హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 8.4 వలీమా

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 8. నికాహ్ పుస్తకం, 4వ అధ్యాయం: వలీమా. ఈ అధ్యాయంలో 13 హదీసులు (హదీసు 892 – 904) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

باب الوليمة

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

892

హదీసు 892

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ ‏- رضى الله عنه ‏- { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-رَأَى عَلَى عَبْدِ اَلرَّحْمَنِ بْنِ عَوْفٍ أَثَرَ صُفْرَةٍ , فَقَالَ : " مَا هَذَا ? " , قَالَ : يَا رَسُولَ اَللَّهِ ! إِنِّي تَزَوَّجْتُ اِمْرَأَةً عَلَى وَزْنِ نَوَاةٍ مِنْ ذَهَبٍ.‏ قَالَ : " فَبَارَكَ اَللَّهُ لَكَ , أَوْلِمْ وَلَوْ بِشَاةٍ } مُتَّفَقٌ عَلَيْهِ , وَاللَّفْظُ لِمُسْلِمٍ.

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) దుస్తులపై పసుపు పచ్చని రంగును చూచి “ఇదేమిటీ?” అని అడిగారు. “ఓ దైవప్రవక్తా ﷺ! నేను ఒక స్త్రీకి ఖర్జూరపు విత్తనమంత బంగారాన్ని మహర్‌గా ఇచ్చి వివాహమాడాను” అని అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) చెప్పారు. దానికాయన ﷺ “అల్లాహ్ నీకు శుభమొసగుగాక! ఒక మేకనయినాసరే కోసి వలీమా విందు తప్పకుండా చెయ్యి” అని అన్నారు. (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి)

English

Narrated Anas bin Malik (RA): The Prophet (ﷺ) saw the trace of yellow color on 'Abdur-Rahman bin 'Auf (RA) and asked, "What is this?" He replied, "O Messenger of Allah, I have married a woman for a Nawat weight (equal to one weight of a date-stone) of gold." He said. "May Allah bless you! Hold a wedding feast, even if with a sheep (only)." [Agreed upon; the wording is Muslim's].

సారాంశం

వధూవరులు పరస్పరం ఏకం కావడాన్ని ‘వలీమా’ అంటారు. వారు తమ ఈ అన్యోన్య కలయికకు సంకేతంగా వలీమా విందును ఏర్పాటు చేయటం మస్నూన్ (సంప్రదాయం). కొంతమంది విద్వాంసులు ఈ వలీమా విందును వాజిబ్ (తప్పనిసరి)గా కూడా ఖరారు చేశారు.

వలీమా విందును వరుడు తన శక్తీ స్థోమతలకు తగ్గట్టుగా ఇవ్వవచ్చు. అయితే దుబారా ఖర్చు చేయకూడదు. దైవప్రవక్త ﷺ ఏర్పాటు చేసిన కొన్ని వలీమా విందుల్లో ఒక మేక కన్నా తక్కువ మాంసం ఉండేది. హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) ఆర్థిక స్థోమత దృష్ట్యా ఒక మేక కోయటం తక్కువ ఖర్చు క్రిందికే వస్తుంది. చివరకు చెప్పొచ్చేదేమిటంటే మనిషి తన స్థోమతను బట్టి వలీమాను ఏర్పాటు చేయవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.4 వలీమా|హదీసు 892

893

హదీసు 893

وَعَنْ اِبْنِ عُمَرَ ‏- رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا دُعِيَ أَحَدُكُمْ إِلَى اَلْوَلِيمَةِ فَلْيَأْتِهَا } مُتَّفَقٌ عَلَيْهِ. وَلِمُسْلِمٍ : { إِذَا دَعَا أَحَدُكُمْ أَخَاهُ , فَلْيُجِبْ; عُرْسًا كَانَ أَوْ نَحْوَهُ }.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: “మీలో ఎవరినయినా వలీమా విందుకు ఆహ్వానిస్తే అతడు ఆ విందుకు వెళ్ళాలి” (బుఖారీ, ముస్లిం). ముస్లింలోని ఉల్లేఖనంలో ఉంది – “మీలో ఎవరికయినా అతని సోదరుని తరపున ఆహ్వానం అందితే ఆ ఆహ్వానాన్ని స్వీకరించాలి – అది పెళ్ళి ఆహ్వానమైనాసరే, అలాంటిదే మరోవిధమైన ఆహ్వానమైనా సరే!”

