قَدَرُوا اللَّـهَ حَقَّ قَدْرِهِ إِذْ قَالُوا مَا أَنزَلَ اللَّـهُ عَلَىٰ بَشَرٍ مِّن شَيْءٍ ۗ قُلْ مَنْ أَنزَلَ الْكِتَابَ الَّذِي جَاءَ بِهِ مُوسَىٰ نُورًا وَهُدًى لِّلنَّاسِ ۖ تَجْعَلُونَهُ قَرَاطِيسَ تُبْدُونَهَا وَتُخْفُونَ كَثِيرًا ۖ وَعُلِّمْتُم مَّا لَمْ تَعْلَمُوا أَنتُمْ وَلَا آبَاؤُكُمْ ۖ قُلِ اللَّـهُ ۖ ثُمَّ ذَرْهُمْ فِي خَوْضِهِمْ يَلْعَبُونَ ٩١

మరియు వారు: ”అల్లాహ్‌, ఏ మానవుని పైననూ ఏమీ అవతరింపజేయలేదు.” 50 అని పలికినప్పుడు, వారు (అవిశ్వాసులు) అల్లాహ్‌ను గురించి తగురీతిలో అంచనావేయలేదు. వారితో ఇలా అను: ”అయితే! మానవులకు జ్యోతి మరియు మార్గదర్శిని అయిన గ్రంథాన్ని, మూసాపై ఎవరు అవతరింపజేశారు? దానిని మీరు (యూదులు) విడిపత్రాలుగా చేసి (దానిలోని కొంత భాగాన్ని) చూపుతున్నారు మరియు చాలా భాగాన్ని దాస్తున్నారు. మరియు దాని నుండి మీకూ మరియు మీ తండ్రి-తాతలకూ తెలియని విషయాల జ్ఞానం ఇవ్వబడింది కదా?” ఇంకా ఇలా అను: ”అల్లాహ్‌యే (దానిని అవత రింపజేశాడు).” ఆ పిదప వారిని, వారి పనికి మాలిన వివాదంలో పడి ఆడుకోనివ్వు!

6:92 – وَهَـٰذَا كِتَابٌ أَنزَلْنَاهُ مُبَارَكٌ مُّصَدِّقُ الَّذِي بَيْنَ يَدَيْهِ وَلِتُنذِرَ أُمَّ الْقُرَىٰ وَمَنْ حَوْلَهَا ۚ وَالَّذِينَ يُؤْمِنُونَ بِالْآخِرَةِ يُؤْمِنُونَ بِهِ ۖ وَهُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ ٩٢

మరియు మేము అవతరింపజేసిన ఈ గ్రంథం (ఖుర్‌ఆన్‌) ఎన్నో శుభాలు గలది. ఇది ఇంతకు పూర్వం వచ్చిన గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాలను ధృవపరుస్తోంది. మరియు ఇది ఉమ్ముల్‌-ఖురా (మక్కహ్) 51 మరియు దాని చుట్టుప్రక్కలలో ఉన్న వారిని హెచ్చరించటానికి అవతరింపజేయబడింది. మరియు పరలోకము నందు విశ్వాసమున్న వారు దీనిని (ఈ గ్రంథాన్ని) విశ్వసిస్తారు. మరియు వారు తమ నమా’జ్‌లను క్రమబద్ధంగా పాటిస్తారు.

6:93 – وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّـهِ كَذِبًا أَوْ قَالَ أُوحِيَ إِلَيَّ وَلَمْ يُوحَ إِلَيْهِ شَيْءٌ وَمَن قَالَ سَأُنزِلُ مِثْلَ مَا أَنزَلَ اللَّـهُ ۗ وَلَوْ تَرَىٰ إِذِ الظَّالِمُونَ فِي غَمَرَاتِ الْمَوْتِ وَالْمَلَائِكَةُ بَاسِطُو أَيْدِيهِمْ أَخْرِجُوا أَنفُسَكُمُ ۖ الْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُونِ بِمَا كُنتُمْ تَقُولُونَ عَلَى اللَّـهِ غَيْرَ الْحَقِّ وَكُنتُمْ عَنْ آيَاتِهِ تَسْتَكْبِرُونَ ٩٣

మరియు అల్లాహ్‌పై అబద్ధపు నిందమోపే వానికంటే, లేదా తనపై ఏ దివ్యజ్ఞానం (వ’హీ) అవతరించక పోయినప్పటికీ: ”నాపై దివ్యజ్ఞానం అవతరింపజేయబడింది.” అని చెప్పేవాని కంటే, లేదా: ”అల్లాహ్‌ అవతరింపజేసినటువంటి విష యాలను నేను కూడా అవతరింపజేయగలను.” అని పలికేవానికంటే, మించిన దుర్మార్గుడు ఎవడు? దుర్మార్గులు మరణవేదనలో ఉన్న ప్పుడు దేవదూతలు తమ చేతులు చాచి: ”మీ ప్రాణాలను వదలండి! అల్లాహ్‌పై అసత్యాలు పలుకుతూ ఉన్నందువలన మరియు ఆయన సూచనల పట్ల అనాదరణ చూపటం వలన, ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడు తుంది!” 52 అని అంటూ ఉండే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండేది! 53

6:94 – وَلَقَدْ جِئْتُمُونَا فُرَادَىٰ كَمَا خَلَقْنَاكُمْ أَوَّلَ مَرَّةٍ وَتَرَكْتُم مَّا خَوَّلْنَاكُمْ وَرَاءَ ظُهُورِكُمْ ۖ وَمَا نَرَىٰ مَعَكُمْ شُفَعَاءَكُمُ الَّذِينَ زَعَمْتُمْ أَنَّهُمْ فِيكُمْ شُرَكَاءُ ۚ لَقَد تَّقَطَّعَ بَيْنَكُمْ وَضَلَّ عَنكُم مَّا كُنتُمْ تَزْعُمُونَ ٩٤

మరియు వాస్తవంగా, మేము మొదటి సారి మిమ్మల్ని పుట్టించినట్లే, మీరిప్పుడు మా వద్దకు ఒంటరిగా వచ్చారు. మరియు మేము ఇచ్చినదంతా, మీరు మీ వీపుల వెనుక వదలి వచ్చారు. మరియు మీరు అల్లాహ్‌కు సాటిగా (భాగస్వాములుగా) కల్పించిన మీ సిఫారసు దారులను, మేము మీతోపాటు చూడటం లేదే! వాస్తవంగా ఇప్పుడు మీ మధ్య ఉన్న సంబంధాలన్నీ తెగిపోయాయి మరియు మీ భ్రమలన్నీ మిమ్మల్ని త్యజించాయి. (7/8)

6:95 – إِنَّ اللَّـهَ فَالِقُ الْحَبِّ وَالنَّوَىٰ ۖ يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَمُخْرِجُ الْمَيِّتِ مِنَ الْحَيِّ ۚ ذَٰلِكُمُ اللَّـهُ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ ٩٥

నిశ్చయంగా, ధాన్యమును మరియు ఖర్జూరపు బీజాన్ని చీల్చి (మొలకెత్తజేసే) వాడు అల్లాహ్‌ మాత్రమే. ఆయనే సజీవమైన దానిని, నిర్జీవమైనదాని నుండి తీస్తాడు, మరియు నిర్జీవమైన దానిని సజీవమైనదాని నుండి తీస్తాడు. ఆయనే, అల్లాహ్‌! అయితే మీరెందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింప బడుతున్నారు)?

6:96 – فَالِقُ الْإِصْبَاحِ وَجَعَلَ اللَّيْلَ سَكَنًا وَالشَّمْسَ وَالْقَمَرَ حُسْبَانًا ۚ ذَٰلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ ٩٦

ఆయనే (రాత్రి చీకటిని) చీల్చి ఉదయాన్ని తెచ్చేవాడు. మరియు రాత్రిని విశ్రాంతి కొరకు చేసినవాడు మరియు సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి (కాల) గణన కొరకు నియమించిన వాడు 54 ఇవన్నీ ఆ సర్వశక్తిమంతుని, సర్వజ్ఞుని, నియామకాలే!

6:97 – وَهُوَ الَّذِي جَعَلَ لَكُمُ النُّجُومَ لِتَهْتَدُوا بِهَا فِي ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ ۗ قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ ٩٧

రియు ఆయనే మీ కొరకు చీకట్లలో – భూమి మీద మరియు సముద్రంలో – మార్గాలను తెలుసు కోవటానికి, నక్షత్రాలను పుట్టించాడు. 55 వాస్తవానికి, ఈ విధంగా మేము జ్ఞానవంతుల కొరకు మా సూచనలను వివరించి తెలిపాము.

6:98 – وَهُوَ الَّذِي أَنشَأَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ فَمُسْتَقَرٌّ وَمُسْتَوْدَعٌ ۗ قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَفْقَهُونَ ٩٨

మరియు ఆయనే మిమ్మల్ని ఒకేవ్యక్తి (ప్రాణి) నుండి పుట్టించి, తరువాత నివాసం మరియు సేకరించబడే స్థలం 56 నియమించాడు. వాస్తవంగా, అర్థంచేసుకునే వారికి ఈ విధంగా మేము మా సూచనలను వివరించాము.

6:99 – وَهُوَ الَّذِي أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجْنَا بِهِ نَبَاتَ كُلِّ شَيْءٍ فَأَخْرَجْنَا مِنْهُ خَضِرًا نُّخْرِجُ مِنْهُ حَبًّا مُّتَرَاكِبًا وَمِنَ النَّخْلِ مِن طَلْعِهَا قِنْوَانٌ دَانِيَةٌ وَجَنَّاتٍ مِّنْ أَعْنَابٍ وَالزَّيْتُونَ وَالرُّمَّانَ مُشْتَبِهًا وَغَيْرَ مُتَشَابِهٍ ۗ انظُرُوا إِلَىٰ ثَمَرِهِ إِذَا أَثْمَرَ وَيَنْعِهِ ۚ إِنَّ فِي ذَٰلِكُمْ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ ٩٩

మరియు ఆయనే ఆకాశం నుండి వర్షాన్ని కురి పించాడు. తరువాత దాని ద్వారా మేము సర్వరకాల వృక్షకోటిని ఉద్భవింపజేశాము. 57 మరియు దాని నుండి మేము పచ్చని పైరును పండించాము. వాటిలో దట్టమైన గింజలను పుట్టించాము. మరియు ఖర్జూరపుచెట్ల గెలల నుండి క్రిందికి వ్రేలాడుతున్న పండ్లగుత్తులను, ద్రాక్ష, జైతూన్‌ మరియు దానిమ్మ తోటలను (పుట్టించాము). వాటిలో కొన్ని ఒకదానినొకటి పోలి ఉంటాయి, 58 మరికొన్ని ఒకదానినొకటి పోలి ఉండవు. ఫలించినప్పుడు వాటి ఫలాలను మరియు వాటి పరిపక్వాన్ని గమనించండి. నిశ్చయంగా వీటిలో విశ్వసించేవారికి సూచన లున్నాయి.

6:100 – وَجَعَلُوا لِلَّـهِ شُرَكَاءَ الْجِنَّ وَخَلَقَهُمْ ۖ وَخَرَقُوا لَهُ بَنِينَ وَبَنَاتٍ بِغَيْرِ عِلْمٍ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يَصِفُونَ ١٠٠

మరియు వారు, ఆయన (అల్లాహ్‌) సృష్టించిన జిన్నాతులను, అల్లాహ్‌కే సాటిగా (భాగ-స్వాములుగా) కల్పిస్తున్నారు. మూఢ త్వంతో ఆయనకు కుమారులు, కుమార్తెలు ఉన్నారని ఆరోపిస్తున్నారు. 59 ఆయన సర్వ లోపాలకు అతీతుడు, వారి ఈ కల్పనలకు మహోన్నతుడు. 60

6:101 – بَدِيعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ أَنَّىٰ يَكُونُ لَهُ وَلَدٌ وَلَمْ تَكُن لَّهُ صَاحِبَةٌ ۖ وَخَلَقَ كُلَّ شَيْءٍ ۖ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ١٠١

ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఏ నమూనా లేకుండా ఆరంభించినవాడు. 61 నిశ్చయంగా, ఆయనకు జీవన సహవాసియే (భార్యయే) లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉండగలడు? 62 మరియు ప్రతి దానిని ఆయనే సృష్టించాడు. 63 మరియు ఆయనే ప్రతి విషయం గురించి బాగా తెలిసినవాడు.

6:102 – ذَٰلِكُمُ اللَّـهُ رَبُّكُمْ ۖ لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۖ خَالِقُ كُلِّ شَيْءٍ فَاعْبُدُوهُ ۚ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ وَكِيلٌ ١٠٢

ఆయనే, అల్లాహ్‌! మీ ప్రభువు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడులేడు. ఆయనే సర్వానికి సృష్టికర్త, 64 కావున మీరు ఆయననే ఆరా ధించండి. మరియు ఆయనే ప్రతిదాని కార్యకర్త. 65

6:103 – لَّا تُدْرِكُهُ الْأَبْصَارُ وَهُوَ يُدْرِكُ الْأَبْصَارَ ۖ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ ١٠٣

ఏ చూపులు కూడా ఆయనను అందుకో లేవు 66 కాని ఆయన (అన్ని) చూపులను పరివేష్టించి ఉన్నాడు. మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు 67

6:104 – قَدْ جَاءَكُم بَصَائِرُ مِن رَّبِّكُمْ ۖ فَمَنْ أَبْصَرَ فَلِنَفْسِهِ ۖ وَمَنْ عَمِيَ فَعَلَيْهَا ۚ وَمَا أَنَا عَلَيْكُم بِحَفِيظٍ ١٠٤

వాస్తవానికి ఇప్పుడు మీ ప్రభువు తరఫు నుండి నిదర్శనాలు వచ్చాయి. కావున వాటిని ఎవడు గ్రహిస్తాడో తన మేలుకే గ్రహిస్తాడు! మరియు ఎవడు అంధుడిగా ఉంటాడో అతడే నష్టపోతాడు: 68 ”మరియు నేను మీ రక్షకుడను కాను.” (అని అను).

6:105 – وَكَذَٰلِكَ نُصَرِّفُ الْآيَاتِ وَلِيَقُولُوا دَرَسْتَ وَلِنُبَيِّنَهُ لِقَوْمٍ يَعْلَمُونَ ١٠٥

మరియు వారు (అవిశ్వాసులు): ”నీవు ఎవరి వద్దనో నేర్చుకున్నావు.” అని అనాలనీ మరియు తెలివి గలవారికి (సత్యాన్ని) స్పష్ట పరచుటకూను, మేము మా సూచనలను ఈ విధంగా వివరిస్తూ ఉంటాము. 69

6:106 – اتَّبِعْ مَا أُوحِيَ إِلَيْكَ مِن رَّبِّكَ ۖ لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۖ وَأَعْرِضْ عَنِ الْمُشْرِكِينَ ١٠٦

నీవు నీ ప్రభువు తరఫు నుండి అవతరింపజేయబడిన దివ్యజ్ఞానాన్ని (వ’హీని) అనుసరించు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. మరియు అల్లాహ్‌కు సాటి (భాగ- స్వాములను) కల్పించే వారి నుండి విముఖడవగు.

6:107 – وَلَوْ شَاءَ اللَّـهُ مَا أَشْرَكُوا ۗ وَمَا جَعَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا ۖ وَمَا أَنتَ عَلَيْهِم بِوَكِيلٍ ١٠٧

మరియు అల్లాహ్‌ సంకల్పించి ఉంటే! వారు అల్లాహ్‌కు సాటికల్పించి ఉండేవారుకాదు. 70 మరియు మేము నిన్ను వారిపై రక్షకునిగా నియమించ లేదు. నీవు వారి కొరకు బాధ్యుడవు (కార్యకర్తవు) కావు. 71

6:108 – وَلَا تَسُبُّوا الَّذِينَ يَدْعُونَ مِن دُونِ اللَّـهِ فَيَسُبُّوا اللَّـهَ عَدْوًا بِغَيْرِ عِلْمٍ ۗ كَذَٰلِكَ زَيَّنَّا لِكُلِّ أُمَّةٍ عَمَلَهُمْ ثُمَّ إِلَىٰ رَبِّهِم مَّرْجِعُهُمْ فَيُنَبِّئُهُم بِمَا كَانُوا يَعْمَلُونَ ١٠٨

మరియు – అల్లాహ్‌ను వదలి వారు ప్రార్థిస్తున్న ఇతరులను (వారి దైవాలను) – మీరు దూషించకండి. ఎందుకంటే, వారు ద్వేషంతో, అజ్ఞానంతో అల్లాహ్‌ను దూషించవచ్చు! ఈ విధంగా మేము ప్రతి జాతికి, వారి కర్మలు (ఆచారాలు) వారికి ఆకర్షణీయంగా కనబడేటట్లు చేశాము. తరువాత వారి ప్రభువు వైపునకు వారి మరలింపు ఉంటుంది; అప్పుడు వారికి వారి చేష్టలు తెలుపబడతాయి.

6:109 – وَأَقْسَمُوا بِاللَّـهِ جَهْدَ أَيْمَانِهِمْ لَئِن جَاءَتْهُمْ آيَةٌ لَّيُؤْمِنُنَّ بِهَا ۚ قُلْ إِنَّمَا الْآيَاتُ عِندَ اللَّـهِ ۖ وَمَا يُشْعِرُكُمْ أَنَّهَا إِذَا جَاءَتْ لَا يُؤْمِنُونَ ١٠٩

మరియు వారు: ”ఒకవేళ మావద్దకు అద్భుత సూచన (మహిమ) వస్తే, మేము తప్పక విశ్వసిస్తాము.” అని అల్లాహ్‌ పేరుతో గట్టి ప్రమాణాలు చేస్తారు. వారితో అను: ”నిశ్చయంగా, అద్భుత సూచనలు (మహిమలు) అల్లాహ్‌ వశంలోనే ఉన్నాయి. 72 ఒకవేళ అవి (అద్భుత సూచనలు) వచ్చినా, వారు విశ్వసించరని (ఓ ముస్లింలారా!) మీకు ఏవిధంగా గ్రహింప జేయాలి?”

6:110 – وَنُقَلِّبُ أَفْئِدَتَهُمْ وَأَبْصَارَهُمْ كَمَا لَمْ يُؤْمِنُوا بِهِ أَوَّلَ مَرَّةٍ وَنَذَرُهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ ١١٠

మరియు వారు మొదటిసారి దీనిని ఎలా విశ్వసించలేదో, అదే విధంగా వారి హృదయాలను మరియు వారి కన్నులను మేము త్రిప్పివేస్తాము. మరియు మేము వారిని వారి తలబిరుసుతనంలో అంధులై తిరగటానికి వదలిపెడతాము.

6:111 – وَلَوْ أَنَّنَا نَزَّلْنَا إِلَيْهِمُ الْمَلَائِكَةَ وَكَلَّمَهُمُ الْمَوْتَىٰ وَحَشَرْنَا عَلَيْهِمْ كُلَّ شَيْءٍ قُبُلًا مَّا كَانُوا لِيُؤْمِنُوا إِلَّا أَن يَشَاءَ اللَّـهُ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ يَجْهَلُونَ ١١١

[(*)] మరియు ఒకవేళ మేము వారి వైపుకు దైవదూతలను దింపినా మరియు మరణించిన వారు వారితో మాట్లాడినా మరియు మేము ప్రతి వస్తువును వారి కళ్ళ ముందు సమీకరించినా 73 – అల్లాహ్‌ సంకల్పంలేనిదే – వారు విశ్వసించేవారు కారు. ఎందుకంటే, వాస్తవానికి వారిలో అనేకులు అజ్ఞానులున్నారు.

6:112 – وَكَذَٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِيٍّ عَدُوًّا شَيَاطِينَ الْإِنسِ وَالْجِنِّ يُوحِي بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ زُخْرُفَ الْقَوْلِ غُرُورًا ۚ وَلَوْ شَاءَ رَبُّكَ مَا فَعَلُوهُ ۖ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ ١١٢

మరియు ఈ విధంగా మేము మానవుల నుండి మరియు జిన్నాతుల నుండి, షైతానులను ప్రతి ప్రవక్తకు శత్రువులుగా చేశాము. వారు ఒకరినొకరు మోసపుచ్చుకోవటానికి ఇంపైన మాటలు చెప్పుకుంటారు. మరియు నీ ప్రభువు తలచుకుంటే వారిలా చేసేవారు కాదు. కావున వారిని వారి కల్పనలలో వదలిపెట్టు. 74

6:113 – وَلِتَصْغَىٰ إِلَيْهِ أَفْئِدَةُ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ وَلِيَرْضَوْهُ وَلِيَقْتَرِفُوا مَا هُم مُّقْتَرِفُونَ ١١٣

మరియు పరలోక జీవితాన్ని విశ్వసించని వారి హృదయాలు ఇలాంటి (మోసం) వైపుకు మొగ్గాలని మరియు వారు దానితో సంతోష పడుతూ ఉండాలని మరియు వారు అర్జించేవి (దుష్టఫలితాలు) అర్జిస్తూ ఉండాలనీను.

6:114 – أَفَغَيْرَ اللَّـهِ أَبْتَغِي حَكَمًا وَهُوَ الَّذِي أَنزَلَ إِلَيْكُمُ الْكِتَابَ مُفَصَّلًا ۚ وَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْلَمُونَ أَنَّهُ مُنَزَّلٌ مِّن رَّبِّكَ بِالْحَقِّ ۖ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ ١١٤

(వారితో ఇలా అను): “ఏమీ? నేను అల్లాహ్‌ ను వదలి వేరే న్యాయాధిపతిని అన్వేషిం చాలా? మరియు ఆయనే మీపై స్పష్టమైన గ్రంథాన్ని అవతరింపజేశాడుకదా?” మరియు నిశ్చయంగా, ఇది (ఈ గ్రంథం) నీ ప్రభువు తరఫు నుండి సత్యాధారంగా అవతరింపజేయబడిందని, పూర్వం గ్రంథమొసంగబడిన ప్రజలకు బాగా తెలుసు! 75 కావున నీవు సందేహించేవారిలో చేరకు.

6:115 – وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ صِدْقًا وَعَدْلًا ۚ لَّا مُبَدِّلَ لِكَلِمَاتِهِ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ ١١٥

మరియు సత్యంరీత్యా మరియు న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు పూర్తి అయ్యింది. 76 ఆయన వాక్కులను మార్చేవాడు ఎవ్వడూ లేడు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

6:116 – وَإِن تُطِعْ أَكْثَرَ مَن فِي الْأَرْضِ يُضِلُّوكَ عَن سَبِيلِ اللَّـهِ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَإِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ ١١٦

మరియు భూమిలోని అధిక సంఖ్యాకు లను నీవు అనుసరిస్తే, వారు నిన్నుఅల్లాహ్‌ మార్గం నుండి తప్పిస్తారు. వారు కేవలం ఊహలనే అనుసరిస్తున్నారు మరియు వారు కేవలం ఊహాగానాలు మాత్రమే చేస్తున్నారు. 77

6:117 – إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ مَن يَضِلُّ عَن سَبِيلِهِ ۖ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ ١١٧

నిశ్చయంగా, నీ ప్రభువు! ఆయనకు ఎవడు ఆయన మార్గం నుండి వైదొలగి ఉన్నాడో తెలుసు. మరియు ఎవడు సన్మార్గంలో ఉన్నాడనేది కూడా ఆయనకు బాగా తెలుసు.

6:118 – فَكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّـهِ عَلَيْهِ إِن كُنتُم بِآيَاتِهِ مُؤْمِنِينَ ١١٨

కావున మీరు ఆయన సూచన (ఆయాత్‌) లను విశ్వసించే వారే అయితే, అల్లాహ్‌ పేరు స్మరించబడిన దానినే తినండి.

6:119 – وَمَا لَكُمْ أَلَّا تَأْكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّـهِ عَلَيْهِ وَقَدْ فَصَّلَ لَكُم مَّا حَرَّمَ عَلَيْكُمْ إِلَّا مَا اضْطُرِرْتُمْ إِلَيْهِ ۗ وَإِنَّ كَثِيرًا لَّيُضِلُّونَ بِأَهْوَائِهِم بِغَيْرِ عِلْمٍ ۗ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِالْمُعْتَدِينَ ١١٩

మరియు మీకేమయింది? అల్లాహ్‌ పేరు స్మరించబడిన దానిని మీరెందుకు తినకూడదు? వాస్తవానికి – గత్యంతరం లేని సంకట పరిస్థితు లలో తప్ప – ఏవేవి మీకు (తినటానికి) నిషేధింప బడ్డాయో, మీకు విశదీకరించబడింది కదా? మరియు నిశ్చయంగా, చాలా మంది అజ్ఞానంతో (ఇతరులను) తమ ఇష్టానుసారంగా మార్గ భ్రష్టత్వానికి గురిచేస్తున్నారు. నిశ్చయంగా, నీ ప్రభువు, ఆయనకు హద్దులు మీరి ప్రవర్తించే వారి గురించి బాగా తెలుసు.

6:120 – وَذَرُوا ظَاهِرَ الْإِثْمِ وَبَاطِنَهُ ۚ إِنَّ الَّذِينَ يَكْسِبُونَ الْإِثْمَ سَيُجْزَوْنَ بِمَا كَانُوا يَقْتَرِفُونَ ١٢٠

మరియు పాపాన్ని – బహిరంగంగా గానీ, రహస్యంగా గానీ – చేయటాన్ని మానుకోండి. నిశ్చయంగా పాపం అర్జించినవారు తాము చేసిన దుష్కృత్యాలకు తగిన ప్రతిఫలం పొందగలరు.

6:121 – وَلَا تَأْكُلُوا مِمَّا لَمْ يُذْكَرِ اسْمُ اللَّـهِ عَلَيْهِ وَإِنَّهُ لَفِسْقٌ ۗ وَإِنَّ الشَّيَاطِينَ لَيُوحُونَ إِلَىٰ أَوْلِيَائِهِمْ لِيُجَادِلُوكُمْ ۖ وَإِنْ أَطَعْتُمُوهُمْ إِنَّكُمْ لَمُشْرِكُونَ ١٢١

మరియు అల్లాహ్‌ పేరు స్మరించబడని దానిని తినకండి. మరియు అది (తినటం) నిశ్చయంగా, పాపం. మరియు నిశ్చయంగా, మీతో వాదులాడటానికి షై’తానులు తమ స్నేహితులను (అవ్‌లియా’లను) ప్రేరేపింపజేస్తారు. 78 ఒకవేళ మీరు వారిని అనుసరిస్తే! నిశ్చయంగా, మీరు కూడా అల్లాహ్‌కు సాటి (భాగ-స్వాములు) కల్పించిన వారవుతారు.

6:122 – أَوَمَن كَانَ مَيْتًا فَأَحْيَيْنَاهُ وَجَعَلْنَا لَهُ نُورًا يَمْشِي بِهِ فِي النَّاسِ كَمَن مَّثَلُهُ فِي الظُّلُمَاتِ لَيْسَ بِخَارِجٍ مِّنْهَا ۚ كَذَٰلِكَ زُيِّنَ لِلْكَافِرِينَ مَا كَانُوا يَعْمَلُونَ ١٢٢

మరియు ఏమీ? ఒక మరణించిన వ్యక్తిని (అవిశ్వాసిని), మేము సజీవునిగా (విశ్వాసిగా) చేసి జ్యోతిని ప్రసాదించగా! దానితో ప్రజల మధ్య సంచరిస్తున్నవాడూ మరియు అంధకారంలో (అవిశ్వాసంలో) చిక్కుకొని వాటినుండి బయటకు రాజాలనివాడూ ఇద్దరూ సమానులా? 79 ఇదే విధంగా సత్య-తిరస్కారులకు, వారు చేస్తున్న కర్మలు, మనోహరమైనవిగా చేయబడ్డాయి.

6:123 – وَكَذَٰلِكَ جَعَلْنَا فِي كُلِّ قَرْيَةٍ أَكَابِرَ مُجْرِمِيهَا لِيَمْكُرُوا فِيهَا ۖ وَمَا يَمْكُرُونَ إِلَّا بِأَنفُسِهِمْ وَمَا يَشْعُرُونَ ١٢٣

మరియు ఇదే విధంగా మేము ప్రతి నగరంలో, దానిలోని నేరస్థులైన పెద్దవారిని, కుట్రలు పన్నేవారిగా చేశాము. 80 మరియు వారు చేసేకుట్రలు కేవలం వారికే ప్రతికూలమైనవి, కాని వారది గ్రహించడం లేదు. 81

6:124 – وَإِذَا جَاءَتْهُمْ آيَةٌ قَالُوا لَن نُّؤْمِنَ حَتَّىٰ نُؤْتَىٰ مِثْلَ مَا أُوتِيَ رُسُلُ اللَّـهِ ۘ اللَّـهُ أَعْلَمُ حَيْثُ يَجْعَلُ رِسَالَتَهُ ۗ سَيُصِيبُ الَّذِينَ أَجْرَمُوا صَغَارٌ عِندَ اللَّـهِ وَعَذَابٌ شَدِيدٌ بِمَا كَانُوا يَمْكُرُونَ ١٢٤

మరియు వారి వద్దకు ఏదైనా సూచన వచ్చినప్పుడు వారు: ”అల్లాహ్‌ యొక్క సందేశ హరులకు ఇవ్వబడినట్లు, మాకు కూడా (దివ్య జ్ఞానం) 82 ఇవ్వబడనంత వరకు మేము విశ్వ సించము.” అని అంటారు. తన సందేశాన్ని ఎవరిపై అవతరింపజేయాలో అల్లాహ్‌కు బాగా తెలుసు. త్వరలోనే అపరాధులు అల్లాహ్‌ దగ్గర అవమానింపబడగలరు. మరియు వారి కుట్రల ఫలితంగా వారికి తీవ్రమైన శిక్ష విధించబడగలదు.

6:125 – فَمَن يُرِدِ اللَّـهُ أَن يَهْدِيَهُ يَشْرَحْ صَدْرَهُ لِلْإِسْلَامِ ۖ وَمَن يُرِدْ أَن يُضِلَّهُ يَجْعَلْ صَدْرَهُ ضَيِّقًا حَرَجًا كَأَنَّمَا يَصَّعَّدُ فِي السَّمَاءِ ۚ كَذَٰلِكَ يَجْعَلُ اللَّـهُ الرِّجْسَ عَلَى الَّذِينَ لَا يُؤْمِنُونَ ١٢٥

కావున అల్లాహ్‌ సన్మార్గం చూపదలచిన వ్యక్తి హృదయాన్ని ఇస్లాం కొరకు తెరుస్తాడు. మరియు ఎవరిని ఆయన మార్గభ్రష్టత్వంలో వదల గోరుతాడో అతని హృదయాన్ని (ఇస్లాం కొరకు) – ఆకాశంపైకి ఎక్కేవానివలే – బిగుతుగా అణచి వేయబడినట్లు చేస్తాడు. ఈ విధంగా అల్లాహ్‌! విశ్వసించని వారిపై మాలిన్యాన్ని రుద్దుతాడు.

6:126 – وَهَـٰذَا صِرَاطُ رَبِّكَ مُسْتَقِيمًا ۗ قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَذَّكَّرُونَ ١٢٦

మరియు ఇది నీ ప్రభువు యొక్క ఋజుమార్గం. వాస్తవానికి యోచించేవారికి, మేము ఈ సూచనలను వివరించాము. (1/8)

6:127 – لَهُمْ دَارُ السَّلَامِ عِندَ رَبِّهِمْ ۖ وَهُوَ وَلِيُّهُم بِمَا كَانُوا يَعْمَلُونَ ١٢٧

వారి కొరకు వారి ప్రభువు వద్ద శాంతి నిలయం (స్వర్గం) ఉంటుంది. మరియు వారు (మంచి) కర్మలు చేస్తున్నందుకు ఆయన వారి సంరక్షకునిగా ఉంటాడు.

6:128 – وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيعًا يَا مَعْشَرَ الْجِنِّ قَدِ اسْتَكْثَرْتُم مِّنَ الْإِنسِ ۖ وَقَالَ أَوْلِيَاؤُهُم مِّنَ الْإِنسِ رَبَّنَا اسْتَمْتَعَ بَعْضُنَا بِبَعْضٍ وَبَلَغْنَا أَجَلَنَا الَّذِي أَجَّلْتَ لَنَا ۚ قَالَ النَّارُ مَثْوَاكُمْ خَالِدِينَ فِيهَا إِلَّا مَا شَاءَ اللَّـهُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ ١٢٨

మరియు ఆయన వారందరినీ జమచేసిన రోజు వారితో ఇలా అంటాడు: “ఓ జిన్నాతుల వంశీయులారా! వాస్తవంగా మీరు మానవులలో నుండి చాలా మందిని వలలో వేసుకున్నారు.” 83 అప్పుడు మానవులలోని వారి స్నేహితులు (అవ్‌ లియా’) అంటారు: “ఓ మా ప్రభూ! మేము పరస్పరం బాగా సుఖసంతోషాలు పొందాము. మరియు నీవు మా కొరకు నియమించిన గడువుకు మే మిప్పుడు చేరుకున్నాము.” అప్పుడు అల్లాహ్‌ వారితో అంటాడు: “మీ నివాసం నరకాగ్నియే – అల్లాహ్‌ కోరితే తప్ప – మీరందు శాశ్వతంగా ఉంటారు! 84 నిశ్చయంగా, నీ ప్రభువు మహా వివేచనాపరుడు, సర్వజ్ఞుడు.”

6:129 – وَكَذَٰلِكَ نُوَلِّي بَعْضَ الظَّالِمِينَ بَعْضًا بِمَا كَانُوا يَكْسِبُونَ ١٢٩

ఈ విధంగా మేము దుర్మార్గులను – వారు అర్జించిన దానికి ఫలితంగా – పరస్పరం స్నేహితులు (అవ్‌లియా’)గా ఉంచుతాము.

6:130 – يَا مَعْشَرَ الْجِنِّ وَالْإِنسِ أَلَمْ يَأْتِكُمْ رُسُلٌ مِّنكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ آيَاتِي وَيُنذِرُونَكُمْ لِقَاءَ يَوْمِكُمْ هَـٰذَا ۚ قَالُوا شَهِدْنَا عَلَىٰ أَنفُسِنَا ۖ وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا وَشَهِدُوا عَلَىٰ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ ١٣٠

”ఓ జిన్నాతుల మరియు మానవుల వంశీ యులారా! ఏమీ? నాసూచనలను మీకువినిపించి మీరు (నన్ను) కలుసుకునే ఈ దినమును గురించి హెచ్చరించే ప్రవక్తలు మీలో నుంచే మీ వద్దకు రాలేదా?” (అని అల్లాహ్‌ వారిని అడుగుతాడు). దానికి వారు: ”(వచ్చారని!) మాకు వ్యతిరేకంగా స్వయంగా మేమే సాక్షులం.” అని జవాబిస్తారు. మరియు వారిని ఈ ప్రాపంచిక జీవితం మోస పుచ్చింది. మరియు వారు వాస్తవానికి సత్య-తిరస్కారులుగా ఉండేవారని స్వయంగా తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యమిస్తారు.

6:131 – ذَٰلِكَ أَن لَّمْ يَكُن رَّبُّكَ مُهْلِكَ الْقُرَىٰ بِظُلْمٍ وَأَهْلُهَا غَافِلُونَ ١٣١

ఇదంతా ఎందుకంటే! నీ ప్రభువు నగరాలను – వాటిలోని ప్రజలు సత్యాన్ని ఎరుగ కుండా ఉన్నప్పుడు – అన్యాయంగా నాశనం చేయడు. 85

6:132 – وَلِكُلٍّ دَرَجَاتٌ مِّمَّا عَمِلُوا ۚ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا يَعْمَلُونَ ١٣٢

మరియు ప్రతి ఒక్కరికీ వారి కర్మల ప్రకారం స్థానాలు ఉంటాయి. మరియు నీ ప్రభువు వారి కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు.

6:133 – وَرَبُّكَ الْغَنِيُّ ذُو الرَّحْمَةِ ۚ إِن يَشَأْ يُذْهِبْكُمْ وَيَسْتَخْلِفْ مِن بَعْدِكُم مَّا يَشَاءُ كَمَا أَنشَأَكُم مِّن ذُرِّيَّةِ قَوْمٍ آخَرِينَ ١٣٣

మరియు నీ ప్రభువు స్వయంసమృధ్ధుడు 86 కరుణించే స్వభావం గలవాడు. ఆయన కోరితే, ఇతర జాతివారి తరువాత మిమ్మల్ని పుట్టించి నట్లు, మిమ్మల్ని తొలగించి మీకు బదులుగా మీ తర్వాత తాను కోరిన వారిని పుట్టించగలడు. 87

6:134 – إِنَّ مَا تُوعَدُونَ لَآتٍ ۖ وَمَا أَنتُم بِمُعْجِزِينَ ١٣٤

మీకు చేయబడిన వాగ్దానం తప్పక పూర్తయి తీరుతుంది. మీరు దాని (శిక్ష) నుండి తప్పించుకోలేరు.

6:135 – قُلْ يَا قَوْمِ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنِّي عَامِلٌ ۖ فَسَوْفَ تَعْلَمُونَ مَن تَكُونُ لَهُ عَاقِبَةُ الدَّارِ ۗ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ ١٣٥

ఇలా అను: “ఓ నా జాతి (విశ్వసించని) ప్రజలారా! మీరు (సరి అనుకున్నది) మీ శక్తి మేరకు చేయండి. మరియు నిశ్చయంగా, (నేను సరి అనుకున్నది) నేనూ చేస్తాను. 88 ఎవరి పరిణామం సఫలీకృతం కాగలదో! మీరు త్వరలోనే తెలుసుకుంటారు. నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నడూ సాఫల్యం పొందరు.”

6:136 – وَجَعَلُوا لِلَّـهِ مِمَّا ذَرَأَ مِنَ الْحَرْثِ وَالْأَنْعَامِ نَصِيبًا فَقَالُوا هَـٰذَا لِلَّـهِ بِزَعْمِهِمْ وَهَـٰذَا لِشُرَكَائِنَا ۖ فَمَا كَانَ لِشُرَكَائِهِمْ فَلَا يَصِلُ إِلَى اللَّـهِ ۖ وَمَا كَانَ لِلَّـهِ فَهُوَ يَصِلُ إِلَىٰ شُرَكَائِهِمْ ۗ سَاءَ مَا يَحْكُمُونَ ١٣٦

మరియు ఆయన (అల్లాహ్‌) పుట్టించిన పంటల నుండి మరియు పశువుల నుండి, వారు అల్లాహ్‌ కొరకు కొంత భాగాన్ని నియమించి: ”ఇది అల్లాహ్‌ కొరకు మరియు ఇది మా దేవతల (అల్లాహ్‌ కు వారు సాటి కల్పించిన వారి) కొరకు.” అని తమ ఊహలో చెబుతారు. వారి దేవతలకు చెందినభాగం అల్లాహ్‌కు చేరదు. మరియు అల్లాహ్‌ కు చెందిన భాగం వారి దేవతలకు చేరుతుంది. ఎలాంటి చెడు నిర్ణయాలు చేస్తున్నారు వీరు! 89

6:137 – وَكَذَٰلِكَ زَيَّنَ لِكَثِيرٍ مِّنَ الْمُشْرِكِينَ قَتْلَ أَوْلَادِهِمْ شُرَكَاؤُهُمْ لِيُرْدُوهُمْ وَلِيَلْبِسُوا عَلَيْهِمْ دِينَهُمْ ۖ وَلَوْ شَاءَ اللَّـهُ مَا فَعَلُوهُ ۖ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ ١٣٧

మరియు ఇదేవిధంగా చాలా మంది బహు దైవారాధకులకు (ముష్రికీన్‌ లకు) తమ సంతాన హత్యను – వారు (అల్లాహ్‌కు సాటి కల్పించిన) భాగస్వాములు–సరైనవిగా కనిపించేటట్లు చేశారు. ఇది వారిని నాశనానికి గురి చేయటానికి మరియు వారి ధర్మం వారికి సంశయాస్పదమైనదిగా చేయటానికీ! అల్లాహ్‌ కోరితే వారు అలా చేసి ఉండే వారు కాదు. కావున నీవు వారిని వారి కల్పనలోనే వదలిపెట్టు. 90

6:138 – وَقَالُوا هَـٰذِهِ أَنْعَامٌ وَحَرْثٌ حِجْرٌ لَّا يَطْعَمُهَا إِلَّا مَن نَّشَاءُ بِزَعْمِهِمْ وَأَنْعَامٌ حُرِّمَتْ ظُهُورُهَا وَأَنْعَامٌ لَّا يَذْكُرُونَ اسْمَ اللَّـهِ عَلَيْهَا افْتِرَاءً عَلَيْهِ ۚ سَيَجْزِيهِم بِمَا كَانُوا يَفْتَرُونَ ١٣٨

మరియు వారు: “ఈ పశువులు మరియు ఈ పంటలు నిషిధ్ధం చేయబడ్డాయి. మేము కోరిన వారు తప్ప ఇతరులు వీటిని తినరాదు.” అని అంటారు. కొన్ని జంతువుల వీపులపై బరువు వేయటాన్ని (స్వారీచేయటాన్ని) నిషేధిస్తారు. మరికొన్ని జంతువులను (వధించేటప్పుడు) వాటి మీద అల్లాహ్‌ పేరు ఉచ్చరించరు. 91 ఇవన్నీ వారు ఆయనపై కల్పించిన (అబద్ధాలు) మాత్రమే. ఆయన త్వరలోనే వారికి, వారి (అసత్య) కల్పన లకు తగిన ప్రతిఫలం ఇవ్వగలడు.

6:139 – وَقَالُوا مَا فِي بُطُونِ هَـٰذِهِ الْأَنْعَامِ خَالِصَةٌ لِّذُكُورِنَا وَمُحَرَّمٌ عَلَىٰ أَزْوَاجِنَا ۖ وَإِن يَكُن مَّيْتَةً فَهُمْ فِيهِ شُرَكَاءُ ۚ سَيَجْزِيهِمْ وَصْفَهُمْ ۚ إِنَّهُ حَكِيمٌ عَلِيمٌ ١٣٩

ఇంకా వారు ఇలా అంటారు: ”ఈ పశువుల గర్భాలలో ఉన్నది కేవలం మా పురుషులకే ప్రత్యేకించబడింది మరియు ఇది మా స్త్రీలకు నిషేధించబడింది. కాని ఒకవేళ అది మరణించినది అయితే, వారు (స్త్రీలు) దానిలో భాగస్థులు.” ఆయన వారి ఈ ఆరోపణలకు త్వరలోనే వారికి ప్రతీకారం చేస్తాడు. నిశ్చయంగా, ఆయన మహా వివేచనాపరుడు, సర్వజ్ఞుడు.

6:140 – قَدْ خَسِرَ الَّذِينَ قَتَلُوا أَوْلَادَهُمْ سَفَهًا بِغَيْرِ عِلْمٍ وَحَرَّمُوا مَا رَزَقَهُمُ اللَّـهُ افْتِرَاءً عَلَى اللَّـهِ ۚ قَدْ ضَلُّوا وَمَا كَانُوا مُهْتَدِينَ ١٤٠

మూఢత్వం మరియు అజ్ఞానం వల్ల తమ సంతానాన్ని హత్యచేసే వారునూ మరియు అల్లాహ్‌పై అసత్యాలు కల్పిస్తూ, తమకు అల్లాహ్‌ ఇచ్చిన జీవనోపాధిని నిషేధించుకున్నవారునూ, వాస్తవంగా నష్టానికి గురిఅయిన వారే! నిశ్చయంగా, వారు మార్గం తప్పారు. వారెన్నటికీ మార్గదర్శకత్వం పొందేవారు కారు. (1/4)

6:141 – وَهُوَ الَّذِي أَنشَأَ جَنَّاتٍ مَّعْرُوشَاتٍ وَغَيْرَ مَعْرُوشَاتٍ وَالنَّخْلَ وَالزَّرْعَ مُخْتَلِفًا أُكُلُهُ وَالزَّيْتُونَ وَالرُّمَّانَ مُتَشَابِهًا وَغَيْرَ مُتَشَابِهٍ ۚ كُلُوا مِن ثَمَرِهِ إِذَا أَثْمَرَ وَآتُوا حَقَّهُ يَوْمَ حَصَادِهِ ۖ وَلَا تُسْرِفُوا ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُسْرِفِينَ ١٤١

మరియు ఆయనే పందిళ్ళమీద ప్రాకే (ఎక్కించబడే) తీగలు మరియు పందిళ్ళమీద ప్రాకని (ఎక్కించబడని) చెట్ల తోటలు మరియు ఖర్జూరపు చెట్లు మరియు వివిధరకాల రుచిగల పంటలు మరియు ‘జైతూన్‌ (ఆలివు), దానిమ్మ చెట్లను పుట్టించాడు. అవి కొన్ని విషయాలలో ఒక దానితో ఒకటి పోలిఉంటాయి, మరికొన్ని విషయా లలో ఒక దానితో ఒకటి పోలి ఉండవు. 92 వాటికి ఫలాలువచ్చినపుడు వాటి ఫలాలనుతినండి. కానీ వాటి కోతదినమున (ఫలకాలంలో) వాటి హక్కు (‘జకాత్‌) చెల్లిచండి. 93 మరియు వృథాగా ఖర్చు చేయకండి. నిశ్చయంగా, ఆయన వృథా ఖర్చుచేసే వారంటే ఇష్టపడడు.

6:142 – وَمِنَ الْأَنْعَامِ حَمُولَةً وَفَرْشًا ۚ كُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّـهُ وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ ١٤٢

మరియు పశువులలో కొన్ని బరువు మోయటానికి, మరికొన్ని చిన్నవి (భారం మోయలేనివి) ఉన్నాయి. అల్లాహ్‌ మీకు జీవనోపాధికి ఇచ్చిన వాటిని తినండి. మరియు షై’తాన్‌ అడుగు జాడలలో నడవకండి. నిశ్చయంగా, వాడు మీకు బహిరంగ శత్రువు!

6:143 – ثَمَانِيَةَ أَزْوَاجٍ ۖ مِّنَ الضَّأْنِ اثْنَيْنِ وَمِنَ الْمَعْزِ اثْنَيْنِ ۗ قُلْ آلذَّكَرَيْنِ حَرَّمَ أَمِ الْأُنثَيَيْنِ أَمَّا اشْتَمَلَتْ عَلَيْهِ أَرْحَامُ الْأُنثَيَيْنِ ۖ نَبِّئُونِي بِعِلْمٍ إِن كُنتُمْ صَادِقِينَ ١٤٣

(పెంటి-పోతు కలిసి) ఎనిమిది రకాలు (జతలు). 94 అందులో గొర్రెలలో నుండి రెండు (పెంటి-పోతు) మరియు మేకలలో నుండి రెండు (పెంటి-పోతు). వారిని అడుగు: ”ఏమీ? ఆయన నిషేధించింది, రెండు మగ వాటినా? లేక రెండు ఆడ వాటినా? లేక ఆరెండు ఆడవాటి గర్భాలలో ఉన్నవాటినా? 95 మీరు సత్యవంతులే అయితే, నాకు సరైన జ్ఞానంతో తెలుపండి.”

6:144 – وَمِنَ الْإِبِلِ اثْنَيْنِ وَمِنَ الْبَقَرِ اثْنَيْنِ ۗ قُلْ آلذَّكَرَيْنِ حَرَّمَ أَمِ الْأُنثَيَيْنِ أَمَّا اشْتَمَلَتْ عَلَيْهِ أَرْحَامُ الْأُنثَيَيْنِ ۖ أَمْ كُنتُمْ شُهَدَاءَ إِذْ وَصَّاكُمُ اللَّـهُ بِهَـٰذَا ۚ فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّـهِ كَذِبًا لِّيُضِلَّ النَّاسَ بِغَيْرِ عِلْمٍ ۗ إِنَّ اللَّـهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ ١٤٤

”మరియు ఒంటెలలో రెండు (పెంటి-పోతు) 96 మరియు ఆవులలో రెండు (పెంటి-పోతు).” వారిని అడుగు: ”ఏమీ? ఆయన నిషేధించింది, రెండు మగవాటినా లేక రెండు ఆడవాటినా? లేక ఆ రెండింటి గర్భాలలో ఉన్న వాటినా? అల్లాహ్‌ ఈ విధంగా ఆజ్ఞాపించినపుడు, మీరు సాక్షులుగా ఉంటిరా? లేకపోతే! జ్ఞానం లేకుండా ప్రజలను పెడమార్గం పట్టించటానికి అల్లాహ్‌ పేరుతో అబద్ధాన్ని కల్పించే వ్యక్తికంటే మించిన దుర్మార్గుడెవడు? నిశ్చయంగా, అల్లాహ్‌ దుర్మార్గులకు సన్మార్గం చూపడు.”

6:145 – قُل لَّا أَجِدُ فِي مَا أُوحِيَ إِلَيَّ مُحَرَّمًا عَلَىٰ طَاعِمٍ يَطْعَمُهُ إِلَّا أَن يَكُونَ مَيْتَةً أَوْ دَمًا مَّسْفُوحًا أَوْ لَحْمَ خِنزِيرٍ فَإِنَّهُ رِجْسٌ أَوْ فِسْقًا أُهِلَّ لِغَيْرِ اللَّـهِ بِهِ ۚ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَإِنَّ رَبَّكَ غَفُورٌ رَّحِيمٌ ١٤٥

(ఓ ప్రవక్తా!) వారికి తెలుపు: ”నాపై అవత రింపజేయబడిన దివ్యజ్ఞానంలో (వ’హీలో): ఆహార పదార్థాలలో చచ్చిన జంతువు, కారిన రక్తం, పంది మాంసం – ఎందుకంటే అది అపరిశుద్ధమైనది (రిజ్స్‌); లేక అల్లాహ్ కు అవిధేయతకు పాల్పడి – ఆయన పేరుతో గాక – ఇతరుల పేరుతో కోయ బడిన జంతువు తప్ప, ఇతర వాటిని తినటాన్ని నిషేధించబడినట్లు నేను చూడలేదు. కాని ఎవడైనా గత్యంతరం లేని పరిస్థితులలో దుర్నీతికి ఒడిగట్ట కుండా, ఆవశ్యకత వలన, హద్దులు మీరకుండా (తింటే) నీ ప్రభువు నిశ్చయంగా, క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. 97

6:146 – وَعَلَى الَّذِينَ هَادُوا حَرَّمْنَا كُلَّ ذِي ظُفُرٍ ۖ وَمِنَ الْبَقَرِ وَالْغَنَمِ حَرَّمْنَا عَلَيْهِمْ شُحُومَهُمَا إِلَّا مَا حَمَلَتْ ظُهُورُهُمَا أَوِ الْحَوَايَا أَوْ مَا اخْتَلَطَ بِعَظْمٍ ۚ ذَٰلِكَ جَزَيْنَاهُم بِبَغْيِهِمْ ۖ وَإِنَّا لَصَادِقُونَ ١٤٦

”మరియు యూద మతం అవలంబించిన వారికి మేము గోళ్ళు ఉన్న అన్ని జంతువులను నిషేధించాము. 98 మరియు వారికి ఆవు మరియు మేకలలో, వాటి వీపులకు లేదా ప్రేగులకు తగిలి వున్న మరియు ఎముకలలో మిశ్రమమై ఉన్న క్రొవ్వు తప్ప, మిగతా (క్రొవ్వును) నిషేధించాము. ఇది వారి అక్రమాలకు విధించిన శిక్ష. మరియు నిశ్చయంగా, మేము సత్యవంతులము!”

6:147 – فَإِن كَذَّبُوكَ فَقُل رَّبُّكُمْ ذُو رَحْمَةٍ وَاسِعَةٍ وَلَا يُرَدُّ بَأْسُهُ عَنِ الْقَوْمِ الْمُجْرِمِينَ ١٤٧

(ఓ ము’హమ్మద్‌!) ఒకవేళ వారు నిన్ను అసత్యుడవని తిరస్కరిస్తే! 99 నీవు వారితో ఇలా అను: ”మీ ప్రభువు కారుణ్యపరిధి సువిశాలమైనది, కాని ఆయన శిక్ష పాపిష్ఠి ప్రజలపై పడకుండా నివారించబడదు.”

6:148 – سَيَقُولُ الَّذِينَ أَشْرَكُوا لَوْ شَاءَ اللَّـهُ مَا أَشْرَكْنَا وَلَا آبَاؤُنَا وَلَا حَرَّمْنَا مِن شَيْءٍ ۚ كَذَٰلِكَ كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ حَتَّىٰ ذَاقُوا بَأْسَنَا ۗ قُلْ هَلْ عِندَكُم مِّنْ عِلْمٍ فَتُخْرِجُوهُ لَنَا ۖ إِن تَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَإِنْ أَنتُمْ إِلَّا تَخْرُصُونَ ١٤٨

అల్లాహ్‌కు సాటి (భాగస్వాములు) కల్పించే వారు అంటారు: ”ఒకవేళ అల్లాహ్‌ కోరితే మేముగానీ, మా తండ్రి-తాతలుగానీ ఆయనకు సాటికల్పించేవారమూ కాము మరియు దేనినీ నిషేధించి ఉండేవారమూ కాము.” వారికి పూర్వం వారు కూడా మా శిక్షను రుచిచూడనంత వరకు ఇదేవిధంగా తిరస్కరించారు. వారిని అడుగు: ”మీ వద్ద ఏదైనా (రూఢి అయిన) జ్ఞానం ఉందా! ఉంటే మా ముందు పెట్టండి. మీరు కేవలం కల్పనలను అనుసరిస్తున్నారు. మరియు మీరు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు.”

6:149 – قُلْ فَلِلَّـهِ الْحُجَّةُ الْبَالِغَةُ ۖ فَلَوْ شَاءَ لَهَدَاكُمْ أَجْمَعِينَ ١٤٩

ఇలా అను: ”రూఢి అయిన ప్రమాణం అల్లాహ్‌ వద్దనే ఉంది. ఆయన గనక తలచుకుని ఉంటే మీ అందరికీ సన్మార్గం చూపి ఉండేవాడు.”

6:150 – قُلْ هَلُمَّ شُهَدَاءَكُمُ الَّذِينَ يَشْهَدُونَ أَنَّ اللَّـهَ حَرَّمَ هَـٰذَا ۖ فَإِن شَهِدُوا فَلَا تَشْهَدْ مَعَهُمْ ۚ وَلَا تَتَّبِعْ أَهْوَاءَ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَالَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ وَهُم بِرَبِّهِمْ يَعْدِلُونَ ١٥٠

(ఇంకా) ఇలా అను: ” ‘నిశ్చయంగా, అల్లాహ్‌ ఈ వస్తువులను నిషేధించాడు.’ అని సాక్ష్యమిచ్చే మీ సాక్షులను తీసుకొనిరండి.” ఒకవేళ వారు అలా సాక్ష్యమిస్తే, నీవు వారితో కలిసి సాక్ష్య మివ్వకు. మరియు మా సూచనలను అసత్యాలని తిరస్కరించేవారి మరియు పరలోకమునందు విశ్వాసంలేనివారి మరియు ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా నిలబెట్టేవారి మనో వాంఛలను నీవు ఏ మాత్రం అనుసరించకు! (3/8)

6:151 – قُلْ تَعَالَوْا أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ ۖ أَلَّا تُشْرِكُوا بِهِ شَيْئًا ۖ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا ۖ وَلَا تَقْتُلُوا أَوْلَادَكُم مِّنْ إِمْلَاقٍ ۖ نَّحْنُ نَرْزُقُكُمْ وَإِيَّاهُمْ ۖ وَلَا تَقْرَبُوا الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ ۖ وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّـهُ إِلَّا بِالْحَقِّ ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ ١٥١

ఇలా అను: ”రండి మీ ప్రభువు మీకు నిషేధించివున్న వాటిని మీకు వినిపిస్తాను: ‘మీరు ఆయనకు ఎలాంటి సాటి (భాగస్వాములను) కల్పించకండి. 100 మరియు తల్లి-దండ్రులతో మంచిగా ప్రవర్తించండి. మరియు పేదరికానికి భయపడి మీ సంతానాన్ని చంపకండి. 101 మేమే మీకూ మరియు వారికి కూడా జీవనోపాధిని ఇచ్చే వారము. మరియు బహిరంగంగా గానీ, లేదా దొంగచాటుగా గానీ అశ్లీలమైన (సిగ్గుమాలిన) పనులను సమీపించకండి. అల్లాహ్‌ నిషేధించిన ప్రాణిని, న్యాయం కొరకు తప్ప చంపకండి. 102 మీరు అర్థం చేసుకోవాలని, ఈ విషయాలను ఆయన మీకు ఆజ్ఞాపిస్తున్నాడు.

6:152 – وَلَا تَقْرَبُوا مَالَ الْيَتِيمِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ حَتَّىٰ يَبْلُغَ أَشُدَّهُ ۖ وَأَوْفُوا الْكَيْلَ وَالْمِيزَانَ بِالْقِسْطِ ۖ لَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۖ وَإِذَا قُلْتُمْ فَاعْدِلُوا وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ ۖ وَبِعَهْدِ اللَّـهِ أَوْفُوا ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَذَكَّرُونَ ١٥٢

‘మరియు అనాథుడు తన యుక్త వయస్సుకు చేరనంత వరకు అతని ఆస్తిని, బాగుపరచటానికి తప్ప ఇతర ఉద్దేశ్యంతో సమీపించకండి. కొలవటంలో మరియు తూచటంలో న్యాయాన్ని పాటించండి. ఏ ప్రాణిపై గూడా మేము దాని శక్తికి మించిన భారాన్ని మోపము. పలికితే న్యాయమే పలకండి, అది మీ దగ్గరి బంధువుకు (ప్రతికూలమైనది) అయినా సరే! అల్లాహ్‌తో చేసిన ఒడంబడికను పూర్తి చేయండి. మీరు హితోపదేశం స్వీకరించాలని ఆయన మీకు ఈ విషయాలను ఆజ్ఞాపిస్తున్నాడు.

6:153 – وَأَنَّ هَـٰذَا صِرَاطِي مُسْتَقِيمًا فَاتَّبِعُوهُ ۖ وَلَا تَتَّبِعُوا السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَن سَبِيلِهِ ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَتَّقُونَ ١٥٣

‘మరియు నిశ్చయంగా ఇదే బుజుమార్గం కావున మీరు దీనినే అనుసరించండి. ఇతర మార్గాలను అనురించకండి. అవి మిమ్మల్ని ఆయన మార్గం నుండి తప్పిస్తాయి. మీరు భయ-భక్తులు కలిగి ఉండాలని ఆయన మిమ్మల్ని ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు.’ ”

6:154 – ثُمَّ آتَيْنَا مُوسَى الْكِتَابَ تَمَامًا عَلَى الَّذِي أَحْسَنَ وَتَفْصِيلًا لِّكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً لَّعَلَّهُم بِلِقَاءِ رَبِّهِمْ يُؤْمِنُونَ ١٥٤

తరువాత మేము మూసాకు – సజ్జనుల పై మా అనుగ్రహాన్ని పూర్తిచేయటానికి, ప్రతి విషయాన్ని వివరించటానికి మరియు మార్గదర్శ కత్వం మరియు కరుణను చూపటానికి మరియు వారు తమప్రభువును దర్శించవలసి ఉన్న దానిని విశ్వసించటానికి – గ్రంథాన్ని ప్రసాదించాము.

6:155 – وَهَـٰذَا كِتَابٌ أَنزَلْنَاهُ مُبَارَكٌ فَاتَّبِعُوهُ وَاتَّقُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ ١٥٥

మరియు ఇదేవిధంగా శుభప్రదమైన ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) అవతరింపజేశాము. కావున దీనిని అనుసరించి, భయ-భక్తులు కలిగి ఉంటే మీరు కరుణింపబడవచ్చు!

6:156 – أَن تَقُولُوا إِنَّمَا أُنزِلَ الْكِتَابُ عَلَىٰ طَائِفَتَيْنِ مِن قَبْلِنَا وَإِن كُنَّا عَن دِرَاسَتِهِمْ لَغَافِلِينَ ١٥٦

లేకుంటే మీరు (అరబ్బులు): ”వాస్తవానికి మాకు పూర్వం ఉన్న రెండు వర్గాల వారికి (యూదులకు మరియు క్రైస్తవులకు) గ్రంథం అవతరింపజేయబడింది, కాని వారు చదివేదేమిటో మేము ఎరుగము.” అని అంటారని!

6:157 – أَوْ تَقُولُوا لَوْ أَنَّا أُنزِلَ عَلَيْنَا الْكِتَابُ لَكُنَّا أَهْدَىٰ مِنْهُمْ ۚ فَقَدْ جَاءَكُم بَيِّنَةٌ مِّن رَّبِّكُمْ وَهُدًى وَرَحْمَةٌ ۚ فَمَنْ أَظْلَمُ مِمَّن كَذَّبَ بِآيَاتِ اللَّـهِ وَصَدَفَ عَنْهَا ۗ سَنَجْزِي الَّذِينَ يَصْدِفُونَ عَنْ آيَاتِنَا سُوءَ الْعَذَابِ بِمَا كَانُوا يَصْدِفُونَ ١٥٧

లేదా మీరు: “ఒకవేళ నిశ్చయంగా, మాపై గ్రంథం అవతరింపజేయబడి ఉంటే మేమూ వారి కంటే ఉత్తమ రీతిలో సన్మార్గం మీద నడిచి ఉండే వారము.” అని అంటారని. కాబట్టి వాస్తవానికి ఇప్పుడు మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు ఒక స్పష్టమైన ప్రమాణం, మార్గదర్శకత్వం మరియు కారుణ్యం (ఈ ఖుర్ఆన్‌) వచ్చింది. ఇక అల్లాహ్‌ సూచనలను అసత్యాలని పలికేవాడికంటే, వాటి పట్ల వైముఖ్యం ప్రదర్శించే వాడికంటే, మించిన దుర్మార్గుడెవడు? కాబట్టి మా సూచనల పట్ల విముఖత చూపేవారికి, వారి ఈ వైముఖ్యానికి ఫలితంగా భయంకరమైన శిక్ష విధిస్తాము.

6:158 – هَلْ يَنظُرُونَ إِلَّا أَن تَأْتِيَهُمُ الْمَلَائِكَةُ أَوْ يَأْتِيَ رَبُّكَ أَوْ يَأْتِيَ بَعْضُ آيَاتِ رَبِّكَ ۗ يَوْمَ يَأْتِي بَعْضُ آيَاتِ رَبِّكَ لَا يَنفَعُ نَفْسًا إِيمَانُهَا لَمْ تَكُنْ آمَنَتْ مِن قَبْلُ أَوْ كَسَبَتْ فِي إِيمَانِهَا خَيْرًا ۗ قُلِ انتَظِرُوا إِنَّا مُنتَظِرُونَ ١٥٨

ఏమీ? వారు తమ వద్దకు దేవదూతలు రావాలని గానీ, లేక నీ ప్రభువు రావాలని గానీ, లేదా నీ ప్రభువుయొక్క కొన్ని (బహిరంగ) నిదర్శ నాలు రావాలని గానీ ఎదురు చూస్తున్నారా? నీ ప్రభువు యొక్క కొన్ని (బహిరంగ) నిదర్శనాలు వచ్చేరోజున, పూర్వం విశ్వసించకుండా, ఆరోజున విశ్వసించిన వ్యక్తికీ లేదా విశ్వసించి కూడా ఏ మంచినీ సంపాదించుకోని వ్యక్తికీ, తన విశ్వాసం వల్ల (ఆ రోజు) ఏ ప్రయో జనం చేకూరదు. వారితో ఇలా అను: ”మీరు నిరీక్షించండి. నిశ్చయంగా, మేము కూడా నిరీక్షిస్తాము.” 103

6:159 – إِنَّ الَّذِينَ فَرَّقُوا دِينَهُمْ وَكَانُوا شِيَعًا لَّسْتَ مِنْهُمْ فِي شَيْءٍ ۚ إِنَّمَا أَمْرُهُمْ إِلَى اللَّـهِ ثُمَّ يُنَبِّئُهُم بِمَا كَانُوا يَفْعَلُونَ ١٥٩

నిశ్చయంగా, ఎవరైతే తమ ధర్మంలో విభేదాలు కల్పించుకొని, వేర్వేరు తెగలుగా చీలి పోయారో, వారితో నీకు ఎలాంటి సంబంధంలేదు. నిశ్చయంగా, వారి వ్యవహారం అల్లాహ్‌ ఆధీనంలో ఉంది. తరువాత ఆయనే వారు చేస్తూవున్న కర్మలను గురించి వారికి తెలుపుతాడు. 104

6:160 – مَن جَاءَ بِالْحَسَنَةِ فَلَهُ عَشْرُ أَمْثَالِهَا ۖ وَمَن جَاءَ بِالسَّيِّئَةِ فَلَا يُجْزَىٰ إِلَّا مِثْلَهَا وَهُمْ لَا يُظْلَمُونَ ١٦٠

ఎవడు ఒక సత్కార్యంచేస్తాడో అతనికి, దానికి పదిరెట్లు ప్రతిఫలం ఉంటుంది. మరియు ఎవడు ఒక పాప కార్యం చేస్తాడో, అతనికి దానంతటి శిక్షయే ఉంటుంది. మరియు వారి కెలాంటి అన్యాయం జరుగదు. 105

6:161 – قُلْ إِنَّنِي هَدَانِي رَبِّي إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ دِينًا قِيَمًا مِّلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۚ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ ١٦١

వారితో ఇలా అను: ”నిశ్చయంగా, నా ప్రభువు నాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శ కత్వం చేశాడు. అదే సరైనధర్మం. ఏకదైవ సిధ్ధాంత మైన ఇబ్రాహీమ్‌ ధర్మం. అతను అల్లాహ్‌కు సాటికల్పించేవారిలో చేరినవాడు కాడు!”

6:162 – قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّـهِ رَبِّ الْعَالَمِينَ ١٦٢

(ఇంకా) ఇలా అను: ”నిశ్చయంగా, నా నమా’జ్‌, నా బలి (ఖుర్బానీ), 106 నా జీవితం మరియు నా మరణం, సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్‌ కొరకే!

6:163 – لَا شَرِيكَ لَهُ ۖ وَبِذَٰلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ الْمُسْلِمِينَ ١٦٣

”ఆయనకు ఎలాంటి భాగస్వామి (సాటి) లేడు. మరియునేను ఇదేవిధంగా ఆదేశించబడ్డాను మరియు నేను అల్లాహ్‌కు విధేయుడను(ముస్లింను) అయిన వారిలో మొట్ట మొదటి వాడను!” 107

6:164 – قُلْ أَغَيْرَ اللَّـهِ أَبْغِي رَبًّا وَهُوَ رَبُّ كُلِّ شَيْءٍ ۚ وَلَا تَكْسِبُ كُلُّ نَفْسٍ إِلَّا عَلَيْهَا ۚ وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۚ ثُمَّ إِلَىٰ رَبِّكُم مَّرْجِعُكُمْ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ ١٦٤

ఇలా అను: ”ఏమీ? నేను అల్లాహ్‌ను వదలి ఇతరులను ప్రభువులుగా అర్థించాలా? ఆయనే ప్రతిదానికీ ప్రభువు! ప్రతివ్యక్తి తాను సంపాదించిందే అనుభవిస్తాడు. మరియు బరువు మోసేవాడు ఎవ్వడూ ఇతరుల బరువును మోయడు. 108 చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు ఏ విషయాలను గురించి భేదాభిప్రాయాలు కలిగి ఉండేవారో వాటిని మీకు తెలియజేస్తాడు.”

6:165 – وَهُوَ الَّذِي جَعَلَكُمْ خَلَائِفَ الْأَرْضِ وَرَفَعَ بَعْضَكُمْ فَوْقَ بَعْضٍ دَرَجَاتٍ لِّيَبْلُوَكُمْ فِي مَا آتَاكُمْ ۗ إِنَّ رَبَّكَ سَرِيعُ الْعِقَابِ وَإِنَّهُ لَغَفُورٌ رَّحِيمٌ ١٦٥

మరియు ఆయనే మిమ్మల్ని భూమిమీద ఉత్తరాధికారులుగా నియమించి 109 – మీ కిచ్చిన దానితో మిమ్మల్నిపరీక్షించటానికి–మీలో కొందరికి మరికొందరిపై ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష విధించటంలో అతి శీఘ్రుడు, మరియు నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. (1/2)

సూరహ్‌ అల్‌-అ’అరాఫ్‌ – ఈ సూరహ్‌ మక్కహ్ చివరి సంవత్సరంలో, సూరహ్‌ అల్‌-అన్‌’ఆమ్‌ (6) కంటే ముందు అవత రింపజేయబడింది. అల్‌-అ’అరాఫు, అంటే ఎత్తైనప్రదేశాలు అని అర్థం. స్వర్గ-నరకాల మధ్య ఉన్న గోడమీది స్థలాన్ని అల్‌-అ’అరాఫు అంటారు. ఈ సూరహ్‌లో ఆదమ్‌ మరియు అతని భార్య ‘హవ్వా (‘అలైహిమ్‌ స.)ల గాథ ఉంది (ఆయత్‌లు 19-25). నూ’హ్‌, హూద్‌, ‘సాలి’హ్‌, లూ’త్‌, షు’ఐబ్‌ మరియు మూసా (‘అలైహిమ్‌ స.)ల గాథలు కూడా ఉన్నాయి. ”మరియు చివరి ప్రవక్త ము’హమ్మద్‌ (‘స’అస), కేవలం శుభవార్తలు ఇచ్చేవారు, హెచ్చరిక చేసేవారు, అల్లాహ్‌ (సు.త.) యొక్క దాసులు మరియు అతనికి (‘స’అస) ఏవిధమైన అగోచర జ్ఞానం గానీ, అప్రకృతిక, అద్భుత శక్తులు గానీ లేవు”, అని ఆయత్‌ 188లో వివరించబడింది. ము’హమ్మద్‌ (‘స’అస), అల్లాహుత’ఆలాను మాత్రమే ఆరాధించటానికి ఎన్నడూ అహంభావం చూపలేదు. (ఆయత్‌ 206). ఈ సూరహ్ పేరు 46వ ఆయత్‌ నుండి తీసుకోబడింది. ఇందులో 206 ఆయాతులున్నాయి.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 7:1 – المص ١

అలిఫ్‌ -లామ్‌ -మీమ్‌ -‘సాద్‌!

7:2 – كِتَابٌ أُنزِلَ إِلَيْكَ فَلَا يَكُن فِي صَدْرِكَ حَرَجٌ مِّنْهُ لِتُنذِرَ بِهِ وَذِكْرَىٰ لِلْمُؤْمِنِينَ ٢

(ఓ ము’హమ్మద్‌!) ఈ గ్రంథం నీపై అవత రింపజేయబడింది. కావున దీనిని గురించి నీ హృదయంలో ఏవిధమైన సంకోచం ఉండనివ్వకు; ఇది నీవు (సన్మార్గం నుండి తప్పే వారికి) హెచ్చరిక చేయటానికి (అవతరింపజేయబడింది); మరియు ఇది విశ్వాసులకొక హితోపదేశం.

7:3 – اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۗ قَلِيلًا مَّا تَذَكَّرُونَ ٣

(ప్రజలారా!) మీ ప్రభువు తరఫు నుండి మీ కొరకు అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్‌ఆన్‌ను) అనుసరించండి. మరియు ఆయన (అల్లాహ్‌)ను కాదని ఇతర స్నేహితులను (సహాయకులను) అనుసరించకండి. మీరు ఎంతో తక్కువగా ఈ హితబోధను స్వీకరిస్తున్నారు!

7:4 – وَكَم مِّن قَرْيَةٍ أَهْلَكْنَاهَا فَجَاءَهَا بَأْسُنَا بَيَاتًا أَوْ هُمْ قَائِلُونَ ٤

మరియు మేము ఎన్నో నగరాలను (వాటి నేరాలకు గాను) నాశనం చేశాము. వారిపై, మాశిక్ష (అకస్మాత్తుగా) రాత్రివేళలో గానీ, లేదా మధ్యాహ్నం వారు విశ్రాంతి తీసుకునే సమయంలో గానీ వచ్చిపడింది.

7:5 – فَمَا كَانَ دَعْوَاهُمْ إِذْ جَاءَهُم بَأْسُنَا إِلَّا أَن قَالُوا إِنَّا كُنَّا ظَالِمِينَ ٥

వారిపై మా శిక్ష పడినప్పుడు వారి రోదన: ”నిశ్చయంగా, మేము అపరాధులుగా ఉండే వారం!” అని అనడం తప్ప మరేమీ లేకుండింది. 1

7:6 – فَلَنَسْأَلَنَّ الَّذِينَ أُرْسِلَ إِلَيْهِمْ وَلَنَسْأَلَنَّ الْمُرْسَلِينَ ٦

కావున మేము ఎవరి వద్దకు మా సందేశాన్ని (ప్రవక్తను) పంపామో, వారిని తప్పక ప్రశ్నిస్తాము. మరియు నిశ్చయంగా ప్రవక్తలను కూడా ప్రశ్నిస్తాము. 2

7:7 – فَلَنَقُصَّنَّ عَلَيْهِم بِعِلْمٍ ۖ وَمَا كُنَّا غَائِبِينَ ٧

అప్పుడు (జరిగిందంతా) వారికి పూర్తి జ్ఞానంతో వివరిస్తాము. ఎందుకంటే మేము (ఎక్కడనూ, ఎప్పుడునూ) లేకుండా లేము. 3

7:8 – وَالْوَزْنُ يَوْمَئِذٍ الْحَقُّ ۚ فَمَن ثَقُلَتْ مَوَازِينُهُ فَأُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ٨

మరియు ఆరోజు (కర్మల)తూకం న్యాయంగా జరుగుతుంది. కావున ఎవరి తూనికలు బరువుగా ఉంటాయో అలాంటివారే సఫలీకృతులు. 4

7:9 – وَمَنْ خَفَّتْ مَوَازِينُهُ فَأُولَـٰئِكَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُم بِمَا كَانُوا بِآيَاتِنَا يَظْلِمُونَ ٩

మరియు ఎవరి తూనికలు తేలికగా ఉంటా యో అలాంటివారే తమను తాము నష్టానికి గురి చేసుకున్నవారు. 5 ఎందుకంటే, వారు మా సూచ నలను దుర్మార్గంతో తిరస్కరిస్తూ ఉండేవారు.

7:10 – وَلَقَدْ مَكَّنَّاكُمْ فِي الْأَرْضِ وَجَعَلْنَا لَكُمْ فِيهَا مَعَايِشَ ۗ قَلِيلًا مَّا تَشْكُرُونَ ١٠

మరియు వాస్తవానికి మేము మిమ్మల్ని భూమిలో స్థిరపరిచాము మరియు అందులో మీకు జీవనవసతులను కల్పించాము. (అయినా) మీరు కృతజ్ఞత చూపేది చాలా తక్కువ.

7:11 – وَلَقَدْ خَلَقْنَاكُمْ ثُمَّ صَوَّرْنَاكُمْ ثُمَّ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ لَمْ يَكُن مِّنَ السَّاجِدِينَ ١١

మరియు వాస్తవానికి మేము మిమ్మల్ని సృష్టించాము, పిదప మీ రూపాన్ని తీర్చిదిద్దాము. ఆ పిదప దైవదూతలను: ”మీరు ఆదమ్‌కు సాష్టాంగం (సజ్దా) చేయండి!” అని ఆదేశించగా, ఒక్క ఇబ్లీస్‌ తప్ప అందరూ సాష్టాంగం (సజ్దా) చేశారు, అతడు సాష్టాంగం చేసేవారిలో చేరలేదు. 6

7:12 – قَالَ مَا مَنَعَكَ أَلَّا تَسْجُدَ إِذْ أَمَرْتُكَ ۖ قَالَ أَنَا خَيْرٌ مِّنْهُ خَلَقْتَنِي مِن نَّارٍ وَخَلَقْتَهُ مِن طِينٍ ١٢

(అప్పుడు అల్లాహ్‌) అన్నాడు: ”(ఓ ఇబ్లీస్!) నేను ఆజ్ఞాపించినప్పటికీ, సాష్టాంగం చేయ కుండా నిన్ను ఆపింది ఏమిటీ?” దానికి (ఇబ్లీస్‌): ”నేను అతనికంటే శ్రేష్ఠుడను. నీవు నన్ను అగ్నితో సృష్టించావు మరియు అతనిని నీవు మట్టితో సృష్టించావు.” అని జవాబిచ్చాడు. 7

7:13 – قَالَ فَاهْبِطْ مِنْهَا فَمَا يَكُونُ لَكَ أَن تَتَكَبَّرَ فِيهَا فَاخْرُجْ إِنَّكَ مِنَ الصَّاغِرِينَ ١٣

(అప్పుడు అల్లాహ్‌) ఆజ్ఞాపించాడు: ”నీ విక్కడినుండి దిగిపో! ఇక్కడ గర్వపడటం నీకు తగదు, కావున వెళ్ళిపో! నిశ్చయంగా, నీవు నీచులలో చేరావు!”

7:14 – قَالَ أَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ ١٤

(ఇబ్లీస్‌) ఇలా వేడుకున్నాడు: ”వారు తిరిగి లేపబడే (పునరుత్థాన) దినంవరకు నాకు వ్యవధి నివ్వు!”

7:15 – قَالَ إِنَّكَ مِنَ الْمُنظَرِينَ ١٥

(అల్లాహ్) సెలవిచ్చాడు: ”నిశ్చయంగా నీకు వ్యవధి ఇవ్వబడుతోంది!”

7:16 – قَالَ فَبِمَا أَغْوَيْتَنِي لَأَقْعُدَنَّ لَهُمْ صِرَاطَكَ الْمُسْتَقِيمَ ١٦

(దానికి ఇబ్లీస్‌) అన్నాడు: ”నీవు నన్ను మార్గభ్రష్టత్వంలోవేసినట్లు, నేనుకూడా వారికొరకు నీ ఋజు మార్గంపై మాటువేసి కూర్చుంటాను!

7:17 – ثُمَّ لَآتِيَنَّهُم مِّن بَيْنِ أَيْدِيهِمْ وَمِنْ خَلْفِهِمْ وَعَنْ أَيْمَانِهِمْ وَعَن شَمَائِلِهِمْ ۖ وَلَا تَجِدُ أَكْثَرَهُمْ شَاكِرِينَ ١٧

”తరువాత నేను వారి ముందు నుండి, వారి వెనుక నుండి, వారి కుడివైపు నుండి మరియు వారి ఎడమవైపు నుండి, వారివైపుకు వస్తూ ఉంటాను. మరియు వారిలో అనేకులను నీవు కృతజ్ఞులుగా పొందవు!” 8

7:18 – قَالَ اخْرُجْ مِنْهَا مَذْءُومًا مَّدْحُورًا ۖ لَّمَن تَبِعَكَ مِنْهُمْ لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنكُمْ أَجْمَعِينَ ١٨

(అల్లాహ్‌) జవాబిచ్చాడు: ”నీవిక్కడి నుండి అవమానింపబడి, బహిష్కృతుడవై వెళ్ళిపో! వారిలో ఎవరైతే నిన్ను అనుసరిస్తారో! అలాంటి మీవారి అందరితో నిశ్చయంగా, నేను నరకాన్ని నింపుతాను.”

7:19 – وَيَا آدَمُ اسْكُنْ أَنتَ وَزَوْجُكَ الْجَنَّةَ فَكُلَا مِنْ حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَـٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ ١٩

మరియు: ”ఓ ఆదమ్‌! నీవు మరియు నీ భార్య ఈ స్వర్గంలో ఉండండి. మరియు మీరిద్దరూ మీ ఇచ్ఛానుసారంగా దీనిలో (ఫలాలను) తినండి, కాని ఈ వృక్షాన్ని సమీపించకండి! 9 అలాచేస్తే మీరు దుర్మార్గులలో చేరిపోతారు.”

7:20 – فَوَسْوَسَ لَهُمَا الشَّيْطَانُ لِيُبْدِيَ لَهُمَا مَا وُورِيَ عَنْهُمَا مِن سَوْآتِهِمَا وَقَالَ مَا نَهَاكُمَا رَبُّكُمَا عَنْ هَـٰذِهِ الشَّجَرَةِ إِلَّا أَن تَكُونَا مَلَكَيْنِ أَوْ تَكُونَا مِنَ الْخَالِدِينَ ٢٠

ఆ పిదప షై’తాన్‌ వారిద్దరి చూపులకు మరుగుగా ఉన్న వారిద్దరి మర్మాంగాలను వారికి బహిర్గతం చేయటానికి, రహస్యంగా వారి చెవులలో అన్నాడు: ”మీరిద్దరూ దైవదూతలు అయిపోతారని, లేదా మీరిద్దరూ శాశ్వత జీవితాన్ని పొందుతారని మీ ప్రభువు, మీ ఇద్దరినీ ఈ వృక్షం నుండి నివారించాడు!” 10

7:21 – وَقَاسَمَهُمَا إِنِّي لَكُمَا لَمِنَ النَّاصِحِينَ ٢١

మరియు (షై’తాన్‌) వారిద్దరితో ప్రమాణం చేస్తూ పలికాడు: ”నిశ్చయంగా, నేను మీ ఇద్దరి శ్రేయోభిలాషిని!”

7:22 – فَدَلَّاهُمَا بِغُرُورٍ ۚ فَلَمَّا ذَاقَا الشَّجَرَةَ بَدَتْ لَهُمَا سَوْآتُهُمَا وَطَفِقَا يَخْصِفَانِ عَلَيْهِمَا مِن وَرَقِ الْجَنَّةِ ۖ وَنَادَاهُمَا رَبُّهُمَا أَلَمْ أَنْهَكُمَا عَن تِلْكُمَا الشَّجَرَةِ وَأَقُل لَّكُمَا إِنَّ الشَّيْطَانَ لَكُمَا عَدُوٌّ مُّبِينٌ ٢٢

ఈ విధంగా వారిద్దరిని మోసపుచ్చి, తన (పన్నుగడ) వైపునకు త్రిప్పుకున్నాడు. వా రిద్దరూ ఆ వృక్షమును (ఫలమును) రుచిచూడ గానే వారిద్దరి మర్మాంగాలు వారికి బహిర్గత మయ్యాయి. అప్పుడు వారు తమపై (శరీరాలపై) స్వర్గపు ఆకులను కప్పుకోసాగారు. మరియు వారి ప్రభువు వారిద్దరినీ పిలిచి అన్నాడు: ”ఏమి? నేను మీ ఇద్దరినీ ఈ చెట్టు వద్దకు పోవద్దని నివారించ లేదా? మరియు నిశ్చయంగా, షై’తాన్‌ మీ ఇద్దరి యొక్క బహిరంగ శత్రువని చెప్పలేదా?”

7:23 – قَالَا رَبَّنَا ظَلَمْنَا أَنفُسَنَا وَإِن لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ ٢٣

వారిద్దరూ ఇలా విన్నవించుకున్నారు: ”ఓ మా ప్రభూ! మాకు మేము అన్యాయం చేసు కున్నాము. మరియు నీవు మమ్మల్ని కరుణించక పోతే! మమ్మల్ని క్షమించకపోతే! నిశ్చయంగా, మేము నాశనమైపోయే వారమవుతాము.” 11

7:24 – قَالَ اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَمَتَاعٌ إِلَىٰ حِينٍ ٢٤

(అల్లాహ్‌) అన్నాడు: ”మీరందరు దిగి పొండి! మీరు ఒకరికొకరు శత్రువులు అవుతారు. మరియు మీరందరికీ ఒకనిర్ణీతకాలం వరకు భూమి లో నివాసం మరియు జీవనోపాధి ఉంటాయి.”

7:25 – قَالَ فِيهَا تَحْيَوْنَ وَفِيهَا تَمُوتُونَ وَمِنْهَا تُخْرَجُونَ ٢٥

ఇంకా ఇలా అన్నాడు: ”మీరందరూ అందులోనే జీవిస్తారు మరియు అందులోనే మరణిస్తారు మరియు దాని నుండే మరల లేపబడతారు (పునరుత్థరింపబడతారు).”

7:26 – يَا بَنِي آدَمَ قَدْ أَنزَلْنَا عَلَيْكُمْ لِبَاسًا يُوَارِي سَوْآتِكُمْ وَرِيشًا ۖ وَلِبَاسُ التَّقْوَىٰ ذَٰلِكَ خَيْرٌ ۚ ذَٰلِكَ مِنْ آيَاتِ اللَّـهِ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ ٢٦

ఓ ఆదమ్‌ సంతానమా! వాస్తవానికి మేము మీ కొరకు వస్త్రాలను కల్పించాము, అవి మీ మర్మాంగాలను కప్పుతాయి మరియు మీకు అలంకారమిస్తాయి. మరియు దైవభీతియే అన్నిటి కంటే శ్రేష్ఠమైన వస్త్రం. ఇవి అల్లాహ్‌ సూచనలలో కొన్ని; బహుశా గుణపాఠం నేర్చుకుంటారేమోనని, (వీటిని మీకు వినిపిస్తున్నాము).

7:27 – يَا بَنِي آدَمَ لَا يَفْتِنَنَّكُمُ الشَّيْطَانُ كَمَا أَخْرَجَ أَبَوَيْكُم مِّنَ الْجَنَّةِ يَنزِعُ عَنْهُمَا لِبَاسَهُمَا لِيُرِيَهُمَا سَوْآتِهِمَا ۗ إِنَّهُ يَرَاكُمْ هُوَ وَقَبِيلُهُ مِنْ حَيْثُ لَا تَرَوْنَهُمْ ۗ إِنَّا جَعَلْنَا الشَّيَاطِينَ أَوْلِيَاءَ لِلَّذِينَ لَا يُؤْمِنُونَ ٢٧

ఓ ఆదమ్‌ సంతానమా! షైతాను మీ తల్లి-దండ్రుల నుండి (స్వర్గ) వస్త్రాలను తొలగించి, వారి మర్మాంగాలను వారికి కనబడేటట్లుచేసి, వారిని స్వర్గం నుండి వెడలగొట్టినట్లు మిమ్మల్ని కూడా ఆపదకు (ఫిత్నకు) గురిచేయకూడదు. నిశ్చయంగా వాడు మరియు వాని సంతతివారు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారు. కాని, మీరు వారిని చూడలేరు. నిశ్చయంగా, మేము షై’తాను లను, విశ్వసించని వారికి స్నేహితులుగా చేశాము.

7:28 – وَإِذَا فَعَلُوا فَاحِشَةً قَالُوا وَجَدْنَا عَلَيْهَا آبَاءَنَا وَاللَّـهُ أَمَرَنَا بِهَا ۗ قُلْ إِنَّ اللَّـهَ لَا يَأْمُرُ بِالْفَحْشَاءِ ۖ أَتَقُولُونَ عَلَى اللَّـهِ مَا لَا تَعْلَمُونَ ٢٨

మరియు వారు (అవిశ్వాసులు), ఏదైనా అశ్లీల మైన పని చేసినపుడు ఇలా అంటారు: ”మేము మా తండ్రి-తాతలను ఈ పద్దతినే అవలంబిస్తూ ఉండగా చూశాము. మరియు అలా చేయమని అల్లాహ్‌యే మమ్మల్ని ఆదేశించాడు.” వారితో అను: ”నిశ్చయంగా, అల్లాహ్‌ అశ్లీలమైన పనులు చేయమని ఎన్నడూ ఆదేశించడు. ఏమీ? మీకు తెలియని విషయాన్ని గురించి అల్లాహ్‌పై నిందలు వేస్తున్నారా?”

7:29 – قُلْ أَمَرَ رَبِّي بِالْقِسْطِ ۖ وَأَقِيمُوا وُجُوهَكُمْ عِندَ كُلِّ مَسْجِدٍ وَادْعُوهُ مُخْلِصِينَ لَهُ الدِّينَ ۚ كَمَا بَدَأَكُمْ تَعُودُونَ ٢٩

(ఓ ము’హమ్మద్‌! వారితో) ఇలా అను: ”నా ప్రభువు న్యాయాన్ని పాటించమని ఆదే శించాడు. మరియు మీరు ప్రతి మస్జిద్‌లో (నమా’జ్‌లో) మీ ముఖాలను సరిగ్గా (ఆయన వైపునకే) 12 మరల్చుకొని నమా’జ్‌ను పూర్తిశ్రధ్ధతో నిర్వహించండి మరియు ధర్మాన్ని / ఆరాధనను (దీన్‌ను) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకొని, ఆయనను మాత్రమే ప్రార్థించండి.” ఆయన మిమ్మల్ని మొదట సృష్టించి నట్లు మీరు తిరిగి సృష్టించబడతారు.

7:30 – فَرِيقًا هَدَىٰ وَفَرِيقًا حَقَّ عَلَيْهِمُ الضَّلَالَةُ ۗ إِنَّهُمُ اتَّخَذُوا الشَّيَاطِينَ أَوْلِيَاءَ مِن دُونِ اللَّـهِ وَيَحْسَبُونَ أَنَّهُم مُّهْتَدُونَ ٣٠

మీలో కొందరికి ఆయన సన్మార్గం చూపిం చాడు. మరికొందరు మార్గభ్రష్టత్వానికి గుర య్యారు. ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్‌ను వదలి షై’తానులను తమ స్నేహితులుగా చేసు కున్నారు మరియు నిశ్చయంగా, తామే సన్మార్గం పై ఉన్నామని భ్రమలో ఉన్నారు. (5/8)

7:31 – يَا بَنِي آدَمَ خُذُوا زِينَتَكُمْ عِندَ كُلِّ مَسْجِدٍ وَكُلُوا وَاشْرَبُوا وَلَا تُسْرِفُوا ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُسْرِفِينَ ٣١

13 తినండి త్రాగండి, కాని మితిమీర కండి. నిశ్చయంగా, ఆయన (అల్లాహ్‌) మితిమీరే వారిని ప్రేమించడు.

7:32 – قُلْ مَنْ حَرَّمَ زِينَةَ اللَّـهِ الَّتِي أَخْرَجَ لِعِبَادِهِ وَالطَّيِّبَاتِ مِنَ الرِّزْقِ ۚ قُلْ هِيَ لِلَّذِينَ آمَنُوا فِي الْحَيَاةِ الدُّنْيَا خَالِصَةً يَوْمَ الْقِيَامَةِ ۗ كَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ ٣٢

  1. ఇలా అను: ”అల్లాహ్‌ తన దాసుల కొరకు సృష్టించిన వస్త్రాలంకరణను మరియు మంచి జీవనోపాధిని నిషేధించేవాడెవడు?” (ఇంకా) ఇలా అను: ”ఇవి ఇహలోక జీవితంలో విశ్వాసుల కొరకే; పునరుత్థానదినమున ప్రత్యేకంగా వారి కొరకు మాత్రమే గలవు. 14 ఈవిధంగా మేము మాసూచన లను జ్ఞానంగలవారికి స్పష్టంగా వివరిస్తున్నాము.”

7:33 – قُلْ إِنَّمَا حَرَّمَ رَبِّيَ الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ وَالْإِثْمَ وَالْبَغْيَ بِغَيْرِ الْحَقِّ وَأَن تُشْرِكُوا بِاللَّـهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ سُلْطَانًا وَأَن تَقُولُوا عَلَى اللَّـهِ مَا لَا تَعْلَمُونَ ٣٣

ఇలా అను: ”నా ప్రభువు బహిరంగంగా గానీ, లేదా రహస్యంగా గానీ, అశ్లీల (అసహ్య కరమైన) కార్యాలను పాపకార్యాలను చేయటాన్ని మరియు దౌర్జన్యం చేయటాన్ని మరియు ఆయన (అల్లాహ్‌) అవతరింపజేసిన ప్రమాణం ఏదీ లేనిదే ఇతరులను అల్లాహ్‌కు సాటి (భాగస్వాములుగా) కల్పించటాన్ని మరియు మీకు జ్ఞానంలేనిదే ఏ విషయాన్ని అయినా అల్లాహ్‌పై మోపటాన్ని నిషేధించివున్నాడు.”

7:34 – وَلِكُلِّ أُمَّةٍ أَجَلٌ ۖ فَإِذَا جَاءَ أَجَلُهُمْ لَا يَسْتَأْخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ ٣٤

మరియు ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడిఉంది. కావున ఆ గడువు వచ్చి నపుడు, వారు ఒక ఘడియ వెనుకగానీ మరియు ముందుగానీ కాలేరు.

7:35 – يَا بَنِي آدَمَ إِمَّا يَأْتِيَنَّكُمْ رُسُلٌ مِّنكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ آيَاتِي ۙ فَمَنِ اتَّقَىٰ وَأَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ٣٥

ఓ ఆదమ్‌ సంతానమా! మీలోనుంచే మీ వద్దకు నా సూచనలను వినిపించే ప్రవక్తలు వచ్చినపుడు, ఎవరైతే దైవభీతి కలిగివుండి తమను తాము సరిదిద్దుకుంటారో, అలాంటి వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!

7:36 – وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَاسْتَكْبَرُوا عَنْهَا أُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٣٦

కాని ఎవరైతే మా సూచనలను అసత్యా లని నిరాకరించి, వాటి యెడల దురహంకారం చూపుతారో, అలాంటి వారు నరకాగ్నివాసులవు తారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

7:37 – فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّـهِ كَذِبًا أَوْ كَذَّبَ بِآيَاتِهِ ۚ أُولَـٰئِكَ يَنَالُهُمْ نَصِيبُهُم مِّنَ الْكِتَابِ ۖ حَتَّىٰ إِذَا جَاءَتْهُمْ رُسُلُنَا يَتَوَفَّوْنَهُمْ قَالُوا أَيْنَ مَا كُنتُمْ تَدْعُونَ مِن دُونِ اللَّـهِ ۖ قَالُوا ضَلُّوا عَنَّا وَشَهِدُوا عَلَىٰ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ ٣٧

ఇక అల్లాహ్‌పై అసత్యాలు కల్పించే వాని కంటే; లేదా ఆయన సూచనలను అసత్యాలని తిరస్కరించే వానికంటే మించిన దుర్మార్గుడెవడు? అలాంటి వారు తమ విధివ్రాత ప్రకారం తమ భాగ్యాన్ని పొందుతారు. తుదకు మేము పంపే దైవదూతలు వారి ప్రాణాలు తీయటానికి వారి వద్దకు వచ్చి: ”మీరు అల్లాహ్‌ను వదలి ప్రార్థించే వారు (ఆ దైవాలు) ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?” అని అడుగుతారు. వారిలా జవాబిస్తారు: ”వారు మమ్మల్ని వదిలిపోయారు.” మరియు ఈ విధంగా వారు: ”మేము నిజంగానే సత్య- తిరస్కారులమై ఉండేవారము.” అని, తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యమిచ్చు కుంటారు.

7:38 – قَالَ ادْخُلُوا فِي أُمَمٍ قَدْ خَلَتْ مِن قَبْلِكُم مِّنَ الْجِنِّ وَالْإِنسِ فِي النَّارِ ۖ كُلَّمَا دَخَلَتْ أُمَّةٌ لَّعَنَتْ أُخْتَهَا ۖ حَتَّىٰ إِذَا ادَّارَكُوا فِيهَا جَمِيعًا قَالَتْ أُخْرَاهُمْ لِأُولَاهُمْ رَبَّنَا هَـٰؤُلَاءِ أَضَلُّونَا فَآتِهِمْ عَذَابًا ضِعْفًا مِّنَ النَّارِ ۖ قَالَ لِكُلٍّ ضِعْفٌ وَلَـٰكِن لَّا تَعْلَمُونَ ٣٨

(అల్లాహ్‌) అంటాడు: ”మీకు పూర్వం గతించిన జిన్నాతుల మరియు మానవుల సమా జాలు పోయి చేరిన ఆ నరకాగ్నిలోకి ప్రవేశించండి.” ప్రతి సమాజం (నరకంలో) ప్రవేశించినపుడు తన పూర్వపువారిని (సమాజాన్ని) శపిస్తుంది. తుదకు వారంతా అక్కడ చేరిన పిదప; తరువాత వచ్చిన వారు తమకంటే ముందు వచ్చిన వారిని గురించి: ”ఓ మా ప్రభూ! వీరే మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసినవారు, కావున వీరికి రెట్టింపు నరకాగ్నిశిక్ష విధించు!” అని అంటారు. 16 దానికి (అల్లాహ్‌): ”ప్రతివాడికి రెట్టింపు (శిక్ష) విధించబడుతుంది, 17 కాని మీరది తెలుసుకోలేరు!” అని అంటాడు.

7:39 – وَقَالَتْ أُولَاهُمْ لِأُخْرَاهُمْ فَمَا كَانَ لَكُمْ عَلَيْنَا مِن فَضْلٍ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْسِبُونَ ٣٩

మరియు అప్పుడు మొదటి వారు తరువాత వచ్చినవారితో: ”మీకు మాపై ఎలాంటి ఆధిక్యత లేదు కావున మీరుకూడా మీ కర్మలకు బదులుగా శిక్షను చవిచూడండి!” అని అంటారు.

7:40 – إِنَّ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَاسْتَكْبَرُوا عَنْهَا لَا تُفَتَّحُ لَهُمْ أَبْوَابُ السَّمَاءِ وَلَا يَدْخُلُونَ الْجَنَّةَ حَتَّىٰ يَلِجَ الْجَمَلُ فِي سَمِّ الْخِيَاطِ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُجْرِمِينَ ٤٠

నిశ్చయంగా, మా సూచనలను అబద్ధాలని తిరస్కరించిన వారి కొరకు మరియు వాటిపట్ల దురహంకారం చూపినవారి కొరకు, ఆకాశ ద్వారాలు ఏ మాత్రం తెరువబడవు. మరియు ఒంటె సూదిబెజ్జంలో నుండి దూరిపోగలిగే వరకు వారు స్వర్గంలో ప్రవేశించజాలరు. మరియు ఈ విధంగా మేము అపరాధులకు ప్రతిఫలమిస్తాము.

7:41 – لَهُم مِّن جَهَنَّمَ مِهَادٌ وَمِن فَوْقِهِمْ غَوَاشٍ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الظَّالِمِينَ ٤١

నరకమే వారి పాన్పు మరియు వారి దుప్పటి అవుతుంది. మరియు ఈ విధంగా మేము దుర్మార్గులకు ప్రతిఫలమిస్తాము.

7:42 – وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا أُولَـٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٤٢

కాని, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటివ్యక్తికి మేము అతని శక్తికిమించిన భారం వేయము. ఇటువంటి వారే స్వర్గవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

7:43 – وَنَزَعْنَا مَا فِي صُدُورِهِم مِّنْ غِلٍّ تَجْرِي مِن تَحْتِهِمُ الْأَنْهَارُ ۖ وَقَالُوا الْحَمْدُ لِلَّـهِ الَّذِي هَدَانَا لِهَـٰذَا وَمَا كُنَّا لِنَهْتَدِيَ لَوْلَا أَنْ هَدَانَا اللَّـهُ ۖ لَقَدْ جَاءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّ ۖ وَنُودُوا أَن تِلْكُمُ الْجَنَّةُ أُورِثْتُمُوهَا بِمَا كُنتُمْ تَعْمَلُونَ ٤٣

మరియు మేము వారి హృదయాల నుండి పరస్పర ద్వేషభావాలను తొలగిస్తాము. వారి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు వారు ఇలాఅంటారు: ”మాకు ఇక్కడికి చేరటానికి సన్మా ర్గం చూపిన అల్లాహ్‌యే సర్వ స్తోత్రాలకు అర్హుడు. అల్లాహ్‌ మాకు ఈ సన్మార్గం చూపకపోతే మేము సన్మార్గం పొంది ఉండేవారం కాదు. మాప్రభువు పంపిన ప్రవక్తలు వాస్తవంగా సత్యాన్నే తీసుకు వచ్చారు!” అపుడువారికి ఒకవాణివినబడుతుంది: ”మీరు చేస్తూ ఉండిన సత్కార్యాలకు ఫలితంగా మీరు వారసులుగా చేయబడిన స్వర్గం ఇదే!”

7:44 – وَنَادَىٰ أَصْحَابُ الْجَنَّةِ أَصْحَابَ النَّارِ أَن قَدْ وَجَدْنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقًّا فَهَلْ وَجَدتُّم مَّا وَعَدَ رَبُّكُمْ حَقًّا ۖ قَالُوا نَعَمْ ۚ فَأَذَّنَ مُؤَذِّنٌ بَيْنَهُمْ أَن لَّعْنَةُ اللَّـهِ عَلَى الظَّالِمِينَ ٤٤

మరియు స్వర్గవాసులు, నరకవాసులను ఉద్దేశించి ఇలా అంటారు: ”మా ప్రభువు మాకు చేసిన వాగ్దానాన్ని మేము వాస్తవంగా, సత్యమైన దిగా పొందాము. ఏమీ? మీరు కూడా మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని సత్యమైనదిగా పొందారా?” వారు జవాబిస్తారు: ”అవును!” అప్పుడు ప్రకటించే వాడొకడు వారి మధ్య ఇలా ప్రకటిస్తాడు: ”దుర్మా ర్గులపై అల్లాహ్‌ శాపం (బహిష్కారం) ఉంది!”

7:45 – الَّذِينَ يَصُدُّونَ عَن سَبِيلِ اللَّـهِ وَيَبْغُونَهَا عِوَجًا وَهُم بِالْآخِرَةِ كَافِرُونَ ٤٥

ఎవరైతే (ప్రజలను) అల్లాహ్‌ మార్గం నుండి నిరోధిస్తారో మరియు అది తప్పుమార్గమని చూపగోరుతారో! అలాంటి వారే పరలోక జీవితాన్ని తిరస్కరించినవారు.

7:46 – وَبَيْنَهُمَا حِجَابٌ ۚ وَعَلَى الْأَعْرَافِ رِجَالٌ يَعْرِفُونَ كُلًّا بِسِيمَاهُمْ ۚ وَنَادَوْا أَصْحَابَ الْجَنَّةِ أَن سَلَامٌ عَلَيْكُمْ ۚ لَمْ يَدْخُلُوهَا وَهُمْ يَطْمَعُونَ ٤٦

మరియు ఆఉభయవర్గాల మధ్య ఒక అడ్డు తెర ఉంటుంది. 18 దాని ఎత్తైన ప్రదేశాల మీద కొందరు ప్రజలుంటారు. 19 వారు ప్రతి ఒక్కరినీ వారి గుర్తులను బట్టి తెలుసుకుంటారు. వారు స్వర్గవాసులను పిలిచి: “మీకు శాంతి కలుగు గాక (సలాం)!” అని అంటారు. వారు ఇంకా స్వర్గంలో ప్రవేశించ లేదు, కాని దానిని ఆశిస్తున్నారు. (3/4)

7:47 – وَإِذَا صُرِفَتْ أَبْصَارُهُمْ تِلْقَاءَ أَصْحَابِ النَّارِ قَالُوا رَبَّنَا لَا تَجْعَلْنَا مَعَ الْقَوْمِ الظَّالِمِينَ ٤٧

  • మరియు వారి దృష్టి నరకవాసుల వైపునకు మళ్ళించబడినపుడు వారు ఇలా అంటారు: ”ఓ మా ప్రభూ! మమ్మల్ని ఈ దుర్మార్గులతో చేర్చకు!”

7:48 – وَنَادَىٰ أَصْحَابُ الْأَعْرَافِ رِجَالًا يَعْرِفُونَهُم بِسِيمَاهُمْ قَالُوا مَا أَغْنَىٰ عَنكُمْ جَمْعُكُمْ وَمَا كُنتُمْ تَسْتَكْبِرُونَ ٤٨

మరియు ఎత్తైన ప్రదేశాలపై ఉన్నవారు వారిని (నరకవాసులను) వారి గుర్తుల ద్వారా గుర్తించి వారితో అంటారు: ”మీరు కూడబెట్టిన ఆస్తిపాస్తులు మరియు మీ దురహంకారాలు, మీకు ఏమైనా లాభం చేకూర్చాయా?

7:49 – أَهَـٰؤُلَاءِ الَّذِينَ أَقْسَمْتُمْ لَا يَنَالُهُمُ اللَّـهُ بِرَحْمَةٍ ۚ ادْخُلُوا الْجَنَّةَ لَا خَوْفٌ عَلَيْكُمْ وَلَا أَنتُمْ تَحْزَنُونَ ٤٩

” ‘వీరికి, అల్లాహ్‌ తన కారుణ్యాన్ని ఏమాత్రం ప్రసాదించడు.’ అని మీరు ప్రమాణాలు చేసి చెబుతూ ఉండేవారు, వీరేకదా? (చూడండి వారితో ఇలా అనబడింది): ‘మీరు స్వర్గంలో ప్రవేశించండి, మీకు ఎలాంటి భయమూ ఉండదు మరియు మీరు దుఃఖపడరు కూడా! ‘ ”

7:50 – وَنَادَىٰ أَصْحَابُ النَّارِ أَصْحَابَ الْجَنَّةِ أَنْ أَفِيضُوا عَلَيْنَا مِنَ الْمَاءِ أَوْ مِمَّا رَزَقَكُمُ اللَّـهُ ۚ قَالُوا إِنَّ اللَّـهَ حَرَّمَهُمَا عَلَى الْكَافِرِينَ ٥٠

  1. మరియు నరకవాసులు స్వర్గవాసులతో: ”కొద్ది నీళ్ళో లేక అల్లాహ్‌ మీకు ప్రసాదించిన ఆహారంలో నుండైనా కొంత మావైపుకు విసరండి.” అని అంటారు. (దానికి స్వర్గవాసులు): ”నిశ్చ యంగా, అల్లాహ్‌! ఈ రెండింటినీ సత్య-తిరస్కారు లకు నిషేధించి వున్నాడు.” 20 అని అంటారు.

7:51 – الَّذِينَ اتَّخَذُوا دِينَهُمْ لَهْوًا وَلَعِبًا وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا ۚ فَالْيَوْمَ نَنسَاهُمْ كَمَا نَسُوا لِقَاءَ يَوْمِهِمْ هَـٰذَا وَمَا كَانُوا بِآيَاتِنَا يَجْحَدُونَ ٥١

వీరే, వారు; ఎవరైతే తమ ధర్మాన్ని ఒక ఆటగా మరియు కాలక్షేపంగా చేసుకున్నారో. మరియు ఇహలోక జీవితం వారిని మోసానికి గురిచేసింది. (అల్లాహ్‌ ఇలా సెలవిస్తాడు): ”వారు ఈ నాటి సమావేశాన్ని మరచి, మా సూచనలను తిరస్కరించినట్లు, ఈ నాడు మేమూ వారిని మరచిపోతాము!”

7:52 – وَلَقَدْ جِئْنَاهُم بِكِتَابٍ فَصَّلْنَاهُ عَلَىٰ عِلْمٍ هُدًى وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ ٥٢

  1. మరియు వాస్తవానికి మేము వారికి గ్రంథాన్ని ప్రసాదించి, దానిని జ్ఞానపూర్వకంగా స్పష్టంగా వివరించి ఉన్నాము. 21 అది విశ్వసించే వారికి ఒక మార్గదర్శిని, మరియు కారుణ్యం.

7:53 – هَلْ يَنظُرُونَ إِلَّا تَأْوِيلَهُ ۚ يَوْمَ يَأْتِي تَأْوِيلُهُ يَقُولُ الَّذِينَ نَسُوهُ مِن قَبْلُ قَدْ جَاءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّ فَهَل لَّنَا مِن شُفَعَاءَ فَيَشْفَعُوا لَنَا أَوْ نُرَدُّ فَنَعْمَلَ غَيْرَ الَّذِي كُنَّا نَعْمَلُ ۚ قَدْ خَسِرُوا أَنفُسَهُمْ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ ٥٣

ఏమీ? వారు (అవిశ్వాసులు) దాని తుది ఫలితం సంభవించాలని నిరీక్షిస్తున్నారా? దాని తుదిఫలితం సంభవించే దినమున, దానిని నిర్ల క్ష్యం చేసిన వారు: ”వాస్తవానికి మాప్రభువు పంపిన ప్రవక్తలు సత్యం తెచ్చారు. అయితే ఏమీ? మా కొరకు సిఫారసు చేయటానికి, సిఫారసుదారులు ఎవరైనా ఉన్నారా? లేదా మేము మళ్ళీ తిరిగి (భూలోకంలోకి) పంపబడితే మేమింత వరకు చేసిన కర్మలకు విరుధ్ధంగా చేసేవారంకదా?” అని పలుకు తారు. వాస్తవానికి వారు తమకు తాము నష్టం కలిగించుకున్నారు మరియు వారు కల్పించు కున్న (దైవాలన్నీ) వారిని త్యజించి ఉంటాయి.

7:54 – إِنَّ رَبَّكُمُ اللَّـهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّـهُ رَبُّ الْعَالَمِينَ ٥٤

నిశ్చయంగా మీ ప్రభువైన అల్లాహ్‌యే ఆకాశాలను మరియు భూమిని ఆరుదినములలో (అయ్యామ్‌లలో) సృష్టించాడు. 22 ఆ పిదప తన సింహాసనాన్ని(‘అర్ష్‌ను) అధిష్ఠించాడు. 23 ఆయన రాత్రిని పగటి వెంట ఎడతెగ కుండా అనుసరింపజేసి, దానిపై (పగటిపై) కప్పుతూ ఉంటాడు. మరియు సూర్య, చంద్ర, నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. నిశ్చయంగా, సర్వ సృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్‌ ఎంతో శుభదాయకుడు, 24 సర్వలోకాలకు పోషకుడు!

7:55 – ادْعُوا رَبَّكُمْ تَضَرُّعًا وَخُفْيَةً ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُعْتَدِينَ ٥٥

మీ ప్రభువును వినయంతో మరియు రహస్యంగా (మౌనంగా) ప్రార్థించండి. నిశ్చయంగా, ఆయన హద్దులు మీరే వారిని ప్రేమించడు.

7:56 – وَلَا تُفْسِدُوا فِي الْأَرْضِ بَعْدَ إِصْلَاحِهَا وَادْعُوهُ خَوْفًا وَطَمَعًا ۚ إِنَّ رَحْمَتَ اللَّـهِ قَرِيبٌ مِّنَ الْمُحْسِنِينَ ٥٦

మరియు భూమిలోసంస్కరణ జరిగినపిదప దానిలో కల్లోలాన్ని రేకెత్తించకండి మరియు భయంతో మరియు ఆశతో ఆయనను ప్రార్థించండి. నిశ్చయంగా, అల్లాహ్‌ కారుణ్యం సజ్జనులకు సమీపంలోనే ఉంది. 25

7:57 – وَهُوَ الَّذِي يُرْسِلُ الرِّيَاحَ بُشْرًا بَيْنَ يَدَيْ رَحْمَتِهِ ۖ حَتَّىٰ إِذَا أَقَلَّتْ سَحَابًا ثِقَالًا سُقْنَاهُ لِبَلَدٍ مَّيِّتٍ فَأَنزَلْنَا بِهِ الْمَاءَ فَأَخْرَجْنَا بِهِ مِن كُلِّ الثَّمَرَاتِ ۚ كَذَٰلِكَ نُخْرِجُ الْمَوْتَىٰ لَعَلَّكُمْ تَذَكَّرُونَ ٥٧

  1. మరియు ఆయనే తన కారుణ్యానికి ముందు శుభవార్తలు తెచ్చే వాయువులను పంపేవాడు. ఎప్పుడైతే అవి బరువైన మేఘాలను ఎత్తుకొనివస్తాయో మేము వాటిని నిర్జీవమైన నగరాల వైపునకు తీసుకొనిపోయి వాటి నుండి నీటిని కురిపిస్తాము. ఆ నీటి వలన పలువిధాలైన ఫలాలను ఉత్పత్తి చేస్తాము. ఇదే విధంగా మేము మృతులను కూడా లేపుతాము; ఈ విధంగానైనా మీరు హితబోధ స్వీకరిస్తారని! 26

7:58 – وَالْبَلَدُ الطَّيِّبُ يَخْرُجُ نَبَاتُهُ بِإِذْنِ رَبِّهِ ۖ وَالَّذِي خَبُثَ لَا يَخْرُجُ إِلَّا نَكِدًا ۚ كَذَٰلِكَ نُصَرِّفُ الْآيَاتِ لِقَوْمٍ يَشْكُرُونَ ٥٨

మరియు సారవంతమైన నేల తన ప్రభువు ఆదేశంతో పుష్కలంగా పంటనిస్తుంది. మరియు నిస్సారమైన దాని (నేల) నుండి నాసిరకం పంట తప్ప మరేమీ రాదు. ఈ విధంగా మేము కృతజ్ఞతలు చూపేవారికి మా సూచనలను వివరిస్తాము. 27

7:59 – لَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ فَقَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّـهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُ إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ ٥٩

వాస్తవంగా, మేము నూ’హ్‌ను అతని జాతి వారివద్దకు పంపాము. 28 అతను వారితో: “నా జాతి ప్రజలారా! అల్లాహ్‌నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. వాస్తవానికి నేను మీపై రాబోయే ఆ గొప్ప దినపు శిక్షను గురించి భయపడుతున్నాను.” అని అన్నాడు.

7:60 – قَالَ الْمَلَأُ مِن قَوْمِهِ إِنَّا لَنَرَاكَ فِي ضَلَالٍ مُّبِينٍ ٦٠

అతని జాతి నాయకులు అన్నారు: “నిశ్చయంగా, మేము నిన్ను స్పష్టమైన తప్పు దారిలో చూస్తున్నాము!”

7:61 – قَالَ يَا قَوْمِ لَيْسَ بِي ضَلَالَةٌ وَلَـٰكِنِّي رَسُولٌ مِّن رَّبِّ الْعَالَمِينَ ٦١

దానికి (నూ’హ్‌) అన్నాడు: “నా జాతి ప్రజలారా! నాలో ఏ తప్పిదం లేదు. మరియు వాస్తవానికి నేను సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను.

7:62 – أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنصَحُ لَكُمْ وَأَعْلَمُ مِنَ اللَّـهِ مَا لَا تَعْلَمُونَ ٦٢

“నా ప్రభువు సందేశాలను మీకు అంద జేస్తు న్నాను మరియు (ధర్మ) బోధ చేస్తున్నాను. ఎందుకంటే! మీకు తెలియని విషయాలు అల్లాహ్‌ తరఫు నుండి నాకు తెలుస్తున్నాయి.

7:63 – أَوَعَجِبْتُمْ أَن جَاءَكُمْ ذِكْرٌ مِّن رَّبِّكُمْ عَلَىٰ رَجُلٍ مِّنكُمْ لِيُنذِرَكُمْ وَلِتَتَّقُوا وَلَعَلَّكُمْ تُرْحَمُونَ ٦٣

“మీలోని ఒక పురుషుని ద్వారా – దైవభీతి కలిగి ఉంటే మీరు కరుణింపబడతారని మిమ్మల్ని హెచ్చరించటానికి, మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు జ్ఞాపిక వచ్చిందని మీరు ఆశ్చర్యపడు తున్నారా?”

7:64 – فَكَذَّبُوهُ فَأَنجَيْنَاهُ وَالَّذِينَ مَعَهُ فِي الْفُلْكِ وَأَغْرَقْنَا الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۚ إِنَّهُمْ كَانُوا قَوْمًا عَمِينَ ٦٤

అయినా, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు. కావున మేము అతనిని మరియు అతనితో బాటు ఓడలో ఉన్నవారిని కాపాడాము. మరియు మా సూచనలను అసత్యాలని తిరస్క రించిన వారిని ముంచివేశాము. నిశ్చయంగా, వారు గుడ్డిగా ప్రవర్తించిన జనం. (7/8)

7:65 – وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّـهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُ ۚ أَفَلَا تَتَّقُونَ ٦٥

  • ఇంకా మేము ‘ఆద్‌ (జాతి) వద్దకు వారి సోదరుడైన హూద్‌ను పంపాము. 29 అతను: “ఓ నా జాతి సోదరులారా! మీరు అల్లాహ్‌నే ఆరాధిం చండి, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదేవుడు లేడు.ఏమీ? మీకు దైవభీతిలేదా?” అనిఅన్నాడు.

7:66 – قَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِن قَوْمِهِ إِنَّا لَنَرَاكَ فِي سَفَاهَةٍ وَإِنَّا لَنَظُنُّكَ مِنَ الْكَاذِبِينَ ٦٦

అతని జాతివారిలో సత్య-తిరస్కారులైన నాయకులు ఇలా అన్నారు: “మేము నిశ్చయంగా నిన్ను మూఢత్వంలో చూస్తున్నాము మరియు నిశ్చయంగా, నిన్ను అసత్యవాదిగా భావిస్తున్నాము!”

7:67 – قَالَ يَا قَوْمِ لَيْسَ بِي سَفَاهَةٌ وَلَـٰكِنِّي رَسُولٌ مِّن رَّبِّ الْعَالَمِينَ ٦٧

(హూద్‌) అన్నాడు: “నా జాతివారలారా! నాలో ఏ మూఢత్వం లేదు. మరియు నిశ్చయంగా నేను సర్వలోకాలప్రభువుయొక్కసందేశహరుడను!

7:68 – أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنَا لَكُمْ نَاصِحٌ أَمِينٌ ٦٨

“నేను మీకు నా ప్రభువు సందేశాలను అందజేస్తున్నాను మరియు నిశ్చయంగా, నేను మీకు నమ్మదగిన ఉపదేశకుడను.

7:69 – أَوَعَجِبْتُمْ أَن جَاءَكُمْ ذِكْرٌ مِّن رَّبِّكُمْ عَلَىٰ رَجُلٍ مِّنكُمْ لِيُنذِرَكُمْ ۚ وَاذْكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفَاءَ مِن بَعْدِ قَوْمِ نُوحٍ وَزَادَكُمْ فِي الْخَلْقِ بَسْطَةً ۖ فَاذْكُرُوا آلَاءَ اللَّـهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ ٦٩

“లేదా! మిమ్మల్నిహెచ్చరించటానికి – మీ ప్రభువు తరఫునుండి హితోపదేశం – మీలోని ఒక పురుషుని ద్వారా వచ్చిందని మీరు ఆశ్చర్యపడు తున్నారా?నూ’హ్‌ జాతిపిదప మిమ్మల్ని వారసు లుగా చేసి, మీకు అపార బలాధిక్యతను ఇచ్చిన విషయాన్ని జ్ఞప్తికితెచ్చుకోండి. 30 ఈ విధంగా అల్లాహ్‌ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసు కుంటే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు!”

7:70 – قَالُوا أَجِئْتَنَا لِنَعْبُدَ اللَّـهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا ۖ فَأْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ ٧٠

వారన్నారు: “మేము అల్లాహ్‌ను ఒక్కణ్ణి మాత్రమే ఆరాధించి, మా తండ్రి-తాతలు ఆరాధించేవాటిని వదలిపెట్టమని (చెప్పటానికి) నీవు మా వద్దకు వచ్చావా? ఒకవేళ నీవు సత్య వంతుడవే అయితే మమ్మల్ని భయపెట్టే దానిని (శిక్షను) తీసుకొనిరా!” 31

7:71 – قَالَ قَدْ وَقَعَ عَلَيْكُم مِّن رَّبِّكُمْ رِجْسٌ وَغَضَبٌ ۖ أَتُجَادِلُونَنِي فِي أَسْمَاءٍ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا نَزَّلَ اللَّـهُ بِهَا مِن سُلْطَانٍ ۚ فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ ٧١

(హూద్‌) అన్నాడు: “వాస్తవానికి మీపై మీ ప్రభువు యొక్క ఆగ్రహం మరియు శిక్ష విరుచుకు పడ్డాయి. అల్లాహ్‌ ఏ ప్రమాణం ఇవ్వకున్నా – మీరు మరియు మీ తండ్రి-తాతలు పెట్టుకున్న (కల్పిత) పేర్ల విషయంలో – నాతో వాదులాడు తున్నారా? సరే, అయితే మీరు నిరీక్షించండి, మీతో పాటు నేనూ నిరీక్షిస్తాను!”

7:72 – فَأَنجَيْنَاهُ وَالَّذِينَ مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَقَطَعْنَا دَابِرَ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۖ وَمَا كَانُوا مُؤْمِنِينَ ٧٢

కావున తుదకు మేము అతనిని (హూద్‌ను) మరియు అతని తోటి వారిని మా అనుగ్రహంతో రక్షించాము. మరియు మా సూచనలను అసత్యా లని తిరస్కరించిన వారిని నిర్మూలించాము. 32 ఎందుకంటే వారు విశ్వసించకుండా ఉన్నారు.

7:73 – وَإِلَىٰ ثَمُودَ أَخَاهُمْ صَالِحًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّـهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُ ۖ قَدْ جَاءَتْكُم بَيِّنَةٌ مِّن رَّبِّكُمْ ۖ هَـٰذِهِ نَاقَةُ اللَّـهِ لَكُمْ آيَةً ۖ فَذَرُوهَا تَأْكُلْ فِي أَرْضِ اللَّـهِ ۖ وَلَا تَمَسُّوهَا بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذَابٌ أَلِيمٌ ٧٣

ఇక స’మూద్‌ జాతివారి వద్దకు వారి సోదరుడైన, ‘సాలి’హ్‌ను పంపాము. 33 అతను వారితో: “నా జాతి సోదరులారా! అల్లాహ్‌నే ఆరా ధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవానికి, మీ వద్దకు మీ ప్రభువు తరఫునుండి ఒక స్పష్టమైన సూచన వచ్చింది. ఇది అల్లాహ్‌ మీకు ఒక అద్భుత సూచనగా పంపిన ఆడ-ఒంటె కావున దీనిని అల్లాహ్‌ భూమిపై మేయ టానికి వదలిపెట్టండి. మరియు హాని కలిగించే ఉద్దేశంతో దీనిని ముట్టుకోకండి. అలా చేస్తే మిమ్మల్ని బాధాకరమైన శిక్ష పట్టు కుంటుంది. 34

7:74 – وَاذْكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفَاءَ مِن بَعْدِ عَادٍ وَبَوَّأَكُمْ فِي الْأَرْضِ تَتَّخِذُونَ مِن سُهُولِهَا قُصُورًا وَتَنْحِتُونَ الْجِبَالَ بُيُوتًا ۖ فَاذْكُرُوا آلَاءَ اللَّـهِ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ ٧٤

“మరియు ఆయన, ‘ఆద్ జాతివారి పిదప మిమ్మల్ని వారసులుగా చేసి మిమ్మల్ని భూమిపై స్థిరపరచిన విషయం జ్ఞాపకంచేసుకోండి. మీరు దాని మైదానాలలో కోటలను నిర్మించుకుంటున్నారు. మరియు కొండలనుతొలచి గృహాలు నిర్మించుకుంటున్నారు. కావున అల్లాహ్‌ అనుగ్ర హాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరియు భూమిపై అన ర్థాన్ని, కల్లోలాన్నిరేకెత్తించకండి!” అని అన్నాడు.

7:75 – قَالَ الْمَلَأُ الَّذِينَ اسْتَكْبَرُوا مِن قَوْمِهِ لِلَّذِينَ اسْتُضْعِفُوا لِمَنْ آمَنَ مِنْهُمْ أَتَعْلَمُونَ أَنَّ صَالِحًا مُّرْسَلٌ مِّن رَّبِّهِ ۚ قَالُوا إِنَّا بِمَا أُرْسِلَ بِهِ مُؤْمِنُونَ ٧٥

(‘సాలి’హ్‌) జాతివారిలోని అహంకారులైన నాయకులు విశ్వసించిన బలహీనవర్గం వారితో అన్నారు: “సాలిహ్‌ తనప్రభువు పంపిన ప్రవక్త అని మీకునిశ్చయంగాతెలుసా?” దానికి వారు: ”మేము నిశ్చయంగా, అతని ద్వారా పంపబడిన సందే శాన్ని విశ్వసిస్తున్నాము.” అని జవాబిచ్చారు.

7:76 – قَالَ الَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا بِالَّذِي آمَنتُم بِهِ كَافِرُونَ ٧٦

ఆ అహంకారు లన్నారు: “మీరు విశ్వసించిన దానిని మేము నిశ్చయంగా, తిరస్కరిస్తున్నాము!”

7:77 – فَعَقَرُوا النَّاقَةَ وَعَتَوْا عَنْ أَمْرِ رَبِّهِمْ وَقَالُوا يَا صَالِحُ ائْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الْمُرْسَلِينَ ٧٧

ఆ తరువాత వారు ఆ ఆడ-ఒంటె వెనుక కాలి మోకాలి పెద్దనరం కోసి (చంపి), తమ ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించి, అతనితో అన్నారు: “ఓ ‘సాలి’హ్‌! నీవు నిజంగానే సందేశహరుడవైతే నీవు మమ్మల్ని బెదిరించే, ఆ శిక్షను తీసుకురా!”

7:78 – فَأَخَذَتْهُمُ الرَّجْفَةُ فَأَصْبَحُوا فِي دَارِهِمْ جَاثِمِينَ ٧٨

అప్పుడు వారిని భూకంపం పట్టుకున్నది. 35 వారు తమ ఇండ్లలోనే బోర్లా (శవాలుగా మారి) పడిపోయారు.

7:79 – فَتَوَلَّىٰ عَنْهُمْ وَقَالَ يَا قَوْمِ لَقَدْ أَبْلَغْتُكُمْ رِسَالَةَ رَبِّي وَنَصَحْتُ لَكُمْ وَلَـٰكِن لَّا تُحِبُّونَ النَّاصِحِينَ ٧٩

పిదప అతను (‘సాలి’హ్‌) వారి నుండి తిరిగి పోతూ అన్నాడు: “ఓ నా జాతి ప్రజలారా! వాస్తవంగా, నేను నా ప్రభువు సందేశాన్ని మీకు అందజేశాను. మరియు మీకు మంచి సలహాలను ఇచ్చాను, కానీ మీరు మంచి సలహాలు ఇచ్చే వారంటే ఇష్టపడలేదు!”

7:80 – وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِ أَتَأْتُونَ الْفَاحِشَةَ مَا سَبَقَكُم بِهَا مِنْ أَحَدٍ مِّنَ الْعَالَمِينَ ٨٠

ఇక లూ’త్‌! 36 అతను తన జాతివారితో: “ఏమీ? మీరు ఇంతకు పూర్వం ప్రపంచంలో ఎవ్వరూ చేయని అసహ్యకరమైన పనులు చేస్తారా?” అని అడిగిన విషయం జ్ఞప్తికి తెచ్చుకోండి.

7:81 – إِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ شَهْوَةً مِّن دُونِ النِّسَاءِ ۚ بَلْ أَنتُمْ قَوْمٌ مُّسْرِفُونَ ٨١

”వాస్తవానికి, మీరు స్త్రీలను వదలి కామంతో పురుషుల వద్దకు పోతున్నారు. వాస్తవంగా, మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు.

7:82 – وَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا أَخْرِجُوهُم مِّن قَرْيَتِكُمْ ۖ إِنَّهُمْ أُنَاسٌ يَتَطَهَّرُونَ ٨٢

కాని అతని జాతివారి జవాబు కేవలం ఇలాగే ఉండింది: 37 “వీరిని మీ నగరం నుండి వెళ్ళగొట్టండి. వాస్తవానికి వీరు తమను తాము మహా పవిత్రులనుకుంటున్నారు!”

7:83 – فَأَنجَيْنَاهُ وَأَهْلَهُ إِلَّا امْرَأَتَهُ كَانَتْ مِنَ الْغَابِرِينَ ٨٣

ఆ పిదప మేము అతనినీ మరియు అతని ఇంటివారినీ – అతనిభార్యనుతప్ప – రక్షించాము. ఆమె వెనుక ఉండిపోయిన వారిలో చేరిపోయింది. 38

7:84 – وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًا ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُجْرِمِينَ ٨٤

మరియు మేము వారిపై (రాళ్ళ) వర్షాన్ని కురిపించాము. 39 చూడండి! ఆ అపరాధుల ముగింపు ఏలా జరిగిందో!

7:85 – وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّـهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُ ۖ قَدْ جَاءَتْكُم بَيِّنَةٌ مِّن رَّبِّكُمْ ۖ فَأَوْفُوا الْكَيْلَ وَالْمِيزَانَ وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تُفْسِدُوا فِي الْأَرْضِ بَعْدَ إِصْلَاحِهَا ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ ٨٥

మరియు మేము మద్‌యన్‌ జాతివారి వద్దకు వారి సహోదరుడు షు’ఐబ్‌ను (పంపాము). 40 అతను వారితో అన్నాడు: “నా జాతి ప్రజలారా! అల్లాహ్‌నే ఆరాధించండి, మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు. వాస్తవంగా మీ వద్దకు, మీ ప్రభువు దగ్గర నుండి స్పష్టమైన (మార్గదర్శకత్వం) వచ్చివున్నది. కొలిచేటప్పడు మరియు తూచేటప్పుడు పూర్తిగా ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిపై సంస్కరణ జరిగిన తరువాత కల్లోలాన్ని రేకెత్తించకండి. మీరు విశ్వాసులే అయితే, ఇదే మీకు మేలైనది.

7:86 – وَلَا تَقْعُدُوا بِكُلِّ صِرَاطٍ تُوعِدُونَ وَتَصُدُّونَ عَن سَبِيلِ اللَّـهِ مَنْ آمَنَ بِهِ وَتَبْغُونَهَا عِوَجًا ۚ وَاذْكُرُوا إِذْ كُنتُمْ قَلِيلًا فَكَثَّرَكُمْ ۖ وَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِينَ ٨٦

“మరియు ఆయనను విశ్వసించిన వారిని, అల్లాహ్‌ మార్గం నుండి నిరోధించటానికి వారిని బెదరిస్తూ, అది వక్రమైనదని చూపగోరి ప్రతి మార్గంలో కూర్చోకండి. మీరు అల్ప సంఖ్యలో ఉన్నప్పుడు ఆయన మీ సంఖ్యను అధికంచేసిన విషయాన్ని జ్ఞాపకంచేసుకోండి. మరియు కల్లోలం రేకెత్తించిన వారి గతి ఏమయిందో చూడండి.

7:87 – وَإِن كَانَ طَائِفَةٌ مِّنكُمْ آمَنُوا بِالَّذِي أُرْسِلْتُ بِهِ وَطَائِفَةٌ لَّمْ يُؤْمِنُوا فَاصْبِرُوا حَتَّىٰ يَحْكُمَ اللَّـهُ بَيْنَنَا ۚ وَهُوَ خَيْرُ الْحَاكِمِينَ ٨٧

“మరియు నా ద్వారా పంపబడిన దానిని (సందేశాన్ని) మీలో ఒక వర్గం వారు విశ్వసించి మరొక వర్గం వారు విశ్వసించక పోతే! అల్లాహ్‌ మన మధ్య తీర్పు చేసేవరకూ సహనం వహించండి. మరియు ఆయనే అత్యుత్తమమైన న్యాయాధిపతి!” 41

7:88 – قَالَ الْمَلَأُ الَّذِينَ اسْتَكْبَرُوا مِن قَوْمِهِ لَنُخْرِجَنَّكَ يَا شُعَيْبُ وَالَّذِينَ آمَنُوا مَعَكَ مِن قَرْيَتِنَا أَوْ لَتَعُودُنَّ فِي مِلَّتِنَا ۚ قَالَ أَوَلَوْ كُنَّا كَارِهِينَ ٨٨

[(*)] దురహంకారులైన అతని జాతి నాయకులు అన్నారు: “ఓ షు’ఐబ్‌! మేము నిన్నూ మరియు నీతో బాటు విశ్వసించిన వారినీ, మా నగరం నుండి తప్పక వెడలగొడ్తాము. లేదా మీరు తిరిగి మా ధర్మంలోకి రండి!” అతను అన్నాడు: “మేము దానిని అసహ్యించు కున్నప్పటికీ (మీ ధర్మంలోకి చేరాలా)?”

7:89 – قَدِ افْتَرَيْنَا عَلَى اللَّـهِ كَذِبًا إِنْ عُدْنَا فِي مِلَّتِكُم بَعْدَ إِذْ نَجَّانَا اللَّـهُ مِنْهَا ۚ وَمَا يَكُونُ لَنَا أَن نَّعُودَ فِيهَا إِلَّا أَن يَشَاءَ اللَّـهُ رَبُّنَا ۚ وَسِعَ رَبُّنَا كُلَّ شَيْءٍ عِلْمًا ۚ عَلَى اللَّـهِ تَوَكَّلْنَا ۚ رَبَّنَا افْتَحْ بَيْنَنَا وَبَيْنَ قَوْمِنَا بِالْحَقِّ وَأَنتَ خَيْرُ الْفَاتِحِينَ ٨٩

(ఇంకాఇలాఅన్నాడు):“వాస్తవంగా అల్లాహ్‌ మాకు (మీ ధర్మం నుండి) విముక్తి కలిగించిన తరువాత కూడా మేము తిరిగి మీ ధర్మంలోకి చేరితే! మేము అల్లాహ్‌పై అబద్ధం కల్పించిన వార మవుతాము. మా ప్రభువైన అల్లాహ్‌ కోరితే తప్ప! మేము తిరిగి దానిలో చేరలేము. మా ప్రభువు జ్ఞానం ప్రతి వస్తువునూ ఆవరించి ఉంది. మేము అల్లాహ్‌పైననే ఆధారపడి ఉన్నాము. ‘ఓ మా ప్రభూ! మా మధ్య మరియు మా జాతి వారి మధ్య న్యాయంగా తీర్పుచేయి. మరియు నీవే అత్యుత్తమమైన తీర్పు చేసేవాడవు!’ ”

7:90 – وَقَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِن قَوْمِهِ لَئِنِ اتَّبَعْتُمْ شُعَيْبًا إِنَّكُمْ إِذًا لَّخَاسِرُونَ ٩٠

మరియు అతని జాతిలోని సత్య- తిరస్కారులైన నాయకులు అన్నారు: “ఒకవేళ మీరు షు’ఐబ్‌ను అనుసరిస్తే! నిశ్చయంగా మీరు నష్టం పొందిన వారవుతారు.”

7:91 – فَأَخَذَتْهُمُ الرَّجْفَةُ فَأَصْبَحُوا فِي دَارِهِمْ جَاثِمِينَ ٩١

అప్పుడు వారిని ఒక భూకంపం పట్టు కున్నది 42 మరియు వారు తమఇండ్లలోనే బోర్లా (శవాలై) పడిపోయారు.

7:92 – الَّذِينَ كَذَّبُوا شُعَيْبًا كَأَن لَّمْ يَغْنَوْا فِيهَا ۚ الَّذِينَ كَذَّبُوا شُعَيْبًا كَانُوا هُمُ الْخَاسِرِينَ ٩٢

షు’ఐబ్‌ను అబద్ధమాడుతున్నాడని తిరస్కరించిన వారు అక్కడ ఎన్నడూ నివసించి ఉండనే లేదన్నట్లుగా నశించిపోయారు. షు’ఐబ్‌ను అబద్ధమాడుతున్నాడని తిరస్కరించిన వారే వాస్తవానికి నష్టంపొందిన వారయ్యారు.

7:93 – فَتَوَلَّىٰ عَنْهُمْ وَقَالَ يَا قَوْمِ لَقَدْ أَبْلَغْتُكُمْ رِسَالَاتِ رَبِّي وَنَصَحْتُ لَكُمْ ۖ فَكَيْفَ آسَىٰ عَلَىٰ قَوْمٍ كَافِرِينَ ٩٣

(షు’ఐబ్‌) ఇలా అంటూ వారి నుండి మరలి పోయాడు: “నా జాతి ప్రజలారా! వాస్తవంగా నేను నా ప్రభువు సందేశాలను మీకు అందజేశాను మరియు మీకు హితోపదేశం చేశాను. కావున ఇపుడు సత్య-తిరస్కారులైన జాతివారి కొరకు నేనెందుకు దుఃఖించాలి?”

7:94 – وَمَا أَرْسَلْنَا فِي قَرْيَةٍ مِّن نَّبِيٍّ إِلَّا أَخَذْنَا أَهْلَهَا بِالْبَأْسَاءِ وَالضَّرَّاءِ لَعَلَّهُمْ يَضَّرَّعُونَ ٩٤

మరియు మేము ఏ నగరానికి ప్రవక్తను పంపినా! దాని ప్రజలను ఆపదలకు మరియు దౌర్భాగ్యానికి గురిచేయకుండా ఉండలేదు, వారు ఇలాగైనా వినమ్రులు అవుతారేమోనని!

7:95 – ثُمَّ بَدَّلْنَا مَكَانَ السَّيِّئَةِ الْحَسَنَةَ حَتَّىٰ عَفَوا وَّقَالُوا قَدْ مَسَّ آبَاءَنَا الضَّرَّاءُ وَالسَّرَّاءُ فَأَخَذْنَاهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ ٩٥

ఆ తరువాత వారి దుస్థితిని, సుస్థితిగా మార్చిన పిదప వారు హాయిగా ఉంటూ ఇలా అన్నారు: “వాస్తవానికి కష్టసుఖాలు మా పూర్వి కులకు కూడా సంభవించాయి.” కావున మేము వారిని అకస్మాత్తుగా పట్టుకున్నాము మరియు వారు దానిని గ్రహించలేక పోయారు. 43

7:96 – وَلَوْ أَنَّ أَهْلَ الْقُرَىٰ آمَنُوا وَاتَّقَوْا لَفَتَحْنَا عَلَيْهِم بَرَكَاتٍ مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ وَلَـٰكِن كَذَّبُوا فَأَخَذْنَاهُم بِمَا كَانُوا يَكْسِبُونَ ٩٦

మరియు ఒకవేళ ఆ నగరవాసులు విశ్వ సించి, దైవభీతి కలిగి ఉంటే – మేము వారిపై ఆకా శం నుండి మరియు భూమి నుండి – సర్వ శుభాల నొసంగిఉండేవారం. కానివారు (ప్రవక్తలను) అసత్య వాదులని తిరస్కరించారు, కనుక వారు చేసిన కర్మలకు ఫలితంగా మేము వారిని శిక్షించాము.

7:97 – أَفَأَمِنَ أَهْلُ الْقُرَىٰ أَن يَأْتِيَهُم بَأْسُنَا بَيَاتًا وَهُمْ نَائِمُونَ ٩٧

ఏమీ? ఈ నగరాలవాసులు, తాము నిద్ర పోయేటప్పుడు రాత్రి సమయమున వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా?

7:98 – أَوَأَمِنَ أَهْلُ الْقُرَىٰ أَن يَأْتِيَهُم بَأْسُنَا ضُحًى وَهُمْ يَلْعَبُونَ ٩٨

లేదా ఈ నగరాలవాసులు, పట్టపగలు తాము కాలక్షేపంలో ఉన్నప్పుడు వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా? 43

7:99 – أَفَأَمِنُوا مَكْرَ اللَّـهِ ۚ فَلَا يَأْمَنُ مَكْرَ اللَّـهِ إِلَّا الْقَوْمُ الْخَاسِرُونَ ٩٩

ఏమీ? వారు అల్లాహ్‌ యుక్తి (శిక్ష) అంటే నిర్భయంగా ఉన్నారా? నాశనం కాబోయేవారు తప్ప, ఇతర జాతి వారెవ్వరూ అల్లాహ్‌ యుక్తి గురించి నిర్భయంగా ఉండజాలరు. 44

7:100 – أَوَلَمْ يَهْدِ لِلَّذِينَ يَرِثُونَ الْأَرْضَ مِن بَعْدِ أَهْلِهَا أَن لَّوْ نَشَاءُ أَصَبْنَاهُم بِذُنُوبِهِمْ ۚ وَنَطْبَعُ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَسْمَعُونَ ١٠٠

ఏమీ? పూర్వపు భూలోక వాసుల తరువాత, భూమికి వారసులయిన వారికి, మేము కోరితే వారి పాపాల వలన వారికి కూడా శిక్ష విధించగలమని ఉపదేశం అందలేదా? మరియు మేము, వారి హృదయాల మీద ముద్ర వేసిఉన్నాము, దాని వల్ల వారు (మా హితోప దేశాన్ని) వినలేకున్నారు.

1:101 – تِلْكَ الْقُرَىٰ نَقُصُّ عَلَيْكَ مِنْ أَنبَائِهَا ۚ وَلَقَدْ جَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَمَا كَانُوا لِيُؤْمِنُوا بِمَا كَذَّبُوا مِن قَبْلُ ۚ كَذَٰلِكَ يَطْبَعُ اللَّـهُ عَلَىٰ قُلُوبِ الْكَافِرِينَ ١٠١

ఈ నగరాల వృత్తాంతాలను కొన్నింటిని మేము నీకు వినిపిస్తున్నాము. మరియు వాస్తవానికి వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన (నిదర్శనాలు) తీసుకొనివచ్చారు. 45 కాని వారు ముందు తిరస్కరించిన దానిని మరల విశ్వసించ లేదు. ఈ విధంగా అల్లాహ్‌ సత్య-తిరస్కారుల హృదయాలపై ముద్రవేస్తాడు. 46

1:102 – وَمَا وَجَدْنَا لِأَكْثَرِهِم مِّنْ عَهْدٍ ۖ وَإِن وَجَدْنَا أَكْثَرَهُمْ لَفَاسِقِينَ ١٠٢

మరియు మేము వారిలో చాలా మందిని తమ వాగ్దానాన్ని పాటించేవారిగా చూడలేదు. మరియు వాస్తవానికి వారిలో చాలా మందిని దుష్టులు (ఫాసిఖీన్‌) గానే పొందాము (చూశాము).

1:103 – ثُمَّ بَعَثْنَا مِن بَعْدِهِم مُّوسَىٰ بِآيَاتِنَا إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ فَظَلَمُوا بِهَا ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِينَ ١٠٣

ఆ తరువాత మేము మూసాను మా సూచనలతో ఫిర్‌’ఔన్‌ మరియు అతని నాయకుల వద్దకు పంపాము. వారు, వాటి (మా సూచనల) పట్ల దుర్మార్గంతో ప్రవర్తించారు. కావున చూడండి, దౌర్జన్యపరుల గతి ఏమయిందో!

1:104 – وَقَالَ مُوسَىٰ يَا فِرْعَوْنُ إِنِّي رَسُولٌ مِّن رَّبِّ الْعَالَمِينَ ١٠٤

మరియు మూసా అన్నాడు: “ఓ ఫిర్‌’ఔన్! నేను నిశ్చయంగా, సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను!

1:105 – حَقِيقٌ عَلَىٰ أَن لَّا أَقُولَ عَلَى اللَّـهِ إِلَّا الْحَقَّ ۚ قَدْ جِئْتُكُم بِبَيِّنَةٍ مِّن رَّبِّكُمْ فَأَرْسِلْ مَعِيَ بَنِي إِسْرَائِيلَ ١٠٥

“అల్లాహ్‌ను గురించి సత్యం తప్ప మరే విషయాన్ని పలకని బాధ్యత గలవాడను. వాస్త వానికి, నేను మీ వద్దకు, మీ ప్రభువు తరఫు నుండి స్పష్టమైన సూచనలు తీసుకొనివచ్చాను, కావున ఇస్రాయీ’ల్‌ సంతతి వారిని నావెంట పోనివ్వు.” 47

1:106 – قَالَ إِن كُنتَ جِئْتَ بِآيَةٍ فَأْتِ بِهَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ ١٠٦

(ఫిర్‌’ఔన్‌) అన్నాడు: “నీవు ఏదైనా సూచనను తీసుకొని వచ్చిఉంటే – నీవు సత్య వంతుడవే అయితే – దానిని తీసుకొనిరా!”

1:107 – فَأَلْقَىٰ عَصَاهُ فَإِذَا هِيَ ثُعْبَانٌ مُّبِينٌ ١٠٧

అప్పుడు (మూసా) తన చేతికర్రను విసిరాడు, అకస్మాత్తుగా అది ఒక స్పష్టమైన పెద్ద సర్పం (సు”అబాన్‌) గా మారిపోయింది.

1:108 – وَنَزَعَ يَدَهُ فَإِذَا هِيَ بَيْضَاءُ لِلنَّاظِرِينَ ١٠٨

మరియు అతడు తన చేతిని బయటికి తీశాడు. ఇక అది చూసేవారికి తెల్లగా మెరుస్తూ కనిపించింది.

1:109 – قَالَ الْمَلَأُ مِن قَوْمِ فِرْعَوْنَ إِنَّ هَـٰذَا لَسَاحِرٌ عَلِيمٌ ١٠٩

(ఇది చూసి), ఫిర్‌’ఔన్‌ జాతి నాయకులు అన్నారు: “నిశ్చయంగా, ఇతడు నేర్పుగల ఒక గొప్ప మాంత్రికుడు!”

1:110 – يُرِيدُ أَن يُخْرِجَكُم مِّنْ أَرْضِكُمْ ۖ فَمَاذَا تَأْمُرُونَ ١١٠

(ఫిర్‌’ఔన్‌ అన్నాడు): “ఇతడు మిమ్మల్ని మీ భూమి నుండి వెడలగొట్టగోరు తున్నాడు. అయితే! మీ సలహా ఏమిటి?”

1:111 – قَالُوا أَرْجِهْ وَأَخَاهُ وَأَرْسِلْ فِي الْمَدَائِنِ حَاشِرِينَ ١١١

వారన్నారు: “అతనికి (మూసాకు) మరియు అతని సోదరునికి కొంత వ్యవధినిచ్చి, అన్ని నగరాలకు బంటులను పంపు.

1:112 – يَأْتُوكَ بِكُلِّ سَاحِرٍ عَلِيمٍ ١١٢

“వారు నిపుణులైన ప్రతి మాంత్రికుణ్ణి నీ వద్దకు తీసుకొనివస్తారు.” 48

1:113 – وَجَاءَ السَّحَرَةُ فِرْعَوْنَ قَالُوا إِنَّ لَنَا لَأَجْرًا إِن كُنَّا نَحْنُ الْغَالِبِينَ ١١٣

మరియు మాంత్రికులందరూ ఫిర్‌’ఔన్‌ వద్ద కు వచ్చి: “ఒకవేళ మేము గెలిస్తే మాకు ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది కదా!” అని అన్నారు.

1:114 – قَالَ نَعَمْ وَإِنَّكُمْ لَمِنَ الْمُقَرَّبِينَ ١١٤

(ఫిర్‌’ఔన్‌)అన్నాడు:“అవునునిశ్చయంగా మీరు నాసాన్నిధ్యాన్ని కూడా పొందుతారు.”

1:115 – قَالُوا يَا مُوسَىٰ إِمَّا أَن تُلْقِيَ وَإِمَّا أَن نَّكُونَ نَحْنُ الْمُلْقِينَ ١١٥

వారన్నారు: “ఓ మూసా! (ముందు) నీవు విసురుతావా? లేక మేము విసరాలా?”

1:116 – قَالَ أَلْقُوا ۖ فَلَمَّا أَلْقَوْا سَحَرُوا أَعْيُنَ النَّاسِ وَاسْتَرْهَبُوهُمْ وَجَاءُوا بِسِحْرٍ عَظِيمٍ ١١٦

(మూసా) అన్నాడు: “(ముందు) మీరే విసరండి!” వారు (తమ కర్రలను) విసిరి, ప్రజల చూపులను మంత్రముగ్ధం చేస్తూ వారికి భయం కలిగించే ఒక అద్భుతమైన మాయాజాలాన్ని ప్రదర్శించారు. (1/8)

1:117 – وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنْ أَلْقِ عَصَاكَ ۖ فَإِذَا هِيَ تَلْقَفُ مَا يَأْفِكُونَ ١١٧

*మేముమూసాకు: “నీచేతికర్రనువిసురు.” అని ఆదేశమిచ్చాము. అప్పుడది వారి (మాంత్రికు ల) బూటక (మాయాజాలాన్ని) మ్రింగివేసింది.

1:118 – فَوَقَعَ الْحَقُّ وَبَطَلَ مَا كَانُوا يَعْمَلُونَ فَوَقَعَ الْحَقُّ وَبَطَلَ مَا كَانُوا يَعْمَلُونَ ١١٨

ఈ విధంగా సత్యం స్థాపితమయ్యింది మరియు వారు (మాంత్రికులు) చేసిందంతా విఫలమయ్యింది.

1:119 – فَغُلِبُوا هُنَالِكَ وَانقَلَبُوا صَاغِرِينَ ١١٩

ఈ విధంగా వారక్కడ అపజయం పొంది అవమానంతో కృంగిపోయారు.

1:120 – وَأُلْقِيَ السَّحَرَةُ سَاجِدِينَ ١٢٠

మరియు మాంత్రికులు సాష్టాంగపడ్డారు.

1:121 – قَالُوا آمَنَّا بِرَبِّ الْعَالَمِينَ ١٢١

(మాంత్రికులు) అన్నారు: “మేము సర్వ లోకాల ప్రభువును విశ్వసించాము.

1:122 – رَبِّ مُوسَىٰ وَهَارُونَ ١٢٢

“మూసా మరియుహారూన్‌ల ప్రభువును.”

1:123 – قَالَ فِرْعَوْنُ آمَنتُم بِهِ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ ۖ إِنَّ هَـٰذَا لَمَكْرٌ مَّكَرْتُمُوهُ فِي الْمَدِينَةِ لِتُخْرِجُوا مِنْهَا أَهْلَهَا ۖ فَسَوْفَ تَعْلَمُونَ ١٢٣

ఫిర్‌’ఔన్‌ అన్నాడు: “నేను అనుమతి ఇవ్వకముందే మీరు అతనిని విశ్వసించారా? నిశ్చయంగా, మీరందరూ కలిసి ఈ నగరం నుండి దాని వాసులను వెడలగొట్టటానికి పన్నిన పన్నాగమిది, (దీని పరిణామం) మీరిప్పుడే తెలుసుకోగలరు.

1:124 – لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَافٍ ثُمَّ لَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ ١٢٤

“నేను తప్పక మీ ఒక ప్రక్క చేతులను మరొక ప్రక్క కాళ్ళను నరికిస్తాను. ఆ తరువాత మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను.”

1:125 – قَالُوا إِنَّا إِلَىٰ رَبِّنَا مُنقَلِبُونَ ١٢٥

వారు ఇలా జవాబిచ్చారు: “నిశ్చయంగా, మేము మా ప్రభువువద్దకే కదా మరలిపోయేది!

1:126 – وَمَا تَنقِمُ مِنَّا إِلَّا أَنْ آمَنَّا بِآيَاتِ رَبِّنَا لَمَّا جَاءَتْنَا ۚ رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَتَوَفَّنَا مُسْلِمِينَ ١٢٦

“మరియు మా ప్రభువు తరఫునుండి మా వద్దకు వచ్చిన సూచనలను మేము విశ్వసించా మనే కదా! నీవు మాతో పగ తీర్చుకోదలచావు.” (ఇలా ప్రార్థించారు): “ఓ మా ప్రభూ! మాకు సహన మొసంగు. మేము నీకు విధేయులముగా (ముస్లింలముగా) మృతినొందేటట్లు చేయి!”

1:127 – وَقَالَ الْمَلَأُ مِن قَوْمِ فِرْعَوْنَ أَتَذَرُ مُوسَىٰ وَقَوْمَهُ لِيُفْسِدُوا فِي الْأَرْضِ وَيَذَرَكَ وَآلِهَتَكَ ۚ قَالَ سَنُقَتِّلُ أَبْنَاءَهُمْ وَنَسْتَحْيِي نِسَاءَهُمْ وَإِنَّا فَوْقَهُمْ قَاهِرُونَ ١٢٧

మరియు ఫిర్‌’ఔన్‌ జాతి నాయకులు అత నితో అన్నారు:“ఏమీ? భూమిలో కల్లోలంరేకెత్తించ టానికి మరియు నిన్నూ నీ దేవతలను విడిచిపోవ టానికి, నీవు మూసాను మరియు అతని జాతి వారిని వదలుతున్నావా?” అతడు (ఫిర్‌’ఔన్‌) జవాబిచ్చాడు: “మేము తప్పక వారి కుమారులను చంపి వారి కుమార్తెలను బ్రతకనిస్తాము. మరియు నిశ్చయంగా, మేము వారిపై ప్రాబల్యం కలిగి ఉన్నాము.”

1:128 – قَالَ مُوسَىٰ لِقَوْمِهِ اسْتَعِينُوا بِاللَّـهِ وَاصْبِرُوا ۖ إِنَّ الْأَرْضَ لِلَّـهِ يُورِثُهَا مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۖ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ ١٢٨

మూసా తన జాతివారితో అన్నాడు: “అల్లాహ్‌ సహాయం కోరండి మరియు సహనం వహించండి. నిశ్చయంగా ఈ భూమి అల్లాహ్‌దే! ఆయన తన దాసులలో తాను కోరిన వారిని దానికి వారసులుగా చేస్తాడు. మరియు అంతిమ (సాఫల్యం) దైవభీతి గలవారిదే!”

1:129 – قَالُوا أُوذِينَا مِن قَبْلِ أَن تَأْتِيَنَا وَمِن بَعْدِ مَا جِئْتَنَا ۚ قَالَ عَسَىٰ رَبُّكُمْ أَن يُهْلِكَ عَدُوَّكُمْ وَيَسْتَخْلِفَكُمْ فِي الْأَرْضِ فَيَنظُرَ كَيْفَ تَعْمَلُونَ ١٢٩

(మూసా జాతి వారు) అన్నారు: “నీవు రాక పూర్వమూ మరియు నీవు వచ్చిన తర్వాతనూ మేము బాధించబడ్డాము!” (మూసా) జవాబిచ్చాడు: “మీ ప్రభువు త్వరలోనే మీ శత్రువులను నాశనం చేసి మిమ్మల్ని భూమిలో ‘ఖలీఫాలుగా 49 చేసినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో ఆయన చూస్తాడు?”

1:130 – وَلَقَدْ أَخَذْنَا آلَ فِرْعَوْنَ بِالسِّنِينَ وَنَقْصٍ مِّنَ الثَّمَرَاتِ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ ١٣٠

మరియు వాస్తవానికి, మేము ఫిర్‌’ఔన్‌ జాతివారిని – బహుశా వారికి తెలివి వస్తుందేమో నని – ఎన్నో సంవత్సరాల వరకు కరువుకు, ఫలాల నష్టానికి గురిచేశాము.

1:131 – فَإِذَا جَاءَتْهُمُ الْحَسَنَةُ قَالُوا لَنَا هَـٰذِهِ ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ يَطَّيَّرُوا بِمُوسَىٰ وَمَن مَّعَهُ ۗ أَلَا إِنَّمَا طَائِرُهُمْ عِندَ اللَّـهِ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ ١٣١

ఆ పిదప వారికి మంచికాలం వచ్చినపుడు వారు: “మేము దీనికే అర్హులం!” అని అనేవారు. కాని వారికి కష్టకాలం దాపురించినపుడు, వారు మూసా మరియు అతనితో పాటు ఉన్నవారిని తమకు అపశకునంగా పరిగణించేవారు. 50 వాస్తవానికి వారి అపశకునాలన్నీ అల్లాహ్‌ చేతులలోనే ఉన్నాయి, కాని వారిలో చాలా మందికి తెలియదు.

1:132 – وَقَالُوا مَهْمَا تَأْتِنَا بِهِ مِنْ آيَةٍ لِّتَسْحَرَنَا بِهَا فَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِينَ ١٣٢

మరియు వారు (మూసాతో) అన్నారు: “నీవు మమ్మల్నిభ్రమింపజేయటానికి ఏసూచ నను తెచ్చినా మేము నిన్నునమ్మేవారంకాము!”

1:133 – فَأَرْسَلْنَا عَلَيْهِمُ الطُّوفَانَ وَالْجَرَادَ وَالْقُمَّلَ وَالضَّفَادِعَ وَالدَّمَ آيَاتٍ مُّفَصَّلَاتٍ فَاسْتَكْبَرُوا وَكَانُوا قَوْمًا مُّجْرِمِينَ ١٣٣

కావున మేము వారిపై జల ప్రళయం (‘తూఫాన్‌), మిడుతలదండు, పేనులు, కప్పలు మరియు రక్తం మొదలైన స్పష్టమైన సూచనలను పంపాము. 51 అయినావారు దురహంకారం చూపారు. ఎందుకంటే వారు మహా అపరాధులై ఉండిరి.

1:134 – وَلَمَّا وَقَعَ عَلَيْهِمُ الرِّجْزُ قَالُوا يَا مُوسَى ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِندَكَ ۖ لَئِن كَشَفْتَ عَنَّا الرِّجْزَ لَنُؤْمِنَنَّ لَكَ وَلَنُرْسِلَنَّ مَعَكَ بَنِي إِسْرَائِيلَ ١٣٤

మరియు వారిపైకి ఆపద వచ్చినపుడు వారనే వారు: “ఓ మూసా! నీ ప్రభువు నీకిచ్చిన వాగ్దానం ఆధారంగా నీవు మా కొరకు ప్రార్థించు! ఒకవేళ నీవు మానుండి ఈ ఆపదను తొలగిస్తే మేము నిన్ను విశ్వసిస్తాము; మరియు ఇస్రాయీ’ల్‌ సంతతివారిని తప్పక నీ వెంట పంపుతాము.”

1:135 – فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الرِّجْزَ إِلَىٰ أَجَلٍ هُم بَالِغُوهُ إِذَا هُمْ يَنكُثُونَ ١٣٥

కానీ, ఒక నిర్ణీతకాలం వరకు వారి నుండి ఆపదను తొలగించగానే – ఆ కాలానికి వారు చేరుకోవలసిన వారే కాబట్టి – వారు తమ వాగ్దానాన్ని భంగ పరిచేవారు!

1:136 – فَانتَقَمْنَا مِنْهُمْ فَأَغْرَقْنَاهُمْ فِي الْيَمِّ بِأَنَّهُمْ كَذَّبُوا بِآيَاتِنَا وَكَانُوا عَنْهَا غَافِلِينَ ١٣٦

కావున మేము వారికి ప్రతీకారం చేశాము మరియు వారిని సముద్రంలో ముంచివేశాము; ఎందుకంటే! వాస్తవానికి వారు మా సూచనలను అసత్యాలని తిరస్కరించారు మరియు వాటిని లక్ష్యపెట్టకుండా ఉన్నారు.

1:137 – وَأَوْرَثْنَا الْقَوْمَ الَّذِينَ كَانُوا يُسْتَضْعَفُونَ مَشَارِقَ الْأَرْضِ وَمَغَارِبَهَا الَّتِي بَارَكْنَا فِيهَا ۖ وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ الْحُسْنَىٰ عَلَىٰ بَنِي إِسْرَائِيلَ بِمَا صَبَرُوا ۖ وَدَمَّرْنَا مَا كَانَ يَصْنَعُ فِرْعَوْنُ وَقَوْمُهُ وَمَا كَانُوا يَعْرِشُونَ ١٣٧

  1. మరియు వారి స్థానంలో బలహీనులుగా ఎంచబడే వారిని మేము శుభాలతో నింపిన, ఆ దేశపు తూర్పు భాగాలకు మరియు పశ్చిమ భాగా లకు వారసులుగా చేశాము. 52 ఈ విధంగా నీ ప్రభువు ఇస్రాయి’ల్‌ సంతతి వారికి చేసిన ఉత్తమ మైన వాగ్దానం, వారు ఓర్పు వహించి నందుకు పూర్తయింది. 53 మరియు ఫిర్‌’ఔన్‌ మరియు అతని జాతివారు ఉత్పత్తిచేసిన వాటిని మరియు ఎత్తిన (నిర్మించిన) కట్టడాలను నాశనంచేశాము. 54

1:138 – وَجَاوَزْنَا بِبَنِي إِسْرَائِيلَ الْبَحْرَ فَأَتَوْا عَلَىٰ قَوْمٍ يَعْكُفُونَ عَلَىٰ أَصْنَامٍ لَّهُمْ ۚ قَالُوا يَا مُوسَى اجْعَل لَّنَا إِلَـٰهًا كَمَا لَهُمْ آلِهَةٌ ۚ قَالَ إِنَّكُمْ قَوْمٌ تَجْهَلُونَ ١٣٨

మరియు మేము ఇస్రాయి’ల్‌ సంతతి వారిని సముద్రం దాటించిన తరువాత వారు (నడుస్తూ) తమ విగ్రహాలను ఆరాధించే ఒక జాతివారి వద్దకు చేరారు 55 వారన్నారు: “ఓ మూసా! వీరి ఆరాధ్యదైవాలవలే మాకు కూడ ఒక ఆరాధ్యదైవాన్ని నియమించు.” (దానికి మూసా) జవాబిచ్చాడు: “నిశ్చయంగా, మీరు జ్ఞాన హీనులైన జాతికి చెందినవారు.”

1:139 – إِنَّ هَـٰؤُلَاءِ مُتَبَّرٌ مَّا هُمْ فِيهِ وَبَاطِلٌ مَّا كَانُوا يَعْمَلُونَ ١٣٩

“నిశ్చయంగా, వీరు ఆచరిస్తున్నందుకు (విగ్రహారాధన చేస్తున్నందుకు) నాశనం చేయ బడతారు. వీరు చేస్తున్నదంతా నిరర్థకమైనదే.”

1:140 – قَالَ أَغَيْرَ اللَّـهِ أَبْغِيكُمْ إِلَـٰهًا وَهُوَ فَضَّلَكُمْ عَلَى الْعَالَمِينَ ١٤٠

(మూసా ఇంకా) ఇలా అన్నాడు: “ఏమీ? నేను అల్లాహ్‌ను వదలి మరొక ఆరాధ్య దైవాన్ని మీ కొరకు అన్వేషించాలా? వాస్తవానికి ఆయనే (మీ కాలపు) సర్వలోకాల వారిపై మీకు ఘనతను ప్రసాదించాడు కదా!”

1:141 – وَإِذْ أَنجَيْنَاكُم مِّنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ ۖ يُقَتِّلُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُم بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ ١٤١

మరియు మేము మిమ్మల్ని ఫిర్‌’ఔన్‌ జాతి వారి నుండి విముక్తి కలిగించిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వారు మిమ్మల్ని ఘోర బాధకు గురిచేస్తూ ఉన్నారు. మీ కుమారులను చంపి, మీ స్త్రీలను సజీవులుగా వదులుతూ ఉన్నారు. మరియు ఇందు మీ ప్రభువు తరఫు నుండి మీ కొక గొప్పపరీక్ష ఉండింది. (1/4)

1:142 – وَوَاعَدْنَا مُوسَىٰ ثَلَاثِينَ لَيْلَةً وَأَتْمَمْنَاهَا بِعَشْرٍ فَتَمَّ مِيقَاتُ رَبِّهِ أَرْبَعِينَ لَيْلَةً ۚ وَقَالَ مُوسَىٰ لِأَخِيهِ هَارُونَ اخْلُفْنِي فِي قَوْمِي وَأَصْلِحْ وَلَا تَتَّبِعْ سَبِيلَ الْمُفْسِدِينَ ١٤٢

  • మరియు మేము మూసా కొరకు (సినాయి కొండపై) ముప్ఫైరాత్రుల (గడువు) నిర్ణ యించాము. తరువాత పది (రాత్రులు) పొడి గించాము. ఈవిధంగా అతని ప్రభువు నిర్ణయించిన నలభై-రాత్రుల గడువు పూర్తయ్యింది. మూసా తన సోదరుడగు హారూన్‌తో అన్నాడు: “నీవు నా జాతి ప్రజలలో నాకు ప్రాతినిధ్యం వహించు మరియు సంస్కరణకు పాటుపడు మరియు అరాచకాలు చేసేవారి మార్గాన్ని అనుసరించకు.”

1:143 – وَلَمَّا جَاءَ مُوسَىٰ لِمِيقَاتِنَا وَكَلَّمَهُ رَبُّهُ قَالَ رَبِّ أَرِنِي أَنظُرْ إِلَيْكَ ۚ قَالَ لَن تَرَانِي وَلَـٰكِنِ انظُرْ إِلَى الْجَبَلِ فَإِنِ اسْتَقَرَّ مَكَانَهُ فَسَوْفَ تَرَانِي ۚ فَلَمَّا تَجَلَّىٰ رَبُّهُ لِلْجَبَلِ جَعَلَهُ دَكًّا وَخَرَّ مُوسَىٰ صَعِقًا ۚ فَلَمَّا أَفَاقَ قَالَ سُبْحَانَكَ تُبْتُ إِلَيْكَ وَأَنَا أَوَّلُ الْمُؤْمِنِينَ ١٤٣

మరియు మూసా మేము నిర్ణయించిన సమయానికి (మా నిర్ణీత చోటుకు) వచ్చినపుడు, అతని ప్రభువు అతనితో మాట్లాడాడు. (మూసా) అన్నాడు: “ఓ నా ప్రభూ! నాకు నీ దర్శన భాగ్య మివ్వు(కనిపించు). నేనునిన్ను చూడదలచాను!” (అల్లాహ్‌) అన్నాడు: “నీవు నన్ను (ఏ మాత్రం) చూడలేవు! కాని ఈ పర్వతం వైపుకు చూడు! ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉండ గలిగితే, అప్పుడు నీవు నన్ను చూడగలవనుకో!” 56 అతని ప్రభువు ఆ కొండపై తన తేజస్సును ప్రసరింపజేయగా అది భస్మమై పోయింది మరియు మూసా స్పృహతప్పి పడిపోయాడు. తెలివి వచ్చిన తరువాత (మూసా) అన్నాడు: “నీవు సర్వలోపాలకు అతీతుడవు, నేను పశ్చాత్తాపంతో నీ వైపుకు మరలుతున్నాను మరియు నేను విశ్వసించే వారిలో మొట్టమొదటి వాడను.” 57

1:144 – قَالَ يَا مُوسَىٰ إِنِّي اصْطَفَيْتُكَ عَلَى النَّاسِ بِرِسَالَاتِي وَبِكَلَامِي فَخُذْ مَا آتَيْتُكَ وَكُن مِّنَ الشَّاكِرِينَ ١٤٤

(అల్లాహ్‌) అన్నాడు: “ఓ మూసా – ప్రవక్త పదవికి మరియు సంభాషించటానికి –నిశ్చయంగా నేను ప్రజలందరిలో, నిన్ను ఎన్నుకున్నాను. కావున నేను నీకిచ్చిన దానిని తీసుకొని, కృతజ్ఞులలో చేరు.”

1:145 – وَكَتَبْنَا لَهُ فِي الْأَلْوَاحِ مِن كُلِّ شَيْءٍ مَّوْعِظَةً وَتَفْصِيلًا لِّكُلِّ شَيْءٍ فَخُذْهَا بِقُوَّةٍ وَأْمُرْ قَوْمَكَ يَأْخُذُوا بِأَحْسَنِهَا ۚ سَأُرِيكُمْ دَارَ الْفَاسِقِينَ ١٤٥

మరియు మేము అతని కొరకు, ఫలకాల మీద ప్రతివిధమైన ఉపదేశాన్ని ప్రతివ్యవహారానికి సంబంధించిన వివరాలను వ్రాసిఇచ్చి, అతనితో (మూసాతో) అన్నాము: “వీటిని గట్టిగా పట్టుకో! మరియు వీటి ఉత్తమ ఉపదేశాలను అనుసరించ మని నీ జాతి వారిని ఆజ్ఞాపించు. త్వరలోనే నేను అవిధేయుల (ఫాసిఖూన్‌ల) నివాసాన్ని మీకు చూపుతాను.” 58

1:146 – سَأَصْرِفُ عَنْ آيَاتِيَ الَّذِينَ يَتَكَبَّرُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَإِن يَرَوْا كُلَّ آيَةٍ لَّا يُؤْمِنُوا بِهَا وَإِن يَرَوْا سَبِيلَ الرُّشْدِ لَا يَتَّخِذُوهُ سَبِيلًا وَإِن يَرَوْا سَبِيلَ الْغَيِّ يَتَّخِذُوهُ سَبِيلًا ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَذَّبُوا بِآيَاتِنَا وَكَانُوا عَنْهَا غَافِلِينَ ١٤٦

ఏ హక్కూ లేకుండా భూమిపై దురహం కారంతో వ్యవహరించే వారిని నేను నా సూచన (ఆయాత్‌) ల నుండి దూరం చేస్తాను. మరియు వారు ఏ సూచన (ఆయత్‌) ను చూసినా దానిని విశ్వసించరు. 59 ఒకవేళ సక్రమమైన మార్గం వారి ముందుకువచ్చినా, వారు దానిని అవలంబించరు. కాని వారు తప్పు దారిని చూస్తే దానిని అవలం బిస్తారు. 60 ఎందుకంటే వాస్తవానికి, వారు మా సూచన (ఆయాత్‌)లను అబద్ధాలని తిరస్క రించారు మరియు వాటి నుండి నిర్లక్ష్యులై ఉన్నారు. 61

1:147 – وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَلِقَاءِ الْآخِرَةِ حَبِطَتْ أَعْمَالُهُمْ ۚ هَلْ يُجْزَوْنَ إِلَّا مَا كَانُوا يَعْمَلُونَ ١٤٧

మరియు మా సూచన (ఆయాత్‌)లను మరియు పరలోక దర్శనాన్ని (పునరుత్థాన దినాన్ని) అబద్ధాలని తిరస్కరించిన వారు, చేసిన కర్మలన్నీ వ్యర్థమవుతాయి. ఏమీ? వారు కేవలం తమ కర్మలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా పొందగలరా?

1:148 – وَاتَّخَذَ قَوْمُ مُوسَىٰ مِن بَعْدِهِ مِنْ حُلِيِّهِمْ عِجْلًا جَسَدًا لَّهُ خُوَارٌ ۚ أَلَمْ يَرَوْا أَنَّهُ لَا يُكَلِّمُهُمْ وَلَا يَهْدِيهِمْ سَبِيلًا ۘ اتَّخَذُوهُ وَكَانُوا ظَالِمِينَ ١٤٨

మరియు మూసా జాతి వారు, అతను పోయిన పిదప తమ ఆభరణాలతో ఒక ఆవుదూడ విగ్రహాన్ని తయారుచేశారు. దానిలో నుండి (ఆవు అరుపు వంటి) ధ్వని వచ్చేది. ఏమీ? అది వారితో మాట్లాడజాలదని మరియు వారికి ఏ విధమైన మార్గదర్శకత్వం చేయజాలదని వారికి తెలియదా? అయినా వారు దానిని (దైవంగా) చేసుకొని పరమ దుర్మార్గులయ్యారు. 62

1:149 – وَلَمَّا سُقِطَ فِي أَيْدِيهِمْ وَرَأَوْا أَنَّهُمْ قَدْ ضَلُّوا قَالُوا لَئِن لَّمْ يَرْحَمْنَا رَبُّنَا وَيَغْفِرْ لَنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ ١٤٩

మరియు వారు మార్గంతప్పారని తెలుసు కున్నప్పుడు పశ్చాత్తాపంతో మొత్తుకుంటూ అనేవారు: “మా ప్రభువు మమ్మల్ని కరుణించి మమ్మల్ని క్షమించక పోతే, మేము తప్పక నాశనం అయ్యేవారమే!”

1:150 – وَلَمَّا رَجَعَ مُوسَىٰ إِلَىٰ قَوْمِهِ غَضْبَانَ أَسِفًا قَالَ بِئْسَمَا خَلَفْتُمُونِي مِن بَعْدِي ۖ أَعَجِلْتُمْ أَمْرَ رَبِّكُمْ ۖ وَأَلْقَى الْأَلْوَاحَ وَأَخَذَ بِرَأْسِ أَخِيهِ يَجُرُّهُ إِلَيْهِ ۚ قَالَ ابْنَ أُمَّ إِنَّ الْقَوْمَ اسْتَضْعَفُونِي وَكَادُوا يَقْتُلُونَنِي فَلَا تُشْمِتْ بِيَ الْأَعْدَاءَ وَلَا تَجْعَلْنِي مَعَ الْقَوْمِ الظَّالِمِينَ ١٥٠

మరియు మూసా తన జాతివారి వద్దకు తిరిగి వచ్చి క్రోధంతో విచారంతోఅన్నాడు: “నేను వెళ్ళిన పిదప మీరు ఆచరించింది ఎంతచెడ్డది! ఏమీ? మీ ప్రభువు ఆజ్ఞ (రాకముందే) తొందరపడి (ఆయన ఆరాధనను వదిలారా)?” తరువాత ఫలకాలను పడవేసి, 63 తన సోదరుని తలవెంట్రు కలను పట్టుకొని తనవైపునకులాగాడు. (హారూన్‌) అన్నాడు: “నాసోదరుడా (తల్లి-కుమారుడా)! వాస్తవానికి ఈ ప్రజలు బలహీనునిగా చూసి నన్ను చంపేవారే, 64 కావున నీవు (మన) శత్రువులకు, నన్ను చూసి సంతోషించే అవకాశం ఇవ్వకు మరియు నన్ను దుర్మార్గులలో లెక్కించకు!”

1:151 – إِنَّ الَّذِينَ اتَّخَذُوا الْعِجْلَ سَيَنَالُهُمْ غَضَبٌ مِّن رَّبِّهِمْ وَذِلَّةٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُفْتَرِينَ ١٥١

(మూసా) అన్నాడు: “ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా సోదరుణ్ణి క్షమించు. మరియు మా ఇద్దరినీ నీ కారుణ్యంలోకి చేర్చుకో. మరియు నీవే కరుణించే వారిలో అందరికంటే అధికంగా కరుణించేవాడవు!”

1:152 – إِنَّ الَّذِينَ اتَّخَذُوا الْعِجْلَ سَيَنَالُهُمْ غَضَبٌ مِّن رَّبِّهِمْ وَذِلَّةٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُفْتَرِينَ ١٥٢

ఆవు దూడను (దైవంగా) చేసుకున్నవారు తప్ప కుండా తమ ప్రభువు ఆగ్రహానికి గురిఅవు తారు మరియు వారు ఇహలోక జీవితంలో అవమానం పాలవుతారు. మరియు అసత్యాలు కల్పించే వారిని మేము ఇదేవిధంగా శిక్షిస్తాము.

1:153 – وَالَّذِينَ عَمِلُوا السَّيِّئَاتِ ثُمَّ تَابُوا مِن بَعْدِهَا وَآمَنُوا إِنَّ رَبَّكَ مِن بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ ١٥٣

మరియు ఎవరు దుష్కార్యాలు చేసిన పిదప, పశ్చాత్తాపపడతారో మరియు విశ్వసిస్తారో! అలాంటి వారు నిశ్చయంగా, ఆ తరువాత నీ ప్రభువును క్షమించేవాడుగా, కరుణించేవాడుగా పొందుతారు.

1:154 – وَلَمَّا سَكَتَ عَن مُّوسَى الْغَضَبُ أَخَذَ الْأَلْوَاحَ ۖ وَفِي نُسْخَتِهَا هُدًى وَرَحْمَةٌ لِّلَّذِينَ هُمْ لِرَبِّهِمْ يَرْهَبُونَ ١٥٤

మరియు మూసా కోపంచల్లారిన తరువాత ఆ ఫలకాలను ఎత్తుకున్నాడు. 65 మరియు తమ ప్రభువుకు భయపడేవారికి, వాటి వ్రాతలలో మార్గ దర్శకత్వం మరియు కారుణ్యం ఉన్నాయి.

1:155 – وَاخْتَارَ مُوسَىٰ قَوْمَهُ سَبْعِينَ رَجُلًا لِّمِيقَاتِنَا ۖ فَلَمَّا أَخَذَتْهُمُ الرَّجْفَةُ قَالَ رَبِّ لَوْ شِئْتَ أَهْلَكْتَهُم مِّن قَبْلُ وَإِيَّايَ ۖ أَتُهْلِكُنَا بِمَا فَعَلَ السُّفَهَاءُ مِنَّا ۖ إِنْ هِيَ إِلَّا فِتْنَتُكَ تُضِلُّ بِهَا مَن تَشَاءُ وَتَهْدِي مَن تَشَاءُ ۖ أَنتَ وَلِيُّنَا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا ۖ وَأَنتَ خَيْرُ الْغَافِرِينَ ١٥٥

మరియు మేము నిర్ణయించిన గడువు కొరకు, మూసా తన జాతివారిలో నుండి డెభ్భై-మందిని ఎన్నుకున్నాడు. ఆ పిదప వారిని భూ కంపం ఆవరించగా 66 (మూసా) ఇలా ప్రార్థించాడు: ”ఓ నా ప్రభూ! నీవు కోరితే, వీరిని మరియు నన్ను కూడా ఇంతకుపూర్వమే సంహరించి ఉండేవాడవు. ఏమీ? మాలో కొందరు మూఢులు చేసిన పనికి నీవు మమ్మల్ని నశింపజేస్తావా? ఇదంతా నీ పరీక్షయే! దీని ద్వారా నీవు కోరిన వారిని మార్గ భ్రష్టత్వానికి గురిచేస్తావు మరియు నీవు కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తావు. మా సంరక్షకుడవు నీవే, కావున మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. మరియు క్షమించే వారందరిలో నీవే అత్యుత్తముడవు! (3/8)

1:156 – وَاكْتُبْ لَنَا فِي هَـٰذِهِ الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ إِنَّا هُدْنَا إِلَيْكَ ۚ قَالَ عَذَابِي أُصِيبُ بِهِ مَنْ أَشَاءُ ۖ وَرَحْمَتِي وَسِعَتْ كُلَّ شَيْءٍ ۚ فَسَأَكْتُبُهَا لِلَّذِينَ يَتَّقُونَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَالَّذِينَ هُم بِآيَاتِنَا يُؤْمِنُونَ ١٥٦

  • “మాకు ఇహలోకంలో మరియు పర లోకంలో కూడా మంచిస్థితినే వ్రాయి. నిశ్చయంగా, మేము నీ వైపునకే మరలాము.” (అల్లాహ్‌) సమా ధానం ఇచ్చాడు: ”నేను కోరిన వారికి నా శిక్షను విధిస్తాను. నా కారుణ్యం ప్రతి దానిని ఆవరించి ఉన్నది. 67 కనుక నేను దానిని దైవభీతి గల వారికీ, విధిదానం (‘జకాత్‌) ఇచ్చేవారికీ మరియు నా సూచనలను విశ్వసించే వారికీ వ్రాస్తాను!

1:157 – الَّذِينَ يَتَّبِعُونَ الرَّسُولَ النَّبِيَّ الْأُمِّيَّ الَّذِي يَجِدُونَهُ مَكْتُوبًا عِندَهُمْ فِي التَّوْرَاةِ وَالْإِنجِيلِ يَأْمُرُهُم بِالْمَعْرُوفِ وَيَنْهَاهُمْ عَنِ الْمُنكَرِ وَيُحِلُّ لَهُمُ الطَّيِّبَاتِ وَيُحَرِّمُ عَلَيْهِمُ الْخَبَائِثَ وَيَضَعُ عَنْهُمْ إِصْرَهُمْ وَالْأَغْلَالَ الَّتِي كَانَتْ عَلَيْهِمْ ۚ فَالَّذِينَ آمَنُوا بِهِ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَاتَّبَعُوا النُّورَ الَّذِي أُنزِلَ مَعَهُ ۙ أُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ١٥٧

“ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్ష్య రాస్యుడైన 68 ఈ ప్రవక్తను అనుసరిస్తారో! ఎవరి ప్రస్తావన వారి వద్దవున్న తౌరాత్‌ మరియు ఇంజీల్‌ గ్రంథాలలో వ్రాయబడిఉన్నదో 69 అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరిశుద్ధ మైన వస్తువులను ధర్మసమ్మతం చేసి, అపరిశుద్ధ మైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారా లను మరియు వారి నిర్బంధాలను తొలగిస్తాడు. కావున అతనిని సమర్థించి, అతనితో సహకరించి, అతనిపై అవతరింపజేయబడిన జ్యోతిని అనుస రించేవారు మాత్రమే సాఫల్యం పొందేవారు.”

1:158 – قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّـهِ إِلَيْكُمْ جَمِيعًا الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ لَا إِلَـٰهَ إِلَّا هُوَ يُحْيِي وَيُمِيتُ ۖ فَآمِنُوا بِاللَّـهِ وَرَسُولِهِ النَّبِيِّ الْأُمِّيِّ الَّذِي يُؤْمِنُ بِاللَّـهِ وَكَلِمَاتِهِ وَاتَّبِعُوهُ لَعَلَّكُمْ تَهْتَدُونَ ١٥٨

(ఓ ము’హమ్మద్‌!) వారితో ఇలా అను: “మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్‌ యొక్క సందేశ హరుడను. 70 భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు;ఆయనే జీవన్మరణాలనుఇచ్చేవాడు. కావున అల్లాహ్‌ను మరియు ఆయన సందేశహరుడు, నిరక్షరాస్యుడైన ఈ ప్రవక్తను విశ్వసించండి. అతను అల్లాహ్‌ను మరియు ఆయన సందేశాలను విశ్వసిస్తాడు. అతనినే అనుసరించండి, అప్పుడే మీరు మార్గదర్శకత్వం పొందుతారు!” 71

1:159 – وَمِن قَوْمِ مُوسَىٰ أُمَّةٌ يَهْدُونَ بِالْحَقِّ وَبِهِ يَعْدِلُونَ ١٥٩

మరియు మూసా జాతి వారిలో సత్యం ప్రకారమే మార్గదర్శకత్వం చూపుతూ మరియు దాని (సత్యం) ప్రకారమే న్యాయం చేసే ఒక వర్గంవారు ఉన్నారు. 72

1:160 – وَقَطَّعْنَاهُمُ اثْنَتَيْ عَشْرَةَ أَسْبَاطًا أُمَمًا ۚ وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ إِذِ اسْتَسْقَاهُ قَوْمُهُ أَنِ اضْرِب بِّعَصَاكَ الْحَجَرَ ۖ فَانبَجَسَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَيْنًا ۖ قَدْ عَلِمَ كُلُّ أُنَاسٍ مَّشْرَبَهُمْ ۚ وَظَلَّلْنَا عَلَيْهِمُ الْغَمَامَ وَأَنزَلْنَا عَلَيْهِمُ الْمَنَّ وَالسَّلْوَىٰ ۖ كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ ۚ وَمَا ظَلَمُونَا وَلَـٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ ١٦٠

మరియు మేము వారిని పన్నెండు తెగలుగా (వర్గాలుగా)విభజించాము. 73 . మరియు మూసా జాతి వారు అతనిని నీటి కొరకు అడిగి నపుడు. మేము అతనిని: “నీ చేతికర్రతో రాయిపై కొట్టు!” అని ఆజ్ఞాపించాము. అపుడు దానినుండి పన్నెండు ఊటలు ప్రవహించసాగాయి. అపుడు ప్రతి తెగవారు, తాము నీళ్ళు తీసుకునే స్థలాన్ని తెలుసుకున్నారు. మరియు మేము వారిపై మేఘాలఛాయను కల్పించాము. మరియు వారి కొరకు మన్న మరియు సల్వాలను దింపాము: 74 “మేము మీకు ప్రసాదించిన పరిశుధ్ధమైన పదార్థా లను తినండి.” అని అన్నాము. మరియు వారు మాకు అన్యాయం చేయలేదు, కాని తమకుతామే అన్యాయం చేసుకున్నారు.

1:161 – وَإِذْ قِيلَ لَهُمُ اسْكُنُوا هَـٰذِهِ الْقَرْيَةَ وَكُلُوا مِنْهَا حَيْثُ شِئْتُمْ وَقُولُوا حِطَّةٌ وَادْخُلُوا الْبَابَ سُجَّدًا نَّغْفِرْ لَكُمْ خَطِيئَاتِكُمْ ۚ سَنَزِيدُ الْمُحْسِنِينَ ١٦١

మరియు వారికి ఇలా ఆజ్ఞ ఇవ్వబడిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి!): “ఈ నగరంలో నివసించి, అందులో మీఇష్టప్రకారం తినండి మరి యు: ‘మా పాపాలను క్షమించు (‘హి’త్త తున్‌)’ అని అంటూ ఉండండి. మరియు సాష్టాంగ పడుతూ దాని ద్వారంలో ప్రవేశించండి, మేము మీ పాపాలను క్షమిస్తాము. మేము సజ్జనులను అధికంగా (అనుగ్రహిస్తాము).”

1:162 – فَبَدَّلَ الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ قَوْلًا غَيْرَ الَّذِي قِيلَ لَهُمْ فَأَرْسَلْنَا عَلَيْهِمْ رِجْزًا مِّنَ السَّمَاءِ بِمَا كَانُوا يَظْلِمُونَ ١٦٢

కాని వారిలో దుర్మార్గులైన వారు తమకు చెప్పబడిన మాటను మార్చి, మరొక మాటను ఉచ్చరించారు; కావున వారు చేస్తున్న దుర్మార్గానికి ఫలితంగా మేము వారిపై ఆకాశం నుండి ఆపదను పంపాము. 75

1:163 – وَاسْأَلْهُمْ عَنِ الْقَرْيَةِ الَّتِي كَانَتْ حَاضِرَةَ الْبَحْرِ إِذْ يَعْدُونَ فِي السَّبْتِ إِذْ تَأْتِيهِمْ حِيتَانُهُمْ يَوْمَ سَبْتِهِمْ شُرَّعًا وَيَوْمَ لَا يَسْبِتُونَ ۙ لَا تَأْتِيهِمْ ۚ كَذَٰلِكَ نَبْلُوهُم بِمَا كَانُوا يَفْسُقُونَ ١٦٣

మరియు సముద్ర తీరమునందున్న ఆ నగర (వాసులను) గురించి వారిని అడుగు; వారు శనివారపు (సబ్త్‌) ధర్మాన్ని ఉల్లంఘించేవారు! ఆశనివారం(సబ్త్‌)రోజుననే చేపలు వారిముందుకు ఎగిరెగిరి నీటిపైకి వచ్చేవి. మరియు శనివారపు (సబ్త్) ధర్మం పాటించని రోజు (చేపలు) వచ్చేవి కావు. వారి అవిధేయతకు కారణంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురిచేశాము. 76

1:164 – وَإِذْ قَالَتْ أُمَّةٌ مِّنْهُمْ لِمَ تَعِظُونَ قَوْمًا ۙ اللَّـهُ مُهْلِكُهُمْ أَوْ مُعَذِّبُهُمْ عَذَابًا شَدِيدًا ۖ قَالُوا مَعْذِرَةً إِلَىٰ رَبِّكُمْ وَلَعَلَّهُمْ يَتَّقُونَ ١٦٤

వారిలోని ఒక వర్గం వారు: “అల్లాహ్‌ ఎవరిని నశింపజేయనున్నాడో లేదా ఎవరికి కఠినశిక్ష విధించనున్నాడో! అలాంటి వారికి, మీరెందుకు ఉపదేశం చేస్తున్నారు?” అని అంటే అతను (ఉపదేశం చేసే వ్యక్తి) అన్నాడు: “మీ ప్రభువు ముందు, (హితబోధ ఎందుకు చేయలేదని), నాపై నింద ఉండకుండా మరియు వారు దైవభీతి గలవారు అవుతారేమోనని!”

1:165 – فَلَمَّا نَسُوا مَا ذُكِّرُوا بِهِ أَنجَيْنَا الَّذِينَ يَنْهَوْنَ عَنِ السُّوءِ وَأَخَذْنَا الَّذِينَ ظَلَمُوا بِعَذَابٍ بَئِيسٍ بِمَا كَانُوا يَفْسُقُونَ ١٦٥

తరువాత వారికిచేయబడిన హితబోధను వారు మరచినప్పుడు! దుష్కార్యాల నుంచి వారిస్తూ ఉన్నవారిని మేము రక్షించాము. మరియు దుర్మార్గులైన ఇతరులను, అవిధేయత చూపినందుకు కఠిన శిక్షకు గురిచేశాము.

1:166 – فَلَمَّا عَتَوْا عَن مَّا نُهُوا عَنْهُ قُلْنَا لَهُمْ كُونُوا قِرَدَةً خَاسِئِينَ ١٦٦

కాని నిషేధించబడినవాటినే వారుహద్దులు మీరి చేసినప్పుడు మేము వారితో: ”మీరు నీచ మైన కోతులుగా మారండి.” అని అన్నాము. 77

1:167 – وَإِذْ تَأَذَّنَ رَبُّكَ لَيَبْعَثَنَّ عَلَيْهِمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ مَن يَسُومُهُمْ سُوءَ الْعَذَابِ ۗ إِنَّ رَبَّكَ لَسَرِيعُ الْعِقَابِ ۖ وَإِنَّهُ لَغَفُورٌ رَّحِيمٌ ١٦٧

మరియు నీ ప్రభువు వారి (యూదుల) పై అంతిమ దినం వరకు దుఃఖకరమైన శిక్ష విధించే వారిని పంపుతూఉంటానని ప్రకటించినవిషయాన్ని (జ్ఞప్తికి తెచ్చుకోండి). 78 నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష విధించటంలో శీఘ్రుడు. మరియు నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

1:168 – وَقَطَّعْنَاهُمْ فِي الْأَرْضِ أُمَمًا ۖ مِّنْهُمُ الصَّالِحُونَ وَمِنْهُمْ دُونَ ذَٰلِكَ ۖ وَبَلَوْنَاهُم بِالْحَسَنَاتِ وَالسَّيِّئَاتِ لَعَلَّهُمْ يَرْجِعُونَ ١٦٨

మరియు మేము వారిని భువిలో వేర్వేరు తెగలుగా జేసి వ్యాపింపజేశాము. వారిలో కొందరు సన్మార్గులున్నారు, మరికొందరు దానికి దూర మైన వారున్నారు. బహుశా వారు (సన్మార్గానికి) మరలి వస్తారేమోనని, మేము వారిని మంచి-చెడు స్థితుల ద్వారా పరీక్షించాము.

1:169 – فَخَلَفَ مِن بَعْدِهِمْ خَلْفٌ وَرِثُوا الْكِتَابَ يَأْخُذُونَ عَرَضَ هَـٰذَا الْأَدْنَىٰ وَيَقُولُونَ سَيُغْفَرُ لَنَا وَإِن يَأْتِهِمْ عَرَضٌ مِّثْلُهُ يَأْخُذُوهُ ۚ أَلَمْ يُؤْخَذْ عَلَيْهِم مِّيثَاقُ الْكِتَابِ أَن لَّا يَقُولُوا عَلَى اللَّـهِ إِلَّا الْحَقَّ وَدَرَسُوا مَا فِيهِ ۗ وَالدَّارُ الْآخِرَةُ خَيْرٌ لِّلَّذِينَ يَتَّقُونَ ۗ أَفَلَا تَعْقِلُونَ ١٦٩

ఆ పిదప వారి తరువాత దుష్టులైనవారు వారి స్థానంలో గ్రంథానికి వారసులై, తుచ్ఛమైన ప్రాపంచిక వస్తువుల లోభంలో పడుతూ: “మేము క్షమింపబడతాము.” అని పలుకుతున్నారు. అయినా ఇటువంటి సొత్తు తిరిగి వారికి లభిస్తే దానిని తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. “అల్లాహ్‌ విషయంలో సత్యం తప్ప మరేమీ పలుకరాదు.” అని గ్రంథంలో వారితో వాగ్దానం తీసుకోబడలేదా ఏమిటి? అందులో (గ్రంథంలో) ఉన్నదంతా వారు చదివారు కదా! మరియు దైవభీతిగల వారి కొరకు పరలోక నివాసమే ఉత్తమమైనది. ఏమీ? మీరిది గ్రహించలేరా?

1:170 – وَالَّذِينَ يُمَسِّكُونَ بِالْكِتَابِ وَأَقَامُوا الصَّلَاةَ إِنَّا لَا نُضِيعُ أَجْرَ الْمُصْلِحِينَ ١٧٠

మరియు ఎవరైతే గ్రంథాన్ని స్థిరంగా అనుసరిస్తారో మరియు నమా’జ్‌ స్థాపిస్తారో, అలాంటి సద్వర్తనుల ప్రతిఫలాన్ని నిశ్చయంగా, మేము వ్యర్థంచేయము. (1/2)

1:171 – وَإِذْ نَتَقْنَا الْجَبَلَ فَوْقَهُمْ كَأَنَّهُ ظُلَّةٌ وَظَنُّوا أَنَّهُ وَاقِعٌ بِهِمْ خُذُوا مَا آتَيْنَاكُم بِقُوَّةٍ وَاذْكُرُوا مَا فِيهِ لَعَلَّكُمْ تَتَّقُونَ ١٧١

  • మరియు (జ్ఞాపకం చేసుకోండి!) మేము (‘తూర్‌) పర్వతాన్ని పైకెత్తి వారిపై కప్పుగా ఉంచితే! వాస్తవానికి, వారు అది తమపై పడుతుందేమోనని భావించినప్పుడు మేము వారితో అన్నాము: “మేము మీకు ఇచ్చిన దానిని (గ్రంథాన్ని) దృఢంగా పట్టుకోండి మరియు అందులో ఉన్న దానిని జ్ఞాపకం ఉంచుకోండి, దానితో మీరు దైవభీతిపరులు కావచ్చు!”

1:172 – وَإِذْ أَخَذَ رَبُّكَ مِن بَنِي آدَمَ مِن ظُهُورِهِمْ ذُرِّيَّتَهُمْ وَأَشْهَدَهُمْ عَلَىٰ أَنفُسِهِمْ أَلَسْتُ بِرَبِّكُمْ ۖ قَالُوا بَلَىٰ ۛ شَهِدْنَا ۛ أَن تَقُولُوا يَوْمَ الْقِيَامَةِ إِنَّا كُنَّا عَنْ هَـٰذَا غَافِلِينَ ١٧٢

మరియు (జ్ఞాపకంచేసుకోండి!) నీ ప్రభువు ఆదమ్‌ సంతతివారి వీపుల నుండి వారి సంతా నాన్ని తీసి, వారికి వారినే సాక్షులుగా నిలబెట్టి: “ఏమీ? నేను మీ ప్రభువును కానా?” అని అడు గగా, వారు: “అవును! (నీవే మా ప్రభువని) మేము సాక్ష్యమిస్తున్నాము.” అని జవా బిచ్చారు. 79 తీర్పుదినమున మీరు:“నిశ్చయంగా మేము దీనిని ఎరుగము.” అని అనగూడదని.

1:173 – أَوْ تَقُولُوا إِنَّمَا أَشْرَكَ آبَاؤُنَا مِن قَبْلُ وَكُنَّا ذُرِّيَّةً مِّن بَعْدِهِمْ ۖ أَفَتُهْلِكُنَا بِمَا فَعَلَ الْمُبْطِلُونَ ١٧٣

లేక: “వాస్తవానికి ఇంతకు పూర్వం మా తాత-ముత్తాతలు అల్లాహ్‌కు సాటి (భాగ స్వాములు) కల్పించారు. మేము వారి తరువాత వచ్చిన, వారి సంతతివారం (కాబట్టి వారిని అనుసరించాము). అయితే? ఆ అసత్యవాదులు చేసిన కర్మలకు నీవు మమ్మల్ని నశింపజేస్తావా?” అని అనగూడదని.

1:174 – وَكَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ وَلَعَلَّهُمْ يَرْجِعُونَ ١٧٤

మరియు ఈ విధంగానైనా వారు సన్మార్గానికి మరలుతారేమోనని మేము ఈ సూచనలను స్పష్టంగా తెలుపుతున్నాము.

1:175 – وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ الَّذِي آتَيْنَاهُ آيَاتِنَا فَانسَلَخَ مِنْهَا فَأَتْبَعَهُ الشَّيْطَانُ فَكَانَ مِنَ الْغَاوِينَ ١٧٥

మరియు మేము, మా సూచనలు (ఆయాత్‌) ప్రసాదించిన ఆ వ్యక్తి గాథ వారికి వినిపించు. అతడు వాటి నుండి విముఖుడై నందుకు షై’తాన్‌ అతనిని వెంబడించాడు, కావున అతడు మార్గభ్రష్టులలో చేరి పోయాడు.

1:176 – وَلَوْ شِئْنَا لَرَفَعْنَاهُ بِهَا وَلَـٰكِنَّهُ أَخْلَدَ إِلَى الْأَرْضِ وَاتَّبَعَ هَوَاهُ ۚ فَمَثَلُهُ كَمَثَلِ الْكَلْبِ إِن تَحْمِلْ عَلَيْهِ يَلْهَثْ أَوْ تَتْرُكْهُ يَلْهَث ۚ ذَّٰلِكَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۚ فَاقْصُصِ الْقَصَصَ لَعَلَّهُمْ يَتَفَكَّرُونَ ١٧٦

మరియు మేము కోరుకుంటే వాటి (ఆ సూచనల) ద్వారా అతనికి ఔన్నత్యాన్ని ప్రసా దించే వారము. కాని అతడు భూమి వైపునకు వంగాడు, మరియు తన కోరికలను అనుస రించాడు. అతని దృష్టాంతం ఆ కుక్కవలె ఉంది: నీవు దానిని బెదిరించినా అది నాలుకను బయ టికి వ్రేలాడదీస్తుంది, లేక వదలిపెట్టినా అది నాలు కను బయటికి వ్రేలాడదీస్తుంది. మా సూచన (ఆయాత్‌)లను అబద్ధాలని నిరాకరించే వారి దృష్టాంతం కూడా ఇదే! నీవు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉంటే, బహుశా వారు ఆలోచించవచ్చు!

1:177 – سَاءَ مَثَلًا الْقَوْمُ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَأَنفُسَهُمْ كَانُوا يَظْلِمُونَ ١٧٧

మాసూచనలను అబద్ధాలని తిరస్కరించే వారి దృష్టాంతం చాలాచెడ్డది. ఎందుకంటే వారు తమకుతాము అన్యాయం చేసుకుంటున్నారు.

1:178 – مَن يَهْدِ اللَّـهُ فَهُوَ الْمُهْتَدِي ۖ وَمَن يُضْلِلْ فَأُولَـٰئِكَ هُمُ الْخَاسِرُونَ ١٧٨

అల్లాహ్‌ మార్గదర్శకత్వం చేసినవాడే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గభ్రష్టత్వంలో పడనిచ్చినవారు, వారే నష్టపోయే వారు!

1:179 – وَلَقَدْ ذَرَأْنَا لِجَهَنَّمَ كَثِيرًا مِّنَ الْجِنِّ وَالْإِنسِ ۖ لَهُمْ قُلُوبٌ لَّا يَفْقَهُونَ بِهَا وَلَهُمْ أَعْيُنٌ لَّا يُبْصِرُونَ بِهَا وَلَهُمْ آذَانٌ لَّا يَسْمَعُونَ بِهَا ۚ أُولَـٰئِكَ كَالْأَنْعَامِ بَلْ هُمْ أَضَلُّ ۚ أُولَـٰئِكَ هُمُ الْغَافِلُونَ ١٧٩

మరియు వాస్తవానికి మేము చాలా మంది జిన్నాతులను మరియు మానవులను నరకం కొరకు సృజించాము. ఎందుకంటే! వారికి హృద యాలున్నాయి కాని వాటితో వారు అర్థంచేసుకో లేరు మరియు వారికి కళ్ళున్నాయి కాని వాటితో వారు చూడలేరు మరియు వారికి చెవులున్నాయి కాని వాటితో వారు వినలేరు. ఇలాంటివారు, పశు వుల వంటి వారు; కాదు! వాటికంటే అధములు. ఇలాంటివారే నిర్లక్ష్యంలో మునిగిఉన్న వారు.

1:180 – وَلِلَّـهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا ۖ وَذَرُوا الَّذِينَ يُلْحِدُونَ فِي أَسْمَائِهِ ۚ سَيُجْزَوْنَ مَا كَانُوا يَعْمَلُونَ ١٨٠

మరియు అల్లాహ్‌ పేర్లు! అన్నీ అత్యు త్తమమైనవే; కావున మీరు వాటితో ఆయనను ప్రార్థించండి. 80 మరియు ఆయన పేర్ల విషయంలో సత్యం నుండి వైదొలగిన వారిని విసర్జించండి. వారు తమ కర్మలకు ప్రతిఫలం పొందగలరు.

1:181 – وَمِمَّنْ خَلَقْنَا أُمَّةٌ يَهْدُونَ بِالْحَقِّ وَبِهِ يَعْدِلُونَ ١٨١

మరియు మేము సృష్టించిన వారిలో ఒక వర్గం వారు సత్యం ప్రకారం మార్గదర్శకత్వం చేసే వారునూ మరియు దానిని అనుసరించియే న్యాయం చేసేవారునూ ఉన్నారు.

1:182 – وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا سَنَسْتَدْرِجُهُم مِّنْ حَيْثُ لَا يَعْلَمُونَ ١٨٢

మరియు మా సూచనలను అబద్ధాలని తిరస్కరించేవారిని మేము వారికి తెలియకుండానే క్రమక్రమంగా (నాశనం వైపునకు) తీసుకుపోతాము.

1:183 – وَأُمْلِي لَهُمْ ۚ إِنَّ كَيْدِي مَتِينٌ ١٨٣

మరియు నేను వారికి వ్యవధినిస్తున్నాను. నిశ్చయంగా, నా వ్యూహం బలమైనది. 81

1:184 – أَوَلَمْ يَتَفَكَّرُوا ۗ مَا بِصَاحِبِهِم مِّن جِنَّةٍ ۚ إِنْ هُوَ إِلَّا نَذِيرٌ مُّبِينٌ ١٨٤

ఏమీ? తమ సహచరుడు పిచ్చిపట్టిన వాడు కాదని వారు గమనించలేదా? అతను కేవలం స్పష్టమైన హెచ్చరిక చేసేవాడు మాత్రమే!

1:185 – أَوَلَمْ يَنظُرُوا فِي مَلَكُوتِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا خَلَقَ اللَّـهُ مِن شَيْءٍ وَأَنْ عَسَىٰ أَن يَكُونَ قَدِ اقْتَرَبَ أَجَلُهُمْ ۖ فَبِأَيِّ حَدِيثٍ بَعْدَهُ يُؤْمِنُونَ ١٨٥

ఏమీ? వారు భూమ్యాకాశాలపై గల (అల్లాహ్) ఆధిపత్యాన్ని మరియు అల్లాహ్‌ సృష్టించిన ప్రతి వస్తువును గమనించి చూసి, బహుశా తమ గడువు కూడా సమీపించిందేమోనని అనుకోలేరా? దీని తరువాత వారు మరేవిధమైన సందేశాన్ని విశ్వసిస్తారు?

1:186 – مَن يُضْلِلِ اللَّـهُ فَلَا هَادِيَ لَهُ ۚ وَيَذَرُهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ ١٨٦

అల్లాహ్‌ మార్గభ్రష్టత్వంలో పడనిచ్చిన వానికి మార్గదర్శకుడెవ్వడూ లేడు! 82 మరియు ఆయన వారిని తమ తలబిరుసుతనంలో త్రోవతప్పి తిరుగటానికి వదలిపెడుతున్నాడు.

1:187 – يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِندَ رَبِّي ۖ لَا يُجَلِّيهَا لِوَقْتِهَا إِلَّا هُوَ ۚ ثَقُلَتْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ لَا تَأْتِيكُمْ إِلَّا بَغْتَةً ۗ يَسْأَلُونَكَ كَأَنَّكَ حَفِيٌّ عَنْهَا ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِندَ اللَّـهِ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ ١٨٧

(ఓ ప్రవక్తా!) వారు నిన్ను ఆ అంతిమ ఘడియనుగురించి: ”అది ఎప్పుడు రానున్నది?” అని అడుగుతున్నారు. వారితో ఇలా అను: ”నిస్సందేహంగా, దాని జ్ఞానం నా ప్రభువుకు మాత్రమే ఉంది. 83 కేవలం ఆయన స్వయంగా దానిని, దాని సమయంలో తెలియజేస్తాడు. అది భూమ్యాకాశాలకు ఎంతో దుర్భరమైనదిగా ఉంటుంది. అది మీపై అకస్మాత్తుగానే వచ్చిపడు తుంది.” దానిని గురించి నీకు బాగా తెలిసి ఉన్నట్లు భావించి, వారు నిన్ను దానిని గురించి అడుగుతున్నారు. నీవు ఇలా సమాధానం ఇవ్వు: ”నిస్సందేహంగా, దాని జ్ఞానం అల్లాహ్‌కు మాత్రమే ఉంది. కాని చాలామంది ఇది తెలుసుకోలేరు.” 84

1:188 – قُل لَّا أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَاءَ اللَّـهُ ۚ وَلَوْ كُنتُ أَعْلَمُ الْغَيْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَيْرِ وَمَا مَسَّنِيَ السُّوءُ ۚ إِنْ أَنَا إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ ١٨٨

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: ”అల్లాహ్‌ కోరితే తప్ప నా స్వయానికి నేను, లాభం 85 గానీ, నష్టం 86 గానీ చేసుకునేఅధికారం నాకులేదు. నాకు అగోచరవిషయ జ్ఞానం ఉండి ఉన్నట్లైతే నేను లాభం కలిగించే విషయాలను నా కొరకు అధికంగా సమకూర్చుకునేవాడిని. మరియు నాకు ఎన్నడూ ఏ నష్టం కలిగేది కాదు. నేను విశ్వసించే వారికి కేవలం హెచ్చరిక చేసేవాడను మరియు శుభవార్త నిచ్చేవాడను మాత్రమే!” 87 (5/8)

1:189 – هُوَ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَجَعَلَ مِنْهَا زَوْجَهَا لِيَسْكُنَ إِلَيْهَا ۖ فَلَمَّا تَغَشَّاهَا حَمَلَتْ حَمْلًا خَفِيفًا فَمَرَّتْ بِهِ ۖ فَلَمَّا أَثْقَلَت دَّعَوَا اللَّـهَ رَبَّهُمَا لَئِنْ آتَيْتَنَا صَالِحًا لَّنَكُونَنَّ مِنَ الشَّاكِرِينَ ١٨٩

  • ఆయనే, మిమ్మల్ని ఒకే వ్యక్తి నుండి సృష్టించాడు మరియు అతని నుండియే జీవిత సౌఖ్యం పొందటానికి అతని భార్యను పుట్టించాడు. 88 అతనుఆమెను కలుసుకున్నపుడు ఆమె ఒక తేలికైన భారాన్నిధరించి దానిని మోస్తూ తిరుగుతూ ఉంటుంది. పిదప ఆమె గర్భభారం అధికమైనప్పుడు, వారు ఉభయులూ కలిసి వారి ప్రభువైన అల్లాహ్‌ను ఇలా వేడుకుంటారు: “నీవు మాకు మంచి బిడ్డను ప్రసాదిస్తే మేము తప్పక నీకు కృతజ్ఞతలు తెలిపేవార మవుతాము!”

1:190 – فَلَمَّا آتَاهُمَا صَالِحًا جَعَلَا لَهُ شُرَكَاءَ فِيمَا آتَاهُمَا ۚ فَتَعَالَى اللَّـهُ عَمَّا يُشْرِكُونَ ١٩٠

ఆయన వారికి ఒక మంచి బిడ్డను ప్రసా దించిన పిదప, వారు ఆయన ప్రసాదించిన దాని విషయంలో ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించసాగుతారు. కాని వారు కల్పించే భాగ స్వాముల కంటే అల్లాహ్‌ మహోన్నతుడు.

1:191 – أَيُشْرِكُونَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ ١٩١

ఏమీ? దేనినీ కూడ సృష్టించలేని మరియు (స్వయంగా) తామే సృష్టించబడిన వారిని, వారు ఆయనకు సాటి (భాగస్వాములు)గా కల్పిస్తారా?

1:192 – وَلَا يَسْتَطِيعُونَ لَهُمْ نَصْرًا وَلَا أَنفُسَهُمْ يَنصُرُونَ ١٩٢

మరియు వారు, వారికి ఎలాంటి సహాయం చేయలేరు. మరియు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు.

1:193 – وَإِن تَدْعُوهُمْ إِلَى الْهُدَىٰ لَا يَتَّبِعُوكُمْ ۚ سَوَاءٌ عَلَيْكُمْ أَدَعَوْتُمُوهُمْ أَمْ أَنتُمْ صَامِتُونَ ١٩٣

మరియు మీరు వారిని సన్మార్గానికి పిలిచినా, వారు మిమ్మల్ని అనుసరించలేరు. మీరు వారిని పిలిచినా, లేక మౌనం వహించినా మీకు సమానమే!

1:194 – إِنَّ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّـهِ عِبَادٌ أَمْثَالُكُمْ ۖ فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ ١٩٤

నిశ్చయంగా, మీరు అల్లాహ్‌ను విడిచి ఎవరినైతే పిలుస్తున్నారో, వారు కూడా మీలాంటి దాసులే! మీరు వారిని పిలువండి, మీరు సత్యవంతులే అయితే మీ పిలుపుకు వారు సమాధానమివ్వాలి. 89

1:195 – أَلَهُمْ أَرْجُلٌ يَمْشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَيْدٍ يَبْطِشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَعْيُنٌ يُبْصِرُونَ بِهَا ۖ أَمْ لَهُمْ آذَانٌ يَسْمَعُونَ بِهَا ۗ قُلِ ادْعُوا شُرَكَاءَكُمْ ثُمَّ كِيدُونِ فَلَا تُنظِرُونِ ١٩٥

ఏమీ? వారికి కాళ్ళున్నాయా, వాటితో నడవటానికి? లేదా వారికి చేతులున్నాయా, వాటితో పట్టుకోవటానికి? లేదా వారికి కళ్ళు న్నాయా, వాటితో చూడటానికి? లేదా వారికి చెవులున్నాయా, వాటితో వినటానికి? వారితో అను: “మీరు సాటికల్పించిన వారిని (భాగస్వాము లను) పిలువండి. తరువాత మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా కుట్రలు (వ్యూహలు) పన్నండి, నాకు గడువు కూడా ఇవ్వకండి.

1:196 – إِنَّ وَلِيِّيَ اللَّـهُ الَّذِي نَزَّلَ الْكِتَابَ ۖ وَهُوَ يَتَوَلَّى الصَّالِحِينَ ١٩٦

“నిశ్చయంగా, ఈ గ్రంథాన్ని అవతరింప జేసిన అల్లాహ్‌యే నా సంరక్షకుడు, ఆయన సద్వర్తనులనే మిత్రులుగా చేసుకుంటాడు.

1:197 – وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ لَا يَسْتَطِيعُونَ نَصْرَكُمْ وَلَا أَنفُسَهُمْ يَنصُرُونَ ١٩٧

“మరియు ఆయనను విడిచి మీరు వేడుకునే వారు మీకు ఏవిధమైన సహాయం చేయలేరు. మరియు వారు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు.

1:198 – وَإِن تَدْعُوهُمْ إِلَى الْهُدَىٰ لَا يَسْمَعُوا ۖ وَتَرَاهُمْ يَنظُرُونَ إِلَيْكَ وَهُمْ لَا يُبْصِرُونَ ١٩٨

“మరియు మీరు వారిని సన్మార్గానికి పిలిచినా వారు వినలేరు. మరియు వారు నీ వైపుకు చూస్తున్నట్లు నీవు భావిస్తావు, కాని వారు చూడలేరు.”

1:199 – خُذِ الْعَفْوَ وَأْمُرْ بِالْعُرْفِ وَأَعْرِضْ عَنِ الْجَاهِلِينَ ١٩٩

మన్నింపు వైఖరిని అవలంబించు, ధర్మమును బోధించు మరియు మూర్ఖుల నుండి విముఖుడవగు. 90

1:200 – وَإِمَّا يَنزَغَنَّكَ مِنَ الشَّيْطَانِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللَّـهِ ۚ إِنَّهُ سَمِيعٌ عَلِيمٌ ٢٠٠

మరియు ఒకవేళ షై’తాన్‌ నుండి నీకు ప్రేరేపణ కలిగితే! నీవు అల్లాహ్‌ శరణువేడుకో! నిశ్చయంగా ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

1:201 – إِنَّ الَّذِينَ اتَّقَوْا إِذَا مَسَّهُمْ طَائِفٌ مِّنَ الشَّيْطَانِ تَذَكَّرُوا فَإِذَا هُم مُّبْصِرُونَ ٢٠١

వాస్తవానికి, దైవభీతి గలవారు తమకు షై’తాన్‌ నుండి కలత గలిగితే! వారు (అల్లాహ్‌ ను) స్మరిస్తారు, అప్పుడు వారు అంతా సరిగ్గా చూస్తారు.

1:202 – وَإِخْوَانُهُمْ يَمُدُّونَهُمْ فِي الْغَيِّ ثُمَّ لَا يُقْصِرُونَ ٢٠٢

మరియు వారి (షై’తానుల) సహోదరులు వారిని తప్పుదారివైపుకు లాక్కొని పోగోరుతారు మరియు వారు ఏ మాత్రం పట్టువదలరు.

1:203 – وَإِذَا لَمْ تَأْتِهِم بِآيَةٍ قَالُوا لَوْلَا اجْتَبَيْتَهَا ۚ قُلْ إِنَّمَا أَتَّبِعُ مَا يُوحَىٰ إِلَيَّ مِن رَّبِّي ۚ هَـٰذَا بَصَائِرُ مِن رَّبِّكُمْ وَهُدًى وَرَحْمَةٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ ٢٠٣

మరియు (ఓ ప్రవక్తా!) నీవు వారికి ఏదైనా సూచనను తేలేక పోయినప్పుడు వారు: “నీవే స్వయంగా దానిని ఎందుకు (కల్పించుకొని) తేలేదు?” అని అంటారు. వారితో ఇలా అను: “నేను కేవలం నా ప్రభువు తరఫు నుండి నాకు పంపబడే సందేశాన్ని (వ’హీని) మాత్రమే అనుస రించేవాడను. 91 ఇందు (ఈ ఖుర్‌ఆన్‌)లో విశ్వసించే వారి కొరకు, మీ ప్రభువు తరఫు నుండి అనేక బోధనలు, మార్గదర్శకత్వం మరియు కారుణ్యమున్నాయి.” 92

1:204 – وَإِذَا قُرِئَ الْقُرْآنُ فَاسْتَمِعُوا لَهُ وَأَنصِتُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ ٢٠٤

మరియు ఖుర్‌ఆన్‌ పారాయణం జరిగేటప్పుడు దానిని శ్రధ్ధగా వినండి మరియు నిశ్శబ్దంగా ఉండండి, అప్పుడు మీరు కరుణింప బడవచ్చు! 93

1:205 – وَاذْكُر رَّبَّكَ فِي نَفْسِكَ تَضَرُّعًا وَخِيفَةً وَدُونَ الْجَهْرِ مِنَ الْقَوْلِ بِالْغُدُوِّ وَالْآصَالِ وَلَا تَكُن مِّنَ الْغَافِلِينَ ٢٠٥

మరియు నీవు నీ మనస్సులో వినయంతో, భయంతో మరియు ఎక్కువ శబ్దంతో గాక (తగ్గు స్వరంతో) ఉదయం మరియు సాయంత్రం నీ ప్రభువును స్మరించు. మరియు నిర్లక్ష్యం చేసేవారిలో చేరకు. 94

1:206 – إِنَّ الَّذِينَ عِندَ رَبِّكَ لَا يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِهِ وَيُسَبِّحُونَهُ وَلَهُ يَسْجُدُونَ ۩ ٢٠٦

నిశ్చయంగా, నీ ప్రభువుకు దగ్గరగా ఉన్న వారు (దైవదూతలు) తమ ప్రభువును ఆరాధించ టానికి అహంభావం చూపరు. మరియు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు. మరియు ఆయనకే సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారు. (3/4) (సజ్దా)

సూరహ్‌ అల్‌-అన్‌ఫాల్‌ – అల్‌-అన్ఫాలు, నఫ్‌లున్‌ యొక్క బహువచనం. అంటే అధికం. ఇక్కడ ధర్మయుధ్ధంలో దొరికే విజయధనం లేక యుద్ధబూటి, అని అర్థం. ఇది బద్ర్‌ యుద్ధం (2వ హిజ్రీలో, 17వ రమ’దాన్‌), తరువాత అవతరింపజేయబడిన మదనీ సూరహ్. మొదటి 7 సూరాహ్‌లు కలసి ఖుర్‌ఆన్‌ యొక్క మూడవ (1/3) భాగం కంటే కొంత తక్కువ ఉన్నాయి. వీటిలో ప్రాచీన గాథలు మరియు మొట్ట మొదటి ఇస్లామియా సమాజమును (ఉమ్మత్‌ను) గురించిన విషయాలు ఉన్నాయి. ఈ సూరహ్‌లో బద్ర్‌ యుద్ధం మరియు విజయధనం మొదలైన విషయాల ప్రస్తావన ఉంది. బూటీ నుండి ఐదవ (1/5) భాగం నాయకునకు మిగిలింది ఇతర యుద్ధానికి పోయిన వారికి – నాయకుని ఆజ్ఞానుసారంగా – పంచబడుతుంది. ఇందులో విశ్వాసులకు, ధర్మయుద్ధంలో అల్లాహ్‌ (సు.త.) తరఫునుండి వచ్చిన సహాయం కూడా పేర్కొనబడింది.

ముష్రిక్‌ ఖురైషుల బాధలకు తాళలేక, వారి హత్యాపన్నుగడ నుండి తప్పించుకొని; ము’హమ్మద్‌ (‘స’అస) మరియు ఆ తరువాత ఇతర ముస్లింలూ – శాంతి, భద్రతలు కోరుతూ – మదీనహ్ కు వలసపోతారు. వారికి ముష్రికులు దాడిచేయవచ్చనే భయం ఉంటుంది. కాబట్టి వారు ముష్రికులకు గుణపాఠం నేర్పటానికి – 313 మంది వీరులతో, 70 ఒంటెలతో మరియు 2 గుర్రాలతో మాత్రమే – సిరియానుండి మక్కహ్ కు తిరిగివచ్చే వాణిజ్య బిడారం (కార్‌వాన్‌) మీద దాడి చేయటానికి వెళ్ళుతారు. ఈ విషయం కార్‌వాన్‌ నాయకుడైన అబూ-సుఫియాన్‌కు తెలుస్తుంది, (అంతవరకు అతడు ఇంకా ముష్రిక్‌ గానే ఉంటాడు). అతడు సహాయం కొరకు మక్కహ్ కు వార్తాహరుణ్ణి పంపుతాడు. అబూ-సుఫియాన్‌ కార్‌వాన్‌లో, 1000 ఒంటెలు, 40 యుద్ధవీరులు మాత్రమే ఉంటారు. అతడు తన దారిమార్చి సముద్ర తట్టునుండి తన ప్రయాణం సాగిస్తాడు. మక్కహ్ ముష్రిక్‌ ఖురైషులు 1000 మంది అస్త్రధారులు, యుద్ధనిపుణులు అయిన వీరులను, 700 ఒంటెలను మరియు 100 గుర్రాలను తీసుకుని బయలుదేరి, బద్ర్‌ ప్రాంతంలో చేరుకుంటారు. కేవలం వ్యాపార బిడారం మీదపడి వారికి గుణపాఠం నేర్పాలని – మంచి యుద్ధ సామాగ్రి లేకుండానే – బయలుదేరిన, 313 మందికి, 1000 మంది నిపుణులైన అబూ-జహల్‌ సైన్యంతో పోరాడవలసివస్తుంది. ము’హమ్మద్‌ (‘స’అస), తమ అనుచరులతో (ర’ది. ‘అన్హుమ్‌) సమాలోచనలు చేస్తారు. అందులో ఏ కొందరో తప్పా, అందరూ యుద్ధానికి సిద్ధవుతారు. 75 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 8:1 – يَسْأَلُونَكَ عَنِ الْأَنفَالِ ۖ قُلِ الْأَنفَالُ لِلَّـهِ وَالرَّسُولِ ۖ فَاتَّقُوا اللَّـهَ وَأَصْلِحُوا ذَاتَ بَيْنِكُمْ ۖ وَأَطِيعُوا اللَّـهَ وَرَسُولَهُ إِن كُنتُم مُّؤْمِنِينَ ١

  • (ఓ ప్రవక్తా!) వారు నిన్ను విజయధనం (అన్‌ఫాల్‌) ను గురించి అడుగుతున్నారు. వారితో ఇలా అను: ”విజయధనం అల్లాహ్‌ది మరియు ఆయన సందేశహరునిది.” కనుక మీరు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. మరియు మీ పరస్పర సంబంధాలను సరిదిద్దు కోండి. మీరు విశ్వాసులే అయితే, అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి.

8:2 – إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ إِذَا ذُكِرَ اللَّـهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَإِذَا تُلِيَتْ عَلَيْهِمْ آيَاتُهُ زَادَتْهُمْ إِيمَانًا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ ٢

నిశ్చయంగా, విశ్వాసులైన వారి హృదయా లు అల్లాహ్‌ ప్రస్తావన వచ్చినపుడు భయంతో వణ కుతాయి. మరియు వారి ముందు ఆయన సూచ నలు (ఖుర్‌ఆన్‌) పఠింపబడినప్పుడు వారి విశ్వా సం మరింత అధికమే అవుతుంది. మరియు వారు తమ ప్రభువుమీదే దృఢనమ్మకం కలిగి ఉంటారు.

8:3 – الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ ٣

వారే నమా’జ్‌ను స్థాపిస్తారు మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధినుండి (ఇతరులపై) ఖర్చుచేస్తారు.

8:4 – أُولَـٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا ۚ لَّهُمْ دَرَجَاتٌ عِندَ رَبِّهِمْ وَمَغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ ٤

అలాంటివారు, వారే! నిజమైన విశ్వాసులు. వారిప్రభువువద్ద వారికి ఉన్నతస్థానాలు, క్షమాపణ మరియు గౌరవనీయమైన జీవనోపాధి ఉంటాయి.

8:5 – كَمَا أَخْرَجَكَ رَبُّكَ مِن بَيْتِكَ بِالْحَقِّ وَإِنَّ فَرِيقًا مِّنَ الْمُؤْمِنِينَ لَكَارِهُونَ ٥

(ఓ ప్రవక్తా)ఎప్పడైతే! నీప్రభువు నిన్ను సత్య స్థాపన కొరకు నీ గృహంనుండి (యుద్ధానికి) బయ టకు తీసుకొనివచ్చాడో! అప్పుడు నిశ్చయంగా, విశ్వాసులలో ఒక పక్షం వారు దానికి ఇష్టపడలేదు;

8:6 – يُجَادِلُونَكَ فِي الْحَقِّ بَعْدَ مَا تَبَيَّنَ كَأَنَّمَا يُسَاقُونَ إِلَى الْمَوْتِ وَهُمْ يَنظُرُونَ ٦

సత్యం బహిర్గతమైన తరువాతకూడా, వారు దానినిగురించి నీతోవాదులాడుతున్నారు.అప్పుడు (వారి స్థితి) వారు చావును కళ్ళారా చూస్తుండగా! దాని వైపునకు లాగబడే వారివలే ఉంది.

8:7 – وَإِذْ يَعِدُكُمُ اللَّـهُ إِحْدَى الطَّائِفَتَيْنِ أَنَّهَا لَكُمْ وَتَوَدُّونَ أَنَّ غَيْرَ ذَاتِ الشَّوْكَةِ تَكُونُ لَكُمْ وَيُرِيدُ اللَّـهُ أَن يُحِقَّ الْحَقَّ بِكَلِمَاتِهِ وَيَقْطَعَ دَابِرَ الْكَافِرِينَ ٧

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఆ రెండు పక్షాలలో, ఒక పక్షం మీ చేతికి తప్పక చిక్కు తుందని అల్లాహ్‌ మీతో వాగ్దానం చేసినప్పుడు; ఆయుధాలు లేని పక్షం మీకు దొరకాలని మీరు కోరుతూ ఉన్నారు. కాని అల్లాహ్‌ తాను ఇచ్చిన మాట ప్రకారం సత్యాన్ని సత్యంగా నిరూపించాలనీ మరియు అవిశ్వాసులను సమూలంగా నాశనం చేయాలనీ కోరాడు.

8:8 – لِيُحِقَّ الْحَقَّ وَيُبْطِلَ الْبَاطِلَ وَلَوْ كَرِهَ الْمُجْرِمُونَ ٨

అపరాధులు ఎంత అసహ్యించుకున్నా సత్యాన్ని సత్యంగా నిరూపించాలని (నెగ్గించాలని) మరియు అసత్యాన్ని అసత్యంగా నిరూపించాలని (విఫలం చేయాలని) ఆయన (ఇచ్ఛ). 1

8:9 – إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ أَنِّي مُمِدُّكُم بِأَلْفٍ مِّنَ الْمَلَائِكَةِ مُرْدِفِينَ ٩

(జ్ఞాపకం చేసుకోండి!) మీరు మీ ప్రభువును సహాయం కొరకు ప్రార్థించినపుడు ఆయన ఇలా జవాబిచ్చాడు: “నిశ్చయంగా, నేను వేయి దైవదూతలను ఒకరి తరువాత ఒకరిని పంపి మిమ్మల్ని బలపరుస్తాను.” 2

8:10 – وَمَا جَعَلَهُ اللَّـهُ إِلَّا بُشْرَىٰ وَلِتَطْمَئِنَّ بِهِ قُلُوبُكُمْ ۚ وَمَا النَّصْرُ إِلَّا مِنْ عِندِ اللَّـهِ ۚ إِنَّ اللَّـهَ عَزِيزٌ حَكِيمٌ ١٠

మరియు మీకు శుభవార్తనిచ్చి, మీ హృదయాలకు శాంతి కలుగజేయటానికే, ఈ విషయాన్ని అల్లాహ్‌ మీకు తెలిపాడు. మరియు వాస్తవానికి సహాయం (విజయం) కేవలం అల్లాహ్‌ నుంచే వస్తుంది. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు. 3

8:11 – إِذْ يُغَشِّيكُمُ النُّعَاسَ أَمَنَةً مِّنْهُ وَيُنَزِّلُ عَلَيْكُم مِّنَ السَّمَاءِ مَاءً لِّيُطَهِّرَكُم بِهِ وَيُذْهِبَ عَنكُمْ رِجْزَ الشَّيْطَانِ وَلِيَرْبِطَ عَلَىٰ قُلُوبِكُمْ وَيُثَبِّتَ بِهِ الْأَقْدَامَ ١١

(జ్ఞాపకం చేసుకోండి!) ఆయన (అల్లాహ్‌) తన తరఫునుండి మీకు మనశ్శాంతి కలుగజేయ టానికి మీకు నిద్రమత్తును కలిగించాడు మరియు మీపై ఆకాశంనుండి నీటిని కురిపించాడు, దాని ద్వారా మిమ్మల్ని పరిశుధ్ధపరచటానికి మీ నుండి షై’తాన్‌ మాలిన్యాన్ని దూరం చేయటానికి మరియు మీ హృదయాలను బలపరచటానికి మరియు మీ పాదాలను స్థిరపరచటానికీని!

8:12 – إِذْ يُوحِي رَبُّكَ إِلَى الْمَلَائِكَةِ أَنِّي مَعَكُمْ فَثَبِّتُوا الَّذِينَ آمَنُوا ۚ سَأُلْقِي فِي قُلُوبِ الَّذِينَ كَفَرُوا الرُّعْبَ فَاضْرِبُوا فَوْقَ الْأَعْنَاقِ وَاضْرِبُوا مِنْهُمْ كُلَّ بَنَانٍ ١٢

నీ ప్రభువు దైవదూతలకు ఇచ్చిన దివ్య జ్ఞానాన్ని (జ్ఞాపకం చేసుకోండి):”నేను నిశ్చయంగా మీతో ఉన్నాను. కావున మీరు విశ్వాసులకు ఈ విధంగా ధైర్య-స్థైర్యాలను కలిగించండి: ‘నేను సత్య-తిరస్కారులైన వారి హృదయాలలో భయాన్ని కలిగిస్తాను, అప్పుడు మీరు వారి మెడలపై కొట్టండి మరియు వారి వ్రేళ్ళకొనలను నరికివేయండి.’ ”

8:13 – ذَٰلِكَ بِأَنَّهُمْ شَاقُّوا اللَّـهَ وَرَسُولَهُ ۚ وَمَن يُشَاقِقِ اللَّـهَ وَرَسُولَهُ فَإِنَّ اللَّـهَ شَدِيدُ الْعِقَابِ ١٣

ఇది ఎందుకంటే! వాస్తవానికి వారు అల్లాహ్‌ ను మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించారు. కాబట్టి ఎవడైతే అల్లాహ్‌ మరియు ఆయన ప్రవ క్తను వ్యతిరేకిస్తాడో!నిశ్చయంగా అల్లాహ్‌ (అలాంటి వానికి) శిక్ష విధించటంలో ఎంతో కఠినుడు.

8:14 – ذَٰلِكُمْ فَذُوقُوهُ وَأَنَّ لِلْكَافِرِينَ عَذَابَ النَّارِ ١٤

(ఓ సత్య-తిరస్కారులారా!): ”ఇదే (మీ శిక్ష), దీనిని మీరు చవిచూడండి! నిశ్చయంగా, సత్య-తిరస్కారులకు నరకాగ్నిశిక్ష ఉంటుంది.”

8:15 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا لَقِيتُمُ الَّذِينَ كَفَرُوا زَحْفًا فَلَا تُوَلُّوهُمُ الْأَدْبَارَ ١٥

ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు సత్య-తిర స్కారుల సైన్యాలను యుధ్ధరంగంలో ఎదుర్కొన్న ప్పుడు, వారికి మీ వీపులు చూపకండి (పారిపోకండి)!

8:16 – وَمَن يُوَلِّهِمْ يَوْمَئِذٍ دُبُرَهُ إِلَّا مُتَحَرِّفًا لِّقِتَالٍ أَوْ مُتَحَيِّزًا إِلَىٰ فِئَةٍ فَقَدْ بَاءَ بِغَضَبٍ مِّنَ اللَّـهِ وَمَأْوَاهُ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمَصِيرُ ١٦

మరియు ఆ దినమున వారికి వీపు చూపిన వాడు – యుధ్ధతంత్రం కోసమో, లేక (తమవారి) మరొక సమూహంలో చేరటానికో, వెనుదిరిగితే తప్ప – తప్పక అల్లాహ్‌ ఆగ్రహానికి పాత్రు డవుతాడు మరియు అతని ఆశ్రయం నరకమే. అది ఎంత చెడ్డ గమ్యస్థానం!

8:17 – فَلَمْ تَقْتُلُوهُمْ وَلَـٰكِنَّ اللَّـهَ قَتَلَهُمْ ۚ وَمَا رَمَيْتَ إِذْ رَمَيْتَ وَلَـٰكِنَّ اللَّـهَ رَمَىٰ ۚ وَلِيُبْلِيَ الْمُؤْمِنِينَ مِنْهُ بَلَاءً حَسَنًا ۚ إِنَّ اللَّـهَ سَمِيعٌ عَلِيمٌ ١٧

మీరు వారిని చంపలేదు, కాని అల్లాహ్‌ వారిని చంపాడు. (ఓ ప్రవక్తా!) నీవు (దుమ్ము) విసిరినపుడు, నీవుకాదు విసిరింది, 4 కాని అల్లాహ్‌ విసిరాడు. మరియు విశ్వాసులను దీనితో పరీక్షించి, వారికి మంచి ఫలితాన్ని ఇవ్వటానికి ఆయన ఇలా చేశాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

8:18 – ذَٰلِكُمْ وَأَنَّ اللَّـهَ مُوهِنُ كَيْدِ الْكَافِرِينَ ١٨

ఇదే (ఆయన ఇచ్ఛ) మరియు నిశ్చయంగా అల్లాహ్‌ సత్య-తిరస్కారుల ఎత్తుగడలను బలహీనపరుస్తాడు.

8:19 – إِن تَسْتَفْتِحُوا فَقَدْ جَاءَكُمُ الْفَتْحُ ۖ وَإِن تَنتَهُوا فَهُوَ خَيْرٌ لَّكُمْ ۖ وَإِن تَعُودُوا نَعُدْ وَلَن تُغْنِيَ عَنكُمْ فِئَتُكُمْ شَيْئًا وَلَوْ كَثُرَتْ وَأَنَّ اللَّـهَ مَعَ الْمُؤْمِنِينَ ١٩

(ఓ అవిశ్వాసులారా!) మీరు తీర్పు కోరితే, వాస్తవానికి మీకు తీర్పులభించింది. ఇకమీద మీరు (దుర్మార్గాన్ని) మానుకుంటే అది మీకే మేలైనది. ఒకవేళ మీరు తిరిగి ఇలాచేస్తే మేము కూడా తిరిగి చేస్తాము. అప్పుడు మీ సైనికదళం ఎంత హెచ్చుగఉన్నా మీకెలాంటి లాభం చేకూర్చదు. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ విశ్వాసులతో ఉంటాడు. ా

8:20 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّـهَ وَرَسُولَهُ وَلَا تَوَلَّوْا عَنْهُ وَأَنتُمْ تَسْمَعُونَ ٢٠

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌కు మరియు ఆయనప్రవక్తకు విధేయులుగా ఉండండి. మరియు మీరు (అతని సందేశాలను) వింటూ కూడా, అతని (ప్రవక్త) నుండి మరలిపోకండి.

8:21 – وَلَا تَكُونُوا كَالَّذِينَ قَالُوا سَمِعْنَا وَهُمْ لَا يَسْمَعُونَ ٢١

మరియు వాస్తవానికి వినకుండానే: ”మేము విన్నాము!” అని అనేవారివలే కాకండి. 5 (7/8)

8:22 – إِنَّ شَرَّ الدَّوَابِّ عِندَ اللَّـهِ الصُّمُّ الْبُكْمُ الَّذِينَ لَا يَعْقِلُونَ ٢٢

  • తమబుద్ధిని ఉపయోగించని చెవిటివారు మూగవారు మాత్రమే, నిశ్చయంగా, అల్లాహ్‌ దృష్టి లో నీచాతినీచమైన పశుజాతికి చెందినవారు. 6

8:23 – وَلَوْ عَلِمَ اللَّـهُ فِيهِمْ خَيْرًا لَّأَسْمَعَهُمْ ۖ وَلَوْ أَسْمَعَهُمْ لَتَوَلَّوا وَّهُم مُّعْرِضُونَ ٢٣

మరియు అల్లాహ్‌ వారిలో కొంతైనా మంచి తనాన్ని చూసి ఉంటే, వారిని వినేటట్లు చేసి ఉండే వాడు. (కాని వారిలో మంచితనం లేదు కాబట్టి) ఆయనవారిని వినేటట్లుచేసినా, వారు(తమమూర్ఖ త్వంలో) ముఖాలుత్రిప్పుకొని వెనుదిరిగిపోయేవారు.

8:24 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اسْتَجِيبُوا لِلَّـهِ وَلِلرَّسُولِ إِذَا دَعَاكُمْ لِمَا يُحْيِيكُمْ ۖ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ يَحُولُ بَيْنَ الْمَرْءِ وَقَلْبِهِ وَأَنَّهُ إِلَيْهِ تُحْشَرُونَ ٢٤

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ మరియు ఆయన సందేశహరుడు మీకు జీవనమిచ్చే దాని వైపునకు, మిమ్మల్ని పిలిచినప్పుడు దానికి జవాబు ఇవ్వండి. 7 మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ మానవునికి మరియు అతని హృదయ కాంక్షలకు మధ్యఉన్నాడనీ మరియు నిశ్చయంగా మీరంతా ఆయన వద్దనే సమీకరించబడతారని తెలుసుకోండి.

8:25 – وَاتَّقُوا فِتْنَةً لَّا تُصِيبَنَّ الَّذِينَ ظَلَمُوا مِنكُمْ خَاصَّةً ۖ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ شَدِيدُ الْعِقَابِ ٢٥

  1. మరియు మీలోని దుర్మార్గులకు మాత్రమే గాక (అందరికీ) సంభవించబోయే ఆ విపత్తు గురించి భీతిపరులై ఉండండి. మరియు అల్లాహ్‌ శిక్ష విధించటంలో చాలా కఠినుడని తెలుసుకోండి.

8:26 – وَاذْكُرُوا إِذْ أَنتُمْ قَلِيلٌ مُّسْتَضْعَفُونَ فِي الْأَرْضِ تَخَافُونَ أَن يَتَخَطَّفَكُمُ النَّاسُ فَآوَاكُمْ وَأَيَّدَكُم بِنَصْرِهِ وَرَزَقَكُم مِّنَ الطَّيِّبَاتِ لَعَلَّكُمْ تَشْكُرُونَ ٢٦

మరియు ఆ సమయాన్ని జ్ఞాపకం చేసు కోండి: అప్పుడు మీరు అల్ప సంఖ్యలో ఉన్నారు.భూమిపై మీరు బలహీనులుగా పరిగణించబడే వారు. ప్రజలు మిమ్మల్నిపారద్రోలుతారని (హింసి స్తారని) భయపడేవారు. అప్పుడు ఆయన మీకు ఆశ్రయమిచ్చి తన సహాయంతో మిమ్మల్ని బల పరచి, మీకు మంచి జీవనోపాధిని సమకూర్చాడు, బహుశా మీరు కృతజ్ఞులవుతారని!

8:27 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَخُونُوا اللَّـهَ وَالرَّسُولَ وَتَخُونُوا أَمَانَاتِكُمْ وَأَنتُمْ تَعْلَمُونَ ٢٧

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు నమ్మకద్రోహం చేయకండి మరియు తెలిసి ఉండి కూడా మీ (పరస్పర) అమానతుల 8 విషయంలో నమ్మక ద్రోహం చేయకండి.

8:28 – وَاعْلَمُوا أَنَّمَا أَمْوَالُكُمْ وَأَوْلَادُكُمْ فِتْنَةٌ وَأَنَّ اللَّـهَ عِندَهُ أَجْرٌ عَظِيمٌ ٢٨

మరియు వాస్తవానికి మీ ఆస్తిపాస్తులు, మీ సంతానం, పరీక్షాసాధనాలనీ మరియు నిశ్చయంగా అల్లాహ్‌వద్ద గొప్పప్రతిఫలం ఉన్నదనీతెలుసుకోండి!

8:29 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تَتَّقُوا اللَّـهَ يَجْعَل لَّكُمْ فُرْقَانًا وَيُكَفِّرْ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَيَغْفِرْ لَكُمْ ۗ وَاللَّـهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ ٢٩

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉంటే, ఆయన మీకు (మంచి-చెడులను గుర్తించే) విచక్షణాశక్తిని ప్రసాదించి, మీ నుండి మీ పాపాలను తొలగించి, మిమ్మల్ని క్షమిస్తాడు. మరియు అల్లాహ్‌ దాతృత్వంలో సర్వోత్తముడు.

8:30 – وَإِذْ يَمْكُرُ بِكَ الَّذِينَ كَفَرُوا لِيُثْبِتُوكَ أَوْ يَقْتُلُوكَ أَوْ يُخْرِجُوكَ ۚ وَيَمْكُرُونَ وَيَمْكُرُ اللَّـهُ ۖ وَاللَّـهُ خَيْرُ الْمَاكِرِينَ ٣٠

మరియు (ఓ ప్రవక్తా!) సత్య-తిరస్కారులు నిన్ను బంధించటానికి నిన్ను హతమార్చటానికి, లేదా నిన్ను వెడలగొట్టటానికి కుట్రలు పన్నుతున్న విషయాన్ని (జ్ఞప్తికితెచ్చుకో)! వారు కుట్రలు పన్నుతూ ఉన్నారు మరియు అల్లాహ్‌ కూడా కుట్రలు పన్నుతూ ఉన్నాడు. మరియు వాస్తవానికి అల్లాహ్‌యే కుట్రలు పన్నటంలో అందరికంటే ఉత్తముడు. 9

8:31 – وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا قَالُوا قَدْ سَمِعْنَا لَوْ نَشَاءُ لَقُلْنَا مِثْلَ هَـٰذَا ۙ إِنْ هَـٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ ٣١

మరియు మా సూచనలు (ఆయాత్‌) వారికి వినిపించబడినప్పుడు వారు: ”వాస్తవానికి, మేము విన్నాము మేముకోరితే మేముకూడా ఇటు వంటివి రచించగలము (చెప్పగలము). ఇవి కేవ లం పూర్వికుల గాథలుమాత్రమే!” అని అంటారు.

8:32 – وَإِذْ قَالُوا اللَّـهُمَّ إِن كَانَ هَـٰذَا هُوَ الْحَقَّ مِنْ عِندِكَ فَأَمْطِرْ عَلَيْنَا حِجَارَةً مِّنَ السَّمَاءِ أَوِ ائْتِنَا بِعَذَابٍ أَلِيمٍ ٣٢

మరియు వారు: “ఓ అల్లాహ్‌! ఇది (ఈ ఖుర్‌ఆన్‌) నిజంగా నీ తరఫు నుండి వచ్చిన సత్యమే అయితే! మాపై ఆకాశం నుండి రాళ్ళ వర్షం కురిపించు! లేదా ఏదైనా బాధాకరమైన శిక్షను మా పైకి తీసుకొని రా!” అని పలికిన మాట (జ్ఞాపకం చేసుకోండి).

8:33 – وَمَا كَانَ اللَّـهُ لِيُعَذِّبَهُمْ وَأَنتَ فِيهِمْ ۚ وَمَا كَانَ اللَّـهُ مُعَذِّبَهُمْ وَهُمْ يَسْتَغْفِرُونَ ٣٣

కాని (ఓ ము’హమ్మద్‌!) నీవు వారి మధ్య ఉన్నంతవరకుఅల్లాహ్‌ వారిని ఏమాత్రంశిక్షించడు. మరియు వారుక్షమాభిక్షకోరుతూ ఉన్నంత వరకు కూడా! అల్లాహ్‌ వారిని ఏమాత్రం శిక్షించడు.

8:34 – وَمَا لَهُمْ أَلَّا يُعَذِّبَهُمُ اللَّـهُ وَهُمْ يَصُدُّونَ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَمَا كَانُوا أَوْلِيَاءَهُ ۚ إِنْ أَوْلِيَاؤُهُ إِلَّا الْمُتَّقُونَ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ ٣٤

వారి వాదమేమిటీ? అల్లాహ్‌ వారిని ఎందుకు శిక్షించకూడదు? వారు దాని ధర్మకర్తలు కాకున్నా, వారు ప్రజలను మస్జిద్‌ అల్‌-‘హరామ్‌ నుండి ఆపుతున్నారు. 10 దాని ధర్మకర్తలు కేవలం దైవభీతి గలవారే కాగలరు. కాని వాస్తవానికి, చాలామంది ఇది తెలుసుకోలేరు.

8:35 – وَمَا كَانَ صَلَاتُهُمْ عِندَ الْبَيْتِ إِلَّا مُكَاءً وَتَصْدِيَةً ۚ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ ٣٥

మరియు (అల్లాహ్‌)గృహం (క’అబహ్‌) వద్ద వారిప్రార్థనలు కేవలం ఈలలువేయటం (ముకాఅ’) మరియు చప్పట్లు కొట్టడం (త’స్దియహ్‌) తప్ప మరేమీలేవు. కావున మీ సత్య-తిరస్కారానికి బదులుగా ఈ శిక్షను రుచి చూడండి. 11

8:36 – إِنَّ الَّذِينَ كَفَرُوا يُنفِقُونَ أَمْوَالَهُمْ لِيَصُدُّوا عَن سَبِيلِ اللَّـهِ ۚ فَسَيُنفِقُونَهَا ثُمَّ تَكُونُ عَلَيْهِمْ حَسْرَةً ثُمَّ يُغْلَبُونَ ۗ وَالَّذِينَ كَفَرُوا إِلَىٰ جَهَنَّمَ يُحْشَرُونَ ٣٦

నిశ్చయంగా సత్య-తిరస్కారులు, ప్రజలను అల్లాహ్‌ మార్గం వైపునకు రాకుండా ఆపటానికి, తమ ధనం ఖర్చుచేస్తారు. వారు ఇలాగే ఖర్చు చేస్తూ ఉంటారు; చివరకు అది వారి వ్యసనానికి (దుఃఖానికి) కారణమవుతుంది. తరువాత వారు పరాధీనులవుతారు. మరియు సత్య-తిరస్కారు లైన వారు నరకంవైపుకు సమీకరించబడతారు.

8:37 – لِيَمِيزَ اللَّـهُ الْخَبِيثَ مِنَ الطَّيِّبِ وَيَجْعَلَ الْخَبِيثَ بَعْضَهُ عَلَىٰ بَعْضٍ فَيَرْكُمَهُ جَمِيعًا فَيَجْعَلَهُ فِي جَهَنَّمَ ۚ أُولَـٰئِكَ هُمُ الْخَاسِرُونَ ٣٧

ఇదంతా అల్లాహ్‌, చెడును (దుష్టులను), మంచి (సత్పురుషుల) నుండి వేరుచేసి, దుష్టు లందరినీ ఒకరితో పాటు మరొకరిని చేకూర్చి, ఒక గుంపుగా చేసి వారందరినీ నరకంలో పడవేయ టానికి. ఇలాంటివారు, వారే నష్టపోయే వారు!

8:38 – قُل لِّلَّذِينَ كَفَرُوا إِن يَنتَهُوا يُغْفَرْ لَهُم مَّا قَدْ سَلَفَ وَإِن يَعُودُوا فَقَدْ مَضَتْ سُنَّتُ الْأَوَّلِينَ ٣٨

సత్య-తిరస్కారులతో ఇలా అను: ఒకవేళ వారు మానుకుంటే గడిచిపోయింది క్షమించబడు తుంది, కాని వారు (పూర్వవైఖరినే) మళ్ళీ అవలం బిస్తే! వాస్తవానికి (దుష్టులైన) పూర్వికుల విషయం లో జరిగిందే, మరల వారికి సంభవిస్తుంది! 12

8:39 – وَقَاتِلُوهُمْ حَتَّىٰ لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ كُلُّهُ لِلَّـهِ ۚ فَإِنِ انتَهَوْا فَإِنَّ اللَّـهَ بِمَا يَعْمَلُونَ بَصِيرٌ ٣٩

మరియు అధర్మం (ఫిత్న) 13 ఏ మాత్రం మిగలకుండా పోయేవరకు మరియు ఆరాధన (ధర్మం) కేవలం అల్లాహ్‌ కొరకే ప్రత్యేకించబడనంత వరకు వారితో (సత్యతిరస్కారులతో) పోరాడుతూ ఉండండి. కాని వారు (పోరాడటం) మానుకుంటే! నిశ్చయంగా అల్లాహ్‌ వారి కర్మలను గమనిస్తున్నాడు.

8:40 – وَإِن تَوَلَّوْا فَاعْلَمُوا أَنَّ اللَّـهَ مَوْلَاكُمْ ۚ نِعْمَ الْمَوْلَىٰ وَنِعْمَ النَّصِيرُ ٤٠

మరియు ఒకవేళ వారు తిరిగిపోతే! నిశ్చయంగా, అల్లాహ్‌ మీ స్నేహితుడు (సంరక్షకుడు) అని తెలుసుకోండి. ఆయనే ఉత్తమ స్నేహితుడు (సంరక్షకుడు) మరియు ఉత్తమ సహాయకుడూను!

8:41 – وَاعْلَمُوا أَنَّمَا غَنِمْتُم مِّن شَيْءٍ فَأَنَّ لِلَّـهِ خُمُسَهُ وَلِلرَّسُولِ وَلِذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ إِن كُنتُمْ آمَنتُم بِاللَّـهِ وَمَا أَنزَلْنَا عَلَىٰ عَبْدِنَا يَوْمَ الْفُرْقَانِ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ ۗ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٤١

[(*)] మరియు మీ విజయధనంలో 14 నిశ్చయంగా, అయిదవ భాగం, అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకు మరియు (అతని) దగ్గరి బంధువులకు మరియు అనాథులకు మరియు యాచించని పేదవారికి 15 మరియు ప్రయాణీ కులకు ఉందని తెలుసుకోండి, ఒకవేళ మీరు – అల్లాహ్‌ను మరియు మేము సత్యాసత్యాల అంతరాన్ని విశదంచేసే దినమున, ఆ రెండు సైన్యాలు మార్కొనిన (బద్ర్‌ యుద్ధ) దినమున, మా దాసునిపై అవతరింపజేసిన దానిని – విశ్వసించేవారే అయితే! మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు. 16

8:42 – إِذْ أَنتُم بِالْعُدْوَةِ الدُّنْيَا وَهُم بِالْعُدْوَةِ الْقُصْوَىٰ وَالرَّكْبُ أَسْفَلَ مِنكُمْ ۚ وَلَوْ تَوَاعَدتُّمْ لَاخْتَلَفْتُمْ فِي الْمِيعَادِ ۙ وَلَـٰكِن لِّيَقْضِيَ اللَّـهُ أَمْرًا كَانَ مَفْعُولًا لِّيَهْلِكَ مَنْ هَلَكَ عَن بَيِّنَةٍ وَيَحْيَىٰ مَنْ حَيَّ عَن بَيِّنَةٍ ۗ وَإِنَّ اللَّـهَ لَسَمِيعٌ عَلِيمٌ ٤٢

(ఆ దినాన్ని గుర్తుకు తెచ్చుకోండి!) అప్పుడు మీరు లోయలో (మదీనహ్కు) సమీపంగా ఉన్న స్థలంలో ఉన్నారు మరియు వారు (ముష్రికులు) దూరంగా ఉన్న స్థలంలో ఉన్నారు 17 మరియు బిడారం మీకు క్రింది (ఒడ్డు) వైపునకు. ఒకవేళ మీరు (ఇరువురు) యుధ్ధం చేయాలని నిర్ణయించుకొని ఉంటే! మీరు మీ నిర్ణయాన్ని పాటించకుండా ఉండేవారు. కాని అల్లాహ్‌ తాను నిర్ణయించిన కార్యాన్ని పూర్తిచేయటానికి, నశించే వాడు స్పష్టమైన నిదర్శనం పొందిన తరువాత నశించాలని మరియు జీవించేవాడు స్పష్టమైన నిదర్శనం పొందిన తరువాత జీవించాలని అలా చేశాడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

8:43 – إِذْ يُرِيكَهُمُ اللَّـهُ فِي مَنَامِكَ قَلِيلًا ۖ وَلَوْ أَرَاكَهُمْ كَثِيرًا لَّفَشِلْتُمْ وَلَتَنَازَعْتُمْ فِي الْأَمْرِ وَلَـٰكِنَّ اللَّـهَ سَلَّمَ ۗ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ٤٣

(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ నీకు, నీ స్వప్నంలో వారిని కొద్దిమందిగా చూపింది (జ్ఞాపకంచేసుకో)! వారిని ఎక్కువ మందిగా నీకుచూపిఉంటే, మీరు తప్పక ధైర్యాన్ని కోల్పోయి (యుధ్ధ) విషయంలో వాదులాడేవారు. కాని వాస్తవానికి, అల్లాహ్‌ మిమ్మ ల్ని రక్షించాడు. నిశ్చయంగా, ఆయనకు హృద యాలలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసు.

8:44 – وَإِذْ يُرِيكُمُوهُمْ إِذِ الْتَقَيْتُمْ فِي أَعْيُنِكُمْ قَلِيلًا وَيُقَلِّلُكُمْ فِي أَعْيُنِهِمْ لِيَقْضِيَ اللَّـهُ أَمْرًا كَانَ مَفْعُولًا ۗ وَإِلَى اللَّـهِ تُرْجَعُ الْأُمُورُ ٤٤

మరియు (జ్ఞాపకం చేసుకోండి) అల్లాహ్‌ నెర వేర్చవలసిన పనిని నెరవేర్చటానికి – మీరు (బద్ర్‌ యుద్ధరంగంలో) మార్కొనినపుడు – వారి (అవిశ్వా సుల) సైన్యాన్ని మీ కన్నులకు కొద్దిగా చూపాడు మరియు మిమ్మల్ని కొద్దిమందిగా వారికిచూపాడు. మరియు అన్ని వ్యవహారాలూ (నిర్ణయానికి) అల్లాహ్‌ వైపునకే మరలింపబడతాయి.

8:45 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا لَقِيتُمْ فِئَةً فَاثْبُتُوا وَاذْكُرُوا اللَّـهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ ٤٥

ఓ విశ్వాసులారా! మీరు ఏ సైన్యాన్నైనా ఎదుర్కొనేటప్పుడు, స్థైర్యంతో ఉండండి. మరియు అల్లాహ్‌ను అత్యధికంగా స్మరిస్తే, మీరు సాఫల్యం పొందుతారు!

8:46 – وَأَطِيعُوا اللَّـهَ وَرَسُولَهُ وَلَا تَنَازَعُوا فَتَفْشَلُوا وَتَذْهَبَ رِيحُكُمْ ۖ وَاصْبِرُوا ۚ إِنَّ اللَّـهَ مَعَ الصَّابِرِينَ ٤٦

మరియు అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి మరియు పరస్పర కలహాలకు గురికాకండి, అట్లుచేస్తే మీరు బలహీను లవుతారు మరియు మీ బలసాహసాలు తగ్గి పోతాయి. మరియు సహనం వహించండి. నిశ్చ యంగా అల్లాహ్‌ సహనంవహించేవారితో ఉంటాడు.

8:47 – وَلَا تَكُونُوا كَالَّذِينَ خَرَجُوا مِن دِيَارِهِم بَطَرًا وَرِئَاءَ النَّاسِ وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّـهِ ۚ وَاللَّـهُ بِمَا يَعْمَلُونَ مُحِيطٌ ٤٧

మరియు తమ గృహాల నుండి, ప్రజలకు చూపటానికి దురాభిమానంతో బయలుదేరి ఇతరులను అల్లాహ్‌ మార్గం నుండి ఆపేవారివలే కాకండి. మరియు వారు చేసే క్రియలన్నింటినీ అల్లాహ్‌ పరివేష్టించి ఉన్నాడు.

8:48 – وَإِذْ زَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ وَقَالَ لَا غَالِبَ لَكُمُ الْيَوْمَ مِنَ النَّاسِ وَإِنِّي جَارٌ لَّكُمْ ۖ فَلَمَّا تَرَاءَتِ الْفِئَتَانِ نَكَصَ عَلَىٰ عَقِبَيْهِ وَقَالَ إِنِّي بَرِيءٌ مِّنكُمْ إِنِّي أَرَىٰ مَا لَا تَرَوْنَ إِنِّي أَخَافُ اللَّـهَ ۚ وَاللَّـهُ شَدِيدُ الْعِقَابِ ٤٨

మరియు (జ్ఞాపకం చేసుకోండి అవిశ్వాసు లకు) వారి కర్మలు ఉత్తమమైనవిగా చూపించి షై’తాన్‌ వారితో అన్నాడు: ”ఈ రోజు ప్రజలలో ఎవ్వడునూ మిమ్మల్ని జయించలేడు, (ఎందు కంటే) నేను మీకు తోడుగా ఉన్నాను.” కాని ఆ రెండు పక్షాలు పరస్పరం ఎదురు పడినపుడు, అతడు తన మడమలపై వెనకకు మరలి అన్నాడు: ”వాస్తవంగా, నాకు మీతో ఎలాంటి సంబంధం లేదు, మీరు చూడనిది నేను చూస్తున్నాను. నిశ్చయంగా, నేను అల్లాహ్‌కు భయపడుతున్నాను. 18 మరియు అల్లాహ్‌ శిక్ష విధించటంలో చాలా కఠినుడు.”

8:49 – إِذْ يَقُولُ الْمُنَافِقُونَ وَالَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ غَرَّ هَـٰؤُلَاءِ دِينُهُمْ ۗ وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّـهِ فَإِنَّ اللَّـهَ عَزِيزٌ حَكِيمٌ ٤٩

కపట విశ్వాసులు మరియు ఎవరి హృద యాలలో రోగముందో వారు: ”వీరిని (ఈ విశ్వాసులను) వారి ధర్మం మోసపుచ్చింది.” అని అంటారు, కాని అల్లాహ్‌ యందు నమ్మకం గలవాని కొరకు, నిశ్చయంగా అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు మహా వివేచనాపరుడు.

8:50 – وَلَوْ تَرَىٰ إِذْ يَتَوَفَّى الَّذِينَ كَفَرُوا ۙ الْمَلَائِكَةُ يَضْرِبُونَ وُجُوهَهُمْ وَأَدْبَارَهُمْ وَذُوقُوا عَذَابَ الْحَرِيقِ ٥٠

మరియు సత్య-తిరస్కారుల ప్రాణాలను దైవదూతలు తీసే దృశ్యాన్ని నీవు చూడగలిగితే (ఎంత బాగుండేది)! వారు (దేవదూతలు) వారి ముఖాల పైనను మరియు వారి పిరుదులపైనను కొడుతూ ఇలా అంటారు: ”భగభగమండే ఈ నరకాగ్నిశిక్షను చవిచూడండి. 19

8:51 – ذَٰلِكَ بِمَا قَدَّمَتْ أَيْدِيكُمْ وَأَنَّ اللَّـهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ ٥١

”ఇది మీరు స్వయంగా మీ చేతులారా చేసి పంపిన కర్మల ఫలితమే! మరియు నిశ్చయంగా అల్లాహ్‌ తన దాసులకు ఏ మాత్రం అన్యాయం చేయడు.”

8:52 – كَدَأْبِ آلِ فِرْعَوْنَ ۙ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَفَرُوا بِآيَاتِ اللَّـهِ فَأَخَذَهُمُ اللَّـهُ بِذُنُوبِهِمْ ۗ إِنَّ اللَّـهَ قَوِيٌّ شَدِيدُ الْعِقَابِ ٥٢

ఫిర్‌’ఔన్‌ జాతి వారి మరియు వారికి పూర్వం వారి మాదిరిగా, వీరు కూడా అల్లాహ్‌ సూచన (ఆయాత్‌)లను తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్‌ వారి పాపాల ఫలితంగా వారిని శిక్షించాడు. నిశ్చయంగా అల్లాహ్‌ మహా బలవంతుడు, శిక్ష విధించటంలో చాలా కఠినుడు. 20

8:53 – ذَٰلِكَ بِأَنَّ اللَّـهَ لَمْ يَكُ مُغَيِّرًا نِّعْمَةً أَنْعَمَهَا عَلَىٰ قَوْمٍ حَتَّىٰ يُغَيِّرُوا مَا بِأَنفُسِهِمْ ۙ وَأَنَّ اللَّـهَ سَمِيعٌ عَلِيمٌ ٥٣

ఇది ఎందుకంటే! వాస్తవానికి, ఒక జాతి వారు, తమ నడవడికను తాము మార్చుకోనంత వరకు, అల్లాహ్‌ వారికి ప్రసాదించిన తన అనుగ్రహాన్ని ఉపసంహరించుకోడు. 21 మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వంవినేవాడు సర్వజ్ఞుడు.

8:54 – كَدَأْبِ آلِ فِرْعَوْنَ ۙ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَذَّبُوا بِآيَاتِ رَبِّهِمْ فَأَهْلَكْنَاهُم بِذُنُوبِهِمْ وَأَغْرَقْنَا آلَ فِرْعَوْنَ ۚ وَكُلٌّ كَانُوا ظَالِمِينَ ٥٤

ఫిర్‌ఔను జాతివారు మరియు వారికి పూర్వం వారి మాదిరిగా! వీరు కూడా తమ ప్రభువు సూచన (ఆయాత్‌) లను అబద్ధాలని నిరాకరించారు. కాబట్టి వారి పాపాలకు ఫలితంగా వారిని నాశనం చేశాము. మరియు ఫిర్‌’ఔను జాతి వారిని ముంచివేశాము. మరియు వారందరూ దుర్మార్గులు. 22

8:55 – إِنَّ شَرَّ الدَّوَابِّ عِندَ اللَّـهِ الَّذِينَ كَفَرُوا فَهُمْ لَا يُؤْمِنُونَ ٥٥

నిశ్చయంగా, అల్లాహ్‌ దృష్టిలో సత్యాన్ని తిరస్కరించే వారు నీచాతినీచమైన జీవులు, ఇక వారు విశ్వసించరు. 23

8:56 – الَّذِينَ عَاهَدتَّ مِنْهُمْ ثُمَّ يَنقُضُونَ عَهْدَهُمْ فِي كُلِّ مَرَّةٍ وَهُمْ لَا يَتَّقُونَ ٥٦

వారిలో ఎవరితోనైతే నీవు ఒడంబడిక చేసు కున్నావో! వారు ప్రతిసారీ తమ ఒడంబడికను భంగపరుస్తున్నారు. మరియు వారికి దైవభీతి లేదు. 24

8:57 – فَإِمَّا تَثْقَفَنَّهُمْ فِي الْحَرْبِ فَشَرِّدْ بِهِم مَّنْ خَلْفَهُمْ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ ٥٧

ఒకవేళ నీవు యుధ్ధరంగంలో వారిపై ప్రాబల్యం పొందితే – వారి వెనుకఉన్నవారు చెల్లా చెదరై పోయేటట్లుగా – వారిని శిక్షించు. బహుశా వారు గుణపాఠం నేర్చుకోవచ్చు!

8:58 – وَإِمَّا تَخَافَنَّ مِن قَوْمٍ خِيَانَةً فَانبِذْ إِلَيْهِمْ عَلَىٰ سَوَاءٍ ۚ إِنَّ اللَّـهَ لَا يُحِبُّ الْخَائِنِينَ ٥٨

మరియు ఒకవేళ నీకు ఏ జాతివారి వల్ల నైనా నమ్మకద్రోహం జరుగుతుందనే భయం ఉంటే – మీరు ఇరు పక్షంవారు సరిసమానులని తెలుప టానికి 25 – (వారి ఒప్పందాన్ని) వారి వైపుకు విసరి వేయి. నిశ్చయంగా, అల్లాహ్‌ నమ్మక ద్రోహులంటే ఇష్టపడడు.

8:59 – وَلَا يَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا سَبَقُوا ۚ إِنَّهُمْ لَا يُعْجِزُونَ ٥٩

మరియు సత్య-తిరస్కారులు తాము తప్పించు కున్నామని భావించనవసరంలేదు. నిశ్చయంగా, వారు (అల్లాహ్‌ శిక్ష నుండి) తప్పించుకోలేరు.

8:60 – وَأَعِدُّوا لَهُم مَّا اسْتَطَعْتُم مِّن قُوَّةٍ وَمِن رِّبَاطِ الْخَيْلِ تُرْهِبُونَ بِهِ عَدُوَّ اللَّـهِ وَعَدُوَّكُمْ وَآخَرِينَ مِن دُونِهِمْ لَا تَعْلَمُونَهُمُ اللَّـهُ يَعْلَمُهُمْ ۚ وَمَا تُنفِقُوا مِن شَيْءٍ فِي سَبِيلِ اللَّـهِ يُوَفَّ إِلَيْكُمْ وَأَنتُمْ لَا تُظْلَمُونَ ٦٠

మరియు మీరు మీశక్తిమేరకు బలసామాగ్రిని యుద్ధపు గుర్రాలను సిధ్ధపరచుకొని, దాని ద్వారా అల్లాహ్‌ కు శత్రువులైన మీ శత్రువులను మరియు అల్లాహ్‌కు తెలిసి, మీకు తెలియని ఇతరులను కూడా భయకంపితులుగా చేయండి. మరియు అల్లాహ్‌ మార్గంలో మీరు ఏమి ఖర్చుచేసినా దాని ఫలితం మీకు పూర్తిగా చెల్లించబడుతుంది. మరియు మీకెలాంటి అన్యాయం జరుగదు. (1/8)

8:61 – وَإِن جَنَحُوا لِلسَّلْمِ فَاجْنَحْ لَهَا وَتَوَكَّلْ عَلَى اللَّـهِ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ ٦١

  • కాని ఒకవేళ వారు శాంతివైపుకు మొగ్గితే నీవు కూడా దానికి దిగు మరియు అల్లాహ్‌పై ఆధారపడు. 26 నిశ్చయంగా, ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

8:62 – وَإِن يُرِيدُوا أَن يَخْدَعُوكَ فَإِنَّ حَسْبَكَ اللَّـهُ ۚ هُوَ الَّذِي أَيَّدَكَ بِنَصْرِهِ وَبِالْمُؤْمِنِينَ ٦٢

కాని ఒకవేళ వారు నిన్ను మోసగించాలని సంకల్పిస్తే! నిశ్చయంగా, నీకు అల్లాహ్‌యే చాలు. ఆయనే తన సహాయం ద్వారా మరియు విశ్వాసుల ద్వారా నిన్ను బలపరుస్తాడు. ప్రేమను కలిగించాడు.

8:63 – وَأَلَّفَ بَيْنَ قُلُوبِهِمْ ۚ لَوْ أَنفَقْتَ مَا فِي الْأَرْضِ جَمِيعًا مَّا أَلَّفْتَ بَيْنَ قُلُوبِهِمْ وَلَـٰكِنَّ اللَّـهَ أَلَّفَ بَيْنَهُمْ ۚ إِنَّهُ عَزِيزٌ حَكِيمٌ ٦٣

మరియు ఆయనే వారి (విశ్వాసుల) హృద యాలను కలిపాడు. ఒకవేళ నీవు భూమిలో ఉన్న సమస్తాన్ని ఖర్చుచేసినా, వారి హృదయాలను కలుపజాలవు. కాని అల్లాహ్‌యే వారి మధ్య 27 నిశ్చయంగా, ఆయన సర్వ శక్తి సంపన్నుడు, మహా వివేచనాపరుడు.

8:64 – يَا أَيُّهَا النَّبِيُّ حَسْبُكَ اللَّـهُ وَمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ ٦٤

ఓ ప్రవక్తా! నీకూ మరియు నిన్ను అనుసరించే విశ్వాసులకు అల్లాహ్‌యే చాలు!

8:65 – يَا أَيُّهَا النَّبِيُّ حَرِّضِ الْمُؤْمِنِينَ عَلَى الْقِتَالِ ۚ إِن يَكُن مِّنكُمْ عِشْرُونَ صَابِرُونَ يَغْلِبُوا مِائَتَيْنِ ۚ وَإِن يَكُن مِّنكُم مِّائَةٌ يَغْلِبُوا أَلْفًا مِّنَ الَّذِينَ كَفَرُوا بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُونَ ٦٥

ఓ ప్రవక్తా! విశ్వాసులను యుధ్ధానికి ప్రోత్సహించు. మీలో ఇరవై మంది స్థైర్యం గల వారుంటే, వారు రెండువందల మందిని జయించ గలరు. మరియు మీరు వందమంది ఉంటే వేయి మంది సత్య-తిరస్కారులను జయించగలరు. ఎందుకంటే వారు (సత్యాన్ని) గ్రహించలేనిజాతికి చెందినవారు. 28

8:66 – الْآنَ خَفَّفَ اللَّـهُ عَنكُمْ وَعَلِمَ أَنَّ فِيكُمْ ضَعْفًا ۚ فَإِن يَكُن مِّنكُم مِّائَةٌ صَابِرَةٌ يَغْلِبُوا مِائَتَيْنِ ۚ وَإِن يَكُن مِّنكُمْ أَلْفٌ يَغْلِبُوا أَلْفَيْنِ بِإِذْنِ اللَّـهِ ۗ وَاللَّـهُ مَعَ الصَّابِرِينَ ٦٦

ఇప్పుడు అల్లాహ్‌ మీ భారాన్ని తగ్గించాడు, ఎందుకంటే వాస్తవానికి, మీలో బలహీనత ఉన్నదని ఆయనకు తెలుసు. కాబట్టి మీలో వంద మంది స్థైర్యం గలవారు ఉంటే వారు రెండువందల మందిని జయించగలరు. మరియు మీరు వేయి మంది ఉంటే, అల్లాహ్‌ సెలవుతో రెండువేల మందిని జయించ గలరు. మరియు అల్లాహ్‌ సహనం గలవారితో ఉంటాడు.

8:67 – مَا كَانَ لِنَبِيٍّ أَن يَكُونَ لَهُ أَسْرَىٰ حَتَّىٰ يُثْخِنَ فِي الْأَرْضِ ۚ تُرِيدُونَ عَرَضَ الدُّنْيَا وَاللَّـهُ يُرِيدُ الْآخِرَةَ ۗ وَاللَّـهُ عَزِيزٌ حَكِيمٌ ٦٧

(శత్రువులతో తీవ్రంగా పోరాడి, వారిని) పూర్తిగా అణచనంతవరకు, తనవద్ద యుద్ధ ఖైదీలను ఉంచుకోవటం ధరణిలో, ఏ ప్రవక్తకూ తగదు. 29 మీరు ప్రాపంచిక సామగ్రి కోరు తున్నారు. కాని అల్లాహ్‌ (మీ కొరకు) పరలోక (సుఖాన్ని) కోరుతున్నాడు. మరియు అల్లాహ్‌ సర్వ శక్తి మంతుడు, మహా వివేచనాపరుడు.

8:68 – لَّوْلَا كِتَابٌ مِّنَ اللَّـهِ سَبَقَ لَمَسَّكُمْ فِيمَا أَخَذْتُمْ عَذَابٌ عَظِيمٌ ٦٨

ఒకవేళ అల్లాహ్‌ (ఫర్మానా) ముందే వ్రాయ బడి ఉండకపోతే, మీరు తీసుకున్న దాని (నిర్ణ యాని)కి మీకు ఘోరశిక్ష విధించబడి ఉండేది. 30

8:69 – فَكُلُوا مِمَّا غَنِمْتُمْ حَلَالًا طَيِّبًا ۚ وَاتَّقُوا اللَّـهَ ۚ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ٦٩

కావున మీకు ధర్మసమ్మతంగా లభించిన ఉత్తమమైన విజయ ధనాన్నిఅనుభవించండి. అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

8:70 – يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّمَن فِي أَيْدِيكُم مِّنَ الْأَسْرَىٰ إِن يَعْلَمِ اللَّـهُ فِي قُلُوبِكُمْ خَيْرًا يُؤْتِكُمْ خَيْرًا مِّمَّا أُخِذَ مِنكُمْ وَيَغْفِرْ لَكُمْ ۗ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٧٠

ఓ ప్రవక్తా! నీ ఆధీనంలో ఉన్న యుధ్ధ ఖైదీలతో ఇలా అను: ”ఒకవేళ అల్లాహ్‌ మీ హృదయాలలో మంచితనం చూస్తే ఆయన మీ వద్ద నుండి తీసుకున్నదానికంటే ఎంతో ఉత్తమమైన దానిని మీకు ప్రసాదించి ఉంటాడు. మరియు మిమ్మల్ని క్షమించి ఉంటాడు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.” 31

8:71 – وَإِن يُرِيدُوا خِيَانَتَكَ فَقَدْ خَانُوا اللَّـهَ مِن قَبْلُ فَأَمْكَنَ مِنْهُمْ ۗ وَاللَّـهُ عَلِيمٌ حَكِيمٌ ٧١

కాని ఒకవేళ వారు నీకు నమ్మకద్రోహం చేయాలని తలచుకుంటే, వారు ఇంతకు పూర్వం అల్లాహ్‌కు నమ్మకద్రోహం చేశారు, కావున వారిపై నీకు శక్తినిచ్చాడు. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

8:72 – إِنَّ الَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ فِي سَبِيلِ اللَّـهِ وَالَّذِينَ آوَوا وَّنَصَرُوا أُولَـٰئِكَ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ وَالَّذِينَ آمَنُوا وَلَمْ يُهَاجِرُوا مَا لَكُم مِّن وَلَايَتِهِم مِّن شَيْءٍ حَتَّىٰ يُهَاجِرُوا ۚ وَإِنِ اسْتَنصَرُوكُمْ فِي الدِّينِ فَعَلَيْكُمُ النَّصْرُ إِلَّا عَلَىٰ قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُم مِّيثَاقٌ ۗ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ٧٢

నిశ్చయంగా, విశ్వసించి వలసపోయే వారూ మరియు తమ సంపద మరియు ప్రాణాలతో అల్లాహ్‌ మార్గంలో పోరాడేవారూ, 32 వారికి ఆశ్రయమిచ్చేవారూ మరియు సహాయం చేసే వారూ, 33 అందరూ ఒకరికొకరు మిత్రులు. 34 మరియు ఎవరైతే విశ్వసించి వలసపోలేదో వారు, వలస పోనంతవరకు వారి మైత్రిత్వంతో మీకు ఎలాంటి సంబంధం లేదు. కాని వారు ధర్మం విషయంలో మీతో సహాయం కోరితే, వారికి సహాయం చేయటం మీ కర్తవ్యం; కాని మీతో ఒడంబడిక ఉన్న జాతి వారికి వ్యతిరేకంగా మాత్రం కాదు. మరియు అల్లాహ్‌ మీరు చేస్తున్నదంతా చూస్తున్నాడు.

8:73 – وَالَّذِينَ كَفَرُوا بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ إِلَّا تَفْعَلُوهُ تَكُن فِتْنَةٌ فِي الْأَرْضِ وَفَسَادٌ كَبِيرٌ ٧٣

మరియు సత్య-తిరస్కారులు ఒకరికొకరు స్నేహితులు. కావున (ఓ విశ్వాసులారా!) మీరు కూడా అలా చేయకపోతే (విశ్వాసుల మధ్య పరస్పర మైత్రిత్వాన్ని పెంచకపోతే), భూమిలో ఉపద్రవం మరియు కల్లోలం చెలరేగుతాయి.

8:74 – وَالَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّـهِ وَالَّذِينَ آوَوا وَّنَصَرُوا أُولَـٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا ۚ لَّهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ ٧٤

మరియు ఎవరైతే విశ్వసించి వలసపోయి అల్లాహ్‌ మార్గంలో పోరాడారో వారూ మరియు ఎవరైతే వారికి ఆశ్రయమిచ్చి సహాయపడ్డారో వారూ; ఇలాంటివారే నిజమైన విశ్వాసులు. వారికి వారి (పాపాల) క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి ఉంటాయి.

8:75 – وَالَّذِينَ آمَنُوا مِن بَعْدُ وَهَاجَرُوا وَجَاهَدُوا مَعَكُمْ فَأُولَـٰئِكَ مِنكُمْ ۚ وَأُولُو الْأَرْحَامِ بَعْضُهُمْ أَوْلَىٰ بِبَعْضٍ فِي كِتَابِ اللَّـهِ ۗ إِنَّ اللَّـهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ٧٥

మరియు ఎవరైతే తరువాత విశ్వసించి మరియు వలస పోయి మరియు మీతోబాటు (అల్లాహ్‌ మార్గంలో) పోరాడారో, వారు కూడా మీ వారే! కాని అల్లాహ్‌ గ్రంథం ప్రకారం, రక్తసంబంధం గలవారు (వారసత్వ విషయంలో) ఒకరిపైనొకరు ఎక్కువ హక్కుదారులు. 35 నిశ్చయంగా అల్లాహ్‌ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు. (1/4)

సూరహ్ అత్-తౌబహ్ – ఈ సూరహ్‌ ప్రారంభంలో, బిస్మిల్లా హిర్ర’హ్మా నిర్ర’హీం, లేదు. కొందరు దీనిని సూరహ్‌ అల్‌- అన్ఫాల్‌ యొక్క మిగతా భాగమని భావిస్తారు. ఇది మదీనహ్లో అవతరింపజేయబడింది. ఖుర్‌ఆన్‌లోని సబ’అ ‘తవాలు, 7 పెద్ద సూరాలలో ఇది ఏడవది. ఈ రెండు సూరాహ్‌లలో కూడా సత్య తిరస్కారులతో జరిగిన యుద్ధాల వివరాలున్నాయి. ఈ సూరహ్‌ 9వ హిజ్రీ తబూక్‌ దండయాత్ర కాలపు విషయాలను వివరిస్తోంది. దీని పేరు, తబూక్‌ దండయాత్రకు వెళ్ళని కొందరు సహాబీల పశ్చాత్తాపం (తౌబహ్‌) మరియు దాని అంగీకారాన్ని సంబోధించి ఇవ్వబడింది. ఇది సూరహ్‌ అల్‌-అన్ఫాల్‌ (8) అవతరణకు 7 సంవత్సరాల తరువాత అవతరింపజేయబడింది. తబూక్‌ మదీనహ్ నుండి 350 మైళ్ళ దూరంలో పశ్చిమోత్తరదిశలో ఉంది. బెజాన్‌టైన్‌ (Byzantine), క్రైస్తవ చక్రవర్తి హిరాక్లియస్‌ (Hiraclies), అబూ-‘ఆమిర్‌, ప్రోత్సాహం వల్ల అరేబియాపై దాడి చేయటానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలిసి, దైవప్రవక్త ము’హమ్మద్‌ (‘స’అస) వారిని తబూక్‌ దగ్గర ఎదుర్కోవాలని యుద్ధసన్నాహాల చాటింపుచేయించి, అక్కడికి వెళ్ళుతారు. ఇది సూరహ్‌ అల్‌- బరాఅ’, అని కూడా అనబడుతుంది. ఈ పదం మొదటి ఆయత్‌లోనే ఉంది. బరాఅ’తున్‌ – అంటే విముక్తి, రాహిత్యం, సంబంధం లేకపోవటం. 129 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 104వ ఆయత్‌లో ఉంది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 9:1 – بَرَاءَةٌ مِّنَ اللَّـهِ وَرَسُولِهِ إِلَى الَّذِينَ عَاهَدتُّم مِّنَ الْمُشْرِكِينَ ١

  • అల్లాహ్‌ తరఫునుండి మరియు ఆయన ప్రవక్త తరఫునుండి: ‘(ఓ విశ్వాసులారా!) మీరు ఒడంబడిక చేసుకున్న బహుదైవారాధకులతో (ముష్రికీన్‌లతో) ఎలాంటి సంబంధం లేదు’ అని ప్రకటించబడుతోంది. 1

9:2 – فَسِيحُوا فِي الْأَرْضِ أَرْبَعَةَ أَشْهُرٍ وَاعْلَمُوا أَنَّكُمْ غَيْرُ مُعْجِزِي اللَّـهِ ۙ وَأَنَّ اللَّـهَ مُخْزِي الْكَافِرِينَ ٢

కావున (ఓ ముష్రికులారా!) మీరు నాలుగు నెలలవరకు ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగండి. 2 కాని మీరు అల్లాహ్‌(శిక్ష) నుండి తప్పించుకోలేరని తెలుసుకోండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌! సత్య-తిరస్కారులను అవమానంపాలు చేస్తాడు.

9:3 – وَأَذَانٌ مِّنَ اللَّـهِ وَرَسُولِهِ إِلَى النَّاسِ يَوْمَ الْحَجِّ الْأَكْبَرِ أَنَّ اللَّـهَ بَرِيءٌ مِّنَ الْمُشْرِكِينَ ۙ وَرَسُولُهُ ۚ فَإِن تُبْتُمْ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۖ وَإِن تَوَلَّيْتُمْ فَاعْلَمُوا أَنَّكُمْ غَيْرُ مُعْجِزِي اللَّـهِ ۗ وَبَشِّرِ الَّذِينَ كَفَرُوا بِعَذَابٍ أَلِيمٍ ٣

మరియు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త తరఫు నుండి పెద్ద ‘హజ్జ్‌రోజున, 3 సర్వ మానవ జాతికి ప్రకటన చేయబడుతోంది: ”నిశ్చయంగా అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకు, బహుదైవా రాధకులతో, ఎలాంటి సంబంధం లేదు. కావున మీరు (ఓ ముష్రికులారా!) పశ్చాత్తాపపడితే, అది మీ మేలుకే. కాని మీరువిముఖులైతే మీరు అల్లాహ్‌ (శిక్ష) నుండి తప్పించుకోలేరని తెలుసుకోండి.” మరియు సత్య-తిరస్కారులకు బాధాకరమైన శిక్ష (విధించబడ) నున్నదనే వార్తను వినిపించు.

9:4 – إِلَّا الَّذِينَ عَاهَدتُّم مِّنَ الْمُشْرِكِينَ ثُمَّ لَمْ يَنقُصُوكُمْ شَيْئًا وَلَمْ يُظَاهِرُوا عَلَيْكُمْ أَحَدًا فَأَتِمُّوا إِلَيْهِمْ عَهْدَهُمْ إِلَىٰ مُدَّتِهِمْ ۚ إِنَّ اللَّـهَ يُحِبُّ الْمُتَّقِينَ ٤

కాని ఏ బహుదైవారాధకులతోనైతే మీరు ఒడంబడికలు చేసుకొని ఉన్నారో, వారు మీకు ఏ విషయంలోను లోపంచేయక, మీకు వ్యతిరేకంగా ఎవరికీ సహాయం చేయకుండా ఉంటే! వారి ఒడం బడికను దాని గడువువరకు పూర్తి చెయ్యండి. నిశ్చ యంగా, అల్లాహ్‌ దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు.

9:5 – فَإِذَا انسَلَخَ الْأَشْهُرُ الْحُرُمُ فَاقْتُلُوا الْمُشْرِكِينَ حَيْثُ وَجَدتُّمُوهُمْ وَخُذُوهُمْ وَاحْصُرُوهُمْ وَاقْعُدُوا لَهُمْ كُلَّ مَرْصَدٍ ۚ فَإِن تَابُوا وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ فَخَلُّوا سَبِيلَهُمْ ۚ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ٥

ఇక నిషిధ్ధమాసాలు 4 గడిచిపోయిన తరువాత బహు-దైవారాధకులను, ఎక్కడ దొరికితే అక్కడ వధించండి. 5 మరియు వారిని పట్టుకోండి 6 మరియు చుట్టుముట్టండి మరియు ప్రతి మాటు వద్ద వారికై పొంచిఉండండి. 7 కాని వారు పశ్చాత్తాప పడి, నమా’జ్‌ స్థాపించి, ‘జకాత్‌ ఇస్తే, వారిని వారి మార్గాన వదిలిపెట్టండి 8 నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

9:6 – وَإِنْ أَحَدٌ مِّنَ الْمُشْرِكِينَ اسْتَجَارَكَ فَأَجِرْهُ حَتَّىٰ يَسْمَعَ كَلَامَ اللَّـهِ ثُمَّ أَبْلِغْهُ مَأْمَنَهُ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْلَمُونَ ٦

మరియు బహుదైవారాధకులలో (ముష్రికీన్‌ లలో) ఎవడైనా నీ శరణు కోరితే – అతడు అల్లాహ్‌ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) వినటానికి – అతనికి శరణు ఇవ్వు. తరువాత అతనిని, అతని కొరకు సురక్షితమైన స్థలానికి చేర్చు. ఇది ఎందుకంటే! వాస్తవానికి వారు (సత్యం) తెలియని ప్రజలు. 9

9:7 – كَيْفَ يَكُونُ لِلْمُشْرِكِينَ عَهْدٌ عِندَ اللَّـهِ وَعِندَ رَسُولِهِ إِلَّا الَّذِينَ عَاهَدتُّمْ عِندَ الْمَسْجِدِ الْحَرَامِ ۖ فَمَا اسْتَقَامُوا لَكُمْ فَاسْتَقِيمُوا لَهُمْ ۚ إِنَّ اللَّـهَ يُحِبُّ الْمُتَّقِينَ ٧

బహు-దైవారాధకులకు (ముష్రికీన్‌లకు) అల్లాహ్‌ తో మరియు ఆయన ప్రవక్తతో ఒడంబడిక ఎలా సాధ్యం కాగలదు? మస్జిద్‌ అల్‌-‘హరామ్‌ వద్ద మీరు ఒడంబడిక చేసుకున్నవారితో తప్ప! వారు తమ (ఒడంబడికపై) స్థిరంగా ఉన్నంత వరకు మీరు కూడా దానిపై స్థిరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు.

9:8 – كَيْفَ وَإِن يَظْهَرُوا عَلَيْكُمْ لَا يَرْقُبُوا فِيكُمْ إِلًّا وَلَا ذِمَّةً ۚ يُرْضُونَكُم بِأَفْوَاهِهِمْ وَتَأْبَىٰ قُلُوبُهُمْ وَأَكْثَرُهُمْ فَاسِقُونَ ٨

(వారితో ఒడంబడిక) ఎలా సాధ్యంకాగలదు? ఎందుకంటే వారు మీపై ప్రాబల్యం వహిస్తే, వారు మీ బంధుత్వాన్ని గానీ, ఒడంబడికను గానీ పాటించరు. వారు కేవలం నోటి మాటలతోనే మిమ్మల్ని సంతోషపరుస్తున్నారు, కాని వారి హృదయాలు మాత్రం మిమ్మల్ని అసహ్యించు కుంటున్నాయి మరియు వారిలో అనేకులు అవిధేయులు (ఫాసిఖూన్‌) ఉన్నారు.

9:9 – اشْتَرَوْا بِآيَاتِ اللَّـهِ ثَمَنًا قَلِيلًا فَصَدُّوا عَن سَبِيلِهِ ۚ إِنَّهُمْ سَاءَ مَا كَانُوا يَعْمَلُونَ ٩

వారు అల్లాహ్‌ సూక్తులను (ఆయాత్‌లను) అల్ప ధరకు విక్రయించి, ప్రజలను ఆయన మార్గం నుండి ఆటంకపరుస్తున్నారు. నిశ్చయంగా, వారు చేసే పనులు ఎంతో నీచమైనవి!

9:10 – لَا يَرْقُبُونَ فِي مُؤْمِنٍ إِلًّا وَلَا ذِمَّةً ۚ وَأُولَـٰئِكَ هُمُ الْمُعْتَدُونَ ١٠

వారు ఏ విశ్వాసి విషయంలో కూడా బంధు త్వాన్ని గానీ, ఒడంబడికను గానీ పాటించరు! ఇటువంటి వారే, హద్దులను అతిక్రమించిన వారు.

9:11 – فَإِن تَابُوا وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ فَإِخْوَانُكُمْ فِي الدِّينِ ۗ وَنُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ ١١

కావున వారు పశ్చాత్తాపపడి, నమా’జ్‌ స్థాపించి, ‘జకాతు ఇస్తే! వారు మీధార్మిక సోదరులు. మరియు తెలుసుకోగల వారికి, మేము మా సూచనలను, ఈ విధంగా స్పష్ట పరుస్తున్నాము.

9:12 – وَإِن نَّكَثُوا أَيْمَانَهُم مِّن بَعْدِ عَهْدِهِمْ وَطَعَنُوا فِي دِينِكُمْ فَقَاتِلُوا أَئِمَّةَ الْكُفْرِ ۙ إِنَّهُمْ لَا أَيْمَانَ لَهُمْ لَعَلَّهُمْ يَنتَهُونَ ١٢

మరియు వారు ఒడంబడిక చేసిన తరువాత, మళ్ళీ తమ ప్రమాణాలను భంగంచేస్తే! మరియు మీ ధర్మాన్ని అవమానపరిస్తే, అలాంటి సత్య-తిరస్కారుల నాయకులతో మీరు యుద్ధం చేయండి. నిశ్చయంగా, వారి ప్రమాణాలు నమ్మదగినవి కావు. బహుశా ఈవిధంగానైనా వారు మానుకోవచ్చు! 10

9:13 – أَلَا تُقَاتِلُونَ قَوْمًا نَّكَثُوا أَيْمَانَهُمْ وَهَمُّوا بِإِخْرَاجِ الرَّسُولِ وَهُم بَدَءُوكُمْ أَوَّلَ مَرَّةٍ ۚ أَتَخْشَوْنَهُمْ ۚ فَاللَّـهُ أَحَقُّ أَن تَخْشَوْهُ إِن كُنتُم مُّؤْمِنِينَ ١٣

ఏమీ? ఎవరైతే తమ ప్రమాణాలను భంగం చేసి, సందేశహరుణ్ణి (మక్కహ్ నుండి) వెడలగొట్టా లని నిర్ణయించారో! మరియు మొదట వారే, మీతో తగవు ఆరంభించారో, 11 అలాంటి వారితో మీరు యుధ్ధం చేయరా? ఏమీ? మీరు వారికి భయపడు తున్నారా? వాస్తవానికి మీరు విశ్వాసులే అయితే కేవలం అల్లాహ్‌కు మాత్రమే భయపడటం మీ కర్తవ్యం.

9:14 – قَاتِلُوهُمْ يُعَذِّبْهُمُ اللَّـهُ بِأَيْدِيكُمْ وَيُخْزِهِمْ وَيَنصُرْكُمْ عَلَيْهِمْ وَيَشْفِ صُدُورَ قَوْمٍ مُّؤْمِنِينَ

వారితో యుధ్ధం చేయండి. అల్లాహ్‌ మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు మరియు వారిని అవమానం పాలు చేస్తాడు. మరియు వారికి ప్రతి కూలంగా మీకు సహాయం చేస్తాడు. మరియు విశ్వసించిన ప్రజల హృదయాలను చల్లబరుస్తాడు;

9:15 – وَيُذْهِبْ غَيْظَ قُلُوبِهِمْ ۗ وَيَتُوبُ اللَّـهُ عَلَىٰ مَن يَشَاءُ ۗ وَاللَّـهُ عَلِيمٌ حَكِيمٌ ١٥

మరియు వారి హృదయాలలోని క్రోధాన్ని దూరంచేస్తాడు. మరియు అల్లాహ్‌! తాను కోరిన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

9:16 – أَمْ حَسِبْتُمْ أَن تُتْرَكُوا وَلَمَّا يَعْلَمِ اللَّـهُ الَّذِينَ جَاهَدُوا مِنكُمْ وَلَمْ يَتَّخِذُوا مِن دُونِ اللَّـهِ وَلَا رَسُولِهِ وَلَا الْمُؤْمِنِينَ وَلِيجَةً ۚ وَاللَّـهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ ١٦

ఏమీ? అల్లాహ్‌ మీలో నుండి (తన మార్గంలో) పోరాడే వారెవరో మరియు – అల్లాహ్‌, ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు తప్ప – ఇతరుల నెవ్వరినీ తమ ఆప్తమిత్రులుగా చేసుకోని వారెవరో, చూడకముందే మిమ్మల్ని వదలిపెడ తాడని అనుకుంటున్నారా? మరియు అల్లాహ్‌ మీరు చేస్తున్నదంతా బాగా ఎరుగును.

9:17 – مَا كَانَ لِلْمُشْرِكِينَ أَن يَعْمُرُوا مَسَاجِدَ اللَّـهِ شَاهِدِينَ عَلَىٰ أَنفُسِهِم بِالْكُفْرِ ۚ أُولَـٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ وَفِي النَّارِ هُمْ خَالِدُونَ ١٧

బహుదైవారాధకులు (ముష్రికీన్‌) తాము సత్య-తిరస్కారులమని సాక్ష్యమిస్తూ, అల్లాహ్‌ మస్జిదులను నిర్వహించటానికి (సేవచేయటానికి) అర్హులుకారు. అలాంటివారి కర్మలు వ్యర్థమై పోతాయి మరియు వారు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటారు.

9:18 – إِنَّمَا يَعْمُرُ مَسَاجِدَ اللَّـهِ مَنْ آمَنَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَلَمْ يَخْشَ إِلَّا اللَّـهَ ۖ فَعَسَىٰ أُولَـٰئِكَ أَن يَكُونُوا مِنَ الْمُهْتَدِينَ ١٨

నిశ్చయంగా అల్లాహ్‌ను అంతిమ దినాన్ని విశ్వసించే వారు, నమా’జ్‌ను స్థాపించేవారు, ‘జకాత్‌ ఇచ్చేవారు, అల్లాహ్‌కు తప్ప మరెవ్వరికీ భయపడని వారు మాత్రమే అల్లాహ్‌ మస్జిద్‌లను నిర్వహించాలి. ఇలాంటి వారే మార్గదర్శకత్వం పొందినవారని ఆశించవచ్చు! 12 (3/8)

9:19 – أَجَعَلْتُمْ سِقَايَةَ الْحَاجِّ وَعِمَارَةَ الْمَسْجِدِ الْحَرَامِ كَمَنْ آمَنَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ وَجَاهَدَ فِي سَبِيلِ اللَّـهِ ۚ لَا يَسْتَوُونَ عِندَ اللَّـهِ ۗ وَاللَّـهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ ١٩

  • ఏమీ? ‘హజ్జ్‌ మరియు ‘ఉమ్రా కొరకు వచ్చే వారికి నీరు త్రాపటాన్ని మరియు మస్జిద్‌ అల్‌-‘హరామ్‌ను నిర్వహించటాన్ని, మీరు అల్లాహ్‌ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించి, అల్లాహ్‌ మార్గంలో పోరాడేదానికి సమానంగా భావి స్తున్నారా? అల్లాహ్‌ దగ్గర, వారు (ఈ రెండు పక్షాల వారు) సరిసమానులు కారు. 13 మరియు అల్లాహ్‌ దుర్మార్గులైన ప్రజలకు సన్మార్గం చూపడు.

9:20 – الَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّـهِ بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ أَعْظَمُ دَرَجَةً عِندَ اللَّـهِ ۚ وَأُولَـٰئِكَ هُمُ الْفَائِزُونَ ٢٠

విశ్వసించి, అల్లాహ్‌ మార్గంలో వలస పోయిన వారికీ మరియు తమ ధనసంపత్తులను ప్రాణాలను వినియోగించి పోరాడిన వారికీ, అల్లాహ్‌ దగ్గర అత్యున్నత స్థానముంది. మరియు అలాంటి వారే సాఫల్యం (విజయం) పొందేవారు. 14

9:21 – يُبَشِّرُهُمْ رَبُّهُم بِرَحْمَةٍ مِّنْهُ وَرِضْوَانٍ وَجَنَّاتٍ لَّهُمْ فِيهَا نَعِيمٌ مُّقِيمٌ ٢١

వారి ప్రభువు వారికి, తన తరఫునుండి కారు ణ్యాన్ని మరియు ప్రసన్నతను మరియు శాశ్వత సౌఖ్యాలుగల స్వర్గవనాల శుభవార్తనుఇస్తున్నాడు.

9:22 – خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ إِنَّ اللَّـهَ عِندَهُ أَجْرٌ عَظِيمٌ ٢٢

వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్‌ దగ్గర గొప్ప ప్రతిఫలముంది.

9:23 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا آبَاءَكُمْ وَإِخْوَانَكُمْ أَوْلِيَاءَ إِنِ اسْتَحَبُّوا الْكُفْرَ عَلَى الْإِيمَانِ ۚ وَمَن يَتَوَلَّهُم مِّنكُمْ فَأُولَـٰئِكَ هُمُ الظَّالِمُونَ ٢٣

ఓవిశ్వాసులారా! మీతండ్రితాతలు మరియు మీ సోదరులు సత్య-తిరస్కారానికి విశ్వాసంపై ప్రాధాన్యతనిస్తే, మీరు వారిని స్నేహితులుగా చేసు కోకండి. మీలో వారివైపు మొగ్గేవారే (వారిని మీ స్నేహితులుగా చేసుకునేవారే) దుర్మార్గులు. 15

9:24 – قُلْ إِن كَانَ آبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ وَإِخْوَانُكُمْ وَأَزْوَاجُكُمْ وَعَشِيرَتُكُمْ وَأَمْوَالٌ اقْتَرَفْتُمُوهَا وَتِجَارَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَمَسَاكِنُ تَرْضَوْنَهَا أَحَبَّ إِلَيْكُم مِّنَ اللَّـهِ وَرَسُولِهِ وَجِهَادٍ فِي سَبِيلِهِ فَتَرَبَّصُوا حَتَّىٰ يَأْتِيَ اللَّـهُ بِأَمْرِهِ ۗ وَاللَّـهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ ٢٤

వారితో ఇలా అను: ”మీ తండ్రి-తాతలు, మీ కుమారులు, మీ సోదరులు, మీ సహవాసులు (అ’జ్వాజ్‌), మీ బంధువులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు, మందగిస్తాయేమోనని భయపడే మీ వ్యాపారాలు, మీకు ప్రీతికరమైన మీ భవనాలు – అల్లాహ్‌ కంటే, ఆయన ప్రవక్త కంటే మరియు ఆయ న మార్గంలో పోరాడటం కంటే – మీకు ఎక్కువ ప్రియమైనవైతే, అల్లాహ్‌ తన తీర్పును బహిర్గ తం చేసే వరకు నిరీక్షించండి. మరియు అల్లాహ్‌ అవిధేయులైన జాతివారికి సన్మార్గంచూపడు.” 16

9:25 – لَقَدْ نَصَرَكُمُ اللَّـهُ فِي مَوَاطِنَ كَثِيرَةٍ ۙ وَيَوْمَ حُنَيْنٍ ۙ إِذْ أَعْجَبَتْكُمْ كَثْرَتُكُمْ فَلَمْ تُغْنِ عَنكُمْ شَيْئًا وَضَاقَتْ عَلَيْكُمُ الْأَرْضُ بِمَا رَحُبَتْ ثُمَّ وَلَّيْتُم مُّدْبِرِينَ ٢٥

వాస్తవానికి ఇదివరకు చాలా యుధ్ధ రంగాలలో (మీరు కొద్దిమంది ఉన్నా) అల్లాహ్‌ మీకు విజయం చేకూర్చాడు. మరియు ‘హునైన్‌ (యుధ్ధం) రోజు మీ సంఖ్యాబలం మీకు గర్వ కారణమయింది. కాని, అది మీకు ఏ విధంగానూ పనికిరాలేదు. మరియు భూమి విశాలమైనది అయినప్పటికీ మీకు ఇరుకైపోయింది. తరువాత మీరు వెన్నుచూపి పారిపోయారు. 17

9:26 – ثُمَّ أَنزَلَ اللَّـهُ سَكِينَتَهُ عَلَىٰ رَسُولِهِ وَعَلَى الْمُؤْمِنِينَ وَأَنزَلَ جُنُودًا لَّمْ تَرَوْهَا وَعَذَّبَ الَّذِينَ كَفَرُوا ۚ وَذَٰلِكَ جَزَاءُ الْكَافِرِينَ ٢٦

తరువాత అల్లాహ్‌ తన ప్రవక్తపై మరియు విశ్వాసులపై ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. మరియు మీకుకనిపించని (దైవదూతల) దళాలను దింపి సత్య-తిరస్కారులనుశిక్షించాడు. 18 మరియు ఇదే సత్య-తిరస్కారులకు లభించే ప్రతిఫలం.

9:27 – ثُمَّ يَتُوبُ اللَّـهُ مِن بَعْدِ ذَٰلِكَ عَلَىٰ مَن يَشَاءُ ۗ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٢٧

ఆ తరువాత కూడా అల్లాహ్‌ తాను కోరిన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

9:28 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّمَا الْمُشْرِكُونَ نَجَسٌ فَلَا يَقْرَبُوا الْمَسْجِدَ الْحَرَامَ بَعْدَ عَامِهِمْ هَـٰذَا ۚ وَإِنْ خِفْتُمْ عَيْلَةً فَسَوْفَ يُغْنِيكُمُ اللَّـهُ مِن فَضْلِهِ إِن شَاءَ ۚ إِنَّ اللَّـهَ عَلِيمٌ حَكِيمٌ ٢٨

ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, బహుదైవా రాధకులు (ముష్రికీన్‌) అపరిశుద్ధులు (నజ్స్). 19 కనుక ఈ సంవత్సరం తరువాత వారు మస్జిద్‌ అల్‌-‘హరామ్‌ సమీపానికి రాకూడదు. 20 మరియు ఒకవేళ మీరు లేమికి భయపడితే! అల్లాహ్‌ కోరితే, తన అనుగ్రహంతో మిమ్మల్ని సంపన్నులుగా చేయగలడు! నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

9:29 – قَاتِلُوا الَّذِينَ لَا يُؤْمِنُونَ بِاللَّـهِ وَلَا بِالْيَوْمِ الْآخِرِ وَلَا يُحَرِّمُونَ مَا حَرَّمَ اللَّـهُ وَرَسُولُهُ وَلَا يَدِينُونَ دِينَ الْحَقِّ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ حَتَّىٰ يُعْطُوا الْجِزْيَةَ عَن يَدٍ وَهُمْ صَاغِرُونَ ٢٩

అల్లాహ్‌ను మరియు అంతిమదినాన్ని విశ్వ సించని; అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త నిషేధించి నవి, నిషిధ్ధమని భావించని; సత్యధర్మాన్ని తమ ధర్మంగా స్వీకరించని గ్రంథప్రజలతో – వారు స్వయంగా తమచేతులతో జి’జ్యా 21 ఇచ్చి లోబడి ఉండేవరకూ – పోరాడండి. 22

9:30 – وَقَالَتِ الْيَهُودُ عُزَيْرٌ ابْنُ اللَّـهِ وَقَالَتِ النَّصَارَى الْمَسِيحُ ابْنُ اللَّـهِ ۖ ذَٰلِكَ قَوْلُهُم بِأَفْوَاهِهِمْ ۖ يُضَاهِئُونَ قَوْلَ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ ۚ قَاتَلَهُمُ اللَّـهُ ۚ أَنَّىٰ يُؤْفَكُونَ ٣٠

మరియు యూదులు ‘ఉ’జైర్‌ అల్లాహ్‌ కుమారుడని అంటారు 23 మరియు క్రైస్తవులు మసీ’హ్‌ (క్రీస్తు) అల్లాహ్‌ కుమారుడని. ఇవి వారు తమ నోటితో అనే మాటలే. ఇంతకు పూర్వపు సత్య-తిరస్కారులు పలికిన మాటలనే వారు అనుకరిస్తున్నారు. అల్లాహ్‌ వారిని నశింపజేయు గాక! వారెంత మోసగింపబడుతున్నారు (వారెంత సత్యం నుండి మరలింపబడుతున్నారు)!

9:31 – اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِّن دُونِ اللَّـهِ وَالْمَسِيحَ ابْنَ مَرْيَمَ وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا إِلَـٰهًا وَاحِدًا ۖ لَّا إِلَـٰهَ إِلَّا هُوَ ۚ سُبْحَانَهُ عَمَّا يُشْرِكُونَ ٣١

వారు (యూదులు మరియు క్రైస్తవులు) అల్లాహ్‌ను వదలి తమ యూద మతాచారులు (అ’హ్‌బార్‌ లను) మరియు(క్రైస్తవ)సన్యాసులు (రుహ్‌బాన్‌ లను) మరియు మర్యమ్‌ కుమారు డైన మసీ’హ్‌ (క్రీస్తు)ను తమ ప్రభువులుగా చేసు కున్నారు. 24 వాస్తవానికి, వారు ఒకే ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞాపించబడ్డారు. ఆయన (అల్లాహ్‌) తప్పమరొక ఆరాధ్యదైవంలేడు. ఆయన వారు సాటికల్పించే వాటికి అతీతుడు.

9:32 – يُرِيدُونَ أَن يُطْفِئُوا نُورَ اللَّـهِ بِأَفْوَاهِهِمْ وَيَأْبَى اللَّـهُ إِلَّا أَن يُتِمَّ نُورَهُ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ ٣٢

వారు అల్లాహ్‌ జ్యోతిని (ఇస్లాంను) తమ నోటితో (ఊది) ఆర్పగోరుతున్నారు, కాని అల్లాహ్‌ అలా కానివ్వడు; సత్య-తిరస్కారులకు అది ఎంత అసహ్యకరమైనా, ఆయన తన జ్యోతిని పూర్తిచేసి తీరుతాడు.

9:33 – هُوَ الَّذِي أَرْسَلَ رَسُولَهُ بِالْهُدَىٰ وَدِينِ الْحَقِّ لِيُظْهِرَهُ عَلَى الدِّينِ كُلِّهِ وَلَوْ كَرِهَ الْمُشْرِكُونَ ٣٣

బహుదైవారాధకులకు (ముష్రికీన్‌లకు) అది ఎంత అసహ్యకరమైనా, తన ప్రవక్తకు మార్గదర్శ కత్వాన్నీ మరియు సత్యధర్మాన్నీ ఇచ్చి పంపి, దానిని సకల ధర్మాల మీద ప్రబలింపజేసిన (ఆధిక్య తనిచ్చిన) వాడు ఆయన (అల్లాహ్‌)యే! 25 (1/2)

9:34 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّ كَثِيرًا مِّنَ الْأَحْبَارِ وَالرُّهْبَانِ لَيَأْكُلُونَ أَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّـهِ ۗ وَالَّذِينَ يَكْنِزُونَ الذَّهَبَ وَالْفِضَّةَ وَلَا يُنفِقُونَهَا فِي سَبِيلِ اللَّـهِ فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ ٣٤

  • ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, చాలా మంది యూదమతాచారులు (అ’హ్‌బార్‌) మరియు క్రైస్తవ సన్యాసులు (రుహ్‌బాన్‌) ప్రజల సొత్తును అక్రమ పద్దతుల ద్వారా తినివేస్తున్నారు మరియు వారిని అల్లాహ్‌ మార్గం నుండి ఆటంకపరుస్తు న్నారు. మరియు ఎవరైతే వెండి, బంగారాన్ని కూడ బెట్టి, దానిని అల్లాహ్‌ మార్గంలో ఖర్చుపెట్టరో వారికి బాధాకరమైన శిక్షగలదనే వార్తనువినిపించు.

9:35 – يَوْمَ يُحْمَىٰ عَلَيْهَا فِي نَارِ جَهَنَّمَ فَتُكْوَىٰ بِهَا جِبَاهُهُمْ وَجُنُوبُهُمْ وَظُهُورُهُمْ ۖ هَـٰذَا مَا كَنَزْتُمْ لِأَنفُسِكُمْ فَذُوقُوا مَا كُنتُمْ تَكْنِزُونَ ٣٥

ఆ దినమున దానిని (ఆ వెండి బంగారాన్ని/ జకాత్‌ ఇవ్వని ధనాన్ని) నరకాగ్నిలో కాల్చి దానితో వారి నుదురుల మీద, ప్రక్కల మీద మరియు వీపుల మీద వాతలు వేయబడతాయి. 26 (అప్పుడువారితో ఇలాఅనబడుతుంది): ”ఇదంతా మీరు మీకొరకు కూడబెట్టుకున్నదే, కావున మీరు కూడబెట్టుకున్న దానిని చవి చూడండి.”

9:36 – إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّـهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّـهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ ۚ وَقَاتِلُوا الْمُشْرِكِينَ كَافَّةً كَمَا يُقَاتِلُونَكُمْ كَافَّةً ۚ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ مَعَ الْمُتَّقِينَ ٣٦

నిశ్చయంగా, నెలల సంఖ్య అల్లాహ్‌ దగ్గర పన్నెండు నెలలు మాత్రమే. ఇది భూమ్యాకాశాలు సృష్టించిన దినం నుండి అల్లాహ్‌ గ్రంథంలో వ్రాయబడి ఉంది. వాటిలో నాలుగు నిషిధ్ధ (మాసాలు). 27 ఇదే సరైన ధర్మం. కావున వాటిలో (ఆ నాలుగు హిజ్రీ మాసాలలో) మీకు మీరు అన్యాయం చేసుకోకండి. 28 బహుదైవారాధకులతో (ముష్రికీన్‌లతో) అందరూ కలిసి పోరాడండి. ఏ విధంగా అయితే వారందరూ కలిసి మీతో పోరాడు తున్నారో! మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ దైవభీతి గలవారితోనే ఉంటాడని తెలుసుకోండి. 29

9:37 – إِنَّمَا النَّسِيءُ زِيَادَةٌ فِي الْكُفْرِ ۖ يُضَلُّ بِهِ الَّذِينَ كَفَرُوا يُحِلُّونَهُ عَامًا وَيُحَرِّمُونَهُ عَامًا لِّيُوَاطِئُوا عِدَّةَ مَا حَرَّمَ اللَّـهُ فَيُحِلُّوا مَا حَرَّمَ اللَّـهُ ۚ زُيِّنَ لَهُمْ سُوءُ أَعْمَالِهِمْ ۗ وَاللَّـهُ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ ٣٧

నిశ్చయంగా, నెలలను వెనుక ముందు చేయటం (నసీఉ’) సత్య-తిరస్కారంలో అదనపు చేష్టయే! దానివల్ల సత్య-తిరస్కారులు మార్గ భ్రష్టత్వానికి గురిచేయబడుతున్నారు. వారు దానిని ఒక సంవత్సరం ధర్మసమ్మతం చేసు కుంటారు, మరొక సంవత్సరం నిషేధించుకుంటారు. ఈ విధంగా వారు అల్లాహ్‌ నిషేధించిన (నెలల) సంఖ్యను తమకు అనుగుణంగా మార్చుకొని అల్లాహ్‌ నిషేధించిన దానిని ధర్మసమ్మతం చేసుకుంటున్నారు. వారి దుష్కార్యాలు వారికి మనోహరమైనవిగా కనిపిస్తున్నాయి. మరియు అల్లాహ్‌ సత్య-తిరస్కారులకు సన్మార్గం చూపడు.

9:38 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَا لَكُمْ إِذَا قِيلَ لَكُمُ انفِرُوا فِي سَبِيلِ اللَّـهِ اثَّاقَلْتُمْ إِلَى الْأَرْضِ ۚ أَرَضِيتُم بِالْحَيَاةِ الدُّنْيَا مِنَ الْآخِرَةِ ۚ فَمَا مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا فِي الْآخِرَةِ إِلَّا قَلِيلٌ ٣٨

ఓ విశ్వాసులారా! మీ కేమయింది? మీతో: ”అల్లాహ్ మార్గంలో బయలుదేరండి.” అని చెప్పి నపుడు మీరు భూమికి అతుక్కొని పోతున్నా రేమిటి? ఏమీ? మీరు పరలోకాన్ని వదలి, ఇహలోక జీవితంతోనే తృప్తిపడ దలచుకున్నారా? కాని ఇహలోక జీవిత సుఖం, పరలోక (జీవిత సుఖాల ముందు) ఎంతో అల్పమైనది! 30

9:39 – إِلَّا تَنفِرُوا يُعَذِّبْكُمْ عَذَابًا أَلِيمًا وَيَسْتَبْدِلْ قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّوهُ شَيْئًا ۗ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٣٩

మీరు బయలు దేరకపోతే, ఆయన మీకు బాధాకరమైన శిక్షను విధిస్తాడు. మరియు మీకు బదులుగా మరొక జాతిని మీ స్థానంలో తెస్తాడు. మరియు మీరు ఆయనకు ఎలాంటి నష్టం కలిగించ లేరు. 31 మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.

9:40 – إِلَّا تَنصُرُوهُ فَقَدْ نَصَرَهُ اللَّـهُ إِذْ أَخْرَجَهُ الَّذِينَ كَفَرُوا ثَانِيَ اثْنَيْنِ إِذْ هُمَا فِي الْغَارِ إِذْ يَقُولُ لِصَاحِبِهِ لَا تَحْزَنْ إِنَّ اللَّـهَ مَعَنَا ۖ فَأَنزَلَ اللَّـهُ سَكِينَتَهُ عَلَيْهِ وَأَيَّدَهُ بِجُنُودٍ لَّمْ تَرَوْهَا وَجَعَلَ كَلِمَةَ الَّذِينَ كَفَرُوا السُّفْلَىٰ ۗ وَكَلِمَةُ اللَّـهِ هِيَ الْعُلْيَا ۗ وَاللَّـهُ عَزِيزٌ حَكِيمٌ ٤٠

ఒకవేళ మీరు అతనికి (ప్రవక్తకు) సహాయం చేయక పోతే ఏం ఫర్వాలేదు! (అల్లాహ్‌ అతనికి తప్పక సహాయం చేస్తాడు). ఏ విధంగానైతే, సత్య- తిరస్కారులు అతనిని పారద్రోలినపుడు, అల్లాహ్‌ అతనికి సహాయంచేశాడో! అప్పుడు అతను ఇద్దరి లో రెండవ వాడిగా (సౌ’ర్‌) గుహలో ఉన్నప్పుడు అతను తన తోటివాని (అబూ-బక్ర్‌)తో: ”నీవు దుఃఖపడకు, నిశ్చయంగా అల్లాహ్‌ మనతో ఉన్నాడు!” అని అన్నాడు. 33 అప్పుడు అల్లాహ్! అతనిపై తన తరఫు నుండి మనశ్శాంతిని అవత రింపజేశాడు. అతనిని మీకు కనిపించని (దైవ దూతల) దళాలతో సహాయం చేసి సత్య-తిరస్కా రుల మాటను కించపరచాడు. మరియు అల్లాహ్‌ మాట సదా సర్వోన్నతమైనదే. మరియు అల్లాహ్‌ సర్వశక్తిమంతుడు మహా వివేచనాపరుడు.

9:41 – انفِرُوا خِفَافًا وَثِقَالًا وَجَاهِدُوا بِأَمْوَالِكُمْ وَأَنفُسِكُمْ فِي سَبِيلِ اللَّـهِ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ ٤١

తేలికగానైనా సరే, లేక బరువుగానైనా సరే బయలుదేరండి. మరియు మీ సంపదలతో మరియు మీ ప్రాణాలతో అల్లాహ్‌ మార్గంలో పోరాడండి. ఒకవేళ మీరిది తెలుసుకోగలిగితే, ఇది మీకెంతో ఉత్తమమైనది.

9:42 – لَوْ كَانَ عَرَضًا قَرِيبًا وَسَفَرًا قَاصِدًا لَّاتَّبَعُوكَ وَلَـٰكِن بَعُدَتْ عَلَيْهِمُ الشُّقَّةُ ۚ وَسَيَحْلِفُونَ بِاللَّـهِ لَوِ اسْتَطَعْنَا لَخَرَجْنَا مَعَكُمْ يُهْلِكُونَ أَنفُسَهُمْ وَاللَّـهُ يَعْلَمُ إِنَّهُمْ لَكَاذِبُونَ ٤٢

అది తొందరగా దొరికే లాభం మరియు సులభమైన ప్రయాణం అయితే వారు తప్పక నీ వెంట వెళ్ళేవారు. కాని వారికది (తబూక్‌ ప్రయా ణం) చాలా కష్టమైనదిగా (దూరమైనదిగా) అని పించింది. కావున వారు అల్లాహ్‌ పై ప్రమాణం చేస్తూ అంటున్నారు: ”మేము రాగలస్థితిలో ఉంటే తప్పక మీ వెంట వచ్చి ఉండేవారము.” (ఈ విధంగా అబద్ధ మాడి) వారు తమను తాము నాశనం చేసుకుంటు న్నారు. మరియు వారు అబద్ధమాడుతున్నారని అల్లాహ్‌కు బాగా తెలుసు. 33

9:43 – عَفَا اللَّـهُ عَنكَ لِمَ أَذِنتَ لَهُمْ حَتَّىٰ يَتَبَيَّنَ لَكَ الَّذِينَ صَدَقُوا وَتَعْلَمَ الْكَاذِبِينَ ٤٣

(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ నిన్ను మన్నించు గాక! సత్యవంతులెవరో నీకు స్పష్టం కాకముందే మరియు అబద్ధమాడేవారెవరో నీకు తెలియక ముందే, వారికి (వెనుక ఉండటానికి) ఎందుకు అనుమతినిచ్చావు? 34

9:44 – لَا يَسْتَأْذِنُكَ الَّذِينَ يُؤْمِنُونَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ أَن يُجَاهِدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ ۗ وَاللَّـهُ عَلِيمٌ بِالْمُتَّقِينَ ٤٤

అల్లాహ్‌ను మరియు అంతిమదినాన్ని విశ్వసించే వారు, తమ సంపత్తి మరియు తమ ప్రాణాలను వినియోగించి (అల్లాహ్‌ మార్గంలో) పోరాడటం నుండి తప్పించుకోవటానికి ఎన్నడూ అనుమతి అడగరు. మరియు దైవభీతి గలవారు ఎవరో అల్లాహ్‌కు బాగా తెలుసు.

9:45 – إِنَّمَا يَسْتَأْذِنُكَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ وَارْتَابَتْ قُلُوبُهُمْ فَهُمْ فِي رَيْبِهِمْ يَتَرَدَّدُونَ ٤٥

నిస్సందేహంగా, అల్లాహ్‌ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించనివారే, వెనుక ఉండ టానికి అనుమతి అడుగుతారు. మరియు వారి హృదయాలు సందేహంలో మునిగి ఉన్నాయి. కావున వారు తమ సందేహాలలో పడి ఊగిసలాడు తున్నారు. 35 (5/8)

9:46 – وَلَوْ أَرَادُوا الْخُرُوجَ لَأَعَدُّوا لَهُ عُدَّةً وَلَـٰكِن كَرِهَ اللَّـهُ انبِعَاثَهُمْ فَثَبَّطَهُمْ وَقِيلَ اقْعُدُوا مَعَ الْقَاعِدِينَ ٤٦

  • మరియు ఒకవేళ వారు బయలు దేరాలని కోరి ఉంటే తప్పక దానికై వారు యుధ్ధ సామగ్రి సిధ్ధపరచుకొని ఉండేవారు, కాని వారు బయలుదేరటం అల్లాహ్‌కు ఇష్టం లేదు, కావున వారిని నిలిపివేశాడు. మరియు వారితో: ”కూర్చొని ఉన్నవారితో మీరు కూడా కూర్చొని ఉండండి!” అని చెప్పబడింది.

9:47 – لَوْ خَرَجُوا فِيكُم مَّا زَادُوكُمْ إِلَّا خَبَالًا وَلَأَوْضَعُوا خِلَالَكُمْ يَبْغُونَكُمُ الْفِتْنَةَ وَفِيكُمْ سَمَّاعُونَ لَهُمْ ۗ وَاللَّـهُ عَلِيمٌ بِالظَّالِمِينَ ٤٧

ఒకవేళ వారు మీతో కలిసి వెళ్ళినా మీలో కలతలు తప్ప మరేమీ అధికం చేసేవారు కాదు. మరియు మీ మధ్య ఉపద్రవం (ఫిత్న) రేకెత్తించటానికి తీవ్ర ప్రయత్నాలు చేసేవారు. మరియు మీలో కొందరు వారి కొరకు (కపట-విశ్వాసుల కొరకు) మాటలు వినేవారు (వారి గూఢాచారులు) ఉన్నారు. మరియు అల్లాహ్‌కు దుర్మార్గుల గురించి బాగా తెలుసు.

9:48 – لَقَدِ ابْتَغَوُا الْفِتْنَةَ مِن قَبْلُ وَقَلَّبُوا لَكَ الْأُمُورَ حَتَّىٰ جَاءَ الْحَقُّ وَظَهَرَ أَمْرُ اللَّـهِ وَهُمْ كَارِهُونَ ٤٨

(ఓ ప్రవక్తా!) వాస్తవానికి వారు ఇంతకు ముందు కూడా కల్లోలాన్ని (ఫిత్నను) పుట్టించి, నీ కార్యాలను తల క్రిందులు చేయగోరారు. చివరకు సత్యం బహిర్గతమయింది. మరియు అల్లాహ్‌ నిర్ణయం స్పష్టమయ్యింది. మరియు వారు దీన్ని అసహ్యించుకున్నారు!

9:49 – وَمِنْهُم مَّن يَقُولُ ائْذَن لِّي وَلَا تَفْتِنِّي ۚ أَلَا فِي الْفِتْنَةِ سَقَطُوا ۗ وَإِنَّ جَهَنَّمَ لَمُحِيطَةٌ بِالْكَافِرِينَ ٤٩

మరియు వారిలో: ”నాకు (వెనుక ఉండ టానికి) అనుమతినివ్వు! నన్ను ఏ మాత్రం పరీక్షకు గురిచేయకు!” అని అనేవారు కూడా ఉన్నారు. వాస్తవానికి, వారు (ఇలా అనుమతికోరి) పరీక్షకు గురి అయ్యారు! మరియు నిశ్చయంగా, సత్య-తిరస్కారులను నరకాగ్ని చుట్టుకోనున్నది.

9:50 – إِن تُصِبْكَ حَسَنَةٌ تَسُؤْهُمْ ۖ وَإِن تُصِبْكَ مُصِيبَةٌ يَقُولُوا قَدْ أَخَذْنَا أَمْرَنَا مِن قَبْلُ وَيَتَوَلَّوا وَّهُمْ فَرِحُونَ ٥٠

(ఓ ప్రవక్తా!)ఒకవేళ నీకుమేలుకలిగితే వారికి బాధ కలుగుతుంది. మరియు నీపై ఆపద వస్తే, వారు: ”మేము ముందుగానే జాగ్రత్తపడ్డాము!” అని అంటూ సంతోష పడుతూ మరలిపోతారు.

9:51 – قُل لَّن يُصِيبَنَا إِلَّا مَا كَتَبَ اللَّـهُ لَنَا هُوَ مَوْلَانَا ۚ وَعَلَى اللَّـهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ ٥١

వారితో ఇలా అను: ”అల్లాహ్‌ మా కొరకు వ్రాసింది తప్ప మరేమీ మాకు సంభవించదు. ఆయనే మా సంరక్షకుడు. మరియు విశ్వాసులు అల్లాహ్‌ మీదే నమ్మకం ఉంచుకోవాలి!”

9:52 – قُلْ هَلْ تَرَبَّصُونَ بِنَا إِلَّا إِحْدَى الْحُسْنَيَيْنِ ۖ وَنَحْنُ نَتَرَبَّصُ بِكُمْ أَن يُصِيبَكُمُ اللَّـهُ بِعَذَابٍ مِّنْ عِندِهِ أَوْ بِأَيْدِينَا ۖ فَتَرَبَّصُوا إِنَّا مَعَكُم مُّتَرَبِّصُونَ ٥٢

ఇలా అను: ”మీరు మా విషయంలో నిరీక్షిస్తున్నది రెండు మేలైన వాటిలో ఒకటి. అల్లాహ్‌ స్వయంగా మీకు శిక్ష విధిస్తాడా, లేదా మా చేతుల ద్వారానా? అని, మేము నిరీక్షిస్తున్నాము. కావున మీరూ నిరీక్షించండి, నిశ్చయంగా, మేము కూడా మీతోపాటు నిరీక్షిస్తున్నాము!”

9:53 – قُلْ أَنفِقُوا طَوْعًا أَوْ كَرْهًا لَّن يُتَقَبَّلَ مِنكُمْ ۖ إِنَّكُمْ كُنتُمْ قَوْمًا فَاسِقِينَ ٥٣

ఇలా అను: ”మీరు మీ (సంపదను) ఇష్ట పూర్వకంగా ఖర్చుచేసినా, లేదా ఇష్టం లేకుండా ఖర్చుచేసినా అది మీ నుండి స్వీకరించబడదు. 36 నిశ్చయంగా, మీరు అవిధేయులు (ఫాసిఖూన్‌).”

9:54 – وَمَا مَنَعَهُمْ أَن تُقْبَلَ مِنْهُمْ نَفَقَاتُهُمْ إِلَّا أَنَّهُمْ كَفَرُوا بِاللَّـهِ وَبِرَسُولِهِ وَلَا يَأْتُونَ الصَّلَاةَ إِلَّا وَهُمْ كُسَالَىٰ وَلَا يُنفِقُونَ إِلَّا وَهُمْ كَارِهُونَ ٥٤

మరియు వారి విరాళం (చందా) స్వీకరించ బడకుండా పోవటానికి కారణం, వాస్తవానికి వారు అల్లాహ్‌ను మరియు ఆయన సందేశహరుణ్ణి తిరస్కరించడం మరియు నమా’జ్‌ కొరకు ఎంతో సోమరితనంతో తప్ప రాకపోవడం మరియు అయి ష్టంతో (అల్లాహ్‌ మార్గంలో) ఖర్చు పెట్టడమే! 37

9:55 – فَلَا تُعْجِبْكَ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُمْ ۚ إِنَّمَا يُرِيدُ اللَّـهُ لِيُعَذِّبَهُم بِهَا فِي الْحَيَاةِ الدُّنْيَا وَتَزْهَقَ أَنفُسُهُمْ وَهُمْ كَافِرُونَ ٥٥

కావున వారి సిరిసంపదలు గానీ, వారి సంతానం గానీ, నిన్ను ఆశ్చర్యంలో పడనివ్వ కూడదు! 38 నిశ్చయంగా, అల్లాహ్‌ వాటి వలన వారిని ఇహలోక జీవితంలో శిక్షించగోరుతున్నాడు. మరియు వారు సత్య-తిరస్కార స్థితిలోనే తమ ప్రాణాలను కోల్పోతారు.

9:56 – وَيَحْلِفُونَ بِاللَّـهِ إِنَّهُمْ لَمِنكُمْ وَمَا هُم مِّنكُمْ وَلَـٰكِنَّهُمْ قَوْمٌ يَفْرَقُونَ ٥٦

మరియు వారు నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నామని అల్లాహ్‌పై ప్రమాణం చేస్తున్నారు. కాని వారు మీతో లేరు. వాస్తవానికి వారు మీకు భయపడుతున్నారు.

9:57 – لَوْ يَجِدُونَ مَلْجَأً أَوْ مَغَارَاتٍ أَوْ مُدَّخَلًا لَّوَلَّوْا إِلَيْهِ وَهُمْ يَجْمَحُونَ ٥٧

ఒకవేళ వారికి ఏదైనా ఆశ్రయం గానీ, గుహ గానీ లేదా తలదాచుకోవటానికి ఏకాంత స్థలంగానీ దొరికితే, వారు తొందరగా పరుగెత్తి అందులో దాక్కుంటారు. 39

9:58 – وَمِنْهُم مَّن يَلْمِزُكَ فِي الصَّدَقَاتِ فَإِنْ أُعْطُوا مِنْهَا رَضُوا وَإِن لَّمْ يُعْطَوْا مِنْهَا إِذَا هُمْ يَسْخَطُونَ ٥٨

మరియు (ఓ ప్రవక్తా!) వారిలో కొందరు దానాలు (‘సదఖాత్‌) పంచే విషయంలో నీపై అప నిందలు మోపుతున్నారు. 40 దాని నుండి వారికి కొంత ఇవ్వబడితే సంతోషిస్తారు. కాని దాని నుండి వారికి ఇవ్వబడకపోతే కోపగించుకుంటారు!

9:59 – وَلَوْ أَنَّهُمْ رَضُوا مَا آتَاهُمُ اللَّـهُ وَرَسُولُهُ وَقَالُوا حَسْبُنَا اللَّـهُ سَيُؤْتِينَا اللَّـهُ مِن فَضْلِهِ وَرَسُولُهُ إِنَّا إِلَى اللَّـهِ رَاغِبُونَ ٥٩

మరియు ఒకవేళ అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త వారికి ఇచ్చిన దానితో వారు తృప్తిపడి: ”అల్లాహ్‌యే మాకు చాలు! అల్లాహ్‌ తన అనుగ్రహంతో మాకు ఇంకా చాలా ఇస్తాడు మరియు ఆయన ప్రవక్త కూడా (ఇస్తాడు). నిశ్చయంగా, మేము అల్లాహ్‌నే వేడుకుంటాము!” అని పలికి ఉంటే (అది వారికే బాగుండేది!). (3/4)

9:60 – إِنَّمَا الصَّدَقَاتُ لِلْفُقَرَاءِ وَالْمَسَاكِينِ وَالْعَامِلِينَ عَلَيْهَا وَالْمُؤَلَّفَةِ قُلُوبُهُمْ وَفِي الرِّقَابِ وَالْغَارِمِينَ وَفِي سَبِيلِ اللَّـهِ وَابْنِ السَّبِيلِ ۖ فَرِيضَةً مِّنَ اللَّـهِ ۗ وَاللَّـهُ عَلِيمٌ حَكِيمٌ ٦٠

  • నిశ్చయంగా, దానాలు (‘సదఖాత్‌) 41 కేవలం యాచించు నిరుపేదలకు మరియు యాచించని పేదవారికి, 42 (‘జకాత్‌) వ్యవహారాలపై నియుక్తులైన వారికి మరియు ఎవరి హృదయాల నైతే (ఇస్లాంవైపుకు) ఆకర్షించ వలసి ఉందో వారికి, బానిసల విముక్తి కొరకు, ఋణగ్రస్తులైన వారి కొరకు, అల్లాహ్‌ మార్గంలో (పోయే వారికొరకు) మరియు బాటసారుల కొరకు. ఇది అల్లాహ్‌ నిర్ణయించిన ఒక విధి. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

9:61 – وَمِنْهُمُ الَّذِينَ يُؤْذُونَ النَّبِيَّ وَيَقُولُونَ هُوَ أُذُنٌ ۚ قُلْ أُذُنُ خَيْرٍ لَّكُمْ يُؤْمِنُ بِاللَّـهِ وَيُؤْمِنُ لِلْمُؤْمِنِينَ وَرَحْمَةٌ لِّلَّذِينَ آمَنُوا مِنكُمْ ۚ وَالَّذِينَ يُؤْذُونَ رَسُولَ اللَّـهِ لَهُمْ عَذَابٌ أَلِيمٌ ٦١

మరియు వారిలో కొందరు ప్రవక్తను తమ మాటలతో బాధ కలిగించే వారున్నారు. వారంటారు: ”ఇతను (చెప్పడు మాటలు) వినేవాడు.” 43 ఇలా అను: ”అతను వినేది మీ మేలుకే! అతను అల్లాహ్‌ను విశ్వసిస్తాడు మరియు విశ్వాసులను నమ్ముతాడు మరియు మీలో విశ్వసించిన వారికి అతను కారుణ్యమూర్తి.” మరియు అల్లాహ్‌ సందేశహరునికి బాధకలిగించే వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

9:62 – يَحْلِفُونَ بِاللَّـهِ لَكُمْ لِيُرْضُوكُمْ وَاللَّـهُ وَرَسُولُهُ أَحَقُّ أَن يُرْضُوهُ إِن كَانُوا مُؤْمِنِينَ ٦٢

(ఓ విశ్వాసులారా!) మిమ్మల్ని సంతోష పెట్టటానికి వారు మీ ముందు అల్లాహ్‌పై ప్రమాణాలు చేస్తున్నారు. వాస్తవానికి వారు విశ్వాసులే అయితే, అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తను సంతోషపెట్టటమే వారి బాధ్యత. 44

9:63 – أَلَمْ يَعْلَمُوا أَنَّهُ مَن يُحَادِدِ اللَّـهَ وَرَسُولَهُ فَأَنَّ لَهُ نَارَ جَهَنَّمَ خَالِدًا فِيهَا ۚ ذَٰلِكَ الْخِزْيُ الْعَظِيمُ ٦٣

ఏమీ? అల్లాహ్‌ను మరియు ఆయన సందేశ హరుణ్ణి విరోధించేవానికి నిశ్చయంగా భగభగమండే నరకాగ్నిశిక్ష ఉందనీ, అదే అతని శాశ్వతనివాసమనీ, వారికి తెలియదా? ఇది ఎంత గొప్ప అవమానం!

9:64 – يَحْذَرُ الْمُنَافِقُونَ أَن تُنَزَّلَ عَلَيْهِمْ سُورَةٌ تُنَبِّئُهُم بِمَا فِي قُلُوبِهِمْ ۚ قُلِ اسْتَهْزِئُوا إِنَّ اللَّـهَ مُخْرِجٌ مَّا تَحْذَرُونَ ٦٤

తమ హృదయాలలో ఉన్న (రహస్యాలను) స్పష్టంగా తెలియజేసేటటువంటి సూరహ్‌ వారికి విరుద్ధంగా అవతరింపజేయబడుతుందేమోనని, ఈ కపట-విశ్వాసులు భయపడుతున్నారు. వారితో అను: ”మీరు ఎగతాళి చెయ్యండి, మీరు (బయట పడుతుందని) భయపడుతున్న విషయాన్ని, అల్లాహ్‌ తప్పక బయటపెడ్తాడు.”

9:65 – وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِاللَّـهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِئُونَ ٦٥

నీవు వారిని అడిగితే వారు తప్పక: ”మేము కేవలం కాలక్షేపానికి మరియు పరిహాసానికి మాత్రమే ఇలా మాట్లాడుతున్నాము.” అని సమాధాన మిస్తారు. వారితో అను: ”ఏమీ మీరు అల్లాహ్‌తో మరియు ఆయన సూచన (ఆయాత్‌) లతో మరియు ఆయనప్రవక్తతో వేళాకోళంచేస్తున్నారా?

9:66 – لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ ۚ إِن نَّعْفُ عَن طَائِفَةٍ مِّنكُمْ نُعَذِّبْ طَائِفَةً بِأَنَّهُمْ كَانُوا مُجْرِمِينَ ٦٦

”ఇక మీరు సాకులు చెప్పకండి, వాస్తవానికి మీరు విశ్వసించిన తరువాత సత్యాన్ని తిరస్కరించారు.” మీలో కొందరిని మేము క్షమించినా ఇతరులను తప్పకుండా శిక్షిస్తాము, ఎందుకంటే వాస్తవానికి వారు అపరాధులు. 45

9:67 – الْمُنَافِقُونَ وَالْمُنَافِقَاتُ بَعْضُهُم مِّن بَعْضٍ ۚ يَأْمُرُونَ بِالْمُنكَرِ وَيَنْهَوْنَ عَنِ الْمَعْرُوفِ وَيَقْبِضُونَ أَيْدِيَهُمْ ۚ نَسُوا اللَّـهَ فَنَسِيَهُمْ ۗ إِنَّ الْمُنَافِقِينَ هُمُ الْفَاسِقُونَ ٦٧

కపటవిశ్వాసులైన పురుషులు మరియు కపట విశ్వాసులైన స్త్రీలు, అందరూ ఒకే కోవకు చెందిన వారు! వారు అధర్మాన్ని ఆదేశిస్తారు. మరియు ధర్మాన్ని నిషేధిస్తారు 46 మరియు తమ చేతులను (మేలు నుండి) ఆపుకుంటారు. వారు అల్లాహ్‌ను మరచిపోయారు, కావున ఆయన కూడా వారిని మరచిపోయాడు. 47 నిశ్చయంగా, ఈ కపట-విశ్వాసులే అవిధేయులు (ఫాసిఖూన్‌).

9:68 – وَعَدَ اللَّـهُ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْكُفَّارَ نَارَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۚ هِيَ حَسْبُهُمْ ۚ وَلَعَنَهُمُ اللَّـهُ ۖ وَلَهُمْ عَذَابٌ مُّقِيمٌ ٦٨

మరియు కపటవిశ్వాసులైన పురుషులకు మరియు కపటవిశ్వాసులైన స్త్రీలకు మరియు సత్య-తిరస్కారులకు, అల్లాహ్‌ నరకాగ్ని వాగ్దానం చేశాడు. వారందులో శాశ్వతంగా ఉంటారు. అదే వారికి తగినది. మరియు అల్లాహ్‌ వారిని శపించాడు (బహిష్కరించాడు). మరియు వారికి ఎడతెగని శిక్ష ఉంటుంది.

9:69 – كَالَّذِينَ مِن قَبْلِكُمْ كَانُوا أَشَدَّ مِنكُمْ قُوَّةً وَأَكْثَرَ أَمْوَالًا وَأَوْلَادًا فَاسْتَمْتَعُوا بِخَلَاقِهِمْ فَاسْتَمْتَعْتُم بِخَلَاقِكُمْ كَمَا اسْتَمْتَعَ الَّذِينَ مِن قَبْلِكُم بِخَلَاقِهِمْ وَخُضْتُمْ كَالَّذِي خَاضُوا ۚ أُولَـٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۖ وَأُولَـٰئِكَ هُمُ الْخَاسِرُونَ ٦٩

(మీరు కూడా) గతించిన మీ పూర్వీకుల వంటి వారు. వారు మీకంటే ఎక్కువ బలవంతులు, ధనవంతులు మరియు అధిక సంతానం గలవారు. వారు తమ భాగపు ఐహిక సుఖాలను అనుభవించారు. మీరు కూడా మీ పూర్వికులు అనుభవించినట్లు మీ భాగపు ఐహిక సుఖాలను అనుభవించారు. వారు పడినటువంటి వ్యర్థ వాదోపవాదాలలో మీరు కూడా పడ్డారు. ఇలాంటి వారి కర్మలు ఇహలోకంలోనూ మరియు పరలోకం లోనూ వ్యర్థమవుతాయి. మరియు ఇలాంటివారు! వీరే నష్టానికి గురిఅయ్యే వారు.

9:70 – أَلَمْ يَأْتِهِمْ نَبَأُ الَّذِينَ مِن قَبْلِهِمْ قَوْمِ نُوحٍ وَعَادٍ وَثَمُودَ وَقَوْمِ إِبْرَاهِيمَ وَأَصْحَابِ مَدْيَنَ وَالْمُؤْتَفِكَاتِ ۚ أَتَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ ۖ فَمَا كَانَ اللَّـهُ لِيَظْلِمَهُمْ وَلَـٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ ٧٠

ఏమీ? వారి పూర్వీకుల గాథ వారికి అందలేదా? నూ’హ్‌ జాతివారి, ‘ఆద్‌, స’మూద్‌, ఇబ్రాహీమ్‌ జాతివారి, 48 ఏమీ? వారి పూర్వీకుల గాథ వారికి అందలేదా? నూ’హ్‌ జాతివారి, ‘ఆద్‌, స’మూద్‌, 49 మద్‌యన్‌ (షు’ఐబ్‌) ప్రజల 50 మరియు తలక్రిందులు చేయబడిన పట్టణాల (లూ’త్‌) వారి (గాథలు అందలేదా)? 51 వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొనివచ్చారు. అల్లాహ్‌ వారికి అన్యాయం చేయదలచుకోలేదు కాని, వారే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారు.

9:71 – وَالْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ يَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَيُطِيعُونَ اللَّـهَ وَرَسُولَهُ ۚ أُولَـٰئِكَ سَيَرْحَمُهُمُ اللَّـهُ ۗ إِنَّ اللَّـهَ عَزِيزٌ حَكِيمٌ ٧١

మరియు విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు ఒకరి కొకరు స్నేహితులు. వారు ధర్మాన్ని ఆదేశిస్తారు (బోధిస్తారు) మరియు అధర్మం నుండి నిషేధిస్తారు (వారిస్తారు) మరియు నమా’జ్‌ను స్థాపిస్తారు మరియు విధిదానం (‘జకాత్‌) చెల్లిస్తారు మరియు అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. ఇలాంటి వారినే అల్లాహ్‌ కరుణిస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.

9:72 – وَعَدَ اللَّـهُ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَمَسَاكِنَ طَيِّبَةً فِي جَنَّاتِ عَدْنٍ ۚ وَرِضْوَانٌ مِّنَ اللَّـهِ أَكْبَرُ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ ٧٢

మరియు అల్లాహ్‌ విశ్వాసులైన పురుషు లకు మరియు విశ్వాసులైన స్త్రీలకు క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలవాగ్దానం చేశాడు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. మరియు శాశ్వతమైన సుఖాలున్న ఆ స్వర్గవనాలలో, వారి కొరకు పరిశుద్ధ నివాసాలు ఉంటాయి. 52 వాటన్నిటి కంటే మించింది వారికి లభించే అల్లాహ్‌ ప్రసన్నత. అదే ఆ గొప్ప సాఫల్యం (విజయం).

9:73 – يَا أَيُّهَا النَّبِيُّ جَاهِدِ الْكُفَّارَ وَالْمُنَافِقِينَ وَاغْلُظْ عَلَيْهِمْ ۚ وَمَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمَصِيرُ ٧٣

ఓ ప్రవక్తా! సత్య-తిరస్కారులతో మరియు కపట-విశ్వాసులతో పోరాడు మరియు వారిపట్ల కఠినంగా వ్యవహరించు. మరియు వారి ఆశ్రయం నరకమే. మరియు అది అతిచెడ్డ గమ్యస్థానం.

9:74 – يَحْلِفُونَ بِاللَّـهِ مَا قَالُوا وَلَقَدْ قَالُوا كَلِمَةَ الْكُفْرِ وَكَفَرُوا بَعْدَ إِسْلَامِهِمْ وَهَمُّوا بِمَا لَمْ يَنَالُوا ۚ وَمَا نَقَمُوا إِلَّا أَنْ أَغْنَاهُمُ اللَّـهُ وَرَسُولُهُ مِن فَضْلِهِ ۚ فَإِن يَتُوبُوا يَكُ خَيْرًا لَّهُمْ ۖ وَإِن يَتَوَلَّوْا يُعَذِّبْهُمُ اللَّـهُ عَذَابًا أَلِيمًا فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۚ وَمَا لَهُمْ فِي الْأَرْضِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ ٧٤

”మేము ఏమీ (చెడుమాట) అనలేదు!” అని, వారు అల్లాహ్‌పై ప్రమాణంచేసి అంటున్నారు. కాని వాస్తవానికి వారు సత్య-తిరస్కారపు మాట అన్నారు. మరియు ఇస్లాంను స్వీకరించిన తరు వాత దానిని తిరస్కరించారు. మరియు వారికి అసాధ్యమైన దానిని చేయదలచుకున్నారు. అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త, (అల్లాహ్‌) అనుగ్రహంతో వారిని సంపన్నులుగా చేశారనేకదా! వారు ఈ విధంగా ప్రతీకారం చేస్తున్నారు. ఇప్పు డైనా వారు పశ్చాత్తాపపడితే అది వారికే మేలు. మరియు వారు మరలిపోతే, అల్లాహ్‌ వారికి ఇహ లోకంలోనూ మరియు పరలోకంలోనూ, బాధాకర మైన శిక్ష విధిస్తాడు. మరియు భూమిలో వారికి ఏ రక్షకుడు గానీ సహాయకుడు గానీ ఉండడు. (7/8)

9:75 – وَمِنْهُم مَّنْ عَاهَدَ اللَّـهَ لَئِنْ آتَانَا مِن فَضْلِهِ لَنَصَّدَّقَنَّ وَلَنَكُونَنَّ مِنَ الصَّالِحِينَ ٧٥

  • మరియు వారిలో (కొందరు) ఈ విధంగా అల్లాహ్‌పై ప్రమాణం చేసేవారు కూడా ఉన్నారు: ”ఆయన (అల్లాహ్‌) తన అనుగ్రహంతో మాకేమి ప్రసాదించినా మేము తప్పక దానం చేస్తాము మరియు సద్వర్తనులమై ఉంటాము.”

9:76 – فَلَمَّا آتَاهُم مِّن فَضْلِهِ بَخِلُوا بِهِ وَتَوَلَّوا وَّهُم مُّعْرِضُونَ ٧٦

కాని అల్లాహ్‌ తన అనుగ్రహం వల్ల వారికి (ధనం) ప్రసాదించినప్పుడు, వారు పిసినారితనం ప్రదర్శించి, తమ (వాగ్దానం) నుండి విముఖులై మరలిపోతారు.

9:77 – فَأَعْقَبَهُمْ نِفَاقًا فِي قُلُوبِهِمْ إِلَىٰ يَوْمِ يَلْقَوْنَهُ بِمَا أَخْلَفُوا اللَّـهَ مَا وَعَدُوهُ وَبِمَا كَانُوا يَكْذِبُونَ ٧٧

ఆ పిదప వారు అల్లాహ్‌తో చేసిన వాగ్దానం పూర్తిచేయ నందుకు, అసత్యం పలికినందుకు, ఆయన్ను కలుసుకునే (పునరుత్థాన) దినం వరకు, ఆయన వారి హృదయాలలో కాపట్యం నాటుకునేటట్లు చేశాడు.

9:78 – أَلَمْ يَعْلَمُوا أَنَّ اللَّـهَ يَعْلَمُ سِرَّهُمْ وَنَجْوَاهُمْ وَأَنَّ اللَّـهَ عَلَّامُ الْغُيُوبِ ٧٨

ఏమీ? వారి గుప్తరహస్యాలు మరియు వారి రహస్య సమాలోచనలు, అల్లాహ్‌కు తెలుసని వారికి తెలియదా? మరియు నిశ్చయంగా అల్లాహ్‌ అగోచర విషయాలన్నీ తెలిసివున్నవాడు.

9:79 – الَّذِينَ يَلْمِزُونَ الْمُطَّوِّعِينَ مِنَ الْمُؤْمِنِينَ فِي الصَّدَقَاتِ وَالَّذِينَ لَا يَجِدُونَ إِلَّا جُهْدَهُمْ فَيَسْخَرُونَ مِنْهُمْ ۙ سَخِرَ اللَّـهُ مِنْهُمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ٧٩

మనస్పూర్తిగా సంతోషంతో (అల్లాహ్‌ మార్గంలో) దానం చేసే విశ్వాసులను నిందించే వారినీ మరియు తమ శ్రమ తప్ప మరేమి ఇవ్వటానికి లేనివారిని ఎగతాళి చేసేవారినీ, అల్లాహ్‌ ఎగతాళికి గురిచేస్తాడు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంది.

9:80 – اسْتَغْفِرْ لَهُمْ أَوْ لَا تَسْتَغْفِرْ لَهُمْ إِن تَسْتَغْفِرْ لَهُمْ سَبْعِينَ مَرَّةً فَلَن يَغْفِرَ اللَّـهُ لَهُمْ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَفَرُوا بِاللَّـهِ وَرَسُولِهِ ۗ وَاللَّـهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ ٨٠

(ఓ ప్రవక్తా!) నీవు వారి (కపట-విశ్వాసుల) క్షమాపణ కొరకు వేడుకున్నా, లేదా వారి క్షమా పణ కొరకు వేడుకోక పోయినా ఒక్కటే – ఇంకా నీవు డెబ్భైసార్లు వారి క్షమాపణ కొరకు వేడుకున్నా – అల్లాహ్‌ వారిని క్షమించడు. 53 ఎందు కంటే వాస్తవానికి వారు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు. మరియు అల్లాహ్‌ అవిధేయులైన ప్రజలకు సన్మార్గం చూపడు. 54

9:81 – فَرِحَ الْمُخَلَّفُونَ بِمَقْعَدِهِمْ خِلَافَ رَسُولِ اللَّـهِ وَكَرِهُوا أَن يُجَاهِدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ فِي سَبِيلِ اللَّـهِ وَقَالُوا لَا تَنفِرُوا فِي الْحَرِّ ۗ قُلْ نَارُ جَهَنَّمَ أَشَدُّ حَرًّا ۚ لَّوْ كَانُوا يَفْقَهُونَ ٨١

(తబూక్‌ దండయాత్రకు పోకుండా) వెనుక ఆగిపోయిన వారు, తాము అల్లాహ్‌ సందేశహరుని వెంట వెళ్ళటాన్ని నిరోధించి (తమ ఇండ్లలో) కూర్చుండి నందుకు సంతోషపడ్డారు. మరియు వారు తమ ధనసంపత్తులతో మరియు తమ ప్రాణాలతో అల్లాహ్‌ మార్గంలో పోరాడటాన్ని అసహ్యించుకున్నారు. మరియు వారు ఇతరులతో: ”ఈ తీవ్రమైన వేడిలో వెళ్ళకండి!” అని అన్నారు. వారితో అను: ”భగభగ మండే నరకాగ్ని దీనికంటే ఎక్కువ వేడిగా ఉంటుంది.” అది వారు అర్థం చేసుకుంటే ఎంతబాగుండేది!

9:82 – فَلْيَضْحَكُوا قَلِيلًا وَلْيَبْكُوا كَثِيرًا جَزَاءً بِمَا كَانُوا يَكْسِبُونَ ٨٢

కావున ఇప్పుడు వారిని కొంత నవ్వనివ్వు మరియు వారి కర్మలకు ప్రతిఫలంగా (మున్ముందు) వారికి ఎంతో ఏడ్వవలసి ఉంది.

9:83 – فَإِن رَّجَعَكَ اللَّـهُ إِلَىٰ طَائِفَةٍ مِّنْهُمْ فَاسْتَأْذَنُوكَ لِلْخُرُوجِ فَقُل لَّن تَخْرُجُوا مَعِيَ أَبَدًا وَلَن تُقَاتِلُوا مَعِيَ عَدُوًّا ۖ إِنَّكُمْ رَضِيتُم بِالْقُعُودِ أَوَّلَ مَرَّةٍ فَاقْعُدُوا مَعَ الْخَالِفِينَ ٨٣

కావున (ఓ ప్రవక్తా!) ఒకవేళ అల్లాహ్‌ నిన్ను తిరిగి వారిలో (కపట-విశ్వాసులలో) ఒక వర్గం వారి వద్దకు తీసుకొనిపోతే! మరియు వారు నిన్ను (మరొక దండయాత్రకు) పోవటానికి అనుమతి అడిగితే! వారితో అను: ”మీరు నాతో ఏ మాత్రం బయలుదేరవద్దు! మరియు నా పక్షమున శత్రువులతో పోరాడనూ వద్దు! వాస్తవానికి, మీరు మొదట కూర్చొని ఉండటానికి ఇష్టపడ్డారు, కాబట్టి మీరు వెనుక ఉండిపోయిన వారితో (ఇండ్లలోనే) కూర్చొని ఉండండి.”

