హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 12.1 జంతు వేట

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 12. అన్నపానీయాల పుస్తకం, 1వ అధ్యాయం: జంతు వేట. ఈ అధ్యాయంలో 13 హదీసులు (హదీసు 1147 – 1159) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

12.1 జంతు వేట

↑ విషయ సూచిక

باب الصيد والذبائح

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

1147

హదీసు 1147

عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ "مَنِ اتَّخَذَ كَلْباً, إِلَّا كَلْبَ مَاشِيَةٍ, أَوْ صَيْدٍ, أَوْ زَرْعٍ, اِنْتَقَصَ مِنْ أَجْرِهِ كُلَّ يَوْمٍ قِيرَاطٌ" } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “ఎవరయినాసరే పశువులను, సంపదను కాపాడుకునే ఉద్దేశ్యంతో పెంచుకునే కుక్కలు లేదా వేట కుక్కలు లేదా వ్యవసాయోత్పత్తుల పరిరక్షణకై ఉద్దేశ్యించిన కుక్కలు తప్ప వేరితర కుక్కను (సరదా కోసం) పెంచుకుంటే అతని పుణ్యంలో నుంచి ప్రతి రోజూ ఒకింత పుణ్యం తగ్గుతూ పోతుంది.” (బుఖారీ, ముస్లిం)

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: 'If anyone owns a dog except a sheepdog, a hunting dog, or a farm dog, a carat of his reward will be deducted daily." Agreed upon.

సారాంశం

మనోరంజన కోసం, కాలక్షేపం కోసం, కుహనా ప్రతిష్ఠల కోసం కుక్కను పెంచటం నిషిద్ధమని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. వ్యవసాయోత్పత్తుల, పాడిపంటల పరిరక్షణ కోసం, పశు సంపదను దొంగలబారి నుండి, శత్రువుల బారినుండి కాపాడుకునేందుకు కుక్కను పెంచుకుంటే తప్పులేదు. కేవలం సరదా కోసం గనక కుక్కను పోషిస్తే అనుదినం ఒక్కో యూనిట్ చొప్పున అతని పుణ్యం తగ్గుతూ ఉంటుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|12. అన్నపానీయాల పుస్తకం|12.1 జంతు వేట|హదీసు 1147

1148

హదీసు 1148

وَعَنْ عَدِيِّ بنِ حَاتِمٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ لِي رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ "إِذَا أَرْسَلَتَ كَلْبَكَ فَاذْكُرِ اسْمَ اَللَّهِ عَلَيْهِ, فَإِنْ أَمْسَكَ عَلَيْكَ فَأَدْرَكْتَهُ حَيًّا فَاذْبَحْهُ, وَإِنْ أَدْرَكْتَهُ قَدْ قُتِلَ وَلَمْ يَأْكُلْ مِنْهُ فَكُلْهُ, وَإِنْ وَجَدْتَ مَعَ كَلْبِكَ كَلْبًا غَيْرَهُ وَقَدْ قُتِلَ فَلَا تَأْكُلْ: فَإِنَّكَ لَا تَدْرِي أَيَّهُمَا قَتَلَهُ, وَإِنْ رَمَيْتَ بِسَهْمِكَ فَاذْكُرِ اسْمَ اَللَّهِ, فَإِنْ غَابَ عَنْكَ يَوْماً, فَلَمْ تَجِدْ فِيهِ إِلَّا أَثَرَ سَهْمِكَ, فَكُلْ إِنْ شِئْتَ, وَإِنْ وَجَدْتَهُ غَرِيقاً فِي اَلْمَاءِ, فَلَا تَأْكُلْ" } مُتَّفَقٌ عَلَيْهِ, وَهَذَا لَفْظُ مُسْلِمٍ.

దైవప్రవక్త ﷺ తనకీవిధంగా ఉపదేశించారని హజ్రత్ అదీ బిన్ హాతిమ్ (రదియల్లాహు అన్హు) చెప్పారు: నువ్వు నీ వేట కుక్కను జంతువేట కోసం వదలినపుడు, దానిపై అల్లాహ్ పేరు పఠించు (‘బిస్మిల్లాహ్’ అని చెప్పు). మరి అది ఒకవేళ వేటాడిన జంతువును నీ కోసం ఆపి ఉంచితే, వేటాడబడిన ఆ జంతువు బ్రతికి ఉన్నట్లు నువ్వు చూస్తే దాన్ని ‘జిబహ్’ చేయి. ఒకవేళ వేటాడబడిన ఆ జంతువు చనిపోయినా దాన్ని వేట కుక్క గనక ఇంకా ఏమి తిని ఉండకపోతే నువ్వు దాన్ని తినవచ్చు. ఒకవేళ ఆ వేట కుక్కతో పాటు మరో కుక్క కూడా అక్కడ కనిపిస్తే, వేటాడబడిన జంతువు కూడా చచ్చిపోయి ఉంటే, అప్పుడు దాన్ని తినవద్దు. ఎందుకంటే ఆ రెండు కుక్కల్లో ఏ కుక్క దాన్ని చంపిందో నీకు తెలీదు. ఒకవేళ నీవు బాణం (లేక ఈటె) వదిలితే దానిపై ‘బిస్మిల్లాహ్’ పఠించు. (నీ బాణానికి గురైన) వేట జంతువు ఒక రోజు తరువాతే నీకు కానవస్తే, దాని శరీరంపై నీ బాణం తప్ప మరొక బాణం గుర్తు లేకపోతే, అట్టి పరిస్థితిలో నువ్వా జంతువును తినదలచుకుంటే నిస్సంకోచంగా తినవచ్చు. అయితే బాణం దెబ్బ తగిలిన తరువాత ఆ జంతువు నీటిలో పడి చచ్చిపోతే మాత్రం దాన్ని తినకు. (బుఖారీ, ముస్లిం – ఈ వాక్యాలు ముస్లింలోనివి)