English

Narrated Ibn 'Umar (RA): Allah's Messenger (ﷺ) said: "When one of you is invited to a wedding feast he must attend it." [Agreed upon].

Muslims has: "When one of you invites his brother, he must respond (i.e. attend), whether it is a wedding or something similar."

సారాంశం

వివాహ సందర్భంగా అందే వలీమా ఆహ్వానాన్ని అందుకోవటం తప్పనిసరి అని ఈ హదీసు చెబుతోంది. అత్యధిక మంది ఉలమా అభిప్రాయం కూడా ఇదే. అయితే ఆ ఆహ్వానంలో పాల్గొనడానికి ఏదయినా విషయం అవరోధంగా ఉంటే అప్పుడు దాన్ని బహిష్కరించవచ్చు. ఉదాహరణకు: విందు భోజనం అనుమానాస్పదం అయివుంటే లేదా ప్రత్యేకంగా ధనవంతులు, పలుకుబడి గలవారు మాత్రమే ఆ విందుకు ఆహ్వానించబడి ఉంటే, లేదా ఏదైనా అధర్మ కార్యంలో సహాయ సహకారాలు పొందే ఉద్దేశ్యంతో ఆహ్వానం ఇవ్వబడి ఉంటే లేదా షరీయత్‌కు విరుద్ధంగా గల పోకడలు ఆ సదనంలో జరుగుతూ ఉంటే అట్టి విందును బహిష్కరించటమే మంచిది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.4 వలీమా|హదీసు 893

894

హదీసు 894

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ شَرُّ اَلطَّعَامِ طَعَامُ اَلْوَلِيمَةِ: يُمْنَعُهَا مَنْ يَأْتِيهَا , وَيُدْعَى إِلَيْهَا مَنْ يَأْبَاهَا , وَمَنْ لَمْ يُجِبِ اَلدَّعْوَةَ فَقَدْ عَصَى اَللَّهَ وَرَسُولَهُ } أَخْرَجَهُ مُسْلِمٌ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: ఏ వలీమా విందులో వచ్చేవారిని (అగత్యపరులను) అడ్డుకోవటం జరుగుతుందో, రావడానికి నిరాకరించే వారిని (పదే పదే) ఆహ్వానించటం జరుగుతుందో ఆ వలీమా విందు అత్యంత నీచమైనది. కాగా; వలీమా ఆహ్వానాన్ని స్వీకరించనివాడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ధిక్కరించాడు.” (ముస్లిం)

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "The worst kind of food is that at a wedding feast from which those who come (i.e. the poor) are turned away, and to which those who refuse (i.e. the rich) are invited. If anyone does not accept an invitation he has disobeyed Allah and His Messenger." [Reported by Muslim].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.4 వలీమా|హదీసు 894

895

హదీసు 895

وَعَنْهُ قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا دُعِيَ أَحَدُكُمْ فَلْيُجِبْ ; فَإِنْ كَانَ صَائِمًا فَلْيُصَلِّ , وَإِنْ كَانَ مُفْطِرًا فَلْيُطْعَمْ } أَخْرَجَهُ مُسْلِمٌ أَيْضًا. وَلَهُ مِنْ حَدِيثِ جَابِرٍ نَحْوُهُ. وَقَالَ : { فَإِنْ شَاءَ طَعِمَ وَإِنْ شَاءَ تَرَكَ }.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారిదే ఇంకొక కథనం : దైవప్రవక్త ﷺ ప్రబోధించారు – “మీలో ఎవరికయినా వలీమా ఆహ్వానం అందితే దాన్ని స్వీకరించాలి. ఒకవేళ అతడు (ఆహ్వానితుడు) ఉపవాసం ఉంటే (ఆహ్వానించిన వానికోసం) దుఆ చేయాలి. ఉపవాస స్థితిలో లేకుంటే మాత్రం విందు భోజనం చేయాలి.” (ముస్లిం)