9:84 – وَلَا تُصَلِّ عَلَىٰ أَحَدٍ مِّنْهُم مَّاتَ أَبَدًا وَلَا تَقُمْ عَلَىٰ قَبْرِهِ ۖ إِنَّهُمْ كَفَرُوا بِاللَّـهِ وَرَسُولِهِ وَمَاتُوا وَهُمْ فَاسِقُونَ ٨٤

మరియు వారిలో (కపట-విశ్వాసులలో) ఎవరైనా మరణిస్తే, అతడి నమా’జే జనా’జహ్‌ కూడా నీవు ఏ మాత్రం చేయకు మరియు అతని గోరీవద్ద కూడా నిలబడకు. 55 నిశ్చయంగా, వారు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తను తిరస్క రించారు. మరియు వారు అవిధేయులు (ఫాసిఖూన్) గా ఉన్న స్థితిలోనే మరణించారు.

9:85 – وَلَا تُعْجِبْكَ أَمْوَالُهُمْ وَأَوْلَادُهُمْ ۚ إِنَّمَا يُرِيدُ اللَّـهُ أَن يُعَذِّبَهُم بِهَا فِي الدُّنْيَا وَتَزْهَقَ أَنفُسُهُمْ وَهُمْ كَافِرُونَ ٨٥

మరియు వారి సిరిసంపదలు మరియు వారి సంతానం నిన్ను ఆశ్చర్యానికి గురిచేయనివ్వ కూడదు. నిశ్చయంగా, అల్లాహ్‌! వాటితో ఈ ప్రపంచంలో వారిని శిక్షించాలనీ మరియు వారు సత్య-తిరస్కారులుగా ఉన్న స్థితిలోనే వారి ప్రాణాలను కోల్పోవాలనీ సంకల్పించాడు. 56

9:86 – وَإِذَا أُنزِلَتْ سُورَةٌ أَنْ آمِنُوا بِاللَّـهِ وَجَاهِدُوا مَعَ رَسُولِهِ اسْتَأْذَنَكَ أُولُو الطَّوْلِ مِنْهُمْ وَقَالُوا ذَرْنَا نَكُن مَّعَ الْقَاعِدِينَ ٨٦

మరియు: ”అల్లాహ్‌ను విశ్వసించండి. మరియు ఆయన ప్రవక్తతో కలసి (అల్లాహ్‌ మార్గంలో) పోరాడండి!” అని సూరహ్‌ అవతరింప జేయబడినపుడు, 57 వారిలోని ధనవంతులు నీతో: ”వెనుక ఉండే వారితో కూర్చోవటానికి మమ్మల్ని విడిచిపెట్టు.” అని అనుమతికోరారు.

9:87 – رَضُوا بِأَن يَكُونُوا مَعَ الْخَوَالِفِ وَطُبِعَ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَفْقَهُونَ ٨٧

వారు, వెనక ఉండిపోయేవారితో ఉండటానికి ఇష్టపడ్డారు. వారి హృదయాల మీద ముద్ర వేయ బడివుంది, కావున వారు అర్థంచేసుకోలేరు. 58

9:88 – لَـٰكِنِ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ جَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ ۚ وَأُولَـٰئِكَ لَهُمُ الْخَيْرَاتُ ۖ وَأُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ٨٨

కాని, ప్రవక్త మరియు అతనితో పాటు విశ్వ సించినవారు తమ సిరిసంపదలతో మరియు తమ ప్రాణాలతో (అల్లాహ్‌ మార్గంలో) పోరాడారు. మరియు అలాంటి వారికి అన్ని మేళ్ళూ ఉన్నాయి. మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు. 59

9:89 – أَعَدَّ اللَّـهُ لَهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ ٨٩

అల్లాహ్‌ వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవ హించే స్వర్గవనాలు సిధ్ధంచేసి ఉంచాడు, వారందు లో శాశ్వతంగా ఉంటారు. అదే గొప్ప విజయం.

9:90 – وَجَاءَ الْمُعَذِّرُونَ مِنَ الْأَعْرَابِ لِيُؤْذَنَ لَهُمْ وَقَعَدَ الَّذِينَ كَذَبُوا اللَّـهَ وَرَسُولَهُ ۚ سَيُصِيبُ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ عَذَابٌ أَلِيمٌ ٩٠

మరియు సాకులు చెప్పే ఎడారి-వాసులు (బద్దూలు) కూడా వచ్చి వెనుక ఉండి పోవటానికి అనుమతి అడిగారు. మరియు ఈవిధంగా అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకు అబద్ధాలు చెప్పిన వారు కూర్చుండి పోయారు. త్వరలో సత్య- తిరస్కా రులకు బాధా కరమైన శిక్ష ఉండగలదు.

9:91 – لَّيْسَ عَلَى الضُّعَفَاءِ وَلَا عَلَى الْمَرْضَىٰ وَلَا عَلَى الَّذِينَ لَا يَجِدُونَ مَا يُنفِقُونَ حَرَجٌ إِذَا نَصَحُوا لِلَّـهِ وَرَسُولِهِ ۚ مَا عَلَى الْمُحْسِنِينَ مِن سَبِيلٍ ۚ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٩١

బలహీనులు మరియు వ్యాధిగ్రస్తులు మరియు ప్రయాణపు ఖర్చులు లేనివారు, ఒకవేళ అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు వాస్తవానికి విశ్వాసపాత్రులై ఉంటే వారిపై (జిహాద్‌కు వెళ్ళకుంటే) ఎలాంటి నిందలేదు. సజ్జనులపై కూడా ఎలాంటి నిందలేదు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

9:92 – وَلَا عَلَى الَّذِينَ إِذَا مَا أَتَوْكَ لِتَحْمِلَهُمْ قُلْتَ لَا أَجِدُ مَا أَحْمِلُكُمْ عَلَيْهِ تَوَلَّوا وَّأَعْيُنُهُمْ تَفِيضُ مِنَ الدَّمْعِ حَزَنًا أَلَّا يَجِدُوا مَا يُنفِقُونَ ٩٢

మరియు ఎవరైతే నీవద్దకువచ్చి వాహ నాలు కోరినప్పుడు నీవు వారితో: ”నా దగ్గర మీకివ్వటానికి ఏవాహనం లేదు.” అని పలికి నప్పుడు, ఖర్చుచేయటానికి తమ దగ్గర ఏమీ లేదుకదా అనే చింతతో కన్నీరు కార్చుతూ తిరిగి పోయారో, అలాంటివారిపై కూడా ఎలాంటి నిందలేదు.

9:93 – إِنَّمَا السَّبِيلُ عَلَى الَّذِينَ يَسْتَأْذِنُونَكَ وَهُمْ أَغْنِيَاءُ ۚ رَضُوا بِأَن يَكُونُوا مَعَ الْخَوَالِفِ وَطَبَعَ اللَّـهُ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَعْلَمُونَ ٩٣

(*) కాని వాస్తవానికి ధనవంతులై కూడా, వెనుక కూర్చున్నవారితో ఉండటానికి ఇష్టపడి, నిన్ను అనుమతి అడిగే వారిపై తప్పక నింద గలదు. అల్లాహ్‌ వారి హృదయాల మీద ముద్రవేసి ఉన్నాడు, కావున (తాము పోగొట్టుకొనేదేమిటో) వారికి తెలియదు. 60

9:94 – يَعْتَذِرُونَ إِلَيْكُمْ إِذَا رَجَعْتُمْ إِلَيْهِمْ ۚ قُل لَّا تَعْتَذِرُوا لَن نُّؤْمِنَ لَكُمْ قَدْ نَبَّأَنَا اللَّـهُ مِنْ أَخْبَارِكُمْ ۚ وَسَيَرَى اللَّـهُ عَمَلَكُمْ وَرَسُولُهُ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ٩٤

[*] మీరు (తబూక్‌ దండయాత్ర నుండి) మరలి వారి వద్దకు వచ్చిన తరువాతకూడా, వారు (కపట-విశ్వాసులు) మీతో తమ సాకులు చెబుతున్నారు. వారితో అను: ”మీరు సాకులు చెప్పకండి, మేము మీ మాటలను నమ్మము. అల్లాహ్‌ మాకు మీ వృత్తాంతం తెలిపివున్నాడు. మరియు అల్లాహ్‌ మరియు ఆయన సందేశ హరుడు మీ ప్రవర్తనను కనిపెట్టగలరు, తరువాత మీరు అగోచర మరియు గోచర విషయాలు ఎరుగునట్టి ఆయన (అల్లాహ్‌) వైపునకు మరలింప బడతారు. అప్పుడాయన మీరు చేస్తూ ఉన్న వాటిని గురించి మీకు తెలుపుతాడు.”

9:95 – سَيَحْلِفُونَ بِاللَّـهِ لَكُمْ إِذَا انقَلَبْتُمْ إِلَيْهِمْ لِتُعْرِضُوا عَنْهُمْ ۖ فَأَعْرِضُوا عَنْهُمْ ۖ إِنَّهُمْ رِجْسٌ ۖ وَمَأْوَاهُمْ جَهَنَّمُ جَزَاءً بِمَا كَانُوا يَكْسِبُونَ ٩٥

(ఓవిశ్వాసులారా!)మీరు వారివద్దకుమరలి వచ్చిన తరువాత వారిని వదలిపెట్టాలని (మీరు వారిపై చర్య తీసుకోగూడదని), వారు మీ ముందు అల్లాహ్‌ పేరుతో ప్రమాణాలు చేస్తారు. కావున మీరు వారి నుండి విముఖులు కండి. నిశ్చయంగా, వారు అశుచులు (మాలిన్యం వంటి వారు). వారి నివాసం నరకమే. అదే వారు అర్జించిన దాని ఫలితం.

9:96 – يَحْلِفُونَ لَكُمْ لِتَرْضَوْا عَنْهُمْ ۖ فَإِن تَرْضَوْا عَنْهُمْ فَإِنَّ اللَّـهَ لَا يَرْضَىٰ عَنِ الْقَوْمِ الْفَاسِقِينَ ٩٦

మీరు వారితో రాజీపడాలని, వారు (కపట- విశ్వాసులు) మీ ముందు ప్రమాణాలు చేస్తున్నారు. ఒకవేళ మీరు వారితో రాజీపడినా, నిశ్చయంగా, అల్లాహ్‌ అవిధేయులు (ఫాసిఖూన్) అయిన ప్రజలతో రాజీపడడు. 61

9:97 – الْأَعْرَابُ أَشَدُّ كُفْرًا وَنِفَاقًا وَأَجْدَرُ أَلَّا يَعْلَمُوا حُدُودَ مَا أَنزَلَ اللَّـهُ عَلَىٰ رَسُولِهِ ۗ وَاللَّـهُ عَلِيمٌ حَكِيمٌ ٩٧

ఎడారి-వాసులు (బద్దూలు) సత్య- తిరస్కార మరియు కపట-విశ్వాస విషయాలలో అతి కఠినులు. వారు అల్లాహ్‌ తన ప్రవక్తపై అవత రింపజేసిన (ధర్మ) నియమాలు అర్థం చేసుకునే యోగ్యత లేనివారు. 62 మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

9:98 – وَمِنَ الْأَعْرَابِ مَن يَتَّخِذُ مَا يُنفِقُ مَغْرَمًا وَيَتَرَبَّصُ بِكُمُ الدَّوَائِرَ ۚ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ ۗ وَاللَّـهُ سَمِيعٌ عَلِيمٌ ٩٨

మరియు ఎడారి-వాసులలో (బద్దూలలో) కొందరు తాము (అల్లాహ్‌ మార్గంలో) ఖర్చుచేసిన దానిని దండుగగా భావించే వారున్నారు. (ఓ విశ్వాసులారా!) మీరు ఆపదలలో చిక్కుకోవాలని వారు ఎదురుచూస్తున్నారు. (కాని) వారినే ఆపద చుట్టుకుంటుంది. మరియు అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. 63

9:99 – وَمِنَ الْأَعْرَابِ مَن يُؤْمِنُ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ وَيَتَّخِذُ مَا يُنفِقُ قُرُبَاتٍ عِندَ اللَّـهِ وَصَلَوَاتِ الرَّسُولِ ۚ أَلَا إِنَّهَا قُرْبَةٌ لَّهُمْ ۚ سَيُدْخِلُهُمُ اللَّـهُ فِي رَحْمَتِهِ ۗ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ٩٩

మరియు ఎడారి-వాసులలో (బద్దూలలో) కొందరు అల్లాహ్‌ను అంతిమదినాన్ని విశ్వసించే వారున్నారు 64 వారు తాము (అల్లాహ్‌ మార్గంలో) ఖర్చుచేసేది, తమకు అల్లాహ్‌ సాన్నిధ్యాన్ని మరియు ప్రవక్త ప్రార్థనలను చేకూర్చటానికి సాధనంగా చేసుకుంటున్నారు. వాస్తవానికి అది వారికి తప్పక సాన్నిధ్యాన్ని చేకూర్చుతుంది. అల్లాహ్‌ వారిని తన కారుణ్యంలోకి చేర్చుకోగలడు. నిశ్చయంగా! అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

9:100 – وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُم بِإِحْسَانٍ رَّضِيَ اللَّـهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي تَحْتَهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ ١٠٠

మరియు వలస వచ్చిన ముహాజిర్‌లలో నుండి మరియు అన్సారులలో(మదీనహ్ వాసులలో) నుండి, ప్రప్రథమంగా ముందంజవేసిన (ఇస్లాంను స్వీకరించిన) వారితోనూ మరియు సహృదయం తో వారిని అనుసరించిన వారితోనూ, అల్లాహ్‌ సంతోషపడ్డాడు. మరియు వారు కూడా ఆయనతో సంతోషపడ్డారు. మరియు వారి కొరకు క్రింద సెల యేళ్ళు ప్రవహించే స్వర్గవనాలను సిధ్ధపరిచి ఉంచాడు. వారు వాటిలో శాశ్వతంగా కలకాల ముంటారు. అదే గొప్ప సాఫల్యం (విజయం).

9:101 – وَمِمَّنْ حَوْلَكُم مِّنَ الْأَعْرَابِ مُنَافِقُونَ ۖ وَمِنْ أَهْلِ الْمَدِينَةِ ۖ مَرَدُوا عَلَى النِّفَاقِ لَا تَعْلَمُهُمْ ۖ نَحْنُ نَعْلَمُهُمْ ۚ سَنُعَذِّبُهُم مَّرَّتَيْنِ ثُمَّ يُرَدُّونَ إِلَىٰ عَذَابٍ عَظِيمٍ ١٠١

మరియు మీచుట్టు ప్రక్కలఉండే ఎడారి వాసులలో (బద్దూలలో) కొందరు కపటవిశ్వాసు లున్నారు. మరియు (ప్రవక్త) నగరం (మదీనహ్ మునవ్వరహ్) లో కూడా (కపట-విశ్వాసులు) ఉన్నారు. 65 వారు తమ కాపట్యంలో నాటుకొని ఉన్నారు. కాని (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఎరుగవు. 66 మేము వారిని ఎరుగుతాము. మేము వారికి రెట్టింపు శిక్షను విధించగలము. తరువాత వారు ఘోరశిక్ష వైపుకు మరలింపబడతారు.

9:102 – وَآخَرُونَ اعْتَرَفُوا بِذُنُوبِهِمْ خَلَطُوا عَمَلًا صَالِحًا وَآخَرَ سَيِّئًا عَسَى اللَّـهُ أَن يَتُوبَ عَلَيْهِمْ ۚ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٠٢

మరియు ఇతరులు, తమ పాపాలను ఒప్పుకున్నవారున్నారు. వారు తమ సత్కార్యాన్ని ఇతర పాపకార్యంతో కలిపారు. 67 అల్లాహ్‌ వారిని తప్పక 68 క్షమిస్తాడు! నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

9:103 – خُذْ مِنْ أَمْوَالِهِمْ صَدَقَةً تُطَهِّرُهُمْ وَتُزَكِّيهِم بِهَا وَصَلِّ عَلَيْهِمْ ۖ إِنَّ صَلَاتَكَ سَكَنٌ لَّهُمْ ۗ وَاللَّـهُ سَمِيعٌ عَلِيمٌ ١٠٣

(కావున ఓ ప్రవక్తా!) నీవు వారి సంపదల నుండి దానం (సదఖహ్‌) తీసుకొని, దానితో వారి పాపవిమోచనం చెయ్యి మరియు వారిని సంస్కరించు. మరియు వారి కొరకు (అల్లాహ్‌ను) ప్రార్థించు. మరియు నిశ్చయంగా, నీ ప్రార్థనలు వారికి మనశ్శాంతిని కలిగిస్తాయి. అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

9:104 – أَلَمْ يَعْلَمُوا أَنَّ اللَّـهَ هُوَ يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهِ وَيَأْخُذُ الصَّدَقَاتِ وَأَنَّ اللَّـهَ هُوَ التَّوَّابُ الرَّحِيمُ ١٠٤

ఏమీ? వాస్తవానికి అల్లాహ్‌ తనదాసుల పశ్చాత్తాపాన్ని (తౌబహ్ను) అంగీకరిస్తాడని మరియు వారి దానాలను (‘సదఖాత్‌లను) స్వీకరిస్తాడని వారికి తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్‌! ఆయన మాత్రమే, పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణాప్రదాత.

9:105 – وَقُلِ اعْمَلُوا فَسَيَرَى اللَّـهُ عَمَلَكُمْ وَرَسُولُهُ وَالْمُؤْمِنُونَ ۖ وَسَتُرَدُّونَ إِلَىٰ عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ١٠٥

మరియు (ఓ ప్రవక్తా!) వారితో అను: ”మీరు (మీ పని) చేస్తూ ఉండండి, అల్లాహ్‌ ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు మీరు చేస్తున్న పనులు చూస్తున్నారు. తరువాత మీరు తప్పక అగోచర మరియు గోచర విషయాలను ఎరుగు ఆయన (అల్లాహ్‌) వద్దకు తిరిగి పంపబడగలరు. అప్పుడాయన మీరు చేస్తూవున్న కర్మలను గురించి మీకు తెలియజేస్తాడు.”

9:106 – وَآخَرُونَ مُرْجَوْنَ لِأَمْرِ اللَّـهِ إِمَّا يُعَذِّبُهُمْ وَإِمَّا يَتُوبُ عَلَيْهِمْ ۗ وَاللَّـهُ عَلِيمٌ حَكِيمٌ ١٠٦

మరికొందరు అల్లాహ్‌ ఆజ్ఞ (తీర్పు) కొరకు వేచి ఉన్నారు. ఆయన వారిని శిక్షించనూ వచ్చు, లేదా క్షమించనూ వచ్చు! మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

9:107 – وَالَّذِينَ اتَّخَذُوا مَسْجِدًا ضِرَارًا وَكُفْرًا وَتَفْرِيقًا بَيْنَ الْمُؤْمِنِينَ وَإِرْصَادًا لِّمَنْ حَارَبَ اللَّـهَ وَرَسُولَهُ مِن قَبْلُ ۚ وَلَيَحْلِفُنَّ إِنْ أَرَدْنَا إِلَّا الْحُسْنَىٰ ۖ وَاللَّـهُ يَشْهَدُ إِنَّهُمْ لَكَاذِبُونَ ١٠٧

మరియు (కపట-విశ్వాసులలో) కొందరు (విశ్వాసులకు) హాని కలిగించటానికి, సత్య-తిర స్కార వైఖరిని (బలపరచటానికి) మరియు విశ్వా సులను విడదీయటానికి, అల్లాహ్‌ మరియు ఆయనసందేశహరునితో ఇంతకుముందు పోరాడిన వారు పొంచి ఉండటానికి, ఒక మస్జిద్‌ నిర్మించారు. మరియు వారు: ”మా ఉద్దేశం మేలుచేయటం తప్ప మరేమీ కాదు!” అని గట్టి ప్రమాణాలు కూడా చేస్తున్నారు. 69 కాని వారు వాస్తవంగా అసత్య వాదులని అల్లాహ్‌ సాక్ష్యమిస్తున్నాడు.

9:108 – لَا تَقُمْ فِيهِ أَبَدًا ۚ لَّمَسْجِدٌ أُسِّسَ عَلَى التَّقْوَىٰ مِنْ أَوَّلِ يَوْمٍ أَحَقُّ أَن تَقُومَ فِيهِ ۚ فِيهِ رِجَالٌ يُحِبُّونَ أَن يَتَطَهَّرُوا ۚ وَاللَّـهُ يُحِبُّ الْمُطَّهِّرِينَ ١٠٨

నీ వెన్నడూ దానిలో (నమా’జ్‌కు) నిల బడకు. మొదటి రోజు నుండియే దైవభీతి ఆధారంగా స్థాపించబడిన మస్జిదే నీకు (నమా’జ్‌కు) నిలబడటానికి తగినది. అందులో పరిశుద్ధులు కాగోరేవారున్నారు. మరియు అల్లాహ్‌ పరి శుద్ధులు కాగోరేవారిని ప్రేమిస్తాడు.

9:109 – أَفَمَنْ أَسَّسَ بُنْيَانَهُ عَلَىٰ تَقْوَىٰ مِنَ اللَّـهِ وَرِضْوَانٍ خَيْرٌ أَم مَّنْ أَسَّسَ بُنْيَانَهُ عَلَىٰ شَفَا جُرُفٍ هَارٍ فَانْهَارَ بِهِ فِي نَارِ جَهَنَّمَ ۗ وَاللَّـهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ ١٠٩

ఏమీ? ఎవడైతే అల్లాహ్‌ యందు గల భయ-భక్తులు మరియు ఆయన ప్రీతి, పునాదుల మీద తన (మస్జిద్‌) కట్టడాన్ని కట్టాడో, అతడు శ్రేష్ఠుడా? లేక, తన కట్టడపు పునాదులను, వరదలకు కూలిపోయి దాని క్రింది భాగం ఖాళీగా ఉన్న నది ఒడ్డున కట్టేవాడా? అది వానితో సహా నరకాగ్నిలోకి కొట్టుకొని పోతుంది. మరియు అల్లాహ్‌ దుర్మార్గులకు సన్మార్గం చూపడు.

9:110 – لَا يَزَالُ بُنْيَانُهُمُ الَّذِي بَنَوْا رِيبَةً فِي قُلُوبِهِمْ إِلَّا أَن تَقَطَّعَ قُلُوبُهُمْ ۗ وَاللَّـهُ عَلِيمٌ حَكِيمٌ ١١٠

వారి హృదయాలు ముక్కలై పోయి (వారు చనిపోయి) నంతవరకు, వారు కట్టిన కట్టడం వారి హృదయాలలో కలతలు పుట్టిస్తూ ఉంటుంది. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు. (1/8)

9:111 – إِنَّ اللَّـهَ اشْتَرَىٰ مِنَ الْمُؤْمِنِينَ أَنفُسَهُمْ وَأَمْوَالَهُم بِأَنَّ لَهُمُ الْجَنَّةَ ۚ يُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّـهِ فَيَقْتُلُونَ وَيُقْتَلُونَ ۖ وَعْدًا عَلَيْهِ حَقًّا فِي التَّوْرَاةِ وَالْإِنجِيلِ وَالْقُرْآنِ ۚ وَمَنْ أَوْفَىٰ بِعَهْدِهِ مِنَ اللَّـهِ ۚ فَاسْتَبْشِرُوا بِبَيْعِكُمُ الَّذِي بَايَعْتُم بِهِ ۚ وَذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ ١١١

  • నిశ్చయంగా, అల్లాహ్‌ విశ్వాసుల నుండి వారి ప్రాణాలను వారి సంపదలను కొన్నాడు. కాబట్టి నిశ్చయంగా, వారి కొరకు స్వర్గముంది. వారు అల్లాహ్‌ మార్గంలో పోరాడి (తమ శత్రువు లను) చంపుతారు మరియు చంపబడతారు. మరియు ఇది తౌరాత్‌, ఇంజీల్‌ మరియు ఖుర్‌ఆన్‌ లలో, ఆయన (అల్లాహ్‌) చేసిన వాగ్దానం, సత్య మైనది. మరియు తన వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్‌ను మించినవాడు ఎవడు? కావున మీరు ఆయనతో చేసిన వ్యాపారానికి సంతోషపడండి. మరియు ఇదే ఆ గొప్ప విజయం. 70

9:112 – التَّائِبُونَ الْعَابِدُونَ الْحَامِدُونَ السَّائِحُونَ الرَّاكِعُونَ السَّاجِدُونَ الْآمِرُونَ بِالْمَعْرُوفِ وَالنَّاهُونَ عَنِ الْمُنكَرِ وَالْحَافِظُونَ لِحُدُودِ اللَّـهِ ۗ وَبَشِّرِ الْمُؤْمِنِينَ ١١٢

(వీరే అల్లాహ్‌ ముందు) పశ్చాత్తాపపడే వారు, ఆయనను ఆరాధించేవారు, స్తుతించేవారు, (అల్లాహ్‌ మార్గంలో) సంచరించేవారు (ఉపవాసాలు చేసేవారు). 71 ఆయన సన్నిధిలో వంగే (రుకూ’ఉ చేసే) వారు, సాష్టాంగం (సజ్దా) చేసే వారు, ధర్మ మును ఆదేశించేవారు మరియు అధర్మమును నిషేధించేవారు 72 మరియు అల్లాహ్‌ విధించిన హద్దులను పాటించేవారు కూడాను. మరియు విశ్వాసులకు శుభవార్త తెలుపు.

9:113 – مَا كَانَ لِلنَّبِيِّ وَالَّذِينَ آمَنُوا أَن يَسْتَغْفِرُوا لِلْمُشْرِكِينَ وَلَوْ كَانُوا أُولِي قُرْبَىٰ مِن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمْ أَنَّهُمْ أَصْحَابُ الْجَحِيمِ ١١٣

అల్లాహ్‌కు సాటి కల్పించేవారు (ముష్రికు లు) దగ్గరి బంధువులైనా, వారు నరకవాసులని వ్యక్తమైన తరువాత కూడా, ప్రవక్తకు మరియు విశ్వా సులకు వారి క్షమాపణకై ప్రార్థించటం తగదు. 73

9:114 – وَمَا كَانَ اسْتِغْفَارُ إِبْرَاهِيمَ لِأَبِيهِ إِلَّا عَن مَّوْعِدَةٍ وَعَدَهَا إِيَّاهُ فَلَمَّا تَبَيَّنَ لَهُ أَنَّهُ عَدُوٌّ لِّلَّـهِ تَبَرَّأَ مِنْهُ ۚ إِنَّ إِبْرَاهِيمَ لَأَوَّاهٌ حَلِيمٌ ١١٤

మరియు ఇబ్రాహీమ్‌ తన తండ్రి క్షమాపణ కొరకు ప్రార్థించింది కేవలం అతను, అతడి (తన తండ్రి) తో చేసిన వాగ్దానం వల్లనే. 74 కాని అతనికి, అతడు (తన తండ్రి) నిశ్చయంగా, అల్లాహ్‌కు శత్రువని స్పష్టమైనప్పుడు, అతను (ఇబ్రాహీమ్‌) అతనిని విడనాడాడు. వాస్తవానికి ఇబ్రాహీమ్‌ వినయ విధేయతలతో (అల్లాహ్‌ను) అర్థించే వాడు, 75 సహనశీలుడు.

9:115 – وَمَا كَانَ اللَّـهُ لِيُضِلَّ قَوْمًا بَعْدَ إِذْ هَدَاهُمْ حَتَّىٰ يُبَيِّنَ لَهُم مَّا يَتَّقُونَ ۚ إِنَّ اللَّـهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ١١٥

మరియు ఒక జాతికి సన్మార్గం చూపిన తరువాత వారు దూరంగా ఉండవలసిన విషయాలను గురించి వారికి స్పష్టంగా తెలుప నంత వరకు, అల్లాహ్‌ వారిని మార్గ-భ్రష్టత్వంలో పడవేయడు. నిశ్చయంగా, అల్లాహ్‌కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు. 76

9:116 – إِنَّ اللَّـهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يُحْيِي وَيُمِيتُ ۚ وَمَا لَكُم مِّن دُونِ اللَّـهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ ١١٦

నిశ్చయంగా, భూమ్యాకాశాల సామ్రాజ్యాధి పత్యం అల్లాహ్‌కే చెందుతుంది. ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు. మరియు అల్లాహ్‌ తప్ప, మీకు వేరే రక్షకుడుగానీ సహాయకుడుగానీ ఎవ్వడూ లేడు.

9:117 – لَّقَد تَّابَ اللَّـهُ عَلَى النَّبِيِّ وَالْمُهَاجِرِينَ وَالْأَنصَارِ الَّذِينَ اتَّبَعُوهُ فِي سَاعَةِ الْعُسْرَةِ مِن بَعْدِ مَا كَادَ يَزِيغُ قُلُوبُ فَرِيقٍ مِّنْهُمْ ثُمَّ تَابَ عَلَيْهِمْ ۚ إِنَّهُ بِهِمْ رَءُوفٌ رَّحِيمٌ ١١٧

వాస్తవానికి అల్లాహ్‌ ప్రవక్తను మరియు వలస వచ్చిన వారిని (ముహాజిర్‌లను) మరియు అన్సార్‌ లను, ఎవరైతే బహు కష్టకాలంలో ప్రవక్త వెంట ఉన్నారో! అలాంటి వారినందరినీ క్షమించాడు. 77 వారిలో ఒక పక్షంవారి హృదయాలు, దాదాపు వక్రత్వం వైపునకు మరలినప్పటికీ (ప్రవక్తవెంట వెళ్లారు), అప్పుడు ఆయన వారి పశ్చాత్తాపాన్ని

9:118 – وَعَلَى الثَّلَاثَةِ الَّذِينَ خُلِّفُوا حَتَّىٰ إِذَا ضَاقَتْ عَلَيْهِمُ الْأَرْضُ بِمَا رَحُبَتْ وَضَاقَتْ عَلَيْهِمْ أَنفُسُهُمْ وَظَنُّوا أَن لَّا مَلْجَأَ مِنَ اللَّـهِ إِلَّا إِلَيْهِ ثُمَّ تَابَ عَلَيْهِمْ لِيَتُوبُوا ۚ إِنَّ اللَّـهَ هُوَ التَّوَّابُ الرَّحِيمُ ١١٨

మరియు వెనుక ఉండిపోయిన ఆ ముగ్గు రుని కూడా (ఆయన క్షమించాడు). 78 చివరకు విశాలంగా ఉన్న భూమి కూడా వారికి ఇరుకై పోయింది. మరియు వారి ప్రాణాలు కూడా వారికి భారమయ్యాయి. అల్లాహ్‌నుండి (తమను కాపాడు కోవటానికి) ఆయన శరణం తప్ప మరొకటి లేదని వారు తెలుసుకున్నారు. అప్పుడు ఆయన వారి పశ్చాత్తాపాన్నిఅంగీకరించాడు – వారు పశ్చాత్తాప పడాలని – నిశ్చయంగా, అల్లాహ్‌ మాత్రమే పశ్చా త్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణాప్రదాత.

9:119 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّـهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ ١١٩

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి మరియు సత్యవంతులతో ఉండండి. 79

9:120 – مَا كَانَ لِأَهْلِ الْمَدِينَةِ وَمَنْ حَوْلَهُم مِّنَ الْأَعْرَابِ أَن يَتَخَلَّفُوا عَن رَّسُولِ اللَّـهِ وَلَا يَرْغَبُوا بِأَنفُسِهِمْ عَن نَّفْسِهِ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ لَا يُصِيبُهُمْ ظَمَأٌ وَلَا نَصَبٌ وَلَا مَخْمَصَةٌ فِي سَبِيلِ اللَّـهِ وَلَا يَطَئُونَ مَوْطِئًا يَغِيظُ الْكُفَّارَ وَلَا يَنَالُونَ مِنْ عَدُوٍّ نَّيْلًا إِلَّا كُتِبَ لَهُم بِهِ عَمَلٌ صَالِحٌ ۚ إِنَّ اللَّـهَ لَا يُضِيعُ أَجْرَ الْمُحْسِنِينَ ١٢٠

మదీనహ్ పురవాసులకు మరియు చుట్టు ప్రక్కలలో ఉండే ఎడారి-వాసులకు (బద్దూలకు) అల్లాహ్‌ ప్రవక్తను వదలి వెనుక ఉండి పోవటం మరియు తమ ప్రాణాలకు అతని (దైవప్రవక్త) ప్రాణాలపై ఆధిక్యత నివ్వటం తగినపని కాదు. ఎందుకంటే అల్లాహ్‌ మార్గంలో వారు ఆకలి -దప్పులు (శారీరక) కష్టాలు సహిస్తే, శత్రువుల భూమిలోకి దూరి సత్య-తిరస్కారుల కోపాన్ని రేకెత్తిస్తే మరియు శత్రువుల నుండి ఏదైనా సాధిస్తే, 80 దానికి బదులుగా వారికి ఒక సత్కార్యం వ్రాయబడకుండా ఉండదు. నిశ్చయంగా, అల్లాహ్‌ సజ్జనుల ఫలితాన్ని వ్యర్థపరచడు.

9:121 – وَلَا يُنفِقُونَ نَفَقَةً صَغِيرَةً وَلَا كَبِيرَةً وَلَا يَقْطَعُونَ وَادِيًا إِلَّا كُتِبَ لَهُمْ لِيَجْزِيَهُمُ اللَّـهُ أَحْسَنَ مَا كَانُوا يَعْمَلُونَ ١٢١

మరియు (అల్లాహ్‌ మార్గంలో) వారు ఖర్చుచేసే ధనం కొంచెమైనా లేదా అధికమైనా లేక వారు(శ్రమపడి)కొండలోయలను దాటే విషయమూ అంతా వారి కొరకు వ్రాయబడకుండా ఉండదు –వారు చేస్తూ ఉండిన ఈ సత్కార్యాల కొరకు – అల్లాహ్‌ వారికిప్రతిఫలాన్నిప్రసాదించటానికి. (1/4)

9:122 – وَمَا كَانَ الْمُؤْمِنُونَ لِيَنفِرُوا كَافَّةً ۚ فَلَوْلَا نَفَرَ مِن كُلِّ فِرْقَةٍ مِّنْهُمْ طَائِفَةٌ لِّيَتَفَقَّهُوا فِي الدِّينِ وَلِيُنذِرُوا قَوْمَهُمْ إِذَا رَجَعُوا إِلَيْهِمْ لَعَلَّهُمْ يَحْذَرُونَ ١٢٢

  • మరియు విశ్వాసులందరూ (పోరా టానికి) బయలుదేరటం సరికాదు. కావున వారిలో ప్రతి తెగనుండి కొందరు ధర్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి పోయి, వారు తమ వారి వద్దకు తిరిగి వచ్చినప్పుడు తమ జాతి (ప్రాంత) ప్రజలను హెచ్చరిస్తే! బహుశా వారుకూడా తమను తాము (దుర్మార్గం నుండి) కాపాడుకోగలరు. 81

9:123 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قَاتِلُوا الَّذِينَ يَلُونَكُم مِّنَ الْكُفَّارِ وَلْيَجِدُوا فِيكُمْ غِلْظَةً ۚ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ مَعَ الْمُتَّقِينَ ١٢٣

ఓ విశ్వాసులారా! మీ దగ్గర నున్న సత్య- తిరస్కారులతో పోరాడి, వారిని మీలోనున్న కాఠిన్యాన్ని గ్రహించనివ్వండి. 82 మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ దైవభీతి గలవారితో ఉంటాడని తెలుసుకోండి.

9:124 – وَإِذَا مَا أُنزِلَتْ سُورَةٌ فَمِنْهُم مَّن يَقُولُ أَيُّكُمْ زَادَتْهُ هَـٰذِهِ إِيمَانًا ۚ فَأَمَّا الَّذِينَ آمَنُوا فَزَادَتْهُمْ إِيمَانًا وَهُمْ يَسْتَبْشِرُونَ ١٢٤

మరియు ఒక సూరహ్‌ అవతరింపజేయ బడినప్పుడల్లా వారి (కపట-విశ్వాసుల)లో కొందరు: ”ఇది మీలో ఎవరి విశ్వాసాన్ని అధికం చేసింది?” అని అడుగుతారు. కాని వాస్తవానికి అది విశ్వసించిన వారందరివిశ్వాసాన్ని అధికం చేస్తుంది. మరియు వారు దానితో సంతోషపడతారు. 83

9:125 – وَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ فَزَادَتْهُمْ رِجْسًا إِلَىٰ رِجْسِهِمْ وَمَاتُوا وَهُمْ كَافِرُونَ ١٢٥

కాని ఎవరి హృదయాలలో రోగముందో, ఇది వారి మాలిన్యంలో మరింత మాలిన్యాన్ని అధికంచేస్తుంది. మరియు వారు సత్య- తిరస్కారులు గానే మరణిస్తారు. 84

9:126 – أَوَلَا يَرَوْنَ أَنَّهُمْ يُفْتَنُونَ فِي كُلِّ عَامٍ مَّرَّةً أَوْ مَرَّتَيْنِ ثُمَّ لَا يَتُوبُونَ وَلَا هُمْ يَذَّكَّرُونَ ١٢٦

ఏమీ? వారు ప్రతి సంవత్సరం ఒకసారి లేక రెండు సార్లు (బాధలతో) పరీక్షింపబడటాన్ని గమనించటం లేదా? అయినా వారు పశ్చాత్తాప పడటం లేదు మరియు గుణపాఠం కూడా నేర్చుకోవటం లేదు.

9:127 – وَإِذَا مَا أُنزِلَتْ سُورَةٌ نَّظَرَ بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ هَلْ يَرَاكُم مِّنْ أَحَدٍ ثُمَّ انصَرَفُوا ۚ صَرَفَ اللَّـهُ قُلُوبَهُم بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُونَ ١٢٧

మరియు ఏదైనా సూరహ్‌ అవతరించి నపుడల్లా వారు ఒకరినొకరు చూసుకుంటూ (అంటారు): ”ఎవడైనా మిమ్మల్ని చూస్తు న్నాడా?” ఆ తరువాత అక్కడి నుండి మెల్లగా జారుకుంటారు. అల్లాహ్‌ వారి హృదయాలను (సన్మార్గం నుండి) మళ్ళించాడు. ఎందుకంటే నిశ్చయంగా, వారు అర్థంచేసుకోలేని జనులు. 85

9:128 – لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ ١٢٨

(ఓ ప్రజలారా!) వాస్తవానికి, మీ వద్దకు మీలో నుంచే ఒక సందేశహరుడు (ము’హమ్మద్‌) వచ్చి ఉన్నాడు; 86 మీరు ఆపదకు గురికావటం అతనికి కష్టం కలిగిస్తుంది; అతను మీ మేలు కోరేవాడు విశ్వాసుల ఎడల కనికరుడు కరుణామయుడు.

9:129 – فَإِن تَوَلَّوْا فَقُلْ حَسْبِيَ اللَّـهُ لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۖ عَلَيْهِ تَوَكَّلْتُ ۖ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ ١٢٩

అయినా వారు విముఖులైతే, వారితో అను: ”నాకు అల్లాహ్‌ చాలు! ఆయన తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు! నేను ఆయననే నమ్ముకున్నాను. మరియు ఆయనే సర్వోత్తమ సింహాసనానికి (‘అర్ష్‌కు) ప్రభువు.” 87

సూరహ్ యూనుస్ – ఇది మక్కహ్ సూరహ్‌. కొందరు దీనిలోని రెండు, మూడు ఆయతులు మదీనహ్లో అవతరింప జేయబడ్డాయని అభిప్రాయపడ్డారు. ఇది మరియు దీని తరువాత వచ్చే 5 సూరాహ్‌లు అవతరణలో ఒక దానితో ఒకటి సంబంధించి ఉన్నాయి. ఇవి ఆఖరు మక్కహ్ కాలంలో అవతరింప జేయబడ్డాయి. 10-15 సూరాహ్‌లు ప్రతి ఒక్కటి అలిఫ్‌-లామ్‌-రా అక్షరాలతో ప్రారంభ మవుతాయి. కాని 13వ సూరహ్‌ మాత్రం అలిఫ్‌-లామ్‌-మీమ్‌-రా అక్షరాలతో ప్రారంభ మవుతోంది. 109 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 98వ ఆయత్‌లో ఉన్న దైవప్రవక్త యూనుస్‌ (‘అ.స.) పేరుతో పెట్టబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 10:1 – الر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ الْحَكِيمِ ١

అలిఫ్‌-లామ్‌-రా. ఇవి వివేకంతో నిండివున్న దివ్యగ్రంథం యొక్క ఆయతులు.

10:2 – أَكَانَ لِلنَّاسِ عَجَبًا أَنْ أَوْحَيْنَا إِلَىٰ رَجُلٍ مِّنْهُمْ أَنْ أَنذِرِ النَّاسَ وَبَشِّرِ الَّذِينَ آمَنُوا أَنَّ لَهُمْ قَدَمَ صِدْقٍ عِندَ رَبِّهِمْ ۗ قَالَ الْكَافِرُونَ إِنَّ هَـٰذَا لَسَاحِرٌ مُّبِينٌ ٢

”ఏమీ? మానవులను హెచ్చరించటానికి మరియు విశ్వసించినవారికి నిశ్చయంగా, తమ ప్రభువు వద్ద, వారు చేసి పంపిన మంచి పనులకు తగిన స్థానం ఉంది.”అనే శుభవార్త వినిపించటానికి మేము వారిలోని ఒక మనిషి (ము’హమ్మద్‌)పై మా సందేశాన్ని అవతరింపజేయటం ప్రజలకు ఆశ్చర్య కరమైన విషయంగా ఉందా? 1 (ఎందుకంటే) సత్య తిరస్కారులు ఇలా అన్నారు: ”నిశ్చయంగా, ఇతను పచ్చి మాంత్రికుడు!”

10:3 – إِنَّ رَبَّكُمُ اللَّـهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۖ يُدَبِّرُ الْأَمْرَ ۖ مَا مِن شَفِيعٍ إِلَّا مِن بَعْدِ إِذْنِهِ ۚ ذَٰلِكُمُ اللَّـهُ رَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ أَفَلَا تَذَكَّرُونَ ٣

నిశ్చయంగా మీ పోషకుడూ, ప్రభువూ అయిన అల్లాహ్‌, ఆకాశాలను మరియు భూమిని ఆరు దిన ములలో (అయ్యామ్‌లలో) సృష్టించి, తర్వాత తన సింహాసనాన్ని (‘అర్ష్‌ను) అధిష్టించాడు. 2 . ఆయనే (సర్వసృష్టి) వ్యవహారాలను నడుపుతున్నాడు. ఆయన అనుమతిలేకుండా సిఫారసు చేయగల వాడు ఎవ్వడూ లేడు. 3 ఆయనే అల్లాహ్‌! మీ పోషకుడు (ప్రభువు), కావున మీరు ఆయననే ఆరా ధించండి. ఏమీ? మీరు హితోపదేశం స్వీకరించరా?

10:4 – إِلَيْهِ مَرْجِعُكُمْ جَمِيعًا ۖ وَعْدَ اللَّـهِ حَقًّا ۚ إِنَّهُ يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ لِيَجْزِيَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ بِالْقِسْطِ ۚ وَالَّذِينَ كَفَرُوا لَهُمْ شَرَابٌ مِّنْ حَمِيمٍ وَعَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْفُرُونَ ٤

ఆయన వైపునకే మీరందరూ మరలి పోవలసి ఉంది. అల్లాహ్‌ వాగ్దానం నిజమైనది. నిశ్చయంగా, ఆయనే సృష్టిని మొదట సరిక్రొత్తగా ప్రారంభిం చాడు, మరల ఆయనే దానిని ఉనికిలోకి తెస్తాడు. ఇది విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి న్యాయ మైన ప్రతిఫలమివ్వటానికి. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారికి – వారు సత్యాన్ని తిరస్క రిస్తూ ఉండినందుకు – త్రాగటానికి సలసల కాగే నీళ్ళు మరియు బాధాకరమైన శిక్ష ఉంటాయి.

10:5 – هُوَ الَّذِي جَعَلَ الشَّمْسَ ضِيَاءً وَالْقَمَرَ نُورًا وَقَدَّرَهُ مَنَازِلَ لِتَعْلَمُوا عَدَدَ السِّنِينَ وَالْحِسَابَ ۚ مَا خَلَقَ اللَّـهُ ذَٰلِكَ إِلَّا بِالْحَقِّ ۚ يُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ ٥

ఆయనే, సూర్యుణ్ణి (ప్రకాశించే) దీపంగానూ మరియు చంద్రుణ్ణి వెలుగును (ప్రతిబింబింపజేసే) దానిగానూ చేసి, దానికి (పెరిగే-తరిగే) దశలు నియ మించాడు, 4 దాని ద్వారా మీరు సంవత్సరాల మరియు (కాలపు) గణనను తెలుసుకోవాలని. 5 అల్లాహ్‌ ఇదంతా సత్యాధారంగా తప్ప సృష్టించ లేదు. జ్ఞానం గలవారికి ఆయన తన సూచనలను (ఈ విధంగా) విశదీకరిస్తున్నాడు.

10:6 – إِنَّ فِي اخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَمَا خَلَقَ اللَّـهُ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَّقُونَ ٦

నిశ్చయంగా రేయింబవళ్ళ నిరంతర మార్పు లలోనూ మరియు భూమ్యాకాశాలలో, అల్లాహ్‌ సృష్టించిన ప్రతిదానిలోనూ, దైవభీతిగల ప్రజలకు సూచనలు ఉన్నాయి.

10:7 – إِنَّ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا وَرَضُوا بِالْحَيَاةِ الدُّنْيَا وَاطْمَأَنُّوا بِهَا وَالَّذِينَ هُمْ عَنْ آيَاتِنَا غَافِلُونَ ٧

నిశ్చయంగా ఎవరైతే మమ్మల్ని కలుసుకోవ టాన్ని ఆశించక, ఇహలోక జీవితంతోనే సంతసించి, దానితోనే తృప్తిచెందుతారో మరియు మా సూచన (ఆయాత్‌)లను గురించి నిర్లక్ష్య భావం కలిగి ఉంటారో!

10:8 – أُولَـٰئِكَ مَأْوَاهُمُ النَّارُ بِمَا كَانُوا يَكْسِبُونَ ٨

అలాంటి వారి ఆశ్రయం – తమ కర్మలకు ఫలితంగా – నరకాగ్నియే!

10:9 – إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ يَهْدِيهِمْ رَبُّهُم بِإِيمَانِهِمْ ۖ تَجْرِي مِن تَحْتِهِمُ الْأَنْهَارُ فِي جَنَّاتِ النَّعِيمِ ٩

నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసిన వారిని, వారి విశ్వాస ఫలితంగా, వారి ప్రభువు వారిని సన్మార్గం మీద నడిపిస్తాడు. వారి క్రింద పరమ సుఖాలతో నిండి ఉన్న స్వర్గవనాలలో, సెల యేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి.

10:10 – دَعْوَاهُمْ فِيهَا سُبْحَانَكَ اللَّـهُمَّ وَتَحِيَّتُهُمْ فِيهَا سَلَامٌ ۚ وَآخِرُ دَعْوَاهُمْ أَنِ الْحَمْدُ لِلَّـهِ رَبِّ الْعَالَمِينَ ١٠

అందులో వారి ప్రార్థన: ”ఓ అల్లాహ్‌! నీవు సర్వ లోపాలకు అతీతుడవు.” అని మరియు వారి అభివందనం: ”అస్సలాము అలైకుం (మీకు శాంతి కలుగు గాక)!” అని, మాత్రమే ఉంటాయి. మరియు వారు తమ ప్రార్థనలను: ”సర్వ స్తోత్రాలకు అర్హుడు, సమస్తలోకాల పోషకుడైన అల్లాహ్‌ మాత్రమే!” అని ముగించుకుంటారు. (3/8)

10:11 – وَلَوْ يُعَجِّلُ اللَّـهُ لِلنَّاسِ الشَّرَّ اسْتِعْجَالَهُم بِالْخَيْرِ لَقُضِيَ إِلَيْهِمْ أَجَلُهُمْ ۖ فَنَذَرُ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ ١١

  • మరియు ప్రజలు తమ మేలుకొరకు తొందర పడినట్లు అల్లాహ్‌ వారిపై (వారి చేష్టలకు) కీడును పంపటంలో తొందర పడి ఉంటే, వారి వ్యవధి ఎప్పుడో పూర్తయిఉండేది. అందువలన మేము, మమ్మల్ని కలుసుకునే నమ్మకంలేని వారిని, తమ తలబిరుసుతనంలో భ్రష్టులై తిరగ టానికి వదలి పెడుతున్నాము. 6

10:12 – وَإِذَا مَسَّ الْإِنسَانَ الضُّرُّ دَعَانَا لِجَنبِهِ أَوْ قَاعِدًا أَوْ قَائِمًا فَلَمَّا كَشَفْنَا عَنْهُ ضُرَّهُ مَرَّ كَأَن لَّمْ يَدْعُنَا إِلَىٰ ضُرٍّ مَّسَّهُ ۚ كَذَٰلِكَ زُيِّنَ لِلْمُسْرِفِينَ مَا كَانُوا يَعْمَلُونَ ١٢

మరియు మానవునికి కష్టకాలం వచ్చి నప్పుడు: అతడు పరుండినా, కూర్చుండినా లేక నిలుచుండినా, మమ్మల్ని ప్రార్థిస్తాడు. కాని మేము అతని ఆపదను తొలగించిన వెంటనే, అతడు తనకు కలిగిన కష్టానికి, ఎన్నడూ మమ్మల్ని ప్రార్థించనే లేదు, అన్నట్లు ప్రవర్తిస్తాడు. ఈ విధంగా మితిమీరి ప్రవర్తించే వారికి, వారి చేష్టలు ఆకర్షణీయ మైనవిగా చూపబడతాయి.

10:13 – وَلَقَدْ أَهْلَكْنَا الْقُرُونَ مِن قَبْلِكُمْ لَمَّا ظَلَمُوا ۙ وَجَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ وَمَا كَانُوا لِيُؤْمِنُوا ۚ كَذَٰلِكَ نَجْزِي الْقَوْمَ الْمُجْرِمِينَ ١٣

మరియు వాస్తవంగా మీకు పూర్వం ఎన్నో తరాలను మేము నాశనంచేశాము 7 ఎందుకంటే వారు దుర్మార్గపువైఖరిని అవలంబించారు;మరియు వారిప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలు తీసుకొనివచ్చినా, వారు విశ్వసించ లేదు. ఈ విధంగా మేము అపరాధులకు ప్రతీకారం చేస్తాము.

10:14 – ثُمَّ جَعَلْنَاكُمْ خَلَائِفَ فِي الْأَرْضِ مِن بَعْدِهِمْ لِنَنظُرَ كَيْفَ تَعْمَلُونَ ١٤

వారి తరువాత – మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో చూడటానికి – మేము మిమ్మల్ని భూమికి వారసులుగా చేశాము.

10:15 – وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ ۙ قَالَ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا ائْتِ بِقُرْآنٍ غَيْرِ هَـٰذَا أَوْ بَدِّلْهُ ۚ قُلْ مَا يَكُونُ لِي أَنْ أُبَدِّلَهُ مِن تِلْقَاءِ نَفْسِي ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰ إِلَيَّ ۖ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ ١٥

మరియు మా స్పష్టమైన ఆయతులను వారికి చదివి వినిపించినప్పుడు – మమ్మల్ని కలుసుకునే నమ్మకం లేనివారు – అంటారు: ”దీనికి బదులుగా మరొక ఖుర్‌ఆన్‌ తీసుకురా లేదా ఇందులో సవరణలు చెయ్యి.” (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: ”ఇందులో నా అంతట నేను మార్పులు చేయటం నా పనికాదు. నా వద్దకు పంపబడే దివ్యజ్ఞానాన్ని (వ’హీని) మాత్రమే నేను అనుసరిస్తాను. నిశ్చయంగా, నేను నా ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘిస్తే, ఆ గొప్ప దినమున శిక్ష పడుతుందని భయపడుతున్నాను!”

10:16 – قُل لَّوْ شَاءَ اللَّـهُ مَا تَلَوْتُهُ عَلَيْكُمْ وَلَا أَدْرَاكُم بِهِ ۖ فَقَدْ لَبِثْتُ فِيكُمْ عُمُرًا مِّن قَبْلِهِ ۚ أَفَلَا تَعْقِلُونَ ١٦

(ఇంకా ఇలా) అను: ”ఒకవేళ అల్లాహ్‌ కోరితే, నేను దీనిని మీకు వినిపించి ఉండేవాడిని కాదు; మరియు ఆయన కూడా దీనిని మీకు తెలిపి ఉండేవాడు కాదు. వాస్తవంగా నేను దీనికి (ఈ గ్రంథ అవతరణకు) పూర్వం మీతో నా వయస్సులోని దీర్ఘకాలాన్ని గడిపాను కదా? 8 ఏమీ? మీరిది గ్రహించలేరా?”

10:17 – فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّـهِ كَذِبًا أَوْ كَذَّبَ بِآيَاتِهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْمُجْرِمُونَ ١٧

  1. ఇక అబద్ధాన్ని కల్పించి, దానిని అల్లాహ్‌కు ఆపాదించే వాడికంటే, లేక ఆయన సూచన (ఆయాత్‌)లను అబద్ధాలని తిరస్కరించేవాడి కంటే, మహా దుర్మార్గుడెవడు? నిశ్చయంగా, పాపులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు!

10:18 – وَيَعْبُدُونَ مِن دُونِ اللَّـهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَـٰؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّـهِ ۚ قُلْ أَتُنَبِّئُونَ اللَّـهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ ١٨

మరియు వారు అల్లాహ్‌ను కాదని తమకు నష్టంగానీ, లాభంగానీ కలిగించలేని వాటిని ఆరా ధిస్తున్నారు. మరియు వారు ఇలా అంటున్నారు: ”వీరు మాకు అల్లాహ్‌వద్ద సిఫారసు చేసేవారు.” వారినడుగు: ”ఏమీ? ఆకాశాలలో గానీ, భూమిలో గానీ, అల్లాహ్‌ ఎరుగని విషయాన్ని, మీరు ఆయనకు తెలుపగోరుతున్నారా?” ఆయన సర్వ లోపాలకు అతీతుడు, మీరు సాటికల్పించే వాటికి ఆయన అత్యున్నతుడు. 9

10:19 – وَمَا كَانَ النَّاسُ إِلَّا أُمَّةً وَاحِدَةً فَاخْتَلَفُوا ۚ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ لَقُضِيَ بَيْنَهُمْ فِيمَا فِيهِ يَخْتَلِفُونَ ١٩

మరియు మానవులందరూ మొదట ఒకే సంఘంగా (ఒకే ధర్మం మీద) ఉండేవారు. కానీ, వారు తరువాత భిన్నాభిప్రాయాలకు లోన య్యారు. మరియు నీ ప్రభువు తరఫు నుండి ముందుగానే ఈ విషయం నిర్ణయించబడకుండా ఉండి ఉన్నట్లయితే, వారి మధ్య ఉన్న ఈ విభేదాల తీర్పు ఎప్పుడో జరిగివుండేది. 10

10:20 – وَيَقُولُونَ لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ ۖ فَقُلْ إِنَّمَا الْغَيْبُ لِلَّـهِ فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ ٢٠

మరియు వారంటున్నారు: ”అతనిపై, అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా (అధ్భుత) సంకేతం ఎందుకు అవతరింపజేయబడలేదు?” నీవిలా జవాబివ్వు: ”నిశ్చయంగా, అగోచర విషయజ్ఞానం కేవలం అల్లాహ్‌కే చెందుతుంది, 11 కావున వేచి ఉండండి! నిశ్చయంగా, నేను కూడా మీతోబాటు వేచి ఉంటాను.”

10:21 – وَإِذَا أَذَقْنَا النَّاسَ رَحْمَةً مِّن بَعْدِ ضَرَّاءَ مَسَّتْهُمْ إِذَا لَهُم مَّكْرٌ فِي آيَاتِنَا ۚ قُلِ اللَّـهُ أَسْرَعُ مَكْرًا ۚ إِنَّ رُسُلَنَا يَكْتُبُونَ مَا تَمْكُرُونَ ٢١

మరియు మానవులకు ఆపద కలిగిన పిదప, మేము వారికి కారుణ్యం రుచి చూపిస్తే, వెంటనే వారు మా సూచనలకు విరుద్ధంగా ఎత్తుగడలు వేయటం ప్రారంభిస్తారు. 12 వారితో అను: ”ఎత్తుగడలు వేయటంలో అల్లాహ్‌ అతి శీఘ్రుడు!” నిశ్చయంగా, మా దూతలు మీరు చేసే ఎత్తుగడలన్నింటినీ వ్రాస్తున్నారు.

10:22 – هُوَ الَّذِي يُسَيِّرُكُمْ فِي الْبَرِّ وَالْبَحْرِ ۖ حَتَّىٰ إِذَا كُنتُمْ فِي الْفُلْكِ وَجَرَيْنَ بِهِم بِرِيحٍ طَيِّبَةٍ وَفَرِحُوا بِهَا جَاءَتْهَا رِيحٌ عَاصِفٌ وَجَاءَهُمُ الْمَوْجُ مِن كُلِّ مَكَانٍ وَظَنُّوا أَنَّهُمْ أُحِيطَ بِهِمْ ۙ دَعَوُا اللَّـهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ لَئِنْ أَنجَيْتَنَا مِنْ هَـٰذِهِ لَنَكُونَنَّ مِنَ الشَّاكِرِينَ ٢٢

ఆయన (అల్లా)యే! మిమ్మల్ని భూమి లోనూ మరియు సముద్రంలోనూ ప్రయాణింపజేయ గలవాడు. ఇక మీరు ఓడలలో ఉన్నప్పుడు: అవి వారితో సహా, అనుకూలమైన గాలి వీస్తూ ఉండగా పోతూఉంటాయి మరియు దానితో వారు ఆనం దిస్తూ ఉంటారు. (అకస్మాత్తుగా) వారిపైకి తీవ్రమైన తుఫానుగాలి వస్తుంది మరియు ప్రతి దిక్కునుండి వారిమీదికి పెద్దపెద్ద అలలు వస్తాయి మరియు వారు వాటివల్ల నిశ్చయంగా, చుట్టుకోబడ్డామని భావించి, అల్లాహ్‌ను వేడుకుంటారు. తమ ధర్మం (ప్రార్థన)లో కేవలం ఆయననే ప్రత్యేకించుకొని ఇలా ప్రార్థిస్తారు: ”ఒకవేళ నీవు మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడితే మేము నిశ్చయంగా, కృతజ్ఞతలు చూపేవారమై ఉంటాము!” 13

10:23 – فَلَمَّا أَنجَاهُمْ إِذَا هُمْ يَبْغُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ ۗ يَا أَيُّهَا النَّاسُ إِنَّمَا بَغْيُكُمْ عَلَىٰ أَنفُسِكُم ۖ مَّتَاعَ الْحَيَاةِ الدُّنْيَا ۖ ثُمَّ إِلَيْنَا مَرْجِعُكُمْ فَنُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ٢٣

కాని, ఆయన వారిని కాపాడినవెంటనే, వారు భూమిలో అన్యాయంగా దౌర్జన్యం చేయ సాగుతారు. 14 ఓ మానవులారా! నిశ్చయంగా, మీ దౌర్జన్యాలు మీకే హాని కలిగిస్తాయి. ఇహలోక జీవితం తాత్కాలిక ఆనందమే. చివరకు మీకు మా వైపునకే మరలి రావలసి ఉన్నది, అప్పుడు మేము, మీరు చేస్తూ ఉండిన కర్మలన్నీ మీకు తెలియజేస్తాము.

10:24 – إِنَّمَا مَثَلُ الْحَيَاةِ الدُّنْيَا كَمَاءٍ أَنزَلْنَاهُ مِنَ السَّمَاءِ فَاخْتَلَطَ بِهِ نَبَاتُ الْأَرْضِ مِمَّا يَأْكُلُ النَّاسُ وَالْأَنْعَامُ حَتَّىٰ إِذَا أَخَذَتِ الْأَرْضُ زُخْرُفَهَا وَازَّيَّنَتْ وَظَنَّ أَهْلُهَا أَنَّهُمْ قَادِرُونَ عَلَيْهَا أَتَاهَا أَمْرُنَا لَيْلًا أَوْ نَهَارًا فَجَعَلْنَاهَا حَصِيدًا كَأَن لَّمْ تَغْنَ بِالْأَمْسِ ۚ كَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَتَفَكَّرُونَ ٢٤

వాస్తవానికి ఈ ప్రాపంచిక జీవితాన్ని ఇలా పోల్చవచ్చు: మేము ఆకాశం నుండి నీటిని కురిపించగా దాని నుండి భూమిలో మానవులకు మరియు పశువులకు తినటానికి, వివిధ రకాల చెట్లూ చేమలూ పెరుగుతాయి. అప్పుడు భూమి తన అలంకారంతో వర్ధిల్లుతూ ఉండగా, దాని యజమానులు నిశ్చయంగా, అది తమ వశంలో ఉందను కుంటారు; అలాంటి సమయంలో అకస్మాత్తుగా రాత్రిపూటనో లేక పగటి పూటనో మా తీర్పువస్తుంది. అప్పుడు మేము దానిని – నిన్నటి వరకు ఏమీలేని – కోసి వేసిన పంటపొలంగా మార్చి వేస్తాము. ఈ విధంగా మేము మా సూచనలను ఆలోచించే ప్రజలకొరకు స్పష్టంగా వివరిస్తాము.

10:25 – وَاللَّـهُ يَدْعُو إِلَىٰ دَارِ السَّلَامِ وَيَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ٢٥

మరియు అల్లాహ్‌ మిమ్మల్ని శాంతి నిలయం (దారుస్సలాం) వైపునకు ఆహ్వానిస్తున్నాడు. మరియు ఆయన తానుకోరిన వానికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు. (1/2)

10:26 – لِّلَّذِينَ أَحْسَنُوا الْحُسْنَىٰ وَزِيَادَةٌ ۖ وَلَا يَرْهَقُ وُجُوهَهُمْ قَتَرٌ وَلَا ذِلَّةٌ ۚ أُولَـٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٢٦

  • మంచిపనులు చేసినవారికి, మంచిఫలితం దొరుకుతుంది. మరియు ఇంకా ఎక్కువ లభిస్తుంది. 15 మరియు వారి ముఖాలు నల్లబడవు మరియు వారికి అవమానమూ జరుగదు. అలాంటి వారు స్వర్గవాసులు. వారందు శాశ్వతంగా ఉంటారు.

10:27 – وَالَّذِينَ كَسَبُوا السَّيِّئَاتِ جَزَاءُ سَيِّئَةٍ بِمِثْلِهَا وَتَرْهَقُهُمْ ذِلَّةٌ ۖ مَّا لَهُم مِّنَ اللَّـهِ مِنْ عَاصِمٍ ۖ كَأَنَّمَا أُغْشِيَتْ وُجُوهُهُمْ قِطَعًا مِّنَ اللَّيْلِ مُظْلِمًا ۚ أُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٢٧

మరియు పాపకార్యాలు చేసిన వారికి, వారి పాపాలకు తగినట్టి ప్రతిఫలం లభిస్తుంది మరియు వారిని అవమానంక్రమ్ముకుంటుంది. అల్లాహ్‌ నుండి వారిని రక్షించేవాడెవ్వడూ ఉండడు. వారి ముఖాలు చీకటిరాత్రి యొక్క నల్లని తెరల వంటి వాటితో కప్పబడిఉంటాయి. 16 అలాంటి వారు నరకాగ్ని వాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

10:28 – وَيَوْمَ نَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ نَقُولُ لِلَّذِينَ أَشْرَكُوا مَكَانَكُمْ أَنتُمْ وَشُرَكَاؤُكُمْ ۚ فَزَيَّلْنَا بَيْنَهُمْ ۖ وَقَالَ شُرَكَاؤُهُم مَّا كُنتُمْ إِيَّانَا تَعْبُدُونَ ٢٨

మరియు మేము వారందరినీ సమావేశపర చినరోజు, 17 సాటికల్పించిన (షిర్కుచేసిన) వారితో ఇలాఅంటాము: ”మీరునూ మరియు మీరు అల్లాహ్‌ కు సాటి కల్పించిన వారునూ, మీ స్థానాలలోనే ఆగండి!” ఆ పిదప మేము వారిని వేరుచేస్తాము. 18 వారు, అల్లాహ్‌కు భాగస్వాములుగా కల్పించిన వారు (వారిదైవాలు) ఇలా అంటారు: ”మీరు ఆరాధిస్తూ ఉండేది మమ్మల్ని కాదు; 19

10:29 – فَكَفَىٰ بِاللَّـهِ شَهِيدًا بَيْنَنَا وَبَيْنَكُمْ إِن كُنَّا عَنْ عِبَادَتِكُمْ لَغَافِلِينَ ٢٩

”ఇక మీకూ మరియు మాకూ మధ్య అల్లాహ్‌ సాక్ష్యం చాలు. నిశ్చయంగా, మీరు (చేస్తూవున్న) ఆరాధనగురించి మాకు ఏమాత్రం తెలియదు!” 20

10:30 – هُنَالِكَ تَبْلُو كُلُّ نَفْسٍ مَّا أَسْلَفَتْ ۚ وَرُدُّوا إِلَى اللَّـهِ مَوْلَاهُمُ الْحَقِّ ۖ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ ٣٠

అక్కడ ప్రతివ్యక్తి తాను ముందుగా చేసి పంపుకున్నకర్మలను తెలుసుకుంటాడు. అందరూ తమ వాస్తవ యజమాని అయిన అల్లాహ్‌ వైపునకు మరలింపబడతారు మరియు వారు కల్పించు కున్న(బూటకదైవాలన్నీ) వారిని వీడిపోతాయి. 21

10:31 – قُلْ مَن يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ أَمَّن يَمْلِكُ السَّمْعَ وَالْأَبْصَارَ وَمَن يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَمَن يُدَبِّرُ الْأَمْرَ ۚ فَسَيَقُولُونَ اللَّـهُ ۚ فَقُلْ أَفَلَا تَتَّقُونَ ٣١

వారిని అడుగు: ”ఆకాశం నుండి మరియు భూమి నుండి, మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు? వినేశక్తీ చూసేశక్తీ ఎవడిఆధీనంలోఉన్నాయి? మరియు ప్రాణంలేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్నదాని నుండి ప్రాణంలేని దానిని తీసేవాడు ఎవడు? మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు?” వారు: ”అల్లాహ్‌!” అని తప్పకుండా అంటారు. అప్పు డను: ”అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా?”

10:32 – فَذَٰلِكُمُ اللَّـهُ رَبُّكُمُ الْحَقُّ ۖ فَمَاذَا بَعْدَ الْحَقِّ إِلَّا الضَّلَالُ ۖ فَأَنَّىٰ تُصْرَفُونَ ٣٢

ఆయనే అల్లాహ్‌! మీ నిజమైన ప్రభువు. అయితే సత్యం తరువాత, మార్గభ్రష్టత్వం తప్ప మిగిలేదేమిటి? అయితే మీరు ఎందుకు (సత్యం నుండి) తప్పించబడుతున్నారు?

10:33 – كَذَٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَى الَّذِينَ فَسَقُوا أَنَّهُمْ لَا يُؤْمِنُونَ ٣٣

ఈ విధంగా దుష్టులైనవారి విషయంలో వారెన్నడూ విశ్వసించరని, నీ ప్రభువు అన్నమాట నిజమయింది. 22

10:34 – قُلْ هَلْ مِن شُرَكَائِكُم مَّن يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ ۚ قُلِ اللَّـهُ يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ ٣٤

వారిని అడుగు: ”మీరు అల్లాహ్‌కు సాటిగా కల్పించుకున్న వారిలో సృష్టిని మొదటిసారి ఆరం భించేవాడు, తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా?” ఇలా అను: ”సృష్టిని ఆరంభించే వాడు దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడూ కేవలం అల్లాహ్‌ మాత్రమే! అయితే మీరు ఎందుకు మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింప బడుతున్నారు)?”

10:35 – قُلْ هَلْ مِن شُرَكَائِكُم مَّن يَهْدِي إِلَى الْحَقِّ ۚ قُلِ اللَّـهُ يَهْدِي لِلْحَقِّ ۗ أَفَمَن يَهْدِي إِلَى الْحَقِّ أَحَقُّ أَن يُتَّبَعَ أَمَّن لَّا يَهِدِّي إِلَّا أَن يُهْدَىٰ ۖ فَمَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ ٣٥

వారిని అడుగు: ”మీరు అల్లాహ్‌కు సాటి కల్పించుకున్న వారిలో సత్యం వైపునకు మార్గ దర్శకత్వం చేసేవాడు, ఎవడైనా ఉన్నాడా?” ఇంకా ఇలా అను: ”కేవలం అల్లాహ్‌యే సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు. ఏమీ? సత్యం వైపునకు మార్గదర్శ కత్వం చేసేవాడు విధేయతకు ఎక్కువ అర్హుడా? లేక మార్గదర్శకత్వం చేయబడితేనే తప్ప స్వయంగా సన్మార్గం పొందలేని వాడా? అయితే మీకేమయింది? మీ రెలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు?”

10:36 – وَمَا يَتَّبِعُ أَكْثَرُهُمْ إِلَّا ظَنًّا ۚ إِنَّ الظَّنَّ لَا يُغْنِي مِنَ الْحَقِّ شَيْئًا ۚ إِنَّ اللَّـهَ عَلِيمٌ بِمَا يَفْعَلُونَ ٣٦

మరియు వారిలో చాలా మంది తమ ఊహలను మాత్రమే అనుసరించే వారున్నారు. నిశ్చయంగా ఊహ, సత్య (అవగాహనకు) ఏ మాత్రం పనికిరాదు. 23 నిశ్చయంగా, వారు చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.

10:37 – وَمَا كَانَ هَـٰذَا الْقُرْآنُ أَن يُفْتَرَىٰ مِن دُونِ اللَّـهِ وَلَـٰكِن تَصْدِيقَ الَّذِي بَيْنَ يَدَيْهِ وَتَفْصِيلَ الْكِتَابِ لَا رَيْبَ فِيهِ مِن رَّبِّ الْعَالَمِينَ ٣٧

మరియు అల్లాహ్‌ తప్ప మరొకరి ద్వారా ఈ ఖుర్‌ఆన్‌ కల్పించబడటం సంభవం కాదు; వాస్తవానికి ఇది (పూర్వగ్రంథాలలో) మిగిలిఉన్న దానిని (సత్యాన్ని) ధృవపరుస్తోంది మరియు ఇది (ముఖ్య సూచనలను) వివరించే గ్రంథం; ఇది సమస్తలోకాల పోషకుడైన (అల్లాహ్‌) తరఫు నుండి వచ్చిందనటంలో ఎలాంటి సందేహంలేదు!

10:38 – أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ فَأْتُوا بِسُورَةٍ مِّثْلِهِ وَادْعُوا مَنِ اسْتَطَعْتُم مِّن دُونِ اللَّـهِ إِن كُنتُمْ صَادِقِينَ ٣٨

అయినా వారు: ”అతనే (ము’హమ్మదే) దీనిని కల్పించాడు.” అని అంటున్నారా? వారితో అను: ”మీరు సత్యవంతులే అయితే – అల్లాహ్‌ను విడిచి మీరు పిలువగలిగే వారినందరినీ (మీ సహాయానికి) పిలుచుకొని – దీనివంటి ఒక్క సూరహ్‌నైనా (రచించి) తీసుకురండి!” 24

10:39 – بَلْ كَذَّبُوا بِمَا لَمْ يُحِيطُوا بِعِلْمِهِ وَلَمَّا يَأْتِهِمْ تَأْوِيلُهُ ۚ كَذَٰلِكَ كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الظَّالِمِينَ ٣٩

కాని వారు – దాని జ్ఞానాన్ని ఇముడ్చుకొనక ముందే మరియు దాని వ్యాఖ్యానం వారివద్దకు రాకముందే – దానిని అబధ్ధమని తిరస్కరించారు. వీరికి పూర్వమున్న వారు కూడా ఈ విధంగానే అబధ్ధమని తిరస్కరించారు. కావున, చూశారా! ఆ దుర్మార్గుల ముగింపు ఎలా జరిగిందో!

10:40 – وَمِنْهُم مَّن يُؤْمِنُ بِهِ وَمِنْهُم مَّن لَّا يُؤْمِنُ بِهِ ۚ وَرَبُّكَ أَعْلَمُ بِالْمُفْسِدِينَ ٤٠

మరియు వారిలో కొందరు దీనిని (ఈ ఖుర్‌ ఆన్‌ను) నమ్మేవారున్నారు మరికొందరు దీనిని నమ్మనివారున్నారు. మరియు దౌర్జన్యపరులు ఎవరో నీ ప్రభువుకు బాగా తెలుసు.

10:41 – وَإِن كَذَّبُوكَ فَقُل لِّي عَمَلِي وَلَكُمْ عَمَلُكُمْ ۖ أَنتُم بَرِيئُونَ مِمَّا أَعْمَلُ وَأَنَا بَرِيءٌ مِّمَّا تَعْمَلُونَ ٤١

మరియు ఒకవేళ వారు నిన్ను అసత్యుడ వని తిరస్కరిస్తే, వారితో అను: ”నా కర్మలు నాకు మరియు మీ కర్మలు మీకు. నా కర్మలకు మీరు బాధ్యులుకారు మరియు మీ కర్మలకు నేను బాధ్యుడనుకాను.”

10:42 – وَمِنْهُم مَّن يَسْتَمِعُونَ إِلَيْكَ ۚ أَفَأَنتَ تُسْمِعُ الصُّمَّ وَلَوْ كَانُوا لَا يَعْقِلُونَ ٤٢

మరియు వారిలో కొందరు నీ మాటలను వింటూ ఉంటారు! ఏమీ? నీవు చెవిటివారికి వినిపించగలవా? మరియు వారు ఏమీ అర్థంచేసు కోలేక పోయిప్పటికీ (వారికి వినిపించగలవా)?

10:43 – وَمِنْهُم مَّن يَنظُرُ إِلَيْكَ ۚ أَفَأَنتَ تَهْدِي الْعُمْيَ وَلَوْ كَانُوا لَا يُبْصِرُونَ ٤٣

మరియు వారిలో కొందరు నీవైపుకు చూస్తూ ఉంటారు. ఏమీ? నీవు గ్రుడ్డివారికి సరైన మార్గం చూపించగలవా? మరియు వారికి ఏమీ కనిపించ నప్పటికి కూడానా?

10:44 – إِنَّ اللَّـهَ لَا يَظْلِمُ النَّاسَ شَيْئًا وَلَـٰكِنَّ النَّاسَ أَنفُسَهُمْ يَظْلِمُونَ ٤٤

నిశ్చయంగా, అల్లాహ్‌ మానవులకు ఎలాంటి అన్యాయం చేయడు, కాని మానవులే తమకుతాము అన్యాయం చేసుకుంటారు.

10:45 – وَيَوْمَ يَحْشُرُهُمْ كَأَن لَّمْ يَلْبَثُوا إِلَّا سَاعَةً مِّنَ النَّهَارِ يَتَعَارَفُونَ بَيْنَهُمْ ۚ قَدْ خَسِرَ الَّذِينَ كَذَّبُوا بِلِقَاءِ اللَّـهِ وَمَا كَانُوا مُهْتَدِينَ ٤٥

మరియు ఆయన (అల్లాహ్‌) వారిని సమా వేశపరచే రోజు, ఒక దినపు ఒక ఘడియ కంటే ఎక్కువ కాలం (ఇహలోకంలో) గడపలేదని వారు భావిస్తారు. 25 వారు ఒకరినొకరు గుర్తు పడతారు 26 వాస్తవానికి అల్లాహ్‌ను దర్శించవలసి వున్న సత్యాన్ని నిరాకరించిన వారు, తీవ్రమైన నష్టానికి గురిఅవుతారు మరియు వారు మార్గ దర్శకత్వాన్ని పొందలేక పోయారు.

10:46 – وَإِمَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِلَيْنَا مَرْجِعُهُمْ ثُمَّ اللَّـهُ شَهِيدٌ عَلَىٰ مَا يَفْعَلُونَ ٤٦

మరియు (ఓ ము’హమ్మద్‌!) మేము వాస్తవానికి వారికి వాగ్దానం చేసిన (శిక్షలలో) కొన్నింటిని నీకు చూపినా, లేక (అంతకు ముందే) నిన్ను మరణింపజేసినా, వారు మావైపుకే కదా మరలి రావలసి వున్నది. చివరకు వారి కర్మలన్నింటికీ అల్లాహ్‌యే సాక్షి!

10:47 – وَلِكُلِّ أُمَّةٍ رَّسُولٌ ۖ فَإِذَا جَاءَ رَسُولُهُمْ قُضِيَ بَيْنَهُم بِالْقِسْطِ وَهُمْ لَا يُظْلَمُونَ ٤٧

మరియు ప్రతి సమాజానికీ ఒక ప్రవక్త (పంప బడ్డాడు). ఎప్పుడైతే వారి ప్రవక్త వస్తాడో అప్పుడు వారి మధ్య (వ్యవహారాల) తీర్పు న్యాయంగా చేయబడుతుంది. మరియు వారి కెలాంటి అన్యాయం జరుగదు. 27

10:48 – وَيَقُولُونَ مَتَىٰ هَـٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ ٤٨

మరియు వారిలా అడుగుతున్నారు: ”మీరు సత్యవంతులే అయితే ఈ వాగ్దానం ఎప్పుడు పూర్తి కానున్నది?”

10:49 – قُل لَّا أَمْلِكُ لِنَفْسِي ضَرًّا وَلَا نَفْعًا إِلَّا مَا شَاءَ اللَّـهُ ۗ لِكُلِّ أُمَّةٍ أَجَلٌ ۚ إِذَا جَاءَ أَجَلُهُمْ فَلَا يَسْتَأْخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ ٤٩

(ఓ ము’హమ్మద్‌!) వారితో ఇలా అను: ”అల్లాహ్‌ కోరితే తప్ప! నా కొరకు నేను కీడుగానీ, మేలుగానీ చేసుకోగలిగే శక్తి నాకులేదు. 28 ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడి ఉంది. వారి గడువు వచ్చినపుడు వారు ఒక ఘడియ వెనకగానీ లేక ముందుగానీ కాలేరు.” 29

10:50 – قُلْ أَرَأَيْتُمْ إِنْ أَتَاكُمْ عَذَابُهُ بَيَاتًا أَوْ نَهَارًا مَّاذَا يَسْتَعْجِلُ مِنْهُ الْمُجْرِمُونَ ٥٠

వారితో అను: ”ఏమీ? మీరు ఆలోచించారా (చూశారా)! ఒకవేళ ఆయన శిక్ష మీపై రాత్రిగానీ, లేక పగలుగానీ వచ్చిపడితే (మీరేం చేయగలరు)? అయితే దేని కొరకు ఈ అపరాధులు తొందర పెడు తున్నారు?” 30

10:51 – أَثُمَّ إِذَا مَا وَقَعَ آمَنتُم بِهِ ۚ آلْآنَ وَقَدْ كُنتُم بِهِ تَسْتَعْجِلُونَ ٥١

ఏమి? అది (ఆ శిక్ష) మీపై వచ్చిపడిన తరువాతనే మీరు దానిని నమ్ముతారా? (ఆ రోజు మీరిలా అడగబడతారు): ”ఇప్పుడా (మీరు దానిని నమ్మేది)? వాస్తవానికి మీరు దాని కొరకు తొందరపెడ్తూ ఉండేవారు కదా!”

10:52 – ثُمَّ قِيلَ لِلَّذِينَ ظَلَمُوا ذُوقُوا عَذَابَ الْخُلْدِ هَلْ تُجْزَوْنَ إِلَّا بِمَا كُنتُمْ تَكْسِبُونَ ٥٢

అప్పుడు దుర్మార్గులతో ఇలా అనబడు తుంది: ”మీరు శాశ్వతమైన శిక్షను అనుభ వించండి! మీకు – మీరు చేస్తూ ఉండిన కర్మల ప్రతి ఫలం తప్ప – వేరే (శిక్ష) విధించబడునా?” (5/8)

10:53 – وَيَسْتَنبِئُونَكَ أَحَقٌّ هُوَ ۖ قُلْ إِي وَرَبِّي إِنَّهُ لَحَقٌّ ۖ وَمَا أَنتُم بِمُعْجِزِينَ ٥٣

  • మరియు (ఓ ము’హమ్మద్‌!) వారు ఇంకా ఇలా అడుగుతున్నారు: ”ఏమీ? ఇదంతా సత్య మేనా?” 31 వారితో అను: ”అవును, నా ప్రభువు సాక్షిగా! ఇదంతా నిశ్చయంగా జరగబోయే సత్యమే! మరియు మీరు దాని నుండి తప్పించు కోలేరు!”

10:54 – وَلَوْ أَنَّ لِكُلِّ نَفْسٍ ظَلَمَتْ مَا فِي الْأَرْضِ لَافْتَدَتْ بِهِ ۗ وَأَسَرُّوا النَّدَامَةَ لَمَّا رَأَوُا الْعَذَابَ ۖ وَقُضِيَ بَيْنَهُم بِالْقِسْطِ ۚ وَهُمْ لَا يُظْلَمُونَ ٥٤

మరియు దుర్మార్గం చేసిన ప్రతివ్యక్తి వద్ద ఒకవేళ వాస్తవానికి భూమిలో ఉన్న ధనమంతా ఉన్నా, దానిని అంతా పరిహారంగా ఇవ్వటానికి సిధ్ధపడతాడు, 32 (కాని అది స్వీకరించబడదు). మరియు వారు ఆ శిక్షను చూసినప్పుడు లోలోపల పశ్చాత్తాపపడతారు. మరియు వారిమధ్య తీర్పు న్యాయంగా జరుగుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.

10:55 – أَلَا إِنَّ لِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ أَلَا إِنَّ وَعْدَ اللَّـهِ حَقٌّ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ ٥٥

వినండి! నిశ్చయంగా, ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న సమస్తమూ, అల్లాహ్‌ కే చెందినది. తెలుసుకోండి! నిశ్చయంగా, అల్లాహ్‌ వాగ్దానంసత్యం, కాని చాలామందికి ఇదితెలియదు.

10:56 – هُوَ يُحْيِي وَيُمِيتُ وَإِلَيْهِ تُرْجَعُونَ ٥٦

ఆయనే జీవన్మరణాలనుఇచ్చేవాడు మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు. 33

10:57 – يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاءٌ لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ ٥٧

ఓ మానవులారా! వాస్తవంగా మీ ప్రభువు తరఫునుండి మీవద్దకు హితోపదేశం (ఈ ఖుర్ఆన్‌) వచ్చింది మరియు ఇది మీ హృదయాల (రోగాల)కు స్వస్థతనిస్తుంది. మరియు విశ్వసించిన వారికి మార్గదర్శకత్వం మరియు కారుణ్యం (ప్రసాదిస్తుంది). 34

10:58 – قُلْ بِفَضْلِ اللَّـهِ وَبِرَحْمَتِهِ فَبِذَٰلِكَ فَلْيَفْرَحُوا هُوَ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ ٥٨

ఇలా అను: ”ఇది అల్లాహ్‌ అనుగ్రహంవల్ల మరియు ఆయన కారుణ్యంవల్ల, కావున దీనితో వారిని ఆనందించమను, ఇది వారు కూడబెట్టే దానికంటే ఎంతో మేలైనది.”

10:59 – قُلْ أَرَأَيْتُم مَّا أَنزَلَ اللَّـهُ لَكُم مِّن رِّزْقٍ فَجَعَلْتُم مِّنْهُ حَرَامًا وَحَلَالًا قُلْ آللَّـهُ أَذِنَ لَكُمْ ۖ أَمْ عَلَى اللَّـهِ تَفْتَرُونَ ٥٩

ఇలా అను: ”మీరు ఆలోచించారా! అల్లాహ్‌ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే కొన్నింటిని ధర్మసమ్మతం, మరికొన్నింటిని నిషేధం చేసుకున్నారు.” 35 ఇలా అడుగు: ”ఏమీ అల్లాహ్‌ దీనికి అనుమతి నిచ్చాడా? లేదా మీ బూటక కల్పనలను అల్లాహ్‌కు అంటగట్టుతున్నారా?”

10:60 – وَمَا ظَنُّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللَّـهِ الْكَذِبَ يَوْمَ الْقِيَامَةِ ۗ إِنَّ اللَّـهَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَشْكُرُونَ ٦٠

మరియు అల్లాహ్‌పై అబద్ధాలు కల్పించే వారు, తీర్పుదినమును గురించి ఏమను కుంటున్నారు? నిశ్చయంగా, అల్లాహ్‌ మానవుల యెడల అత్యంత అనుగ్రహం కలవాడు, కాని చాలా మంది కృతజ్ఞతలు చూపరు.

10:61 – وَمَا تَكُونُ فِي شَأْنٍ وَمَا تَتْلُو مِنْهُ مِن قُرْآنٍ وَلَا تَعْمَلُونَ مِنْ عَمَلٍ إِلَّا كُنَّا عَلَيْكُمْ شُهُودًا إِذْ تُفِيضُونَ فِيهِ ۚ وَمَا يَعْزُبُ عَن رَّبِّكَ مِن مِّثْقَالِ ذَرَّةٍ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ وَلَا أَصْغَرَ مِن ذَٰلِكَ وَلَا أَكْبَرَ إِلَّا فِي كِتَابٍ مُّبِينٍ ٦١

మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ కార్యంలో ఉన్నా మరియు ఖుర్‌ఆన్‌ నుండి నీవు దేనిని పఠిస్తూ ఉన్నా మరియు (ఓ మానవులారా!) మీరు ఏమి చేస్తూ ఉన్నా! మీరు మీ పనులలో నిమగ్నులై ఉన్నప్పుడు, మేము మిమ్మల్ని కనిపెట్టుకునే ఉంటాము. భూమ్యాకాశాలలో ఉన్నటువంటి ఒక రవంత (పరమాణువంత) వస్తువైనా, దానికంటే చిన్నదైనా లేదా పెద్దదైనా, నీ ప్రభువు దృష్టినుండి మరుగుగా లేదు. అదంతా ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది. 36

10:62 – أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّـهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ٦٢

వినండి! నిశ్చయంగా అల్లాహ్‌కు ప్రియులైన వారికి 37 ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!

10:63 – الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ ٦٣

ఎవరైతే విశ్వసించారో మరియు దైవభీతి కలిగి ఉంటారో!

10:64 – لَهُمُ الْبُشْرَىٰ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ ۚ لَا تَبْدِيلَ لِكَلِمَاتِ اللَّـهِ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ ٦٤

వారికి ఇహలోక జీవితంలోనూ మరియు పరలోకంలోనూ శుభవార్త ఉంటుంది. అల్లాహ్‌ పలుకులలో ఎలాంటి మార్పు ఉండదు. ఇదే ఆ గొప్ప సాఫల్యం (విజయం).

10:65 – وَلَا يَحْزُنكَ قَوْلُهُمْ ۘ إِنَّ الْعِزَّةَ لِلَّـهِ جَمِيعًا ۚ هُوَ السَّمِيعُ الْعَلِيمُ ٦٥

మరియు (ఓ ము’హమ్మద్‌!) వారి మాటలు నిన్ను దుఃఖింపజేయకూడదు. నిశ్చ యంగా, శక్తి (గౌరవం) 38 అంతా అల్లాహ్ కే చెందు తుంది. ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

10:66 – أَلَا إِنَّ لِلَّـهِ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ ۗ وَمَا يَتَّبِعُ الَّذِينَ يَدْعُونَ مِن دُونِ اللَّـهِ شُرَكَاءَ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَإِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ ٦٦

వినండి! నిశ్చయంగా, ఆకాశాలలో ఉన్న దంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్‌కే చెందుతుంది. మరియు అల్లాహ్‌ను కాదని ఆయనకు భాగస్వాములను కల్పించి వారిని ప్రార్థించే వారు, ఎవరిని అనుసరిస్తున్నారు? వారు అనుసరిస్తున్నది కేవలం తమ భ్రమలనే. మరియు వారు కేవలం ఊహాగానాలు మాత్రమే చేస్తున్నారు.

10:67 – هُوَ الَّذِي جَعَلَ لَكُمُ اللَّيْلَ لِتَسْكُنُوا فِيهِ وَالنَّهَارَ مُبْصِرًا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَسْمَعُونَ ٦٧

ఆయనే మీ కొరకు రాత్రిని విశ్రాంతి పొంద టానికి మరియు పగటిని (సంపాదించటానికి) ప్రకాశ వంతంగా చేశాడు. నిశ్చయంగా శ్రధ్ధగా వినేవారికి ఇందులో సూచనలున్నాయి.

10:68 – قَالُوا اتَّخَذَ اللَّـهُ وَلَدًا ۗ سُبْحَانَهُ ۖ هُوَ الْغَنِيُّ ۖ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ إِنْ عِندَكُم مِّن سُلْطَانٍ بِهَـٰذَا ۚ أَتَقُولُونَ عَلَى اللَّـهِ مَا لَا تَعْلَمُونَ ٦٨

”అల్లాహ్‌ (ఒకడిని) కొడుకుగా చేసు కున్నాడు.” 39 అని వారు (యూదులు మరియు క్రైస్తవులు) అంటారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన స్వయం సమృద్ధుడు. ఆకాశాలలోను మరియు భూమిలోనూ ఉన్నదంతా ఆయనకే చెందుతుంది! ఇలా అనటానికి మీ దగ్గర ఏదైనా నిదర్శనం ఉందా? ఏమీ? అల్లాహ్‌ను గురించి మీకు తెలియని మాటలు అంటారా?

10:69 – قُلْ إِنَّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللَّـهِ الْكَذِبَ لَا يُفْلِحُونَ ٦٩

ఇలా అను: ”నిశ్చయంగా అల్లాహ్‌కు అబ ద్ధం అంటగట్టే వారు ఎన్నటికీ సాఫల్యం పొందరు.”

10:70 – مَتَاعٌ فِي الدُّنْيَا ثُمَّ إِلَيْنَا مَرْجِعُهُمْ ثُمَّ نُذِيقُهُمُ الْعَذَابَ الشَّدِيدَ بِمَا كَانُوا يَكْفُرُونَ ٧٠

ఇహలోకంలో వారు కొంతకాలం సుఖాలు అనుభవించవచ్చు! కాని తరువాత మా వైపునకే, వారికి మరలి రావలసి ఉంది. అప్పుడు మేము వారి సత్యతిరస్కారానికి ఫలితంగా, వారికి కఠిన శిక్షను రుచిచూపుతాము. (3/4)

10:71 – وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ نُوحٍ إِذْ قَالَ لِقَوْمِهِ يَا قَوْمِ إِن كَانَ كَبُرَ عَلَيْكُم مَّقَامِي وَتَذْكِيرِي بِآيَاتِ اللَّـهِ فَعَلَى اللَّـهِ تَوَكَّلْتُ فَأَجْمِعُوا أَمْرَكُمْ وَشُرَكَاءَكُمْ ثُمَّ لَا يَكُنْ أَمْرُكُمْ عَلَيْكُمْ غُمَّةً ثُمَّ اقْضُوا إِلَيَّ وَلَا تُنظِرُونِ ٧١

  • మరియు వారికి నూ’హ్‌ గాథను వినిపించు. 40 అతను తన జాతి వారితో ఇలా అన్నప్పుడు: ”నా జాతి సోదరులారా! నేను మీతో ఉండటం మరియు అల్లాహ్‌ సూచన (ఆయాత్‌) లను బోధించటం, మీకు బాధాకరమైనదిగా ఉంటే! నేను మాత్రం అల్లాహ్‌నే నమ్ముకున్నాను. మీరూ మరియు మీరు అల్లాహ్‌కు సాటి కల్పించిన వారూ, అందరూ కలిసి ఒక (పన్నాగపు) నిర్ణయం తీసుకోండి, తరువాత మీ నిర్ణయంలో మీకెలాంటి సందేహం లేకుండా చూసుకోండి. ఆ పిదప ఆ పన్నాగాన్ని నాకు వ్యతిరేకంగా ప్రయోగించండి; నాకు ఏమాత్రం వ్యవధినివ్వకండి.

10:72 – فَإِن تَوَلَّيْتُمْ فَمَا سَأَلْتُكُم مِّنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى اللَّـهِ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُسْلِمِينَ ٧٢

”కాని, ఒకవేళ మీరు వెనుదిరిగితే, నేను మాత్రం మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు! నా ప్రతిఫలం కేవలం అల్లాహ్‌ దగ్గరఉంది. మరియు నేను కేవలం అల్లాహ్‌కే విధేయుడను (ముస్లిం) అయి ఉండాలని ఆజ్ఞాపించబడ్డాను.” 41

10:73 – فَكَذَّبُوهُ فَنَجَّيْنَاهُ وَمَن مَّعَهُ فِي الْفُلْكِ وَجَعَلْنَاهُمْ خَلَائِفَ وَأَغْرَقْنَا الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُنذَرِينَ ٧٣

కాని, వారు అతనిని అబద్ధీకుడని తిరస్క రించారు. కావున మేము అతనిని మరియు అతని తోపాటు ఓడలోఉన్నవారినిరక్షించి,వారిని భూమికి వారసులుగా చేశాము. మరియు మా సూచనలను అబద్ధాలని తిరస్కరించినవారిని ముంచివేశాము. కావున చూడండి హెచ్చరిక చేయబడినా (విశ్వసించని) వారి గతి ఏమయిందో!

10:74 – ثُمَّ بَعَثْنَا مِن بَعْدِهِ رُسُلًا إِلَىٰ قَوْمِهِمْ فَجَاءُوهُم بِالْبَيِّنَاتِ فَمَا كَانُوا لِيُؤْمِنُوا بِمَا كَذَّبُوا بِهِ مِن قَبْلُ ۚ كَذَٰلِكَ نَطْبَعُ عَلَىٰ قُلُوبِ الْمُعْتَدِينَ ٧٤

అతని (నూ’హ్‌) తరువాత ప్రవక్తలను వారి వారి జాతుల వారి వద్దకు పంపాము. వారు, వారి వద్దకు స్పష్టమైననిదర్శనాలు తీసుకొనివచ్చినా! వారు మొదట అబధ్ధమని తిరస్కరించిన విషయాన్ని మళ్ళీ విశ్వసించ లేక పోయారు. ఈ విధంగా మేము హద్దులుమీరి ప్రవర్తించేవారి హృదయాల మీద ముద్రవేస్తాము.

10:75 – ثُمَّ بَعَثْنَا مِن بَعْدِهِم مُّوسَىٰ وَهَارُونَ إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ بِآيَاتِنَا فَاسْتَكْبَرُوا وَكَانُوا قَوْمًا مُّجْرِمِينَ ٧٥

ఇక వారి తరువాత, మూసా మరియు హారూన్‌లను మా సూచనలతో ఫిర్‌’ఔన్‌ మరియు అతని నాయకుల వద్దకు పంపితే, వారు దుర హంకారం చూపారు. వారు అపరాధులైన జనులు.

10:76 – فَلَمَّا جَاءَهُمُ الْحَقُّ مِنْ عِندِنَا قَالُوا إِنَّ هَـٰذَا لَسِحْرٌ مُّبِينٌ ٧٦

కావున మా వద్ద నుండి సత్యం వారి ముందుకు వచ్చినపుడు వారు: ”నిశ్చయంగా, ఇది స్పష్టమైన మంత్రజాలమే!” అని అన్నారు.

10:77 – قَالَ مُوسَىٰ أَتَقُولُونَ لِلْحَقِّ لَمَّا جَاءَكُمْ ۖ أَسِحْرٌ هَـٰذَا وَلَا يُفْلِحُ السَّاحِرُونَ ٧٧

మూసా అన్నాడు: ”ఏమీ? సత్యం మీ ముందుకు వచ్చిన తరువాత కూడా ఇలా అంటారా? ఏమీ? ఇది మంత్రజాలమా? మరియు మాంత్రికులు ఎన్నడూ సాఫల్యం పొందరు కదా!”

10:78 – قَالُوا أَجِئْتَنَا لِتَلْفِتَنَا عَمَّا وَجَدْنَا عَلَيْهِ آبَاءَنَا وَتَكُونَ لَكُمَا الْكِبْرِيَاءُ فِي الْأَرْضِ وَمَا نَحْنُ لَكُمَا بِمُؤْمِنِينَ ٧٨

వారన్నారు: ”మా తండ్రి-తాతలు నడిచిన మార్గం నుండి మమ్మల్ని మళ్ళించాలని మరియు మీ ఇద్దరి పెద్దరికాన్ని భూమిలో స్థాపించాలనా, మీరిద్దరూ వచ్చింది? మరియు మేము మీ ఇద్దరినీ ఏ మాత్రం విశ్వసించము!”

10:79 – وَقَالَ فِرْعَوْنُ ائْتُونِي بِكُلِّ سَاحِرٍ عَلِيمٍ ٧٩

మరియు ఫిర్‌’ఔన్‌ (తన వారితో) అన్నాడు: ”నేర్పుగల ప్రతి మాంత్రికుణ్ణి నా వద్దకు తీసుకురండి!”

10:80 – فَلَمَّا جَاءَ السَّحَرَةُ قَالَ لَهُم مُّوسَىٰ أَلْقُوا مَا أَنتُم مُّلْقُونَ ٨٠

మాంత్రికులు వచ్చిన తరువాత మూసా వారితో: ”మీరు విసరదలచుకున్న వాటిని విసరండి!” అని అన్నాడు.

10:81 – فَلَمَّا أَلْقَوْا قَالَ مُوسَىٰ مَا جِئْتُم بِهِ السِّحْرُ ۖ إِنَّ اللَّـهَ سَيُبْطِلُهُ ۖ إِنَّ اللَّـهَ لَا يُصْلِحُ عَمَلَ الْمُفْسِدِينَ ٨١

వారు విసరగానే మూసా: ”మీరు విసిరింది మంత్రజాలం. నిశ్చయంగా, అల్లాహ్‌ దానిని భంగపరుస్తాడు. 42 నిశ్చయంగా, అల్లాహ్‌ దౌర్జన్య పరుల కార్యాలను చక్కబడ నివ్వడు.

10:82 – وَيُحِقُّ اللَّـهُ الْحَقَّ بِكَلِمَاتِهِ وَلَوْ كَرِهَ الْمُجْرِمُونَ ٨٢

మరియు అల్లాహ్‌ తన ఆజ్ఞతో సత్యాన్ని సత్యంగా నిరూపిస్తాడు, 43 అది అపరాధులకు ఎంత అసహ్యకరమైనా సరే!”

10:83 – فَمَا آمَنَ لِمُوسَىٰ إِلَّا ذُرِّيَّةٌ مِّن قَوْمِهِ عَلَىٰ خَوْفٍ مِّن فِرْعَوْنَ وَمَلَئِهِمْ أَن يَفْتِنَهُمْ ۚ وَإِنَّ فِرْعَوْنَ لَعَالٍ فِي الْأَرْضِ وَإِنَّهُ لَمِنَ الْمُسْرِفِينَ ٨٣

కాని ఫిర్‌’ఔన్‌ మరియు అతని నాయకులు తమను హింసిస్తారేమో అనే భయంతో! అతని జాతివారిలోని కొందరు ప్రజలు తప్ప ఇతరులు మూసాను విశ్వసించలేదు. 44 మరియు వాస్తవానికి, ఫిర్‌’ఔన్‌ దేశంలో ప్రాబల్యం వహించి ఉండేవాడు. మరియు నిశ్చయంగా, అతడు మితిమీరి పవర్తించే వారిలో ఒకడుగా ఉండేవాడు.

10:84 – وَقَالَ مُوسَىٰ يَا قَوْمِ إِن كُنتُمْ آمَنتُم بِاللَّـهِ فَعَلَيْهِ تَوَكَّلُوا إِن كُنتُم مُّسْلِمِينَ ٨٤

  1. మరియు మూసా అన్నాడు: ”నాజాతి ప్రజలారా! మీకు నిజంగానే అల్లాహ్‌ మీద విశ్వాసం ఉంటే మరియు మీరు నిజంగానే అల్లాహ్‌ కు విధేయులు (ముస్లింలు) అయితే, మీరు ఆయన (అల్లాహ్‌) పైననే నమ్మకం ఉంచుకోండి.” 45

10:85 – فَقَالُوا عَلَى اللَّـهِ تَوَكَّلْنَا رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلْقَوْمِ الظَّالِمِينَ ٨٥

అప్పుడు వారిలా జవాబిచ్చారు: ”మేము అల్లాహ్‌నే నమ్ముకున్నాము. ఓ మా ప్రభూ! మమ్మల్ని దుర్మార్గులకు పరీక్షాసాధనంగా చేయకు;

10:86 – وَنَجِّنَا بِرَحْمَتِكَ مِنَ الْقَوْمِ الْكَافِرِينَ ٨٦

”మరియు నీ కారుణ్యంతో మమ్మల్ని సత్య- తిరస్కార ప్రజల నుండి కాపాడు.”

10:87 – وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ وَأَخِيهِ أَن تَبَوَّآ لِقَوْمِكُمَا بِمِصْرَ بُيُوتًا وَاجْعَلُوا بُيُوتَكُمْ قِبْلَةً وَأَقِيمُوا الصَّلَاةَ ۗ وَبَشِّرِ الْمُؤْمِنِينَ ٨٧

మరియు మేము మూసాకు మరియు అతని సోదరునికి ఇలా దివ్యజ్ఞానం (వ’హీ) పంపాము: ”మీరు, మీ జాతివారి కొరకు ఈజిప్టులో గృహాలను సమకూర్చుకోండి. మరియు మీగృహాలను ప్రార్థనా స్థలాలుగా చేసుకొని నమా’జ్‌లను స్థాపించండి. 46 మరియు విశ్వాసులకు శుభవార్తలు ఇవ్వు.”

10:88 – وَقَالَ مُوسَىٰ رَبَّنَا إِنَّكَ آتَيْتَ فِرْعَوْنَ وَمَلَأَهُ زِينَةً وَأَمْوَالًا فِي الْحَيَاةِ الدُّنْيَا رَبَّنَا لِيُضِلُّوا عَن سَبِيلِكَ ۖ رَبَّنَا اطْمِسْ عَلَىٰ أَمْوَالِهِمْ وَاشْدُدْ عَلَىٰ قُلُوبِهِمْ فَلَا يُؤْمِنُوا حَتَّىٰ يَرَوُا الْعَذَابَ الْأَلِيمَ ٨٨

మూసా ఇలా ప్రార్థించాడు: ”ఓ మా ప్రభూ! నిశ్చయంగా, నీవు ఫిర్‌’ఔన్‌కు మరియు అతని నాయకులకు ఇహలోక జీవితంలో వైభవం మరియు సంపదలను ప్రసాదించావు. ఓ మా ప్రభూ! వారిని (ప్రజలను) నీ మార్గం నుండి తప్పించ టానికా ఇవి? ఓ మా ప్రభూ! వారి సంపదలను ధ్వంసం చేయి, వారి హృదయాలపై కఠినావస్థను కలుగజేయి, ఎందుకంటే వారు కఠిన శిక్షను చూసేంతవరకు విశ్వసించరు!” 47

10:89 – قَالَ قَدْ أُجِيبَت دَّعْوَتُكُمَا فَاسْتَقِيمَا وَلَا تَتَّبِعَانِّ سَبِيلَ الَّذِينَ لَا يَعْلَمُونَ ٨٩

(అల్లాహ్‌) సెలవిచ్చాడు: ”మీ ఉభయుల ప్రార్థన అంగీకరించబడింది. మీరిద్దరూ (ఋజు మార్గంపై) స్థిరంగా ఉండండి. మీరిద్దరూ తెలివిలేని వారి మార్గాన్ని అనుసరించకండి.” (7/8)

10:90 – وَجَاوَزْنَا بِبَنِي إِسْرَائِيلَ الْبَحْرَ فَأَتْبَعَهُمْ فِرْعَوْنُ وَجُنُودُهُ بَغْيًا وَعَدْوًا ۖ حَتَّىٰ إِذَا أَدْرَكَهُ الْغَرَقُ قَالَ آمَنتُ أَنَّهُ لَا إِلَـٰهَ إِلَّا الَّذِي آمَنَتْ بِهِ بَنُو إِسْرَائِيلَ وَأَنَا مِنَ الْمُسْلِمِينَ ٩٠

  • మరియు మేము ఇస్రాయీ’ల్‌ సంతతి వారిని సముద్రం దాటించాము. ఆ పిదప ఫిర్‌’ఔన్‌ మరియు అతని సైనికులు దౌర్జన్యంతో మరియు శతృత్వంతో వారిని వెంబడించారు. చివరకు (ఫిర్’ఔన్‌) మునిగిపోతూ అన్నాడు: 48 ”నిశ్చయంగా, ఇస్రాయీ’ల్‌ సంతతి వారు విశ్వసించిన దేవుడు (అల్లాహ్) తప్ప మరొక దేవుడు లేడని నేను విశ్వసించాను. నేను విధేయులలో (ముస్లింలలో) చేరాను!”

10:91 – آلْآنَ وَقَدْ عَصَيْتَ قَبْلُ وَكُنتَ مِنَ الْمُفْسِدِينَ ٩١

(అతనికి ఇలా జవాబు ఇవ్వబడింది): ”ఇప్పుడా, 49 (నీవు విశ్వసించేది)? మరియు వాస్తవానికి నీవు, ఇంత వరకు ఆజ్ఞోల్లంఘన చేస్తూఉన్నావు మరియు దౌర్జన్యపరులలో చేరి ఉన్నావు కదా!

10:92 – فَالْيَوْمَ نُنَجِّيكَ بِبَدَنِكَ لِتَكُونَ لِمَنْ خَلْفَكَ آيَةً ۚ وَإِنَّ كَثِيرًا مِّنَ النَّاسِ عَنْ آيَاتِنَا لَغَافِلُونَ ٩٢

”ఇక నీ తరువాత వచ్చేవారికి ఒక సూచ నగా ఉండటానికి ఈ నాడు నీశవాన్ని కాపాడు తాము.” మరియు నిశ్చయంగా, చాలామంది ప్రజలు మా సూచనలపట్ల నిర్లక్ష్యులై ఉన్నారు.

10:93 – وَلَقَدْ بَوَّأْنَا بَنِي إِسْرَائِيلَ مُبَوَّأَ صِدْقٍ وَرَزَقْنَاهُم مِّنَ الطَّيِّبَاتِ فَمَا اخْتَلَفُوا حَتَّىٰ جَاءَهُمُ الْعِلْمُ ۚ إِنَّ رَبَّكَ يَقْضِي بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ ٩٣

మరియు వాస్తవానికి మేము ఇస్రాయీ’ల్‌ సంతతి వారికి ఉండటానికి మంచి స్థానాన్ని ఇచ్చి, వారికి ఉత్తమ జీవనోపాధిని ప్రసాదించాము. మరియు వారివద్దకు దివ్యజ్ఞానం వచ్చినంత వరకు వారి మధ్య భేదాభిప్రాయాలు రాలేదు. నిశ్చయంగా, నీ ప్రభువు పునరుత్థానదినమున వారిమధ్య ఉన్న భేదాభి ప్రాయాలను గురించి తీర్పుచేస్తాడు.

10:94 – فَإِن كُنتَ فِي شَكٍّ مِّمَّا أَنزَلْنَا إِلَيْكَ فَاسْأَلِ الَّذِينَ يَقْرَءُونَ الْكِتَابَ مِن قَبْلِكَ ۚ لَقَدْ جَاءَكَ الْحَقُّ مِن رَّبِّكَ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ ٩٤

(ఓ ము’హమ్మద్‌) ఒకవేళ నీ వైపునకు అవతరింపజేయబడిన విషయాలను గురించి నీకేమైనా సందేహముంటే నీకు పూర్వం వచ్చిన గ్రంథాన్ని చదువుతున్న వారిని అడుగు! వాస్త వంగా, నీ ప్రభువు తరఫు నుండి నీ వద్దకు సత్యం వచ్చింది. కావున నీవు సందేహించేవారిలో చేరకు;

10:95 – وَلَا تَكُونَنَّ مِنَ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِ اللَّـهِ فَتَكُونَ مِنَ الْخَاسِرِينَ ٩٥

మరియు అల్లాహ్‌ సూచనలను అబద్ధాలని నిరాకరించిన వారిలో చేరకు. అలాచేస్తే నీవుకూడా తప్పక నష్టం పొందేవారిలో చేరిపోతావు.

10:96 – إِنَّ الَّذِينَ حَقَّتْ عَلَيْهِمْ كَلِمَتُ رَبِّكَ لَا يُؤْمِنُونَ ٩٦

నిశ్చయంగా, ఎవరి విషయంలోనైతే నీ ప్రభువు వాక్కు సత్యమని నిరూపించబడిందో, వారు ఎన్నటికీ విశ్వసించరు.

10:97 – وَلَوْ جَاءَتْهُمْ كُلُّ آيَةٍ حَتَّىٰ يَرَوُا الْعَذَابَ الْأَلِيمَ ٩٧

మరియు ఒకవేళ వారి వద్దకు ఏ విధమైన అద్భుత సూచన వచ్చినా! వారు బాధాకరమైన శిక్షను చూడనంత వరకు (విశ్వసించరు). 50

10:98 – فَلَوْلَا كَانَتْ قَرْيَةٌ آمَنَتْ فَنَفَعَهَا إِيمَانُهَا إِلَّا قَوْمَ يُونُسَ لَمَّا آمَنُوا كَشَفْنَا عَنْهُمْ عَذَابَ الْخِزْيِ فِي الْحَيَاةِ الدُّنْيَا وَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ ٩٨

యూనుస్‌ జాతి వారు తప్ప, ఇతర ఏ పుర వాసులకు కూడా, (శిక్షనుచూసిన తరువాత) విశ్వ సించగా, వారి విశ్వాసం వారికి లాభదాయకం కాలేక పోయింది! (యూనుస్‌ జాతి) వారు విశ్వసించిన పిదప మేము వారి నుండి ఇహలోక జీవితపు అవమానకరమైన శిక్షను తొలగించాము. మరియు వారిని కొంత కాలం వరకు, వారికి (ఇహలోక జీవి తాన్ని) అనుభవించే అవకాశాన్ని ఇచ్చాము. 51

10:99 – وَلَوْ شَاءَ رَبُّكَ لَآمَنَ مَن فِي الْأَرْضِ كُلُّهُمْ جَمِيعًا ۚ أَفَأَنتَ تُكْرِهُ النَّاسَ حَتَّىٰ يَكُونُوا مُؤْمِنِينَ ٩٩

మరియు నీ ప్రభువు కోరితే, భూమిలో ఉన్న వారందరూ విశ్వసించేవారు. ఏమీ? నీవు మానవు లందరినీ విశ్వాసులయ్యేవరకు, వారిని బలవంతం చేస్తూ ఉంటావా?

10:100 – وَمَا كَانَ لِنَفْسٍ أَن تُؤْمِنَ إِلَّا بِإِذْنِ اللَّـهِ ۚ وَيَجْعَلُ الرِّجْسَ عَلَى الَّذِينَ لَا يَعْقِلُونَ ١٠٠

మరియు ఏ వ్యక్తి అయినా సరే అల్లాహ్‌ అనుమతి లేనిదే విశ్వసించజాలడు. జ్ఞానాన్ని ఉపయోగించని వారిపై ఆయన (అవిశ్వాసపు) మాలిన్యాన్ని రుద్దుతాడు.

10:101 – قُلِ انظُرُوا مَاذَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَمَا تُغْنِي الْآيَاتُ وَالنُّذُرُ عَن قَوْمٍ لَّا يُؤْمِنُونَ ١٠١

ఇలా అను: ”ఆకాశాలలోనూ మరియు భూమి లోనూ, ఏమేమున్నాయో చూడండి!” మరియు విశ్వసించని ప్రజలకు సూచనలుగానీ, హెచ్చరికలు గానీ ఏ విధంగానూ పనికిరావు!

10:102 – فَهَلْ يَنتَظِرُونَ إِلَّا مِثْلَ أَيَّامِ الَّذِينَ خَلَوْا مِن قَبْلِهِمْ ۚ قُلْ فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ ١٠٢

ఇప్పుడు వారు, తమకు పూర్వం గతించిన వారికి సంభవించిన దినాల కోసం తప్ప మరి దేనికోసం నిరీక్షిస్తున్నారు? వారితో అను: ”మీరూ నిరీక్షించండి! నిశ్చయంగా, నేను కూడా మీతోపాటు నిరీక్షిస్తాను!”

10:103 – ثُمَّ نُنَجِّي رُسُلَنَا وَالَّذِينَ آمَنُوا ۚ كَذَٰلِكَ حَقًّا عَلَيْنَا نُنجِ الْمُؤْمِنِينَ ١٠٣

తరువాత (చివరకు) మేము మా ప్రవక్తలను మరియు విశ్వసించిన వారిని కాపాడుతూ ఉంటాము. ఈ విధంగా విశ్వాసులను కాపాడటం మా విధి.

10:104 – قُلْ يَا أَيُّهَا النَّاسُ إِن كُنتُمْ فِي شَكٍّ مِّن دِينِي فَلَا أَعْبُدُ الَّذِينَ تَعْبُدُونَ مِن دُونِ اللَّـهِ وَلَـٰكِنْ أَعْبُدُ اللَّـهَ الَّذِي يَتَوَفَّاكُمْ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُؤْمِنِينَ ١٠٤

(ఓప్రవక్తా!) ఇలా అను: ”ఓమానవులారా! నా ధర్మాన్నిగురించి మీకు ఎలాంటి సందేహం ఉన్నా అల్లాహ్‌ను వదలి మీరు ఆరాధించేవారిని నేనెన్నడూ ఆరాధించను. అంతే కాదు, నేను అల్లాహ్‌నే ఆరాధిస్తాను. ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. మరియు నేను విశ్వాసులలో ఒకడిగా ఉండాలని ఆదేశించబడ్డాను.”

10:105 – وَأَنْ أَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا وَلَا تَكُونَنَّ مِنَ الْمُشْرِكِينَ ١٠٥

(నేను ఇలా ఆజ్ఞాపించబడ్డాను): ”నీవు మాత్రం సత్య-ధర్మమైన ఏకదైవ సిధ్ధాంతాన్నే అనుసరించు. మరియు ఎన్నటికీ అల్లాహ్‌కు సాటికల్పించే వారిలో (షిర్క్‌చేసే వారిలో) చేరకు.

10:106 – وَلَا تَدْعُ مِن دُونِ اللَّـهِ مَا لَا يَنفَعُكَ وَلَا يَضُرُّكَ ۖ فَإِن فَعَلْتَ فَإِنَّكَ إِذًا مِّنَ الظَّالِمِينَ ١٠٦

”మరియు అల్లాహ్‌ను వదలి నీకు లాభం గానీ మరియు నష్టంగానీ కలిగించలేని దానిని నీవు ప్రార్థించకు. ఒకవేళ నీవు అలాచేస్తే! నిశ్చయంగా, నీవు దుర్మార్గులలో చేరిన వాడవవుతావు.”

10:107 – وَإِن يَمْسَسْكَ اللَّـهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ ۚ يُصِيبُ بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَهُوَ الْغَفُورُ الرَّحِيمُ ١٠٧

ఒకవేళ అల్లాహ్‌ నీకు ఏదైనా ఆపద కలి గించదలిస్తే ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొల గించలేరు. మరియు ఆయన నీకు మేలు చేయ దలిస్తే, ఆయన అనుగ్రహాన్ని ఎవ్వడూ మళ్ళించ లేడు. ఆయన తన దాసులలో తాను కోరిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మరియు ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

10:108 – قُلْ يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُمُ الْحَقُّ مِن رَّبِّكُمْ ۖ فَمَنِ اهْتَدَىٰ فَإِنَّمَا يَهْتَدِي لِنَفْسِهِ ۖ وَمَن ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيْهَا ۖ وَمَا أَنَا عَلَيْكُم بِوَكِيلٍ ١٠٨

(ఓప్రవక్తా!) ఇలాఅను: ”ఓ మానవులారా! వాస్తవంగా, మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు సత్యం వచ్చిఉన్నది. ఇక ఎవడుసన్మార్గాన్ని అను సరిస్తాడో! నిశ్చయంగా, అతడు తన మేలుకే సన్మా ర్గాన్ని అనుసరిస్తాడు. ఇక ఎవడు మార్గభ్రష్టుడవు తాడో నిశ్చయంగా తనకేనష్టం కలిగించు కుంటాడు. నేను మీ బాధ్యత వహించేవాడను కాను!”

10:109 – وَاتَّبِعْ مَا يُوحَىٰ إِلَيْكَ وَاصْبِرْ حَتَّىٰ يَحْكُمَ اللَّـهُ ۚ وَهُوَ خَيْرُ الْحَاكِمِينَ ١٠٩

మరియు (ఓ ప్రవక్తా!) నీపై అవతరింప జేయబడిన సందేశాన్ని (వ’హీని) అనుసరించు. మరియు అల్లాహ్‌ తీర్పుచేసే వరకు నీవు ఓర్పు వహించు. మరియు న్యాయాధిపతులలో ఆయనే అత్యుత్తముడు.

సూరహ్‌ హూద్‌ – ఈ సూరహ్‌, సూరహ్‌ యూనుస్‌ (10) తరువాత, అంతిమ మక్కహ్ కాలంలో అవతరింపజేయ బడింది. ఇందులో మానవుల పరస్పర వ్యవహారాలను గురించి చర్చ ఉంది. ముఖ్యంగా ఆయత్‌, 117: ”మరియు వాటిలో నివసించే ప్రజలు సద్వర్తనులై ఉన్నంతవరకు, అలాంటి నగరాలను నీ ప్రభువు అన్యాయంగా నాశనం చేసేవాడు కాడు!” హూద్‌ (‘అ.స.) ‘అరబ్బు ప్రవక్త. ఈ సూరహ్‌లో ఇంకా ఇద్దరు ‘అరబ్బు ప్రవక్తల ప్రస్తావన ఉంది. వారు స’మూద్‌ జాతికి చెందిన ‘సాలి’హ్‌ (‘అ.స.) మరియు మద్‌యన్‌ ప్రాతానికి చెందిన షు’ఐబ్‌ (‘అ.స.). 123 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 50వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 11:1 – الر ۚ كِتَابٌ أُحْكِمَتْ آيَاتُهُ ثُمَّ فُصِّلَتْ مِن لَّدُنْ حَكِيمٍ خَبِيرٍ ١

అలిఫ్‌-లామ్‌-రా. (ఇది) ఒక దివ్యగ్రంథం, దీని సూక్తులు (ఆయాత్‌) నిర్దుష్టమైనవి మరియు మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు అయిన (అల్లాహ్‌) తరఫు నుండి వివరించబడ్డాయి;

11:2 – أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّـهَ ۚ إِنَّنِي لَكُم مِّنْهُ نَذِيرٌ وَبَشِيرٌ ٢

మీరు అల్లాహ్‌ను తప్ప ఇతరులను ఆరాధించ కూడదని. (ఓ ము’హమ్మద్‌ ఇలా అను): ”నిశ్చయంగా నేను, ఆయన (అల్లాహ్‌) తరఫు నుండి మీకు హెచ్చరిక చేసేవాడిని మరియు శుభవార్తలు ఇచ్చే వాడిని మాత్రమే!

11:3 – وَأَنِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُمَتِّعْكُم مَّتَاعًا حَسَنًا إِلَىٰ أَجَلٍ مُّسَمًّى وَيُؤْتِ كُلَّ ذِي فَضْلٍ فَضْلَهُ ۖ وَإِن تَوَلَّوْا فَإِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ كَبِيرٍ ٣

”మరియు మీరు మీ ప్రభువును క్షమాభిక్ష వేడు కుంటే, తరువాత ఆయన వైపుకు పశ్చాత్తాపంతో మరలితే, ఆయన మీకు నిర్ణయించిన గడువువరకు మంచి సుఖసంతోషాలను ప్రసాదిస్తాడు. మరియు అనుగ్రహాలకు అర్హుడైన ప్రతిఒక్కనికీ ఆయన తన అనుగ్రహాలను ప్రసాదిస్తాడు. కానీ మీరు వెను దిరిగితే! నిశ్చయంగా, ఆ గొప్ప దినమున మీపై రాబోయే శిక్షకు నేను భయపడుతున్నాను!

11:4 – إِلَى اللَّـهِ مَرْجِعُكُمْ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٤

”అల్లాహ్‌ వైపునకే మీ మరలింపు ఉంది. మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు.”

11:5 – أَلَا إِنَّهُمْ يَثْنُونَ صُدُورَهُمْ لِيَسْتَخْفُوا مِنْهُ ۚ أَلَا حِينَ يَسْتَغْشُونَ ثِيَابَهُمْ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ٥

వినండి! వాస్తవానికి వారు ఆయన నుండి దాక్కోవ టానికి తమ వక్షాలను త్రిప్పుకుంటున్నారు. జాగ్రత్త! వారు తమ వస్త్రాలలో తమను తాము కప్పు కున్నప్పటికీ, ఆయన (అల్లాహ్‌)కు వారు దాచే విషయాలూ మరియు వెలిబుచ్చే విషయాలూ అన్నీ బాగా తెలుసు. నిశ్చయంగా, ఆయనకు హృదయా లలో ఉన్నవి (రహస్యాలు) కూడా బాగా తెలుసు. 1

11:6 – وَمَا مِن دَابَّةٍ فِي الْأَرْضِ إِلَّا عَلَى اللَّـهِ رِزْقُهَا وَيَعْلَمُ مُسْتَقَرَّهَا وَمُسْتَوْدَعَهَا ۚ كُلٌّ فِي كِتَابٍ مُّبِينٍ ٦

[(*)] మరియు భూమిపై సంచరించే ప్రతి ప్రాణి జీవనోపాధి (బాధ్యత) అల్లాహ్‌పైననే ఉంది. ఆయనకు దాని నివాసం, నివాసకాలం మరియు దాని అంతిమ నివాసస్థలమూ తెలుసు. 2 అంతా ఒక స్పష్టమైన గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.

11:7 – وَهُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ وَكَانَ عَرْشُهُ عَلَى الْمَاءِ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا ۗ وَلَئِن قُلْتَ إِنَّكُم مَّبْعُوثُونَ مِن بَعْدِ الْمَوْتِ لَيَقُولَنَّ الَّذِينَ كَفَرُوا إِنْ هَـٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ ٧

మరియుఆయనే ఆకాశాలను మరియుభూమిని ఆరు దినములలో (అయ్యామ్‌లలో) సృష్టించాడు. మరియు ఆయన సింహాసనం (‘అర్ష్‌) నీటిమీద ఉండెను. మీలో మంచి పనులు చేసేవాడు ఎవడో పరీక్షించటానికి (ఆయన ఇదంతా సృష్టించాడు). నీవు వారితో: ”నిశ్చయంగా, మీరు మరణించిన తరువాత మరల లేపబడతారు.” అని అన్న ప్పుడు, సత్య-తిరస్కారులు తప్పక అంటారు: ”ఇది ఒక స్పష్టమైన మాయాజాలం మాత్రమే.”

11:8 – وَلَئِنْ أَخَّرْنَا عَنْهُمُ الْعَذَابَ إِلَىٰ أُمَّةٍ مَّعْدُودَةٍ لَّيَقُولُنَّ مَا يَحْبِسُهُ ۗ أَلَا يَوْمَ يَأْتِيهِمْ لَيْسَ مَصْرُوفًا عَنْهُمْ وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ٨

మరియు ఒకవేళ మేము వారి శిక్షను ఒక నిర్ణీత కాలం వరకు ఆపి ఉంచితే, వారు తప్ప కుండా అంటారు: ”దానిని ఆపుతున్నది ఏమిటీ?” వాస్తవానికి అది వచ్చిన రోజు, దానిని వారి నుండి తొలగించగల వారెవ్వరూ ఉండరు. మరియు వారు ఎగతాళి చేస్తూ ఉన్నదే, వారిని క్రమ్ముకుంటుంది.

11:9 – وَلَئِنْ أَذَقْنَا الْإِنسَانَ مِنَّا رَحْمَةً ثُمَّ نَزَعْنَاهَا مِنْهُ إِنَّهُ لَيَئُوسٌ كَفُورٌ ٩

మరియు ఒకవేళ మేము మానవునికి మా కారుణ్యాన్ని రుచిచూపించి, తరువాత అతని నుండి దానిని లాక్కుంటే! నిశ్చయంగా, అతడు నిరాశచెంది, కృతఘ్నుడవుతాడు.

11:10 – وَلَئِنْ أَذَقْنَاهُ نَعْمَاءَ بَعْدَ ضَرَّاءَ مَسَّتْهُ لَيَقُولَنَّ ذَهَبَ السَّيِّئَاتُ عَنِّي ۚ إِنَّهُ لَفَرِحٌ فَخُورٌ ١٠

  1. కాని ఒకవేళ మేము అతనికి ఆపద తరువాత అనుగ్రహాన్ని రుచిచూపిస్తే: ”నా ఆపదలన్నీ నా నుండి తొలగిపోయాయి!” అని అంటాడు. నిశ్చయంగా, అతడు ఆనందంతో, విర్రవీగుతాడు.

11:11 – إِلَّا الَّذِينَ صَبَرُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَـٰئِكَ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ ١١

కాని ఎవరైతే సహనం వహించి, సత్కార్యాలు చేస్తూ ఉంటారో, అలాంటి వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి. 4

11:12 – فَلَعَلَّكَ تَارِكٌ بَعْضَ مَا يُوحَىٰ إِلَيْكَ وَضَائِقٌ بِهِ صَدْرُكَ أَن يَقُولُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ كَنزٌ أَوْ جَاءَ مَعَهُ مَلَكٌ ۚ إِنَّمَا أَنتَ نَذِيرٌ ۚ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ وَكِيلٌ ١٢

(ఓ ప్రవక్తా!) బహుశా నీవు, నీపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానం (వ’హీ) లోని కొంత భాగాన్ని విడిచిపెట్ట నున్నావేమో! మరియు దానితో నీ హృదయానికి ఇబ్బంది కలుగు తుందేమో! ఎందుకంటే, (సత్య-తిరస్కారులు): ”ఇతనిపై ఒక నిధి ఎందుకు దింపబడలేదు? లేదా ఇతనితో బాటు ఒక దేవదూత ఎందుకు రాలేదు?” అని అంటున్నారని! నిశ్చయంగా, నీవైతే కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే. మరియు అల్లాహ్‌యే ప్రతిదాని కార్యసాధకుడు. 5

11:13 – أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ فَأْتُوا بِعَشْرِ سُوَرٍ مِّثْلِهِ مُفْتَرَيَاتٍ وَادْعُوا مَنِ اسْتَطَعْتُم مِّن دُونِ اللَّـهِ إِن كُنتُمْ صَادِقِينَ ١٣

లేదా వారు: ”అతనే (ప్రవక్తయే) దీనిని (ఈ ఖుర్‌ఆన్‌ను) కల్పించాడు.” అని అంటున్నారా? వారితో అను: ”మీరు సత్యవంతులే అయితే – అల్లాహ్‌ తప్ప, మీరు పిలుచుకోగల వారినందరినీ పిలుచుకొని – దీనివంటి పది సూరాహ్‌లను కల్పించి తీసుకురండి!” 6

11:14 – فَإِلَّمْ يَسْتَجِيبُوا لَكُمْ فَاعْلَمُوا أَنَّمَا أُنزِلَ بِعِلْمِ اللَّـهِ وَأَن لَّا إِلَـٰهَ إِلَّا هُوَ ۖ فَهَلْ أَنتُم مُّسْلِمُونَ ١٤

ఒకవేళ (మీరు సాటి కల్పించిన) వారు మీకు సహాయం చేయలేక (సమాధాన మివ్వక) పోతే నిశ్చయంగా, ఇది అల్లాహ్‌ జ్ఞానంతోనే అవతరింప జేయబడిందని తెలుసుకోండి. మరియు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. అయితే ఇప్పుడైనా మీరు అల్లాహ్‌కు విధేయులు (ముస్లింలు) అవుతారా?

11:15 – مَن كَانَ يُرِيدُ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا نُوَفِّ إِلَيْهِمْ أَعْمَالَهُمْ فِيهَا وَهُمْ فِيهَا لَا يُبْخَسُونَ ١٥

ఎవరు ప్రాపంచిక జీవిత సౌకర్యాలు మరియు దాని అలంకరణ కోరుకుంటారో మేము వారి కర్మల ఫలితాన్ని, ఈ జీవితంలోనే పూర్తిగా చెల్లిస్తాము. మరియు అందులో వారికెలాంటి లోపం జరుగదు.

11:16 – أُولَـٰئِكَ الَّذِينَ لَيْسَ لَهُمْ فِي الْآخِرَةِ إِلَّا النَّارُ ۖ وَحَبِطَ مَا صَنَعُوا فِيهَا وَبَاطِلٌ مَّا كَانُوا يَعْمَلُونَ ١٦

అలాంటి వారికి పరలోకంలో నరకాగ్ని తప్ప మరేమీ ఉండదు. వారు ఇందులో (ఈ లోకంలో) పాటుపడిందంతా వ్యర్థమైపోతుంది మరియు వారు చేసిన కర్మలన్నీ విఫలమవుతాయి. 7

11:17 – أَفَمَن كَانَ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّهِ وَيَتْلُوهُ شَاهِدٌ مِّنْهُ وَمِن قَبْلِهِ كِتَابُ مُوسَىٰ إِمَامًا وَرَحْمَةً ۚ أُولَـٰئِكَ يُؤْمِنُونَ بِهِ ۚ وَمَن يَكْفُرْ بِهِ مِنَ الْأَحْزَابِ فَالنَّارُ مَوْعِدُهُ ۚ فَلَا تَكُ فِي مِرْيَةٍ مِّنْهُ ۚ إِنَّهُ الْحَقُّ مِن رَّبِّكَ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُونَ ١٧

ఏ వ్యక్తి అయితే తనప్రభువు తరఫునుండి వచ్చిన స్పష్టమైన నిదర్శనంపై ఉన్నాడో! మరియు దానికి తోడుగా ఆయన (అల్లాహ్‌) సాక్ష్యం ఉందో! 8 మరియు దీనికి ముందు మార్గదర్శిని మరియు కారుణ్యంగా వచ్చిన మూసా గ్రంథం కూడా సాక్షిగా ఉందో! (అలాంటివాడు సత్య-తిరస్కారులతో సమా నుడా)? అలాంటివారు దీనిని (ఖుర్‌ఆన్‌ను) విశ్వ సిస్తారు. మరియు దీనిని (ఖుర్‌ఆన్‌ను) తిరస్క రించే తెగలవారి 9 వాగ్దానస్థలం నరకాగ్నియే! కావున దీనిని గురించి నీవు ఎలాంటి సందేహంలోపడకు. నిశ్చయంగా ఇది నీ ప్రభువు తరఫునుండి వచ్చిన సత్యం. కాని చాలా మంది ప్రజలు విశ్వసించరు. 10

11:18 – وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّـهِ كَذِبًا ۚ أُولَـٰئِكَ يُعْرَضُونَ عَلَىٰ رَبِّهِمْ وَيَقُولُ الْأَشْهَادُ هَـٰؤُلَاءِ الَّذِينَ كَذَبُوا عَلَىٰ رَبِّهِمْ ۚ أَلَا لَعْنَةُ اللَّـهِ عَلَى الظَّالِمِينَ ١٨

మరియు అల్లాహ్‌కు అబద్ధం అంటగట్టేవాడి కంటే ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? అలాంటి వారు తమ ప్రభువు ముందు ప్రవేశపెట్టబడతారు. అప్పుడు: ”వీరే, తమ ప్రభువుకు అబద్ధాన్ని అంటగట్టినవారు.” అని సాక్షులు పలుకుతారు. నిస్సందేహంగా, అల్లాహ్‌ శాపం (బహిష్కారం) దుర్మార్గులపై ఉంటుంది. 11

11:19 – الَّذِينَ يَصُدُّونَ عَن سَبِيلِ اللَّـهِ وَيَبْغُونَهَا عِوَجًا وَهُم بِالْآخِرَةِ هُمْ كَافِرُونَ ١٩

ఎవరు అల్లాహ్‌ మార్గం నుండి (ప్రజలను) అడ్డగిస్తారో మరియు దానిని వక్రమైనదిగా చూపుతారో అలాంటివారు, వారే! పరలోక జీవితం ఉన్నదనే సత్యాన్ని తిరస్కరించేవారు. 12

11:20 – أُولَـٰئِكَ لَمْ يَكُونُوا مُعْجِزِينَ فِي الْأَرْضِ وَمَا كَانَ لَهُم مِّن دُونِ اللَّـهِ مِنْ أَوْلِيَاءَ ۘ يُضَاعَفُ لَهُمُ الْعَذَابُ ۚ مَا كَانُوا يَسْتَطِيعُونَ السَّمْعَ وَمَا كَانُوا يُبْصِرُونَ ٢٠

అలాంటివారు భూమిలో(అల్లాహ్‌ శిక్షనుండి) తప్పించుకోలేరు. మరియు వారికి అల్లాహ్‌ తప్ప ఇతర సంరక్షకులు లేరు. వారి శిక్ష రెట్టింపు చేయ బడుతుంది.(ఇహలోకంలో వారుసత్యాన్ని) వినలేక పోయే వారు మరియు చూడలేక పోయే వారు. 13

11:21 – أُولَـٰئِكَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ ٢١

అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేసుకున్న వారు మరియు వారు కల్పించుకున్న (దైవాలన్నీ) వారిని వీడిపోతాయి. 14

11:22 – لَا جَرَمَ أَنَّهُمْ فِي الْآخِرَةِ هُمُ الْأَخْسَرُونَ ٢٢

నిస్సందేహంగా పరలోక జీవితంలో వీరే అత్యధికంగా నష్టపోయేవారు.

11:23 – إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَأَخْبَتُوا إِلَىٰ رَبِّهِمْ أُولَـٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٢٣

నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసి తమ ప్రభువుకే అంకితమైపోయేటటువంటి వారే స్వర్గవాసులవుతారు. వారు దానిలోనే శాశ్వతంగా ఉంటారు.(1/8)

11:24 – مَثَلُ الْفَرِيقَيْنِ كَالْأَعْمَىٰ وَالْأَصَمِّ وَالْبَصِيرِ وَالسَّمِيعِ ۚ هَلْ يَسْتَوِيَانِ مَثَلًا ۚ أَفَلَا تَذَكَّرُونَ ٢٤

  • ఈఉభయపక్షాలవారిని ఒకగ్రుడ్డి మరియు చెవిటి, మరొక చూడగల మరియు వినగల వారితో పోల్చవచ్చు! ఏమీ? పోలికలో వీరిరువురూ సమా నులా? మీరు ఇకనైనా గుణపాఠం నేర్చుకోరా? 15

11:25 – وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ إِنِّي لَكُمْ نَذِيرٌ مُّبِينٌ ٢٥

మరియు వాస్తవానికి మేము నూ’హ్‌ను అతని జాతివారి వద్దకు పంపాము. (అతను వారితో అన్నాడు): ”నిశ్చయంగా, నేను మీకు స్పష్టమైన హెచ్చరిక చేసేవాడిని మాత్రమే –

11:26 – أَن لَّا تَعْبُدُوا إِلَّا اللَّـهَ ۖ إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ أَلِيمٍ ٢٦

”మీరు అల్లాహ్‌ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకూడదని. 16 అలా చేస్తే నిశ్చయంగా, ఆ బాధాకరమైన దినమున మీకు పడబోయే శిక్షకు నేను భయపడుతున్నాను.”

11:27 – فَقَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِن قَوْمِهِ مَا نَرَاكَ إِلَّا بَشَرًا مِّثْلَنَا وَمَا نَرَاكَ اتَّبَعَكَ إِلَّا الَّذِينَ هُمْ أَرَاذِلُنَا بَادِيَ الرَّأْيِ وَمَا نَرَىٰ لَكُمْ عَلَيْنَا مِن فَضْلٍ بَلْ نَظُنُّكُمْ كَاذِبِينَ ٢٧

అప్పుడు అతని జాతి వారిలో సత్య- తిరస్కారులైన నాయకులు: ”నీవు కూడా మా మాదిరిగా ఒక సాధారణ మానవుడవే తప్ప, నీలో మరే ప్రత్యేకతను మేము చూడటం లేదు. 17 మరియు వివేకంలేని నీచమైనవారు తప్ప ఇతరులు నిన్ను అనుసరిస్తున్నట్లు కూడా మేము చూడటం లేదు. 18 మరియు మీలో మా కంటే ఎక్కువ ఘనత కూడా మాకు కనబడటం లేదు. అంతేగాక మీరు అసత్యవాదులని మేము భావిస్తున్నాము.” అని అన్నారు.

11:28 – قَالَ يَا قَوْمِ أَرَأَيْتُمْ إِن كُنتُ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّي وَآتَانِي رَحْمَةً مِّنْ عِندِهِ فَعُمِّيَتْ عَلَيْكُمْ أَنُلْزِمُكُمُوهَا وَأَنتُمْ لَهَا كَارِهُونَ ٢٨

అతను (నూ’హ్‌) అన్నాడు: ”ఓ నాజాతి ప్రజలారా! మీరు చూస్తున్నారు కదా? నేను నా ప్రభువు తరఫునుండి వచ్చిన స్పష్టమైన సూచనను అనుసరిస్తున్నాను. ఆయన తన కారుణ్యాన్ని నాపై ప్రసాదించాడు, కాని అది మీకు కనబడటం లేదు. అలాంటప్పుడు మీరు దానిని అసహ్యించు కుంటున్నా, దానిని స్వీకరించమని మేము మిమ్మల్ని బలవంతం చేయగలమా? 19

11:29 – وَيَا قَوْمِ لَا أَسْأَلُكُمْ عَلَيْهِ مَالًا ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى اللَّـهِ ۚ وَمَا أَنَا بِطَارِدِ الَّذِينَ آمَنُوا ۚ إِنَّهُم مُّلَاقُو رَبِّهِمْ وَلَـٰكِنِّي أَرَاكُمْ قَوْمًا تَجْهَلُونَ ٢٩

  1. ”మరియు ఓ నా జాతి ప్రజలారా! నేను దాని కోసం మీ నుండి ధనాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం అల్లాహ్‌ దగ్గరనే ఉంది. మరియు నేను విశ్వసించిన వారిని త్రోసివేయలేను. 20 నిశ్చయంగా, వారైతే తమ ప్రభువును కలుసు కుంటారు, కాని నిశ్చయంగా, నేను మిమ్మల్ని మూఢ జనులుగా చూస్తున్నాను.

11:30 – وَيَا قَوْمِ مَن يَنصُرُنِي مِنَ اللَّـهِ إِن طَرَدتُّهُمْ ۚ أَفَلَا تَذَكَّرُونَ ٣٠

”మరియు ఓ నా జాతి ప్రజలారా! ఒకవేళ నేను వారిని (విశ్వాసులను) గెంటివేస్తే నన్ను అల్లాహ్‌ (శిక్ష) నుండి, ఎవడు కాపాడగలడు? ఏమీ? మీరిది గ్రహించలేరా?

11:31 – وَلَا أَقُولُ لَكُمْ عِندِي خَزَائِنُ اللَّـهِ وَلَا أَعْلَمُ الْغَيْبَ وَلَا أَقُولُ إِنِّي مَلَكٌ وَلَا أَقُولُ لِلَّذِينَ تَزْدَرِي أَعْيُنُكُمْ لَن يُؤْتِيَهُمُ اللَّـهُ خَيْرًا ۖ اللَّـهُ أَعْلَمُ بِمَا فِي أَنفُسِهِمْ ۖ إِنِّي إِذًا لَّمِنَ الظَّالِمِينَ ٣١

”మరియు నా వద్ద అల్లాహ్‌ నిధులు ఉన్నాయని గానీ మరియు నాకు అగోచర జ్ఞానమున్నదని గానీ నేను మీతో అనటం లేదు; మరియు నేను దైవదూతనని కూడా అనటం లేదు 21 మరియు మీరు హీనంగా చూసేవారికి అల్లాహ్‌ మేలు చేయలేడని కూడా అనటంలేదు. వారి మనస్సులలో ఉన్నది అల్లాహ్‌కు బాగా తెలుసు. అలా అయితే! నిశ్చయంగా, నేను దుర్మార్గులలో చేరినవాడనే!”

11:32 – قَالُوا يَا نُوحُ قَدْ جَادَلْتَنَا فَأَكْثَرْتَ جِدَالَنَا فَأْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ ٣٢

వారు అన్నారు: ”ఓ నూ’హ్‌! నీవు మాతో వాదించావు, చాలా వాదించావు, 22 ఇక నీవు సత్యవంతుడవే అయితే, నీవు భయపెట్టే దానిని (ఆశిక్షను) మాపై దింపు!”

11:33 – قَالَ إِنَّمَا يَأْتِيكُم بِهِ اللَّـهُ إِن شَاءَ وَمَا أَنتُم بِمُعْجِزِينَ ٣٣

అతను(నూ’హ్‌) అన్నాడు: ”అల్లాహ్‌ కోరితే నిశ్చయంగా, దానిని (ఆ శిక్షను) మీపైకి తెస్తాడు మరియు మీరు దాని నుండి తప్పించుకోలేరు!

11:34 – وَلَا يَنفَعُكُمْ نُصْحِي إِنْ أَرَدتُّ أَنْ أَنصَحَ لَكُمْ إِن كَانَ اللَّـهُ يُرِيدُ أَن يُغْوِيَكُمْ ۚ هُوَ رَبُّكُمْ وَإِلَيْهِ تُرْجَعُونَ ٣٤

”ఒకవేళ అల్లాహ్‌ మిమ్మల్ని తప్పుదారిలో విడిచిపెట్టాలని కోరితే, నేను మీకు మంచి సలహా ఇవ్వాలని ఎంతకోరినా, నాసలహా మీకు లాభ దాయకం కాజాలదు. ఆయనే మీ ప్రభువు మరియు ఆయనవైపునకే మీరంతా మరలిపోవలసి ఉన్నది.”

11:35 – أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ إِنِ افْتَرَيْتُهُ فَعَلَيَّ إِجْرَامِي وَأَنَا بَرِيءٌ مِّمَّا تُجْرِمُونَ ٣٥

ఏమీ? వారు: ”అతనే (ము’హమ్మదే) దీనిని కల్పించాడు.” అని అంటున్నారా? వారితో ఇలా అను: ”నేను దీనిని కల్పిస్తే దాని పాపం నాపై ఉంటుంది మరియు మీరు చేసే పాపాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు.”

11:36 – وَأُوحِيَ إِلَىٰ نُوحٍ أَنَّهُ لَن يُؤْمِنَ مِن قَوْمِكَ إِلَّا مَن قَدْ آمَنَ فَلَا تَبْتَئِسْ بِمَا كَانُوا يَفْعَلُونَ ٣٦

వారు అన్నారు: ”ఓ నూ’హ్‌! నీవు మాతో వాదించావు, చాలా వాదించావు,

11:37 – وَاصْنَعِ الْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا وَلَا تُخَاطِبْنِي فِي الَّذِينَ ظَلَمُوا ۚ إِنَّهُم مُّغْرَقُونَ ٣٧

”మరియు నీవు మా సమక్షంలో, మా సందేశానుసారంగా, ఒక ఓడను నిర్మించు మరియు దుర్మార్గులను గురించి నన్ను అడుగకు. నిశ్చయంగా, వారు ముంచి వేయబడతారు.”

11:38 – وَيَصْنَعُ الْفُلْكَ وَكُلَّمَا مَرَّ عَلَيْهِ مَلَأٌ مِّن قَوْمِهِ سَخِرُوا مِنْهُ ۚ قَالَ إِن تَسْخَرُوا مِنَّا فَإِنَّا نَسْخَرُ مِنكُمْ كَمَا تَسْخَرُونَ ٣٨

మరియు నూ’హ్‌ ఓడ నిర్మిస్తూ ఉన్న ప్పుడు, ప్రతిసారి అతనిజాతి నాయకులు అతని ఎదుట నుండి పోయేటప్పుడు అతనితో పరిహాసాలాడేవారు. అతను (నూ’హ్‌) వారితో అనేవాడు: ”ఇప్పుడు మీరు మాతోపరిహాసాలాడు తున్నారు, నిశ్చయంగా, మీరు పరిహాసాలాడినట్లే మేము కూడా మీతో పరిహాసాలాడుదుము.

11:39 – فَسَوْفَ تَعْلَمُونَ مَن يَأْتِيهِ عَذَابٌ يُخْزِيهِ وَيَحِلُّ عَلَيْهِ عَذَابٌ مُّقِيمٌ ٣٩

”అవమానకరమైన శిక్ష ఎవరిపైకి వస్తుందో మరియు శాశ్వతమైన శిక్ష ఎవరిపై పడుతుందో త్వరలోనే మీరు తెలుసుకుంటారు.”

11:40 – حَتَّىٰ إِذَا جَاءَ أَمْرُنَا وَفَارَ التَّنُّورُ قُلْنَا احْمِلْ فِيهَا مِن كُلٍّ زَوْجَيْنِ اثْنَيْنِ وَأَهْلَكَ إِلَّا مَن سَبَقَ عَلَيْهِ الْقَوْلُ وَمَنْ آمَنَ ۚ وَمَا آمَنَ مَعَهُ إِلَّا قَلِيلٌ ٤٠

చివరకు మా ఆజ్ఞ వచ్చింది మరియు పొయ్యి పొంగింది (జల ప్రవాహాలు భూమిని చీల్చుకొని రాసాగాయి). 23 అప్పుడు మేము, (నూ’హ్‌తో) అన్నాము: ”ప్రతి జాతి (పశువుల) నుండి రెండు (ఆడ-మగ) జంటలను మరియు నీ కుటుంబంవారిని – ఇదివరకే సూచించబడినవారు తప్ప – మరియు విశ్వసించిన వారిని, అందరినీ దానిలోకి (నావలోకి) ఎక్కించుకో!” అతనిని విశ్వసించినవారు కొందరు మాత్రమే. (1/4)

11:41 – وَقَالَ ارْكَبُوا فِيهَا بِسْمِ اللَّـهِ مَجْرَاهَا وَمُرْسَاهَا ۚ إِنَّ رَبِّي لَغَفُورٌ رَّحِيمٌ ٤١

  • మరియు (నూ’హ్‌) అన్నాడు: ”ఇందులోకి ఎక్కండి, అల్లాహ్‌ పేరుతో దీని పయనం మరియు దీని ఆగటం. నిశ్చయంగా, నా ప్రభువు క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.”

11:42 – وَهِيَ تَجْرِي بِهِمْ فِي مَوْجٍ كَالْجِبَالِ وَنَادَىٰ نُوحٌ ابْنَهُ وَكَانَ فِي مَعْزِلٍ يَا بُنَيَّ ارْكَب مَّعَنَا وَلَا تَكُن مَّعَ الْكَافِرِينَ ٤٢

మరియు అది వారిని పర్వతాలవలే ఎత్తైన అలలలోనికి తీసుకొని పోసాగింది. అప్పుడు నూ’హ్ (పడవనుండి) దూరంగా ఉన్న తన కుమారుణ్ణి పిలుస్తూ (అన్నాడు): ”ఓ నాకుమారా! మాతో పాటు (ఓడలోకి) ఎక్కు అవిశ్వాసులలో కలిసి పోకు!” 24

11:43 – قَالَ سَآوِي إِلَىٰ جَبَلٍ يَعْصِمُنِي مِنَ الْمَاءِ ۚ قَالَ لَا عَاصِمَ الْيَوْمَ مِنْ أَمْرِ اللَّـهِ إِلَّا مَن رَّحِمَ ۚ وَحَالَ بَيْنَهُمَا الْمَوْجُ فَكَانَ مِنَ الْمُغْرَقِينَ ٤٣

అతడు (కుమారుడు) అన్నాడు: ”నేను ఒక కొండపైకి ఎక్కి శరణుపొందుతాను, అది నన్ను నీళ్ల నుండి కాపాడుతుంది.” (నూ’హ్) అన్నాడు: ”ఈ రోజు అల్లాహ్‌ తీర్పుకు విరుధ్ధంగా కాపాడేవాడు ఎవ్వడూ లేడు, ఆయన (అల్లాహ్) యే కరుణిస్తే తప్ప!” అప్పుడే వారి మధ్య ఒక కెరటంరాగా అతడు కూడా మునిగి పోయే వారిలో కలిసిపోయాడు.

11:44 – وَقِيلَ يَا أَرْضُ ابْلَعِي مَاءَكِ وَيَا سَمَاءُ أَقْلِعِي وَغِيضَ الْمَاءُ وَقُضِيَ الْأَمْرُ وَاسْتَوَتْ عَلَى الْجُودِيِّ ۖ وَقِيلَ بُعْدًا لِّلْقَوْمِ الظَّالِمِينَ ٤٤

ఆ తరువాత ఆజ్ఞ వచ్చింది: ”ఓ భూమీ! నీ నీళ్ళను మ్రింగివేయి. ఓ ఆకాశమా! (కురవటం) ఆపివేయి!” అప్పుడు నీరు (భూమిలోకి) ఇంకి పోయింది. (అల్లాహ్) తీర్పు నెరవేరింది. ఓడ జూదీ కొండమీద ఆగింది. 25 మరియు అప్పుడు: ”దుర్మార్గుల జాతివారు దూరమై (నాశనమై) పోయారు!” అని అనబడింది.

11:45 – وَنَادَىٰ نُوحٌ رَّبَّهُ فَقَالَ رَبِّ إِنَّ ابْنِي مِنْ أَهْلِي وَإِنَّ وَعْدَكَ الْحَقُّ وَأَنتَ أَحْكَمُ الْحَاكِمِينَ ٤٥

మరియునూ’హ్‌ తనప్రభువును వేడుకుంటూ అన్నాడు: ”ఓ నాప్రభూ! నిశ్చయంగా, నా కుమా రుడు నా కుటుంబంలోని వాడు! నీ వాగ్దానం సత్య మైనదిమరియు నీవే సర్వోత్తమ న్యాయాధికారివి.”

11:46 – قَالَ يَا نُوحُ إِنَّهُ لَيْسَ مِنْ أَهْلِكَ ۖ إِنَّهُ عَمَلٌ غَيْرُ صَالِحٍ ۖ فَلَا تَسْأَلْنِ مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ ۖ إِنِّي أَعِظُكَ أَن تَكُونَ مِنَ الْجَاهِلِينَ ٤٦

ఆయన (అల్లాహ్‌) జవాబిచ్చాడు: ”ఓ నూ’హ్‌! అతడు నిశ్చయంగా, నీ కుటుంబంలోని వాడు కాడు. 26 నిశ్చయంగా, అతడి పనులు మంచివి కావు. 27 కావున నీకు తెలియని విషయం గురించి నన్ను అడగకు. నీవు కూడా మూఢులలో చేరినవాడవు కావద్దు. 28 అని నేను నిన్ను ఉపదేశిస్తున్నాను.”

11:47 – قَالَ رَبِّ إِنِّي أَعُوذُ بِكَ أَنْ أَسْأَلَكَ مَا لَيْسَ لِي بِهِ عِلْمٌ ۖ وَإِلَّا تَغْفِرْ لِي وَتَرْحَمْنِي أَكُن مِّنَ الْخَاسِرِينَ ٤٧

(నూ’హ్‌) ఇలా విన్నవించుకున్నాడు: ”ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నాకు తెలియని విషయాన్ని గురించి నిన్ను అడిగినందుకు, నేను నీ శరణు వేడుకుంటున్నాను. మరియు నీవు నన్ను క్షమించకపోతే, నన్ను కరుణించకపోతే, నేను నష్ట పోయిన వారిలో చేరుతాను.”

11:48 – قِيلَ يَا نُوحُ اهْبِطْ بِسَلَامٍ مِّنَّا وَبَرَكَاتٍ عَلَيْكَ وَعَلَىٰ أُمَمٍ مِّمَّن مَّعَكَ ۚ وَأُمَمٌ سَنُمَتِّعُهُمْ ثُمَّ يَمَسُّهُم مِّنَّا عَذَابٌ أَلِيمٌ ٤٨

ఇలా ఆజ్ఞ ఇవ్వబడింది: ”ఓ నూ’హ్‌! నీవు మరియు నీతో ఉన్న నీ జాతివారు శాంతి మరియు మా ఆశీర్వాదాలతో (ఓడ / జూదీ పర్వతం నుండి) దిగండి. వారి లోని కొన్ని సంఘాలకు మేము కొంత కాలం వరకు సుఖ-సంతోషాలను ప్రసాదించ గలము. ఆ తరువాత మా వద్ద నుండి బాధాకరమైన శిక్ష వారిపై పడుతుంది.”

11:49 – تِلْكَ مِنْ أَنبَاءِ الْغَيْبِ نُوحِيهَا إِلَيْكَ ۖ مَا كُنتَ تَعْلَمُهَا أَنتَ وَلَا قَوْمُكَ مِن قَبْلِ هَـٰذَا ۖ فَاصْبِرْ ۖ إِنَّ الْعَاقِبَةَ لِلْمُتَّقِينَ ٤٩

(ఓ ప్రవక్తా!) ఇవి అగోచర విషయాలు. వాటిని మేము నీకు మా సందేశం (వ’హీ) ద్వారా తెలుపుతున్నాము. వాటిని నీవుగానీ, నీ జాతి వారుగానీ ఇంతకు పూర్వం ఎరుగరు. కనుక సహనంవహించు! నిశ్చయంగా, మంచి ఫలితం దైవభీతి గలవారికే లభిస్తుంది. 29

11:50 – وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۚ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّـهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُ ۖ إِنْ أَنتُمْ إِلَّا مُفْتَرُونَ ٥٠

మరియు ‘ఆద్‌ జాతివారి దగ్గరికి వారి సహో దరుడు హూద్‌ను పంపాము. అతను ఇలాఅన్నాడు: ”నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్‌నే ఆరాధిం చండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. మీరు కేవలం అబద్ధాలు కల్పిస్తున్నారు!

11:51 – يَا قَوْمِ لَا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى الَّذِي فَطَرَنِي ۚ أَفَلَا تَعْقِلُونَ ٥١

”ఓ నాజాతి ప్రజలారా! (ఈ పనికి) నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలం అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం నన్ను సృజించిన ఆయన వద్దనే ఉంది. ఏమీ? మీరు బుద్ధిని ఉపయోగించరా (అర్థం చేసుకోలేరా)?

11:52 – وَيَا قَوْمِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا وَيَزِدْكُمْ قُوَّةً إِلَىٰ قُوَّتِكُمْ وَلَا تَتَوَلَّوْا مُجْرِمِينَ ٥٢

”మరియు ఓ నా జాతి ప్రజలారా! మీ ప్రభువు క్షమాభిక్షను వేడుకోండి, తరువాత ఆయన వైపుకు పశ్చాత్తాపంతో మరలండి; ఆయన మీకొరకు ఆకాశం నుండి భారీవర్షాలు కురిపిస్తాడు మరియు మీకు, మీ శక్తిపై మరింత శక్తిని ఇస్తాడు, 30 కావున మీరు నేరస్థులై వెనుదిరగకండి!”

11:53 – قَالُوا يَا هُودُ مَا جِئْتَنَا بِبَيِّنَةٍ وَمَا نَحْنُ بِتَارِكِي آلِهَتِنَا عَن قَوْلِكَ وَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِينَ ٥٣

వారు అన్నారు: ”ఓ హూద్‌! నీవు మా వద్దకు స్పష్టమైన సూచనను తీసుకొని రాలేదు మరియు మేము కేవలం నీ మాటలు విని మా దేవతలను వదలిపెట్టలేము మరియు మేము నిన్ను విశ్వసించలేము.

11:54 – إِن نَّقُولُ إِلَّا اعْتَرَاكَ بَعْضُ آلِهَتِنَا بِسُوءٍ ۗ قَالَ إِنِّي أُشْهِدُ اللَّـهَ وَاشْهَدُوا أَنِّي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ ٥٤

”మా దైవాలలో నుండి కొందరు నీకు కీడు కలిగించారు (నిన్ను పిచ్చికి గురిచేశారు) అని మాత్రమే మేము అనగలము!” అతను (హూద్‌) జవాబిచ్చాడు: ”ఆయన (అల్లాహ్‌) తప్ప! 31 మీరు ఆయనకు సాటి కల్పించే వాటితో నిశ్చయంగా నాకు ఎలాంటి సంబంధంలేదని, నేను అల్లాహ్‌ను సాక్షిగా పెడుతున్నాను మరియు మీరు కూడా సాక్షులుగా ఉండండి;

11:55 – مِن دُونِهِ ۖ فَكِيدُونِي جَمِيعًا ثُمَّ لَا تُنظِرُونِ ٥٥

”ఇక మీరంతాకలసి నాకువ్యతిరేకంగా కుట్రలు పన్నండి. నా కెలాంటి వ్యవధి ఇవ్వకండి. 32

11:56 – إِنِّي تَوَكَّلْتُ عَلَى اللَّـهِ رَبِّي وَرَبِّكُم ۚ مَّا مِن دَابَّةٍ إِلَّا هُوَ آخِذٌ بِنَاصِيَتِهَا ۚ إِنَّ رَبِّي عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ٥٦

”నిశ్చయంగా, నాకూ మరియు మీకూ ప్రభువైన అల్లాహ్‌నే నేను నమ్ముకున్నాను! ఏ ప్రాణి జుట్టుకూడా ఆయనచేతిలో లేకుండాలేదు. 33 నిశ్చయంగా, నా ప్రభువే ఋజుమార్గం (సత్యం) పై ఉన్నాడు.

11:57 – فَإِن تَوَلَّوْا فَقَدْ أَبْلَغْتُكُم مَّا أُرْسِلْتُ بِهِ إِلَيْكُمْ ۚ وَيَسْتَخْلِفُ رَبِّي قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّونَهُ شَيْئًا ۚ إِنَّ رَبِّي عَلَىٰ كُلِّ شَيْءٍ حَفِيظٌ ٥٧

”ఒకవేళ మీరు వెనుదిరిగితే (మీ ఇష్టం), వాస్తవానికి నేనైతే, నాకివ్వబడిన సందేశాన్ని మీకు అందజేశాను. మరియు నా ప్రభువు మీ స్థానంలో మరొకజాతిని మీకు వారసులుగా చేయగలడు మరియు మీరు ఆయనకు ఏ మాత్రం హాని చేయలేరు. నిశ్చయంగా, నా ప్రభువే ప్రతిదానికీ రక్షకుడు.” 34

11:58 – وَلَمَّا جَاءَ أَمْرُنَا نَجَّيْنَا هُودًا وَالَّذِينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَنَجَّيْنَاهُم مِّنْ عَذَابٍ غَلِيظٍ ٥٨

మరియు మా ఆదేశం జారీ అయినప్పుడు, మా కారుణ్యంతో హూద్‌ను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని రక్షించాము మరియు వారిని ఘోర శిక్షనుండి కాపాడాము! 35

11:59 – وَتِلْكَ عَادٌ ۖ جَحَدُوا بِآيَاتِ رَبِّهِمْ وَعَصَوْا رُسُلَهُ وَاتَّبَعُوا أَمْرَ كُلِّ جَبَّارٍ عَنِيدٍ ٥٩

మరియు వీరే ‘ఆద్‌ జాతివారు! వారు తమ ప్రభువు సూచన (ఆయాత్‌)లను తిరస్కరించారు మరియు ఆయన ప్రవక్తలకు అవిధేయులయ్యారు మరియు క్రూరుడైన ప్రతి (సత్య) విరోధి ఆజ్ఞలను అనుసరించారు! 36

11:60 – وَأُتْبِعُوا فِي هَـٰذِهِ الدُّنْيَا لَعْنَةً وَيَوْمَ الْقِيَامَةِ ۗ أَلَا إِنَّ عَادًا كَفَرُوا رَبَّهُمْ ۗ أَلَا بُعْدًا لِّعَادٍ قَوْمِ هُودٍ ٦٠

మరియు ఇహలోకంలో (అల్లాహ్‌) శాపం (బహిష్కారం) వారిని వెంబడింపజేయబడింది మరియు పునరుత్థానదినమున కూడా (అల్లాహ్‌ శాపం వారిని వెంబడించగలదు). 37 వినండి! నిస్సందేహంగా, ‘ఆద్‌ జాతివారు తమ ప్రభువును తిరస్కరించారు. కావున చూశారా! హూద్‌ జాతి వారైన ‘ఆద్‌లు ఎలా (అల్లాహ్‌ కారుణ్యానికి) దూరమైపోయారో! 38 (3/8)

11:61 – وَإِلَىٰ ثَمُودَ أَخَاهُمْ صَالِحًا ۚ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّـهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُ ۖ هُوَ أَنشَأَكُم مِّنَ الْأَرْضِ وَاسْتَعْمَرَكُمْ فِيهَا فَاسْتَغْفِرُوهُ ثُمَّ تُوبُوا إِلَيْهِ ۚ إِنَّ رَبِّي قَرِيبٌ مُّجِيبٌ ٦١

  • ఇక స’మూద్‌ వారి వద్దకు వారి సహో దరుడు ‘సాలి’హ్‌ను పంపాము. అతను అన్నాడు: ”నా జాతి ప్రజలారా! అల్లాహ్‌నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి పుట్టించి, 39 దానిలో మిమ్మల్ని నివసింపజేశాడు. 40 కనుక మీరు ఆయన క్షమాభిక్ష వేడుకోండి, తరువాత ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలండి. నిశ్చయంగా, నా ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. (మీ ప్రార్థనలకు) జవాబిస్తాడు.” 41

11:62 – قَالُوا يَا صَالِحُ قَدْ كُنتَ فِينَا مَرْجُوًّا قَبْلَ هَـٰذَا ۖ أَتَنْهَانَا أَن نَّعْبُدَ مَا يَعْبُدُ آبَاؤُنَا وَإِنَّنَا لَفِي شَكٍّ مِّمَّا تَدْعُونَا إِلَيْهِ مُرِيبٍ ٦٢

వారన్నారు: ”ఓ ‘సాలి’హ్‌! ఇంతకు ముందు మేము నీపై ఆశలు పెట్టుకొనిఉన్నాము. ఏమీ? మా తండ్రి-తాతలు ఆరాధిస్తూ వచ్చిన వాటిని (దైవా లను) ఆరాధించకుండా, మమ్మల్ని ఆపదలచు కున్నావా? నీవు మాకు బోధించే (ధర్మం) విషయం గురించి వాస్తవంగా మాకు చాలా సందేహం ఉంది.”

11:63 – قَالَ يَا قَوْمِ أَرَأَيْتُمْ إِن كُنتُ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّي وَآتَانِي مِنْهُ رَحْمَةً فَمَن يَنصُرُنِي مِنَ اللَّـهِ إِنْ عَصَيْتُهُ ۖ فَمَا تَزِيدُونَنِي غَيْرَ تَخْسِيرٍ ٦٣

(‘సాలి’హ్‌) అన్నాడు: ”ఓ నాజాతి సోదరు లారా! ఏమీ? మీరు చూడరా (ఆలోచించరా)? నేను నా ప్రభువు యొక్క స్పష్టమైన (నిదర్శనంపై) ఉన్నాను. మరియు ఆయన నాకు తన కారుణ్యాన్ని ప్రసాదించాడు. ఇక నేను ఆయన (అల్లాహ్‌) ఆజ్ఞను ఉల్లంఘిస్తే, 42 అల్లాహ్‌కు విరుద్ధంగా నాకుఎవడు సహాయపడగలడు? మీరు నాకు నష్టం తప్ప మరేమి అధికం చేయటం లేదు.

11:64 – وَيَا قَوْمِ هَـٰذِهِ نَاقَةُ اللَّـهِ لَكُمْ آيَةً فَذَرُوهَا تَأْكُلْ فِي أَرْضِ اللَّـهِ وَلَا تَمَسُّوهَا بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذَابٌ قَرِيبٌ ٦٤

”మరియు నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ యొక్క ఈ ఆడ ఒంటె మీ కొరకు ఒక అద్భుత సూచన! కావున దీనిని అల్లాహ్‌ భూమిలో స్వేచ్ఛగా మేయటానికి వదలిపెట్టండి. దానికి ఎలాంటి కీడు కలిగించకండి, లేదా త్వరలోనే మిమ్మల్ని శిక్ష పట్టుకోగలదు.” 43

11:65 – فَعَقَرُوهَا فَقَالَ تَمَتَّعُوا فِي دَارِكُمْ ثَلَاثَةَ أَيَّامٍ ۖ ذَٰلِكَ وَعْدٌ غَيْرُ مَكْذُوبٍ ٦٥

అయినా వారు దానిని, వెనుక కాలి మోకాలి నరం కోసి చంపారు. అప్పుడు అతను (‘సాలి’హ్‌) వారితో అన్నాడు: ”మీరు మీ ఇండ్లలో మూడు రోజులు మాత్రమే హాయిగా గడపండి. ఇదొక వాగ్దానం, ఇది అబద్ధం కాబోదు.”

11:66 – فَلَمَّا جَاءَ أَمْرُنَا نَجَّيْنَا صَالِحًا وَالَّذِينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَمِنْ خِزْيِ يَوْمِئِذٍ ۗ إِنَّ رَبَّكَ هُوَ الْقَوِيُّ الْعَزِيزُ ٦٦

ఆ తరువాత మా ఆదేశం జారీ అయి నప్పుడు మేము ‘సాలి’హ్‌ను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని మా కారుణ్యంతో రక్షించాము. వారిని ఆ దినపు అవమానం నుండి కాపాడాము. నిశ్చయంగా నీ ప్రభువు! ఆయన మాత్రమే, మహా బలవంతుడు, సర్వ శక్తి సంపన్నుడు.

11:67 – وَأَخَذَ الَّذِينَ ظَلَمُوا الصَّيْحَةُ فَأَصْبَحُوا فِي دِيَارِهِمْ جَاثِمِينَ ٦٧

మరియు దుర్మార్గానికిపాల్పడిన వారిపై ఒక పెద్ద అరుపు (ప్రేలుడు) పడి, వారు తమ ఇండ్లలోనే చలనం లేకుండా (చచ్చి) పడిపోయారు; 44

11:68 – كَأَن لَّمْ يَغْنَوْا فِيهَا ۗ أَلَا إِنَّ ثَمُودَ كَفَرُوا رَبَّهُمْ ۗ أَلَا بُعْدًا لِّثَمُودَ ٦٨

వారెన్నడూ అక్కడ నివసించనే లేదన్న ట్లుగా. చూడండి! వాస్తవానికి, స’మూద్‌ జాతివారు తమ ప్రభువును తిరస్కరించారు. కాబట్టి చూశారా! స’మూద్‌ వారెలా దూరమైపోయారో (నశించిపోయారో)!

11:69 – وَلَقَدْ جَاءَتْ رُسُلُنَا إِبْرَاهِيمَ بِالْبُشْرَىٰ قَالُوا سَلَامًا ۖ قَالَ سَلَامٌ ۖ فَمَا لَبِثَ أَن جَاءَ بِعِجْلٍ حَنِيذٍ ٦٩

మరియు వాస్తవానికి మా దూతలు శుభవార్త తీసుకొని ఇబ్రాహీమ్ వద్దకు వచ్చారు. వారు అన్నారు: ”నీకు శాంతి కలుగుగాక (సలాం)!” అతను: ”మీకూ శాంతి కలుగుగాక (సలాం)!” అని జవాబిచ్చాడు. తరువాత అతను అతి త్వరగా, వేపిన దూడను (వారి ఆతిథ్యానికి) తీసుకొనివచ్చాడు.

11:70 – فَلَمَّا رَأَىٰ أَيْدِيَهُمْ لَا تَصِلُ إِلَيْهِ نَكِرَهُمْ وَأَوْجَسَ مِنْهُمْ خِيفَةً ۚ قَالُوا لَا تَخَفْ إِنَّا أُرْسِلْنَا إِلَىٰ قَوْمِ لُوطٍ ٧٠

కానీ వారి చేతులు దానివైపు పోకపోవటం చూసి 45 వారిని గురించి అనుమానంలో పడ్డాడు మరియు వారి నుండి అపాయం కలుగుతుందేమో నని భయపడ్డాడు! వారన్నారు: ”భయపడకు! వాస్తవానికి మేము లూ’త్‌ జాతి వైపునకు పంపబడినవారము (దూతలము).” 46

11:71 – وَامْرَأَتُهُ قَائِمَةٌ فَضَحِكَتْ فَبَشَّرْنَاهَا بِإِسْحَاقَ وَمِن وَرَاءِ إِسْحَاقَ يَعْقُوبَ ٧١

అతని (ఇబ్రాహీమ్‌) భార్య (అక్కడే) నిలబడి ఉండెను; అప్పుడామె నవ్వింది; పిదప మేము ఆమెకు ఇస్’హాఖ్‌ యొక్క మరియు ఇస్’హాఖ్‌ తరువాత య’అఖూబ్‌ యొక్క శుభవార్తను ఇచ్చాము. 47

11:72 – قَالَتْ يَا وَيْلَتَىٰ أَأَلِدُ وَأَنَا عَجُوزٌ وَهَـٰذَا بَعْلِي شَيْخًا ۖ إِنَّ هَـٰذَا لَشَيْءٌ عَجِيبٌ ٧٢

ఆమె (ఆశ్చర్యంతో) అన్నది: ”నా దౌర్భాగ్యం! నాకిప్పుడు బిడ్డ పుడుతాడా? నేను ముసలి దానిని మరియు నా ఈ భర్త కూడా వృద్ధుడు. (అలా అయితే) నిశ్చయంగా, ఇది చాలా విచిత్రమైన విషయమే!”

11:73 – قَالُوا أَتَعْجَبِينَ مِنْ أَمْرِ اللَّـهِ ۖ رَحْمَتُ اللَّـهِ وَبَرَكَاتُهُ عَلَيْكُمْ أَهْلَ الْبَيْتِ ۚ إِنَّهُ حَمِيدٌ مَّجِيدٌ ٧٣

వారన్నారు: ”అల్లాహ్‌ ఉత్తరువు విషయంలో మీరు ఆశ్చర్యపడుతున్నారా? ఓ (ఇబ్రాహీమ్‌) గృహస్థులారా! 48 మీపై అల్లాహ్‌ కారుణ్యం మరియు ఆయన శుభాశీస్సు లున్నాయి! నిశ్చయంగా, ఆయనే సర్వస్తోత్రాలకు అర్హుడు, మహత్త్వపూర్ణుడు. 49

11:74 – فَلَمَّا ذَهَبَ عَنْ إِبْرَاهِيمَ الرَّوْعُ وَجَاءَتْهُ الْبُشْرَىٰ يُجَادِلُنَا فِي قَوْمِ لُوطٍ ٧٤

అప్పుడు ఇబ్రాహీమ్‌ భయం దూరమై, అత నికి(సంతానపు) శుభవార్తఅందినతరువాత అతను లూ’త్‌ జాతివారికొరకు మాతో వాదించసాగాడు. 50

11:75 – إِنَّ إِبْرَاهِيمَ لَحَلِيمٌ أَوَّاهٌ مُّنِيبٌ ٧٥

(ఎందుకంటే) వాస్తవానికి, ఇబ్రాహీమ్‌ సహనశీలుడు, మృదుహృదయుడు (నమ్రతతో అల్లాహ్‌ను అర్థించేవాడు) మరియు పశ్చాత్తా పంతో (అల్లాహ్‌ వైపుకు) మరలేవాడు!

11:76 – يَا إِبْرَاهِيمُ أَعْرِضْ عَنْ هَـٰذَا ۖ إِنَّهُ قَدْ جَاءَ أَمْرُ رَبِّكَ ۖ وَإِنَّهُمْ آتِيهِمْ عَذَابٌ غَيْرُ مَرْدُودٍ ٧٦

(వారన్నారు): ”ఓఇబ్రాహీమ్‌! దీనిని(నీ మధ్య వర్తిత్వాన్ని) మానుకో! నిశ్చయంగా, నీ ప్రభువు ఆజ్ఞ వచ్చివున్నది. మరియు నిశ్చయంగా వారిపై ఆ శిక్ష పడటం తప్పదు; అది నివారించబడదు.”

11:77 – وَلَمَّا جَاءَتْ رُسُلُنَا لُوطًا سِيءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَقَالَ هَـٰذَا يَوْمٌ عَصِيبٌ ٧٧

మరియు మా దూతలు లూ’త్‌ వద్దకు వచ్చి నపుడు వారి రాకకు అతను, (వారిని కాపాడలేనని) దుఃఖితుడయ్యాడు. అతని హృదయం కృంగి పోయింది. అతను: ”ఈ దినం చాలా ఆందోళన కరమైనది.” అని వాపోయాడు.

11:78 – وَجَاءَهُ قَوْمُهُ يُهْرَعُونَ إِلَيْهِ وَمِن قَبْلُ كَانُوا يَعْمَلُونَ السَّيِّئَاتِ ۚ قَالَ يَا قَوْمِ هَـٰؤُلَاءِ بَنَاتِي هُنَّ أَطْهَرُ لَكُمْ ۖ فَاتَّقُوا اللَّـهَ وَلَا تُخْزُونِ فِي ضَيْفِي ۖ أَلَيْسَ مِنكُمْ رَجُلٌ رَّشِيدٌ ٧٨

మరియు అతని జాతి ప్రజలు అతనివైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారు మొదటి నుండి నీచపు పనులు చేస్తూఉండేవారు. అతను (లూ’త్‌) అన్నాడు: ”నా జాతి ప్రజలారా! ఇదిగో నా ఈ కుమార్తెలు (నా జాతి స్త్రీలు) ఉన్నారు 51 వీరు మీ కొరకు చాలా శ్రేష్ఠమైన వారు. అల్లాహ్ యందు భయ-భక్తులు కలిగి ఉండండి మరియు నా అతి థుల విషయంలో నన్ను అవమానంపాలు చేయ కండి. ఏమీ? మీలోఒక్కడైనా నీతిపరుడులేడా?” 52

11:79 – قَالُوا لَقَدْ عَلِمْتَ مَا لَنَا فِي بَنَاتِكَ مِنْ حَقٍّ وَإِنَّكَ لَتَعْلَمُ مَا نُرِيدُ ٧٩

వారన్నారు: ”నీ కూతుళ్ళు మాకు అవసరం లేదని నీకు బాగా తెలుసు కదా! మరియు నిశ్చయంగా, మేము కోరేది ఏమిటో కూడా నీకు బాగా తెలుసు!”

11:80 – قَالَ لَوْ أَنَّ لِي بِكُمْ قُوَّةً أَوْ آوِي إِلَىٰ رُكْنٍ شَدِيدٍ ٨٠

అతను (లూ’త్‌) అన్నాడు: ”మిమ్మల్ని ఎదుర్కొనే బలం నాకుంటే, లేక శరణుపొందటానికి పటిష్ఠమైన ఆధారమైనా ఉండిఉంటే ఎంత బాగుండేది?” 53

11:81 – قَالُوا يَا لُوطُ إِنَّا رُسُلُ رَبِّكَ لَن يَصِلُوا إِلَيْكَ ۖ فَأَسْرِ بِأَهْلِكَ بِقِطْعٍ مِّنَ اللَّيْلِ وَلَا يَلْتَفِتْ مِنكُمْ أَحَدٌ إِلَّا امْرَأَتَكَ ۖ إِنَّهُ مُصِيبُهَا مَا أَصَابَهُمْ ۚ إِنَّ مَوْعِدَهُمُ الصُّبْحُ ۚ أَلَيْسَ الصُّبْحُ بِقَرِيبٍ ٨١

వారు(దైవదూతలు) అన్నారు: ”ఓ లూ’త్‌! నిశ్చయంగా మేము నీప్రభువుతరఫునుండి వచ్చిన దూతలము! వారు ఏ మాత్రం నీ వద్దకు చేరలేరు. కావున కొంత రాత్రి మిగిలి ఉండగానే నీవు నీ ఇంటి వారిని తీసుకొని బయలుదేరు – నీ భార్య తప్ప – మీలో ఎవ్వరూ వెనుకకు తిరిగి చూడగూడదు. నిశ్చయంగా, వారికి ఏ ఆపద సంభవించనున్నదో అదే ఆమె (నీ భార్య)కూ సంభవిస్తుంది. 54 నిశ్చయంగా వారి నిర్ణీతకాలం ఉదయపు సమయం. ఏమీ? ఉదయం సమీపంలోనే లేదా?”

11:82 – فَلَمَّا جَاءَ أَمْرُنَا جَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهَا حِجَارَةً مِّن سِجِّيلٍ مَّنضُودٍ ٨٢

మా తీర్పుసమయం వచ్చినపుడు మేము దానిని (సోడోంను) తలక్రిందులుగా జేసి, దాని మీద మట్టితో చేసి కాల్చిన గులకరాళ్ళను ఎడతెగ కుండా కురిపించాము. 55

11:83 – مُّسَوَّمَةً عِندَ رَبِّكَ ۖ وَمَا هِيَ مِنَ الظَّالِمِينَ بِبَعِيدٍ ٨٣

అవి నీ ప్రభువు తరఫు నుండి గుర్తు వేయబడినవి. అది (ఆ శిక్ష) ఈ దుర్మార్గులకు ఎంతో దూరంలో లేదు. (1/2)

11:84 – وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا ۚ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّـهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُ ۖ وَلَا تَنقُصُوا الْمِكْيَالَ وَالْمِيزَانَ ۚ إِنِّي أَرَاكُم بِخَيْرٍ وَإِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ مُّحِيطٍ ٨٤

  • ఇక మద్‌యన్‌ వారివద్దకు వారి సహోదరు డైన షు’ఐబ్‌ను పంపాము. 56 అతను అన్నాడు: ”ఓ నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్‌నే ఆరా ధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు. కొలతల్లో మరియు తూనికల్లో తగ్గించి ఇవ్వకండి. నేను నిశ్చయంగా, మిమ్మల్ని (ఇప్పుడు) మంచి స్థితిలో చూస్తున్నాను; కాని వాస్తవానికి మీపై ఆ రోజు చుట్టుముట్టబోయే శిక్షను గురించి నేను భయపడు తున్నాను.

11:85 – وَيَا قَوْمِ أَوْفُوا الْمِكْيَالَ وَالْمِيزَانَ بِالْقِسْطِ ۖ وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ ٨٥

”మరియు ఓ నా జాతి ప్రజలారా! మీరు న్యాయంగా మరియు సరిగ్గా కొలవండి మరియు తూకం చేయండి. మరియు ప్రజలకు వారి వస్తువు లను తక్కువజేసిఇవ్వకండి. 57 మరియుభూమిలో అనర్థాన్ని, కల్లోలాన్ని వ్యాపింపజేయకండి.

11:86 – بَقِيَّتُ اللَّـهِ خَيْرٌ لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ ۚ وَمَا أَنَا عَلَيْكُم بِحَفِيظٍ ٨٦

”మీరు విశ్వాసులే అయితే, (ప్రజలకు వారి హక్కు ఇచ్చిన తరువాత) అల్లాహ్‌ మీ కొరకు మిగిల్చినదే మీకు మేలైనది. 58 మరియు నేను మీ రక్షకుడను కాను.” 59

11:87 – قَالُوا يَا شُعَيْبُ أَصَلَاتُكَ تَأْمُرُكَ أَن نَّتْرُكَ مَا يَعْبُدُ آبَاؤُنَا أَوْ أَن نَّفْعَلَ فِي أَمْوَالِنَا مَا نَشَاءُ ۖ إِنَّكَ لَأَنتَ الْحَلِيمُ الرَّشِيدُ ٨٧

వారు (వ్యంగ్యంగా) అన్నారు: ”ఓ షు’ఐబ్‌! ఏమీ? మా తండ్రి-తాతలు ఆరాధించే దేవతలను మేము వదలి పెట్టాలని, లేదా మా ధనాన్ని నీ ఇష్టప్రకారం ఖర్చుచేయాలని నీకు నీ నమా’జ్‌ నేర్పుతుందా? 60 (అయితే) నిశ్చయంగా, ఇక నీవే చాలా సహనశీలుడవు, ఉదాత్తుడవు!” 61

11:88 – قَالَ يَا قَوْمِ أَرَأَيْتُمْ إِن كُنتُ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّي وَرَزَقَنِي مِنْهُ رِزْقًا حَسَنًا ۚ وَمَا أُرِيدُ أَنْ أُخَالِفَكُمْ إِلَىٰ مَا أَنْهَاكُمْ عَنْهُ ۚ إِنْ أُرِيدُ إِلَّا الْإِصْلَاحَ مَا اسْتَطَعْتُ ۚ وَمَا تَوْفِيقِي إِلَّا بِاللَّـهِ ۚ عَلَيْهِ تَوَكَّلْتُ وَإِلَيْهِ أُنِيبُ ٨٨

అప్పుడు అతను (షు’ఐబ్‌) అన్నాడు: ”ఓ నా జాతి ప్రజలారా! ఏమీ? మీరు చూశారా (ఆలోచించారా)? ఒకవేళ నేను నా ప్రభువు తరఫు నుండి స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉండి మరియు ఆయన నాకు తన తరఫు నుండి మంచి జీవనోపాధిని కూడా ప్రసాదించినపుడు (నేను ఇలా కాకుండా మరేమి అనగలను)? నేను మిమ్మల్ని నిషేధించిన దానికి వ్యతిరేకంగా చేయదలచుకో లేదు. నేను మాత్రం మిమ్మల్ని నా శక్తి మేరకు సంస్కరించదలచుకున్నాను. నా కార్యసిధ్ధి కేవలం అల్లాహ్‌ పైననే ఆధారపడివుంది. నేను ఆయననే నమ్ముకున్నాను మరియు నేను ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలుతాను.

11:89 – وَيَا قَوْمِ لَا يَجْرِمَنَّكُمْ شِقَاقِي أَن يُصِيبَكُم مِّثْلُ مَا أَصَابَ قَوْمَ نُوحٍ أَوْ قَوْمَ هُودٍ أَوْ قَوْمَ صَالِحٍ ۚ وَمَا قَوْمُ لُوطٍ مِّنكُم بِبَعِيدٍ ٨٩

  1. ”మరియు ఓ నాజాతి ప్రజలారా! నాతో ఉన్న భేదాభిప్రాయం మిమ్మల్ని నూ’హ్‌ జాతి వారిపై, హూద్‌ జాతివారిపై లేక ‘సాలి’హ్‌ జాతి వారిపై పడినటువంటి శిక్షకు గురిచేయకూడదు సుమా! మరియు లూ’త్‌ జాతి వారు మీకు ఎంతో దూరంవారు కారు కదా! 62

11:90 – وَاسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ ۚ إِنَّ رَبِّي رَحِيمٌ وَدُودٌ ٩٠

”మరియు మీరు మీ ప్రభువు క్షమాభిక్షను కోరుకోండి. మరియు ఆయన వైపునకు పశ్చాత్తా పంతో మరలండి. నిశ్చయంగా, నా ప్రభువు అపార కరుణాప్రదాత, వాత్సల్యుడు.” 63

11:91 – قَالُوا يَا شُعَيْبُ مَا نَفْقَهُ كَثِيرًا مِّمَّا تَقُولُ وَإِنَّا لَنَرَاكَ فِينَا ضَعِيفًا ۖ وَلَوْلَا رَهْطُكَ لَرَجَمْنَاكَ ۖ وَمَا أَنتَ عَلَيْنَا بِعَزِيزٍ ٩١

వారన్నారు: ”ఓ షు’ఐబ్‌! నీవు చెప్పే మాటలు చాలా వరకు మేము గ్రహించలేక పో తున్నాము. 64 మరియు నిశ్చయంగా నీవు మాలో బలహీనుడివిగా పరిగణించబడుతున్నావు. మరియు నీ కుటుంబం వారే గనక లేకుంటే! మేము నిశ్చయంగా, నిన్ను రాళ్ళురువ్వి చంపేవారము. మరియు నీవు మాకంటే శక్తిశాలివి కావు.”

11:92 – قَالَ يَا قَوْمِ أَرَهْطِي أَعَزُّ عَلَيْكُم مِّنَ اللَّـهِ وَاتَّخَذْتُمُوهُ وَرَاءَكُمْ ظِهْرِيًّا ۖ إِنَّ رَبِّي بِمَا تَعْمَلُونَ مُحِيطٌ ٩٢

అతను అన్నాడు: ”ఓ నాజాతి ప్రజలారా! ఏమీ? నా కుటుంబం మీకు అల్లాహ్‌ కంటే, ఎక్కువ గౌరవనీయమైనదా? మరియు మీరు ఆయన (అల్లాహ్‌)ను మీ వీపుల వెనుకకు నెట్టుతారా? నిశ్చయంగా, నా ప్రభువు మీరు చేసే పనులను ఆవరించి ఉన్నాడు.

11:93 – وَيَا قَوْمِ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنِّي عَامِلٌ ۖ سَوْفَ تَعْلَمُونَ مَن يَأْتِيهِ عَذَابٌ يُخْزِيهِ وَمَنْ هُوَ كَاذِبٌ ۖ وَارْتَقِبُوا إِنِّي مَعَكُمْ رَقِيبٌ ٩٣

”మరియు ఓ నా జాతి ప్రజలారా! మీ శక్తి మేరకు మీరు చేసేది చేయండి, నిశ్చయంగా, (నా శక్తి మేరకు) నేను కూడా చేస్తాను. అవమాన కరమైన శిక్ష ఎవరికి పడుతుందో, అసత్యవాది ఎవడో, మీరు మున్ముందు తెలుసుకోగలరు. మరియు మీరు నిరీక్షించండి, నిశ్చయంగా, మీతో బాటు నేను కూడా నిరీక్షిస్తాను.”

11:94 – وَلَمَّا جَاءَ أَمْرُنَا نَجَّيْنَا شُعَيْبًا وَالَّذِينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَأَخَذَتِ الَّذِينَ ظَلَمُوا الصَّيْحَةُ فَأَصْبَحُوا فِي دِيَارِهِمْ جَاثِمِينَ ٩٤

చివరకు మా ఆదేశం వచ్చినప్పుడు, మేము షు’ఐబ్‌ను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని మా కారుణ్యంతో రక్షించాము. మరియు దుర్మార్గులైన వారిపై ఒక తీవ్రమైన అరుపు (ధ్వని) విరుచుకుపడింది. కాబట్టి వారు తమ ఇండ్లలోనే చలనం లేకుండా (చచ్చి) పడిపోయారు –

11:95 – كَأَن لَّمْ يَغْنَوْا فِيهَا ۗ أَلَا بُعْدًا لِّمَدْيَنَ كَمَا بَعِدَتْ ثَمُودُ ٩٥

వారక్కడ ఎన్నడూ నివసించనే లేదన్నట్లుగా! ఈ విధంగా స’మూద్‌ జాతివారు లేకుండా పోయినట్లు, మద్‌ యన్‌ జాతివారు కూడా లేకుండా (నశించి) పోయారు! 65

11:96 – وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِآيَاتِنَا وَسُلْطَانٍ مُّبِينٍ ٩٦

మరియు నిశ్చయంగా, మేము మూసాను కూడా మా సూచనలతో మరియు స్పష్టమైన ప్రమాణంతో పంపాము –

11:97 – إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ فَاتَّبَعُوا أَمْرَ فِرْعَوْنَ ۖ وَمَا أَمْرُ فِرْعَوْنَ بِرَشِيدٍ ٩٧

ఫిర్‌’ఔన్‌ మరియు అతని నాయకుల వద్దకు! కానీ వారు ఫిర్‌’ఔన్‌ ఆజ్ఞలనే అనుస రించారు. మరియు ఫిర్‌’ఔన్‌ ఆజ్ఞ సరైనదికాదు.

11:98 – يَقْدُمُ قَوْمَهُ يَوْمَ الْقِيَامَةِ فَأَوْرَدَهُمُ النَّارَ ۖ وَبِئْسَ الْوِرْدُ الْمَوْرُودُ ٩٨

పునరుత్థానదినమున అతడు (ఫిర్‌’ఔన్‌) తన జాతివారికి మున్ముందుగా ఉండి, వారిని నరకాగ్నిలోకి తీసుకొనిపోతాడు మరియు అది ప్రవేశించే వారికి ఎంత చెడ్డ గమ్యస్థానం.

11:99 – وَأُتْبِعُوا فِي هَـٰذِهِ لَعْنَةً وَيَوْمَ الْقِيَامَةِ ۚ بِئْسَ الرِّفْدُ الْمَرْفُودُ ٩٩

మరియు వారు ఈ లోకంలో శాపంతో వెంబడించబడ్డారు మరియు పునరుత్థాన దిన మున కూడా (బహిష్కరించబడతారు). ఎంత చెడ్డ బహుమానం (వారికి) బహూకరించబడుతుంది.

11:100 – ذَٰلِكَ مِنْ أَنبَاءِ الْقُرَىٰ نَقُصُّهُ عَلَيْكَ ۖ مِنْهَا قَائِمٌ وَحَصِيدٌ ١٠٠

ఇవి కొన్ని(ప్రాచీన)పట్టణాలగాథలు వీటిని మేము నీకువినిపిస్తున్నాము. వాటిలో కొన్ని నిలిచి (మిగిలి) ఉన్నాయి. మరికొన్ని పంటపొలాల మాదిరిగా కోయబడ్డాయి (నిర్మూలించబడ్డాయి).

11:101 – وَمَا ظَلَمْنَاهُمْ وَلَـٰكِن ظَلَمُوا أَنفُسَهُمْ ۖ فَمَا أَغْنَتْ عَنْهُمْ آلِهَتُهُمُ الَّتِي يَدْعُونَ مِن دُونِ اللَّـهِ مِن شَيْءٍ لَّمَّا جَاءَ أَمْرُ رَبِّكَ ۖ وَمَا زَادُوهُمْ غَيْرَ تَتْبِيبٍ ١٠١

మరియు మేము వారికెలాంటి అన్యాయం చేయలేదు. కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. నీ ప్రభువు ఆజ్ఞ వచ్చినప్పుడు – అల్లాహ్‌ను వదలి – వారు ఏ దేవతలనైతే ప్రార్థించే వారో! వారు, వారికి ఏ విధంగానూ సహాయపడలేక పోయారు. మరియు వారు, వారి వినాశం తప్ప మరేమీ అధికం చేయలేదు.

11:102 – وَكَذَٰلِكَ أَخْذُ رَبِّكَ إِذَا أَخَذَ الْقُرَىٰ وَهِيَ ظَالِمَةٌ ۚ إِنَّ أَخْذَهُ أَلِيمٌ شَدِيدٌ ١٠٢

మరియు ఈ విధంగా నీ ప్రభువు దుర్మార్గులైన నగర (వాసులను) – పట్టుకొన (శిక్షించ) దలచితే – ఇలాగే పట్టుకొని (శిక్షిస్తాడు). నిశ్చయంగా, ఆయన పట్టు చాలా బాధాకరమైనది, ఎంతో తీవ్రమైనది.

11:103 – إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّمَنْ خَافَ عَذَابَ الْآخِرَةِ ۚ ذَٰلِكَ يَوْمٌ مَّجْمُوعٌ لَّهُ النَّاسُ وَذَٰلِكَ يَوْمٌ مَّشْهُودٌ ١٠٣

నిశ్చయంగా, ఇందులో పరలోక శిక్షకు భయపడే వారికి ఒక సూచన ఉంది. అది సర్వ మానవులను సమావేశపరిచే రోజు! ఆ దినమున అందరూ హాజరవుతారు.

11:104 – وَمَا نُؤَخِّرُهُ إِلَّا لِأَجَلٍ مَّعْدُودٍ ١٠٤

మరియు మేము దానిని కేవలం ఒక నియమిత కాలం వరకు మాత్రమే ఆపి ఉన్నాము.

11:105 – يَوْمَ يَأْتِ لَا تَكَلَّمُ نَفْسٌ إِلَّا بِإِذْنِهِ ۚ فَمِنْهُمْ شَقِيٌّ وَسَعِيدٌ ١٠٥

ఆదినం వచ్చినప్పుడు, ఆయన (అల్లాహ్‌) సెలవులేనిదే, ఏప్రాణి కూడా మాట్లాడజాలదు. వారిలో కొందరు దౌర్భాగ్యులుంటారు మరికొందరు భాగ్యవంతు లుంటారు.

11:106 – فَأَمَّا الَّذِينَ شَقُوا فَفِي النَّارِ لَهُمْ فِيهَا زَفِيرٌ وَشَهِيقٌ ١٠٦

దౌర్భాగ్యులైన వారు నరకాగ్నిలో చేరు తారు, అక్కడ వారు దుఃఖం వల్ల మూలుగుతూ ఉంటారు మరియు వెక్కివెక్కి ఏడుస్తూ ఉంటారు.

11:107 – خَالِدِينَ فِيهَا مَا دَامَتِ السَّمَاوَاتُ وَالْأَرْضُ إِلَّا مَا شَاءَ رَبُّكَ ۚ إِنَّ رَبَّكَ فَعَّالٌ لِّمَا يُرِيدُ ١٠٧

వారందులో శాశ్వతంగా భూమ్యాకాశాలు ఉన్నంత వరకు ఉంటారు. 66 నీ ప్రభువు (మరొకటి) కోరితే తప్ప! నిశ్చయంగా, నీ ప్రభువు తానుకోరిందే చేసేవాడు. (5/8)

11:108 – وَأَمَّا الَّذِينَ سُعِدُوا فَفِي الْجَنَّةِ خَالِدِينَ فِيهَا مَا دَامَتِ السَّمَاوَاتُ وَالْأَرْضُ إِلَّا مَا شَاءَ رَبُّكَ ۖ عَطَاءً غَيْرَ مَجْذُوذٍ ١٠٨

  • ఇక భాగ్యవంతులైన వారు, భూమ్యా- కాశాలు ఉన్నంత వరకు స్వర్గంలో శాశ్వతంగా ఉంటారు. నీ ప్రభువు (మరొకటి) కోరితే తప్ప! ఇదొక ఎడతెగని బహుమానం. 67

11:109 – فَلَا تَكُ فِي مِرْيَةٍ مِّمَّا يَعْبُدُ هَـٰؤُلَاءِ ۚ مَا يَعْبُدُونَ إِلَّا كَمَا يَعْبُدُ آبَاؤُهُم مِّن قَبْلُ ۚ وَإِنَّا لَمُوَفُّوهُمْ نَصِيبَهُمْ غَيْرَ مَنقُوصٍ ١٠٩

కావున (ఓ ప్రవక్తా!) వారు ఆరాధించే వాటిని గురించి నీవు సందేహంలో పడకు. పూర్వం నుండి వారి తాత-ముత్తాతలు ఆరాధించినట్లుగానే వారుకూడా(అంధులై) ఆరాధిస్తున్నారు. మరియు మేము నిశ్చయంగా వారి భాగపు (శిక్షను) ఏ మాత్రం తగ్గించకుండా వారికి పూర్తిగా నొసంగుతాము.

11:110 – وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ فَاخْتُلِفَ فِيهِ ۚ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ لَقُضِيَ بَيْنَهُمْ ۚ وَإِنَّهُمْ لَفِي شَكٍّ مِّنْهُ مُرِيبٍ ١١٠

మరియు వాస్తవంగా, మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము. పిదప అందులో అభిప్రాయభేదాలు వచ్చాయి. నీ ప్రభువు మాట (ఆజ్ఞ) ముందుగానే నిర్ణయించబడి ఉండకుంటే, వారి తీర్పు ఎప్పుడో జరిగిఉండేది. మరియు నిశ్చయంగా, వారు దీనిని గురించి సంశయంలో, సందేహంలో పడివున్నారు.

11:111 – وَإِنَّ كُلًّا لَّمَّا لَيُوَفِّيَنَّهُمْ رَبُّكَ أَعْمَالَهُمْ ۚ إِنَّهُ بِمَا يَعْمَلُونَ خَبِيرٌ ١١١

మరియు నిశ్చయంగా నీ ప్రభువు ప్రతి ఒక్కరి కర్మల ప్రతిఫలాన్ని వారికి తప్పకుండా పూర్తిగా ఇచ్చివేస్తాడు. నిశ్చయంగా, ఆయన వారి కర్మలను బాగా ఎరుగును.

11:112 – فَاسْتَقِمْ كَمَا أُمِرْتَ وَمَن تَابَ مَعَكَ وَلَا تَطْغَوْا ۚ إِنَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ١١٢

కనుక (ఓప్రవక్తా!) నీవూ మరియు పశ్చాత్తా పపడి (ఆయన వైపుకు మరలిన) నీ సహచరులూ, నీకు ఆజ్ఞ ఇవ్వబడిన విధంగా ఋజుమార్గంపై స్థిరంగా ఉండండి, హద్దులు మీరకండి. నిశ్చయంగా, ఆయన మీ కర్మలన్నీ చూస్తున్నాడు.

11:113 – وَلَا تَرْكَنُوا إِلَى الَّذِينَ ظَلَمُوا فَتَمَسَّكُمُ النَّارُ وَمَا لَكُم مِّن دُونِ اللَّـهِ مِنْ أَوْلِيَاءَ ثُمَّ لَا تُنصَرُونَ ١١٣

దుర్మార్గులవైపునకు మీరుమొగ్గకండి, నర కాగ్నిలో చిక్కుకుంటారు. ఆ తరువాత అల్లాహ్‌ తప్ప మరెవ్వరూ మీకు సంరక్షకులూ ఉండరు. అప్పుడు మీకెవ్వరి సహాయమూ లభించదు.

11:114 – وَأَقِمِ الصَّلَاةَ طَرَفَيِ النَّهَارِ وَزُلَفًا مِّنَ اللَّيْلِ ۚ إِنَّ الْحَسَنَاتِ يُذْهِبْنَ السَّيِّئَاتِ ۚ ذَٰلِكَ ذِكْرَىٰ لِلذَّاكِرِينَ ١١٤

మరియు దినపుచివరి రెండు భాగాల్లోనూ మరియు రాత్రిపూట కొంత భాగంలో కూడా నమా’జ్‌ సలపండి. 68 నిశ్చయంగా సత్కార్యాలు దుష్కార్యాలను దూరంచేస్తాయి. జ్ఞాపకం ఉంచుకునేవారికి ఇది ఒక ఉపదేశం (జ్ఞాపిక).

11:115 – وَاصْبِرْ فَإِنَّ اللَّـهَ لَا يُضِيعُ أَجْرَ الْمُحْسِنِينَ ١١٥

మరియు సహనంవహించు; నిశ్చయంగా, అల్లాహ్‌ సజ్జనుల ప్రతిఫలాన్ని వ్యర్థంచేయడు.

11:116 – فَلَوْلَا كَانَ مِنَ الْقُرُونِ مِن قَبْلِكُمْ أُولُو بَقِيَّةٍ يَنْهَوْنَ عَنِ الْفَسَادِ فِي الْأَرْضِ إِلَّا قَلِيلًا مِّمَّنْ أَنجَيْنَا مِنْهُمْ ۗ وَاتَّبَعَ الَّذِينَ ظَلَمُوا مَا أُتْرِفُوا فِيهِ وَكَانُوا مُجْرِمِينَ ١١٦

మీకు పూర్వం గతించిన తరాలవారిలో, భూమిలో కల్లోలం రేకెత్తించకుండా నిషేధించే సజ్జనులు ఎందుకులేరు? కాని అలాంటి వారు కొందరు మాత్రమే ఉండేవారు! వారిని మేము అలాంటి వారి (దుర్మార్గుల) నుండి కాపాడాము. మరియు దుర్మార్గు లైనవారు ఐహిక సుఖాలకు లోనయ్యారు మరియు వారు అపరాధులు.

11:117 – وَمَا كَانَ رَبُّكَ لِيُهْلِكَ الْقُرَىٰ بِظُلْمٍ وَأَهْلُهَا مُصْلِحُونَ ١١٧

మరియు వాటిలో నివసించే ప్రజలు సద్వర్తనులై ఉన్నంత వరకు, అలాంటి నగరాలను నీ ప్రభువు అన్యాయంగా నాశనం చేసేవాడు కాడు.

11:118 – وَلَوْ شَاءَ رَبُّكَ لَجَعَلَ النَّاسَ أُمَّةً وَاحِدَةً ۖ وَلَا يَزَالُونَ مُخْتَلِفِينَ ١١٨

మరియు నీ ప్రభువు సంకల్పిస్తే, సర్వ మానవులను (ఒకే ధర్మాన్ని అవలంబించే) ఒకే ఒక్క సంఘంగా చేసేవాడు. అయినా వారు అభి ప్రాయ భేదాలు లేకుండా ఉండలేక పోయేవారు 69

11:119 – إِلَّا مَن رَّحِمَ رَبُّكَ ۚ وَلِذَٰلِكَ خَلَقَهُمْ ۗ وَتَمَّتْ كَلِمَةُ رَبِّكَ لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ أَجْمَعِينَ ١١٩

నీ ప్రభువు కరుణించినవాడు తప్ప! 70 మరియు దాని కొరకే ఆయన వారిని సృష్టించాడు. 71 మరియు నీ ప్రభువు: ”నేను జిన్నాతులు మరియు మానవులు అందరితో నరకాన్ని నింపుతాను!” అని అన్నమాట నెరవేరుతుంది. 72

11:120 – وَكُلًّا نَّقُصُّ عَلَيْكَ مِنْ أَنبَاءِ الرُّسُلِ مَا نُثَبِّتُ بِهِ فُؤَادَكَ ۚ وَجَاءَكَ فِي هَـٰذِهِ الْحَقُّ وَمَوْعِظَةٌ وَذِكْرَىٰ لِلْمُؤْمِنِينَ ١٢٠

మరియు (ఓ ప్రవక్తా!) నీ హృదయాన్ని స్థిరపరచటానికి, మేము ప్రవక్తల గాథలను నీకు వినిపిస్తున్నాము. మరియు ఇందు (ఈ సూరహ్‌) లో నీకు సత్యం వచ్చింది మరియు విశ్వాసులకు హితబోధ మరియు జ్ఞాపిక.

11:121 – وَقُل لِّلَّذِينَ لَا يُؤْمِنُونَ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنَّا عَامِلُونَ ١٢١

మరియు విశ్వసించని వారితో ఇలా అను: ”మీరు మీ శక్తిమేరకు మీ పనులు చేయండి. నిశ్చయంగా మేము కూడా మా శక్తిమేరకు మా పనులు చేస్తాము.

11:122 – وَانتَظِرُوا إِنَّا مُنتَظِرُونَ ١٢٢

”మరియు మీరు వేచి ఉండండి; మేము కూడా వేచి ఉంటాము.”

11:123 – وَلِلَّـهِ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَإِلَيْهِ يُرْجَعُ الْأَمْرُ كُلُّهُ فَاعْبُدْهُ وَتَوَكَّلْ عَلَيْهِ ۚ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ ١٢٣

మరియు ఆకాశాల యొక్క మరియు భూమి యొక్క సర్వ అగోచరవిషయాలు కేవలం అల్లాహ్‌కే తెలుసు 73 మరియు సర్వవిషయాలు ఆయనవద్దకే మరలింపబడతాయి కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయననే నమ్ముకోండి. మరియు మీరు చేసే కర్మలు నీ ప్రభువు ఎరుగకుండా లేడు.

సూరహ్‌ యూసుఫ్‌ – ఈ సూరహ్, 10 నుండి 15వ సూరాహ్‌ల సమూహంలో 3వది. ఇది చివరి మక్కహ్ కాలపు సూరహ్‌. ఇది ఒక ప్రవక్తయొక్క పూర్తిగాథను ఒకేచోట వివరించిన ఒకేఒక్క సూరహ్‌. దీని ద్వారా కష్టాలలో సహనం వహించాలి, అల్లాహ్‌ (సు.త.) కోరినదే జరుగుతుంది, సత్యానిదే అంతిమ విజయం మరియు ప్రవక్తల కలలు నిజమవుతాయి అనే విషయాలు తెలుస్తున్నాయి. ఇబ్రాహీం, ఇస్‌’హాఖ్‌, య’అఖూబ్‌ (ఇస్రాయీ’ల్‌) ‘అలైహిమ్‌ అస్సలామ్‌ల తరువాత వచ్చిన ప్రవక్త యూసుఫ్‌ (‘అ.స.). ఇతని తరువాత కూడా ఇస్రాయీ’ల్‌ సంతతిలో చాలా మంది ప్రవక్తలు వచ్చారు. ఇది సూరహ్‌ హూద్‌ (11) తరువాత అవతరింపజేయబడింది. 111 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 4వ ఆయత్‌లో మొదటిసారి వచ్చింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 12:1 – الر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ ١

అలిఫ్‌-లామ్‌-రా. ఇవి స్పష్టమైన గ్రంథ ఆయతులు.

12:2 – إِنَّا أَنزَلْنَاهُ قُرْآنًا عَرَبِيًّا لَّعَلَّكُمْ تَعْقِلُونَ ٢

వాస్తవంగా, మీరు బాగా అర్థం చేసుకోవాలని, మేము ఈ ఖుర్‌ఆన్‌ను అరబ్బీ భాషలో అవతరింప జేశాము. 1

12:3 – نَحْنُ نَقُصُّ عَلَيْكَ أَحْسَنَ الْقَصَصِ بِمَا أَوْحَيْنَا إِلَيْكَ هَـٰذَا الْقُرْآنَ وَإِن كُنتَ مِن قَبْلِهِ لَمِنَ الْغَافِلِينَ ٣

(ఓ ప్రవక్తా!) మేము ఈ ఖుర్‌ఆన్‌ ద్వారా అవతరింపజేసిన కథలలో ఉత్తమమైన గాథను నీకు వినిపించబోతున్నాము మరియు ఇంతకు ముందు నీవు దీనిని ఎరుగవు. 2

12:4 – إِذْ قَالَ يُوسُفُ لِأَبِيهِ يَا أَبَتِ إِنِّي رَأَيْتُ أَحَدَ عَشَرَ كَوْكَبًا وَالشَّمْسَ وَالْقَمَرَ رَأَيْتُهُمْ لِي سَاجِدِينَ ٤

(జ్ఞాపకం చేసుకోండి) యూసుఫ్‌ తన తండ్రితో: ”ఓ నాన్నా! నేను వాస్తవంగా (కలలో) పదకొండు నక్షత్రాలను, సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి చూశాను; వాటిని నా ముందు సాష్టాంగ పడుతున్నట్లు చూశాను.” అని అన్నప్పుడు!

12:5 – قَالَ يَا بُنَيَّ لَا تَقْصُصْ رُؤْيَاكَ عَلَىٰ إِخْوَتِكَ فَيَكِيدُوا لَكَ كَيْدًا ۖ إِنَّ الشَّيْطَانَ لِلْإِنسَانِ عَدُوٌّ مُّبِينٌ ٥

(అతని తండ్రి) అన్నాడు: ”ఓ నా చిన్న ప్రియ కుమారుడా! నీ స్వప్నాన్ని నీ సోదరులకు తెలుపకు. ఎందుకంటే వారు నీకు విరుధ్ధంగా కుట్ర పన్నవచ్చు! 3 నిశ్చయంగా, షై’తాన్‌ మానవునికి బహిరంగ శత్రువు.

12:6 – وَكَذَٰلِكَ يَجْتَبِيكَ رَبُّكَ وَيُعَلِّمُكَ مِن تَأْوِيلِ الْأَحَادِيثِ وَيُتِمُّ نِعْمَتَهُ عَلَيْكَ وَعَلَىٰ آلِ يَعْقُوبَ كَمَا أَتَمَّهَا عَلَىٰ أَبَوَيْكَ مِن قَبْلُ إِبْرَاهِيمَ وَإِسْحَاقَ ۚ إِنَّ رَبَّكَ عَلِيمٌ حَكِيمٌ ٦

”మరియు ఆ విధంగానే జరుగుతుంది! నీ ప్రభువు నిన్ను ఎన్నుకుంటాడు మరియు నీకు సంఘటనల (స్వప్నాల) గూడార్థవివరణ కూడా నేర్పుతాడు మరియు నీ పూర్వికులైన (తాత- ముత్తాతలైన), ఇబ్రాహీమ్‌ మరియు ఇస్‌’హాఖ్‌లకు ప్రసాదించినట్లు నీకూ మరియు య’అఖూబ్‌ సంతతివారికి సంపూర్ణంగా తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. నిశ్చయంగా, నీ ప్రభువు సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.” (3/4)

12:7 – لَّقَدْ كَانَ فِي يُوسُفَ وَإِخْوَتِهِ آيَاتٌ لِّلسَّائِلِينَ ٧

  • వాస్తవానికి యూసుఫ్‌ మరియు అతని సోద రుల(గాథలో)అడిగేవారికి ఎన్నో సూచనలున్నాయి.

12:8 – إِذْ قَالُوا لَيُوسُفُ وَأَخُوهُ أَحَبُّ إِلَىٰ أَبِينَا مِنَّا وَنَحْنُ عُصْبَةٌ إِنَّ أَبَانَا لَفِي ضَلَالٍ مُّبِينٍ ٨

అప్పుడు వారు (యూసుఫ్‌ సోదరులు పరస్పరం) ఇలా అనుకున్నారు: ”మనది ఒక బలమైన వర్గం, అయినప్పటికీ యూసుఫ్‌ మరియు అతని సోదరుడు (బెన్యామీన్‌) అంటే మన తండ్రికి మనకంటే ఎక్కువ ప్రేమ. 4 నిశ్చయంగా, మన తండ్రి స్పష్టమైన తప్పుడు అభిప్రాయంలో ఉన్నాడు.”

12:9 – اقْتُلُوا يُوسُفَ أَوِ اطْرَحُوهُ أَرْضًا يَخْلُ لَكُمْ وَجْهُ أَبِيكُمْ وَتَكُونُوا مِن بَعْدِهِ قَوْمًا صَالِحِينَ ٩

(వారిలో ఒకడు ఇలా అన్నాడు): ”యూసుఫ్‌ను చంపండి, లేదా అతణ్ణి ఎక్కడైనా ఒంటరిగా వదలిపెట్టండి. ఇలా చేసినట్లయితే మీ తండ్రి ధ్యాస (ప్రేమ) కేవలం మీ వైపునకే మరలు తుంది. ఆ తరువాత మీరు (ప్రాయశ్చిత్తం చేసి) సద్వర్తనులుగా ప్రవర్తించండి.”

12:10 – قَالَ قَائِلٌ مِّنْهُمْ لَا تَقْتُلُوا يُوسُفَ وَأَلْقُوهُ فِي غَيَابَتِ الْجُبِّ يَلْتَقِطْهُ بَعْضُ السَّيَّارَةِ إِن كُنتُمْ فَاعِلِينَ ١٠

వారిలో మరొకడు అన్నాడు: ”యూసుఫ్‌ను చంపకండి. మీరు (ఏదైనా) చేయాలనే అనుకుంటే! అతనిని ఒక లోతైన బావిలో పడవేయండి, 5 ఎవ రైనా బాటసారులు అతనిని తీసుకొని పోవచ్చు!”

12:11 – قَالُوا يَا أَبَانَا مَا لَكَ لَا تَأْمَنَّا عَلَىٰ يُوسُفَ وَإِنَّا لَهُ لَنَاصِحُونَ ١١

వారు అన్నారు: ”నాన్నా నీవు యూసుఫ్‌ విషయంలో మమ్మల్ని ఎందుకు నమ్మవు? వాస్తవానికి మేము అతని శ్రేయోభిలాషులము!

12:12 – أَرْسِلْهُ مَعَنَا غَدًا يَرْتَعْ وَيَلْعَبْ وَإِنَّا لَهُ لَحَافِظُونَ ١٢

”రేపు అతనిని మావెంట పంపండి, అతడు అక్కడ ఆడుకొని సంతోషపడతాడు. మరియు మేము తప్పక అతనికి రక్షకులుగా ఉంటాము.”

12:13 – قَالَ إِنِّي لَيَحْزُنُنِي أَن تَذْهَبُوا بِهِ وَأَخَافُ أَن يَأْكُلَهُ الذِّئْبُ وَأَنتُمْ عَنْهُ غَافِلُونَ ١٣

(వారితండ్రి య’అఖూబ్‌) అన్నాడు: ‘మీరు అతనినితీసుకొనిపోవటం నిశ్చయంగా నన్నుచింతా క్రాంతునిగాచేస్తోంది. మీరుఅతని విషయంలో ఏమరు పాటులో ఉన్నప్పుడు, అతనిని ఏదైనా తోడేలు తినివేస్తుందేమోనని నేను భయపడుతున్నాను.”

12:14 – قَالُوا لَئِنْ أَكَلَهُ الذِّئْبُ وَنَحْنُ عُصْبَةٌ إِنَّا إِذًا لَّخَاسِرُونَ ١٤

వారన్నారు: ”మేము ఇంత పెద్దబలగం ఉన్నప్పటికీ అతనిని తోడేలుతినివేస్తే! నిశ్చ యంగా మేము పనికిరాని(చేతగాని) వారమే కదా!”

12:15 – فَلَمَّا ذَهَبُوا بِهِ وَأَجْمَعُوا أَن يَجْعَلُوهُ فِي غَيَابَتِ الْجُبِّ ۚ وَأَوْحَيْنَا إِلَيْهِ لَتُنَبِّئَنَّهُم بِأَمْرِهِمْ هَـٰذَا وَهُمْ لَا يَشْعُرُونَ ١٥

ఆ పిదప వారు అతనిని తీసుకొని పోయి ఒక లోతు బావిలో పడవేద్దామని నిర్ణయించు కున్నారు. అప్పుడు మేము అతనికి దివ్యజ్ఞానం (వ’హీ) ద్వారా ఇలాతెలిపాము: ”నీవు (ఒకరోజు) వారికి ఈ కార్యాన్ని జ్ఞప్తికితెచ్చే సమయం వస్తుంది మరియు వారు నిన్ను గుర్తుపట్టలేరు.” 6

12:16 – وَجَاءُوا أَبَاهُمْ عِشَاءً يَبْكُونَ ١٦

మరియు ‘ఇషా సమయంలో (చీకటి పడ్డ తరువాత) వారు తమ తండ్రి వద్దకు ఏడ్చు కుంటూ వచ్చారు.

12:17 – قَالُوا يَا أَبَانَا إِنَّا ذَهَبْنَا نَسْتَبِقُ وَتَرَكْنَا يُوسُفَ عِندَ مَتَاعِنَا فَأَكَلَهُ الذِّئْبُ ۖ وَمَا أَنتَ بِمُؤْمِنٍ لَّنَا وَلَوْ كُنَّا صَادِقِينَ ١٧

వారన్నారు: ”ఓ నాన్నా! మేము పరుగు పందాలలో మునిగిపోయాము. మరియు యూసుఫ్‌ను మేము మా సామాగ్రివద్ద విడిచి వెళ్లాము; అప్పుడు ఒక తోడేలు అతనిని తినిపోయింది. మరియు మేము సత్యం పలికినా నీవు మా మాట నమ్మకపోవచ్చు!”

12:18 – وَجَاءُوا عَلَىٰ قَمِيصِهِ بِدَمٍ كَذِبٍ ۚ قَالَ بَلْ سَوَّلَتْ لَكُمْ أَنفُسُكُمْ أَمْرًا ۖ فَصَبْرٌ جَمِيلٌ ۖ وَاللَّـهُ الْمُسْتَعَانُ عَلَىٰ مَا تَصِفُونَ ١٨

వారు అతనిఅంగికి బూటకపురక్తాన్ని పూసి తెచ్చారు. (వారి తండ్రి) అన్నాడు: ”మీ ఆత్మ మిమ్మల్ని (ఒకఘోర) కార్యాన్ని (విషయాన్ని), తేలికైనదిగా అనిపించేటట్లు చేసింది. ఇక (నా కొరకు) సహనమే మేలైనది. మరియు మీరు చెప్పే విషయంలో అల్లాహ్‌ సహాయమే నేను కోరేది!”

12:19 – وَجَاءَتْ سَيَّارَةٌ فَأَرْسَلُوا وَارِدَهُمْ فَأَدْلَىٰ دَلْوَهُ ۖ قَالَ يَا بُشْرَىٰ هَـٰذَا غُلَامٌ ۚ وَأَسَرُّوهُ بِضَاعَةً ۚ وَاللَّـهُ عَلِيمٌ بِمَا يَعْمَلُونَ ١٩

మరియు అటువైపునకు ఒక బాటసారుల బృందం వచ్చింది. వారు తమ నీరుతెచ్చే మనిషిని పంపారు, అతడు (బావిలో) బొక్కెనను దింపాడు. (అతనికి బావిలో ఒక బాలుడు కనిపించగా) అన్నాడు: ”ఇదిగో శుభవార్త! ఇక్కడ ఒక బాలు డున్నాడు.” వారు అతనిని ఒక వ్యాపార సరుకుగా (బానిసగా) భావించి దాచుకున్నారు. మరియు వారు చేస్తున్నదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.

12:20 – وَشَرَوْهُ بِثَمَنٍ بَخْسٍ دَرَاهِمَ مَعْدُودَةٍ وَكَانُوا فِيهِ مِنَ الزَّاهِدِينَ ٢٠

మరియు వారు స్వల్పధరకు – కొన్ని దిర్హములకు – మాత్రమే అతనిని అమ్ము కున్నారు. 7 మరియు అసలు వారు అతనికి ఎలాంటి ప్రాధాన్యతనివ్వలేదు.

12:21 – وَقَالَ الَّذِي اشْتَرَاهُ مِن مِّصْرَ لِامْرَأَتِهِ أَكْرِمِي مَثْوَاهُ عَسَىٰ أَن يَنفَعَنَا أَوْ نَتَّخِذَهُ وَلَدًا ۚ وَكَذَٰلِكَ مَكَّنَّا لِيُوسُفَ فِي الْأَرْضِ وَلِنُعَلِّمَهُ مِن تَأْوِيلِ الْأَحَادِيثِ ۚ وَاللَّـهُ غَالِبٌ عَلَىٰ أَمْرِهِ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ ٢١

మరియు అతనిని కొన్న ఈజిప్టు (మి’స్ర్‌) వాసి తన భార్యతో 8 అన్నాడు: ”ఇతనిని గౌరవంగా ఉంచుకో! బహుశా ఇతను మనకు లాభదాయకుడు కావచ్చు! లేదా మనం ఇతనిని కొడుకుగా చేసుకోవచ్చు!” మరియు ఈ విధంగా మేము యూసుఫ్‌ను భూమిపై స్థానమిచ్చి అతనికి సంఘటనల గూఢార్థాన్ని (స్వప్నాల భావాన్ని) తెలియజేసే (విద్యను) నేర్పాము. అల్లాహ్‌ తన కార్యాన్ని పూర్తి చేయగల శక్తి కలిగి ఉన్నాడు, కాని చాలా మందికి ఇది తెలియదు.

12:22 – وَلَمَّا بَلَغَ أَشُدَّهُ آتَيْنَاهُ حُكْمًا وَعِلْمًا ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ ٢٢

మరియు అతను తన నిండు యవ్వనానికి చేరుకున్నపుడు మేము అతనికివివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలము నొసంగుతాము.

12:23 – وَرَاوَدَتْهُ الَّتِي هُوَ فِي بَيْتِهَا عَن نَّفْسِهِ وَغَلَّقَتِ الْأَبْوَابَ وَقَالَتْ هَيْتَ لَكَ ۚ قَالَ مَعَاذَ اللَّـهِ ۖ إِنَّهُ رَبِّي أَحْسَنَ مَثْوَايَ ۖ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ ٢٣

మరియు అతను నివసించే ఇంటి స్త్రీ అతనిని మోహించి అతని మనస్సును చలింప జేయగోరి తలుపులు మూసి, అతనితో: ”(నా వద్దకు) రా!” అని పిలిచింది. అతను: ”నేను అల్లాహ్‌ శరణు కోరుతున్నాను! నిశ్చయంగా ఆయన! నా ప్రభువు, నాకు మంచి స్థానాన్ని ప్రసాదించాడు. నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు.” అని పలికాడు.

12:24 – وَلَقَدْ هَمَّتْ بِهِ ۖ وَهَمَّ بِهَا لَوْلَا أَن رَّأَىٰ بُرْهَانَ رَبِّهِ ۚ كَذَٰلِكَ لِنَصْرِفَ عَنْهُ السُّوءَ وَالْفَحْشَاءَ ۚ إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُخْلَصِينَ ٢٤

మరియు వాస్తవానికి, ఆమె అతనిని ఆశిం చింది. మరియు అతను కూడా ఆమె కోరికకు మొగ్గి ఉండేవాడే! ఒకవేళ అతను తన ప్రభువు యొక్క నిదర్శనాన్ని చూసి ఉండకపోతే! ఈ విధంగా జరిగింది, మేము పాపం మరియు అశ్లీలతను అతని నుండి దూరంగా ఉంచటానికి. నిశ్చయంగా అతను మేము ఎన్నుకున్న దాసులలో ఒకడు.

12:25 – وَاسْتَبَقَا الْبَابَ وَقَدَّتْ قَمِيصَهُ مِن دُبُرٍ وَأَلْفَيَا سَيِّدَهَا لَدَى الْبَابِ ۚ قَالَتْ مَا جَزَاءُ مَنْ أَرَادَ بِأَهْلِكَ سُوءًا إِلَّا أَن يُسْجَنَ أَوْ عَذَابٌ أَلِيمٌ ٢٥

మరియు వారిద్దరు (ఒకరి వెనుక ఒకరు) తలుపువైపుకు పరుగెత్తారు. ఆమె అతని అంగిని వెనుక నుండి లాగి చించింది. వారిద్దరు తలుపు వద్ద ఆమె భర్తను చూశారు. ఆమె (తన భర్తతో) అన్నది: ”నీ భార్యను చెరుపాలని తలచిన వానికి చెరసాలలో ఉంచటం, లేదా బాధాకరమైన శిక్ష విధించటం తప్ప, మరొక శిక్ష ఏముంటుంది?”

12:26 – قَالَ هِيَ رَاوَدَتْنِي عَن نَّفْسِي ۚ وَشَهِدَ شَاهِدٌ مِّنْ أَهْلِهَا إِن كَانَ قَمِيصُهُ قُدَّ مِن قُبُلٍ فَصَدَقَتْ وَهُوَ مِنَ الْكَاذِبِينَ ٢٦

(యూసుఫ్‌) అన్నాడు: ”ఈమెనే, నన్ను మోహింపజేయగోరింది!” ఆమె కుటుంబంవారిలో నుండి అక్కడ ఉన్న ఒకడు ఇలా సాక్ష్యమిచ్చాడు: ”ఒకవేళ అతని అంగి, ముందు నుండి చినిగిఉంటే ఆమెపలికేది సత్యం మరియు అతను అసత్యుడు!

12:27 – وَإِن كَانَ قَمِيصُهُ قُدَّ مِن دُبُرٍ فَكَذَبَتْ وَهُوَ مِنَ الصَّادِقِينَ ٢٧

”కాని ఒకవేళ అతని అంగి వెనుక నుండి చినిగి ఉంటే! ఆమె పలికేది అబద్ధం మరియు అతను సత్యవంతుడు!”

12:28 – فَلَمَّا رَأَىٰ قَمِيصَهُ قُدَّ مِن دُبُرٍ قَالَ إِنَّهُ مِن كَيْدِكُنَّ ۖ إِنَّ كَيْدَكُنَّ عَظِيمٌ ٢٨

అతని అంగి వెనుకనుండి చినిగి ఉండటాన్ని చూసి (ఆమె భర్త) ఇలా అన్నాడు: ”నిశ్చయంగా, ఇది మీ స్త్రీల పన్నాగం. నిశ్చయంగా, మీ పన్నాగం ఎంతో భయంకరమైనది!

12:29 – يُوسُفُ أَعْرِضْ عَنْ هَـٰذَا ۚ وَاسْتَغْفِرِي لِذَنبِكِ ۖ إِنَّكِ كُنتِ مِنَ الْخَاطِئِينَ ٢٩

”ఓ యూసుఫ్‌! ఈ విషయాన్ని పోనివ్వు!” (తన భార్యతో అన్నాడు): ”నీవు నీ పాపానికి క్షమాపణ కోరుకో, నిశ్చయంగా నీవే తప్పుచేసిన దానవు.” (7/8)

12:30 – وَقَالَ نِسْوَةٌ فِي الْمَدِينَةِ امْرَأَتُ الْعَزِيزِ تُرَاوِدُ فَتَاهَا عَن نَّفْسِهِ ۖ قَدْ شَغَفَهَا حُبًّا ۖ إِنَّا لَنَرَاهَا فِي ضَلَالٍ مُّبِينٍ ٣٠

  • మరియు నగర స్త్రీలు పరస్పరం ఇలా చర్చించు కోసాగారు: ” ‘అ’జీ’జ్‌ భార్య తన యువ బానిసను మోహింపగోరింది. నిశ్చయంగా, ఆమె గాఢ మైన ప్రేమలో పడిఉంది. నిశ్చయంగా, ఆమె స్పష్టమైన పొరపాటులో ఉన్నట్లు మేము చూస్తున్నాము.”

12:31 – فَلَمَّا سَمِعَتْ بِمَكْرِهِنَّ أَرْسَلَتْ إِلَيْهِنَّ وَأَعْتَدَتْ لَهُنَّ مُتَّكَأً وَآتَتْ كُلَّ وَاحِدَةٍ مِّنْهُنَّ سِكِّينًا وَقَالَتِ اخْرُجْ عَلَيْهِنَّ ۖ فَلَمَّا رَأَيْنَهُ أَكْبَرْنَهُ وَقَطَّعْنَ أَيْدِيَهُنَّ وَقُلْنَ حَاشَ لِلَّـهِ مَا هَـٰذَا بَشَرًا إِنْ هَـٰذَا إِلَّا مَلَكٌ كَرِيمٌ ٣١

ఆమె వారి నిందారోపణలు విని, వారికి ఆహ్వానం పంపింది. వారికి ఒక మంచి విందు ఏర్పాటు చేసి, ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క కత్తి ఇచ్చి, (యూసుఫ్‌తో): ”వారి ముందుకు రా!” అని అన్నది. ఆ స్త్రీలు అతనిని చూడగానే నివ్వెర పోయారు మరియు (ఆశ్చర్యంతో చేతులలో ఉన్న కత్తులతో) తమ చేతులను కోసుకున్నారు. (అప్రయత్నంగా) అన్నారు: ”అల్లాహ్‌ మహిమ! (‘హాషలిల్లాహ్‌) ఇతను మానవుడు మాత్రం కాడు! ఇతను గొప్ప దేవదూతయే కాగలడు!”

12:32 – قَالَتْ فَذَٰلِكُنَّ الَّذِي لُمْتُنَّنِي فِيهِ ۖ وَلَقَدْ رَاوَدتُّهُ عَن نَّفْسِهِ فَاسْتَعْصَمَ ۖ وَلَئِن لَّمْ يَفْعَلْ مَا آمُرُهُ لَيُسْجَنَنَّ وَلَيَكُونًا مِّنَ الصَّاغِرِينَ ٣٢

ఆమె అన్నది: ”ఇతనే ఆ మనిషి! ఇతనిని గురించే మీరు నాపై నిందలు మోపింది. వాస్తవానికి నేనే ఇతనిని మోహింపజేయటానికి ప్రయత్నించాను కాని ఇతను తప్పించుకున్నాడు. కాని ఇతను ఇక నేను చెప్పింది చేయకుంటే తప్పక చెరసాలపాలు కాగలడు, లేదా తీవ్ర అవమానానికి గురికాగలడు!”

12:33 – قَالَ رَبِّ السِّجْنُ أَحَبُّ إِلَيَّ مِمَّا يَدْعُونَنِي إِلَيْهِ ۖ وَإِلَّا تَصْرِفْ عَنِّي كَيْدَهُنَّ أَصْبُ إِلَيْهِنَّ وَأَكُن مِّنَ الْجَاهِلِينَ ٣٣

(యూసుఫ్‌) అన్నాడు: ”ఓ నా ప్రభూ! ఈ స్త్రీలు నన్ను పిలిచేవిషయాని కంటే నాకు చెరసాల యే ప్రియమైనది.నీవువారిఎత్తుగడలనుండి నన్ను తప్పించక పోతే, నేను వారి వలలో చిక్కిపోయే వాడిని మరియు అజ్ఞానులలో చేరిపోయే వాడిని.”

12:34 – فَاسْتَجَابَ لَهُ رَبُّهُ فَصَرَفَ عَنْهُ كَيْدَهُنَّ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ ٣٤

అప్పుడు అతని ప్రభువు అతని ప్రార్థనను అంగీకరించి, అతనిని ఆ స్త్రీల పన్నాగాల నుండి తప్పించాడు. నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

12:35 – ثُمَّ بَدَا لَهُم مِّن بَعْدِ مَا رَأَوُا الْآيَاتِ لَيَسْجُنُنَّهُ حَتَّىٰ حِينٍ ٣٥

ఆ తరువాత వారికి – (అతను నిర్దోషి అనే) సూచనలు కనిపించినా – అతనిని కొంతకాలం చెరసాలలో ఉంచాలని అనిపించింది.

12:36 – وَدَخَلَ مَعَهُ السِّجْنَ فَتَيَانِ ۖ قَالَ أَحَدُهُمَا إِنِّي أَرَانِي أَعْصِرُ خَمْرًا ۖ وَقَالَ الْآخَرُ إِنِّي أَرَانِي أَحْمِلُ فَوْقَ رَأْسِي خُبْزًا تَأْكُلُ الطَّيْرُ مِنْهُ ۖ نَبِّئْنَا بِتَأْوِيلِهِ ۖ إِنَّا نَرَاكَ مِنَ الْمُحْسِنِينَ ٣٦

మరియు అతనితోబాటు ఇద్దరు యువకులు కూడా చెరసాలలో ప్రవేశించారు. వారిలో ఒకడు అన్నాడు: ”నేను సారాయి పిండుతూ ఉన్నట్లు కలచూశాను!” రెండో వాడు అన్నాడు: ”నేను నా తలపై రొట్టెలుమోస్తున్నట్లు, వాటినిపక్షులు తింటు న్నట్లు కలలోచూశాను.” (ఇద్దరూకలిసి అన్నారు): ”మాకు దీని భావాన్ని తెలుపు. నిశ్చయంగా మేము నిన్ను సజ్జనునిగా చూస్తున్నాము.”

12:37 – قَالَ لَا يَأْتِيكُمَا طَعَامٌ تُرْزَقَانِهِ إِلَّا نَبَّأْتُكُمَا بِتَأْوِيلِهِ قَبْلَ أَن يَأْتِيَكُمَا ۚ ذَٰلِكُمَا مِمَّا عَلَّمَنِي رَبِّي ۚ إِنِّي تَرَكْتُ مِلَّةَ قَوْمٍ لَّا يُؤْمِنُونَ بِاللَّـهِ وَهُم بِالْآخِرَةِ هُمْ كَافِرُونَ ٣٧

(యూసుఫ్‌) అన్నాడు: ”మీరిద్దరికి తిన టానికి ఇవ్వబడే భోజనం వస్తుంది కదా! అది రాక ముందే నేను వీటి (మీకలల) భావాన్ని మీ ఇద్దరికి తెలుపుతాను. ఇది నా ప్రభువు నేర్పిన విద్యల లోనిదే. నిశ్చయంగా నేను, అల్లాహ్‌ను విశ్వసించని వారి మరియు పరలోకాన్ని తిరస్కరించే వారి ధర్మాన్ని వదలిపెట్టాను.

12:38 – وَاتَّبَعْتُ مِلَّةَ آبَائِي إِبْرَاهِيمَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ ۚ مَا كَانَ لَنَا أَن نُّشْرِكَ بِاللَّـهِ مِن شَيْءٍ ۚ ذَٰلِكَ مِن فَضْلِ اللَّـهِ عَلَيْنَا وَعَلَى النَّاسِ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَشْكُرُونَ ٣٨

”మరియు నేను నా తండ్రి-తాతలైన ఇబ్రాహీమ్‌ ఇస్’హాఖ్‌ మరియు య’అఖూబ్‌ల యొక్క ధర్మాన్ని అవలంబించాను. అల్లాహ్‌కు ఎవడినైనా సాటి కల్పించటం మా విధానం కాదు. వాస్తవానికి ఇది మాపై మరియు సర్వ మానవుల పై ఉన్న అల్లాహ్‌ యొక్క అనుగ్రహం. కాని చాలా మంది ప్రజలు కృతజ్ఞతలు చూపరు.

12:39 – يَا صَاحِبَيِ السِّجْنِ أَأَرْبَابٌ مُّتَفَرِّقُونَ خَيْرٌ أَمِ اللَّـهُ الْوَاحِدُ الْقَهَّارُ ٣٩

”ఓ నా ఇద్దరు చెరసాల సహచరులారా! ఏమీ? చాలా మంది విభిన్న ప్రభువులు మేలా? లేక, తన సృష్టిపై సంపూర్ణాధికారం గల అద్వితీయుడైన 9 అల్లాహ్‌ మేలా?

12:40 – مَا تَعْبُدُونَ مِن دُونِهِ إِلَّا أَسْمَاءً سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا أَنزَلَ اللَّـهُ بِهَا مِن سُلْطَانٍ ۚ إِنِ الْحُكْمُ إِلَّا لِلَّـهِ ۚ أَمَرَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ ٤٠

”ఆయన (అల్లాహ్‌)ను వదలి మీరు ఆరాధి స్తున్నవి – మీరు మరియు మీ తండ్రి-తాతలు కల్పించుకున్న – పేర్లు మాత్రమే! దాని కొరకు అల్లాహ్‌ ఎలాంటి ప్రమాణాన్ని అవతరింపజేయ లేదు. నిశ్చయంగా, ఆజ్ఞాపించే అధికారం కేవలం అల్లాహ్‌కే చెందుతుంది. ఆయనను తప్ప మరొక రిని ఆరాధించరాదని ఆయన ఆజ్ఞాపించాడు. ఇదే సరైన ధర్మం, కానీ చాలామందికి ఇదితెలియదు. 10

12:41 – يَا صَاحِبَيِ السِّجْنِ أَمَّا أَحَدُكُمَا فَيَسْقِي رَبَّهُ خَمْرًا ۖ وَأَمَّا الْآخَرُ فَيُصْلَبُ فَتَأْكُلُ الطَّيْرُ مِن رَّأْسِهِ ۚ قُضِيَ الْأَمْرُ الَّذِي فِيهِ تَسْتَفْتِيَانِ ٤١

”ఓ నా ఇద్దరు చెరసాల సహచరులారా! మీలో ఒకడు తన యజమానికి మద్యపానం (సారాయి) త్రాగిస్తూ ఉంటాడు. ఇక రెండవవాడు సిలువపై ఎక్కించబడతాడు మరియు అతడి నెత్తిపై నుండి పక్షులు తింటూ ఉంటాయి. మీరు అడుగుతున్న (కలల) విషయం గురించి ఈ విధమైన తీర్పు ఇవ్వబడుతోంది!”

12:42 – وَقَالَ لِلَّذِي ظَنَّ أَنَّهُ نَاجٍ مِّنْهُمَا اذْكُرْنِي عِندَ رَبِّكَ فَأَنسَاهُ الشَّيْطَانُ ذِكْرَ رَبِّهِ فَلَبِثَ فِي السِّجْنِ بِضْعَ سِنِينَ ٤٢

మరియు వారిద్దరిలో విడుదలపొందుతాడని భావించిన వాడితో (యూసుఫ్‌) అన్నాడు: ”నీ స్వామి దగ్గర నా ప్రస్తావన చెయ్యి.” కాని అతనిని తన స్వామి దగ్గర ప్రస్తావన చేయటాన్ని షై’తాన్‌ మరపింపజేశాడు, కావున (యూసుఫ్‌) చెరసాలలో మరికొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు. 11

12:43 – وَقَالَ الْمَلِكُ إِنِّي أَرَىٰ سَبْعَ بَقَرَاتٍ سِمَانٍ يَأْكُلُهُنَّ سَبْعٌ عِجَافٌ وَسَبْعَ سُنبُلَاتٍ خُضْرٍ وَأُخَرَ يَابِسَاتٍ ۖ يَا أَيُّهَا الْمَلَأُ أَفْتُونِي فِي رُؤْيَايَ إِن كُنتُمْ لِلرُّؤْيَا تَعْبُرُونَ ٤٣

(ఒక రోజు) రాజు అన్నాడు: 12 ”వాస్తవానికి నేను (కలలో) ఏడు బలిసిన ఆవులను, ఏడు బక్క చిక్కిన (ఆవులు) తినివేస్తున్నట్లు మరియు ఏడు పచ్చివెన్నులను మరొక ఏడుఎండిపోయిన వాటిని చూశాను. ఓ సభాసదులారా! మీకు స్వప్నాల భావం తెలిస్తే నా స్వప్నపు భావాన్ని తెలుపండి!”

12:44 – قَالُوا أَضْغَاثُ أَحْلَامٍ ۖ وَمَا نَحْنُ بِتَأْوِيلِ الْأَحْلَامِ بِعَالِمِينَ ٤٤

వారన్నారు:”ఇవిపీడకలలు. మరియు మాకు కలల గూఢార్థం తెలుసుకునే నైపుణ్యం లేదు!”

12:45 – وَقَالَ الَّذِي نَجَا مِنْهُمَا وَادَّكَرَ بَعْدَ أُمَّةٍ أَنَا أُنَبِّئُكُم بِتَأْوِيلِهِ فَأَرْسِلُونِ ٤٥

ఆ ఇద్దరు బందీలలో నుండి విడుదల పొందిన వ్యక్తికి చాలా కాలం తరువాత ఇప్పుడా విషయం గుర్తుకువచ్చింది. 13 అతడు అన్నాడు: ”నేను దీని గూఢార్థాన్ని మీకు తెలుపుతాను, దానికి నన్ను (యూసుఫ్‌ వద్దకు) పంపండి.”

12:46 – يُوسُفُ أَيُّهَا الصِّدِّيقُ أَفْتِنَا فِي سَبْعِ بَقَرَاتٍ سِمَانٍ يَأْكُلُهُنَّ سَبْعٌ عِجَافٌ وَسَبْعِ سُنبُلَاتٍ خُضْرٍ وَأُخَرَ يَابِسَاتٍ لَّعَلِّي أَرْجِعُ إِلَى النَّاسِ لَعَلَّهُمْ يَعْلَمُونَ ٤٦

(అతడు అన్నాడు): ”యూసుఫ్‌! సత్య వంతుడా! నాకు – ఏడు బలిసిన ఆవులను, ఏడు బక్కచిక్కిన ఆవులు తినివేయటాన్ని; మరియు ఏడు పచ్చివెన్నుల మరి ఏడు ఎండిపోయిన (వెన్నుల) – గూఢార్థ మేమిటో చెప్పు. నేను (రాజసభలోని) ప్రజలవద్దకు పోయి (చెబుతాను), వారు దానిని తెలుసు కుంటారు.”

12:47 – قَالَ تَزْرَعُونَ سَبْعَ سِنِينَ دَأَبًا فَمَا حَصَدتُّمْ فَذَرُوهُ فِي سُنبُلِهِ إِلَّا قَلِيلًا مِّمَّا تَأْكُلُونَ ٤٧

(యూసుఫ్‌) అన్నాడు: ”మీరు యథా ప్రకా రంగా ఏడు సంవత్సరాలు సేద్యం చేస్తూ ఉంటారు, కాని మీరు కోసినపంటలో కొంత భాగాన్ని మాత్రమే తినటానికి ఉపయోగించుకొని, మిగిలిందంతా, వెన్నులతోనే కొట్లలో ఉంచి (భద్రపరచండి).

12:48 – ثُمَّ يَأْتِي مِن بَعْدِ ذَٰلِكَ سَبْعٌ شِدَادٌ يَأْكُلْنَ مَا قَدَّمْتُمْ لَهُنَّ إِلَّا قَلِيلًا مِّمَّا تُحْصِنُونَ ٤٨

”ఆ తరువాత చాలా కఠినమైన ఏడు సంవ త్సరాలు వస్తాయి, వాటిలో మీరు ముందే నిలువ చేసి ఉంచిన దానిని తింటారు. మీరు (విత్తనాని కోసం) భద్రంగా ఉంచుకున్న కొంతభాగంతప్ప! 14

12:49 – ثُمَّ يَأْتِي مِن بَعْدِ ذَٰلِكَ عَامٌ فِيهِ يُغَاثُ النَّاسُ وَفِيهِ يَعْصِرُونَ ٤٩

”ఆ తరువాత ఒక సంవత్సరం వస్తుంది. అందులోప్రజలకుపుష్కలమైనవర్షాలు కురుస్తాయి. అందులోవారు(రసం/నూనె)తీస్తారు(పిండుతారు).”

12:50 – وَقَالَ الْمَلِكُ ائْتُونِي بِهِ ۖ فَلَمَّا جَاءَهُ الرَّسُولُ قَالَ ارْجِعْ إِلَىٰ رَبِّكَ فَاسْأَلْهُ مَا بَالُ النِّسْوَةِ اللَّاتِي قَطَّعْنَ أَيْدِيَهُنَّ ۚ إِنَّ رَبِّي بِكَيْدِهِنَّ عَلِيمٌ ٥٠

రాజు ఇలా అన్నాడు: ”అతనిని నా వద్దకు తీసుకురండి!” రాజదూత అతని వద్దకు వచ్చి నపుడు, (యూసుఫ్‌) అన్నాడు: ”నీవు తిరిగిపోయి నీ స్వామిని అడుగు: ‘తమ చేతులు కోసుకున్న స్త్రీల వాస్తవ విషయమేమిటి?’ 15 నిశ్చయంగా, నా ప్రభువుకు వారి కుట్ర గురించి బాగా తెలుసు.”

12:51 – قَالَ مَا خَطْبُكُنَّ إِذْ رَاوَدتُّنَّ يُوسُفَ عَن نَّفْسِهِ ۚ قُلْنَ حَاشَ لِلَّـهِ مَا عَلِمْنَا عَلَيْهِ مِن سُوءٍ ۚ قَالَتِ امْرَأَتُ الْعَزِيزِ الْآنَ حَصْحَصَ الْحَقُّ أَنَا رَاوَدتُّهُ عَن نَّفْسِهِ وَإِنَّهُ لَمِنَ الصَّادِقِينَ ٥١

(రాజు స్త్రీలను) విచారించాడు: ”మీరు యూసుఫ్‌ను మోహింపజేయటానికి ప్రయత్నించిన విషయమేమిటి?” వారందరూ (ఒకేసారిగా) అన్నారు: ”అల్లాహ్‌ రక్షించుగాక! మేము అతనిలో ఏ పాపాన్ని చూడలేదు! ‘అ’జీ’జ్‌ భార్య ఇలా అన్నది: ”ఇప్పుడు సత్యం బయటపడింది. నేనే అతనిని మోహింపజేయటానికి ప్రయత్నించాను. మరియు నిశ్చయంగా, అతను సత్యవంతుడు.”

12:52 – ذَٰلِكَ لِيَعْلَمَ أَنِّي لَمْ أَخُنْهُ بِالْغَيْبِ وَأَنَّ اللَّـهَ لَا يَهْدِي كَيْدَ الْخَائِنِينَ ٥٢

(అప్పుడు యూసుఫ్‌) అన్నాడు: ”నేను ఇదంతా చేసింది నిశ్చయంగా, నేను (‘అ’జీ’జ్‌కు) గోప్యంగా ఎలాంటి నమ్మకద్రోహం చేయలేదని తెలుపటానికే మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ నమ్మకద్రోహుల కుట్రలను సాగనివ్వడు.

12:53 – وَمَا أُبَرِّئُ نَفْسِي ۚ إِنَّ النَّفْسَ لَأَمَّارَةٌ بِالسُّوءِ إِلَّا مَا رَحِمَ رَبِّي ۚ إِنَّ رَبِّي غَفُورٌ رَّحِيمٌ ٥٣

[(*)] ”మరియు నన్ను నేను (ఈ నింద నుండి) విముక్తి చేసుకోవడంలేదు. 16 వాస్తవానికి మానవ ఆత్మ చెడు (పాపం) చేయటానికి పురికొల్పుతూ ఉంటుంది – నా ప్రభువు కరుణించిన వాడు తప్ప – నిశ్చయంగా, నా ప్రభువు క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.”

12:54 – وَقَالَ الْمَلِكُ ائْتُونِي بِهِ أَسْتَخْلِصْهُ لِنَفْسِي ۖ فَلَمَّا كَلَّمَهُ قَالَ إِنَّكَ الْيَوْمَ لَدَيْنَا مَكِينٌ أَمِينٌ ٥٤

మరియు రాజు అన్నాడు: 17 ”అతనిని నా వద్దకు తీసుకొనిరండి నేను అతనిని ప్రత్యేకంగా నా కొరకు నియమించుకుంటాను.” (యూసుఫ్‌) అత డితో మాట్లాడినప్పుడు (రాజు) అన్నాడు: ”నిశ్చ యంగా నీవు ఈ నాటి నుండి మా వద్ద ఉన్నత స్థానంలో నమ్మకంగలవ్యక్తిగా పరిగణింపబడతావు.”

12:55 – قَالَ اجْعَلْنِي عَلَىٰ خَزَائِنِ الْأَرْضِ ۖ إِنِّي حَفِيظٌ عَلِيمٌ ٥٥

(యూసుఫ్‌) అన్నాడు: ”నన్ను దేశపు కోశాగారాధి కారిగా నియమించండి. నిశ్చయంగా, నేను తెలివిగల మంచి రక్షకుడను.”

12:56 – وَكَذَٰلِكَ مَكَّنَّا لِيُوسُفَ فِي الْأَرْضِ يَتَبَوَّأُ مِنْهَا حَيْثُ يَشَاءُ ۚ نُصِيبُ بِرَحْمَتِنَا مَن نَّشَاءُ ۖ وَلَا نُضِيعُ أَجْرَ الْمُحْسِنِينَ ٥٦

మరియు ఈ విధంగా మేము యూసుఫ్‌కు భూమిపై అధికారమొసంగాము. దానితో అతను తన ఇష్టప్రకారం వ్యవహరించగలిగాడు. మేము కోరిన వారి మీద మా కారుణ్యాన్ని ధారపోస్తాము. మరియు మేము సజ్జనుల ప్రతిఫలాన్ని వ్యర్థం చేయము.

12:57 – وَلَأَجْرُ الْآخِرَةِ خَيْرٌ لِّلَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ ٥٧

మరియు విశ్వసించి, భయభక్తులు గల వారికి, పరలోక ప్రతిఫలమే ఎంతో ఉత్తమమైనది.

12:58 – وَجَاءَ إِخْوَةُ يُوسُفَ فَدَخَلُوا عَلَيْهِ فَعَرَفَهُمْ وَهُمْ لَهُ مُنكِرُونَ ٥٨

మరియు యూసుఫ్‌(జోసెఫ్‌) సోదరులువచ్చి అతని ముందు ప్రవేశించారు. అతను వారిని గుర్తిం చాడు కాని, వారు అతనిని గుర్తించలేక పోయారు.

12:59 – وَلَمَّا جَهَّزَهُم بِجَهَازِهِمْ قَالَ ائْتُونِي بِأَخٍ لَّكُم مِّنْ أَبِيكُمْ ۚ أَلَا تَرَوْنَ أَنِّي أُوفِي الْكَيْلَ وَأَنَا خَيْرُ الْمُنزِلِينَ ٥٩

మరియు అతను వారి సామాగ్రిని సిధ్ధపర చిన తరువాత వారితో అన్నాడు: ”మీ నాన్న కుమారుడైన మీ సోదరుణ్ణి 18 మీరు (మళ్ళీ వచ్చేటప్పుడు) నా వద్దకు తీసుకొనిరండి. ఏమీ? నేను ఏవిధంగా నిండుగా కొలిచి ఇస్తున్నానో మీరు చూడటం లేదా? నిశ్చయంగా ఆతిథ్యం చేసే వారిలో నేను ఉత్తముడను.

12:60 – فَإِن لَّمْ تَأْتُونِي بِهِ فَلَا كَيْلَ لَكُمْ عِندِي وَلَا تَقْرَبُونِ ٦٠

”కాని మీరు అతనిని నా వద్దకు తీసుకొని రాకపోతే నా వద్ద మీకు ఎలాంటి (ధాన్యం) దొరకదు, అలాంటప్పుడు మీరు నా దరిదాపులకు కూడా రాకండి!”

12:61 – قَالُوا سَنُرَاوِدُ عَنْهُ أَبَاهُ وَإِنَّا لَفَاعِلُونَ ٦١

వారు ఇలా అన్నారు: ”మేము అతనిని గురించి అతని తండ్రిని ఒప్పించటానికి ప్రయత్ని స్తాము. మరియు మేము అలాతప్పకుండాచేస్తాము.”

12:62 – وَقَالَ لِفِتْيَانِهِ اجْعَلُوا بِضَاعَتَهُمْ فِي رِحَالِهِمْ لَعَلَّهُمْ يَعْرِفُونَهَا إِذَا انقَلَبُوا إِلَىٰ أَهْلِهِمْ لَعَلَّهُمْ يَرْجِعُونَ ٦٢

మరియు (యూసుఫ్‌) తన సేవకులతో: ”వారు (ధాన్యాన్ని కొనటానికి) తెచ్చిన సామగ్రిని (తిరిగి) వారిసంచులలోపెట్టండి. వారు తిరిగి తమ కుటుంబంవారివద్దకు పోయినతరువాత అది తెలు సుకొని బహుశా, తిరిగిరావచ్చు!” అని అన్నాడు.

12:63 – فَلَمَّا رَجَعُوا إِلَىٰ أَبِيهِمْ قَالُوا يَا أَبَانَا مُنِعَ مِنَّا الْكَيْلُ فَأَرْسِلْ مَعَنَا أَخَانَا نَكْتَلْ وَإِنَّا لَهُ لَحَافِظُونَ ٦٣

వారు తమ తండ్రి దగ్గరకు తిరిగివచ్చిన తరువాత అన్నారు: ”నాన్నా! ఇక ముందు మనకు ధాన్యం ఇవ్వడానికి తిరస్కరించారు, కావున ధాన్యం తేవాలంటే! నీవు మా తమ్ముణ్ణి (బెన్యామీన్‌ను) మాతోబాటు పంపు మరియు నిశ్చయంగా, మేము అతనిని కాపాడుతాము.”

12:64 – قَالَ هَلْ آمَنُكُمْ عَلَيْهِ إِلَّا كَمَا أَمِنتُكُمْ عَلَىٰ أَخِيهِ مِن قَبْلُ ۖ فَاللَّـهُ خَيْرٌ حَافِظًا ۖ وَهُوَ أَرْحَمُ الرَّاحِمِينَ ٦٤

(య’అఖూబ్‌) అన్నాడు: ”ఏమీ? నేను మిమ్మల్ని అతని విషయంలో – ఇదివరకు అతని సోదరుని విషయంలో నమ్మినట్లు – నమ్మాలా? వాస్తవానికి, అల్లాహ్‌యే ఉత్తమ రక్షకుడు. ఆయనే కరుణించే వారిలో అందరి కంటే ఉత్తమమైన కారుణ్యమూర్తి.”

12:65 – وَلَمَّا فَتَحُوا مَتَاعَهُمْ وَجَدُوا بِضَاعَتَهُمْ رُدَّتْ إِلَيْهِمْ ۖ قَالُوا يَا أَبَانَا مَا نَبْغِي ۖ هَـٰذِهِ بِضَاعَتُنَا رُدَّتْ إِلَيْنَا ۖ وَنَمِيرُ أَهْلَنَا وَنَحْفَظُ أَخَانَا وَنَزْدَادُ كَيْلَ بَعِيرٍ ۖ ذَٰلِكَ كَيْلٌ يَسِيرٌ ٦٥

మరియు వారు తమ మూటలను విప్పగా తమ సొమ్ముకూడా తమకు తిరిగిఇవ్వబడటాన్ని చూసి తమ తండ్రితోఅన్నారు: ”నాన్నా!(చూడండి) ఇంకేంకావాలి? మన సొమ్ము కూడా మనకు తిరిగి ఇవ్వబడింది. మరియు మేము మన ఇంటివారి కొరకు మరింత ఎక్కువ ధాన్యం తేగలము. మేము మా తమ్ముణ్ణి కాపాడుకుంటాము. ఇంకా ఒక ఒంటె మోసే బరువు (ధాన్యం) కూడా ఎక్కువగా తీసుకొనిరాగలము. ఇక అంత ధాన్యం కూడా (అదనంగా) సులభంగా లభిస్తుంది కదా!”

12:66 – قَالَ لَنْ أُرْسِلَهُ مَعَكُمْ حَتَّىٰ تُؤْتُونِ مَوْثِقًا مِّنَ اللَّـهِ لَتَأْتُنَّنِي بِهِ إِلَّا أَن يُحَاطَ بِكُمْ ۖ فَلَمَّا آتَوْهُ مَوْثِقَهُمْ قَالَ اللَّـهُ عَلَىٰ مَا نَقُولُ وَكِيلٌ ٦٦

(య’అఖూబ్‌) అన్నాడు: ”మీరు ముట్టడికి గురిఅయితే తప్ప, అతనిని నా వద్దకు తప్పక తీసుకురాగలమని అల్లాహ్‌ పేరుతో నాముందు ప్రమాణంచేస్తేనేగానీ నేను అతనిని మీవెంట పంపను.” వారుప్రమాణం చేసినతరువాత అతను అన్నాడు: ”మన ఈ మాటలకు అల్లాహ్‌యే సాక్షి!”

12:67 – وَقَالَ يَا بَنِيَّ لَا تَدْخُلُوا مِن بَابٍ وَاحِدٍ وَادْخُلُوا مِنْ أَبْوَابٍ مُّتَفَرِّقَةٍ ۖ وَمَا أُغْنِي عَنكُم مِّنَ اللَّـهِ مِن شَيْءٍ ۖ إِنِ الْحُكْمُ إِلَّا لِلَّـهِ ۖ عَلَيْهِ تَوَكَّلْتُ ۖ وَعَلَيْهِ فَلْيَتَوَكَّلِ الْمُتَوَكِّلُونَ ٦٧

(ఇంకా) ఇలా అన్నాడు: ”ఓ నా కుమారులారా! మీరందరూ ఒకే ద్వారం గుండా ప్రవేశించకండి, మీరు వేర్వేరు ద్వారాల గుండా ప్రవేశించండి. 19 నేను మిమ్మల్ని అల్లాహ్‌ (సంకల్పం) నుండి ఏవిధంగానూ తప్పించలేను. అంతిమ తీర్పు కేవలం అల్లాహ్‌కే చెందుతుంది. నేను ఆయనను మాత్రమే నమ్ముకున్నాను. మరియు ఆయనను నమ్ముకున్నవారు కేవలం ఆయన పైననే ఆధారపడి ఉంటారు.”

12:68 – وَلَمَّا دَخَلُوا مِنْ حَيْثُ أَمَرَهُمْ أَبُوهُم مَّا كَانَ يُغْنِي عَنْهُم مِّنَ اللَّـهِ مِن شَيْءٍ إِلَّا حَاجَةً فِي نَفْسِ يَعْقُوبَ قَضَاهَا ۚ وَإِنَّهُ لَذُو عِلْمٍ لِّمَا عَلَّمْنَاهُ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ ٦٨

మరియు వారు తమ తండ్రి ఆజ్ఞ ప్రకారం (ఆ నగరంలో వేర్వేరు ద్వారాల గుండా) ప్రవే శించారు. అది కేవలం య’అఖూబ్‌ మనస్సులోని కోరికలను పూర్తిచేయటానికిమాత్రమే కాని అల్లాహ్‌ సంకల్పం నుండి తప్పించుకోవటానికి, వారికి ఏ మాత్రమూ పనికిరాలేదు. మేము అతనికి నేర్పిన జ్ఞానంప్రకారం అతను జ్ఞానవంతుడే కాని చాలా మందికి తెలియదు. 20

12:69 – وَلَمَّا دَخَلُوا عَلَىٰ يُوسُفَ آوَىٰ إِلَيْهِ أَخَاهُ ۖ قَالَ إِنِّي أَنَا أَخُوكَ فَلَا تَبْتَئِسْ بِمَا كَانُوا يَعْمَلُونَ ٦٩

మరియు వారు యూసుఫ్‌ వద్ద ప్రవేశించగా అతను తన సోదరుణ్ణి (బెన్యామీన్‌ను) తన దగ్గరికి తీసుకున్నాడు. అతనితో అన్నాడు: ”వాస్త వానికి! నేనే నీ (తప్పిపోయిన) సోదరుడను, కావున వారు ఇంత వరకు చేస్తూ వచ్చిన పనులకు నీవు దుఃఖపడకు.”

12:70 – فَلَمَّا جَهَّزَهُم بِجَهَازِهِمْ جَعَلَ السِّقَايَةَ فِي رَحْلِ أَخِيهِ ثُمَّ أَذَّنَ مُؤَذِّنٌ أَيَّتُهَا الْعِيرُ إِنَّكُمْ لَسَارِقُونَ ٧٠

వారికి వారి సామగ్రి సిధ్ధరచిన తరువాత తన సోదరుని జీనుసంచిలో ఒక నీరుత్రాగే పాత్రను 21 పెట్టాడు. ఆ పిదప ఒక ప్రకటించేవాడు ఇలా ప్రకటించాడు: ”ఓ బిడారువారలారా! మీరు నిశ్చయంగా దొంగలు!”

12:71 – قَالُوا وَأَقْبَلُوا عَلَيْهِم مَّاذَا تَفْقِدُونَ ٧١

వారు (యూసుఫ్‌ సోదరులు) వారివైపు తిరిగి ఇలా అన్నారు: ”మీవస్తువు ఏదైనా పోయిందా?”

12:72 – قَالُوا نَفْقِدُ صُوَاعَ الْمَلِكِ وَلِمَن جَاءَ بِهِ حِمْلُ بَعِيرٍ وَأَنَا بِهِ زَعِيمٌ ٧٢

(కార్యకర్తలు) అన్నారు: ”రాజుగారి పాత్ర పోయింది! మరియు ఎవడు దానిని తీసుకొని వస్తాడో అతనికి ఒక ఒంటె బరువు ధాన్యం (బహుమానంగా) ఇవ్వబడుతుంది మరియు నేను దానికి బాధ్యుణ్ణి.”

12:73 – قَالُوا تَاللَّـهِ لَقَدْ عَلِمْتُم مَّا جِئْنَا لِنُفْسِدَ فِي الْأَرْضِ وَمَا كُنَّا سَارِقِينَ ٧٣

(యూసుఫ్‌ సోదరులు) అన్నారు: ”అల్లాహ్‌ సాక్షి! మీకు బాగా తెలుసు. మేము మీ దేశంలో సంక్షోభం రేకెత్తించటానికి రాలేదు మరియు మేము దొంగలము కాము!”

12:74 – قَالُوا فَمَا جَزَاؤُهُ إِن كُنتُمْ كَاذِبِينَ ٧٤

(కార్యకర్తలు) అన్నారు: ”మీరు అబద్ధ మాడుతున్నారని తెలిస్తే దానికి శిక్ష ఏమిటి?”

12:75 – قَالُوا جَزَاؤُهُ مَن وُجِدَ فِي رَحْلِهِ فَهُوَ جَزَاؤُهُ ۚ كَذَٰلِكَ نَجْزِي الظَّالِمِينَ ٧٥

వారు (యూసుఫ్‌ సోదరులు) జవాబి చ్చారు: ”ఎవడి సంచిలో ఆ పాత్ర దొరుకుతుందో అతడు దానికి పరిహారంగా (బానిసగా) ఉండాలి. మేము ఇదేవిధంగా దుర్మార్గులను శిక్షిస్తాము.” 22

12:76 – فَبَدَأَ بِأَوْعِيَتِهِمْ قَبْلَ وِعَاءِ أَخِيهِ ثُمَّ اسْتَخْرَجَهَا مِن وِعَاءِ أَخِيهِ ۚ كَذَٰلِكَ كِدْنَا لِيُوسُفَ ۖ مَا كَانَ لِيَأْخُذَ أَخَاهُ فِي دِينِ الْمَلِكِ إِلَّا أَن يَشَاءَ اللَّـهُ ۚ نَرْفَعُ دَرَجَاتٍ مَّن نَّشَاءُ ۗ وَفَوْقَ كُلِّ ذِي عِلْمٍ عَلِيمٌ ٧٦

అప్పుడతడు తన సోదరుని మూట వెదికే ముందు, వారి (సవతి-సోదరుల) మూటలను వెతకటం ప్రారంభించాడు. చివరకు తన సోదరుని మూట నుండి దానిని (పాత్రను) బయటికితీశాడు. ఈ విధంగా మేము యూసుఫ్‌ కొరకు యుక్తి చూపాము. ఈ విధంగా – అల్లాహ్‌ ఇచ్ఛయే లేకుంటే – అతను తన సోదరుణ్ణి, రాజ ధర్మం ప్రకారం ఉంచుకోలేక పోయేవాడు. 23 మేము కోరినవారి స్థానాలను పెంచుతాము. మరియు జ్ఞానులందరినీ మించిన జ్ఞాని ఒకడు (అల్లాహ్‌) ఉన్నాడు. (1/8)

12:77 – قَالُوا إِن يَسْرِقْ فَقَدْ سَرَقَ أَخٌ لَّهُ مِن قَبْلُ ۚ فَأَسَرَّهَا يُوسُفُ فِي نَفْسِهِ وَلَمْ يُبْدِهَا لَهُمْ ۚ قَالَ أَنتُمْ شَرٌّ مَّكَانًا ۖ وَاللَّـهُ أَعْلَمُ بِمَا تَصِفُونَ ٧٧

(అతని సోదరులన్నారు): ”ఇతడు దొంగతనం చేసినా (ఆశ్చర్యం లేదు)! వాస్తవానికి ఇతని సోదరుడు కూడా ఇంతకు ముందు దొంగ తనం చేశాడు.” ఇదివిని యూసుఫ్‌ (కోపాన్ని) తన హృదయంలోనే దాచుకున్నాడు మరియు దానిని వారిపై వ్యక్తపరచలేదు. (తన మనస్సులో) అను కున్నాడు: ”మీరు చాల నీచమైనవారు మరియు మీరు పలికేది అల్లాహ్‌కు బాగా తెలుసు!”

12:78 – قَالُوا يَا أَيُّهَا الْعَزِيزُ إِنَّ لَهُ أَبًا شَيْخًا كَبِيرًا فَخُذْ أَحَدَنَا مَكَانَهُ ۖ إِنَّا نَرَاكَ مِنَ الْمُحْسِنِينَ ٧٨

వారన్నారు: ”ఓ సర్దార్‌ (‘అ’జీ’జ్‌)! వాస్తవానికి, ఇతని తండ్రి చాలా ముసలివాడు, కావున ఇతనికి బదులుగా నీవు మాలో ఒకనిని ఉంచుకో. వాస్తవానికి, మేము నిన్ను మేలు చేసేవానిగా చూస్తున్నాము.”

12:79 – قَالَ مَعَاذَ اللَّـهِ أَن نَّأْخُذَ إِلَّا مَن وَجَدْنَا مَتَاعَنَا عِندَهُ إِنَّا إِذًا لَّظَالِمُونَ ٧٩

అతను అన్నాడు: ”అల్లాహ్‌ నన్ను రక్షించు గాక! మా సొమ్ము ఎవరి వద్ద దొరికిందో అతనిని విడిచి, మరొకనిని మేమెలా పట్టుకో గలము. ఒకవేళ అలాచేస్తే నిశ్చయంగా, మేము దుర్మార్గుల మవుతాము.”

12:80 – فَلَمَّا اسْتَيْأَسُوا مِنْهُ خَلَصُوا نَجِيًّا ۖ قَالَ كَبِيرُهُمْ أَلَمْ تَعْلَمُوا أَنَّ أَبَاكُمْ قَدْ أَخَذَ عَلَيْكُم مَّوْثِقًا مِّنَ اللَّـهِ وَمِن قَبْلُ مَا فَرَّطتُمْ فِي يُوسُفَ ۖ فَلَنْ أَبْرَحَ الْأَرْضَ حَتَّىٰ يَأْذَنَ لِي أَبِي أَوْ يَحْكُمَ اللَّـهُ لِي ۖ وَهُوَ خَيْرُ الْحَاكِمِينَ ٨٠

తరువాత వారు అతని పట్ల నిరాశులై, ఆలోచించటానికి ఏకాంతంలో చేరారు! వారిలో పెద్దవాడు అన్నాడు: ”ఏమీ? మీ తండ్రి వాస్తవానికి మీతో అల్లాహ్‌పై ప్రమాణం తీసుకున్నవిషయం మీకు గుర్తులేదా? మరియు ఇంతకు పూర్వం మీరు యూసుఫ్‌ విషయంలో కూడా మాట తప్పారు కదా? కావున నేను నా తండ్రి నాకు అనుమతి ఇవ్వనంత వరకు, లేదా అల్లాహ్‌ నా గురించి తీర్పు చేయనంత వరకు, నేను ఈ దేశాన్ని వదలను. మరియు ఆయనే తీర్పుచేసే వారిలో అత్యుత్తముడు.”

12:81 – ارْجِعُوا إِلَىٰ أَبِيكُمْ فَقُولُوا يَا أَبَانَا إِنَّ ابْنَكَ سَرَقَ وَمَا شَهِدْنَا إِلَّا بِمَا عَلِمْنَا وَمَا كُنَّا لِلْغَيْبِ حَافِظِينَ ٨١

(ఇంకా ఇలా అన్నాడు): ”మీరు మీ నాన్న దగ్గరికి పోయి అతనితో ఇలా చెప్పండి: ‘నాన్నా! వాస్తవానికి నీ కుమారుడు దొంగతనం చేశాడు. మేము అతనిని (దొంగతనం చేస్తూ ఉండగా) చూడలేదు! మాకు తెలిసిందే (మేము చెబుతున్నాము). మరియు వాస్తవానికి రహస్యంగా జరిగే దానిని మేము చూడలేము కదా!

12:82 – وَاسْأَلِ الْقَرْيَةَ الَّتِي كُنَّا فِيهَا وَالْعِيرَ الَّتِي أَقْبَلْنَا فِيهَا ۖ وَإِنَّا لَصَادِقُونَ ٨٢

” ‘మరియు మేము ఉన్న నగరవాసులను మరియు మేము కలిసి తిరిగివచ్చిన బిడారు వారిని కూడా అడగండి. మరియు మేము నిశ్చయంగా సత్యం పలుకుతున్నాము.’ ”

12:83 – قَالَ بَلْ سَوَّلَتْ لَكُمْ أَنفُسُكُمْ أَمْرًا ۖ فَصَبْرٌ جَمِيلٌ ۖ عَسَى اللَّـهُ أَن يَأْتِيَنِي بِهِمْ جَمِيعًا ۚ إِنَّهُ هُوَ الْعَلِيمُ الْحَكِيمُ ٨٣

(య’అఖూబ్‌) అన్నాడు: ”కానీ, మీ (దుష్ట) మనస్సులు మీ చేత మరొక ఘోర కార్యాన్ని తేలికగా చేయించాయి. ఇక నా కొరకు సహనమే మేలైనది. ఇక అల్లాహ్‌యే! వారందరినీ నా వద్దకు తీసుకురావచ్చు! నిశ్చయంగా, ఆయనే సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.”

12:84 – وَتَوَلَّىٰ عَنْهُمْ وَقَالَ يَا أَسَفَىٰ عَلَىٰ يُوسُفَ وَابْيَضَّتْ عَيْنَاهُ مِنَ الْحُزْنِ فَهُوَ كَظِيمٌ ٨٤

మరియు అతను వారి నుండి ముఖం త్రిప్పుకొని అన్నాడు: ”అయ్యో! యూసుఫ్‌.” అతని కన్నులు, దుఃఖం వలన తెల్లబడ్డాయి (చూపు పోయింది). అయినా అతను దానిని (వెలిబుచ్చకుండా) అణచుకున్నాడు.

12:85 – قَالُوا تَاللَّـهِ تَفْتَأُ تَذْكُرُ يُوسُفَ حَتَّىٰ تَكُونَ حَرَضًا أَوْ تَكُونَ مِنَ الْهَالِكِينَ ٨٥

అతని (కుమారులు) అన్నారు: ”అల్లాహ్‌ తోడు! నీవు వ్యాధితో కృశించిపోయే వరకో లేదా నశించిపోయే వరకో యూసుఫ్‌ను జ్ఞాపకం చేసుకోవటం మానవు.”

12:86 – قَالَ إِنَّمَا أَشْكُو بَثِّي وَحُزْنِي إِلَى اللَّـهِ وَأَعْلَمُ مِنَ اللَّـهِ مَا لَا تَعْلَمُونَ ٨٦

(య’అఖూబ్‌) అన్నాడు: ”వాస్తవానికి నా ఆ వేదనను మరియు నా దుఃఖాన్ని నేను కేవలం అల్లాహ్‌తో మాత్రమే మొరపెట్టుకోగలను మరియు మీకు తెలియనిది నాకు అల్లాహ్‌ ద్వారా తెలుస్తుంది.

12:87 – يَا بَنِيَّ اذْهَبُوا فَتَحَسَّسُوا مِن يُوسُفَ وَأَخِيهِ وَلَا تَيْأَسُوا مِن رَّوْحِ اللَّـهِ ۖ إِنَّهُ لَا يَيْأَسُ مِن رَّوْحِ اللَّـهِ إِلَّا الْقَوْمُ الْكَافِرُونَ ٨٧

నా కుమారులారా! మీరు పోయి యూసుఫ్‌ ను మరియు అతని సోదరుణ్ణి గురించి దర్యాఫ్తు చేయండి మరియు అల్లాహ్‌ అనుగ్రహం పట్ల నిరాశచెందకండి. నిశ్చయంగా, సత్య-తిరస్కార జాతికి చెందినవారు తప్ప, ఇతరులు అల్లాహ్‌ అనుగ్రహం పట్ల నిరాశచెందరు.” 24

12:88 – فَلَمَّا دَخَلُوا عَلَيْهِ قَالُوا يَا أَيُّهَا الْعَزِيزُ مَسَّنَا وَأَهْلَنَا الضُّرُّ وَجِئْنَا بِبِضَاعَةٍ مُّزْجَاةٍ فَأَوْفِ لَنَا الْكَيْلَ وَتَصَدَّقْ عَلَيْنَا ۖ إِنَّ اللَّـهَ يَجْزِي الْمُتَصَدِّقِينَ ٨٨

వారు అతని (యూసుఫ్‌) దగ్గరకు(మరల) వచ్చి 25 అన్నారు: ”ఓ సర్దార్‌ (‘అ’జీ’జ్‌)! మేము మా కుటుంబంవారు చాలా ఇబ్బందులకు గురి అయ్యాము. మరియు మేము చాలా తక్కువ సామాగ్రి తెచ్చాము, కాని మాకు పూర్తి సామగ్రిని (ధాన్యాన్ని) దాన-ధర్మ రూపంలోనైనా సరే ఇవ్వండి. నిశ్చయంగా, అల్లాహ్‌ దానధర్మాలు చేసే వారికి మంచి ప్రతిఫలం ఇస్తాడు.”

12:89 – قَالَ هَلْ عَلِمْتُم مَّا فَعَلْتُم بِيُوسُفَ وَأَخِيهِ إِذْ أَنتُمْ جَاهِلُونَ ٨٩

(యూసుఫ్‌) అడిగాడు: ”అజ్ఞానంలో పడి మీరు యూసుఫ్‌ మరియు అతని సోదరునితో ఎలా వ్యవహరించారో మీకు గుర్తుందా?”

12:90 – قَالُوا أَإِنَّكَ لَأَنتَ يُوسُفُ ۖ قَالَ أَنَا يُوسُفُ وَهَـٰذَا أَخِي ۖ قَدْ مَنَّ اللَّـهُ عَلَيْنَا ۖ إِنَّهُ مَن يَتَّقِ وَيَصْبِرْ فَإِنَّ اللَّـهَ لَا يُضِيعُ أَجْرَ الْمُحْسِنِينَ ٩٠

వారన్నారు: ”ఏమిటి? వాస్తవానికి నీవే యూసుఫ్‌వా?” అతను జవాబిచ్చాడు: ”నేనే యూసుఫ్‌ను మరియు ఇతడు (బెన్యామీన్‌) నా సోదరుడు. నిశ్చయంగా అల్లాహ్‌ మమ్మల్ని అను గ్రహించాడు. నిశ్చయంగా, ఎవరైతే దైవభీతి కలిగి వుండి, సహనంతో ఉంటారో, అలాంటి సజ్జనుల ప్రతిఫలాన్ని అల్లాహ్‌ ఎన్నడూ వృథాచేయడు.”

12:91 – قَالُوا تَاللَّـهِ لَقَدْ آثَرَكَ اللَّـهُ عَلَيْنَا وَإِن كُنَّا لَخَاطِئِينَ ٩١

వారన్నారు: ”అల్లాహ్‌ తోడు! వాస్తవంగా, అల్లాహ్‌ నీకు మాపై ఔన్నత్యాన్ని ప్రసాదించాడు. మరియు నిశ్చయంగా, మేము అపరాధులము!”

12:92 – قَالَ لَا تَثْرِيبَ عَلَيْكُمُ الْيَوْمَ ۖ يَغْفِرُ اللَّـهُ لَكُمْ ۖ وَهُوَ أَرْحَمُ الرَّاحِمِينَ ٩٢

(యూసుఫ్‌) అన్నాడు: ”ఈ రోజు మీపై ఎలాంటి నిందలేదు. 26 అల్లాహ్‌ మిమ్మల్ని క్షమించుగాక! ఆయన కరుణించేవారిలో అందరి కంటే ఉత్తమమైన కారుణ్యమూర్తి!

12:93 – اذْهَبُوا بِقَمِيصِي هَـٰذَا فَأَلْقُوهُ عَلَىٰ وَجْهِ أَبِي يَأْتِ بَصِيرًا وَأْتُونِي بِأَهْلِكُمْ أَجْمَعِينَ ٩٣

”మీరు నా ఈ చొక్కా తీసుకొని పోయి దానిని నా తండ్రి ముఖం మీద వేయండి. అతనికి దృష్టి వస్తుంది. మరియు మీరు మీ కుటుంబంవారి నందరినీ నా వద్దకు తీసుకొనిరండి.”

12:94 – وَلَمَّا فَصَلَتِ الْعِيرُ قَالَ أَبُوهُمْ إِنِّي لَأَجِدُ رِيحَ يُوسُفَ ۖ لَوْلَا أَن تُفَنِّدُونِ ٩٤

ఆ బిడారం (ఈజిప్టు నుండి) బయలుదేర గానే వారి తండ్రి అన్నాడు: ”మీరు నన్ను బుధ్ధి నశించిన ముసలివాడు అన్నా! నిశ్చయంగా నాకు యూసుఫ్‌ సువాసన వస్తోంది.”

12:95 – قَالُوا تَاللَّـهِ إِنَّكَ لَفِي ضَلَالِكَ الْقَدِيمِ ٩٥

(అతని దగ్గర ఉన్న వారు) అన్నారు: ”అల్లాహ్‌ తోడు! నిశ్చయంగా, నీవు నీ పూర్వపు పొరపాటులోనే పడి ఉన్నావు.”

12:96 – فَلَمَّا أَن جَاءَ الْبَشِيرُ أَلْقَاهُ عَلَىٰ وَجْهِهِ فَارْتَدَّ بَصِيرًا ۖ قَالَ أَلَمْ أَقُل لَّكُمْ إِنِّي أَعْلَمُ مِنَ اللَّـهِ مَا لَا تَعْلَمُونَ ٩٦

ఆ తరువాత శుభవార్త తెలిపేవాడు వచ్చి, (యూసుఫ్‌ చొక్కాను) అతని ముఖం మీద వేయగానే అతని దృష్టి తిరిగి వచ్చేసింది. (అప్పుడు) అతను అన్నాడు: ”ఏమీ నేను మీతో అనలేదా? ‘మీకు తెలియనిది నాకు అల్లాహ్‌ ద్వారా తెలుస్తుందని?’ ”

12:97 – قَالُوا يَا أَبَانَا اسْتَغْفِرْ لَنَا ذُنُوبَنَا إِنَّا كُنَّا خَاطِئِينَ ٩٧

వారన్నారు: ”ఓ మా నాన్నా! మా పాపాల క్షమాపణకై (అల్లాహ్‌ను) ప్రార్థించు. నిశ్చయంగా, మేము అపరాధులము.”

12:98 – قَالَ سَوْفَ أَسْتَغْفِرُ لَكُمْ رَبِّي ۖ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ ٩٨

అతనుఅన్నాడు:”మిమ్మల్ని క్షమించమని నేను నా ప్రభువును ప్రార్థించగలను. నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత!”

12:99 – فَلَمَّا دَخَلُوا عَلَىٰ يُوسُفَ آوَىٰ إِلَيْهِ أَبَوَيْهِ وَقَالَ ادْخُلُوا مِصْرَ إِن شَاءَ اللَّـهُ آمِنِينَ ٩٩

తరువాత వారందరూ యూసుఫ్‌ వద్దకు వెళ్ళినప్పుడు, అతను తనతల్లిదండ్రులకు 27 స్థానమిచ్చి అన్నాడు: ”ఈజిప్టులో ప్రవేశించండి. అల్లాహ్‌ కోరితే మీకుసుఖశాంతులు దొరుకుతాయి.”

12:100 – وَرَفَعَ أَبَوَيْهِ عَلَى الْعَرْشِ وَخَرُّوا لَهُ سُجَّدًا ۖ وَقَالَ يَا أَبَتِ هَـٰذَا تَأْوِيلُ رُؤْيَايَ مِن قَبْلُ قَدْ جَعَلَهَا رَبِّي حَقًّا ۖ وَقَدْ أَحْسَنَ بِي إِذْ أَخْرَجَنِي مِنَ السِّجْنِ وَجَاءَ بِكُم مِّنَ الْبَدْوِ مِن بَعْدِ أَن نَّزَغَ الشَّيْطَانُ بَيْنِي وَبَيْنَ إِخْوَتِي ۚ إِنَّ رَبِّي لَطِيفٌ لِّمَا يَشَاءُ ۚ إِنَّهُ هُوَ الْعَلِيمُ الْحَكِيمُ ١٠٠

మరియు అతను తన తల్లిదండ్రులను సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. మరియు వారందరూ అతని ముందు సాష్టాంగపడ్డారు. 28 మరియు (యూసుఫ్‌) అన్నాడు: ”ఓ నా తండ్రీ! నేను పూర్వం కన్న కలయొక్క భావం ఇదేకదా! నాప్రభువు వాస్తవంగా దానిని సత్యంచేసిచూపాడు. మరియు వాస్తవంగా నన్ను చెరసాల నుండి బయ టికితీసి కూడా నాకు ఎంతో మేలుచేశాడు; నాకూ మరియు నా సోదరుల మధ్య షై’తాను విరోధం కలిగించిన తరువాత(ఇప్పుడు)మిమ్మల్ని ఎడారి నుండి (ఇక్కడకు) తెచ్చాడు. 29 నిశ్చయంగా, నా ప్రభువు సూక్ష్మగ్రాహి, తానుకోరినది యుక్తితో నెరవేర్చుతాడు. నిశ్చయంగా, ఆయన సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు. (1/4)

12:101 – رَبِّ قَدْ آتَيْتَنِي مِنَ الْمُلْكِ وَعَلَّمْتَنِي مِن تَأْوِيلِ الْأَحَادِيثِ ۚ فَاطِرَ السَّمَاوَاتِ وَالْأَرْضِ أَنتَ وَلِيِّي فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۖ تَوَفَّنِي مُسْلِمًا وَأَلْحِقْنِي بِالصَّالِحِينَ ١٠١

  • ”ఓ నా ప్రభూ! నీవు నాకు వాస్తవంగా రాజ్యాధికారాన్ని ప్రసాదించావు మరియు నాకు స్వప్ననిర్వచన జ్ఞానాన్ని కూడా ప్రసాదించావు. నీవే భూమ్యాకాశాలకు మూలాధారుడవు. మరియు ఇహ-పరలోకాలలో నీవే నా సంరక్ష కుడవు. నీకు విధేయునిగా (ముస్లింగా) ఉన్న స్థితిలోనే నన్ను మరణింపజేయి. మరియు నన్ను సద్వర్తనులలో కలుపు.”

12:102 – ذَٰلِكَ مِنْ أَنبَاءِ الْغَيْبِ نُوحِيهِ إِلَيْكَ ۖ وَمَا كُنتَ لَدَيْهِمْ إِذْ أَجْمَعُوا أَمْرَهُمْ وَهُمْ يَمْكُرُونَ ١٠٢

(ఓప్రవక్తా!) మేము నీకు దివ్యజ్ఞానం (వ’హీ) ద్వారా అవతరింపజేసిన ఈగాథ అగోచర విషయాలలోనిది. ఎందుకంటే, వారందరూ కలసి కుట్రలుపన్ని, నిర్ణయాలు చేసినప్పుడు, నీవు అక్కడ వారితో బాటు లేవు. 30

12:103 – وَمَا أَكْثَرُ النَّاسِ وَلَوْ حَرَصْتَ بِمُؤْمِنِينَ ١٠٣

మరియు నీవు ఎంతకోరినా, వీరిలో చాలా మంది విశ్వసించే వారు కారు. 31

12:104 – وَمَا تَسْأَلُهُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۚ إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ ١٠٤

మరియు నీవు వారిని దీని (హితబోధ) కొరకు ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటంలేదు. ఇది సర్వలోకాలవారికి కేవలం ఒక హితబోధ మాత్రమే.

12:105 – وَكَأَيِّن مِّنْ آيَةٍ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ يَمُرُّونَ عَلَيْهَا وَهُمْ عَنْهَا مُعْرِضُونَ ١٠٥

మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఎన్ని సూచనలను వారు చూస్తూ ఉన్నారు. అయినా వారు (వాటిని గమనించ లేక) వాటి నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు.

12:106 – وَمَا يُؤْمِنُ أَكْثَرُهُم بِاللَّـهِ إِلَّا وَهُم مُّشْرِكُونَ ١٠٦

మరియు వారిలో చాలా మంది అల్లాహ్‌ ను విశ్వసించికూడా, ఆయనకు సాటి కల్పించే వారున్నారు. 32

12:107 – أَفَأَمِنُوا أَن تَأْتِيَهُمْ غَاشِيَةٌ مِّنْ عَذَابِ اللَّـهِ أَوْ تَأْتِيَهُمُ السَّاعَةُ بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ ١٠٧

ఏమిటి? అల్లాహ్‌ శిక్ష తమను క్రమ్ముకో కుండా, వారు సురక్షితంగా ఉండగలరని, వారు భావిస్తున్నారా? లేదా వారికి తెలియకుండానే అకస్మాత్తుగా (అంతిమ) ఘడియ రాదని వారు భావిస్తున్నారా?

12:108 – قُلْ هَـٰذِهِ سَبِيلِي أَدْعُو إِلَى اللَّـهِ ۚ عَلَىٰ بَصِيرَةٍ أَنَا وَمَنِ اتَّبَعَنِي ۖ وَسُبْحَانَ اللَّـهِ وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ ١٠٨

(వారితో) అను: ”ఇదే నా మార్గం. నేనూ మరియు నన్ను అనుసరించే వారూ, నిశ్చిత జ్ఞానంతో మిమ్మల్ని అల్లాహ్‌ వైపునకు పిలుస్తున్నాము. మరియు అల్లాహ్‌ సర్వ లోపాలకు అతీతుడు మరియు నేను ఆయనకు సాటికల్పించే వారిలోని వాడనుకాను!”

12:109 – وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ إِلَّا رِجَالًا نُّوحِي إِلَيْهِم مِّنْ أَهْلِ الْقُرَىٰ ۗ أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ ۗ وَلَدَارُ الْآخِرَةِ خَيْرٌ لِّلَّذِينَ اتَّقَوْا ۗ أَفَلَا تَعْقِلُونَ ١٠٩

మరియు మేము నీ కంటే పూర్వం దివ్యజ్ఞానం (వ’హీ) ఇచ్చి పంపిన వారందరూ పురుషులే, 33 వారూ నగరవాసులలోని వారే. ఏమీ? వీరు భూమిలో సంచారం చేయలేదా, తమ పూర్వీకుల గతి ఏమయిందో చూడటానికి? దైవభీతి గలవారికి పరలోక వాసమే ఎంతో మేలైనది. ఏమీ? మీరిది అర్థంచేసుకోలేరా?

12:110 – حَتَّىٰ إِذَا اسْتَيْأَسَ الرُّسُلُ وَظَنُّوا أَنَّهُمْ قَدْ كُذِبُوا جَاءَهُمْ نَصْرُنَا فَنُجِّيَ مَن نَّشَاءُ ۖ وَلَا يُرَدُّ بَأْسُنَا عَنِ الْقَوْمِ الْمُجْرِمِينَ ١١٠

తుదకు ప్రవక్తలు నిరాశులయ్యారు మరియు వారు వాస్తవానికి (ప్రజల ద్వారా) అబద్ధీకులని తిరస్కరించబడ్డారని భావించి నప్పుడు వారికి (ప్రవక్తలకు) మా సహాయం లభించింది కాబట్టి మేము కోరిన వాడు రక్షించబడ్డాడు. మరియు మా శిక్ష అపరాధులైన జాతి వారిపై నుండి తొలగింపబడదు.

12:111 – لَقَدْ كَانَ فِي قَصَصِهِمْ عِبْرَةٌ لِّأُولِي الْأَلْبَابِ ۗ مَا كَانَ حَدِيثًا يُفْتَرَىٰ وَلَـٰكِن تَصْدِيقَ الَّذِي بَيْنَ يَدَيْهِ وَتَفْصِيلَ كُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ ١١١

వాస్తవానికి, వారి గాథలలో బుధ్ధి మంతులకు గుణపాఠముంది. ఇది (ఈ ఖుర్‌ఆన్‌) కల్పితగాథ కాదు. కాని ఇది ఇంతవరకు వచ్చిన గ్రంథాలలో మిగిలివున్న సత్యాన్ని ధృవీక రిస్తుంది మరియు ప్రతి విషయాన్ని వివరిస్తుంది. మరియు ఇది విశ్వసించేవారికి మార్గదర్శిని మరియు కారుణ్యం కూడాను.

సూరహ్‌ అర్‌-ర’అద్‌ – ర’అదున్‌: ఉరుము, మేఘగర్జన, లేక పిడుగు. ఈ సూరహ్‌ మదీనహ్లో అవతరింపజేయ బడింది. అల్లాహ్‌ (సు.త.) ఆదేశం: ”నిశ్చయంగా, ఒక జాతివారు తమ స్థితిని తాము మార్చుకో నంతవరకు, అల్లాహ్‌ వారి స్థితిని మార్చడు!” (ఆయత్‌ 13:11). 43 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 13వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 13:1 – المر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ ۗ وَالَّذِي أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ الْحَقُّ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُونَ ١

అలిఫ్‌-లామ్‌-మీమ్‌-రా. ఇవి ఈ గ్రంథ (ఖుర్‌ఆన్‌) ఆయతులు. మరియు ఇది నీ ప్రభువు తరఫు నుండి, నీపై అవతరింపజేయబడిన సత్యం! అయినా చాలా మంది విశ్వసించటం లేదు.

13:2 – اللَّـهُ الَّذِي رَفَعَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا ۖ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۖ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ ۖ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُّسَمًّى ۚ يُدَبِّرُ الْأَمْرَ يُفَصِّلُ الْآيَاتِ لَعَلَّكُم بِلِقَاءِ رَبِّكُمْ تُوقِنُونَ ٢

మీరు చూస్తున్నారు కదా! ఆకాశాలను స్తంభాలు లేకుండా నిలిపిన ఆయన, అల్లాహ్‌యే! ఆ తరువాత ఆయన, తన సింహాసనాన్ని (‘అర్ష్ను) అధిష్ఠించాడు. మరియు ఆయన సూర్య-చంద్రులను తన నియమానికి బద్ధులుగా చేశాడు. ప్రతి ఒక్కటీ తన నిర్ణీతకాలంలో (తన పరిధిలో) పయనిస్తూ ఉంటుంది. 1 ఆయన అన్ని వ్యవహారాలను నడిపిస్తూ, తన సూచనలను వివరిస్తున్నాడు; బహుశా! (ఈ విధంగానైనా) మీరు మీ ప్రభువును కలుసుకోవలసి ఉందనే విషయాన్ని నమ్ముతారేమోనని.

13:3 – وَهُوَ الَّذِي مَدَّ الْأَرْضَ وَجَعَلَ فِيهَا رَوَاسِيَ وَأَنْهَارًا ۖ وَمِن كُلِّ الثَّمَرَاتِ جَعَلَ فِيهَا زَوْجَيْنِ اثْنَيْنِ ۖ يُغْشِي اللَّيْلَ النَّهَارَ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ ٣

మరియు ఆయనే భూమిని విశాలంగా చేసి దానిలో స్థిరమైన పర్వతాలను మరియు నదులను నెలకొల్పాడు. అందులో ప్రతి రకమైన ఫలాన్ని, రెండేసి (ఆడ-మగ) జతలుగా చేశాడు. 2 ఆయనే రాత్రిని పగటిమీద కప్పుతాడు. నిశ్చయంగా వీట న్నింటిలో ఆలోచించేవారి కొరకు సూచన లున్నాయి.

13:4 – وَفِي الْأَرْضِ قِطَعٌ مُّتَجَاوِرَاتٌ وَجَنَّاتٌ مِّنْ أَعْنَابٍ وَزَرْعٌ وَنَخِيلٌ صِنْوَانٌ وَغَيْرُ صِنْوَانٍ يُسْقَىٰ بِمَاءٍ وَاحِدٍ وَنُفَضِّلُ بَعْضَهَا عَلَىٰ بَعْضٍ فِي الْأُكُلِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ ٥

మరియు భూమిలో వేర్వేరు రకాల (నేలలు) ఒక దానికొకటి ప్రక్క-ప్రక్కన ఉన్నాయి మరియు ద్రాక్ష తోటలు, పంటపొలాలు మరియు ఖర్జూరపు చెట్లు, కొన్ని ఒక్కొక్కటిగానూ, మరికొన్ని గుచ్ఛలు గుచ్ఛలు (జతలు) గానూ ఉన్నాయి. 3 వాటన్నిటికీ ఒకే నీరు పారుతుంది, కాని తినటానికి వాటి రుచులు, ఒకటి మరొక దాని కంటే ఉత్తమమైనదిగా ఉన్నట్లు చేశాము. నిశ్చయంగా, వీటన్నింటిలో అర్థంచేసుకోగల వారి కొరకు ఎన్నో సూచనలున్నాయి. 4 (3/8

13:5 – وَإِن تَعْجَبْ فَعَجَبٌ قَوْلُهُمْ أَإِذَا كُنَّا تُرَابًا أَإِنَّا لَفِي خَلْقٍ جَدِيدٍ ۗ أُولَـٰئِكَ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ ۖ وَأُولَـٰئِكَ الْأَغْلَالُ فِي أَعْنَاقِهِمْ ۖ وَأُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٥

  • ఇది నీకు ఆశ్చర్యకరంగా ఉంటే, వారి ఈ మాట అంతకంటే ఆశ్చర్యకరమైనది: ”ఏమీ? మేము మట్టిగా మారిపోయిన తరువాత కూడా వాస్తవంగా మరల క్రొత్తగా సృష్టించబడతామా?” అలాంటివారే తమ ప్రభువును తిరస్కరించిన వారు. అలాంటివారి మెడలలో సంకెళ్ళు వేయబడి ఉంటాయి. 5 మరియు అలాంటివారే నరక వాసులు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు.

13:6 – وَيَسْتَعْجِلُونَكَ بِالسَّيِّئَةِ قَبْلَ الْحَسَنَةِ وَقَدْ خَلَتْ مِن قَبْلِهِمُ الْمَثُلَاتُ ۗ وَإِنَّ رَبَّكَ لَذُو مَغْفِرَةٍ لِّلنَّاسِ عَلَىٰ ظُلْمِهِمْ ۖ وَإِنَّ رَبَّكَ لَشَدِيدُ الْعِقَابِ ٦

మరియు వారు మేలుకు ముందు కీడును (తెమ్మని) నిన్ను తొందరపెడుతున్నారు. 6 మరియు వారికి పూర్వం అనేక ఉదాహరణలు గడిచాయి. మరియు వారు దుర్మార్గం చేసి నప్పటికీ! 7 నిశ్చయంగా, నీ ప్రభువు ప్రజల యెడల క్షమాశీలుడు. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు శిక్షించటంలో కూడా చాలా కఠినుడు. 8

13:7 – وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ ۗ إِنَّمَا أَنتَ مُنذِرٌ ۖ وَلِكُلِّ قَوْمٍ هَادٍ ٧

మరియు సత్యతిరస్కారులు అంటున్నారు: ”అతని పై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా ఒక అద్భుత సంకేతం ఎందుకు అవతరింపజేయ బడలేదు?” 9 వాస్తవానికి నీవు కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే! మరియు ప్రతి జాతికి ఒక మార్గదర్శకుడు వచ్చి ఉన్నాడు. 10

13:8 – اللَّـهُ يَعْلَمُ مَا تَحْمِلُ كُلُّ أُنثَىٰ وَمَا تَغِيضُ الْأَرْحَامُ وَمَا تَزْدَادُ ۖ وَكُلُّ شَيْءٍ عِندَهُ بِمِقْدَارٍ ٨

అల్లాహ్‌కు, ప్రతి స్త్రీ తన గర్భంలోదాల్చేది 11 మరియు గర్భకాలపు హెచ్చుతగ్గులు 12 కూడా బాగా తెలుసు. ప్రతిదానికి ఆయన దగ్గర ఒక పరిమాణం (నిర్ణయింపబడి) ఉంది.

13:9 – عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْكَبِيرُ الْمُتَعَالِ ٩

ఆయన అగోచర మరియు గోచర విషయా లన్నింటినీ ఎరిగిన వాడు. మహనీయుడు, 13 సర్వోన్నతుడు. 14

13:10 – سَوَاءٌ مِّنكُم مَّنْ أَسَرَّ الْقَوْلَ وَمَن جَهَرَ بِهِ وَمَنْ هُوَ مُسْتَخْفٍ بِاللَّيْلِ وَسَارِبٌ بِالنَّهَارِ ١٠

మీలో ఒకడు తన మాటను రహస్యంగా చెప్పినా, లేక దానిని బహిరంగంగా చెప్పినా మరియు ఒకడు రాత్రి చీకటిలో దాగి ఉన్నా లేక పగటి వెలుగులో తిరుగుతూ ఉన్నా, (అల్లాహ్‌ దృష్టిలో) అంతా సమానమే (ఒకటే)! 14

13:11 – لَهُ مُعَقِّبَاتٌ مِّن بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ يَحْفَظُونَهُ مِنْ أَمْرِ اللَّـهِ ۗ إِنَّ اللَّـهَ لَا يُغَيِّرُ مَا بِقَوْمٍ حَتَّىٰ يُغَيِّرُوا مَا بِأَنفُسِهِمْ ۗ وَإِذَا أَرَادَ اللَّـهُ بِقَوْمٍ سُوءًا فَلَا مَرَدَّ لَهُ ۚ وَمَا لَهُم مِّن دُونِهِ مِن وَالٍ ١١

ప్రతివాని ముందూ వెనుకా ఆయన నియ మించిన, ఒకరివెంట ఒకరు వచ్చే 16 కావలివారు (దైవదూతలు) ఉన్నారు. వారు అల్లాహ్‌ ఆజ్ఞానుసారం అతనిని (మనిషిని) కాపాడుతూ ఉంటారు. నిశ్చయంగా ఒక జాతివారు తమ స్థితిని తాము మార్చుకోనంత వరకు, అల్లాహ్‌ వారి స్థితిని మార్చడు. 17 అల్లాహ్‌ ఒక జాతి వారికి కీడు చేయదలిస్తే దానిని ఎవ్వరూ తొలగించ లేరు. మరియు వారికి ఆయన తప్ప మరొక స్నేహితుడు (ఆదుకునేవాడు) లేడు.

13:12 – هُوَ الَّذِي يُرِيكُمُ الْبَرْقَ خَوْفًا وَطَمَعًا وَيُنشِئُ السَّحَابَ الثِّقَالَ ١٢

ఆయనే! మీకు భయం మరియు ఆశ కలిగించే మెరుపులను చూపుతున్నాడు. మరియు ఆయనే నీళ్ళతో బరువెక్కిన మేఘాలను పుట్టిస్తున్నాడు.

13:13 – وَيُسَبِّحُ الرَّعْدُ بِحَمْدِهِ وَالْمَلَائِكَةُ مِنْ خِيفَتِهِ وَيُرْسِلُ الصَّوَاعِقَ فَيُصِيبُ بِهَا مَن يَشَاءُ وَهُمْ يُجَادِلُونَ فِي اللَّـهِ وَهُوَ شَدِيدُ الْمِحَالِ ١٣

  1. మరియు ఉరుము ఆయన పవిత్రతను కొని యాడుతుంది, ఆయన స్తోత్రం చేస్తుంది; మరియు దైవదూతలు కూడా ఆయనభయంతో (ఆయన స్తోత్రం చేస్తూ ఉంటారు)! 18 మరియు ఆయన ఫెళ ఫెళమనే ఉరుములను పంపి, వాటిద్వారా తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అయినా వీరు (సత్య- తిరస్కారులు) అల్లాహ్‌ ను గురించి వాదులాడు తున్నారు. మరియు ఆయన అద్భుత యుక్తిపరుడు. 19

13:14 – لَهُ دَعْوَةُ الْحَقِّ ۖ وَالَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ لَا يَسْتَجِيبُونَ لَهُم بِشَيْءٍ إِلَّا كَبَاسِطِ كَفَّيْهِ إِلَى الْمَاءِ لِيَبْلُغَ فَاهُ وَمَا هُوَ بِبَالِغِهِ ۚ وَمَا دُعَاءُ الْكَافِرِينَ إِلَّا فِي ضَلَالٍ ١٤

ఆయనను ప్రార్థించటమే విద్యుక్త ధర్మం. ఆయనను వదలి వారు ప్రార్థించేవి (ఇతర శక్తులు) వారికి ఏవిధమైన సమాధానమివ్వలేవు. అది (వాటిని వేడుకోవడం): ఒకడు తన రెండుచేతులు నీటివైపుకు చాచి అది (నీరు) నోటిదాకా రావాలని ఆశించటమే! కాని అది అతని (నోటి వరకు) చేరదు కదా! (అలాగే) సత్య-తిరస్కారుల ప్రార్థన లన్నీ వ్యర్థమైపోతాయి.

13:15 – وَلِلَّـهِ يَسْجُدُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَظِلَالُهُم بِالْغُدُوِّ وَالْآصَالِ ۩ ١٥

మరియు భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఇష్టంగానో అయిష్టంగానో అల్లాహ్‌కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటుంది. మరియు వాటి నీడలు కూడా ఉదయం మరియు సాయంత్రం (సాష్టాంగం చేస్తూ ఉంటాయి). 20 (సజ్దా)

13:16 – قُلْ مَن رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّـهُ ۚ قُلْ أَفَاتَّخَذْتُم مِّن دُونِهِ أَوْلِيَاءَ لَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ نَفْعًا وَلَا ضَرًّا ۚ قُلْ هَلْ يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ أَمْ هَلْ تَسْتَوِي الظُّلُمَاتُ وَالنُّورُ ۗ أَمْ جَعَلُوا لِلَّـهِ شُرَكَاءَ خَلَقُوا كَخَلْقِهِ فَتَشَابَهَ الْخَلْقُ عَلَيْهِمْ ۚ قُلِ اللَّـهُ خَالِقُ كُلِّ شَيْءٍ وَهُوَ الْوَاحِدُ الْقَهَّارُ ١٦

ఇలా అడుగు: ”భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు?” నీవే ఇలా జవాబివ్వు: ”అల్లాహ్‌!” తరు వాత ఇలా అను: ”అయితే మీరు ఆయనను వదలి తమకుతాము మేలుగానీ, కీడుగానీ చేసుకో లేని వారిని, మీకు సహాయకులుగా (సంరక్షకు లుగా) ఎన్నుకుంటారా?” ఇంకా ఇలా అడుగు: ”ఏమీ? గ్రుడ్డివాడు మరియు చూడ గలిగేవాడూ సమానులు కాగలరా? లేక అంధకారాలు మరియు వెలుగు సమానమేనా? లేక వారు (అల్లాహ్‌కు) సాటి-కల్పించిన వారు కూడా అల్లాహ్‌ సృష్టించి నట్లు ఏమైనా సృష్టించారా అందువలన సృష్టి విషయంలో వారికి సందేహం కలిగిందా?” వారితో అను: ”అల్లాహ్‌యే ప్రతి దానికి సృష్టికర్త. 21 మరియు ఆయన అద్వితీయుడు, ప్రబలుడు (తన సృష్టిపై సంపూర్ణ అధికారం గలవాడు).” 22

13:17 – أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَسَالَتْ أَوْدِيَةٌ بِقَدَرِهَا فَاحْتَمَلَ السَّيْلُ زَبَدًا رَّابِيًا ۚ وَمِمَّا يُوقِدُونَ عَلَيْهِ فِي النَّارِ ابْتِغَاءَ حِلْيَةٍ أَوْ مَتَاعٍ زَبَدٌ مِّثْلُهُ ۚ كَذَٰلِكَ يَضْرِبُ اللَّـهُ الْحَقَّ وَالْبَاطِلَ ۚ فَأَمَّا الزَّبَدُ فَيَذْهَبُ جُفَاءً ۖ وَأَمَّا مَا يَنفَعُ النَّاسَ فَيَمْكُثُ فِي الْأَرْضِ ۚ كَذَٰلِكَ يَضْرِبُ اللَّـهُ الْأَمْثَالَ ١٧

ఆయన (అల్లాహ్‌) ఆకాశం నుండి నీరు కురిపించగా (ఎండిపోయిన) సెలయేళ్ళు తమ తమ పరిమాణాలకు సరిపడేలా 23 ప్రవహింప సాగుతాయి. అప్పుడు వరద (ఉపరితలం మీద) నురుగులు ఉబ్బివస్తాయి. మరియు అగ్నిని రగిలించి నగలు, పాత్రలు చేసేటప్పుడు కూడా కరిగించే లోహాల మీద కూడా అదేవిధంగా నురుగులు వస్తాయి. 24 ఈ విధంగా అల్లాహ్‌ సత్యమేదో అసత్యమేదో పోల్చి వివరిస్తున్నాడు. ఎందుకంటే నురుగంతా ఎగిరిపోతుంది, కాని మానవులకు లాభదాయకమైనది భూమిలో మిగులుతుంది. ఈ విధంగా అల్లాహ్‌ ఉదాహరణ లను వివరిస్తున్నాడు. 25

13:18 – لِلَّذِينَ اسْتَجَابُوا لِرَبِّهِمُ الْحُسْنَىٰ ۚ وَالَّذِينَ لَمْ يَسْتَجِيبُوا لَهُ لَوْ أَنَّ لَهُم مَّا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ مَعَهُ لَافْتَدَوْا بِهِ ۚ أُولَـٰئِكَ لَهُمْ سُوءُ الْحِسَابِ وَمَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمِهَادُ ١٨

తమ ప్రభువుసందేశాన్ని స్వీకరించిన వారికి మంచిప్రతిఫలంఉంటుంది. మరియు ఆయన సందే శాన్ని స్వీకరించని వారి దగ్గర భూమిలో ఉన్న దంతా మరియు దానితో పాటు దానికి సమానంగా ఉన్నా, వారు అదంతా పరిహారంగా ఇవ్వదలచు కున్నా (అది స్వీకరించబడదు). 26 అలాంటి వారి లెక్క దారుణంగా ఉంటుంది. మరియు వారి ఆశ్రయం నరకమే. మరియు అది ఎంతో దుర్భర మైన విరామ స్థలము. (1/2)

13:19 – فَمَن يَعْلَمُ أَنَّمَا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ الْحَقُّ كَمَنْ هُوَ أَعْمَىٰ ۚ إِنَّمَا يَتَذَكَّرُ أُولُو الْأَلْبَابِ ١٩

  • ఏమీ? నీ ప్రభువు నుండి నీపై అవతరింప జేయబడినది (ఈ సందేశం) సత్యమని తెలుసు కున్నవాడు, గ్రుడ్డివానితో సమానుడా? నిశ్చయంగా, బుధ్ధిమంతులే ఇది (ఈ విషయం) గ్రహించగలరు.

13:20 – الَّذِينَ يُوفُونَ بِعَهْدِ اللَّـهِ وَلَا يَنقُضُونَ الْمِيثَاقَ ٢٠

వారే, ఎవరైతే అల్లాహ్‌తో చేసిన వాగ్దానం పూర్తిచేస్తారో మరియు తమ వాగ్దానాన్ని భంగపరచరో! 27

13:21 – وَالَّذِينَ يَصِلُونَ مَا أَمَرَ اللَّـهُ بِهِ أَن يُوصَلَ وَيَخْشَوْنَ رَبَّهُمْ وَيَخَافُونَ سُوءَ الْحِسَابِ ٢١

మరియు ఎవరైతే అల్లాహ్‌ కలుపమని ఆజ్ఞాపించిన వాటిని కలుపుతారో! 28 మరియు తమ ప్రభువుకు భయపడుతారో మరియు దారుణంగా (ఖచ్చితంగా) తీసుకోబడే లెక్కకు భయపడుతారో!

13:22 – وَالَّذِينَ صَبَرُوا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِمْ وَأَقَامُوا الصَّلَاةَ وَأَنفَقُوا مِمَّا رَزَقْنَاهُمْ سِرًّا وَعَلَانِيَةً وَيَدْرَءُونَ بِالْحَسَنَةِ السَّيِّئَةَ أُولَـٰئِكَ لَهُمْ عُقْبَى الدَّارِ ٢٢

మరియు ఎవరైతే తమప్రభువు ప్రీతి కొరకు సహనం వహించి 29 మరియు నమా’జ్‌ స్థాపించి 30 మరియు మేము ప్రసాదించిన ఉపాధి నుండి రహస్యంగా మరియు బహిరంగంగా (అల్లాహ్‌ మార్గంలో) ఖర్చుచేస్తూ, చెడును మంచి ద్వారా పారద్రోలుతూ ఉంటారో; 31 అలాంటి వారికే ఉత్తమ పరలోకగృహం ప్రతిఫలంగా ఉంటుంది.

13:23 – جَنَّاتُ عَدْنٍ يَدْخُلُونَهَا وَمَن صَلَحَ مِنْ آبَائِهِمْ وَأَزْوَاجِهِمْ وَذُرِّيَّاتِهِمْ ۖ وَالْمَلَائِكَةُ يَدْخُلُونَ عَلَيْهِم مِّن كُلِّ بَابٍ ٢٣

శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలో 32 వారు మరియు వారితో పాటు సద్వర్తనులైన వారి తండ్రి-తాతలు వారి సహవాసులు (అ’జ్వాజ్‌) మరియు వారి సంతానం కూడా ప్రవేశిస్తారు. 33 మరియు ప్రతి ద్వారం నుండి దేవదూతలు వారి (స్వాగతం) కొరకు వస్తారు.

13:24 – سَلَامٌ عَلَيْكُم بِمَا صَبَرْتُمْ ۚ فَنِعْمَ عُقْبَى الدَّارِ ٢٤

(దేవదూతలు అంటారు): ”మీ సహనానికి, ఫలితంగా ఇప్పుడు మీకు శాంతి కలుగుగాక (సలాం)! ఇక ఈ అంతిమ (పరలోక) గృహం ఎంతో సౌఖ్యదాయక మైనది!”

13:25 – وَالَّذِينَ يَنقُضُونَ عَهْدَ اللَّـهِ مِن بَعْدِ مِيثَاقِهِ وَيَقْطَعُونَ مَا أَمَرَ اللَّـهُ بِهِ أَن يُوصَلَ وَيُفْسِدُونَ فِي الْأَرْضِ ۙ أُولَـٰئِكَ لَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوءُ الدَّارِ ٢٥

మరియుఅల్లాహ్‌తో ఒడంబడిక చేసుకున్న తరువాత తమ వాగ్దానాన్ని భంగంచేసేవారు మరియు అల్లాహ్‌: ‘కలపండి’, అని ఆదేశించిన వాటిని త్రెంచేవారు మరియు భూమిలో కల్లోలం రేకెత్తించేవారు! ఇలాంటి వారందరికీ ఆయన శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు వారికి (పరలోకంలో) బహుచెడ్డ నివాసముంటుంది.

13:26 – اللَّـهُ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ وَفَرِحُوا بِالْحَيَاةِ الدُّنْيَا وَمَا الْحَيَاةُ الدُّنْيَا فِي الْآخِرَةِ إِلَّا مَتَاعٌ ٢٦

అల్లాహ్‌ తాను కోరినవారికి జీవనోపాధి పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు (తాను కోరిన వారికి) పరిమితం చేస్తాడు. 34 మరియు వారు ఇహలోక జీవితంలో సంతోషంగా ఉన్నారు, కాని పరలోక జీవితం ముందు ఇహలోక జీవిత సుఖ సంతోషాలు తాత్కాలిక (తుచ్ఛ) మైనవే!

13:27 – وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ ۗ قُلْ إِنَّ اللَّـهَ يُضِلُّ مَن يَشَاءُ وَيَهْدِي إِلَيْهِ مَنْ أَنَابَ ٢٧

మరియు సత్య-తిరస్కారులు: ”అతని (ము’హమ్మద్‌) పై, అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా ఒక అద్భుత సంకేతం ఎందుకు అవత రింపజేయబడలేదు?” 35 అని అంటున్నారు. వారితో అను: ”నిశ్చయంగా, అల్లాహ్‌ తాను కోరిన వారిని మార్గ-భ్రష్టులుగా వదలుతాడు మరియు పశ్చాత్తాపపడి ఆయన వైపునకు తిరిగే వారికి సన్మార్గం చూపుతాడు.”

13:28 – الَّذِينَ آمَنُوا وَتَطْمَئِنُّ قُلُوبُهُم بِذِكْرِ اللَّـهِ ۗ أَلَا بِذِكْرِ اللَّـهِ تَطْمَئِنُّ الْقُلُوبُ ٢٨

ఎవరైతే విశ్వసించారో, వారి హృదయాలు అల్లాహ్‌ ధ్యానం వలన తృప్తి పొందుతాయి. జాగ్రత్తగా వినండి! కేవలం అల్లాహ్‌ ధ్యానమే (స్మరణయే) హృదయాలకు తృప్తినిస్తుంది.

13:29 – الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ طُوبَىٰ لَهُمْ وَحُسْنُ مَآبٍ ٢٩

విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి (ఇహ లోకంలో) ఆనందం, సర్వసుఖాలు 36 మరియు (పర లోకంలో) మంచి గమ్యస్థానం ఉంటాయి.

13:30 – كَذَٰلِكَ أَرْسَلْنَاكَ فِي أُمَّةٍ قَدْ خَلَتْ مِن قَبْلِهَا أُمَمٌ لِّتَتْلُوَ عَلَيْهِمُ الَّذِي أَوْحَيْنَا إِلَيْكَ وَهُمْ يَكْفُرُونَ بِالرَّحْمَـٰنِ ۚ قُلْ هُوَ رَبِّي لَا إِلَـٰهَ إِلَّا هُوَ عَلَيْهِ تَوَكَّلْتُ وَإِلَيْهِ مَتَابِ ٣٠

అందుకే (ఓ ము’హమ్మద్‌!) మేము నిన్ను ఒక సమాజం వారి వద్దకు పంపాము – వాస్తవానికి వారికి పూర్వం ఎన్నో సమాజాలు గతించాయి – నీవు నీపై మేము అవతరింపజేసిన దివ్యజ్ఞానం వారికి వినిపించటానికి! ఎందుకంటే వారు తమ కరుణామయుణ్ణి తిరస్కరిస్తున్నారు. 37 వారితో అను: ”ఆయనే నా ప్రభువు! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! నేను ఆయననే నమ్ము కున్నాను. మరియు ఆయన వైపునకే నేను పశ్చాత్తాపంతో మరలిపోవలసి ఉన్నది.”

13:31 – وَلَوْ أَنَّ قُرْآنًا سُيِّرَتْ بِهِ الْجِبَالُ أَوْ قُطِّعَتْ بِهِ الْأَرْضُ أَوْ كُلِّمَ بِهِ الْمَوْتَىٰ ۗ بَل لِّلَّـهِ الْأَمْرُ جَمِيعًا ۗ أَفَلَمْ يَيْأَسِ الَّذِينَ آمَنُوا أَن لَّوْ يَشَاءُ اللَّـهُ لَهَدَى النَّاسَ جَمِيعًا ۗ وَلَا يَزَالُ الَّذِينَ كَفَرُوا تُصِيبُهُم بِمَا صَنَعُوا قَارِعَةٌ أَوْ تَحُلُّ قَرِيبًا مِّن دَارِهِمْ حَتَّىٰ يَأْتِيَ وَعْدُ اللَّـهِ ۚ إِنَّ اللَّـهَ لَا يُخْلِفُ الْمِيعَادَ ٣١

మరియు నిశ్చయంగా, (ఖుర్‌ఆన్‌ను) పఠిం చటం వలన కొండలు కదలింపబడినా, లేదా దాని వల్ల భూమిచీల్చబడినా లేదా దానివల్ల మృతులు మాట్లాడేటట్లు చేయబడినా! (అవిశ్వాసులు దానిని విశ్వసించరు). వాస్తవానికి సర్వ నిర్ణయాల అధికారం కేవలం అల్లాహ్‌కే చెందుతుంది. 38 ఏమీ? ఒకవేళ అల్లాహ్‌ కోరితే సర్వ మానవులకు సన్మార్గం చూపేవాడని తెలిసికూడా విశ్వాసులు ఎందుకు ఆశవదులుకుంటున్నారు? 39 మరియు అల్లాహ్‌ వాగ్దానం పూర్తి అయ్యేవరకు సత్య-తిరస్కారంలో మునిగి ఉన్న వారిపై, వారి కర్మల ఫలితంగా, ఏదో ఒక ఆపద కలుగుతూనే ఉంటుంది. లేదా అది వారి ఇండ్ల సమీపంలో పడుతూ ఉంటుంది. 40 నిశ్చయంగా, అల్లాహ్‌ తన వాగ్దానాన్ని భంగపరచడు.

13:32 – وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّن قَبْلِكَ فَأَمْلَيْتُ لِلَّذِينَ كَفَرُوا ثُمَّ أَخَذْتُهُمْ ۖ فَكَيْفَ كَانَ عِقَابِ ٣٢

మరియు (ఓ ము’హమ్మద్‌!) వాస్తవానికి నీకు పూర్వం కూడా చాలా మంది ప్రవక్తలు పరిహసించబడ్డారు, కావున మొదట నేను సత్య-తిరస్కారులకు వ్యవధినిచ్చాను తరువాత వారిని పట్టుకున్నాను. (చూశారా!) నా ప్రతీకారం (శిక్ష) ఎలా ఉండిందో! 41

13:33 – أَفَمَنْ هُوَ قَائِمٌ عَلَىٰ كُلِّ نَفْسٍ بِمَا كَسَبَتْ ۗ وَجَعَلُوا لِلَّـهِ شُرَكَاءَ قُلْ سَمُّوهُمْ ۚ أَمْ تُنَبِّئُونَهُ بِمَا لَا يَعْلَمُ فِي الْأَرْضِ أَم بِظَاهِرٍ مِّنَ الْقَوْلِ ۗ بَلْ زُيِّنَ لِلَّذِينَ كَفَرُوا مَكْرُهُمْ وَصُدُّوا عَنِ السَّبِيلِ ۗ وَمَن يُضْلِلِ اللَّـهُ فَمَا لَهُ مِنْ هَادٍ ٣٣

ఏమీ? ఆయన (అల్లాహ్‌) ప్రతివ్యక్తి అర్జించే దానిని కనిపెట్టుకుని ఉండేవాడు (మరియు లాభ-నష్టాలు కలుగజేయలేని మీ బూటకపు దైవాలు సరిసమానులా)? అయినా వారు అల్లాహ్‌కు భాగ స్వాములు (సాటి) కల్పిస్తారు. వారితో ఇలా అను: ”(నిజంగానే వారు అల్లాహ్‌ స్వయంగా నియ మించుకున్న భాగస్వాములేఅయితే) వారి పేర్లను తెలుపండి! లేక భూమిలో ఉన్నట్లు ఆయనకు తెలియని విషయాన్ని మీరు ఆయనకు తెలుపు తున్నారా? లేక మీరు ఇట్లే నోటికి వచ్చినట్లు వాగుతున్నారా?” 42 వాస్తవానికి, సత్యాన్ని తిరస్కరించిన వారికి, వారి కుట్ర ఆకర్షణీయంగా చేయబడుతోంది. మరియు వారు ఋజుమార్గం నుండి నిరోధించబడ్డారు. మరియు అల్లాహ్‌ మార్గభ్రష్టత్వంలో వదలిన వానికి సన్మార్గం చూపేవాడు ఎవ్వడూ ఉండడు. 43

13:34 – لَّهُمْ عَذَابٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَشَقُّ ۖ وَمَا لَهُم مِّنَ اللَّـهِ مِن وَاقٍ ٣٤

వారికి ఇహలోక జీవితంలో శిక్ష వుంది. మరియు వారి పరలోక జీవిత శిక్ష ఎంతో కఠినమైనది. మరియు వారిని అల్లాహ్‌ (శిక్ష) నుండి రక్షించేవాడు ఎవ్వడూ ఉండడు. 44 (5/8)

13:35 – مَّثَلُ الْجَنَّةِ الَّتِي وُعِدَ الْمُتَّقُونَ ۖ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ أُكُلُهَا دَائِمٌ وَظِلُّهَا ۚ تِلْكَ عُقْبَى الَّذِينَ اتَّقَوا ۖ وَّعُقْبَى الْكَافِرِينَ النَّارُ ٣٥

  • దైవభీతి గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గపు ఉదాహరణ ఇదే! దాని క్రింద సెలయేళ్ళు పారుతూ ఉంటాయి. 45 దాని ఫలాలు మరియు నీడ సదా ఉంటాయి. 46 దైవభీతి గలవారి అంతిమ ఫలితం ఇదే. మరియు సత్య-తిరస్కారుల అంతిమ ఫలితం నరకాగ్నియే!

13:36 – وَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَفْرَحُونَ بِمَا أُنزِلَ إِلَيْكَ ۖ وَمِنَ الْأَحْزَابِ مَن يُنكِرُ بَعْضَهُ ۚ قُلْ إِنَّمَا أُمِرْتُ أَنْ أَعْبُدَ اللَّـهَ وَلَا أُشْرِكَ بِهِ ۚ إِلَيْهِ أَدْعُو وَإِلَيْهِ مَآبِ ٣٦

మరియు (ఓ ప్రవక్తా!) ఎవరికైతే మేము (ముందు) గ్రంథాన్ని ఇచ్చామో! వారు నీపై అవతరింపజేయబడిన దాని (ఈ గ్రంథం) వలన సంతోషపడుతున్నారు. 47 మరియు వారిలోని కొన్ని వర్గాల వారు దానిలోని కొన్ని విషయాలను తిరస్కరించేవారు కూడా ఉన్నారు. 48 వారితో ఇలా అను: ”నిశ్చయంగా, నేను అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలని మరియు ఆయనకు సాటి (భాగ-స్వాములను) కల్పించరాదని ఆజ్ఞాపించబడ్డాను. నేను మిమ్మల్ని ఆయన వైపునకే ఆహ్వానిస్తున్నాను మరియు గమ్యస్థానం కూడా ఆయనవద్దనే ఉంది!”

13:37 – وَكَذَٰلِكَ أَنزَلْنَاهُ حُكْمًا عَرَبِيًّا ۚ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُم بَعْدَ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ مَا لَكَ مِنَ اللَّـهِ مِن وَلِيٍّ وَلَا وَاقٍ ٣٧

మరియు ఈవిధంగా మేము అరబ్బీభాషలో మా శాసనాన్ని అవతరింపజేశాము. 49 ఇక నీవు ఈ జ్ఞానం వచ్చిన తరువాత కూడా వారి కోరిక లను అనుసరిస్తే, అల్లాహ్‌ నుండి నిన్ను రక్షించే వాడుగానీ, కాపాడేవాడుగానీ ఎవ్వడూ ఉండడు.

13:38 – وَلَقَدْ أَرْسَلْنَا رُسُلًا مِّن قَبْلِكَ وَجَعَلْنَا لَهُمْ أَزْوَاجًا وَذُرِّيَّةً ۚ وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأْتِيَ بِآيَةٍ إِلَّا بِإِذْنِ اللَّـهِ ۗ لِكُلِّ أَجَلٍ كِتَابٌ ٣٨

మరియు (ఓ ము’హమ్మద్‌!) వాస్తవానికి మేము నీకు పూర్వం అనేక ప్రవక్తలను పంపాము మరియు వారికి భార్యాపిల్లలను ప్రసాదించాము. 50 అల్లాహ్‌ అనుమతి లేకుండా, ఏ అధ్భుత సంకే తాన్ని (స్వయంగా) తెచ్చి చూపే శక్తి ఏ ప్రవక్తకూ లేదు. 51 ప్రతి వాగ్దానానికి (విషయానికి) వ్రాయ బడిన ఒక ఆదేశం (శాసనం) ఉంది. 52

13:39 – يَمْحُو اللَّـهُ مَا يَشَاءُ وَيُثْبِتُ ۖ وَعِندَهُ أُمُّ الْكِتَابِ ٣٩

అల్లాహ్‌ తానుకోరిన దానిని రద్దుచేస్తాడు మరియు (తాను కోరిన దానిని) స్థిరపరుస్తాడు. 53 మరియు మాతృగ్రంథం (ఉమ్ముల్‌ కితాబ్‌) ఆయన దగ్గరే ఉంది. 54

13:40 – وَإِن مَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ وَعَلَيْنَا الْحِسَابُ ٤٠

మరియు (ఓ ప్రవక్తా!) మేము వారికి చేసిన వాగ్దానాలలో కొన్నింటిని నీకు చూపినా, లేదా (వాటిని చూపక ముందు) నిన్ను మరణింపజేసినా, నీ బాధ్యత కేవలం (మా సందేశాన్ని) అందజేయ టమే! మరియు లెక్కతీసుకోవటం కేవలం మాపని.

13:41 – أَوَلَمْ يَرَوْا أَنَّا نَأْتِي الْأَرْضَ نَنقُصُهَا مِنْ أَطْرَافِهَا ۚ وَاللَّـهُ يَحْكُمُ لَا مُعَقِّبَ لِحُكْمِهِ ۚ وَهُوَ سَرِيعُ الْحِسَابِ ٤١

ఏమీ? వాస్తవానికి మేము భూమిని అన్ని వైపులనుండి తగ్గిస్తూవస్తున్నామనేది వారు చూడ టం లేదా? 55 మరియు అల్లాహ్‌యే ఆజ్ఞఇస్తాడు! ఆయన ఆజ్ఞను మార్చేవాడు ఎవ్వడూ లేడు. మరియు ఆయన లెక్కతీసుకోవటంలో అతిశీఘ్రుడు.

13:42 – وَقَدْ مَكَرَ الَّذِينَ مِن قَبْلِهِمْ فَلِلَّـهِ الْمَكْرُ جَمِيعًا ۖ يَعْلَمُ مَا تَكْسِبُ كُلُّ نَفْسٍ ۗ وَسَيَعْلَمُ الْكُفَّارُ لِمَنْ عُقْبَى الدَّارِ ٤٢

మరియు వాస్తవానికి వారికి పూర్వం ఉన్నవారు కూడా కుట్రలు పన్నారు. కాని, కుట్ర లన్నీ అల్లాహ్‌కే చెందినవి. ప్రతిప్రాణి సంపాదించేది ఆయనకు తెలుసు. మరియు (మేలైన) అంతిమ (పరలోక) నివాసం ఎవరిదో సత్యతిరస్కారులు తెలుసుకుంటారు.

13:43 – وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَسْتَ مُرْسَلًا ۚ قُلْ كَفَىٰ بِاللَّـهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ وَمَنْ عِندَهُ عِلْمُ الْكِتَابِ ٤٣

మరియు (ఓ ప్రవక్తా!) సత్యతిరస్కారులు నీతో అంటున్నారు: ”నీవు సందేశహరుడవు కావు!” వారితో అను: ”నాకూ-మీకూ మధ్య అల్లాహ్‌ సాక్ష్యమే చాలు! మరియు వారి (సాక్ష్యం), ఎవరికైతే గ్రంథజ్ఞానం ఉందో!” 56

సూరహ్‌ ఇబ్రాహీమ్‌ – ఇబ్రాహీమ్‌ (‘అ.స.) మక్కహ్ ముకర్రమహ్ కొరకు చేసిన ప్రార్థన (ఆయత్‌లు 35-41), ఈ సూరహ్‌ యొక్క మూల భాగం. ఇది చివరి మక్కహ్ కాలపు సూరాహ్‌లలో (10-15) ఐదవది. ఇ’త్ఖాన్‌ ప్రకారం ఇది సూరహ్‌ నూ’హ్‌ (71) తరువాత అవతరింపజేయబడింది. దివ్యసందేశాలు ప్రజలను అంధకారాల నుండి వెలుగులోకి తీసుకురావటానికి అవతరింపజేయబడ్డాయి. ఇతర దివ్యగ్రంథాలు తమ ప్రవక్తలపై తమకాలపు ప్రజలకొరకు వచ్చాయి, కాని దివ్యఖుర్‌ఆన్‌ సర్వలోకాల వారికొరకు అవతరింపజేయబడిందని, అల్లాహ్‌ (సు.త.) మొదటి మరియు 52వ ఆయత్‌లలో వ్యక్తం చేశాడు. 52 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 35వ ఆయత్‌లో ఉంది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 14:1 – الر ۚ كِتَابٌ أَنزَلْنَاهُ إِلَيْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ بِإِذْنِ رَبِّهِمْ إِلَىٰ صِرَاطِ الْعَزِيزِ الْحَمِيدِ ١

అలిఫ్‌-లామ్‌-రా. (ఇది) ఒక దివ్యగ్రంథం. దీనిని మేము, ప్రజలను – వారి ప్రభువు అనుమతితో – అంధకారాల నుండి వెలుతురు లోకి, 1 సర్వ శక్తిమంతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడైన (అల్లాహ్‌) మార్గం వైపునకు తీసుకు రావటానికి (ఓ ము’హమ్మద్‌!) నీపై అవతరింపజేశాము.

14:2 – اللَّـهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَوَيْلٌ لِّلْكَافِرِينَ مِنْ عَذَابٍ شَدِيدٍ ٢

ఆయనే అల్లాహ్‌! ఆకాశాలలో ఉన్నదీ మరియు భూమిలో ఉన్నదీ సర్వమూ ఆయనకే చెందుతుంది! మరియు సత్య-తిరస్కారులకు కఠిన శిక్ష వల్ల తీవ్రమైన దుఃఖం (వ్యధ) కలుగు తుంది.

14:3 – الَّذِينَ يَسْتَحِبُّونَ الْحَيَاةَ الدُّنْيَا عَلَى الْآخِرَةِ وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّـهِ وَيَبْغُونَهَا عِوَجًا ۚ أُولَـٰئِكَ فِي ضَلَالٍ بَعِيدٍ ٣

ఎవరైతే పరలోక జీవితం కంటే, ఇహలోక జీవి తానికి అధిక ప్రాధాన్యతనిచ్చి, (ప్రజలను) అల్లాహ్‌ మార్గం నుండి ఆటంకపరుస్తూ, దానిని వక్ర మైనదిగా చూపగోరుతారో! అలాంటివారే మార్గ భ్రష్టత్వంలో చాలాదూరం వెళ్లి పోయినవారు.

14:4 – وَمَا أَرْسَلْنَا مِن رَّسُولٍ إِلَّا بِلِسَانِ قَوْمِهِ لِيُبَيِّنَ لَهُمْ ۖ فَيُضِلُّ اللَّـهُ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ٥

మరియు మేము ప్రతి ప్రవక్తను, అతని జాతివారి భాషతోనే పంపాము; అతను వారికి స్పష్టంగా బోధించటానికి. మరియు అల్లాహ్‌ తాను కోరినవారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. 2 మరియు ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

14:5 – وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِآيَاتِنَا أَنْ أَخْرِجْ قَوْمَكَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ وَذَكِّرْهُم بِأَيَّامِ اللَّـهِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُورٍ ٥

మరియు వాస్తవానికి మేము మూసాను, మా సూచన(ఆయాత్‌)లతో పంపి: ”నీ జాతివారిని అంధకారాల నుండి వెలుతురు వైపునకు తెచ్చి, వారికి అల్లాహ్‌ దినాలను 3 జ్ఞాపకంచేయించు.” అని అన్నాము. నిశ్చయంగా, ఇందులో సహన శీలురకు కృతజ్ఞులకు ఎన్నోసూచనలున్నాయి. 4

14:6 – وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ اذْكُرُوا نِعْمَةَ اللَّـهِ عَلَيْكُمْ إِذْ أَنجَاكُم مِّنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ وَيُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُم بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ ٦

మూసా తన జాతివారితో ఇలా అన్నాడు: ”అల్లాహ్‌ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీకు ఫిర్‌’ఔన్‌ జాతివారి నుండి విముక్తి కలిగించాడు. వారు మిమ్మల్ని తీవ్రమైన శిక్షలకు గురిచేస్తూ ఉండేవారు, మీ కుమారులనువధించి, మీ కుమార్తెలను (స్త్రీలను) బ్రతుకనిచ్చేవారు 5 మరియు అందులో మీకు, మీ ప్రభువు తరఫునుండి ఒక గొప్పపరీక్ష ఉండింది.”

14:7 – وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِن شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ ۖ وَلَئِن كَفَرْتُمْ إِنَّ عَذَابِي لَشَدِيدٌ ٧

మరియు మీ ప్రభువు ప్రకటించింది (జ్ఞాపకం చేసుకోండి): ”మీరు కృతజ్ఞులైతే! నేను మిమ్మల్ని ఎంతో అధికంగా అనుగ్రహిస్తాను. 6 కాని ఒకవేళ మీరు కృతఘ్నులైతే! నిశ్చయంగా నా శిక్ష ఎంతో కఠినమైనది.” 7

14:8 – وَقَالَ مُوسَىٰ إِن تَكْفُرُوا أَنتُمْ وَمَن فِي الْأَرْضِ جَمِيعًا فَإِنَّ اللَّـهَ لَغَنِيٌّ حَمِيدٌ ٨

మరియు మూసా ఇలా అన్నాడు: ”ఒకవేళ మీరు మరియు భూమిలోనున్న వారందరూ సత్య-తిరస్కారానికి పాల్పడితే! తెలుసుకోండి నిశ్చయంగా, అల్లాహ్‌ స్వయం సమృద్ధుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడు.”

14:9 – أَلَمْ يَأْتِكُمْ نَبَأُ الَّذِينَ مِن قَبْلِكُمْ قَوْمِ نُوحٍ وَعَادٍ وَثَمُودَ ۛ وَالَّذِينَ مِن بَعْدِهِمْ ۛ لَا يَعْلَمُهُمْ إِلَّا اللَّـهُ ۚ جَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَرَدُّوا أَيْدِيَهُمْ فِي أَفْوَاهِهِمْ وَقَالُوا إِنَّا كَفَرْنَا بِمَا أُرْسِلْتُم بِهِ وَإِنَّا لَفِي شَكٍّ مِّمَّا تَدْعُونَنَا إِلَيْهِ مُرِيبٍ ٩

ఏమీ? పూర్వం గతించిన, ప్రజల గాథలు మీకు చేరలేదా? నూ’హ్‌, ‘ఆద్‌ మరియు స’మూద్‌ జాతివారి మరియు వారి తరువాత వచ్చిన వారి (గాథలు)? వారిని గురించి అల్లాహ్‌ తప్ప మరెవ్వరూ ఎరుగరు! వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొనివచ్చినపుడు, వారు తమ నోళ్ళలో తమచేతులు పెట్టుకొని 8 ఇలా అన్నారు: ”నిశ్చయంగా, మేము మీతో పంపబడిన సందేశాన్ని తిరస్కరిస్తున్నాము. మరియు నిశ్చయంగా, మీరు దేని వైపునకైతే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారో, దానిని గురించి మేము ఆందోళన కలిగించేటంత సందేహంలో పడివున్నాము.” 9 (3/4)

14:10 – قَالَتْ رُسُلُهُمْ أَفِي اللَّـهِ شَكٌّ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يَدْعُوكُمْ لِيَغْفِرَ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُؤَخِّرَكُمْ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۚ قَالُوا إِنْ أَنتُمْ إِلَّا بَشَرٌ مِّثْلُنَا تُرِيدُونَ أَن تَصُدُّونَا عَمَّا كَانَ يَعْبُدُ آبَاؤُنَا فَأْتُونَا بِسُلْطَانٍ مُّبِينٍ ١٠

వారి ప్రవక్తలు (వారితో) ఇలా అన్నారు: ”ఏమీ? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన, అల్లాహ్‌ను గురించి (మీకు) సందేహం ఉందా? ఆయన మీ పాపాలను క్షమించటానికి మరియు మీకు ఒక నిర్ణీతకాలం వరకు వ్యవధి నివ్వటానికి మిమ్మల్ని పిలుస్తున్నాడు!” 10 వారన్నారు: ”మీరు కూడా మా వంటి మానవులే మీరు మా తండ్రి-తాతలు ఆరాధిస్తూ వచ్చిన (దైవాల) ఆరాధన నుండి మమ్మల్ని ఆపాలను కుంటున్నారా? అయితే స్పష్టమైన ప్రమాణం ఏదైనా తీసుకురండి.” 11

14:11 – قَالَتْ لَهُمْ رُسُلُهُمْ إِن نَّحْنُ إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ وَلَـٰكِنَّ اللَّـهَ يَمُنُّ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۖ وَمَا كَانَ لَنَا أَن نَّأْتِيَكُم بِسُلْطَانٍ إِلَّا بِإِذْنِ اللَّـهِ ۚ وَعَلَى اللَّـهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ ١١

వారి ప్రవక్తలు వారితో (ఇంకా) ఇలా అన్నారు: ”నిశ్చయంగా మేము మీ వంటి మానవులం మాత్రమే! కాని అల్లాహ్‌ తన దాసులలో తాను కోరిన వారిని అనుగ్రహిస్తాడు. మరియు – అల్లాహ్‌ అనుమతిస్తేనే తప్ప – మీ కొరకు ప్రమాణం తీసుకురావటమనేది మా వశంలో లేదు. మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్‌ మీదనే దృఢనమ్మకం ఉంచుకోవాలి. 12

14:12 – وَمَا لَنَا أَلَّا نَتَوَكَّلَ عَلَى اللَّـهِ وَقَدْ هَدَانَا سُبُلَنَا ۚ وَلَنَصْبِرَنَّ عَلَىٰ مَا آذَيْتُمُونَا ۚ وَعَلَى اللَّـهِ فَلْيَتَوَكَّلِ الْمُتَوَكِّلُونَ ١٢

”మరియు మేము అల్లాహ్‌ మీద నమ్మకం ఎందుకు ఉంచుకోరాదు? వాస్తవానికి ఆయనే మాకు సన్మార్గపు దారులను చూపాడు. మరియు మేము నిశ్చయంగా మీరు పెట్టే బాధలను సహనం తో భరిస్తాము. మరియు నమ్మకం గలవారు, కేవ లం అల్లాహ్‌ మీదే దృఢనమ్మకం ఉంచుకోవాలి!”

14:13 – وَقَالَ الَّذِينَ كَفَرُوا لِرُسُلِهِمْ لَنُخْرِجَنَّكُم مِّنْ أَرْضِنَا أَوْ لَتَعُودُنَّ فِي مِلَّتِنَا ۖ فَأَوْحَىٰ إِلَيْهِمْ رَبُّهُمْ لَنُهْلِكَنَّ الظَّالِمِينَ ١٣

మరియు సత్య-తిరస్కారులు తమ ప్రవక్త లతో అన్నారు: ”మీరు మా మతంలోకి తిరిగి రాకపోతే మేము తప్పకుండా మిమ్మల్ని మాదేశం నుండి వెళ్ళ గొడ్తాము.” 13 అప్పుడు వారి ప్రభువు వారికి ఇలా దివ్యజ్ఞానం (వ’హీ) పంపాడు: ”మేము ఈ దుర్మార్గులను తప్పక నాశనం చేస్తాము. 14

14:14 – وَلَنُسْكِنَنَّكُمُ الْأَرْضَ مِن بَعْدِهِمْ ۚ ذَٰلِكَ لِمَنْ خَافَ مَقَامِي وَخَافَ وَعِيدِ ١٤

”మరియు వారి తరువాత ఆ భూమి మీద మిమ్మల్ని నివసింపజేస్తాము. 15 ఇది నా సాన్నిధ్యంలో నిలువటానికి (లెక్కచెప్పటానికి) భయపడేవానికి మరియు నా హెచ్చరికకు (శిక్షకు) భయపడేవానికి (నా వాగ్దానం).” 16

14:15 – وَاسْتَفْتَحُوا وَخَابَ كُلُّ جَبَّارٍ عَنِيدٍ ١٥

మరియు వారు తీర్పు కోరారు 17 మరియు నిర్దయుడూ, 18 (సత్య) విరోధి అయిన ప్రతివాడూ నాశనమయ్యాడు.

14:16 – مِّن وَرَائِهِ جَهَنَّمُ وَيُسْقَىٰ مِن مَّاءٍ صَدِيدٍ ١٦

అతని ముందు నరకం అతనికై వేచి ఉంటుంది మరియు అక్కడ సలసలకాగే చిక్కని చీములాంటి నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది. 19

14:17 – يَتَجَرَّعُهُ وَلَا يَكَادُ يُسِيغُهُ وَيَأْتِيهِ الْمَوْتُ مِن كُلِّ مَكَانٍ وَمَا هُوَ بِمَيِّتٍ ۖ وَمِن وَرَائِهِ عَذَابٌ غَلِيظٌ ١٧

దానిని అతడు గుటకలు-గుటకలుగా బలవంతంగా గొంతులోకి దింపటానికి ప్రయత్నిస్తాడు, కాని దానిని మ్రింగలేడు. అతనికి ప్రతివైపు నుండి మరణం ఆసన్నమవుతుంది, కాని అతడు మరణించ లేడు. మరియు అతని ముందు భయంకరమైన శిక్ష వేచిఉంటుంది.

14:18 – مَّثَلُ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ ۖ أَعْمَالُهُمْ كَرَمَادٍ اشْتَدَّتْ بِهِ الرِّيحُ فِي يَوْمٍ عَاصِفٍ ۖ لَّا يَقْدِرُونَ مِمَّا كَسَبُوا عَلَىٰ شَيْءٍ ۚ ذَٰلِكَ هُوَ الضَّلَالُ الْبَعِيدُ ١٨

తమ ప్రభువును తిరస్కరించిన వారి కర్మలను, తుఫాను దినమున పెనుగాలి ఎగురవేసే బూడిదతో పోల్చవచ్చు. 20 వారు తమ కర్మలకు ఎలాంటి ప్రతిఫలం పొందలేరు. ఇదే మార్గ్ర భష్టత్వంలో చాలా దూరం పోవటం. 21

14:19 – أَلَمْ تَرَ أَنَّ اللَّـهَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ إِن يَشَأْ يُذْهِبْكُمْ وَيَأْتِ بِخَلْقٍ جَدِيدٍ ١٩

ఏమీ? నిశ్చయంగా, అల్లాహ్‌ భూమ్యా- కాశాలను సత్యంతో సృష్టించాడని నీకు తెలి యదా? 22 ఆయన కోరితే మిమ్మల్ని నశింపజేసి, మరొక క్రొత్త సృష్టిని తేగలడు! 23

14:20 – وَمَا ذَٰلِكَ عَلَى اللَّـهِ بِعَزِيزٍ ٢٠

మరియు అలా చేయటం అల్లాహ్‌కు కష్టమైన పని కాదు.

14:21 – وَبَرَزُوا لِلَّـهِ جَمِيعًا فَقَالَ الضُّعَفَاءُ لِلَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ أَنتُم مُّغْنُونَ عَنَّا مِنْ عَذَابِ اللَّـهِ مِن شَيْءٍ ۚ قَالُوا لَوْ هَدَانَا اللَّـهُ لَهَدَيْنَاكُمْ ۖ سَوَاءٌ عَلَيْنَا أَجَزِعْنَا أَمْ صَبَرْنَا مَا لَنَا مِن مَّحِيصٍ ٢١

మరియు వారందరూ అల్లాహ్‌ ముందు హాజరు పరచబడినప్పుడు, (ఇహలోకంలో) బలహీనులుగా ఉన్నవారు, గొప్పవారిగా ఉన్న వారితో అంటారు: ”వాస్తవానికి ప్రపంచంలో మేము మిమ్మల్ని అనుసరించాము, ఇపుడు మీరు మమ్మల్ని అల్లాహ్‌ శిక్ష నుండి కాపాడటానికి ఏమైనా చేయగలరా?” వారంటారు: ”అల్లాహ్‌ మాకు సన్మార్గం చూపిఉంటే మేము మీకు కూడా (సన్మార్గం)చూపిఉండేవారం. ఇపుడు మనం దుఃఖ పడినా లేదా సహనంవహించినా అంతా ఒక్కటే! మనకిప్పుడు తప్పించుకునే మార్గం ఏదీలేదు.” 24

14:22 – وَقَالَ الشَّيْطَانُ لَمَّا قُضِيَ الْأَمْرُ إِنَّ اللَّـهَ وَعَدَكُمْ وَعْدَ الْحَقِّ وَوَعَدتُّكُمْ فَأَخْلَفْتُكُمْ ۖ وَمَا كَانَ لِيَ عَلَيْكُم مِّن سُلْطَانٍ إِلَّا أَن دَعَوْتُكُمْ فَاسْتَجَبْتُمْ لِي ۖ فَلَا تَلُومُونِي وَلُومُوا أَنفُسَكُم ۖ مَّا أَنَا بِمُصْرِخِكُمْ وَمَا أَنتُم بِمُصْرِخِيَّ ۖ إِنِّي كَفَرْتُ بِمَا أَشْرَكْتُمُونِ مِن قَبْلُ ۗ إِنَّ الظَّالِمِينَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ ٢٢

మరియు తీర్పు జరిగినతరువాత షై’తాను (వారితో) అంటాడు: ”నిశ్చయంగా, అల్లాహ్‌ మీకు చేసిన వాగ్దానమే సత్యమైన వాగ్దానం. మరియు నేను మీకు వాగ్దానం చేసి దానిని భంగంచేశాను. మరియు నాకు మీపై ఎలాంటి అధికారం ఉండేది కాదు; నేను కేవలం మిమ్మల్ని ఆహ్వానించాను, మీరు స్వీకరించారు. 25 కావున మీరు నన్ను నిందించకండి, మిమ్మల్ని మీరే నిందించుకోండి. నేను మీకు సహాయం చేయలేను మరియు మీరూ నాకు సహాయంచేయలేరు. ఇంతకు ముందు మీరు నన్ను, (అల్లాహ్‌కు) సాటిగా కల్పించిన దాన్ని నిశ్చయంగా, నేను తిరస్కరిస్తున్నాను.” 26 నిశ్చ యంగా దుర్మార్గులకు బాధాకరమైన శిక్ష ఉంటుంది.

14:23 – وَأُدْخِلَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا بِإِذْنِ رَبِّهِمْ ۖ تَحِيَّتُهُمْ فِيهَا سَلَامٌ ٢٣

మరియు విశ్వసించి, సత్కార్యాలు చేసే వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేయబడుతుంది. వారి ప్రభువు అనుమతితో వారక్కడ శాశ్వతంగా ఉంటారు. వారితో అక్కడ: ”మీకు శాంతి కలుగుగాక (సలాం)!” అని అనబడుతుంది. 27

14:24 – أَلَمْ تَرَ كَيْفَ ضَرَبَ اللَّـهُ مَثَلًا كَلِمَةً طَيِّبَةً كَشَجَرَةٍ طَيِّبَةٍ أَصْلُهَا ثَابِتٌ وَفَرْعُهَا فِي السَّمَاءِ ٢٤

మంచి మాట (కలిమయె ‘తయ్యిబ్‌)ను, అల్లాహ్‌ దేనితో పోల్చాడో మీకు తెలియదా? ఒక మేలుజాతి చెట్టుతో! దాని వ్రేళ్ళు (భూమిలో) స్థిరంగా నాటుకొని ఉంటాయి మరియు దాని శాఖలు ఆకాశాన్ని (అంటుకొంటున్నట్లు) ఉంటాయి.

14:25 – تُؤْتِي أُكُلَهَا كُلَّ حِينٍ بِإِذْنِ رَبِّهَا ۗ وَيَضْرِبُ اللَّـهُ الْأَمْثَالَ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ ٢٥

తన ప్రభువు ఆజ్ఞతో, అది ఎల్లప్పుడూ ఫలాలను ఇస్తూ ఉంటుంది. మరియు ప్రజలు జ్ఞాపకముంచుకోవాలని అల్లాహ్‌ ఈ విధమైన ఉపమానాలు ఇస్తూ ఉంటాడు. 28

14:26 – وَمَثَلُ كَلِمَةٍ خَبِيثَةٍ كَشَجَرَةٍ خَبِيثَةٍ اجْتُثَّتْ مِن فَوْقِ الْأَرْضِ مَا لَهَا مِن قَرَارٍ ٢٦

మరియు చెడ్డ మాటను, భూమి నుండి పెల్లగింపబడిన, స్థిరత్వంలేని, ఒక చెడ్డజాతి చెట్టుతో పోల్చవచ్చు!

14:27 – يُثَبِّتُ اللَّـهُ الَّذِينَ آمَنُوا بِالْقَوْلِ الثَّابِتِ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ ۖ وَيُضِلُّ اللَّـهُ الظَّالِمِينَ ۚ وَيَفْعَلُ اللَّـهُ مَا يَشَاءُ ٢٧

విశ్వసించి తమ మాటపై స్థిరంగా ఉన్న వారిని అల్లాహ్‌ ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ స్థిరపరుస్తాడు. మరియు అల్లాహ్‌ దుర్మార్గులను మార్గభ్రష్టులుగా చేస్తాడు. మరియు అల్లాహ్‌ తాను కోరినది చేస్తాడు. (7/8)

14:28 – أَلَمْ تَرَ إِلَى الَّذِينَ بَدَّلُوا نِعْمَتَ اللَّـهِ كُفْرًا وَأَحَلُّوا قَوْمَهُمْ دَارَ الْبَوَارِ ٢٨

  • ఏమీ? నీవు చూడలేదా (ఎరుగవా)? అల్లాహ్‌ అనుగ్రహాలను సత్య-తిరస్కారంగా మార్చిన వారిని మరియు తమ జాతి వారిని వినాశ గృహంలోకి త్రోసిన వారిని –

14:29 – جَهَنَّمَ يَصْلَوْنَهَا ۖ وَبِئْسَ الْقَرَارُ ٢٩

(అంటే) నరకం! వారంతా అందులో ప్రవే శిస్తారు.మరియు అది ఎంతదుర్భరమైన నివాసము.

