హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 12.3 అఖీఖా

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 12. అన్నపానీయాల పుస్తకం, 3వ అధ్యాయం: అఖీఖా. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 1168 – 1170) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

باب العقيقة

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

1168

హదీసు 1168

عَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-عَقَّ عَنْ اَلْحَسَنِ وَالْحُسَيْنِ كَبْشًا كَبْشًا } رَوَاهُ أَبُو دَاوُدَ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ, وَابْنُ اَلْجَارُودِ, وَعَبْدُ اَلْحَقّ ِ. لَكِنْ رَجَّحَ أَبُو حَاتِمٍ إِرْسَالَه ُ. وَأَخْرَجَ اِبْنُ حِبَّانَ: مِنْ حَدِيثِ أَنَسٍ نَحْوَه ُ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ హసన్ (రదియల్లాహు అన్హు) మరియు హుసైన్ (రదియల్లాహు అన్హు)ల తరపున ఒక్కో పొట్టేలును కోసి, అఖీఖా చేశారు. (దీనిని అబూదావూద్ ఉల్లేఖించారు. ఇబ్నె ఖుజైమ, ఇబ్నె జారూద్, అబ్దుల్ హఖ్ దీన్ని ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు. అయితే ఈ హదీసు ‘ముర్సల్’అని అబూ హాతిమ్ నొక్కి చెప్పారు. ఇంకా ఇబ్నె హిబ్బాన్ కూడా హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఆధారంగా ఇలాగే ఉల్లేఖించారు).

English

Ibn 'Abbas (RAA) narrated, "The Messenger of Allah (ﷺ) slaughtered a ram for both al-Hasan and al-Husain (at their birth).' Related by Abu Dawud, Ibn Khuzaimah, Ibn al-Garud and 'Abdul Haqq graded it as Sahih.

but Abu Hatim said that it is most probably Mursal.

Ibn Hibban transmitted a similar hadith on the authority of Anas.

సారాంశం

పుట్టిన శిశువు తరపున జిబహ్ చేయబడే దానిని అఖీఖాగా వ్యవహరిస్తారు.

అయితే – గర్భస్థ శిశువు తలపై మొలిచే వెంట్రుకలను అసలు ‘అఖీఖా’ అంటారు. పుట్టిన శిశువుకు ఆ వెంట్రుకలు ఉన్న స్థితిలోనే పశువును జిబహ్ చేసి, శిరో ముండనం చేయటం జరుగుతుంది. పుట్టిన శిశువు మగ పిల్లవాడైనప్పటికీ అతని పేరున ఒక జంతువును జిబహ్ చేసినా సరిపోతుందని ఈ హదీసు ద్వారా బోధపడుతున్నది.

హదీసు ఉల్లేఖకులు

హుసైన్ (రదియల్లాహు అన్హు): ఈ హదీసులో ప్రస్తావనకు వచ్చిన హసన్ (రదియల్లాహు అన్హు) గురించి ఈ పుస్తకం మొదటి భాగం (నమాజ్ పుస్తకం)లో చెప్పుకున్నాము. ఇక హజ్రత్ హుసైన్ (రదియల్లాహు అన్హు) గురించి – ఈయన హజ్రత్ హసన్ సోదరులు. హజ్రత్ హసన్ (రదియల్లాహు అన్హు) కన్నా సుమారు ఏడాది చిన్నవారు. ఇద్దరూ దైవప్రవక్త ﷺ ముద్దుల మనవళ్ళు. హజ్రత్ హుసైన్ (రదియల్లాహు అన్హు) హిజ్రీ 61లో ముహర్రం 10వ తేదీన ఇరాక్‌లోని ‘కర్బలా’ కదన రంగంలో అమరగతి నొందారు. సదాచార సంపన్నులు; ప్రశంసలు, పొగడ్తలకు అతీతులు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|12. అన్నపానీయాల పుస్తకం|12.3 అఖీఖా|హదీసు 1168

1169

హదీసు 1169

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا; { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَمْرَهُمْ; أَنْ يُعَقَّ عَنْ اَلْغُلَامِ شَاتَانِ مُكَافِئَتَانِ, وَعَنْ اَلْجَارِيَةِ شَاةٌ } رَوَاهُ اَلتِّرْمِذِيُّ وَصَحَّحَه ُ. وَأَخْرَجَهُ أَحْمَدُ وَالْأَرْبَعَة ُ عَنْ أُمِّ كُرْزٍ الْكَعْبِيَّةِ نَحْوَه ُ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : మగ పిల్లవాని తరపున ఒకే విధమైన రెండు మేకలు, ఆడ పిల్ల తరపున ఒక మేకను కోసి అఖీఖా చేయవలసిందిగా దైవప్రవక్త ﷺ తన సహచరులకు ఆదేశించారు. (దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు. ప్రామాణికంగా కూడా ఖరారు చేశారు. అహ్మద్ మరియు ‘నలుగురు’ కూడా ఉమ్మె కుర్జ్ కాబియా ద్వారా ఇదే విధంగా ఉటంకించారు)

English

'Aishah (RAA) narrated, "Allah's Messenger (ﷺ) commanded them to slaughter two sheep equal (in age) for a boy and one for a girl at their birth.' Related by At-Tirmidhi and graded it as Sahih.