ముస్లింలో హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) చే కూడా ఇలాగే ఉల్లేఖించబడింది. అందులో ఆయన ﷺ ఇలా చెప్పారని ఉంది – “అతడు కోరితే భోజనం చేయవచ్చు. లేకుంటే వదలివేయవచ్చు.”

English

Narrated [Abu Hurairah (RA)]: Allah's Messenger (ﷺ), "When one of you is invited (to a meal) he must accept. If he is fasting he should pray (i.e. make supplication for the host) and if he is not fasting he should eat." [Muslim reported it too].

Muslim has something similar to the above from the Hadith of Jabir (RA), it goes: "If he wishes he may eat, and if he wishes he may leave (the food alone)."

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.4 వలీమా|హదీసు 895

896

హదీసు 896

وَعَنْ اِبْنِ مَسْعُودٍ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ طَعَامُ الْوَلِيمَةِ أَوَّلَ يَوْمٍ حَقٌّ , وَطَعَامُ يَوْمِ اَلثَّانِي سُنَّةٌ, وَطَعَامُ يَوْمِ اَلثَّالِثِ سُمْعَةٌ ، وِمَنْ سَمَّعَ سَمَّعَ اللهُ بِهِ " " } رَوَاهُ اَلتِّرْمِذِيُّ وَاسْتَغْرَبَهُ , وَرِجَالُهُ رِجَالُ اَلصَّحِيحِ. وَلَهُ شَاهِدٌ : عَنْ أَنَسٍ عِنْدَ اِبْنِ مَاجَهْ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) చెప్పారు : “వలీమా భోజనం మొదటి రోజు విధి. రెండవ రోజు సున్నత్. మూడవ రోజు భోజనం ప్రదర్శన కోసం, పరువు ప్రతిష్ఠల కోసం పెట్టే భోజనమే అవుతుంది. ఎవరయితే కుహనా ప్రతిష్ఠల కోసం ప్రాకులాడుతాడో అతణ్ణి అల్లాహ్ శిక్షిస్తాడు.” (ఈ ఉల్లేఖనాన్ని తిర్మిజీ ఉల్లేఖించి, దీనిని ‘అరుదైనది’గా ఖరారు చేశారు. వాస్తవానికి ఈ హదీసును అందజేసిన వారు సహీహ్ హదీసు ఉల్లేఖకుల కోవకు చెందినవారే. ఇబ్నెమాజాలో హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) గారి ఒక హదీసు దీనికి సాక్షిగా ఉంది.

English

Narrated Ibn Mas'ud (RA): Allah's Messenger (ﷺ) said: "The food of Walima on the first day is a duty, that on the second day is a Sunnah, while the third is showing off. Whoever (does something) to show-off, Allah will expose him (in the Hereafter)." [Reported by at-Tirmidhi who considered it Gharib (transmitted through a single narrator)]. [It is incorrectly claimed that] its narrators are those who are reported from in the Sahih (collection of al-Bukhari)].

This Hadith also has a supporting narration collected by Ibn Majah on the authority of Anas (RA).