14:30 – وَجَعَلُوا لِلَّـهِ أَندَادًا لِّيُضِلُّوا عَن سَبِيلِهِ ۗ قُلْ تَمَتَّعُوا فَإِنَّ مَصِيرَكُمْ إِلَى النَّارِ ٣٠

మరియు (ప్రజలను) ఆయన మార్గం నుండి తప్పించటానికి వారు అల్లాహ్‌కు సమానులను (అందాదులను) కల్పించారు. వారితో అను: ”మీరు (తాత్కాలికంగా) సుఖసంతోషాలను అనుభవించండి. ఎందుకంటే! నిశ్చయంగా, మీ గమ్యస్థానం నరకాగ్నియే!”

14:31 – قُل لِّعِبَادِيَ الَّذِينَ آمَنُوا يُقِيمُوا الصَّلَاةَ وَيُنفِقُوا مِمَّا رَزَقْنَاهُمْ سِرًّا وَعَلَانِيَةً مِّن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا بَيْعٌ فِيهِ وَلَا خِلَالٌ ٣١

నా దాసులలో విశ్వసించిన వారితో నమా’జ్‌ స్థాపించమని మరియు మేము వారికిచ్చిన ఉపాధి నుండి రహస్యంగానో, బహిరంగంగానో – బేరం జరగటంగానీ, మిత్రుల సహాయం పొందటం గానీ సాధ్యంకాని దినం రాక పూర్వమే – ఖర్చు పెట్టమని చెప్పు. 29

14:32 – اللَّـهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ وَسَخَّرَ لَكُمُ الْفُلْكَ لِتَجْرِيَ فِي الْبَحْرِ بِأَمْرِهِ ۖ وَسَخَّرَ لَكُمُ الْأَنْهَارَ ٣٢

అల్లాహ్‌! ఆయనే, భూమ్యాకాశాలను సృష్టించాడు. మరియు ఆకాశం నుండి నీటిని కురిపించి, దాని నుండి మీ కొరకు ఆహారంగా ఫలాలను పుట్టించాడు. మరియు తన ఆజ్ఞతో, ఓడలను మీకు ఉపయుక్తంగా చేసి సముద్రంలో నడిపించాడు. మరియు నదులను కూడా మీకు ఉపయుక్తంగా చేశాడు.

14:33 – وَسَخَّرَ لَكُمُ الشَّمْسَ وَالْقَمَرَ دَائِبَيْنِ ۖ وَسَخَّرَ لَكُمُ اللَّيْلَ وَالنَّهَارَ ٣٣

మరియు ఎడతెగకుండా, నిరంతరం పయనించే, సూర్యచంద్రులను మీకు ఉపయుక్తంగా చేశాడు. మరియు రాత్రింబవళ్ళను కూడా మీకు ఉపయుక్తంగా ఉండేటట్లు చేశాడు. 30

14:34 – وَآتَاكُم مِّن كُلِّ مَا سَأَلْتُمُوهُ ۚ وَإِن تَعُدُّوا نِعْمَتَ اللَّـهِ لَا تُحْصُوهَا ۗ إِنَّ الْإِنسَانَ لَظَلُومٌ كَفَّارٌ ٣٤

మరియు మీరు అడిగినదంతా మీకు ఇచ్చాడు. మీరు అల్లాహ్‌ అనుగ్రహాలను లెక్కించ దలచినా లెక్కించజాలరు. నిశ్చయంగా, మానవుడు దుర్మార్గుడు, కృతఘ్నుడు.

14:35 – وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَـٰذَا الْبَلَدَ آمِنًا وَاجْنُبْنِي وَبَنِيَّ أَن نَّعْبُدَ الْأَصْنَامَ ٣٥

మరియు ఇబ్రాహీమ్‌ ఇలా ప్రార్థించిన విషయం (జ్ఞాపకంచేసుకోండి): 31 ”ఓ నా ప్రభూ! ఈ నగరాన్ని (మక్కహ్ ను) శాంతి నిలయంగా ఉంచు! మరియు నన్నూ నా సంతానాన్నీ విగ్రహారాధన నుండి తప్పించు!

14:36 – رَبِّ إِنَّهُنَّ أَضْلَلْنَ كَثِيرًا مِّنَ النَّاسِ ۖ فَمَن تَبِعَنِي فَإِنَّهُ مِنِّي ۖ وَمَنْ عَصَانِي فَإِنَّكَ غَفُورٌ رَّحِيمٌ ٣٦

”ఓ నా ప్రభూ! నిశ్చయంగా, అవి అనేక మానవులను మార్గభ్రష్టులుగా చేశాయి. ఇక నా విధానాన్ని అనుసరించేవాడు నిశ్చయంగా, నా వాడు. మరియు ఎవడైనా నా విధానాన్ని ఉల్లంఘిస్తే! నిశ్చయంగా, నీవు క్షమాశీలుడవు, అపార కరుణాప్రదాతవు.

14:37 – رَّبَّنَا إِنِّي أَسْكَنتُ مِن ذُرِّيَّتِي بِوَادٍ غَيْرِ ذِي زَرْعٍ عِندَ بَيْتِكَ الْمُحَرَّمِ رَبَّنَا لِيُقِيمُوا الصَّلَاةَ فَاجْعَلْ أَفْئِدَةً مِّنَ النَّاسِ تَهْوِي إِلَيْهِمْ وَارْزُقْهُم مِّنَ الثَّمَرَاتِ لَعَلَّهُمْ يَشْكُرُونَ ٣٧

”ఓ మా ప్రభూ! వాస్తవానికి నేను నా సంతా నంలో కొందరిని నీ పవిత్ర గృహం (క’అబహ్‌) దగ్గర, పైరుపండని, ఎండిపోయిన కొండలోయలో నివసింప జేశాను. 32 ఓ మా ప్రభూ! వారిని అక్కడ నమా’జ్‌ స్థాపించటానికి ఉంచాను. కనుక నీవు ప్రజల హృదయాలను, వారివైపుకు ఆకర్షింపజేయి మరియు వారు కృతజ్ఞులై ఉండటానికి వారికి జీవనోపాధిగా ఫలాలను సమకూర్చు.

14:38 – رَبَّنَا إِنَّكَ تَعْلَمُ مَا نُخْفِي وَمَا نُعْلِنُ ۗ وَمَا يَخْفَىٰ عَلَى اللَّـهِ مِن شَيْءٍ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ ٣٨

”ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము దాచేదంతా మరియు వ్యక్తపరచేదంతా నీకు తెలుసు. మరియు భూమిలోగానీ, ఆకాశంలోగానీ అల్లాహ్‌ నుండి దాగి ఉన్నది ఏదీ లేదు.

14:39 – الْحَمْدُ لِلَّـهِ الَّذِي وَهَبَ لِي عَلَى الْكِبَرِ إِسْمَاعِيلَ وَإِسْحَاقَ ۚ إِنَّ رَبِّي لَسَمِيعُ الدُّعَاءِ ٣٩

”సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్‌ నాకు వృద్ధాప్యంలో కూడా ఇస్మా’యీల్‌ మరియు ఇస్‌’హాఖ్‌లను ప్రసాదించాడు. నిశ్చయంగా, నా ప్రభువు ప్రార్థనలను వినేవాడు.

14:40 – رَبِّ اجْعَلْنِي مُقِيمَ الصَّلَاةِ وَمِن ذُرِّيَّتِي ۚ رَبَّنَا وَتَقَبَّلْ دُعَاءِ ٤٠

”ఓ నా ప్రభూ! నన్ను మరియు నా సంతతి వారిని నమా’జ్‌ స్థాపించేవారిగా చేయి. 33 ఓ మా ప్రభూ! నా ప్రార్థనలను స్వీకరించు.

14:41 – رَبَّنَا اغْفِرْ لِي وَلِوَالِدَيَّ وَلِلْمُؤْمِنِينَ يَوْمَ يَقُومُ الْحِسَابُ ٤١

”ఓ మా ప్రభూ! నన్నూ నా తల్లి-దండ్రులను మరియు సమస్త విశ్వాసులను లెక్కల పరిష్కారంరోజు క్షమించు.”

14:42 – وَلَا تَحْسَبَنَّ اللَّـهَ غَافِلًا عَمَّا يَعْمَلُ الظَّالِمُونَ ۚ إِنَّمَا يُؤَخِّرُهُمْ لِيَوْمٍ تَشْخَصُ فِيهِ الْأَبْصَارُ ٤٢

మరియు ఈ దుర్మార్గుల చేష్టల నుండి అల్లాహ్‌ నిర్లక్ష్యంగా ఉన్నాడని నీవు భావించకు. 34 నిశ్చయంగా, ఆయన వారిని – వారి కళ్ళు, రెప్పవేయకుండా ఉండిపోయే – ఆ రోజు వరకు వ్యవధి నిస్తున్నాడు.

14:43 – مُهْطِعِينَ مُقْنِعِي رُءُوسِهِمْ لَا يَرْتَدُّ إِلَيْهِمْ طَرْفُهُمْ ۖ وَأَفْئِدَتُهُمْ هَوَاءٌ ٤٣

(ఆ రోజు) వారు తలలు పైకెత్తి పరిగెత్తుతూ ఉంటారు, పై చూపులు పైనే నిలిచి ఉంటాయి. మరియు వారు శూన్యహృదయులై ఉంటారు.

14:44 – وَأَنذِرِ النَّاسَ يَوْمَ يَأْتِيهِمُ الْعَذَابُ فَيَقُولُ الَّذِينَ ظَلَمُوا رَبَّنَا أَخِّرْنَا إِلَىٰ أَجَلٍ قَرِيبٍ نُّجِبْ دَعْوَتَكَ وَنَتَّبِعِ الرُّسُلَ ۗ أَوَلَمْ تَكُونُوا أَقْسَمْتُم مِّن قَبْلُ مَا لَكُم مِّن زَوَالٍ ٤٤

మరియు (ఓ ము’హమ్మద్‌!) శిక్షపడే ఆ రోజు గురించి ప్రజలను నీవు హెచ్చరించు. ఆ రోజు దుర్మార్గం చేసినవారు అంటారు: ”ఓ మాప్రభూ! నీ సందేశాన్ని స్వీకరించటానికి ప్రవక్తలను అనుస రించటానికి, మాకు మరికొంత వ్యవధినివ్వు!” 35 (వారికి ఇలాంటి సమాధానమివ్వబడుతుంది): ”ఏమీ? ఇంతకు ముందు ‘మాకు వినాశంలేదు.’ అని ప్రమాణం చేసి చెప్పిన వారు మీరు కాదా?

14:45 – وَسَكَنتُمْ فِي مَسَاكِنِ الَّذِينَ ظَلَمُوا أَنفُسَهُمْ وَتَبَيَّنَ لَكُمْ كَيْفَ فَعَلْنَا بِهِمْ وَضَرَبْنَا لَكُمُ الْأَمْثَالَ ٤٥

”మరియు తమకు తాము అన్యాయం చేసుకున్న వారి స్థలాలలో మీరు నివసించారు. మరియు వారితో ఎలా వ్యవహరించామో మీకు బాగా తెలుసు. మరియు మేము మీకు ఎన్నో ఉపమానాలు కూడా ఇచ్చాము.”

14:46 – وَقَدْ مَكَرُوا مَكْرَهُمْ وَعِندَ اللَّـهِ مَكْرُهُمْ وَإِن كَانَ مَكْرُهُمْ لِتَزُولَ مِنْهُ الْجِبَالُ ٤٦

మరియు వాస్తవానికి వారు తమ కుట్ర పన్నారు మరియు వారి కుట్ర అల్లాహ్‌కు బాగా తెలుసు. కాని వారి కుట్ర కొండలను తమ చోటునుండి కదిలింప గలిగేది కాదు. 36

14:47 – فَلَا تَحْسَبَنَّ اللَّـهَ مُخْلِفَ وَعْدِهِ رُسُلَهُ ۗ إِنَّ اللَّـهَ عَزِيزٌ ذُو انتِقَامٍ ٤٧

కనుక అల్లాహ్‌ తన ప్రవక్తలకు చేసిన వాగ్దానాన్ని భంగపరుస్తాడని భావించకు. నిశ్చయంగా, అల్లాహ్‌! సర్వశక్తిమంతుడు, ప్రతీకారం తీర్చుకో గలవాడు.

14:48 – يَوْمَ تُبَدَّلُ الْأَرْضُ غَيْرَ الْأَرْضِ وَالسَّمَاوَاتُ ۖ وَبَرَزُوا لِلَّـهِ الْوَاحِدِ الْقَهَّارِ ٤٨

ఈ భూమి మరొక భూమిగా మరియు ఆకాశాలు (వేరే ఆకాశాలుగా) మారే రోజు; 37 ఆ అద్వితీయుడు, ప్రబలుడు అయిన అల్లాహ్‌ ముందు అందరూ హాజరుచేయబడతారు.

14:49 – وَتَرَى الْمُجْرِمِينَ يَوْمَئِذٍ مُّقَرَّنِينَ فِي الْأَصْفَادِ ٤٩

మరియు ఆ రోజు అపరాధులను సంకెళ్ళలో కూడబెట్టి, బంధించి ఉంచటాన్ని నీవు చూస్తావు.

14:50 – سَرَابِيلُهُم مِّن قَطِرَانٍ وَتَغْشَىٰ وُجُوهَهُمُ النَّارُ ٥٠

వారి వస్త్రాలు తారు (నల్లని జిడ్డు ద్రవం)తో చేయబడి ఉంటాయి మరియు అగ్నిజ్వాలలు వారి ముఖాలను క్రమ్ముకొని ఉంటాయి –

14:51 – لِيَجْزِيَ اللَّـهُ كُلَّ نَفْسٍ مَّا كَسَبَتْ ۚ إِنَّ اللَّـهَ سَرِيعُ الْحِسَابِ ٥١

అల్లాహ్‌ ప్రతి ప్రాణికి దాని కర్మల ప్రతిఫలం ఇవ్వటానికి – నిశ్చయంగా, అల్లాహ్‌ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు.

14:52 – هَـٰذَا بَلَاغٌ لِّلنَّاسِ وَلِيُنذَرُوا بِهِ وَلِيَعْلَمُوا أَنَّمَا هُوَ إِلَـٰهٌ وَاحِدٌ وَلِيَذَّكَّرَ أُولُو الْأَلْبَابِ ٥٢

ఇది (ఈ ఖుర్‌ఆన్‌) మానవులకు ఒక సందేశం. వారు దీనితో హెచ్చరించబడటానికి మరియు నిశ్చయంగా, ఆయన (అల్లాహ్) ఒక్కడే ఆరాధ్య దైవమని వారు తెలుసుకోవడానికి మరియు బుద్ధిమంతులు గ్రహించడానికి ఇది పంపబడింది.

సూరహ్‌ అల్‌-‘హిజ్ర్‌ – అల్‌-‘హిజ్ర్‌ : గుట్టల ప్రాంతం (Rocky Track). ఇది ఒకప్రాంతంపేరు. ఇది సూరహ్‌ యూసుఫ్‌ (12) తరువాత అవతరింపజేయబడిందని సుయూతిగారు అభిప్రాయపడ్డారు. ”నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్‌ఆన్‌)ను అవతరింపజేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడే వారము.” (9వ ఆయత్‌) స’మూద్‌ జాతివారు ఇక్కడ నివసించారు. ఇది మక్కహ్-సిరియా మార్గంలో ఉంది. అక్కడ చాలా గుట్టలున్నాయి. ఇది చివరి 6 మక్కహ్ సూరాహ్‌ల (10-15) సమూహంలో చివరిది. 99ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 80వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ – 15:1 – الر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ وَقُرْآنٍ مُّبِينٍ ١

(*) అలిఫ్‌-లామ్‌-రా. ఇవి దివ్యగ్రంథ ఆయత్‌లు మరియు (ఇది) ఒక స్పష్టమైన ఖుర్ఆన్‌. 1

15:2 – رُّبَمَا يَوَدُّ الَّذِينَ كَفَرُوا لَوْ كَانُوا مُسْلِمِينَ ٢

[*] సత్య-తిరస్కారులు: ”మేము అల్లాహ్‌కు విధేయులమైతే (ముస్లిములమైతే) ఎంత బాగుండేది!” అని (పునరుత్థానదినమున) పలు మార్లు కోరుకుంటారు.

15:3 – ذَرْهُمْ يَأْكُلُوا وَيَتَمَتَّعُوا وَيُلْهِهِمُ الْأَمَلُ ۖ فَسَوْفَ يَعْلَمُونَ ٣

వారిని తింటూ (త్రాగుతూ) సుఖసంతో షాలను అనుభవిస్తూ, (వృథా) ఆశలలో ఉండ టానికి విడిచిపెట్టు. తరువాత వారు (సత్యాన్ని) తెలుసుకుంటారు.

15:4 – وَمَا أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا وَلَهَا كِتَابٌ مَّعْلُومٌ ٤

మరియు (దాని వ్యవధి) నిర్ణయించి వ్రాయబడి ఉండనిదే, మేము ఏ నగరాన్నీకూడా నాశనం చేయలేదు. 2

15:5 – مَّا تَسْبِقُ مِنْ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسْتَأْخِرُونَ ٥

ఏ సమాజం కూడా తన నిర్ణీత గడువుకు, ముందు గానీ మరియు వెనకగానీ కాజాలదు. 3

15:6 – وَقَالُوا يَا أَيُّهَا الَّذِي نُزِّلَ عَلَيْهِ الذِّكْرُ إِنَّكَ لَمَجْنُونٌ ٦

మరియు (సత్య-తిరస్కారులు) అంటారు: ”ఓ హితబోధ (ఖుర్‌ఆన్‌) అవతరింపజేయబడిన వాడా (ము’హమ్మద్‌)! నిశ్చయంగా, నీవు పిచ్చి వాడవు.

15:7 – لَّوْ مَا تَأْتِينَا بِالْمَلَائِكَةِ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ ٧

”నీవు సత్యవంతుడవే అయితే, మా వద్దకు దేవదూతలను ఎందుకు తీసుకొనిరావు? ”

15:8 – مَا نُنَزِّلُ الْمَلَائِكَةَ إِلَّا بِالْحَقِّ وَمَا كَانُوا إِذًا مُّنظَرِينَ ٨

మేము దేవదూతలను, సత్యంతో తప్ప పంపము మరియు వారు వచ్చినప్పుడు వీరికి ఏ మాత్రం వ్యవధి ఇవ్వబడదు. 4

15:9 – إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ ٩

నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్‌ఆన్‌)ను అవతరింపజేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము. 5

15:10 – وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ فِي شِيَعِ الْأَوَّلِينَ ١٠

మరియు (ఓ ము’హమ్మద్‌!) వాస్తవానికి మేము, నీకు పూర్వం గతించిన తెగలవారి వద్దకు కూడా (ప్రవక్తలను) పంపాము.

15:11 – وَمَا يَأْتِيهِم مِّن رَّسُولٍ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ١١

మరియు వారి వద్దకు వచ్చిన ఏ ప్రవక్తను కూడా, వారు పరిహసించకుండా ఉండలేదు. 6

15:12 – كَذَٰلِكَ نَسْلُكُهُ فِي قُلُوبِ الْمُجْرِمِينَ ١٢

మరియు వారి వద్దకు వచ్చిన ఏ ప్రవక్తను కూడా, వారు పరిహసించకుండా ఉండలేదు.

15:13 – لَا يُؤْمِنُونَ بِهِ ۖ وَقَدْ خَلَتْ سُنَّةُ الْأَوَّلِينَ ١٣

వారు దీనిని (ఈ ఖుర్‌ఆన్‌ను) విశ్వసించడం లేదు. మరియు వాస్తవానికి (సత్య-తిరస్కారులైన) వారి పూర్వీకుల విధానం కూడా ఇలాగే ఉండేది.

15:14 – وَلَوْ فَتَحْنَا عَلَيْهِم بَابًا مِّنَ السَّمَاءِ فَظَلُّوا فِيهِ يَعْرُجُونَ ١٤

మరియు ఒకవేళ మేము వారి కొరకు ఆకాశపు ఒక ద్వారాన్ని తెరిచినా, వారు దానిపైకి ఎక్కుతూ పోతూ –

15:15 – لَقَالُوا إِنَّمَا سُكِّرَتْ أَبْصَارُنَا بَلْ نَحْنُ قَوْمٌ مَّسْحُورُونَ ١٥

ఇలా అనేవారు: ”నిశ్చయంగా, మా చూపులు భ్రమింపజేయబడ్డాయి. అలాకాదు, మాపై మంత్రజాలం చేయబడింది.” 7

15:16 – وَلَقَدْ جَعَلْنَا فِي السَّمَاءِ بُرُوجًا وَزَيَّنَّاهَا لِلنَّاظِرِينَ ١٦

మరియు వాస్తవానికి, మేము ఆకాశంలో తారాగణాన్ని (నక్షత్రరాశులను) సృష్టించి, దానిని చూపరులకు అలంకారమైనదిగా చేశాము.

15:17 – وَحَفِظْنَاهَا مِن كُلِّ شَيْطَانٍ رَّجِيمٍ ١٧

మరియు శపించబడిన (బహిష్కరించ బడిన) ప్రతి షై’తాను నుండి దానిని (ఆకాశాన్ని) సురక్షితంగా ఉంచాము 8

15:18 – إِلَّا مَنِ اسْتَرَقَ السَّمْعَ فَأَتْبَعَهُ شِهَابٌ مُّبِينٌ ١٨

కాని, ఎవడైనా (ఏ షై’తానైనా) దొంగ చాటుగా వినటానికి ప్రయత్నిస్తే, స్పష్టమైన కొరవి (అగ్నిజ్వాల) అతనిని వెంబడిస్తుంది. 9

15:19 – وَالْأَرْضَ مَدَدْنَاهَا وَأَلْقَيْنَا فِيهَا رَوَاسِيَ وَأَنبَتْنَا فِيهَا مِن كُلِّ شَيْءٍ مَّوْزُونٍ ١٩

మరియు మేము భూమిని వ్యాపింపజేశాము మరియు దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము మరియు దానిలో ప్రతి వస్తువును తగిన పరిమాణంలో ఉత్పత్తిచేశాము.

15:20 – وَجَعَلْنَا لَكُمْ فِيهَا مَعَايِشَ وَمَن لَّسْتُمْ لَهُ بِرَازِقِينَ ٢٠

మరియు అందులో మీకూ మరియు మీరు పోషించని వాటికొరకు (జీవరాసుల కొరకు) మేము జీవనోపాధిని కల్పించాము. 10

15:21 – وَإِن مِّن شَيْءٍ إِلَّا عِندَنَا خَزَائِنُهُ وَمَا نُنَزِّلُهُ إِلَّا بِقَدَرٍ مَّعْلُومٍ ٢١

మరియు మా దగ్గర పుష్కలంగా నిలువలేని వస్తువు అంటూ ఏదీలేదు మరియు దానిని మేము ఒక నిర్ణీత పరిమాణంలో మాత్రమే పంపుతూ ఉంటాము.

15:22 – وَأَرْسَلْنَا الرِّيَاحَ لَوَاقِحَ فَأَنزَلْنَا مِنَ السَّمَاءِ مَاءً فَأَسْقَيْنَاكُمُوهُ وَمَا أَنتُمْ لَهُ بِخَازِنِينَ ٢٢

మరియు మేము (వృక్షకోటిని) ఫలవంతం చేయటానికి గాలులను పంపుతాము! తరువాత మేము ఆకాశం నుండి నీటిని కురిపించి, దానిని మీకు త్రాగటానికి సమకూర్చుతాము మరియు దాని కోశాధికారులు మీరు మాత్రం కారు!

15:23 – وَإِنَّا لَنَحْنُ نُحْيِي وَنُمِيتُ وَنَحْنُ الْوَارِثُونَ ٢٣

మరియు నిశ్చయంగా, మేమే జీవన్మర ణాలను ఇచ్చేవారము; మరియు చివరకు మేమే వారసులుగా మిగిలేవారము. 11

15:24 – وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَقْدِمِينَ مِنكُمْ وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَأْخِرِينَ ٢٤

మరియు వాస్తవానికి, మీకు ముందు గడిచి పోయిన వారిని గురించి మాకు తెలుసు మరియు వాస్తవంగా మీ తరువాత వచ్చే వారిని గురించి కూడా మాకు బాగా తెలుసు. 12

15:25 – وَإِنَّ رَبَّكَ هُوَ يَحْشُرُهُمْ ۚ إِنَّهُ حَكِيمٌ عَلِيمٌ ٢٥

మరియు నిశ్చయంగా నీ ప్రభువు ఆయనే! వారందరినీ సమావేశపరుస్తాడు. నిశ్చయంగా, ఆయన మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు.

15:26 – وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ مِن صَلْصَالٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ ٢٦

మరియు వాస్తవంగా మేము మానవుణ్ణి మ్రోగేమట్టి (ధ్వనిచేసేమట్టి) రూపాంతరం చెందిన జిగటబురద (బంకమట్టి)తో సృష్టించాము. 13

15:27 – وَالْجَانَّ خَلَقْنَاهُ مِن قَبْلُ مِن نَّارِ السَّمُومِ ٢٧

మరియు దీనికి పూర్వం మేము జిన్నాతులను (పొగలేని) మండే అగ్నిజ్వాలతో సృష్టించాము. 14

15:28 – وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي خَالِقٌ بَشَرًا مِّن صَلْصَالٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ ٢٨

మరియు నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న విషయం (జ్ఞాపకంచేసుకో!): ”నిశ్చయంగా, నేను మ్రోగేమట్టి, రూపాంతరంచెందిన జిగట బురదతో మానవుణ్ణి సృష్టించబోతున్నాను.

15:29 – فَإِذَا سَوَّيْتُهُ وَنَفَخْتُ فِيهِ مِن رُّوحِي فَقَعُوا لَهُ سَاجِدِينَ ٢٩

”ఇక నేను అతనికి పూర్తిగా ఆకారమిచ్చి (రూపమిచ్చి), అతనిలో (ఆదమ్‌ లో) నా తరఫు నుండి ప్రాణం (రూ’హ్) ఊదిన తరువాత, మీరంతా అతని ముందు సాష్టాంగం (సజ్దా) చేయాలి.” 15

15:30 – فَسَجَدَ الْمَلَائِكَةُ كُلُّهُمْ أَجْمَعُونَ ٣٠

అప్పుడు దేవదూతలు, అందరూ కలిసి సాష్టాంగం (సజ్దా) చేశారు –

15:31 – إِلَّا إِبْلِيسَ أَبَىٰ أَن يَكُونَ مَعَ السَّاجِدِينَ ٣١

ఒక్క ఇబ్లీస్‌ తప్ప! అతడు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో చేరనని మొండికేశాడు. 16

15:32 – قَالَ يَا إِبْلِيسُ مَا لَكَ أَلَّا تَكُونَ مَعَ السَّاجِدِينَ ٣٢

(అల్లాహ్‌) ఇలా ప్రశ్నించాడు: ”ఓ ఇబ్లీస్‌! నీకేమయింది, నీవు సాష్టాంగం (సజ్దా) చేసేవారిలో ఎందుకు చేరలేదు?”

15:33 – قَالَ لَمْ أَكُن لِّأَسْجُدَ لِبَشَرٍ خَلَقْتَهُ مِن صَلْصَالٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ ٣٣

(ఇబ్లీస్‌) ఇలా జవాబిచ్చాడు: ”మ్రోగేమట్టి, రూపాంతరంచెందిన జిగట బురదతో నీవు సృష్టించిన మానవునికి నేను సాష్టాంగం (సజ్దా) చేసే వాడను కాను.”

15:34 – قَالَ فَاخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ ٣٤

(అల్లాహ్‌) అన్నాడు: ”అయితే నీవు ఇక్కడి నుండి వెళ్ళిపో! ఇక, నిశ్చయంగా, నీవు శపించబడ్డవాడవు (బహిష్కరించబడ్డవాడవు)!

15:35 – وَإِنَّ عَلَيْكَ اللَّعْنَةَ إِلَىٰ يَوْمِ الدِّينِ ٣٥

”మరియు నిశ్చయంగా, తీర్పుదినము వరకు నీపై శాపం (బహిష్కారం) ఉంటుంది.”

15:36 – قَالَ رَبِّ فَأَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ ٣٦

(ఇబ్లీస్‌) వేడుకున్నాడు: ”ఓ నా ప్రభూ! పునరుత్థానదినం వరకు నాకు వ్యవధినివ్వు!”

15:37 – قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ ٣٧

(అల్లాహ్‌) జవాబిచ్చాడు:”ఇక నిశ్చయంగా, నీవు వ్యవధి ఇవ్వబడిన వారిలోనివాడవు!

15:38 – إِلَىٰ يَوْمِ الْوَقْتِ الْمَعْلُومِ ٣٨

”(నాకు మాత్రమే) తెలిసివున్న ఆ దినపు, ఆ సమయం వరకు!”

15:39 – قَالَ رَبِّ بِمَا أَغْوَيْتَنِي لَأُزَيِّنَنَّ لَهُمْ فِي الْأَرْضِ وَلَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ ٣٩

(ఇబ్లీస్‌) అన్నాడు: ”ఓ నా ప్రభూ! నీవు నన్ను అపమార్గం పట్టించావు, కావున నేను వారికి భూమిలో (వారి దుష్కర్మలన్నీ) మంచివిగా కనబడేటట్లు చేస్తాను మరియు నిశ్చయంగా, వారందరినీ అపమార్గంలో పడవేస్తాను.

15:40 – إِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِينَ ٤٠

”వారిలో నీవు ఎన్నుకున్న (నీ ఆజ్ఞాను వర్తనులైన) నీ దాసులు తప్ప!”

15:41 – قَالَ هَـٰذَا صِرَاطٌ عَلَيَّ مُسْتَقِيمٌ ٤١

(అల్లాహ్‌) అన్నాడు: ”ఇదే నా దగ్గరకు తెచ్చే ఋజుమార్గం. 17

15:42 – إِنَّ عِبَادِي لَيْسَ لَكَ عَلَيْهِمْ سُلْطَانٌ إِلَّا مَنِ اتَّبَعَكَ مِنَ الْغَاوِينَ ٤٢

”నిశ్చయంగా, నా దాసులపై నీ అధికారం సాగదు! కేవలం మార్గభ్రష్టులై నిన్ను అనుసరించే వారి మీద తప్ప! 18

15:43 – وَإِنَّ جَهَنَّمَ لَمَوْعِدُهُمْ أَجْمَعِينَ ٤٣

”మరియు నిశ్చయంగా, వారందరి కొరకు వాగ్దానం చేయబడిన (నివాసం) నరకమే!

15:44 – لَهَا سَبْعَةُ أَبْوَابٍ لِّكُلِّ بَابٍ مِّنْهُمْ جُزْءٌ مَّقْسُومٌ ٤٤

”దానికి (నరకానికి) ఏడు ద్వారాలు ఉన్నాయి. 19 వాటిలో ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క వర్గం వారు ప్రత్యేకించబడి ఉన్నారు.

15:45 – إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَعُيُونٍ ٤٥

”నిశ్చయంగా, దైవభీతి గలవారు స్వర్గవనా లలో చెలమల మధ్య ఉంటారు.

15:46 – ادْخُلُوهَا بِسَلَامٍ آمِنِينَ ٤٦

”(వారు): ‘శాంతితో సురక్షితంగా ప్రవేశిం చండి!’ అని ఆహ్వానించబడతారు.

15:47 – وَنَزَعْنَا مَا فِي صُدُورِهِم مِّنْ غِلٍّ إِخْوَانًا عَلَىٰ سُرُرٍ مُّتَقَابِلِينَ ٤٧

”వారి హృదయాలలో మిగిలివున్న కాపట్యాన్ని (మాలిన్యాన్ని) మేము తొలగిస్తాము. వారు సోదరులవలే ఎదురెదురుగా పీఠాలపై కూర్చొని ఉంటారు. 20

15:48 – لَا يَمَسُّهُمْ فِيهَا نَصَبٌ وَمَا هُم مِّنْهَا بِمُخْرَجِينَ ٤٨

”అక్కడ వారికి అలసట ఉండదు. మరియు అక్కడి నుండి వారు ఎన్నడూ వెడలగొట్ట బడరు.”(1/8)

15:49 – نَبِّئْ عِبَادِي أَنِّي أَنَا الْغَفُورُ الرَّحِيمُ ٤٩

  • నా దాసులకు ఇలా తెలియజెయ్యి: నిశ్చయంగా నేను, కేవలం నేనే! క్షమించేవాడను, కరుణించేవాడను. 21

15:50 – وَأَنَّ عَذَابِي هُوَ الْعَذَابُ الْأَلِيمُ ٥٠

మరియు నిశ్చయంగా, నా శిక్షయే అతి బాధాకరమైన శిక్ష!

15:51 – وَنَبِّئْهُمْ عَن ضَيْفِ إِبْرَاهِيمَ ٥١

మరియు వారికి ఇబ్రాహీమ్‌ అతిథులను గురించి తెలుపు 22

15:52 – إِذْ دَخَلُوا عَلَيْهِ فَقَالُوا سَلَامًا قَالَ إِنَّا مِنكُمْ وَجِلُونَ ٥٢

వారు అతని వద్దకు వచ్చి: ”నీకు శాంతి కలుగు గాక (సలాం)! ” అని అన్నారు. అతనన్నాడు: ”నిశ్చయంగా, మాకు మీ వలన భయం కలుగుతున్నది.” 23

15:53 – قَالُوا لَا تَوْجَلْ إِنَّا نُبَشِّرُكَ بِغُلَامٍ عَلِيمٍ ٥٣

వారు జవాబిచ్చారు: ”నీవు భయపడకు! నిశ్చయంగా, మేము జ్ఞానవంతుడైన ఒక కుమారుని శుభవార్తను నీకు ఇస్తున్నాము.”

15:54 – قَالَ أَبَشَّرْتُمُونِي عَلَىٰ أَن مَّسَّنِيَ الْكِبَرُ فَبِمَ تُبَشِّرُونَ ٥٤

(ఇబ్రాహీమ్‌) అన్నాడు: ”మీరు ఈ ముసలి తనంలో నాకు (కుమారుడు కలుగుననే) శుభ వార్తను ఇస్తున్నారా? మీరు ఎలాంటి (అసాధ్య మైన) శుభవార్తను ఇస్తున్నారు?”

15:55 – قَالُوا بَشَّرْنَاكَ بِالْحَقِّ فَلَا تَكُن مِّنَ الْقَانِطِينَ ٥٥

వారన్నారు: ”మేము నీకు సత్యమైన శుభ వార్తను ఇచ్చాము. కనుక నీవు నిరాశచెందకు.”

15:56 – قَالَ وَمَن يَقْنَطُ مِن رَّحْمَةِ رَبِّهِ إِلَّا الضَّالُّونَ ٥٦

(ఇబ్రాహీమ్‌) అన్నాడు: ”తన ప్రభువు కారుణ్యం పట్ల నిరాశచెందేవారు మార్గభ్రష్టులు తప్ప మరెవరు?”

15:57 – قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا الْمُرْسَلُونَ ٥٧

(ఇంకా) ఇలా అన్నాడు: ”ఓ దైవదూత లారా! మరి మీరు వచ్చిన కారణమేమిటి?”

15:58 – قَالُوا إِنَّا أُرْسِلْنَا إِلَىٰ قَوْمٍ مُّجْرِمِينَ ٥٨

వారన్నారు: ”వాస్తవానికి మేము అపరాధు లైన జాతివారి వైపునకు పంపబడ్డాము 24

15:59 – إِلَّا آلَ لُوطٍ إِنَّا لَمُنَجُّوهُمْ أَجْمَعِينَ ٥٩

”లూ’త్‌ ఇంటివారు తప్ప – నిశ్చయంగా వారందరినీ రక్షిస్తాము;

15:60 – إِلَّا امْرَأَتَهُ قَدَّرْنَا ۙ إِنَّهَا لَمِنَ الْغَابِرِينَ ٦٠

”అతని భార్య తప్ప! (ఆమెను గురించి అల్లాహ్‌ అన్నాడు): ‘నిశ్చయంగా, ఆమె వెనుక ఉండిపోయేవారిలో చేరాలని మేము నిర్ణయించాము.’ ” 26

15:61 – فَلَمَّا جَاءَ آلَ لُوطٍ الْمُرْسَلُونَ ٦١

తరువాత ఆ దేవదూతలు లూ’త్‌ ఇంటి వారి వద్దకు వచ్చినపుడు;

15:62 – قَالَ إِنَّكُمْ قَوْمٌ مُّنكَرُونَ ٦٢

(లూ’త్‌) అన్నాడు: ”నిశ్చయంగా, మీరు (నాకు) పరాయివారిగా కన్పిస్తున్నారు.” 27

15:63 – قَالُوا بَلْ جِئْنَاكَ بِمَا كَانُوا فِيهِ يَمْتَرُونَ ٦٣

వారన్నారు: ”కాదు! వాస్తవానికి వారు (దుర్మార్గులు) దేనిని గురించి సందేహంలో పడి ఉన్నారో, దానిని (ఆ శిక్షను) తీసుకొని నీ వద్దకు వచ్చాము. 28

15:64 – وَأَتَيْنَاكَ بِالْحَقِّ وَإِنَّا لَصَادِقُونَ ٦٤

”మరియు మేము నీ వద్దకు సత్యాన్ని తెచ్చాము. మరియు మేము నిశ్చయంగా, సత్యం పలుకుతున్నాము.

15:65 – فَأَسْرِ بِأَهْلِكَ بِقِطْعٍ مِّنَ اللَّيْلِ وَاتَّبِعْ أَدْبَارَهُمْ وَلَا يَلْتَفِتْ مِنكُمْ أَحَدٌ وَامْضُوا حَيْثُ تُؤْمَرُونَ ٦٥

”కావున నీవు కొంతరాత్రి మిగిలి ఉండగానే, నీ ఇంటివారిని తీసుకొని బయలుదేరు, నీవు వారి వెనుక పో! మీలో ఎవ్వరూ కూడా వెనుదిరిగి చూడరాదు; మరియు మీరు, మీకు ఆజ్ఞాపించిన వైపునకే, పోతూ ఉండండి.”

15:66 – وَقَضَيْنَا إِلَيْهِ ذَٰلِكَ الْأَمْرَ أَنَّ دَابِرَ هَـٰؤُلَاءِ مَقْطُوعٌ مُّصْبِحِينَ ٦٦

మరియు (మా దూతలద్వారా) మా ఆదేశాన్ని అతనికి ఇలా తెలియజేశాము: ”నిశ్చయంగా, తెల్లవారే సరికి వారందరూ సమూలంగా నిర్మూలించబడతారు.”

15:67 – وَجَاءَ أَهْلُ الْمَدِينَةِ يَسْتَبْشِرُونَ ٦٧

మరియు నగరవాసులు ఉల్లాసంతో అక్కడికి వచ్చారు.

15:68 – قَالَ إِنَّ هَـٰؤُلَاءِ ضَيْفِي فَلَا تَفْضَحُونِ ٦٨

(లూ’త్‌) అన్నాడు: ”వాస్తవానికి, వీరు నా అతిథులు, కావున నన్ను అవమానం పాలు చేయకండి. 29

15:69 – وَاتَّقُوا اللَّـهَ وَلَا تُخْزُونِ ٦٩

”మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి మరియు నా గౌరవాన్ని పోగొట్టకండి.”

15:70 – قَالُوا أَوَلَمْ نَنْهَكَ عَنِ الْعَالَمِينَ ٧٠

వారన్నారు: ” ‘ప్రపంచంలోని (ప్రతివాణ్ణి) వెనకేసుకోకు!’ అని మేము నిన్ను వారించ లేదా?” 30

15:71 – قَالَ هَـٰؤُلَاءِ بَنَاتِي إِن كُنتُمْ فَاعِلِينَ ٧١

(లూ’త్‌) అన్నాడు: ”మీకు (ఏమైనా) చేయాలనే ఉంటే, నా కుమార్తెలు (జాతిస్త్రీలు) ఉన్నారు.” 31

15:72 – لَعَمْرُكَ إِنَّهُمْ لَفِي سَكْرَتِهِمْ يَعْمَهُونَ ٧٢

”నీ ప్రాణం సాక్షి! నిశ్చయంగా, వారు తమ (కామ) మత్తులో త్రోవతప్పి తిరుగుతున్నారు.” 32

15:73 – فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ مُشْرِقِينَ ٧٣

ఆ పిదప సూర్యోదయ సమయమున ఒక భయంకరమైన గర్జన (సయ్‌’హా) వారిని పట్టుకున్నది.

15:74 – فَجَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّن سِجِّيلٍ ٧٤

తరువాత మేము ఆ నగరాన్ని తల క్రిందులుగా చేశాము మరియు వారిపై కాల్చిన మట్టి గులకరాళ్ళను కురిపించాము.

15:75 – إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّلْمُتَوَسِّمِينَ ٧٥

నిశ్చయంగా, ఇందులో దూరదృష్టి గల వారికి ఎన్నో సూచనలున్నాయి.

15:76 – وَإِنَّهَا لَبِسَبِيلٍ مُّقِيمٍ ٧٦

మరియు వాస్తవానికి ఆ ప్రాంతం ఒక రహదారి పైననే ఉన్నది.

15:77 – إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّلْمُؤْمِنِينَ ٧٧

నిశ్చయంగా, ఇందులో విశ్వసించిన వారికి ఒక సూచన ఉంది.

15:78 – وَإِن كَانَ أَصْحَابُ الْأَيْكَةِ لَظَالِمِينَ ٧٨

మరియు అయ్‌కహ్‌ (మద్‌యన్‌) వాసులు కూడా దుర్మార్గులుగానే ఉండేవారు. 33

15:79 – فَانتَقَمْنَا مِنْهُمْ وَإِنَّهُمَا لَبِإِمَامٍ مُّبِينٍ ٧٩

కావున మేము వారి మీద కూడా ప్రతీకారం తీర్చుకున్నాము. మరియు ఆ రెండు (శిథిలాలు) కూడా ఒక స్పష్టమైన మార్గంమీద ఉన్నాయి. 34

15:80 – وَلَقَدْ كَذَّبَ أَصْحَابُ الْحِجْرِ الْمُرْسَلِينَ ٨٠

మరియు వాస్తవానికి ‘హిజ్ర్‌ వాసులు కూడా ప్రవక్తలను అసత్యవాదులన్నారు. 35

15:81 – وَآتَيْنَاهُمْ آيَاتِنَا فَكَانُوا عَنْهَا مُعْرِضِينَ ٨١

మరియు వారికి కూడా మేము అద్భుత సూచన (ఆయాత్‌) లను ఇచ్చి ఉంటిమి. కాని వారు వాటి నుండి విముఖులై ప్రవర్తించారు. 36

15:82 – وَكَانُوا يَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا آمِنِينَ ٨٢

మరియు వారు కొండలను తొలచి గృహాలను నిర్మించుకునేవారు 37 సురక్షితంగా ఉండగలమని (భావిస్తూ)!

15:83 – فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ مُصْبِحِينَ ٨٣

చివరకు ఒక ఉదయమున ఒక తీవ్రమైన గర్జన (‘సయ్‌’హా) వారిపై కూడా వచ్చిపడింది.

15:84 – فَمَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يَكْسِبُونَ ٨٤

అప్పుడు వారు సంపాదించింది వారికి ఏ మాత్రం పనికిరాలేక పోయింది.

15:85 – وَمَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ ۗ وَإِنَّ السَّاعَةَ لَآتِيَةٌ ۖ فَاصْفَحِ الصَّفْحَ الْجَمِيلَ ٨٥

మరియు మేము ఆకాశాలనూ, భూమినీ మరియు వాటి మధ్యనున్న సర్వాన్ని కేవలం సత్యంతోనే 38 సృష్టించాము. మరియు నిశ్చయంగా, తీర్పు గడియ రానున్నది. కావున నీవు ఉదారభావంతో వారిని ఉపేక్షించు!

15:86 – إِنَّ رَبَّكَ هُوَ الْخَلَّاقُ الْعَلِيمُ ٨٦

నిశ్చయంగా నీ ప్రభువు, ఆయనే సర్వ సృష్టికర్త, 39 సర్వజ్ఞుడు. 40

15:87 – وَلَقَدْ آتَيْنَاكَ سَبْعًا مِّنَ الْمَثَانِي وَالْقُرْآنَ الْعَظِيمَ ٨٧

మరియు మేము నిశ్చయంగా, నీకు తరచుగా పఠింపబడే ఏడు సూక్తులను 41 మరియు సర్వోత్తమ ఖుర్‌ఆన్‌ను ప్రసాదించాము.

15:88 – لَا تَمُدَّنَّ عَيْنَيْكَ إِلَىٰ مَا مَتَّعْنَا بِهِ أَزْوَاجًا مِّنْهُمْ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَاخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِينَ ٨٨

వారిలో (అవిశ్వాసులలో) కొందరికి మేము ఒసంగిన ఐహిక సంపదలను నీవు కన్నెత్తి కూడా చూడకు. మరియు వారి (అవిశ్వాస) వైఖరికి బాధ పడకు. మరియు విశ్వసించిన వారికి ఆశ్రయం (ఛాయ) ఇవ్వటానికి నీ రెక్కలను విప్పు. 42

15:89 – وَقُلْ إِنِّي أَنَا النَّذِيرُ الْمُبِينُ ٨٩

మరియు (ఓ ము’హమ్మద్‌!) వారితో ఇలా అను: ”నిశ్చయంగా, నేను స్పష్టమైన హెచ్చరిక చేసేవాడను మాత్రమే!”

15:90 – كَمَا أَنزَلْنَا عَلَى الْمُقْتَسِمِينَ ٩٠

ఏ విధంగానైతే మేము (గ్రంథాన్ని) విభజించేవారిపై అవతరింపజేశామో! 43

15:91 – الَّذِينَ جَعَلُوا الْقُرْآنَ عِضِينَ ٩١

ఎవరైతే ఈ ఖుర్‌ఆన్‌ను (తమ తిరస్కారంతో) ముక్కలు ముక్కలుగా చేశారో!

15:92 – فَوَرَبِّكَ لَنَسْأَلَنَّهُمْ أَجْمَعِينَ ٩٢

నీ ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, మేము వారందరినీ ప్రశ్నిస్తాము;

15:93 – عَمَّا كَانُوا يَعْمَلُونَ ٩٣

వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి.

15:94 – فَاصْدَعْ بِمَا تُؤْمَرُ وَأَعْرِضْ عَنِ الْمُشْرِكِينَ ٩٤

కావున నీకు ఆజ్ఞాపించబడిన దానిని బహిరంగంగా చాటించు 44 మరియు అల్లాహ్‌కు సాటి కల్పించే వారి (ముష్రికీన్‌) నుండి విముఖుడవగు.

15:95 – إِنَّا كَفَيْنَاكَ الْمُسْتَهْزِئِينَ ٩٥

నిశ్చయంగా, నీతో పరిహాసాలాడేవారి నుండి నిన్ను రక్షించటానికి మేమే చాలు!

15:96 – الَّذِينَ يَجْعَلُونَ مَعَ اللَّـهِ إِلَـٰهًا آخَرَ ۚ فَسَوْفَ يَعْلَمُونَ ٩٦

ఎవరైతే అల్లాహ్‌తో పాటు ఇతర దైవాలను కూడా (ఆరాధనకు) నియమించుకుంటున్నారో, వారు త్వరలోనే (సత్యాన్ని) తెలుసుకుంటారు.

15:97 – وَلَقَدْ نَعْلَمُ أَنَّكَ يَضِيقُ صَدْرُكَ بِمَا يَقُولُونَ ٩٧

మరియు వాస్తవానికి వారు పలికే మాటల వలన నీ హృదయానికి తప్పక కష్టం కలుగు తుందని మాకు బాగా తెలుసు.

15:98 – فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَكُن مِّنَ السَّاجِدِينَ ٩٨

కావున నీవు నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ స్తోత్రంచేస్తూ ఉండు. మరియు సాష్టాంగం (సజ్దా) చేసేవారిలో చేరు.

15:99 – وَاعْبُدْ رَبَّكَ حَتَّىٰ يَأْتِيَكَ الْيَقِينُ ٩٩

మరియు తప్పక రాబోయే ఆ అంతిమ ఘడియ (మరణం) వచ్చేవరకు, నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండు. 45 (1/4)

సూరహ్ అన్‌-న’హ్ల్‌ – అన్‌-న’హ్లు: తేనెటీగ. ఈ సూరహ్‌ చివరి మక్కహ్ కాలంలో అవతరింపజేయబడింది. విశ్వం లో ఉన్న ప్రతిదీ అల్లాహ్‌ (సు.త.)ను స్తుతిస్తుంది. మానవునికి ప్రకృతి మీద ఆధిక్యత ఇవ్వబడింది. అతడు, అల్లాహ్‌ (సు.త.) అద్వితీయతను మరియు సత్యాన్ని గుర్తించాలని దీని సారాంశం. అల్లాహ్‌ (సు.త.) ప్రతి దానిని ఒక ఉద్దేశ్యంతో ఒక ప్రయోజనం కొరకు పుట్టించాడు. విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండాలి. తోటివారితో న్యాయం మరియు ఉదారస్వభావంతో వర్తించాలి. అల్లాహ్‌ (సు.త.) నిషేధించినట్టి, పాపం, చెడు, అసహ్యకరమైన, అశ్లీకరమైన పనుల నుండి దూరంగా ఉండాలి. 128 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 68వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 16:1 – أَتَىٰ أَمْرُ اللَّـهِ فَلَا تَسْتَعْجِلُوهُ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ ١

  • అల్లాహ్‌ ఆజ్ఞ (తీర్పు) వచ్చింది! కావున మీరు దాని కొరకు తొందరపెట్టకండి. ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు వారు సాటి కల్పించే భాగ స్వాములకు అత్యున్నతుడు.

16:2 – يُنَزِّلُ الْمَلَائِكَةَ بِالرُّوحِ مِنْ أَمْرِهِ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ أَنْ أَنذِرُوا أَنَّهُ لَا إِلَـٰهَ إِلَّا أَنَا فَاتَّقُونِ ٢

ఆయనే, తన ఆజ్ఞతో, దేవదూతల ద్వారా, దివ్యజ్ఞానాన్ని (రూ’హ్‌ను) 1 తానుకోరిన, తన దాసులపై అవత రింపజేస్తాడు, 2 వారిని (ప్రజలను) ఇలా హెచ్చరించటానికి: ”నిశ్చయంగా, నేను తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు! కావున మీరు నా యందే భయ భక్తులు కలిగి ఉండండి!”

16:3 – خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ تَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ ٣

ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు. వారు, ఆయనకు సాటికల్పించే భాగస్వాములకంటే (షరీక్‌లకంటే) ఆయన అత్యున్నతుడు. 3

16:4 – خَلَقَ الْإِنسَانَ مِن نُّطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُّبِينٌ ٥

ఆయన మానవుణ్ణి వీర్య (ఇంద్రియ) బిందువుతో సృష్టించాడు, తరువాత ఆ వ్యక్తియే ఒక బహిరంగ వివాదిగా మారిపోతాడు.

16:5 – وَالْأَنْعَامَ خَلَقَهَا ۗ لَكُمْ فِيهَا دِفْءٌ وَمَنَافِعُ وَمِنْهَا تَأْكُلُونَ ٥

మరియు ఆయన పశువులను సృష్టించాడు. వాటిలో మీ కొరకు వెచ్చని దుస్తులు మరియు అనేక లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటిలో (కొన్నిటి మాంసం) మీరు తింటారు.

16:6 – وَلَكُمْ فِيهَا جَمَالٌ حِينَ تُرِيحُونَ وَحِينَ تَسْرَحُونَ ٦

మరియు వాటిని మీరు సాయంత్రం ఇండ్లకు తోలుకొని వచ్చేటప్పుడు మరియు ఉదయం మేపటానికి తోలుకొని పోయేటప్పుడు, వాటిలో మీకొక మనోహరమైన దృశ్యం ఉంది.

16:7 – وَتَحْمِلُ أَثْقَالَكُمْ إِلَىٰ بَلَدٍ لَّمْ تَكُونُوا بَالِغِيهِ إِلَّا بِشِقِّ الْأَنفُسِ ۚ إِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ ٧

మరియు అవి మీ బరువును మోసుకొని – మీరు ఎంతో శ్రమపడనిదే చేరుకోలేని ప్రాంతాలకు – తీసుకుపోతాయి. నిశ్చయంగా, మీ ప్రభువు మహా కనికరుడు, అపార కరుణాప్రదాత.

16:8 – وَالْخَيْلَ وَالْبِغَالَ وَالْحَمِيرَ لِتَرْكَبُوهَا وَزِينَةً ۚ وَيَخْلُقُ مَا لَا تَعْلَمُونَ ٨

మరియు ఆయన గుర్రాలను, 4 కంచర గాడిదలను మరియు గాడిదలను, మీరు స్వారీ చేయటానికి మరియు మీ శోభను పెంచటానికి సృష్టించాడు. మరియు ఆయన, మీకు తెలియనివి (అనేక ఇతర సాధనాలను) కూడా సృష్టిస్తాడు. 5

16:9 – وَعَلَى اللَّـهِ قَصْدُ السَّبِيلِ وَمِنْهَا جَائِرٌ ۚ وَلَوْ شَاءَ لَهَدَاكُمْ أَجْمَعِينَ ٩

మరియు సన్మార్గం చూపటమే అల్లాహ్‌ విధానం 6 మరియు అందులో (లోకంలో) తప్పుడు (వక్ర) మార్గాలు కూడా ఉన్నాయి. ఆయన తలచుకొని ఉంటే మీ రందరికీ సన్మార్గం చూపి ఉండే వాడు. 7

16:10 – هُوَ الَّذِي أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً ۖ لَّكُم مِّنْهُ شَرَابٌ وَمِنْهُ شَجَرٌ فِيهِ تُسِيمُونَ ١٠

ఆయనే, ఆకాశం నుండి మీ కొరకు నీళ్ళను కురిపిస్తాడు. దాని నుండి మీకు త్రాగటానికి నీరు దొరుకుతుంది మరియు మీ పశువులను మేపటానికి పచ్చిక పెరుగుతుంది.

16:11 – يُنبِتُ لَكُم بِهِ الزَّرْعَ وَالزَّيْتُونَ وَالنَّخِيلَ وَالْأَعْنَابَ وَمِن كُلِّ الثَّمَرَاتِ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَتَفَكَّرُونَ ١١

ఆయన దీనిద్వారా (నీటి ద్వారా) మీకొరకు పంటలను, ‘జైతూన్‌ మరియు ఖర్జూరపు వృక్షాలను, ద్రాక్ష మరియు ఇతర రకాల ఫలాలను పండింపజేస్తున్నాడు. నిశ్చయంగా ఆలోచించే వారికి ఇందులో ఒక సూచన (నిదర్శనం) ఉంది.

16:12 – وَسَخَّرَ لَكُمُ اللَّيْلَ وَالنَّهَارَ وَالشَّمْسَ وَالْقَمَرَ ۖ وَالنُّجُومُ مُسَخَّرَاتٌ بِأَمْرِهِ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ ١٢

మరియు ఆయనే రేయింబవళ్ళను మరియు సూర్య-చంద్రులను, మీకు ఉపయుక్త మైనవిగాచేశాడు. మరియు నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞతోనే మీకు ఉపయుక్తమైనవిగా చేయబడ్డాయి. 8 నిశ్చయంగా, బుద్ధిని ఉపయోగించే వారికి వీటిలో సూచనలు (నిదర్శనాలు) ఉన్నాయి.

16:13 – وَمَا ذَرَأَ لَكُمْ فِي الْأَرْضِ مُخْتَلِفًا أَلْوَانُهُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَذَّكَّرُونَ ١٣

మరియు ఆయన మీ కొరకు భూమిలో వివిధ రంగుల వస్తువులను ఉత్పత్తి (వ్యాపింప) జేశాడు. నిశ్చ యంగా, హితబోధ స్వీకరించేవారికి వీటిలో సూచన ఉంది.

16:14 – وَهُوَ الَّذِي سَخَّرَ الْبَحْرَ لِتَأْكُلُوا مِنْهُ لَحْمًا طَرِيًّا وَتَسْتَخْرِجُوا مِنْهُ حِلْيَةً تَلْبَسُونَهَا وَتَرَى الْفُلْكَ مَوَاخِرَ فِيهِ وَلِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ ١٤

మరియు ఆయన సముద్రాన్ని – తాజా మాంసము తినటానికి మరియు మీరు ధరించే ఆభరణాలు తీయటానికి – మీకు ఉపయుక్త మైనదిగా చేశాడు. ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి (ప్రజలు), అందులో ఓడల మీద దాని నీటిని చీల్చుకొని పోవటాన్ని నీవు చూస్తున్నావు. మరియు బహుశా మీరు కృతజ్ఞులవుతారని ఆయన మీకు (ఇవన్నీ ప్రసాదించాడు).

16:15 – وَأَلْقَىٰ فِي الْأَرْضِ رَوَاسِيَ أَن تَمِيدَ بِكُمْ وَأَنْهَارًا وَسُبُلًا لَّعَلَّكُمْ تَهْتَدُونَ ١٥

మరియు భూమి మీతోపాటు చలించకుండా ఉండటానికి, ఆయన దానిలో స్థిరమైన పర్వ తాలను నాటాడు 9 మరియు అందులో నదులను ప్రవహింపజేశాడు. మరియు రహదారులను నిర్మించాడు, బహుశా మీరు మార్గం పొందుతారని!

16:16 – وَعَلَامَاتٍ ۚ وَبِالنَّجْمِ هُمْ يَهْتَدُونَ ١٦

మరియు (భూమిలో మార్గంచూపే) సంకేతా లను పెట్టాడు. మరియు వారు (ప్రజలు) నక్షత్రాల ద్వారా కూడా తమ మార్గాలు తెలుసుకుంటారు.

16:17 – أَفَمَن يَخْلُقُ كَمَن لَّا يَخْلُقُ ۗ أَفَلَا تَذَكَّرُونَ ١٧

సృష్టించేవాడూ, అసలు ఏమీ సృష్టించలేని వాడూసమానులా? ఇది మీరెందుకు గమనించరు?

16:18 – وَإِن تَعُدُّوا نِعْمَةَ اللَّـهِ لَا تُحْصُوهَا ۗ إِنَّ اللَّـهَ لَغَفُورٌ رَّحِيمٌ ١٨

మరియు మీరు అల్లాహ్‌ అనుగ్రహాలను లెక్కపెట్టదలచినా, మీరు వాటిని లెక్కపెట్టలేరు. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

16:19 – وَاللَّـهُ يَعْلَمُ مَا تُسِرُّونَ وَمَا تُعْلِنُونَ ١٩

మరియు అల్లాహ్‌కు మీరు దాచేవి మరియు మీరు వెలిబుచ్చేవి అన్నీతెలుసు.

16:20 – وَالَّذِينَ يَدْعُونَ مِن دُونِ اللَّـهِ لَا يَخْلُقُونَ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ ٢٠

మరియు ఎవరినైతే వారు (ప్రజలు), అల్లాహ్‌ను వదలి ప్రార్థిస్తున్నారో, వారు ఏమీ సృష్టించలేరు మరియు స్వయంగా వారే సృష్టించ బడి ఉన్నారు.

16:21 – أَمْوَاتٌ غَيْرُ أَحْيَاءٍ ۖ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ ٢١

వారు (ఆ దైవాలు) మృతులు, ప్రాణంలేని వారు. 10 మరియు వారికి, తాము తిరిగి ఎప్పుడు లేపబడతారో కూడా తెలియదు.

16:22 – إِلَـٰهُكُمْ إِلَـٰهٌ وَاحِدٌ ۚ فَالَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ قُلُوبُهُم مُّنكِرَةٌ وَهُم مُّسْتَكْبِرُونَ ٢٢

మీ ఆరాధ్యదైవం కేవలం (అల్లాహ్‌) ఒక్కడే! పరలోక జీవితాన్ని విశ్వసించనివారి హృదయాలు (ఈ సత్యాన్ని) తిరస్కరిస్తున్నాయి మరియు వారు దురహంకారంలో పడి ఉన్నారు. 11

16:23 – لَا جَرَمَ أَنَّ اللَّـهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُسْتَكْبِرِينَ ٢٣

నిస్సందేహంగా, వారి రహస్య విషయాలు మరియు వారి బహిరంగ విషయాలు అన్నీ, నిశ్చయంగా అల్లాహ్‌కు తెలుసు. నిశ్చయంగా, దురహంకారులంటే 12 ఆయన ఇష్టపడడు.

16:24 – وَإِذَا قِيلَ لَهُم مَّاذَا أَنزَلَ رَبُّكُمْ ۙ قَالُوا أَسَاطِيرُ الْأَوَّلِينَ ٢٤

మరియు: ”మీ ప్రభువు ఏమి అవతరింప జేశాడు?” అని వారిని అడిగినప్పుడు, వారు: ”అవి పూర్వకాలపు కల్పిత గాథలు మాత్రమే!” అని జవాబిస్తారు.

16:25 – لِيَحْمِلُوا أَوْزَارَهُمْ كَامِلَةً يَوْمَ الْقِيَامَةِ ۙ وَمِنْ أَوْزَارِ الَّذِينَ يُضِلُّونَهُم بِغَيْرِ عِلْمٍ ۗ أَلَا سَاءَ مَا يَزِرُونَ ٢٥

కావున పునరుత్థానదినమున వారు తమ (పాపాల) భారాలను పూర్తిగా మరియు తాము మార్గం తప్పించిన అజ్ఞానుల భారాలలోని కొంత భాగాన్ని కూడా మోస్తారు. 13 వారు మోసే భారం ఎంత దుర్భరమైనదో చూడండి!

16:26 – قَدْ مَكَرَ الَّذِينَ مِن قَبْلِهِمْ فَأَتَى اللَّـهُ بُنْيَانَهُم مِّنَ الْقَوَاعِدِ فَخَرَّ عَلَيْهِمُ السَّقْفُ مِن فَوْقِهِمْ وَأَتَاهُمُ الْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ ٢٦

వాస్తవానికి, వారికంటే పూర్వం గతించిన వారు కూడా (అల్లాహ్‌ సందేశాలకు వ్యతిరేకంగా) కుట్రలు పన్నారు. కాని అల్లాహ్‌ వారి (పన్నాగపు) కట్టడాలను వాటి పునాదులతో సహా పెకలించాడు. దానితో వాటి కప్పులు వారి మీద పడ్డాయి మరియు వారిపై, వారు ఊహించని వైపునుండి శిక్ష వచ్చిపడింది.

16:27 – ثُمَّ يَوْمَ الْقِيَامَةِ يُخْزِيهِمْ وَيَقُولُ أَيْنَ شُرَكَائِيَ الَّذِينَ كُنتُمْ تُشَاقُّونَ فِيهِمْ ۚ قَالَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ إِنَّ الْخِزْيَ الْيَوْمَ وَالسُّوءَ عَلَى الْكَافِرِينَ ٢٧

తరువాత పునరుత్థానదినమున ఆయన వారిని అవమానపరుస్తాడు మరియు వారిని అడుగుతాడు: ”మీరు నాకు సాటి కల్పించిన వారు – ఎవరిని గురించి అయితే మీరు (విశ్వాసులతో) వాదులాడేవారో – ఇప్పుడు ఎక్కడున్నారు?” జ్ఞానం ప్రసాదించబడినవారు అంటారు: ”నిశ్చయంగా ఈ రోజు అవమానం మరియు దుర్దశ సత్య-తిరస్కారుల కొరకే!

16:28 – الَّذِينَ تَتَوَفَّاهُمُ الْمَلَائِكَةُ ظَالِمِي أَنفُسِهِمْ ۖ فَأَلْقَوُا السَّلَمَ مَا كُنَّا نَعْمَلُ مِن سُوءٍ ۚ بَلَىٰ إِنَّ اللَّـهَ عَلِيمٌ بِمَا كُنتُمْ تَعْمَلُونَ ٢٨

”వారిపై, ఎవరైతే తమను తాము దుర్మార్గం లో ముంచుకొని ఉన్నప్పుడు, దేవదూతలు వారి ప్రాణాలు తీస్తారో!” అప్పుడు వారు (సత్య-తిరస్కా రులు) లొంగిపోయి: ”మేము ఎలాంటి పాపం చేయలేదు.” 14 అని అంటారు. (దేవదూతలు వారితో ఇలాఅంటారు): ”అలాకాదు! నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్‌ కు బాగా తెలుసు.

16:29 – فَادْخُلُوا أَبْوَابَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۖ فَلَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِينَ ٢٩

”కావున నరక ద్వారాలలో ప్రవేశించండి. అక్కడ శాశ్వతంగా ఉండటానికి! గర్విష్ఠులకు లభించే నివాసం ఎంత చెడ్డది!” (3/8)

16:30 – وَقِيلَ لِلَّذِينَ اتَّقَوْا مَاذَا أَنزَلَ رَبُّكُمْ ۚ قَالُوا خَيْرًا ۗ لِّلَّذِينَ أَحْسَنُوا فِي هَـٰذِهِ الدُّنْيَا حَسَنَةٌ ۚ وَلَدَارُ الْآخِرَةِ خَيْرٌ ۚ وَلَنِعْمَ دَارُ الْمُتَّقِينَ ٣٠

  • మరియు దైవభీతి గలవారితో: ”మీ ప్రభువు ఏమి అవతరింపజేశాడు?” అని అడిగి నప్పుడు, వారు: ”అత్యుత్తమమైనది.” అని జవాబిస్తారు. ఎవరైతే ఈ లోకంలో మేలు చేస్తారో వారికి మేలుంటుంది మరియు పరలోక గృహం దీని కంటే ఉత్తమమైనది. మరియు దైవభీతి గలవారి గృహం పరమానందకరమైనది.

16:31 – جَنَّاتُ عَدْنٍ يَدْخُلُونَهَا تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ لَهُمْ فِيهَا مَا يَشَاءُونَ ۚ كَذَٰلِكَ يَجْزِي اللَّـهُ الْمُتَّقِينَ ٣١

వారు ప్రవేశించే శాశ్వత స్వర్గవనాలలో క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారికి వారు కోరేది దొరుకుతుంది. దైవభీతి గలవారికి అల్లాహ్‌ ఈ విధంగా ప్రతిఫలమిస్తాడు.

16:32 – الَّذِينَ تَتَوَفَّاهُمُ الْمَلَائِكَةُ طَيِّبِينَ ۙ يَقُولُونَ سَلَامٌ عَلَيْكُمُ ادْخُلُوا الْجَنَّةَ بِمَا كُنتُمْ تَعْمَلُونَ ٣٢

ఎవరైతే, పరిశుద్ధులుగా ఉండగా దైవ దూతలు వారి ప్రాణాలు తీస్తారో, వారితో: ”మీకు శాంతి కలుగుగాక (సలాం)! మీరు చేసిన మంచి పనులకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశించండి!” అని అంటారు. 15

16:33 – هَلْ يَنظُرُونَ إِلَّا أَن تَأْتِيَهُمُ الْمَلَائِكَةُ أَوْ يَأْتِيَ أَمْرُ رَبِّكَ ۚ كَذَٰلِكَ فَعَلَ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ وَمَا ظَلَمَهُمُ اللَّـهُ وَلَـٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ ٣٣

ఏమీ? వారు (సత్య-తిరస్కారులు), తమ వద్దకు దేవదూతల రాకకోసం ఎదురు చూస్తున్నారా? లేక నీ ప్రభువు ఆజ్ఞ (తీర్పు) కొసం ఎదురుచూస్తున్నారా? 16 వారికి పూర్వం ఉన్న వారు కూడా ఈ విధంగానే ప్రవర్తించారు. మరియు అల్లాహ్‌ వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.

16:34 – فَأَصَابَهُمْ سَيِّئَاتُ مَا عَمِلُوا وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ٣٤

అప్పుడు వారి దుష్కర్మల ఫలితాలు వారిపై పడ్డాయి మరియు వారు దేనిని గురించి పరిహాసమాడుతూ ఉన్నారో, అదే వారిని క్రమ్ముకుంది. 17

16:35 – وَقَالَ الَّذِينَ أَشْرَكُوا لَوْ شَاءَ اللَّـهُ مَا عَبَدْنَا مِن دُونِهِ مِن شَيْءٍ نَّحْنُ وَلَا آبَاؤُنَا وَلَا حَرَّمْنَا مِن دُونِهِ مِن شَيْءٍ ۚ كَذَٰلِكَ فَعَلَ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ فَهَلْ عَلَى الرُّسُلِ إِلَّا الْبَلَاغُ الْمُبِينُ ٣٥

మరియు (అల్లాహ్‌కు) సాటికల్పించేవారు అంటారు: ”ఒకవేళ అల్లాహ్‌ కోరి ఉంటే! మేము గానీ మా తండ్రి-తాతలు గానీ, ఆయన్ని తప్ప మరెవ్వరినీ ఆరాధించేవారం కాదు. మరియు ఆయన ఆజ్ఞలేనిదే మేము దేన్ని కూడా నిషేధించే వారం కాదు.” 18 వారికి పూర్వం వారు కూడా ఇలాగేచేశారు.అయితే ప్రవక్తల బాధ్యత (అల్లాహ్‌) సందేశాన్ని స్పష్టంగా అందజేయటం తప్ప ఇంకేమిటి?

16:36 – وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللَّـهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ ۖ فَمِنْهُم مَّنْ هَدَى اللَّـهُ وَمِنْهُم مَّنْ حَقَّتْ عَلَيْهِ الضَّلَالَةُ ۚ فَسِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ ٣٦

మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అత నన్నాడు): ”మీరు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధిం చండి. మరియు మిథ్యదైవాల (‘తాగూత్‌ల) ఆరాధనను త్యజించండి.” వారిలో కొందరికి అల్లాహ్‌ సన్మార్గం చూపాడు, మరి కొందరి కొరకు మార్గభ్రష్టత్వం నిశ్చితమైపోయింది. కావున మీరు భూమిలో సంచారం చేసి చూడండి, ఆ సత్య-తిరస్కారుల గతి ఏమయిందో!

16:37 – إِن تَحْرِصْ عَلَىٰ هُدَاهُمْ فَإِنَّ اللَّـهَ لَا يَهْدِي مَن يُضِلُّ ۖ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ ٣٧

ఇక (ఓ ము’హమ్మద్‌!) నీవు వారిని సన్మార్గానికి తేవాలని ఎంత కోరుకున్నా! నిశ్చయంగా, అల్లాహ్‌ మార్గభ్రష్టతకు గురిచేసిన వానికి సన్మార్గం చూపడు. 19 వారికి సహాయపడే వారు ఎవ్వరూ ఉండరు.

16:38 – وَأَقْسَمُوا بِاللَّـهِ جَهْدَ أَيْمَانِهِمْ ۙ لَا يَبْعَثُ اللَّـهُ مَن يَمُوتُ ۚ بَلَىٰ وَعْدًا عَلَيْهِ حَقًّا وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ ٣٨

మరియు వారు అల్లాహ్‌ పేరుతో దృఢమైన శపథం చేసి ఇలా అంటారు: ”మరణించిన వానిని అల్లాహ్‌ తిరిగి బ్రతికించిలేపడు!” ఎందుకు లేపడు! ఆయన చేసిన వాగ్దానం సత్యం! అయినా చాలా మంది ప్రజలకు ఇది తెలియదు (కాని అది జరిగి తీరుతుంది);

16:39 – لِيُبَيِّنَ لَهُمُ الَّذِي يَخْتَلِفُونَ فِيهِ وَلِيَعْلَمَ الَّذِينَ كَفَرُوا أَنَّهُمْ كَانُوا كَاذِبِينَ ٣٩

వారు వాదిస్తూ ఉండిన దానిని గురించి వారికి తెలుపటానికి మరియు సత్యతిరస్కారులు తాము నిశ్చయంగా, అబద్ధమాడుతున్నారని తెలుసుకోవటానికి.

16:40 – إِنَّمَا قَوْلُنَا لِشَيْءٍ إِذَا أَرَدْنَاهُ أَن نَّقُولَ لَهُ كُن فَيَكُونُ ٤٠

నిశ్చయంగా మేము ఏదైనావస్తువును ఉనికి లోనికి తీసుకురాదలచినపుడు దానిని మేము: ”అయిపో!” అని ఆజ్ఞాపిస్తాము. అంతే! అది అయి పోతుంది. 20

16:41 – وَالَّذِينَ هَاجَرُوا فِي اللَّـهِ مِن بَعْدِ مَا ظُلِمُوا لَنُبَوِّئَنَّهُمْ فِي الدُّنْيَا حَسَنَةً ۖ وَلَأَجْرُ الْآخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ ٤١

మరియు దౌర్జన్యాన్ని సహించిన తరువాత, ఎవరైతే అల్లాహ్‌ కొరకు వలసపోతారో; 21 అలాంటి వారికి మేము ప్రపంచంలో తప్పకుండా మంచి స్థానాన్ని నొసంగుతాము. మరియు వారి పరలోక ప్రతిఫలం దాని కంటే గొప్పగా ఉంటుంది. ఇది వారు తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది!

16:42 – الَّذِينَ صَبَرُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ ٤٢

అలాంటివారే సహనం వహించినవారు మరియు తమ ప్రభువును నమ్ముకున్నవారు.

16:43 – وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ إِلَّا رِجَالًا نُّوحِي إِلَيْهِمْ ۚ فَاسْأَلُوا أَهْلَ الذِّكْرِ إِن كُنتُمْ لَا تَعْلَمُونَ ٤٣

మరియు (ఓ ము’హమ్మద్‌!) నీకు పూర్వం కూడా మేము పంపిన ప్రవక్తలందరూ పురుషులే (మానవులే)! 22 మేము వారిపై దివ్యజ్ఞానాన్ని (వ’హీని) అవతరింపజేశాము. కావున ఇది మీకు తెలియక పోతే పూర్వగ్రంథ ప్రజలను అడగండి.

16:44 – بِالْبَيِّنَاتِ وَالزُّبُرِ ۗ وَأَنزَلْنَا إِلَيْكَ الذِّكْرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيْهِمْ وَلَعَلَّهُمْ يَتَفَكَّرُونَ ٤٤

(పూర్వపు ప్రవక్తలను) మేము స్పష్టమైన నిదర్శనాలతో మరియు గ్రంథాలతో (‘జుబుర్‌ లతో) పంపాము. మరియు (ఓ ప్రవక్తా!) ఇప్పుడు ఈ జ్ఞాపికను (గ్రంథాన్ని) నీపై అవతరింపజేసింది, వారి వద్దకు అవతరింపజేయబడిన దానిని వారికి నీవు స్పష్టంగా వివరించటానికి మరియు బహుశా వారు ఆలోచిస్తారేమోనని!

16:45 – أَفَأَمِنَ الَّذِينَ مَكَرُوا السَّيِّئَاتِ أَن يَخْسِفَ اللَّـهُ بِهِمُ الْأَرْضَ أَوْ يَأْتِيَهُمُ الْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ ٤٥

దుష్ట పన్నాగాలు చేస్తున్నవారు – అల్లాహ్‌ తమను భూమిలోనికి దిగిపోయినట్లు చేయకుండా, లేదా తాము ఊహించనివైపు నుండి తమపై శిక్ష అవతరింపజేయకుండా – తాము సురక్షితంగా ఉన్నారనుకొంటున్నారా ఏమిటి?

16:46 – أَوْ يَأْخُذَهُمْ فِي تَقَلُّبِهِمْ فَمَا هُم بِمُعْجِزِينَ ٤٦

లేదా వారు తిరుగాడుతున్నపుడు, అకస్మాత్తుగా ఆయన వారిని పట్టుకుంటే, వారు ఆయన (పట్టు) నుండి తప్పించుకోగలరా?

16:47 – أَوْ يَأْخُذَهُمْ عَلَىٰ تَخَوُّفٍ فَإِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ ٤٧

లేదా, వారిని భయకంపితులు జేసి పట్టుకో వచ్చు కదా! కాని నిశ్చయంగా, నీ ప్రభువు మహా కనికరుడు, అపార కరుణాప్రదాత.

16:48 – أَوَلَمْ يَرَوْا إِلَىٰ مَا خَلَقَ اللَّـهُ مِن شَيْءٍ يَتَفَيَّأُ ظِلَالُهُ عَنِ الْيَمِينِ وَالشَّمَائِلِ سُجَّدًا لِّلَّـهِ وَهُمْ دَاخِرُونَ ٤٨

ఏమీ? వారు అల్లాహ్‌ సృష్టించిన ప్రతి వస్తువునూ గమనించటం (చూడటం) లేదా? వాటి నీడలు కుడి వైపుకూ ఎడమవైపుకూ వంగుతూ ఉండి, అల్లాహ్‌కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ, ఎలా వినమ్రత చూపుతున్నాయో? 23

16:49 – وَلِلَّـهِ يَسْجُدُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ مِن دَابَّةٍ وَالْمَلَائِكَةُ وَهُمْ لَا يَسْتَكْبِرُونَ ٤٩

మరియు ఆకాశాలలోను మరియు భూమి లోను ఉన్న సమస్త ప్రాణులు మరియు దేవదూతలు అందరూ అల్లాహ్‌కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారు. వారెన్నడూ (తమ ప్రభువు సన్నిధిలో) గర్వపడరు.

16:50 – يَخَافُونَ رَبَّهُم مِّن فَوْقِهِمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ ۩ ٥٠

వారు తమపై నున్న ప్రభువునకు భయపడుతూ, తమకు ఆజ్ఞాపించిన విధంగా నడుచు కుంటారు. (1/2) (సజ్దా)

16:51 – وَقَالَ اللَّـهُ لَا تَتَّخِذُوا إِلَـٰهَيْنِ اثْنَيْنِ ۖ إِنَّمَا هُوَ إِلَـٰهٌ وَاحِدٌ ۖ فَإِيَّايَ فَارْهَبُونِ ٥١

  • మరియు అల్లాహ్‌ ఇలా ఆజ్ఞాపించాడు: ”(ఓ మానవులారా!) ఇద్దరిని ఆరాధ్య దైవాలుగా చేసుకోకండి. నిశ్చయంగా ఆరాధ్యదైవం ఆయన (అల్లాహ్‌) ఒక్కడే! కావున నాకే భీతిపరులై ఉండండి.” 24

16:52 – وَلَهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَهُ الدِّينُ وَاصِبًا ۚ أَفَغَيْرَ اللَّـهِ تَتَّقُونَ ٥٢

మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకు చెందినదే! మరియు నిరంతర విధేయతకు కేవలం ఆయనే అర్హుడు. 25 ఏమీ? మీరు అల్లాహ్‌ను కాదని ఇతరులకు భయభక్తులు చూపుతారా?

16:53 – وَمَا بِكُم مِّن نِّعْمَةٍ فَمِنَ اللَّـهِ ۖ ثُمَّ إِذَا مَسَّكُمُ الضُّرُّ فَإِلَيْهِ تَجْأَرُونَ ٥٣

మరియు మీకు లభించిన అనుగ్రహాలన్నీ కేవలం అల్లాహ్‌ నుండి వచ్చినవే. అంతేగాక మీకు ఆపదలు వచ్చినపుడు కూడా మీరు సహాయం కొరకు ఆయననే మొరపెట్టుకుంటారు కదా! 26

16:54 – ثُمَّ إِذَا كَشَفَ الضُّرَّ عَنكُمْ إِذَا فَرِيقٌ مِّنكُم بِرَبِّهِمْ يُشْرِكُونَ ٥٤

తరువాత ఆయన మీ ఆపదలు తొలగించి నపుడు; మీలో కొందరు మీ ప్రభువుకు సాటి (షరీక్‌లను) కల్పించ సాగుతారు –

16:55 – لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ ۚ فَتَمَتَّعُوا ۖ فَسَوْفَ تَعْلَمُونَ ٥٥

మేము చేసిన ఉపకారానికి కృతఘ్నతగా. సరే (కొంత కాలం) సుఖాలను అనుభవించండి. తరువాత మీరు తెలుసుకుంటారు. 27

16:56 – وَيَجْعَلُونَ لِمَا لَا يَعْلَمُونَ نَصِيبًا مِّمَّا رَزَقْنَاهُمْ ۗ تَاللَّـهِ لَتُسْأَلُنَّ عَمَّا كُنتُمْ تَفْتَرُونَ ٥٦

మరియు మేము వారికిచ్చిన జీవనోపాధి నుండి కొంత భాగాన్ని, తాము ఏ మాత్రం ఎరుగని తమ (బూటకదైవాల) కొరకు నిర్ణయించు కుంటారు వారు 28 అల్లాహ్‌తోడు! మీరు కల్పిస్తున్న ఈ బూటక (కల్పిత) దైవాలను గురించి మీరు తప్పక ప్రశ్నింపబడతారు.

16:57 – وَيَجْعَلُونَ لِلَّـهِ الْبَنَاتِ سُبْحَانَهُ ۙ وَلَهُم مَّا يَشْتَهُونَ ٥٧

మరియు వారు అల్లాహ్‌కేమో కుమార్తెలను అంటగడుతున్నారు – ఆయన సర్వలోపాలకు అతీతుడు – మరియు తమకేమో తాముకోరేది 29 (నిర్ణయించుకుంటారు).

16:58 – وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِالْأُنثَىٰ ظَلَّ وَجْهُهُ مُسْوَدًّا وَهُوَ كَظِيمٌ ٥٨

మరియు వారిలో ఎవడికైనా బాలిక (పుట్టిందనే) శుభవార్త అందజేస్తే; అతడి ముఖం నల్లబడిపోతుంది. మరియు అతడు తన క్రోధావేశాన్ని అణచుకోవటానికి ప్రయత్నిస్తాడు.

16:59 – يَتَوَارَىٰ مِنَ الْقَوْمِ مِن سُوءِ مَا بُشِّرَ بِهِ ۚ أَيُمْسِكُهُ عَلَىٰ هُونٍ أَمْ يَدُسُّهُ فِي التُّرَابِ ۗ أَلَا سَاءَ مَا يَحْكُمُونَ ٥٩

తనకు ఇవ్వబడిన శుభవార్తను (అతడు) దుర్వార్తగా భావించి, తన జాతివారి నుండి దాక్కుంటూ తిరుగుతాడు. అవమానాన్ని భరించి దానిని (ఆ బాలికను) ఉంచుకోవాలా? లేక, దానిని మట్టిలో పూడ్చివేయాలా? అని ఆలోచిస్తాడు. చూడండి! వారి నిర్ణయం ఎంత దారుణమైనదో! 30

16:60 – لِلَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ مَثَلُ السَّوْءِ ۖ وَلِلَّـهِ الْمَثَلُ الْأَعْلَىٰ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ٦٠

ఎవరైతే పరలోకాన్నివిశ్వసించరో, వారే దుష్టులుగా పరిగణింపబడేవారు. మరియు అల్లాహ్‌ మాత్రమే సర్వోన్నతుడిగా పరిగణింప బడేవాడు. మరియు ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

16:61 – وَلَوْ يُؤَاخِذُ اللَّـهُ النَّاسَ بِظُلْمِهِم مَّا تَرَكَ عَلَيْهَا مِن دَابَّةٍ وَلَـٰكِن يُؤَخِّرُهُمْ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۖ فَإِذَا جَاءَ أَجَلُهُمْ لَا يَسْتَأْخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ ٦١

మరియు ఒకవేళ అల్లాహ్‌ మానవులను – వారు చేసే దుర్మార్గానికి – పట్టుకోదలిస్తే, భూమిపై ఒక్క ప్రాణిని కూడ వదిలేవాడు కాదు. 31 కాని, ఆయన ఒక నిర్ణీతకాలం వరకు వారికి వ్యవధి నిస్తున్నాడు. ఇక, వారి కాలం వచ్చినప్పుడు వారు, ఒక ఘడియ వెనుకగానీ మరియు ముందు గానీ కాలేరు. 32

16:62 – وَيَجْعَلُونَ لِلَّـهِ مَا يَكْرَهُونَ وَتَصِفُ أَلْسِنَتُهُمُ الْكَذِبَ أَنَّ لَهُمُ الْحُسْنَىٰ ۖ لَا جَرَمَ أَنَّ لَهُمُ النَّارَ وَأَنَّهُم مُّفْرَطُونَ ٦٢

మరియు వారు తమకు ఇష్టంలేని దానిని అల్లాహ్‌ కొరకు నిర్ణయిస్తారు.”నిశ్చయంగా, వారికి ఉన్నదంతా శుభమే (మేలైనదే).” అని వారి నాలు కలు అబద్ధం పలుకుతున్నాయి. నిస్సందేహంగా, వారు నరకాగ్ని పాలవుతారు. మరియు నిశ్చ యంగా వారందులోకి త్రోయబడి వదలబడతారు.

16:63 – تَاللَّـهِ لَقَدْ أَرْسَلْنَا إِلَىٰ أُمَمٍ مِّن قَبْلِكَ فَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ فَهُوَ وَلِيُّهُمُ الْيَوْمَ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ٦٣

అల్లాహ్‌ తోడు, (ఓ ప్రవక్తా!) వాస్తవానికి, నీకు పూర్వమున్న సమాజాలవారి వద్దకు, మేము ప్రవక్తలను పంపాము! కాని షై’తాన్‌ వారి (దుష్ట) కర్మలను వారికి మంచివిగా కనిపించేటట్లుచేశాడు. అదేవిధంగా ఈ నాడు కూడా, వాడు వారి స్నేహితుడిగా ఉన్నాడు. 33 మరియు వారికి బాధా కరమైన శిక్ష ఉంటుంది.

16:64 – وَمَا أَنزَلْنَا عَلَيْكَ الْكِتَابَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ الَّذِي اخْتَلَفُوا فِيهِ ۙ وَهُدًى وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ ٦٤

మరియు మేము ఈ గ్రంథాన్ని(ఖుర్‌ఆన్‌ను) నీపై అవతరింపజేసింది, వారు విభేదాలకు గురిఅయిన విషయాన్ని వారికి, నీవు స్పష్టం చేయటానికీ మరియు విశ్వసించే జనుల కొరకు మార్గదర్శకత్వంగానూ మరియు కారుణ్యంగానూ ఉంచటానికి!

16:65 – وَاللَّـهُ أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَسْمَعُونَ ٦٥

మరియు అల్లాహ్‌ ఆకాశంనుండి నీటిని కురిపించి, దాని ద్వారా నిర్జీవంగా ఉన్న భూమిలో జీవంపోశాడు. నిశ్చయంగా, ఇందులో వినేవారికి సూచన ఉంది.

16:66 – وَإِنَّ لَكُمْ فِي الْأَنْعَامِ لَعِبْرَةً ۖ نُّسْقِيكُم مِّمَّا فِي بُطُونِهِ مِن بَيْنِ فَرْثٍ وَدَمٍ لَّبَنًا خَالِصًا سَائِغًا لِّلشَّارِبِينَ ٦٦

మరియు నిశ్చయంగా మీకు పశువులలో ఒక గుణపాఠం ఉంది. వాటి కడుపులలో ఉన్న దానిని (పాలను) మేము మీకు త్రాగటానికి ఇస్తున్నాము. అది మలం మరియు రక్తముల మధ్యనున్న నిర్మలమైన (స్వచ్ఛమైన) పాలు, త్రాగేవారికి ఎంతో రుచికరమైనది.

16:67 – وَمِن ثَمَرَاتِ النَّخِيلِ وَالْأَعْنَابِ تَتَّخِذُونَ مِنْهُ سَكَرًا وَرِزْقًا حَسَنًا ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَعْقِلُونَ ٦٧

మరియు ఖర్జూరపు మరియు ద్రాక్ష ఫలాల నుండి మీరు మత్తుపానీయం మరియు మంచి ఆహారం కూడా పొందుతారు. 34 నిశ్చయంగా, ఇందులో బుధ్ధిమంతులకు సూచన ఉంది.

16:68 – وَأَوْحَىٰ رَبُّكَ إِلَى النَّحْلِ أَنِ اتَّخِذِي مِنَ الْجِبَالِ بُيُوتًا وَمِنَ الشَّجَرِ وَمِمَّا يَعْرِشُونَ ٦٨

మరియు నీ ప్రభువు తేనెటీగకు ఈ విధంగా ఆదేశమిచ్చాడు: 35 ”నీవు కొండలలో, చెట్లలో మరియు మానవుల కట్టడాలలో నీ తెట్టెలను కట్టుకో!

16:69 – ثُمَّ كُلِي مِن كُلِّ الثَّمَرَاتِ فَاسْلُكِي سُبُلَ رَبِّكِ ذُلُلًا ۚ يَخْرُجُ مِن بُطُونِهَا شَرَابٌ مُّخْتَلِفٌ أَلْوَانُهُ فِيهِ شِفَاءٌ لِّلنَّاسِ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَتَفَكَّرُونَ ٦٩

”తరువాత అన్నిరకాల ఫలాలను తిను. ఇలా నీ ప్రభువు మార్గాలపై నమ్రతతో నడువు.” దాని కడుపు నుండి. రంగురంగుల పానకం (తేనే) ప్రసవిస్తుంది; అందులో మానవులకు వ్యాధి నివారణ ఉంది. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి సూచన ఉంది.

16:70 – وَاللَّـهُ خَلَقَكُمْ ثُمَّ يَتَوَفَّاكُمْ ۚ وَمِنكُم مَّن يُرَدُّ إِلَىٰ أَرْذَلِ الْعُمُرِ لِكَيْ لَا يَعْلَمَ بَعْدَ عِلْمٍ شَيْئًا ۚ إِنَّ اللَّـهَ عَلِيمٌ قَدِيرٌ ٧٠

మరియు అల్లాహ్‌యే మిమ్మల్ని సృష్టించాడు, తరువాత మిమ్మల్ని మరణింప జేస్తాడు. మరియు మీలో కొందరు అతి నికృష్టమైన (ముసలి) వయస్సుకు చేరుతారు. అప్పుడు అతడు అంతా తెలిసినా, ఏమీ తెలియని వాడిగా అయిపోతాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు.

16:71 – وَاللَّـهُ فَضَّلَ بَعْضَكُمْ عَلَىٰ بَعْضٍ فِي الرِّزْقِ ۚ فَمَا الَّذِينَ فُضِّلُوا بِرَادِّي رِزْقِهِمْ عَلَىٰ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَهُمْ فِيهِ سَوَاءٌ ۚ أَفَبِنِعْمَةِ اللَّـهِ يَجْحَدُونَ ٧١

మరియు అల్లాహ్‌ జీవనోపాధి విషయంలో మీలో కొందరికి మరికొందరిపై ఆధిక్యతను ప్రసా దించాడు. కాని ఈ ఆధిక్యత ఇవ్వబడినవారు తమ జీవనోపాధిని తమ ఆధీనంలో ఉన్నవారికి (బానిస లకు) ఇవ్వటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు తమతో సమానులు అవుతారేమోనని! ఏమీ? వారు అల్లాహ్‌ అనుగ్రహాన్ని తిరస్కరిస్తున్నారా?

16:72 – وَاللَّـهُ جَعَلَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَاجًا وَجَعَلَ لَكُم مِّنْ أَزْوَاجِكُم بَنِينَ وَحَفَدَةً وَرَزَقَكُم مِّنَ الطَّيِّبَاتِ ۚ أَفَبِالْبَاطِلِ يُؤْمِنُونَ وَبِنِعْمَتِ اللَّـهِ هُمْ يَكْفُرُونَ ٧٢

మరియు అల్లాహ్‌ మీ వంటి వారి నుండియే మీ సహవాసులను (అ’జ్వాజ్‌లను) పుట్టించాడు. మరియు మీ సహవాసుల నుండి మీకు పిల్లలను మరియు మనమళ్ళను ప్రసాదించి, మీకు ఉత్తమమైన జీవనోపాధులను కూడా సమకూర్చాడు. అయినా వారు (మానవులు) అసత్యమైన వాటిని (దైవాలుగా) విశ్వసించి, అల్లాహ్‌ అనుగ్రహాలను తిరస్కరిస్తారా?

16:73 – وَيَعْبُدُونَ مِن دُونِ اللَّـهِ مَا لَا يَمْلِكُ لَهُمْ رِزْقًا مِّنَ السَّمَاوَاتِ وَالْأَرْضِ شَيْئًا وَلَا يَسْتَطِيعُونَ ٧٣

మరియు వారు అల్లాహ్‌ను వదలి, ఆకాశాల నుండి గానీ, భూమినుండి గానీ వారికి ఎలాంటి జీవనోపాధిని సమకూర్చలేని మరియు కనీసం (సమకూర్చే) సామర్థ్యం కూడా లేని వారిని ఆరాధిస్తున్నారు.

16:74 – فَلَا تَضْرِبُوا لِلَّـهِ الْأَمْثَالَ ۚ إِنَّ اللَّـهَ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ ٧٤

కావున అల్లాహ్‌కు పోలికలు కల్పించకండి. 36 నిశ్చయంగా, అల్లాహ్‌కు అంతా తెలుసు మరియు మీకేమీ తెలియదు. (5/8)

16:75 – ضَرَبَ اللَّـهُ مَثَلًا عَبْدًا مَّمْلُوكًا لَّا يَقْدِرُ عَلَىٰ شَيْءٍ وَمَن رَّزَقْنَاهُ مِنَّا رِزْقًا حَسَنًا فَهُوَ يُنفِقُ مِنْهُ سِرًّا وَجَهْرًا ۖ هَلْ يَسْتَوُونَ ۚ الْحَمْدُ لِلَّـهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ ٧٥

  • అల్లాహ్‌ ఒక ఉపమానం ఇచ్చాడు: ఒకడు బానిసగా ఇతరుని యాజమాన్యంలో ఉన్నవాడు. అతడు ఏ విధమైన అధికారం లేనివాడు, మరొకడు మా నుండి మంచి జీవనోపాధి పొందినవాడు. అతడు దానిలో నుండి రహస్యంగాను మరియు బహిరంగంగాను ఖర్చుచేయగలవాడు. ఏమీ? వీరిద్దరు సమానులవుతారా? సర్వ స్తోత్రాలకు అర్హుడు కేవలం అల్లాహ్‌ మాత్రమే! కానీ, చాలా మందికి ఇది తెలియదు.

16:76 – وَضَرَبَ اللَّـهُ مَثَلًا رَّجُلَيْنِ أَحَدُهُمَا أَبْكَمُ لَا يَقْدِرُ عَلَىٰ شَيْءٍ وَهُوَ كَلٌّ عَلَىٰ مَوْلَاهُ أَيْنَمَا يُوَجِّههُّ لَا يَأْتِ بِخَيْرٍ ۖ هَلْ يَسْتَوِي هُوَ وَمَن يَأْمُرُ بِالْعَدْلِ ۙ وَهُوَ عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ٧٦

అల్లాహ్‌ ఇద్దరు పురుషుల, మరొక ఉపమానం ఇచ్చాడు: వారిలో ఒకడు మూగవాడు, అతడు ఏమీ చేయలేడు, అతడు తన యజమానికి భారమై ఉన్నాడు. అతనిని ఎక్కడికి పంపినా మేలైనపని చేయలేడు. ఏమీ? ఇటువంటి వాడు మరొకనితో – ఎవడైతే న్యాయాన్ని పాటిస్తూ, ఋజుమార్గంపై నడుస్తున్నాడో – సమానుడు కాగలడా? 37

16:77 – وَلِلَّـهِ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَمَا أَمْرُ السَّاعَةِ إِلَّا كَلَمْحِ الْبَصَرِ أَوْ هُوَ أَقْرَبُ ۚ إِنَّ اللَّـهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٧٧

మరియు ఆకాశాలలోనూ మరియు భూమి లోనూ ఉన్న అగోచర విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్‌ కు మాత్రమే ఉంది. అంతిమ గడియ కేవలం రెప్పపాటు కాలంలో లేదా అంతకు ముందే సంభవించ వచ్చు! నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.

16:78 – وَاللَّـهُ أَخْرَجَكُم مِّن بُطُونِ أُمَّهَاتِكُمْ لَا تَعْلَمُونَ شَيْئًا وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۙ لَعَلَّكُمْ تَشْكُرُونَ ٧٨

మరియు అల్లాహ్‌, మిమ్మల్ని మీతల్లుల గర్భాల నుండి, బయటికితీశాడు (పుట్టించాడు) అప్పుడు మీకేమీ తెలియదు. మరియు మీకు వినికిడినీ, దృష్టినీ మరియు హృదయాలను ప్రసాదించాడు. బహుశా మీరు కృతజ్ఞులై ఉంటారని. 38

16:79 – أَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ مُسَخَّرَاتٍ فِي جَوِّ السَّمَاءِ مَا يُمْسِكُهُنَّ إِلَّا اللَّـهُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ ٧٩

ఏమీ? వారు పక్షులను ఆకాశం మధ్యలో తాటస్థ్య్థస్థ్తితిలో(పడిపోకుండా) ఎగురుతూ ఉండేది, గమనించడం లేదా? వాటిని అల్లాహ్‌ తప్ప ఇతరు లెవ్వరూ (ఆకాశంలో) నిలుపలేరు. నిశ్చయంగా ఇందులో విశ్వసించేవారికి సూచనలు ఉన్నాయి.

16:80 – وَاللَّـهُ جَعَلَ لَكُم مِّن بُيُوتِكُمْ سَكَنًا وَجَعَلَ لَكُم مِّن جُلُودِ الْأَنْعَامِ بُيُوتًا تَسْتَخِفُّونَهَا يَوْمَ ظَعْنِكُمْ وَيَوْمَ إِقَامَتِكُمْ ۙ وَمِنْ أَصْوَافِهَا وَأَوْبَارِهَا وَأَشْعَارِهَا أَثَاثًا وَمَتَاعًا إِلَىٰ حِينٍ ٨٠

మరియు అల్లాహ్‌ మీకు, మీ గృహాలలో నివాసం ఏర్పరిచాడు. మరియు పశువుల చర్మాలతో మీకు ఇండ్లు (గుడారాలు) నిర్మించాడు. అవి మీకు ప్రయాణంలో ఉన్నప్పుడు మరియు మీరు బసచేసి నప్పుడు, చాలా తేలికగా ఉంటాయి. వాటి ఉన్నితో, బొచ్చుగల చర్మాలతో మరియు వెంట్రుకలతో గృహోపకరణ సామాగ్రి మరియు కొంతకాలం సుఖంగా గడుపుకునే వస్తువులను (మీ కొరకు సృష్టించాడు).

16:81 – وَاللَّـهُ جَعَلَ لَكُم مِّمَّا خَلَقَ ظِلَالًا وَجَعَلَ لَكُم مِّنَ الْجِبَالِ أَكْنَانًا وَجَعَلَ لَكُمْ سَرَابِيلَ تَقِيكُمُ الْحَرَّ وَسَرَابِيلَ تَقِيكُم بَأْسَكُمْ ۚ كَذَٰلِكَ يُتِمُّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تُسْلِمُونَ ٨١

మరియు అల్లాహ్‌ తాను సృష్టించిన వస్తువు లలో కొన్నింటిని నీడకొరకునియమించాడు మరియు పర్వతాలలో మీకు రక్షణా స్థలాలను ఏర్పర చాడు. మరియు మీరు వేడినుండి కాపాడుకోవ టానికి వస్త్రాలను మరియు యుధ్ధంనుండి కాపాడు కోవటానికి కవచాలను ఇచ్చాడు. మీరు ఆయనకు విధేయులై ఉండాలని, ఈ విధంగా ఆయన మీపై తన అనుగ్రహాలను పూర్తిచేస్తున్నాడు.

16:82 – فَإِن تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ الْمُبِينُ ٨٢

(ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు వెనుదిరిగితే, నీ కర్తవ్యం కేవలం సందేశాన్ని స్పష్టంగా అందజేయటం మాత్రమే!

16:83 – يَعْرِفُونَ نِعْمَتَ اللَّـهِ ثُمَّ يُنكِرُونَهَا وَأَكْثَرُهُمُ الْكَافِرُونَ ٨٣

వారు అల్లాహ్‌ ఉపకారాన్ని గుర్తించిన తరువాత దానిని నిరాకరిస్తున్నారు మరియు వారిలో చాలా మంది సత్యతిరస్కారులే!

16:84 – وَيَوْمَ نَبْعَثُ مِن كُلِّ أُمَّةٍ شَهِيدًا ثُمَّ لَا يُؤْذَنُ لِلَّذِينَ كَفَرُوا وَلَا هُمْ يُسْتَعْتَبُونَ ٨٤

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని లేపి నిలబెడ్తాము. అప్పుడు సత్య-తిరస్కారులకు ఏ విధమైన (సాకులు చెప్పటానికి) అనుమతి ఇవ్వబడదు 39 మరియు వారికి పశ్చాత్తాపపడే అవకాశం కూడా ఇవ్వబడదు.

16:85 – وَإِذَا رَأَى الَّذِينَ ظَلَمُوا الْعَذَابَ فَلَا يُخَفَّفُ عَنْهُمْ وَلَا هُمْ يُنظَرُونَ ٨٥

మరియు దుర్మార్గులు ఆ శిక్షను చూసినప్పుడు, అది వారి కొరకు తగ్గించడం జరుగదు మరియు వారికెలాంటి వ్యవధి కూడా ఇవ్వబడదు. 40

16:86 – وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ قَالُوا رَبَّنَا هَـٰؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِن دُونِكَ ۖ فَأَلْقَوْا إِلَيْهِمُ الْقَوْلَ إِنَّكُمْ لَكَاذِبُونَ ٨٦

మరియు (అల్లాహ్‌కు) సాటి కల్పించిన వారు, తాము సాటిగా నిలిపిన వారిని చూసి అంటారు: ”ఓ మా ప్రభూ! వీరే మేము నీకు సాటి కల్పించి, నీకు బదులుగా ఆరాధించినవారు.” కాని (సాటిగా నిలుపబడిన) వారు సాటి కల్పించిన వారి మాటలను వారి వైపుకే విసురుతూ అంటారు: ”నిశ్చయంగా, మీరు అసత్య వాదులు.” 41

16:87 – وَأَلْقَوْا إِلَى اللَّـهِ يَوْمَئِذٍ السَّلَمَ ۖ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ ٨٧

మరియు ఆ రోజు (అందరూ) వినమ్రులై తమను తాము అల్లాహ్‌కు అప్పగించుకుంటారు. వారు కల్పించినవి (దైవాలు) వారిని త్యజించి ఉంటాయి.

16:88 – الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّـهِ زِدْنَاهُمْ عَذَابًا فَوْقَ الْعَذَابِ بِمَا كَانُوا يُفْسِدُونَ ٨٨

ఎవరైతే సత్యాన్ని తిరస్కరించి (ప్రజలను) అల్లాహ్‌ మార్గం నుండి నిరోధించారో, వారికి మేము వారు చేస్తూఉండిన దౌర్జన్యాలకు, శిక్ష మీద శిక్ష విధిస్తాము. 42

16:89 – وَيَوْمَ نَبْعَثُ فِي كُلِّ أُمَّةٍ شَهِيدًا عَلَيْهِم مِّنْ أَنفُسِهِمْ ۖ وَجِئْنَا بِكَ شَهِيدًا عَلَىٰ هَـٰؤُلَاءِ ۚ وَنَزَّلْنَا عَلَيْكَ الْكِتَابَ تِبْيَانًا لِّكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ ٨٩

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుండి వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చే వానిని (ప్రవక్తను) లేపి నిలబెడ్తాము. మరియు (ఓ ప్రవక్తా!) మేము నిన్ను వీరికి వ్యతి రేకంగా సాక్ష్యమివ్వటానికి తీసుకువస్తాము 43 ప్రతి విషయాన్ని స్పష్టపరచటానికి నీపై ఈ దివ్యగ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు ఇందులో అల్లాహ్‌కు విధేయులు (ముస్లింలు) అయినవారికి మార్గదర్శకత్వం, కారుణ్యం మరియు శుభవార్తలూ ఉన్నాయి. (3/4)

16:90 – إِنَّ اللَّـهَ يَأْمُرُ بِالْعَدْلِ وَالْإِحْسَانِ وَإِيتَاءِ ذِي الْقُرْبَىٰ وَيَنْهَىٰ عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ وَالْبَغْيِ ۚ يَعِظُكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُونَ ٩٠

  • నిశ్చయంగా, అల్లాహ్‌ న్యాయం చేయ మని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. 44 ఆయన ఈ విధంగా మీకు బోధిస్తున్నాడు, బహుశా మీరు హితబోధ గ్రహిస్తారని.

16:91 – وَأَوْفُوا بِعَهْدِ اللَّـهِ إِذَا عَاهَدتُّمْ وَلَا تَنقُضُوا الْأَيْمَانَ بَعْدَ تَوْكِيدِهَا وَقَدْ جَعَلْتُمُ اللَّـهَ عَلَيْكُمْ كَفِيلًا ۚ إِنَّ اللَّـهَ يَعْلَمُ مَا تَفْعَلُونَ ٩١

మరియు మీరు అల్లాహ్‌ పేరుతో వాగ్దానం చేస్తే మీ వాగ్దానాలను తప్పక నెరవేర్చండి. మరియు మీరు ప్రమాణాలను దృఢపరచిన తర్వాత భంగపరచకండి. 45 (ఎందుకంటే) వాస్తవానికి, మీరు అల్లాహ్‌ను మీకు జామీను దారుగా 46 చేసుకున్నారు. నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.

16:92 – وَلَا تَكُونُوا كَالَّتِي نَقَضَتْ غَزْلَهَا مِن بَعْدِ قُوَّةٍ أَنكَاثًا تَتَّخِذُونَ أَيْمَانَكُمْ دَخَلًا بَيْنَكُمْ أَن تَكُونَ أُمَّةٌ هِيَ أَرْبَىٰ مِنْ أُمَّةٍ ۚ إِنَّمَا يَبْلُوكُمُ اللَّـهُ بِهِ ۚ وَلَيُبَيِّنَنَّ لَكُمْ يَوْمَ الْقِيَامَةِ مَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ ٩٢

మరియు మీరు ఆ స్త్రీ వలె కాకండి, ఏ స్త్రీ అయితే స్వయంగా కష్టపడి నూలువడికి గట్టి దారాన్ని చేసిన తరువాత దాన్ని ముక్కలు ముక్కలగా త్రెంచివేసిందో! ఒక వర్గంవారు మరొక వర్గంవారి కంటే అధికంగా ఉన్నారని, పరస్పరం మోసగించుకోవటానికి, మీ ప్రమాణాలను ఉపయో గించుకోకండి. నిశ్చయంగా అల్లాహ్‌ మిమ్మల్ని వీటి (ఈ ప్రమాణాల) ద్వారా పరీక్షిస్తున్నాడు. మరియు నిశ్చయంగా, పునరుత్థానదినమున ఆయన మీకు, మీరు వాదులాడే విషయాలను గురించి స్పష్టంగా తెలియజేస్తాడు.

16:93 – وَلَوْ شَاءَ اللَّـهُ لَجَعَلَكُمْ أُمَّةً وَاحِدَةً وَلَـٰكِن يُضِلُّ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ ۚ وَلَتُسْأَلُنَّ عَمَّا كُنتُمْ تَعْمَلُونَ ٩٣

ఒకవేళ అల్లాహ్‌ కోరితే మిమ్మల్ని అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురిచేస్తాడు. మరియు తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. 47 మరియు నిశ్చయంగా, మీరు చేస్తున్న కర్మలను గురించి మీరు తప్పక ప్రశ్నించబడతారు.

16:94 – وَلَا تَتَّخِذُوا أَيْمَانَكُمْ دَخَلًا بَيْنَكُمْ فَتَزِلَّ قَدَمٌ بَعْدَ ثُبُوتِهَا وَتَذُوقُوا السُّوءَ بِمَا صَدَدتُّمْ عَن سَبِيلِ اللَّـهِ ۖ وَلَكُمْ عَذَابٌ عَظِيمٌ ٩٤

మరియు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకోవటానికి ఉపయోగించుకోకండి. అలా చేస్తే స్థిరపడిన పాదాలు జారిపోవచ్చు మరియు మీరు అల్లాహ్‌ మార్గం నుండి ప్రజలను నిరోధించిన పాపఫలితాన్ని రుచిచూడగలరు. 48 మరియు మీకు ఘోరమైన శిక్ష పడగలదు.

16:95 – وَلَا تَشْتَرُوا بِعَهْدِ اللَّـهِ ثَمَنًا قَلِيلًا ۚ إِنَّمَا عِندَ اللَّـهِ هُوَ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ ٩٥

మరియు మీరు అల్లాహ్‌తో చేసిన వాగ్దానాన్ని స్వల్పలాభానికి అమ్ముకోకండి. మీరు తెలుసుకో గలిగితే, నిశ్చయంగా, అల్లాహ్‌ వద్ద ఉన్నదే మీకు ఎంతో మేలైనది.

16:96 – مَا عِندَكُمْ يَنفَدُ ۖ وَمَا عِندَ اللَّـهِ بَاقٍ ۗ وَلَنَجْزِيَنَّ الَّذِينَ صَبَرُوا أَجْرَهُم بِأَحْسَنِ مَا كَانُوا يَعْمَلُونَ ٩٦

మీ దగ్గర ఉన్నదంతా నశించేదే. మరియు అల్లాహ్‌ వద్ద ఉన్నదే (శాశ్వతంగా) మిగిలేది! మరియు మేము సహనం వహించేవారికి, వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.

16:97 – مَنْ عَمِلَ صَالِحًا مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَلَنُحْيِيَنَّهُ حَيَاةً طَيِّبَةً ۖ وَلَنَجْزِيَنَّهُمْ أَجْرَهُم بِأَحْسَنِ مَا كَانُوا يَعْمَلُونَ ٩٧

ఏ పురుషుడూగానీ, లేక స్త్రీగానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. 49 మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.

16:98 – فَإِذَا قَرَأْتَ الْقُرْآنَ فَاسْتَعِذْ بِاللَّـهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ ٩٨

కావున నీవు ఖుర్‌ఆన్‌ పఠించబోయే టప్పుడు శపించబడిన (బహిష్కరించబడిన) షై’తాన్‌ నుండి (రక్షణ పొందటానికి) అల్లాహ్‌ శరణు వేడుకో! 50

16:99 – إِنَّهُ لَيْسَ لَهُ سُلْطَانٌ عَلَى الَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ ٩٩

విశ్వసించి, తమ ప్రభువును నమ్ముకున్న వారిపై నిశ్చయంగా, వాడికి ఎలాంటి అధికారం ఉండదు.

16:100 – إِنَّمَا سُلْطَانُهُ عَلَى الَّذِينَ يَتَوَلَّوْنَهُ وَالَّذِينَ هُم بِهِ مُشْرِكُونَ ١٠٠

కాని! నిశ్చయంగా వాడి (షై’తాన్‌) వైపుకు మరలి వాడిని అనుసరించే (స్నేహంచేసుకునే) వారిపై 51 మరియు ఆయనకు (అల్లాహ్‌కు) సాటి కల్పించే వారిపై, వాడికి అధికారం ఉంటుంది.

16:101 – وَإِذَا بَدَّلْنَا آيَةً مَّكَانَ آيَةٍ ۙ وَاللَّـهُ أَعْلَمُ بِمَا يُنَزِّلُ قَالُوا إِنَّمَا أَنتَ مُفْتَرٍ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ ١٠١

మరియు మేము ఒక సందేశాన్ని (ఆయత్‌ ను) మార్చి దాని స్థానంలో మరొక సందేశాన్ని అవతరింపజేసినప్పుడు; 52 తాను దేన్ని ఎప్పుడు అవతరింపజేశాడో అల్లాహ్‌కు బాగా తెలుసు. (అయినా) వారు (సత్య-తిరస్కారులు) ఇలా అంటారు: ”నిశ్చయంగా నీవే (ఓ ము’హమ్మద్‌!) దీనిని కల్పించేవాడవు.” అసలు వారిలో చాలా మంది (యథార్థం) తెలుసుకోలేరు.

16:102 – قُلْ نَزَّلَهُ رُوحُ الْقُدُسِ مِن رَّبِّكَ بِالْحَقِّ لِيُثَبِّتَ الَّذِينَ آمَنُوا وَهُدًى وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ ١٠٢

వారితో అను: ”దీనిని (ఈ ఖుర్‌ఆన్‌ను) నీ ప్రభువు వద్ద నుండి సత్యంతో, విశ్వాసులను (విశ్వాసంలో) పటిష్టం చేయటానికి మరియు (అల్లాహ్‌కు) సంపూర్ణంగా విధేయులుగా ఉన్న వారికి (ముస్లింలకు) సన్మార్గం చూపటానికి మరియు శుభవార్త అందజేయటానికి, పరిశుద్ధాత్మ (జిబ్రీల్) 53 క్రమక్రమంగా ఉన్నది ఉన్నట్లుగా తీసుకొనివచ్చాడు.”

16:103 – وَلَقَدْ نَعْلَمُ أَنَّهُمْ يَقُولُونَ إِنَّمَا يُعَلِّمُهُ بَشَرٌ ۗ لِّسَانُ الَّذِي يُلْحِدُونَ إِلَيْهِ أَعْجَمِيٌّ وَهَـٰذَا لِسَانٌ عَرَبِيٌّ مُّبِينٌ ١٠٣

మరియు: ”నిశ్చయంగా, ఇతనికి ఒక మనిషి నేర్పుతున్నాడు.” 54 అని, వారు అనే విషయం మాకు బాగా తెలుసు. వారు సూచించే (అపార్థం చేసే) వ్యక్తి భాష పరాయి భాష. కాని ఈ (ఖుర్‌ఆన్‌) భాష స్వచ్ఛమైన ‘అరబ్బీ భాష. 55

16:104 – إِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِآيَاتِ اللَّـهِ لَا يَهْدِيهِمُ اللَّـهُ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ١٠٤

నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్‌ సందేశాలను (ఆయాత్‌ లను) విశ్వసించరో! వారికి అల్లాహ్‌ సన్మార్గం చూపడు మరియు వారికి బాధాకర మైనశిక్ష ఉంటుంది.

16:105 – إِنَّمَا يَفْتَرِي الْكَذِبَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِآيَاتِ اللَّـهِ ۖ وَأُولَـٰئِكَ هُمُ الْكَاذِبُونَ ١٠٥

నిశ్చయంగా, అల్లాహ్‌ సూచనలను (ఆయాత్ లను) విశ్వసించని వారు, అబద్ధాలను కల్పిస్తున్నారు. మరియు అలాంటి వారు! వారే, అసత్యవాదులు.

16:106 – مَن كَفَرَ بِاللَّـهِ مِن بَعْدِ إِيمَانِهِ إِلَّا مَنْ أُكْرِهَ وَقَلْبُهُ مُطْمَئِنٌّ بِالْإِيمَانِ وَلَـٰكِن مَّن شَرَحَ بِالْكُفْرِ صَدْرًا فَعَلَيْهِمْ غَضَبٌ مِّنَ اللَّـهِ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ ١٠٦

ఎవడైతే విశ్వసించిన తరువాత, అల్లాహ్‌ను తిరస్కరిస్తాడో – తన హృదయం సంతృప్తికరమైన విశ్వాసంతో నిండి ఉండి, బలవంతంగా తిరస్కరించేవాడు తప్ప 56 మరియు ఎవరైతే హృదయపూర్వకంగా సత్య- తిరస్కారానికి పాల్పడుతారో, అలాంటి వారిపై అల్లాహ్‌ ఆగ్రహం (దూషణ) విరుచుకు పడుతుంది. మరియు వారి కొరకు ఘోరమైన శిక్ష ఉంటుంది.

16:107 – ذَٰلِكَ بِأَنَّهُمُ اسْتَحَبُّوا الْحَيَاةَ الدُّنْيَا عَلَى الْآخِرَةِ وَأَنَّ اللَّـهَ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ ١٠٧

ఇది ఎందుకంటే! నిశ్చయంగా, వారు పరలోక జీవితంకంటే ఇహలోక జీవితాన్నే ఎక్కువగా ప్రేమించటం మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ సత్య-తిరస్కారులకు సన్మార్గం చూపడు.

16:108 – أُولَـٰئِكَ الَّذِينَ طَبَعَ اللَّـهُ عَلَىٰ قُلُوبِهِمْ وَسَمْعِهِمْ وَأَبْصَارِهِمْ ۖ وَأُولَـٰئِكَ هُمُ الْغَافِلُونَ ١٠٨

ఇలాంటి వారి హృదయాల మీదా, చెవుల మీదా మరియు కన్నుల మీదా అల్లాహ్‌ ముద్ర వేసి ఉన్నాడు. 57 మరియు ఇలాంటి వారే నిర్లక్ష్యంలో మునిగి ఉన్నవారు!

16:109 – لَا جَرَمَ أَنَّهُمْ فِي الْآخِرَةِ هُمُ الْخَاسِرُونَ ١٠٩

నిశ్చయంగా, పరలోకంలో నష్టానికి గురి కాగలవారు వీరే, అని అనటంలో ఎలాంటి సందేహం లేదు.

16:110 – ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ هَاجَرُوا مِن بَعْدِ مَا فُتِنُوا ثُمَّ جَاهَدُوا وَصَبَرُوا إِنَّ رَبَّكَ مِن بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ ١١٠

ఇక నిశ్చయంగా, నీ ప్రభువు! వారి కొరకు, ఎవరైతే మొదట పరీక్షకు గురిచేయబడి, పిదప (తమ ఇల్లూ వాకిలి విడిచి) వలసపోయి, తరువాత ధర్మపోరాటంలో పాల్గొంటారో మరియు సహనం వహిస్తారో! 58 దాని తరువాత నిశ్చయంగా, అలాంటివారి కొరకు నీ ప్రభువు! ఎంతో క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. (7/8)

16:111 – يَوْمَ تَأْتِي كُلُّ نَفْسٍ تُجَادِلُ عَن نَّفْسِهَا وَتُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَهُمْ لَا يُظْلَمُونَ ١١١

  • ఆ దినమును (జ్ఞాపకముంచుకోండి), ఎప్పుడైతే ప్రతిప్రాణి కేవలం తనస్వంతం కొరకే బ్రతిమాలుకుంటుందో! 59 ప్రతి ప్రాణికి దాని కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరియు వారి కెలాంటి అన్యాయం జరుగదు. 60

16:112 – وَضَرَبَ اللَّـهُ مَثَلًا قَرْيَةً كَانَتْ آمِنَةً مُّطْمَئِنَّةً يَأْتِيهَا رِزْقُهَا رَغَدًا مِّن كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِأَنْعُمِ اللَّـهِ فَأَذَاقَهَا اللَّـهُ لِبَاسَ الْجُوعِ وَالْخَوْفِ بِمَا كَانُوا يَصْنَعُونَ ١١٢

మరియు అల్లాహ్‌ ఒక నగరపు ఉపమానం ఇస్తున్నాడు: మొదట అది (ఆ నగరం) శాంతి భద్రతలతో నిండిఉండేది. దానికి (దాని ప్రజలకు) ప్రతిదిక్కునుండి జీవనోపాధి పుష్కలంగా లభిస్తూ ఉండేది. తరువాత (ఆ నగరం) వారు అల్లాహ్‌ అనుగ్రహాలను తిరస్కరించారు (కృతఘ్ను లయ్యారు), కావున అల్లాహ్‌ వారి చర్యలకు బదులుగా వారికి ఆకలీ, భయమూ వంటి ఆపదల రుచి చూపించాడు.

16:113 – وَلَقَدْ جَاءَهُمْ رَسُولٌ مِّنْهُمْ فَكَذَّبُوهُ فَأَخَذَهُمُ الْعَذَابُ وَهُمْ ظَالِمُونَ ١١٣

మరియు వాస్తవంగా వారి వద్దకు వారి (జాతి) నుండి ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు, కాని వారు అతనిని అసత్యవాదుడవని తిరస్క రించారు. కావున వారు దుర్మార్గంలో మునిగి ఉన్నప్పుడు వారిని శిక్ష పట్టుకున్నది.

16:114 – فَكُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّـهُ حَلَالًا طَيِّبًا وَاشْكُرُوا نِعْمَتَ اللَّـهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ ١١٤

కావున మీరు అల్లాహ్‌నే ఆరాధించేవారైతే, ఆయన మీ కొరకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన, పరిశుధ్ధమైన ఆహారాలనే తినండి మరియు అల్లాహ్‌ అనుగ్రహాలకు కృతజ్ఞతలు చూపండి.

16:115 – إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنزِيرِ وَمَا أُهِلَّ لِغَيْرِ اللَّـهِ بِهِ ۖ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَإِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١١٥

నిశ్చయంగా, ఆయన మీ కొరకు (దానంతట అది) చచ్చినది (పశువు / పక్షి) రక్తం, పందిమాంసం, అల్లాహ్‌ తప్ప ఇతరుల కొరకు (ఇతరుల పేర) జి’బ’హ్‌ చేయబడినది (పశువు / పక్షి మాంసాన్ని) నిషేధించి ఉన్నాడు. కాని ఎవడైనా (అల్లాహ్‌) నియమాలను ఉల్లఘించే ఉద్దేశంతో కాక, (ఆకలికి) తాళలేక, గత్యంతరం లేని పరిస్థితిలో (తింటే); నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. 61

16:116 – وَلَا تَقُولُوا لِمَا تَصِفُ أَلْسِنَتُكُمُ الْكَذِبَ هَـٰذَا حَلَالٌ وَهَـٰذَا حَرَامٌ لِّتَفْتَرُوا عَلَى اللَّـهِ الْكَذِبَ ۚ إِنَّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللَّـهِ الْكَذِبَ لَا يُفْلِحُونَ ١١٦

అల్లాహ్‌ మీద అబద్ధాలుకల్పిస్తూ: ”ఇది ధర్మసమ్మతం, ఇది నిషిధ్ధం.” అని మీ నోటి కొచ్చినట్లు (మనస్సులకు తోచినట్లు) అబద్ధాలు పలకకండి. నిశ్చయంగా, అల్లాహ్‌పై అబద్ధాలు కల్పించేవారు ఎన్నడూ సాఫల్యం పొందరు.

16:117 – مَتَاعٌ قَلِيلٌ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ١١٧

దీనితో కొంతవరకు సుఖసంతోషాలు కలుగవచ్చు, కాని వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

16:118 – وَعَلَى الَّذِينَ هَادُوا حَرَّمْنَا مَا قَصَصْنَا عَلَيْكَ مِن قَبْلُ ۖ وَمَا ظَلَمْنَاهُمْ وَلَـٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ ١١٨

మరియు మేము నీకు ప్రస్తావించిన వాటిని, ఇంతకు ముందు యూదులకు నిషేధించాము. మరియు మేము వారికి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తామే అన్యాయం చేసుకుంటూ ఉండేవారు. 62

16:119 – ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ عَمِلُوا السُّوءَ بِجَهَالَةٍ ثُمَّ تَابُوا مِن بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوا إِنَّ رَبَّكَ مِن بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ ١١٩

అయితే నిశ్చయంగా, నీ ప్రభువు – ఎవరైతే అజ్ఞానంలో పాపాలుచేసి, ఆ పిదప పశ్చాత్తాపపడి, సరిదిద్దుకుంటారో – దాని (ఆ పశ్చాత్తాపం) తరువాత (వారిని క్షమిస్తాడు); నిశ్చయంగా, నీ ప్రభువు క్షమించేవాడు, అపార కరుణాప్రదాత.

16:120 – إِنَّ إِبْرَاهِيمَ كَانَ أُمَّةً قَانِتًا لِّلَّـهِ حَنِيفًا وَلَمْ يَكُ مِنَ الْمُشْرِكِينَ ١٢٠

నిశ్చయంగా, ఇబ్రాహీమ్‌ (ఒక్కడే) అల్లాహ్‌కు భక్తిపరుడై, ఏకదైవ సిధ్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) స్థాపించటంలో తనకుతానే ఒక సమాజమై ఉండెను. 63 అతను అల్లాహ్‌కు సాటి కల్పించేవారిలో ఎన్నడూ చేరలేదు.

16:121 – شَاكِرًا لِّأَنْعُمِهِ ۚ اجْتَبَاهُ وَهَدَاهُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ١٢١

ఆయన (అల్లాహ్‌) యొక్క అనుగ్రహాలకు కృతజ్ఞుడై ఉండేవాడు. ఆయన (అల్లాహ్‌) అతనిని (తన స్నేహితునిగా) ఎన్నుకొని, అతనికి ఋజు మార్గం వైపుకు మార్గదర్శకత్వం చేశాడు.

16:122 – وَآتَيْنَاهُ فِي الدُّنْيَا حَسَنَةً ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ ١٢٢

మేము అతనికి ఇహలోకంలో మంచి స్థితిని ప్రసాదించాము. మరియు నిశ్చయంగా, అతను పరలోకంలో సద్వర్తనులతో పాటు ఉంటాడు.

16:123 – ثُمَّ أَوْحَيْنَا إِلَيْكَ أَنِ اتَّبِعْ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۖ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ ١٢٣

తరువాత మేము నీకు (ఓ ము’హమ్మద్!) ఈ సందేశాన్ని పంపాము: ”నీవు ఇబ్రాహీమ్‌ అనుసరించిన, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్య ధర్మాన్ని) అనుసరించు. అతను (ఇబ్రాహీమ్‌) అల్లాహ్‌కు సాటి కల్పించే వారిలోనివాడు కాడు.”

16:124 – إِنَّمَا جُعِلَ السَّبْتُ عَلَى الَّذِينَ اخْتَلَفُوا فِيهِ ۚ وَإِنَّ رَبَّكَ لَيَحْكُمُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ ١٢٤

వాస్తవానికి, శనివార శాసనం (సబ్త్‌) విషయంలో అభిప్రాయభేదాలు కలిగి ఉన్న వారికే అది విధించబడింది. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు! పునరుత్థానదినమున వారి మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను గురించి తీర్పుచేస్తాడు.

16:125 – ادْعُ إِلَىٰ سَبِيلِ رَبِّكَ بِالْحِكْمَةِ وَالْمَوْعِظَةِ الْحَسَنَةِ ۖ وَجَادِلْهُم بِالَّتِي هِيَ أَحْسَنُ ۚ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ ۖ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ ١٢٥

(ప్రజలను) వివేకంతోనూ, మంచి ఉపదేశం (ప్రచారం) తోనూ నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు. మరియు వారితో ఉత్తమ రీతిలో వాదించు 64 నిశ్చయంగా, నీ ప్రభువుకు తన మార్గం నుండి భ్రష్టుడైనవాడెవడో తెలుసు. మరియు మార్గదర్శకత్వం పొందినవాడెవడో కూడా ఆయనకు బాగా తెలుసు

16:126 – وَإِنْ عَاقَبْتُمْ فَعَاقِبُوا بِمِثْلِ مَا عُوقِبْتُم بِهِ ۖ وَلَئِن صَبَرْتُمْ لَهُوَ خَيْرٌ لِّلصَّابِرِينَ ١٢٦

మరియు మీరు (మీ ప్రత్యర్థులను) శిక్షించ దలచుకుంటే, మీకు జరిగిన దానికి (అన్యాయానికి) సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వండి. కాని మీరు సహనంవహిస్తే నిశ్చయంగా, సహనం వహించేవారికి ఎంతో మేలు కలుగుతుంది.

16:127 – وَاصْبِرْ وَمَا صَبْرُكَ إِلَّا بِاللَّـهِ ۚ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَلَا تَكُ فِي ضَيْقٍ مِّمَّا يَمْكُرُونَ ١٢٧

(ఓ ము’హమ్మద్‌!) నీవు సహనం వహించు మరియు నీకు సహనమిచ్చేవాడు కేవలం అల్లాహ్‌ మాత్రమే. మరియు వారిని గురించి దుఃఖపడకు మరియు వారు పన్నే కుట్రలకు నీవు వ్యాకులపడకు.

16:128 – إِنَّ اللَّـهَ مَعَ الَّذِينَ اتَّقَوا وَّالَّذِينَ هُم مُّحْسِنُونَ ١٢٨

నిశ్చయంగా, అల్లాహ్‌ భయభక్తులు గల వారితో మరియు సజ్జనులైన వారితో పాటు ఉంటాడు.

— – సూరహ్‌ అల్‌-ఇస్రా’ – ఇస్రాయీల్‌ సంతతివారి విషయం 2-8 మరియు 101-104 ఆయత్‌లలో వచ్చినందుకు కొందరు దీనిని సూరహ్‌ బనీ-ఇస్రాయీ’ల్‌ అని కూడా అంటారు. ఇస్రా’ – రాత్రి ప్రయాణం, అంటే దైవప్రవక్త ము’హమ్మద్‌ (‘స’అస)ను మక్కహ్ ముకర్రమహ్ నుండి బైతుల్‌-మఖ్దిస్‌కు తీసుకు పోబడిన రాత్రి ప్రయాణం. ‘స. బు’ఖారీలో, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌-మస్‌’ఊద్‌ (ర’ది.’అ.) కథనం ప్రకారం సూరాహ్‌లు అల్‌-కహఫ్ (18), మర్యమ్‌ (19) మరియు ఇస్రా’లు (17) మొట్టమొదట అవతరింపజేయబడిన మక్కహ్ సూరాహ్‌లలోనివి. ‘ఆయి’షహ్‌ (ర. అన్హా) కథనం: ‘దైవప్రవక్త (‘స’అస) ఈ సూరహ్‌ (17) మరియు సూరహ్‌ అ’జ్‌-‘జుమర్‌ (39)లను ప్రతిరాత్రి నమా’జ్‌లో చదివే వారు.’ (తిర్మిజీ’, 292, 3405; నసాయీ’; ఇబ్నె-‘హంబల్‌ – అల్బానీ ప్రమాణీకం, పు. 2, ‘హ. నం. 641). 111 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటిఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ – 17:1 – سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْبَصِيرُ ١

[(*)] తన దాసుణ్ణి (ము’హమ్మద్‌ను), మస్జిద్‌ అల్‌-‘హరామ్‌ (మక్కహ్ ముకర్రమహ్) నుండి పరిసరాలను శుభవంతం చేసిన మస్జిద్‌ అల్‌-అ’ఖ్సా (బైతుల్‌-మఖ్ది’స్‌) వరకు రాత్రివేళ తీసుకొని పోయిన ఆయన (అల్లాహ్‌) సర్వ లోపాలకు అతీతుడు. ఇది మేము అతనికి మా కొన్ని నిదర్శనాలను (ఆయాత్‌లను) చూప టానికి చేశాము. 1 నిశ్చయంగా ఆయన సర్వం నిశ్చయంగా ఆయన సర్వం

17:2 – وَآتَيْنَا مُوسَى الْكِتَابَ وَجَعَلْنَاهُ هُدًى لِّبَنِي إِسْرَائِيلَ أَلَّا تَتَّخِذُوا مِن دُونِي وَكِيلً ٢

మరియు మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము. 2 మరియు దానిని ఇస్రాయీ’ల్‌ సంతతి వారికి మార్గదర్శినిగా చేసి, దాని ద్వారా ఇలా ఆజ్ఞాపించాము: ”నన్ను (అల్లాహ్‌ను) తప్ప మరెవ్వరినీ సంరక్షకునిగా (కార్యసాధకునిగా) చేసుకోవద్దు.

17:3 – ذُرِّيَّةَ مَنْ حَمَلْنَا مَعَ نُوحٍ ۚ إِنَّهُ كَانَ عَبْدًا شَكُورًا ٣

”మేము నూ’హ్‌తో బాటు ఓడలో ఎక్కించిన వారి సంతతివారలారా! నిశ్చయంగా, అతను (నూ’హ్‌) కృతజ్ఞుడైన దాసుడు.”

17:4 – وَقَضَيْنَا إِلَىٰ بَنِي إِسْرَائِيلَ فِي الْكِتَابِ لَتُفْسِدُنَّ فِي الْأَرْضِ مَرَّتَيْنِ وَلَتَعْلُنَّ عُلُوًّا كَبِيرًا ٤

మరియు మేము గ్రంథంలో ఇస్రాయీ’ల్ సంతతివారిని ఇలా హెచ్చరించాము: ”మీరు భువిలో రెండుసార్లు సంక్షోభాన్ని రేకెత్తిస్తారు, మరియు గొప్ప అహంకారాన్ని ప్రదర్శిస్తారు!”

17:5 – فَإِذَا جَاءَ وَعْدُ أُولَاهُمَا بَعَثْنَا عَلَيْكُمْ عِبَادًا لَّنَا أُولِي بَأْسٍ شَدِيدٍ فَجَاسُوا خِلَالَ الدِّيَارِ ۚ وَكَانَ وَعْدًا مَّفْعُولًا ٥

ఇక ఆ రెంటిలో మొదటి వాగ్దానం రాగా మేము మీపై ఘోర యుద్ధనిపుణులైన మా దాసులను పంపాము. 3 వారు మీ గృహాలలోకి దూసుకెళ్ళారు. మరియు ఈ విధంగా మా వాగ్దానం నెరవేర్చబడింది.

17:6 – ثُمَّ رَدَدْنَا لَكُمُ الْكَرَّةَ عَلَيْهِمْ وَأَمْدَدْنَاكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَجَعَلْنَاكُمْ أَكْثَرَ نَفِيرًا ٦

ఆ తరువాత మేము మీకు వారిపై మరల ప్రాబల్యం వహించే అవకాశం కలిగించాము. మరియు సంపదతోనూ మరియు సంతానంతోనూ మీకు సహాయం చేశాము మరియు మీ సంఖ్యాబలాన్ని కూడా పెంచాము.

17:7 – إِنْ أَحْسَنتُمْ أَحْسَنتُمْ لِأَنفُسِكُمْ ۖ وَإِنْ أَسَأْتُمْ فَلَهَا ۚ فَإِذَا جَاءَ وَعْدُ الْآخِرَةِ لِيَسُوءُوا وُجُوهَكُمْ وَلِيَدْخُلُوا الْمَسْجِدَ كَمَا دَخَلُوهُ أَوَّلَ مَرَّةٍ وَلِيُتَبِّرُوا مَا عَلَوْا تَتْبِيرًا ٧

(మరియు మేము అన్నాము): ”ఒకవేళ మీరు మేలుచేస్తే అది మీ స్వయంకొరకే మేలు చేసుకొన్నట్లు. మరియు ఒకవేళ మీరు కీడుచేస్తే అది మీ కొరకే!” పిదప రెండవ వాగ్దానం రాగా మీ ముఖాలను (మిమ్మల్ని) అవమానపరచటానికి, మొదటిసారి వారు మస్జిద్‌ అల్‌-అ’ఖ్సాలో దూరినట్లు, మరల దూరటానికి మరియు వారికి అందిన ప్రతిదానిని నాశనం చేయటానికి (మీ శత్రువులను మీపైకి పంపాము). 4

17:8 – عَسَىٰ رَبُّكُمْ أَن يَرْحَمَكُمْ ۚ وَإِنْ عُدتُّمْ عُدْنَا ۘ وَجَعَلْنَا جَهَنَّمَ لِلْكَافِرِينَ حَصِيرًا ٨

(మరియు తౌరాత్‌లో ఇలా అన్నాము): ”బహుశా మీ ప్రభువు ఇప్పుడు మిమ్మల్ని కరుణించవచ్చు! కాని ఒకవేళ మీరు అలాగే ప్రవర్తిస్తే, మేము కూడా తిరిగి అలాగే చేస్తాము. మేము నరకాగ్నిని, సత్య-తిరస్కారుల కొరకు చెరసాలగా చేసి ఉంచాము.”

17:9 – إِنَّ هَـٰذَا الْقُرْآنَ يَهْدِي لِلَّتِي هِيَ أَقْوَمُ وَيُبَشِّرُ الْمُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا كَبِيرًا ٩

నిశ్చయంగా, ఈ ఖుర్‌ఆన్‌ పూర్తిగా, సరి అయిన (సవ్యమైన) మార్గంవైపునకు మార్గ దర్శకత్వం చేస్తుంది. మరియు సత్కార్యాలు చేస్తూ ఉండే విశ్వాసులకు తప్పక గొప్ప ప్రతిఫల ముందని శుభ వార్తనూ అందజేస్తుంది;

17:10 – وَأَنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ أَعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًا ١٠

మరియు నిశ్చయంగా, పరలోకాన్ని విశ్వసించని వారికి మేము బాధాకరమైన శిక్షను సిధ్ధ పరచి ఉంచామని (తెలియజేస్తుంది).

17:11 – وَيَدْعُ الْإِنسَانُ بِالشَّرِّ دُعَاءَهُ بِالْخَيْرِ ۖ وَكَانَ الْإِنسَانُ عَجُولًا ١١

మరియు మానవుడు (తెలియక తరచుగా) మేలు కొరకు ఎలా అర్థించాలో, కీడు కొరకు కూడా అలాగే అర్థిస్తాడు. మరియు మానవుడు చాలా తొందరపాటు గలవాడు (ఆత్రగాడు).

17:12 – وَجَعَلْنَا اللَّيْلَ وَالنَّهَارَ آيَتَيْنِ ۖ فَمَحَوْنَا آيَةَ اللَّيْلِ وَجَعَلْنَا آيَةَ النَّهَارِ مُبْصِرَةً لِّتَبْتَغُوا فَضْلًا مِّن رَّبِّكُمْ وَلِتَعْلَمُوا عَدَدَ السِّنِينَ وَالْحِسَابَ ۚ وَكُلَّ شَيْءٍ فَصَّلْنَاهُ تَفْصِيلًا ١٢

మరియు మేము రాత్రింబవళ్ళను రెండు సూచనలుగా చేశాము. రాత్రి సూచనను మేము కాంతి హీనం చేశాము. మరియు పగటి సూచనను – మీరు, మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించ టానికి మరియు సంవత్సరాల లెక్కపెట్టటానికి మరియు (కాలాన్ని) గణించటానికి – ప్రకాశవంత మైనదిగా చేశాము. మరియు మేము ప్రతి విషయాన్ని వివరించి స్పష్టంగా తెలిపాము.

17:13 – وَكُلَّ إِنسَانٍ أَلْزَمْنَاهُ طَائِرَهُ فِي عُنُقِهِ ۖ وَنُخْرِجُ لَهُ يَوْمَ الْقِيَامَةِ كِتَابًا يَلْقَاهُ مَنشُورًا ١٣

మరియు మేము ప్రతి మానవుని మెడలో అతని కర్మలను 5 కట్టి ఉంచాము. మరియు పునరుత్థానదినమున అతని (కర్మ) గ్రంథాన్ని అతని ముందు పెడ్తాము, దానిని అతడు స్పష్ట మైనదిగా గ్రహిస్తాడు.

17:14 – اقْرَأْ كِتَابَكَ كَفَىٰ بِنَفْسِكَ الْيَوْمَ عَلَيْكَ حَسِيبًا ١٤

(అతనితో ఇలా అనబడుతుంది): ”నీవు నీ కర్మపత్రాన్ని చదువుకో! ఈ రోజు నీ (కర్మల) లెక్క చూసుకోవటానికి స్వయంగా నీవే చాలు.” 6

17:15 – مَّنِ اهْتَدَىٰ فَإِنَّمَا يَهْتَدِي لِنَفْسِهِ ۖ وَمَن ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيْهَا ۚ وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۗ وَمَا كُنَّا مُعَذِّبِينَ حَتَّىٰ نَبْعَثَ رَسُولً ١٥

ఎవడు సన్మార్గాన్నిఅవలంబిస్తాడో అతడు నిశ్చయంగా, తన మేలుకే సన్మార్గాన్ని అవలం బిస్తాడు. మరియు ఎవడు మార్గభ్రష్టుడవుతాడో, అతడు నిశ్చయంగా, తన నష్టానికే మార్గభ్రష్టుడవు తాడు. మరియు బరువు మోసేవాడెవ్వడూ మరొకని బరువును మోయడు. 7 మరియు మేము ఒక ప్రవక్తను పంపనంత వరకు (ప్రజలకు) శిక్ష విధించేవారము కాము.

17:16 – وَإِذَا أَرَدْنَا أَن نُّهْلِكَ قَرْيَةً أَمَرْنَا مُتْرَفِيهَا فَفَسَقُوا فِيهَا فَحَقَّ عَلَيْهَا الْقَوْلُ فَدَمَّرْنَاهَا تَدْمِيرًا ١٦

మరియు మేము ఒక నగరాన్ని నాశనం చేయదలచుకున్నప్పుడు (మొదట) అందులో ఉన్న స్థితిమంతులకు ఆజ్ఞ పంపుతాము; ఆ పిదపకూడా వారు భ్రష్టాచారానికి పాల్పడితే! అప్పుడు దానిపై (మా) ఆదేశం జారీచేయబడు తుంది అప్పుడు మేము దానిని నాశనం చేస్తాము.

17:17 – وَكَمْ أَهْلَكْنَا مِنَ الْقُرُونِ مِن بَعْدِ نُوحٍ ۗ وَكَفَىٰ بِرَبِّكَ بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا بَصِيرًا ١٧

మరియు మేము నూ’హ్‌ తర్వాత ఎన్నో తరాల వారిని ఈ విధంగా నాశనం చేశాము. మరియు తన దాసుల పాపాలను తెలుసుకోవ టానికి, చూడటానికి నీ ప్రభువే చాలు!

17:18 – مَّن كَانَ يُرِيدُ الْعَاجِلَةَ عَجَّلْنَا لَهُ فِيهَا مَا نَشَاءُ لِمَن نُّرِيدُ ثُمَّ جَعَلْنَا لَهُ جَهَنَّمَ يَصْلَاهَا مَذْمُومًا مَّدْحُورًا ١٨

ఎవడు (ఇహలోక) తాత్కాలిక సుఖాలు కోరుకుంటాడో – మేము కోరినవానికి – దానిలో మాకు ఇష్టం వచ్చినంత, ఒసంగుతాము. తరువాత అతని కొరకు నరకాన్ని నియమిస్తాము, దానిలో అతడు అవమానంతో బహిష్కరించ బడినవాడై దహింపబడతాడు.

17:19 – وَمَنْ أَرَادَ الْآخِرَةَ وَسَعَىٰ لَهَا سَعْيَهَا وَهُوَ مُؤْمِنٌ فَأُولَـٰئِكَ كَانَ سَعْيُهُم مَّشْكُورًا ١٩

మరియు ఎవడు విశ్వాసి అయి, పరలోక (సుఖాన్ని) కోరి దానికై కృషిచేయవలసిన విధంగా కృషిచేస్తాడో, అలాంటివారి కృషి స్వీకరించబడు తుంది.

17:20 – كُلًّا نُّمِدُّ هَـٰؤُلَاءِ وَهَـٰؤُلَاءِ مِنْ عَطَاءِ رَبِّكَ ۚ وَمَا كَانَ عَطَاءُ رَبِّكَ مَحْظُورًا ٢٠

నీ ప్రభువు యొక్క బహుమానాలు వీరికీ మరియు వారికీ అందరికీ స్వేచ్ఛగా ప్రసాదించ బడతాయి. మరియు నీ ప్రభువు యొక్క బహు మానాలు (ఎవ్వరికీ) నిషేధించబడలేదు.

17:21 – انظُرْ كَيْفَ فَضَّلْنَا بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ ۚ وَلَلْآخِرَةُ أَكْبَرُ دَرَجَاتٍ وَأَكْبَرُ تَفْضِيلًا ٢١

చూడండి! మేము కొందరికి మరికొందరిపై ఏ విధంగా ఘనత నొసంగామో! కాని పరలోక (జీవితసుఖ) మే గొప్ప స్థానాలు గలది మరియు గొప్ప ఘనత గలది.

17:22 – لَّا تَجْعَلْ مَعَ اللَّـهِ إِلَـٰهًا آخَرَ فَتَقْعُدَ مَذْمُومًا مَّخْذُولًا ٢٢

(ఓ మానవుడా!) అల్లాహ్‌కు తోడుగా మరొక ఆరాధ్య దైవాన్ని కల్పించకు, అలాచేస్తే నీవు అవమానించబడి సహకారాలు పొందని (త్యజించబడిన) వాడవవుతావు. (1/8)

17:23 – وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا ۚ إِمَّا يَبْلُغَنَّ عِندَكَ الْكِبَرَ أَحَدُهُمَا أَوْ كِلَاهُمَا فَلَا تَقُل لَّهُمَا أُفٍّ وَلَا تَنْهَرْهُمَا وَقُل لَّهُمَا قَوْلًا كَرِيمًا ٢٣

  • మరియు నీ ప్రభువు: తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదనీ మరియు తల్లి-దండ్రులతో మంచితనంతో వ్యవహరించాలనీ, ఆజ్ఞాపించి ఉన్నాడు. 8 ఒక వేళ వారిలో ఏ ఒక్కరు గానీ, లేదా వారిరువురు గానీ, ముసలి వారైతే, వారితో విసుక్కుంటూ: ”ఛీ! (ఉఫ్‌)” అని కూడా అనకు మరియు వారిని గద్దించకు మరియు వారితో మర్యాదగా మాట్లాడు.

17:24 – وَاخْفِضْ لَهُمَا جَنَاحَ الذُّلِّ مِنَ الرَّحْمَةِ وَقُل رَّبِّ ارْحَمْهُمَا كَمَا رَبَّيَانِي صَغِيرًا ٢٤

మరియు వారి మీద కరుణ మరియు వినయ-విధేయతల రెక్కలను చాపు మరియు వారి కొరకు ఇలా ప్రార్థించు: ”ఓ నా ప్రభూ! వారు ఏ విధంగా నన్ను బాల్యంలో పెంచారో అదేవిధంగా నీవు వారియెడల కరుణనుచూపు!”

17:25 – رَّبُّكُمْ أَعْلَمُ بِمَا فِي نُفُوسِكُمْ ۚ إِن تَكُونُوا صَالِحِينَ فَإِنَّهُ كَانَ لِلْأَوَّابِينَ غَفُورًا ٢٥

మీ మనస్సులలో ఉన్నది మీ ప్రభువుకు బాగా తెలుసు. మీరు సన్మార్గులయితే, నిశ్చయంగా ఆయన వైపునకు (పశ్చాత్తాపంతో) పలుమార్లు మరలేవారిని ఆయన క్షమిస్తాడు.

17:26 – وَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ وَالْمِسْكِينَ وَابْنَ السَّبِيلِ وَلَا تُبَذِّرْ تَبْذِيرًا ٢٦

మరియు బంధువులకు పేదలకు మరియు బాటసారులకు, వారి హక్కు ఇవ్వు. 9 మరియు (నీ ధనాన్ని) వృథా ఖర్చులలో వ్యర్థంచేయకు.

17:27 – إِنَّ الْمُبَذِّرِينَ كَانُوا إِخْوَانَ الشَّيَاطِينِ ۖ وَكَانَ الشَّيْطَانُ لِرَبِّهِ كَفُورًا ٢٧

నిశ్చయంగా, వ్యర్థమైన ఖర్చులు చేసేవారు షై’తానుల సోదరులు. మరియు షై’తాన్‌ తన ప్రభువు పట్ల కృతఘ్నుడైనవాడు.

17:28 – وَإِمَّا تُعْرِضَنَّ عَنْهُمُ ابْتِغَاءَ رَحْمَةٍ مِّن رَّبِّكَ تَرْجُوهَا فَقُل لَّهُمْ قَوْلًا مَّيْسُورًا ٢٨

మరియు నీవు ఆశించే, నీ ప్రభువు కారుణ్యాన్ని పొందటానికి – నీకు వారి నుండి ముఖం త్రిప్పుకోవలసి వచ్చినా – వారితో మృదువుగా మాట్లాడు. 10

17:29 – وَلَا تَجْعَلْ يَدَكَ مَغْلُولَةً إِلَىٰ عُنُقِكَ وَلَا تَبْسُطْهَا كُلَّ الْبَسْطِ فَتَقْعُدَ مَلُومًا مَّحْسُورًا ٢٩

మరియు నీవు (పిసినారితనంతో) నీ చేతిని నీ మెడకు కట్టుకోకు 11 మరియు దానిని పూర్తిగా స్వేచ్ఛగా కూడా వదలి పెట్టకు. అలా చేస్తే నిందలకు గురి అవుతావు, దిక్కులేనివాడవై కూర్చుంటావు (విచారిస్తావు).

17:30 – إِنَّ رَبَّكَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّهُ كَانَ بِعِبَادِهِ خَبِيرًا بَصِيرًا ٣٠

నిశ్చయంగా, నీప్రభువు తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి తగ్గిస్తాడు. నిశ్చయంగా, ఆయనే తన దాసుల (స్థితుల)ను బాగా ఎరిగే వాడూ, చూసే వాడూను!

17:31 – وَلَا تَقْتُلُوا أَوْلَادَكُمْ خَشْيَةَ إِمْلَاقٍ ۖ نَّحْنُ نَرْزُقُهُمْ وَإِيَّاكُمْ ۚ إِنَّ قَتْلَهُمْ كَانَ خِطْئًا كَبِيرًا ٣١

మరియు పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని చంపకండి. మేమే వారికీ మరియు మీకు కూడా జీవనోపాధిని సమకూర్చేవారము. నిశ్చయంగా, వారిని చంపటం గొప్పనేరం. 12

17:32 – وَلَا تَقْرَبُوا الزِّنَىٰ ۖ إِنَّهُ كَانَ فَاحِشَةً وَسَاءَ سَبِيلًا ٣٢

మరియు వ్యభిచారాన్ని సమీపించకండి. అది నిశ్చయంగా, అశ్లీలమైనది మరియు బహు చెడ్డ మార్గము. 13

17:33 – وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّـهُ إِلَّا بِالْحَقِّ ۗ وَمَن قُتِلَ مَظْلُومًا فَقَدْ جَعَلْنَا لِوَلِيِّهِ سُلْطَانًا فَلَا يُسْرِف فِّي الْقَتْلِ ۖ إِنَّهُ كَانَ مَنصُورًا ٣٣

న్యాయానికి తప్ప, అల్లాహ్‌ నిషేధించిన ఏ ప్రాణిని కూడా చంపకండి. 14 ఎవడు అన్యాయంగా చంపబడతాడో, మేము అతని వారసునికి (ప్రతీకార) హక్కు ఇచ్చి ఉన్నాము. 15 కాని అతడు హత్య (ప్రతీకార) విషయంలో హద్దులను మీరకూడదు. నిశ్చయంగా, అతనికి (ధర్మప్రకారం) సహాయ మొసంగబడుతుంది.

17:34 – وَلَا تَقْرَبُوا مَالَ الْيَتِيمِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ حَتَّىٰ يَبْلُغَ أَشُدَّهُ ۚ وَأَوْفُوا بِالْعَهْدِ ۖ إِنَّ الْعَهْدَ كَانَ مَسْئُولًا ٣٤

మరియు అతడు యుక్త వయస్సుకు చేరనంత వరకు – సక్రమమైన పద్ధతిలో తప్ప – అనాథుని ఆస్తిని సమీపించకండి. మరియు చేసిన వాగ్దానాన్ని పూర్తి చేయండి. నిశ్చయంగా, వాగ్దానం గురించి ప్రశ్నించడం జరుగుతుంది. 16

17:35 – وَأَوْفُوا الْكَيْلَ إِذَا كِلْتُمْ وَزِنُوا بِالْقِسْطَاسِ الْمُسْتَقِيمِ ۚ ذَٰلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلًا ٣٥

మరియు మీరు కొలిచి ఇచ్చేటప్పుడు కొలత పాత్ర నిండుగాకొలిచి ఇవ్వండి. మరియు (తూచి ఇచ్చేటప్పుడు) త్రాసుతో సమానంగా తూకంచేయండి. ఇదే మంచి పద్ధతి మరియు (ఇదే) చివరకు మంచి ఫలితం ఇస్తుంది.

17:36 – وَلَا تَقْفُ مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ ۚ إِنَّ السَّمْعَ وَالْبَصَرَ وَالْفُؤَادَ كُلُّ أُولَـٰئِكَ كَانَ عَنْهُ مَسْئُولًا ٣٦

మరియు (ఓ మానవుడా!) నీకు తెలియని విషయం వెంటపడకు. 17 నిశ్చయంగా చూపులూ వినికిడీ మరియు హృదయమూ వీటన్నింటినీ గురించీ (తీర్పు దినమున) ప్రశ్నించడం జరుగుతుంది.

17:37 – وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا ۖ إِنَّكَ لَن تَخْرِقَ الْأَرْضَ وَلَن تَبْلُغَ الْجِبَالَ طُولً ٣٧

మరియు భూమిపై విర్రవీగుతూ నడవకు. 18 నిశ్చయంగా, నీవు భూమిని చీల్చనూలేవు మరియు పర్వతాల ఎత్తుకు చేరనూలేవు!

17:38 – كُلُّ ذَٰلِكَ كَانَ سَيِّئُهُ عِندَ رَبِّكَ مَكْرُوهًا ٣٨

ఇవన్నీ దుష్కార్యాలే, నీ ప్రభువు దృష్టిలో ఎంతో అసహ్యకరమైనవి.

17:39 – ذَٰلِكَ مِمَّا أَوْحَىٰ إِلَيْكَ رَبُّكَ مِنَ الْحِكْمَةِ ۗ وَلَا تَجْعَلْ مَعَ اللَّـهِ إِلَـٰهًا آخَرَ فَتُلْقَىٰ فِي جَهَنَّمَ مَلُومًا مَّدْحُورًا ٣٩

ఇవి వివేకంతో నిండివున్న విషయాలు వాటిని నీ ప్రభువు నీకు దివ్యజ్ఞానం (వ’హీ) ద్వారా తెలియజేశాడు. మరియు అల్లాహ్‌తో పాటు మరొకరిని ఆరాధ్య దైవంగా చేసుకోకు. అలాచేస్తే అవమానానికి గురి అయి, బహిష్క రించబడి నరకంలో త్రోయబడతావు.

17:40 – أَفَأَصْفَاكُمْ رَبُّكُم بِالْبَنِينَ وَاتَّخَذَ مِنَ الْمَلَائِكَةِ إِنَاثًا ۚ إِنَّكُمْ لَتَقُولُونَ قَوْلًا عَظِيمًا ٤٠

ఏమీ? మీ ప్రభువు, మీకు ప్రత్యేకంగా కుమారులను ప్రసాదించి తన కొరకు దేవదూత లను కుమార్తెలుగా చేసుకున్నాడా? నిశ్చయంగా మీరు పలికేది చాలా ఘోరమైన మాట. 19

17:41 – وَلَقَدْ صَرَّفْنَا فِي هَـٰذَا الْقُرْآنِ لِيَذَّكَّرُوا وَمَا يَزِيدُهُمْ إِلَّا نُفُورًا ٤١

మరియు వారు వాస్తవానికి హితబోధ పొందుతారని, మేము ఈ ఖుర్‌ఆన్‌లో అనేక విధాలుగా బోధించాము. 20 కాని అది వారి వ్యతిరేకతను మాత్రమే అధికం చేస్తున్నది.

17:42 – قُل لَّوْ كَانَ مَعَهُ آلِهَةٌ كَمَا يَقُولُونَ إِذًا لَّابْتَغَوْا إِلَىٰ ذِي الْعَرْشِ سَبِيلًا ٤٢

వారితో అను: ”ఒకవేళ వారు అన్నట్లు అల్లాహ్‌తో పాటు ఇతర ఆరాధ్య దైవాలే ఉన్నట్లైతే, వారుకూడా (అల్లాహ్‌) సింహాసనానికి (‘అర్ష్‌కు) చేరే మార్గాన్ని వెతికే వారు కదా!” 21

17:43 – سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يَقُولُونَ عُلُوًّا كَبِيرًا ٤٣

ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు అత్యున్నతుడు, వారు ఆపాదించే మాటలకంటే మహోన్నతుడు, మహానీయుడు (గొప్పవాడు).

17:44 – تُسَبِّحُ لَهُ السَّمَاوَاتُ السَّبْعُ وَالْأَرْضُ وَمَن فِيهِنَّ ۚ وَإِن مِّن شَيْءٍ إِلَّا يُسَبِّحُ بِحَمْدِهِ وَلَـٰكِن لَّا تَفْقَهُونَ تَسْبِيحَهُمْ ۗ إِنَّهُ كَانَ حَلِيمًا غَفُورًا ٤٤

సప్తాకాశాలు, భూమి మరియు వాటిలో ఉన్న సమస్తమూ ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయన పవిత్రతను కొనియాడనిది, ఆయన స్తోత్రం చేయనటువంటిది ఏదీలేదు, కాని మీరు వాటి స్తుతిని అర్థంచేసుకోలేరు. నిశ్చయంగా, ఆయన ఎంతో సహనశీలుడు, క్షమాశీలుడు.

17:45 – وَإِذَا قَرَأْتَ الْقُرْآنَ جَعَلْنَا بَيْنَكَ وَبَيْنَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ حِجَابًا مَّسْتُورًا ٤٥

మరియు నీవుఖుర్‌ఆన్‌ను పఠించేటప్పుడు నీకూ మరియు పరలోక జీవితాన్ని విశ్వసించని వారికీ, మధ్య కనబడని తెరవేసి ఉన్నాము.

17:46 – وَجَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا ۚ وَإِذَا ذَكَرْتَ رَبَّكَ فِي الْقُرْآنِ وَحْدَهُ وَلَّوْا عَلَىٰ أَدْبَارِهِمْ نُفُورًا ٤٦

మరియు వారు గ్రహించకుండా, వారి హృదయాల మీద తెరలు మరియు వారి చెవులలో చెవుడు వేసి ఉన్నాము. 22 ఒకవేళ నీవు ఖుర్‌ఆన్‌ (పారాయణం)తో నీ ప్రభువు యొక్క ఏకత్వాన్ని ప్రస్తావిస్తే, వారు అసహ్యంతో వెనుదిరిగి మరలిపోతారు.

17:47 – نَّحْنُ أَعْلَمُ بِمَا يَسْتَمِعُونَ بِهِ إِذْ يَسْتَمِعُونَ إِلَيْكَ وَإِذْ هُمْ نَجْوَىٰ إِذْ يَقُولُ الظَّالِمُونَ إِن تَتَّبِعُونَ إِلَّا رَجُلًا مَّسْحُورًا ٤٧

వారు నీ మాటలను వింటున్నప్పుడు, వారు ఏమి వింటున్నారో మాకు బాగా తెలుసు. ఈ దుర్మార్గులు ఏకాంతంలో ఉన్నప్పుడు పరస్ప రం గుసగుసలాడుతూ ఇలా చెప్పుకుంటారు: ”మీరు అనుసరిస్తున్న ఈ మనిషి కేవలం మంత్ర జాలానికి గురి అయిన వాడు మాత్రమే.”

17:48 – انظُرْ كَيْفَ ضَرَبُوا لَكَ الْأَمْثَالَ فَضَلُّوا فَلَا يَسْتَطِيعُونَ سَبِيلًا ٤٨

(ఓ ము’హమ్మద్‌!) చూడు! వారు నిన్ను ఎలాంటి ఉదాహరణలతో పోల్చుతున్నారో, ఎందుకంటే వారు మార్గంతప్పారు, కావున వారు (సరైన) మార్గంపొందలేరు 23

17:49 – وَقَالُوا أَإِذَا كُنَّا عِظَامًا وَرُفَاتًا أَإِنَّا لَمَبْعُوثُونَ خَلْقًا جَدِيدًا ٤٩

మరియు వారు ఇలా అంటారు: ”ఏమీ? మేము ఎముకలుగా మరియు దుమ్ము (పొడి) గా మారిపోయిన తరువాత కూడా తిరిగి క్రొత్తసృష్టిగా లేపబడతామా?” (1/4)

17:50 – قُلْ كُونُوا حِجَارَةً أَوْ حَدِيدًا ٥٠

  • వారితో అను: ”మీరు రాళ్ళుగా గానీ లేదా ఇనుముగా గానీ మారిపోయి ఉండినా సరే!”

17:51 – أَوْ خَلْقًا مِّمَّا يَكْبُرُ فِي صُدُورِكُمْ ۚ فَسَيَقُولُونَ مَن يُعِيدُنَا ۖ قُلِ الَّذِي فَطَرَكُمْ أَوَّلَ مَرَّةٍ ۚ فَسَيُنْغِضُونَ إِلَيْكَ رُءُوسَهُمْ وَيَقُولُونَ مَتَىٰ هُوَ ۖ قُلْ عَسَىٰ أَن يَكُونَ قَرِيبًا ٥١

”లేదా, తిరిగి సృష్టింపబడటానికి అసాధ్య మైనదని మీ హృదయాలు భావించేదానిగా ఉన్నా సరే! (తిరిగి లేపబడతారు).” వారు మళ్ళీ ఇలా అడుగుతారు:”మమ్మల్ని తిరిగి బ్రతికించి లేపగలవాడు ఎవడు?” వారితో అను: ”ఆయనే, మిమ్మల్ని మొదటి సారి పుట్టించినవాడు!” వారు ఎగతాళిగా తలలుఊపుతూ అంటారు:”అయితే! అది ఎప్పుడు సంభవిస్తుంది?” వారితో అను: ”బహుశా ఆసమయం సమీపంలోనే ఉండవచ్చు!”

17:52 – يَوْمَ يَدْعُوكُمْ فَتَسْتَجِيبُونَ بِحَمْدِهِ وَتَظُنُّونَ إِن لَّبِثْتُمْ إِلَّا قَلِيلًا ٥٢

ఆ దినమున, ఆయన మిమ్మల్ని పిలిచి నపుడు! మీరు ఆయన పిలుపుకు సమాధానంగా ఆయనను స్తుతిస్తూ వస్తారు. మరియు మీరు కేవలం కొంతకాలం మాత్రమే (భూమిలో) ఉండి వున్నట్లు భావిస్తారు. 24

17:53 – وَقُل لِّعِبَادِي يَقُولُوا الَّتِي هِيَ أَحْسَنُ ۚ إِنَّ الشَّيْطَانَ يَنزَغُ بَيْنَهُمْ ۚ إِنَّ الشَّيْطَانَ كَانَ لِلْإِنسَانِ عَدُوًّا مُّبِينًا ٥٣

మరియు నా దాసులతో, వారు మాట్లాడే టప్పుడు మంచి మాటలనే పలకమని చెప్పు. (ఎందుకంటే) షై’తాన్‌ నిశ్చయంగా, వారి మధ్య విరోధాన్ని రేకెత్తించడానికి ప్రయత్నిస్తుంటాడు. నిశ్చయంగా, షై’తాన్‌ మానవుడికి బహిరంగ శత్రువు. 25

17:54 – رَّبُّكُمْ أَعْلَمُ بِكُمْ ۖ إِن يَشَأْ يَرْحَمْكُمْ أَوْ إِن يَشَأْ يُعَذِّبْكُمْ ۚ وَمَا أَرْسَلْنَاكَ عَلَيْهِمْ وَكِيلًا ٥٤

మీ ప్రభువుకు మిమ్మల్ని గురించి బాగా తెలుసు. ఆయన కోరితే మిమ్మల్ని కరుణించ వచ్చు, లేదా ఆయన కోరితే మిమ్మల్ని శిక్షించ వచ్చు! మరియు (ఓ ము’హమ్మద్‌!) మేము నిన్ను వారి కార్యకర్తగా (రక్షకునిగా) నియమించి పంపలేదు.

17:55 – وَرَبُّكَ أَعْلَمُ بِمَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَلَقَدْ فَضَّلْنَا بَعْضَ النَّبِيِّينَ عَلَىٰ بَعْضٍ ۖ وَآتَيْنَا دَاوُودَ زَبُورًا ٥٥

మరియు భూమ్యాకాశాలలో ఉన్న వారి నందరినీ గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. మరియు వాస్తవానికి మేము కొందరు ప్రవక్తలకు మరి కొందరిపై ఘనత నొసంగాము. మరియు మేము దావూద్‌కు ‘జబూర్ 26 ఇచ్చాము.

17:56 – قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِهِ فَلَا يَمْلِكُونَ كَشْفَ الضُّرِّ عَنكُمْ وَلَا تَحْوِيلًا ٥٦

వారితో ఇట్లను: ”ఆయన (అల్లాహ్‌)ను కాదని మీరెవరినైతే (ఆరాధ్య దైవాలుగా) భావించారో, వారిని అర్థించి చూడండి; మీ ఆపదను తొలగించటానికి గానీ, దానిని మార్చటానికి గానీ వారికి ఎలాంటి శక్తిలేదు.”

17:57 – أُولَـٰئِكَ الَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَىٰ رَبِّهِمُ الْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُ وَيَخَافُونَ عَذَابَهُ ۚ إِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحْذُورًا ٥٧

వారు, ఎవరినైతే వీరు ప్రార్థిస్తూ ఉన్నారో, వారే తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు. మరియు వారిలో ఆయనకు ఎవరు ఎక్కువ సాన్నిధ్యం పొందుతారో అని ప్రయత్నిస్తున్నారు. మరియు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు మరియు ఆయన శిక్షకు భయపడుతున్నారు. 27 నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష, దానికి భయపడవలసిందే!

17:58 – وَإِن مِّن قَرْيَةٍ إِلَّا نَحْنُ مُهْلِكُوهَا قَبْلَ يَوْمِ الْقِيَامَةِ أَوْ مُعَذِّبُوهَا عَذَابًا شَدِيدًا ۚ كَانَ ذَٰلِكَ فِي الْكِتَابِ مَسْطُورًا ٥٨

మరియు పునరుత్థానదినానికి ముందు మేము నాశనం చేయని, లేదా కఠిన శిక్షకు గురి చేయని, నగరమనేది ఉండదు. ఈ విషయం గ్రంథంలో వ్రాయబడి వుంది.

17:59 – وَمَا مَنَعَنَا أَن نُّرْسِلَ بِالْآيَاتِ إِلَّا أَن كَذَّبَ بِهَا الْأَوَّلُونَ ۚ وَآتَيْنَا ثَمُودَ النَّاقَةَ مُبْصِرَةً فَظَلَمُوا بِهَا ۚ وَمَا نُرْسِلُ بِالْآيَاتِ إِلَّا تَخْوِيفًا ٥٩

మరియు నిదర్శనాలను (ఆయాత్‌ లను) పంపకుండా మమ్మల్ని ఏదీ ఆపలేదు. కాని పూర్వకాలపు ప్రజలు వాటిని తిరస్కరించడమే తప్ప! 28 మరియు మేము స’మూదు జాతి వారికి ప్రత్యక్ష నిదర్శనంగా ఒక ఆడ ఒంటెను పంపాము, కాని వారు దానిపట్ల క్రూరంగా ప్రవర్తించారు. 29 మరియు మేము నిదర్శనాలను (ఆయాత్‌లను) పంపుతున్నది, కేవలం ప్రజలు వాటిని చూసి భయపడటానికే!

17:60 – وَإِذْ قُلْنَا لَكَ إِنَّ رَبَّكَ أَحَاطَ بِالنَّاسِ ۚ وَمَا جَعَلْنَا الرُّؤْيَا الَّتِي أَرَيْنَاكَ إِلَّا فِتْنَةً لِّلنَّاسِ وَالشَّجَرَةَ الْمَلْعُونَةَ فِي الْقُرْآنِ ۚ وَنُخَوِّفُهُمْ فَمَا يَزِيدُهُمْ إِلَّا طُغْيَانًا كَبِيرًا ٦٠

”నిశ్చయంగా, నీ ప్రభువు ప్రజలను పరివేష్టించి ఉన్నాడు.”అని మేము నీతో చెప్పిన విషయం (జ్ఞాపకంచేసుకో)! మేము నీకు (ఇస్రా’ రాత్రిలో) చూపిన దృశ్యం 30 – మరియు ఖుర్‌ఆన్‌లో శపించబడిన (నరక) వృక్షం 31 మేము వారికి ఒక పరీక్షగా చేశాము. కాని మా భయపెట్టడం, వారి తలబిరుసుతనాన్ని మాత్రమే మరింత అధికం చేస్తున్నది.

17:61 – وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ قَالَ أَأَسْجُدُ لِمَنْ خَلَقْتَ طِينًا ٦١

మరియు (జ్ఞాపకం చేసుకోండి!) మేము దేవదూతలతో: ”ఆదమ్‌కు సాష్టాంగం (సజ్దా) చేయండి.” అని చెప్పినపుడు; ఒక్క ఇబ్లీస్‌ తప్ప, అందరూ సాష్టాంగపడ్డారు. 32 అతడు అన్నాడు: ”ఏమీ? నీవు మట్టితో సృష్టించిన వానికి నేను సాష్టాంగం (సజ్దా) చేయాలా?”

17:62 – قَالَ أَرَأَيْتَكَ هَـٰذَا الَّذِي كَرَّمْتَ عَلَيَّ لَئِنْ أَخَّرْتَنِ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَأَحْتَنِكَنَّ ذُرِّيَّتَهُ إِلَّا قَلِيلًا ٦٢

ఇంకా ఇలా అన్నాడు: ”ఏమీ? నేను చూడటంలేదా? నీవు ఇతనికి నాపై ఆధిక్యత నిచ్చావు. కానీ ఒకవేళ నీవు నాకు పునరుత్థాన దినం వరకు వ్యవధి నిస్తే, నేను ఇతని సంతతి వారిలో కొందరిని తప్ప అందరినీ వశపరచుకొని తప్పుదారి పట్టిస్తాను.” 33

17:63 – قَالَ اذْهَبْ فَمَن تَبِعَكَ مِنْهُمْ فَإِنَّ جَهَنَّمَ جَزَاؤُكُمْ جَزَاءً مَّوْفُورًا ٦٣

ఆయన (అల్లాహ్‌) అన్నాడు: ”సరే పో! వారిలో నిన్ను ఎవరు అనుసరిస్తారో! నిశ్చయంగా, మీరందరికీ నరకమే ప్రతిఫలమవుతుంది, పరిపూర్ణ ప్రతిఫలం!

17:64 – وَاسْتَفْزِزْ مَنِ اسْتَطَعْتَ مِنْهُم بِصَوْتِكَ وَأَجْلِبْ عَلَيْهِم بِخَيْلِكَ وَرَجِلِكَ وَشَارِكْهُمْ فِي الْأَمْوَالِ وَالْأَوْلَادِ وَعِدْهُمْ ۚ وَمَا يَعِدُهُمُ الشَّيْطَانُ إِلَّا غُرُورًا ٦٤

”మరియు నీవు నీ ధ్వని (మాటల) తో వారిలో ఎవరెవరిని ఆశచూపి (ఆకర్షించగలవో) ఆకర్షించు. 34 మరియు నీ అశ్విక దళాలతో మరియు నీ పదాతి దళాలతో వారిమీద పడు. 35 మరియు వారికి సంపదలో, సంతానంలో భాగస్వామివి కా 36 మరియు వారితో వాగ్దానాలు చెయ్యి. 37 మరియు షై’తాన్‌ చేసే వాగ్దానాలు మోసపుచ్చటం తప్ప ఇంకేముంటాయి. 38

17:65 – إِنَّ عِبَادِي لَيْسَ لَكَ عَلَيْهِمْ سُلْطَانٌ ۚ وَكَفَىٰ بِرَبِّكَ وَكِيلًا ٦٥

”నిశ్చయంగా, నా దాసులు! వారిపై నీకు ఏ విధమైన అధికారం లేదు. 39 మరియు వారికి కార్యకర్తగా (రక్షకునిగా) నీ ప్రభువే చాలు!”

17:66 – رَّبُّكُمُ الَّذِي يُزْجِي لَكُمُ الْفُلْكَ فِي الْبَحْرِ لِتَبْتَغُوا مِن فَضْلِهِ ۚ إِنَّهُ كَانَ بِكُمْ رَحِيمًا ٦٦

మీ ప్రభువు, ఆయనే – ఆయన అనుగ్ర హాన్ని అన్వేషించటానికి – మీ కొరకు సముద్రంలో నావలను నడిపింపజేసేవాడు. నిశ్చయంగా, ఆయన మీ పట్ల అపార కరుణాప్రదాత.

17:67 – وَإِذَا مَسَّكُمُ الضُّرُّ فِي الْبَحْرِ ضَلَّ مَن تَدْعُونَ إِلَّا إِيَّاهُ ۖ فَلَمَّا نَجَّاكُمْ إِلَى الْبَرِّ أَعْرَضْتُمْ ۚ وَكَانَ الْإِنسَانُ كَفُورًا ٦٧

మరియు ఒకవేళ సముద్రంలో మీకు ఆపదవస్తే ఆయన (అల్లాహ్‌) తప్ప, మీరు పిలిచే వారందరూ మిమ్మల్ని త్యజిస్తారు. కాని, ఆయన మిమ్మల్ని రక్షించి, ఒడ్డుకు చేర్చినపుడు, మీరు ఆయన నుండి ముఖం త్రిప్పుకుంటారు. వాస్తవానికి మానవుడు ఎంతో కృతఘ్నుడు.

17:68 – أَفَأَمِنتُمْ أَن يَخْسِفَ بِكُمْ جَانِبَ الْبَرِّ أَوْ يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا ثُمَّ لَا تَجِدُوا لَكُمْ وَكِيلًا ٦٨

ఏమీ? ఆయన! నేల చీలిపోయి మిమ్మల్ని మ్రింగకుండా; లేదా తుఫాను మీపైరాకుండా; మిమ్మల్ని సురక్షితంగా ఉండనివ్వగలడని మీరు భావిస్తున్నారా? 40 అప్పుడు మీరు ఏ రక్షకుడినీ పొందలేరు.

17:69 – أَمْ أَمِنتُمْ أَن يُعِيدَكُمْ فِيهِ تَارَةً أُخْرَىٰ فَيُرْسِلَ عَلَيْكُمْ قَاصِفًا مِّنَ الرِّيحِ فَيُغْرِقَكُم بِمَا كَفَرْتُمْ ۙ ثُمَّ لَا تَجِدُوا لَكُمْ عَلَيْنَا بِهِ تَبِيعًا ٦٩

లేదా! మరొక సారి ఆయన మిమ్మల్ని సముద్రంలోకి తీసుకొని పోయి – మీ కృతఘ్నతకు ఫలితంగా – మీ మీద తీవ్రమైన తుఫానుగాలిని పంపి, మిమ్మల్ని ముంచివేయకుండా సురక్షితంగా ఉండనివ్వగలడని భావిస్తున్నారా? అప్పుడు మాకు విరుద్ధంగా 41 సహాయపడేవారి నెవ్వరినీ మీరు పొందలేరు. (3/8)

17:70 – وَلَقَدْ كَرَّمْنَا بَنِي آدَمَ وَحَمَلْنَاهُمْ فِي الْبَرِّ وَالْبَحْرِ وَرَزَقْنَاهُم مِّنَ الطَّيِّبَاتِ وَفَضَّلْنَاهُمْ عَلَىٰ كَثِيرٍ مِّمَّنْ خَلَقْنَا تَفْضِيلًا ٧٠

  • మరియు వాస్తవానికి మేము ఆదమ్‌ సంతతికి గౌరవము నొసంగాము. 42 మరియు వారికి నేలమీదనూ, సముద్రంలోనూ, ప్రయాణం కొరకు వాహనాలను ప్రసాదించాము. మరియు మేము వారికి పరిశుధ్ధమైన వస్తువులను జీవనోపాధిగా సమకూర్చాము. మరియు మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చాము.

17:71 – يَوْمَ نَدْعُو كُلَّ أُنَاسٍ بِإِمَامِهِمْ ۖ فَمَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ فَأُولَـٰئِكَ يَقْرَءُونَ كِتَابَهُمْ وَلَا يُظْلَمُونَ فَتِيلً ٧١

(జ్ఞాపకముంచుకోండి!) ఒక రోజు మేము మానవులందరినీ వారివారి నాయకులతో (ఇమామ్‌ లతో) సహా పిలుస్తాము. 43 అప్పుడు వారి కర్మపత్రాలు కుడిచేతిలో ఇవ్వబడినవారు 44 తమ కర్మపత్రాలను చదువుకుంటారు మరియు వారికి రవ్వంత (ఖర్జూరపు బీజపు చీలికలోని పొరంత) అన్యాయం కూడా జరుగదు.

17:72 – وَمَن كَانَ فِي هَـٰذِهِ أَعْمَىٰ فَهُوَ فِي الْآخِرَةِ أَعْمَىٰ وَأَضَلُّ سَبِيلًا ٧٢

మరియు ఎవడు ఇహలోకంలో అంధుడై మెలగుతాడో, అతడు పరలోకంలో కూడా అంధుడిగానే ఉంటాడు 45 మరియు సన్మార్గం నుండి భ్రష్టుడవుతాడు.

17:73 – وَإِن كَادُوا لَيَفْتِنُونَكَ عَنِ الَّذِي أَوْحَيْنَا إِلَيْكَ لِتَفْتَرِيَ عَلَيْنَا غَيْرَهُ ۖ وَإِذًا لَّاتَّخَذُوكَ خَلِيلًا ٧٣

మరియు (ఓ ప్రవక్తా!) మేము నీపై అవత రింపజేసిన దివ్యజ్ఞానం (వ’హీ) నుండి నిన్ను మరలించి, నీవు అదికాక మా పేరుతో మరొక దానిని (సందేశాన్ని) కల్పించాలని నిన్ను పురికొల్పటానికి వారు ప్రయత్నిస్తున్నారు. 46 నీవు అలా చేసిఉంటే వారు తప్పకుండా నిన్ను తమ ఆప్తమిత్రునిగా చేసుకునేవారు.

17:74 – وَلَوْلَا أَن ثَبَّتْنَاكَ لَقَدْ كِدتَّ تَرْكَنُ إِلَيْهِمْ شَيْئًا قَلِيلًا ٧٤

మరియు ఒకవేళ మేము నిన్ను స్థిరంగా ఉంచకపోతే నీవు వారి వైపుకు కొంతైనా మొగ్గి ఉండే వాడవు.

17:75 – إِذًا لَّأَذَقْنَاكَ ضِعْفَ الْحَيَاةِ وَضِعْفَ الْمَمَاتِ ثُمَّ لَا تَجِدُ لَكَ عَلَيْنَا نَصِيرًا ٧٥

అలాగైతే, మేము నీకు ఈ జీవితంలో రెట్టింపు శిక్షను మరియు చనిపోయిన తరువాతకూడా రెట్టింపు శిక్షను రుచిచూపి ఉండేవారం. అప్పుడు మాకు వ్యతిరేకంగా నీకు సహాయపడే వాడిని, ఎవ్వడినీ నీవు పొందిఉండే వాడవు కాదు.

17:76 – وَإِن كَادُوا لَيَسْتَفِزُّونَكَ مِنَ الْأَرْضِ لِيُخْرِجُوكَ مِنْهَا ۖ وَإِذًا لَّا يَلْبَثُونَ خِلَافَكَ إِلَّا قَلِيلً ٧٦

మరియు వారు (అవిశ్వాసులు) నిన్ను కలవర పెట్టి, నిన్ను ఈ భూమి నుండి వెడలగొట్ట టానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు నీవు వెళ్ళిపోయిన తరువాత, వారు కూడా కొద్దికాలం మాత్రమే ఉండగలిగే వారు. 47

17:77 – سُنَّةَ مَن قَدْ أَرْسَلْنَا قَبْلَكَ مِن رُّسُلِنَا ۖ وَلَا تَجِدُ لِسُنَّتِنَا تَحْوِيلًا ٧٧

(ఓ ము’హమ్మద్‌) ఇది వాస్తవానికి! మేము, నీకు పూర్వం పంపిన ప్రవక్తలందరికీ వర్తించిన సంప్రదాయమే! నీవు మా సాంప్రదాయంలో ఎలాంటి మార్పును పొందలేవు.

17:78 – أَقِمِ الصَّلَاةَ لِدُلُوكِ الشَّمْسِ إِلَىٰ غَسَقِ اللَّيْلِ وَقُرْآنَ الْفَجْرِ ۖ إِنَّ قُرْآنَ الْفَجْرِ كَانَ مَشْهُودًا ٧٨

మధ్యాహ్నం సూర్యుడు వాలినప్పటి నుండి, రాత్రి అయి చీకటి పడేవరకూ నమాజ్‌లను సలుపు. మరియు ప్రాతఃకాలంలో (నమా’జ్‌లో ఖుర్‌ఆన్‌) పఠించు. 48 నిశ్చయంగా, ప్రాతఃకాల (ఖుర్‌ఆన్‌) పఠనం (దేవదూతల ద్వారా) వీక్షింప బడుతుంది. 49

17:79 – وَمِنَ اللَّيْلِ فَتَهَجَّدْ بِهِ نَافِلَةً لَّكَ عَسَىٰ أَن يَبْعَثَكَ رَبُّكَ مَقَامًا مَّحْمُودًا ٧٩

మరియు రాత్రివేళలో జాగరణ (తహజ్జుద్‌) నమా’జ్‌ చెయ్యి; 50 ఇది నీ కొరకు అదనపు (నఫిల్‌) నమా’జ్‌. దీనితో నీ ప్రభువు నిన్ను (పునరుత్థాన దినమున) ప్రశంసనీయమైన స్థానము (మఖామమ్‌ మ’హ్‌మూద్‌) నొసంగవచ్చు!

17:80 – وَقُل رَّبِّ أَدْخِلْنِي مُدْخَلَ صِدْقٍ وَأَخْرِجْنِي مُخْرَجَ صِدْقٍ وَاجْعَل لِّي مِن لَّدُنكَ سُلْطَانًا نَّصِيرًا ٨٠

మరియు ఇలా ప్రార్ధించు: ”ఓ నా ప్రభూ! నీవు నా ప్రతి ప్రవేశాన్ని, సత్య ప్రవేశంగా చేయి మరియు నా బహిర్గమనాన్ని కూడా సత్య బహిర్గమనంగాచేయి మరియు నీ వైపు నుండి నాకు అధికారశక్తిని, సహాయాన్నీ ప్రసాదించు.” 51

17:81 – وَقُلْ جَاءَ الْحَقُّ وَزَهَقَ الْبَاطِلُ ۚ إِنَّ الْبَاطِلَ كَانَ زَهُوقًا ٨١

మరియు ఇలా అను: ”సత్యం వచ్చింది మరియు అసత్యం అంతరించింది. నిశ్చయంగా, అసత్యం అంతరించక తప్పదు.” 52

17:82 – وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ ۙ وَلَا يَزِيدُ الظَّالِمِينَ إِلَّا خَسَارًا ٨٢

మరియు మేము ఈ ఖుర్‌ఆన్‌ ద్వారా విశ్వాసులకు స్వస్థతను మరియు కారుణ్యాన్ని క్రమ-క్రమంగా అవతరింపజేస్తాము. కాని దుర్మార్గులకు ఇది నష్టం తప్ప మరేమీ అధికం చేయదు. 53

17:83 – وَإِذَا أَنْعَمْنَا عَلَى الْإِنسَانِ أَعْرَضَ وَنَأَىٰ بِجَانِبِهِ ۖ وَإِذَا مَسَّهُ الشَّرُّ كَانَ يَئُوسًا ٨٣

మరియు ఒకవేళ మేము మానవుణ్ణి అనుగ్రహిస్తే, అతడు ముఖం త్రిప్పుకొని (మా నుండి) మరలిపోతాడు. కాని అతనికి కీడు కలిగితే నిరాశచెందుతాడు. 54

17:84 – قُلْ كُلٌّ يَعْمَلُ عَلَىٰ شَاكِلَتِهِ فَرَبُّكُمْ أَعْلَمُ بِمَنْ هُوَ أَهْدَىٰ سَبِيلًا ٨٤

వారితో ఇలా అను: ”ప్రతి ఒక్కడు తనకు తోచినట్లే పనులు చేస్తాడు, కాని మీ ప్రభువుకు మాత్రం ఎవడు సన్మార్గం పొందేవాడో బాగా తెలుసు.” 55

17:85 – وَيَسْأَلُونَكَ عَنِ الرُّوحِ ۖ قُلِ الرُّوحُ مِنْ أَمْرِ رَبِّي وَمَا أُوتِيتُم مِّنَ الْعِلْمِ إِلَّا قَلِيلًا ٨٥

మరియు వారు నిన్ను ఆత్మ (రూ’హ్‌)ను గురించి ప్రశ్నిస్తున్నారు. వారితో ఇలా అను: ”ఆత్మ! నా ప్రభువు ఆజ్ఞతో వస్తుంది. మరియు (దానిని గురించి) మీకు ఇవ్వబడిన జ్ఞానం అతి స్వల్పమైనది.” 56

17:86 – وَلَئِن شِئْنَا لَنَذْهَبَنَّ بِالَّذِي أَوْحَيْنَا إِلَيْكَ ثُمَّ لَا تَجِدُ لَكَ بِهِ عَلَيْنَا وَكِيلًا ٨٦

మరియు ఒకవేళ మేము కోరినట్లయితే నీపై అవతరింపజేయబడిన సందేశాన్ని (ఖుర్‌ఆన్‌ను) లాగుకో గలము (స్వాధీనపరచుకో గలము). అప్పుడు దానిని గురించి, మాకు వ్యతిరేకంగా, నీవు ఏ సహాయకుడినీ పొందలేవు –

17:87 – إِلَّا رَحْمَةً مِّن رَّبِّكَ ۚ إِنَّ فَضْلَهُ كَانَ عَلَيْكَ كَبِيرًا ٨٧

కేవలం నీ ప్రభువు కారుణ్యం తప్ప! నిశ్చయంగా, నీపై ఉన్న ఆయన (నీప్రభువు) అనుగ్రహంఎంతోగొప్పది.

17:88 – قُل لَّئِنِ اجْتَمَعَتِ الْإِنسُ وَالْجِنُّ عَلَىٰ أَن يَأْتُوا بِمِثْلِ هَـٰذَا الْقُرْآنِ لَا يَأْتُونَ بِمِثْلِهِ وَلَوْ كَانَ بَعْضُهُمْ لِبَعْضٍ ظَهِيرًا ٨٨

ఇలా అను:”ఒకవేళ మానవులు మరియు జిన్నాతులు అందరూ కలిసి, ఈ ఖుర్ఆన్‌ వంటి దానిని కల్పించి తీసుకురావటానికి ప్రయ త్నించినా – వారు ఒకరికొకరు తోడ్పడినప్పటికీ – ఇటువంటి దానిని కల్పించితేలేరు.” 57

17:89 – وَلَقَدْ صَرَّفْنَا لِلنَّاسِ فِي هَـٰذَا الْقُرْآنِ مِن كُلِّ مَثَلٍ فَأَبَىٰ أَكْثَرُ النَّاسِ إِلَّا كُفُورًا ٨٩

మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్‌ఆన్‌ లో ప్రజలకు ప్రతివిధమైన ఉపమానాన్ని వివరించి బోధించి ఉన్నాము. అయినా చాలా మంది ప్రజలు సత్య-తిరస్కారులుగానే ఉండి పోయారు.

17:90 – وَقَالُوا لَن نُّؤْمِنَ لَكَ حَتَّىٰ تَفْجُرَ لَنَا مِنَ الْأَرْضِ يَنبُوعً ٩٠

మరియు వారు ఇలా అంటారు: ”(ఓ ము’హమ్మద్!) నీవు భూమి నుండి మా కొరకు ఒక చెలమను ఝల్లున ప్రవహింపజేయనంత వరకు మేము నిన్ను విశ్వసించము; 58

17:91 – أَوْ تَكُونَ لَكَ جَنَّةٌ مِّن نَّخِيلٍ وَعِنَبٍ فَتُفَجِّرَ الْأَنْهَارَ خِلَالَهَا تَفْجِيرًا ٩١

”లేదా! నీ కొరకు ఖర్జూరపు మరియు ద్రాక్ష తోట ఏర్పడి, దాని మధ్య నుండి సెలయేళ్ళు పొంగి ప్రవహింప జేయనంత వరకు;

17:92 – أَوْ تُسْقِطَ السَّمَاءَ كَمَا زَعَمْتَ عَلَيْنَا كِسَفًا أَوْ تَأْتِيَ بِاللَّـهِ وَالْمَلَائِكَةِ قَبِيلً ٩٢

”లేదా, నీవు మమ్మల్ని భయపెట్టినట్లు, 59 ఆకాశం ముక్కలై మాపై పడవేయబడనంత వరకు; లేదా అల్లాహ్‌ను మరియు దేవదూతలను మా ముందు ప్రత్యక్ష పరచనంత వరకు;

17:93 – أَوْ يَكُونَ لَكَ بَيْتٌ مِّن زُخْرُفٍ أَوْ تَرْقَىٰ فِي السَّمَاءِ وَلَن نُّؤْمِنَ لِرُقِيِّكَ حَتَّىٰ تُنَزِّلَ عَلَيْنَا كِتَابًا نَّقْرَؤُهُ ۗ قُلْ سُبْحَانَ رَبِّي هَلْ كُنتُ إِلَّا بَشَرًا رَّسُولًا ٩٣

”లేదా నీ కొరకు స్వర్ణగృహం ఏర్పడనంత వరకు; లేదా నీవు ఆకాశంలోకి ఎక్కిపోయినా నీవు, మేము చదువగలిగే ఒక గ్రంథాన్ని అవతరింప జేయనంత వరకు; నీవు ఆకాశంలోకి ఎక్కటాన్ని మేము నమ్మము.” వారితో అను: ”నా ప్రభువు సర్వ లోపాలకు అతీతుడు, నేను కేవలం సందేశ హరునిగా పంపబడిన మానవుడను మాత్రమే?” 60

17:94 – وَمَا مَنَعَ النَّاسَ أَن يُؤْمِنُوا إِذْ جَاءَهُمُ الْهُدَىٰ إِلَّا أَن قَالُوا أَبَعَثَ اللَّـهُ بَشَرًا رَّسُولًا ٩٤

మరియు ప్రజల ముందుకు మార్గదర్శ కత్వం వచ్చినపుడు, దానిని విశ్వసించకుండా వారిని ఆపిందేమిటి? వారు (మూఢ విశ్వాసంలో మునిగి): ”ఏమీ? అల్లాహ్‌ మానవుణ్ణి తన సందేశహరునిగా పంపాడా?” అని పలకడం తప్ప!

17:95 – قُل لَّوْ كَانَ فِي الْأَرْضِ مَلَائِكَةٌ يَمْشُونَ مُطْمَئِنِّينَ لَنَزَّلْنَا عَلَيْهِم مِّنَ السَّمَاءِ مَلَكًا رَّسُولً ٩٥

ఇలా అను: ”ఒకవేళ భూమి మీద దేవదూతలు నివసిస్తూ నిశ్చింతగా తిరుగుతూ ఉండి నట్లయితే, మేము వారి కొరకు దేవదూతనే సందేశహరునిగా పంపి ఉండే వారము.”

17:96 – قُلْ كَفَىٰ بِاللَّـهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ ۚ إِنَّهُ كَانَ بِعِبَادِهِ خَبِيرًا بَصِيرًا ٩٦

ఇలా అను: ”నాకూ మరియు మీకూ మధ్య అల్లాహ్‌యే సాక్షిగా చాలు. నిశ్చయంగా ఆయన తన దాసులనుబాగాఎరుగువాడు సర్వదృష్టికర్త.”

17:97 – وَمَن يَهْدِ اللَّـهُ فَهُوَ الْمُهْتَدِ ۖ وَمَن يُضْلِلْ فَلَن تَجِدَ لَهُمْ أَوْلِيَاءَ مِن دُونِهِ ۖ وَنَحْشُرُهُمْ يَوْمَ الْقِيَامَةِ عَلَىٰ وُجُوهِهِمْ عُمْيًا وَبُكْمًا وَصُمًّا ۖ مَّأْوَاهُمْ جَهَنَّمُ ۖ كُلَّمَا خَبَتْ زِدْنَاهُمْ سَعِيرًا ٩٧

మరియు ఎవడికి అల్లాహ్‌ మార్గదర్శకత్వం చేస్తాడో అతడే సన్మార్గం పొందుతాడు. మరియు ఎవడిని ఆయన మార్గభ్రష్టత్వంలో పడనిస్తాడో, వాడికి ఆయన తప్ప ఇతరుల నెవ్వరినీ నీవు సంరక్షకులుగా పొందలేవు. మరియు వారిని మేము పునరుత్థాన దినమున గ్రుడ్డివారుగా, మూగ వారుగా మరియు చెవిటి వారుగా చేసి, వారి ముఖాల మీద బోర్లా పడవేసి లాగుతూ ప్రోగు చేస్తాము. వారి ఆశ్రయం నరకమే! అది చల్లారి నప్పుడల్లా మేము వారికై అగ్నిజ్వాలను తీవ్రంచేస్తాము.

17:98 – ذَٰلِكَ جَزَاؤُهُم بِأَنَّهُمْ كَفَرُوا بِآيَاتِنَا وَقَالُوا أَإِذَا كُنَّا عِظَامًا وَرُفَاتًا أَإِنَّا لَمَبْعُوثُونَ خَلْقًا جَدِيدًا ٩٨

అదే వారి ప్రతిఫలం ఎందుకంటే వాస్తవానికి వారు మా సూచనలను తిరస్కరించారు మరియు అన్నారు: ”ఏమీ? మేము ఎముకలుగా, పొడిగా మారిపోయిన తరువాత కూడా, సరిక్రొత్త సృష్టిగా మళ్ళీ లేపబడతామా?” 61 (1/2)

17:99 – أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّـهَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ قَادِرٌ عَلَىٰ أَن يَخْلُقَ مِثْلَهُمْ وَجَعَلَ لَهُمْ أَجَلًا لَّا رَيْبَ فِيهِ فَأَبَى الظَّالِمُونَ إِلَّا كُفُورًا ٩٩

  • ఏమీ? వారు చూడటంలేదా (ఎరుగరా)? నిశ్చయంగా అల్లాహ్‌యే ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించినవాడనీ 62 మరియు వారివంటి వారినీ సృష్టించగల సమర్థుడనీ మరియు ఆయనే వారి కొరకు ఒక నిర్ణీత సమయాన్ని నియమించాడనీ, 63 దానిని (ఆ సమయాన్ని) గురించి ఎలాంటి సందేహంలేదనీ; అయినా ఈ దుర్మార్గులు మొండిగా సత్యాన్ని తిరస్కరించ టానికే పూనుకున్నారు.

17:100 – قُل لَّوْ أَنتُمْ تَمْلِكُونَ خَزَائِنَ رَحْمَةِ رَبِّي إِذًا لَّأَمْسَكْتُمْ خَشْيَةَ الْإِنفَاقِ ۚ وَكَانَ الْإِنسَانُ قَتُورًا ١٠٠

వారితో అను: ”ఒకవేళ మీరు నా ప్రభువు యొక్క అనుగ్రహపు నిధులను పొందివున్నా, అవి ఖర్చయిపోతాయేమోననే భయంతో వాటిని మీరు పట్టుకొని (ఖర్చుచేయకుండా) ఉండేవారు. 64 మరియు వాస్తవానికి మానవుడు ఎంతో లోభి!”

17:101 – وَلَقَدْ آتَيْنَا مُوسَىٰ تِسْعَ آيَاتٍ بَيِّنَاتٍ ۖ فَاسْأَلْ بَنِي إِسْرَائِيلَ إِذْ جَاءَهُمْ فَقَالَ لَهُ فِرْعَوْنُ إِنِّي لَأَظُنُّكَ يَا مُوسَىٰ مَسْحُورًا ١٠١

మరియు మేము వాస్తవానికి, మూసాకు స్పష్టమైన తొమ్మిది అద్భుత సూచనలను ప్రసాదించాము. 65 ఇస్రాయీ’ల్‌ సంతతి వారిని అడుగు, అతను (మూసా) వారి వద్దకు వచ్చి నపుడు ఫిర్‌’ఔన్‌ అతనితో అన్నాడు: ”ఓ మూసా! నిశ్చయంగా, నీవు మంత్రజాలానికి గురి అయ్యావని నేను భావిస్తున్నాను.”

17:102 – قَالَ لَقَدْ عَلِمْتَ مَا أَنزَلَ هَـٰؤُلَاءِ إِلَّا رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ بَصَائِرَ وَإِنِّي لَأَظُنُّكَ يَا فِرْعَوْنُ مَثْبُورًا ١٠٢

(మూసా) అన్నాడు: ”నీకు బాగా తెలుసు జ్ఞానవృధ్ధికలుగజేసే వాటిని (సూచనలను) భూమ్యా కాశాలప్రభువు తప్ప మరెవ్వరూ అవత రింపజేయలేరని! మరియు ఓఫిర్‌’ఔన్‌ నీవు నిశ్చయంగా, నశింపనున్నావని నేను భావిస్తున్నాను.” 66

17:103 – فَأَرَادَ أَن يَسْتَفِزَّهُم مِّنَ الْأَرْضِ فَأَغْرَقْنَاهُ وَمَن مَّعَهُ جَمِيعًا ١٠٣

అప్పుడు అతడు (ఫిర్‌’ఔన్‌) వారిని భూమి (ఈజిప్ట్‌) నుండి వెడలగొట్టాలని సంకల్పించుకున్నాడు. కావున మేము అతనిని (ఫిర్‌’ఔన్‌ను) మరియు అతనితో పాటు ఉన్న వారందరినీ ముంచివేశాము.

17:104 – وَقُلْنَا مِن بَعْدِهِ لِبَنِي إِسْرَائِيلَ اسْكُنُوا الْأَرْضَ فَإِذَا جَاءَ وَعْدُ الْآخِرَةِ جِئْنَا بِكُمْ لَفِيفًا ١٠٤

మరియు ఆ తరువాత, ఇస్రాయీ’ల్ సంతతి వారితో మేము ఇలా అన్నాము: ”మీరు ఈ భూమిలో స్వేచ్ఛగా నివసించండి. కానీ అంతిమ వాగ్దానం ఆసన్న మైనప్పుడు, మేము మీరందరినీ ఒకేచోట చేర్చుతాము.” మరియు మేము దీనిని (ఈ ఖుర్‌ఆన్‌ను) సత్యంతో అవతరింపజేశాము మరియు ఇది సత్యంతోనే అవతరించింది. (ఓ ప్రవక్తా!) మేము

17:105 – وَبِالْحَقِّ أَنزَلْنَاهُ وَبِالْحَقِّ نَزَلَ ۗ وَمَا أَرْسَلْنَاكَ إِلَّا مُبَشِّرًا وَنَذِيرًا ١٠٥

మరియు మేము దీనిని (ఈ ఖుర్‌ఆన్‌ను) సత్యంతో అవతరింపజేశాము మరియు ఇది సత్యంతోనే అవతరించింది. (ఓ ప్రవక్తా!) మేము నిన్ను కేవలం శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము!

17:106 – وَقُرْآنًا فَرَقْنَاهُ لِتَقْرَأَهُ عَلَى النَّاسِ عَلَىٰ مُكْثٍ وَنَزَّلْنَاهُ تَنزِيلًا ١٠٦

వారితో అను: ”మీరు దీనిని (ఈ ఖుర్ఆన్‌ను) నమ్మినా నమ్మక పోయినా; నిశ్చయంగా, ఇది వరకు జ్ఞానమొసంగబడిన వారికి దీనిని వినిపించినప్పుడు వారు తమ ముఖాలమీదపడి సాష్టాంగం (సజ్దా) చేస్తారు.”

17:107 – قُلْ آمِنُوا بِهِ أَوْ لَا تُؤْمِنُوا ۚ إِنَّ الَّذِينَ أُوتُوا الْعِلْمَ مِن قَبْلِهِ إِذَا يُتْلَىٰ عَلَيْهِمْ يَخِرُّونَ لِلْأَذْقَانِ سُجَّدًا ١٠٧

వారితో అను: ”మీరు దీనిని (ఈ ఖుర్ఆన్‌ను) నమ్మినా నమ్మక పోయినా; నిశ్చయంగా, ఇది వరకు జ్ఞానమొసంగబడిన వారికి దీనిని వినిపించినప్పుడు వారు తమ ముఖాలమీదపడి సాష్టాంగం (సజ్దా) చేస్తారు.”

17:108 – وَيَقُولُونَ سُبْحَانَ رَبِّنَا إِن كَانَ وَعْدُ رَبِّنَا لَمَفْعُولً ١٠٨

మరియు ఇలా అంటారు: ”మా ప్రభువు సర్వ లోపాలకు ఆతీతుడు, మా ప్రభువు వాగ్దానం పూర్తయి తీరుతుంది.”

17:109 – وَيَخِرُّونَ لِلْأَذْقَانِ يَبْكُونَ وَيَزِيدُهُمْ خُشُوعًا ۩ ١٠٩

మరియు వారు ఏడుస్తూ, తమ ముఖాల మీద పడిపోతారు. మరియు వారి వినమ్రత మరింత అధికమవుతుంది. (సజ్దా)

17:110 – قُلِ ادْعُوا اللَّـهَ أَوِ ادْعُوا الرَّحْمَـٰنَ ۖ أَيًّا مَّا تَدْعُوا فَلَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ ۚ وَلَا تَجْهَرْ بِصَلَاتِكَ وَلَا تُخَافِتْ بِهَا وَابْتَغِ بَيْنَ ذَٰلِكَ سَبِيلًا ١١٠

వారితో అను: ”మీరు ఆయనను, ‘అల్లాహ్‌!’ అని పిలవండీ, లేదా ‘అనంత కరుణామయుడు (అర్ర’హ్మాన్‌)!’ అని పిలువండీ, మీరు ఆయనను ఏ పేరుతోనైనా పిలవండీ, ఆయనకున్న పేర్లన్నీ అత్యుత్తమమైనవే! నీ నమా’జ్‌లో నీవు చాలా గట్టిగాగానీ, చాలా మెల్లగాగానీ పఠించక, వాటి మధ్య మార్గాన్ని అవలంబించు.”

17:111 – وَقُلِ الْحَمْدُ لِلَّـهِ الَّذِي لَمْ يَتَّخِذْ وَلَدًا وَلَمْ يَكُن لَّهُ شَرِيكٌ فِي الْمُلْكِ وَلَمْ يَكُن لَّهُ وَلِيٌّ مِّنَ الذُّلِّ ۖ وَكَبِّرْهُ تَكْبِيرًا ١١١

ఇంకా ఇలా అను: ”సంతానం లేనటువంటి, తన రాజరికంలో భాగస్వాములు లేనటువంటి, తనలో ఎలాంటి లోపం లేనటువంటి మరియు సహాయకుడి అవసరం లేనటువంటి అల్లాహ్‌యే సర్వస్తోత్రాలకు అర్హుడు. మరియు మీరు ఆయన మహనీయతను గొప్పగా కొనియాడండి!”

సూరహ్‌ అల్‌-కహ్ఫ్ – కహఫున్‌: అంటే గుహ. ఈ సూరహ్‌ మొదటి మరియు చివరి 10 ఆయతులు చదువటం వల్ల దజ్జాల్‌ ఫిత్న నుండి ముక్తి దొరకుతుంది. (‘స. ముస్లిం). జుమ’అహ్‌ రోజు దీనిని చదివితే వచ్చే జుమ’అహ్‌ వరకు, అతని కొరకు ఒక ప్రత్యేక వెలుగు ఉంటుంది. (ముస్తద్రిక్‌ ‘హాకిమ్‌-2/368, అల్బానీ ప్రమాణీకం – 6470) ఇది సూరహ్‌ అన్‌-న’హ్ల్‌ (16) కంటే ముందు అవతరింప జేయబడింది. అంటే చివరి మక్కహ్ కాలంలో. ఇందులో గుహవారు ఎంతోకాలం అందు ఉన్నా ఒక్కరోజు మాత్రమే ఉన్నాము అని భావించిన కథ (10-27) ఆయత్‌లలో; అల్లాహ్‌ (సు.త.) ప్రసాదించిన ధనసంపత్తులకు గర్వితుడై, తన తోటివానిని హేళనచేసి అంతా పోగొట్టుకున్న వాని కథ (32-44) ఆయత్‌లలో; మూసా (‘అ.స.), అల్‌-‘ఖి’ద్ర్‌ (‘అ.స.) నుండి నేర్చుకున్న విషయాల గాథ (60-82) ఆయత్‌లలో మరియు జుల్‌-ఖర్ నైన్‌ తూర్పు పడమరలకు ప్రయాణించి యా’జూజ్‌-మా’జూజ్‌లు రాకుండా లోహాలతో గోడనిర్మించి అక్కడి ప్రజలను కాపాడిన కథ (83-98) ఆయత్‌లలో ఉన్నాయి. ఈ సూరహ్‌ సారాంశం 7వ ఆయత్‌లో ఉంది: ‘నిశ్చయంగా – ప్రజలలో మంచిపనులు చేసేవారు ఎవరో పరీక్షించటానికి – మేము భూమిపై ఉన్న వస్తువులను దానికి అలంకారంగా (ఆకర్షణీయమైనవిగా) చేశాము.’ ఇందులో 110 ఆయతులు ఉన్నాయి. దీనిపేరు 10వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 18:1 – الْحَمْدُ لِلَّـهِ الَّذِي أَنزَلَ عَلَىٰ عَبْدِهِ الْكِتَابَ وَلَمْ يَجْعَل لَّهُ عِوَجًا ۜ ١

తన దాసుని పై (ము’హమ్మద్‌పై) ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్‌ను) అవతరింపజేసిన అల్లాహ్‌ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. మరియు ఆయన ఇందులో ఏవిధమైన వక్రత్వాన్ని ఉంచలేదు. 1

18:2 – قَيِّمًا لِّيُنذِرَ بَأْسًا شَدِيدًا مِّن لَّدُنْهُ وَيُبَشِّرَ الْمُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا حَسَنًا ٢

ఇది సక్రమంగా స్థిరంగా ఉండి, ఆయన నుండి వచ్చే కఠిన శిక్షను గురించి హెచ్చరిస్తుంది మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి మంచి ప్రతిఫలం (స్వర్గం) తప్పక ఉంటుందనే శుభవార్తనూ ఇస్తుంది.

18:3 – مَّاكِثِينَ فِيهِ أَبَدًا ٣

అందులో వారు నిరంతరంగా కలకాల ముంటారు.

18:4 – وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّـهُ وَلَدًا ٤

ఇంకా ఇది: ”అల్లాహ్‌కు సంతానముంది!” అని, అనే వారిని హెచ్చరిస్తుంది.

18:5 – مَّا لَهُم بِهِ مِنْ عِلْمٍ وَلَا لِآبَائِهِمْ ۚ كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ أَفْوَاهِهِمْ ۚ إِن يَقُولُونَ إِلَّا كَذِبًا ٥

ఈ విషయాన్ని గురించి వారికిగానీ, వారి తండ్రి-తాతలకుగానీ ఎలాంటి జ్ఞానం లేదు. వారి నోటినుండి వచ్చే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు పలికేదంతా కేవలం అసత్యమే.

18:6 – فَلَعَلَّكَ بَاخِعٌ نَّفْسَكَ عَلَىٰ آثَارِهِمْ إِن لَّمْ يُؤْمِنُوا بِهَـٰذَا الْحَدِيثِ أَسَفًا ٦

ఈ సందేశాన్ని విశ్వసించని వారి వైఖరి వల్ల దుఃఖపడి బహుశా నీవు నీ ప్రాణాన్నే కోల్పోతావేమో!

18:7 – إِنَّا جَعَلْنَا مَا عَلَى الْأَرْضِ زِينَةً لَّهَا لِنَبْلُوَهُمْ أَيُّهُمْ أَحْسَنُ عَمَلً ٧

నిశ్చయంగా – ప్రజలలో మంచి పనులు చేసే వారు ఎవరో పరీక్షించటానికి – మేము భూమిపై ఉన్న వస్తువులను దానికి అలంకారంగా (ఆకర్ష ణీయ మైనవిగా) చేశాము.

18:8 – وَإِنَّا لَجَاعِلُونَ مَا عَلَيْهَا صَعِيدًا جُرُزًا ٨

మరియు నిశ్చయంగా, మేమే దానిపై ఉన్న దాన్నంతటినీ చదునైన మైదానం (బంజరునేల) గా మార్చగలము.

18:9 – أَمْ حَسِبْتَ أَنَّ أَصْحَابَ الْكَهْفِ وَالرَّقِيمِ كَانُوا مِنْ آيَاتِنَا عَجَبًا ٩

ఏమీ? నిశ్చయంగా, ఆ గుహవాసులు మరియు ఆ శిలాఫలకంవారు, మా (ఇతర) సూచనలన్నిటిలో అద్భుతమైనవని నీవు భావించావా? 2

18:10 – إِذْ أَوَى الْفِتْيَةُ إِلَى الْكَهْفِ فَقَالُوا رَبَّنَا آتِنَا مِن لَّدُنكَ رَحْمَةً وَهَيِّئْ لَنَا مِنْ أَمْرِنَا رَشَدًا ١٠

(జ్ఞాపకం చేసుకోండి) ఎప్పుడైతే ఆ యువకులు ఆ గుహలో ఆశ్రయం పొందారో, ఇలా ప్రార్థించారు: ”ఓ మా ప్రభూ! మాపై నీ కారుణ్యాన్ని ప్రసాదించు. మరియు మా వ్యవహారంలో మేము నీతిపరులమై ఉండేటట్లు మమ్మల్ని సరిదిద్దు!”

18:11 – فَضَرَبْنَا عَلَىٰ آذَانِهِمْ فِي الْكَهْفِ سِنِينَ عَدَدًا ١١

కావున ఆ గుహలో, కొన్నిసంవత్సరాల వరకు మేము వారి చెవులను మూసివేశాము. 3

18:12 – ثُمَّ بَعَثْنَاهُمْ لِنَعْلَمَ أَيُّ الْحِزْبَيْنِ أَحْصَىٰ لِمَا لَبِثُوا أَمَدًا ١٢

ఆ తరువాత, ఆ రెండు పక్షాలవారిలో 4 ఎవరు వారి (గుహలో) నివసించినకాలాన్ని సరిగ్గా లెక్కపెడతారో చూద్దామని వారిని లేపాము.

18:13 – نَّحْنُ نَقُصُّ عَلَيْكَ نَبَأَهُم بِالْحَقِّ ۚ إِنَّهُمْ فِتْيَةٌ آمَنُوا بِرَبِّهِمْ وَزِدْنَاهُمْ هُدًى ١٣

మేము వారి యథార్థగాథ నీకు వినిపిస్తు న్నాము. నిశ్చయంగా, వారు తమ ప్రభువును విశ్వసించిన కొందరు యువకులు; 5 మేము వారి మార్గదర్శకత్వాన్ని అధికంచేశాము.

18:14 – وَرَبَطْنَا عَلَىٰ قُلُوبِهِمْ إِذْ قَامُوا فَقَالُوا رَبُّنَا رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ لَن نَّدْعُوَ مِن دُونِهِ إِلَـٰهًا ۖ لَّقَدْ قُلْنَا إِذًا شَطَطًا ١٤

మరియు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని ప్రసాదించాము. వారు లేచి నిలబడి నప్పుడు ఇలాఅన్నారు: ”భూమ్యాకాశాల ప్రభువే మాప్రభువు! ఆయననువదలి మేము వేరేదైవాన్ని ఎలాంటి స్థితిలోనూ ప్రార్థించము. వాస్తవానికి అలా చేస్తే దారుణం చేసిన వారమవుతాము!

18:15 – هَـٰؤُلَاءِ قَوْمُنَا اتَّخَذُوا مِن دُونِهِ آلِهَةً ۖ لَّوْلَا يَأْتُونَ عَلَيْهِم بِسُلْطَانٍ بَيِّنٍ ۖ فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّـهِ كَذِبًا ١٥

”ఈ, మా జాతివారు ఆయనను విడిచి ఇతర దైవాలను నియమించుకున్నారు. అయితే, వారిని (ఆ దైవాలను) గురించి వారు స్పష్టమైన ప్రమాణాన్ని ఎందుకు తీసుకురారు? ఇక అల్లాహ్‌పై అబద్ధాలు కల్పించేవాని కంటే మించిన దుర్మార్గుడు ఎవడు?”

18:16 – وَإِذِ اعْتَزَلْتُمُوهُمْ وَمَا يَعْبُدُونَ إِلَّا اللَّـهَ فَأْوُوا إِلَى الْكَهْفِ يَنشُرْ لَكُمْ رَبُّكُم مِّن رَّحْمَتِهِ وَيُهَيِّئْ لَكُم مِّنْ أَمْرِكُم مِّرْفَقًا ١٦

(వారు పరస్పరం ఇలా అనుకున్నారు): ”ఇపుడు మీరు వారిని మరియు అల్లాహ్‌ను కాదని వారు ఆరాధించే దైవాలను విడిచి, గుహలో శరణు తీసుకోండి. మీ ప్రభువు తన కారుణ్యాన్ని మీపై విస్తరింపజేస్తాడు మరియు మీ కార్యాలను సరిదిద్ది వాటిని మీకు సులభమైనట్లుగా చేస్తాడు.” (5/8)

18:17 – وَتَرَى الشَّمْسَ إِذَا طَلَعَت تَّزَاوَرُ عَن كَهْفِهِمْ ذَاتَ الْيَمِينِ وَإِذَا غَرَبَت تَّقْرِضُهُمْ ذَاتَ الشِّمَالِ وَهُمْ فِي فَجْوَةٍ مِّنْهُ ۚ ذَٰلِكَ مِنْ آيَاتِ اللَّـهِ ۗ مَن يَهْدِ اللَّـهُ فَهُوَ الْمُهْتَدِ ۖ وَمَن يُضْلِلْ فَلَن تَجِدَ لَهُ وَلِيًّا مُّرْشِدًا ١٧

  • మరియు వారు (ఆ గుహలోని) ఒక విశాలమైన భాగంలో (నిద్రిస్తూ) ఉన్నప్పుడు; సూర్యుడు ఉదయించేటప్పుడు (ఎండ) వారి గుహ నుండి కుడిప్రక్కకు వాలి పోవటాన్ని మరియు అస్తమించేటప్పుడు (ఎండ) ఎడమ ప్రక్కకు తొలగిపోవటాన్ని నీవు చూసి ఉంటావు. ఇది అల్లాహ్‌ సూచనలలో ఒకటి. అల్లాహ్‌ మార్గ దర్శకత్వం చేసినవాడే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గ భ్రష్టత్వంలో వదలిన వాడికి సరైన మార్గం చూపే సంరక్షకుణ్ణి నీవు పొందలేవు.

18:18 – وَتَحْسَبُهُمْ أَيْقَاظًا وَهُمْ رُقُودٌ ۚ وَنُقَلِّبُهُمْ ذَاتَ الْيَمِينِ وَذَاتَ الشِّمَالِ ۖ وَكَلْبُهُم بَاسِطٌ ذِرَاعَيْهِ بِالْوَصِيدِ ۚ لَوِ اطَّلَعْتَ عَلَيْهِمْ لَوَلَّيْتَ مِنْهُمْ فِرَارًا وَلَمُلِئْتَ مِنْهُمْ رُعْبًا ١٨

మరియు వారు నిద్ర పోతున్నప్పటికీ, నీవు వారిని మేల్కొని ఉన్నారనే భావించి ఉంటావు! మరియు మేము వారిని కుడి ప్రక్కకు మరియు ఎడమ ప్రక్కకు మరలించే వారము. మరియు వారి కుక్క గుహద్వారం వద్ద తన ముందు కాళ్ళనుచాచి పడి ఉండెను. ఒకవేళ నీవు వారిని తొంగిచూసి ఉంటే, నీవు తప్పక వెనుదిరిగి పారి పోయేవాడవు మరియు వారిని గురించి భయకంపి తుడవై పోయేవాడవు.

18:19 – وَكَذَٰلِكَ بَعَثْنَاهُمْ لِيَتَسَاءَلُوا بَيْنَهُمْ ۚ قَالَ قَائِلٌ مِّنْهُمْ كَمْ لَبِثْتُمْ ۖ قَالُوا لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ ۚ قَالُوا رَبُّكُمْ أَعْلَمُ بِمَا لَبِثْتُمْ فَابْعَثُوا أَحَدَكُم بِوَرِقِكُمْ هَـٰذِهِ إِلَى الْمَدِينَةِ فَلْيَنظُرْ أَيُّهَا أَزْكَىٰ طَعَامًا فَلْيَأْتِكُم بِرِزْقٍ مِّنْهُ وَلْيَتَلَطَّفْ وَلَا يُشْعِرَنَّ بِكُمْ أَحَدًا ١٩

మరియు ఈ విధంగా (ఉన్న తరువాత), వారు ఒకరినొకరు ప్రశ్నించుకోవటానికి మేము వారిని (నిద్రనుండి) లేపాము. వారిలో నుండి ఒకడు మాట్లాడుతూ ఇలా అన్నాడు: ”మీరు ఈ స్థితిలో ఎంతకాలమున్నారు?” వారన్నారు: ”మేము ఒక దినమో లేదా అంతకంటే తక్కువనో ఈ స్థితిలో ఉన్నాము.” 6 (మరికొందరు) ఇలా అన్నారు: ”మీరెంత కాలమున్నారో మీ ప్రభువుకే తెలుసు! మీలో ఒకనికి నాణ్యం (డబ్బు) ఇచ్చి పట్టణానికి పంపండి. అతడు అక్కడ శ్రేష్ఠమైన ఆహారాన్ని వెతికి, దానినే మీ కొరకు తినటానికి తెస్తాడు. అతడు జాగ్రత్తగా వ్యవహరించాలి మరియు మీ గురించి ఎవ్వడికీ తెలియనివ్వగూడదు.

18:20 – إِنَّهُمْ إِن يَظْهَرُوا عَلَيْكُمْ يَرْجُمُوكُمْ أَوْ يُعِيدُوكُمْ فِي مِلَّتِهِمْ وَلَن تُفْلِحُوا إِذًا أَبَدًا ٢٠

”ఒకవేళ వారు మిమ్మల్ని గుర్తుపడితే, వారు తప్పక మిమ్మల్ని రాళ్ళురువ్వి చంపు తారు లేదా (బలవంతంగా) మిమ్మల్ని వారి మతంలోకి త్రిప్పుకుంటారు, అలాంటప్పుడు మీరు ఎలాంటి సాఫల్యం పొందలేరు.”

18:21 – وَكَذَٰلِكَ أَعْثَرْنَا عَلَيْهِمْ لِيَعْلَمُوا أَنَّ وَعْدَ اللَّـهِ حَقٌّ وَأَنَّ السَّاعَةَ لَا رَيْبَ فِيهَا إِذْ يَتَنَازَعُونَ بَيْنَهُمْ أَمْرَهُمْ ۖ فَقَالُوا ابْنُوا عَلَيْهِم بُنْيَانًا ۖ رَّبُّهُمْ أَعْلَمُ بِهِمْ ۚ قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا ٢١

మరియు ఈ విధంగా అల్లాహ్‌ వాగ్దానం సత్యమని చివరిగడియ నిశ్చయమని, అది రావటంలో ఎలాంటి సందేహంలేదని తెలుసుకోవ టానికి, ఆ యువకుల విషయం ప్రజలకు తెలియ జేశాము. అప్పుడు వారు (ప్రజలు) వారి (గుహ వాసుల) విషయాన్ని తీసుకొని పరస్పరం వాదులాడుకున్న విషయం (జ్ఞాపకం చేసుకోండి!) వారిలో కొందరన్నారు: ”వారి కొరకు ఒక స్మారక భవనం నిర్మించాలి.” వారి విషయం వారి ప్రభువుకే తెలుసు. ఆ వ్యవహారంలో పైచేయి (ప్రాబల్యం) ఉన్నవారు: ”వారి స్మారకంగా ఒక మస్జిద్‌ను నిర్మించాలి.” అని అన్నారు.

18:22 – سَيَقُولُونَ ثَلَاثَةٌ رَّابِعُهُمْ كَلْبُهُمْ وَيَقُولُونَ خَمْسَةٌ سَادِسُهُمْ كَلْبُهُمْ رَجْمًا بِالْغَيْبِ ۖ وَيَقُولُونَ سَبْعَةٌ وَثَامِنُهُمْ كَلْبُهُمْ ۚ قُل رَّبِّي أَعْلَمُ بِعِدَّتِهِم مَّا يَعْلَمُهُمْ إِلَّا قَلِيلٌ ۗ فَلَا تُمَارِ فِيهِمْ إِلَّا مِرَاءً ظَاهِرًا وَلَا تَسْتَفْتِ فِيهِم مِّنْهُمْ أَحَدًا ٢٢

(వారి సంఖ్యను గురించి) కొందరంటారు: ”వారు ముగ్గురు, నాలుగవది వారి కుక్క.” మరి కొందరంటారు: ”వారు అయిదుగురు, ఆరవది వారి కుక్క.” ఇవి వారి ఊహాగానాలే. ఇంకా కొంద రంటారు: ”వారు ఏడుగురు, ఎనిమిదవది వారి కుక్క.” వారితో అను: ”వారి సంఖ్య కేవలం నా ప్రభువుకేతెలుసు. వారినిగురించికొందరికిమాత్రమే తెలుసు.” కావున నిదర్శనంలేనిదే వారిని గురించి వాదించకు. మరియు (గుహ) వారిని గురించి వీరిలో ఎవ్వరితోనూ విచారణ చేయకు.

18:23 – وَلَا تَقُولَنَّ لِشَيْءٍ إِنِّي فَاعِلٌ ذَٰلِكَ غَدًا ٢٣

మరియు ఏవిషయాన్ని గురించి అయినా: ”నేను ఈ పనిని రేపుచేస్తాను.” అని అనకు –

18:24 – إِلَّا أَن يَشَاءَ اللَّـهُ ۚ وَاذْكُر رَّبَّكَ إِذَا نَسِيتَ وَقُلْ عَسَىٰ أَن يَهْدِيَنِ رَبِّي لِأَقْرَبَ مِنْ هَـٰذَا رَشَدًا ٢٤

”అల్లాహ్‌ కోరితే తప్ప (ఇన్షా’ అల్లా)!” – అని, అననిదే. 7 మరియు నీ ప్రభువును స్మరించు, ఒకవేళ నీవు మరచిపోతే! ఇలా ప్రార్థించు: ”బహుశా నా ప్రభువు నాకు సన్మార్గం వైపునకు దీనికంటే దగ్గరిత్రోవ చూపుతాడేమో!”

18:25 – وَلَبِثُوا فِي كَهْفِهِمْ ثَلَاثَ مِائَةٍ سِنِينَ وَازْدَادُوا تِسْعًا ٢٥

మరియు వారు తమ గుహలో మూడు వందల సంవత్సరాలు ఉన్నారు. మరియు వాటి మీద తొమ్మిది సంవత్సరాలు అధికం. 8

18:26 – قُلِ اللَّـهُ أَعْلَمُ بِمَا لَبِثُوا ۖ لَهُ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ أَبْصِرْ بِهِ وَأَسْمِعْ ۚ مَا لَهُم مِّن دُونِهِ مِن وَلِيٍّ وَلَا يُشْرِكُ فِي حُكْمِهِ أَحَدًا ٢٦

వారితో అను: ”వారెంతకాలం (గుహలో) ఉన్నారో అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న సమస్త అగోచర విషయాలు కేవలం ఆయనకే తెలుసు. ఆయన అంతా చూడగలడు మరియు వినగలడు. వారికి ఆయన తప్ప మరొక సంరక్షకుడు లేడు మరియు ఆయన తన ఆధిపత్యంలో ఎవ్వడినీ భాగస్వామిగా చేర్చుకోడు.”

18:27 – وَاتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِن كِتَابِ رَبِّكَ ۖ لَا مُبَدِّلَ لِكَلِمَاتِهِ وَلَن تَجِدَ مِن دُونِهِ مُلْتَحَدًا ٢٧

మరియు (ఓ ప్రవక్తా!) నీ ప్రభువు గ్రంథం నుండి నీపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానాన్ని (వ’హీని) చదివి వినిపించు. 9 ఆయన ప్రవచనాలను ఎవ్వడూ మార్చలేడు. మరియు ఆయన వద్ద తప్ప నీవు మరెక్కడా శరణు పొందలేవు. 10

18:28 – وَاصْبِرْ نَفْسَكَ مَعَ الَّذِينَ يَدْعُونَ رَبَّهُم بِالْغَدَاةِ وَالْعَشِيِّ يُرِيدُونَ وَجْهَهُ ۖ وَلَا تَعْدُ عَيْنَاكَ عَنْهُمْ تُرِيدُ زِينَةَ الْحَيَاةِ الدُّنْيَا ۖ وَلَا تُطِعْ مَنْ أَغْفَلْنَا قَلْبَهُ عَن ذِكْرِنَا وَاتَّبَعَ هَوَاهُ وَكَانَ أَمْرُهُ فُرُطًا ٢٨

మరియు (ఓ ప్రవక్తా!) ఎవరు ఆయన ముఖదర్శనం (ప్రసన్నతను) కోరుతూ, ఉదయం మరియు సాయంత్రం తమ ప్రభువును ప్రార్థిస్తున్నారో, వారి సహచర్యంలోనే, సహనం వహించి ఉండు. ఇహలోక ఆడంబరాలను అపేక్షించి నీ దృష్టిని వారి నుండి దాటనివ్వకు (వారిని ఉపేక్షించకు). 11 మరియు అలాంటి వానిని అనుసరించకు (మాటవినకు), ఎవడి హృదయాన్ని మా ధ్యానం నుండి తొలగించామో మరియు ఎవడు తన మనోవాంఛలను అనుసరిస్తున్నాడో మరియు ఎవడి వ్యవహారాలు (కర్మలు) వ్యర్థమయ్యాయో!

18:29 – وَقُلِ الْحَقُّ مِن رَّبِّكُمْ ۖ فَمَن شَاءَ فَلْيُؤْمِن وَمَن شَاءَ فَلْيَكْفُرْ ۚ إِنَّا أَعْتَدْنَا لِلظَّالِمِينَ نَارًا أَحَاطَ بِهِمْ سُرَادِقُهَا ۚ وَإِن يَسْتَغِيثُوا يُغَاثُوا بِمَاءٍ كَالْمُهْلِ يَشْوِي الْوُجُوهَ ۚ بِئْسَ الشَّرَابُ وَسَاءَتْ مُرْتَفَقًا ٢٩

మరియు వారితో అను: ”ఇది మీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కావున ఇష్టపడిన వారు దీనిని విశ్వసించవచ్చు మరియు ఇష్టపడని వారు దీనిని తిరస్కరించవచ్చు!” నిశ్చయంగా, మేము దుర్మార్గుల కొరకు నరకాగ్నిని సిధ్ధపరచి ఉంచాము, దాని జ్వాలలు వారిని చుట్టు కుంటాయి. అక్కడ వారు నీటి కొరకు మొరపెట్టు కున్నప్పుడు, వారికి ముఖాలను మాడ్చే (మరిగే) నూనెవంటి నీరు (అల్‌-ముహ్లు) ఇవ్వబడుతుంది. అది ఎంత చెడ్డ పానీయం మరియు ఎంత చెడ్డ (దుర్భరమైన) విరామస్థలం!

18:30 – إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ إِنَّا لَا نُضِيعُ أَجْرَ مَنْ أَحْسَنَ عَمَلً ٣٠

నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో, నిశ్చయంగా మేము అలాంటి వారి మంచి పనుల ప్రతిఫలాన్ని వృథా కానివ్వము. 12

18:31 – أُولَـٰئِكَ لَهُمْ جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِن تَحْتِهِمُ الْأَنْهَارُ يُحَلَّوْنَ فِيهَا مِنْ أَسَاوِرَ مِن ذَهَبٍ وَيَلْبَسُونَ ثِيَابًا خُضْرًا مِّن سُندُسٍ وَإِسْتَبْرَقٍ مُّتَّكِئِينَ فِيهَا عَلَى الْأَرَائِكِ ۚ نِعْمَ الثَّوَابُ وَحَسُنَتْ مُرْتَفَقًا ٣١

అలాంటి వారు! వారి కొరకు క్రింద సెల యేళ్ళు ప్రవహించే శాశ్వత స్వర్గవనాలు ఉంటాయి. అందు వారు బంగారు కంకణాలను మరియు ఆకుపచ్చని బంగారు జలతారు గల పట్టువస్త్రాలను ధరించి, ఎత్తైన ఆసనాలపై దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. 13 ఎంత మంచి ప్రతిఫలం మరియు ఎంత శ్రేష్టమైన విరామస్థలం! (3/4)

18:32 – وَاضْرِبْ لَهُم مَّثَلًا رَّجُلَيْنِ جَعَلْنَا لِأَحَدِهِمَا جَنَّتَيْنِ مِنْ أَعْنَابٍ وَحَفَفْنَاهُمَا بِنَخْلٍ وَجَعَلْنَا بَيْنَهُمَا زَرْعًا ٣٢

  • మరియు వారికి ఆ ఇద్దరు మనుష్యుల ఉదాహరణ తెలుపు: వారిద్దరిలో ఒకనికి మేము రెండు ద్రాక్షతోటలను ప్రసాదించి, వాటి చుట్టు ఖర్జూరపు చెట్లను మరియు వాటి మధ్య పంటపొలాన్ని ఏర్పరిచాము.

18:33 – كِلْتَا الْجَنَّتَيْنِ آتَتْ أُكُلَهَا وَلَمْ تَظْلِم مِّنْهُ شَيْئًا ۚ وَفَجَّرْنَا خِلَالَهُمَا نَهَرًا ٣٣

ఆ రెండు తోటలు, ఏ కొరతా లేకుండా (పుష్కలంగా) పంటలిచ్చేవి. మరియు వాటి మధ్య మేము ఒక సెలయేరును ప్రవహింపజేశాము.

18:34 – وَكَانَ لَهُ ثَمَرٌ فَقَالَ لِصَاحِبِهِ وَهُوَ يُحَاوِرُهُ أَنَا أَكْثَرُ مِنكَ مَالًا وَأَعَزُّ نَفَرًا ٣٤

మరియు అతనికి పుష్కలమైన ఫలాలు పండేవి (లాభాలువచ్చేవి). మరియు అతడు తన పొరుగు వాడితో మాట్లాడుతూ అన్నాడు: ”నేను నీకంటే ఎక్కువ ధనవంతుణ్ణి మరియు నా వద్ద బలవంతులైన మనుషులు కూడా ఉన్నారు.”

18:35 – وَدَخَلَ جَنَّتَهُ وَهُوَ ظَالِمٌ لِّنَفْسِهِ قَالَ مَا أَظُنُّ أَن تَبِيدَ هَـٰذِهِ أَبَدًا ٣٥

మరియు ఈ విధంగా అతడు తనకు తాను అన్యాయం చేసుకునే వాడవుతూ, తన తోటలో ప్రవేశించి ఇలా అన్నాడు: ”ఇది ఎన్నటికైనా నాశన మవుతుందని నేను భావించను!

18:36 – وَمَا أَظُنُّ السَّاعَةَ قَائِمَةً وَلَئِن رُّدِدتُّ إِلَىٰ رَبِّي لَأَجِدَنَّ خَيْرًا مِّنْهَا مُنقَلَبًا ٣٦

”మరియు అంతిమ గడియ కూడా వస్తుందని నేను భావించను, ఒకవేళ నా ప్రభువు వద్దకు నేను తిరిగి మరలింపబడినా, అచ్చట నేను దీనికంటే మేలైన స్థానాన్నే పొందగలను.” 14

18:37 – قَالَ لَهُ صَاحِبُهُ وَهُوَ يُحَاوِرُهُ أَكَفَرْتَ بِالَّذِي خَلَقَكَ مِن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ سَوَّاكَ رَجُلًا ٣٧

అతని పొరుగు వాడు అతనితో మాట్లా డుతూ అన్నాడు: ”నిన్ను మట్టితో, 15 తరువాత ఇంద్రియ బిందువుతో సృష్టించి, ఆ తరువాత నిన్ను (సంపూర్ణ) మానవునిగా తీర్చిదిద్దిన ఆయన (అల్లాహ్‌)ను నీవు తిరస్కరిస్తున్నావా?

18:38 – لَّـٰكِنَّا هُوَ اللَّـهُ رَبِّي وَلَا أُشْرِكُ بِرَبِّي أَحَدًا ٣٨

”కాని నిశ్చయంగా నా మట్టుకు మాత్రం, ఆయన! అల్లాహ్‌యే నా ప్రభువు మరియు నేను ఎవ్వడినీ నా ప్రభువుకు భాగస్వామి (సాటి) గా కల్పించను.

18:39 – وَلَوْلَا إِذْ دَخَلْتَ جَنَّتَكَ قُلْتَ مَا شَاءَ اللَّـهُ لَا قُوَّةَ إِلَّا بِاللَّـهِ ۚ إِن تَرَنِ أَنَا أَقَلَّ مِنكَ مَالًا وَوَلَدًا ٣٩

”మరియు ఒకవేళ నీవు, నన్ను సంపదలో మరియు సంతానంలో నీ కంటే తక్కువగా తలచి నప్పటికీ, నీవు నీ తోటలో ప్రవేశించినపుడు: ‘అల్లాహ్‌ కోరిందే అవుతుంది (మాషా’ అల్లాహ్‌), సర్వ శక్తికి ఆధారభూతుడు కేవలం అల్లాహ్‌యే (లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్)!’ అని, అని వుంటే ఎంతబాగుండేది.

18:40 – فَعَسَىٰ رَبِّي أَن يُؤْتِيَنِ خَيْرًا مِّن جَنَّتِكَ وَيُرْسِلَ عَلَيْهَا حُسْبَانًا مِّنَ السَّمَاءِ فَتُصْبِحَ صَعِيدًا زَلَقًا ٤٠

”వాస్తవానికి నా ప్రభువు, నీ తోట కంటే ఉత్తమమైన దానిని నాకు ప్రసాదించి, దాని (నీ తోట) పైకి ఆకాశం నుండి ఒక పెద్ద ఆపదను పంపి, దానిని చదునైన మైదానంగా చేయవచ్చు!

18:41 – أَوْ يُصْبِحَ مَاؤُهَا غَوْرًا فَلَن تَسْتَطِيعَ لَهُ طَلَبًا ٤١

”లేదా! దాని నీటిని భూమిలో ఇంకిపోయి నట్లు చేస్తే, నీవు దానిని ఏవిధంగానూ, తిరిగి పొందలేవు!”

18:42 – وَأُحِيطَ بِثَمَرِهِ فَأَصْبَحَ يُقَلِّبُ كَفَّيْهِ عَلَىٰ مَا أَنفَقَ فِيهَا وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا وَيَقُولُ يَا لَيْتَنِي لَمْ أُشْرِكْ بِرَبِّي أَحَدًا ٤٢

మరియు అతని పంటను (వినాశం) చుట్టు ముట్టింది, అతడు తాను ఖర్చు చేసినదంతా నాశనమైనదని చేతులు నలుపుకుంటూ ఉండి పోయాడు. మరియు అది దాని పందిరితోసహా నాశనమై పోయింది. మరియు అతడు ఇలా వాపోయాడు: ”అయ్యో నా దౌర్భాగ్యం! నేను నా ప్రభువుకు భాగస్వాములను (షరీక్‌లను) కల్పించ కుండా ఉంటే ఎంత బాగుండేది!”

18:43 – وَلَمْ تَكُن لَّهُ فِئَةٌ يَنصُرُونَهُ مِن دُونِ اللَّـهِ وَمَا كَانَ مُنتَصِرًا ٤٣

మరియు అల్లాహ్‌కు విరుద్ధంగా అతనికి సహాయపడే వారెవ్వరూ లేక పోయారు. మరియు అతడు కూడా తనకుతాను సహాయం చేసుకోలేక పోయాడు.

18:44 – هُنَالِكَ الْوَلَايَةُ لِلَّـهِ الْحَقِّ ۚ هُوَ خَيْرٌ ثَوَابًا وَخَيْرٌ عُقْبًا ٤٤

అక్కడ (ఆ తీర్పు దినం నాడు) 16 శరణు (రక్షణ) కేవలం అల్లాహ్‌, ఆ సత్యవంతునిదే! ఆయనే ప్రతిఫలం ఇవ్వటంలో ఉత్తముడు మరియు అత్యుత్తమ అంతిమ ఫలితం ఇచ్చేవాడు.

18:45 – وَاضْرِبْ لَهُم مَّثَلَ الْحَيَاةِ الدُّنْيَا كَمَاءٍ أَنزَلْنَاهُ مِنَ السَّمَاءِ فَاخْتَلَطَ بِهِ نَبَاتُ الْأَرْضِ فَأَصْبَحَ هَشِيمًا تَذْرُوهُ الرِّيَاحُ ۗ وَكَانَ اللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ مُّقْتَدِرًا ٤٥

మరియు వారికి ఇహలోక జీవితాన్ని 17 ఈ ఉపమానం ద్వారా బోధించు: మేము ఆకాశంనుండి నీటిని కురిపించినపుడు, దానిని భూమిలోని చెట్టూ చేమలు పీల్చుకొని (పచ్చగా పెరుగు తాయి). ఆ తరువాత అవి ఎండి పొట్టుగా మారి పోయినపుడు, గాలి వాటిని చెల్లాచెదురు చేస్తుంది. మరియు వాస్తవానికి అల్లాహ్‌యే ప్రతిదీ చేయగల సమర్థుడు.

18:46 – الْمَالُ وَالْبَنُونَ زِينَةُ الْحَيَاةِ الدُّنْيَا ۖ وَالْبَاقِيَاتُ الصَّالِحَاتُ خَيْرٌ عِندَ رَبِّكَ ثَوَابًا وَخَيْرٌ أَمَلً ٤٦

ఈ సంపదా మరియు ఈ సంతానం, కేవలం ఐహిక జీవితపు అలంకారాలు మాత్రమే. కాని శాశ్వతంగా నిలిచేవి సత్కార్యాలే! అవే నీ ప్రభువు దృష్టిలో ప్రతిఫలానికి ఉత్తమమైనవి మరియు దానిని ఆశించటానికి కూడా ఉత్తమమైనవి. 18

18:47 – وَيَوْمَ نُسَيِّرُ الْجِبَالَ وَتَرَى الْأَرْضَ بَارِزَةً وَحَشَرْنَاهُمْ فَلَمْ نُغَادِرْ مِنْهُمْ أَحَدًا ٤٧

మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆ రోజున మేము పర్వతాలను చలింపజేస్తాము. 19 మరియు నీవు భూమిని చదునైన మైదానంగా చూస్తావు. మరియు మేము ఒక్కడిని కూడా విడువకుండా అందరినీ సమావేశపరుస్తాము.

18:48 – وَعُرِضُوا عَلَىٰ رَبِّكَ صَفًّا لَّقَدْ جِئْتُمُونَا كَمَا خَلَقْنَاكُمْ أَوَّلَ مَرَّةٍ ۚ بَلْ زَعَمْتُمْ أَلَّن نَّجْعَلَ لَكُم مَّوْعِدًا ٤٨

మరియు వారందరు నీ ప్రభువు సన్నిధిలో వరుసలలో ప్రవేశపెట్టడతారు, (నీ ప్రభువు వారితో): ”వాస్తవానికి మేము మొదటి సారి మిమ్మల్ని పుట్టించిన స్థితిలోనే 20 మీరు మా వద్దకు వచ్చారు! కాని మా ముందు హాజరయ్యే ఘడియను మేము నియమించలేదని మీరు భావించేవారు కదా!” అని పలుకుతాడు.

18:49 – وَوُضِعَ الْكِتَابُ فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ وَيَقُولُونَ يَا وَيْلَتَنَا مَالِ هَـٰذَا الْكِتَابِ لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً إِلَّا أَحْصَاهَا ۚ وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا ۗ وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا ٤٩

మరియు కర్మపత్రం వారిముందు ఉంచబడి నపుడు, ఆ అపరాధులు, అందులో ఉన్నదానిని చూసి భయపడటాన్ని నీవు చూస్తావు. వారు ఇలా అంటారు: ”అయ్యో! మా దౌర్భాగ్యం ఇదేమి గ్రంథం! ఏ చిన్న విషయాన్నిగానీ, ఏ పెద్ద విష యాన్నిగానీ ఇది లెక్కపెట్టకుండా విడువలేదే!” తాము చేసిందంతా వారు తమ ఎదుట పొందు తారు. నీ ప్రభువు ఎవ్వరికీ అన్యాయం చేయడు.

18:50 – وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ كَانَ مِنَ الْجِنِّ فَفَسَقَ عَنْ أَمْرِ رَبِّهِ ۗ أَفَتَتَّخِذُونَهُ وَذُرِّيَّتَهُ أَوْلِيَاءَ مِن دُونِي وَهُمْ لَكُمْ عَدُوٌّ ۚ بِئْسَ لِلظَّالِمِينَ بَدَلًا ٥٠

మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము దేవదూతలతో: ”ఆదమ్‌కు సాష్టాంగపడండి.” అని చెప్పినపుడు, ఒక్క ఇబ్లీస్‌ తప్ప మిగతా వారందరూ సాష్టాంగపడ్డారు. అతడు జిన్నాతుల లోని వాడు. 21 అప్పుడు అతడు తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించాడు. ఏమీ? మీరు నన్ను కాదని అతనిని మరియు అతని సంతానాన్ని స్నేహితులుగా (సంరక్షకులుగా) చేసుకుంటారా? మరియు వారు మీ శత్రువులు కదా! దుర్మార్గులకు ఎంత చెడ్డ ఫలితముంది. (7/8)

18:51 – مَّا أَشْهَدتُّهُمْ خَلْقَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَا خَلْقَ أَنفُسِهِمْ وَمَا كُنتُ مُتَّخِذَ الْمُضِلِّينَ عَضُدًا ٥١

  • నేను ఆకాశాలను మరియు భూమిని సృష్టించినప్పుడుగానీ, లేదా స్వయంగా వారిని (షై’తానులను) సృష్టించినప్పుడుగానీ వారిని సాక్షులుగా పెట్టలేదు. 22 మార్గం తప్పించేవారిని నేను (అల్లాహ్‌) సహాయకులుగా చేసుకునే వాడనుకాను.

18:52 – وَيَوْمَ يَقُولُ نَادُوا شُرَكَائِيَ الَّذِينَ زَعَمْتُمْ فَدَعَوْهُمْ فَلَمْ يَسْتَجِيبُوا لَهُمْ وَجَعَلْنَا بَيْنَهُم مَّوْبِقًا ٥٢

మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆ దినమున ఆయన (అల్లాహ్‌) వారితో: ”మీరు నా భాగస్వాములని భావించిన వారిని పిలవండి!” అని అన్నప్పుడు, వారు (భాగస్వాములుగా భావించిన) వారిని పిలుస్తారు, కాని వారు వారికి జవాబివ్వరు. మరియు మేము వారి మధ్య ఒక పెద్ద లోతైన వినాశగుండాన్ని నియమించి ఉంటాము.

18:53 – وَرَأَى الْمُجْرِمُونَ النَّارَ فَظَنُّوا أَنَّهُم مُّوَاقِعُوهَا وَلَمْ يَجِدُوا عَنْهَا مَصْرِفًا ٥٣

మరియు ఆ అపరాధులు నరకాగ్నిని చూసి వారు తప్పక అందులో పడవలసి ఉన్నదని తెలుసుకుంటారు. మరియు వారు దాని నుండి తప్పించుకోవటానికి ఎలాంటి ఉపాయం పొందరు.

18:54 – وَلَقَدْ صَرَّفْنَا فِي هَـٰذَا الْقُرْآنِ لِلنَّاسِ مِن كُلِّ مَثَلٍ ۚ وَكَانَ الْإِنسَانُ أَكْثَرَ شَيْءٍ جَدَلً ٥٤

మరియు నిశ్చయంగా, మేము ఈ ఖుర్ఆన్‌లో, మానవులకు, ప్రతి విధమైన ఉపమానాన్ని వివరించాము. కాని మానవుడు పరమ జగడాలమారి!

18:55 – وَمَا مَنَعَ النَّاسَ أَن يُؤْمِنُوا إِذْ جَاءَهُمُ الْهُدَىٰ وَيَسْتَغْفِرُوا رَبَّهُمْ إِلَّا أَن تَأْتِيَهُمْ سُنَّةُ الْأَوَّلِينَ أَوْ يَأْتِيَهُمُ الْعَذَابُ قُبُلًا ٥٥

మరియు వారి ముందుకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు, దానిని విశ్వసించకుండా మరియు తమ ప్రభువు సన్నిధిలో క్షమాభిక్ష కోరకుండా ఉండటానికి వారిని ఆటంకపరిచిందేమిటి? వారి పూర్వికుల మీద పడిన (ఆపద) వారిమీద కూడా పడాలనో, లేదా ఆ శిక్ష ప్రత్యక్షంగా వారిపైకి రావాలనో వేచి ఉండటం తప్ప?

18:56 – وَمَا نُرْسِلُ الْمُرْسَلِينَ إِلَّا مُبَشِّرِينَ وَمُنذِرِينَ ۚ وَيُجَادِلُ الَّذِينَ كَفَرُوا بِالْبَاطِلِ لِيُدْحِضُوا بِهِ الْحَقَّ ۖ وَاتَّخَذُوا آيَاتِي وَمَا أُنذِرُوا هُزُوًا ٥٦

మరియు మేము సందేశహరులను కేవలం శుభవార్తలు అందజేసేవారిగా మరియు హెచ్చరికలు చేసేవారిగా మాత్రమే పంపుతాము. మరియు సత్య-తిరస్కారులు, సత్యాన్ని ఖండించటానికి నిరర్థకమైన మాటలతో వాదు లాడుతారు. మరియు నా సూచనలను మరియు హెచ్చరికలను హాస్యంగా తీసుకుంటారు.

18:57 – وَمَنْ أَظْلَمُ مِمَّن ذُكِّرَ بِآيَاتِ رَبِّهِ فَأَعْرَضَ عَنْهَا وَنَسِيَ مَا قَدَّمَتْ يَدَاهُ ۚ إِنَّا جَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا ۖ وَإِن تَدْعُهُمْ إِلَى الْهُدَىٰ فَلَن يَهْتَدُوا إِذًا أَبَدًا ٥٧

మరియు తన ప్రభువు సూచనలతో హితబోధ చేయబడినపుడు, వాటికి విముఖుడై తన చేతులారా చేసుకొని పంపిన దాన్ని (దుష్పరిణామాన్ని) మరచిపోయే వ్యక్తికంటే, పరమ దుర్మార్గుడెవడు? వారు దానిని (ఖుర్ఆన్‌ను) అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలమీద తెరలు వేసిఉన్నాము మరియు వారి చెవులకు చెవుడు కలిగించాము. కావున, నీవు వారిని సన్మార్గం వైపునకు పిలిచినా వారెన్నటికీ సన్మార్గం వైపునకు రాలేరు.

18:58 – وَرَبُّكَ الْغَفُورُ ذُو الرَّحْمَةِ ۖ لَوْ يُؤَاخِذُهُم بِمَا كَسَبُوا لَعَجَّلَ لَهُمُ الْعَذَابَ ۚ بَل لَّهُم مَّوْعِدٌ لَّن يَجِدُوا مِن دُونِهِ مَوْئِلًا ٥٨

మరియు నీ ప్రభువు క్షమాశీలుడు, కారుణ్య మూర్తి. ఆయన వారి దుష్కర్మల ఫలితంగా వారిని పట్టుకోదలిస్తే, వారిపై తొందరగానే శిక్ష పంపి ఉండేవాడు. కాని వారికొక నిర్ణీత సమయం నిర్ణయించబడి ఉంది, దాని నుండి వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు. 23

18:59 – وَتِلْكَ الْقُرَىٰ أَهْلَكْنَاهُمْ لَمَّا ظَلَمُوا وَجَعَلْنَا لِمَهْلِكِهِم مَّوْعِدًا ٥٩

మరియు (ఆ నగరాల వారు) దుర్మార్గం చేసినందుకు మేము నాశనంచేసిన నగరాలు ఇవే! మరియు వారి నాశనంకొరకు కూడా మేము ఒక సమయాన్ని నిర్ణయించి ఉన్నాము.

18:60 – وَإِذْ قَالَ مُوسَىٰ لِفَتَاهُ لَا أَبْرَحُ حَتَّىٰ أَبْلُغَ مَجْمَعَ الْبَحْرَيْنِ أَوْ أَمْضِيَ حُقُبًا ٦٠

మరియు (జ్ఞాపకం చేసుకోండి) మూసా తన సేవకునితో 24 ఇలా అన్నది: ”రెండు సముద్రాల సంగమస్థలానికి చేరనంతవరకు నేను నా ప్రయాణాన్ని ఆపను. 25 నేను సంవత్సరాల తరబడి సంచరిస్తూ ఉండవలసినా సరే!” 26

18:61 – فَلَمَّا بَلَغَا مَجْمَعَ بَيْنِهِمَا نَسِيَا حُوتَهُمَا فَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ سَرَبًا ٦١

ఆ పిదప వారిద్దరు ఆ (రెండు సముద్రాల) సంగమ స్థలానికి చేరినప్పుడు, వారి చేపను గురించి మరిచిపోయారు. అది వారి నుండి తప్పించుకొని వేగంగా సముద్రంలోకి – సొరంగం గుండా పోయినట్లు 27 – దూసుకుపోయింది.

18:62 – فَلَمَّا جَاوَزَا قَالَ لِفَتَاهُ آتِنَا غَدَاءَنَا لَقَدْ لَقِينَا مِن سَفَرِنَا هَـٰذَا نَصَبًا ٦٢

ఆ పిదప వారు మరికొంత ముందుకు పోయిన తరువాత, అతను (మూసా) తన సేవకునితో ఇలా అన్నాడు: ”మన భోజనం తీసుకురా! వాస్తవానికి మనం ఈ ప్రయాణంలో చాలా అలసిపోయాము.”

18:63 – قَالَ أَرَأَيْتَ إِذْ أَوَيْنَا إِلَى الصَّخْرَةِ فَإِنِّي نَسِيتُ الْحُوتَ وَمَا أَنسَانِيهُ إِلَّا الشَّيْطَانُ أَنْ أَذْكُرَهُ ۚ وَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ عَجَبًا ٦٣

(సేవకుడు) ఇలా అన్నాడు: ”చూశారా! మనం ఆ బండమీద విశ్రాంతి తీసుకోవటానికి ఆగినపుడు వాస్తవానికి నేను చేపను గురించి పూర్తిగా మరచిపోయాను. షై’తాను తప్ప మరెవ్వడూ నన్ను దానిని గురించి మరపింపజేయలేదు. అది విచిత్రంగా సముద్రంలోకి దూసుకొని పోయింది!”

18:64 – قَالَ ذَٰلِكَ مَا كُنَّا نَبْغِ ۚ فَارْتَدَّا عَلَىٰ آثَارِهِمَا قَصَصًا ٦٤

(మూసా) అన్నాడు: ”అదే కదా, మనం కోరుతున్నది (వెతుకుతున్న స్థానం)!” ఆ పిదప వారిరువురు తమ అడుగుజాడలను అనుసరిస్తూ వెనుకకు మరలిపోయారు.

18:65 – فَوَجَدَا عَبْدًا مِّنْ عِبَادِنَا آتَيْنَاهُ رَحْمَةً مِّنْ عِندِنَا وَعَلَّمْنَاهُ مِن لَّدُنَّا عِلْمًا ٦٥

అప్పుడు వారు మా దాసులలో ఒక దాసుణ్ణి (అచ్చట) చూశారు. మేము అతనికి మా అనుగ్రహాన్ని ప్రసాదించి, 28 అతనికి మా తరఫు నుండి విశిష్టజ్ఞానం నేర్పిఉన్నాము. 29

18:66 – قَالَ لَهُ مُوسَىٰ هَلْ أَتَّبِعُكَ عَلَىٰ أَن تُعَلِّمَنِ مِمَّا عُلِّمْتَ رُشْدًا ٦٦

మూసా అతనితో (‘ఖి’ద్ర్‌తో) అన్నాడు: ”నీకు నేర్పబడిన జ్ఞానాన్ని నీవు నాకు నేర్పుటకై నేను నిన్ను అనుసరించవచ్చునా?”

18:67 – قَالَ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا ٦٧

అతను జవాబిచ్చాడు: ”నీవు నాతోపాటు ఏ మాత్రం సహనం వహించలేవు!

18:68 – وَكَيْفَ تَصْبِرُ عَلَىٰ مَا لَمْ تُحِطْ بِهِ خُبْرًا ٦٨

”అసలు నీకు తెలియని విషయాన్ని గురించి నీవెట్లు సహనం వహించగలవు?”

18:69 – قَالَ سَتَجِدُنِي إِن شَاءَ اللَّـهُ صَابِرًا وَلَا أَعْصِي لَكَ أَمْرًا ٦٩

(మూసా) అన్నాడు: ”అల్లాహ్‌ కోరితే! నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు. నేను నీ యొక్క ఏ ఆజ్ఞనూ ఉల్లంఘించను!”

18:70 – قَالَ فَإِنِ اتَّبَعْتَنِي فَلَا تَسْأَلْنِي عَن شَيْءٍ حَتَّىٰ أُحْدِثَ لَكَ مِنْهُ ذِكْرًا ٧٠

  1. అతను అన్నాడు: ”ఒకవేళ నీవు నన్ను అనుసరించటానికే నిశ్చయించుకుంటే, స్వయంగా నేనే నీతో ప్రస్తావించనంతవరకు నీవు నన్ను, ఏ విషయాన్ని గురించి కూడా ప్రశ్నించకూడదు.”

18:71 – فَانطَلَقَا حَتَّىٰ إِذَا رَكِبَا فِي السَّفِينَةِ خَرَقَهَا ۖ قَالَ أَخَرَقْتَهَا لِتُغْرِقَ أَهْلَهَا لَقَدْ جِئْتَ شَيْئًا إِمْرًا ٧١

ఆ పిదప వారిద్దరూ బయలుదేరారు. చివరికి వారిద్దరు పడవలో ఎక్కినపుడు అతను పడవకు రంధ్రంచేశాడు. (మూసా) అతనితో అన్నాడు: ”ఏమీ? పడవలో ఉన్న వారిని ముంచివేయటానికా, నీవు దానిలో రంధ్రంచేశావు? వాస్తవానికి, నీవు ఒక దారుణమైన పని చేశావు!”

18:72 – قَالَ أَلَمْ أَقُلْ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا ٧٢

అతను అన్నాడు: ”నేను నీతో అనలేదా? నీవు నాతోపాటు ఏ మాత్రం సహనం వహించలేవని?”

18:73 – قَالَ لَا تُؤَاخِذْنِي بِمَا نَسِيتُ وَلَا تُرْهِقْنِي مِنْ أَمْرِي عُسْرًا ٧٣

(మూసా) అన్నాడు: ”మరచిపోయి చేసిన దానికి నన్ను తప్పుపట్టకు. నేను చేసిన దానికి నా పట్ల కఠినంగా వ్యవహరించకు!”

18:74 – فَانطَلَقَا حَتَّىٰ إِذَا لَقِيَا غُلَامًا فَقَتَلَهُ قَالَ أَقَتَلْتَ نَفْسًا زَكِيَّةً بِغَيْرِ نَفْسٍ لَّقَدْ جِئْتَ شَيْئًا نُّكْرًا ٧٤

ఆ పిదప వారు తమ ప్రయాణం సాగించగా వారికి ఒక బాలుడు కలిశాడు. అతను వానిని (ఆ బాలుణ్ణి) చంపాడు. (అది చూసి) మూసా అన్నాడు: ”ఏమీ? ఒక అమాయకుడిని చంపావా? అతడు ఎవ్వడినీ (చంపలేదే)! వాస్తవానికి నీవు ఒక ఘోరమైన పనిచేశావు!”

18:75 – قَالَ أَلَمْ أَقُل لَّكَ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا ٧٥

[(*)] అతను (‘ఖి’ద్ర్‌) అన్నాడు: ”నేను నీతో అనలేదా, నిశ్చయంగా, నీవు నాతోపాటు ఏ మాత్రం సహనం వహించలేవని?”

18:76 – قَالَ إِن سَأَلْتُكَ عَن شَيْءٍ بَعْدَهَا فَلَا تُصَاحِبْنِي ۖ قَدْ بَلَغْتَ مِن لَّدُنِّي عُذْرًا ٧٦

(మూసా) అన్నాడు: ”ఇక ముందు దేన్ని గురించి అయినా నిన్న అడిగితే నన్ను నీతోపాటు ఉండనివ్వకు. వాస్తవానికి నీవు, నా తరఫు నుండి ఇంత వరకు చాలినన్ని సాకులు స్వీకరించావు.”

18:77 – فَانطَلَقَا حَتَّىٰ إِذَا أَتَيَا أَهْلَ قَرْيَةٍ اسْتَطْعَمَا أَهْلَهَا فَأَبَوْا أَن يُضَيِّفُوهُمَا فَوَجَدَا فِيهَا جِدَارًا يُرِيدُ أَن يَنقَضَّ فَأَقَامَهُ ۖ قَالَ لَوْ شِئْتَ لَاتَّخَذْتَ عَلَيْهِ أَجْرًا ٧٧

ఆ పిదప వారిద్దరూ ముందుకు సాగిపోయి ఒకనగరం చేరుకొని ఆనగరవాసులను భోజన మడి గారు. కాని వారు (ఆనగరవాసులు) వారిద్దరికి ఆతి థ్యమివ్వటానికి నిరాకరించారు. 30 అప్పుడు వార క్కడ కూలిపో నున్న ఒక గోడను చూశారు. అతను (‘ఖి’ద్ర్‌) దానిని మళ్ళీ నిలబెట్టాడు. (మూసా) అన్నాడు: ”నీవు కోరితే దానికి (ఆ శ్రమకు) ప్రతి ఫలం (వేతనం) తీసుకొని ఉండవచ్చు కదా!”

18:78 – قَالَ هَـٰذَا فِرَاقُ بَيْنِي وَبَيْنِكَ ۚ سَأُنَبِّئُكَ بِتَأْوِيلِ مَا لَمْ تَسْتَطِع عَّلَيْهِ صَبْرًا ٧٨

అతను (‘ఖి’ద్ర్‌) అన్నాడు: ”ఇక నేనూ-నీవూ విడిపోవలసిన (సమయం) వచ్చింది. ఇక నీవు సహనం వహించలేక పోయిన విషయాల వాస్తవాలను (తత్త్వాలను) గురించి నీకు తెలుపుతాను.

18:79 – أَمَّا السَّفِينَةُ فَكَانَتْ لِمَسَاكِينَ يَعْمَلُونَ فِي الْبَحْرِ فَأَرَدتُّ أَنْ أَعِيبَهَا وَكَانَ وَرَاءَهُم مَّلِكٌ يَأْخُذُ كُلَّ سَفِينَةٍ غَصْبًا ٧٩

”ఇక ఆ నావ విషయం: అది సముద్రంలో పనిచేసుకునే కొందరు పేదవారిది. కావున దానిలో లోపం కలిగించగోరాను; ఎందుకంటే వారి వెనుక ఒక క్రూరుడైన రాజు ఉన్నాడు. అతడు (లోపంలేని) ప్రతి నావను బలవంతంగా తీసుకుంటాడు.

18:80 – وَأَمَّا الْغُلَامُ فَكَانَ أَبَوَاهُ مُؤْمِنَيْنِ فَخَشِينَا أَن يُرْهِقَهُمَا طُغْيَانًا وَكُفْرًا ٨٠

”ఇక ఆ బాలుని విషయం: అతని తల్లి- దండ్రులు విశ్వాసులు. అతడు తన సత్య- తిరస్కారం మరియు తలబిరుసుతనం వలన వారిని బాధిస్తాడని భయపడ్డాము.

18:81 – فَأَرَدْنَا أَن يُبْدِلَهُمَا رَبُّهُمَا خَيْرًا مِّنْهُ زَكَاةً وَأَقْرَبَ رُحْمًا ٨١

”కావున వారిద్దరి ప్రభువు వారికి అతనికి బదులుగా అతనికంటే ఎక్కువ నీతిమంతుడు మరియు కారుణ్యంగలవాడిని ఇవ్వాలని కోరాము.

18:82 – وَأَمَّا الْجِدَارُ فَكَانَ لِغُلَامَيْنِ يَتِيمَيْنِ فِي الْمَدِينَةِ وَكَانَ تَحْتَهُ كَنزٌ لَّهُمَا وَكَانَ أَبُوهُمَا صَالِحًا فَأَرَادَ رَبُّكَ أَن يَبْلُغَا أَشُدَّهُمَا وَيَسْتَخْرِجَا كَنزَهُمَا رَحْمَةً مِّن رَّبِّكَ ۚ وَمَا فَعَلْتُهُ عَنْ أَمْرِي ۚ ذَٰلِكَ تَأْوِيلُ مَا لَمْ تَسْطِع عَّلَيْهِ صَبْرًا ٨٢

”ఇక ఆ గోడ విషయం: అది ఈ పట్టణంలోని ఇద్దరు అనాథబాలురకు చెందినది. దానిక్రింద వారి ఒకనిధి(పాతబడి)ఉంది.మరియు వారితండ్రి పుణ్య పురుషుడు. ఆ ఇద్దరు బాలురు యుక్త వయస్కు లైన పిదప – నీ ప్రభువు కారుణ్యంగా – తమ నిధిని, వారు త్రవ్వితీసుకోవాలని, నీ ప్రభువు సంకల్పం. ఇదంతా నా అంతట నేను చేయలేదు. నీవు సహ నం వహించలేనివిషయాల వాస్తవం(తత్త్వం) ఇదే!”

18:83 – وَيَسْأَلُونَكَ عَن ذِي الْقَرْنَيْنِ ۖ قُلْ سَأَتْلُو عَلَيْكُم مِّنْهُ ذِكْرًا ٨٣

మరియు వారు నిన్ను జు’ల్‌-ఖర్‌నైన్‌ను 31 గురించి అడుగుతున్నారు. వారితో అను: ”అతనిని గురించి జ్ఞాపక ముంచుకోదగిన విషయాన్ని నేను మీకు వినిపిస్తాను.”

18:84 – إِنَّا مَكَّنَّا لَهُ فِي الْأَرْضِ وَآتَيْنَاهُ مِن كُلِّ شَيْءٍ سَبَبًا ٨٤

నిశ్చయంగా, మేము అతని (అధికారాన్ని) భూమిలో స్థాపించాము మరియు అతనికి ప్రతిదానిని పొందే మార్గాన్ని చూపాము. 32

18:85 – فَأَتْبَعَ سَبَبًا ٨٥

అతను ఒక మార్గం మీద పోయాడు.

18:86 – حَتَّىٰ إِذَا بَلَغَ مَغْرِبَ الشَّمْسِ وَجَدَهَا تَغْرُبُ فِي عَيْنٍ حَمِئَةٍ وَوَجَدَ عِندَهَا قَوْمًا ۗ قُلْنَا يَا ذَا الْقَرْنَيْنِ إِمَّا أَن تُعَذِّبَ وَإِمَّا أَن تَتَّخِذَ فِيهِمْ حُسْنًا ٨٦

చివరకు సూర్యుడు అస్తమించేటట్లు (కనబడే) స్థలానికి చేరాడు. దానిని (సూర్యుణ్ణి) నల్లటి బురదవంటి నీటి చెలిమలో మునుగు తున్నట్లు చూశాడు. 33 మరియు అక్కడొక జాతి వారిని చూశాడు. మేము అతనితో అన్నాము: 34 ”ఓ జు’ల్‌-ఖర్‌నైన్! నీవు వారిని శిక్షించవచ్చు, లేదా, వారి యెడల ఉదార వైఖరిని అవలంబించవచ్చు!”

18:87 – قَالَ أَمَّا مَن ظَلَمَ فَسَوْفَ نُعَذِّبُهُ ثُمَّ يُرَدُّ إِلَىٰ رَبِّهِ فَيُعَذِّبُهُ عَذَابًا نُّكْرًا ٨٧

అతను అన్నాడు: ”ఎవడైతే దుర్మార్గం చేస్తాడో మేము అతనిని శిక్షిస్తాము. ఆ పిదప అతడు తన ప్రభువు వైపునకు మరలింపబడతాడు. అప్పుడు ఆయన అతనికి ఘోరమైన శిక్ష విధిస్తాడు.

18:88 – وَأَمَّا مَنْ آمَنَ وَعَمِلَ صَالِحًا فَلَهُ جَزَاءً الْحُسْنَىٰ ۖ وَسَنَقُولُ لَهُ مِنْ أَمْرِنَا يُسْرًا ٨٨

”ఇక ఎవడైతే! విశ్వసించి సత్కార్యాలు చేస్తాడో అతనికి మంచి ప్రతిఫలముంటుంది. మేము అతనిని ఆజ్ఞాపించినపుడు, సులభతరమైన ఆజ్ఞనే ఇస్తాము.”

18:89 – ثُمَّ أَتْبَعَ سَبَبًا ٨٩

తరువాత అతను మరొక మార్గం మీద పోయాడు.

18:90 – حَتَّىٰ إِذَا بَلَغَ مَطْلِعَ الشَّمْسِ وَجَدَهَا تَطْلُعُ عَلَىٰ قَوْمٍ لَّمْ نَجْعَل لَّهُم مِّن دُونِهَا سِتْرًا ٩٠

చివరకు సూర్యుడు ఉదయించేటట్లు (కనపడే) స్థలానికి చేరాడు. అక్కడ అతను దానిని (సూర్యుణ్ణి) ఒక జాతిపై ఉదయించడం చూశాడు. వారికి మేము దాని (సూర్యుని) నుండి కాపాడు కోవటానికి ఎలాంటి చాటు (రక్షణ) నివ్వలేదు. 35

18:91 – كَذَٰلِكَ وَقَدْ أَحَطْنَا بِمَا لَدَيْهِ خُبْرًا ٩١

ఈ విధంగా! వాస్తవానికి, అతనికి (జు’ల్‌- ఖర్‌నైన్‌కు) తెలిసిఉన్న విషయాలను గురించి మాకు బాగా తెలుసు.

18:92 – ثُمَّ أَتْبَعَ سَبَبًا ٩٢

ఆతరువాత అతను మరొక మార్గం మీద పోయాడు.

18:93 – حَتَّىٰ إِذَا بَلَغَ بَيْنَ السَّدَّيْنِ وَجَدَ مِن دُونِهِمَا قَوْمًا لَّا يَكَادُونَ يَفْقَهُونَ قَوْلً ٩٣

చివరకు అతను రెండుపర్వతాల మధ్య చేరాడు. వాటి మధ్య ఒక జాతి వారిని చూశాడు. వారు అతని మాటలను అతి కష్టంతో అర్థంచేసుకో గలిగారు. 36

18:94 – قَالُوا يَا ذَا الْقَرْنَيْنِ إِنَّ يَأْجُوجَ وَمَأْجُوجَ مُفْسِدُونَ فِي الْأَرْضِ فَهَلْ نَجْعَلُ لَكَ خَرْجًا عَلَىٰ أَن تَجْعَلَ بَيْنَنَا وَبَيْنَهُمْ سَدًّا ٩٤

వారన్నారు: ”ఓ జు’ల్‌-ఖర్‌నైన్‌! వాస్తవానికి యా’జూజ్‌ మరియు మాజూజ్‌లు, 37 ఈ భూభాగంలో కల్లోలం రేకెత్తిస్తున్నారు. అయితే నీవు మాకూ మరియు వారికీ మధ్య ఒక అడ్డుగోడను నిర్మించ టానికి, మేము నీకేమైనా శుల్కం చెల్లించాలా?”

18:95 – قَالَ مَا مَكَّنِّي فِيهِ رَبِّي خَيْرٌ فَأَعِينُونِي بِقُوَّةٍ أَجْعَلْ بَيْنَكُمْ وَبَيْنَهُمْ رَدْمًا ٩٥

అతను అన్నాడు: ”నా ప్రభువు ఇచ్చిందే నాకు ఉత్తమమైనది. ఇక మీరు మీ శ్రమద్వారా మాత్రమే నాకు సహాయపడితే, నేను మీకూ మరియు వారికీ మధ్య అడ్డుగోడను నిర్మిస్తాను.

18:96 – آتُونِي زُبَرَ الْحَدِيدِ ۖ حَتَّىٰ إِذَا سَاوَىٰ بَيْنَ الصَّدَفَيْنِ قَالَ انفُخُوا ۖ حَتَّىٰ إِذَا جَعَلَهُ نَارًا قَالَ آتُونِي أُفْرِغْ عَلَيْهِ قِطْرً ٩٦

”మీరు నాకు ఇనుప ముద్దలు తెచ్చి ఇవ్వండి.” అతను ఆ రెండు కొండలమధ్య ఉన్న సందును మూసిన తరువాత వారితో అన్నాడు: ”అగ్నిరగిలించండి.” అది ఎర్రని నిప్పుగా మారిన తరువాత, అన్నాడు: ”ఇక కరిగిన రాగిని తీసుకు రండి, దీనిమీద పోయటానికి.”

18:97 – فَمَا اسْطَاعُوا أَن يَظْهَرُوهُ وَمَا اسْتَطَاعُوا لَهُ نَقْبًا ٩٧

ఈ విధంగా వారు (యా’జూజ్‌ మరియు మా’జూజ్‌లు) దానిపై నుండి ఎక్కి రాలేకపోయారు. మరియు దానిలో కన్నం కూడా చేయలేక పోయారు.

18:98 – قَالَ هَـٰذَا رَحْمَةٌ مِّن رَّبِّي ۖ فَإِذَا جَاءَ وَعْدُ رَبِّي جَعَلَهُ دَكَّاءَ ۖ وَكَانَ وَعْدُ رَبِّي حَقًّا ٩٨

అతను (జు’ల్‌-ఖర్‌నైన్‌) అన్నాడు: ”ఇది నా ప్రభువు యొక్క కారుణ్యం. కాని నా ప్రభువు వాగ్దానపు ఘడియ వచ్చినపుడు ఆయన దీనిని బూడిదగా మార్చివేస్తాడు. మరియు నా ప్రభువు వాగ్దానం నిజమై తీరుతుంది.” (1/8)

18:99 – وَتَرَكْنَا بَعْضَهُمْ يَوْمَئِذٍ يَمُوجُ فِي بَعْضٍ ۖ وَنُفِخَ فِي الصُّورِ فَجَمَعْنَاهُمْ جَمْعًا ٩٩

  • మరియు ఆ (యా’జూజ్‌ మరియు మా’జూజ్‌లు బయటికి వచ్చిన) రోజు మేము వారిని అలలవలే ఒకరి మీద ఒకరు పడటానికి వదిలివేస్తాము. మరియు బాకా (‘సూర్‌) ఊదబడి నప్పుడు వారందరినీ ఒకచోట సమావేశపరుస్తాము.

18:100 – وَعَرَضْنَا جَهَنَّمَ يَوْمَئِذٍ لِّلْكَافِرِينَ عَرْضًا ١٠٠

మరియు ఆ రోజున మేము సత్య-తిరస్కా రులకు నరకాన్ని స్పష్టంగా చూసేందుకు వారి ముందుకు తెస్తాము.

18:101 – الَّذِينَ كَانَتْ أَعْيُنُهُمْ فِي غِطَاءٍ عَن ذِكْرِي وَكَانُوا لَا يَسْتَطِيعُونَ سَمْعًا ١٠١

అలాంటి వారికి, ఎవరి కన్నులైతే, మా హితోపదేశం పట్ల కప్పబడి ఉన్నాయో మరియు వారికి, ఎవరైతే (దానిని) ఏ మాత్రమూ వినటానికి కూడా ఇష్టపడలేదో!

18:102 – أَفَحَسِبَ الَّذِينَ كَفَرُوا أَن يَتَّخِذُوا عِبَادِي مِن دُونِي أَوْلِيَاءَ ۚ إِنَّا أَعْتَدْنَا جَهَنَّمَ لِلْكَافِرِينَ نُزُلًا ١٠٢

ఏమీ? ఈ సత్య-తిరస్కారులు నన్ను వదలి, నా దాసులను తమ స్నేహితులుగా (సంరక్షకులుగా) చేసుకోనగలరని భావించారా? నిశ్చయంగా, మేము సత్య-తిరస్కారుల ఆతిథ్యం కొరకు నరకాన్ని సిధ్ధపరచి ఉంచాము.

18:103 – قُلْ هَلْ نُنَبِّئُكُم بِالْأَخْسَرِينَ أَعْمَالً ١٠٣

వారితో అను: ”కర్మలను బట్టి అందరికంటే ఎక్కువ నష్టపడేవారు ఎవరో మీకు తెలుపాలా?

18:104 – الَّذِينَ ضَلَّ سَعْيُهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا وَهُمْ يَحْسَبُونَ أَنَّهُمْ يُحْسِنُونَ صُنْعًا ١٠٤

”ఎవరైతే ఇహలోక జీవితంలో చేసే కర్మలన్నీ వ్యర్థమైనా, తాము చేసేవన్నీ సత్కార్యాలే, అని భావిస్తారో!

18:105 – أُولَـٰئِكَ الَّذِينَ كَفَرُوا بِآيَاتِ رَبِّهِمْ وَلِقَائِهِ فَحَبِطَتْ أَعْمَالُهُمْ فَلَا نُقِيمُ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ وَزْنًا ١٠٥

”ఎవరైతే ఇహలోక జీవితంలో చేసే కర్మలన్నీ వ్యర్థమైనా, తాము చేసేవన్నీ సత్కార్యాలే, అని భావిస్తారో!

18:106 – ذَٰلِكَ جَزَاؤُهُمْ جَهَنَّمُ بِمَا كَفَرُوا وَاتَّخَذُوا آيَاتِي وَرُسُلِي هُزُوًا ١٠٦

”అదే వారి ప్రతిఫలం, నరకం! ఎందుకంటే వారు సత్యాన్ని తిరస్కరించారు మరియు నా సూచనలను మరియు నా సందేశహరులను పరిహసించారు.

18:107 – إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ كَانَتْ لَهُمْ جَنَّاتُ الْفِرْدَوْسِ نُزُلًا ١٠٧

”నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించి సత్కా ర్యాలు చేస్తారో! వారి ఆతిథ్యం కొరకు ఫిర్దౌస్‌ స్వర్గ వనాలు ఉంటాయి. 38

18:108 – خَالِدِينَ فِيهَا لَا يَبْغُونَ عَنْهَا حِوَلً ١٠٨

”వారందులో శాశ్వతంగా ఉంటారు, వారు అక్కడి నుండి వేరగుటకు ఇష్టపడరు.”

18:109 – قُل لَّوْ كَانَ الْبَحْرُ مِدَادًا لِّكَلِمَاتِ رَبِّي لَنَفِدَ الْبَحْرُ قَبْلَ أَن تَنفَدَ كَلِمَاتُ رَبِّي وَلَوْ جِئْنَا بِمِثْلِهِ مَدَدًا ١٠٩

వారితో అను: ”నా ప్రభువు మాటలను వ్రాయటానికి, సముద్రమంతా సిరాగా మారి పోయినా – నా ప్రభువు మాటలు పూర్తికాకముందే – దానికి తోడుగా దాని వంటి మరొక సముద్రాన్ని తెచ్చినా, అది కూడా తరిగిపోతుంది.” 39

18:110 – قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِّثْلُكُمْ يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَـٰهُكُمْ إِلَـٰهٌ وَاحِدٌ ۖ فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا ١١٠

(ఓ ప్రవక్తా!) ఇంకా ఇలా అను: ”నిశ్చయంగా, నేను కూడా మీలాంటి ఒక మానవుడనే! నాపై దివ్యజ్ఞానం (వ’హీ) అవతరింప జేయబడింది. నిశ్చయంగా, మీ ఆరాధ్యదేవుడు ఆ ఏకైక దైవం (అల్లాహ్‌) మాత్రమే! కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములు (షరీక్‌లు) గా కల్పించుకోరాదు.”

సూరహ్‌ మర్యమ్‌ – జ’అఫర్ బిన్‌-అబీ-‘తాలిబ్‌ (ర’ది.’అ.) ‘హబషా (Abyssinia)కు వలస పోయినప్పుడు, ‘హబషా రాజు నజాషీ (Negus) సభలో సూరహ్‌ మర్యం మొదటి భాగం చదివి వినిపిస్తారు. అప్పుడు వారందరి గడ్డాలు కన్నీరుతో నిండుతాయి. అప్పుడతడు అంటాడు: ‘ఖుర్‌ఆన్‌ మరియు ‘ఈసా (‘అ.స.) తెచ్చిన గ్రంథం రెండూ ఒకేజ్యోతి యొక్క కిరణాలు.’ (ఫ’త్హ్ అల్‌-ఖదీర్). 98 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 16వ ఆయత్‌ నుండి తీసుకోబడింది ఈ సూరహ్‌ హిజ్రత్‌కు దాదాపు 7-8 సంవత్సరాలకు ముందు మక్కహ్లో అవతరింపజేయబడింది. ఇందులో సయ్యిదా మర్యం, ఆమె కుమారులు ‘ఈసా, పోషకులు ‘జకరియ్యా మరియు అతని కుమారులు య’హ్యా (‘అలైహిమ్.స.)ల గాథలున్నాయి.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 19:1 – كهيعص ١

కాఫ్ -హా-యా-ఐన్-సాద్‌.

19:2 – ذِكْرُ رَحْمَتِ رَبِّكَ عَبْدَهُ زَكَرِيَّا ٢

ఇది నీ ప్రభువు తన దాసుడైన ‘జకరియ్యాపై చూపిన కారుణ్య ప్రస్తావన.

19:3 – إِذْ نَادَىٰ رَبَّهُ نِدَاءً خَفِيًّا ٣

అతను తన ప్రభువును రహస్యంగా (ఏకాంతంలో) మొరపెట్టుకుంటూ!

19:4 – قَالَ رَبِّ إِنِّي وَهَنَ الْعَظْمُ مِنِّي وَاشْتَعَلَ الرَّأْسُ شَيْبًا وَلَمْ أَكُن بِدُعَائِكَ رَبِّ شَقِيًّا ٤

ఇలా ప్రార్థించాడు: ”ఓ నా ప్రభూ! నా ఎము కలు బలహీనమైపోయాయి మరియు నా తల (వెంట్రుకలు) ముసలితనం వల్ల తెల్లబడి మెరిసి పోతున్నాయి. మరియు ఓ నా ప్రభూ! నిన్ను వేడుకొని నేను ఎన్నడూ నిష్ఫలుడను కాలేదు!

19:5 – وَإِنِّي خِفْتُ الْمَوَالِيَ مِن وَرَائِي وَكَانَتِ امْرَأَتِي عَاقِرًا فَهَبْ لِي مِن لَّدُنكَ وَلِيًّا ٥

”మరియు వాస్తవానికి, నా తరువాత నా బంధువులకు (ఏమిచేస్తారో అని) నేను భయపడు తున్నాను. నా భార్యనేమో గొడ్రాలు. కావున (నీ అనుగ్రహంతో) నాకు ఒక వారసుణ్ణి ప్రసాదించు.

19:6 – يَرِثُنِي وَيَرِثُ مِنْ آلِ يَعْقُوبَ ۖ وَاجْعَلْهُ رَبِّ رَضِيًّا ٦

”అతడు నాకు మరియు య’అఖూబ్‌ సంతతి వారికి వారసుడవుతాడు. మరియు ఓ నా ప్రభూ! అతనిని నీకు ప్రీతిపాత్రునిగా చేసుకో!”

19:7 – يَا زَكَرِيَّا إِنَّا نُبَشِّرُكَ بِغُلَامٍ اسْمُهُ يَحْيَىٰ لَمْ نَجْعَل لَّهُ مِن قَبْلُ سَمِيًّا ٧

(అతనికి ఇలా జవాబివ్వబడింది): ”ఓ ‘జకరియ్యా! నిశ్చయంగా, మేము నీకు య’హ్యా అనే పేరుగల ఒక కుమారుని శుభవార్తను ఇస్తున్నాము. 1 ఇంతకు పూర్వం మేము ఈ పేరు ఎవ్వరికీ ఇవ్వలేదు.”

19:8 – قَالَ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي غُلَامٌ وَكَانَتِ امْرَأَتِي عَاقِرًا وَقَدْ بَلَغْتُ مِنَ الْكِبَرِ عِتِيًّا ٨

(‘జకరియ్యా) అన్నాడు: ”ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? నా భార్యనేమో గొడ్రాలు, 2 మరియు నే నేమో వృద్ధాప్యంతో క్షీణించి (దుర్బలుడనై) పోయాను?”

19:9 – قَالَ كَذَٰلِكَ قَالَ رَبُّكَ هُوَ عَلَيَّ هَيِّنٌ وَقَدْ خَلَقْتُكَ مِن قَبْلُ وَلَمْ تَكُ شَيْئًا ٩

ఇలా జవాబిచ్చాడు: ”అలాగే అవుతుంది నీ ప్రభువు ఇలా అంటున్నాడు: ‘ఇది నాకు సులభం మరియు వాస్తవానికి ఇంతకుముందు నీవు ఏమీ లేనప్పుడు, నేను నిన్నుసృష్టించాను కదా!’ ”

19:10 – قَالَ رَبِّ اجْعَل لِّي آيَةً ۚ قَالَ آيَتُكَ أَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلَاثَ لَيَالٍ سَوِيًّا ١٠

(‘జకరియ్యా) అన్నాడు: ”ఓ నా ప్రభూ! నాకొక గుర్తును నియమించు.” ఇలా జవాబు ఇవ్వబడింది: ”నీ గుర్తు ఏమిటంటే! నీవు స్వస్థతతో ఉండికూడా వరుసగా మూడు రాత్రులు (దినములు) ప్రజలతో మాట్లాడలేవు.” 3

19:11 – فَخَرَجَ عَلَىٰ قَوْمِهِ مِنَ الْمِحْرَابِ فَأَوْحَىٰ إِلَيْهِمْ أَن سَبِّحُوا بُكْرَةً وَعَشِيًّا ١١

ఆ పిదప అతను (‘జకరియ్యా) తన ప్రార్థనాలయం నుండి బయటికి వచ్చి తన జాతి వారికి, సైగలతో ఉదయమూ మరియు సాయంత్రమూ, ఆయన (ప్రభువు) పవిత్రతను కొనియాడండని సూచించాడు.

19:12 – يَا يَحْيَىٰ خُذِ الْكِتَابَ بِقُوَّةٍ ۖ وَآتَيْنَاهُ الْحُكْمَ صَبِيًّا ١٢

(అతని కుమారునితో ఇలా అనబడింది): ”ఓ య’హ్యా! ఈ దివ్యగ్రంథాన్ని గట్టిగాపట్టుకో.” మరియు మేము అతనికి బాల్యంలోనే వివేకాన్ని 4 ప్రసాదించాము.

19:13 – وَحَنَانًا مِّن لَّدُنَّا وَزَكَاةً ۖ وَكَانَ تَقِيًّا ١٣

మరియు మా తరఫు నుండి కనికరాన్ని, పరిశుధ్ధతను ఒసంగాము మరియు అతను దైవభీతి గలవాడు.

19:14 – وَبَرًّا بِوَالِدَيْهِ وَلَمْ يَكُن جَبَّارًا عَصِيًّا ١٤

మరియు తన తల్లి-దండ్రుల పట్ల కర్తవ్య పాలకుడు మరియు అతను హింసాపరుడు గానీ, అవిధేయుడు గానీ కాడు.

19:15 – وَسَلَامٌ عَلَيْهِ يَوْمَ وُلِدَ وَيَوْمَ يَمُوتُ وَيَوْمَ يُبْعَثُ حَيًّا ١٥

మరియు అతను పుట్టిన రోజూ మరియు అతను మరణించే రోజూ మరియు అతను బ్రతి కించి మరల లేపబడే రోజూ అతనికి శాంతి కలుగు గాక! 5

19:16 – وَاذْكُرْ فِي الْكِتَابِ مَرْيَمَ إِذِ انتَبَذَتْ مِنْ أَهْلِهَا مَكَانًا شَرْقِيًّا ١٦

మరియు ఈ గ్రంథం (ఖుర్‌ఆన్‌)లో ఉన్న మర్యమ్‌ (గాథను) ప్రస్తావించు. ఆమె తన కుటుంబంవారిని విడిచి తూర్పుదిశలో ఒక స్థలానికి వెళ్ళి పోయింది.

19:17 – فَاتَّخَذَتْ مِن دُونِهِمْ حِجَابًا فَأَرْسَلْنَا إِلَيْهَا رُوحَنَا فَتَمَثَّلَ لَهَا بَشَرًا سَوِيًّا ١٧

అక్కడ ఆమె వారినుండి ఏకాంతంలో ఒక అడ్డుతెర కట్టుకొని ఉండసాగింది. అప్పుడు మేము ఆమె వద్దకు మా దూత (జిబ్రీల్‌)ను పంపాము. 6 అతను ఆమె ముందు సంపూర్ణ మానవఆకారం (రూపం)లో ప్రత్యక్షమయ్యాడు.

19:18 – قَالَتْ إِنِّي أَعُوذُ بِالرَّحْمَـٰنِ مِنكَ إِن كُنتَ تَقِيًّا ١٨

(మర్యమ్‌) ఇలా అన్నది: ”ఒకవేళ నీవు దైవభీతి గలవాడవే అయితే! నిశ్చయంగా, నేను నీ నుండి (రక్షించబడటానికి) అనంత కరుణామయుని శరణు వేడుకుంటున్నాను.”

19:19 – قَالَ إِنَّمَا أَنَا رَسُولُ رَبِّكِ لِأَهَبَ لَكِ غُلَامًا زَكِيًّا ١٩

  1. (దేవదూత ఇలా) జవాబిచ్చాడు: ”నిశ్చ యంగా, నేను నీప్రభువుయొక్క సందేశహరుడను! నీకు ఒక సుశీలుడైన (నీతిమంతుడైన) కుమారుని (సందేశాన్ని) ఇవ్వటానికి పంపబడ్డాను.”

19:20 – قَالَتْ أَنَّىٰ يَكُونُ لِي غُلَامٌ وَلَمْ يَمْسَسْنِي بَشَرٌ وَلَمْ أَكُ بَغِيًّا ٢٠

ఆమె ఇలా ప్రశ్నించింది: ”నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? నన్ను ఏ మానవుడునూ ముట్టుకోలేదే! మరియు నేను చెడు నడవడిక గలదానిని కూడా కాను!”

19:21 – قَالَ كَذَٰلِكِ قَالَ رَبُّكِ هُوَ عَلَيَّ هَيِّنٌ ۖ وَلِنَجْعَلَهُ آيَةً لِّلنَّاسِ وَرَحْمَةً مِّنَّا ۚ وَكَانَ أَمْرًا مَّقْضِيًّا ٢١

అతను అన్నాడు: ”అలాగే అవుతుంది! నీ ప్రభువు అంటున్నాడు: ‘అది నాకు సులభం! మేము అతనిని, మానుండి ప్రజలకు ఒక సూచనగా మరియు కారుణ్యంగా పంపుతున్నాము.’ మరియు (నీ ప్రభువు) ఆజ్ఞ నెరవేరి తీరుతుంది.” (1/4)

19:22 – فَحَمَلَتْهُ فَانتَبَذَتْ بِهِ مَكَانًا قَصِيًّا ٢٢

  • తరువాత మర్యమ్‌ ఆ బాలుణ్ణి గర్భంలో భరించి, అతనితో ఒక దూరమైన స్థలానికి వెళ్ళి పోయింది.

19:23 – فَأَجَاءَهَا الْمَخَاضُ إِلَىٰ جِذْعِ النَّخْلَةِ قَالَتْ يَا لَيْتَنِي مِتُّ قَبْلَ هَـٰذَا وَكُنتُ نَسْيًا مَّنسِيًّا ٢٣

తరువాత ప్రసవవేదనతో ఆమె ఒక ఖర్జూ రపు చెట్టు మొదలు దగ్గరికి చేరుకొని ఇలా వాపోయింది: ”అయ్యో! నా దౌర్భాగ్యం, దీనికి ముందే నేను చనిపోయివుంటే! మరియు నామ రూపాలు లేకుండా నశించిపోతే ఎంత బాగుండేది!”

19:24 – فَنَادَاهَا مِن تَحْتِهَا أَلَّا تَحْزَنِي قَدْ جَعَلَ رَبُّكِ تَحْتَكِ سَرِيًّا ٢٤

అప్పుడు క్రిందినుండి ఒకధ్వని వినిపించింది: ”నీవు దుఃఖించకు! వాస్తవంగా, నీ ప్రభువు, నీ క్రింద (దగ్గరగా) ఒక సెలయేరు సృష్టించాడు;

19:25 – وَهُزِّي إِلَيْكِ بِجِذْعِ النَّخْلَةِ تُسَاقِطْ عَلَيْكِ رُطَبًا جَنِيًّا ٢٥

”మరియు నీవు ఈ చెట్టు మొదలు పట్టి ఊపితే నీపై తాజా ఖర్జూరపు పండ్లు రాలుతాయి.

19:26 – فَكُلِي وَاشْرَبِي وَقَرِّي عَيْنًا ۖ فَإِمَّا تَرَيِنَّ مِنَ الْبَشَرِ أَحَدًا فَقُولِي إِنِّي نَذَرْتُ لِلرَّحْمَـٰنِ صَوْمًا فَلَنْ أُكَلِّمَ الْيَوْمَ إِنسِيًّا ٢٦

”కావున నీవు తిను, త్రాగు, నీకళ్ళను చల్ల బరచుకో! ఇక ఏ మానవుణ్ణి చూసినా అతనితో (సైగలతో): ‘నేను నా కరుణామయుని కొరకు ఉపవాసమున్నాను, కావున ఈ రోజు నేను ఏ మానవునితో మాట్లాడను.’ అని చెప్పు.”

19:27 – فَأَتَتْ بِهِ قَوْمَهَا تَحْمِلُهُ ۖ قَالُوا يَا مَرْيَمُ لَقَدْ جِئْتِ شَيْئًا فَرِيًّا ٢٧

తరువాత ఆమె ఆ బాలుణ్ణి తీసుకొని తన జాతివారివద్దకు రాగా! వారన్నారు: ”ఓ మర్యమ్‌! వాస్తవానికి నీవు నింద్యమైన (పాపమైన) పని చేశావు!

19:28 – يَا أُخْتَ هَارُونَ مَا كَانَ أَبُوكِ امْرَأَ سَوْءٍ وَمَا كَانَتْ أُمُّكِ بَغِيًّا ٢٨

”ఓహారూన్‌ సోదరీ! 7 నీతండ్రీ చెడ్డవాడుకాదు మరియు నీ తల్లి కూడా చెడునడతగలది కాదే!”

19:29 – فَأَشَارَتْ إِلَيْهِ ۖ قَالُوا كَيْفَ نُكَلِّمُ مَن كَانَ فِي الْمَهْدِ صَبِيًّا ٢٩

అప్పుడామె అతని (ఆ బాలుని) వైపు సైగ చేసింది. వారన్నారు: ”తొట్టెలో వున్న ఈ బాలునితో మేమెలా మాట్లాడగలము?”

19:30 – قَالَ إِنِّي عَبْدُ اللَّـهِ آتَانِيَ الْكِتَابَ وَجَعَلَنِي نَبِيًّا ٣٠

(ఆ బాలుడు) అన్నాడు: ”నిశ్చయంగా, నేను అల్లాహ్‌ దాసుణ్ణి. ఆయన నాకు దివ్య గ్రంథాన్నిచ్చి, నన్ను ప్రవక్తగా నియమించాడు.

19:31 – وَجَعَلَنِي مُبَارَكًا أَيْنَ مَا كُنتُ وَأَوْصَانِي بِالصَّلَاةِ وَالزَّكَاةِ مَا دُمْتُ حَيًّا ٣١

”మరియు నేనెక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు; నేను బ్రతికి వున్నంత కాలం నమా’జ్‌ చేయమని మరియు విధి దానం (‘జకాత్‌) ఇవ్వమని నన్ను ఆదేశించాడు.

19:32 – وَبَرًّا بِوَالِدَتِي وَلَمْ يَجْعَلْنِي جَبَّارًا شَقِيًّا ٣٢

”మరియు నన్ను నా తల్లి యెడల కర్తవ్య పాలకునిగా చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగా, దౌర్భాగ్యునిగా చేయలేదు.

19:33 – وَالسَّلَامُ عَلَيَّ يَوْمَ وُلِدتُّ وَيَوْمَ أَمُوتُ وَيَوْمَ أُبْعَثُ حَيًّا ٣٣

”మరియు నేను పుట్టిన రోజూ మరియు నేను మరణించే రోజూ మరియు నేను సజీవుడనై మరల లేచే రోజూ, నాకు శాంతి కలుగు గాక!”

19:34 – ذَٰلِكَ عِيسَى ابْنُ مَرْيَمَ ۚ قَوْلَ الْحَقِّ الَّذِي فِيهِ يَمْتَرُونَ ٣٤

ఇతనే మర్యమ్‌ కుమారుడు ఈసా! ఇదే సత్యమైన మాట, దీనిని గురించే వారు వాదు లాడుతున్నారు (సందేహంలో పడి ఉన్నారు).

19:35 – مَا كَانَ لِلَّـهِ أَن يَتَّخِذَ مِن وَلَدٍ ۖ سُبْحَانَهُ ۚ إِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ ٣٥

ఎవరినైనా కుమారునిగా చేసుకోవటం అల్లాహ్‌కు తగినపని కాదు. ఆయన సర్వ లోపాలకు అతీతుడు, ఆయన ఏదైనా చేయ దలుచుకుంటే, దానిని కేవలం: ”అయిపో!” అని అంటాడు, అంతే అది అయిపోతుంది. 8

19:36 – وَإِنَّ اللَّـهَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ هَـٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ ٣٦

(‘ఈసా అన్నాడు): ”నిశ్చయంగా అల్లాహ్‌ యే నాప్రభువు మరియు మీ ప్రభువు, కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజు మార్గము.”

19:37 – فَاخْتَلَفَ الْأَحْزَابُ مِن بَيْنِهِمْ ۖ فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا مِن مَّشْهَدِ يَوْمٍ عَظِيمٍ ٣٧

తరువాత విభిన్న (క్రైస్తవ) వర్గాల వారు (‘ఈసాను గురించి) పరస్పర అభిప్రాయభేదాలు నెలకొల్పుకున్నారు. కావున ఈ సత్య- తిరస్కారులకు ఆ మహాదినపు దర్శనం వినాశాత్మకంగా ఉంటుంది. 9

19:38 – أَسْمِعْ بِهِمْ وَأَبْصِرْ يَوْمَ يَأْتُونَنَا ۖ لَـٰكِنِ الظَّالِمُونَ الْيَوْمَ فِي ضَلَالٍ مُّبِينٍ ٣٨

వారు మా ముందు హాజరయ్యేరోజున వారి చెవులు బాగానే వింటాయి మరియు వారి కండ్లు కూడా బాగానే చూస్తాయి. కాని ఈనాడు ఈ దుర్మా ర్గులుస్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడిఉన్నారు. 10

19:39 – وَأَنذِرْهُمْ يَوْمَ الْحَسْرَةِ إِذْ قُضِيَ الْأَمْرُ وَهُمْ فِي غَفْلَةٍ وَهُمْ لَا يُؤْمِنُونَ ٣٩

మరియు వారిని (రాబోయే) ఆ పశ్చాత్తాప పడవలసిన దినాన్ని 11 గురించి హెచ్చరించు. అప్పుడు పరిణామం నిర్ణయించబడి ఉంటుంది. 12 (ఇప్పుడైతే) వారు ఏమరుపాటులో పడి ఉన్నారు, కావున వారు విశ్వసించడం లేదు.

19:40 – إِنَّا نَحْنُ نَرِثُ الْأَرْضَ وَمَنْ عَلَيْهَا وَإِلَيْنَا يُرْجَعُونَ ٤٠

నిశ్చయంగా, భూమికి మరియు దానిపై వున్న వారికి వారసులం మేమే! వారందరూ మా వైపునకే మరలింపబడతారు.

19:41 – وَاذْكُرْ فِي الْكِتَابِ إِبْرَاهِيمَ ۚ إِنَّهُ كَانَ صِدِّيقًا نَّبِيًّا ٤١

మరియు ఈ గ్రంథం (ఖుర్‌ఆన్‌)లో వున్న ఇబ్రాహీమ్‌ గాథను ప్రస్తావించు. నిశ్చయంగా, అతను సత్యవంతుడైన దైవప్రవక్త.

19:42 – إِذْ قَالَ لِأَبِيهِ يَا أَبَتِ لِمَ تَعْبُدُ مَا لَا يَسْمَعُ وَلَا يُبْصِرُ وَلَا يُغْنِي عَنكَ شَيْئًا ٤٢

అతను తన తండ్రితో ఇలా అన్నప్పుడు: ”ఓ నాన్నా! వినలేని మరియు చూడలేని మరియు నీకు ఏ విధంగానూ సహాయపడలేని వాటిని, నీ వెందుకు ఆరాధిస్తున్నావు?

19:43 – يَا أَبَتِ إِنِّي قَدْ جَاءَنِي مِنَ الْعِلْمِ مَا لَمْ يَأْتِكَ فَاتَّبِعْنِي أَهْدِكَ صِرَاطًا سَوِيًّا ٤٣

”ఓ నాన్నా! వాస్తవానికి, నావద్దకు వచ్చిన జ్ఞానం నీ వద్దకు రాలేదు, కావున నీవు నన్ను అనుసరిస్తే, నేను నీకు సరైనమార్గం చూపుతాను.

19:44 – يَا أَبَتِ لَا تَعْبُدِ الشَّيْطَانَ ۖ إِنَّ الشَّيْطَانَ كَانَ لِلرَّحْمَـٰنِ عَصِيًّا ٤٤

”ఓ నాన్నా! నీవు షై’తాన్‌ను ఆరాధించకు, నిశ్చయంగా షై’తాన్‌ అనంత కరుణామయుణ్ణి ఉల్లంఘించాడు.

19:45 – يَا أَبَتِ إِنِّي أَخَافُ أَن يَمَسَّكَ عَذَابٌ مِّنَ الرَّحْمَـٰنِ فَتَكُونَ لِلشَّيْطَانِ وَلِيًّا ٤٥

”ఓ నాన్నా! నిశ్చయంగా, నీవు అనంత కరుణామయుని శిక్షకు గురి అయ్యి షై’తాను యొక్క స్నేహితుడవు (సహచరుడవు) వలి అయిపోతావేమోనని నేను భయపడుతున్నాను!”

19:46 – قَالَ أَرَاغِبٌ أَنتَ عَنْ آلِهَتِي يَا إِبْرَاهِيمُ ۖ لَئِن لَّمْ تَنتَهِ لَأَرْجُمَنَّكَ ۖ وَاهْجُرْنِي مَلِيًّا ٤٦

(అతని తండ్రి) అన్నాడు: ”ఓ ఇబ్రాహీమ్‌! ఏమీ? నీవు నా దేవుళ్ళకు విముఖత చూపు తున్నావా? ఒక వేళ నీవిది మానుకోకపోతే నేను నిన్ను రాళ్ళురువ్వి చంపివేస్తాను. కావున నీవు నానుండి చాలా దూరమైపో!”

19:47 – قَالَ سَلَامٌ عَلَيْكَ ۖ سَأَسْتَغْفِرُ لَكَ رَبِّي ۖ إِنَّهُ كَانَ بِي حَفِيًّا ٤٧

(ఇబ్రాహీమ్‌) అన్నాడు:”నీకు సలాం! 13 నీ కొరకు నా ప్రభువు క్షమాపణను వేడుకుంటాను. 14 నిశ్చయంగా ఆయన నాయెడల ఎంతోదయాళువు.

19:48 – وَأَعْتَزِلُكُمْ وَمَا تَدْعُونَ مِن دُونِ اللَّـهِ وَأَدْعُو رَبِّي عَسَىٰ أَلَّا أَكُونَ بِدُعَاءِ رَبِّي شَقِيًّا ٤٨

”మరియు నేను మిమ్మల్ని – మరియు అల్లాహ్‌కు బదులుగా మీరు ప్రార్థిస్తున్నవాటిని – అందరినీ వదలిపోతున్నాను. మరియు నేను నా ప్రభువును ప్రార్థిస్తాను. నేను నా ప్రభువును ప్రార్థించి విఫలుడనుకానని, నమ్ముతున్నాను!”

19:49 – فَلَمَّا اعْتَزَلَهُمْ وَمَا يَعْبُدُونَ مِن دُونِ اللَّـهِ وَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ ۖ وَكُلًّا جَعَلْنَا نَبِيًّا ٤٩

అతను (ఇబ్రాహీమ్‌) వారిని – మరియు అల్లాహ్‌ను వదలి వారు ఆరాధించే వాటిని – వదలి పోయిన తరువాత మేము అతనికి ఇస్‌’హాఖ్‌ మరియు య’అఖూబ్‌లను ప్రసాదించాము. మరియు ప్రతి ఒక్కరినీ ప్రవక్తలుగా చేశాము.

19:50 – وَوَهَبْنَا لَهُم مِّن رَّحْمَتِنَا وَجَعَلْنَا لَهُمْ لِسَانَ صِدْقٍ عَلِيًّا ٥٠

మరియు వారికి మా కారుణ్యాన్ని ప్రసాదించాము. వారికి నిజమైన, ఉన్నతమైన కీర్తి ప్రతిష్ఠలను కలుగజేశాము.

19:51 – وَاذْكُرْ فِي الْكِتَابِ مُوسَىٰ ۚ إِنَّهُ كَانَ مُخْلَصًا وَكَانَ رَسُولًا نَّبِيًّا ٥١

మరియు ఈ గ్రంథం (ఖుర్‌ఆన్‌)లో వచ్చిన మూసా గాథను ప్రస్తావించు. నిశ్చయంగా, అతను (అల్లాహ్‌) ఎన్నుకున్న ఒక సందేశహరుడు మరియు ఒక ప్రవక్త. 15

19:52 – وَنَادَيْنَاهُ مِن جَانِبِ الطُّورِ الْأَيْمَنِ وَقَرَّبْنَاهُ نَجِيًّا ٥٢

మరియు మేము ‘తూర్‌ కొండ కుడివైపు నుండి అతనిని (మూసాను) పిలిచి, 16 అతనితో ఏకాంతంలో మాట్లాడటానికి మమ్మల్ని సమీపింప జేశాము.

19:53 – وَوَهَبْنَا لَهُ مِن رَّحْمَتِنَا أَخَاهُ هَارُونَ نَبِيًّا ٥٣

మరియు మా కారుణ్యంతో, అతనికి తోడుగా అతని సోదరుడైన, హారూన్‌ను కూడా ప్రవక్తగా నియమించాము.

19:54 – وَاذْكُرْ فِي الْكِتَابِ إِسْمَاعِيلَ ۚ إِنَّهُ كَانَ صَادِقَ الْوَعْدِ وَكَانَ رَسُولًا نَّبِيًّا ٥٤

మరియు ఈ గ్రంథంలో (ఖుర్‌ఆన్‌లో) వచ్చిన ఇస్మా’యీల్‌ గాథను ప్రస్తావించు. నిశ్చయంగా, అతను వాగ్దానాలను సత్యం చేసే (నెరవేర్చే) వాడు మరియు ఒక సందేశహరుడు మరియు ఒక ప్రవక్త.

19:55 – وَكَانَ يَأْمُرُ أَهْلَهُ بِالصَّلَاةِ وَالزَّكَاةِ وَكَانَ عِندَ رَبِّهِ مَرْضِيًّا ٥٥

మరియు అతను తన కుటుంబం వారిని నమా’జ్‌ మరియు విధిదానం (‘జకాత్‌)లను పాటించమని ఆజ్ఞాపించే వాడు. మరియు తన ప్రభువుకు ప్రీతి పాత్రుడుగా ఉండేవాడు.

19:56 – وَاذْكُرْ فِي الْكِتَابِ إِدْرِيسَ ۚ إِنَّهُ كَانَ صِدِّيقًا نَّبِيًّا ٥٦

మరియు ఈ గ్రంథంలో (ఖుర్‌ఆన్‌లో) వచ్చిన ఇద్రీస్‌ గాథను ప్రస్తావించు. నిశ్చయంగా, అతను సత్య వంతుడైన ప్రవక్త.

19:57 – وَرَفَعْنَاهُ مَكَانًا عَلِيًّا ٥٧

మరియు మేము అతనిని ఉన్నత స్థానానికి ఎత్తాము. 17

19:58 – أُولَـٰئِكَ الَّذِينَ أَنْعَمَ اللَّـهُ عَلَيْهِم مِّنَ النَّبِيِّينَ مِن ذُرِّيَّةِ آدَمَ وَمِمَّنْ حَمَلْنَا مَعَ نُوحٍ وَمِن ذُرِّيَّةِ إِبْرَاهِيمَ وَإِسْرَائِيلَ وَمِمَّنْ هَدَيْنَا وَاجْتَبَيْنَا ۚ إِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُ الرَّحْمَـٰنِ خَرُّوا سُجَّدًا وَبُكِيًّا ۩ ٥٨

వారందరూ, అల్లాహ్‌ అనుగ్రహించిన ఆదమ్‌ సంతతి వారిలోని దైవప్రవక్తలలో కొందరు. మరియు వారిలో కొందరు, మేము నూ’హ్‌ ఓడలో ఎక్కింప జేసినవారు, మరికొందరు ఇబ్రాహీమ్‌ మరియు ఇస్రాయీ’ల్‌ (య’అఖూబ్‌) సంతానానికి చెందిన వారున్నారు. మరియు వారిలో మేము ఎన్నుకొని సన్మార్గం చూపిన వారున్నారు. ఒకవేళ వారికి కరుణామయుని సూచనలు (ఆయాత్‌) చదివి వినిపించినప్పుడు, వారు విలపిస్తూ సాష్టాంగం (సజ్దా) లో పడిపోయేవారు. (3/8) (సజ్దా)

19:59 – فَخَلَفَ مِن بَعْدِهِمْ خَلْفٌ أَضَاعُوا الصَّلَاةَ وَاتَّبَعُوا الشَّهَوَاتِ ۖ فَسَوْفَ يَلْقَوْنَ غَيًّا ٥٩

  • కాని వారి తరువాత వచ్చిన, వారి సంతతి వారు కొందరు, నమా’జ్‌లను విడిచిపెట్టి, తమ (దుష్ట) మనోవాంఛలను అనుసరించారు. కావున త్వరలోనే వారు అధోగతి (నరకంలో)కి చేరగలరు.

19:60 – إِلَّا مَن تَابَ وَآمَنَ وَعَمِلَ صَالِحًا فَأُولَـٰئِكَ يَدْخُلُونَ الْجَنَّةَ وَلَا يُظْلَمُونَ شَيْئًا ٦٠

కాని ఎవరైతే, పశ్చాత్తాపపడి మరియు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, అలాంటివారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.

19:61 – جَنَّاتِ عَدْنٍ الَّتِي وَعَدَ الرَّحْمَـٰنُ عِبَادَهُ بِالْغَيْبِ ۚ إِنَّهُ كَانَ وَعْدُهُ مَأْتِيًّا ٦١

అనంత కరుణామయుడు, తన దాసులకు వాగ్దానం చేసిన, అగోచర జగత్తులోని శాశ్వతమైన స్వర్గవనాలు. నిశ్చయంగా, ఆయన వాగ్దానం పూర్తయి తీరుతుంది.

19:62 – لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًا إِلَّا سَلَامًا ۖ وَلَهُمْ رِزْقُهُمْ فِيهَا بُكْرَةً وَعَشِيًّا ٦٢

వారందులో మీకు శాంతి కలుగుగాక (సలాం)! అనడం తప్ప ఇతర ఏ విధమైన వ్యర్థపు మాటలు వినరు. మరియుఅందులోవారికి ఉదయంమరియు సాయంత్రం జీవనోపాధి లభిస్తూ ఉంటుంది.

19:63 – تِلْكَ الْجَنَّةُ الَّتِي نُورِثُ مِنْ عِبَادِنَا مَن كَانَ تَقِيًّا ٦٣

మా దాసులలో దైవభీతి గలవారిని వారసులుగా చేసే స్వర్గం ఇదే!

19:64 – وَمَا نَتَنَزَّلُ إِلَّا بِأَمْرِ رَبِّكَ ۖ لَهُ مَا بَيْنَ أَيْدِينَا وَمَا خَلْفَنَا وَمَا بَيْنَ ذَٰلِكَ ۚ وَمَا كَانَ رَبُّكَ نَسِيًّا ٦٤

(దేవదూతలు అంటారు): ”మరియు మేము కేవలం నీ ప్రభువు ఆజ్ఞతో తప్ప క్రిందికి దిగిరాము. మా ముందున్నది, మా వెనుక నున్నది మరియు వాటి మధ్య నున్నదీ, సర్వం ఆయనకు చెందినదే! 18 నీ ప్రభువు మరచిపోయేవాడు కాడు.

19:65 – رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا فَاعْبُدْهُ وَاصْطَبِرْ لِعِبَادَتِهِ ۚ هَلْ تَعْلَمُ لَهُ سَمِيًّا ٦٥

”ఆకాశాలకూ, భూమికీ మరియు వాటి మధ్యనున్న సమస్తానికీ ఆయనే ప్రభువు, కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయన ఆరాధనలోనే స్థిరంగా వుండండి. ఆయనతో సమానమైన స్థాయిగల వానిని ఎవడినైనా మీరెరుగుదురా?”

19:66 – وَيَقُولُ الْإِنسَانُ أَإِذَا مَا مِتُّ لَسَوْفَ أُخْرَجُ حَيًّا ٦٦

మరియు మానవుడు 19 ఇలా అంటూ ఉంటాడు: ”ఏమీ? నేను చనిపోయిన తరువాత మళ్ళీ బ్రతికించబడి లేపబడతానా?”

19:67 – أَوَلَا يَذْكُرُ الْإِنسَانُ أَنَّا خَلَقْنَاهُ مِن قَبْلُ وَلَمْ يَكُ شَيْئًا ٦٧

ఏమీ? మునుపు, అతడి ఉనికే లేనప్పుడు, మేము అతనిని సృష్టించిన విషయం అతనికి జ్ఞాపకం రావటం లేదా?

19:68 – فَوَرَبِّكَ لَنَحْشُرَنَّهُمْ وَالشَّيَاطِينَ ثُمَّ لَنُحْضِرَنَّهُمْ حَوْلَ جَهَنَّمَ جِثِيًّا ٦٨

కావున నీ ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, మేము వారందరినీ మరియు (వారితో పాటు) షైతానులను కూడా ప్రోగుచేసి, ఆ తరువాత నిశ్చయంగా, వారందరినీ నరకం చుట్టు మోకాళ్ళ మీద సమావేశ పరుస్తాము.

19:69 – ثُمَّ لَنَنزِعَنَّ مِن كُلِّ شِيعَةٍ أَيُّهُمْ أَشَدُّ عَلَى الرَّحْمَـٰنِ عِتِيًّا ٦٩

ఆ తరువాత నిశ్చయంగా, ప్రతి తెగవారిలో నుండి అనంత కరుణామయునికి ఎవరు ఎక్కువ అవిధేయులుగా ఉండేవారో వారిని వేరుచేస్తాము. 20

19:70 – ثُمَّ لَنَحْنُ أَعْلَمُ بِالَّذِينَ هُمْ أَوْلَىٰ بِهَا صِلِيًّا ٧٠

అప్పుడు వారిలో (నరకాగ్నిలో) కాలటానికి ఎక్కువ అర్హులెవరో, మాకు బాగా తెలుసు.

19:71 – وَإِن مِّنكُمْ إِلَّا وَارِدُهَا ۚ كَانَ عَلَىٰ رَبِّكَ حَتْمًا مَّقْضِيًّا ٧١

మరియు మీలో ఎవ్వడునూ దాని (నరకంపై గల వంతెన) మీద నుండి పోకుండా (దాటకుండా) ఉండలేడు. ఇది తప్పించుకోలేని, నీ ప్రభువు యొక్క నిర్ణయం. 21

19:72 – ثُمَّ نُنَجِّي الَّذِينَ اتَّقَوا وَّنَذَرُ الظَّالِمِينَ فِيهَا جِثِيًّا ٧٢

ఆ పిదప మేము దైవభీతి గలవారిని రక్షిస్తాము. మరియు దుర్మార్గులను అందులో మోకాళ్ళ మీద పడి ఉండటానికి వదులుతాము.

19:73 – وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا أَيُّ الْفَرِيقَيْنِ خَيْرٌ مَّقَامًا وَأَحْسَنُ نَدِيًّا ٧٣

మరియు స్పష్టమైన మా సూచనలను వారికి చదివి వినిపించినపుడు, సత్య- తిరస్కారులు విశ్వాసులతో అంటారు: ”మన రెండువర్గాల వారిలో ఎవరి వర్గం మంచిస్థితిలో ఉంది మరియు ఎవరి సభ ఉత్తమమైనది?” 22

19:74 – وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّن قَرْنٍ هُمْ أَحْسَنُ أَثَاثًا وَرِئْيًا ٧٤

మరియు వారికి ముందు మేము ఎన్నో తరాలను (వంశాలను) నాశనం చేశాము; వారు వీరికంటే ఎక్కువ సిరి సంపదలు మరియు బాహ్య ఆడంబరాలు గలవారై ఉండిరి?

19:75 – قُلْ مَن كَانَ فِي الضَّلَالَةِ فَلْيَمْدُدْ لَهُ الرَّحْمَـٰنُ مَدًّا ۚ حَتَّىٰ إِذَا رَأَوْا مَا يُوعَدُونَ إِمَّا الْعَذَابَ وَإِمَّا السَّاعَةَ فَسَيَعْلَمُونَ مَنْ هُوَ شَرٌّ مَّكَانًا وَأَضْعَفُ جُندًا ٧٥

వారితో అను: ”మార్గభ్రష్టత్వంలో పడివున్న వానికి, అనంత కరుణామయుడు, ఒక సమయం వరకు వ్యవధి నిస్తూ ఉంటాడు. తుదకు వారు తమకు వాగ్దానం చేయబడిన దానిని చూసినపుడు, అది (కఠినమైన) శిక్షనో కావచ్చు లేదా అంతిమ గడియనో కావచ్చు! హీనస్థితిలో ఉన్నవాడెవడో మరియు బలహీన వర్గం (సేన) ఎవరిదో వారికి తెలియగలదు!

19:76 – وَيَزِيدُ اللَّـهُ الَّذِينَ اهْتَدَوْا هُدًى ۗ وَالْبَاقِيَاتُ الصَّالِحَاتُ خَيْرٌ عِندَ رَبِّكَ ثَوَابًا وَخَيْرٌ مَّرَدًّا ٧٦

”మరియు (దానికి ప్రతిగా) మార్గదర్శకత్వం పొందినవారికి, అల్లాహ్‌ మార్గదర్శకత్వంలో వృధ్ధిని ప్రసాదిస్తాడు. చిరస్థాయిగా ఉండిపోయే సత్కార్యాలే నీ ప్రభువు దగ్గర ప్రతిఫలం రీత్యా ఉత్తమమైనవి మరియు పర్యవసానం దృష్ట్యా కూడా ఉత్తమమైనవి.” 23

19:77 – أَفَرَأَيْتَ الَّذِي كَفَرَ بِآيَاتِنَا وَقَالَ لَأُوتَيَنَّ مَالًا وَوَلَدًا ٧٧

ఏమీ? మా సూచనలను తిరస్కరించి: ”నిశ్చయంగా నాకు ధనసంపదలూ మరియు సంతానం ఇవ్వబడుతూనే ఉంటాయి.” అని పలికే వానిని నీవు చూశావా?

19:78 – أَطَّلَعَ الْغَيْبَ أَمِ اتَّخَذَ عِندَ الرَّحْمَـٰنِ عَهْدًا ٧٨

ఏమీ? అతడు అగోచరాన్ని చూశాడా? లేదా అనంత కరుణామయుని వాగ్దానం పొందాడా?

19:79 – كَلَّا ۚ سَنَكْتُبُ مَا يَقُولُ وَنَمُدُّ لَهُ مِنَ الْعَذَابِ مَدًّا ٧٩

అలాకాదు! అతడు చెప్పేది, మేము వ్రాసిపెట్టగలము. మరియు అతడి శిక్షను మరింత పెంచగలము.

19:80 – وَنَرِثُهُ مَا يَقُولُ وَيَأْتِينَا فَرْدًا ٨٠

మరియు అతడు చెప్పే వస్తువులకు మేమే వారసులమవుతాము మరియు అతడు ఒంటరిగానే మా వద్దకు వస్తాడు.

19:81 – وَاتَّخَذُوا مِن دُونِ اللَّـهِ آلِهَةً لِّيَكُونُوا لَهُمْ عِزًّا ٨١

మరియు వారు అల్లాహ్‌ను వదిలి ఇతరులను ఆరాధ్యదైవాలుగా చేసుకున్నారు, వారు వీరికి అండగా ఉంటారనుకొని!

19:82 – كَلَّا ۚ سَيَكْفُرُونَ بِعِبَادَتِهِمْ وَيَكُونُونَ عَلَيْهِمْ ضِدًّا ٨٢

అలా కాదు! వారు (ఆ దైవాలు) వీరి ఆరాధనను నిరాకరించటమే గాక, వీరికి విరోధులుగా ఉంటారు.

19:83 – أَلَمْ تَرَ أَنَّا أَرْسَلْنَا الشَّيَاطِينَ عَلَى الْكَافِرِينَ تَؤُزُّهُمْ أَزًّا ٨٣

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా మేము సత్య-తిరస్కారులపై షై’తానులను వదిలా మని? అవి వారిని (సత్యాన్ని తిరస్కరించమని) అత్యధికంగా ప్రేరేపిస్తూ ఉంటాయని? 24

19:84 – فَلَا تَعْجَلْ عَلَيْهِمْ ۖ إِنَّمَا نَعُدُّ لَهُمْ عَدًّا ٨٤

కావున వారిమీద (శిక్షను) అవతరింప జేయ మని నీవుతొందరపెట్టకు.నిశ్చయంగా మేము(వారి దినాలను) ఖచ్చితంగా లెక్కపెడుతున్నాము.

19:85 – يَوْمَ نَحْشُرُ الْمُتَّقِينَ إِلَى الرَّحْمَـٰنِ وَفْدًا ٨٥

ఆరోజు మేము దైవభీతి గలవారిని అనంత కరుణామయుని సన్నిధిలో అతిథులుగా ప్రవేశ పెడతాము.

19:86 – وَنَسُوقُ الْمُجْرِمِينَ إِلَىٰ جَهَنَّمَ وِرْدًا ٨٦

మరియు అపరాధులను దప్పికగొన్న వాటి వలే (జంతువులవలే), నరకం వైపునకు తోలుకొని పోతాము.

19:87 – لَّا يَمْلِكُونَ الشَّفَاعَةَ إِلَّا مَنِ اتَّخَذَ عِندَ الرَّحْمَـٰنِ عَهْدًا ٨٧

(ఆ నాడు) అనంత కరుణామయుని అనుమతి పొందినవాడు తప్ప మరెవ్వరికీ సిఫారసు చేసే అధికారం ఉండదు. 25

19:88 – وَقَالُوا اتَّخَذَ الرَّحْمَـٰنُ وَلَدًا ٨٨

వారిలా అంటున్నారు: ”అనంత కరుణా మయునికి కొడుకున్నాడు.” 26

19:89 – لَّقَدْ جِئْتُمْ شَيْئًا إِدًّا ٨٩

వాస్తవానికి, మీరు ఎంత పాపిష్ఠికరమైన విష యాన్ని కల్పించారు.

19:90 – تَكَادُ السَّمَاوَاتُ يَتَفَطَّرْنَ مِنْهُ وَتَنشَقُّ الْأَرْضُ وَتَخِرُّ الْجِبَالُ هَدًّا ٩٠

దాని వలన ఆకాశాలు ప్రేలిపోవచ్చు! భూమి చీలి పోవచ్చు! మరియు పర్వతాలు ధ్వంసమై పోవచ్చు!

19:91 – أَن دَعَوْا لِلرَّحْمَـٰنِ وَلَدًا ٩١

ఎందుకంటే వారు అనంత కరుణామయునికి కొడుకున్నాడని ఆరోపించారు.

19:92 – وَمَا يَنبَغِي لِلرَّحْمَـٰنِ أَن يَتَّخِذَ وَلَدًا ٩٢

ఎవరినైనా కొడుకుగా చేసుకోవటం అనంత కరుణామయునికి తగినది కాదు. 27

19:93 – إِن كُلُّ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ إِلَّا آتِي الرَّحْمَـٰنِ عَبْدًا ٩٣

ఎందు కంటే! భూమ్యాకాశాలలో నున్న వారందరూ కేవలం అనంత కరుణామయుని దాసులుగా మాత్రమే హాజరుకానున్నారు. 28

19:94 – لَّقَدْ أَحْصَاهُمْ وَعَدَّهُمْ عَدًّا ٩٤

వాస్తవానికి, ఆయన అందరినీ పరివేష్టించి ఉన్నాడు మరియు వారిని సరిగ్గా లెక్కపెట్టి ఉన్నాడు.

19:95 – وَكُلُّهُمْ آتِيهِ يَوْمَ الْقِيَامَةِ فَرْدًا ٩٥

మరియు పునరుత్థాన దినమున వారందరూ, ఒంటరిగానే ఆయన ముందు హాజరవుతారు. 29

19:96 – إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَيَجْعَلُ لَهُمُ الرَّحْمَـٰنُ وُدًّا ٩٦

నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసేవారి పట్ల అనంత కరుణామయుడు (ప్రజల హృదయాలలో) ప్రేమను (వాత్సల్యాన్ని) కలుగ జేయగలడు.

19:97 – فَإِنَّمَا يَسَّرْنَاهُ بِلِسَانِكَ لِتُبَشِّرَ بِهِ الْمُتَّقِينَ وَتُنذِرَ بِهِ قَوْمًا لُّدًّا ٩٧

కావున నీవు (ఓ ప్రవక్తా!) దైవభీతి గలవారికి శుభవార్త నివ్వటానికీ మరియు వాదులాడే జాతి వారిని హెచ్చరించటానికీ, మేము దీనిని (ఈ ఖుర్‌ఆన్‌ను) సులభతరంచేసి, నీ భాషలో అవతరింపజేశాము. 30

19:98 – وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّن قَرْنٍ هَلْ تُحِسُّ مِنْهُم مِّنْ أَحَدٍ أَوْ تَسْمَعُ لَهُمْ رِكْزًا ٩٨

మరియు వీరికి పూర్వం మేము ఎన్ని తరాలవారిని నాశనం చేయలేదు! ఏమీ? నీవు ఇప్పుడు వారిలో ఏ ఒక్కరినైనా చూస్తున్నావా? లేక వారి మెల్లని శబ్దమైనా వింటున్నావా? (1/2)

సూరహ్‌ ‘తా-హా – ‘ఉమర్‌ (ర’ది.’అ.) ఇస్లాం స్వీకరించిన విధానాలు ఎన్నోవివరించబడ్డాయి. కొన్ని ఉల్లేఖనా (రివాయాత్‌)లలో ఇలా ఉంది: అతడు తన చెల్లెలు మరియు ఆమె భర్త ఇంట్లో – ఎవరైతే అతని కంటే ముందే ఇస్లాం స్వీకరించి ఉంటారో – ఈ సూరహ్‌ను విని ప్రభావితుడై ఇస్లాం స్వీకరిస్తారు. ఇది హిజ్రత్‌కు దాదాపు 7 సంవత్సరాలకు ముందు – అబీసీనియాకు ముస్లింలు వెళ్ళక ముందు – మక్కహ్ లో అతరింపజేయబడింది. ఈ సూరహ్‌లో మూసా (‘అ.స.) వృత్తాంతం 9-98 ఆయత్‌లలో వివరంగా ఉంది. 135 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 20:1 – طه ١

‘తా-హా!

20:2 – مَا أَنزَلْنَا عَلَيْكَ الْقُرْآنَ لِتَشْقَ ٢

మేము ఈ ఖుర్‌ఆన్‌ను నీపై అవతరింప జేసింది నిన్ను కష్టానికి గురిచేయటానికి కాదు. 1

20:3 – إِلَّا تَذْكِرَةً لِّمَن يَخْشَىٰ ٣

కేవలం (అల్లాహ్‌కు) భయపడే వారికి హితబోధ చేయటానికే!

20:4 – تَنزِيلًا مِّمَّنْ خَلَقَ الْأَرْضَ وَالسَّمَاوَاتِ الْعُلَى ٤

ఇది (ఈ ఖుర్‌ఆన్‌) భూమినీ మరియు అత్యున్న తమైన ఆకాశాలనూ సృష్టించిన ఆయన (అల్లాహ్‌) తరఫు నుండి క్రమ-క్రమంగా అవతరింప జేయబడింది.

20:5 – الرَّحْمَـٰنُ عَلَى الْعَرْشِ اسْتَوَىٰ ٥

ఆ కరుణామయుడు, సింహాసనం (‘అర్ష్‌)పై ఆసీనుడై ఉన్నాడు. 2

20:6 – لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَمَا تَحْتَ الثَّرَىٰ ٦

ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ మరియు ఆ రెండింటి మధ్యనూ ఇంకా నేలక్రిందనూ ఉన్న 3 సమస్తమూ ఆయనకు చెందినదే.

20:7 – وَإِن تَجْهَرْ بِالْقَوْلِ فَإِنَّهُ يَعْلَمُ السِّرَّ وَأَخْفَى ٧

మరియు నీవు బిగ్గరగా మాట్లాడితే (ఆయన విననే వింటాడు); వాస్తవానికి, ఆయనకు రహస్యంగా (చెప్పుకునే మాటలే గాక) అతి గోప్యమైన మాటలు కూడా, తెలుస్తాయి. 7

20:8 – اللَّـهُ لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۖ لَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ ٨

అల్లాహ్‌! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనకు అత్యుత్తమమైనపేర్లున్నాయి. 5

20:9 – وَهَلْ أَتَاكَ حَدِيثُ مُوسَىٰ ٩

ఇక మూసా వృత్తాంతం నీకు అందిందా? 6

20:10 – إِذْ رَأَىٰ نَارًا فَقَالَ لِأَهْلِهِ امْكُثُوا إِنِّي آنَسْتُ نَارًا لَّعَلِّي آتِيكُم مِّنْهَا بِقَبَسٍ أَوْ أَجِدُ عَلَى النَّارِ هُدًى ١٠

అతను ఒక మంటను చూసినపుడు తన ఇంటి వారితో ఇలా అన్నాడు: 7 ”ఆగండి! నిశ్చయంగా, నాకొక మంట కనబడుతోంది; బహుశా నేను దానినుండి మీ కొరకు ఒక కొరివిని తీసుకొనివస్తాను లేదా ఆ మంట దగ్గర, నాకేదైనా మార్గదర్శకత్వం లభించవచ్చు!”

20:11 – فَلَمَّا أَتَاهَا نُودِيَ يَا مُوسَىٰ ١١

అతను దాని దగ్గరకు చేరినప్పుడు ఇలా పిలువబడ్డాడు: 8 ”ఓ మూసా!

20:12 – إِنِّي أَنَا رَبُّكَ فَاخْلَعْ نَعْلَيْكَ ۖ إِنَّكَ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًى ١٢

”నిశ్చయంగా, నేనే నీ ప్రభువును, కావున నీవు నీ చెప్పులను విడువు. వాస్తవానికి, నీవు పవిత్రమైన ‘తువా 9 లోయలో ఉన్నావు.

20:13 – وَأَنَا اخْتَرْتُكَ فَاسْتَمِعْ لِمَا يُوحَىٰ ١٣

”మరియు నేను నిన్ను (ప్రవక్తగా) ఎన్ను కున్నాను. నేను నీపై అవతరింపజేసే దివ్య జ్ఞానాన్ని (వ’హీని) జాగ్రత్తగా విను.

20:14 – إِنَّنِي أَنَا اللَّـهُ لَا إِلَـٰهَ إِلَّا أَنَا فَاعْبُدْنِي وَأَقِمِ الصَّلَاةَ لِذِكْرِي ١٤

”నిశ్చయంగా, నేనే అల్లాహ్‌ను! నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమా’జ్‌ను స్థాపించు.

20:15 – إِنَّ السَّاعَةَ آتِيَةٌ أَكَادُ أُخْفِيهَا لِتُجْزَىٰ كُلُّ نَفْسٍ بِمَا تَسْعَ ١٥

”నిశ్చయంగా, తీర్పుఘడియ రానున్నది, ప్రతివ్యక్తీ తానుచేసిన కర్మల ప్రకారం ప్రతిఫలం పొందటానికి; నేను దానిని గోప్యంగా ఉంచాలని నిర్ణయించాను. 10

20:16 – فَلَا يَصُدَّنَّكَ عَنْهَا مَن لَّا يُؤْمِنُ بِهَا وَاتَّبَعَ هَوَاهُ فَتَرْدَىٰ ١٦

  1. ”కావున దానిని విశ్వసించకుండా, తన మనో వాంఛలను అనుసరించేవాడు, నిన్ను దాని (ఆ ఘడియ చింత) నుండి మరలింపనివ్వరాదు; అలా అయితే నీవు నాశనానికి గురికాగలవు.

20:17 – وَمَا تِلْكَ بِيَمِينِكَ يَا مُوسَ ١٧

”మరియు ఓ మూసా! నీ కుడిచేతిలో ఉన్నది ఏమిటి?”

20:18 – قَالَ هِيَ عَصَايَ أَتَوَكَّأُ عَلَيْهَا وَأَهُشُّ بِهَا عَلَىٰ غَنَمِي وَلِيَ فِيهَا مَآرِبُ أُخْرَىٰ ١٨

(మూసా) అన్నాడు: ”ఇది నాచేతి కర్ర, దీనిని ఆనుకొని నిలబడతాను మరియు దీనితో నా మేకలకొరకు ఆకులు రాల్చుతాను. మరియు దీని నుండి నాకు ఇంకా ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి.”

20:19 – قَالَ أَلْقِهَا يَا مُوسَىٰ ١٩

(అల్లాహ్‌) అన్నాడు: ”ఓ మూసా! దానిని భూమిమీద పడవేయి.”

20:20 – فَأَلْقَاهَا فَإِذَا هِيَ حَيَّةٌ تَسْعَىٰ ٢٠

అప్పుడు అతను దానిని పడవేశాడు. వెంటనే అది పాముగా (హయ్యగా) 11 మారిపోయి చురుకుగా చలించసాగింది.

20:21 – قَالَ خُذْهَا وَلَا تَخَفْ ۖ سَنُعِيدُهَا سِيرَتَهَا الْأُولَىٰ ٢١

(అల్లాహ్‌) ఆజ్ఞాపించాడు: ”దానిని పట్టుకో, భయపడకు. మేము దానిని దాని పూర్వ స్థితిలోకి మార్చుతాము.

20:22 – وَاضْمُمْ يَدَكَ إِلَىٰ جَنَاحِكَ تَخْرُجْ بَيْضَاءَ مِنْ غَيْرِ سُوءٍ آيَةً أُخْرَىٰ ٢٢

”మరియు నీ చేతిని చంకలో పెట్టి తీయి, దానికెలాంటి బాధ కలుగకుండా, అది తెల్లగా మెరుస్తూ బయటికి వస్తుంది, 12 ఇది రెండవ అద్భుత సూచన!

20:23 – لِنُرِيَكَ مِنْ آيَاتِنَا الْكُبْرَى ٢٣

”ఇదంతా మేము నీకు మా గొప్ప సూచనలను చూపటానికి!

20:24 – اذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَىٰ ٢٤

”నీవు ఫిర్‌’ఔన్‌ వద్దకు పో! నిశ్చయంగా అతడు మితిమీరిపోయాడు.” 13

20:25 – قَالَ رَبِّ اشْرَحْ لِي صَدْرِي ٢٥

(మూసా) ఇలా మనవి చేసుకున్నాడు: ”ఓ నా ప్రభూ! నా హృదయాన్ని వికసింపజేయి.

20:26 – وَيَسِّرْ لِي أَمْرِي ٢٦

”మరియు నా వ్యవహారాన్ని నా కొరకు సులభం చేయి.

20:27 – وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي ٢٧

”నా నాలుకలోని ముడిని (ఆటంకాన్ని) తొలగించు.

20:28 – يَفْقَهُوا قَوْلِ ٢٨

”(దానితో) వారు నా మాటలను సులభంగా అర్థం చేసుకోవటానికి.

20:29 – وَاجْعَل لِّي وَزِيرًا مِّنْ أَهْلِي ٢٩

”మరియు నా కొరకు నా కుటుంబం నుండి ఒక సహాయకుణ్ణి నియమించు. 14

20:30 – هَارُونَ أَخِ ٣٠

”నా సోదరుడైన హారూన్‌ను.

20:31 – اشْدُدْ بِهِ أَزْرِي ٣١

”అతని ద్వారా నా బలాన్ని దృఢపరచు.

20:32 – وَأَشْرِكْهُ فِي أَمْرِي ٣٢

”మరియు అతనిని నా వ్యవహారంలో సహాయ కారిగా (భాగస్వామిగా) చేయి.

20:33 – كَيْ نُسَبِّحَكَ كَثِيرًا ٣٣

”మేము నీ పవిత్రతను బాగా కొనియాడ టానికి;

20:34 – وَنَذْكُرَكَ كَثِيرًا ٣٤

”మరియు నిన్ను అత్యధికంగా స్మరించ టానికి;

20:35 – إِنَّكَ كُنتَ بِنَا بَصِيرًا ٣٥

”నిశ్చయంగా, నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ కనిపెట్టుకునే ఉంటావు!”

20:36 – قَالَ قَدْ أُوتِيتَ سُؤْلَكَ يَا مُوسَىٰ ٣٦

(అల్లాహ్‌) సెలవిచ్చాడు: ”ఓ మూసా! వాస్తవంగా, నీవు కోరినదంతా నీకు ఇవ్వబడింది.

20:37 – وَلَقَدْ مَنَنَّا عَلَيْكَ مَرَّةً أُخْرَىٰ ٣٧

”మరియు వాస్తవానికి మేము నీకు మరొకసారి ఉపకారం చేశాము. 15

20:38 – إِذْ أَوْحَيْنَا إِلَىٰ أُمِّكَ مَا يُوحَ ٣٨

”అప్పుడు మేము నీ తల్లికి ఇవ్వ వలసిన ఆ సూచనను ఈ విధంగా సూచించాము:

20:39 – أَنِ اقْذِفِيهِ فِي التَّابُوتِ فَاقْذِفِيهِ فِي الْيَمِّ فَلْيُلْقِهِ الْيَمُّ بِالسَّاحِلِ يَأْخُذْهُ عَدُوٌّ لِّي وَعَدُوٌّ لَّهُ ۚ وَأَلْقَيْتُ عَلَيْكَ مَحَبَّةً مِّنِّي وَلِتُصْنَعَ عَلَىٰ عَيْنِي ٣٩

‘ఇతనిని (ఈ బాలుణ్ణి) ఒక పెట్టెలో పెట్టి దానిని (ఆ పెట్టెను) నదిలో విడువు. నది దానిని ఒక ఒడ్డుకు చేర్చుతుంది; దానిని నాకు మరియు ఇతనికి శత్రువు అయినవాడు తీసుకుంటాడు.’ మరియు నేను నా తరఫు నుండి నీ మీద ప్రేమను కురిపించాను మరియు నిన్ను నా కంటి ముందు పోషింపబడేటట్లు చేశాను. 16

20:40 – إِذْ تَمْشِي أُخْتُكَ فَتَقُولُ هَلْ أَدُلُّكُمْ عَلَىٰ مَن يَكْفُلُهُ ۖ فَرَجَعْنَاكَ إِلَىٰ أُمِّكَ كَيْ تَقَرَّ عَيْنُهَا وَلَا تَحْزَنَ ۚ وَقَتَلْتَ نَفْسًا فَنَجَّيْنَاكَ مِنَ الْغَمِّ وَفَتَنَّاكَ فُتُونًا ۚ فَلَبِثْتَ سِنِينَ فِي أَهْلِ مَدْيَنَ ثُمَّ جِئْتَ عَلَىٰ قَدَرٍ يَا مُوسَىٰ ٤٠

”అప్పుడు నీ సోదరి (నిన్ను) అనుసరిస్తూ పోయి, వారితో ఇలా అన్నది: ‘ఇతనిని పెంచి పోషించగల ఒకామెను నేను మీకు చూపనా?’ 17 ఈ విధంగా మేము నిన్ను మళ్ళీ నీతల్లి దగ్గరకు చేర్చాము, ఆమె కళ్ళకు చల్లదనమివ్వటానికి, ఆమెను దుఃఖపడకుండా ఉంచటానికి. 18 మరియు నీవొక వ్యక్తిని చంపావు, 19 మేము ఆ ఆపద నుండి నీకు విముక్తి కలిగించాము. మేము నిన్ను అనేక విధాలుగా పరీక్షించాము. 20 ఆ తరువాత నీవు ఎన్నో సంవత్సరాలు మద్‌యన్‌ వారితో ఉంటివి. 21 ఓ మూసా! ఇప్పుడు నీవు (మా) నిర్ణయాను సారంగా (ఇక్కడికి) వచ్చావు.

20:41 – وَاصْطَنَعْتُكَ لِنَفْسِ ٤١

”మరియు నేను నిన్ను నా (సేవ) కొరకు ఎన్నుకున్నాను.

20:42 – اذْهَبْ أَنتَ وَأَخُوكَ بِآيَاتِي وَلَا تَنِيَا فِي ذِكْرِي ٤٢

”నీవు మరియు నీ సోదరుడు నా సూచనలతో వెళ్ళండి. నన్ను స్మరించటంలో అశ్రధ్ధ వహించకండి. 22

20:43 – اذْهَبَا إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَ ٤٣

”మీరిద్దరు ఫిర్‌’ఔన్‌ దగ్గరకు వెళ్ళండి. అతడు మితిమీరి ప్రవర్తిస్తున్నాడు.

20:44 – فَقُولَا لَهُ قَوْلًا لَّيِّنًا لَّعَلَّهُ يَتَذَكَّرُ أَوْ يَخْشَىٰ ٤٤

”కాని అతనితో మృదువుగా మాట్లాడండి. బహుశా అతడు హితబోధ స్వీకరిస్తాడేమో, లేదా భయపడతాడేమో!” 23

20:45 – قَالَا رَبَّنَا إِنَّنَا نَخَافُ أَن يَفْرُطَ عَلَيْنَا أَوْ أَن يَطْغَىٰ ٤٥

(మూసా మరియు హారూన్‌) ఇద్దరూ ఇలా అన్నారు: ”ఓ మా ప్రభూ! వాస్తవానికి, అతడు మమ్మల్ని శిక్షిస్తాడేమోనని, లేదా తలబిరుసు తనంతో ప్రవర్తిస్తాడేమోనని మేము భయపడు తున్నాము!”

20:46 – قَالَ لَا تَخَافَا ۖ إِنَّنِي مَعَكُمَا أَسْمَعُ وَأَرَىٰ ٤٦

(అల్లాహ్‌) సెలవిచ్చాడు: ”మీరిద్దరు భయపడకండి, నిశ్చయంగా, మీరిద్దరితో పాటు నేనూ ఉన్నాను. నేను అంతా వింటూ ఉంటాను మరియు అంతా చూస్తూ ఉంటాను.

20:47 – فَأْتِيَاهُ فَقُولَا إِنَّا رَسُولَا رَبِّكَ فَأَرْسِلْ مَعَنَا بَنِي إِسْرَائِيلَ وَلَا تُعَذِّبْهُمْ ۖ قَدْ جِئْنَاكَ بِآيَةٍ مِّن رَّبِّكَ ۖ وَالسَّلَامُ عَلَىٰ مَنِ اتَّبَعَ الْهُدَىٰ ٤٧

”కావున మీరిద్దరు అతని వద్దకు పోయి ఇలా అనండి: ‘నిశ్చయంగా, మేమిద్దరం నీ ప్రభువు యొక్క సందేశహరులము. కావున ఇస్రాయీ’ల్‌ సంతతివారిని మావెంట పోనివ్వు. 24 మరియు వారిని బాధపెట్టకు. వాస్తవానికి మేము నీ వద్దకు నీ ప్రభువు తరఫు నుండి సూచనలు తీసుకొని వచ్చాము. మరియు సన్మార్గాన్ని అనుసరించే వానిపై (అల్లాహ్‌ తరఫు నుండి) శాంతి వర్థిల్లుతుంది! 25

20:48 – إِنَّا قَدْ أُوحِيَ إِلَيْنَا أَنَّ الْعَذَابَ عَلَىٰ مَن كَذَّبَ وَتَوَلَّىٰ ٤٨

‘నిశ్చయంగా, ఎవడైతే సత్యాన్ని తిరస్కరించి వెనుదిరిగిపోతాడో, అతనికి కఠిన శిక్ష తప్పక ఉంటుంది.’ అని వాస్తవానికి మాకు దివ్యజ్ఞానం (వ’హీ) ద్వారా తెలుపబడింది.”

20:49 – قَالَ فَمَن رَّبُّكُمَا يَا مُوسَىٰ ٤٩

(ఫిర్‌’ఔన్‌) అన్నాడు: ”ఓ మూసా! మీ ఇరువురి ప్రభువు ఎవరు?”

20:50 – قَالَ رَبُّنَا الَّذِي أَعْطَىٰ كُلَّ شَيْءٍ خَلْقَهُ ثُمَّ هَدَىٰ ٥٠

(మూసా) జవాబిచ్చాడు: ”ప్రతి దానికి దాని రూపాన్నిచ్చి, తరువాత దానికి మార్గదర్శకత్వం చేసేవాడే మా ప్రభువు.”

20:51 – قَالَ فَمَا بَالُ الْقُرُونِ الْأُولَ ٥١

(ఫిర్‌’ఔన్‌) అన్నాడు: ”అయితే, పూర్వం గతించిన తరాల వారి సంగతి ఏమిటి?”

20:52 – قَالَ عِلْمُهَا عِندَ رَبِّي فِي كِتَابٍ ۖ لَّا يَضِلُّ رَبِّي وَلَا يَنسَى ٥٢

(మూసా) జవాబిచ్చాడు: ”వాటి జ్ఞానం నాప్రభువు వద్ద ఒక గ్రంథంలో (వ్రాయబడి) వుంది. నా ప్రభువు పొరపాటు చేయడు మరియు మరువడు కూడాను.”

20:53 – الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ مَهْدًا وَسَلَكَ لَكُمْ فِيهَا سُبُلًا وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجْنَا بِهِ أَزْوَاجًا مِّن نَّبَاتٍ شَتَّىٰ ٥٣

ఆయనే మీ కొరకు భూమిని చదునుగా (పరుపుగా) జేసి, అందులో మీకు (నడవటానికి) త్రోవలను ఏర్పరిచాడు. మరియు ఆకాశంనుండి నీటిని కురిపించాడు. మేము దాని ద్వారా రకరకాల వృక్షకోటిని పుట్టిచాము. 26

20:54 – كُلُوا وَارْعَوْا أَنْعَامَكُمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّأُولِي النُّهَىٰ ٥٤

మీరు వాటిని తినండి మరియు మీ పశువు లకు మేపండి. నిశ్చయంగా, అర్థం చేసుకోగల వారికి ఇందులో అనేక సూచన లున్నాయి. (5/8)

20:55 – مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَىٰ ٥٥

  • దాని (ఆ మట్టి) నుంచే మిమ్మల్ని సృష్టించాము, మరల మిమ్మల్ని దానిలోకే చేర్చుతాము మరియు దాని నుంచే మిమ్మల్ని మరొక సారి లేపుతాము. 27

20:56 – وَلَقَدْ أَرَيْنَاهُ آيَاتِنَا كُلَّهَا فَكَذَّبَ وَأَبَىٰ ٥٦

మరియు వాస్తవానికి, మేము అతనికి (ఫిర్‌’ఔన్‌ కు) మా సూచనలన్నీ చూపాము, కాని అతడు వాటిని అబద్ధాలన్నాడు మరియు తిరస్కరించాడు.

20:57 – قَالَ أَجِئْتَنَا لِتُخْرِجَنَا مِنْ أَرْضِنَا بِسِحْرِكَ يَا مُوسَىٰ ٥٧

(ఫిర్‌’ఔన్‌) ఇలా అన్నాడు: ”ఓ మూసా! నీవు నీ మంత్రజాలంతో మమ్మల్ని మా దేశం నుండి వెడలగొట్టటానికి మా వద్దకు వచ్చావా? 28

20:58 – فَلَنَأْتِيَنَّكَ بِسِحْرٍ مِّثْلِهِ فَاجْعَلْ بَيْنَنَا وَبَيْنَكَ مَوْعِدًا لَّا نُخْلِفُهُ نَحْنُ وَلَا أَنتَ مَكَانًا سُوًى ٥٨

”సరే! మేము కూడా దానివంటి మంత్రజాలాన్ని నీకు పోటిగా తెస్తాము; కావున మా మధ్య నీ మధ్య (సమావేశానికి) ఒక సమయం మరియు స్థలాన్ని నిర్ణయించు, దాని నుండి మేముకానీ నీవుకానీ, వెనుకాడ కూడదు. మరియు అదొక యుక్తమైన స్థలమై ఉండాలి.”

20:59 – قَالَ مَوْعِدُكُمْ يَوْمُ الزِّينَةِ وَأَن يُحْشَرَ النَّاسُ ضُحً ٥٩

(మూసా) అన్నాడు: ”మీతో సమావేశం ఉత్సవ దినమున నియమించుకుందాము. ప్రొద్దెక్కే వరకు ప్రజలందరూ సమావేశమైఉండాలి.”

20:60 – فَتَوَلَّىٰ فِرْعَوْنُ فَجَمَعَ كَيْدَهُ ثُمَّ أَتَىٰ ٦٠

ఆ పిదప ఫిర్‌’ఔన్‌ వెళ్ళిపోయి తన తంత్ర సామాగ్రిని సమీకరించుకొని తిరిగివచ్చాడు. 29

20:61 – قَالَ لَهُم مُّوسَىٰ وَيْلَكُمْ لَا تَفْتَرُوا عَلَى اللَّـهِ كَذِبًا فَيُسْحِتَكُم بِعَذَابٍ ۖ وَقَدْ خَابَ مَنِ افْتَرَىٰ ٦١

మూసా వారితో అన్నాడు: ”మీరు నాశన మవుగాక! అల్లాహ్‌పై అబద్ధాలు కల్పించకండి! అలాచేస్తే ఆయన కఠిన శిక్షతో మిమ్మల్ని నిర్మూలించవచ్చు! (అల్లాహ్‌పై) అబద్ధాలు కల్పించేవాడు తప్పక విఫలుడవుతాడు.”

20:62 – فَتَنَازَعُوا أَمْرَهُم بَيْنَهُمْ وَأَسَرُّوا النَّجْوَىٰ ٦٢

(ఇది విన్న) తరువాత వారు ఆ విషయాన్ని గురించి తర్కించుకున్నారు, కాని తమ చర్చను రహస్యంగానే సాగించారు.

20:63 – قَالُوا إِنْ هَـٰذَانِ لَسَاحِرَانِ يُرِيدَانِ أَن يُخْرِجَاكُم مِّنْ أَرْضِكُم بِسِحْرِهِمَا وَيَذْهَبَا بِطَرِيقَتِكُمُ الْمُثْلَىٰ ٦٣

(వారు పరస్పరం ఈ విధంగా) మాట్లాడు కున్నారు: ”వాస్తవానికి వీరిద్దరూ మాంత్రికులే! వీరిద్దరు తమ మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి వెడలగొట్టి, మీ ఆదరణీయమైన విధానాన్ని అంతమొందించ గోరుతున్నారు. 30

20:64 – فَأَجْمِعُوا كَيْدَكُمْ ثُمَّ ائْتُوا صَفًّا ۚ وَقَدْ أَفْلَحَ الْيَوْمَ مَنِ اسْتَعْلَىٰ ٦٤

”కావున మీరు మీ యుక్తులను సమీకరించుకొని సమైక్యంగా (రంగంలోకి) దిగండి. ఈనాడు ప్రాబల్యం పొందిన వాడే, వాస్తవానికి సాఫల్యం (గెలుపు) పొందిన వాడు.” 31

20:65 – قَالُوا يَا مُوسَىٰ إِمَّا أَن تُلْقِيَ وَإِمَّا أَن نَّكُونَ أَوَّلَ مَنْ أَلْقَىٰ ٦٥

వారు (మాంత్రికులు) ఇలా అన్నారు: ”ఓ మూసా! నీవు విసురుతావా, లేదా మేము మొదట విసరాలా?”