The Five Imams (Ahmad and the four Imams) transmitted a simialr hadith on the authority of Umm Kurz al-Ka-biyah.

సారాంశం

ఇది ‘జమ్హూర్’ దృష్టిలో అభిలషణీయం. అయితే అఖీఖాలో మగపిల్లవాడైతే రెండు మేకల్ని, ఆడపిల్ల అయితే ఒక మేకను జిబహ్ చేయాలని హదీసులో స్పష్టంగా చెప్పబడింది. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) దృష్టిలో ఈ ‘తేడా’ కనబరచనవసరం లేదు. అయితే ఆయన అభిప్రాయం ఈ హదీసుకు విరుద్ధంగా ఉంది. ఖుర్బానీ పశువుల మాదిరిగా అఖీఖా పశువుల విషయంలో కఠినమైన షరతులైతే లేవుగాని మొత్తమ్మీద అఖీఖా పశువులో కూడా పెద్ద లోపం ఏదీ ఉండకూడదు. ఖుర్బానీ పశువులలో ఏ ఏ లోపాలు ఉండకుండా జాగ్రత్తపడమని చెప్పబడిందో వాటిని ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవటం అభిలషణీయం. అఖీఖా సందర్భంగా జిబహ్ చేసే పశువు ‘ముసిన్నా’ (నిర్ణీత వయస్సుకు చేరినదై) ఉండాలన్న షరతు కూడా ఏ హదీసులోనూ లేదు. అయితే అది మరీ మేకపిల్ల అయి ఉండకూడదు. ఇక్కడ అరబీలో ‘షాతున్’ అనే పదం ప్రయోగించబడింది. దీన్నిబట్టి అది కనీసం మేక అనిపించేలా ఉంటే చాలు.

హదీసు ఉల్లేఖకులు

ఉమ్మె కుర్జ్ కాబియా (రదియల్లాహు అన్హా) : ఖుజాఅ తెగకు చెందిన మహిళ. అందుచేత ఈమె ఖుజాయియగా పిలువబడ్డారు. సహాబియా (ప్రవక్త సహచరురాలు). అనేక హదీసులు ఈమెచే ఉల్లేఖించబడ్డాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|12. అన్నపానీయాల పుస్తకం|12.3 అఖీఖా|హదీసు 1169

1170

హదీసు 1170

وَعَنْ سَمُرَةَ ‏- رضى الله عنه ‏- أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { "كُلُّ غُلَامٍ مُرْتَهَنٌ بِعَقِيقَتِهِ, تُذْبَحُ عَنْهُ يَوْمَ سَابِعِهِ, وَيُحْلَقُ, وَيُسَمَّى" } رَوَاهُ أَحْمَدُ وَالْأَرْبَعَةُ, وَصَحَّحَهُ اَلتِّرْمِذِيّ ُ.

హజ్రత్ సముర కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ప్రతి పిల్లవాడూ తన అఖీఖాకు బదులు ‘తాకట్టు’గా ఉన్నాడు. పుట్టిన ఏడవ రోజున అతని అఖీఖా చేయాలి.శిరోముండనం చేయించాలి. అతనికి పేరు పెట్టాలి. (దీనిని అహ్మద్ మరియు ‘నలుగురు’ ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు)

English

Samurah (RAA) narrated that Allah's Messenger (ﷺ) said: "Every boy is pawned against his 'Aqiqah, to be slaughtered on his behalf on the seventh day of his birth, his head is to be shaved, and he must be given a name." Related by the five Imams (Ahmad and the four Imams). At-Tirmidhi graded it as Sahih.

సారాంశం

పిల్లవాడు పుట్టిన ఏడవ రోజున అతని తలపైని వెంట్రుకలను తొలగించి, తలకు స్నానం చేయించాలని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. మరి అదే రోజున అతని అఖీఖా చేయటంతో పాటు, అతనికి నామకరణం కూడా చేయటం మంచిది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|12. అన్నపానీయాల పుస్తకం|12.3 అఖీఖా|హదీసు 1170