సారాంశం

రెండు రోజుల వరకూ వలీమా విందును ఏర్పాటు చేయవచ్చుననీ, మూడవ రోజు కూడా వలీమా విందు చేస్తే అది బడాయిని చాటుకోవటం క్రిందికే వస్తుందని ఈ హదీసు చెబుతోంది. అయితే మూడవ రోజు కూడా మొదటి రెండు రోజుల్లో ఆహ్వానించిన వారినే పిలిస్తే అప్పుడది విపరీత విషయంగానీ, కొత్త వారిని ఆహ్వానిస్తే తప్పులేదని మరి కొంతమంది అభిప్రాయపడ్డారు. ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారైతే ఏడు రోజుల దాకా వలీమా విందు చేయవచ్చుని అభిప్రాయపడ్డారు. హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) గారి ఈ హదీసుపై హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ఏమంటారంటే; “దీని ఉల్లేఖకుల మాట పునఃపరిశీలించ దగినది. ఈ అధ్యాయం క్రింద వచ్చిన మరికొన్ని హదీసులు కూడా చర్చనీయాంశాలే.” (సుబుల్)

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.4 వలీమా|హదీసు 896

897

హదీసు 897

وَعَنْ صَفِيَّةَ بِنْتِ شَيْبَةَ قَالَتْ : { أَوْلَمَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-عَلَى بَعْضِ نِسَائِهِ بِمُدَّيْنِ مِنْ شَعِيرٍ } أَخْرَجَهُ اَلْبُخَارِيُّ.

హజ్రత్ సఫియా బిన్తె షైబ (రదియల్లాహు అన్హా) కథనం : “దైవప్రవక్త ﷺ తన సతీమణుల్లో కొందరి వలీమా విందు కేవలం రెండు ‘ముద్’ల శిష్ట గోధుమలతో సరిపెట్టుకున్నారు.” (బుఖారీ)

English

Narrated Safiya (RA), daughter of Shaiba: The Prophet (ﷺ) held a wedding feast for one of his wives with two Mudd of barley. [Reported by al-Bukhari].

సారాంశం

ఒక వ్యక్తి ఒకటికన్నా ఎక్కువ నికాహ్‌లు చేసుకున్నప్పుడు వలీమాలన్నీ ఒకే స్థాయిలో చేయాలని ఎక్కడా లేదు. ఆనాటి ఆర్థిక స్థితిగతులను బట్టి, పరిస్థితులనుబట్టి తగు రీతిలో వలీమా విందును ఏర్పాటు చేయవచ్చు. ఆయన ﷺ ఒక్కోసారి వలీమాలో మేక మాంసం పెట్టారు, కొన్నిసార్లు గోధుమ పిండితోనే విందు ఇచ్చారు. హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) గారి వలీమాలోనయితే కేవలం రెండు ‘ముద్’ల శిష్ట గోధుమలనే సమర్పించారు.

హదీసు ఉల్లేఖకులు

సఫియా బిన్తె షైబ బిన్ ఉస్మాన్ బిన్ అబూ తల్హా (రదియల్లాహు అన్హా) అబ్దుద్దార్ తెగకు చెందినవారు. ఈమె గారు దైవప్రవక్త ﷺను చూచారని ఒక కథనముండగా, చూడలేదని మరో కథనం ఉంది. ఈమె తాబయియా మాత్రమేనని ఇబ్నె సాద్ ఖచ్చితంగా చెప్పారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.4 వలీమా|హదీసు 897