20:66 – قَالَ بَلْ أَلْقُوا ۖ فَإِذَا حِبَالُهُمْ وَعِصِيُّهُمْ يُخَيَّلُ إِلَيْهِ مِن سِحْرِهِمْ أَنَّهَا تَسْعَ ٦٦

(మూసా) అన్నాడు: ”లేదు! మీరే (ముందు) విసరండి!” అప్పుడు అకస్మాత్తుగా వారి త్రాళ్ళు మరియు వారి కర్రలూ – వారి మంత్రజాలం వల్ల – అతనికి (మూసాకు) చలిస్తూ ఉన్నట్లు కనిపించాయి. 32

20:67 – فَأَوْجَسَ فِي نَفْسِهِ خِيفَةً مُّوسَ ٦٧

దానితో మూసాకు, తన మనస్సులో కొంత భయం కలిగింది. 33

20:68 – قُلْنَا لَا تَخَفْ إِنَّكَ أَنتَ الْأَعْلَىٰ ٦٨

మేము (అల్లాహ్‌) అన్నాము: ”భయ పడకు! నిశ్చయంగా నీవే ప్రాబల్యంపొందుతావు. 34

20:69 – وَأَلْقِ مَا فِي يَمِينِكَ تَلْقَفْ مَا صَنَعُوا ۖ إِنَّمَا صَنَعُوا كَيْدُ سَاحِرٍ ۖ وَلَا يُفْلِحُ السَّاحِرُ حَيْثُ أَتَ ٦٩

”నీ కుడిచేతిలో ఉన్నదానిని విసురు! అది వారు కల్పించిన వాటిని మ్రింగివేస్తుంది. వారు కల్పించింది నిశ్చయంగా, మాంత్రికుని తంత్రమే! మరియు మాంత్రికుడు ఎన్నడూ సఫలుడు కానేరడు. వాడు ఎటునుంచి, ఎలా వచ్చినా సరే!”

20:70 – فَأُلْقِيَ السَّحَرَةُ سُجَّدًا قَالُوا آمَنَّا بِرَبِّ هَارُونَ وَمُوسَىٰ ٧٠

అప్పుడు ఆ మాంత్రికులు సాష్టాంగం (సజ్దా)లో పడుతూ అన్నారు: ”మేము హారూన్‌ మరియు మూసాల ప్రభువును విశ్వసించాము.” 35

20:71 – قَالَ آمَنتُمْ لَهُ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ ۖ إِنَّهُ لَكَبِيرُكُمُ الَّذِي عَلَّمَكُمُ السِّحْرَ ۖ فَلَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَافٍ وَلَأُصَلِّبَنَّكُمْ فِي جُذُوعِ النَّخْلِ وَلَتَعْلَمُنَّ أَيُّنَا أَشَدُّ عَذَابًا وَأَبْقَىٰ ٧١

(ఫిర్‌’ఔన్‌) అన్నాడు: ”నేను అనుమతించక ముందే మీరు ఇతనిని విశ్వసించారా? 36 నిశ్చయంగా, ఇతనే మీకు మంత్రజాలం నేర్పిన గురువు! కావున ఇప్పుడు నేను మీ అందరి చేతులను మరియు కాళ్ళను, వ్యతిరేక పక్షాల నుండి నరికిస్తాను 37 మరియు మిమ్మల్ని అందరినీ, ఖర్జూరపు దూలాల మీద సిలువ (శూలారోహణ) చేయిస్తాను. అప్పుడు మా ఇద్దరిలో ఎవరి శిక్ష ఎక్కువ కఠినమైనదో మరియు దీర్ఘకాలికమైనదో మీకు తప్పక తెలియగలదు.”

20:72 – قَالُوا لَن نُّؤْثِرَكَ عَلَىٰ مَا جَاءَنَا مِنَ الْبَيِّنَاتِ وَالَّذِي فَطَرَنَا ۖ فَاقْضِ مَا أَنتَ قَاضٍ ۖ إِنَّمَا تَقْضِي هَـٰذِهِ الْحَيَاةَ الدُّنْيَا ٧٢

వారు(మాంత్రికులు) అన్నారు: ”మావద్దకు వచ్చిన స్పష్టమైన సూచనలను మరియు మమ్మల్ని సృజించిన ప్రభువు (అల్లాహ్)ను వదలి, మేము నీకు ప్రాధాన్యత నివ్వము. నీవు చేయదలచుకున్నది చేసుకో! నీవు కేవలం ఐహిక జీవితాన్ని మాత్రమే అంతమొందించగలవు. 38

20:73 – إِنَّا آمَنَّا بِرَبِّنَا لِيَغْفِرَ لَنَا خَطَايَانَا وَمَا أَكْرَهْتَنَا عَلَيْهِ مِنَ السِّحْرِ ۗ وَاللَّـهُ خَيْرٌ وَأَبْقَىٰ ٧٣

”నిశ్చయంగా, మేము మా ప్రభువు నందే విశ్వాస ముంచాము, ఆయన (అల్లాహ్)యే మా తప్పులను మరియు నీవు బలవంతంగా మా చేత చేయించిన మంత్ర తంత్రాలను క్షమించేవాడు. (ప్రతిఫలమివ్వటంలో) అల్లాహ్‌యే సర్వశ్రేష్ఠుడు మరియు శాశ్వతంగా ఉండేవాడు (నిత్యుడు).” 39

20:74 – إِنَّهُ مَن يَأْتِ رَبَّهُ مُجْرِمًا فَإِنَّ لَهُ جَهَنَّمَ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ ٧٤

నిశ్చయంగా, తన ప్రభువు ముందు పాపా త్ముడిగా హాజరయ్యే వాడికి తప్పక నరకం గలదు. అందులో వాడు చావనూలేడు బ్రతకనూలేడు!

20:75 – وَمَن يَأْتِهِ مُؤْمِنًا قَدْ عَمِلَ الصَّالِحَاتِ فَأُولَـٰئِكَ لَهُمُ الدَّرَجَاتُ الْعُلَىٰ ٧٥

ఎవడైతే విశ్వాసిగా హాజరవుతాడో మరియు సత్కార్యాలు చేసి ఉంటాడో, 40 అలాంటి వారికి ఉన్నత స్థానాలుంటాయి –

20:76 – جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَاءُ مَن تَزَكَّ ٧٦

శాశ్వతమైన స్వర్గవనాలు – వాటి క్రింద సెల యేళ్ళు పారుతూ ఉంటాయి. వారందులో శాశ్వతంగా ఉంటారు. మరియు ఇదే పుణ్యవంతులకు దొరికే ప్రతిఫలం.

20:77 – وَلَقَدْ أَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنْ أَسْرِ بِعِبَادِي فَاضْرِبْ لَهُمْ طَرِيقًا فِي الْبَحْرِ يَبَسًا لَّا تَخَافُ دَرَكًا وَلَا تَخْشَ ٧٧

మరియు వాస్తవానికి, మేము మూసాకు దివ్యజ్ఞానం (వ’హీ) ద్వారా ఇలా తెలిపాము: 40 ”నా దాసులను రాత్రివేళ తీసుకొని బయలుదేరు మరియు వారి కొరకు సముద్రం నుండి తడిలేని మార్గాన్ని ఏర్పరచు; వెంబడించి పట్టుబడతా వేమోనని భయపడకు, (సముద్రంలో మునిగి పోతావేమోనని కూడా) భీతిచెందకు.” 41

20:78 – فَأَتْبَعَهُمْ فِرْعَوْنُ بِجُنُودِهِ فَغَشِيَهُم مِّنَ الْيَمِّ مَا غَشِيَهُمْ ٧٨

ఆ పిదప ఫిర్‌’ఔన్‌ తన సేనలతో వారిని వెంబడించి (అక్కడికి) చేరగానే, సముద్రం వారిని హఠాత్తుగా అలుముకొని క్రమ్ముకున్నది.

20:79 – وَأَضَلَّ فِرْعَوْنُ قَوْمَهُ وَمَا هَدَىٰ ٧٩

మరియు ఫిర్‌’ఔన్‌ తనజాతి ప్రజలను మార్గభ్రష్టులుగా చేశాడు మరియు వారికి సన్మార్గం చూపలేదు.

20:80 – يَا بَنِي إِسْرَائِيلَ قَدْ أَنجَيْنَاكُم مِّنْ عَدُوِّكُمْ وَوَاعَدْنَاكُمْ جَانِبَ الطُّورِ الْأَيْمَنَ وَنَزَّلْنَا عَلَيْكُمُ الْمَنَّ وَالسَّلْوَىٰ ٨٠

ఓ ఇస్రాయీ’ల్‌ సంతతి వారలారా! వాస్తవానికి మేము, మిమ్మల్ని మీ శత్రువు నుండి విముక్తి కలిగించి, ‘తూర్‌ పర్వతపు కుడివైపున మీతో వాగ్దానం చేసి, మీపై మన్న్ మరియు సల్వాలను అవతరింపజేశాము. 43

20:81 – كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ وَلَا تَطْغَوْا فِيهِ فَيَحِلَّ عَلَيْكُمْ غَضَبِي ۖ وَمَن يَحْلِلْ عَلَيْهِ غَضَبِي فَقَدْ هَوَىٰ ٨١

(ఇంకా ఇలా అన్నాము): ”మేము మీకు ప్రసాదించిన మంచి ఆహారపదార్థాలను తినండి, 44 అందు తలబిరుసుతనం చేయకండి, అలాచేస్తే నా ఆగ్రహానికి గురికాగలరు. నా ఆగ్రహానికి గురిఅయిన వాడు తప్పక నాశనమవుతాడు.

20:82 – وَإِنِّي لَغَفَّارٌ لِّمَن تَابَ وَآمَنَ وَعَمِلَ صَالِحًا ثُمَّ اهْتَدَىٰ ٨٢

అయితే, ఎవడైతే పశ్చాత్తాపపడి విశ్వసించి మరియు సత్కార్యాలు చేసి సన్మార్గంలో ఉంటాడో,అలాంటివానిపట్ల నేను క్షమాశీలుడను.” 45 (3/4)

20:83 – وَمَا أَعْجَلَكَ عَن قَوْمِكَ يَا مُوسَىٰ ٨٣

  • మరియు (మూసా ‘తూర్‌ పర్వతం మీద ఉన్నప్పుడు 46 అల్లాహ్‌ అన్నాడు): ”ఓ మూసా! నీవు నీ జాతి వారిని విడిచి శీఘ్రంగా (ఇక్కడికి) వచ్చిన కారణ మేమిటి?”

20:84 – قَالَ هُمْ أُولَاءِ عَلَىٰ أَثَرِي وَعَجِلْتُ إِلَيْكَ رَبِّ لِتَرْضَىٰ ٨٤

(మూసా) జవాబిచ్చాడు: ”అదిగో! వారు నా వెనుక నా అడుగుజాడలలో వస్తూనే ఉన్నారు; నీవు నా పట్ల ప్రసన్నుడవు కావాలని, ఓ నా ప్రభూ! నేను త్వరత్వరగా నీ సాన్నిధ్యానికి వచ్చాను.” 47

20:85 – قَالَ فَإِنَّا قَدْ فَتَنَّا قَوْمَكَ مِن بَعْدِكَ وَأَضَلَّهُمُ السَّامِرِيُّ ٨٥

(అల్లాహ్‌) అన్నాడు: ”వాస్తవానికి! నీ వెనుక మేము, నీజాతివారిని పరీక్షకు గురిచేశాము మరియు సామిరి వారిని మార్గభ్రష్టులుగా చేశాడు.”

20:86 – فَرَجَعَ مُوسَىٰ إِلَىٰ قَوْمِهِ غَضْبَانَ أَسِفًا ۚ قَالَ يَا قَوْمِ أَلَمْ يَعِدْكُمْ رَبُّكُمْ وَعْدًا حَسَنًا ۚ أَفَطَالَ عَلَيْكُمُ الْعَهْدُ أَمْ أَرَدتُّمْ أَن يَحِلَّ عَلَيْكُمْ غَضَبٌ مِّن رَّبِّكُمْ فَأَخْلَفْتُم مَّوْعِدِي ٨٦

ఆ తరువాత మూసా కోపంతోనూ, విచారం తోనూ తనజాతివారివద్దకు తిరిగి వచ్చిఅన్నాడు: ”ఓ నా జాతి ప్రజలారా! ఏమీ? మీ ప్రభువు మీకు మంచి వాగ్దానం చేయలేదా? ఏమీ? ఒడంబడిక పూర్తికావటంలో ఏమైనా ఆలస్యమయ్యిందా? లేదా! మీ ప్రభువు యొక్క ఆగ్రహం మీపై విరుచుకు పడాలని కోరుతున్నారా? అందుకేనా మీరు నాకు చేసిన వాగ్దానాన్ని భంగపరచారు?”

20:87 – قَالُوا مَا أَخْلَفْنَا مَوْعِدَكَ بِمَلْكِنَا وَلَـٰكِنَّا حُمِّلْنَا أَوْزَارًا مِّن زِينَةِ الْقَوْمِ فَقَذَفْنَاهَا فَكَذَٰلِكَ أَلْقَى السَّامِرِيُّ ٨٧

వారు అన్నారు: ”మేము నీకు చేసిన వాగ్దానాన్ని మాకు మేమై భంగపరచలేదు. కాని మాపై ప్రజల ఆభరణాల భారం మోపబడి ఉండెను, దానిని (అగ్నిలోకి) విసిరాము, ఇదేవిధంగా సామిరి కూడా వేశాడు.”

20:88 – فَأَخْرَجَ لَهُمْ عِجْلًا جَسَدًا لَّهُ خُوَارٌ فَقَالُوا هَـٰذَا إِلَـٰهُكُمْ وَإِلَـٰهُ مُوسَىٰ فَنَسِيَ ٨٨

తరువాత అతడు (సామిరి) వారికొక ఆవుదూడ విగ్రహాన్ని తయారుచేశాడు. దాని నుండి ఆవుదూడ అరుపువంటి శబ్దం వచ్చేది. 48 పిదప వారన్నారు: ”ఇదే మీ ఆరాధ్య దైవం మరియు మూసా యొక్క ఆరాధ్య దైవం కూడాను, కాని అతను దానిని మరచిపోయాడు.”

20:89 – أَفَلَا يَرَوْنَ أَلَّا يَرْجِعُ إِلَيْهِمْ قَوْلًا وَلَا يَمْلِكُ لَهُمْ ضَرًّا وَلَا نَفْعًا ٨٩

ఏమీ? అది వారికెలాంటి సమాధానమివ్వ జాలదనీ మరియు వారికెలాంటి కీడుగానీ, మేలు గానీ చేయజాలదని వారు చూడటం లేదా? 49

20:90 – وَلَقَدْ قَالَ لَهُمْ هَارُونُ مِن قَبْلُ يَا قَوْمِ إِنَّمَا فُتِنتُم بِهِ ۖ وَإِنَّ رَبَّكُمُ الرَّحْمَـٰنُ فَاتَّبِعُونِي وَأَطِيعُوا أَمْرِي ٩٠

మరియు వాస్తవానికి హారూన్‌ ఇంతకు ముందు వారితో చెప్పి ఉన్నాడు: ”ఓ నా జాతి ప్రజలారా! దీని (ఈ విగ్రహం)తో మీరు పరీక్షింపబడుతున్నారు. మరియు నిశ్చయంగా, ఆ అనంత కరుణామయుడే మీ ప్రభువు! కావున మీరు నన్నే అనుసరించండి మరియు నా ఆజ్ఞనే పాలించండి.”

20:91 – قَالُوا لَن نَّبْرَحَ عَلَيْهِ عَاكِفِينَ حَتَّىٰ يَرْجِعَ إِلَيْنَا مُوسَ ٩١

వారన్నారు: ”మూసా తిరిగి మా వద్దకు వచ్చే వరకు, మేము దీనిని ఆరాధించకుండా ఉండలేము.”

20:92 – قَالَ يَا هَارُونُ مَا مَنَعَكَ إِذْ رَأَيْتَهُمْ ضَلُّوا ٩٢

(మూసా, హారూన్‌తో) అన్నాడు: ”ఓ హారూన్‌! నీవు వారిని మార్గభ్రష్టత్వంలో పడటం చూసినప్పుడు (వారిని వారించకుండా) నిన్ను ఎవరు ఆపారు?

20:93 – أَلَّا تَتَّبِعَنِ ۖ أَفَعَصَيْتَ أَمْرِي ٩٣

”నీ వెందుకు నన్ను అనుసరించలేదు? నీవు కూడా నా ఆజ్ఞను ఉల్లంఘించావా?” 50

20:94 – قَالَ يَا ابْنَ أُمَّ لَا تَأْخُذْ بِلِحْيَتِي وَلَا بِرَأْسِي ۖ إِنِّي خَشِيتُ أَن تَقُولَ فَرَّقْتَ بَيْنَ بَنِي إِسْرَائِيلَ وَلَمْ تَرْقُبْ قَوْلِي ٩٤

(హారూన్‌) అన్నాడు: ”నా తల్లి కుమారుడా (సోదరుడా)! నాగడ్డాన్నిగానీ, నాతల వెంట్రుకలనుగానీ పట్టిలాగకు: ‘వాస్తవానికి ఇస్రాయీల్‌ సంతతివారిలో విభేదాలు కల్పించావు, నీవు నా మాటను లక్ష్యపెట్టలేదు.’అని, నీవు అంటావేమో నని నేనుభయపడ్డాను.” 51

20:95 – قَالَ فَمَا خَطْبُكَ يَا سَامِرِيُّ ٩٥

(మూసా) అన్నాడు: ”ఓ సామిరీ! ఇక నీ సంగతేమిటీ?”

20:96 – قَالَ بَصُرْتُ بِمَا لَمْ يَبْصُرُوا بِهِ فَقَبَضْتُ قَبْضَةً مِّنْ أَثَرِ الرَّسُولِ فَنَبَذْتُهَا وَكَذَٰلِكَ سَوَّلَتْ لِي نَفْسِي ٩٦

(సామిరీ) అన్నాడు: ”వారు చూడని దానిని నేను చూశాను. ఆ తరువాత నేను సందేశహరుని (జిబ్రీల్‌) 52 పాదగుర్తుల నుండి ఒక పిడికెడు (మట్టి) తీసుకొని దాని (ఆవుదూడ విగ్రహం) మీద వేశాను మరియు నా ఆత్మ నన్ను ఈ విధంగా ప్రేరేపించింది.”

20:97 – قَالَ فَاذْهَبْ فَإِنَّ لَكَ فِي الْحَيَاةِ أَن تَقُولَ لَا مِسَاسَ ۖ وَإِنَّ لَكَ مَوْعِدًا لَّن تُخْلَفَهُ ۖ وَانظُرْ إِلَىٰ إِلَـٰهِكَ الَّذِي ظَلْتَ عَلَيْهِ عَاكِفًا ۖ لَّنُحَرِّقَنَّهُ ثُمَّ لَنَنسِفَنَّهُ فِي الْيَمِّ نَسْفًا ٩٧

(మూసా) అన్నాడు: ”సరే వెళ్ళిపో! నిశ్చయంగా, నీ శిక్ష ఏమిటంటే, నీవు జీవితాంతం ‘నన్ను ముట్టవద్దు’ (లా మిసాస) అని, అంటూ ఉంటావు. మరియు నిశ్చయంగా, నీకు (వచ్చే జీవితంలో శిక్ష) నిర్ణయించబడిఉంది, దాని నుండి నీవు తప్పించుకోలేవు. ఇక నీవు, భక్తుడవైన నీ ఆరాధ్యదైవాన్ని చూడు! మేము దానిని నిశ్చయంగా, కాల్చుతాము, తరువాత దానిని భస్మంచేసి సముద్రంలో విసిరివేస్తాము.” 53

20:98 – إِنَّمَا إِلَـٰهُكُمُ اللَّـهُ الَّذِي لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۚ وَسِعَ كُلَّ شَيْءٍ عِلْمًا ٩٨

నిశ్చయంగా, మీ ఆరాధ్య దైవం అల్లాహ్‌ మాత్రమే. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన జ్ఞానం ప్రతిదానిని ఆవరించి ఉంది.

20:99 – كَذَٰلِكَ نَقُصُّ عَلَيْكَ مِنْ أَنبَاءِ مَا قَدْ سَبَقَ ۚ وَقَدْ آتَيْنَاكَ مِن لَّدُنَّا ذِكْرًا ٩٩

(ఓ ము’హమ్మద్‌!) ఈ విధంగా మేము పూర్వం జరిగిన గాథలను నీకు వినిపిస్తున్నాము. మరియు వాస్తవంగా మేము, మా తరఫు నుండి నీకు హితోపదేశాన్ని (ఈ ఖుర్‌ఆన్‌ను) ప్రసాదించాము.

20:100 – مَّنْ أَعْرَضَ عَنْهُ فَإِنَّهُ يَحْمِلُ يَوْمَ الْقِيَامَةِ وِزْرًا ١٠٠

దీని నుండి ముఖం త్రిప్పుకునేవాడు పున రుత్థానదినమున (గొప్పపాప) భారాన్నిభరిస్తాడు.

20:101 – خَالِدِينَ فِيهِ ۖ وَسَاءَ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ حِمْلً ١٠١

అదే స్థితిలో వారు శాశ్వతంగా ఉంటారు. పునరుత్థాన దినమున వారికాభారం ఎంతో దుర్భర మైనదిగా ఉంటుంది.

20:102 – يَوْمَ يُنفَخُ فِي الصُّورِ ۚ وَنَحْشُرُ الْمُجْرِمِينَ يَوْمَئِذٍ زُرْقًا ١٠٢

ఆ దినమున బాకా (‘సూర్‌) ఊదబడు తుంది. 54 మరియు మేము అపరాధులను ఒకచోట జమచేస్తాము. ఆ రోజు వారి కళ్ళు (భయంతో) నీలమైపోతాయి.

20:103 – يَتَخَافَتُونَ بَيْنَهُمْ إِن لَّبِثْتُمْ إِلَّا عَشْرًا ١٠٣

వారు ఒకరితోనొకరు ఇలా గుసగుసలాడు కుంటారు: ”మీరు (భూమిలో) పది (రోజుల) కంటే ఎక్కువ ఉండలేదు.” 55

20:104 – نَّحْنُ أَعْلَمُ بِمَا يَقُولُونَ إِذْ يَقُولُ أَمْثَلُهُمْ طَرِيقَةً إِن لَّبِثْتُمْ إِلَّا يَوْمًا ١٠٤

వారు ఏమి మాట్లాడుకుంటున్నారో మాకు బాగా తెలుసు. వారిలో మంచి తెలివిగల వారు: ”మీరు కేవలం ఒక్క దినం మాత్రమే ఉన్నారు!” అని అంటారు.

20:105 – وَيَسْأَلُونَكَ عَنِ الْجِبَالِ فَقُلْ يَنسِفُهَا رَبِّي نَسْفًا ١٠٥

మరియు వారు నిన్ను పర్వతాలను గురించి అడుగుతున్నారు. వారితో అను: ”నా ప్రభువు వాటిని ధూళిగా మార్చి ఎగురవేస్తాడు.

20:106 – فَيَذَرُهَا قَاعًا صَفْصَفًا ١٠٦

”ఆ తరువాత దానిని (భూమిని) చదునైన మైదానంగా చేసివేస్తాడు.

20:107 – لَّا تَرَىٰ فِيهَا عِوَجًا وَلَا أَمْتًا ١٠٧

”నీవు దానిలో ఎలాంటి పల్లం గానీ, మిట్ట గానీ చూడలేవు.” 56

20:108 – يَوْمَئِذٍ يَتَّبِعُونَ الدَّاعِيَ لَا عِوَجَ لَهُ ۖ وَخَشَعَتِ الْأَصْوَاتُ لِلرَّحْمَـٰنِ فَلَا تَسْمَعُ إِلَّا هَمْسًا ١٠٨

ఆరోజు అందరూ పిలిచేవానిని వెంబడిస్తారు అతని నుండి తొలగిపోరు. 57 అనంత కరుణా మయుని ముందు వారి కంఠ స్వరాలన్నీ అణిగిపోయి ఉంటాయి, కావున నీవు గొణుగులు తప్ప మరేమీ వినలేవు.

20:109 – يَوْمَئِذٍ لَّا تَنفَعُ الشَّفَاعَةُ إِلَّا مَنْ أَذِنَ لَهُ الرَّحْمَـٰنُ وَرَضِيَ لَهُ قَوْلًا ١٠٩

ఆ రోజు సిఫారసు ఏ మాత్రం పనికిరాదు. కానీ! అనంత కరుణామయుడు ఎవరికైనా అనుమతినిచ్చి, అతని మాట ఆయనకు సమ్మత మైనదైతేనే తప్ప! 58

20:110 – يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يُحِيطُونَ بِهِ عِلْمًا ١١٠

(ఎందు కంటే!) ఆయనకు – వారికి ప్రత్యక్షంగా నున్నది మరియు పరోక్షంగా నున్నది – అంతా తెలుసు, కాని వారు తమ జ్ఞానంతో ఆయనను గ్రహించజాలరు. 59 (7/8)

20:111 – وَعَنَتِ الْوُجُوهُ لِلْحَيِّ الْقَيُّومِ ۖ وَقَدْ خَابَ مَنْ حَمَلَ ظُلْمًا ١١١

  • మరియు సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు (శాశ్వితుడు) అయిన, ఆయన (అల్లాహ్‌) ముందు అందరి ముఖాలు నమ్రతతో వంగి ఉంటాయి. మరియు దుర్మార్గాన్ని అవలం బించిన వాడు, నిశ్చయంగా విఫలుడవుతాడు. 60

20:112 – وَمَن يَعْمَلْ مِنَ الصَّالِحَاتِ وَهُوَ مُؤْمِنٌ فَلَا يَخَافُ ظُلْمًا وَلَا هَضْمًا ١١٢

మరియు సత్కార్యాలు చేస్తూ, విశ్వాసియై ఉన్న వానికి ఎలాంటి అన్యాయం గానీ, నష్టం గానీ జరుగునేమోనని భయపడే అవసరం ఉండదు. 61

20:113 – وَكَذَٰلِكَ أَنزَلْنَاهُ قُرْآنًا عَرَبِيًّا وَصَرَّفْنَا فِيهِ مِنَ الْوَعِيدِ لَعَلَّهُمْ يَتَّقُونَ أَوْ يُحْدِثُ لَهُمْ ذِكْرًا ١١٣

మరియు ఈ విధంగా, మేము ఈ ఖుర్‌ఆన్‌ను ‘అరబ్బీభాషలో క్రమక్రమంగా అవతరింపజేశాము. మరియు ఇందులో పలురకాల హెచ్చరికలు చేశాము. బహుశా వారు దైవభీతి కలిగి ఉంటారేమోనని; లేదా! వారు ఉపదేశం గ్రహిస్తారేమోనని. 62

20:114 – فَتَعَالَى اللَّـهُ الْمَلِكُ الْحَقُّ ۗ وَلَا تَعْجَلْ بِالْقُرْآنِ مِن قَبْلِ أَن يُقْضَىٰ إِلَيْكَ وَحْيُهُ ۖ وَقُل رَّبِّ زِدْنِي عِلْمًا ١١٤

అల్లాహ్‌ అత్యున్నతుడు, సార్వ భౌముడు, 63 పరమసత్యుడు. (ఓ ము’హమ్మద్‌!) 64 నీకు ఖుర్‌ఆన్‌ సందేశం (వ’హీ) పూర్తిగా అవతరింప జేయబడేవరకు దానిని గురించి తొందరపడకు. మరియు ఇలా ప్రార్థించు: ”ఓ నా ప్రభూ! నా జ్ఞానాన్ని వృధ్ధిపరచు!”

20:115 – وَلَقَدْ عَهِدْنَا إِلَىٰ آدَمَ مِن قَبْلُ فَنَسِيَ وَلَمْ نَجِدْ لَهُ عَزْمًا ١١٥

మరియు వాస్తవానికి, మేము ఇంతకు పూర్వంఆదమ్‌తో ఒకవాగ్దానం చేయంచిఉన్నాము కాని అతడు దానిని మరచిపోయాడు మరియు మేము అతనిలో స్థిరత్వాన్ని చూడలేదు. 65

20:116 – وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَىٰ ١١٦

మరియు మేము దేవదూతలతో: ”ఆదమ్‌కు 66 సాష్టాంగం (సజ్దా) చేయండి.” అని ఆజ్ఞాపించినపుడు ఒక్క ఇబ్లీస్‌ తప్ప అందరూ సాష్టాంగం (సజ్దా) చేశారు. అతడు నిరాకరించాడు.

20:117 – فَقُلْنَا يَا آدَمُ إِنَّ هَـٰذَا عَدُوٌّ لَّكَ وَلِزَوْجِكَ فَلَا يُخْرِجَنَّكُمَا مِنَ الْجَنَّةِ فَتَشْقَ ١١٧

అప్పుడు అన్నాము: ”ఓ ఆదమ్‌! నిశ్చయంగా, ఇతడు నీకు మరియు నీ భార్యకు శత్రువు, కాబట్టి ఇతడిని, మీ ఇద్దరిని స్వర్గం నుండి వెడలగొట్టనివ్వకండి అలా అయితే మీరు దురవస్థకు గురి కాగలరు. 67

20:118 – إِنَّ لَكَ أَلَّا تَجُوعَ فِيهَا وَلَا تَعْرَىٰ ١١٨

”నిశ్చయంగా, ఇక్కడ నీవు ఆకలిగొనవూ మరియు వస్త్రహీనుడవూ (దిగంబరుడవూ) కావు. 68

20:119 – وَأَنَّكَ لَا تَظْمَأُ فِيهَا وَلَا تَضْحَىٰ ١١٩

”మరియు నిశ్చయంగా, ఇందులో నీకు దాహమూ కలుగదు మరియు ఎండకూడా తగలదు.”

20:120 – فَوَسْوَسَ إِلَيْهِ الشَّيْطَانُ قَالَ يَا آدَمُ هَلْ أَدُلُّكَ عَلَىٰ شَجَرَةِ الْخُلْدِ وَمُلْكٍ لَّا يَبْلَىٰ ١٢٠

అప్పుడు షై’తాన్‌ అతని మనస్సులో కలతలు రేకెత్తిస్తూ అన్నాడు: ”ఓ ఆదమ్‌! శాశ్వత జీవితాన్ని మరియు అంతంకాని సామ్రాజ్యాన్ని ఇచ్చే వృక్షాన్ని నీకు చూపనా?”

20:121 – فَأَكَلَا مِنْهَا فَبَدَتْ لَهُمَا سَوْآتُهُمَا وَطَفِقَا يَخْصِفَانِ عَلَيْهِمَا مِن وَرَقِ الْجَنَّةِ ۚ وَعَصَىٰ آدَمُ رَبَّهُ فَغَوَىٰ ١٢١

ఆ పిదప వారిద్దరు దాని నుండి (ఫలాన్ని) తిన గానే వారిద్దరికి, వారి దిగంబరత్వం వ్యక్తం కాసాగింది. 69 మరియు వారిద్దరు స్వర్గపు ఆకులను తమమీద కప్పుకోసాగారు. (ఈ విధంగా) ఆదమ్‌ తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించి, సన్మార్గం నుండి తప్పిపోయాడు.

20:122 – ثُمَّ اجْتَبَاهُ رَبُّهُ فَتَابَ عَلَيْهِ وَهَدَىٰ ١٢٢

ఆ తరువాత అతని ప్రభువు, అతనిని (తన కారుణ్యానికి) ఎన్నుకొని, అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించి, అతనికి మార్గ దర్శకత్వం చేశాడు.

20:123 – قَالَ اهْبِطَا مِنْهَا جَمِيعًا ۖ بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ فَإِمَّا يَأْتِيَنَّكُم مِّنِّي هُدًى فَمَنِ اتَّبَعَ هُدَايَ فَلَا يَضِلُّ وَلَا يَشْقَ ١٢٣

(అల్లాహ్‌) అన్నాడు: ”మీరిద్దరూ కలసి ఇక్కడి నుండి దిగిపోండి. మీరు ఒకరికొకరు శత్రువులై 70 ఉంటారు. కాని నా తరఫు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది, కావున నా మార్గదర్శకత్వాన్ని అనుసరించే వాడు, మార్గభ్రష్టుడూ కాడు మరియు దురవస్థకూ గురికాడు.

20:124 – وَمَنْ أَعْرَضَ عَن ذِكْرِي فَإِنَّ لَهُ مَعِيشَةً ضَنكًا وَنَحْشُرُهُ يَوْمَ الْقِيَامَةِ أَعْمَىٰ ١٢٤

  1. ”మరియు ఎవడైతే నా సందేశం నుండి విముఖుడవుతాడో నిశ్చయంగా, అతని జీవితం ఇరుకైపోతుంది మరియు పునరుత్థానదినమున అతనిని అంధునిగా లేపుతాము.”

20:125 – قَالَ رَبِّ لِمَ حَشَرْتَنِي أَعْمَىٰ وَقَدْ كُنتُ بَصِيرًا ١٢٥

అప్పుడతడు అంటాడు: ”ఓ నా ప్రభూ! నన్నెందుకు గ్రుడ్డివానిగా లేపావు, వాస్తవానికి నేను (ప్రపంచంలో) చూడగలిగేవాణ్ణి కదా?”

20:126 – قَالَ كَذَٰلِكَ أَتَتْكَ آيَاتُنَا فَنَسِيتَهَا ۖ وَكَذَٰلِكَ الْيَوْمَ تُنسَىٰ ١٢٦

అప్పుడు (అల్లాహ్‌) అంటాడు: ”మా సూచనలు నీ వద్దకు వచ్చినపుడు, నీవు వాటిని విస్మరించావు. మరియు అదేవిధంగా ఈ రోజు నీవు విస్మరించబడుతున్నావు.”

20:127 – وَكَذَٰلِكَ نَجْزِي مَنْ أَسْرَفَ وَلَمْ يُؤْمِن بِآيَاتِ رَبِّهِ ۚ وَلَعَذَابُ الْآخِرَةِ أَشَدُّ وَأَبْقَىٰ ١٢٧

మరియు ఈ విధంగా, మేము మితిమీరి ప్రవర్తిస్తూ తన ప్రభువు సూచనలను విశ్వసించని వానికి ప్రతీకారం చేస్తాము. మరియు పరలోక శిక్ష ఎంతో కఠినమైనది మరియు శాశ్వతమైనది.

20:128 – أَفَلَمْ يَهْدِ لَهُمْ كَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّنَ الْقُرُونِ يَمْشُونَ فِي مَسَاكِنِهِمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّأُولِي النُّهَىٰ ١٢٨

వీరికి పూర్వం గడిచిన ఎన్నో తరాలను మేము నాశనం చేసి ఉన్నాము. వీరు వారి నివాసస్థలాలలో తిరుగుతున్నారు. ఏమీ? దీని వలన కూడా వీరికి మార్గదర్శకత్వం లభించలేదా? నిశ్చయంగా, ఇందులో అర్థంచేసుకొనేవారికి ఎన్నో సూచనలున్నాయి.

20:129 – وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ لَكَانَ لِزَامًا وَأَجَلٌ مُّسَمًّ ١٢٩

మరియు నీ ప్రభువు నుండి మొదట్లోనే ఒక గడువు కాలం నిర్ణయించబడి ఉండకపోతే, వీరికి ఈ పాటికే (శిక్ష) తప్పక విధించబడి ఉండేది. కాని (వీరి) గడువుకాలం నిర్ణయించబడి ఉంది. 71

20:130 – فَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوبِهَا ۖ وَمِنْ آنَاءِ اللَّيْلِ فَسَبِّحْ وَأَطْرَافَ النَّهَارِ لَعَلَّكَ تَرْضَىٰ ١٣٠

కావున (ఓ ము’హమ్మద్‌!) వారు పలికే మాటలకు నీవు ఓర్పు వహించు. సూర్యుడు ఉదయించక ముందు మరియు అస్తమించక ముందు నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయన స్తోత్రం చెయ్యి. మరియు రాత్రి సమయాలలో మరియు పగటి వేళలలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు 72 అప్పుడు నీవు సంతుష్టుడవవుతావు!

20:131 – وَلَا تَمُدَّنَّ عَيْنَيْكَ إِلَىٰ مَا مَتَّعْنَا بِهِ أَزْوَاجًا مِّنْهُمْ زَهْرَةَ الْحَيَاةِ الدُّنْيَا لِنَفْتِنَهُمْ فِيهِ ۚ وَرِزْقُ رَبِّكَ خَيْرٌ وَأَبْقَىٰ ١٣١

మేము వారిలో చాలా మందికి – వాటితో వారిని పరీక్షించటానికి – వారు అనుభవించటానికి, ఇచ్చిన ఇహలోక జీవితశోభను నీవు కళ్ళెత్తి చూడకు. 73 నీ ప్రభువు ఇచ్చే జీవనోపాధియే అత్యుత్తమమైనది మరియు చిరకాలముండేది. 74

20:132 – وَأْمُرْ أَهْلَكَ بِالصَّلَاةِ وَاصْطَبِرْ عَلَيْهَا ۖ لَا نَسْأَلُكَ رِزْقًا ۖ نَّحْنُ نَرْزُقُكَ ۗ وَالْعَاقِبَةُ لِلتَّقْوَىٰ ١٣٢

మరియు నీ కుటుంబంవారిని నమా’జ్‌ చేయమని ఆజ్ఞాపించు; మరియు స్వయంగా నీవు కూడా దానిని సహనంతో పాటించు. మేము నీ నుండి జీవనోపాధిని ఆశించము. మేమే నీకు జీవనోపాధిని ఇచ్చేవారము. చివరకు దైవభీతి గలవారిదే ఉత్తమ ముగింపు.

20:133 – وَقَالُوا لَوْلَا يَأْتِينَا بِآيَةٍ مِّن رَّبِّهِ ۚ أَوَلَمْ تَأْتِهِم بَيِّنَةُ مَا فِي الصُّحُفِ الْأُولَىٰ ١٣٣

మరియు వారంటారు: ”ఇతను (ఈ ప్రవక్త) తన ప్రభువు నుండి ఏదైనా ఒక అద్భుత సూచన (మహిమ) ఎందుకు తీసుకురాడు?” ఏమీ? పూర్వపు గ్రంథాలలో పేర్కొనబడిన స్పష్టమైన నిదర్శనం వారివద్దకు రాలేదా? 75

20:134 – وَلَوْ أَنَّا أَهْلَكْنَاهُم بِعَذَابٍ مِّن قَبْلِهِ لَقَالُوا رَبَّنَا لَوْلَا أَرْسَلْتَ إِلَيْنَا رَسُولًا فَنَتَّبِعَ آيَاتِكَ مِن قَبْلِ أَن نَّذِلَّ وَنَخْزَىٰ ١٣٤

ఒకవేళ మేము దీనిని (ఈ ఖుర్‌ఆన్‌ను / ము’హమ్మద్‌ను) పంపక ముందే వారిని శిక్షించి ఉంటే! వారు అనేవారు: ”ఓ మా ప్రభూ! నీవు మా వద్దకు ఒక సందేశహరుణ్ణి ఎందుకు పంపలేదు? (అలాచేస్తే) నిశ్చయంగా, మేము – అవమానం పొంది, అగౌరవంపాలు కాకముందే – నీ సూచనలను పాటించేవారం కదా?” 76

20:135 – قُلْ كُلٌّ مُّتَرَبِّصٌ فَتَرَبَّصُوا ۖ فَسَتَعْلَمُونَ مَنْ أَصْحَابُ الصِّرَاطِ السَّوِيِّ وَمَنِ اهْتَدَىٰ ١٣٥

వారితో ఇలా అను: ”ప్రతి ఒక్కడు (తన అంతిమ ఫలితం కొరకు) వేచి ఉన్నాడు. కావున మీరు కూడా వేచిఉండండి. సరైనమార్గంలో ఉన్న వారెవరో మరియు మార్గదర్శకత్వం పొందిన వారెవరో, మీరు త్వరలోనే తెలుసుకుంటారు.”

సూరహ్ అల్-అంబియా‘ – ఈ సూరహ్ లో చాలామంది ప్రవక్తల గాథలున్నాయి కావున ఇది సూరహ్ అల్-అంబియా’ అనబడుతుంది. మక్కహ్లో అవతరిపజేయబడిన ఈసూరహ్ లో 112 ఆయతులున్నాయి. విగ్రహరాధనకు విరుద్ధంగా ఇబ్రహీం (’అ.స.) పాటుపడింది; అన్యాయానికి విరుద్ధంగా లూ’త్ (’అ.స.) పోరాటం; సహనం వహించిన అయ్యూబ్ (’అ.స.); ఇస్మా’యీల్, ఇద్రిస్ మరియు జు’ల్-కిఫ్ల్ (’అలైహిమ్ స.)ల గాథలున్నాయి. క్రోధానికి విరుద్ధంగా యూనుస్ (’అ.స.) పడిన పాట్లు ’జకరియ్యా (’అ.స.) మరియు సయ్యిదా మర్యమ్ (’అలైహా స.) మెదలైన వారి విషయాలు కూడా ఉన్నాయి.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 21:1 – اقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِي غَفْلَةٍ مُّعْرِضُونَ ١

[(*)] మానవులతో లెక్క (తీసుకునే) సమయం సమీపించింది, అయినా వారు ఏమరు పాటులో పడి విముఖులై ఉన్నారు. 1

21:2 – مَا يَأْتِيهِم مِّن ذِكْرٍ مِّن رَّبِّهِم مُّحْدَثٍ إِلَّا اسْتَمَعُوهُ وَهُمْ يَلْعَبُونَ ٢

(కావున) వారి ప్రభువు తరపునుండి వారివద్దకు ఏ క్రొత్త సందేశం వచ్చినా, వారు దానిని పరిహసించ కుండా వినలేరు.

21:3 – لَاهِيَةً قُلُوبُهُمْ ۗ وَأَسَرُّوا النَّجْوَى الَّذِينَ ظَلَمُوا هَلْ هَـٰذَا إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ ۖ أَفَتَأْتُونَ السِّحْرَ وَأَنتُمْ تُبْصِرُونَ ٣

వారి హృదయాలు వినోదక్రీడలలో (అశ్రద్ధలో) మునిగి ఉన్నాయి. మరియు వారిలో దుర్మార్గానికి పాల్పడిన వారు రహస్య సంప్రదింపులు చేసుకొని (ఇలా అంటారు): “ఏమి? ఇతను (ము’హమ్మద్) మీలాంటి ఒక సాధారణ మానవుడు కాడా? 2 అయినా మీరు చూస్తూవుండి కూడా, ఇతని మంత్రజాలంలో 3 చిక్కుకుపోతారా?”

21:4 – قَالَ رَبِّي يَعْلَمُ الْقَوْلَ فِي السَّمَاءِ وَالْأَرْضِ ۖ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ ٤

(ము’హమ్మద్) ఇలా అన్నాడు: “నా ప్రభువుకు ఆకాశంలోను మరియు భూమిలోను పలుకబడే ప్రతిమాట తెలుసు. మరియు అయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

21:5 – بَلْ قَالُوا أَضْغَاثُ أَحْلَامٍ بَلِ افْتَرَاهُ بَلْ هُوَ شَاعِرٌ فَلْيَأْتِنَا بِآيَةٍ كَمَا أُرْسِلَ الْأَوَّلُونَ ٥

అలా కాదు! వారన్నారు: “ఇవి (ఈ సందేశాలు) కేవలం పీడకలలు మాత్రమే; కాదు కాదు! ఇతడే దీనిని కల్పించాడు; అలాకాదు! ఇతడొక కవి! (ఇతడు ప్రవక్తయే అయితే) పూర్వం పంపబడిన సందేశహరుల మాదిరిగా, ఇతనిని కూడా మా కొరకు ఒక అద్భుత సూచన (ఆయత్)ను తెమ్మను!”

21:6 – مَا آمَنَتْ قَبْلَهُم مِّن قَرْيَةٍ أَهْلَكْنَاهَا ۖ أَفَهُمْ يُؤْمِنُونَ ٦

మరియు వీరికి పూర్వం మేము నాశనం చేసిన ఏ పురవాసులు కూడా విశ్వసించి ఉండలేదు. అయితే! వీరు మాత్రం విశ్వసిస్తారా?

21:7 – وَمَا أَرْسَلْنَا قَبْلَكَ إِلَّا رِجَالًا نُّوحِي إِلَيْهِمْ ۖ فَاسْأَلُوا أَهْلَ الذِّكْرِ إِن كُنتُمْ لَا تَعْلَمُونَ ٧

మరియు నీకు పూర్వం కూడా (ఓ ము’హమ్మద్!) మేము పురుషులను మాత్రమే ప్రవక్తలుగా చేసి పంపి, వారిపై దివ్యజ్ఞానాన్ని (వ’హీని) అవతరింపజేశాము. కావున మీకిది తెలియకుంటే హితబోధగలవారిని (గ్రంథ ప్రజలను) అడగండి.

21:8 – وَمَا جَعَلْنَاهُمْ جَسَدًا لَّا يَأْكُلُونَ الطَّعَامَ وَمَا كَانُوا خَالِدِينَ ٨

మరియు మేము వారికి (ఆ ప్రవక్తలకు) ఆహరం తినే అవసరంలేని శరీరాలను ఇవ్వలేదు. మరియు వారు చిరంజీవులు కూడా కాలేదు. 4

21:9 – ثُمَّ صَدَقْنَاهُمُ الْوَعْدَ فَأَنجَيْنَاهُمْ وَمَن نَّشَاءُ وَأَهْلَكْنَا الْمُسْرِفِينَ ٩

ఆ పిదప మేము వారికి చేసిన వాగ్దానాలు పూర్తిచేశాము. కావున వారిని మరియు మేము కోరిన వారిని రక్షించాము మరియు మితిమీరి ప్రవర్తించిన వారిని నాశనం చేశాము.

21:10 – لَقَدْ أَنزَلْنَا إِلَيْكُمْ كِتَابًا فِيهِ ذِكْرُكُمْ ۖ أَفَلَا تَعْقِلُونَ ١٠

(ఓ మానవులారా!) వాస్తవంగా, మేము మీ కొరకు ఒక గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింప జేశాము. అందులో మీ కొరకు ఉపదేశముంది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా?

21:11 – وَكَمْ قَصَمْنَا مِن قَرْيَةٍ كَانَتْ ظَالِمَةً وَأَنشَأْنَا بَعْدَهَا قَوْمًا آخَرِينَ ١١

మరియు దుర్మార్గానికి పాల్పడిన ఎన్ని నగరాలను మేము నిర్మూలించలేదు! మరియు వారి తరువాత మరొక జాతి వారిని పుట్టించాము! 5

21:12 – فَلَمَّا أَحَسُّوا بَأْسَنَا إِذَا هُم مِّنْهَا يَرْكُضُونَ ١٢

మాశిక్ష (రావటం) తెలుసుకున్నప్పడువారు దాని నుండి పారిపోవటానికి ప్రయత్నించే వారు.

21:13 – لَا تَرْكُضُوا وَارْجِعُوا إِلَىٰ مَا أُتْرِفْتُمْ فِيهِ وَمَسَاكِنِكُمْ لَعَلَّكُمْ تُسْأَلُونَ ١٣

(అప్పడు వారితో ఇలా చెప్పబడింది): “పారిపోకండి! మరలిరండి – మీరు అనుభ విస్తున్న, మీ సుఖసంపదల వైపుకు మరియు మీ ఇళ్ళ వైపుకు – ఎందుకంటే! మిమ్మల్ని ప్రశ్నించవలసి ఉంది!”

21:14 – قَالُوا يَا وَيْلَنَا إِنَّا كُنَّا ظَالِمِينَ ١٤

వారన్నారు: “అయ్యె మా దౌర్భాగ్యం! నిస్సందేహంగా మేము దుర్మార్గులము.”

21:15 – فَمَا زَالَت تِّلْكَ دَعْوَاهُمْ حَتَّىٰ جَعَلْنَاهُمْ حَصِيدًا خَامِدِينَ ١٥

ఆ పిదప మేము వారిని కోయబడిన పైరువలే, చల్లారిన అగ్నివలే, చేసినంత వరకు వారి అరుపు ఆగలేదు.

21:16 – وَمَا خَلَقْنَا السَّمَاءَ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَاعِبِينَ ١٦

మరియు మేము ఈ ఆకాశాన్ని, భూమిని మరియు వాటి మధ్య ఉన్నదంతా కేవలం వినోదం కొరకు సృష్టించలేదు. 6

21:17 – لَوْ أَرَدْنَا أَن نَّتَّخِذَ لَهْوًا لَّاتَّخَذْنَاهُ مِن لَّدُنَّا إِن كُنَّا فَاعِلِينَ ١٧

ఒకవేళ మేము కాలక్షేపమే చేయదలచు కుంటే, మేము మా వద్ద ఉన్న దానితోనే చేసుకునే వారం; వాస్తవానికి, ఇలా చేయడమే, మా ఉద్దేశ్యమై ఉంటే!

21:18 – بَلْ نَقْذِفُ بِالْحَقِّ عَلَى الْبَاطِلِ فَيَدْمَغُهُ فَإِذَا هُوَ زَاهِقٌ ۚ وَلَكُمُ الْوَيْلُ مِمَّا تَصِفُونَ ١٨

అలాకాదు! మేము సత్యాన్ని అసత్యంపై విసురుతాము. అది దాని తలను పగుల గొడుతుంది, అప్పుడు అది (అసత్యం) నశించి పోతుంది మరియు మీరు కల్పించే కల్పనలకు, మీకు వినాశం తప్పదు.

21:19 – وَلَهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَمَنْ عِندَهُ لَا يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِهِ وَلَا يَسْتَحْسِرُونَ ١٩

మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ అయనకు చెందినదే. మరియు అయనకు దగ్గరగా ఉన్నవారు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నామని గర్వించరు మరియు (ఆయన ఆరాధనలో) అలసట కూడా చూపరు. 7

21:20 – يُسَبِّحُونَ اللَّيْلَ وَالنَّهَارَ لَا يَفْتُرُونَ ٢٠

వారు రేయింబవళ్ళు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు, వారు ఎన్నడూ బలహీనత చూపరు.

21:21 – أَمِ اتَّخَذُوا آلِهَةً مِّنَ الْأَرْضِ هُمْ يُنشِرُونَ ٢١

ఏమీ? వారు భూలోకం నుండి ఆరాధ్య దైవాలను నియమించుకున్నారా? అవి (చని పోయిన వారిని) మరల బ్రతికించి లేపగలవా? 8

21:22 – لَوْ كَانَ فِيهِمَا آلِهَةٌ إِلَّا اللَّـهُ لَفَسَدَتَا ۚ فَسُبْحَانَ اللَّـهِ رَبِّ الْعَرْشِ عَمَّا يَصِفُونَ ٢٢

వాటిలో (భూమ్యాకాశాలలో) అల్లాహ్ తప్ప ఇతర ఆరాధ్యదైవాలు ఉంటే అవి రెండూ నాశనమైపోయేవే కదా! కావున సింహాసనానికి (’అర్ష్ కు) ప్రభువైన అల్లాహ్! వారు కల్పించే కల్పనలకు అతీతుడు. 9

21:23 – لَا يُسْأَلُ عَمَّا يَفْعَلُ وَهُمْ يُسْأَلُونَ ٢٣

తాను చేసేదానిని గురించి అయన (అల్లాహ్) ప్రశ్నించబడడు, కాని వారు ప్రశ్నించబడతారు.

21:24 – أَمِ اتَّخَذُوا مِن دُونِهِ آلِهَةً ۖ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ ۖ هَـٰذَا ذِكْرُ مَن مَّعِيَ وَذِكْرُ مَن قَبْلِي ۗ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ الْحَقَّ ۖ فَهُم مُّعْرِضُونَ ٢٤

ఏమీ? వారు ఆయనను వదలి ఇతర ఆరాధ్య దైవాలను నియమించుకున్నారా? వారితో అను: “మీ నిదర్శనాన్ని తీసుకురండి.” ఇది (ఈ ఖుర్ఆన్) నాతో పాటు ఉన్నవారికి హితబోధ; మరియు నా పూర్వికులకు కూడా (ఇలాంటి) హితబోధలు (వచ్చాయి). కాని వారిలో చాలామంది సత్యాన్ని గ్రహిచలేదు, కావున వారు విముఖులై పోతున్నారు.

21:25 – وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَـٰهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ ٢٥

మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: “నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరోక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి.” అని దివ్యజ్ఞానం (వ’హీ) ఇచ్చి పంపాము.

21:26 – وَقَالُوا اتَّخَذَ الرَّحْمَـٰنُ وَلَدًا ۗ سُبْحَانَهُ ۚ بَلْ عِبَادٌ مُّكْرَمُونَ ٢٦

వారంటున్నారు: “అనంత కరుణా మయునికి సంతానముంది!” అని. అయన సర్వ లోపాలకు అతీతుడు, (అల్లాహ్ సంతానంగా పరిగణించబడే) వారు కేవలం గౌరవనీయులైన (అయన) దాసులు మాత్రమే! 10

21:27 – لَا يَسْبِقُونَهُ بِالْقَوْلِ وَهُم بِأَمْرِهِ يَعْمَلُونَ ٢٧

వారు అయన (అనుమతించక) ముందు మాట్లాడ లేరు. మరియు వారు (దేవదూతలు) అయన అజ్ఞలనే పాటిస్తూ ఉంటారు. 11

21:28 – يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يَشْفَعُونَ إِلَّا لِمَنِ ارْتَضَىٰ وَهُم مِّنْ خَشْيَتِهِ مُشْفِقُونَ ٢٨

ఆయనకు, వారికి ప్రత్యక్షంగా (ముందు) ఉన్నదీ మరియు వారికి పరోక్షంగా (గోప్యంగా) ఉన్నదీ, అంతా తేలుసు. వారు, అయన సమ్మతించిన వారికి తప్ప ఇతరుల కొరకు సిఫారసు చేయలేరు. 12 వారు, అయన భీతివలన భయకంపితులై ఉంటారు. (1/8)

21:29 – وَمَن يَقُلْ مِنْهُمْ إِنِّي إِلَـٰهٌ مِّن دُونِهِ فَذَٰلِكَ نَجْزِيهِ جَهَنَّمَ ۚ كَذَٰلِكَ نَجْزِي الظَّالِمِينَ ٢٩

  • వారిలో (దేవదూతలలో) ఎవరైనా: “నిశ్చయంగా ఆయనే కాక, నేను కూడా ఒక ఆరాధ్య దైవాన్ని.” అని అంటే, అలాంటి వానికి మేము నరక శిక్ష విధిస్తాము. 13 మేము దుర్మార్గులను ఇదే విధంగా శిక్షిస్తాము.

21:30 – أَوَلَمْ يَرَ الَّذِينَ كَفَرُوا أَنَّ السَّمَاوَاتِ وَالْأَرْضَ كَانَتَا رَتْقًا فَفَتَقْنَاهُمَا ۖ وَجَعَلْنَا مِنَ الْمَاءِ كُلَّ شَيْءٍ حَيٍّ ۖ أَفَلَا يُؤْمِنُونَ ٣٠

ఏమి ? ఈ సత్య-తిరస్కారులకు తెలి యదా (వారు చూడలేదా)? వాస్తవానికి భూమ్యా కాశాలు (ఒకే ఒక్క భౌతికాంశంగా) కలుసుకొని ఉండేవని అయితే మేమే వాటిని పగులగొట్టి వేరుచేశామని? 14 మరియు మేమే ప్రతి ప్రాణిని నీటి నుండి పుట్టించాము. 15 ఇకనైన వారు విశ్వసించరా?

21:31 – وَجَعَلْنَا فِي الْأَرْضِ رَوَاسِيَ أَن تَمِيدَ بِهِمْ وَجَعَلْنَا فِيهَا فِجَاجًا سُبُلًا لَّعَلَّهُمْ يَهْتَدُونَ ٣١

మరియు భూమి వారితో పాటు కదలకుండా ఉండాలని మేము దానిలో స్థిరమైన పర్వతాలను (మేకులవలే) నాటాము. 16 మరియు వారు (ప్రజలు) మార్గదర్శకత్వం పొందాలని మేము దానిలో విశాలమైన మార్గలను కూడా ఏర్పాటు చేశాము.

21:32 – وَجَعَلْنَا السَّمَاءَ سَقْفًا مَّحْفُوظًا ۖ وَهُمْ عَنْ آيَاتِهَا مُعْرِضُونَ ٣٢

మరియు మేము ఆకాశాన్నిసురక్షితమైన కప్పుగా చేశాము. 17 అయినా వారు అందులోని సూచన (ఆయాత్)ల నుండి విముఖులవు తున్నారు.

21:33 – وَهُوَ الَّذِي خَلَقَ اللَّيْلَ وَالنَّهَارَ وَالشَّمْسَ وَالْقَمَرَ ۖ كُلٌّ فِي فَلَكٍ يَسْبَحُونَ ٣٣

మరియు రేయింబవళ్ళను మరియు సూర్య-చంద్రులను సృష్టించిన వాడు అయనే. అవి తమతమ కక్ష్యలలో తేలియాడుతూ (తిరుగుతూ) ఉన్నాయి.

21:34 – وَمَا جَعَلْنَا لِبَشَرٍ مِّن قَبْلِكَ الْخُلْدَ ۖ أَفَإِن مِّتَّ فَهُمُ الْخَالِدُونَ ٣٤

మరియు (ఓ ప్రవక్తా!) నీకు పూర్వం మేము ఏ మానవునికి కూడా శాశ్వత జీవితాన్ని ప్రసాదించ లేదు. 18 ఏమీ? ఒకవేళ నీవు మరణిస్తే! వారు మాత్రం శాశ్వతంగా సజీవులుగా (చిరంజీవులుగా)ఉంటారా? 19

21:35 – كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ ۗ وَنَبْلُوكُم بِالشَّرِّ وَالْخَيْرِ فِتْنَةً ۖ وَإِلَيْنَا تُرْجَعُونَ ٣٥

ప్రతి ప్రాణి మృత్యువును చవిచూస్తుంది. మరియు మేము మీ అందరినీ, మంచి మరియు చెడు స్థితులకు గురిచేసి పరీక్షిస్తాము. 20 మరియు మీరందరూ మా వైపునకే మరలింపబడతారు.

21:36 – وَإِذَا رَآكَ الَّذِينَ كَفَرُوا إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَـٰذَا الَّذِي يَذْكُرُ آلِهَتَكُمْ وَهُم بِذِكْرِ الرَّحْمَـٰنِ هُمْ كَافِرُونَ ٣٦

మరియు ఈ సత్య-తిరస్కారులు నిన్ను చూసినప్పుడల్లా నీతో పరిహసమాడే వైఖరిని మాత్రమే అవలంబిస్తూ (అంటారు) 21 “ఏమీ? మీ ఆరాధ్యదైవాలను గురించి (నిర్లక్ష్యంగా) మాట్లాడే వ్యక్తి ఇతనేనా?” ఇక వారేమో అనంత కరుణామయుని ప్రస్తావన వచ్చినప్పుడు! వారే, సత్యాన్ని తిరస్కరిస్తున్నారు.

21:37 – خُلِقَ الْإِنسَانُ مِنْ عَجَلٍ ۚ سَأُرِيكُمْ آيَاتِي فَلَا تَسْتَعْجِلُونِ ٣٧

మానవుడు ఆత్రగాడుగా (తోందరపాటు జీవిగా) పుట్టించబడ్డాడు. 22 త్వరలోనే నేను మీకు నా సూచనలు చూపుతాను, కావున నన్ను తొందరపెట్టకండి. 23

21:38 – وَيَقُولُونَ مَتَىٰ هَـٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ ٣٨

మరియు వారంటున్నారు: “మీరు సత్యవంతులే అయితే ఈ వాగ్దానం (బెదిరింపు) ఎప్పుడు నెరవేరనున్నది. 24

21:39 – لَوْ يَعْلَمُ الَّذِينَ كَفَرُوا حِينَ لَا يَكُفُّونَ عَن وُجُوهِهِمُ النَّارَ وَلَا عَن ظُهُورِهِمْ وَلَا هُمْ يُنصَرُونَ ٣٩

ఒకవేళ, ఈ సత్య-తిరస్కారులు, ఆ సమయాన్ని గురించి తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది! అప్పుడు వారు ఆ అగ్నినుండి తమ ముఖాలను గానీ, తమ వీపులను గానీ కాపాడుకోలేరు. మరియు వారి కెలాంటి సహయం కూడా లభించదు.

21:40 – بَلْ تَأْتِيهِم بَغْتَةً فَتَبْهَتُهُمْ فَلَا يَسْتَطِيعُونَ رَدَّهَا وَلَا هُمْ يُنظَرُونَ ٤٠

వాస్తవంగా, అది వారిపై అకస్మాత్తుగా వచ్చిపడి వారిని కలవరపెడుతుంది. 25 వారు దానిని నివారించనూ లేరు మరియు వారికెలాంటి వ్యవధి కూడా ఇవ్వబడదు.

21:41 – وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّن قَبْلِكَ فَحَاقَ بِالَّذِينَ سَخِرُوا مِنْهُم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ٤١

మరియు (ఓ ము’హమ్మద్!) వాస్తవానికి, నీకు పూర్వం కూడా ప్రవక్తలు ఎగతాళి చేయబడ్డారు, కానీ ఆ వెక్కిరించిన వారిని, వారి ఎగతాళియే చుట్టుకున్నది. 26

21:42 – قُلْ مَن يَكْلَؤُكُم بِاللَّيْلِ وَالنَّهَارِ مِنَ الرَّحْمَـٰنِ ۗ بَلْ هُمْ عَن ذِكْرِ رَبِّهِم مُّعْرِضُونَ ٤٢

ఇలా అను: “రేయింబవళ్ళు మిమ్మల్ని అనంత కరుణామయుని (శిక్ష) నుండి ఎవడు కాపాడగలడు?” అయినా వారు తమ ప్రభువు స్మరణ నుండి విముఖులవుతున్నారు.

21:43 – أَمْ لَهُمْ آلِهَةٌ تَمْنَعُهُم مِّن دُونِنَا ۚ لَا يَسْتَطِيعُونَ نَصْرَ أَنفُسِهِمْ وَلَا هُم مِّنَّا يُصْحَبُونَ ٤٣

లేక! వారిని మా (శిక్ష) నుండి కాపాడటానికి మేము తప్ప వేరేదైవాలు ఎవరైనా ఉన్నారా? వారు (ఆ దైవాలు) తమకు తామే సహయం చేసుకోలేరు మరియు వారు మా నుండి కాపాడు కోనూ లేరు.

21:44 – بَلْ مَتَّعْنَا هَـٰؤُلَاءِ وَآبَاءَهُمْ حَتَّىٰ طَالَ عَلَيْهِمُ الْعُمُرُ ۗ أَفَلَا يَرَوْنَ أَنَّا نَأْتِي الْأَرْضَ نَنقُصُهَا مِنْ أَطْرَافِهَا ۚ أَفَهُمُ الْغَالِبُونَ ٤٤

అయినా! మేము వారికి మరియు వారి తండ్రి-తాతలకు చాలా కాలం వరకు సుఖ- సంతోషాలను ఇస్తూ వచ్చాము. అయితే! వారు చూడటంలేదా! వాస్తవానికి, మేము భూమిని, దాని అన్ని వైపుల నుండి తగ్గిస్తున్నామని? 27 అయినా! వారు ఆధిక్యత వహించగలరని భావిస్తున్నారా?

21:45 – قُلْ إِنَّمَا أُنذِرُكُم بِالْوَحْيِ ۚ وَلَا يَسْمَعُ الصُّمُّ الدُّعَاءَ إِذَا مَا يُنذَرُونَ ٤٥

(ఓ ము’హమ్మద్!) వారితో అను: “నేను కేవలం దివ్యజ్ఞానం (వ’హీ) ఆధారంగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.” కాని చెవిటి వారిని, ఎంత హెచ్చరించినా, వారు పిలుపును వినలేరు కదా!

21:46 – وَلَئِن مَّسَّتْهُمْ نَفْحَةٌ مِّنْ عَذَابِ رَبِّكَ لَيَقُولُنَّ يَا وَيْلَنَا إِنَّا كُنَّا ظَالِمِينَ ٤٦

మరియు ఒకవేళ నీ ప్రభువు శిక్ష, కొంత వారికి పడితే, వారు: “అయ్యె మా పాడుగాను! వాస్తవానికి, మేము దుర్మార్గులుగా ఉండేవారం.” అని అంటారు.

21:47 – وَنَضَعُ الْمَوَازِينَ الْقِسْطَ لِيَوْمِ الْقِيَامَةِ فَلَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا ۖ وَإِن كَانَ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ أَتَيْنَا بِهَا ۗ وَكَفَىٰ بِنَا حَاسِبِينَ ٤٧

మరియు పునరుత్థానదినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటుచేస్తాము, కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయం జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము. మరియు లెక్కచూడటానికి మేమే చాలు!

21:48 – وَلَقَدْ آتَيْنَا مُوسَىٰ وَهَارُونَ الْفُرْقَانَ وَضِيَاءً وَذِكْرًا لِّلْمُتَّقِينَ ٤٨

మరియు వాస్తవానికి మేము, మూసా మరియు హారూన్ లకు ఒక గీటురాయిని మరియు దివ్యజ్యోతిని (తౌరాత్ ను) ప్రసాదించి ఉన్నాము మరియు దైవభీతి గల వారికి ఒక హితబోధను. 28

21:49 – الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِالْغَيْبِ وَهُم مِّنَ السَّاعَةِ مُشْفِقُونَ ٤٩

వారి కొరకు ఎవరైతే అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో! 29 మరియు అంతిమ ఘడియను గురించి భీతిపరులై ఉంటారో!

21:50 – وَهَـٰذَا ذِكْرٌ مُّبَارَكٌ أَنزَلْنَاهُ ۚ أَفَأَنتُمْ لَهُ مُنكِرُونَ ٥٠

మరియు ఈ శుభప్రదమైన జ్ఞాపిక (ఖుర్ఆన్)ను మేము అవతరింపజేశాము. ఏమీ? మీరు దీనిని నిరాకరిస్తారా? (1/4)

21:51 – وَلَقَدْ آتَيْنَا إِبْرَاهِيمَ رُشْدَهُ مِن قَبْلُ وَكُنَّا بِهِ عَالِمِينَ ٥١

  • మరియు వాస్తవానికి, మేము ఇంతకు పూర్వం ఇబ్రాహీమ్ కు కూడా మార్గదర్శకత్వం చేశాము మరియు అతనిని గురించి మాకు బాగా తెలుసు. 30

21:52 – إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَا هَـٰذِهِ التَّمَاثِيلُ الَّتِي أَنتُمْ لَهَا عَاكِفُونَ ٥٢

అతను తన తండ్రి మరియు తన జాతి ప్రజలతో ఇలా అన్నప్పుడు: “మీరు భక్తితో ఆరాధిస్తూ ఉన్న ఈ విగ్రహలు ఏమిటి?”

21:53 – قَالُوا وَجَدْنَا آبَاءَنَا لَهَا عَابِدِينَ ٥٣

వారన్నారు: “మేము మా తండ్రి- తాతలను, వీటినే ఆరాధిస్తూ ఉండగా చూశాము.”

21:54 – قَالَ لَقَدْ كُنتُمْ أَنتُمْ وَآبَاؤُكُمْ فِي ضَلَالٍ مُّبِينٍ ٥٤

(ఇబ్రాహీమ్) అన్నాడు: “వాస్తవానికి, మీరు మరియు మీ తండ్రి-తాతలు స్పష్టంగా మార్గ భ్రష్టత్వంలో పడి ఉన్నారు.”

21:55 – قَالُوا أَجِئْتَنَا بِالْحَقِّ أَمْ أَنتَ مِنَ اللَّاعِبِينَ ٥٥

వారన్నారు: “ఏమీ? నీవు మా వద్దకు ఏదైన సత్యాని తెచ్చావా? లేదా నీవు మాతో పరిహసమాడుతున్నావా?”

21:56 – قَالَ بَل رَّبُّكُمْ رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ الَّذِي فَطَرَهُنَّ وَأَنَا عَلَىٰ ذَٰلِكُم مِّنَ الشَّاهِدِينَ ٥٦

(ఇబ్రాహీమ్) అన్నాడు: “అలాకాదు! భూమ్యాకాశాల ప్రభువే మీ ప్రభువు! ఆయనే వాటన్నింటినీ సృజించాడు. మరియు నేను ఈ విషయం గురించి మీ ముందు సాక్ష్యమిస్తున్నాను.

21:57 – وَتَاللَّـهِ لَأَكِيدَنَّ أَصْنَامَكُم بَعْدَ أَن تُوَلُّوا مُدْبِرِينَ ٥٧

“మరియు నేను అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను. మీరు వెళ్ళిపోయిన తరువాత మీ విగ్రహలకు విరుద్థంగా తప్పక యుక్తిపన్నుతాను.”

21:58 – فَجَعَلَهُمْ جُذَاذًا إِلَّا كَبِيرًا لَّهُمْ لَعَلَّهُمْ إِلَيْهِ يَرْجِعُونَ ٥٨

తరువాత అతను ఒక పెద్ద దానిని (విగ్రహన్ని) తప్ప అన్నింటినీ ముక్కలు ముక్కలుగా చేశాడు; బహుశా వారు దాని వైపునకు మరలుతారని!

21:59 – قَالُوا مَن فَعَلَ هَـٰذَا بِآلِهَتِنَا إِنَّهُ لَمِنَ الظَّالِمِينَ ٥٩

వారన్నారు: “మా ఆరాధ్య దైవాలతో ఈ విధంగా ప్రవర్తించిన వాడెవడు? నిశ్చయంగా, వాడు దుర్మార్గుడు.”

21:60 – قَالُوا سَمِعْنَا فَتًى يَذْكُرُهُمْ يُقَالُ لَهُ إِبْرَاهِيمُ ٦٠

(కొందరు) ఇలా అన్నారు; “ఇబ్రాహీమ్ అనే ఒక యువకుడు, వీటిని గురించి ప్రస్తావిస్తూ ఉండగా మేము విన్నాము.”

21:61 – قَالُوا فَأْتُوا بِهِ عَلَىٰ أَعْيُنِ النَّاسِ لَعَلَّهُمْ يَشْهَدُونَ ٦١

(ఇతరులు) అన్నారు: “అయితే, అతనిని ప్రజల కళ్ళ ముందుకు తీసుకురండి; బహుశా వారు సాక్ష్యమిస్తారేమె!”

21:62 – قَالُوا أَأَنتَ فَعَلْتَ هَـٰذَا بِآلِهَتِنَا يَا إِبْرَاهِيمُ ٦٢

(అతనిని తెచ్చిన తరువాత) వారు అడిగారు: “ఓ ఇబ్రాహీమ్! ఏమీ? నీవేనా మా ఆరాధ్యదైవాలతో ఇలా వ్యవహరించినవాడవు?”

21:63 – قَالَ بَلْ فَعَلَهُ كَبِيرُهُمْ هَـٰذَا فَاسْأَلُوهُمْ إِن كَانُوا يَنطِقُونَ ٦٣

(ఇబ్రాహీమ్) జవాబిచ్చాడు: “కాదు కాదు! వారిలోని ఈ పెద్దవాడే ఇలా చేశాడు! అవి మాట్లాడ గలిగితే వాటినే అడగండి!”

21:64 – فَرَجَعُوا إِلَىٰ أَنفُسِهِمْ فَقَالُوا إِنَّكُمْ أَنتُمُ الظَّالِمُونَ ٦٤

వారు తమలో తాము సమాలోచనలు చేసుకుంటూ ఇలా అనుకున్నారు: “నిశ్చయంగా, స్వయంగా మీరే దుర్మార్గులు!”

21:65 – ثُمَّ نُكِسُوا عَلَىٰ رُءُوسِهِمْ لَقَدْ عَلِمْتَ مَا هَـٰؤُلَاءِ يَنطِقُونَ ٦٥

కాని, తరువాత వారి బుద్థి తలక్రిందులై వారు ఇలా అన్నారు: “వాస్తవానికి, నీకు తెలుసు కదా, ఇవి మాట్లాడలేవని!”

21:66 – قَالَ أَفَتَعْبُدُونَ مِن دُونِ اللَّـهِ مَا لَا يَنفَعُكُمْ شَيْئًا وَلَا يَضُرُّكُمْ ٦٦

(ఇబ్రాహీమ్) ఇలా అన్నాడు: “అలా అయితే! మీరు అల్లాహ్ ను వదలి, మీ కెలాంటి లాభంగానీ, నష్టంగానీ చేకూర్చలేని వాటిని ఆరాధిస్తారా?

21:67 – أُفٍّ لَّكُمْ وَلِمَا تَعْبُدُونَ مِن دُونِ اللَّـهِ ۖ أَفَلَا تَعْقِلُونَ ٦٧

“ధిక్కారం! మీపై మరియు అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వాటిపై (దైవాలపై)! ఏమీ? మీరు ఏ మాత్రమూ తెలివిని ఉపయెగించరా?”

21:68 – قَالُوا حَرِّقُوهُ وَانصُرُوا آلِهَتَكُمْ إِن كُنتُمْ فَاعِلِينَ ٦٨

వారన్నారు: “మీరేమైనా చేయదలుచు కుంటే! ఇతనిని కాల్చివేయండి, మీ ఆరాధ్య దైవాలకు తోడ్పడండి.”

21:69 – قُلْنَا يَا نَارُ كُونِي بَرْدًا وَسَلَامًا عَلَىٰ إِبْرَاهِيمَ ٦٩

మేము (అల్లాహ్) ఆజ్ఞాపించాము: “ఓ అగ్నీ! నీవు ఇబ్రాహీమ్ కొరకు చల్లగా సురక్షితంగా అయిపో!” 31

21:70 – وَأَرَادُوا بِهِ كَيْدًا فَجَعَلْنَاهُمُ الْأَخْسَرِينَ ٧٠

మరియు వారు ఇబ్రాహీమ్ కు కీడు తలపెట్ట గోరారు, కాని మేము వారినే నష్టంలో పడవేశాము.

21:71 – وَنَجَّيْنَاهُ وَلُوطًا إِلَى الْأَرْضِ الَّتِي بَارَكْنَا فِيهَا لِلْعَالَمِينَ ٧١

మరియు మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) మరియు లూ’త్ ను రక్షించి, సర్వజనుల కొరకు శుభప్రదం చేసిన భూమి వైపునకు పంపాము. 32

21:72 – وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ نَافِلَةً ۖ وَكُلًّا جَعَلْنَا صَالِحِينَ ٧٢

మరియు అతనికి (ఇబ్రహీమ్)కు ఇస్హా’ఖ్ మరియు య’అఖూబ్ లను అదనపు కానుకగా ప్రసాదించాము. 33 మరియు మేము ప్రతి ఒక్కరినీ సద్వర్తనులుగా చేశాము.

21:73 – وَجَعَلْنَاهُمْ أَئِمَّةً يَهْدُونَ بِأَمْرِنَا وَأَوْحَيْنَا إِلَيْهِمْ فِعْلَ الْخَيْرَاتِ وَإِقَامَ الصَّلَاةِ وَإِيتَاءَ الزَّكَاةِ ۖ وَكَانُوا لَنَا عَابِدِينَ ٧٣

మరియు మేము వారిని నాయకులుగా చేశాము. వారు ప్రజలకు మా అజ్ఞ ప్రకారం మార్గ దర్శకత్వం చేస్తూ ఉండేవారు. మరియు మేము వారిపై – సత్కార్యాలు చేయాలని, నమా’జ్ స్థాపిచాలని, విధిదానం (’జకాత్) ఇవ్వాలని – దివ్యజ్ఞానం (వ’హీ) పంపాము. మరియు వారు (కేవలం) మమ్మల్నే ఆరాధించే వారు.

21:74 – وَلُوطًا آتَيْنَاهُ حُكْمًا وَعِلْمًا وَنَجَّيْنَاهُ مِنَ الْقَرْيَةِ الَّتِي كَانَت تَّعْمَلُ الْخَبَائِثَ ۗ إِنَّهُمْ كَانُوا قَوْمَ سَوْءٍ فَاسِقِينَ ٧٤

మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము లూ’త్ కు 34 వివేకాన్ని మరియు జ్ఞాన్నాన్ని ప్రసాదించాము మరియు మేము అతనిని అసహ్య కరమైన పనులు చేస్తున్నవారి నగరం నుండి కాపాడాము. నిశ్చయంగా, వారు నీచులు, అవిధేయులు (ఫాసిఖూన్) అయిన ప్రజలు.

21:75 – وَأَدْخَلْنَاهُ فِي رَحْمَتِنَا ۖ إِنَّهُ مِنَ الصَّالِحِينَ ٧٥

మరియు మేము అతనిని మా కారుణ్యం లోకి ప్రవేశింపజేసుకున్నాము. నిశ్చయంగా, అతను సద్వర్తనులలోని వాడు.

21:76 – وَنُوحًا إِذْ نَادَىٰ مِن قَبْلُ فَاسْتَجَبْنَا لَهُ فَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ ٧٦

మరియు (జ్ఞాపకంచేసుకోండి) నూ’హ్ 35 అంతకు ముందు, మమ్మల్ని వేడుకొనగా మేము అతని (ప్రార్థనను) అంగికరించాము. కావున అతనికి మరియు అతనితోబాటు ఉన్నవారికి ఆ మహా విపత్తునుండి విముక్తి కలిగించాము.

21:77 – وَنَصَرْنَاهُ مِنَ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۚ إِنَّهُمْ كَانُوا قَوْمَ سَوْءٍ فَأَغْرَقْنَاهُمْ أَجْمَعِينَ ٧٧

మరియు మా సూచనలను అబద్థాలని నిరాకరించిన వారికి వ్యతిరేకంగా మేము అతనికి సహయంచేశాము. నిశ్చయంగా, వారు దుష్ట ప్రజలు. కావున మేము వారినందరినీ ముంచివేశాము.

21:78 – وَدَاوُودَ وَسُلَيْمَانَ إِذْ يَحْكُمَانِ فِي الْحَرْثِ إِذْ نَفَشَتْ فِيهِ غَنَمُ الْقَوْمِ وَكُنَّا لِحُكْمِهِمْ شَاهِدِينَ ٧٨

మరియు దావూదు మరియు సులైమాన్ ఇద్దరు ఒక చేను గురించి తీర్పుచేసినవిషయం (జ్ఞాపకం చేసుకోండి) 36 ఒక తెగవారి మేకలు (మరొక తెగవారి చేను) మేశాయి. అప్పుడు వాస్తవానికి, మేము వారి తీర్పునకు సాక్షులుగా ఉన్నాము.

21:79 – فَفَهَّمْنَاهَا سُلَيْمَانَ ۚ وَكُلًّا آتَيْنَا حُكْمًا وَعِلْمًا ۚ وَسَخَّرْنَا مَعَ دَاوُودَ الْجِبَالَ يُسَبِّحْنَ وَالطَّيْرَ ۚ وَكُنَّا فَاعِلِينَ ٧٩

  1. అసలు సులైమాన్ కు మేము (వాస్తవ విషయం) తెలియజేశాము. మరియు వారిద్దరికీ మేము వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు మేము పర్వతాలను మరియు పక్షులను దావూద్ తో బాటు మా స్తోత్రం చేయటానికి లోబరిచాము. 37 మరియు నిశ్చయంగా మేమే (ప్రతిదీ) చేయగలవారము.

21:80 – وَعَلَّمْنَاهُ صَنْعَةَ لَبُوسٍ لَّكُمْ لِتُحْصِنَكُم مِّن بَأْسِكُمْ ۖ فَهَلْ أَنتُمْ شَاكِرُونَ ٨٠

మరియు మేము అతనికి, మీ యుద్ధాలలో, మీ రక్షణ కొరకు కవచాలు తయారుచేయడం నేర్పాము. అయితే! (ఇప్పుడైనా) మీరు కృతజ్ఞులవుతారా?

21:81 – وَلِسُلَيْمَانَ الرِّيحَ عَاصِفَةً تَجْرِي بِأَمْرِهِ إِلَى الْأَرْضِ الَّتِي بَارَكْنَا فِيهَا ۚ وَكُنَّا بِكُلِّ شَيْءٍ عَالِمِينَ ٨١

మరియు మేము తీవ్రంగా వీచే గాలిని సులైమాన్ కు (వశపరిచాము). అది అతని అజ్ఞతో మేము శుభాలను ప్రసాదించిన (అనుగ్రహించిన) భూమి మీద వీచేది. 38 మరియు నిశ్చయంగా, మాకు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.

21:82 – وَمِنَ الشَّيَاطِينِ مَن يَغُوصُونَ لَهُ وَيَعْمَلُونَ عَمَلًا دُونَ ذَٰلِكَ ۖ وَكُنَّا لَهُمْ حَافِظِينَ ٨٢

మరియు ’షైతానులలో కొందరు అతని కొరకు (సులైమాన్ కొరకు సముద్రంలో) మునిగే వారు మరియు ఇతర పనులు కూడా చేసేవారు. మరియు నిశ్చయంగా, మేమే వారిని కనిపెట్టుకొని ఉండేవారము. (3/8)

21:83 – وَأَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُ أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ ٨٣

  • మరియు (జ్ఞాపకం చేసుకోండి), అయ్యూబ్ తన ప్రభువును వేడుకున్నప్పుడు (ఇలా అన్నాడు): “నిశ్చయంగా, నన్ను బాధ (వ్యాధి) చుట్టుకున్నది. మరియు నీవే కరుణా మయులలో కెల్లా గొప్ప కరుణామయుడవు!” 39

21:84 – فَاسْتَجَبْنَا لَهُ فَكَشَفْنَا مَا بِهِ مِن ضُرٍّ ۖ وَآتَيْنَاهُ أَهْلَهُ وَمِثْلَهُم مَّعَهُمْ رَحْمَةً مِّنْ عِندِنَا وَذِكْرَىٰ لِلْعَابِدِينَ ٨٤

అప్పడు మేము అతని (ప్రార్థనను) అంగీకరించి, అతని బాధనుండి అతనికి విముక్తి కలిగించాము. మరియు అతనికి, అతని కుటుంబ వాసులను తిరిగి ఇవ్వటమే గాక వారితో బాటు ఇంకా అంత మందిని ఎక్కువగా ఇచ్చి, దానిని మా నుండి ఒక ప్రత్యేక కరుణగా మరియు మమ్మల్ని ఆరాధించే వారికి ఒక జ్ఞాపికగా చేశాము.

21:85 – وَإِسْمَاعِيلَ وَإِدْرِيسَ وَذَا الْكِفْلِ ۖ كُلٌّ مِّنَ الصَّابِرِينَ ٨٥

మరియు (జ్ఞాపకంచేసుకోండి) ఇస్మా’యీల్ ఇద్రీస్ మరియు జు’ల్-కిఫ్ల్ 40 వీరందరుకూడా సహనశీలురైన వారే!

21:86 – وَأَدْخَلْنَاهُمْ فِي رَحْمَتِنَا ۖ إِنَّهُم مِّنَ الصَّالِحِينَ ٨٦

మరియు మేము వారందరినీ మా కారుణ్యంలోకి తీసుకున్నాము. నిశ్చయంగా వారందరూ సద్వర్తనులు.

21:87 – وَذَا النُّونِ إِذ ذَّهَبَ مُغَاضِبًا فَظَنَّ أَن لَّن نَّقْدِرَ عَلَيْهِ فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَـٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ إِنِّي كُنتُ مِنَ الظَّالِمِينَ ٨٧

మరియు (జ్ఞాపకం చేసుకోండి) చేపవాడు (యూనుస్) 41 – ఉద్రేకంతో వెళ్ళిపోతూ – మేము అతనిని పట్టుకోలేమని అనుకున్నాడు! కాని ఆ తరువాత, అంధకారాలలో చిక్కుకొని పోయి నప్పుడు, ఇలా మొరపెట్టుకున్నాడు: “వాస్తవానికి నీవు (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, నీవు సర్వలోపాలకు అతీతుడవు, నిశ్చయంగా, నేనే అపరాధులలోని వాడను.”

21:88 – فَاسْتَجَبْنَا لَهُ وَنَجَّيْنَاهُ مِنَ الْغَمِّ ۚ وَكَذَٰلِكَ نُنجِي الْمُؤْمِنِينَ ٨٨

అప్పుడు మేము అతని (ప్రార్థనను) అంగీకరించి, అతనికి ఆ దుఃఖము నుండి విముక్తి కలిగించాము. మరియు విశ్వసించిన వారిని మేము ఇదే విధంగా కాపాడుతూ ఉంటాము.

21:89 – وَزَكَرِيَّا إِذْ نَادَىٰ رَبَّهُ رَبِّ لَا تَذَرْنِي فَرْدًا وَأَنتَ خَيْرُ الْوَارِثِينَ ٨٩

మరియు (జ్ఞాపకంచేసుకోండి) ’జకరియ్యా 42 తన ప్రభువును వేడుకున్నప్పుడు ఇలా ప్రార్థించాడు: “ఓ నా ప్రభూ! నన్ను ఒంటరి వానిగా (సంతానహీనునిగా) వదలకు. నీవే సర్వశ్రేష్ఠమైన వారసుడవు!”

21:90 – فَاسْتَجَبْنَا لَهُ وَوَهَبْنَا لَهُ يَحْيَىٰ وَأَصْلَحْنَا لَهُ زَوْجَهُ ۚ إِنَّهُمْ كَانُوا يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَيَدْعُونَنَا رَغَبًا وَرَهَبًا ۖ وَكَانُوا لَنَا خَاشِعِينَ ٩٠

అప్పుడు మేము అతని ప్రార్థనను అంగీకరించి, అతని కొరకు అతని భార్యను (సంతానానికి) యెగ్యురాలుగా జేసి, అతనికి య’హ్యాను ప్రసాదించాము. వాస్తవానికి వారు సత్కార్యాలు చేయటానికి పోటిపడేవారు. మరియు శ్రద్థతో మరియు భీతితో మమ్మల్ని ఆరాధించేవారు. మరియు మా సమక్షంలో వినమృలై ఉండేవారు.

21:91 – وَالَّتِي أَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِيهَا مِن رُّوحِنَا وَجَعَلْنَاهَا وَابْنَهَا آيَةً لِّلْعَالَمِينَ ٩١

మరియు (జ్ఞాపకంచేసుకోండి), తన శీలాన్ని కాపాడుకున్న ఆ మహిళ (మర్యమ్)లో మా నుండి ప్రాణం (రూ’హ్) ఊది, అమెను మరియు అమె కొడుకును, సర్వ లోకాలవారికి ఒక సూచనగా చేశాము. 43

21:92 – إِنَّ هَـٰذِهِ أُمَّتُكُمْ أُمَّةً وَاحِدَةً وَأَنَا رَبُّكُمْ فَاعْبُدُونِ ٩٢

నిశ్చయంగా, మీ ఈ సమాజం ఒకే ఒక్క సమాజం 44 మరియు కేవలం నేనే మీ ప్రభువును, కావున మీరు నన్ను మాత్రమే ఆరాధించండి.

21:93 – وَتَقَطَّعُوا أَمْرَهُم بَيْنَهُمْ ۖ كُلٌّ إِلَيْنَا رَاجِعُونَ ٩٣

కాని వారు (ప్రజలు) తమ ధర్మవిషయంలో తెగలు తెగలుగా చీలిపోయారు. వారందరికీ మా వైపునకే మరలి రావలసి వున్నది.

21:94 – فَمَن يَعْمَلْ مِنَ الصَّالِحَاتِ وَهُوَ مُؤْمِنٌ فَلَا كُفْرَانَ لِسَعْيِهِ وَإِنَّا لَهُ كَاتِبُونَ ٩٤

సత్కార్యాలు చేసేవాడు విశ్వసించేవాడై ఉంటే, అతని శ్రమ నిరాదరించబడదు మరియు నిశ్చయంగా, మేము దానిని వ్రాసిపెడతాము.

21:95 – وَحَرَامٌ عَلَىٰ قَرْيَةٍ أَهْلَكْنَاهَا أَنَّهُمْ لَا يَرْجِعُونَ ٩٥

మరియు మేము నాశనం చేసిన ప్రతి నగరం (వారి) పై, వారు (ఆ నగరవాసులు) మరలి రావటం నిషేధించబడింది.

21:96 – حَتَّىٰ إِذَا فُتِحَتْ يَأْجُوجُ وَمَأْجُوجُ وَهُم مِّن كُلِّ حَدَبٍ يَنسِلُونَ ٩٦

ఎంతవరకైతే యా‘జూజ్ మరియు మా‘జూజ్ లు వదలి పెట్టబడి ప్రతి మిట్ట నుండి పరుగెడుతూ రారో! 45

21:97 – وَاقْتَرَبَ الْوَعْدُ الْحَقُّ فَإِذَا هِيَ شَاخِصَةٌ أَبْصَارُ الَّذِينَ كَفَرُوا يَا وَيْلَنَا قَدْ كُنَّا فِي غَفْلَةٍ مِّنْ هَـٰذَا بَلْ كُنَّا ظَالِمِينَ ٩٧

మరియు సత్యవాగ్దనం నెరవేరే సమయం దగ్గర పడినప్పుడు సత్య-తిరస్కారుల కళ్లు విచ్చుకుపోయి: “అయె మా దౌర్భాగ్యం! వాస్తవానికి మేము దీని నుండి అశ్రద్థకు గురి అయ్యాము. కాదు కాదు! మేము దుర్మార్గులుగా ఉండేవారము.” అని అంటారు.

21:98 – إِنَّكُمْ وَمَا تَعْبُدُونَ مِن دُونِ اللَّـهِ حَصَبُ جَهَنَّمَ أَنتُمْ لَهَا وَارِدُونَ ٩٨

(వారితో ఇంకా ఇలా అనబడుతుంది): “నిశ్చయంగా, మీరు మరియు అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వారూ, నరకాగ్నికి ఇంధన మవుతారు! (ఎందుకంటే) మీకు అక్కడికే పోవలసి ఉన్నది. 46

21:99 – لَوْ كَانَ هَـٰؤُلَاءِ آلِهَةً مَّا وَرَدُوهَا ۖ وَكُلٌّ فِيهَا خَالِدُونَ ٩٩

ఒకవేళ ఇవన్నీ ఆరాధ్య దైవాలే అయివుంటే, ఇవి అందులో (నరకంలో) ప్రవేశించి ఉండేవి కావు కదా! ఇక మీరంతా అందులోనే శాశ్వతంగా ఉంటారు!”

21:100 – لَهُمْ فِيهَا زَفِيرٌ وَهُمْ فِيهَا لَا يَسْمَعُونَ ١٠٠

అందులో వారు (దుఃఖంచేత) మూలు గుతూ ఉంటారు. అందులో వారేమి వినలేరు. 47

21:101 – إِنَّ الَّذِينَ سَبَقَتْ لَهُم مِّنَّا الْحُسْنَىٰ أُولَـٰئِكَ عَنْهَا مُبْعَدُونَ ١٠١

నిశ్చయంగా ఎవరికొరకైతే, మా తరపు నుండి మేలు (స్వర్గం) నిర్ణయింపబడివుందో, అలాంటి వారు దాని (నరకం) నుండి దూరంగా ఉంచబడతారు.

21:102 – لَا يَسْمَعُونَ حَسِيسَهَا ۖ وَهُمْ فِي مَا اشْتَهَتْ أَنفُسُهُمْ خَالِدُونَ ١٠٢

వారు దాని మెల్లని శబ్దం కూడా వినరు. వారు తాము కోరిన వాటిలో శాశ్వతంగా ఉంటారు.

21:103 – لَا يَحْزُنُهُمُ الْفَزَعُ الْأَكْبَرُ وَتَتَلَقَّاهُمُ الْمَلَائِكَةُ هَـٰذَا يَوْمُكُمُ الَّذِي كُنتُمْ تُوعَدُونَ ١٠٣

ఆ గొప్ప భీతి కూడా వారికి దుఖం కలిగించదు 48 మరియు దేవదుతలు వారిని ఆహ్వనిస్తూ వచ్చి: “మీకు వాగ్దనం చేయబడిన మీ దినం ఇదే! అని అంటారు.

21:104 – يَوْمَ نَطْوِي السَّمَاءَ كَطَيِّ السِّجِلِّ لِلْكُتُبِ ۚ كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُّعِيدُهُ ۚ وَعْدًا عَلَيْنَا ۚ إِنَّا كُنَّا فَاعِلِينَ ١٠٤

(జ్ఞాపముంచుకోండి)! ఆ రోజు మేము ఆకాశాన్ని, చిట్టా కాగితాలను (ఖాతా గ్రంథాలను) చుట్టినట్టు చుట్టి వేస్తాము. 49 మేము ఏ విధంగా సృష్టిని మెుదట ఆరంభించామో! ఆదేవిధంగా దానిని మరల ఉనికిలోకి తెస్తాము. ఇది (మాపై బాధ్యతగా) ఉన్న మా వాగ్దనం. మేము దానిని తప్పక పూర్తిచేస్తాము.

21:105 – وَلَقَدْ كَتَبْنَا فِي الزَّبُورِ مِن بَعْدِ الذِّكْرِ أَنَّ الْأَرْضَ يَرِثُهَا عِبَادِيَ الصَّالِحُونَ ١٠٥

వాస్తవానికి మేము ’జబూర్ లో – మా హితబోధ తరువాత – నిశ్చయంగా, ఈ భూమికి 50 సద్వర్తునులైన నా దాసులు వారసులవుతారని వ్రాసి ఉన్నాము.

21:106 – إِنَّ فِي هَـٰذَا لَبَلَاغًا لِّقَوْمٍ عَابِدِينَ ١٠٦

నిశ్చయంగా, ఇందులో భక్తిపరులైన ప్రజలకు సందేశం ఉంది. 51

21:107 – وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِّلْعَالَمِينَ ١٠٧

మరియు మేము నిన్ను (ఓ ప్రవక్త!) సర్వ లోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము. 52

21:108 – قُلْ إِنَّمَا يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَـٰهُكُمْ إِلَـٰهٌ وَاحِدٌ ۖ فَهَلْ أَنتُم مُّسْلِمُونَ ١٠٨

(ఓ ము’హమ్మద్) ఇలా అను: “నిశ్చయంగా, నాపై దివ్యజ్ఞానం (వ’హీ) అవతరిప జేయబడింది. వాస్తవంగా మీ ఆరాధ్య దైవం ఆ అద్వితీయ ఆరాధ్యుడే (అల్లాహ్ యే)! ఇకనైన మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అవుతారా?

21:109 – فَإِن تَوَلَّوْا فَقُلْ آذَنتُكُمْ عَلَىٰ سَوَاءٍ ۖ وَإِنْ أَدْرِي أَقَرِيبٌ أَم بَعِيدٌ مَّا تُوعَدُونَ ١٠٩

ఒకవేళ వారు వెనుదిరిగితే వారితో ఇలా అను: “నేను మీకు అందరికి బహిరంగంగా ప్రకటిస్తున్నాను. మరియు మీతో చేయబడిన వాగ్దానం సమీపంలో ఉందో లేదా బహుదూరం ఉందో నాకు తెలియదు.”

21:110 – إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ مِنَ الْقَوْلِ وَيَعْلَمُ مَا تَكْتُمُونَ ١١٠

నిశ్చయంగా, అయన (అల్లాహ్)కు మీరు బహిరంగంగా వ్యక్తపరిచేది మరియు దాచేది అంతాతెలుసు.

21:111 – وَإِنْ أَدْرِي لَعَلَّهُ فِتْنَةٌ لَّكُمْ وَمَتَاعٌ إِلَىٰ حِينٍ ١١١

మరియు బహుశా ఇది (ఈ ఆలస్యం) మీకు పరీక్ష కావచ్చు, లేదా మీకు కొంతకాలం సుఖ సంతోషాలు అనుభవించటానికి ఇవ్వబడీన వ్యవధి కావచ్చు, అది నాకు తెలియదు!

21:112 – قَالَ رَبِّ احْكُم بِالْحَقِّ ۗ وَرَبُّنَا الرَّحْمَـٰنُ الْمُسْتَعَانُ عَلَىٰ مَا تَصِفُونَ ١١٢

అతను (ము’హమ్మద్) ఇలా అన్నాడు: “ఓ నా ప్రభూ! నీవు సత్యంతో తీర్పుచేయి! మరియు మీరు కల్పించే వాటికి (ఆరోపణలకు), ఆ అపార కరుణామయుడైన మా ప్రభువు సహయమే కోరబడుతుంది!” (1/2)

సూరహ్‌ అల్‌-’హజ్జ్‌ – ఈ సూరహ్‌ మదీనహ్ లో అవతరింపజేయబడింది. ఇందులో 78 ఆయతులున్నాయి. దీని పేరు 27-38 ఆయత్‌ల నుండి తీసుకోబడింది. దీని కంటే ముందున్న ఐదు (17-21) సూరహ్‌లు ప్రవక్తల గాథలు తెలిపాయి. ఇది మరియు దీని తరువాత వచ్చే మూడు (22-25) సూరహ్‌లు ధర్మ విషయాలను బోధిస్తున్నాయి.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 22:1 – يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ ۚ إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ ١

ఓ మానవులారా! మీ ప్రభువునందు భయ- భక్తులు కలిగి ఉండండి! నిశ్చయంగా, ఆ అంతిమ ఘడియ యొక్క భూకంపం ఎంతో భయంకర మైనది.

22:2 – يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَـٰكِنَّ عَذَابَ اللَّـهِ شَدِيدٌ ٢

ఆ రోజు ఆవరించినప్పుడు, పాలిచ్చే ప్రతి స్త్రీ తన చంటిబిడ్డను మరచిపోవటాన్ని, గర్భవతి అయిన ప్రతి స్త్రీ, తన గర్భాన్ని కోల్పోవటాన్ని నీవు చూస్తావు. మరియు మానవులందరినీ మత్తులో ఉన్నట్లు నీవు చూస్తావు, కానీ (వాస్తవానికి) వారు త్రాగి (మత్తులో) ఉండరు. కాని అల్లాహ్‌ శిక్షయే అంత తీవ్రంగా ఉంటుంది.

22:3 – وَمِنَ النَّاسِ مَن يُجَادِلُ فِي اللَّـهِ بِغَيْرِ عِلْمٍ وَيَتَّبِعُ كُلَّ شَيْطَانٍ مَّرِيدٍ ٣

మరియు ప్రజలలో ఒకడుంటాడు, జ్ఞానం లేనిదే, అల్లాహ్‌ను గురించి వాదులాడేవాడు మరియు ధిక్కారి అయిన ప్రతి షై’తాన్‌ను అనుసరించేవాడు.

22:4 – كُتِبَ عَلَيْهِ أَنَّهُ مَن تَوَلَّاهُ فَأَنَّهُ يُضِلُّهُ وَيَهْدِيهِ إِلَىٰ عَذَابِ السَّعِيرِ ٤

అతడిని (షై’తాన్‌ను) గురించి వ్రాయబడిందే మిటంటే వాస్తవానికి ఎవడైతే అతడి వైపునకు మరలుతాడో, వాడిని నిశ్చయంగా అతడు మార్గ భ్రష్టునిగా చేస్తాడు మరియు వాడికి మండే నరకాగ్ని వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.

22:5 – يَا أَيُّهَا النَّاسُ إِن كُنتُمْ فِي رَيْبٍ مِّنَ الْبَعْثِ فَإِنَّا خَلَقْنَاكُم مِّن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ مِن مُّضْغَةٍ مُّخَلَّقَةٍ وَغَيْرِ مُخَلَّقَةٍ لِّنُبَيِّنَ لَكُمْ ۚ وَنُقِرُّ فِي الْأَرْحَامِ مَا نَشَاءُ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ثُمَّ نُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوا أَشُدَّكُمْ ۖ وَمِنكُم مَّن يُتَوَفَّىٰ وَمِنكُم مَّن يُرَدُّ إِلَىٰ أَرْذَلِ الْعُمُرِ لِكَيْلَا يَعْلَمَ مِن بَعْدِ عِلْمٍ شَيْئًا ۚ وَتَرَى الْأَرْضَ هَامِدَةً فَإِذَا أَنزَلْنَا عَلَيْهَا الْمَاءَ اهْتَزَّتْ وَرَبَتْ وَأَنبَتَتْ مِن كُلِّ زَوْجٍ بَهِيجٍ ٥

ఓ మానవులారా! ఒకవేళ (మరణించిన తరు వాత) మరల సజీవులుగా లేపబడటాన్ని గురించి మీకు ఏదైనా సందేహముంటే! (జ్ఞాపకముంచు కోండి) నిశ్చయంగా, మేము మిమ్మల్ని మట్టితో 1 సృష్టించాము, తరువాత వీర్య బిందువుతో, ఆ తరువాత నెత్తురుగడ్డతో, ఆ పైన మాంసపు కండతో; అది పూర్తిగా రూపం పొందవచ్చు, లేక పూర్తిగా రూపం పొందకపోవచ్చు. ఇదంతా మేము మీకు (మా శక్తిని తెలుసుకోవటానికి) స్పష్టం చేస్తున్నాము. ఆ తరువాత మేము కోరిన వారిని ఒక నిర్ణీతకాలం వరకు గర్భకోశాలలో ఉంచు తాము. పిదప మిమ్మల్ని శిశువుల రూపంలో బయటికితీస్తాము. ఆ తరువాత మిమ్మల్ని యవ్వన దశకు చేరనిస్తాము. మీలో ఒకడు (వృధ్ధుడు కాకముందే) చనిపోతాడు, మరొకడు నికృష్టమైన వృద్ధాప్యం వరకు చేర్చబడతాడు 2 అప్పుడతడు మొదట అంతా తెలిసినవాడైనా ఏమీ తెలియనివాడిగా అయిపోతాడు. నీవు భూమిని ఫలింపలేని దానిగా చూస్తావు. కాని ఒకవేళ మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపిస్తే, అది పులకరించి పొంగిపోయి అన్నిరకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పన్నంచేస్తుంది.

22:6 – ذَٰلِكَ بِأَنَّ اللَّـهَ هُوَ الْحَقُّ وَأَنَّهُ يُحْيِي الْمَوْتَىٰ وَأَنَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٦

ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్‌! ఆయనే సత్యం. మరియు నిశ్చయంగా, ఆయన మాత్రమే చచ్చిన వారిని తిరిగి బ్రతికించ గలవాడు మరియు నిశ్చయంగా, ఆయనే ప్రతిదీ చేయగల సమర్థుడు.

22:7 – وَأَنَّ السَّاعَةَ آتِيَةٌ لَّا رَيْبَ فِيهَا وَأَنَّ اللَّـهَ يَبْعَثُ مَن فِي الْقُبُورِ ٧

మరియు అంతిమ ఘడియ నిశ్చయంగా రానున్నది. అందులో ఎలాంటి సందేహం లేదు మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ గోరీలలో నున్నవారిని మరల బ్రతికించి లేపుతాడు.

22:8 – وَمِنَ النَّاسِ مَن يُجَادِلُ فِي اللَّـهِ بِغَيْرِ عِلْمٍ وَلَا هُدًى وَلَا كِتَابٍ مُّنِيرٍ ٨

అయినా మానవులలో – జ్ఞానం లేనిదే మరియు మార్గదర్శకత్వం లేనిదే మరియు ప్రకాశవంతమైన గ్రంథం లేనిదే – అల్లాహ్‌ను గురించి వాదులాడేవాడు ఉన్నాడు.

22:9 – ثَانِيَ عِطْفِهِ لِيُضِلَّ عَن سَبِيلِ اللَّـهِ ۖ لَهُ فِي الدُّنْيَا خِزْيٌ ۖ وَنُذِيقُهُ يَوْمَ الْقِيَامَةِ عَذَابَ الْحَرِيقِ ٩

(అలాంటి వాడు) గర్వంతో తన మెడను త్రిప్పుకుంటాడు. ఇతరులను అల్లాహ్‌ మార్గం నుండి తప్పింపజూస్తాడు. 3 వానికి ఈ లోకంలో అవమానముంటుంది. మరియు పునరుత్థాన దినమున అతనికి మేము దహించే అగ్నిశిక్షను రుచిచూపుతాము.

22:10 – ذَٰلِكَ بِمَا قَدَّمَتْ يَدَاكَ وَأَنَّ اللَّـهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ ١٠

(అతనితో): “ఇది నీవు నీ చేతులారా చేసి పంపిన దాని (ఫలితం) మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ తన దాసులకు ఎలాంటి అన్యాయం చేయడు!” (అని అనబడుతుంది).

22:11 – وَمِنَ النَّاسِ مَن يَعْبُدُ اللَّـهَ عَلَىٰ حَرْفٍ ۖ فَإِنْ أَصَابَهُ خَيْرٌ اطْمَأَنَّ بِهِ ۖ وَإِنْ أَصَابَتْهُ فِتْنَةٌ انقَلَبَ عَلَىٰ وَجْهِهِ خَسِرَ الدُّنْيَا وَالْآخِرَةَ ۚ ذَٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِينُ ١١

మరియు ప్రజలలో కొందరు అంచున 4 నిలచి (సందేహంతో) అల్లాహ్‌ను ఆరాధించేవారు ఉన్నారు. (అలాంటివాడు) తనకు లాభం కలిగితే, ఎంతో తృప్తి పొందుతాడు. కాని ఆపదకు గురి అయితే ముఖం త్రిప్పుకొని, ఇహమును మరియు పరమును కూడా కోల్పోతాడు. స్పష్టమైన నష్టమంటే ఇదే!

22:12 – يَدْعُو مِن دُونِ اللَّـهِ مَا لَا يَضُرُّهُ وَمَا لَا يَنفَعُهُ ۚ ذَٰلِكَ هُوَ الضَّلَالُ الْبَعِيدُ ١٢

అతడు అల్లాహ్‌ను వదలి తనకు నష్టం గానీ, లాభం గానీ చేకూర్చలేని వారిని ప్రార్థిస్తున్నాడు. ఇదే మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోవటం. 5

22:13 – يَدْعُو لَمَن ضَرُّهُ أَقْرَبُ مِن نَّفْعِهِ ۚ لَبِئْسَ الْمَوْلَىٰ وَلَبِئْسَ الْعَشِيرُ ١٣

ఎవరి వల్ల లాభం కంటే, నష్టమే ఎక్కువ రానున్నదో వారినే అతడు ప్రార్థిస్తున్నాడు. ఎంత నికృష్టుడైన సంరక్షకుడు మరియు ఎంత నికృష్టుడైన అనుచరుడు (‘అషీరు).

22:14 – إِنَّ اللَّـهَ يُدْخِلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۚ إِنَّ اللَّـهَ يَفْعَلُ مَا يُرِيدُ ١٤

విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని, అల్లాహ్‌ నిశ్చయంగా, క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ తాను కోరింది చేస్తాడు.

22:15 – مَن كَانَ يَظُنُّ أَن لَّن يَنصُرَهُ اللَّـهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ فَلْيَمْدُدْ بِسَبَبٍ إِلَى السَّمَاءِ ثُمَّ لْيَقْطَعْ فَلْيَنظُرْ هَلْ يُذْهِبَنَّ كَيْدُهُ مَا يَغِيظُ ١٥

ఎవడైతే – ఇహలోకంలో మరియు పరలోకం లో కూడా – అల్లాహ్‌, అతనికి (ప్రవక్తకు) సహాయ పడడని భావిస్తాడో! (వాడికి సాధ్యమైతే) వాడిని ఒకత్రాడు సహాయంతో ఆకాశంపైకి పోయి, తరువాత వాటిని (అంటే ప్రవక్తపై అవతరింప జేయబడే వ’హీ మరియు ఇతర సహాయాలను) త్రెంపి చూడమను, అతడి ఈ యుక్తి అతడి క్రోధావేశాన్ని దూరం చేయగలదేమో! 6

22:16 – وَكَذَٰلِكَ أَنزَلْنَاهُ آيَاتٍ بَيِّنَاتٍ وَأَنَّ اللَّـهَ يَهْدِي مَن يُرِيدُ ١٦

మరియు ఈ విధంగా మేము దీనిని (ఈ ఖుర్‌ఆన్‌ ను) స్పష్టమైన సందేశాలతో అవతరింప జేశాము. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. 7

22:17 – إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالصَّابِئِينَ وَالنَّصَارَىٰ وَالْمَجُوسَ وَالَّذِينَ أَشْرَكُوا إِنَّ اللَّـهَ يَفْصِلُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ ۚ إِنَّ اللَّـهَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ ١٧

నిశ్చయంగా (ఈ ఖుర్‌ఆన్‌ను) విశ్వసించిన వారి మరియు యూదులు, సాబీయులు, క్రైస్తవులు, మజూసీలు 8 మరియు బహుదైవారాధ కులు అయిన వారి మధ్య పునరుత్థాన దినమున అల్లాహ్‌ తప్పక తీర్పుచేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రతిదానికి సాక్షిగా ఉంటాడు.

22:18 – أَلَمْ تَرَ أَنَّ اللَّـهَ يَسْجُدُ لَهُ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ وَالشَّمْسُ وَالْقَمَرُ وَالنُّجُومُ وَالْجِبَالُ وَالشَّجَرُ وَالدَّوَابُّ وَكَثِيرٌ مِّنَ النَّاسِ ۖ وَكَثِيرٌ حَقَّ عَلَيْهِ الْعَذَابُ ۗ وَمَن يُهِنِ اللَّـهُ فَمَا لَهُ مِن مُّكْرِمٍ ۚ إِنَّ اللَّـهَ يَفْعَلُ مَا يَشَاءُ ۩ ١٨

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలలో ఉన్నవన్నీ మరియు భూమిలో ఉన్నవన్నీ మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, సర్వ వృక్షరాశి, సర్వ జీవరాశి మరియు ప్రజలలో చాలామంది, అల్లాహ్‌కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారని? 9 మరియు చాలామంది శిక్షకు కూడా గురి అవుతారు. మరియు అల్లాహ్‌ ఎవడినైతే అవమానం పాలుచేస్తాడో, అతడికి గౌరవమిప్పించ గలవాడు ఎవ్వడూ లేడు. నిశ్చయంగా, అల్లాహ్‌ తాను కోరిందే చేస్తాడు. (5/8) (సజ్దా)

22:19 – هَـٰذَانِ خَصْمَانِ اخْتَصَمُوا فِي رَبِّهِمْ ۖ فَالَّذِينَ كَفَرُوا قُطِّعَتْ لَهُمْ ثِيَابٌ مِّن نَّارٍ يُصَبُّ مِن فَوْقِ رُءُوسِهِمُ الْحَمِيمُ ١٩

  • ఆ రెండు విపక్ష తెగలవారు తమ ప్రభువును గురించి వాదులాడారు, కావున వారిలో సత్య-తిరస్కారులకు అగ్నివస్త్రాలు కత్తిరించబడి (కుట్టించబడి) ఉంటాయి వారి తలల మీద సలసలకాగే నీరు పోయబడుతుంది. 10

22:20 – يُصْهَرُ بِهِ مَا فِي بُطُونِهِمْ وَالْجُلُودُ ٢٠

దానితో వారి కడుపులలో ఉన్నది మరియు వారి చర్మాలు కరిగిపోతాయి.

22:21 – وَلَهُم مَّقَامِعُ مِنْ حَدِيدٍ ٢١

మరియు వారిని (శిక్షించటానికి) ఇనుప గదలు ఉంటాయి.

22:22 – كُلَّمَا أَرَادُوا أَن يَخْرُجُوا مِنْهَا مِنْ غَمٍّ أُعِيدُوا فِيهَا وَذُوقُوا عَذَابَ الْحَرِيقِ ٢٢

ప్రతిసారి వారు దానినుండి (ఆనరకంనుండి), దాని బాధనుండి బయటపడటానికి ప్రయత్నించి నప్పుడల్లా తిరిగి అందులోకే నెట్టబడతారు. మరియు వారితో: “నరకాగ్నిని చవిచూడండి!” (అని అనబడుతుంది).

22:23 – إِنَّ اللَّـهَ يُدْخِلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ يُحَلَّوْنَ فِيهَا مِنْ أَسَاوِرَ مِن ذَهَبٍ وَلُؤْلُؤًا ۖ وَلِبَاسُهُمْ فِيهَا حَرِيرٌ ٢٣

నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసే వారిని అల్లాహ్‌ క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారికి బంగారం మరియు ముత్యాలతో చేయబడిన కంకణాలు తొడిగింపబడతాయి. అక్కడ వారి కొరకు పట్టువస్త్రాలు ఉంటాయి. 11

22:24 – وَهُدُوا إِلَى الطَّيِّبِ مِنَ الْقَوْلِ وَهُدُوا إِلَىٰ صِرَاطِ الْحَمِيدِ ٢٤

ఎందుకంటే వారికి మంచి మాటల వైపునకు మార్గదర్శకత్వం చూపబడింది. మరియు వారు సర్వస్తోత్రాలకు అర్హుడైన (అల్లాహ్‌) యొక్క మార్గం వైపునకు మార్గదర్శకత్వం పొందారు.

22:25 – الَّذِينَ كَفَرُوا وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّـهِ وَالْمَسْجِدِ الْحَرَامِ الَّذِي جَعَلْنَاهُ لِلنَّاسِ سَوَاءً الْعَاكِفُ فِيهِ وَالْبَادِ ۚ وَمَن يُرِدْ فِيهِ بِإِلْحَادٍ بِظُلْمٍ نُّذِقْهُ مِنْ عَذَابٍ أَلِيمٍ ٢٥

నిశ్చయంగా, ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తూ (ప్రజలను) అల్లాహ్‌ మార్గం నుండి మరియు మస్జిద్‌ అల్‌’హరామ్‌ నుండి ఆటంక పరుస్తారో 12 – దేనినైతే మేము అందరి కొరకు సమానంగా చేసి ఉన్నామో – వారు అక్కడ నివసించేవారైనా సరే, 13 లేదా బయట నుండి వచ్చిన వారైనా సరే. మరియు ఎవరైనా అందులో అపవిత్రత మరియు అన్యాయం చేయగోరుతారో, అలాంటి వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపుతాము.

22:26 – وَإِذْ بَوَّأْنَا لِإِبْرَاهِيمَ مَكَانَ الْبَيْتِ أَن لَّا تُشْرِكْ بِي شَيْئًا وَطَهِّرْ بَيْتِيَ لِلطَّائِفِينَ وَالْقَائِمِينَ وَالرُّكَّعِ السُّجُودِ ٢٦

మరియు మేము ఇబ్రాహీమ్‌కు ఈ గృహం (క’అబహ్) యొక్క స్థలాన్ని నిర్దేశించి (చూపుతూ) 14 అతనితో: “ఎవ్వరినీ నాకు సాటిగా (భాగస్వాములుగా) కల్పించకు. మరియు నా గృహాన్ని, ప్రదక్షిణ (‘తవాఫ్‌) చేసే వారికొరకు, నమా’జ్‌ చేసేవారి కొరకు, వంగే (రుకూ’ఉ) మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారికొరకు, పరిశుధ్ధంగా ఉంచు.” 15 అని అన్నాము.

22:27 – وَأَذِّن فِي النَّاسِ بِالْحَجِّ يَأْتُوكَ رِجَالًا وَعَلَىٰ كُلِّ ضَامِرٍ يَأْتِينَ مِن كُلِّ فَجٍّ عَمِيقٍ ٢٧

మరియు ప్రజలకు ‘హజ్జ్‌ యాత్రను గురించి ప్రకటించు: 16 వారు పాదాచారులుగా మరియు ప్రతి బలహీనమైన ఒంటె (సవారీ) మీద, విశాల (దూర) ప్రాంతాల నుండి మరియు కనుమల నుండి నీ వైపుకు వస్తారు.

22:28 – لِّيَشْهَدُوا مَنَافِعَ لَهُمْ وَيَذْكُرُوا اسْمَ اللَّـهِ فِي أَيَّامٍ مَّعْلُومَاتٍ عَلَىٰ مَا رَزَقَهُم مِّن بَهِيمَةِ الْأَنْعَامِ ۖ فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْبَائِسَ الْفَقِيرَ ٢٨

వారు, తమ కొరకు ఇక్కడ ఉన్న ప్రయోజనాలను అనుభవించటానికి మరియు ఆయన వారికి జీవనోపాధిగా ప్రసాదించిన పశువుల మీద, నిర్ణీత దినాలలో అల్లాహ్‌ పేరును స్మరించి (జి”బ్హ్ చేయటానికి). కావున దానిని (వాటి మాంసాన్ని) తినండి మరియు లేమికి గురి అయిన నిరుపేదలకు తినిపించండి. 17

22:29 – ثُمَّ لْيَقْضُوا تَفَثَهُمْ وَلْيُوفُوا نُذُورَهُمْ وَلْيَطَّوَّفُوا بِالْبَيْتِ الْعَتِيقِ ٢٩

తరువాత వారు ‘హజ్జ్‌ ఆచారాలు 18 (తఫస్‌’) మరియు మొక్కుబడులు (నుజు’ర్‌) పూర్తిచేసుకొనిన పిదప ఆ ప్రాచీన గృహం (క’అబహ్) యొక్క ప్రదక్షిణ చేయాలి. 19

22:30 – ذَٰلِكَ وَمَن يُعَظِّمْ حُرُمَاتِ اللَّـهِ فَهُوَ خَيْرٌ لَّهُ عِندَ رَبِّهِ ۗ وَأُحِلَّتْ لَكُمُ الْأَنْعَامُ إِلَّا مَا يُتْلَىٰ عَلَيْكُمْ ۖ فَاجْتَنِبُوا الرِّجْسَ مِنَ الْأَوْثَانِ وَاجْتَنِبُوا قَوْلَ الزُّورِ ٣٠

ఇదే (‘హజ్జ్‌)! మరియు ఎవడైతే అల్లాహ్‌ విధించిన నిషేధాలను (పవిత్ర నియమాలను) ఆదరిస్తాడో, అది అతని కొరకు, అతని ప్రభువువద్ద ఎంతో మేలైనది. మరియు మీ కొరకు ఇది వరకు మీకు (నిషిధ్ధమని) చెప్పబడినవి తప్ప, 20 ఇతర పశువులన్నీ ధర్మసమ్మతం చేయబడ్డాయి. ఇక మీరు విగ్రహారాధన వంటి మాలిన్యం నుండి దూరంగా ఉండండి మరియు అబద్దపు (బూటకపు) మాటల నుండి కూడా దూరంగా ఉండండి.

22:31 – حُنَفَاءَ لِلَّـهِ غَيْرَ مُشْرِكِينَ بِهِ ۚ وَمَن يُشْرِكْ بِاللَّـهِ فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ فَتَخْطَفُهُ الطَّيْرُ أَوْ تَهْوِي بِهِ الرِّيحُ فِي مَكَانٍ سَحِيقٍ ٣١

ఏకాగ్ర చిత్తంతో (ఏకదైవ సిద్ధాంతంతో) 21 అల్లాహ్‌ వైపునకే మరలండి, ఆయనకు సాటి (భాగ స్వాములను) కల్పించకండి. అల్లాహ్‌కు సాటి కల్పించిన వాని గతి ఆకాశం నుండి క్రింద పడిపోయే దాని వంటిదే! దానిని పక్షులైనా ఎత్తుకొని పోవచ్చు, లేదా గాలి అయినా దూర ప్రదేశాలకు ఎగుర గొట్టుకు పోవచ్చు!

22:32 – ذَٰلِكَ وَمَن يُعَظِّمْ شَعَائِرَ اللَّـهِ فَإِنَّهَا مِن تَقْوَى الْقُلُوبِ ٣٢

ఇదే! మరియు ఎవడైతే, అల్లాహ్‌ నియమించిన చిహ్నాలను 22 గౌరవిస్తాడో, అది నిశ్చయంగా, హృదయాలలో ఉన్న దైవభీతి వల్లనే!

22:33 – لَكُمْ فِيهَا مَنَافِعُ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ثُمَّ مَحِلُّهَا إِلَى الْبَيْتِ الْعَتِيقِ ٣٣

ఒక నిర్ణీత కాలం వరకు మీకు వాటిలో (ఈ పశువులలో) లాభాలున్నాయి. 23 ఆ తరువాత వాటి గమ్యస్థానం ప్రాచీన గృహమే (క’అబహ్యే)!

22:34 – وَلِكُلِّ أُمَّةٍ جَعَلْنَا مَنسَكًا لِّيَذْكُرُوا اسْمَ اللَّـهِ عَلَىٰ مَا رَزَقَهُم مِّن بَهِيمَةِ الْأَنْعَامِ ۗ فَإِلَـٰهُكُمْ إِلَـٰهٌ وَاحِدٌ فَلَهُ أَسْلِمُوا ۗ وَبَشِّرِ الْمُخْبِتِينَ ٣٤

మరియు ప్రతి సమాజానికి మేము ధర్మ ఆచారాలు (ఖుర్బానీ పద్దతి) 24 నిర్ణయించి ఉన్నాము. మేము వారి జీవనోపాధి కొరకు ప్రసాదించిన పశువులను, వారు (వధించేటప్పుడు) అల్లాహ్‌ పేరును ఉచ్చరించాలి. ఎందుకంటే మీరందరి ఆరాధ్య దైవం ఆ ఏకైక దేవుడు (అల్లాహ్‌)! కావున మీరు ఆయనకు మాత్రమే విధేయులై (ముస్లింలై) ఉండండి. మరియు వినయ విధేయతలు గలవారికి శుభవార్త నివ్వు.

22:35 – الَّذِينَ إِذَا ذُكِرَ اللَّـهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَالصَّابِرِينَ عَلَىٰ مَا أَصَابَهُمْ وَالْمُقِيمِي الصَّلَاةِ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ ٣٥

(వారికి) ఎవరి హృదయాలైతే, అల్లాహ్‌ పేరు ఉచ్చరించబడినప్పుడు భయంతో వణికిపోతాయో మరియు ఆపదలలో సహనం వహిస్తారో మరియు నమా’జ్‌ స్థాపిస్తారో మరియు వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఇతరులపై ఖర్చు చేస్తారో!

22:36 – وَالْبُدْنَ جَعَلْنَاهَا لَكُم مِّن شَعَائِرِ اللَّـهِ لَكُمْ فِيهَا خَيْرٌ ۖ فَاذْكُرُوا اسْمَ اللَّـهِ عَلَيْهَا صَوَافَّ ۖ فَإِذَا وَجَبَتْ جُنُوبُهَا فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْقَانِعَ وَالْمُعْتَرَّ ۚ كَذَٰلِكَ سَخَّرْنَاهَا لَكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ ٣٦

ఖుర్బానీ పశువులను, 25 మేము మీ కొరకు అల్లాహ్‌ చిహ్నాలుగా చేశాము; మీకు వాటిలో మేలున్నది. కావున వాటిని (ఖుర్బానీ కొరకు) నిలబెట్టి వాటిపై అల్లాహ్‌ పేరును ఉచ్చ రించండి. అవి (ప్రాణం విడిచి) ప్రక్కలమీద పడి పోయిన తరువాత మీరు వాటిని తినండి.మరియు యాచించని పేదలకు మరియు యాచించే పేదలకు కూడా తినిపించండి. ఈ విధంగా మేము వాటిని మీకు ఉపయుక్తంగా చేశాము, బహుశా మీరు కృతజ్ఞులవుతారేమోనని. 26

22:37 – لَن يَنَالَ اللَّـهَ لُحُومُهَا وَلَا دِمَاؤُهَا وَلَـٰكِن يَنَالُهُ التَّقْوَىٰ مِنكُمْ ۚ كَذَٰلِكَ سَخَّرَهَا لَكُمْ لِتُكَبِّرُوا اللَّـهَ عَلَىٰ مَا هَدَاكُمْ ۗ وَبَشِّرِ الْمُحْسِنِينَ ٣٧

వాటి మాంసం గానీ, వాటి రక్తం గానీ అల్లాహ్‌కు చేరవు! కానీ మీ భయభక్తులే ఆయనకు చేరుతాయి. మీకు సన్మార్గం చూపి నందుకు, మీరు అల్లాహ్‌ ఘనతను కొనియాడ టానికి, ఈ విధంగా ఆయన వాటిని మీకు వశపరి చాడు. సజ్జనులకు శుభవార్తను వినిపించు! (3/4)

22:38 – إِنَّ اللَّـهَ يُدَافِعُ عَنِ الَّذِينَ آمَنُوا ۗ إِنَّ اللَّـهَ لَا يُحِبُّ كُلَّ خَوَّانٍ كَفُورٍ ٣٨

  • నిశ్చయంగా, అల్లాహ్‌ విశ్వసించిన వారిని కాపాడుతాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ ఏ విశ్వాస ఘాతకుణ్ణి మరియు కృతఘ్నుణ్ణి ప్రేమించడు.

22:39 – أُذِنَ لِلَّذِينَ يُقَاتَلُونَ بِأَنَّهُمْ ظُلِمُوا ۚ وَإِنَّ اللَّـهَ عَلَىٰ نَصْرِهِمْ لَقَدِيرٌ ٣٩

తమపై దాడిచేసిన వారితో యుధ్ధం చేయటానికి అనుమతి ఇవ్వబడుతోంది. 27 ఎందు కంటే వారు అన్యాయానికి గురిచేయబడ్డారు. నిశ్చయంగా, అల్లాహ్‌ వారికి సహాయం చేయగల సమర్థుడు.

22:40 – الَّذِينَ أُخْرِجُوا مِن دِيَارِهِم بِغَيْرِ حَقٍّ إِلَّا أَن يَقُولُوا رَبُّنَا اللَّـهُ ۗ وَلَوْلَا دَفْعُ اللَّـهِ النَّاسَ بَعْضَهُم بِبَعْضٍ لَّهُدِّمَتْ صَوَامِعُ وَبِيَعٌ وَصَلَوَاتٌ وَمَسَاجِدُ يُذْكَرُ فِيهَا اسْمُ اللَّـهِ كَثِيرًا ۗ وَلَيَنصُرَنَّ اللَّـهُ مَن يَنصُرُهُ ۗ إِنَّ اللَّـهَ لَقَوِيٌّ عَزِيزٌ ٤٠

వారికి ఎవరైతే కేవలం: “మా ప్రభువు అల్లాహ్‌!” అని అన్నందుకు మాత్రమే, అన్యాయంగా తమ ఇండ్ల నుండి తరిమివేయ బడ్డారో! ఒకవేళ అల్లాహ్‌ ప్రజలను ఒకరి ద్వారా మరొకరిని తొలగిస్తూ ఉండకపోతే 28 క్రైస్తవ సన్యాసుల మఠాలు, చర్చులు, యూదుల ప్రార్థనాలయాలు 29 మరియు మస్జిదులు, ఎక్కడైతే అల్లాహ్‌ పేరు అత్యధికంగా స్మరించబడు తుందో, అన్నీ ధ్వంసం చేయబడి ఉండేవి. 30 నిశ్చయంగా తనకు తాను సహాయం చేసుకునే వానికి అల్లాహ్‌ తప్పకుండా సహాయం చేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ మహా బలవంతుడు, సర్వ శక్తిమంతుడు.

22:41 – الَّذِينَ إِن مَّكَّنَّاهُمْ فِي الْأَرْضِ أَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ وَأَمَرُوا بِالْمَعْرُوفِ وَنَهَوْا عَنِ الْمُنكَرِ ۗ وَلِلَّـهِ عَاقِبَةُ الْأُمُورِ ٤١

వారే! ఒకవేళ మేము వారికి భూమిపై అధికారాన్ని ప్రసాదిస్తే, వారు నమా’జ్‌ స్థాపిస్తారు, విధిదానం (‘జకాత్‌) ఇస్తారు మరియు ధర్మమును (మంచిని) ఆదేశిస్తారు మరియు అధర్మము (చెడు) నుండి నిషేధిస్తారు. 31 సకల వ్యవహారాల అంతిమ నిర్ణయం అల్లాహ్‌ చేతిలోనే వుంది.

22:42 – وَإِن يُكَذِّبُوكَ فَقَدْ كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَعَادٌ وَثَمُودُ ٤٢

మరియు (ఓ ము’హమ్మద్‌!) వారు (సత్య- తిరస్కారులు) ఒకవేళ నిన్ను అసత్యవాదుడవని తిరస్కరిస్తే (ఆశ్చర్యపడకు); వాస్తవానికి, వారికి పూర్వం నూ’హ్‌, ‘ఆద్‌ మరియు స’మూద్‌ జాతుల వారు కూడా (తమ ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు;

22:43 – وَقَوْمُ إِبْرَاهِيمَ وَقَوْمُ لُوطٍ ٤٣

మరియు ఇబ్రాహీమ్‌ జాతివారు మరియు లూ’త్‌ జాతి వారు;

22:44 – وَأَصْحَابُ مَدْيَنَ ۖ وَكُذِّبَ مُوسَىٰ فَأَمْلَيْتُ لِلْكَافِرِينَ ثُمَّ أَخَذْتُهُمْ ۖ فَكَيْفَ كَانَ نَكِيرِ ٤٤

మరియు మద్‌యన్‌ వాసులు కూడాను! అంతేకాదు మూసా కూడా అసత్యవాదుడవని తిరస్కరించబడ్డాడు. కావున నేను సత్య- తిరస్కారులకు (మొదట) కొంత వ్యవధినిచ్చి, తరువాత పట్టుకుంటాను. (చూశారా!) నన్ను తిరస్కరించడం వారి కొరకు ఎంత ఘోరమైనదిగా ఉండెనో!

22:45 – فَكَأَيِّن مِّن قَرْيَةٍ أَهْلَكْنَاهَا وَهِيَ ظَالِمَةٌ فَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا وَبِئْرٍ مُّعَطَّلَةٍ وَقَصْرٍ مَّشِيدٍ ٤٥

(ఈ విధంగా), మేము ఎన్నో పురాలను నాశనంచేశాము. ఎందుకంటే, వాటి (ప్రజలు) దుర్మార్గులై ఉండిరి. (ఈ నాడు) అవి నాశనమై, తమ కప్పులమీద తలక్రిందులై పడిఉన్నాయి, వారి బావులు మరియు వారి దృఢమైన కోటలు గూడా పాడుపడి ఉన్నాయి!

22:46 – أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَتَكُونَ لَهُمْ قُلُوبٌ يَعْقِلُونَ بِهَا أَوْ آذَانٌ يَسْمَعُونَ بِهَا ۖ فَإِنَّهَا لَا تَعْمَى الْأَبْصَارُ وَلَـٰكِن تَعْمَى الْقُلُوبُ الَّتِي فِي الصُّدُورِ ٤٦

ఏమీ? వారు భూమిలో ప్రయాణం చేయరా? దానిని, వారి హృదయాలు (మనస్సులు) అర్థం చేసుకో గలగటానికి మరియు వారి చెవులు దానిని వినటానికి? వాస్తవమేమిటంటే వారి కన్నులైతే గ్రుడ్డివికావు, కాని ఎదలలో ఉన్న హృదయాలే గ్రుడ్డివయిపోయాయి.

22:47 – وَيَسْتَعْجِلُونَكَ بِالْعَذَابِ وَلَن يُخْلِفَ اللَّـهُ وَعْدَهُ ۚ وَإِنَّ يَوْمًا عِندَ رَبِّكَ كَأَلْفِ سَنَةٍ مِّمَّا تَعُدُّونَ ٤٧

మరియు (ఓ ము’హమ్మద్‌!) వారు నిన్ను శిక్ష కొరకు తొందరపెడుతున్నారు. 32 కాని, అల్లాహ్‌ తన వాగ్దానాన్ని భంగపరచడు. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్ద ఒక్క దినం మీ లెక్కల ప్రకారం వేయి సంవత్సరాలకు సమానమైనది. 33

22:48 – وَكَأَيِّن مِّن قَرْيَةٍ أَمْلَيْتُ لَهَا وَهِيَ ظَالِمَةٌ ثُمَّ أَخَذْتُهَا وَإِلَيَّ الْمَصِيرُ ٤٨

మరియు దుర్మార్గంలో మునిగి ఉన్న ఎన్నో నగరాలకు నేను వ్యవధినిచ్చాను! తరువాత వాటిని (శిక్షించటానికి) పట్టుకున్నాను. (వారి) గమ్యస్థానం నా వైపునకే కదా!”

22:49 – قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنَّمَا أَنَا لَكُمْ نَذِيرٌ مُّبِينٌ ٤٩

(ఓ ము’హమ్మద్‌!) వారితో అను: “ఓ మానవులారా! నేను కేవలం మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే!”

22:50 – فَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ ٥٠

కావున ఎవరైతే, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారికి క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి ఉంటాయి. 34

22:51 – وَالَّذِينَ سَعَوْا فِي آيَاتِنَا مُعَاجِزِينَ أُولَـٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ ٥١

కాని ఎవరైతే మా సూచనలను కించపరచటానికి ప్రయత్నిస్తారో అలాంటి వారు తప్పక భగభగమండే నరకాగ్ని వాసులవుతారు.

22:52 – وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ وَلَا نَبِيٍّ إِلَّا إِذَا تَمَنَّىٰ أَلْقَى الشَّيْطَانُ فِي أُمْنِيَّتِهِ فَيَنسَخُ اللَّـهُ مَا يُلْقِي الشَّيْطَانُ ثُمَّ يُحْكِمُ اللَّـهُ آيَاتِهِ ۗ وَاللَّـهُ عَلِيمٌ حَكِيمٌ ٥٢

  1. మరియు (ఓ ప్రవక్తా!) నీకు పూర్వం మేము పంపిన ఏ సందేశహరుడు గానీ, లేదా ప్రవక్త గానీ, (నా సందేశాన్ని ప్రజలకు) అందించగోరినపుడు, షై’తాన్‌ అతని కోరికలను ఆటంకపరచకుండా ఉండలేదు. 35 కాని షై’తాన్‌ కల్పించిన ఆటంకాలను అల్లాహ్‌ నిర్మూలించాడు. ఆ తరువాత అల్లాహ్‌ తన ఆయతులను స్థిరపరచాడు. 36 మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహావివేచనాపరుడు;

22:53 – لِّيَجْعَلَ مَا يُلْقِي الشَّيْطَانُ فِتْنَةً لِّلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ وَالْقَاسِيَةِ قُلُوبُهُمْ ۗ وَإِنَّ الظَّالِمِينَ لَفِي شِقَاقٍ بَعِيدٍ ٥٣

ఎవరి హృదయాలలో రోగముందో! 37 మరియు ఎవరి హృదయాలు కఠినమైనవో, వారికి షై’తాన్‌ కల్పించేవి (సందేహాలు) ఒక పరీక్షగా చేయబడటానికి. మరియు నిశ్చయంగా, ఈ దుర్మార్గులు విరోధంలో చాలా దూరం వెళ్ళి పోయారు.

22:54 – وَلِيَعْلَمَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ أَنَّهُ الْحَقُّ مِن رَّبِّكَ فَيُؤْمِنُوا بِهِ فَتُخْبِتَ لَهُ قُلُوبُهُمْ ۗ وَإِنَّ اللَّـهَ لَهَادِ الَّذِينَ آمَنُوا إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ٥٤

మరియు జ్ఞానమొసంగబడినవారు ఇది (ఈ ఖుర్‌ఆన్‌) నీ ప్రభువు తరఫునుండి వచ్చిన సత్య మని తెలుసుకొని దానిని విశ్వసించటానికి, వారి హృదయాలు దానికి అంకితంఅవటానికి. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ విశ్వసించే వారికి ఋజు మార్గంవైపునకు మార్గదర్శకత్వం 38 చేస్తాడు.

22:55 – وَلَا يَزَالُ الَّذِينَ كَفَرُوا فِي مِرْيَةٍ مِّنْهُ حَتَّىٰ تَأْتِيَهُمُ السَّاعَةُ بَغْتَةً أَوْ يَأْتِيَهُمْ عَذَابُ يَوْمٍ عَقِيمٍ ٥٥

మరియు సత్య-తిరస్కారులు దీనిని (ఈ ఖుర్‌ఆన్‌) గురించి – అకస్మాత్తుగా అంతిమ ఘడియ వచ్చేవరకు లేదా ఆ ఏకైక దినపు శిక్ష అవతరించే వరకు – సందేహంలో పడిఉంటారు. 39

22:56 – الْمُلْكُ يَوْمَئِذٍ لِّلَّـهِ يَحْكُمُ بَيْنَهُمْ ۚ فَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فِي جَنَّاتِ النَّعِيمِ ٥٦

ఆ రోజు సర్వాధిపత్యం అల్లాహ్‌దే. ఆయన వారిమధ్య తీర్పుచేస్తాడు. కావున విశ్వసించి సత్కార్యాలు చేసేవారు పరమానంద కరమైన స్వర్గవనాలలో ఉంటారు.

22:57 – وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا فَأُولَـٰئِكَ لَهُمْ عَذَابٌ مُّهِينٌ ٥٧

కాని, ఎవరైతే సత్యతిరస్కారులై, మా సూచనలను అబద్ధాలని తిరస్కరించారో, వారికి అవమానకరమైన శిక్ష ఉంటుంది.

22:58 – وَالَّذِينَ هَاجَرُوا فِي سَبِيلِ اللَّـهِ ثُمَّ قُتِلُوا أَوْ مَاتُوا لَيَرْزُقَنَّهُمُ اللَّـهُ رِزْقًا حَسَنًا ۚ وَإِنَّ اللَّـهَ لَهُوَ خَيْرُ الرَّازِقِينَ ٥٨

ఎవరు అల్లాహ్‌ మార్గంలో తమ ఇండ్లను వదలి (వలస) పోయి, ఆ తరువాత చంపబడతారో లేదా మరణిస్తారో, వారికి అల్లాహ్‌ (పరలోకంలో) శ్రేష్ఠమైన ఉపాధిని ప్రసాదిస్తాడు. 41 నిశ్చయంగా, అల్లాహ్‌ మాత్రమే ఉత్తమ ఉపాధిప్రదాత.

22:59 – لَيُدْخِلَنَّهُم مُّدْخَلًا يَرْضَوْنَهُ ۗ وَإِنَّ اللَّـهَ لَعَلِيمٌ حَلِيمٌ ٥٩

ఆయన వారిని వారు తృప్తిపడే స్థలంలో ప్రవేశింపజేస్తాడు. 42 మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, సహనశీలుడు. (7/8)

22:60 – ذَٰلِكَ وَمَنْ عَاقَبَ بِمِثْلِ مَا عُوقِبَ بِهِ ثُمَّ بُغِيَ عَلَيْهِ لَيَنصُرَنَّهُ اللَّـهُ ۗ إِنَّ اللَّـهَ لَعَفُوٌّ غَفُورٌ ٦٠

  • ఇదే (వారి పరిణామం!) 43 ఇక ఎవడైతే తనకు కలిగిన బాధకు సమానంగా మాత్రమే ప్రతీకారం తీసుకున్న 44 తరువాత, అతనిపై మరల దౌర్జన్యం జరిగితే! నిశ్చయంగా, అల్లాహ్‌ అతనికి సహాయం చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ 45

22:61 – ذَٰلِكَ بِأَنَّ اللَّـهَ يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَأَنَّ اللَّـهَ سَمِيعٌ بَصِيرٌ ٦١

ఇలాగే జరుగుతుంది! నిశ్చయంగా, అల్లాహ్‌యే రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేసేవాడు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింపజేసేవాడు మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వం వినేవాడు అంతా చూసేవాడు. 46

22:62 – ذَٰلِكَ بِأَنَّ اللَّـهَ هُوَ الْحَقُّ وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ هُوَ الْبَاطِلُ وَأَنَّ اللَّـهَ هُوَ الْعَلِيُّ الْكَبِيرُ ٦٢

ఇది ఎందుకంటే, నిశ్చయంగా అల్లాహ్‌! ఆయనే సత్యం! 47 మరియు ఆయనకు బదులుగా వారు ఆరాధించేవన్నీ అసత్యాలే! మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ ఆయన మాత్రమే మహోన్నతుడు, మహానీయుడు (గొప్పవాడు).

22:63 – أَلَمْ تَرَ أَنَّ اللَّـهَ أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَتُصْبِحُ الْأَرْضُ مُخْضَرَّةً ۗ إِنَّ اللَّـهَ لَطِيفٌ خَبِيرٌ ٦٣

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్‌యే ఆకాశం నుండి వర్షం కురిపించి, దానితో భూమిని పచ్చగా చేస్తాడని? నిశ్చయంగా, అల్లాహ్‌ సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు.

22:64 – لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَإِنَّ اللَّـهَ لَهُوَ الْغَنِيُّ الْحَمِيدُ ٦٤

ఆకాశాలలో ఉన్నది మరియు భూమిలో ఉన్నది అంతా ఆయనకు చెందినదే. మరియు నిశ్చయంగా అల్లాహ్‌! ఆయన మాత్రమే స్వయం సమృద్ధుడు, ప్రశంసనీయుడు.

22:65 – أَلَمْ تَرَ أَنَّ اللَّـهَ سَخَّرَ لَكُم مَّا فِي الْأَرْضِ وَالْفُلْكَ تَجْرِي فِي الْبَحْرِ بِأَمْرِهِ وَيُمْسِكُ السَّمَاءَ أَن تَقَعَ عَلَى الْأَرْضِ إِلَّا بِإِذْنِهِ ۗ إِنَّ اللَّـهَ بِالنَّاسِ لَرَءُوفٌ رَّحِيمٌ ٦٥

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్‌ భూమిలో ఉన్న సమస్తాన్ని మీకు వశపరచాడు. మరియు సముద్రంలో పడవ ఆయన అనుమతితోనే నడుస్తుంది మరియు ఆయనే! తాను అనుమతించే వరకు ఆకాశాన్ని భూమిమీద పడకుండా నిలిపి ఉంచాడు. 48 నిశ్చయంగా, అల్లాహ్‌ మానవుల పట్ల ఎంతో కనికరుడు, అపార కరుణాప్రదాత.

22:66 – وَهُوَ الَّذِي أَحْيَاكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ۗ إِنَّ الْإِنسَانَ لَكَفُورٌ ٦٦

మరియు ఆయనే మీకు జీవితాన్ని ప్రసాదించాడు, తరువాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత ఆయనే మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాడు. నిశ్చయంగా, మానవుడు ఎంతో కృతఘ్నుడు!

22:67 – لِّكُلِّ أُمَّةٍ جَعَلْنَا مَنسَكًا هُمْ نَاسِكُوهُ ۖ فَلَا يُنَازِعُنَّكَ فِي الْأَمْرِ ۚ وَادْعُ إِلَىٰ رَبِّكَ ۖ إِنَّكَ لَعَلَىٰ هُدًى مُّسْتَقِيمٍ ٦٧

మేము ప్రతి సమాజంవారికి ఒక ఆరాధనా రీతిని నియమించాము. 49 వారు దానినే అనుసరిస్తారు. కావున వారిని ఈ విషయంలో నీతో వాదులాడనివ్వకు. మరియు వారిని నీ ప్రభువు వైపుకు ఆహ్వానించు. నిశ్చయంగా, నీవు సరైన మార్గదర్శకత్వంలో ఉన్నావు.

22:68 – وَإِن جَادَلُوكَ فَقُلِ اللَّـهُ أَعْلَمُ بِمَا تَعْمَلُونَ ٦٨

ఒకవేళ వారు నీతో వాదులాటకు దిగితే, వారితో అను: “మీరు చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు. 50

22:69 – اللَّـهُ يَحْكُمُ بَيْنَكُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ ٦٩

“అల్లాహ్‌ పునరుత్థాన దినమున, మీరు పరస్పరం కలిగి ఉన్న అభిప్రాయభేదాలను గురించి తీర్పుచేస్తాడు.”

22:70 – أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّـهَ يَعْلَمُ مَا فِي السَّمَاءِ وَالْأَرْضِ ۗ إِنَّ ذَٰلِكَ فِي كِتَابٍ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّـهِ يَسِيرٌ ٧٠

ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్‌కు బాగా తెలుసని! నిశ్చయంగా, ఇదంతా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది. నిశ్చయంగా, ఇదంతా అల్లాహ్‌కు చాలా సులభమైనది 51

22:71 – وَيَعْبُدُونَ مِن دُونِ اللَّـهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ سُلْطَانًا وَمَا لَيْسَ لَهُم بِهِ عِلْمٌ ۗ وَمَا لِلظَّالِمِينَ مِن نَّصِيرٍ ٧١

మరియు వారు అల్లాహ్‌ను వదలి ఇతరులను ఆరాధిస్తున్నారు. దాని కొరకు ఆయన ఎలాంటి నిదర్శనాన్ని అవతరింపజేయ లేదు మరియు వారికి (సత్య-తిరస్కారులకు) దానిని గురించి ఎలాంటి జ్ఞానంలేదు. మరియు దుర్మార్గులకు సహాయపడే వాడు ఎవ్వడూ ఉండడు. 52

22:72 – وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ تَعْرِفُ فِي وُجُوهِ الَّذِينَ كَفَرُوا الْمُنكَرَ ۖ يَكَادُونَ يَسْطُونَ بِالَّذِينَ يَتْلُونَ عَلَيْهِمْ آيَاتِنَا ۗ قُلْ أَفَأُنَبِّئُكُم بِشَرٍّ مِّن ذَٰلِكُمُ ۗ النَّارُ وَعَدَهَا اللَّـهُ الَّذِينَ كَفَرُوا ۖ وَبِئْسَ الْمَصِيرُ ٧٢

మరియు మా స్పష్టమైన సూచనలు వారికి వినిపించబడినప్పుడు, సత్య-తిరస్కారుల ముఖాల మీద తిరస్కారాన్ని నీవు గమనిస్తావు. ఇంకా వారు మా సూచనలను వినిపించేవారిపై దాదాపు విరుచుకు పడబోయే వారు. వారితో అను: “ఏమీ? నేను దీనికంటే ఘోరమైన విషయాన్ని గురించి మీకు తెలుపనా? అది నరకాగ్ని! అల్లాహ్‌ దానిని సత్య-తిరస్కారులకు వాగ్దానం చేసి ఉన్నాడు. మరియు అది ఎంత అధ్వాన్నమైన గమ్యస్థానం.”

22:73 – يَا أَيُّهَا النَّاسُ ضُرِبَ مَثَلٌ فَاسْتَمِعُوا لَهُ ۚ إِنَّ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّـهِ لَن يَخْلُقُوا ذُبَابًا وَلَوِ اجْتَمَعُوا لَهُ ۖ وَإِن يَسْلُبْهُمُ الذُّبَابُ شَيْئًا لَّا يَسْتَنقِذُوهُ مِنْهُ ۚ ضَعُفَ الطَّالِبُ وَالْمَطْلُوبُ ٧٣

ఓ మానవులారా! ఒక ఉదాహరణ ఇవ్వ బడుతోంది, దానిని శ్రధ్ధగావినండి! నిశ్చయంగా, మీరు అల్లాహ్‌ను వదలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారంతా కలిసి ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. మరియు ఒకవేళ, ఆ ఈగ వారి నుండి ఏమైనా లాక్కొనిపోయినా, వారు దానిని, దాని (ఆ ఈగ) నుండి విడిపించుకోనూలేరు. 53 ఎంత బలహీనులు, ఈ అర్థించే వారు మరియు అర్థించబడే వారు.

22:74 – مَا قَدَرُوا اللَّـهَ حَقَّ قَدْرِهِ ۗ إِنَّ اللَّـهَ لَقَوِيٌّ عَزِيزٌ ٧٤

అల్లాహ్‌ ఘనతను వారు గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. వాస్తవానికి, అల్లాహ్‌ మహా బలవంతుడు, సర్వ శక్తిమంతుడు.

22:75 – اللَّـهُ يَصْطَفِي مِنَ الْمَلَائِكَةِ رُسُلًا وَمِنَ النَّاسِ ۚ إِنَّ اللَّـهَ سَمِيعٌ بَصِيرٌ ٧٥

అల్లాహ్‌ దేవదూతల నుండి మరియు మానవుల నుండి తన సందేశహరులను ఎన్ను కుంటాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వం వినేవాడు, అంతా చూసేవాడు.

22:76 – يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۗ وَإِلَى اللَّـهِ تُرْجَعُ الْأُمُورُ ٧٦

ఆయనకు, వారికి ప్రత్యక్షంగా ఉన్నది మరియు వారికి పరోక్షంగా ఉన్నది అంతా తెలుసు. మరియు అన్ని వ్యవహారాలు (పరిష్కారానికి) అల్లాహ్ వైపునకే మరలింపబడతాయి.

22:77 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا ارْكَعُوا وَاسْجُدُوا وَاعْبُدُوا رَبَّكُمْ وَافْعَلُوا الْخَيْرَ لَعَلَّكُمْ تُفْلِحُونَ ۩ ٧٧

ఓ విశ్వాసులారా! (మీ ప్రభువు సన్నిధిలో) వంగండి (రుకూ’ఉ చేయండి), సాష్టాంగం (సజ్దా) చేయండి మరియు మీ ప్రభువునే ఆరాధించండి మరియు మంచిపనులు చేయండి, అప్పుడే మీరు సాఫల్యం పొందుతారు. (సజ్దా)

22:78 – وَجَاهِدُوا فِي اللَّـهِ حَقَّ جِهَادِهِ ۚ هُوَ اجْتَبَاكُمْ وَمَا جَعَلَ عَلَيْكُمْ فِي الدِّينِ مِنْ حَرَجٍ ۚ مِّلَّةَ أَبِيكُمْ إِبْرَاهِيمَ ۚ هُوَ سَمَّاكُمُ الْمُسْلِمِينَ مِن قَبْلُ وَفِي هَـٰذَا لِيَكُونَ الرَّسُولُ شَهِيدًا عَلَيْكُمْ وَتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ ۚ فَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَاعْتَصِمُوا بِاللَّـهِ هُوَ مَوْلَاكُمْ ۖ فَنِعْمَ الْمَوْلَىٰ وَنِعْمَ النَّصِيرُ ٧٨

మరియు అల్లాహ్‌ మార్గంలో పోరాడవలసిన విధంగా ధర్మపోరాటం చేయండి. 54 ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మరియు ఆయన ధర్మ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. ఇది మీ తండ్రి ఇబ్రాహీమ్‌ మతమే. 55 ఆయన మొదటి నుండి మీకు అల్లాహ్‌కు విధేయులు (ముస్లింలు) అని పేరు పెట్టాడు. దీనికై మీ సందేశహరుడు మీకు సాక్షిగా ఉండటానికి మరియు మీరు ప్రజలకు సాక్షులుగా ఉండటానికి. 56 కావున నమా’జ్‌ స్థాపించండి, విధిదానం (‘జకాత్‌) ఇవ్వండి. మరియు అల్లాహ్‌తో గట్టి సంబంధం కలిగి ఉండండి, ఆయనే మీ సంరక్షకుడు. ఎంత శ్రేష్టమైన సంరక్షకుడు మరియు ఎంత ఉత్తమ సహాయకుడు!

సూరహ్‌ అల్‌-ము‘మినూన్‌ – ఈ సూరహ్‌ అంతిమ మక్కహ్ కాలంలో అవతరింపజేయబడిందని చాలామంది వ్యాఖ్యాతల అభిప్రాయం. ఈ సూరహ్‌ సత్యధర్మాన్ని ఏకైక ఆరాధ్యుణ్ణి గురించి వ్యాఖ్యానిస్తుంది. మానవ జాతి ఒకే ఒక సంఘం. (223:92-93). 118 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 23:1 – قَدْ أَفْلَحَ الْمُؤْمِنُونَ ١

వాస్తవానికి విశ్వాసులు సాఫల్యం పొందుతారు;

23:2 – الَّذِينَ هُمْ فِي صَلَاتِهِمْ خَاشِعُونَ ٢

వారే! ఎవరైతే తమ నమా’జ్‌లో వినమ్రతను పాటిస్తారో!

23:3 – وَالَّذِينَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُونَ ٣

మరియు ఎవరైతే వ్యర్థమైన మాటల నుండి దూరంగా ఉంటారో;

23:4 – وَالَّذِينَ هُمْ لِلزَّكَاةِ فَاعِلُونَ ٤

మరియు ఎవరైతే విధిదానం (’జకాత్‌) సక్రమంగా చెల్లిస్తారో!

23:5 – وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ ٥

మరియు ఎవరేతే తమ మర్మాంగాలను కాపాడుకుంటారో –

23:6 – إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ ٦

తమ భార్య (అ’జ్వాజ్‌)లతో లేక తమ అధీనంలో (కుడిచేతిలో) ఉన్న బానిసస్త్రీలతో తప్ప 1 అలాంటప్పుడు వారు నిశ్చయంగా, నిందార్హులు కారు.

23:7 – فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَـٰئِكَ هُمُ الْعَادُونَ ٧

కాని ఎవరైతే దీనిని మించి కోరుతారో! అలాంటి వారే వాస్తవంగా హద్దులను అతిక్రమించినవారు.

23:8 – وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ ٨

మరియు వారు ఎవరైతే తమ పూచీలను (అమానతులను) మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో, 2

23:9 – وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَاتِهِمْ يُحَافِظُونَ ٩

మరియు వారు ఎవరైతే తమ నమా’జ్‌లను కాపాడుకుంటారో!

23:10 – أُولَـٰئِكَ هُمُ الْوَارِثُونَ ١٠

అలాంటి వారే (స్వర్గానికి) వారసులు అవుతారు.

23:11 – الَّذِينَ يَرِثُونَ الْفِرْدَوْسَ هُمْ فِيهَا خَالِدُونَ ١١

వారే ఫిర్‌దౌస్‌ స్వర్గానికి వారసులై, అందులో వారు శాశ్వతంగా ఉంటారు. 3

23:12 – وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ مِن سُلَالَةٍ مِّن طِينٍ ١٢

మరియు వాస్తవంగా, మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము. 4

23:13 – ثُمَّ جَعَلْنَاهُ نُطْفَةً فِي قَرَارٍ مَّكِينٍ ١٣

తరువాత అతనిని ఇంద్రియ బిందువుగా ఒక కోశంలో భద్రంగా ఉంచాము. 5

23:14 – ثُمَّ خَلَقْنَا النُّطْفَةَ عَلَقَةً فَخَلَقْنَا الْعَلَقَةَ مُضْغَةً فَخَلَقْنَا الْمُضْغَةَ عِظَامًا فَكَسَوْنَا الْعِظَامَ لَحْمًا ثُمَّ أَنشَأْنَاهُ خَلْقًا آخَرَ ۚ فَتَبَارَكَ اللَّـهُ أَحْسَنُ الْخَالِقِينَ ١٤

ఆ తరువాత ఆ ఇంద్రియ బిందువును రక్తపుముద్దగా (జలగగా) మార్చాము. ఆ పైన ఆ రక్తపుముద్దను (జలగను) మాంసపుముద్దగా (జీవాణువుల పిండంగా) మార్చాము, ఆ జీవాణువుల పిండంలో ఎముకలను ఏర్పరచి, ఆ ఎముకలను మాంసంతో కప్పాము. ఆ తరువాత దానిని మరొక (భిన్న) సృష్టిగా చేశాము. కావున శుభకరుడు (శుభప్రదుడు) 6 అయిన అల్లాహ్‌యే అత్యుత్తమ సృష్టికర్త.

23:15 – ثُمَّ إِنَّكُم بَعْدَ ذَٰلِكَ لَمَيِّتُونَ ١٥

ఆ తరువాత మీరు నిశ్చయంగా మరణిస్తారు.

23:16 – ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ تُبْعَثُونَ ١٦

అటు పిమ్మట నిశ్చయంగా, మీరు పునరుత్థాన దినమున మరల లేపబడతారు.

23:17 – وَلَقَدْ خَلَقْنَا فَوْقَكُمْ سَبْعَ طَرَائِقَ وَمَا كُنَّا عَنِ الْخَلْقِ غَافِلِينَ ١٧

మరియు వాస్తవానికి మేము మీపై ఏడు మార్గాలను (ఆకాశాలను) సృష్టించాము. 7 మరియు మేము సృష్టి విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా లేము.

23:18 – وَأَنزَلْنَا مِنَ السَّمَاءِ مَاءً بِقَدَرٍ فَأَسْكَنَّاهُ فِي الْأَرْضِ ۖ وَإِنَّا عَلَىٰ ذَهَابٍ بِهِ لَقَادِرُونَ ١٨

మరియు మేము ఆకాశం నుండి ఒక పరిమా ణంతో వర్షాన్ని (నీటిని) కురిపించాము, పిదప దానిని భూమిలో నిలువజేశాము. మరియు నిశ్చ యంగా, దానిని వెనక్కి తీసుకునే శక్తి మాకుంది.

23:19 – فَأَنشَأْنَا لَكُم بِهِ جَنَّاتٍ مِّن نَّخِيلٍ وَأَعْنَابٍ لَّكُمْ فِيهَا فَوَاكِهُ كَثِيرَةٌ وَمِنْهَا تَأْكُلُونَ ١٩

తరువాత దాని ద్వారా మేము మీకొరకు ఖర్జూరపు తోటలను ద్రాక్షతోటలను ఉత్పత్తి చేశాము; అందులో మీకు ఎన్నో ఫలాలు దొరుకుతాయి. మరియు వాటి నుండి మీరు తింటారు.

23:20 – وَشَجَرَةً تَخْرُجُ مِن طُورِ سَيْنَاءَ تَنبُتُ بِالدُّهْنِ وَصِبْغٍ لِّلْآكِلِينَ ٢٠

మరియు సినాయి కొండప్రాంతంలో ఒక వృక్షం పెరుగుతున్నది, అది నూనె ఇస్తుంది మరియు (దాని ఫలం) తినేవారికి రుచికరమైన (కూరగా) ఉపయోగపడుతుంది. 8

23:21 – وَإِنَّ لَكُمْ فِي الْأَنْعَامِ لَعِبْرَةً ۖ نُّسْقِيكُم مِّمَّا فِي بُطُونِهَا وَلَكُمْ فِيهَا مَنَافِعُ كَثِيرَةٌ وَمِنْهَا تَأْكُلُونَ ٢١

మరియు నిశ్చయంగా, మీ పశువులలో మీకు ఒక గుణపాఠముంది. మేము వాటి కడుపులలో ఉన్నది (పాలు) మీకు త్రాపుతున్నాము. మరియు వాటిలో మీకు ఇంకా ఎన్నో ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటి (మాంసం) మీరు తింటారు.

23:22 – وَعَلَيْهَا وَعَلَى الْفُلْكِ تُحْمَلُونَ ٢٢

మరియు వాటి మీద మరియు ఓడల మీద మీరు సవారి చేస్తారు.

23:23 – وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ فَقَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّـهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُ ۖ أَفَلَا تَتَّقُونَ ٢٣

మరియు వాస్తవానికి మేము నూ’హ్‌ను తన జాతి ప్రజల వద్దకు పంపాము. అతను వారితో అన్నాడు: “నా జాతి ప్రజలారా! అల్లాహ్‌నే ఆరాధించండి మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! ఏమీ మీరు ఆయనయందు భయ- భక్తులు కలిగి ఉండరా?”

23:24 – فَقَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِن قَوْمِهِ مَا هَـٰذَا إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ يُرِيدُ أَن يَتَفَضَّلَ عَلَيْكُمْ وَلَوْ شَاءَ اللَّـهُ لَأَنزَلَ مَلَائِكَةً مَّا سَمِعْنَا بِهَـٰذَا فِي آبَائِنَا الْأَوَّلِينَ ٢٤

అతని జాతిలోని సత్య-తిరస్కారులైన నాయకులు ఇలా అన్నారు:“ఇతను మీ వంటి ఒక సాధారణ మానవుడే తప్ప మరేమీకాడు! మీపై ఆధిక్యత పొందగోరుతున్నాడు. మరియు అల్లాహ్‌ తలుచుకుంటే దైవదూతలను పంపి ఉండేవాడు. ఇలాంటి విషయం పూర్వీకులైన మన తాత-ముత్తాతలలో కూడ జరిగినట్లు మేము వినలేదే! 9

23:25 – إِنْ هُوَ إِلَّا رَجُلٌ بِهِ جِنَّةٌ فَتَرَبَّصُوا بِهِ حَتَّىٰ حِينٍ ٢٥

“ఇతడు కేవలం పిచ్చిపట్టిన మనిషి, కావున కొంతకాలం ఇతనిని సహించండి.”

23:26 – قَالَ رَبِّ انصُرْنِي بِمَا كَذَّبُونِ ٢٦

(నూ’హ్‌) అన్నాడు: “ఓ నా ప్రభూ! వీరు నన్ను అసత్యుడవని తిరస్కరిస్తున్నారు. కావున నాకు సహాయం చేయి.” 10

23:27 – فَأَوْحَيْنَا إِلَيْهِ أَنِ اصْنَعِ الْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا فَإِذَا جَاءَ أَمْرُنَا وَفَارَ التَّنُّورُ ۙ فَاسْلُكْ فِيهَا مِن كُلٍّ زَوْجَيْنِ اثْنَيْنِ وَأَهْلَكَ إِلَّا مَن سَبَقَ عَلَيْهِ الْقَوْلُ مِنْهُمْ ۖ وَلَا تُخَاطِبْنِي فِي الَّذِينَ ظَلَمُوا ۖ إِنَّهُم مُّغْرَقُونَ ٢٧

కావున మేము అతనికి ఈ విధంగా దివ్య జ్ఞానం (వ’హీ) పంపాము: “మా పర్యవేక్షణలో, మా దివ్యజ్ఞానం (వ’హీ) ప్రకారం ఒక ఓడను తయారు చెయ్యి. తరువాత మా ఆజ్ఞ వచ్చినపుడు మరియు పొయ్యి నుండి నీరు ఉబికినప్పుడు (పొంగినప్పుడు), 11 ఆ నావలో ప్రతిరకపు జంతు జాతి నుండి ఒక్కొక్క జంటను మరియు నీ పరి వారపు వారిని (కుటుంబసభ్యులను) ఎక్కించుకో ఎవరిని గురించి అయితే ముందుగానే నిర్ణయం జరిగిందో వారు తప్ప! ఇక దుర్మార్గుల కొరకు నాతో మనవిచేయకు. నిశ్చయంగా, వారు ముంచివేయబడతారు.

23:28 – فَإِذَا اسْتَوَيْتَ أَنتَ وَمَن مَّعَكَ عَلَى الْفُلْكِ فَقُلِ الْحَمْدُ لِلَّـهِ الَّذِي نَجَّانَا مِنَ الْقَوْمِ الظَّالِمِينَ ٢٨

“ఆ తరువాత నీవు మరియు నీతో ఉన్న వారు నావలోకి ఎక్కినపిదప ఇలా ప్రార్థించండి: ‘సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్‌ మాత్రమే, ఆయనే మమ్మల్ని దుర్మార్గుల నుండి విమోచనం కలిగించాడు.’

23:29 – وَقُل رَّبِّ أَنزِلْنِي مُنزَلًا مُّبَارَكًا وَأَنتَ خَيْرُ الْمُنزِلِينَ ٢٩

“ఇంకా ఇలా ప్రార్థించు: ‘ఓ నా ప్రభూ! నన్ను శుభప్రదమైన గమ్యస్థానంలో దించు. గమ్యస్థానానికి చేర్పించే వారిలో నీవే అత్యుత్తముడవు!’ ” 12

23:30 – إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ وَإِن كُنَّا لَمُبْتَلِينَ ٣٠

నిశ్చయంగా, ఇందులో (ఈ గాథలో) సూచనలున్నాయి. మరియు నిశ్చయంగా, మేము (ప్రజలను) పరీక్షకు గురిచేస్తూ ఉంటాము.

23:31 – ثُمَّ أَنشَأْنَا مِن بَعْدِهِمْ قَرْنًا آخَرِينَ ٣١

వారి తరువాత మేము మరొక తరాన్ని పుట్టించాము. 13

23:32 – فَأَرْسَلْنَا فِيهِمْ رَسُولًا مِّنْهُمْ أَنِ اعْبُدُوا اللَّـهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُ ۖ أَفَلَا تَتَّقُونَ ٣٢

మరియు వారి వద్దకు వారి నుండియే, ఒక సందేశహరుణ్ణి పంపినప్పుడు, అతను): “కేవలం అల్లాహ్‌నే ఆరాధించండి. మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. ఏమీ? మీకు దైవభీతి లేదా?” అని అన్నాడు.

23:33 – وَقَالَ الْمَلَأُ مِن قَوْمِهِ الَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِلِقَاءِ الْآخِرَةِ وَأَتْرَفْنَاهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا مَا هَـٰذَا إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ يَأْكُلُ مِمَّا تَأْكُلُونَ مِنْهُ وَيَشْرَبُ مِمَّا تَشْرَبُونَ ٣٣

దానికి, అతని జాతివారిలోని – సత్య- తిరస్కారులైనట్టివారు, పరలోక సమావేశాన్ని అబద్ధమని నిరాకరించేవారు మరియు ఇహలోక జీవితంలో మేము భాగ్యవంతులుగా చేసినట్టి – నాయకులు, ఇలా అన్నారు: “ఇతను మీవంటి సాధారణ మానవుడే తప్ప మరేమీ కాడు, మీరు తినేదే ఇతనూ తింటున్నాడు మరియు మీరు త్రాగేదే ఇతనూ త్రాగుతున్నాడు.

23:34 – وَلَئِنْ أَطَعْتُم بَشَرًا مِّثْلَكُمْ إِنَّكُمْ إِذًا لَّخَاسِرُونَ ٣٤

“మరియు ఒకవేళ మీరు మీ వంటి ఒక సాధారణ మానవుణ్ణి అనుసరించినట్లైతే! నిశ్చయంగా, మీరు నష్టపడిన వారవుతారు.

23:35 – أَيَعِدُكُمْ أَنَّكُمْ إِذَا مِتُّمْ وَكُنتُمْ تُرَابًا وَعِظَامًا أَنَّكُم مُّخْرَجُونَ ٣٥

“ఏమీ? మీరు మరణించి మట్టిగా ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా తిరిగి లేపబడతారని ఇతను మీకు వాగ్గానం చేస్తున్నాడా? (1/8)

23:36 – هَيْهَاتَ هَيْهَاتَ لِمَا تُوعَدُونَ ٣٦

  • “అసంభవం! మీకు చేయబడే ఈ వాగ్దానం నెరవేరటం అసంభవం.

23:37 – إِنْ هِيَ إِلَّا حَيَاتُنَا الدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ ٣٧

“ఇక మన జీవితం ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే! మనం మరణించేది జీవించేదీ ఇక్కడే! మనం ఏ మాత్రమూ తిరిగి సజీవులుగా లేపబడము!

23:38 – إِنْ هُوَ إِلَّا رَجُلٌ افْتَرَىٰ عَلَى اللَّـهِ كَذِبًا وَمَا نَحْنُ لَهُ بِمُؤْمِنِينَ ٣٨

“ఇక ఇతను, ఈ వ్యక్తి అల్లాహ్‌ పేరుతో కేవలం అబద్ధాలు కల్పిస్తున్నాడు మరియు మేము ఇతనిని (ఇతని మాటలను) ఎన్నటికీ విశ్వసించలేము.”

23:39 – قَالَ رَبِّ انصُرْنِي بِمَا كَذَّبُونِ ٣٩

(ఆ ప్రవక్త) అన్నాడు: “ఓ నా ప్రభూ! వీరు చేసే నిందారోపణల నుండి నన్నుకాపాడు.”

23:40 – قَالَ عَمَّا قَلِيلٍ لَّيُصْبِحُنَّ نَادِمِينَ ٤٠

(అల్లాహ్‌) ఇలా సెలవిచ్చాడు: “వీరు కొంత కాలంలోనే పశ్చాత్తాపపడతారు.”

23:41 – فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ بِالْحَقِّ فَجَعَلْنَاهُمْ غُثَاءً ۚ فَبُعْدًا لِّلْقَوْمِ الظَّالِمِينَ ٤١

ఆ తరువాత సత్య (వాగ్దాన) ప్రకారం ఒక భయంకరమైన గర్జన (’సయ్‌’హా) వారిని చుట్టు ముట్టింది. మేము వారిని చెత్తాచెదారంగా మార్చివేశాము. ఇక దుర్మార్గులైన జాతివారు ఈ విధంగానే దూరమైపోతారు (నాశనం చేయబడతారు)!

23:42 – ثُمَّ أَنشَأْنَا مِن بَعْدِهِمْ قُرُونًا آخَرِينَ ٤٢

వారి తరువాత ఇతర తరాల వారిని పుట్టించాము. 14

23:43 – مَا تَسْبِقُ مِنْ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسْتَأْخِرُونَ ٤٣

ఏ సమాజం వారు కూడా తమకు (నియమింపబడిన) గడువుకు ముందుకాలేరు మరియు దానికి వెనుక కాలేరు. 15

23:44 – ثُمَّ أَرْسَلْنَا رُسُلَنَا تَتْرَىٰ ۖ كُلَّ مَا جَاءَ أُمَّةً رَّسُولُهَا كَذَّبُوهُ ۚ فَأَتْبَعْنَا بَعْضَهُم بَعْضًا وَجَعَلْنَاهُمْ أَحَادِيثَ ۚ فَبُعْدًا لِّقَوْمٍ لَّا يُؤْمِنُونَ ٤٤

ఆ తరువాత మేము మా సందేశహరులను ఒకరి తరువాత ఒకరిని పంపుతూ వచ్చాము. ప్రతి సారి ఒక సమాజం వద్దకు దాని సందేశహరుడు వచ్చినప్పుడు, వారు అతనిని అసత్యుడని తిర స్కరించారు. వారిని ఒకరితరువాత ఒకరిని నశింప జేస్తూ వచ్చాము. చివరకు వారిని గాథలుగా చేసి వదిలాము. ఇక విశ్వసించని ప్రజలు ఈ విధంగా దూరమైపోవుగాక (నాశనం చేయబడుగాక)!

23:45 – ثُمَّ أَرْسَلْنَا مُوسَىٰ وَأَخَاهُ هَارُونَ بِآيَاتِنَا وَسُلْطَانٍ مُّبِينٍ ٤٥

ఆ తరువాత మూసా మరియు అతని సోదరుడు హారూన్‌లను మా సూచనలతో మరియు స్పష్టమైన ప్రమాణంతో పంపాము;

23:46 – إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ فَاسْتَكْبَرُوا وَكَانُوا قَوْمًا عَالِينَ ٤٦

ఫిర్‌’ఔన్‌ మరియు అతని నాయకుల వద్దకు. కాని వారు దురహంకారం చూపారు, వారు తమ అహంభావంలో మునిగి ఉండేవారు.

23:47 – فَقَالُوا أَنُؤْمِنُ لِبَشَرَيْنِ مِثْلِنَا وَقَوْمُهُمَا لَنَا عَابِدُونَ ٤٧

అపుడు వారన్నారు: “ఏమీ? మేము మా వంటి ఈ ఇద్దరు మానవులను విశ్వసించాలా? మరియు ఎవరి జాతివారైతే మా బానిసలుగా ఉన్నారో!”

23:48 – فَكَذَّبُوهُمَا فَكَانُوا مِنَ الْمُهْلَكِينَ ٤٨

కావున వారు, ఆ ఇరువురిని అసత్య వాదులని తిరస్కరించి, నాశనం చేయబడిన వారిలో చేరిపోయారు.

23:49 – وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ لَعَلَّهُمْ يَهْتَدُونَ ٤٩

మరియు వాస్తవానికి మేము మూసాకు గ్ర్గంథాన్ని ప్రసాదించాము, బహుశా వారు మార్గ దర్శకత్వం పొందుతారేమోనని!

23:50 – وَجَعَلْنَا ابْنَ مَرْيَمَ وَأُمَّهُ آيَةً وَآوَيْنَاهُمَا إِلَىٰ رَبْوَةٍ ذَاتِ قَرَارٍ وَمَعِينٍ ٥٠

ఇక మర్యమ్‌ కుమారుణ్ణి మరియు అతని తల్లిని మేము (మా అనుగ్రహపు) సూచనగా చేశాము. 16 మరియు వారిద్దరికి ఉన్నతమైన, ప్రశాంతమైననీడ, ప్రవహించే సెలయేళ్ళు మరియు చెలమలు గల స్థానంలో ఆశ్రయమిచ్చాము.

23:51 – يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا ۖ إِنِّي بِمَا تَعْمَلُونَ عَلِيمٌ ٥١

ఓ సందేశహరులారా! పరిశుద్ధమైన వస్తువులనే తినండి మరియు సత్కార్యాలు చేయండి. 17 నిశ్చయంగా, మీరు చేసేదంతా నాకు బాగా తెలుసు.

23:52 – وَإِنَّ هَـٰذِهِ أُمَّتُكُمْ أُمَّةً وَاحِدَةً وَأَنَا رَبُّكُمْ فَاتَّقُونِ ٥٢

మరియు నిశ్చయంగా, మీ ఈ సమాజం ఒకే ఒక్క సమాజం మరియు నేనే మీ ప్రభువును, కావున మీరు నాయందే భయభక్తులు కలిగి ఉండండి. 18

23:53 – فَتَقَطَّعُوا أَمْرَهُم بَيْنَهُمْ زُبُرًا ۖ كُلُّ حِزْبٍ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ ٥٣

కాని వారు, తమ (ధర్మం) విషయంలో పరస్పర భేదాభిప్రాయాలు కల్పించుకొని, విభిన్న తెగలుగాచీలిపోయారు. 19 ప్రతివర్గంవారు తాము అనుసరించే దానితో సంతోషపడుతున్నారు. 20

23:54 – فَذَرْهُمْ فِي غَمْرَتِهِمْ حَتَّىٰ حِينٍ ٥٤

కావున వారిని కొంత కాలం వరకు వారి మూఢత్వంలోనే మునిగి ఉండనివ్వు.

23:55 – أَيَحْسَبُونَ أَنَّمَا نُمِدُّهُم بِهِ مِن مَّالٍ وَبَنِينَ ٥٥

ఏమీ? మేము వారికి సంపదలు మరియు సంతానం సమృద్ధిగా ఇస్తున్నామంటే!

23:56 – نُسَارِعُ لَهُمْ فِي الْخَيْرَاتِ ۚ بَل لَّا يَشْعُرُونَ ٥٦

మేము వారికి మేలుచేయటంలో తొందర పడుతున్నామని, ‘వారు భావిస్తున్నారా?’ 21 అలా కాదు వారు గ్రహించటం లేదు!

23:57 – إِنَّ الَّذِينَ هُم مِّنْ خَشْيَةِ رَبِّهِم مُّشْفِقُونَ ٥٧

నిశ్చయంగా, ఎవరైతే, తమ ప్రభువు భయం వల్ల, భీతిపరులై ఉంటారో!

23:58 – وَالَّذِينَ هُم بِآيَاتِ رَبِّهِمْ يُؤْمِنُونَ ٥٨

మరియు ఎవరైతే, తమ ప్రభువు ఆయాతులను విశ్వసిస్తారో!

23:59 – وَالَّذِينَ هُم بِرَبِّهِمْ لَا يُشْرِكُونَ ٥٩

మరియు ఎవరైతే తమ ప్రభువుకు ఎవ్వరినీ సాటిగా (భాగస్వాములుగా) కల్పించరో!

23:60 – وَالَّذِينَ يُؤْتُونَ مَا آتَوا وَّقُلُوبُهُمْ وَجِلَةٌ أَنَّهُمْ إِلَىٰ رَبِّهِمْ رَاجِعُونَ ٦٠

మరియు ఎవరైతే, తాము ఇవ్వవలసినది (’జకాత్‌) ఇచ్చేటప్పుడు, నిశ్చయంగా, వారు తమ ప్రభువు వైపుకు మరలి పోవలసి ఉన్నదనే భయాన్ని తమ హృదయాలలో ఉంచుకొని ఇస్తారో!

23:61 – أُولَـٰئِكَ يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَهُمْ لَهَا سَابِقُونَ ٦١

ఇలాంటి వారే మంచి పనులు చేయటంలో పోటీపడే వారు. మరియు వారు వాటిని చేయటానికి అందరికంటే ముందు ఉండేవారు.

23:62 – وَلَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۖ وَلَدَيْنَا كِتَابٌ يَنطِقُ بِالْحَقِّ ۚ وَهُمْ لَا يُظْلَمُونَ ٦٢

మరియు మేము ఏ ప్రాణిపై కూడా దాని శక్తికి మించిన భారం వేయము. 22 మరియు మా వద్ద అంతా వ్రాయబడిన ఒక గ్రంథముంది, అది సత్యాన్ని పలుకుతుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.

23:63 – بَلْ قُلُوبُهُمْ فِي غَمْرَةٍ مِّنْ هَـٰذَا وَلَهُمْ أَعْمَالٌ مِّن دُونِ ذَٰلِكَ هُمْ لَهَا عَامِلُونَ ٦٣

అలాకాదు, వారి హృదయాలు దీనిని గురించి అజ్ఞానంలో పడి ఉన్నాయి ఇంతేగాక వారుచేసే (దుష్ట) కార్యాలు ఎన్నో ఉన్నాయి వారు వాటిని చేస్తూనే ఉంటారు. 23

23:64 – حَتَّىٰ إِذَا أَخَذْنَا مُتْرَفِيهِم بِالْعَذَابِ إِذَا هُمْ يَجْأَرُونَ ٦٤

చివరకు, వారిలోని ఇహలోక భోగ- భాగ్యాలలో మునిగి ఉన్నవారిని శిక్షించటానికి మేము పట్టుకున్నప్పుడు, వారు మోరపెట్టు కుంటారు. 24

23:65 – لَا تَجْأَرُوا الْيَوْمَ ۖ إِنَّكُم مِّنَّا لَا تُنصَرُونَ ٦٥

(అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): “ఈ రోజు మీరు మొరపెట్టుకోకండి! నిశ్చయంగా, మా తరఫు నుండి మీకు ఎలాంటి సహాయం లభించడం జరుగదు.

23:66 – قَدْ كَانَتْ آيَاتِي تُتْلَىٰ عَلَيْكُمْ فَكُنتُمْ عَلَىٰ أَعْقَابِكُمْ تَنكِصُونَ ٦٦

“వాస్తవానికి, నా సూచనలు మీకు వినిపించబడినప్పుడు, మీరు మీ మడమల మీద వెనుకకు తిరిగిపోయేవారు.

23:67 – مُسْتَكْبِرِينَ بِهِ سَامِرًا تَهْجُرُونَ ٦٧

“దురహంకారంతో దానిని 25 గురించి వ్యర్థపు ప్రలాపాలలో రాత్రులు గడుపుతూ ఉండే వారు.”

23:68 – أَفَلَمْ يَدَّبَّرُوا الْقَوْلَ أَمْ جَاءَهُم مَّا لَمْ يَأْتِ آبَاءَهُمُ الْأَوَّلِينَ ٦٨

ఏమీ? వారు ఈ (దైవ) వాక్కును 26 గురించి ఎన్నడూ ఆలోచించలేదా? లేక వారి పూర్వీకులైన, వారి తాత-ముత్తాతల వద్దకు ఎన్నడూ రానిది, వారి వద్దకు వచ్చిందనా?

23:69 – أَمْ لَمْ يَعْرِفُوا رَسُولَهُمْ فَهُمْ لَهُ مُنكِرُونَ ٦٩

లేక వారు తమ సందేశహరుణ్ణి ఎరుగరా? అందుకే అతన్ని తిరస్కరిస్తున్నారా?

23:70 – أَمْ يَقُولُونَ بِهِ جِنَّةٌ ۚ بَلْ جَاءَهُم بِالْحَقِّ وَأَكْثَرُهُمْ لِلْحَقِّ كَارِهُونَ ٧٠

లేక: “అతనికి పిచ్చిపట్టింది!” అని అంటు న్నారా? వాసవానికి, అతను వారి వద్దకు సత్యాన్ని తెచ్చాడు. కాని చాలామంది సత్యాన్ని అసహ్యించుకుంటున్నారు.

23:71 – وَلَوِ اتَّبَعَ الْحَقُّ أَهْوَاءَهُمْ لَفَسَدَتِ السَّمَاوَاتُ وَالْأَرْضُ وَمَن فِيهِنَّ ۚ بَلْ أَتَيْنَاهُم بِذِكْرِهِمْ فَهُمْ عَن ذِكْرِهِم مُّعْرِضُونَ ٧١

మరియు ఒకవేళ సత్యమే 27 వారి కోరికలకు అనుగుణంగా ఉంటే భూమ్యాకాశాలు మరియు వాటిలో ఉన్నదంతా నాశనమైపోయేది. వాస్తవానికి మేము వారి వద్దకు హితబోధను పంపాము. 28 కాని వారు తమ హితబోధ నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు.

23:72 – أَمْ تَسْأَلُهُمْ خَرْجًا فَخَرَاجُ رَبِّكَ خَيْرٌ ۖ وَهُوَ خَيْرُ الرَّازِقِينَ ٧٢

లేక నీవు (ఓ ము’హమ్మద్‌!) వారిని ప్రతిఫలం ఏమైనా అడుగుతున్నావా? నీ ప్రభువు ఇచ్చే ప్రతిఫలమే ఎంతో మేలైనది. ఆయనే అందరికంటే శ్రేష్ఠుడైన ఉపాధి ప్రదాత.

23:73 – وَإِنَّكَ لَتَدْعُوهُمْ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ٧٣

మరియు నిశ్చయంగా, నీవు వారిని ఋజు మార్గం వైపునకు పిలుస్తున్నావు.

23:74 – وَإِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ عَنِ الصِّرَاطِ لَنَاكِبُونَ ٧٤

మరియు నిశ్చయంగా, పరలోకాన్ని నమ్మనివారు (ఋజు) మార్గం నుండి వైదొలగిన వారే! (1/4)

23:75 – وَلَوْ رَحِمْنَاهُمْ وَكَشَفْنَا مَا بِهِم مِّن ضُرٍّ لَّلَجُّوا فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ ٧٥

  • ఒకవేళ మేము వారిని కరుణించి, (ఇహలోకంలో వారికున్న) ఆపదను తొలగించినా! వారు తలబిరుసుతనంతో పట్టు విడువకుండా త్రోవతప్పి సంచరిస్తూ ఉంటారు.

23:76 – وَلَقَدْ أَخَذْنَاهُم بِالْعَذَابِ فَمَا اسْتَكَانُوا لِرَبِّهِمْ وَمَا يَتَضَرَّعُونَ ٧٦

మరియు వాస్తవానికి, మేము వారిని శిక్షకు గురిచేశాము. 29 అయినా వారు తమ ప్రభువు ముందు వంగలేదు మరియు వారు వినమ్రులు కూడా కాలేదు.

23:77 – حَتَّىٰ إِذَا فَتَحْنَا عَلَيْهِم بَابًا ذَا عَذَابٍ شَدِيدٍ إِذَا هُمْ فِيهِ مُبْلِسُونَ ٧٧

చివరకు మేము వారి కొరకు కఠిన శిక్షా ద్వారాన్ని తెరిచాము. అప్పుడు వారు నిరాశచెందిన వారయ్యారు.

23:78 – وَهُوَ الَّذِي أَنشَأَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۚ قَلِيلًا مَّا تَشْكُرُونَ ٧٨

మరియు ఆయనే, మీకు వినే శక్తినీ చూసే శక్తినీ మరియు (అర్థంచేసుకోవటానికి) హృద యాలను సృజించిన వాడు! అయినా మీరెంత తక్కువగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు!

23:79 – وَهُوَ الَّذِي ذَرَأَكُمْ فِي الْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ ٧٩

మరియు మిమ్మల్ని భూమిపై వ్యాపింప జేసినవాడు ఆయనే. మరియు ఆయన వద్దనే మీరంతా సమావేశపరచబడతారు.

23:80 – وَهُوَ الَّذِي يُحْيِي وَيُمِيتُ وَلَهُ اخْتِلَافُ اللَّيْلِ وَالنَّهَارِ ۚ أَفَلَا تَعْقِلُونَ ٨٠

మరియు మీకు జీవితాన్ని ఇచ్చేవాడు మరియు మరణింపజేసేవాడు ఆయనే! మరియు రాత్రింబవళ్ళ మార్పు ఆయన ఆధీనంలోనే ఉంది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా?

23:81 – بَلْ قَالُوا مِثْلَ مَا قَالَ الْأَوَّلُونَ ٨١

కాని వారు తమ పూర్వీకులు పలికినట్లే పలుకుతున్నారు.

23:82 – قَالُوا أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ ٨٢

వారంటున్నారు: “ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మళ్ళీ సజీవులుగా లేపబడతామా?

23:83 – لَقَدْ وُعِدْنَا نَحْنُ وَآبَاؤُنَا هَـٰذَا مِن قَبْلُ إِنْ هَـٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ ٨٣

“వాస్తవానికి, ఇటువంటి వాగ్దానాలు, మాకూ మరియు మాకు పూర్వం మా తాత-ముత్తాతలకు చేయబడినవే! వాస్తవానికి ఇవి కేవలం పూర్వకాలపు కట్టు కథలు మాత్రమే.” 30

23:84 – قُل لِّمَنِ الْأَرْضُ وَمَن فِيهَا إِن كُنتُمْ تَعْلَمُونَ ٨٤

వారిని ఇలా అడుగు: “ఈ భూమి మరియు ఇందులో ఉన్నదంతా ఎవరికి చెందినదో మీకు తెలిస్తే చెప్పండి?”

23:85 – سَيَقُولُونَ لِلَّـهِ ۚ قُلْ أَفَلَا تَذَكَّرُونَ ٨٥

వారంటారు: “అల్లాహ్‌కే!” వారితో అను: “అయినా మీరు హితోపదేశం స్వీకరించరా?”

23:86 – قُلْ مَن رَّبُّ السَّمَاوَاتِ السَّبْعِ وَرَبُّ الْعَرْشِ الْعَظِيمِ ٨٦

వారిని అడుగు: “సప్తాకాశాల ప్రభువు మరియు సర్వోత్తమ సింహాసనానికి (’అర్ష్‌కు) ప్రభువు ఎవరు?” 31

23:87 – سَيَقُولُونَ لِلَّـهِ ۚ قُلْ أَفَلَا تَتَّقُونَ ٨٧

వారంటారు: “అల్లాహ్‌ మాత్రమే!” అని. వారితో అను: “అయితే మీరెందుకు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండరు?”

23:88 – قُلْ مَن بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِن كُنتُمْ تَعْلَمُونَ ٨٨

వారిని ఇలా అడుగు: “మీకు తెలిస్తే చెప్పండి! ప్రతి దానిపై పాలనాధికారం ఎవరి చేతిలో ఉంది? మరియు ప్రతిదానికి శరణమిచ్చే వాడు ఆయనే మరియు ఆయనకు వ్యతిరేకంగా శరణమివ్వగల వాడెవ్వడూ లేనివాడు, ఎవరు?”

23:89 – سَيَقُولُونَ لِلَّـهِ ۚ قُلْ فَأَنَّىٰ تُسْحَرُونَ ٨٩

వారంటారు: “అల్లాహ్‌ మాత్రమే!” వారితో అను: “అయితే మీరెందుకు మాయాజాలానికి గురి అవుతున్నారు (మోసగింపబడు తున్నారు)?”

23:90 – بَلْ أَتَيْنَاهُم بِالْحَقِّ وَإِنَّهُمْ لَكَاذِبُونَ ٩٠

అలాకాదు! మేము వారికి సత్యాన్ని అంద జేశాము. మరియు నిశ్చయంగా, వారే అసత్య వాదులు!

23:91 – مَا اتَّخَذَ اللَّـهُ مِن وَلَدٍ وَمَا كَانَ مَعَهُ مِنْ إِلَـٰهٍ ۚ إِذًا لَّذَهَبَ كُلُّ إِلَـٰهٍ بِمَا خَلَقَ وَلَعَلَا بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ ۚ سُبْحَانَ اللَّـهِ عَمَّا يَصِفُونَ ٩١

అల్లాహ్‌ ఎవ్వరినీ కూడా తనకు సంతా నంగా చేసుకోలేదు మరియు ఆయనతో పాటు మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలాఅయితే ప్రతి దేవుడు తన సృష్టితో వేరై పోయేవాడు మరియు వారు ఒకరిపై నొకరు ప్రాబల్యం పొందగోరేవారు. అల్లాహ్‌! వారు కల్పించేవాటికి అతీతుడు. 32

23:92 – عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ ٩٢

ఆయన అగోచర మరియు గోచర విషయాల జ్ఞానం గలవాడు. వారు సాటికల్పించే భాగస్వాములకంటే, ఆయన అత్యున్నతుడు.

23:93 – قُل رَّبِّ إِمَّا تُرِيَنِّي مَا يُوعَدُونَ ٩٣

(ఓ ము’హమ్మద్‌!) ఇలా ప్రార్థించు: “ఓ నా ప్రభూ! ఏ (శిక్ష అయితే) వారికి (అవిశ్వాసులకు) వాగ్దానం చేయబడిఉన్నదో దానిని నీవు నాకు చూపనున్నచో!

23:94 – رَبِّ فَلَا تَجْعَلْنِي فِي الْقَوْمِ الظَّالِمِينَ ٩٤

“ఓ నా ప్రభూ! నన్ను ఈ దుర్మార్గ ప్రజలలో చేర్చకు.” 33

23:95 – وَإِنَّا عَلَىٰ أَن نُّرِيَكَ مَا نَعِدُهُمْ لَقَادِرُونَ ٩٥

మరియు నిశ్చయంగా, మేము వారికి (అవిశ్వాసులకు) వాగ్దానము చేసింది (శిక్ష) నీకు చూపగల సమర్థులము.

23:96 – ادْفَعْ بِالَّتِي هِيَ أَحْسَنُ السَّيِّئَةَ ۚ نَحْنُ أَعْلَمُ بِمَا يَصِفُونَ ٩٦

చెడును, మంచితనముతో నివారించు. 34 వారు ఆపాదించేవిషయాలు మాకు బాగాతెలుసు.

23:97 – وَقُل رَّبِّ أَعُوذُ بِكَ مِنْ هَمَزَاتِ الشَّيَاطِينِ ٩٧

మరియు ఇలా ప్రార్థించు: “ఓ నా ప్రభూ! షై’తానులు రేకెత్తించే కలతల నుండి (రక్షణ పొందటానికి) నేను నీ శరణు వేడుకుంటున్నాను.

23:98 – وَأَعُوذُ بِكَ رَبِّ أَن يَحْضُرُونِ ٩٨

“మరియు ఓ నా ప్రభూ! అవి నా వద్దకు రాకుండా ఉండాలని, నేను నీ శరణు వేడుకుంటున్నాను. 35

23:99 – حَتَّىٰ إِذَا جَاءَ أَحَدَهُمُ الْمَوْتُ قَالَ رَبِّ ارْجِعُونِ ٩٩

చివరికి వారిలో ఒకడికి మరణం సమీపించి నప్పుడు వాడిలా వేడుకుంటాడు: “ఓ నా ప్రభూ! నన్ను తిరిగి (భూలోకానికి) పంపు;

23:100 – لَعَلِّي أَعْمَلُ صَالِحًا فِيمَا تَرَكْتُ ۚ كَلَّا ۚ إِنَّهَا كَلِمَةٌ هُوَ قَائِلُهَا ۖ وَمِن وَرَائِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ ١٠٠

“నేను చేయకుండా వచ్చిన సత్కార్యాలు చేయటానికి.” 36 అది కానిపని. నిశ్చయంగా, అది అతని నోటిమాట మాత్రమే! 37 ఇక (ఈ మర ణించిన) వారు తిరిగి లేపబడే దినంవరకు వారి ముందు ఒక అడ్డుతెర (బర్‌’జఖ్‌) ఉంటుంది 38

23:101 – فَإِذَا نُفِخَ فِي الصُّورِ فَلَا أَنسَابَ بَيْنَهُمْ يَوْمَئِذٍ وَلَا يَتَسَاءَلُونَ ١٠١

ఆ తరువాత బాకా ఊదబడిన దినమున వారి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండవు. మరియు వారు ఒకరి నొకరు పలుకరించుకోరు కూడా!

23:102 – فَمَن ثَقُلَتْ مَوَازِينُهُ فَأُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ١٠٢

ఇక ఎవరి (సత్కార్యాల) పళ్ళాలు బరువుగా ఉంటాయో, అలాంటి వారే సాఫల్యం పొందే వారు.

23:103 – وَمَنْ خَفَّتْ مَوَازِينُهُ فَأُولَـٰئِكَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ فِي جَهَنَّمَ خَالِدُونَ ١٠٣

మరియు ఎవరి పళ్ళాలు తేలికగా ఉంటాయో అలాంటి వారే తమను తాము నష్టానికి గురిచేసు కున్నవారు, వారే నరకంలో శాశ్వతంగా ఉండేవారు.

23:104 – تَلْفَحُ وُجُوهَهُمُ النَّارُ وَهُمْ فِيهَا كَالِحُونَ ١٠٤

అగ్ని వారిముఖాలను కాల్చివేస్తుంది. 39 వారి పెదవులు బిగించుకుపోయి పళ్ళు బయట పడతాయి.

23:105 – أَلَمْ تَكُنْ آيَاتِي تُتْلَىٰ عَلَيْكُمْ فَكُنتُم بِهَا تُكَذِّبُونَ ١٠٥

(వారిని అల్లాహ్‌ ఇలా ప్రశ్నిస్తాడు): “ఏమీ? నా సూచనలు మీకు వినిపించబడ లేదా? అప్పుడు మీరు వాటిని అసత్యాలని తిరస్కరిస్తూ ఉండేవారు కదా?”

23:106 – قَالُوا رَبَّنَا غَلَبَتْ عَلَيْنَا شِقْوَتُنَا وَكُنَّا قَوْمًا ضَالِّينَ ١٠٦

వారిలా అంటారు: “ఓ మా ప్రభూ! మా దురదృష్టం మమ్మల్ని క్రమ్ముకొని ఉండింది. మేము మార్గభ్రష్టులమైన వారుగా ఉండేవారం!

23:107 – رَبَّنَا أَخْرِجْنَا مِنْهَا فَإِنْ عُدْنَا فَإِنَّا ظَالِمُونَ ١٠٧

“ఓ మాప్రభూ! మమ్మల్ని దీని (ఈ నరకం) నుండి బయటకు తీయి. ఒకవేళ మేము మరల (పాపాలు) చేస్తే, మేము నిశ్చయంగా, దుర్మార్గులమే!”

23:108 – قَالَ اخْسَئُوا فِيهَا وَلَا تُكَلِّمُونِ ١٠٨

ఆయన (అల్లాహ్‌) అంటాడు: “దానిలోనే పరాభవంతో పడి ఉండండి మరియు నాతో మాట్లాడకండి!”

23:109 – إِنَّهُ كَانَ فَرِيقٌ مِّنْ عِبَادِي يَقُولُونَ رَبَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا وَأَنتَ خَيْرُ الرَّاحِمِينَ ١٠٩

నిశ్చయంగా, నా దాసులలో కొందరు ఇలా ప్రార్థించేవారు ఉన్నారు: “ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము, మమ్మల్ని క్షమించు మరియు మమ్మల్ని కరుణించు మరియు కరుణించేవారిలో నీవే అత్యుత్తముడవు!”

23:110 – فَاتَّخَذْتُمُوهُمْ سِخْرِيًّا حَتَّىٰ أَنسَوْكُمْ ذِكْرِي وَكُنتُم مِّنْهُمْ تَضْحَكُونَ ١١٠

కాని మీరు వారిని పరిహాసానికి గురిచేసే వారు, చివరకు (ఆ పరిహాసమే) మిమ్మల్ని నా ధ్యానం నుండి మరపింపజేసింది; మరియు మీరు వారిమీద నవ్వేవారు (ఎగతాళి చేసేవారు)!

23:111 – إِنِّي جَزَيْتُهُمُ الْيَوْمَ بِمَا صَبَرُوا أَنَّهُمْ هُمُ الْفَائِزُونَ ١١١

నిశ్చయంగా, ఈ రోజు నేను వారికి, వారి సహనానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చాను. నిశ్చయంగా, వారే విజయం పొందినవారు!

23:112 – قَالَ كَمْ لَبِثْتُمْ فِي الْأَرْضِ عَدَدَ سِنِينَ ١١٢

(అల్లాహ్‌) ఇలా ప్రశ్నిస్తాడు: “మీరు భూమిలో ఎన్ని సంవత్సరాలు గడిపారు?”

23:113 – قَالُوا لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ فَاسْأَلِ الْعَادِّينَ ١١٣

వారిలా జవాబిస్తారు: “మే మక్కడ ఒక్క దినమో లేక దినపు కొంతభాగమో ఉంటిమి. లెక్క పెట్టిన వారిని అడుగు!” 40

23:114 – قَالَ إِن لَّبِثْتُمْ إِلَّا قَلِيلًا ۖ لَّوْ أَنَّكُمْ كُنتُمْ تَعْلَمُونَ ١١٤

(అల్లాహ్‌) అంటాడు: “మీరక్కడ ఉన్నది కొంత కాలం మాత్రమే! ఒకవేళ ఇది మీరు తెలుసుకొని ఉంటే (ఎంత బాగుండేది)!

23:115 – أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ ١١٥

“ఏమీ? వాస్తవానికి మేము మిమ్మల్ని వృథాగానే పుట్టించామని మరియు మీరు మా వైపునకు ఎన్నడూ మరలిరారని భావించారా?”

23:116 – فَتَعَالَى اللَّـهُ الْمَلِكُ الْحَقُّ ۖ لَا إِلَـٰهَ إِلَّا هُوَ رَبُّ الْعَرْشِ الْكَرِيمِ ١١٦

కావున (తెలుసుకోండి) అల్లాహ్‌ అత్యున్నతుడు, నిజమైన విశ్వసార్వభౌముడు, 41 ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే గౌరవప్రదమైన సింహాసనానికి (’అర్ష్‌కు) ప్రభువు!

23:117 – وَمَن يَدْعُ مَعَ اللَّـهِ إِلَـٰهًا آخَرَ لَا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمَا حِسَابُهُ عِندَ رَبِّهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ ١١٧

ఇక ఎవడైనా అల్లాహ్‌తోపాటు మరొక దైవాన్ని – తనవద్ద దాని కొరకు ఎలాంటి ఆధారం లేకుండానే – ప్రార్థిస్తాడో, నిశ్చయంగా అతని లెక్క అతని ప్రభువు వద్ద ఉంది. నిశ్చయంగా, సత్యతిరస్కారులు సాఫల్యము పొందలేరు. 42

23:118 – وَقُل رَّبِّ اغْفِرْ وَارْحَمْ وَأَنتَ خَيْرُ الرَّاحِمِينَ ١١٨

కావున నీవు ఇలా ప్రార్థించు: “ఓ నా ప్రభూ! నన్ను క్షమించు, నన్ను కరుణించు, కరుణించేవారిలో నీవే అత్యుత్తముడవు!”(3/8)

సూరహ్‌ అన్‌-నూర్‌ – అన్‌-నూరు: అంటే జ్యోతి, ప్రకాశం, వెలుగు. అన్‌-నిసా (4), అన్‌-నూర్‌ (24) మరియు అల్‌-అ’హ్‌’జాబ్‌ (33) సూరాహ్‌లలో స్త్రీల యొక్క సమస్యలు మరియు వాటి పరిష్కారాలు పేర్కొన బడ్డాయి. ఈ సూరహ్‌ 5వ హిజ్రీ చివరి కాలంలో లేక 6వ హిజ్రీ మొదటి కాలంలో మదీనహ్లో అవతరింపజేయబడింది. ఇందులో వ్యక్తిగత గౌరవపు ప్రాముఖ్యత తెలుపబడింది. 2-9 ఆయాత్‌లలో వ్యభిచారానికి గురించిన శాసనాలు ఉన్నాయి. 11-20 ఆయాత్‌లలో బనూ -ము’స్‌’తలిఖ్‌ దండయాత్రలో సంభవించిన సంఘటనను గురించి ఉంది. ఇందులో 64 ఆయతులు ఉన్నాయి. దీని పేరు 35వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 24:1 – سُورَةٌ أَنزَلْنَاهَا وَفَرَضْنَاهَا وَأَنزَلْنَا فِيهَا آيَاتٍ بَيِّنَاتٍ لَّعَلَّكُمْ تَذَكَّرُونَ ١

ఇది ఒక సూరహ్‌! మేమే దీనిని అవతరింప జేశాము మరియు మేము దీనిని విధిగాజేశాము మరియు బహుశా మీరు గుణపాఠం నేర్చుకుంటారని, మేమిందులో స్పష్టమైన సూచనలను (ఆయాత్‌లను) అవతరింపజేశాము.

24:2 – الزَّانِيَةُ وَالزَّانِي فَاجْلِدُوا كُلَّ وَاحِدٍ مِّنْهُمَا مِائَةَ جَلْدَةٍ ۖ وَلَا تَأْخُذْكُم بِهِمَا رَأْفَةٌ فِي دِينِ اللَّـهِ إِن كُنتُمْ تُؤْمِنُونَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ ۖ وَلْيَشْهَدْ عَذَابَهُمَا طَائِفَةٌ مِّنَ الْمُؤْمِنِينَ ٢

వ్యభిచారిణి మరియు వ్యభిచారుడు, ఈ ఇద్దరిలో ప్రతి ఒక్కరికి నూరేసి కొరడాదెబ్బలు కొట్టండి. 1 మరియు మీకు అల్లాహ్‌ యందు మరియు అంతిమదినమునందు విశ్వాసముంటే – అల్లాహ్‌ విధించిన ధర్మవిషయంలో – వారిద్దరి యెడల మీకు జాలి కలుగకూడదు. మరియు వారిద్దరి శిక్షను, విశ్వాసులలో కొందరు చూడాలి.

24:3 – الزَّانِي لَا يَنكِحُ إِلَّا زَانِيَةً أَوْ مُشْرِكَةً وَالزَّانِيَةُ لَا يَنكِحُهَا إِلَّا زَانٍ أَوْ مُشْرِكٌ ۚ وَحُرِّمَ ذَٰلِكَ عَلَى الْمُؤْمِنِينَ ٣

ఒక వ్యభిచారి, ఒక వ్యభిచారిణిని లేక బహుదైవా రాధకురాలయిన (ముష్రిక్‌) స్త్రీని మాత్రమే వివాహమాడుతాడు; మరియు ఒక వ్యభిచారిణిని, ఒక వ్యభిచారుడో లేక ఒక బహు దైవారాధకుడో మాత్రమే వివాహమాడుతాడు. మరియు ఇలాంటి విషయం విశ్వాసుల కొరకు నిషేధించబడింది. 2

24:4 – وَالَّذِينَ يَرْمُونَ الْمُحْصَنَاتِ ثُمَّ لَمْ يَأْتُوا بِأَرْبَعَةِ شُهَدَاءَ فَاجْلِدُوهُمْ ثَمَانِينَ جَلْدَةً وَلَا تَقْبَلُوا لَهُمْ شَهَادَةً أَبَدًا ۚ وَأُولَـٰئِكَ هُمُ الْفَاسِقُونَ ٤

మరియు ఎవరైనా శీలవతులైన స్త్రీలపై అపనింద మోపిన తరువాత నలుగురు సాక్షులను తీసుకొనిరాలేరో, వారికి ఎనభై కొరడాదెబ్బలు కొట్టండి మరియు వారి సాక్ష్యాన్ని ఎన్నటికీ స్వీకరించకండి. అలాంటి వారు పరమ దుష్టులు (ఫాసిఖూన్‌). 3

24:5 – إِلَّا الَّذِينَ تَابُوا مِن بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوا فَإِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ٥

కాని అటుపిమ్మట ఎవరైతే పశ్చాత్తాపపడి తమను తాము సవరించుకుంటారో! నిశ్చయంగా, అలాంటి వారి పట్ల అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

24:6 – وَالَّذِينَ يَرْمُونَ أَزْوَاجَهُمْ وَلَمْ يَكُن لَّهُمْ شُهَدَاءُ إِلَّا أَنفُسُهُمْ فَشَهَادَةُ أَحَدِهِمْ أَرْبَعُ شَهَادَاتٍ بِاللَّـهِ ۙ إِنَّهُ لَمِنَ الصَّادِقِينَ ٦

మరియు ఎవరైతే, తమ భార్యలమీద అపనిందమోపి, దానికి తాము స్వయమే తప్ప ఇతరులను సాక్షులుగాతేలేరో, వారు తమంతట తామే నాలుగు సార్లు అల్లాహ్ పై ప్రమాణంచేసి సాక్ష్యమిస్తూ: ”నిశ్చయంగా, తాను సత్యం పలుకుతున్నాననీ; 4

24:7 – وَالْخَامِسَةُ أَنَّ لَعْنَتَ اللَّـهِ عَلَيْهِ إِن كَانَ مِنَ الْكَاذِبِينَ ٧

”మరియు ఐదవసారి అతడు ఒకవేళ అసత్యం పలుకుతున్నట్లయితే! నిశ్చయంగా, అల్లాహ్‌ ఆగ్రహం తన మీద విరుచుకుపడు గాక!” అనీ అనాలి.

24:8 – وَيَدْرَأُ عَنْهَا الْعَذَابَ أَن تَشْهَدَ أَرْبَعَ شَهَادَاتٍ بِاللَّـهِ ۙ إِنَّهُ لَمِنَ الْكَاذِبِينَ ٨

ఇక ఆమె (భార్య) శిక్షను తప్పించుకోవ టానికి, నాలుగు సార్లు అల్లాహ్‌పై ప్రమాణంచేస్తూ: ”నిశ్చయంగా, అతడు అబద్ధంచెబుతున్నాడనీ;

24:9 – وَالْخَامِسَةَ أَنَّ غَضَبَ اللَّـهِ عَلَيْهَا إِن كَانَ مِنَ الصَّادِقِينَ ٩

”మరియు అయిదవసారి ఒకవేళ అతడు సత్యవంతుడైతే! నిశ్చయంగా, తనమీద అల్లాహ్‌ ఆగ్రహం విరుచుకుపడు గాక!” అనీ అనాలి. 5

24:10 – وَلَوْلَا فَضْلُ اللَّـهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ وَأَنَّ اللَّـهَ تَوَّابٌ حَكِيمٌ ١٠

మరియు మీపై అల్లాహ్‌ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే! (ఆయన మీ శిక్షను త్వరలోనే తెచ్చేవాడు) మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ పశ్చాత్తాపాన్ని స్వీకరించే వాడు, మహా వివేకవంతుడు. 6

24:11 – إِنَّ الَّذِينَ جَاءُوا بِالْإِفْكِ عُصْبَةٌ مِّنكُمْ ۚ لَا تَحْسَبُوهُ شَرًّا لَّكُم ۖ بَلْ هُوَ خَيْرٌ لَّكُمْ ۚ لِكُلِّ امْرِئٍ مِّنْهُم مَّا اكْتَسَبَ مِنَ الْإِثْمِ ۚ وَالَّذِي تَوَلَّىٰ كِبْرَهُ مِنْهُمْ لَهُ عَذَابٌ عَظِيمٌ ١١

నిశ్చయంగా, అపనింద మోపేవారు, 7 మీలో నుంచే కొందరున్నారు. అది మీకు హానికర మైనదని భావించకండి. వాస్తవానికి అది మీకు మేలైనదే. వారిలో ప్రతి ఒక్కనికి తానుచేసిన పాపానికి తగినశిక్ష లభిస్తుంది. మరియు వారిలో (ఈ అపనింద మోపటంలో), పెద్ద బాధ్యత వహించిన వానికి ఘోరమైన శిక్ష పడుతుంది.

24:12 – لَّوْلَا إِذْ سَمِعْتُمُوهُ ظَنَّ الْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بِأَنفُسِهِمْ خَيْرًا وَقَالُوا هَـٰذَا إِفْكٌ مُّبِينٌ ١٢

విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసు లైన స్త్రీలు దానిని వినినప్పుడు, తమను గురించి తాము మంచి తలంపు వహించి: “ఇది స్పష్టమైన అపనిందయే!” అని ఎందుకు అనలేదు? 8

24:13 – لَّوْلَا جَاءُوا عَلَيْهِ بِأَرْبَعَةِ شُهَدَاءَ ۚ فَإِذْ لَمْ يَأْتُوا بِالشُّهَدَاءِ فَأُولَـٰئِكَ عِندَ اللَّـهِ هُمُ الْكَاذِبُونَ ١٣

మరియు వారు దీనికై నలుగురు సాక్షులను ఎందుకు తీసుకొనిరాలేదు? ఒక వేళ వారు సాక్షులను తీసుకొనిరానప్పుడు, అల్లాహ్‌ వద్ద వారే అసత్యవాదులు.

24:14 – وَلَوْلَا فَضْلُ اللَّـهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ لَمَسَّكُمْ فِي مَا أَفَضْتُمْ فِيهِ عَذَابٌ عَظِيمٌ ١٤

మరియు ఒకవేళ మీపై అల్లాహ్‌ అనుగ్రహం మరియు ఆయన కరుణ, ఇహలోకంలో మరియు పరలోకంలో లేకుంటే – మీరు ఏ విషయాలలో పడిపోయారో, వాటి పర్యవసానంగా – మీపై ఘోరమైన శిక్ష పడి ఉండేది.

24:15 – إِذْ تَلَقَّوْنَهُ بِأَلْسِنَتِكُمْ وَتَقُولُونَ بِأَفْوَاهِكُم مَّا لَيْسَ لَكُم بِهِ عِلْمٌ وَتَحْسَبُونَهُ هَيِّنًا وَهُوَ عِندَ اللَّـهِ عَظِيمٌ ١٥

అప్పుడు మీరు దానిని (ఆ అపనిందను) మీ నాలుకలతో వ్యాపింపజేస్తూ పోయారు మరియు మీకు తెలియనిదానిని మీ నోళ్ళతో పలుకసాగారు మరియు మీరు దానిని చిన్న విషయంగా భావించారు, కాని అల్లాహ్‌ దగ్గర (దృష్టిలో) అది ఎంతో గోప్ప విషయం (అపరాధం).

24:16 – وَلَوْلَا إِذْ سَمِعْتُمُوهُ قُلْتُم مَّا يَكُونُ لَنَا أَن نَّتَكَلَّمَ بِهَـٰذَا سُبْحَانَكَ هَـٰذَا بُهْتَانٌ عَظِيمٌ ١٦

మరియు మీరు దానిని విన్నప్పుడు: “ఇలాంటి మాట పలకడం మాకు తగదు, (ఓ మా ప్రభూ!) నీవు సర్వలోపాలకు అతీతుడవు, ఇది గొప్ప నిందారోపణ!” అని ఎందుకు అనలేదు. 9

24:17 – يَعِظُكُمُ اللَّـهُ أَن تَعُودُوا لِمِثْلِهِ أَبَدًا إِن كُنتُم مُّؤْمِنِينَ ١٧

మీరు విశ్వాసులే అయితే, ఇక మీదట ఎన్నటికీ ఇటువంటి చేష్టలు మరల చేయ కూడదని అల్లాహ్‌ మిమ్మల్ని ఉపదేశిస్తున్నాడు.

24:18 – وَيُبَيِّنُ اللَّـهُ لَكُمُ الْآيَاتِ ۚ وَاللَّـهُ عَلِيمٌ حَكِيمٌ ١٨

మరియు అల్లాహ్‌ మీకు స్పష్టమైన ఆయాత్‌ లను చూపుతున్నాడు. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

24:19 – إِنَّ الَّذِينَ يُحِبُّونَ أَن تَشِيعَ الْفَاحِشَةُ فِي الَّذِينَ آمَنُوا لَهُمْ عَذَابٌ أَلِيمٌ فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۚ وَاللَّـهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ ١٩

నిశ్చయంగా, ఎవరైతే, విశ్వాసవర్గంలో అశ్లీలత 10 వ్యాపించాలని కోరుతారో, అలాంటి వారికి ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా కఠిన శిక్ష పడుతుంది. 11 మరియు అల్లాహ్‌కు అంతా తెలుసు, కాని మీకు తెలియదు.

24:20 – وَلَوْلَا فَضْلُ اللَّـهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ وَأَنَّ اللَّـهَ رَءُوفٌ رَّحِيمٌ ٢٠

మరియు మీ యెడల అల్లాహ్‌ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే (మీరు నాశనమై పోయేవారు); మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ మహా కనికరుడు, అపార కరుణాప్రదాత. (1/2)

24:21 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ وَمَن يَتَّبِعْ خُطُوَاتِ الشَّيْطَانِ فَإِنَّهُ يَأْمُرُ بِالْفَحْشَاءِ وَالْمُنكَرِ ۚ وَلَوْلَا فَضْلُ اللَّـهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ مَا زَكَىٰ مِنكُم مِّنْ أَحَدٍ أَبَدًا وَلَـٰكِنَّ اللَّـهَ يُزَكِّي مَن يَشَاءُ ۗ وَاللَّـهُ سَمِيعٌ عَلِيمٌ ٢١

  • ఓ విశ్వాసులారా! షై’తాన్‌ అడుగు జాడలలో నడవకండి. మరియు ఎవడు షై’తాన్‌ అడుగు జాడలలో నడుస్తాడో! నిశ్చయంగా షై’తాన్‌ అతనిని అశ్లీలమైన మరియు అసభ్యకరమైన పనులు చేయటానికి ప్రోత్సహిస్తాడు మరియు మీ యెడల అల్లాహ్‌ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే, మీలో ఒక్కడు కూడా నీతిమంతునిగా ఉండలేడు. కాని అల్లాహ్‌ తాను కోరిన వానిని నీతి మంతునిగా చేస్తాడు. మరియు అల్లాహ్‌ సర్వం వినేవాడు సర్వజ్ఞుడు.

24:22 – وَلَا يَأْتَلِ أُولُو الْفَضْلِ مِنكُمْ وَالسَّعَةِ أَن يُؤْتُوا أُولِي الْقُرْبَىٰ وَالْمَسَاكِينَ وَالْمُهَاجِرِينَ فِي سَبِيلِ اللَّـهِ ۖ وَلْيَعْفُوا وَلْيَصْفَحُوا ۗ أَلَا تُحِبُّونَ أَن يَغْفِرَ اللَّـهُ لَكُمْ ۗ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٢٢

మరియు మీలో (అల్లాహ్‌) అనుగ్రహం మరియు సమృధ్ధిగా (సంపదలు) గలవారు, తమ బంధువులకు, పేదలకు, 12 అల్లాహ్‌ మార్గంలో వలస పోయేవారికి (హిజ్రత్‌ పోయేవారికి), సహాయం చేయమని ప్రతిజ్ఞ చేయరాదు. 13 వారిని మన్నించాలి, (వారి తప్పులను) ఉపేక్షించాలి. ఏమీ? అల్లాహ్‌ మీ తప్పులను క్షమించాలని మీరు కోరరా? వాస్తవానికి అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

24:23 – إِنَّ الَّذِينَ يَرْمُونَ الْمُحْصَنَاتِ الْغَافِلَاتِ الْمُؤْمِنَاتِ لُعِنُوا فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ ٢٣

నిశ్చయంగా, ఎవరైతే శీలవతులు, అమా యకులు అయిన విశ్వాసస్త్రీలపై అపనిందలు మోపుతారో, వారు ఈ లోకంలోనూ మరియు పర లోకంలోనూ శపించబడతారు (బహిష్కరింపబడ తారు) మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది.

24:24 – يَوْمَ تَشْهَدُ عَلَيْهِمْ أَلْسِنَتُهُمْ وَأَيْدِيهِمْ وَأَرْجُلُهُم بِمَا كَانُوا يَعْمَلُونَ ٢٤

వారి నాలుకలు, వారి చేతులు మరియు వారి కాళ్ళు – వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి – వారికి విరుధ్ధంగా సాక్ష్యమిచ్చే రోజు!

24:25 – يَوْمَئِذٍ يُوَفِّيهِمُ اللَّـهُ دِينَهُمُ الْحَقَّ وَيَعْلَمُونَ أَنَّ اللَّـهَ هُوَ الْحَقُّ الْمُبِينُ ٢٥

ఆ రోజు! అల్లాహ్‌ వారికి, (వారి కర్మలకు) పూర్తి ప్రతిఫలమిస్తాడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌! ఆయనే పరమ సత్యమని వారు తెలుసుకుంటారు.

24:26 – الْخَبِيثَاتُ لِلْخَبِيثِينَ وَالْخَبِيثُونَ لِلْخَبِيثَاتِ ۖ وَالطَّيِّبَاتُ لِلطَّيِّبِينَ وَالطَّيِّبُونَ لِلطَّيِّبَاتِ ۚ أُولَـٰئِكَ مُبَرَّءُونَ مِمَّا يَقُولُونَ ۖ لَهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ ٢٦

నికృష్టులైన స్త్రీలు, నికృష్టులైన పురుషు లకు మరియు నికృష్టులైన పురుషులు, నికృష్టు లైన స్త్రీలకు తగినవారు. మరియు నిర్మల స్త్రీనిర్మల పురుషులకు మరియు నిర్మల పురుషులు, నిర్మల స్త్రీలకు తగినవారు. వారు మోపే (కపట-విశ్వాసులు మోపే) అపనిందలకు వీరు నిర్దోషులు. వీరికి క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి ఉంటాయి. లు,

24:27 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَدْخُلُوا بُيُوتًا غَيْرَ بُيُوتِكُمْ حَتَّىٰ تَسْتَأْنِسُوا وَتُسَلِّمُوا عَلَىٰ أَهْلِهَا ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُونَ ٢٧

ఓ విశ్వాసులారా! మీ ఇండ్లు తప్ప, ఇతరుల ఇండ్లలోనికి వారి అనుమతి లేకుండా మరియు ఆ ఇంటివారికి సలామ్‌ చేయకుండా ప్రవేశించకండి. 14 ఈ పధ్ధతి మీకు అతి ఉత్తమమైనది. మీరు ఈ హితోపదేశం జ్ఞాపకం ఉంచుకుంటారని ఆశింపబడుతోంది!

24:28 – فَإِن لَّمْ تَجِدُوا فِيهَا أَحَدًا فَلَا تَدْخُلُوهَا حَتَّىٰ يُؤْذَنَ لَكُمْ ۖ وَإِن قِيلَ لَكُمُ ارْجِعُوا فَارْجِعُوا ۖ هُوَ أَزْكَىٰ لَكُمْ ۚ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ عَلِيمٌ ٢٨

మరియు ఒకవేళ మీకు దానిలో (ఆ ఇంటిలో) ఎవ్వరూ కనబడకపోయినా, మీకు అనుమతి ఇవ్వబడనంత వరకు అందులోకి ప్రవేశించకండి. మరియు (అనుమతి ఇవ్వక), మీతో తిరిగిపొమ్మని (ఆ ఇంటివారు) అంటే! తిరిగి వెళ్ళిపోండి. ఇదే మీ కొరకు శ్రేష్ఠమైనపద్ధతి. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.

24:29 – لَّيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَدْخُلُوا بُيُوتًا غَيْرَ مَسْكُونَةٍ فِيهَا مَتَاعٌ لَّكُمْ ۚ وَاللَّـهُ يَعْلَمُ مَا تُبْدُونَ وَمَا تَكْتُمُونَ ٢٩

ఎవ్వరికీ నివాసస్థలం కాకుండా మీకు ప్రయోజన కరమైన వస్తువులున్న ఇండ్లలో ప్రవేశిస్తే, మీపై ఎట్టి దోషం లేదు. మరియు మీరు వ్యక్తపరిచేది మరియు మీరు దాచేది అంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.

24:30 – قُل لِّلْمُؤْمِنِينَ يَغُضُّوا مِنْ أَبْصَارِهِمْ وَيَحْفَظُوا فُرُوجَهُمْ ۚ ذَٰلِكَ أَزْكَىٰ لَهُمْ ۗ إِنَّ اللَّـهَ خَبِيرٌ بِمَا يَصْنَعُونَ ٣٠

విశ్వసించిన పురుషులతో, వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. 15 ఇది వారికి ఎంతో శ్రేష్ఠమైనది. నిశ్చయంగా, అల్లాహ్‌ వారి చేష్టలను బాగా ఎరుగును.

24:31 – وَقُل لِّلْمُؤْمِنَاتِ يَغْضُضْنَ مِنْ أَبْصَارِهِنَّ وَيَحْفَظْنَ فُرُوجَهُنَّ وَلَا يُبْدِينَ زِينَتَهُنَّ إِلَّا مَا ظَهَرَ مِنْهَا ۖ وَلْيَضْرِبْنَ بِخُمُرِهِنَّ عَلَىٰ جُيُوبِهِنَّ ۖ وَلَا يُبْدِينَ زِينَتَهُنَّ إِلَّا لِبُعُولَتِهِنَّ أَوْ آبَائِهِنَّ أَوْ آبَاءِ بُعُولَتِهِنَّ أَوْ أَبْنَائِهِنَّ أَوْ أَبْنَاءِ بُعُولَتِهِنَّ أَوْ إِخْوَانِهِنَّ أَوْ بَنِي إِخْوَانِهِنَّ أَوْ بَنِي أَخَوَاتِهِنَّ أَوْ نِسَائِهِنَّ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُنَّ أَوِ التَّابِعِينَ غَيْرِ أُولِي الْإِرْبَةِ مِنَ الرِّجَالِ أَوِ الطِّفْلِ الَّذِينَ لَمْ يَظْهَرُوا عَلَىٰ عَوْرَاتِ النِّسَاءِ ۖ وَلَا يَضْرِبْنَ بِأَرْجُلِهِنَّ لِيُعْلَمَ مَا يُخْفِينَ مِن زِينَتِهِنَّ ۚ وَتُوبُوا إِلَى اللَّـهِ جَمِيعًا أَيُّهَ الْمُؤْمِنُونَ لَعَلَّكُمْ تُفْلِحُونَ ٣١

మరియు విశ్వసించిన స్త్రీలతో కూడా వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. మరియు వారి అలంకరణను ప్రదర్శించవద్దని చెప్పు – (దానంతట అదే) ప్రదర్శనమయ్యేది తప్ప. వారిని తమ తలమీది దుప్పటిని రొమ్ములవరకు కప్పుకోమని చెప్పు. వారు తమ అలంకారాన్ని తమభర్తలకు, తమ తండ్రులకు, తమ భర్తలతండ్రులకు, తమ కుమారులకు, తమభర్తల కుమారులకు, తమ సోదరులకు, తమసోదరుల కుమారులకు, తమ సోదరీమణుల కుమారులకు, తమ (తోటి) స్త్రీలకు, తమ బానిస స్త్రీలకు, లేక కామ ఇచ్ఛలేని మగ సేవకులకు, లేక స్త్రీల గుప్తాంగాలనుగురించి తెలియని బాలురకు తప్ప, ఇతరుల ముందు ప్రదర్శించకూడదని మరియు కనబడకుండా ఉన్న తమ అలంకారం తెలియబడే టట్లుగా, వారు తమ పాదాలను నేలపై కొడుతూ నడవకూడదని చెప్పు. మరియు ఓ విశ్వాసు లారా! మీరందరూ కలసి అల్లాహ్‌ను క్షమాపణకై వేడుకుంటే, మీరు సాఫల్యం పొందవచ్చు!

24:32 – وَأَنكِحُوا الْأَيَامَىٰ مِنكُمْ وَالصَّالِحِينَ مِنْ عِبَادِكُمْ وَإِمَائِكُمْ ۚ إِن يَكُونُوا فُقَرَاءَ يُغْنِهِمُ اللَّـهُ مِن فَضْلِهِ ۗ وَاللَّـهُ وَاسِعٌ عَلِيمٌ ٣٢

మీలోని పెండ్లికాని వారికి మరియు శీలవతులైన మీ బానిస పురుషులు మరియు బానిస స్త్రీలకు వివాహాలు చేయించండి. 16 ఒకవేళ వారు పేదవారయితే, అల్లాహ్‌ తన అనుగ్రహంతో వారిని సంపన్నులుగా చేయ వచ్చు! మరియు అల్లాహ్‌ విస్తారుడు, సర్వజ్ఞుడు.

24:33 – وَلْيَسْتَعْفِفِ الَّذِينَ لَا يَجِدُونَ نِكَاحًا حَتَّىٰ يُغْنِيَهُمُ اللَّـهُ مِن فَضْلِهِ ۗ وَالَّذِينَ يَبْتَغُونَ الْكِتَابَ مِمَّا مَلَكَتْ أَيْمَانُكُمْ فَكَاتِبُوهُمْ إِنْ عَلِمْتُمْ فِيهِمْ خَيْرًا ۖ وَآتُوهُم مِّن مَّالِ اللَّـهِ الَّذِي آتَاكُمْ ۚ وَلَا تُكْرِهُوا فَتَيَاتِكُمْ عَلَى الْبِغَاءِ إِنْ أَرَدْنَ تَحَصُّنًا لِّتَبْتَغُوا عَرَضَ الْحَيَاةِ الدُّنْيَا ۚ وَمَن يُكْرِههُّنَّ فَإِنَّ اللَّـهَ مِن بَعْدِ إِكْرَاهِهِنَّ غَفُورٌ رَّحِيمٌ ٣٣

ఎవరికైతే, పెండ్లిచేసుకొనే శక్తిలేదో వారు, అల్లాహ్‌ తన అనుగ్రహంతో వారిని ధనవంతు లుగా చేసేవరకు శీల శుధ్ధతను పాటించాలి. 17 మరియు మీ బానిసలలో ఎవరైనా స్వేచ్ఛాపత్రం వ్రాయించుకోగోరితే వారియందు మీకు మంచితనం కనబడితే, వారికి స్వేచ్ఛాపత్రం వ్రాసి ఇవ్వండి. 18 అల్లాహ్‌ మీకు ఇచ్చిన ధనం నుండి వారికి కూడా కొంత ఇవ్వండి. మీరు ఇహలోక ప్రయోజనాల నిమిత్తం, మీ బానిస స్త్రీలు శీలవంతులుగా ఉండగోరితే, వారిని వ్యభిచారానికి బలవంతపెట్టకండి. 19 ఎవరైనా వారిని బలవంత పెడితే! నిశ్చయంగా, అల్లాహ్‌ వారిని (ఆ బానిస స్త్రీలను) బలాత్కారం తరువాత క్షమించేవాడు, అపార కరుణాప్రదాత.

24:34 – وَلَقَدْ أَنزَلْنَا إِلَيْكُمْ آيَاتٍ مُّبَيِّنَاتٍ وَمَثَلًا مِّنَ الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُمْ وَمَوْعِظَةً لِّلْمُتَّقِينَ ٣٤

మరియు వాస్తవానికి, మేము మీ వద్దకు స్పష్టమైన సూచనలను, మీకు పూర్వం గతించిన వారి ఉదాహరణలను మరియు దైవభీతి గలవారికి బోధనలను (ఉపదేశాలను) అవతరింపజేశాము. (5/8)

24:35 – اللَّـهُ نُورُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ مَثَلُ نُورِهِ كَمِشْكَاةٍ فِيهَا مِصْبَاحٌ ۖ الْمِصْبَاحُ فِي زُجَاجَةٍ ۖ الزُّجَاجَةُ كَأَنَّهَا كَوْكَبٌ دُرِّيٌّ يُوقَدُ مِن شَجَرَةٍ مُّبَارَكَةٍ زَيْتُونَةٍ لَّا شَرْقِيَّةٍ وَلَا غَرْبِيَّةٍ يَكَادُ زَيْتُهَا يُضِيءُ وَلَوْ لَمْ تَمْسَسْهُ نَارٌ ۚ نُّورٌ عَلَىٰ نُورٍ ۗ يَهْدِي اللَّـهُ لِنُورِهِ مَن يَشَاءُ ۚ وَيَضْرِبُ اللَّـهُ الْأَمْثَالَ لِلنَّاسِ ۗ وَاللَّـهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ٣٥

  • అల్లాహ్‌ ఆకాశాలకూ మరియు భూమికీ జ్యోతి! ఆయన జ్యోతిని, 20 గూటిలోని దీపంతో పోల్చవచ్చు! ఆ దీపం చుట్టూ గాజు ఉంది. ఆ గాజు ఒక నక్షత్రంవలే ప్రకాశిస్తున్నది. అదొక పావనమైన ‘జైతూన్‌ వృక్షం (నూనె)తో వెలిగించబడు తున్నది, అది (ఆ వృక్షం) తూర్పుకు గానీ, పడమరకు గానీ చెందినది కాదు. దాని నూనె అగ్ని అంటకున్నా మండుతూనే ఉంటుంది.వెలుగు మీద వెలుగు! అల్లాహ్‌ తన వెలుగు వైపునకు తనకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. అల్లాహ్‌ ఉదాహరణల ద్వారా ప్రజలకు బోధిస్తాడు. మరియు అల్లాహ్‌కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.

24:36 – فِي بُيُوتٍ أَذِنَ اللَّـهُ أَن تُرْفَعَ وَيُذْكَرَ فِيهَا اسْمُهُ يُسَبِّحُ لَهُ فِيهَا بِالْغُدُوِّ وَالْآصَالِ ٣٦

అల్లాహ్‌ ఏ ఇండ్లను (మస్జిద్‌లను) లేపి, వాటిలో ఆయన నామాన్ని స్మరించమని సెలవిచ్చాడో, అందులో వారు, ఆయన పవిత్రతను ఉదయం మరియు సాయంత్రం స్తుతిస్తూ ఉంటారు. 21

24:37 – رِجَالٌ لَّا تُلْهِيهِمْ تِجَارَةٌ وَلَا بَيْعٌ عَن ذِكْرِ اللَّـهِ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ ۙ يَخَافُونَ يَوْمًا تَتَقَلَّبُ فِيهِ الْقُلُوبُ وَالْأَبْصَارُ ٣٧

ప్రజలలో కొందరిని – వారి వ్యాపారం గానీ మరియు క్రయవిక్రయాలు గానీ – అల్లాహ్‌ స్మరణ నుండీ, నమా’జ్‌ స్థాపించడం నుండీ మరియు విధిదానం (‘జకాత్‌) ఇవ్వడం నుండీ తప్పించ లేవు. హృదయాలు మరియు కనుగ్రుడ్లు గిరగిర తిరిగిపోయే, ఆ దినమును గురించి, వారు భయపడుతూ ఉంటారు. 22

24:38 – لِيَجْزِيَهُمُ اللَّـهُ أَحْسَنَ مَا عَمِلُوا وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۗ وَاللَّـهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ ٣٨

వారు ఇలా చేయటం, అల్లాహ్‌ వారికి వారి మంచిపనుల కొరకు ప్రతిఫలమివ్వటానికి; మరియు తన అనుగ్రహాలను వారిపై అధికం చేయటానికి. మరియు అల్లాహ్‌ తాను కోరినవారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు.

24:39 – وَالَّذِينَ كَفَرُوا أَعْمَالُهُمْ كَسَرَابٍ بِقِيعَةٍ يَحْسَبُهُ الظَّمْآنُ مَاءً حَتَّىٰ إِذَا جَاءَهُ لَمْ يَجِدْهُ شَيْئًا وَوَجَدَ اللَّـهَ عِندَهُ فَوَفَّاهُ حِسَابَهُ ۗ وَاللَّـهُ سَرِيعُ الْحِسَابِ ٣٩

ఇక సత్యాన్ని తిరస్కరించినవారి కర్మలను ఎడారిలోని ఎండమావితో పోల్చవచ్చు. దప్పిక గొన్నవాడు – దానిని నీరుగా భావించి దానివద్దకు చేరి, చివరికి ఏమీ పొందలేక – అక్కడ అల్లాహ్‌ను పొందుతాడు. అప్పుడు ఆయన అతని లెక్కను పూర్తిగా తీర్చుతాడు. మరియు అల్లాహ్‌ లెక్క తీర్చటంలో అతి శీఘ్రుడు. 23

24:40 – أَوْ كَظُلُمَاتٍ فِي بَحْرٍ لُّجِّيٍّ يَغْشَاهُ مَوْجٌ مِّن فَوْقِهِ مَوْجٌ مِّن فَوْقِهِ سَحَابٌ ۚ ظُلُمَاتٌ بَعْضُهَا فَوْقَ بَعْضٍ إِذَا أَخْرَجَ يَدَهُ لَمْ يَكَدْ يَرَاهَا ۗ وَمَن لَّمْ يَجْعَلِ اللَّـهُ لَهُ نُورًا فَمَا لَهُ مِن نُّورٍ ٤٠

లేక (సత్య-తిరస్కారుల పరిస్థితి) చాల లోతుగల సముద్రంలోని చీకట్లవలె ఉంటుంది. దానిపై ఒక గొప్పఅల క్రమ్ముకొని ఉంటుంది. దానిపై మరొక గొప్పఅల, దానిపై మేఘాలు. చీకట్లు ఒకదానిపైనొకటి క్రమ్ముకొని ఉంటాయి. అపుడు ఎవడైనా తనచేతిని (చూడాలని) చాచితే, వాడు దానిని చూడలేడు. మరియు ఎవనికైతే అల్లాహ్‌ వెలుగునివ్వడో, అతనికి ఏ మాత్రం వెలుగు దొరకదు. 24

24:41 – أَلَمْ تَرَ أَنَّ اللَّـهَ يُسَبِّحُ لَهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَالطَّيْرُ صَافَّاتٍ ۖ كُلٌّ قَدْ عَلِمَ صَلَاتَهُ وَتَسْبِيحَهُ ۗ وَاللَّـهُ عَلِيمٌ بِمَا يَفْعَلُونَ ٤١

ఏమీ? నీకు తెలియదా (చూడటంలేదా)? నిశ్చయంగా భూమ్యాకాశాలలో ఉన్న సర్వమూ మరియు రెక్కలు విప్పి ఎగిరే పక్షులు సైతం అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయని? వాస్తవానికి ప్రతిదానికి తన నమా’జ్‌ మరియు స్తోత్రం చేసే పద్ధతి తెలుసు. 25 మరియు అవి చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు. 26

24:42 – وَلِلَّـهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَإِلَى اللَّـهِ الْمَصِيرُ ٤٢

మరియు భూమ్యాకాశాల మీద సర్వాధి పత్యం అల్లాహ్‌దే! మరియు అల్లాహ్‌ వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది.

24:43 – أَلَمْ تَرَ أَنَّ اللَّـهَ يُزْجِي سَحَابًا ثُمَّ يُؤَلِّفُ بَيْنَهُ ثُمَّ يَجْعَلُهُ رُكَامًا فَتَرَى الْوَدْقَ يَخْرُجُ مِنْ خِلَالِهِ وَيُنَزِّلُ مِنَ السَّمَاءِ مِن جِبَالٍ فِيهَا مِن بَرَدٍ فَيُصِيبُ بِهِ مَن يَشَاءُ وَيَصْرِفُهُ عَن مَّن يَشَاءُ ۖ يَكَادُ سَنَا بَرْقِهِ يَذْهَبُ بِالْأَبْصَارِ ٤٣

ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా)? నిశ్చయంగా అల్లాహ్‌యే మేఘాలను మెల్లమెల్లగా నడుపుతూ, వాటిని ఒక దానితో ఒకటి కలుపుతాడని, ఆ తరువాత వాటిని ప్రోగు చేస్తా డని! ఆ పిదప వాటి నుండి వర్షాన్ని కురిపించేది నీవు చూస్తున్నావు కదా! మరియు ఆయనే ఆకాశంలో ఉన్న కొండల వంటి (మేఘాల) నుండి వడగండ్ల చల్లని (వర్షాన్ని) తాను కోరిన వారిపై కురిపిస్తాడు. మరియు తాను కోరిన వారిని వాటి నుండి తప్పిస్తాడు. వాటి పిడుగు యొక్క మెరుపు కంటి చూపులను దాదాపు హరించేలా ఉంటుంది.

24:44 – يُقَلِّبُ اللَّـهُ اللَّيْلَ وَالنَّهَارَ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِّأُولِي الْأَبْصَارِ ٤٤

అల్లాహ్‌యే రేయింబవళ్ళను మార్చు తున్నాడు. నిశ్చయంగా కన్నులు గలవారికి ఇందులో గుణపాఠముంది.

24:45 – وَاللَّـهُ خَلَقَ كُلَّ دَابَّةٍ مِّن مَّاءٍ ۖ فَمِنْهُم مَّن يَمْشِي عَلَىٰ بَطْنِهِ وَمِنْهُم مَّن يَمْشِي عَلَىٰ رِجْلَيْنِ وَمِنْهُم مَّن يَمْشِي عَلَىٰ أَرْبَعٍ ۚ يَخْلُقُ اللَّـهُ مَا يَشَاءُ ۚ إِنَّ اللَّـهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٤٥

మరియు అల్లాహ్‌ ప్రతి ప్రాణిని నీటి నుండి సృష్టించాడు. 27 వాటిలోకొన్ని తమ కడుపు మీద ప్రాకేవి ఉన్నాయి మరియు వాటిలో కొన్ని రెండు కాళ్ళ మీద నడిచేవి ఉన్నాయి మరియు వాటిలో మరికొన్ని నాలుగు (కాళ్ళ) మీద నడిచేవి ఉన్నాయి. అల్లాహ్‌ తానుకోరినదానిని సృష్టిస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రతీదిచేయగల సమర్థుడు.

24:46 – لَّقَدْ أَنزَلْنَا آيَاتٍ مُّبَيِّنَاتٍ ۚ وَاللَّـهُ يَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ٤٦

వాస్తవంగా! మేము సుస్పష్టమైన సూచన (ఆయాత్‌) లను అవతరింపజేశాము. 28 . మరియు అల్లాహ్‌ తాను కోరిన వానికి ఋజు మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.

24:47 – وَيَقُولُونَ آمَنَّا بِاللَّـهِ وَبِالرَّسُولِ وَأَطَعْنَا ثُمَّ يَتَوَلَّىٰ فَرِيقٌ مِّنْهُم مِّن بَعْدِ ذَٰلِكَ ۚ وَمَا أُولَـٰئِكَ بِالْمُؤْمِنِينَ ٤٧

వారు (కపటవిశ్వాసులు) అంటారు: “మేము అల్లాహ్‌ను మరియు సందేశహరుణ్ణి విశ్వసించాము మరియు విధేయులమయ్యాము.” కాని దాని తరువాత వారిలో ఒక వర్గం వారు వెనుదిరిగిపోతారు. మరియు అలాంటి వారు విశ్వసించినవారు కారు.

24:48 – وَإِذَا دُعُوا إِلَى اللَّـهِ وَرَسُولِهِ لِيَحْكُمَ بَيْنَهُمْ إِذَا فَرِيقٌ مِّنْهُم مُّعْرِضُونَ ٤٨

మరియు వారి మధ్య తీర్పుచేయటానికి, వారిని అల్లాహ్‌ మరియు ఆయన సందేశహరుని వద్దకు పిలిచినప్పుడు, వారిలోని ఒక వర్గం వారు ముఖం త్రిప్పుకుంటారు.

24:49 – وَإِن يَكُن لَّهُمُ الْحَقُّ يَأْتُوا إِلَيْهِ مُذْعِنِينَ ٤٩

మరియు ఒకవేళ తీర్పు (సత్యం) వారికి అనుకూలమైనదిగా ఉంటే, వారు వినమ్రతతో దానిని స్వీకరిస్తారు. 29

24:50 – أَفِي قُلُوبِهِم مَّرَضٌ أَمِ ارْتَابُوا أَمْ يَخَافُونَ أَن يَحِيفَ اللَّـهُ عَلَيْهِمْ وَرَسُولُهُ ۚ بَلْ أُولَـٰئِكَ هُمُ الظَّالِمُونَ ٥٠

ఏమీ? వారి హృదయాలలో రోగముందా? లేక వారు సందేహంలో పడిపోయారా? లేక అల్లాహ్‌ మరియు ఆయన సందేశహరుడు తమకు న్యాయం చేయరని వారికి భయమా? అలా కాదు! అసలు వారే అన్యాయపరులు.

24:51 – إِنَّمَا كَانَ قَوْلَ الْمُؤْمِنِينَ إِذَا دُعُوا إِلَى اللَّـهِ وَرَسُولِهِ لِيَحْكُمَ بَيْنَهُمْ أَن يَقُولُوا سَمِعْنَا وَأَطَعْنَا ۚ وَأُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ٥١

కాని వాస్తవానికి ఒకవేళ విశ్వాసులను, వారి మధ్య తీర్పుచేయటానికి అల్లాహ్‌ మరియు ఆయన సందేశహరుని వద్దకు పిలిచినప్పుడు, వారి పలుకులు కేవలం ఇలాగే ఉంటాయి: “మేము విన్నాము మరియు విధేయత చూపాము.” మరియు ఇలాంటి వారే సాఫల్యం పొందేవారు.

24:52 – وَمَن يُطِعِ اللَّـهَ وَرَسُولَهُ وَيَخْشَ اللَّـهَ وَيَتَّقْهِ فَأُولَـٰئِكَ هُمُ الْفَائِزُونَ ٥٢

మరియు అల్లాహ్‌కు మరియు ఆయన సందేశహరునికి విధేయత చూపేవారు మరియు అల్లాహ్‌కు భయపడి, ఆయన యందు భయ-భక్తులు కలిగిఉండే వారు, ఇలాంటి వారే సాఫల్యం (విజయం) పొందే వారు. (3/4)

24:53 – وَأَقْسَمُوا بِاللَّـهِ جَهْدَ أَيْمَانِهِمْ لَئِنْ أَمَرْتَهُمْ لَيَخْرُجُنَّ ۖ قُل لَّا تُقْسِمُوا ۖ طَاعَةٌ مَّعْرُوفَةٌ ۚ إِنَّ اللَّـهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ ٥٣

  • మరియు నీవు ఒకవేళ ఆజ్ఞాపిస్తే, అంతా వదలి తప్పక బయలుదేరగలమని వారు (ఆ కపట-విశ్వాసులు) అల్లాహ్‌ పేరుతో గట్టి ప్రమాణాలు చేస్తారు. వారితో అను: “ప్రమాణాలు చేయకండి; మీ విధేయత తెలిసిందే. నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు!”

24:54 – قُلْ أَطِيعُوا اللَّـهَ وَأَطِيعُوا الرَّسُولَ ۖ فَإِن تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْهِ مَا حُمِّلَ وَعَلَيْكُم مَّا حُمِّلْتُمْ ۖ وَإِن تُطِيعُوهُ تَهْتَدُوا ۚ وَمَا عَلَى الرَّسُولِ إِلَّا الْبَلَاغُ الْمُبِينُ ٥٤

వారితో అను: “అల్లాహ్‌కు విధేయులై ఉండండి మరియు సందేశహరుణ్ణి అనుసరించండి. కాని ఒకవేళ మీరు మరలిపోతే, అతనిపై (ప్రవక్తపై) విధించబడిన దానిబాధ్యత అతనిది; 30 మరియు మీపై విధించబడినదాని బాధ్యత మీది. 31 అతనిని (ప్రవక్తను) అనుసరిస్తే మార్గదర్శకత్వం పొందుతారు. మరియు సందేశహరుని బాధ్యత కేవలం స్పష్టంగా సందేశాన్ని అందజేయటం మాత్రమే.” 32

24:55 – وَعَدَ اللَّـهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَعَمِلُوا الصَّالِحَاتِ لَيَسْتَخْلِفَنَّهُمْ فِي الْأَرْضِ كَمَا اسْتَخْلَفَ الَّذِينَ مِن قَبْلِهِمْ وَلَيُمَكِّنَنَّ لَهُمْ دِينَهُمُ الَّذِي ارْتَضَىٰ لَهُمْ وَلَيُبَدِّلَنَّهُم مِّن بَعْدِ خَوْفِهِمْ أَمْنًا ۚ يَعْبُدُونَنِي لَا يُشْرِكُونَ بِي شَيْئًا ۚ وَمَن كَفَرَ بَعْدَ ذَٰلِكَ فَأُولَـٰئِكَ هُمُ الْفَاسِقُونَ ٥٥

మరియు మీలో విశ్వసించి సత్కార్యాలు చేసేవారితో: వారికి పూర్వంవారిని భూమికి ఉత్త రాధికారులుగా చేసినట్లు, వారిని కూడా ఉత్తరాది కారులుగా చేస్తానని; మరియు వారి కొరకు తాను సమ్మతించిన ధర్మాన్ని (ఇస్లాంను) స్థిరపరుస్తానని; మరియు వారి పూర్వపు భయస్థితిని వారికొరకు శాంతిస్థితిగా మార్చుతానని, అల్లాహ్‌ వాగ్దానం చేశాడు. 33 (ఇదంతా) వారు నన్నే (అల్లాహ్‌నే) ఆరాధించాలని మరియు నాకు ఎవరినీ సాటిగా (భాగ-స్వాములుగా) కల్పించరాదని. మరియు దీని తరువాత కూడా ఎవరైనా సత్య-తిరస్కారా నికి పాల్పడితే అలాంటివారు, వారే అవిధేయులు.

24:56 – وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَأَطِيعُوا الرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ ٥٦

మరియు మీరు కరుణించబడాలి అంటే నమా’జ్‌ను స్థాపించండి, విధిదానం (‘జకాత్‌) ఇవ్వండి మరియు సందేశహరునికి విధేయులై ఉండండి!

24:57 – لَا تَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا مُعْجِزِينَ فِي الْأَرْضِ ۚ وَمَأْوَاهُمُ النَّارُ ۖ وَلَبِئْسَ الْمَصِيرُ ٥٧

సత్య-తిరస్కారులు భూమిలో తప్పించు కుంటారని భావించవద్దు. వారి నివాసం నరకాగ్ని యే! అది ఎంత అధ్వాన్నమైన గమ్యస్థానం.

24:58 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لِيَسْتَأْذِنكُمُ الَّذِينَ مَلَكَتْ أَيْمَانُكُمْ وَالَّذِينَ لَمْ يَبْلُغُوا الْحُلُمَ مِنكُمْ ثَلَاثَ مَرَّاتٍ ۚ مِّن قَبْلِ صَلَاةِ الْفَجْرِ وَحِينَ تَضَعُونَ ثِيَابَكُم مِّنَ الظَّهِيرَةِ وَمِن بَعْدِ صَلَاةِ الْعِشَاءِ ۚ ثَلَاثُ عَوْرَاتٍ لَّكُمْ ۚ لَيْسَ عَلَيْكُمْ وَلَا عَلَيْهِمْ جُنَاحٌ بَعْدَهُنَّ ۚ طَوَّافُونَ عَلَيْكُم بَعْضُكُمْ عَلَىٰ بَعْضٍ ۚ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّـهُ لَكُمُ الْآيَاتِ ۗ وَاللَّـهُ عَلِيمٌ حَكِيمٌ ٥٨

ఓ విశ్వాసులారా! మీ బానిసలు మరియు యుక్త వయస్సుకు చేరని మీ పిల్లలు, మూడు సమయాలలో అనుమతి తీసుకొనే మీ వద్దకు రావాలి. (అవి) ఉదయపు (ఫజ్ర్‌) నమా’జ్‌కు ముందు మధ్యాహ్నం (“జుహ్ర్‌) తరువాత – మీరు మీ వస్త్రాలు విడిచి ఉన్నప్పుడు – మరియు రాత్రి (‘ఇషా) నమా’జ్‌ తరువాత. ఈ మూడు, మీ కొరకు ఏకాంత (పరదా) సమయాలు. వీటి తరువాత వారు మరియు మీరు ఒకరి వద్దకు మరొకరు వచ్చి పోతూ వుంటే, వారిపై గానీ, మీపై గానీ ఎలాంటి దోషం లేదు. ఈ విధంగా అల్లాహ్‌ మీకు తన ఆజ్ఞలను విశదీక రిస్తున్నాడు. అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

24:59 – وَإِذَا بَلَغَ الْأَطْفَالُ مِنكُمُ الْحُلُمَ فَلْيَسْتَأْذِنُوا كَمَا اسْتَأْذَنَ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّـهُ لَكُمْ آيَاتِهِ ۗ وَاللَّـهُ عَلِيمٌ حَكِيمٌ ٥٩

మరియు మీ పిల్లలు యుక్తవయస్సుకు చేరుకున్నప్పుడు; వారికంటే పెద్దవారు (ముందు వారు) అనుమతి తీసుకున్నట్లు వారుకూడా అనుమతి తీసుకోవాలి. ఈ విధంగా అల్లాహ్‌ మీకు తన ఆజ్ఞలను విశదీకరిస్తున్నాడు. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

24:60 – وَالْقَوَاعِدُ مِنَ النِّسَاءِ اللَّاتِي لَا يَرْجُونَ نِكَاحًا فَلَيْسَ عَلَيْهِنَّ جُنَاحٌ أَن يَضَعْنَ ثِيَابَهُنَّ غَيْرَ مُتَبَرِّجَاتٍ بِزِينَةٍ ۖ وَأَن يَسْتَعْفِفْنَ خَيْرٌ لَّهُنَّ ۗ وَاللَّـهُ سَمِيعٌ عَلِيمٌ ٦٠

మరియు ఋతుస్రావం ఆగిపోయి, వివాహ ఉత్సాహంలేని స్త్రీలు – తమ సౌందర్యం బయట పడకుండా ఉండేటట్లుగా – తమపై వస్త్రాలను (దుప్పట్లను) తీసివేస్తే, వారిపై దోషం లేదు. కాని వారు అట్లు చేయకుండా ఉండటమే వారికి ఉత్తమమైనది. 34 మరియు అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

24:61 – لَّيْسَ عَلَى الْأَعْمَىٰ حَرَجٌ وَلَا عَلَى الْأَعْرَجِ حَرَجٌ وَلَا عَلَى الْمَرِيضِ حَرَجٌ وَلَا عَلَىٰ أَنفُسِكُمْ أَن تَأْكُلُوا مِن بُيُوتِكُمْ أَوْ بُيُوتِ آبَائِكُمْ أَوْ بُيُوتِ أُمَّهَاتِكُمْ أَوْ بُيُوتِ إِخْوَانِكُمْ أَوْ بُيُوتِ أَخَوَاتِكُمْ أَوْ بُيُوتِ أَعْمَامِكُمْ أَوْ بُيُوتِ عَمَّاتِكُمْ أَوْ بُيُوتِ أَخْوَالِكُمْ أَوْ بُيُوتِ خَالَاتِكُمْ أَوْ مَا مَلَكْتُم مَّفَاتِحَهُ أَوْ صَدِيقِكُمْ ۚ لَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَأْكُلُوا جَمِيعًا أَوْ أَشْتَاتًا ۚ فَإِذَا دَخَلْتُم بُيُوتًا فَسَلِّمُوا عَلَىٰ أَنفُسِكُمْ تَحِيَّةً مِّنْ عِندِ اللَّـهِ مُبَارَكَةً طَيِّبَةً ۚ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّـهُ لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَعْقِلُونَ ٦١

అంధుని మీద నిందలేదు మరియు కుంటి వాని మీద నిందలేదు మరియు రోగిమీద నింద లేదు మరియు మీ మీద కూడా నిందలేదు: ఒక వేళ మీరు మీ ఇండ్లలో లేదా మీ తండ్రి-తాతల ఇండ్లలో లేదా మీ తల్లి నాయ-నమ్మల ఇండ్లలో లేదా మీ సోదరుల ఇండ్లలో లేదా మీ సోదరీమణుల ఇండ్లలో లేదా పిన-తండ్రుల (తండ్రి-సోదరుల) ఇండ్లలో లేదా మీ మేనత్తల (తండ్రి-సోదరీమణుల) ఇండ్లలో లేదా మీ మేనమామల (తల్లి-సోదరుల) ఇండ్లలో లేదా మీ పిన్నమ్మల (తల్లి-సోదరీ మణుల) ఇండ్లలో లేదా మీ ఆధీనంలో తాళపు చెవులు ఉన్నవారి ఇండ్లలో లేదా మీ స్నేహితుల ఇండ్లలో తింటే! మీరు అందరితో కలిసితిన్నా లేదా వేరుగా తిన్నా కూడా మీపై నిందలేదు. అయితే మీరు ఇండ్లలోనికి ప్రవేశించినపుడు, మీరు ఒకరికొకరు సలాం చేసుకోవాలి. ఇది అల్లాహ్‌ తరఫు నుండి నిర్ణయించబడిన దీవన, శుభప్రద మైనది మేలైనది. ఈ విధంగా అల్లాహ్‌ – మీరు అర్థం చేసుకుంటారని – తన ఆజ్ఞలను మీకు విశదీకరిస్తున్నాడు.

24:62 – إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ آمَنُوا بِاللَّـهِ وَرَسُولِهِ وَإِذَا كَانُوا مَعَهُ عَلَىٰ أَمْرٍ جَامِعٍ لَّمْ يَذْهَبُوا حَتَّىٰ يَسْتَأْذِنُوهُ ۚ إِنَّ الَّذِينَ يَسْتَأْذِنُونَكَ أُولَـٰئِكَ الَّذِينَ يُؤْمِنُونَ بِاللَّـهِ وَرَسُولِهِ ۚ فَإِذَا اسْتَأْذَنُوكَ لِبَعْضِ شَأْنِهِمْ فَأْذَن لِّمَن شِئْتَ مِنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمُ اللَّـهَ ۚ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ٦٢

అల్లాహ్‌ను ఆయన ప్రవక్తను హృదయ పూర్వకంగా విశ్వసించినవారే నిజమైన విశ్వాసులు మరియు వారు ఏదైనా సామూహిక కార్యం నిమిత్తం అతనితో (దైవప్రవక్తతో) ఉన్నప్పుడు, అతని అనుమతిలేనిదే వెళ్ళిపోకూడదు. నిశ్చయంగా, ఎవరైతే నీతో (ఓ ము’హమ్మద్‌)! అనుమతి అడుగుతారో అలాంటివారే వాస్తవంగా! అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించిన వారు. కనుక వారు తమ ఏపని కొరకైనా అనుమతి అడిగితే, వారిలో నీవు కోరిన వారికి అనుమతినివ్వు. మరియు వారిని క్షమించమని అల్లాహ్‌ను ప్రార్థించు. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

24:63 – لَّا تَجْعَلُوا دُعَاءَ الرَّسُولِ بَيْنَكُمْ كَدُعَاءِ بَعْضِكُم بَعْضًا ۚ قَدْ يَعْلَمُ اللَّـهُ الَّذِينَ يَتَسَلَّلُونَ مِنكُمْ لِوَاذًا ۚ فَلْيَحْذَرِ الَّذِينَ يُخَالِفُونَ عَنْ أَمْرِهِ أَن تُصِيبَهُمْ فِتْنَةٌ أَوْ يُصِيبَهُمْ عَذَابٌ أَلِيمٌ ٦٣

(ఓ విశ్వాసులారా!) సందేశహరుని పిలుపును మీరు, మీలో ఒకరినొకరు పిలుచుకునే పిలుపుగా భావించకండి. మీలో ఒకరి చాటున ఒకరు దాక్కుంటూ మెల్లగా జారిపోయేవారిని గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు. 35 దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించేవారు, తాము ఏదైనా ఆపదలో చిక్కుకు పోతారేమోననీ లేదా బాధాకరమైన శిక్షకు గురిచేయబడతారేమోనని భయపడాలి.

24:64 – أَلَا إِنَّ لِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ قَدْ يَعْلَمُ مَا أَنتُمْ عَلَيْهِ وَيَوْمَ يُرْجَعُونَ إِلَيْهِ فَيُنَبِّئُهُم بِمَا عَمِلُوا ۗ وَاللَّـهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ٦٤

వినండి! నిశ్చయంగా, ఆకాశాలలో మరియు భూమిలో నున్న సమస్తమూ అల్లాహ్‌దే! మీ స్థితి ఆయనకు బాగా తెలుసు మరియు అందరూ ఆయన వద్దకు మరలింపబడిన రోజు, వారు చేసివచ్చిన కర్మలన్నీ ఆయన వారికి తెలియజేస్తాడు. మరియు అల్లాహ్‌కు ప్రతిదానిని గురించి పూర్తి జ్ఞానముంది. (7/8)

సూరహ్‌ అల్‌-ఫుర్ఖాన్‌ – అల్‌-పుర్ఖాన్‌: గీటురాయి, ప్రమాణం. ఈ సూరహ్‌ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకో బడింది. ఇందులో 77 ఆయతులున్నాయి. ఇది దైవప్రవక్త (‘స’అస) ధర్మప్రచారం ఆరంభించిన 5-6 సంవత్సరాల తరువాత మక్కహ్లో అవతరింపజేయబడింది. ప్రతిప్రవక్త మానవుడే (ఆయత్‌ -20). అల్‌-ఫుర్ఖాన్‌ అంటే సత్యా-సత్యాలను వేరుచేసే గీటురాయి లేక ప్రమాణం, అంటే ఈ ఖుర్‌ఆన్‌. ఇది సత్యా-సత్యాలను, న్యాయ-అన్యాయాలను, ఏక-బహు దైవారాధనలను విశదీకరిస్తుంది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 25:1 – تَبَارَكَ الَّذِي نَزَّلَ الْفُرْقَانَ عَلَىٰ عَبْدِهِ لِيَكُونَ لِلْعَالَمِينَ نَذِيرًا ١

సర్వలోకాలకు హెచ్చరికచేసేదిగా, ఈ గీటురాయిని (ఫుర్ఖాన్‌ను) తన దాసునిపై క్రమక్రమంగా అవతరింపజేసిన ఆయన (అల్లాహ్‌) ఎంతో శుభ దాయకుడు. 1

25:2 – الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَمْ يَتَّخِذْ وَلَدًا وَلَمْ يَكُن لَّهُ شَرِيكٌ فِي الْمُلْكِ وَخَلَقَ كُلَّ شَيْءٍ فَقَدَّرَهُ تَقْدِيرًا ٢

భూమ్యాకాశాల విశ్వ సామ్రాజ్యాధిపత్యం ఆయనకే చెందుతుంది. ఆయన ఎవ్వరినీ సంతానంగా చేసుకోలేదు. 2 విశ్వసామ్రాజ్యాధి పత్యంలో ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. మరియు ఆయన ప్రతిదానిని సృష్టించి, దానికొక విధిని నిర్ణయించాడు. 3

25:3 – وَاتَّخَذُوا مِن دُونِهِ آلِهَةً لَّا يَخْلُقُونَ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ وَلَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ ضَرًّا وَلَا نَفْعًا وَلَا يَمْلِكُونَ مَوْتًا وَلَا حَيَاةً وَلَا نُشُورًا ٣

అయినా వారు ఆయనకు బదులుగా, ఏమీ సృష్టించలేని మరియు తామే సృష్టింపబడినవారిని ఆరాధ్యదైవాలుగాచేసుకున్నారు. మరియు వారు తమకుతాము ఎట్టి నష్టంగానీ, లాభంగానీ చేసుకో జాలరు. మరియు వారికి మరణం మీదగానీ, జీవితం మీదగానీ మరియు పునరుత్థానదినం మీదగానీ, ఎలాంటి అధికారం లేదు.

25:4 – وَقَالَ الَّذِينَ كَفَرُوا إِنْ هَـٰذَا إِلَّا إِفْكٌ افْتَرَاهُ وَأَعَانَهُ عَلَيْهِ قَوْمٌ آخَرُونَ ۖ فَقَدْ جَاءُوا ظُلْمًا وَزُورًا ٤

మరియు సత్యతిరస్కారులు ఇలాఅంటారు: “ఇది (ఈ ఖుర్‌ఆన్‌) కేవలం ఒక బూటక కల్పన; దీనిని ఇతనే కల్పించాడు. మరియు ఇతర జాతి వారు కొందరు, ఇతనికి ఈ పనిలో సహాయ పడ్డారు. 4 కాని వాస్తవానికి వారు అన్యాయానికి మరియు అబద్ధానికి పూనుకున్నారు.”

25:5 – وَقَالُوا أَسَاطِيرُ الْأَوَّلِينَ اكْتَتَبَهَا فَهِيَ تُمْلَىٰ عَلَيْهِ بُكْرَةً وَأَصِيلًا ٥

మరియు వారు ఇంకా ఇలా అంటారు: “ఇవి పూర్వీకుల గాథలు, వాటిని ఇతను వ్రాసు కున్నాడు, ఇవి ఇతనికి ఉదయం మరియు సాయంత్రం చెప్పి వ్రాయించబడుతున్నాయి.” 5

25:6 – قُلْ أَنزَلَهُ الَّذِي يَعْلَمُ السِّرَّ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ إِنَّهُ كَانَ غَفُورًا رَّحِيمًا ٦

వారితో ఇలా అను: “దీనిని (ఈ ఖుర్‌ఆన్‌ ను) భూమ్యాకాశాల రహస్యాలు తెలిసిన వాడు అవతరింపజేశాడు. నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.”

25:7 – وَقَالُوا مَالِ هَـٰذَا الرَّسُولِ يَأْكُلُ الطَّعَامَ وَيَمْشِي فِي الْأَسْوَاقِ ۙ لَوْلَا أُنزِلَ إِلَيْهِ مَلَكٌ فَيَكُونَ مَعَهُ نَذِيرًا ٧

మరియు వారిలా అంటారు: “ఇతను ఎటువంటి సందేశహరుడు, (సాధారణ వ్యక్తివలే) ఇతనూ అన్నం తింటున్నాడు మరియు వీధులలో తిరుగుతున్నాడు? (ఇతను వాస్తవం గానే దైవప్రవక్త అయితే) ఇతనికి తోడుగా హెచ్చరిక చేసేవాడిగా, ఒక దేవదూత ఎందుకు అవతరింపజేయబడలేదు? 6

25:8 – أَوْ يُلْقَىٰ إِلَيْهِ كَنزٌ أَوْ تَكُونُ لَهُ جَنَّةٌ يَأْكُلُ مِنْهَا ۚ وَقَالَ الظَّالِمُونَ إِن تَتَّبِعُونَ إِلَّا رَجُلًا مَّسْحُورًا ٨

“లేదా ఇతనికొక నిధి ఎందుకు ఇవ్వబడ లేదు? లేదా ఇతనికొక తోట ఎందుకు ఇవ్వబడ లేదు? ఇతను దాని నుండి తినటానికి!” ఆ దుర్మార్గులు ఇంకా ఇలా అంటారు: “మీరు కేవలం ఒక మంత్రజాలానికి గురిఅయిన మానవుణ్ణి అనుసరిస్తున్నారు.”

25:9 – انظُرْ كَيْفَ ضَرَبُوا لَكَ الْأَمْثَالَ فَضَلُّوا فَلَا يَسْتَطِيعُونَ سَبِيلًا ٩

(ఓ ప్రవక్తా!) చూడు వారు నిన్ను గురించి ఎటువంటి ఉదాహరణలు ఇస్తున్నారు! వారు మార్గభ్రష్టులై పోయారు, వారు ఋజుమార్గం పొందజాలరు.

25:10 – تَبَارَكَ الَّذِي إِن شَاءَ جَعَلَ لَكَ خَيْرًا مِّن ذَٰلِكَ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ وَيَجْعَل لَّكَ قُصُورًا ١٠

ఆ శుభదాయకుడు కోరితే, నీకు వాటి కంటే, ఉత్తమమైన వాటిని ప్రసాదించగలడు – స్వర్గవనాలు – వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి మరియు అక్కడ నీ కొరకు పెద్దకోటలు కూడా ఉంటాయి.

25:11 – بَلْ كَذَّبُوا بِالسَّاعَةِ ۖ وَأَعْتَدْنَا لِمَن كَذَّبَ بِالسَّاعَةِ سَعِيرًا ١١

వాస్తవానికి వారు ఆ అంతిమ ఘడియను అబద్ధమని తిరస్కరించారు. మరియు ఆ అంతిమ ఘడియను అబద్ధమని తిరస్కరించే వారికొరకు మేము జ్వలించే నరకాగ్నిని సిద్ధ పరచి ఉంచాము.

25:12 – إِذَا رَأَتْهُم مِّن مَّكَانٍ بَعِيدٍ سَمِعُوا لَهَا تَغَيُّظًا وَزَفِيرًا ١٢

అది, దూరం నుండి వారిని చూసినప్పుడు వారు దాని ఆవేశ ధ్వనులను మరియు దాని బుసను వింటారు. 7

25:13 – وَإِذَا أُلْقُوا مِنْهَا مَكَانًا ضَيِّقًا مُّقَرَّنِينَ دَعَوْا هُنَالِكَ ثُبُورًا ١٣

మరియు దానిలోని ఒక ఇరుకైన స్థలంలో వారు బంధింపబడి, త్రోయబడినప్పుడు వారక్కడ తమ చావును పిలువడం ప్రారంభిస్తారు. 8

25:14 – لَّا تَدْعُوا الْيَوْمَ ثُبُورًا وَاحِدًا وَادْعُوا ثُبُورًا كَثِيرًا ١٤

(వారితో అనబడుతుంది): “ఈ రోజు మీరు ఒక్క చావును పిలువకండి, ఎన్నో చావుల కొరకు అరవండి!”

25:15 – قُلْ أَذَٰلِكَ خَيْرٌ أَمْ جَنَّةُ الْخُلْدِ الَّتِي وُعِدَ الْمُتَّقُونَ ۚ كَانَتْ لَهُمْ جَزَاءً وَمَصِيرًا ١٥

వారితో అను: “ఏమీ? ఇది మంచిదా, లేక దైవభీతి గలవారికి వాగ్దానం చేయబడిన శాశ్వత మైన స్వర్గమా? అదే (దైవభీతి గల) వారి ప్రతి ఫలం మరియు గమ్యస్థానం.

25:16 – لَّهُمْ فِيهَا مَا يَشَاءُونَ خَالِدِينَ ۚ كَانَ عَلَىٰ رَبِّكَ وَعْدًا مَّسْئُولًا ١٦

అందులో వారికి వారు కోరింది లభిస్తుంది. వారందు శాశ్వతంగా వుంటారు. ఇది నీప్రభువు కర్తవ్యంతో పూర్తిచేయవలసిన వాగ్దానం.

25:17 – وَيَوْمَ يَحْشُرُهُمْ وَمَا يَعْبُدُونَ مِن دُونِ اللَّـهِ فَيَقُولُ أَأَنتُمْ أَضْلَلْتُمْ عِبَادِي هَـٰؤُلَاءِ أَمْ هُمْ ضَلُّوا السَّبِيلَ ١٧

మరియు ఆయన (అల్లాహ్‌) వారిని (సత్య తిరస్కారులను) మరియు అల్లాహ్‌కు బదులుగా వారు ఆరాధించేవారిని, అందరినీ, ఆ రోజు సమావేశ పరచి వారితో ఇలా అంటాడు: “ఏమీ? మీరేనా నా దాసులను మార్గం తప్పించిన వారు? లేక స్వయంగా వారే మార్గభ్రష్టులయ్యారా?”

25:18 – قَالُوا سُبْحَانَكَ مَا كَانَ يَنبَغِي لَنَا أَن نَّتَّخِذَ مِن دُونِكَ مِنْ أَوْلِيَاءَ وَلَـٰكِن مَّتَّعْتَهُمْ وَآبَاءَهُمْ حَتَّىٰ نَسُوا الذِّكْرَ وَكَانُوا قَوْمًا بُورًا ١٨

వారంటారు: “ఓ మా ప్రభూ! నీవు సర్వ లోపాలకు అతీతుడవు! మేము నిన్ను వదలి ఇతరులను మా సంరక్షకులుగా చేసుకోవటం మాకు తగినది కాదు, కాని నీవు వారికి మరియు వారి తండ్రి-తాతలకు చాలా సుఖసంతోషాలను ప్రసాదించావు, చివరకు వారు నీ బోధననే మరచి పోయి నాశనానికి గురిఅయిన వారయ్యారు.”

25:19 – فَقَدْ كَذَّبُوكُم بِمَا تَقُولُونَ فَمَا تَسْتَطِيعُونَ صَرْفًا وَلَا نَصْرًا ۚ وَمَن يَظْلِم مِّنكُمْ نُذِقْهُ عَذَابًا كَبِيرًا ١٩

(అప్పుడు అల్లాహ్‌ అంటాడు): “కాని ఇప్పుడైతే వారు, మీ మాటలను అసత్యాలని తిరస్కరిస్తున్నారు. ఇక మీరు మీ శిక్ష నుండి తప్పించుకోలేరు మరియు ఎలాంటి సహాయమూ పొందలేరు. మరియు మీలో దుర్మార్గానికి పాల్ప డిన వానికి మేము ఘోరశిక్ష రుచి చూపుతాము!”

25:20 – وَمَا أَرْسَلْنَا قَبْلَكَ مِنَ الْمُرْسَلِينَ إِلَّا إِنَّهُمْ لَيَأْكُلُونَ الطَّعَامَ وَيَمْشُونَ فِي الْأَسْوَاقِ ۗ وَجَعَلْنَا بَعْضَكُمْ لِبَعْضٍ فِتْنَةً أَتَصْبِرُونَ ۗ وَكَانَ رَبُّكَ بَصِيرًا ٢٠

మరియు (ఓ ము’హమ్మద్‌!) మేము నీకు పూర్వం పంపిన సందేశహరులు అందరూ నిశ్చయంగా, ఆహారం తినేవారే, వీధులలో సంచ రించే వారే. మరియు మేము మిమ్మల్ని ఒకరిని మరొకరి కొరకు పరీక్షాసాధనాలుగా చేశాము; ఏమీ? మీరు 9 సహనం వహిస్తారా? మరియు వాస్తవానికి, నీ ప్రభువు సర్వం చూసేవాడు. 10

25:21 – وَقَالَ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا لَوْلَا أُنزِلَ عَلَيْنَا الْمَلَائِكَةُ أَوْ نَرَىٰ رَبَّنَا ۗ لَقَدِ اسْتَكْبَرُوا فِي أَنفُسِهِمْ وَعَتَوْا عُتُوًّا كَبِيرًا ٢١

[(*)] మరియు మమ్మల్నికలుసుకోవలసి ఉందని ఆశించని వారు ఇలా అన్నారు: “దేవ దూతలు మా వద్దకు ఎందుకు పంపబడలేదు? లేదా మేము మా ప్రభువును ఎందుకు చూడలేము?” వాస్తవానికి వారు తమను తాము చాలా గొప్పవారిగా భావించారు మరియు వారు తలబిరుసుతనంలో చాలా మితిమీరిపోయారు. 11

25:22 – يَوْمَ يَرَوْنَ الْمَلَائِكَةَ لَا بُشْرَىٰ يَوْمَئِذٍ لِّلْمُجْرِمِينَ وَيَقُولُونَ حِجْرًا مَّحْجُورًا ٢٢

ఆ రోజు 12 వారు దేవదూతలను చూస్తారు; ఆ రోజు అపరాధులకు ఎలాంటి శుభవార్తలు ఉండవు మరియు వారు (దేవదూతలు) ఇలా అంటారు: “మీకు శుభవార్తలన్నీ ఖచ్చితంగా నిషేధించబడ్డాయి.”

25:23 – وَقَدِمْنَا إِلَىٰ مَا عَمِلُوا مِنْ عَمَلٍ فَجَعَلْنَاهُ هَبَاءً مَّنثُورًا ٢٣

మరియు మేము, వారు (అవిశ్వాసులు) చేసిన కార్యాలవైపుకు మరలుతాము, తరువాత వాటిని సూక్ష్మ కణాలవలే (ధూళివలే) ఎగురవేస్తాము 13

25:24 – أَصْحَابُ الْجَنَّةِ يَوْمَئِذٍ خَيْرٌ مُّسْتَقَرًّا وَأَحْسَنُ مَقِيلًا ٢٤

ఆ దినమున స్వర్గానికి అర్హులైనవారు మంచి నివాసంలో మరియు ఉత్తమ విశ్రాంతి స్థలంలో ఉంటారు.

25:25 – وَيَوْمَ تَشَقَّقُ السَّمَاءُ بِالْغَمَامِ وَنُزِّلَ الْمَلَائِكَةُ تَنزِيلً ٢٥

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు ఆకాశం మేఘాలతో సహా బ్రద్దలు చేయబ డుతుంది. మరియు దేవదూతలు వరుసగా దింపబడతారు. 14

25:26 – الْمُلْكُ يَوْمَئِذٍ الْحَقُّ لِلرَّحْمَـٰنِ ۚ وَكَانَ يَوْمًا عَلَى الْكَافِرِينَ عَسِيرًا ٢٦

ఆ రోజు వాస్తవమైన విశ్వసామ్రాజ్యాధిపత్యం కేవలం ఆ అనంత కరుణామయునిదే! సత్య-తిరస్కారులకు ఆ దినం ఎంతో కఠినమైనదిగా ఉంటుంది.

25:27 – وَيَوْمَ يَعَضُّ الظَّالِمُ عَلَىٰ يَدَيْهِ يَقُولُ يَا لَيْتَنِي اتَّخَذْتُ مَعَ الرَّسُولِ سَبِيلًا ٢٧

మరియు (జ్ఞాపకముంచుకోండి), ఆ దిన మున దుర్మార్గుడు తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: “అయ్యో! నేను సందేశహరుని మార్గం అనుసరిస్తే, ఎంత బాగుండేది!

25:28 – يَا وَيْلَتَىٰ لَيْتَنِي لَمْ أَتَّخِذْ فُلَانًا خَلِيلً ٢٨

“అయ్యో నా దౌర్భాగ్యం! నేను ఫలానా వానిని స్నేహితునిగా చేసుకోకుండా వుంటే ఎంత బాగుండేది! 15

25:29 – لَّقَدْ أَضَلَّنِي عَنِ الذِّكْرِ بَعْدَ إِذْ جَاءَنِي ۗ وَكَانَ الشَّيْطَانُ لِلْإِنسَانِ خَذُولًا ٢٩

“వాస్తవానికి అతడే, హితబోధ (ఖుర్‌ఆన్‌) నా వద్దకు వచ్చిన తరువాత కూడా, నన్ను దాని నుండి తప్పించాడు! వాస్తవానికి షై’తాన్‌ మానవుని యెడల నమ్మకద్రోహి.” 16

25:30 – وَقَالَ الرَّسُولُ يَا رَبِّ إِنَّ قَوْمِي اتَّخَذُوا هَـٰذَا الْقُرْآنَ مَهْجُورًا ٣٠

అప్పుడు సందేశహరుడు ఇలా అంటాడు: “ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నా జాతివారు ఈ ఖుర్‌ఆన్‌ ను పూర్తిగా వదలిపెట్టారు.” 17

25:31 – وَكَذَٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِيٍّ عَدُوًّا مِّنَ الْمُجْرِمِينَ ۗ وَكَفَىٰ بِرَبِّكَ هَادِيًا وَنَصِيرًا ٣١

మరియు ఈ విధంగా మేము అపరాధుల నుండి ప్రతి ప్రవక్తకూ శత్రువులను నియ మించాము. 18 మరియు నీ ప్రభువే, నీకు మార్గ దర్శకుడిగా మరియు సహాయకుడిగా చాలు!

25:32 – وَقَالَ الَّذِينَ كَفَرُوا لَوْلَا نُزِّلَ عَلَيْهِ الْقُرْآنُ جُمْلَةً وَاحِدَةً ۚ كَذَٰلِكَ لِنُثَبِّتَ بِهِ فُؤَادَكَ ۖ وَرَتَّلْنَاهُ تَرْتِيلًا ٣٢

మరియు సత్య-తిరస్కారులు అంటారు: “ఇతని (ము’హమ్మద్‌) మీద ఈ ఖుర్‌ఆన్‌ పూర్తిగా ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు?” మేము (ఈ ఖుర్‌ఆన్‌ ను) ఈ విధంగా (భాగాలుగా పంపింది) నీ హృదయాన్ని దృఢపరచడానికి. మరియు మేము దీనిని క్రమక్రమంగా అవతరింపజేశాము. 19

25:33 – وَلَا يَأْتُونَكَ بِمَثَلٍ إِلَّا جِئْنَاكَ بِالْحَقِّ وَأَحْسَنَ تَفْسِيرًا ٣٣

మరియు వారు నీ వద్దకు (నిన్ను వ్యతిరే కించటానికి) ఎలాంటి ఉపమానాన్ని తెచ్చినా! మేము నీకు దానికి సరైన జవాబు మరియు ఉత్తమమైన వ్యాఖ్యానం ఇవ్వకుండా ఉండము. 20

25:34 – الَّذِينَ يُحْشَرُونَ عَلَىٰ وُجُوهِهِمْ إِلَىٰ جَهَنَّمَ أُولَـٰئِكَ شَرٌّ مَّكَانًا وَأَضَلُّ سَبِيلًا ٣٤

ఎవరైతే, వారి ముఖాల మీద (బోర్లా పడవేయబడి) లాగుతూ నరకంలో కూడబెట్ట బడతారో, అలాంటివారు ఎంతో దుస్థితిలో మరియు మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నవారు. 21

25:35 – وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَجَعَلْنَا مَعَهُ أَخَاهُ هَارُونَ وَزِيرًا ٣٥

మరియు నిశ్చయంగా, మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము మరియు అతని సోదరుడైన హారూన్‌ను అతనికి సహాయకునిగా చేశాము. 22

25:36 – فَقُلْنَا اذْهَبَا إِلَى الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا فَدَمَّرْنَاهُمْ تَدْمِيرًا ٣٦

వారిద్దరితో ఇలా అన్నాము: “మీరిద్దరూ మా సూచనలను అసత్యాలని తిరస్కరించిన జాతివారి వద్దకు వెళ్ళండి.” తరువాత మేము (ఆ జాతి) వారిని పూర్తిగా నాశనంచేశాము.

25:37 – وَقَوْمَ نُوحٍ لَّمَّا كَذَّبُوا الرُّسُلَ أَغْرَقْنَاهُمْ وَجَعَلْنَاهُمْ لِلنَّاسِ آيَةً ۖ وَأَعْتَدْنَا لِلظَّالِمِينَ عَذَابًا أَلِيمًا ٣٧

ఇక నూ’హ్‌ జాతివారు: ఎప్పుడైతే వారు ప్రవక్తలను అసత్యవాదులని తిరస్కరించారో, మేము వారిని ముంచివేసి, సర్వ జనులకు వారిని ఒక సూచనగా చేశాము. మరియు దుర్మార్గుల కొరకు మేము వ్యధాభరితమైన శిక్షను సిధ్ధపరిచి ఉంచాము.

25:38 – وَعَادًا وَثَمُودَ وَأَصْحَابَ الرَّسِّ وَقُرُونًا بَيْنَ ذَٰلِكَ كَثِيرًا ٣٨

మరియు ఇదేవిధంగా ‘ఆద్‌ మరియు స’మూద్‌ మరియు అర్‌-రస్స్‌ 23 ప్రజలు మరియు వారి మధ్య ఎన్నో తరాలవారిని 24 (నాశనం చేశాము).

25:39 – وَكُلًّا ضَرَبْنَا لَهُ الْأَمْثَالَ ۖ وَكُلًّا تَبَّرْنَا تَتْبِيرًا ٣٩

మరియు వారిలో ప్రతి ఒక్కరినీ మేము దృష్టాంతాలను ఇచ్చి నచ్చజెప్పాము. చివరకు ప్రతి ఒక్కరినీ పూర్తిగా నిర్మూలించాము. 25

25:40 – وَلَقَدْ أَتَوْا عَلَى الْقَرْيَةِ الَّتِي أُمْطِرَتْ مَطَرَ السَّوْءِ ۚ أَفَلَمْ يَكُونُوا يَرَوْنَهَا ۚ بَلْ كَانُوا لَا يَرْجُونَ نُشُورًا ٤٠

మరియు మేము దారుణమైన (రాళ్ళ) వర్షం కురిపించిన (లూ’త్‌) నగరం మీద నుండి, వాస్తవానికి వారు (అవిశ్వాసులు) ప్రయాణం చేసి ఉంటారు. ఏమీ? వారు దానిని (దాని స్థితిని) చూడటం లేదా? వాస్తవానికి, వారు తిరిగి బ్రతికించి లేపబడతారని నమ్మలేదు. 26

25:41 – وَإِذَا رَأَوْكَ إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَـٰذَا الَّذِي بَعَثَ اللَّـهُ رَسُولًا ٤١

(ఓ ము’హమ్మద్‌!) వారు నిన్ను చూసి నప్పుడల్లా నిన్ను పరిహాసానికి గురిచేస్తూ ఇలా అంటారు: “ఏమీ? ఇతనినేనా, అల్లాహ్‌ తన సందేశహరునిగా చేసి పంపింది?

25:42 – إِن كَادَ لَيُضِلُّنَا عَنْ آلِهَتِنَا لَوْلَا أَن صَبَرْنَا عَلَيْهَا ۚ وَسَوْفَ يَعْلَمُونَ حِينَ يَرَوْنَ الْعَذَابَ مَنْ أَضَلُّ سَبِيلًا ٤٢

“మేము వాటిపట్ల (మా దేవతలపట్ల) (దృఢ విశ్వాసంమీద) స్థిరంగా ఉండకపోతే, ఇతను మమ్మల్ని మా దేవతల నుండి తప్పించి దూరం చేసేవాడే!” మరియు త్వరలోనే వారు మా శిక్షను చూసినప్పుడు ఎవరు మార్గం తప్పి ఉన్నారో తెలుసుకుంటారు. 27

25:43 – أَرَأَيْتَ مَنِ اتَّخَذَ إِلَـٰهَهُ هَوَاهُ أَفَأَنتَ تَكُونُ عَلَيْهِ وَكِيلًا ٤٣

(ఓ ము’హమ్మద్‌!) ఎవడు తన మనో వాంఛలను తనకు దైవంగా చేసుకొని ఉన్నాడో, అలాంటి వానిని నీవు చూశావా? నీవు అలాంటి వానికి రక్షకుడవు కాగలవా?

25:44 – أَمْ تَحْسَبُ أَنَّ أَكْثَرَهُمْ يَسْمَعُونَ أَوْ يَعْقِلُونَ ۚ إِنْ هُمْ إِلَّا كَالْأَنْعَامِ ۖ بَلْ هُمْ أَضَلُّ سَبِيلً ٤٤

లేక వారిలోని చాలా మంది వింటారని లేదా అర్థంచేసుకుంటారని నీవు భావిస్తున్నావా? అసలు వారు పశువులవంటి వారు. అలాకాదు! వారు వాటికంటే ఎక్కువ దారితప్పిన వారు.

25:45 – أَلَمْ تَرَ إِلَىٰ رَبِّكَ كَيْفَ مَدَّ الظِّلَّ وَلَوْ شَاءَ لَجَعَلَهُ سَاكِنًا ثُمَّ جَعَلْنَا الشَّمْسَ عَلَيْهِ دَلِيلً ٤٥

ఏమీ? నీవు చూడటంలేదా? నీ ప్రభువు! ఏ విధంగా ఛాయను పొడిగిస్తాడో? ఒకవేళ ఆయన కోరితే, దానిని నిలిపివేసి ఉండేవాడు, కాని మేము సూర్యుణ్ణి దానికి మార్గదర్శిగా చేశాము.

25:46 – ثُمَّ قَبَضْنَاهُ إِلَيْنَا قَبْضًا يَسِيرًا ٤٦

తరువాత మేము దానిని (ఆ నీడను) క్రమక్రమంగా మావైపునకు లాక్కుంటాము.

25:47 – وَهُوَ الَّذِي جَعَلَ لَكُمُ اللَّيْلَ لِبَاسًا وَالنَّوْمَ سُبَاتًا وَجَعَلَ النَّهَارَ نُشُورًا ٤٧

మరియు ఆయన (అల్లాహ్‌)యే మీ కొరకు రాత్రిని వస్త్రంగానూ (తెరగానూ), నిద్రను విశ్రాంతి స్థితిగానూ మరియు పగటిని తిరిగి బ్రతికించి లేపబడే (జీవనోపాధి) సమయంగానూ చేశాడు.

25:48 – وَهُوَ الَّذِي أَرْسَلَ الرِّيَاحَ بُشْرًا بَيْنَ يَدَيْ رَحْمَتِهِ ۚ وَأَنزَلْنَا مِنَ السَّمَاءِ مَاءً طَهُورًا ٤٨

మరియు ఆయనయే (అల్లాహ్‌ యే) తన కారుణ్యానికి ముందు గాలులను శుభవార్తలుగా పంపేవాడు. మరియు మేమే ఆకాశం నుండి నిర్మలమైన నీటిని కురిపించే వారము.

25:49 – لِّنُحْيِيَ بِهِ بَلْدَةً مَّيْتًا وَنُسْقِيَهُ مِمَّا خَلَقْنَا أَنْعَامًا وَأَنَاسِيَّ كَثِيرًا ٤٩

దాని ద్వారా ఒక మృత ప్రదేశానికి ప్రాణం పోయటానికి మరియు దానిని మేము సృష్టించిన ఎన్నో పశువులకు మరియు మానవులకు త్రాగటానికీ!

25:50 – وَلَقَدْ صَرَّفْنَاهُ بَيْنَهُمْ لِيَذَّكَّرُوا فَأَبَىٰ أَكْثَرُ النَّاسِ إِلَّا كُفُورًا ٥٠

మరియు వాస్తవానికి, మేము దానిని (నీటిని) వారిమధ్య పంచాము, వారు (మా అనుగ్రహాన్ని) జ్ఞాపకముంచుకోవాలని; కానీ మానవులలో చాలామంది దీనిని తిరస్కరించి, కృతఘ్నులవుతున్నారు.

25:51 – وَلَوْ شِئْنَا لَبَعَثْنَا فِي كُلِّ قَرْيَةٍ نَّذِيرًا ٥١

మరియు మేము తలుచుకుంటే, ప్రతి నగరానికొక హెచ్చరిక చేసేవానిని (ప్రవక్తను) పంపి ఉండేవారము.

25:52 – فَلَا تُطِعِ الْكَافِرِينَ وَجَاهِدْهُم بِهِ جِهَادًا كَبِيرًا ٥٢

కావున నీవు (ఓ ప్రవక్తా!) సత్య-తిరస్కారుల అభిప్రాయాన్ని లక్ష్యపెట్టకు మరియు దీని (ఈ ఖుర్‌ఆన్‌) సహాయంతో, (వారికి హితబోధచేయటానికి) గట్టిగా పాటుపడు. (1/8)

25:53 – وَهُوَ الَّذِي مَرَجَ الْبَحْرَيْنِ هَـٰذَا عَذْبٌ فُرَاتٌ وَهَـٰذَا مِلْحٌ أُجَاجٌ وَجَعَلَ بَيْنَهُمَا بَرْزَخًا وَحِجْرًا مَّحْجُورًا ٥٣

  • మరియు రెండు సముద్రాలను కలిపి ఉంచిన వాడు ఆయనే! ఒకటేమో రుచికరమైనది, దాహం తీర్చునది, మరొకటేమో ఉప్పగనూ, చేదుగనూ ఉన్నది మరియు ఆయన ఆ రెండింటి మధ్య ఒక అడ్డుతెరను – అవి కలిసి పోకుండా – అవరోధంగా ఏర్పరచాడు. 28

25:54 – وَهُوَ الَّذِي خَلَقَ مِنَ الْمَاءِ بَشَرًا فَجَعَلَهُ نَسَبًا وَصِهْرًا ۗ وَكَانَ رَبُّكَ قَدِيرًا ٥٤

మరియు ఆయనే నీటితో మానవుణ్ణి సృష్టించాడు. 29 తరువాత అతనికి తన వంశ బంధుత్వాన్ని మరియు వివాహబంధుత్వాన్ని ఏర్పరచాడు. మరియు వాస్తవానికి నీ ప్రభువు (ప్రతిదీ చేయగల) సమర్థుడు.

25:55 – وَيَعْبُدُونَ مِن دُونِ اللَّـهِ مَا لَا يَنفَعُهُمْ وَلَا يَضُرُّهُمْ ۗ وَكَانَ الْكَافِرُ عَلَىٰ رَبِّهِ ظَهِيرًا ٥٥

మరియు వారు అల్లాహ్‌ను వదలి తమకు లాభంగానీ, నష్టంగానీ, చేకూర్చలేని వారిని ఆరాధిస్తున్నారు. మరియు సత్య-తిరస్కారుడు తన ప్రభువుకు విరుద్ధంగా (షై’తానుకు తోడుగా) ఉంటాడు.

25:56 – وَمَا أَرْسَلْنَاكَ إِلَّا مُبَشِّرًا وَنَذِيرًا ٥٦

మరియు (ఓ ము’హమ్మద్‌!) మేము నిన్ను ఒక శుభవార్తాహరునిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము.

25:57 – قُلْ مَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِلَّا مَن شَاءَ أَن يَتَّخِذَ إِلَىٰ رَبِّهِ سَبِيلًا ٥٧

కావున నీవు వారితో అను: “నేను దీనికై (ఈ ప్రచారానికై) మీతో ఎలాంటి ప్రతిఫలము నడగటం లేదు. కేవలం, తాను కోరిన వ్యక్తియే తన ప్రభువు మార్గాన్ని అవలంబించవచ్చు!”

25:58 – وَتَوَكَّلْ عَلَى الْحَيِّ الَّذِي لَا يَمُوتُ وَسَبِّحْ بِحَمْدِهِ ۚ وَكَفَىٰ بِهِ بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا ٥٨

కావున ఎన్నడూ మరణించని, ఆ సజీవుని (నిత్యుని) పైననే ఆధారపడి ఉండు మరియు ఆయన స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు. తన దాసుల పాపాలను ఎరుగటకు ఆయనే చాలు.

25:59 – الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۚ الرَّحْمَـٰنُ فَاسْأَلْ بِهِ خَبِيرًا ٥٩

ఆయనే ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని ఆరు దినములలో (అయ్యాములలో) సృష్టించి తరువాత తన సింహాసనాన్ని (‘అర్ష్‌ను) అధిష్ఠించాడు. 30 ఆయన అనంత కరుణా మయుడు, ఆయన ఘనతను గురించి ఎరిగిన వాడిని అడుగు.

25:60 – وَإِذَا قِيلَ لَهُمُ اسْجُدُوا لِلرَّحْمَـٰنِ قَالُوا وَمَا الرَّحْمَـٰنُ أَنَسْجُدُ لِمَا تَأْمُرُنَا وَزَادَهُمْ نُفُورًا ۩ ٦٠

మరియు వారితో: “ఆ కరుణామయునికి సాష్టాంగం (సజ్దా) చేయండి.” అని అన్నప్పుడల్లా, వారంటారు: “ఆ కరుణామయుడెవడు? మీరు ఆజ్ఞాపించినవానికిమేము సాష్టాంగం చేయాలా (సజ్దా చేయాలా)?” మరియు అది (నీ పిలుపు) వారి వ్యతిరేకతను మరింతఅధికమేచేసింది 31 (సజ్దా)

25:61 – تَبَارَكَ الَّذِي جَعَلَ فِي السَّمَاءِ بُرُوجًا وَجَعَلَ فِيهَا سِرَاجًا وَقَمَرًا مُّنِيرًا ٦١

ఆకాశంలో నక్షత్రరాసులను 32 (బురూజు లను) నిర్మించి అందులో ఒక (ప్రకాశించే) సూర్యుణ్ణి 33 మరియు వెలుగునిచ్చే (ప్రతిబిం బింపజేసే) చంద్రుణ్ణి నియమించిన ఆయన (అల్లాహ్‌) శుభదాయకుడు.

25:62 – وَهُوَ الَّذِي جَعَلَ اللَّيْلَ وَالنَّهَارَ خِلْفَةً لِّمَنْ أَرَادَ أَن يَذَّكَّرَ أَوْ أَرَادَ شُكُورًا ٦٢

మరియు ఆయనే, రేయింబవళ్ళను ఒక దాని వెంట ఒకటి అనుక్రమంగా వచ్చేటట్లు చేసే వాడు, ఇవన్నీ గమనించగోరిన వారి కొరకు లేదా కృతజ్ఞత చూపగోరిన వారికొరకు ఉన్నాయి.

25:63 – وَعِبَادُ الرَّحْمَـٰنِ الَّذِينَ يَمْشُونَ عَلَى الْأَرْضِ هَوْنًا وَإِذَا خَاطَبَهُمُ الْجَاهِلُونَ قَالُوا سَلَامًا ٦٣

మరియు వారే, అనంత కరుణామయుని దాసులు, ఎవరైతే భూమి మీద నమ్రతతో నడుస్తారో! మరియు మూర్ఖులు వారిని పలుకరించి నప్పుడు: “మీకు సలాం!” 34 అని అంటారో!

25:64 – وَالَّذِينَ يَبِيتُونَ لِرَبِّهِمْ سُجَّدًا وَقِيَامًا ٦٤

మరియు ఎవరైతే తమ ప్రభువు సన్నిధిలో సాష్టాంగం (సజ్దా) చేస్తూ మరియు (నమా’జ్‌లో) నిలబడుతూ రాత్రులు గడుపుతారో!

25:65 – وَالَّذِينَ يَقُولُونَ رَبَّنَا اصْرِفْ عَنَّا عَذَابَ جَهَنَّمَ ۖ إِنَّ عَذَابَهَا كَانَ غَرَامًا ٦٥

మరియు ఎవరైతే: “ఓ మా ప్రభూ! మా నుండి నరకపు శిక్షను తొలగించు. నిశ్చయంగా, దాని శిక్ష ఎడతెగని పీడన.” అని అంటారో! 35

25:66 – إِنَّهَا سَاءَتْ مُسْتَقَرًّا وَمُقَامًا ٦٦

నిశ్చయంగా, అది అతిచెడ్డ ఆశ్రయం మరియు నివాసస్థలం.

25:67 – وَالَّذِينَ إِذَا أَنفَقُوا لَمْ يُسْرِفُوا وَلَمْ يَقْتُرُوا وَكَانَ بَيْنَ ذَٰلِكَ قَوَامًا ٦٧

మరియు ఎవరైతే, ఖర్చు చేసేటప్పుడు అనవసర ఖర్చుగానీ లేక లోభత్వంగానీ చేయ కుండా, ఈ రెండింటి మధ్య మితంగా ఉంటారో;

25:68 – وَالَّذِينَ لَا يَدْعُونَ مَعَ اللَّـهِ إِلَـٰهًا آخَرَ وَلَا يَقْتُلُونَ النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّـهُ إِلَّا بِالْحَقِّ وَلَا يَزْنُونَ ۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ يَلْقَ أَثَامًا ٦٨

మరియు ఎవరైతే, అల్లాహ్‌తోపాటు ఇతర దైవాలను ఆరాధించరో! మరియు అల్లాహ్‌ నిషేధించిన ఏ ప్రాణిని కూడా న్యాయానికి తప్ప చంపరో! 36 మరియు వ్యభిచారానికి పాల్పడరో. 37 మరియు ఈ విధంగా చేసేవాడు దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు.

25:69 – يُضَاعَفْ لَهُ الْعَذَابُ يَوْمَ الْقِيَامَةِ وَيَخْلُدْ فِيهِ مُهَانًا ٦٩

పునరుత్థాన దినంనాడు, అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది మరియు అతడు అందులోనే అవమానంతో శాశ్వతంగా పడిఉంటాడు.

25:70 – إِلَّا مَن تَابَ وَآمَنَ وَعَمِلَ عَمَلًا صَالِحًا فَأُولَـٰئِكَ يُبَدِّلُ اللَّـهُ سَيِّئَاتِهِمْ حَسَنَاتٍ ۗ وَكَانَ اللَّـهُ غَفُورًا رَّحِيمًا ٧٠

కాని, ఇక ఎవరైతే (తాము చేసిన పాపాలకు) పశ్చాత్తాప పడి, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వారి పాపాలను అల్లాహ్‌ పుణ్యాలుగా మార్చుతాడు. 38 మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

25:71 – وَمَن تَابَ وَعَمِلَ صَالِحًا فَإِنَّهُ يَتُوبُ إِلَى اللَّـهِ مَتَابًا ٧١

మరియు ఎవడైతే, పశ్చాత్తాపపడి సత్కార్యాలు చేస్తాడో! నిశ్చయంగా అలాంటివాడు హృదయపూర్వకంగా అల్లాహ్‌ వైపునకు పశ్చాత్తాపంతో మరలుతాడు!

25:72 – وَالَّذِينَ لَا يَشْهَدُونَ الزُّورَ وَإِذَا مَرُّوا بِاللَّغْوِ مَرُّوا كِرَامًا ٧٢

మరియు ఎవరైతే, అబద్ధమైన సాక్ష్యం ఇవ్వరో! మరియు వ్యర్థమైన పనులవైపు నుండి పోవటం జరిగితే, సంస్కారవంతులుగా అక్కడి నుండి దాటిపోతారో! 39

25:73 – وَالَّذِينَ إِذَا ذُكِّرُوا بِآيَاتِ رَبِّهِمْ لَمْ يَخِرُّوا عَلَيْهَا صُمًّا وَعُمْيَانًا ٧٣

మరియు ఎవరైతే, తమ ప్రభువు సూచన (ఆయాత్‌)ల హితబోధ చేసినపుడు, వారు దానికి చెవిటివారిగా మరియు గ్రుడ్డివారిగా ఉండిపోరో!

25:74 – وَالَّذِينَ يَقُولُونَ رَبَّنَا هَبْ لَنَا مِنْ أَزْوَاجِنَا وَذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا ٧٤

మరియు ఎవరైతే, ఇలా ప్రార్థిస్తారో: “ఓ మా ప్రభూ! మా సహవాసుల (అ’జ్వాజ్‌ల) మరియు సంతానం ద్వారా మా కన్నులకు చల్లదనం ప్రసాదించు. మరియు మమ్మల్ని దైవభీతి గల వారికి నాయకులుగా (ఇమాములుగా) చేయి.”

25:75 – أُولَـٰئِكَ يُجْزَوْنَ الْغُرْفَةَ بِمَا صَبَرُوا وَيُلَقَّوْنَ فِيهَا تَحِيَّةً وَسَلَامًا ٧٥

ఇలాంటి వారే తమ సహనశీలతకు ప్రతిఫలంగా (స్వర్గంలో) ఉన్నతస్థానాన్ని పొందేవారు. అక్కడ వారికి గౌరవమైన స్వాగతం మరియు శాంతి లభిస్తాయి.

25:76 – خَالِدِينَ فِيهَا ۚ حَسُنَتْ مُسْتَقَرًّا وَمُقَامًا ٧٦

వారందు శాశ్వతంగా ఉంటారు. అది ఎంత మంచి నివాసం మరియు ఎంత మంచి స్థలం.

25:77 – قُلْ مَا يَعْبَأُ بِكُمْ رَبِّي لَوْلَا دُعَاؤُكُمْ ۖ فَقَدْ كَذَّبْتُمْ فَسَوْفَ يَكُونُ لِزَامًا ٧٧

(ఓ ము’హమ్మద్‌! అవిశ్వాసులతో) ఇలా అను: “మీరు ఆయనను ప్రార్థిస్తున్నారు కాబట్టి నా ప్రభువు మిమ్మల్ని అలక్ష్యం చేయడంలేదు. 40 కాని వాస్తవానికి, ఇప్పుడు మీరు (ఆయనను) తిరస్కరించారు. కావున త్వరలోనే ఆయన శిక్ష మీపై అనివార్యమవుతుంది.” (1/4)

సూరహ్‌ అష్‌-షు’అరా’ – అష్‌-షు’అరాఉ’: కవులు. ఈ సూరహ్‌ పేరు 224 ఆయత్‌ నుండి తీసుకోబడింది. ఇందులో 227 ఆయతులు ఉన్నాయి. ఈ సూరహ్‌ దైవప్రవక్త (‘స’అస) యొక్క మదీనహ్ ప్రస్థానానికి 6-7 సంవత్సరాలకు ముందు మక్కహ్లో అవతరింపజేయబడింది. కవులు కేవలం ఊహాగానాలే చేస్తారు. వారు తాము పలికే మాటలను ఆచరించరు. కాని దైవప్రవక్తలు (‘అలైహిమ్‌. స.) తమ మాటలను ఆచరణలో పెట్టి చూపుతారు. మార్గదర్శకత్వం చేస్తారు. వారు సత్యమే పలికారు. దైవప్రవక్తలు (‘అలైహిమ్‌.స.) అందరూ ఒకే విధమైన సందేశం తెచ్చారు. వారందరూ ఆరాధనను కేవలం అల్లాహ్‌ (సు.త.)కు మాత్రమే ప్రత్యేకించుకొని, అల్లాహ్‌ (సు.త.)కు విధేయులై ఉండాలని (ఇస్లాం) మరియు ఆయనకు భాగస్వాములను కల్పించటం, ఎన్నడూ క్షమించబడని పాపమని బోధించారు. ఈ సూరహ్‌ నుండి క్రొత్త విధమైన 4 సూరహ్‌లు వస్తున్నాయి. వాటి (26-29)లో దైవప్రవక్తల ద్వారా పంపబడిన దివ్యజ్యోతి మరియు దానికి వారి కాలపు ప్రజల ప్రక్రియలు వివరించబడ్డాయి. ఇందులో మూసా, ఇబ్రాహీమ్‌, నూ’హ్‌, హూద్‌, ‘సాలి’హ్‌, లూ’త్‌ మరియు షు’ఐబ్‌ (‘అలైహిమ్‌ అస్సలాముల) విషయాలున్నాయి.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 26:1 – طسم ١

‘తా-సీన్‌-మీమ్‌.

26:2 – تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ ٢

ఇవి స్పష్టమైనగ్రంథ సూచనలు (ఆయతులు).

26:3 – لَعَلَّكَ بَاخِعٌ نَّفْسَكَ أَلَّا يَكُونُوا مُؤْمِنِينَ ٣

(ఓ ము’హమ్మద్‌) వారు విశ్వసించలేదనే బాధతో బహుశా నీవు నీ ప్రాణాలే కోల్పోతావేమో. 1

26:4 – إِن نَّشَأْ نُنَزِّلْ عَلَيْهِم مِّنَ السَّمَاءِ آيَةً فَظَلَّتْ أَعْنَاقُهُمْ لَهَا خَاضِعِينَ ٤

మేము కోరితే ఆకాశం నుండి వారిపై ఒక అద్భుత సంకేతాన్ని (ఆయత్‌ను) అవతరింప జేసి, దానికి వారి మెడలను నమ్రతతో వంగి పోయేలా చేసేవారము.

26:5 – وَمَا يَأْتِيهِم مِّن ذِكْرٍ مِّنَ الرَّحْمَـٰنِ مُحْدَثٍ إِلَّا كَانُوا عَنْهُ مُعْرِضِينَ ٥

మరియు వారివద్దకు అనంత కరుణా మయుని వద్ద నుండి క్రొత్త సందేశం వచ్చినప్పుడల్లా, వారు దాని నుండి విముఖులు కాకుండా ఉండలేదు.

26:6 – فَقَدْ كَذَّبُوا فَسَيَأْتِيهِمْ أَنبَاءُ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ٦

వాస్తవానికి, ఇప్పుడు వారు తిరస్కరించారు, కాని త్వరలోనే వారు ఎగతాళి చేస్తూ వచ్చినదాని యథార్థ మేమిటో వారికి తెలిసిపోతుంది. 2

26:7 – أَوَلَمْ يَرَوْا إِلَى الْأَرْضِ كَمْ أَنبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍ كَرِيمٍ ٧

ఏమీ? వారు భూమివైపు చూడలేదా? మేము దానిలో ఎంత పుష్కలంగా శ్రేష్ఠమైన రకరకాల (జీవ రాసుల్ని) 3 పుట్టించామో?

26:8 – إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ٨

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలామంది విశ్వసించడం లేదు.

26:9 – وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ ٩

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే సర్వ శక్తిమంతుడు, అపార కరుణాప్రదాత.

26:10 – وَإِذْ نَادَىٰ رَبُّكَ مُوسَىٰ أَنِ ائْتِ الْقَوْمَ الظَّالِمِينَ ١٠

మరియు నీ ప్రభువు మూసాను ఇలా ఆదేశించిన విషయాన్ని వారికి జ్ఞాపకంచేయించు: “దుర్మార్గులైన జాతి ప్రజలవద్దకు వెళ్ళు; 4

26:11 – قَوْمَ فِرْعَوْنَ ۚ أَلَا يَتَّقُونَ ١١

“ఫిర్‌’ఔన్‌ జాతివారి వద్దకు. ఏమీ? వారికి దైవభీతి లేదా?”

26:12 – قَالَ رَبِّ إِنِّي أَخَافُ أَن يُكَذِّبُونِ ١٢

(మూసా) అన్నాడు: “ఓ నా ప్రభూ! వారు నన్ను అసత్యుడవని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను. 5

26:13 – وَيَضِيقُ صَدْرِي وَلَا يَنطَلِقُ لِسَانِي فَأَرْسِلْ إِلَىٰ هَارُونَ ١٣

“నా హృదయం కుంచించుకు పోతోంది మరియు నా నాలుక తడబడుతోంది, కావున నీవు హారూన్‌ వద్దకు కూడా (వ’హీ) పంపు.

26:14 – وَلَهُمْ عَلَيَّ ذَنبٌ فَأَخَافُ أَن يَقْتُلُونِ ١٤

“మరియు వారి దగ్గర నా మీద ఒక నేరం మోపబడి ఉన్నది, 7 కావున వారు నన్ను చంపు తారేమోనని భయపడుతున్నాను.”

26:15 – قَالَ كَلَّا ۖ فَاذْهَبَا بِآيَاتِنَا ۖ إِنَّا مَعَكُم مُّسْتَمِعُونَ ١٥

(అల్లాహ్‌) సెలవిచ్చాడు: “అట్లు కానేరదు! మీరిద్దరూ మా సూచనలతో వెళ్ళండి. నిశ్చయంగా, మేము కూడా మీతోపాటు ఉండి సర్వమూ వింటూ ఉంటాము. 8

26:16 – فَأْتِيَا فِرْعَوْنَ فَقُولَا إِنَّا رَسُولُ رَبِّ الْعَالَمِينَ ١٦

“కావున మీరిద్దరూ ఫిర్‌’ఔన్‌ వద్దకు వెళ్ళి అనండి: ‘నిశ్చయంగా మేము సర్వలోకాల పోషకుని సందేశహరులము.

26:17 – أَنْ أَرْسِلْ مَعَنَا بَنِي إِسْرَائِيلَ ١٧

” ‘కావున ఇస్రాయీ’ల్‌ సంతతివారిని మా వెంట పోనివ్వు.’ ” 9

26:18 – قَالَ أَلَمْ نُرَبِّكَ فِينَا وَلِيدًا وَلَبِثْتَ فِينَا مِنْ عُمُرِكَ سِنِينَ ١٨

(ఫిర్‌’ఔన్‌) అన్నాడు:”ఏమీ? మేము నిన్ను బాల్యంలో మాతోపాటు పోషించలేదా? మరియు నీవు నీ వయస్సులోని అనేక సంవత్సరాలు మాతో పాటు గడిపావు కదా!

26:19 – وَفَعَلْتَ فَعْلَتَكَ الَّتِي فَعَلْتَ وَأَنتَ مِنَ الْكَافِرِينَ ١٩

“అయినా నీవు హీనమైన ఆ పని చేశావు, కావున నీవు కృతఘ్నులలోని వాడవు!” 10

26:20 – قَالَ فَعَلْتُهَا إِذًا وَأَنَا مِنَ الضَّالِّينَ ٢٠

(మూసా) అన్నాడు: “నేను పొరపాటుగా ఆ పని చేశాను!

26:21 – فَفَرَرْتُ مِنكُمْ لَمَّا خِفْتُكُمْ فَوَهَبَ لِي رَبِّي حُكْمًا وَجَعَلَنِي مِنَ الْمُرْسَلِينَ ٢١

“ఆ పిదప మీకు భయపడి పారిపోయాను, కాని ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని ప్రసాదించి, నన్ను సందేశహరులలో చేర్చుకున్నాడు. 11

26:22 – وَتِلْكَ نِعْمَةٌ تَمُنُّهَا عَلَيَّ أَنْ عَبَّدتَّ بَنِي إِسْرَائِيلَ ٢٢

“ఇక నీవు నాకు చేసిన ఆ ఉపకారానికి నన్ను ఎత్తిపొడిస్తే! నీవు మాత్రం ఇస్రాయీ’ల్‌ సంతతివారి నంతా బానిసలుగా చేసుకున్నావు కదా!” 12

26:23 – قَالَ فِرْعَوْنُ وَمَا رَبُّ الْعَالَمِينَ ٢٣

(ఫిర్‌’ఔన్‌) అడిగాడు: “అయితే ఈ సర్వలోకాల ప్రభువు అంటే ఏమిటి?” 13

26:24 – قَالَ رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ إِن كُنتُم مُّوقِنِينَ ٢٤

(మూసా) జవాబిచ్చాడు: “మీరు నమ్మేవారే అయితే! ఆయనే ఆకాశాలకూ మరియు భూమికీ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు!”

26:25 – قَالَ لِمَنْ حَوْلَهُ أَلَا تَسْتَمِعُونَ ٢٥

(ఫిర్‌’ఔన్‌) తన చుట్టూ ఉన్న వారితో: “ఏమీ? మీరు వింటున్నారా?” 14 అనిప్రశ్నించాడు.

26:26 – قَالَ رَبُّكُمْ وَرَبُّ آبَائِكُمُ الْأَوَّلِينَ ٢٦

(మూసా) అన్నాడు: “ఆయన (అల్లాహ్‌) మీ ప్రభువు మరియు మీ పూర్వికులైన మీ తాత-ముత్తాతల ప్రభువు కూడానూ!”

26:27 – قَالَ إِنَّ رَسُولَكُمُ الَّذِي أُرْسِلَ إِلَيْكُمْ لَمَجْنُونٌ ٢٧

(ఫిర్‌’ఔన్‌) అన్నాడు: “మీ వద్దకు పంపబడిన మీ ఈ సందేశహరుడు నిశ్చయంగా, పిచ్చివాడే!”

26:28 – قَالَ رَبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَمَا بَيْنَهُمَا ۖ إِن كُنتُمْ تَعْقِلُونَ ٢٨

(మూసా) అన్నాడు: “మీరు అర్థం చేసుకో గలిగితే! ఆయనే తూర్పూపడమరలకూ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు.” 15

26:29 – قَالَ لَئِنِ اتَّخَذْتَ إِلَـٰهًا غَيْرِي لَأَجْعَلَنَّكَ مِنَ الْمَسْجُونِينَ ٢٩

(ఫిర్‌’ఔన్‌) అన్నాడు:”నీవు నన్ను కాదని మరెవరినైనా ఆరాధ్యదైవంగా చేసుకుంటే నేను నిన్ను చెరసాలలో ఉన్నవారితో చేర్చుతాను.”

26:30 – قَالَ أَوَلَوْ جِئْتُكَ بِشَيْءٍ مُّبِينٍ ٣٠

(మూసా) అన్నాడు: “ఏమీ? నేను నీ వద్దకు ఒక స్పష్టమైన విషయాన్ని (సత్యాన్ని) తీసుకు వచ్చిన తరువాత కూడానా?” 16

26:31 – قَالَ فَأْتِ بِهِ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ ٣١

(ఫిర్‌’ఔన్‌) అన్నాడు: “నీవు సత్య వంతుడవే అయితే దానిని (ఆ అద్భుత సూచనను) చూపు!”

26:32 – فَأَلْقَىٰ عَصَاهُ فَإِذَا هِيَ ثُعْبَانٌ مُّبِينٌ ٣٢

అప్పుడు (మూసా) తన చేతికర్రను పడవేయ గానే, అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా మారి పోయింది. 17

26:33 – وَنَزَعَ يَدَهُ فَإِذَا هِيَ بَيْضَاءُ لِلنَّاظِرِينَ ٣٣

తరువాత అతను (మూసా) తన చేతిని (చంకనుండి) వెలుపలికి తీయగానే, అది చూసే వారి యెదుట తెల్లగా ప్రకాశించసాగింది! 18

26:34 – قَالَ لِلْمَلَإِ حَوْلَهُ إِنَّ هَـٰذَا لَسَاحِرٌ عَلِيمٌ ٣٤

(ఫిర్‌’ఔన్‌) తన చుట్టూ ఉన్న నాయకులతో అన్నాడు: “నిశ్చయంగా ఇతనొక నేర్పుగల మాంత్రికుడు.

26:35 – يُرِيدُ أَن يُخْرِجَكُم مِّنْ أَرْضِكُم بِسِحْرِهِ فَمَاذَا تَأْمُرُونَ ٣٥

“ఇతను తన మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి తరుమ గోరుతున్నాడు, అయితే మీ సలహా ఏమిటి?” 19

26:36 – قَالُوا أَرْجِهْ وَأَخَاهُ وَابْعَثْ فِي الْمَدَائِنِ حَاشِرِينَ ٣٦

వారన్నారు: “అతనిని మరియు అతని సోదరుణ్ణి ఆపిఉంచు మరియు (మంత్రగాళ్ళను) సమావేశపరచటానికి అన్ని నగరాలకు వార్తాహరులను పంపు;

26:37 – يَأْتُوكَ بِكُلِّ سَحَّارٍ عَلِيمٍ ٣٧

“వారు నీ వద్దకు నేర్పుగల ప్రతి మాంత్రికుణ్ణి తెస్తారు.”

26:38 – فَجُمِعَ السَّحَرَةُ لِمِيقَاتِ يَوْمٍ مَّعْلُومٍ ٣٨

ఈ విధంగా ఒక నియమిత రోజున ఒక నియమిత ప్రదేశంలో మాంత్రికులంతా సమావేశ పరచబడ్డారు. 20

26:39 – وَقِيلَ لِلنَّاسِ هَلْ أَنتُم مُّجْتَمِعُونَ ٣٩

మరియు ప్రజలతో ఇలా ప్రశ్నించడం జరిగింది: “ఏమీ? మీరంతా సమావేశమయ్యారా?

26:40 – لَعَلَّنَا نَتَّبِعُ السَّحَرَةَ إِن كَانُوا هُمُ الْغَالِبِينَ ٤٠

“ఒకవేళ మాంత్రికులు గెలుపొందితే మనమంతా వారిని అనుసరించాలి కదా!”

26:41 – فَلَمَّا جَاءَ السَّحَرَةُ قَالُوا لِفِرْعَوْنَ أَئِنَّ لَنَا لَأَجْرًا إِن كُنَّا نَحْنُ الْغَالِبِينَ ٤١

మాంత్రికులు వచ్చిన తరువాత ఫిర్‌’ఔన్‌ తో అన్నారు: “మేము గెలుపొందితే నిశ్చయంగా, మాకు బహుమానముందికదా?” 21

26:42 – قَالَ نَعَمْ وَإِنَّكُمْ إِذًا لَّمِنَ الْمُقَرَّبِينَ ٤٢

(ఫిర్‌’ఔన్‌) అన్నాడు: “అవును! నిశ్చయంగా, అప్పుడు మీరు నా సన్నిహితులలో చేరుతారు!”

26:43 – قَالَ لَهُم مُّوسَىٰ أَلْقُوا مَا أَنتُم مُّلْقُونَ ٤٣

మూసా వారితో అన్నాడు: “మీరు విసరదలుచుకున్న దానిని విసరండి!”

26:44 – فَأَلْقَوْا حِبَالَهُمْ وَعِصِيَّهُمْ وَقَالُوا بِعِزَّةِ فِرْعَوْنَ إِنَّا لَنَحْنُ الْغَالِبُونَ ٤٤

అప్పుడు వారు తమ త్రాళ్ళను మరియు తమ కర్రలను విసిరి ఇలా అన్నారు: “ఫిర్‌’ఔన్‌ శక్తి సాక్షిగా! నిశ్చయంగా, మేమే విజయం పొందుతాము.” 22

26:45 – فَأَلْقَىٰ مُوسَىٰ عَصَاهُ فَإِذَا هِيَ تَلْقَفُ مَا يَأْفِكُونَ ٤٥

ఆ తరువాత మూసా తన కర్రను పడవేయగా, తక్షణమే అది వారి బూటకపు కల్పనలను మ్రింగివేసింది. 23

26:46 – فَأُلْقِيَ السَّحَرَةُ سَاجِدِينَ ٤٦

అప్పుడు ఆ మాంత్రికులు సజ్దాలో పడ్డారు.

26:47 – قَالُوا آمَنَّا بِرَبِّ الْعَالَمِينَ ٤٧

వారన్నారు: “మేము సర్వలోకాల ప్రభువును విశ్వసిస్తున్నాము.

26:48 – رَبِّ مُوسَىٰ وَهَارُونَ ٤٨

“మూసా మరియు హారూన్‌ల ప్రభువును.”

26:49 – قَالَ آمَنتُمْ لَهُ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ ۖ إِنَّهُ لَكَبِيرُكُمُ الَّذِي عَلَّمَكُمُ السِّحْرَ فَلَسَوْفَ تَعْلَمُونَ ۚ لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَافٍ وَلَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ ٤٩

(ఫిర్‌’ఔన్‌) అన్నాడు: “నేను మీకు అనుమతి ఇవ్వకముందే మీరు ఇతనిని విశ్వసించారా? 24 నిశ్చయంగా ఇతడే మీగురువు, మీకు జాలవిద్యను నేర్పినవాడు. సరే! ఇప్పుడే మీరు తెలుసుకుంటారు. నేను మీ వ్యతిరేక (ప్రతి పక్ష) దిశల చేతులను మరియు కాళ్ళను నరికిస్తాను మరియు మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను.” 25

26:50 – قَالُوا لَا ضَيْرَ ۖ إِنَّا إِلَىٰ رَبِّنَا مُنقَلِبُونَ ٥٠

(మాంత్రికులు) అన్నారు: “బాధ లేదు! నిశ్చయంగా, మేము మా ప్రభువు వద్దకేకదా మరలి పోయేది.

26:51 – إِنَّا نَطْمَعُ أَن يَغْفِرَ لَنَا رَبُّنَا خَطَايَانَا أَن كُنَّا أَوَّلَ الْمُؤْمِنِينَ ٥١

“నిశ్చయంగా, మా ప్రభువు మా పాపాలను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాము, ఎందుకంటే వాస్తవానికి అందరికంటే ముందుగా విశ్వసించిన వారము మేమే!” (3/8)

26:52 – وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنْ أَسْرِ بِعِبَادِي إِنَّكُم مُّتَّبَعُونَ ٥٢

  • మరియు మేము మూసాకు ఈ విధంగా దివ్యజ్ఞానం (వ’హీ) పంపాము: “నీవు నా దాసులను రాత్రివేళ తీసుకొని వెళ్లిపో నిశ్చయంగా, మీరు వెంబడించబడతారు.” 26

26:53 – فَأَرْسَلَ فِرْعَوْنُ فِي الْمَدَائِنِ حَاشِرِينَ ٥٣

తరువాత ఫిర్‌’ఔన్‌ అన్ని పట్టణాలకు వార్తాహరులను పంపాడు.

26:54 – إِنَّ هَـٰؤُلَاءِ لَشِرْذِمَةٌ قَلِيلُونَ ٥٤

(ఇలా ప్రకటనచేయించాడు): “వాస్తవానికి వీరు (ఈ ఇస్రాయీ’ల్‌ సంతతి వారు) ఒక చిన్నతెగ వారు మాత్రమే.

26:55 – وَإِنَّهُمْ لَنَا لَغَائِظُونَ ٥٥

“మరియు నిశ్చయంగా, వారు మాకు చాలా కోపం తెప్పించారు;

26:56 – وَإِنَّا لَجَمِيعٌ حَاذِرُونَ ٥٦

“మరియు నిశ్చయంగా, మనం ఐకమత్యం తో ఉండి జాగరూకత చూపేవారము.”

26:57 – فَأَخْرَجْنَاهُم مِّن جَنَّاتٍ وَعُيُونٍ ٥٧

కావున మేము వారిని, తోటలనుండి మరియు చెలమల నుండి వెళ్ళగొట్టాము;

26:58 – وَكُنُوزٍ وَمَقَامٍ كَرِيمٍ ٥٨

మరియు కోశాగారాల నుండి మరియు ఉన్నతమైన స్థానాల నుండి కూడా.

26:59 – كَذَٰلِكَ وَأَوْرَثْنَاهَا بَنِي إِسْرَائِيلَ ٥٩

ఈ విధంగా! మేము ఇస్రాయీ’ల్‌ సంతతి వారిని, వాటికి వారసులుగా చేశాము. 27

26:60 – فَأَتْبَعُوهُم مُّشْرِقِينَ ٦٠

అప్పుడు (ఫిర్‌’ఔన్‌ జాతి) వారు సూర్యోదయ కాలమున (ఇస్రాయీ’ల్‌ సంతతి) వారిని వెంబడించారు.

26:61 – فَلَمَّا تَرَاءَى الْجَمْعَانِ قَالَ أَصْحَابُ مُوسَىٰ إِنَّا لَمُدْرَكُونَ ٦١

ఆ ఇరుపక్షాల వారు ఒకరినొకరు ఎదురు పడినప్పుడు, మూసా అనుచరులు అన్నారు: “నిశ్చయంగా, మేము చిక్కిపోయాము!”

26:62 – قَالَ كَلَّا ۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ ٦٢

(మూసా) అన్నాడు: “అట్లు కానేరదు! నిశ్చయంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు (మార్గము చూపుతాడు).” 28

26:63 – فَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنِ اضْرِب بِّعَصَاكَ الْبَحْرَ ۖ فَانفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍ كَالطَّوْدِ الْعَظِيمِ ٦٣

అప్పుడు మేము మూసాకు: “నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు!” అని వ’హీ ద్వారా తెలిపాము. అప్పుడది హటాత్తుగా చీలిపోయింది, దాని ప్రతిభాగం ఒక మహా పర్వతం మాదిరిగా అయిపోయింది. 29

26:64 – وَأَزْلَفْنَا ثَمَّ الْآخَرِينَ ٦٤

మరియు అక్కడికి మేము రెండవ పక్షం వారిని సమీపింపజేశాము.

26:65 – وَأَنجَيْنَا مُوسَىٰ وَمَن مَّعَهُ أَجْمَعِينَ ٦٥

మరియు మూసాను మరియు అతనితో పాటు ఉన్నవారిని అందరినీ రక్షించాము.

26:66 – ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ ٦٦

ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము.

26:67 – إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ٦٧

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.

26:68 – وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ ٦٨

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే సర్వశక్తిసంపన్నుడు అపారకరుణాప్రదాత.

26:69 – وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ إِبْرَاهِيمَ ٦٩

ఇక వారికి ఇబ్రాహీమ్‌ గాథను వినిపించు.

26:70 – إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَا تَعْبُدُونَ ٧٠

అతను తన తండ్రితో మరియు తన జాతి వారితో: “మీరెవరిని ఆరాధిస్తున్నారు?” అని అడిగినపుడు;

26:71 – قَالُوا نَعْبُدُ أَصْنَامًا فَنَظَلُّ لَهَا عَاكِفِينَ ٧١

వారన్నారు: “మేము విగ్రహాలను ఆరాధిస్తున్నాము మరియు మేము వాటికే ఎల్లప్పుడు భక్తులమై ఉంటాము.”

26:72 – قَالَ هَلْ يَسْمَعُونَكُمْ إِذْ تَدْعُونَ ٧٢

(ఇబ్రాహీమ్‌) అన్నాడు: “మీరు వీటిని పిలిచి నప్పుడు ఇవి మీ మొర ఆలకిస్తాయా?

26:73 – أَوْ يَنفَعُونَكُمْ أَوْ يَضُرُّونَ ٧٣

“లేదా, మీకేమైనా మేలు చేయగలవా? లేదా హాని చేయగలవా?”

26:74 – قَالُوا بَلْ وَجَدْنَا آبَاءَنَا كَذَٰلِكَ يَفْعَلُونَ ٧٤

వారన్నారు: “అలాకాదు! మేము మా తండ్రి-తాతలను ఇలా చేస్తూఉండగా చూశాము.”

26:75 – قَالَ أَفَرَأَيْتُم مَّا كُنتُمْ تَعْبُدُونَ ٧٥

అతను అన్నాడు: “ఏమీ? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరెవరిని ఆరాధిస్తున్నారో?

26:76 – أَنتُمْ وَآبَاؤُكُمُ الْأَقْدَمُونَ ٧٦

“మీరు గానీ మరియు మీ పూర్వీకులైన మీ తాత-ముత్తాతలు గానీ (ఆలోచించారా)?

26:77 – فَإِنَّهُمْ عَدُوٌّ لِّي إِلَّا رَبَّ الْعَالَمِينَ ٧٧

“ఎందుకంటే! నిశ్చయంగా, ఇవన్నీ నా శత్రువులే! కేవలం ఆ సర్వలోకాల ప్రభువు తప్ప!

26:78 – الَّذِي خَلَقَنِي فَهُوَ يَهْدِينِ ٧٨

“ఆయనే నన్ను సృష్టించాడు. కాబట్టి ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు.

26:79 – وَالَّذِي هُوَ يُطْعِمُنِي وَيَسْقِينِ ٧٩

“ఆయనే నాకు తినిపించేవాడు మరియు త్రాగించేవాడు.

26:80 – وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ ٨٠

“మరియు నేను వ్యాధిగ్రస్తుడనైతే, ఆయనే నాకు స్వస్థతనిచ్చేవాడు.

26:81 – وَالَّذِي يُمِيتُنِي ثُمَّ يُحْيِينِ ٨١

“మరియు ఆయనే నన్ను మరణింపజేసే వాడు, తరువాత మళ్ళీ బ్రతికింపజేసేవాడు.

26:82 – وَالَّذِي أَطْمَعُ أَن يَغْفِرَ لِي خَطِيئَتِي يَوْمَ الدِّينِ ٨٢

“మరియు ఆయనే తీర్పుదినమున నా తప్పులను క్షమిస్తాడని నేను ఆశిస్తున్నాను.

26:83 – رَبِّ هَبْ لِي حُكْمًا وَأَلْحِقْنِي بِالصَّالِحِينَ ٨٣

“మరియు ఓనాప్రభూ! నాకువివేకాన్ని ప్రసా దించు మరియు నన్ను సద్వర్తనులలో కలుపు.

26:84 – وَاجْعَل لِّي لِسَانَ صِدْقٍ فِي الْآخِرِينَ ٨٤

“మరియు తరువాత వచ్చే తరాలవారిలో నాకు మంచి పేరును ప్రసాదించు. 30

26:85 – وَاجْعَلْنِي مِن وَرَثَةِ جَنَّةِ النَّعِيمِ ٨٥

“మరియు సర్వసుఖాల స్వర్గానికి వారసులయ్యే వారిలో నన్ను చేర్చు.

26:86 – وَاغْفِرْ لِأَبِي إِنَّهُ كَانَ مِنَ الضَّالِّينَ ٨٦

“మరియు నా తండ్రిని క్షమించు. నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టులలోని వాడే! 31

26:87 – وَلَا تُخْزِنِي يَوْمَ يُبْعَثُونَ ٨٧

“మరియు అందరూ తిరిగి బ్రతికింపబడే రోజు నన్ను అవమానంపాలు చేయకు.

26:88 – يَوْمَ لَا يَنفَعُ مَالٌ وَلَا بَنُونَ ٨٨

“ఏ రోజునైతే ధనసంపత్తులు గానీ, సంతానం గానీ పనికిరావో!

26:89 – إِلَّا مَنْ أَتَى اللَّـهَ بِقَلْبٍ سَلِيمٍ ٨٩

“కేవలం నిర్మలమైన హృదయంతో అల్లాహ్‌ సన్నిధిలో హాజరయ్యేవాడు తప్ప!”

26:90 – وَأُزْلِفَتِ الْجَنَّةُ لِلْمُتَّقِينَ ٩٠

మరియు (ఆ రోజు) స్వర్గం దైవభీతి గలవారి దగ్గరకు తీసుకురాబడుతుంది.

26:91 – وَبُرِّزَتِ الْجَحِيمُ لِلْغَاوِينَ ٩١

మరియు నరకం మార్గం తప్పిన వారి ముందు పెట్టబడుతుంది.

26:92 – وَقِيلَ لَهُمْ أَيْنَ مَا كُنتُمْ تَعْبُدُونَ ٩٢

మరియు వారితో అనబడుతుంది: “మీరు ఆరాధించేవారు (ఆ దైవాలు) ఇప్పుడు ఎక్కడున్నారు?

26:93 – مِن دُونِ اللَّـهِ هَلْ يَنصُرُونَكُمْ أَوْ يَنتَصِرُونَ ٩٣

“అల్లాహ్‌ను వదలి (మీరు వాటిని ఆరాధించారు కదా)! ఏమీ? వారు మీకు సహాయం చేయగలరా? లేదా తమకు తామైనా సహాయం చేసుకోగలరా?” 32

26:94 – فَكُبْكِبُوا فِيهَا هُمْ وَالْغَاوُونَ ٩٤

అప్పుడు వారు మరియు (వారిని) మార్గం తప్పించిన వారు, అందు (నరకం) లోకి విసిరివేయబడతారు.

26:95 – وَجُنُودُ إِبْلِيسَ أَجْمَعُونَ ٩٥

మరియు వారితో బాటు ఇబ్లీస్‌ సైనికులందరూ. 33

26:96 – قَالُوا وَهُمْ فِيهَا يَخْتَصِمُونَ ٩٦

వారు పరస్పరం వాదించుకుంటూ ఇలా అంటారు:

26:97 – تَاللَّـهِ إِن كُنَّا لَفِي ضَلَالٍ مُّبِينٍ ٩٧

“అల్లాహ్‌ సాక్షిగా! మేము స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాము.

26:98 – إِذْ نُسَوِّيكُم بِرَبِّ الْعَالَمِينَ ٩٨

“ఎప్పుడైతే మేము మిమ్మల్ని సర్వలోకాల ప్రభువుతో సమానులుగా చేశామో!

26:99 – وَمَا أَضَلَّنَا إِلَّا الْمُجْرِمُونَ ٩٩

“మరియు మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసింది కేవలం ఈ అపరాధులే. 34

26:100 – فَمَا لَنَا مِن شَافِعِينَ ١٠٠

“మాకిప్పుడు సిఫారసు చేసేవారు ఎవ్వరూ లేరు.

26:101 – وَلَا صَدِيقٍ حَمِيمٍ ١٠١

“మరియు ఏ ప్రాణ స్నేహితుడు కూడా లేడు.

26:102 – فَلَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ ١٠٢

“ఒకవేళ మళ్ళీ మరలి పోయే అవకాశం మాకు దొరికి ఉంటే, మేము తప్పకుండా విశ్వసించిన వారిలో చేరిపోతాము!” 35

26:103 – إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ١٠٣

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలామంది విశ్వసించటం లేదు.

26:104 – وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ ١٠٤

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణాప్రదాత.

26:105 – كَذَّبَتْ قَوْمُ نُوحٍ الْمُرْسَلِينَ ١٠٥

నూ’హ్‌ జాతి, సందేశహరులను అసత్య- వాదులని తిరస్కరించింది.

26:106 – إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ نُوحٌ أَلَا تَتَّقُونَ ١٠٦

వారి సహోదరుడు నూ’హ్ వారితో ఇలా అన్నప్పుడు: “ఏమీ? మీకు దైవభీతి లేదా?

26:107 – إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ ١٠٧

“నిశ్చయంగా నేను మీ వద్దకు పంపబడిన, విశ్వసనీయుడనైన సందేశహరుడను.

26:108 – فَاتَّقُوا اللَّـهَ وَأَطِيعُونِ ١٠٨

“కావున మీరు అల్లాహ్‌ యందు భయ- భక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

26:109 – وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ ١٠٩

“నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతి ఫలాన్ని అడగటంలేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.

26:110 – فَاتَّقُوا اللَّـهَ وَأَطِيعُونِ ١١٠

“కావున మీరు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. మరియు నన్ను అనుసరించండి.” (1/2)

26:111 – قَالُوا أَنُؤْمِنُ لَكَ وَاتَّبَعَكَ الْأَرْذَلُونَ ١١١

  • వారన్నారు: “ఏమీ? మేము నిన్ను విశ్వసించాలా? నిన్ను కేవలం అధములైనవారే 36 కదా అనుసరిస్తున్నది?”

26:112 – قَالَ وَمَا عِلْمِي بِمَا كَانُوا يَعْمَلُونَ ١١٢

(నూ’హ్‌) అన్నాడు: “వారేమి (పనులు) చేస్తూ ఉండేవారో నాకేం తెలుసు?

26:113 – إِنْ حِسَابُهُمْ إِلَّا عَلَىٰ رَبِّي ۖ لَوْ تَشْعُرُونَ ١١٣

“వారి లెక్క కేవలం నా ప్రభువు వద్ద ఉంది. మీరిది అర్థంచేసుకుంటే ఎంత బాగుండేది. 37

26:114 – وَمَا أَنَا بِطَارِدِ الْمُؤْمِنِينَ ١١٤

“మరియు నేను విశ్వసించే వారిని ధిక్కరించేవాడను కాను.

26:115 – إِنْ أَنَا إِلَّا نَذِيرٌ مُّبِينٌ ١١٥

“నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసే వాడను మాత్రమే!”

26:116 – قَالُوا لَئِن لَّمْ تَنتَهِ يَا نُوحُ لَتَكُونَنَّ مِنَ الْمَرْجُومِينَ ١١٦

వారన్నారు: “ఓ నూ’హ్‌! నీవు దీనిని మానుకోక పోతే, నీవు తప్పక రాళ్లు రువ్వి చంపబడతావు.”

26:117 – قَالَ رَبِّ إِنَّ قَوْمِي كَذَّبُونِ ١١٧

(నూ’హ్‌)అన్నాడు: “ఓనాప్రభూ!నా జాతి ప్రజలు నన్ను అసత్యుడవని తిరస్కరిస్తున్నారు.

26:118 – فَافْتَحْ بَيْنِي وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِي وَمَن مَّعِيَ مِنَ الْمُؤْمِنِينَ ١١٨

“కావున నీవే నాకూ మరియు వారికీ మధ్య తీర్పుచేయి. మరియు నన్నూ మరియు నాతో పాటు ఉన్న విశ్వాసులనూ కాపాడు.” 38

26:119 – فَأَنجَيْنَاهُ وَمَن مَّعَهُ فِي الْفُلْكِ الْمَشْحُونِ ١١٩

ఆ పిదప మేము అతనిని మరియు అతనితోపాటు నిండు నావలో ఎక్కి ఉన్న వారినందరినీ కాపాడాము.

26:120 – ثُمَّ أَغْرَقْنَا بَعْدُ الْبَاقِينَ ١٢٠

ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచివేశాము. 39

26:121 – إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ١٢١

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలామంది విశ్వసించడం లేదు.

26:122 – وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ ١٢٢

నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే సర్వ శక్తిమంతుడు, అపార కరుణాప్రదాత.

26:123 – كَذَّبَتْ عَادٌ الْمُرْسَلِينَ ١٢٣

‘ఆద్‌ జాతి, సందేశహరులను అసత్య- వాదులని తిరస్కరించింది.

26:124 – إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ ١٢٤

వారి సహోదరుడు 40 హూద్‌ వారితో ఇలా అన్నప్పుడు: “ఏమీ? మీకు దైవభీతి లేదా?

26:125 – إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ ١٢٥

“నిశ్చయంగా, నేను మీ వద్దకు పంప బడిన, విశ్వసనీయుడనైన సందేశహరుడను.

26:126 – فَاتَّقُوا اللَّـهَ وَأَطِيعُونِ ١٢٦

“కావున మీరు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

26:127 – وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ ١٢٧

“నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉంది.

26:128 – أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ آيَةً تَعْبَثُونَ ١٢٨

“ఏమీ? మీరు కేవలం ఆడంబరానికి ప్రతి ఎత్తైన స్థలం మీద ఒక స్మారకాన్ని నిర్మిస్తారా?

26:129 – وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ ١٢٩

“మరియు మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండి పోతారన్నట్లు పెద్దపెద్ద కోటలుకడతారా?

26:130 – وَإِذَا بَطَشْتُم بَطَشْتُمْ جَبَّارِينَ ١٣٠

“మరియు మీరు ఎవరినైనా పట్టుకుంటే, అతి క్రూరులై పట్టుకుంటారా?

26:131 – فَاتَّقُوا اللَّـهَ وَأَطِيعُونِ ١٣١

“ఇకనైనమీరు అల్లాహ్‌యందుభయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

26:132 – وَاتَّقُوا الَّذِي أَمَدَّكُم بِمَا تَعْلَمُونَ ١٣٢

“మరియు మీకు తెలిసి వున్న (మంచి) వస్తువులను, మీకు విస్తారంగా ఇచ్చిన ఆయన (అల్లాహ్‌) యందు భయ-భక్తులు కలిగిఉండండి.

26:133 – أَمَدَّكُم بِأَنْعَامٍ وَبَنِينَ ١٣٣

“ఆయన విస్తారంగా మీకు పశువులను మరియు సంతానాన్ని అనుగ్రహించాడు;

26:134 – وَجَنَّاتٍ وَعُيُونٍ ١٣٤

“మరియు తోటలను మరియు చెలమలను.

26:135 – إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ ١٣٥

“నిశ్చయంగా, మీపై ఒక మహా దినమున (పడబోయే) శిక్షకు నేను భయపడుతున్నాను!”

26:136 – قَالُوا سَوَاءٌ عَلَيْنَا أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ الْوَاعِظِينَ ١٣٦

వారన్నారు: “నీవు ఉపదేశించినా, ఉపదే శించక పోయినా మాకు అంతా సమానమే!

26:137 – إِنْ هَـٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ ١٣٧

“ఇది మాపూర్వీకుల యొక్క ప్రాచీన ఆచారమే! 41

26:138 – وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ ١٣٨

“మరియు మాకు ఎలాంటి శిక్ష విధించబడదు.”

26:139 – فَكَذَّبُوهُ فَأَهْلَكْنَاهُمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ١٣٩

ఈ విధంగా, వారు అతనిని అసత్య- వాదుడని తిరస్కరించారు. కావున మేము వారిని నశింపజేశాము. 42 నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.

26:140 – وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ ١٤٠

నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే సర్వ శక్తిమంతుడు, అపార కరుణాప్రదాత.

26:141 – كَذَّبَتْ ثَمُودُ الْمُرْسَلِينَ ١٤١

స’మూద్‌ జాతి, సందేశహరులను అసత్య-వాదులని తిరస్కరించింది. 43

26:142 – إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ صَالِحٌ أَلَا تَتَّقُونَ ١٤٢

వారి సహోదరుడు ‘సాలి’హ్‌ వారితో ఇలా అన్నప్పుడు: “ఏమీ? మీకు దైవభీతి లేదా? 44

26:143 – إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ ١٤٣

“నిశ్చయంగా, నేను మీ వద్దకు పంప బడిన, విశ్వసనీయుడనైన సందేశహరుడను.

26:144 – فَاتَّقُوا اللَّـهَ وَأَطِيعُونِ ١٤٤

“కావున మీరు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

26:145 – وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ ١٤٥

“నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉంది.

26:146 – أَتُتْرَكُونَ فِي مَا هَاهُنَا آمِنِينَ ١٤٦

“ఏమీ? మీరిప్పుడు ఇక్కడ ఉన్న స్థితిలోనే సుఖశాంతులలో ఎల్లపుడూ వదలి వేయబడతారని అనుకుంటున్నారా?

26:147 – فِي جَنَّاتٍ وَعُيُونٍ ١٤٧

“తోటలలో మరియు చెలమలలో!

26:148 – وَزُرُوعٍ وَنَخْلٍ طَلْعُهَا هَضِيمٌ ١٤٨

“మరియు ఈ పొలాలలో, మాగిన పండ్ల గుత్తులు గల ఖర్జూరపు చెట్ల మధ్య; 45

26:149 – وَتَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا فَارِهِينَ ١٤٩

“మరియు మీరు కొండలనుతొలిచి ఎంతో నేర్పుతో గృహాలను నిర్మిస్తూ ఉంటారనీ! 46

26:150 – فَاتَّقُوا اللَّـهَ وَأَطِيعُونِ ١٥٠

“అలా కాదు, అల్లాహ్‌ యందు భయ- భక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

26:151 – وَلَا تُطِيعُوا أَمْرَ الْمُسْرِفِينَ ١٥١

“మరియు మితిమీరి ప్రవర్తించేవారి ఆజ్ఞలను అనుసరించకండి.

26:152 – الَّذِينَ يُفْسِدُونَ فِي الْأَرْضِ وَلَا يُصْلِحُونَ ١٥٢

“ఎవరైతే, భూమిలో కల్లోలం రేకెత్తిస్తున్నారో మరియు ఎన్నడూ సంస్కరణను చేపట్టరో!”

26:153 – قَالُوا إِنَّمَا أَنتَ مِنَ الْمُسَحَّرِينَ ١٥٣

వారన్నారు: “నిశ్చయంగా, నీవు మంత్ర జాలంతో వశపరచుకోబడ్డావు!

26:154 – مَا أَنتَ إِلَّا بَشَرٌ مِّثْلُنَا فَأْتِ بِآيَةٍ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ ١٥٤

“నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! కావున నీవు సత్యవంతుడవే అయితే, ఏదైనా అద్భుత సూచన తీసుకురా!”

26:155 – قَالَ هَـٰذِهِ نَاقَةٌ لَّهَا شِرْبٌ وَلَكُمْ شِرْبُ يَوْمٍ مَّعْلُومٍ ١٥٥

(సాలిహ్‌) అన్నాడు: “ఇదిగో ఈ ఆడ ఒంటె. ఇది నీరు త్రాగే (దినం) మరియు మీరు నీరు త్రాగే దినం నిర్ణంచబడ్డాయి. 47

26:156 – وَلَا تَمَسُّوهَا بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذَابُ يَوْمٍ عَظِيمٍ ١٥٦

“దీనికి హాని కలిగించకండి. అలాచేస్తే ఒక మహా దినపు శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది.”

26:157 – فَعَقَرُوهَا فَأَصْبَحُوا نَادِمِينَ ١٥٧

కాని వారు దాని వెనుకకాలి మోకాలి పెద్ద నరమును కోసి చంపారు, ఆ తరువాత వారు పశ్చాత్తాపపడుతూ ఉండిపోయారు. 48

26:158 – فَأَخَذَهُمُ الْعَذَابُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ١٥٨

కావున, వారిని శిక్ష పట్టుకుంది. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.

26:159 – وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ ١٥٩

నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే సర్వ శక్తిమంతుడు, అపార కరుణాప్రదాత.

26:160 – كَذَّبَتْ قَوْمُ لُوطٍ الْمُرْسَلِينَ ١٦٠

లూ’త్‌ జాతి, సందేశహరులను అసత్య- వాదులని తిరస్కరించింది. 49

26:161 – إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ لُوطٌ أَلَا تَتَّقُونَ ١٦١

వారి సహోదరుడు లూ’త్‌ వారితో ఇలా అన్నప్పుడు: “ఏమీ? మీకు దైవభీతి లేదా?

26:162 – إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ ١٦٢

“నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన, విశ్వసనీయుడనైన సందేశహరుడను.

26:163 – فَاتَّقُوا اللَّـهَ وَأَطِيعُونِ ١٦٣

“కావున మీరు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

26:164 – وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ ١٦٤

“నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువువద్దనే ఉన్నది.

26:165 – أَتَأْتُونَ الذُّكْرَانَ مِنَ الْعَالَمِينَ ١٦٥

“(ప్రకృతికి విరుధ్ధంగా) సర్వ ప్రాణులలో కెల్లా మీరే పురుషుల వద్దకు పోతారేమిటీ?

26:166 – وَتَذَرُونَ مَا خَلَقَ لَكُمْ رَبُّكُم مِّنْ أَزْوَاجِكُم ۚ بَلْ أَنتُمْ قَوْمٌ عَادُونَ ١٦٦

“మీ ప్రభువు, మీ కొరకు సహవాసులు (అ’జ్వాజ్‌) గా పుట్టించిన వారిని విడిచిపెడు తున్నారేమిటి? అలాకాదు, మీరు హద్దుమీరి ప్రవర్తించే జాతివారు!” 50

26:167 – قَالُوا لَئِن لَّمْ تَنتَهِ يَا لُوطُ لَتَكُونَنَّ مِنَ الْمُخْرَجِينَ ١٦٧

(దానికి) వారన్నారు: “ఓ లూ’త్‌! ఇక నీవు మానుకోకపోతే నీవు దేశం నుండి బహిష్క రించబడిన వారిలో చేరుతావు!”

26:168 – قَالَ إِنِّي لِعَمَلِكُم مِّنَ الْقَالِينَ ١٦٨

(లూ’త్‌) అన్నాడు:”నిశ్చయంగా, మీ ఈ చేష్టను అసహ్యించుకునేవారిలో నేనూ ఉన్నాను.”

26:169 – رَبِّ نَجِّنِي وَأَهْلِي مِمَّا يَعْمَلُونَ ١٦٩

(ఇలా ప్రార్థించాడు): “ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా కుటుంబం వారినీ వీరి చేష్టల నుండి కాపాడు.”

26:170 – فَنَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ ١٧٠

కావున మేము అతనిని మరియు అతని కుటుంబం వారి నందరినీ కాపాడాము –

26:171 – إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ ١٧١

వెనుక ఉండి పోయిన వారిలో కలసి పోయిన ముసలామె తప్ప! 51

26:172 – ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ ١٧٢

ఆ తరువాత, మిగతా వారిని నిర్మూలించాము.

26:173 – وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًا ۖ فَسَاءَ مَطَرُ الْمُنذَرِينَ ١٧٣

వారిపై వర్షాన్ని కురిపించాము. అది (ముందు) హెచ్చరించబడిన వారిపై (కురిపించ బడ్డ) అతి భయంకరమైన వర్షం. 52

26:174 – إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ١٧٤

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలామంది విశ్వసించడం లేదు.

26:175 – وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ ١٧٥

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణాప్రదాత.

26:176 – كَذَّبَ أَصْحَابُ الْأَيْكَةِ الْمُرْسَلِينَ ١٧٦

వనవాసులు (అ’య్‌కహ్‌వాసులు) సందేశ హరులను అసత్యవాదులని తిరస్క రించారు. 53

26:177 – إِذْ قَالَ لَهُمْ شُعَيْبٌ أَلَا تَتَّقُونَ ١٧٧

షు’ఐబ్‌ వారితో ఇలా అన్నాడు: “ఏమీ? మీకు దైవభీతి లేదా? 54

26:178 – إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ ١٧٨

“నిశ్చయంగా, నేను మీవద్దకు పంపబడిన, విశ్వసనీయుడనైన సందేశహరుడను.

26:179 – فَاتَّقُوا اللَّـهَ وَأَطِيعُونِ ١٧٩

“కావున మీరు అల్లాహ్‌ యందు భయ- భక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి!

26:180 – وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ ١٨٠

“నేను దానికొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలం అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది. (5/8)

26:181 – أَوْفُوا الْكَيْلَ وَلَا تَكُونُوا مِنَ الْمُخْسِرِينَ ١٨١

  • “మీరు (ఇచ్చినపుడు) సరిగ్గా కొలిచి ఇవ్వండి. నష్టపరిచేవారిలో చేరకండి!

26:182 – وَزِنُوا بِالْقِسْطَاسِ الْمُسْتَقِيمِ ١٨٢

“త్రాసుతో సరిసమానంగా తూచండి.

26:183 – وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ ١٨٣

“ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వ కండి. భూమిలో కల్లోలం రేకెత్తిస్తూ దౌర్జన్యపరులుగా ప్రవర్తించకండి. 55

26:184 – وَاتَّقُوا الَّذِي خَلَقَكُمْ وَالْجِبِلَّةَ الْأَوَّلِينَ ١٨٤

“మిమ్మల్ని మరియు మీకు పూర్వం గతించిన తరాల వారిని సృష్టించిన ఆయన (అల్లాహ్‌) యందు భయ-భక్తులు కలిగి ఉండండి.” 56

26:185 – قَالُوا إِنَّمَا أَنتَ مِنَ الْمُسَحَّرِينَ ١٨٥

వారన్నారు: “నిశ్చయంగా, నీవు మంత్ర జాలంతో వశపరచుకోబడ్డావు!

26:186 – وَمَا أَنتَ إِلَّا بَشَرٌ مِّثْلُنَا وَإِن نَّظُنُّكَ لَمِنَ الْكَاذِبِينَ ١٨٦

“నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! నిశ్చయంగా, మేము నిన్ను అసత్య- వాదులలో ఒకనిగా పరిగణిస్తున్నాము!

26:187 – فَأَسْقِطْ عَلَيْنَا كِسَفًا مِّنَ السَّمَاءِ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ ١٨٧

“నీవు సత్యవంతుడవే అయితే ఆకాశం యొక్క ఒక తునకను మాపై పడవేయి.”

26:188 – قَالَ رَبِّي أَعْلَمُ بِمَا تَعْمَلُونَ ١٨٨

(షు’ఐబ్‌) అన్నాడు: “మీరు చేసేది నా ప్రభువుకు బాగా తెలుసు!”

26:189 – فَكَذَّبُوهُ فَأَخَذَهُمْ عَذَابُ يَوْمِ الظُّلَّةِ ۚ إِنَّهُ كَانَ عَذَابَ يَوْمٍ عَظِيمٍ ١٨٩

కాని, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు, కావున, వారిపై ఛాయాకృత ఉపద్రవం (మేఘాల శిక్ష) వచ్చిపడింది. నిశ్చయంగా అదొక భయంకరమైన దినపు శిక్ష! 57

26:190 – إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ١٩٠

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలామంది విశ్వసించటం లేదు.

26:191 – وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ ١٩١

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వ శక్తిమంతుడు, అపార కరుణాప్రదాత. 58

26:192 – وَإِنَّهُ لَتَنزِيلُ رَبِّ الْعَالَمِينَ ١٩٢

మరియు నిశ్చయంగా, ఇది సర్వలోకాల ప్రభువు అవతరింపజేసిన (గ్రంథం).

26:193 – نَزَلَ بِهِ الرُّوحُ الْأَمِينُ ١٩٣

దీనిని నమ్మదగిన ఆత్మ (రూ’హుల్‌ అమీన్‌) అవతరింపజేశాడు; 59

26:194 – عَلَىٰ قَلْبِكَ لِتَكُونَ مِنَ الْمُنذِرِينَ ١٩٤

నీ హృదయం మీద, నీవు హెచ్చరిక చేసేవారిలో చేరిపోవాలని;

26:195 – بِلِسَانٍ عَرَبِيٍّ مُّبِينٍ ١٩٥

స్పష్టమైన అరబ్బీ భాషలో! 60

26:196 – وَإِنَّهُ لَفِي زُبُرِ الْأَوَّلِينَ ١٩٦

నిశ్చయంగా, దీని (ప్రస్తావన) పూర్వ దివ్యగ్రంథాలలో ఉంది. 61

26:197 – أَوَلَمْ يَكُن لَّهُمْ آيَةً أَن يَعْلَمَهُ عُلَمَاءُ بَنِي إِسْرَائِيلَ ١٩٧

ఇస్రాయీ’ల్‌ సంతతి వారిలోని విద్వాంసులు 62 ఈ విషయాన్ని ఒప్పుకోవటం వారికొక సూచనగా సరిపోదా?

26:198 – وَلَوْ نَزَّلْنَاهُ عَلَىٰ بَعْضِ الْأَعْجَمِينَ ١٩٨

ఒకవేళ మేము దీనిని ‘అరబ్‌ కాని వానిపై అవతరింపజేసి ఉంటే!

26:199 – فَقَرَأَهُ عَلَيْهِم مَّا كَانُوا بِهِ مُؤْمِنِينَ ١٩٩

అతను దానిని, వారికి చదివి వినిపించినా వారు దానిని విశ్వసించేవారు కారు. 63

26:200 – كَذَٰلِكَ سَلَكْنَاهُ فِي قُلُوبِ الْمُجْرِمِينَ ٢٠٠

ఈ విధంగా, మేము దీనిని (తిరస్కారాన్ని) అపరాధుల హృదయాలలోనికి దిగిపోయేలా చేశాము.

26:201 – لَا يُؤْمِنُونَ بِهِ حَتَّىٰ يَرَوُا الْعَذَابَ الْأَلِيمَ ٢٠١

కఠిన శిక్షను చూడనంత వరకు వారు దీనిని విశ్వసించరు.

26:202 – فَيَأْتِيَهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ ٢٠٢

అది వారికి తెలియకుండానే అకస్మాత్తుగా వచ్చిపడుతుంది.

26:203 – فَيَقُولُوا هَلْ نَحْنُ مُنظَرُونَ ٢٠٣

అప్పుడు వారంటారు: “ఏమీ? మాకు కొంత వ్యవధి ఇవ్వబడుతుందా?” 64

26:204 – أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ ٢٠٤

ఏమీ? మా శిక్ష శీఘ్రంగా రావలెనని వారు కోరుతున్నారా? 65

26:205 – أَفَرَأَيْتَ إِن مَّتَّعْنَاهُمْ سِنِينَ ٢٠٥

చూశావా? మేము కొన్ని సంవత్సరాలు వారికి (ఈ జీవితంలో) సుఖ-సంతోషాలతో గడిపే వ్యవధి నిచ్చినా!

26:206 – ثُمَّ جَاءَهُم مَّا كَانُوا يُوعَدُونَ ٢٠٦

తరువాత వాగ్దానం చేయబడినది (శిక్ష) వారిపైకి వచ్చినపుడు;

26:207 – مَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يُمَتَّعُونَ ٢٠٧

వారు అనుభవిస్తూ ఉండిన సుఖ-సంతోషాలు వారికేమీ పనికిరావు. 66

26:208 – وَمَا أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا لَهَا مُنذِرُونَ ٢٠٨

మరియు – హెచ్చరిక చేసే వారిని (ప్రవక్తలను) పంపనిదే – మేము ఏ నగరాన్ని కూడా నాశనం చేయలేదు!

26:209 – ذِكْرَىٰ وَمَا كُنَّا ظَالِمِينَ ٢٠٩

హితబోధ నివ్వటానికి; మేము ఎన్నడూ అన్యాయస్థులముగా ప్రవర్తించ లేదు. 67

26:210 – وَمَا تَنَزَّلَتْ بِهِ الشَّيَاطِينُ ٢١٠

మరియు దీనిని (ఈ దివ్యగ్రంథాన్ని) తీసుకొని క్రిందికి దిగిన వారు షై’తానులు కారు.

26:211 – وَمَا يَنبَغِي لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ ٢١١

మరియు అది వారికి తగినది కాదు; వారది చేయలేరు.

26:212 – إِنَّهُمْ عَنِ السَّمْعِ لَمَعْزُولُونَ ٢١٢

వాస్తవానికి, వారు దీనిని వినకుండా దూరంగా ఉంచబడ్డారు.

26:213 – فَلَا تَدْعُ مَعَ اللَّـهِ إِلَـٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ ٢١٣

కావున అల్లాహ్‌తో పాటు మరొక ఆరాధ్య దైవాన్ని వేడుకోకు, అలాచేస్తే నీవు కూడా శిక్షింపబడే వారిలో చేరిపోతావు.

26:214 – وَأَنذِرْ عَشِيرَتَكَ الْأَقْرَبِينَ ٢١٤

మరియు నీ దగ్గరి బంధువులను హెచ్చరించు;

26:215 – وَاخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ ٢١٥

విశ్వాసులలో నిన్ను అనుసరించే వారిపై నీ కనికరపు రెక్కలను చాపు. 68

26:216 – فَإِنْ عَصَوْكَ فَقُلْ إِنِّي بَرِيءٌ مِّمَّا تَعْمَلُونَ ٢١٦

ఒకవేళ వారు నీపట్ల అవిధేయత చూపితే వారితో అను: “మీరు చేసే కార్యాలకు నేను బాధ్యుడను కాను.”

26:217 – وَتَوَكَّلْ عَلَى الْعَزِيزِ الرَّحِيمِ ٢١٧

మరియు ఆ సర్వశక్తిమంతుడు, అపార కరుణాప్రదాత మీద నమ్మకం ఉంచుకో!

26:218 – الَّذِي يَرَاكَ حِينَ تَقُومُ ٢١٨

ఆయన నీవు నిలిచినపుడు, నిన్ను చూస్తున్నాడు. 69

26:219 – وَتَقَلُّبَكَ فِي السَّاجِدِينَ ٢١٩

మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారితో, నీ రాక పోకడలను కూడా!

26:220 – إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ ٢٢٠

నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

26:221 – هَلْ أُنَبِّئُكُمْ عَلَىٰ مَن تَنَزَّلُ الشَّيَاطِينُ ٢٢١

షై’తాన్‌లు ఎవరిపై దిగుతారో నేను మీకు తెలుపనా?

26:222 – تَنَزَّلُ عَلَىٰ كُلِّ أَفَّاكٍ أَثِيمٍ ٢٢٢

వారు అసత్యవాదులైన పాపాత్ములపై దిగుతారు;

26:223 – يُلْقُونَ السَّمْعَ وَأَكْثَرُهُمْ كَاذِبُونَ ٢٢٣

గాలి వార్తలను చెవులలో ఊదుతారు; 70 మరియు వారిలో చాలా మంది అసత్యవాదులే!

26:224 – وَالشُّعَرَاءُ يَتَّبِعُهُمُ الْغَاوُونَ ٢٢٤

మరియు మార్గభ్రష్టులే కవులను అనుసరిస్తారు. 71

26:225 – أَلَمْ تَرَ أَنَّهُمْ فِي كُلِّ وَادٍ يَهِيمُونَ ٢٢٥

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా వారు (కవులు) తమ కవిత్వంలో ప్రతి విషయాన్ని ఉద్దేశరహితంగా (ప్రశంసిస్తూ) ఉంటారని; 72

26:226 – وَأَنَّهُمْ يَقُولُونَ مَا لَا يَفْعَلُونَ ٢٢٦

మరియు నిశ్చయంగా, వారు తాము ఆచరించని దానిని చెప్పుకుంటారని;

26:227 – إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَذَكَرُوا اللَّـهَ كَثِيرًا وَانتَصَرُوا مِن بَعْدِ مَا ظُلِمُوا ۗ وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنقَلَبٍ يَنقَلِبُونَ ٢٢٧

కాని, (వారిలో) విశ్వసించి, సత్కార్యాలు చేస్తూ, అల్లాహ్‌ను అమితంగా స్మరించే వారూ మరియు – తమకు అన్యాయం జరిగినప్పుడే – ప్రతీకారచర్య తీసుకునేవారుతప్ప! అన్యాయం చేసేవారు తమ పర్యవసానం ఏమిటో త్వరలో తెలుసుకోగలరు. (3/4)

సూరహ్‌ అన్‌-నమ్ల్‌ – నమ్‌లున్‌: చీమలు. ఈ సూరహ్‌లో చీమల సంభాషణ పేర్కొనబడింది కావున దీనికి ఈ పేరు ఇవ్వబడింది. ఇది 18వ ఆయత్‌లో ఉంది. దీని మరొక పేరు ‘తా-సీన్‌. ఇది మొదటి ఆయత్‌లో ఉంది. ఇందులో 93 ఆయతులు ఉన్నాయి. ఈ సూరహ్‌ 26వ సూరహ్‌ తరువాత మధ్య మక్కహ్ కాలంలో అవతరింపజేయబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 27:1 – طس ۚ تِلْكَ آيَاتُ الْقُرْآنِ وَكِتَابٍ مُّبِينٍ ١

  • ‘తా-సీన్‌. ఇవి దివ్యఖుర్‌ఆన్‌ ఆయతులు మరియు ఇది ఒక స్పష్టమైన గ్రంథము. 1

27:2 – هُدًى وَبُشْرَىٰ لِلْمُؤْمِنِينَ ٢

ఇవి విశ్వాసులకు మార్గదర్శకత్వంగానూ మరియు శుభవార్తలు ఇచ్చేవిగానూ ఉన్నాయి.

27:3 – الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُم بِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ ٣

ఎవరైతే నమా’జ్‌ స్థాపిస్తారో మరియు విధిదానం (‘జకాత్‌) ఇస్తారో మరియు పరలోక జీవితాన్ని నమ్ముతారో!

27:4 – إِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ زَيَّنَّا لَهُمْ أَعْمَالَهُمْ فَهُمْ يَعْمَهُونَ ٤

నిశ్చయంగా, ఎవరైతే పరలోక జీవితాన్ని విశ్వసించరో, వారికి మేము వారి చేష్టను ఆకర్షణీయమైనవిగా చేశాము. అందువల్ల వారు అంధులవలే దారి తప్పి తిరుగుతూ ఉంటారు. 2

27:5 – أُولَـٰئِكَ الَّذِينَ لَهُمْ سُوءُ الْعَذَابِ وَهُمْ فِي الْآخِرَةِ هُمُ الْأَخْسَرُونَ ٥

ఇలాంటి వారికి చెడ్డ శిక్ష ఉంది. మరియు చివరకు వారే అందరికంటే ఎక్కువగా నష్టపడేవారు.

27:6 – وَإِنَّكَ لَتُلَقَّى الْقُرْآنَ مِن لَّدُنْ حَكِيمٍ عَلِيمٍ ٦

మరియు (ఓ ము’హమ్మద్‌!) నిశ్చయంగా నీవు ఈ ఖుర్‌ఆన్‌ను, మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు అయిన (అల్లాహ్‌) నుండి పొందు తున్నావు.

27:7 – إِذْ قَالَ مُوسَىٰ لِأَهْلِهِ إِنِّي آنَسْتُ نَارًا سَآتِيكُم مِّنْهَا بِخَبَرٍ أَوْ آتِيكُم بِشِهَابٍ قَبَسٍ لَّعَلَّكُمْ تَصْطَلُونَ ٧

c 3 నేను దాని నుండి మీ వద్దకు ఏదైనా వార్తను తీసుకువస్తాను లేదా మీరు కాచుకోవడానికి మండే కొరివినైనా తీసుకువస్తాను.” అని అన్నాడు.

27:8 – فَلَمَّا جَاءَهَا نُودِيَ أَن بُورِكَ مَن فِي النَّارِ وَمَنْ حَوْلَهَا وَسُبْحَانَ اللَّـهِ رَبِّ الْعَالَمِينَ ٨

కాని అతడు అక్కడికి చేరినప్పుడు ఒక ధ్వని ఇలా వినిపించింది: “ఈ అగ్నిలో ఉన్నవానికీ మరియు దాని పరిసరాలలో ఉన్నవానికీ శుభాలు కలుగుగాక! సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్‌ సర్వలోపాలకు అతీతుడు.

27:9 – يَا مُوسَىٰ إِنَّهُ أَنَا اللَّـهُ الْعَزِيزُ الْحَكِيمُ ٩

“ఓ మూసా! నిశ్చయంగా ఆయన, అల్లాహ్‌ను నేనే! సర్వ శక్తిమంతుడను, మహా వివేకవంతుడను.

27:10 – وَأَلْقِ عَصَاكَ ۚ فَلَمَّا رَآهَا تَهْتَزُّ كَأَنَّهَا جَانٌّ وَلَّىٰ مُدْبِرًا وَلَمْ يُعَقِّبْ ۚ يَا مُوسَىٰ لَا تَخَفْ إِنِّي لَا يَخَافُ لَدَيَّ الْمُرْسَلُونَ ١٠

“నీ చేతికర్రను పడవేయి!” అతను దానిని (పడవేసి) చూశాడు. అది పామువలె కదల సాగింది. 4 అతడు వెనుదిరిగి చూడకుండా పరు గెత్తసాగాడు. (అల్లాహ్‌ అన్నాడు): “ఓ మూసా! భయపడకు 5 నిశ్చయంగా, నా సన్నిధిలో సందేశహరులకు ఎలాంటి భయం ఉండదు.

27:11 – إِلَّا مَن ظَلَمَ ثُمَّ بَدَّلَ حُسْنًا بَعْدَ سُوءٍ فَإِنِّي غَفُورٌ رَّحِيمٌ ١١

“కాని ఎవడైనా తప్పుచేస్తే తప్ప! ఆ తరువాత అతడు దానికి బదులుగా మంచి పనులు చేస్తే! 6 నిశ్చయంగా, నేను క్షమించే వాడను, కరుణాప్రదాతను.

27:12 – وَأَدْخِلْ يَدَكَ فِي جَيْبِكَ تَخْرُجْ بَيْضَاءَ مِنْ غَيْرِ سُوءٍ ۖ فِي تِسْعِ آيَاتٍ إِلَىٰ فِرْعَوْنَ وَقَوْمِهِ ۚ إِنَّهُمْ كَانُوا قَوْمًا فَاسِقِينَ ١٢

“ఇక నీ చేతిని నీ చంకలో (జేబులో) పెట్టి (తీయి), అది ఎలాంటి లోపంలేకుండా తెల్లగా (ప్రకాశిస్తూ) బయటికివస్తుంది. 7 ఈ తొమ్మిది అద్భుత సూచనలు (ఆయాత్‌) తీసుకొని నీవు ఫిర్‌’ఔన్‌ మరియు అతనిజాతివారి వద్దకు వెళ్ళు. 8 నిశ్చయంగా వారు అవిధేయులై పోయారు!”

27:13 – فَلَمَّا جَاءَتْهُمْ آيَاتُنَا مُبْصِرَةً قَالُوا هَـٰذَا سِحْرٌ مُّبِينٌ ١٣

కాని వారి ముందుకు మా ప్రత్యక్ష సూచనలు వచ్చినపుడు వారు: “ఇది స్పష్టమైన మాయాజాలమే!” అని అన్నారు. 9

27:14 – وَجَحَدُوا بِهَا وَاسْتَيْقَنَتْهَا أَنفُسُهُمْ ظُلْمًا وَعُلُوًّا ۚ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِينَ ١٤

మరియు వారి హృదయాలు వాటిని అంగీకరించినా వారు అన్యాయంగా అహంకారంతో తిరస్కరించారు. ఇక చూడు ఆ దౌర్జన్యపరుల గతి ఏమయి పోయిందో!

27:15 – وَلَقَدْ آتَيْنَا دَاوُودَ وَسُلَيْمَانَ عِلْمًا ۖ وَقَالَا الْحَمْدُ لِلَّـهِ الَّذِي فَضَّلَنَا عَلَىٰ كَثِيرٍ مِّنْ عِبَادِهِ الْمُؤْمِنِينَ ١٥

మరియు వాస్తవంగా, మేము దావూద్‌ మరియు సులైమాన్‌లకు జ్ఞానాన్ని ప్రసా దించాము. 10 వారిద్దరు అన్నారు: “విశ్వాసులైన తన అనేక దాసులలో, మా ఇద్దరికి ఘనతను ప్రసా దించిన ఆ అల్లాహ్‌యే సర్వ స్తోత్రాలకు అర్హుడు!”

27:16 – وَوَرِثَ سُلَيْمَانُ دَاوُودَ ۖ وَقَالَ يَا أَيُّهَا النَّاسُ عُلِّمْنَا مَنطِقَ الطَّيْرِ وَأُوتِينَا مِن كُلِّ شَيْءٍ ۖ إِنَّ هَـٰذَا لَهُوَ الْفَضْلُ الْمُبِينُ ١٦

మరియు సులైమాన్‌, దావూద్‌కు వారసు డయ్యాడు. 11 మరియు అతను (సులైమాన్‌) అన్నాడు: “ఓ ప్రజలారా! మాకు పక్షుల భాష నేర్పబడింది. మరియు మాకు ప్రతివస్తువు ఒసంగబడింది. నిశ్చయంగా, ఇది ఒక స్పష్టమైన (అల్లాహ్‌) అనుగ్రహమే!”

27:17 – وَحُشِرَ لِسُلَيْمَانَ جُنُودُهُ مِنَ الْجِنِّ وَالْإِنسِ وَالطَّيْرِ فَهُمْ يُوزَعُونَ ١٧

మరియు సులైమాన్‌ కొరకు జిన్నాతుల, 12 మానవుల మరియు పక్షుల సైన్యాలు సమీకరింప బడి ఉండేవి. తరువాత వాటిని తమతమ స్థానాల ప్రకారం వరుసలలో పెట్టి (బయలుదేరారు)!

27:18 – حَتَّىٰ إِذَا أَتَوْا عَلَىٰ وَادِ النَّمْلِ قَالَتْ نَمْلَةٌ يَا أَيُّهَا النَّمْلُ ادْخُلُوا مَسَاكِنَكُمْ لَا يَحْطِمَنَّكُمْ سُلَيْمَانُ وَجُنُودُهُ وَهُمْ لَا يَشْعُرُونَ ١٨

చివరకు వారు చీమల లోయకు (కనుమకు) చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా అన్నది: “ఓ చీమలారా! మీరు మీ ఇండ్లలోకి ప్రవేశించండి, లేకపోతే సులైమాన్‌ మరియు అతని సైనికులు – వారికి తెలియకుండానే – మిమ్మల్ని నలిపివేయవచ్చు!” 13

27:19 – فَتَبَسَّمَ ضَاحِكًا مِّن قَوْلِهَا وَقَالَ رَبِّ أَوْزِعْنِي أَنْ أَشْكُرَ نِعْمَتَكَ الَّتِي أَنْعَمْتَ عَلَيَّ وَعَلَىٰ وَالِدَيَّ وَأَنْ أَعْمَلَ صَالِحًا تَرْضَاهُ وَأَدْخِلْنِي بِرَحْمَتِكَ فِي عِبَادِكَ الصَّالِحِينَ ١٩

(సులైమాన్‌) దాని మాటలకు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: “ఓ నా ప్రభూ! నీవు నన్ను – నాకూ మరియు నా తల్లి-దండ్రులకు చూపిన అనుగ్రహాలకు – కృతజ్ఞత తెలిపేవానిగా 14 మరియు నీకు నచ్చే సత్కార్యాలు చేసేవానిగా, ప్రోత్సాహపరచు. మరియు నన్ను నీ కారుణ్యంతో సద్వర్తనులైన నీ దాసులలో చేర్చుకో!” 15

27:20 – وَتَفَقَّدَ الطَّيْرَ فَقَالَ مَا لِيَ لَا أَرَى الْهُدْهُدَ أَمْ كَانَ مِنَ الْغَائِبِينَ ٢٠

మరియు (ఒక రోజు) అతను పక్షులను పరిశీలిస్తూ ఇలా అన్నాడు: “ఏమిటీ నాకు వడ్రంగి పిట్ట (హుద్‌హుద్‌) కనిపించడం లేదే! అది ఎటు అదృశ్యమై పోయింది?

27:21 – لَأُعَذِّبَنَّهُ عَذَابًا شَدِيدًا أَوْ لَأَذْبَحَنَّهُ أَوْ لَيَأْتِيَنِّي بِسُلْطَانٍ مُّبِينٍ ٢١

“నేను దానిని కఠినంగా శిక్షిస్తాను. లేదా దానిని కోసివేస్తాను, అది నాకు సరైన కారణం చూపితేనే తప్ప!”

27:22 – فَمَكَثَ غَيْرَ بَعِيدٍ فَقَالَ أَحَطتُ بِمَا لَمْ تُحِطْ بِهِ وَجِئْتُكَ مِن سَبَإٍ بِنَبَإٍ يَقِينٍ ٢٢

ఆ తరువాత ఎంతో సేపు గడవక ముందే అది వచ్చి ఇలా అన్నది: “నీకు తెలియని విషయమొకటి నేను తెలుసుకొని వచ్చాను. నేను సబా’ను గురించి ఒక నమ్మకమైన వార్తను నీ కొరకు తెచ్చాను. 16

27:23 – إِنِّي وَجَدتُّ امْرَأَةً تَمْلِكُهُمْ وَأُوتِيَتْ مِن كُلِّ شَيْءٍ وَلَهَا عَرْشٌ عَظِيمٌ ٢٣

“నిశ్చయంగా, నేను అక్కడ ఒక స్త్రీని చూశాను. ఆమె వారిపై (రాణిగా) పరిపాలన చేస్తుంది. ఆమెకు ప్రతి వస్తువు ఒసంగబడి ఉంది. ఆమె దగ్గర ఒక గొప్ప సింహాసనం ఉంది.

27:24 – وَجَدتُّهَا وَقَوْمَهَا يَسْجُدُونَ لِلشَّمْسِ مِن دُونِ اللَّـهِ وَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ فَصَدَّهُمْ عَنِ السَّبِيلِ فَهُمْ لَا يَهْتَدُونَ ٢٤

“మరియు నేను ఆమెను మరియు ఆమె జాతి వారిని అల్లాహ్‌ను వదలి సూర్యునికి సాష్టాం గం (సజ్దా) చేయటం చూశాను మరియు షై’తాన్‌ వారికర్మలను, వారికి మంచివిగాతోచేటట్లు చేశాడు. కావునవారినిసన్మార్గంనుండి నిరో ధించాడు కాబట్టి వారు సన్మార్గం పొందలేక పోయారు.

27:25 – أَلَّا يَسْجُدُوا لِلَّـهِ الَّذِي يُخْرِجُ الْخَبْءَ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَيَعْلَمُ مَا تُخْفُونَ وَمَا تُعْلِنُونَ ٢٥

“అందుకే వారు – ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ దాగివున్న వాటిని బయటికి తీసే వాడూ మరియు మీరు దాచే వాటినీ మరియు వ్యక్తపరిచే వాటినీ ఎరుగువాడూ అయిన – అల్లాహ్‌కు సాష్టాంగం (సజ్దా) చేయటం లేదు.

27:26 – اللَّـهُ لَا إِلَـٰهَ إِلَّا هُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ ۩ ٢٦

“అల్లాహ్‌! ఆయన తప్పమరొక ఆరాధ్య దైవం లేడు. ఆయనే సర్వోత్తమ సింహాసనానికి (‘అర్ష్‌కు) ప్రభువు.” (7/8) (సజ్దా)

27:27 – قَالَ سَنَنظُرُ أَصَدَقْتَ أَمْ كُنتَ مِنَ الْكَاذِبِينَ ٢٧

  • (సులైమాన్‌) అన్నాడు: “నీవు సత్యం పలుకుతున్నావో, లేదా అబద్దాలాడే వారిలో చేరినవాడవో, మేము ఇప్పుడే చూస్తాము.

27:28 – اذْهَب بِّكِتَابِي هَـٰذَا فَأَلْقِهْ إِلَيْهِمْ ثُمَّ تَوَلَّ عَنْهُمْ فَانظُرْ مَاذَا يَرْجِعُونَ ٢٨

నా ఈ ఉత్తరం తీసుకొని పో! దీనిని వారివద్ద పడవేయి, తరువాత వారినుండి ఒక వైపుకు తొలగిపోయి వారేమి సమాధానమిస్తారో చూడు.”

27:29 – قَالَتْ يَا أَيُّهَا الْمَلَأُ إِنِّي أُلْقِيَ إِلَيَّ كِتَابٌ كَرِيمٌ ٢٩

(రాణి) అన్నది: “ఓ నా ఆస్థాన నాయకులారా! ఇదిగో నా వైపుకు ఒక విశేషమైన ఉత్తరం పంపబడింది.

27:30 – إِنَّهُ مِن سُلَيْمَانَ وَإِنَّهُ بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ ٣٠

“నిశ్చయంగా, ఇది సులైమాన్‌ దగ్గర నుండి వచ్చింది. మరియు ఇది: ‘అనంత కరుణా మయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్‌ పేరుతో,’ ప్రారంభించ బడింది.”

27:31 – أَلَّا تَعْلُوا عَلَيَّ وَأْتُونِي مُسْلِمِينَ ٣١

“(ఇందులో ఇలా వ్రాయబడి ఉంది): ‘నా పై ఆధిక్యతను చూపకండి. నా సన్నిధిలోకి అల్లాహ్‌ కు విధేయులు (ముస్లింలు) అయిరండి.’ ” 17

27:32 – قَالَتْ يَا أَيُّهَا الْمَلَأُ أَفْتُونِي فِي أَمْرِي مَا كُنتُ قَاطِعَةً أَمْرًا حَتَّىٰ تَشْهَدُونِ ٣٢

(రాణి) అన్నది: “ఓ నాయకులారా! ఈ విషయంలో మీరు నాకు సలహా ఇవ్వండి. నేను ఏ విషయంలోనూ, మీరు లేనిదే ఎలాంటి నిర్ణయం తీసుకోనే!”

27:33 – قَالُوا نَحْنُ أُولُو قُوَّةٍ وَأُولُو بَأْسٍ شَدِيدٍ وَالْأَمْرُ إِلَيْكِ فَانظُرِي مَاذَا تَأْمُرِينَ ٣٣

వారిలా జవాబిచ్చారు: “మనం చాలా బల వంతులము. మరియు గొప్ప యుధ్ధ నిపుణు లము, కాని నిర్ణయం మాత్రం నీదే! కావున, నీవు ఏమి ఆజ్ఞాపించదలచుకున్నావో ఆలోచించు!”

27:34 – قَالَتْ إِنَّ الْمُلُوكَ إِذَا دَخَلُوا قَرْيَةً أَفْسَدُوهَا وَجَعَلُوا أَعِزَّةَ أَهْلِهَا أَذِلَّةً ۖ وَكَذَٰلِكَ يَفْعَلُونَ ٣٤

(రాణి) అన్నది: “రాజులు ఏ దేశంలోనైనా జొరబడినప్పుడు, వారందులో కల్లోలం రేకెత్తిస్తారు మరియు అక్కడి గౌరవనీయులైన ప్రజలను అవమానపరుస్తారు. వీరు కూడా అదేవిధంగా చేయవచ్చు!

27:35 – وَإِنِّي مُرْسِلَةٌ إِلَيْهِم بِهَدِيَّةٍ فَنَاظِرَةٌ بِمَ يَرْجِعُ الْمُرْسَلُونَ ٣٥

“కావున నేను తప్పక, వారి వద్దకు ఒక కానుకను పంపుతాను. ఆ తరువాత నా దూతలు ఏమి జవాబు తెస్తారో చూస్తాను.”

27:36 – فَلَمَّا جَاءَ سُلَيْمَانَ قَالَ أَتُمِدُّونَنِ بِمَالٍ فَمَا آتَانِيَ اللَّـهُ خَيْرٌ مِّمَّا آتَاكُم بَلْ أَنتُم بِهَدِيَّتِكُمْ تَفْرَحُونَ ٣٦

(రాయబారులు) సులైమాన్‌ వద్దకు వచ్చి నపుడు, అతను అన్నాడు: “ఏమీ? మీరు నాకు ధన సహాయం చేయదలచారా? అల్లాహ్‌ నాకు ఇచ్చింది, మీకు ఇచ్చిన దానికంటే ఎంతో ఉత్తమ మైనది, ఇక మీ కానుకతో మీరే సంతోషపడండి!”

27:37 – ارْجِعْ إِلَيْهِمْ فَلَنَأْتِيَنَّهُم بِجُنُودٍ لَّا قِبَلَ لَهُم بِهَا وَلَنُخْرِجَنَّهُم مِّنْهَا أَذِلَّةً وَهُمْ صَاغِرُونَ ٣٧

(సులైమాన్‌ అన్నాడు): “నీవు వారి వద్దకు తిరిగి పో, మేము వారిపైకి గొప్ప సేనలతో వస్తాము. వారు వాటిని ఎదిరించజాలరు. మేము వారిని పరాభవించి అచ్చటి నుండి వెడలగొడ్తాము. మరియు వారు అవమానితులై ఉండిపోతారు.”

27:38 – قَالَ يَا أَيُّهَا الْمَلَأُ أَيُّكُمْ يَأْتِينِي بِعَرْشِهَا قَبْلَ أَن يَأْتُونِي مُسْلِمِينَ ٣٨

(తరువాత సులైమాన్‌) ఇలా అన్నాడు: “ఓ నాయకులారా! వారు అల్లాహ్‌కు విధేయులై (ముస్లింలై) రాకముందే, ఆమె సింహాసనాన్ని నా వద్దకు మీలో ఎవరు తేగలరు?”

27:39 – قَالَ عِفْرِيتٌ مِّنَ الْجِنِّ أَنَا آتِيكَ بِهِ قَبْلَ أَن تَقُومَ مِن مَّقَامِكَ ۖ وَإِنِّي عَلَيْهِ لَقَوِيٌّ أَمِينٌ ٣٩

జిన్నాతులలో బలిష్ఠుడైన ఒకడు ఇలా అన్నాడు: “నీవు నీ స్థానం నుండి లేవక ముందే నేను దానిని తీసుకువస్తాను. నిశ్చయంగా, నేను ఇలాచేసే బలంగలవాడను, నమ్మదగిన వాడను!”

27:40 – قَالَ الَّذِي عِندَهُ عِلْمٌ مِّنَ الْكِتَابِ أَنَا آتِيكَ بِهِ قَبْلَ أَن يَرْتَدَّ إِلَيْكَ طَرْفُكَ ۚ فَلَمَّا رَآهُ مُسْتَقِرًّا عِندَهُ قَالَ هَـٰذَا مِن فَضْلِ رَبِّي لِيَبْلُوَنِي أَأَشْكُرُ أَمْ أَكْفُرُ ۖ وَمَن شَكَرَ فَإِنَّمَا يَشْكُرُ لِنَفْسِهِ ۖ وَمَن كَفَرَ فَإِنَّ رَبِّي غَنِيٌّ كَرِيمٌ ٤٠

గ్రంథజ్ఞానం గల ఒకతను ఇలా అన్నాడు: “నేను కనురెప్పపాటు కాలంలో దానిని నీ వద్దకు తేగలను!” ఆ తరువాత (సులైమాన్‌) దానిని వాస్తవంగా తనముందు పెట్టబడిఉండటాన్ని చూసి ఇలా అన్నాడు: “ఇది నా ప్రభువు అనుగ్రహం. నేను కృతజ్ఞతలు చూపుదునా లేక కృతఘ్నుడ నవుదునా అనిపరీక్షించటానికి ఇలా చేయబడింది. కృతజ్ఞతలు తెలిపేవాడు, నిశ్చయంగా తన మేలు కొరకే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. కాని ఎవడైనా కృతఘ్నతకు పాల్పడితే, నిశ్చయంగా, నా ప్రభువు స్వయంసమృద్ధుడు, పరమదాత 18 (అని తెలుసుకోవాలి).”

27:41 – قَالَ نَكِّرُوا لَهَا عَرْشَهَا نَنظُرْ أَتَهْتَدِي أَمْ تَكُونُ مِنَ الَّذِينَ لَا يَهْتَدُونَ ٤١

(సులైమాన్‌) అన్నాడు:”ఆమె గుర్తించ లేకుండా ఆమె సింహాసనపు రూపాన్ని మార్చి వేయండి. మనం చూద్దాం! ఆమె మార్గదర్శకత్వం పొందుతుందా, లేక మార్గదర్శకత్వం పొందని వారిలో చేరిపోతుందా?”

27:42 – فَلَمَّا جَاءَتْ قِيلَ أَهَـٰكَذَا عَرْشُكِ ۖ قَالَتْ كَأَنَّهُ هُوَ ۚ وَأُوتِينَا الْعِلْمَ مِن قَبْلِهَا وَكُنَّا مُسْلِمِينَ ٤٢

ఆ తరువాత ఆమె అక్కడికి రాగానే: “ఏమీ? నీ సింహాసనం ఈ విధంగానే ఉంటుందా?” అని అడగ్గా, ఆమె: “నిశ్చయంగా, ఇది దాని మాదిరిగానే ఉంది!” అని అన్నది. మరియు (సులైమాన్‌ అన్నాడు): “మనకు ఈమె కంటే ముందు (దివ్య) జ్ఞానం ప్రసాదించబడింది కావున మనం అల్లాహ్‌కు విధేయులం (ముస్లింలం) అయ్యాము!” 19

27:43 – وَصَدَّهَا مَا كَانَت تَّعْبُدُ مِن دُونِ اللَّـهِ ۖ إِنَّهَا كَانَتْ مِن قَوْمٍ كَافِرِينَ ٤٣

మరియు అల్లాహ్‌ను వదలి ఆమె ఆరాధి స్తున్నది, ఆమెను (ఇస్లాం నుండి) తొలగించింది. అందుకే! ఆమె వాస్తవానికి, సత్య-తిరస్కారులలో చేరి ఉండేది.

27:44 – قِيلَ لَهَا ادْخُلِي الصَّرْحَ ۖ فَلَمَّا رَأَتْهُ حَسِبَتْهُ لُجَّةً وَكَشَفَتْ عَن سَاقَيْهَا ۚ قَالَ إِنَّهُ صَرْحٌ مُّمَرَّدٌ مِّن قَوَارِيرَ ۗ قَالَتْ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي وَأَسْلَمْتُ مَعَ سُلَيْمَانَ لِلَّـهِ رَبِّ الْعَالَمِينَ ٤٤

ఆమెతో: “రాజ గృహంలో ప్రవేశించు!” అని చెప్పగా! ఆమె దానిని చూసి, అదొక నీటికొలనని భావించి (తన వస్త్రాలను) పైకెత్తగా ఆమె పిక్కలు కనబడ్డాయి. అప్పుడు (సులైమాన్‌): “ఇది గాజుతో నిర్మించబడిన నున్నని నేల మాత్రమే!” అని అన్నాడు. (రాణి) అన్నది: “ఓ నా ప్రభూ! నాకు నేను అన్యాయం చేసుకున్నాను. మరియు నేను సులైమాన్‌తో పాటు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కు విధేయతను (ఇస్లాంను) స్వీకరి స్తున్నాను.” 20

27:45 – وَلَقَدْ أَرْسَلْنَا إِلَىٰ ثَمُودَ أَخَاهُمْ صَالِحًا أَنِ اعْبُدُوا اللَّـهَ فَإِذَا هُمْ فَرِيقَانِ يَخْتَصِمُونَ ٤٥

మరియు వాస్తవంగా! మేము స’మూద్‌ జాతి వారి వద్దకు వారి సోదరుడైన ‘సాలి’హ్‌ను: “మీరు అల్లాహ్‌నే ఆరాధించండి.” 21 అనే (సందే శంతో) పంపాము. కాని వారు రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం కలహించు కోసాగారు.

27:46 – قَالَ يَا قَوْمِ لِمَ تَسْتَعْجِلُونَ بِالسَّيِّئَةِ قَبْلَ الْحَسَنَةِ ۖ لَوْلَا تَسْتَغْفِرُونَ اللَّـهَ لَعَلَّكُمْ تُرْحَمُونَ ٤٦

(‘సాలి’హ్‌) అన్నాడు: “ఓ నాజాతి ప్రజలారా! మీరు సుస్థితికి ముందు దుస్థితి కొరకు ఎందుకు తొందరపెడుతున్నారు? మీరు అల్లాహ్‌ ను మీ తప్పులను క్షమించమని ఎందుకు వేడుకోరు? బహుశా మీరు కరుణించబడవచ్చు!”

27:47 – قَالُوا اطَّيَّرْنَا بِكَ وَبِمَن مَّعَكَ ۚ قَالَ طَائِرُكُمْ عِندَ اللَّـهِ ۖ بَلْ أَنتُمْ قَوْمٌ تُفْتَنُونَ ٤٧

వారన్నారు: “మేము నిన్నూ మరియు నీ అనుచరులను అపశకునపు సూచనలుగా పరిగ ణిస్తున్నాము!” (‘సాలి’హ్‌) అన్నాడు: “మీ శకునం అల్లాహ్‌ వద్ద ఉంది. వాస్తవానికి, మీరు పరీక్షించ బడుతున్నారు!” 22

27:48 – وَكَانَ فِي الْمَدِينَةِ تِسْعَةُ رَهْطٍ يُفْسِدُونَ فِي الْأَرْضِ وَلَا يُصْلِحُونَ ٤٨

మరియు ఆ నగరంలో తొమ్మిది మంది ఉండే వారు. వారు దేశంలో కల్లోలం రేకెత్తిస్తూ ఉండేవారు. మరియు ఎలాంటి సంస్కరణ చేసేవారు కాదు.

27:49 – قَالُوا تَقَاسَمُوا بِاللَّـهِ لَنُبَيِّتَنَّهُ وَأَهْلَهُ ثُمَّ لَنَقُولَنَّ لِوَلِيِّهِ مَا شَهِدْنَا مَهْلِكَ أَهْلِهِ وَإِنَّا لَصَادِقُونَ ٤٩

వారు పరస్పరం ఇలా అనుకున్నారు: “అల్లాహ్‌పై ప్రమాణం చేసి ఇలా ప్రతిజ్ఞచేయండి 23 మనం అతనిపై మరియు అతనితో పాటు ఉన్న వారిపై రాత్రివేళ దాడిచేద్దాము. తరువాత అతని వారసులతో: ‘మీ సంబంధీకులను వధించింది మేము చూడనేలేదు. మేము నిశ్చయంగా సత్యం పలుకుతున్నాము.’ ” అని అందాము.

27:50 – وَمَكَرُوا مَكْرًا وَمَكَرْنَا مَكْرًا وَهُمْ لَا يَشْعُرُونَ ٥٠

మరియు ఈ విధంగా, వారు పన్నాగం పన్నారు మరియు మేము కూడా ఒక పన్నాగం పన్నాము. కాని వారికది తెలియదు.

27:51 – فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ مَكْرِهِمْ أَنَّا دَمَّرْنَاهُمْ وَقَوْمَهُمْ أَجْمَعِينَ ٥١

ఇక చూడండి! వారి పన్నాగపు పర్యవసానం ఏమయిందో! వాస్తవానికి మేము వారిని మరియు వారి వంశం వారినందరినీ సర్వనాశనం చేశాము.

27:52 – فَتِلْكَ بُيُوتُهُمْ خَاوِيَةً بِمَا ظَلَمُوا ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَعْلَمُونَ ٥٢

అవిగో వారి గృహాలు! వారు చేసిన దుర్మార్గాలకు అవి ఎలా పాడుపడి పోయాయో చూడండి. నిశ్చయంగా ఇందులో తెలుసుకునే వారికి గొప్ప సూచన ఉంది.

27:53 – وَأَنجَيْنَا الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ ٥٣

మరియు విశ్వసించి, దైవభీతి కలిగి ఉన్న వారిని మేము కాపాడాము.

27:54 – وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِ أَتَأْتُونَ الْفَاحِشَةَ وَأَنتُمْ تُبْصِرُونَ ٥٤

మరియు లూ’త్‌ను (జ్ఞాపకం చేసుకోండి)! అతను తన జాతివారితో ఇలా అన్నప్పుడు: “ఏమీ? మీరు బహిరంగంగా అశ్లీల కార్యాలు చేస్తారా?” 24

27:55 – أَئِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ شَهْوَةً مِّن دُونِ النِّسَاءِ ۚ بَلْ أَنتُمْ قَوْمٌ تَجْهَلُونَ ٥٥

“ఏమీ? మీరు స్త్రీలను వదలి పురుషుల వద్దకు, మీ కామ ఇచ్ఛను తీర్చుకోవటానికి పోతారా? వాస్తవానికి, మీరు మూఢజనులు!”

27:56 – فَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا أَخْرِجُوا آلَ لُوطٍ مِّن قَرْيَتِكُمْ ۖ إِنَّهُمْ أُنَاسٌ يَتَطَهَّرُونَ ٥٦

(*) కాని, అతని జాతివారి జవాబు ఈ విధంగా మాత్రమే ఉండింది. వారు అన్నారు: “లూ’త్‌ కుటుంబాన్ని మీ పట్టణం నుండి వెళ్ళగొట్టండి. వాస్తవానికి, వారు తమను తాము చాలా పవిత్రులుగా పరిగణిస్తున్నారు.” 25

27:57 – فَأَنجَيْنَاهُ وَأَهْلَهُ إِلَّا امْرَأَتَهُ قَدَّرْنَاهَا مِنَ الْغَابِرِينَ ٥٧

కావున మేము అతనిని మరియు అతని కుటుంబంవారిని కాపాడాము – అతని భార్య తప్ప – ఆమెను వెనుక ఉండిపోయే వారిలో చేర్చాలని నిర్ణయించాము. 26

27:58 – وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًا ۖ فَسَاءَ مَطَرُ الْمُنذَرِينَ ٥٨

మరియు వారిపై (రాళ్ళ) వర్షాన్ని కురిపించాము. కాని అది, హెచ్చరించబడిన వారిపై కురిపించబడ్డ ఎంతో ఘోరమైన వర్షం. 27

27:59 – قُلِ الْحَمْدُ لِلَّـهِ وَسَلَامٌ عَلَىٰ عِبَادِهِ الَّذِينَ اصْطَفَىٰ ۗ آللَّـهُ خَيْرٌ أَمَّا يُشْرِكُونَ ٥٩

(ఓ ము’హమ్మద్‌!) ఇలా అను: “సర్వ స్తోత్రాలకు అర్హుడు అల్లాహ్‌ మాత్రమే. ఆయన ఎన్నుకొన్న, ఆయన దాసులకు శాంతి కలుగు గాక (సలాం)! ఏమీ? అల్లాహ్‌ శ్రేష్ఠుడా? లేక వారు ఆయనకు సాటికల్పించే భాగస్వాములా?”

27:60 – أَمَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ لَكُم مِّنَ السَّمَاءِ مَاءً فَأَنبَتْنَا بِهِ حَدَائِقَ ذَاتَ بَهْجَةٍ مَّا كَانَ لَكُمْ أَن تُنبِتُوا شَجَرَهَا ۗ أَإِلَـٰهٌ مَّعَ اللَّـهِ ۚ بَلْ هُمْ قَوْمٌ يَعْدِلُونَ ٦٠

[*] ఏమీ? ఆయనేకాడా? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించినవాడు మరియు మీ కొరకు ఆకాశం నుండి నీటిని కురిపించినవాడు? దానితో మేము మనోహరమైన తోటలను పుట్టించాము. వాటిలో ఒక్క చెట్టును కూడా మొలిపించటం మీకు సాధ్యమయ్యే పని కాదు కదా? ఏమీ? అల్లాహ్‌తో బాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? అలా కాదు! వారే (ఇతరులను) ఆయనకు సమానులుగా చేసే ప్రజలు!

27:61 – أَمَّن جَعَلَ الْأَرْضَ قَرَارًا وَجَعَلَ خِلَالَهَا أَنْهَارًا وَجَعَلَ لَهَا رَوَاسِيَ وَجَعَلَ بَيْنَ الْبَحْرَيْنِ حَاجِزًا ۗ أَإِلَـٰهٌ مَّعَ اللَّـهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ ٦١

ఏమీ? ఆయనే కాడా? భూమిని నివాస స్థలంగా చేసి, 28 దానిమధ్య నదులను ఏర్పరచి, అది కదలకుండా దానిపై పర్వతాలను మేకులుగా నాటిన వాడు మరియు రెండు సముద్రాలమధ్య అడ్డుతెరను నిర్మించిన వాడు? 29 ఏమీ? అల్లాహ్‌తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? వాస్తవానికి చాలా మంది ఇది తెలుసుకోలేరు.

27:62 – أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الْأَرْضِ ۗ أَإِلَـٰهٌ مَّعَ اللَّـهِ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ ٦٢

ఏమీ? ఆయనే కాడా? బాధితుడు వేడు కొన్నప్పుడు అతడి మొరను ఆలకించి ఆపదను తొలగించేవాడు 30 మరియు భూమిలో మిమ్మల్ని ఉత్తరాధికారులుగా చేసినవాడు? 31 ఏమీ? అల్లాహ్‌తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? మీరు ఆలోచించేది చాలా తక్కువ.

27:63 – أَمَّن يَهْدِيكُمْ فِي ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ وَمَن يُرْسِلُ الرِّيَاحَ بُشْرًا بَيْنَ يَدَيْ رَحْمَتِهِ ۗ أَإِلَـٰهٌ مَّعَ اللَّـهِ ۚ تَعَالَى اللَّـهُ عَمَّا يُشْرِكُونَ ٦٣

ఏమీ? ఆయనే కాడా? నేల మరియు సముద్రాల అంధకారంలో మీకు మార్గదర్శకత్వం చేసేవాడు మరియు తన కారుణ్యానికి ముందు గాలులను శుభవార్తలతో పంపేవాడు? 32 ఏమీ? అల్లాహ్‌తో పాటు మరొకదేవుడు ఎవడైనా ఉన్నాడా? వారు సాటిగా కల్పించే భాగస్వాముల కంటే అల్లాహ్‌ అత్యున్నతుడు!

27:64 – أَمَّن يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَمَن يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ ۗ أَإِلَـٰهٌ مَّعَ اللَّـهِ ۚ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ ٦٤

ఏమీ? ఆయనేకాడా? సృష్టిని తొలిసారి ప్రారంభించి, తరువాత దానిని మరల ఉనికిలోకి తేగలవాడు మరియు మీకు ఆకాశం నుండి మరియు భూమి నుండి జీవనోపాధిని సమకూర్చేవాడు. 33 ఏమీ? అల్లాహ్‌తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? వారితో అను: “మీరు సత్యవంతులే అయితే మీ నిదర్శనాన్ని తీసుకురండి!”

27:65 – قُل لَّا يَعْلَمُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ الْغَيْبَ إِلَّا اللَّـهُ ۚ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ ٦٥

వారితో అను: “ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న అగోచరవిషయ జ్ఞానం గలవాడు అల్లాహ్‌ తప్ప మరొకడు లేడు. 34 మరియు వారు తిరిగి ఎప్పుడు లేపబడతారో కూడా వారికి తెలియదు.”

27:66 – بَلِ ادَّارَكَ عِلْمُهُمْ فِي الْآخِرَةِ ۚ بَلْ هُمْ فِي شَكٍّ مِّنْهَا ۖ بَلْ هُم مِّنْهَا عَمُونَ ٦٦

వాస్తవానికి, పరలోక జీవితం గురించి వారి జ్ఞానం శూన్యమే. అలా కాదు! దానిని గురించి వారు సంశయంలో పడివున్నారు. అలా కాదు! దాని విషయంలో వారు అంధులై పోయారు.

27:67 – وَقَالَ الَّذِينَ كَفَرُوا أَإِذَا كُنَّا تُرَابًا وَآبَاؤُنَا أَئِنَّا لَمُخْرَجُونَ ٦٧

సత్య-తిరస్కారులు అంటారు: “ఏమీ? మేమూ మరియు మా తండ్రి-తాతలు మట్టిగా మారిపోయిన తరువాత కూడా వాస్తవానికి మరల (సజీవులుగా) వెలికి తీయబడతామా?

27:68 – لَقَدْ وُعِدْنَا هَـٰذَا نَحْنُ وَآبَاؤُنَا مِن قَبْلُ إِنْ هَـٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ ٦٨

“వాస్తవానికి ఇంతకు పూర్వం కూడా మాకు మరియు మా తండ్రితాతలకు ఇదేవిధంగా వాగ్దానం చేయబడింది. ఇవి కేవలం పూర్వకాలపు గాథలు మాత్రమే.”

27:69 – قُلْ سِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُجْرِمِينَ ٦٩

వారితో అను: “భూమిలో ప్రయాణం చేసి చూడండి. అపరాధుల గతి ఏమయిందో!”

27:70 – وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَلَا تَكُن فِي ضَيْقٍ مِّمَّا يَمْكُرُونَ ٧٠

మరియు నీవు వారి గురించి దుఃఖపడకు మరియు వారి కుట్రలకు బాధపడకు.

27:71 – وَيَقُولُونَ مَتَىٰ هَـٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ ٧١

వారంటున్నారు: “మీరు సత్యవంతులే అయితే! ఈ వాగ్దానం ఎప్పుడు పూర్తి కానున్నది?”

27:72 – قُلْ عَسَىٰ أَن يَكُونَ رَدِفَ لَكُم بَعْضُ الَّذِي تَسْتَعْجِلُونَ ٧٢

వారితో అను: “మీరు దేనిని (ఏ శిక్షను) గురించి తొందరపెడుతున్నారో? అందులోని కొంత భాగం బహుశా మీకు సమీపంలోనే ఉండవచ్చు! 35

27:73 – وَإِنَّ رَبَّكَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَشْكُرُونَ ٧٣

“మరియు నిశ్చయంగా, నీ ప్రభువు మానవులపై ఎంతో అనుగ్రహం కలవాడు, కాని వారిలో చాలామంది కృతజ్ఞతలు చూపరు.”

27:74 – وَإِنَّ رَبَّكَ لَيَعْلَمُ مَا تُكِنُّ صُدُورُهُمْ وَمَا يُعْلِنُونَ ٧٤

మరియు నిశ్చయంగా, వారి హృదయాలు ఏమి దాస్తున్నాయో మరియు ఏమి వ్యక్తపరుస్తు న్నాయో, నీ ప్రభువుకు బాగా తెలుసు.

27:75 – وَمَا مِنْ غَائِبَةٍ فِي السَّمَاءِ وَالْأَرْضِ إِلَّا فِي كِتَابٍ مُّبِينٍ ٧٥

మరియు ఆకాశంలో మరియు భూమిలో అగోచరంగా ఉన్నది ఏదీ కూడా, స్పష్టమైన ఒక గ్రంథంలో వ్రాయబడకుండా లేదు. 36

27:76 – إِنَّ هَـٰذَا الْقُرْآنَ يَقُصُّ عَلَىٰ بَنِي إِسْرَائِيلَ أَكْثَرَ الَّذِي هُمْ فِيهِ يَخْتَلِفُونَ ٧٦

నిశ్చయంగా, ఈ ఖుర్‌ఆన్‌ ఇస్రాయీ’ల్‌ సంతతి వారు విభేదిస్తూ వున్న పెక్కువిషయాల వాస్తవాన్ని వారికి తెలుపుతున్నది.

27:77 – وَإِنَّهُ لَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ ٧٧

మరియు నిశ్చయంగా, ఇది విశ్వాసులకు మార్గదర్శిని మరియు కారుణ్యం.

27:78 – إِنَّ رَبَّكَ يَقْضِي بَيْنَهُم بِحُكْمِهِ ۚ وَهُوَ الْعَزِيزُ الْعَلِيمُ ٧٨

నిశ్చయంగా, నీ ప్రభువు వారి మధ్య న్యాయంగా తీర్పు చేస్తాడు. ఆయన సర్వ శక్తిమంతుడు, సర్వజ్ఞుడు.

27:79 – فَتَوَكَّلْ عَلَى اللَّـهِ ۖ إِنَّكَ عَلَى الْحَقِّ الْمُبِينِ ٧٩

కావున నీవు అల్లాహ్‌పై ఆధారపడి ఉండు. నిశ్చయంగా, నీవు స్పష్టమైన సత్యంపై ఉన్నావు.

27:80 – إِنَّكَ لَا تُسْمِعُ الْمَوْتَىٰ وَلَا تُسْمِعُ الصُّمَّ الدُّعَاءَ إِذَا وَلَّوْا مُدْبِرِينَ ٨٠

నిశ్చయంగా, నీవు మృతులకు వినిపింపజేయలేవు మరియు వీపు త్రిప్పి మరలిపోయే చెవిటి వారికి కూడా నీ పిలుపును వినిపింపజేయలేవు. 37

27:81 – وَمَا أَنتَ بِهَادِي الْعُمْيِ عَن ضَلَالَتِهِمْ ۖ إِن تُسْمِعُ إِلَّا مَن يُؤْمِنُ بِآيَاتِنَا فَهُم مُّسْلِمُونَ ٨١

మరియు నీవు అంధులను మార్గభ్రష్టత్వం నుండి తొలగించి, వారికి మార్గదర్శకత్వం చేయలేవు. మా సూచనలను (ఆయాత్‌లను) విశ్వసించి, అల్లాహ్‌కు విధేయులు (ముస్లింలు) అయ్యే వారికి మాత్రమే నీవు (నీ మాటలను) వినిపించగలవు. (1/8)

27:82 – وَإِذَا وَقَعَ الْقَوْلُ عَلَيْهِمْ أَخْرَجْنَا لَهُمْ دَابَّةً مِّنَ الْأَرْضِ تُكَلِّمُهُمْ أَنَّ النَّاسَ كَانُوا بِآيَاتِنَا لَا يُوقِنُونَ ٨٢

  • మరియు వారిని గురించిన (శిక్ష) వాగ్దానం పూర్తికానున్నప్పుడు, 38 మేము వారి కొరకు భూమి నుండి ఒక జంతువును బయటికి తీస్తాము. 39 అది వారితో నిశ్చయంగా, మానవులు మా సూచనలను (ఆయాత్‌లను) నమ్మేవారు కాదని చెబుతుంది.

27:83 – وَيَوْمَ نَحْشُرُ مِن كُلِّ أُمَّةٍ فَوْجًا مِّمَّن يُكَذِّبُ بِآيَاتِنَا فَهُمْ يُوزَعُونَ ٨٣

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు (పునరుత్థానదినమున) మేము ప్రతి జాతివారిలో నుండి మా సూచనలను అసత్యాలని తిరస్కరించిన జనసమూహాన్ని సమీకరిస్తాము. మరియు వారు (వారి పాపాల ప్రకారం) వివిధ వరుసలలో నిలబెట్టబడతారు.

27:84 – حَتَّىٰ إِذَا جَاءُوا قَالَ أَكَذَّبْتُم بِآيَاتِي وَلَمْ تُحِيطُوا بِهَا عِلْمًا أَمَّاذَا كُنتُمْ تَعْمَلُونَ ٨٤

చివరకు అందరూ వచ్చినతరువాత వారి (ప్రభువు) వారిని ప్రశ్నిస్తాడు: “ఏమీ? మీరు నా సూచనలను, మీ జ్ఞానంతో గ్రహించకుండానే వాటిని అసత్యాలని తిరస్కరించారా? ఇదిగాక మీరు ఏమి చేస్తూ ఉండేవారు?”

27:85 – وَوَقَعَ الْقَوْلُ عَلَيْهِم بِمَا ظَلَمُوا فَهُمْ لَا يَنطِقُونَ ٨٥

మరియు వారు చేసిన దుర్మార్గం వలన వారికి చేయబడిన వాగ్దానం (శిక్ష) పూర్తి అవుతుంది, కావున వారేమీ మాట్లాడలేరు.

27:86 – أَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا اللَّيْلَ لِيَسْكُنُوا فِيهِ وَالنَّهَارَ مُبْصِرًا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ ٨٦

ఏమీ? వారికి తెలియదా? మేము రాత్రిని వారు విశ్రాంతి పొందటానికి మరియు పగటిని (చూడగలగటానికి) ప్రకాశవంతంగా చేశామని? 40 నిశ్చయంగా, విశ్వసించేవారికి ఇందులో ఎన్నో సూచనలున్నాయి.

27:87 – وَيَوْمَ يُنفَخُ فِي الصُّورِ فَفَزِعَ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ إِلَّا مَن شَاءَ اللَّـهُ ۚ وَكُلٌّ أَتَوْهُ دَاخِرِينَ ٨٧

మరియు (జ్ఞాపకముంచుకోండి) బాకా (‘సూర్‌) ఊదబడే దినమున – అల్లాహ్‌ కోరిన వారు తప్ప 41 – ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్నవన్నీ భయంతో కంపించి పోతాయి. 42 మరియు అన్నీ అత్యంత వినమ్రతతో ఆయన ముందు హాజరవుతాయి.

27:88 – وَتَرَى الْجِبَالَ تَحْسَبُهَا جَامِدَةً وَهِيَ تَمُرُّ مَرَّ السَّحَابِ ۚ صُنْعَ اللَّـهِ الَّذِي أَتْقَنَ كُلَّ شَيْءٍ ۚ إِنَّهُ خَبِيرٌ بِمَا تَفْعَلُونَ ٨٨

మరియు నీవు పర్వతాలను చూసి అవి స్థిరంగా ఉన్నాయని అనుకుంటున్నావు. కాని అవి అప్పుడు మేఘాలవలే ఎగురుతూ పోతుంటాయి. ఇది అల్లాహ్‌ కార్యం! ఆయన ప్రతి కార్యాన్ని నేర్పుతో చేస్తాడు. నిశ్చయంగా, మీరు చేసేదంతా ఆయన ఎరుగును. 43

27:89 – مَن جَاءَ بِالْحَسَنَةِ فَلَهُ خَيْرٌ مِّنْهَا وَهُم مِّن فَزَعٍ يَوْمَئِذٍ آمِنُونَ ٨٩

మంచి పనులుచేసి వచ్చినవారికి, అంత కంటే మంచి (ప్రతిఫలం) ఉంటుంది. మరియు వారు ఆ దినపు మహా భీతి నుండి సురక్షితంగా ఉంటారు. 44

27:90 – وَمَن جَاءَ بِالسَّيِّئَةِ فَكُبَّتْ وُجُوهُهُمْ فِي النَّارِ هَلْ تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ ٩٠

మరియు చెడు పనులుచేసి వచ్చినవారు నరకాగ్నిలోకి బోర్లా త్రోయబడతారు. (వారితో అనబడుతుంది): “మీకు ఇవ్వబడే ప్రతిఫలం మీ కర్మలకు భిన్నంగా ఉండగలదా?”

27:91 – إِنَّمَا أُمِرْتُ أَنْ أَعْبُدَ رَبَّ هَـٰذِهِ الْبَلْدَةِ الَّذِي حَرَّمَهَا وَلَهُ كُلُّ شَيْءٍ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُسْلِمِينَ ٩١

(ఓ ము’హమ్మద్‌! వారితో ఇలా అను): “నిశ్చయంగా, ఈ (మక్కహ్) నగరపు ప్రభువునే ఆరా ధించాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. ఆయనే! దీనిని పవిత్ర క్షేత్రంగా చేశాడు 45 మరియు ప్రతివస్తువు ఆయనకు చెందినదే! మరియు నేను ఆయనకు విధేయుడనై (ముస్లింనై) ఉండాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది.

27:92 – وَأَنْ أَتْلُوَ الْقُرْآنَ ۖ فَمَنِ اهْتَدَىٰ فَإِنَّمَا يَهْتَدِي لِنَفْسِهِ ۖ وَمَن ضَلَّ فَقُلْ إِنَّمَا أَنَا مِنَ الْمُنذِرِينَ ٩٢

మరియు ఈ ఖుర్‌ఆన్‌ను చదివి వినిపించాలని కూడా (ఆజ్ఞ ఇవ్వబడింది). కావున మార్గదర్శకత్వం పొందినవాడు తన మేలుకే, మార్గదర్శకత్వం పొందుతాడు. మరియు మార్గ భ్రష్టుడైనవాడితో అను: “నిశ్చయంగా, నేను హెచ్చరిక చేసేవాడను మాత్రమే!”

27:93 – وَقُلِ الْحَمْدُ لِلَّـهِ سَيُرِيكُمْ آيَاتِهِ فَتَعْرِفُونَهَا ۚ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ ٩٣

వారితో (ఇంకా) ఇలా అను: “సర్వ స్తోత్రాలకు అర్హుడు అల్లాహ్‌ మాత్రమే! త్వరలోనే ఆయన మీకు తన సూచనలను చూపుతాడు, అప్పుడు మీకు తెలుస్తుంది 46 మరియు మీరు చేస్తున్న కార్యాలను నీ ప్రభువు ఎరుగకుండా లేడు!”

సూరహ్‌ అల్‌-ఖ’స’స్‌ – అల్‌-ఖ’స’స్‌: కథలు, వృత్తాంతాలు. ఈ పేరు 25వ ఆయత్‌లో ఉంది. ఇందులో 88 ఆయతు లున్నాయి. ఈ సూరహ్‌లో చాలామట్టుకు మూసా (‘అ.స.) గాథ ఉంది. ఇది చివరి మక్కహ్ కాలపు సూరహ్‌లలో ఒకటి. ఇది సూరహ్‌ అల్‌-ఇ’స్రా (17)కు ముందు అవతరింపజేయబడింది. ఆయత్‌ 85 దైవప్రవక్త (‘స’అస) యొక్క ప్రార్థన సమయంలో జుహ్‌పాలో అవతరింపజేయబడింది. అల్లాహ్‌ (సు.త.) తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడు. ఆ నిత్యుడు, అల్లాహ్‌ (సు.త.) తప్ప ప్రతిదీ నశింపనున్నది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 28:1 – طسم ١

‘తా-సీన్‌-మీమ్‌.

28:2 – تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ ٢

ఇవిస్పష్టమైన గ్రంథసూచనలు (ఆయాత్‌). 1

28:3 – نَتْلُو عَلَيْكَ مِن نَّبَإِ مُوسَىٰ وَفِرْعَوْنَ بِالْحَقِّ لِقَوْمٍ يُؤْمِنُونَ ٣

విశ్వసించే ప్రజల కొరకు, మేము మూసా మరియు ఫిర్‌’ఔన్‌ల యొక్క నిజ వృత్తాంతాన్ని నీకు వినిపిస్తున్నాము.

28:4 – إِنَّ فِرْعَوْنَ عَلَا فِي الْأَرْضِ وَجَعَلَ أَهْلَهَا شِيَعًا يَسْتَضْعِفُ طَائِفَةً مِّنْهُمْ يُذَبِّحُ أَبْنَاءَهُمْ وَيَسْتَحْيِي نِسَاءَهُمْ ۚ إِنَّهُ كَانَ مِنَ الْمُفْسِدِينَ ٤

నిశ్చయంగా, ఫిర్‌’ఔన్‌ భూమి మీద అహంకారంతో ప్రవర్తిస్తూ ఉండేవాడు. మరియు అందులోని ప్రజలను వర్గాలుగా విభజించి, వారిలోని ఒకతెగ వారిని నీచపరచి వారిపుత్రులను వధిస్తూ ఉండేవాడు 2 మరియు వారి స్త్రీలను బ్రతుకనిచ్చే వాడు. నిశ్చయంగా అతడు దౌర్జన్యపరులలోని వాడిగా ఉండేవాడు.

28:5 – وَنُرِيدُ أَن نَّمُنَّ عَلَى الَّذِينَ اسْتُضْعِفُوا فِي الْأَرْضِ وَنَجْعَلَهُمْ أَئِمَّةً وَنَجْعَلَهُمُ الْوَارِثِينَ ٥

మరియు భూమి మీద అణచివేయబడిన వారిని కనికరించాలని మరియు వారిని నాయకులుగా చేయాలని మరియు వారిని వారసులుగా చేయాలని మేము కోరాము. 3

28:6 – وَنُمَكِّنَ لَهُمْ فِي الْأَرْضِ وَنُرِيَ فِرْعَوْنَ وَهَامَانَ وَجُنُودَهُمَا مِنْهُم مَّا كَانُوا يَحْذَرُونَ ٦

మరియు (ఇస్రాయీ’ల్‌ సంతతి) వారికి భూమిలో అధికారం ఒసంగాలనీ 4 మరియు ఫిర్‌’ఔన్‌, హామాన్‌ 5 మరియు వారి సైనికులకు – దేనిని గురించైతే (ఫిర్‌’ఔన్‌ జాతి) వారు భయ పడుతూ ఉండేవారో 6 – అదే, వారికి చూపాలని!

28:7 – وَأَوْحَيْنَا إِلَىٰ أُمِّ مُوسَىٰ أَنْ أَرْضِعِيهِ ۖ فَإِذَا خِفْتِ عَلَيْهِ فَأَلْقِيهِ فِي الْيَمِّ وَلَا تَخَافِي وَلَا تَحْزَنِي ۖ إِنَّا رَادُّوهُ إِلَيْكِ وَجَاعِلُوهُ مِنَ الْمُرْسَلِينَ ٧

మేము మూసా తల్లి మనస్సులో ఇలా 7 సూచించాము: “నీవు అతనికి (మూసాకు) పాలు ఇస్తూఉండు. కాని అతనికి ప్రమాదమున్నదని, నీవు భావిస్తే అతనిని నదిలో విడిచిపెట్టు. 8 మరియు నీవు భయపడకు మరియు దుఃఖించకు; నిశ్చయంగా మేము అతనిని నీ వద్దకు తిరిగి చేర్చుతాము. మరియు అతనిని (మా) సందేశహరులలో ఒకనిగా చేస్తాము!”

28:8 – فَالْتَقَطَهُ آلُ فِرْعَوْنَ لِيَكُونَ لَهُمْ عَدُوًّا وَحَزَنًا ۗ إِنَّ فِرْعَوْنَ وَهَامَانَ وَجُنُودَهُمَا كَانُوا خَاطِئِينَ ٨

తరువాత ఫిర్‌’ఔన్‌ కుటుంబంవారు 9 తమకు శత్రువై, దుఃఖకారణుడవటానికి – అతనిని ఎత్తుకున్నారు. నిశ్చయంగా ఫిర్‌’ఔన్‌, హామాన్‌ మరియు వారి సైనికులు పాపిష్ఠులు!

28:9 – وَقَالَتِ امْرَأَتُ فِرْعَوْنَ قُرَّتُ عَيْنٍ لِّي وَلَكَ ۖ لَا تَقْتُلُوهُ عَسَىٰ أَن يَنفَعَنَا أَوْ نَتَّخِذَهُ وَلَدًا وَهُمْ لَا يَشْعُرُونَ ٩

మరియు ఫిర్‌’ఔన్‌ భార్య (అతనితో) ఇలా అన్నది: “ఇతను నీకూ మరియు నాకూ కంటి చలువ! ఇతనిని చంపకు, బహుశా ఇతడు మనకు ఉపయోగకారి కావచ్చు! లేదా మనం ఇతనిని కుమారునిగా చేసుకోవచ్చు!” 10 కాని వారు (వాస్తవాన్ని) తెలుసుకోలేక పోయారు.

28:10 – وَأَصْبَحَ فُؤَادُ أُمِّ مُوسَىٰ فَارِغًا ۖ إِن كَادَتْ لَتُبْدِي بِهِ لَوْلَا أَن رَّبَطْنَا عَلَىٰ قَلْبِهَا لِتَكُونَ مِنَ الْمُؤْمِنِينَ ١٠

మరియు మూసా తల్లి హృదయం తల్లడిల్లి పోయింది. ఆమె విశ్వసించినవారిలో ఉండటానికి మేము, ఆమె హృదయాన్ని దృఢపరచి ఉండక పోతే, ఆమె అతనిని (మూసాను) గురించి అంతా బట్టబయలు చేసిఉండేది.

28:11 – وَقَالَتْ لِأُخْتِهِ قُصِّيهِ ۖ فَبَصُرَتْ بِهِ عَن جُنُبٍ وَهُمْ لَا يَشْعُرُونَ ١١

ఆమె, అతనిసోదరితో (మూసాసోదరితో) 11 అన్నది: “అతని వెంట వెళ్ళు.” కావున ఆమె దూరం నుండియే అతనిని గమనించసాగింది. కానీ వారది గ్రహించ లేక పోయారు.(1/4)

28:12 – وَحَرَّمْنَا عَلَيْهِ الْمَرَاضِعَ مِن قَبْلُ فَقَالَتْ هَلْ أَدُلُّكُمْ عَلَىٰ أَهْلِ بَيْتٍ يَكْفُلُونَهُ لَكُمْ وَهُمْ لَهُ نَاصِحُونَ ١٢

  • మరియు మేము అతనిని (ఇతరుల) పాలు త్రాగకుండా మొదటనే నిషేధించి ఉన్నాము. (అతని సోదరి) వారితో అన్నది: “మీ కొరకు అతనిని, (పాలిచ్చి) పోషించగల ఒక కుటుంబం వారిని నేను మీకు చూపనా? మరియు వారు అతనిని మంచిగా చూసుకొనేవారై ఉంటారు.”

28:13 – فَرَدَدْنَاهُ إِلَىٰ أُمِّهِ كَيْ تَقَرَّ عَيْنُهَا وَلَا تَحْزَنَ وَلِتَعْلَمَ أَنَّ وَعْدَ اللَّـهِ حَقٌّ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ ١٣

ఈ విధంగా మేము అతనిని (మూసాను) – అతని తల్లి కళ్ళు చల్లబడటానికి, ఆమె దుఃఖించ కుండా ఉండటానికి మరియు అల్లాహ్‌ వాగ్దానం సత్యమైనదని ఆమె తెలుసుకోవటానికి – తిరిగి ఆమెవద్దకు చేర్చాము. కాని వాస్తవానికి, చాలా మందికి ఇది తెలియదు.

28:14 – وَلَمَّا بَلَغَ أَشُدَّهُ وَاسْتَوَىٰ آتَيْنَاهُ حُكْمًا وَعِلْمًا ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ ١٤

మరియు అతను (మూసా) యుక్త వయస్సుకు చేరి పరిపూర్ణుడు అయినప్పుడు, మేము అతనికి వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు ఈ విధంగా, మేము సజ్జనులకు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాము. 12

28:15 – وَدَخَلَ الْمَدِينَةَ عَلَىٰ حِينِ غَفْلَةٍ مِّنْ أَهْلِهَا فَوَجَدَ فِيهَا رَجُلَيْنِ يَقْتَتِلَانِ هَـٰذَا مِن شِيعَتِهِ وَهَـٰذَا مِنْ عَدُوِّهِ ۖ فَاسْتَغَاثَهُ الَّذِي مِن شِيعَتِهِ عَلَى الَّذِي مِنْ عَدُوِّهِ فَوَكَزَهُ مُوسَىٰ فَقَضَىٰ عَلَيْهِ ۖ قَالَ هَـٰذَا مِنْ عَمَلِ الشَّيْطَانِ ۖ إِنَّهُ عَدُوٌّ مُّضِلٌّ مُّبِينٌ ١٥

మరియు (ఒకరోజు) నగరవాసులు ఏమరు పాటులో ఉన్నప్పుడు, అతను నగరంలోకి ప్రవేశించాడు, అతను అక్కడ ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకోవడం చూశాడు వారిలో ఒకడు అతని జాతికి చెందినవాడు, మరొకడు విరోధి జాతికి చెందిన వాడు. అతని జాతికి చెందినవాడు, విరోధి జాతివానికి వ్యతిరేకంగా సహాయపడమని అతనిని (మూసాను) అర్థించాడు. మూసా అతనిని ఒక గుద్దుగుద్దాడు. అది అతనిని అంతమొందించింది. (అప్పుడు) అతను (మూసా) అన్నాడు: “ఇది షై’తాన్‌ పనే! నిశ్చయంగా, అతడు శత్రువు మరియు స్పష్టంగా దారి తప్పించేవాడు.” 13

28:16 – قَالَ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي فَاغْفِرْ لِي فَغَفَرَ لَهُ ۚ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ ١٦

(మూసా) ఇలా ప్రార్థించాడు: “ఓ నా ప్రభూ! నాకు నేను అన్యాయం చేసుకున్నాను. కావున నన్ను క్షమించు!” (అల్లాహ్‌) అతనిని క్షమించాడు. నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. 14

28:17 – قَالَ رَبِّ بِمَا أَنْعَمْتَ عَلَيَّ فَلَنْ أَكُونَ ظَهِيرًا لِّلْمُجْرِمِينَ ١٧

(మూసా) అన్నాడు: “ఓ నా ప్రభూ! నీవు నాకు మహోపకారం చేశావు. కావున నేను ఇక ఎన్నటికీ నేరస్తులకు సహాయపడను!”

28:18 – فَأَصْبَحَ فِي الْمَدِينَةِ خَائِفًا يَتَرَقَّبُ فَإِذَا الَّذِي اسْتَنصَرَهُ بِالْأَمْسِ يَسْتَصْرِخُهُ ۚ قَالَ لَهُ مُوسَىٰ إِنَّكَ لَغَوِيٌّ مُّبِينٌ ١٨

మరుసటి రోజు ఉదయం అతను (మూసా) భయపడుతూ అతి జాగ్రత్తగా (ఇటూ అటూ చూస్తూ) నగరంలోకి వెళ్ళాడు. అప్పుడు అకస్మా త్తుగా అంతకు ముందురోజు, అతనిని సహా యానికి పిలిచినవాడే, మళ్ళీ సహాయానికై అరవ సాగాడు. మూసా వానితో అన్నాడు: “నిశ్చయంగా నీవు స్పష్టమైన తప్పు దారికి లాగేవాడవు!” 15

28:19 – فَلَمَّا أَنْ أَرَادَ أَن يَبْطِشَ بِالَّذِي هُوَ عَدُوٌّ لَّهُمَا قَالَ يَا مُوسَىٰ أَتُرِيدُ أَن تَقْتُلَنِي كَمَا قَتَلْتَ نَفْسًا بِالْأَمْسِ ۖ إِن تُرِيدُ إِلَّا أَن تَكُونَ جَبَّارًا فِي الْأَرْضِ وَمَا تُرِيدُ أَن تَكُونَ مِنَ الْمُصْلِحِينَ ١٩

ఆ తరువాత అతను తమ ఇద్దరికి విరోధి అయిన వాడిని గట్టిగా పట్టుకోబోగా, అతడు అరిచాడు: “ఓ మూసా! ఏమీ? నీవు నిన్న ఒక వ్యక్తిని చంపినట్లు నన్ను కూడా చంపదలచు కున్నావా? నీవు ఈ దేశంలో క్రూరునిగా మారి ఉండదలుచుకున్నావా? సద్వర్తనునిగా ఉండ దలుచుకో లేదా?”

28:20 – وَجَاءَ رَجُلٌ مِّنْ أَقْصَى الْمَدِينَةِ يَسْعَىٰ قَالَ يَا مُوسَىٰ إِنَّ الْمَلَأَ يَأْتَمِرُونَ بِكَ لِيَقْتُلُوكَ فَاخْرُجْ إِنِّي لَكَ مِنَ النَّاصِحِينَ ٢٠

మరియు ఒక వ్యక్తి నగరపు ఒకవైపు నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు: “ఓ మూసా! నాయకులందరూ కలిసి నిన్ను హత్యచేయాలని సంప్రదింపులు చేస్తున్నారు. కావున నీవు వెళ్ళిపో, నేను నిశ్చయంగా, నీ శ్రేయోభిలాషిని!”

28:21 – فَخَرَجَ مِنْهَا خَائِفًا يَتَرَقَّبُ ۖ قَالَ رَبِّ نَجِّنِي مِنَ الْقَوْمِ الظَّالِمِينَ ٢١

అప్పుడతను భయపడుతూ, అతి జాగ్రత్తగా అక్కడి నుండి బయలుదేరాడు. అతను ఇలా ప్రార్థించాడు: “ఓ నా ప్రభూ! నన్ను దుర్మార్గుల నుండి కాపాడు!”

28:22 – وَلَمَّا تَوَجَّهَ تِلْقَاءَ مَدْيَنَ قَالَ عَسَىٰ رَبِّي أَن يَهْدِيَنِي سَوَاءَ السَّبِيلِ ٢٢

ఆ తరువాత అతను మద్‌యన్‌ వైపుకు బయలుదేరుతూ, ఇలా అనుకున్నాడు: “బహుశా, నా ప్రభువు నాకు సరైనమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తున్నాడు!” 16

28:23 – وَلَمَّا وَرَدَ مَاءَ مَدْيَنَ وَجَدَ عَلَيْهِ أُمَّةً مِّنَ النَّاسِ يَسْقُونَ وَوَجَدَ مِن دُونِهِمُ امْرَأَتَيْنِ تَذُودَانِ ۖ قَالَ مَا خَطْبُكُمَا ۖ قَالَتَا لَا نَسْقِي حَتَّىٰ يُصْدِرَ الرِّعَاءُ ۖ وَأَبُونَا شَيْخٌ كَبِيرٌ ٢٣

ఇక అతను మద్‌యన్ లోని ఒక బావి వద్దకు చేరుకున్నప్పుడు; అక్కడ చాలామంది ప్రజలు, తమ తమ పశువులకు నీరు త్రాగించ టాన్ని మరియు వారికి దూరంగా ఒక ప్రక్కన ఇద్దరు స్త్రీలు తమ పశువులను ఆపుతూ ఉండటాన్ని చూశాడు. (మూసా) ఆ స్త్రీలను అడి గాడు: “మీరిద్దరి చిక్కు ఏమిటి?” వారిద్ద రన్నారు: “ఈ పశువుల కాపరులంతా పోయే వరకు మేము (మాపశువులకు) నీరు త్రాపలేము. మరియు మా తండ్రి చాలా వృధ్ధుడు.”

28:24 – فَسَقَىٰ لَهُمَا ثُمَّ تَوَلَّىٰ إِلَى الظِّلِّ فَقَالَ رَبِّ إِنِّي لِمَا أَنزَلْتَ إِلَيَّ مِنْ خَيْرٍ فَقِيرٌ ٢٤

అప్పుడు అతను వారిద్దరి పశువులకు నీరు త్రాపాడు. తరువాత నీడలోకి పోయి ఇలా ప్రార్థించాడు: “ఓ నా ప్రభూ! నీవు నాపై ఏ మేలును అవతరింపజేసినా, నేను దాని ఆవశ్యకత గలవాడనే!”

28:25 – فَجَاءَتْهُ إِحْدَاهُمَا تَمْشِي عَلَى اسْتِحْيَاءٍ قَالَتْ إِنَّ أَبِي يَدْعُوكَ لِيَجْزِيَكَ أَجْرَ مَا سَقَيْتَ لَنَا ۚ فَلَمَّا جَاءَهُ وَقَصَّ عَلَيْهِ الْقَصَصَ قَالَ لَا تَخَفْ ۖ نَجَوْتَ مِنَ الْقَوْمِ الظَّالِمِينَ ٢٥

తరువాత ఆ ఇద్దరిలో ఒకామె సిగ్గు పడుతూ మెల్లగా అతని వద్దకు వచ్చి ఇలా అన్నది: “వాస్తవానికి నా తండ్రి – నీవు మా కొరకు (మా పశువులకు) నీరు త్రాపించినందుకు – ప్రతిఫలమివ్వటానికి, నిన్ను పిలుస్తున్నాడు.” 17 అతను, అతని వద్దకు పోయి తన వృత్తాంతాన్ని వినిపించాడు. అప్పుడతనన్నాడు: “నీవు ఏ మాత్రం భయపడకు. నీవు దుర్మార్గ ప్రజల నుండి విముక్తిపొందావు.”

28:26 – قَالَتْ إِحْدَاهُمَا يَا أَبَتِ اسْتَأْجِرْهُ ۖ إِنَّ خَيْرَ مَنِ اسْتَأْجَرْتَ الْقَوِيُّ الْأَمِينُ ٢٦

వారిద్దరిలో ఒకామె ఇలాఅన్నది: “నాన్నా! ఇతనిని పనికొరకు పెట్టుకో. నిశ్చయంగా, ఇలాంటి బలవంతుని మరియు నమ్మదగిన వానిని పని కొరకు పెట్టుకోవటం ఎంతో మేలైనది.”

28:27 – قَالَ إِنِّي أُرِيدُ أَنْ أُنكِحَكَ إِحْدَى ابْنَتَيَّ هَاتَيْنِ عَلَىٰ أَن تَأْجُرَنِي ثَمَانِيَ حِجَجٍ ۖ فَإِنْ أَتْمَمْتَ عَشْرًا فَمِنْ عِندِكَ ۖ وَمَا أُرِيدُ أَنْ أَشُقَّ عَلَيْكَ ۚ سَتَجِدُنِي إِن شَاءَ اللَّـهُ مِنَ الصَّالِحِينَ ٢٧

(వారి తండ్రి) అన్నాడు: “నీవు నా వద్ద ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తూ ఉండటానికి ఒప్పుకుంటే, నేను నా ఈ ఇద్దరు కుమార్తెలలో ఒకామెను నీకిచ్చి వివాహం చేయగోరు తున్నాను. 18 నీవు ఒకవేళ పది సంవత్సరాలు పూర్తిచేయదలిస్తే అది నీ ఇష్టం! నేను నీకు కష్టంకలిగించ దలచుకోలేదు. అల్లాహ్‌ కోరితే, నీవు నన్ను సద్వర్తనునిగా పొందుతావు!”

28:28 – قَالَ ذَٰلِكَ بَيْنِي وَبَيْنَكَ ۖ أَيَّمَا الْأَجَلَيْنِ قَضَيْتُ فَلَا عُدْوَانَ عَلَيَّ ۖ وَاللَّـهُ عَلَىٰ مَا نَقُولُ وَكِيلٌ ٢٨

(మూసా) అన్నాడు: “ఈ విషయం నీకూ మరియు నాకూ మధ్య నిశ్చయమే! ఈ రెండు గడువులలో నేను దేనిని పూర్తిచేసినా, నాపై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు. మరియు మన ఈ మాటలకు అల్లాహ్‌యే సాక్షి!” (3/8)

28:29 – فَلَمَّا قَضَىٰ مُوسَى الْأَجَلَ وَسَارَ بِأَهْلِهِ آنَسَ مِن جَانِبِ الطُّورِ نَارًا قَالَ لِأَهْلِهِ امْكُثُوا إِنِّي آنَسْتُ نَارًا لَّعَلِّي آتِيكُم مِّنْهَا بِخَبَرٍ أَوْ جَذْوَةٍ مِّنَ النَّارِ لَعَلَّكُمْ تَصْطَلُونَ ٢٩

  • ఆ తరువాత మూసా తన గడువు 19 పూర్తిచేసి, తన కుటుంబం వారిని తీసుకొని పోతుండగా, ‘తూర్‌ పర్వతపు దిక్కులో ఒక మంటను చూశాడు. (అప్పుడు) తన ఇంటివారితో అన్నాడు: “ఆగండి! నేను ఒకమంటను చూశాను. బహుశా! నేను అక్కడినుండి ఏదైనా మంచి వార్త ను తీసుకొనిరావచ్చు, లేదా ఒకఅగ్నికొరవినైనా! అప్పుడు మీరు దానితో చలి కాచుకోవచ్చు.”

28:30 – فَلَمَّا أَتَاهَا نُودِيَ مِن شَاطِئِ الْوَادِ الْأَيْمَنِ فِي الْبُقْعَةِ الْمُبَارَكَةِ مِنَ الشَّجَرَةِ أَن يَا مُوسَىٰ إِنِّي أَنَا اللَّـهُ رَبُّ الْعَالَمِينَ ٣٠

కాని అతను దానివద్దకు (అగ్నివద్దకు)చేరు కున్నప్పుడు, 20 ఆ లోయ కుడివైపు ఉన్న ఒక శుభవంత మైన స్థలములో ఉన్న ఒక చెట్టు నుండి: “ఓ మూసా! నిశ్చయంగా, నేనే అల్లాహ్‌ను! సర్వ లోకాలప్రభువును.” అనే మాటలు వినిపించాయి.

28:31 – وَأَنْ أَلْقِ عَصَاكَ ۖ فَلَمَّا رَآهَا تَهْتَزُّ كَأَنَّهَا جَانٌّ وَلَّىٰ مُدْبِرًا وَلَمْ يُعَقِّبْ ۚ يَا مُوسَىٰ أَقْبِلْ وَلَا تَخَفْ ۖ إِنَّكَ مِنَ الْآمِنِينَ ٣١

(ఇంకా ఇలా వినిపించింది): “నీ చేతి కర్రను పడవేయి!” అతను (మూసా) దానిని పామువలే కదలటం చూసి వెనక్కిమరలి పరుగెత్తాడు, తిరిగి కూడా చూడలేదు. (తరువాత ఇలా సెలవీయ బడింది): “ఓ మూసా, ముందుకు రా, భయ పడకు! నిశ్చయంగా, నీవు సురక్షితంగా ఉన్నావు!

28:32 – اسْلُكْ يَدَكَ فِي جَيْبِكَ تَخْرُجْ بَيْضَاءَ مِنْ غَيْرِ سُوءٍ وَاضْمُمْ إِلَيْكَ جَنَاحَكَ مِنَ الرَّهْبِ ۖ فَذَانِكَ بُرْهَانَانِ مِن رَّبِّكَ إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ ۚ إِنَّهُمْ كَانُوا قَوْمًا فَاسِقِينَ ٣٢

“నీ చేతిని నీ చంకలోకి దూర్చుకో, అది ఎలాంటి లోపం లేకుండా ప్రకాశిస్తూ బయటికి వస్తుంది. 21 నీవు భయపడకుండా ఉండటానికి నీ చేతిని నీ ప్రక్కకు అదుముకో! ఈ రెండు, నీవు ఫిర్‌’ఔన్‌ మరియు అతని నాయకులకు (చూపటానికి) నీ ప్రభువు ప్రసాదించిన నిదర్శనాలు (ఆయాత్‌). నిశ్చయంగా, వారు చాలా దుష్టులయిపోయారు!”

28:33 – قَالَ رَبِّ إِنِّي قَتَلْتُ مِنْهُمْ نَفْسًا فَأَخَافُ أَن يَقْتُلُونِ ٣٣

(మూసా) అన్నాడు: “ఓ నా ప్రభూ! నేను వారి మనిషిని ఒకనిని చంపాను, కావున వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను.

28:34 – وَأَخِي هَارُونُ هُوَ أَفْصَحُ مِنِّي لِسَانًا فَأَرْسِلْهُ مَعِيَ رِدْءًا يُصَدِّقُنِي ۖ إِنِّي أَخَافُ أَن يُكَذِّبُونِ ٣٤

“మరియు నా సోదరుడు హారూన్‌ మాట్లాడ టంలో నాకంటే మంచి వాగ్ధాటి గలవాడు. 22 నన్ను సమర్థించటానికి అతనిని నాకు సహాయకునిగా నాతోపాటు పంపు. వాస్తవానికి వారు నన్ను అసత్యవాదివని తిరస్క రిస్తారేమోనని నేను భయపడుతున్నాను!”

28:35 – قَالَ سَنَشُدُّ عَضُدَكَ بِأَخِيكَ وَنَجْعَلُ لَكُمَا سُلْطَانًا فَلَا يَصِلُونَ إِلَيْكُمَا ۚ بِآيَاتِنَا أَنتُمَا وَمَنِ اتَّبَعَكُمَا الْغَالِبُونَ ٣٥

నన్ను సమర్థించటానికి అతనిని నాకు సహాయకునిగా నాతోపాటు పంపు. వాస్తవానికి వారు నన్ను అసత్యవాదివని తిరస్క రిస్తారేమోనని నేను భయపడుతున్నాను!” 23

28:36 – فَلَمَّا جَاءَهُم مُّوسَىٰ بِآيَاتِنَا بَيِّنَاتٍ قَالُوا مَا هَـٰذَا إِلَّا سِحْرٌ مُّفْتَرًى وَمَا سَمِعْنَا بِهَـٰذَا فِي آبَائِنَا الْأَوَّلِينَ ٣٦

ఆ తరువాత మూసా మా స్పష్టమైన సూచనలను తీసుకొని వారి వద్దకు పోగా వారన్నారు: “ఇది కల్పితమైన మాయాజాలం మాత్రమే. 24 ఇలాంటిది పూర్వీకులైన మా తంతాత-ముత్తాతల కాలంలో కూడా జరిగినట్లు మేము వినలేదు.” 25

28:37 – وَقَالَ مُوسَىٰ رَبِّي أَعْلَمُ بِمَن جَاءَ بِالْهُدَىٰ مِنْ عِندِهِ وَمَن تَكُونُ لَهُ عَاقِبَةُ الدَّارِ ۖ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ ٣٧

ఇక మూసా అన్నాడు: “నా ప్రభువు తరఫు నుండి ఎవడు మార్గదర్శకత్వం తీసుకొనివచ్చాడో మరియు చివరికి ఎవరి పర్యవసానం మంచి దవు తుందో ఆయనకు బాగాతెలుసు. 26 నిశ్చయంగా దుర్మార్గులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు.”

28:38 – وَقَالَ فِرْعَوْنُ يَا أَيُّهَا الْمَلَأُ مَا عَلِمْتُ لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرِي فَأَوْقِدْ لِي يَا هَامَانُ عَلَى الطِّينِ فَاجْعَل لِّي صَرْحًا لَّعَلِّي أَطَّلِعُ إِلَىٰ إِلَـٰهِ مُوسَىٰ وَإِنِّي لَأَظُنُّهُ مِنَ الْكَاذِبِينَ ٣٨

మరియు ఫిర్‌’ఔన్‌ అన్నాడు: “ఓ నాయకులారా! నేను తప్ప మీకు మరొక ఆరాధ్య దేవుడు గలడని నాకు తెలియదు. 27 కావున ఓ హామాన్‌! కాల్చిన మట్టి ఇటు కలతో నాకొక ఎత్తైన గోపురాన్ని నిర్మించు. దానిపై ఎక్కి నేను బహుశా, మూసా దేవుణ్ణి చూడగలనేమో! నిశ్చయంగా నేను ఇతనిని అసత్యవాదిగా భావిస్తున్నాను.”

28:39 – وَاسْتَكْبَرَ هُوَ وَجُنُودُهُ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَظَنُّوا أَنَّهُمْ إِلَيْنَا لَا يُرْجَعُونَ ٣٩

మరియు, అతడు మరియు అతడి సైనికులు భూమిపై అన్యాయంగా అహంభావాన్ని ప్రదర్శించారు. మరియు నిశ్చయంగా, మావైపుకు తాము ఎన్నడూ మరలిరారని భావించారు.

28:40 – فَأَخَذْنَاهُ وَجُنُودَهُ فَنَبَذْنَاهُمْ فِي الْيَمِّ ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الظَّالِمِينَ ٤٠

కావున మేము అతనిని మరియు అతని సేనలను పట్టుకొని సముద్రంలోకి విసరివేశాము. ఇకచూడు! దుర్మార్గుల పర్యవసానం ఏమయిందో!

28:41 – وَجَعَلْنَاهُمْ أَئِمَّةً يَدْعُونَ إِلَى النَّارِ ۖ وَيَوْمَ الْقِيَامَةِ لَا يُنصَرُونَ ٤١

మరియు మేము వారిని నరకం వైపునకు పిలిచే నాయకులుగా చేశాము. మరియు పునరు త్థాన దినమున వారికెలాంటి సహాయం దొరకదు.

28:42 – وَأَتْبَعْنَاهُمْ فِي هَـٰذِهِ الدُّنْيَا لَعْنَةً ۖ وَيَوْمَ الْقِيَامَةِ هُم مِّنَ الْمَقْبُوحِينَ ٤٢

మరియు మేము ఈ లోకంలో కూడా అభిశాపం వారిని వెంటాడేటట్లు చేశాము. మరియు పునరుత్థాన దినమున వారు తృణీకరింపబడేవారిలో చేరుతారు.

28:43 – وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ مِن بَعْدِ مَا أَهْلَكْنَا الْقُرُونَ الْأُولَىٰ بَصَائِرَ لِلنَّاسِ وَهُدًى وَرَحْمَةً لَّعَلَّهُمْ يَتَذَكَّرُونَ ٤٣

మరియు వాస్తవానికి – పూర్వతరాల వారిని నాశనం చేసిన తరువాత – మేము మానవులకు జ్ఞానవృధ్ధి చేయటానికి మరియు వారికి మార్గదర్శకత్వంగా కారుణ్యంగా ఉండటానికి, మూసాకు గ్రంథాన్ని ప్రసా దించాము. బహుశా వారు హితబోధ నేర్చుకుంటారని!

28:44 – وَمَا كُنتَ بِجَانِبِ الْغَرْبِيِّ إِذْ قَضَيْنَا إِلَىٰ مُوسَى الْأَمْرَ وَمَا كُنتَ مِنَ الشَّاهِدِينَ ٤٤

మరియు (ఓ ము’హమ్మద్‌!) మేము మూసాపై మా ఆదేశం (తౌరాత్‌) పూర్తిగా అవత రింపజేసినపుడు, నీవు (‘తూర్‌ పర్వతపు) కుడి వైపునా లేవు. మరియు నీవు అక్కడ ప్రత్యక్ష సాక్షులలో కూడా లేవు!

28:45 – وَلَـٰكِنَّا أَنشَأْنَا قُرُونًا فَتَطَاوَلَ عَلَيْهِمُ الْعُمُرُ ۚ وَمَا كُنتَ ثَاوِيًا فِي أَهْلِ مَدْيَنَ تَتْلُو عَلَيْهِمْ آيَاتِنَا وَلَـٰكِنَّا كُنَّا مُرْسِلِينَ ٤٥

కాని నిశ్చయంగా, (ఆ తరువాత కూడా) మేము అనేక తరాలను ప్రభవింపజేశాము. వారి మీదుగా ఒక సుదీర్ఘకాలం గడిచి పోయింది. మా సూచనలను వినిపించటానికి నీవు మద్‌యన్‌ వాసులతో కూడా లేవు, కాని మేము (ఎల్లప్పుడూ) మా సందేశహరులను పంపుతూ వచ్చాము.

28:46 – وَمَا كُنتَ بِجَانِبِ الطُّورِ إِذْ نَادَيْنَا وَلَـٰكِن رَّحْمَةً مِّن رَّبِّكَ لِتُنذِرَ قَوْمًا مَّا أَتَاهُم مِّن نَّذِيرٍ مِّن قَبْلِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ ٤٦

మరియు మేము (మూసాను) పిలిచి నపుడు, నీవు (ఓ ము’హమ్మద్‌!) ‘తూర్‌ పర్వతం దగ్గర లేవు. కాని నీవు నీ ప్రభువు యొక్క కారుణ్యంతో, నీకు పూర్వం హెచ్చరిక చేసేవాడు రానటువంటి జాతివారిని హెచ్చరించటానికి – బహుశా వారు హితబోధ నేర్చు కుంటారేమోనని – (పంపబడ్డావు).

28:47 – وَلَوْلَا أَن تُصِيبَهُم مُّصِيبَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ فَيَقُولُوا رَبَّنَا لَوْلَا أَرْسَلْتَ إِلَيْنَا رَسُولًا فَنَتَّبِعَ آيَاتِكَ وَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ ٤٧

మరియు వారు తమ చేతులారా, చేసుకొని పంపిన కర్మల ఫలితంగా వారిపై ఆపద వచ్చి పడి నపుడు, వారు: “ఓ మా ప్రభూ! నీవు మా వద్దకు ఒక సందేశహరుణ్ణి ఎందుకు పంపలేదు, అలా చేస్తే మేము నీ సూచనలను అనుసరిస్తూ, విశ్వాసులైన వారిలో చేరి ఉండేవారం కదా!” (అని, తీర్పు దినమున అనకూడదని).

28:48 – فَلَمَّا جَاءَهُمُ الْحَقُّ مِنْ عِندِنَا قَالُوا لَوْلَا أُوتِيَ مِثْلَ مَا أُوتِيَ مُوسَىٰ ۚ أَوَلَمْ يَكْفُرُوا بِمَا أُوتِيَ مُوسَىٰ مِن قَبْلُ ۖ قَالُوا سِحْرَانِ تَظَاهَرَا وَقَالُوا إِنَّا بِكُلٍّ كَافِرُونَ ٤٨

ఆ తర్వాత మా తరఫు నుండి వారి వద్దకు సత్యం వచ్చినపుడు, వారిలా అన్నారు: “మూసా కు ఇవ్వబడి నటువంటిది, ఇతనికి ఎందుకు ఇవ్వబడ లేదు!” ఏమీ? దీనికి పూర్వం మూసాకు ఇవ్వబడిన దానిని వారు తిరస్కరించలేదా? వారన్నారు: “రెండూ మాయాజాలాలే! అవి ఒకదాని కొకటి సహాయపడుతున్నాయి.” ఇంకా ఇలా అన్నారు: “నిశ్చయంగా, మేము వీటన్నింటినీ తిరస్కరిస్తున్నాము.”

28:49 – قُلْ فَأْتُوا بِكِتَابٍ مِّنْ عِندِ اللَّـهِ هُوَ أَهْدَىٰ مِنْهُمَا أَتَّبِعْهُ إِن كُنتُمْ صَادِقِينَ ٤٩

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: “మీరు నిజాయితీపరులే అయితే, అల్లాహ్‌ దగ్గర నుండి ఈ రెండింటి కంటే ఉత్తమమైన మార్గం చూపే ఒక గ్రంథాన్ని తీసుకురండి. దానిని నేను అనుసరిస్తాను.”

28:50 – فَإِن لَّمْ يَسْتَجِيبُوا لَكَ فَاعْلَمْ أَنَّمَا يَتَّبِعُونَ أَهْوَاءَهُمْ ۚ وَمَنْ أَضَلُّ مِمَّنِ اتَّبَعَ هَوَاهُ بِغَيْرِ هُدًى مِّنَ اللَّـهِ ۚ إِنَّ اللَّـهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ ٥٠

వారు నీకు ఎలాంటి సమాధానం ఇవ్వక పోతే, వారు కేవలం తమ కోరికలను అనుసరిస్తున్నారని తెలుసుకో! మరియు అల్లాహ్‌ మార్గదర్శకత్వాన్ని విడిచి కేవలం తన కోరికలను అనుసరించే వానికంటే ఎక్కువ మార్గభ్రష్టుడు ఎవడు? నిశ్చయంగా, అల్లాహ్‌ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు. (1/2)

28:51 – وَلَقَدْ وَصَّلْنَا لَهُمُ الْقَوْلَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ ٥١

  • మరియు వారు హితబోధ పొందాలని, వాస్తవంగా, మేము ఈ వచనాన్ని (ఖుర్‌ఆన్‌ను) క్రమక్రమంగా అందజేశాము.

28:52 – الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ مِن قَبْلِهِ هُم بِهِ يُؤْمِنُونَ ٥٢

ఎవరికైతే పూర్వం మేము గ్రంథాన్ని ఇచ్చామో వారు దీనిని (ఖుర్‌ఆన్‌ను) విశ్వసిస్తారు. 28

28:53 – وَإِذَا يُتْلَىٰ عَلَيْهِمْ قَالُوا آمَنَّا بِهِ إِنَّهُ الْحَقُّ مِن رَّبِّنَا إِنَّا كُنَّا مِن قَبْلِهِ مُسْلِمِينَ ٥٣

మరియు వారికి ఇది వినిపించబడి నప్పుడు, వారు ఇలా అంటారు: “మేము దీనిని విశ్వసించాము, నిశ్చయంగా, ఇది మా ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. నిశ్చయంగా, మేము మొదటి నుండియే అల్లాహ్‌కు విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము.” 29

28:54 – أُولَـٰئِكَ يُؤْتَوْنَ أَجْرَهُم مَّرَّتَيْنِ بِمَا صَبَرُوا وَيَدْرَءُونَ بِالْحَسَنَةِ السَّيِّئَةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ ٥٤

వీరే, తమ సహనానికి ఫలితంగా రెండింతలు ప్రతిఫల మొసంగబడేవారు. 30 వీరే మంచితో చెడును నివారించేవారు. మరియు మేము వారి కిచ్చిన జీవనోపాధినుండి ఖర్చు చేసేవారు.

28:55 – وَإِذَا سَمِعُوا اللَّغْوَ أَعْرَضُوا عَنْهُ وَقَالُوا لَنَا أَعْمَالُنَا وَلَكُمْ أَعْمَالُكُمْ سَلَامٌ عَلَيْكُمْ لَا نَبْتَغِي الْجَاهِلِينَ ٥٥

మరియు వారు వ్యర్థమైన మాటలు విన్నప్పుడు, ఇలా అంటూ దూరంగా తొలగిపోతారు: “మాకు మా కర్మలు మరియు మీకు మీ కర్మలు, మీకు సలాం! 31 మాకు మూర్ఖులతో పనిలేదు.”

28:56 – إِنَّكَ لَا تَهْدِي مَنْ أَحْبَبْتَ وَلَـٰكِنَّ اللَّـهَ يَهْدِي مَن يَشَاءُ ۚ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ ٥٦

  1. (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీవు, నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేయలేవు, కాని అల్లాహ్‌ తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఆయనకు మార్గదర్శకత్వం పొందేవారెవరో బాగా తెలుసు. 32

28:57 – وَقَالُوا إِن نَّتَّبِعِ الْهُدَىٰ مَعَكَ نُتَخَطَّفْ مِنْ أَرْضِنَا ۚ أَوَلَمْ نُمَكِّن لَّهُمْ حَرَمًا آمِنًا يُجْبَىٰ إِلَيْهِ ثَمَرَاتُ كُلِّ شَيْءٍ رِّزْقًا مِّن لَّدُنَّا وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ ٥٧

వారు ఇలా అంటారు: “ఒకవేళ నీతోపాటు మేము కూడా ఈ మార్గదర్శకత్వాన్ని అవలం బిస్తే! మేము మా భూమినుండియే పారద్రోల బడతాము.” 33 ఏమీ? మేము వారిని శాంతికి నిలయమైన ఒక పవిత్ర స్థలం (మక్కహ్)లో స్థిరనివాసము నొసంగి వారికి మా తరఫు నుండి జీవనూపాధిగా అన్నిరకాల ఫలాలను సమకూర్చ లేదా? కాని వాస్తవానికి వారిలో చాలా మందికి ఇది తెలియదు. 34

28:58 – وَكَمْ أَهْلَكْنَا مِن قَرْيَةٍ بَطِرَتْ مَعِيشَتَهَا ۖ فَتِلْكَ مَسَاكِنُهُمْ لَمْ تُسْكَن مِّن بَعْدِهِمْ إِلَّا قَلِيلًا ۖ وَكُنَّا نَحْنُ الْوَارِثِينَ ٥٨

మరియు మేము ఎన్నో నగరాలను, జీవన సుఖసంపదలతో ఉప్పొంగిపోతూ ఉండగా, వాటిని నాశనం చేయలేదా! అవిగో వారి నివాసాలు, వారి తరువాత వాటిలో నివసించిన వారు చాలా తక్కువ! మరియు నిశ్చయంగా, మేమే వాటికి వారసులమయ్యాము. 35

28:59 – وَمَا كَانَ رَبُّكَ مُهْلِكَ الْقُرَىٰ حَتَّىٰ يَبْعَثَ فِي أُمِّهَا رَسُولًا يَتْلُو عَلَيْهِمْ آيَاتِنَا ۚ وَمَا كُنَّا مُهْلِكِي الْقُرَىٰ إِلَّا وَأَهْلُهَا ظَالِمُونَ ٥٩

మరియు నీ ప్రభువు నగరాలను ఏ మాత్రమూ నాశనం చేసేవాడు కాదు, ఎంతవరకైతే వాటి ముఖ్య నగరానికి మా సూచన (ఆయాత్‌) లను వినిపించే సందేశ హరులను పంపమో! మేము నగరాలను వాటి ప్రజలు దుర్మార్గులైపోతే తప్ప, నాశనం చేసేవారం కాము. 36

28:60 – وَمَا أُوتِيتُم مِّن شَيْءٍ فَمَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا وَزِينَتُهَا ۚ وَمَا عِندَ اللَّـهِ خَيْرٌ وَأَبْقَىٰ ۚ أَفَلَا تَعْقِلُونَ ٦٠

మరియు మీకు ఇవ్వబడినవన్నీ ఈ ప్రాపంచిక జీవితపు సుఖసంతోషాల సామాగ్రి మరియు దాని అలంకరణలు మాత్రమే! కాని అల్లాహ్‌ వద్ద ఉన్నది దీని కంటే ఎంతో ఉత్తమమైనది మరియు నిత్యమైనది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా? 37

28:61 – أَفَمَن وَعَدْنَاهُ وَعْدًا حَسَنًا فَهُوَ لَاقِيهِ كَمَن مَّتَّعْنَاهُ مَتَاعَ الْحَيَاةِ الدُّنْيَا ثُمَّ هُوَ يَوْمَ الْقِيَامَةِ مِنَ الْمُحْضَرِينَ ٦١

ఏమీ? మేము చేసిన మంచి వాగ్దానాన్ని తప్పకుండా పొందేవాడు, 38 మేము ఒసంగిన ఈ ప్రాపంచిక సుఖ-సంతోషాలు పొంది, పునరుత్థాన దినమున మా ముందు (శిక్షకై) హాజరు చేయబడేవాడితో సమానుడు కాగలడా?

28:62 – وَيَوْمَ يُنَادِيهِمْ فَيَقُولُ أَيْنَ شُرَكَائِيَ الَّذِينَ كُنتُمْ تَزْعُمُونَ ٦٢

మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆ రోజు ఆయన (అల్లాహ్‌) వారిని పిలిచి ఇలా ప్రశ్నిస్తాడు: “మీరు నా భాగస్వాములని నొక్కిచెప్పినవారు (భావించినవారు) ఇప్పుడు ఎక్కడున్నారు?” 39

28:63 – قَالَ الَّذِينَ حَقَّ عَلَيْهِمُ الْقَوْلُ رَبَّنَا هَـٰؤُلَاءِ الَّذِينَ أَغْوَيْنَا أَغْوَيْنَاهُمْ كَمَا غَوَيْنَا ۖ تَبَرَّأْنَا إِلَيْكَ ۖ مَا كَانُوا إِيَّانَا يَعْبُدُونَ ٦٣

ఎవరికైతే ఆ మాట (శిక్ష) వర్తిస్తుందో, వారిలా విన్నవించుకుంటారు: “ఓ మా ప్రభూ! మేము దారి తప్పించిన వారు వీరే! మేము దారి తప్పిన విధంగానే వీరిని కూడా దారి తప్పించాము. వీరితో మాకెలాంటి సంబంధం లేదని నీ ముందు ప్రకటిస్తున్నాము. అసలు వీరు మమ్మల్ని ఆరాధించనేలేదు.” 40

28:64 – وَقِيلَ ادْعُوا شُرَكَاءَكُمْ فَدَعَوْهُمْ فَلَمْ يَسْتَجِيبُوا لَهُمْ وَرَأَوُا الْعَذَابَ ۚ لَوْ أَنَّهُمْ كَانُوا يَهْتَدُونَ ٦٤

మరియు వారితో ఇలా అనబడుతుంది: “మీరు సాటి కల్పించిన మీ భాగస్వాములను పిలువండి!” అప్పుడు వారు, వారిని (భాగ స్వాములను) పిలుస్తారు, కాని వారు, వారికి సమాధానమివ్వరు. మరియు వారు శిక్షను చూసి (అనుకుంటారు): “ఒక వేళ వాస్తవానికి తాము సన్మార్గాన్ని అవలంబించివుంటే ఎంత బాగుండేది!” 41 అని.

28:65 – وَيَوْمَ يُنَادِيهِمْ فَيَقُولُ مَاذَا أَجَبْتُمُ الْمُرْسَلِينَ ٦٥

మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆయన (అల్లాహ్‌) వారిని పిలిచిన రోజు ఇలా ప్రశ్నిస్తాడు: “మేము పంపిన సందేశహరులకు మీరు ఏవిధంగా సమాధానమిచ్చారు?”

28:66 – فَعَمِيَتْ عَلَيْهِمُ الْأَنبَاءُ يَوْمَئِذٍ فَهُمْ لَا يَتَسَاءَلُونَ ٦٦

ఆ రోజు వారి సమాధానాలన్నీ (కారణా లన్నీ) అస్పష్టమైపోతాయి మరియు వారు ఒకరితోనొకరు సంప్రదించుకోనూ లేరు.

28:67 – فَأَمَّا مَن تَابَ وَآمَنَ وَعَمِلَ صَالِحًا فَعَسَىٰ أَن يَكُونَ مِنَ الْمُفْلِحِينَ ٦٧

కాని ఎవడైతే పశ్చాత్తాపపడి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో! అతడు సాఫల్యం పొందేవారిలో చేరగలడని ఆశించవచ్చు!

28:68 – وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ ۗ مَا كَانَ لَهُمُ الْخِيَرَةُ ۚ سُبْحَانَ اللَّـهِ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ ٦٨

మరియు నీ ప్రభువు తాను కోరిన దానిని సృష్టిస్తాడు మరియు ఎన్నుకుంటాడు. మరియు ఎన్నుకునే హక్కు వారికి ఏ మాత్రం లేదు. అల్లాహ్‌ సర్వలోపాలకు అతీతుడు, వారు సాటి కల్పించే భాగస్వాముల కంటే మహోన్నతుడు.

28:69 – وَرَبُّكَ يَعْلَمُ مَا تُكِنُّ صُدُورُهُمْ وَمَا يُعْلِنُونَ ٦٩

మరియు వారు తమ హృదయాలలో దాచుకున్నది మరియు బహిర్గతంచేసేది అంతా నీ ప్రభువుకు తెలుసు.

28:70 – وَهُوَ اللَّـهُ لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۖ لَهُ الْحَمْدُ فِي الْأُولَىٰ وَالْآخِرَةِ ۖ وَلَهُ الْحُكْمُ وَإِلَيْهِ تُرْجَعُونَ ٧٠

మరియు ఆయనే, అల్లాహ్‌! ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! మొదట (ఇహలోకంలో) మరియు చివరకు (పరలోకంలో) స్తుతింపదగినవాడు కేవలం ఆయనే! మరియు విశ్వ న్యాయాధిపత్యం ఆయనదే. మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు.

28:71 – قُلْ أَرَأَيْتُمْ إِن جَعَلَ اللَّـهُ عَلَيْكُمُ اللَّيْلَ سَرْمَدًا إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ مَنْ إِلَـٰهٌ غَيْرُ اللَّـهِ يَأْتِيكُم بِضِيَاءٍ ۖ أَفَلَا تَسْمَعُونَ ٧١

వారితోఅను:”ఏమీ? మీరు ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్‌ మీపైన పునరుత్థానదినం వరకు ఎడతెగకుండా రాత్రి ఆవరింపజేస్తే, అల్లాహ్‌ తప్ప మరే దేవుడైనా, మీకు వెలుగును తేగలడా? అయితే మీరెందుకు వినరు?”

28:72 – قُلْ أَرَأَيْتُمْ إِن جَعَلَ اللَّـهُ عَلَيْكُمُ النَّهَارَ سَرْمَدًا إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ مَنْ إِلَـٰهٌ غَيْرُ اللَّـهِ يَأْتِيكُم بِلَيْلٍ تَسْكُنُونَ فِيهِ ۖ أَفَلَا تُبْصِرُونَ ٧٢

ఇంకా ఇలా అను: “ఏమీ? మీరు ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్‌ మీపై పునరుత్థాన దినము వరకు ఎడతెగకుండా పగటిని అవతరింప జేస్తే, అల్లాహ్‌ తప్ప మరే దేవుడైనా మీకు విశ్రాంతి పొందటానికి రాత్రిని తేగలడా? అయితే, మీరెందుకు చూడలేరు?”

28:73 – وَمِن رَّحْمَتِهِ جَعَلَ لَكُمُ اللَّيْلَ وَالنَّهَارَ لِتَسْكُنُوا فِيهِ وَلِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ ٧٣

ఆయన తన కారుణ్యంతో మీ కొరకు, రాత్రి మరియు పగటిని – విశ్రాంతి పొందటానికి మరియు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి – చేశాడు, బహుశా మీరు కృతజ్ఞులౌతా రేమోనని. 42

28:74 – وَيَوْمَ يُنَادِيهِمْ فَيَقُولُ أَيْنَ شُرَكَائِيَ الَّذِينَ كُنتُمْ تَزْعُمُونَ ٧٤

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆయన (అల్లాహ్‌) వారిని ఆ రోజు పిలిచి ఇలా ప్రశ్నిస్తాడు: “మీరు నాకు భాగస్వాములని నొక్కిచెప్పినవారు (భావించినవారు) ఇప్పుడు ఎక్కడున్నారు?”

28:75 – وَنَزَعْنَا مِن كُلِّ أُمَّةٍ شَهِيدًا فَقُلْنَا هَاتُوا بُرْهَانَكُمْ فَعَلِمُوا أَنَّ الْحَقَّ لِلَّـهِ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ ٧٥

మరియు మేము ప్రతి సమాజంనుండి ఒక సాక్షిని 43 నిలబెట్టి ఇలా అంటాము: “మీ నిదర్శనాన్ని తీసుకురండి!” అప్పుడు వారు సత్యం, నిశ్చయంగా అల్లాహ్‌ వైపే ఉందని తెలుసుకుంటారు. మరియు వారు కల్పించు కున్నవన్నీ వారిని త్యజించి ఉంటాయి. (5/8)

28:76 – إِنَّ قَارُونَ كَانَ مِن قَوْمِ مُوسَىٰ فَبَغَىٰ عَلَيْهِمْ ۖ وَآتَيْنَاهُ مِنَ الْكُنُوزِ مَا إِنَّ مَفَاتِحَهُ لَتَنُوءُ بِالْعُصْبَةِ أُولِي الْقُوَّةِ إِذْ قَالَ لَهُ قَوْمُهُ لَا تَفْرَحْ ۖ إِنَّ اللَّـهَ لَا يُحِبُّ الْفَرِحِينَ ٧٦

  • వాస్తవానికి ఖారూన్‌, మూసా జాతికి చెందినవాడే. కాని అతడు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటుచేశాడు. 44 మరియు మేము అతడికి ఎన్నో నిధులను ఇచ్చి ఉంటిమి. వాటి తాళపుచెవులను బలవంతులైన పదిమంది లేదా అంతకంటే ఎక్కువమంది కూడా ఎంతో కష్టంతో మాత్రమే మోయగలిగే వారు. అతని జాతివారు అతనితో అన్నారు: “నీవు విర్రవీగకు, నిశ్చయంగా, అల్లాహ్‌ విర్రవీగేవారిని ప్రేమించడు!

28:77 – وَابْتَغِ فِيمَا آتَاكَ اللَّـهُ الدَّارَ الْآخِرَةَ ۖ وَلَا تَنسَ نَصِيبَكَ مِنَ الدُّنْيَا ۖ وَأَحْسِن كَمَا أَحْسَنَ اللَّـهُ إِلَيْكَ ۖ وَلَا تَبْغِ الْفَسَادَ فِي الْأَرْضِ ۖ إِنَّ اللَّـهَ لَا يُحِبُّ الْمُفْسِدِينَ ٧٧

“మరియు అల్లాహ్‌ నీకు ఇచ్చిన సంపదతో పరలోక గృహాన్ని పొందటానికి ప్రయత్నించు. మరియు ఇహలోకం నుండి లభించే భాగాన్ని మరచిపోకు. నీకు అల్లాహ్‌ మేలు చేసినట్లు, నీవు కూడా (ప్రజలకు) మేలుచేయి. 45 భూమిపై కల్లోలం రేకెత్తించటానికి ప్రయత్నించకు. నిశ్చయంగా అల్లాహ్‌ కల్లోలం రేకెత్తించేవారిని ప్రేమించడు!”

28:78 – قَالَ إِنَّمَا أُوتِيتُهُ عَلَىٰ عِلْمٍ عِندِي ۚ أَوَلَمْ يَعْلَمْ أَنَّ اللَّـهَ قَدْ أَهْلَكَ مِن قَبْلِهِ مِنَ الْقُرُونِ مَنْ هُوَ أَشَدُّ مِنْهُ قُوَّةً وَأَكْثَرُ جَمْعًا ۚ وَلَا يُسْأَلُ عَن ذُنُوبِهِمُ الْمُجْرِمُونَ ٧٨

అతడు (ఖారూన్‌) అన్నాడు: “నిశ్చయంగా ఇది (ఈ ధనం) నాకు నా జ్ఞానం వల్లనే ఇవ్వబడింది!” 46 ఏమీ? అతనికి తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్‌ అతనికి ముందు ఎన్నోతరాలవారిని – అతని కంటే ఎక్కువబలం మరియు ఎక్కువ ధనసంపదలు గలవారిని కూడా – నాశనంచేశాడని? మరియు పాపాత్ములు వారి పాపాలను గురించి ప్రశ్నింపబడరు.

28:79 – فَخَرَجَ عَلَىٰ قَوْمِهِ فِي زِينَتِهِ ۖ قَالَ الَّذِينَ يُرِيدُونَ الْحَيَاةَ الدُّنْيَا يَا لَيْتَ لَنَا مِثْلَ مَا أُوتِيَ قَارُونُ إِنَّهُ لَذُو حَظٍّ عَظِيمٍ ٧٩

తరువాత అతడు తన వైభవంతో తన జాతివారి ఎదుటకు వచ్చాడు. ఇహలోక జీవితపు సుఖాలు కోరేవారు ఇలా అన్నారు: “అయ్యో మా దౌర్భాగ్యం! ఖారూన్‌కు లభించి నటువంటివి (ధన సంపత్తులు) మాకు కూడా లభించి ఉంటే ఎంత బాగుండేది? నిశ్చయంగా అతడు ఎంతో అదృష్టవంతుడు!”

28:80 – وَقَالَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ وَيْلَكُمْ ثَوَابُ اللَّـهِ خَيْرٌ لِّمَنْ آمَنَ وَعَمِلَ صَالِحًا وَلَا يُلَقَّاهَا إِلَّا الصَّابِرُونَ ٨٠

కాని జ్ఞానసంపన్నులన్నారు: “మీ దౌర్భాగ్యం! అల్లాహ్‌ ఇచ్చే ప్రతిఫలమే, విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి ఎంతో శ్రేష్ఠమైనది. మరియు ఈ మహా భాగ్యం, సహనం వహించే వారికి తప్ప ఇతరులకు లభించదు.” 47

28:81 – فَخَسَفْنَا بِهِ وَبِدَارِهِ الْأَرْضَ فَمَا كَانَ لَهُ مِن فِئَةٍ يَنصُرُونَهُ مِن دُونِ اللَّـهِ وَمَا كَانَ مِنَ الْمُنتَصِرِينَ ٨١

ఆ పిదప మేము అతనిని, అతని గృహంతో సహా భూమిలోకి అణగద్రొక్కాము. అతనిని, అల్లాహ్‌ (శిక్ష) నుండి తప్పించగల, అతని తెగ వారు ఎవ్వరూ లేక పోయారు మరియు అతడు కూడా తనను తాను కాపాడుకోలేక పోయాడు.

28:82 – وَأَصْبَحَ الَّذِينَ تَمَنَّوْا مَكَانَهُ بِالْأَمْسِ يَقُولُونَ وَيْكَأَنَّ اللَّـهَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ مِنْ عِبَادِهِ وَيَقْدِرُ ۖ لَوْلَا أَن مَّنَّ اللَّـهُ عَلَيْنَا لَخَسَفَ بِنَا ۖ وَيْكَأَنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ ٨٢

మరియు నిన్నటి వరకు అతని (ఖారూన్‌) వలే కావలెనని ఎవరైతే కోరుతూవచ్చారో, వారు ఇప్పుడు ఇలా పలుకసాగారు: “తెలుసుకోండి! 48 అల్లాహ్‌ తన దాసులలో, తాను కోరినవారికి జీవనోపాధిని విస్తరింపజేస్తాడు. 49 మరియు (తాను కోరినవారికి) తగ్గిస్తాడు. ఒక వేళ అల్లాహ్‌ అనుగ్రహమే మాపై లేకుంటే ఆయన మమ్మల్ని కూడా భూమిలోకి అణగద్రొక్కి ఉండేవాడు. తెలుసుకోండి! సత్య-తిరస్కారులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు!”

28:83 – تِلْكَ الدَّارُ الْآخِرَةُ نَجْعَلُهَا لِلَّذِينَ لَا يُرِيدُونَ عُلُوًّا فِي الْأَرْضِ وَلَا فَسَادًا ۚ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ ٨٣

ఆ పరలోక జీవితపు గృహాన్ని మేము భూమిలో పెద్దరికం చూపగోరని వారి కొరకు మరియు కల్లోలం రేకెత్తించని వారి కొరకు ప్రత్యేకిస్తాము. మరియు దైవభీతి గలవారికే (మేలైన) పర్యవసానం ఉంటుంది.

28:84 – مَن جَاءَ بِالْحَسَنَةِ فَلَهُ خَيْرٌ مِّنْهَا ۖ وَمَن جَاءَ بِالسَّيِّئَةِ فَلَا يُجْزَى الَّذِينَ عَمِلُوا السَّيِّئَاتِ إِلَّا مَا كَانُوا يَعْمَلُونَ ٨٤

మంచి పనులు చేసివచ్చిన వారికి వాటి కంటే ఉత్తమమైన (ప్రతిఫలం) లభిస్తుంది. 50 మరియు చెడ్డపనులు చేసి వచ్చిన వారికి, వారు చేస్తూ ఉండిన చెడ్డపనులకు తగినంత ప్రతిఫలమే ఇవ్వబడుతుంది.

28:85 – إِنَّ الَّذِي فَرَضَ عَلَيْكَ الْقُرْآنَ لَرَادُّكَ إِلَىٰ مَعَادٍ ۚ قُل رَّبِّي أَعْلَمُ مَن جَاءَ بِالْهُدَىٰ وَمَنْ هُوَ فِي ضَلَالٍ مُّبِينٍ ٨٥

(ఓ ము’హమ్మద్‌!) నిశ్చయంగా, ఈ ఖుర్‌ ఆన్‌ను నీకు విధిగా చేసినవాడు (అల్లాహ్‌) తప్పక నిన్ను నీ నిర్ణీత స్థానానికి తిరిగితెస్తాడు. 51 వారితో ఇలా అను: “ఎవడు మార్గదర్శకత్వంలో ఉన్నాడో మరియు ఎవడు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడిఉన్నాడో, నా ప్రభువుకు బాగా తెలుసు.”

28:86 – وَمَا كُنتَ تَرْجُو أَن يُلْقَىٰ إِلَيْكَ الْكِتَابُ إِلَّا رَحْمَةً مِّن رَّبِّكَ ۖ فَلَا تَكُونَنَّ ظَهِيرًا لِّلْكَافِرِينَ ٨٦

మరియు నీకు ఈ గ్రంథం (ఖుర్‌ఆన్‌) ఇవ్వబడుతుందని నీవెన్నడూ ఆశించలేదు, ఇది కేవలం నీ ప్రభువు కారుణ్యంవల్లనే లభించింది. కావున నీవు ఎన్నటికీ సత్య-తిరస్కారులకు తోడ్పడేవాడవు కావద్దు!

28:87 – وَلَا يَصُدُّنَّكَ عَنْ آيَاتِ اللَّـهِ بَعْدَ إِذْ أُنزِلَتْ إِلَيْكَ ۖ وَادْعُ إِلَىٰ رَبِّكَ ۖ وَلَا تَكُونَنَّ مِنَ الْمُشْرِكِينَ ٨٧

మరియు అల్లాహ్‌ ఆయతులు, నీపై అవతరింపజేయబడిన తరువాత; వారు (సత్య-తిరస్కారులు) వాటి (పఠనం / ప్రచారం) నుండి నిన్ను ఏ మాత్రం తొలగింపనివ్వరాదు. మరియు (ప్రజలను) నీ ప్రభువు వైపునకు ఆహ్వానించు. మరియు నీవు బహుదైవారాధకులలో చేరిపోకు.

28:88 – وَلَا تَدْعُ مَعَ اللَّـهِ إِلَـٰهًا آخَرَ ۘ لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۚ كُلُّ شَيْءٍ هَالِكٌ إِلَّا وَجْهَهُ ۚ لَهُ الْحُكْمُ وَإِلَيْهِ تُرْجَعُونَ ٨٨

మరియు అల్లాహ్‌తో పాటు ఏ ఇతర దైవాన్నీ ఆరాధించకు. ఆయన (అల్లాహ్‌) తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. కేవలం ఆయన ఉనికి (ముఖం) తప్ప ప్రతిదీ నశిస్తుంది. 52 సర్వ న్యాయాధిపత్యం కేవలం ఆయనదే మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు.

సూరహ్‌ అల్‌-‘అంకబూత్‌ – ‘అంకబూత్‌ : సాలీడు పురుగు లేక సాలె పురుగు. దీని పేరు 41వ ఆయత్‌ నుండి తీసుకో బడింది. ఇందులో 69 ఆయతులు ఉన్నాయి. అసత్యాధారంపై ఉన్న ప్రతిదీ సత్యపు గాలికి ఒక రోజు ఎగిరిపోకుండా ఉండదు. ఇది చివరి మక్కహ్ సూరహ్‌ అని చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం. ఈ సమూహపు 4 (29-32) సూరాహ్ లలో ఇది మొదటిది. ఈ నాలుగు సూరహ్‌లు అలీఫ్‌-లామ్‌-మీమ్‌, అక్షరాలతో ప్రారంభమవుతాయి.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 29:1 – الم ١

అలిఫ్‌-లామ్‌-మీమ్‌.

29:2 – أَحَسِبَ النَّاسُ أَن يُتْرَكُوا أَن يَقُولُوا آمَنَّا وَهُمْ لَا يُفْتَنُونَ ٢

ఏమీ? ప్రజలు: “మేము విశ్వసించాము!” అని అన్నంత మాత్రాన్నే తాము విడిచిపెట్ట బడతారని మరియు తాము పరీక్షింపబడరని భావిస్తున్నారా? 1

29:3 – وَلَقَدْ فَتَنَّا الَّذِينَ مِن قَبْلِهِمْ ۖ فَلَيَعْلَمَنَّ اللَّـهُ الَّذِينَ صَدَقُوا وَلَيَعْلَمَنَّ الْكَاذِبِينَ ٣

మరియు వాస్తవానికి, మేము వారికి పూర్వం గతించిన వారిని కూడా పరీక్షించి ఉన్నాము. కావున నిశ్చయంగా, సత్యవంతులు ఎవరో మరియు అసత్యవంతులు ఎవరో అల్లాహ్‌ వ్యక్తపరుస్తాడు.

29:4 – أَمْ حَسِبَ الَّذِينَ يَعْمَلُونَ السَّيِّئَاتِ أَن يَسْبِقُونَا ۚ سَاءَ مَا يَحْكُمُونَ ٤

లేక, చెడు పనులు చేస్తున్నవారు, మా (శిక్ష) నుండి తప్పించుకోగలరని భావిస్తున్నారా? ఎంతచెడ్డ నిర్ణయం వారిది!

29:5 – مَن كَانَ يَرْجُو لِقَاءَ اللَّـهِ فَإِنَّ أَجَلَ اللَّـهِ لَآتٍ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ ٥

అల్లాహ్‌ను కలుసుకునే కోరిక ఉన్నవాడు, అల్లాహ్‌ నిర్ణయించిన ఆ సమయం తప్పక రానున్నదని నమ్మాలి. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

29:6 – وَمَن جَاهَدَ فَإِنَّمَا يُجَاهِدُ لِنَفْسِهِ ۚ إِنَّ اللَّـهَ لَغَنِيٌّ عَنِ الْعَالَمِينَ ٦

కావున (అల్లాహ్‌ మార్గంలో) పాటుపడేవాడు నిశ్చయంగా తన (మేలు) కొరకే పాటుపడు తున్నాడని (తెలుసుకోవాలి). 2 నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వలోకాలవారి అక్కర ఏ మాత్రం లేనివాడు.

29:7 – وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَنَجْزِيَنَّهُمْ أَحْسَنَ الَّذِي كَانُوا يَعْمَلُونَ ٧

మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, నిశ్చయంగా అలాంటి వారి (పూర్వపు) పాపాలను మేము తప్పక తొలగిస్తాము మరియు వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమమైన ప్రతిఫలం ఇస్తాము.

29:8 – وَوَصَّيْنَا الْإِنسَانَ بِوَالِدَيْهِ حُسْنًا ۖ وَإِن جَاهَدَاكَ لِتُشْرِكَ بِي مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ فَلَا تُطِعْهُمَا ۚ إِلَيَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ٨

మరియు మేము మానవునికి తన తల్లి-దండ్రులతో మంచిగా వ్యవహరించమని ఆదేశించాము. 3 కాని వారిద్దరూ, నీవు ఎరుగని వానిని నాకు భాగస్వామిగా చేయమని బలవంత పెడితే, నీవు వారి ఆజ్ఞాపాలన చేయకు 4 మీరందరూ నా వైపుకే మరలిరావలసి ఉన్నది, అప్పుడు నేను మీకు, మీరు ఏమి చేస్తూ ఉండే వారో తెలుపుతాను.

29:9 – وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُدْخِلَنَّهُمْ فِي الصَّالِحِينَ ٩

మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉంటారో, మేము వారిని తప్పక సద్వర్తనులతో చేర్చుతాము.

29:10 – وَمِنَ النَّاسِ مَن يَقُولُ آمَنَّا بِاللَّـهِ فَإِذَا أُوذِيَ فِي اللَّـهِ جَعَلَ فِتْنَةَ النَّاسِ كَعَذَابِ اللَّـهِ وَلَئِن جَاءَ نَصْرٌ مِّن رَّبِّكَ لَيَقُولُنَّ إِنَّا كُنَّا مَعَكُمْ ۚ أَوَلَيْسَ اللَّـهُ بِأَعْلَمَ بِمَا فِي صُدُورِ الْعَالَمِينَ ١٠

మరియు ప్రజలలో కొందరు (తమ నాలు కలతో): “మేము అల్లాహ్‌ను విశ్వసించాము.” అని అనే వ్యక్తులున్నారు. కాని వారు అల్లాహ్‌ మార్గంలో హింసించబడినప్పుడు, మానవులు పెట్టిన పరీక్షలను అల్లాహ్‌ యొక్క శిక్షగా భావిస్తారు; మరియు ఒకవేళ నీ ప్రభువు నుండి సహాయం వస్తే వారు (కపట-విశ్వాసులు) అంటారు: “నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నాము.” 5 సర్వలోకాల వారి హృదయాల స్థితి అల్లాహ్‌కు తెలియదా ఏమిటి?

29:11 – وَلَيَعْلَمَنَّ اللَّـهُ الَّذِينَ آمَنُوا وَلَيَعْلَمَنَّ الْمُنَافِقِينَ ١١

మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ విశ్వ సించిన వారిని స్పష్టపరుస్తాడు మరియు ఆయన కపట-విశ్వాసులను కూడా స్పష్టపరుస్తాడు. 6

29:12 – وَقَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا اتَّبِعُوا سَبِيلَنَا وَلْنَحْمِلْ خَطَايَاكُمْ وَمَا هُم بِحَامِلِينَ مِنْ خَطَايَاهُم مِّن شَيْءٍ ۖ إِنَّهُمْ لَكَاذِبُونَ ١٢

మరియు సత్యతిరస్కారులు, విశ్వాసులతో: “మీరు మా మార్గాన్ని అనుసరించండి. మేము మీ పాపాలను భరిస్తాము.” అని అంటారు. వాస్త వానికి వారి పాపాలలో నుండి దేనిని కూడా వారు భరించరు. నిశ్చయంగా, వారు అసత్యవాదులు. 7

29:13 – وَلَيَحْمِلُنَّ أَثْقَالَهُمْ وَأَثْقَالًا مَّعَ أَثْقَالِهِمْ ۖ وَلَيُسْأَلُنَّ يَوْمَ الْقِيَامَةِ عَمَّا كَانُوا يَفْتَرُونَ ١٣

మరియు నిశ్చయంగా, వారు తమ బరువులను మోస్తారు. మరియు తమ బరువులతో పాటు ఇతరుల బరువులను కూడా మోస్తారు. 8 మరియు నిశ్చయంగా, వారు పునరుత్థానదినమున, తమ బూటక కల్పనలను గురించి ప్రశ్నించబడతారు.

29:14 – وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ فَلَبِثَ فِيهِمْ أَلْفَ سَنَةٍ إِلَّا خَمْسِينَ عَامًا فَأَخَذَهُمُ الطُّوفَانُ وَهُمْ ظَالِمُونَ ١٤

మరియు వాస్తవానికి, మేము నూ’హ్‌ను అతని జాతివారి వద్దకు పంపాము. అతను వారిమధ్య యాభైతక్కువ వేయిసంవత్సరాల వరకు (వారిని అల్లాహ్‌ ధర్మం వైపుకు ఆహ్వానిస్తూ) నివసించాడు; చివరకు వారు దుర్మార్గాన్ని విడనాడనందుకు, వారిని తుఫాను పట్టుకున్నది. 9

29:15 – فَأَنجَيْنَاهُ وَأَصْحَابَ السَّفِينَةِ وَجَعَلْنَاهَا آيَةً لِّلْعَالَمِينَ ١٥

తరువాత మేము అతనిని (నూ’హ్‌ను) మరియు నావలో ఎక్కినవారిని రక్షించి, దానిని సర్వలోకాల వారికి ఒక సూచనగా చేశాము.

29:16 – وَإِبْرَاهِيمَ إِذْ قَالَ لِقَوْمِهِ اعْبُدُوا اللَّـهَ وَاتَّقُوهُ ۖ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ ١٦

మరియు (జ్ఞాపకంచేసుకోండి!) ఇలాగే ఇబ్రాహీమ్‌ కూడా తన జాతివారితో: “కేవలం అల్లాహ్‌నే ఆరాధించండి మరియు ఆయన యందు భయ-భక్తులు కలిగి ఉండండి. మీరు అర్థం చేసుకోగలిగితే, ఇది మీకు ఎంతో మేలైనది.

29:17 – إِنَّمَا تَعْبُدُونَ مِن دُونِ اللَّـهِ أَوْثَانًا وَتَخْلُقُونَ إِفْكًا ۚ إِنَّ الَّذِينَ تَعْبُدُونَ مِن دُونِ اللَّـهِ لَا يَمْلِكُونَ لَكُمْ رِزْقًا فَابْتَغُوا عِندَ اللَّـهِ الرِّزْقَ وَاعْبُدُوهُ وَاشْكُرُوا لَهُ ۖ إِلَيْهِ تُرْجَعُونَ ١٧

“నిశ్చయంగా, మీరు అల్లాహ్‌ను వదలి విగ్రహాలను ఆరాధిస్తూ, ఒక అభూత కల్పన చేస్తున్నారు. నిశ్చయంగా అల్లాహ్‌ను వదలి మీరు ఎవరినైతే, ఆరాధిస్తున్నారో, వారికి మీకు జీవనోపాధిని సమకూర్చే యోగ్యత లేదు. కావున మీరు, మీ జీవనోపాధిని అల్లాహ్‌ నుండియే అపేక్షించండి మరియు ఆయననే ఆరాధించండి. మరియు ఆయనకే కృతజ్ఞులై ఉండండి. మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు.

29:18 – وَإِن تُكَذِّبُوا فَقَدْ كَذَّبَ أُمَمٌ مِّن قَبْلِكُمْ ۖ وَمَا عَلَى الرَّسُولِ إِلَّا الْبَلَاغُ الْمُبِينُ ١٨

“ఒకవేళ మీరు (ఈ సందేశాన్ని) అబద్ధమని తిరస్కరిస్తే, (ఆశ్చర్యమేమీ లేదు) వాస్తవానికి మీకు పూర్వం ఎన్నో సమాజాలు (దివ్యసందేశాలను అబద్ధాలని) తిరస్కరించాయి. మరియు సందేశ హరుని బాధ్యత, స్పష్టంగా మీకు సందేశాన్ని అందజేయటం మాత్రమే!”

29:19 – أَوَلَمْ يَرَوْا كَيْفَ يُبْدِئُ اللَّـهُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّـهِ يَسِيرٌ ١٩

అల్లాహ్‌ సృష్టిని ఏవిధంగా ప్రారంభిస్తు న్నాడో, తరువాత దానిని ఏవిధంగా మరల ఉనికిలోకి తెస్తున్నాడో, వారు గమనించడం లేదా? నిశ్చయంగా, ఇది అల్లాహ్‌కు ఎంతో సులభం!

29:20 – قُلْ سِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ بَدَأَ الْخَلْقَ ۚ ثُمَّ اللَّـهُ يُنشِئُ النَّشْأَةَ الْآخِرَةَ ۚ إِنَّ اللَّـهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٢٠

వారితో అను: “మీరు భూమిలో సంచారం చేసి చూడండి. ఆయన సృష్టిని ఏవిధంగా ప్రారంభించాడో! 10 తరువాత అల్లాహ్‌యే మరల (రెండవసారి) దానిని ఉనికిలోకి తెస్తున్నాడు! నిశ్చ యంగా, అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు!”

29:21 – يُعَذِّبُ مَن يَشَاءُ وَيَرْحَمُ مَن يَشَاءُ ۖ وَإِلَيْهِ تُقْلَبُونَ ٢١

ఆయన తాను కోరినవారిని శిక్షిస్తాడు మరియు తానుకోరిన వారిని కరుణిస్తాడు.మరియు ఆయన వైపుకే మీరంతా మరలింపబడతారు.

29:22 – وَمَا أَنتُم بِمُعْجِزِينَ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ ۖ وَمَا لَكُم مِّن دُونِ اللَّـهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ ٢٢

మరియు మీరు భూమిలో గాని, ఆకాశంలో గాని ఆయన నుండి తప్పించుకోజాలరు. మరియు అల్లాహ్‌ తప్ప మీకు సంరక్షకుడు గానీ మరియు సహాయకుడు గానీ ఎవ్వడూ లేడు.

29:23 – وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِ اللَّـهِ وَلِقَائِهِ أُولَـٰئِكَ يَئِسُوا مِن رَّحْمَتِي وَأُولَـٰئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ ٢٣

మరియు ఎవరైతే, అల్లాహ్‌ సూచనలను మరియు ఆయనతో కాబోయే సమావేశాన్ని తిరస్కరిస్తారో, అలాంటి వారు నా కరుణపట్ల నిరాశచెందుతారు. 11 మరియు అలాంటి వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది.

29:24 – فَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا اقْتُلُوهُ أَوْ حَرِّقُوهُ فَأَنجَاهُ اللَّـهُ مِنَ النَّارِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ ٢٤

ఇక అతని (ఇబ్రాహీమ్‌) జాతివారి జవాబు ఈ విధంగా అనడం తప్ప మరొకటి లేక పోయింది: “ఇతనిని చంపండి లేదా కాల్చివేయండి. “చివరకు అల్లాహ్‌ అతనిని అగ్ని నుండి రక్షించాడు. 12 నిశ్చయంగా ఇందులో విశ్వసించేవారికి సూచన లున్నాయి.

29:25 – وَقَالَ إِنَّمَا اتَّخَذْتُم مِّن دُونِ اللَّـهِ أَوْثَانًا مَّوَدَّةَ بَيْنِكُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ ثُمَّ يَوْمَ الْقِيَامَةِ يَكْفُرُ بَعْضُكُم بِبَعْضٍ وَيَلْعَنُ بَعْضُكُم بَعْضًا وَمَأْوَاكُمُ النَّارُ وَمَا لَكُم مِّن نَّاصِرِينَ ٢٥

మరియు (ఇబ్రాహీమ్‌) ఇలా అన్నాడు: “నిశ్చయంగా మీరు ప్రాపంచిక జీవితంలో అల్లాహ్‌ ను వదలి, విగ్రహారాధనను మీ మధ్య ప్రేమకు సాధనంగా చేసుకున్నారు. కాని పునరుత్థాన దినమున మీకు పరస్పరం సంబంధమే లేదంటారు మరియు పరస్పరం శపించుకుంటారు మరియు మీ ఆశ్రయం నరకాగ్నియే మరియు మీకు సహాయపడేవారు ఎవ్వరూఉండరు.” (7/8)

29:26 – فَآمَنَ لَهُ لُوطٌ ۘ وَقَالَ إِنِّي مُهَاجِرٌ إِلَىٰ رَبِّي ۖ إِنَّهُ هُوَ الْعَزِيزُ الْحَكِيمُ ٢٦

  • అప్పుడు లూ’త్‌ అతనిని విశ్వసించాడు. (ఇబ్రాహీమ్‌) ఇలా అన్నాడు: “నేను నా ప్రభువు వైపునకు వలసపోతాను. 13 నిశ్చయంగా, ఆయనే సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.”

29:27 – وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ وَجَعَلْنَا فِي ذُرِّيَّتِهِ النُّبُوَّةَ وَالْكِتَابَ وَآتَيْنَاهُ أَجْرَهُ فِي الدُّنْيَا ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ ٢٧

మరియు మేము అతనికి (ఇబ్రాహీమ్‌కు) ఇస్‌’హాఖ్‌ మరియు య’అఖూబ్‌లను ప్రసాదించి, అతనిసంతతిలో ప్రవక్తపదవినీ మరియు గ్రంథాన్ని ఉంచి, ప్రపంచంలో అతనికి, అతని ప్రతిఫలాన్ని ఇచ్చాము. 14 మరియు పరలోకంలో అతడు నిశ్చయంగా, సద్వర్తనులతో పాటు ఉంటాడు 15

29:28 – وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِ إِنَّكُمْ لَتَأْتُونَ الْفَاحِشَةَ مَا سَبَقَكُم بِهَا مِنْ أَحَدٍ مِّنَ الْعَالَمِينَ ٢٨

మరియు (జ్ఞాపకం చేసుకోండి) లూ’త్‌ తన జాతిప్రజలతో ఇలా అన్నప్పుడు: “నిశ్చయంగా, మీరు చాలా హేయమైన పని చేస్తున్నారు. మీకు పూర్వం లోకంలో ఎవ్వడూ ఇలాంటి పని చేయలేదు. 16

29:29 – أَئِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ وَتَقْطَعُونَ السَّبِيلَ وَتَأْتُونَ فِي نَادِيكُمُ الْمُنكَرَ ۖ فَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا ائْتِنَا بِعَذَابِ اللَّـهِ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ ٢٩

“వాస్తవానికి, మీరు (కామంతో) పురుషుల వద్దకు పోతున్నారు! మరియు దారి కొడు తున్నారు (దోపిడిచేస్తున్నారు)! మరియు మీ సభలలో అసభ్యకరమైన పనులు చేస్తున్నారు!” అతని జాతివారి జవాబు కేవలం ఇలానే ఉండేది: “నీవు సత్యవంతుడవే అయితే అల్లాహ్‌ శిక్షను మాపైకి తీసుకురా!”

29:30 – قَالَ رَبِّ انصُرْنِي عَلَى الْقَوْمِ الْمُفْسِدِينَ ٣٠

అపుడు లూ’త్‌ ఇలా ప్రార్థించాడు: “ఓ నా ప్రభూ! దౌర్జన్యపరులపై నాకు విజయము నొసంగు.”

29:31 – وَلَمَّا جَاءَتْ رُسُلُنَا إِبْرَاهِيمَ بِالْبُشْرَىٰ قَالُوا إِنَّا مُهْلِكُو أَهْلِ هَـٰذِهِ الْقَرْيَةِ ۖ إِنَّ أَهْلَهَا كَانُوا ظَالِمِينَ ٣١

మరియు మా దూతలు ఇబ్రాహీమ్‌ వద్దకు శుభవార్త తీసికొని వచ్చినపుడు వారన్నారు: “నిశ్చయంగా, మేము ఈ నగరవాసులను నాశనం చేయబోతున్నాము. ఎందుకంటే వాస్తవానికి దాని ప్రజలు దుర్మార్గులై పోయారు!”

29:32 – قَالَ إِنَّ فِيهَا لُوطًا ۚ قَالُوا نَحْنُ أَعْلَمُ بِمَن فِيهَا ۖ لَنُنَجِّيَنَّهُ وَأَهْلَهُ إِلَّا امْرَأَتَهُ كَانَتْ مِنَ الْغَابِرِينَ ٣٢

(ఇబ్రాహీమ్‌) అన్నాడు: “వాస్తవానికి అక్కడ లూ’త్‌ కూడా ఉన్నాడు కదా!” వారన్నారు: “అక్కడ ఎవరున్నారో, మాకు బాగా తెలుసు. మేము అతనిని మరియు అతని కుటుం బం వారిని రక్షిస్తాము – అతని భార్య తప్ప – ఆమె వెనుక ఉండిపోయేవారిలో చేరిపోయింది.” 18

29:33 – وَلَمَّا أَن جَاءَتْ رُسُلُنَا لُوطًا سِيءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَقَالُوا لَا تَخَفْ وَلَا تَحْزَنْ ۖ إِنَّا مُنَجُّوكَ وَأَهْلَكَ إِلَّا امْرَأَتَكَ كَانَتْ مِنَ الْغَابِرِينَ ٣٣

ఆ తరువాత మా దూతలు లూ’త్‌ వద్దకు రాగా అతను వారి నిమిత్తం చాలా చింతించాడు. 18 మరియు ఇబ్బందిలో పడిపోయాడు. వారిలా అన్నారు: “నీవు భయపడకు మరియు దుఃఖ పడకు! నిశ్చయంగా మేము నిన్ను మరియు నీ కుటుంబంవారిని రక్షిస్తాము – నీ భార్య తప్ప – ఆమె వెనుక ఉండిపోయే వారిలో చేరిపోయింది!

29:34 – إِنَّا مُنزِلُونَ عَلَىٰ أَهْلِ هَـٰذِهِ الْقَرْيَةِ رِجْزًا مِّنَ السَّمَاءِ بِمَا كَانُوا يَفْسُقُونَ ٣٤

“నిశ్చయంగా, మేము ఈ నగరవాసుల మీద ఆకాశం నుండి ఘోర విపత్తు అవతరింపజేయ బోతున్నాము. ఎందుకంటే వారు అవిధేయు లయ్యారు!”

29:35 – وَلَقَد تَّرَكْنَا مِنْهَا آيَةً بَيِّنَةً لِّقَوْمٍ يَعْقِلُونَ ٣٥

మరియు వాస్తవానికి, బుద్ధిమంతుల కొరకు మేము దీని ద్వారా ఒక స్పష్టమైన సూచనను వదలిపెట్టాము. 19

29:36 – وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا فَقَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّـهَ وَارْجُوا الْيَوْمَ الْآخِرَ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ ٣٦

మరియు మేము మద్‌యన్‌ వాసులవద్దకు వారి సహోదరుడు షు’ఐబ్‌ను పంపాము. 20 అతను ఇలా అన్నాడు: “నా జాతి ప్రజలారా! కేవలం అల్లాహ్‌నే ఆరాధించండి. మరియు అంతిమదినం కొరకు నిరీక్షిస్తూ (భయపడుతూ) ఉండండి. మరియు దౌర్జన్యపరులుగా భూమిలో కల్లోలం రేకెత్తిస్తూ తిరగకండి!”

29:37 – فَكَذَّبُوهُ فَأَخَذَتْهُمُ الرَّجْفَةُ فَأَصْبَحُوا فِي دَارِهِمْ جَاثِمِينَ ٣٧

కాని వారు అతనిని అసత్యుడని తిరస్కరించారు, ఒక తీవ్రమైన భూకంపం వారిని పట్టుకున్నది, అప్పుడు వారు తమ ఇండ్లలోనే చలనంలేని శవాలుగా మారిపోయారు.

29:38 – وَعَادًا وَثَمُودَ وَقَد تَّبَيَّنَ لَكُم مِّن مَّسَاكِنِهِمْ ۖ وَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ فَصَدَّهُمْ عَنِ السَّبِيلِ وَكَانُوا مُسْتَبْصِرِينَ ٣٨

మరియు వాస్తవంగా, ‘ఆద్‌ మరియు స’మూద్‌ జాతులవారి (వినాశ) విషయం (మిగిలిపోయిన) వారి నివాసస్థలాల నుండి, మీకు స్పష్టంగా తెలుస్తున్నది 21 వాస్తవానికి, వారు (సత్యాన్ని) గ్రహించేవారు అయినప్పటికీ, షై’తాన్‌ వారి కర్మలను వారికి మంచివిగా కనబడేటట్లు చేశాడు. ఆ తరువాత వారిని (ఋజు) మార్గం నుండి తొలగించాడు.

29:39 – وَقَارُونَ وَفِرْعَوْنَ وَهَامَانَ ۖ وَلَقَدْ جَاءَهُم مُّوسَىٰ بِالْبَيِّنَاتِ فَاسْتَكْبَرُوا فِي الْأَرْضِ وَمَا كَانُوا سَابِقِينَ ٣٩

ఇక ఖారూన్‌ 22 ఫిర్‌’ఔన్‌ మరియు హామా ను లను 23 (కూడా మేము ఇదే విధంగా నాశనం చేశాము). వాస్తవానికి, మూసా వారి వద్దకు స్పష్ట మైన సూచనలను తీసుకొనివచ్చాడు; కాని వారు భూమిలో అహంభావం చూపారు. కావున వారు (మా శిక్ష నుండి) తప్పించుకో లేక పోయారు.

29:40 – فَكُلًّا أَخَذْنَا بِذَنبِهِ ۖ فَمِنْهُم مَّنْ أَرْسَلْنَا عَلَيْهِ حَاصِبًا وَمِنْهُم مَّنْ أَخَذَتْهُ الصَّيْحَةُ وَمِنْهُم مَّنْ خَسَفْنَا بِهِ الْأَرْضَ وَمِنْهُم مَّنْ أَغْرَقْنَا ۚ وَمَا كَانَ اللَّـهُ لِيَظْلِمَهُمْ وَلَـٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ ٤٠

కావున ప్రతి ఒక్కరిని మేము అతని పాపానికి బదులుగా పట్టుకున్నాము. వారిలో కొందరిపైకి మేము ‘తుఫాన్‌ గాలిని పంపాము. 24 మరికొందరిని ఒక భయంకరమైన గర్జన (‘సయ్‌’హా) చిక్కించుకున్నది. 25 ఇంకా కొందరిని భూమిలోనికి అణగద్రొక్కాము, 26 ఇంకా ఇతరులను ముంచివేశాము. 27 మరియు అల్లాహ్‌ వారికెలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకుతాము అన్యాయం చేసుకున్నారు.

29:41 – مَثَلُ الَّذِينَ اتَّخَذُوا مِن دُونِ اللَّـهِ أَوْلِيَاءَ كَمَثَلِ الْعَنكَبُوتِ اتَّخَذَتْ بَيْتًا ۖ وَإِنَّ أَوْهَنَ الْبُيُوتِ لَبَيْتُ الْعَنكَبُوتِ ۖ لَوْ كَانُوا يَعْلَمُونَ ٤١

అల్లాహ్‌ను వదలి ఇతరులను సంరక్ష కులుగా చేసుకున్నవారి ఉపమానాన్ని సాలె పురుగు నిర్మించే ఇంటితో పోల్చవచ్చు. నిశ్చయంగా, అన్నిటికంటే బలహీనమైన ఇల్లు సాలెపురుగు ఇల్లే! వారిది తెలుసుకుంటే ఎంత బాగుండేది! 28

29:42 – إِنَّ اللَّـهَ يَعْلَمُ مَا يَدْعُونَ مِن دُونِهِ مِن شَيْءٍ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ٤٢

వారు ఆయనను వదిలి దేనిని ప్రార్థిస్తున్నారో, అల్లాహ్‌కు బాగా తెలుసు. మరియు ఆయన సర్వ శక్తిమంతుడు మహా వివేకవంతుడు.

29:43 – وَتِلْكَ الْأَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ ۖ وَمَا يَعْقِلُهَا إِلَّا الْعَالِمُونَ ٤٣

మరియు ఈ ఉదాహరణలను మేము ప్రజలకు (అర్థంచేసుకోవాలని) ఇస్తున్నాము. మరియు జ్ఞానం గలవారు తప్ప ఇతరులు వీటిని అర్థం చేసుకోలేరు.

29:44 – خَلَقَ اللَّـهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّلْمُؤْمِنِينَ ٤٤

అల్లాహ్‌ ఆకాశాలను మరియు భూమిని సత్యాధారంగా సృష్టించాడు. నిశ్చయంగా, విశ్వసించే వారికి దీనిలో సూచన ఉంది.

29:45 – اتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِنَ الْكِتَابِ وَأَقِمِ الصَّلَاةَ ۖ إِنَّ الصَّلَاةَ تَنْهَىٰ عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ ۗ وَلَذِكْرُ اللَّـهِ أَكْبَرُ ۗ وَاللَّـهُ يَعْلَمُ مَا تَصْنَعُونَ ٤٥

[*] (ఓ ప్రవక్తా!) నీపై దివ్యజ్ఞానం (వ’హీ) ద్వారా అవతరింపజేయబడిన గ్రంథాన్ని చదివి వినిపించు మరియు నమా’జ్‌ ను స్థాపించు. నిశ్చయంగా, నమా’జ్‌ అసహ్యకరమైన పనుల నుండి మరియు అధర్మమైన పనుల నుండి నిషేధిస్తుంది. మరియు అల్లాహ్‌ ధ్యానమే (అన్నిటి కంటే) గొప్పది. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.

29:46 – وَلَا تُجَادِلُوا أَهْلَ الْكِتَابِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ إِلَّا الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ ۖ وَقُولُوا آمَنَّا بِالَّذِي أُنزِلَ إِلَيْنَا وَأُنزِلَ إِلَيْكُمْ وَإِلَـٰهُنَا وَإِلَـٰهُكُمْ وَاحِدٌ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ ٤٦

(*) మరియు నీవు గ్రంథప్రజలతో – దుర్మా ర్గాన్ని అవలంబించినవారితో తప్ప – కేవలం ఉత్తమమైన రీతిలోనే వాదించు. 30 మరియు వారితో ఇలా అను: “మేము మా కొరకు అవత రింపజేయబడిన దానిని మరియు మీ కొరకు అవతరింపజేయబడిన దానిని విశ్వసించాము. మరియు మా ఆరాధ్యదేవుడు మరియు మీ ఆరాధ్యదేవుడు ఒక్కడే (అల్లాహ్‌). మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము.”

29:47 – وَكَذَٰلِكَ أَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ ۚ فَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يُؤْمِنُونَ بِهِ ۖ وَمِنْ هَـٰؤُلَاءِ مَن يُؤْمِنُ بِهِ ۚ وَمَا يَجْحَدُ بِآيَاتِنَا إِلَّا الْكَافِرُونَ ٤٧

(ఓ ము’హమ్మద్‌!) ఈ విధంగా మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. కావున మేము (ఇంతకు పూర్వం) గ్రంథాన్ని ఇచ్చిన వారిలో కొందరు దీనిని విశ్వసిస్తారు. 30 మరియు ఇతర ప్రజలలో నుండి కూడా కొందరు దీనిని విశ్వ సిస్తారు. 31 మరియు మా సూచనలను సత్య-తిర స్కారులు తప్ప మరెవ్వరూ తిరస్కరించరు. 32

29:48 – وَمَا كُنتَ تَتْلُو مِن قَبْلِهِ مِن كِتَابٍ وَلَا تَخُطُّهُ بِيَمِينِكَ ۖ إِذًا لَّارْتَابَ الْمُبْطِلُونَ ٤٨

మరియు (ఓ ము’హమ్మద్‌!) ఇంతకు పూర్వం నీవు ఏ గ్రంథాన్ని కూడా చదువగలిగే వాడవుకావు మరియు దేనిని కూడా నీ కుడి చేతితో వ్రాయగలిగే వాడవూకావు. 33 అలా జరిగివుంటే ఈ అసత్యవాదులు తప్పక అనుమానానికి గురిఅయి ఉండేవారు.

29:49 – بَلْ هُوَ آيَاتٌ بَيِّنَاتٌ فِي صُدُورِ الَّذِينَ أُوتُوا الْعِلْمَ ۚ وَمَا يَجْحَدُ بِآيَاتِنَا إِلَّا الظَّالِمُونَ ٤٩

వాస్తవానికి ఇవి, స్పష్టమైన సూచనలు (ఖుర్‌ఆన్‌ ఆయాత్‌) జ్ఞానమివ్వబడినవారి హృదయాలలో (భద్రంగా) ఉంచబడ్డాయి. మరియు మా సూచనలను (ఆయాత్‌ లను) దుర్మార్గులు తప్ప మరెవ్వరూ తిరస్కరించరు.

29:50 – وَقَالُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَاتٌ مِّن رَّبِّهِ ۖ قُلْ إِنَّمَا الْآيَاتُ عِندَ اللَّـهِ وَإِنَّمَا أَنَا نَذِيرٌ مُّبِينٌ ٥٠

మరియు వారు ఇలా అంటారు: “ఇతని ప్రభువు తరఫు నుండి ఇతని మీద అద్భుత సంకేతాలు ఎందుకు అవతరింపజేయబడలేదు?” వారితో ఇలా అను: “నిశ్చయంగా, అద్భుత సంకేతాలన్నీ అల్లాహ్‌ దగ్గరనే ఉన్నాయి. 34 మరియు నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే!”

29:51 – أَوَلَمْ يَكْفِهِمْ أَنَّا أَنزَلْنَا عَلَيْكَ الْكِتَابَ يُتْلَىٰ عَلَيْهِمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَرَحْمَةً وَذِكْرَىٰ لِقَوْمٍ يُؤْمِنُونَ ٥١

ఏమీ? వాస్తవానికి మేము నీపై అవతరింప జేసిన ఈ గ్రంథం (ఖుర్‌ఆన్‌) వారికి వినిపించబడు తోంది కదా! ఇది వారికి చాలదా? 35 నిశ్చయంగా ఇందులో విశ్వసించే ప్రజలకు కారుణ్యం మరియు హితబోధలున్నాయి.

29:52 – قُلْ كَفَىٰ بِاللَّـهِ بَيْنِي وَبَيْنَكُمْ شَهِيدًا ۖ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَالَّذِينَ آمَنُوا بِالْبَاطِلِ وَكَفَرُوا بِاللَّـهِ أُولَـٰئِكَ هُمُ الْخَاسِرُونَ ٥٢

(ఓ ము’హమ్మద్‌!) వారితో ఇలా అను: “నాకూ మరియు మీకూ మధ్య సాక్షిగా అల్లాహ్‌ యే చాలు! ఆకాశాలలోనూ మరియు భూమి లోనూ ఉన్న సమస్తమూ ఆయనకు తెలుసు.” మరియు ఎవరైతే, అసత్యాన్ని విశ్వసించి, అల్లాహ్‌ ను తిరస్కరిస్తారో, అలాంటి వారే నష్టపడేవారు.

29:53 – وَيَسْتَعْجِلُونَكَ بِالْعَذَابِ ۚ وَلَوْلَا أَجَلٌ مُّسَمًّى لَّجَاءَهُمُ الْعَذَابُ وَلَيَأْتِيَنَّهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ ٥٣

మరియు వారు (అవిశ్వాసులు) శిక్షను త్వరగా తీసుకురమ్మని నిన్ను కోరుతున్నారు. 36 మరియు దానికై ఒక గడువు (అల్లాహ్‌ తరఫు నుండి) నిర్ణయింపబడి ఉండకపోతే! ఆశిక్ష వారిపై ఎప్పుడో వచ్చి పడిఉండేది. మరియు నిశ్చయంగా అది వారికి తెలియకుండానే అకస్మాత్తుగా వచ్చి వారిమీద పడనున్నది!

29:54 – يَسْتَعْجِلُونَكَ بِالْعَذَابِ وَإِنَّ جَهَنَّمَ لَمُحِيطَةٌ بِالْكَافِرِينَ ٥٤

వారు (అవిశ్వాసులు) శిక్షను త్వరగా తీసుకురమ్మని నిన్ను కోరుతున్నారు. మరియు నిశ్చయంగా నరకాగ్ని సత్య-తిరస్కారులను చుట్టుముట్టనున్నది.

29:55 – يَوْمَ يَغْشَاهُمُ الْعَذَابُ مِن فَوْقِهِمْ وَمِن تَحْتِ أَرْجُلِهِمْ وَيَقُولُ ذُوقُوا مَا كُنتُمْ تَعْمَلُونَ ٥٥

ఆ రోజు, శిక్ష వారి పైనుండి మరియు వారి పాదాల క్రిందినుండి వారిని క్రమ్ముకున్నప్పుడు, వారితో ఇలా అనబడుతుంది: “మీరు చేస్తూ ఉండిన కర్మల ఫలితాన్ని చవిచూడండి.”

29:56 – يَا عِبَادِيَ الَّذِينَ آمَنُوا إِنَّ أَرْضِي وَاسِعَةٌ فَإِيَّايَ فَاعْبُدُونِ ٥٦

ఓ విశ్వసించిన నా దాసులారా! నిశ్చయంగా, నా భూమి ఎంతో విశాలమైనది. కావున మీరు కేవలం నన్నే ఆరాధించండి. 37

29:57 – كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ ۖ ثُمَّ إِلَيْنَا تُرْجَعُونَ ٥٧

ప్రతి ప్రాణి చావును చవిచూస్తుంది. ఆ తరువాత మీరందరూ మా వైపునకే మరలింప బడతారు.

29:58 – وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُبَوِّئَنَّهُم مِّنَ الْجَنَّةِ غُرَفًا تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ نِعْمَ أَجْرُ الْعَامِلِينَ ٥٨

ఇక ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో! వారికి మేము స్వర్గంలో గొప్ప భవనాలలో స్థిరనివాసం ఇస్తాము. దాని క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. సత్కార్యాలు చేసిన వారి ప్రతిఫలం ఎంత శ్రేష్ఠమైనది!

29:59 – الَّذِينَ صَبَرُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ ٥٩

(వారికే) ఎవరైతే సహనం వహించి తమ ప్రభువునే నమ్ముకొని ఉంటారో!

29:60 – وَكَأَيِّن مِّن دَابَّةٍ لَّا تَحْمِلُ رِزْقَهَا اللَّـهُ يَرْزُقُهَا وَإِيَّاكُمْ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ ٦٠

మరియు (ప్రపంచంలో) ఎన్నో ప్రాణు లున్నాయి. అవి తమ జీవనోపాధిని తాము సాధించలేవు! అల్లాహ్‌ యే వాటికీ మరియు మీకు కూడా జీవనోపాధిని సమకూర్చుతున్నాడు. మరియు ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

29:61 – وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ لَيَقُولُنَّ اللَّـهُ ۖ فَأَنَّىٰ يُؤْفَكُونَ ٦١

మరియు ఒకవేళ నీవు వారితో: “ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించి, సూర్య-చంద్రులను ఉపయుక్తంగా చేసింది ఎవరు?” అని అడిగితే, వారు తప్పక: “అల్లాహ్‌!” అని అంటారు. అయినా వారు ఎందుకు మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)?

29:62 – اللَّـهُ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ مِنْ عِبَادِهِ وَيَقْدِرُ لَهُ ۚ إِنَّ اللَّـهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ٦٢

అల్లాహ్‌ తన దాసులలో, తాను కోరినవారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి దానిని మితంగా ఇస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్‌కు ప్రతిదానిని గురించి బాగా తెలుసు. 38

29:63 – وَلَئِن سَأَلْتَهُم مَّن نَّزَّلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَحْيَا بِهِ الْأَرْضَ مِن بَعْدِ مَوْتِهَا لَيَقُولُنَّ اللَّـهُ ۚ قُلِ الْحَمْدُ لِلَّـهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ ٦٣

మరియు ఒకవేళ నీవు వారితో: “ఆకాశం నుండి నీటిని కురిపించి, దాని నుండి నిర్జీవంగా ఉన్న భూమికి జీవితాన్ని ఇచ్చింది ఎవరు?” అని అడిగితే, వారు తప్ప కుండా: “అల్లాహ్‌!” అని అంటారు. నీవు ఇలా అను: “సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్‌ మాత్రమే!” కాని చాలా మంది అర్థం చేసుకోలేరు. 39

29:64 – وَمَا هَـٰذِهِ الْحَيَاةُ الدُّنْيَا إِلَّا لَهْوٌ وَلَعِبٌ ۚ وَإِنَّ الدَّارَ الْآخِرَةَ لَهِيَ الْحَيَوَانُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ ٦٤

మరియు ఈ ప్రాపంచిక జీవితం కేవలం వినోద కాలక్షేపం మరియు క్రీడ మాత్రమే. మరియు అసలు పరలోకగృహ జీవితమే వాస్తవమైన జీవితం. ఇది వారు తెలుసుకుంటే ఎంత బాగుండేది!

29:65 – فَإِذَا رَكِبُوا فِي الْفُلْكِ دَعَوُا اللَّـهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ فَلَمَّا نَجَّاهُمْ إِلَى الْبَرِّ إِذَا هُمْ يُشْرِكُونَ ٦٥

వారు నావలోకి ఎక్కినప్పుడు తమ భక్తిని కేవలం అల్లాహ్‌కు మాత్రమే ప్రత్యేకించుకొని, ఆయననే ప్రార్థిస్తారు; కాని ఆయన వారిని రక్షించి నేలమీదకు తీసుకురాగానే ఆయనకు సాటి కల్పించసాగుతారు. 40

29:66 – لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ وَلِيَتَمَتَّعُوا ۖ فَسَوْفَ يَعْلَمُونَ ٦٦

ఈ విధంగా మేము వారికి ప్రసాదించిన వాటికి కృతఘ్నులై (ప్రాపంచిక) భోగభాగ్యాలలో మునిగివున్న (దాని ఫలితం) వారు మున్ముందు తెలుసుకుంటారు.

29:67 – أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ ۚ أَفَبِالْبَاطِلِ يُؤْمِنُونَ وَبِنِعْمَةِ اللَّـهِ يَكْفُرُونَ ٦٧

ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా మేము ‘హరమ్‌ ను (మక్కహ్ ను) ఒక శాంతి నిల యంగా నెలకొల్పామని! 41 మరియు వారి చుట్టు ప్రక్కల ఉన్న ప్రజలు వారినుండి లాక్కోబడు తున్నారని? అయినా వారు అసత్యాన్ని నమ్మి, అల్లాహ్‌ అనుగ్రహాన్ని తిరస్కరిస్తారా?

29:68 – وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّـهِ كَذِبًا أَوْ كَذَّبَ بِالْحَقِّ لَمَّا جَاءَهُ ۚ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِّلْكَافِرِينَ ٦٨

మరియు అల్లాహ్‌ మీద అబద్ధాలు కల్పించే వానికంటే, లేక తన వద్దకు సత్యం వచ్చినపుడు దానిని అబద్ధమని తిరస్కరించే వానికంటే, ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? ఏమీ? ఇలాంటి సత్య-తిరస్కారులకు నరకమే నివాస స్థలం కాదా?

29:69 – وَالَّذِينَ جَاهَدُوا فِينَا لَنَهْدِيَنَّهُمْ سُبُلَنَا ۚ وَإِنَّ اللَّـهَ لَمَعَ الْمُحْسِنِينَ ٦٩

మరియు ఎవరైతే మా కొరకు హృదయ పూర్వకంగా పాటుపడతారో, వారికి మేము మా మార్గాల వైపునకు మార్గదర్శకత్వం చేస్తాము. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ సజ్జనులకు తోడుగా ఉంటాడు. (1/8)

సూరహ్‌ అర్‌-రూమ్‌ – అర్‌-రూమ్‌: బైజాంతీన్‌ (Estern Roman Empire/ The Byzantine/ Constantinople) అంటే రోమన్‌ సామ్రాజ్యం. వీరు గ్రంథప్రజలు (క్రైస్తవులు). పర్షియన్‌లు అగ్ని పూజారులు. ఆ కాలంలో ఈ రెండే పెద్ద సామ్రాజ్యాలు ఉండేవి. ఈ సూరహ్‌ మధ్య మక్కహ్ కాలం లో, ప్రస్థానం (హిజ్రత్‌) కంటే 6-7 సంవత్సరాలకు ముందు (క్రీ.శ. 615-616)లలో అవతరింప జేయబడింది. ఇలాంటి 4 సూరాహ్‌ల వరుసలో ఇది 2వది. (29-32) ఈ 4 సూరాహ్‌లు, అలీఫ్‌-లామ్‌-మీమ్‌ అక్షరాలతో ప్రారంభమవుతున్నాయి. క్రైస్తవ రాజులైన రోమన్‌లు, పర్షియన్‌ లకు జేరూసలం మరియు ఇతరభాగాలు కోల్పోతారు. పర్షియనులంటే ఇష్టపడే మక్కహ్ ముష్రికులు దీనికి సంతో షపడి దైవప్రవక్త (‘స’అస)ను మరియు అతని తోటి ముస్లింలను ఎగతాళిచేస్తారు. అప్పుడు ఈ సూరహ్‌ అవతరింపజేయబడుతుంది. అల్లాహ్‌ (సు.త.) వాగ్దానం ప్రకారం 7 సంవ త్సరాలలోనే రోమన్‌లు తిరిగి జేరూసలంను తీసుకుంటారు. రోమన్‌ చక్రవర్తి హెరాకల్‌ (Heraclius) పర్షియ నులను ఓడించి వారిని ఏసియామైనర్‌ నుండి పారద్రోలుతాడు. చివరకు క్రీ.శకం 626లో పర్షియన్‌ సామ్రాజ్యంపూర్తిగానిర్మూలించబడుతుంది. రోమన్‌ల ఈవిజయం ఖుర్‌ఆన్‌ లో చెప్పబడినదాన్ని సత్యపరుస్తుంది. 60 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 2వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

30:1 – الم ١

అలిఫ్‌-లామ్‌-మీమ్‌.

30:2 – غُلِبَتِ الرُّومُ ٢

రోమన్‌లు పరాజితులయ్యారు;

30:3 – فِي أَدْنَى الْأَرْضِ وَهُم مِّن بَعْدِ غَلَبِهِمْ سَيَغْلِبُونَ ٣

తమ పొరుగు భూభాగంలోనే! మరియు వారు తమ ఈ పరాజయం తరువాత, తిరిగి విజేతలు కాగలరు 1

30:4 – فِي بِضْعِ سِنِينَ ۗ لِلَّـهِ الْأَمْرُ مِن قَبْلُ وَمِن بَعْدُ ۚ وَيَوْمَئِذٍ يَفْرَحُ الْمُؤْمِنُونَ ٤

(రాబోయే) కొన్ని 2 సంవత్సరాలలోనే. మొదటనయినా, తరువాతనయినా నిర్ణయాధి కారం కేవలం అల్లాహ్‌దే మరియు ఆ రోజు విశ్వాసులు సంతోషపడతారు;

30:5 – بِنَصْرِ اللَّـهِ ۚ يَنصُرُ مَن يَشَاءُ ۖ وَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ ٥

అల్లాహ్‌ ప్రసాదించిన సహాయానికి. 3 ఆయన తనకు ఇష్టమైనవారికి సహాయం చేస్తాడు. మరియు ఆయనే సర్వ శక్తిమంతుడు, అపార కరుణాప్రదాత.

30:6 – وَعْدَ اللَّـهِ ۖ لَا يُخْلِفُ اللَّـهُ وَعْدَهُ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ ٦

మరియు (ఇది) అల్లాహ్‌ చేసిన వాగ్దానం అల్లాహ్‌ తన వాగ్దానాన్ని భంగపరచడు, కానీ వాస్తవానికి చాలా మందికి ఇది తెలియదు. 4

30:7 – يَعْلَمُونَ ظَاهِرًا مِّنَ الْحَيَاةِ الدُّنْيَا وَهُمْ عَنِ الْآخِرَةِ هُمْ غَافِلُونَ ٧

వారికి ఇహలోక జీవితపు బాహ్యరూపం మాత్రమే తెలుసు మరియు వారు పరలోకాన్ని గురించి ఏమరుపాటులో పడి ఉన్నారు.

30:8 – أَوَلَمْ يَتَفَكَّرُوا فِي أَنفُسِهِم ۗ مَّا خَلَقَ اللَّـهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ وَأَجَلٍ مُّسَمًّى ۗ وَإِنَّ كَثِيرًا مِّنَ النَّاسِ بِلِقَاءِ رَبِّهِمْ لَكَافِرُونَ ٨

ఏమీ? వారు తమలో తాము (ఎన్నడూ) ఆలోచించలేదా? ఆకాశాలనూ భూమినీ మరియు వాటి మధ్య ఉన్నదంతా, అల్లాహ్‌ సత్యంతో ఒక నిర్ణీత గడువు కొరకు మాత్రమే సృష్టించాడని? అయినా నిశ్చయంగా, ప్రజలలో చాలామంది తమ ప్రభువును దర్శించవలసి వున్న వాస్తవాన్ని తిరస్కరిస్తున్నారు.

30:9 – أَوَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَانُوا أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَأَثَارُوا الْأَرْضَ وَعَمَرُوهَا أَكْثَرَ مِمَّا عَمَرُوهَا وَجَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ ۖ فَمَا كَانَ اللَّـهُ لِيَظْلِمَهُمْ وَلَـٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ ٩

ఏమీ? వీరు భూమిపై ప్రయాణంచేయలేదా? వీరి పూర్వికుల గతి ఏమయిందో చూడటానికి? వారు, వీరికంటే ఎక్కువ బలవంతులుగా ఉండేవారు మరియు వారు భూమిని బాగా దున్నేవారు, సేద్యం చేసేవారు మరియు దానిపై, వీరి కట్టడాల కంటే ఎక్కువ కట్టడాలు కట్టారు 5 మరియు వారి వద్దకు వారి సందేశహరులు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు. అల్లాహ్‌ వారి కెలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.

30:10 – ثُمَّ كَانَ عَاقِبَةَ الَّذِينَ أَسَاءُوا السُّوأَىٰ أَن كَذَّبُوا بِآيَاتِ اللَّـهِ وَكَانُوا بِهَا يَسْتَهْزِئُونَ ١٠

చివరకు చెడు కార్యాలు చేసిన వారి ముగింపు చెడుగానే జరిగింది. ఎందుకంటే, వారు అల్లాహ్‌ సూచనలను అబద్ధాలని నిరాకరించేవారు వాటిని గురించి ఎగతాళి చేసేవారు.

30:11 – اللَّـهُ يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ ١١

అల్లాహ్‌యే సృష్టి ప్రారంభిస్తాడు, తరువాత దానిని తిరిగి ఉనికిలోకి (పూర్వస్థితిలోకి) తెస్తాడు, ఆ తరువాత మీరంతా ఆయన వైపునకే మరలింప బడతారు.

30:12 – وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يُبْلِسُ الْمُجْرِمُونَ ١٢

మరియు ఆ ఘడియ (పునరుత్థానం) ఆసన్నమైన రోజు, అపరాధులందరూ నిరాశ చెందుతారు.

30:13 – وَلَمْ يَكُن لَّهُم مِّن شُرَكَائِهِمْ شُفَعَاءُ وَكَانُوا بِشُرَكَائِهِمْ كَافِرِينَ ١٣

మరియు వారు అల్లాహ్‌కు భాగస్వాము లుగా కల్పించిన వారెవ్వరూ వారి సిఫారసు చేయజాలరు. మరియు వారు, కల్పించుకున్న తమ భాగ స్వాములను తిరస్కరిస్తారు.

30:14 – وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يَوْمَئِذٍ يَتَفَرَّقُونَ ١٤

మరియు ఆ ఘడియ (పునరుత్థానం) ఆసన్నమైన రోజు, ఆ రోజు వారు (ప్రజలు), వేర్వేరు వర్గాలలో విభజింపబడతారు.

30:15 – فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَهُمْ فِي رَوْضَةٍ يُحْبَرُونَ ١٥

అప్పుడు ఎవరైతే, విశ్వసించి, సత్కార్యాలు చేసి ఉంటారో, వారు ఉద్యాన వనంలో ఆనందంగా ఉంచబడతారు.

30:16 – وَأَمَّا الَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا وَلِقَاءِ الْآخِرَةِ فَأُولَـٰئِكَ فِي الْعَذَابِ مُحْضَرُونَ ١٦

మరియు ఎవరైతే సత్య-తిరస్కారులై మా సూచనలను మరియు పరలోక సమావేశాన్ని తిరస్కరించారో, అలాంటి వారు శిక్ష కొరకు హాజరుచేయ బడతారు. 6

30:17 – فَسُبْحَانَ اللَّـهِ حِينَ تُمْسُونَ وَحِينَ تُصْبِحُونَ ١٧

కావున మీరు సాయంత్రము వేళ మరియు ఉదయం పూట అల్లాహ్‌ పవిత్రతను కొనియాడండి.

30:18 – وَلَهُ الْحَمْدُ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَعَشِيًّا وَحِينَ تُظْهِرُونَ ١٨

మరియు ఆకాశాలలోనూ మరియు భూమి లోనూ సర్వస్తోత్రాలు ఆయన (అల్లాహ్‌)కే మరియు సంధ్యా కాలంలోనూ మరియు మధ్యాహ్న కాలం లోనూ (స్తోత్రాలు ఆయనకే)! 7

30:19 – يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَيُحْيِي الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ وَكَذَٰلِكَ تُخْرَجُونَ ١٩

ఆయన సజీవిని నిర్జీవినుండి తీస్తాడు. మరియు నిర్జీవిని సజీవినుండి తీస్తాడు. మరియు ఆయన భూమి మృతిచెందిన తరువాత దానికి ప్రాణంపోస్తాడు. ఇదే విధంగా మీరు కూడా (గోరీల నుండి) వెలికితీయబడతారు.

30:20 – وَمِنْ آيَاتِهِ أَنْ خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ إِذَا أَنتُم بَشَرٌ تَنتَشِرُونَ ٢٠

మరియు ఆయన సూచనలలో ఒకటి మిమ్మల్ని మట్టినుండి సృష్టించడం 8 ఆతరువాత మీరు మానవులుగా (భూమిలో) వ్యాపిస్తున్నారు!

30:21 – وَمِنْ آيَاتِهِ أَنْ خَلَقَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَاجًا لِّتَسْكُنُوا إِلَيْهَا وَجَعَلَ بَيْنَكُم مَّوَدَّةً وَرَحْمَةً ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ ٢١

మరియు ఆయన సూచనలలో; ఆయన మీ కొరకు మీ జాతి నుండియే – మీరు వారివద్ద సౌఖ్యంపొందటానికి – మీసహవాసులను (అ’జ్వాజ్‌ లను) పుట్టించి, మీ మధ్య ప్రేమను మరియు కారుణ్యాన్ని కలిగించడం. నిశ్చయంగా ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలున్నాయి.

30:22 – وَمِنْ آيَاتِهِ خَلْقُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافُ أَلْسِنَتِكُمْ وَأَلْوَانِكُمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّلْعَالِمِينَ ٢٢

మరియు ఆయన సూచనలలో ఆయన ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించడం; మరియు మీ భాషలలో మరియు మీ రంగులలో ఉన్న విభేదాలుకూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో జ్ఞానులకు ఎన్నో సూచనలున్నాయి.

30:23 – وَمِنْ آيَاتِهِ مَنَامُكُم بِاللَّيْلِ وَالنَّهَارِ وَابْتِغَاؤُكُم مِّن فَضْلِهِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَسْمَعُونَ ٢٣

మరియు ఆయన సూచనలలో, మీరు రాత్రి పూట మరియు పగటిపూట, నిద్రపోవటం మరియు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో శ్రధ్ధతో వినే వారికి ఎన్నో సూచన లున్నాయి.

30:24 – وَمِنْ آيَاتِهِ يُرِيكُمُ الْبَرْقَ خَوْفًا وَطَمَعًا وَيُنَزِّلُ مِنَ السَّمَاءِ مَاءً فَيُحْيِي بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ ٢٤

మరియు ఆయన సూచనలలో, ఆయన మీకు మెరుపును చూపించి, భయాన్ని మరియు ఆశను కలుగజేయడం; 9 మరియు ఆకాశం నుండి నీటిని కురిపించి దానితో నిర్జీవి అయిన భూమికి ప్రాణం పోయడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో బుధ్ధిమంతులకు ఎన్నో సూచన లున్నాయి.

30:25 – وَمِنْ آيَاتِهِ أَن تَقُومَ السَّمَاءُ وَالْأَرْضُ بِأَمْرِهِ ۚ ثُمَّ إِذَا دَعَاكُمْ دَعْوَةً مِّنَ الْأَرْضِ إِذَا أَنتُمْ تَخْرُجُونَ ٢٥

మరియు ఆయన సూచనలలో, ఆయన ఆజ్ఞతో భూమ్యాకాశాలు నిలకడ కలిగి ఉండటం. 10 ఆ తరువాత ఆయన మిమ్మల్ని ఒక్క పిలుపు పిలువగానే మీరంతా భూమినుండి లేచి ఒకేసారి బయటికి రావటం కూడా ఉన్నాయి.

30:26 – وَلَهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ كُلٌّ لَّهُ قَانِتُونَ ٢٦

మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ ఆయనదే. అన్నీ ఆయనకే ఆజ్ఞానువర్తనులై ఉంటాయి.

30:27 – وَهُوَ الَّذِي يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَهُوَ أَهْوَنُ عَلَيْهِ ۚ وَلَهُ الْمَثَلُ الْأَعْلَىٰ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ٢٧

మరియు ఆయనే సృష్టిని ఆరంభించిన వాడు, ఆ తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చే వాడు. 11 ఇది ఆయనకు ఎంతో సులభమైనది. భూమ్యాకాశాలలో ఆయన సౌమ్యమే సర్వోన్నత మైనది. 12 ఆయనే సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.

30:28 – ضَرَبَ لَكُم مَّثَلًا مِّنْ أَنفُسِكُمْ ۖ هَل لَّكُم مِّن مَّا مَلَكَتْ أَيْمَانُكُم مِّن شُرَكَاءَ فِي مَا رَزَقْنَاكُمْ فَأَنتُمْ فِيهِ سَوَاءٌ تَخَافُونَهُمْ كَخِيفَتِكُمْ أَنفُسَكُمْ ۚ كَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَعْقِلُونَ ٢٨

ఆయన, స్వయంగా మీకే చెందిన ఒక ఉపమానాన్ని మీకు తెలుపుతున్నాడు. ఏమీ? మేము మీకు జీవనోపాధిగా సమకూర్చిన దానిలో మీ బానిసలు మీతోపాటు సరిసమానులుగా, భాగ స్వాములు కాగలరా? మీరు పరస్పరం ఒకరి పట్ల నొకరు భీతి కలిగి ఉన్నట్లు వారి పట్ల కూడా భీతి కలిగి ఉంటారా? ఈ విధంగా మేము బుధ్ధిమంతు లకు మా సూచనలను వివరిస్తూ ఉంటాము. 13

30:29 – بَلِ اتَّبَعَ الَّذِينَ ظَلَمُوا أَهْوَاءَهُم بِغَيْرِ عِلْمٍ ۖ فَمَن يَهْدِي مَنْ أَضَلَّ اللَّـهُ ۖ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ ٢٩

కాని దుర్మార్గులైనటువంటి వారు, తెలివి లేనిదే, తమ కోరికలను అనుసరిస్తారు. అల్లాహ్‌ మార్గభ్రష్టత్వంలో వదిలినవ్యక్తికి మార్గదర్శకత్వం ఎవడు చేయగలడు? 14 మరియు వారికి సహాయ పడేవారు ఎవ్వరూ ఉండరు.

30:30 – فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا ۚ فِطْرَتَ اللَّـهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا ۚ لَا تَبْدِيلَ لِخَلْقِ اللَّـهِ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ ٣٠

కావున నీవు నీ ముఖాన్ని, ఏకాగ్రచిత్తంతో, సత్యధర్మం (ఇస్లాం) దిశలో స్థిరంగా నిలుపు. అల్లాహ్‌ మానవులను ఏ స్వభావంతో పుట్టించాడో, ఆ స్వభావంపైననే వారు ఉంటారు 15 అల్లాహ్‌ సృష్టి స్వభావాన్ని (ఎవ్వరూ) మార్చ లేరు. ఇదే సరైన ధర్మం, కాని చాలా మంది ఇది ఎరుగరు. (1/4)

30:31 – مُنِيبِينَ إِلَيْهِ وَاتَّقُوهُ وَأَقِيمُوا الصَّلَاةَ وَلَا تَكُونُوا مِنَ الْمُشْرِكِينَ ٣١

  • (ఎల్లప్పుడు) మీరు ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలుతూ ఉండండి. మరియు ఆయనయందు భయ-భక్తులు కలిగి ఉండండి. మరియు నమా’జ్‌ను స్థాపించండి. మరియు ఆయనకు (అల్లాహ్‌కు) సాటి (భాగస్వాములు) కల్పించే వారిలో చేరిపోకండి;

30:32 – مِنَ الَّذِينَ فَرَّقُوا دِينَهُمْ وَكَانُوا شِيَعًا ۖ كُلُّ حِزْبٍ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ ٣٢

వారిలో ఎవరైతే, తమ ధర్మాన్ని విభజించి వేర్వేరు తెగలుగా చేసుకున్నారో! ప్రతి వర్గంవారు తమవద్ద నున్న దానితోనే (సిధ్ధాంతంతోనే) సంతోషపడుతున్నారు. 16

30:33 – وَإِذَا مَسَّ النَّاسَ ضُرٌّ دَعَوْا رَبَّهُم مُّنِيبِينَ إِلَيْهِ ثُمَّ إِذَا أَذَاقَهُم مِّنْهُ رَحْمَةً إِذَا فَرِيقٌ مِّنْهُم بِرَبِّهِمْ يُشْرِكُونَ ٣٣

మరియు మానవులకు ఆపద వచ్చి నపుడు, వారు తమ ప్రభువువైపునకు పశ్చాత్తా పంతో మరలి ఆయనను వేడుకుంటారు. ఆ తరువాత ఆయన కారుణ్యం నుండి కొంత వారికి రుచి చూపించినప్పుడు, వారిలో కొందరు తమ ప్రభువుకు సాటి (భాగస్వాములను) కల్పించ సాగుతారు; 17

30:34 – لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ ۚ فَتَمَتَّعُوا فَسَوْفَ تَعْلَمُونَ ٣٤

మేము వారికి ప్రసాదించిన దానికి (అను గ్రహాలకు) కృతఘ్నత చూపటానికి (వారు అలా చేస్తారు). సరే! మీరు కొంతకాలం సుఖ-సంతోషాలు అనుభవించండి, త్వరలోనే మీరు (మీ ముగింపును) తెలుసుకుంటారు.

30:35 – أَمْ أَنزَلْنَا عَلَيْهِمْ سُلْطَانًا فَهُوَ يَتَكَلَّمُ بِمَا كَانُوا بِهِ يُشْرِكُونَ ٣٥

లేక మేము వారిపై ఏదైనా ప్రమాణాన్ని 18 అవతరింపజేశామా అది వారు ఆయనకు కల్పించే భాగస్వాములను గురించి పలుకటానికి? 19

30:36 – وَإِذَا أَذَقْنَا النَّاسَ رَحْمَةً فَرِحُوا بِهَا ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ إِذَا هُمْ يَقْنَطُونَ ٣٦

మరియు మేము మానవులకు కారుణ్యపు రుచి చూపించినప్పుడు వారు దానితో చాలా సంతోషపడతారు. కాని వారు తమ చేతులారా చేసుకున్న కర్మల ఫలితంగా 20 వారికేదైనా కీడుకలిగితే నిరాశచెందుతారు.

30:37 – أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّـهَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ ٣٧

ఏమీ? వారికి తెలియదా? అల్లాహ్‌ తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ఇస్తాడని మరియు (తాను కోరిన వారికి) మితంగా ఇస్తాడని? నిశ్చయంగా, ఇందులో విశ్వసించే వారికి ఎన్నో సూచనలున్నాయి.

30:38 – فَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ وَالْمِسْكِينَ وَابْنَ السَّبِيلِ ۚ ذَٰلِكَ خَيْرٌ لِّلَّذِينَ يُرِيدُونَ وَجْهَ اللَّـهِ ۖ وَأُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ٣٨

కావున నీవు నీ బంధువుకు అతని హక్కుఇవ్వు మరియు యాచించని పేదవానికి మరియు బాటసారికి (కూడా). 21 ఇది అల్లాహ్‌ ప్రసన్నతను కోరేవారికి ఎంతో ఉత్తమమైనది. మరియు ఇలాంటివారే సాఫల్యము పొందేవారు.

30:39 – وَمَا آتَيْتُم مِّن رِّبًا لِّيَرْبُوَ فِي أَمْوَالِ النَّاسِ فَلَا يَرْبُو عِندَ اللَّـهِ ۖ وَمَا آتَيْتُم مِّن زَكَاةٍ تُرِيدُونَ وَجْهَ اللَّـهِ فَأُولَـٰئِكَ هُمُ الْمُضْعِفُونَ ٣٩

మరియు మీరు ప్రజలకు – రిబా’ 22 (వడ్డీ మీద డబ్బు / కానుకలు) ఇచ్చి దాని ద్వార వారి సంపద నుండి వృధ్ధిపొందాలని – ఇచ్చే ధనం, అల్లాహ్‌ దృష్టిలో ఏ మాత్రం వృధ్ధిపొందదు. మరియు మీరు అల్లాహ్‌ ప్రసన్నతను పొందే ఉద్దేశంతో ఏదైనా దానం (‘జకాత్‌) చేస్తే అలాంటి వారి (సంపద) ఎన్నోరెట్లు అధికమవుతుంది.

30:40 – اللَّـهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ۖ هَلْ مِن شُرَكَائِكُم مَّن يَفْعَلُ مِن ذَٰلِكُم مِّن شَيْءٍ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ ٤٠

అల్లాహ్‌యే మిమ్మల్ని పుట్టించాడు, తరు వాత జీవనోపాధినిచ్చాడు. తరువాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత మళ్ళీ బ్రతికిస్తాడు. అయితే? మీరు (అల్లాహ్‌కు) సాటిగా (భాగ స్వాములుగా) కల్పించిన వారిలో, ఎవడైనా వీటిలో నుండి ఏదైనా ఒక్క పనిని చేయగల వాడు ఉన్నాడా! 23 ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటికల్పించే భాగస్వాముల కంటే ఆయన మహోన్నతుడు.

30:41 – ظَهَرَ الْفَسَادُ فِي الْبَرِّ وَالْبَحْرِ بِمَا كَسَبَتْ أَيْدِي النَّاسِ لِيُذِيقَهُم بَعْضَ الَّذِي عَمِلُوا لَعَلَّهُمْ يَرْجِعُونَ ٤١

మానవులు తమ చేజేతులా సంపాదించు కున్న దాని ఫలితంగా భూమిలో మరియు సముద్రంలో కల్లోలం వ్యాపించింది. ఇది వారిలో కొందరు చేసిన దుష్కర్మల ఫలితాన్ని రుచి చూపటానికి, బహుశా ఇలాగైనా వారు (అల్లాహ్‌ వైపునకు) మరలు తారేమోనని!

30:42 – قُلْ سِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلُ ۚ كَانَ أَكْثَرُهُم مُّشْرِكِينَ ٤٢

వారితో ఇలా అను: “భూమిలో ప్రయాణం చేసి చూడండి, మీకు పూర్వం గతించిన వారి అంతం (ముగింపు) ఎలా జరిగిందో! వారిలో చాలామంది బహుదైవా రాధకులుండిరి.”

30:43 – فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ الْقَيِّمِ مِن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا مَرَدَّ لَهُ مِنَ اللَّـهِ ۖ يَوْمَئِذٍ يَصَّدَّعُونَ ٤٣

కావున నీవు నీ ముఖాన్ని సరైన ధర్మం (ఇస్లాం) వైపునకే స్థిరంగా నిలుపు 24 – అల్లాహ్‌ తరఫునుండి – ఆ రోజు రాకముందే దేనినైతే ఎవ్వడూ తొలగించలేడో! ఆ రోజు వారు పరస్పరం చెదిరిపోయి వేరవుతారు. 25

30:44 – مَن كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُ ۖ وَمَنْ عَمِلَ صَالِحًا فَلِأَنفُسِهِمْ يَمْهَدُونَ ٤٤

సత్యాన్ని తిరస్కరించినవాడు, తన తిరస్కార ఫలితాన్ని అనుభవిస్తాడు.మరియు సత్కార్యాలు చేసినవారు, తమకొరకే (సాఫల్య మార్గాన్ని) తయారుచేసుకుంటారు.

30:45 – لِيَجْزِيَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِن فَضْلِهِ ۚ إِنَّهُ لَا يُحِبُّ الْكَافِرِينَ ٤٥

ఇది ఆయన (అల్లాహ్‌), తన అనుగ్రహంతో విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి ప్రతిఫల మివ్వటానికి. 26 నిశ్చయంగా, ఆయన సత్య-తిరస్కారులను ప్రేమించడు.

30:46 – وَمِنْ آيَاتِهِ أَن يُرْسِلَ الرِّيَاحَ مُبَشِّرَاتٍ وَلِيُذِيقَكُم مِّن رَّحْمَتِهِ وَلِتَجْرِيَ الْفُلْكُ بِأَمْرِهِ وَلِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ ٤٦

ఇక ఆయనసూచనలలో ఆయన గాలులను శుభవార్తలిచ్చేవిగా పంపి, మీకు తన కారుణ్యాన్ని రుచిచూపటం మరియు ఆయన ఆజ్ఞతో ఓడలను నడిపి మిమ్మల్ని ఆయనఅనుగ్రహాన్ని అన్వేషించ నివ్వటం కూడా ఉన్నాయి. ఇవన్నీ, బహుశా మీరు కృతజ్ఞతలు చూపుతారేమోనని!

30:47 – وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ رُسُلًا إِلَىٰ قَوْمِهِمْ فَجَاءُوهُم بِالْبَيِّنَاتِ فَانتَقَمْنَا مِنَ الَّذِينَ أَجْرَمُوا ۖ وَكَانَ حَقًّا عَلَيْنَا نَصْرُ الْمُؤْمِنِينَ ٤٧

మరియు వాస్తవానికి మేము నీకు పూర్వం కూడా, సందేశహరులను తమ-తమ జాతివారి వద్దకు పంపాము. 27 వారు, వారి వద్దకు స్పష్టమైన సూచనలను తీసుకొనివచ్చారు. ఆ తరువాత కూడా నేరం చేసినవారికి తగిన ప్రతీకారం 28 చేశాము. మరియు విశ్వాసులకు సహాయం చేయటం మా కర్తవ్యం.

30:48 – اللَّـهُ الَّذِي يُرْسِلُ الرِّيَاحَ فَتُثِيرُ سَحَابًا فَيَبْسُطُهُ فِي السَّمَاءِ كَيْفَ يَشَاءُ وَيَجْعَلُهُ كِسَفًا فَتَرَى الْوَدْقَ يَخْرُجُ مِنْ خِلَالِهِ ۖ فَإِذَا أَصَابَ بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ إِذَا هُمْ يَسْتَبْشِرُونَ ٤٨

అల్లాహ్‌యే గాలులను పంపేవాడు, కావున అవి మేఘాలను పైకి ఎత్తుతాయి, ఆ తరువాత ఆయన వాటిని తాను కోరినట్లు ఆకాశంలో వ్యాపింపజేస్తాడు. మరియు వాటిని ముక్కలు ముక్కలుగా చేసి, తరువాత వాటి మధ్య నుండి వర్షాన్ని కురిపిస్తాడు. ఆయన దానిని తన దాసులలో తాను కోరినవారిపై కురిపించగా వారు సంతోషపడతారు!

30:49 – وَإِن كَانُوا مِن قَبْلِ أَن يُنَزَّلَ عَلَيْهِم مِّن قَبْلِهِ لَمُبْلِسِينَ ٤٩

మరియు వాస్తవానికి, అది (వర్షం) కురువక ముందు వారు ఎంతో నిరాశచెంది ఉండేవారు.

30:50 – فَانظُرْ إِلَىٰ آثَارِ رَحْمَتِ اللَّـهِ كَيْفَ يُحْيِي الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ إِنَّ ذَٰلِكَ لَمُحْيِي الْمَوْتَىٰ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٥٠

కావున (ఓ మానవుడా!) అల్లాహ్‌ కారుణ్య చిహ్నాలను చూడు: ఆయన నిర్జీవంగా ఉన్న భూమిలో ఏవిధంగా ప్రాణంపోస్తాడో! నిశ్చయంగా, ఇదేవిధంగా ఆయన (మరణానంతరం) మృతులకు కూడా ప్రాణం పోస్తాడు! మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు.

30:51 – وَلَئِنْ أَرْسَلْنَا رِيحًا فَرَأَوْهُ مُصْفَرًّا لَّظَلُّوا مِن بَعْدِهِ يَكْفُرُونَ ٥١

మరియు మేము గాలిని పంపితే, దాని నుండి వారి పంటలను పసుపుపచ్చగా మారిపోవ టాన్ని చూసిన తరువాత వారు కృతఘ్నతకు లోనవుతారు (సత్య-తిరస్కారులవుతారు).

30:52 – فَإِنَّكَ لَا تُسْمِعُ الْمَوْتَىٰ وَلَا تُسْمِعُ الصُّمَّ الدُّعَاءَ إِذَا وَلَّوْا مُدْبِرِينَ ٥٢

నిశ్చయంగా, నీవు (ఓ ము’హమ్మద్‌!) మృతులకు వినిపించలేవు. మరియు నీవు వెనుదిరిగి పోయే చెవిటివారికి కూడా సందేశాన్ని వినిపించలేవు.

30:53 – وَمَا أَنتَ بِهَادِ الْعُمْيِ عَن ضَلَالَتِهِمْ ۖ إِن تُسْمِعُ إِلَّا مَن يُؤْمِنُ بِآيَاتِنَا فَهُم مُّسْلِمُونَ ٥٣

మరియు నీవు అంధులను, వారి మార్గ భ్రష్టత్వం నుండి తప్పించి, వారికి మార్గదర్శకత్వం చేయలేవు. నీవు కేవలం విశ్వసించి, అల్లాహ్‌కు విధేయులు (ముస్లింలు) అయినవారికి మాత్రమే మా సూచనలు వినిపించగలవు. 29 (3/8)

30:54 – اللَّـهُ الَّذِي خَلَقَكُم مِّن ضَعْفٍ ثُمَّ جَعَلَ مِن بَعْدِ ضَعْفٍ قُوَّةً ثُمَّ جَعَلَ مِن بَعْدِ قُوَّةٍ ضَعْفًا وَشَيْبَةً ۚ يَخْلُقُ مَا يَشَاءُ ۖ وَهُوَ الْعَلِيمُ الْقَدِيرُ ٥٤

  • అల్లాహ్‌యే మిమ్మల్ని బలహీనస్థితిలో పుట్టించినవాడు. మళ్ళీ ఆబలహీనస్థితి తరువాత మీకుబలాన్నిఇచ్చాడు. ఆబలం తరువాత మళ్ళీ మిమ్మల్నిబలహీనులుగా ముసలివారిగాచేశాడు. ఆయన తాను కోరింది సృష్టిస్తాడు. మరియు కేవలం ఆయనే సర్వజ్ఞుడు సర్వసమర్థుడు.

30:55 – وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يُقْسِمُ الْمُجْرِمُونَ مَا لَبِثُوا غَيْرَ سَاعَةٍ ۚ كَذَٰلِكَ كَانُوا يُؤْفَكُونَ ٥٥

మరియు ఆ ఘడియ 30 సంభవించిన రోజు, అపరాధులు, ప్రమాణంచేస్తూ: “మేము ఒక ఘడియసేపు కంటే ఎక్కువ కాలం (ప్రపంచంలో) ఉండలేదు” అని అంటారు. ఇదే విధంగా వారు (ప్రాపంచిక జీవితంలో) భ్రమలో ఉండేవారు. 31

30:56 – وَقَالَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ وَالْإِيمَانَ لَقَدْ لَبِثْتُمْ فِي كِتَابِ اللَّـهِ إِلَىٰ يَوْمِ الْبَعْثِ ۖ فَهَـٰذَا يَوْمُ الْبَعْثِ وَلَـٰكِنَّكُمْ كُنتُمْ لَا تَعْلَمُونَ ٥٦

మరియు జ్ఞానం మరియు విశ్వాసం అనుగ్రహింపబడిన వారు ఇలా అంటారు: “వాస్తవానికి అల్లాహ్‌ మూలగ్రంథం 32 ప్రకారం మీరు పునరుత్థానదినం వరకు (ఇహలోకంలో) ఉంటిరి. ఇక ఇదే ఆ పునరుత్థాన దినం, కాని నిశ్చయంగా! మీరిది తెలుసుకోలేక పోయారు.”

30:57 – فَيَوْمَئِذٍ لَّا يَنفَعُ الَّذِينَ ظَلَمُوا مَعْذِرَتُهُمْ وَلَا هُمْ يُسْتَعْتَبُونَ ٥٧

కనుక ఆ రోజు దుర్మార్గులకు, వారి సాకులు ఏ మాత్రం ప్రయోజనకరం కావు మరియు వారికి తమను తాము సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వబడదు.

30:58 – وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِي هَـٰذَا الْقُرْآنِ مِن كُلِّ مَثَلٍ ۚ وَلَئِن جِئْتَهُم بِآيَةٍ لَّيَقُولَنَّ الَّذِينَ كَفَرُوا إِنْ أَنتُمْ إِلَّا مُبْطِلُونَ ٥٨

మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్‌ఆన్‌ లో ప్రజలకు, ప్రతి ఒక్క విషయపు ఉపమానాన్ని బోధించాము. 33 అయినా నీవు వారి వద్దకు ఏ అద్భుత సూచన (ఆయత్‌) తెచ్చినా, వారిలో సత్య-తిరస్కారులైన వారు ఇలా అంటారు: “మీరు కేవలం బూటకాలే పలుకుతున్నారు.”

30:59 – كَذَٰلِكَ يَطْبَعُ اللَّـهُ عَلَىٰ قُلُوبِ الَّذِينَ لَا يَعْلَمُونَ ٥٩

ఈ విధంగా అల్లాహ్‌ జ్ఞానహీనుల హృదయాల మీద ముద్రవేస్తాడు. 34

30:60 – فَاصْبِرْ إِنَّ وَعْدَ اللَّـهِ حَقٌّ ۖ وَلَا يَسْتَخِفَّنَّكَ الَّذِينَ لَا يُوقِنُونَ ٦٠

కావున నీవు సహనంవహించు! నిశ్చయంగా అల్లాహ్‌ వాగ్దానం సత్యం! కావున విశ్వాసహీనులు నిన్ను వ్యాకులపరచరాదు సుమా!

సూరహ్‌ లుఖ్మాన్‌ – ఇంతకు ముందు సూరహ్‌ వలే ఈ సూరహ్‌ కూడా మధ్య మక్కహ్ కాలంలో, హిజ్రత్‌కు 6-7 సంవత్సరాలకు పూర్వం అవతరింపజేయబడింది. ఇది సూరహ్‌ అల్‌-‘అంకబూత్‌ (29)తో మొదలైన నాల్గు సూరాహ్‌లలో 3వది. లుఖ్మాన్‌ (‘అ.స.) ఒక మంచి జ్ఞానవంతుడు మరియు ప్రజ్ఞుడు. 34 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 12వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 31:1 – الم ١

అలిఫ్‌-లామ్‌-మీమ్‌. 1

31:2 – تِلْكَ آيَاتُ الْكِتَابِ الْحَكِيمِ ٢

ఇవి వివేకంతో నిండి ఉన్న గ్రంథ సూచనలు (ఆయాత్‌).

31:3 – هُدًى وَرَحْمَةً لِّلْمُحْسِنِينَ ٣

(ఇందులో) సజ్జనులకు 2 మార్గదర్శకత్వమూ మరియు కారుణ్యమూ ఉన్నాయి.

31:4 – الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُم بِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ ٤

(వారికే) ఎవరైతే నమా’జ్‌ను స్థాపించి విధిదానం (‘జకాత్‌) ఇస్తారో 3 మరియు పరలోక జీవితం మీద దృఢమైన నమ్మకం కలిగిఉంటారో;

31:5 – أُولَـٰئِكَ عَلَىٰ هُدًى مِّن رَّبِّهِمْ ۖ وَأُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ٥

అలాంటి వారే, తమ ప్రభువు తరఫు నుండి (వచ్చిన) మార్గదర్శకత్వం మీద ఉన్నవారు. మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు.

31:6 – وَمِنَ النَّاسِ مَن يَشْتَرِي لَهْوَ الْحَدِيثِ لِيُضِلَّ عَن سَبِيلِ اللَّـهِ بِغَيْرِ عِلْمٍ وَيَتَّخِذَهَا هُزُوًا ۚ أُولَـٰئِكَ لَهُمْ عَذَابٌ مُّهِينٌ ٦

మరియు మానవులలో కొందరు – జ్ఞానం లేక, వ్యర్థ కాలక్షేపంచేసే మాటలనుకొని 4 ప్రజలను అల్లాహ్‌ మార్గం నుండి తప్పించే వారున్నారు మరియు వారు దానిని (అల్లాహ్‌ మార్గాన్ని) పరిహాసం చేస్తుంటారు. అలాంటి వారికి అవమానకరమైన శిక్షపడుతుంది.

31:7 – وَإِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا وَلَّىٰ مُسْتَكْبِرًا كَأَن لَّمْ يَسْمَعْهَا كَأَنَّ فِي أُذُنَيْهِ وَقْرًا ۖ فَبَشِّرْهُ بِعَذَابٍ أَلِيمٍ ٧

అలాంటి వానికి, మా సూచనలు (ఆయాత్‌) వినిపింపజేసినప్పుడు, అతని రెండు చెవులలో చెవుడు ఉన్నట్లుగా, అతడు వాటిని విననేలే దన్నట్లుగా, అహంకారంతో మరలిపోతాడు. 5 వానికి అతి బాధాకరమైన శిక్ష పడుతుందనే వార్తను వినిపించు.

31:8 – إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ جَنَّاتُ النَّعِيمِ ٨

నిశ్చయంగా ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో, వారికొరకు పరమానంద కరమైన స్వర్గవనా లుంటాయి.

31:9 – خَالِدِينَ فِيهَا ۖ وَعْدَ اللَّـهِ حَقًّا ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ٩

వారు, శాశ్వతంగా వాటిలో ఉంటారు. ఇది అల్లాహ్‌ యొక్క సత్య వాగ్దానం. మరియు ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

31:10 – خَلَقَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا ۖ وَأَلْقَىٰ فِي الْأَرْضِ رَوَاسِيَ أَن تَمِيدَ بِكُمْ وَبَثَّ فِيهَا مِن كُلِّ دَابَّةٍ ۚ وَأَنزَلْنَا مِنَ السَّمَاءِ مَاءً فَأَنبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍ كَرِيمٍ ١٠

మీరు చూస్తున్నారు కదా! ఆయన ఆకాశాలను స్థంభాలు లేకుండానే సృష్టించాడు. 6 మరియు భూమిలో పర్వతాలను నాటాడు, అది మీతోపాటు కదలకుండా ఉండాలని; 7 మరియు దానిలో ప్రతిరకమైన ప్రాణిని నివసింపజేశాడు. మరియు మేము ఆకాశం నుండి నీటిని కురిపించి, దానిలో రకరకాల శ్రేష్ఠమైన (పదార్థాలను) 8 ఉత్పత్తిచేశాము.

31:11 – هَـٰذَا خَلْقُ اللَّـهِ فَأَرُونِي مَاذَا خَلَقَ الَّذِينَ مِن دُونِهِ ۚ بَلِ الظَّالِمُونَ فِي ضَلَالٍ مُّبِينٍ ١١

ఇదంతా అల్లాహ్‌ సృష్టియే! ఇక ఆయన తప్ప ఇతరులు ఏమి సృష్టించారో నాకు చూపండి. అలాకాదు ఈ దుర్మార్గులు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు.

31:12 – وَلَقَدْ آتَيْنَا لُقْمَانَ الْحِكْمَةَ أَنِ اشْكُرْ لِلَّـهِ ۚ وَمَن يَشْكُرْ فَإِنَّمَا يَشْكُرُ لِنَفْسِهِ ۖ وَمَن كَفَرَ فَإِنَّ اللَّـهَ غَنِيٌّ حَمِيدٌ ١٢

మరియు నిశ్చయంగా, మేము లుఖ్మాన్‌ కు వివేకాన్ని ప్రసాదించాము, 9 అతను అల్లాహ్‌ కు కృతజ్ఞుడుగా ఉండాలని. మరియు ఎవడైతే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతాడో, అతడు నిశ్చయంగా, తన మేలు కొరకే కృతజ్ఞతలు తెలుపుతాడు. మరియు కృతఘ్నతకు పాల్పడిన వాడు, నిశ్చయంగా అల్లాహ్‌ స్వయం సమృద్ధుడు సర్వస్తోత్రాలకు అర్హుడని (తెలుసుకోవాలి).

31:13 – وَإِذْ قَالَ لُقْمَانُ لِابْنِهِ وَهُوَ يَعِظُهُ يَا بُنَيَّ لَا تُشْرِكْ بِاللَّـهِ ۖ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ ١٣

మరియు (జ్ఞాపకం చేసుకోండి) లుఖ్మాన్‌ తన కుమారునికి హితబోధచేస్తూ ఇలా అన్నాడు: “ఓ నా పుత్రుడా! అల్లాహ్‌కు సాటి (భాగస్వాము లను) కల్పించకు. నిశ్చయంగా, అల్లాహ్‌కు భాగ స్వాములను కల్పించటం (బహుదైవారాధన) మహా (గొప్ప) దుర్మార్గము.

31:14 – وَوَصَّيْنَا الْإِنسَانَ بِوَالِدَيْهِ حَمَلَتْهُ أُمُّهُ وَهْنًا عَلَىٰ وَهْنٍ وَفِصَالُهُ فِي عَامَيْنِ أَنِ اشْكُرْ لِي وَلِوَالِدَيْكَ إِلَيَّ الْمَصِيرُ ١٤

“మరియు (అల్లాహ్‌ ఇలా ఆదేశి స్తున్నాడు): ‘మేము మానవునకు తన తల్లి దండ్రుల యెడల మంచితనంతో మెలగటం విధిగా జేశాము. అతని తల్లి అతనిని బలహీనతపై బలహీనతను సహిస్తూ (తనగర్భంలో) భరిస్తుంది. మరియు ఆ బిడ్డ చనుపాలు మాన్పించే గడువు రెండు సంవత్సరాలు. నీవు నాకు మరియు నీ తల్లి-దండ్రులకు కృతజ్ఞుడవై ఉండు. నీకు నా వైపునకే మరలి రావలసి ఉన్నది. 10

31:15 – وَإِن جَاهَدَاكَ عَلَىٰ أَن تُشْرِكَ بِي مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ فَلَا تُطِعْهُمَا ۖ وَصَاحِبْهُمَا فِي الدُّنْيَا مَعْرُوفًا ۖ وَاتَّبِعْ سَبِيلَ مَنْ أَنَابَ إِلَيَّ ۚ ثُمَّ إِلَيَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ١٥

” ‘మరియు ఒకవేళ వారిరువురు – నీవు ఎరగని దానిని – నాకు (అల్లాహ్‌కు) భాగ స్వామిగా చేర్చమని, నిన్ను బలవంతం చేస్తే, వారి మాటను నీవు ఏమాత్రం వినకు. 11 మరియు ఇహలోక విషయాలలో ధర్మసమ్మతమైన వాటిలో వారికి తోడుగా ఉండు. మరియు పశ్చాత్తాపంతో నావైపుకు మరలేవాని మార్గాన్ని అనుసరించు. తరువాత మీరంతా నావైపునకే మరలి రావలసి ఉన్నది. అప్పుడు నేను మీరు చేసే కర్మలను గురించి మీకు తెలుపుతాను.’

31:16 – يَا بُنَيَّ إِنَّهَا إِن تَكُ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ فَتَكُن فِي صَخْرَةٍ أَوْ فِي السَّمَاوَاتِ أَوْ فِي الْأَرْضِ يَأْتِ بِهَا اللَّـهُ ۚ إِنَّ اللَّـهَ لَطِيفٌ خَبِيرٌ ١٦

“ఓ నా కుమారా! ఒక వేళ నీ కర్మ ఆవ గింజంత ఉండి, అది ఒక పెద్ద రాతిబండలో గానీ, ఆకాశాలలోగానీ లేదా భూమిలోగానీ దాగివున్నా, అల్లాహ్‌ దానిని తప్పక (వెలుగులోకి) తెస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ ఎంతో సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు.

31:17 – يَا بُنَيَّ أَقِمِ الصَّلَاةَ وَأْمُرْ بِالْمَعْرُوفِ وَانْهَ عَنِ الْمُنكَرِ وَاصْبِرْ عَلَىٰ مَا أَصَابَكَ ۖ إِنَّ ذَٰلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ ١٧

“ఓ నా కుమారా! నమా’జ్‌ను స్థాపించు మరియు ధర్మాన్ని ఆదేశించు మరియు అధర్మాన్నినిషేధించు, ఆపదలో సహనంవహించు. నిశ్చయంగా, ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన విషయాలు. 12

31:18 – وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا ۖ إِنَّ اللَّـهَ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ ١٨

“మరియు నీ చెంపలను గర్వంతో, ప్రజల యెదుట ఉబ్బించకు. 13 మరియు భూమిపై అహం కారంతో నడవకు. నిశ్చయంగా, అల్లాహ్‌ డాంబి కాలు చెప్పుకొని, విర్రవీగే వాడంటే ఇష్టపడడు.

31:19 – وَاقْصِدْ فِي مَشْيِكَ وَاغْضُضْ مِن صَوْتِكَ ۚ إِنَّ أَنكَرَ الْأَصْوَاتِ لَصَوْتُ الْحَمِيرِ ١٩

“మరియు నీ నడకలలో వినమ్రత పాటించు. 14 మరియు నీ స్వరాన్ని తగ్గించు. నిశ్చయంగా, స్వరాలలో అన్నిటికంటే కరకైన (వినసొంపుకానిది) గాడిద స్వరమే!”

31:20 – أَلَمْ تَرَوْا أَنَّ اللَّـهَ سَخَّرَ لَكُم مَّا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَأَسْبَغَ عَلَيْكُمْ نِعَمَهُ ظَاهِرَةً وَبَاطِنَةً ۗ وَمِنَ النَّاسِ مَن يُجَادِلُ فِي اللَّـهِ بِغَيْرِ عِلْمٍ وَلَا هُدًى وَلَا كِتَابٍ مُّنِيرٍ ٢٠

ఏమీ? ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సకల వస్తువులను వాస్తవానికి అల్లాహ్‌ మీకు ఉపయుక్తంగా చేశాడనీ 15 మరియు ఆయన బహిరంగంగానూ మరియు గోప్యంగానూ తన అనుగ్రహాలను, మీకు ప్రసాదించాడనీ, మీకు తెలియదా? మరియు ప్రజలలో కొందరు ఎలాంటి జ్ఞానం, మార్గదర్శకత్వం మరియు వెలుగు చూపే స్పష్టమైన గ్రంథం లేనిదే అల్లాహ్‌ను గురించి వాదులాడేవారున్నారు!

31:21 – وَإِذَا قِيلَ لَهُمُ اتَّبِعُوا مَا أَنزَلَ اللَّـهُ قَالُوا بَلْ نَتَّبِعُ مَا وَجَدْنَا عَلَيْهِ آبَاءَنَا ۚ أَوَلَوْ كَانَ الشَّيْطَانُ يَدْعُوهُمْ إِلَىٰ عَذَابِ السَّعِيرِ ٢١

మరియు వారితో: “అల్లాహ్‌ అవతరింప జేసిన దానిని అనుసరించండి!” అని అన్నప్పుడు వారు: “కాదు మా తండ్రి-తాతలు నడిచిన మార్గాన్నే మేము అనుసరిస్తాము.” అని అంటారు. ఏమీ? షై’తాన్‌ వారిని భగభగ మండే అగ్ని వైపునకు ఆహ్వానిస్తున్నప్పటికీ, (వారు అలాంటి మార్గాన్నే అనుసరిస్తారా)? 16 (1/2)

31:22 – وَمَن يُسْلِمْ وَجْهَهُ إِلَى اللَّـهِ وَهُوَ مُحْسِنٌ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ ۗ وَإِلَى اللَّـهِ عَاقِبَةُ الْأُمُورِ ٢٢

  • ఎవడైతే, తనముఖాన్ని (తనను తాను) అల్లాహ్‌కు సమర్పించుకొని 17 సజ్జనుడై ఉంటాడో, అలాంటివాడు నిస్సందేహంగా దృఢమైన ఆధా రాన్ని పట్టుకున్న వాడే! మరియు సకల వ్యవహా రాల ముగింపు (తీర్పు) అల్లా వద్దనే ఉంది.

31:23 – وَمَن كَفَرَ فَلَا يَحْزُنكَ كُفْرُهُ ۚ إِلَيْنَا مَرْجِعُهُمْ فَنُنَبِّئُهُم بِمَا عَمِلُوا ۚ إِنَّ اللَّـهَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ٢٣

మరియు సత్యాన్ని తిరస్కరించేవాని, తిరస్కారం నిన్ను దుఃఖానికి గురిచేయకూడదు. వారందరి మరలింపు మావైపునకే ఉంది; అప్పుడు మేము వారుచేసినకర్మలను వారికితెలుపుతాము. నిశ్చయంగా, అల్లాహ్‌ కు హృదయాలలో ఉన్న విషయాలు సైతం బాగా తెలుసు.

31:24 – نُمَتِّعُهُمْ قَلِيلًا ثُمَّ نَضْطَرُّهُمْ إِلَىٰ عَذَابٍ غَلِيظٍ ٢٤

మేము వారిని కొంతకాలం సుఖాలను అనుభవించనిస్తాము. ఆ తరువాత మేము వారిని కఠినమైన శిక్ష వైపుకు త్రోస్తాము.

31:25 – وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ اللَّـهُ ۚ قُلِ الْحَمْدُ لِلَّـهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ ٢٥

ఒకవేళ మీరు వారిని: “ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించింది ఎవరు?” అని అడిగితే! వారు నిస్సంకోచంగా అంటారు: “అల్లాహ్‌!” అని. వారితో అను: “సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్‌ మాత్రమే!” కాని వారిలో చాలా మందికి ఇది తెలియదు.

31:26 – لِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ إِنَّ اللَّـهَ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ ٢٦

ఆకాశాలలో మరియు భూమిలో నున్న సమస్తమూ అల్లాహ్‌కే చెందుతుంది. నిశ్చయంగా అల్లాహ్‌! కేవలం ఆయనే సర్వసంపన్నుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు.

31:27 – وَلَوْ أَنَّمَا فِي الْأَرْضِ مِن شَجَرَةٍ أَقْلَامٌ وَالْبَحْرُ يَمُدُّهُ مِن بَعْدِهِ سَبْعَةُ أَبْحُرٍ مَّا نَفِدَتْ كَلِمَاتُ اللَّـهِ ۗ إِنَّ اللَّـهَ عَزِيزٌ حَكِيمٌ ٢٧

ఒకవేళ వాస్తవానికి, భూమిలో ఉన్న వృక్షా లన్నీ కలములై ఈ సముద్రం మరియు దానితో పాటు అటువంటి ఏడు సముద్రాల (నీళ్ళంతా) సిరాగా ఉన్నా, అల్లాహ్‌ మాటలు (సూచనలు వ్రాయటానికి) పూర్తికావు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు. 18

31:28 – مَّا خَلْقُكُمْ وَلَا بَعْثُكُمْ إِلَّا كَنَفْسٍ وَاحِدَةٍ ۗ إِنَّ اللَّـهَ سَمِيعٌ بَصِيرٌ ٢٨

మీ అందరినీ సృష్టించటం మరియు తిరిగి (సజీవులుగా) లేపటం ఆయనకు ఒక మానవుణ్ణి (సృష్టించి, తిరిగిలేపడం వంటిదే). నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.

31:29 – أَلَمْ تَرَ أَنَّ اللَّـهَ يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ كُلٌّ يَجْرِي إِلَىٰ أَجَلٍ مُّسَمًّى وَأَنَّ اللَّـهَ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ ٢٩

ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా)? నిశ్చయంగా, అల్లాహ్‌ రాత్రిని పగటిలోనికి ప్రవేశింప జేస్తున్నాడని మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింప జేస్తున్నాడని. 19 మరియు సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి నియమబద్ధులుగా చేసి ఉంచాడనీ ప్రతి ఒక్కటీ ఒక నిర్ణీతకాలంలో మరియు (పరిధిలో) తిరుగుతూఉంటాయనీ! 20 మరియు నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్‌ ఎరుగునని?

31:30 – ذَٰلِكَ بِأَنَّ اللَّـهَ هُوَ الْحَقُّ وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ الْبَاطِلُ وَأَنَّ اللَّـهَ هُوَ الْعَلِيُّ الْكَبِيرُ ٣٠

ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా అల్లాహ్‌ కేవలం ఆయనే సత్యం. మరియు ఆయనను వదలి వారు ఆరాధించేవన్నీ అసత్యాలు మరియు నిశ్చయంగా అల్లాహ్‌! కేవలం ఆయనే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు).

31:31 – أَلَمْ تَرَ أَنَّ الْفُلْكَ تَجْرِي فِي الْبَحْرِ بِنِعْمَتِ اللَّـهِ لِيُرِيَكُم مِّنْ آيَاتِهِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُورٍ ٣١

ఏమీ? నీకు తెలియదా? మీకు కొన్ని సూచనలనుతెలుపటానికి, అల్లాహ్‌ అనుగ్రహంతో ఓడ సముద్రంలో పయనం చేస్తున్నదనీ? నిశ్చయంగా ఇందులో సహనం వహించే ప్రతివానికి, కృతజ్ఞునికి, ఎన్నో సూచనలున్నాయి.

31:32 – وَإِذَا غَشِيَهُم مَّوْجٌ كَالظُّلَلِ دَعَوُا اللَّـهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ فَلَمَّا نَجَّاهُمْ إِلَى الْبَرِّ فَمِنْهُم مُّقْتَصِدٌ ۚ وَمَا يَجْحَدُ بِآيَاتِنَا إِلَّا كُلُّ خَتَّارٍ كَفُورٍ ٣٢

మరియు వారిని సముద్రపు అల, మేఘంగా క్రమ్ముకున్నపుడు, వారు పరిపూర్ణభక్తితో అల్లాహ్‌ నే వేడుకుంటారు. కాని ఆయన వారిని రక్షించి ఒడ్డుకు చేర్చినతరువాత వారిలోకొందరు (విశ్వాస అవిశ్వాసాల) మధ్య ఆగిపోతారు. 21 మరియు మా సూచనలను, కేవలం విశ్వాసఘాతకులు, కృతఘ్నులైన వారు మాత్రమే తిరస్కరిస్తారు.

31:33 – يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ وَاخْشَوْا يَوْمًا لَّا يَجْزِي وَالِدٌ عَن وَلَدِهِ وَلَا مَوْلُودٌ هُوَ جَازٍ عَن وَالِدِهِ شَيْئًا ۚ إِنَّ وَعْدَ اللَّـهِ حَقٌّ ۖ فَلَا تَغُرَّنَّكُمُ الْحَيَاةُ الدُّنْيَا وَلَا يَغُرَّنَّكُم بِاللَّـهِ الْغَرُورُ ٣٣

ఓ మానవులారా! మీ ప్రభువునందే భయ-భక్తులు కలిగిఉండండి, మరియు ఆదినానికి భయ పడండి, (ఏ నాడైతే) తండ్రి తన కుమారునికి నష్టపరిహారంచెల్లించలేడో మరియు ఏకుమారుడు కూడా తన తండ్రికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించ లేడో! నిశ్చయంగా, అల్లాహ్‌ వాగ్దానం సత్యం! కావున ఈ ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసానికి గురిచేయనివ్వకూడదు. మరియు ఆ వంచకుణ్ణి (షై’తానును) మిమ్మల్ని అల్లాహ్‌ విషయంలో వంచనకు గురిచేయనివ్వకూడదు సుమా!

31:34 – إِنَّ اللَّـهَ عِندَهُ عِلْمُ السَّاعَةِ وَيُنَزِّلُ الْغَيْثَ وَيَعْلَمُ مَا فِي الْأَرْحَامِ ۖ وَمَا تَدْرِي نَفْسٌ مَّاذَا تَكْسِبُ غَدًا ۖ وَمَا تَدْرِي نَفْسٌ بِأَيِّ أَرْضٍ تَمُوتُ ۚ إِنَّ اللَّـهَ عَلِيمٌ خَبِيرٌ ٣٤

నిశ్చయంగా, ఆ (అంతిమ) ఘడియ జ్ఞానం, కేవలం అల్లాహ్‌కు మాత్రమే ఉంది. మరియు ఆయనే వర్షం కురిపించేవాడు మరియు గర్భాలలో ఉన్నదాని విషయం తెలిసినవాడు. మరియు తాను రేపు ఏమి సంపాదిస్తాడో, ఏ మానవుడు కూడా ఎరుగడు. మరియు ఏ మానవుడు కూడా తాను ఏ భూభాగంలో మరణిస్తాడో కూడా ఎరుగడు. 22 నిశ్చయంగా, అల్లాహ్‌ మాత్రమే సర్వజ్ఞుడు, సమస్తం తెలిసినవాడు (ఎరిగిన వాడు).

సూరహ్‌ అస్‌-సజ్‌దహ్‌ – అస్‌-సజ్‌దహ్‌: సాష్టాంగం. ఇది చివరి మక్కహ్ సూరాహ్‌లలోనిది. సూరహ్‌ అల్‌-ము’మినూన్‌ (23) తరువాత అవతరింపజేయబడింది. ఇది సూరహ్‌ అల్‌-‘అంకబూత్‌ (29)తో మొదలైన నాలుగు సూరాహ్‌లలో 4వది, చివరిది. దైవప్రవక్త (‘స’అస) జుము’అహ్‌ రోజు ఫజ్ర్‌ నమా’జ్‌లో మొదటి రక’అత్‌లో ఈ సూరహ్‌ (32) మరియు రెండవ రక’అత్‌లో సూరహ్‌ అల్‌-ఇన్సాన్‌ (76), చదివేవారు, (బు’ఖారీ, ముస్లిం). దైవప్రవక్త (‘స’అస) రాత్రి నిద్రపోయే ముందు ఈ సూరహ్‌ మరియు సూరహ్‌ అల్‌-ముల్క్‌ (67) చదివే వారు, (తిర్మిజీ’ 892; అ’హ్మద్‌ 3/340). 30 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 15వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 32:1 – الم ١

అలిఫ్‌-లామ్‌-మీమ్‌.

32:2 – تَنزِيلُ الْكِتَابِ لَا رَيْبَ فِيهِ مِن رَّبِّ الْعَالَمِينَ ٢

నిస్సంకోచంగా, ఈ గ్రంథ (ఖుర్‌ఆన్‌) అవత రణ సర్వలోకాల ప్రభువు తరఫు నుండియే ఉంది.

32:3 – أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۚ بَلْ هُوَ الْحَقُّ مِن رَّبِّكَ لِتُنذِرَ قَوْمًا مَّا أَتَاهُم مِّن نَّذِيرٍ مِّن قَبْلِكَ لَعَلَّهُمْ يَهْتَدُونَ ٣

ఏమీ? వారు (అవిశ్వాసులు): “ఇతనే (ము’హమ్మదే) దీనిని కల్పించాడు.” అని అంటున్నారా? 1 అలాకాదు! వాస్తవానికి ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. నీకు పూర్వం హెచ్చరించే వారెవ్వరూ రాని జాతి వారికి నీవు హెచ్చరిక చేయటానికి, బహుశా వారు మార్గదర్శకత్వం పొందుతారేమోనని!

32:4 – اللَّـهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۖ مَا لَكُم مِّن دُونِهِ مِن وَلِيٍّ وَلَا شَفِيعٍ ۚ أَفَلَا تَتَذَكَّرُونَ ٤

అల్లాహ్‌, ఆయనే ఆకాశాలను భూమిని మరియు వాటి మధ్య ఉన్నదంతా ఆరు దినము లలో (అయ్యామ్‌లలో) 2 సృష్టించాడు, ఆ తరు వాత సింహాసనాన్ని (‘అర్ష్‌ను) అధిష్టించాడు. ఆయన తప్ప మీకు మరొక సంరక్షకుడుగానీ, సిపారసు చేసే వాడుగానీ ఎవ్వడూ లేడు, అయినా మీరు హితబోధ గ్రహించరా?

32:5 – يُدَبِّرُ الْأَمْرَ مِنَ السَّمَاءِ إِلَى الْأَرْضِ ثُمَّ يَعْرُجُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ أَلْفَ سَنَةٍ مِّمَّا تَعُدُّونَ ٥

ఆయనే ఆకాశం నుండి భూమి వరకు ప్రతి వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు; తరువాత అంతా ఒకే దినమున, 3 ఆయన వద్దకు పోయి చేరుతుంది; దాని (ఆ దినపు) పరిమాణం మీ లెక్క ప్రకారం వేయి సంవత్సరాలు.

32:6 – ذَٰلِكَ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْعَزِيزُ الرَّحِيمُ ٦

ఆయన (అల్లాహ్‌)యే అగోచర మరియు గోచర విషయాల జ్ఞానం గలవాడు, సర్వ శక్తిమంతుడు, అపార కరుణాప్రదాత.

32:7 – الَّذِي أَحْسَنَ كُلَّ شَيْءٍ خَلَقَهُ ۖ وَبَدَأَ خَلْقَ الْإِنسَانِ مِن طِينٍ ٧

ఆయన తాను సృష్టించిన ప్రతి దానిని ఉత్తమరీతిలో చేశాడు. మరియు మానవసృష్టిని మట్టితో ప్రారంభించాడు. 4

32:8 – ثُمَّ جَعَلَ نَسْلَهُ مِن سُلَالَةٍ مِّن مَّاءٍ مَّهِينٍ ٨

తరువాత అతని సంతతిని ఒక అధమమైన ద్రవపదార్థపు సారంతో (వీర్యంతో) చేశాడు.

32:9 – ثُمَّ سَوَّاهُ وَنَفَخَ فِيهِ مِن رُّوحِهِ ۖ وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۚ قَلِيلًا مَّا تَشْكُرُونَ ٩

ఆ తరువాత అతనిని యుక్తమైన రూపంలో తీర్చిదిద్ది, అతనిలో తన (నుండి) ప్రాణం (ఆత్మ) ఊదాడు. 5 మరియు మీకు వినేశక్తిని, చూసేశక్తిని మరియు హృదయాలను (అర్థంచేసుకునే శక్తిని) ఇచ్చాడు. (అయినా) మీరు కృతజ్ఞతలు తెలుపుకునేది చాలా తక్కువ!

32:10 – وَقَالُوا أَإِذَا ضَلَلْنَا فِي الْأَرْضِ أَإِنَّا لَفِي خَلْقٍ جَدِيدٍ ۚ بَلْ هُم بِلِقَاءِ رَبِّهِمْ كَافِرُونَ ١٠

మరియు వారు (అవిశ్వాసులు) అంటు న్నారు: “ఏమీ? మేము నశించి మట్టిలో కలిసి పోయినా మేము మళ్ళీ క్రొత్తగా సృష్టించబడ తామా?” అదికాదు! వారు తమ ప్రభువుతో కాబోయే సమావేశాన్ని తిరస్కరిస్తున్నారు. 6 (5/8)

32:11 – قُلْ يَتَوَفَّاكُم مَّلَكُ الْمَوْتِ الَّذِي وُكِّلَ بِكُمْ ثُمَّ إِلَىٰ رَبِّكُمْ تُرْجَعُونَ ١١

  • వారితో ఇలా అను: “మీపై నియమించ బడిన మృత్యుదూత మీ ప్రాణం తీస్తాడు. ఆ తరువాత మీరు మీ ప్రభువు వద్దకు మరలింపబడతారు.”

32:12 – وَلَوْ تَرَىٰ إِذِ الْمُجْرِمُونَ نَاكِسُو رُءُوسِهِمْ عِندَ رَبِّهِمْ رَبَّنَا أَبْصَرْنَا وَسَمِعْنَا فَارْجِعْنَا نَعْمَلْ صَالِحًا إِنَّا مُوقِنُونَ ١٢

మరియు (పునరుత్థానదినమున) ఈ అపరాధులు, తమ ప్రభువు సమక్షంలో, ఏవిధంగా తమతలలు వంచుకొని నిలబడిఉంటారో, నీవు చూడగలిగితే! వారు: “ఓమాప్రభూ! మేమిప్పుడు చూశాము మరియువిన్నాము, కావున మమ్మల్ని తిరిగి (భూలోకానికి) పంపించు. మేము సత్కార్యాలు చేస్తాము, నిశ్చయంగా, మాకు ఇప్పుడు నమ్మకం కలిగింది.” అని అంటారు.

32:13 – وَلَوْ شِئْنَا لَآتَيْنَا كُلَّ نَفْسٍ هُدَاهَا وَلَـٰكِنْ حَقَّ الْقَوْلُ مِنِّي لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ أَجْمَعِينَ ١٣

మరియు, మేముకోరినట్లయితే, ప్రతి వ్యక్తికి (ఆత్మకు) దాని మార్గదర్శకత్వం చేసి ఉండే వారము. 7 కాని నేను: “నిశ్చయంగా జిన్నాతులు మరియు మానవులందరితో నరకాన్నినింపివేస్తాను.” అని పలికిన, నా మాట సత్యమయ్యింది. 8

32:14 – فَذُوقُوا بِمَا نَسِيتُمْ لِقَاءَ يَوْمِكُمْ هَـٰذَا إِنَّا نَسِينَاكُمْ ۖ وَذُوقُوا عَذَابَ الْخُلْدِ بِمَا كُنتُمْ تَعْمَلُونَ ١٤

కావున మీరు మీ యొక్క ఈ నాటి సమా వేశాన్ని మరచిపోయిన దాని ఫలితాన్ని రుచి చూడండి. నిశ్చయంగా మేము కూడా మిమ్మల్ని మరచిపోయాము. మరియు మీరు మీ కర్మల ఫలితమైన ఈ శాశ్వత శిక్షను రుచి చూడండి!

32:15 – إِنَّمَا يُؤْمِنُ بِآيَاتِنَا الَّذِينَ إِذَا ذُكِّرُوا بِهَا خَرُّوا سُجَّدًا وَسَبَّحُوا بِحَمْدِ رَبِّهِمْ وَهُمْ لَا يَسْتَكْبِرُونَ ١٥

నిశ్చయంగా వారే, మా సూచనలు (ఆయాత్‌) వారికి బోధించినప్పుడు, వాటిని విశ్వసించి సాష్టాంగంలో (సజ్దాలో) పడిపోతారు మరియు తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతారు మరియు ఆయనను స్తుతిస్తారు మరియు వారెన్నడూ గర్వపడరు; (సజ్దా)

32:16 – تَتَجَافَىٰ جُنُوبُهُمْ عَنِ الْمَضَاجِعِ يَدْعُونَ رَبَّهُمْ خَوْفًا وَطَمَعًا وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ ١٦

వారు (రాత్రులలో) తమ ప్రక్కలను తమ పరుపుల నుండి దూరంచేసి, తమ ప్రభువును భయంతో మరియు ఆశతో వేడుకుంటారు 9 మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చుచేస్తారు.

32:17 – فَلَا تَعْلَمُ نَفْسٌ مَّا أُخْفِيَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍ جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ ١٧

కాని వారికి, వారికర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచిపెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు. 10

32:18 – أَفَمَن كَانَ مُؤْمِنًا كَمَن كَانَ فَاسِقًا ۚ لَّا يَسْتَوُونَ ١٨

ఏమీ? విశ్వాసి అయిన వాడు (దైవభీతి లేని) అవిధేయునితో సమానుడా? (కాదు)! వారు సరిసమానులు కాలేరు. 11

32:19 – أَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَلَهُمْ جَنَّاتُ الْمَأْوَىٰ نُزُلًا بِمَا كَانُوا يَعْمَلُونَ ١٩

ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో, వారికి –వారి కర్మలకు ఫలితంగా – వారి ఆతిథ్యం కొరకు స్వర్గవనాలలో నివాసాలుంటాయి.

32:20 – وَأَمَّا الَّذِينَ فَسَقُوا فَمَأْوَاهُمُ النَّارُ ۖ كُلَّمَا أَرَادُوا أَن يَخْرُجُوا مِنْهَا أُعِيدُوا فِيهَا وَقِيلَ لَهُمْ ذُوقُوا عَذَابَ النَّارِ الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ ٢٠

ఇక ఎవరైతే, విద్రోహవైఖరి అవలంబిస్తారో, వారి నివాసం నరకాగ్నియే. ప్రతిసారి వారు దాని నుండి బయటపడటానికి ప్రయత్నించినపుడల్లా, వారందులోకి తిరిగి నెట్టబడతారు. మరియు వారితో ఇలా అనబడుతుంది: “మీరు తిరస్క రిస్తూ ఉండిన నరకాగ్ని శిక్షను చవిచూడండి.”

32:21 – وَلَنُذِيقَنَّهُم مِّنَ الْعَذَابِ الْأَدْنَىٰ دُونَ الْعَذَابِ الْأَكْبَرِ لَعَلَّهُمْ يَرْجِعُونَ ٢١

మరియు ఆ పెద్దశిక్షకు ముందు మేము (ఇహలోకంలో) వారికి సమీప శిక్షను రుచిచూపు తాము. 12 బహుశా, వారు (పశ్చాత్తాపపడి సత్కార్యాల వైపునకు) మరలి వస్తారేమోనని!

32:22 – وَمَنْ أَظْلَمُ مِمَّن ذُكِّرَ بِآيَاتِ رَبِّهِ ثُمَّ أَعْرَضَ عَنْهَا ۚ إِنَّا مِنَ الْمُجْرِمِينَ مُنتَقِمُونَ ٢٢

మరియు తన ప్రభువు సూచన (ఆయత్) ల ద్వారా హితబోధచేయబడిన తరువాతకూడా వాటి నుండి విముఖుడయ్యే వానికంటే ఎక్కువ దుర్మార్గుడెవడు? నిశ్చయంగా, మేము అలాంటి అపరాధులకు ప్రతీకారం చేసి తీరుతాము. 13

32:23 – وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ فَلَا تَكُن فِي مِرْيَةٍ مِّن لِّقَائِهِ ۖ وَجَعَلْنَاهُ هُدًى لِّبَنِي إِسْرَائِيلَ ٢٣

మరియు వాస్తవంగా, మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము. కావున, (ఓ ప్రవక్తా)! నీవు అతనిని (ఇస్రా’రాత్రిలో) కలుసుకోబోయే విషయాన్ని గురించి సందేహంలో పడకు. 14 మరియు మేము దానిని (తౌరాత్‌ను) ఇస్రా’యీల్‌ సంతతివారికి మార్గదర్శినిగా చేశాము. 15

32:24 – وَجَعَلْنَا مِنْهُمْ أَئِمَّةً يَهْدُونَ بِأَمْرِنَا لَمَّا صَبَرُوا ۖ وَكَانُوا بِآيَاتِنَا يُوقِنُونَ ٢٤

మరియు మేము (ఇస్రా’యీల్‌ సంతతి) వారిలో నుండి కొందరిని నాయకులుగాచేశాము – వారు, వారికి మా ఆజ్ఞానుసారంగా మార్గదర్శ కత్వం చేస్తూ ఉన్నారు – ఎంత వరకైతే వారు సహనం వహించి ఉన్నారో మరియు వారు మా ఆయాత్‌ (సూచన) లను నమ్ముతూ ఉన్నారో!

32:25 – إِنَّ رَبَّكَ هُوَ يَفْصِلُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ ٢٥

నిశ్చయంగా, నీ ప్రభువు, పునరుత్థాన దినమున, వారికున్న భేదాభిప్రాయాలను గురించి వారిమధ్య తీర్పుచేస్తాడు. 16

32:26 – أَوَلَمْ يَهْدِ لَهُمْ كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّنَ الْقُرُونِ يَمْشُونَ فِي مَسَاكِنِهِمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ ۖ أَفَلَا يَسْمَعُونَ ٢٦

ఏమీ? వీరికి పూర్వం అనేక తరాలను నాశ నంచేసిన విషయం వీరికి మార్గదర్శకత్వం కాదా? వీరు, వారి నివాసస్థలాలలో తిరుగుతున్నారు కదా! నిశ్చయంగా ఇందులో ఎన్నో సూచన లున్నాయి. ఏమీ? వీరు వినటం లేదా?

32:27 – أَوَلَمْ يَرَوْا أَنَّا نَسُوقُ الْمَاءَ إِلَى الْأَرْضِ الْجُرُزِ فَنُخْرِجُ بِهِ زَرْعًا تَأْكُلُ مِنْهُ أَنْعَامُهُمْ وَأَنفُسُهُمْ ۖ أَفَلَا يُبْصِرُونَ ٢٧

ఏమీ? వారు చూడటంలేదా? నిశ్చయంగా, మేము ఒక బంజరు భూమి వైపునకు నీళ్ళను (వర్షాన్ని) పంపి దాని నుండి పైరును ఉత్పత్తి చేస్తే, దానిని వారి పశువులు మరియు వారూ తింటున్నారని. ఏమీ? వారిది గమనించటం లేదా (చూడటం లేదా)?

32:28 – وَيَقُولُونَ مَتَىٰ هَـٰذَا الْفَتْحُ إِن كُنتُمْ صَادِقِينَ ٢٨

ఇంకా ఇలా అంటున్నారు: “మీరు సత్య వంతులే అయితే, ఆ తీర్పు ఎప్పుడు వస్తుందో చెప్పండి!” 17

32:29 – قُلْ يَوْمَ الْفَتْحِ لَا يَنفَعُ الَّذِينَ كَفَرُوا إِيمَانُهُمْ وَلَا هُمْ يُنظَرُونَ ٢٩

ఇలా అను: “ఆ తీర్పుదినంనాడు 18 సత్య-తిరస్కారులు విశ్వసించగోరినా, అది వారికి ఏ విధంగానూ పనికిరాదు! మరియు వారికెలాంటి గడువు కూడా ఇవ్వబడదు.”

32:30 – فَأَعْرِضْ عَنْهُمْ وَانتَظِرْ إِنَّهُم مُّنتَظِرُونَ ٣٠

కావున నీవు వారితో విముఖుడవగు! 19 మరియు వేచి ఉండు, నిశ్చయంగా, వారు కూడా (ఆ దినం కొరకు) వేచి ఉంటారు. (3/4)

సూరహ్‌ అల్‌-అ’హ్‌’జాబ్‌ – మదీనహ్ లో అవతరింపజేయబడిన ఈసూరహ్‌లో 73 ఆయతులున్నాయి. దీని పేరు 20 (9-27) ఆయత్‌లలో వివరించబడిన, షవ్వాల్‌ 5వ హిజ్రీలో జరిగిన తెగలవారి యుద్ధం పేరుతో ఇవ్వబడింది. ఆ యుద్ధం మరొక పేరు కందక యుద్ధం. 4వ హిజ్రీలో మదీనహ్ నుండి వెళ్ళగొట్ట బడిన బనూ-న’దీర్‌ తెగవారు ముష్రిక్‌ ఖురైలను ప్రోత్సహించి, చుట్టుప్రక్కలనున్న ముష్రిక్‌ తెగలైన బనూ-కినానా, బనూ-అసద్‌ మరియు బనూ-‘గి’త్ఫాన్‌ వారినీ, ఇంకా ఇతరులను కలుపుకొని మదీనహ్ నగరాన్నీ, అందులో ఉన్న ఆ కాలపు చిన్న ముస్లిం సమాజాన్నీ పూర్తిగా రూపుమాపాలనే ఉద్దేశంతో దాదాపు 12,000 యుద్ధవీరులను తీసుకొని మదీనహ్ పై దండ యాత్ర చేస్తారు.

2వ హిజ్రీ రమ’దాన్‌ నెలలో జరిగిన బద్ర్‌ యుద్ధంలో మక్కహ్ ముష్రిక్‌లు ఓడి పారిపోతారు. 3వ హిజ్రీ షవ్వాల్‌లో ఉహుద్‌ వద్ద వారు మస్లిములపై చేసిన దండయాత్రలో ముస్లింలకు హాని కలుగజేసినా, మదీనహ్ నగరం వారి దాడి నుండి కాపాడబడుతుంది.

కాబట్టి ఈ సారి వారు ఏవిధంగానైనా మదీనహ్ వాసులైన ముస్లింలను పూర్తిగా నిర్మూలించా లనే ఉద్దేశంతో ముస్లింలకు విరోధులైన అన్ని తెగలవారిని కలుపుకొని దాదాపు 12వేల యుద్ధ వీరులతో, ఎంతో యుద్ధసామగ్రి సిద్ధపరచుకొని వస్తారు. ఈ విషయం ముందుగానే తెలుసుకొని, దైవప్రవక్త (‘స’అస) మదీనహ్ నగరాన్ని ఏ విధంగానైనా కాపాడుకోదలుస్తారు. మదీనహ్ చుట్టూ లావారాళ్ళు ఉన్నాయి. దక్షిణవైపు ఉన్న యూదతెగ, బనూ-ఖురై”జహ్‌ వారితో ముస్లింల ఒప్పందం ఉంటుంది. కాబట్టి వారు, ఆ దిక్కు నుండి శత్రువులను రానివ్వ మంటారు. ఇక ఒక వైపు నుండి మాత్రమే శత్రువులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దైవప్రవక్త (‘స’అస) సల్మాన్‌ ఫార్సీ, (ర’ది.’అ.) సలహాతో ఆ వైపు ఒక పెద్ద కందకం త్రవ్విస్తారు. దానివల్ల శత్రువులు మదీనహ్ లోకి రాలేకపోతారు. కాని బనూ-న’దీర్‌ తెగవారి మాటలకు లోనై బనూ-ఖురై”జహ్‌ తెగవారు ముస్లింలతో చేసుకున్న ఒప్పందం త్రెంపుకుంటారు. కాని అల్లాహ్‌ (సు.త.) అనుగ్రహంతో బనూ ఖురై”జా మరియు బనూ-న’దీర్‌ తెగల మధ్య భేదాభిప్రాయాలు రావటం వల్ల బనూ-ఖురై”జహ్‌ తెగవారు ముస్లింల మీద దాడిచేయరు. ముష్రిక్‌ ఖురైషీలు మరియు వారితో పాటు వచ్చిన వారు, దాదాపు మూడువారాలు కందకపు అటువైపుఉండి, ఆతరువాత ఏంతో చల్లని తూఫాన్‌ గాలి ఎడతెగకుండా వీచటం వల్ల, దానికి తట్టుకోలేక వెనుదిరిగిపోతారు. ఈ విధంగా ఆ చిన్న ఇస్లాం సమాజం మరియు మదీనహ్ నగరం అల్లాహ్‌ (సు.త.) అనుగ్రహంతో కాపాడబడతాయి.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 33:1 – يَا أَيُّهَا النَّبِيُّ اتَّقِ اللَّـهَ وَلَا تُطِعِ الْكَافِرِينَ وَالْمُنَافِقِينَ ۗ إِنَّ اللَّـهَ كَانَ عَلِيمًا حَكِيمًا ١

  • ఓ ప్రవక్తా! అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండు మరియు సత్యతిరస్కారుల మరియు కపట-విశ్వాసుల యొక్క అభిప్రాయాన్ని లక్ష్య పెట్టకు. నిశ్చయంగా అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

33:2 – وَاتَّبِعْ مَا يُوحَىٰ إِلَيْكَ مِن رَّبِّكَ ۚ إِنَّ اللَّـهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا ٢

మరియు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వ’హీని) మాత్రమే అనుసరించు. నిశ్చయంగా, అల్లాహ్‌ మీరు చేసేదంతా ఎరుగును.

33:3 – وَتَوَكَّلْ عَلَى اللَّـهِ ۚ وَكَفَىٰ بِاللَّـهِ وَكِيلًا ٣

కావున అల్లాహ్‌పైననే నమ్మకం ఉంచుకో మరియు కార్యసాధకుడుగా అల్లాహ్‌ చాలు.

33:4 – مَّا جَعَلَ اللَّـهُ لِرَجُلٍ مِّن قَلْبَيْنِ فِي جَوْفِهِ ۚ وَمَا جَعَلَ أَزْوَاجَكُمُ اللَّائِي تُظَاهِرُونَ مِنْهُنَّ أُمَّهَاتِكُمْ ۚ وَمَا جَعَلَ أَدْعِيَاءَكُمْ أَبْنَاءَكُمْ ۚ ذَٰلِكُمْ قَوْلُكُم بِأَفْوَاهِكُمْ ۖ وَاللَّـهُ يَقُولُ الْحَقَّ وَهُوَ يَهْدِي السَّبِيلَ ٤

అల్లాహ్‌, ఏ వ్యక్తి ఎదలో కూడా రెండు హృద యాలు పెట్టలేదు. మరియు మీరు మీ భార్యలను, ‘తల్లులు’ అని పలికి, “జిహార్‌ 1 చేసినంతటనే వారిని మీకు తల్లులుగా చేయలేదు. మరియు మీరు దత్త తీసుకొన్న వారిని మీ (కన్న) కుమారు లుగా చేయలేదు. ఇవన్నీ మీరు మీ నోటితో పలికే మాటలు మాత్రమే! మరియు అల్లాహ్‌ సత్యం పలుకుతాడు మరియు ఆయన (ఋజు) మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.

33:5 – ادْعُوهُمْ لِآبَائِهِمْ هُوَ أَقْسَطُ عِندَ اللَّـهِ ۚ فَإِن لَّمْ تَعْلَمُوا آبَاءَهُمْ فَإِخْوَانُكُمْ فِي الدِّينِ وَمَوَالِيكُمْ ۚ وَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ فِيمَا أَخْطَأْتُم بِهِ وَلَـٰكِن مَّا تَعَمَّدَتْ قُلُوبُكُمْ ۚ وَكَانَ اللَّـهُ غَفُورًا رَّحِيمًا ٥

వారిని (మీ దత్తపిల్లలను), వారి (వాస్తవ) తండ్రుల పేర్లతోనే కలిపిపిలవండి. 2 అల్లాహ్‌ దృష్టిలో ఇదే న్యాయమైనది. ఒక వేళ వారి తండ్రులెవరో మీకు తెలియకపోతే, అపుడు వారు మీ ధార్మిక సోదరులు మరియు మీ స్నేహితులు. 3 మీరు ఈ విషయంలో (ఇంతవరకు) చేసిన పొర పాటు గురించి మీ కెలాంటి పాపంలేదు, కాని ఇక ముందు మీరు ఉద్దేశ్యపూర్వకంగా చేస్తే (పాపం) అవుతుంది. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

33:6 – النَّبِيُّ أَوْلَىٰ بِالْمُؤْمِنِينَ مِنْ أَنفُسِهِمْ ۖ وَأَزْوَاجُهُ أُمَّهَاتُهُمْ ۗ وَأُولُو الْأَرْحَامِ بَعْضُهُمْ أَوْلَىٰ بِبَعْضٍ فِي كِتَابِ اللَّـهِ مِنَ الْمُؤْمِنِينَ وَالْمُهَاجِرِينَ إِلَّا أَن تَفْعَلُوا إِلَىٰ أَوْلِيَائِكُم مَّعْرُوفًا ۚ كَانَ ذَٰلِكَ فِي الْكِتَابِ مَسْطُورًا ٦

విశ్వాసులకు (ముస్లింలకు), దైవప్రవక్త స్వయంగా తమకంటే కూడా ముఖ్యుడు. 4 మరియు అతని భార్యలు వారికి తల్లులు. 5 అల్లాహ్‌ గ్రంథం ప్రకారం రక్త సంబంధీకులు – ఇతర విశ్వాసుల మరియు వలస వచ్చిన వారి (ముహాజిరీన్‌) కంటే – ఒకరికొకరు ఎక్కువగా పరస్పర సంబంధం (హక్కులు) గలవారు. కాని! మీరు మీ స్నేహితులకు మేలు చేయగోరితే (అది వేరే విషయం)! 6 వాస్తవానికి ఇదంతా గ్రంథంలో వ్రాయబడి వుంది.

33:7 – وَإِذْ أَخَذْنَا مِنَ النَّبِيِّينَ مِيثَاقَهُمْ وَمِنكَ وَمِن نُّوحٍ وَإِبْرَاهِيمَ وَمُوسَىٰ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۖ وَأَخَذْنَا مِنْهُم مِّيثَاقًا غَلِيظًا ٧

మరియు (జ్ఞాపకముంచుకో) వాస్తవానికి మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసు కున్నాము మరియు నీతో (ఓ ముహమ్మద్‌), నూ’హ్‌తో, ఇబ్రాహీమ్‌తో, మూసాతో మరియు మర్యమ్‌ కుమారుడైన ‘ఈసాతో కూడా! మరియు మేము వారందరి నుండి గట్టివాగ్దానం తీసుకున్నాము. 7

33:8 – لِّيَسْأَلَ الصَّادِقِينَ عَن صِدْقِهِمْ ۚ وَأَعَدَّ لِلْكَافِرِينَ عَذَابًا أَلِيمًا ٨

ఇది సత్యవంతులను, వారి సత్యాన్ని గురించి ప్రశ్నించడానికి. మరియు ఆయన సత్య-తిరస్కారుల కొరకు బాధాకరమైన శిక్షను సిధ్ధపరచి ఉంచాడు. 8

33:9 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا نِعْمَةَ اللَّـهِ عَلَيْكُمْ إِذْ جَاءَتْكُمْ جُنُودٌ فَأَرْسَلْنَا عَلَيْهِمْ رِيحًا وَجُنُودًا لَّمْ تَرَوْهَا ۚ وَكَانَ اللَّـهُ بِمَا تَعْمَلُونَ بَصِيرًا ٩

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ మీకు చేసిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీపైకి సైన్యాలు (దండెత్తి) వచ్చినపుడు, మేము వారిపైకి ఒక తుఫానుగాలిని మరియు మీకు కనబడని సైన్యాలను పంపాము. 9 మరియు అల్లాహ్‌ మీరు చేసేదంతా చూస్తున్నాడు.

33:10 – إِذْ جَاءُوكُم مِّن فَوْقِكُمْ وَمِنْ أَسْفَلَ مِنكُمْ وَإِذْ زَاغَتِ الْأَبْصَارُ وَبَلَغَتِ الْقُلُوبُ الْحَنَاجِرَ وَتَظُنُّونَ بِاللَّـهِ الظُّنُونَا ١٠

వారు (మీ శత్రువులు) మీ మీదకు పైనుండి మరియు క్రింది నుండి (దండెత్తి) వచ్చినపుడు 10 మరియు మీ కళ్ళు (భయంతో) తిరిగిపోయి, మీ గుండెలుగొంతులోనికి వచ్చినపుడు మీరు అల్లాహ్‌ ను గురించి పలువిధాలుగా ఊహించసాగారు.

33:11 – هُنَالِكَ ابْتُلِيَ الْمُؤْمِنُونَ وَزُلْزِلُوا زِلْزَالًا شَدِيدًا ١١

అక్కడ (ఆ సమయంలో) విశ్వాసులు పరీక్షించబడ్డారు. మరియు దానితో వారు తీవ్రంగా కంపింపజేయబడ్డారు.

33:12 – وَإِذْ يَقُولُ الْمُنَافِقُونَ وَالَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ مَّا وَعَدَنَا اللَّـهُ وَرَسُولُهُ إِلَّا غُرُورًا ١٢

మరియు ఆ సమయంలో, కపట-విశ్వాసులు మరియు తమ హృదయాలలో రోగమున్న వారు: “అల్లాహ్‌ మరియు ఆయన సందేశహరుడు మాతో చేసిన వాగ్దానాలన్నీ బూటకాలు మాత్రమే!” అని అనసాగారు. 11

33:13 – وَإِذْ قَالَت طَّائِفَةٌ مِّنْهُمْ يَا أَهْلَ يَثْرِبَ لَا مُقَامَ لَكُمْ فَارْجِعُوا ۚ وَيَسْتَأْذِنُ فَرِيقٌ مِّنْهُمُ النَّبِيَّ يَقُولُونَ إِنَّ بُيُوتَنَا عَوْرَةٌ وَمَا هِيَ بِعَوْرَةٍ ۖ إِن يُرِيدُونَ إِلَّا فِرَارًا ١٣

అపుడు వారిలోని ఒక పక్షం వారు: “ఓ యస్‌’రిబ్‌ 12 (మదీనహ్ మునవ్వరహ్) ప్రజలారా! ఇక మీరు వీరిని (శత్రువులను) ఎదిరించలేరు. కనుక వెనుదిరగండి!” అని, అన్నారు. మరియు వారిలో మరొక వర్గంవారు, ప్రవక్తతో ఈ విధంగా పలుకుతూ (వెనుదిరిగి) పోవటానికి అనుమతి అడగసాగారు: “మా ఇండ్లు భద్రంగా లేవు.” 13 కాని వాస్తవానికి అవి భద్రంగానే ఉండెను. వారు కేవలం అక్కడి నుండి పారిపోదలచారు.

33:14 – وَلَوْ دُخِلَتْ عَلَيْهِم مِّنْ أَقْطَارِهَا ثُمَّ سُئِلُوا الْفِتْنَةَ لَآتَوْهَا وَمَا تَلَبَّثُوا بِهَا إِلَّا يَسِيرًا ١٤

ఒకవేళ నగరపు చుట్టుప్రక్కల నుండి శత్రువులు లోపలికి దూరి, వారిని విద్రోహచర్యలకు పాల్పడమని పిలిస్తే, వారు వెంటనే సమ్మతించే వారు, మరియు వారు దానికోసం ఏ మాత్రం ఆలస్యం చేసేవారు కాదు.

33:15 – وَلَقَدْ كَانُوا عَاهَدُوا اللَّـهَ مِن قَبْلُ لَا يُوَلُّونَ الْأَدْبَارَ ۚ وَكَانَ عَهْدُ اللَّـهِ مَسْئُولًا ١٥

వాస్తవానికి వారు ఇంతకు ముందు, తాము వెన్నుచూపి పారిపోమని, అల్లాహ్‌తో వాగ్దానం చేసి ఉన్నారు. మరియు అల్లాహ్‌తో చేసిన వాగ్దానం గురించి తప్పక ప్రశ్నించటం జరుగుతుంది.

33:16 – قُل لَّن يَنفَعَكُمُ الْفِرَارُ إِن فَرَرْتُم مِّنَ الْمَوْتِ أَوِ الْقَتْلِ وَإِذًا لَّا تُمَتَّعُونَ إِلَّا قَلِيلًا ١٦

వారితో ఇలా అను: “ఒకవేళ మీరు మర ణం నుండిగానీ, లేదా హత్యనుండిగానీ, పారిపో దలచుకుంటే! ఆ పారిపోవటం మీకు ఏ మాత్రం లాభదాయకం కాదు. అప్పుడు మీరు కేవలం కొంతకాలం మాత్రమే సుఖ-సంతోషాలు అనుభవిస్తారు!”

33:17 – قُلْ مَن ذَا الَّذِي يَعْصِمُكُم مِّنَ اللَّـهِ إِنْ أَرَادَ بِكُمْ سُوءًا أَوْ أَرَادَ بِكُمْ رَحْمَةً ۚ وَلَا يَجِدُونَ لَهُم مِّن دُونِ اللَّـهِ وَلِيًّا وَلَا نَصِيرًا ١٧

వారితో ఇంకా ఇలా అను: “ఒకవేళ అల్లాహ్‌ మీకు కీడుచేయదలిస్తే! లేదా కరుణించదలిస్తే! ఆయన నుండి మిమ్మల్ని తప్పించేవాడెవడు?” మరియు వారు అల్లాహ్‌ను వదలి ఇతరుణ్ణి ఎవడినీ సంరక్షకునిగా గానీ లేక సహాయకునిగా గానీ పొందలేరు. (7/8)

33:18 – قَدْ يَعْلَمُ اللَّـهُ الْمُعَوِّقِينَ مِنكُمْ وَالْقَائِلِينَ لِإِخْوَانِهِمْ هَلُمَّ إِلَيْنَا ۖ وَلَا يَأْتُونَ الْبَأْسَ إِلَّا قَلِيلً ١٨

  • వాస్తవానికి మీలో ఎవరు ఇతరులను (యుధ్ధం నుండి) ఆటంకపరుస్తూ ఉన్నారో మరియు తమ సోదరులతో: “మా వైపునకు రండి!” అని పలుకుతూ ఉన్నారో, అలాంటి వారందరి గురించి, అల్లాహ్‌కు బాగా తెలుసు. మరియు వారు మాత్రం యుద్ధంలో చాలా తక్కువగా పాల్గొనేవారు;

33:19 – أَشِحَّةً عَلَيْكُمْ ۖ فَإِذَا جَاءَ الْخَوْفُ رَأَيْتَهُمْ يَنظُرُونَ إِلَيْكَ تَدُورُ أَعْيُنُهُمْ كَالَّذِي يُغْشَىٰ عَلَيْهِ مِنَ الْمَوْتِ ۖ فَإِذَا ذَهَبَ الْخَوْفُ سَلَقُوكُم بِأَلْسِنَةٍ حِدَادٍ أَشِحَّةً عَلَى الْخَيْرِ ۚ أُولَـٰئِكَ لَمْ يُؤْمِنُوا فَأَحْبَطَ اللَّـهُ أَعْمَالَهُمْ ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّـهِ يَسِيرًا ١٩

(మీకు తోడ్పడే విషయంలో) వారు పరమ లోభులుగా ఉండేవారు. (ఓప్రవక్తా!) వారిపైకి ప్రమా దం వచ్చినపుడు వారు (నీ సహాయం కోరుతూ) మరణం ఆసన్నమైనవ్యక్తి కనుగ్రుడ్లు త్రిప్పే విధంగా నీ వైపుకు తిరిగి చూడటాన్ని, నీవు చూస్తావు. కాని ఆ ప్రమాదం తొలగిపోయిన వెంటనే, వారు లాభా లను పొందే ఉద్దేశంతో, కత్తెరవలే ఆడే నాలుకలతో మీతో బడాయీలు చెప్పుకుంటారు. అలాంటి వారు ఏమాత్రం విశ్వసించ లేదు. కావున, అల్లాహ్‌ వారి కర్మలను నిరర్థకంచేశాడు. మరియు ఇది అల్లాహ్‌కు ఎంతో సులభం.

33:20 – يَحْسَبُونَ الْأَحْزَابَ لَمْ يَذْهَبُوا ۖ وَإِن يَأْتِ الْأَحْزَابُ يَوَدُّوا لَوْ أَنَّهُم بَادُونَ فِي الْأَعْرَابِ يَسْأَلُونَ عَنْ أَنبَائِكُمْ ۖ وَلَوْ كَانُوا فِيكُم مَّا قَاتَلُوا إِلَّا قَلِيلًا ٢٠

దాడిచేసిన వర్గాలు ఇంకావెళ్ళిపోలేదు అనే వారు భావిస్తున్నారు. ఒకవేళ ఆవర్గాలు తిరిగి మళ్ళీదాడిచేస్తే! ఎడారివాసులతో (బద్దూ లతో) 14 కలిసినివసించి అక్కడినుండి మీ వృత్తాం తా లను తెలుసుకుంటే బాగుండేది కదా! అని అనుకుంటారు. ఒకవేళ వారు మీతోపాటు ఉన్నా చాలా తక్కువగా యుద్ధంలో పాల్గొని ఉండేవారు.

33:21 – لَّقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّـهِ أُسْوَةٌ حَسَنَةٌ لِّمَن كَانَ يَرْجُو اللَّـهَ وَالْيَوْمَ الْآخِرَ وَذَكَرَ اللَّـهَ كَثِيرًا ٢١

వాస్తవానికి, అల్లాహ్‌ యొక్క సందేశ హరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది, వారి కొరకు ఎవరైతే అల్లాహ్‌ మరియు అంతిమదినాన్ని ఆశిస్తారో మరియు అల్లాహ్‌ను అత్యధికంగా స్మరిస్తారో!

33:22 – وَلَمَّا رَأَى الْمُؤْمِنُونَ الْأَحْزَابَ قَالُوا هَـٰذَا مَا وَعَدَنَا اللَّـهُ وَرَسُولُهُ وَصَدَقَ اللَّـهُ وَرَسُولُهُ ۚ وَمَا زَادَهُمْ إِلَّا إِيمَانًا وَتَسْلِيمًا ٢٢

మరియు విశ్వాసులు, దాడిచేసిన వర్గాల వారిని చూసినపుడు ఇలా పలికారు: “అల్లాహ్‌ మరియు ఆయన సందేశహరుడు సత్యం పలి కారు.” ఇది వారి విశ్వాసాన్ని మరియు అల్లాహ్‌ పట్ల వారి విధేయతను మరింత అధికమే చేసింది.

33:23 – مِّنَ الْمُؤْمِنِينَ رِجَالٌ صَدَقُوا مَا عَاهَدُوا اللَّـهَ عَلَيْهِ ۖ فَمِنْهُم مَّن قَضَىٰ نَحْبَهُ وَمِنْهُم مَّن يَنتَظِرُ ۖ وَمَا بَدَّلُوا تَبْدِيلً ٢٣

విశ్వాసులలో అల్లాహ్‌కు తాము చేసిన ఒప్పందం నిజంచేసిచూపినవారుకూడా ఉన్నారు. వారిలో కొందరు తమ శపథాన్ని పూర్తిచేసుకున్న వారున్నారు. మరికొందరు దానిని పూర్తిచేసు కోవటానికి నిరీక్షిస్తున్నారు. మరియు వారు తమ వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు.

33:24 – لِّيَجْزِيَ اللَّـهُ الصَّادِقِينَ بِصِدْقِهِمْ وَيُعَذِّبَ الْمُنَافِقِينَ إِن شَاءَ أَوْ يَتُوبَ عَلَيْهِمْ ۚ إِنَّ اللَّـهَ كَانَ غَفُورًا رَّحِيمًا ٢٤

అల్లాహ్‌, సత్యవంతులకు వారి సత్యానికి ప్రతిఫలం నొసంగటానికి మరియు కపట-విశ్వాసులకు తాను కోరితే శిక్ష విధించటానికి లేదా వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించటానికి ఇలా చేశాడు. 15 నిశ్చయంగా అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

33:25 – وَرَدَّ اللَّـهُ الَّذِينَ كَفَرُوا بِغَيْظِهِمْ لَمْ يَنَالُوا خَيْرًا ۚ وَكَفَى اللَّـهُ الْمُؤْمِنِينَ الْقِتَالَ ۚ وَكَانَ اللَّـهُ قَوِيًّا عَزِيزًا ٢٥

మరియు అల్లాహ్‌ అవిశ్వాసులను వారి క్రోధావేశంతోనే – వారికెలాంటి మేలు లభింప జేయకుండా – వెనుకకు మరలించాడు. యుధ్ధ రంగంలో విశ్వాసులకు అల్లాహ్‌యే (సహాయ కునిగా) మిగిలాడు. వాస్తవంగా అల్లాహ్‌ మహా బలవంతుడు. సర్వ శక్తిమంతుడు.

33:26 – وَأَنزَلَ الَّذِينَ ظَاهَرُوهُم مِّنْ أَهْلِ الْكِتَابِ مِن صَيَاصِيهِمْ وَقَذَفَ فِي قُلُوبِهِمُ الرُّعْبَ فَرِيقًا تَقْتُلُونَ وَتَأْسِرُونَ فَرِيقًا ٢٦

మరియు గ్రంథప్రజలలో నుండి వారికి (అవిశ్వాసులకు యుధ్ధంలో) తోడ్పడిన వారిని ఆయన (అల్లాహ్‌) వారి కోటల నుండి క్రిందికి తీసుకువచ్చాడు. 16 మరియు వారి హృదయా లలో భీతిని ప్రవేశింపజేశాడు. వారిలో కొందరిని మీరు చంపుతున్నారు, మరికొందరిని ఖైదీలుగా చేసుకుంటున్నారు.

33:27 – وَأَوْرَثَكُمْ أَرْضَهُمْ وَدِيَارَهُمْ وَأَمْوَالَهُمْ وَأَرْضًا لَّمْ تَطَئُوهَا ۚ وَكَانَ اللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرًا ٢٧

మరియు ఆయన (అల్లాహ్‌) వారి భూమికి, వారి ఇండ్లకు మరియు వారి ఆస్తులకు మిమ్మల్ని వారసులుగాచేశాడు. మరియు మీరు ఎన్నడూ అడుగుమోపని భూమికి కూడా, (మిమ్మల్ని వారసులు గాచేశాడు). 17 మరియు వాస్తవంగా అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.

33:28 – يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّأَزْوَاجِكَ إِن كُنتُنَّ تُرِدْنَ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا فَتَعَالَيْنَ أُمَتِّعْكُنَّ وَأُسَرِّحْكُنَّ سَرَاحًا جَمِيلً ٢٨

ఓ ప్రవక్తా! నీవు నీ భార్యలతో ఇలా అను: ‘ఒకవేళ మీరు ప్రాపంచిక జీవితాన్ని మరియు దానిశోభను కోరుతున్నట్లైతే, రండి, నేను మీకు తప్పక జీవనసామాగ్రినిచ్చి, మిమ్మల్ని మంచి పద్ధతిలో విడిచిపెడతాను. 18

33:29 – وَإِن كُنتُنَّ تُرِدْنَ اللَّـهَ وَرَسُولَهُ وَالدَّارَ الْآخِرَةَ فَإِنَّ اللَّـهَ أَعَدَّ لِلْمُحْسِنَاتِ مِنكُنَّ أَجْرًا عَظِيمًا ٢٩

“కాని ఒకవేళ మీరు అల్లాహ్‌ను మరియు ఆయన సందేశహరుణ్ణి మరియు పరలోక గృహాన్ని కోరుతున్నట్లైతే, నిశ్చయంగా, అల్లాహ్‌ మీలో సజ్జనులైనవారికి గొప్ప ప్రతిఫలాన్ని సిధ్ధరచి ఉంచాడు.”

33:30 – يَا نِسَاءَ النَّبِيِّ مَن يَأْتِ مِنكُنَّ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ يُضَاعَفْ لَهَا الْعَذَابُ ضِعْفَيْنِ ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّـهِ يَسِيرًا ٣٠

ఓ ప్రవక్త స్త్రీలారా! మీలో ఎవరైనా స్పష్టంగా అనుచితమైనపనికి పాల్పడితే ఆమెకు రెట్టింపు శిక్ష విధించబడుతుంది. 19 మరియు వాస్తవంగా, ఇది అల్లాహ్‌కు ఎంతో సులభం.

33:31 – وَمَن يَقْنُتْ مِنكُنَّ لِلَّـهِ وَرَسُولِهِ وَتَعْمَلْ صَالِحًا نُّؤْتِهَا أَجْرَهَا مَرَّتَيْنِ وَأَعْتَدْنَا لَهَا رِزْقًا كَرِيمًا ٣١

[(*)] మరియు మీలో ఏస్త్రీ అయితే అల్లాహ్‌కు మరియు ఆయన సందేశహరునికి విధేయురాలై ఉండి సత్కార్యాలు చేస్తుందో, ఆమెకు మేము రెట్టింపు ప్రతిఫల మిస్తాము మరియు ఆమె కొరకు గౌరవ ప్రదమైన జీవనోపాధిని సిధ్ధపరచి ఉంచాము. 20

33:32 – يَا نِسَاءَ النَّبِيِّ لَسْتُنَّ كَأَحَدٍ مِّنَ النِّسَاءِ ۚ إِنِ اتَّقَيْتُنَّ فَلَا تَخْضَعْنَ بِالْقَوْلِ فَيَطْمَعَ الَّذِي فِي قَلْبِهِ مَرَضٌ وَقُلْنَ قَوْلًا مَّعْرُوفًا ٣٢

ఓ ప్రవక్త భార్యలారా! మీరు సాధారణస్త్రీల వంటివారు కారు. మీరు దైవభీతి గలవారైతే మీరు మెత్తని స్వరంతో మాట్లాడకండి. ఎందుకంటే! దానితో తన హృదయంలో రోగమున్నవానికి దుర్బుధ్ధి పుట్టవచ్చు. కావున మీరు స్పష్టంగా, సూటిగానే మాట్లాడండి.

33:33 – وَقَرْنَ فِي بُيُوتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْأُولَىٰ ۖ وَأَقِمْنَ الصَّلَاةَ وَآتِينَ الزَّكَاةَ وَأَطِعْنَ اللَّـهَ وَرَسُولَهُ ۚ إِنَّمَا يُرِيدُ اللَّـهُ لِيُذْهِبَ عَنكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيرًا ٣٣

మరియు మీరు మీ ఇండ్లలోనే ఉండండి మరియు పూర్వపు అజ్ఞానకాలంలో అలంకరణను ప్రదర్శిస్తూ తిరిగినట్లు తిరగకండి. 21 మరియు నమా’జ్‌ స్థాపించండి మరియు విధిదానం (‘జకాత్‌) ఇవ్వండి మరియు అల్లాహ్‌కు ఆయన సందేశ హరునికి విధేయులై ఉండండి. (ఓ ప్రవక్త) గృహిణులారా! 22 నిశ్చయంగా, అల్లాహ్‌ మీ నుండి మాలిన్యాన్ని తొలగించి, మిమ్మల్ని పరిశుధ్ధులుగా చేయగోరుతున్నాడు.

33:34 – وَاذْكُرْنَ مَا يُتْلَىٰ فِي بُيُوتِكُنَّ مِنْ آيَاتِ اللَّـهِ وَالْحِكْمَةِ ۚ إِنَّ اللَّـهَ كَانَ لَطِيفًا خَبِيرًا ٣٤

మరియు మీ ఇండ్లలో వినిపించబడే అల్లాహ్‌ ఆయతులను మరియు జ్ఞానవిషయా లను (‘హదీస్‌’లను) స్మరిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ అత్యంత సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు. 23

33:35 – إِنَّ الْمُسْلِمِينَ وَالْمُسْلِمَاتِ وَالْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ وَالْقَانِتِينَ وَالْقَانِتَاتِ وَالصَّادِقِينَ وَالصَّادِقَاتِ وَالصَّابِرِينَ وَالصَّابِرَاتِ وَالْخَاشِعِينَ وَالْخَاشِعَاتِ وَالْمُتَصَدِّقِينَ وَالْمُتَصَدِّقَاتِ وَالصَّائِمِينَ وَالصَّائِمَاتِ وَالْحَافِظِينَ فُرُوجَهُمْ وَالْحَافِظَاتِ وَالذَّاكِرِينَ اللَّـهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّـهُ لَهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا ٣٥

నిశ్చయంగా ముస్లింపురుషులు (అల్లాహ్‌కు విధేయులైన) పురుషులు మరియు ముస్లిం స్త్రీలు; విశ్వాసులైన (ము’మిన్‌) పురుషులు మరియు విశ్వాసులైన (ము’మిన్‌) స్త్రీలు; భక్తిపరులైన పురుషులు మరియు భక్తిపరులైన స్త్రీలు; సత్య వంతులైన పురుషులు మరియు సత్యవంతులైన స్త్రీలు; ఓర్పుగల పురుషులు మరియు ఓర్పుగల స్త్రీలు; వినమ్రతగల పురుషులు మరియు వినమ్రతగల స్త్రీలు; దానశీలురైన పురుషులు మరియు దానశీలురైన స్త్రీలు; ఉపవాసాలు 24 ఉండే పురుషులు మరియు ఉపవాసాలు ఉండే స్త్రీలు; తమ మర్మాంగాలను కాపాడుకునే పురుషులు మరియు (తమ మర్మాంగాలను) కాపాడుకునే స్త్రీలు; 25

33:36 – وَمَا كَانَ لِمُؤْمِنٍ وَلَا مُؤْمِنَةٍ إِذَا قَضَى اللَّـهُ وَرَسُولُهُ أَمْرًا أَن يَكُونَ لَهُمُ الْخِيَرَةُ مِنْ أَمْرِهِمْ ۗ وَمَن يَعْصِ اللَّـهَ وَرَسُولَهُ فَقَدْ ضَلَّ ضَلَالًا مُّبِينًا ٣٦

మరియు అల్లాహ్‌ మరియు ఆయన సందేశ హరుడు, ఒక విషయంలో నిర్ణయం తీసుకున్న ప్పుడు, విశ్వసించిన పురుషునికిగానీ లేక విశ్వసించిన స్త్రీకిగానీ ఆ విషయంలో మరొక నిర్ణయం తీసుకునేహక్కు లేదు. 26 మరియు ఎవడైతే అల్లాహ్‌ మరియు ఆయన సందేశ హరునికి అవిధేయుడవుతాడో వాస్తవంగా అతడు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడిఉన్నట్లే!

33:37 – وَإِذْ تَقُولُ لِلَّذِي أَنْعَمَ اللَّـهُ عَلَيْهِ وَأَنْعَمْتَ عَلَيْهِ أَمْسِكْ عَلَيْكَ زَوْجَكَ وَاتَّقِ اللَّـهَ وَتُخْفِي فِي نَفْسِكَ مَا اللَّـهُ مُبْدِيهِ وَتَخْشَى النَّاسَ وَاللَّـهُ أَحَقُّ أَن تَخْشَاهُ ۖ فَلَمَّا قَضَىٰ زَيْدٌ مِّنْهَا وَطَرًا زَوَّجْنَاكَهَا لِكَيْ لَا يَكُونَ عَلَى الْمُؤْمِنِينَ حَرَجٌ فِي أَزْوَاجِ أَدْعِيَائِهِمْ إِذَا قَضَوْا مِنْهُنَّ وَطَرًا ۚ وَكَانَ أَمْرُ اللَّـهِ مَفْعُولًا ٣٧

మరియు (ఓ ప్రవక్తా జ్ఞాపకంచేసుకో!) అల్లాహ్‌ అనుగ్రహించిన మరియు నీవు అనుగ్ర హించిన వ్యక్తితో 27 నీవు: “నీ భార్యను ఉండ నివ్వు (విడిచిపెట్టకు) మరియు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండు.” అని అన్నప్పుడు; నీవు అల్లాహ్‌ బయటపెట్ట దలచిన విషయాన్ని, నీ మనస్సులో దాచి ఉంచావు. నీవు ప్రజలకు భయపడ్డావు, వాస్తవానికి నీవు అల్లాహ్‌కు భయపడటమే చాలా ఉత్తమమైనది. ‘జైద్‌, ఆమెతో తన సంబంధాన్ని తన ఇచ్చానుసారంగా త్రెంపుకున్న తరువాతనే, మేము ఆమె వివాహం నీతో జరిపించాము. విశ్వాసులకు తమ దత్త- పుత్రుల భార్యలతో పెండ్లి చేసుకోవటంలో – వారు తమ భార్యల నుండి తమ ఇష్టానుసారంగా తమ సంబంధం త్రెంపుకొన్నప్పుడు – ఏ విధమైన దోషం లేదు. వాస్తవానికి అల్లాహ్‌ ఆదేశం తప్పక అమలులోకి రావలసిందే!

33:38 – مَّا كَانَ عَلَى النَّبِيِّ مِنْ حَرَجٍ فِيمَا فَرَضَ اللَّـهُ لَهُ ۖ سُنَّةَ اللَّـهِ فِي الَّذِينَ خَلَوْا مِن قَبْلُ ۚ وَكَانَ أَمْرُ اللَّـهِ قَدَرًا مَّقْدُورًا ٣٨

అల్లాహ్‌ తన కొరకు ధర్మసమ్మతం చేసిన దానిని ప్రవక్త పూర్తిచేస్తే, అతనిపై ఎలాంటి నిందలేదు, ఇంతకు పూర్వం గతించిన వారి విషయంలో కూడ అల్లాహ్‌ సంప్రదాయం ఇదే. మరియు అల్లాహ్‌ ఆజ్ఞ, నిర్దేశింపబడిన (తిరుగులేని) శాసనం;

33:39 – الَّذِينَ يُبَلِّغُونَ رِسَالَاتِ اللَّـهِ وَيَخْشَوْنَهُ وَلَا يَخْشَوْنَ أَحَدًا إِلَّا اللَّـهَ ۗ وَكَفَىٰ بِاللَّـهِ حَسِيبًا ٣٩

వారికి, ఎవరైతే అల్లాహ్‌ సందేశాలను అంద జేస్తారో మరియు కేవలం ఆయనకే భయపడతారో మరియు అల్లాహ్‌కు తప్ప మరెవ్వరికీ భయపడరో! మరియు లెక్క తీసుకోవటానికి కేవలం అల్లాహ్‌యే చాలు!

33:40 – مَّا كَانَ مُحَمَّدٌ أَبَا أَحَدٍ مِّن رِّجَالِكُمْ وَلَـٰكِن رَّسُولَ اللَّـهِ وَخَاتَمَ النَّبِيِّينَ ۗ وَكَانَ اللَّـهُ بِكُلِّ شَيْءٍ عَلِيمًا ٤٠

(ఓ మానవులారా!) ము’హమ్మద్‌ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రికాడు. 28 కాని అతను అల్లాహ్‌ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరి వాడు. 29 మరియు వాస్తవానికి అల్లాహ్‌యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు.

33:41 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا اللَّـهَ ذِكْرًا كَثِيرًا ٤١

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ను (ఏకాగ్ర చిత్తంతో) అత్యధికంగా స్మరించండి.

33:42 – وَسَبِّحُوهُ بُكْرَةً وَأَصِيلًا ٤٢

మరియు ఉదయం మరియు సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండండి.

33:43 – هُوَ الَّذِي يُصَلِّي عَلَيْكُمْ وَمَلَائِكَتُهُ لِيُخْرِجَكُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۚ وَكَانَ بِالْمُؤْمِنِينَ رَحِيمًا ٤٣

ఆయన మీపై ఆశీర్వాదాలు (‘సలాత్‌) పంపుతూ ఉంటాడు మరియు ఆయన దూతలు మిమ్మల్ని అంధకారం నుండి వెలుగులోకి తీసుకు రావటానికి (ఆయనను ప్రార్థిస్తూ ఉంటారు). మరియు ఆయన విశ్వాసుల పట్ల అపార కరుణాప్రదాత.

33:44 – تَحِيَّتُهُمْ يَوْمَ يَلْقَوْنَهُ سَلَامٌ ۚ وَأَعَدَّ لَهُمْ أَجْرًا كَرِيمًا ٤٤

వారు ఆయనను కలుసుకునే రోజున వారికి: “మీకు శాంతి కలుగుగాక (సలాం)!” అనే అభినందనలతో స్వాగతం లభిస్తుంది. 30 మరియు ఆయన వారి కొరకు గౌరవప్రదమైన ప్రతిఫలం సిధ్ధపరచి ఉంచాడు.

33:45 – يَا أَيُّهَا النَّبِيُّ إِنَّا أَرْسَلْنَاكَ شَاهِدًا وَمُبَشِّرًا وَنَذِيرًا ٤٥

ఓ ప్రవక్తా! నిశ్చయంగా మేము, నిన్ను సాక్షిగా, శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరిక చేసే వానిగా పంపాము!

33:46 – وَدَاعِيًا إِلَى اللَّـهِ بِإِذْنِهِ وَسِرَاجًا مُّنِيرًا ٤٦

మరియు ఆయన అనుమతితో, అల్లాహ్‌ వైపునకు పిలిచేవానిగా మరియు ప్రకాశించే దీపంగానూ (చేసి పంపాము)!

33:47 – وَبَشِّرِ الْمُؤْمِنِينَ بِأَنَّ لَهُم مِّنَ اللَّـهِ فَضْلًا كَبِيرًا ٤٧

మరియు నిశ్చయంగా, వారిమీద అల్లాహ్‌ యొక్క గొప్ప అనుగ్రహం ఉందనే శుభవార్తను విశ్వాసులకు ఇవ్వు.

33:48 – وَلَا تُطِعِ الْكَافِرِينَ وَالْمُنَافِقِينَ وَدَعْ أَذَاهُمْ وَتَوَكَّلْ عَلَى اللَّـهِ ۚ وَكَفَىٰ بِاللَّـهِ وَكِيلً ٤٨

మరియు నీవు సత్య-తిరస్కారుల మరియు కపటవిశ్వాసుల మాటలకు లోబడకు మరియు వారి వేధింపులను లక్ష్యపెట్టకు మరియు కేవలం అల్లాహ్‌నే నమ్ముకో. మరియు కార్యకర్తగా కేవలం అల్లాహ్‌యే చాలు!

33:49 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نَكَحْتُمُ الْمُؤْمِنَاتِ ثُمَّ طَلَّقْتُمُوهُنَّ مِن قَبْلِ أَن تَمَسُّوهُنَّ فَمَا لَكُمْ عَلَيْهِنَّ مِنْ عِدَّةٍ تَعْتَدُّونَهَا ۖ فَمَتِّعُوهُنَّ وَسَرِّحُوهُنَّ سَرَاحًا جَمِيلًا ٤٩

ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసినులైన స్త్రీలను వివాహమాడి, తరువాత – మీరు వారిని తాకకపూర్వమే – వారికి విడాకులిచ్చినట్లైతే, మీ కొరకు వేచివుండే వ్యవధి (‘ఇద్దత్‌) పూర్తిచేయమని అడిగే హక్కు మీకు వారిపై లేదు. 31 కనుక వారికి పారితోషికం ఇచ్చి, మంచితనంతో వారిని సాగనంపండి. 32

33:50 – يَا أَيُّهَا النَّبِيُّ إِنَّا أَحْلَلْنَا لَكَ أَزْوَاجَكَ اللَّاتِي آتَيْتَ أُجُورَهُنَّ وَمَا مَلَكَتْ يَمِينُكَ مِمَّا أَفَاءَ اللَّـهُ عَلَيْكَ وَبَنَاتِ عَمِّكَ وَبَنَاتِ عَمَّاتِكَ وَبَنَاتِ خَالِكَ وَبَنَاتِ خَالَاتِكَ اللَّاتِي هَاجَرْنَ مَعَكَ وَامْرَأَةً مُّؤْمِنَةً إِن وَهَبَتْ نَفْسَهَا لِلنَّبِيِّ إِنْ أَرَادَ النَّبِيُّ أَن يَسْتَنكِحَهَا خَالِصَةً لَّكَ مِن دُونِ الْمُؤْمِنِينَ ۗ قَدْ عَلِمْنَا مَا فَرَضْنَا عَلَيْهِمْ فِي أَزْوَاجِهِمْ وَمَا مَلَكَتْ أَيْمَانُهُمْ لِكَيْلَا يَكُونَ عَلَيْكَ حَرَجٌ ۗ وَكَانَ اللَّـهُ غَفُورًا رَّحِيمًا ٥٠

ఓ ప్రవక్తా! నిశ్చయంగా, మేము నీకు: నీవు మహ్ర్‌ (వధుకట్నం) చెల్లించిన నీ భార్యలను 33 మరియు అల్లాహ్‌ ప్రసాదించిన (బానిస) స్త్రీలనుండి నీ ఆధీనంలోకి వచ్చిన వారిని (స్త్రీలను) 34 మరియు నీతోపాటు వలస వచ్చిన నీ పినతండ్రి (తండ్రి-సోదరుల) కుమార్తెలను మరియు నీ మేనత్తల (తండ్రి-సోదరీమణుల) కుమార్తెలను మరియు నీ మేనమామల (తల్లి-సోదరుల) కుమార్తెలను మరియు నీ పినతల్లుల (తల్లి-సోదరీమణుల) కుమార్తెలను; మరియు తనను తాను ప్రవక్తకు సమర్పించుకున్న విశ్వాసిని అయిన స్త్రీని – ఒక వేళ ప్రవక్త ఆమెను వివాహం చేసుకోదలిస్తే ఇతర విశ్వాసుల కొరకు గాక ప్రత్యేకంగా నీ కొరకే – ధర్మసమ్మతం చేశాము. వాస్తవానికి వారి (ఇతర విశ్వాసుల) కొరకు, వారి భార్యల విషయంలో మరియు వారి బానిసల విషయంలో, మేము విధించిన పరిమితులు మాకు బాగా తెలుసు. 35 ఇదంతా మేము నీకు ఏవిధమైన ఇబ్బంది కలుగకుండా ఉండాలని చేశాము. వాస్తవానికి అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. (1/8)

33:51 – تُرْجِي مَن تَشَاءُ مِنْهُنَّ وَتُؤْوِي إِلَيْكَ مَن تَشَاءُ ۖ وَمَنِ ابْتَغَيْتَ مِمَّنْ عَزَلْتَ فَلَا جُنَاحَ عَلَيْكَ ۚ ذَٰلِكَ أَدْنَىٰ أَن تَقَرَّ أَعْيُنُهُنَّ وَلَا يَحْزَنَّ وَيَرْضَيْنَ بِمَا آتَيْتَهُنَّ كُلُّهُنَّ ۚ وَاللَّـهُ يَعْلَمُ مَا فِي قُلُوبِكُمْ ۚ وَكَانَ اللَّـهُ عَلِيمًا حَلِيمًا ٥١

  • నీవు వారిలో (నీ భార్యలలో) నుండి, నీవు కోరిన ఆమెను నీ నుండి కొంతకాలం వేరుగా ఉంచవచ్చు. మరియు నీవు కోరిన ఆమెను నీతో పాటు ఉండనివ్వవచ్చు. మరియు నీవు వేరుగా ఉంచిన వారిలో నుండి ఏ స్త్రీనైనా నీవు తిరిగి పిలుచుకోగోరితే, నీపై ఎలాంటి దోషంలేదు. దీనితో వారి కళ్లకు చల్లదనం కలుగుతుందని, వారు దుఃఖపడరనీ నీవు వారికి ఏమి ఇచ్చినా, వారు సంతోషపడుతారని ఆశించవచ్చు! వాస్తవానికి మీ హృదయాలలో ఏముందో అల్లాహ్‌కు తెలుసు. 36 మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, శాంత స్వభావుడు (సహనశీలుడు).

33:52 – لَّا يَحِلُّ لَكَ النِّسَاءُ مِن بَعْدُ وَلَا أَن تَبَدَّلَ بِهِنَّ مِنْ أَزْوَاجٍ وَلَوْ أَعْجَبَكَ حُسْنُهُنَّ إِلَّا مَا مَلَكَتْ يَمِينُكَ ۗ وَكَانَ اللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ رَّقِيبًا ٥٢

వీరుగాక, ఇతరస్త్రీలు నీకు (వివాహ మాడటానికి) ధర్మసమ్మతంకారు. 37 వీరికి బదులుగా కూడా మరెవ్వరినీ భార్యలుగా తీసుకునే అనుమతి కూడా నీకు లేదు – వారి సౌందర్యం నీకు ఎంతనచ్చినా – నీ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలు తప్ప! 38 వాస్తవానికి అల్లాహ్‌ ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు.

33:53 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَدْخُلُوا بُيُوتَ النَّبِيِّ إِلَّا أَن يُؤْذَنَ لَكُمْ إِلَىٰ طَعَامٍ غَيْرَ نَاظِرِينَ إِنَاهُ وَلَـٰكِنْ إِذَا دُعِيتُمْ فَادْخُلُوا فَإِذَا طَعِمْتُمْ فَانتَشِرُوا وَلَا مُسْتَأْنِسِينَ لِحَدِيثٍ ۚ إِنَّ ذَٰلِكُمْ كَانَ يُؤْذِي النَّبِيَّ فَيَسْتَحْيِي مِنكُمْ ۖ وَاللَّـهُ لَا يَسْتَحْيِي مِنَ الْحَقِّ ۚ وَإِذَا سَأَلْتُمُوهُنَّ مَتَاعًا فَاسْأَلُوهُنَّ مِن وَرَاءِ حِجَابٍ ۚ ذَٰلِكُمْ أَطْهَرُ لِقُلُوبِكُمْ وَقُلُوبِهِنَّ ۚ وَمَا كَانَ لَكُمْ أَن تُؤْذُوا رَسُولَ اللَّـهِ وَلَا أَن تَنكِحُوا أَزْوَاجَهُ مِن بَعْدِهِ أَبَدًا ۚ إِنَّ ذَٰلِكُمْ كَانَ عِندَ اللَّـهِ عَظِيمًا ٥٣

ఓ విశ్వాసులారా! ప్రవక్తయొక్క ఇండ్లలోకి అనుమతి లేకుండా ప్రవేశించకండి. భోజనార్థం (పిలువబడినపుడు) ఆహారం సిధ్ధపరిచే సమయం కొరకు వేచిఉండకండి, కాని మీరు పిలువబడినప్పుడు తప్ప కుండా వెళ్ళండి. అయితే భోజనం చేసిన వెంటనే వెళ్ళిపొండి మరియు సాధారణ సంభాషణలో కాలక్షేపంచేస్తూ కూర్చోకండి. నిశ్చయంగా, దీనివలన ప్రవక్తకు కష్టం కలుగుతుంది; కాని అతను మిమ్మల్ని (పొమ్మన టానికి) సంకోచిస్తాడు. మరియు అల్లాహ్‌ సత్యం చెప్పటానికి సంకోచించడు (సిగ్గుపడడు). 39 మరియు మీరు ప్రవక్త భార్యలతో ఏదైనా అడగ వలసి వచ్చినప్పుడు తెరచాటునుండి అడగండి. ఇది మీ హృదయాలను మరియు వారి హృదయాలను కూడా నిర్మలంగా ఉంచుతుంది. మరియు అల్లాహ్‌ సందేశహరునికి కష్టం కలిగించటం మీకు తగదు. మరియు అతని తరువాత అతని భార్యలతో మీరు ఎన్నటికీ వివాహం చేసుకోకండి. నిశ్చయంగా, ఇది అల్లాహ్‌ దృష్టిలో మహా అపరాధం.

33:54 – إِن تُبْدُوا شَيْئًا أَوْ تُخْفُوهُ فَإِنَّ اللَّـهَ كَانَ بِكُلِّ شَيْءٍ عَلِيمًا ٥٤

ఒకవేళ మీరు ఏ విషయాన్నైనా వెలి బుచ్చినా లేదా దానిని దాచినా! నిశ్చయంగా అల్లాహ్‌ కు మాత్రం ప్రతివిషయం గురించి బాగా తెలుసు.

33:55 – لَّا جُنَاحَ عَلَيْهِنَّ فِي آبَائِهِنَّ وَلَا أَبْنَائِهِنَّ وَلَا إِخْوَانِهِنَّ وَلَا أَبْنَاءِ إِخْوَانِهِنَّ وَلَا أَبْنَاءِ أَخَوَاتِهِنَّ وَلَا نِسَائِهِنَّ وَلَا مَا مَلَكَتْ أَيْمَانُهُنَّ ۗ وَاتَّقِينَ اللَّـهَ ۚ إِنَّ اللَّـهَ كَانَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدًا ٥٥

వారిపై (ప్రవక్త భార్యలపై) – తమ తండ్రుల, తమ కుమారుల, తమ సోదరుల, తమ సోదరుల -కుమారుల, తమ సోదరీమణుల-కుమారుల, తమస్త్రీల లేదా తమబానిస (స్త్రీల) – యెదుటకు వస్తే ఎలాంటి దోషంలేదు. 40 (ఓ స్త్రీలారా!) మీరు అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రతీ దానికి సాక్షి;

33:56 – إِنَّ اللَّـهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا ٥٦

నిశ్చయంగా, అల్లాహ్‌ మరియు ఆయన దూతలు ప్రవక్తపై దురూద్‌లు పంపుతూఉంటారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దురూద్‌లు మరియు మీ హృదయపూర్వక సలాంలు పంపుతూ ఉండండి.

33:57 – إِنَّ الَّذِينَ يُؤْذُونَ اللَّـهَ وَرَسُولَهُ لَعَنَهُمُ اللَّـهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَأَعَدَّ لَهُمْ عَذَابًا مُّهِينًا ٥٧

నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్‌ మరియు ఆయన సందేశహరునికి బాధ కలిగిస్తారో, వారిని అల్లాహ్‌ ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా శపిస్తాడు (బహిష్కరిస్తాడు) మరియు ఆయన వారికై అవమాన కరమైన శిక్షను సిధ్ధపరచి ఉంచాడు. 42

33:58 – وَالَّذِينَ يُؤْذُونَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ بِغَيْرِ مَا اكْتَسَبُوا فَقَدِ احْتَمَلُوا بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا ٥٨

మరియు ఎవరైతే, ఏ తప్పూచేయని, విశ్వాసులైన పురుషులకు మరియు స్త్రీలకు బాధ కలిగిస్తారో, వాస్తవానికి వారు అపనిందను మరియు స్పష్టమైన పాపభారాన్ని తమ మీద మోపుకున్నట్లే!

33:59 – يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّأَزْوَاجِكَ وَبَنَاتِكَ وَنِسَاءِ الْمُؤْمِنِينَ يُدْنِينَ عَلَيْهِنَّ مِن جَلَابِيبِهِنَّ ۚ ذَٰلِكَ أَدْنَىٰ أَن يُعْرَفْنَ فَلَا يُؤْذَيْنَ ۗ وَكَانَ اللَّـهُ غَفُورًا رَّحِيمًا ٥٩

ఓ ప్రవక్తా! నీ భార్యలతో, నీ కుమార్తెలతో మరియు విశ్వాసినులైన స్త్రీలతోనూ తమ దుప్పట్లను తమమీద పూర్తిగా కప్పుకోమని చెప్పు. ఇది వారు గుర్తించబడి బాధింపబడకుండా ఉండటానికి ఎంతో సముచితమైనది. 43 మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు అపార కరుణాప్రదాత.(1/4)

33:60 – لَّئِن لَّمْ يَنتَهِ الْمُنَافِقُونَ وَالَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ وَالْمُرْجِفُونَ فِي الْمَدِينَةِ لَنُغْرِيَنَّكَ بِهِمْ ثُمَّ لَا يُجَاوِرُونَكَ فِيهَا إِلَّا قَلِيلًا ٦٠

  • ఒకవేళ ఈ కపటవిశ్వాసులు మరియు తమ హృదయాలలో రోగం (కలుషితం) ఉన్నవారు మరియు మదీనహ్ లో వదంతులు వ్యాపింపజేసే వారు. తమ (దుశ్చేష్టలను) మానుకోకపోతే మేము తప్పక నీకు వారిపై ఆధిక్యత నొసంగుతాము. ఆ తరువాత వారు ఈ నగరంలో నీ పొరుగువారిగా కొన్నాళ్ళ కంటే ఎక్కువ ఉండలేరు.

33:61 – مَّلْعُونِينَ ۖ أَيْنَمَا ثُقِفُوا أُخِذُوا وَقُتِّلُوا تَقْتِيلًا ٦١

వారు శపించబడ్డవారు (బహిష్కరించ బడ్డ వారు). వారు ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకో బడతారు మరియు వారు దారుణంగా చంపబడతారు. 44

33:62 – سُنَّةَ اللَّـهِ فِي الَّذِينَ خَلَوْا مِن قَبْلُ ۖ وَلَن تَجِدَ لِسُنَّةِ اللَّـهِ تَبْدِيلًا ٦٢

ఇది ఇంతకు పూర్వం గడిచిన వారి విషయంలో జరుగుతున్న అల్లాహ్‌ సంప్ర దాయమే! మరియు అల్లాహ్‌ సంప్రదాయంలో నీవు ఎలాంటి మార్పును చూడవు. 45

33:63 – يَسْأَلُكَ النَّاسُ عَنِ السَّاعَةِ ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِندَ اللَّـهِ ۚ وَمَا يُدْرِيكَ لَعَلَّ السَّاعَةَ تَكُونُ قَرِيبًا ٦٣

ప్రజలు నిన్ను అంతిమ ఘడియ (పునరు త్థానం) ను గురించి అడుగుతున్నారు. వారితో ఇలా అను: “దాని జ్ఞానం కేవలం అల్లాహ్‌కే ఉంది.” మరియు నీకెలా తెలియగలదు? బహుశా ఆఘడియ సమీపంలోనే ఉండవచ్చు! 46

33:64 – إِنَّ اللَّـهَ لَعَنَ الْكَافِرِينَ وَأَعَدَّ لَهُمْ سَعِيرًا ٦٤

నిశ్చయంగా, అల్లాహ్‌ సత్య-తిరస్కా రులను శపించాడు (బహిష్కరించాడు) మరియు ఆయన వారి కొరకు మండే (నరక) అగ్నిని సిద్ధపరచి ఉంచాడు.

33:65 – خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ لَّا يَجِدُونَ وَلِيًّا وَلَا نَصِيرًا ٦٥

వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. వారు ఎలాంటి సంరక్షకుణ్ణి గానీ సహాయకుణ్ణి గానీ పొందలేరు.

33:66 – يَوْمَ تُقَلَّبُ وُجُوهُهُمْ فِي النَّارِ يَقُولُونَ يَا لَيْتَنَا أَطَعْنَا اللَّـهَ وَأَطَعْنَا الرَّسُولَا ٦٦

వారి ముఖాలు నిప్పులపై బొర్లింపబడిన నాడు; వారు: “అయ్యో! మేము అల్లాహ్‌కు విధేయులమై ఉండి, సందేశహరుణ్ణి అనుసరించి ఉంటే ఎంత బాగుండేది?” అని వాపోతారు.

33:67 – وَقَالُوا رَبَّنَا إِنَّا أَطَعْنَا سَادَتَنَا وَكُبَرَاءَنَا فَأَضَلُّونَا السَّبِيلَا ٦٧

వారు ఇంకా ఇలాఅంటారు: “ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము మా నాయకులను మరియు మా పెద్దలను అనుసరించాము. కాని, వారే మమ్మల్ని (ఋజు) మార్గం నుండి తప్పించారు.

33:68 – رَبَّنَا آتِهِمْ ضِعْفَيْنِ مِنَ الْعَذَابِ وَالْعَنْهُمْ لَعْنًا كَبِيرًا ٦٨

“ఓ మా ప్రభూ! వారికి రెట్టింపు శిక్ష విధించు మరియు వారిని పూర్తిగా శపించు (బహిష్కరించు)!”

33:69 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَكُونُوا كَالَّذِينَ آذَوْا مُوسَىٰ فَبَرَّأَهُ اللَّـهُ مِمَّا قَالُوا ۚ وَكَانَ عِندَ اللَّـهِ وَجِيهًا ٦٩

ఓ విశ్వాసులారా! మీరు మూసాను బాధించిన వారివలె అయిపోకండి. 47 తరువాత అల్లాహ్‌ వారు (కల్పించిన) ఆరోపణ నుండి అతనికి విముక్తి కలిగించాడు. అతను (మూసా), అల్లాహ్‌ దృష్టిలో ఎంతో ఆదరణీయుడు.

33:70 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّـهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا ٧٠

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ యందు భయ- భక్తులు కలిగి ఉండండి. మరియు మీరు మాట్లాడి నప్పుడు యుక్తమైన మాటనే పలకండి.

33:71 – يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَمَن يُطِعِ اللَّـهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا ٧١

  1. ఆయన మీ కర్మలను సరిదిద్దుతాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఎవడైతే అల్లాహ్‌ కు విధేయుడై సందేశహరుని ఆజ్ఞను పాలిస్తాడో! నిశ్చయంగా అతడే గొప్ప విజయం పొందిన వాడు!

33:72 – إِنَّا عَرَضْنَا الْأَمَانَةَ عَلَى السَّمَاوَاتِ وَالْأَرْضِ وَالْجِبَالِ فَأَبَيْنَ أَن يَحْمِلْنَهَا وَأَشْفَقْنَ مِنْهَا وَحَمَلَهَا الْإِنسَانُ ۖ إِنَّهُ كَانَ ظَلُومًا جَهُولًا ٧٢

నిశ్చయంగా, మేము బాధ్యతను 48 ఆకాశాలకు, భూమికి మరియు పర్వతాలకు సమర్పించ గోరాము, కాని అవి దానిని భరించటానికి సమ్మతించ లేదు మరియు దానికి భయపడ్డాయి, కాని మానవుడు దానిని తన మీద మోపుకున్నాడు. నిశ్చయంగా, అతడు దుర్మార్గుడు, మూఢుడు కూడాను.

33:73 – لِّيُعَذِّبَ اللَّـهُ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْمُشْرِكِينَ وَالْمُشْرِكَاتِ وَيَتُوبَ اللَّـهُ عَلَى الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ۗ وَكَانَ اللَّـهُ غَفُورًا رَّحِيمًا ٧٣

(దాని ఫలితంగా!) అల్లాహ్‌ కపట-విశ్వాసు లయిన పురుషులను మరియు కపట-విశ్వాసులయిన స్త్రీలను మరియు అల్లాహ్‌కు సాటి-కల్పించే పురుషులను మరియు సాటి-కల్పించే స్త్రీలను శిక్షిస్తాడు; మరియు విశ్వాసులైన పురుషుల మరియు విశ్వాసులైన స్త్రీల పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

సూరహ్‌ సబా’ – ఇక్కడి నుండి 6 సూరాహ్‌ల సమూహం ప్రారంభమవుతోంది (34-39). ఇది మధ్య మక్కహ్ కాలపు సూరహ్‌. ఈ సూరహ్‌ (34) బహుశా సూరహ్‌ అల్‌-ఇ’స్రా (17) కంటే ముందు అవతరింప జేయబడింది. సబా’ వారు ఈ కాలపు యమన్‌లో ఉండేవారు. ‘ధనసంపత్తులు, మానవ శక్తి సామర్థ్యాలు తాత్కాలికమైనవి. అవి ఎప్పడైనా నశించిపోవచ్చు.’ అనే విషయం ఈ గాథ వల్ల తెలుస్తుంది. బైబిల్‌లో వారు షీబా అనే పేరుతో పిలువబడ్డారు. ఇందులో 54 ఆయతులు ఉన్నాయి. దీని పేరు 15-20 ఆయతులలో పేర్కొనబడ్డ సబా’ తెగవారి పేరుతో తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 34:1 – الْحَمْدُ لِلَّـهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَلَهُ الْحَمْدُ فِي الْآخِرَةِ ۚ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ ١

సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్‌ మాత్రమే! ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు పరలోకంలో కూడా సర్వస్తోత్రాలకు అర్హుడు ఆయనే! 1 మరియు ఆయన మహా వివేకవంతుడు, సర్వం తెలిసిన వాడు. 2

34:2 – يَعْلَمُ مَا يَلِجُ فِي الْأَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنزِلُ مِنَ السَّمَاءِ وَمَا يَعْرُجُ فِيهَا ۚ وَهُوَ الرَّحِيمُ الْغَفُورُ ٢

భూమిలోకి ప్రవేశించేది మరియు దాని నుండి బయటికి వచ్చేది మరియు ఆకాశం నుండి దిగేది మరియు దానిలోకి పైకి ఎక్కిపోయేది, అంతా ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన అపార కరుణాప్రదాత, క్షమాశీలుడు.

34:3 – وَقَالَ الَّذِينَ كَفَرُوا لَا تَأْتِينَا السَّاعَةُ ۖ قُلْ بَلَىٰ وَرَبِّي لَتَأْتِيَنَّكُمْ عَالِمِ الْغَيْبِ ۖ لَا يَعْزُبُ عَنْهُ مِثْقَالُ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَلَا أَصْغَرُ مِن ذَٰلِكَ وَلَا أَكْبَرُ إِلَّا فِي كِتَابٍ مُّبِينٍ ٣

మరియు సత్య-తిరస్కారులు ఇలా అంటారు: “అంతిమ ఘడియ (పునరుత్థానం) మాపై ఎన్నడూ రాదు!” వారితో ఇలా అను: “ఎందుకు రాదు! అగోచరవిషయ జ్ఞానంగల నా ప్రభువు సాక్షిగా! అది తప్పక మీ మీదకు వస్తుంది.” ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న రవ్వతో (పరమాణువుతో) సమానమైన వస్తువు గానీ, లేదా దానికంటే చిన్నది గానీ లేదా దాని కంటే పెద్దది గానీ, ఒక స్పష్టమైన గ్రంథంలో (వ్రాయబడకుండా) ఆయనకు మరుగుగాలేదు.

34:4 – لِّيَجْزِيَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۚ أُولَـٰئِكَ لَهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ ٤

అది (అంతిమ ఘడియ), విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి ప్రతిఫలం ఇవ్వటానికి వస్తుంది. అలాంటి వారికి క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి (స్వర్గం) ఉంటాయి. 3

34:5 – وَالَّذِينَ سَعَوْا فِي آيَاتِنَا مُعَاجِزِينَ أُولَـٰئِكَ لَهُمْ عَذَابٌ مِّن رِّجْزٍ أَلِيمٌ ٥

మరియు ఎవరైతే మా సూచనలను (ఆయత్‌లను) విఫలం చేయటానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారికి అధమమైన, బాధాకరమైన శిక్ష ఉంటుంది.

34:6 – وَيَرَى الَّذِينَ أُوتُوا الْعِلْمَ الَّذِي أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ هُوَ الْحَقَّ وَيَهْدِي إِلَىٰ صِرَاطِ الْعَزِيزِ الْحَمِيدِ ٦

మరియు ఎవరికైతే జ్ఞానం ఇవ్వబడిందో! వారు, 4 ఇది నీ ప్రభువు తరఫునుండి నీపై అవతరింపజేయబడిన సత్యమనీ మరియు అది సర్వ శక్తిమంతుడు ప్రశంసనీయుడు (అయిన అల్లాహ్‌) మార్గం వైపునకే మార్గదర్శకత్వం చేస్తుందనీ గ్రహిస్తారు.

34:7 – وَقَالَ الَّذِينَ كَفَرُوا هَلْ نَدُلُّكُمْ عَلَىٰ رَجُلٍ يُنَبِّئُكُمْ إِذَا مُزِّقْتُمْ كُلَّ مُمَزَّقٍ إِنَّكُمْ لَفِي خَلْقٍ جَدِيدٍ ٧

మరియు సత్య-తిరస్కారులు ఇలా అంటారు: “మీరు (చచ్చి) దుమ్ముగా మారి, చెల్లాచెదరైన తరువాత కూడా! నిశ్చయంగా, మళ్ళీ క్రొత్తగా సృష్టింపబడతారని తెలియజేసే వ్యక్తిని 5 మీకు చూపమంటారా?

34:8 – أَفْتَرَىٰ عَلَى اللَّـهِ كَذِبًا أَم بِهِ جِنَّةٌ ۗ بَلِ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ فِي الْعَذَابِ وَالضَّلَالِ الْبَعِيدِ ٨

“అతను అల్లాహ్‌పై అబద్ధం కల్పించాడో లేక! అతనికి పిచ్చిపట్టిందో తెలియటం లేదు!” అలాకాదు, ఎవరైతే పరలోకాన్ని నమ్మరో, వారు శిక్షకు గురి అవుతారు. మరియు వారు మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయారు.

34:9 – أَفَلَمْ يَرَوْا إِلَىٰ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ ۚ إِن نَّشَأْ نَخْسِفْ بِهِمُ الْأَرْضَ أَوْ نُسْقِطْ عَلَيْهِمْ كِسَفًا مِّنَ السَّمَاءِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّكُلِّ عَبْدٍ مُّنِيبٍ ٩

ఏమిటి? వారు తమకు ముందున్న మరియు తమ వెనుక నున్న ఆకాశాన్ని మరియు భూమిని చూడటం లేదా? మేము కోరితే, వారిని భూమిలోకి అణగద్రొక్కేవారం, లేదా వారిపై ఆకాశం నుండి ఒక ముక్కను పడవేసేవారం. నిశ్చయంగా ఇందులో పశ్చాత్తాపంతో (అల్లాహ్‌ వైపునకు) మరలే, ప్రతి దాసుని కొరకు ఒక సూచనఉంది. 6 (3/8)

34:10 – وَلَقَدْ آتَيْنَا دَاوُودَ مِنَّا فَضْلًا ۖ يَا جِبَالُ أَوِّبِي مَعَهُ وَالطَّيْرَ ۖ وَأَلَنَّا لَهُ الْحَدِيدَ ١٠

  • మరియు వాస్తవంగా, మేము దావూద్‌కు మా తరఫు నుండి గొప్పఅనుగ్రహాన్ని ప్రసా దించాము: “ఓ పర్వతాల్లారా! మరియు పక్షు లారా! అతనితో కలిసి (మా స్తోత్రాన్ని) ఉచ్చ రించండి!” 7 (అని మేము ఆజ్ఞాపించాము). మేము అతని కొరకు ఇనుమును మెత్తదిగా చేశాము.

34:11 – أَنِ اعْمَلْ سَابِغَاتٍ وَقَدِّرْ فِي السَّرْدِ ۖ وَاعْمَلُوا صَالِحًا ۖ إِنِّي بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ١١

(అతనికి ఇలా ఆదేశమిచ్చాము): “నీవు కవచాలు తయారుచేయి మరియు వాటి వలయాలను (కడియాలను) సరిసమానంగా కూర్చు!” మరియు (ఓ మానవులారా!): “మీరు సత్కార్యాలు చేయండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా నేను చూస్తున్నాను.”

34:12 – وَلِسُلَيْمَانَ الرِّيحَ غُدُوُّهَا شَهْرٌ وَرَوَاحُهَا شَهْرٌ ۖ وَأَسَلْنَا لَهُ عَيْنَ الْقِطْرِ ۖ وَمِنَ الْجِنِّ مَن يَعْمَلُ بَيْنَ يَدَيْهِ بِإِذْنِ رَبِّهِ ۖ وَمَن يَزِغْ مِنْهُمْ عَنْ أَمْرِنَا نُذِقْهُ مِنْ عَذَابِ السَّعِيرِ ١٢

మరియు మేము గాలిని సులైమాన్‌కు (వశపరచాము); దాని ఉదయపు గమనం ఒకనెల రోజుల పాటి ప్రయాణాన్ని పూర్తిచేసేది మరియు దాని సాయంకాలపు గమనం ఒకనెల. 8 మరియు మేము అతని కొరకు రాగిఊటను ప్రవహింప జేశాము. మరియు అతని ప్రభువు ఆజ్ఞతో, అతని సన్నిధిలో పనిచేసే జిన్నాతులను అతనికి వశపరచాము. మరియు వారిలో మా ఆజ్ఞను ఉల్లంఘించిన వాడికి ప్రజ్వలించే నరకాగ్ని శిక్షను రుచి చూపుతూ ఉండేవారము.

34:13 – يَعْمَلُونَ لَهُ مَا يَشَاءُ مِن مَّحَارِيبَ وَتَمَاثِيلَ وَجِفَانٍ كَالْجَوَابِ وَقُدُورٍ رَّاسِيَاتٍ ۚ اعْمَلُوا آلَ دَاوُودَ شُكْرًا ۚ وَقَلِيلٌ مِّنْ عِبَادِيَ الشَّكُورُ ١٣

వారు (జిన్నాతులు) అతనికి అతను కోరే, పెద్దపెద్ద కట్టడాలను, ప్రతిమలను, గుంటల వంటి పెద్దపెద్ద గంగాళాలను, (తమ స్థానము నుండి) కదిలింపలేని కళాయీలను తయారుచేసేవారు. “ఓ దావూద్‌ వంశీయులారా! మీరు కృతజ్ఞులై పనులు చేస్తూ ఉండండి.” మరియు నా దాసులలో కృతజ్ఞతలు తెలిపేవారు చాలా తక్కువ.

34:14 – فَلَمَّا قَضَيْنَا عَلَيْهِ الْمَوْتَ مَا دَلَّهُمْ عَلَىٰ مَوْتِهِ إِلَّا دَابَّةُ الْأَرْضِ تَأْكُلُ مِنسَأَتَهُ ۖ فَلَمَّا خَرَّ تَبَيَّنَتِ الْجِنُّ أَن لَّوْ كَانُوا يَعْلَمُونَ الْغَيْبَ مَا لَبِثُوا فِي الْعَذَابِ الْمُهِينِ ١٤

మేము అతని (సులైమాన్‌)పై మృత్యు వును విధించినప్పుడు, అతని చేతికర్రను తింటూ ఉన్న పురుగు తప్ప, మరెవ్వరూ! అతని మరణ విషయం, వారికి (జిన్నాతులకు) తెలుపలేదు. 9 ఆ తరువాత అతను పడిపోగా జిన్నాతులు తమకు అగోచర విషయాలు తెలిసిఉంటే, తాము అవమానకరమైన ఈ బాధలో పడిఉండే వారం కాముకదా అని తెలుసుకున్నారు.

34:15 – لَقَدْ كَانَ لِسَبَإٍ فِي مَسْكَنِهِمْ آيَةٌ ۖ جَنَّتَانِ عَن يَمِينٍ وَشِمَالٍ ۖ كُلُوا مِن رِّزْقِ رَبِّكُمْ وَاشْكُرُوا لَهُ ۚ بَلْدَةٌ طَيِّبَةٌ وَرَبٌّ غَفُورٌ ١٥

వాస్తవంగా, సబా’ వారి కొరకు, వారి నివాసస్థలంలో ఒక సూచన ఉంది. 10 దాని కుడి మరియు ఎడమ ప్రక్కలలో రెండు తోటలుండేవి (వారితో): “మీ ప్రభువు ప్రసాదించిన ఆహారంతిని ఆయనకు కృతజ్ఞతలు తెలుపండి!” (అని అనబడింది). ఇది చాలా మంచి దేశం మరియు మీ ప్రభువు క్షమాశీలుడు.

34:16 – فَأَعْرَضُوا فَأَرْسَلْنَا عَلَيْهِمْ سَيْلَ الْعَرِمِ وَبَدَّلْنَاهُم بِجَنَّتَيْهِمْ جَنَّتَيْنِ ذَوَاتَيْ أُكُلٍ خَمْطٍ وَأَثْلٍ وَشَيْءٍ مِّن سِدْرٍ قَلِيلٍ ١٦

అయినా వారు విముఖులయ్యారు. కాబట్టి మేము వారిపైకి, కట్టనుతెంచి వరదను పంపాము. మరియు వారి రెండు తోటలను చేదైన ఫలాలిచ్చే చెట్లు, ఝావుకచెట్లు మరియు కొన్ని మాత్రమే రేగుచెట్లు ఉన్న తోటలుగా మార్చాము. 11

34:17 – ذَٰلِكَ جَزَيْنَاهُم بِمَا كَفَرُوا ۖ وَهَلْ نُجَازِي إِلَّا الْكَفُورَ ١٧

ఇది వారి కృతఘ్నతకు (సత్య-తిరస్కారానికి) బదులుగా వారికిచ్చిన ప్రతిఫలం. మరియు ఇలాంటి ప్రతిఫలం మేము కృతఘ్నులకు తప్ప, ఇతరులకు ఇవ్వము.

34:18 – وَجَعَلْنَا بَيْنَهُمْ وَبَيْنَ الْقُرَى الَّتِي بَارَكْنَا فِيهَا قُرًى ظَاهِرَةً وَقَدَّرْنَا فِيهَا السَّيْرَ ۖ سِيرُوا فِيهَا لَيَالِيَ وَأَيَّامًا آمِنِينَ ١٨

మరియు మేము వారిమధ్య మరియు మేము శుభాలు ప్రసాదించిన నగరాల మధ్య, స్పష్టంగా కనిపించే నగరాలను స్థాపించి: “వాటి మధ్య సురక్షితంగా రేయింబవళ్ళు ప్రయాణిస్తూ ఉండండి.” (అని అన్నాము).

34:19 – فَقَالُوا رَبَّنَا بَاعِدْ بَيْنَ أَسْفَارِنَا وَظَلَمُوا أَنفُسَهُمْ فَجَعَلْنَاهُمْ أَحَادِيثَ وَمَزَّقْنَاهُمْ كُلَّ مُمَزَّقٍ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُورٍ ١٩

కాని వారు: “ఓ మా ప్రభూ! మా ప్రయాణ దూరాలను పొడిగించు.” అని వేడుకొని, తమకు తామే అన్యాయం చేసుకున్నారు. కావున మేము వారిని కథలుగా మిగిల్చి, వారిని పూర్తిగా చెల్లాచెదురు చేశాము. 12 నిశ్చయంగా, ఇందులో సహనశీలుడు, కృతజ్ఞుడు అయిన ప్రతీ వ్యక్తికి సూచనలున్నాయి.

34:20 – وَلَقَدْ صَدَّقَ عَلَيْهِمْ إِبْلِيسُ ظَنَّهُ فَاتَّبَعُوهُ إِلَّا فَرِيقًا مِّنَ الْمُؤْمِنِينَ ٢٠

వాస్తవానికి ఇబ్లీస్‌ (షై’తాన్‌) వారి విషయంలో తాను ఊహించింది సత్యమయిందని నిరూపించాడు. ఎందుకంటే! విశ్వాసులలోని ఒక వర్గం వారు తప్ప అందరూ వాడిని అనుసరించారు.

34:21 – وَمَا كَانَ لَهُ عَلَيْهِم مِّن سُلْطَانٍ إِلَّا لِنَعْلَمَ مَن يُؤْمِنُ بِالْآخِرَةِ مِمَّنْ هُوَ مِنْهَا فِي شَكٍّ ۗ وَرَبُّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ حَفِيظٌ ٢١

మరియు వాడికి (షై’తాన్‌కు) వారిపై ఎలాంటి అధికారంలేదు. 13 కాని, పరలోకాన్ని విశ్వసించేవాడెవడో (మరియు) దానిని గురించి సంశయంలో పడ్డవాడెవడో, తెలుసుకోవటానికి మాత్రమే (మేమెలా చేశాము) మరియు నీ ప్రభువు ప్రతి విషయాన్ని కనిపెట్టుకొని ఉంటాడు.

34:22 – قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّـهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ ٢٢

వారితో ఇలా అను: “అల్లాహ్‌ను వదలి మీరు ఎవరినైతే, (ఆరాధ్యదైవాలుగా) భావిస్తు న్నారో, వారిని పిలిచిచూడండి!” ఆకాశాలలో గానీ మరియు భూమిలో గానీ రవ్వ (పరమాణువు) అంత వస్తువుపై కూడా వారికి అధికారం లేదు. మరియు వారికి ఆ రెండింటిలో ఎలాంటి భాగ స్వామ్యమూ లేదు. మరియు ఆయనకు వారిలో నుండి ఎవ్వడూ సహాయకుడునూ కాడు. 14

34:23 – وَلَا تَنفَعُ الشَّفَاعَةُ عِندَهُ إِلَّا لِمَنْ أَذِنَ لَهُ ۚ حَتَّىٰ إِذَا فُزِّعَ عَن قُلُوبِهِمْ قَالُوا مَاذَا قَالَ رَبُّكُمْ ۖ قَالُوا الْحَقَّ ۖ وَهُوَ الْعَلِيُّ الْكَبِيرُ ٢٣

మరియు ఆయన దగ్గర ఏ విధమైన సిఫారసు పనికిరాదు, ఆయన అనుమతించిన వాడి (సిఫారసు తప్ప)! 15 చివరకు వారి హృదయాల నుండి భయం తొలగి పోయినప్పుడు వారు (దేవదూతలు): “మీ ప్రభువు మీతో చెప్పిందేమిటీ?” అని అడుగుతారు. దానికి వారంటారు: “సత్యం మాత్రమే!” మరియు ఆయన మహోన్నతుడు, మహనీయుడు. (1/2)

34:24 – قُلْ مَن يَرْزُقُكُم مِّنَ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ قُلِ اللَّـهُ ۖ وَإِنَّا أَوْ إِيَّاكُمْ لَعَلَىٰ هُدًى أَوْ فِي ضَلَالٍ مُّبِينٍ ٢٤

  • వారిని ఇలా అడుగు: “మీకు ఆకాశాల నుండి మరియు భూమి నుండి జీవనోపాధిని సమకూర్చే వాడెవడు?” వారికి తెలుపు: “అల్లాహ్‌!” అయితే నిశ్చయంగా మేమో లేక మీరో ఎవరో ఒకరు మాత్రమే సన్మార్గంలో ఉన్నాము లేదా స్పష్టమైన మార్గ భ్రష్టత్వంలో ఉన్నాము.”

34:25 – قُل لَّا تُسْأَلُونَ عَمَّا أَجْرَمْنَا وَلَا نُسْأَلُ عَمَّا تَعْمَلُونَ ٢٥

ఇంకా ఇలా అను: “మేము చేసిన పాపాలకు మీరు ప్రశ్నించబడరు మరియు మీ కర్మలను గురించి మేమూ ప్రశ్నించబడము.”

34:26 – قُلْ يَجْمَعُ بَيْنَنَا رَبُّنَا ثُمَّ يَفْتَحُ بَيْنَنَا بِالْحَقِّ وَهُوَ الْفَتَّاحُ الْعَلِيمُ ٢٦

వారితో ఇలా అను: “మన ప్రభువు మనందరినీ (పునరుత్థానదినమున) ఒకేచోట సమకూర్చుతాడు. తరువాత న్యాయంగా మన మధ్య తీర్పుచేస్తాడు. ఆయనే (సర్వోత్తమమైన) తీర్పుచేసేవాడు, 16 సర్వజ్ఞుడు.”

34:27 – قُلْ أَرُونِيَ الَّذِينَ أَلْحَقْتُم بِهِ شُرَكَاءَ ۖ كَلَّا ۚ بَلْ هُوَ اللَّـهُ الْعَزِيزُ الْحَكِيمُ ٢٧

వారితో ఇలా అను: “మీరు ఆయనకు సాటిగా నిలబెట్టిన భాగస్వాములను నాకు చూపించండి. ఎవరూ లేరు! వాస్తవానికి ఆయన, అల్లాహ్‌యే సర్వశక్తి మంతుడు, మహా వివేకవంతుడు.”

34:28 – وَمَا أَرْسَلْنَاكَ إِلَّا كَافَّةً لِّلنَّاسِ بَشِيرًا وَنَذِيرًا وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ ٢٨

మరియు (ఓ ము’హమ్మద్‌!) మేము నిన్ను సర్వ మానవులకు శుభవార్త నిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము. 17 కాని వాస్తవానికి చాలా మంది ప్రజలకు ఇది తెలియదు. 18

34:29 – وَيَقُولُونَ مَتَىٰ هَـٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ ٢٩

మరియు వారు: “మీరు సత్యవంతులే అయితే, ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరనున్నది?” అని అడుగుతున్నారు. 19

34:30 – قُل لَّكُم مِّيعَادُ يَوْمٍ لَّا تَسْتَأْخِرُونَ عَنْهُ سَاعَةً وَلَا تَسْتَقْدِمُونَ ٣٠

వారితో ఇలా అను: “మీ కొరకు ఒక రోజు వ్యవధి నిర్ణయించబడి ఉంది; మీరు దాని రాకను ఒక్క ఘడియ వెనుకకూ చేయలేరు లేదా (ఒక్కఘడియ) ముందుకునూ చేయలేరు.” 20

34:31 – وَقَالَ الَّذِينَ كَفَرُوا لَن نُّؤْمِنَ بِهَـٰذَا الْقُرْآنِ وَلَا بِالَّذِي بَيْنَ يَدَيْهِ ۗ وَلَوْ تَرَىٰ إِذِ الظَّالِمُونَ مَوْقُوفُونَ عِندَ رَبِّهِمْ يَرْجِعُ بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ الْقَوْلَ يَقُولُ الَّذِينَ اسْتُضْعِفُوا لِلَّذِينَ اسْتَكْبَرُوا لَوْلَا أَنتُمْ لَكُنَّا مُؤْمِنِينَ ٣١

మరియు సత్య-తిరస్కారులైన వారు ఇలా అంటారు: “మేము ఈ ఖుర్‌ఆన్‌ను మరియు దీనికి ముందు వచ్చిన ఏ గ్రంథాన్ని కూడా నమ్మము.” ఒకవేళ ఈ దుర్మార్గులను తమ ప్రభువు ఎదుట నిలబెట్టడినప్పుడు, వారు ఒకరిపైనొకరు, ఆరోపణలు చేసుకోవటం నీవు చూస్తే (ఎంత బాగుండును)! బలహీనవర్గం వారు దురహంకారులైన తమ నాయకులతో: “మీరే లేకుంటే మేము తప్పక విశ్వాసుల మయ్యేవారం!” అని అంటారు.

34:32 – قَالَ الَّذِينَ اسْتَكْبَرُوا لِلَّذِينَ اسْتُضْعِفُوا أَنَحْنُ صَدَدْنَاكُمْ عَنِ الْهُدَىٰ بَعْدَ إِذْ جَاءَكُم ۖ بَلْ كُنتُم مُّجْرِمِينَ ٣٢

దురహంకారులైన నాయకులు బలహీను లైన వారితో ఇలా అంటారు: “ఏమీ? మీ వద్దకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు మేము మిమ్మల్ని దాని నుండి నిరోధించామా? అలా కాదు, మీరే అపరాధానికి పాల్పడ్డారు!”

34:33 – وَقَالَ الَّذِينَ اسْتُضْعِفُوا لِلَّذِينَ اسْتَكْبَرُوا بَلْ مَكْرُ اللَّيْلِ وَالنَّهَارِ إِذْ تَأْمُرُونَنَا أَن نَّكْفُرَ بِاللَّـهِ وَنَجْعَلَ لَهُ أَندَادًا ۚ وَأَسَرُّوا النَّدَامَةَ لَمَّا رَأَوُا الْعَذَابَ وَجَعَلْنَا الْأَغْلَالَ فِي أَعْنَاقِ الَّذِينَ كَفَرُوا ۚ هَلْ يُجْزَوْنَ إِلَّا مَا كَانُوا يَعْمَلُونَ ٣٣

మరియు బలహీనులైనవారు దురహంకారు లైన నాయకులతో ఇలా అంటారు: “అలాకాదు! ఇది మీరు రాత్రింబవళ్ళు పన్నిన కుట్ర. 21 మీరు మమ్మల్ని – అల్లాహ్‌ను తిరస్కరించి – ఇతరు లను ఆయనకు సాటి కల్పించమని ఆజ్ఞాపిస్తూ ఉండేవారు.” మరియు వారు శిక్షను చూసి నప్పుడు, తమ పశ్చాత్తాపాన్ని దాస్తారు. మరియు మేము సత్య-తిరస్కారుల మెడలలో సంకెళ్లు వేస్తాము. 22 వారు తమ కర్మలకు తగిన ప్రతిఫలం తప్ప మరేదైనా పొందగలరా?

34:34 – وَمَا أَرْسَلْنَا فِي قَرْيَةٍ مِّن نَّذِيرٍ إِلَّا قَالَ مُتْرَفُوهَا إِنَّا بِمَا أُرْسِلْتُم بِهِ كَافِرُونَ ٣٤

మరియు మేము హెచ్చరికచేసే అతనిని (ప్రవక్తను) ఏ నగరానికి పంపినా, దానిలోని ఐశ్వర్యవంతులు: “నిశ్చయంగా, మేము మీవెంట పంపబడిన సందేశాన్ని తిరస్కరిస్తున్నాము.” అని అనకుండా ఉండలేదు. 23

34:35 – وَقَالُوا نَحْنُ أَكْثَرُ أَمْوَالًا وَأَوْلَادًا وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ ٣٥

వారు ఇంకా ఇలా అన్నారు: “మేము (నీ కంటే) ఎక్కువ సంపద మరియు సంతానం కలిగి ఉన్నాము. మరియు మేము ఏ మాత్రం శిక్షింపబడము.”

34:36 – قُلْ إِنَّ رَبِّي يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ ٣٦

వారితో అను: “నిశ్చయంగా, నా ప్రభువు తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు, మరియు (తాను కోరిన వారికి) మితంగా ఇస్తాడు. కాని చాలా మందికి ఇది తెలియదు.”

34:37 – وَمَا أَمْوَالُكُمْ وَلَا أَوْلَادُكُم بِالَّتِي تُقَرِّبُكُمْ عِندَنَا زُلْفَىٰ إِلَّا مَنْ آمَنَ وَعَمِلَ صَالِحًا فَأُولَـٰئِكَ لَهُمْ جَزَاءُ الضِّعْفِ بِمَا عَمِلُوا وَهُمْ فِي الْغُرُفَاتِ آمِنُونَ ٣٧

మరియు, మీ సంపద గానీ మరియు మీ సంతానం గానీ మిమ్మల్ని మా దగ్గరికి తేలేవు; కాని విశ్వసించి సత్కార్యాలు చేసేవారు తప్ప! కావున అలాంటి వారికి తాము చేసిన దానికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. మరియు వారు భవనాలలో సురక్షితంగా ఉంటారు.

34:38 – وَالَّذِينَ يَسْعَوْنَ فِي آيَاتِنَا مُعَاجِزِينَ أُولَـٰئِكَ فِي الْعَذَابِ مُحْضَرُونَ ٣٨

మరియు ఎవరైతే మా సూచనలను భంగపరచటానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారు కఠిన శిక్షకు హాజరు చేయబడతారు.

34:39 – قُلْ إِنَّ رَبِّي يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ مِنْ عِبَادِهِ وَيَقْدِرُ لَهُ ۚ وَمَا أَنفَقْتُم مِّن شَيْءٍ فَهُوَ يُخْلِفُهُ ۖ وَهُوَ خَيْرُ الرَّازِقِينَ ٣٩

  1. వారితో అను: “నిశ్చయంగా, నా ప్రభువు తన దాసులలో తాను కోరినవారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు (తాను కోరిన) వారికి మితంగా ఇస్తాడు. మరియు మీరు (ఆయన మార్గంలో) ఖర్చుపెట్టేదంతా ఆయన మీకు తిరిగి ఇస్తాడు. మరియు ఆయనే సర్వశ్రేష్ఠుడైన జీవనోపాధి ప్రదాత.”

34:40 – وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ يَقُولُ لِلْمَلَائِكَةِ أَهَـٰؤُلَاءِ إِيَّاكُمْ كَانُوا يَعْبُدُونَ ٤٠

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు ఆయన వారందరిని సమీకరించిన తరువాత దేవదూతలతో ఇలా అడుగుతాడు: “ఏమీ? వీరేనా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండేవారు?” 24

34:41 – قَالُوا سُبْحَانَكَ أَنتَ وَلِيُّنَا مِن دُونِهِم ۖ بَلْ كَانُوا يَعْبُدُونَ الْجِنَّ ۖ أَكْثَرُهُم بِهِم مُّؤْمِنُونَ ٤١

వారు (దేవదూతలు) జవాబిస్తారు: “నీవు సర్వలోపాలకు అతీతుడవు! నీవే మా సంరక్షకు డవు, వీరుకారు. వాస్తవానికి, వీరు జిన్నాతులను ఆరాధించే వారు, వీరిలో చాలా మంది, వారిని (జిన్నాతులను) విశ్వసించే వారు.” 25

34:42 – فَالْيَوْمَ لَا يَمْلِكُ بَعْضُكُمْ لِبَعْضٍ نَّفْعًا وَلَا ضَرًّا وَنَقُولُ لِلَّذِينَ ظَلَمُوا ذُوقُوا عَذَابَ النَّارِ الَّتِي كُنتُم بِهَا تُكَذِّبُونَ ٤٢

(అప్పుడు వారితో ఇట్లనబడుతుంది): “అయితే ఈ రోజు మీరు ఒకరికొకరు లాభం గానీ, నష్టం గానీ చేకూర్చుకోలేరు.” మరియు మేము దుర్మార్గులతో: “మీరు తిరస్కరిస్తూ ఉండిన నరక బాధను రుచి చూడండి!” అని పలుకుతాము.

34:43 – وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالُوا مَا هَـٰذَا إِلَّا رَجُلٌ يُرِيدُ أَن يَصُدَّكُمْ عَمَّا كَانَ يَعْبُدُ آبَاؤُكُمْ وَقَالُوا مَا هَـٰذَا إِلَّا إِفْكٌ مُّفْتَرًى ۚ وَقَالَ الَّذِينَ كَفَرُوا لِلْحَقِّ لَمَّا جَاءَهُمْ إِنْ هَـٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ ٤٣

మరియు వారికి మాస్పష్టమైన సూచన (ఆయాత్‌) లను వినిపింపజేసినప్పుడు వారు: “ఈ వ్యక్తి కేవలం మీ తండ్రి-తాతలు ఆరాధించే వాటి నుండి మిమ్మల్ని నిరోధిస్తున్నాడు.” అని అంటారు. వారింకా ఇలా అంటారు: “ఇది (ఈ ఖుర్‌ఆన్‌) కేవలం కల్పించబడిన బూటకం మాత్రమే.” మరియు సత్య-తిరస్కారులు, సత్యం వారిముందుకు వచ్చినప్పుడు: “ఇది కేవలం స్పష్ట మైన మంత్రజాలం మాత్రమే!” 26 అని అంటారు.

34:44 – وَمَا آتَيْنَاهُم مِّن كُتُبٍ يَدْرُسُونَهَا ۖ وَمَا أَرْسَلْنَا إِلَيْهِمْ قَبْلَكَ مِن نَّذِيرٍ ٤٤

(ఓ ము’హమ్మద్‌!) మేము, వారికి చదవటానికి ఎలాంటి గ్రంథాలు ఇవ్వలేదు. 27 మరియు మేము వారి వద్దకు నీకు పూర్వం హెచ్చరించే (సందేశహరుణ్ణి) కూడా పంపలేదు.

34:45 – وَكَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ وَمَا بَلَغُوا مِعْشَارَ مَا آتَيْنَاهُمْ فَكَذَّبُوا رُسُلِي ۖ فَكَيْفَ كَانَ نَكِيرِ ٤٥

మరియు వారికి పూర్వం గతించిన వారు కూడా (ఇదే విధంగా) తిరస్కరించారు. మేము (పూర్వం) వారి కిచ్చిన దానిలో వీరు పదోవంతు కూడా పొందలేదు. అయినా వారు నా సందేశహరులను తిరస్కరించారు. చూశారా! నా శిక్ష ఎంత ఘోరంగా ఉండిందో! 28 (5/8)

34:46 – قُلْ إِنَّمَا أَعِظُكُم بِوَاحِدَةٍ ۖ أَن تَقُومُوا لِلَّـهِ مَثْنَىٰ وَفُرَادَىٰ ثُمَّ تَتَفَكَّرُوا ۚ مَا بِصَاحِبِكُم مِّن جِنَّةٍ ۚ إِنْ هُوَ إِلَّا نَذِيرٌ لَّكُم بَيْنَ يَدَيْ عَذَابٍ شَدِيدٍ ٤٦

(ఓ ము’హమ్మద్‌!) వారితో ఇలా అను: “వాస్తవానికి, నేను మీకు ఒక విషయం బోధిస్తాను: ‘మీరు అల్లాహ్‌ కొరకు ఇద్దరిద్దరిగా, ఒక్కొక్కరిగా నిలవండి. తరువాత బాగా ఆలోచించండి!’ మీతో పాటుఉన్న ఈ వ్యక్తికి (ప్రవక్తకు) పిచ్చి పట్టలేదు. 29 అతను కేవలం, మీపై ఒక ఘోరశిక్ష రాక ముందే, దానిని గురించి మిమ్మల్ని హెచ్చరించే వాడు మాత్రమే!” 30

34:47 – قُلْ مَا سَأَلْتُكُم مِّنْ أَجْرٍ فَهُوَ لَكُمْ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى اللَّـهِ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ ٤٧

ఇలా అను: “నేను మిమ్మల్ని ఏదైనా ప్రతి ఫలం అడిగి ఉన్నట్లైతే, దానిని మీరే ఉంచు కోండి. 31 వాస్తవానికి నా ప్రతిఫలం కేవలం అల్లాహ్‌ వద్దనే ఉంది. మరియు ఆయనే ప్రతిదానికి సాక్షి!”

34:48 – قُلْ إِنَّ رَبِّي يَقْذِفُ بِالْحَقِّ عَلَّامُ الْغُيُوبِ ٤٨

ఇలా అను: “నిశ్చయంగా నా ప్రభువే సత్యాన్ని (అసత్యానికి విరుధ్ధంగా) పంపేవాడు. 32 ఆయనే అగోచర యథార్థాలన్నీ తెలిసిఉన్న వాడు.”

34:49 – قُلْ جَاءَ الْحَقُّ وَمَا يُبْدِئُ الْبَاطِلُ وَمَا يُعِيدُ ٤٩

ఇలా అను: “సత్యం వచ్చేసింది! మరియు అసత్యం (మిథ్యం) దేనినీ ఆరంభం చేయజాలదు మరియు దానిని తిరిగి ఉనికిలోకి తేజాలదు.” 33

34:50 – قُلْ إِن ضَلَلْتُ فَإِنَّمَا أَضِلُّ عَلَىٰ نَفْسِي ۖ وَإِنِ اهْتَدَيْتُ فَبِمَا يُوحِي إِلَيَّ رَبِّي ۚ إِنَّهُ سَمِيعٌ قَرِيبٌ ٥٠

ఇలా అను: “ఒకవేళ నేను మార్గభ్రష్టుడ నైతే! నిశ్చయంగా, అది నా స్వంత నాశనానికే! మరియు ఒక వేళ మార్గదర్శకత్వం పొందితే, అది కేవలం నా ప్రభువు నాపై అవతరింపజేసిన దివ్యజ్ఞానం (వ’హీ) వల్లనే! నిశ్చయంగా, ఆయన సర్వం వినేవాడు, దగ్గరలోనే ఉంటాడు (అతి సన్నిహితుడు)!” 34

34:51 – وَلَوْ تَرَىٰ إِذْ فَزِعُوا فَلَا فَوْتَ وَأُخِذُوا مِن مَّكَانٍ قَرِيبٍ ٥١

మరియు వారు భయకంపితులై ఉండటాన్ని, నీవు చూడగలిగితే (ఎంత బాగుండేది), కాని వారికి తప్పించుకోవటానికి వీలుండదు. మరియు వారు చాలా సమీపం నుండి పట్టుకోబడతారు. 35

34:52 – وَقَالُوا آمَنَّا بِهِ وَأَنَّىٰ لَهُمُ التَّنَاوُشُ مِن مَّكَانٍ بَعِيدٍ ٥٢

అప్పుడు (పరలోకంలో) వారంటారు: “మేము (ఇప్పుడు) దానిని (సత్యాన్ని) విశ్వసించాము!” వాస్తవానికి వారు చాలా దూరం నుండి దానిని (విశ్వాసాన్ని) ఎలా పొందగలరు?

34:53 – وَقَدْ كَفَرُوا بِهِ مِن قَبْلُ ۖ وَيَقْذِفُونَ بِالْغَيْبِ مِن مَّكَانٍ بَعِيدٍ ٥٣

మరియు వాస్తవానికి వారు దానిని (సత్యాన్ని) ఇంతకు ముందు తిరస్కరించి ఉన్నారు. మరియు వారు తమకు అగోచరమైన విషయానికి దూరం నుండియే నిరసన చూపుతూ ఉండేవారు.

34:54 – وَحِيلَ بَيْنَهُمْ وَبَيْنَ مَا يَشْتَهُونَ كَمَا فُعِلَ بِأَشْيَاعِهِم مِّن قَبْلُ ۚ إِنَّهُمْ كَانُوا فِي شَكٍّ مُّرِيبٍ ٥٤

మరియు వారికి పూర్వం గడిచినవారి విధంగానే, వారి మధ్య మరియు వారి కోరికల మధ్య అడ్డువేయబడుతుంది. నిశ్చయంగా, వారు సంశయంలో పడవేసే గొప్ప సందేహంలో పడిఉండే వారు. 36

సూరహ్‌ ఫా’తిర్‌ – ఫా’తిరున్‌: సృష్టికి మూలాధారి, Originator. అంటే ఉత్పత్తికి కారకుడు, ఆరంభకుడు, ప్రభవింపజేసేవాడు, ప్రతిదానిని పుట్టించేవాడు,. దీని మరొక పేరు అల్‌-మలాయికహ్‌ అంటే దైవదూతలు. మొదటి ఆయత్‌లోనే ఈ రెండు పదాలున్నాయి. ఇందులో 45 ఆయతులు ఉన్నాయి. ఇది సూరహ్‌ అల్‌-ఫుర్ఖాన్‌ (25) మరియు సూరహ్‌ మర్యమ్‌ (19)ల మధ్య కాలంలో అవతరింపజేయబడింది; అంటే హిజ్రత్‌కు 7-8 సంవత్సరాలకు ముందు, మక్కహ్ లో. అల్లాహ్‌ (సు.త.) కు తాను కోరిన దానిని సృష్టించగల, దానిని మరల పునరుత్థరింపజేయగల శక్తి ఉంది. ఆయన తన సందేశాన్ని ప్రవక్తల ద్వారా అవతరింపజేస్తాడు. జ్ఞానవంతులే దైవభీతి కలిగి ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్‌ (సు.త.) సర్వశక్తిమంతుడు. క్షమాశీలుడు.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 35:1 – الْحَمْدُ لِلَّـهِ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ جَاعِلِ الْمَلَائِكَةِ رُسُلًا أُولِي أَجْنِحَةٍ مَّثْنَىٰ وَثُلَاثَ وَرُبَاعَ ۚ يَزِيدُ فِي الْخَلْقِ مَا يَشَاءُ ۚ إِنَّ اللَّـهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١

సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్‌ మాత్రమే! ఆకాశాలు మరియు భూమి యొక్క సృష్టికి మూలాధారి. 1 ఆయనే దేవదూతలను సందేశాలు అందజేసేవారిగా నియమించాడు. వారు రెండేసి మూడేసి లేదా నాలుగేసి రెక్కలు గలవారు. 2 ఆయన తన సృష్టిలో తాను కోరిన దానిని అధికం చేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.