898

హదీసు 898

وَعَنْ أَنَسٍ قَالَ : { أَقَامَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-بَيْنَ خَيْبَرَ وَالْمَدِينَةِ ثَلَاثَ لَيَالٍ , يُبْنَى عَلَيْهِ بِصَفِيَّةَ , فَدَعَوْتُ اَلْمُسْلِمِينَ إِلَى وَلِيمَتِهِ , فَمَا كَانَ فِيهَا مِنْ خُبْزٍ وَلَا لَحْمٍ , وَمَا كَانَ فِيهَا إِلَّا أَنْ أَمَرَ بِالْأَنْطَاعِ , فَبُسِطَتْ , فَأُلْقِيَ عَلَيْهَا اَلتَّمْرُ , وَالْأَقِطُ , وَالسَّمْنُ.‏ } مُتَّفَقٌ عَلَيْهِ , وَاللَّفْظُ لِلْبُخَارِيِّ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ ఖైబర్ మరియు మదీనాల మధ్య దారిలో మూడు రోజులు గడిపారు. ఈ సందర్భంగానే ఆయన ﷺ సఫియా (రదియల్లాహు అన్హా) తో రాత్రి గడిపారు. నేను మరునాడు దైవప్రవక్త ﷺ తరపున ముస్లిములను వలీమా విందుకు పిలిచాను. ఆ విందు భోజనంలో రొట్టెగానీ, మాంసం గానీ లేదు. ఆ ఉత్సవంలో ఆయన ﷺ సూచనానుసారం చాప (లేదా చర్మ వస్త్రం) పరచబడింది. దానిపై ఖర్జూర పండ్లు, జున్ను ముక్కలు, నెయ్యి వడ్డించబడ్డాయి.” (బుఖారీ, ముస్లిం – వాక్యాలు బుఖారీలోనివి)

English

Narrated Anas (RA): The Prophet (ﷺ) stayed three nights between Khaibar and al-Madinah when he consummated his marriage with Safiya (RA). I called the Muslims to his wedding feast which did not include bread or meat. He just ordered some leather dining sheets to be spread, and [Hais, a food made from] dates, sun-baked yogurt and butter were thrown on them. [Agreed upon: the wording is al-Bukhari's].

సారాంశం

ప్రయాణావస్థలో కూడా పెళ్ళి చేసుకోవటం ధర్మసమ్మతమేనని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. ఈ లెక్కన వివాహమహోత్సవానికి బంధువులు, ఆత్మీయులందరినీ పిలవటం అవశ్యం కూడా కాదు. వలీమా విందులో ఒకటికన్నా ఎక్కువ వంటకాలు వడ్డించవచ్చునని కూడా ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. అయితే దుబారా ఖర్చు కూడదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.4 వలీమా|హదీసు 898

899

హదీసు 899

وَعَنْ رَجُلٍ مِنْ أَصْحَابِ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ : { إِذَا اِجْتَمَعَ دَاعِيَانِ , فَأَجِبْ أَقْرَبَهُمَا بَابًا , فَإِنْ سَبَقَ أَحَدُهُمَا فَأَجِبِ اَلَّذِي سَبَقَ } رَوَاهُ أَبُو دَاوُدَ , وَسَنَدُهُ ضَعِيفٌ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని ప్రవక్త సహచరులలోని ఒక సహచరుడు తెలిపారు – “ఇద్దరు వ్యక్తులు భోజనానికి ఆహ్వానిస్తే వారిలో ఎవరి గడప మీ ఇంటికి మరీ దగ్గరవుందో వారి ఆహ్వానాన్ని స్వీకరించండి. ఆ ఇరువురిలో ఎవరు ముందు ఆహ్వానిస్తే వారి ఆహ్వానాన్ని సమ్మతించి ఆమోదించండి.” (దీనిని అబూదావూద్ ఉల్లేఖించారు – ఇది అందిన తీరు బలహీనంగా ఉంది)

English

Narrated a Companion of the Prophet (ﷺ): "When two people come together to issue an invitation, accept that of the one whose door is nearer to you. However, if one of them comes before the other, accept the invitation of the first." [Reported by Abu Dawud, its chain of narrators is weak].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.4 వలీమా|హదీసు 899

900

హదీసు 900

وَعَنْ أَبِي جُحَيْفَةَ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا آكُلُ مُتَّكِئًا } رَوَاهُ اَلْبُخَارِيُّ.

హజ్రత్ అబూ జుహైఫా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “నేను భోజనం చేసే సమయంలో దేనికీ ఆనుకోను.” (బుఖారీ)

English

Narrated Abu Juhaifah (RA): Allah's Messenger (ﷺ) said: "I do not eat Muttaki'an (sitting with support of something, so as to eat more)." [Reported by al-Bukhari].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.4 వలీమా|హదీసు 900

901

హదీసు 901

وَعَنْ عُمَرَ بْنِ أَبِي سَلَمَةَ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ لِي رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ يَا غُلَامُ ! سَمِّ اَللَّهَ , وَكُلْ بِيَمِينِكَ , وَكُلْ مِمَّا يَلِيكَ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ ఉమర్ బిన్ అబూ సలమా (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ నన్నుద్దేశించి, “అబ్బాయి! అల్లాహ్ పేరుతో తినటం మొదలెట్టు. నీ కుడిచేత్తో తిను. నీకు దగ్గరున్న పదార్థాన్ని తీసుకుని తిను” అని ఉపదేశించారు. (బుఖారీ, ముస్లిం)

English

Narrated 'Umar bin Abu Salamah (RA): Allah's Messenger (ﷺ) said to me, "Dear child, mention Allah's Name, eat with your right hand, and eat from what is next to you." [Agreed upon].

సారాంశం

భోజనానికి కూర్చున్నప్పుడు అన్నింటికన్నా ముందు బిస్మిల్లాహ్ పలికి, కుడిచేత్తో తినాలనీ, ఒక కంచంలో ఒకరికన్నా ఎక్కువ మంది భుజిస్తున్నప్పుడు తమకు ముందున్న ఆహార పదార్థాన్ని తీసుకుని తినాలని ఈ హదీసు వల్ల స్పష్టమవుతున్నది. అయితే ఒకటి కన్నా ఎక్కువ ఆహార పదార్థాలు ముందున్నప్పుడు ఎవరికి నచ్చిన వెరైటీని వారు తీసుకోవచ్చు.

హదీసు ఉల్లేఖకులు

ఉమర్ బిన్ అబూ సలమా (రదియల్లాహు అన్హు) : ఉమర్ బిన్ అబూ సలమా అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ అసద్ బిన్ హిలాల్ మఖ్జూమీ. ఈయన ఉమ్ముల్ మోమినీన్ హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) పుత్ర రత్నం. దైవప్రవక్త ﷺ శిక్షణలో ఆరితేరారు. అబిసీనియాలో జన్మించారు. ఈయన జననం అబిసీనియా హిజ్రత్‌కు – మదీనా హిజ్రత్‌కు మధ్య కాలంలో జరిగింది. హిజ్రీ 83లో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.4 వలీమా|హదీసు 901

902

హదీసు 902

وَعَنْ اِبْنِ عَبَّاسٍ ; { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-أُتِيَ بِقَصْعَةٍ مِنْ ثَرِيدٍ، فَقَالَ : "كُلُوا مِنْ جَوَانِبِهَا, وَلَا تَأْكُلُوا مِنْ وَسَطِهَا, فَإِنَّ اَلْبَرَكَةَ تَنْزِلُ فِي وَسَطِهَا } رَوَاهُ اَلْأَرْبَعَةُ , وَهَذَا لَفْظُ النَّسَائِيِّ , وَسَنَدُهُ صَحِيحٌ. وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ : { مَا عَابَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-طَعَامًا قَطُّ , كَانَ إِذَا اِشْتَهَى شَيْئًا أَكَلَهُ , وَإِنْ كَرِهَهُ تَرَكَهُ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ సమక్షంలోకి ‘సరీద్’ అనే వంటకంతో నింపబడిన ఒక పాత్ర తేబడింది. అప్పుడాయన ﷺ, “పాత్ర అంచుల్లో నుంచి తీసుకుని తినండి. మధ్య నుండి తీసుకోకండి. ఎందుకంటే, సమృద్ధి (బరకత్) వర్షించేది మధ్య భాగంలోనే” అని ఉపదేశించారు. (దీనిని నలుగురు ఉల్లేఖించారు- హదీసు వాక్యాలు మాత్రం ‘నసాయి’ లోనివి. ఇది అందిన తీరు ప్రమాణబద్ధమైనది)