35:2 – مَّا يَفْتَحِ اللَّـهُ لِلنَّاسِ مِن رَّحْمَةٍ فَلَا مُمْسِكَ لَهَا ۖ وَمَا يُمْسِكْ فَلَا مُرْسِلَ لَهُ مِن بَعْدِهِ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ٢

అల్లాహ్‌ ప్రజల కొరకు ఏ కారుణ్యాన్ని పంపినా దానిని ఆపేవాడు ఎవ్వడూ లేడు. మరియు ఏ (కారుణ్యాన్నైనా) ఆయన ఆపితే, ఆ తరువాత దానిని పంపగలవాడు కూడా ఎవ్వడూ లేడు. మరియు ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.

35:3 – يَا أَيُّهَا النَّاسُ اذْكُرُوا نِعْمَتَ اللَّـهِ عَلَيْكُمْ ۚ هَلْ مِنْ خَالِقٍ غَيْرُ اللَّـهِ يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ ۚ لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ ٣

ఓ మానవులారా! అల్లాహ్‌ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకంచేసుకోండి! ఏమీ? భూమ్యా కాశాల నుండి మీకు జీవనోపాధి సమకూర్చే సృష్టికర్త అల్లాహ్‌ తప్ప మరొకడు ఉన్నాడా? 3 ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! అయితే మీరు ఎందుకు మోసగింప (సత్యం నుండి మరలింప) బడుతున్నారు?

35:4 – وَإِن يُكَذِّبُوكَ فَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّن قَبْلِكَ ۚ وَإِلَى اللَّـهِ تُرْجَعُ الْأُمُورُ ٤

మరియు (ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు నిన్ను అసత్యవాదుడవని తిరస్కరించినా (ఇది క్రొత్త విషయం కాదు) వాస్తవానికి నీకు పూర్వం పంప బడిన సందేశహరులు కూడా తిరస్కరింపబడ్డారు. మరియు వ్యవహారాలన్నీ (తీర్పుకొరకు) చివరకు అల్లాహ్‌ వద్దకే మరలింపబడతాయి.

35:5 – يَا أَيُّهَا النَّاسُ إِنَّ وَعْدَ اللَّـهِ حَقٌّ ۖ فَلَا تَغُرَّنَّكُمُ الْحَيَاةُ الدُّنْيَا ۖ وَلَا يَغُرَّنَّكُم بِاللَّـهِ الْغَرُورُ ٥

ఓ మానవులారా! నిశ్చయంగా, అల్లాహ్‌ వాగ్దానం సత్యం! కావున ఈ ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసగించరాదు. మరియు ఆ మహా వంచకుణ్ణి (షై’తాన్‌ను) కూడా మిమ్మల్ని అల్లాహ్‌ విషయంలో మోసగింపనివ్వకండి. 4

35:6 – إِنَّ الشَّيْطَانَ لَكُمْ عَدُوٌّ فَاتَّخِذُوهُ عَدُوًّا ۚ إِنَّمَا يَدْعُو حِزْبَهُ لِيَكُونُوا مِنْ أَصْحَابِ السَّعِيرِ ٦

నిశ్చయంగా, షై’తాన్‌ మీ శత్రువు, కావున మీరు కూడా వాడిని శత్రువుగానే భావించండి. 5 నిశ్చయంగా, వాడు తన అనుచరులను (భగభగ మండే) అగ్నివాసులు అవటానికే ఆహ్వానిస్తుంటాడు.

35:7 – الَّذِينَ كَفَرُوا لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۖ وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ ٧

ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో, వారికి కఠినమైన శిక్ష పడుతుంది. మరియు ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలుచేస్తారో, వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం (స్వర్గం) కూడా ఉంటాయి.

35:8 – أَفَمَن زُيِّنَ لَهُ سُوءُ عَمَلِهِ فَرَآهُ حَسَنًا ۖ فَإِنَّ اللَّـهَ يُضِلُّ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ ۖ فَلَا تَذْهَبْ نَفْسُكَ عَلَيْهِمْ حَسَرَاتٍ ۚ إِنَّ اللَّـهَ عَلِيمٌ بِمَا يَصْنَعُونَ ٨

ఏమీ? తన దుష్కార్యాలు తనకు ఆకర్షణీయంగా కనబడేటట్లు చేయబడినందుకు, ఎవడైతే వాటిని మంచి కార్యాలుగా భావిస్తాడో! (అతడు సన్మార్గంలో ఉన్నవాడితో సమానుడు కాగలడా)? నిశ్చయంగా అల్లాహ్‌ తాను కోరిన వానిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు మరియు తాను కోరిన వానికి మార్గదర్శకత్వంచేస్తాడు. కావున నీవు వారి కొరకు చింతించి నిన్ను నీవు దుఃఖానికి గురిచేసుకోకు. నిశ్చయంగా, వారి కర్మలన్నీ అల్లాహ్‌కు బాగా తెలుసు.

35:9 – وَاللَّـهُ الَّذِي أَرْسَلَ الرِّيَاحَ فَتُثِيرُ سَحَابًا فَسُقْنَاهُ إِلَىٰ بَلَدٍ مَّيِّتٍ فَأَحْيَيْنَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ كَذَٰلِكَ النُّشُورُ ٩

మరియు అల్లాహ్‌యే! గాలులను పంపు తాడు. తరు వాత అవి మేఘాలను ఎత్తుతాయి. ఆ తరువాత మేము వాటిని మృత ప్రదేశం వైపునకు పంపి, దానితో ఆ నేలను మరణించిన తరువాత తిరిగి బ్రతికిస్తాము. ఇదేవిధంగా, (మానవుల) పునరుత్థానం కూడా జరుగుతుంది.

35:10 – مَن كَانَ يُرِيدُ الْعِزَّةَ فَلِلَّـهِ الْعِزَّةُ جَمِيعًا ۚ إِلَيْهِ يَصْعَدُ الْكَلِمُ الطَّيِّبُ وَالْعَمَلُ الصَّالِحُ يَرْفَعُهُ ۚ وَالَّذِينَ يَمْكُرُونَ السَّيِّئَاتِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۖ وَمَكْرُ أُولَـٰئِكَ هُوَ يَبُورُ ١٠

గౌరవాన్ని కాంక్షించు వాడు తెలుసుకోవాలి, గౌరవమంతా అల్లాహ్‌కే చెందుతుందని! మంచి ప్రవచనాలన్నీ 6 ఆయన వైపునకు ఎక్కిపోతాయి. మరియు సత్కర్మ దానిని పైకి ఎత్తుతుంది. మరియు ఎవరైతే చెడుకుట్రలు పన్నుతారో! 7 వారికి కఠిన శిక్ష ఉంటుంది. మరియు అలాంటి వారి కుట్ర, అదే! నశించిపోతుంది.

35:11 – وَاللَّـهُ خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ جَعَلَكُمْ أَزْوَاجًا ۚ وَمَا تَحْمِلُ مِنْ أُنثَىٰ وَلَا تَضَعُ إِلَّا بِعِلْمِهِ ۚ وَمَا يُعَمَّرُ مِن مُّعَمَّرٍ وَلَا يُنقَصُ مِنْ عُمُرِهِ إِلَّا فِي كِتَابٍ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّـهِ يَسِيرٌ ١١

మరియు అల్లాహ్‌ మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. 8 తరువాత ఇంద్రియ బిందువుతో, ఆ తరువాత మిమ్మల్ని (ఆడ-మగ) జంటలుగా చేశాడు. మరియు ఏ స్త్రీ కూడా ఆయనకు తెలియకుండా గర్భం దాల్చజాలదు మరియు ప్రసవించనూ జాలదు. గ్రంథంలో వ్రాయబడనిదే, పెరుగుతున్నవాడి వయస్సు పెరగనూ జాలదు మరియు ఎవని వయస్సు తరగనూ జాలదు. నిశ్చయంగా, ఇదంతా అల్లాహ్‌కు ఎంతో సులభం.

35:12 – وَمَا يَسْتَوِي الْبَحْرَانِ هَـٰذَا عَذْبٌ فُرَاتٌ سَائِغٌ شَرَابُهُ وَهَـٰذَا مِلْحٌ أُجَاجٌ ۖ وَمِن كُلٍّ تَأْكُلُونَ لَحْمًا طَرِيًّا وَتَسْتَخْرِجُونَ حِلْيَةً تَلْبَسُونَهَا ۖ وَتَرَى الْفُلْكَ فِيهِ مَوَاخِرَ لِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ ١٢

రెండు సముద్రాలు సరిసమానం కాజాలవు. 9 వాటిలోని ఒక దాని (నీరు) రుచికరమైనది, దాహం తీర్చేది మరియు త్రాగటానికి మధురమైనది. రెండోదాని (నీరు) ఉప్పుగానూ, చేదుగానూ ఉన్నది. అయినా వాటిలో ప్రతి ఒక్కదాని నుండి మీరు తాజా మాంసం తింటున్నారు మరియు ఆభరణాలు తీసి ధరిస్తున్నారు. మరియు నీవు చూస్తున్నావు, ఓడలు వాటిని చీల్చుతూ పోవటాన్ని; (వాటిలో) మీరు, ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు మీరు ఆయనకు కృతజ్ఞులై ఉండటానికి!

35:13 – يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُّسَمًّى ۚ ذَٰلِكُمُ اللَّـهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ۚ وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ ١٣

ఆయనే రాత్రిని పగటిలోకి ప్రవేశింప జేస్తున్నాడు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింప జేస్తున్నాడు మరియు సూర్య-చంద్రులను నియమబద్ధులుగా చేసి ఉన్నాడు. అవి తమతమ పరిధిలో, నిర్ణీత వ్యవధిలో తిరుగుతూ ఉన్నాయి. ఆయనే అల్లాహ్‌! మీ ప్రభువు, విశ్వ సామ్రాజ్యాధి కారం ఆయనదే! మరియు ఆయనను వదలి మీరు వేడుకొనేవారు, ఖర్జూర బీజంపైనున్న పొరకు 10 కూడా యజమానులు కారు.

35:14 – إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ ١٤

మీరు వారిని వేడుకొన్నప్పటికీ, వారు మీ ప్రార్థనలను వినలేరు, ఒకవేళ విన్నా, వారు మీకు జవాబివ్వలేరు. మరియు పునరుత్థానదినమున మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు తిరస్కరిస్తారు. 11 మరియు (సత్యాన్ని) గురించి నీకు ఆ సర్వం తెలిసినవాడు తెలిపినట్లు మరెవ్వరూ తెలుపజాలరు. (3/4)

35:15 – يَا أَيُّهَا النَّاسُ أَنتُمُ الْفُقَرَاءُ إِلَى اللَّـهِ ۖ وَاللَّـهُ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ ١٥

  • ఓ మానవులారా! 12 అల్లాహ్‌ అక్కర గలవారు మీరే! వాస్తవానికి అల్లాహ్‌ స్వయం సమృద్ధుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడు.

35:16 – إِن يَشَأْ يُذْهِبْكُمْ وَيَأْتِ بِخَلْقٍ جَدِيدٍ ١٦

ఆయన కోరితే మిమ్మల్ని నాశనం చేసి (మీ స్థానంలో) క్రొత్త సృష్ఠిని తేగలడు. 13

35:17 – وَمَا ذَٰلِكَ عَلَى اللَّـهِ بِعَزِيزٍ ١٧

మరియు అలా చేయటం అల్లాహ్‌కు కష్టమైనది కాదు.

35:18 – وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۚ وَإِن تَدْعُ مُثْقَلَةٌ إِلَىٰ حِمْلِهَا لَا يُحْمَلْ مِنْهُ شَيْءٌ وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ ۗ إِنَّمَا تُنذِرُ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِالْغَيْبِ وَأَقَامُوا الصَّلَاةَ ۚ وَمَن تَزَكَّىٰ فَإِنَّمَا يَتَزَكَّىٰ لِنَفْسِهِ ۚ وَإِلَى اللَّـهِ الْمَصِيرُ ١٨

మరియు బరువు మోసేవాడెవ్వడూ మరొ కని బరువును మోయడు. 14 మరియు ఒకవేళ బరువు మోసేవాడు, దానిని ఎత్తుకోవడానికి ఎవరినైనా పిలిచినా, దగ్గరి బంధువైనా దాని నుండి కొంతైనా ఎత్తుకోడు. కాని నిశ్చయంగా నీవు వారినే హెచ్చరించగలవు ఎవరైతే తమకు అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో! 15 మరియు నమా’జ్‌ను స్థాపిస్తారో. మరియు ఎవడైతే నీతిమంతుడవుతాడో అతడు తనస్వంత (లాభం) కొరకే నీతిమంతుడవుతాడు. మరియు (అందరికీ) అల్లాహ్‌ వైపునకే మరలి పోవలసి ఉన్నది.

35:19 – وَمَا يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ ١٩

మరియు గ్రుడ్డివాడు మరియు కళ్ళున్న వాడు సరిసమానులు కాజాలరు;

35:20 – وَلَا الظُّلُمَاتُ وَلَا النُّورُ ٢٠

మరియు (అదే విధంగా) చీకట్లు (అవిశ్వాసం) మరియు వెలుగు (విశ్వాసం);

35:21 – وَلَا الظِّلُّ وَلَا الْحَرُورُ ٢١

మరియు నీడలు, మరియు ఎండా; 16

35:22 – وَمَا يَسْتَوِي الْأَحْيَاءُ وَلَا الْأَمْوَاتُ ۚ إِنَّ اللَّـهَ يُسْمِعُ مَن يَشَاءُ ۖ وَمَا أَنتَ بِمُسْمِعٍ مَّن فِي الْقُبُورِ ٢٢

మరియు బ్రతికి ఉన్నవారు మరియు మరణించిన వారు కూడా సరిసమానులు కాజాలరు. 17 నిశ్చయంగా, అల్లాహ్‌ తాను కోరిన వానికి (హితబోధ) వినేటట్లుచేస్తాడు. కాని నీవు గోరీలలో ఉన్నవారికి వినిపించజాలవు. 18

35:23 – إِنْ أَنتَ إِلَّا نَذِيرٌ ٢٣

నీవు (ఓ ము’హమ్మద్‌)! కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే. 19

35:24 – إِنَّا أَرْسَلْنَاكَ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا ۚ وَإِن مِّنْ أُمَّةٍ إِلَّا خَلَا فِيهَا نَذِيرٌ ٢٤

నిశ్చయంగా, మేము, నిన్ను సత్యం ప్రసాదించి, శుభవార్తనిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము. మరియు హెచ్చరికచేసేవాడు వారి మధ్య లేకుండా, ఏ సమాజం కూడా గడచిపోలేదు!

35:25 – وَإِن يُكَذِّبُوكَ فَقَدْ كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ جَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ وَبِالزُّبُرِ وَبِالْكِتَابِ الْمُنِيرِ ٢٥

మరియు ఒకవేళ వీరు నిన్ను అసత్య వాదుడవని తిరస్కరిస్తున్నారంటే (ఆశ్చర్యమేమీ కాదు)! ఎందుకంటే, వీరికి పూర్వం గతించినవారు కూడా (ఇదే విధంగా తమ ప్రవక్తలను) అసత్య వాదులని తిరస్కరించారు. వారి సందేశహరులు, వారివద్దకు స్పష్టమైన నిదర్శనాలను, శాసనాలను (‘జుబూర్‌) 20 మరియు వెలుగునిచ్చే గ్రంథాన్ని తీసుకొనివచ్చారు. 21

35:26 – ثُمَّ أَخَذْتُ الَّذِينَ كَفَرُوا ۖ فَكَيْفَ كَانَ نَكِيرِ ٢٦

ఆ తరువాత సత్య-తిరస్కారులను నేను (శిక్షకు) గురిచేశాను. (చూశారా) నా శిక్ష ఎంత కఠినమైనదో!

35:27 – أَلَمْ تَرَ أَنَّ اللَّـهَ أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجْنَا بِهِ ثَمَرَاتٍ مُّخْتَلِفًا أَلْوَانُهَا ۚ وَمِنَ الْجِبَالِ جُدَدٌ بِيضٌ وَحُمْرٌ مُّخْتَلِفٌ أَلْوَانُهَا وَغَرَابِيبُ سُودٌ ٢٧

ఏమీ? నీవు చూడటంలేదా? నిశ్చయంగా, అల్లాహ్‌ యే ఆకాశం నుండి వర్షం కురిపించేవాడని. తరువాత దాని నుండి మేము రంగురంగుల ఫలాలను ఉత్పత్తి చేస్తామని! మరియు పర్వతాలలో తెల్లని, ఎర్రని వివిధ రంగుల చారలను (కొన్నిటిని) మిక్కిలి నల్లగా కూడా చేస్తామని. 22

35:28 – وَمِنَ النَّاسِ وَالدَّوَابِّ وَالْأَنْعَامِ مُخْتَلِفٌ أَلْوَانُهُ كَذَٰلِكَ ۗ إِنَّمَا يَخْشَى اللَّـهَ مِنْ عِبَادِهِ الْعُلَمَاءُ ۗ إِنَّ اللَّـهَ عَزِيزٌ غَفُورٌ ٢٨

మరియు ఇదే విధంగా మానవుల, ఇతర ప్రాణుల మరియు పశువుల రంగులు కూడా వేర్వేరుగా ఉంటాయి. 23 నిశ్చయంగా, అల్లాహ్‌ దాసులలో జ్ఞానం గలవారు మాత్రమే ఆయనకు భయపడతారు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వ శక్తి మంతుడు, క్షమాశీలుడు.

35:29 – إِنَّ الَّذِينَ يَتْلُونَ كِتَابَ اللَّـهِ وَأَقَامُوا الصَّلَاةَ وَأَنفَقُوا مِمَّا رَزَقْنَاهُمْ سِرًّا وَعَلَانِيَةً يَرْجُونَ تِجَارَةً لَّن تَبُورَ ٢٩

నిశ్చయంగా అల్లాహ్‌ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ ను) పారాయణం చేసేవారు మరియు నమా’జ్‌ను స్థాపించేవారు మరియు తమకు ప్రసాదించబడిన జీవనోపాధి నుండి రహస్యంగా మరియు బహిరం గంగా ఖర్చు (దానం) చేసేవారు అందరూ! 24 నష్టంలేని వ్యాపారాన్ని అపేక్షించేవారే!

35:30 – لِيُوَفِّيَهُمْ أُجُورَهُمْ وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۚ إِنَّهُ غَفُورٌ شَكُورٌ ٣٠

ఇదంతా అల్లాహ్‌ వారి ప్రతిఫలాన్ని పూర్తిగా వారికి ఇవ్వాలనీ మరియు తన అనుగ్రహంతో వారికి మరింత అధికంగా ఇవ్వాలనీ! నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, కృతజ్ఞతలను ఆమోదించేవాడు.

35:31 – وَالَّذِي أَوْحَيْنَا إِلَيْكَ مِنَ الْكِتَابِ هُوَ الْحَقُّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ ۗ إِنَّ اللَّـهَ بِعِبَادِهِ لَخَبِيرٌ بَصِيرٌ ٣١

మరియు (ఓ ము’హమ్మద్‌!) మేము నీపై అవతరింపజేసిన గ్రంథమే నిజమైనది, దానికి పూర్వం వచ్చిన గ్రంథాలలో (మిగిలి ఉన్న సత్యాన్ని) ధృవపరిచేది. నిశ్చయంగా, అల్లాహ్‌ తన దాసులను బాగా ఎరిగేవాడు, సర్వ దృష్టికర్త.

35:32 – ثُمَّ أَوْرَثْنَا الْكِتَابَ الَّذِينَ اصْطَفَيْنَا مِنْ عِبَادِنَا ۖ فَمِنْهُمْ ظَالِمٌ لِّنَفْسِهِ وَمِنْهُم مُّقْتَصِدٌ وَمِنْهُمْ سَابِقٌ بِالْخَيْرَاتِ بِإِذْنِ اللَّـهِ ۚ ذَٰلِكَ هُوَ الْفَضْلُ الْكَبِيرُ ٣٢

ఆ తరువాత మేము ఈ గ్రంథానికి, మా దాసులలో నుండి మేము ఎన్నుకున్న వారిని వారసులుగా చేశాము. 25 వారిలో కొందరు తమకు తాము అన్యాయం చేసుకున్న వారున్నారు, 26 మరికొందరు మధ్యస్థంగా ఉండే వారున్నారు, 27 ఇంకా కొందరు అల్లాహ్‌ సెలవుతో సత్కార్యాలలో మున్ముందు ఉండేవారూ ఉన్నారు. 28 ఇదే ఆ గొప్ప అనుగ్రహం.

35:33 – جَنَّاتُ عَدْنٍ يَدْخُلُونَهَا يُحَلَّوْنَ فِيهَا مِنْ أَسَاوِرَ مِن ذَهَبٍ وَلُؤْلُؤًا ۖ وَلِبَاسُهُمْ فِيهَا حَرِيرٌ ٣٣

శాశ్వతమైన స్వర్గవనాలలో వారు ప్రవే శిస్తారు. అందు వారు బంగారు కంకణాలు మరియు ముత్యాలతో అలంకరింపబడుతారు. మరియు వారి వస్త్రాలు పట్టుతో చేయబడి ఉంటాయి. 29

35:34 – وَقَالُوا الْحَمْدُ لِلَّـهِ الَّذِي أَذْهَبَ عَنَّا الْحَزَنَ ۖ إِنَّ رَبَّنَا لَغَفُورٌ شَكُورٌ ٣٤

మరియు (అప్పుడు) వారు ఇలా అంటారు: “మా నుండి దుఃఖాన్ని తొలగించిన అల్లాహ్‌యే సర్వ స్తోత్రాలకు అర్హుడు. నిశ్చయంగా మా ప్రభువు క్షమాశీలుడు, కృతజ్ఞతలను ఆమోదించేవాడు.

35:35 – الَّذِي أَحَلَّنَا دَارَ الْمُقَامَةِ مِن فَضْلِهِ لَا يَمَسُّنَا فِيهَا نَصَبٌ وَلَا يَمَسُّنَا فِيهَا لُغُوبٌ ٣٥

ఆయనే తన అనుగ్రహంతో మమ్మల్ని శాశ్వతమైన నివాసస్థలంలో దింపాడు. ఇందులో మాకు ఎలాంటి కష్టమూ లేదు మరియు ఇందులో ఎలాంటి అలసట కూడా లేదు.”

35:36 – وَالَّذِينَ كَفَرُوا لَهُمْ نَارُ جَهَنَّمَ لَا يُقْضَىٰ عَلَيْهِمْ فَيَمُوتُوا وَلَا يُخَفَّفُ عَنْهُم مِّنْ عَذَابِهَا ۚ كَذَٰلِكَ نَجْزِي كُلَّ كَفُورٍ ٣٦

మరియు సత్యతిరస్కారులైన వారికొరకు నరకాగ్ని ఉంటుంది. అందులో వారు చనిపోవాలనీ తీర్పూ ఇవ్వబడదు, లేదా వారికి దాని (నరకపు) శిక్ష కూడా తగ్గింపబడదు. ఈ విధంగా, మేము ప్రతి కృతఘ్నునికి (సత్య-తిరస్కారునికి) ప్రతీకారం చేస్తాము.

35:37 – وَهُمْ يَصْطَرِخُونَ فِيهَا رَبَّنَا أَخْرِجْنَا نَعْمَلْ صَالِحًا غَيْرَ الَّذِي كُنَّا نَعْمَلُ ۚ أَوَلَمْ نُعَمِّرْكُم مَّا يَتَذَكَّرُ فِيهِ مَن تَذَكَّرَ وَجَاءَكُمُ النَّذِيرُ ۖ فَذُوقُوا فَمَا لِلظَّالِمِينَ مِن نَّصِيرٍ ٣٧

మరియు వారు దానిలో (నరకంలో) ఇలా మొర పెట్టుకుంటారు: “ఓ మా ప్రభూ! మమ్మల్ని బయటికి తీయి. మేము పూర్వం చేసిన కార్యా లకు భిన్నంగా సత్కార్యాలు చేస్తాము.” (వారికి ఇలా సమాధానం ఇవ్వబడుతుంది): “ఏమీ? గుణ పాఠం నేర్చుకోదలచిన వాడు గుణపాఠం నేర్చు కోవటానికి, మేము మీకు తగినంత వయస్సును ఇవ్వలేదా? మరియు మీ వద్దకు హెచ్చరిక చేసేవాడు కూడా వచ్చాడు కదా? కావున మీరు (శిక్షను) రుచిచూడండి. ఇక్కడ దుర్మార్గులకు సహాయపడేవాడు ఎవ్వడూ లేడు.”

35:38 – إِنَّ اللَّـهَ عَالِمُ غَيْبِ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ٣٨

నిశ్చయంగా, అల్లాహ్‌కు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న అగోచర విషయాలన్నీ తెలుసు. నిశ్చయంగా ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలు కూడా బాగా తెలుసు. 30

35:39 – هُوَ الَّذِي جَعَلَكُمْ خَلَائِفَ فِي الْأَرْضِ ۚ فَمَن كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُ ۖ وَلَا يَزِيدُ الْكَافِرِينَ كُفْرُهُمْ عِندَ رَبِّهِمْ إِلَّا مَقْتًا ۖ وَلَا يَزِيدُ الْكَافِرِينَ كُفْرُهُمْ إِلَّا خَسَارًا ٣٩

ఆయనే మిమ్మల్ని భూమిపై ఉత్తరాది కారులుగా చేసినవాడు. కావున ఎవడు (సత్యాన్ని) తిరస్కరిస్తాడో అతని తిరస్కారం అతనిపైననే పడుతుంది. సత్య-తిరస్కారులకు వారి తిరస్కారం వారి ప్రభువు వద్ద కేవలం వారి యెడల అసహాస్యాన్నే అధికం చేస్తుంది. మరియు సత్య-తిరస్కారులకు వారి తిరస్కారం వారికి నష్టాన్నే అధికం చేస్తుంది. 31

35:40 – قُلْ أَرَأَيْتُمْ شُرَكَاءَكُمُ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّـهِ أَرُونِي مَاذَا خَلَقُوا مِنَ الْأَرْضِ أَمْ لَهُمْ شِرْكٌ فِي السَّمَاوَاتِ أَمْ آتَيْنَاهُمْ كِتَابًا فَهُمْ عَلَىٰ بَيِّنَتٍ مِّنْهُ ۚ بَلْ إِن يَعِدُ الظَّالِمُونَ بَعْضُهُم بَعْضًا إِلَّا غُرُورًا ٤٠

వారితో ఇలా అను: “అల్లాహ్‌ను వదలి మీరు ఆరాధించే ఈ భాగస్వాములను గురించి ఎప్పుడైనా ఆలోచించారా? వారు భూమిలో ఏమి సృష్టించారో నాకు చూపండి? లేదా వారికి ఆకాశాలలో ఏదైనా భాగస్వామ్యం ఉందా? లేదా మేము వారికి ఏదైనా గ్రంథాన్ని ఇచ్చామా? వారు దాని స్పష్టమైన ప్రమాణంపై ఉన్నారని అనటానికి? అదికాదు, అసలు ఈ దుర్మార్గులు పరస్పరం, కేవలం మోసపు మాటలను గురించి వాగ్దానం చేసు కుంటున్నారు.” (7/8)

35:41 – إِنَّ اللَّـهَ يُمْسِكُ السَّمَاوَاتِ وَالْأَرْضَ أَن تَزُولَا ۚ وَلَئِن زَالَتَا إِنْ أَمْسَكَهُمَا مِنْ أَحَدٍ مِّن بَعْدِهِ ۚ إِنَّهُ كَانَ حَلِيمًا غَفُورًا ٤١

  • నిశ్చయంగా, అల్లాహ్‌ భూమ్యాకాశాలను తమ స్థానాలనుండి విడిపోకుండా వాటిని నిలిపి ఉంచాడు. ఒకవేళ అవి తొలగిపోతే, ఆయన తప్ప మరెవరైనా వాటిని నిలిపి ఉంచగలరా? 32 నిశ్చయంగా ఆయన సహనశీలుడు, క్షమాశీలుడు.

35:42 – وَأَقْسَمُوا بِاللَّـهِ جَهْدَ أَيْمَانِهِمْ لَئِن جَاءَهُمْ نَذِيرٌ لَّيَكُونُنَّ أَهْدَىٰ مِنْ إِحْدَى الْأُمَمِ ۖ فَلَمَّا جَاءَهُمْ نَذِيرٌ مَّا زَادَهُمْ إِلَّا نُفُورًا ٤٢

మరియు, ఒకవేళ హెచ్చరిక చేసేవాడు వారి వద్దకు వస్తే! వారు తప్పక, ఇతర సమాజాల వారి కంటే ఎక్కువగా సన్మార్గం మీద ఉండేవారని అల్లాహ్‌ సాక్షిగా గట్టి ప్రమాణాలు చేస్తారు. 33 కాని హెచ్చరిక చేసేవాడు, వారి వద్దకు వచ్చినపుడు మాత్రం (అతని రాక) వారి వ్యతిరేకతను తప్ప మరేమీ అధికం చేయలేకపోయింది; 34

35:43 – اسْتِكْبَارًا فِي الْأَرْضِ وَمَكْرَ السَّيِّئِ ۚ وَلَا يَحِيقُ الْمَكْرُ السَّيِّئُ إِلَّا بِأَهْلِهِ ۚ فَهَلْ يَنظُرُونَ إِلَّا سُنَّتَ الْأَوَّلِينَ ۚ فَلَن تَجِدَ لِسُنَّتِ اللَّـهِ تَبْدِيلًا ۖ وَلَن تَجِدَ لِسُنَّتِ اللَّـهِ تَحْوِيلًا ٤٣

(ఇది) వారు భూమిలో మరింత దురహం కారంతో తిరుగుతూ దుష్టపన్నాగాలు పన్ని నందుకు. 35 వాస్తవానికి దుష్టపన్నాగాలు, వాటిని పన్నేవారికే హాని కలిగిస్తాయి. తమ పూర్వికుల పట్ల అవలంబించబడిన విధానమే (వారిపట్ల గూడా) అవలంబించబడాలని వారు నిరీక్షి స్తున్నారా ఏమిటి? కాని నీవు అల్లాహ్‌ సంప్రదాయంలో ఎలాంటిమార్పును పొందలేవు. మరియు అల్లాహ్‌ సంప్రదాయంలో నీవు ఎలాంటి అతిక్రమాన్ని చూడలేవు.

35:44 – أَوَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ وَكَانُوا أَشَدَّ مِنْهُمْ قُوَّةً ۚ وَمَا كَانَ اللَّـهُ لِيُعْجِزَهُ مِن شَيْءٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ ۚ إِنَّهُ كَانَ عَلِيمًا قَدِيرًا ٤٤

వారు భూమిలో ఎన్నడూ సంచరించలేదా ఏమిటి? వారికి పూర్వం గతించినవారు వీరికంటే అత్యంత బలవంతులైనా, వారి పరిణామం ఏమయిందో వారు చూడలేదా? అల్లాహ్‌ నుండి తప్పించుకోగలిగేది ఆకాశాలలో గానీ మరియు భూమిలో గానీ ఏదీలేదు. నిశ్చయంగా, ఆయన సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు.

35:45 – وَلَوْ يُؤَاخِذُ اللَّـهُ النَّاسَ بِمَا كَسَبُوا مَا تَرَكَ عَلَىٰ ظَهْرِهَا مِن دَابَّةٍ وَلَـٰكِن يُؤَخِّرُهُمْ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۖ فَإِذَا جَاءَ أَجَلُهُمْ فَإِنَّ اللَّـهَ كَانَ بِعِبَادِهِ بَصِيرًا ٤٥

ఒకవేళ అల్లాహ్‌ మానవులను వారు చేసిన కర్మలకు గానూ పట్టుకోదలిస్తే! (భూమి) మీద ఏ ఒక్క ప్రాణిని కూడా ఆయన వదిలిపెట్టి ఉండేవాడు కాదు! నిజానికి ఆయన వారికి ఒక నియమిత సమ యం వరకు గడువునిస్తున్నాడు. కాని వారి గడువు పూర్తయితే; అప్పుడు నిశ్చయంగా, అల్లాహ్‌ సదా తన దాసులను స్వయంగా చూసుకుంటాడు.

సూరహ్‌ యా-సీన్‌ – ఈ సూరహ్‌ చదువటం వల్ల చాలా పుణ్యాలున్నాయని ఎన్నో దైవప్రవక్త (‘స’అస) ప్రవచనా లున్నాయి. ఇది ఖుర్‌ఆన్‌ యొక్క హృదయం. మానవునికి మరణసమయం ఆసన్నమై నప్పుడు అతని దగ్గర ఈ సూరహ్‌ చదవాలని ఉల్లేఖనాలు (రివాయత్‌లు) ఉన్నాయి. కాని ఈ ఉల్లేఖనాలు పూర్తిగా ప్రామాణికమైనవి (‘స’హీ’హ్‌) అని నిరూపించబడలేదు. ఈ సూరహ్‌లో మానవుని నైతిక బాధ్యతలు వివరించబడ్డాయి. ఇది మధ్య మక్కహ్ కాలంలో అవతరింపజేయ బడింది, బహుశా సూరహ్‌ అల్‌-ఫుర్ఖాన్‌ (25)కు ముందు. 83 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 36:1 – يس ١

యా-సీన్‌. 1

36:2 – وَالْقُرْآنِ الْحَكِيمِ ٢

వివేకంతో నిండిఉన్న ఖుర్‌ఆన్‌ సాక్షిగా!

36:3 – إِنَّكَ لَمِنَ الْمُرْسَلِينَ ٣

(ఓ ము’హమ్మద్‌!) నిశ్చయంగా, నీవు సందేశ హరులలో ఒకడవు. 2

36:4 – عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ٤

(నీవు) ఋజుమార్గంపై ఉన్నావు.

36:5 – تَنزِيلَ الْعَزِيزِ الرَّحِيمِ ٥

ఇది (ఈ ఖుర్‌ఆన్‌) సర్వశక్తిమంతుడు, అపార కరుణాప్రదాత ద్వారానే అవతరింపజేయ బడింది. 3

36:6 – لِتُنذِرَ قَوْمًا مَّا أُنذِرَ آبَاؤُهُمْ فَهُمْ غَافِلُونَ ٦

ఏ జాతివారి తండ్రి-తాతలైతే హెచ్చరిక చేయబడక, నిర్లక్ష్యులై ఉన్నారో, వారిని హెచ్చరించటానికి. 4

36:7 – لَقَدْ حَقَّ الْقَوْلُ عَلَىٰ أَكْثَرِهِمْ فَهُمْ لَا يُؤْمِنُونَ ٧

వాస్తవానికి వారిలో అనేకులను గురించి మా వాక్కు నిజం కానున్నది, కావున వారు విశ్వసించరు. 5

36:8 – إِنَّا جَعَلْنَا فِي أَعْنَاقِهِمْ أَغْلَالًا فَهِيَ إِلَى الْأَذْقَانِ فَهُم مُّقْمَحُونَ ٨

నిశ్చయంగా, మేము వారి మెడలలో పట్టాలు వేశాము. 6 అవి వారి గడ్డాలవరకు వున్నాయి. కావున వారి తలలు నిక్కివున్నాయి.

36:9 – وَجَعَلْنَا مِن بَيْنِ أَيْدِيهِمْ سَدًّا وَمِنْ خَلْفِهِمْ سَدًّا فَأَغْشَيْنَاهُمْ فَهُمْ لَا يُبْصِرُونَ ٩

మరియు మేము వారి ముందు ఒక అడ్డు (తెర)ను మరియు వారి వెనుక ఒక అడ్డు (తెర)ను నిలబెట్టాము. మరియు మేము వారిని కప్పి వేశాము అందువల్ల వారు ఏమీ చూడలేరు.

36:10 – وَسَوَاءٌ عَلَيْهِمْ أَأَنذَرْتَهُمْ أَمْ لَمْ تُنذِرْهُمْ لَا يُؤْمِنُونَ ١٠

మరియు నీవు వారిని హెచ్చరించినా, హెచ్చరించక పోయినా, వారికి సమానమే, వారు విశ్వసించరు!

36:11 – إِنَّمَا تُنذِرُ مَنِ اتَّبَعَ الذِّكْرَ وَخَشِيَ الرَّحْمَـٰنَ بِالْغَيْبِ ۖ فَبَشِّرْهُ بِمَغْفِرَةٍ وَأَجْرٍ كَرِيمٍ ١١

నిశ్చయంగా, ఎవడైతే హితబోధను అనుస రిస్తూ, అగోచరుడైన కరుణామయునికి భయపడ తాడో! అతనిని మాత్రమే నీవు హెచ్చరించగలవు. అతనికి క్షమాభిక్ష మరియు మంచి ప్రతిఫలం (స్వర్గం) లభిస్తుందనే శుభవార్తను అందజేయి.

36:12 – إِنَّا نَحْنُ نُحْيِي الْمَوْتَىٰ وَنَكْتُبُ مَا قَدَّمُوا وَآثَارَهُمْ ۚ وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ فِي إِمَامٍ مُّبِينٍ ١٢

నిశ్చయంగా, మేము మృతులను సజీవులుగా చేస్తాము. మరియు మేము వారు చేసి పంపిన మరియు తమ వెనుక విడిచిన చిహ్నాలను కూడా వ్రాసి పెడుతున్నాము. 7 మరియు ప్రతి విషయాన్ని మేము స్పష్టమైన గ్రంథంలో వ్రాసిపెడు తున్నాము.

36:13 – وَاضْرِبْ لَهُم مَّثَلًا أَصْحَابَ الْقَرْيَةِ إِذْ جَاءَهَا الْمُرْسَلُونَ ١٣

వారికి సందేశహరులను పంపిన ఆ నగరవాసుల 8 గాథను వినిపించు;

36:14 – إِذْ أَرْسَلْنَا إِلَيْهِمُ اثْنَيْنِ فَكَذَّبُوهُمَا فَعَزَّزْنَا بِثَالِثٍ فَقَالُوا إِنَّا إِلَيْكُم مُّرْسَلُونَ ١٤

మేము వారి వద్దకు ఇద్దరిని పంపగా వారు ఆ ఇద్దరినీ అబద్ధీకులని తిరస్కరించారు. అప్పుడు మేము వారిని మూడవ వానితో బలపరి చాము. అప్పుడు వారు, వారితో: “నిశ్చయంగా, మేము (మీ వద్దకు పంపబడిన) సందేశహరులం.” అని అన్నారు.

36:15 – قَالُوا مَا أَنتُمْ إِلَّا بَشَرٌ مِّثْلُنَا وَمَا أَنزَلَ الرَّحْمَـٰنُ مِن شَيْءٍ إِنْ أَنتُمْ إِلَّا تَكْذِبُونَ ١٥

(దానికి ఆ నగరవాసులు) ఇలా అన్నారు: “మీరు కేవలం మా వంటి మానవులే మరియు అనంత కరుణామయుడు మీపై ఏ (సందేశాన్నీ) అవతరింపజేయలేదు. మీరు కేవలం అబద్ధాలాడు తున్నారు?” 9

36:16 – قَالُوا رَبُّنَا يَعْلَمُ إِنَّا إِلَيْكُمْ لَمُرْسَلُونَ ١٦

(ఆ ప్రవక్తలు) అన్నారు: “మా ప్రభువుకు తెలుసు, నిశ్చయంగా మేము మీ వద్దకు పంపబడిన సందేశహరులము!

36:17 – وَمَا عَلَيْنَا إِلَّا الْبَلَاغُ الْمُبِينُ ١٧

“మా బాధ్యత కేవలం మీకు స్పష్టంగా సందేశాన్ని అందజేయటమే!”

36:18 – قَالُوا إِنَّا تَطَيَّرْنَا بِكُمْ ۖ لَئِن لَّمْ تَنتَهُوا لَنَرْجُمَنَّكُمْ وَلَيَمَسَّنَّكُم مِّنَّا عَذَابٌ أَلِيمٌ ١٨

(ఆనగరవాసులు) అన్నారు: “నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక దుశ్శకునంగా పరిగ ణిస్తున్నాము. మీరు దీనిని మానుకోకపోతే, మేము మిమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపేస్తాము. మరియు మా నుండి మీకు బాధాకరమైన శిక్ష పడుతుంది.”

36:19 – قَالُوا طَائِرُكُم مَّعَكُمْ ۚ أَئِن ذُكِّرْتُم ۚ بَلْ أَنتُمْ قَوْمٌ مُّسْرِفُونَ ١٩

(ఆ ప్రవక్తలు) అన్నారు: “మీ అపశకునం మీ వెంటనే ఉంది. 10 మీకు చేసే హితబోధను (మీరు అపశకునంగా పరిగణిస్తున్నారా)? అది కాదు, అసలు మీరు మితిమీరిపోయిన ప్రజలు.” 11

36:20 – وَجَاءَ مِنْ أَقْصَى الْمَدِينَةِ رَجُلٌ يَسْعَىٰ قَالَ يَا قَوْمِ اتَّبِعُوا الْمُرْسَلِينَ ٢٠

మీకు చేసే హితబోధను (మీరు అపశకునంగా పరిగణిస్తున్నారా)? అది కాదు, అసలు మీరు మితిమీరిపోయిన ప్రజలు.”

36:21 – اتَّبِعُوا مَن لَّا يَسْأَلُكُمْ أَجْرًا وَهُم مُّهْتَدُونَ ٢١

‘మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ కోరని వారిని (ఈ సందేశహరులను) అనుసరించండి! వారు సన్మార్గంలో ఉన్నారు.

36:22 – وَمَا لِيَ لَا أَعْبُدُ الَّذِي فَطَرَنِي وَإِلَيْهِ تُرْجَعُونَ ٢٢

[*] “మరియు నన్నుసృష్టించిన ఆయనను నేనెందుకు ఆరాధించకూడదూ? మరియు మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు.

36:23 – أَأَتَّخِذُ مِن دُونِهِ آلِهَةً إِن يُرِدْنِ الرَّحْمَـٰنُ بِضُرٍّ لَّا تُغْنِ عَنِّي شَفَاعَتُهُمْ شَيْئًا وَلَا يُنقِذُونِ ٢٣

“ఏమీ? ఆయనను వదలి నేను ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకోవాలా? ఒకవేళ ఆ కరుణామయుడు నాకు హాని చేయదలచుకుంటే, వారి సిఫారసు నాకు ఏ మాత్రం ఉపయోగపడదు మరియు వారు నన్ను కాపాడనూ లేరు.

36:24 – إِنِّي إِذًا لَّفِي ضَلَالٍ مُّبِينٍ ٢٤

“అలా చేస్తే నిశ్చయంగా, నేను స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడిపోయినవాడిని అవుతాను.

36:25 – إِنِّي آمَنتُ بِرَبِّكُمْ فَاسْمَعُونِ ٢٥

“నిశ్చయంగా, నేను మీ ప్రభువును విశ్వ సిస్తున్నాను, కావున మీరు నా మాట వినండి!”

36:26 – قِيلَ ادْخُلِ الْجَنَّةَ ۖ قَالَ يَا لَيْتَ قَوْمِي يَعْلَمُونَ ٢٦

(అతనిని వారుచంపినతరువాత అతనితో) ఇలా అనబడింది: “నీవు స్వర్గంలో ప్రవేశించు.” అతడు ఇలా అన్నాడు: “అయ్యో! నా జాతివారికి ఈ విషయం తెలిస్తే ఎంత బాగుండేది!

36:27 – بِمَا غَفَرَ لِي رَبِّي وَجَعَلَنِي مِنَ الْمُكْرَمِينَ ٢٧

“నా ప్రభువు నన్ను క్షమించాడు మరియు నన్నుగౌరవనీయులలోకి ప్రవేశింపజేశాడు!”అనేది.

36:28 – وَمَا أَنزَلْنَا عَلَىٰ قَوْمِهِ مِن بَعْدِهِ مِن جُندٍ مِّنَ السَّمَاءِ وَمَا كُنَّا مُنزِلِينَ ٢٨

(*) మరియు ఆ తరువాత అతని జాతి వారి మీదకు, మేము ఆకాశంనుండి ఏ సైన్యాన్నీ పంపలేదు. అసలు మాకు సైన్యాన్ని పంపే అవసరమే ఉండదు!

36:29 – إِن كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ خَامِدُونَ ٢٩

అది కేవలం ఒక పెద్ద ధ్వని 12 మాత్రమే! అంతే! వారంతా (ఒకేసారి) అంతంచేయబడ్డారు.

36:30 – يَا حَسْرَةً عَلَى الْعِبَادِ ۚ مَا يَأْتِيهِم مِّن رَّسُولٍ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ٣٠

ఆ దాసులగతి ఎంత శోచనీయమయినది! వారి వద్దకు ఏ సందేశహరుడు వచ్చినా, వారు అతనిని ఎగతాళి చేయకుండా ఉండలేదు.

36:31 – أَلَمْ يَرَوْا كَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّنَ الْقُرُونِ أَنَّهُمْ إِلَيْهِمْ لَا يَرْجِعُونَ ٣١

ఏమీ? వారుచూడలేదా (వారికి తెలియదా)? వారికి ముందు మేము ఎన్నో తరాలను నాశనం చేశామని? నిశ్చయంగా, వారు (వారి పూర్వీ కులు) ఎన్నటికీ వారి వద్దకు తిరిగిరాలేదు.

36:32 – وَإِن كُلٌّ لَّمَّا جَمِيعٌ لَّدَيْنَا مُحْضَرُونَ ٣٢

కాని వారందరినీ కలిపి ఒకేసారి, మా ముందు హాజరుపరచడం జరుగుతుంది.

36:33 – وَآيَةٌ لَّهُمُ الْأَرْضُ الْمَيْتَةُ أَحْيَيْنَاهَا وَأَخْرَجْنَا مِنْهَا حَبًّا فَمِنْهُ يَأْكُلُونَ ٣٣

మరియు వారి కొరకు సూచనగా జీవంలేని ఈ భూమియే ఉంది. మేము దీనికి ప్రాణం పోసి, దీని నుండి ధాన్యం తీస్తాము, దాన్ని వారు తింటారు.

36:34 – وَجَعَلْنَا فِيهَا جَنَّاتٍ مِّن نَّخِيلٍ وَأَعْنَابٍ وَفَجَّرْنَا فِيهَا مِنَ الْعُيُونِ ٣٤

మేము దీనిలో ఖర్జూరపు మరియు ద్రాక్ష వనాలను పెంచాము మరియు వాటిలో ఊటలను ప్రవహింపజేశాము.

36:35 – لِيَأْكُلُوا مِن ثَمَرِهِ وَمَا عَمِلَتْهُ أَيْدِيهِمْ ۖ أَفَلَا يَشْكُرُونَ ٣٥

వారు దీని ఫలాలను తినటానికి; మరియు ఇదంతా వారి చేతులు చేసింది కాదు. అయినా వారు కృతజ్ఞతలు తెలుపరా?

36:36 – سُبْحَانَ الَّذِي خَلَقَ الْأَزْوَاجَ كُلَّهَا مِمَّا تُنبِتُ الْأَرْضُ وَمِنْ أَنفُسِهِمْ وَمِمَّا لَا يَعْلَمُونَ ٣٦

భూమి నుండి ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువులలో, జీవులలో మరియు స్వయాన వారిలో (మానవులలో) ఇంకా వారికి తెలియని వాటిలోనూ (ఆడ-మగ) జతలను సృష్టించిన, ఆయన (అల్లాహ్‌) లోపాలకు అతీతుడు. 13

36:37 – وَآيَةٌ لَّهُمُ اللَّيْلُ نَسْلَخُ مِنْهُ النَّهَارَ فَإِذَا هُم مُّظْلِمُونَ ٣٧

మరియు వారి కొరకు మా సూచనలలో రాత్రి ఒకటి; మేము దానిపైనుండి పగటిని (వెలుగును) తొలగించినప్పుడు, వారిని చీకటి ఆవరించుకుంటుంది.

36:38 – وَالشَّمْسُ تَجْرِي لِمُسْتَقَرٍّ لَّهَا ۚ ذَٰلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ ٣٨

మరియు సూర్యుడు తన నిర్ణీతపరిధిలో, నిర్ణీత కాలంలో పయనిస్తూ ఉంటాడు. ఇది ఆ సర్వశక్తిమంతుని, సర్వజ్ఞుని నియమావళి.

36:39 – وَالْقَمَرَ قَدَّرْنَاهُ مَنَازِلَ حَتَّىٰ عَادَ كَالْعُرْجُونِ الْقَدِيمِ ٣٩

మరియు చంద్రుని కొరకు మేము దశలను నియమించాము, చివరకు అతడు ఎండిన ఖర్జూరపు మట్టవలే అయిపోతాడు.

36:40 – لَا الشَّمْسُ يَنبَغِي لَهَا أَن تُدْرِكَ الْقَمَرَ وَلَا اللَّيْلُ سَابِقُ النَّهَارِ ۚ وَكُلٌّ فِي فَلَكٍ يَسْبَحُونَ ٤٠

చంద్రుణ్ణి అందుకోవటం సూర్యుడి తరంకాదు. మరియు రాత్రి పగటిని అధిగమించ జాలదు. మరియు అవన్నీ తమ-తమ కక్ష్యలలో సంచరిస్తూ ఉంటాయి.

36:41 – وَآيَةٌ لَّهُمْ أَنَّا حَمَلْنَا ذُرِّيَّتَهُمْ فِي الْفُلْكِ الْمَشْحُونِ ٤١

వారికి మరొక సూచన ఏమిటంటే, నిశ్చయంగా, మేము వారి సంతతిని (నూ’హ్‌ యొక్క) నిండు నావలోనికి ఎక్కించాము.

36:42 – وَخَلَقْنَا لَهُم مِّن مِّثْلِهِ مَا يَرْكَبُونَ ٤٢

మరియుమేము వారుఎక్కి ప్రయాణంచేయ టానికి, ఇటువంటి వాటిని ఎన్నోసృష్టించాము. 14

36:43 – وَإِن نَّشَأْ نُغْرِقْهُمْ فَلَا صَرِيخَ لَهُمْ وَلَا هُمْ يُنقَذُونَ ٤٣

మరియు మేముకోరినట్లయితే వారిని ముంచి వేసే వారము; అప్పుడు వారికేకలు వినేవాడెవడూ ఉండడు మరియు వారు రక్షింపబడనూలేరు –

36:44 – إِلَّا رَحْمَةً مِّنَّا وَمَتَاعًا إِلَىٰ حِينٍ ٤٤

మేము కరుణిస్తే తప్ప – మరియు మేము కొంత కాలం వరకు వారికి వ్యవధినిస్తే తప్ప!

36:45 – وَإِذَا قِيلَ لَهُمُ اتَّقُوا مَا بَيْنَ أَيْدِيكُمْ وَمَا خَلْفَكُمْ لَعَلَّكُمْ تُرْحَمُونَ ٤٥

మరియు వారితో: “మీరు, మీ ముందున్న దానికీ (ఇహలోక శిక్షకూ) మరియు మీ వెనుక రానున్న దానికీ (పరలోక శిక్షకూ) భీతిపరులై ఉండండి, 15 బహుశా మీరు కరుణింపబడవచ్చు!” అని అన్నప్పుడు, (వారు లక్ష్యం చేయటం లేదు).

36:46 – وَمَا تَأْتِيهِم مِّنْ آيَةٍ مِّنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ ٤٦

మరియు వారి ప్రభువు సూచనలలో నుండి, వారివద్దకు ఏ సూచన వచ్చినా, వారు దాని నుండి ముఖం త్రిప్పుకోకుండా ఉండలేదు.

36:47 – وَإِذَا قِيلَ لَهُمْ أَنفِقُوا مِمَّا رَزَقَكُمُ اللَّـهُ قَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا أَنُطْعِمُ مَن لَّوْ يَشَاءُ اللَّـهُ أَطْعَمَهُ إِنْ أَنتُمْ إِلَّا فِي ضَلَالٍ مُّبِينٍ ٤٧

మరియు వారితో: “అల్లాహ్‌ మీకు ప్రసాదించిన జీవనోపాధినుండి ఖర్చుచేయండి.” అని అన్నప్పుడు సత్య-తిరస్కారులు విశ్వాసు లతో అంటారు: “ఏమీ? అల్లాహ్‌ కోరితే, తానే తినిపించగల వారికి, మేము తినిపించాలా? మీరు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు.”

36:48 – وَيَقُولُونَ مَتَىٰ هَـٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ ٤٨

వారు ఇంకా ఇలా అంటారు: “మీరు సత్యవంతులే అయితే, ఆ వాగ్దానం (పునరుత్థానం) ఎప్పుడు పూర్తి కానున్నది?”

36:49 – مَا يَنظُرُونَ إِلَّا صَيْحَةً وَاحِدَةً تَأْخُذُهُمْ وَهُمْ يَخِصِّمُونَ ٤٩

వారు నిరీక్షిస్తున్నది కేవలం ఒక పెద్దధ్వని 16 కొరకే. మరియు వారు వాదులాడుకుంటూ ఉండగానే, అది వారిని చిక్కించుకుంటుంది.

36:50 – فَلَا يَسْتَطِيعُونَ تَوْصِيَةً وَلَا إِلَىٰ أَهْلِهِمْ يَرْجِعُونَ ٥٠

వారు ఏవిధమైన వీలునామా కూడా వ్రాయలేరు మరియు తమ కుటుంబంవారి వద్దకు కూడా తిరిగి పోలేరు.

36:51 – وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُم مِّنَ الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنسِلُونَ ٥١

మరియు (మరొక సారి) బాకా ఊదబడి నప్పుడు, వారంతా గోరీల నుండి (లేచి) తమ ప్రభువు వైపునకు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తారు. 17

36:52 – قَالُوا يَا وَيْلَنَا مَن بَعَثَنَا مِن مَّرْقَدِنَا ۜ ۗ هَـٰذَا مَا وَعَدَ الرَّحْمَـٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ ٥٢

వారంటారు: “అయ్యో మా దౌర్భాగ్యం! మమ్మల్ని మా పడకల నుండి లేపి ఎవరు నిల బెట్టారు?” (వారితో అనబడుతుంది): “ఇదే ఆ కరుణామయుడు చేసిన వాగ్దానం. మరియు అతని సందేశహరులు సత్యమే పలికారు!”

36:53 – إِن كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ جَمِيعٌ لَّدَيْنَا مُحْضَرُونَ ٥٣

అది కేవలం ఒక పెద్దధ్వని 18 మాత్రమే అయి ఉంటుంది! వెంటనే వారంతా మా ముందు హాజరు చేయబడతారు!

36:54 – فَالْيَوْمَ لَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا وَلَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ ٥٤

ఆ రోజు ఎవ్వరికీ ఎలాంటి అన్యాయం జరుగదు. మరియు మీ కర్మలకు తగినది తప్ప, మరే ప్రతిఫల మివ్వబడదు.

36:55 – إِنَّ أَصْحَابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغُلٍ فَاكِهُونَ ٥٥

నిశ్చయంగా, ఆ రోజు స్వర్గవాసులు సుఖ-సంతోషాలలో నిమగ్నులై ఉంటారు.

36:56 – هُمْ وَأَزْوَاجُهُمْ فِي ظِلَالٍ عَلَى الْأَرَائِكِ مُتَّكِئُونَ ٥٦

వారు మరియు వారి సహవాసులు (అ’జ్వాజ్‌), చల్లని నీడలలో, ఆనుడు ఆసనాల మీద హాయిగా కూర్చొని ఉంటారు. 19

36:57 – لَهُمْ فِيهَا فَاكِهَةٌ وَلَهُم مَّا يَدَّعُونَ ٥٧

అందులో వారికి ఫలాలు మరియు వారు కోరేవన్నీ ఉంటాయి.

36:58 – سَلَامٌ قَوْلًا مِّن رَّبٍّ رَّحِيمٍ ٥٨

“మీకు శాంతి కలుగుగాక (సలాం)!” అనే పలుకులు, అపార కరుణాప్రదాత అయిన ప్రభువు తరఫు నుండి వస్తాయి. 20

36:59 – وَامْتَازُوا الْيَوْمَ أَيُّهَا الْمُجْرِمُونَ ٥٩

ఇంకా (ఇలాఅనబడుతుంది): “ఓ అపరాధు లారా! ఈ నాడు మీరు వేరయిపొండి. 21 (1/8)

36:60 – أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَا بَنِي آدَمَ أَن لَّا تَعْبُدُوا الشَّيْطَانَ ۖ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ ٦٠

  • “ఓ ఆదమ్‌ సంతతివారలారా: ‘షై’తాను ను ఆరాధించకండి.’ అని నేను మిమ్మల్ని ఆదేశించలేదా? నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు! 22

36:61 – وَأَنِ اعْبُدُونِي ۚ هَـٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ ٦١

“మరియు మీరు నన్నే ఆరాధించండి. ఇదే ఋజుమార్గమని!

36:62 – وَلَقَدْ أَضَلَّ مِنكُمْ جِبِلًّا كَثِيرًا ۖ أَفَلَمْ تَكُونُوا تَعْقِلُونَ ٦٢

“మరియు వాస్తవానికి వాడు (షై’తాన్‌) మీలో పెద్ద సమూహాన్ని దారి తప్పించాడు. ఏమీ? మీకు తెలివి లేక పోయిందా?

36:63 – هَـٰذِهِ جَهَنَّمُ الَّتِي كُنتُمْ تُوعَدُونَ ٦٣

“మీకు వాగ్దానంచేయబడిన ఆ నరకం ఇదే!

36:64 – اصْلَوْهَا الْيَوْمَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ ٦٤

“మీరు సత్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నం దుకు ఈ రోజు దీనిలో ప్రవేశించండి (కాలండి).”

36:65 – الْيَوْمَ نَخْتِمُ عَلَىٰ أَفْوَاهِهِمْ وَتُكَلِّمُنَا أَيْدِيهِمْ وَتَشْهَدُ أَرْجُلُهُم بِمَا كَانُوا يَكْسِبُونَ ٦٥

ఆ రోజు మేము వారి నోళ్ళమీద ముద్ర వేస్తాము. 23 మరియు వారేమి అర్జించారో వారి చేతులు మాతో చెబుతాయి మరియు వారి కాళ్ళు మా ముందు సాక్ష్యమిస్తాయి.

36:66 – وَلَوْ نَشَاءُ لَطَمَسْنَا عَلَىٰ أَعْيُنِهِمْ فَاسْتَبَقُوا الصِّرَاطَ فَأَنَّىٰ يُبْصِرُونَ ٦٦

మరియు మేము కోరినట్లయితే, వారి దృష్టిని నిర్మూలించేవారము, అప్పుడు వారు దారి కొరకు పెనుగులాడేవారు, కాని వారు ఎలా చూడగలిగే వారు? 24

36:67 – وَلَوْ نَشَاءُ لَمَسَخْنَاهُمْ عَلَىٰ مَكَانَتِهِمْ فَمَا اسْتَطَاعُوا مُضِيًّا وَلَا يَرْجِعُونَ ٦٧

మరియు మేము కోరినట్లయితే, వారిని వారి స్థానంలోనే రూపాన్నిమార్చి ఉంచేవారం, అప్పుడు వారు ముందుకూ పోలేరు మరియు వెనుకకూ మరలలేరు.

36:68 – وَمَن نُّعَمِّرْهُ نُنَكِّسْهُ فِي الْخَلْقِ ۖ أَفَلَا يَعْقِلُونَ ٦٨

మరియు మేము ఎవరికి దీర్ఘాయువు నొసంగుతామో, అతని శారీరక రూపాన్ని మార్చు తాము. ఏమీ? వారు ఇది కూడా గ్రహించలేరా? 25

36:69 – وَمَا عَلَّمْنَاهُ الشِّعْرَ وَمَا يَنبَغِي لَهُ ۚ إِنْ هُوَ إِلَّا ذِكْرٌ وَقُرْآنٌ مُّبِينٌ ٦٩

మరియు మేము అతనికి (ము’హమ్మద్‌ కు) కవిత్వం నేర్పలేదు. 26 మరియు అది అతనికి శోభించదు కూడా! ఇది కేవలం ఒక హితోపదేశం మరియు స్పష్టమైన పఠన గ్రంథం (ఖుర్‌ఆన్‌) మాత్రమే. 27

36:70 – لِّيُنذِرَ مَن كَانَ حَيًّا وَيَحِقَّ الْقَوْلُ عَلَى الْكَافِرِينَ ٧٠

బ్రతికి వున్న ప్రతి వానికి హెచ్చరిక చేయటానికి మరియు సత్య-తిరస్కారుల ఎడల మా ఆదేశాన్ని నిరూపించటానికి!

36:71 – أَوَلَمْ يَرَوْا أَنَّا خَلَقْنَا لَهُم مِّمَّا عَمِلَتْ أَيْدِينَا أَنْعَامًا فَهُمْ لَهَا مَالِكُونَ ٧١

ఏమివారికితెలియదా? నిశ్చయంగా మేము వారి కొరకు మా చేతులతో పశువులను సృష్టించి, తరువాతవాటిపైవారికియాజమాన్యం ఇచ్చామని?

36:72 – وَذَلَّلْنَاهَا لَهُمْ فَمِنْهَا رَكُوبُهُمْ وَمِنْهَا يَأْكُلُونَ ٧٢

మరియు వాటిని, వారికి స్వాధీనపరిచాము. కావున వాటిలో కొన్నిటిపై వారుస్వారీచేస్తారు, మరి కొన్నిటిని (వాటి మాంసాన్ని) వారు తింటారు.

36:73 – وَلَهُمْ فِيهَا مَنَافِعُ وَمَشَارِبُ ۖ أَفَلَا يَشْكُرُونَ ٧٣

మరియు వాటిలో వారికి ఎన్నో ప్రయోజ నాలు మరియు పానీయాలు (పాలు) ఉన్నాయి. అయినా, వారెందుకు కృతజ్ఞతలు చూపరు?

36:74 – وَاتَّخَذُوا مِن دُونِ اللَّـهِ آلِهَةً لَّعَلَّهُمْ يُنصَرُونَ ٧٤

మరియు వారు అల్లాహ్‌ను వదలి, ఇతరు లను ఆరాధ్యదైవాలుగా చేసుకున్నారు. 28 బహుశా వారివలన తమకు సహాయం దొరుకు తుందేమోననే ఆశతో!

36:75 – لَا يَسْتَطِيعُونَ نَصْرَهُمْ وَهُمْ لَهُمْ جُندٌ مُّحْضَرُونَ ٧٥

వారు (ఆ దైవాలు), తమకెలాంటి సహాయం చేయలేరు. అయినా! వీరు (సత్య-తిరస్కారులు) వారి (ఆదైవాల) కొరకు సైన్యం మాదిరిగా సర్వ సన్నద్ధులై ఉన్నారు. 29

36:76 – فَلَا يَحْزُنكَ قَوْلُهُمْ ۘ إِنَّا نَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ٧٦

కావున (ఓ ము’హమ్మద్‌!) వారి మాటలు నిన్ను బాధింపనివ్వరాదు. వాస్తవానికి! మాకు, వారు దాచేవీ మరియు వెలిబుచ్చేవీ అన్నీ బాగా తెలుసు.

36:77 – أَوَلَمْ يَرَ الْإِنسَانُ أَنَّا خَلَقْنَاهُ مِن نُّطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُّبِينٌ ٧٧

ఏమీ? మానవుడు ఎరుగడా? నిశ్చయంగా మేము అతనిని వీర్య బిందువుతో సృష్టిచామని? అయినా! అతడు బహిరంగ ప్రత్యర్థిగా తయారయ్యాడు? 30

36:78 – وَضَرَبَ لَنَا مَثَلًا وَنَسِيَ خَلْقَهُ ۖ قَالَ مَن يُحْيِي الْعِظَامَ وَهِيَ رَمِيمٌ ٧٨

మరియు అతడు మాకు పోలికలు కల్పిస్తూ తన సృష్టినే మరచిపోయాడు. అతడు ఇలా అంటాడు: “కృశించిపోయిన ఈ ఎముకలను తిరిగి ఎవడు బ్రతికించగలడు?”

36:79 – قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۖ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ ٧٩

ఇలా అను: “మొదట వాటిని పుట్టించిన ఆయనే, మళ్ళీ వాటిని బ్రతికిస్తాడు. మరియు ఆయనకు, ప్రతి దానిని సృష్టించే జ్ఞానముంది.”

36:80 – الَّذِي جَعَلَ لَكُم مِّنَ الشَّجَرِ الْأَخْضَرِ نَارًا فَإِذَا أَنتُم مِّنْهُ تُوقِدُونَ ٨٠

ఆయనే పచ్చని చెట్టు నుండి మీ కొరకు అగ్నిని పుట్టించేవాడు, తరువాత మీరు దాని నుండి మంటను వెలిగించుకుంటారు.

36:81 – أَوَلَيْسَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِقَادِرٍ عَلَىٰ أَن يَخْلُقَ مِثْلَهُم ۚ بَلَىٰ وَهُوَ الْخَلَّاقُ الْعَلِيمُ ٨١

ఏమీ? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించగలవాడు, వాటిలాంటి వాటిని మరల సృష్టించలేడా? ఎందుకు చేయలేడు! ఆయనే సర్వసృష్టికర్త, సర్వజ్ఞుడు. 31

36:82 – إِنَّمَا أَمْرُهُ إِذَا أَرَادَ شَيْئًا أَن يَقُولَ لَهُ كُن فَيَكُونُ ٨٢

నిశ్చయంగా, ఆయన విధానమేమిటంటే! ఆయన ఏదైనా చేయదలచుకున్నప్పుడు దానితో: “అయిపో!” అని అంటాడు, అంతే! అది అయిపోతుంది.

36:83 – فَسُبْحَانَ الَّذِي بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَإِلَيْهِ تُرْجَعُونَ ٨٣

ఎందుకంటే! సర్వలోపాలకు అతీతుడైన ఆయన (అల్లాహ్) చేతిలోప్రతిదానికిసంబంధించిన సర్వాధి కారాలు ఉన్నాయి మరియు మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు.

సూరహ్‌ అ’స్‌-‘సాఫ్ఫాత్‌ – ఈ సూరహ్‌ మధ్య మక్కహ్ కాలంలో అవతరింపజేయబడింది. అ’స్‌-‘సాప్ఫాత్‌, అంటే వరుసలలో లేక పంక్తులలో నిలబడినవారు. ఈ సూరహ్‌ ఈ సమూహంలో 4వది. ఇందులో నూ’హ్‌, ఇబ్రాహీమ్‌, మూసా, హారూన్‌, ఇల్యాస్‌, లూ’త్‌ మరియు యూనుస్‌ (‘అలైహిమ్‌ స.)లు చెడుతో చేసిన పోరాటం మరియు వారికి లభించిన విజయాలు వివరించబడ్డాయి. 182 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 37:1 – وَالصَّافَّاتِ صَفًّا ١

వరుసగా బారులుతీరి నిలుచున్న వారి (దైవ దూతల) సాక్షిగా!

37:2 – فَالزَّاجِرَاتِ زَجْرًا ٢

మేఘాలను నడిపించే వారి (దైవదూతల) సాక్షిగా! 1

37:3 – فَالتَّالِيَاتِ ذِكْرًا ٣

ఈ ఉపదేశాన్ని (ఖుర్‌ఆన్‌ను, అల్లాహ్‌ దగ్గరి నుండి మానవులకు) తెచ్చే వారి (దైవదూతల) సాక్షిగా! 2

37:4 – إِنَّ إِلَـٰهَكُمْ لَوَاحِدٌ ٤

నిశ్చయంగా, మీ ఆరాధ్యదైవం కేవలం ఆయన (అల్లాహ్‌) ఒక్కడే! 3

37:5 – رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ الْمَشَارِقِ ٥

ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్య నున్న వాటి ప్రభువు మరియు సూర్యోదయ (తూర్పు) స్థలాలకు ప్రభువు. 4

37:6 – إِنَّا زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِزِينَةٍ الْكَوَاكِبِ ٦

నిశ్చయంగా, మేము భూలోకానికి దగ్గరి ఆకాశాన్ని నక్షత్ర సముదాయాలతో అలంకరించాము;

37:7 – وَحِفْظًا مِّن كُلِّ شَيْطَانٍ مَّارِدٍ ٧

మరియు ధిక్కారి అయిన ప్రతి షై’తాన్‌ నుండి కాపాడటానికి; 5

37:8 – لَّا يَسَّمَّعُونَ إِلَى الْمَلَإِ الْأَعْلَىٰ وَيُقْذَفُونَ مِن كُلِّ جَانِبٍ ٨

ఇక వారు (షై’తాన్‌లు), ఉన్నత స్థానాలలో ఉన్న నాయకుల (దైవదూతల) మాటలు వినలేరు మరియు వారు ప్రతి దిక్కు నుండి తరుమబడుతూ ఉంటారు.

37:9 – دُحُورًا ۖ وَلَهُمْ عَذَابٌ وَاصِبٌ ٩

ఎందుకంటే) వారు (షై’తాన్‌లు) బహిష్కరించబడ్డారు. మరియు వారికి నిరంతరమైన శిక్ష ఉంది.

37:10 – إِلَّا مَنْ خَطِفَ الْخَطْفَةَ فَأَتْبَعَهُ شِهَابٌ ثَاقِبٌ ١٠

కాని, ఎవడైనా (ఏ షై’తానైనా), దేనినైనా ఎగుర వేసుకొని పోతున్నట్లైతే, మండే అగ్నిజ్వాల అతనిని వెంబడిస్తుంది. 6

37:11 – فَاسْتَفْتِهِمْ أَهُمْ أَشَدُّ خَلْقًا أَم مَّنْ خَلَقْنَا ۚ إِنَّا خَلَقْنَاهُم مِّن طِينٍ لَّازِبٍ ١١

అయితే వారిని అడగండి: “ఏమీ? వారు (మానవులు) దృఢమైన సృష్టా! లేక, మేము సృష్టించింది (ఈ సృష్టి దృఢమైనదా)?” నిశ్చయంగా, మేము వారిని జిగట మట్టి (‘తీనిల్లా’జిబ్‌)తో సృష్టించాము.

37:12 – بَلْ عَجِبْتَ وَيَسْخَرُونَ ١٢

వాస్తవానికి, నీవైతే ఆశ్చర్యపడుతున్నావు కాని వారు ఎగతాళి చేస్తున్నారు.

37:13 – وَإِذَا ذُكِّرُوا لَا يَذْكُرُونَ ١٣

మరియు వారికి ఉపదేశ మిచ్చినపుడు, వారు దానిని స్వీకరించరు.

37:14 – وَإِذَا رَأَوْا آيَةً يَسْتَسْخِرُونَ ١٤

మరియు వారొక సంకేతాన్ని చూసి నప్పుడు, దానిని ఎగతాళిచేస్తారు.

37:15 – وَقَالُوا إِنْ هَـٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ ١٥

మరియు వారిలా అంటారు: “ఇది స్పష్టమైన మంత్ర జాలం మాత్రమే!

37:16 – أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ ١٦

“ఏమిటి? మేము మరణించి మట్టిగా, ఎముకలుగా (అస్తిపంజరంగా) మారిపోయిన తరువాత కూడా మరల సజీవులుగా లేపబడతామా?

37:17 – أَوَآبَاؤُنَا الْأَوَّلُونَ ١٧

“ఏమిటి? మరియు పూర్వీకులైన మా తాత-ముత్తాతలు కూడానా?”

37:18 – قُلْ نَعَمْ وَأَنتُمْ دَاخِرُونَ ١٨

వారితో ఇలా అను: “అవును! అప్పుడు మీరు అధమమైనవారు అవుతారు.” 8

37:19 – فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ فَإِذَا هُمْ يَنظُرُونَ ١٩

నిశ్చయంగా, అది ఒక పెద్ద ధ్వని మాత్రమే (రెండవ బాకా), అప్పుడు వారు (లేచి) చూస్తూ ఉండిపోతారు.

37:20 – وَقَالُوا يَا وَيْلَنَا هَـٰذَا يَوْمُ الدِّينِ ٢٠

మరియు వారు ఇలా అంటారు: “అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదే ఆ తీర్పుదినం.”

37:21 – هَـٰذَا يَوْمُ الْفَصْلِ الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ ٢١

(అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): “మీరు అబద్ధమని తిరస్కరిస్తూ ఉండే న్యాయవిచారణ దినం ఇదే!” 8 (1/4)

37:22 – احْشُرُوا الَّذِينَ ظَلَمُوا وَأَزْوَاجَهُمْ وَمَا كَانُوا يَعْبُدُونَ ٢٢

  • (దైవదూతలతో ఇలా అనబడుతుంది): ‘ఆ దుర్మార్గులను సమావేశపరచండి! మరియు వారి సహవాసులను మరియు వారు ఆరాధిస్తూ ఉన్న వారిని –

37:23 – مِن دُونِ اللَّـهِ فَاهْدُوهُمْ إِلَىٰ صِرَاطِ الْجَحِيمِ ٢٣

“అల్లాహ్‌ను కాదని – తరువాత వారందరికీ ప్రజ్వలించే నరకాగ్ని మార్గాన్ని చూపండి;

37:24 – وَقِفُوهُمْ ۖ إِنَّهُم مَّسْئُولُونَ ٢٤

“మరియు వారిని అక్కడ నిలబెట్టండి. వాస్తవానికి వారిని ప్రశ్నించవలసి ఉన్నది.

37:25 – مَا لَكُمْ لَا تَنَاصَرُونَ ٢٥

“మీకేమైంది? మీరు పరస్పరం ఎందుకు సహాయం చేసుకోవటంలేదు?”

37:26 – بَلْ هُمُ الْيَوْمَ مُسْتَسْلِمُونَ ٢٦

అలాకాదు! ఆ రోజు వారు తమను తాము అల్లాహ్‌కు అప్పగించుకుంటారు.

37:27 – وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ ٢٧

మరియు వారు ఒకరి వైపునకు మరొకరు మరలి ఇలా ప్రశ్నించుకుంటారు.

37:28 – قَالُوا إِنَّكُمْ كُنتُمْ تَأْتُونَنَا عَنِ الْيَمِينِ ٢٨

కొందరు అంటారు: “మీరు మా వద్దకు (మమ్మల్ని మోసగించటానికి) మా కుడివైపు నుండి వచ్చేవారు!” 9

37:29 – قَالُوا بَل لَّمْ تَكُونُوا مُؤْمِنِينَ ٢٩

ఇతరులు ఇలా జవాబిస్తారు: “అలాకాదు, మీ అంతట మీరే విశ్వసించేవారు కాదు.

37:30 – وَمَا كَانَ لَنَا عَلَيْكُم مِّن سُلْطَانٍ ۖ بَلْ كُنتُمْ قَوْمًا طَاغِينَ ٣٠

“మాకు మీపై ఎలాంటి అధికారం ఉండేది కాదు. అలాకాదు! మీరే తలబిరుసుతనం చూపేవారు. 10

37:31 – فَحَقَّ عَلَيْنَا قَوْلُ رَبِّنَا ۖ إِنَّا لَذَائِقُونَ ٣١

“కావున, ఇప్పుడు మన ప్రభువు వాక్కు మనపై పూర్తి అయ్యింది. నిశ్చయంగా, మనమంతా (శిక్షను) రుచి చూడగలము.

37:32 – فَأَغْوَيْنَاكُمْ إِنَّا كُنَّا غَاوِينَ ٣٢

“కావున మేము మిమ్మల్ని తప్పుదారిలో పడవేశాము, నిశ్చయంగా, మేము కూడా మార్గభ్రష్టులమై ఉంటిమి!” 11

37:33 – فَإِنَّهُمْ يَوْمَئِذٍ فِي الْعَذَابِ مُشْتَرِكُونَ ٣٣

అప్పుడు నిశ్చయంగా, వారందరూ ఆ రోజు, శిక్షలో భాగస్వాములవుతారు.

37:34 – إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ ٣٤

నిశ్చయంగా, మేము అపరాధులతో ఇదేవిధంగా ప్రవర్తిస్తాము.

37:35 – إِنَّهُمْ كَانُوا إِذَا قِيلَ لَهُمْ لَا إِلَـٰهَ إِلَّا اللَّـهُ يَسْتَكْبِرُونَ ٣٥

వాస్తవానికి, వారితో: “అల్లాహ్‌ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు.” అని అన్నప్పుడు, వారు దురహంకారం చూపేవారు.

37:36 – وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُو آلِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُونٍ ٣٦

మరియు వారు ఇలా అనేవారు:”ఏమిటి? మేము ఒక పిచ్చికవి కొరకు మా ఆరాధ్య దైవాలను త్యజించాలా?” 12

37:37 – بَلْ جَاءَ بِالْحَقِّ وَصَدَّقَ الْمُرْسَلِينَ ٣٧

వాస్తవానికి, అతను (ము’హమ్మద్‌) సత్యాన్ని తీసుకొనివచ్చాడు. మరియు అతను (తనకు పూర్వం వచ్చిన) ప్రవక్తలను సత్యవంతులని ధృవపరచాడు.

37:38 – إِنَّكُمْ لَذَائِقُو الْعَذَابِ الْأَلِيمِ ٣٨

నిశ్చయంగా, మీరు బాధాకరమైన శిక్షను రుచి చూడగలరు;

37:39 – وَمَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ ٣٩

మరియు మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ఫలితం తప్ప, మరేమీ ఇవ్వబడదు –

37:40 – إِلَّا عِبَادَ اللَّـهِ الْمُخْلَصِينَ ٤٠

ఎన్నుకోబడిన అల్లాహ్‌ దాసులకుతప్ప 13

37:41 – أُولَـٰئِكَ لَهُمْ رِزْقٌ مَّعْلُومٌ ٤١

అలాంటి వారికొరకు వారికి తెలిసి ఉన్న జీవనోపాధి ఉంది; 14

37:42 – فَوَاكِهُ ۖ وَهُم مُّكْرَمُونَ ٤٢

అన్నిరకాల ఫలాలు. మరియు వారు ఆదరించబడతారు;

37:43 – فِي جَنَّاتِ النَّعِيمِ ٤٣

పరమ సుఖాలు గల స్వర్గవనాలలో;

37:44 – عَلَىٰ سُرُرٍ مُّتَقَابِلِينَ ٤٤

ఆసనాల మీద ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు; 15

37:45 – يُطَافُ عَلَيْهِم بِكَأْسٍ مِّن مَّعِينٍ ٤٥

వారి మధ్య ప్రవహించే చెలమల నుండి, పానీయపు (మధు) పాత్రలు త్రిప్పబడు తుంటాయి;

37:46 – بَيْضَاءَ لَذَّةٍ لِّلشَّارِبِينَ ٤٦

అది తెల్లగా (మెరిసిపోతూ) త్రాగే వారికి ఎంతో రుచికరమైనదిగా ఉంటుంది;

37:47 – لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ ٤٧

దాని వల్ల వారికి ఎలాంటి బాధా కలుగదు మరియు వారు తమ తెలివినీ పోగొట్టుకోరు.

37:48 – وَعِندَهُمْ قَاصِرَاتُ الطَّرْفِ عِينٌ ٤٨

మరియు వారి దగ్గర, శీలవతులైన తమ చూపులను నిగ్రహించుకునే, అందమైన కళ్ళుగల స్త్రీలు ఉంటారు. 16

37:49 – كَأَنَّهُنَّ بَيْضٌ مَّكْنُونٌ ٤٩

వారు దాచబడిన గ్రుడ్లవలే (కోమలంగా) ఉంటారు. 17

37:50 – فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ ٥٠

అప్పుడు వారు ఒకరివైపు కొకరు మరలి, పరస్పరం ఇలా ప్రశ్నించుకుంటారు.

37:51 – قَالَ قَائِلٌ مِّنْهُمْ إِنِّي كَانَ لِي قَرِينٌ ٥١

వారిలో ఒకడంటాడు: “వాస్తవానికి (భూలో కంలో) నాకొక స్నేహితుడు (ఖరీనున్‌) ఉండేవాడు;

37:52 – يَقُولُ أَإِنَّكَ لَمِنَ الْمُصَدِّقِينَ ٥٢

“అతడు నన్ను ఇలా అడిగేవాడు: ‘ఏమీ? నీవు కూడా (పునరుత్థానం) నిజమేనని నమ్మే వారిలో ఒకడివా?

37:53 – أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَدِينُونَ ٥٣

‘ఏమీ? మనం చనిపోయి మట్టిగా ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా నిశ్చయంగా మనకు ప్రతిఫలమనేది ఉంటుందా?'”

37:54 – قَالَ هَلْ أَنتُم مُّطَّلِعُونَ ٥٤

అతడు ఇంకా ఇలా అంటాడు: “ఏమీ? మీరు అతనిని చూడదలచుకున్నారా?”

37:55 – فَاطَّلَعَ فَرَآهُ فِي سَوَاءِ الْجَحِيمِ ٥٥

తరువాత అతడు తొంగిచూసి, అతనిని (తన పూర్వ స్నేహితుణ్ణి) భగభగ మండే నరకాగ్ని మధ్యలో చూస్తాడు.

37:56 – قَالَ تَاللَّـهِ إِن كِدتَّ لَتُرْدِينِ ٥٦

అతనితో (ఆ స్నేహితునితో), అతడు అంటాడు: “అల్లాహ్‌ సాక్షిగా! నీవు నన్ను నాశనంచేసి ఉండేవాడివే!

37:57 – وَلَوْلَا نِعْمَةُ رَبِّي لَكُنتُ مِنَ الْمُحْضَرِينَ ٥٧

“ఒక వేళ నా ప్రభువు అనుగ్రహమే లేకున్నట్లయితే! నేను కూడా (నరకానికి) హాజరు చేయబడిన వారిలో చేరిపోయేవాడిని.”

37:58 – أَفَمَا نَحْنُ بِمَيِّتِينَ ٥٨

(తరువాత ఆ స్వర్గవాసి తన సహచరులతో అంటాడు): “ఏమీ? ఇక మనం మరల చనిపోము కదా?

37:59 – إِلَّا مَوْتَتَنَا الْأُولَىٰ وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ ٥٩

“మన మొదటి (భూలోక) మరణం తప్ప! మనకు ఇక ఎలాంటి శిక్ష పడదు కదా?”

37:60 – إِنَّ هَـٰذَا لَهُوَ الْفَوْزُ الْعَظِيمُ ٦٠

నిశ్చయంగా ఇదే ఆ గొప్ప సాఫల్యం (విజయం). 18

37:61 – لِمِثْلِ هَـٰذَا فَلْيَعْمَلِ الْعَامِلُونَ ٦١

ఇలాంటి (స్థానం) పొందటానికి పాటుపడే వారు పాటుపడాలి.

37:62 – أَذَٰلِكَ خَيْرٌ نُّزُلًا أَمْ شَجَرَةُ الزَّقُّومِ ٦٢

ఏమీ? ఇలాంటి ఆతిథ్యం మేలైనదా? లేక జముడు ఫలపు 19 ఆతిథ్యమా?

37:63 – إِنَّا جَعَلْنَاهَا فِتْنَةً لِّلظَّالِمِينَ ٦٣

నిశ్చయంగా, మేము దానిని, దుర్మార్గుల కొరకు ఒక పరీక్షగా చేశాము.

37:64 – إِنَّهَا شَجَرَةٌ تَخْرُجُ فِي أَصْلِ الْجَحِيمِ ٦٤

నిశ్చయంగా, అది నరకపు అడుగు భాగం నుండి మొలిచే ఒక చెట్టు;

37:65 – طَلْعُهَا كَأَنَّهُ رُءُوسُ الشَّيَاطِينِ ٦٥

దాని మొగ్గలు షై’తానుల తలలవలే ఉంటాయి.

37:66 – فَإِنَّهُمْ لَآكِلُونَ مِنْهَا فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ ٦٦

నిశ్చయంగా, వారు దానినుంచే తింటారు మరియు దానితోనే తమ కడుపులు నింపు కుంటారు.

37:67 – ثُمَّ إِنَّ لَهُمْ عَلَيْهَا لَشَوْبًا مِّنْ حَمِيمٍ ٦٧

తరువాత నిశ్చయంగా దాని మీద వారికి త్రాగటానికి సలసల కాగే పానీయం మాత్రమే ఉంటుంది. 20

37:68 – ثُمَّ إِنَّ مَرْجِعَهُمْ لَإِلَى الْجَحِيمِ ٦٨

ఆ తరువాత నిశ్చయంగా, వారి మరలింపు కేవలంభగభగమండేనరకాగ్నివైపునకే అవుతుంది.

37:69 – إِنَّهُمْ أَلْفَوْا آبَاءَهُمْ ضَالِّينَ ٦٩

నిశ్చయంగా, అప్పుడు వారు తమ తండ్రి-తాతలు మార్గభ్రష్టత్వంలో ఉండేవారని కనుగొంటారు!

37:70 – فَهُمْ عَلَىٰ آثَارِهِمْ يُهْرَعُونَ ٧٠

మరియు తాముకూడా వారి అడుగు జాడలను అనుసరించటానికి త్వరపడుతూ ఉండే వారమని!

37:71 – وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ أَكْثَرُ الْأَوَّلِينَ ٧١

మరియు వాస్తవానికి వారి పూర్వీకులు కూడా చాలామంది మార్గభ్రష్టులుగానే ఉండేవారు.

37:72 – وَلَقَدْ أَرْسَلْنَا فِيهِم مُّنذِرِينَ ٧٢

మరియు వాస్తవానికి మేము వారివద్దకు హెచ్చరిక చేయటానికి (సందేశహరులను) పంపి ఉన్నాము.

37:73 – فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُنذَرِينَ ٧٣

ఇక చూడు! హెచ్చరిక చేయబడిన వారి పర్యవసానం ఎలా ఉండందో!

37:74 – إِلَّا عِبَادَ اللَّـهِ الْمُخْلَصِينَ ٧٤

ఎన్నుకోబడిన అల్లాహ్‌ దాసులు తప్ప!

37:75 – وَلَقَدْ نَادَانَا نُوحٌ فَلَنِعْمَ الْمُجِيبُونَ ٧٥

మరియు వాస్తవంగా నూ’హ్‌ 21 మమ్మల్ని వేడుకున్నాడు. ఎందుకంటే, మేము (ప్రార్థనలకు) ప్రత్యుత్తరమిచ్చేవారిలో సర్వోత్తములము.

37:76 – وَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ ٧٦

మరియు మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని మహా విపత్తు (జల ప్రళయం) నుండి కాపాడాము. 22

37:77 – وَجَعَلْنَا ذُرِّيَّتَهُ هُمُ الْبَاقِينَ ٧٧

మరియు అతని సంతతి వారిని మాత్రమే మిగిలి ఉండేటట్లు చేశాము. 23

37:78 – وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ ٧٨

మరియు తరువాత వచ్చే వారిలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠలను) నిలిపాము.

37:79 – سَلَامٌ عَلَىٰ نُوحٍ فِي الْعَالَمِينَ ٧٩

సర్వలోకాలలో నూ’హ్‌కు శాంతి కలుగుగాక (సలాం)!

37:80 – إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ ٨٠

నిశ్చయంగా, మేము సజ్జనులకు ఈ విధంగా ప్రతి ఫలం ఇస్తూ ఉంటాము.

37:81 – إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ ٨١

నిశ్చయంగా, అతను మా విశ్వాసులైన దాసులలోని వాడు.

37:82 – ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ ٨٢

తరువాత మేము ఇతరులను ముంచి వేశాము. (3/8)

37:83 – وَإِنَّ مِن شِيعَتِهِ لَإِبْرَاهِيمَ ٨٣

  • మరియు నిశ్చయంగా, అతనిని అనుసరించిన వారిలో ఇబ్రాహీమ్‌ ఒకడు.

37:84 – إِذْ جَاءَ رَبَّهُ بِقَلْبٍ سَلِيمٍ ٨٤

అతను తన ప్రభువు సాన్నిధ్యానికి నిర్మల హృదయంతో వచ్చి;

37:85 – إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَاذَا تَعْبُدُونَ ٨٥

అతను తన తండ్రి మరియు తన జాతి వారితో ఇలా అన్నాడు: “మీరు దేనిని ఆరాధిస్తున్నారు?

37:86 – أَئِفْكًا آلِهَةً دُونَ اللَّـهِ تُرِيدُونَ ٨٦

“ఏమీ? మీరు అల్లాహ్‌ను వదలి మిథ్య (బూటక) దైవాలను (ఆరాధించ) గోరుతున్నారా?

37:87 – فَمَا ظَنُّكُم بِرَبِّ الْعَالَمِينَ ٨٧

“అయితే సర్వలోకాల ప్రభువును గురించి మీ అభిప్రాయమేమిటి?”

37:88 – فَنَظَرَ نَظْرَةً فِي النُّجُومِ ٨٨

ఆ తరువాత, అతను నక్షత్రాల వైపుకు తన దృష్టి సారించాడు; 24

37:89 – فَقَالَ إِنِّي سَقِيمٌ ٨٩

అప్పుడు అతను ఇలా అన్నాడు: “నిశ్చయంగా, నా ఆరోగ్యం బాగులేదు.” 25

37:90 – فَتَوَلَّوْا عَنْهُ مُدْبِرِينَ ٩٠

కావున వారు అతనిని వదలి పెట్టి వెళ్ళిపోయారు.

37:91 – فَرَاغَ إِلَىٰ آلِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ ٩١

తరువాత అతను మెల్లగా వారి దేవతల (విగ్రహాల) దగ్గరికివెళ్ళి ఇలా అన్నాడు: “మీరు తినటంలేదేమిటీ?

37:92 – مَا لَكُمْ لَا تَنطِقُونَ ٩٢

“మీకేమైంది? మీరెందుకు మాట్లాడరు?”

37:93 – فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًا بِالْيَمِينِ ٩٣

తరువాత అతను వాటివద్దకు వెళ్ళి తన కుడి చేతితో వాటిని పగులగొట్టాడు. 26

37:94 – فَأَقْبَلُوا إِلَيْهِ يَزِفُّونَ ٩٤

అప్పుడు, వారు (ప్రజలు) అతని దగ్గరకు త్వర త్వరగా వచ్చారు.

37:95 – قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ ٩٥

అతను (ఇబ్రాహీమ్‌) వారితో అన్నాడు: “ఏమీ? మీరు చెక్కినవాటినే, మీరు ఆరాధిస్తారా?

37:96 – وَاللَّـهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ ٩٦

“వాస్తవానికి మిమ్మల్ని మరియు మీరు (చెక్కి) చేసిన వాటిని సృష్టించింది అల్లాహ్‌యే కదా!” 27

37:97 – قَالُوا ابْنُوا لَهُ بُنْيَانًا فَأَلْقُوهُ فِي الْجَحِيمِ ٩٧

వారు (పరస్పరం ఇలా చెప్పుకున్నారు): “ఇతని కొరకు ఒక (అగ్ని) గుండం నిర్మించి, తరువాత అతనిని ఆ భగభగ మండే అగ్నిలో పడవేయండి!”

37:98 – فَأَرَادُوا بِهِ كَيْدًا فَجَعَلْنَاهُمُ الْأَسْفَلِينَ ٩٨

కావున, వారు అతనికి విరుధ్ధంగా పన్నాగాలు పన్నారు, కాని మేము వారిని కించపరచాము.

37:99 – وَقَالَ إِنِّي ذَاهِبٌ إِلَىٰ رَبِّي سَيَهْدِينِ ٩٩

మరియు అతను (ఇబ్రాహీమ్‌) అన్నాడు: “నిశ్చయంగా, నేను నా ప్రభువు (తీసుకొనివెళ్ళే) వైపునకు వెళ్ళిపోతాను. ఆయనే నాకు మార్గదర్శ కత్వం చేస్తాడు.” 28

37:100 – رَبِّ هَبْ لِي مِنَ الصَّالِحِينَ ١٠٠

(అతను ఇలాప్రార్థించాడు): “ఓ నాప్రభూ! నాకు సద్వర్తనుడైన (కుమారుణ్ణి) ప్రసాదించు!”

37:101 – فَبَشَّرْنَاهُ بِغُلَامٍ حَلِيمٍ ١٠١

కావున మేము అతనికి సహనశీలుడైన కుమారుని శుభవార్త నిచ్చాము. 29

37:102 – فَلَمَّا بَلَغَ مَعَهُ السَّعْيَ قَالَ يَا بُنَيَّ إِنِّي أَرَىٰ فِي الْمَنَامِ أَنِّي أَذْبَحُكَ فَانظُرْ مَاذَا تَرَىٰ ۚ قَالَ يَا أَبَتِ افْعَلْ مَا تُؤْمَرُ ۖ سَتَجِدُنِي إِن شَاءَ اللَّـهُ مِنَ الصَّابِرِينَ ١٠٢

ఆ బాలుడు అతనికి తోడుగా శ్రమ చేయగల వయస్సుకు చేరుకున్నపుడు, అతను (ఇబ్రాహీమ్‌) అన్నాడు: “ఓ నా కుమారా! వాస్తవానికి నేను, నిన్ను బలి (జి’బ్‌’హ్‌) చేస్తున్నట్లుగా కలలో చూశాను, ఇక నీ సలహా ఏమిటో చెప్పు!” అతను (ఇస్మా’యీల్‌) అన్నాడు: “ఓ నాన్నా! నీకు ఇవ్వబడిన ఆజ్ఞను నెరవేర్చు. అల్లాహ్‌ కోరితే నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు!”

37:103 – فَلَمَّا أَسْلَمَا وَتَلَّهُ لِلْجَبِينِ ١٠٣

ఆతరువాత వారిద్దరూ ఆయన (అల్లాహ్) ఆజ్ఞను నెరవేర్చటానికి సిధ్ధపడ్డారు. మరియు అతను (ఇబ్రాహీమ్‌) అతనిని (ఇస్మా’యీల్‌ను) నుదుటిపై బోర్లా పరుండబెట్టాడు.

37:104 – قَدْ صَدَّقْتَ الرُّؤْيَا ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ ١٠٤

మరియు మేము అతనిని పిలుస్తూ ఇలా అన్నాము: “ఓ ఇబ్రాహీమ్‌!

37:105 – إِنَّ هَـٰذَا لَهُوَ الْبَلَاءُ الْمُبِينُ ١٠٥

“వాస్తవంగా, నీవు కలను నిజం చేసి చూపించావు!” నిశ్చయంగా మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమిస్తాము.

37:106 – وَفَدَيْنَاهُ بِذِبْحٍ عَظِيمٍ ١٠٦

నిశ్చయంగా ఇదొకస్పష్టమైన(కఠిన) పరీక్ష.

37:107 – وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ ١٠٧

మరియు మేము అతనికి (ఇస్మా’యీల్‌కు) బదులుగా ఒక గొప్ప బలిని పరిహారంగా ఇచ్చాము. 30

37:108 – سَلَامٌ عَلَىٰ إِبْرَاهِيمَ ١٠٨

మరియు తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని నిలిపాము.

37:109 – كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ ١٠٩

“ఇబ్రాహీమ్‌కు శాంతి కలుగు గాక (సలాం)!”

37:110 – إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ ١١٠

ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫల మిస్తాము.

37:111 – وَبَشَّرْنَاهُ بِإِسْحَاقَ نَبِيًّا مِّنَ الصَّالِحِينَ ١١١

నిశ్చయంగా అతను (ఇబ్రాహీమ్‌) విశ్వసించిన మా దాసులలోని వాడు!

37:112 – وَبَارَكْنَا عَلَيْهِ وَعَلَىٰ إِسْحَاقَ ۚ وَمِن ذُرِّيَّتِهِمَا مُحْسِنٌ وَظَالِمٌ لِّنَفْسِهِ مُبِينٌ ١١٢

మరియు మేము అతనికి ఇస్‌’హాఖ్‌ యొక్క శుభవార్త నిచ్చాము అతను ఒక సద్వర్తనుడైన ప్రవక్త. 31

37:113 – وَلَقَدْ مَنَنَّا عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ ١١٣

మరియు మేము అతనిని (ఇబ్రాహీమ్‌ను) మరియు ఇస్‌’హాఖ్‌ను అనుగ్రహించాము. మరియు వారి సంతతిలో కొందరు సజ్జనులుండే వారు మరి కొందరు తమకు తాము స్పష్టంగా అన్యాయం చేసుకున్నవారు కూడా ఉన్నారు. 32

37:114 – وَنَجَّيْنَاهُمَا وَقَوْمَهُمَا مِنَ الْكَرْبِ الْعَظِيمِ ١١٤

మరియు వాస్తవానికి, మేము మూసా మరియు హారూన్‌లను అనుగ్రహించాము.

37:115 – وَنَصَرْنَاهُمْ فَكَانُوا هُمُ الْغَالِبِينَ ١١٥

మరియు మేము వారిద్దరిని మరియు వారి జాతి వారిని మహావిపత్తు నుండి విముక్తి కలిగించాము.

37:116 – وَآتَيْنَاهُمَا الْكِتَابَ الْمُسْتَبِينَ ١١٦

మరియు మేము వారికి సహాయంచేశాము కాబట్టి వారు విజయం పొందిన వారయ్యారు.

37:117 – وَهَدَيْنَاهُمَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ ١١٧

మరియు వారిద్దరికి (మంచి చెడులను) స్పష్ట పరిచే గ్రంథాన్ని ప్రసాదించాము. 33

37:118 – وَتَرَكْنَا عَلَيْهِمَا فِي الْآخِرِينَ ١١٨

మరియు వారిద్దరికి రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాము.

37:119 – سَلَامٌ عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ ١١٩

మరియు తరువాత తరాలవారిలో వారిద్దరిని గురించి మంచి కీర్తిని నిలిపాము.

37:120 – سَلَامٌ عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ ١٢٠

“మూసా మరియు హారూన్‌లకు శాంతి కలుగు గాక (సలాం)!”

37:121 – إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ ١٢١

నిశ్చయంగా, ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము.

37:122 – إِنَّهُمَا مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ ١٢٢

నిశ్చయంగా వారిద్దరూ, విశ్వాసులైన మా దాసులలోని వారు.

37:123 – وَإِنَّ إِلْيَاسَ لَمِنَ الْمُرْسَلِينَ ١٢٣

మరియు నిశ్చయంగా, ఇల్యాస్‌ కూడా మా సందేశహరులలో ఒకడు. 34

37:124 – إِذْ قَالَ لِقَوْمِهِ أَلَا تَتَّقُونَ ١٢٤

అతను తన జాతి వారితో ఇలా అన్నప్పుడు: “ఏమీ? మీకు దైవభీతి లేదా?

37:125 – أَتَدْعُونَ بَعْلًا وَتَذَرُونَ أَحْسَنَ الْخَالِقِينَ ١٢٥

“ఏమీ? మీరు బ’అల్‌ 35 “ఏమీ? మీరు బ’అల్‌

37:126 – اللَّـهَ رَبَّكُمْ وَرَبَّ آبَائِكُمُ الْأَوَّلِينَ ١٢٦

“అల్లాహ్‌యే మీ ప్రభువు! మరియు మీ పూర్వీకులైన మీ తాత-ముత్తాతల ప్రభువు కదా?”

37:127 – فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ ١٢٧

కాని వారు అతనిని (ఇల్యాస్‌ను) అసత్య- వాదుడని తిరస్కరించారు, కాబట్టి వారు తప్ప కుండా (శిక్ష కొరకు) హాజరుచేయబడతారు.

37:128 – إِلَّا عِبَادَ اللَّـهِ الْمُخْلَصِينَ ١٢٨

ఎన్నుకోబడిన అల్లాహ్‌ దాసులు తప్ప!

37:129 – وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ ١٢٩

తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠలను) నిలిపాము.

37:130 – سَلَامٌ عَلَىٰ إِلْ يَاسِينَ ١٣٠

“ఇల్‌-యాసీన్‌కు 36 శాంతి కలుగు గాక (సలాం)!”

37:131 – إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ ١٣١

నిశ్చయంగా, సజ్జనులకు మేము ఈ విధంగా ప్రతిఫలమిస్తాము.

37:132 – إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ ١٣٢

నిశ్చయంగా, అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు. 37

37:133 – وَإِنَّ لُوطًا لَّمِنَ الْمُرْسَلِينَ ١٣٣

మరియు నిశ్చయంగా, లూ’త్‌ కూడా మేము పంపిన సందేశహరులలో ఒకడు. 38

37:134 – إِذْ نَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ ١٣٤

ఎప్పుడైతే మేము అతనిని మరియు అతని కుటుంబంవారిని అందరిని రక్షించామో –

37:135 – إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ ١٣٥

ముసలామె (అతని భార్య) తప్ప – ఆమె వెనుక ఉండిపోయేవారిలో చేరిపోయింది. 39

37:136 – ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ ١٣٦

ఆ తరువాత మిగతా వారి నందరినీ నిర్మూలించాము.

37:137 – وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِم مُّصْبِحِينَ ١٣٧

మరియు వాస్తవానికి, మీరిప్పుడు వారి (శిథిల) ప్రాంతాల మీదుగా ఉదయపు వేళలలో ప్రయాణిస్తూ ఉంటారు; 40

37:138 – وَبِاللَّيْلِ ۗ أَفَلَا تَعْقِلُونَ ١٣٨

మరియు రాత్రులలో కూడా! అయినా మీరు అర్థం చేసుకోలేరా?

37:139 – وَإِنَّ يُونُسَ لَمِنَ الْمُرْسَلِينَ ١٣٩

మరియు నిశ్చయంగా, యూనుస్‌ 41 కూడా మేము పంపిన సందేశహరులలోని వాడు.

37:140 – إِذْ أَبَقَ إِلَى الْفُلْكِ الْمَشْحُونِ ١٤٠

అతను నిండు పడవ వైపుకు పరిగెత్తి నప్పుడు; 42

37:141 – فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِينَ ١٤١

అక్కడ చీటీలలో పాల్గొన్నాడు, కాని ఓడిపోయాడు.

37:142 – فَالْتَقَمَهُ الْحُوتُ وَهُوَ مُلِيمٌ ١٤٢

ఆ పిదప అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది; ఎందుకంటే అతను నిందార్హుడు. 43

37:143 – فَلَوْلَا أَنَّهُ كَانَ مِنَ الْمُسَبِّحِينَ ١٤٣

అప్పుడతను, (అల్లాహ్‌) పవిత్రతను కొనియాడే వారిలోనివాడు కాకపోయినట్లైతే! 44

37:144 – لَلَبِثَ فِي بَطْنِهِ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ ١٤٤

దాని (చేప) కడుపులో పునరుత్థానదినం వరకు ఉండిపోయే వాడు. (1/2)

37:145 – فَنَبَذْنَاهُ بِالْعَرَاءِ وَهُوَ سَقِيمٌ ١٤٥

  • ఆ పిదప మేము అతనిని అనారోగ్య స్థితిలో, ఒక దిగంబర మైదానంలో పడవేశాము.

37:146 – وَأَنبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِّن يَقْطِينٍ ١٤٦

మరియు అతనిపై ఒక ఆనప జాతి తీగను మొలిపించాము. 45

37:147 – وَأَرْسَلْنَاهُ إِلَىٰ مِائَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ ١٤٧

మరియు అతనిని ఒక లక్ష లేదా అంత కంటే ఎక్కువ మంది (ప్రజల) వద్దకు పంపాము.

37:148 – فَآمَنُوا فَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ ١٤٨

వారు విశ్వసించారు, కావున మేము ఒక నిర్ణీత కాలం వరకు వారిని సుఖసంతోషాలు అనుభవించనిచ్చాము. 46

37:149 – فَاسْتَفْتِهِمْ أَلِرَبِّكَ الْبَنَاتُ وَلَهُمُ الْبَنُونَ ١٤٩

అయితే వారిని ఇలా అడుగు: “ఏమీ? నీ ప్రభువుకైతే కుమార్తెలు మరియు వారి కొరకు కుమారులా?” 47

37:150 – أَمْ خَلَقْنَا الْمَلَائِكَةَ إِنَاثًا وَهُمْ شَاهِدُونَ ١٥٠

“లేక మేము దేవదూతలను స్త్రీలుగా పుట్టించామా? మరియు వారు దానికిసాక్షులా?” 48

37:151 – أَلَا إِنَّهُم مِّنْ إِفْكِهِمْ لَيَقُولُونَ ١٥١

అలా కాదు! నిశ్చయంగా, వారు (ఖురైషులు) తమ బూటకపు నమ్మకాల ఆధారంగా అంటున్నారు:

37:152 – وَلَدَ اللَّـهُ وَإِنَّهُمْ لَكَاذِبُونَ ١٥٢

“అల్లాహ్‌కు సంతానముంది!” అని. మరియు వారు నిశ్చయంగా, అబద్ధాలాడు తున్నారు!

37:153 – أَصْطَفَى الْبَنَاتِ عَلَى الْبَنِينَ ١٥٣

ఆయన (అల్లాహ్‌) కుమార్తెలను – కుమారులకు బదులుగా – ఎన్నుకున్నాడా? 49

37:154 – مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ ١٥٤

మీ కేమయింది? మీరెలాంటి నిర్ణయాలు చేస్తున్నారు?

37:155 – أَفَلَا تَذَكَّرُونَ ١٥٥

ఏమీ? మీరు గ్రహించలేరా?

37:156 – أَمْ لَكُمْ سُلْطَانٌ مُّبِينٌ ١٥٦

లేక! మీవద్ద ఏదైనా స్పష్టమైన ప్రమాణం ఉందా?

37:157 – فَأْتُوا بِكِتَابِكُمْ إِن كُنتُمْ صَادِقِينَ ١٥٧

మీరు సత్యవంతులే అయితే మీ గ్రంథాన్ని తీసుకు రండి!

37:158 – وَجَعَلُوا بَيْنَهُ وَبَيْنَ الْجِنَّةِ نَسَبًا ۚ وَلَقَدْ عَلِمَتِ الْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ ١٥٨

మరియు వారు, ఆయన (అల్లాహ్‌) మరియు జిన్నాతుల మధ్య బంధుత్వం కల్పించారు. 50 కాని వాస్తవానికి జిన్నాతులకు తెలుసు, తాము ఆయన (అల్లాహ్‌) ముందు (లెక్క కొరకు) హాజరు చేయబడతామని!

37:159 – سُبْحَانَ اللَّـهِ عَمَّا يَصِفُونَ ١٥٩

వారు కల్పించే విషయాలకు అల్లాహ్‌ అతీతుడు (పరమ పవిత్రుడు)! 51

37:160 – إِلَّا عِبَادَ اللَّـهِ الْمُخْلَصِينَ ١٦٠

ఎన్నుకోబడిన అల్లాహ్‌ దాసులు తప్ప!

37:161 – فَإِنَّكُمْ وَمَا تَعْبُدُونَ ١٦١

ఇక నిశ్చయంగా, మీరు మరియు మీ ఆరాధ్య దైవాలు (కలిసి);

37:162 – مَا أَنتُمْ عَلَيْهِ بِفَاتِنِينَ ١٦٢

ఎవ్వడినీ కూడా, దుష్టకార్యాలు చేయటానికి పురికొలుప లేరు;

37:163 – إِلَّا مَنْ هُوَ صَالِ الْجَحِيمِ ١٦٣

భగభగ మండే నరకాగ్నిలో కాలిపోనున్న వాడిని తప్ప!

37:164 – وَمَا مِنَّا إِلَّا لَهُ مَقَامٌ مَّعْلُومٌ ١٦٤

(దైవదూతలు ఇలా అంటారు): “మరియు మాలో ఒక్కడు కూడా తన స్థానం నియమింపబడకుండా లేడు.

37:165 – وَإِنَّا لَنَحْنُ الصَّافُّونَ ١٦٥

మరియు నిశ్చయంగా, మేము కూడా (ఆయనను ప్రార్థించటానికి) వరుసలు దీరి నిలుచుంటాము.

37:166 – وَإِنَّا لَنَحْنُ الْمُسَبِّحُونَ ١٦٦

మరియు నిశ్చయంగా, మేము కూడా ఆయన పవిత్రతను కొనియాడేవారమే! 152

37:167 – وَإِن كَانُوا لَيَقُولُونَ ١٦٧

మరియు (సత్య-తిరస్కారులు) ఇలా అంటూ ఉండేవారు:

37:168 – لَوْ أَنَّ عِندَنَا ذِكْرًا مِّنَ الْأَوَّلِينَ ١٦٨

“ఒకవేళ మా పూర్వీకుల నుండి మాకు ఇలాంటి బోధన లభించి ఉంటే!

37:169 – لَكُنَّا عِبَادَ اللَّـهِ الْمُخْلَصِينَ ١٦٩

“మేము కూడా, అల్లాహ్‌ యొక్క ఎన్నుకున్న, భక్తులమై ఉండేవారము!”

37:170 – فَكَفَرُوا بِهِ ۖ فَسَوْفَ يَعْلَمُونَ ١٧٠

కాని, వారిప్పుడు దీనిని (ఈ ఖుర్‌ఆన్‌ను) తిరస్కరిస్తున్నారు. ఇక త్వరలోనే వారు తెలుసు కుంటారు!

37:171 – وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا الْمُرْسَلِينَ ١٧١

మరియు వాస్తవానికి మా దాసులైన, మేము పంపిన సందేశహరుల విషయంలో మా నిర్ణయం జరిగింది;

37:172 – إِنَّهُمْ لَهُمُ الْمَنصُورُونَ ١٧٢

నిశ్చయంగా వారు సహాయం (విజయం) పొందుతారని!

37:173 – وَإِنَّ جُندَنَا لَهُمُ الْغَالِبُونَ ١٧٣

మరియు నిశ్చయంగా, మా సైనికులే తప్పక విజయం పొందుతారని! 53

37:174 – فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ ١٧٤

కావున నీవు వారిని (సత్య-తిరస్కారు లను) కొంతకాలం వదలిపెట్టు.

37:175 – وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ ١٧٥

మరియు వారిని చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు!

37:176 – أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ ١٧٦

ఏమీ? వారు మా శిక్ష కొరకు తొందర పెడుతున్నారా?

37:177 – فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَاءَ صَبَاحُ الْمُنذَرِينَ ١٧٧

కాని, అది వారి ఇంటి ప్రాంగణంలో దిగినప్పుడు, హెచ్చరించబడిన వారికి అది దుర్భరమైన ఉదయం కాగలదు!

37:178 – وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ ١٧٨

కావున నీవు ప్రస్తుతానికి వారిని వదలిపెట్టు;

37:179 – وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ ١٧٩

మరియు చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడ గలరు!

37:180 – سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ ١٨٠

నీ ప్రభువు సర్వలోపాలకు అతీతుడు; సర్వ శక్తిమంతుడైన ప్రభువు, వారి కల్పనలకు అతీతుడు.

37:181 – وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ ١٨١

మరియు సందేశహరులందరికి శాంతి కలుగు గాక (సలాం)!

37:182 – وَالْحَمْدُ لِلَّـهِ رَبِّ الْعَالَمِينَ ١٨٢

మరియు సర్వ స్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్‌ యే సమస్త లోకాలకు ప్రభువు!

సూరహ్‌ ‘సాద్‌ – ‘సాద్‌: ఈ సూరహ్‌ ప్రవక్తృత్వం లభించిన 4-5 సంవత్సరాల తరువాత మక్కహ్లో అవతరింపజేయబడింది. దైవమార్గదర్శకత్వం గురించి ఇందులో వివరించబడింది. ఈ అనుక్రమంలో ఇది 5 వది. 88 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ లోని అక్షరంతో పెట్టబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 38:1 – ص ۚ وَالْقُرْآنِ ذِي الذِّكْرِ ١

‘సాద్‌. మరియు హితబోధతో నిండివున్న ఈ ఖుర్‌ఆన్‌ సాక్షిగా!

38:2 – بَلِ الَّذِينَ كَفَرُوا فِي عِزَّةٍ وَشِقَاقٍ ٢

వాస్తవానికి, సత్యాన్ని తిరస్కరించిన వారు అహంకారంలో మరియు విరోధంలో పడివున్నారు.

38:3 – كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّن قَرْنٍ فَنَادَوا وَّلَاتَ حِينَ مَنَاصٍ ٣

వారికి పూర్వం గతించిన ఎన్నో తరాలను మేము నాశనం చేశాము. అప్పుడు వారు మొర పెట్టుకోసాగారు, కాని అప్పుడు వారికి దాని నుండి తప్పించుకునే సమయం లేక పోయింది!

38:4 – وَعَجِبُوا أَن جَاءَهُم مُّنذِرٌ مِّنْهُمْ ۖ وَقَالَ الْكَافِرُونَ هَـٰذَا سَاحِرٌ كَذَّابٌ ٤

మరియు వారిని హెచ్చరించేవాడు, తమలో నుంచే రావటం చూసి వారు ఆశ్చర్యపడ్డారు! మరియు సత్య-తిరస్కారులు ఇలా అన్నారు: “ఇతడు మాంత్రికుడు, అసత్యవాది.

38:5 – أَجَعَلَ الْآلِهَةَ إِلَـٰهًا وَاحِدًا ۖ إِنَّ هَـٰذَا لَشَيْءٌ عُجَابٌ ٥

“ఏమీ? ఇతను (ఈ ప్రవక్త) దైవాలందరినీ, ఒకే ఆరాధ్య దైవంగా చేశాడా? నిశ్చయంగా ఇది ఎంతో విచిత్రమైన విషయం!”

38:6 – وَانطَلَقَ الْمَلَأُ مِنْهُمْ أَنِ امْشُوا وَاصْبِرُوا عَلَىٰ آلِهَتِكُمْ ۖ إِنَّ هَـٰذَا لَشَيْءٌ يُرَادُ ٦

మరియు వారి నాయకులు ఇలా అన సాగారు: “పదండి! మీరు మీ దైవాల (ఆరాధన) మీద స్థిరంగా ఉండండి.” నిశ్చయంగా, ఇందులో (మీకు విరుద్ధంగా) ఏదో ఉద్దేశింపబడి ఉంది!

38:7 – مَا سَمِعْنَا بِهَـٰذَا فِي الْمِلَّةِ الْآخِرَةِ إِنْ هَـٰذَا إِلَّا اخْتِلَاقٌ ٧

“ఇలాంటి విషయాన్ని మేము ఇటీవలి కాలపు మతంలో విని ఉండలేదు. ఇది కేవలం కల్పన మాత్రమే!

38:8 – أَأُنزِلَ عَلَيْهِ الذِّكْرُ مِن بَيْنِنَا ۚ بَلْ هُمْ فِي شَكٍّ مِّن ذِكْرِي ۖ بَل لَّمَّا يَذُوقُوا عَذَابِ ٨

“ఏమీ? మా అందరిలోనూ, కేవలం ఇతని పైననే, ఈ హితబోధ అవతరింపజేయబడిందా?” 1 వాస్తవానికి వారు నా హితబోధను గురించి సంశయంలో పడి వున్నారు. 2 అలా కాదు, వారు ఇంకా (నా) శిక్షను రుచిచూడలేదు!

38:9 – أَمْ عِندَهُمْ خَزَائِنُ رَحْمَةِ رَبِّكَ الْعَزِيزِ الْوَهَّابِ ٩

లేక వారి దగ్గర సర్వశక్తుడు, సర్వప్రదుడు 3 అయిన నీ ప్రభువు యొక్క కారుణ్య నిధులు ఉన్నాయా?

38:10 – أَمْ لَهُم مُّلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ فَلْيَرْتَقُوا فِي الْأَسْبَابِ ١٠

అయిన నీ ప్రభువు యొక్క కారుణ్య నిధులు ఉన్నాయా?

38:11 – جُندٌ مَّا هُنَالِكَ مَهْزُومٌ مِّنَ الْأَحْزَابِ ١١

ఇంతకు ముందు ఓడించబడిన సైన్యాల వలే, ఒక వర్గం వీరిది కూడా ఉంటుంది!

38:12 – كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَعَادٌ وَفِرْعَوْنُ ذُو الْأَوْتَادِ ١٢

వీరికి పూర్వం నూ’హ్‌ మరియు ‘ఆద్‌ (జాతి) వారు మరియు మేకుల ఫిర్‌’ఔన్‌ జాతుల వారు సత్యాన్ని తిరస్కరించారు;

38:13 – وَثَمُودُ وَقَوْمُ لُوطٍ وَأَصْحَابُ الْأَيْكَةِ ۚ أُولَـٰئِكَ الْأَحْزَابُ ١٣

మరియు, స’మూద్‌ మరియు లూ’త్‌ జాతుల వారు మరియు అయ్‌కహ్‌ (మద్‌యన్‌) 4 వాసులు అందరూ ఇలాంటి వర్గాలకు చెందినవారే.

38:14 – إِن كُلٌّ إِلَّا كَذَّبَ الرُّسُلَ فَحَقَّ عِقَابِ ١٤

ఇక వీరిలో ఏ ఒక్కరూ ప్రవక్తలను అసత్య వాదులని తిరస్కరించకుండా ఉండలేదు, కావున నా శిక్ష అనివార్యమయ్యింది.

38:15 – وَمَا يَنظُرُ هَـٰؤُلَاءِ إِلَّا صَيْحَةً وَاحِدَةً مَّا لَهَا مِن فَوَاقٍ ١٥

మరియు వీరందరూ కేవలం ఒక గర్జన (‘సయ్‌’హా) 5 కొరకు మాత్రమే ఎదురు చూస్తు న్నారు, దానికి ఎలాంటి నిలుపుదల ఉండదు.

38:16 – وَقَالُوا رَبَّنَا عَجِّل لَّنَا قِطَّنَا قَبْلَ يَوْمِ الْحِسَابِ ١٦

మరియు వారు: “ఓ మా ప్రభూ! లెక్క దినానికి ముందే మా భాగం మాకు తొందరగాఇచ్చివెయ్యి.” 6 అని అంటారు.

38:17 – اصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاذْكُرْ عَبْدَنَا دَاوُودَ ذَا الْأَيْدِ ۖ إِنَّهُ أَوَّابٌ ١٧

(ఓ ము’హమ్మద్‌!) వారి మాటల యెడల నీవు సహనంవహించు మరియు బలవంతుడైన, మా దాసుడు దావూద్‌ను జ్ఞాపకంచేసుకో. 7 నిశ్చయంగా, అతను ఎల్లప్పుడూ పశ్చాత్తాపంతో (అల్లాహ్‌ వైపునకు) మరలుతూ ఉండేవాడు.

38:18 – إِنَّا سَخَّرْنَا الْجِبَالَ مَعَهُ يُسَبِّحْنَ بِالْعَشِيِّ وَالْإِشْرَاقِ ١٨

నిశ్చయంగా, మేము పర్వతాలను అతని తో బాటు సాయంత్రం మరియు ఉదయం మా పవిత్రతను కొనియాడుతూ ఉండేటట్లు చేశాము.

38:19 – وَالطَّيْرَ مَحْشُورَةً ۖ كُلٌّ لَّهُ أَوَّابٌ ١٩

మరియు పక్షులు కూడా గుమికూడేవి.అంతా కలసి ఆయన (అల్లాహ్‌) వైపుకు మరలేవారు.

38:20 – وَشَدَدْنَا مُلْكَهُ وَآتَيْنَاهُ الْحِكْمَةَ وَفَصْلَ الْخِطَابِ ٢٠

మరియు మేము అతని సామ్రాజ్యాన్ని పటిష్ఠపరిచాము మరియు మేము అతనికి వివే కాన్ని మరియు తిరుగులేని తీర్పుచేయడంలో, నేర్పరి తనాన్ని ప్రసాదించాము. (5/8)

38:21 – وَهَلْ أَتَاكَ نَبَأُ الْخَصْمِ إِذْ تَسَوَّرُوا الْمِحْرَابَ ٢١

  • మరియు తగవులాడుకొని వచ్చిన ఆ ఇద్దరివార్త నీకు చేరిందా? 8 వారు గోడఎక్కి అతని ప్రార్థనా గదిలోకి వచ్చారు.

38:22 – إِذْ دَخَلُوا عَلَىٰ دَاوُودَ فَفَزِعَ مِنْهُمْ ۖ قَالُوا لَا تَخَفْ ۖ خَصْمَانِ بَغَىٰ بَعْضُنَا عَلَىٰ بَعْضٍ فَاحْكُم بَيْنَنَا بِالْحَقِّ وَلَا تُشْطِطْ وَاهْدِنَا إِلَىٰ سَوَاءِ الصِّرَاطِ ٢٢

వారు దావూద్‌ వద్దకు వచ్చినపుడు, అతను వారిని చూసి బెదిరిపోయాడు. వార న్నారు: “భయపడకు! మేమిద్దరం ప్రత్యర్థులం, మాలో ఒకడు మరొకనికి అన్యాయం చేశాడు. కావున నీవు మా మధ్య న్యాయంగా తీర్పు చెయ్యి. మరియు నీతిమీరి నడువకు, మాకు సరైన మార్గంవైపునకు మార్గదర్శకత్వం చెయ్యి.

38:23 – إِنَّ هَـٰذَا أَخِي لَهُ تِسْعٌ وَتِسْعُونَ نَعْجَةً وَلِيَ نَعْجَةٌ وَاحِدَةٌ فَقَالَ أَكْفِلْنِيهَا وَعَزَّنِي فِي الْخِطَابِ ٢٣

“వాస్తవానికి, ఇతడు నా సోదరుడు, ఇతని వద్ద తొంభైతొమ్మిది ఆడగొర్రె లున్నాయి మరియు నా దగ్గర కేవలం ఒకేఒక్క ఆడగొర్రె ఉంది, అయినా ఇతడు అంటున్నాడు: ‘దీనిని నాకివ్వు.’ మరియు తన మాటల నేర్పుతో నన్ను వశపరచుకుంటున్నాడు.”

38:24 – قَالَ لَقَدْ ظَلَمَكَ بِسُؤَالِ نَعْجَتِكَ إِلَىٰ نِعَاجِهِ ۖ وَإِنَّ كَثِيرًا مِّنَ الْخُلَطَاءِ لَيَبْغِي بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَقَلِيلٌ مَّا هُمْ ۗ وَظَنَّ دَاوُودُ أَنَّمَا فَتَنَّاهُ فَاسْتَغْفَرَ رَبَّهُ وَخَرَّ رَاكِعًا وَأَنَابَ ٢٤

(దావూద్‌) అన్నాడు: “వాస్తవంగా, నీ ఆడ గొర్రెను తన గొర్రెలలో కలుపుకోవటానికి అడిగి, ఇతడు నీపై అన్యాయం చేస్తున్నాడు. మరియు వాస్తవానికి, చాలా మంది భాగస్థులు ఒకరికొకరు అన్యాయం చేసు కుంటూ ఉంటారు, విశ్వసించి సత్కార్యాలు చేసే వారు తప్ప! కాని అటువంటి వారు కొందరు మాత్రమే!” వాస్తవానికి మేము అతనిని (దావూద్‌ను) పరీక్షిస్తున్నా మని అతను అర్థం చేసుకున్నాడు. కాబట్టి తన ప్రభువును క్షమాపణ వేడు కున్నాడు. మరియు సాష్టాంగం (సజ్దా)లో పడిపోయాడు. మరియు పశ్చాత్తాపంతో (అల్లాహ్‌ వైపుకు) మరలాడు. (సజ్దా)

38:25 – فَغَفَرْنَا لَهُ ذَٰلِكَ ۖ وَإِنَّ لَهُ عِندَنَا لَزُلْفَىٰ وَحُسْنَ مَآبٍ ٢٥

అప్పుడు మేము అతనిని (ఆ తప్పును) క్షమించాము. మరియు నిశ్చయంగా, మా వద్ద అతనికి సాన్నిహిత్యం మరియు మంచి స్థానం కూడా ఉన్నాయి.

38:26 – يَا دَاوُودُ إِنَّا جَعَلْنَاكَ خَلِيفَةً فِي الْأَرْضِ فَاحْكُم بَيْنَ النَّاسِ بِالْحَقِّ وَلَا تَتَّبِعِ الْهَوَىٰ فَيُضِلَّكَ عَن سَبِيلِ اللَّـهِ ۚ إِنَّ الَّذِينَ يَضِلُّونَ عَن سَبِيلِ اللَّـهِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ بِمَا نَسُوا يَوْمَ الْحِسَابِ ٢٦

(మేము అతనితో ఇలా అన్నాము): “ఓ దావూద్‌! నిశ్చయంగా, మేము నిన్ను భూమిలో ఉత్తరాధికారిగా నియమించాము. కావున నీవు ప్రజల మధ్య న్యాయంగా తీర్పుచెయ్యి మరియు నీ మనో కాంక్షలను అనుసరించకు, ఎందుకంటే అవి నిన్ను అల్లాహ్‌ మార్గం నుండి తప్పిస్తాయి.” నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్‌ మార్గంనుండి తప్పి పోతారో, వారికి లెక్కదినమును మరచిపోయిన దాని ఫలితంగా, కఠినమైన శిక్ష పడుతుంది.

38:27 – وَمَا خَلَقْنَا السَّمَاءَ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا بَاطِلًا ۚ ذَٰلِكَ ظَنُّ الَّذِينَ كَفَرُوا ۚ فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا مِنَ النَّارِ ٢٧

మరియు మేము ఈ ఆకాశాన్ని మరియు ఈభూమిని మరియు వాటిమధ్య ఉన్నదాన్నంతా వృథాగా సృష్టించలేదు! ఇది సత్యాన్ని తిరస్క రించిన వారి భ్రమ మాత్రమే. 9 కావున అట్టి సత్య-తిరస్కారులకు నరకాగ్ని బాధ పడనున్నది!

38:28 – أَمْ نَجْعَلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ كَالْمُفْسِدِينَ فِي الْأَرْضِ أَمْ نَجْعَلُ الْمُتَّقِينَ كَالْفُجَّارِ ٢٨

ఏమీ? మేము విశ్వసించి, సత్కార్యాలు చేసే వారిని భూమిలో కల్లోలం రేకెత్తించే వారితో సమానులుగా చేస్తామా? లేక మేము దైవభీతి గలవారిని దుష్టులతో సమానులుగా చేస్తామా? 10

38:29 – كِتَابٌ أَنزَلْنَاهُ إِلَيْكَ مُبَارَكٌ لِّيَدَّبَّرُوا آيَاتِهِ وَلِيَتَذَكَّرَ أُولُو الْأَلْبَابِ ٢٩

(ఓ ము’హమ్మద్‌!) మేము ఎంతో శుభ వంత మైన ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) నీపై అవత రింపజేశాము. ప్రజలు దీనిసూచన (ఆయాత్‌)లను గురించి యోచించాలని మరియు బుద్ధిమంతులు దీని నుండి హితబోధ గ్రహించాలని.

38:30 – وَوَهَبْنَا لِدَاوُودَ سُلَيْمَانَ ۚ نِعْمَ الْعَبْدُ ۖ إِنَّهُ أَوَّابٌ ٣٠

మరియు మేము దావూద్‌కు సులైమాన్‌ను ప్రసాదించాము. అతను ఉత్తమ దాసుడు! నిశ్చయంగా, అతను ఎల్లపుడు మా వైపునకు పశ్చాత్తాపంతో మరలుతూ ఉండేవాడు.

38:31 – إِذْ عُرِضَ عَلَيْهِ بِالْعَشِيِّ الصَّافِنَاتُ الْجِيَادُ ٣١

ఒకరోజు సాయంకాలం అతని ముందు మేలు జాతి, వడిగల గుర్రాలు ప్రవేశపెట్టబడినప్పుడు;

38:32 – فَقَالَ إِنِّي أَحْبَبْتُ حُبَّ الْخَيْرِ عَن ذِكْرِ رَبِّي حَتَّىٰ تَوَارَتْ بِالْحِجَابِ ٣٢

అతను అన్నాడు: “అయ్యో! వాస్తవంగా నేను నా ప్రభువు స్మరణకు బదులుగా ఈ సంపదను (గుర్రాలను) ప్రేమించాను.” చివరకు (సూర్యుడు) కను మరుగై పోయాడు.

38:33 – رُدُّوهَا عَلَيَّ ۖ فَطَفِقَ مَسْحًا بِالسُّوقِ وَالْأَعْنَاقِ ٣٣

(అతను ఇంకాఇలాఅన్నాడు): “వాటిని నా వద్దకుతిరిగితీసుకురండి.” తరువాత అతనువాటి పిక్కలను మరియు మెడలను నిమరసాగాడు. 11

38:34 – وَلَقَدْ فَتَنَّا سُلَيْمَانَ وَأَلْقَيْنَا عَلَىٰ كُرْسِيِّهِ جَسَدًا ثُمَّ أَنَابَ ٣٤

మరియు వాస్తవానికి మేము సులైమాన్‌ను పరీక్షకు గురిచేశాము మరియు అతని సింహాసనం పై ఒక కళేబరాన్ని 12 పడవేశాము, అప్పుడతను పశ్చాత్తాపంతో మా వైపునకు మరలాడు.

38:35 – قَالَ رَبِّ اغْفِرْ لِي وَهَبْ لِي مُلْكًا لَّا يَنبَغِي لِأَحَدٍ مِّن بَعْدِي ۖ إِنَّكَ أَنتَ الْوَهَّابُ ٣٥

అతను ఇలా ప్రార్థించాడు: “ఓ నా ప్రభూ! నన్ను క్షమించు, నా తరువాత మరెవ్వరికీ లభించనటువంటి సామ్రాజ్యాన్ని నాకు ప్రసాదించు. నిశ్చయంగా, నీవే సర్వప్రదుడవు!”

38:36 – فَسَخَّرْنَا لَهُ الرِّيحَ تَجْرِي بِأَمْرِهِ رُخَاءً حَيْثُ أَصَابَ ٣٦

అప్పుడు మేము గాలిని అతనికి వశపర చాము. అది అతని ఆజ్ఞానుసారంగా, అతడు కోరిన వైపునకు తగినట్లుగా మెల్లగా వీచేది. 13

38:37 – وَالشَّيَاطِينَ كُلَّ بَنَّاءٍ وَغَوَّاصٍ ٣٧

మరియు షై’తానులలో (జిన్నాతులలో) నుండి కూడా రకరకాల కట్టడాలు నిర్మించే వాటినీ మరియు సముద్రంలో మునిగి (ముత్యాలు తీసే) వాటినీ (అతనికి వశపరచిఉన్నాము).

38:38 – وَآخَرِينَ مُقَرَّنِينَ فِي الْأَصْفَادِ ٣٨

మరికొన్ని సంకెళ్ళతో బంధింపబడినవి కూడా ఉండేవి.

38:39 – هَـٰذَا عَطَاؤُنَا فَامْنُنْ أَوْ أَمْسِكْ بِغَيْرِ حِسَابٍ ٣٩

(అల్లాహ్‌ అతనితో అన్నాడు): “ఇది నీకు మా కానుక, కావున నీవు దీనిని (ఇతరులకు) ఇచ్చినా, లేక నీవే ఉంచుకున్నా, నీతో ఎలాంటి లెక్క తీసుకోబడదు.” 14

38:40 – وَإِنَّ لَهُ عِندَنَا لَزُلْفَىٰ وَحُسْنَ مَآبٍ ٤٠

మరియు నిశ్చయంగా, అతనికి మా సాన్ని హిత్యం మరియు ఉత్తమ గమ్యస్థానం ఉన్నాయి.

38:41 – وَاذْكُرْ عَبْدَنَا أَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُ أَنِّي مَسَّنِيَ الشَّيْطَانُ بِنُصْبٍ وَعَذَابٍ ٤١

మరియు మా దాసుడు అయ్యూబ్‌ను గురించి ప్రస్తావించు; అతను తన ప్రభువుతో ఇలా మొరపెట్టు కున్నాడు: “నిశ్చయంగా షై’తాన్‌ నన్ను ఆపదకు మరియు శిక్షకు గురిచేశాడు.” 15

38:42 – ارْكُضْ بِرِجْلِكَ ۖ هَـٰذَا مُغْتَسَلٌ بَارِدٌ وَشَرَابٌ ٤٢

(మేము అతనితో అన్నాము): “నీ కాలును నేలమీద కొట్టు. అదిగో చల్లని (నీటిచెలిమ)! నీవు స్నానం చేయటానికి మరియు త్రాగుటకూను.”

38:43 – وَوَهَبْنَا لَهُ أَهْلَهُ وَمِثْلَهُم مَّعَهُمْ رَحْمَةً مِّنَّا وَذِكْرَىٰ لِأُولِي الْأَلْبَابِ ٤٣

మరియు మేము అతని కుటుంబంవారిని మరియు వారితోబాటు, వారివంటి వారిని మా కరుణతో అతనికి తిరిగి ఇచ్చాము మరియు బుధ్ధి మంతులకు ఇది ఒక హితబోధ. 16

38:44 – وَخُذْ بِيَدِكَ ضِغْثًا فَاضْرِب بِّهِ وَلَا تَحْنَثْ ۗ إِنَّا وَجَدْنَاهُ صَابِرًا ۚ نِّعْمَ الْعَبْدُ ۖ إِنَّهُ أَوَّابٌ ٤٤

(అల్లాహ్‌ అతనితో అన్నాడు): “ఒక పుల్లల కట్టను నీ చేతిలోకి తీసికొని దానితో (నీ భార్యను) కొట్టు మరియు నీ ఒట్టును భంగపరచు కోకు.” 17 వాస్తవానికి, మేము అతనిని ఎంతో సహనశీలునిగా పొందాము. అతను ఉత్తమ దాసుడు! నిశ్చయంగా, ఎల్లపుడు మా వైపునకు పశ్చాత్తాపంతో మరలుతూ ఉండేవాడు.

38:45 – وَاذْكُرْ عِبَادَنَا إِبْرَاهِيمَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ أُولِي الْأَيْدِي وَالْأَبْصَارِ ٤٥

మరియు మా దాసులైన ఇబ్రాహీమ్‌, ఇస్‌’హాఖ్‌ మరియు య’అఖూబ్‌లను జ్ఞాపకం చేసుకో! వారు గొప్ప కార్యశీలురు మరియు దూర దృష్టి గలవారు.

38:46 – إِنَّا أَخْلَصْنَاهُم بِخَالِصَةٍ ذِكْرَى الدَّارِ ٤٦

నిశ్చయంగా, మేము వారిని ఒక విశిష్ట గుణం కారణంగా ఎన్నుకున్నాము, అది వారి పరలోక చింతన.

38:47 – وَإِنَّهُمْ عِندَنَا لَمِنَ الْمُصْطَفَيْنَ الْأَخْيَارِ ٤٧

మరియునిశ్చయంగా మాదృష్టిలోవారు ఎన్ను కొనబడిన ఉత్తమ (పుణ్య) పురుషులలోని వారు!

38:48 – وَاذْكُرْ إِسْمَاعِيلَ وَالْيَسَعَ وَذَا الْكِفْلِ ۖ وَكُلٌّ مِّنَ الْأَخْيَارِ ٤٨

మరియు ఇస్మా’యీల్‌, అల్‌-యస’అ మరియు జుల్‌-కిఫ్ల్‌ను 18 కూడా జ్ఞాపకంచేసుకో. మరియు వారందరూ ఎన్నుకొనబడిన ఉత్తమ పురుషులలోని వారు.

38:49 – هَـٰذَا ذِكْرٌ ۚ وَإِنَّ لِلْمُتَّقِينَ لَحُسْنَ مَآبٍ ٤٩

ఇది ఒక ప్రస్తావన. మరియు నిశ్చయంగా! దైవభీతి గలవారికి ఉత్తమ గమ్యస్థానం ఉంది.

38:50 – جَنَّاتِ عَدْنٍ مُّفَتَّحَةً لَّهُمُ الْأَبْوَابُ ٥٠

శాశ్వతమైన స్వర్గవనాలు, వాటి ద్వారాలు వారి కొరకు తెరువబడి ఉంటాయి.

38:51 – مُتَّكِئِينَ فِيهَا يَدْعُونَ فِيهَا بِفَاكِهَةٍ كَثِيرَةٍ وَشَرَابٍ ٥١

అందులోవారు దిండ్లను ఆనుకొని కూర్చొని; అందులో వారు అనేక ఫలాలను మరియు పానీయాలను అడుగుతూ ఉంటారు. (3/4)

38:52 – وَعِندَهُمْ قَاصِرَاتُ الطَّرْفِ أَتْرَابٌ ٥٢

  • మరియు వారి దగ్గర సమవయస్కులు మరియు తమ చూపులను వారి కొరకే ప్రత్యేకించుకొనే శీలవతులైన స్త్రీలు ఉంటారు. 19

38:53 – هَـٰذَا مَا تُوعَدُونَ لِيَوْمِ الْحِسَابِ ٥٣

లెక్కదినం కొరకు మీతో (దైవభీతి గల వారితో) చేయబడిన వాగ్దానం ఇదే!

38:54 – إِنَّ هَـٰذَا لَرِزْقُنَا مَا لَهُ مِن نَّفَادٍ ٥٤

నిశ్చయంగా, ఇదే మేమిచ్చే జీవనోపాధి. దానికి తరుగులేదు;

38:55 – هَـٰذَا ۚ وَإِنَّ لِلطَّاغِينَ لَشَرَّ مَآبٍ ٥٥

ఇదే (విశ్వాసులకు లభించేది). మరియు నిశ్చయంగా, తలబిరుసుతనం గల దుష్టులకు అతిచెడ్డ గమ్యస్థానం ఉంటుంది –

38:56 – جَهَنَّمَ يَصْلَوْنَهَا فَبِئْسَ الْمِهَادُ ٥٦

నరకం – వారందులో కాలుతారు. ఎంత బాధా కరమైన విరామ (నివాస) స్థలము.

38:57 – هَـٰذَا فَلْيَذُوقُوهُ حَمِيمٌ وَغَسَّاقٌ ٥٧

ఇదే (దుష్టులకులభించేది) కావున వారు దాని రుచి చూస్తారు; సలసలకాగే నీరు మరియు చీము.

38:58 – وَآخَرُ مِن شَكْلِهِ أَزْوَاجٌ ٥٨

ఇంకా ఇలాంటివే అనేకం ఉంటాయి!

38:59 – هَـٰذَا فَوْجٌ مُّقْتَحِمٌ مَّعَكُمْ ۖ لَا مَرْحَبًا بِهِمْ ۚ إِنَّهُمْ صَالُو النَّارِ ٥٩

“ఇదొక దళం, మీ వైపునకు త్రోయబడుతూ వస్తున్నది. వారికి ఎలాంటి స్వాగతం లేదు! నిశ్చయంగా, వారు నరకాగ్నిలో కాలుతారు.”

38:60 – قَالُوا بَلْ أَنتُمْ لَا مَرْحَبًا بِكُمْ ۖ أَنتُمْ قَدَّمْتُمُوهُ لَنَا ۖ فَبِئْسَ الْقَرَارُ ٦٠

(సత్య-తిరస్కారులు తమను మార్గం తప్పించిన వారితో) అంటారు: “అయితే మీకు కూడా స్వాగతం లేదు కదా! ఈ పర్యవసానాన్ని మా ముందుకు తెచ్చినవారు మీరే కదా! ఎంత చెడ్డ నివాసస్థలము.”

38:61 – قَالُوا رَبَّنَا مَن قَدَّمَ لَنَا هَـٰذَا فَزِدْهُ عَذَابًا ضِعْفًا فِي النَّارِ ٦١

వారు ఇంకా ఇలా అంటారు: “ఓ మా ప్రభూ! మా యెదుట దీనిని (నరకాన్ని) తెచ్చిన వానికి రెట్టింపు నరకాగ్నిశిక్షను విధించు!” 20

38:62 – وَقَالُوا مَا لَنَا لَا نَرَىٰ رِجَالًا كُنَّا نَعُدُّهُم مِّنَ الْأَشْرَارِ ٦٢

ఇంకా వారు ఇలా అంటారు: “మాకే మయింది? మనం చెడ్డవారిగా ఎంచిన వారు ఇక్కడ మనకు కనబడటం లేదేమిటి?

38:63 – أَتَّخَذْنَاهُمْ سِخْرِيًّا أَمْ زَاغَتْ عَنْهُمُ الْأَبْصَارُ ٦٣

“మనం ఊరికే వారిని ఎగతాళి చేశామా? లేదా వారు మనకు కనుమరుగయ్యారా?”

38:64 – إِنَّ ذَٰلِكَ لَحَقٌّ تَخَاصُمُ أَهْلِ النَّارِ ٦٤

నిశ్చయంగా, ఇదే నిజం! నరకవాసులు ఇలాగే వాదులాడుకుంటారు.

38:65 – قُلْ إِنَّمَا أَنَا مُنذِرٌ ۖ وَمَا مِنْ إِلَـٰهٍ إِلَّا اللَّـهُ الْوَاحِدُ الْقَهَّارُ ٦٥

(ఓ ము’హమ్మద్‌!) వారితో ఇలా అను: “వాస్తవానికి నేను హెచ్చరించేవాడను మాత్రమే! అల్లాహ్‌ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! ఆయన అద్వితీయుడు తన సృష్టిమీద సంపూర్ణ అధికారం గలవాడు. 21

38:66 – رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا الْعَزِيزُ الْغَفَّارُ ٦٦

“ఆకాశాలు, భూమి మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు, సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు.”

38:67 – قُلْ هُوَ نَبَأٌ عَظِيمٌ ٦٧

వారితో అను: “ఇది (ఈ ఖుర్‌ఆన్‌) ఒక గొప్ప సందేశం.

38:68 – أَنتُمْ عَنْهُ مُعْرِضُونَ ٦٨

“దానినుండి మీరు విముఖులవుతున్నారు!”

38:69 – مَا كَانَ لِيَ مِنْ عِلْمٍ بِالْمَلَإِ الْأَعْلَىٰ إِذْ يَخْتَصِمُونَ ٦٩

(ఓ ము’హమ్మద్‌! ఇలా అను): “ఉన్నత స్థానాలలో ఉన్న ముఖ్యుల (దేవదూతల) మధ్య (ఆదమ్‌ సృష్టి గురించి) ఒకప్పుడు జరిగిన వివాదం గురించి నాకు తెలియదు. 22

38:70 – إِن يُوحَىٰ إِلَيَّ إِلَّا أَنَّمَا أَنَا نَذِيرٌ مُّبِينٌ ٧٠

“కాని అది నాకు దివ్యజ్ఞానం (వ’హీ) ద్వారానే తెలుపబడింది. వాస్తవానికి, నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే!”

38:71 – إِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي خَالِقٌ بَشَرًا مِّن طِينٍ ٧١

నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న మాటను (జ్ఞాపకంచేసుకో): “నేను మట్టితో ఒక మనిషిని సృష్టించబోతున్నాను. 23

38:72 – فَإِذَا سَوَّيْتُهُ وَنَفَخْتُ فِيهِ مِن رُّوحِي فَقَعُوا لَهُ سَاجِدِينَ ٧٢

“ఇక ఎప్పుడైతే, నేను అతని సృష్టిని పూర్తిచేసి అతనిలో నా (తరఫు నుండి) ఆత్మను (జీవాన్ని) ఊదుతానో అప్పుడు, 24 మీరు అతని ముందు సాష్టాంగం (సజ్దా)లో పడిపొండి.” 25

38:73 – فَسَجَدَ الْمَلَائِكَةُ كُلُّهُمْ أَجْمَعُونَ ٧٣

అప్పుడు దేవదూతలందరూ కలసి అతనికి సజ్దా చేశారు. 26

38:74 – إِلَّا إِبْلِيسَ اسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ ٧٤

ఒక్క ఇబ్లీస్ 27 తప్ప! అతడు గర్వితు డయ్యాడు మరియు సత్య-తిరస్కారులలో కలిసి పోయాడు.

38:75 – قَالَ يَا إِبْلِيسُ مَا مَنَعَكَ أَن تَسْجُدَ لِمَا خَلَقْتُ بِيَدَيَّ ۖ أَسْتَكْبَرْتَ أَمْ كُنتَ مِنَ الْعَالِينَ ٧٥

(అల్లాహ్‌) ఇలాఅన్నాడు: “ఓ ఇబ్లీస్‌! నేను నా రెండు చేతులతో సృష్టించిన వానికి సాష్టాంగం (సజ్దా) చేయకుండా నిన్ను ఆపింది ఏమిటీ? నీవు గర్వితుడవై పోయావా! లేదా నిన్ను, నీవు ఉన్నత శ్రేణికి చెందినవాడ వనుకున్నావా?”

38:76 – قَالَ أَنَا خَيْرٌ مِّنْهُ ۖ خَلَقْتَنِي مِن نَّارٍ وَخَلَقْتَهُ مِن طِينٍ ٧٦

(ఇబ్లీస్‌) అన్నాడు: “నేను అతని కంటే శ్రేష్ఠుడను. నీవు నన్ను అగ్నితో సృష్టించావు మరియు అతనిని మట్టితో సృష్టించావు.”

38:77 – قَالَ فَاخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ ٧٧

(అల్లాహ్‌) అన్నాడు: “ఇక ఇక్కడి నుండి వెళ్ళిపో! నిశ్చయంగా నీవు భ్రష్టుడవు.

38:78 – وَإِنَّ عَلَيْكَ لَعْنَتِي إِلَىٰ يَوْمِ الدِّينِ ٧٨

“మరియు నిశ్చయంగా, తీర్పుదినం వరకు నీపై నా శాపం (బహిష్కారం) ఉంటుంది.”

38:79 – قَالَ رَبِّ فَأَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ ٧٩

(అప్పుడు ఇబ్లీస్‌) ఇలా మనవి చేసుకున్నాడు: “ఓ నా ప్రభూ! మృతులు తిరిగి లేపబడే దినం వరకు నాకు వ్యవధినివ్వు!”

38:80 – قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ ٨٠

(అల్లాహ్‌) సెలవిచ్చాడు: “సరే! నీకు వ్యవధి ఇవ్వబడుతోంది!

38:81 – إِلَىٰ يَوْمِ الْوَقْتِ الْمَعْلُومِ ٨١

“ఆనియమితదినపు ఆగడువు వచ్చే వరకు.”

38:82 – قَالَ فَبِعِزَّتِكَ لَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ ٨٢

(ఇబ్లీస్‌) అన్నాడు: “నీ శక్తి సాక్షిగా నేను వారందరినీ తప్పుదారి పట్టిస్తాను;

38:83 – إِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِينَ ٨٣

“వారిలో నుండి నీవు ఎన్నుకున్న నీ దాసుల్ని తప్ప!”

38:84 – قَالَ فَالْحَقُّ وَالْحَقَّ أَقُولُ ٨٤

(అల్లాహ్‌) అన్నాడు: “అయితే సత్యం ఇదే! మరియు నేను సత్యం పలుకుతున్నాను;

38:85 – لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنكَ وَمِمَّن تَبِعَكَ مِنْهُمْ أَجْمَعِينَ ٨٥

“నీవు మరియు వారిలో నుండి నిన్ను అను సరించే వారందరితో నేను నరకాన్ని నింపుతాను!”

38:86 – قُلْ مَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ وَمَا أَنَا مِنَ الْمُتَكَلِّفِينَ ٨٦

(ఓ ప్రవక్తా!) వారితో అను: “నేను దీని (ఈ సందేశం) కొరకు మీ నుండి, ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటంలేదు మరియు నేను వంచకులలోని వాడనుకాను.

38:87 – إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ ٨٧

“ఇది (ఈ ఖుర్‌ఆన్‌) సమస్త లోకాల వారందరికీ కేవలం ఒక జ్ఞాపిక (హితబోధ)!

38:88 – وَلَتَعْلَمُنَّ نَبَأَهُ بَعْدَ حِينٍ ٨٨

“మరియు అచిర కాలంలోనే దీని ఉద్దేశాన్ని (వార్తను) మీరు తప్పక తెలుసుకుంటారు.”

సూరహ్‌ అ’జ్‌-‘జుమర్‌ – ‘జుమరున్‌: అంటే గుంపులు, సముదాయం, సమూహం లేక సైనికులు అని అర్థం. ఈ సూరహ్‌ మధ్య మక్కహ్ కాలంలో అవతరింపజేయబడింది. ఇందులో 75 ఆయతులున్నాయి. ఈ పదం 71వ ఆయత్‌లో వచ్చింది. అల్లాహ్‌ (సు.త.) ఉనికి మరియు ఆయన ఏకత్వం, సృష్టి యొక్క ప్రతిదానిలో విశదమౌతోంది. ఎన్నో ఆయతులు అంతిమ ఘడియను గురించి కూడా వివరిస్తున్నాయి. దైవప్రవక్త (‘స’అస) ప్రతిరాత్రి నమా’జ్‌లో సూరహ్‌ అల్ ఇస్రా (17) మరియు ఇది (39) చదివేవారు. (తిర్మిజీ’-అల్బానీ ప్రమాణీకం). ఈ అనుక్రమంలో ఇది చివరిది (6 వది).

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 39:1 – تَنزِيلُ الْكِتَابِ مِنَ اللَّـهِ الْعَزِيزِ الْحَكِيمِ ١

ఈ గ్రంథ (ఖుర్‌ఆన్‌) అవతరణ సర్వ శక్తి మంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్‌ తరఫు నుండి జరిగింది.

39:2 – إِنَّا أَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ فَاعْبُدِ اللَّـهَ مُخْلِصًا لَّهُ الدِّينَ ٢

(ఓ ము’హమ్మద్‌!) నిశ్చయంగా, మేము ఈ గ్రంథాన్ని, సత్యంతో నీపై అవతరింపజేశాము. కావున నీవు అల్లాహ్‌నే ఆరాధిస్తూ నీ భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకో!

39:3 – أَلَا لِلَّـهِ الدِّينُ الْخَالِصُ ۚ وَالَّذِينَ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ مَا نَعْبُدُهُمْ إِلَّا لِيُقَرِّبُونَا إِلَى اللَّـهِ زُلْفَىٰ إِنَّ اللَّـهَ يَحْكُمُ بَيْنَهُمْ فِي مَا هُمْ فِيهِ يَخْتَلِفُونَ ۗ إِنَّ اللَّـهَ لَا يَهْدِي مَنْ هُوَ كَاذِبٌ كَفَّارٌ ٣

వినండి! భక్తి కేవలం అల్లాహ్‌ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది! ఇక ఆయనను వదలి ఇతరు లను సంరక్షకులుగా చేసుకునే వారు (ఇలా అంటారు): “వారు మమ్మల్ని అల్లాహ్‌ సాన్నిధ్యా నికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరా ధిస్తున్నాము!” 1 నిశ్చయంగా, అల్లాహ్‌ వారిలో ఉన్న భేదాభి ప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పుచేస్తాడు. 2 నిశ్చయంగా, అల్లాహ్‌ అసత్య వాదికి, కృతఘ్నునికి మార్గదర్శకత్వంచేయడు. 3

39:4 – لَّوْ أَرَادَ اللَّـهُ أَن يَتَّخِذَ وَلَدًا لَّاصْطَفَىٰ مِمَّا يَخْلُقُ مَا يَشَاءُ ۚ سُبْحَانَهُ ۖ هُوَ اللَّـهُ الْوَاحِدُ الْقَهَّارُ ٤

ఒకవేళ అల్లాహ్‌ ఎవరినైనా కుమారునిగా చేసుకోదలిస్తే, 4 తన సృష్టిలో తాను కోరినవానిని ఎన్నుకొని ఉండేవాడు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన అల్లాహ్‌! అద్వితీయుడు, తన సృష్టిమీద సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. 5

39:5 – خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۖ يُكَوِّرُ اللَّيْلَ عَلَى النَّهَارِ وَيُكَوِّرُ النَّهَارَ عَلَى اللَّيْلِ ۖ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ ۖ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُّسَمًّى ۗ أَلَا هُوَ الْعَزِيزُ الْغَفَّارُ ٥

ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు. 6 ఆయన రాత్రిని పగటిమీద చుట్టుతున్నాడు. మరియు పగటిని రాత్రిమీద చుట్టుతున్నాడు. 7 సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి నియమబద్ధులుగా చేసి ఉంచాడు. వాటిలో ప్రతిఒక్కటీ ఒక నిర్ణీత కాలంలో (నిర్ణీతపరిధిలో) పయనిస్తూ ఉన్నాయి. వినండి! ఆయన, సర్వ శక్తిమంతుడు, క్షమించేవాడు.

39:6 – خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ ثُمَّ جَعَلَ مِنْهَا زَوْجَهَا وَأَنزَلَ لَكُم مِّنَ الْأَنْعَامِ ثَمَانِيَةَ أَزْوَاجٍ ۚ يَخْلُقُكُمْ فِي بُطُونِ أُمَّهَاتِكُمْ خَلْقًا مِّن بَعْدِ خَلْقٍ فِي ظُلُمَاتٍ ثَلَاثٍ ۚ ذَٰلِكُمُ اللَّـهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ۖ لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُصْرَفُونَ ٦

ఆయన మిమ్మల్ని ఒకేప్రాణి (ఆదమ్‌) నుండి సృష్టించాడు. తరువాత అతని నుండి అతని జంట (‘జౌజ్) ను పుట్టించాడు. 8 మరియు మీ కొరకు ఎనిమిది జతల (ఆడ-మగ) పశువులను పుట్టించాడు. 9 ఆయన మిమ్మల్ని మీ తల్లుల గర్భాలలో మూడు చీకటితెరలలో ఒక రూపం తరువాత మరొక రూపాన్నిచ్చాడు. 10 ఆయనే అల్లాహ్‌! మీ ప్రభువు విశ్వాధిపత్యం ఆయనదే, ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలాంటప్పుడు మీరు ఎలా (సత్యంనుండి) తప్పించబడుతున్నారు?

39:7 – إِن تَكْفُرُوا فَإِنَّ اللَّـهَ غَنِيٌّ عَنكُمْ ۖ وَلَا يَرْضَىٰ لِعِبَادِهِ الْكُفْرَ ۖ وَإِن تَشْكُرُوا يَرْضَهُ لَكُمْ ۗ وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۗ ثُمَّ إِلَىٰ رَبِّكُم مَّرْجِعُكُمْ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ٧

ఒకవేళ మీరు సత్యాన్ని తిరస్కరిస్తే, నిశ్చయంగా అల్లాహ్‌ మీ అక్కరలేని వాడు. 11 మరియు ఆయన తన దాసులు సత్య-తిరస్కార వైఖరిని అవలంబించడాన్ని ఇష్ట పడడు. మరియు మీరు కృతజ్ఞులై నట్లయితే ఆయన మీ పట్ల ఎంతో సంతోషపడతాడు. మరియు బరువు మోసేవాడు ఎవ్వడూ ఇతరుల బరువును మోయడు. 12 చివరకు మీరందరికీ, మీ ప్రభువు వైపునకే మరల వలసి ఉంది! అప్పుడు ఆయన, మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో మీకు తెలియజేస్తాడు. నిశ్చయంగా, ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలన్నీ బాగాతెలుసు. (7/8)

39:8 – وَإِذَا مَسَّ الْإِنسَانَ ضُرٌّ دَعَا رَبَّهُ مُنِيبًا إِلَيْهِ ثُمَّ إِذَا خَوَّلَهُ نِعْمَةً مِّنْهُ نَسِيَ مَا كَانَ يَدْعُو إِلَيْهِ مِن قَبْلُ وَجَعَلَ لِلَّـهِ أَندَادًا لِّيُضِلَّ عَن سَبِيلِهِ ۚ قُلْ تَمَتَّعْ بِكُفْرِكَ قَلِيلًا ۖ إِنَّكَ مِنْ أَصْحَابِ النَّارِ ٨

  • మానవునికి ఏదైనా కష్టం కలిగినప్పుడు అతడు పశ్చాత్తాపంతో తన ప్రభువు వైపునకు మరలి ఆయనను వేడుకుంటాడు. తరువాత ఆయన (అల్లాహ్‌) అతనికి తన అనుగ్రహాన్ని ప్రసాదించినప్పుడు, అతడు పూర్వం దేనిని గురించి వేడుకుంటూ ఉండేవాడో దానిని మరచి పోతాడు మరియు అల్లాహ్‌కు సాటికల్పించి, (ఇతరులను) ఆయన మార్గంనుండితప్పిస్తాడు. 13 (అలాంటి వానితో) ఇలా అను: “నీవు, నీ సత్య- తిరస్కార వైఖరితో కొంతకాలం సంతోషపడు. నిశ్చ యంగా, నీవు నరకవాసుల్లోని వాడవవుతావు!”

39:9 – أَمَّنْ هُوَ قَانِتٌ آنَاءَ اللَّيْلِ سَاجِدًا وَقَائِمًا يَحْذَرُ الْآخِرَةَ وَيَرْجُو رَحْمَةَ رَبِّهِ ۗ قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ ۗ إِنَّمَا يَتَذَكَّرُ أُولُو الْأَلْبَابِ ٩

ఏమీ? ఎవడైతే శ్రధ్ధతో రాత్రి ఘడియలలో సాష్టాంగం (సజ్దా) చేస్తూ మరియు నిలిచి(నమా’జ్‌) చేస్తూ, పరలోక (జీవిత)మును గురించి భయ పడుతూ, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తూ ఉంటాడో! (అలాంటి వాడు, అలా చేయని వాడితో సమానుడా)? వారిని అడుగు: “ఏమీ? విజ్ఞానులు మరియు అజ్ఞానులు సరిసమానులు కాగలరా? వాస్తవానికి బుద్ధిమంతులే హితబోధ స్వీకరిస్తారు.

39:10 – قُلْ يَا عِبَادِ الَّذِينَ آمَنُوا اتَّقُوا رَبَّكُمْ ۚ لِلَّذِينَ أَحْسَنُوا فِي هَـٰذِهِ الدُّنْيَا حَسَنَةٌ ۗ وَأَرْضُ اللَّـهِ وَاسِعَةٌ ۗ إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ ١٠

(ఓ ము’హమ్మద్‌! అల్లాహ్‌ ఇలా సెల విస్తున్నాడని) అను: “ఓ విశ్వసించిన నా దాసులారా! మీ ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండండి. ఎవరైతే ఈ లోకంలో సత్పురు షులై ఉంటారో (వారికి పరలోకంలో) మేలు జరుగు తుంది. మరియు అల్లాహ్‌ భూమి చాలా విశాల మైనది. 14 నిశ్చయంగా, సహనం వహించిన వారికి లెక్క లేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది.”

39:11 – قُلْ إِنِّي أُمِرْتُ أَنْ أَعْبُدَ اللَّـهَ مُخْلِصًا لَّهُ الدِّينَ ١١

(ఓ ము’హమ్మద్‌! ఇంకా) ఇలా అను: “నిశ్చయంగా, నేను అల్లాహ్‌ను మాత్రమే ఆరాధిస్తూ, నా భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని ఆజ్ఞాపించబడ్డాను.

39:12 – وَأُمِرْتُ لِأَنْ أَكُونَ أَوَّلَ الْمُسْلِمِينَ ١٢

“మరియు నేను అందరికంటే ముందు (అల్లాహ్‌కు) విధేయుడను (ముస్లిం) అయి ఉండాలి” అని కూడా ఆజ్ఞాపించబడ్డాను.

39:13 – قُلْ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ ١٣

(ఇంకా) ఇలా అను: “ఒకవేళ నేను నా ప్రభువుకు అవిధేయుడనైతే ఆ మహా దినపు శిక్షకు గురిఅవుతానని భయపడుతున్నాను.”

39:14 – قُلِ اللَّـهَ أَعْبُدُ مُخْلِصًا لَّهُ دِينِي ١٤

(ఇంకా) ఇలా అను: “నేను కేవలం అల్లాహ్‌నే ఆరాధిస్తూ, నా భక్తిని (ఆరాధనను) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకుంటాను;

39:15 – فَاعْبُدُوا مَا شِئْتُم مِّن دُونِهِ ۗ قُلْ إِنَّ الْخَاسِرِينَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ وَأَهْلِيهِمْ يَوْمَ الْقِيَامَةِ ۗ أَلَا ذَٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِينُ ١٥

“కావున మీరు ఆయనను వదలి మీకు ఇష్ట మైన వారినిఆరాధించండి!” (ఇంకా) ఇలా అను: “పునరుత్థాన దినమున తమకుతాము మరియు తమ కుటుంబంవారికి నష్టం కలిగించు కున్న వారే, నిశ్చయంగా నష్టపడ్డవారు. వాస్తవానికి అదే స్పష్టమైన నష్టం!”

39:16 – لَهُم مِّن فَوْقِهِمْ ظُلَلٌ مِّنَ النَّارِ وَمِن تَحْتِهِمْ ظُلَلٌ ۚ ذَٰلِكَ يُخَوِّفُ اللَّـهُ بِهِ عِبَادَهُ ۚ يَا عِبَادِ فَاتَّقُونِ ١٦

వారిని, వారి పైనుండి అగ్నిజ్వాలలు క్రమ్ముకుంటాయి మరియు వారి క్రిందినుండి (అగ్ని జ్వాలలు) క్రమ్ముకుంటాయి. ఈ విధంగా, అల్లాహ్‌ తన దాసులను భయపెడుతున్నాడు: 15 “ఓ నా దాసులారా! నాపట్ల మాత్రమే భయభక్తులు కలిగి ఉండండి.”

39:17 – وَالَّذِينَ اجْتَنَبُوا الطَّاغُوتَ أَن يَعْبُدُوهَا وَأَنَابُوا إِلَى اللَّـهِ لَهُمُ الْبُشْرَىٰ ۚ فَبَشِّرْ عِبَادِ ١٧

మరియు ఎవరైతే కల్పిత దైవాలను (‘తాగూత్‌ లను) త్యజించి, వాటిని ఆరాధించ కుండా, పశ్చాత్తాపంతో అల్లాహ్‌ వైపునకు మరలుతారో! వారికి శుభవార్త ఉంది. 16 కావున నా దాసులకు ఈ శుభవార్తను ఇవ్వు.

39:18 – الَّذِينَ يَسْتَمِعُونَ الْقَوْلَ فَيَتَّبِعُونَ أَحْسَنَهُ ۚ أُولَـٰئِكَ الَّذِينَ هَدَاهُمُ اللَّـهُ ۖ وَأُولَـٰئِكَ هُمْ أُولُو الْأَلْبَابِ ١٨

ఎవరైతే మాటను శ్రద్ధగా విని, అందులోని ఉత్తమమైన దానిని అనుసరిస్తారో! అలాంటివారే, అల్లాహ్‌ మార్గదర్శకత్వం పొందినవారు. మరియు అలాంటివారే బుధ్ధిమంతులు.

39:19 – أَفَمَنْ حَقَّ عَلَيْهِ كَلِمَةُ الْعَذَابِ أَفَأَنتَ تُنقِذُ مَن فِي النَّارِ ١٩

ఏమీ? ఎవడిని గురించి అయితే ఆయన (అల్లాహ్‌ తరఫు నుండి) శిక్ష నిర్ణయించబడి ఉందో, వానిని నీవు నరకాగ్నిలో నుండి బయటికి తీయగలవా?

39:20 – لَـٰكِنِ الَّذِينَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ غُرَفٌ مِّن فَوْقِهَا غُرَفٌ مَّبْنِيَّةٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ وَعْدَ اللَّـهِ ۖ لَا يُخْلِفُ اللَّـهُ الْمِيعَادَ ٢٠

కాని ఎవరైతే తమ ప్రభువుయెడల భయ-భక్తులు కలిగి ఉన్నారో! వారికొరకు అంతస్తుపై అంతస్తుగా, కట్టబడిన ఎత్తైన భవనాలు ఉంటాయి. వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. ఇది అల్లాహ్‌ వాగ్దానం. అల్లాహ్‌ తన వాగ్దానాన్ని ఎన్నడూ భంగపరచడు.

39:21 – أَلَمْ تَرَ أَنَّ اللَّـهَ أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَسَلَكَهُ يَنَابِيعَ فِي الْأَرْضِ ثُمَّ يُخْرِجُ بِهِ زَرْعًا مُّخْتَلِفًا أَلْوَانُهُ ثُمَّ يَهِيجُ فَتَرَاهُ مُصْفَرًّا ثُمَّ يَجْعَلُهُ حُطَامًا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَذِكْرَىٰ لِأُولِي الْأَلْبَابِ ٢١

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్‌ ఆకాశంనుండి నీటినికురిపించి, తరువాత దానిని భూమిలో ఊటలుగా ప్రవహింప జేస్తు న్నాడని? ఆతరువాత దానివల్ల వివిధ రంగుల వృక్షకోటిని ఉత్పత్తిచేస్తాడు. ఆ తరువాత అది ఎండిపోయినపుడు, నీవుదానిని పసుపురంగుగా మారిపోవటాన్నిచూస్తావు. చివరకుఆయన దానిని పొట్టుగా మార్చివేస్తాడు. నిశ్చయంగా ఇందులో బుధ్ధిమంతులకు హితబోధ ఉంది.

39:22 – أَفَمَن شَرَحَ اللَّـهُ صَدْرَهُ لِلْإِسْلَامِ فَهُوَ عَلَىٰ نُورٍ مِّن رَّبِّهِ ۚ فَوَيْلٌ لِّلْقَاسِيَةِ قُلُوبُهُم مِّن ذِكْرِ اللَّـهِ ۚ أُولَـٰئِكَ فِي ضَلَالٍ مُّبِينٍ ٢٢

ఏమీ? ఏ వ్యక్తి హృదయాన్నైతే అల్లాహ్‌ విధేయత (ఇస్లాం) కొరకు తెరుస్తాడో, అతడు తన ప్రభువు చూపిన వెలుగులో నడుస్తూ ఉంటాడో (అలాంటి వాడు సత్య-తిరస్కారితో సమానుడు కాగలడా?) ఎవరి హృదయాలైతే అల్లాహ్‌ హితోపదేశం పట్ల కఠినమైపోయాయో, అలాంటి వారికి వినాశం ఉంది. అలాంటి వారు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు!

39:23 – اللَّـهُ نَزَّلَ أَحْسَنَ الْحَدِيثِ كِتَابًا مُّتَشَابِهًا مَّثَانِيَ تَقْشَعِرُّ مِنْهُ جُلُودُ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُمْ ثُمَّ تَلِينُ جُلُودُهُمْ وَقُلُوبُهُمْ إِلَىٰ ذِكْرِ اللَّـهِ ۚ ذَٰلِكَ هُدَى اللَّـهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ ۚ وَمَن يُضْلِلِ اللَّـهُ فَمَا لَهُ مِنْ هَادٍ ٢٣

అల్లాహ్‌ సర్వశ్రేష్ఠమైన బోధనను ఒక గ్రంథ రూపంలో అవతరింపజేశాడు. దానిలో ఒకేరకమైన వాటిని (వచనాలను) మాటిమాటికీ ఎన్నో విధాలుగా (విశదీకరించాడు). 17 తమ ప్రభువుకు భయపడేవారి శరీరాలు (చర్మాలు) దానితో (ఆ పఠనంతో) గజగజ వణకుతాయి. కాని తరువాత వారి చర్మాలు మరియు వారి హృదయాలు అల్లాహ్‌ ధ్యానం వలన మెత్తబడతాయి. ఇది అల్లాహ్‌ మార్గదర్శకత్వం. ఆయన దీనితో తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఏ వ్యక్తిని అల్లాహ్‌ మార్గభ్రష్టత్వంలో వదలుతాడో అతనికి మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడూ. 18

39:24 – أَفَمَن يَتَّقِي بِوَجْهِهِ سُوءَ الْعَذَابِ يَوْمَ الْقِيَامَةِ ۚ وَقِيلَ لِلظَّالِمِينَ ذُوقُوا مَا كُنتُمْ تَكْسِبُونَ ٢٤

ఏమీ? పునరుత్థానదినపు కఠినమైన శిక్షను తన ముఖంతో కాపాడుకోవలసిన వాడు (స్వర్గంలో ప్రవేశించేవానితో సమానుడా)? మరియు (ఆ రోజు) దుర్మార్గులతో ఇలా అనబడుతుంది: “మీరు సంపా దించిన దానిని రుచిచూడండి.”

39:25 – كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ فَأَتَاهُمُ الْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ ٢٥

వీరికి పూర్వమున్నవారు కూడా (అల్లాహ్‌ సందేశాలను) అబద్ధాలని తిరస్కరించారు, కాబట్టి వారు ఊహించలేని దిశనుండి వారిపై శిక్ష వచ్చిపడింది.

39:26 – فَأَذَاقَهُمُ اللَّـهُ الْخِزْيَ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ ٢٦

ఈ విధంగా, అల్లాహ్‌ వారికి ఇహలోక జీవితంలో కూడా అవమానాన్ని రుచిచూపాడు. 19 మరియు వారి పరలోక శిక్ష దీనికంటే ఎంతో ఘోరమైనదిగా ఉంటుంది. వారు ఇది గ్రహిస్తే ఎంత బాగుండేది!

39:27 – وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِي هَـٰذَا الْقُرْآنِ مِن كُلِّ مَثَلٍ لَّعَلَّهُمْ يَتَذَكَّرُونَ ٢٧

మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్‌ఆన్‌ లో ప్రజల కొరకు అనేకరకాల దృష్టాంతాలు పేర్కొన్నాము, బహుశా వారు గుణపాఠం నేర్చుకుంటారని;

39:28 – قُرْآنًا عَرَبِيًّا غَيْرَ ذِي عِوَجٍ لَّعَلَّهُمْ يَتَّقُونَ ٢٨

‘అరబ్బీ భాషలో ఉన్న ఈ ఖుర్‌ఆన్‌ను, 20 ఏ విధమైన వక్రత లేకుండా అవతరింపజేశాము; బహుశా వారు దైవభీతి కలిగివుంటారని.

39:29 – ضَرَبَ اللَّـهُ مَثَلًا رَّجُلًا فِيهِ شُرَكَاءُ مُتَشَاكِسُونَ وَرَجُلًا سَلَمًا لِّرَجُلٍ هَلْ يَسْتَوِيَانِ مَثَلًا ۚ الْحَمْدُ لِلَّـهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ ٢٩

అల్లాహ్‌ ఒక దృష్టాంతం ఇస్తున్నాడు: ఒక మానవుడు (బానిస) పరస్పరం విరోధమున్న ఎంతో మంది యజమానులకు చెందినవాడు. మరొక మానవుడు (బానిస) పూర్తిగా ఒకే ఒక్క యజమానికి చెందినవాడు. వారిద్దరి పరిస్థితి సమానంగా ఉంటుందా? 21 సర్వ స్తోత్రాలకు అర్హుడు అల్లాహ్‌ మాత్రమే! కాని వారిలో చాలా మందికి ఇది తెలియదు.

39:30 – إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ ٣٠

(ఓ ము’హమ్మద్‌!) నిశ్చయంగా (ఒక రోజు) నీవు మరణిస్తావు. మరియు నిశ్చయంగా, వారు కూడా మరణిస్తారు. 22

39:31 – ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ عِندَ رَبِّكُمْ تَخْتَصِمُونَ ٣١

ఆ తరువాత నిశ్చయంగా, పునరుత్థాన దినమున మీరంతా మీ ప్రభువు సమక్షంలో మీ వివాదాలను విన్నవించుకుంటారు.

39:32 – فَمَنْ أَظْلَمُ مِمَّن كَذَبَ عَلَى اللَّـهِ وَكَذَّبَ بِالصِّدْقِ إِذْ جَاءَهُ ۚ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِّلْكَافِرِينَ ٣٢

[(*)] ఇక అల్లాహ్‌ను గురించి అసత్యం కల్పించి, సత్యం తన ముందుకు వచ్చినప్పుడు దానిని తిరస్కరించే వానికంటే పరమ దుర్మార్గు డెవడు? అందుకే! సత్య-తిరస్కారులకు కేవలం నరకంలోనేకదా నివాసం ఉండేది?

39:33 – وَالَّذِي جَاءَ بِالصِّدْقِ وَصَدَّقَ بِهِ ۙ أُولَـٰئِكَ هُمُ الْمُتَّقُونَ ٣٣

మరియు సత్యాన్ని తెచ్చిన వాడూ మరియు దానిని హృదయపూర్వకంగా నమ్మిన వాడూ, ఇలాంటి వారే దైవభీతి గలవారు.

39:34 – لَهُم مَّا يَشَاءُونَ عِندَ رَبِّهِمْ ۚ ذَٰلِكَ جَزَاءُ الْمُحْسِنِينَ ٣٤

వారికి తమ ప్రభువు వద్ద వారు కోరిందంతా లభిస్తుంది. ఇదే సజ్జనులకు దొరికే ప్రతిఫలం. 23

39:35 – لِيُكَفِّرَ اللَّـهُ عَنْهُمْ أَسْوَأَ الَّذِي عَمِلُوا وَيَجْزِيَهُمْ أَجْرَهُم بِأَحْسَنِ الَّذِي كَانُوا يَعْمَلُونَ ٣٥

దానికి బదులుగా అల్లాహ్‌, వారు చేసిన ఘోర పాపకార్యాలను రద్దుచేయటానికి మరియు వారు చేస్తూవచ్చిన మంచి పనులకు అత్యుత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి!

39:36 – أَلَيْسَ اللَّـهُ بِكَافٍ عَبْدَهُ ۖ وَيُخَوِّفُونَكَ بِالَّذِينَ مِن دُونِهِ ۚ وَمَن يُضْلِلِ اللَّـهُ فَمَا لَهُ مِنْ هَادٍ ٣٦

ఏమిటీ? అల్లాహ్‌ తన దాసునికి చాలడా? అయినా వారు ఆయన (అల్లాహ్‌)ను విడిచి, ఇతరులను గురించి నిన్ను భయపెడుతున్నారు. మరియు అల్లాహ్‌ మార్గభ్రష్టత్వంలో పడనిచ్చిన వానికి మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు.

39:37 – وَمَن يَهْدِ اللَّـهُ فَمَا لَهُ مِن مُّضِلٍّ ۗ أَلَيْسَ اللَّـهُ بِعَزِيزٍ ذِي انتِقَامٍ ٣٧

మరియు అల్లాహ్‌ మార్గదర్శకత్వం చేసిన వానిని, మార్గభ్రష్టుడు చేయగల వాడెవ్వడూలేడు! ఏమీ? అల్లాహ్‌ సర్వశక్తిమంతుడు, ప్రతీకారం చేయగలవాడు కాడా?

39:38 – وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ اللَّـهُ ۚ قُلْ أَفَرَأَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ اللَّـهِ إِنْ أَرَادَنِيَ اللَّـهُ بِضُرٍّ هَلْ هُنَّ كَاشِفَاتُ ضُرِّهِ أَوْ أَرَادَنِي بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكَاتُ رَحْمَتِهِ ۚ قُلْ حَسْبِيَ اللَّـهُ ۖ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكِّلُونَ ٣٨

మరియు ఒకవేళ నీవు వారితో: “భూమ్యా కాశాలను సృష్టించింది ఎవరు?” అని అడిగితే, వారు నిశ్చయంగా: “అల్లాహ్‌!” అని అంటారు. 24 వారిని ఇలాఅడుగు: “ఏమీ? మీరు ఆలోచించరా? అల్లాహ్‌ ను వదలి మీరు ఆరాధించేవి – అల్లాహ్‌ నాకు కీడు చేయదలచుకుంటే – ఆయన కీడు నుండి, నన్ను తప్పించగలవా? లేక ఆయన (అల్లాహ్‌) నన్ను కరు ణించగోరితే ఇవి ఆయన కారుణ్యాన్ని ఆపగలవా?” వారితో ఇంకా ఇలా అను: “నాకు కేవలం అల్లాహ్‌చాలు! ఆయన (అల్లాహ్‌) ను నమ్మేవారు (విశ్వాసులు), కేవలం ఆయన మీదే నమ్మకం ఉంచు కుంటారు.”

39:39 – قُلْ يَا قَوْمِ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنِّي عَامِلٌ ۖ فَسَوْفَ تَعْلَمُونَ ٣٩

(ఓము’హమ్మద్‌!) వారితో ఇలాఅను: “నా జాతి ప్రజలారా! మీరు మీ ఇష్టప్రకారం మీ పని చేస్తూ ఉండండి; నిశ్చయంగా, నేనూ నాపని చేస్తూ ఉంటాను. తరువాత మీరు తెలుసుకోగలరు;

39:40 – مَن يَأْتِيهِ عَذَابٌ يُخْزِيهِ وَيَحِلُّ عَلَيْهِ عَذَابٌ مُّقِيمٌ ٤٠

“(ఇహలోకంలో) ఎవరి మీద అవమానకర మైన శిక్ష వచ్చిపడుతుందో మరియు (పరలోక జీవితంలో) ఎవరి మీద శాశ్వతమైన శిక్ష పడనున్నదో!”

39:41 – إِنَّا أَنزَلْنَا عَلَيْكَ الْكِتَابَ لِلنَّاسِ بِالْحَقِّ ۖ فَمَنِ اهْتَدَىٰ فَلِنَفْسِهِ ۖ وَمَن ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيْهَا ۖ وَمَا أَنتَ عَلَيْهِم بِوَكِيلٍ ٤١

నిశ్చయంగా మేము మానవులందరి కొరకు, ఈ గ్రంథాన్ని, సత్యంతో నీపై అవతరింపజేశాము. కావున సన్మార్గంపై నడిచేవాడు, తన మేలుకొరకే అలా చేస్తాడు. మరియు నిశ్చయంగా, మార్గభ్రష్టు డైనవాడు తన కీడు కొరకే మార్గభ్రష్టుడవుతాడు. మరియు నీవు వారి కొరకు బాధ్యుడవు కావు. 25

39:42 – اللَّـهُ يَتَوَفَّى الْأَنفُسَ حِينَ مَوْتِهَا وَالَّتِي لَمْ تَمُتْ فِي مَنَامِهَا ۖ فَيُمْسِكُ الَّتِي قَضَىٰ عَلَيْهَا الْمَوْتَ وَيُرْسِلُ الْأُخْرَىٰ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ ٤٢

అల్లాహ్‌యే ఆత్మలను (ప్రాణాలను) మరణ కాలమున వశపరచుకునేవాడు మరియు మర ణించని వాడి (ఆత్మలను) నిద్రావస్థలో (వశపరచు కునే వాడునూ). తరువాత దేనికైతే మరణం నిర్ణ యింపబడుతుందో దానిని ఆపుకొని, మిగతా వారి (ఆత్మలను) ఒక నియమిత కాలం కొరకు తిరిగి పంపుతాడు. 26 నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి గొప్ప సూచనలు (ఆయాత్‌) ఉన్నాయి.

39:43 – أَمِ اتَّخَذُوا مِن دُونِ اللَّـهِ شُفَعَاءَ ۚ قُلْ أَوَلَوْ كَانُوا لَا يَمْلِكُونَ شَيْئًا وَلَا يَعْقِلُونَ ٤٣

ఏమీ? వారు అల్లాహ్‌ను వదలి ఇతరులను సిఫారసుదారులుగా చేసుకున్నారా? వారిని ఇలా అడుగు: “ఏమీ? వారికెలాంటి అధికారం లేకున్నా మరియు వారికి బుద్ధిలేకున్నానా?” 27

39:44 – قُل لِّلَّـهِ الشَّفَاعَةُ جَمِيعًا ۖ لَّهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ ٤٤

ఇలా అను: “సిఫారసు కేవలం అల్లాహ్‌ అధీనంలోనే ఉంది. భూమ్యాకాశాల సామ్రాజ్యాధి పత్యం కేవలం ఆయనకే చెందుతుంది. తరువాత ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు.”

39:45 – وَإِذَا ذُكِرَ اللَّـهُ وَحْدَهُ اشْمَأَزَّتْ قُلُوبُ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ ۖ وَإِذَا ذُكِرَ الَّذِينَ مِن دُونِهِ إِذَا هُمْ يَسْتَبْشِرُونَ ٤٥

మరియు ఒకవేళ అద్వితీయుడైన అల్లాహ్‌ ను గురించి ప్రస్తావన జరిగినపుడు, పరలోకాన్ని విశ్వసించని వారి హృదయాలు క్రుంగిపోతాయి. మరియు ఒకవేళ ఆయన తప్ప ఇతరుల ప్రస్తావన జరిగినపుడు వారు సంతోషంతో పొంగిపోతారు!

39:46 – اللَّـهُمَّ فَاطِرَ السَّمَاوَاتِ وَالْأَرْضِ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ أَنتَ تَحْكُمُ بَيْنَ عِبَادِكَ فِي مَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ ٤٦

ఇలా అను: “ఓ అల్లాహ్‌! భూమ్యాకాశాల సృష్టికి మూలాధారుడా! అగోచర-గోచరాలను ఎరిగిన వాడా! నీవే నీ దాసుల మధ్య ఉన్న భేదాభి ప్రాయాలను గురించి తీర్పుచేసేవాడవు.”

39:47 – وَلَوْ أَنَّ لِلَّذِينَ ظَلَمُوا مَا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ مَعَهُ لَافْتَدَوْا بِهِ مِن سُوءِ الْعَذَابِ يَوْمَ الْقِيَامَةِ ۚ وَبَدَا لَهُم مِّنَ اللَّـهِ مَا لَمْ يَكُونُوا يَحْتَسِبُونَ ٤٧

మరియు ఒకవేళ వాస్తవానికి ఈ దుర్మార్గుల వద్ద భూమిలో ఉన్న సమస్తమూ మరియు దానితో పాటు దానంత (రెట్టింపు) సంపద ఉన్నా పునరుత్థానదినపు ఘోర శిక్ష నుండి తప్పించుకోవటానికి, వారు దానిని పరిహారంగా ఇవ్వగోరుతారు. 28 ఎందుకంటే! అల్లాహ్‌ తరఫు నుండి వారి ముందు, వారు ఎన్నడూ లెక్కించని దంతా ప్రత్యక్షమవుతుంది.

39:48 – وَبَدَا لَهُمْ سَيِّئَاتُ مَا كَسَبُوا وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ٤٨

మరియు వారు చేసివున్న దుష్ట కార్యాలన్నీ స్పష్టంగా వారి ముందుకు వస్తాయి. మరియు వారు ఎగతాళిచేస్తూ వచ్చిందే వారిని చుట్టుకుంటుంది.

39:49 – فَإِذَا مَسَّ الْإِنسَانَ ضُرٌّ دَعَانَا ثُمَّ إِذَا خَوَّلْنَاهُ نِعْمَةً مِّنَّا قَالَ إِنَّمَا أُوتِيتُهُ عَلَىٰ عِلْمٍ ۚ بَلْ هِيَ فِتْنَةٌ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ ٤٩

ఒకవేళ మానవునికి ఆపదవస్తే అతడు మమ్మల్ని వేడుకుంటాడు. ఆ తరువాత మేము మా దిక్కు నుండి అతనికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తే అతడు: “నిశ్చయంగా, ఇది నాకున్న తెలివి వల్ల నాకు ఇవ్వబడింది!” 29 అని అంటాడు. వాస్తవానికి, అది ఒక పరీక్ష, కాని చాలా మంది ఇది తెలుసుకోలేరు.

39:50 – قَدْ قَالَهَا الَّذِينَ مِن قَبْلِهِمْ فَمَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يَكْسِبُونَ ٥٠

వాస్తవానికి, వీరికి పూర్వం గతించినవారు కూడా ఇలాగే అన్నారు, కాని వారు సంపాదించిన దంతా వారికి ఏ విధంగానూ పనికిరాలేదు.

39:51 – فَأَصَابَهُمْ سَيِّئَاتُ مَا كَسَبُوا ۚ وَالَّذِينَ ظَلَمُوا مِنْ هَـٰؤُلَاءِ سَيُصِيبُهُمْ سَيِّئَاتُ مَا كَسَبُوا وَمَا هُم بِمُعْجِزِينَ ٥١

కావున, వారు చేసిన దుష్కార్యాల ఫలితాలు వారిపై పడ్డాయి. మరియు వారిలోని దుర్మార్గులు తాము చేసిన దుష్కార్యాల ఫలితాలను త్వరలోనే అనుభవించగలరు. మరియు వారు ఏవిధంగానూ తప్పించుకోలేరు.

39:52 – أَوَلَمْ يَعْلَمُوا أَنَّ اللَّـهَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ ٥٢

ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్‌ తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడని మరియు (తాను కోరిన వారికి) మితంగా ఇస్తాడని? నిశ్చయంగా, ఇందులో విశ్వసించే వారికి ఎన్నో సూచనలు (ఆయాత్‌) ఉన్నాయి. (1/8)

39:53 – قُلْ يَا عِبَادِيَ الَّذِينَ أَسْرَفُوا عَلَىٰ أَنفُسِهِمْ لَا تَقْنَطُوا مِن رَّحْمَةِ اللَّـهِ ۚ إِنَّ اللَّـهَ يَغْفِرُ الذُّنُوبَ جَمِيعًا ۚ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ ٥٣

  • ఇలా అను: “స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్‌ అన్ని పాపాలను క్షమిస్తాడు. 30 నిశ్చయంగా ఆయన! కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

39:54 – وَأَنِيبُوا إِلَىٰ رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ مِن قَبْلِ أَن يَأْتِيَكُمُ الْعَذَابُ ثُمَّ لَا تُنصَرُونَ ٥٤

“మరియు మీరు పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపునకు మరలండి మరియు మీపైకి శిక్ష రాకముందే, మీరు ఆయనకు విధేయులు (ముస్లింలు) అయి ఉండండి, తరువాత మీకు ఎలాంటి సహాయం లభించదు. 31

39:55 – وَاتَّبِعُوا أَحْسَنَ مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُم مِّن قَبْلِ أَن يَأْتِيَكُمُ الْعَذَابُ بَغْتَةً وَأَنتُمْ لَا تَشْعُرُونَ ٥٥

“మరియు మీకు తెలియకుండానే అకస్మా త్తుగా, మీపైకి శిక్ష రాకముందే మీ ప్రభువు తరఫు నుండి మీ కొరకు అవతరింపజేయబడిన శ్రేష్ఠమైన దానిని (ఈ ఖుర్‌ఆన్‌ను) అనుసరించండి.” 32

39:56 – أَن تَقُولَ نَفْسٌ يَا حَسْرَتَىٰ عَلَىٰ مَا فَرَّطتُ فِي جَنبِ اللَّـهِ وَإِن كُنتُ لَمِنَ السَّاخِرِينَ ٥٦

లేకపోతే మానవుడు: “నా పాడుగాను! నేను అల్లాహ్‌ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండకపోతే మరియు ఎగతాళి చేసేవారిలో చేరి ఉండకపోతే ఎంత బాగుండేది!” అని పశ్చాత్తాపపడవచ్చు!

39:57 – أَوْ تَقُولَ لَوْ أَنَّ اللَّـهَ هَدَانِي لَكُنتُ مِنَ الْمُتَّقِينَ ٥٧

లేక, ఇలా అనవచ్చు: “ఒకవేళ అల్లాహ్‌ నాకు సన్మార్గం చూపివుంటే, నేను కూడా దైవభీతి గలవారిలో చేరిపోయేవాడిని కదా!” 33

39:58 – أَوْ تَقُولَ حِينَ تَرَى الْعَذَابَ لَوْ أَنَّ لِي كَرَّةً فَأَكُونَ مِنَ الْمُحْسِنِينَ ٥٨

లేక శిక్షనుచూసి ఇలాఅనవచ్చు: “ఒకవేళ నాకు మరల (ఇహలోకానికి) పోయే అవకాశం దొరికి ఉంటే నేను తప్పక సజ్జనులలో చేరిపోయేవాడిని కదా!” 34

39:59 – بَلَىٰ قَدْ جَاءَتْكَ آيَاتِي فَكَذَّبْتَ بِهَا وَاسْتَكْبَرْتَ وَكُنتَ مِنَ الْكَافِرِينَ ٥٩

(అప్పుడు అతనికి అల్లాహ్‌ ఇలా సెల విస్తాడు): “అలాకాదు! వాస్తవానికి నా సూచనలు (ఆయాత్‌) నీ వద్దకు వచ్చాయి. కాని నీవు వాటిని అబద్ధాలని తిరస్కరించావు మరియు గర్వానికి లోనయ్యావు మరియు నీవు సత్య-తిరస్కారులలో చేరిపోయావు.”

39:60 – وَيَوْمَ الْقِيَامَةِ تَرَى الَّذِينَ كَذَبُوا عَلَى اللَّـهِ وُجُوهُهُم مُّسْوَدَّةٌ ۚ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِّلْمُتَكَبِّرِينَ ٦٠

మరియు పునరుత్థాన దినమున అల్లాహ్‌పై అబద్ధాలు పలికిన వారి ముఖాలను నల్లగా మారి పోవటాన్ని నీవు గమనిస్తావు. ఏమీ? ఈ గర్విష్ఠుల నివాసం నరకంలోనే ఉండదా?

39:61 – وَيُنَجِّي اللَّـهُ الَّذِينَ اتَّقَوْا بِمَفَازَتِهِمْ لَا يَمَسُّهُمُ السُّوءُ وَلَا هُمْ يَحْزَنُونَ ٦١

మరియు అల్లాహ్‌, భయ-భక్తులు గల వారిని వారి సాఫల్యానికి బదులుగా వారికి ముక్తిని ప్రసాదిస్తాడు. ఎలాంటి బాధ వారిని ముట్టుకోదు మరియు వారు దుఃఖపడరు కూడా!

39:62 – اللَّـهُ خَالِقُ كُلِّ شَيْءٍ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ وَكِيلٌ ٦٢

అల్లాహ్‌యే ప్రతిదాని సృష్టికర్త మరియు ఆయనే ప్రతిదానికీ కార్యకర్త. 35

39:63 – لَّهُ مَقَالِيدُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِ اللَّـهِ أُولَـٰئِكَ هُمُ الْخَاسِرُونَ ٦٣

ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న నిక్షేపాల తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. మరియు ఎవరైతే అల్లాహ్‌ సూచన లను (ఆయాత్‌ లను) తిరస్కరిస్తారో అలాంటి వారు, వారే! నష్టానికి గురిఅయ్యే వారు.

39:64 – قُلْ أَفَغَيْرَ اللَّـهِ تَأْمُرُونِّي أَعْبُدُ أَيُّهَا الْجَاهِلُونَ ٦٤

(ఓ ప్రవక్తా!) ఇలా అను: “ఓ మూర్ఖులారా! ఏమీ? అల్లాహ్‌ను వదలి, ఇతరులను ఆరాధించ మని, మీరు నన్ను ఆజ్ఞాపిస్తున్నారా?”

39:65 – وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ ٦٥

మరియు వాస్తవానికి! నీకూ మరియు నీ కంటే ముందు వచ్చిన (ప్రతి ప్రవక్తకూ) దివ్యజ్ఞానం (వ’హీ) ద్వారా ఇలా తెలుపబడింది: “ఒకవేళ నీవు బహు-దైవారాధన (షిర్కు) చేసినట్లైతే నీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి మరియు నిశ్చయంగా నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు.”

39:66 – بَلِ اللَّـهَ فَاعْبُدْ وَكُن مِّنَ الشَّاكِرِينَ ٦٦

అలాకాదు! నీవుకేవలం అల్లాహ్‌నుమాత్రమే ఆరాధించు మరియు కృతజ్ఞులలో చేరిపో!

39:67 – وَمَا قَدَرُوا اللَّـهَ حَقَّ قَدْرِهِ وَالْأَرْضُ جَمِيعًا قَبْضَتُهُ يَوْمَ الْقِيَامَةِ وَالسَّمَاوَاتُ مَطْوِيَّاتٌ بِيَمِينِهِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ ٦٧

వారు అల్లాహ్‌ సామర్థ్యాన్ని గుర్తించ వలసిన విధంగా గుర్తించలేదు; పునరుత్థాన దినమున భూమి అంతా ఆయన పిడికిలిలో ఉంటుంది; మరియు ఆకాశాలన్నీ చుట్టబడి ఆయన కుడిచేతిలో ఉంటాయి. 36 ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు వారు కల్పించే భాగస్వాముల కంటే అత్యున్నతుడు.

39:68 – وَنُفِخَ فِي الصُّورِ فَصَعِقَ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ إِلَّا مَن شَاءَ اللَّـهُ ۖ ثُمَّ نُفِخَ فِيهِ أُخْرَىٰ فَإِذَا هُمْ قِيَامٌ يَنظُرُونَ ٦٨

మరియు బాకా (‘సూర్‌) ఊదబడినప్పుడు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న వారందరూ మూర్ఛిల్లి పడిపోతారు అల్లాహ్‌ కోరిన వారు తప్ప. ఆ తరువాత రెండవ సారి (బాకా) ఊదబడుతుంది అప్పుడు వారందరూ లేచి చూడటం ప్రారంభిస్తారు. 37

39:69 – وَأَشْرَقَتِ الْأَرْضُ بِنُورِ رَبِّهَا وَوُضِعَ الْكِتَابُ وَجِيءَ بِالنَّبِيِّينَ وَالشُّهَدَاءِ وَقُضِيَ بَيْنَهُم بِالْحَقِّ وَهُمْ لَا يُظْلَمُونَ ٦٩

మరియు భూమి తన ప్రభువు తేజస్సుతో వెలిగిపోతుంది 38 మరియు కర్మపత్రం వారి యెదుట ఉంచబడుతుంది, 39 ప్రవక్తలు మరియు (ఇతర) సాక్షులు రప్పింపబడతారు. 40 మరియు వారిమధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది మరియు వారి కెలాంటి అన్యాయం జరుగదు.

39:70 – وَوُفِّيَتْ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَهُوَ أَعْلَمُ بِمَا يَفْعَلُونَ ٧٠

మరియు ప్రతివ్యక్తి (ఆత్మ) తాను చేసిన కర్మలకు పూర్తి ప్రతిఫలం పొందుతాడు. 41 ఎందు కంటే వారుచేస్తున్నదంతా ఆయనకు బాగా తెలుసు.

39:71 – وَسِيقَ الَّذِينَ كَفَرُوا إِلَىٰ جَهَنَّمَ زُمَرًا ۖ حَتَّىٰ إِذَا جَاءُوهَا فُتِحَتْ أَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَا أَلَمْ يَأْتِكُمْ رُسُلٌ مِّنكُمْ يَتْلُونَ عَلَيْكُمْ آيَاتِ رَبِّكُمْ وَيُنذِرُونَكُمْ لِقَاءَ يَوْمِكُمْ هَـٰذَا ۚ قَالُوا بَلَىٰ وَلَـٰكِنْ حَقَّتْ كَلِمَةُ الْعَذَابِ عَلَى الْكَافِرِينَ ٧١

సత్యాన్ని తిరస్కరించిన వారు గుంపులు గుంపులుగా నరకం వైపునకు తోలబడతారు. చివరకు వారు దాని వద్దకు వచ్చినపుడు, దాని ద్వారాలు తెరువబడతాయి మరియు వారితో దాని రక్షకులు ఇలా అంటారు: “ఏమీ? మీలో నుండి మీ ప్రభువు సూచనలను వినిపించే సందేశ హరులు మీ వద్దకు రాలేదా? మరియు వారు మిమ్మల్ని ఈ నాటి మీ సమావేశాన్ని గురించి హెచ్చరించలేదా?” వారంటారు: “అవును (హెచ్చ రించారు)!” కాని (అప్పటికే) సత్య-తిరస్కారులపై శిక్షా నిర్ణయం తీసుకోబడి ఉంటుంది. 42

39:72 – قِيلَ ادْخُلُوا أَبْوَابَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۖ فَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِينَ ٧٢

వారితో ఇలా అనబడుతుంది: “నరక ద్వారాలలోనికి ప్రవేశించండి, ఇక్కడ మీరు శాశ్వతంగా ఉంటారు. గర్విష్ఠుల నివాసస్థలం ఎంతచెడ్డది!”

39:73 – وَسِيقَ الَّذِينَ اتَّقَوْا رَبَّهُمْ إِلَى الْجَنَّةِ زُمَرًا ۖ حَتَّىٰ إِذَا جَاءُوهَا وَفُتِحَتْ أَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَا سَلَامٌ عَلَيْكُمْ طِبْتُمْ فَادْخُلُوهَا خَالِدِينَ ٧٣

మరియు తమ ప్రభువు పట్ల భయభక్తులు గలవారు గుంపులు-గుంపులుగా స్వర్గంవైపునకు తీసుకొని పోబడతారు. చివరకు వారు దాని దగ్గరికి వచ్చినపుడు, దాని ద్వారాలు తెరువ బడతాయి 43 మరియు దాని రక్షకులు వారితో అంటారు: “మీకు శాంతి కలుగుగాక (సలాం)! మీరు మంచిగా ప్రవర్తించారు, కావున ఇందులో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశించండి!”

39:74 – وَقَالُوا الْحَمْدُ لِلَّـهِ الَّذِي صَدَقَنَا وَعْدَهُ وَأَوْرَثَنَا الْأَرْضَ نَتَبَوَّأُ مِنَ الْجَنَّةِ حَيْثُ نَشَاءُ ۖ فَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ ٧٤

మరియు వారంటారు: “మాకు చేసిన వాగ్దానాన్ని నిజంచేసి చూపిన అల్లాహ్‌యే సర్వస్తోత్రాలకు అర్హుడు మరియు ఆయనే మమ్మల్ని ఈ నేలకు వారసులుగా చేశాడు. స్వర్గంలో మేము కోరిన చోట స్థిరనివాసం ఏర్పరచుకోగలము! సత్కార్యాలు చేసేవారి ప్రతిఫలం ఎంత ఉత్తమమైనది!”

39:75 – وَتَرَى الْمَلَائِكَةَ حَافِّينَ مِنْ حَوْلِ الْعَرْشِ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ ۖ وَقُضِيَ بَيْنَهُم بِالْحَقِّ وَقِيلَ الْحَمْدُ لِلَّـهِ رَبِّ الْعَالَمِينَ ٧٥

మరియు దైవదూతలను, తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ ఆయన సింహాసనాన్ని (‘అర్ష్‌ను) అన్ని వైపుల నుండి చుట్టుకొని ఉండటాన్ని నీవు చూస్తావు. 44 మరియు వారి (సర్వ ప్రాణుల) మధ్య న్యాయంగా తీర్పుచేయబడుతుంది మరియు: “సర్వ స్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్‌యే సమస్త లోకాలకు ప్రభువు.” అని పలుకబడుతుంది. (1/4)

సూరహ్‌ ‘గాఫిర్‌ – ‘గాఫిరున్‌: క్షమించేవాడు, క్షమాగుణ పరిపూర్ణుడు. దీని ఇతరపేర్లు సూరహ్‌ అల్‌-ము’మిన్‌, విశ్వాసి మరియు సూరహ్‌ అ’త్‌-‘తౌల్‌ అనికూడాఉన్నాయి. జి’-‘త్తౌలు, అంటే ధనసంపత్తులు ప్రసాదించేవాడు, లేక తన దాసులను అనుగ్రహించేవాడు.ఈ సూరహ్‌తో ‘హా-మీమ్‌, అక్షరాలతో మొదలయ్యే 7 సూరాహ్‌లు వస్తున్నాయి. ఇవన్నీ చివరి మక్కహ్ కాలపు సూరాహ్‌లు. వీటిలో విశ్వాస-అవిశ్వాసం మరియు దివ్యజ్ఞాన అవతరణ మరియు సత్య-తిరస్కారుల తిరస్కారం, మంచి-చెడులు మరియు సత్యా-సత్యాల మధ్య భేదాలు వివరించబడ్డాయి. 85 ఆయాతు లున్న ఈ సూరహ్ పేరు 3వ ఆయత్‌ నుండి తీసుకోబడింది. అ’త్‌-‘తౌల్‌ పదం కూడా 3వ ఆయత్‌లోనే ఉంది. అల్‌-ము’మిన్‌ పదం 28వ ఆయత్‌లో ఉంది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 40:1 – حم ١

  • ‘హా-మీమ్‌.

40:2 – تَنزِيلُ الْكِتَابِ مِنَ اللَّـهِ الْعَزِيزِ الْعَلِيمِ ٢

ఈ గ్రంథ అవతరణ (ఖుర్‌ఆన్‌ అవతరణ) సర్వ శక్తిమంతుడు, సర్వజ్ఞుడు అయిన అల్లాహ్‌ తరఫునుండి జరిగింది.

40:3 – غَافِرِ الذَّنبِ وَقَابِلِ التَّوْبِ شَدِيدِ الْعِقَابِ ذِي الطَّوْلِ ۖ لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۖ إِلَيْهِ الْمَصِيرُ ٣

పాపాలను క్షమించేవాడు 1 మరియు పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, శిక్షించటంలో కఠినుడు, 2 ఎంతో ఉదార స్వభావుడు. 3 ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. (అందరీ) మరలింపు ఆయన వైపునకే ఉంది!

40:4 – مَا يُجَادِلُ فِي آيَاتِ اللَّـهِ إِلَّا الَّذِينَ كَفَرُوا فَلَا يَغْرُرْكَ تَقَلُّبُهُمْ فِي الْبِلَادِ ٤

సత్య-తిరస్కారులు తప్ప, ఇతరులెవ్వరూ అల్లాహ్‌ సూచన (ఆయాత్‌) లను గురించి వాదించరు, కావున భూమిలో వారి గర్వపూరిత మైన నడక నిన్ను మోసగింప నివ్వరాదు!

40:5 – كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَالْأَحْزَابُ مِن بَعْدِهِمْ ۖ وَهَمَّتْ كُلُّ أُمَّةٍ بِرَسُولِهِمْ لِيَأْخُذُوهُ ۖ وَجَادَلُوا بِالْبَاطِلِ لِيُدْحِضُوا بِهِ الْحَقَّ فَأَخَذْتُهُمْ ۖ فَكَيْفَ كَانَ عِقَابِ ٥

వారికి పూర్వం గడిచిన నూ’హ్‌ జాతి వారూ మరియు వారి పిదప వచ్చిన ఇతర వర్గాలవారు కూడా (తమ ప్రవక్తలను) అసత్యవాదులని తిర స్కరించారు. మరియు ప్రతి సమాజంవారు తమ సందేశహరుణ్ణి నిర్బంధించటానికి ప్రయత్నాలు చేశారు. మరియు అసత్యంతో సత్యాన్ని ఖండించ టానికి వాదులాడారు; కావున చివరకు నేను వారిని పట్టుకున్నాను. చూశారా! నా శిక్ష ఎలా ఉండిందో!

40:6 – وَكَذَٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَى الَّذِينَ كَفَرُوا أَنَّهُمْ أَصْحَابُ النَّارِ ٦

మరియు ఈ విధంగా సత్య-తిరస్కారానికి పాల్పడిన వారిని గురించి: “నిశ్చయంగా, వారు నరకవాసులు.” అని, అన్న నీ ప్రభువు వాక్కు సత్యమయ్యింది.

40:7 – الَّذِينَ يَحْمِلُونَ الْعَرْشَ وَمَنْ حَوْلَهُ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَيُؤْمِنُونَ بِهِ وَيَسْتَغْفِرُونَ لِلَّذِينَ آمَنُوا رَبَّنَا وَسِعْتَ كُلَّ شَيْءٍ رَّحْمَةً وَعِلْمًا فَاغْفِرْ لِلَّذِينَ تَابُوا وَاتَّبَعُوا سَبِيلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِيمِ ٧

సింహాసనాన్ని (‘అర్ష్‌ను) మోసేవారు మరియు దాని చుట్టు ఉండేవారు (దైవదూతలు), తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ ఉంటారు. 4 మరియు ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటారు. మరియు విశ్వసించినవారి కొరకు క్షమాభిక్ష కోరుతూ: “ఓ మా ప్రభూ! నీవు నీ కారుణ్యం మరియు నీ జ్ఞానంతో ప్రతిదానిని ఆవరించి ఉన్నావు. కావున పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలి, నీ మార్గాన్ని అనుసరించేవారిని క్షమించు; మరియు వారిని భగభగ మండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడు!

40:8 – رَبَّنَا وَأَدْخِلْهُمْ جَنَّاتِ عَدْنٍ الَّتِي وَعَدتَّهُمْ وَمَن صَلَحَ مِنْ آبَائِهِمْ وَأَزْوَاجِهِمْ وَذُرِّيَّاتِهِمْ ۚ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ ٨

“ఓ మా ప్రభూ! ఇంకా వారిని, నీవు వాగ్దానం చేసిన, కలకాలముండే స్వర్గవనాలలో ప్రవేశింప జేయి మరియు వారి తండ్రులలో వారి సహవాసు లలో (అ’జ్వాజ్‌లలో) మరియు వారి సంతానం లో, సద్వర్తనులైన వారిని కూడా! నిశ్చయంగా నీవే సర్వ శక్తిమంతుడవు, మహా వివేకవంతుడవు. 5

40:9 – وَقِهِمُ السَّيِّئَاتِ ۚ وَمَن تَقِ السَّيِّئَاتِ يَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهُ ۚ وَذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ ٩

“మరియు వారిని దుష్కార్యాల నుండి కాపాడు. మరియు ఆ రోజు నీవు ఎవడినైతే దుష్కార్యాల నుండి కాపాడుతావో! వాస్తవంగా వాడిని నీవు కరుణించి నట్లే! మరియు అదే ఆ గొప్ప సాఫల్యం (విజయం).” 6

40:10 – إِنَّ الَّذِينَ كَفَرُوا يُنَادَوْنَ لَمَقْتُ اللَّـهِ أَكْبَرُ مِن مَّقْتِكُمْ أَنفُسَكُمْ إِذْ تُدْعَوْنَ إِلَى الْإِيمَانِ فَتَكْفُرُونَ ١٠

నిశ్చయంగా, (ఆ రోజు) సత్య-తిరస్కారులను పిలిచి వారితో: “ఈ రోజు మీకు, మీ పట్ల ఎంత అసహ్యం కలుగుతున్నదో! మిమ్మల్ని విశ్వాసం వైపునకు పిలువగా మీరు నిరాకరించినపుడు, అల్లాహ్‌కు మీ పట్ల ఇంతకంటే ఎక్కువ అసహ్యం కలిగేది!” అని అనబడుతుంది.

40:11 – قَالُوا رَبَّنَا أَمَتَّنَا اثْنَتَيْنِ وَأَحْيَيْتَنَا اثْنَتَيْنِ فَاعْتَرَفْنَا بِذُنُوبِنَا فَهَلْ إِلَىٰ خُرُوجٍ مِّن سَبِيلٍ ١١

వారు ఇలా అంటారు: “ఓ మా ప్రభూ! నీవు మాకు రెండుసార్లు మరణాన్నిఇచ్చావు మరియు రెండుసార్లు జీవితాన్ని ఇచ్చావు. 7 ఇప్పడు మేము మా పాపాలను ఒప్పుకుంటున్నాము. కావున ఇప్పుడైనా ఇక్కడి నుండి (నరకం నుండి) బయటపడే మార్గం ఏదైనా ఉందా?”

40:12 – ذَٰلِكُم بِأَنَّهُ إِذَا دُعِيَ اللَّـهُ وَحْدَهُ كَفَرْتُمْ ۖ وَإِن يُشْرَكْ بِهِ تُؤْمِنُوا ۚ فَالْحُكْمُ لِلَّـهِ الْعَلِيِّ الْكَبِيرِ ١٢

(వారికి ఇలా సమాధానం ఇవ్వబడు తుంది): “దీనికి కారణమేమిటంటే వాస్తవానికి అద్వితీయుడైన అల్లాహ్‌ను ప్రార్థించమన్నప్పుడు మీరు తిరస్కరించారు మరియు ఆయనకు భాగ స్వాములు కల్పించబడినప్పుడు, మీరు విశ్వ సించారు! ఇప్పుడుతీర్పు మహోన్నతుడు, మహ నీయుడు 8 అయిన అల్లాహ్‌ చేతిలో ఉంది. 9

40:13 – هُوَ الَّذِي يُرِيكُمْ آيَاتِهِ وَيُنَزِّلُ لَكُم مِّنَ السَّمَاءِ رِزْقًا ۚ وَمَا يَتَذَكَّرُ إِلَّا مَن يُنِيبُ ١٣

ఆయనే మీకు తన అద్భుత సూచనలను చూపించేవాడు మరియు ఆకాశం నుండి మీ కొరకు జీవనోపాధిని అవతరింపజేసేవాడు. కాని, ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలేవారు తప్ప, ఇతరులు వీటిని గ్రహించలేరు.

40:14 – فَادْعُوا اللَّـهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ ١٤

కావున (ఓ విశ్వాసులారా!) మీరు మీ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయనకే ప్రత్యేకించు కొని, అల్లాహ్‌ను మాత్రమే ప్రార్థించండి సత్య-తిరస్కారులకు ఇది ఎంత అసహ్యకరమైనా!

40:15 – رَفِيعُ الدَّرَجَاتِ ذُو الْعَرْشِ يُلْقِي الرُّوحَ مِنْ أَمْرِهِ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ لِيُنذِرَ يَوْمَ التَّلَاقِ ١٥

ఆయన మహోన్నతమైన స్థానాలు గల వాడు, 10 (సర్వాధికార) సింహాసనానికి (‘అర్ష్‌కు) అధిపతి; 11 తన దాసులలో తనకు ఇష్టమైన వారి పై, తన ఆజ్ఞప్రకారం, దివ్యజ్ఞానాన్ని (రూ’హ్‌ను) అవతరింపజేస్తాడు, 12 ఆయనతో సమావేశమయ్యే దినమును గురించి హెచ్చరించటానికి.

40:16 – يَوْمَ هُم بَارِزُونَ ۖ لَا يَخْفَىٰ عَلَى اللَّـهِ مِنْهُمْ شَيْءٌ ۚ لِّمَنِ الْمُلْكُ الْيَوْمَ ۖ لِلَّـهِ الْوَاحِدِ الْقَهَّارِ ١٦

ఆ రోజు వారందరూ బయటికి వస్తారు. వారి ఏ విషయం కూడా అల్లాహ్ నుండి రహస్యంగా ఉండదు. ఆ రోజు విశ్వసామ్రాజ్యాధికారం ఎవరిది? అద్వితీయుడూ, ప్రబలుడూ 13 అయిన అల్లాహ్‌దే!

40:17 – الْيَوْمَ تُجْزَىٰ كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ ۚ لَا ظُلْمَ الْيَوْمَ ۚ إِنَّ اللَّـهَ سَرِيعُ الْحِسَابِ ١٧

ఆ రోజు ప్రతిప్రాణికి తాను సంపాదించిన దాని ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఆ రోజు ఎవ్వరికీ అన్యాయం జరుగదు. నిశ్చయంగా, అల్లాహ్‌ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు.

40:18 – وَأَنذِرْهُمْ يَوْمَ الْآزِفَةِ إِذِ الْقُلُوبُ لَدَى الْحَنَاجِرِ كَاظِمِينَ ۚ مَا لِلظَّالِمِينَ مِنْ حَمِيمٍ وَلَا شَفِيعٍ يُطَاعُ ١٨

మరియు (ఓ ము’హమ్మద్‌!) సమీపంలో రానున్న దినాన్ని గురించి వారిని హెచ్చరించు. అప్పుడు గుండెలు గొంతులవరకు వచ్చి అడ్డు కొని, ఊపిరి ఆడకుండా చేస్తాయి. (ఆరోజు) దుర్మా ర్గులకు, ఆప్తమిత్రుడు గానీ, మాట చెల్లునట్టి సిఫారసు చేసే వాడు గానీ, 14 ఎవ్వడూ ఉండడు.

40:19 – يَعْلَمُ خَائِنَةَ الْأَعْيُنِ وَمَا تُخْفِي الصُّدُورُ ١٩

ఆయన (అల్లాహ్‌)కు చూపులలోని నమ్మక ద్రోహం మరియు హృదయాలలో దాగి వున్న రహస్యాలు అన్నీ తెలుసు.

40:20 – وَاللَّـهُ يَقْضِي بِالْحَقِّ ۖ وَالَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ لَا يَقْضُونَ بِشَيْءٍ ۗ إِنَّ اللَّـهَ هُوَ السَّمِيعُ الْبَصِيرُ ٢٠

మరియు అల్లాహ్‌, న్యాయంగా తీర్పు చేస్తాడు. మరియు వారు ఆయనను (అల్లాహ్‌ను) వదలి ఎవరినైతే ప్రార్థిస్తూ ఉన్నారో, వారు ఎలాంటి తీర్పుచేయలేరు. నిశ్చయంగా, అల్లాహ్‌! ఆయన మాత్రమే సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. (3/8)

40:21 – أَوَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ كَانُوا مِن قَبْلِهِمْ ۚ كَانُوا هُمْ أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَآثَارًا فِي الْأَرْضِ فَأَخَذَهُمُ اللَّـهُ بِذُنُوبِهِمْ وَمَا كَانَ لَهُم مِّنَ اللَّـهِ مِن وَاقٍ ٢١

  • ఏమీ? వారు భూమిలో సంచారం చేసి తమకు ముందు గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో చూడలేదా? వారు, వీరికంటే ఎక్కువ బలం గలవారు. మరియు వీరికంటే ఎక్కువ గుర్తులను భూమిలో వదిలి పోయారు; కాని అల్లాహ్‌ వారి పాపాలకుగానూ వారిని పట్టు కున్నాడు మరియు అప్పుడు వారిని అల్లాహ్‌ పట్టు నుండి కాపాడేవాడు ఎవ్వడూ లేకపోయాడు.

40:22 – ذَٰلِكَ بِأَنَّهُمْ كَانَت تَّأْتِيهِمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَكَفَرُوا فَأَخَذَهُمُ اللَّـهُ ۚ إِنَّهُ قَوِيٌّ شَدِيدُ الْعِقَابِ ٢٢

ఇలా ఎందుకు జరిగిందంటే! వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు! కాని వారు, వారిని తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్‌ వారిని శిక్షకు గురిచేశాడు. నిశ్చయంగా, ఆయన మహా బలశాలి, శిక్ష విధించటంలో కఠినుడు.

40:23 – وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِآيَاتِنَا وَسُلْطَانٍ مُّبِينٍ ٢٣

మరియు వాస్తవంగా, మేము మూసాను మా సూచనలతో (ఆయాత్‌లతో) మరియు స్పష్టమైన అధికారంతో పంపి ఉన్నాము;

40:24 – إِلَىٰ فِرْعَوْنَ وَهَامَانَ وَقَارُونَ فَقَالُوا سَاحِرٌ كَذَّابٌ ٢٤

ఫిర్‌’ఔన్‌, హామాన్‌ మరియు ఖారూన్‌ల 15 వద్దకు! కాని వారు: “ఇతను మాంత్రికుడు, అసత్యవాది!” అని అన్నారు.

40:25 – فَلَمَّا جَاءَهُم بِالْحَقِّ مِنْ عِندِنَا قَالُوا اقْتُلُوا أَبْنَاءَ الَّذِينَ آمَنُوا مَعَهُ وَاسْتَحْيُوا نِسَاءَهُمْ ۚ وَمَا كَيْدُ الْكَافِرِينَ إِلَّا فِي ضَلَالٍ ٢٥

తరువాత అతను మా వద్ద నుండి సత్యాన్ని వారి ముందుకు తీసుకొనిరాగా వారన్నారు: “ఇతనిని విశ్వసించే వారందరి పుత్రులను చంపండి మరియు వారి స్త్రీలను బ్రతకనివ్వండి.” 16 కాని సత్య-తిరస్కారుల పన్నాగాలు వ్యర్థమే అవుతాయి.

40:26 – وَقَالَ فِرْعَوْنُ ذَرُونِي أَقْتُلْ مُوسَىٰ وَلْيَدْعُ رَبَّهُ ۖ إِنِّي أَخَافُ أَن يُبَدِّلَ دِينَكُمْ أَوْ أَن يُظْهِرَ فِي الْأَرْضِ الْفَسَادَ ٢٦

మరియు ఫిర్‌’ఔన్‌ ఇలా అన్నాడు: “మూసాను చంపేపని నాకువదలిపెట్టండి; అతనిని తన ప్రభువును పిలుచుకోనివ్వండి. వాస్తవానికి, నాభయమేమిటంటే, అతను మీధర్మాన్ని మార్చ వచ్చు, లేదా దేశంలో కల్లోలాన్ని రేకెత్తించవచ్చు!”

40:27 – وَقَالَ مُوسَىٰ إِنِّي عُذْتُ بِرَبِّي وَرَبِّكُم مِّن كُلِّ مُتَكَبِّرٍ لَّا يُؤْمِنُ بِيَوْمِ الْحِسَابِ ٢٧

మరియు మూసా అన్నాడు: “నిశ్చయంగా నేను లెక్కతీసుకోబడే రోజును విశ్వసించని ప్రతి దురహంకారి నుండి కాపాడటానికి, నాకూ మరియు మీకూ కూడా ప్రభువైన ఆయన (అల్లాహ్‌) శరణు వేడుకుంటున్నాను!” 17

40:28 – وَقَالَ رَجُلٌ مُّؤْمِنٌ مِّنْ آلِ فِرْعَوْنَ يَكْتُمُ إِيمَانَهُ أَتَقْتُلُونَ رَجُلًا أَن يَقُولَ رَبِّيَ اللَّـهُ وَقَدْ جَاءَكُم بِالْبَيِّنَاتِ مِن رَّبِّكُمْ ۖ وَإِن يَكُ كَاذِبًا فَعَلَيْهِ كَذِبُهُ ۖ وَإِن يَكُ صَادِقًا يُصِبْكُم بَعْضُ الَّذِي يَعِدُكُمْ ۖ إِنَّ اللَّـهَ لَا يَهْدِي مَنْ هُوَ مُسْرِفٌ كَذَّابٌ ٢٨

అప్పుడు తన విశ్వాసాన్ని గుప్తంగా ఉంచిన ఫిర్‌’ఔన్‌ కుటుంబపు ఒకవ్యక్తి ఇలా అన్నాడు: 18 “ఏమీ? మీరు, ‘అల్లాహ్‌యే నా ప్రభువు.’ అని అన్నందుకు, ఒక వ్యక్తిని చంపగోరుతున్నారా? వాస్తవానికి, అతను మీ ప్రభువు తరఫునుండి మీ వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొనివచ్చాడు కదా! మరియు ఒకవేళ అతను అసత్యవాది అయితే, అతని అసత్యం అతని మీదనే పడు తుంది! కాని ఒకవేళ అతను సత్యవంతుడే అయితే, అతను హెచ్చరించే (శిక్ష) మీపై పడవచ్చు కదా! నిశ్చయంగా, అల్లాహ్‌ మితిమీరే అసత్యవాదికి సన్మార్గం చూపడు!

40:29 – يَا قَوْمِ لَكُمُ الْمُلْكُ الْيَوْمَ ظَاهِرِينَ فِي الْأَرْضِ فَمَن يَنصُرُنَا مِن بَأْسِ اللَّـهِ إِن جَاءَنَا ۚ قَالَ فِرْعَوْنُ مَا أُرِيكُمْ إِلَّا مَا أَرَىٰ وَمَا أَهْدِيكُمْ إِلَّا سَبِيلَ الرَّشَادِ ٢٩

“ఓ నాజాతి ప్రజలారా! ఈనాడు రాజ్యాధికారం మీదే; దేశంలో మీరు ప్రాబల్యం వహించి ఉన్నారు, కాని ఒకవేళ అల్లాహ్‌ శిక్ష మన మీద వచ్చి పడితే, అప్పుడు మనకెవడు సహాయం చేయగలడు?” అప్పుడు ఫిర్‌’ఔన్‌ అన్నాడు: “నాకు సముచితమైన మార్గమే నేను మీకూ చూపుతాను, నేను మీకు మార్గదర్శకత్వం చేసేది కేవలం సరైన మార్గం వైపునకే!” 19

40:30 – وَقَالَ الَّذِي آمَنَ يَا قَوْمِ إِنِّي أَخَافُ عَلَيْكُم مِّثْلَ يَوْمِ الْأَحْزَابِ ٣٠

మరియు విశ్వసించిన ఆ వ్యక్తి అన్నాడు: “నా జాతి ప్రజలారా! నిశ్చయంగా పూర్వం అనేక సంఘాలకు దాపురించిన దినమే మీకూ దాపురించునేమోనని నేను భయపడుతున్నాను!

40:31 – مِثْلَ دَأْبِ قَوْمِ نُوحٍ وَعَادٍ وَثَمُودَ وَالَّذِينَ مِن بَعْدِهِمْ ۚ وَمَا اللَّـهُ يُرِيدُ ظُلْمًا لِّلْعِبَادِ ٣١

“నూ’హ్‌, ‘ఆద్‌, స’మూద్‌ మరియు వారి తరువాత వచ్చిన జాతుల వారికి వచ్చినటువంటి (దుర్దినం). మరియు అల్లాహ్‌ తన దాసులకు అన్యాయం చేయగోరడు.

40:32 – وَيَا قَوْمِ إِنِّي أَخَافُ عَلَيْكُمْ يَوْمَ التَّنَادِ ٣٢

“మరియు ఓ నా జాతి ప్రజలారా! వాస్తవానికి నేను, మీరు పరస్పరం పిలుచుకునే, ఆ దినం 20 గురించి భయపడుతున్నాను.”

40:33 – يَوْمَ تُوَلُّونَ مُدْبِرِينَ مَا لَكُم مِّنَ اللَّـهِ مِنْ عَاصِمٍ ۗ وَمَن يُضْلِلِ اللَّـهُ فَمَا لَهُ مِنْ هَادٍ ٣٣

ఆ రోజు మీరు వెనుదిరిగి పారిపోవాలను కుంటారు, కాని అల్లాహ్‌ (శిక్ష) నుండి మిమ్మల్ని తప్పించే వాడు ఎవ్వడూ ఉండడు. మరియు అల్లాహ్‌ మార్గభ్రష్టత్వంలో వదలిన వాడికి, మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు.

40:34 – وَلَقَدْ جَاءَكُمْ يُوسُفُ مِن قَبْلُ بِالْبَيِّنَاتِ فَمَا زِلْتُمْ فِي شَكٍّ مِّمَّا جَاءَكُم بِهِ ۖ حَتَّىٰ إِذَا هَلَكَ قُلْتُمْ لَن يَبْعَثَ اللَّـهُ مِن بَعْدِهِ رَسُولًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّـهُ مَنْ هُوَ مُسْرِفٌ مُّرْتَابٌ ٣٤

మరియు వాస్తవానికి ఇంతకు పూర్వం యూసుఫ్‌ మీ వద్దకు స్పష్టమైన ప్రమాణాలు తీసుకొనివచ్చాడు. కాని మీరు అతడు తెచ్చినవాటిని గురించి సందేహంలో పడ్డారు. చివరకు అతడు మరణించినప్పుడు, మీరు అన్నారు: “ఇక అల్లాహ్‌ ఇతని తరువాత ఏ ప్రవక్తనూ పంపడు!” 21 ఈ విధంగా అల్లాహ్‌ మితిమీరి ప్రవర్తించే వారిని, సందేహంలో పడేవారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు.

40:35 – الَّذِينَ يُجَادِلُونَ فِي آيَاتِ اللَّـهِ بِغَيْرِ سُلْطَانٍ أَتَاهُمْ ۖ كَبُرَ مَقْتًا عِندَ اللَّـهِ وَعِندَ الَّذِينَ آمَنُوا ۚ كَذَٰلِكَ يَطْبَعُ اللَّـهُ عَلَىٰ كُلِّ قَلْبِ مُتَكَبِّرٍ جَبَّارٍ ٣٥

ఎవరైతే అల్లాహ్‌ సూచన (ఆయాత్‌) లను గురించి తమ దగ్గర ఏ ఆధారంలేనిదే వాదిస్తారో, వారు అల్లాహ్‌ దగ్గర మరియు విశ్వసించిన వారి దగ్గర ఎంతో గర్హనీయులు. ఈ విధంగా అల్లాహ్‌ దురహంకారీ, నిర్దయుడూ (క్రూరుడు) అయిన ప్రతివ్యక్తి హృదయం మీద ముద్రవేస్తాడు.

40:36 – وَقَالَ فِرْعَوْنُ يَا هَامَانُ ابْنِ لِي صَرْحًا لَّعَلِّي أَبْلُغُ الْأَسْبَابَ ٣٦

మరియు ఫిర్‌’ఔన్‌ ఇలా అన్నాడు: “ఓ హామాన్‌! నా కొరకు ఒక ఎత్తైన గోపురాన్ని నిర్మించు, బహుశా (దానిపైకి ఎక్కి) నేను మార్గాలను పొందవచ్చు;

40:37 – أَسْبَابَ السَّمَاوَاتِ فَأَطَّلِعَ إِلَىٰ إِلَـٰهِ مُوسَىٰ وَإِنِّي لَأَظُنُّهُ كَاذِبًا ۚ وَكَذَٰلِكَ زُيِّنَ لِفِرْعَوْنَ سُوءُ عَمَلِهِ وَصُدَّ عَنِ السَّبِيلِ ۚ وَمَا كَيْدُ فِرْعَوْنَ إِلَّا فِي تَبَابٍ ٣٧

“ఆకాశాలలోనికి వెళ్ళే మార్గాలు! మరియు వాటి ద్వారా నేను మూసా దేవుణ్ణి చూడటానికి. ఎందుకంటే, నిశ్చయంగా నేను అతనిని అసత్య వాదిగా భావిస్తున్నాను!” మరియు ఈ విధంగా ఫిర్‌’ఔన్‌కు తన దుష్కార్యాలు మంచివిగా కనబడ్డాయి. మరియు అతడు సన్మార్గం నుండి నిరోధించబడ్డాడు. మరియు ఫిర్‌’ఔన్‌ యొక్క ప్రతి పన్నాగం అతనిని నాశనానికి మాత్రమే గురి చేసింది.

40:38 – وَقَالَ الَّذِي آمَنَ يَا قَوْمِ اتَّبِعُونِ أَهْدِكُمْ سَبِيلَ الرَّشَادِ ٣٨

మరియు విశ్వసించిన ఆవ్యక్తి ఇంకా ఇలా అన్నాడు: “నాజాతి ప్రజలారా! నన్ను అనుసరించండి, నేను మీకు సరైనమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను.

40:39 – يَا قَوْمِ إِنَّمَا هَـٰذِهِ الْحَيَاةُ الدُّنْيَا مَتَاعٌ وَإِنَّ الْآخِرَةَ هِيَ دَارُ الْقَرَارِ ٣٩

“నా జాతి ప్రజలారా! నిశ్చయంగా ఈ ఇహ లోక జీవితసుఖం తాత్కాలికమైనదే మరియు నిశ్చ యంగా పరలోకమే శాశ్వతమైన నివాసస్థలము.

40:40 – مَنْ عَمِلَ سَيِّئَةً فَلَا يُجْزَىٰ إِلَّا مِثْلَهَا ۖ وَمَنْ عَمِلَ صَالِحًا مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَأُولَـٰئِكَ يَدْخُلُونَ الْجَنَّةَ يُرْزَقُونَ فِيهَا بِغَيْرِ حِسَابٍ ٤٠

“దుష్కార్యాలు చేసిన వానికి, వాటికి సరిపోయే ప్రతీకారం మాత్రమే లభిస్తుంది. మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవాడు, పురుషుడైనా లేదా స్త్రీ అయినా! అతడు (ఆమె) విశ్వాసి అయితే; అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. 22 అందు వారికి అపరిమితమైన జీవనోపాధి ఇవ్వబడుతుంది. 23 (1/2)

40:41 – وَيَا قَوْمِ مَا لِي أَدْعُوكُمْ إِلَى النَّجَاةِ وَتَدْعُونَنِي إِلَى النَّارِ ٤١

  • “మరియు నా జాతి ప్రజలారా! ఇది ఎంత విచిత్రమైన విషయం! నేనేమో మిమ్మల్ని ముక్తి వైపునకు పిలుస్తున్నాను. మరియు మీరేమో నన్ను నరకాగ్ని వైపునకు పిలుస్తున్నారు.

40:42 – تَدْعُونَنِي لِأَكْفُرَ بِاللَّـهِ وَأُشْرِكَ بِهِ مَا لَيْسَ لِي بِهِ عِلْمٌ وَأَنَا أَدْعُوكُمْ إِلَى الْعَزِيزِ الْغَفَّارِ ٤٢

“మీరు నన్ను – అల్లాహ్‌ను తిరస్కరించి – ఎవరిని గురించైతే నాకు ఎలాంటి జ్ఞానంలేదో! వారిని, ఆయనకు భాగస్వాములుగా కల్పించమని పిలుస్తున్నారు. మరియు నేనేమో మిమ్మల్ని సర్వ శక్తిమంతుని, క్షమాశీలుని వైపునకు పిలుస్తున్నాను.

40:43 – لَا جَرَمَ أَنَّمَا تَدْعُونَنِي إِلَيْهِ لَيْسَ لَهُ دَعْوَةٌ فِي الدُّنْيَا وَلَا فِي الْآخِرَةِ وَأَنَّ مَرَدَّنَا إِلَى اللَّـهِ وَأَنَّ الْمُسْرِفِينَ هُمْ أَصْحَابُ النَّارِ ٤٣

“నిస్సందేహంగా! వాస్తవానికి, మీరు దేని వైపునకైతే (ప్రార్థించటానికి) నన్ను పిలుస్తున్నారో! దానికి ఇహలోకంలోను మరియు పరలోకంలోను ప్రార్థనా అర్హత లేదు. 24 మరియు నిశ్చయంగా, మనందరి మరలింపు అల్లాహ్‌ వైపునకే మరియు నిశ్చయంగా, మితిమీరి ప్రవర్తించే వారే నరకాగ్ని వాసులవుతారు.

40:44 – فَسَتَذْكُرُونَ مَا أَقُولُ لَكُمْ ۚ وَأُفَوِّضُ أَمْرِي إِلَى اللَّـهِ ۚ إِنَّ اللَّـهَ بَصِيرٌ بِالْعِبَادِ ٤٤

“కావున నేను మీతో చెప్పే విషయం మున్ముందు మీరే తెలుసుకోగలరు. ఇక నా వ్యవహారాన్ని నేను అల్లాహ్‌కు అప్పగిస్తున్నాను. నిశ్చయంగా, అల్లాహ్‌ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు.”

40:45 – فَوَقَاهُ اللَّـهُ سَيِّئَاتِ مَا مَكَرُوا ۖ وَحَاقَ بِآلِ فِرْعَوْنَ سُوءُ الْعَذَابِ ٤٥

ఆ తరువాత అల్లాహ్‌ అతనిని, వారు పన్నిన చెడుకుట్రల నుండి కాపాడాడు. మరియు ఫిర్‌’ఔన్‌ జనులను దుర్భరమైన శిక్ష చుట్టు కున్నది.

40:46 – النَّارُ يُعْرَضُونَ عَلَيْهَا غُدُوًّا وَعَشِيًّا ۖ وَيَوْمَ تَقُومُ السَّاعَةُ أَدْخِلُوا آلَ فِرْعَوْنَ أَشَدَّ الْعَذَابِ ٤٦

ఆ నరకాగ్ని! వారు దాని యెదుటకు ఉదయమూ మరియు సాయంత్రమూ రప్పింప బడుతూ ఉంటారు. 25 మరియు (పునరుత్థాన) దినపు ఘడియ వచ్చినపుడు: “ఫిర్‌’ఔన్‌ జనులను తీవ్రమైన శిక్షలో పడవేయండి!” 26 అని ఆజ్ఞ ఇవ్వబడుతుంది.

40:47 – وَإِذْ يَتَحَاجُّونَ فِي النَّارِ فَيَقُولُ الضُّعَفَاءُ لِلَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ أَنتُم مُّغْنُونَ عَنَّا نَصِيبًا مِّنَ النَّارِ ٤٧

ఇక వారు నరకాగ్నిలో పరస్పరం వాదు లాడుతున్నప్పుడు (ఇహలోకంలో) బలహీను లుగా పరిగణింపబడిన వారు, పెద్దమనుషులుగా (నాయకులుగా) పరిగణింపబడే వారితో ఇలా అంటారు: “వాస్తవానికి, మేము మిమ్మల్ని అనుస రిస్తూ ఉండేవారము, కావున మీరిప్పుడు మా నుండి నరకాగ్నిని కొంతనైనా తొలగించగలరా?”

40:48 – قَالَ الَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا كُلٌّ فِيهَا إِنَّ اللَّـهَ قَدْ حَكَمَ بَيْنَ الْعِبَادِ ٤٨

దురహంకారంలో మునిగి ఉన్నవారు (ఆ పెద్ద మనుషులు) ఇలా అంటారు: “వాస్తవానికి, మనమందరం అందులో (నరకాగ్నిలో) ఉన్నాం. నిశ్చయంగా, అల్లాహ్‌ తన దాసుల మధ్య వాస్తవమైన తీర్పుచేశాడు!”

40:49 – وَقَالَ الَّذِينَ فِي النَّارِ لِخَزَنَةِ جَهَنَّمَ ادْعُوا رَبَّكُمْ يُخَفِّفْ عَنَّا يَوْمًا مِّنَ الْعَذَابِ ٤٩

మరియు నరకాగ్నిలో పడివున్న వారు, నరకపు రక్షకులతో: “మా శిక్షను కనీసం ఒక్కరోజు కొరకైనా తగ్గించమని, మీరు మీ ప్రభువును ప్రార్థించండి!” అని అంటారు.

40:50 – قَالُوا أَوَلَمْ تَكُ تَأْتِيكُمْ رُسُلُكُم بِالْبَيِّنَاتِ ۖ قَالُوا بَلَىٰ ۚ قَالُوا فَادْعُوا ۗ وَمَا دُعَاءُ الْكَافِرِينَ إِلَّا فِي ضَلَالٍ ٥٠

వారు (రక్షకులు) అంటారు: “ఏమీ? మీ వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని మీ దైవ ప్రవక్తలు రాలేదా?” అప్పుడు వారంటారు: “అవును (వచ్చారు)!” వారికి ఇలా జవాబివ్వ బడుతుంది: “అయితే మీరే ప్రార్థించండి!” కాని సత్య-తిరస్కారుల ప్రార్థన నిష్ఫలమే అవుతుంది.

40:51 – إِنَّا لَنَنصُرُ رُسُلَنَا وَالَّذِينَ آمَنُوا فِي الْحَيَاةِ الدُّنْيَا وَيَوْمَ يَقُومُ الْأَشْهَادُ ٥١

నిశ్చయంగా, మేము మా ప్రవక్తలకు మరియు విశ్వసించినవారికి ఇహలోకజీవితంలో మరియు సాక్షులు నిలబడేరోజున కూడా సహాయము నొసంగుతాము. 27

40:52 – يَوْمَ لَا يَنفَعُ الظَّالِمِينَ مَعْذِرَتُهُمْ ۖ وَلَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوءُ الدَّارِ ٥٢

ఆ రోజు దుర్మార్గులకు వారి సాకులు ఏ మాత్రం ఉపయోగకరం కావు. వారికి (అల్లాహ్) శాపం (బహిష్కారం) ఉంటుంది. 28 మరియు వారికి అతి దుర్భరమైన నిలయం ఉంటుంది.

40:53 – وَلَقَدْ آتَيْنَا مُوسَى الْهُدَىٰ وَأَوْرَثْنَا بَنِي إِسْرَائِيلَ الْكِتَابَ ٥٣

మరియు వాస్తవంగా, మేము మూసాకు మార్గదర్శకత్వం చేశాము. మరియు ఇస్రా’యీల్‌ సంతతి వారిని గ్రంథానికి (తౌరాత్‌కు) వారసులుగా చేశాము; 29

40:54 – هُدًى وَذِكْرَىٰ لِأُولِي الْأَلْبَابِ ٥٤

బుధ్ధిమంతులకు మార్గ దర్శకత్వంగా మరియు హితోపదేశంగా!

40:55 – فَاصْبِرْ إِنَّ وَعْدَ اللَّـهِ حَقٌّ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ بِالْعَشِيِّ وَالْإِبْكَارِ ٥٥

కావున నీవు సహనం వహించు! నిశ్చయంగా అల్లాహ్‌ వాగ్దానం సత్యం; నీ పాపాలకు క్షమాపణ వేడుకో మరియు సాయంత్రం మరియు ఉదయం నీ ప్రభువు పవిత్రతను కొనియాడు ఆయనను స్తుతించు.

40:56 – إِنَّ الَّذِينَ يُجَادِلُونَ فِي آيَاتِ اللَّـهِ بِغَيْرِ سُلْطَانٍ أَتَاهُمْ ۙ إِن فِي صُدُورِهِمْ إِلَّا كِبْرٌ مَّا هُم بِبَالِغِيهِ ۚ فَاسْتَعِذْ بِاللَّـهِ ۖ إِنَّهُ هُوَ السَّمِيعُ الْبَصِيرُ ٥٦

నిశ్చయంగా, ఎవరైతే, తమదగ్గర ఎలాంటి ప్రమాణంలేనిదే అల్లాహ్‌ సూచన (ఆయాత్‌) లను గురించి వాదులాడుతారో, వారి హృదయాలలో వాస్తవానికి గొప్పతనపు గర్వం నిండిఉంది. కాని వారు దానిని (గొప్పతనాన్ని) పొందజాలరు. కావున నీవు అల్లాహ్‌ శరణు వేడుకో. నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.

40:57 – لَخَلْقُ السَّمَاوَاتِ وَالْأَرْضِ أَكْبَرُ مِنْ خَلْقِ النَّاسِ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ ٥٧

వాస్తవానికి ఆకాశాలను మరియు భూమిని సృష్టించటం, మానవులను సృష్టించటం కంటే ఎంతో గొప్ప విషయం, కానీ చాలా మంది ప్రజలకు ఇది తెలియదు.

40:58 – وَمَا يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَلَا الْمُسِيءُ ۚ قَلِيلًا مَّا تَتَذَكَّرُونَ ٥٨

మరియు గ్రుడ్డివాడు మరియు చూడగల వాడు, సమానులు కాజాలరు మరియు అదే విధంగా! విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మరియు దుర్వర్తనులు కూడా (సమానులు కాజా లరు). మీరు అర్థం చేసుకునేది చాలా తక్కువ!

40:59 – إِنَّ السَّاعَةَ لَآتِيَةٌ لَّا رَيْبَ فِيهَا وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُونَ ٥٩

నిశ్చయంగా, అంతిమ ఘడియ తప్పక రానున్నది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయినా చాలామంది ప్రజలు విశ్వసించరు.

40:60 – وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ ۚ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ ٦٠

మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: “నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. 30 నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశించగలరు.”

40:61 – اللَّـهُ الَّذِي جَعَلَ لَكُمُ اللَّيْلَ لِتَسْكُنُوا فِيهِ وَالنَّهَارَ مُبْصِرًا ۚ إِنَّ اللَّـهَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَشْكُرُونَ ٦١

అల్లాహ్‌! ఆయనే, మీ కొరకు విశ్రాంతి తీసుకోవటానికి రాత్రిని మరియు (చూడటానికి) ప్రకాశవంతమైన పగటిని నియమించిన వాడు. 31 నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రజల పట్ల ఎంతో అనుగ్రహుడు, కాని చాలా మంది ప్రజలు కృతజ్ఞతలు తెలుపరు.

40:62 – ذَٰلِكُمُ اللَّـهُ رَبُّكُمْ خَالِقُ كُلِّ شَيْءٍ لَّا إِلَـٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ ٦٢

ఆయనే అల్లాహ్‌, మీ ప్రభువు! ప్రతి దానిని సృష్టించిన వాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు! అయితే మీరెందుకు మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)? 32

40:63 – كَذَٰلِكَ يُؤْفَكُ الَّذِينَ كَانُوا بِآيَاتِ اللَّـهِ يَجْحَدُونَ ٦٣

ఇదేవిధంగా అల్లాహ్‌ సూచనలను (ఆయాత్‌ లను) తిరస్కరించే వారందరూ మోసగింపబడుతూ ఉంటారు.

40:64 – اللَّـهُ الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ قَرَارًا وَالسَّمَاءَ بِنَاءً وَصَوَّرَكُمْ فَأَحْسَنَ صُوَرَكُمْ وَرَزَقَكُم مِّنَ الطَّيِّبَاتِ ۚ ذَٰلِكُمُ اللَّـهُ رَبُّكُمْ ۖ فَتَبَارَكَ اللَّـهُ رَبُّ الْعَالَمِينَ ٦٤

అల్లాహ్‌యే! మీ కొరకు భూమిని నివాస స్థలంగా మరియు ఆకాశాన్ని కప్పుగా నియ మించినవాడు మరియు ఆయనే మీకు మంచి రూపాన్నిచ్చి దానిని ఎంతో చక్కగా తీర్చి దిద్దాడు మరియు మీకు మంచి వస్తువులను జీవనోపాధిగా సమకూర్చాడు. ఆయనే అల్లాహ్‌! మీ పోషకుడు. కావున అల్లాహ్‌ ఎంతో శుభదాయ కుడు, సర్వలోకాలకు ప్రభువు.

40:65 – هُوَ الْحَيُّ لَا إِلَـٰهَ إِلَّا هُوَ فَادْعُوهُ مُخْلِصِينَ لَهُ الدِّينَ ۗ الْحَمْدُ لِلَّـهِ رَبِّ الْعَالَمِينَ ٦٥

ఆయన సజీవుడు. 33 ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున మీరు ఆయననే ప్రార్థించండి! మీ ధర్మాన్ని(భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోండి. సర్వ స్తోత్రాలకు అర్హుడు, సర్వలోకాల పోషకుడైన అల్లాహ్‌ మాత్రమే. (5/8)

40:66 – قُلْ إِنِّي نُهِيتُ أَنْ أَعْبُدَ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّـهِ لَمَّا جَاءَنِيَ الْبَيِّنَاتُ مِن رَّبِّي وَأُمِرْتُ أَنْ أُسْلِمَ لِرَبِّ الْعَالَمِينَ ٦٦

  • ఇలా అను: “నిశ్చయంగా, నా ప్రభువు తరఫు నుండి, నాకు స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాతనే, అల్లాహ్‌ను వదలి మీరు ఆరాధించేవాటి ఆరాధన నుండి నేను వారించ బ్డడాను మరియు నేను సర్వలోకాల ప్రభువుకు మాత్రమే విధేయుడను (ముస్లింను) అయి ఉండాలని ఆజ్ఞాపించబడ్డాను.”

40:67 – هُوَ الَّذِي خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ يُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوا أَشُدَّكُمْ ثُمَّ لِتَكُونُوا شُيُوخًا ۚ وَمِنكُم مَّن يُتَوَفَّىٰ مِن قَبْلُ ۖ وَلِتَبْلُغُوا أَجَلًا مُّسَمًّى وَلَعَلَّكُمْ تَعْقِلُونَ ٦٧

ఆయనే మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. 34 తరువాత వీర్య బిందువుతో, ఆ తరువాత పిండంతో (రక్త- ముద్దతో), ఆ తరువాత మిమ్మల్ని శిశువు రూపంలో బయటికి తీస్తాడు. ఆ తరువాత మిమ్మల్ని యుక్త వయస్సులో బలంగలవారిగా చేస్తాడు; చివరకు మిమ్మల్ని ముసలివారిగా మార్చుతాడు. మీలో కొందరు దీనికి ముందే చనిపోతారు. మరియు మీరంతా మీ నియమిత కాలం వరకే నివసిస్తారు. బహుశా మీరు అర్థంచేసు కుంటారని (ఇదంతా మీకు వివరించబడుతోంది).

40:68 – هُوَ الَّذِي يُحْيِي وَيُمِيتُ ۖ فَإِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ ٦٨

జీవితాన్ని ఇచ్చేవాడు మరియు మరణింప జేసేవాడు ఆయనే! ఆయన ఏదైనా చేయాలను కున్నప్పుడు, కేవలం దానితో: “అయిపో!” అని అంటాడు, అంతే అది అయిపోతుంది.

40:69 – أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يُجَادِلُونَ فِي آيَاتِ اللَّـهِ أَنَّىٰ يُصْرَفُونَ ٦٩

ఏమీ? నీకు తెలియదా? అల్లాహ్‌ సూచన లను (ఆయాత్‌లను) గురించి వాదులాడేవారు ఏ విధంగా (సత్యంనుండి) తప్పించబడుతున్నారో?

40:70 – الَّذِينَ كَذَّبُوا بِالْكِتَابِ وَبِمَا أَرْسَلْنَا بِهِ رُسُلَنَا ۖ فَسَوْفَ يَعْلَمُونَ ٧٠

ఎవరైతే ఈ గ్రంథాన్ని అసత్యమని తిరస్క రించారో మరియు మేము మా సందేశహరులకు ఇచ్చి పంపిన దానిని (తిరస్కరించారో), వారు తప్పక త్వరలోనే (తమ పర్యవసానం) తెలుసుకుంటారు;

40:71 – إِذِ الْأَغْلَالُ فِي أَعْنَاقِهِمْ وَالسَّلَاسِلُ يُسْحَبُونَ ٧١

ఎప్పుడైతే వారి మెడలలో సంకెళ్ళు 35 (ఇనుప పట్టీలు) మరియు గొలుసులు వేయబడ తాయో మరియు వారు ఈడ్చబడతారో!

40:72 – فِي الْحَمِيمِ ثُمَّ فِي النَّارِ يُسْجَرُونَ ٧٢

సలసల కాగే నీళ్లలోకి, తరువాత నరకాగ్ని లోకి, కాల్చబడటానికి.

40:73 – ثُمَّ قِيلَ لَهُمْ أَيْنَ مَا كُنتُمْ تُشْرِكُونَ ٧٣

అప్పుడు వారితో అనబడుతుంది: “మీరు సాటి కల్పించే (భాగస్వాములు) ఇప్పుడు ఎక్కడున్నారు?

40:74 – مِن دُونِ اللَّـهِ ۖ قَالُوا ضَلُّوا عَنَّا بَل لَّمْ نَكُن نَّدْعُو مِن قَبْلُ شَيْئًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّـهُ الْكَافِرِينَ ٧٤

“(ఎవరినైతే) మీరు అల్లాహ్‌ను వదలి (ప్రార్థిస్తూ ఉన్నారో)!” వారంటారు: “వారు మమ్మల్ని త్యజించారు! అలాకాదు దీనికి పూర్వం మేము ఎవరినీ ప్రార్థించేవారమే కాదు.” 36 ఈ విధంగా అల్లాహ్‌ సత్య-తిరస్కారులను మార్గభ్రష్టత్వంలో వదలుతాడు.

40:75 – ذَٰلِكُم بِمَا كُنتُمْ تَفْرَحُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَبِمَا كُنتُمْ تَمْرَحُونَ ٧٥

(వారితో ఇలా అనబడుతుంది): “ఇదంతా మీరు అన్యాయంగా, భూమిలో విర్రవీగుతూ ఉన్నందుకు మరియు దురభిమానంతో ప్రవర్తించి నందుకూ!

40:76 – ادْخُلُوا أَبْوَابَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۖ فَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِينَ ٧٦

“(కావున ఇప్పుడు) నరక ద్వారాలలో ప్రవేశించండి, అందులో శాశ్వతంగా ఉండటానికి. దురహంకారంతో ప్రవర్తించిన వారి నివాసస్థలం ఎంత దుర్భరమైనది!”

40:77 – فَاصْبِرْ إِنَّ وَعْدَ اللَّـهِ حَقٌّ ۚ فَإِمَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِلَيْنَا يُرْجَعُونَ ٧٧

కావున (ఓ ప్రవక్తా!) నీవు సహనం వహించు! నిశ్చయంగా, అల్లాహ్‌ వాగ్దానం సత్యం. మేము వారికి చేసిన వాగ్దానాల (శిక్ష) నుండి కొంత నీకు చూపినా! లేదా (దానికి ముందు) నిన్ను మరణింపజేసినా వారందరూ మా వైపునకే కదా మరలింపబడతారు! 37

40:78 – وَلَقَدْ أَرْسَلْنَا رُسُلًا مِّن قَبْلِكَ مِنْهُم مَّن قَصَصْنَا عَلَيْكَ وَمِنْهُم مَّن لَّمْ نَقْصُصْ عَلَيْكَ ۗ وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأْتِيَ بِآيَةٍ إِلَّا بِإِذْنِ اللَّـهِ ۚ فَإِذَا جَاءَ أَمْرُ اللَّـهِ قُضِيَ بِالْحَقِّ وَخَسِرَ هُنَالِكَ الْمُبْطِلُونَ ٧٨

మరియు (ఓ ము’హమ్మద్‌!) వాస్తవానికి మేము నీకు పూర్వం అనేక ప్రవక్తలను పంపాము; వారిలో కొందరి వృత్తాంతం మేము నీకు తెలిపాము; మరికొందరిని గురించి నీకు తెలుప లేదు. మరియు అల్లాహ్‌ అనుమతి లేనిదే, ఏ ప్రవక్త కూడా ఏ అద్భుత క్రియ (ఆయాత్‌) లను స్వయంగా చేయలేడు. 28 కాని అల్లాహ్‌ ఆజ్ఞ వచ్చినపుడు, న్యాయంగా తీర్పు చేయబడు తుంది. మరియు అప్పుడు అసత్యవాదులు నష్టానికి గురి అవుతారు.

40:79 – اللَّـهُ الَّذِي جَعَلَ لَكُمُ الْأَنْعَامَ لِتَرْكَبُوا مِنْهَا وَمِنْهَا تَأْكُلُونَ ٧٩

అల్లాహ్‌ మీ కొరకు పశువులను సృష్టించాడు, వాటి మీద మీరు సవారీ చేయటానికి మరియు వాటిలో కొన్నింటిని మీరు తినుటకూను! 39

40:80 – وَلَكُمْ فِيهَا مَنَافِعُ وَلِتَبْلُغُوا عَلَيْهَا حَاجَةً فِي صُدُورِكُمْ وَعَلَيْهَا وَعَلَى الْفُلْكِ تُحْمَلُونَ ٨٠

మరియు వాటి వల్ల మీకు ఇతర లాభాలు కూడా ఉన్నాయి, వాటి ద్వారా మీ హృదయాలు కోరినచోట్లకు పోవటానికి ఉపయోగపడతాయి మరియు వాటి మీద మరియు పడవల మీద మీరు తీసుకుపోబడతారు.

40:81 – وَيُرِيكُمْ آيَاتِهِ فَأَيَّ آيَاتِ اللَّـهِ تُنكِرُونَ ٨١

మరియు (ఈవిధంగా) ఆయన మీకు తన సూచనలను (ఆయాత్‌ లను) చూపుతున్నాడు. అయితే అల్లాహ్‌ యొక్క ఏ ఏ సూచనలను (ఆయాత్‌లను) మీరు నిరాకరిస్తారు?

40:82 – أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَانُوا أَكْثَرَ مِنْهُمْ وَأَشَدَّ قُوَّةً وَآثَارًا فِي الْأَرْضِ فَمَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يَكْسِبُونَ ٨٢

ఏమీ? వీరు భూమిలో సంచరించలేదా? అప్పుడు వీరికి పూర్వం గతించిన వారి గతి ఏమయిందో కనిపించలేదా? వారు వీరికంటే సంఖ్యాపరంగా అధికులు మరియు వీరికంటే ఎక్కువ బలవంతులు మరియు భూమిలో (ఎక్కువ) చిహ్నాలు వదలిపోయారు, కాని వారి సంపాదన వారికి ఏ విధంగానూ పనికిరాలేదు.

40:83 – فَلَمَّا جَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَرِحُوا بِمَا عِندَهُم مِّنَ الْعِلْمِ وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ٨٣

ఎందుకంటే! వారి సందేశహరులు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చి నప్పుడు, వారు తమ దగ్గరున్న జ్ఞానానికి గర్వ పడ్డారు; కాబట్టి వారు దేనిని గురించి పరిహాసా లాడుతూ ఉన్నారో అదే వారిని చుట్టుకున్నది.

40:84 – فَلَمَّا رَأَوْا بَأْسَنَا قَالُوا آمَنَّا بِاللَّـهِ وَحْدَهُ وَكَفَرْنَا بِمَا كُنَّا بِهِ مُشْرِكِينَ ٨٤

ఆ తరువాత మా శిక్షను చూసినప్పుడు వారు ఇలా అన్నారు: “మేము అద్వితీయుడైన అల్లాహ్‌ను విశ్వసిస్తున్నాము మరియు మేము (అల్లాహ్‌కు) సాటి-కల్పిస్తూ వచ్చిన భాగస్వాము లను తిరస్క రిస్తున్నాము.”

40:85 – فَلَمْ يَكُ يَنفَعُهُمْ إِيمَانُهُمْ لَمَّا رَأَوْا بَأْسَنَا ۖ سُنَّتَ اللَّـهِ الَّتِي قَدْ خَلَتْ فِي عِبَادِهِ ۖ وَخَسِرَ هُنَالِكَ الْكَافِرُونَ ٨٥

కాని మా శిక్షను చూసిన తర్వాత, వారి విశ్వాసం వారికి ఏ మాత్రం లాభదాయకం కాజాలదు. ఇదే అల్లాహ్‌ తన దాసుల కొరకు వాస్తవంగా, నియమించిన విధానం. మరియు అక్కడ సత్య-తిరస్కారులు నష్టానికి గురిఅవుతారు.

సూరహ్‌ ఫు’స్సిలత్‌ – ఈ సూరహ్‌, 40వ సూరహ్‌ తరువాత అవతరింపజేయబడింది. ఫు’స్సిలత్‌ అంటే వివరించ, ప్రతిపాదించ, వ్యాఖ్యానించబడిన విషయం. ఈ శబ్దం 3వ ఆయత్‌లో ఉంది. దీని మరొక పేరు. ‘హా-మీమ్‌ అస్‌-సజ్దహ్‌. ఈ శబ్దం 37వ ఆయత్‌లో ఉంది. ఈ సూరహ్‌లో 54 ఆయాతులు ఉన్నాయి. ఇది మక్కహ్ లో అవతరింపజేయబడింది. 32వ సూరహ్‌ పేరు సజ్దా కాబట్టి, దీని ముందు ‘హా-మీమ్‌ పెట్టబడ్డాయి. దీని అవతరణ విషయం ఈ విధంగా వివరించబడింది: దైవప్రవక్త (‘స’అస) యొక్క అనుచరులు దినదినానికి ఎక్కువ కావటం చూసి, ముష్రిక్‌ ఖురైషులు అందరూ కలసి సమావేశం చేసి, ‘ఉత్బ బిన్‌-రబీ’అ అనే వ్యక్తిని దైవప్రవక్త (‘స’అస) దగ్గరికి రాయబారిగా పంపుతారు. అతడు దైవప్రవక్త (‘స’అస)తో: ‘నీకు ధనసంపత్తులు, నాయక పదవి, అందమైన స్త్రీలతో వివాహం లేక నీకు (‘స’అస) ఏదైన దుష్టజిన్‌ బాధిస్తున్నట్లయితే దాని కొరకు మంత్ర-తంత్రాలు కూడా చేయిస్తాము, నీవు ప్రచారం చేసే, ఈ క్రొత్త ధర్మాన్ని విడిచి మన తండ్రి-తాతల ధర్మాన్ని అనుసరించు.’ అని అంటాడు. అప్పుడు దైవప్రవక్త (‘స’అస) ఈ సూరహ్‌ చదివి వినిపిస్తారు. దానితో అతడు తిరిగిపోయి ఖురైషీలతో: “అతను (‘స’అస) చెప్పే మాటలు మంత్రజాలం కావు, కవిత్వం కావు, అవి సత్యాలే!” అని అంటాడు. దానికి వారు: “నీవు కూడా అతని మంత్రజాలానికి గురయ్యావు!” అని అంటారు.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 41:1 – حم ١

హా-మీమ్‌.

41:2 – تَنزِيلٌ مِّنَ الرَّحْمَـٰنِ الرَّحِيمِ ٢

దీని (ఈ ఖుర్‌ఆన్‌) అవతరణ అనంత కరుణామయుడు, అపార కరుణాప్రదాత తరఫు నుండి జరిగింది.

41:3 – كِتَابٌ فُصِّلَتْ آيَاتُهُ قُرْآنًا عَرَبِيًّا لِّقَوْمٍ يَعْلَمُونَ ٣

ఇదొక గ్రంథం, దీని సూచనలు (ఆయాత్‌) తెలివిగల వారికొరకు, ‘అరబ్బీ 1 భాషలో స్పష్టమైన ఉపన్యాసం (ఖుర్‌ఆన్‌) గా వివరించబడ్డాయి.

41:4 – بَشِيرًا وَنَذِيرًا فَأَعْرَضَ أَكْثَرُهُمْ فَهُمْ لَا يَسْمَعُونَ ٤

(స్వర్గపు) శుభవార్త నిచ్చేదిగా మరియు హెచ్చరించేదిగా; అయినా చాలా మంది దీనిపట్ల విముఖత చూపుతున్నారు, కాబట్టి వారు వినటంలేదు.

41:5 – وَقَالُوا قُلُوبُنَا فِي أَكِنَّةٍ مِّمَّا تَدْعُونَا إِلَيْهِ وَفِي آذَانِنَا وَقْرٌ وَمِن بَيْنِنَا وَبَيْنِكَ حِجَابٌ فَاعْمَلْ إِنَّنَا عَامِلُونَ ٥

మరియు వారు ఇలా అన్నారు: “నీవు దేని వైపునకైతే మమ్మల్ని పిలుస్తున్నావో, దాని పట్ల మా హృదయాల మీద తెరలు కప్పబడి ఉన్నాయి; మరియు మా చెవులలో చెవుడు ఉంది మరియు నీకూ మాకూ మధ్య ఒక అడ్డుతెర ఉంది; 2 కావున నీవు నీ పని చేయి, మేము మా పని చేస్తాము.”

41:6 – قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِّثْلُكُمْ يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَـٰهُكُمْ إِلَـٰهٌ وَاحِدٌ فَاسْتَقِيمُوا إِلَيْهِ وَاسْتَغْفِرُوهُ ۗ وَوَيْلٌ لِّلْمُشْرِكِينَ ٦

(ఓ ప్రవక్తా!) ఇలా అను: “నిశ్చయంగా నేను కూడా మీలాంటి ఒక మానవుణ్ణి మాత్రమే! 3 నాకు దివ్యజ్ఞానం (వ’హీ) ద్వారా ఇలా తెలుపబడింది: ‘నిశ్చయంగా మీ ఆరాధ్య దేవుడు, ఒకే ఒక్క దేవుడు (అల్లాహ్‌); కావున మీరు నేరుగా ఆయన వైపునకే మరలండి మరియు ఆయననే క్షమాపణకై వేడుకోండి.’ ” మరియు ఆయనకు (అల్లాహ్‌ కు) సాటి కల్పించే వారికి వినాశం ఉంది.

41:7 – الَّذِينَ لَا يُؤْتُونَ الزَّكَاةَ وَهُم بِالْآخِرَةِ هُمْ كَافِرُونَ ٧

వారికి, ఎవరైతే విధిదానం (‘జకాత్‌) ఇవ్వరో మరియు పరలోకాన్ని తిరస్కరిస్తారో! 4

41:8 – إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ ٨

నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారికి ఎడతెగని ప్రతిఫలం (స్వర్గం) ఉంటుంది. (3/4)

41:9 – قُلْ أَئِنَّكُمْ لَتَكْفُرُونَ بِالَّذِي خَلَقَ الْأَرْضَ فِي يَوْمَيْنِ وَتَجْعَلُونَ لَهُ أَندَادًا ۚ ذَٰلِكَ رَبُّ الْعَالَمِينَ ٩

  • వారితో ఇలా అను: “ఏమీ? మీరు, భూమిని రెండు రోజులలో సృష్టించిన ఆయన (అల్లాహ్‌)ను తిరస్కరించి, ఇతరులను ఆయనకు సమానులుగా నిలబెడతారా? సర్వలోకాలకు పోషకుడు ఆయనే కదా?” 5

41:10 – وَجَعَلَ فِيهَا رَوَاسِيَ مِن فَوْقِهَا وَبَارَكَ فِيهَا وَقَدَّرَ فِيهَا أَقْوَاتَهَا فِي أَرْبَعَةِ أَيَّامٍ سَوَاءً لِّلسَّائِلِينَ ١٠

మరియు ఆయన దానిలో (భూమిలో) దాని పైనుండి స్థిరమైన పర్వతాలను నెలకొలిపాడు 6 మరియు అందులో శుభాలను అనుగ్రహించాడు మరియు అర్థించే వారికొరకు, వారి అవసరాలకు సరిపోయేటట్లు జీవనోపాధిని సమకూర్చాడు, ఇదంతా నాలుగు రోజులలో పూర్తిచేశాడు.

41:11 – ثُمَّ اسْتَوَىٰ إِلَى السَّمَاءِ وَهِيَ دُخَانٌ فَقَالَ لَهَا وَلِلْأَرْضِ ائْتِيَا طَوْعًا أَوْ كَرْهًا قَالَتَا أَتَيْنَا طَائِعِينَ ١١

అప్పుడే 7 ఆయన కేవలం పొగగా 8 ఉన్న ఆకాశం వైపునకు తన ధ్యానాన్ని మరల్చి, దానిని మరియు భూమిని ఉద్దేశించి ఇలా అన్నాడు: “మీరిద్దరు (ఉనికిలోకి) రండి మీకు ఇష్టమున్నా, ఇష్టం లేక పోయినా!” అవి రెండూ: “మేమిద్దరమూ విధేయులమై (ఉనికిలోకి) వస్తాము.” అని అన్నాయి.

41:12 – فَقَضَاهُنَّ سَبْعَ سَمَاوَاتٍ فِي يَوْمَيْنِ وَأَوْحَىٰ فِي كُلِّ سَمَاءٍ أَمْرَهَا ۚ وَزَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِمَصَابِيحَ وَحِفْظًا ۚ ذَٰلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ ١٢

కావున ఆయన వాటిని రెండు రోజులలో ఏడు ఆకాశాలుగా నిర్మించాడు, మరియు ప్రతి ఆకాశానికి దాని వ్యవహారాన్ని దివ్యజ్ఞానం (వ’హీ) ద్వారా నిర్దేశించాడు. మరియు మేము ఈ ప్రపంచపు ఆకాశాన్ని దీపాలతో (నక్షత్రాలతో) అలంకరించాము మరియు దానిని సురక్షితం చేశాము. ఇదే సర్వ శక్తిమంతుని, సర్వజ్ఞుని నియామకం. 9

41:13 – فَإِنْ أَعْرَضُوا فَقُلْ أَنذَرْتُكُمْ صَاعِقَةً مِّثْلَ صَاعِقَةِ عَادٍ وَثَمُودَ ١٣

ఇప్పుడు ఒకవేళ వారు విముఖులైతే వారి తో ఇలా అను: ” ‘ఆద్‌ మరియు స’మూద్‌ జాతు ల వారిపై వచ్చి పడినట్టి గొప్ప పిడుగులాంటి శిక్ష గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.” 10

41:14 – إِذْ جَاءَتْهُمُ الرُّسُلُ مِن بَيْنِ أَيْدِيهِمْ وَمِنْ خَلْفِهِمْ أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّـهَ ۖ قَالُوا لَوْ شَاءَ رَبُّنَا لَأَنزَلَ مَلَائِكَةً فَإِنَّا بِمَا أُرْسِلْتُم بِهِ كَافِرُونَ ١٤

ఇక దైవప్రవక్తలు వారి వద్దకు వారి ముందు నుండి మరియు వారి వెనుక నుండి వచ్చి: “మీరు అల్లాహ్‌ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి!” అని అన్నప్పుడు, వారు ఇలా అన్నారు: “మా ప్రభువే గనక కోరితే దేవదూతలను పంపి ఉండేవాడు. 11 కావున మేము మీ ద్వారా పంప బడిన దానిని నిశ్చయంగా, తిరస్కరిస్తున్నాము!”

41:15 – فَأَمَّا عَادٌ فَاسْتَكْبَرُوا فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَقَالُوا مَنْ أَشَدُّ مِنَّا قُوَّةً ۖ أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّـهَ الَّذِي خَلَقَهُمْ هُوَ أَشَدُّ مِنْهُمْ قُوَّةً ۖ وَكَانُوا بِآيَاتِنَا يَجْحَدُونَ ١٥

ఇక ‘ఆద్‌ వారి విషయం: వారు దురహంకా రంతో భూమిలో అన్యాయంగా ప్రవర్తించేవారు. మరియు ఇలా అనేవారు: “బలంలో మమ్మల్ని మించినవాడు ఎవడున్నాడు?” ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా, వారిని సృష్టించిన అల్లాహ్‌ బలంలో వారికంటే ఎంతో మించిన వాడని? అయినా వారు మా సూచనలను (ఆయాత్‌ లను) తిరస్కరిస్తూ ఉండేవారు!

41:16 – فَأَرْسَلْنَا عَلَيْهِمْ رِيحًا صَرْصَرًا فِي أَيَّامٍ نَّحِسَاتٍ لِّنُذِيقَهُمْ عَذَابَ الْخِزْيِ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَخْزَىٰ ۖ وَهُمْ لَا يُنصَرُونَ ١٦

చివరకు మేము వారికి, ఇహలోక జీవితంలోనే అవమానకరమైన శిక్ష రుచి చూపించాలని అశుభమైన దినాలలో వారిపై తీవ్రమైన తుఫానుగాలిని పంపాము. 12 మరియు వారి పరలోక శిక్ష దీనికంటే ఎంతో అవమాన కరమైనదిగా ఉండబోతుంది. మరియు వారి కెలాంటి సహాయం లభించదు.

41:17 – وَأَمَّا ثَمُودُ فَهَدَيْنَاهُمْ فَاسْتَحَبُّوا الْعَمَىٰ عَلَى الْهُدَىٰ فَأَخَذَتْهُمْ صَاعِقَةُ الْعَذَابِ الْهُونِ بِمَا كَانُوا يَكْسِبُونَ ١٧

మరియు స’మూద్‌ వారి విషయం: మేము వారికి మార్గదర్శకత్వం చేశాము. కాని వారు మార్గ దర్శకత్వానికి బదులు గ్రుడ్డితనానికే ఇష్టపడ్డారు. చివరకు వారి (దుష్ట) కర్మలకు ఫలితంగా, వారిపై పిడుగు లాంటి అవమానకరమైన శిక్ష పడింది. 13

41:18 – وَنَجَّيْنَا الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ ١٨

మరియు మేము వారిలో విశ్వాసులైన వారిని మరియు దైవభీతిగల వారిని రక్షించాము.

41:19 – وَيَوْمَ يُحْشَرُ أَعْدَاءُ اللَّـهِ إِلَى النَّارِ فَهُمْ يُوزَعُونَ ١٩

మరియు (జ్ఞాపకముంచుకోండి) అల్లాహ్‌ యొక్క విరోధులు నరకాగ్నివైపుకు సమీక రించబడే రోజు, వారు తమతమ స్థానాలకు పంపబడతారు.

41:20 – حَتَّىٰ إِذَا مَا جَاءُوهَا شَهِدَ عَلَيْهِمْ سَمْعُهُمْ وَأَبْصَارُهُمْ وَجُلُودُهُم بِمَا كَانُوا يَعْمَلُونَ ٢٠

చివరకు వారు దానిని (నరకాగ్నిని) చేరు కున్నప్పుడు; వారి చెవులు, వారి కళ్ళు మరియు వారి చర్మాలు వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి, వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి.

41:21 – وَقَالُوا لِجُلُودِهِمْ لِمَ شَهِدتُّمْ عَلَيْنَا ۖ قَالُوا أَنطَقَنَا اللَّـهُ الَّذِي أَنطَقَ كُلَّ شَيْءٍ وَهُوَ خَلَقَكُمْ أَوَّلَ مَرَّةٍ وَإِلَيْهِ تُرْجَعُونَ ٢١

మరియు వారు తమ చర్మాలను (అవయవాలను) అడుగుతారు: “మీరెందుకు మాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నారు?” అవి ఇలా సమాధాన మిస్తాయి: “ప్రతి వస్తువుకు మాట్లాడే శక్తి ప్రసాదించిన అల్లాహ్‌యే మమ్మల్ని మాట్లాడింపజేశాడు.”మరియు ఆయనేమిమ్మల్ని మొదటి సారి సృష్టించినవాడు, మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు. 14

41:22 – وَمَا كُنتُمْ تَسْتَتِرُونَ أَن يَشْهَدَ عَلَيْكُمْ سَمْعُكُمْ وَلَا أَبْصَارُكُمْ وَلَا جُلُودُكُمْ وَلَـٰكِن ظَنَنتُمْ أَنَّ اللَّـهَ لَا يَعْلَمُ كَثِيرًا مِّمَّا تَعْمَلُونَ ٢٢

మరియు (మీరు దుష్కార్యాలు చేసే టప్పుడు) మీ చెవుల నుండి మీ కండ్ల నుండి మరియు మీ చర్మాల నుండి – మీకు వ్యతిరేకంగా సాక్ష్యం వస్తుందేమోనని – మిమ్మల్ని మీరు దాచుకునేవారు కాదు. అంతేకాదు మీరు చేస్తున్న ఎన్నో కార్యాలు వాస్తవంగా, అల్లాహ్‌కు తెలియటంలేదని మీరు భావించేవారు.

41:23 – وَذَٰلِكُمْ ظَنُّكُمُ الَّذِي ظَنَنتُم بِرَبِّكُمْ أَرْدَاكُمْ فَأَصْبَحْتُم مِّنَ الْخَاسِرِينَ ٢٣

మరియు మీ ప్రభువు పట్ల మీరు భావించిన ఈ భావనే మిమ్మల్ని నాశనం చేసింది. కావున మీరు నష్టపోయే వారిలో చేరిపోయారు.

41:24 – فَإِن يَصْبِرُوا فَالنَّارُ مَثْوًى لَّهُمْ ۖ وَإِن يَسْتَعْتِبُوا فَمَا هُم مِّنَ الْمُعْتَبِينَ ٢٤

అప్పుడు వారు సహనం చూపినా, నరకాగ్నియే వారి నివాసస్థాన మవుతుంది. ఒక వేళ వారు (తమను తాము సరిదిద్దుకోవటానికి) అవకాశం కొరకు వేడుకున్నా వారికి అవకాశం ఇవ్వబడదు. 15 (7/8)

41:25 – وَقَيَّضْنَا لَهُمْ قُرَنَاءَ فَزَيَّنُوا لَهُم مَّا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَحَقَّ عَلَيْهِمُ الْقَوْلُ فِي أُمَمٍ قَدْ خَلَتْ مِن قَبْلِهِم مِّنَ الْجِنِّ وَالْإِنسِ ۖ إِنَّهُمْ كَانُوا خَاسِرِينَ ٢٥

  • మరియు మేము వీరికి స్నేహితులుగా (షై’తానులను) నియమించాము. వారు వీరి ముందూ వెనుకా ఉన్న వాటిని వీరికి ఆకర్షణీయ మైన వాటిగా చేశారు. కావున వీరికి పూర్వం గతించిన జిన్నాతుల మరియు మానవుల తరాల విషయంలో జరిగిన శిక్షా నిర్ణయమే, వీరి విషయంలో కూడా జరిగింది. నిశ్చయంగా, వీరే నష్టానికి గురి అయిన వారయ్యారు.

41:26 – وَقَالَ الَّذِينَ كَفَرُوا لَا تَسْمَعُوا لِهَـٰذَا الْقُرْآنِ وَالْغَوْا فِيهِ لَعَلَّكُمْ تَغْلِبُونَ ٢٦

మరియు సత్య-తిరస్కారులు (పరస్పరం) ఇలా చెప్పుకుంటారు: “ఈ ఖుర్‌ఆన్‌ను వినకండి! మరియు ఇది వినిపించబడిప్పుడు వినబడకుండా విఘ్నం కలిగించండి, బహుశా మీరు ప్రాబల్యం పొందవచ్చు!”

41:27 – فَلَنُذِيقَنَّ الَّذِينَ كَفَرُوا عَذَابًا شَدِيدًا وَلَنَجْزِيَنَّهُمْ أَسْوَأَ الَّذِي كَانُوا يَعْمَلُونَ ٢٧

కావున మేము నిశ్చయంగా, ఈ సత్య- తిరస్కారులకు కఠిన శిక్షను చవి చూపిస్తాము మరియు వారు చేస్తూ ఉండిన దుష్ట కార్యాలకు తగిన ఫలితాన్ని నొసంగుతాము.

41:28 – ذَٰلِكَ جَزَاءُ أَعْدَاءِ اللَّـهِ النَّارُ ۖ لَهُمْ فِيهَا دَارُ الْخُلْدِ ۖ جَزَاءً بِمَا كَانُوا بِآيَاتِنَا يَجْحَدُونَ ٢٨

అల్లాహ్‌ విరోధులకు దొరికే ప్రతిఫలం ఇదే – నరకాగ్ని – అందు వారి శాశ్వత గృహం ఉంటుంది. ఇది మా సూచనలను (ఆయాత్‌ లను) తిరస్కరిస్తూ వున్న దాని ప్రతిఫలం.

41:29 – وَقَالَ الَّذِينَ كَفَرُوا رَبَّنَا أَرِنَا اللَّذَيْنِ أَضَلَّانَا مِنَ الْجِنِّ وَالْإِنسِ نَجْعَلْهُمَا تَحْتَ أَقْدَامِنَا لِيَكُونَا مِنَ الْأَسْفَلِينَ ٢٩

అప్పుడా సత్య-తిరస్కారులు ఇలా అంటారు: “ఓ మా ప్రభూ! మమ్మల్ని మార్గ భ్రష్టులుగా చేసిన ఆ జిన్నాతులను మరియు మానవులను మాకు చూపించు; వారు మరింత పరాభవం పొందటానికి మేము వారిని మా పాదాల క్రింద పడవేసి త్రొక్కుతాము.” 16

41:30 – إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّـهُ ثُمَّ اسْتَقَامُوا تَتَنَزَّلُ عَلَيْهِمُ الْمَلَائِكَةُ أَلَّا تَخَافُوا وَلَا تَحْزَنُوا وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنتُمْ تُوعَدُونَ ٣٠

నిశ్చయంగా, ఎవరైతే: “అల్లాహ్‌యే మా ప్రభువు!” అని పలుకుతూ తరువాత దానిపైననే స్థిరంగా ఉంటారో! 17 వారిపై దేవదూతలు దిగి వచ్చి (ఇలా అంటారు): “మీరు భయపడకండి మరియు దుఃఖపడకండి, మీకు వాగ్దానం చేయబడిన స్వర్గపు శుభ వార్తను వినండి!

41:31 – نَحْنُ أَوْلِيَاؤُكُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ ۖ وَلَكُمْ فِيهَا مَا تَشْتَهِي أَنفُسُكُمْ وَلَكُمْ فِيهَا مَا تَدَّعُونَ ٣١

“మేము ఇహలోక జీవితంలో మరియు పరలోక జీవితంలో కూడా మీకు సన్నిహితు లముగా ఉన్నాము. మరియు మీ కొరకు అందులో మీ మనస్సులు కోరిందంతా ఉంటుంది. మరియు మీరు ఆశించేదంతా దొరుకుతుంది.

41:32 – نُزُلًا مِّنْ غَفُورٍ رَّحِيمٍ ٣٢

“ఇదంతా క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత ప్రసాదించిన ఆతిథ్యము.”

41:33 – وَمَنْ أَحْسَنُ قَوْلًا مِّمَّن دَعَا إِلَى اللَّـهِ وَعَمِلَ صَالِحًا وَقَالَ إِنَّنِي مِنَ الْمُسْلِمِينَ ٣٣

మరియు (ప్రజలను) అల్లాహ్‌ వైపునకు పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ: “నిశ్చయంగా, నేను అల్లాహ్‌కే విధేయుడను (ముస్లింను)!” అని పలికేవాని మాటకంటే మంచి మాట మరెవరిది?

41:34 – وَلَا تَسْتَوِي الْحَسَنَةُ وَلَا السَّيِّئَةُ ۚ ادْفَعْ بِالَّتِي هِيَ أَحْسَنُ فَإِذَا الَّذِي بَيْنَكَ وَبَيْنَهُ عَدَاوَةٌ كَأَنَّهُ وَلِيٌّ حَمِيمٌ ٣٤

మరియు మంచీ మరియు చెడులు సరిసమానం కాజాలవు. (చెడును) మంచితో తొలగించు; అప్పుడు నీతో విరోధమున్నవాడు కూడా తప్పక నీ ప్రాణస్నేహితు డవుతాడు. 18

41:35 – وَمَا يُلَقَّاهَا إِلَّا الَّذِينَ صَبَرُوا وَمَا يُلَقَّاهَا إِلَّا ذُو حَظٍّ عَظِيمٍ ٣٥

మరియు ఇది కేవలం సహనశీలురకు తప్ప ఇతరులకు లభించదు. మరియు ఇది 19 గొప్ప అదృష్టవంతులకు తప్ప ఇతరులకు లభించదు.

41:36 – وَإِمَّا يَنزَغَنَّكَ مِنَ الشَّيْطَانِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللَّـهِ ۖ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ ٣٦

మరియు ఒకవేళ షై’తాన్‌ నుండి నీకు ఏదైనా కలత కలిగినపుడు, నీవు అల్లాహ్‌ శరణు వేడుకో. 20 నిశ్చయంగా ఆయనే సర్వం వినేవాడు సర్వజ్ఞుడు.

41:37 – وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّـهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ ٣٧

మరియు ఆయన సూచన (ఆయాత్‌) లలో రేయింబవళ్ళు మరియు సూర్య-చంద్రు లున్నాయి. మీరు సూర్యునికి గానీ చంద్రునికి గానీ సాష్టాంగం (సజ్దా) చేయకండి, కాని కేవలం వాటిని సృష్టించిన అల్లాహ్‌కు మాత్రమే సాష్టాంగం (సజ్దా) చేయండి – నిజంగానే మీరు ఆయనను ఆరాధించే వారే అయితే.

41:38 – فَإِنِ اسْتَكْبَرُوا فَالَّذِينَ عِندَ رَبِّكَ يُسَبِّحُونَ لَهُ بِاللَّيْلِ وَالنَّهَارِ وَهُمْ لَا يَسْأَمُونَ ۩ ٣٨

ఒకవేళ వారు దురహంకారానికి పాల్పడితే! ఇక నీ ప్రభువుకు దగ్గరగా ఉన్నవారు (దేవ దూతలు) రేయింబవళ్ళు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు; మరియు వారెన్నడూ అలసట చూపరు. (సజ్దా)

41:39 – وَمِنْ آيَاتِهِ أَنَّكَ تَرَى الْأَرْضَ خَاشِعَةً فَإِذَا أَنزَلْنَا عَلَيْهَا الْمَاءَ اهْتَزَّتْ وَرَبَتْ ۚ إِنَّ الَّذِي أَحْيَاهَا لَمُحْيِي الْمَوْتَىٰ ۚ إِنَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٣٩

మరియు ఆయన సూచనలలో (ఆయాత్‌ లలో) ఒకటి: నిశ్చయంగా, నీవు భూమిని పాడునేలగా (ఎండిపోయిన బంజరునేలగా) చూస్తున్నావు; కాని మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపించ గానే, అది పులకించి, ఉబ్బిపోతుంది. నిశ్చయంగా, దీనిని (ఈ భూమిని) బ్రతికించి లేపే ఆయన (అల్లాహ్‌యే) మృతులను కూడా బ్రతికించి లేపుతాడు. నిశ్చయంగా ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు.

41:40 – إِنَّ الَّذِينَ يُلْحِدُونَ فِي آيَاتِنَا لَا يَخْفَوْنَ عَلَيْنَا ۗ أَفَمَن يُلْقَىٰ فِي النَّارِ خَيْرٌ أَم مَّن يَأْتِي آمِنًا يَوْمَ الْقِيَامَةِ ۚ اعْمَلُوا مَا شِئْتُمْ ۖ إِنَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ٤٠

నిశ్చయంగా, మా సూచనలకు వికృత అర్థం అంటగట్టే వారు మాకు కనిపించకుండా ఉండలేరు. అయితే! పునరుత్థానదినమున నరకాగ్నిలో పడ వేయ బడేవాడు ఉత్తముడా? లేక శాంతియుతంగా వచ్చేవాడా? మీరు కోరేది మీరు చేయండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా ఆయన చూస్తున్నాడు.

41:41 – إِنَّ الَّذِينَ كَفَرُوا بِالذِّكْرِ لَمَّا جَاءَهُمْ ۖ وَإِنَّهُ لَكِتَابٌ عَزِيزٌ ٤١

నిశ్చయంగా తమ దగ్గరకు హితబోధ వచ్చి నపుడు దానిని తిరస్కరించే వారే (నష్టపోయే వారు). మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్‌ఆన్‌) చాలా శక్తివంతమైన (గొప్ప) గ్రంథం;

41:42 – لَّا يَأْتِيهِ الْبَاطِلُ مِن بَيْنِ يَدَيْهِ وَلَا مِنْ خَلْفِهِ ۖ تَنزِيلٌ مِّنْ حَكِيمٍ حَمِيدٍ ٤٢

అసత్యం దాని (ఖుర్‌ఆన్‌) ముందు నుండి గానీ లేదా దాని వెనుక నుండి గానీ దానిపైకి రాజాలదు. అది మహా వివేకవంతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడు, అయిన ఆయన (అల్లాహ్‌) తరఫు నుండి అవతరింప జేయబడింది. 21

41:43 – مَّا يُقَالُ لَكَ إِلَّا مَا قَدْ قِيلَ لِلرُّسُلِ مِن قَبْلِكَ ۚ إِنَّ رَبَّكَ لَذُو مَغْفِرَةٍ وَذُو عِقَابٍ أَلِيمٍ ٤٣

(ఓ ము’హమ్మద్‌!) వాస్తవానికి, నీకు చెప్ప బడిన దానిలో పూర్వం గతించిన ప్రవక్తలకు చెప్ప బడనిది ఏదీ లేదు. 22 నిశ్చయంగా, నీ ప్రభువు మాత్రమే క్షమాశీలుడు మరియు బాధాకరమైన శిక్ష విధించేవాడు కూడాను!

41:44 – وَلَوْ جَعَلْنَاهُ قُرْآنًا أَعْجَمِيًّا لَّقَالُوا لَوْلَا فُصِّلَتْ آيَاتُهُ ۖ أَأَعْجَمِيٌّ وَعَرَبِيٌّ ۗ قُلْ هُوَ لِلَّذِينَ آمَنُوا هُدًى وَشِفَاءٌ ۖ وَالَّذِينَ لَا يُؤْمِنُونَ فِي آذَانِهِمْ وَقْرٌ وَهُوَ عَلَيْهِمْ عَمًى ۚ أُولَـٰئِكَ يُنَادَوْنَ مِن مَّكَانٍ بَعِيدٍ ٤٤

ఒకవేళ మేము ఈ ఖుర్‌ఆన్‌ను అరబ్బేతర భాషలో అవతరింపజేసి ఉండినట్లైతే వారు ఇలా అని ఉండేవారు: “దీని సూచనలు (ఆయాత్‌) స్పష్టంగా ఎందుకు వివరించబడలేదు? 23 (గ్రంథమేమో) అరబ్బేతర భాషలో మరియు (సందేశహరుడేమో) అరబ్బు?” వారితో ఇలా అను: “ఇది (ఈ ఖుర్‌ఆన్‌) విశ్వసించిన వారికి మార్గదర్శకత్వం మరియు స్వస్థత నొసంగేది. మరియు విశ్వసించని వారి చెవులకు అవరోధం మరియు వారి కళ్ళకు ఒక గంత. అలాంటివారి స్థితి ఎంతో దూరం నుండి పిలువబడిన వారి అరుపులాంటిది!”

41:45 – وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ فَاخْتُلِفَ فِيهِ ۗ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ لَقُضِيَ بَيْنَهُمْ ۚ وَإِنَّهُمْ لَفِي شَكٍّ مِّنْهُ مُرِيبٍ ٤٥

వాస్తవానికి మేము మూసాకు గ్రంథాన్ని ప్రసా దించాము, కాని దాని విషయంలో కూడా భేదాభి ప్రాయాలు వచ్చాయి. ఒకవేళ నీ ప్రభువు నుండి, మొదటి నుంచే నిర్ణయం తీసుకోబడి ఉండక పోతే, 24 వారి మధ్య ఎప్పుడో తీర్పు జరిగివుండేది. మరియు నిశ్చయంగా, వారు దానిని గురించి ఆందోళన కలిగించే సందేహానికి గురి అయ్యారు.

41:46 – مَّنْ عَمِلَ صَالِحًا فَلِنَفْسِهِ ۖ وَمَنْ أَسَاءَ فَعَلَيْهَا ۗ وَمَا رَبُّكَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ ٤٦

ఎవడైతే సత్కార్యం చేస్తాడో అతడు తన (మేలు) కొరకే చేస్తాడు. మరియు దుష్కార్యం చేసే వాడు దాని (ఫలితాన్ని) అనుభవిస్తాడు. మరియు నీ ప్రభువు తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు.

41:47 – إِلَيْهِ يُرَدُّ عِلْمُ السَّاعَةِ ۚ وَمَا تَخْرُجُ مِن ثَمَرَاتٍ مِّنْ أَكْمَامِهَا وَمَا تَحْمِلُ مِنْ أُنثَىٰ وَلَا تَضَعُ إِلَّا بِعِلْمِهِ ۚ وَيَوْمَ يُنَادِيهِمْ أَيْنَ شُرَكَائِي قَالُوا آذَنَّاكَ مَا مِنَّا مِن شَهِيدٍ ٤٧

[(*)] ఆ (అంతిమ) ఘడియ జ్ఞానం కేవలం ఆయనకే చెందినది. 25 మరియు ఆయనకు తెలియ కుండా ఫలాలు పుష్పకోశాల 26 నుండి బయటికిరావు మరియు ఆయనకు తెలియ కుండా ఏ స్త్రీ కూడా గర్భం దాల్చదు మరియు ప్రసవించదు. మరియు ఏ దినమునైతే వారిని పిలిచి: “మీరు నాకు సాటికల్పించే ఆ భాగ-స్వాములు ఎక్కడున్నారు?” అని అడిగితే, వారు ఇలా జవాబిస్తారు: “మాలో ఎవ్వడు కూడా దీనికి సాక్ష్యం ఇచ్చేవాడులేడని మేము ఇదివరకే మనవి చేసుకున్నాము!”

41:48 – وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَدْعُونَ مِن قَبْلُ ۖ وَظَنُّوا مَا لَهُم مِّن مَّحِيصٍ ٤٨

మరియు వారు ఇంతకు పూర్వం ఆరాధించే వారంతా వారిని త్యజించి ఉంటారు. మరియు తమకు తప్పించుకునే మార్గం లేదని వారు గ్రహిస్తారు. 27

41:49 – لَّا يَسْأَمُ الْإِنسَانُ مِن دُعَاءِ الْخَيْرِ وَإِن مَّسَّهُ الشَّرُّ فَيَئُوسٌ قَنُوطٌ ٤٩

మానవుడు మేలుకొరకు ప్రార్థిస్తూ ఎన్నడూ అలసి పోడు. కాని ఒకవేళ అతనికి ఏదైనా ఆపద కలిగితే, అతడు ఆశవదలి నిరాశచెందుతాడు. 28

41:50 – وَلَئِنْ أَذَقْنَاهُ رَحْمَةً مِّنَّا مِن بَعْدِ ضَرَّاءَ مَسَّتْهُ لَيَقُولَنَّ هَـٰذَا لِي وَمَا أَظُنُّ السَّاعَةَ قَائِمَةً وَلَئِن رُّجِعْتُ إِلَىٰ رَبِّي إِنَّ لِي عِندَهُ لَلْحُسْنَىٰ ۚ فَلَنُنَبِّئَنَّ الَّذِينَ كَفَرُوا بِمَا عَمِلُوا وَلَنُذِيقَنَّهُم مِّنْ عَذَابٍ غَلِيظٍ ٥٠

మరియు ఒకవేళ మేము అతనికి ఆపద కాలం దాటి పోయిన తర్వాత మా కారుణ్యాన్ని రుచిచూపిస్తే అతడు తప్పకుండా ఇలా అంటాడు: “ఇది నా హక్కే! మరియు పునరుత్థానదినం వస్తుందని నేను భావించను. మరియు ఒకవేళ నేను నా ప్రభువు వద్దకు మరలింపబడినా! నిశ్చయంగా, నాకు ఆయన దగ్గర మేలే ఉంటుంది.” కాని మేము సత్య-తిస్కారులకు వారు చేసిన కర్మలను గురించి వారికి తప్పక తెలుపుతాము మరియు వారికి భయంకరమైన శిక్షను రుచిచూపిస్తాము.

41:51 – وَإِذَا أَنْعَمْنَا عَلَى الْإِنسَانِ أَعْرَضَ وَنَأَىٰ بِجَانِبِهِ وَإِذَا مَسَّهُ الشَّرُّ فَذُو دُعَاءٍ عَرِيضٍ ٥١

మరియు ఒకవేళ మేము మానవుణ్ణి అనుగ్రహిస్తే, అతడు మా నుండి విముఖుడై ప్రక్కకు మరలిపోతాడు. మరియు ఒకవేళ తనకు ఆపద వస్తే సుదీర్ఘమైన ప్రార్థనలు చేస్తాడు.

41:52 – قُلْ أَرَأَيْتُمْ إِن كَانَ مِنْ عِندِ اللَّـهِ ثُمَّ كَفَرْتُم بِهِ مَنْ أَضَلُّ مِمَّنْ هُوَ فِي شِقَاقٍ بَعِيدٍ ٥٢

ఇలా అను: “ఏమీ? మీరు ఆలోచించారా? ఒకవేళ ఇది (ఈ ఖుర్‌ఆన్‌) అల్లాహ్‌ తరఫు నుండి వచ్చిఉండి మీరు దానిని తిరస్కరిస్తే, దానిని వ్యతిరేకించటంలో చాలాదూరం పోయిన వాని కంటే ఎక్కువ మార్గభ్రష్టుడెవడు?”

41:53 – سَنُرِيهِمْ آيَاتِنَا فِي الْآفَاقِ وَفِي أَنفُسِهِمْ حَتَّىٰ يَتَبَيَّنَ لَهُمْ أَنَّهُ الْحَقُّ ۗ أَوَلَمْ يَكْفِ بِرَبِّكَ أَنَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ ٥٣

ఇక త్వరలోనే మేము వారికి మా సంకేతా లను (ఆయాత్‌లను), వారి చుట్టూ ఉన్న ఖగో ళంలో 29 మరియు వారియందును చూపుతాము; చివరకు ఇదే (ఈ ఖుర్‌ఆనే) సత్యమని వారికి స్పష్టమవుతుంది. ఏమీ? నీ ప్రభువు! నిశ్చయంగా ఆయనే ప్రతిదానికి సాక్షి, అనే విషయం చాలదా?

41:54 – أَلَا إِنَّهُمْ فِي مِرْيَةٍ مِّن لِّقَاءِ رَبِّهِمْ ۗ أَلَا إِنَّهُ بِكُلِّ شَيْءٍ مُّحِيطٌ ٥٤

అది కాదు! నిశ్చయంగా, వారు తమ ప్రభువును కలుసుకునే విషయం పట్ల సందేహంలో పడివున్నారు. జాగ్రత్త! నిశ్చయంగా, ఆయన ప్రతిదానిని ఆవరించి ఉన్నాడు.

సూరహ్‌ అష్‌-షూరా – అష్‌-షూరా: సలహా. వ’హీ దివ్యజ్ఞాన అవతరణ సత్యమని ఈ సూరహ్‌ మొదటి మరియు చివరి ఆయతులలో విశదీకరించబడింది. ప్రవక్తలందరూ ఒకేఒక్క సత్యప్రచారం చేశారు. అంటే అల్లాహ్‌ (సు.త.) ఉన్నాడు. ఆయనే! ఒకేఒక్క ఆరాధ్యుడు మరియు ప్రభువు. ఆయనను పోలినది విశ్వంలో ఏదీలేదు. ఆయనను దేనితోనూ పోల్చలేము. ఆయన వివరణకు అతీతుడు. ఆయన తనసృష్టిపై కారణ-పరిణామాల శాసనాన్ని విధించాడు. కావున మానవుడు ఈ జీవితంలో చేసిన దాని ఫలితాన్నే వచ్చే (పరలోక) జీవితంలో అనుభవిస్తాడు. ఈ అనుక్రమంలోని 7 సూరహ్ లలో ఇది 3వది. మక్కహ్లో అవతరింపజేయబడింది. ఇందులో 53 ఆయతులు ఉన్నాయి. దీని పేరు 38వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 42:1 – حم ١

‘హా-మీమ్‌.

42:2 – عسق ٢

‘ఐన్‌-సీన్‌-ఖాఫ్‌.

42:3 – كَذَٰلِكَ يُوحِي إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ اللَّـهُ الْعَزِيزُ الْحَكِيمُ ٣

(ఓ ము’హమ్మద్‌!) సర్వ శక్తిమంతుడూ, మహావివేకవంతుడూ అయిన అల్లాహ్‌ ఇదే విధంగా నీకూ మరియు నీ కంటే ముందు వచ్చిన వారికి కూడా దివ్యజ్ఞానం (వ’హీ) అవతరింపజేశాడు. 1

42:4 – لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ ٤

ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకు చెందినదే. ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు.

42:5 – تَكَادُ السَّمَاوَاتُ يَتَفَطَّرْنَ مِن فَوْقِهِنَّ ۚ وَالْمَلَائِكَةُ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَيَسْتَغْفِرُونَ لِمَن فِي الْأَرْضِ ۗ أَلَا إِنَّ اللَّـهَ هُوَ الْغَفُورُ الرَّحِيمُ ٥

ఆకాశాలు పైనుండి దాదాపు ప్రేలిపోనున్నాయి. మరియు దేవదూతలు తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ ఉన్నారు మరియు భూమిలో ఉన్న వారికొరకు క్షమాపణ కోరుతున్నారు. చూడండి, నిశ్చయంగా అల్లాహ్‌! ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

42:6 – وَالَّذِينَ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ اللَّـهُ حَفِيظٌ عَلَيْهِمْ وَمَا أَنتَ عَلَيْهِم بِوَكِيلٍ ٦

మరియు ఎవరైతే ఆయనను వదలి ఇతరులను తమ సంరక్షకులుగా చేసుకుంటారో, వారిని అల్లాహ్‌ కనిపెట్టుకొని ఉన్నాడు. మరియు నీవు వారికి బాధ్యుడవుకావు. 2

42:7 – وَكَذَٰلِكَ أَوْحَيْنَا إِلَيْكَ قُرْآنًا عَرَبِيًّا لِّتُنذِرَ أُمَّ الْقُرَىٰ وَمَنْ حَوْلَهَا وَتُنذِرَ يَوْمَ الْجَمْعِ لَا رَيْبَ فِيهِ ۚ فَرِيقٌ فِي الْجَنَّةِ وَفَرِيقٌ فِي السَّعِيرِ ٧

మరియు ఈవిధంగా మేమునీపై ఈ ఖుర్‌ఆన్‌ ను, అరబ్బీ భాషలో, దివ్యజ్ఞానం (వ’హీ) ద్వారా అవతరింపజేశాము. 3 దానితో నీవు ఉమ్ముల్‌-ఖురా (మక్కహ్) 4 మరియు దాని చుట్టుప్రక్కల వారిని హెచ్చరించటానికి మరియు – దానిని గురించి ఎలాంటి సందేహంలేని – ఆ సమావేశ దినాన్ని గురించి హెచ్చరించేందుకు కూడా. 5 (ఆ రోజు) ఒక వర్గం వారు స్వర్గానికి పోతారు, మరొక వర్గం వారు మండే నరకాగ్నిలోకి పోతారు.

42:8 – وَلَوْ شَاءَ اللَّـهُ لَجَعَلَهُمْ أُمَّةً وَاحِدَةً وَلَـٰكِن يُدْخِلُ مَن يَشَاءُ فِي رَحْمَتِهِ ۚ وَالظَّالِمُونَ مَا لَهُم مِّن وَلِيٍّ وَلَا نَصِيرٍ ٨

మరియు ఒకవేళ అల్లాహ్‌ కోరితే వారందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు! 6 కాని ఆయన తాను కోరిన వారిని తన కరుణకుపాత్రులుగా చేసు కుంటాడు. 7 మరియు దుర్మార్గులకొరకు, రక్షించే వాడుగానీ సహాయ పడేవాడుగానీ ఎవ్వడూఉండడు.

42:9 – أَمِ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۖ فَاللَّـهُ هُوَ الْوَلِيُّ وَهُوَ يُحْيِي الْمَوْتَىٰ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٩

లేక, వారు ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నారా? కానీ అల్లాహ్‌! కేవలం ఆయనే సంరక్షకుడు మరియు ఆయనే మృతులను బ్రతికించేవాడు మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్థుడు.

42:10 – وَمَا اخْتَلَفْتُمْ فِيهِ مِن شَيْءٍ فَحُكْمُهُ إِلَى اللَّـهِ ۚ ذَٰلِكُمُ اللَّـهُ رَبِّي عَلَيْهِ تَوَكَّلْتُ وَإِلَيْهِ أُنِيبُ ١٠

మరియు మీరు ఏ విషయాన్ని గురించి భేదాభిప్రాయాలు కలిగివున్నారో, దాని తీర్పు అల్లాహ్‌ వద్దనే ఉంది. 8 ఆయనే అల్లాహ్‌! నా ప్రభువు, నేను ఆయననే నమ్ముకున్నాను మరియు నేను పశ్చాత్తాపంతో ఆయన వైపునకే మరలుతాను.

42:11 – فَاطِرُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ جَعَلَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَاجًا وَمِنَ الْأَنْعَامِ أَزْوَاجًا ۖ يَذْرَؤُكُمْ فِيهِ ۚ لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ ۖ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ ١١

ఆయనే ఆకాశాలు మరియు భూమి యొక్క సృష్టికి మూలాధారి. ఆయన మీలోనుండే మీకొరకు జంటల్ని మరియు పశువులలో కూడా జంటల్ని చేశాడు. 9 ఈవిధంగా ఆయన మిమ్మల్ని వ్యాపింపజేస్తున్నాడు. ఆయనకు పోలింది ఏదీలేదు. 10 మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.

42:12 – لَهُ مَقَالِيدُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ١٢

ఆకాశాలయొక్క మరియు భూమియొక్క తాళపుచెవులు ఆయనవద్దనే ఉన్నాయి. ఆయన తాను కోరిన వానికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు (తాను కోరిన వానికి) దానిని మితంగా ఇస్తాడు. నిశ్చయంగా, ఆయనకు ప్రతి దానిని గురించి బాగా తెలుసు. (1/8)

42:13 – شَرَعَ لَكُم مِّنَ الدِّينِ مَا وَصَّىٰ بِهِ نُوحًا وَالَّذِي أَوْحَيْنَا إِلَيْكَ وَمَا وَصَّيْنَا بِهِ إِبْرَاهِيمَ وَمُوسَىٰ وَعِيسَىٰ ۖ أَنْ أَقِيمُوا الدِّينَ وَلَا تَتَفَرَّقُوا فِيهِ ۚ كَبُرَ عَلَى الْمُشْرِكِينَ مَا تَدْعُوهُمْ إِلَيْهِ ۚ اللَّـهُ يَجْتَبِي إِلَيْهِ مَن يَشَاءُ وَيَهْدِي إِلَيْهِ مَن يُنِيبُ ١٣

  • ఆయన, నూ’హ్‌కు విధించిన (ఇస్లాం) ధర్మాన్నే, మీకొరకు శాసించాడు; మరియు దానినే (ఓ ము’హమ్మద్‌!) మేము నీకు దివ్యజ్ఞానం (వ’హీ) ద్వారా అవతరింపజేశాము; మరియు మేము దానినే ఇబ్రాహీమ్‌, మూసా మరియు ‘ఈసా లకు కూడా విధిగా జేశాము. ఈ ధర్మాన్నే స్థాపించాలని 11 మరియు దానిని గురించి భేదాభి ప్రాయాలకు గురికాకుండా ఉండాలని. నీవు దాని వైపునకు పిలిచేది బహుదైవారాధకులకు ఎంతో సహింపలేనిదిగా ఉంది. అల్లాహ్‌ తాను కోరిన వానిని తన వైపునకు ఆకర్షిస్తాడు మరియు పశ్చాత్తాపంతో తన వైపునకు మరలే వానికి మార్గదర్శకత్వం చేస్తాడు. 12

42:14 – وَمَا تَفَرَّقُوا إِلَّا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْعِلْمُ بَغْيًا بَيْنَهُمْ ۚ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى لَّقُضِيَ بَيْنَهُمْ ۚ وَإِنَّ الَّذِينَ أُورِثُوا الْكِتَابَ مِن بَعْدِهِمْ لَفِي شَكٍّ مِّنْهُ مُرِيبٍ ١٤

మరియు వారి వద్దకు (సత్య) జ్ఞానం వచ్చిన తరువాతనే – వారి పరస్పర ద్వేషంవల్ల – వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. మరియు ఒక నిర్ణీత కాలపు వాగ్దానం నీ ప్రభువు తరఫు నుండి చేయబడి ఉండకపోతే, వారిమధ్య తీర్పు ఎప్పుడో జరిగి ఉండేది. 13 మరియు నిశ్చయంగా, వారి తర్వాత గ్రంథాన్ని వారసత్వంలో పొందిన వారు దానిని (ఇస్లాంను) గురించి గొప్ప సంశయంలో పడిఉన్నారు.

42:15 – فَلِذَٰلِكَ فَادْعُ ۖ وَاسْتَقِمْ كَمَا أُمِرْتَ ۖ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ ۖ وَقُلْ آمَنتُ بِمَا أَنزَلَ اللَّـهُ مِن كِتَابٍ ۖ وَأُمِرْتُ لِأَعْدِلَ بَيْنَكُمُ ۖ اللَّـهُ رَبُّنَا وَرَبُّكُمْ ۖ لَنَا أَعْمَالُنَا وَلَكُمْ أَعْمَالُكُمْ ۖ لَا حُجَّةَ بَيْنَنَا وَبَيْنَكُمُ ۖ اللَّـهُ يَجْمَعُ بَيْنَنَا ۖ وَإِلَيْهِ الْمَصِيرُ ١٥

కావున నీవు (ఓ ము’హమ్మద్‌!) దీని (ఈ సత్య ధర్మం) వైపునకే వారిని పిలువు. మరియు నీకు ఆజ్ఞాపించబడిన విధంగా దానిపై స్థిరంగా ఉండు. మరియు వారి కోరికలను అనుసరించకు. మరియు వారితో ఇలా అను: “అల్లాహ్‌ అవత రింపజేసిన గ్రంథాన్నే నేనువిశ్వసించాను. మరియు మీ మధ్య న్యాయం చేయమని నేను ఆజ్ఞాపించ బడ్డాను. అల్లాహ్‌యే మా ప్రభువు! మరియు మీ ప్రభువు కూడాను, మా కర్మలు మాకూ మరియు మీ కర్మలు మీకూ. మా మధ్య మరియు మీ మధ్య ఎలాంటి వివాదం ఉండనవసరం లేదు. అల్లాహ్‌ మనందరినీ సమావేశపరుస్తాడు. మరియు ఆయనవైపే (మనందరి) గమ్యస్థానముంది.”

42:16 – وَالَّذِينَ يُحَاجُّونَ فِي اللَّـهِ مِن بَعْدِ مَا اسْتُجِيبَ لَهُ حُجَّتُهُمْ دَاحِضَةٌ عِندَ رَبِّهِمْ وَعَلَيْهِمْ غَضَبٌ وَلَهُمْ عَذَابٌ شَدِيدٌ ١٦

మరియు అల్లాహ్‌ సందేశం స్వీకరించిన తర్వాత, (స్వీకరించినవారితో) ఆయననుగురించి ఎవరు వాదిస్తారో, వారి వాదం వారి ప్రభువు సన్నిధిలో నిరర్థకమైనది; మరియు వారిపై ఆయన (అల్లాహ్‌) ఆగ్రహం విరుచుకు పడుతుంది మరియు వారికి కఠిన శిక్ష పడుతుంది.

42:17 – اللَّـهُ الَّذِي أَنزَلَ الْكِتَابَ بِالْحَقِّ وَالْمِيزَانَ ۗ وَمَا يُدْرِيكَ لَعَلَّ السَّاعَةَ قَرِيبٌ ١٧

అల్లాహ్‌యే సత్యంతో గ్రంథాన్ని 14 మరియు (న్యాయానికి) త్రాసును 15 అవతరింప జేశాడు. మరి నీవు ఏవిధంగా గ్రహించగలవు. బహుశా తీర్పుగడియ సమీపంలోనే ఉండవచ్చు!

42:18 – يَسْتَعْجِلُ بِهَا الَّذِينَ لَا يُؤْمِنُونَ بِهَا ۖ وَالَّذِينَ آمَنُوا مُشْفِقُونَ مِنْهَا وَيَعْلَمُونَ أَنَّهَا الْحَقُّ ۗ أَلَا إِنَّ الَّذِينَ يُمَارُونَ فِي السَّاعَةِ لَفِي ضَلَالٍ بَعِيدٍ ١٨

దానిని నమ్మనివారే దాని కొరకు తొందర పెడతారు. మరియు విశ్వసించిన వారు, దానిని గురించి భయపడతారు మరియు అది రావటం నిశ్చయంగా, సత్యమేనని తెలుసుకుంటారు. వినండి! నిశ్చయంగా ఎవరైతే తీర్పుఘడియను గురించి వాదులాడుతారో, వారు మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినవారే!

42:19 – اللَّـهُ لَطِيفٌ بِعِبَادِهِ يَرْزُقُ مَن يَشَاءُ ۖ وَهُوَ الْقَوِيُّ الْعَزِيزُ ١٩

అల్లాహ్‌ తన దాసుల పట్ల ఎంతో మృదు హృదయుడు; ఆయన తాను కోరిన వారికి జీవనోపాధిని ప్రసాదిస్తాడు. మరియు ఆయన మహా బలవంతుడు, సర్వ శక్తిసంపన్నుడు.

42:20 – مَن كَانَ يُرِيدُ حَرْثَ الْآخِرَةِ نَزِدْ لَهُ فِي حَرْثِهِ ۖ وَمَن كَانَ يُرِيدُ حَرْثَ الدُّنْيَا نُؤْتِهِ مِنْهَا وَمَا لَهُ فِي الْآخِرَةِ مِن نَّصِيبٍ ٢٠

ఎవడు పరలోక ఫలాన్ని కోరుకుంటాడో మేము అతనికి అతని ఫలంలో వృధ్ధికలిగిస్తాము. 16 మరియు ఎవడైతే ఇహలోక ఫలాన్ని కోరుకుంటాడో, మేము అతనికి దాని నొసంగు తాము మరియు అతనికి పరలోక (ప్రతిఫలంలో) ఎలాంటి భాగముండదు. 17

42:21 – أَمْ لَهُمْ شُرَكَاءُ شَرَعُوا لَهُم مِّنَ الدِّينِ مَا لَمْ يَأْذَن بِهِ اللَّـهُ ۚ وَلَوْلَا كَلِمَةُ الْفَصْلِ لَقُضِيَ بَيْنَهُمْ ۗ وَإِنَّ الظَّالِمِينَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ ٢١

ఏమీ? అల్లాహ్‌ అనుమతించని ధర్మాన్ని వారికొరకు విధించగల, ఆయన భాగస్వాములు ఎవరైనా వారి దగ్గర ఉన్నారా? ఒకవేళ తీర్పు దినపు వాగ్దానం ముందే చేయబడి ఉండకపోతే, వారి మధ్య తీర్పు ఎప్పుడో జరిగి వుండేదే. మరియు నిశ్చయంగా, ఈ దుర్మార్గులకు బాధా కరమైన శిక్ష పడుతుంది.

42:22 – تَرَى الظَّالِمِينَ مُشْفِقِينَ مِمَّا كَسَبُوا وَهُوَ وَاقِعٌ بِهِمْ ۗ وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فِي رَوْضَاتِ الْجَنَّاتِ ۖ لَهُم مَّا يَشَاءُونَ عِندَ رَبِّهِمْ ۚ ذَٰلِكَ هُوَ الْفَضْلُ الْكَبِيرُ ٢٢

ఈ దుర్మార్గులు (పునరుత్థాన దినాన) తాము చేసిన కర్మల ఫలితాన్ని చూసి భయపడ టాన్ని, నీవు చూస్తావు మరియు అది వారిపై తప్పక పడుతుంది. మరియు ఎవ రైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారు స్వర్గపు పచ్చిక మైదానాలలో ఉంటారు. వారికి తాము కోరేదంతా తమ ప్రభువు తరఫు నుండి లభిస్తుంది. అదే ఆ గొప్ప అనుగ్రహం.

42:23 – ذَٰلِكَ الَّذِي يُبَشِّرُ اللَّـهُ عِبَادَهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۗ قُل لَّا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا إِلَّا الْمَوَدَّةَ فِي الْقُرْبَىٰ ۗ وَمَن يَقْتَرِفْ حَسَنَةً نَّزِدْ لَهُ فِيهَا حُسْنًا ۚ إِنَّ اللَّـهَ غَفُورٌ شَكُورٌ ٢٣

ఆ (స్వర్గపు) శుభవార్తనే, అల్లాహ్‌ విశ్వసించి సత్కార్యాలు చేసే తన దాసులకు తెలియజేస్తున్నాడు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: “నేను దీనికి బదులుగా మీ నుండి బంధుత్వ ప్రేమ తప్ప వేరే ప్రతిఫలాన్ని కోరడం లేదు!” 18 మరియు ఎవడు మంచిని సంపాదించు కుంటాడో, అతనికి దానిలో మేము మరింత మంచిని పెంచుతాము. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, కృతజ్ఞతలను ఆమోదించేవాడు.

42:24 – أَمْ يَقُولُونَ افْتَرَىٰ عَلَى اللَّـهِ كَذِبًا ۖ فَإِن يَشَإِ اللَّـهُ يَخْتِمْ عَلَىٰ قَلْبِكَ ۗ وَيَمْحُ اللَّـهُ الْبَاطِلَ وَيُحِقُّ الْحَقَّ بِكَلِمَاتِهِ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ٢٤

ఏమీ? వారు: “అతను (ము’హమ్మద్‌!) అల్లాహ్‌ పేరుతో అసత్యాలుకల్పిస్తున్నాడు.”అని అంటున్నారా? కానిఒకవేళ అల్లాహ్‌ తలచుకుంటే నీహృదయంమీద ముద్రవేసేవాడు. మరియు అల్లాహ్‌ అసత్యాన్ని రూపుమాపి, తన ఆజ్ఞతో సత్యాన్ని స్థాపిస్తాడు. 19 నిశ్చయంగా, ఆయనకు హృదయాలలో ఉన్నదంతా బాగా తెలుసు.

42:25 – وَهُوَ الَّذِي يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهِ وَيَعْفُو عَنِ السَّيِّئَاتِ وَيَعْلَمُ مَا تَفْعَلُونَ ٢٥

ఆయనే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీక రించే వాడు. మరియు పాపాలనుమన్నించే వాడు. మరియు మీరుచేసేదంతా ఆయనకుబాగాతెలుసు.

42:26 – وَيَسْتَجِيبُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَيَزِيدُهُم مِّن فَضْلِهِ ۚ وَالْكَافِرُونَ لَهُمْ عَذَابٌ شَدِيدٌ ٢٦

మరియు ఆయన విశ్వసించి, సత్కార్యాలు చేసేవారి ప్రార్థనలను అంగీకరిస్తాడు మరియు వారిపై తన అనుగ్రహాన్ని మరింత అధికం చేస్తాడు. ఇక సత్య-తిరస్కారులు! వారికి కఠినశిక్ష పడుతుంది. (1/4)

42:27 – وَلَوْ بَسَطَ اللَّـهُ الرِّزْقَ لِعِبَادِهِ لَبَغَوْا فِي الْأَرْضِ وَلَـٰكِن يُنَزِّلُ بِقَدَرٍ مَّا يَشَاءُ ۚ إِنَّهُ بِعِبَادِهِ خَبِيرٌ بَصِيرٌ ٢٧

  • మరియు ఒకవేళ అల్లాహ్‌ తన దాసు లందరికీ పుష్కలంగా జీవనోపాధినిప్రసాదించి ఉంటే వారు భూమిలో తిరుగుబాటుకు పాల్పడేవారు. కావున ఆయన తన ఇష్టప్రకారం, మితంగా ఇస్తాడు. నిశ్చయంగా, ఆయన తన దాసులను గురించి బాగా ఎరుగును, ఆయన అంతా చూస్తున్నాడు!

42:28 – وَهُوَ الَّذِي يُنَزِّلُ الْغَيْثَ مِن بَعْدِ مَا قَنَطُوا وَيَنشُرُ رَحْمَتَهُ ۚ وَهُوَ الْوَلِيُّ الْحَمِيدُ ٢٨

మరియు ఆయనే, వారు నిరాశకులోనై ఉన్నప్పుడు వర్షాన్ని కురిపిస్తాడు మరియు తన కారుణ్యాన్ని వ్యాపింపజేస్తాడు. మరియు ఆయనే సంరక్షకుడు, ప్రశంసనీయుడు.

42:29 – وَمِنْ آيَاتِهِ خَلْقُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَثَّ فِيهِمَا مِن دَابَّةٍ ۚ وَهُوَ عَلَىٰ جَمْعِهِمْ إِذَا يَشَاءُ قَدِيرٌ ٢٩

మరియు ఆయన సూచన (ఆయాత్‌) లలో ఆకాశాలను మరియు భూమిని మరియు వాటిలో వ్యాపింపజేసిన జీవరాసులను సృష్టించటం కూడా ఉంది. మరియు ఆయన తాను కోరినప్పుడు వాటి నన్నింటినీ సమీకరించగల సమర్థుడు.

42:30 – وَمَا أَصَابَكُم مِّن مُّصِيبَةٍ فَبِمَا كَسَبَتْ أَيْدِيكُمْ وَيَعْفُو عَن كَثِيرٍ ٣٠

మీపై ఏ ఆపద వచ్చినా, అది మీ చేతులారా మీరు సంపాదించుకున్నదే! మరియు ఆయన (మీతప్పులను) ఎన్నింటినో క్షమిస్తాడు. 20

42:31 – وَمَا أَنتُم بِمُعْجِزِينَ فِي الْأَرْضِ ۖ وَمَا لَكُم مِّن دُونِ اللَّـهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ ٣١

మరియు మీరు భూమిలో ఆయన నుంచి తప్పించుకోలేరు. మరియు మీకు అల్లాహ్‌ తప్ప మరొక సంరక్షకుడుగానీ సహాయకుడు గానీ లేడు!

42:32 – وَمِنْ آيَاتِهِ الْجَوَارِ فِي الْبَحْرِ كَالْأَعْلَامِ ٣٢

మరియు ఆయన సూచనలలో (ఆయాత్‌ లలో) సముద్రంలో, కొండల మాదిరిగా పయనించే ఓడలు కూడా ఉన్నాయి.

42:33 – إِن يَشَأْ يُسْكِنِ الرِّيحَ فَيَظْلَلْنَ رَوَاكِدَ عَلَىٰ ظَهْرِهِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُورٍ ٣٣

ఒకవేళ ఆయన కోరితే గాలిని ఆపగలడు అప్పుడవి దాని (సముద్రపు) వీపుమీద నిలిచి పోతాయి. నిశ్చయంగా, ఇందులో సహనం గల వానికి, కృతజ్ఞునికి ఎన్నో సూచనలున్నాయి.

42:34 – أَوْ يُوبِقْهُنَّ بِمَا كَسَبُوا وَيَعْفُ عَن كَثِيرٍ ٣٤

లేదా ఆయన వారి కర్మల ఫలితంగా వారిని (ముంచి) నాశనం చేయవచ్చు, కాని ఆయన ఎన్నింటినో క్షమిస్తాడు కూడాను.

42:35 – وَيَعْلَمَ الَّذِينَ يُجَادِلُونَ فِي آيَاتِنَا مَا لَهُم مِّن مَّحِيصٍ ٣٥

మరియు మా సూచనలను (ఆయాత్‌ లను) గురించి వాదులాడేవారు, తమకు తప్పించుకునే చోటు లేదని తెలుసుకుంటారు. 21

42:36 – فَمَا أُوتِيتُم مِّن شَيْءٍ فَمَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا ۖ وَمَا عِندَ اللَّـهِ خَيْرٌ وَأَبْقَىٰ لِلَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ ٣٦

కావున మీకు ఇవ్వబడిందంతా ప్రాపంచిక జీవితపు సుఖసంతోషమే. కనుక అల్లాహ్‌ వద్ద నున్నదే – విశ్వసించి తమ ప్రభువునే నమ్ము కున్న వారి కొరకు – ఉత్తమమైనదీ మరియు శాశ్వతమైనదీను. 22

42:37 – وَالَّذِينَ يَجْتَنِبُونَ كَبَائِرَ الْإِثْمِ وَالْفَوَاحِشَ وَإِذَا مَا غَضِبُوا هُمْ يَغْفِرُونَ ٣٧

మరియు అలాంటి వారు పెద్ద పాపాలు మరియు అశ్లీలమైన పనులకు దూరంగా ఉంటారు మరియు కోపం వచ్చినా క్షమిస్తారు; 23

42:38 – وَالَّذِينَ اسْتَجَابُوا لِرَبِّهِمْ وَأَقَامُوا الصَّلَاةَ وَأَمْرُهُمْ شُورَىٰ بَيْنَهُمْ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ ٣٨

మరియు అలాంటివారు తమ ప్రభువు ఆజ్ఞాపాలన చేస్తారు మరియు నమా’జ్‌ను స్థాపిస్తారు 24 మరియు తమ వ్యవహారాలను పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించు కుంటారు 25 మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఇతరుల మీద ఖర్చుచేస్తారు;

42:39 – وَالَّذِينَ إِذَا أَصَابَهُمُ الْبَغْيُ هُمْ يَنتَصِرُونَ ٣٩

మరియు అలాంటి వారు తమపై దౌర్జన్యం జరిగినపుడు దానికి న్యాయ ప్రతీకారం మాత్రమే చేస్తారు. 26

42:40 – وَجَزَاءُ سَيِّئَةٍ سَيِّئَةٌ مِّثْلُهَا ۖ فَمَنْ عَفَا وَأَصْلَحَ فَأَجْرُهُ عَلَى اللَّـهِ ۚ إِنَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ ٤٠

మరియు కీడుకు ప్రతీకారం దానంతటి కీడు మాత్రమే. కాని ఎవడైనా క్షమించి సంధి చేసుకుంటే అతని ప్రతిఫలం అల్లాహ్‌ దగ్గర ఉంది. నిశ్చ యంగా, ఆయన దుర్మార్గులంటే ఇష్టపడడు. 27

42:41 – وَلَمَنِ انتَصَرَ بَعْدَ ظُلْمِهِ فَأُولَـٰئِكَ مَا عَلَيْهِم مِّن سَبِيلٍ ٤١

కాని ఎవరైనా తమకు అన్యాయం జరిగి నప్పుడు దానికితగినంత న్యాయ ప్రతీకారం మాత్ర మే తీసుకుంటే అలాంటివారు నిందార్హులుకారు.

42:42 – إِنَّمَا السَّبِيلُ عَلَى الَّذِينَ يَظْلِمُونَ النَّاسَ وَيَبْغُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ ۚ أُولَـٰئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ ٤٢

కాని, వాస్తవానికి ఎవరైతే ప్రజలపై దౌర్జన్యా లు చేస్తారో మరియు భూమిలో అన్యాయంగా ఉప ద్రవాలు రేకెత్తిస్తారో అలాంటివారు నిందార్హులు. అలాంటివారు, వారికే! బాధాకరమైన శిక్షగలదు.

42:43 – إِنَّمَا السَّبِيلُ عَلَى الَّذِينَ يَظْلِمُونَ النَّاسَ وَيَبْغُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ ۚ أُولَـٰئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ ٤٣

మరియు ఎవడైతే సహనం వహించి క్షమి స్తాడో! నిశ్చయంగా అది (అల్లాహ్‌ దృష్టిలో) ఎంతో సహృదయంతో (సాహసంతో) కూడిన పని! 28

42:44 – وَمَن يُضْلِلِ اللَّـهُ فَمَا لَهُ مِن وَلِيٍّ مِّن بَعْدِهِ ۗ وَتَرَى الظَّالِمِينَ لَمَّا رَأَوُا الْعَذَابَ يَقُولُونَ هَلْ إِلَىٰ مَرَدٍّ مِّن سَبِيلٍ ٤٤

మరియు, ఎవడినైతే అల్లాహ్‌ మార్గభ్రష్ట త్వంలో పడనిస్తాడో! దాని తరువాత వాడికి సంరక్ష కుడు, ఎవ్వడూ ఉండడు. 29 మరియు ఈ దుర్మార్గులు శిక్షను చూసి నపుడు: “మేము తిరిగి (భూలోకంలోకి) పోయే మార్గమేదైనా ఉందా?” అని అడగటం నీవు చూస్తావు. 30

42:45 – وَتَرَاهُمْ يُعْرَضُونَ عَلَيْهَا خَاشِعِينَ مِنَ الذُّلِّ يَنظُرُونَ مِن طَرْفٍ خَفِيٍّ ۗ وَقَالَ الَّذِينَ آمَنُوا إِنَّ الْخَاسِرِينَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ وَأَهْلِيهِمْ يَوْمَ الْقِيَامَةِ ۗ أَلَا إِنَّ الظَّالِمِينَ فِي عَذَابٍ مُّقِيمٍ ٤٥

మరియు వారిని, దాని(నరకం) ముందుకు తీసుకొని వచ్చినప్పుడు, వారు అవమానంతో కృంగిపోతూ, దొంగ చూపులతో దానిని చూడటం నీవు గమనిస్తావు. మరియు విశ్వసించినవారు ఇలా అంటారు: “నిశ్చయంగా తమను తాము మరియు తమ సంబంధీకులను (అనుచరులను) నష్టానికి గురిచేసుకున్నవారే, ఈ పునరుత్థాన దినమున నష్టపోయే వారు. జాగ్రత్త! నిశ్చయంగా, దుర్మార్గులే శాశ్వతమైన శిక్షకు గురిఅవుతారు.”

42:46 – وَمَا كَانَ لَهُم مِّنْ أَوْلِيَاءَ يَنصُرُونَهُم مِّن دُونِ اللَّـهِ ۗ وَمَن يُضْلِلِ اللَّـهُ فَمَا لَهُ مِن سَبِيلٍ ٤٦

మరియు అల్లాహ్‌ తప్ప, ఇతరులెవ్వరూ వారికి రక్షకులుగా గానీ, సహాయకులుగా గానీ ఉండరు. మరియు అల్లాహ్‌ మార్గభ్రష్టత్వంలో వదిలిన వారికి (దాని నుండి బయటపడే) మార్గమేదీ వుండదు.

42:47 – اسْتَجِيبُوا لِرَبِّكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا مَرَدَّ لَهُ مِنَ اللَّـهِ ۚ مَا لَكُم مِّن مَّلْجَإٍ يَوْمَئِذٍ وَمَا لَكُم مِّن نَّكِيرٍ ٤٧

(కావున ఓ మానవులారా మరియు జిన్నాతులారా!) మీరు, తొలగింపబడే అవకాశం లేనటువంటి ఆ దినం అల్లాహ్‌ తరఫు నుండి రాకముందే, మీ ప్రభువు ఆజ్ఞను శిరసావహించండి. ఆ రోజున మీకు ఎక్కడా ఆశ్రయం లభించదు. మరియు మీకు (మీ పాపాలను) నిరాకరించటానికి కూడా వీలుండదు. 31

42:48 – فَإِنْ أَعْرَضُوا فَمَا أَرْسَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا ۖ إِنْ عَلَيْكَ إِلَّا الْبَلَاغُ ۗ وَإِنَّا إِذَا أَذَقْنَا الْإِنسَانَ مِنَّا رَحْمَةً فَرِحَ بِهَا ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ فَإِنَّ الْإِنسَانَ كَفُورٌ ٤٨

(ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు విముఖులైతే మేము నిన్ను వారిపై రక్షకునిగా చేసి పంపలేదు. నీపని కేవలం (సందేశాన్ని) అందజేయటం మాత్రమే. 32 మరియు మేము మానవునికి మా కారుణ్యాన్ని రుచి చూపిస్తే, దానికి అతడు సంతోషంతో పొంగిపోతాడు. కాని ఒకవేళ వారికి తమ చేతులారా చేసుకున్నదానికి ఫలితంగా, కీడు కలిగినట్లయితే! నిశ్చయంగా, అప్పుడు మానవుడు కృతఘ్నుడవుతాడు!

42:49 – لِّلَّـهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ يَخْلُقُ مَا يَشَاءُ ۚ يَهَبُ لِمَن يَشَاءُ إِنَاثًا وَيَهَبُ لِمَن يَشَاءُ الذُّكُورَ ٤٩

భూమ్యాకాశాల సామ్రాజ్యాధికారం అల్లాహ్‌ దే! ఆయన తానుకోరిందిసృష్టిస్తాడు. ఆయనతాను కోరిన వారికి కుమార్తెలను ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి కుమారులను ప్రసాదిస్తాడు.

42:50 – أَوْ يُزَوِّجُهُمْ ذُكْرَانًا وَإِنَاثًا ۖ وَيَجْعَلُ مَن يَشَاءُ عَقِيمًا ۚ إِنَّهُ عَلِيمٌ قَدِيرٌ ٥٠

లేదా! వారికి కుమారులను మరియు కుమార్తెలను కలిపి ప్రసాదిస్తాడు. మరియు తాను కోరిన వారికి అసలు సంతానమే ఇవ్వడు. నిశ్చయంగా, ఆయన సర్వజ్ఞుడు, అంతా చేయగల సమర్థుడు. (3/8)

42:51 – وَمَا كَانَ لِبَشَرٍ أَن يُكَلِّمَهُ اللَّـهُ إِلَّا وَحْيًا أَوْ مِن وَرَاءِ حِجَابٍ أَوْ يُرْسِلَ رَسُولًا فَيُوحِيَ بِإِذْنِهِ مَا يَشَاءُ ۚ إِنَّهُ عَلِيٌّ حَكِيمٌ ٥١

  • మరియు అల్లాహ్‌తో మాట్లాడగలిగే శక్తి ఏ మానవునికీ లేదు; కేవలం దివ్యజ్ఞానం (వ’హీ) ద్వారా లేదా తెరవెనుక నుండి, లేదా ఆయన పంపిన సందేశహరుని ద్వారా, ఆయన అనుమతితో, ఆయన కోరిన (వ’హీ) అవతరింప జేయబడటం తప్ప! 33 నిశ్చయంగా, ఆయన మహోన్నతుడు, మహా వివేకవంతుడు.

42:52 – وَكَذَٰلِكَ أَوْحَيْنَا إِلَيْكَ رُوحًا مِّنْ أَمْرِنَا ۚ مَا كُنتَ تَدْرِي مَا الْكِتَابُ وَلَا الْإِيمَانُ وَلَـٰكِن جَعَلْنَاهُ نُورًا نَّهْدِي بِهِ مَن نَّشَاءُ مِنْ عِبَادِنَا ۚ وَإِنَّكَ لَتَهْدِي إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ٥٢

మరియు ఇదే విధంగా (ఓ ము’హమ్మద్‌!) మేము మా ఆజ్ఞతో నీ వద్దకు దివ్యజ్ఞానం (రూ’హ్‌) అవతరింపజేశాము. 34 (దీనికి ముందు) నీకు గ్రంథమేమిటో మరియు విశ్వాసమేమిటో తెలియదు. కాని మేము దీనిని (ఈ ఖుర్‌ఆన్‌ను) జ్యోతిగా జేసి, దీని ద్వారా మా దాసులలో మేము కోరిన వారికి, మార్గదర్శకత్వం చేస్తాము. 35 మరియు నిశ్చయంగా, నీవు (ప్రజలకు) ఋజు మార్గం వైపునకు దారి చూపుతున్నావు.

42:53 – صِرَاطِ اللَّـهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ أَلَا إِلَى اللَّـهِ تَصِيرُ الْأُمُورُ ٥٣

అల్లాహ్‌ మార్గం! 36 భూమ్యాకాశాలలో నున్న ప్రతిదీ ఆయనకే చెందుతుంది. వాస్తవానికి, వ్యవహారాలన్నీ చివరకు (తీర్పుకొరకు) అల్లాహ్‌ వద్దకే చేరుతాయి.

సూరహ్‌ అ’జ్‌-‘జు’ఖ్‌రుఫ్‌ – ‘జు’ఖ్‌రుఫున్: అంటే బంగారం, ఆభరణాలు లేక అలంకరణ. ‘హా-మీమ్‌ వరుసల 7 సూరహ్‌ లలో ఇది 4వది. ప్రజలు తమ తండ్రి-తాతలు అనుసరించే ధర్మాలను అంధ విశ్వాసంతో అనుసరిస్తూ, అల్లాహ్‌ (సు.త.) ప్రసాదించిన విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించక పోవటం వల్లనే మార్గభ్రష్టత్వంలో పడిపోతున్నారు. మక్కహ్లో అవతరింపజేయబడిన ఈ సూరహ్‌లో 89 ఆయాతులున్నాయి. దీని పేరు 35వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 43:1 – حم ١

‘హా-మీమ్‌.

43:2 – وَالْكِتَابِ الْمُبِينِ ٢

స్పష్టమైన ఈ గ్రంథం (ఖుర్‌ఆన్‌) సాక్షిగా! 1

43:3 – إِنَّا جَعَلْنَاهُ قُرْآنًا عَرَبِيًّا لَّعَلَّكُمْ تَعْقِلُونَ ٣

నిశ్చయంగా, మీరు అర్థంచేసుకోగలగ టానికి, మేము దీనిని అరబ్బీభాషలో ఖుర్‌ఆన్‌గా 2 అవతరింపజేశాము.

43:4 – وَإِنَّهُ فِي أُمِّ الْكِتَابِ لَدَيْنَا لَعَلِيٌّ حَكِيمٌ ٤

మరియు నిశ్చయంగా, ఇది మా వద్దనున్న మాతృ గ్రంథం లోనిదే! 3 అది మహోన్నతమైనది, వివేకంతో నిండి ఉన్నది.

43:5 – أَفَنَضْرِبُ عَنكُمُ الذِّكْرَ صَفْحًا أَن كُنتُمْ قَوْمًا مُّسْرِفِينَ ٥

ఏమిటి? మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారని, మేము ఈ హితోపదేశాన్ని (ఖుర్‌ఆన్‌ను) మీ నుండి తొలగించాలా? 4

43:6 – وَكَمْ أَرْسَلْنَا مِن نَّبِيٍّ فِي الْأَوَّلِينَ ٦

మరియు మేము పూర్వం గతించిన వారి వద్దకు ఎంతో మంది ప్రవక్తలను పంపాము.

43:7 – وَمَا يَأْتِيهِم مِّن نَّبِيٍّ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ٧

మరియు వారు, తమ వద్దకు వచ్చిన ప్రవక్తలలో ఏ ఒక్కరిని కూడా ఎగతాళి చేయకుండా వదలలేదు.

43:8 – فَأَهْلَكْنَا أَشَدَّ مِنْهُم بَطْشًا وَمَضَىٰ مَثَلُ الْأَوَّلِينَ ٨

కావున వీరికంటే ఎంతో బలిష్ఠులైన వారిని మేము పట్టుకొని నాశనం చేశాము. 5 మరియు పూర్వజాతుల వారి దృష్టాంతాలు ఈ విధంగా గడిచాయి.

43:9 – وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ خَلَقَهُنَّ الْعَزِيزُ الْعَلِيمُ ٩

ఒకవేళ, నీవు వారితో: “భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారు?” అని అడిగితే! వారు తప్పక: “వాటిని సర్వ శక్తిమంతుడు, సర్వజ్ఞుడు సృష్టించాడు.” అని అంటారు.

43:10 – الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ مَهْدًا وَجَعَلَ لَكُمْ فِيهَا سُبُلًا لَّعَلَّكُمْ تَهْتَدُونَ ١٠

ఆయనే మీ కొరకు ఈ భూమిని పరుపుగా చేశాడు; మరియు మీరు మీ గమ్యస్థానాలకు చేరుకోవడానికి, అందులో మీ కొరకు త్రోవలు ఏర్పరచాడు. 6

43:11 – وَالَّذِي نَزَّلَ مِنَ السَّمَاءِ مَاءً بِقَدَرٍ فَأَنشَرْنَا بِهِ بَلْدَةً مَّيْتًا ۚ كَذَٰلِكَ تُخْرَجُونَ ١١

మరియు ఆయనే ఆకాశం నుండి తగినంత నీటిని (వర్షాన్ని) కురిపించాడు. తరువాత దాని ద్వారా మేము చచ్చిన నేలను బ్రతికిస్తాము. ఇదే విధంగా మీరు కూడా (బ్రతికింపబడి) బయటికి తీయబడతారు.

43:12 – وَالَّذِي خَلَقَ الْأَزْوَاجَ كُلَّهَا وَجَعَلَ لَكُم مِّنَ الْفُلْكِ وَالْأَنْعَامِ مَا تَرْكَبُونَ ١٢

మరియు ఆయనే అన్నిరకాల జతలను పుట్టించాడు! మరియు ఓడలను మరియు పశువులను మీకు వాహనాలుగా చేశాడు;

43:13 – لِتَسْتَوُوا عَلَىٰ ظُهُورِهِ ثُمَّ تَذْكُرُوا نِعْمَةَ رَبِّكُمْ إِذَا اسْتَوَيْتُمْ عَلَيْهِ وَتَقُولُوا سُبْحَانَ الَّذِي سَخَّرَ لَنَا هَـٰذَا وَمَا كُنَّا لَهُ مُقْرِنِينَ ١٣

మీరు వాటి వీపుల మీద ఎక్కటానికి; తరువాత మీరు వాటిమీద కూర్చున్నప్పుడు, మీ ప్రభువు అనుగ్రహాన్ని తలచుకొని ఇలా ప్రార్థించ టానికి: “ఆ సర్వ లోపాలకు అతీతుడైన ఆయన (అల్లాహ్‌) వీటిని మాకు వశపరచాడు, లేకపోతే ఆ (వశపరచుకునే) సామర్థ్యం మాకు లేదు.

43:14 – وَإِنَّا إِلَىٰ رَبِّنَا لَمُنقَلِبُونَ ١٤

“మరియు నిశ్చయంగా, మేము మా ప్రభువు వైపునకే మరలి పోవలసి ఉన్నది!” 7

43:15 – وَجَعَلُوا لَهُ مِنْ عِبَادِهِ جُزْءًا ۚ إِنَّ الْإِنسَانَ لَكَفُورٌ مُّبِينٌ ١٥

మరియు వారు ఆయన దాసులలో కొందరిని ఆయనలో భాగంగా (భాగస్వాములుగా / సంతానంగా) చేశారు. 8 నిశ్చయంగా మానవుడు పరమ కృతఘ్నుడు!

43:16 – أَمِ اتَّخَذَ مِمَّا يَخْلُقُ بَنَاتٍ وَأَصْفَاكُم بِالْبَنِينَ ١٦

ఏమిటి? ఆయన తాను సృష్టించిన వాటిలో నుండి తన కొరకు కుమార్తెలను తీసుకొని మీ కొరకు ప్రత్యేకంగా కుమారులను ఉంచాడా? 9

43:17 – وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِمَا ضَرَبَ لِلرَّحْمَـٰنِ مَثَلًا ظَلَّ وَجْهُهُ مُسْوَدًّا وَهُوَ كَظِيمٌ ١٧

మరియు వారు, కరుణామయునికి అంటగట్టేది (ఆడసంతానమేగనక) వారిలో ఎవడికైనా కలిగిందనే వార్త అందజేయబడి నప్పుడు, అతని ముఖం నల్లబడిపోతుంది మరియు అతడు దుఃఖంలో మునిగిపోతాడు!

43:18 – أَوَمَن يُنَشَّأُ فِي الْحِلْيَةِ وَهُوَ فِي الْخِصَامِ غَيْرُ مُبِينٍ ١٨

ఏమీ? ఆభరణాల అలంకారంలో పెంచబడి మరియు వివాదంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించలేని (స్త్రీ సంతానాన్ని అల్లాహ్‌కు అంటగట్టుతున్నారా)?

43:19 – وَجَعَلُوا الْمَلَائِكَةَ الَّذِينَ هُمْ عِبَادُ الرَّحْمَـٰنِ إِنَاثًا ۚ أَشَهِدُوا خَلْقَهُمْ ۚ سَتُكْتَبُ شَهَادَتُهُمْ وَيُسْأَلُونَ ١٩

మరియు వీరు కరుణామయునికి దాసులైన దేవదూతలను స్త్రీలుగా పరిగణిస్తున్నారా వీరు? వారు (దేవదూతలు) సృష్టింపబడినప్పుడు చూశారా ఏమిటి? వీరి ఆరోపణలు వ్రాసి వుంచబడతాయి. మరియు వీరు దానిని గురించి ప్రశ్నింపబడతారు.

43:20 – وَقَالُوا لَوْ شَاءَ الرَّحْمَـٰنُ مَا عَبَدْنَاهُم ۗ مَّا لَهُم بِذَٰلِكَ مِنْ عِلْمٍ ۖ إِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ ٢٠

మరియు వారు ఇలా అంటారు: “ఒకవేళ ఆ కరుణామయుడు తలచుకుంటే మేము వారిని ఆరాధించేవారం కాదు.” దాని వాస్తవజ్ఞానం వారికి లేదు. వారు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు!

43:21 – أَمْ آتَيْنَاهُمْ كِتَابًا مِّن قَبْلِهِ فَهُم بِهِ مُسْتَمْسِكُونَ ٢١

మేము వారికి ఇంతకు ముందు ఏదైనా గ్రంథాన్ని ఇచ్చి ఉన్నామా ఏమిటి? వారు దానిని ఖచ్చితంగా అనుసరించటానికి?

43:22 – بَلْ قَالُوا إِنَّا وَجَدْنَا آبَاءَنَا عَلَىٰ أُمَّةٍ وَإِنَّا عَلَىٰ آثَارِهِم مُّهْتَدُونَ ٢٢

అలాకాదు! వారిలా అంటారు: “వాస్తవానికి మేము, మా తండ్రి-తాతలను ఇలాంటి సమా జాన్నే (మతాన్నే) అనుసరిస్తుండగా చూశాము. మరియు నిశ్చయంగా, మేముకూడా వారి అడుగు జాడల్లోనే వారి మార్గదర్శకత్వంపై ఉన్నాము.”

43:23 – وَكَذَٰلِكَ مَا أَرْسَلْنَا مِن قَبْلِكَ فِي قَرْيَةٍ مِّن نَّذِيرٍ إِلَّا قَالَ مُتْرَفُوهَا إِنَّا وَجَدْنَا آبَاءَنَا عَلَىٰ أُمَّةٍ وَإِنَّا عَلَىٰ آثَارِهِم مُّقْتَدُونَ ٢٣

మరియు ఇదే విధంగా, నీకు ముందు (ఓ ము’హమ్మద్‌!) మేము హెచ్చరించేవాడిని ఏ పట్టణానికి పంపినా దానిలోని ఐశ్వర్యవంతులు అనే వారు: 10 “వాస్తవానికి మేము మా తండ్రి-తాతలను ఇలాంటి సమాజాన్నే (మతాన్నే) అనుసరిస్తూ ఉండగా చూశాము. మరియు నిశ్చయంగా, మేము కూడా వారి అడుగుజాడలనే అనుసరిస్తాము.” (1/2)

43:24 – قَالَ أَوَلَوْ جِئْتُكُم بِأَهْدَىٰ مِمَّا وَجَدتُّمْ عَلَيْهِ آبَاءَكُمْ ۖ قَالُوا إِنَّا بِمَا أُرْسِلْتُم بِهِ كَافِرُونَ ٢٤

  • (వారి ప్రవక్త) ఇలా అనేవాడు: “ఒకవేళ నేను మీ తండ్రి-తాతలు అనుసరిస్తూ వచ్చిన దాని కంటే ఉత్తమమైన మార్గదర్శకత్వాన్ని మీ కోసం తెచ్చినా (మీరు వారినే అనుసరిస్తారా)?” వారిలా జవాబిచ్చేవారు: “నిశ్చయంగా మీరు దేనితో పంపబడ్డారో దానిని మేము తిరస్కరిస్తున్నాము.”

43:25 – فَانتَقَمْنَا مِنْهُمْ ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ ٢٥

కావున మేము వారిపై మా ప్రతీకారాన్ని (శిక్షను) పంపాము. చూశారా! సత్యాన్ని తిరస్కరించిన వారి గతి ఏమయిందో!

43:26 – وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِ إِنَّنِي بَرَاءٌ مِّمَّا تَعْبُدُونَ ٢٦

మరియు (జ్ఞాపకంచేసుకోండి) ఇబ్రాహీమ్‌ తనతండ్రి మరియు తన జాతివారితో ఇలా అన్నప్పుడు: “నిశ్చయంగా, మీరు పూజించే వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు. 11

43:27 – إِلَّا الَّذِي فَطَرَنِي فَإِنَّهُ سَيَهْدِينِ ٢٧

“(నేనైతే) నన్ను సృజించిన ఆయన (అల్లాహ్ నే ఆరాధిస్తాను). ఎందుకంటే! నిశ్చయంగా ఆయనే నాకు మార్గదర్శకత్వం చేయగలడు.”

43:28 – وَجَعَلَهَا كَلِمَةً بَاقِيَةً فِي عَقِبِهِ لَعَلَّهُمْ يَرْجِعُونَ ٢٨

మరియు అతను (ఇబ్రాహీమ్‌) ఈ వచనాన్నే తన తర్వాత తన సంతానం కొరకు విడిచి వెళ్ళాడు. 12 బహుశా వారు దాని వైపుకు మరలుతారని!

43:29 – بَلْ مَتَّعْتُ هَـٰؤُلَاءِ وَآبَاءَهُمْ حَتَّىٰ جَاءَهُمُ الْحَقُّ وَرَسُولٌ مُّبِينٌ ٢٩

వాస్తవానికి, నేను వారికి మరియు వారి తండ్రి-తాతలకు ప్రాపంచిక సుఖసంతోషాలను ఇస్తూనే వచ్చాను. చివరకు వారి వద్దకు సత్యం మరియు (దానిని) స్పష్టంగా వివరించే దైవప్రవక్త కూడా వచ్చాడు. 13

43:30 – وَلَمَّا جَاءَهُمُ الْحَقُّ قَالُوا هَـٰذَا سِحْرٌ وَإِنَّا بِهِ كَافِرُونَ ٣٠

కాని వారి వద్దకు సత్యం (ఈ ఖుర్‌ఆన్‌) వచ్చినపుడు వారన్నారు: “ఇది కేవలం మంత్ర జాలమే. 14 మరియు నిశ్చయంగా, మేము దీనిని తిరస్కరిస్తున్నాము.”

43:31 – وَقَالُوا لَوْلَا نُزِّلَ هَـٰذَا الْقُرْآنُ عَلَىٰ رَجُلٍ مِّنَ الْقَرْيَتَيْنِ عَظِيمٍ ٣١

వారు ఇంకా ఇలా అన్నారు: “ఈ ఖుర్‌ఆన్‌ ఈ రెండు నగరాలలోని ఒక గొప్ప వ్యక్తిపై ఎందుకు అవతరింపజేయబడలేదు?” 15

43:32 – أَهُمْ يَقْسِمُونَ رَحْمَتَ رَبِّكَ ۚ نَحْنُ قَسَمْنَا بَيْنَهُم مَّعِيشَتَهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا ۚ وَرَفَعْنَا بَعْضَهُمْ فَوْقَ بَعْضٍ دَرَجَاتٍ لِّيَتَّخِذَ بَعْضُهُم بَعْضًا سُخْرِيًّا ۗ وَرَحْمَتُ رَبِّكَ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ ٣٢

నీ ప్రభువు కారుణ్యాన్ని పంచిపెట్టేవారు వారేనా ఏమిటి? మేమే వారి జీవనోపాయాలను, ఈప్రాపంచిక జీవితంలో వారి మధ్య పంచిపెట్టాము. వారు ఒకరితోనొకరు పనితీసుకోవటానికి, 16 వారిలోకొందరికిమరికొందరిపై స్థానాలనుపెంచాము. మరియు వారుకూడబెట్టే దానికంటే (సంపదకంటే) నీ ప్రభువు కారుణ్యమే 17 ఎంతో ఉత్తమమైనది.

43:33 – وَلَوْلَا أَن يَكُونَ النَّاسُ أُمَّةً وَاحِدَةً لَّجَعَلْنَا لِمَن يَكْفُرُ بِالرَّحْمَـٰنِ لِبُيُوتِهِمْ سُقُفًا مِّن فِضَّةٍ وَمَعَارِجَ عَلَيْهَا يَظْهَرُونَ ٣٣

మరియు మానవులందరూ ఒక (దుష్ట) సమాజంగా మారిపోతారన్న భయమేగనక మాకు లేకున్నట్లయితే, మేము ఆ కరుణామయుణ్ణి తిరస్కరించే వారి ఇళ్ళ కప్పులనూ మరియు వాటిపైకి ఎక్కే మెట్లను వెండితో నిర్మించేవారము.

43:34 – وَلِبُيُوتِهِمْ أَبْوَابًا وَسُرُرًا عَلَيْهَا يَتَّكِئُونَ ٣٤

మరియు వారి ఇండ్ల తలుపులను మరియు వారు ఆనుకొని కూర్చునే పీఠాలను కూడా;

43:35 – وَزُخْرُفًا ۚ وَإِن كُلُّ ذَٰلِكَ لَمَّا مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا ۚ وَالْآخِرَةُ عِندَ رَبِّكَ لِلْمُتَّقِينَ ٣٥

మరియు బంగారంతో కూడా! 18 మరియు ఇవన్నీ ప్రాపంచిక జీవిత సుఖసంతో షాలు మాత్రమే. మరియు దైవభీతి గలవారికి నీ ప్రభువు వద్ద పరలోకజీవిత (సుఖం) ఉంటుంది.

43:36 – وَمَن يَعْشُ عَن ذِكْرِ الرَّحْمَـٰنِ نُقَيِّضْ لَهُ شَيْطَانًا فَهُوَ لَهُ قَرِينٌ ٣٦

మరియు ఎవడైతే కరుణామయుని స్మరణ విషయంలో అంధుడిగా ప్రవర్తిస్తాడో అతనిపై మేము ఒక షై’తాన్‌ను నియమిస్తాము. ఇక వాడు (ఆ షై’తాన్‌) వాని సహచరుడు (ఖరీనున్‌) అవుతాడు. 19

43:37 – وَإِنَّهُمْ لَيَصُدُّونَهُمْ عَنِ السَّبِيلِ وَيَحْسَبُونَ أَنَّهُم مُّهْتَدُونَ ٣٧

మరియు నిశ్చయంగా, వారు (షై’తానులు) వారిని (అల్లాహ్‌) మార్గం నుండి ఆటంకపరుస్తారు. మరియు వారేమో నిశ్చయంగా, తాము సరైన మార్గదర్శకత్వంలోనే ఉన్నామని భావిస్తారు!

43:38 – حَتَّىٰ إِذَا جَاءَنَا قَالَ يَا لَيْتَ بَيْنِي وَبَيْنَكَ بُعْدَ الْمَشْرِقَيْنِ فَبِئْسَ الْقَرِينُ ٣٨

చివరకు అతడు మా వద్దకు వచ్చినపుడు (తన వెంట ఉన్న షై’తాన్‌తో) ఇలా అంటాడు: “అయ్యో నా దౌర్భాగ్యం! నీకూ-నాకూ మధ్య తూర్పు-పడమరల 20 మధ్య ఉన్నంత దూరం ఉండి వుంటే ఎంత బాగుండేది! ఎందుకంటే నీవు అతిచెడ్డ సహచరుడివి!”