902. (అ) హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఎన్నడూ భోజనంలోని లోపాన్ని ఎత్తి చూపలేదు. ఏదైనా పదార్థాన్ని తినదలచుకుంటే తినేవారు. రుచించకపోతే తినేవారు కారు. (బుఖారీ, ముస్లిం)

English

Narrated Ibn 'Abbas (RA): The Prophet (ﷺ) was brought a dish containing Tharid and said, "Eat from its side and not from the middle, for the blessing descends in the middle of it." [Reported by al-Arba'a. This is the wording of an-Nasa'i. Its chain of narrators is Sahih (authentic)].

Abu Huraira reported that Allah's Messenger (ﷺ) never found fault with food (served to him). If he liked anything, he ate it and if he did not like it he left it. [Agreed upon]

సారాంశం

భోజన సందర్భంగా లోపాలను ఎత్తిచూపటం, వంటకాలపై వంకలు పెట్టడం సముచితం కాదని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. ఇష్టముంటే తినాలి. ఏదైనా వంటకం తన అభిరుచికి అనుగుణంగా లేకుంటే – మౌనంగానే – దాన్ని వదలివేయాలి. అంతేగాని వంట చేసిన వారిని నిరుత్సాహపరచే మాటలనడంగాని, ఆతిథ్యం ఇచ్చిన వారి మనసు నొప్పించే విధంగా ఏదైనా చెప్పటం గానీ చేయరాదు. ఇలా చేయటం వల్ల వండబడిన దైవప్రసాదితం పట్ల వైముఖ్య ధోరణిని కనబరచినట్లవుతుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.4 వలీమా|హదీసు 902

903

హదీసు 903

وَعَنْ جَابِرٍ , عَنِ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ : { لَا تَأْكُلُوا بِالشِّمَالِ ; فَإِنَّ اَلشَّيْطَانَ يَأْكُلُ بِالشِّمَالِ } رَوَاهُ مُسْلِمٌ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) తెలిపారు : “ఎడమ చేత్తో తినకండి. ఎందుకంటే షైతాన్ ఎడమ చేత్తో తింటాడు.” (ముస్లిం)

English

Narrated Jabir (RA): The Prophet (ﷺ) said: "Do not eat with the left hand, for the devil eats with the left hand." [Reported by Muslim].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.4 వలీమా|హదీసు 903

904

హదీసు 904

وَعَنْ أَبِي قَتَادَةَ ‏- رضى الله عنه ‏- أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ : { إِذَا شَرِبَ أَحَدُكُمْ , فَلَا يَتَنَفَّسْ فِي اَلْإِنَاءِ } مُتَّفَقٌ عَلَيْهِ. وَلِأَبِي دَاوُدَ : عَنْ اِبْنِ عَبَّاسٍ نَحْوُهُ , وَزَادَ : { أَوْ يَنْفُخْ فِيهِ } وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ.

దైవప్రవక్త ﷺ ఉపదేశించారని హజ్రత్ అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : “మీలో ఎవరయినా సరే పానీయం త్రాగుతున్నప్పుడు పాత్రలో గాలి పీల్చరాదు.” (బుఖారీ, ముస్లిం) ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా)చే అబూదావూద్‌లోనూ ఇలాగే ఉల్లేఖించబడింది. అయితే “అందులో ఊదరాదు” అన్న వాక్యం అదనంగా ఉంది.

English

Narrated Abu Qatadah (RA): The Prophet (ﷺ) said: "When one of you drinks, he must not breathe into the vessel." [Agreed upon].

Abu Dawud reported something similar from Ibn 'Abbas (RA) and he added: "or blow into it," [at-Tirmidhi graded it Sahih (authentic)].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.4 వలీమా|హదీసు 904