43:39 – وَلَن يَنفَعَكُمُ الْيَوْمَ إِذ ظَّلَمْتُمْ أَنَّكُمْ فِي الْعَذَابِ مُشْتَرِكُونَ ٣٩

మరియు మీరు దుర్మార్గం చేశారు! కావున, ఈ రోజు మీరంతా ఈ శిక్షలో కలిసి ఉండటం మీకు ఏ మాత్రం లాభదాయకం కాదు. 21

43:40 – أَفَأَنتَ تُسْمِعُ الصُّمَّ أَوْ تَهْدِي الْعُمْيَ وَمَن كَانَ فِي ضَلَالٍ مُّبِينٍ ٤٠

(ఓ ము’హమ్మద్‌!) నీవు చెవిటివాడికి వినిపింపజేయగలవా? లేదా గ్రుడ్డివాడికి మార్గం చూపించగలవా? లేక, స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో ఉన్నవాడికి (మార్గదర్శకత్వం చేయగలవా)? 22

43:41 – فَإِمَّا نَذْهَبَنَّ بِكَ فَإِنَّا مِنْهُم مُّنتَقِمُونَ ٤١

ఒకవేళ వాస్తవానికి మేము నిన్ను తీసుకొని పోయినా, వారికి మాత్రం తప్పకుండా ప్రతీకారం చేస్తాము.

43:42 – أَوْ نُرِيَنَّكَ الَّذِي وَعَدْنَاهُمْ فَإِنَّا عَلَيْهِم مُّقْتَدِرُونَ ٤٢

లేదా మేము వారికి వాగ్దానం చేసిన దానిని (శిక్షను) నీకు తప్పక చూపగలము. ఎందుకంటే మాకు వారిపై పూర్తి అధికారముంది.

43:43 – فَاسْتَمْسِكْ بِالَّذِي أُوحِيَ إِلَيْكَ ۖ إِنَّكَ عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ٤٣

కావున నీవు దివ్యజ్ఞానం (వ’హీ) ద్వారా వచ్చిన సందేశం మీద స్థిరంగా ఉండు. నిశ్చయంగా, నీవు ఋజుమార్గం మీద ఉన్నావు.

43:44 – وَإِنَّهُ لَذِكْرٌ لَّكَ وَلِقَوْمِكَ ۖ وَسَوْفَ تُسْأَلُونَ ٤٤

మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్‌ఆన్‌) నీకు మరియు నీజాతివారికి ఒకహితబోధ. మరియు (దీనిని గురించి) మీరు ప్రశ్నింపబడగలరు. 23

43:45 – وَاسْأَلْ مَنْ أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رُّسُلِنَا أَجَعَلْنَا مِن دُونِ الرَّحْمَـٰنِ آلِهَةً يُعْبَدُونَ ٤٥

మరియు (ఓ ము’హమ్మద్‌!) నీకు పూర్వం మేము పంపిన మా ప్రవక్తలను అడుగు: “మేము, ఆ కరుణామయుడు తప్ప ఇతర దైవాలను ఆరాధింపబడటానికి నియమించామేమో?”

43:46 – وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِآيَاتِنَا إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ فَقَالَ إِنِّي رَسُولُ رَبِّ الْعَالَمِينَ ٤٦

మరియు వాస్తవంగా, మేము మూసాను, మా సూచన (ఆయాత్‌)లతో ఫిర్‌’ఔన్‌ మరియు అతని నాయకుల వద్దకు పంపాము. అతను వారితో ఇలా అన్నాడు: “నిశ్చయంగా నేను సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుణ్ణి.”

43:47 – فَلَمَّا جَاءَهُم بِآيَاتِنَا إِذَا هُم مِّنْهَا يَضْحَكُونَ ٤٧

కాని, అతను వారి వద్దకు మా సూచనలను (ఆయాత్‌లను) తీసుకొని వచ్చినప్పుడు, వారు వాటిని గురించి పరిహాసలాడేవారు. 24

43:48 – وَمَا نُرِيهِم مِّنْ آيَةٍ إِلَّا هِيَ أَكْبَرُ مِنْ أُخْتِهَا ۖ وَأَخَذْنَاهُم بِالْعَذَابِ لَعَلَّهُمْ يَرْجِعُونَ ٤٨

మరియు మేము వారికి చూపిన ప్రతి అద్భుతసూచన (ఆయత్‌), దానికి ముందు చూపి నటువంటి దాని (అద్భుతసూచన) కంటే మించి నదిగా ఉండేది. 25 మరియు మేము వారిని శిక్షకు గురిచేశాము. బహుశా, ఇలాగైనా వారు మరలి వస్తారేమోనని! 26

43:49 – وَقَالُوا يَا أَيُّهَ السَّاحِرُ ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِندَكَ إِنَّنَا لَمُهْتَدُونَ ٤٩

మరియు వారు (మూసాతో) ఇలా అన్నారు: “ఓ మాంత్రికుడా! (నీ ప్రభువు) నీతో చేసిన ఒప్పందం ప్రకారం నీ ప్రభువును ప్రార్థించు, మేము తప్పక సన్మార్గుల మవుతాము.”

43:50 – فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الْعَذَابَ إِذَا هُمْ يَنكُثُونَ ٥٠

కాని మేము వారిపై నుండి ఆ శిక్షను తొలగించిన వెంటనే వారు తమ వాగ్దానాన్ని భంగపరచేవారు.

43:51 – وَنَادَىٰ فِرْعَوْنُ فِي قَوْمِهِ قَالَ يَا قَوْمِ أَلَيْسَ لِي مُلْكُ مِصْرَ وَهَـٰذِهِ الْأَنْهَارُ تَجْرِي مِن تَحْتِي ۖ أَفَلَا تُبْصِرُونَ ٥١

మరియు, ఫిర్‌’ఔన్‌ తన జాతి ప్రజలలో ప్రకటిస్తూ ఇలా అన్నాడు: “ఓ నాజాతి ప్రజలారా! ఈజిప్టు (మి’స్ర్‌) యొక్క సామ్రాజ్యాధిపత్యం నాది కాదా? మరియు ఈ సెలయేళ్ళు నా క్రింద ప్రవహించటం లేదా? ఇది మీకు కనిపించటంలేదా?

43:52 – أَمْ أَنَا خَيْرٌ مِّنْ هَـٰذَا الَّذِي هُوَ مَهِينٌ وَلَا يَكَادُ يُبِينُ ٥٢

“ఈ తుచ్ఛమైనవాడు మరియు (తన మాటను) స్పష్టంగా వివరించలేని వాడి (మూసా) కంటే నేను శ్రేష్ఠుణ్ణి కానా? 27

43:53 – فَلَوْلَا أُلْقِيَ عَلَيْهِ أَسْوِرَةٌ مِّن ذَهَبٍ أَوْ جَاءَ مَعَهُ الْمَلَائِكَةُ مُقْتَرِنِينَ ٥٣

“అయితే ఇతనికి బంగారు కంకణాలు ఎందుకు వేయబడలేదు. లేదా, ఇతనికి తోడుగా ఇతనితో పాటు దేవదూతలు ఎందుకు రాలేదు?” 28

43:54 – فَاسْتَخَفَّ قَوْمَهُ فَأَطَاعُوهُ ۚ إِنَّهُمْ كَانُوا قَوْمًا فَاسِقِينَ ٥٤

ఈ విధంగా, అతడు (ఫిర్‌’ఔన్‌) తన జాతి వారిని ప్రేరేపింపజేయటంవలన వారు అతనిని అనుసరించారు. నిశ్చయంగా, వారు దుర్జనులు (ఫాసిఖీన్‌).

43:55 – فَلَمَّا آسَفُونَا انتَقَمْنَا مِنْهُمْ فَأَغْرَقْنَاهُمْ أَجْمَعِينَ ٥٥

ఈ విధంగా వారు మమ్మల్ని కోపానికి గురి చేయటం వల్ల, మేము వారికి ప్రతీకారం చేశాము. మరియు వారందరినీ ముంచివేశాము.

43:56 – فَجَعَلْنَاهُمْ سَلَفًا وَمَثَلًا لِّلْآخِرِينَ ٥٦

ఇక మేము, వారిని తర్వాత వచ్చేవారి కొరకు ఒక గడిచిన నిదర్శనంగా మరియు ఒక ఉదాహరణగా చేశాము. (5/8)

43:57 – وَلَمَّا ضُرِبَ ابْنُ مَرْيَمَ مَثَلًا إِذَا قَوْمُكَ مِنْهُ يَصِدُّونَ ٥٧

  • మరియు మర్యమ్‌ కుమారుడు ఒక ఉదాహరణగా పేర్కొన బడినప్పుడు (ఓ ము’హమ్మద్‌!) నీ జాతి ప్రజలు అతనిని గురించి కేకలువేస్తారు.

43:58 – وَقَالُوا أَآلِهَتُنَا خَيْرٌ أَمْ هُوَ ۚ مَا ضَرَبُوهُ لَكَ إِلَّا جَدَلًا ۚ بَلْ هُمْ قَوْمٌ خَصِمُونَ ٥٨

మరియు అంటారు: “మా దేవుళ్ళు మంచివా లేక అతడా (‘ఈసానా)?” వారు ఈ విష యం నీ ముందు పెట్టేది కేవలం జగడమాడటానికే. వాస్తవానికి వారు కలహప్రియులైన జనులు.

43:59 – إِنْ هُوَ إِلَّا عَبْدٌ أَنْعَمْنَا عَلَيْهِ وَجَعَلْنَاهُ مَثَلًا لِّبَنِي إِسْرَائِيلَ ٥٩

అతను (‘ఈసా) కేవలం ఒక దాసుడు మాత్రమే. మేము అతనిని అనుగ్రహించాము. మరియు మేము అతనిని ఇస్రా’యీల్‌ సంతతి వారికి ఒక నిదర్శనంగా చేశాము.

43:60 – وَلَوْ نَشَاءُ لَجَعَلْنَا مِنكُم مَّلَائِكَةً فِي الْأَرْضِ يَخْلُفُونَ ٦٠

మరియు మేము కోరితే మీకు బదులుగా, దేవదూతలను, భూమిపై ఉత్తరాధికారులుగా చేసేవారము.

43:61 – وَإِنَّهُ لَعِلْمٌ لِّلسَّاعَةِ فَلَا تَمْتَرُنَّ بِهَا وَاتَّبِعُونِ ۚ هَـٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ ٦١

మరియు నిశ్చయంగా, అతని (‘ఈసా) పునరాగమనం అంతిమ ఘడియ రావటానికి సూచన. 29 కావున మీరు దానిని (ఆ ఘడియను) గురించి సంశయంలో పడకండి. మరియు నన్నే (అల్లాహ్‌నే) అనుసరించండి, ఇదే బుజుమార్గం.

43:62 – وَلَا يَصُدَّنَّكُمُ الشَّيْطَانُ ۖ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ ٦٢

మరియు షై’తాన్‌ను, మిమ్మల్ని ఆటంక పరచనివ్వకండి. నిశ్చయంగా అతడు మీకు బహిరంగ శత్రువు.

43:63 – وَلَمَّا جَاءَ عِيسَىٰ بِالْبَيِّنَاتِ قَالَ قَدْ جِئْتُكُم بِالْحِكْمَةِ وَلِأُبَيِّنَ لَكُم بَعْضَ الَّذِي تَخْتَلِفُونَ فِيهِ ۖ فَاتَّقُوا اللَّـهَ وَأَطِيعُونِ ٦٣

మరియు, ‘ఈసా స్పష్టమైన (మా) సూచనలు తీసుకొని వచ్చినప్పుడు ఇలా అన్నాడు: “వాస్తవంగా, నేను మీ వద్దకు వివేకాన్ని తీసుకొని వచ్చాను; 30 మరియు మీరు విభేదా లకులోనైన కొన్ని విషయాల వాస్తవాన్ని మీకు స్పష్టంగా వివరించటానికి వచ్చాను. కావున మీరు అల్లాహ్‌ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. మరియు నన్ను అనుసరించండి.

43:64 – إِنَّ اللَّـهَ هُوَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ هَـٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ ٦٤

“నిశ్చయంగా, అల్లాహ్‌యే నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే బుజుమార్గం.”

43:65 – فَاخْتَلَفَ الْأَحْزَابُ مِن بَيْنِهِمْ ۖ فَوَيْلٌ لِّلَّذِينَ ظَلَمُوا مِنْ عَذَابِ يَوْمٍ أَلِيمٍ ٦٥

అయినా, తరువాత వచ్చిన వర్గాల వారు పరస్పర వర్గవిభేదాలకు లోనయ్యారు. కావున దుర్మార్గానికి పాల్పడినవారికి బాధాకరమైన ఆ దినమున శిక్షపడుతుంది!

43:66 – هَلْ يَنظُرُونَ إِلَّا السَّاعَةَ أَن تَأْتِيَهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ ٦٦

వారు కేవలం ఆ అంతిమ ఘడియ అకస్మాత్తుగా – తమకు తెలియకుండానే – తమపై వచ్చిపడాలని నిరీక్షిస్తున్నారా ఏమిటి?

43:67 – الْأَخِلَّاءُ يَوْمَئِذٍ بَعْضُهُمْ لِبَعْضٍ عَدُوٌّ إِلَّا الْمُتَّقِينَ ٦٧

ఆ దినమున దైవభీతి గలవారుతప్ప ఇతర స్నేహితులంతా ఒకరికొకరు శత్రువులవుతారు.

43:68 – يَا عِبَادِ لَا خَوْفٌ عَلَيْكُمُ الْيَوْمَ وَلَا أَنتُمْ تَحْزَنُونَ ٦٨

(విశ్వాసులతో ఇలా అనబడుతుంది): “ఓ నా దాసులారా! ఈనాడు మీకు ఏ భయమూ లేదు మరియు మీరు దుఃఖపడరు కూడా!

43:69 – الَّذِينَ آمَنُوا بِآيَاتِنَا وَكَانُوا مُسْلِمِينَ ٦٩

“అలాంటివారు, ఎవరైతే మా సూచనలను విశ్వసించారో మరియు ముస్లింలు అయిఉన్నారో!

43:70 – ادْخُلُوا الْجَنَّةَ أَنتُمْ وَأَزْوَاجُكُمْ تُحْبَرُونَ ٧٠

“మీరు మరియు మీ సహవాసులు (అ’జ్వాజ్‌) సంతోషంగా స్వర్గంలో ప్రవేశించండి.”

43:71 – يُطَافُ عَلَيْهِم بِصِحَافٍ مِّن ذَهَبٍ وَأَكْوَابٍ ۖ وَفِيهَا مَا تَشْتَهِيهِ الْأَنفُسُ وَتَلَذُّ الْأَعْيُنُ ۖ وَأَنتُمْ فِيهَا خَالِدُونَ ٧١

వారిమధ్య, బంగారు పళ్ళాలు 31 మరియు కప్పులు త్రిప్పబడతాయి. మరియు అందులో, మనస్సులు కోరేవి మరియు కళ్ళకు ఇంపుగా ఉండేవి, అన్నీ ఉంటాయి. మరియు మీరందులో శాశ్వతంగా ఉంటారు.

43:72 – وَتِلْكَ الْجَنَّةُ الَّتِي أُورِثْتُمُوهَا بِمَا كُنتُمْ تَعْمَلُونَ ٧٢

మరియు మీరు చేస్తూవున్న కర్మల ఫలితానికి బదులుగా మీరు ఈస్వర్గానికి వారసులయ్యారు.

43:73 – لَكُمْ فِيهَا فَاكِهَةٌ كَثِيرَةٌ مِّنْهَا تَأْكُلُونَ ٧٣

మీకు అందులో పండ్లూ-ఫలాలు పుష్క లంగా ఉంటాయి, వాటిని మీరు తింటారు.

43:74 – إِنَّ الْمُجْرِمِينَ فِي عَذَابِ جَهَنَّمَ خَالِدُونَ ٧٤

నిశ్చయంగా, అపరాధులు నరకశిక్షలో శాశ్వతంగా ఉంటారు. 32

43:75 – لَا يُفَتَّرُ عَنْهُمْ وَهُمْ فِيهِ مُبْلِسُونَ ٧٥

వారి (శిక్ష) ఏ మాత్రం తగ్గించబడదు మరియు వారందులో హతాశులై పడి ఉంటారు.

43:76 – وَمَا ظَلَمْنَاهُمْ وَلَـٰكِن كَانُوا هُمُ الظَّالِمِينَ ٧٦

మేము వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే దుర్మార్గులై ఉండిరి. 33

43:77 – وَنَادَوْا يَا مَالِكُ لِيَقْضِ عَلَيْنَا رَبُّكَ ۖ قَالَ إِنَّكُم مَّاكِثُونَ ٧٧

మరియు వారిలా మొరపెట్టుకుంటారు: “ఓ నరక పాలకుడా (మాలిక్‌)! నీ ప్రభువును మమ్మల్ని అంతం చేయమను.” అతను అంటాడు: “నిశ్చయంగా మీరిక్కడే (ఇదేవిధంగా) పడి ఉంటారు.”

43:78 – لَقَدْ جِئْنَاكُم بِالْحَقِّ وَلَـٰكِنَّ أَكْثَرَكُمْ لِلْحَقِّ كَارِهُونَ ٧٨

వాస్తవానికి మేము మీ వద్దకు సత్యాన్ని తీసుకొని వచ్చాము, కాని మీలో చాలా మంది సత్యమంటేనే అసహ్యించుకునేవారు.

43:79 – أَمْ أَبْرَمُوا أَمْرًا فَإِنَّا مُبْرِمُونَ ٧٩

వారు ఏదైనా నిర్ణయం (పన్నాగం) చేస్తున్నారా ఏమిటి? అయితే నిశ్చయంగా, మేము కూడా ఒక గట్టి నిర్ణయం (పన్నాగం) చేస్తున్నాము. 34

43:80 – أَمْ يَحْسَبُونَ أَنَّا لَا نَسْمَعُ سِرَّهُمْ وَنَجْوَاهُم ۚ بَلَىٰ وَرُسُلُنَا لَدَيْهِمْ يَكْتُبُونَ ٨٠

లేదా! మేము వారి రహస్య విషయాలను మరియు వారిగుసగుసలను వినటంలేదని వారను కుంటున్నారా? అలాకాదు, (వాస్తవానికి) మా దూతలు వారి దగ్గర ఉండి, అంతా వ్రాస్తున్నారు.

43:81 – قُلْ إِن كَانَ لِلرَّحْمَـٰنِ وَلَدٌ فَأَنَا أَوَّلُ الْعَابِدِينَ ٨١

వారితో ఇలా అను: “ఒకవేళ ఆ కరుణా మయునికి కుమారుడే ఉంటే, అందరి కంటే ముందు నేనే అతనిని ఆరాధించేవాడిని.”

43:82 – سُبْحَانَ رَبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبِّ الْعَرْشِ عَمَّا يَصِفُونَ ٨٢

భూమ్యాకాశాలకు ప్రభువు మరియు సింహాసనానికి (‘అర్ష్‌కు) ప్రభువు అయిన ఆయన (అల్లాహ్‌) వారి కల్పనలకు అతీతుడు. 35

43:83 – فَذَرْهُمْ يَخُوضُوا وَيَلْعَبُوا حَتَّىٰ يُلَاقُوا يَوْمَهُمُ الَّذِي يُوعَدُونَ ٨٣

వారికి వాగ్దానం చేయబడిన ఆ దినాన్ని వారు దర్శించే వరకు, వారిని వారి వాదోపవాదా లలో మరియు వారి క్రీడలలో మునిగి ఉండనీ!

43:84 – وَهُوَ الَّذِي فِي السَّمَاءِ إِلَـٰهٌ وَفِي الْأَرْضِ إِلَـٰهٌ ۚ وَهُوَ الْحَكِيمُ الْعَلِيمُ ٨٤

మరియు ఆయన (అల్లాహ్‌) మాత్రమే ఆకాశాలలో ఆరాధ్యుడు మరియు భూమిలో కూడా ఆరాధ్యుడు. మరియు ఆయన మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు. 36

43:85 – وَتَبَارَكَ الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَعِندَهُ عِلْمُ السَّاعَةِ وَإِلَيْهِ تُرْجَعُونَ ٨٥

మరియు ఆకాశాలలోను మరియు భూమి లోను మరియు ఆ రెండింటి మధ్యను ఉన్న సమస్తానికీ సామ్రాజ్యాధికారి అయిన ఆయన (అల్లాహ్‌) శుభదాయకుడు; మరియు అంతిమ ఘడియ జ్ఞానం కేవలం ఆయనకే ఉంది; మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు.

43:86 – وَلَا يَمْلِكُ الَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ الشَّفَاعَةَ إِلَّا مَن شَهِدَ بِالْحَقِّ وَهُمْ يَعْلَمُونَ ٨٦

మరియు వారు ఆయనను వదలి, ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారికి సిఫారసు చేసే అధికారం లేదు. 37 కేవలం సత్యానికి సాక్ష్యమిచ్చే వారు మరియు (అల్లాహ్‌ ఒక్కడే, అని) తెలిసి ఉన్నవారు తప్ప!

43:87 – وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَهُمْ لَيَقُولُنَّ اللَّـهُ ۖ فَأَنَّىٰ يُؤْفَكُونَ ٨٧

మరియు నీవు: “మిమ్మల్ని ఎవరు సృష్టించారు?” అని వారితో అడిగినప్పుడు, వారు నిశ్చయంగా: “అల్లాహ్‌!” అని అంటారు. అయితే వారు ఎందుకు మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)?

43:88 – وَقِيلِهِ يَا رَبِّ إِنَّ هَـٰؤُلَاءِ قَوْمٌ لَّا يُؤْمِنُونَ ٨٨

“మరియు ఓ నా ప్రభూ! నిశ్చయంగా, ఈ ప్రజలు విశ్వసించరు!” అని పలికే (ప్రవక్త యొక్క) మాట (అల్లాహ్‌కు బాగా తెలుసు).

43:89 – فَاصْفَحْ عَنْهُمْ وَقُلْ سَلَامٌ ۚ فَسَوْفَ يَعْلَمُونَ ٨٩

కావున నీవు (ఓ ము’హమ్మద్‌!) వారిని ఉపేక్షించు. మరియు ఇలాఅను: “మీకుసలాం!” 38 మున్ముందు వారు తెలుసుకుంటారు.

సూరహ్‌ అద్‌-దు’ఖాన్‌ – దు’ఖానున్‌: పొగ. ఈ సూరహ్‌ కూడా ఇతర ‘హా-మీమ్‌ సూరాహ్‌ల వలే మక్కహ్ మధ్య కాలపు చివరి భాగంలో అవతరింపజేయబడింది. ఈ సూరాహ్‌ల సముదాయంలో ఇది 5వది. ఈ సూరహ్‌ పునరుత్థానదినం సత్యమనీ, అది తప్పకవస్తుందని తెలుపుతోంది మరియు అప్పుడు సంభవించే విషయాలను కూడా వివరిస్తోంది. 59 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 10వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 44:1 – حم ١

‘హా-మీమ్‌.

44:2 – وَالْكِتَابِ الْمُبِينِ ٢

స్పష్టమైన ఈ గ్రంథం సాక్షిగా! 1

44:3 – إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةٍ مُّبَارَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ ٣

నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్‌ఆన్‌ను) శుభవంతమైన రాత్రిలో అవతరింపజేశాము. 2 నిశ్చయంగా, మేము (ప్రజలను) ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ వచ్చాము. 3

44:4 – فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيمٍ ٤

దానిలో (ఆ రాత్రిలో), ప్రతి విషయం వివేకంతో విశదీకరించబడుతుంది;

44:5 – أَمْرًا مِّنْ عِندِنَا ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ ٥

మా ఆజ్ఞానుసారంగా. నిశ్చయంగా, మేము (సందేశ హరులను) పంపుతూ వచ్చాము.

44:6 – رَحْمَةً مِّن رَّبِّكَ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ ٦

నీ ప్రభువు తరఫు నుండి కారుణ్యంగా! నిశ్చయంగా, ఆయనే అంతా వినేవాడు, సర్వజ్ఞుడు.

44:7 – رَبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ إِن كُنتُم مُّوقِنِينَ ٧

భూమ్యాకాశాలకు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు. మీకు వాస్తవంగా నమ్మకమే ఉంటే!

44:8 – لَا إِلَـٰهَ إِلَّا هُوَ يُحْيِي وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ آبَائِكُمُ الْأَوَّلِينَ ٨

ఆయన తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదించేవాడు మరియు ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. ఆయనే మీ ప్రభువు మరియు పూర్వీకులైన మీ తాత-ముత్తాతల ప్రభువు. 4

44:9 – بَلْ هُمْ فِي شَكٍّ يَلْعَبُونَ ٩

అసలు! వారు సందేహంలో పడి ఆటల్లో మునిగి ఉన్నారు (పరిహసిస్తున్నారు).

44:10 – فَارْتَقِبْ يَوْمَ تَأْتِي السَّمَاءُ بِدُخَانٍ مُّبِينٍ ١٠

కావున నీవు ఆకాశం నుండి స్పష్టమైన పొగ వచ్చే దినం కొరకు నిరీక్షించు!

44:11 – يَغْشَى النَّاسَ ۖ هَـٰذَا عَذَابٌ أَلِيمٌ ١١

అది మానవులందరినీ క్రమ్ముకుంటుంది. అదొక బాధాకరమైన శిక్ష.

44:12 – رَّبَّنَا اكْشِفْ عَنَّا الْعَذَابَ إِنَّا مُؤْمِنُونَ ١٢

(అప్పుడు వారు ఇలా వేడుకుంటారు): “ఓ మా ప్రభూ! ఈ శిక్షను మా నుండి తొలగించు. నిశ్చయంగా, మేము విశ్వాసులమవుతాము.”

44:13 – أَنَّىٰ لَهُمُ الذِّكْرَىٰ وَقَدْ جَاءَهُمْ رَسُولٌ مُّبِينٌ ١٣

ఇక (అంతిమ ఘడియలో) హితబోధ స్వీకరించటం వారికి ఎలా పనికిరాగలదు? వాస్తవానికి వారి వద్దకు (సత్యాన్ని) స్పష్టంగా తెలియజేసే ప్రవక్త వచ్చిఉన్నాడు;

44:14 – ثُمَّ تَوَلَّوْا عَنْهُ وَقَالُوا مُعَلَّمٌ مَّجْنُونٌ ١٤

అప్పుడు వారు అతని నుండి మరలి పోయారు మరియు ఇలా అన్నారు: “ఇతను ఇతరుల నుండి నేర్చుకున్నాడు, ఇతనొక పిచ్చివాడు!” 5

44:15 – إِنَّا كَاشِفُو الْعَذَابِ قَلِيلًا ۚ إِنَّكُمْ عَائِدُونَ ١٥

వాస్తవానికి మేము కొంత కాలం వరకు ఈ శిక్షను తొలగిస్తే నిశ్చయంగా, మీరు చేస్తూ వచ్చిందే మళ్ళీ చేస్తారు.

44:16 – يَوْمَ نَبْطِشُ الْبَطْشَةَ الْكُبْرَىٰ إِنَّا مُنتَقِمُونَ ١٦

మేము శిక్షించటం కోసం గట్టిగా పట్టుకున్న రోజు, మేము నిశ్చయంగా ప్రతీకారం చేస్తాము. (3/4)

44:17 – وَلَقَدْ فَتَنَّا قَبْلَهُمْ قَوْمَ فِرْعَوْنَ وَجَاءَهُمْ رَسُولٌ كَرِيمٌ ١٧

  • మరియు వాస్తవంగా, వారికి పూర్వం మేము ఫిర్‌’ఔన్‌ జాతివారిని పరీక్షకు గురి చేశాము. మరియు వారి వద్దకు గౌరవనీయుడైన ప్రవక్త వచ్చి ఉన్నాడు.

44:18 – أَنْ أَدُّوا إِلَيَّ عِبَادَ اللَّـهِ ۖ إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ ١٨

(అతను ఇలా అన్నాడు): “అల్లాహ్‌ దాసులను నాకు అప్పగించు. 6 నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్తుణ్ణయిన సందేశహరుణ్ణి.

44:19 – وَأَن لَّا تَعْلُوا عَلَى اللَّـهِ ۖ إِنِّي آتِيكُم بِسُلْطَانٍ مُّبِينٍ ١٩

“మరియు మీరు అల్లాహ్‌ ముందు అహంభావాన్ని (ఔన్నత్యాన్ని) చూపకండి. నిశ్చయంగా, నేను మీ వద్దకు స్పష్టమైన ప్రమాణం తీసుకొనివచ్చాను.

44:20 – وَإِنِّي عُذْتُ بِرَبِّي وَرَبِّكُمْ أَن تَرْجُمُونِ ٢٠

“మరియు నిశ్చయంగా నేను నా ప్రభువు మరియు మీ ప్రభువు (అయిన అల్లాహ్) యొక్క శరణు పొందాను, – మీరు నన్ను రాళ్లు రువ్విచంప కుండా ఉండటానికి.

44:21 – وَإِن لَّمْ تُؤْمِنُوا لِي فَاعْتَزِلُونِ ٢١

“ఒకవేళ మీరు నా మాట నమ్మక పోయినా సరే! నా జోలికి మాత్రం రాకండి!”

44:22 – فَدَعَا رَبَّهُ أَنَّ هَـٰؤُلَاءِ قَوْمٌ مُّجْرِمُونَ ٢٢

చివరకు అతను తన ప్రభువును ఇలా ప్రార్థించాడు: “నిశ్చయంగా, ఈ జనులు చాలా అపరాధులు!”

44:23 – فَأَسْرِ بِعِبَادِي لَيْلًا إِنَّكُم مُّتَّبَعُونَ ٢٣

(అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు): “నీవు నా దాసులను తీసుకొని రాత్రివేళ బయలుదేరు, నిశ్చయంగా, మీరు వెంబడించబడతారు.

44:24 – وَاتْرُكِ الْبَحْرَ رَهْوًا ۖ إِنَّهُمْ جُندٌ مُّغْرَقُونَ ٢٤

“మరియు సముద్రాన్ని చీల్చి నెమ్మదిగా వెళ్ళిపో. 7 నిశ్చయంగా, ఆ సైనికులు అందులో మునిగిపోతారు!”

44:25 – كَمْ تَرَكُوا مِن جَنَّاتٍ وَعُيُونٍ ٢٥

వారు ఎన్నో తోటలను మరియు చెలమలను వెనుక విడిచిపోయారు;

44:26 – وَزُرُوعٍ وَمَقَامٍ كَرِيمٍ ٢٦

మరియు ఎన్నో పంట పొలాలను మరియు గొప్ప భవనాలను;

44:27 – وَنَعْمَةٍ كَانُوا فِيهَا فَاكِهِينَ ٢٧

మరియు వారు అనుభవిస్తూ ఉన్న ఎన్నో సుఖ-సంతోషాలను కూడా!

44:28 – كَذَٰلِكَ ۖ وَأَوْرَثْنَاهَا قَوْمًا آخَرِينَ ٢٨

ఈ విధంగా, (వారి ముగింపు జరిగింది). మరియు మేము వాటికి ఇతర జాతివారిని వారసులుగా చేశాము.

44:29 – فَمَا بَكَتْ عَلَيْهِمُ السَّمَاءُ وَالْأَرْضُ وَمَا كَانُوا مُنظَرِينَ ٢٩

కాని, వారి కొరకు ఆకాశంగానీ, భూమిగానీ విలపించలేదు మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడలేదు.

44:30 – وَلَقَدْ نَجَّيْنَا بَنِي إِسْرَائِيلَ مِنَ الْعَذَابِ الْمُهِينِ ٣٠

మరియు వాస్తవంగా! మేము ఇస్రా’యీల్‌ సంతతి వారిని అవమానకరమైన శిక్ష నుండి విముక్తికలిగించాము –

44:31 – مِن فِرْعَوْنَ ۚ إِنَّهُ كَانَ عَالِيًا مِّنَ الْمُسْرِفِينَ ٣١

ఫిర్‌ఔన్‌ నుండి. నిశ్చయంగా, అతడు మితిమీరి ప్రవర్తించే వారిలో, అగ్రగణ్యుడు.

44:32 – وَلَقَدِ اخْتَرْنَاهُمْ عَلَىٰ عِلْمٍ عَلَى الْعَالَمِينَ ٣٢

మరియు వాస్తవానికి మాకు తెలిసి ఉండి కూడా మేము వారిని లోకంలో (ఆ కాలపు) సర్వజనులపై ఎన్నుకున్నాము. 8

44:33 – وَآتَيْنَاهُم مِّنَ الْآيَاتِ مَا فِيهِ بَلَاءٌ مُّبِينٌ ٣٣

మరియు మేము వారికి అద్భుత సూచనలను (ఆయాత్‌లను) ఒసంగి ఉంటిమి. అందులో వారికి స్పష్టమైన పరీక్ష ఉండింది.

44:34 – إِنَّ هَـٰؤُلَاءِ لَيَقُولُونَ ٣٤

నిశ్చయంగా వీరు (ఖురైషులు) ఇలా అంటున్నారు:

44:35 – إِنْ هِيَ إِلَّا مَوْتَتُنَا الْأُولَىٰ وَمَا نَحْنُ بِمُنشَرِينَ ٣٥

“వాస్తవానికి, మాకు ఈ మొదటి మరణం మాత్రమే ఉంది, ఆ తరువాత మేము తిరిగి బ్రతికించబడము.

44:36 – فَأْتُوا بِآبَائِنَا إِن كُنتُمْ صَادِقِينَ ٣٦

“మీరు సత్యవంతులే అయితే, మా తాత-ముత్తాతలను లేపి తీసుకురండి!” 9

44:37 – أَهُمْ خَيْرٌ أَمْ قَوْمُ تُبَّعٍ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ أَهْلَكْنَاهُمْ ۖ إِنَّهُمْ كَانُوا مُجْرِمِينَ ٣٧

వారు మేలైనవారా? లేక తుబ్బ’అ జాతి వారు 10 మరియు వారికంటే పూర్వంవారా? మేము వారందరినీ నాశనం చేశాము. నిశ్చయంగా, వారందరూ అపరాధులే!

44:38 – وَمَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَاعِبِينَ ٣٨

మేము ఈ ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్నీ ఆట (కాలక్షేపం) కొరకు సృష్టించలేదు. 11

44:39 – مَا خَلَقْنَاهُمَا إِلَّا بِالْحَقِّ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ ٣٩

మేము వాటిని ఒక లక్ష్యంతోనే సృష్టిం చాము, కాని చాలామందికి ఇది తెలియదు. 12

44:40 – إِنَّ يَوْمَ الْفَصْلِ مِيقَاتُهُمْ أَجْمَعِينَ ٤٠

నిశ్చయంగా, తీర్పుదినం వారందరి కొరకు ఒక నిర్ణీతదినం. 13

44:41 – يَوْمَ لَا يُغْنِي مَوْلًى عَن مَّوْلًى شَيْئًا وَلَا هُمْ يُنصَرُونَ ٤١

ఆ దినమున ఏ స్నేహితుడు కూడా మరొక స్నేహితునికి ఏమాత్రం ఉపయోగపడడు.మరియు వారికి ఎలాంటి సహాయమూ లభించదు; 14

44:42 – إِلَّا مَن رَّحِمَ اللَّـهُ ۚ إِنَّهُ هُوَ الْعَزِيزُ الرَّحِيمُ ٤٢

అల్లాహ్‌ కరుణించిన వానికి తప్ప! నిశ్చయంగా, ఆయనే సర్వ శక్తిమంతుడు, అపార కరుణాప్రదాత.

44:43 – إِنَّ شَجَرَتَ الزَّقُّومِ ٤٣

నిశ్చయంగా, జఖ్ఖూమ్‌ వృక్ష ఫలం;

44:44 – طَعَامُ الْأَثِيمِ ٤٤

పాపులకు అహారంగా ఇవ్వబడుతుంది;

44:45 – كَالْمُهْلِ يَغْلِي فِي الْبُطُونِ ٤٥

మరిగే నూనె (సీసం) వలే, 15 అది వారి కడుపులో మరుగుతుంది;

44:46 – كَغَلْيِ الْحَمِيمِ ٤٦

సలసల కాగే నీటిలాగా!

44:47 – خُذُوهُ فَاعْتِلُوهُ إِلَىٰ سَوَاءِ الْجَحِيمِ ٤٧

(ఇలా అనబడుతుంది): “ఇతనిని పట్టుకొని భగభగ మండే నరకాగ్ని మధ్యలోకి ఈడ్వండి;

44:48 – ثُمَّ صُبُّوا فَوْقَ رَأْسِهِ مِنْ عَذَابِ الْحَمِيمِ ٤٨

“ఆ తరువాత అతని నెత్తిమీద సలసల కాగే నీటి శిక్షను పోయండి.

44:49 – ذُقْ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْكَرِيمُ ٤٩

” ‘దీనిని రుచిచూడు; నిశ్చయంగా, నీవు శక్తిమంతుడివిగా, గౌరవనీయుడివిగా ఉండేవాడివి కదా!’

44:50 – إِنَّ هَـٰذَا مَا كُنتُم بِهِ تَمْتَرُونَ ٥٠

“నిశ్చయంగా, ఇదే మీరు సందేహంలో పడివున్న విషయం!”

44:51 – إِنَّ الْمُتَّقِينَ فِي مَقَامٍ أَمِينٍ ٥١

నిశ్చయంగా, దైవభీతి గలవారు శాంతి భద్రతలుగల స్థలంలో ఉంటారు.

44:52 – فِي جَنَّاتٍ وَعُيُونٍ ٥٢

ఉద్యానవనాలలో మరియు చెలమలమధ్య.

44:53 – يَلْبَسُونَ مِن سُندُسٍ وَإِسْتَبْرَقٍ مُّتَقَابِلِينَ ٥٣

వారు, మృదువైన పట్టు వస్త్రాలు మరియు బంగారు (జరీ) పట్టువస్త్రాలు ధరించి, ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు. 16

44:54 – كَذَٰلِكَ وَزَوَّجْنَاهُم بِحُورٍ عِينٍ ٥٤

ఇలా ఉంటుంది వారి స్థితి! మరియు మేము వారిని అందమైన, ప్రకాశవంతమైన కళ్ళుగల వారితో (హూర్‌లతో) వివాహం చేయిస్తాము. 17

44:55 – يَدْعُونَ فِيهَا بِكُلِّ فَاكِهَةٍ آمِنِينَ ٥٥

వారక్కడ శాంతియుతంగా ఉంటూ అనేక రకాలైన ఫలాలను అడుగుతుంటారు. 18

44:56 – لَا يَذُوقُونَ فِيهَا الْمَوْتَ إِلَّا الْمَوْتَةَ الْأُولَىٰ ۖ وَوَقَاهُمْ عَذَابَ الْجَحِيمِ ٥٦

వారక్కడ మరణాన్ని 19 ఎన్నడూ రుచి చూడరు; వారి మొదటి (ఇహలోక) మరణం తప్ప! మరియు ఆయన వారిని భగభగమండే అగ్ని శిక్ష నుండి కాపాడాడు;

44:57 – فَضْلًا مِّن رَّبِّكَ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ ٥٧

నీ ప్రభువు అనుగ్రహం వల్ల. ఇదే, ఆ గొప్ప సాఫల్యం!

44:58 – فَإِنَّمَا يَسَّرْنَاهُ بِلِسَانِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ ٥٨

అందుకే నిశ్చయంగా, మేము (ఈ ఖుర్‌ఆన్‌ను) నీ భాషలో సులభంచేశాము. ఇలాగైనా వారు అర్థం చేసుకుంటారని (హితబోధ గ్రహిస్తారని). 20

44:59 – فَارْتَقِبْ إِنَّهُم مُّرْتَقِبُونَ ٥٩

కావున, నీవు నిరీక్షించు! నిశ్చయంగా, వారు కూడా నిరీక్షిస్తున్నారు.

సూరహ్‌ అల్‌-జాసి’యహ్‌ – జాసి’యతున్‌: భక్తితో మోకరిల్లటం, కూలబడటం ఇది సూరహ్‌ అద్‌-‘దుఖాన్‌ (44) తరువాత అవతరింపజేయబడింది. మానవులంతా పునరుత్థాన దినమున నమ్రతతో అల్లాహ్‌ ముందు మోకరిల్లుతారు. ‘హా-మీమ్‌, 7 సూరాహ్‌లలో ఇది 6 వది. మక్కహ్ లో అవతరింప- జేయబడిన ఈ సూరహ్‌లో 37 ఆయతులు ఉన్నాయి. దీని పేరు 28వ ఆయత్‌లో ఉంది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 45:1 – حم ١

‘హా-మీమ్‌.

45:2 – تَنزِيلُ الْكِتَابِ مِنَ اللَّـهِ الْعَزِيزِ الْحَكِيمِ ٢

ఈ గ్రంథ (ఖుర్‌ఆన్‌) అవతరణ సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్‌ తరఫునుండి జరిగింది.

45:3 – إِنَّ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ لَآيَاتٍ لِّلْمُؤْمِنِينَ ٣

నిశ్చయంగా, విశ్వసించే వారి కొరకు, ఆకాశాలలో మరియు భూమిలో అనేక సూచనలు (ఆయాత్‌) ఉన్నాయి. 1

45:4 – وَفِي خَلْقِكُمْ وَمَا يَبُثُّ مِن دَابَّةٍ آيَاتٌ لِّقَوْمٍ يُوقِنُونَ ٤

మరియు మీ సృష్టిలోనూ మరియు (భూమిలో) ఆయన వ్యాపింపజేసిన జీవరాసుల లోనూ, దృఢవిశ్వాసం ఉన్నవారికొరకు ఎన్నో సూచనలు (ఆయాత్‌) ఉన్నాయి. 2

45:5 – وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَمَا أَنزَلَ اللَّـهُ مِنَ السَّمَاءِ مِن رِّزْقٍ فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَتَصْرِيفِ الرِّيَاحِ آيَاتٌ لِّقَوْمٍ يَعْقِلُونَ ٥

మరియు రేయింబవళ్ళ అనుక్రమంలో మరియు అల్లాహ్‌ ఆకాశం నుండి జీవనోపాధిని (వర్షాన్ని) పంపి, దాని ద్వారా భూమికి దాని మరణం తర్వాత, తిరిగి జీవం పోయటంలో మరియు వాయువుల మారటంలోనూ బుద్ధి మంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి.

45:6 – تِلْكَ آيَاتُ اللَّـهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۖ فَبِأَيِّ حَدِيثٍ بَعْدَ اللَّـهِ وَآيَاتِهِ يُؤْمِنُونَ ٦

ఇవి అల్లాహ్‌ సూచనలు (ఆయాత్‌), మేము వీటిని నీకు యథా-తథంగా వినిపిస్తున్నాము. ఇక వారు అల్లాహ్‌ను మరియు ఆయన సూచనలను (ఆయాత్‌లను) కాక మరే సమాచారాన్ని విశ్వసిస్తారు? 3

45:7 – وَيْلٌ لِّكُلِّ أَفَّاكٍ أَثِيمٍ ٧

అపవాదుడు, పాపిష్ఠుడు అయిన ప్రతి వ్యక్తికి తీవ్రమైన వ్యథ గలదు.

45:8 – يَسْمَعُ آيَاتِ اللَّـهِ تُتْلَىٰ عَلَيْهِ ثُمَّ يُصِرُّ مُسْتَكْبِرًا كَأَن لَّمْ يَسْمَعْهَا ۖ فَبَشِّرْهُ بِعَذَابٍ أَلِيمٍ ٨

అతడు తన ముందు పఠించబడే అల్లాహ్‌ సూచనలను (ఆయాత్‌ లను) వింటున్నాడు ఆ తరువాత మూర్ఖపు పట్టుతో దురహంకారంతో వాటిని విననట్లు వ్యవహరిస్తున్నాడు. కావున అతనికి బాధాకరమైన శిక్ష పడనున్నదనే వార్తను వినిపించు.

45:9 – وَإِذَا عَلِمَ مِنْ آيَاتِنَا شَيْئًا اتَّخَذَهَا هُزُوًا ۚ أُولَـٰئِكَ لَهُمْ عَذَابٌ مُّهِينٌ ٩

మరియు మా సూచనలకు (ఆయాత్‌ లకు) సంబంధించిన విషయం అతనికి తెలిసినప్పుడు, వాటిని గురించి ఎగతాళి చేస్తాడు. అటువంటి వారందరికీ అవమానకరమైన శిక్ష ఉంది.

45:10 – مِّن وَرَائِهِمْ جَهَنَّمُ ۖ وَلَا يُغْنِي عَنْهُم مَّا كَسَبُوا شَيْئًا وَلَا مَا اتَّخَذُوا مِن دُونِ اللَّـهِ أَوْلِيَاءَ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ ١٠

వారి ముందు నరకం ఉంటుంది. మరియు వారి సంపాదన వారికి ఏ మాత్రం పనికిరాదు. మరియు అల్లాహ్‌ను వదలి వారు సంరక్షకులుగా చేసుకున్న వారు కూడా వారికి ఏ విధంగానూ ఉపయోగపడరు. మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది.

45:11 – هَـٰذَا هُدًى ۖ وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِ رَبِّهِمْ لَهُمْ عَذَابٌ مِّن رِّجْزٍ أَلِيمٌ ١١

ఇది (ఈ ఖుర్‌ఆన్‌) మార్గదర్శకత్వం. మరియు ఎవరైతే తమ ప్రభువు సూచనలను (ఆయాత్‌లను) తిరస్కరిస్తారో, వారికి అధమమైన, బాధాకరమైన శిక్ష ఉంది. 4 (7/8)

45:12 – اللَّـهُ الَّذِي سَخَّرَ لَكُمُ الْبَحْرَ لِتَجْرِيَ الْفُلْكُ فِيهِ بِأَمْرِهِ وَلِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ ١٢

  • అల్లాహ్‌! ఆయనే, సముద్రాన్ని మీకు ఉపయుక్తంగా చేశాడు; దానిలో తన ఆజ్ఞతో ఓడలు పయనించటానికి మరియు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు బహుశా మీరు కృతజ్ఞులవుతారని.

45:13 – وَسَخَّرَ لَكُم مَّا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ جَمِيعًا مِّنْهُ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ ١٣

మరియు ఆయన ఆకాశాలలో మరియు భూమిలో నున్న సమస్తాన్ని, తన అనుగ్రహంతో మీకు ఉపయుక్తంగా చేశాడు. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలు (ఆయాత్‌) ఉన్నాయి.

45:14 – قُل لِّلَّذِينَ آمَنُوا يَغْفِرُوا لِلَّذِينَ لَا يَرْجُونَ أَيَّامَ اللَّـهِ لِيَجْزِيَ قَوْمًا بِمَا كَانُوا يَكْسِبُونَ ١٤

(ఓ ప్రవక్తా!) విశ్వసించిన వారితో: ” ‘ఒక జాతి వారికి తమ కర్మలకు తగిన ప్రతిఫలమిచ్చే అల్లాహ్‌ దినాలు 5 వస్తాయని’ నమ్మని వారిని క్షమించండి.” అని చెప్పు. 6

45:15 – مَنْ عَمِلَ صَالِحًا فَلِنَفْسِهِ ۖ وَمَنْ أَسَاءَ فَعَلَيْهَا ۖ ثُمَّ إِلَىٰ رَبِّكُمْ تُرْجَعُونَ ١٥

సత్కార్యం చేసేవాడు తన మేలుకే చేస్తాడు. మరియు దుష్కార్యం చేసేవాడు దాని (ఫలితాన్ని) అనుభవిస్తాడు. చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలింపబడతారు.

45:16 – وَلَقَدْ آتَيْنَا بَنِي إِسْرَائِيلَ الْكِتَابَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ وَرَزَقْنَاهُم مِّنَ الطَّيِّبَاتِ وَفَضَّلْنَاهُمْ عَلَى الْعَالَمِينَ ١٦

మరియు వాస్తవంగా, మేము ఇస్రా’యీల్‌ సంతతి వారికి గ్రంథాన్ని (తౌరాత్‌ను), వివేకాన్ని మరియు ప్రవక్త పదవులను ప్రసాదించి ఉన్నాము మరియు వారికి మంచి జీవనోపాధిని ప్రసాదించి ఉన్నాము మరియు వారిని (వారి కాలపు) ప్రజలపై ప్రత్యేకంగా ఆదరించి ఉన్నాము. 7

45:17 – وَآتَيْنَاهُم بَيِّنَاتٍ مِّنَ الْأَمْرِ ۖ فَمَا اخْتَلَفُوا إِلَّا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْعِلْمُ بَغْيًا بَيْنَهُمْ ۚ إِنَّ رَبَّكَ يَقْضِي بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ ١٧

మరియు వారికి ధర్మవిషయంలో స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చి ఉన్నాము. 8 వారు తమ పరస్పర ద్వేషాల వల్ల వారికి జ్ఞానం వచ్చిన పిదపనే విభేదాలకు లోనయ్యారు. 9 నిశ్చయంగా, నీప్రభువు వారిమధ్య ఉన్న విభేదాలను గురించి పునరుత్థానదినమున, వారి మధ్య తీర్పుచేస్తాడు.

45:18 – ثُمَّ جَعَلْنَاكَ عَلَىٰ شَرِيعَةٍ مِّنَ الْأَمْرِ فَاتَّبِعْهَا وَلَا تَتَّبِعْ أَهْوَاءَ الَّذِينَ لَا يَعْلَمُونَ ١٨

తరువాత (ఓ ము’హమ్మద్‌!) మేము, నిన్ను (మేము) నియమించిన ధర్మవిధానం మీద ఉంచాము. కావున నీవు దానినే అనుసరించు మరియు నీవు జ్ఞానంలేని వారి కోరికలను అనుసరించకు.

45:19 – إِنَّهُمْ لَن يُغْنُوا عَنكَ مِنَ اللَّـهِ شَيْئًا ۚ وَإِنَّ الظَّالِمِينَ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۖ وَاللَّـهُ وَلِيُّ الْمُتَّقِينَ ١٩

నిశ్చయంగా వారు నీకు – అల్లాహ్‌కు ప్రతిగా – ఏ మాత్రం ఉపయోగపడలేరు. మరియు నిశ్చయంగా దుర్మార్గులు ఒకరికొకరు రక్షకులు. మరియు అల్లాహ్‌యే దైవభీతి గలవారి సంరక్షకుడు.

45:20 – هَـٰذَا بَصَائِرُ لِلنَّاسِ وَهُدًى وَرَحْمَةٌ لِّقَوْمٍ يُوقِنُونَ ٢٠

ఇది (ఈ ఖుర్‌ఆన్‌) మానవులకు అంతర్దృష్టి (పరిజ్ఞానం) ఇచ్చేది గానూ మరియు విశ్వసించే జనులకు మార్గదర్శకత్వం గానూ మరియు కారుణ్యం గానూ ఉంది.

45:21 – أَمْ حَسِبَ الَّذِينَ اجْتَرَحُوا السَّيِّئَاتِ أَن نَّجْعَلَهُمْ كَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَوَاءً مَّحْيَاهُمْ وَمَمَاتُهُمْ ۚ سَاءَ مَا يَحْكُمُونَ ٢١

దుష్కార్యాలకు పాల్పడిన వారు, వారి ఇహలోక జీవితంలోనూ మరియు వారి మరణానంతర జీవితంలోనూ – వారినీ మరియు విశ్వసించి సత్కార్యాలు చేసే వారినీ – మేము ఒకే విధంగా పరిగణిస్తామని భావిస్తున్నారా ఏమిటి? వారి నిర్ణయాలు ఎంతచెడ్డవి!

45:22 – وَخَلَقَ اللَّـهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ وَلِتُجْزَىٰ كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ ٢٢

మరియు అల్లాహ్‌ ఆకాశాలనూ మరియు భూమినీ సత్యంతో సృష్టించాడు మరియు ప్రతి వ్యక్తికి తన కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికి మరియు వారికి ఎలాంటి అన్యాయం జరుగదు.

45:23 – أَفَرَأَيْتَ مَنِ اتَّخَذَ إِلَـٰهَهُ هَوَاهُ وَأَضَلَّهُ اللَّـهُ عَلَىٰ عِلْمٍ وَخَتَمَ عَلَىٰ سَمْعِهِ وَقَلْبِهِ وَجَعَلَ عَلَىٰ بَصَرِهِ غِشَاوَةً فَمَن يَهْدِيهِ مِن بَعْدِ اللَّـهِ ۚ أَفَلَا تَذَكَّرُونَ ٢٣

తన మనోవాంఛలను తన దైవంగా చేసుకున్నవానిని నీవు చూశావా? మరియు అతడు జ్ఞానవంతుడు అయినప్పటికీ అల్లాహ్‌! అతనిని మార్గభ్రష్టత్వంలో వదిలాడు 10 మరియు అతని చెవుల మీద మరియు అతని హృదయం మీద ముద్రవేశాడు మరియు అతని కళ్ళమీద తెర వేశాడు; 11 ఇక అల్లాహ్‌ తప్ప అతనికి మార్గదర్శకత్వం చేసేవాడు ఎవడున్నాడు? ఇది మీరు గ్రహించలేరా?

45:24 – وَقَالُوا مَا هِيَ إِلَّا حَيَاتُنَا الدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا يُهْلِكُنَا إِلَّا الدَّهْرُ ۚ وَمَا لَهُم بِذَٰلِكَ مِنْ عِلْمٍ ۖ إِنْ هُمْ إِلَّا يَظُنُّونَ ٢٤

మరియు వారిలా అంటారు: “మా (జీవితం) కేవలం ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే! మేము మరణించేది మరియు జీవించేది ఇక్కడే మరియు మమ్మల్ని నశింపజేసేది ఈ కాలచక్రం మాత్రమే!” 12 మరియు వాస్తవానికి, దానిని గురించి వారికి ఎలాంటి జ్ఞానంలేదు. వారు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు.

45:25 – وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ مَّا كَانَ حُجَّتَهُمْ إِلَّا أَن قَالُوا ائْتُوا بِآبَائِنَا إِن كُنتُمْ صَادِقِينَ ٢٥

మరియు వారి ముందు స్పష్టమైన మా సూచనలు (ఆయాత్‌) వినిపించబడినప్పుడు: “మీరు సత్యవంతులే అయితే మా తాత-ముత్తాతలను (బ్రతికించి) తీసుకురండి!” అని మాత్రమే వాదిస్తారు. 13

45:26 – قُلِ اللَّـهُ يُحْيِيكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يَجْمَعُكُمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ ٢٦

వారితో ఇలా అను: “అల్లాహ్‌యే మీకు జీవితం ఇచ్చేవాడు తరువాత మరణింపజేసేవాడు ఆ పిదప పునరుత్థాన దినమున సమావేశపరచే వాడూను! ఇందులో ఎలాంటి సందేహంలేదు. అయినా చాలామంది జనులకు ఇది తెలియదు.”

45:27 – وَلِلَّـهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يَوْمَئِذٍ يَخْسَرُ الْمُبْطِلُونَ ٢٧

మరియు ఆకాశాలమరియు భూమి యొక్క సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్‌కే చెందినది. మరియు ఆ ఘడియ ఆసన్నమైన నాడు, ఆ దినమున అసత్యవాదులు నష్టానికి గురి అవుతారు.

45:28 – وَتَرَىٰ كُلَّ أُمَّةٍ جَاثِيَةً ۚ كُلُّ أُمَّةٍ تُدْعَىٰ إِلَىٰ كِتَابِهَا الْيَوْمَ تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ ٢٨

మరియు ప్రతి సమాజంవారిని నీవు మోకరిల్లి 14 ఉండటాన్ని చూస్తావు. ప్రతి జాతి వారిని తమ కర్మ పత్రం వైపునకు పిలవడం జరుగుతుంది. (వారితో ఇలా అనబడుతుంది): “ఈ రోజు మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది.

45:29 – هَـٰذَا كِتَابُنَا يَنطِقُ عَلَيْكُم بِالْحَقِّ ۚ إِنَّا كُنَّا نَسْتَنسِخُ مَا كُنتُمْ تَعْمَلُونَ ٢٩

“ఇది మేము వ్రాసిపెట్టిన (మీ కర్మ) పత్రం, ఇది మీ గురించి సత్యమే పలుకుతుంది. 15 నిశ్చయంగా, మేము మీరు చేస్తున్న కర్మలన్నింటినీ వ్రాయిస్తూ ఉండేవారము.”

45:30 – فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُدْخِلُهُمْ رَبُّهُمْ فِي رَحْمَتِهِ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْمُبِينُ ٣٠

కావున విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండిన వారిని, వారి ప్రభువు తన కారుణ్యంలోకి ప్రవేశింపజేసుకుంటాడు. 16 ఇదే ఆ స్పష్టమైన విజయం.

45:31 – وَأَمَّا الَّذِينَ كَفَرُوا أَفَلَمْ تَكُنْ آيَاتِي تُتْلَىٰ عَلَيْكُمْ فَاسْتَكْبَرْتُمْ وَكُنتُمْ قَوْمًا مُّجْرِمِينَ ٣١

మరియు సత్యాన్ని తిరస్కరించిన వారితో (ఇలా అనబడుతుంది): “మీకు మా సూచనలు వినిపించబడలేదా? కాని మీరు దురహంకారంలో పడిపోయారు మరియు అపరాధులైపోయారు.”

45:32 – وَإِذَا قِيلَ إِنَّ وَعْدَ اللَّـهِ حَقٌّ وَالسَّاعَةُ لَا رَيْبَ فِيهَا قُلْتُم مَّا نَدْرِي مَا السَّاعَةُ إِن نَّظُنُّ إِلَّا ظَنًّا وَمَا نَحْنُ بِمُسْتَيْقِنِينَ ٣٢

మరియు: “నిశ్చయంగా, అల్లాహ్‌ వాగ్దానం సత్యం మరియు అంతిమ ఘడియను గురించి ఎలాంటి సందేహంలేదు.” అని అన్నప్పుడు మీరన్నారు: “ఆ అంతిమ ఘడియ ఏమిటో మాకు తెలియదు. అది కేవలం ఒక ఊహాగానం తప్ప మరేమీ కాదని మేము భావిస్తున్నాము. మేము దానిని ఏ మాత్రం నమ్మేవారం కాము.” 17

45:33 – وَبَدَا لَهُمْ سَيِّئَاتُ مَا عَمِلُوا وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ٣٣

అప్పుడు వారి ముందు వారు చేస్తూ ఉండిన దుష్కార్యాలు ప్రత్యక్షమవుతాయి. మరియు వారు దేనిని గురించి పరిహాసమాడుతూ ఉన్నారో, అదే వారిని క్రమ్ముకుంటుంది.

45:34 – وَقِيلَ الْيَوْمَ نَنسَاكُمْ كَمَا نَسِيتُمْ لِقَاءَ يَوْمِكُمْ هَـٰذَا وَمَأْوَاكُمُ النَّارُ وَمَا لَكُم مِّن نَّاصِرِينَ ٣٤

అప్పుడు వారి ముందు వారు చేస్తూ ఉండిన దుష్కార్యాలు ప్రత్యక్షమవుతాయి. మరియు వారు దేనిని గురించి పరిహాసమాడుతూ ఉన్నారో, అదే వారిని క్రమ్ముకుంటుంది.

45:35 – ذَٰلِكُم بِأَنَّكُمُ اتَّخَذْتُمْ آيَاتِ اللَّـهِ هُزُوًا وَغَرَّتْكُمُ الْحَيَاةُ الدُّنْيَا ۚ فَالْيَوْمَ لَا يُخْرَجُونَ مِنْهَا وَلَا هُمْ يُسْتَعْتَبُونَ ٣٥

ఇది ఎందుకంటే, వాస్తవానికి మీరు అల్లాహ్‌ సూచనలను (ఆయాత్‌ లను) పరిహాసంగా తీసుకున్నారు. మరియు ఇహలోక జీవితం మిమ్మల్ని మోసపుచ్చింది. కావున ఈ రోజు వారిని దాని (నరకం) నుండి బయటికి తీయడం జరగదు. 18 మరియు వారికి తమ తప్పులను సరిదిద్దుకునే అవకాశమూ దొరకదు.

45:36 – فَلِلَّـهِ الْحَمْدُ رَبِّ السَّمَاوَاتِ وَرَبِّ الْأَرْضِ رَبِّ الْعَالَمِينَ ٣٦

ఇక సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్‌ మాత్రమే! ఆయనే ఆకాశాలకూ ప్రభువు మరియు భూమికీ ప్రభువు; ఆయనే సర్వలోకాలకు కూడా ప్రభువు!

45:37 – وَلَهُ الْكِبْرِيَاءُ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ٣٧

ఆకాశాలలో మరియు భూమిలో ఘనత (మహనీయత) ఆయనకే చెందుతుంది. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

సూరహ్‌ అల్‌-అ’హ్‌ఖాఫ్‌ – అ’హ్‌ఖాఫ్‌: ఒరిగిన ఇసుక దిబ్బలు. ‘హా-మీమ్‌, సూరాహ్‌లలో ఇది 7వది మరియు చివరిది. ఈ ఒరిగిన ఇసుక దిబ్బలు ‘ఆద్‌ జాతివారి దేశపు చిహ్నాలు. ఇవి హ’దర్‌మౌత్‌ మరియు యమన్‌ పరిసరాలలో ఉన్నాయి. చూడండి, 7:65. వారి దేశంలో అప్పుడు పుష్కలంగా ధనధాన్యాలుండేవి. వారి సత్య-తిరస్కారం వల్ల వారి మీద అల్లాహ్‌ (సు.త.) శిక్ష అవతరించింది. చూడండి, 46:24-25. ‘ఎల్లప్పుడు సత్యమే వర్థిల్లుతుంది.’ అనేది ఈ సూరహ్‌ ఉపదేశం. ప్రతి దాని సృష్టికి ఒక కారణముంది. మక్కహ్ లో అవతరింపజేయబడిన ఈ సూరహ్‌లో 35 ఆయతులు ఉన్నాయి. దీని పేరు 21వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 46:1 – حم ١

  1. [(*)] ‘హా-మీమ్‌. 1

46:2 – تَنزِيلُ الْكِتَابِ مِنَ اللَّـهِ الْعَزِيزِ الْحَكِيمِ ٢

ఈ గ్రంథ (ఖుర్‌ఆన్‌) అవతరణ సర్వశక్తి మంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్‌ తరఫు నుండి జరిగింది.

46:3 – مَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ وَأَجَلٍ مُّسَمًّى ۚ وَالَّذِينَ كَفَرُوا عَمَّا أُنذِرُوا مُعْرِضُونَ ٣

మేము ఆకాశాలను, భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని, సత్యంతో ఒక నిర్ణీత కాలం కొరకు మాత్రమే సృష్టించాము. 2 మరియు సత్యాన్ని తిరస్కరించిన వారు తమకు చేయ బడిన హెచ్చరిక నుండి విముఖులవుతున్నారు.

46:4 – قُلْ أَرَأَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ اللَّـهِ أَرُونِي مَاذَا خَلَقُوا مِنَ الْأَرْضِ أَمْ لَهُمْ شِرْكٌ فِي السَّمَاوَاتِ ۖ ائْتُونِي بِكِتَابٍ مِّن قَبْلِ هَـٰذَا أَوْ أَثَارَةٍ مِّنْ عِلْمٍ إِن كُنتُمْ صَادِقِينَ ٤

వారితో ఇలా అను: “అల్లాహ్‌ను వదలి, మీరు ప్రార్థిస్తున్నవాటిని గురించి ఆలోచించారా? అయితే నాకు చూపండి. 3 వారు భూమిలో ఏమి సృష్టించారో? లేదా, వారికి ఆకాశాలలో ఏదైనా భాగముందా? మీరు సత్యవంతులే అయితే, దీనికి (ఈ ఖుర్‌ఆన్‌కు) ముందు వచ్చిన ఏదైనా గ్రంథాన్ని లేదా ఏదైనా మిగిలి ఉన్న జ్ఞానాన్ని తెచ్చి చూపండి.” 4

46:5 – وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّـهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ ٥

మరియు అల్లాహ్‌ను వదలి పునరుత్థాన దినం వరకు తమ ప్రార్థనలను విని సమాధాన మివ్వ లేనటువంటి వారిని ప్రార్థించే వారికంటే, ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు, తమను (ప్రార్థించే వారి) ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారు.

46:6 – وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ ٦

మరియు మానవులను (పునరుత్థాన దినమున) సమావేశపరచినపుడు, (ఆరాధించ బడిన) వారు! (తమను ఆరాధించిన) వారికి విరోధులై ఉంటారు మరియు వారి ఆరాధనను తిరస్కరిస్తారు. 5

46:7 – وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالَ الَّذِينَ كَفَرُوا لِلْحَقِّ لَمَّا جَاءَهُمْ هَـٰذَا سِحْرٌ مُّبِينٌ ٧

  1. మరియు వారికి మా స్పష్టమైన సూచనలు (ఆయాత్‌) వినిపించబడినప్పుడు, సత్య-తిరస్కారులు – సత్యం (ఈ ఖుర్‌ఆన్‌) వారి ముందుకు వచ్చినప్పుడు – ఇలా అంటారు: “ఇది స్పష్టమైన మంత్రజాలమే!” 6

46:8 – أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ إِنِ افْتَرَيْتُهُ فَلَا تَمْلِكُونَ لِي مِنَ اللَّـهِ شَيْئًا ۖ هُوَ أَعْلَمُ بِمَا تُفِيضُونَ فِيهِ ۖ كَفَىٰ بِهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ ۖ وَهُوَ الْغَفُورُ الرَّحِيمُ ٨

లేదా ఇలా అంటారు: “ఇతనే (ము’హమ్మదే) దీనిని కల్పించాడు.” వారితో ఇలా అను: “ఒకవేళ నేను దీనిని కల్పించి ఉండి నట్లయితే, మీరు నన్ను అల్లాహ్‌ (శిక్ష) నుండి ఏ మాత్రం కాపాడలేరు. మీరు కల్పించే మాటలు ఆయనకు బాగాతెలుసు. నాకూ మీకూ మధ్య ఆయన (అల్లాహ్‌) సాక్ష్యమే చాలు! మరియు ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.”

46:9 – قُلْ مَا كُنتُ بِدْعًا مِّنَ الرُّسُلِ وَمَا أَدْرِي مَا يُفْعَلُ بِي وَلَا بِكُمْ ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰ إِلَيَّ وَمَا أَنَا إِلَّا نَذِيرٌ مُّبِينٌ ٩

(ఓ ము’హమ్మద్‌!) వారితో ఇలా అను: “నేను మొట్టమొదటి ప్రవక్తనేమీకాను. నాకూ మరియు మీకూ ఏమి కానున్నదో నాకు తెలియదు. 7 నేను అనుసరించేది, నాపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వ’హీ) మాత్రమే. మరియు నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే.”

46:10 – قُلْ أَرَأَيْتُمْ إِن كَانَ مِنْ عِندِ اللَّـهِ وَكَفَرْتُم بِهِ وَشَهِدَ شَاهِدٌ مِّن بَنِي إِسْرَائِيلَ عَلَىٰ مِثْلِهِ فَآمَنَ وَاسْتَكْبَرْتُمْ ۖ إِنَّ اللَّـهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ ١٠

వారితో ఇలా అను: “ఇది (ఈ ఖుర్‌ఆన్‌) ఒక వేళ అల్లాహ్‌ తరఫు నుండి వచ్చి ఉండి, మీరు దీనిని తిరస్కరిస్తూ ఉండినట్లయితే (మీ గతి ఏమవుతుందో) మీరు ఆలోచించారా? ఇస్రా’యీల్‌ సంతతికి చెందిన ఒక సాక్షి ఇది (ఈ ఖర్‌ఆన్‌) దాని (తౌరాత్‌) లాంటి గ్రంథమేనని, సాక్ష్యం ఇచ్చాడు మరియు విశ్వసించాడు కూడా. 8 కాని మీరేమో అహంభావానికి గురి అయ్యారు. నిశ్చయంగా, అల్లాహ్‌ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు.”

46:11 – وَقَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا لَوْ كَانَ خَيْرًا مَّا سَبَقُونَا إِلَيْهِ ۚ وَإِذْ لَمْ يَهْتَدُوا بِهِ فَسَيَقُولُونَ هَـٰذَا إِفْكٌ قَدِيمٌ ١١

సత్య-తిరస్కారులు, విశ్వాసులను గురించి ఇలా అంటారు: “ఒకవేళ ఇందులో (ఇస్లాంలో) మేలే ఉంటే, వీరు మా కంటే ముందుగా దాని వైపునకు పోయి ఉండేవారు కాదు!” 9 మరియు వారు దాని (ఖుర్‌ఆన్‌) నుండి మార్గదర్శకత్వం పొందలేదు! కాబట్టి వారు: “ఇదొక ప్రాచీన బూటక కల్పనయే!” అని అంటారు.

46:12 – وَمِن قَبْلِهِ كِتَابُ مُوسَىٰ إِمَامًا وَرَحْمَةً ۚ وَهَـٰذَا كِتَابٌ مُّصَدِّقٌ لِّسَانًا عَرَبِيًّا لِّيُنذِرَ الَّذِينَ ظَلَمُوا وَبُشْرَىٰ لِلْمُحْسِنِينَ ١٢

మరియు దీనికి (ఈ గ్రంథానికి) పూర్వం మూసా గ్రంథం మార్గదర్శినిగా మరియు కారుణ్యంగా వచ్చింది. మరియు ఈ గ్రంథం (ఖుర్‌ఆన్‌) దానిని ధృవీకరిస్తూ అరబ్బీ భాషలో, దుర్మార్గులను హెచ్చరించటానికి మరియు సజ్జనులకు శుభవార్తలు ఇవ్వటానికి వచ్చింది.

46:13 – إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّـهُ ثُمَّ اسْتَقَامُوا فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ١٣

నిశ్చయంగా, ఎవరైతే: “మా ప్రభువు అల్లాహ్‌యే!” అని, తరువాత దానిపై స్థిరంగా ఉంటారో! అలాంటివారికి ఎలాంటి భయమూ వుండదు మరియు వారు దుఃఖపడరు కూడా!

46:14 – أُولَـٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ خَالِدِينَ فِيهَا جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ ١٤

అలాంటి వారే స్వర్గవాసులవుతారు. తాము చేస్తూ ఉండిన (మంచి) కర్మల ఫలితంగా వారు అందులో శాశ్వతంగా ఉంటారు.

46:15 – وَوَصَّيْنَا الْإِنسَانَ بِوَالِدَيْهِ إِحْسَانًا ۖ حَمَلَتْهُ أُمُّهُ كُرْهًا وَوَضَعَتْهُ كُرْهًا ۖ وَحَمْلُهُ وَفِصَالُهُ ثَلَاثُونَ شَهْرًا ۚ حَتَّىٰ إِذَا بَلَغَ أَشُدَّهُ وَبَلَغَ أَرْبَعِينَ سَنَةً قَالَ رَبِّ أَوْزِعْنِي أَنْ أَشْكُرَ نِعْمَتَكَ الَّتِي أَنْعَمْتَ عَلَيَّ وَعَلَىٰ وَالِدَيَّ وَأَنْ أَعْمَلَ صَالِحًا تَرْضَاهُ وَأَصْلِحْ لِي فِي ذُرِّيَّتِي ۖ إِنِّي تُبْتُ إِلَيْكَ وَإِنِّي مِنَ الْمُسْلِمِينَ ١٥

మరియు మేము మానవునికి తన తల్లి-దండ్రుల పట్ల మంచితనంతో మెలగాలని ఆదేశించాము. 10 అతని తల్లి అతనిని ఎంతో బాధతో తన గర్భంలో భరించింది మరియు ఎంతో బాధతో అతనిని కన్నది. మరియు అతనిని గర్భంలో భరించి, అతనిని పాలు విడిపించే వరకు ముప్పైనెలలు అవుతాయి. 11 చివరకు అతడు పెరిగి పెద్దవాడవుతాడు మరియు అతడు నలభై సంవత్సరాల 12 వయస్సుకు చేరి ఇలా అంటాడు: “ఓ నా ప్రభూ! నీవు, నాకూ మరియు నా తల్లి-దండ్రులకూ ప్రసాదించిన అనుగ్రహాలకు నేను నీకు కృతజ్ఞతలు తెలుపు కోవటానికి మరియు నీవు ఇష్టపడే సత్కార్యాలు చేయటానికి నాకు సద్బుద్ధిని ప్రసాదించు మరియు నా సంతానాన్ని కూడా సద్వర్తనులుగా చేయి. నిశ్చయంగా, నేను పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలుతున్నాను. మరియు నిశ్చయంగా, నేను నీకువిధేయులైన (ముస్లింలైన)వారిలో ఒకడిని.” 13

46:16 – أُولَـٰئِكَ الَّذِينَ نَتَقَبَّلُ عَنْهُمْ أَحْسَنَ مَا عَمِلُوا وَنَتَجَاوَزُ عَن سَيِّئَاتِهِمْ فِي أَصْحَابِ الْجَنَّةِ ۖ وَعْدَ الصِّدْقِ الَّذِي كَانُوا يُوعَدُونَ ١٦

ఇలాంటి వారి నుండి మేము వారి మంచి కర్మలను స్వీకరిస్తాము. 14 మరియు వారి చెడుకర్మలను ఉపేక్షిస్తాము; వారు స్వర్గవాసులలో చేరుతారు. ఇది వారికి చేయబడిన వాగ్దానం, ఒక సత్య వాగ్దానం.

46:17 – وَالَّذِي قَالَ لِوَالِدَيْهِ أُفٍّ لَّكُمَا أَتَعِدَانِنِي أَنْ أُخْرَجَ وَقَدْ خَلَتِ الْقُرُونُ مِن قَبْلِي وَهُمَا يَسْتَغِيثَانِ اللَّـهَ وَيْلَكَ آمِنْ إِنَّ وَعْدَ اللَّـهِ حَقٌّ فَيَقُولُ مَا هَـٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ ١٧

మరియు ఎవడైనా తన తల్లి-దండ్రులతో ఇలాఅంటే: “ఛీ పొండి (ఉఫ్‌)! 15 నేను (గోరీ నుండి సజీవిగా) లేపబడతానని మీరు నన్ను బెదిరిస్తున్నారా? మరియు వాస్తవానికి, నాకు ముందు ఎన్నోతరాలు గతించాయి, (కాని తిరిగి లేపబడలేదు కదా)?” మరియు వారిద్దరూ అల్లాహ్‌ సహాయంకోరుతూ ఇలా అంటారు: “ఓ దౌర్భాగ్యుడా! విశ్వసించు! నిశ్చయంగా, అల్లాహ్‌ వాగ్దానం సత్యం!” అప్పుడు వాడు ఇలా అంటాడు: “ఇవన్నీ కేవలం పాత కాలపు కట్టు కథలు తప్ప మరేమీ కావు.”

46:18 – أُولَـٰئِكَ الَّذِينَ حَقَّ عَلَيْهِمُ الْقَوْلُ فِي أُمَمٍ قَدْ خَلَتْ مِن قَبْلِهِم مِّنَ الْجِنِّ وَالْإِنسِ ۖ إِنَّهُمْ كَانُوا خَاسِرِينَ ١٨

వీరికి పూర్వం గతించిన జిన్నాతుల మరియు మానవ సమాజాలలో, ఇలాంటి వారి మీదనే (అల్లాహ్‌) వాక్కు (శిక్ష) సత్యమయింది. నిశ్చయంగా, వారే నష్టపడిన వారయ్యారు. 16

46:19 – وَلِكُلٍّ دَرَجَاتٌ مِّمَّا عَمِلُوا ۖ وَلِيُوَفِّيَهُمْ أَعْمَالَهُمْ وَهُمْ لَا يُظْلَمُونَ ١٩

ప్రతి ఒక్కరికీ వారివారి కర్మలకు తగిన స్థానాలుంటాయి. మరియు ఇది వారి కర్మలకు తగినట్లుగా పూర్తి ప్రతిఫలమివ్వటానికి మరియు వారికి ఎలాంటి అన్యాయం జరుగదు.

46:20 – وَيَوْمَ يُعْرَضُ الَّذِينَ كَفَرُوا عَلَى النَّارِ أَذْهَبْتُمْ طَيِّبَاتِكُمْ فِي حَيَاتِكُمُ الدُّنْيَا وَاسْتَمْتَعْتُم بِهَا فَالْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُونِ بِمَا كُنتُمْ تَسْتَكْبِرُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَبِمَا كُنتُمْ تَفْسُقُونَ ٢٠

మరియు ఆ రోజు సత్యాన్ని తిరస్కరించిన వారిని నరకాగ్ని ముందుకు తెచ్చి, వారితో (ఇలా అనబడు తుంది): “మీరు, మీ ఇహలోక జీవితంలో మీ భోగభాగ్యాలను తరిగించుకున్నారు మరియు వాటిని బాగా అనుభవించారు; కావున మీరు ఏ హక్కూలేకుండా భూమిలోప్రదర్శించిన అహంకా రానికి మరియు మీరు చేసిన అవిధేయతకు ప్రతిఫలంగా, ఈ రోజు మీకు అవమానకరమైనశిక్ష విధించబడుతుంది.”(1/8)

46:21 – وَاذْكُرْ أَخَا عَادٍ إِذْ أَنذَرَ قَوْمَهُ بِالْأَحْقَافِ وَقَدْ خَلَتِ النُّذُرُ مِن بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّـهَ إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ ٢١

  • మరియు జ్ఞాపకంచేసుకోండి, ‘ఆద్‌ జాతి సోదరుడు (హూద్‌) ఇసుక దిబ్బలలో 17 ఉన్న తన జాతివారిని హెచ్చరించింది. మరియు అలా హెచ్చరించేవారు అతనికి పూర్వం కూడా వచ్చారు మరియు అతని తరువాత కూడా వచ్చారు. (అతను ఇలా అన్నాడు): “మీరు అల్లాహ్‌ను తప్ప ఇతరులను ఆరాధించకండి. (అలాచేస్తే) నిశ్చయంగా, ఆ గొప్ప దినమున మీపై పడబోయే, ఆ శిక్షను గురించి నేను భయపడుతున్నాను.”

46:22 – قَالُوا أَجِئْتَنَا لِتَأْفِكَنَا عَنْ آلِهَتِنَا فَأْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ ٢٢

వారిలా అన్నారు: “మా దేవతల నుండి మమ్మల్ని దూరం చేయటానికా నీవు వచ్చింది? నీవు సత్యవంతుడవే అయితే నీవు బెదిరించే (ఆ శిక్షను) తీసుకురా!”

46:23 – قَالَ إِنَّمَا الْعِلْمُ عِندَ اللَّـهِ وَأُبَلِّغُكُم مَّا أُرْسِلْتُ بِهِ وَلَـٰكِنِّي أَرَاكُمْ قَوْمًا تَجْهَلُونَ ٢٣

(హూద్‌)అన్నాడు: “నిశ్చయంగా, దాని (ఆ శిక్ష) జ్ఞానం కేవలం అల్లాహ్‌కే ఉంది. మరియు నేను మాత్రం నాకు ఇచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేస్తున్నాను. కాని, నేను మిమ్మల్ని మూఢ త్వంలో పడిపోయినవారిగా చూస్తున్నాను!”

46:24 – فَلَمَّا رَأَوْهُ عَارِضًا مُّسْتَقْبِلَ أَوْدِيَتِهِمْ قَالُوا هَـٰذَا عَارِضٌ مُّمْطِرُنَا ۚ بَلْ هُوَ مَا اسْتَعْجَلْتُم بِهِ ۖ رِيحٌ فِيهَا عَذَابٌ أَلِيمٌ ٢٤

ఆ తరువాత వారు ఒక దట్టమైన మేఘాన్ని వారి లోయల వైపునకు రావటం చూసి ఇలా అన్నారు: “ఈ మేఘం మాకు వర్షం ఇస్తుంది!” 18 (హూద్‌ అన్నాడు): “కాదుకాదు, మీరు దేనికి తొందరపెడుతున్నారో అది (ఆ శిక్ష) ఇదే! ఒక తుఫాను గాలి అందులో బాధాకరమైన శిక్ష ఉంది;

46:25 – تُدَمِّرُ كُلَّ شَيْءٍ بِأَمْرِ رَبِّهَا فَأَصْبَحُوا لَا يُرَىٰ إِلَّا مَسَاكِنُهُمْ ۚ كَذَٰلِكَ نَجْزِي الْقَوْمَ الْمُجْرِمِينَ ٢٥

“అది తన ప్రభువు ఆజ్ఞతో ప్రతి దానిని నాశనం చేస్తుంది.” చివరకు వారి నివాసస్థలాలు తప్ప, అక్కడ ఏమీ కనిపించకుండా పోయాయి. ఈ విధంగా మేము నేరస్తులకు ప్రతీకారం చేస్తాము.

46:26 – وَلَقَدْ مَكَّنَّاهُمْ فِيمَا إِن مَّكَّنَّاكُمْ فِيهِ وَجَعَلْنَا لَهُمْ سَمْعًا وَأَبْصَارًا وَأَفْئِدَةً فَمَا أَغْنَىٰ عَنْهُمْ سَمْعُهُمْ وَلَا أَبْصَارُهُمْ وَلَا أَفْئِدَتُهُم مِّن شَيْءٍ إِذْ كَانُوا يَجْحَدُونَ بِآيَاتِ اللَّـهِ وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ٢٦

మరియు వాస్తవానికి మేము వారిని దృఢంగా స్థిరపరచి ఉన్నాము; ఆ విధంగా మేము (ఓ ఖురైషులారా) మిమ్మల్నికూడా స్థిరపరచ లేదు. మేము వారికి చెవులను, కన్నులను మరియు హృదయాలను ఇచ్చాము. కాని వారి చెవులూ, కళ్ళూ మరియు హృదయాలు వారికి ఉపయోగపడలేదు; ఎందుకంటే వారు అల్లాహ్‌ సూచనలను తిరస్కరిస్తూ ఉండేవారు మరియు వారు దేనిని గురించి పరిహాసం చేస్తూ ఉండేవారో అదే వారిని చుట్టుకున్నది.

46:27 – وَلَقَدْ أَهْلَكْنَا مَا حَوْلَكُم مِّنَ الْقُرَىٰ وَصَرَّفْنَا الْآيَاتِ لَعَلَّهُمْ يَرْجِعُونَ ٢٧

మరియు వాస్తవానికి, మేము మీ చుట్టు ప్రక్కల ఎన్నో నగరాలను నాశనం చేశాము. మరియు బహుశా వారు (సత్యం వైపునకు) మరలివస్తారని, మా సంకేతాలను వారికి ఎన్నో విధాలుగా చూపాము.

46:28 – فَلَوْلَا نَصَرَهُمُ الَّذِينَ اتَّخَذُوا مِن دُونِ اللَّـهِ قُرْبَانًا آلِهَةً ۖ بَلْ ضَلُّوا عَنْهُمْ ۚ وَذَٰلِكَ إِفْكُهُمْ وَمَا كَانُوا يَفْتَرُونَ ٢٨

అల్లాహ్‌ను వదలి – తమను ఆయన సాన్ని ధ్యానికి తేగలవారని – వారు భావించిన, వారి దేవతలు వారికి ఎందుకు సహాయం చేయవు? అలా కాదు! అవి వారిని త్యజించాయి. ఎందు కంటే అది కేవలం వారి భ్రమ. మరియు వారు కల్పించుకున్న బూటక కల్పన మాత్రమే!

46:29 – وَإِذْ صَرَفْنَا إِلَيْكَ نَفَرًا مِّنَ الْجِنِّ يَسْتَمِعُونَ الْقُرْآنَ فَلَمَّا حَضَرُوهُ قَالُوا أَنصِتُوا ۖ فَلَمَّا قُضِيَ وَلَّوْا إِلَىٰ قَوْمِهِم مُّنذِرِينَ ٢٩

మరియు (ఓ ము’హమ్మద్‌!) జిన్నాతుల ఒక సమూహాన్ని 19 మేము – ఖుర్‌ఆన్‌ను వినటానికి – నీ వైపునకు మొగ్గునట్లు చేసినపుడు, వారు అక్కడ చేరిన తరువాత పరస్పరం ఇలా మాట్లాడుకున్నారు: “నిశ్శబ్దంగా వినండి!” అది (ఆ పఠనం) ముగిసిన తరువాత, వారు హెచ్చరిక చేసేవారిగా, తమ జాతి వైపునకు మరలిపోయారు.

46:30 – قَالُوا يَا قَوْمَنَا إِنَّا سَمِعْنَا كِتَابًا أُنزِلَ مِن بَعْدِ مُوسَىٰ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ يَهْدِي إِلَى الْحَقِّ وَإِلَىٰ طَرِيقٍ مُّسْتَقِيمٍ ٣٠

వారు (జిన్నాతులు) ఇలా అన్నారు: “ఓ మాజాతి వారలారా! వాస్తవంగా మేము మూసా తరువాత అవతరింపజేయబడిన ఒక గ్రంథాన్ని విన్నాము. అది దానికి పూర్వం వచ్చిన దానిని (తౌరాత్‌ను) ధృవీకరిస్తుంది; సత్యం వైపునకు మరియు ఋజుమార్గం (ఇస్లాం) వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. 20

46:31 – يَا قَوْمَنَا أَجِيبُوا دَاعِيَ اللَّـهِ وَآمِنُوا بِهِ يَغْفِرْ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُجِرْكُم مِّنْ عَذَابٍ أَلِيمٍ ٣١

“మా జాతి వారలారా! అల్లాహ్‌ వైపునకు పిలిచే వానిని అనుసరించండి. మరియు ఆయన (అల్లాహ్) ను విశ్వసించండి. ఆయన మీ పాపాలను క్షమిస్తాడు మరియు మిమ్మల్ని బాధాకరమైన శిక్ష నుండి కాపాడుతాడు.

46:32 – وَمَن لَّا يُجِبْ دَاعِيَ اللَّـهِ فَلَيْسَ بِمُعْجِزٍ فِي الْأَرْضِ وَلَيْسَ لَهُ مِن دُونِهِ أَوْلِيَاءُ ۚ أُولَـٰئِكَ فِي ضَلَالٍ مُّبِينٍ ٣٢

“మరియు అల్లాహ్‌ వైపునకు పిలిచే వానిని అనుసరించని వాడు భూమిలో (అల్లాహ్‌ నుండి) తప్పించుకోలేడు. మరియు అతడికి, ఆయన తప్ప మరొక సంరక్షకుడు లేడు. అలాంటి వారు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లే!”

46:33 – أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّـهَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَلَمْ يَعْيَ بِخَلْقِهِنَّ بِقَادِرٍ عَلَىٰ أَن يُحْيِيَ الْمَوْتَىٰ ۚ بَلَىٰ إِنَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٣٣

ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించినవాడు అల్లాహ్‌యేనని మరియు ఆయన వారిని సృష్టించటంలో అలసిపోడని, మరణించిన వారిని తిరిగి బ్రతికించగల సామర్థ్యం గలవాడని? అలా కాదు ఎందుకు కలిగి లేడు? నిశ్చయంగా, ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు.

46:34 – وَيَوْمَ يُعْرَضُ الَّذِينَ كَفَرُوا عَلَى النَّارِ أَلَيْسَ هَـٰذَا بِالْحَقِّ ۖ قَالُوا بَلَىٰ وَرَبِّنَا ۚ قَالَ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ ٣٤

మరియు సత్యాన్ని తిరస్కరించిన వారిని నరకాగ్ని ముందు ప్రవేశపెట్టబడేరోజు వారితో ఇలా ప్రశ్నించడం జరుగుతుంది: “ఏమీ? ఇది సత్యం కాదా?” అని. వారంటారు: “ఎందుకు కాదు! మా ప్రభువు సాక్షిగా (ఇది సత్యమే!)” వారితో అనబడు తుంది: “అయితే, మీరు తిరస్కరిస్తూవున్న దానికి గానూ ఈ శిక్షను రుచి చూడండి!”

46:35 – فَاصْبِرْ كَمَا صَبَرَ أُولُو الْعَزْمِ مِنَ الرُّسُلِ وَلَا تَسْتَعْجِل لَّهُمْ ۚ كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَ مَا يُوعَدُونَ لَمْ يَلْبَثُوا إِلَّا سَاعَةً مِّن نَّهَارٍ ۚ بَلَاغٌ ۚ فَهَلْ يُهْلَكُ إِلَّا الْقَوْمُ الْفَاسِقُونَ ٣٥

కావున నీవు (ఓ ప్రవక్తా!) సహనంవహించు! దృఢ సంకల్పం గల ప్రవక్తలు సహనం వహించినట్లు; మరియు వారి విషయంలో తొందర పడకు. నిశ్చయంగా వారికి వాగ్దానం చేయబడిన (శిక్షను) వారు చూసిన రోజు; వారు (ఈ ప్రపంచంలో) దినంలోని ఒక ఘడియ కంటే ఎక్కువ కాలం గడపలేదని అనుకుంటారు. (ఇదే మా) సందేశం! అలాంటప్పుడు, దుష్టులు (ఫాసిఖూన్‌) గాక, ఇతరులు నశింపజేయబడతారా?

సూరహ్‌ ము’హమ్మద్‌ – ఈ సూరహ్‌ మరొక పేరు అల్‌-ఖితాల్‌, అని కూడా ఉంది. దైవప్రవక్త (‘స’అస) పేరు 2వ ఆయత్‌లో వచ్చింది. ఇందులో 38 ఆయాతులు ఉన్నాయి. ఇది మొదటి మదీనహ్ కాలపు సూరాహ్‌లలోనిది. ఇంతవరకు 5/6వ భాగం ఖుర్‌ఆన్‌ పూర్తి అయ్యింది. ఈ మిగిలిన 1/6వ భాగంలో చిన్నచిన్న సూరాహ్‌లు ఉన్నాయి. ఈ వరుసలోని 3 సూరాహ్‌లలో ఇది మొదటిది. ము’హమ్మద్‌ (‘స’అస) పేరు ఖుర్‌ఆన్‌లో 4 సార్లు వచ్చింది. 3:144, 33:40, 47:2 మరియు 48:29లలో. అ’హ్మద్‌ (‘స’అస) అని, ఒకేసారి 647:6లో వచ్చింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 47:1 – الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّـهِ أَضَلَّ أَعْمَالَهُمْ ١

ఎవరైతే సత్యాన్ని తిరస్కరించి (ఇతరు లను) అల్లాహ్‌ మార్గం నుండి నిరోధించారో, వారి కర్మలను ఆయన (అల్లాహ్‌) నిష్ఫలంచేశాడు.

47:2 – وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَآمَنُوا بِمَا نُزِّلَ عَلَىٰ مُحَمَّدٍ وَهُوَ الْحَقُّ مِن رَّبِّهِمْ ۙ كَفَّرَ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَأَصْلَحَ بَالَهُمْ ٢

మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తూ – ముహమ్మద్‌ మీద అవతరింపజేయ బడినదానిని – తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమని నమ్మారో! వారి పాపాలను ఆయన తుడిచివేశాడు మరియు వారి స్థితిని బాగుపరిచాడు.

47:3 – ذَٰلِكَ بِأَنَّ الَّذِينَ كَفَرُوا اتَّبَعُوا الْبَاطِلَ وَأَنَّ الَّذِينَ آمَنُوا اتَّبَعُوا الْحَقَّ مِن رَّبِّهِمْ ۚ كَذَٰلِكَ يَضْرِبُ اللَّـهُ لِلنَّاسِ أَمْثَالَهُمْ ٣

ఇలా ఎందుకు జరిగిందంటే! వాస్తవానికి అవిశ్వాసులు అసత్యాన్ని అనుసరించారు మరియు విశ్వసించినవారు తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించారు. ఈ విధంగా అల్లాహ్‌! ప్రజలకు ఉదాహరణల ద్వారా (వారి స్థానం) తెలియ జేస్తున్నాడు.

47:4 – فَإِذَا لَقِيتُمُ الَّذِينَ كَفَرُوا فَضَرْبَ الرِّقَابِ حَتَّىٰ إِذَا أَثْخَنتُمُوهُمْ فَشُدُّوا الْوَثَاقَ فَإِمَّا مَنًّا بَعْدُ وَإِمَّا فِدَاءً حَتَّىٰ تَضَعَ الْحَرْبُ أَوْزَارَهَا ۚ ذَٰلِكَ وَلَوْ يَشَاءُ اللَّـهُ لَانتَصَرَ مِنْهُمْ وَلَـٰكِن لِّيَبْلُوَ بَعْضَكُم بِبَعْضٍ ۗ وَالَّذِينَ قُتِلُوا فِي سَبِيلِ اللَّـهِ فَلَن يُضِلَّ أَعْمَالَهُمْ ٤

ఇలా ఎందుకు జరిగిందంటే! వాస్తవానికి అవిశ్వాసులు అసత్యాన్ని అనుసరించారు మరియు విశ్వసించినవారు తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించారు. ఈ విధంగా అల్లాహ్‌! ప్రజలకు ఉదాహరణల ద్వారా (వారి స్థానం) తెలియ జేస్తున్నాడు. 1 వారిపైప్రాబల్యం పొందేవరకు, వారి మెడలపై కొట్టండి. ఆ తరువాత వారిని గట్టిగా బంధించండి, (యుధ్ధం ముగిసిన) తరువాత వారిని కనికరించి వదలి పెట్టండి, లేదా పరిహారధనం తీసుకొని వదలి పెట్టండి. 2 (మీతో) యుధ్ధం చేసేవారు తమ ఆయుధాలను పడవేసే వరకు (వారితో పోరా డండి). ఇది మీరు చేయవలసిన పని. అల్లాహ్‌ తలుచుకుంటే ఆయన వారికి ప్రతీకారం చేసే వాడు, కాని మిమ్మల్ని ఒకరి ద్వారా మరొకరిని పరీక్షించటానికి (ఆయన ఇలా చేశాడు). మరియు ఎవరైతే అల్లాహ్‌ మార్గంలో చంపబడ్డారో, అలాంటి వారి కర్మలను ఆయన వ్యర్థం చేయడు.

47:5 – سَيَهْدِيهِمْ وَيُصْلِحُ بَالَهُمْ ٥

ఆయన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు మరియు వారి స్థితిని చక్కబరుస్తాడు.

47:6 – وَيُدْخِلُهُمُ الْجَنَّةَ عَرَّفَهَا لَهُمْ ٦

మరియు వారికి తెలియజేసి యున్న స్వర్గం లోకి వారిని ప్రవేశింపజేస్తాడు.

47:7 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تَنصُرُوا اللَّـهَ يَنصُرْكُمْ وَيُثَبِّتْ أَقْدَامَكُمْ ٧

ఓ విశ్వాసులారా! ఒకవేళ మీరు అల్లాహ్‌కు (ఆయన మార్గంలో) సహాయపడితే, ఆయన మీకు సహాయం చేస్తాడు మరియు మీ పాదాలను స్థిరపరుస్తాడు. 3

47:8 – وَالَّذِينَ كَفَرُوا فَتَعْسًا لَّهُمْ وَأَضَلَّ أَعْمَالَهُمْ ٨

ఇకపోతే సత్యాన్ని తిరస్కరించిన వారికి వినాశం తప్పదు. మరియు (అల్లాహ్‌) వారి కర్మలు వ్యర్థం చేస్తాడు.

47:9 – ذَٰلِكَ بِأَنَّهُمْ كَرِهُوا مَا أَنزَلَ اللَّـهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ ٩

ఇది ఎందుకంటే వాస్తవానికి, వారు అల్లాహ్‌ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నారు, కాబట్టి ఆయన వారి కర్మలను విఫలంచేశాడు. 4 (1/4)

47:10 – أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ دَمَّرَ اللَّـهُ عَلَيْهِمْ ۖ وَلِلْكَافِرِينَ أَمْثَالُهَا ١٠

  • ఏమీ? వారు భూమిలో సంచరించి చూడలేదా? వారికి పూర్వం గతించిన వారి పర్యవసానం ఏమయిందో? అల్లాహ్‌ వారిని నిర్మూలించాడు. మరియు సత్య-తిరస్కారులకు అలాంటి గతే పట్టబోతోంది. 5

47:11 – ذَٰلِكَ بِأَنَّ اللَّـهَ مَوْلَى الَّذِينَ آمَنُوا وَأَنَّ الْكَافِرِينَ لَا مَوْلَىٰ لَهُمْ ١١

ఇది ఎందుకంటే! నిశ్చయంగా, విశ్వసించిన వారి సంరక్షకుడు అల్లాహ్‌! మరియు నిశ్చయంగా, సత్య-తిరస్కారులకు సంరక్షకుడు ఎవ్వడూ లేడు. 6

47:12 – إِنَّ اللَّـهَ يُدْخِلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ وَالَّذِينَ كَفَرُوا يَتَمَتَّعُونَ وَيَأْكُلُونَ كَمَا تَأْكُلُ الْأَنْعَامُ وَالنَّارُ مَثْوًى لَّهُمْ ١٢

నిశ్చయంగా, అల్లాహ్‌! విశ్వసించి సత్కార్యాలు చేసే వారిని స్వర్గవనాలలో ప్రవేశింప జేస్తాడు. వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు సత్యాన్ని తిరస్కరించి భోగ భాగ్యాలలో మునిగి ఉండి పశువుల మాదిరిగా తింటున్నవారినివాసం నరకాగ్నియే అవుతుంది. 7

47:13 – وَكَأَيِّن مِّن قَرْيَةٍ هِيَ أَشَدُّ قُوَّةً مِّن قَرْيَتِكَ الَّتِي أَخْرَجَتْكَ أَهْلَكْنَاهُمْ فَلَا نَاصِرَ لَهُمْ ١٣

మరియు (ఓ ము’హమ్మద్‌!) నిన్ను బహిష్కరించిన నగరం కంటే బలమైన ఎన్నో నగరాలను మేము నాశనం చేశాము వారికి సహాయపడే వాడెవ్వడూ లేక పోయాడు. 8

47:14 – أَفَمَن كَانَ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّهِ كَمَن زُيِّنَ لَهُ سُوءُ عَمَلِهِ وَاتَّبَعُوا أَهْوَاءَهُم ١٤

ఏమీ? తన ప్రభువు తరఫునుండి వచ్చిన స్పష్టమైన మార్గంమీద ఉన్నవాడు, తమ దుష్కార్యాలను మనోహరమైనవిగా భావించి, తమ మనోవాంఛలను అనుసరించే వారితో సమానుడు కాగలడా?

47:15 – مَّثَلُ الْجَنَّةِ الَّتِي وُعِدَ الْمُتَّقُونَ ۖ فِيهَا أَنْهَارٌ مِّن مَّاءٍ غَيْرِ آسِنٍ وَأَنْهَارٌ مِّن لَّبَنٍ لَّمْ يَتَغَيَّرْ طَعْمُهُ وَأَنْهَارٌ مِّنْ خَمْرٍ لَّذَّةٍ لِّلشَّارِبِينَ وَأَنْهَارٌ مِّنْ عَسَلٍ مُّصَفًّى ۖ وَلَهُمْ فِيهَا مِن كُلِّ الثَّمَرَاتِ وَمَغْفِرَةٌ مِّن رَّبِّهِمْ ۖ كَمَنْ هُوَ خَالِدٌ فِي النَّارِ وَسُقُوا مَاءً حَمِيمًا فَقَطَّعَ أَمْعَاءَهُمْ ١٥

భయ-భక్తులు గలవారికి వాగ్దానం చేయ బడిన స్వర్గం యొక్క ఉదాహరణ ఇలా వుంది: అందులో వాసన మరియు రంగు మారని నీటి సెలయేళ్ళు ఉంటాయి మరియు రుచి మారని పాల కాలువలు ఉంటాయి 9 మరియు అందులో త్రాగేవారికి మధురంగా వుండే మద్యపానపు కాలువలు ఉంటాయి మరియు అందులో శుధ్ధమైన తేనె కాలువలుంటాయి. మరియు వారి కొరకు అందులో అన్నిరకాల మంచి ఫలాలు మరియు వారి ప్రభువు నుండి క్షమాపణ కూడా వుంటాయి. 10 ఇలాంటి వాడు – నరకాగ్నిలో శాశ్వతంగా ఉండి – సలసలకాగే నీటిని 11 త్రాగేందుకు ఇవ్వబడి, దానితో ప్రేగులు కోయబడి నట్లు బాధపడే వానితో సమానుడు కాగలడా?

47:16 – وَمِنْهُم مَّن يَسْتَمِعُ إِلَيْكَ حَتَّىٰ إِذَا خَرَجُوا مِنْ عِندِكَ قَالُوا لِلَّذِينَ أُوتُوا الْعِلْمَ مَاذَا قَالَ آنِفًا ۚ أُولَـٰئِكَ الَّذِينَ طَبَعَ اللَّـهُ عَلَىٰ قُلُوبِهِمْ وَاتَّبَعُوا أَهْوَاءَهُمْ ١٦

మరియు (ఓ ము’హమ్మద్‌!) వారిలో (కపట-విశ్వాసులలో) నీ మాటలను చెవియొగ్గి వినేవారు కొందరున్నారు. 12 కాని వారు నీ దగ్గర నుండి వెళ్ళిపోయిన తరువాత, జ్ఞానవంతులను ఇలా ప్రశ్నిస్తారు: “అతను చెప్పినదేమిటీ?” వీరే! అల్లాహ్‌ హృదయాల మీద ముద్రవేసినవారు మరియు వీరే తమ మనోవాంఛలను అనుసరించేవారు. 13

47:17 – وَالَّذِينَ اهْتَدَوْا زَادَهُمْ هُدًى وَآتَاهُمْ تَقْوَاهُمْ ١٧

మరియు మార్గదర్శకత్వం పొందిన వారికి ఆయన (అల్లాహ్‌) ఇంకా ఎక్కువగా సన్మార్గం చూపుతాడు మరియు వారి దైవభీతిని వృద్ధిచేస్తాడు.

47:18 – فَهَلْ يَنظُرُونَ إِلَّا السَّاعَةَ أَن تَأْتِيَهُم بَغْتَةً ۖ فَقَدْ جَاءَ أَشْرَاطُهَا ۚ فَأَنَّىٰ لَهُمْ إِذَا جَاءَتْهُمْ ذِكْرَاهُمْ ١٨

ఏమీ? ఇప్పుడు వారు అంతిమ ఘడియ అకస్మాత్తుగా రావాలని ఎదురుచూస్తున్నారా? వాస్తవానికి, దాని చిహ్నాలు కూడా వచ్చేశాయి. 14 అది వచ్చిపడితే, ఇక వారికి హితోపదేశం స్వీకరించే అవకాశం ఎక్కడ ఉంటుంది?

47:19 – فَاعْلَمْ أَنَّهُ لَا إِلَـٰهَ إِلَّا اللَّـهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ۗ وَاللَّـهُ يَعْلَمُ مُتَقَلَّبَكُمْ وَمَثْوَاكُمْ ١٩

కావున (ఓ ము’హమ్మద్‌) తెలుసుకో! నిశ్చయంగా, అల్లాహ్‌ తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. కావున నీ పాపాలకు మరియు విశ్వాస స్త్రీల కొరకు మరియు విశ్వాస పురుషుల కొరకు కూడా క్షమాపణవేడుకో! 15 మరియు అల్లాహ్‌కు మీ కార్య-కలాపాలు మరియు మీ (అంతిమ) నివాసం కూడా తెలుసు.

47:20 – وَيَقُولُ الَّذِينَ آمَنُوا لَوْلَا نُزِّلَتْ سُورَةٌ ۖ فَإِذَا أُنزِلَتْ سُورَةٌ مُّحْكَمَةٌ وَذُكِرَ فِيهَا الْقِتَالُ ۙ رَأَيْتَ الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ يَنظُرُونَ إِلَيْكَ نَظَرَ الْمَغْشِيِّ عَلَيْهِ مِنَ الْمَوْتِ ۖ فَأَوْلَىٰ لَهُمْ ٢٠

మరియు విశ్వసించిన వారు ఇలా అంటున్నారు: “(యుధ్ధం చేయమని ఆదేశిస్తూ) ఒక సూరహ్‌ ఎందుకు అవతరింపజేయ బడలేదు?” 16 కాని ఇప్పుడు యుధ్ధం చేయమని నిర్దేశిస్తూ ఒక సూరహ్‌ అవతరింపజేయబడితే, తమ హృదయాలలో వ్యాధి ఉన్నవారు – మరణం ఆవరించినవారి వలే – నీవైపునకు చూడటాన్ని, నీవు గమనిస్తావు; 17 కాని అది వారికే మేలైనదై ఉండేది.

47:21 – طَاعَةٌ وَقَوْلٌ مَّعْرُوفٌ ۚ فَإِذَا عَزَمَ الْأَمْرُ فَلَوْ صَدَقُوا اللَّـهَ لَكَانَ خَيْرًا لَّهُمْ ٢١

ఆజ్ఞాపాలన చేయటం మరియు మంచి మాటలు పలుకటం. ఒకవేళ (జిహాద్‌ కొరకు) దృఢమైన నిర్ణయం తీసుకోబడినప్పుడు, వారు అల్లాహ్‌ విషయంలో సత్యవంతులుగా ఉన్నట్లయితే వారికే మేలు జరిగేది.

47:22 – فَهَلْ عَسَيْتُمْ إِن تَوَلَّيْتُمْ أَن تُفْسِدُوا فِي الْأَرْضِ وَتُقَطِّعُوا أَرْحَامَكُمْ ٢٢

(వారితో ఇలా అను): “ఏమీ? మీరు (అల్లాహ్‌) ఆజ్ఞాపాలనకు విముఖులై, మరల భూమిలో సంక్షోభం రేకెత్తిస్తూ మీ బంధుత్వాలను తెంపుకుంటారా?”

47:23 – أُولَـٰئِكَ الَّذِينَ لَعَنَهُمُ اللَّـهُ فَأَصَمَّهُمْ وَأَعْمَىٰ أَبْصَارَهُمْ ٢٣

ఇలాంటి వారినే అల్లాహ్‌ శపించాడు (బహిష్కరించాడు). వారిని చెవిటివారిగా చేశాడు మరియు వారి కండ్లను గ్రుడ్డిచేశాడు.

47:24 – أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ أَمْ عَلَىٰ قُلُوبٍ أَقْفَالُهَا ٢٤

వారు ఈ ఖుర్‌ఆన్‌ను గురించి యోచించరా? లేదా వారి హృదయాల మీద తాళాలు పడివున్నాయా?

47:25 – إِنَّ الَّذِينَ ارْتَدُّوا عَلَىٰ أَدْبَارِهِم مِّن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْهُدَى ۙ الشَّيْطَانُ سَوَّلَ لَهُمْ وَأَمْلَىٰ لَهُمْ ٢٥

మార్గదర్శకత్వం స్పష్టమైన తర్వాత కూడా, ఎవరైతే తమ వీపులు త్రిప్పుకొని మరలి పోయారో! నిశ్చయంగా, షై’తాన్‌ (వారి చేష్టలను) వారికి మంచివిగా చూపాడు మరియు (అల్లాహ్‌) వారికి వ్యవధినిచ్చాడు.

47:26 – ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لِلَّذِينَ كَرِهُوا مَا نَزَّلَ اللَّـهُ سَنُطِيعُكُمْ فِي بَعْضِ الْأَمْرِ ۖ وَاللَّـهُ يَعْلَمُ إِسْرَارَهُمْ ٢٦

ఇది ఎందుకంటే, వాస్తవానికి వారు, అల్లాహ్‌ అవతరింపజేసిన దానిని అసహ్యించుకునేవారితో ఇలా అన్నందుకు: “మేము కొన్ని విషయాలలో మిమ్మల్ని అనుసరిస్తాము.” మరియు అల్లాహ్‌కు వారి రహస్య సమాలోచనలను గురించి బాగా తెలుసు. 18

47:27 – فَكَيْفَ إِذَا تَوَفَّتْهُمُ الْمَلَائِكَةُ يَضْرِبُونَ وُجُوهَهُمْ وَأَدْبَارَهُمْ ٢٧

అయితే దేవదూతలు వారి ఆత్మలను వశపరచుకొని, వారి ముఖాల మీద మరియు వీపుల మీద కొడుతూ వారిని తీసుకు వెళ్ళే టప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది? 19

47:28 – ذَٰلِكَ بِأَنَّهُمُ اتَّبَعُوا مَا أَسْخَطَ اللَّـهَ وَكَرِهُوا رِضْوَانَهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ ٢٨

ఇది వాస్తవానికి, వారు అల్లాహ్‌కు ఆగ్రహం కలిగించే విధానాన్ని అనుసరించినందుకు మరియు ఆయన సమ్మతించే మార్గాన్ని అసహ్యించు కున్నందుకు! కావున ఆయన వారి కర్మలను వృథా చేశాడు.

47:29 – أَمْ حَسِبَ الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ أَن لَّن يُخْرِجَ اللَّـهُ أَضْغَانَهُمْ ٢٩

ఏమీ? తమ హృదయాలలో వ్యాధి ఉన్నవారు, అల్లాహ్‌ వారి ద్వేషాన్ని బయట పెట్టడని భావిస్తున్నారా? 20

47:30 – وَلَوْ نَشَاءُ لَأَرَيْنَاكَهُمْ فَلَعَرَفْتَهُم بِسِيمَاهُمْ ۚ وَلَتَعْرِفَنَّهُمْ فِي لَحْنِ الْقَوْلِ ۚ وَاللَّـهُ يَعْلَمُ أَعْمَالَكُمْ ٣٠

మరియు మేము తలచుకుంటే, వారిని నీకు చూపేవారం; వారి లక్షణాలను బట్టి నీవు వారిని తెలుసుకో గలవు. మరియు వారు మాట్లాడేరీతిని బట్టి, వారిని నీవు తప్పక తెలుసుకోగలవు. మరియు అల్లాహ్‌కు మీ కర్మలు బాగాతెలుసు.

47:31 – وَلَنَبْلُوَنَّكُمْ حَتَّىٰ نَعْلَمَ الْمُجَاهِدِينَ مِنكُمْ وَالصَّابِرِينَ وَنَبْلُوَ أَخْبَارَكُمْ ٣١

మరియు నిశ్చయంగా మీలో ధర్మయుధ్ధం చేసేవారెవరో మరియు సహనం వహించేవారెవరో! చూచే వరకు మేము మిమ్మల్ని తప్పక పరీక్షిస్తాము. 21 మరియు మేము మీ ప్రతిజ్ఞా వచనాలను కూడా పరీక్షిస్తాము.

47:32 – إِنَّ الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّـهِ وَشَاقُّوا الرَّسُولَ مِن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْهُدَىٰ لَن يَضُرُّوا اللَّـهَ شَيْئًا وَسَيُحْبِطُ أَعْمَالَهُمْ ٣٢

నిశ్చయంగా, మార్గదర్శకత్వం స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా, సత్యాన్నితిరస్కరించి, ప్రజలను అల్లాహ్‌ మార్గం నుండి నిరోధిస్తూ, ప్రవక్తతో విరోధం కలిగివున్నవారు, 22 అల్లాహ్‌కు ఏ మాత్రం నష్టం కలిగించలేరు. కాని ఆయన వారి కర్మలను నిష్ఫలం చేయగలడు. (3/8)

47:33 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّـهَ وَأَطِيعُوا الرَّسُولَ وَلَا تُبْطِلُوا أَعْمَالَكُمْ ٣٣

  • ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు అల్లాహ్‌కు విధేయులై ఉండండి మరియు ప్రవక్తను అనుసరించండి మరియు మీ కర్మలను వ్యర్థం చేసుకోకండి. 23

47:34 – إِنَّ الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّـهِ ثُمَّ مَاتُوا وَهُمْ كُفَّارٌ فَلَن يَغْفِرَ اللَّـهُ لَهُمْ ٣٤

నిశ్చయంగా, సత్యాన్ని తిరస్కరిస్తూ ప్రజలను అల్లాహ్‌ మార్గం నుండి నిరోధిస్తూ వుండి, సత్య-తిరస్కారులుగానే మరణించిన వారిని అల్లాహ్‌ ఎంత మాత్రం క్షమించడు.

47:35 – فَلَا تَهِنُوا وَتَدْعُوا إِلَى السَّلْمِ وَأَنتُمُ الْأَعْلَوْنَ وَاللَّـهُ مَعَكُمْ وَلَن يَتِرَكُمْ أَعْمَالَكُمْ ٣٥

కావున మీరు (ధర్మ-యుధ్ధంలో) ధైర్యాన్ని వీడకండి మరియు సంధికొరకు అడగకండి మరియు మీరే ప్రాబల్యం వహిస్తారు. మరియు అల్లాహ్‌ మీకు తోడుగా ఉన్నాడు మరియు ఆయన మీ కర్మలను వృథా కానివ్వడు.

47:36 – إِنَّمَا الْحَيَاةُ الدُّنْيَا لَعِبٌ وَلَهْوٌ ۚ وَإِن تُؤْمِنُوا وَتَتَّقُوا يُؤْتِكُمْ أُجُورَكُمْ وَلَا يَسْأَلْكُمْ أَمْوَالَكُمْ ٣٦

నిశ్చయంగా, ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట మరియు కాలక్షేపం మాత్రమే. ఒకవేళ మీరు విశ్వసించి దైవభీతి కలిగిఉన్నట్లయితే, ఆయన మీకు మీ ప్రతిఫలం ఇస్తాడు. మరియు మీ నుండి ధనాన్నికూడా అడగడు. 25

47:37 – إِن يَسْأَلْكُمُوهَا فَيُحْفِكُمْ تَبْخَلُوا وَيُخْرِجْ أَضْغَانَكُمْ ٣٧

ఒకవేళ ఆయన దానిని (ధనాన్నే) అడిగితే మరియు దాని కొరకు గట్టి పట్టుపట్టితే, మీరు పిసినారితనం చూపితే, ఆయన మీ ద్వేషాన్ని బయటపెట్టేవాడు.

47:38 – هَا أَنتُمْ هَـٰؤُلَاءِ تُدْعَوْنَ لِتُنفِقُوا فِي سَبِيلِ اللَّـهِ فَمِنكُم مَّن يَبْخَلُ ۖ وَمَن يَبْخَلْ فَإِنَّمَا يَبْخَلُ عَن نَّفْسِهِ ۚ وَاللَّـهُ الْغَنِيُّ وَأَنتُمُ الْفُقَرَاءُ ۚ وَإِن تَتَوَلَّوْا يَسْتَبْدِلْ قَوْمًا غَيْرَكُمْ ثُمَّ لَا يَكُونُوا أَمْثَالَكُم ٣٨

ఇదిగో చూడండి! వారు మీరే! అల్లాహ్‌ మార్గంలో ఖర్చుచేయండని పిలువబడుతున్న వారు. కాని మీలో కొందరు పిసినారితనం వహిస్తున్నారు. మరియు ఎవడు పిసినారితనం వహిస్తున్నాడో, అతడు నిజానికి తన సొంత విషయంలోనే పిసినారితనం వహిస్తున్నాడు. మరియు అల్లాహ్‌ స్వయం సమృద్ధుడు మరియు మీరే కొరతగల (పేద) వారు. 26 మరియు మీరు విముఖులైతే ఆయన మీకు బదులుగా ఇతర జాతిని మీ స్థానంలో తేగలడు, అప్పుడు వారు మీలాంటివారై ఉండరు.

— – సూరహ్‌ అల్‌-ఫత్‌’హ్‌ – అల్‌-ఫత్‌’హ్‌: విజయం. ఈ సమూహపు 3 సూరాహ్‌లలో ఇది 2వది. ఇది ‘హుదైబియా ఒప్పందం తరువాత 6వ హిజ్రీ (క్రీ.శ.628)లో అవతరింపజేయబడిన మదీనహ్ సూరహ్‌. ఇందులో 29 ఆయతులు ఉన్నాయి. దీని పేరు మొదటి ఆయత్‌లో ఉంది. జు’ల్‌-ఖాఇదహ్‌ 6వ హిజ్రీలో దైవప్రవక్త (‘స’అస), దాదాపు 1400 అనుచరులతో ఇ’హ్రామ్‌ ధరించి ‘ఉమ్రా కొరకు బయలుదేరుతారు. అది విని, మక్కహ్ ముష్రిక్‌లు, వారి దారికి, అడ్డుపోతారు. అది తెలుసుకొని దైవప్రవక్త (‘స’అస) బీర్‌-‘ఉస్ఫాన్‌ నుండి తమ త్రోవను మార్చి ‘హుదైబియా అనే ప్రాంతం వైపునకు వెళ్ళి అక్కడ ఆగుతారు. ‘హూదైబియా, జిద్దహ్-మక్కహ్ ల మధ్య ‘హరం సరిహద్దు దగ్గర ఉంది. అక్కడి నుండి తమను ‘ఉమ్రా చేసుకోవటానికి అనుమతి అడగటానికి రాయబారిగా ‘ఉస్మాన్‌ బిన్‌ ‘అప్ఫాన్‌ (ర’ది.’అ.)ను మక్కహ్ కు పంపుతారు. అతనిని చంపారని, శత్రువులు వదంతిలేపుతారు. అది విని దైవప్రవక్త (‘స’అస) తమ అనుచరులతో (ర’ది. ‘అన్హుమ్‌) వాగ్దానం తీసుకుంటారు. దీనినే బై’అతు ర్రి’ద్వాన్‌ అంటారు. ఆ తరువాత ‘ఉస్మాన్‌ (ర’ది.’అ.) తిరిగి వస్తారు. తరువాత మక్కహ్ ముష్రికులతో ఒప్పందం జరుగుతుంది. అందులో: (i) పది సంవత్సరాల వరకు వారి మధ్య ఎలాంటి యుద్ధం జరగకూడదు. (ii) ఇరువురు, ఇతర తెగలవారితో, ఎవరితోనైనా స్నేహం చేసుకోవచ్చు. (iii) ఒక ఖురైషుడు తన పెద్దవారి అనుమతి లేనిదే ఇస్లాం స్వీకరించి మదీనహ్ వెళ్ళితే, ఆ పెద్దవారు అడిగితే, అతనిని వారికి అప్పగించాలి. కాని ఎవడైనా ఇస్లాం వదలి మక్కహ్ వెళ్ళితే వారు అతనిని ముస్లింలకు అప్పగించే అవసరంలేదు. (iv) ఆ సంవత్సరం వారు ‘ఉమ్రా చేయకుండా తిరిగి వెళ్ళిపోవాలి. వచ్చే సంవత్సరం వారికి 3 రోజుల కొరకు ‘ఉమ్రా చేయటానికి మక్కహ్ లోకి వచ్చే అనుమతి ఇవ్వబడుతుంది, మొదలైనవి… మొదట ఈ ఒప్పందం అనుచరుల (ర’ది.’అన్హుమ్‌) దృష్టిలో మక్కహ్ ముష్రిక్‌లకు లాభదాయకరమైనదిగా కనిపించినా! చివరకు, అది మక్కహ్ ముష్రిక్‌లకే దుర్భరమవుతుంది. ఈ ఒప్పందం తరువాత రెండు సంవత్సరాలలోనే ఖురైషులతో స్నేహ సంబంధాలుగల బనీ-బక్ర్‌ తెగవారు, ముస్లింలతో స్నేహంగల బనీ-‘ఖు’జా’అ తెగవారి కొందరు వ్యక్తులను మక్కహ్ లో చంపుతారు. దాని ఫలితంగా 8వ హిజ్రీలో దైవప్రవక్త (‘స’అస) పదివేల మందితో మక్కహ్ ఆక్రమణకు బయలుదేరి, మక్కహ్ ను ఆక్రమించుకుంటారు. 19 సంవత్సరాలలో చాలా తక్కువ మంది, దాదాపు 3000, మాత్రమే ముస్లింలు అవుతారు. కాని ఈ ఒప్పందం తరువాత ప్రజలు వేలసంఖ్యలలో ముస్లింలవుతారు. 8వ హిజ్రీలో 10వేల యుద్ధ నిపుణులు తయారవుతారు. మరియు 10వ హిజ్రీలో లక్షమంది ముస్లింలు దైవప్రవక్త (‘స’అస)తో ‘హజ్జ్‌ కొరకు పోతారు. మొదట ముస్లింలకు అనుకూలమైనదిగా లేక పోయనా, ఈ ఒప్పందం ముస్లింలకు గొప్ప విజయాన్నిస్తుంది. అందుకనే, ఈ సూరహ్‌కు అల్‌-ఫ’త్హ్ (విజయం) అనే పేరు ఇచ్చారు.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 48:1 – إِنَّا فَتَحْنَا لَكَ فَتْحًا مُّبِينًا ١

(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము;

48:2 – لِّيَغْفِرَ لَكَ اللَّـهُ مَا تَقَدَّمَ مِن ذَنبِكَ وَمَا تَأَخَّرَ وَيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكَ وَيَهْدِيَكَ صِرَاطًا مُّسْتَقِيمًا ٢

అల్లాహ్‌! నీ పూర్వపు మరియు భావి కాలపు తప్పులను క్షమించటానికి మరియు నీపై తన అనుగ్రహాన్ని పూర్తిచేయటానికి మరియు నీకు ఋజు-మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయటానికి;

48:3 – وَيَنصُرَكَ اللَّـهُ نَصْرًا عَزِيزًا ٣

మరియు అల్లాహ్‌! నీకు గొప్ప సహకారంతో సహాయపడటానికి.

48:4 – هُوَ الَّذِي أَنزَلَ السَّكِينَةَ فِي قُلُوبِ الْمُؤْمِنِينَ لِيَزْدَادُوا إِيمَانًا مَّعَ إِيمَانِهِمْ ۗ وَلِلَّـهِ جُنُودُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَكَانَ اللَّـهُ عَلِيمًا حَكِيمًا ٤

ఆయనే, విశ్వాసుల హృదయాలలో శాంతిని అవతరింపజేశాడు, వారి విశ్వాసంలో మరింత విశ్వాసాన్ని అధికం చేసేందుకు. మరియు ఆకాశాలలోని, భూమిలోని సైన్యాలన్నీ అల్లాహ్‌ ఆధీనంలోనే ఉన్నాయి. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

48:5 – لِّيُدْخِلَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَيُكَفِّرَ عَنْهُمْ سَيِّئَاتِهِمْ ۚ وَكَانَ ذَٰلِكَ عِندَ اللَّـهِ فَوْزًا عَظِيمًا ٥

విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేసేందుకు, అందులో వారు శాశ్వతంగా ఉండేందుకు మరియు వారి పాపాలను తొలగించేందుకూను. మరియు అల్లాహ్‌ దృష్టిలో ఇది ఒకగొప్ప విజయం.

48:6 – وَيُعَذِّبَ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْمُشْرِكِينَ وَالْمُشْرِكَاتِ الظَّانِّينَ بِاللَّـهِ ظَنَّ السَّوْءِ ۚ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ ۖ وَغَضِبَ اللَّـهُ عَلَيْهِمْ وَلَعَنَهُمْ وَأَعَدَّ لَهُمْ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا ٦

మరియు కపట-విశ్వాసులు (మునాఫిఖీన్‌) అయిన పురుషులను మరియు కపటవిశ్వాసులు అయిన స్త్రీలను; మరియు బహుదైవారాధకులైన పురుషులను మరియు బహుదైవారాధకులైన స్త్రీలను; అల్లాహ్‌ను గురించి చెడు భావనలు, భావించే వారందరినీ శిక్షించేందుకు. వారిపై చెడు అన్ని వైపుల నుండి ఆవరించి ఉంటుంది. మరియు అల్లాహ్‌ యొక్క ఆగ్రహం వారిపై విరుచుకుపడుతుంది. మరియు ఆయన వారిని శపించాడు (బహిష్కరించాడు); మరియు వారి కొరకు నరకాన్ని సిధ్ధపరచి ఉంచాడు. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం!

48:7 – وَلِلَّـهِ جُنُودُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَكَانَ اللَّـهُ عَزِيزًا حَكِيمًا ٧

ఆకాశాలలోని మరియు భూమిలోని సైన్యాలన్నీ అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నాయి. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

48:8 – إِنَّا أَرْسَلْنَاكَ شَاهِدًا وَمُبَشِّرًا وَنَذِيرًا ٨

నిశ్చయంగా, (ఓ ము’హమ్మద్‌!) మేము నిన్ను సాక్షిగా, శుభవార్తలు అందజేసేవానిగా మరియు హెచ్చరించేవానిగానూ చేసి పంపాము.

48:9 – لِّتُؤْمِنُوا بِاللَّـهِ وَرَسُولِهِ وَتُعَزِّرُوهُ وَتُوَقِّرُوهُ وَتُسَبِّحُوهُ بُكْرَةً وَأَصِيلًا ٩

ఎందుకంటే (ఓ ముస్లింలారా!) మీరు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించాలనీ మరియు మీరు అతనితో (ప్రవక్తతో) సహకరించాలనీ మరియు అతనిని గౌరవించాలనీ మరియు ఉదయం మరియు సాయంత్రం ఆయన (అల్లాహ్‌) పవిత్రతను కొనియాడాలనీ!

48:10 – إِنَّ الَّذِينَ يُبَايِعُونَكَ إِنَّمَا يُبَايِعُونَ اللَّـهَ يَدُ اللَّـهِ فَوْقَ أَيْدِيهِمْ ۚ فَمَن نَّكَثَ فَإِنَّمَا يَنكُثُ عَلَىٰ نَفْسِهِ ۖ وَمَنْ أَوْفَىٰ بِمَا عَاهَدَ عَلَيْهُ اللَّـهَ فَسَيُؤْتِيهِ أَجْرًا عَظِيمًا ١٠

(ఓ ము’హమ్మద్‌!) నిశ్చయంగా (నీ చేతిలో చేయివేసి) నీతో శపథం చేసేవారు, వాస్తవానికి అల్లాహ్‌తో శపథం చేస్తున్నారు. 1 అల్లాహ్‌ చెయ్యి వారి చేతులమీద ఉంది. ఇక ఎవడు (తన శపథాన్ని) భంగంచేస్తాడో, వాస్తవానికి అతడు తన నష్టం కొరకే తన శపథాన్ని భంగం చేస్తాడు. మరియు ఎవడు తన వాగ్దానాన్ని పూర్తిచేస్తాడో, అల్లాహ్‌ అతనికి గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు.

48:11 – سَيَقُولُ لَكَ الْمُخَلَّفُونَ مِنَ الْأَعْرَابِ شَغَلَتْنَا أَمْوَالُنَا وَأَهْلُونَا فَاسْتَغْفِرْ لَنَا ۚ يَقُولُونَ بِأَلْسِنَتِهِم مَّا لَيْسَ فِي قُلُوبِهِمْ ۚ قُلْ فَمَن يَمْلِكُ لَكُم مِّنَ اللَّـهِ شَيْئًا إِنْ أَرَادَ بِكُمْ ضَرًّا أَوْ أَرَادَ بِكُمْ نَفْعًا ۚ بَلْ كَانَ اللَّـهُ بِمَا تَعْمَلُونَ خَبِيرًا ١١

వెనుక ఉండిపోయిన ఎడారివాసులు (బద్దూలు) 2 నీతో ఇలా అంటారు: “మా ఆస్తిపాస్తుల మరియు మా ఆలు-బిడ్డల చింత మాకు తీరికలేకుండా చేశాయి. కావున మా క్షమాపణకై ప్రార్థించండి!” వారు తమ హృదయాలలో లేనిది తమ నాలుకలతో పలుకు తున్నారు. వారితో ఇలా అను: “ఒకవేళ అల్లాహ్‌ మీకు నష్టం చేయదలిస్తే, లేదా లాభం చేయదలిస్తే, ఆయన నుండి మిమ్మల్ని తప్పించగల శక్తి ఎవరికుంది? వాస్తవానికి మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును!

48:12 – بَلْ ظَنَنتُمْ أَن لَّن يَنقَلِبَ الرَّسُولُ وَالْمُؤْمِنُونَ إِلَىٰ أَهْلِيهِمْ أَبَدًا وَزُيِّنَ ذَٰلِكَ فِي قُلُوبِكُمْ وَظَنَنتُمْ ظَنَّ السَّوْءِ وَكُنتُمْ قَوْمًا بُورًا ١٢

“అలాకాదు! ప్రవక్త మరియు విశ్వాసులు ఎన్నటికీ – తమ ఆలు-బిడ్డల వద్దకు – తిరిగి రాలేరని మీరు భావించారు; మరియు ఇది (ఈ ఆలోచన) మీ హృదయాలకు చాలా నచ్చింది మరియు మీరు చాలా చెడ్డ తలంపులు చేశారు మరియు మీరు అధోగతికి చెందినవారు.”

48:13 – وَمَن لَّمْ يُؤْمِن بِاللَّـهِ وَرَسُولِهِ فَإِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَعِيرًا ١٣

మరియు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించని సత్య-తిరస్కారుల కొరకు మేము నిశ్చయంగా, భగభగ మండే అగ్ని జ్వాలలను సిధ్ధపరచి ఉంచాము.

48:14 – وَلِلَّـهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۚ وَكَانَ اللَّـهُ غَفُورًا رَّحِيمًا ١٤

మరియు భూమ్యాకాశాలపై సామ్రాజ్యాధి పత్యం అల్లాహ్‌దే! ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్‌ సదా క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

48:15 – سَيَقُولُ الْمُخَلَّفُونَ إِذَا انطَلَقْتُمْ إِلَىٰ مَغَانِمَ لِتَأْخُذُوهَا ذَرُونَا نَتَّبِعْكُمْ ۖ يُرِيدُونَ أَن يُبَدِّلُوا كَلَامَ اللَّـهِ ۚ قُل لَّن تَتَّبِعُونَا كَذَٰلِكُمْ قَالَ اللَّـهُ مِن قَبْلُ ۖ فَسَيَقُولُونَ بَلْ تَحْسُدُونَنَا ۚ بَلْ كَانُوا لَا يَفْقَهُونَ إِلَّا قَلِيلًا ١٥

ఇక మీరు విజయధనాన్ని తీసుకోవటానికి పోయినప్పుడు, వెనుక ఉండిపోయినవారు ఇలా అంటారు: “మమ్మల్ని కూడా మీ వెంట రానివ్వండి.” 3 వారు అల్లాహ్‌ ఉత్తరువును మార్చగోరుతున్నారు. 4 వారితో అను: “మీరు మా వెంట రాజాలరు; మీ గురించి అల్లాహ్‌ ముందే ఈ విధంగా చెప్పాడు.” అప్పుడు వారు ఇలా అంటారు: “అది కాదు! మీరు మా మీద అసూయపడుతున్నారు.” అలాకాదు! వారు వాస్తవాన్ని అర్థంచేసుకోగలిగేది చాలా తక్కువ.

48:16 – قُل لِّلْمُخَلَّفِينَ مِنَ الْأَعْرَابِ سَتُدْعَوْنَ إِلَىٰ قَوْمٍ أُولِي بَأْسٍ شَدِيدٍ تُقَاتِلُونَهُمْ أَوْ يُسْلِمُونَ ۖ فَإِن تُطِيعُوا يُؤْتِكُمُ اللَّـهُ أَجْرًا حَسَنًا ۖ وَإِن تَتَوَلَّوْا كَمَا تَوَلَّيْتُم مِّن قَبْلُ يُعَذِّبْكُمْ عَذَابًا أَلِيمًا ١٦

వెనుక ఉండి పోయిన ఎడారి వాసులతో (బద్దూలతో) ఇలా అను: “ఇక మీద చాలా కఠినంగా పోరాడే వారికి విరుద్ధంగా (యుధ్ధం చేసేందుకు) మీరు పిలువబడతారు. అప్పుడు (మీరు చనిపోయే వరకూ) వారితో యుద్ధం చేయవలసి ఉంటుంది, లేదా వారు లొంగిపోయే వరకు. ఒక వేళ మీరు ఆజ్ఞాపాలనచేస్తే, అల్లాహ్‌ మీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ మీరు ఇంతకు ముందు మరలిపోయినట్లు, మరలిపోతే ఆయన మీకు అత్యంత బాధాకరమైన శిక్ష విధించగలడు.”

48:17 – لَّيْسَ عَلَى الْأَعْمَىٰ حَرَجٌ وَلَا عَلَى الْأَعْرَجِ حَرَجٌ وَلَا عَلَى الْمَرِيضِ حَرَجٌ ۗ وَمَن يُطِعِ اللَّـهَ وَرَسُولَهُ يُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ وَمَن يَتَوَلَّ يُعَذِّبْهُ عَذَابًا أَلِيمًا ١٧

కాని గ్రుడ్డివానిపై ఎలాంటి నిందలేదు మరియు కుంటివానిపై కూడా ఎలాంటి నిందలేదు మరియు అదేవిధంగా వ్యాధిగ్రస్తునిపై కూడా ఎలాంటి నిందలేదు. అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపేవారిని, ఆయన క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. మరియు వెనుదిరిగిన వానికి ఆయన బాధాకరమైన శిక్ష విధిస్తాడు. (1/2)

48:18 – لَّقَدْ رَضِيَ اللَّـهُ عَنِ الْمُؤْمِنِينَ إِذْ يُبَايِعُونَكَ تَحْتَ الشَّجَرَةِ فَعَلِمَ مَا فِي قُلُوبِهِمْ فَأَنزَلَ السَّكِينَةَ عَلَيْهِمْ وَأَثَابَهُمْ فَتْحًا قَرِيبًا ١٨

  • వాస్తవానికి విశ్వాసులు చెట్టుక్రింద నీతో చేసిన శపథం 5 చూసి అల్లాహ్‌ సంతోషించాడు; మరియు వారి హృదయాల స్థితి ఆయనకు తెలిసిందే. కావున ఆయన వారిమీద శాంతిని అవతరింపజేశాడు. మరియు బహుమానంగా వారికి సమీప విజయాన్ని ప్రసాదించాడు. 6

48:19 – وَمَغَانِمَ كَثِيرَةً يَأْخُذُونَهَا ۗ وَكَانَ اللَّـهُ عَزِيزًا حَكِيمًا ١٩

మరియు అందులో వారు చాలా విజయ ధనాన్ని కూడా పొందుతారు. మరియు అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.

48:20 – وَعَدَكُمُ اللَّـهُ مَغَانِمَ كَثِيرَةً تَأْخُذُونَهَا فَعَجَّلَ لَكُمْ هَـٰذِهِ وَكَفَّ أَيْدِيَ النَّاسِ عَنكُمْ وَلِتَكُونَ آيَةً لِّلْمُؤْمِنِينَ وَيَهْدِيَكُمْ صِرَاطًا مُّسْتَقِيمًا ٢٠

మరియు అల్లాహ్‌ మీకు ఇంకా చాలా విజయధనాల వాగ్దానం చేశాడు. మీరు వాటిని పొందుతారు. కావున మీకు వాటిని త్వరగా ప్రసాదిస్తాడు. మరియు ఆయన ప్రజల చేతులను మీ నుండి ఆపాడు. ఇది విశ్వాసులకు ఒక సూచనగా ఉండేందుకు మరియు ఆయన మీకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేసేందుకూను. 7

48:21 – وَأُخْرَىٰ لَمْ تَقْدِرُوا عَلَيْهَا قَدْ أَحَاطَ اللَّـهُ بِهَا ۚ وَكَانَ اللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرًا ٢١

ఇంకా ఇతర (విజయాలు) కూడా! వాటిని మీరింకా సాధించలేదు. వాస్తవానికి, అల్లాహ్‌ వాటిని ఆవరించి ఉన్నాడు. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.

48:22 – وَلَوْ قَاتَلَكُمُ الَّذِينَ كَفَرُوا لَوَلَّوُا الْأَدْبَارَ ثُمَّ لَا يَجِدُونَ وَلِيًّا وَلَا نَصِيرًا ٢٢

మరియు ఒకవేళ సత్య-తిరస్కారులు మీతో యుధ్ధానికి దిగివుంటే, వారు తప్పక వెన్నుచూపి పారిపోయే వారు, అప్పుడు వారు ఏ రక్షకుడిని గానీ లేదా సహాయకుడిని గానీ పొందేవారు కాదు. 8

48:23 – سُنَّةَ اللَّـهِ الَّتِي قَدْ خَلَتْ مِن قَبْلُ ۖ وَلَن تَجِدَ لِسُنَّةِ اللَّـهِ تَبْدِيلًا ٢٣

ఇది మొదటి నుంచే వస్తూ ఉన్న అల్లాహ్‌ సంప్రదాయం. నీవు అల్లాహ్‌ సంప్రదాయంలో ఎలాంటి మార్పును పొందలేవు.

48:24 – وَهُوَ الَّذِي كَفَّ أَيْدِيَهُمْ عَنكُمْ وَأَيْدِيَكُمْ عَنْهُم بِبَطْنِ مَكَّةَ مِن بَعْدِ أَنْ أَظْفَرَكُمْ عَلَيْهِمْ ۚ وَكَانَ اللَّـهُ بِمَا تَعْمَلُونَ بَصِيرًا ٢٤

మరియు మక్కహ్ లోయలో మీకు వారి మీద ప్రాబల్యం ఇచ్చిన తర్వాత, ఆయనే వారి చేతులను మీపై పడకుండా మరియు మీచేతులు వారిపై పడకుండా చేశాడు. 9 మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌ చూస్తున్నాడు.

48:25 – هُمُ الَّذِينَ كَفَرُوا وَصَدُّوكُمْ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَالْهَدْيَ مَعْكُوفًا أَن يَبْلُغَ مَحِلَّهُ ۚ وَلَوْلَا رِجَالٌ مُّؤْمِنُونَ وَنِسَاءٌ مُّؤْمِنَاتٌ لَّمْ تَعْلَمُوهُمْ أَن تَطَئُوهُمْ فَتُصِيبَكُم مِّنْهُم مَّعَرَّةٌ بِغَيْرِ عِلْمٍ ۖ لِّيُدْخِلَ اللَّـهُ فِي رَحْمَتِهِ مَن يَشَاءُ ۚ لَوْ تَزَيَّلُوا لَعَذَّبْنَا الَّذِينَ كَفَرُوا مِنْهُمْ عَذَابًا أَلِيمًا ٢٥

(వాస్తవానికి) సత్యాన్ని తిరస్కరించి, మిమ్మల్ని మస్జిద్‌ అల్‌-‘హరామ్‌కు పోకుండా నిరోధించి, బలి (ఖుర్బానీ) జంతువులను వాటిని బలిచేసే స్థలానికి చేరనివ్వకుండా ఆపింది వారే కదా! 10 ఒకవేళ వారిలో విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు లేకుంటే – ఎవరిని గురించైతే మీకు తెలియదో – వారిని మీరు త్రొక్కివేసి ఉండేవారు. దాని వలన మీరు – మీకు తెలియకుండానే – పాపానికి గురిఅయ్యే వారు. అల్లాహ్‌ తాను కోరినవారిని తన కారుణ్యంలోనికి తీసుకుంటాడు. ఒకవేళ వారు (విశ్వాసులు) వారి నుండి వేరుగా ఉండి ఉంటే, మేము తప్పక వారిలోని సత్య-తిరస్కారులకు బాధాకరమైన శిక్ష విధించి ఉండేవారము.

48:26 – إِذْ جَعَلَ الَّذِينَ كَفَرُوا فِي قُلُوبِهِمُ الْحَمِيَّةَ حَمِيَّةَ الْجَاهِلِيَّةِ فَأَنزَلَ اللَّـهُ سَكِينَتَهُ عَلَىٰ رَسُولِهِ وَعَلَى الْمُؤْمِنِينَ وَأَلْزَمَهُمْ كَلِمَةَ التَّقْوَىٰ وَكَانُوا أَحَقَّ بِهَا وَأَهْلَهَا ۚ وَكَانَ اللَّـهُ بِكُلِّ شَيْءٍ عَلِيمًا ٢٦

సత్యాన్ని తిరస్కరించిన వారు, తమ హృదయాలలోని మూఢ అభిమానం వల్ల, మూర్ఖపు పట్టు వహించినప్పుడు, అల్లాహ్‌!తన సందేశహరుని మీద మరియు విశ్వాసుల మీద, శాంతిని అవతరింపజేశాడు. మరియు వారిలో దైవభీతిని స్థిరపరచాడు మరియు వారే దానికి హక్కుదారులు మరియు అర్హులు కూడాను. మరియు అల్లాహ్‌కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.

48:27 – لَّقَدْ صَدَقَ اللَّـهُ رَسُولَهُ الرُّؤْيَا بِالْحَقِّ ۖ لَتَدْخُلُنَّ الْمَسْجِدَ الْحَرَامَ إِن شَاءَ اللَّـهُ آمِنِينَ مُحَلِّقِينَ رُءُوسَكُمْ وَمُقَصِّرِينَ لَا تَخَافُونَ ۖ فَعَلِمَ مَا لَمْ تَعْلَمُوا فَجَعَلَ مِن دُونِ ذَٰلِكَ فَتْحًا قَرِيبًا ٢٧

వాస్తవానికి అల్లాహ్‌ తన ప్రవక్తకు, అతని స్వప్నాన్ని, నిజంచేసి చూపాడు. 12 అల్లాహ్‌ కోరితే, మీరు తప్పక శాంతియుతంగా, మీ తలలను పూర్తిగా గొరిగించుకొని లేదా తల వెంట్రుకలను కత్తిరించుకొని, మస్జిద్‌ అల్‌-‘హరామ్‌ లోకి భయపడకుండా ప్రవేశించేవారు. మీకు తెలియనిది ఆయనకు తెలుసు, ఇక ఇదేకాక సమీపంలోనే మీకు మరొక విజయాన్ని కూడా ప్రసాదించ బోతున్నాడు. 13

48:28 – هُوَ الَّذِي أَرْسَلَ رَسُولَهُ بِالْهُدَىٰ وَدِينِ الْحَقِّ لِيُظْهِرَهُ عَلَى الدِّينِ كُلِّهِ ۚ وَكَفَىٰ بِاللَّـهِ شَهِيدًا ٢٨

ఆయనే, తన ప్రవక్తను మార్గదర్శకత్వంతో మరియు సత్యధర్మంతో అన్నిధర్మాలపై అది ఆధిక్యత కలిగివుండేలా చేసి పంపాడు. మరియు సాక్షిగా అల్లాహ్‌యే చాలు. 14

48:29 – مُّحَمَّدٌ رَّسُولُ اللَّـهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ ۖ تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّـهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ ۚ وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّـهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا ٢٩

ము’హమ్మద్‌ అల్లాహ్‌ యొక్క సందేశహరుడు. మరియు అతని వెంట ఉన్న వారు, సత్య-తిరస్కారుల పట్ల కఠినులు మరియు పరస్పరం కరుణామయులు. 15 నీవు వారిని (అల్లాహ్‌ ముందు) వంగుతూ (రుకూ’ఉ చేస్తూ), సాష్టాంగాలు (సజ్దా) చేస్తూ ఉండటం చూస్తున్నావు. వారు అల్లాహ్‌ అనుగ్రహాన్ని మరియు ప్రసన్నతను అర్థిస్తూ ఉంటారు. వారి ముఖాల మీద సాష్టాంగం (సజ్దా) చేయటం వల్ల వచ్చిన గుర్తులుంటాయి. వారి ఈ ఉపమానం తౌరాత్‌లో కూడా ఇవ్వబడింది. మరియు ఇంజీల్‌లో వారు ఒక పైరుతో పోల్చబడ్డారు: మొదట (బీజం నుండి) ఒక మొలక అంకురిస్తుంది 16 తరువాత ఆయన దానిని బలపరుస్తాడు, తరువాత దానిని లావుగా చేస్తాడు. ఆ తరువాత అది తన కాండం మీద నిటారుగా నిలబడి 17 రైతులను ఆనందపరిచి సత్య-తిరస్కారులకు క్రోధావేశాలు కలిగిస్తుంది. విశ్వసించి, సత్కార్యాలు చేసేవారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్‌ వాగ్దానం చేశాడు. (5/8)

సూరహ్‌ అల్‌-‘హుజురాత్‌ – ‘హుజురాతున్ : గృహాలు, ఇండ్లు. ఈ సూరహ్‌ ఈ వరుసలో 3వది మరియు చివరిది. 9వ హిజ్రీలో మదీనహ్ లో అవతరింపజేయబడింది. ఈ పేరు 4వ ఆయత్‌ నుండి తీసుకోబడింది. ఇందులో 18 ఆయతులు ఉన్నాయి. ఇందులో దైవప్రవక్త (‘స’అస)కు ముస్లింలపై ఉన్న హక్కులు మరియు అతని పట్ల వారి మర్యాదలు మరియు ముస్లిం సహోదరుల పరస్పర హక్కులు మరియు తమ నాయకుని పట్ల ముస్లింల బాధ్యతలు బోధింపబడ్డాయి. 9వ హిజ్రీలో రాయబారాలు చాలా వస్తాయి. ఈ సూరహ్ వాటిని గురించి కూడా చెబుతోంది.

(1) ‘తివాలు ముఫ’స్సల్‌ (49-79): ఈ సమూహపు సూరాహ్‌లలో ఇది మొదటిది అని కొందరంటారు. మరికొందరు, ఇవి సూరహ్‌ ఖాఫ్‌ (50) నుండి మొదలవుతాయి అంటారు. వీటిని ఫజ్ర్‌ నమా’జ్‌లో చదవటం మస్నూన్‌, ముస్త’హాబ్‌. (ఫ’త్హ్ అల్‌-ఖదీర్‌, ఇబ్నె-కసీ’ర్‌).

(2) అవ్‌సా’తు ముఫ’స్సల్‌ (80-91): వీటిని “జుహ్ర్‌ మరియు ‘ఇషా నమాజులలో చదవటం, మస్నూన్‌, ముస్త’హబ్‌.

ఖి’సారు ముఫ’స్సల్‌ (92-114): వీటిని మగ్‌రిబ్‌ నమాజ్‌లో చదవటం, మస్నూన్‌, ముస్త’హబ్‌. (అయ్‌సర్‌ అత్తఫాసీర్‌).

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 49:1 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُقَدِّمُوا بَيْنَ يَدَيِ اللَّـهِ وَرَسُولِهِ ۖ وَاتَّقُوا اللَّـهَ ۚ إِنَّ اللَّـهَ سَمِيعٌ عَلِيمٌ ١

  • ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త అనుమతికి ముందే నిర్ణయాలకు దిగకండి. 1 అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ అంతా వినేవాడు, సర్వజ్ఞుడు.

49:2 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَن تَحْبَطَ أَعْمَالُكُمْ وَأَنتُمْ لَا تَشْعُرُونَ ٢

ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను, ప్రవక్త కంఠస్వరాని కంటే పెంచకండి మరియు మీరు పరస్పరం ఒకరితోనొకరు విచ్చలవిడిగా మాట్లాడుకునే విధంగా అతనితో మాట్లాడకండి, దానివల్ల మీకు తెలియకుండానే, మీ కర్మలు వ్యర్థం కావచ్చు!

49:3 – إِنَّ الَّذِينَ يَغُضُّونَ أَصْوَاتَهُمْ عِندَ رَسُولِ اللَّـهِ أُولَـٰئِكَ الَّذِينَ امْتَحَنَ اللَّـهُ قُلُوبَهُمْ لِلتَّقْوَىٰ ۚ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ ٣

నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్‌ యొక్క సందేశహరుని సన్నిధిలో తమ కంఠస్వరాలను తగ్గిస్తారో, అలాంటి వారి హృదయాలను అల్లాహ్‌ భయ-భక్తుల కొరకు పరీక్షించి ఉన్నాడు. వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి.

49:4 – إِنَّ الَّذِينَ يُنَادُونَكَ مِن وَرَاءِ الْحُجُرَاتِ أَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ ٤

(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, ఎవరైతే, నిన్ను గృహాల బయటనుండి బిగ్గరగా (అరుస్తూ) పిలుస్తారో, వారిలో చాలామంది బుధ్ధిహీనులే. 2

49:5 – وَلَوْ أَنَّهُمْ صَبَرُوا حَتَّىٰ تَخْرُجَ إِلَيْهِمْ لَكَانَ خَيْرًا لَّهُمْ ۚ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٥

మరియు ఒకవేళ వారు నీవు బయటకు వచ్చేవరకు ఓపిక పట్టివుంటే, అది వారికే మేలై ఉండేది. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

49:6 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن جَاءَكُمْ فَاسِقٌ بِنَبَإٍ فَتَبَيَّنُوا أَن تُصِيبُوا قَوْمًا بِجَهَالَةٍ فَتُصْبِحُوا عَلَىٰ مَا فَعَلْتُمْ نَادِمِينَ ٦

ఓ విశ్వాసులారా! ఎవడైనా ఒక అవిధేయుడు (ఫాసిఖ్‌), మీ వద్దకు ఏదైనా వార్త తెస్తే, మీరు – మీకు తెలియకుండానే జనులకు నష్టం కలిగించి, మీరు చేసిన దానికి పశ్చాత్తాప పడవలసిన స్థితి రాకముందే – నిజానిజాలను విచారించి తెలుసుకోండి. 3

49:7 – وَاعْلَمُوا أَنَّ فِيكُمْ رَسُولَ اللَّـهِ ۚ لَوْ يُطِيعُكُمْ فِي كَثِيرٍ مِّنَ الْأَمْرِ لَعَنِتُّمْ وَلَـٰكِنَّ اللَّـهَ حَبَّبَ إِلَيْكُمُ الْإِيمَانَ وَزَيَّنَهُ فِي قُلُوبِكُمْ وَكَرَّهَ إِلَيْكُمُ الْكُفْرَ وَالْفُسُوقَ وَالْعِصْيَانَ ۚ أُولَـٰئِكَ هُمُ الرَّاشِدُونَ ٧

మరియు మీ మధ్య అల్లాహ్‌ యొక్క సందేశ హరుడు ఉన్నాడనే విషయాన్ని బాగా గుర్తుంచు కోండి. ఒకవేళ అతను చాలా విషయాలలో మీ మాటనే వింటే మీరే ఆపదలో పడవచ్చు, కానీ అల్లాహ్‌ మీకు విశ్వాసం పట్ల ప్రేమ కలిగించాడు మరియు దానిని మీ హృదయాలకు ఆకర్షణీయమైనదిగా చేశాడు. మరియు సత్య-తిరస్కారాన్ని, అవిధేయతను మరియు దుర్నడతను (ఆజ్ఞోల్లంఘనను) మీకు అసహ్యకర మైనదిగా చేశాడు. అలాంటి వారే సరైన మార్గ దర్శకత్వం పొందినవారు.

49:8 – فَضْلًا مِّنَ اللَّـهِ وَنِعْمَةً ۚ وَاللَّـهُ عَلِيمٌ حَكِيمٌ ٨

అది అల్లాహ్‌ తరఫు నుండి వారికి లభించిన అనుగ్రహం మరియు ఉపకారం. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

49:9 – وَإِن طَائِفَتَانِ مِنَ الْمُؤْمِنِينَ اقْتَتَلُوا فَأَصْلِحُوا بَيْنَهُمَا ۖ فَإِن بَغَتْ إِحْدَاهُمَا عَلَى الْأُخْرَىٰ فَقَاتِلُوا الَّتِي تَبْغِي حَتَّىٰ تَفِيءَ إِلَىٰ أَمْرِ اللَّـهِ ۚ فَإِن فَاءَتْ فَأَصْلِحُوا بَيْنَهُمَا بِالْعَدْلِ وَأَقْسِطُوا ۖ إِنَّ اللَّـهَ يُحِبُّ الْمُقْسِطِينَ ٩

మరియు ఒకవేళ విశ్వాసులలోని రెండు వర్గాలవారు పరస్పరం కలహించుకుంటే, వారి ద్దరి మధ్య సంధి చేయించండి. కాని ఒకవేళ, వారి లోని ఒక వర్గం వారు రెండవ వర్గం వారిపై దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యం చేసినవారు, అల్లాహ్‌ ఆజ్ఞ వైపునకు మరలేవరకు, వారికి వ్యతిరేకంగా పోరాడండి. 4 తరువాత వారు మరలివస్తే, వారి మధ్య న్యాయంగా సంధి చేయించండి మరియు నిష్పక్ష పాతంగా వ్యవహరించండి. నిశ్చయంగా, అల్లాహ్ నిష్పక్షపాతంగా వ్యవహరించే వారిని ప్రేమిస్తాడు.

49:10 – إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ ۚ وَاتَّقُوا اللَّـهَ لَعَلَّكُمْ تُرْحَمُونَ ١٠

వాస్తవానికి విశ్వాసులు పరస్పరం సహోదరులు, కావున మీ సహోదరుల మధ్య సంధి చేయించండి. 5 మరియు మీరు కరుణించబడా లంటే అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండండి.

49:11 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا يَسْخَرْ قَوْمٌ مِّن قَوْمٍ عَسَىٰ أَن يَكُونُوا خَيْرًا مِّنْهُمْ وَلَا نِسَاءٌ مِّن نِّسَاءٍ عَسَىٰ أَن يَكُنَّ خَيْرًا مِّنْهُنَّ ۖ وَلَا تَلْمِزُوا أَنفُسَكُمْ وَلَا تَنَابَزُوا بِالْأَلْقَابِ ۖ بِئْسَ الِاسْمُ الْفُسُوقُ بَعْدَ الْإِيمَانِ ۚ وَمَن لَّمْ يَتُبْ فَأُولَـٰئِكَ هُمُ الظَّالِمُونَ ١١

ఓ విశ్వాసులారా! మీలో ఎవరూ (పురుషులు) ఇతరులెవరినీ ఎగతాళి చేయరాదు. బహుశా వారే (ఎగతాళి చేయబడే వారే) వీరికంటే శ్రేష్ఠులు కావచ్చు! 6 అదేవిధంగా స్త్రీలు కూడా ఇతర స్త్రీలను ఎగతాళి చేయరాదు. బహుశా వారే (ఎగతాళి చేయబడే స్త్రీలే) వీరి కంటే శ్రేష్ఠురాండ్రు కావచ్చు! మీరు పరస్పరం ఎత్తిపొడుచుకోకండి మరియు చెడ్డపేర్లతో పిలుచు కోకండి. విశ్వసించిన తర్వాత ఒకనిని చెడ్డపేరుతో పిలవటం ఎంతో నీచమైన విషయం మరియు (ఇలా చేసిన పిదప) పశ్చాత్తాపపడకుంటే, అలాంటి వారు చాలా దుర్మార్గులు. 7

49:12 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اجْتَنِبُوا كَثِيرًا مِّنَ الظَّنِّ إِنَّ بَعْضَ الظَّنِّ إِثْمٌ ۖ وَلَا تَجَسَّسُوا وَلَا يَغْتَب بَّعْضُكُم بَعْضًا ۚ أَيُحِبُّ أَحَدُكُمْ أَن يَأْكُلَ لَحْمَ أَخِيهِ مَيْتًا فَكَرِهْتُمُوهُ ۚ وَاتَّقُوا اللَّـهَ ۚ إِنَّ اللَّـهَ تَوَّابٌ رَّحِيمٌ ١٢

ఓ విశ్వాసులరా! అతిగా అనుమానించడం నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే కొన్ని అనుమానాలే నిశ్చయంగా పాపాలు. మరియు మీరు మీ పరస్పర రహస్యాలను తెలుసు కోవటానికి ప్రయత్నించకండి మరియు చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవడైనా చచ్చిన తన సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతాడా? మీరు దానిని అసహ్యించుకుంటారు కదా! అల్లాహ్‌ పట్ల భయ-భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణాప్రదాత.

49:13 – يَا أَيُّهَا النَّاسُ إِنَّا خَلَقْنَاكُم مِّن ذَكَرٍ وَأُنثَىٰ وَجَعَلْنَاكُمْ شُعُوبًا وَقَبَائِلَ لِتَعَارَفُوا ۚ إِنَّ أَكْرَمَكُمْ عِندَ اللَّـهِ أَتْقَاكُمْ ۚ إِنَّ اللَّـهَ عَلِيمٌ خَبِيرٌ ١٣

ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము మరియు మీరు ఒకరినొకరు గుర్తించు కోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. 8 నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్‌ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు. (3/4)

49:14 – قَالَتِ الْأَعْرَابُ آمَنَّا ۖ قُل لَّمْ تُؤْمِنُوا وَلَـٰكِن قُولُوا أَسْلَمْنَا وَلَمَّا يَدْخُلِ الْإِيمَانُ فِي قُلُوبِكُمْ ۖ وَإِن تُطِيعُوا اللَّـهَ وَرَسُولَهُ لَا يَلِتْكُم مِّنْ أَعْمَالِكُمْ شَيْئًا ۚ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٤

  • ఎడారి వాసులు (బద్దూలు): “మేము విశ్వసించాము.” అని అంటారు. (ఓ ము’హమ్మద్‌!) వారితో ఇలా అను: “మీరు ఇంకా విశ్వసించలేదు కావున: ‘మేము విధేయులం (ముస్లింలం) అయ్యాము.’ అని అనండి. ఎందు కంటే విశ్వాసం (ఈమాన్‌) మీ హృదయాలలోకి ఇంకా ప్రవేశించలేదు. ఒకవేళ మీరు అల్లాహ్‌ యొక్క మరియు ఆయన ప్రవక్త యొక్క ఆజ్ఞాపాలన చేస్తే, ఆయన మీ కర్మలను ఏ మాత్రం వృథాకానివ్వడు. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.”

49:15 – إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ آمَنُوا بِاللَّـهِ وَرَسُولِهِ ثُمَّ لَمْ يَرْتَابُوا وَجَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ فِي سَبِيلِ اللَّـهِ ۚ أُولَـٰئِكَ هُمُ الصَّادِقُونَ ١٥

వాస్తవానికి, ఎవరైతే అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించి, ఆ తరువాత ఏ అనుమానానికీ లోనుకాకుండా, అల్లాహ్‌ మార్గంలో, తమ సిరిసంపదలతో మరియు ప్రాణాలతో పోరాడుతారో! అలాంటి వారు, వారే! సత్యవంతులు.

49:16 – قُلْ أَتُعَلِّمُونَ اللَّـهَ بِدِينِكُمْ وَاللَّـهُ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَاللَّـهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ١٦

వారితో ఇలా అను: “ఏమిటి? మీరు అల్లాహ్‌కు మీ ధర్మస్వీకారం గురించి తెలియ జేస్తున్నారా? ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు. మరియు అల్లాహ్‌కు ప్రతివిషయం గురించి బాగా తెలుసు.”

49:17 – يَمُنُّونَ عَلَيْكَ أَنْ أَسْلَمُوا ۖ قُل لَّا تَمُنُّوا عَلَيَّ إِسْلَامَكُم ۖ بَلِ اللَّـهُ يَمُنُّ عَلَيْكُمْ أَنْ هَدَاكُمْ لِلْإِيمَانِ إِن كُنتُمْ صَادِقِينَ ١٧

(ఓ ము’హమ్మద్‌!) వారు ఇస్లాంను స్వీకరించి, నీకు ఉపకారం చేసినట్లు వ్యవహ రిస్తున్నారు. వారితో ఇలా అను: “మీరు ఇస్లాంను స్వీకరించి నాకు ఎలాంటి ఉపకారం చేయలేదు! వాస్తవానికి, మీరు సత్యవంతులే అయితే! మీకు విశ్వాసం వైపునకు మార్గదర్శకత్వం చేసి, అల్లాహ్‌ యే మీకు ఉపకారం చేశాడని తెలుసుకోండి.”

49:18 – إِنَّ اللَّـهَ يَعْلَمُ غَيْبَ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَاللَّـهُ بَصِيرٌ بِمَا تَعْمَلُونَ ١٨

నిశ్చయంగా, అల్లాహ్‌! ఆకాశాలలో మరియు భూమిలోనున్న అగోచర విషయా లన్నింటినీ ఎరుగును. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌ చూస్తున్నాడు.

సూరహ్‌ ఖాఫ్‌ – మొదటి ఆయత్‌లోనే ఈ సూరహ్‌ పేరుగల ఈ అక్షరము ఉంది. ఇందులో 45 ఆయాతు లున్నాయి. దైవప్రవక్త (‘స’అస) సూరహ్‌ ఖాఫ్‌ (50), సూరహ్‌ అల్‌-ఖమర్‌ (54)లను పండుగల మరియు జుము’అహ్‌ నమా’జ్‌లలో పఠించేవారు, అంటే పెద్ద సమూహం ఉన్నప్పుడు, (‘స. ముస్లిం). ఇది దైవప్రవక్త (‘స’అస), ప్రవక్తపదవికి ఎన్నుకోబడిన 4 సంవత్సరాల తరువాత మక్కహ్ లో అవతరింపజేయబడింది. ఇందులో మరణం మరియు పునరుత్థానం గురించి వివరాలున్నాయి. ఇది మక్కహ్ కు చెందిన ఈ సమూహపు 7 సూరాహ్‌లలో మొదటిది (50-56). అవతరణాక్రమంలో సూరహ్‌ అల్‌-ఖలమ్‌ / నూన్‌ (68) తరువాత – మొదట అక్షరాలు ఉన్న సూరాలలో – ఇది 2 వది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 50:1 – ق ۚ وَالْقُرْآنِ الْمَجِيدِ ١

ఖాఫ్‌. మరియు దివ్యమైన 1 ఈ ఖుర్‌ఆన్‌ సాక్షిగా!

50:2 – بَلْ عَجِبُوا أَن جَاءَهُم مُّنذِرٌ مِّنْهُمْ فَقَالَ الْكَافِرُونَ هَـٰذَا شَيْءٌ عَجِيبٌ ٢

అలా కాదు! హెచ్చరిక చేసేవాడు, వారి వద్దకు వారిలోనుంచే వచ్చాడనే విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది, కావున సత్య-తిరస్కారులు ఇలా అన్నారు: 2 “ఇది ఆశ్చర్యకరమైన విషయం!

50:3 – أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا ۖ ذَٰلِكَ رَجْعٌ بَعِيدٌ ٣

“మేము మరణించి మట్టిగా మారిపోయినా (మరల బ్రతికించబడతామా)? ఈ విధంగా మరల (సజీవులై) రావటం చాలా అసంభవమైన విషయం!”

50:4 – قَدْ عَلِمْنَا مَا تَنقُصُ الْأَرْضُ مِنْهُمْ ۖ وَعِندَنَا كِتَابٌ حَفِيظٌ ٤

వాస్తవానికి వారి (శరీరాల)లో నుండి భూమి దేనిని తగ్గిస్తుందో మాకు బాగా తెలుసు. 3 మరియు మా దగ్గర అంతా ఒక సురక్షితమైన గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.

50:5 – بَلْ كَذَّبُوا بِالْحَقِّ لَمَّا جَاءَهُمْ فَهُمْ فِي أَمْرٍ مَّرِيجٍ ٥

కాని వారు, సత్యం వారి వద్దకు వచ్చినపుడు దానిని అసత్యమని తిరస్కరించారు. కాబట్టి వారు ఈ విషయం గురించి కలవరపడు తున్నారు.

50:6 – أَفَلَمْ يَنظُرُوا إِلَى السَّمَاءِ فَوْقَهُمْ كَيْفَ بَنَيْنَاهَا وَزَيَّنَّاهَا وَمَا لَهَا مِن فُرُوجٍ ٦

వారు, తమ మీద ఉన్న ఆకాశం వైపునకు చూడటం లేదా ఏమిటి? మేము దానిని ఏవిధంగా నిర్మించి అలంకరించామో మరియు దానిలో ఎలాంటి చీలికలూ (పగుళ్లూ) లేవు. 4

50:7 – وَالْأَرْضَ مَدَدْنَاهَا وَأَلْقَيْنَا فِيهَا رَوَاسِيَ وَأَنبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍ بَهِيجٍ ٧

ఇక భూమిని! మేము దానిని విస్తరింపజేసి, దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము మరియు అందులో అన్నిరకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పత్తిచేశాము. 5

50:8 – تَبْصِرَةً وَذِكْرَىٰ لِكُلِّ عَبْدٍ مُّنِيبٍ ٨

(అల్లాహ్‌) వైపునకు మరలే ప్రతి దాసునికి సూచనగా మరియు బోధనగా!

50:9 – وَنَزَّلْنَا مِنَ السَّمَاءِ مَاءً مُّبَارَكًا فَأَنبَتْنَا بِهِ جَنَّاتٍ وَحَبَّ الْحَصِيدِ ٩

మరియు మేము ఆకాశం నుండి శుభదాయకమైన నీటిని కురిపించి దాని ద్వారా తోటలను ఉత్పత్తి చేశాము మరియు ధాన్యాలను పండించాము.

50:10 – وَالنَّخْلَ بَاسِقَاتٍ لَّهَا طَلْعٌ نَّضِيدٌ ١٠

మరియు ఎత్తయిన ఖర్జూరపుచెట్లను పెంచి, వాటికి వరుసలలో పండ్ల గుత్తులను (పుట్టించాము); 6

50:11 – رِّزْقًا لِّلْعِبَادِ ۖ وَأَحْيَيْنَا بِهِ بَلْدَةً مَّيْتًا ۚ كَذَٰلِكَ الْخُرُوجُ ١١

మా దాసులకు జీవనోపాధిగా. మరియు దానితో (ఆ నీటితో) చచ్చిన భూమికి ప్రాణం పోశాము. ఇదే విధంగా (చచ్చినవారిని) కూడా లేపుతాము.

50:12 – كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَأَصْحَابُ الرَّسِّ وَثَمُودُ ١٢

వారికి పూర్వం నూ’హ్‌ జాతి వారు, అర్‌-రస్‌ 7 వాసులు మరియు స’మూద్‌ జాతి వారు కూడా, సత్యాన్ని తిరస్కరించారు.

50:13 – وَعَادٌ وَفِرْعَوْنُ وَإِخْوَانُ لُوطٍ ١٣

మరియు ‘ఆద్‌ జాతివారు, ఫిర్‌’ఔన్‌ జాతివారు మరియు లూ’త్‌ సహోదరులు కూడా;

50:14 – وَأَصْحَابُ الْأَيْكَةِ وَقَوْمُ تُبَّعٍ ۚ كُلٌّ كَذَّبَ الرُّسُلَ فَحَقَّ وَعِيدِ ١٤

మరియు అయ్‌కహ్ (వన) వాసులు మరియు తుబ్బ’అ 8 జాతి వారు కూడాను. ప్రతి ఒక్కరూ తమ ప్రవక్తలను అసత్యులని తిరస్కరించారు, కావున నా బెదిరింపు వారి విషయంలో సత్యమయింది.

50:15 – أَفَعَيِينَا بِالْخَلْقِ الْأَوَّلِ ۚ بَلْ هُمْ فِي لَبْسٍ مِّنْ خَلْقٍ جَدِيدٍ ١٥

ఏమిటి? మేము మొదటి సృష్టితోనే అలసి పోయామా? అలాకాదు, అసలు వారు కొత్త సృష్టి (పునరుత్థానమును) గురించి సందేహంలో పడి ఉన్నారు. 9

50:16 – وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ وَنَعْلَمُ مَا تُوَسْوِسُ بِهِ نَفْسُهُ ۖ وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنْ حَبْلِ الْوَرِيدِ ١٦

మరియు వాస్తవంగా, మేమే మానవుణ్ణి సృష్టించాము మరియు అతని మనస్సులో మెదిలే ఊహలను కూడా మేము ఎరుగుతాము. 10 మరియు మేము అతనికి అతని కంఠ రక్తనాళం కంటే కూడా అతి దగ్గరగా ఉన్నాము.

50:17 – إِذْ يَتَلَقَّى الْمُتَلَقِّيَانِ عَنِ الْيَمِينِ وَعَنِ الشِّمَالِ قَعِيدٌ ١٧

(జ్ఞాపకముంచుకోండి) అతని కుడి మరియు ఎడమ ప్రక్కలలో కూర్చుండి (ప్రతి విషయాన్ని వ్రాసే) ఇద్దరు పర్యవేక్షకులు (దేవదూతలు) అతనిని కలుసుకున్న తరువాత నుంచి –

50:18 – مَّا يَلْفِظُ مِن قَوْلٍ إِلَّا لَدَيْهِ رَقِيبٌ عَتِيدٌ ١٨

అతనితో బాటు ఒక పర్యవేక్షకుడైనా సిధ్ధంగా లేనిదే – అతడు ఏ మాటనూ పలకలేడు.

50:19 – وَجَاءَتْ سَكْرَةُ الْمَوْتِ بِالْحَقِّ ۖ ذَٰلِكَ مَا كُنتَ مِنْهُ تَحِيدُ ١٩

మరియు మరణ మూర్ఛ వచ్చేది సత్యం. అది, ఇదే! దేనినుండైతే నీవు తప్పించుకోగోరుతూ ఉండే వాడివో!

50:20 – وَنُفِخَ فِي الصُّورِ ۚ ذَٰلِكَ يَوْمُ الْوَعِيدِ ٢٠

మరియు బాకా (‘సూర్‌) ఊదబడుతుంది. ఆ హెచ్చరించబడిన (పునరుత్థాన) దినం అదే!

50:21 – وَجَاءَتْ كُلُّ نَفْسٍ مَّعَهَا سَائِقٌ وَشَهِيدٌ ٢١

మరియు ప్రతిఆత్మ(ప్రాణి) ఒకతోలేవాడితో మరొక సాక్ష్యమిచ్చే వాడితో సహా వస్తుంది.

50:22 – لَّقَدْ كُنتَ فِي غَفْلَةٍ مِّنْ هَـٰذَا فَكَشَفْنَا عَنكَ غِطَاءَكَ فَبَصَرُكَ الْيَوْمَ حَدِيدٌ ٢٢

(ఇలా అనబడుతుంది): “వాస్తవానికి నీవు (ఈ దినాన్ని గురించి) నిర్లక్ష్యంగా ఉండేవాడివి. కావున ఇపుడు మేము నీ ముందున్న తెరను తొలగించాము. కావున, ఈ రోజు నీ దృష్టి చాలా చురుకుగా ఉంది.”

50:23 – وَقَالَ قَرِينُهُ هَـٰذَا مَا لَدَيَّ عَتِيدٌ ٢٣

మరియు అతని సహచరుడు (ఖరీనున్‌) ఇలా అంటాడు: “ఇదిగో నా దగ్గర సిద్ధంగా ఉన్న (ఇతని కర్మపత్రం) ఇది!”

50:24 – أَلْقِيَا فِي جَهَنَّمَ كُلَّ كَفَّارٍ عَنِيدٍ ٢٤

(ఇలా ఆజ్ఞ వస్తుంది): “మూర్ఖపు పట్టు (హఠము) గల ప్రతి సత్య-తిరస్కారుణ్ణి మీరిద్దరు కలసి నరకంలో విసరివేయండి;

50:25 – مَّنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ مُّرِيبٍ ٢٥

“మంచిని నిషేధించే వాడిని, హద్దులు మీరి ప్రవర్తిస్తూ సందేహాలను వ్యాపింపజేసేవాడిని;

50:26 – الَّذِي جَعَلَ مَعَ اللَّـهِ إِلَـٰهًا آخَرَ فَأَلْقِيَاهُ فِي الْعَذَابِ الشَّدِيدِ ٢٦

“అల్లాహ్‌కు సాటిగా ఇతర ఆరాధ్యదైవాన్నీ కల్పించినవాడు ఇతడే. కావున ఇతనిని మీ రిద్దరూ కలిసి ఘోరశిక్షలో పడవేయండి.” (7/8)

50:27 – قَالَ قَرِينُهُ رَبَّنَا مَا أَطْغَيْتُهُ وَلَـٰكِن كَانَ فِي ضَلَالٍ بَعِيدٍ ٢٧

  • అతని స్నేహితుడు (ఖరీనున్‌) ఇలా అంటాడు: 11 “ఓ మా ప్రభూ! నేను ఇతని తల బిరుసుతనాన్ని ప్రోత్సహించలేదు, కాని ఇతడే స్వయంగా, మార్గభ్రష్టత్వంలో చాలాదూరం వెళ్ళి పోయాడు.”

50:28 – قَالَ لَا تَخْتَصِمُوا لَدَيَّ وَقَدْ قَدَّمْتُ إِلَيْكُم بِالْوَعِيدِ ٢٨

ఆయన (అల్లాహ్‌) ఇలా అంటాడు: “మీరు నా దగ్గర వాదులాడకండి మరియు వాస్తవానికి నేను ముందుగానే మీ వద్దకు హెచ్చరికను పంపి ఉన్నాను.

50:29 – مَا يُبَدَّلُ الْقَوْلُ لَدَيَّ وَمَا أَنَا بِظَلَّامٍ لِّلْعَبِيدِ ٢٩

“నా దగ్గర మాట మార్చటం జరుగదు మరియు నేను నా దాసులకు అన్యాయం చేసేవాడను కాను.”

50:30 – يَوْمَ نَقُولُ لِجَهَنَّمَ هَلِ امْتَلَأْتِ وَتَقُولُ هَلْ مِن مَّزِيدٍ ٣٠

ఆ రోజు మేము నరకంతో: “నీవు నిండి పోయావా? అని ప్రశ్నిస్తాము. మరియు అది: “ఇంకా ఏమైనా ఉందా ఏమీటీ?” అని అడుగు తుంది. 12

50:31 – وَأُزْلِفَتِ الْجَنَّةُ لِلْمُتَّقِينَ غَيْرَ بَعِيدٍ ٣١

మరియు స్వర్గం దైవభీతి గలవారి దగ్గరకు తీసుకు రాబడుతుంది! అది వారి నుండి ఏ మాత్రం దూరంగా ఉండదు.

50:32 – هَـٰذَا مَا تُوعَدُونَ لِكُلِّ أَوَّابٍ حَفِيظٍ ٣٢

(వారితో ఇలా అనబడుతుంది): “ఇదే మీకు వాగ్దానం చేయబడినది. మళ్ళీ-మళ్ళీ మా వైపుకు మరలే ప్రతి వానికి, (మా హద్దును) లక్ష్యపెట్టిన (పాటించిన) వానికి;

50:33 – مَّنْ خَشِيَ الرَّحْمَـٰنَ بِالْغَيْبِ وَجَاءَ بِقَلْبٍ مُّنِيبٍ ٣٣

“అగోచరుడైన ఆ కరుణామయునికి భయపడే వానికి మరియు మా వైపునకు పశ్చాత్తాప హృదయంతో మరలే వానికి;

50:34 – ادْخُلُوهَا بِسَلَامٍ ۖ ذَٰلِكَ يَوْمُ الْخُلُودِ ٣٤

“ఇందులో (ఈ స్వర్గంలో), శాంతితో ప్రవేశించండి. ఇదే శాశ్వత జీవిత దినం.”

50:35 – لَهُم مَّا يَشَاءُونَ فِيهَا وَلَدَيْنَا مَزِيدٌ ٣٥

అందులోవారికి వారు కోరేదంతా ఉంటుంది. మరియు మా దగ్గర ఇంకా చాలా ఉంది. 13

50:36 – وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّن قَرْنٍ هُمْ أَشَدُّ مِنْهُم بَطْشًا فَنَقَّبُوا فِي الْبِلَادِ هَلْ مِن مَّحِيصٍ ٣٦

మరియు మేము, వీరికి పూర్వం ఎన్నో తరాల వారిని నాశనం చేశాము. వారు వీరికంటే ఎక్కువ శక్తిమంతులు. కాని, (మా శిక్ష పడి నప్పుడు) వారు దేశదిమ్మరులై పోయారు. ఏమీ? వారికి తప్పించుకొనే మార్గం ఏదైనా దొరికిందా?

50:37 – إِنَّ فِي ذَٰلِكَ لَذِكْرَىٰ لِمَن كَانَ لَهُ قَلْبٌ أَوْ أَلْقَى السَّمْعَ وَهُوَ شَهِيدٌ ٣٧

నిశ్చయంగా, హృదయమున్న వానికి, శ్రధ్ధతో వినేవాడికి మరియు లక్ష్యపెట్టేవాడికి ఇందులో ఒక గుణపాఠముంది.

50:38 – وَلَقَدْ خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا فِي سِتَّةِ أَيَّامٍ وَمَا مَسَّنَا مِن لُّغُوبٍ ٣٨

మరియు వాస్తవంగా! మేము ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్ని ఆరు దినములలో (అయ్యామ్‌ లలో) సృష్టించాము. కాని మాకు ఎలాంటి అలసట కలుగలేదు.

50:39 – فَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ الْغُرُوبِ ٣٩

కావున (ఓ ము’హమ్మద్‌!) వారు పలికే మాటలకు సహనం వహించు మరియు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన స్తోత్రాలు చెయ్యి, ప్రతిరోజు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు కూడా; 14

50:40 – وَمِنَ اللَّيْلِ فَسَبِّحْهُ وَأَدْبَارَ السُّجُودِ ٤٠

మరియు రాత్రి వేళలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు 15 మరియు సాష్టాంగం (సజ్దా) చేసిన తరువాత కూడా స్తుతించు. 16

50:41 – وَاسْتَمِعْ يَوْمَ يُنَادِ الْمُنَادِ مِن مَّكَانٍ قَرِيبٍ ٤١

మరియు చెవియొగ్గి విను, చాటింపు చేసేవాడు అతి దగ్గరినుంచే పిలిచే రోజున!

50:42 – يَوْمَ يَسْمَعُونَ الصَّيْحَةَ بِالْحَقِّ ۚ ذَٰلِكَ يَوْمُ الْخُرُوجِ ٤٢

ఆ రోజు మీరు ఒక భయంకర శబ్దం వినేది సత్యం. (గోరీలలో నుండి) బయటికి వచ్చే దినం అదే!

50:43 – إِنَّا نَحْنُ نُحْيِي وَنُمِيتُ وَإِلَيْنَا الْمَصِيرُ ٤٣

నిశ్చయంగా, మేమే జీవనమిచ్చేవారం మరియు మేమే మరణింపజేసేవారం మరియు మీ అందరి మరలింపు మా వైపునకే జరుగుతుంది.

50:44 – يَوْمَ تَشَقَّقُ الْأَرْضُ عَنْهُمْ سِرَاعًا ۚ ذَٰلِكَ حَشْرٌ عَلَيْنَا يَسِيرٌ ٤٤

ఆ రోజు భూమి చీలిపోయి వారందరూ పరుగిడుతూ బయటికివస్తారు. అదే సమావేశ సమయం. అది మాకెంతో సులభం.

50:45 – نَّحْنُ أَعْلَمُ بِمَا يَقُولُونَ ۖ وَمَا أَنتَ عَلَيْهِم بِجَبَّارٍ ۖ فَذَكِّرْ بِالْقُرْآنِ مَن يَخَافُ وَعِيدِ ٤٥

వారనేది మాకు బాగా తెలుసు. నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేయలేవు. కావున నా హెచ్చరికకు భయపడేవాడికి మాత్రమే నీవు ఈ ఖుర్‌ఆన్‌ ద్వారా హితబోధ చెయ్యి.

సూరహ్‌ అజ్‌‘-జా‘రియాత్‌ – అజ్‌’-జా’రియాత్‌: ఎగురగొట్టే, వెదజల్లే, చెల్లాచెదురు చేసే, లేక విసరే వాయువులు. పునరుత్థానం గురించి వివరించే 7 సూరాహ్‌లలో ఇది 2వది. సుయూతీ అభిప్రాయంలో ఇది ప్రస్థానానికి 2 సంవత్సరాలకు ముందు మక్కహ్ లో అవతరింపజేయబడింది. ఇందులో 60 ఆయతులున్నాయి. దీనిపేరు మొదటి ఆయత్ లోనుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 51:1 – وَالذَّارِيَاتِ ذَرْوًا ١

దుమ్ము ఎగురవేసే వాటి (గాలుల) సాక్షిగా!

51:2 – فَالْحَامِلَاتِ وِقْرًا ٢

మరియు, (నీటి) భారాన్ని మోసే (మేఘాల);

51:3 – فَالْجَارِيَاتِ يُسْرًا ٣

మరియు సముద్రంలో సులభంగా తేలియాడే (ఓడల);

51:4 – فَالْمُقَسِّمَاتِ أَمْرًا ٤

మరియు (ఆయన) ఆజ్ఞతో (అనుగ్రహాలను) పంచిపెట్టే (దేవదూతల సాక్షిగా); 1

51:5 – إِنَّمَا تُوعَدُونَ لَصَادِقٌ ٥

నిశ్చయంగా, మీకు చేయబడ్డ వాగ్దానం సత్యం.

51:6 – وَإِنَّ الدِّينَ لَوَاقِعٌ ٦

మరియు నిశ్చయంగా, తీర్పు రానున్నది.

51:7 – وَالسَّمَاءِ ذَاتِ الْحُبُكِ ٧

మార్గాలతో నిండిన ఆకాశం సాక్షిగా!

51:8 – إِنَّكُمْ لَفِي قَوْلٍ مُّخْتَلِفٍ ٨

నిశ్చయంగా, మీరు భేదాభిప్రాయాలలో పడి ఉన్నారు. 2

51:9 – يُؤْفَكُ عَنْهُ مَنْ أُفِكَ ٩

(సత్యం నుండి) మరలింపబడిన వాడే, మోసగింపబడిన వాడు.

51:10 – قُتِلَ الْخَرَّاصُونَ ١٠

ఆధారంలేని అభిప్రాయాలు గలవారే నాశనం చేయబడేవారు!

51:11 – الَّذِينَ هُمْ فِي غَمْرَةٍ سَاهُونَ ١١

ఎవరైతే నిర్లక్ష్యంలో పడి అశ్రధ్ధగా ఉన్నారో!

51:12 – يَسْأَلُونَ أَيَّانَ يَوْمُ الدِّينِ ١٢

వారు ఇలా అడుగుతున్నారు: “తీర్పు దినం ఎప్పుడు రానున్నది?”

51:13 – يَوْمَ هُمْ عَلَى النَّارِ يُفْتَنُونَ ١٣

ఆ దినమున, వారు అగ్నితో దహింప (పరీక్షింప) బడతారు.

51:14 – ذُوقُوا فِتْنَتَكُمْ هَـٰذَا الَّذِي كُنتُم بِهِ تَسْتَعْجِلُونَ ١٤

(వారితో ఇలా అనబడుతుంది): “మీ పరీక్షను 3 రుచి చూడండి! మీరు దీని కొరకే తొందరపెట్టే వారు!”

51:15 – إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَعُيُونٍ ١٥

నిశ్చయంగా, దైవభీతి గలవారు చెలమలు గల స్వర్గవనాలలో ఉంటారు.

51:16 – آخِذِينَ مَا آتَاهُمْ رَبُّهُمْ ۚ إِنَّهُمْ كَانُوا قَبْلَ ذَٰلِكَ مُحْسِنِينَ ١٦

తమ ప్రభువు తమకు ప్రసాదించిన వాటితో సంతోషపడుతూ! నిశ్చయంగా, వారు అంతకు పూర్వం సజ్జనులై ఉండేవారు.

51:17 – كَانُوا قَلِيلًا مِّنَ اللَّيْلِ مَا يَهْجَعُونَ ١٧

వారు రాత్రివేళలో చాలా తక్కువగా నిద్రపోయే వారు.

51:18 – وَبِالْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ ١٨

మరియు వారు రాత్రి చివరి గడియలలో 4 క్షమాపణ వేడుకునేవారు.

51:19 – وَفِي أَمْوَالِهِمْ حَقٌّ لِّلسَّائِلِ وَالْمَحْرُومِ ١٩

మరియు వారి సంపదలో యాచించే వారికి మరియు ఆవశ్యకత గలవారికి 5 హక్కు ఉంటుంది.

51:20 – وَفِي الْأَرْضِ آيَاتٌ لِّلْمُوقِنِينَ ٢٠

మరియు భూమిలో కూడా నమ్మేవారి కొరకు ఎన్నో నిదర్శనాలు (ఆయాత్‌) ఉన్నాయి.

51:21 – وَفِي أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ ٢١

మరియు స్వయంగా మీలో కూడా ఉన్నాయి. ఏమీ? మీరు చూడలేరా? 6

51:22 – وَفِي السَّمَاءِ رِزْقُكُمْ وَمَا تُوعَدُونَ ٢٢

మరియు ఆకాశంలో మీ జీవనోపాధి మరియు మీకు వాగ్దానం చేయబడినది ఉంది.

51:23 – فَوَرَبِّ السَّمَاءِ وَالْأَرْضِ إِنَّهُ لَحَقٌّ مِّثْلَ مَا أَنَّكُمْ تَنطِقُونَ ٢٣

కావున భూమ్యాకాశాల ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, ఇది సత్యం; ఏ విధంగానైతే మీరు మాట్లాడగలిగేది (సత్యమో)!

51:24 – هَلْ أَتَاكَ حَدِيثُ ضَيْفِ إِبْرَاهِيمَ الْمُكْرَمِينَ ٢٤

ఏమీ? ఇబ్రాహీమ్‌ యొక్క గౌరవనీయులైన అతిథులగాథ నీకు చేరిందా? 7

51:25 – إِذْ دَخَلُوا عَلَيْهِ فَقَالُوا سَلَامًا ۖ قَالَ سَلَامٌ قَوْمٌ مُّنكَرُونَ ٢٥

వారు అతని వద్దకు వచ్చినపుడు: “మీకు సలాం!” అని అన్నారు. అతను: “మీకూ సలాం!” అని జవాబిచ్చి: “మీరు పరిచయంలేని (కొత్త) వారుగా ఉన్నారు.” అని అన్నాడు.

51:26 – فَرَاغَ إِلَىٰ أَهْلِهِ فَجَاءَ بِعِجْلٍ سَمِينٍ ٢٦

తరువాత అతను తన ఇంటిలోకి పోయి బలిసిన (వేయించిన) ఒక ఆవుదూడను తీసుకొని వచ్చాడు.

51:27 – فَقَرَّبَهُ إِلَيْهِمْ قَالَ أَلَا تَأْكُلُونَ ٢٧

దానిని వారి ముందుకు జరిపి: “ఏమీ? మీరెందుకు తినటం లేదు?” అని అడిగాడు.

51:28 – فَأَوْجَسَ مِنْهُمْ خِيفَةً ۖ قَالُوا لَا تَخَفْ ۖ وَبَشَّرُوهُ بِغُلَامٍ عَلِيمٍ ٢٨

(వారు తినకుండా ఉండటం చూసి), వారి నుండి భయపడ్డాడు. 8 వారన్నారు: “భయ పడకు!” మరియు వారు అతనికి జ్ఞానవంతుడైన కుమారుని శుభవార్తనిచ్చారు.

51:29 – فَأَقْبَلَتِ امْرَأَتُهُ فِي صَرَّةٍ فَصَكَّتْ وَجْهَهَا وَقَالَتْ عَجُوزٌ عَقِيمٌ ٢٩

అప్పుడతని భార్య అరుస్తూ వారి ముందుకు వచ్చి, తన చేతిని నుదుటి మీద కొట్టుకుంటూ: “నేను ముసలిదాన్ని, గొడ్రాలను కదా!” అని అన్నది.

51:30 – قَالُوا كَذَٰلِكِ قَالَ رَبُّكِ ۖ إِنَّهُ هُوَ الْحَكِيمُ الْعَلِيمُ ٣٠

వారన్నారు: “నీ ప్రభువు ఇలాగే అన్నాడు! నిశ్చయంగా, ఆయన మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు!”

51:31 – قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا الْمُرْسَلُونَ ٣١

(*) అడిగాడు: “ఓ సందేశ హరులారా (ఓ దేవదూతలారా)! అయితే మీరు వచ్చిన కారణమేమిటి?”

51:32 – قَالُوا إِنَّا أُرْسِلْنَا إِلَىٰ قَوْمٍ مُّجْرِمِينَ ٣٢

వారన్నారు: “వాస్తవానికి, మేము నేరస్థు లైన జనుల వైపునకు పంపబడ్డాము.

51:33 – لِنُرْسِلَ عَلَيْهِمْ حِجَارَةً مِّن طِينٍ ٣٣

“వారి మీద (కాల్చబడిన) మట్టి-రాళ్ళను కురిపించటం కోసం! 9

51:34 – مُّسَوَّمَةً عِندَ رَبِّكَ لِلْمُسْرِفِينَ ٣٤

“నీ ప్రభువు తరఫు నుండి గుర్తువేయబడిన (రాళ్ళు); 10 మితిమీరి ప్రవర్తించేవారి కొరకు!”

51:35 – فَأَخْرَجْنَا مَن كَانَ فِيهَا مِنَ الْمُؤْمِنِينَ ٣٥

అప్పుడు మేము అందులో ఉన్న విశ్వాసు లందరినీ బయటికి తీశాము. 11

51:36 – فَمَا وَجَدْنَا فِيهَا غَيْرَ بَيْتٍ مِّنَ الْمُسْلِمِينَ ٣٦

మేము అందు ఒక్క గృహం తప్ప! 12 ఇతర విధేయుల (ముస్లింల) 13 గృహాన్ని చూడలేదు.

51:37 – وَتَرَكْنَا فِيهَا آيَةً لِّلَّذِينَ يَخَافُونَ الْعَذَابَ الْأَلِيمَ ٣٧

మరియు బాధాకరమైన శిక్షకు భయపడే వారి కొరకు, మేము అక్కడ ఒక సూచన (ఆయత్‌)ను వదలిపెట్టాము. 14

51:38 – وَفِي مُوسَىٰ إِذْ أَرْسَلْنَاهُ إِلَىٰ فِرْعَوْنَ بِسُلْطَانٍ مُّبِينٍ ٣٨

ఇక మూసా (గాథ)లో కూడ (ఒక సూచన వుంది) మేము అతనిని ఫిర్‌’ఔన్‌ వద్దకు స్పష్టమైన ప్రమాణంతో పంపినపుడు;

51:39 – فَتَوَلَّىٰ بِرُكْنِهِ وَقَالَ سَاحِرٌ أَوْ مَجْنُونٌ ٣٩

అతడు (ఫిర్‌’ఔన్‌) తన సభాసదులతో సహా మరలిపోతూ, ఇలా అన్నాడు: “ఇతడు మాంత్రికుడు లేదా పిచ్చివాడు!”

51:40 – فَأَخَذْنَاهُ وَجُنُودَهُ فَنَبَذْنَاهُمْ فِي الْيَمِّ وَهُوَ مُلِيمٌ ٤٠

కావున మేము అతనిని మరియు అతని సైనికులను పట్టుకొని, వారందరినీ సముద్రంలో ముంచివేశాము మరియు దానికి అతడే నిందితుడు.

51:41 – وَفِي عَادٍ إِذْ أَرْسَلْنَا عَلَيْهِمُ الرِّيحَ الْعَقِيمَ ٤١

ఇక ‘ఆద్‌ జాతివారిలో కూడా (ఒక సూచన వుంది): మేము వారిపై వినాశకరమైన గాలిని పంపినప్పుడు! 15

51:42 – مَا تَذَرُ مِن شَيْءٍ أَتَتْ عَلَيْهِ إِلَّا جَعَلَتْهُ كَالرَّمِيمِ ٤٢

అది దేనిపైనయితే వీచిందో, దానిని క్షీణింపజేయకుండా వదలలేదు. 16

51:43 – وَفِي ثَمُودَ إِذْ قِيلَ لَهُمْ تَمَتَّعُوا حَتَّىٰ حِينٍ ٤٣

మరియు స’మూద్‌ జాతివారి గాథలో కూడా (ఒక సూచన ఉంది). వారితో: “కొంత కాలం మీరు సుఖ-సంతోషాలను అనుభవించండి.” అని అన్నాము. 17

51:44 – فَعَتَوْا عَنْ أَمْرِ رَبِّهِمْ فَأَخَذَتْهُمُ الصَّاعِقَةُ وَهُمْ يَنظُرُونَ ٤٤

అప్పుడు వారు తమ ప్రభువు ఆజ్ఞను ఉపేక్షించారు. కావున వారు చూస్తూఉండగానే ఒక పెద్ద పిడుగు వారిమీద విరుచుకుపడింది. 18

51:45 – فَمَا اسْتَطَاعُوا مِن قِيَامٍ وَمَا كَانُوا مُنتَصِرِينَ ٤٥

అప్పుడు వారికి లేచి నిలబడే శక్తి కూడా లేక పోయింది మరియు వారు తమను తాము కూడా కాపాడుకోలేక పోయారు.

51:46 – وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا قَوْمًا فَاسِقِينَ ٤٦

మరియు దీనికి ముందు నూ’హ్ జాతి వారిని కూడా (నాశనం చేశాము). నిశ్చయంగా, వారు కూడా అవిధేయులు.

51:47 – وَالسَّمَاءَ بَنَيْنَاهَا بِأَيْدٍ وَإِنَّا لَمُوسِعُونَ ٤٧

మరియు ఆకాశాన్ని మేము (మా) చేతులతో నిర్మించాము. మరియు నిశ్చయంగా, మేమే దానిని విస్తరింపజేయగల వారము.

51:48 – وَالْأَرْضَ فَرَشْنَاهَا فَنِعْمَ الْمَاهِدُونَ ٤٨

మరియు భూమిని మేము పరుపుగా చేశాము, మేమే చక్కగా పరిచేవారము!

51:49 – وَمِن كُلِّ شَيْءٍ خَلَقْنَا زَوْجَيْنِ لَعَلَّكُمْ تَذَكَّرُونَ ٤٩

మరియు మేము ప్రతి దానిని జంటలుగా సృష్టించాము, మీరు గ్రహించాలని. 19

51:50 – فَفِرُّوا إِلَى اللَّـهِ ۖ إِنِّي لَكُم مِّنْهُ نَذِيرٌ مُّبِينٌ ٥٠

“కావున మీరు అల్లాహ్‌ వైపుకు పరుగెత్తండి. నిశ్చయంగా, నేను (ము’హమ్మద్‌) ఆయన తరఫు నుండి మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని మాత్రమే!

51:51 – وَلَا تَجْعَلُوا مَعَ اللَّـهِ إِلَـٰهًا آخَرَ ۖ إِنِّي لَكُم مِّنْهُ نَذِيرٌ مُّبِينٌ ٥١

“మరియు మీరు అల్లాహ్‌కు సాటిగా ఇతర దైవాన్ని నిలుపకండి! నిశ్చయంగా, నేను (ము’హమ్మద్‌) ఆయన తరఫు నుండి మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని మాత్రమే!”

51:52 – كَذَٰلِكَ مَا أَتَى الَّذِينَ مِن قَبْلِهِم مِّن رَّسُولٍ إِلَّا قَالُوا سَاحِرٌ أَوْ مَجْنُونٌ ٥٢

ఇదే విధంగా, వారికి పూర్వం గడచిన వారి వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వారు: “ఇతను మాంత్రికుడు లేదా పిచ్చివాడు.” అని అనకుండా ఉండలేదు.

51:53 – أَتَوَاصَوْا بِهِ ۚ بَلْ هُمْ قَوْمٌ طَاغُونَ ٥٣

ఏమీ? దీనిని (ఇలా పలుకుటను) వారు ఒకరికొకరు వారసత్వంగా ఇచ్చుకున్నారా? అలా కాదు! అసలు వారు తలబిరుసుతనంతో ప్రవర్తించే జనం!

51:54 – فَتَوَلَّ عَنْهُمْ فَمَا أَنتَ بِمَلُومٍ ٥٤

కావున నీవు వారి నుండి మరలిపో, ఇక నీపై ఎలాంటి నిందలేదు.

51:55 – وَذَكِّرْ فَإِنَّ الذِّكْرَىٰ تَنفَعُ الْمُؤْمِنِينَ ٥٥

మరియు వారిని ఉపదేశిస్తూ వుండు, నిశ్చయంగా ఉపదేశం విశ్వాసులకు ప్రయోజనకర మవుతుంది.

51:56 – وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ ٥٦

మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే!

51:57 – مَا أُرِيدُ مِنْهُم مِّن رِّزْقٍ وَمَا أُرِيدُ أَن يُطْعِمُونِ ٥٧

నేను వారి నుండి ఎలాంటి జీవనోపాధిని కోరటం లేదు మరియు వారు నాకు ఆహారం పెట్టాలని కూడా కోరటం లేదు.

51:58 – إِنَّ اللَّـهَ هُوَ الرَّزَّاقُ ذُو الْقُوَّةِ الْمَتِينُ ٥٨

నిశ్చయంగా అల్లాహ్‌! ఆయన మాత్రమే ఉపాధి ప్రదాత, మహా బలవంతుడు, స్థైర్యం గలవాడు. 20

51:59 – فَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا ذَنُوبًا مِّثْلَ ذَنُوبِ أَصْحَابِهِمْ فَلَا يَسْتَعْجِلُونِ ٥٩

కావున నిశ్చయంగా, దుర్మార్గానికి పాల్పడిన వారి పాపాలు వారి (పూర్వ) స్నేహితుల పాపాల వంటివే! కావున వారు నా (శిక్షకొరకు) తొందరపెట్ట నవసరం లేదు!

51:60 – فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا مِن يَوْمِهِمُ الَّذِي يُوعَدُونَ ٦٠

కావున సత్య-తిరస్కారులకు వినాశం గలదు – వారికి వాగ్దానం చేయబడిన – ఆ దినమున!

సూరహ్‌ అ’త్‌-‘తూర్‌ – అ’త్‌-‘తూరు: ఒక పర్వతం పేరు. ఈ పదం మొదటి ఆయత్‌లో పేర్కొనబడింది. ఇందులో 49 ఆయతులు ఉన్నాయి. అది సినాయి ద్వీపకల్పంలో ఉంది. ఆ పర్వతం మీదనే మూసా (‘అ.స.)పై తౌరాత్‌ అవతరింపజేయబడింది. ఈ సమూహపు 7 సూరాహ్‌లలో ఇది 3 వది. ఈ సూరహ్‌ మధ్య మక్కహ్ కాలంలో అవతరింపజేయబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 52:1 – وَالطُّورِ ١

‘తూర్‌ పర్వతం సాక్షిగా! 1

52:2 – وَكِتَابٍ مَّسْطُورٍ ٢

వ్రాయబడిన గ్రంథం సాక్షిగా!

52:3 – فِي رَقٍّ مَّنشُورٍ ٣

విప్పబడిన చర్మపత్రం మీద. 2

52:4 – وَالْبَيْتِ الْمَعْمُورِ ٤

చిరకాల సందర్శనాలయం సాక్షిగా! 3

52:5 – وَالسَّقْفِ الْمَرْفُوعِ ٥

పైకెత్తబడిన కప్పు (అంతరిక్షం) సాక్షిగా! 4

52:6 – وَالْبَحْرِ الْمَسْجُورِ ٦

ఉప్పొంగే సముద్రం సాక్షిగా! 5

52:7 – إِنَّ عَذَابَ رَبِّكَ لَوَاقِعٌ ٧

నిశ్చయంగా నీప్రభువు శిక్ష సంభవించనున్నది.

52:8 – مَّا لَهُ مِن دَافِعٍ ٨

దానిని తప్పించేవాడు ఎవ్వడూ లేడు.

52:9 – يَوْمَ تَمُورُ السَّمَاءُ مَوْرًا ٩

ఆకాశాలు భయంకరంగా కంపించే రోజు!

52:10 – وَتَسِيرُ الْجِبَالُ سَيْرًا ١٠

మరియు పర్వతాలు దారుణంగా చలించి నప్పుడు!

52:11 – فَوَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ١١

అప్పుడు ఆ రోజు, అసత్యవాదులకు వినాశం ఉంది.

52:12 – الَّذِينَ هُمْ فِي خَوْضٍ يَلْعَبُونَ ١٢

ఎవరైతే వృథా మాటలలో కాలక్షేపం చేస్తూ ఉంటారో!

52:13 – يَوْمَ يُدَعُّونَ إِلَىٰ نَارِ جَهَنَّمَ دَعًّ ١٣

వారు నరకాగ్నిలోకి నెట్టుతూ త్రోయబడేరోజు;

52:14 – هَـٰذِهِ النَّارُ الَّتِي كُنتُم بِهَا تُكَذِّبُونَ ١٤

(వారితో ఇలా అనబడుతుంది): “మీరు అసత్యమని నిరాకరిస్తూ ఉండిన నరకాగ్ని ఇదే!

52:15 – أَفَسِحْرٌ هَـٰذَا أَمْ أَنتُمْ لَا تُبْصِرُونَ ١٥

“ఏమీ? ఇది మంత్రజాలమా? లేక దీనిని మీరు చూడలేకపోతున్నారా?

52:16 – اصْلَوْهَا فَاصْبِرُوا أَوْ لَا تَصْبِرُوا سَوَاءٌ عَلَيْكُمْ ۖ إِنَّمَا تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ ١٦

“ఇందులో మీరు కాలుతూ ఉండండి. దానికి మీరు సహనంవహించినా, సహనంవహించకపోయినా అంతా మీకుసమానమే! నిశ్చయంగా మీ కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతున్నది.”

52:17 – إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَنَعِيمٍ ١٧

నిశ్చయంగా, భయ-భక్తులు గలవారు స్వర్గ వనాలలో సుఖసంతోషాలలో ఉంటారు.

52:18 – فَاكِهِينَ بِمَا آتَاهُمْ رَبُّهُمْ وَوَقَاهُمْ رَبُّهُمْ عَذَابَ الْجَحِيمِ ١٨

వారి ప్రభువు వారికి ప్రసాదించిన వాటిని హాయిగా అనుభవిస్తూ ఉంటారు. మరియు వారి ప్రభువు వారిని భగభగ మండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడాడు.

52:19 – كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا كُنتُمْ تَعْمَلُونَ ١٩

(వారితో ఇలా అనబడుతుంది): “మీరు చేస్తూ వుండిన కర్మలకు ఫలితంగా హాయిగా తినండి త్రాగండి!”

52:20 – مُتَّكِئِينَ عَلَىٰ سُرُرٍ مَّصْفُوفَةٍ ۖ وَزَوَّجْنَاهُم بِحُورٍ عِينٍ ٢٠

వారు వరుసగా వేయబడిన ఆసనాల మీద, దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు మేము అందమైన పెద్దపెద్ద కన్నులుగల సుందరీ మణులతో 6 వారి వివాహం చేయిస్తాము.

52:21 – وَالَّذِينَ آمَنُوا وَاتَّبَعَتْهُمْ ذُرِّيَّتُهُم بِإِيمَانٍ أَلْحَقْنَا بِهِمْ ذُرِّيَّتَهُمْ وَمَا أَلَتْنَاهُم مِّنْ عَمَلِهِم مِّن شَيْءٍ ۚ كُلُّ امْرِئٍ بِمَا كَسَبَ رَهِينٌ ٢١

మరియు ఎవరైతే విశ్వసిస్తారో మరియు వారి సంతానంవారు విశ్వాసంలో వారిని అనుస రిస్తారో! అలాంటి వారిని వారి సంతానంతో (స్వర్గం లో) కలుపుతాము. 7 మరియు వారి కర్మలలో వారికి ఏ మాత్రం నష్టం కలిగించము. ప్రతివ్యక్తి తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉంటాడు. 8

52:22 – وَأَمْدَدْنَاهُم بِفَاكِهَةٍ وَلَحْمٍ مِّمَّا يَشْتَهُونَ ٢٢

మరియు మేమువారికి వారు కోరే ఫలాలను మరియు మాంసాన్ని పుష్కలంగా ప్రసాదిస్తాము.

52:23 – يَتَنَازَعُونَ فِيهَا كَأْسًا لَّا لَغْوٌ فِيهَا وَلَا تَأْثِيمٌ ٢٣

అందులో (ఆ స్వర్గంలో) వారు ఒకరికొకరు (మధు) పాత్ర మార్చుకుంటూ ఉంటారు; దాన్ని (త్రాగటం) వల్ల వారు వ్యర్థపు మాటలు మాట్లాడరు మరియు పాపాలు చేయరు. 9 (1/8)

52:24 – وَيَطُوفُ عَلَيْهِمْ غِلْمَانٌ لَّهُمْ كَأَنَّهُمْ لُؤْلُؤٌ مَّكْنُونٌ ٢٤

  • మరియు దాచబడిన ముత్యాల వంటి బాలురు, 10 వారి సేవకొరకు వారి చుట్టుప్రక్కలలో తిరుగుతూ ఉంటారు.

52:25 – وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ ٢٥

మరియు వారు ఒకరివైపుకొకరు మరలి పరస్పరం (తమ గతించిన జీవితాలను గురించి) మాట్లాడుకుంటూ ఉంటారు.

52:26 – قَالُوا إِنَّا كُنَّا قَبْلُ فِي أَهْلِنَا مُشْفِقِينَ ٢٦

వారు ఇలా అంటారు: “వాస్తవానికి మనం ఇంతకు పూర్వం మనకుటుంబం వారిమధ్య ఉన్న ప్పుడు(అల్లాహ్‌శిక్షకు)భయపడుతూ ఉండేవారము.

52:27 – فَمَنَّ اللَّـهُ عَلَيْنَا وَوَقَانَا عَذَابَ السَّمُومِ ٢٧

“కావున నిశ్చయంగా, అల్లాహ్‌ మన మీద కనికరం చూపాడు మరియు మమ్ము దహించే గాలుల శిక్ష నుండి కాపాడాడు. 11

52:28 – إِنَّا كُنَّا مِن قَبْلُ نَدْعُوهُ ۖ إِنَّهُ هُوَ الْبَرُّ الرَّحِيمُ ٢٨

“నిశ్చయంగా, మనం ఇంతకు పూర్వం ఆయననే ప్రార్థిస్తూ ఉండేవారము. నిశ్చయంగా, ఆయన మహోపకారి, 12 అపార కరుణాప్రదాత!”

52:29 – فَذَكِّرْ فَمَا أَنتَ بِنِعْمَتِ رَبِّكَ بِكَاهِنٍ وَلَا مَجْنُونٍ ٢٩

కావున (ఓప్రవక్తా!) నీవు హితోపదేశం చేస్తూ వుండు. నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు జ్యోతి ష్యుడవు కావు మరియు పిచ్చివాడవూ కావు.

52:30 – أَمْ يَقُولُونَ شَاعِرٌ نَّتَرَبَّصُ بِهِ رَيْبَ الْمَنُونِ ٣٠

లేదా? వారు: “ఇతను ఒకకవి ఇతని వినాశ కాలం కోసం మేము ఎదురుచూస్తున్నాము.” అని అంటున్నారా? 13

52:31 – قُلْ تَرَبَّصُوا فَإِنِّي مَعَكُم مِّنَ الْمُتَرَبِّصِينَ ٣١

వారితో ఇలా అను: “మీరు ఎదురు చూస్తూ ఉండండి, నిశ్చయంగా, నేను కూడా మీతో పాటు ఎదురుచూస్తూ ఉంటాను!”

52:32 – أَمْ تَأْمُرُهُمْ أَحْلَامُهُم بِهَـٰذَا ۚ أَمْ هُمْ قَوْمٌ طَاغُونَ ٣٢

ఏమీ? వారి బుద్ధులు వారికి ఇవే ఆజ్ఞా పిస్తున్నాయా? లేక వారు తలబిరుసుతనంగల జనులా? 14

52:33 – أَمْ يَقُولُونَ تَقَوَّلَهُ ۚ بَل لَّا يُؤْمِنُونَ ٣٣

ఏమీ? వారు: “ఇతనే, దీనిని (ఈ సందే శాన్ని) కల్పించుకున్నాడు.” అని అంటున్నారా? అలాకాదు, వారుఅసలు విశ్వసించదలుచుకోలేదు!

52:34 – فَلْيَأْتُوا بِحَدِيثٍ مِّثْلِهِ إِن كَانُوا صَادِقِينَ ٣٤

వారు సత్యవంతులే అయితే దీని వంటి ఒక వచనాన్ని (రచించి) తెమ్మను. 15

52:35 – أَمْ خُلِقُوا مِنْ غَيْرِ شَيْءٍ أَمْ هُمُ الْخَالِقُونَ ٣٥

వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింప బడ్డారా? లేక వారే సృష్టికర్తలా?

52:36 – أَمْ خَلَقُوا السَّمَاوَاتِ وَالْأَرْضَ ۚ بَل لَّا يُوقِنُونَ ٣٦

లేక వారు ఆకాశాలను మరియు భూమిని సృష్టించారా? అలా కాదు, అసలు వారికి విశ్వాసం లేదు.

52:37 – أَمْ عِندَهُمْ خَزَائِنُ رَبِّكَ أَمْ هُمُ الْمُصَيْطِرُونَ ٣٧

వారి దగ్గర నీ ప్రభువు కోశాగారాలు ఏవైనా ఉన్నాయా? లేక వారు వాటికి అధికారులా?

52:38 – أَمْ لَهُمْ سُلَّمٌ يَسْتَمِعُونَ فِيهِ ۖ فَلْيَأْتِ مُسْتَمِعُهُم بِسُلْطَانٍ مُّبِينٍ ٣٨

వారి దగ్గర నిచ్చెన ఏదైనా ఉందా? దానితో పైకెక్కి వారు (దేవదూతల మాటలు) వినటానికి? అలా అయితే! వారిలో ఎవడైతే విన్నాడో, అతనిని స్పష్టమైన నిదర్శనాన్ని తెమ్మను.

52:39 – أَمْ لَهُ الْبَنَاتُ وَلَكُمُ الْبَنُونَ ٣٩

ఆయన (అల్లాహ్‌)కు కూతుళ్ళూ మరియు మీకేమో కుమారులా? 16

52:40 – أَمْ تَسْأَلُهُمْ أَجْرًا فَهُم مِّن مَّغْرَمٍ مُّثْقَلُونَ ٤٠

(ఓ ము’హమ్మద్‌!) నీవు వారితో ఏమైనా ప్రతిఫలం అడుగుతున్నావా? వారు ఋణ భారంతో అణిగిపోవటానికి?

52:41 – أَمْ عِندَهُمُ الْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ ٤١

లేక వారి దగ్గర అగోచర విషయపు జ్ఞాన ముందా? వారు దానిని వ్రాసిపెట్టారా? 17

52:42 – أَمْ يُرِيدُونَ كَيْدًا ۖ فَالَّذِينَ كَفَرُوا هُمُ الْمَكِيدُونَ ٤٢

లేక వారేదైనా పన్నాగం పన్నదలచారా? కాని ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో, వారే పన్నాగానికి గురి అవుతారు. 18

52:43 – أَمْ لَهُمْ إِلَـٰهٌ غَيْرُ اللَّـهِ ۚ سُبْحَانَ اللَّـهِ عَمَّا يُشْرِكُونَ ٤٣

లేక వారికి అల్లాహ్‌ గాకుండా మరొక ఆరాధ్య దేవుడు ఉన్నాడా? వారు కల్పించే భాగస్వాములకు అల్లాహ్‌ అతీతుడు.

52:44 – وَإِن يَرَوْا كِسْفًا مِّنَ السَّمَاءِ سَاقِطًا يَقُولُوا سَحَابٌ مَّرْكُومٌ ٤٤

ఒకవేళ వారు ఆకాశపు ఒక తునకను రాలి పడటం చూసినా: “ఇవి దట్టమైన మేఘాలు!” అని, అనే వారు.

52:45 – فَذَرْهُمْ حَتَّىٰ يُلَاقُوا يَوْمَهُمُ الَّذِي فِيهِ يُصْعَقُونَ ٤٥

కావున వారు తమ (తీర్పు) దినాన్ని దర్శించే వరకు వారిని వదిలిపెట్టు. అప్పుడు వారు భీతితో మూర్ఛ పోయి పడిపోతారు.

52:46 – يَوْمَ لَا يُغْنِي عَنْهُمْ كَيْدُهُمْ شَيْئًا وَلَا هُمْ يُنصَرُونَ ٤٦

ఆ రోజు వారి పన్నాగం వారికి ఏ మాత్రం పనికిరాదు. మరియు వారికి ఎలాంటి సహాయం కూడా లభించదు.

52:47 – وَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا عَذَابًا دُونَ ذَٰلِكَ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ ٤٧

మరియు నిశ్చయంగా దుర్మార్గానికి పాల్ప డిన వారికి, ఇదేగాక మరొక శిక్ష కూడా ఉంది, 19 కాని వారిలో చాలామందికి అది తెలియదు.

52:48 – وَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ فَإِنَّكَ بِأَعْيُنِنَا ۖ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ حِينَ تَقُومُ ٤٨

కావున (ఓ ము’హమ్మద్‌!) నీవు, నీ ప్రభువు ఆజ్ఞ వచ్చేవరకు సహనంవహించు. నిశ్చయంగా, నీవు మా దృష్టిలో ఉన్నావు. మరియు నీవు నిద్రనుండి లేచినపుడు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయన స్తోత్రం చెయ్యి.

52:49 – وَمِنَ اللَّيْلِ فَسَبِّحْهُ وَإِدْبَارَ النُّجُومِ ٤٩

మరియు రాత్రివేళలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు 20 మరియు నక్షత్రాలు అస్తమించే వేళలో కూడాను! 21

సూరహ్‌ అన్‌-నజ్‌మ్‌ – అన్‌-నజ్‌ము: నక్షత్రం. మొదటి ఆయత్‌లోనే ఈ పదం ఉంది. ఇందులో 62 ఆయతులు ఉన్నాయి. ఈ సమూహపు 7 సూరాహ్‌లలో ఇది 4వది. ఇది మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌, బహుశా సూరహ్‌ అల్‌-ఇ’ఖ్లా’స్‌ (112) తరువాత అవతరింపజేయబడింది. ఇందులో అల్లాహ్‌ (సు.త.) ఏకత్వపు ప్రాముఖ్యత వివరించబడింది. ఇది దైవప్రవక్త (‘స’అస) సత్య-తిరస్కారుల ముందు చదివిన మొదటి సూరహ్‌. దీని పఠనం ముగించిన తరువాత అతను (‘స’అస) సజ్దా చేశారు. అతని (‘స’అస)తో బాటు అందరూ సజ్దా చేశారు. ఒక్క ఉమయ్య బిన్‌-‘ఖలఫ్‌ తప్ప. అతడు తన చేతిలోకి మట్టి తీసుకొని దానిపై సజ్దా చేశాడు. కాబట్టి అతను సత్య-తిరస్కారిగానే మరణించాడు. (‘స. బు’ఖారీ). కొందరు ఇతడు ‘ఉత్బా బిన్‌ రబీ’అ, అంటారు. (ఇబ్నె-కసీ’ర్‌). ‘జైద్‌ బిన్‌-సా’బిత్‌ (ర’ది.’అ.) కథనం: ‘నేను దైవప్రవక్త (‘స’అస) ముందు ఈ సూరహ్‌ చదివాను. అతనప్పుడు సజ్దా చేయలేదు,’ (‘స. బు’ఖారీ). దీనిద్వారా తెలిసేదేమిటంటే సజ్దా చేయటం అభిలషణీయం (ముస’హ్తబ్‌), ఫ’ర్ద్‌ కాదు. ఒకవేళ సజ్దా చేయకపోయినా ఫర్వాలేదు!

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 53:1 – وَالنَّجْمِ إِذَا هَوَىٰ ١

అస్తమించే నక్షత్రం సాక్షిగా! 1

53:2 – مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوَىٰ ٢

మీ సహచరుడు (ము’హమ్మద్‌), మార్గ భ్రష్టుడుకాలేదు మరియు తప్పుదారిలోనూలేడు. 2

53:3 – وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ ٣

మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు.

53:4 – إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَ ٤

అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వ’హీ) మాత్రమే.

53:5 – عَلَّمَهُ شَدِيدُ الْقُوَىٰ ٥

అది అతనికి మహాబలవంతుడు (జిబ్రీల్‌) నేర్పాడు.

53:6 – ذُو مِرَّةٍ فَاسْتَوَىٰ ٦

అతను శక్తి సామర్థ్యాలు గలవాడు, 3 తన వాస్తవ రూపంలో ప్రత్యక్షమయినప్పుడు;

53:7 – وَهُوَ بِالْأُفُقِ الْأَعْلَىٰ ٧

అతను ఎత్తైన దిఙ్మండలంలో (దిక్చక్రంలో) కనిపించాడు. 4

53:8 – ثُمَّ دَنَا فَتَدَلَّ ٨

తరువాత సమీపించాడు, మరింత క్రిందికి దిగి వచ్చాడు.

53:9 – فَكَانَ قَابَ قَوْسَيْنِ أَوْ أَدْنَ ٩

అప్పుడు అతను రెండుధనస్సుల దూరంలోనో లేక అంతకంటే తక్కువ దూరంలోనో ఉన్నాడు.

53:10 – فَأَوْحَىٰ إِلَىٰ عَبْدِهِ مَا أَوْحَ ١٠

అప్పుడు అతను (జిబ్రీల్‌), ఆయన (అల్లాహ్‌) దాసునిపై అవతరింపజేయవలసిన, దానిని (వ’హీని) అవతరింపజేశాడు.

53:11 – مَا كَذَبَ الْفُؤَادُ مَا رَأَىٰ ١١

అతను (ప్రవక్త) చూసిన దానిని, అతని హృదయం అబద్ధమని అనలేదు.

53:12 – أَفَتُمَارُونَهُ عَلَىٰ مَا يَرَىٰ ١٢

అయితే మీరు, అతను (కళ్ళారా) చూసిన దానిని గురించి (అతనితో) వాదులాడుతారా?

53:13 – وَلَقَدْ رَآهُ نَزْلَةً أُخْرَىٰ ١٣

మరియు వాస్తవానికి అతను (ప్రవక్త) అతనిని (జిబ్రీల్‌ను) మరొకసారి (ప్రత్యక్షంగా) అవతరించినప్పుడు చూశాడు.

53:14 – عِندَ سِدْرَةِ الْمُنتَهَىٰ ١٤

(సప్తాకాశంలో) చివరి హద్దులో నున్న రేగుచెట్టు (సిద్‌రతుల్‌-మున్‌తహా) దగ్గర. 5

53:15 – عِندَهَا جَنَّةُ الْمَأْوَىٰ ١٥

అక్కడికి దగ్గరలోనే జన్నతుల్‌ మ’అవా ఉంది. 6

53:16 – إِذْ يَغْشَى السِّدْرَةَ مَا يَغْشَىٰ ١٦

అప్పుడు ఆ సిద్‌రహ్‌ వృక్షాన్ని కప్పేది కప్పేసి నప్పుడు! 7

53:17 – مَا زَاغَ الْبَصَرُ وَمَا طَغَىٰ ١٧

అతని (ప్రవక్త) దృష్టి తప్పిపోనూ లేదు మరియు హద్దులు దాటి కూడా పోలేదు.

53:18 – لَقَدْ رَأَىٰ مِنْ آيَاتِ رَبِّهِ الْكُبْرَىٰ ١٨

వాస్తవంగా, అతను (ము’హమ్మద్‌) తన ప్రభువు యొక్క గొప్పగొప్ప సూచనలను (ఆయాత్‌ లను) చూశాడు. 8

53:19 – أَفَرَأَيْتُمُ اللَّاتَ وَالْعُزَّىٰ ١٩

మీరు, అల్‌-లాత్‌ మరియు అల్‌-‘ఉ’జ్జాను గురించి ఆలోచించారా? 9

53:20 – وَمَنَاةَ الثَّالِثَةَ الْأُخْرَىٰ ٢٠

మరియు మూడవదీ చివరిది అయిన మనాత్‌ను (గురించి కూడా)? 10

53:21 – أَلَكُمُ الذَّكَرُ وَلَهُ الْأُنثَىٰ ٢١

మీ కొరకైతే కుమారులు మరియు ఆయన కొరకు కుమార్తెలా? 11

53:22 – تِلْكَ إِذًا قِسْمَةٌ ضِيزَىٰ ٢٢

ఇది అన్యాయమైన విభజన కాదా!

53:23 – إِنْ هِيَ إِلَّا أَسْمَاءٌ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا أَنزَلَ اللَّـهُ بِهَا مِن سُلْطَانٍ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَمَا تَهْوَى الْأَنفُسُ ۖ وَلَقَدْ جَاءَهُم مِّن رَّبِّهِمُ الْهُدَىٰ ٢٣

ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి-తాతలు పెట్టిన పేర్లుమాత్రమే, అల్లాహ్‌ వీటిని గురించి ఎట్టి ప్రమాణం అవతరింపజేయలేదు. 12 వారు, కేవలం తమ ఊహాగానాలను మరియు తమఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు. 13 వాస్తవానికి వారి ప్రభువు తరఫునుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది!

53:24 – أَمْ لِلْإِنسَانِ مَا تَمَنَّ ٢٤

ఏమిటి? మానవునికి తాను కోరినదంతా లభిస్తుందా?

53:25 – فَلِلَّـهِ الْآخِرَةُ وَالْأُولَىٰ ٢٥

వాస్తవానికి, అంతిమం (పరలోకం) మరియు ప్రథమం(ఇహలోకం)అన్నీ అల్లాహ్‌కేచెందినవి.(1/4)

53:26 – وَكَم مِّن مَّلَكٍ فِي السَّمَاوَاتِ لَا تُغْنِي شَفَاعَتُهُمْ شَيْئًا إِلَّا مِن بَعْدِ أَن يَأْذَنَ اللَّـهُ لِمَن يَشَاءُ وَيَرْضَىٰ ٢٦

  • మరియు ఆకాశాలలో ఎందరో దేవ దూతలు ఉన్నారు. కాని వారి సిఫారసు ఏ మాత్రం పనికిరాదు; అల్లాహ్‌ ఎవరిపట్లనైతే ప్రసన్నుడై, తన ఇష్టంతో వారికి అనుమతిస్తేనే తప్ప! 14

53:27 – إِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ لَيُسَمُّونَ الْمَلَائِكَةَ تَسْمِيَةَ الْأُنثَىٰ ٢٧

నిశ్చయంగా, ఎవరైతే పరలోక జీవితాన్ని విశ్వసించరో! వారే దేవదూతలను స్త్రీల పేర్లతో పిలుస్తారు;

53:28 – وَمَا لَهُم بِهِ مِنْ عِلْمٍ ۖ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ ۖ وَإِنَّ الظَّنَّ لَا يُغْنِي مِنَ الْحَقِّ شَيْئًا ٢٨

ఈ విషయం గురించి వారికి ఎలాంటి జ్ఞానం లేదు. వారు కేవలం తమ ఊహలనే అనుస రిస్తున్నారు. కాని వాస్తవానికి ఊహ సత్యానికి ఏ మాత్రం బదులు కాజాలదు.

53:29 – فَأَعْرِضْ عَن مَّن تَوَلَّىٰ عَن ذِكْرِنَا وَلَمْ يُرِدْ إِلَّا الْحَيَاةَ الدُّنْيَا ٢٩

కావున, మా హితబోధ (ఖుర్‌ఆన్‌) నుండి ముఖం త్రిప్పుకొని ఇహలోక జీవితం తప్ప మరేమీ కోరని వ్యక్తిని నీవు పట్టించుకోకు.

53:30 – ذَٰلِكَ مَبْلَغُهُم مِّنَ الْعِلْمِ ۚ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِمَنِ اهْتَدَىٰ ٣٠

ఇదే వారి జ్ఞానపరిధి. నిశ్చయంగా, నీ ప్రభువుకు, ఆయన మార్గం నుండి ఎవడు తప్పి పోయాడో తెలుసు. మరియు ఎవడు సన్మార్గంలో ఉన్నాడో కూడా, ఆయనకు బాగా తెలుసు.

53:31 – وَلِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ لِيَجْزِيَ الَّذِينَ أَسَاءُوا بِمَا عَمِلُوا وَيَجْزِيَ الَّذِينَ أَحْسَنُوا بِالْحُسْنَى ٣١

మరియు ఆకాశాలలో నున్నది మరియు భూమిలో నున్నది, అంతా అల్లాహ్‌కే చెందు తుంది. దుష్టులకు వారి కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికి మరియు సత్కార్యాలు చేసిన వారికి మంచి ప్రతిఫలం ఇవ్వటానికి. 15

53:32 – الَّذِينَ يَجْتَنِبُونَ كَبَائِرَ الْإِثْمِ وَالْفَوَاحِشَ إِلَّا اللَّمَمَ ۚ إِنَّ رَبَّكَ وَاسِعُ الْمَغْفِرَةِ ۚ هُوَ أَعْلَمُ بِكُمْ إِذْ أَنشَأَكُم مِّنَ الْأَرْضِ وَإِذْ أَنتُمْ أَجِنَّةٌ فِي بُطُونِ أُمَّهَاتِكُمْ ۖ فَلَا تُزَكُّوا أَنفُسَكُمْ ۖ هُوَ أَعْلَمُ بِمَنِ اتَّقَىٰ ٣٢

ఎవరైతే చిన్నచిన్న తప్పులు తప్ప, పెద్ద పాపాల నుండి 16 మరియు అసహ్యకరమైన పనుల నుండి దూరంగా ఉంటారో వారి కొరకు, నిశ్చయంగా, నీ ప్రభువు క్షమాపణ పరిధి చాలా విశాలమైనది. మిమ్మల్ని మట్టి నుండి సృష్టించి నప్పటి నుండి మరియు మీరు మీ తల్లుల గర్భాలలో పిండాలుగా 17 ఉన్నప్పటి నుండి కూడా, ఆయనకు మీ గురించి బాగా తెలుసు. కావున మీరు మీ పవిత్రతను గురించి (గొప్పలు) చెప్పుకోకండి. 18 ఎవడు భయభక్తులు గలవాడో ఆయనకు బాగా తెలుసు.

53:33 – أَفَرَأَيْتَ الَّذِي تَوَلَّىٰ ٣٣

నీవు (ఇస్లాం నుండి) మరలిపోయే వాడిని చూశావా?

53:34 – وَأَعْطَىٰ قَلِيلًا وَأَكْدَىٰ ٣٤

మరియు (అల్లాహ్‌ మార్గంలో) కొంత మాత్రమే ఇచ్చి, చేయి ఆపుకునే వాడిని?

53:35 – أَعِندَهُ عِلْمُ الْغَيْبِ فَهُوَ يَرَىٰ ٣٥

అతని వద్ద అగోచర జ్ఞానముందా? అతడు (స్పష్టంగా) చూడటానికి?

53:36 – أَمْ لَمْ يُنَبَّأْ بِمَا فِي صُحُفِ مُوسَ ٣٦

లేక, మూసా గ్రంథంలో నున్న విషయాలు అతనికి తెలుపబడలేదా?

53:37 – وَإِبْرَاهِيمَ الَّذِي وَفَّىٰ ٣٧

మరియు తన బాధ్యతను నెరవేర్చిన ఇబ్రాహీమ్‌ విషయము; 19

53:38 – أَلَّا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ٣٨

మరియు (పాపాల) భారం మోసేవాడు ఎవడూ ఇతరుల (పాపాల) భారంమోయడని; 20

53:39 – وَأَن لَّيْسَ لِلْإِنسَانِ إِلَّا مَا سَعَىٰ ٣٩

మరియు మానవునికి తాను చేసిన దాని ఫలితం తప్ప మరొకటి లభించదని; 21

53:40 – وَأَنَّ سَعْيَهُ سَوْفَ يُرَىٰ ٤٠

మరియు నిశ్చయంగా, అతనికి తన కృషి ఫలితమే చూపబడుతుందని;

53:41 – ثُمَّ يُجْزَاهُ الْجَزَاءَ الْأَوْفَىٰ ٤١

అప్పుడు అతనికి తన కృషికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుందని;

53:42 – وَأَنَّ إِلَىٰ رَبِّكَ الْمُنتَهَىٰ ٤٢

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్దనే (ప్రతిదాని) ముగింపు ఉన్నదని;

53:43 – وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ ٤٣

మరియు నిశ్చయంగా, ఆయనే నిన్ను నవ్విస్తున్నాడు మరియు ఏడ్పిస్తున్నాడని;

53:44 – وَأَنَّهُ هُوَ أَمَاتَ وَأَحْيَا ٤٤

మరియు నిశ్చయంగా, ఆయనే మరణింప జేసేవాడు మరియు జీవితాన్ని ప్రసాదించేవాడని;

53:45 – وَأَنَّهُ خَلَقَ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْأُنثَ ٤٥

మరియు నిశ్చయంగా, మగ-ఆడ జంట లను సృష్టించినవాడు ఆయనేనని –

53:46 – مِن نُّطْفَةٍ إِذَا تُمْنَىٰ ٤٦

విసర్జింపబడిన వీర్యబిందువు నుండి.

53:47 – وَأَنَّ عَلَيْهِ النَّشْأَةَ الْأُخْرَىٰ ٤٧

మరియు నిశ్చయంగా, దానికి మరొక జీవి తాన్ని (పునరుత్థానం) ప్రసాదించడం ఆయన (అల్లాహ్‌)కే చెందినదని;

53:48 – وَأَنَّهُ هُوَ أَغْنَىٰ وَأَقْنَىٰ ٤٨

మరియు నిశ్చయంగా, ఆయనే సంపన్ను నిగా చేసేవాడు మరియు తృప్తినిచ్చువాడని;

53:49 – وَأَنَّهُ هُوَ رَبُّ الشِّعْرَىٰ ٤٩

మరియు నిశ్చయంగా ఆయనే అగ్ని 22 నక్షత్రానికి ప్రభువని;

53:50 – وَأَنَّهُ أَهْلَكَ عَادًا الْأُولَىٰ ٥٠

మరియు నిశ్చయంగా, ఆయనే తొలి ‘ఆద్‌ జాతిని నాశనం చేసినవాడని; 23

53:51 – وَثَمُودَ فَمَا أَبْقَىٰ ٥١

మరియు స’మూద్‌ జాతిని; ఒక్కడూ కూడా లేకుండా రూపుమాపాడని. 24

53:52 – وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا هُمْ أَظْلَمَ وَأَطْغَ ٥٢

మరియు అంతకు పూర్వం నూ’హ్‌ జాతి వారిని. నిశ్చయంగా, వారు పరమ దుర్మార్గులు మరియు తలబిరుసులు.

53:53 – وَالْمُؤْتَفِكَةَ أَهْوَىٰ ٥٣

మరియు ఆయనే తలక్రిందులైన నగరాలను నాశనం చేశాడు. 25

53:54 – فَغَشَّاهَا مَا غَشَّىٰ ٥٤

తరువాత వాటిని క్రమ్ముకొనవలసింది (రాళ్ళ వర్షం) క్రమ్ముకున్నది.

53:55 – فَبِأَيِّ آلَاءِ رَبِّكَ تَتَمَارَىٰ ٥٥

అయితే (ఓ మానవుడా!) నీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను గురించి నీవు అనుమానంలో పడి ఉంటావు? 26

53:56 – هَـٰذَا نَذِيرٌ مِّنَ النُّذُرِ الْأُولَىٰ ٥٦

ఇదివరకు వచ్చిన హెచ్చరిక చేసేవారివలే ఇతను (ము’హమ్మద్‌) కూడా హెచ్చరిక చేసేవాడు మాత్రమే!

53:57 – أَزِفَتِ الْآزِفَةُ ٥٧

రానున్న ఘడియ (పునరుత్థాన దినం) సమీపంలోనే వుంది.

53:58 – لَيْسَ لَهَا مِن دُونِ اللَّـهِ كَاشِفَةٌ ٥٨

అల్లాహ్‌ తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు.

53:59 – أَفَمِنْ هَـٰذَا الْحَدِيثِ تَعْجَبُونَ ٥٩

ఏమీ? మీరు ఈ సందేశాన్ని చూసి ఆశ్చర్య పడుతున్నారా?

53:60 – وَتَضْحَكُونَ وَلَا تَبْكُونَ ٦٠

మరియు మీరు నవ్వుతున్నారా? మరియు మీకు ఏడ్పు రావటంలేదా?

53:61 – وَأَنتُمْ سَامِدُونَ ٦١

మరియు మీరు నిర్లక్ష్యంలో మునిగి ఉన్నారు. 27

53:62 – فَاسْجُدُوا لِلَّـهِ وَاعْبُدُوا ۩ ٦٢

కావున! అల్లాహ్‌కు సాష్టాంగం (సజ్దా) చేయండి. మరియు (ఆయనను మాత్రమే) ఆరాధించండి! 28 (సజ్దా)

సూరహ్‌ అల్‌-ఖమర్‌ – అల్‌-ఖమరు: చంద్రుడు, The Moon. మొదటి ఆయత్‌లో ఈ పేరు ఉంది. ఇందులో 55 ఆయతులు ఉన్నాయి. ఈ సమూహపు 7 సూరాహ్‌లలో ఇది 5వది. ఇది మక్కహ్ మొదటి కాలంలో అవతరింపజేయబడింది. దైవప్రవక్త (‘స’అస) పండుగ (‘ఈద్‌)ల నమా’జ్‌లలో చదివే సూరాహ్‌లలో సూరహ్ ఖాఫ్‌ (50) మరియు ఇది పేర్కొనదగినవి.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 54:1 – اقْتَرَبَتِ السَّاعَةُ وَانشَقَّ الْقَمَرُ ١

ఆ ఘడియ దగ్గరకు వచ్చింది మరియు చంద్రుడు పూర్తిగా చీలిపోయాడు. 1

54:2 – وَإِن يَرَوْا آيَةً يُعْرِضُوا وَيَقُولُوا سِحْرٌ مُّسْتَمِرٌّ ٢

అయినా(సత్యతిరస్కారులు)అద్భుత సూచ నను చూసినా తమ ముఖాలను త్రిప్పుకుంటు న్నారు. మరియు: “ఇది ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్న మంత్ర జాలమే.” అని అంటున్నారు.

54:3 – وَكَذَّبُوا وَاتَّبَعُوا أَهْوَاءَهُمْ ۚ وَكُلُّ أَمْرٍ مُّسْتَقِرٌّ ٣

మరియు వారుదీనిని(ఈఖుర్‌ఆన్‌ను) అసత్య మని తిరస్కరించారు. మరియు తమ మనోవాంఛ లను అనుసరించారు. మరియు ప్రతి వ్యవహారం ఒక పర్యవసానానికి చేరవలసి ఉంటుంది. 2

54:4 – وَلَقَدْ جَاءَهُم مِّنَ الْأَنبَاءِ مَا فِيهِ مُزْدَجَرٌ ٤

మరియు వాస్తవానికి, వారి వద్దకు సమాచా రాలు వచ్చాయి. అందు వారికి మందలింపులు ఉండేవి.

54:5 – حِكْمَةٌ بَالِغَةٌ ۖ فَمَا تُغْنِ النُّذُرُ ٥

కావలసినంత వివేకమూ ఉండేది. కాని ఆ హెచ్చరికలు వారికి ప్రయోజనకరం కాలేదు.

54:6 – فَتَوَلَّ عَنْهُمْ ۘ يَوْمَ يَدْعُ الدَّاعِ إِلَىٰ شَيْءٍ نُّكُرٍ ٦

కావున (ఓ ము’హమ్మద్‌!) నీవు వారి నుండి మరలిపో! పిలిచే వాడు భయంకరమైన ఒక విషయం వైపునకు పిలిచే రోజున;

54:7 – خُشَّعًا أَبْصَارُهُمْ يَخْرُجُونَ مِنَ الْأَجْدَاثِ كَأَنَّهُمْ جَرَادٌ مُّنتَشِرٌ ٧

వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి, వారు చెల్లాచెదురైన మిడతలవలే, తమ గోరీల నుండి లేచి బయటికి వస్తారు –

54:8 – مُّهْطِعِينَ إِلَى الدَّاعِ ۖ يَقُولُ الْكَافِرُونَ هَـٰذَا يَوْمٌ عَسِرٌ ٨

వేగంగా – పిలిచే వాని వైపునకు. సత్య-తిరస్కారులు: “ఇది చాలా కఠినమైన రోజు.” అని అంటారు. (3/8)

54:9 – كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ فَكَذَّبُوا عَبْدَنَا وَقَالُوا مَجْنُونٌ وَازْدُجِرَ ٩

  • వారికి పూర్వం నూ’హ్‌ 3 జాతివారు (తమ ప్రవక్తను) అసత్యవాదుడని తిరస్కరించి ఉన్నారు అప్పుడు వారు మాదాసుణ్ణి: “అసత్యవాది!” అని అన్నారు. మరియు: “ఇతడు పిచ్చివాడు.” అని అన్నారు. మరియు అతను కసిరికొట్టబడ్డాడు.

54:10 – فَدَعَا رَبَّهُ أَنِّي مَغْلُوبٌ فَانتَصِرْ ١٠

అప్పుడతను తన ప్రభువును ఇలా ప్రార్థించాడు: “నిశ్చయంగా నేను ఓడిపోయాను కావున నాకు సహాయం చేయి!”

54:11 – فَفَتَحْنَا أَبْوَابَ السَّمَاءِ بِمَاءٍ مُّنْهَمِرٍ ١١

అప్పుడు మేము ఆకాశపు ద్వారాలు తెరిచి కుంభవర్షాన్ని కురిపించాము.

54:12 – وَفَجَّرْنَا الْأَرْضَ عُيُونًا فَالْتَقَى الْمَاءُ عَلَىٰ أَمْرٍ قَدْ قُدِرَ ١٢

మరియు భూమి నుండి ఊటలను పొంగింప జేశాము అపుడు నిర్ణీత కార్యానికిగాను నీళ్ళన్నీ కలిసి పోయాయి.

54:13 – وَحَمَلْنَاهُ عَلَىٰ ذَاتِ أَلْوَاحٍ وَدُسُرٍ ١٣

మరియు మేము అతనిని (నూ’హ్‌ను) పలకలు మరియు మేకులుగల దాని (ఓడ)పై ఎక్కించాము.

54:14 – تَجْرِي بِأَعْيُنِنَا جَزَاءً لِّمَن كَانَ كُفِرَ ١٤

అది మా కన్నుల ముందు తేలియాడుతూ పోయింది. (తన జాతివారి చేత) తిరస్కరింప బడిన వానికి ప్రతిఫలంగా!

54:15 – وَلَقَد تَّرَكْنَاهَا آيَةً فَهَلْ مِن مُّدَّكِرٍ ١٥

మరియు వాస్తవానికి మేము దానిని (ఆ ఓడను) ఒక సూచనగా చేసి వదలిపెట్టాము. అయితే, హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా? 4

54:16 – فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ ١٦

చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?

54:17 – وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ ١٧

మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్‌ఆన్‌ను హితబోధ గ్రహించటంకోసం సులభం చేశాము. అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?

54:18 – كَذَّبَتْ عَادٌ فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ ١٨

ఆద్‌ జాతి సత్యాన్ని తిరస్కరించింది. చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండేనో?

54:19 – إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ رِيحًا صَرْصَرًا فِي يَوْمِ نَحْسٍ مُّسْتَمِرٍّ ١٩

నిశ్చయంగా, మేము పూర్తిగా దురదృష్ట మైన (అరిష్టదాయకమైన) ఒక రోజున, తీవ్రమైన ఎడతెగని తుఫానుగాలిని పంపాము. 5

54:20 – تَنزِعُ النَّاسَ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ مُّنقَعِرٍ ٢٠

అది ప్రజలను, వేళ్లతో పెళ్ళగింపబడిన ఖర్జూరపు చెట్లవలె పెళ్ళగించి వేసింది. 6

54:21 – فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ ٢١

ఇక చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?

54:22 – وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ ٢٢

మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్‌ఆన్‌ను హితబోధ గ్రహించటం కోసం సులభం చేశాము, అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?

54:23 – كَذَّبَتْ ثَمُودُ بِالنُّذُرِ ٢٣

స’మూద్‌ జాతి హెచ్చరికలను అసత్యాలని తిరస్కరించింది.

54:24 – فَقَالُوا أَبَشَرًا مِّنَّا وَاحِدًا نَّتَّبِعُهُ إِنَّا إِذًا لَّفِي ضَلَالٍ وَسُعُرٍ ٢٤

అప్పుడు వారు ఇలా అన్నారు: “ఏమీ? మాలోని ఒక వ్యక్తిని, ఒంటరివాడిని, మేము అనుస రించాలా?అలాఅయితే నిశ్చయంగా మేము మార్గ భ్రష్టులం మరియు పిచ్చివారం అయినట్లే కదా?”

54:25 – أَأُلْقِيَ الذِّكْرُ عَلَيْهِ مِن بَيْنِنَا بَلْ هُوَ كَذَّابٌ أَشِرٌ ٢٥

“ఏమీ? మాఅందరిలో కేవలం అతని మీదనే (దివ్య) సందేశంపంపబడిందా? అలాకాదు! అసలు అతను అసత్యవాది, డంబాలు పలికేవాడు!”

54:26 – سَيَعْلَمُونَ غَدًا مَّنِ الْكَذَّابُ الْأَشِ ٢٦

అసత్యవాది, డంబాలు పలికేవాడు! ఎవడో రేపే (త్వరలోనే) వారికి తెలిసిపోతుంది!

54:27 – إِنَّا مُرْسِلُو النَّاقَةِ فِتْنَةً لَّهُمْ فَارْتَقِبْهُمْ وَاصْطَبِرْ ٢٧

నిశ్చయంగా, మేము ఆడ ఒంటెను, వారిని పరీక్షించటం కోసం పంపుతున్నాము, కావున (ఓ ‘సాలి’హ్‌!) వారి విషయంలో వేచిఉండు మరియు సహనంవహించు!

54:28 – وَنَبِّئْهُمْ أَنَّ الْمَاءَ قِسْمَةٌ بَيْنَهُمْ ۖ كُلُّ شِرْبٍ مُّحْتَضَ ٢٨

మరియు వారి మధ్య నీరు (న్యాయంగా) పంచబడాలని వారికి బోధించు. ప్రతి ఒక్కరూ తమవంతు వచ్చే రోజునే త్రాగాలని నియమించ బడింది. 7

54:29 – فَنَادَوْا صَاحِبَهُمْ فَتَعَاطَىٰ فَعَقَرَ ٢٩

ఆ పిదప వారు తమ సహచరుణ్ణి పిలిచారు. వాడు దాన్ని పట్టుకొని (దాని వెనుక కాలి మోకాలి నరాలు కోసి) చంపాడు. 8

54:30 – فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ ٣٠

అప్పుడు చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?

54:31 – إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ صَيْحَةً وَاحِدَةً فَكَانُوا كَهَشِيمِ الْمُحْتَظِرِ ٣١

నిశ్చయంగా, మేము వారి మీదకు ఒక భయంకరమైన శబ్దాన్ని (‘సయ్‌’హను) పంపాము, దాంతో వారు త్రొక్కబడిన పశువుల దొడ్డి కంచెవలే నుగ్గు-నుగ్గు అయిపోయారు.

54:32 – وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ ٣٢

మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్‌ఆన్‌ ను హితబోధ గ్రహించటానికి సులభం చేశాము, అయితే హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?

54:33 – كَذَّبَتْ قَوْمُ لُوطٍ بِالنُّذُرِ ٣٣

లూ’త్‌ జాతి కూడా హెచ్చరికలను అసత్యాలని తిరస్కరించింది.

54:34 – إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ حَاصِبًا إِلَّا آلَ لُوطٍ ۖ نَّجَّيْنَاهُم بِسَحَرٍ ٣٤

నిశ్చయంగా, మేము, లూ’త్‌ ఇంటివారు తప్ప! ఇతరుల మీదికి రాళ్ళువిసిరే ‘తుఫాన్‌ గాలిని పంపాము. (లూ’త్‌ ఇంటి) వారిని మేము వేకువ జామున రక్షించాము; 9

54:35 – نِّعْمَةً مِّنْ عِندِنَا ۚ كَذَٰلِكَ نَجْزِي مَن شَكَرَ ٣٥

మా తరఫు నుండి అనుగ్రహంగా. ఈ విధంగా మేము కృతజ్ఞులకు ప్రతిఫలం ఇస్తాము.

54:36 – وَلَقَدْ أَنذَرَهُم بَطْشَتَنَا فَتَمَارَوْا بِالنُّذُرِ ٣٦

మరియు వాస్తవానికి (లూ’త్‌ తనజాతి) వారిని మా రాబోయే శిక్షను గురించి హెచ్చరించాడు. కాని వారు మా హెచ్చరికలను సందేహించి (మొండి) వాదనలకు దిగారు!

54:37 – وَلَقَدْ رَاوَدُوهُ عَن ضَيْفِهِ فَطَمَسْنَا أَعْيُنَهُمْ فَذُوقُوا عَذَابِي وَنُذُرِ ٣٧

మరియు వాస్తవానికి వారు అతని అతిథు లను 10 అతని నుండి బలవంతంగా లాక్కో వాలని అనుకున్నారు. కావున మేము వారి కళ్ళను పోగొ ట్టాము. (వారితో ఇలా అన్నాము): “ఇప్పుడు నా శిక్షను మరియు నా హెచ్చరికను చవిచూడండి.”

54:38 – وَلَقَدْ صَبَّحَهُم بُكْرَةً عَذَابٌ مُّسْتَقِرٌّ ٣٨

మరియు వాస్తవానికి, ఉదయపు వేళ శాశ్వతమైన శిక్ష వారిమీద పడింది:

54:39 – فَذُوقُوا عَذَابِي وَنُذُرِ ٣٩

“ఇప్పుడు మీరు నా శిక్షను మరియు నా హెచ్చరికలను చవిచూడండి.”

54:40 – وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ ٤٠

మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్‌ఆన్‌ ను హితబోధ గ్రహించడానికి సులభంచేశాము. అయితే, హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?

54:41 – وَلَقَدْ جَاءَ آلَ فِرْعَوْنَ النُّذُرُ ٤١

మరియు వాస్తవానికి ఫిర్‌’ఔన్‌ జాతి వారికి కూడా హెచ్చరికలు వచ్చాయి.

54:42 – كَذَّبُوا بِآيَاتِنَا كُلِّهَا فَأَخَذْنَاهُمْ أَخْذَ عَزِيزٍ مُّقْتَدِرٍ ٤٢

వారు మా సూచనలను అన్నిటినీ అబద్ధాలని తిరస్కరించారు, కావున మేము వారిని పట్టుకున్నాము, సర్వశక్తిమంతుడు సర్వ సమర్థుడు పట్టుకునే విధంగా!

54:43 – أَكُفَّارُكُمْ خَيْرٌ مِّنْ أُولَـٰئِكُمْ أَمْ لَكُم بَرَاءَةٌ فِي الزُّبُرِ ٤٣

(ఓ ఖురేషులారా!) ఏమీ? మీ సత్య-తిరస్కారులు మీకు పూర్వం గడిచిన వారికంటే శ్రేష్ఠులా? లేక దివ్యగ్రంథాలలో మీ కొరకు (మా శిక్ష నుండి) ఏదైనా మినహాయింపు వ్రాయబడి ఉందా?

54:44 – أَمْ يَقُولُونَ نَحْنُ جَمِيعٌ مُّنتَصِرٌ ٤٤

లేక వారు: “మాది ఒక శక్తిగల వర్గం, (కావున) మేము ప్రాబల్యం పొందగలం” అని అంటున్నారా?

54:45 – سَيُهْزَمُ الْجَمْعُ وَيُوَلُّونَ الدُّبُرَ ٤٥

కాని త్వరలోనే ఈ శక్తిగల వర్గం పరాజయం పొందగలదు. మరియు వారు వెన్నుచూపి పారిపోతారు. 11

54:46 – بَلِ السَّاعَةُ مَوْعِدُهُمْ وَالسَّاعَةُ أَدْهَىٰ وَأَمَرُّ ٤٦

అంతే కాదు! అంతిమ ఘడియయే, వారి వాగ్దాన సమయం మరియు ఆ ఘడియ ఎంతో దారుణమైనది మరియు ఎంతో తీవ్రమైనదీను (చేదైనదీను).

54:47 – إِنَّ الْمُجْرِمِينَ فِي ضَلَالٍ وَسُعُرٍ ٤٧

నిశ్చయంగా పాపాత్ములు మార్గ-భ్రష్టత్వంలో ఉన్నారు మరియు వారు (పరలోకంలో) నరకాగ్నిలో కాలుతారు.

54:48 – يَوْمَ يُسْحَبُونَ فِي النَّارِ عَلَىٰ وُجُوهِهِمْ ذُوقُوا مَسَّ سَقَرَ ٤٨

ఆ రోజు వారు తమ ముఖాల మీద నర కాగ్నిలోకి ఈడ్చబడతారు; (వారితో): “నరకాగ్ని స్పర్శను చవిచూడండి!” అని అనబడుతుంది. 12

54:49 – إِنَّا كُلَّ شَيْءٍ خَلَقْنَاهُ بِقَدَرٍ ٤٩

నిశ్చయంగా, మేము ప్రతి దానిని ఒక విధివ్రాత (ఖద్ర్‌)తో సృష్టించాము. 13

54:50 – وَمَا أَمْرُنَا إِلَّا وَاحِدَةٌ كَلَمْحٍ بِالْبَصَرِ ٥٠

మరియు మా ఆజ్ఞ కేవలం ఒక్కటే చాలు, కనురెప్ప పాటుది. (అది అయిపోతుంది) 14

54:51 – وَلَقَدْ أَهْلَكْنَا أَشْيَاعَكُمْ فَهَلْ مِن مُّدَّكِرٍ ٥١

మరియు వాస్తవానికి, మేము మీ వంటి వారిని, ఎందరినో నాశనం చేశాము. అయితే, హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?

54:52 – وَكُلُّ شَيْءٍ فَعَلُوهُ فِي الزُّبُرِ ٥٢

మరియు వారు చేసిన ప్రతి విషయం వారి కర్మ గ్రంథాలలో (చిట్టాలలో) వ్రాయబడి ఉంది. 15

54:53 – وَكُلُّ صَغِيرٍ وَكَبِيرٍ مُّسْتَطَرٌ ٥٣

మరియు ప్రతి చిన్న మరియు ప్రతి పెద్ద విషయం అన్నీ వ్రాయబడి ఉన్నాయి. 16

54:54 – إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَنَهَرٍ ٥٤

నిశ్చయంగా, దైవభీతి గలవారు స్వర్గవనాలలో సెలయేళ్ళ దగ్గర ఉంటారు.

54:55 – فِي مَقْعَدِ صِدْقٍ عِندَ مَلِيكٍ مُّقْتَدِرٍ ٥٥

సత్య పీఠం మీద, 17 విశ్వసామ్రాట్టు, 18 సర్వ సమర్థుని సన్నిధిలో. (1/2)

సూరహ్‌ అర్‌-ర’హ్మాన్‌ – అర్‌-ర’హ్మాన్‌: The Most Gracious, అనంత కరుణామయుడు. దీని పేరు మొదటి ఆయత్‌లోనే ఉంది. ఈ సూరహ్‌లో 78 ఆయతులు ఉన్నాయి. చాలా మంది వ్యాఖ్యాతలు ఈ సూరహ్‌ మదీనహ్ లో అవతరింపజేయబడిందని అంటారు. ఈ సమూహపు 7 సూరాహ్‌లలో ఇది 6 వది. ఇది పునరుత్థానదినం గురించి వివరిస్తోంది. దైవప్రవక్త (‘స’అస) ప్రవచనం: “ఏమీ? మీరు మౌనం వహిస్తున్నారా? మీ కంటే జిన్నాతులు మేలు! రాత్రి నేను ఈ సూరహ్‌ను జిన్నాతులకు వినిపించినప్పుడు నేను: ‘ఫబి అయ్యి ఆలాయి’ రబ్బికుమా తుకజ్జి’బాన్‌.’ చదివినప్పుడల్లా, జిన్నాతులు దానికి జవాబుగా: ‘ఓ మా ప్రభూ! మేము నీ యొక్క ఏ అనుగ్రహాలను కూడా నిరాకరించడం లేదు! సర్వస్తోత్రాలకు అర్హుడవు నీవు మాత్రమే!’ అని అన్నారు.” (తిర్మిజీ’, అల్బానీ ప్రమాణీకం)

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 55:1 – الرَّحْمَـٰنُ ١

  • అనంత కరుణామయుడు (అల్లాహ్‌)!

55:2 – عَلَّمَ الْقُرْآنَ ٢

ఆయనే ఈ ఖుర్‌ఆన్‌ను నేర్పాడు. 1

55:3 – خَلَقَ الْإِنسَانَ ٣

ఆయనే మానవుణ్ణి సృష్టించాడు.

55:4 – عَلَّمَهُ الْبَيَانَ ٤

ఆయనే అతనికి మాట్లాడటం నేర్పాడు.

55:5 – الشَّمْسُ وَالْقَمَرُ بِحُسْبَانٍ ٥

సూర్యుడు మరియు చంద్రుడు ఒక నియమిత గమనాన్ని (నియమిత పరిధిలో) అనుస రిస్తున్నారు.

55:6 – وَالنَّجْمُ وَالشَّجَرُ يَسْجُدَانِ ٦

మరియు నక్షత్రాలు మరియు వృక్షాలు అన్నీ ఆయనకు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటాయి. 2

55:7 – وَالسَّمَاءَ رَفَعَهَا وَوَضَعَ الْمِيزَانَ ٧

మరియు ఆయనే ఖగోళాన్ని పైకెత్తి ఉంచాడు మరియు ఆయనే త్రాసును నెలకొల్పాడు. 3

55:8 – أَلَّا تَطْغَوْا فِي الْمِيزَانِ ٨

తద్వారా మీరు తూకంలో మోసానికి పాల్పడ కూడదని! 4

55:9 – وَأَقِيمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِيزَانَ ٩

మరియు న్యాయంగా తూకం చేయండి మరియు తూకంలో తగ్గించకండి.

55:10 – وَالْأَرْضَ وَضَعَهَا لِلْأَنَامِ ١٠

మరియు ఆయన, భూమిని సకల జీవరాసుల కొరకు ఉంచాడు.

55:11 – فِيهَا فَاكِهَةٌ وَالنَّخْلُ ذَاتُ الْأَكْمَامِ ١١

అందులో రకరకాల ఫలాలు మరియు పొరలలో (పుష్పకోశాలలో) ఉండే ఖర్జూరపు పండ్లు ఉన్నాయి.

55:12 – وَالْحَبُّ ذُو الْعَصْفِ وَالرَّيْحَانُ ١٢

మరియు దంట్లపై (పొరలలో చుట్టబడి) 5 ఉన్న ధాన్యం మరియు సుగంధ పుష్పాలు కూడా!

55:13 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ١٣

అయితే మీ రిరువురు (మానవులు మరియు జిన్నాతులు) మీ ప్రభువుయొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:14 – خَلَقَ الْإِنسَانَ مِن صَلْصَالٍ كَالْفَخَّارِ ١٤

ఆయన మానవుణ్ణి పెంకులాంటి శబ్దమిచ్చే మట్టితో 6 సృష్టించాడు.

55:15 – وَخَلَقَ الْجَانَّ مِن مَّارِجٍ مِّن نَّارٍ ١٥

మరియు జిన్నాతులను అగ్నిజ్వాలలతో సృష్టించాడు. 7

55:16 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ١٦

అయితే మీ రివురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:17 – رَبُّ الْمَشْرِقَيْنِ وَرَبُّ الْمَغْرِبَيْنِ ١٧

ఆయనే రెండు తూర్పు (దిక్కు)లకు మరియు రెండు పడమర (దిక్కు)లకు ప్రభువు. 8

55:18 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ١٨

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:19 – مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ ١٩

ఆయనే రెండు సముద్రాలను కలుసుకోవ టానికి వదలిపెట్టాడు.

55:20 – بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ ٢٠

ఆ రెండింటి మధ్య, అవి అతిక్రమించలేని అడ్డుతెర వుంది 9

55:21 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٢١

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:22 – يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ ٢٢

ఆ రెండింటి నుండి ముత్యాలు మరియు పగడాలు వస్తాయి.

55:23 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٢٣

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:24 – وَلَهُ الْجَوَارِ الْمُنشَآتُ فِي الْبَحْرِ كَالْأَعْلَامِ ٢٤

మరియు ఎత్తైన కొండలవలే సముద్రంలో 10 పయనించే ఓడలు ఆయనకు చెందినవే!

55:25 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٢٥

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:26 – كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ ٢٦

దానిపై (భూమిపై) నున్నది ప్రతిదీ నశిస్తుంది;

55:27 – وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ ٢٧

మరియు మిగిలి వుండేది, కేవలం మహిమాన్వితుడు 11 మరియు పరమదాత 12 అయిన నీ ప్రభువు ముఖం (ఉనికి) మాత్రమే! 13

55:28 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٢٨

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:29 – يَسْأَلُهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ كُلَّ يَوْمٍ هُوَ فِي شَأْنٍ ٢٩

భూమిలో మరియు ఆకాశాలలో నున్న ప్రతిదీ (తన జీవనోపాధి కొరకు) ఆయననే యాచిస్తుంది. మరియు ప్రతి క్షణం (రోజు) ఆయన ఒక కార్యంలో నిమగ్నుడై ఉంటాడు.

55:30 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٣٠

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:31 – سَنَفْرُغُ لَكُمْ أَيُّهَ الثَّقَلَانِ ٣١

భారాలను మోసే మీరిద్దరు! 14 త్వరలోనే మేము మీ విషయం నిర్ణయించగలము.

55:32 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٣٢

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:33 – يَا مَعْشَرَ الْجِنِّ وَالْإِنسِ إِنِ اسْتَطَعْتُمْ أَن تَنفُذُوا مِنْ أَقْطَارِ السَّمَاوَاتِ وَالْأَرْضِ فَانفُذُوا ۚ لَا تَنفُذُونَ إِلَّا بِسُلْطَانٍ ٣٣

ఓ జిన్నాతుల మరియు మానవ జాతి వారలారా! ఒకవేళ మీరు ఆకాశాల మరియు భూమి యొక్క సరిహద్దుల నుండి బయటికి వెళ్ళిపోగలిగితే, వెళ్ళిపొండి! ఆయన (అల్లాహ్‌) యొక్క సెలవు లేనిదే మీరు వాటి నుండి వెళ్లిపోలేరు. 15

55:34 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٣٤

అయితే మీ రిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:35 – يُرْسَلُ عَلَيْكُمَا شُوَاظٌ مِّن نَّارٍ وَنُحَاسٌ فَلَا تَنتَصِرَانِ ٣٥

మీ ఇద్దరిపైకి అగ్నిజ్వాలలు మరియు పొగ 16 పంపబడతాయి. అప్పుడు మీరు ఎదుర్కోలేరు (మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు).

55:36 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٣٦

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:37 – فَإِذَا انشَقَّتِ السَّمَاءُ فَكَانَتْ وَرْدَةً كَالدِّهَانِ ٣٧

మరియు ఆకాశం ప్రేలిపోయినప్పుడు అది మండేనూనెగా ఎర్రగా మారిపోతుంది. 17

55:38 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٣٨

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:39 – فَيَوْمَئِذٍ لَّا يُسْأَلُ عَن ذَنبِهِ إِنسٌ وَلَا جَانٌّ ٣٩

ఇక, ఆ రోజు ఏ మానవునితో గానీ, లేక ఏ జిన్నాతునితో గానీ అతని పాపాలను గురించి అడగడం జరుగదు. 18

55:40 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٤٠

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:41 – يُعْرَفُ الْمُجْرِمُونَ بِسِيمَاهُمْ فَيُؤْخَذُ بِالنَّوَاصِي وَالْأَقْدَامِ ٤١

ఈ నేరస్తులు వారి వారి ముఖ చిహ్నాలతోనే గుర్తింపబడతారు. అప్పుడు వారు, వారి ముంగురులు మరియు కాళ్ళు పట్టి లాగబడతారు. 19

55:42 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٤٢

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:43 – هَـٰذِهِ جَهَنَّمُ الَّتِي يُكَذِّبُ بِهَا الْمُجْرِمُونَ ٤٣

ఈ నేరస్తులు అసత్యమని తిరస్కరిస్తూ వుండిన నరకం ఇదే!

55:44 – يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ آنٍ ٤٤

వారు దానిలో (ఆ నరకంలో) మరియు సల-సలకాగే నీటి మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.

55:45 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٤٥

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:46 – وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِ جَنَّتَانِ ٤٦

మరియు ఎవడైతే తన ప్రభువు సన్నిధిలో హాజరు కావలసి ఉంటుందనే భయం కలిగి ఉంటాడో, అతనికి రెండు స్వర్గవనా లుంటాయి.

55:47 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٤٧

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:48 – ذَوَاتَا أَفْنَانٍ ٤٨

అవి రెండూ అనేక శాఖల (వృక్షాల)తో నిండి ఉంటాయి. 20

55:49 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٤٩

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:50 – فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ ٥٠

ఆ రెండింటిలో రెండు సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. 21

55:51 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٥١

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:52 – فِيهِمَا مِن كُلِّ فَاكِهَةٍ زَوْجَانِ ٥٢

ఆ రెండింటిలో ప్రతిఫలం జోడుగా (రెండు రకాలుగా) ఉంటుంది.

55:53 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٥٣

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:54 – مُتَّكِئِينَ عَلَىٰ فُرُشٍ بَطَائِنُهَا مِنْ إِسْتَبْرَقٍ ۚ وَجَنَى الْجَنَّتَيْنِ دَانٍ ٥٤

వారు జరీపని అస్తరుగల పట్టు తివాచీల మీద ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు ఆ రెండు స్వర్గవనాల ఫలాలు దగ్గరగా అందు బాటులో ఉంటాయి. 22

55:55 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٥٥

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:56 – فِيهِنَّ قَاصِرَاتُ الطَّرْفِ لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَانٌّ ٥٦

అందులో తమ దృష్టిని ఎల్లపుడూ క్రిందికి వంచి ఉంచే నిర్మల కన్యలుంటారు. వారిని ఇంతకు పూర్వం ఏ మానవుడు గానీ, ఏ జిన్నాతుడు గానీ తాకి ఉండడు. 23

55:57 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٥٧

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:58 – كَأَنَّهُنَّ الْيَاقُوتُ وَالْمَرْجَانُ ٥٨

వారు కెంపులను (మాణిక్యాలను) మరియు పగడాలను పోలి ఉంటారు.

55:59 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٥٩

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:60 – هَلْ جَزَاءُ الْإِحْسَانِ إِلَّا الْإِحْسَانُ ٦٠

సత్కార్యానికి మంచి ప్రతిఫలం తప్ప మరేమైనా ఉంటుందా?

55:61 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٦١

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:62 – وَمِن دُونِهِمَا جَنَّتَانِ ٦٢

మరియు ఆ రెండే కాక ఇంకా రెండు స్వర్గవనాలు ఉంటాయి.

55:63 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٦٣

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:64 – مُدْهَامَّتَانِ ٦٤

అవి దట్టంగా ముదురుపచ్చగా ఉంటాయి.

55:65 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٦٥

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:66 – فِيهِمَا عَيْنَانِ نَضَّاخَتَانِ ٦٦

ఆ రెండు తోటలలో పొంగిప్రవహించే రెండు చెలమలుంటాయి.

55:67 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٦٧

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:68 – فِيهِمَا فَاكِهَةٌ وَنَخْلٌ وَرُمَّانٌ ٦٨

ఆ రెండింటిలో ఫలాలు, ఖర్జూరాలు మరియు దానిమ్మలు ఉంటాయి.

55:69 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٦٩

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:70 – فِيهِنَّ خَيْرَاتٌ حِسَانٌ ٧٠

వాటిలో గుణవంతులు, సౌందర్యవతులైన స్త్రీలు ఉంటారు.

55:71 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٧١

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:72 – حُورٌ مَّقْصُورَاتٌ فِي الْخِيَامِ ٧٢

నిర్మలమైన, శీలవతులైన స్త్రీలు (హూర్‌) డేరాలలో ఉంటారు. 24

55:73 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٧٣

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:74 – لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَانٌّ ٧٤

ఆ స్త్రీలను ఇంతకు ముందు ఏ మానవుడు కాని, ఏ జిన్నాతు కాని తాకి ఉండడు.

55:75 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٧٥

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:76 – مُتَّكِئِينَ عَلَىٰ رَفْرَفٍ خُضْرٍ وَعَبْقَرِيٍّ حِسَانٍ ٧٦

వారు అందమైన తివాచీల మీద ఆకు పచ్చని దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.

55:77 – فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ٧٧

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు? 25

55:78 – تَبَارَكَ اسْمُ رَبِّكَ ذِي الْجَلَالِ وَالْإِكْرَامِ ٧٨

మహిమాన్వితుడు మరియు పరమదాత 26 అయిన నీ ప్రభువు పేరే సర్వశ్రేష్ఠమైనది. 27

— – సూరహ్‌ అల్‌-వాఖి’అహ్‌ – అల్‌-వాఖి’అహ్: రానున్న సంఘటన. ఇది సంపదల సూరహ్‌ అని ప్రఖ్యాతి చెందింది. “దీనిని ప్రతిరోజు రాత్రి చదివేవాడు ఎన్నడూ పస్తులుండడు.” కాని ఈ ప్రవచనం, ప్రమాణీకమైనది కాదు. (అల్బానీ). ఈ సమూహంలో ఇది 7వది మరియు చివరిది. ఈ సూరాహ్‌లన్నీ దివ్యజ్ఞానం మరియు పరలోక జీవితాన్ని గురించి చర్చించాయి. పునరుత్థానం గురించి ఇందు వివరాలున్నాయి. ఈ సూరహ్‌ మక్కహ్ మొదటి కాలానికి చెందింది. 96 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 56:1 – إِذَا وَقَعَتِ الْوَاقِعَةُ ١

  • ఆ అనివార్య సంఘటన సంభవించి నపుడు; 1

56:2 – لَيْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ ٢

అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు.

56:3 – خَافِضَةٌ رَّافِعَةٌ ٣

అది కొందరిని హీనపరుస్తుంది, మరి కొందరిని పైకెత్తుతుంది. 2

56:4 – إِذَا رُجَّتِ الْأَرْضُ رَجًّا ٤

భూమి తీవ్ర కంపనంతో కంపించినపుడు;

56:5 – وَبُسَّتِ الْجِبَالُ بَسًّا ٥

మరియు పర్వతాలు పొడిగా మార్చ బడినపుడు;

56:6 – فَكَانَتْ هَبَاءً مُّنبَثًّا ٦

అప్పుడు వాటి దుమ్ము నలువైపులా నిండి పోయినపుడు;

56:7 – وَكُنتُمْ أَزْوَاجًا ثَلَاثَةً ٧

మరియు మీరు మూడు వర్గాలుగా విభజింప బడతారు.

56:8 – فَأَصْحَابُ الْمَيْمَنَةِ مَا أَصْحَابُ الْمَيْمَنَةِ ٨

ఇక కుడి పక్షం వారు, ఆ కుడి పక్షము వారు ఎంత (అదృష్టవంతులు)! 3

56:9 – وَأَصْحَابُ الْمَشْأَمَةِ مَا أَصْحَابُ الْمَشْأَمَةِ ٩

మరికొందరు వామ పక్షం వారుంటారు, 4 ఆ వామ పక్షపు వారు ఎంత (దౌర్భాగ్యులు)!

56:10 – وَالسَّابِقُونَ السَّابِقُونَ ١٠

మరియు (ఇహలోకంలో విశ్వాసంలో) ముందు న్నవారు (స్వర్గంలోకూడా) ముందుంటారు.

56:11 – أُولَـٰئِكَ الْمُقَرَّبُونَ ١١

అలాంటి వారు (అల్లాహ్‌) సాన్నిధ్యాన్ని పొందుతారు.

56:12 – فِي جَنَّاتِ النَّعِيمِ ١٢

వారు సర్వసుఖాలు గల స్వర్గవనాలలో ఉంటారు.

56:13 – ثُلَّةٌ مِّنَ الْأَوَّلِينَ ١٣

మొదటితరాల వారిలోనుండి చాలా మంది;

56:14 – وَقَلِيلٌ مِّنَ الْآخِرِينَ ١٤

మరియు తరువాత తరాలవారిలో నుండి కొంత మంది.

56:15 – عَلَىٰ سُرُرٍ مَّوْضُونَةٍ ١٥

(బంగారు)జలతారు అల్లిన ఆసనాల మీద;

56:16 – مُّتَّكِئِينَ عَلَيْهَا مُتَقَابِلِينَ ١٦

ఒకరికొకరు ఎదురెదురుగా, వాటి మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. 5

56:17 – يَطُوفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُونَ ١٧

వారి చుట్టుప్రక్కలలో చిరంజీవులైన (నిత్య బాల్యం గల) బాలురు (సేవకులు) తిరుగుతూ ఉంటారు.

56:18 – بِأَكْوَابٍ وَأَبَارِيقَ وَكَأْسٍ مِّن مَّعِينٍ ١٨

(మధువు) ప్రవహించే చెలమల నుండి నింపిన పాత్రలు, గిన్నెలు మరియు కప్పులతో!

56:19 – لَّا يُصَدَّعُونَ عَنْهَا وَلَا يُنزِفُونَ ١٩

దాని వలన వారికి తలనొప్పి గానీ లేక మత్తు గానీ కలుగదు.

56:20 – وَفَاكِهَةٍ مِّمَّا يَتَخَيَّرُونَ ٢٠

మరియు వారు కోరే పండ్లూ, ఫలాలు ఉంటాయి.

56:21 – وَلَحْمِ طَيْرٍ مِّمَّا يَشْتَهُونَ ٢١

మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం. 6

56:22 – وَحُورٌ عِينٌ ٢٢

మరియు అందమైన కన్నులు గల సుందరాంగులు (‘హూరున్‌);

56:23 – كَأَمْثَالِ اللُّؤْلُؤِ الْمَكْنُونِ ٢٣

దాచబడిన ముత్యాలవలే!

56:24 – جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ ٢٤

ఇదంతా వారు చేస్తూ ఉండిన వాటికి (సత్కార్యాలకు) ప్రతిఫలంగా!

56:25 – لَا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا تَأْثِيمًا ٢٥

అందులో వారు వ్యర్థమైన మాటలు గానీ, పాప విషయాలు గానీ వినరు. 7

56:26 – إِلَّا قِيلًا سَلَامًا سَلَامًا ٢٦

“శాంతి (సలాం) శాంతి (సలాం)!” అనే మాటలు తప్ప! 8

56:27 – وَأَصْحَابُ الْيَمِينِ مَا أَصْحَابُ الْيَمِينِ ٢٧

మరియు కుడిపక్షం వారు, ఆ కుడిపక్షం వారు ఎంత (అదృష్టవంతులు)!

56:28 – فِي سِدْرٍ مَّخْضُودٍ ٢٨

వారు ముళ్ళులేని సిద్‌రవృక్షాల మధ్య! 9

56:29 – وَطَلْحٍ مَّنضُودٍ ٢٩

మరియు పండ్లగెలలతో నిండిన అరటిచెట్లు;

56:30 – وَظِلٍّ مَّمْدُودٍ ٣٠

మరియు వ్యాపించి ఉన్న నీడలు; 10

56:31 – وَمَاءٍ مَّسْكُوبٍ ٣١

మరియు ఎల్లపుడు ప్రవహించే నీరు;

56:32 – وَفَاكِهَةٍ كَثِيرَةٍ ٣٢

మరియు సమృధ్ధిగా ఉన్న పండ్లు, ఫలాలు;

56:33 – لَّا مَقْطُوعَةٍ وَلَا مَمْنُوعَةٍ ٣٣

ఎడతెగకుండా మరియు అంతం కాకుండా (ఉండే వనాలలో);

56:34 – وَفُرُشٍ مَّرْفُوعَةٍ ٣٤

మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని) ఉంటారు. 11

56:35 – إِنَّا أَنشَأْنَاهُنَّ إِنشَاءً ٣٥

నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము;

56:36 – فَجَعَلْنَاهُنَّ أَبْكَارًا ٣٦

మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము; 12

56:37 – عُرُبًا أَتْرَابًا ٣٧

వారు ప్రేమించే వారుగానూ, సమవయస్సు గల వారుగానూ (ఉంటారు); 13

56:38 – لِّأَصْحَابِ الْيَمِينِ ٣٨

కుడి పక్షం వారి కొరకు.

56:39 – ثُلَّةٌ مِّنَ الْأَوَّلِينَ ٣٩

అందులో చాలా మంది మొదటి తరాలకు చెందిన వారుంటారు;

56:40 – وَثُلَّةٌ مِّنَ الْآخِرِينَ ٤٠

మరియు తరువాత తరాల వారిలో నుండి కూడా చాలా మంది ఉంటారు.

56:41 – وَأَصْحَابُ الشِّمَالِ مَا أَصْحَابُ الشِّمَالِ ٤١

ఇక వామ (ఎడమ) పక్షంవారు; ఆ వామ పక్షంవారు ఎంత (దౌర్భాగ్యులు)?

56:42 – فِي سَمُومٍ وَحَمِيمٍ ٤٢

వారు దహించే నరకాగ్నిలో మరియు సలసల కాగే నీటిలో;

56:43 – وَظِلٍّ مِّن يَحْمُومٍ ٤٣

మరియు నల్లటి పొగ ఛాయలో (ఉంటారు).

56:44 – لَّا بَارِدٍ وَلَا كَرِيمٍ ٤٤

అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేది గానూ ఉండదు;

56:45 – إِنَّهُمْ كَانُوا قَبْلَ ذَٰلِكَ مُتْرَفِينَ ٤٥

నిశ్చయంగా, వారు ఇంతకు ముందు చాలా భోగ-భాగ్యాలలో పడి ఉండిరి;

56:46 – وَكَانُوا يُصِرُّونَ عَلَى الْحِنثِ الْعَظِيمِ ٤٦

మరియు వారు మూర్ఖపు పట్టుతో ఘోరమైన పాపాలలో పడి ఉండిరి;

56:47 – وَكَانُوا يَقُولُونَ أَئِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ ٤٧

మరియు వారు ఇలా అనేవారు: ‘ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా?

56:48 – أَوَآبَاؤُنَا الْأَوَّلُونَ ٤٨

“మరియు పూర్వీకులైన మా తాత-ముత్తాతలు కూడానా?”

56:49 – قُلْ إِنَّ الْأَوَّلِينَ وَالْآخِرِينَ ٤٩

వారితో ఇలా అను: “నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాతవారు కూడాను!

56:50 – لَمَجْمُوعُونَ إِلَىٰ مِيقَاتِ يَوْمٍ مَّعْلُومٍ ٥٠

“వారందరూ ఆ నిర్ణీత రోజు, ఆ సమయమున సమావేశపరచబడతారు.

56:51 – ثُمَّ إِنَّكُمْ أَيُّهَا الضَّالُّونَ الْمُكَذِّبُونَ ٥١

“ఇక నిశ్చయంగా, మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా!

56:52 – لَآكِلُونَ مِن شَجَرٍ مِّن زَقُّومٍ ٥٢

“మీరు జఖ్ఖూమ్‌ చెట్టు (ఫలాల)ను తింటారు. 14

56:53 – فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ ٥٣

“దానితో కడుపులు నింపుకుంటారు.

56:54 – فَشَارِبُونَ عَلَيْهِ مِنَ الْحَمِيمِ ٥٤

“తరువాత, దాని మీద సలసలకాగే నీరు త్రాగుతారు.

56:55 – فَشَارِبُونَ شُرْبَ الْهِيمِ ٥٥

“వాస్తవానికి మీరు దానిని దప్పికగొన్న ఒంటెలవలే త్రాగుతారు.”

56:56 – هَـٰذَا نُزُلُهُمْ يَوْمَ الدِّينِ ٥٦

తీర్పుదినం నాడు (ఈ వామపక్షం వారికి లభించే) ఆతిథ్యం ఇదే!

56:57 – نَحْنُ خَلَقْنَاكُمْ فَلَوْلَا تُصَدِّقُونَ ٥٧

మిమ్మల్ని మేమే సృష్టించాము; అయితే మీరెందుకు ఇది సత్యమని నమ్మరు?

56:58 – أَفَرَأَيْتُم مَّا تُمْنُونَ ٥٨

ఏమీ? మీరెప్పడైనా, మీరు విసర్జించే వీర్యబిందువును గమనించారా?

56:59 – أَأَنتُمْ تَخْلُقُونَهُ أَمْ نَحْنُ الْخَالِقُونَ ٥٩

ఏమీ? మీరా, దానిని సృష్టించే వారు? లేక మేమా దాని సృష్టికర్తలము?

56:60 – نَحْنُ قَدَّرْنَا بَيْنَكُمُ الْمَوْتَ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ ٦٠

మేమే మీ కోసం మరణం నిర్ణయించాము మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు;

56:61 – عَلَىٰ أَن نُّبَدِّلَ أَمْثَالَكُمْ وَنُنشِئَكُمْ فِي مَا لَا تَعْلَمُونَ ٦١

మీ రూపాలను మార్చివేసి మీరు ఎరుగని (ఇతర రూపంలో) మిమ్మల్ని సృష్టించటం నుండి.

56:62 – وَلَقَدْ عَلِمْتُمُ النَّشْأَةَ الْأُولَىٰ فَلَوْلَا تَذَكَّرُونَ ٦٢

మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు; అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు?

56:63 – أَفَرَأَيْتُم مَّا تَحْرُثُونَ ٦٣

మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా?

56:64 – أَأَنتُمْ تَزْرَعُونَهُ أَمْ نَحْنُ الزَّارِعُونَ ٦٤

మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించేవారము?

56:65 – لَوْ نَشَاءُ لَجَعَلْنَاهُ حُطَامًا فَظَلْتُمْ تَفَكَّهُونَ ٦٥

మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చివేయగలము, అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడిపోతారు.

56:66 – إِنَّا لَمُغْرَمُونَ ٦٦

(మీరు అనే వారు): “నిశ్చయంగా, మేము పాడై పోయాము!

56:67 – بَلْ نَحْنُ مَحْرُومُونَ ٦٧

“కాదు కాదు, మేము దరిద్రుల మయ్యాము!” అని.

56:68 – أَفَرَأَيْتُمُ الْمَاءَ الَّذِي تَشْرَبُونَ ٦٨

ఏమీ? మీరు ఎప్పుడైనా మీరు త్రాగే నీటిని గురించి ఆలోచించారా?

56:69 – أَأَنتُمْ أَنزَلْتُمُوهُ مِنَ الْمُزْنِ أَمْ نَحْنُ الْمُنزِلُونَ ٦٩

మీరా దానిని మేఘాల నుండి కురిపించే వారు? లేక మేమా దానిని కురిపించేవారము?

56:70 – لَوْ نَشَاءُ جَعَلْنَاهُ أُجَاجًا فَلَوْلَا تَشْكُرُونَ ٧٠

మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పుగా ఉండేలా చేసేవారము! అయినా మీరెందుకు కృతజ్ఞతలు చూపరు?

56:71 – أَفَرَأَيْتُمُ النَّارَ الَّتِي تُورُونَ ٧١

మీరు రాజేసే అగ్నిని గమనించారా?

56:72 – أَأَنتُمْ أَنشَأْتُمْ شَجَرَتَهَا أَمْ نَحْنُ الْمُنشِئُونَ ٧٢

దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా? లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా? 15

56:73 – نَحْنُ جَعَلْنَاهَا تَذْكِرَةً وَمَتَاعًا لِّلْمُقْوِينَ ٧٣

మేము దానిని (నరకాగ్నిని), గుర్తుచేసేదిగా మరియు ప్రయాణీకులకు (అవసరం గలవారికి) ప్రయోజనకారిగా చేశాము. 16

56:74 – فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ ٧٤

కావున సర్వోత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు. (3/4)

56:75 – فَلَا أُقْسِمُ بِمَوَاقِعِ النُّجُومِ ٧٥

  • ఇక నేను నక్షత్రాల స్థానాల (కక్ష్యల) సాక్షిగా చెబుతున్నాను.

56:76 – وَإِنَّهُ لَقَسَمٌ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ ٧٦

మరియు నిశ్చయంగా, మీరు గమనించ గలిగితే, ఈ శపథం ఎంతో గొప్పది!

56:77 – إِنَّهُ لَقُرْآنٌ كَرِيمٌ ٧٧

నిశ్చయంగా, ఈ ఖుర్‌ఆన్‌ దివ్యమైనది.

56:78 – فِي كِتَابٍ مَّكْنُونٍ ٧٨

సురక్షితమైన 17 గ్రంథంలో ఉన్నది.

56:79 – لَّا يَمَسُّهُ إِلَّا الْمُطَهَّرُونَ ٧٩

దానిని 18 పరిశుధ్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు.

56:80 – تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ ٨٠

ఇది సర్వలోకాల ప్రభువు తరఫునుండి అవతరింపజేయబడింది.

56:81 – أَفَبِهَـٰذَا الْحَدِيثِ أَنتُم مُّدْهِنُونَ ٨١

ఏమీ? మీరు ఈ సందేశాన్ని 19 తేలికగా తీసుకుంటున్నారా?

56:82 – وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ ٨٢

మరియు (అల్లాహ్‌) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనను మీరు తిరస్కరిస్తున్నారా? 20

56:83 – فَلَوْلَا إِذَا بَلَغَتِ الْحُلْقُومَ ٨٣

అయితే (చనిపోయే వాడి) ప్రాణం గొంతు లోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)?

56:84 – وَأَنتُمْ حِينَئِذٍ تَنظُرُونَ ٨٤

మరియు అప్పుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండిపోతారు.

56:85 – وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنكُمْ وَلَـٰكِن لَّا تُبْصِرُونَ ٨٥

మరియు అప్పుడు, మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాము, కాని మీరు చూడలేక పోతారు. 21

56:86 – فَلَوْلَا إِن كُنتُمْ غَيْرَ مَدِينِينَ ٨٦

ఒకవేళ మీరు ఎవరి అదుపాజ్ఞలో (ఆధీనంలో) లేరనుకుంటే;

56:87 – تَرْجِعُونَهَا إِن كُنتُمْ صَادِقِينَ ٨٧

మీరు సత్యవంతులే అయితే దానిని (ఆ ప్రాణాన్ని) ఎందుకు తిరిగి రప్పించుకోలేరు?

56:88 – فَأَمَّا إِن كَانَ مِنَ الْمُقَرَّبِينَ ٨٨

కాని అతడు (మరణించేవాడు), (అల్లాహ్‌) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే! 22

56:89 – فَرَوْحٌ وَرَيْحَانٌ وَجَنَّتُ نَعِيمٍ ٨٩

అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి.

56:90 – وَأَمَّا إِن كَانَ مِنْ أَصْحَابِ الْيَمِينِ ٩٠

మరియు ఎవడైతే కుడి పక్షం వారికి చెందినవాడో! 23

56:91 – فَسَلَامٌ لَّكَ مِنْ أَصْحَابِ الْيَمِينِ ٩١

అతనితో: “నీకు శాంతి కలుగు గాక (సలాం)! నీవు కుడిపక్షం వారిలో చేరావు.”(అని అనబడుతుంది).

56:92 – وَأَمَّا إِن كَانَ مِنَ الْمُكَذِّبِينَ الضَّالِّينَ ٩٢

మరియు ఎవడైతే, అసత్యవాదులు, మార్గభ్రష్టులైన వారిలో చేరుతాడో! 24

56:93 – فَنُزُلٌ مِّنْ حَمِيمٍ ٩٣

అతని ఆతిథ్యానికి సలసల కాగే నీరు ఉంటుంది.

56:94 – وَتَصْلِيَةُ جَحِيمٍ ٩٤

మరియు భగభగ మండే నరకాగ్ని ఉంటుంది.

56:95 – إِنَّ هَـٰذَا لَهُوَ حَقُّ الْيَقِينِ ٩٥

నిశ్చయంగా, ఇది రూఢి అయిన నమ్మ దగిన సత్యం!

56:96 – فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ ٩٦

కావున సర్వోత్తముడైన నీ ప్రభువు పేరును స్తుతించు. 25

సూరహ్‌ అల్‌-‘హదీద్‌ – ఈ సూరాహ్‌ 8వ హిజ్రీ ప్రాంతంలో మదీనహ్ లో అవతరింపజేయబడింది. అల్‌-‘హదీదు: ఇనుము. దీని పేరు 25వ ఆయత్‌ నుండి తీసుకోబడింది. ఇందులో 29 ఆయతులు ఉన్నాయి. ఇంతవరకు దాదాపు 9/10 వంతులు ఖుర్‌ఆన్‌ పూర్తి అయ్యింది. మిగిలిన 1/10 భాగాన్ని 2 భాగాలలో విభజించవచ్చు. మొదటి భాగంలో 10 సూరాహ్‌లు ఉన్నాయి, 57-66 వరకు. ఇవన్నీ మదీనహ్ లో అవతరింపజేయబడ్డాయి. ప్రతి ఒక్కటి సాంఘిక జీవితపు ఒక విషయాన్ని వివరిస్తోంది. రెండవ భాగంలో 48 సూరాహ్‌లు, 67-114 వరకు ఉన్నాయి. ఇవి చిన్న చిన్న మక్కహ్ సూరాహ్‌లు, కొన్ని తప్ప. ప్రతి ఒక్కటి ధర్మవిషయాలను బోధిస్తోంది. ఈ సూరహ్‌ వినయవిధేయతలను బోధిస్తోంది, అహంకారాన్ని ఖండిస్తోంది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 57:1 – سَبَّحَ لِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ١

ఆకాశాలలోను మరియు భూమిలోనూ ఉన్న సమస్తం అల్లాహ్‌ పవిత్రతను కొనియాడు తుంటాయి. 1 మరియు ఆయనే సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

57:2 – لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يُحْيِي وَيُمِيتُ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٢

ఆకాశాలపై మరియు భూమిపై సామ్రాజ్యాధి పత్యం ఆయనదే. ఆయనే జీవనమిచ్చేవాడు మరియు మరణమిచ్చేవాడు. మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్థుడు.

57:3 – هُوَ الْأَوَّلُ وَالْآخِرُ وَالظَّاهِرُ وَالْبَاطِنُ ۖ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ٣

ఆయనే ప్రథమం మరియు ఆయనే అంతం 2 మరియు ఆయనే ప్రత్యక్షుడు మరియు ఆయనే పరోక్షుడు. 3 మరియు ఆయనే ప్రతిదాని గురించి జ్ఞానం గలవాడు.

57:4 – هُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۚ يَعْلَمُ مَا يَلِجُ فِي الْأَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنزِلُ مِنَ السَّمَاءِ وَمَا يَعْرُجُ فِيهَا ۖ وَهُوَ مَعَكُمْ أَيْنَ مَا كُنتُمْ ۚ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ٤

ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్‌లలో) సృష్టించిన వాడు, తరువాత ఆయన సింహాసనాన్ని(‘అర్ష్‌ను) అధిష్టించాడు. 6 భూమిలోకి పోయేది మరియు దాని నుండి బయటికి వచ్చేది మరియు ఆకాశం నుండి దిగేది మరియు దానిలోకి ఎక్కేది అంతా ఆయనకు తెలుసు. 5 మరియు మీరెక్కడున్నా ఆయన మీతోపాటు ఉంటాడు. మరియు అల్లాహ్‌ మీరు చేసేదంతా చూస్తున్నాడు.

57:5 – لَّهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَإِلَى اللَّـهِ تُرْجَعُ الْأُمُورُ ٥

ఆకాశాలపై మరియు భూమిపై సామ్రాజ్యాధి పత్యం ఆయనదే మరియు అన్ని వ్యవహారాలు (నిర్ణయానికై) అల్లాహ్‌ వైపునకే తీసుకు పోబడతాయి.

57:6 – يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ ۚ وَهُوَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ٦

ఆయనే రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తాడు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింపజేస్తాడు. 6 మరియు ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసు.

57:7 – آمِنُوا بِاللَّـهِ وَرَسُولِهِ وَأَنفِقُوا مِمَّا جَعَلَكُم مُّسْتَخْلَفِينَ فِيهِ ۖ فَالَّذِينَ آمَنُوا مِنكُمْ وَأَنفَقُوا لَهُمْ أَجْرٌ كَبِيرٌ ٧

అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తను విశ్వ సించండి, ఆయన మిమ్మల్ని ఉత్తరాధికారులుగా చేసినవాటినుండి(దానంగా)ఖర్చుపెట్టండి. 7 మీలో ఎవరైతే విశ్వసించి తమ ధనాన్ని (దానముగా) ఖర్చుచేస్తారో, వారికి గొప్ప ప్రతిఫలం ఉంటుంది.

57:8 – وَمَا لَكُمْ لَا تُؤْمِنُونَ بِاللَّـهِ ۙ وَالرَّسُولُ يَدْعُوكُمْ لِتُؤْمِنُوا بِرَبِّكُمْ وَقَدْ أَخَذَ مِيثَاقَكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ ٨

మరియు మీకేమయింది? మీరు (వాస్త వానికి) విశ్వాసులే అయితే? మీరెందుకు అల్లాహ్‌ను విశ్వసించరు? మరియు ప్రవక్త, మిమ్మల్ని మీ ప్రభువును విశ్వసించండని పిలుస్తున్నాడు మరియు వాస్తవానికి మీచేత ప్రమాణం కూడా చేయించుకున్నాడు. 8

57:9 – هُوَ الَّذِي يُنَزِّلُ عَلَىٰ عَبْدِهِ آيَاتٍ بَيِّنَاتٍ لِّيُخْرِجَكُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۚ وَإِنَّ اللَّـهَ بِكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ ٩

తన దాసుని (ము’హమ్మద్‌)పై స్పష్టమైన ఆయాత్‌ (సూచనలు) అవతరింపజేసేవాడు ఆయనే! అతను వాటి ద్వారా మిమ్మల్ని అంధకారం నుండి వెలుతురులోకి తీసుకు రావటానికి. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ మిమ్మల్ని ఎంతో కనికరించేవాడు, అపార కరుణాప్రదాత.

57:10 – وَمَا لَكُمْ أَلَّا تُنفِقُوا فِي سَبِيلِ اللَّـهِ وَلِلَّـهِ مِيرَاثُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ لَا يَسْتَوِي مِنكُم مَّنْ أَنفَقَ مِن قَبْلِ الْفَتْحِ وَقَاتَلَ ۚ أُولَـٰئِكَ أَعْظَمُ دَرَجَةً مِّنَ الَّذِينَ أَنفَقُوا مِن بَعْدُ وَقَاتَلُوا ۚ وَكُلًّا وَعَدَ اللَّـهُ الْحُسْنَىٰ ۚ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ ١٠

మరియు మీకేమయింది? మీరెందుకు అల్లాహ్‌ మార్గంలో ఖర్చుపెట్టడం లేదు? ఆకాశాలు మరియు భూమి యొక్క వారసత్వం అల్లాహ్‌కే చెందుతుంది. 9 (మక్కహ్) విజయానికి ముందు (అల్లాహ్‌ మార్గంలో) ఖర్చుపెట్టిన వారితో మరియు పోరాడిన వారితో, (మక్కహ్ విజయం తరువాత పోరాడిన వారు మరియు ఖర్చుపెట్టిన వారు) సమానులు కాజాలరు! అలాంటివారి స్థానం (విజయం తరువాత అల్లాహ్‌ మార్గంలో) ఖర్చు పెట్టిన మరియు పోరాడిన వారికంటే గొప్పది. కాని వారందరికీ అల్లాహ్‌ ఉత్తమమైన (ప్రతిఫల) వాగ్దానం చేశాడు. 10 మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును.

57:11 – مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّـهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ وَلَهُ أَجْرٌ كَرِيمٌ ١١

అల్లాహ్‌కు ఉత్తమమైన అప్పు ఇచ్చేవాడు ఎవడు? ఆయన దానిని ఎన్నోరెట్లు హెచ్చించి తిరిగి అతనికి ఇస్తాడు 11 మరియు అతనికి శ్రేష్ఠమైన ప్రతిఫలం (స్వర్గం) ఉంటుంది.

57:12 – يَوْمَ تَرَى الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ يَسْعَىٰ نُورُهُم بَيْنَ أَيْدِيهِمْ وَبِأَيْمَانِهِم بُشْرَاكُمُ الْيَوْمَ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ ١٢

ఆ దినమున నీవు విశ్వాసులైన పురుషు లను మరియు విశ్వాసులైన స్త్రీలను చూస్తే, వారి వెలుగు, వారి ముందు నుండి మరియు వారి కుడివైపు నుండి పరిగెత్తుతూ ఉంటుంది. 12 (వారితో ఇలా అనబడుతుంది): “ఈ రోజు మీకు క్రింద సెలయేర్లు ప్రవహించే స్వర్గవనాల శుభవార్త ఇవ్వబడుతోంది, మీరందులో శాశ్వతంగా ఉంటారు! ఇదే ఆ గొప్ప విజయం.” 13

57:13 – يَوْمَ يَقُولُ الْمُنَافِقُونَ وَالْمُنَافِقَاتُ لِلَّذِينَ آمَنُوا انظُرُونَا نَقْتَبِسْ مِن نُّورِكُمْ قِيلَ ارْجِعُوا وَرَاءَكُمْ فَالْتَمِسُوا نُورًا فَضُرِبَ بَيْنَهُم بِسُورٍ لَّهُ بَابٌ بَاطِنُهُ فِيهِ الرَّحْمَةُ وَظَاهِرُهُ مِن قِبَلِهِ الْعَذَابُ ١٣

ఆ రోజు కపటవిశ్వాసులైన పురుషులు మరియు కపటవిశ్వాసులైన స్త్రీలు విశ్వాసులతో ఇలా అంటారు: 14 “మీరు మాకొరకు కొంచెం వేచి ఉండండి, మేము మీ వెలుగు నుండి కొంచెం తీసు కుంటాము.” 15 వారితో ఇలా అనబడుతుంది: “మీరు వెనుకకు మరలి పొండి, తరువాత వెలుగు కొరకు వెదకండి!” అప్పుడు వారి మధ్య ఒక గోడ నిలబెట్టబడుతుంది. దానికి ఒక ద్వార ముంటుంది, దాని లోపలివైపు కారుణ్య ముంటుంది 16 మరియు దాని బయటవైపు శిక్ష ఉంటుంది. 17

57:14 – يُنَادُونَهُمْ أَلَمْ نَكُن مَّعَكُمْ ۖ قَالُوا بَلَىٰ وَلَـٰكِنَّكُمْ فَتَنتُمْ أَنفُسَكُمْ وَتَرَبَّصْتُمْ وَارْتَبْتُمْ وَغَرَّتْكُمُ الْأَمَانِيُّ حَتَّىٰ جَاءَ أَمْرُ اللَّـهِ وَغَرَّكُم بِاللَّـهِ الْغَرُورُ ١٤

(బయటనున్న కపటవిశ్వాసులు) ఇలా అరుస్తారు: “ఏమీ? మేము మీతో పాటు ఉండే వాళ్ళం కాదా?” (విశ్వాసులు) ఇలా జవాబిస్తారు: “ఎందుకు ఉండలేదు? కానీ వాస్తవానికి మిమ్మల్ని మీరు స్వయంగా పరీక్షకు గురిచేసుకున్నారు. మీరు మా (నాశనంకోసం) వేచిఉన్నారు. మరియు మీరు (పునరుత్థానాన్ని) సందేహిస్తూ ఉన్నారు మరియు మీ తుచ్ఛమైన కోరికలు మిమ్మల్ని మోసపుచ్చాయి. చివరకు అల్లాహ్‌ నిర్ణయం వచ్చింది. మరియు ఆ మోసగాడు (షై’తాన్‌) మిమ్మల్నిఅల్లాహ్‌ విషయంలో మోసపుచ్చాడు 18

57:15 – فَالْيَوْمَ لَا يُؤْخَذُ مِنكُمْ فِدْيَةٌ وَلَا مِنَ الَّذِينَ كَفَرُوا ۚ مَأْوَاكُمُ النَّارُ ۖ هِيَ مَوْلَاكُمْ ۖ وَبِئْسَ الْمَصِيرُ ١٥

కావున ఈ రోజు మీ నుండి ఏవిధమైన పరిహారం తీసుకోబడదు. మరియు సత్య-తిరస్కారుల నుండి కూడా తీసుకోబడదు. మీ నివాసం నరకమే, అదే మీ ఆశ్రయం. 19 ఎంత చెడ్డ గమ్యస్థానం!” (7/8)

57:16 – أَلَمْ يَأْنِ لِلَّذِينَ آمَنُوا أَن تَخْشَعَ قُلُوبُهُمْ لِذِكْرِ اللَّـهِ وَمَا نَزَلَ مِنَ الْحَقِّ وَلَا يَكُونُوا كَالَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلُ فَطَالَ عَلَيْهِمُ الْأَمَدُ فَقَسَتْ قُلُوبُهُمْ ۖ وَكَثِيرٌ مِّنْهُمْ فَاسِقُونَ ١٦

  • ఏమీ? విశ్వాసుల హృదయాలు అల్లాహ్‌ ప్రస్తావవనతో కృంగిపోయి, ఆయన అవతరింప జేసిన సత్యానికి విధేయులయ్యే సమయం ఇంకా రాలేదా? పూర్వగ్రంథ ప్రజల్లాగా వారు కూడా మారి పోకూడదు. ఎందుకంటే చాలా కాలం గడిచి పోయినందుకు వారి హృదయాలు కఠినమై పోయాయి. మరియు వారిలో చాలా మంది అవిధేయులు (ఫాసిఖూన్‌) ఉన్నారు. 20

57:17 – اعْلَمُوا أَنَّ اللَّـهَ يُحْيِي الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ قَدْ بَيَّنَّا لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَعْقِلُونَ ١٧

బాగా తెలుసుకోండి! నిశ్చయంగా అల్లాహ్‌, భూమి చనిపోయిన తరువాత, దానికి మళ్ళీ జీవం పోస్తాడు. వాస్తవానికి మేము ఈ సూచనలను మీకు స్పష్టంగా తెలుపుతున్నాము, బహుశా మీరు అర్థం చేసుకుంటారని.

57:18 – إِنَّ الْمُصَّدِّقِينَ وَالْمُصَّدِّقَاتِ وَأَقْرَضُوا اللَّـهَ قَرْضًا حَسَنًا يُضَاعَفُ لَهُمْ وَلَهُمْ أَجْرٌ كَرِيمٌ ١٨

నిశ్చయంగా, విధిదానం(‘జకాత్‌) చేసే పురు షులు మరియు విధిదానంచేసే స్త్రీలు మరియు అల్లాహ్‌కు మంచి అప్పు ఇచ్చేవారికి, ఆయన దానిని ఎన్నోరెట్లు పెంచి (తిరిగి) ఇస్తాడు. 21 మరియు వారికి గొప్ప ప్రతిఫలం ఉంటుంది.

57:19 – وَالَّذِينَ آمَنُوا بِاللَّـهِ وَرُسُلِهِ أُولَـٰئِكَ هُمُ الصِّدِّيقُونَ ۖ وَالشُّهَدَاءُ عِندَ رَبِّهِمْ لَهُمْ أَجْرُهُمْ وَنُورُهُمْ ۖ وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَـٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ ١٩

మరియు ఎవరైతే అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తలనువిశ్వసిస్తారో, అలాంటివారే సత్య సంధులైన (విశ్వాసులు). మరియు వారే తమ ప్రభువువద్ద అమరవీరులు. వారికి వారి ప్రతి ఫలం మరియు జ్యోతి లభిస్తాయి. కాని ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో మరియు మా ఆయతు లను అబద్ధాలని అంటారో, అలాంటి వారు తప్పక భగభగ మండే నరకాగ్ని వాసులవుతారు.

57:20 – اعْلَمُوا أَنَّمَا الْحَيَاةُ الدُّنْيَا لَعِبٌ وَلَهْوٌ وَزِينَةٌ وَتَفَاخُرٌ بَيْنَكُمْ وَتَكَاثُرٌ فِي الْأَمْوَالِ وَالْأَوْلَادِ ۖ كَمَثَلِ غَيْثٍ أَعْجَبَ الْكُفَّارَ نَبَاتُهُ ثُمَّ يَهِيجُ فَتَرَاهُ مُصْفَرًّا ثُمَّ يَكُونُ حُطَامًا ۖ وَفِي الْآخِرَةِ عَذَابٌ شَدِيدٌ وَمَغْفِرَةٌ مِّنَ اللَّـهِ وَرِضْوَانٌ ۚ وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ ٢٠

బాగా తెలుసుకోండి! నిశ్చయంగా, ఇహలోక జీవితం, ఒక ఆట మరియు ఒక వినోదం మరియు ఒక శృంగారం మరియు మీరు పరస్పరం గొప్పలు చెప్పుకోవడం మరియు సంపద మరియు సంతానం విషయంలో ఆధిక్యత పొందటానికి ప్రయత్నించడం మాత్రమే. 22 దాని దృష్టాంతం ఆ వర్షంవలే ఉంది: దాని (వర్షం) వల్ల పెరిగే పైరు రైతులకు ఆనందం కలిగిస్తుంది. 23 ఆ పిదప అది ఎండిపోయి పసుపుపచ్చగా మారిపోతుంది. ఆ పిదప అది పొట్టుగా మారిపోతుంది. కాని పరలోక జీవితంలో మాత్రం (దుష్టులకు) బాధాకరమైన శిక్ష మరియు (సత్పురుషులకు) అల్లాహ్‌ నుండి క్షమాపణ మరియు ఆయన ప్రసన్నత ఉంటాయి. కావున ఇహలోక జీవితం కేవలం మోసగించే బోగభాగ్యాలు మాత్రమే.

57:21 – سَابِقُوا إِلَىٰ مَغْفِرَةٍ مِّن رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا كَعَرْضِ السَّمَاءِ وَالْأَرْضِ أُعِدَّتْ لِلَّذِينَ آمَنُوا بِاللَّـهِ وَرُسُلِهِ ۚ ذَٰلِكَ فَضْلُ اللَّـهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّـهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ ٢١

మీ ప్రభువు క్షమాపణ వైపునకు మరియు ఆకాశం మరియు భూమియొక్క వైశాల్యమంతటి విశాలమైన స్వర్గం వైపునకు పరుగెత్తండి. అది అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించే వారికొరకు సిద్ధపరచబడి ఉంది. ఇది అల్లాహ్‌ అనుగ్రహం, ఆయన తాను కోరినవారికి దానిని ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్‌ అనుగ్రహశాలి, సర్వోత్తముడు.

57:22 – مَا أَصَابَ مِن مُّصِيبَةٍ فِي الْأَرْضِ وَلَا فِي أَنفُسِكُمْ إِلَّا فِي كِتَابٍ مِّن قَبْلِ أَن نَّبْرَأَهَا ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّـهِ يَسِيرٌ ٢٢

భూమిమీద గానీ లేదా స్వయంగా మీ మీద గానీ విరుచుకుపడే ఏ ఆపద అయినా సరే! మేము దానిని సంభవింపజేయకముందే గ్రంథంలో వ్రాయబడకుండా లేదు. నిశ్చయంగా, ఇది అల్లాహ్‌కు ఎంతో సులభం. 24

57:23 – لِّكَيْلَا تَأْسَوْا عَلَىٰ مَا فَاتَكُمْ وَلَا تَفْرَحُوا بِمَا آتَاكُمْ ۗ وَاللَّـهُ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ ٢٣

ఇదంతా మీరు పోయిన దానికి నిరాశ చెందకూడదని మరియు మీకు ఇచ్చిన దానికి సంతోషంతో ఉప్పొంగిపోరాదని. 25 మరియు అల్లాహ్‌ బడాయీలు చెప్పుకునే వారూ, గర్వించే వారూ అంటే ఇష్టపడడు.

57:24 – الَّذِينَ يَبْخَلُونَ وَيَأْمُرُونَ النَّاسَ بِالْبُخْلِ ۗ وَمَن يَتَوَلَّ فَإِنَّ اللَّـهَ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ ٢٤

ఎవరైతే స్వయంగా లోభత్వంచూపుతూ 26 ఇతరులను కూడా లోభత్వానికి పురికొలుపుతారో మరియు ఎవడైతే (సత్యం నుండి) వెనుదిరుగు తాడో, వాడు (తెలుసుకోవాలి) నిశ్చయంగా అల్లాహ్‌ స్వయం సమృధ్ధుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడని!

57:25 – لَقَدْ أَرْسَلْنَا رُسُلَنَا بِالْبَيِّنَاتِ وَأَنزَلْنَا مَعَهُمُ الْكِتَابَ وَالْمِيزَانَ لِيَقُومَ النَّاسُ بِالْقِسْطِ ۖ وَأَنزَلْنَا الْحَدِيدَ فِيهِ بَأْسٌ شَدِيدٌ وَمَنَافِعُ لِلنَّاسِ وَلِيَعْلَمَ اللَّـهُ مَن يَنصُرُهُ وَرُسُلَهُ بِالْغَيْبِ ۚ إِنَّ اللَّـهَ قَوِيٌّ عَزِيزٌ ٢٥

వాస్తవానికి, మేము మా సందేశహరులను స్పష్టమైన సూచనలనిచ్చి పంపాము. మరియు వారితో బాటు గ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు మానవులు న్యాయశీలురుగా మెలగ టానికి త్రాసును కూడా పంపాము 27 మరియు ఇనుమును కూడా ప్రసాదించాము. అందులో గొప్పశక్తి ఉంది, మరియు మానవులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. 28 మరియు (ఇదంతా) అల్లాహ్‌ అగోచరుడైన తనకు మరియు తన ప్రవక్తలకు ఎవడు సహాయకుడవుతాడో చూడటానికి చేశాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ మహా బలశాలి, సర్వ శక్తిమంతుడు.

57:26 – وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا وَإِبْرَاهِيمَ وَجَعَلْنَا فِي ذُرِّيَّتِهِمَا النُّبُوَّةَ وَالْكِتَابَ ۖ فَمِنْهُم مُّهْتَدٍ ۖ وَكَثِيرٌ مِّنْهُمْ فَاسِقُونَ ٢٦

మరియు వాస్తవంగా మేము నూ’హ్‌ను మరియు ఇబ్రాహీమ్‌ను పంపాము. మరియు వారిద్దరి సంతానంలో ప్రవక్త పదవినీ మరియు గ్రంథాన్ని ఉంచాము. కాని వారిసంతతిలో కొందరు మార్గదర్శకత్వం మీద ఉన్నారు, కాని వారిలో చాలామంది అవిధేయులు (ఫాసిఖూన్‌) ఉన్నారు.

57:27 – ثُمَّ قَفَّيْنَا عَلَىٰ آثَارِهِم بِرُسُلِنَا وَقَفَّيْنَا بِعِيسَى ابْنِ مَرْيَمَ وَآتَيْنَاهُ الْإِنجِيلَ وَجَعَلْنَا فِي قُلُوبِ الَّذِينَ اتَّبَعُوهُ رَأْفَةً وَرَحْمَةً وَرَهْبَانِيَّةً ابْتَدَعُوهَا مَا كَتَبْنَاهَا عَلَيْهِمْ إِلَّا ابْتِغَاءَ رِضْوَانِ اللَّـهِ فَمَا رَعَوْهَا حَقَّ رِعَايَتِهَا ۖ فَآتَيْنَا الَّذِينَ آمَنُوا مِنْهُمْ أَجْرَهُمْ ۖ وَكَثِيرٌ مِّنْهُمْ فَاسِقُونَ ٢٧

ఆ తరువాత చాలా మంది ప్రవక్తలను మేము వారి తరువాత పంపాము. మరియు మర్యమ్‌ కుమారుడు ఈసాను కూడా పంపాము మరియు అతనికి ఇంజీల్‌ను ప్రసాదించాము. మరియు అతనిని అనుసరించే వారి హృదయా లలో మేము జాలిని, కరుణను కలిగించాము, కాని సన్యాసాన్ని 29 వారేస్వయంగాకల్పించుకున్నారు. మేము దానిని వారిపై విధించలేదు, కాని అల్లాహ్‌ ప్రసన్నతను పొందగోరి వారే దానిని విధించు కున్నారు, కాని వారు దానిని పాటించవలసిన విధంగా నిజాయితీతో పాటించలేదు. కావున వారిలో విశ్వసించినవారికి వారి ప్రతిఫలాన్ని ప్రసాదించాము. కాని వారిలో చాలామంది అవిధేయులు (ఫాసిఖూన్‌) ఉన్నారు.

57:28 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّـهَ وَآمِنُوا بِرَسُولِهِ يُؤْتِكُمْ كِفْلَيْنِ مِن رَّحْمَتِهِ وَيَجْعَل لَّكُمْ نُورًا تَمْشُونَ بِهِ وَيَغْفِرْ لَكُمْ ۚ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٢٨

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ యందు భయ- భక్తులు కలిగి ఉండండి, మరియు ఆయన సందేశహరుణ్ణి విశ్వసించండి, ఆయన (అల్లాహ్‌) మీకు రెట్టింపు కరుణను ప్రసాదిస్తాడు మరియు వెలుగును ప్రసాదిస్తాడు, మీరు అందులో నడుస్తారు మరియు ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. మరియు అల్లాహ్‌ ఎంతో క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

57:29 – لِّئَلَّا يَعْلَمَ أَهْلُ الْكِتَابِ أَلَّا يَقْدِرُونَ عَلَىٰ شَيْءٍ مِّن فَضْلِ اللَّـهِ ۙ وَأَنَّ الْفَضْلَ بِيَدِ اللَّـهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّـهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ ٢٩

అల్లాహ్‌ అనుగ్రహం మీద తమకు ఎలాంటి అధికారం లేదని మరియు నిశ్చయంగా, అనుగ్రహం కేవలం అల్లాహ్‌ చేతిలో ఉందని మరియు ఆయన తాను కోరిన వారికి దానిని ప్రసాదిస్తాడని, పూర్వ గ్రంథప్రజలు తెలుసుకోవాలి. మరియు అల్లాహ్‌ అనుగ్రహశాలి, సర్వోత్తముడు.

సూరహ్‌ అల్‌-ముజాదిలహ్‌ – అల్‌-ముజా(ది)దలహ్‌: వాదించటం. ఈ 10 మదీనహ్ సూరాహ్‌ల సమూహంలో ఇది 2వది. ఇస్లాంకు ముందు ‘అరబ్బులలో స్త్రీలపై జరిగే అన్యాయాన్ని గురించి మరియు దానిని నిషేధించడం గురించి ఇందులో వివరించబడింది. ఇది దాదాపు 4-5 హిజ్రీలో అవతరింపజేయ- బడింది. ఇది బహుశా సూరహ్‌ అల్‌-అహ్‌జాబ్‌ (33) కంటే ముందు అవతరింపజేయబడింది. 22 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 58:1 – قَدْ سَمِعَ اللَّـهُ قَوْلَ الَّتِي تُجَادِلُكَ فِي زَوْجِهَا وَتَشْتَكِي إِلَى اللَّـهِ وَاللَّـهُ يَسْمَعُ تَحَاوُرَكُمَا ۚ إِنَّ اللَّـهَ سَمِيعٌ بَصِيرٌ ١

[(*)] వాస్తవానికి, తన భర్తను గురించి నీతో వాదిస్తున్న మరియు అల్లాహ్‌తో మోరపెట్టు కుంటున్న ఆ స్త్రీ మాటలు అల్లాహ్‌ విన్నాడు. 1 అల్లాహ్‌ మీ ఇద్దరి సంభాషణ వింటున్నాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వం వినేవాడు, సమస్తం చూసేవాడు.

58:2 – الَّذِينَ يُظَاهِرُونَ مِنكُم مِّن نِّسَائِهِم مَّا هُنَّ أُمَّهَاتِهِمْ ۖ إِنْ أُمَّهَاتُهُمْ إِلَّا اللَّائِي وَلَدْنَهُمْ ۚ وَإِنَّهُمْ لَيَقُولُونَ مُنكَرًا مِّنَ الْقَوْلِ وَزُورًا ۚ وَإِنَّ اللَّـهَ لَعَفُوٌّ غَفُورٌ ٢

మీలో ఎవరైతే తమ భార్యలను “జిహార్‌ ద్వారా దూరంగా ఉంచుతారో! అలాంటి వారి భార్యలు, వారి తల్లులు కాలేరు. వారిని కన్నవారు మాత్రమే వారి తల్లులు. 2 మరియు నిశ్చయంగా, వారు అనుచితమైన మరియు అబద్ధమైన మాట పలుకుతున్నారు. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ మన్నించేవాడు, క్షమాశీలుడు.

58:3 – وَالَّذِينَ يُظَاهِرُونَ مِن نِّسَائِهِمْ ثُمَّ يَعُودُونَ لِمَا قَالُوا فَتَحْرِيرُ رَقَبَةٍ مِّن قَبْلِ أَن يَتَمَاسَّا ۚ ذَٰلِكُمْ تُوعَظُونَ بِهِ ۚ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ ٣

మరియు ఎవరైతే తమ భార్యలను “జిహార్‌ ద్వారా దూరంచేసి, తరువాత తమ మాటను వారు ఉపసంహరించుకోదలిస్తే! వారిద్దరు ఒకరి నొకరు తాకక ముందు, ఒక బానిసను విడుదల చేయించాలి. ఈ విధంగా మీకు ఉపదేశమివ్వ బడుతోంది. మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్‌ ఎరుగును.

58:4 – فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ مِن قَبْلِ أَن يَتَمَاسَّا ۖ فَمَن لَّمْ يَسْتَطِعْ فَإِطْعَامُ سِتِّينَ مِسْكِينًا ۚ ذَٰلِكَ لِتُؤْمِنُوا بِاللَّـهِ وَرَسُولِهِ ۚ وَتِلْكَ حُدُودُ اللَّـهِ ۗ وَلِلْكَافِرِينَ عَذَابٌ أَلِيمٌ ٤

కాని ఎవడైతే ఇలా చేయలేడో, అతడు తన భార్యను తాకకముందు, రెండు నెలలు వరుసగా ఉపవాసముండాలి. ఇది కూడా చేయలేనివాడు, అరవైమంది నిరుపేదలకు భోజనంపెట్టాలి. ఇదంతా మీరు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించటానికి. మరియు ఇవి అల్లాహ్‌ నిర్ణయించిన హద్దులు. మరియు సత్య-తిరస్కా రులకు బాధాకర మైన శిక్ష పడుతుంది.

58:5 – إِنَّ الَّذِينَ يُحَادُّونَ اللَّـهَ وَرَسُولَهُ كُبِتُوا كَمَا كُبِتَ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ وَقَدْ أَنزَلْنَا آيَاتٍ بَيِّنَاتٍ ۚ وَلِلْكَافِرِينَ عَذَابٌ مُّهِينٌ ٥

నిశ్చయంగా, అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించేవారు, తమకు పూర్వం గతించిన వారు అవమానింపబడినట్లు అవమా నింపబడతారు. మరియు వాస్తవానికి మేము స్పష్టమైన సూచనలను (ఆయాత్‌లను) అవత రింపజేశాము. మరియు సత్య-తిరస్కారులకు అవమానకరమైన శిక్ష పడుతుంది.

58:6 – يَوْمَ يَبْعَثُهُمُ اللَّـهُ جَمِيعًا فَيُنَبِّئُهُم بِمَا عَمِلُوا ۚ أَحْصَاهُ اللَّـهُ وَنَسُوهُ ۚ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ ٦

అల్లాహ్‌ వారందరిని మరల బ్రతికించి లేపి, వారు చేసిందంతా వారికి తెలిపేరోజున వారు (తాము చేసిందంతా) మరచిపోయి ఉండవచ్చు, కాని అల్లాహ్‌ అంతా లెక్కపెట్టి ఉంచుతాడు. మరియు అల్లాహ్‌యే ప్రతిదానికి సాక్షి.

58:7 – أَلَمْ تَرَ أَنَّ اللَّـهَ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ مَا يَكُونُ مِن نَّجْوَىٰ ثَلَاثَةٍ إِلَّا هُوَ رَابِعُهُمْ وَلَا خَمْسَةٍ إِلَّا هُوَ سَادِسُهُمْ وَلَا أَدْنَىٰ مِن ذَٰلِكَ وَلَا أَكْثَرَ إِلَّا هُوَ مَعَهُمْ أَيْنَ مَا كَانُوا ۖ ثُمَّ يُنَبِّئُهُم بِمَا عَمِلُوا يَوْمَ الْقِيَامَةِ ۚ إِنَّ اللَّـهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ٧

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలలో మరియు భూమిలోనున్న సర్వమూ అల్లాహ్‌కు తెలుసునని? ఏ ముగ్గురు కలిసి రహస్య సమాలోచనలు చేస్తూవున్నా ఆయన నాలుగవ వాడిగా ఉంటాడు. మరియు ఏ అయిదు గురు రహస్యసమాలోచనలు చేస్తూవున్నా ఆయన ఆరవవాడిగా ఉంటాడు. మరియు అంతకు తక్కువ మందిగానీ లేక అంతకు ఎక్కువమంది గానీ ఉన్నా ఆయన వారితో తప్పక ఉంటాడు. 4 వారు ఎక్కడ వున్నాసరే! తరువాత ఆయన పునరుత్థానదినమున వారు చేసిన కర్మలను వారికి తెలుపుతాడు. నిశ్చయంగా, అల్లాహ్‌కు ప్రతి విషయం గురించి బాగాతెలుసు.

58:8 – أَلَمْ تَرَ إِلَى الَّذِينَ نُهُوا عَنِ النَّجْوَىٰ ثُمَّ يَعُودُونَ لِمَا نُهُوا عَنْهُ وَيَتَنَاجَوْنَ بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِيَتِ الرَّسُولِ وَإِذَا جَاءُوكَ حَيَّوْكَ بِمَا لَمْ يُحَيِّكَ بِهِ اللَّـهُ وَيَقُولُونَ فِي أَنفُسِهِمْ لَوْلَا يُعَذِّبُنَا اللَّـهُ بِمَا نَقُولُ ۚ حَسْبُهُمْ جَهَنَّمُ يَصْلَوْنَهَا ۖ فَبِئْسَ الْمَصِيرُ ٨

ఏమీ? నీకు తెలియదా (చూడటంలేదా)? రహస్య సమాలోచనల్ని నిషేధించటం జరిగి నప్పటికీ! వారు – వారికి నిషేధింపబడిన దానినే – మళ్ళీ చేస్తున్నారని? 5 మరియు వారు రహస్యంగా – పాపం చేయడం, హద్దులు మీరి ప్రవర్తించడం మరియు ప్రవక్త ఆజ్ఞలను ఉల్లంఘించడం గురించి – సమాలోచనలు చేస్తున్నారని! (ఓ ము’హమ్మద్‌!) నీవద్దకు వచ్చి నపుడు, అల్లాహ్‌ కూడా నీకు సలాం చేయని విధంగా, వారు నీకు సలాంచేస్తూ, తమలో తాము ఇలా అనుకుంటారు: 6 “మేము పలికే మాటలకు అల్లాహ్‌ మమ్మల్ని ఎందుకు శిక్షించటంలేదు?” వారికి నరకమే చాలు, వారందులో ప్రవేశిస్తారు. ఎంత ఘోరమైన గమ్యస్థానం!

58:9 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا تَنَاجَيْتُمْ فَلَا تَتَنَاجَوْا بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِيَتِ الرَّسُولِ وَتَنَاجَوْا بِالْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَاتَّقُوا اللَّـهَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ ٩

ఓ విశ్వాసులారా! మీరు రహస్యసమాలో- చనలు చేస్తే – పాపకార్యాలు, హద్దులు మీరి ప్రవర్తించటం మరియు ప్రవక్త ఆజ్ఞలను ఉల్లంఘిం చటం గురించి కాకుండా – పుణ్యకార్యాలు మరియు దైవభీతికి సంబంధించిన విషయాలను గురించి మాత్రమే (రహస్య సమాలోచనలు) చేయండి. మరియు అల్లాహ్‌ పట్ల భయ-భక్తులు కలిగి ఉండండి. ఆయన సన్నిధిలోనే మీరు సమావేశపరచబడతారు.

58:10 – إِنَّمَا النَّجْوَىٰ مِنَ الشَّيْطَانِ لِيَحْزُنَ الَّذِينَ آمَنُوا وَلَيْسَ بِضَارِّهِمْ شَيْئًا إِلَّا بِإِذْنِ اللَّـهِ ۚ وَعَلَى اللَّـهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ ١٠

నిశ్చయంగా, రహస్య సమాలోచన షై’తాన్‌ చేష్టయే. 7 అది విశ్వాసులకు దుఃఖం కలిగించ- టానికే! కాని అల్లాహ్‌ అనుమతిలేనిదే అది వారికి ఏ మాత్రం నష్టం కలిగించజాలదు. 8 మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్‌ మీదే నమ్మకం ఉంచుకోవాలి.

58:11 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا قِيلَ لَكُمْ تَفَسَّحُوا فِي الْمَجَالِسِ فَافْسَحُوا يَفْسَحِ اللَّـهُ لَكُمْ ۖ وَإِذَا قِيلَ انشُزُوا فَانشُزُوا يَرْفَعِ اللَّـهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ ۚ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ ١١

ఓ విశ్వాసులారా సమావేశాలలో (వచ్చే వారికి) చోటు కల్పించమని మీతో అన్నప్పుడు, మీరు జరిగి, చోటుకల్పిస్తే, అల్లాహ్‌ మీకు విశాలమైన చోటును ప్రసాదిస్తాడు. 9 మరియు ఒకవేళ మీతో (నమా’జ్‌ లేక జిహాద్‌కు) లేవండి అని చెప్పబడితే! మీరు లేవండి. మరియు మీలో విశ్వసించిన వారికి మరియు జ్ఞానం ప్రసాదించ- బడిన వారికి అల్లాహ్‌ ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు. 10 మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును.

58:12 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نَاجَيْتُمُ الرَّسُولَ فَقَدِّمُوا بَيْنَ يَدَيْ نَجْوَاكُمْ صَدَقَةً ۚ ذَٰلِكَ خَيْرٌ لَّكُمْ وَأَطْهَرُ ۚ فَإِن لَّمْ تَجِدُوا فَإِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٢

ఓ విశ్వాసులారా! మీరు ప్రవక్తతో ఏకాంతంలో మాట్లాడదలిస్తే, మాట్లాడబోయే ముందు, ఏదైనా కొంత దానం చేయండి. ఇది మీ కొరకు ఉత్తమమైనది మరియు చాలాశ్రేష్ఠమైనది. కాని (ఒకవేళ దానంచేయటానికి) మీ వద్ద ఏమీలేకపోతే, నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత అని తెలుసుకోండి.

58:13 – أَأَشْفَقْتُمْ أَن تُقَدِّمُوا بَيْنَ يَدَيْ نَجْوَاكُمْ صَدَقَاتٍ ۚ فَإِذْ لَمْ تَفْعَلُوا وَتَابَ اللَّـهُ عَلَيْكُمْ فَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَأَطِيعُوا اللَّـهَ وَرَسُولَهُ ۚ وَاللَّـهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ ١٣

ఏమీ? మీరు (ప్రవక్తతో) మీ ఏకాంత సమాలోచనలకు ముందు దానాలు చేయవలసి ఉన్నదని భయపడుతున్నారా? ఒకవేళ మీరు అలా (దానం) చేయకపోతే అల్లాహ్‌ మిమ్మల్ని మన్నించాడు, కావున మీరు నమా’జ్‌ను స్థాపించండి మరియు విధిదానం (‘జకాత్‌) ఇవ్వండి. అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకు విధేయులుగా ఉండండి. వాస్తవానికి మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును. (1/8)

58:14 – أَلَمْ تَرَ إِلَى الَّذِينَ تَوَلَّوْا قَوْمًا غَضِبَ اللَّـهُ عَلَيْهِم مَّا هُم مِّنكُمْ وَلَا مِنْهُمْ وَيَحْلِفُونَ عَلَى الْكَذِبِ وَهُمْ يَعْلَمُونَ ١٤

  • ఏమీ? అల్లాహ్‌ ఆగ్రహానికి గురిఅయిన జాతివారి వైపుకు మరలినవారిని నీవు చూడలేదా? వారు మీతో చేరినవారు కారు మరియు వారితోను చేరినవారు కారు. వారు బుధ్ధిపూర్వకంగా అసత్య ప్రమాణం చేస్తున్నారు.

58:15 – أَعَدَّ اللَّـهُ لَهُمْ عَذَابًا شَدِيدًا ۖ إِنَّهُمْ سَاءَ مَا كَانُوا يَعْمَلُونَ ١٥

అల్లాహ్‌ వారి కొరకు కఠిన శిక్షను సిధ్ధపరచి ఉంచాడు. నిశ్చయంగా, వారు చేసే పనులన్నీ చాలా చెడ్డవి.

58:16 – اتَّخَذُوا أَيْمَانَهُمْ جُنَّةً فَصَدُّوا عَن سَبِيلِ اللَّـهِ فَلَهُمْ عَذَابٌ مُّهِينٌ ١٦

వారు తమ ప్రమాణాలను డాలుగా చేసుకొని (ప్రజలను) అల్లాహ్‌ మార్గం నుండి నిరోధిస్తున్నారు, కావున వారికి అవమానకరమైన శిక్ష పడుతుంది.

58:17 – لَّن تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُم مِّنَ اللَّـهِ شَيْئًا ۚ أُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ١٧

అల్లాహ్‌ (శిక్ష) నుండి కాపాడటానికి, వారి సంపదలు గానీ, వారి సంతానం గానీ, వారికి ఏ మాత్రం పనికిరావు. ఇలాంటి వారే నరకాగ్ని వాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

58:18 – يَوْمَ يَبْعَثُهُمُ اللَّـهُ جَمِيعًا فَيَحْلِفُونَ لَهُ كَمَا يَحْلِفُونَ لَكُمْ ۖ وَيَحْسَبُونَ أَنَّهُمْ عَلَىٰ شَيْءٍ ۚ أَلَا إِنَّهُمْ هُمُ الْكَاذِبُونَ ١٨

అల్లాహ్‌ వారందరినీ మరల బ్రతికించి లేపిన రోజు, వారు మీతో ప్రమాణాలు చేసినట్లు ఆయన (అల్లాహ్‌) ముందు కూడా ప్రమాణాలు చేస్తారు. మరియు దాని వలన వారు మంచి స్థితిలో ఉన్నారని భావిస్తారు. జాగ్రత్త! నిశ్చయంగా, ఇలాంటి వారే అసత్యవాదులు!

58:19 – اسْتَحْوَذَ عَلَيْهِمُ الشَّيْطَانُ فَأَنسَاهُمْ ذِكْرَ اللَّـهِ ۚ أُولَـٰئِكَ حِزْبُ الشَّيْطَانِ ۚ أَلَا إِنَّ حِزْبَ الشَّيْطَانِ هُمُ الْخَاسِرُونَ ١٩

షై’తాన్‌ వారిపై ప్రాబల్యం పొందినందువలన వారిని అల్లాహ్‌ ధ్యానం నుండి మరపింపజేశాడు. అలాంటివారు షై’తాన్‌ పక్షానికి చెందినవారు. జాగ్రత్త! షై’తాన్‌ పక్షానికి చెందినవారు, వారే! నిశ్చయంగా నష్టపోయేవారు.

58:20 – إِنَّ الَّذِينَ يُحَادُّونَ اللَّـهَ وَرَسُولَهُ أُولَـٰئِكَ فِي الْأَذَلِّينَ ٢٠

నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకిస్తారో! అలాంటి వారే, పరమ నీచులలో చేరినవారు.

58:21 – كَتَبَ اللَّـهُ لَأَغْلِبَنَّ أَنَا وَرُسُلِي ۚ إِنَّ اللَّـهَ قَوِيٌّ عَزِيزٌ ٢١

“నిశ్చయంగా, నేను మరియు నా ప్రవక్తలు మాత్రమే ప్రాబల్యం వహిస్తాము.” అని అల్లాహ్‌ వ్రాసిపెట్టాడు 11 నిశ్చయంగా, అల్లాహ్‌ మహా బలశాలి, సర్వ శక్తిమంతుడు!

58:22 – لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّـهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ ۚ أُولَـٰئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ الْإِيمَانَ وَأَيَّدَهُم بِرُوحٍ مِّنْهُ ۖ وَيُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ رَضِيَ اللَّـهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ أُولَـٰئِكَ حِزْبُ اللَّـهِ ۚ أَلَا إِنَّ حِزْبَ اللَّـهِ هُمُ الْمُفْلِحُونَ ٢٢

అల్లాహ్‌ మరియు పరలోకాన్ని విశ్వసించే జనులలో, అల్లాహ్‌ మరియు ఆయన సందేశ- హరుణ్ణి వ్యతిరేకించే వారితో స్నేహం చేసుకునే వారిని నీవు పొందలేవు! 12 ఆ వ్యతిరేకించేవారు, తమ తండ్రులైనా లేదా తమ కుమారులైనా లేదా తమ సోదరులైనా లేదా తమ కుంటుంబంవారైనా సరే! 13 అలాంటివారి హృదయాలలో ఆయన విశ్వాసాన్ని స్థిరపరచాడు. మరియు వారిని తన వైపు నుండి ఒక ఆత్మశక్తి (రూ’హ్‌) ఇచ్చి బలపరిచాడు. మరియు వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్‌ వారి పట్ల ప్రసన్నుడవుతాడు మరియు వారు ఆయన పట్ల ప్రసన్నులవుతారు. ఇలాంటి వారు అల్లాహ్‌ పక్షానికి చెందినవారు. గుర్తుంచుకోండి! నిశ్చయంగా, అల్లాహ్‌ పక్షం వారే సాఫల్యం పొందేవారు.

సూరహ్‌ అల్‌-‘హష్ర్‌ – అల్‌-‘హష్రు: అంటే సమకూర్చటం, సమావేశపరచటం, ప్రోగుచేయటం, కూడబెట్టటం, సమీకరించటం అని అర్థం. ఈ 10 మదీనహ్ సూరహ్‌లలో ఇది 3వది. 3వ హిజ్రీలో ఉ’హుద్‌ యుద్ధంలో ముస్లింలకు కొంత పరాభవం కలిగినందుకు, బనూ-న’దీర్‌ తెగవారు ముస్లింలతో చేసుకున్న ఒప్పందాన్ని త్రెంపుకొని, మక్కహ్ ముష్రిక్‌ ఖురైషులతో మైత్రి చేసుకొని విశ్వాసఘాతకం చేసినందుకు, వారిని రబీ’ అల్‌-అవ్వల్‌ 4వ హిజ్రీలో మదీనహ్‌ మునవ్వరహ్‌ నుండి వెడలగొట్టిన విషయం పేర్కొనబడింది. (2-7). సమాజపు కొన్ని ముఖ్య అంశాలు ఇందులో వివరించబడ్డాయి. బనూ-న’దీర్‌ తెగవారిని గురించి ఈ సూరహ్‌ అవతరింపజేయబడింది. కాబట్టి ఇది సూరహ్‌ అన్‌-న’దీర్‌ అని కూడా అనబడుతుంది. (‘స’హీ’హ్‌ బు’ఖారీ). వారిలో చాలా మంది సిరియాకు వెళ్ళిపోయారు. రెండు కుటుంబాల వారు మాత్రమే ‘ఖైబర్‌కు పోయారు. విశ్వాసులు, తాము సత్యసంధులై దైవభీతిపరులైతే – సంఖ్యలో, ధనసంపత్తులలో మరియు యద్ధ సామాగ్రిలో తక్కువ ఉన్నా – సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు అయిన అల్లాహ్‌ (సు.త.) వారికి తప్పక సహాయం చేస్తాడని నమ్మాలి. 24 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 2వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 59:1 – سَبَّحَ لِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ١

ఆకాశాలలోనున్న సమస్తమూ మరియు భూమిలో నున్న సమస్తమూ, అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతుంటాయి. మరియు ఆయనే సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

59:2 – هُوَ الَّذِي أَخْرَجَ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ مِن دِيَارِهِمْ لِأَوَّلِ الْحَشْرِ ۚ مَا ظَنَنتُمْ أَن يَخْرُجُوا ۖ وَظَنُّوا أَنَّهُم مَّانِعَتُهُمْ حُصُونُهُم مِّنَ اللَّـهِ فَأَتَاهُمُ اللَّـهُ مِنْ حَيْثُ لَمْ يَحْتَسِبُوا ۖ وَقَذَفَ فِي قُلُوبِهِمُ الرُّعْبَ ۚ يُخْرِبُونَ بُيُوتَهُم بِأَيْدِيهِمْ وَأَيْدِي الْمُؤْمِنِينَ فَاعْتَبِرُوا يَا أُولِي الْأَبْصَارِ ٢

గ్రంథ ప్రజలలోని సత్య-తిరస్కారులను మొదట సమీకరించిన (బనూ-న’దీర్‌ తెగ) వారిని, వారి గృహాల నుండి వెళ్ళగొట్టిన వాడు ఆయనే. 1 వారు వెళ్ళిపోతారని మీరు ఏ మాత్రం భావించ లేదు. మరియు అల్లాహ్‌ నుండి తమను తమ కోటలు తప్పక రక్షిస్తాయని వారు భావించారు! కాని అల్లాహ్‌ (శిక్ష) వారు ఊహించని వైపు నుండి, వారి పై వచ్చిపడింది. మరియు ఆయన వారి హృదయాలలో భయం కలుగజేశాడు, కావున వారు తమ ఇండ్లను తమ చేతులారా మరియు విశ్వాసుల చేతులతో కూడా, నాశనం చేయించు కున్నారు. కావున ఓ పరిజ్ఞానం (కళ్ళు) గల వారలారా! గుణపాఠం నేర్చుకోండి.

59:3 – وَلَوْلَا أَن كَتَبَ اللَّـهُ عَلَيْهِمُ الْجَلَاءَ لَعَذَّبَهُمْ فِي الدُّنْيَا ۖ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابُ النَّارِ ٣

మరియు ఒకవేళ అల్లాహ్‌ వారి విషయంలో దేశబహిష్కారం వ్రాసి ఉండకపోతే, వారిని ఈ ప్రపంచములోనే శిక్షించి ఉండేవాడు. మరియు వారికి పరలోకంలో నరకాగ్ని శిక్ష పడుతుంది.

59:4 – ذَٰلِكَ بِأَنَّهُمْ شَاقُّوا اللَّـهَ وَرَسُولَهُ ۖ وَمَن يُشَاقِّ اللَّـهَ فَإِنَّ اللَّـهَ شَدِيدُ الْعِقَابِ ٤

ఇది ఎందుకంటే, వారు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించారు. మరియు అల్లాహ్‌ను వ్యతిరేకించిన వాడిని శిక్షించటంలో నిశ్చయంగా, అల్లాహ్‌ చాలా కఠినుడు.

59:5 – مَا قَطَعْتُم مِّن لِّينَةٍ أَوْ تَرَكْتُمُوهَا قَائِمَةً عَلَىٰ أُصُولِهَا فَبِإِذْنِ اللَّـهِ وَلِيُخْزِيَ الْفَاسِقِينَ ٥

(ఓ విశ్వాసులారా!) మీరు ఏ ఖర్జూరపు చెట్లను నరికివేశారో 2 లేక ఏ ఖర్జూరపుచెట్లను వాటి వ్రేళ్ళమీద నిలబడేలా వదలిపెట్టారో, అంతా అల్లాహ్‌ ఆజ్ఞతోనే జరిగింది. మరియు ఇదంతా అవిధేయులను అవమానించటానికి జరిగిన విషయం.

59:6 – وَمَا أَفَاءَ اللَّـهُ عَلَىٰ رَسُولِهِ مِنْهُمْ فَمَا أَوْجَفْتُمْ عَلَيْهِ مِنْ خَيْلٍ وَلَا رِكَابٍ وَلَـٰكِنَّ اللَّـهَ يُسَلِّطُ رُسُلَهُ عَلَىٰ مَن يَشَاءُ ۚ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٦

మరియు అల్లాహ్‌ తన ప్రవక్తకు, వారి నుండి ఇప్పించిన ఫయ్‌’అ కొరకు, మీరు గుర్రాలను గానీ ఒంటెలను గానీ పరిగెత్తించలేదు. 3 కాని అల్లాహ్‌ తాను కోరిన వారిపై, తన సందేశహరునికి ఆధిక్యత నొసంగుతాడు. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.

59:7 – مَّا أَفَاءَ اللَّـهُ عَلَىٰ رَسُولِهِ مِنْ أَهْلِ الْقُرَىٰ فَلِلَّـهِ وَلِلرَّسُولِ وَلِذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ كَيْ لَا يَكُونَ دُولَةً بَيْنَ الْأَغْنِيَاءِ مِنكُمْ ۚ وَمَا آتَاكُمُ الرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانتَهُوا ۚ وَاتَّقُوا اللَّـهَ ۖ إِنَّ اللَّـهَ شَدِيدُ الْعِقَابِ ٧

అల్లాహ్‌ తన ప్రవక్తకు ఆ నగరవాసుల నుండి ఇప్పించిన దానిలో (ఫయ్‌అ’లో), అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు మరియు అతని దగ్గరి బంధువులకు మరియు అనాథులకు మరియు పేదలకు మరియు బాటసారులకు హక్కు ఉంది. 4 అది మీలో ధనవంతులైన వారి మధ్యనే తిరగ కుండా ఉండటానికి, ఇలా నిర్ణయించబడింది. మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు అతను మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి. అల్లాహ్‌ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ శిక్షించటంలో చాలా కఠినుడు.

59:8 – لِلْفُقَرَاءِ الْمُهَاجِرِينَ الَّذِينَ أُخْرِجُوا مِن دِيَارِهِمْ وَأَمْوَالِهِمْ يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّـهِ وَرِضْوَانًا وَيَنصُرُونَ اللَّـهَ وَرَسُولَهُ ۚ أُولَـٰئِكَ هُمُ الصَّادِقُونَ ٨

(దానిలో నుండి కొంత భాగంపై) తమ ఇండ్ల నుండి మరియు తమ ఆస్తిపాస్తుల నుండి వెడల గొట్టబడి, వలస వచ్చిన (ముహాజిర్‌లకు) పేద వారికి కూడా హక్కు ఉంది. వారు అల్లాహ్‌ అనుగ్రహాన్ని మరియు ఆయన ప్రసన్నతను కోరుతున్నారు. మరియు వారు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకు సహాయం చేస్తున్నారు. ఇలాంటి వారు, వీరే సత్యవంతులు. 5

59:9 – وَالَّذِينَ تَبَوَّءُوا الدَّارَ وَالْإِيمَانَ مِن قَبْلِهِمْ يُحِبُّونَ مَنْ هَاجَرَ إِلَيْهِمْ وَلَا يَجِدُونَ فِي صُدُورِهِمْ حَاجَةً مِّمَّا أُوتُوا وَيُؤْثِرُونَ عَلَىٰ أَنفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ ۚ وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ٩

మరియు ఎవరైతే – ఈ (వలస వచ్చిన వారు) రాక పూర్వమే – విశ్వసించి వలస కేంద్రం (మదీనహ్)లో నివసిస్తూ ఉండేవారో! వారికి కూడా హక్కువుంది. 6 వారు తమ వద్దకు వలస వచ్చిన వారిని ప్రేమిస్తారు. మరియు వారు (వలస వచ్చిన) వారికి ఏది ఇవ్వబడినా! దాని అవసరం తమకు ఉన్నట్లు భావించరు. మరియు తమకు అవసరమున్నా, వారికి తమ సొంత (అవసరాల) మీద ప్రాధాన్యతనిస్తారు. మరియు ఎవరైతే ఆత్మలోభం నుండి రక్షింపబడతారో! అలాంటి వారు, వారే! సాఫల్యం పొందేవారు. 7

59:10 – وَالَّذِينَ جَاءُوا مِن بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ وَلَا تَجْعَلْ فِي قُلُوبِنَا غِلًّا لِّلَّذِينَ آمَنُوا رَبَّنَا إِنَّكَ رَءُوفٌ رَّحِيمٌ ١٠

మరియు ఎవరైతే వారి తరువాత వచ్చారో! వారికి అందులో హక్కు ఉంది. వారు ఇలా అంటారు: “ఓ మా ప్రభూ! మమ్మల్ని మరియు మా కంటే ముందు విశ్వసించిన మా సోదరులను క్షమించు. మరియు మా హృదయాలలో విశ్వాసులపట్ల ద్వేషాన్ని కలిగించకు. 8 ఓ మా ప్రభూ! నిశ్చయంగా, నీవు చాలా కనికరించేవాడవు, అపార కరుణా ప్రదాతవు!” (1/4)

59:11 – أَلَمْ تَرَ إِلَى الَّذِينَ نَافَقُوا يَقُولُونَ لِإِخْوَانِهِمُ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ لَئِنْ أُخْرِجْتُمْ لَنَخْرُجَنَّ مَعَكُمْ وَلَا نُطِيعُ فِيكُمْ أَحَدًا أَبَدًا وَإِن قُوتِلْتُمْ لَنَنصُرَنَّكُمْ وَاللَّـهُ يَشْهَدُ إِنَّهُمْ لَكَاذِبُونَ ١١

  • (ఓ ము’హమ్మద్‌!) కపట-విశ్వాసులను గురించి నీకు తెలియదా? 9 వారు గ్రంథప్రజలలో సత్య-తిరస్కారులైన తమ సోదరులతో, ఇలా అంటారు: “ఒకవేళ మీరు వెళ్ళగొట్టబడి నట్లయితే, మేము కూడా తప్పక మీతో బాటు వెళ్తాము. మరియు మీ విషయంలో మేము ఎవ్వరి మాటా వినము. ఒకవేళ మీతో యుద్ధం జరిగితే, మేము తప్పక మీకు సహాయపడతాము.” మరియు నిశ్చయంగా, వారు అసత్యవాదులు, అల్లాహ్‌యే దీనికి సాక్షి!

59:12 – لَئِنْ أُخْرِجُوا لَا يَخْرُجُونَ مَعَهُمْ وَلَئِن قُوتِلُوا لَا يَنصُرُونَهُمْ وَلَئِن نَّصَرُوهُمْ لَيُوَلُّنَّ الْأَدْبَارَ ثُمَّ لَا يُنصَرُونَ ١٢

కాని (వాస్తవానికి) వారు (యూదులు) వెడలగొట్ట బడితే, వీరు (ఈ కపట-విశ్వాసులు) వారివెంట ఎంత మాత్రం వెళ్ళరు మరియు వారితో యుధ్ధం జరిగితే, (ఈ కపట-విశ్వాసులు) వారికి ఏమాత్రం సహాయపడరు. 10 ఒకవేళ వీరు, వారికి (యూదులకు) సహాయపడినా, వారు తప్పక వెన్నుచూపి పారిపోతారు. ఆ తరువాత వారు విజయం (సహాయం) పొందలేరు.

59:13 – لَأَنتُمْ أَشَدُّ رَهْبَةً فِي صُدُورِهِم مِّنَ اللَّـهِ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُونَ ١٣

వారి హృదయాలలో, అల్లాహ్‌ భయం కంటే, మీ భయమే ఎక్కువ ఉంది. ఇది ఎందుకంటే! వాస్తవానికి వారు అర్థంచేసుకోలేని జనులు.

59:14 – لَا يُقَاتِلُونَكُمْ جَمِيعًا إِلَّا فِي قُرًى مُّحَصَّنَةٍ أَوْ مِن وَرَاءِ جُدُرٍ ۚ بَأْسُهُم بَيْنَهُمْ شَدِيدٌ ۚ تَحْسَبُهُمْ جَمِيعًا وَقُلُوبُهُمْ شَتَّىٰ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْقِلُونَ ١٤

వారందరూ కలసికూడా, దృఢమైన కోటలు గల నగరాలలోనో, లేదా గోడలచాటు నుండో తప్ప, మీతో యుద్ధం చేయజాలరు. వారి మధ్య ఒకరిమీద ఒకరికి ఉన్న ద్వేషం, ఎంతో తీవ్రమైనది. వారు కలసి ఉన్నట్లు నీవు భావిస్తావు, కాని వారి హృదయాలు చీలిపోయి ఉన్నాయి. ఇది ఎందు కంటే, వాస్తవానికి వారు బుద్ధిహీనులైన జనులు.

59:15 – كَمَثَلِ الَّذِينَ مِن قَبْلِهِمْ قَرِيبًا ۖ ذَاقُوا وَبَالَ أَمْرِهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ١٥

వీరి దృష్టాంతం సమీపంలోనే గడిచిన వారిని (బనూ-ఖైనుఖాఅ’లను) పోలి ఉంది. వారు తమ కార్యాల ఫలితాన్ని చూశారు, మరియు (పరలోకంలో) వారికి బాధాకరమైన శిక్ష ఉంది. 11

59:16 – كَمَثَلِ الشَّيْطَانِ إِذْ قَالَ لِلْإِنسَانِ اكْفُرْ فَلَمَّا كَفَرَ قَالَ إِنِّي بَرِيءٌ مِّنكَ إِنِّي أَخَافُ اللَّـهَ رَبَّ الْعَالَمِينَ ١٦

వారి దృష్టాంతం మానవుణ్ణి ప్రేరేపిస్తూ, ఇలా అనే ఆ షై’తాన్‌ వలే ఉంది అతడు: “సత్యాన్ని తిరస్కరించు.” అని అంటాడు. అతడు తిరస్కరించిన తరువాత ఇలా అంటాడు: “నిశ్చయంగా, నాకు నీతో ఏ విధమైన సంబంధం లేదు, నిశ్చయంగా, నేను సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కు భయపడేవాడిని!” 12

59:17 – فَكَانَ عَاقِبَتَهُمَا أَنَّهُمَا فِي النَّارِ خَالِدَيْنِ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَاءُ الظَّالِمِينَ ١٧

తరువాత ఆ ఇద్దరి పర్యవసానం, నిశ్చయంగా, ఆ ఇరువురూ నరకాగ్నిలో ఉండటమే! అందు వారు శాశ్వతంగా ఉంటారు. మరియు దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఇదే!

59:18 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّـهَ وَلْتَنظُرْ نَفْسٌ مَّا قَدَّمَتْ لِغَدٍ ۖ وَاتَّقُوا اللَّـهَ ۚ إِنَّ اللَّـهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ ١٨

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ పట్ల భయ-భక్తులు కలిగి ఉండండి. మరియు ప్రతి వ్యక్తి, తాను రేపటి కొరకు ఏమి సమకూర్చు కున్నాడో చూసుకోవాలి. మరియు అల్లాహ్‌ పట్ల భయ-భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్‌ ఎరుగును!

59:19 – وَلَا تَكُونُوا كَالَّذِينَ نَسُوا اللَّـهَ فَأَنسَاهُمْ أَنفُسَهُمْ ۚ أُولَـٰئِكَ هُمُ الْفَاسِقُونَ ١٩

మరియు అల్లాహ్‌ను మరచిపోయిన వారి మాదిరిగా మీరూ అయిపోకండి. అందువలన ఆయన వారిని, తమను తాము మరచి పోయేటట్లు చేశాడు. అలాంటి వారు! వారే అవిధేయులు (ఫాసిఖూన్‌).

59:20 – لَا يَسْتَوِي أَصْحَابُ النَّارِ وَأَصْحَابُ الْجَنَّةِ ۚ أَصْحَابُ الْجَنَّةِ هُمُ الْفَائِزُونَ ٢٠

నరకవాసులు మరియు స్వర్గవాసులు సరి- సమానులు కాజాలరు. స్వర్గవాసులు, వారే! విజయం పొందినవారు.

59:21 – لَوْ أَنزَلْنَا هَـٰذَا الْقُرْآنَ عَلَىٰ جَبَلٍ لَّرَأَيْتَهُ خَاشِعًا مُّتَصَدِّعًا مِّنْ خَشْيَةِ اللَّـهِ ۚ وَتِلْكَ الْأَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَفَكَّرُونَ ٢١

ఒకవేళ మేము ఈ ఖుర్‌ఆన్‌ను ఏ పర్వతంపైనైనా అవతరింపజేసి ఉంటే, అల్లాహ్‌ భయంవల్ల అది అణిగి బ్రద్దలై పోవటాన్ని నీవు చూసి ఉంటావు. మరియు బహుశా ప్రజలు ఆలోచిస్తారని, ఇలాంటి దృష్టాంతాలను మేము వారిముందు పెడుతున్నాము.

59:22 – هُوَ اللَّـهُ الَّذِي لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۖ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ ۖ هُوَ الرَّحْمَـٰنُ الرَّحِيمُ ٢٢

ఆయనే, అల్లాహ్‌! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనకు అగోచర మరియు గోచర విషయాలన్నీ తెలుసు. 13 ఆయన అనంత కరుణామయుడు, అపార కరుణాప్రదాత.

59:23 – هُوَ اللَّـهُ الَّذِي لَا إِلَـٰهَ إِلَّا هُوَ الْمَلِكُ الْقُدُّوسُ السَّلَامُ الْمُؤْمِنُ الْمُهَيْمِنُ الْعَزِيزُ الْجَبَّارُ الْمُتَكَبِّرُ ۚ سُبْحَانَ اللَّـهِ عَمَّا يُشْرِكُونَ ٢٣

ఆయనే, అల్లాహ్‌! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన విశ్వ సార్వభౌముడు, పరమ పవిత్రుడు, శాంతికి మూలాధారుడు, శాంతి ప్రదాత, శరణమిచ్చేవాడు, సర్వ శక్తిమంతుడు, నిరంకుశుడు, గొప్పవాడు. వారు కల్పించే భాగస్వాములకు అల్లాహ్‌ అతీతుడు. 14

59:24 – هُوَ اللَّـهُ الْخَالِقُ الْبَارِئُ الْمُصَوِّرُ ۖ لَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ ۚ يُسَبِّحُ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ٢٤

ఆయనే, అల్లాహ్‌! విశ్వ సృష్టికర్త, ప్రతి దానిని సృజించేవాడు మరియు రూపాలను తీర్చిదిద్దేవాడు. ఆయనకు సర్వశ్రేష్ఠమైన పేర్లున్నాయి. 15 ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ, ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయనే సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

సూరహ్‌ అల్‌-ముమ్‌త’హనహ్‌ – అల్‌-ముమ్‌త’హి(‘హ)నహ్‌: The Examined, అంటే పరిశోధింపబడినది, పరిశీలింప బడినది, పరీక్షించబడినది. ఈ 10 మదీనహ్ సూరహ్‌ల సమూహంలో ఇది 4వది. ఈ సూరహ్‌ 7-8 హిజ్రీలో అవతరింపజేయబడింది. ముష్రిక్‌లను వదలి, ‘మేము విశ్వసించాము’ అని మదీనహ్ కు వచ్చే స్త్రీల నిజాయితీని పరిశీలించాలని ఈ సూరహ్‌లో ఆజ్ఞ వచ్చింది. 13 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 10వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 60:1 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا عَدُوِّي وَعَدُوَّكُمْ أَوْلِيَاءَ تُلْقُونَ إِلَيْهِم بِالْمَوَدَّةِ وَقَدْ كَفَرُوا بِمَا جَاءَكُم مِّنَ الْحَقِّ يُخْرِجُونَ الرَّسُولَ وَإِيَّاكُمْ ۙ أَن تُؤْمِنُوا بِاللَّـهِ رَبِّكُمْ إِن كُنتُمْ خَرَجْتُمْ جِهَادًا فِي سَبِيلِي وَابْتِغَاءَ مَرْضَاتِي ۚ تُسِرُّونَ إِلَيْهِم بِالْمَوَدَّةِ وَأَنَا أَعْلَمُ بِمَا أَخْفَيْتُمْ وَمَا أَعْلَنتُمْ ۚ وَمَن يَفْعَلْهُ مِنكُمْ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ ١

ఓ విశ్వాసులారా! నాకు శత్రువులైనవారిని మరియు మీకు కూడా శత్రువులైన వారిని – వారి మీద ప్రేమ చూపిస్తూ – వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. 1 మరియు వాస్తవానికి వారు మీ వద్దకు వచ్చిన సత్యాన్ని తిరస్కరించారు. మీ ప్రభువైన అల్లాహ్‌ను మీరు విశ్వసించినందుకు, వారు ప్రవక్తను మరియు మిమ్మల్ని (మీ నగరం నుండి) వెడలగొట్టారు! ఒకవేళ మీరు నా ప్రసన్నత కోరి, నా మార్గంలో ధర్మయుధ్ధం కొరకు వెళితే (ఈ సత్య-తిరస్కారులను మీ స్నేహితులుగా చేసుకో కండి). వారిపట్ల వాత్సల్యం చూపుతూ మీరు వారికి రహస్యంగా సందేశం పంపుతారా! మీరు దాచేది మరియు వెలిబుచ్చేది, నాకు బాగా తెలుసు. మరియు మీలో ఎవడైతే ఇలాచేస్తాడో, అతడు వాస్తవంగా, ఋజుమార్గం నుండి తప్పిపోయిన వాడే!

60:2 – إِن يَثْقَفُوكُمْ يَكُونُوا لَكُمْ أَعْدَاءً وَيَبْسُطُوا إِلَيْكُمْ أَيْدِيَهُمْ وَأَلْسِنَتَهُم بِالسُّوءِ وَوَدُّوا لَوْ تَكْفُرُونَ ٢

ఒకవేళ వారు మీ మీద ప్రాబల్యం వహిస్తే, వారు మీకు విరోధులవుతారు. మరియు కీడుతో మీ వైపుకు తమ చేతులను మరియు తమ నాలుకలను చాపుతారు 2 మరియు మీరు కూడా సత్య- తిరస్కారులై పోవాలని కోరుతారు.

60:3 – لَن تَنفَعَكُمْ أَرْحَامُكُمْ وَلَا أَوْلَادُكُمْ ۚ يَوْمَ الْقِيَامَةِ يَفْصِلُ بَيْنَكُمْ ۚ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ٣

మీ బంధువులు గానీ, మీ సంతానం గానీ మీకు ఏ విధంగానూ పనికిరారు. 3 ఆయన పునరు త్థాన దినమున మీ మధ్య తీర్పుచేస్తాడు. మరియు అల్లాహ్‌ మీరు చేసే దంతా చూస్తున్నాడు.

60:4 – قَدْ كَانَتْ لَكُمْ أُسْوَةٌ حَسَنَةٌ فِي إِبْرَاهِيمَ وَالَّذِينَ مَعَهُ إِذْ قَالُوا لِقَوْمِهِمْ إِنَّا بُرَآءُ مِنكُمْ وَمِمَّا تَعْبُدُونَ مِن دُونِ اللَّـهِ كَفَرْنَا بِكُمْ وَبَدَا بَيْنَنَا وَبَيْنَكُمُ الْعَدَاوَةُ وَالْبَغْضَاءُ أَبَدًا حَتَّىٰ تُؤْمِنُوا بِاللَّـهِ وَحْدَهُ إِلَّا قَوْلَ إِبْرَاهِيمَ لِأَبِيهِ لَأَسْتَغْفِرَنَّ لَكَ وَمَا أَمْلِكُ لَكَ مِنَ اللَّـهِ مِن شَيْءٍ ۖ رَّبَّنَا عَلَيْكَ تَوَكَّلْنَا وَإِلَيْكَ أَنَبْنَا وَإِلَيْكَ الْمَصِيرُ ٤

వాస్తవానికి ఇబ్రాహీమ్‌ మరియు అతనితో ఉన్న వారిలో మీకొరకు ఒక మంచి ఆదర్శం ఉంది. వారు తమ జాతివారితో ఇలా అన్నప్పుడు: “నిశ్చయంగా, అల్లాహ్‌ను వదలి మీరు ఆరాధించే వాటితో మరియు మీతో, మాకు ఎలాంటి సంబంధంలేదు. మేము మిమ్మల్ని త్యజించాము మరియు మీరు అద్వితీయుడైన అల్లాహ్‌ను విశ్వసించనంత వరకు, మాకూ మీకూ మధ్య విరోధం మరియు ద్వేషం ఉంటుంది.” ఇక ఇబ్రాహీమ్‌ తన తండ్రితో: “నేను తప్పక నిన్ను క్షమించమని (నా ప్రభువును) వేడుకుంటాను. ఇది తప్ప, నీ కొరకు అల్లాహ్‌ నుండి మరేమీ పొందే అధికారం నాకు లేదు.” అని మాత్రమే అనగలిగాడు. 4 (అల్లాహ్‌తో ఇలా ప్రార్థించాడు): “ఓ నా ప్రభూ! మేము నిన్నే నమ్ముకున్నాము 5 మరియు నీ వైపునకే పశ్చాత్తాపంతో మరలు తున్నాము మరియు నీ వైపుకే మా గమ్యస్థానముంది.

60:5 – رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا وَاغْفِرْ لَنَا رَبَّنَا ۖ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ ٥

“ఓ మా ప్రభూ! మమ్మల్ని సత్య- తిరస్కారుల కొరకు పరీక్షా సాధనంగా చేయకు 6 మరియు ఓ మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా కేవలం, నీవే సర్వశక్తి మంతుడువు, మహా వివేచనాపరుడవు.”

60:6 – لَقَدْ كَانَ لَكُمْ فِيهِمْ أُسْوَةٌ حَسَنَةٌ لِّمَن كَانَ يَرْجُو اللَّـهَ وَالْيَوْمَ الْآخِرَ ۚ وَمَن يَتَوَلَّ فَإِنَّ اللَّـهَ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ ٦

వాస్తవంగా! మీకు – అల్లాహ్‌ను మరియు అంతిమదినాన్ని అపేక్షించే వారికి – వారిలో ఒక మంచి ఆదర్శం ఉంది. మరియు ఎవడైనా దీని నుండి మరలిపోతే! నిశ్చయంగా, అల్లాహ్‌ నిరపేక్షాపరుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు (అని తెలుసుకోవాలి). 7 (3/8)

60:7 – عَسَى اللَّـهُ أَن يَجْعَلَ بَيْنَكُمْ وَبَيْنَ الَّذِينَ عَادَيْتُم مِّنْهُم مَّوَدَّةً ۚ وَاللَّـهُ قَدِيرٌ ۚ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٧

  • బహుశా, అల్లాహ్‌ మీ మధ్య మరియు మీకు విరోధులైన వారి మధ్య ప్రేమ కలిగించవచ్చు. మరియు అల్లాహ్‌ (ప్రతిదీ చేయగల) సమర్థుడు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

60:8 – لَّا يَنْهَاكُمُ اللَّـهُ عَنِ الَّذِينَ لَمْ يُقَاتِلُوكُمْ فِي الدِّينِ وَلَمْ يُخْرِجُوكُم مِّن دِيَارِكُمْ أَن تَبَرُّوهُمْ وَتُقْسِطُوا إِلَيْهِمْ ۚ إِنَّ اللَّـهَ يُحِبُّ الْمُقْسِطِينَ ٨

ఎవరైతే ధర్మ విషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో! వారి పట్ల మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్‌ నిషేధించలేదు. 8 నిశ్చయంగా అల్లాహ్‌ న్యాయవర్తనులను ప్రేమిస్తాడు. 9

60:9 – إِنَّمَا يَنْهَاكُمُ اللَّـهُ عَنِ الَّذِينَ قَاتَلُوكُمْ فِي الدِّينِ وَأَخْرَجُوكُم مِّن دِيَارِكُمْ وَظَاهَرُوا عَلَىٰ إِخْرَاجِكُمْ أَن تَوَلَّوْهُمْ ۚ وَمَن يَتَوَلَّهُمْ فَأُولَـٰئِكَ هُمُ الظَّالِمُونَ ٩

కాని, వాస్తవానికి ఎవరైతే, ధర్మ విషయంలో మీతో యుధ్ధం చేస్తారో మరియు మిమ్మల్ని మీ ఇండ్ల నుండి వెళ్ళగొడ్తారో మరియు మిమ్మల్ని వెళ్ళగొట్టటంలో పరస్పరం సహకరించుకుంటారో; వారితో స్నేహం చేయటాన్ని అల్లాహ్‌ మీ కొరకు నిషేధిస్తున్నాడు. మరియు ఎవరైతే వారితో స్నేహంచేస్తారో, అలాంటి వారు, వారే! దుర్మార్గులు. 10

60:10 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا جَاءَكُمُ الْمُؤْمِنَاتُ مُهَاجِرَاتٍ فَامْتَحِنُوهُنَّ ۖ اللَّـهُ أَعْلَمُ بِإِيمَانِهِنَّ ۖ فَإِنْ عَلِمْتُمُوهُنَّ مُؤْمِنَاتٍ فَلَا تَرْجِعُوهُنَّ إِلَى الْكُفَّارِ ۖ لَا هُنَّ حِلٌّ لَّهُمْ وَلَا هُمْ يَحِلُّونَ لَهُنَّ ۖ وَآتُوهُم مَّا أَنفَقُوا ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ أَن تَنكِحُوهُنَّ إِذَا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ ۚ وَلَا تُمْسِكُوا بِعِصَمِ الْكَوَافِرِ وَاسْأَلُوا مَا أَنفَقْتُمْ وَلْيَسْأَلُوا مَا أَنفَقُوا ۚ ذَٰلِكُمْ حُكْمُ اللَّـهِ ۖ يَحْكُمُ بَيْنَكُمْ ۚ وَاللَّـهُ عَلِيمٌ حَكِيمٌ ١٠

ఓ విశ్వాసులారా! విశ్వసించిన స్త్రీలు, మీ వద్దకు వలస వచ్చినపుడు, వారిని పరీక్షించండి. 11 అల్లాహ్‌కు వారి విశ్వాసం గురించి బాగా తెలుసు. వారు వాస్తవంగా విశ్వసించినవారని మీకు తెలిసి నప్పుడు, వారిని సత్య-తిరస్కారుల వద్దకు తిరిగి పంపకండి. (ఎందుకంటే) ఆ స్త్రీలు వారికి (సత్య- తిరస్కారులకు) ధర్మసమ్మతమైన (భార్యలు) కారు మరియు వారు కూడా ఆ స్త్రీలకు ధర్మ- సమ్మతమైన (భర్తలు) కారు. కాని, వారు (సత్య-తిరస్కారులు), వారికిచ్చిన మహ్ర్‌ మీరు వారికి చెల్లించండి. మరియు వారికి వారి మహ్ర్‌ ఇచ్చిన తరువాత, ఆ స్త్రీలను వివాహమాడితే మీకు ఎలాంటి దోషంలేదు. మరియు మీరు కూడా సత్య-తిరస్కారులైన స్త్రీలను మీ వివాహబంధంలో ఉంచుకోకండి. 12 (అవిశ్వాసులుగా ఉండిపో దలచిన) మీ భార్యల నుండి మీరు ఇచ్చిన మహ్ర్‌ అడిగి తీసుకోండి. 13 (అలాగే అవిశ్వాసులను, విశ్వాసులైన తమ) భార్యల నుండి మహ్ర్‌ అడిగి తీసుకోనివ్వండి. ఇది అల్లాహ్‌ తీర్మానం. ఆయన ఈ విధంగా మీ మధ్య తీర్పు చేస్తున్నాడు. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

60:11 – وَإِن فَاتَكُمْ شَيْءٌ مِّنْ أَزْوَاجِكُمْ إِلَى الْكُفَّارِ فَعَاقَبْتُمْ فَآتُوا الَّذِينَ ذَهَبَتْ أَزْوَاجُهُم مِّثْلَ مَا أَنفَقُوا ۚ وَاتَّقُوا اللَّـهَ الَّذِي أَنتُم بِهِ مُؤْمِنُونَ ١١

మరియు ఒకవేళ మీ (విశ్వాసుల) భార్యలలో ఒకామె, మిమ్మల్ని విడిచి సత్య- తిరస్కారుల వద్దకు వెళ్ళిపోతే! (ఆ సత్య- తిరస్కారులు, మీరు ఆ స్త్రీలకు చెల్లించిన మహ్ర్‌ (వధుకట్నం), మీకు వాపసు ఇవ్వడానికి నిరాకరిస్తే)! ఆ తరువాత మీకు వారితో ప్రతీకారం తీర్చుకొనే అవకాశం దొరికితే (మీరు వారిపై యుద్ధంచేసి విజయం పొందితే)! 14 దాని (విజయ ధనం) నుండి, ఎవరి భార్యలైతే సత్య-తిరస్కారుల వద్దకు పోయారో వారికి – వారు (తమ భార్యలకు) ఇచ్చిన దానికి (మహ్ర్‌కు) సమానంగా – చెల్లించండి. మరియు మీరు విశ్వసించిన, అల్లాహ్‌ యందు, భయభక్తులు కలిగి ఉండండి.

60:12 – يَا أَيُّهَا النَّبِيُّ إِذَا جَاءَكَ الْمُؤْمِنَاتُ يُبَايِعْنَكَ عَلَىٰ أَن لَّا يُشْرِكْنَ بِاللَّـهِ شَيْئًا وَلَا يَسْرِقْنَ وَلَا يَزْنِينَ وَلَا يَقْتُلْنَ أَوْلَادَهُنَّ وَلَا يَأْتِينَ بِبُهْتَانٍ يَفْتَرِينَهُ بَيْنَ أَيْدِيهِنَّ وَأَرْجُلِهِنَّ وَلَا يَعْصِينَكَ فِي مَعْرُوفٍ ۙ فَبَايِعْهُنَّ وَاسْتَغْفِرْ لَهُنَّ اللَّـهَ ۖ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٢

ఓ ప్రవక్తా! విశ్వసించిన స్త్రీలు ప్రమాణం (బై’అత్‌) చేయటానికి నీ వద్దకు వచ్చి: ‘తాము ఎవరినీ అల్లాహ్‌ కు సాటికల్పించమని, మరియు దొంగతనం చేయమని, మరియు వ్యభిచారం చేయమని, మరియు తమ సంతానాన్ని హత్య చేయమని, మరియు తమ చేతుల మధ్య మరియు తమ కాళ్ళ మధ్య నిందారోపణ కల్పించమని, మరియు ధర్మసమ్మతమైన విషయాలలో నీకు అవిధేయత చూపమని,’ ప్రమాణం చేస్తే, వారి నుండి ప్రమాణం (బై’అత్‌) తీసుకో 15 మరియు వారిని క్షమించమని అల్లాహ్‌ను ప్రార్థించు. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

60:13 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَوَلَّوْا قَوْمًا غَضِبَ اللَّـهُ عَلَيْهِمْ قَدْ يَئِسُوا مِنَ الْآخِرَةِ كَمَا يَئِسَ الْكُفَّارُ مِنْ أَصْحَابِ الْقُبُورِ ١٣

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ ఆగ్రహానికి గురి అయిన జాతి వారిని స్నేహితులుగా చేసుకో కండి. 16 వాస్తవానికి గోరీలలో ఉన్న సత్య- తిరస్కారులు, నిరాశచెందినట్లు వారు కూడా పరలోక జీవితం పట్ల నిరాశచెంది ఉన్నారు.

సూరహ్‌ అ’స్‌-‘సఫ్ప్‌ – అ’స్‌-‘సఫ్ఫు: వరుస. ఇంతకు ముందు సూరహ్‌లో సత్య-తిరస్కారుల పట్ల ఎలా వ్యవహరించాలో వివరించబడింది. ఈ సూరహ్‌లో ధర్మ-యుద్ధం గురించిన వివరాలున్నాయి. ఈ 10 మదీనహ్ సూరహ్‌ల సమూహంలో ఇది 5వది. ఇది బహుశా ఉ’హుద్‌ యుద్ధం తరువాత 3-4 హిజ్రీలలో అవతరింపజేయబడింది. ‘స’హాబా (ర’ది. ‘అన్హుమ్‌)లు: ‘అల్లాహ్‌కు అన్నిటి కంటే ప్రీతికరమైన కార్యం ఏది?’ అని దైవప్రవక్త (‘స’అస)ను అడగాలనుకున్నారు. కాని సాహసించ లేక పోయారు. అప్పుడు ఈ సూరహ్‌ అవతరింపజేయబడింది, (అ’హ్మద్‌, తిర్మిజీ’). 14 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 4వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 61:1 – سَبَّحَ لِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ١

ఆకాశాలలో నున్న సమస్తమూ మరియు భూమిలో నున్న సమస్తమూ, అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయనే సర్వ శక్తి మంతుడు, మహా వివేకవంతుడు.

61:2 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لِمَ تَقُولُونَ مَا لَا تَفْعَلُونَ ٢

ఓ విశ్వాసులారా! మీరు చేయని దానిని ఎందుకు పలుకుతున్నారు? 1

61:3 – كَبُرَ مَقْتًا عِندَ اللَّـهِ أَن تَقُولُوا مَا لَا تَفْعَلُونَ ٣

మీరు చేయని దానిని పలకటం అల్లాహ్‌ దృష్టిలో చాలా అసహ్యకరమైన విషయం.

61:4 – إِنَّ اللَّـهَ يُحِبُّ الَّذِينَ يُقَاتِلُونَ فِي سَبِيلِهِ صَفًّا كَأَنَّهُم بُنْيَانٌ مَّرْصُوصٌ ٤

నిశ్చయంగా, అల్లాహ్‌! తన మార్గంలో దృఢమైన కట్టడంవలే బారులుతీరి పోరాడేవారిని ప్రేమిస్తాడు.

61:5 – وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ لِمَ تُؤْذُونَنِي وَقَد تَّعْلَمُونَ أَنِّي رَسُولُ اللَّـهِ إِلَيْكُمْ ۖ فَلَمَّا زَاغُوا أَزَاغَ اللَّـهُ قُلُوبَهُمْ ۚ وَاللَّـهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ ٥

మరియు మూసా తన జాతివారితో ఇలా అన్న విషయం (జ్ఞాపకంచేసుకోండి): “ఓ నా జాతి ప్రజలారా! వాస్తవానికి, నేను మీ వద్దకు పంపబడిన అల్లాహ్‌ యొక్క సందేశహరుడనని రూఢిగా తెలిసి కూడా, మీరు నన్ను ఎందుకు బాధిస్తున్నారు?” అయినా వారు వక్రమార్గం అవలంబించినందుకు, అల్లాహ్‌ వారి హృదయాలను వక్రమార్గంలో పడవేశాడు. మరియు అల్లాహ్‌ దుర్జనులకు (ఫాసిఖీన్‌లకు) సన్మార్గం చూపడు.

61:6 – وَإِذْ قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ يَا بَنِي إِسْرَائِيلَ إِنِّي رَسُولُ اللَّـهِ إِلَيْكُم مُّصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيَّ مِنَ التَّوْرَاةِ وَمُبَشِّرًا بِرَسُولٍ يَأْتِي مِن بَعْدِي اسْمُهُ أَحْمَدُ ۖ فَلَمَّا جَاءَهُم بِالْبَيِّنَاتِ قَالُوا هَـٰذَا سِحْرٌ مُّبِينٌ ٦

మరియు మర్యమ్‌ కుమారుడు ‘ఈసా 2 (తన జాతి వారితో) ఇలా అన్నది (జ్ఞాపకంచేసుకోండి): “ఓ ఇస్రా’యీల్‌ సంతతివారలారా! నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన అల్లాహ్‌ యొక్క సందేశహరుడను, నాకు పూర్వం, వచ్చి ఉన్న తౌరాత్‌ గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. మరియు నా తరువాత అ’హ్మద్‌ 3 అనే సందేశహరుడు రాబోతున్నాడు, అనే శుభవార్తను ఇస్తున్నాను.” తరువాత అతను (అ’హ్మద్‌) 4 వారి వద్దకు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినపుడు వారు ఇలా అన్నారు: “ఇది కేవలం స్పష్టమైన మంత్ర జాలమే!”

61:7 – وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّـهِ الْكَذِبَ وَهُوَ يُدْعَىٰ إِلَى الْإِسْلَامِ ۚ وَاللَّـهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ ٧

  1. తనను ఇస్లామ్‌ వైపునకు పిలిచినప్పుడు, అల్లాహ్‌ మీద అపనిందలు మోపేవాని కంటే పరమ దుర్మార్గుడు ఎవడు? మరియు అల్లాహ్‌ దుర్మార్గు లైన ప్రజలకు మార్గదర్శకత్వం చేయడు.

61:8 – يُرِيدُونَ لِيُطْفِئُوا نُورَ اللَّـهِ بِأَفْوَاهِهِمْ وَاللَّـهُ مُتِمُّ نُورِهِ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ ٨

వారు అల్లాహ్‌ జ్యోతిని (ఇస్లాంను) తమ నోటితో ఊది, ఆర్పివేయాలను కుంటున్నారు. కాని సత్య-తిరస్కారులకు ఎంత అసహ్య కరమైనా! అల్లాహ్‌ తన జ్యోతిని వ్యాపింప జేయాలని నిర్ణయించుకున్నాడు.

61:9 – هُوَ الَّذِي أَرْسَلَ رَسُولَهُ بِالْهُدَىٰ وَدِينِ الْحَقِّ لِيُظْهِرَهُ عَلَى الدِّينِ كُلِّهِ وَلَوْ كَرِهَ الْمُشْرِكُونَ ٩

ఆయనే, తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్ని ఇచ్చిపంపి, దానిని సకల ధర్మాలపై ఆధిక్యత వహించే ధర్మంగా చేశాడు 5 అది బహుదైవారాధకులకు ఎంత అసహ్యకరమైనా!

61:10 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا هَلْ أَدُلُّكُمْ عَلَىٰ تِجَارَةٍ تُنجِيكُم مِّنْ عَذَابٍ أَلِيمٍ ١٠

ఓ విశ్వాసులారా! మిమ్మల్ని బాధాకరమైన 6 శిక్ష నుండి కాపాడే వ్యాపారాన్ని మీకు సూచించాలా?

61:11 – تُؤْمِنُونَ بِاللَّـهِ وَرَسُولِهِ وَتُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّـهِ بِأَمْوَالِكُمْ وَأَنفُسِكُمْ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ ١١

(అది), మీరు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించడం మరియు అల్లాహ్‌ మార్గంలో మీ సంపదలను మరియు మీ ప్రాణాలను వినియోగించి పోరాడటం. మీరు తెలుసుకుంటే! ఇదే మీకు ఎంతో మేలైనది.

61:12 – يَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَيُدْخِلْكُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ وَمَسَاكِنَ طَيِّبَةً فِي جَنَّاتِ عَدْنٍ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ ١٢

(ఇలా చేస్తే) ఆయన మీ పాపాలను క్షమిస్తాడు మరియు మిమ్మల్ని క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. మరియు శాశ్వతమైన స్వర్గవనాలలో 7 మంచి గృహాలను ప్రసాదిస్తాడు. అదే ఆ గొప్ప విజయం.

61:13 – وَأُخْرَىٰ تُحِبُّونَهَا ۖ نَصْرٌ مِّنَ اللَّـهِ وَفَتْحٌ قَرِيبٌ ۗ وَبَشِّرِ الْمُؤْمِنِينَ ١٣

మరియు మీకు ప్రీతికరమైన, మరొక (అనుగ్రహం) కూడా ఉంది! (అది) అల్లాహ్‌ సహాయం మరియు శీఘ్ర విజయం. మరియు ఈ శుభవార్తను విశ్వాసులకు తెలుపు. 8

61:14 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا أَنصَارَ اللَّـهِ كَمَا قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ لِلْحَوَارِيِّينَ مَنْ أَنصَارِي إِلَى اللَّـهِ ۖ قَالَ الْحَوَارِيُّونَ نَحْنُ أَنصَارُ اللَّـهِ ۖ فَآمَنَت طَّائِفَةٌ مِّن بَنِي إِسْرَائِيلَ وَكَفَرَت طَّائِفَةٌ ۖ فَأَيَّدْنَا الَّذِينَ آمَنُوا عَلَىٰ عَدُوِّهِمْ فَأَصْبَحُوا ظَاهِرِينَ ١٤

  1. ఓ విశ్వాసులారా! మర్యమ్‌ కుమారుడు ‘ఈసా తన శిష్యులకు (హవారియ్యూన్‌లకు) ఉపదేశించిన విధంగా, మీరు కూడా అల్లాహ్‌కు సహాయకులుగా ఉండండి. (ఆయన వారితో ఇలా అన్నాడు): “అల్లాహ్‌ మార్గంలో నాకు తోడ్పడే వారు ఎవరు?” ఆ శిష్యులు ఇలా జవాబిచ్చారు: “మేము అల్లాహ్‌ (మార్గంలో) తోడ్పడేవారము!” అప్పుడు ఇస్రా’యీల్‌ సంతతివారిలో ఒకవర్గంవారు విశ్వసించారు, మరొకవర్గం వారు తిరస్కరించారు. తరువాత మేము విశ్వసించిన వారికి, వారి శత్రువులకు వ్యతిరేకంగా సహాయం చేశాము కావున వారు ఆధిక్యతను పొందారు! (1/2)

సూరహ్‌ అల్‌-జుము’అహ్‌ – అల్‌-జుము’అహ్‌: అంటే The congregation, సమావేశం. మతవిధుల నిర్వహణకు కూడిన జన సముదాయం. ఈ 10 మదీనహ్ సూరహ్‌ల సమూహంలో ఇది 6వది. మదీనహ్ ప్రారంభపు కాలంలో (2-4వ హిజ్రీలలో) అవతరింపజేయబడింది. దైవప్రవక్త (‘స’అస) జుము’అహ్‌ నమా’జులో సూరహ్‌ అల్‌-జుము’అహ్‌ (62) మరియు సూరహ్‌ అల్‌-మునాఫిఖూన్‌ (63) చదివేవారు, (‘స. ముస్లిం). 11 ఆయాతులున్నఈ సూరహ్ పేరు 9వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 62:1 – يُسَبِّحُ لِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ الْمَلِكِ الْقُدُّوسِ الْعَزِيزِ الْحَكِيمِ ١

  • ఆకాశాలలో నున్నవి మరియు భూమిలో నున్నవి, సమస్తమూ విశ్వ సార్వభౌముడు, 1 పరమ పవిత్రుడు, సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు అయిన అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి.

62:2 – هُوَ الَّذِي بَعَثَ فِي الْأُمِّيِّينَ رَسُولًا مِّنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِن كَانُوا مِن قَبْلُ لَفِي ضَلَالٍ مُّبِينٍ ٢

ఆయనే ఆ నిరక్షరాస్యులైన 2 వారిలో నుండి ఒక సందేశహరుణ్ణి లేపాడు. అతను వారికి ఆయన సూచనలను (ఆయాత్‌లను) చదివి వినిపిస్తు న్నాడు మరియు వారిని సంస్కరిస్తున్నాడు మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు. మరియు వాస్తవానికివారు అంతకు పూర్వం స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడిఉండే వారు.

62:3 – وَآخَرِينَ مِنْهُمْ لَمَّا يَلْحَقُوا بِهِمْ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ٣

మరియు ఇంకా వారిలో చేరని ఇతరులకు కూడా (బోధించటానికి). మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

62:4 – ذَٰلِكَ فَضْلُ اللَّـهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّـهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ ٤

ఇది అల్లాహ్‌ అనుగ్రహం, ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్‌ అనుగ్రహశాలి, సర్వోత్తముడు.

62:5 – مَثَلُ الَّذِينَ حُمِّلُوا التَّوْرَاةَ ثُمَّ لَمْ يَحْمِلُوهَا كَمَثَلِ الْحِمَارِ يَحْمِلُ أَسْفَارًا ۚ بِئْسَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِ اللَّـهِ ۚ وَاللَّـهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ ٥

తౌరాత్‌ బాధ్యత (భారం) మోపబడిన తరువాత దానిపై అమలు చేయలేక పోయిన వారి పోలిక, పుస్తకాల భారాన్ని మోసే ఆ గాడిదవలే ఉంది. (వారు ఆ భారాన్ని భరించారే గానీ, దానిని అర్థం చేసుకోలేక పోయారు). అల్లాహ్‌ సూచన (ఆయాత్‌) లను తిరస్కరించిన వారి దృష్టాంతము ఎంతచెడ్డది. మరియు అల్లాహ్‌ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు.

62:6 – قُلْ يَا أَيُّهَا الَّذِينَ هَادُوا إِن زَعَمْتُمْ أَنَّكُمْ أَوْلِيَاءُ لِلَّـهِ مِن دُونِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِن كُنتُمْ صَادِقِينَ ٦

వారితో ఇలా అను: “ఓ యూదులారా! నిశ్చయంగా, ఇతర ప్రజలకంటే మీరు మాత్రమే అల్లాహ్‌కు ప్రియమైన వారు (స్నేహితులు) అనే భావం మీకుంటే, మీ (వాదంలో) మీరు సత్యవంతులే అయితే మీరు చావునుకోరండి.” 3

62:7 – وَلَا يَتَمَنَّوْنَهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ۚ وَاللَّـهُ عَلِيمٌ بِالظَّالِمِينَ ٧

కాని వారు తాము చేసి పంపుకున్న కర్మల (ఫలితాల) కు భయపడి దానిని ఏ మాత్రం కోరుకోరు! 4 మరియు అల్లాహ్‌కు దుర్మార్గులను గురించి బాగా తెలుసు.

62:8 – قُلْ إِنَّ الْمَوْتَ الَّذِي تَفِرُّونَ مِنْهُ فَإِنَّهُ مُلَاقِيكُمْ ۖ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ٨

వారితో ఇలా అను: “వాస్తవానికి ఏ చావు నుండి అయితే మీరు పారిపోతున్నారో! నిశ్చయంగా, అదే మిమ్మల్ని పట్టుకుంటుంది. ఆ తరువాత మీరు, అగోచర మరియు గోచర విషయాలు తెలిసిన ఆయన (అల్లాహ్‌) వైపునకు మరలింపబడతారు, అప్పుడు ఆయన మీరు చేస్తూ ఉండిన కర్మలను మీకు తెలుపుతాడు.”

62:9 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِن يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّـهِ وَذَرُوا الْبَيْعَ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ ٩

ఓ విశ్వాసులారా! శుక్రవారం (జుము’అహ్) రోజు నమా’జ్‌ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు మీ వ్యాపారాలను విడిచి అల్లాహ్‌ స్మరణ వైపునకు పరుగెత్తండి. మీరు తెలుసుకోగలిగితే, ఇది మీకు ఎంతో ఉత్తమమైనది!

62:10 – فَإِذَا قُضِيَتِ الصَّلَاةُ فَانتَشِرُوا فِي الْأَرْضِ وَابْتَغُوا مِن فَضْلِ اللَّـهِ وَاذْكُرُوا اللَّـهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ ١٠

ఇక నమా’జ్‌ పూర్తి అయిన తరువాత భూమిలో వ్యాపించండి మరియు అల్లాహ్‌ అనుగ్రహాన్ని అన్వేషించండి మరియు మీరు సాఫల్యం పొందాలంటే అల్లాహ్‌ను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి!

62:11 – وَإِذَا رَأَوْا تِجَارَةً أَوْ لَهْوًا انفَضُّوا إِلَيْهَا وَتَرَكُوكَ قَائِمًا ۚ قُلْ مَا عِندَ اللَّـهِ خَيْرٌ مِّنَ اللَّـهْوِ وَمِنَ التِّجَارَةِ ۚ وَاللَّـهُ خَيْرُ الرَّازِقِينَ ١١

మరియు (ఓ ము’హమ్మద్‌!) వారు వ్యాపారాన్ని గానీ లేదా వినోదక్రీడను గానీ చూసినప్పుడు, నిన్ను నిలబడివున్న స్థితిలోనే వదలి పెట్టి, దాని చుట్టు గుమిగూడుతారు. 5 వారితో ఇలా అను: “వినోదక్రీడల కంటే మరియు వ్యాపారం కంటే, అల్లాహ్‌ వద్ద ఉన్నదే ఎంతో ఉత్తమమైనది. మరియు అల్లాహ్‌యే జీవనోపాధి ప్రసాదించటంలో అత్యుత్తముడు.”

సూరహ్‌ అల్‌-మునాఫిఖూన్‌ – అల్‌-మునాఫిఖూన్‌: అంటే కపట-విశ్వాసులు, వంచకులు, డాంబికులు, ఈ 10 మదీనహ్ సూరాహ్‌ల సమూహంలో ఇది 7వది. ఇది ఉహుద్‌ యుద్ధం తరువాత 3-4 హిజ్రీలలో అవతరింపజేయబడింది. ఇందులో కపట-విశ్వాసులను గురించిన విషయాలు ఉన్నాయి. 11 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 63:1 – إِذَا جَاءَكَ الْمُنَافِقُونَ قَالُوا نَشْهَدُ إِنَّكَ لَرَسُولُ اللَّـهِ ۗ وَاللَّـهُ يَعْلَمُ إِنَّكَ لَرَسُولُهُ وَاللَّـهُ يَشْهَدُ إِنَّ الْمُنَافِقِينَ لَكَاذِبُونَ ١

(ఓ ప్రవక్తా!) ఈ కపట-విశ్వాసులు (మునా ఫిఖూన్‌) నీ వద్దకు వచ్చినపుడు 1 ఇలాఅంటారు: “నీవు అల్లాహ్‌ యొక్క సందేశహరుడవని మేము సాక్ష్యమిస్తున్నాము.” మరియు నిశ్చయంగా, నీవు ఆయన సందేశహరుడవని అల్లాహ్‌కు తెలుసు మరియు ఈ కపట-విశ్వాసులు, నిశ్చయంగా అసత్యవాదులని అల్లాహ్‌ సాక్ష్యమిస్తున్నాడు.

63:2 – اتَّخَذُوا أَيْمَانَهُمْ جُنَّةً فَصَدُّوا عَن سَبِيلِ اللَّـهِ ۚ إِنَّهُمْ سَاءَ مَا كَانُوا يَعْمَلُونَ ٢

వారు తమ ప్రమాణాలను డాలుగా చేసు- కున్నారు. ఆవిధంగా వారు (ఇతరులను) అల్లాహ్‌ మార్గం నుండి నిరోధిస్తున్నారు. 2 నిశ్చయంగా, వారు చేస్తున్న చేష్టలు ఎంతో నీచమైనవి.

63:3 – ذَٰلِكَ بِأَنَّهُمْ آمَنُوا ثُمَّ كَفَرُوا فَطُبِعَ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَفْقَهُونَ ٣

ఇది నిశ్చయంగా, వారు విశ్వసించిన తరువాత సత్య-తిరస్కారులు అవటం మూలంగానే జరిగింది కావున వారి హృదయాల మీద ముద్ర వేయబడిఉంది. కనుక వారు ఏమీ అర్థం చేసుకోలేరు. (5/8)

63:4 – وَإِذَا رَأَيْتَهُمْ تُعْجِبُكَ أَجْسَامُهُمْ ۖ وَإِن يَقُولُوا تَسْمَعْ لِقَوْلِهِمْ ۖ كَأَنَّهُمْ خُشُبٌ مُّسَنَّدَةٌ ۖ يَحْسَبُونَ كُلَّ صَيْحَةٍ عَلَيْهِمْ ۚ هُمُ الْعَدُوُّ فَاحْذَرْهُمْ ۚ قَاتَلَهُمُ اللَّـهُ ۖ أَنَّىٰ يُؤْفَكُونَ ٤

  • మరియు నీవు గనక వారిని చూస్తే! వారి రూపాలు నీకు ఎంతో అద్భుతమైనవిగా కనిపిస్తాయి. మరియు వారు మాట్లాడినప్పుడు, నీవు వారి మాటలను వింటూ ఉండిపోతావు. నిశ్చయంగా, వారు గోడకు ఆనించబడిన మొద్దులవలే ఉన్నారు. వారు ప్రతి అరుపును తమకు వ్యతిరేకమైనదిగానే భావిస్తారు. వారు శత్రువులు, కావున వారి పట్ల జాగ్రత్తగా ఉండు. అల్లాహ్‌ వారిని నాశనం చేయుగాక! 3 వారెంత పెడమార్గంలో పడివున్నారు.

63:5 – وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا يَسْتَغْفِرْ لَكُمْ رَسُولُ اللَّـهِ لَوَّوْا رُءُوسَهُمْ وَرَأَيْتَهُمْ يَصُدُّونَ وَهُم مُّسْتَكْبِرُونَ ٥

మరియు వారితో: “రండి అల్లాహ్‌ ప్రవక్త మీ క్షమాపణ కొరకు (అల్లాహ్‌ను) ప్రార్థిస్తాడు.” అని అన్నప్పుడు వారు తమ తలలు త్రిప్పుకోవటాన్ని మరియు దురహంకారంతో మరలిపోవటాన్ని నీవు చూస్తావు.

63:6 – سَوَاءٌ عَلَيْهِمْ أَسْتَغْفَرْتَ لَهُمْ أَمْ لَمْ تَسْتَغْفِرْ لَهُمْ لَن يَغْفِرَ اللَّـهُ لَهُمْ ۚ إِنَّ اللَّـهَ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ ٦

(ఓ ప్రవక్తా!) నీవు వారి కొరకు క్షమాపణ కోరినా లేక క్షమాపణ కోరక పోయినా వారి విషయంలో రెండూ సమానమే! (ఎందుకంటే) అల్లాహ్‌ వారిని ఎంత మాత్రం క్షమించడు. నిశ్చయంగా, అల్లాహ్‌ అవిధేయులకు మార్గదర్శకత్వం చేయడు. 4

63:7 – هُمُ الَّذِينَ يَقُولُونَ لَا تُنفِقُوا عَلَىٰ مَنْ عِندَ رَسُولِ اللَّـهِ حَتَّىٰ يَنفَضُّوا ۗ وَلِلَّـهِ خَزَائِنُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَـٰكِنَّ الْمُنَافِقِينَ لَا يَفْقَهُونَ ٧

వారే (కపట-విశ్వాసులే) ఇలా అంటూ ఉండే వారు: “అల్లాహ్‌ సందేశహరుని వద్దనున్న వారిపై మీరు ఖర్చుచేయకుండా ఉంటే! చివరకు వారే చెల్లాచెదురైపోతారు.” 5 వాస్తవానికి ఆకాశాలలో మరియు భూమిలో నున్న సమస్త కోశాగారాలు అల్లాహ్‌కే చెందినవి. కాని ఈ కపట-విశ్వాసులు అది గ్రహించలేరు.

63:8 – يَقُولُونَ لَئِن رَّجَعْنَا إِلَى الْمَدِينَةِ لَيُخْرِجَنَّ الْأَعَزُّ مِنْهَا الْأَذَلَّ ۚ وَلِلَّـهِ الْعِزَّةُ وَلِرَسُولِهِ وَلِلْمُؤْمِنِينَ وَلَـٰكِنَّ الْمُنَافِقِينَ لَا يَعْلَمُونَ ٨

వారు (కపట-విశ్వాసులు) ఇంకా ఇలా అంటున్నారు: “మనం మదీనహ్ నగరానికి తిరిగి వెళ్ళిన తరువాత, నిశ్చయంగా గౌరవనీయులమైన (మనం), అక్కడవున్న తుచ్ఛమైనవారిని తప్పక వెడలగొడ్దాం.” మరియు గౌరవమనేది అల్లాహ్‌కు, ఆయన సందేశహరునికి మరియు విశ్వాసులకు మాత్రమే చెందినది, కాని ఈ కపట-విశ్వాసులకు అది తెలియదు.

63:9 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُلْهِكُمْ أَمْوَالُكُمْ وَلَا أَوْلَادُكُمْ عَن ذِكْرِ اللَّـهِ ۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ فَأُولَـٰئِكَ هُمُ الْخَاسِرُونَ ٩

ఓ విశ్వాసులారా! మీ సంపదలు, మీ సంతానం మిమ్మల్ని అల్లాహ్‌ స్మరణ నుండి నిర్లక్ష్యంలో పడవేయరాదు సుమా! ఎవరైతే ఇలా నిర్లక్ష్యంలో పడతారో అలాంటి వారే నష్టపడేవారు.

63:10 – وَأَنفِقُوا مِن مَّا رَزَقْنَاكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ أَحَدَكُمُ الْمَوْتُ فَيَقُولَ رَبِّ لَوْلَا أَخَّرْتَنِي إِلَىٰ أَجَلٍ قَرِيبٍ فَأَصَّدَّقَ وَأَكُن مِّنَ الصَّالِحِينَ ١٠

మరియు మీలో ఎవరికైనా మరణ సమయం సమీపించి: “ఓ నా ప్రభూ! నీవు నాకు మరికొంత వ్యవధి ఎందుకివ్వలేదు! నేను దాన-ధర్మాలు చేసి, సత్పురుషులలో చేరిపోయేవాడిని కదా?” అని పలికే స్థితి రాకముందే, మేము మీకు ప్రసాదించిన జీవనో పాధినుండి ఖర్చుచేయండి.

63:11 – وَلَن يُؤَخِّرَ اللَّـهُ نَفْسًا إِذَا جَاءَ أَجَلُهَا ۚ وَاللَّـهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ ١١

కాని ఒక వ్యక్తికి (మరణ) సమయం ఆసన్న మైనప్పుడు అల్లాహ్‌ అతనికి ఏ మాత్రం వ్యవధి నివ్వడు. మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును.

సూరహ్‌ అత్‌-త’గాబున్‌ – అత్ -త’గాబున్‌: లాభనష్టాలు. ఈ సూరహ్ మొదటి హిజ్రీలో మదీనహ్ లో అవతరింపజేయ బడిందని చాలామంది వ్యాఖ్యాతల అభిప్రాయం. ఈ 10 మదీనహ్ సూరహ్‌ల సమూహంలో ఇది 8వది. ఈ సూరహ్‌లో సమాజపు పరస్పర వ్యవహార సంబంధాలు వివరించబడ్డాయి. 18 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 9వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 64:1 – يُسَبِّحُ لِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١

ఆకాశాలలోనున్న సమస్తమూ మరియు భూమిలో నున్న సమస్తమూ, అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. విశ్వ సామ్రాజ్యాధి పత్యం ఆయనదే మరియు సర్వస్తోత్రాలు ఆయనకే. మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్థుడు.

64:2 – هُوَ الَّذِي خَلَقَكُمْ فَمِنكُمْ كَافِرٌ وَمِنكُم مُّؤْمِنٌ ۚ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ٢

ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. మీలో కొందరు సత్య-తిరస్కారులున్నారు మరియు మీలో కొందరు విశ్వాసులున్నారు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌ చూస్తున్నాడు. 1

64:3 – خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ وَصَوَّرَكُمْ فَأَحْسَنَ صُوَرَكُمْ ۖ وَإِلَيْهِ الْمَصِيرُ ٣

ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు మరియు మిమ్మల్ని ఉత్తమ రూపంలో రూపొందించాడు. 2 మరియు మీ గమ్యస్థానం ఆయన వైపునకే ఉంది.

64:4 – يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَيَعْلَمُ مَا تُسِرُّونَ وَمَا تُعْلِنُونَ ۚ وَاللَّـهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ٤

ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు మీరు దాచేది మరియు వెలిబుచ్చేది అంతా ఆయనకు బాగా తెలుసు. మరియు అల్లాహ్‌కు హృదయాలలో దాగి ఉన్నదంతా తెలుసు.

64:5 – أَلَمْ يَأْتِكُمْ نَبَأُ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ فَذَاقُوا وَبَالَ أَمْرِهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ٥

ఇంతకు పూర్వం, సత్యాన్ని తిరస్కరించి, తమ కర్మల దుష్ఫలితాన్ని చవిచూసిన వారి వృత్తాంతం మీకు అందలేదా? మరియు వారికి (పరలోకంలో) బాధాకరమైన శిక్ష ఉంటుంది.

64:6 – ذَٰلِكَ بِأَنَّهُ كَانَت تَّأْتِيهِمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَقَالُوا أَبَشَرٌ يَهْدُونَنَا فَكَفَرُوا وَتَوَلَّوا ۚ وَّاسْتَغْنَى اللَّـهُ ۚ وَاللَّـهُ غَنِيٌّ حَمِيدٌ ٦

దీనికి కారణ మేమిటంటే, వాస్తవానికి వారి వద్దకు వారి ప్రవక్తలు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినప్పటికీ, వారు: “ఏమీ? మాకు మానవులు మార్గదర్శకత్వం చేస్తారా?” 3 అని పలుకుతూ సత్యాన్ని తిరస్కరించి మరలి పోయారు. మరియు అల్లాహ్‌ కూడా వారిని నిర్లక్ష్యంచేశాడు. మరియు అల్లాహ్‌ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు.

64:7 – زَعَمَ الَّذِينَ كَفَرُوا أَن لَّن يُبْعَثُوا ۚ قُلْ بَلَىٰ وَرَبِّي لَتُبْعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلْتُمْ ۚ وَذَٰلِكَ عَلَى اللَّـهِ يَسِيرٌ ٧

సత్యాన్ని తిరస్కరించిన వారు (చనిపోయిన తరువాత) మరల సజీవులుగా లేపబడమని భావిస్తున్నారు. వారితో ఇలా అను: “అదికాదు, నా ప్రభువు సాక్షిగా! మీరు తప్పకుండా లేపబడతారు. 4 తరువాత మీరు (ప్రపంచంలో) చేసిందంతా మీకు తెలుపబడుతుంది. మరియు ఇది అల్లాహ్‌కు ఎంతో సులభం.”

64:8 – فَآمِنُوا بِاللَّـهِ وَرَسُولِهِ وَالنُّورِ الَّذِي أَنزَلْنَا ۚ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ ٨

కావున మీరు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తను మరియు మేము అవతరింపజేసిన జ్యోతిని (ఈ ఖుర్‌ఆన్‌ను) విశ్వసించండి. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును.

64:9 – يَوْمَ يَجْمَعُكُمْ لِيَوْمِ الْجَمْعِ ۖ ذَٰلِكَ يَوْمُ التَّغَابُنِ ۗ وَمَن يُؤْمِن بِاللَّـهِ وَيَعْمَلْ صَالِحًا يُكَفِّرْ عَنْهُ سَيِّئَاتِهِ وَيُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ ٩

(జ్ఞాపకముంచుకోండి) సమావేశపు రోజున ఆయన మీ అందరిని సమావేశపరుస్తాడు. 5 అదే లాభనష్టాల దినం. మరియు ఎవడైతే అల్లాహ్‌ను విశ్వసించి సత్కార్యాలు చేస్తాడో, అలాంటి వాని పాపాలను ఆయన తొలగిస్తాడు. మరియు అతనిని క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు, వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. అదే గొప్ప విజయం.

64:10 – وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ خَالِدِينَ فِيهَا ۖ وَبِئْسَ الْمَصِيرُ ١٠

మరియు ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో మరియు మా సూచనలను (ఆయాత్‌లను) అబద్ధాలని నిరాకరిస్తారో, అలాంటి వారు నరక వాసులవుతారు; అందు వారు శాశ్వతంగా ఉంటారు. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం!

64:11 – مَا أَصَابَ مِن مُّصِيبَةٍ إِلَّا بِإِذْنِ اللَّـهِ ۗ وَمَن يُؤْمِن بِاللَّـهِ يَهْدِ قَلْبَهُ ۚ وَاللَّـهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ١١

ఏ ఆపద కూడా, అల్లాహ్‌ అనుమతి లేనిదే సంభవించదు. మరియు ఎవడైతే అల్లాహ్‌ను విశ్వసిస్తాడో, అల్లాహ్‌ అతని హృదయానికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు అల్లాహ్‌కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.

64:12 – وَأَطِيعُوا اللَّـهَ وَأَطِيعُوا الرَّسُولَ ۚ فَإِن تَوَلَّيْتُمْ فَإِنَّمَا عَلَىٰ رَسُولِنَا الْبَلَاغُ الْمُبِينُ ١٢

మీరు అల్లాహ్‌కు విధేయులై ఉండండి మరియు సందేశహరుణ్ణి అనుసరించండి. ఒకవేళ మీరు మరలిపోతే (తెలుసుకోండి) వాస్తవానికి మా సందేశహరుని బాధ్యత కేవలం (మా సందేశాన్ని) మీకు స్పష్టంగా అందజేయటం మాత్రమే!

64:13 – اللَّـهُ لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۚ وَعَلَى اللَّـهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ ١٣

అల్లాహ్‌! ఆయన తప్ప, మరొక ఆరాధ్యుడు లేడు! మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్‌ మీదే నమ్మకం ఉంచుకోవాలి!

64:14 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّ مِنْ أَزْوَاجِكُمْ وَأَوْلَادِكُمْ عَدُوًّا لَّكُمْ فَاحْذَرُوهُمْ ۚ وَإِن تَعْفُوا وَتَصْفَحُوا وَتَغْفِرُوا فَإِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٤

ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, మీ సహవాసులు (అ’జ్వాజ్‌) మరియు మీ సంతానంలో మీ శత్రువులు ఉండవచ్చు! కావున మీరు వారిపట్ల జాగ్రత్త వహించండి. కాని ఒకవేళ మీరు వారి అపరాధాన్ని మన్నించి వారిని ఉపేక్షించి వారిని క్షమించితే! నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత (అని తెలుసుకోండి).

64:15 – إِنَّمَا أَمْوَالُكُمْ وَأَوْلَادُكُمْ فِتْنَةٌ ۚ وَاللَّـهُ عِندَهُ أَجْرٌ عَظِيمٌ ١٥

నిశ్చయంగా, మీ సంపదలు మరియు మీ సంతానం మీ కొరకు ఒక పరీక్ష. మరియు అల్లాహ్‌! ఆయన దగ్గర గొప్ప ప్రతిఫలం (స్వర్గం) ఉంది. 6

64:16 – فَاتَّقُوا اللَّـهَ مَا اسْتَطَعْتُمْ وَاسْمَعُوا وَأَطِيعُوا وَأَنفِقُوا خَيْرًا لِّأَنفُسِكُمْ ۗ وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ١٦

కావున మీరు మీ శక్తి మేరకు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండి, (ఆయన సూచనలను విని), ఆయనకు విధేయులై ఉండండి మరియు (మీ ధనం నుండి) దానం చేస్తే! అది మీ సొంత మేలుకే. మరియు ఎవరైతే తమ హృదయ (ఆత్మ) లోభత్వం నుండి రక్షణ పొందుతారో, అలాంటి వారే సాఫల్యం పొందేవారు. 7

64:17 – إِن تُقْرِضُوا اللَّـهَ قَرْضًا حَسَنًا يُضَاعِفْهُ لَكُمْ وَيَغْفِرْ لَكُمْ ۚ وَاللَّـهُ شَكُورٌ حَلِيمٌ ١٧

ఒకవేళ మీరు అల్లాహ్‌కు అప్పుగా మంచి అప్పు ఇస్తే, ఆయన దానిని ఎన్నోరెట్లు పెంచి తిరిగి మీకు ప్రసాదిస్తాడు మరియు మిమ్మల్ని క్షమిస్తాడు. వాస్తవానికి అల్లాహ్‌ కృతజ్ఞతలను ఆమోదించే వాడు, సహనశీలుడు.

64:18 – عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْعَزِيزُ الْحَكِيمُ ١٨

ఆయన అగోచర మరియు గోచర విషయాలన్నీ బాగా తెలిసిన వాడు, అపార శక్తి సంపన్నుడు, మహా వివేకవంతుడు. (3/4)

— – సూరహ్‌ అ’త్‌-‘తలాఖ్‌ – అ’త్‌-‘తలాఖు: విడాకులు. ఈ 10 మదీనహ్ సూరహ్‌ల సమూహంలో ఇది 9వది. దాదాపు 6వ హిజ్రీలో అవతరింపజేయబడింది. దైవప్రవక్త (‘స’అస) ప్రవచనం: ‘విడాకులు అల్లాహ్‌ (సు.త.) దృష్టిలో అనుమతింపబడిన వాటిలో అత్యంత అయిష్టకరమైన విషయం.’ [అబూ-దావూద్‌, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌-‘ఉమర్‌ (ర. అన్హు) కథనం]. చూడండి, 2:228-233. 12 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 65:1 – يَا أَيُّهَا النَّبِيُّ إِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَطَلِّقُوهُنَّ لِعِدَّتِهِنَّ وَأَحْصُوا الْعِدَّةَ ۖ وَاتَّقُوا اللَّـهَ رَبَّكُمْ ۖ لَا تُخْرِجُوهُنَّ مِن بُيُوتِهِنَّ وَلَا يَخْرُجْنَ إِلَّا أَن يَأْتِينَ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ ۚ وَتِلْكَ حُدُودُ اللَّـهِ ۚ وَمَن يَتَعَدَّ حُدُودَ اللَّـهِ فَقَدْ ظَلَمَ نَفْسَهُ ۚ لَا تَدْرِي لَعَلَّ اللَّـهَ يُحْدِثُ بَعْدَ ذَٰلِكَ أَمْرًا ١

ఓ ప్రవక్తా! మీరు స్త్రీలకు విడాకులు (‘తలాఖ్‌) ఇచ్చేటప్పుడు వారికి, వారి నిర్ణీత గడువు (‘ఇద్దత్‌) తో విడాకులివ్వండి. మరియు ఆ గడువును ఖచ్చితంగా లెక్కపెట్టండి. 1 మరియు మీ ప్రభు వైన అల్లాహ్‌ పట్ల భయ-భక్తులు కలిగి ఉండండి. వారు బహిరంగంగా అశ్లీల చేష్టలకు పాల్పడితే తప్ప, మీరు వారిని వారి ఇండ్ల నుండి వెడలగొట్టకండి మరియు వారు కూడా స్వయంగా వెళ్ళిపోకూడదు. 2 మరియు ఇవి అల్లాహ్‌ నిర్ణయించిన హద్దులు. మరియు ఎవడైతే అల్లాహ్‌ (నిర్ణయించిన) హద్దులను అతిక్రమిస్తాడో వాస్తవానికి వాడు తనకు తానే అన్యాయం చేసుకున్నట్లు. నీకు తెలియదు, బహుశా! దాని తరువాత అల్లాహ్‌ ఏదైనా క్రొత్త మార్గం చూపించవచ్చు! 3

65:2 – فَإِذَا بَلَغْنَ أَجَلَهُنَّ فَأَمْسِكُوهُنَّ بِمَعْرُوفٍ أَوْ فَارِقُوهُنَّ بِمَعْرُوفٍ وَأَشْهِدُوا ذَوَيْ عَدْلٍ مِّنكُمْ وَأَقِيمُوا الشَّهَادَةَ لِلَّـهِ ۚ ذَٰلِكُمْ يُوعَظُ بِهِ مَن كَانَ يُؤْمِنُ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ ۚ وَمَن يَتَّقِ اللَّـهَ يَجْعَل لَّهُ مَخْرَجًا ٢

ఇక వారి నిర్ణీత గడువు ముగిసినప్పుడు, వారిని ధర్మప్రకారంగా (వివాహబంధంలో) ఉంచు కోండి, లేదా ధర్మప్రకారంగా వారిని విడిచిపెట్టండి. మరియు మీలో న్యాయవంతులైన ఇద్దరు వ్యక్తులను సాక్షులుగా పెట్టుకోండి. మరియు అల్లాహ్‌ కొరకు సాక్ష్యం సరిగ్గా ఇవ్వండి. అల్లాహ్‌ను మరియు అంతిమ దినమును విశ్వసించే ప్రతి వ్యక్తి కొరకు, ఈ విధమైన ఉపదేశ మివ్వబడుతోంది. మరియు అల్లాహ్‌ యందు భయభక్తులు గల వానికి, ఆయన ముక్తి మార్గం చూపుతాడు.

65:3 – وَيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ ۚ وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّـهِ فَهُوَ حَسْبُهُ ۚ إِنَّ اللَّـهَ بَالِغُ أَمْرِهِ ۚ قَدْ جَعَلَ اللَّـهُ لِكُلِّ شَيْءٍ قَدْرًا ٣

మరియు ఆయన, అతనికి, అతడు ఊహించని దిక్కునుండి జీవనోపాధిని ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్‌ మీద నమ్మకం ఉంచుకున్న వానికి ఆయనే చాలు. నిశ్చయంగా, అల్లాహ్‌ తన పని పూర్తిచేసి తీరుతాడు. వాస్తవానికి అల్లాహ్‌ ప్రతిదానికి దాని విధి (ఖద్ర్‌) నిర్ణయించి ఉన్నాడు.

65:4 – وَاللَّائِي يَئِسْنَ مِنَ الْمَحِيضِ مِن نِّسَائِكُمْ إِنِ ارْتَبْتُمْ فَعِدَّتُهُنَّ ثَلَاثَةُ أَشْهُرٍ وَاللَّائِي لَمْ يَحِضْنَ ۚ وَأُولَاتُ الْأَحْمَالِ أَجَلُهُنَّ أَن يَضَعْنَ حَمْلَهُنَّ ۚ وَمَن يَتَّقِ اللَّـهَ يَجْعَل لَّهُ مِنْ أَمْرِهِ يُسْرًا ٤

మరియు మీ స్త్రీలు ఋతుస్రావపు వయస్సు గడిచిపోయిన వారైతే లేక మీకు దానిని గురించి ఎలాంటి అనుమానం ఉంటే; లేక వారి ఋతు స్రావం ఇంకా ప్రారంభంకాని వారైతే, అలాంటి వారి గడువు మూడు మాసాలు. 4 మరియు గర్భవతు లైన స్త్రీల గడువు వారి కాన్పు అయ్యే వరకు. 5 మరియు అల్లాహ్‌ పట్ల భయ-భక్తులు గలవానికి ఆయన అతని వ్యవహారంలో సౌలభ్యం కలిగిస్తాడు.

65:5 – ذَٰلِكَ أَمْرُ اللَّـهِ أَنزَلَهُ إِلَيْكُمْ ۚ وَمَن يَتَّقِ اللَّـهَ يُكَفِّرْ عَنْهُ سَيِّئَاتِهِ وَيُعْظِمْ لَهُ أَجْرًا ٥

ఇది అల్లాహ్‌ ఆజ్ఞ, ఆయన దానిని మీపై అవతరింపజేశాడు. మరియు ఎవడైతే అల్లాహ్‌ పట్ల భయ-భక్తులు కలిగి ఉంటాడో, ఆయన అతని పాపాలను తొలగిస్తాడు. మరియు అతని ప్రతిఫలాన్ని అధికం చేస్తాడు.

65:6 – أَسْكِنُوهُنَّ مِنْ حَيْثُ سَكَنتُم مِّن وُجْدِكُمْ وَلَا تُضَارُّوهُنَّ لِتُضَيِّقُوا عَلَيْهِنَّ ۚ وَإِن كُنَّ أُولَاتِ حَمْلٍ فَأَنفِقُوا عَلَيْهِنَّ حَتَّىٰ يَضَعْنَ حَمْلَهُنَّ ۚ فَإِنْ أَرْضَعْنَ لَكُمْ فَآتُوهُنَّ أُجُورَهُنَّ ۖ وَأْتَمِرُوا بَيْنَكُم بِمَعْرُوفٍ ۖ وَإِن تَعَاسَرْتُمْ فَسَتُرْضِعُ لَهُ أُخْرَىٰ ٦

(నిర్ణీత గడువు కాలంలో) మీ శక్తి మేరకు, మీరు నివసించేచోటనే, వారిని కూడా నివసించ నివ్వండి. మరియు వారిని ఇబ్బందులకు గురి చేయడానికి వారిని బాధించకండి. మరియు వారు గర్భవతులైతే, వారు ప్రసవించేవరకు వారి మీద ఖర్చుపెట్టండి. ఒకవేళ వారు మీబిడ్డకు పాలు పడుతున్నట్లైతే వారికి వారి ప్రతిఫలంఇవ్వండి. దాని కొరకు మీరు ధర్మసమ్మతంగా మీ మధ్య సంప్రదింపులు చేసుకోండి. ఒకవేళ మీకు దాని (పాలిచ్చే) విషయంలో ఇబ్బందులు కలిగితే, (తండ్రి) మరొక స్త్రీతో (బిడ్డకు) పాలిప్పించ వచ్చు!

65:7 – لِيُنفِقْ ذُو سَعَةٍ مِّن سَعَتِهِ ۖ وَمَن قُدِرَ عَلَيْهِ رِزْقُهُ فَلْيُنفِقْ مِمَّا آتَاهُ اللَّـهُ ۚ لَا يُكَلِّفُ اللَّـهُ نَفْسًا إِلَّا مَا آتَاهَا ۚ سَيَجْعَلُ اللَّـهُ بَعْدَ عُسْرٍ يُسْرًا ٧

సంపన్నుడైన వ్యక్తి తన ఆర్థిక స్తోమత ప్రకారం ఖర్చుపెట్టాలి. మరియు తక్కువ జీవనోపాధి గలవ్యక్తి అల్లాహ్‌ తనకు ప్రసాదించిన విధంగా ఖర్చుపెట్టాలి. అల్లాహ్‌ ఏ వ్యక్తిపై కూడా అతనికి ప్రసాదించిన దాని కంటే మించిన భారం వేయడు. 6 అల్లాహ్‌ కష్టం తరువాత సుఖం కూడా కలిగిస్తాడు.

65:8 – وَكَأَيِّن مِّن قَرْيَةٍ عَتَتْ عَنْ أَمْرِ رَبِّهَا وَرُسُلِهِ فَحَاسَبْنَاهَا حِسَابًا شَدِيدًا وَعَذَّبْنَاهَا عَذَابًا نُّكْرًا ٨

మరియు ఎన్నో నగరవాసులు, తమ ప్రభువు మరియు ఆయన ప్రవక్తల ఆజ్ఞలను తిరస్కరించారు. అప్పుడు మేము వాటి ప్రజల నుండి కఠినంగా లెక్క తీసుకున్నాము. మరియు వారికి తీవ్రమైన శిక్షను సిద్ధపరిచాము.

65:9 – فَذَاقَتْ وَبَالَ أَمْرِهَا وَكَانَ عَاقِبَةُ أَمْرِهَا خُسْرًا ٩

కావున వారు తమ వ్యవహారాల దుష్ట ఫలితాన్ని రుచి చూశారు. 7 మరియు వారి వ్యవహారాల పర్యవసానం నష్టమే!

65:10 – أَعَدَّ اللَّـهُ لَهُمْ عَذَابًا شَدِيدًا ۖ فَاتَّقُوا اللَّـهَ يَا أُولِي الْأَلْبَابِ الَّذِينَ آمَنُوا ۚ قَدْ أَنزَلَ اللَّـهُ إِلَيْكُمْ ذِكْرًا ١٠

అల్లాహ్‌ వారి కొరకు కఠినమైన శిక్షను సిధ్ధపరచి ఉంచాడు. కావున విశ్వాసులైన బుధ్ధిమంతులారా! అల్లాహ్‌ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. వాస్తవానికి అల్లాహ్‌ మీ వద్దకు హితబోధను (ఖుర్‌ఆన్‌ను) అవతరింపజేశాడు.

65:11 – رَّسُولًا يَتْلُو عَلَيْكُمْ آيَاتِ اللَّـهِ مُبَيِّنَاتٍ لِّيُخْرِجَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۚ وَمَن يُؤْمِن بِاللَّـهِ وَيَعْمَلْ صَالِحًا يُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ قَدْ أَحْسَنَ اللَّـهُ لَهُ رِزْقًا ١١

ఒక ప్రవక్తను కూడా! అతను మీకు స్పష్టమైన అల్లాహ్ సూచనలను (ఆయాత్‌లను) వినిపిస్తు న్నాడు. 8 అది, విశ్వసించి సత్కార్యాలు చేసే వారిని అంధకారాల నుండి వెలుగు లోనికి తీసుకు రావటానికి. మరియు అల్లాహ్‌ను విశ్వసించి సత్కార్యాలు చేసే వారిని, ఆయన క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింప జేస్తాడు. అక్కడ వారు శాశ్వతంగా కలకాలం ఉంటారు. వాస్తవానికి అల్లాహ్‌ అలాంటి వ్యక్తి కొరకు ఉత్తమ జీవనోపాధిని ప్రసాదించాడు.

65:12 – اللَّـهُ الَّذِي خَلَقَ سَبْعَ سَمَاوَاتٍ وَمِنَ الْأَرْضِ مِثْلَهُنَّ يَتَنَزَّلُ الْأَمْرُ بَيْنَهُنَّ لِتَعْلَمُوا أَنَّ اللَّـهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ وَأَنَّ اللَّـهَ قَدْ أَحَاطَ بِكُلِّ شَيْءٍ عِلْمًا ١٢

అల్లాహ్‌యే సప్తాకాశాలను మరియు వాటిని పోలిన భూమండలాలను సృష్టించి, వాటి మధ్య ఆయన తన ఆదేశాలను అవతరింపజేస్తూ వుంటాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు మరియు వాస్తవానికి అల్లాహ్‌ తన జ్ఞానంతో ప్రతి దానిని పరివేష్టించి వున్నాడని మీరు తెలుసు కోవటానికి. (7/8)

సూరహ్‌ అత్‌-త’హ్రీమ్‌ – అత్‌-త’హ్రీము: నిషేధించటం. ఈ 10 మదీనహ్ సూరహ్‌ల సమూహం (57-66)లో ఇది చివరిది. ఇది దాదాపు 7వ హిజ్రీలో మదీనహ్ లో అవతరింపజేయబడింది.

దైవప్రవక్త (‘స’అస) తమ భార్యలలో ఒకామె ‘జైనబ్‌ బింతె జ’హష్‌ (ర. ‘అన్హా) ఇంటికి పోయి నప్పుడు, అక్కడ తేనె త్రాగేవారు మరియు అక్కడ కొంత ఎక్కువ కాలం ఆగేవారు. ఈ విషయం ‘ఆయి’షహ్‌ మరియు ‘హ’ఫ్స (ర.’అన్హా)లకు, సహించరానిదయ్యింది. ఈ విషయాన్ని వారు మాన్పించదలచి, ఒక రోజు దైవప్రవక్త (‘స’అస), ‘జైనబ్‌ బింతె జ’హష్‌ (ర.’అన్హా), ఇంటి నుండి వారిలో ఒకామె ఇంటికి రాగానే ఆమె: ‘ఓ దైవప్రవక్త (‘స’అస) మీ నోటి నుండి మ’గాఫీర్‌ (దుర్వాసనగల ఒక పువ్వు) వాసన వస్తుందేమిటీ?’ అని అన్నది. దానికి దైవప్రవక్త (‘స’అస): ‘నేను తేనె మాత్రమే త్రాగాను! అల్లాహ్‌ (సు.త.) సాక్షిగా ఇక ముందు నేను తేనె త్రాగను.’ అని దానిని తమపై నిషేధించుకున్నారు. ఆ సందర్భంలో ఈ ఆయతులు అవతరింపజేయబడ్డాయి, (‘స. బు’ఖారీ). 12 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 66:1 – يَا أَيُّهَا النَّبِيُّ لِمَ تُحَرِّمُ مَا أَحَلَّ اللَّـهُ لَكَ ۖ تَبْتَغِي مَرْضَاتَ أَزْوَاجِكَ ۚ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ١

  • ఓ ప్రవక్తా! అల్లాహ్‌ నీకు ధర్మసమ్మతం చేసిన దానిని నీవు ఎందుకు నిషేధించు కుంటున్నావు? 1 నీవు నీ భార్యల ప్రసన్నతను కోరుతున్నావా? మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

66:2 – قَدْ فَرَضَ اللَّـهُ لَكُمْ تَحِلَّةَ أَيْمَانِكُمْ ۚ وَاللَّـهُ مَوْلَاكُمْ ۖ وَهُوَ الْعَلِيمُ الْحَكِيمُ ٢

వాస్తవానికి అల్లాహ్‌ మీ ప్రమాణాల పరిహార పద్ధతి మీకు నిర్దేశించాడు. 2 మరియు అల్లాహ్‌యే మీ యజమాని. మరియు ఆయన సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

66:3 – وَإِذْ أَسَرَّ النَّبِيُّ إِلَىٰ بَعْضِ أَزْوَاجِهِ حَدِيثًا فَلَمَّا نَبَّأَتْ بِهِ وَأَظْهَرَهُ اللَّـهُ عَلَيْهِ عَرَّفَ بَعْضَهُ وَأَعْرَضَ عَن بَعْضٍ ۖ فَلَمَّا نَبَّأَهَا بِهِ قَالَتْ مَنْ أَنبَأَكَ هَـٰذَا ۖ قَالَ نَبَّأَنِيَ الْعَلِيمُ الْخَبِيرُ ٣

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ప్రవక్త తన భార్యలలో ఒకామెకు 3 రహస్యంగా ఒక విషయం చెప్పగా ఆమె దానిని (ఆ రహస్యాన్ని) మరొకామెకు 4 చెప్పింది మరియు అల్లాహ్‌ అతనికి (ప్రవక్తకు) ఆ విషయాన్ని తెలియజేశాడు. (వాస్తవానికి) అతను (ప్రవక్త) ఆ విషయాన్ని (మొదటి) ఆమెకు కొంత తెలిపి మరికొంత తెలుపలేదు. ఇక అతను (ప్రవక్త, మొదటి) ఆమెకు దానిని (రహస్యం బయటపడిన సంగతిని) తెలిపినప్పుడు, ఆమె (ఆశ్చర్యపోతూ) అతనితో ఇలా అడిగింది: “ఇది నీకు ఎవరు తెలిపారు?” అతను జవాబిచ్చాడు: “నాకు ఈ విషయం ఆ సర్వజ్ఞుడు, ఆ సర్వం తెలిసినవాడు తెలిపాడు.” 5

66:4 – إِن تَتُوبَا إِلَى اللَّـهِ فَقَدْ صَغَتْ قُلُوبُكُمَا ۖ وَإِن تَظَاهَرَا عَلَيْهِ فَإِنَّ اللَّـهَ هُوَ مَوْلَاهُ وَجِبْرِيلُ وَصَالِحُ الْمُؤْمِنِينَ ۖ وَالْمَلَائِكَةُ بَعْدَ ذَٰلِكَ ظَهِيرٌ ٤

(ఆ ఇద్దరు స్త్రీలతో ఇలా అనబడింది): “ఒక వేళ మీరిద్దరూ అల్లాహ్‌ వైపునకు పశ్చాత్తాపంతో మరలితే (అది మీ మేలుకే), వాస్తవానికి మీ ఇద్దరి హృదయాలు (ఋజుమార్గం నుండి) తొలగి పోయాయి. ఒకవేళ మీరిద్దరు ప్రవక్తకు విరోధంగా పోతే! నిశ్చయంగా, అల్లాహ్‌ అతని సంరక్షకుడు మరియు జిబ్రీల్‌ మరియు సత్పురుషులైన విశ్వాసులు అతని (సహాయకులు). మరియు దేవదూతలందరు కూడా అతని సహాయకులని (తెలుసుకోండి).

66:5 – عَسَىٰ رَبُّهُ إِن طَلَّقَكُنَّ أَن يُبْدِلَهُ أَزْوَاجًا خَيْرًا مِّنكُنَّ مُسْلِمَاتٍ مُّؤْمِنَاتٍ قَانِتَاتٍ تَائِبَاتٍ عَابِدَاتٍ سَائِحَاتٍ ثَيِّبَاتٍ وَأَبْكَارًا ٥

“ఒకవేళ అతను (ము’హమ్మద్‌) మీ అందరికీ విడాకులిస్తే! అల్లాహ్‌, మీకు బదులుగా, మీ కంటే మంచి భార్యలను, అతనికి (ప్రవక్తకు) ప్రసాదించ గలడు! వారు మంచి ముస్లింలు, విశ్వాసులు, భక్తి పరులు, పశ్చాత్తాపపడేవారు, (అల్లాహ్‌ను) ఆరా ధించేవారు, వలస పోయే (ఉపవాసాలు చేసే) 6 వారు అయిన, విధవలు లేదా కన్యలు అయి ఉంటారు!” 7

66:6 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ عَلَيْهَا مَلَائِكَةٌ غِلَاظٌ شِدَادٌ لَّا يَعْصُونَ اللَّـهَ مَا أَمَرَهُمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ ٦

ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని మరియు మీ కుటుంబం వారిని, మానవులు మరియు రాళ్ళు ఇంధనం కాబోయే నరకాగ్ని నుండి కాపాడుకోండి! 8 దానిపై ఎంతో బలిష్ఠులూ, కఠినులూ అయిన దేవదూతలు నియమింపబడి ఉంటారు. వారు అల్లాహ్‌ ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించరు మరియు వారికిచ్చిన ఆజ్ఞలనే నెరవేరుస్తూ ఉంటారు.

66:7 – يَا أَيُّهَا الَّذِينَ كَفَرُوا لَا تَعْتَذِرُوا الْيَوْمَ ۖ إِنَّمَا تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ ٧

ఓ సత్యతిరస్కారులారా! ఈ రోజు మీరు సాకులు చెప్పకండి. నిశ్చయంగా, మీరు చేస్తూ ఉండిన కర్మలకు, తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతోంది.

66:8 – يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا تُوبُوا إِلَى اللَّـهِ تَوْبَةً نَّصُوحًا عَسَىٰ رَبُّكُمْ أَن يُكَفِّرَ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَيُدْخِلَكُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ يَوْمَ لَا يُخْزِي اللَّـهُ النَّبِيَّ وَالَّذِينَ آمَنُوا مَعَهُ ۖ نُورُهُمْ يَسْعَىٰ بَيْنَ أَيْدِيهِمْ وَبِأَيْمَانِهِمْ يَقُولُونَ رَبَّنَا أَتْمِمْ لَنَا نُورَنَا وَاغْفِرْ لَنَا ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٨

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌ వైపునకు మనఃపూర్వకమైన పశ్చాత్తాపంతో, క్షమాపణ కొరకు మరలితే! 9 మీ ప్రభువు మీ పాపాలను తొలగించి, మిమ్మల్ని క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు; ఆ రోజు అల్లాహ్‌ తనప్రవక్తను మరియు అతనితోపాటు విశ్వసించిన వారిని అవమానంపాలు చేయడు. వారి కాంతి, వారి ముందు మరియు వారి కుడివైపు నుండి ప్రసరిస్తూ ఉంటుంది. 10 వారు ఇలా ప్రార్థిస్తారు: “ఓ మా ప్రభూ! మా కాంతిని మా కొరకు పరిపూర్ణం చేయి మరియు మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా, నీవే ప్రతిదీ చేయగల సమర్థుడవు!”

66:9 – يَا أَيُّهَا النَّبِيُّ جَاهِدِ الْكُفَّارَ وَالْمُنَافِقِينَ وَاغْلُظْ عَلَيْهِمْ ۚ وَمَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمَصِيرُ ٩

ఓ ప్రవక్తా! నీవు సత్య-తిరస్కారులతో మరియు కపట-విశ్వాసులతో ధర్మయుద్ధం చెయ్యి. మరియు వారి విషయంలో కఠినంగా వ్యవహరించు. మరియు వారి ఆశ్రయం నరకమే! అది అతిచెడ్డ గమ్యస్థానం. 11

66:10 – ضَرَبَ اللَّـهُ مَثَلًا لِّلَّذِينَ كَفَرُوا امْرَأَتَ نُوحٍ وَامْرَأَتَ لُوطٍ ۖ كَانَتَا تَحْتَ عَبْدَيْنِ مِنْ عِبَادِنَا صَالِحَيْنِ فَخَانَتَاهُمَا فَلَمْ يُغْنِيَا عَنْهُمَا مِنَ اللَّـهِ شَيْئًا وَقِيلَ ادْخُلَا النَّارَ مَعَ الدَّاخِلِينَ ١٠

సత్య-తిరస్కారుల విషయంలో అల్లాహ్‌ నూ’హ్‌ భార్య మరియు లూ’త్‌ భార్యల ఉదాహరణలను ఇచ్చాడు. 12 ఆ ఇద్దరు స్త్రీలు మా సత్పురుషులైన మా ఇద్దరు దాసుల (వివాహ) బంధంలో ఉండిరి. కాని ఆ ఇద్దరు స్త్రీలు వారిద్దరిని మోసగించారు. కావున వారిద్దరు, ఆ ఇద్దరు స్త్రీల విషయంలో అల్లాహ్‌ ముందు (పరలోకంలో) ఏ విధంగాను సహాయపడలేరు. 13 మరియు (తీర్పు దినమున) వారితో: “నరకాగ్నిలో ప్రవేశించేవారితో సహా మీరిద్దరు స్త్రీలు కూడా ప్రవేశించండి!” అని చెప్పబడుతుంది.

66:11 – وَضَرَبَ اللَّـهُ مَثَلًا لِّلَّذِينَ آمَنُوا امْرَأَتَ فِرْعَوْنَ إِذْ قَالَتْ رَبِّ ابْنِ لِي عِندَكَ بَيْتًا فِي الْجَنَّةِ وَنَجِّنِي مِن فِرْعَوْنَ وَعَمَلِهِ وَنَجِّنِي مِنَ الْقَوْمِ الظَّالِمِينَ ١١

మరియు అల్లాహ్‌, విశ్వసించినవారిలో ఫిర్‌’ఔన్‌ భార్యను ఉదాహరణగా పేర్కొన్నాడు. 14 ఆమె ఇలా అన్న విషయం (జ్ఞాపకంచేసుకోండి): “ఓ నా ప్రభూ! నా కొరకు నీ వద్ద స్వర్గంలో ఒక గృహాన్నినిర్మించు! మరియు నన్ను, ఫిర్‌’ఔన్‌ మరియు అతని చేష్టల నుండి కాపాడు మరియు నన్ను ఈ దుర్మార్గ జాతి వారి నుండి కాపాడు.”

66:12 – وَمَرْيَمَ ابْنَتَ عِمْرَانَ الَّتِي أَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِيهِ مِن رُّوحِنَا وَصَدَّقَتْ بِكَلِمَاتِ رَبِّهَا وَكُتُبِهِ وَكَانَتْ مِنَ الْقَانِتِينَ ١٢

మరియు ‘ఇమ్రాన్‌ కుమార్తె మర్యమ్‌ను 15 (కూడా ఉదాహరణగా పేర్కొన్నాడు) ఆమె తన శీలాన్ని కాపాడుకున్నది. మరియు మేము ఆమెలోకి మా (తరపు నుండి) జీవం (ఆత్మ) ఊదాము. 16 మరియు ఆమె తన ప్రభువు సమాచారాలను మరియు ఆయన గ్రంథాలను, సత్యాలని ధృవపరిచింది మరియు ఆమె భక్తిపరులలో చేరిపోయింది. 17

సూరహ్‌ అల్-ముల్క్‌ – ఇంతవరకు 14/15వ వంతు ఖుర్‌ఆన్‌ పూర్తి అయ్యింది. ఇక మిగిలిన 1/15 భాగంలో చిన్న చిన్న సూరహ్‌లు చాలామట్టుకు మక్కహ్ కు చెందినవి ఉన్నాయి. అల్‌-ముల్క్‌: The Dominion, సామ్రాజ్యాధిపత్యం, అధికారం, ఆధిపత్యం, రాజ్యం, ప్రభుత్వం. దీని గొప్పతనాలను గురించిన ‘హదీస్‌’లు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి: “ఒక సూరహ్‌ 30 ఆయతులది ఉంది. అది మానవునికి సిఫారసు చేస్తుంది, దాని వల్ల అతడు క్షమించబడతాడు.” అన్న ‘హదీస్‌’ (సునన్‌ తిర్మిజీ’, సునన్‌ అబూ-దావూద్‌, ఇబ్నె-మాజా మరియు ముస్నద్‌ అ’హ్మద్‌). మరొక ‘హదీస్‌’: “ఖుర్‌ఆన్‌లో ఒక సూరహ్‌ ఉంది అది తనను చదివిన వాడిని స్వర్గానికి పంపేవరకు అల్లాహ్‌తో వాదులాడుతుంది.” (మజ్‌మ’అ అ’జ్జవాయి’ద్‌ 7/172,) మరొక ‘హదీస్‌’: “దైవప్రవక్త (‘స’అస) రాత్రి నిద్రపోక ముందు సూరహ్‌ అస్‌-సజ్దా (32) మరియు సూరహ్‌ అల్‌-ముల్క్‌ (67) తప్పక చదివే వారు.” మరొక షే’ఖ్‌ అల్బానీ సమకూర్చిన ‘స’హీ’హ్‌ రివాయత్‌లో: “సూరహ్‌ అల్‌-ముల్క్‌ గోరీ శిక్ష నుండి కాపాడుతుంది. అయితే చదివేవాడు ఇస్లాం ఆజ్ఞలను మరియు విధులను పాటించేవాడై ఉండాలి!” అని ఉంది. 30 ఆయాతులున్న ఈ మక్కహ్ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 67:1 – تَبَارَكَ الَّذِي بِيَدِهِ الْمُلْكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١

[(*)] ఎవరి చేతిలోనయితే విశ్వ సామ్రాజ్యాధి పత్యం ఉందో! ఆయన సర్వశ్రేష్ఠుడు (శుభదాయకుడు) మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు.

67:2 – الَّذِي خَلَقَ الْمَوْتَ وَالْحَيَاةَ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا ۚ وَهُوَ الْعَزِيزُ الْغَفُورُ ٢

ఆయనే! మీలో మంచిపనులు చేసేవారెవరో పరీక్షించటానికి, చావుబ్రతుకులను సృష్టించాడు. 1 మరియు ఆయన సర్వ శక్తిమంతుడు క్షమాశీలుడు.

67:3 – الَّذِي خَلَقَ سَبْعَ سَمَاوَاتٍ طِبَاقًا ۖ مَّا تَرَىٰ فِي خَلْقِ الرَّحْمَـٰنِ مِن تَفَاوُتٍ ۖ فَارْجِعِ الْبَصَرَ هَلْ تَرَىٰ مِن فُطُورٍ ٣

ఆయనే, ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశాలను సృష్టించాడు. ఆ అనంత కరుణామయుని సృష్టిలో నీవు ఎలాంటి లోపాన్నీ చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు: “ఏమీ? నీకేమైనా లోపం కనిపిస్తుందా?”

67:4 – ثُمَّ ارْجِعِ الْبَصَرَ كَرَّتَيْنِ يَنقَلِبْ إِلَيْكَ الْبَصَرُ خَاسِئًا وَهُوَ حَسِيرٌ ٤

ఇంకా, మాటిమాటికీ నీ చూపులు త్రిప్పి చూడు. అది (నీ చూపు) విఫలమై, అలిసి సొలసి తిరిగి నీవైపుకే వస్తుంది.

67:5 – وَلَقَدْ زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِمَصَابِيحَ وَجَعَلْنَاهَا رُجُومًا لِّلشَّيَاطِينِ ۖ وَأَعْتَدْنَا لَهُمْ عَذَابَ السَّعِيرِ ٥

మరియు వాస్తవంగా, మేము భూమికి దగ్గరగా ఉన్న ఆకాశాన్ని దీపాలతో అలంక రించాము. మరియు వాటిని, షై’తాన్‌లను తరిమి కొట్టే సాధనాలుగా చేశాము. 2 మరియు వారి కొరకు (షై’తాన్‌ల కొరకు) మేము భగభగ మండే అగ్నిజ్వాలల శిక్షను సిధ్ధపరచి ఉంచాము.

67:6 – وَلِلَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ عَذَابُ جَهَنَّمَ ۖ وَبِئْسَ الْمَصِيرُ ٦

మరియు తమ ప్రభువును (అల్లాహ్‌ను) తిరస్కరించే వారికి నరకశిక్షఉంది. అది ఎంతచెడ్డ గమ్యస్థానం.

67:7 – إِذَا أُلْقُوا فِيهَا سَمِعُوا لَهَا شَهِيقًا وَهِيَ تَفُورُ ٧

వారు అందులోకి విసిరివేయబడినప్పుడు, వారు దాని (భయంకరమైన) గర్జనను వింటారు. మరియు అది మరిగి పొంగుతూ ఉంటుంది.

67:8 – تَكَادُ تَمَيَّزُ مِنَ الْغَيْظِ ۖ كُلَّمَا أُلْقِيَ فِيهَا فَوْجٌ سَأَلَهُمْ خَزَنَتُهَا أَلَمْ يَأْتِكُمْ نَذِيرٌ ٨

అది దాదాపు ఉద్రేకంతో ప్రేలిపోతూ ఉంటుంది. ప్రతిసారి అందులోకి (పాపుల) గుంపు పడవేయబడినప్పుడు! దాని కాపలాదారులు వారితో: “ఏమీ? మీ వద్దకు ఏ హెచ్చరిక చేసేవాడు రాలేదా?” అని, ప్రశ్నిస్తారు.

67:9 – قَالُوا بَلَىٰ قَدْ جَاءَنَا نَذِيرٌ فَكَذَّبْنَا وَقُلْنَا مَا نَزَّلَ اللَّـهُ مِن شَيْءٍ إِنْ أَنتُمْ إِلَّا فِي ضَلَالٍ كَبِيرٍ ٩

వారంటారు: “ఎందుకు రాలేదు! వాస్తవానికి మా వద్దకు హెచ్చరిక చేసేవాడు వచ్చాడు, కాని మేము అతనిని అసత్యుడవని తిరస్కరించాము మరియు అతనితో ఇలా అన్నాము: ‘అల్లాహ్‌ దేనినీ (ఏ దివ్యజ్ఞానాన్ని) అవతరింపజేయలేదు; మీరు కేవలం ఘోర మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు!’ “

67:10 – وَقَالُوا لَوْ كُنَّا نَسْمَعُ أَوْ نَعْقِلُ مَا كُنَّا فِي أَصْحَابِ السَّعِيرِ ١٠

ఇంకా వారు ఇలా అంటారు: “ఒకవేళ మేము విని ఉంటే లేదా గ్రహించి ఉంటే, మేము మండే అగ్నిజ్వాలలలో పడివుండే వారితో చేరేవారము కాముకదా!”

67:11 – فَاعْتَرَفُوا بِذَنبِهِمْ فَسُحْقًا لِّأَصْحَابِ السَّعِيرِ ١١

అప్పుడు వారే స్వయంగా తమ పాపాన్ని ఒప్పుకుంటారు. కావున భగగ మండే అగ్నిజ్వాల వాసులు దూరమై పోవు గాక!

67:12 – إِنَّ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِالْغَيْبِ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ ١٢

నిశ్చయంగా, ఎవరైతే అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో! వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి.

67:13 – وَأَسِرُّوا قَوْلَكُمْ أَوِ اجْهَرُوا بِهِ ۖ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ١٣

మరియు మీరు మీ మాటలను రహస్యంగా ఉంచినా సరే! లేక వాటిని వెల్లడిచేసినా సరే! నిశ్చయంగా, ఆయనకు హృదయాల స్థితి బాగా తెలుసు.

67:14 – أَلَا يَعْلَمُ مَنْ خَلَقَ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ ١٤

ఏమిటీ? పుట్టించిన వాడికే తెలియదా? మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు!

67:15 – هُوَ الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ ذَلُولًا فَامْشُوا فِي مَنَاكِبِهَا وَكُلُوا مِن رِّزْقِهِ ۖ وَإِلَيْهِ النُّشُورُ ١٥

  1. భూమిని మీ ఆధీనంలో ఉంచినవాడు ఆయనే! కావున మీరు దాని దారులలో తిరగండి. మరియు ఆయన ప్రసాదించిన జీవనోపాధిని తినండి. మరియు మీరు ఆయన వైపునకే సజీవులై మరలిపోవలసి ఉంది.

67:16 – أَأَمِنتُم مَّن فِي السَّمَاءِ أَن يَخْسِفَ بِكُمُ الْأَرْضَ فَإِذَا هِيَ تَمُورُ ١٦

ఏమీ? మీరు నిర్భయంగా ఉన్నారా? ఆకాశాలలో ఉన్నవాడు, మిమ్మల్ని భూమిలోకి అణగ ద్రొక్కడని, ఎప్పుడైతే అది తీవ్ర కంపనాలకు గురి అవుతుందో?

67:17 – أَمْ أَمِنتُم مَّن فِي السَّمَاءِ أَن يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا ۖ فَسَتَعْلَمُونَ كَيْفَ نَذِيرِ ١٧

లేక, ఆకాశాలలో ఉన్నవాడు, మీపైకి రాళ్ళు కురిపించే గాలివాన పంపడని మీరు నిర్భయంగా ఉన్నారా? నా హెచ్చరిక ఎలాంటిదో అప్పుడు మీరు తెలుసుకోగలరు.

67:18 – وَلَقَدْ كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ فَكَيْفَ كَانَ نَكِيرِ ١٨

మరియు వాస్తవానికి వారికి పూర్వం గతించిన వారు కూడా (ప్రవక్తలను) తిరస్కరించారు. నా పట్టు (శిక్ష) ఎంత తీవ్రంగా ఉండిందో (చూశారా)?

67:19 – أَوَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ فَوْقَهُمْ صَافَّاتٍ وَيَقْبِضْنَ ۚ مَا يُمْسِكُهُنَّ إِلَّا الرَّحْمَـٰنُ ۚ إِنَّهُ بِكُلِّ شَيْءٍ بَصِيرٌ ١٩

ఏమీ? వారు తమ మీద ఎగిరే పక్షులు రెక్కలను ఎలా చాపుతూ ముడుచుకుంటూ, ఎగురు తున్నాయో చూడటం లేదా? ఆ అనంత కరుణామయుడు తప్ప మరెవ్వరూ వాటిని అలా నిలిపి ఉంచలేరు కదా! నిశ్చయంగా, ఆయన ప్రతి దానినీ చూస్తున్నాడు!

67:20 – أَمَّنْ هَـٰذَا الَّذِي هُوَ جُندٌ لَّكُمْ يَنصُرُكُم مِّن دُونِ الرَّحْمَـٰنِ ۚ إِنِ الْكَافِرُونَ إِلَّا فِي غُرُورٍ ٢٠

ఏమీ? అనంత కరుణామయుడు తప్ప మీకు సేనవలే అడ్డుగా నిలిచి, మీకు సహాయ పడగల వాడెవడైనా ఉన్నాడా? ఈ సత్య-తిరస్కారులు కేవలం మోసంలో పడివున్నారు.

67:21 – أَمَّنْ هَـٰذَا الَّذِي يَرْزُقُكُمْ إِنْ أَمْسَكَ رِزْقَهُ ۚ بَل لَّجُّوا فِي عُتُوٍّ وَنُفُورٍ ٢١

ఒకవేళ ఆయన మీ జీవనోపాధిని ఆపివేస్తే, మీకు జీవనోపాధి ఇచ్చేవాడు ఎవడున్నాడు? అయినా వారు తలబిరుసుతనంలో మునిగి (సత్యానికి) దూరమై పోతున్నారు.

67:22 – أَفَمَن يَمْشِي مُكِبًّا عَلَىٰ وَجْهِهِ أَهْدَىٰ أَمَّن يَمْشِي سَوِيًّا عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ٢٢

ఏమీ? ఎవడైతే తన ముఖం మీద దేవులాడుతూ నడుస్తాడో, అతడు సరైన మార్గం పొందుతాడా? 3 లేక చక్కగా ఋజుమార్గం మీద నడిచే వాడు పొందుతాడా?

67:23 – قُلْ هُوَ الَّذِي أَنشَأَكُمْ وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۖ قَلِيلًا مَّا تَشْكُرُونَ ٢٣

వారితో ఇలా అను: “ఆయనే మిమ్మల్ని సృజించాడు. మరియు ఆయనే మీకు వినికిడినీ, దృష్టినీ మరియు హృదయాలనూ ఇచ్చాడు. (అయినా) మీరు కృతజ్ఞతలు తెలిపేది చాలా తక్కువ!”

67:24 – قُلْ هُوَ الَّذِي ذَرَأَكُمْ فِي الْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ ٢٤

(ఇంకా) ఇలా అను: “ఆయనే మిమ్మల్ని భూమిలో వ్యాపింపజేశాడు మరియు ఆయన వద్దనే మీరంతా సమావేశపరచబడతారు.”

67:25 – وَيَقُولُونَ مَتَىٰ هَـٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ ٢٥

మరియు వారు ఇలా అడుగుతున్నారు: “మీరు సత్యవంతులే అయితే, ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరనున్నది?”

67:26 – قُلْ إِنَّمَا الْعِلْمُ عِندَ اللَّـهِ وَإِنَّمَا أَنَا نَذِيرٌ مُّبِينٌ ٢٦

వారితో ఇలా అను: “నిశ్చయంగా, దాని జ్ఞానం కేవలం అల్లాహ్‌కే ఉంది. 4 మరియు నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని మాత్రమే!”

67:27 – فَلَمَّا رَأَوْهُ زُلْفَةً سِيئَتْ وُجُوهُ الَّذِينَ كَفَرُوا وَقِيلَ هَـٰذَا الَّذِي كُنتُم بِهِ تَدَّعُونَ ٢٧

తరువాత వారు దానిని సమీపంలో ఉండటం చూసి నప్పుడు, సత్యతిరస్కారుల ముఖాలు దుఃఖంతో నిండి నల్లబడిపోతాయి. 5 మరియు వారితో ఇలా అనబడుతుంది: “మీరు దేనినయితే అడుగుతూ ఉండేవారో అది (ఆ వాగ్దానం) ఇదే!” 6

67:28 – قُلْ أَرَأَيْتُمْ إِنْ أَهْلَكَنِيَ اللَّـهُ وَمَن مَّعِيَ أَوْ رَحِمَنَا فَمَن يُجِيرُ الْكَافِرِينَ مِنْ عَذَابٍ أَلِيمٍ ٢٨

(ఓ ప్రవక్తా!) వారితో ఇలాఅను: “ఏమీ? మీరు ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్‌ నన్ను మరియు నా తోటివారిని నాశనం చేయనూ వచ్చు! లేదా మమ్మల్ని కరుణించనూ వచ్చు. కాని సత్య-తిరస్కారులను బాధాకరమైన శిక్ష నుండి ఎవడు రక్షించ గలడు?”

67:29 – قُلْ هُوَ الرَّحْمَـٰنُ آمَنَّا بِهِ وَعَلَيْهِ تَوَكَّلْنَا ۖ فَسَتَعْلَمُونَ مَنْ هُوَ فِي ضَلَالٍ مُّبِينٍ ٢٩

వారితో ఇంకా ఇలా అను: “ఆయనే అనంత కరుణామయుడు, మేము ఆయననే విశ్వ సించాము మరియు ఆయననే నమ్ముకున్నాము. ఇక ఎవరు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారో త్వరలోనే మీరు తెలుసుకోగలరు!”

67:30 – قُلْ أَرَأَيْتُمْ إِنْ أَصْبَحَ مَاؤُكُمْ غَوْرًا فَمَن يَأْتِيكُم بِمَاءٍ مَّعِينٍ ٣٠

వారితో ఇలా అను: “ఏమీ? మీరు ఆలోచించారా? ఒక వేళ మీ బావులలోని నీరు, భూమిలోనికి ఇంకిపోతే, ప్రవహించే ఈ నీటి ఊటలను మీ కొరకు ఎవడు బయటికి తేగలడు?” (1/8)

సూరహ్‌ అల్‌-ఖలమ్‌ – ఖలమున్‌: The Pen, కలము. ఇది మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌. అవతరణాక్రమంలో ఇది 3వది. సూరహ్‌ అల్‌-‘అలఖ్‌ (96) యొక్క మొదటి 5 ఆయతుల తరువాత సూరహ్‌ అల్‌-ముద్దస్సి’ర్‌ (74) అవతరింపజేయబడింది. దాని తరువాత ఈ సూరహ్‌ అల్‌-ఖలమ్‌ (68) అవతరింపజేయబడిందని, చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం. దీని మరొక పేరు సూరహ్‌ నూన్‌. 52 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 68:1 – ن ۚ وَالْقَلَمِ وَمَا يَسْطُرُونَ ١

  • నూన్‌. 1 కలం సాక్షిగా! 2 మరియు వారు (దేవ-దూతలు) వ్రాస్తున్నదాని సాక్షిగా!

68:2 – مَا أَنتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍ ٢

నీ ప్రభువు అనుగ్రహం వలన నీవు (ఓ ము’హమ్మద్‌) పిచ్చివాడవు కావు!

68:3 – وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ ٣

మరియు నిశ్చయంగా, నీకు ఎన్నటికీ తరిగిపోని ప్రతిఫలం ఉంది.

68:4 – وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ ٤

మరియు నిశ్చయంగా, నీవు ఉత్తమమైన శీలవంతుడవు! 3

68:5 – فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ ٥

కావున త్వరలోనే నీవు చూడగలవు మరియు వారు కూడా చూడగలరు;

68:6 – بِأَييِّكُمُ الْمَفْتُونُ ٦

మీలో ఎవరికి పిచ్చి ఉందో!

68:7 – إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ ٧

నిశ్చయంగా, నీ ప్రభువు! ఆయనకు ఎవడు మార్గభ్రష్టుడయ్యాడో తెలుసు మరియు ఎవడు సన్మార్గం మీద ఉన్నాడో కూడా ఆయనకు బాగా తెలుసు!

68:8 – فَلَا تُطِعِ الْمُكَذِّبِينَ ٨

కావున నీవు ఈ అసత్యవాదులను అనుసరించకు.

68:9 – وَدُّوا لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ ٩

ఒకవేళ నీవు (ధర్మం విషయంలో) మెత్త పడితే వారు కూడా మెత్తపడగోరుతున్నారు. 4

68:10 – وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍ مَّهِينٍ ١٠

కావున నీవు ప్రమాణాలు చేసే ప్రతి నీచుడిని అనుసరించకు;

68:11 – هَمَّازٍ مَّشَّاءٍ بِنَمِيمٍ ١١

చాడీలు చెప్పే వాడిని, ఎత్తిపొడుస్తూ ఉండే వాడిని;

68:12 – مَّنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ أَثِيمٍ ١٢

మంచిని నిరోధించే వాడిని, హద్దులుమీరి ప్రవర్తించే పాపిష్ఠుడిని;

68:13 – عُتُلٍّ بَعْدَ ذَٰلِكَ زَنِيمٍ ١٣

నిర్దయుడిని, ఇంతే గాకుండా అపఖ్యాతి గల (నిందార్హుడైన) వాడిని;

68:14 – أَن كَانَ ذَا مَالٍ وَبَنِينَ ١٤

వాడు ధనవంతుడూ మరియు సంతాన భాగ్యంతో తులతూగుతూ ఉన్నవాడు అయినా సరే!

68:15 – إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ ١٥

ఒకవేళ వాడికి మా సూచనలు (ఆయాత్‌) వినిపిస్తే, అందుకు వాడు: “ఇవి పూర్వకాలపు కట్టు కథలే!” అని అంటాడు.

68:16 – سَنَسِمُهُ عَلَى الْخُرْطُومِ ١٦

మేము త్వరలోనే వాడి ముక్కు మీద వాతపెడ్తాము.

68:17 – إِنَّا بَلَوْنَاهُمْ كَمَا بَلَوْنَا أَصْحَابَ الْجَنَّةِ إِذْ أَقْسَمُوا لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ ١٧

నిశ్చయంగా, మేము ఆ తోట వారిని పరీక్షించినట్లుగా వీరిని కూడా పరీక్షిస్తాము. ఎవరైతే తెల్లవార గానే తప్పక దాని పంట కోసుకుందామని ప్రతిజ్ఞ చేసుకున్నారో!

68:18 – وَلَا يَسْتَثْنُونَ ١٨

మరియు (అల్లాహ్‌ కోరితే) అనే, మినహాయింపుకు తావు ఇవ్వకుండా!

68:19 – فَطَافَ عَلَيْهَا طَائِفٌ مِّن رَّبِّكَ وَهُمْ نَائِمُونَ ١٩

కావున వారు పడుకొని ఉండగానే నీ ప్రభువు తరఫు నుండి దానిపై (ఆ తోటపై) ఒక ఆపద వచ్చిపడింది.

68:20 – فَأَصْبَحَتْ كَالصَّرِيمِ ٢٠

దాంతో తెల్లవారే సరికి అది (ఆ తోట) పంటకోసిన పొలం వలే మారిపోయింది.

68:21 – فَتَنَادَوْا مُصْبِحِينَ ٢١

తరువాత ఉదయం లేచి వారు ఒకరితో నొకరు ఇలా చెప్పుకోసాగారు:

68:22 – أَنِ اغْدُوا عَلَىٰ حَرْثِكُمْ إِن كُنتُمْ صَارِمِينَ ٢٢

“మీరు పంటను కోయదలచు కుంటే, ఉదయమే మీ పొలానికి వెళ్ళండి.”

68:23 – فَانطَلَقُوا وَهُمْ يَتَخَافَتُونَ ٢٣

ఆ తరువాత వారు ఒకరితోనొకరు (ఈ విధంగా) మెల్లగా చెప్పుకుంటూ బయలుదేరారు.

68:24 – أَن لَّا يَدْخُلَنَّهَا الْيَوْمَ عَلَيْكُم مِّسْكِينٌ ٢٤

“ఈ రోజు ఏ పేదవాడిని కూడా మీ దగ్గరకు రానివ్వకండి!”

68:25 – وَغَدَوْا عَلَىٰ حَرْدٍ قَادِرِينَ ٢٥

మరియు వారు (పేదవారిని) దగ్గరకు రానివ్వకూడదని గట్టి నిర్ణయంతో, తెల్లవారు ఝామున బయలుదేరారు.

68:26 – فَلَمَّا رَأَوْهَا قَالُوا إِنَّا لَضَالُّونَ ٢٦

వారు దానిని (తోటను) చూసి ఇలా వా పోయారు: ‘నిశ్చయంగా, మనం దారి తప్పాము!

68:27 – بَلْ نَحْنُ مَحْرُومُونَ ٢٧

“కాదు కాదు! మనం సర్వం కోల్పోయాము!”

68:28 – قَالَ أَوْسَطُهُمْ أَلَمْ أَقُل لَّكُمْ لَوْلَا تُسَبِّحُونَ ٢٨

వారిలో మధ్యరకానికి చెందిన వాడు ఇలా అన్నాడు: “ఏమీ? నేను మీతో అనలేదా? మీరు ఎందుకు ఆయన (అల్లాహ్) పవిత్రతను కొనియాడరని (‘ఇన్షా-అల్లాహ్!’ అనరని)?” 5

68:29 – قَالُوا سُبْحَانَ رَبِّنَا إِنَّا كُنَّا ظَالِمِينَ ٢٩

వారు ఇలా అన్నారు: “మా ప్రభువు సర్వలోపాలకూ అతీతుడు! నిశ్చయంగా, మేమే దుర్మార్గులము!”

68:30 – فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَلَاوَمُونَ ٣٠

తరువాత వారు అభిముఖులై ఒకరినొకరు నిందించుకోసాగారు.

68:31 – قَالُوا يَا وَيْلَنَا إِنَّا كُنَّا طَاغِينَ ٣١

వారు ఇలా వాపోయారు: “అయ్యో! మా పాడుగాను! నిశ్చయంగా, మేము తలబిరుసు తనం చూపాము!

68:32 – عَسَىٰ رَبُّنَا أَن يُبْدِلَنَا خَيْرًا مِّنْهَا إِنَّا إِلَىٰ رَبِّنَا رَاغِبُونَ ٣٢

“బహుశా! మన ప్రభువు మనకు దీనికి బదులుగా దీనికంటే శ్రేష్ఠమైన దానిని ప్రసాదించ వచ్చు! నిశ్చయంగా, మనం మన ప్రభువు వైపునకు (పశ్చాత్తాపంతో) మరలుదాము!”

68:33 – كَذَٰلِكَ الْعَذَابُ ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ ٣٣

ఈ విధంగా ఉంటుంది శిక్ష! మరియు పరలోక శిక్ష దీనికంటే ఘోరంగా ఉంటుంది. వారు ఇది తెలుసుకుంటే ఎంత బాగుండేది!

68:34 – إِنَّ لِلْمُتَّقِينَ عِندَ رَبِّهِمْ جَنَّاتِ النَّعِيمِ ٣٤

నిశ్చయంగా, దైవభీతి గల వారికి వారి ప్రభువు వద్ద పరమానందకరమైన స్వర్గవనాలు ఉంటాయి.

68:35 – أَفَنَجْعَلُ الْمُسْلِمِينَ كَالْمُجْرِمِينَ ٣٥

ఏమీ? మేము విధేయులను (ముస్లింలను) నేరస్థులతో సమానంగా ఎంచుదుమా? 6

68:36 – مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ ٣٦

మీ కేమయింది? మీరు ఏ విధమైన నిర్ణయాలు చేస్తున్నారు?

68:37 – أَمْ لَكُمْ كِتَابٌ فِيهِ تَدْرُسُونَ ٣٧

మీ వద్ద ఏదయినా (దివ్య) గ్రంథముందా? దానినుండి మీరు నేర్చుకోవటానికి!

68:38 – إِنَّ لَكُمْ فِيهِ لَمَا تَخَيَّرُونَ ٣٨

నిశ్చయంగా, అందులో మీకు, మీరు కోరేదంతా ఉందని?

68:39 – أَمْ لَكُمْ أَيْمَانٌ عَلَيْنَا بَالِغَةٌ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۙ إِنَّ لَكُمْ لَمَا تَحْكُمُونَ ٣٩

లేక, పునరుత్థానదినం వరకు, మీరు నిర్ణయించుకున్నదే మీకు తప్పక లభిస్తుందని మేము మీతో చేసిన గట్టి ప్రమాణం ఏదైనా ఉందా?

68:40 – سَلْهُمْ أَيُّهُم بِذَٰلِكَ زَعِيمٌ ٤٠

వారిలో దీనికి ఎవడు హామీగా ఉన్నాడో అడుగు.

68:41 – أَمْ لَهُمْ شُرَكَاءُ فَلْيَأْتُوا بِشُرَكَائِهِمْ إِن كَانُوا صَادِقِينَ ٤١

లేక, వారికి ఎవరైనా (వారు అల్లాహ్‌కు కల్పించిన) భాగస్వాములు ఉన్నారా? ఒకవేళ వారు సత్యవంతులే అయితే తమ ఆ భాగస్వాములను తీసుకురమ్మను.

68:42 – يَوْمَ يُكْشَفُ عَن سَاقٍ وَيُدْعَوْنَ إِلَى السُّجُودِ فَلَا يَسْتَطِيعُونَ ٤٢

(జ్ఞాపకముంచుకోండి) ఏ రోజయితే పిక్క ఎముక తెరిచి వేయబడుతుందో! మరియు వారు సాష్టాంగం (సజ్దా) చేయటానికి పిలువబడతారో అప్పుడు వారు (కపట-విశ్వాసులు), అలా (సజ్దా) చేయలేరు!

68:43 – خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ۖ وَقَدْ كَانُوا يُدْعَوْنَ إِلَى السُّجُودِ وَهُمْ سَالِمُونَ ٤٣

వారి చూపులు క్రిందికి వాలిపోయి ఉంటాయి. అవమానం వారిని ఆవరించి ఉంటుంది. మరియు వాస్తవానికి వారు నిక్షేపంగా ఉన్నప్పుడు సాష్టాంగం (సజ్దా) చేయటానికి ఆహ్వానించబడితే (తిరస్కరించే వారు)!

68:44 – فَذَرْنِي وَمَن يُكَذِّبُ بِهَـٰذَا الْحَدِيثِ ۖ سَنَسْتَدْرِجُهُم مِّنْ حَيْثُ لَا يَعْلَمُونَ ٤٤

కావున నన్ను మరియు ఈ సందేశాన్ని అబద్ధమని తిరస్కరించేవారిని వదలండి. వారు గ్రహించని విధంగా మేము వారిని క్రమక్రమంగా (వినాశం వైపునకు) తీసుకొనిపోతాము. 7

68:45 – وَأُمْلِي لَهُمْ ۚ إِنَّ كَيْدِي مَتِينٌ ٤٥

మరియు నేను వారికి కొంత వ్యవధి నిస్తున్నాను. నిశ్చయంగా, నా పన్నాగం చాలా దృఢమైనది. 8

68:46 – أَمْ تَسْأَلُهُمْ أَجْرًا فَهُم مِّن مَّغْرَمٍ مُّثْقَلُونَ ٤٦

లేక, (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఏదైనా ప్రతిఫలం ఇవ్వమని అడుగుతున్నావా? వారికి దాని రుణం భారమవటానికి?

68:47 – أَمْ عِندَهُمُ الْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ ٤٧

లేక, వారి వద్ద ఏదైనా అగోచర జ్ఞానం ఉందా? 9 వారు దానిని వ్రాసిపెట్టడానికి?

68:48 – فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تَكُن كَصَاحِبِ الْحُوتِ إِذْ نَادَىٰ وَهُوَ مَكْظُومٌ ٤٨

కావున నీవు నీప్రభువు ఆజ్ఞకొరకు వేచి ఉండు. మరియు నీవు, చేపవాని (యూనుస్‌) వలే వ్యవహరించకు. 10 (గుర్తుకు తెచ్చుకో) అతను దుఃఖంలో ఉన్నప్పుడు (తన ప్రభువును) మొరపెట్టుకున్నాడు.

68:49 – لَّوْلَا أَن تَدَارَكَهُ نِعْمَةٌ مِّن رَّبِّهِ لَنُبِذَ بِالْعَرَاءِ وَهُوَ مَذْمُومٌ ٤٩

అతని ప్రభవు అనుగ్రహమే గనక అతనికి అందకపోయి ఉంటే, అతను అవమానకరమైన స్థితిలో (చేప కడుపులో పడిఉండే వాడు కాని మేము అతనిని క్షమించాము). కావున అతను చౌట(బంజరు) మైదానంలో విసరివేయబడ్డాడు. 11

68:50 – فَاجْتَبَاهُ رَبُّهُ فَجَعَلَهُ مِنَ الصَّالِحِينَ ٥٠

చివరకు అతని ప్రభువు అతనిని ఎన్నుకొని సత్పురుషులలో చేర్చాడు.

68:51 – وَإِن يَكَادُ الَّذِينَ كَفَرُوا لَيُزْلِقُونَكَ بِأَبْصَارِهِمْ لَمَّا سَمِعُوا الذِّكْرَ وَيَقُولُونَ إِنَّهُ لَمَجْنُونٌ ٥١

మరియు ఈ సత్య-తిరస్కారులు, ఈ సందేశాన్ని (ఖుర్‌ఆన్‌ను) విన్నప్పుడు, తమ చూపులతో నీకాళ్ళు ఊడగొడతారా అన్నట్లు (నిన్ను జారించి పడవేసేటట్లు) నిన్ను చూస్తున్నారు. 12 మరియు వారు నిన్ను (ఓ ముహమ్మద్‌!): “నిశ్చయంగా, ఇతడు పిచ్చి వాడు!” అని అంటున్నారు.

68:52 – وَمَا هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ ٥٢

కాని సర్వలోకాల (వారికి) ఇదొక హితోపదేశం మాత్రమే! (1/4)

సూరహ్‌ అల్‌-‘హాఖ్ఖహ్ – అల్‌-‘హాఖ్ఖహ్: The Reality,The Inevitable, అనివార్య సంఘటన, పరమ యథార్థం, నిజం, సత్యం. (ఇది పునరుత్థానదినానికి గల మరొక పేరు). ఈ సూరహ్‌ మక్కహ్ లో, సూరహ్‌ అల్‌-ముల్క్‌ (67), తరువాత అవతరింపజేయబడింది. దాదాపు హిజ్రత్‌కు 3-4 సంవత్స రాలకు ముందు. ఇంకా చూడండి, 37:19, 39:68 చివరిభాగం మరియు 50:20-21. 52 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 69:1 – الْحَاقَّةُ ١

  • ఆ అనివార్య సంఘటన (పునరుత్థానం)!

69:2 – مَا الْحَاقَّةُ ٢

ఏమిటా అనివార్యసంఘటన?

69:3 – وَمَا أَدْرَاكَ مَا الْحَاقَّةُ ٣

మరియు ఆ అనివార్య సంఘటన, అంటే ఏమిటో నీకేమి తెలుసు?

69:4 – كَذَّبَتْ ثَمُودُ وَعَادٌ بِالْقَارِعَةِ ٤

స’మూద్‌ మరియు ‘ఆద్‌ జాతి వారు అకస్మాత్తుగా విరుచుకుపడే ఆ ఉపద్రవాన్ని అసత్యమని తిరస్కరించారు. 1

69:5 – فَأَمَّا ثَمُودُ فَأُهْلِكُوا بِالطَّاغِيَةِ ٥

కావున స’మూద్‌ జాతివారైతే ఒక భయం కరమైన గర్జన ద్వారా నాశనం చేయబడ్డారు.

69:6 – وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ ٦

మరియు ఆద్‌ జాతి వారేమో అతి తీవ్రమైన తుఫాను గాలి ద్వారా నాశనం చేయబడ్డారు.

69:7 – سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ ٧

ఆయన (అల్లాహ్‌), దానిని వారి మీద ఏడు రాత్రులు మరియు ఎనిమిది పగళ్ళ వరకు ఎడతెగకుండా ఆవరింపజేశాడు. 2 దాని వలన వారు వేళ్ళతో పెళ్ళగించబడిన ఖర్జూరపు బోదెల వలే పాడైపోవటం, నీవు చూస్తావు!

69:8 – فَهَلْ تَرَىٰ لَهُم مِّن بَاقِيَةٍ ٨

అయితే ఇప్పుడు వారిలో ఎవరైనా మిగిలి ఉన్నట్లు నీవు చూస్తున్నావా?

69:9 – وَجَاءَ فِرْعَوْنُ وَمَن قَبْلَهُ وَالْمُؤْتَفِكَاتُ بِالْخَاطِئَةِ ٩

ఫిర్‌’ఔన్‌ మరియు అతనికి పూర్వం గతించిన వారూ మరియు తలక్రిందులు చేయబడిన నగరాలవారూ, 3 అందరూ గొప్ప నేరాలకు పాల్పడిన వారే.

69:10 – فَعَصَوْا رَسُولَ رَبِّهِمْ فَأَخَذَهُمْ أَخْذَةً رَّابِيَةً ١٠

మరియు వారు తమ ప్రభువు పంపిన ప్రవక్తలకు అవిధేయత కనబరచారు కావున ఆయన వారిని కఠినమైనపట్టుతో పట్టుకున్నాడు.

69:11 – إِنَّا لَمَّا طَغَى الْمَاءُ حَمَلْنَاكُمْ فِي الْجَارِيَةِ ١١

నిశ్చయంగా, ఎప్పుడైతే (నూహ్‌ తుఫాన్‌) నీరు హద్దులేకుండా ఉప్పొంగి పోయిందో! అప్పుడు మేము మిమ్మల్ని 4 పయనించే (నావలో) ఎక్కించాము.

69:12 – لِنَجْعَلَهَا لَكُمْ تَذْكِرَةً وَتَعِيَهَا أُذُنٌ وَاعِيَةٌ ١٢

దానిని, మీకొక హితబోధగానూ మరియు జ్ఞాపకముంచుకోగల చెవి, దానిని జ్ఞాపకం ఉంచుకోవ టానికి అనువైనదిగా చేశాము.

69:13 – فَإِذَا نُفِخَ فِي الصُّورِ نَفْخَةٌ وَاحِدَةٌ ١٣

ఇక ఎప్పుడైతే ఒక పెద్ద ధ్వనితో బాకా ఊదబడుతుందో! 5

69:14 – وَحُمِلَتِ الْأَرْضُ وَالْجِبَالُ فَدُكَّتَا دَكَّةً وَاحِدَةً ١٤

మరియు భూమి మరియు పర్వతాలు పైకి ఎత్తబడి ఒక పెద్దదెబ్బతో తుత్తునియలుగా చేయబడతాయో!

69:15 – فَيَوْمَئِذٍ وَقَعَتِ الْوَاقِعَةُ ١٥

అప్పుడు, ఆ రోజున సంభవించవలసిన, ఆ అనివార్య సంఘటన సంభవిస్తుంది.

69:16 – وَانشَقَّتِ السَّمَاءُ فَهِيَ يَوْمَئِذٍ وَاهِيَةٌ ١٦

మరియు ఆ రోజున ఆకాశం బ్రద్దలైపోతుంది మరియు దాని వ్యవస్థ సడలిపోతుంది. 6

69:17 – وَالْمَلَكُ عَلَىٰ أَرْجَائِهَا ۚ وَيَحْمِلُ عَرْشَ رَبِّكَ فَوْقَهُمْ يَوْمَئِذٍ ثَمَانِيَةٌ ١٧

మరియు దేవదూతలు దాని (‘అర్ష్‌) ప్రక్కలలో ఉంటారు. మరియు నీ ప్రభువు యొక్క సింహాసనాన్ని (‘అర్ష్‌ను), ఆ రోజు ఎనిమిది మంది (దేవదూతలు) ఎత్తుకొని ఉంటారు.

69:18 – يَوْمَئِذٍ تُعْرَضُونَ لَا تَخْفَىٰ مِنكُمْ خَافِيَةٌ ١٨

ఆ రోజు మీరు (తీర్పుకొరకు) హాజరు చేయబడతారు. మీరు దాచిన ఏ రహస్యం కూడా (ఆ రోజు) దాగి ఉండదు. 7

69:19 – فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ فَيَقُولُ هَاؤُمُ اقْرَءُوا كِتَابِيَهْ ١٩

ఇక ఎవనికైతే తన కర్మ పత్రము కుడి చేతిలో ఇవ్వబడుతుందో, అతడు ఇలా అంటాడు: “ఇదిగో నా కర్మపత్రాన్ని తీసుకొని చదవండి!

69:20 – إِنِّي ظَنَنتُ أَنِّي مُلَاقٍ حِسَابِيَهْ ٢٠

“నిశ్చయంగా, నా లెక్క నాకు తప్పకుండా లభిస్తుందని నేను భావించే వాడిని!”

69:21 – فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ ٢١

కావున, అతడు సంతోషకరమైన జీవితం గడుపుతాడు.

69:22 – فِي جَنَّةٍ عَالِيَةٍ ٢٢

అత్యున్నతమైన స్వర్గవనంలో; 8

69:23 – قُطُوفُهَا دَانِيَةٌ ٢٣

దాని పండ్ల గుత్తులు, సమీపంలో వ్రేలాడుతూ ఉంటాయి.

69:24 – كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ ٢٤

(వారితో ఇలా అనబడుతుంది): “గడిచి పోయిన దినాలలో మీరు చేసి పంపిన కర్మలకు ప్రతిఫలంగా, ఇప్పుడు మీరు హాయిగా తినండి మరియు త్రాగండి!”

69:25 – وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِشِمَالِهِ فَيَقُولُ يَا لَيْتَنِي لَمْ أُوتَ كِتَابِيَهْ ٢٥

ఇక ఎవడికైతే, తన కర్మపత్రం ఎడమ చేతికి ఇవ్వబడుతుందో, అతడు ఇలా వాపోతాడు: “అయ్యో నా పాడుగాను! నా కర్మపత్రం అసలు నాకు ఇవ్వబడకుండా ఉంటే ఎంత బాగుండేది!

69:26 – وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ ٢٦

“మరియు నా లెక్క ఏమిటో నాకు తెలియకుంటే ఎంత బాగుండేది!

69:27 – يَا لَيْتَهَا كَانَتِ الْقَاضِيَةَ ٢٧

“అయ్యో, నా పాడుగాను! అది (ఆ మరణమే) నాకు అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండేది!

69:28 – مَا أَغْنَىٰ عَنِّي مَالِيَهْ ۜ ٢٨

“నా సంపద నాకేమీ పనికిరాలేదు;

69:29 – هَلَكَ عَنِّي سُلْطَانِيَهْ ٢٩

“నా అధికారమంతా అంతమైపోయింది!”

69:30 – خُذُوهُ فَغُلُّوهُ ٣٠

(అప్పుడు ఇలా ఆజ్ఞ ఇవ్వబడుతుంది): “అతన్ని పట్టుకోండి మరియు అతని మెడలో సంకెళ్ళు వేయండి; 9

69:31 – ثُمَّ الْجَحِيمَ صَلُّوهُ ٣١

“తరువాత అతనిని భగభగ మండే నరకాగ్నిలో వేయండి.

69:32 – ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ ٣٢

“ఆ తరువాత అతనిని డెభ్భై మూరల పొడువుగల గొలుసుతో బంధించండి!” 10

69:33 – إِنَّهُ كَانَ لَا يُؤْمِنُ بِاللَّـهِ الْعَظِيمِ ٣٣

వాస్తవానికి అతడు సర్వోత్తముడైన అల్లాహ్‌ను విశ్వసించేవాడు కాదు.

69:34 – وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ ٣٤

మరియు నిరుపేదలకు ఆహారం పెట్టమని ప్రోత్సహించేవాడు కాదు.

69:35 – فَلَيْسَ لَهُ الْيَوْمَ هَاهُنَا حَمِيمٌ ٣٥

కావున, ఈనాడు అతనికి ఇక్కడ ఏ స్నేహితుడూ లేడు;

69:36 – وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ ٣٦

మరియు అసహ్యకరమైన గాయాల కడుగు తప్ప, మరొక ఆహారమూ లేదు!

69:37 – لَّا يَأْكُلُهُ إِلَّا الْخَاطِئُونَ ٣٧

దానిని పాపులు తప్ప మరెవ్వరూ తినరు!

69:38 – فَلَا أُقْسِمُ بِمَا تُبْصِرُونَ ٣٨

కావున, నేను మీరు చూడగలిగే వాటి శపథం చేస్తున్నాను;

69:39 – وَمَا لَا تُبْصِرُونَ ٣٩

మరియు మీరు చూడలేనట్టి వాటి (శపథం) కూడా!

69:40 – إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ ٤٠

నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్‌ఆన్‌) గౌరవనీయుడైన సందేశహరునిపై (అవతరింప జేయబడిన) వాక్కు.

69:41 – وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ۚ قَلِيلًا مَّا تُؤْمِنُونَ ٤١

మరియు ఇది ఒక కవియొక్క వాక్కు కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ.

69:42 – وَلَا بِقَوْلِ كَاهِنٍ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ ٤٢

మరియు ఇది ఏ జ్యోతిష్యుని వాక్కు కూడా కాదు! మీరు గ్రహించేది చాలా తక్కువ.

69:43 – تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ ٤٣

ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరించింది.

69:44 – وَلَوْ تَقَوَّلَ عَلَيْنَا بَعْضَ الْأَقَاوِيلِ ٤٤

ఒకవేళ ఇతను (ఈ ప్రవక్త), మా (అల్లాహ్‌ను) గురించి ఏదైనా అబద్ధపు మాట కల్పించి ఉంటే!

69:45 – لَأَخَذْنَا مِنْهُ بِالْيَمِينِ ٤٥

మేము అతని కుడిచేతిని పట్టుకునేవారం.

69:46 – ثُمَّ لَقَطَعْنَا مِنْهُ الْوَتِينَ ٤٦

తరువాత అతని (మెడ) రక్తనాళాన్ని కోసేవారం.

69:47 – فَمَا مِنكُم مِّنْ أَحَدٍ عَنْهُ حَاجِزِينَ ٤٧

అప్పుడు మీలో నుండి ఏ ఒక్కడు కూడా అతనిని (మా శిక్ష నుండి) కాపాడలేక పోయేవాడు.

69:48 – وَإِنَّهُ لَتَذْكِرَةٌ لِّلْمُتَّقِينَ ٤٨

మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్‌ఆన్‌) దైవభీతి గలవారికొక హితోపదేశం.

69:49 – وَإِنَّا لَنَعْلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ ٤٩

మరియు నిశ్చయంగా మీలో కొందరు దీనిని (ఈ ఖుర్‌ఆన్‌ను) అసత్యమని అనేవారు ఉన్నారని మాకు బాగా తెలుసు.

69:50 – وَإِنَّهُ لَحَسْرَةٌ عَلَى الْكَافِرِينَ ٥٠

మరియు నిశ్చయంగా ఇది (ఈ తిరస్కారం) సత్య-తిరస్కారులకు దుఃఖకారణ మవుతుంది.

69:51 – وَإِنَّهُ لَحَقُّ الْيَقِينِ ٥١

మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్‌ఆన్‌) నమ్మదగిన సత్యం.

69:52 – فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ ٥٢

కావున నీవు సర్వత్తముడైన నీ ప్రభువు పవిత్ర నామాన్ని స్తుతించు.

సూరహ్‌ అల్‌-మ’ఆరిజ్‌ – అల్‌-మ’ఆరిజ్‌: Tha Ways of Ascent, ఆరోహణ, అధిరోహణ, ఊర్థ్వగమన, లేక పైకి వెళ్ళే మార్గాలు. ఇది మధ్య మక్కహ్ కాలపు సూరహ్‌. 44 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 3వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 70:1 – سَأَلَ سَائِلٌ بِعَذَابٍ وَاقِعٍ ١

ప్రశ్నించే వాడు, 1 ఆ అనివార్యమైన శిక్షను గురించి ప్రశ్నించాడు;

70:2 – لِّلْكَافِرِينَ لَيْسَ لَهُ دَافِعٌ ٢

సత్య-తిరస్కారులకు విధించబడే దాని గురించి; దానిని ఎవ్వడూ తొలగించలేడు.

70:3 – مِّنَ اللَّـهِ ذِي الْمَعَارِجِ ٣

అది ఆరోహణ మార్గాలకు యజమానుడైన అల్లాహ్‌ తరఫు నుండి వస్తుంది. 2

70:4 – تَعْرُجُ الْمَلَائِكَةُ وَالرُّوحُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ ٤

యాభైవేల సంవత్సరాలకు సమానమైన (ప్రమాణం గల) ఒక రోజులో, 3 దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్‌) 4 ఆయన వద్దకు అధిరోహిస్తారు.

70:5 – فَاصْبِرْ صَبْرًا جَمِيلً ٥

కావున (ఓ ము’హమ్మద్‌!) నీవు సహనం వహించు, ఉత్తమమైన సహనంతో!

70:6 – إِنَّهُمْ يَرَوْنَهُ بَعِيدًا ٦

వాస్తవానికి, వారు (ప్రజలు) అది (ఆ దినం) దూరంగా ఉందని అనుకుంటున్నారు.

70:7 – وَنَرَاهُ قَرِيبًا ٧

కాని మా కది అతి దగ్గరలో కనిపిస్తోంది.

70:8 – يَوْمَ تَكُونُ السَّمَاءُ كَالْمُهْلِ ٨

ఆ రోజు ఆకాశం మరిగే సీసం వలే (నూనె వలే) అయిపోతుంది;

70:9 – وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ ٩

మరియు కొండలు ఏకిన ఉన్నివలె అయిపోతాయి. 5

70:10 – وَلَا يَسْأَلُ حَمِيمٌ حَمِيمًا ١٠

మరియు ప్రాణ స్నేహితుడు కూడా తన స్నేహితుని (క్షేమాన్ని) అడగడు.

70:11 – يُبَصَّرُونَهُمْ ۚ يَوَدُّ الْمُجْرِمُ لَوْ يَفْتَدِي مِنْ عَذَابِ يَوْمِئِذٍ بِبَنِيهِ ١١

వారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆరోజు అపరాధి తన సంతానాన్ని పరిహారంగా ఇచ్చి అయినా శిక్ష నుండి తప్పించుకోగోరుతాడు;

70:12 – وَصَاحِبَتِهِ وَأَخِيهِ ١٢

మరియు తన సహవాసిని మరియు తన సోదరుణ్ణి;

70:13 – وَفَصِيلَتِهِ الَّتِي تُؤْوِيهِ ١٣

మరియు తనకు ఆశ్రయమిచ్చిన దగ్గరి బంధువులను;

70:14 – وَمَن فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ يُنجِيهِ ١٤

మరియు భూమిలో ఉన్న వారినందరినీ కూడా ఇచ్చి అయినా, తాను విముక్తి పొందాలని కోరుతాడు.

70:15 – كَلَّا ۖ إِنَّهَا لَظَىٰ ١٥

కాని అలా కానేరదు! నిశ్చయంగా ఆ మండే అగ్నిజ్వాల (అతని కొరకు వేచి ఉంటుంది)!

70:16 – نَزَّاعَةً لِّلشَّوَىٰ ١٦

అది అతని చర్మాన్ని పూర్తిగా వలచి కాల్చివేస్తుంది.

70:17 – تَدْعُو مَنْ أَدْبَرَ وَتَوَلَّىٰ ١٧

అది (సత్యం నుండి) వెనుదిరిగి మరియు వెన్నుచూపి, పోయేవారిని (అందరినీ) పిలుస్తుంది.

70:18 – وَجَمَعَ فَأَوْعَىٰ ١٨

మరియు (ధనాన్ని) కూడబెట్టి, దానిని దాచే వారిని. (3/8)

70:19 – إِنَّ الْإِنسَانَ خُلِقَ هَلُوعًا ١٩

  • నిశ్చయంగా మానవుడు ఆత్రగాడుగా (తొందరపడేవాడిగా) సృష్టించబడ్డాడు;

70:20 – إِذَا مَسَّهُ الشَّرُّ جَزُوعً ٢٠

తనకు కీడు కలిగినప్పుడు వాడు ఆందోళన చెందుతాడు;

70:21 – وَإِذَا مَسَّهُ الْخَيْرُ مَنُوعًا ٢١

మరియు తనకు మేలు కలిగినపుడు స్వార్థపరునిగా ప్రవర్తిస్తాడు.

70:22 – إِلَّا الْمُصَلِّينَ ٢٢

నమా’జ్‌ను ఖచ్చితంగాపాఠించేవారుతప్ప!

70:23 – الَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ دَائِمُونَ ٢٣

ఎవరైతే తమ నమా’జ్‌ను సదా నియమంతో పాటిస్తారో;

70:24 – وَالَّذِينَ فِي أَمْوَالِهِمْ حَقٌّ مَّعْلُومٌ ٢٤

మరియు అలాంటి వారు, ఎవరైతే తమ సంపదలలో (ఇతరులకు) ఉన్న హక్కును సమ్మతిస్తారో! 6

70:25 – لِّلسَّائِلِ وَالْمَحْرُومِ ٢٥

యాచకులకు మరియు లేమికి గురి అయిన వారికి; 7

70:26 – وَالَّذِينَ يُصَدِّقُونَ بِيَوْمِ الدِّينِ ٢٦

మరియు అలాంటి వారికి, ఎవరైతే తీర్పుదినాన్ని సత్యమని నమ్ముతారో;

70:27 – وَالَّذِينَ هُم مِّنْ عَذَابِ رَبِّهِم مُّشْفِقُونَ ٢٧

మరియు ఎవరైతే తమ ప్రభువు శిక్షకు భయపడుతారో!

70:28 – إِنَّ عَذَابَ رَبِّهِمْ غَيْرُ مَأْمُونٍ ٢٨

నిశ్చయంగా, వారి ప్రభువు యొక్క ఆ శిక్ష; దాని పట్ల ఎవ్వరూ నిర్భయంగా ఉండలేరు.

70:29 – وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ ٢٩

మరియు ఎవరైతే, తమ మర్మాంగాలను కాపాడుకుంటారో –

70:30 – إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ ٣٠

తమ భార్యలు (అ’జ్వాజ్‌), లేదా ధర్మ సమ్మతంగా తమ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలతో తప్ప 8 – అలాంటప్పుడు వారు నిందార్హులు కారు.

70:31 – فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَـٰئِكَ هُمُ الْعَادُونَ ٣١

కాని ఎవరైతే వీటిని మించి పోగోరుతారో, అలాంటి వారే మితిమీరి పోయే వారు.

70:32 – وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ ٣٢

మరియు ఎవరైతే తమ అమానతులను మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో;

70:33 – وَالَّذِينَ هُم بِشَهَادَاتِهِمْ قَائِمُونَ ٣٣

మరియు ఎవరైతే తమ సాక్ష్యాల మీద స్థిరంగా ఉంటారో;

70:34 – وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ ٣٤

మరియు ఎవరైతే తమ నమాజులను కాపాడుకుంటారో;

70:35 – أُولَـٰئِكَ فِي جَنَّاتٍ مُّكْرَمُونَ ٣٥

ఇలాంటి వారంతా సగౌరవంగా స్వర్గ వనాలలో ఉంటారు.

70:36 – فَمَالِ الَّذِينَ كَفَرُوا قِبَلَكَ مُهْطِعِينَ ٣٦

ఈ సత్య-తిరస్కారులకు ఏమయ్యింది? వీరెందుకు హడావిడిగా, నీ ముందు ఇటూ అటూ తిరుగుతున్నారు?

70:37 – عَنِ الْيَمِينِ وَعَنِ الشِّمَالِ عِزِينَ ٣٧

కుడిప్రక్క నుండి మరియు ఎడమ ప్రక్క నుండి గుంపులుగా; 9

70:38 – أَيَطْمَعُ كُلُّ امْرِئٍ مِّنْهُمْ أَن يُدْخَلَ جَنَّةَ نَعِيمٍ ٣٨

ఏమీ? వారిలో ప్రతి ఒక్కడూ, తాను పరమ సుఖాలు గల స్వర్గవనంలో ప్రవేశింపజేయ- బడతానని ఆశిస్తున్నాడా?

70:39 – كَلَّا ۖ إِنَّا خَلَقْنَاهُم مِّمَّا يَعْلَمُونَ ٣٩

అలా కానేరదు! నిశ్చయంగా, మేము వారిని దేనితో పుట్టించామో వారికి బాగా తెలుసు!

70:40 – فَلَا أُقْسِمُ بِرَبِّ الْمَشَارِقِ وَالْمَغَارِبِ إِنَّا لَقَادِرُونَ ٤٠

కావున! నేను తూర్పుల మరియు పడమరల ప్రభువు శపథంచేసి చెబుతున్నాను. 10 నిశ్చయంగా, మేము అలా చేయగల సమర్థులము;

70:41 – عَلَىٰ أَن نُّبَدِّلَ خَيْرًا مِّنْهُمْ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ ٤١

వారికి బదులుగా వారికంటే ఉత్తమమైన వారిని వారి స్థానంలో తీసుకురావటానికి; మరియు మమ్మల్ని మించిపోయే వారు ఎవ్వరూ లేరు.

70:42 – فَذَرْهُمْ يَخُوضُوا وَيَلْعَبُوا حَتَّىٰ يُلَاقُوا يَوْمَهُمُ الَّذِي يُوعَدُونَ ٤٢

కావున వారిని – వారితో వాగ్దానం చేయ- బడిన ఆ దినానికి చేరే వరకు –వ్యర్థపు మాటలలో మరియు విలాసవినోదాల్లో విడిచిపెట్టు.

70:43 – يَوْمَ يَخْرُجُونَ مِنَ الْأَجْدَاثِ سِرَاعًا كَأَنَّهُمْ إِلَىٰ نُصُبٍ يُوفِضُونَ ٤٣

ఆ రోజు వారు తమ సమాధులనుండి లేచి, తమ గమ్యస్థానాలకు చేరుకోవటానికి తొందర- పడుతూ వేగంగా బయటికి వస్తారు.

70:44 – خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ۚ ذَٰلِكَ الْيَوْمُ الَّذِي كَانُوا يُوعَدُونَ ٤٤

వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి, అవమానం వారిని క్రమ్ముకొని ఉంటుంది. అదే వారికి వాగ్దానం చేయబడిన దినం!

సూరహ్‌ నూ’హ్‌ – ఖుర్‌ఆన్‌లో నూ’హ్‌ ‘అ.స. (Noah) ప్రస్తావన ఎన్నోసార్లు వచ్చింది. ఈ సూరహ్‌ మొదటి మక్కహ్ కాలంలో అవతరింపజేయబడింది. చూడండి, 171:25. 28 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 71:1 – إِنَّا أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ أَنْ أَنذِرْ قَوْمَكَ مِن قَبْلِ أَن يَأْتِيَهُمْ عَذَابٌ أَلِيمٌ ١

నిశ్చయంగా, మేము నూ’హ్‌ను, అతని జాతి వారి వద్దకు: “వారిపై బాధాకరమైన శిక్ష రాకముందే వారిని హెచ్చరించు!” అని (ఆజ్ఞాపించి) పంపాము.

71:2 – قَالَ يَا قَوْمِ إِنِّي لَكُمْ نَذِيرٌ مُّبِينٌ ٢

అతను వారితో ఇలా అన్నాడు: “ఓ నాజాతి ప్రజలారా! నిశ్చయంగా, నేను మీకు స్పష్టంగా హెచ్చరిక చేయటానికి వచ్చినవాడిని!

71:3 – أَنِ اعْبُدُوا اللَّـهَ وَاتَّقُوهُ وَأَطِيعُونِ ٣

“కావున మీరు అల్లాహ్‌నే ఆరాధించండి మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

71:4 – يَغْفِرْ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُؤَخِّرْكُمْ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۚ إِنَّ أَجَلَ اللَّـهِ إِذَا جَاءَ لَا يُؤَخَّرُ ۖ لَوْ كُنتُمْ تَعْلَمُونَ ٤

“అలా చేస్తే ఆయన మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఒక నియమిత కాలం వరకు మిమ్మల్ని వదలిపెడ్తాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ నిర్ణయించిన కాలం వచ్చినపుడు, దానిని తప్పించడం సాధ్యం కాదు. ఇది మీరు తెలుసుకుంటే ఎంత బాగుండేది!”

71:5 – قَالَ رَبِّ إِنِّي دَعَوْتُ قَوْمِي لَيْلًا وَنَهَارًا ٥

అతను ఇలా ప్రార్థించాడు: “ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నేను నా జాతివారిని రేయింబవళ్ళు పిలిచాను;

71:6 – فَلَمْ يَزِدْهُمْ دُعَائِي إِلَّا فِرَارًا ٦

“కాని, నా పిలుపు, వారి పలాయనాన్ని మాత్రమే హెచ్చించింది.

71:7 – وَإِنِّي كُلَّمَا دَعَوْتُهُمْ لِتَغْفِرَ لَهُمْ جَعَلُوا أَصَابِعَهُمْ فِي آذَانِهِمْ وَاسْتَغْشَوْا ثِيَابَهُمْ وَأَصَرُّوا وَاسْتَكْبَرُوا اسْتِكْبَارًا ٧

“మరియు వాస్తవానికి, నేను వారిని, నీ క్షమాభిక్ష వైపునకు పిలిచినప్పుడల్లా, వారు తమ చెవులలో వ్రేళ్ళు దూర్చుకునేవారు మరియు తమ వస్త్రాలను తమపై కప్పుకునేవారు మరియు వారు మొండివైఖరి అవలంబిస్తూ దురహకారంలో మునిగి ఉండేవారు.

71:8 – ثُمَّ إِنِّي دَعَوْتُهُمْ جِهَارًا ٨

“తరువాత వాస్తవానికి, నేను వారిని ఎలుగెత్తి పిలిచాను.

71:9 – ثُمَّ إِنِّي أَعْلَنتُ لَهُمْ وَأَسْرَرْتُ لَهُمْ إِسْرَارًا ٩

“ఆ తరువాత వాస్తవంగా, నేను వారికి బహిరంగంగా చాటి చెప్పాను మరియు ఏకాంతంలో రహస్యంగా కూడా పిలిచాను.

71:10 – فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا ١٠

“ఇంకా వారితో ఇలా అన్నాను: ‘మీ ప్రభువును క్షమాపణకై వేడుకోండి, నిశ్చయంగా, ఆయన ఎంతో క్షమాశీలుడు!

71:11 – يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا ١١

‘ఆయన మీపై ఆకాశం నుండి ధారాళంగా వర్షాన్ని కురిపింపజేస్తాడు. 1

71:12 – وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا ١٢

‘మరియు మీకు ధన సంపదలలోను మరియు సంతానంలోను వృధ్ధినొసంగుతాడు మరియు మీ కొరకు తోటలను ఉత్పత్తిచేస్తాడు మరియు నదులను ప్రవహింపజేస్తాడు.’ “

71:13 – مَّا لَكُمْ لَا تَرْجُونَ لِلَّـهِ وَقَارًا ١٣

మీ కేమయింది? మీరు అల్లాహ్‌ మహత్త్వమును ఎందుకు ఆదరించరు? 2

71:14 – وَقَدْ خَلَقَكُمْ أَطْوَارًا ١٤

మరియు వాస్తవానికి ఆయనే, మిమ్మల్ని విభిన్న దశలలో సృష్టించాడు. 3

71:15 – أَلَمْ تَرَوْا كَيْفَ خَلَقَ اللَّـهُ سَبْعَ سَمَاوَاتٍ طِبَاقًا ١٥

ఏమీ? మీరు చూడటం లేదా? అల్లాహ్‌ ఏడు ఆకాశాలను ఏ విధంగా అంతస్తులలో సృష్టించాడో! 4

71:16 – وَجَعَلَ الْقَمَرَ فِيهِنَّ نُورًا وَجَعَلَ الشَّمْسَ سِرَاجًا ١٦

మరియు వాటి మధ్య చంద్రుణ్ణి (ప్రతిబింబించే) కాంతిగాను మరియు సూర్యుణ్ణి (వెలిగే) దీపంగాను చేశాడు! 5

71:17 – وَاللَّـهُ أَنبَتَكُم مِّنَ الْأَرْضِ نَبَاتًا ١٧

మరియు అల్లాహ్‌యే మిమ్మల్ని భూమి(మట్టి) నుండి 6 ఉత్పత్తిచేశాడు!

71:18 – ثُمَّ يُعِيدُكُمْ فِيهَا وَيُخْرِجُكُمْ إِخْرَاجًا ١٨

తరువాత ఆయన మిమ్మల్ని అందులోకే తీసుకొని పోతాడు మరియు మిమ్మల్ని దాని నుండి (బ్రతికించి) బయటికి తీస్తాడు!

71:19 – وَاللَّـهُ جَعَلَ لَكُمُ الْأَرْضَ بِسَاطًا ١٩

మరియు అల్లాహ్‌యే మీ కొరకు భూమిని విస్తరింపజేశాడు.

71:20 – لِّتَسْلُكُوا مِنْهَا سُبُلًا فِجَاجًا ٢٠

మీరు దానిపైనున్న విశాలమైన మార్గాలలో నడవటానికి.

71:21 – قَالَ نُوحٌ رَّبِّ إِنَّهُمْ عَصَوْنِي وَاتَّبَعُوا مَن لَّمْ يَزِدْهُ مَالُهُ وَوَلَدُهُ إِلَّا خَسَارًا ٢١

నూ’హ్‌ ఇంకా ఇలా విన్నవించుకున్నాడు: “ఓ నా ప్రభూ! వాస్తవానికి, వారు నా మాటను ధిక్కరించారు. మరియు వాడిని అనుసరించారు, ఎవడి సంపద మరియు సంతానం వారికి కేవలం నష్టం తప్ప మరేమి అధికంచేయదో!

71:22 – وَمَكَرُوا مَكْرًا كُبَّارًا ٢٢

“మరియు వారు పెద్ద కుట్ర పన్నారు. 7

71:23 – وَقَالُوا لَا تَذَرُنَّ آلِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّا وَلَا سُوَاعًا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا ٢٣

“మరియు వారు ఒకరితోనొకరు ఇలా అనుకున్నారు: ‘మీరు మీ ఆరాధ్యదైవాలను విడిచి పెట్టకండి. వద్ద్‌ మరియు సువా’అ; య’గూస్‌’, య’ఊఖ్‌ మరియు నస్ర్‌లను విడిచిపెట్టకండి!’

71:24 – وَقَدْ أَضَلُّوا كَثِيرًا ۖ وَلَا تَزِدِ الظَّالِمِينَ إِلَّا ضَلَالًا ٢٤

“మరియు వాస్తవానికి, వారు చాలా మందిని తప్పు దారిలో పడవేశారు. కావున (ఓ నా ప్రభూ!): “నీవు కూడా ఈ దుర్మార్గులకు కేవలం వారి మార్గభ్రష్టత్వాన్నే హెచ్చించు!”

71:25 – مِّمَّا خَطِيئَاتِهِمْ أُغْرِقُوا فَأُدْخِلُوا نَارًا فَلَمْ يَجِدُوا لَهُم مِّن دُونِ اللَّـهِ أَنصَارًا ٢٥

వారు తమ పాపాల కారణంగా ముంచివేయ బడ్డారు మరియు నరకాగ్నిలోకి త్రోయబడ్డారు, కావున వారు అల్లాహ్‌ తప్ప తమను కాపాడే వారినెవ్వరినీ పొందలేక పోయారు.

71:26 – وَقَالَ نُوحٌ رَّبِّ لَا تَذَرْ عَلَى الْأَرْضِ مِنَ الْكَافِرِينَ دَيَّارًا ٢٦

మరియు నూ’హ్‌ ఇలా ప్రార్థించాడు: “ఓ నా ప్రభూ! సత్య-తిరస్కారులలో ఒక్కరిని కూడా భూమి మీద వదలకు. 8

71:27 – إِنَّكَ إِن تَذَرْهُمْ يُضِلُّوا عِبَادَكَ وَلَا يَلِدُوا إِلَّا فَاجِرًا كَفَّارًا ٢٧

“ఒకవేళ నీవు వారిని వదలిపెడితే, నిశ్చయంగా, వారు నీ దాసులను మార్గ్ర-భష్టత్వంలో పడవేస్తారు. మరియు వారు పాపులను మరియు కృతఘ్నులను మాత్రమే పుట్టిస్తారు.

71:28 – رَّبِّ اغْفِرْ لِي وَلِوَالِدَيَّ وَلِمَن دَخَلَ بَيْتِيَ مُؤْمِنًا وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ وَلَا تَزِدِ الظَّالِمِينَ إِلَّا تَبَارًا ٢٨

“ఓ నా ప్రభూ! నన్నూ, నా తల్లి దండ్రులను మరియు విశ్వాసిగా నా ఇంటిలోనికి ప్రవేశించేవానిని మరియు విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను, అందరినీ క్షమించు. మరియు దుర్మార్గులకు వినాశం తప్ప మరేమీ అధికం చేయకు!” (1/2)

సూరహ్‌ అల్‌-జిన్న్‌ – ఈ సూరహ్‌ చివరి మక్కహ్ కాలంలో అవతరింపజేయబడింది. దాదాపు ప్రస్థానం (హిజ్రత్‌)కు 2 సంవత్సరాలకు ముందు. మక్కహ్ వారు తిరస్కరించినందుకు దైవప్రవక్త (‘స’అస) ధర్మప్రచారం చేయటానికి ‘తాయఫ్‌కు వెళ్తారు. కాని ‘తాయఫ్‌ వాసులు అతనిని అవమానిస్తారు. అప్పుడు దైవప్రవక్త (‘స’అస) అల్లాహ్‌ (సు.త.)ను ప్రార్థిస్తారు. దాదాపు 2 నెలల తరువాత యస్‌’రిబ్‌ (మదీనహ్) నుండి కొందరు వచ్చి ఇస్లాం స్వీకరిస్తారు. వారు దైనప్రవక్త (‘స’అస)ను మదీనహ్ కు రమ్మని ఆహ్వానిస్తారు. 28 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 72:1 – قُلْ أُوحِيَ إِلَيَّ أَنَّهُ اسْتَمَعَ نَفَرٌ مِّنَ الْجِنِّ فَقَالُوا إِنَّا سَمِعْنَا قُرْآنًا عَجَبًا ١

*(ఓ ప్రవక్తా!) ఇలాఅను: “నాకు ఈవిధంగా దివ్య సందేశం పంపబడింది; నిశ్చయంగా ఒక జిన్నాతుల సమూహం 1 – దీనిని (ఈ ఖుర్‌ ఆన్‌ను) విని – తమ జాతివారితో ఇలా అన్నారు: ‘వాస్తవానికి మేము ఒక అద్భుతమైన పఠనం (ఖుర్‌ఆన్‌) విన్నాము!

72:2 – يَهْدِي إِلَى الرُّشْدِ فَآمَنَّا بِهِ ۖ وَلَن نُّشْرِكَ بِرَبِّنَا أَحَدًا ٢

” ‘అది సరైనమార్గం వైపునకు మార్గదర్శ కత్వం చేస్తుంది. కావున మేము దానిని విశ్వ సించాము. 2 మరియు మేము మా ప్రభువుకు ఎవ్వడిని కూడా భాగస్వామిగా సాటి కల్పించము.

72:3 – وَأَنَّهُ تَعَالَىٰ جَدُّ رَبِّنَا مَا اتَّخَذَ صَاحِبَةً وَلَا وَلَدًا ٣

” ‘మరియు నిశ్చయంగా, మా ప్రభువు వైభవం ఎంతో ఉన్నతమైనది. ఆయన ఎవ్వడినీ భార్య (సాహిబతున్‌) గా గానీ, కుమారునిగా గానీ చేసుకోలేదు.

72:4 – وَأَنَّهُ كَانَ يَقُولُ سَفِيهُنَا عَلَى اللَّـهِ شَطَطًا ٤

” ‘మరియు నిశ్చయంగా మనలోని అవివేకులు, కొందరు అల్లాహ్‌ విషయంలో దారుణమైన మాటలు పలుకుతున్నారు.

72:5 – وَأَنَّا ظَنَنَّا أَن لَّن تَقُولَ الْإِنسُ وَالْجِنُّ عَلَى اللَّـهِ كَذِبًا ٥

” ‘మరియు వాస్తవానికి, మనం మానవులు గానీ, జిన్నాతులు గానీ అల్లాహ్‌ను గురించి అబద్ధం పలకరని భావించేవారము.

72:6 – وَأَنَّهُ كَانَ رِجَالٌ مِّنَ الْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا ٦

” ‘మరియు వాస్తవానికి, మానవులలో నుండి కొందరు పురుషులు, జిన్నాతులలో నుండి కొందరు పురుషుల శరణు వేడుతూ ఉండేవారు. ఈ విధంగా వారు, వారి (జిన్నాతుల) తలబిరుసుతనం మరింత అధికమే చేసేవారు. 3

72:7 – وَأَنَّهُمْ ظَنُّوا كَمَا ظَنَنتُمْ أَن لَّن يَبْعَثَ اللَّـهُ أَحَدًا ٧

” ‘మరియు వాస్తవానికి, వారు (మానవులు) కూడా మీరు (జిన్నాతులు) భావించినట్లు, అల్లాహ్‌ ఎవ్వడినీ కూడా సందేశహరునిగా పంపడని భావించారు.

72:8 – وَأَنَّا لَمَسْنَا السَّمَاءَ فَوَجَدْنَاهَا مُلِئَتْ حَرَسًا شَدِيدًا وَشُهُبًا ٨

” ‘మరియు నిశ్చయంగా, మేము ఆకాశాలలో (రహస్యాలను) తొంగిచూడటానికి ప్రయత్నించి నపుడు మేము దానిని కఠినమైన కావలివారితో మరియు అగ్నిజ్వాలలతో నిండి ఉండటాన్ని చూశాము. 4

72:9 – وَأَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ ۖ فَمَن يَسْتَمِعِ الْآنَ يَجِدْ لَهُ شِهَابًا رَّصَدًا ٩

” ‘మరియు వాస్తవానికి పూర్వం అక్కడి మాటలు వినటానికి మేము రహస్యంగా అక్కడ కూర్చునే వారం 5 కాని ఇప్పుడు ఎవడైనా (రహస్యంగా) వినే ప్రయత్నం చేస్తే, అతడి కొరకు అక్కడ ఒక అగ్నిజ్వాల పొంచి ఉంటుంది. 6

72:10 – وَأَنَّا لَا نَدْرِي أَشَرٌّ أُرِيدَ بِمَن فِي الْأَرْضِ أَمْ أَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًا ١٠

” ‘మరియు వాస్తవానికి, భూమిలో ఉన్న వారికి ఏదైనా కీడు ఉద్దేశింపబడిందా, లేక వారి ప్రభువు,వారికి సరైనమార్గం చూపగోరు తున్నాడా అనే విషయం, మాకు అర్థం కావడంలేదు.

72:11 – وَأَنَّا مِنَّا الصَّالِحُونَ وَمِنَّا دُونَ ذَٰلِكَ ۖ كُنَّا طَرَائِقَ قِدَدًا ١١

” ‘మరియు వాస్తవానికి, మనలో కొందరు సద్వర్తనులున్నారు, మరికొందరు దానికి విరుధ్ధంగా ఉన్నారు. వాస్తవానికి మనం విభిన్న మార్గాలను అనుసరిస్తూవచ్చాము. 7

72:12 – وَأَنَّا ظَنَنَّا أَن لَّن نُّعْجِزَ اللَّـهَ فِي الْأَرْضِ وَلَن نُّعْجِزَهُ هَرَبًا ١٢

” ‘మరియు నిశ్చయంగా మేము అల్లాహ్‌ నుండి భూలోకంలో తప్పించుకోలేము, అని అర్థం చేసుకున్నాము. మరియు పారిపోయి కూడా ఆయన నుండి తప్పించుకోలేము.

72:13 – وَأَنَّا لَمَّا سَمِعْنَا الْهُدَىٰ آمَنَّا بِهِ ۖ فَمَن يُؤْمِن بِرَبِّهِ فَلَا يَخَافُ بَخْسًا وَلَا رَهَقًا ١٣

” ‘మరియు నిశ్చయంగా, మేము ఈ మార్గ దర్శకత్వాన్ని(ఖుర్‌ఆన్‌ను) విన్నప్పుడు దానిని విశ్వసించాము. కావున ఎవడైతే తన ప్రభువును విశ్వసిస్తాడో అతడికి తన సత్కర్మల ఫలితంలో నష్టాన్ని గురించీ మరియు శిక్షలో హెచ్చింపును గురించీ భయపడే అవసరం ఉండదు.

72:14 – وَأَنَّا مِنَّا الْمُسْلِمُونَ وَمِنَّا الْقَاسِطُونَ ۖ فَمَنْ أَسْلَمَ فَأُولَـٰئِكَ تَحَرَّوْا رَشَدًا ١٤

” ‘మరియు నిశ్చయంగా మనలో కొందరు అల్లాహ్‌కు విధేయులైన వారు (ముస్లింలు) ఉన్నారు. మరికొందరు నిశ్చయంగా, అన్యాయ పరులు 8 (సత్యానికి దూరమైన వారు) ఉన్నారు. కావున ఎవరైతే అల్లాహ్‌కు విధేయత (ఇస్లాం)ను అవలంబించారో, అలాంటి వారే సరైన మార్గాన్ని కనుగొన్న వారు!’ “

72:15 – وَأَمَّا الْقَاسِطُونَ فَكَانُوا لِجَهَنَّمَ حَطَبًا ١٥

మరియు అన్యాయపరులే (సత్యానికి దూరమైనవారే) నరకానికి ఇంధనమయ్యే వారు! 9

72:16 – وَأَن لَّوِ اسْتَقَامُوا عَلَى الطَّرِيقَةِ لَأَسْقَيْنَاهُم مَّاءً غَدَقًا ١٦

ఒకవేళ వారు (సత్య-తిరస్కారులు) ఋజు మార్గం మీద స్థిరంగా ఉన్నట్లైతే, మేము వారిపై పుష్కలంగా నీటిని కురిపించేవారము.

72:17 – لِّنَفْتِنَهُمْ فِيهِ ۚ وَمَن يُعْرِضْ عَن ذِكْرِ رَبِّهِ يَسْلُكْهُ عَذَابًا صَعَدًا ١٧

దానితో వారిని పరీక్షించటానికి! మరియు ఎవడైతే తన ప్రభువు ధ్యానం నుండి విముఖుడవుతాడో, ఆయన వానిని తీవ్రమైన శిక్షకు గురి చేస్తాడు.

72:18 – وَأَنَّ الْمَسَاجِدَ لِلَّـهِ فَلَا تَدْعُوا مَعَ اللَّـهِ أَحَدًا ١٨

మరియు నిశ్చయంగా, మస్జిదులు అల్లాహ్‌ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కావున వాటిలో అల్లాహ్‌తో బాటు ఇతరు లెవ్వరినీ ప్రార్థించకండి.

72:19 – وَأَنَّهُ لَمَّا قَامَ عَبْدُ اللَّـهِ يَدْعُوهُ كَادُوا يَكُونُونَ عَلَيْهِ لِبَدًا ١٩

మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ యొక్క దాసుడు (ము’హమ్మద్‌) ఆయన (అల్లాహ్‌)ను ప్రార్థించటానికి నిలబడినప్పుడు, వారు (జిన్నా తులు) అతని చుట్టు దట్టంగా (అతని ఖుర్‌ఆన్‌ పఠనాన్ని వినటానికి) గుమిగూడుతారు. 10

72:20 – قُلْ إِنَّمَا أَدْعُو رَبِّي وَلَا أُشْرِكُ بِهِ أَحَدًا ٢٠

వారితో ఇలా అను: “నిశ్చయంగా నేను, నా ప్రభువును మాత్రమే ప్రార్థిస్తాను మరియు ఆయనకు ఎవ్వరినీ సాటి కల్పించను.” 11

72:21 – قُلْ إِنِّي لَا أَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا رَشَدًا ٢١

వారితో ఇలా అను: “నిశ్చయంగా, మీకు కీడు చేయటం గానీ, లేదా సరైన మార్గం చూపటం గానీ నావశంలో లేదు.”

72:22 – قُلْ إِنِّي لَن يُجِيرَنِي مِنَ اللَّـهِ أَحَدٌ وَلَنْ أَجِدَ مِن دُونِهِ مُلْتَحَدًا ٢٢

ఇంకా ఇలా అను: “నిశ్చయంగా, నన్ను అల్లాహ్‌ నుండి ఎవ్వడునూ కాపాడలేడు మరియు నాకు ఆయనతప్ప మరొకరిఆశ్రయం కూడాలేదు;

72:23 – إِلَّا بَلَاغًا مِّنَ اللَّـهِ وَرِسَالَاتِهِ ۚ وَمَن يَعْصِ اللَّـهَ وَرَسُولَهُ فَإِنَّ لَهُ نَارَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا أَبَدًا ٢٣

“(నా పని) కేవలం అల్లాహ్‌ ఉపదేశాన్ని మరియు ఆయన సందేశాన్ని అందజేయటమే!” ఇక ఎవడైతే అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘిస్తాడో! అతడు నిశ్చయంగా, నరకాగ్నికి గురిఅవుతాడు; అందులో శాశ్వతంగా కలకాలం ఉంటాడు.

72:24 – حَتَّىٰ إِذَا رَأَوْا مَا يُوعَدُونَ فَسَيَعْلَمُونَ مَنْ أَضْعَفُ نَاصِرًا وَأَقَلُّ عَدَدًا ٢٤

చివరకు వారికి వాగ్దానం చేయబడిన దానిని వారు చూసినప్పుడు, ఎవరి సహాయకులు బలహీనులో, మరెవరి వర్గం సంఖ్యా పరంగా తక్కువో వారికి తెలిసిపోతుంది. 12

72:25 – قُلْ إِنْ أَدْرِي أَقَرِيبٌ مَّا تُوعَدُونَ أَمْ يَجْعَلُ لَهُ رَبِّي أَمَدًا ٢٥

ఇలా అను: “మీకు వాగ్దానం చేయబడినది (శిక్ష) సమీపంలోనే రానున్నదో, లేక దాని కొరకు నా ప్రభువు దీర్ఘకాల వ్యవధి నియమించాడో నాకు తెలియదు.”

72:26 – عَالِمُ الْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِ أَحَدًا ٢٦

ఆయనే అగోచర జ్ఞానం గలవాడు, కావున ఆయన అగోచర విషయాలు ఎవ్వడికీ తెలియజేయడు –

72:27 – إِلَّا مَنِ ارْتَضَىٰ مِن رَّسُولٍ فَإِنَّهُ يَسْلُكُ مِن بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ رَصَدًا ٢٧

తాను కోరి ఎన్నుకొన్న ప్రవక్తకు తప్ప 13 ఎందుకంటే, ఆయన నిశ్చయంగా, అతని (ఆ ప్రవక్త) ముందు మరియు వెనుక రక్షక భటులను నియమిస్తాడు.

72:28 – لِّيَعْلَمَ أَن قَدْ أَبْلَغُوا رِسَالَاتِ رَبِّهِمْ وَأَحَاطَ بِمَا لَدَيْهِمْ وَأَحْصَىٰ كُلَّ شَيْءٍ عَدَدًا ٢٨

వారు, (ప్రవక్తలు) తమ ప్రభువు యొక్క సందేశాలను యథాతథంగా అందజేస్తున్నారని పరిశీలించటానికి 14 మరియు ఆయన వారి అన్ని విషయాలను పరివేష్టించి ఉన్నాడు. మరియు ఆయన ప్రతి ఒక్క విషయాన్ని లెక్కపెట్టి ఉంచుతాడు.

సూరహ్‌ అల్‌-ము’జ్జమ్మిల్ – అల్‌-ము’జ్జమ్మిల్: The Enwrapped దుప్పటి కప్పుకున్నవాడు. ఈ సూరహ్‌ అవతరణా క్రమంలో 4 వది. మొదటి మక్కహ్ కాలానికి చెందినది. 20 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 73:1 – يَا أَيُّهَا الْمُزَّمِّلُ ١

ఓ దుప్పటి కప్పుకున్నవాడా! 1

73:2 – قُمِ اللَّيْلَ إِلَّا قَلِيلً ٢

రాత్రంతా (నమా’జ్‌లో) నిలబడు, కొంత భాగాన్ని విడిచి;

73:3 – نِّصْفَهُ أَوِ انقُصْ مِنْهُ قَلِيلًا ٣

దాని సగభాగంలో, లేదా దానికంటే కొంత తక్కువ;

73:4 – أَوْ زِدْ عَلَيْهِ وَرَتِّلِ الْقُرْآنَ تَرْتِيلً ٤

లేదా దానికంటే కొంత ఎక్కువ; మరియు ఖుర్‌ఆన్‌ను ఆగిఆగి నెమ్మదిగాస్పష్టంగా పఠించు.

73:5 – إِنَّا سَنُلْقِي عَلَيْكَ قَوْلًا ثَقِيلً ٥

నిశ్చయంగా, మేము నీపై భారమైన సందేశాన్ని అవతరింపజేయ బోతున్నాము.

73:6 – إِنَّ نَاشِئَةَ اللَّيْلِ هِيَ أَشَدُّ وَطْئًا وَأَقْوَمُ قِيلًا ٦

నిశ్చయంగా, రాత్రివేళ లేవటం (మనస్సును) అదుపులో ఉంచుకోవటానికి ఎంతో ఉపయుక్త మైనది మరియు (అల్లాహ్‌) ప్రవచనాలను (అర్థం చేసుకోవటానికి) కూడా ఎంతో అనుగుణమైనది.

73:7 – إِنَّ لَكَ فِي النَّهَارِ سَبْحًا طَوِيلً ٧

వాస్తవానికి, పగటి వేళ నీకు చాలా పనులుంటాయి.

73:8 – وَاذْكُرِ اسْمَ رَبِّكَ وَتَبَتَّلْ إِلَيْهِ تَبْتِيلً ٨

మరియు నీవు నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు. మరియు అత్యంత శ్రధ్ధతో ఆయన వైపుకు మరలుతూ ఉండు.

73:9 – رَّبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ لَا إِلَـٰهَ إِلَّا هُوَ فَاتَّخِذْهُ وَكِيلًا ٩

ఆయనే తూర్పూ పడమరల స్వామి, ఆయన తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు, కావున నీవు ఆయననే కార్యకర్తగా చేసుకో.

73:10 – وَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا ١٠

మరియు వారు పలికే మాటలకు సహనం వహించు మరియు మంచితనంతో వారి నుండి తొలగిపో.

73:11 – وَذَرْنِي وَالْمُكَذِّبِينَ أُولِي النَّعْمَةِ وَمَهِّلْهُمْ قَلِيلًا ١١

మరియు అసత్యవాదులైన ఈ సంపన్నులను, నాకు వదలిపెట్టు. 2 మరియు వారికి కొంత వ్యవధి నివ్వు.

73:12 – إِنَّ لَدَيْنَا أَنكَالًا وَجَحِيمًا ١٢

నిశ్చయంగా, మా వద్ద వారికొరకు సంకెళ్ళు మరియు భగభగ మండే నరకాగ్ని ఉన్నాయి.

73:13 – وَطَعَامًا ذَا غُصَّةٍ وَعَذَابًا أَلِيمًا ١٣

మరియు గొంతులో ఇరుక్కుపోయే ఆహారం మరియు బాధాకరమైన శిక్ష (ఉన్నాయి).

73:14 – يَوْمَ تَرْجُفُ الْأَرْضُ وَالْجِبَالُ وَكَانَتِ الْجِبَالُ كَثِيبًا مَّهِيلًا ١٤

ఆ రోజు భూమి మరియు పర్వతాలు కంపించి పోతాయి. మరియు పర్వతాలు ప్రవహించే ఇసుక దిబ్బలుగా మారిపోతాయి. 3

73:15 – إِنَّا أَرْسَلْنَا إِلَيْكُمْ رَسُولًا شَاهِدًا عَلَيْكُمْ كَمَا أَرْسَلْنَا إِلَىٰ فِرْعَوْنَ رَسُولً ١٥

మేము ఫిర్‌’ఔన్‌ వద్దకు సందేశహరుణ్ణి పంపినట్లు, నిశ్చయంగా, మీ వద్దకు కూడా ఒక సందేశహరుణ్ణి, మీకుసాక్షిగా ఉండటానికి పంపాము.

73:16 – فَعَصَىٰ فِرْعَوْنُ الرَّسُولَ فَأَخَذْنَاهُ أَخْذًا وَبِيلً ١٦

కాని ఫిర్‌’ఔన్‌ ఆ సందేశహరునికి అవిధేయత చూపాడు. కావున మేము అతనిని తీవ్రమైన శిక్షకు గురిచేశాము.

73:17 – فَكَيْفَ تَتَّقُونَ إِن كَفَرْتُمْ يَوْمًا يَجْعَلُ الْوِلْدَانَ شِيبًا ١٧

ఒకవేళ మీరు సత్యాన్ని తిరస్కరిస్తే, బాలురను ముసలివారిగా చేసేటటువంటి ఆ దినపు శిక్ష నుండి ఎలా తప్పించుకోగలరు? 4

73:18 – السَّمَاءُ مُنفَطِرٌ بِهِ ۚ كَانَ وَعْدُهُ مَفْعُولًا ١٨

అప్పుడు ఆకాశం బ్రద్దలైపోతుంది. ఆయన యొక్క వాగ్దానం తప్పక నెరవేరి తీరుతుంది.

73:19 – إِنَّ هَـٰذِهِ تَذْكِرَةٌ ۖ فَمَن شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ سَبِيلًا ١٩

నిశ్చయంగా, ఇదొక ఉపదేశం కావున ఇష్టమైన వాడు తన ప్రభువు వద్దకు పోయే మార్గాన్ని అవలంబించవచ్చు! (5/8)

73:20 – إِنَّ رَبَّكَ يَعْلَمُ أَنَّكَ تَقُومُ أَدْنَىٰ مِن ثُلُثَيِ اللَّيْلِ وَنِصْفَهُ وَثُلُثَهُ وَطَائِفَةٌ مِّنَ الَّذِينَ مَعَكَ ۚ وَاللَّـهُ يُقَدِّرُ اللَّيْلَ وَالنَّهَارَ ۚ عَلِمَ أَن لَّن تُحْصُوهُ فَتَابَ عَلَيْكُمْ ۖ فَاقْرَءُوا مَا تَيَسَّرَ مِنَ الْقُرْآنِ ۚ عَلِمَ أَن سَيَكُونُ مِنكُم مَّرْضَىٰ ۙ وَآخَرُونَ يَضْرِبُونَ فِي الْأَرْضِ يَبْتَغُونَ مِن فَضْلِ اللَّـهِ ۙ وَآخَرُونَ يُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّـهِ ۖ فَاقْرَءُوا مَا تَيَسَّرَ مِنْهُ ۚ وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَأَقْرِضُوا اللَّـهَ قَرْضًا حَسَنًا ۚ وَمَا تُقَدِّمُوا لِأَنفُسِكُم مِّنْ خَيْرٍ تَجِدُوهُ عِندَ اللَّـهِ هُوَ خَيْرًا وَأَعْظَمَ أَجْرًا ۚ وَاسْتَغْفِرُوا اللَّـهَ ۖ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ٢٠

  • (ఓ ము’హమ్మద్‌!) నీవు, వాస్తవానికి దాదాపు మూడింట రెండువంతుల రాత్రి లేక సగం (రాత్రి) లేక మూడింట ఒకభాగం (నమా’జ్‌లో) నిలుస్తావనేది నీ ప్రభువుకు బాగా తెలుసు. మరియు నీతోపాటు ఉన్నవారిలో కొందరు కూడా! మరియు అల్లాహ్‌ రేయింబవళ్ళ పరిమాణాలను నిర్ణయిస్తాడు. మీరు ఖచ్చితంగా పూర్తిరాత్రి ప్రార్థించలేరని ఆయనకు తెలుసు. కావున ఆయన మీ వైపునకు (కనికరంతో) మరలాడు. కావున ఖుర్‌ఆన్‌ను, మీరు సులభంగా పఠించగలిగినంతే పఠించండి. మీలో కొందరు వ్యాధిగ్రస్తులు కావచ్చు, మరికొందరు అల్లాహ్‌ అనుగ్రహాన్ని అన్వేషిస్తూ భూమిలో ప్రయాణంలో ఉండవచ్చు, మరికొందరు అల్లాహ్‌ మార్గంలో ధర్మయుధ్ధం చేస్తూ ఉండవచ్చు, అని ఆయనకు బాగా తెలుసు. కావున మీకు దానిలో సులభమైనంత దానినే పఠించండి. 5 మరియు నమా’జ్‌ను స్థాపించండి, 6 విధిదానం (‘జకాత్‌) ఇవ్వండి. మరియు అల్లాహ్‌కు మంచి అప్పును, అప్పుగా ఇస్తూ ఉండండి. మరియు మీరు, మీ కొరకు ముందుగా చేసి పంపుకున్న మంచి కార్యాలన్నింటినీ అల్లాహ్‌ దగ్గర పొందుతారు. అదే చాలా ఉత్తమమైనది. మరియు దాని ప్రతిఫలం చాలా గొప్పది. మరియు మీరు అల్లాహ్‌ను క్షమాభిక్ష అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

సూరహ్‌ అల్‌-ముద్దస్సి’ర్‌ – అల్‌-ముద్దస్సి’ర్‌: The Enfolded One, బట్ట(దుప్పటి)లో చుట్టుకున్నవాడు! దైవప్రవక్త ము’హమ్మద్‌ (‘స’అస)పై సూరహ్‌ అల్‌-ఇఖ్‌రా’ (96:1-5) మొదటి అయిదు ఆయతులు అవతరించిన తరువాత కొంతకాలం (6 నెలల నుండి 3 సంవత్సరాల) వరకు ఏ వ’హీ అవతరింపజేయబడలేదు. ఈ కాలాన్ని, ఫతరతుల్‌ వ’హీ అంటారు. అప్పుడు దైవప్రవక్త (‘స’అస) ఎంతో కలవరపడ్డారు. అప్పుడు అతని (‘స’అస) భార్య ‘ఖదీజహ్‌ (ర.’అన్హా) అతనికి నైతిక ప్రోత్సాహాన్నిచ్చారు. ఆ తరువాత ఒక రోజు జిబ్రీల్‌ (‘అ.స.) ఆకాశాలు మరియు భూమి మధ్య ప్రత్యక్షమయ్యారు. ఆ తరువాత ఈ సూరహ్‌ అవతరిపంజేయబడింది. ఆ తరువాత వ’హీ త్వరత్వరగా రావడం ఆరంభమయ్యింది, (‘స. బు’ఖారీ, ముస్లిం). దీని కొన్ని ఆయతులు తరువాత అవతరింపజేయబడ్డాయి. ఈ సూరహ్‌ మక్కహ్ లోఅవతరింపజేయబడింది.

ఈ సూరహ్‌ ఇస్లాం విధులను, అల్లాహ్‌ ఏకత్వాన్ని పునరుత్థానాన్ని మరియు అంతిమ తీర్పును వివరిస్తోంది. మానవుడు బలహీనుడని, అల్లాహ్‌ (సు.త.)పై అతడు ఆధారపడి ఉన్నాడని, ప్రతి మానవుడు తన కర్మలకు తానే బాధ్యుడని, అతడు వాటి ఫలితాన్ని అనుభవిస్తాడని మరియు అతడి కర్మలను బట్టి స్వర్గ-నరకాలున్నాయని బోధిస్తోంది. 56 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 74:1 – يَا أَيُّهَا الْمُدَّثِّرُ ١

ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా!

74:2 – قُمْ فَأَنذِرْ ٢

లే! ఇక హెచ్చరించు!

74:3 – وَرَبَّكَ فَكَبِّرْ ٣

మరియు నీ ప్రభువు గొప్పతనాన్ని (ఘనతను) కొని యాడు (చాటి చెప్పు)!

74:4 – وَثِيَابَكَ فَطَهِّرْ ٤

మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో!

74:5 – وَالرُّجْزَ فَاهْجُرْ ٥

మరియు మాలిన్యానికి దూరంగా ఉండు!

74:6 – وَلَا تَمْنُن تَسْتَكْثِرُ ٦

మరియు ఎక్కువ పొందాలనే ఆశతో ఇవ్వకు (ఉపకారం చేయకు)!

74:7 – وَلِرَبِّكَ فَاصْبِ ٧

మరియు నీ ప్రభువు కొరకు సహనం వహించు!

74:8 – فَإِذَا نُقِرَ فِي النَّاقُورِ ٨

మరియు బాకా (నాఖూర్‌) ఊదబడి నప్పుడు;

74:9 – فَذَٰلِكَ يَوْمَئِذٍ يَوْمٌ عَسِيرٌ ٩

ఆ దినం చాలా కఠినమైన దినమై ఉంటుంది;

74:10 – عَلَى الْكَافِرِينَ غَيْرُ يَسِيرٍ ١٠

సత్యతిరస్కారులకు అది సులభమైన (దినం) కాదు. 1

74:11 – ذَرْنِي وَمَنْ خَلَقْتُ وَحِيدًا ١١

వదలండి! నన్నూ మరియు నేను ఒంటరిగా పుట్టించిన వానినీ! 2

74:12 – وَجَعَلْتُ لَهُ مَالًا مَّمْدُودًا ١٢

మరియు నేను అతనికి పుష్కలంగా సంపదనిచ్చాను.

74:13 – وَبَنِينَ شُهُودًا ١٣

మరియు అతనికి తోడుగా ఉండే కుమారులను!

74:14 – وَمَهَّدتُّ لَهُ تَمْهِيدًا ١٤

మరియు అతని కొరకు అతని జీవన సౌకర్యాలను సులభంచేశాను.

74:15 – ثُمَّ يَطْمَعُ أَنْ أَزِيدَ ١٥

అయినా నేను అతనికి ఇంకా ఇవ్వాలని అతడు ఆశిస్తూ ఉంటాడు.

74:16 – كَلَّا ۖ إِنَّهُ كَانَ لِآيَاتِنَا عَنِيدًا ١٦

అలాకాదు! వాస్తవానికి అతడు మా (అల్లాహ్‌) సూచన (ఆయాత్‌)ల పట్ల విరోధం కలిగివున్నాడు.

74:17 – سَأُرْهِقُهُ صَعُودًا ١٧

నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానానికి (శిక్షకు) నెట్టుతాను!

74:18 – إِنَّهُ فَكَّرَ وَقَدَّرَ ١٨

వాస్తవానికి అతడు ఆలోచించాడు మరియు మనస్సులో ప్రణాళిక చేసుకున్నాడు.

74:19 – فَقُتِلَ كَيْفَ قَدَّرَ ١٩

కావున (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు నాశనానికి గురికానివ్వండి!

74:20 – ثُمَّ قُتِلَ كَيْفَ قَدَّرَ ٢٠

అవును (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు, నాశనానికి గురికానివ్వండి!

74:21 – ثُمَّ نَظَرَ ٢١

అప్పుడు అతడు ఆలోచించాడు.

74:22 – ثُمَّ عَبَسَ وَبَسَ ٢٢

తరువాత అతడు నుదురు చిట్లించు కున్నాడు మరియు కోపంతో చూశాడు (ముఖం మాడ్చుకున్నాడు);

74:23 – ثُمَّ أَدْبَرَ وَاسْتَكْبَرَ ٢٣

తరువాత అతడు వెనుకకు మరలి దురహంకారం చూపాడు. 3

74:24 – فَقَالَ إِنْ هَـٰذَا إِلَّا سِحْرٌ يُؤْثَرُ ٢٤

అప్పుడతడు ఇలా అన్నాడు: “ఇది పూర్వం నుండి వస్తూ ఉన్న ఒక మంత్రజాలం మాత్రమే!

74:25 – إِنْ هَـٰذَا إِلَّا قَوْلُ الْبَشَرِ ٢٥

“ఇది కేవలం ఒక మానవ వాక్కు మాత్రమే!”

74:26 – سَأُصْلِيهِ سَقَرَ ٢٦

త్వరలోనే నేను అతనిని నరకాగ్నిలో కాల్చుతాను.

74:27 – وَمَا أَدْرَاكَ مَا سَقَرُ ٢٧

మరియు ఆ నరకాగ్ని అంటే నీవు ఏమను కుంటున్నావు? 4

74:28 – لَا تُبْقِي وَلَا تَذَرُ ٢٨

అది (ఎవరినీ) మిగల్చదు మరియు వదలి పెట్టదు. 5

74:29 – لَوَّاحَةٌ لِّلْبَشَرِ ٢٩

అది మానవుణ్ణి (అతడి చర్మాన్ని) దహించి వేస్తుంది. 6

74:30 – عَلَيْهَا تِسْعَةَ عَشَرَ ٣٠

దానిపై పందొమ్మిది (దేవదూతలు నియమించబడి) ఉన్నారు.

74:31 – وَمَا جَعَلْنَا أَصْحَابَ النَّارِ إِلَّا مَلَائِكَةً ۙ وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا لِيَسْتَيْقِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَيَزْدَادَ الَّذِينَ آمَنُوا إِيمَانًا ۙ وَلَا يَرْتَابَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْمُؤْمِنُونَ ۙ وَلِيَقُولَ الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ وَالْكَافِرُونَ مَاذَا أَرَادَ اللَّـهُ بِهَـٰذَا مَثَلًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّـهُ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ ۚ وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ ۚ وَمَا هِيَ إِلَّا ذِكْرَىٰ لِلْبَشَ ٣١

మరియు మేము దేవదూతలను మాత్రమే నరకానికి రక్షకులుగా నియమించాము. మరియు మేము వారి సంఖ్యను (పందొమ్మిదిని), సత్య-తిరస్కారులకు ఒక పరీక్షగా, గ్రంథ ప్రజలకు నమ్మకం కలగటానికి, విశ్వాసుల విశ్వాసాన్ని అధికం చేయటానికి మరియు గ్రంథ ప్రజలు మరియు విశ్వాసులు సందేహంలో పడకుండా ఉండటానికి మరియు తమ హృదయాలలో రోగమున్న వారు మరియు సత్య-తిరస్కారులు: “ఈ ఉపమానం ఇవ్వటంలో అల్లాహ్‌ ఉద్దేశ్య మేమిటి?” అని పలుకటానికి! ఈ విధంగా అల్లాహ్‌ తాను కోరినవారిని మార్గభ్రష్టత్వంలో వదులు తాడు. మరియు తాను కోరినవారికి మార్గదర్శ కత్వంచేస్తాడు. 7 మరియు నీ ప్రభువు సైన్యాలను ఆయనతప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు ఇదంతా మానవునికి ఒక జ్ఞాపిక మాత్రమే.

74:32 – كَلَّا وَالْقَمَرِ ٣٢

అలా కాదు! చంద్రుని సాక్షిగా!

74:33 – وَاللَّيْلِ إِذْ أَدْبَرَ ٣٣

గడిచిపోయే రాత్రి సాక్షిగా!

74:34 – وَالصُّبْحِ إِذَا أَسْفَرَ ٣٤

ప్రకాశించే, ఉదయం సాక్షిగా!

74:35 – إِنَّهَا لَإِحْدَى الْكُبَرِ ٣٥

నిశ్చయంగా, ఇది (ఈ నరకాగ్ని ప్రస్తావన) ఒక గొప్ప విషయం.

74:36 – نَذِيرًا لِّلْبَشَ ٣٦

మానవునికి ఒక హెచ్చరిక;

74:37 – لِمَن شَاءَ مِنكُمْ أَن يَتَقَدَّمَ أَوْ يَتَأَخَّرَ ٣٧

మీలో ముందుకు రావాలని కోరుకునేవానికి లేదా వెనుక ఉండిపోయేవానికి;

74:38 – كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ رَهِينَةٌ ٣٨

ప్రతి మానవుడు తాను చేసిన కర్మలకు తాకట్టుగా ఉంటాడు.

74:39 – إِلَّا أَصْحَابَ الْيَمِينِ ٣٩

కుడి పక్షంవారు తప్ప!

74:40 – فِي جَنَّاتٍ يَتَسَاءَلُونَ ٤٠

వారు స్వర్గాలలో ఉంటూ ఒకరినొకరు ఇలా ప్రశ్నించుకుంటారు!

74:41 – عَنِ الْمُجْرِمِينَ ٤١

అపరాధులను గురించి (మరియు వారితో అంటారు):

74:42 – مَا سَلَكَكُمْ فِي سَقَرَ ٤٢

“మిమ్మల్ని ఏ విషయం నరకంలోకి ప్రవేశింపజేసింది?”

74:43 – قَالُوا لَمْ نَكُ مِنَ الْمُصَلِّينَ ٤٣

వారు (నరకవాసులు) ఇలా జవాబిస్తారు: “మేము నమా’జ్‌ చేసేవాళ్ళం కాము.

74:44 – وَلَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِينَ ٤٤

“మరియు నిరుపేదకు ఆహారం పెట్టేవాళ్ళం కాము;

74:45 – وَكُنَّا نَخُوضُ مَعَ الْخَائِضِينَ ٤٥

“మరియు వృథా కాలక్షేపం చేసేవారితో కలిసి వ్యర్థప్రలాపాలు (ప్రసంగాలు) చేస్తూ ఉండే వాళ్ళము;

74:46 – وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ الدِّينِ ٤٦

“మరియు తీర్పు దినాన్ని అబద్ధమని నిరాక రిస్తూ ఉండేవాళ్ళము;

74:47 – حَتَّىٰ أَتَانَا الْيَقِينُ ٤٧

“చివరకు ఆ అనివార్యమైన ఘడియ మాపై వచ్చి పడింది.” 8

74:48 – فَمَا تَنفَعُهُمْ شَفَاعَةُ الشَّافِعِينَ ٤٨

అప్పుడు సిఫారసు చేసేవారి సిఫారసు, వారికి ఏ మాత్రం ఉపయోగపడదు. 9

74:49 – فَمَا لَهُمْ عَنِ التَّذْكِرَةِ مُعْرِضِينَ ٤٩

అయితే, వారికేమయింది? ఈ హితోపదేశం నుండి వారెందుకు ముఖం త్రిప్పుకుంటున్నారు.

74:50 – كَأَنَّهُمْ حُمُرٌ مُّسْتَنفِرَةٌ ٥٠

వారి స్థితి బెదిరిన అడవి గాడిదల మాదిరిగా ఉంది;

74:51 – فَرَّتْ مِن قَسْوَرَةٍ ٥١

సింహం నుండి పారిపోయే (గాడిదల మాదిరిగా)! 10

74:52 – بَلْ يُرِيدُ كُلُّ امْرِئٍ مِّنْهُمْ أَن يُؤْتَىٰ صُحُفًا مُّنَشَّرَةً ٥٢

అలాకాదు! వారిలో ప్రతిఒక్క వ్యక్తి తనకు విప్ప బడిన గ్రంథాలు ఇవ్వబడాలని కోరుతున్నాడు 11

74:53 – كَلَّا ۖ بَل لَّا يَخَافُونَ الْآخِرَةَ ٥٣

కాదుకాదు! అసలు వారు పరలోక జీవితం గురించి భయపడటంలేదు.

74:54 – كَلَّا إِنَّهُ تَذْكِرَةٌ ٥٤

అలా కాదు! నిశ్చయంగా, ఇది ఒక హితోపదేశం.

74:55 – فَمَن شَاءَ ذَكَرَهُ ٥٥

కావున కోరినవాడు దీని నుండి హితబోధ గ్రహించవచ్చు.

74:56 – وَمَا يَذْكُرُونَ إِلَّا أَن يَشَاءَ اللَّـهُ ۚ هُوَ أَهْلُ التَّقْوَىٰ وَأَهْلُ الْمَغْفِرَةِ ٥٦

కాని అల్లాహ్‌ కోరితే తప్ప! 12 వీరు దీని నుండి హితబోధ గ్రహించలేరు. ఆయనే (అల్లాహ్ యే) భయభక్తులకు అర్హుడు మరియు ఆయనే క్షమించే అర్హత గలవాడు. (3/4)

సూరహ్‌ అల్‌-ఖియామహ్‌ – అల్‌-ఖియామహ్‌: The Resurrection, పునరుత్థానం. ఇందులో పునరుత్థాన దినం గురించి వివరాలున్నాయి. ఇది మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌. 40 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 75:1 – لَا أُقْسِمُ بِيَوْمِ الْقِيَامَةِ ١

  • అలాకాదు! నేను పునరుత్థానదినపు శపథం చేస్తున్నాను.

75:2 – وَلَا أُقْسِمُ بِالنَّفْسِ اللَّوَّامَةِ ٢

అలాకాదు! నేను తనను-తాను నిందించు కునే అంతరాత్మ శపథం చేస్తున్నాను.

75:3 – أَيَحْسَبُ الْإِنسَانُ أَلَّن نَّجْمَعَ عِظَامَهُ ٣

ఏమిటి? మేము అతని ఎముకలను ప్రోగుచేయ లేమని మానవుడు భావిస్తున్నాడా?

75:4 – بَلَىٰ قَادِرِينَ عَلَىٰ أَن نُّسَوِّيَ بَنَانَهُ ٤

వాస్తవానికి! మేము అతని వ్రేళ్ళకొనలను గూడా సరిగ్గా సవరించగల సమర్థులము.

75:5 – بَلْ يُرِيدُ الْإِنسَانُ لِيَفْجُرَ أَمَامَهُ ٥

అయినా, మానవుడు ఇక మీద కూడా దుష్కార్యాలు చేయగోరు తున్నాడు.

75:6 – يَسْأَلُ أَيَّانَ يَوْمُ الْقِيَامَةِ ٦

అతడు: “అయితే ఈ పునరుత్థాన దినం ఎప్పుడు వస్తుంది?” అని అడుగుతున్నాడు.

75:7 – فَإِذَا بَرِقَ الْبَصَرُ ٧

కళ్ళు మిరుమిట్లుగొన్నప్పుడు;

75:8 – وَخَسَفَ الْقَمَرُ ٨

మరియు చంద్రునికి గ్రహణం పట్టినప్పుడు;

75:9 – وَجُمِعَ الشَّمْسُ وَالْقَمَرُ ٩

మరియు సూర్య-చంద్రులు కలిపివేయబడి నప్పుడు;

75:10 – يَقُولُ الْإِنسَانُ يَوْمَئِذٍ أَيْنَ الْمَفَرُّ ١٠

మానవుడు ఆ రోజు: “ఎక్కడికి పారి పోవాలి?” అని అంటాడు.

75:11 – كَلَّا لَا وَزَرَ ١١

అదికాదు! (అతనికి) ఎక్కడా శరణం ఉండదు!

75:12 – إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ الْمُسْتَقَرُّ ١٢

ఆ రోజు నీ ప్రభువు వద్దనే ఆశ్రయం ఉంటుంది.

75:13 – يُنَبَّأُ الْإِنسَانُ يَوْمَئِذٍ بِمَا قَدَّمَ وَأَخَّرَ ١٣

ఆ రోజు మానవుడికి, తాను చేసి పంపింది మరియు వెనక వదలింది అంతా తెలుప బడుతుంది. 1

75:14 – بَلِ الْإِنسَانُ عَلَىٰ نَفْسِهِ بَصِيرَةٌ ١٤

అలాకాదు! మానవుడు తనకు విరుధ్ధంగా, తానే సాక్షి అవుతాడు;

75:15 – وَلَوْ أَلْقَىٰ مَعَاذِيرَهُ ١٥

మరియు అతడు ఎన్నిసాకులు చెప్పినా సరే! 2

75:16 – لَا تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ ١٦

నీవు దీనిని (ఈ ఖుర్‌ఆన్‌ను గ్రహించ టానికి) నీ నాలుకను త్వరత్వరగా కదిలించకు. 3

75:17 – إِنَّ عَلَيْنَا جَمْعَهُ وَقُرْآنَهُ ١٧

నిశ్చయంగా, దీనిని సేకరించటం మరియు దీనిని చదివించటం మా భాధ్యతే!

75:18 – فَإِذَا قَرَأْنَاهُ فَاتَّبِعْ قُرْآنَهُ ١٨

కావున మేము దీనిని పఠించినప్పుడు నీవు ఆ పారాయణాన్ని శ్రధ్ధగా అనుసరించు.

75:19 – ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ ١٩

ఇక దాని భావాన్ని అర్థమయ్యేలా చేయటం మా బాధ్యతే! 4

75:20 – كَلَّا بَلْ تُحِبُّونَ الْعَاجِلَةَ ٢٠

అలాకాదు! వాస్తవానికి మీరు అనిశ్చితమైన (ఇహలోక జీవితం పట్ల) వ్యామోహం పెంచుకుంటున్నారు;

75:21 – وَتَذَرُونَ الْآخِرَةَ ٢١

మరియు పరలోక జీవితాన్ని వదలిపెడు తున్నారు! 5

75:22 – وُجُوهٌ يَوْمَئِذٍ نَّاضِرَةٌ ٢٢

ఆ రోజున కొన్ని ముఖాలు కళకళ లాడుతూ ఉంటాయి;

75:23 – إِلَىٰ رَبِّهَا نَاظِرَةٌ ٢٣

తమ ప్రభువు (అల్లాహ్‌) వైపునకు చూస్తూ ఉంటాయి; 6

75:24 – وَوُجُوهٌ يَوْمَئِذٍ بَاسِرَةٌ ٢٤

మరికొన్ని ముఖాలు ఆ రోజు, కాంతిహీనమై ఉంటాయి; 7

75:25 – تَظُنُّ أَن يُفْعَلَ بِهَا فَاقِرَةٌ ٢٥

నడుమును విరిచే బాధ వారికి కలుగు తుందని భావించి. 8

75:26 – كَلَّا إِذَا بَلَغَتِ التَّرَاقِيَ ٢٦

అలాకాదు! ప్రాణం గొంతులోకి వచ్చి నపుడు; 9

75:27 – وَقِيلَ مَنْ ۜ رَاقٍ ٢٧

మరియు: “ఎవడైనా ఉన్నాడా? అతనిని (మరణం నుండి) కాపాడటానికి?” అని అనబడు తుంది. 10

75:28 – وَظَنَّ أَنَّهُ الْفِرَاقُ ٢٨

మరియు అప్పుడతడు వాస్తవానికి తన ఎడబాటు కాలం వచ్చిందని గ్రహిస్తాడు;

75:29 – وَالْتَفَّتِ السَّاقُ بِالسَّاقِ ٢٩

మరియు ఒక పిక్క మరొక పిక్కతో కలిసి పోతుంది. 11

75:30 – إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ الْمَسَاقُ ٣٠

ఆ రోజు నీ ప్రభువు వైపునకు ప్రయాణం ఉంటుంది!

75:31 – فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ ٣١

కాని అతడు సత్యాన్ని నమ్మలేదు మరియు నమా’జ్‌ సలపనూ లేదు! 12

75:32 – وَلَـٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ ٣٢

మరియు అతడు (ఈ సందేశాన్ని) అసత్యమన్నాడు మరియు దాని నుండి వెనుదిరిగాడు!

75:33 – ثُمَّ ذَهَبَ إِلَىٰ أَهْلِهِ يَتَمَطَّىٰ ٣٣

ఆ తరువాత నిక్కుతూ నీల్గుతూ తన ఇంటి వారి వద్దకు పోయాడు!

75:34 – أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ ٣٤

(ఓ సత్య-తిరస్కారుడా!) నీకు నాశనం మీద నాశనం రానున్నది!

75:35 – ثُمَّ أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ ٣٥

అవును, నీకు నాశనం మీద నాశనం రానున్నది!

75:36 – أَيَحْسَبُ الْإِنسَانُ أَن يُتْرَكَ سُدًى ٣٦

ఏమిటి? మానవుడు తనను విచ్చలవిడిగా వదలి పెట్టడం జరుగుతుందని భావిస్తున్నాడా?

75:37 – أَلَمْ يَكُ نُطْفَةً مِّن مَّنِيٍّ يُمْنَىٰ ٣٧

ఏమీ? అతడు ప్రసరింపజేయబడిన ఒక వీర్య బిందువు కాడా?

75:38 – ثُمَّ كَانَ عَلَقَةً فَخَلَقَ فَسَوَّىٰ ٣٨

తరువాత ఒక రక్తకండగా (జలగగా) ఉండే వాడు కాదా? తరువాత ఆయనే (అల్లాహ్‌యే) అతనిని సృష్టించి అతని రూపాన్ని తీర్చిదిద్దాడు. 13

75:39 – فَجَعَلَ مِنْهُ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْأُنثَ ٣٩

ఆ తరువాత అతని నుండి స్త్రీ పురుషుల రెండు రకాలను (జాతులను) ఏర్పరచాడు.

75:40 – أَلَيْسَ ذَٰلِكَ بِقَادِرٍ عَلَىٰ أَن يُحْيِيَ الْمَوْتَىٰ ٤٠

అలాంటప్పుడు ఆయనకు మరణించిన వారిని మళ్ళీ బ్రతికించే సామర్థ్యం లేదా?

సూరహ్‌ అల్‌-ఇన్సాన్‌ – అల్‌-ఇన్సాను: The Man, మానవుడు. దీనికి సూరహ్‌ అద్‌-దహ్ర్‌, The Time, కాలచక్రం, సమయం అనే పేరు కూడా ఉంది. దైవప్రవక్త (‘స’అస) జుమ’అహ్‌ రోజు, ఫజ్ర్‌ నమాజులలో సూరహ్‌ అస్‌-సజ్దా (32) మరియు ఈ సూరహ్‌ (76) చదివేవారు (‘స’హీ’హ్‌ ముస్లిం). చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయంలో ఈ సూరహ్‌ మదీనహ్ లో అవతరింపజేయబడింది, (ఫ’త్హ్ అల్‌-ఖదీర్‌). 31 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

76:1 – هَلْ أَتَىٰ عَلَى الْإِنسَانِ حِينٌ مِّنَ الدَّهْرِ لَمْ يَكُن شَيْئًا مَّذْكُورًا ١

అనంత కాల చక్రంలో, మానవుడు తాను చెప్పుకోదగిన వస్తువు కాకుండా ఉన్న సమయం గడవలేదా?

76:2 – إِنَّا خَلَقْنَا الْإِنسَانَ مِن نُّطْفَةٍ أَمْشَاجٍ نَّبْتَلِيهِ فَجَعَلْنَاهُ سَمِيعًا بَصِيرًا ٢

నిశ్చయంగా, మేము, మానవుణ్ణి ఒక మిశ్రమ వీర్య- బిందువుతో సృష్టించాము. 1 అతనిని పరీక్షించటానికి, మేము అతనిని వినేవాడిగా, చూసేవాడిగా చేశాము. 2

76:3 – إِنَّا هَدَيْنَاهُ السَّبِيلَ إِمَّا شَاكِرًا وَإِمَّا كَفُورًا ٣

నిశ్చయంగా, మేము అతనికి మార్గం చూపాము. ఇక అతడు కృతజ్ఞుడు కావచ్చు, లేదా కృతఘ్నుడూ కావచ్చు! 3

76:4 – إِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَلَاسِلَ وَأَغْلَالًا وَسَعِيرًا ٤

నిశ్చయంగా, మేము సత్య-తిరస్కారుల కొరకు సంకెళ్ళను, మెడలో పట్టాలను మరియు భగభగ మండే నరకాగ్నిని (స’ఈరాను) సిధ్దపరచి ఉంచాము. 4

76:5 – إِنَّ الْأَبْرَارَ يَشْرَبُونَ مِن كَأْسٍ كَانَ مِزَاجُهَا كَافُورًا ٥

నిశ్చయంగా, పుణ్యాత్ములు కాఫూర్‌ అనే ఒక చెలమనుండి ఒక గిన్నెలో తెచ్చిన (పానీయాన్ని) త్రాగుతారు. 5

76:6 – عَيْنًا يَشْرَبُ بِهَا عِبَادُ اللَّـهِ يُفَجِّرُونَهَا تَفْجِيرًا ٦

ధారాళంగా పొంగి ప్రవహింపజేయబడే ఊటల నుండి, అల్లాహ్‌ దాసులు త్రాగుతూ ఉంటారు. 6

76:7 – يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا ٧

వారు తమ మొక్కుబడులను పూర్తిచేసు కున్నవారై ఉంటారు. 7 మరియు దాని హాని అన్ని వైపులా క్రమ్ముకొనే, ఆ దినమును గురించి భయపడుతూ ఉంటారు.

76:8 – وَيُطْعِمُونَ الطَّعَامَ عَلَىٰ حُبِّهِ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا ٨

మరియు అది తమకు ప్రీతికరమైనప్పటికీ, వారు నిరుపేదలకు మరియు అనాథులకు మరియు ఖైదీలకు, ఆహారంపెట్టే వారై ఉంటారు. 8

76:9 – إِنَّمَا نُطْعِمُكُمْ لِوَجْهِ اللَّـهِ لَا نُرِيدُ مِنكُمْ جَزَاءً وَلَا شُكُورًا ٩

వారు (వారితో ఇలా అంటారు): “వాస్తవానికి మేము అల్లాహ్‌ ప్రసన్నతకొరకే మీకుఆహారం పెడు తున్నాము. మేము మీ నుండి ఎలాంటి ప్రతిఫలం గానీ, లేదా కృతజ్ఞతలు గానీ ఆశించటం లేదు.

76:10 – إِنَّا نَخَافُ مِن رَّبِّنَا يَوْمًا عَبُوسًا قَمْطَرِيرًا ١٠

“నిశ్చయంగా, మేము మా ప్రభువు నుండి వచ్చే ఉగ్రమైన, దుర్భరమైన, ఆ దినానికి భయపడుతున్నాము!”

76:11 – فَوَقَاهُمُ اللَّـهُ شَرَّ ذَٰلِكَ الْيَوْمِ وَلَقَّاهُمْ نَضْرَةً وَسُرُورًا ١١

కావున అల్లాహ్‌ వారిని ఆ దినపు కీడు నుండి కాపాడాడు. మరియు వారికి ఉల్లాసాన్ని మరియు ఆనందాన్ని ప్రసాదించాడు.

76:12 – وَجَزَاهُم بِمَا صَبَرُوا جَنَّةً وَحَرِيرًا ١٢

మరియు వారి సహనానికి 9 ప్రతిఫలంగా వారికి స్వర్గాన్ని మరియు పట్టు వస్త్రాలను ఇచ్చాడు. 10

76:13 – مُّتَّكِئِينَ فِيهَا عَلَى الْأَرَائِكِ ۖ لَا يَرَوْنَ فِيهَا شَمْسًا وَلَا زَمْهَرِيرًا ١٣

అందులో వారు ఎత్తైన పీఠాల మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. అందులో వారు ఎండ (బాధ) గానీ, చలి తీవ్రతను గానీ చూడరు!

76:14 – وَدَانِيَةً عَلَيْهِمْ ظِلَالُهَا وَذُلِّلَتْ قُطُوفُهَا تَذْلِيلًا ١٤

మరియు అందులో వారిపై నీడలు పడుతుంటాయి. 11 దాని ఫలాల గుత్తులు వారికి అందుబాటులో ఉంటాయి.

76:15 – وَيُطَافُ عَلَيْهِم بِآنِيَةٍ مِّن فِضَّةٍ وَأَكْوَابٍ كَانَتْ قَوَارِيرَا ١٥

మరియు వారిమధ్య వెండిపాత్రలు మరియు గాజుగ్లాసులు త్రిప్పబడుతూ ఉంటాయి.

76:16 – قَوَارِيرَ مِن فِضَّةٍ قَدَّرُوهَا تَقْدِيرًا ١٦

ఆ గాజు గ్లాసులు స్ఫటికంవలే తెల్లనైన వెండితో చేయబడి ఉంటాయి. అవి నియమబద్ధంగా నింపబడి ఉంటాయి.

76:17 – وَيُسْقَوْنَ فِيهَا كَأْسًا كَانَ مِزَاجُهَا زَنجَبِيلًا ١٧

మరియు వారికి సొంటి కలిపిన మధుపాత్రలు త్రాగటానికి ఇవ్వబడతాయి. 12

76:18 – عَيْنًا فِيهَا تُسَمَّىٰ سَلْسَبِيلًا ١٨

అది స్వర్గంలోని సల్‌సబీల్‌ అనే పేరుగల ఒక ఊట! (7/8)

76:19 – وَيَطُوفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُونَ إِذَا رَأَيْتَهُمْ حَسِبْتَهُمْ لُؤْلُؤًا مَّنثُورًا ١٩

  • మరియు వారి మధ్య శాశ్వతంగా, యవ్వనులుగా ఉండే బాలురు తిరుగుతూ ఉంటారు. మరియు నీవు వారిని చూస్తే, వారిని వెదజల్లిన ముత్యాలుగా భావిస్తావు. 13

76:20 – وَإِذَا رَأَيْتَ ثَمَّ رَأَيْتَ نَعِيمًا وَمُلْكًا كَبِيرًا ٢٠

మరియు నీవు అక్కడ (స్వర్గంలో) చూస్తే, ఎక్కడచూసినా ఆనందమే పొందుతావు. మరియు ఒక మహత్తర సామ్రాజ్య వైభవం కనిపిస్తుంది.

76:21 – عَالِيَهُمْ ثِيَابُ سُندُسٍ خُضْرٌ وَإِسْتَبْرَقٌ ۖ وَحُلُّوا أَسَاوِرَ مِن فِضَّةٍ وَسَقَاهُمْ رَبُّهُمْ شَرَابًا طَهُورًا ٢١

వారి ఒంటి మీద సన్నని ఆకుపచ్చని శ్రేష్ఠమైన పట్టువస్త్రాలు మరియు బంగారు జలతారు అల్లిన దుస్తులుంటాయి. మరియు వారికి వెండికంకణాలు తొడిగించబడతాయి మరియు వారి ప్రభువు వారికి నిర్మలమైన పానీయాన్ని త్రాగటానికి ప్రసాదిస్తాడు.

76:22 – إِنَّ هَـٰذَا كَانَ لَكُمْ جَزَاءً وَكَانَ سَعْيُكُم مَّشْكُورًا ٢٢

(వారితో ఇలా అనబడుతుంది): “నిశ్చయంగా, ఇది మీకు ఇవ్వబడే ప్రతిఫలం. ఎందుకంటే, మీ శ్రమ అంగీకరించబడింది.”

76:23 – إِنَّا نَحْنُ نَزَّلْنَا عَلَيْكَ الْقُرْآنَ تَنزِيلً ٢٣

నిశ్చయంగా మేమే, ఈ ఖుర్‌ఆన్‌ను నీపై (ఓ ము’హమ్మద్‌!) క్రమక్రమంగా అవతరింపజేశాము.

76:24 – فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تُطِعْ مِنْهُمْ آثِمًا أَوْ كَفُورًا ٢٤

కావున నీవు నీ ప్రభువు యొక్క ఆజ్ఞపై స్థిరంగాఉండు మరియు వీరిలోని ఏ పాపి యొక్క లేదా సత్య-తిరస్కారుని యొక్క మాటగానివినకు. 14

76:25 – وَاذْكُرِ اسْمَ رَبِّكَ بُكْرَةً وَأَصِيلًا ٢٥

మరియు నీ ప్రభువు నామాన్ని ఉదయం మరియు సాయంత్రం స్మరిస్తూ ఉండు. 15

76:26 – وَمِنَ اللَّيْلِ فَاسْجُدْ لَهُ وَسَبِّحْهُ لَيْلًا طَوِيلًا ٢٦

మరియు రాత్రివేళ ఆయన సన్నిధిలో సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉండు 16 మరియు రాత్రివేళ సుదీర్ఘకాలం, ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు.

76:27 – إِنَّ هَـٰؤُلَاءِ يُحِبُّونَ الْعَاجِلَةَ وَيَذَرُونَ وَرَاءَهُمْ يَوْمًا ثَقِيلًا ٢٧

నిశ్చయంగా, వీరు అనిశ్చితమైన ఈ ప్రాపంచిక జీవితం పట్ల మోహితులై వున్నారు. మరియు మున్ముందు రానున్న భారమైన దినాన్ని విస్మరిస్తున్నారు. 17

76:28 – نَّحْنُ خَلَقْنَاهُمْ وَشَدَدْنَا أَسْرَهُمْ ۖ وَإِذَا شِئْنَا بَدَّلْنَا أَمْثَالَهُمْ تَبْدِيلً ٢٨

మేమే వీరిని సృష్టించిన వారము మరియు వీరి శరీరాన్ని దృఢపరిచిన వారము. మరియు మేము కోరినప్పుడు వీరికి బదులుగా వీరి వంటి వారిని తేగలము.

76:29 – إِنَّ هَـٰذِهِ تَذْكِرَةٌ ۖ فَمَن شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ سَبِيلًا ٢٩

నిశ్చయంగా, ఇదొక హితోపదోశం కావున ఇష్టపడిన వాడు తన ప్రభువు వైపునకు పోయే మార్గాన్ని అవలంబించవచ్చు!

76:30 – وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّـهُ ۚ إِنَّ اللَّـهَ كَانَ عَلِيمًا حَكِيمًا ٣٠

మరియు, అల్లాహ్‌ కోరకపోతే, మీరు కోరేదీ (జరగదు)! నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

76:31 – يُدْخِلُ مَن يَشَاءُ فِي رَحْمَتِهِ ۚ وَالظَّالِمِينَ أَعَدَّ لَهُمْ عَذَابًا أَلِيمًا ٣١

ఆయన, తాను కోరిన వారిని తన కారుణ్యంలోకి తీసుకుంటాడు. మరియు దుర్మార్గులకొరకు, ఆయన బాధాకరమైన శిక్షను సిధ్ధపరచి ఉంచాడు.

సూరహ్‌ అల్‌-ముర్సలాత్‌ – అల్‌-ముర్సలాతు: Those sent forth, పంపబడ్డవి. ఈ సూరహ్‌ ఆరంభ మక్కహ్ కాలపు సూరహ్‌లలో ఒకటి. ఈ సూరహ్‌ సత్య-తిరస్కారులను రాబోయే జీవితపు శిక్ష గురించి హెచ్చరిస్తుంది. ‘అబ్దుల్లాహ్‌ ఇబ్నె-మస్‌’ఊద్‌ (ర’ది.’అ.) కథనం: ”మేము మునాలోని ఒక గుహలో ఉండగా ఈ సూరహ్‌ అవతరింపజేయబడింది. దైవప్రవక్త (‘స’అస) దీనిని చదువు తుండగా అకస్మాత్తుగా ఒక పాము వచ్చింది. దైవప్రవక్త (‘స’అస) దానిని చంపమన్నారు. కాని అది త్వరగా వెళ్ళిపోయింది. అప్పుడు అతనన్నారు: ‘నీవు దాని హానినుండి మరియు అది నీహాని నుండి తప్పించుకున్నారు.’ ” (‘స’హీ’హ్‌ బు’ఖారీ మరియు ‘స’హీ’హ్‌ ముస్లిం) దైవప్రవక్త (‘స’అస) కొన్నిసార్లు మ’గ్‌రిబ్‌ నమా’జ్‌లో ఈ సూరహ్‌ చదివేవారు (‘స’హీ’హ్‌ బు’ఖారీ). 50 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 77:1 – وَالْمُرْسَلَاتِ عُرْفًا ١

ఒకదాని తరువాత ఒకటి, వరుసగా పంపబడే వాయువుల సాక్షిగా! 1

77:2 – فَالْعَاصِفَاتِ عَصْفًا ٢

మరియు తీవ్రమైన వేగంతో వీచే వాయువుల సాక్షిగా! 2

77:3 – وَالنَّاشِرَاتِ نَشْرًا ٣

మరియు మేఘాలను దూర-దూరంగా వ్యాపింప జేసే వాయువుల సాక్షిగా! 3

77:4 – فَالْفَارِقَاتِ فَرْقًا ٤

మరియు మంచి-చెడులను విశదపరచే (దైవదూతల) సాక్షిగా! 4

77:5 – فَالْمُلْقِيَاتِ ذِكْرًا ٥

సందేశాలను ప్రవక్తల వద్దకు తెచ్చే (దైవదూత) సాక్షిగా! 5

77:6 – عُذْرًا أَوْ نُذْرًا ٦

సాకుగా లేక హెచ్చరికగా! 6

77:7 – إِنَّمَا تُوعَدُونَ لَوَاقِعٌ ٧

నిశ్చయంగా, మీకు వాగ్దానం చేయబడినది, జరగవలసి ఉంది.

77:8 – فَإِذَا النُّجُومُ طُمِسَتْ ٨

అప్పుడు ఎప్పుడైతే నక్షత్రాలు కాంతిహీనమై పోతాయో!

77:9 – وَإِذَا السَّمَاءُ فُرِجَتْ ٩

మరియు ఆకాశం చీలిపోతుందో!

77:10 – وَإِذَا الْجِبَالُ نُسِفَتْ ١٠

మరియు పర్వతాలు పొడిగామారి, చెల్లా చెదురుగా చేయబడతాయో!

77:11 – وَإِذَا الرُّسُلُ أُقِّتَتْ ١١

మరియు ప్రవక్తలు తమ నిర్ణీత సమయంలో సమావేశపరచబడతారో! 7

77:12 – لِأَيِّ يَوْمٍ أُجِّلَتْ ١٢

ఏ దినానికిగాను, (ఇవన్నీ) వాయిదా వేయబడ్డాయి?

77:13 – لِيَوْمِ الْفَصْلِ ١٣

ఆ తీర్పు దినం కొరకా! 8

77:14 – وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الْفَصْلِ ١٤

మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా అర్థం కాగలదు?

77:15 – وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ١٥

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!

77:16 – أَلَمْ نُهْلِكِ الْأَوَّلِينَ ١٦

ఏమీ? మేము పూర్వీకులను నాశనం చేయలేదా?

77:17 – ثُمَّ نُتْبِعُهُمُ الْآخِرِينَ ١٧

తరువాత రాబోయేవారిని కూడా, మేము వారి వెనక పంపుతాము.

77:18 – كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ ١٨

ఈ విధంగా మేము నేరస్థుల పట్ల వ్యవహరిస్తాము.

77:19 – وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ١٩

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!

77:20 – أَلَمْ نَخْلُقكُّم مِّن مَّاءٍ مَّهِينٍ ٢٠

ఏమీ? మేము మిమ్మల్ని తుచ్ఛమైన నీటితో (వీర్యబిందువుతో) సృష్టించలేదా?

77:21 – فَجَعَلْنَاهُ فِي قَرَارٍ مَّكِينٍ ٢١

తరువాత మేము దానిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము.

77:22 – إِلَىٰ قَدَرٍ مَّعْلُومٍ ٢٢

ఒక నిర్ణీతకాలం వరకు.

77:23 – فَقَدَرْنَا فَنِعْمَ الْقَادِرُونَ ٢٣

ఈ విధంగా మేము నిర్ణయించాము, ఎందుకంటే మేమే ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునే వారము. 9

77:24 – وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ٢٤

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!

77:25 – أَلَمْ نَجْعَلِ الْأَرْضَ كِفَاتًا ٢٥

ఏమీ? మేము భూమిని ఒక సమీకరించే స్థానంగా చేయలేదా?

77:26 – أَحْيَاءً وَأَمْوَاتًا ٢٦

జీవులకూ మరియు మృతులకూను?

77:27 – وَجَعَلْنَا فِيهَا رَوَاسِيَ شَامِخَاتٍ وَأَسْقَيْنَاكُم مَّاءً فُرَاتًا ٢٧

మరియు దానిలో ఎత్తైన పర్వతాలను స్థిరంగా నిలుపలేదా? మరియు మీకు త్రాగటానికి మంచి నీటిని ప్రసాదించలేదా?

77:28 – وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ٢٨

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!

77:29 – انطَلِقُوا إِلَىٰ مَا كُنتُم بِهِ تُكَذِّبُونَ ٢٩

(సత్య-తిరస్కారులతో ఇలా అనబడు తుంది): “మీరు తిరస్కరిస్తూ వచ్చిన దాని వైపునకు పొండి!”

77:30 – انطَلِقُوا إِلَىٰ ظِلٍّ ذِي ثَلَاثِ شُعَبٍ ٣٠

(దాని పొగ) మూడు శాఖలుగా చీలిపోయే నీడ వైపునకు పొండి;

77:31 – لَّا ظَلِيلٍ وَلَا يُغْنِي مِنَ اللَّـهَبِ ٣١

కాని అది ఏ విధమైన (చల్లని) నీడనూ ఇవ్వదూ మరియు (నరక) జ్వాలల నుండి కూడా కాపాడదు!

77:32 – إِنَّهَا تَرْمِي بِشَرَرٍ كَالْقَصْرِ ٣٢

వాస్తవానికి అది పెద్దపెద్ద మొద్దుల వంటి అగ్నికణాలను విసురుతుంది.

77:33 – كَأَنَّهُ جِمَالَتٌ صُفْرٌ ٣٣

వాస్తవానికి ఆ అగ్నికణాలు పసుపుపచ్చని ఒంటెలవలే కనిపిస్తాయి.

77:34 – وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ٣٤

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరిం చేవారికి వినాశముంది!

77:35 – هَـٰذَا يَوْمُ لَا يَنطِقُونَ ٣٥

ఆ దినాన వారు మాట్లాడలేరు.

77:36 – وَلَا يُؤْذَنُ لَهُمْ فَيَعْتَذِرُونَ ٣٦

మరియు వారికి సాకులు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వబడదు.

77:37 – وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ٣٧

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!

77:38 – هَـٰذَا يَوْمُ الْفَصْلِ ۖ جَمَعْنَاكُمْ وَالْأَوَّلِينَ ٣٨

అది తీర్పుదినమై ఉంటుంది! మేము మిమ్మల్ని మరియు మీ పూర్వికులను సమావేశపరచి ఉంటాము!

77:39 – فَإِن كَانَ لَكُمْ كَيْدٌ فَكِيدُونِ ٣٩

కావున మీ వద్ద ఏదైనా పన్నాగముంటే దానిని పన్నండి. 10

77:40 – وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ٤٠

ఆరోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!

77:41 – إِنَّ الْمُتَّقِينَ فِي ظِلَالٍ وَعُيُونٍ ٤١

నిశ్చయంగా భయ-భక్తులు గలవారు (ఆ రోజు చల్లని) నీడలలో చెలమల దగ్గర ఉంటారు.

77:42 – وَفَوَاكِهَ مِمَّا يَشْتَهُونَ ٤٢

మరియు వారికి, వారు కోరే ఫలాలు లభిస్తాయి.

77:43 – كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا كُنتُمْ تَعْمَلُونَ ٤٣

(వారితో ఇలా అనబడుతుంది): “మీరు చేస్తూఉండిన కర్మలకు ఫలితంగా హాయిగా తినండి త్రాగండి!”

77:44 – إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ ٤٤

నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము.

77:45 – وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ٤٥

ఆరోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!

77:46 – كُلُوا وَتَمَتَّعُوا قَلِيلًا إِنَّكُم مُّجْرِمُونَ ٤٦

(ఓ సత్య-తిరస్కారులారా!) మీరు కొంత కాలం తినండి, సుఖాలు అనుభవించండి. నిశ్చయంగా, మీరు నేరస్థులు!

77:47 – وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ٤٧

ఆరోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!

77:48 – وَإِذَا قِيلَ لَهُمُ ارْكَعُوا لَا يَرْكَعُونَ ٤٨

మరియు వారితో: “(అల్లాహ్‌ ముందు) వంగండి (రుకూ’ఉ చేయండి).” అని అన్నప్పుడు, వారు వంగలేదు.

77:49 – وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ٤٩

ఆరోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! 11

77:50 – فَبِأَيِّ حَدِيثٍ بَعْدَهُ يُؤْمِنُونَ ٥٠

దీని (ఈ ఖుర్‌ఆన్‌) తరువాత, ఇక వారు మరెలాంటి సందేశాన్ని విశ్వసిస్తారు?

సూరహ్‌ అన్‌-నబఅ’ – అన్‌- నబఅ’: The Great News, The Tiding, వార్త, సమాచారం. ఇది చివరి మక్కహ్ కాలపు సూరహ్‌. ఇది పునరుత్థానం మరియు అంతిమ తీర్పులను గురించి తెలుపుతోంది. 40 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు రెండవ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 78:1 – عَمَّ يَتَسَاءَلُونَ ١

[(*)] ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు? 1

78:2 – عَنِ النَّبَإِ الْعَظِيمِ ٢

ఆ మహా వార్తను గురించేనా?

78:3 – الَّذِي هُمْ فِيهِ مُخْتَلِفُونَ ٣

దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలను కలిగిఉన్నారో!

78:4 – كَلَّا سَيَعْلَمُونَ ٤

అది కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.

78:5 – ثُمَّ كَلَّا سَيَعْلَمُونَ ٥

ఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసు కోగలరు.

78:6 – أَلَمْ نَجْعَلِ الْأَرْضَ مِهَادًا ٦

ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా?

78:7 – وَالْجِبَالَ أَوْتَادًا ٧

మరియు పర్వతాలను మేకులుగా? 2

78:8 – وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا ٨

మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము. 3

78:9 – وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا ٩

మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము.

78:10 – وَجَعَلْنَا اللَّيْلَ لِبَاسًا ١٠

మరియు రాత్రిని ఆచ్ఛాదంగా చేశాము.

78:11 – وَجَعَلْنَا النَّهَارَ مَعَاشًا ١١

మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము.

78:12 – وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا ١٢

మరియు మేము మీపైన పటిష్ఠమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము.

78:13 – وَجَعَلْنَا سِرَاجًا وَهَّاجًا ١٣

మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము.

78:14 – وَأَنزَلْنَا مِنَ الْمُعْصِرَاتِ مَاءً ثَجَّاجًا ١٤

మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము. 4

78:15 – لِّنُخْرِجَ بِهِ حَبًّا وَنَبَاتًا ١٥

దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లు చేమలను) పెరిగించటానికి!

78:16 – وَجَنَّاتٍ أَلْفَافًا ١٦

మరియు దట్టమైన తోటలను.

78:17 – إِنَّ يَوْمَ الْفَصْلِ كَانَ مِيقَاتًا ١٧

నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం. 5

78:18 – يَوْمَ يُنفَخُ فِي الصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًا ١٨

ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచివస్తారు.

78:19 – وَفُتِحَتِ السَّمَاءُ فَكَانَتْ أَبْوَابًا ١٩

మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి;

78:20 – وَسُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا ٢٠

మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమైపోతాయి. 6

78:21 – إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا ٢١

నిశ్చయంగా, నరకం ఒక మాటు;

78:22 – لِّلطَّاغِينَ مَآبًا ٢٢

ధిక్కారుల గమ్యస్థానం;

78:23 – لَّابِثِينَ فِيهَا أَحْقَابًا ٢٣

అందులో వారు యుగాల తరబడి ఉంటారు. 7

78:24 – لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا ٢٤

అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవిచూడరు.

78:25 – إِلَّا حَمِيمًا وَغَسَّاقًا ٢٥

సలసల కాగే నీరు మరియు చీములాంటి మురికి (పానీయం) తప్ప! 8

78:26 – جَزَاءً وِفَاقًا ٢٦

(వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా!

78:27 – إِنَّهُمْ كَانُوا لَا يَرْجُونَ حِسَابًا ٢٧

వాస్తవానికి వారు లెక్కతీసుకోబడుతుందని ఆశించలేదు.

78:28 – وَكَذَّبُوا بِآيَاتِنَا كِذَّابًا ٢٨

పైగా వారు మా సూచన (ఆయాత్‌)లను అసత్యాలని తిరస్కరించారు.

78:29 – وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ كِتَابًا ٢٩

మరియు మేము (వారు చేసిన) ప్రతి దానిని ఒక పుస్తకంలో వ్రాసిపెట్టాము. 9

78:30 – فَذُوقُوا فَلَن نَّزِيدَكُمْ إِلَّا عَذَابًا ٣٠

కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవిచూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము 10

78:31 – إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا ٣١

నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది;

78:32 – حَدَائِقَ وَأَعْنَابًا ٣٢

ఉద్యాన వనాలూ, ద్రాక్ష తోటలూ!

78:33 – وَكَوَاعِبَ أَتْرَابًا ٣٣

మరియు ఈడూ-జోడూ గల (యవ్వన) సుందర కన్యలు;

78:34 – وَكَأْسًا دِهَاقًا ٣٤

మరియు నిండిపొర్లే (మధు) పాత్ర.

78:35 – لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا كِذَّابًا ٣٥

అందులో (స్వర్గంలో) వారు ఏలాంటి వ్యర్థపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు.

78:36 – جَزَاءً مِّن رَّبِّكَ عَطَاءً حِسَابًا ٣٦

(ఇదంతా) నీ ప్రభువు తరఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం.

78:37 – رَّبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا الرَّحْمَـٰنِ ۖ لَا يَمْلِكُونَ مِنْهُ خِطَابًا ٣٧

భూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన అనంత కరుణామయుని (బహుమానం), ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు.

78:38 – يَوْمَ يَقُومُ الرُّوحُ وَالْمَلَائِكَةُ صَفًّا ۖ لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنْ أَذِنَ لَهُ الرَّحْمَـٰنُ وَقَالَ صَوَابًا ٣٨

ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్‌) 11 మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించినవాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడ లేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు. 12

78:39 – ذَٰلِكَ الْيَوْمُ الْحَقُّ ۖ فَمَن شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ مَآبًا ٣٩

అదే అంతిమ సత్య దినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి! 13

78:40 – إِنَّا أَنذَرْنَاكُمْ عَذَابًا قَرِيبًا يَوْمَ يَنظُرُ الْمَرْءُ مَا قَدَّمَتْ يَدَاهُ وَيَقُولُ الْكَافِرُ يَا لَيْتَنِي كُنتُ تُرَابً ٤٠

నిశ్చయంగా, మేము అతి సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు. 14 మరియు సత్య-తిరస్కారి: “అయ్యో, నా పాడుగాను! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది!” 15 అని వాపోతాడు.

సూరహ్‌ అన్‌-నాజి’ఆత్‌ – అన్‌-నాజి’ఆత్‌: Those Who Pull Out, బలవంతంగా లాగు, ఈడ్చు లేక కఠినంగా తీయు వారు. ఇది సూరహ్‌ అన్‌-నబా’ (78) తరువాత అవతరింపజేయబడిన చివరి మక్కహ్ కాలపు సూరహ్‌. 46 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 79:1 – وَالنَّازِعَاتِ غَرْقًا ١

(అవిశ్వాసుల ప్రాణాలను) కఠినంగా లాగి తీసేవారి (దేవదూతల) సాక్షిగా! 1

79:2 – وَالنَّاشِطَاتِ نَشْطًا ٢

(విశ్వాసుల ప్రాణాలను) నెమ్మదిగా తీసేవారి (దేవ దూతల) సాక్షిగా! 2

79:3 – وَالسَّابِحَاتِ سَبْحًا ٣

(విశ్వంలో) తేలియాడుతూ పోయే వారి సాక్షిగా! 3

79:4 – فَالسَّابِقَاتِ سَبْقًا ٤

మరియు పందెంలో వలే (ఒకరితోనొకరు) పోటీపడే వారి సాక్షిగా!

79:5 – فَالْمُدَبِّرَاتِ أَمْرًا ٥

మరియు (తమ ప్రభువు) ఆజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించేవారి (దేవదూతల) సాక్షిగా!

79:6 – يَوْمَ تَرْجُفُ الرَّاجِفَةُ ٦

ఆ రోజు (మొదటి) బాకా ధ్వని భూగోళాన్ని తీవ్రంగా కంపింపజేస్తుంది. 4

79:7 – تَتْبَعُهَا الرَّادِفَةُ ٧

దాని తర్వాత రెండవసారి 5 బాకా ఊద బడుతుంది (అప్పుడు అందరూ పునరుత్థరింప బడతారు).

79:8 – قُلُوبٌ يَوْمَئِذٍ وَاجِفَةٌ ٨

ఆ రోజు (కొన్ని) హృదయాలు (భయంతో) దడదడ లాడుతూ ఉంటాయి.

79:9 – أَبْصَارُهَا خَاشِعَةٌ ٩

వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి.

79:10 – يَقُولُونَ أَإِنَّا لَمَرْدُودُونَ فِي الْحَافِرَةِ ١٠

వారు ఇలా అంటున్నారు: “ఏమీ? మనం మన పూర్వస్థితిలోకి మళ్ళీ తీసుకురాబడతామా?

79:11 – أَإِذَا كُنَّا عِظَامًا نَّخِرَةً ١١

“మనం శిథిలమైన ఎముకలుగా మారి పోయిన తరువాత కూడానా?”

79:12 – قَالُوا تِلْكَ إِذًا كَرَّةٌ خَاسِرَةٌ ١٢

వారు (ఇంకా ఇలా) అంటారు: “అయితే ఈ తిరిగి రావటమనేది చాల నష్టదాయకమైనదే!”

79:13 – فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ ١٣

కాని అది వాస్తవానికి, ఒకే ఒక (తీవ్రమైన) ధ్వని.

79:14 – فَإِذَا هُم بِالسَّاهِرَةِ ١٤

అప్పుడు వారందరూ, ఒకేసారి లేచి మైదానంలోకి వచ్చి ఉంటారు.

79:15 – هَلْ أَتَاكَ حَدِيثُ مُوسَىٰ ١٥

ఏమీ? నీకు మూసా వృత్తాంతం అందిందా? 6

79:16 – إِذْ نَادَاهُ رَبُّهُ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًى ١٦

అతని ప్రభువు పవిత్ర ‘తువా లోయలో అతనిని పిలిచి నప్పుడు, 7

79:17 – اذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَىٰ ١٧

(ఇలా అన్నాడు): “ఫిర్‌’ఔన్‌ వద్దకు వెళ్ళు, నిశ్చయంగా, అతడు ధిక్కారుడయ్యాడు.

79:18 – فَقُلْ هَل لَّكَ إِلَىٰ أَن تَزَكَّ ١٨

“ఇక (అతనితో) ఇట్లను: ‘ఏమీ? నీవు పాపరహితుడవు అవటానికి ఇష్టపడతావా?

79:19 – وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ ١٩

‘మరియు నేను నీకు నీ ప్రభువు వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను, మరి నీవు ఆయన పట్ల భీతికలిగి ఉంటావా?’ “

79:20 – فَأَرَاهُ الْآيَةَ الْكُبْرَىٰ ٢٠

తరువాత అతను (మూసా) అతనికి (ఫిర్‌’ఔన్‌కు) గొప్ప అద్భుత నిదర్శనాన్ని చూపాడు.

79:21 – فَكَذَّبَ وَعَصَىٰ ٢١

కాని అతడు (ఫిర్‌’ఔన్‌) దానిని అబద్ధమని తిరస్కరించాడు మరియు (అతని మాటను) ఉల్లంఘించాడు.

79:22 – ثُمَّ أَدْبَرَ يَسْعَىٰ ٢٢

ఆ తర్వాత అతడు (ఫిర్‌’ఔన్‌) వెనక్కి మరలిపోయి (కుట్రలు) పన్నసాగాడు.

79:23 – فَحَشَرَ فَنَادَىٰ ٢٣

పిదప (ప్రజలను) సమావేశపరచి, ఎలుగెత్తి చాటుతూ;

79:24 – فَقَالَ أَنَا رَبُّكُمُ الْأَعْلَىٰ ٢٤

ఇలా అన్నాడు: “నేనే మీ యొక్క మహోన్నత ప్రభువును!” 8

79:25 – فَأَخَذَهُ اللَّـهُ نَكَالَ الْآخِرَةِ وَالْأُولَ ٢٥

కావున అల్లాహ్‌ అతనిని ఇహపరలోకాల శిక్షకు గురిచేశాడు. 9

79:26 – إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِّمَن يَخْشَ ٢٦

నిశ్చయంగా, ఇందులో (అల్లాహ్‌కు) భయపడే ప్రతివ్యక్తి కొరకు గుణపాఠ ముంది.

79:27 – أَأَنتُمْ أَشَدُّ خَلْقًا أَمِ السَّمَاءُ ۚ بَنَاهَا ٢٧

ఏమీ? మిమ్మల్ని సృష్టించడం కఠిన మయిన పనా? లేక ఆకాశాన్నా? ఆయనే కదా దానిని నిర్మించింది! 10

79:28 – رَفَعَ سَمْكَهَا فَسَوَّاهَا ٢٨

ఆయన దాని కప్పును (ఎత్తును) చాలా పైకి లేపాడు. తరువాత దానిని క్రమపరిచాడు;

79:29 – وَأَغْطَشَ لَيْلَهَا وَأَخْرَجَ ضُحَاهَا ٢٩

మరియు ఆయన దాని రాత్రిని చీకటిగా చేశాడు మరియు దాని పగటిని (వెలుగును) బహిర్గతం చేశాడు.

79:30 – وَالْأَرْضَ بَعْدَ ذَٰلِكَ دَحَاهَا ٣٠

మరియు ఆపిదప భూమిని పరచినట్లు చేశాడు. 11

79:31 – أَخْرَجَ مِنْهَا مَاءَهَا وَمَرْعَاهَا ٣١

దాని నుండి దాని నీళ్ళను మరియు దాని పచ్చికను బయటికి తీశాడు;

79:32 – وَالْجِبَالَ أَرْسَاهَا ٣٢

మరియు పర్వతాలను (దానిలో) స్థిరంగా నాటాడు;

79:33 – مَتَاعًا لَّكُمْ وَلِأَنْعَامِكُمْ ٣٣

మీకూ మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా! 12

79:34 – فَإِذَا جَاءَتِ الطَّامَّةُ الْكُبْرَىٰ ٣٤

ఇక ఆ గొప్ప దుర్ఘటన (పునరుత్థానదినం) వచ్చినప్పుడు;

79:35 – يَوْمَ يَتَذَكَّرُ الْإِنسَانُ مَا سَعَىٰ ٣٥

ఆ రోజు మానవుడు తాను చేసిందంతా జ్ఞాపకం చేసుకుంటాడు;

79:36 – وَبُرِّزَتِ الْجَحِيمُ لِمَن يَرَىٰ ٣٦

మరియు చూసేవారి యెదుటకు, నరకాగ్ని స్పష్టంగా కనబడేటట్లు తేబడుతుంది. 13

79:37 – فَأَمَّا مَن طَغَ ٣٧

ఇక ధిక్కారంతో హద్దులుమీరి ప్రవర్తించిన వాడికి;

79:38 – وَآثَرَ الْحَيَاةَ الدُّنْيَا ٣٨

మరియు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిచ్చినవాడికి;

79:39 – فَإِنَّ الْجَحِيمَ هِيَ الْمَأْوَىٰ ٣٩

నిశ్చయంగా, నరకాగ్నియే వాని నివాసస్థాన మవుతుంది!

79:40 – وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ ٤٠

నిశ్చయంగా, నరకాగ్నియే వాని నివాసస్థాన మవుతుంది!

79:41 – فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ ٤١

నిశ్చయంగా, స్వర్గమే, అతని నివాసస్థాన మవుతుంది!

79:42 – يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا ٤٢

(ఓ ము’హమ్మద్‌!) వీరు నిన్ను – ఆ ఘడియను గురించి – “అసలు అది ఎప్పడొస్తుంది?” అని అడుగు తున్నారు.

79:43 – فِيمَ أَنتَ مِن ذِكْرَاهَا ٤٣

దాని గురించి చెప్పడానికి, దాంతో నీకేమి సంబంధం?

79:44 – إِلَىٰ رَبِّكَ مُنتَهَاهَا ٤٤

దాని వాస్తవజ్ఞానం నీ ప్రభువుకే ఉంది!

79:45 – إِنَّمَا أَنتَ مُنذِرُ مَن يَخْشَاهَا ٤٥

(ఓ ము’హమ్మద్‌!) నిశ్చయంగా, నీవు, దానికి భయపడే వారిని హెచ్చరించేవాడవు మాత్రమే!

79:46 – كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوا إِلَّا عَشِيَّةً أَوْ ضُحَاهَا ٤٦

వారు దానిని చూసిన రోజు (తాము ప్రపంచంలో) కేవలం ఒక సాయంత్రమో లేక ఒక ఉదయమో గడిపినట్లు భావిస్తారు. 12 (1/8)

సూరహ్‌ ‘అబస – ‘అబస: He Frowned, కనుబొమలు / భృకుటి ముడివేసుకున్నాడు, ముఖం చిట్లించు కున్నాడు, కోపముఖం చూపాడు. ఈ సూరహ్‌ మొదటి మక్కహ్ కాలంలో అవతరింపజేయ బడింది. ఒకసారి దైవప్రవక్త (‘స’అస) పెద్ద (అష్‌రాఫ్‌) ఖురైషులతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌-ఉమ్మె మక్తూమ్‌ (ర’ది.’అ.) వచ్చి కొన్ని ధర్మవిషయాలను గురించి ప్రశ్నిస్తారు. అతడు అంధుడు. అప్పుడు దైవప్రవక్త (‘స’అస) అయిష్టతతో ముఖం చిట్లించు కుంటారు. అప్పుడు ఈ ఆయత్‌లు అవతరింపజేయబడతాయి. (తిర్మీజీ’, అల్బానీ ప్రమాణీకం) 42 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 80:1 – عَبَسَ وَتَوَلَّىٰ ١

  • అతను (ప్రవక్త) భృకుటి ముడివేసు కున్నాడు మరియు ముఖం త్రిప్పుకున్నాడు;

80:2 – أَن جَاءَهُ الْأَعْمَ ٢

ఆ గ్రుడ్డివాడు తన వద్దకు వచ్చాడని!

80:3 – وَمَا يُدْرِيكَ لَعَلَّهُ يَزَّكَّىٰ ٣

కాని నీకేం తెలుసు? బహుశా అతడు తనను తాను సంస్కరించుకోవచ్చు!

80:4 – أَوْ يَذَّكَّرُ فَتَنفَعَهُ الذِّكْرَىٰ ٤

లేదా అతడు హితబోధ పొందవచ్చు మరియు ఆ హితబోధ అతనికి ప్రయోజనకరం కావచ్చు!

80:5 – أَمَّا مَنِ اسْتَغْنَىٰ ٥

కాని అతడు, ఎవడైతే తనను తాను స్వయం సమృద్ధుడు, అనుకుంటున్నాడో!

80:6 – فَأَنتَ لَهُ تَصَدَّىٰ ٦

అతని పట్ల నీవు ఆసక్తి చూపుతున్నావు. 1

80:7 – وَمَا عَلَيْكَ أَلَّا يَزَّكَّ ٧

ఒకవేళ అతడు సంస్కరించుకోకపోతే నీపై బాధ్యత ఏముంది? 2

80:8 – وَأَمَّا مَن جَاءَكَ يَسْعَ ٨

కాని, ఎవడైతే తనంతట తాను, నీ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడో!

80:9 – وَهُوَ يَخْشَ ٩

మరియు (అల్లాహ్‌ యెడల) భీతిపరుడై ఉన్నాడో!

80:10 – فَأَنتَ عَنْهُ تَلَهَّ ١٠

అతనిని నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు.

80:11 – كَلَّا إِنَّهَا تَذْكِرَةٌ ١١

అలాకాదు! నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్‌ఆన్‌) ఒక హితోపదేశం. 3

80:12 – فَمَن شَاءَ ذَكَرَهُ ١٢

కావున ఇష్టమున్న వారు దీనిని స్వీకరించ వచ్చు!

80:13 – فِي صُحُفٍ مُّكَرَّمَةٍ ١٣

ఇది ప్రతిష్ఠాత్మకమైన పుటలలో (వ్రాయబడి) ఉంది;

80:14 – فِي صُحُفٍ مُّكَرَّمَةٍ ١٤

మహోన్నతమైనది, పవిత్రమైనది;

80:15 – بِأَيْدِي سَفَرَةٍ ١٥

లేఖకుల (దేవదూతల) చేతులలో;

80:16 – كِرَامٍ بَرَرَةٍ ١٦

వారు గౌరవనీయులైన సత్పురుషులు (ఆజ్ఞానువర్తనులు).

80:17 – قُتِلَ الْإِنسَانُ مَا أَكْفَرَهُ ١٧

మానవుడు నాశనం గాను! అతడు ఎంత కృతఘ్నుడు! 4

80:18 – مِنْ أَيِّ شَيْءٍ خَلَقَهُ ١٨

ఆయన (అల్లాహ్‌) దేనితో అతనిని సృష్టించాడు?

80:19 – مِن نُّطْفَةٍ خَلَقَهُ فَقَدَّرَهُ ١٩

అతనిని, వీర్య-బిందువుతో సృష్టించాడు తరువాత అతనిని తగిన విధంగా తీర్చిదిద్దాడు.

80:20 – ثُمَّ السَّبِيلَ يَسَّرَهُ ٢٠

ఆ తరువాత, అతని మార్గాన్ని అతనికి సులభతరం చేశాడు; 5

80:21 – ثُمَّ أَمَاتَهُ فَأَقْبَرَهُ ٢١

ఆ పైన అతనిని మరణింపజేసి గోరీలోకి చేర్చాడు;

80:22 – ثُمَّ إِذَا شَاءَ أَنشَرَهُ ٢٢

మళ్ళీ ఆయన (అల్లాహ్‌) కోరినపుడు, అతనిని తిరిగి బ్రతికించి లేపాడు.

80:23 – كَلَّا لَمَّا يَقْضِ مَا أَمَرَهُ ٢٣

అలాకాదు, ఆయన (అల్లాహ్‌) ఆదేశించిన దానిని (మానవుడు) నెరవేర్చలేదు.

80:24 – فَلْيَنظُرِ الْإِنسَانُ إِلَىٰ طَعَامِهِ ٢٤

ఇక, మానవుడు తన ఆహారాన్ని గమనించాలి!

80:25 – أَنَّا صَبَبْنَا الْمَاءَ صَبًّا ٢٥

నిశ్చయంగా, మేము నీటిని (వర్షాన్ని) ఎంత పుష్కలంగా కురిపించాము.

80:26 – ثُمَّ شَقَقْنَا الْأَرْضَ شَقًّا ٢٦

ఆ తరువాత భూమిని (మొలిచే మొక్కలతో) చీల్చాము, ఒక అద్భుతమైన చీల్పుతో!

80:27 – فَأَنبَتْنَا فِيهَا حَبًّا ٢٧

తరువాత దానిలో ధాన్యాన్ని పెంచాము;

80:28 – وَعِنَبًا وَقَضْبًا ٢٨

మరియు ద్రాక్షలను మరియు కూర- గాయలను;

80:29 – وَزَيْتُونًا وَنَخْلًا ٢٩

మరియు ఆలివ్‌ (‘జైతూన్‌) మరియు ఖర్జూరపు చెట్లను;

80:30 – وَحَدَائِقَ غُلْبًا ٣٠

మరియు దట్టమైన తోటలను;

80:31 – وَفَاكِهَةً وَأَبًّا ٣١

మరియు (రకరకాల) పండ్లను మరియు పచ్చికలను;

80:32 – مَّتَاعًا لَّكُمْ وَلِأَنْعَامِكُمْ ٣٢

మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా.

80:33 – فَإِذَا جَاءَتِ الصَّاخَّةُ ٣٣

ఎప్పుడైతే, చెవులను చెవిటిగా చేసే ఆ గొప్ప ధ్వని వస్తుందో!

80:34 – يَوْمَ يَفِرُّ الْمَرْءُ مِنْ أَخِيهِ ٣٤

ఆ రోజు, మానవుడు తన సోదరుని నుండి దూరంగా పారిపోతాడు;

80:35 – وَأُمِّهِ وَأَبِيهِ ٣٥

మరియు తన తల్లి నుండి మరియు తండ్రి నుండి;

80:36 – وَصَاحِبَتِهِ وَبَنِيهِ ٣٦

మరియు తన భార్య (సాహిబతి) నుండి మరియు తన సంతానం నుండి.

80:37 – لِكُلِّ امْرِئٍ مِّنْهُمْ يَوْمَئِذٍ شَأْنٌ يُغْنِيهِ ٣٧

ఆ రోజు, వారిలో ప్రతి మానవునికి తనను గురించి మాత్రమే చాలినంత చింత ఉంటుంది. 6

80:38 – وُجُوهٌ يَوْمَئِذٍ مُّسْفِرَةٌ ٣٨

ఆ రోజు కొన్ని ముఖాలు ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటాయి;

80:39 – ضَاحِكَةٌ مُّسْتَبْشِرَةٌ ٣٩

అవి చిరునవ్వులతో ఆనందోత్సాహాలతో కళకళ లాడుతుంటాయి.

80:40 – وَوُجُوهٌ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌ ٤٠

మరికొన్ని ముఖాలు ఆ రోజు దుమ్ము కొట్టుకొని (ఎంతో వ్యాకులంతో) నిండి ఉంటాయి.

80:41 – تَرْهَقُهَا قَتَرَةٌ ٤١

అవి నల్లగా మాడిపోయి ఉంటాయి;

80:42 – أُولَـٰئِكَ هُمُ الْكَفَرَةُ الْفَجَرَةُ ٤٢

అలాంటి వారు, వారే! సత్య-తిరస్కారులైన దుష్టులు.

సూరహ్‌ అత్‌-తక్వీర్‌ – అత్‌-తక్వీర్‌: Shrouding in Darkness (అంధకారంలో) చుట్టివేయబడటం, మూయబడటం, కాంతిని కోల్పోవటం. ఇది మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌. బహుశా అవతరణలో 7వది. ఇది అంతిమ ఘడియను సూచిస్తోంది. 8-9 ఆయత్‌లలో అజ్ఞానకాలపు ముష్రిక్‌ అరబ్బులు తమ ఆడ శిశువులను పుట్టిన వెంటనే సజీవంగా మట్టిలో పూడ్చివేసే దారుణమైన సామాజిక దురాచారం పేర్కొన బడింది. ఈ సూరహ్‌లో పునరుత్థానదినపు దృశ్యం చూపబడింది. అందుకే దైవప్రవక్త (‘స’అస) అన్నారు: “ఎవనికైతే పునరుత్థానదినపు దృశ్యాన్నిచూడాలని ఉందో అతడు దీనిని – సూరహ్‌ అత్‌-తక్వీర్ (81), సూరహ్‌ అల్‌-ఇన్ఫితార్‌ (82) మరియు సూరహ్‌ అల్‌ – ఇన్షిఖాఖ్‌ (84)లు ధ్యానంతో చదవాలి.” (తిర్మీజీ’, ముస్నద్‌ అ’హ్మద్‌; అల్బానీ ప్రమాణీకం). 29 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 81:1 – إِذَا الشَّمْسُ كُوِّرَتْ ١

సూర్యుడు (అంధకారంలో) చుట్టివేయబడి, కాంతిహీను- డైనప్పుడు! 1

81:2 – وَإِذَا النُّجُومُ انكَدَرَتْ ٢

మరియు నక్షత్రాలు (కాంతిని కోల్పోయి) రాలి పోవునప్పుడు!

81:3 – وَإِذَا الْجِبَالُ سُيِّرَتْ ٣

మరియు పర్వతాలు కదిలించబడి నప్పుడు! 2

81:4 – وَإِذَا الْعِشَارُ عُطِّلَتْ ٤

మరియు నిండు సూడి ఒంటెలు, నిరపేక్షంగా వదిలి వేయబడినప్పుడు!

81:5 – وَإِذَا الْوُحُوشُ حُشِرَتْ ٥

మరియు క్రూర మృగాలన్నీ ఒకచోట సమకూర్చబడినప్పుడు! 3

81:6 – وَإِذَا الْبِحَارُ سُجِّرَتْ ٦

మరియు సముద్రాలు ఉప్పొంగి పోయినప్పుడు! 4

81:7 – وَإِذَا النُّفُوسُ زُوِّجَتْ ٧

మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు! 5

81:8 – وَإِذَا الْمَوْءُودَةُ سُئِلَتْ ٨

మరియు సజీవంగా పాతిపెట్టడిన బాలిక ప్రశ్నించ బడినప్పుడు:

81:9 – بِأَيِّ ذَنبٍ قُتِلَتْ ٩

ఏ అపరాధానికి తాను హత్యచేయ బడిందని?

81:10 – وَإِذَا الصُّحُفُ نُشِرَتْ ١٠

మరియు కర్మపత్రాలు తెరువబడి నప్పుడు! 6

81:11 – وَإِذَا السَّمَاءُ كُشِطَتْ ١١

మరియు ఆకాశం ఒలిచివేయబడి నప్పుడు!

81:12 – وَإِذَا الْجَحِيمُ سُعِّرَتْ ١٢

మరియు నరకాగ్ని మండించబడి నప్పుడు!

81:13 – وَإِذَا الْجَنَّةُ أُزْلِفَتْ ١٣

మరియు స్వర్గం దగ్గరకు తీసుకురాబడి నప్పుడు!

81:14 – عَلِمَتْ نَفْسٌ مَّا أَحْضَرَتْ ١٤

ప్రతి ఆత్మ తాను చేసి తెచ్చిన కర్మలను తెలుసు కుంటుంది.

81:15 – فَلَا أُقْسِمُ بِالْخُنَّسِ ١٥

అలా కాదు! నేను తొలగిపోయే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను;

81:16 – الْجَوَارِ الْكُنَّسِ ١٦

(ఏవైతే) వేగంగా తిరుగుతూ కనుమరుగవు తున్నాయో! 7

81:17 – وَاللَّيْلِ إِذَا عَسْعَسَ ١٧

మరియు గడచిపోయే రాత్రి సాక్షిగా!

81:18 – وَالصُّبْحِ إِذَا تَنَفَّسَ ١٨

మరియు ప్రకాశించే ఉదయం సాక్షిగా!

81:19 – إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ ١٩

నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్‌ఆన్‌) గౌరవ నీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు! 8

81:20 – ذِي قُوَّةٍ عِندَ ذِي الْعَرْشِ مَكِينٍ ٢٠

అతను (జిబ్రీల్‌) మహా బలశాలి, సింహాసన (‘అర్ష్‌) 9 అధిపతి సన్నిధిలో ఉన్నతస్థానం గల వాడు!

81:21 – مُّطَاعٍ ثَمَّ أَمِينٍ ٢١

అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు!

81:22 – وَمَا صَاحِبُكُم بِمَجْنُونٍ ٢٢

మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు! 10

81:23 – وَلَقَدْ رَآهُ بِالْأُفُقِ الْمُبِينِ ٢٣

మరియు వాస్తవంగా, అతను ఆ సందేశహరుణ్ణి (జిబ్రీల్‌ను) ప్రకాశవంతమైన దిఙ్మండలంలో చూశాడు. 11

81:24 – وَمَا هُوَ عَلَى الْغَيْبِ بِضَنِينٍ ٢٤

మరియు అతను (ము’హమ్మద్‌) అగోచర జ్ఞానాన్ని ప్రజల నుండి దాచేవాడు కాడు.

81:25 – وَمَا هُوَ بِقَوْلِ شَيْطَانٍ رَّجِيمٍ ٢٥

మరియు ఇది (ఈ ఖుర్‌ఆన్‌) శపించబడిన (బహిష్కరించబడిన) షై’తాన్‌ వాక్కు కాదు.

81:26 – فَأَيْنَ تَذْهَبُونَ ٢٦

మరి మీరు ఎటు పోతున్నారు?

81:27 – إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ ٢٧

ఇది (ఈ ఖుర్‌ఆన్‌) సర్వలోకాలకు ఒక హితోపదేశం.

81:28 – لِمَن شَاءَ مِنكُمْ أَن يَسْتَقِيمَ ٢٨

మీలో, ఋజుమార్గంలో నడవదలచుకున్న ప్రతివాని కొరకు.

81:29 – وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّـهُ رَبُّ الْعَالَمِينَ ٢٩

మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు. 12 (1/4)

సూరహ్‌ అల్‌-ఇన్‌ఫి’తార్‌ – అల్‌-ఇన్‌ఫి’తార్‌: The Cleaving, చీలిపోవుట, బీటలువారుట, బ్రద్దలగుట, పెళ్ళుమనుట, ప్రేలుట, పగులుట. కొందరు దీనిని మొదటి మక్కహ్ కాలపు, మరి కొందరు చివరి మక్కహ్ కాలపు సూరహ్‌ అని అంటారు. 19ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌లో ఉంది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 82:1 – إِذَا السَّمَاءُ انفَطَرَتْ ١

  • ఆకాశం చీల్చబడినప్పుడు! 1

82:2 – وَإِذَا الْكَوَاكِبُ انتَثَرَتْ ٢

మరియు నక్షత్రాలు చెదిరిపోయినప్పుడు!

82:3 – وَإِذَا الْبِحَارُ فُجِّرَتْ ٣

మరియు సముద్రాలు పొంగి పొరలిపోయి నప్పుడు!

82:4 – وَإِذَا الْقُبُورُ بُعْثِرَتْ ٤

మరియు సమాధులు పెళ్ళగింప (తెరువ) బడినప్పుడు!

82:5 – عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ ٥

ప్రతి వ్యక్తికి తాను చేసి పంపుకున్నది మరియు వెనుక వదలిపెట్టింది అంతా తెలిసి పోతుంది.

82:6 – يَا أَيُّهَا الْإِنسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ ٦

ఓ మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువును గురించి, ఏ విషయం నిన్ను ఏమరు పాటుకు గురిచేసింది?

82:7 – الَّذِي خَلَقَكَ فَسَوَّاكَ فَعَدَلَكَ ٧

ఆయనే నిన్ను సృష్టించాడు, తరువాత ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు మరియు నిన్ను తగిన ప్రమాణంలో రూపొందించాడు.

82:8 – فِي أَيِّ صُورَةٍ مَّا شَاءَ رَكَّبَكَ ٨

తాను తలచిన ఆకారంలో నిన్ను మలిచాడు.

82:9 – كَلَّا بَلْ تُكَذِّبُونَ بِالدِّينِ ٩

అలా కాదు! వాస్తవానికి మీరు (పరలోక) తీర్పును అబద్ధమని తిరస్కరిస్తున్నారు!

82:10 – وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ ١٠

మరియు నిశ్చయంగా! మిమ్మల్ని కనిపెట్టు కొని ఉండేవారు (దేవదూతలు) ఉన్నారు. 2

82:11 – كِرَامًا كَاتِبِينَ ١١

వారు, గౌరవనీయులైన లేఖకులు;

82:12 – يَعْلَمُونَ مَا تَفْعَلُونَ ١٢

మీరు చేసేదంతా తెలుసుకునేవారు!

82:13 – إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ ١٣

నిశ్చయంగా పుణ్యాత్ములు 3 సుఖ- సంతో షాలలో తేలియాడుతూ ఉంటారు.

82:14 – وَإِنَّ الْفُجَّارَ لَفِي جَحِيمٍ ١٤

మరియు నిశ్చయంగా, దుష్టులు భగభగ మండే నరకాగ్నిలో ఉంటారు. 4

82:15 – يَصْلَوْنَهَا يَوْمَ الدِّينِ ١٥

తీర్పు దినమున వారు అందులో ప్రవేశిస్తారు.

82:16 – وَمَا هُمْ عَنْهَا بِغَائِبِينَ ١٦

మరియు వారు దాని నుండి ఎంత మాత్రం తప్పించుకోలేరు.

82:17 – وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ ١٧

మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది?

82:18 – ثُمَّ مَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ ١٨

అవును మరి! ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది?

82:19 – يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِّنَفْسٍ شَيْئًا ۖ وَالْأَمْرُ يَوْمَئِذٍ لِّلَّـهِ ١٩

ఆ దినమున ఏ మానవునికి కూడా ఇతరునికి ఎలాంటి సహాయం చేసే అధికారం ఉండదు. మరియు ఆ రోజు నిర్ణయాధికారం కేవలం అల్లాహ్‌కే ఉంటుంది. 5

సూరహ్‌ అల్‌-ము’తఫ్ఫిఫీన్‌

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 83:1 – وَيْلٌ لِّلْمُطَفِّفِينَ ١

కొలతలలో, తూనికలలో తగ్గించి ఇచ్చే వారికి వినాశముంది.

83:2 – الَّذِينَ إِذَا اكْتَالُوا عَلَى النَّاسِ يَسْتَوْفُونَ ٢

వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు.

83:3 – وَإِذَا كَالُوهُمْ أَو وَّزَنُوهُمْ يُخْسِرُونَ ٣

మరియు తాము ప్రజలకు కొలిచి గానీ లేక తూచిగానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు. 1

83:4 – أَلَا يَظُنُّ أُولَـٰئِكَ أَنَّهُم مَّبْعُوثُونَ ٤

ఏమీ? ఇలాంటి వారు తిరిగి బ్రతికించి లేపబడరని భావిస్తున్నారా?

83:5 – لِيَوْمٍ عَظِيمٍ ٥

ఒక గొప్ప దినమున!

83:6 – يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ ٦

సర్వ లోకాల ప్రభువు సమక్షంలో ప్రజలు అందరూ నిలబడే రోజు. 2

83:7 – كَلَّا إِنَّ كِتَابَ الْفُجَّارِ لَفِي سِجِّينٍ ٧

అలాకాదు!నిశ్చయంగా దుష్టుల కర్మపత్రం సిజ్జీనులో ఉంది.

83:8 – وَمَا أَدْرَاكَ مَا سِجِّينٌ ٨

ఆ సిజ్జీన్‌ అంటే నీవు ఏమనుకుంటున్నావు?

83:9 – كِتَابٌ مَّرْقُومٌ ٩

వ్రాసిపెట్టబడిన (చెరగని) గ్రంథం. 3

83:10 – وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ١٠

సత్యాన్ని తిరస్కరించే వారికి ఆ రోజు వినాశముంది.

83:11 – الَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ الدِّينِ ١١

వారికే! ఎవరైతే తీర్పుదినాన్ని తిరస్కరిస్తారో!

83:12 – وَمَا يُكَذِّبُ بِهِ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ ١٢

మరియు మితిమీరి ప్రవర్తించే పాపిష్ఠుడు తప్ప, మరెవ్వడూ దానిని (తీర్పుదినాన్ని) తిరస్కరించడు.

83:13 – إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ ١٣

మా సూచనలు (ఆయాత్‌) అతడికి వినిపించ బడినప్పుడు అతడు: “ఇవి పూర్వకాలపు కట్టు కథలే!” అని అంటాడు.

83:14 – كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا يَكْسِبُونَ ١٤

అలాకాదు! వాస్తవానికి వారి హృదయా లకు వారి (దుష్ట) కార్యాల త్రుప్పు పట్టింది. 4

83:15 – كَلَّا إِنَّهُمْ عَن رَّبِّهِمْ يَوْمَئِذٍ لَّمَحْجُوبُونَ ١٥

అంతేకాదు, ఆ రోజు నిశ్చయంగా, వారు తమ ప్రభువు కారుణ్యం నుండి నిరోధింపబడతారు.

83:16 – ثُمَّ إِنَّهُمْ لَصَالُو الْجَحِيمِ ١٦

తరువాత వారు నిశ్చయంగా, భగభగ మండే నరకాగ్నిలోకి పోతారు.

83:17 – ثُمَّ يُقَالُ هَـٰذَا الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ ١٧

అప్పుడు వారితో: “దేనినైతే మీరు అసత్యమని తిరస్కరిస్తూ వచ్చారో, అది ఇదే!” అని చెప్పబడుతుంది.

83:18 – كَلَّا إِنَّ كِتَابَ الْأَبْرَارِ لَفِي عِلِّيِّينَ ١٨

అలాకాదు! నిశ్చయంగా, ధర్మనిష్ఠాపరుల (పుణ్యాత్ముల) కర్మపత్రం మహోన్నత గ్రంథం (‘ఇల్లియ్యీన్)లో ఉంది. 5

83:19 – وَمَا أَدْرَاكَ مَا عِلِّيُّونَ ١٩

మరి ఆ ‘ఇల్లియ్యూన్‌ అంటే నీవు ఏమను కుంటున్నావు?

83:20 – كِتَابٌ مَّرْقُومٌ ٢٠

అది వ్రాసిపెట్టబడిన ఒక గ్రంథం.

83:21 – يَشْهَدُهُ الْمُقَرَّبُونَ ٢١

దానికి, (అల్లాహ్‌కు) సన్నిహితులైన వారు (దేవదూతలు) సాక్ష్యంగా ఉంటారు. 6

83:22 – إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ ٢٢

నిశ్చయంగా, పుణ్యాత్ములు సుఖ- సంతోషాలలో ఉంటారు.

83:23 – عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ ٢٣

ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గ దృశ్యాలను) తిలకిస్తూ. 7

83:24 – تَعْرِفُ فِي وُجُوهِهِمْ نَضْرَةَ النَّعِيمِ ٢٤

వారి ముఖాలు సుఖ-సంతోషాలతో కళకళ లాడుతూ ఉండటం, నీవు చూస్తావు.

83:25 – يُسْقَوْنَ مِن رَّحِيقٍ مَّخْتُومٍ ٢٥

సీలు చేయబడిన నాణ్యమైన మధువు వారికి త్రాగటానికి ఇవ్వబడుతుంది. 8

83:26 – خِتَامُهُ مِسْكٌ ۚ وَفِي ذَٰلِكَ فَلْيَتَنَافَسِ الْمُتَنَافِسُونَ ٢٦

దాని చివరి చుక్కలోనూ కస్తూరి సువాసన ఉంటుంది. కాబట్టి దానిని పొందటానికి అపేక్షించే వారంతా ప్రయాసపడాలి.

83:27 – وَمِزَاجُهُ مِن تَسْنِيمٍ ٢٧

మరియు దానిలో (ఆ మధువులో) తస్నీమ్‌ కలుపబడి ఉంటుంది. 9

83:28 – عَيْنًا يَشْرَبُ بِهَا الْمُقَرَّبُونَ ٢٨

అదొక చెలమ, (అల్లాహ్‌) సాన్నిధ్యం పొందినవారే దాని నుండి త్రాగుతారు. 10

83:29 – إِنَّ الَّذِينَ أَجْرَمُوا كَانُوا مِنَ الَّذِينَ آمَنُوا يَضْحَكُونَ ٢٩

వాస్తవానికి (ప్రపంచంలో) అపరాధులు విశ్వసించిన వారిని హేళన చేసేవారు.

83:30 – وَإِذَا مَرُّوا بِهِمْ يَتَغَامَزُونَ ٣٠

మరియు వీరు (విశ్వాసులు), వారి (అవిశ్వాసుల) యెదుట నుండి పోయినప్పుడు, వారు (అవిశ్వాసులు) పరస్పరం కనుసైగలు చేసుకునేవారు.

83:31 – وَإِذَا انقَلَبُوا إِلَىٰ أَهْلِهِمُ انقَلَبُوا فَكِهِينَ ٣١

మరియు (అవిశ్వాసులు) తమ ఇంటివారి దగ్గరికి పోయినప్పుడు (విశ్వాసులను గురించి) పరిహసిస్తూ మరలేవారు.

83:32 – وَإِذَا رَأَوْهُمْ قَالُوا إِنَّ هَـٰؤُلَاءِ لَضَالُّونَ ٣٢

మరియు (విశ్వాసులను) చూసినపుడల్లా: “నిశ్చయంగా, వీరు దారితప్పిన వారు!” అని అనేవారు.

83:33 – وَمَا أُرْسِلُوا عَلَيْهِمْ حَافِظِينَ ٣٣

మరియు వారు (అవిశ్వాసులు) వీరి (విశ్వాసుల) మీద కాపలా దారులుగా పంపబడలేదు!

83:34 – فَالْيَوْمَ الَّذِينَ آمَنُوا مِنَ الْكُفَّارِ يَضْحَكُونَ ٣٤

కాని ఈ రోజు (పురుత్థాన దినంనాడు) విశ్వసించిన వారు, సత్య-తిరస్కారులను చూసి నవ్వుతారు.

83:35 – عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ ٣٥

ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గ దృశ్యాలను) తిలకిస్తూ (ఇలా అంటారు):

83:36 – هَلْ ثُوِّبَ الْكُفَّارُ مَا كَانُوا يَفْعَلُونَ ٣٦

“ఇక! ఈ సత్య-తిరస్కారులకు, వారి చేష్టలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా దొరుకునా?” (3/8)

సూరహ్‌ అల్‌-ఇన్‌షిఖాఖ్‌ – అల్‌-ఇన్‌షిఖాఖ్‌: The Splitting asunder, బ్రద్దలవటం, ప్రేలిపోవటం, పగిలిపోవటం,ఖండన. ఇది సూరహ్‌ అల్‌-ఇన్‌ఫి’తార్‌ (82) తరువాత అవతరింపజేయబడింది. చివరి మక్కహ్ సూరాహ్‌. 25 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 84:1 – إِذَا السَّمَاءُ انشَقَّتْ ١

  • ఆకాశం బ్రద్దలయి పోయినప్పుడు! 1

84:2 – وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ ٢

మరియు అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం. 2

84:3 – وَإِذَا الْأَرْضُ مُدَّتْ ٣

మరియు భూమి విస్తరింపజేయబడి (చదునుగా చేయబడి) నప్పుడు;

84:4 – وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ ٤

మరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు;

84:5 – وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ ٥

అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్తధర్మం.

84:6 – يَا أَيُّهَا الْإِنسَانُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَاقِيهِ ٦

ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చితమరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు.

84:7 – فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ ٧

అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడిన వాడి నుండి; 3

84:8 – فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا ٨

అతని లెక్క అతి తేలికగా తీసుకోబడగలదు.

84:9 – وَيَنقَلِبُ إِلَىٰ أَهْلِهِ مَسْرُورًا ٩

మరియు అతడు సంతోషంగా తనవారి దగ్గరకు మరలిపోతాడు!

84:10 – وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ وَرَاءَ ظَهْرِهِ ١٠

ఇక తన కర్మపత్రం వీపు వెనుక నుండి ఇవ్వబడిన వాడు; 4

84:11 – فَسَوْفَ يَدْعُو ثُبُورًا ١١

అప్పుడతడు తన నాశనాన్నే కోరుకుంటాడు;

84:12 – وَيَصْلَىٰ سَعِيرًا ١٢

మరియు అతడు మండుతున్న నరకాగ్నిలో పడిపోతాడు.

84:13 – إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا ١٣

వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు. 5

84:14 – إِنَّهُ ظَنَّ أَن لَّن يَحُورَ ١٤

వాస్తవానికి, అతడు (మా వైపుకు) మరలి రాడని భావించేవాడు.

84:15 – بَلَىٰ إِنَّ رَبَّهُ كَانَ بِهِ بَصِيرًا ١٥

అలాకాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు.

84:16 – فَلَا أُقْسِمُ بِالشَّفَقِ ١٦

కనుక, నేను సంధ్యకాలపు ఎరుపు సాక్షిగా చెబుతున్నాను! 6

84:17 – وَاللَّيْلِ وَمَا وَسَقَ ١٧

రాత్రి సాక్షిగా, అది ప్రోగుచేసే వాటి సాక్షిగా!

84:18 – وَالْقَمَرِ إِذَا اتَّسَقَ ١٨

పూర్ణ చంద్రుని సాక్షిగా! 7

84:19 – لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍ ١٩

మీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది. 8

84:20 – فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ ٢٠

అయితే వీరి కేమయింది? వీరు ఎందుకు విశ్వసించరు?

84:21 – وَإِذَا قُرِئَ عَلَيْهِمُ الْقُرْآنُ لَا يَسْجُدُونَ ۩ ٢١

మరియు ఖుర్‌ఆన్‌ వీరి ముందు పఠింప బడినప్పుడు వీరెందుకు సాష్టాంగం (సజ్దా) చేయరు? 9 (సజ్దా)

84:22 – بَلِ الَّذِينَ كَفَرُوا يُكَذِّبُونَ ٢٢

అలా కాదు! ఈ సత్యతిరస్కారులు దీనిని అసత్యమంటున్నారు.

84:23 – وَاللَّـهُ أَعْلَمُ بِمَا يُوعُونَ ٢٣

మరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.

84:24 – فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ ٢٤

కాబట్టి వారికి (పరలోకంలో) లభించే వ్యధాభరితమైన శిక్ష యొక్క వార్తనివ్వు –

84:25 – إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ ٢٥

విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి తప్ప – వారికి ఎన్నటికీ అంతంగాని ప్రతిఫలం ఉంటుంది.

సూరహ్‌ అల్‌-బురూజ్‌ – అల్‌-బురూజ్‌: తారాగణం, బురుజులు, The Big Stars, The Great Constillations, నక్షత్ర రాశులు, నక్షత్రసముదాయం. ఇది సూరహ్‌ అష్‌-షమ్స్‌ (91) తరువాత అవతరింపజేయ బడిన మక్కహ్ సూరహ్‌. దైవప్రవక్త (‘స’అస) “జుహ్ర్‌ మరియు ‘అస్ర్‌ నమాజులలో సూరహ్‌ అల్‌- బురూజ్‌ (85) మరియు సూరహ్‌ అత్‌-‘తారిఖ్‌ (86) చదివేవారు. (తిర్మీజీ’). 4-7వ ఆయత్‌లలో, ప్రాచీన కాలంలో స’ఊదీ ‘అరేబియాలో ఉన్న, నజ్‌రాన్‌ యొక్క సత్య-తిరస్కారులు విశ్వాసులను అగ్ని కందకంలో త్రోసి చంపిన దారుణ సంఘటన పేర్కొనబడింది. ఈ విధమైన దౌర్జన్యాలు ఇతర చోట్లలో కూడా జరిగినట్లు పేర్కొనబడ్డాయి. వివరాలకు చూడండి, ఇబ్నె-కసీ’ర్‌. 22 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 85:1 – وَالسَّمَاءِ ذَاتِ الْبُرُوجِ ١

విస్తారమైన తారాగణం గల ఆకాశం సాక్షిగా! 1

85:2 – وَالْيَوْمِ الْمَوْعُودِ ٢

వాగ్దానం చేయబడిన (పునరుత్థాన) దినం సాక్షిగా!

85:3 – وَشَاهِدٍ وَمَشْهُودٍ ٣

చూచే (దినం) మరియు చూడబడే (దినం) సాక్షిగా! 2

85:4 – قُتِلَ أَصْحَابُ الْأُخْدُودِ ٤

అగ్ని కందకం (ఉ’ఖ్దూద్‌) వారు నాశనం చేయబడ్డారు. 3

85:5 – النَّارِ ذَاتِ الْوَقُودِ ٥

ఇంధనంతో తీవ్రంగా మండే అగ్నిని రాజేసే వారు.

85:6 – إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌ ٦

వారు దాని (ఆ కందకం) అంచుపై కూర్చొని ఉన్నప్పుడు; 4

85:7 – وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِالْمُؤْمِنِينَ شُهُودٌ ٧

మరియు తాము విశ్వాసుల పట్ల చేసే ఘోర కార్యాలను (సజీవ దహనాలను) తిలకించేవారు.

85:8 – وَمَا نَقَمُوا مِنْهُمْ إِلَّا أَن يُؤْمِنُوا بِاللَّـهِ الْعَزِيزِ الْحَمِيدِ ٨

మరియు వారు విశ్వాసుల పట్ల కసి పెంచుకోవడానికి కారణం – వారు (విశ్వాసులు) సర్వ శక్తిమంతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడైన – అల్లాహ్‌ను విశ్వసించడం మాత్రమే!

85:9 – الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ ٩

అయనే! ఎవరికైతే భూమ్యాకాశాల ఆధిపత్యం ఉందో! మరియు అల్లాహ్‌యే ప్రతి దానికి సాక్షి.

85:10 – إِنَّ الَّذِينَ فَتَنُوا الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ثُمَّ لَمْ يَتُوبُوا فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ الْحَرِيقِ ١٠

ఎవరైతే విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను హింసిస్తారో, ఆ తరువాత పశ్చాత్తాపంతో క్షమాపణకోరరో! నిశ్చయంగా, అలాంటి వారికి నరకశిక్ష ఉంటుంది. మరియు వారికి మండే నరకాగ్ని శిక్ష విధించబడుతుంది.

85:11 – إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْكَبِيرُ ١١

నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసే వారి కొరకు, క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనా లుంటాయి. 5 అదే గొప్ప విజయం.

85:12 – إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ ١٢

నిశ్చయంగా, నీ ప్రభువు యొక్క పట్టు (శిక్ష) చాలా కఠినమైనది. 6

85:13 – إِنَّهُ هُوَ يُبْدِئُ وَيُعِيدُ ١٣

నిశ్చయంగా, ఆయనే (సృష్టిని) ఆరంభించే వాడు మరియు ఆయనే (దానిని) మరల ఉనికిలోకి తెచ్చే వాడు.

85:14 – وَهُوَ الْغَفُورُ الْوَدُودُ ١٤

మరియు ఆయన క్షమాశీలుడు, అమిత వాత్సల్యుడు.

85:15 – ذُو الْعَرْشِ الْمَجِيدُ ١٥

సింహాసనాన్ని (‘అర్ష్‌ను) అధిష్టించిన వాడు, 7 మహత్త్వపూర్ణుడు. 8

85:16 – فَعَّالٌ لِّمَا يُرِيدُ ١٦

తాను తలచింది చేయగలవాడు.

85:17 – هَلْ أَتَاكَ حَدِيثُ الْجُنُودِ ١٧

ఏమీ? సైన్యాల వారి సమాచారం నీకు అందిందా?

85:18 – فِرْعَوْنَ وَثَمُودَ ١٨

ఫిర్‌’ఔన్‌ మరియు స’మూద్‌ వారి (సైన్యాల).

85:19 – بَلِ الَّذِينَ كَفَرُوا فِي تَكْذِيبٍ ١٩

అలాకాదు, సత్యతిరస్కారులు (సత్యాన్ని) తిరస్కరించుటలో నిమగ్నులై ఉన్నారు.

85:20 – وَاللَّـهُ مِن وَرَائِهِم مُّحِيطٌ ٢٠

మరియు అల్లాహ్‌ వారిని, వెనుక (ప్రతి దిక్కు) నుండి చుట్టుముట్టి ఉన్నాడు.

85:21 – بَلْ هُوَ قُرْآنٌ مَّجِيدٌ ٢١

వాస్తవానికి, ఇది ఒక దివ్యమైన 9 ఖుర్‌ఆన్‌;

85:22 – فِي لَوْحٍ مَّحْفُوظٍ ٢٢

సురక్షితమైన ఫలకం (లౌ’హె మ’హ్‌ ఫూ”జ్‌)లో 10 (వ్రాయబడి) ఉన్నది.

సూరహ్‌ అ’త్‌-‘తారిఖ్‌ – అ’త్‌-‘తారిఖ్‌: The Night-Comer, రాత్రివేళ వచ్చేది, కాంతివంతమైన నక్షత్రం. ఇది ఆరంభ మక్కహ్ కాలంలో అవతరింపజేయబడింది. బహుశా 4వ సంవత్సరంలో. 17 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 86:1 – وَالسَّمَاءِ وَالطَّارِقِ ١

ఆకాశం మరియు రాత్రివేళవచ్చే నక్షత్రం (అ’త్‌-‘తారిఖ్‌) సాక్షిగా!

86:2 – وَمَا أَدْرَاكَ مَا الطَّارِقُ ٢

రాత్రివేళ వచ్చేది (అ’త్‌-‘తారిఖ్‌) అంటే ఏమిటో నీకు ఎలా తెలుస్తుంది?

86:3 – النَّجْمُ الثَّاقِبُ ٣

అదొక అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం.

86:4 – إِن كُلُّ نَفْسٍ لَّمَّا عَلَيْهَا حَافِظٌ ٤

కనిపెట్టుకొని ఉండేవాడు (దేవదూత) లేకుండా ఏ వ్యక్తి కూడా లేడు. 1

86:5 – فَلْيَنظُرِ الْإِنسَانُ مِمَّ خُلِقَ ٥

కావున మానవుడు తాను దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి!

86:6 – خُلِقَ مِن مَّاءٍ دَافِقٍ ٦

అతడు విసర్జించబడే (చిమ్ముకుంటూ వెలువడే) ద్రవపదార్థంతో సృష్టించబడ్డాడు.

86:7 – يَخْرُجُ مِن بَيْنِ الصُّلْبِ وَالتَّرَائِبِ ٧

అది వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్య భాగం నుండి బయటికి వస్తుంది.

86:8 – إِنَّهُ عَلَىٰ رَجْعِهِ لَقَادِرٌ ٨

నిశ్చయంగా, ఆయన (సృష్టికర్త), అతనిని మరల బ్రతికించి తేగల సామర్థ్యం గలవాడు!

86:9 – يَوْمَ تُبْلَى السَّرَائِرُ ٩

ఏ రోజయితే రహస్య విషయాల విచారణ జరుగుతుందో!

86:10 – فَمَا لَهُ مِن قُوَّةٍ وَلَا نَاصِرٍ ١٠

అప్పుడు అతనికి (మానవునికి) ఎలాంటి శక్తి ఉండదు మరియు ఏ సహాయకుడునూ ఉండడు. 2

86:11 – وَالسَّمَاءِ ذَاتِ الرَّجْعِ ١١

వర్షం కురిపించే ఆకాశం సాక్షిగా! 3

86:12 – وَالْأَرْضِ ذَاتِ الصَّدْعِ ١٢

(చెట్లు మొలకెత్తేటప్పుడు) చీలిపోయే భూమి సాక్షిగా!

86:13 – إِنَّهُ لَقَوْلٌ فَصْلٌ ١٣

నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్‌ఆన్‌, సత్యా- సత్యాలను) వేరుపరచే వాక్కు (గీటురాయి).

86:14 – وَمَا هُوَ بِالْهَزْلِ ١٤

మరియు ఇది వృథా కాలక్షేపానికి వచ్చినది కాదు.

86:15 – إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًا ١٥

(ఓ ము’హమ్మద్‌!) నిశ్చయంగా, వారు (నీకు విరుద్ధంగా) కుట్రలు పన్నుతున్నారు. 4

86:16 – وَأَكِيدُ كَيْدًا ١٦

మరియు నేను కూడ పన్నాగం పన్నుతున్నాను.

86:17 – فَمَهِّلِ الْكَافِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًا ١٧

కనుక నీవు సత్య-తిరస్కారులకు కొంత వ్యవధినివ్వు! 5 వారి పట్ల మృదువుగా వ్యవహరించు.(1/2)

సూరహ్‌ అల్‌-అ’అలా – అల్‌-అ’అలా: The Most High, అత్యున్నతుడు. ప్రారంభ మక్కహ్ కాలపు, ఇది బహుశా అవతరణాక్రమంలో 8వది, సూరహ్‌ అత్‌-తక్వీర్‌ (81) తరువాత అవతరింపజేయబడింది. దైవప్రవక్త (‘స’అస) పండుగ (‘ఈద్‌)ల నమా’జ్‌లలో మరియు జుము’అహ్‌ నమా’జ్‌లలో ఈ సూరహ్‌ (87)ను మరియు సూరహ్‌ అల్‌-‘గాషియహ్‌ (88)ను పఠించేవారు. వి’త్ర్‌ నమా’జ్‌ మొదటి రకాత్‌లో ఈ సూరహ్‌ అల్‌-అ’అలా (87)ను, 2వ రకాత్‌లో సూరహ్‌ అల్‌-కాఫిరూన్‌ (109)ను మరియు 3వ రకాత్‌లో సూరహ్‌ అల్‌-ఇ’ఖ్లా’స్‌ (112)ను పఠించేవారు 19 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 87:1 – سَبِّحِ اسْمَ رَبِّكَ الْأَعْلَى ١

  • అత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు!

87:2 – الَّذِي خَلَقَ فَسَوَّىٰ ٢

ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు. 1

87:3 – وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ ٣

మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు, 2 మరియు మార్గం చూపాడు!

87:4 – وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ ٤

మరియు ఆయనే పచ్చికను మొలిపింప- జేశాడు!

87:5 – فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ ٥

మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు. 3

87:6 – سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ ٦

మేము నీచేత (ఖుర్‌ఆన్‌ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు –

87:7 – إِلَّا مَا شَاءَ اللَّـهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ ٧

అల్లాహ్‌ కోరింది తప్ప! 4 నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు.

87:8 – وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ ٨

మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము. 5

87:9 – فَذَكِّرْ إِن نَّفَعَتِ الذِّكْرَىٰ ٩

కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు! 6

87:10 – سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ ١٠

(అల్లాహ్‌కు) భయపడే వాడు హితోప- దేశాన్ని స్వీకరిస్తాడు.

87:11 – وَيَتَجَنَّبُهَا الْأَشْقَى ١١

మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు;

87:12 – الَّذِي يَصْلَى النَّارَ الْكُبْرَىٰ ١٢

అలాంటి వాడే ఘోరమైన నరకాగ్నిలో పడి కాలుతాడు.

87:13 – ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَ ١٣

అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు. 7

87:14 – قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ ١٤

సుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు;

87:15 – وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ ١٥

మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమా’జ్‌ చేస్తూ ఉండేవాడు.

87:16 – بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا ١٦

అలాకాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు;

87:17 – وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ ١٧

కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది.

87:18 – إِنَّ هَـٰذَا لَفِي الصُّحُفِ الْأُولَىٰ ١٨

నిశ్చయంగా, ఈ విషయం పూర్వ గ్రంథాలలో (వ్రాయబడి) ఉంది;

87:19 – صُحُفِ إِبْرَاهِيمَ وَمُوسَىٰ ١٩

ఇబ్రాహీమ్‌ మరియు మూసాలపై (అవతరింపజేయబడిన) గ్రంథాలలో.

సూరహ్‌ అల్‌-‘గాషియహ్‌ – అల్‌-‘గాషియహ్: The Overwhelming, హఠాత్తుగా ఆసన్మయ్యేది. క్రమ్ముకొనేది, పునరుత్థానదినం. దాని విపత్తు సర్వసృష్టిని క్రమ్ముకొంటుంది. ఇది ఆరంభ మక్కహ్ కాలపు సూరహ్‌. దైవప్రవక్త (‘స’అస) జుము’అహ్‌ నమాజులలో సూరహ్‌ అల్‌-జుము’అహ్‌ (62) తరువాత దీనిని (88) పఠించేవారు (మువ’త్తా’ ఇమామ్‌ మాలిక్‌). 26 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 88:1 – هَلْ أَتَاكَ حَدِيثُ الْغَاشِيَةِ ١

హఠాత్తుగా ఆసన్నమయ్యే ఆ విపత్తు (పునరు త్థానదినపు) సమాచారం నీకు అందిందా?

88:2 – وُجُوهٌ يَوْمَئِذٍ خَاشِعَةٌ ٢

కొన్ని ముఖాలు ఆ రోజు వాలి (క్రుంగి) పోయి ఉంటాయి.

88:3 – عَامِلَةٌ نَّاصِبَةٌ ٣

(ప్రపంచంలోని వృథా) శ్రమకు, (పరలోకంలో జరిగే) అవమానానికి, 1

88:4 – تَصْلَىٰ نَارًا حَامِيَةً ٤

వారు దహించే అగ్నిలో పడి కాలుతారు.

88:5 – تُسْقَىٰ مِنْ عَيْنٍ آنِيَةٍ ٥

వారికి సలసలకాగే చెలమ నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది.

88:6 – لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ ٦

వారికి చేదు ముళ్ళ గడ్డ (‘దరీ’అ) తప్ప మరొక ఆహారం ఉండదు.

88:7 – لَّا يُسْمِنُ وَلَا يُغْنِي مِن جُوعٍ ٧

అది వారికి బలమూ నియ్యదు మరియు ఆకలీ తీర్చదు!

88:8 – وُجُوهٌ يَوْمَئِذٍ نَّاعِمَةٌ ٨

ఆ రోజున, మరికొన్ని ముఖాలు కళకళ లాడుతూ ఉంటాయి;

88:9 – لِّسَعْيِهَا رَاضِيَةٌ ٩

తాము చేసుకున్న సత్కార్యాలకు (ఫలితాలకు) వారు సంతోషపడుతూ ఉంటారు.

88:10 – فِي جَنَّةٍ عَالِيَةٍ ١٠

అత్యున్నతమైన స్వర్గవనంలో.

88:11 – لَّا تَسْمَعُ فِيهَا لَاغِيَةً ١١

అందులో వారు ఎలాంటి వృథా మాటలు వినరు.

88:12 – فِيهَا عَيْنٌ جَارِيَةٌ ١٢

అందులో ప్రవహించే సెలయేళ్ళు ఉంటాయి;

88:13 – فِيهَا سُرُرٌ مَّرْفُوعَةٌ ١٣

అందులో ఎత్తైన ఆసనాలు ఉంటాయి; 2

88:14 – وَأَكْوَابٌ مَّوْضُوعَةٌ ١٤

మరియు పేర్చబడిన (మధు) పాత్రలు;

88:15 – وَنَمَارِقُ مَصْفُوفَةٌ ١٥

మరియు వరుసలుగా వేయబడిన, దిండ్లు;

88:16 – وَزَرَابِيُّ مَبْثُوثَةٌ ١٦

మరియు పరచబడిన నాణ్యమైన తివాచీలు.

88:17 – أَفَلَا يَنظُرُونَ إِلَى الْإِبِلِ كَيْفَ خُلِقَتْ ١٧

ఏమిటీ? వారు ఒంటెలవైపు చూడరా? అవి ఎలా సృష్టించబడ్డాయో?

88:18 – وَإِلَى السَّمَاءِ كَيْفَ رُفِعَتْ ١٨

మరియు ఆకాశంవైపుకు (చూడరా)? అది ఎలా పైకి ఎత్తబడి ఉందో?

88:19 – وَإِلَى الْجِبَالِ كَيْفَ نُصِبَتْ ١٩

మరియు కొండలవైపుకు చూడరా? అవి ఎలా గట్టిగా నాటబడి ఉన్నాయో?

88:20 – وَإِلَى الْأَرْضِ كَيْفَ سُطِحَتْ ٢٠

మరియు భూమివైపుకు (చూడరా)? అది ఎలా విశాలంగా పరచబడి ఉందో?

88:21 – فَذَكِّرْ إِنَّمَا أَنتَ مُذَكِّرٌ ٢١

కావున (ఓ ము’హమ్మద్‌!) నీవు హితోప దేశం చేస్తూ ఉండు, వాస్తవానికి నీవు కేవలం హితోపదేశం చేసేవాడవు మాత్రమే!

88:22 – لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ ٢٢

నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేసేవాడవు కావు.

88:23 – إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ ٢٣

ఇక, ఎవడైతే వెనుదిరుగుతాడో మరియు సత్యాన్ని తిరస్కరిస్తాడో!

88:24 – فَيُعَذِّبُهُ اللَّـهُ الْعَذَابَ الْأَكْبَ ٢٤

అప్పుడు అతనికి అల్లాహ్‌ ఘోరశిక్ష విధిస్తాడు.

88:25 – إِنَّ إِلَيْنَا إِيَابَهُمْ ٢٥

నిశ్చయంగా, మావైపునకే వారి మరలింపు ఉంది;

88:26 – ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم ٢٦

ఆ తర్వాత నిశ్చయంగా, వారి లెక్క తీసుకునేదీ మేమే!

సూరహ్‌ అల్‌-ఫజ్ర్‌ – అల్‌-ఫజ్ర్‌: The Dawn, The Day Break, ప్రాతఃకాలము, వేకువజాము. అవతరణా క్రమంలో ఇది 10వది. మక్కహ్ లో అవతరింపజేయబడింది. 30 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 89:1 – وَالْفَجْرِ ١

ప్రాతఃకాలం సాక్షిగా! 1

89:2 – وَلَيَالٍ عَشْ ٢

పది రాత్రుల సాక్షిగా! 2

89:3 – وَالشَّفْعِ وَالْوَتْرِ ٣

సరి-బేసీల సాక్షిగా!

89:4 – وَاللَّيْلِ إِذَا يَسْرِ ٤

గడచిపోయే రాత్రి సాక్షిగా!

89:5 – هَلْ فِي ذَٰلِكَ قَسَمٌ لِّذِي حِجْرٍ ٥

వీటిలో బుధ్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి? 3

89:6 – أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ ٦

నీ ప్రభువు ‘ఆద్‌ (జాతి) వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా? 4

89:7 – إِرَمَ ذَاتِ الْعِمَادِ ٧

ఎత్తైన స్తంభాల (భవనాలు గల) ఇరమ ప్రజల పట్ల? 5

89:8 – الَّتِي لَمْ يُخْلَقْ مِثْلُهَا فِي الْبِلَادِ ٨

వారిలాంటి జాతి భూమిలో ఎన్నడూ సృష్టించ బడలేదు. 6

89:9 – وَثَمُودَ الَّذِينَ جَابُوا الصَّخْرَ بِالْوَادِ ٩

మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్‌ జాతి పట్ల? 7

89:10 – وَفِرْعَوْنَ ذِي الْأَوْتَادِ ١٠

మరియు మేకులవాడైన ఫిర్‌’ఔన్‌ పట్ల? 8

89:11 – الَّذِينَ طَغَوْا فِي الْبِلَادِ ١١

వారంతా ఆయాదేశాలలో తలబిరుసు తనంతో ప్రవర్తించారు;

89:12 – فَأَكْثَرُوا فِيهَا الْفَسَادَ ١٢

మరియు వాటిలో దౌర్జన్యాన్ని రేకెత్తించారు.

89:13 – فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ ١٣

కాబట్టి నీ ప్రభువు వారిపైకి అనేకరకాల బాధాకరమైన శిక్షలను పంపాడు.

89:14 – إِنَّ رَبَّكَ لَبِالْمِرْصَادِ ١٤

వాస్తవానికి, నీ ప్రభువు మాటువేసి ఉన్నాడు (అంతా కనిపెడ్తూ ఉంటాడు)!

89:15 – فَأَمَّا الْإِنسَانُ إِذَا مَا ابْتَلَاهُ رَبُّهُ فَأَكْرَمَهُ وَنَعَّمَهُ فَيَقُولُ رَبِّي أَكْرَمَنِ ١٥

అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టలనిచ్చి అనుగ్రహించినప్పుడు: “నా ప్రభువు నన్ను గౌరవించాడు.” అని అంటాడు; 9

89:16 – وَأَمَّا إِذَا مَا ابْتَلَاهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُ فَيَقُولُ رَبِّي أَهَانَنِ ١٦

కాని, అతన్ని పరీక్షించటానికి, అతని ఉపాధిని తగ్గించినప్పుడు: “నా ప్రభువు నన్ను అవమా నించాడు.” అని అంటాడు. 10

89:17 – كَلَّا ۖ بَل لَّا تُكْرِمُونَ الْيَتِيمَ ١٧

అలాకాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు; 11

89:18 – وَلَا تَحَاضُّونَ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ ١٨

మరియు మీరు పేదలకు అన్నంపెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు; 12

89:19 – وَتَأْكُلُونَ التُّرَاثَ أَكْلًا لَّمًّا ١٩

మరియు వారసత్వపు ఆస్తిని పేరాశతో అంతా మీరే తినేస్తారు.

89:20 – وَتُحِبُّونَ الْمَالَ حُبًّا جَمًّا ٢٠

మరియు మీరు ధన వ్యామోహంలో దారుణంగా చిక్కుకు పోయారు! 13

89:21 – كَلَّا إِذَا دُكَّتِ الْأَرْضُ دَكًّا دَكًّا ٢١

అలాకాదు, భూమి, దంచి పిండి-పిండిగా చేయబడినపుడు;

89:22 – وَجَاءَ رَبُّكَ وَالْمَلَكُ صَفًّا صَفًّا ٢٢

మరియు నీ ప్రభువు (స్వయంగా) వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు. 14

89:23 – وَجِيءَ يَوْمَئِذٍ بِجَهَنَّمَ ۚ يَوْمَئِذٍ يَتَذَكَّرُ الْإِنسَانُ وَأَنَّىٰ لَهُ الذِّكْرَىٰ ٢٣

ఆ రోజు నరకం (ముందుకు) తీసుకురాబడు తుంది. ఆ రోజు మానవుడు (తన కర్మలన్నీ) జ్ఞప్తికి తెచ్చుకుంటాడు; కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజన మేమిటీ?

89:24 – يَقُولُ يَا لَيْتَنِي قَدَّمْتُ لِحَيَاتِي ٢٤

అతడు: “అయ్యో! నా పాడుగాను! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!” అని వాపోతాడు.

89:25 – فَيَوْمَئِذٍ لَّا يُعَذِّبُ عَذَابَهُ أَحَدٌ ٢٥

అయితే ఆ రోజు, ఆయన (అల్లాహ్‌) శిక్షించి నట్లు, మరెవ్వడూ శిక్షించలేడు!

89:26 – وَلَا يُوثِقُ وَثَاقَهُ أَحَدٌ ٢٦

మరియు ఆయన (అల్లాహ్‌) బంధించి నట్లు, మరెవ్వడూ బంధించలేడు. 15

89:27 – يَا أَيَّتُهَا النَّفْسُ الْمُطْمَئِنَّةُ ٢٧

(సన్మార్గునితో ఇలా అనబడుతుంది): “ఓ తృప్తి పొందిన ఆత్మా!

89:28 – ارْجِعِي إِلَىٰ رَبِّكِ رَاضِيَةً مَّرْضِيَّةً ٢٨

“నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై!

89:29 – فَادْخُلِي فِي عِبَادِي ٢٩

“నీవు (పుణ్యాత్ములైన) నాదాసులలో చేరిపో!

89:30 – وَادْخُلِي جَنَّتِ ٣٠

“మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు!” (5/8)

— – సూరహ్‌ అల్‌-బలద్‌ – అల్‌-బలద్‌: నగరం, పురం, పట్నం, The City, The Land. ఇది మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌. 20 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 90:1 – لَا أُقْسِمُ بِهَـٰذَا الْبَلَدِ ١

  • కాదు, నేను ఈ నగరం (మక్కహ్) సాక్షిగా (అంటున్నాను)!

90:2 – وَأَنتَ حِلٌّ بِهَـٰذَا الْبَلَدِ ٢

మరియు నీకు ఈ నగరంలో (మక్కహ్ లో) స్వేచ్ఛ ఉంది.

90:3 – وَوَالِدٍ وَمَا وَلَدَ ٣

మరియు తండ్రి (మూల పురుషుడు) మరియు అతని సంతానం సాక్షిగా! 1

90:4 – لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي كَبَدٍ ٤

వాస్తవానికి, మేము మానవుణ్ణి శ్రమ జీవిగా పుట్టించాము.

90:5 – أَيَحْسَبُ أَن لَّن يَقْدِرَ عَلَيْهِ أَحَدٌ ٥

ఏమిటి? తనను ఎవ్వడూ వశపరచుకోలేడని అతడు భావిస్తున్నాడా?

90:6 – يَقُولُ أَهْلَكْتُ مَالًا لُّبَدًا ٦

అతడు: “నేను విపరీతధనాన్ని ఖర్చు పెట్టాను!” అని అంటాడు. 2

90:7 – أَيَحْسَبُ أَن لَّمْ يَرَهُ أَحَدٌ ٧

ఏమిటి? తనను ఎవ్వడూ చూడటంలేదని అతడు భావిస్తున్నాడా? 3

90:8 – أَلَمْ نَجْعَل لَّهُ عَيْنَيْنِ ٨

ఏమిటి? మేము అతనికి రెండుకళ్ళు ఇవ్వలేదా?

90:9 – وَلِسَانًا وَشَفَتَيْنِ ٩

మరియు నాలుకను మరియు రెండు పెదవులను.

90:10 – وَهَدَيْنَاهُ النَّجْدَيْنِ ١٠

మరియు అతనికి (మంచీ-చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము. 4

90:11 – فَلَا اقْتَحَمَ الْعَقَبَةَ ١١

కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వగమనానికి సాహసించలేదు! 5

90:12 – وَمَا أَدْرَاكَ مَا الْعَقَبَةُ ١٢

మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా?

90:13 – فَكُّ رَقَبَةٍ ١٣

అది ఒకని మెడను (బానిసత్వం నుండి) విడిపించడం. 6

90:14 – أَوْ إِطْعَامٌ فِي يَوْمٍ ذِي مَسْغَبَةٍ ١٤

లేదా! (స్వయంగా) ఆకలిగొని 7 ఉన్నరోజు కూడా (ఇతరులకు) అన్నం పెట్టడం.

90:15 – يَتِيمًا ذَا مَقْرَبَةٍ ١٥

సమీప అనాథునికి గానీ;

90:16 – أَوْ مِسْكِينًا ذَا مَتْرَبَةٍ ١٦

లేక, దిక్కులేని నిరుపేదకు గానీ! 8

90:17 – ثُمَّ كَانَ مِنَ الَّذِينَ آمَنُوا وَتَوَاصَوْا بِالصَّبْرِ وَتَوَاصَوْا بِالْمَرْحَمَةِ ١٧

మరియు విశ్వసించి, సహనాన్ని బోధించే వారిలో! 9 మరియు కరుణను ఒకరికొకరు బోధించుకునే వారిలో చేరిపోవడం.

90:18 – أُولَـٰئِكَ أَصْحَابُ الْمَيْمَنَةِ ١٨

ఇలాంటి వారే కుడిపక్షం వారు. 10

90:19 – وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا هُمْ أَصْحَابُ الْمَشْأَمَةِ ١٩

ఇక మా సందేశాలను తిరస్కరించిన వారు, ఎడమ పక్షానికి చెందిన వారు.

90:20 – عَلَيْهِمْ نَارٌ مُّؤْصَدَةٌ ٢٠

వారిని నరకాగ్ని చుట్టుకుంటుంది. 11

సూరహ్‌ అష్‌-షమ్స్‌ – అష్‌-షమ్స్‌: The Sun, సూర్యుడు. ఇది సూరహ్‌ అల్‌-ఖద్ర్‌ (97) తరువాత అవతరింపజేయబడింది. మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌. పరలోక జీవితానికి భయపడని వారికి భయంకరమైన పర్యవసానం ఉంటుందని ఈ సూరహ్‌ తెలుపుతుంది. 15 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 91:1 – وَالشَّمْسِ وَضُحَاهَا ١

సూర్యుని మరియు దాని ఎండ సాక్షిగా! 1

91:2 – وَالْقَمَرِ إِذَا تَلَاهَا ٢

దాని వెనుక వచ్చే చంద్రుని సాక్షిగా!

91:3 – وَالنَّهَارِ إِذَا جَلَّاهَا ٣

ప్రకాశించే పగటి సాక్షిగా!

91:4 – وَاللَّيْلِ إِذَا يَغْشَاهَا ٤

దానిని క్రమ్ముకొనే, రాత్రి సాక్షిగా!

91:5 – وَالسَّمَاءِ وَمَا بَنَاهَا ٥

ఆకాశం మరియు దానిని నిర్మించిన ఆయన (అల్లాహ్‌) సాక్షిగా!

91:6 – وَالْأَرْضِ وَمَا طَحَاهَا ٦

భూమి మరియు దానిని విస్తరింపజేసిన ఆయన సాక్షిగా!

91:7 – وَنَفْسٍ وَمَا سَوَّاهَا ٧

మానవ ఆత్మ మరియు దానిని తీర్చిదిద్దిన ఆయన సాక్షిగా! 2

91:8 – فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَاهَا ٨

ఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు. 3

91:9 – قَدْ أَفْلَحَ مَن زَكَّاهَا ٩

వాస్తవానికి తన ఆత్మను శుధ్ధపరచుకున్న వాడే సఫలుడవుతాడు.

91:10 – وَقَدْ خَابَ مَن دَسَّاهَا ١٠

మరియు వాస్తవానికి దానిని అణగద్రొక్కిన వాడే విఫలుడవుతాడు. 4

91:11 – كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَاهَا ١١

స’మూద్‌ జాతి తలబిరుసుతనంతో (ప్రవక్తను) అసత్యవాదుడవని తిరస్కరించింది; 5

91:12 – إِذِ انبَعَثَ أَشْقَاهَا ١٢

తమలోని పరమ దుష్టుడు (ఆ దుష్కార్యం చేయటానికి) లేచినప్పుడు;

91:13 – فَقَالَ لَهُمْ رَسُولُ اللَّـهِ نَاقَةَ اللَّـهِ وَسُقْيَاهَا ١٣

అల్లాహ్‌ సందేశహరుడు(‘సాలి’హ్‌) వారితో: “ఈ ఆడఒంటె అల్లాహ్‌కు చెందింది. కాబట్టి దీనిని (నీళ్ళు) త్రాగనివ్వండి!” అని అన్నాడు.

91:14 – فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنبِهِمْ فَسَوَّاهَا ١٤

అయినా వారు అతని(‘సాలి’హ్‌) మాటను అబద్ధమని తిరస్కరించారు. మరియు దాని (ఆ ఒంటె) వెనకకాలి మోకాలి నరాన్ని కోసి, కుంటి దాన్ని చేసి చంపారు. 6 కాబట్టి వారి ప్రభువు వారి పాపానికి పర్యవసానంగా వారిమీద మహా విపత్తును పంపి వారందరినీ నాశనంచేశాడు.

91:15 – وَلَا يَخَافُ عُقْبَاهَا ١٥

మరియు ఆయన (అల్లాహ్‌) దాని పర్యవసానాన్ని గురించి భయపడలేదు! 7

సూరహ్‌ అల్‌-లైల్‌ – అల్‌-లైల్‌: The Night, రాత్రి, అవతరణాక్రమంలో బహుశా ఇది 9వ మక్కహ్ సూరహ్‌. 21 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 92:1 – وَاللَّيْلِ إِذَا يَغْشَىٰ ١

క్రమ్ముకొనే రాత్రి సాక్షిగా!

92:2 – وَالنَّهَارِ إِذَا تَجَلَّىٰ ٢

ప్రకాశించే పగటి సాక్షిగా!

92:3 – وَمَا خَلَقَ الذَّكَرَ وَالْأُنثَ ٣

మరియు, మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్‌) సాక్షిగా!

92:4 – إِنَّ سَعْيَكُمْ لَشَتَّىٰ ٤

వాస్తవానికి, మీ ప్రయత్నాలు నానా విధాలుగా ఉన్నాయి; 1

92:5 – فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ ٥

కాని ఎవడైతే (దాన-ధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో!

92:6 – وَصَدَّقَ بِالْحُسْنَ ٦

మరియు మంచిని నమ్ముతాడో! 2

92:7 – فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ ٧

అతనికి మేము మేలు కొరకు దారిని సులభం చేస్తాము. 3

92:8 – وَأَمَّا مَن بَخِلَ وَاسْتَغْنَىٰ ٨

కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్యవైఖరిని అవలంబిస్తాడో! 4

92:9 – وَكَذَّبَ بِالْحُسْنَىٰ ٩

మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో!

92:10 – فَسَنُيَسِّرُهُ لِلْعُسْرَىٰ ١٠

అతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము.

92:11 – وَمَا يُغْنِي عَنْهُ مَالُهُ إِذَا تَرَدَّىٰ ١١

మరియు అతడు నశించిపోయినప్పుడు, అతనిధనం అతనికి ఎలాఉపయోగపడుతుంది?

92:12 – إِنَّ عَلَيْنَا لَلْـهُدَىٰ ١٢

నిశ్చయంగా సన్మార్గం చూపడం మా పని!

92:13 – وَإِنَّ لَنَا لَلْآخِرَةَ وَالْأُولَىٰ ١٣

మరియు నిశ్చయంగా, ఇహపర లోకాల (ఆధిపత్యం) మాకే చెందినది.

92:14 – فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ ١٤

కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను.

92:15 – لَا يَصْلَاهَا إِلَّا الْأَشْقَى ١٥

పరమ దౌర్భాగ్యుడు తప్ప, మరెవ్వడూ అందులో కాలడు!

92:16 – الَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ ١٦

ఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో!

92:17 – وَسَيُجَنَّبُهَا الْأَتْقَى ١٧

కాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు!

92:18 – الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّ ١٨

అతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో!

92:19 – وَمَا لِأَحَدٍ عِندَهُ مِن نِّعْمَةٍ تُجْزَىٰ ١٩

కాని అది, వారు అతనికి చేసిన ఏ ఉపకారానికి బదులుగా గాక;

92:20 – إِلَّا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِ الْأَعْلَىٰ ٢٠

కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అయితే!

92:21 – وَلَسَوْفَ يَرْضَىٰ ٢١

మరియు అలాంటి వాడే తప్పక సంతోషిస్తాడు. 5

సూరహ్‌ అ’ద్‌-‘దు’హా – అ’ద్‌-‘దు’హా: The Forenoon, పూర్వాహ్ణం, ఎండ, పగలు, పగటి కాంతి, సూర్యోదయం తరువాత మధ్యాహ్నం వరకు ఉండే కాలం. సూరహ్‌ అల్‌-ఫజ్ర్‌ (89) తరువాత ఈ సూరహ్‌ అవతరింపజేయబడిందని వ్యాఖ్యాతలు అంటారు. మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌. 11 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 93:1 – وَالضُّحَىٰ ١

ప్రకాశవంతమైన ప్రొద్దటిపూట (పూర్వాహ్ణం) సాక్షిగా!

93:2 – وَاللَّيْلِ إِذَا سَجَىٰ ٢

మరియు చీకటిపడ్డ రాత్రి సాక్షిగా! 1

93:3 – مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ ٣

(ఓము’హమ్మద్‌!) నీప్రభువు, నిన్ను త్యజించనూ లేదు మరియు నిన్ను ఉపేక్షించనూ లేదు.

93:4 – وَلَلْآخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ الْأُولَ ٤

మరియు రాబోయే కాలం (జీవితం) నీ కొరకు మొదటి కాలం (జీవితం) కంటే ఎంతో మేలైనది! 2

93:5 – وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَ ٥

మరియు త్వరలోనే నీ ప్రభువు నీకు (నీవు కోరేది) ప్రసాదిస్తాడు. దానితో నీవు సంతోషపడతావు.

93:6 – أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَىٰ ٦

(ఓ ము’హమ్మద్‌!) ఏమీ? నిన్ను అనాథునిగా 3 చూసి, ఆయన(అల్లాహ్‌)నీకు ఆశ్రయం కల్పించలేదా?

93:7 – وَوَجَدَكَ ضَالًّا فَهَدَىٰ ٧

మరియు నీకు మార్గం తోచనప్పుడు, ఆయన నీకు మార్గదర్శకత్వం చేయలేదా? 4

93:8 – وَوَجَدَكَ عَائِلًا فَأَغْنَىٰ ٨

మరియు ఆయన, పేదవానిగా చూసి, నిన్ను సంపన్నునిగా చేయలేదా?

93:9 – فَأَمَّا الْيَتِيمَ فَلَا تَقْهَرْ ٩

కాబట్టి నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకు;

93:10 – وَأَمَّا السَّائِلَ فَلَا تَنْهَرْ ١٠

మరియు యాచకుణ్ణి కసరుకోకు;

93:11 – وَأَمَّا بِنِعْمَةِ رَبِّكَ فَحَدِّثْ ١١

మరియు నీ ప్రభువు అనుగ్రహాలను బహిరం గంగా ప్రకటిస్తూ ఉండు. 5 (3/4)

సూరహ్‌ అష్‌-షర్‌’హ్‌ – అష్‌-షర్‌’హ్‌: The Opening Forth, తెరవటం, విప్పటం. సూరహ్‌ అ’ద్‌-‘దు’హా (93) తరువాతనే ఇది కూడా మక్కహ్ లో అవతరింపజేయబడింది. దీని ఇతర పేర్లు అల్‌-ఇన్‌షిరా’హ్‌ మరియు అలమ్‌ నష్ర’హ్‌. 8 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ లో ఉంది. అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 94:1 – أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ ١

  • (ఓ ము’హమ్మద్‌!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా? 1

94:2 – وَوَضَعْنَا عَنكَ وِزْرَكَ ٢

మరియు మేము నీ భారాన్ని నీపై నుండి దించివేయలేదా?

94:3 – الَّذِي أَنقَضَ ظَهْرَكَ ٣

ఏదైతే నీ వెన్నును విరుస్తూ ఉండిందో?

94:4 – وَرَفَعْنَا لَكَ ذِكْرَكَ ٤

మరియు నీ పేరు ప్రతిష్ఠలను పైకెత్తలేదా? 2

94:5 – فَإِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا ٥

నిశ్చయంగా, ఎల్లప్పుడు కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది;

94:6 – إِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا ٦

నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది. 3

94:7 – فَإِذَا فَرَغْتَ فَانصَبْ ٧

కావున నీకు తీరిక లభించినప్పుడు ఆరాధనలో నిమగ్నుడవైపో!

94:8 – وَإِلَىٰ رَبِّكَ فَارْغَب ٨

మరియు నీ ప్రభువునందే ధ్యానం నిలుపు.

సూరహ్‌ అత్‌-తీన్‌ – అత్‌-తీన్‌: The Fig, అత్తి, అంజూరం, ఇది సూరహ్‌ అల్‌-బురూజ్‌ (85) తరువాత మక్కహ్ లో అవతరింపజేయబడింది. ఇది సూరహ్‌ అల్‌-‘అ’స్ర్‌ (103)ను పోలిఉంది. అత్తి మరియు ‘జైతూన్‌ చెట్లు ఫలస్తీన్‌ మరియు సీరియాలలో చాలా ఉన్నాయి. 8 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِّسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 95:1 – وَالتِّينِ وَالزَّيْتُونِ ١

అంజూరం (అత్తి) మరియు జైతూన్‌ సాక్షిగా!

95:2 – وَطُورِ سِينِينَ ٢

సీనాయ్‌ (తూర్‌) కొండ సాక్షిగా! 1

95:3 – وَهَـٰذَا الْبَلَدِ الْأَمِينِ ٣

ఈ శాంతి నగరం (మక్కహ్) సాక్షిగా! 2

95:4 – لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي أَحْسَنِ تَقْوِيمٍ ٤

వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము. 3

95:5 – ثُمَّ رَدَدْنَاهُ أَسْفَلَ سَافِلِينَ ٥

తరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి అధమమైన స్థితికి మార్చాము.

95:6 – إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ ٦

కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప! ఎందుకంటే అలాంటి వారికి అంతులేని ప్రతిఫలం ఉంది.

95:7 – فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِالدِّينِ ٧

అయితే, (ఓ మానవుడా!) దీని తరువాత గూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావు?

95:8 – أَلَيْسَ اللَّـهُ بِأَحْكَمِ الْحَاكِمِينَ ٨

ఏమీ? అల్లాహ్‌ న్యాయాధిపతులలో కెల్లా సర్వోత్తమ న్యాయాధిపతి కాడా?

సూరహ్‌ అల్‌-‘అలఖ్‌ – అల్‌-‘అలఖ్‌: The Germ Cell, The Clot, జీవకణం, పిండం, రక్తముద్ద, జలగ, దీని మరొక పేరు సూరహ్‌ అల్‌-ఇఖ్‌రా’, చదువు, పఠించు. దీని మొదటి 5 ఆయత్‌లతో దివ్యజ్ఞాన (ఖుర్‌ఆన్‌) అవతరణ ప్రారంభమయ్యింది. ఇవి రమ’దాన్‌ నెల చివరి 10 రోజులలో ప్రస్థానానికి (హిజ్‌రత్‌కు) 13 సంవత్సరాలకు ముందు, (610వ క్రీస్తు శకం)లో దైవప్రవక్త ము’హమ్మద్‌ (‘స’అస) 40 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, మక్కహ్ లోని నూర్‌ పర్వతం మీద ఉన్న, ‘హిరా గుహలో అవతరింపజేయబడ్డాయి. మిగతా ఆయాత్‌లు (6-19), ఈ మొదటి వ’హీ అవతరింపజేయబడిన కొంతకాలం (ఫత్‌రతుల్‌ వ’హీ) తరువాత అవతరింపజేయబడ్డాయి. 19 ఆయాతులున్న ఈ సూరహ్‌ పేరు 2వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 96:1 – اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ ١

చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు! 1

96:2 – خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ ٢

ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు. 2

96:3 – اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ ٣

చదువు! మరియు నీ ప్రభువు పరమదాత.

96:4 – الَّذِي عَلَّمَ بِالْقَلَمِ ٤

ఆయన కలం ద్వారా నేర్పాడు 3

96:5 – عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ ٥

మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు.

96:6 – كَلَّا إِنَّ الْإِنسَانَ لَيَطْغَ ٦

అలా కాదు! వాస్తవానికి, మానవుడు తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడు.

96:7 – أَن رَّآهُ اسْتَغْنَىٰ ٧

ఎందుకంటే, అతడు తనను తాను నిరపేక్షాపరుడిగా భావిస్తాడు.

96:8 – إِنَّ إِلَىٰ رَبِّكَ الرُّجْعَ ٨

నిశ్చయంగా, నీ ప్రభువు వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది.

96:9 – أَرَأَيْتَ الَّذِي يَنْهَ ٩

నీవు నిరోధించే వ్యక్తిని చూశావా? 4

96:10 – عَبْدًا إِذَا صَلَّىٰ ١٠

నమా’జ్‌ చేసే (అల్లాహ్‌) దాసుణ్ణి? 5

96:11 – أَرَأَيْتَ إِن كَانَ عَلَى الْهُدَىٰ ١١

ఒకవేళ అతను (ము’హమ్మద్‌!) సన్మార్గంపై ఉంటే నీ అభిప్రాయమేమిటి?

96:12 – أَوْ أَمَرَ بِالتَّقْوَىٰ ١٢

ఇంకా, దైవభీతినిగురించి ఆదేశిస్తూ ఉంటే? 6

96:13 – أَرَأَيْتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰ ١٣

ఒకవేళ (ఆ నిరోధించే) వాడు 7 సత్యాన్ని తిరస్కరించే వాడు మరియు సన్మార్గం నుండి విముఖుడయ్యే వాడు అయితే?

96:14 – أَلَمْ يَعْلَم بِأَنَّ اللَّـهَ يَرَىٰ ١٤

వాస్తవానికి, అల్లాహ్‌ అంతా చూస్తున్నాడని అతనికి తెలియదా?

96:15 – كَلَّا لَئِن لَّمْ يَنتَهِ لَنَسْفَعًا بِالنَّاصِيَةِ ١٥

అలా కాదు! ఒకవేళ అతడు మానుకోకపోతే, మేము అతడిని, నుదుటి జుట్టు వెంట్రుకలను పట్టి ఈడుస్తాము. 8

96:16 – نَاصِيَةٍ كَاذِبَةٍ خَاطِئَةٍ ١٦

అది అబద్ధాలలో అపరాధాలలో మునిగి వున్న నుదురు!

96:17 – فَلْيَدْعُ نَادِيَهُ ١٧

అయితే, అతన్ని తన అనుచరులను పిలుచుకోమను!

96:18 – سَنَدْعُ الزَّبَانِيَةَ ١٨

మేము కూడా నరక దూతలను పిలుస్తాము!

96:19 – كَلَّا لَا تُطِعْهُ وَاسْجُدْ وَاقْتَرِب ۩ ١٩

అలా కాదు! నీవు అతని మాట వినకు మరియు ఆయనకే (అల్లాహ్‌కే) సాష్టాంగం (సజ్దా) చెయ్యి మరియు ఆయన (అల్లాహ్‌) సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రయత్నించు! (సజ్దా)

సూరహ్‌ అల్‌-ఖద్ర్‌ – అల్‌-ఖద్ర్‌: The Decree, ఘనత, ఆదేశం, శాసనం, తీర్పు, భగవత్సంకల్పం, విధి, అదృష్టం, పర్యవసానం, Destiny. ఈ సూరహ్‌ మొదటి మక్కహ్ సూరహ్‌లలోనిది. 5 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِّسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 97:1 – إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ ١

నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్‌ఆన్‌ను) ఘనతగల ఆ రాత్రి 1 (అల్‌-ఖద్ర్‌)లో అవతరింపజేశాము. 2

97:2 – وَمَا أَدْرَاكَ مَا لَيْلَةُ الْقَدْرِ ٢

మరియు ఆ ఘనత గల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు?

97:3 – لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ ٣

ఆ ఘనతగల రాత్రి వేయినెలల కంటే శ్రేష్ఠమైనది. 3

97:4 – تَنَزَّلُ الْمَلَائِكَةُ وَالرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ ٤

ఆ రాత్రిలో దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్‌), 4 తమ ప్రభువు అనుమతితో, ప్రతి (వ్యవహారానికి సంబంధించిన) ఆజ్ఞలు తీసుకుని దిగివస్తారు.

97:5 – سَلَامٌ هِيَ حَتَّىٰ مَطْلَعِ الْفَجْرِ ٥

ఆ రాత్రిలో తెల్లవారే వరకు శాంతి వర్థిల్లుతుంది.

సూరహ్‌ అల్‌-బయ్యినహ్‌ – అల్‌-బయ్యినహ్‌: The Clear Evidence, స్పష్టమయిన నిదర్శనం, ప్రమాణం, సూచన. ఇది బహశా మొదటి హిజ్రీలో మదీనహ్ లో అవతరింపజేయబడింది. దీని మరొక పేరు సూరహ్‌ లమ్‌యకున్‌. 8 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 98:1 – لَمْ يَكُنِ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ مُنفَكِّينَ حَتَّىٰ تَأْتِيَهُمُ الْبَيِّنَةُ ١

ఎంతవరకైతే స్పష్టమైన నిదర్శనం రాదో! అంతవరకు సత్యతిరస్కారులైన పూర్వగ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు (తమ సత్య-తిరస్కారాన్ని) మానుకునేవారు కారు! 1

98:2 – رَسُولٌ مِّنَ اللَّـهِ يَتْلُو صُحُفًا مُّطَهَّرَةً ٢

అల్లాహ్‌ తరఫు నుండి వచ్చిన సందేశ హరుడు, 2 వారికి పవిత్ర గ్రంథ పుటలను వినిపిస్తున్నాడు. 3

98:3 – فِيهَا كُتُبٌ قَيِّمَةٌ ٣

అందులో సమంజసమైన వ్రాతలు (సత్యోపదేశాలు) ఉన్నాయి. 4

98:4 – وَمَا تَفَرَّقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَةُ ٤

మరియు స్పష్టమైన సూచన వచ్చిన తర్వాతనే గ్రంథప్రజలు భేదాభిప్రాయాలలో పడ్డారు. 5

98:5 – وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّـهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ ۚ وَذَٰلِكَ دِينُ الْقَيِّمَةِ ٥

మరియు వారికి ఇచ్చిన ఆదేశం: వారు అల్లాహ్‌నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్రచిత్తంతో 6 తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమా’జ్‌ను స్థాపించాలని మరియు ‘జకాత్‌ ఇవ్వాలని. ఇదే సరైన ధర్మము.

98:6 – إِنَّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ فِي نَارِ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۚ أُولَـٰئِكَ هُمْ شَرُّ الْبَرِيَّةِ ٦

నిశ్చయంగా, సత్య-తిరస్కారులైన గ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు, నరకాగ్నిలోకి పోతారు. వారందులో శాశ్వతంగా ఉంటారు. ఇలాంటి వారే, సృష్టిలో అత్యంత నికృష్టజీవులు. 7

98:7 – إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَـٰئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ ٧

నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసే వారు, వారే సృష్టిలో అత్యంత ఉత్కృష్టజీవులు.

98:8 – جَزَاؤُهُمْ عِندَ رَبِّهِمْ جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ رَّضِيَ اللَّـهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِيَ رَبَّهُ ٨

వారికి తమ ప్రభువు నుండి లభించే ప్రతిఫలం శాశ్వతమైన స్వర్గవనాలు. వాటిలో క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. వారు, వాటిలో శాశ్వతంగా కలకాల ముంటారు. అల్లాహ్‌ వారితో ప్రసన్నుడవుతాడు 8 మరియు వారు ఆయనతో సంతుష్టులవుతారు. ఇదే తన ప్రభువుకు భయపడే వ్యక్తికి లభించే ప్రతిఫలం.

సూరహ్‌ అ’జ్‌-‘జల్‌’జలహ్‌ – అ’జ్‌-‘జల్‌’జలహ్‌: The Earthquake, భూకంపం, ఇది సూరహ్‌ అ’జ్‌-‘జిల్‌’జాల్‌ అని కూడా అనబడుతుంది. ఇది మొదటి మదీనహ్ కాలంలో అవతరింపజేయబడింది. 8 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 99:1 – إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا ١

భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు! 1

99:2 – وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا ٢

మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడవేసినప్పుడు! 2

99:3 – وَقَالَ الْإِنسَانُ مَا لَهَا ٣

మరియు మానవుడు: “దీనికి ఏమైంది?” అని అన్నప్పుడు.

99:4 – يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا ٤

ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది. 3

99:5 – بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا ٥

ఎందుకంటే, నీ ప్రభువు దానిని ఆదేశించి ఉంటాడు.

99:6 – يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ ٦

ఆ రోజు ప్రజలు తమతమ కర్మలు చూపించ బడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు.

99:7 – فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ ٧

అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసిఉన్నా, దానిని చూసుకుంటాడు. 4

99:8 – وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ ٨

మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసిఉన్నా, దానిని చూసుకుంటాడు.

సూరహ్‌ అల్‌-‘ఆదియాత్‌ – అల్‌-‘ఆదియాత్‌: The Chargers, వడిగా పరిగెత్తే గుర్రాలు, యుద్ధాశ్వాలు, Those That Run, ఇది సూరహ్‌ అల్‌-‘అస్ర్‌ (103) తరువాత మొదటి మక్కహ్ కాలంలో అవతరింపజేయ- బడింది. 11 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 100:1 – وَالْعَادِيَاتِ ضَبْحًا ١

వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా! 1

100:2 – فَالْمُورِيَاتِ قَدْحًا ٢

తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి; 2

100:3 – فَالْمُغِيرَاتِ صُبْحًا ٣

తెల్లవారుఝామున దాడిచేసే వాటి; 3

100:4 – فَأَثَرْنَ بِهِ نَقْعًا ٤

(మేఘాల వంటి) దుమ్ము లేపుతూ; 4

100:5 – فَوَسَطْنَ بِهِ جَمْعًا ٥

(శత్రువుల) సమూహంలోకి దూరిపోయే వాటి.

100:6 – إِنَّ الْإِنسَانَ لِرَبِّهِ لَكَنُودٌ ٦

నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు. 5

100:7 – وَإِنَّهُ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ ٧

మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి.

100:8 – وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ ٨

మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు. (7/8)

100:9 – أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ ٩

  • ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడి నప్పుడు; 6

100:10 – وَحُصِّلَ مَا فِي الصُّدُورِ ١٠

మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడిచేయబడినప్పుడు;

100:11 – إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيرٌ ١١

నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని!

సూరహ్‌ అల్‌-ఖారి’అహ్‌ – అల్‌-ఖారి’అహ్‌: The Sudden Calamity, ఉపద్రవం, The Striking Hour, దుర్ఘటన, విపత్తు. మొదటి మక్కహ్ కాలపు ఈ సూరహ్‌. బహుశా సూరహ్‌ అత్‌-తీన్‌ (95) తరువాత అవతరింపజేయబడింది. 11 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ లో ఉంది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 101:1 – الْقَارِعَةُ ١

ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం! 1

101:2 – مَا الْقَارِعَةُ ٢

ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం?

101:3 – وَمَا أَدْرَاكَ مَا الْقَارِعَةُ ٣

మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు?

101:4 – يَوْمَ يَكُونُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوثِ ٤

ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు. 2

101:5 – وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنفُوشِ ٥

మరియు పర్వతాలు రంగురంగుల ఏకిన దూదివలే అయిపోతాయి. 3

101:6 – فَأَمَّا مَن ثَقُلَتْ مَوَازِينُهُ ٦

అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కా ర్యాలతో) బరువుగా ఉంటాయో! 4

101:7 – فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ ٧

అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు.

101:8 – وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ ٨

మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో! 5

101:9 – فَأُمُّهُ هَاوِيَةٌ ٩

అతని నివాసం అధఃపాతాళమే. 6

101:10 – وَمَا أَدْرَاكَ مَا هِيَهْ ١٠

మరియు అది ఏమిటో నీకేం తెలుసు?

101:11 – نَارٌ حَامِيَةٌ ١١

అదొక భగభగ మండే అగ్ని 7 (గుండం).

సూరహ్‌ అత్‌-తకాసు’ర్‌ – అత్‌-తకాసు’ర్‌: పేరాస, Greed for more, The Piling up. మొదటి మక్కహ్ కాలపు ఈ సూరహ్‌, మానవుని ఎడతెగని పేరాసను ఖండిస్తోంది. 8 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 102:1 – أَلْهَاكُمُ التَّكَاثُرُ ١

(ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరు పాటులో పడవేసింది; 1

102:2 – حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ ٢

మీరు గోరీలలోకి చేరే వరకు. 2

102:3 – كَلَّا سَوْفَ تَعْلَمُونَ ٣

అలాకాదు! త్వరలోనే మీరు తెలుసు- కుంటారు.

102:4 – ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ ٤

మరొక సారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు. 3

102:5 – كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ ٥

ఎంత మాత్రము కాదు! ఒక వేళ మీరు నిశ్చితజ్ఞానంతో తెలుసుకొనిఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు).

102:6 – لَتَرَوُنَّ الْجَحِيمَ ٦

నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు!

102:7 – ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ ٧

మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడ గలరు!

102:8 – ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ ٨

అప్పుడు, ఆ రోజు మీరు, (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు! 4

సూరహ్‌ అల్‌-‘అ’స్ర్‌ – అల్‌-‘అ’స్ర్‌: The Time, కాలము. ఇది మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌. చెడుకు పర్యవ సానం చెడు. గడిచిపోయిన కాలం మళ్ళీ చేజిక్కదు. కావున విశ్వసించి, సత్కార్యాలు చేస్తూ, సత్యాన్ని మరియు సహనాన్ని పాటిస్తూ ఒకరికొకరు బోధించుకునే వారే సాఫల్యం పొందుతారు. ఇది 3 ఆయాతులు ఉన్న 3 సూరహ్‌లలో మొదటిది. దీని పేరు మొదటి ఆయత్‌ లో ఉంది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 103:1 – وَالْعَصْرِ ١

కాలం (‘అ’స్ర్‌) సాక్షిగా! 1

103:2 – إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ ٢

నిశ్చయంగా, మానవుడు నష్టంలో ఉన్నాడు! 2

103:3 – إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ ٣

కాని విశ్వసించి, సత్కార్యాలు చేసే వారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప! 3

సూరహ్‌ అల్‌-హుమ’జహ్‌ – అల్‌-హుమ’జహ్‌: The Slanderer, అపనిందలు, అపవాదాలు మోపేవాడు, ఇది దైవప్రవక్త (‘స’అస) ప్రవక్తగా ఎన్నుకోబడిన దాదాపు 3 సంవత్సరాల తరువాత, సూరహ్‌ అల్‌-ఖియామహ్‌ (75) తరువాత మక్కహ్ లో అవతరింపజేయబడింది. 9 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 104:1 – وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ ١

అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు. 1

104:2 – الَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُ ٢

ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటిమాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో! 2

104:3 – يَحْسَبُ أَنَّ مَالَهُ أَخْلَدَهُ ٣

తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు! 3

104:4 – كَلَّا ۖ لَيُنبَذَنَّ فِي الْحُطَمَةِ ٤

ఎంతమాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు. 4

104:5 – وَمَا أَدْرَاكَ مَا الْحُطَمَةُ ٥

ఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా? 5

104:6 – نَارُ اللَّـهِ الْمُوقَدَةُ ٦

అల్లాహ్‌, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని;

104:7 – الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ ٧

అది గుండెలదాకా చేరుకుంటుంది.

104:8 – إِنَّهَا عَلَيْهِم مُّؤْصَدَةٌ ٨

నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది; 6

104:9 – فِي عَمَدٍ مُّمَدَّدَةٍ ٩

పొడుగాటి (అగ్ని) స్తంభాలవలె!

— – సూరహ్‌ అల్‌-ఫీల్‌ – అల్‌-ఫీల్‌: The Elephant, ఏనుగు. యమన్‌ యొక్క అబిసీనియా రాజ ప్రతినిధి (Abyssinia’s Viceroy of Yaman) అబ్రాహా (Abraha), క్రైస్తవుడు. అతడు 570 క్రీస్తు శకంలో మక్కహ్ లోని క’అబహ్ ను పడగొట్టే ఉద్దేశ్యంతో పెద్ద సైన్యం తీసుకొని, ఒక ఏనుగుపై ఎక్కి వస్తాడు. మక్కహ్ కొంతదూరంలో ఉందనగా అతడి ఏనుగు మక్కహ్ వైపుకు పోకుండా ఆగిపోతుంది. ఆ తరువాత ఒక పక్షుల దండు వచ్చి మట్టితో చేసి కాల్చిన చిన్న-చిన్న కంకర రాళ్ళను వారిపై కురిపిస్తుంది. దానితో చాలా మంది సైనికులు మరణిస్తారు. సైన్యమంతా చెల్లాచెదరైపోతుంది. అబ్రాహా వెనుదిరిగిపోతూ మధ్య మార్గంలోనే మరణిస్తాడు. ఆ కాలంలో అబ్దుల్‌ ముత్తలిబ్‌ – దైవప్రవక్త (‘స’అస) తాత – మక్కహ్ ఖురైషుల నాయకులుగా ఉంటారు. అదే సంవత్సరంలో దైవప్రవక్త (‘స’అస) జన్మిస్తారు. ఇది మొదటి మక్కహ్ కాలపు సూరహ్. 5 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 105:1 – أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الْفِيلِ ١

ఏమీ? ఏనుగు వారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?

105:2 – أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيلٍ ٢

ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా? 1

105:3 – وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ ٣

మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు;

105:4 – تَرْمِيهِم بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ ٤

అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకరరాళ్ళను (సిజ్జీల్‌) విసురుతూ పోయాయి; 2

105:5 – فَجَعَلَهُمْ كَعَصْفٍ مَّأْكُولٍ ٥

ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తిని వేసిన పొట్టుగా మార్చివేశాడు.

— – సూరహ్‌ ఖురైష్‌ – ఖురైష్‌: మక్కహ్ లోని ఒక పెద్ద తెగ పేరు. దైవప్రవక్త (‘స’అస) ఈ తెగకే చెందిన వారు. ఈ సూరహ్‌ మరొక పేరు సూరహ్‌ అల్‌-ఈలాఫ్‌. ఇది మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌. అల్‌- ఫీల్‌ మరియు ఖురైష్‌ సూరాహ్‌లు ఒకేసూరహ్‌ కావచ్చని కొందరు వ్యాఖ్యాతలు అభిప్రాయ పడ్డారు. 4 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 106:1 – لِإِيلَافِ قُرَيْشٍ ١

(అల్లాహ్‌ రక్షణ మరియు ఆయన కరుణతో) ఖురైషులు (ప్రయాణాలకు) అలవాటుపడ్డారు.

106:2 – إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ ٢

(అల్లాహ్‌ కరుణ మరియు ఆయన రక్షణతో) వారు శీతా కాలపు మరియు వేసవి కాలపు ప్రయాణాలు చేయగలుగుతున్నారు. 1

106:3 – فَلْيَعْبُدُوا رَبَّ هَـٰذَا الْبَيْتِ ٣

కావున వారు ఈ ఆలయ (క’అబహ్) ప్రభువును (అల్లాహ్‌ను) మాత్రమే ఆరాధించాలి! 2

106:4 – الَّذِي أَطْعَمَهُم مِّن جُوعٍ وَآمَنَهُم مِّنْ خَوْفٍ ٤

వారు ఆకలితో ఉన్నప్పుడు ఆయనే వారికి ఆహారమిచ్చాడు మరియు ఆయనే వారిని భయం (ప్రమాదం) నుండి కాపాడాడు. 3

సూరహ్‌ అల్‌-మా’ఊన్‌ – అల్‌-మా’ఊన్‌: ఉపకారం, సహాయం, తోడ్పాటు, Assistance, ఇది మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌. దీని ఇతర పేర్లు; అద్‌-దీన్‌, అరా’య్‌త లేక అల్‌-యతీమ్‌ (ఫ’త్హ్ అల్‌-ఖదీర్‌). బహుశా ఇది సూరహ్ అత్‌-తకాసు’ర్‌ (102) తరువాత అవతరింపజేయబడింది. 7 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 7వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 107:1 – أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ ١

తీర్పు దినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా? 1

107:2 – فَذَٰلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ ٢

అతడే అనాథులను కసరికొట్టేవాడు; 2

107:3 – وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ ٣

మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు.

107:4 – فَوَيْلٌ لِّلْمُصَلِّينَ ٤

కావున, నమా’జ్‌ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు! 3

107:5 – الَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ ٥

ఎవరైతే తమ నమా’జ్‌ల పట్ల అశ్రధ్ధ వహిస్తారో! 4

107:6 – الَّذِينَ هُمْ يُرَاءُونَ ٦

ఎవరైతే ప్రదర్శనా బుధ్ధితో వ్యవహరిస్తారో (నమా’జ్‌ సలుపుతారో)! 5

107:7 – وَيَمْنَعُونَ الْمَاعُونَ ٧

మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో! 6

సూరహ్‌ అల్‌-కౌస’ర్‌ – అల్‌-కౌస’ర్‌: అంటే అధికం, Good in Abundance, పుష్కలత్వం, సమృద్ధి. ఈ సూరహ్ మరొక పేరు అన్‌-నహ్ర్‌. చాలా మంది ఇది మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌ అని అంటారు. ఇది 3 ఆయాతులున్న 2వ సూరహ్. దీని పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 108:1 – إِنَّا أَعْطَيْنَاكَ الْكَوْثَرَ ١

(ఓ ము’హమ్మద్‌!) నిశ్చయంగా, మేము నీకు కౌస’ర్‌ 1 ప్రసాదించాము.

108:2 – فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ ٢

కనుక, నీవు నీ ప్రభువు కొరకే నమా’జ్‌ చెయ్యి మరియు బలి (ఖుర్బానీ) కూడా (ఆయన కొరకే) ఇవ్వు! 2

108:3 – إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَ ٣

నిశ్చయంగా, నీ శత్రువు, వాడే! వేరుతెగిన వాడిగా (వారసుడూ, పేరూ లేకుండా) అయిపోతాడు. 3

— – సూరహ్‌ అల్‌-కాఫిరూన్‌ – అల్‌-కాఫిరూన్‌: Deniers of the Truth, సత్యతిరస్కారులు. The Disbelievers. ఇది సూరహ్‌ అల్‌-మా’ఊన్‌ (107) తరువాత, మొదటి మక్కహ్ కాలంలో అవతరింపజేయ బడింది. సత్య-ధర్మం విషయంలో సమాధానపడటం / రాజీపడటం విశ్వాసులకు తగనిపని. ధర్మం విషయంలో కొంతవరకు రాజీపడమని, మక్కహ్ ముష్రికులు దైవప్రవక్త (‘స’అస)తో అన్నప్పుడు ఈ సూరహ్‌ అవతరింపజేయబడింది. ‘స’హీ’హ్‌ ‘హదీస్‌’ ల ప్రకారం క’అబహ్ ‘తవాఫ్‌ తరువాత చేసే రెండు రక’ఆత్‌లలో, ఫజ్ర్‌ మరియు మ’గ్‌రిబ్‌ సున్నత్‌లలో దైవప్రవక్త (‘స’అస) ఈ సూరహ్‌ (109) మరియు సూరహ్‌ అల్‌-ఇ’ఖ్‌లా’స్‌ (112) పఠించేవారు. అంతేకాదు అతను (‘స’అస) తమ అనుచరులకు: “మీరు రాత్రి నిద్రపోయే ముందు ఈ సూరహ్‌ చదివితే షిర్క్‌నుండి దూరమవుతారు.” అని కూడా ప్రబోధించారు. (ముస్నద్‌ అ’హ్‌మద్‌, 5/456, తిర్మీజీ’, 3403, అబూ-దావూద్‌, 5055 మొదలైనవి). 6 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 109:1 – قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ ١

ఇలా అను: “ఓ సత్య-తిరస్కారులారా!

109:2 – لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ ٢

“మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను;

109:3 – وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ ٣

“మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు.

109:4 – وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ ٤

“మరియు మీరు ఆరాధిస్తున్నవాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను;

109:5 – وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ ٥

“మరియు మీరు ఆరాధిస్తున్నవాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను;

109:6 – لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ ٦

“మీధర్మం మీకూ మరియు నాధర్మం నాకు!” 1

— – సూరహ్‌ అన్‌-న’స్ర్‌ – అన్‌-న’స్ర్: Help, Succour, సహాయం, విజయం, తోడ్పాటు. ఇది దైవప్రవక్త (‘స’అస) నిర్యాణానికి కొన్ని వారాల ముందు, చిట్టచివర అవతరింపజేయబడిన మదీనహ్ సూరహ్‌. ఇది 10వ హిజ్రీలో అవతరింపజేయబడింది. (‘స’హీ’హ్‌ ముస్లిం). ఇది 3 ఆయాతులున్న3వ సూరహ్. దీని పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 110:1 – إِذَا جَاءَ نَصْرُ اللَّـهِ وَالْفَتْحُ ١

(ఓ ము’హమ్మద్‌!) ఎప్పడైతే అల్లాహ్‌ సహాయం వస్తుందో మరియు విజయం (లభిస్తుందో)!

110:2 – وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّـهِ أَفْوَاجًا ٢

మరియు నీవు ప్రజలను గుంపులు- గుంపులుగా అల్లాహ్‌ ధర్మం (ఇస్లాం)లో ప్రవేశించడం చూస్తావో! 1

110:3 – فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ ۚ إِنَّهُ كَانَ تَوَّابًا ٣

అప్పుడు నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు మరియు ఆయన క్షమాభిక్షను అర్థించు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు. 2

సూరహ్‌ అల్‌-మసద్‌ – అల్‌-మసద్‌: The Palm Fiber, ఖర్జూరపు నార. ఈ సూరహ్‌ మొదటి మక్కహ్ కాలానికి చెందింది. బహుశా అవతరణలో 6వది. దీని ఇతరపేర్లు అల్‌-లహబ్‌ (అగ్నిజ్వాలలు) మరియు తబ్బత్‌ (నాశనమగుట). దీని అవతరణ గురించి ఈ ‘హదీస్‌’ ఉంది: దైవప్రవక్త (‘స’అస)కు తన దగ్గరి వారికి ఇస్లాం ధర్మప్రచారం చేయటానికి ఆజ్ఞ దొరికిన తరువాత, అతను ‘సఫా గుట్టపై ఎక్కి: “యా ‘సబా’హా!” అంటారు. ఆ కాలంలో ఏదైన ఆపద వస్తే ఇలా అరిచేవారు. అప్పుడు అందరూ అక్కడ సమావేశమవుతారు. అప్పుడతను అంటారు: “ఓ మక్కహ్ వాసులారా: ‘ఈ గుట్ట వెనుక ఒక గుర్రాల సైన్యం మీపై దాడిచేయటానికి సిద్ధంగా ఉంది.’ అని, నేను అంటే మీరు నమ్ముతారా?” దానికి వారంటారు: “ఎందుకు నమ్మము. నీవు సదా సత్యమే పలికావు!” అతను అంటారు: “అయితే వినండి! ఒకవేళ మీరు షిర్క్‌ మరియు కుఫ్ర్‌ విడువకుంటే మీపై ఘోరశిక్ష పడనున్న దని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.” అది విని అబూ-లహబ్‌ అంటాడు: “నీవు నాశనమైపోవు గాక (తబ్బన్‌లక)! దీనికేనా నీవు మమ్మల్ని ఇక్కడ జమచేసింది?” అప్పుడు ఈ సూరహ్‌ అవతరింప జేయబడుతుంది, (‘స’హీ’హ్‌ బు’ఖారీ). అబూ-లహబ్‌ అసలు పేరు అబ్దుల్‌-‘ఉ’జ్జా! తన ఎర్ర రంగు రూపుల వల్ల అబూ-లహబ్‌ అనే మారు పేరుతో పిలవబడ్డాడు. ఇతడు దైవప్రవక్త (‘స’అస) పిన్నాన్న. అతని భార్య పేరు ఉమ్మె-జమీల్‌ బిన్తె-‘హర్బ్‌. వీరిద్దరు అతని (‘స’అస) యొక్క క్రూరమైన విరోధులు. 5 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 5వ ఆయత్‌ లో ఉంది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 111:1 – تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ ١

అబూ-లహబ్‌ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించిపోవుగాక! 1

111:2 – مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ ٢

అతని ధనం మరియు అతని సంపాదన (సంతానం) అతనికి ఏ మాత్రం పనికిరావు!

111:3 – سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ ٣

అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చ బడతాడు!

111:4 – وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ ٤

మరియు అతని భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ! 2

111:5 – فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ ٥

ఆమె మెడలో బాగా పేనిన ఖర్జూరపునార త్రాడు (మసద్‌) ఉంటుంది. 3

సూరహ్‌ అల్‌-ఇ’ఖ్లా’స్‌ – అల్‌-ఇ’ఖ్లా’స్‌: The Purity, దృఢ విశ్వాసం. దీని మరోక పేరు అత్‌-తౌ’హీద్‌ – ఏక దైవత్వం. ఈ సూరహ్‌ ఖుర్‌ఆన్‌ యొక్క సారం అనబడుతుంది. దైవప్రవక్త (‘స’అస) దీనిని 1/3 ఖుర్‌ఆన్‌ అన్నారు. ఈ సూరహ్‌ను రాత్రిపూట చదవమని ప్రోత్సహించారు. (‘స’హీ’హ్‌ బు’ఖారీ). ముష్రికులు దైవప్రవక్త (‘స’అస)ను నీ ప్రభువు లక్షణాలు చెప్పమని ప్రశ్నించినప్పుడు ఈ సూరహ్‌ అవతరింపజేయబడింది (ముస్నద్‌ అ’హ్‌మద్‌ 5/133-134). ఈ సూరహ్‌ మొదటి మక్కహ్ కాలంలో అవతరింపజేయబడింది. కొందరు ‘స’హాబీలు ప్రతి రక’అత్‌లో ఇతర సూరహ్‌ల తరువాత ఈ సూరహ్‌ను చదివేవారు. దానికి దైవప్రవక్త (‘స’అస) అన్నారు: “ఈ సూరహ్‌ పట్ల మీ ప్రేమ మిమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తుంది.” (బు’ఖారీ, ముస్లిం). 4 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు దీని తాత్పర్యం నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 112:1 – قُلْ هُوَ اللَّـهُ أَحَدٌ ١

ఇలా అను: “ఆయనే అల్లాహ్‌! ఏకైకుడు. 1

112:2 – اللَّـهُ الصَّمَدُ ٢

“అల్లాహ్‌! ఎవరి అక్కరా లేనివాడు. 2

112:3 – لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ ٣

“ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించినవాడునూ) కాడు.

112:4 – وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ ٤

“మరియు (సర్వ లోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు.” 3

సూరహ్‌ అల్‌-ఫలఖ్‌ – అల్‌-ఫలఖ్‌: The Day Break, ‘సుబ్‌’హున్‌, ఉదయం, ప్రాతఃకాలము, ప్రభాతం, వేకువజాము, తెల్లవారుజాము, అరుణోదయం. ఇది మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌. ఈ సూరహ్‌ (113) మరియు దీని తరువాత సూరహ్‌ అన్‌-నాస్‌ (114)ల యొక్క ఘనతలు ఎన్నో ‘హదీస్‌’లలో పేర్కొనబడ్డాయి. దైవప్రవక్త (‘స’అస) అన్నారు: “ఈ రాత్రి నాపై కొన్ని ఆయాతులు అవతరింపజేయబడ్డాయి. ఇటువంటి వాటిని నేను ఎన్నడూ వినలేదు.” ఆ తరువాత అతను ఈ రెండు సూరహ్‌లు పఠించారు (‘స. ముస్లిం, తిర్మిజీ’). దైవప్రవక్త (‘స’అస) మానవుల మరియు జిన్నాతుల దిష్టి నుండి శరణు కోరేవారు. ఈ రెండు సూరహ్‌లు అవతరింపజేయబడిన తరువాత అతను వీటిని నిత్యం చదివే వారు, (తిర్మిజీ’, అల్బానీ – ప్రమాణీకం నం. 2150). ‘ఆయి’షహ్‌ (ర. ‘అన్హా) కథనం: అతనికి ఏదైనా కష్టం కలిగితే, మ’ఊజ’తేన్‌ (అల్‌-ఫలఖ్‌, అన్‌-నాస్‌), సూరహ్‌లు చదివి తమ దేహంపై ఊదుకునే వారు. అతని కష్టం అధికమైతే, నేను ఈ సూరహ్‌లు చదివి నా చేతులను అతని శరీరం మీద పోనిచ్చే దానిని. (బు’ఖారీ, ముస్లిం).

దైవప్రవక్త (‘స’అస)కు చేతబడి చేసినప్పుడు జిబ్రీల్‌ (‘అ.స.) వచ్చి అతనితో ఈ రెండు సూరహ్‌లు చదవమన్నారు. దానితో, ఆ చేతబడి ప్రభావం దూరమయ్యింది (‘స. బు’ఖారీ, ముస్లిం). దైవప్రవక్త (‘స’అస) ప్రతిరోజూ రాత్రి నిద్రపోకముందు సూ. అల్‌-ఇ’ఖ్లా’స్‌ (112) మరియు ఈ రెండు సూరహ్‌లు చదివి తమ అరచేతులపై ఊది, వాటితో పూర్తి శరీరం మీద పూసుకునే వారు. మొదట నెత్తి, తరువాత ముఖం, ఆ తరువాత శరీరమంతా. (‘స’హీ’హ్‌ బు’ఖారీ). 5 ఆయాతులున్నఈ సూరహ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 113:1 – قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ١

ఇలా అను: “నేను ఉదయకాలపు ప్రభువు అయిన (అల్లాహ్‌) శరణు వేడుకుంటున్నాను.

113:2 – مِن شَرِّ مَا خَلَقَ ٢

“ఆయన సృష్టించిన ప్రతిదాని కీడునుండి; 1

113:3 – وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ٣

“మరియు చిమ్మ చీకటి కీడునుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో! 2

113:4 – وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ٤

“మరియు ముడుల మీద మంత్రించి ఊదేవారి కీడు నుండి; 3

113:5 – وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ٥

“మరియు అసూయపరుడి కీడునుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో!” 4

సూరహ్‌ అన్‌-నాస్‌ – అన్‌-నాస్‌: Mankind, మానవులు, జనులు. సూరహ్ అల్‌-ఫలఖ్‌ (113) తో పాటు, ఈ సూరహ్‌ మక్కహ్ లో అవతరింపజేయబడింది. మానవుని హృదయంలో ఉండే కీడు నుండి మరియు ఇతరుల హృదయాలలో ఉండే కీడు నుండి శరణుకోరుకోమని ప్రబోధించబడింది. దీని ఘనత ఇంతకు ముందు సూరహ్‌లో పేర్కొనబడింది. ఒకసారి దైవప్రవక్త (‘స’అస) నమా’జ్‌ చేస్తుండగా అతనికి తేలుకుట్టింది. నమా’జ్‌ పూర్తి చేసిన తరువాత అతను నీటిలో ఉప్పు కలిపి గాయం మీద పూస్తూ సూ.అల్‌-కాఫిరూన్ (109) సూ. అల్‌-ఇ’ఖ్లా’స్‌ (112) మరియు సూ. అన్‌-నాస్‌ (114) సూరహ్‌లు చదివారు. (ముజమ్మ’అ అ’జ్జవాయి’ద్‌, 5/111). 6 ఆయాతులున్నఈ సూరహ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ – 114:1 – قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ ١

ఇలా అను: “నేను మానవుల ప్రభువు (అల్లాహ్‌) ను శరణుకై వేడుకుంటున్నాను! 1

114:2 – مَلِكِ النَّاسِ ٢

“మానవుల సార్వభౌముడు! 2

114:3 – إِلَـٰهِ النَّاسِ ٣

“మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్‌ యొక్క శరణు)!

114:4 – مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ ٤

“కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడునుండి;

114:5 – الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ ٥

“ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో! 3

114:6 – مِنَ الْجِنَّةِ وَالنَّاسِ ٦

“వాడు జిన్నాతులలోనివాడూ కావచ్చు లేదా మానవులలోనివాడూ కావచ్చు! 4