English

'Adi bin Hatim (RAA) narrated, 'The Messenger of Allah (ﷺ) said to me, "When you set off your dog, mention Allah's Name (Say Bismillah), and if it catched anything for you and come up to it while it is still alive slaughter it; if you come up to it when the dog has killed it but not eaten any of it, eat it. If you find another dog with yours and the game has been killed, do not eat, for you do not know which of them killed the animal. When you shoot your arrow, mention Allah's Name and if the game goes out of sight for a day and you find it without any marks except for that arrow, eat if you wish, but if you find it drowned in water do not eat it." Agreed upon, and the wording is from Muslim.

సారాంశం

ఈ హదీసు ద్వారా బోధపడేదేమంటే తినడానికి, లేదా లాభం గడించడానికి వేటాడటం ధర్మసమ్మతమే. వేట కుక్కలతో జంతువును వేటాడినా, వేట పక్షుల సాయంతో వేటాడినా అట్టి జంతువులను తినటం హలాలే. అయితే ఈ సందర్భంగా రెండు నిబంధనలను పాటించాలి – 1. వేట కుక్కను వదిలేటప్పుడు ‘బిస్మిల్లాహ్’ పఠించటం తప్పనిసరి. 2. కుక్క శిక్షణ పొందినదై ఉండాలి. మరి శిక్షణ పొందిన కుక్క వేటాడిన జంతువులో ఏ కొంత భాగం తిన్నా ఆ జంతు మాంసం తినటం ధర్మ సమ్మతం కాదు. అది ‘హరాం’ అయిపోతుంది. వేటాడబడిన జంతువు సురక్షితంగా ఉంటే దాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. ఈ సందర్భంగా గమనించవలసిన ఇంకొక విషయమేమిటంటే, కుక్క వేట జంతువును తన దంతాలతో పట్టుకోగా, అది చనిపోతే దాన్ని తినవచ్చు. ఒకవేళ కుక్క శరీరపు దెబ్బతో అది మరణిస్తే మాత్రం తినటం హరామ్. వేటాడబడిన జంతువు మనిషి సమీపించే వరకూ బ్రతికి ఉంటే దాన్ని ‘జిబహ్’ చేయాలి. ఒకవేళ చచ్చిపోయినా తినటంలో అభ్యంతరం లేదు. వేట కుక్క జంతువును వేటాడక ముందు, దాని యజమాని అల్లాహ్ పేరును పఠించి మరీ వదలాలి. ఒకవేళ వేట కుక్క తనంతట తానే ఏదైనా జంతువును వేటాడితే అట్టి జంతువును తినటం సమ్మతం కాదు. మెజారిటీ ఉలమాల అభిమతం ఇదే.

బాణం లేక ఈటె ద్వారా వేటాడటం గురించి కూడా హదీసులో వచ్చింది. అయితే బాణాన్ని వదిలేటప్పుడు అల్లాహ్ పేరును స్మరించటం అవసరం. ఒకవేళ ఆ సమయంలో ‘బిస్మిల్లాహ్’ పఠించటం మరచిపోయినా వచ్చిన చిక్కు ఏమీ లేదు; అది సమ్మతమేనంటారు ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్).

ఒకవేళ ఉద్దేశ్యపూర్వకంగా వదలివేసినా అట్టి జంతువును తినటం ఆక్షేపణీయం కాదని ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) భావిస్తున్నారు. ప్రవక్త ప్రియసహచరులలో ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) అభిప్రాయం కూడా ఇదే. జాహిరియా వర్గం మాత్రం మరపు వల్ల పఠించకపోయినా తినటం హరామేనంటోంది. ఈ తర్జన భర్జన తరువాత ప్రాధాన్యత నివ్వదగిన విషయం ఏమిటంటే, ముస్లిం వ్యక్తి చేసిన ‘జిబహ్’ లో అల్లాహ్ పేరు స్మరించలేదని ఖచ్చితంగా తెలిసిపోతే దాన్ని తినకుండా ఉండటమే శ్రేయస్కరం. అవునా? కాదా? అన్న సంశయం ఏర్పడినట్లయితే అట్టి పరిస్థితిలో ‘జిబహ్’ చేసిన వ్యక్తి నికార్సయిన ముస్లిం అయివుంటే ‘బిస్మిల్లాహ్’ అంటూ ఆ మాంసాన్ని తినవచ్చు. ఒకవేళ బాణం తగిలిన పక్షి నీటిలో పడి చచ్చిపోతే దాన్ని తినకూడదు. ఎందుకంటే అది ఏకారణంగా చచ్చింది? – బాణం తగలటం వల్ల చచ్చిందా?! లేక నీటిలో మునగటం వల్ల ప్రాణం కోల్పోయిందా?! అన్నది సందేహాస్పదంగా మిగిలిపోతుంది. ఈ సందేహం మూలంగా దాన్ని తినకపోవటమే మేలు.

హదీసు ఉల్లేఖకులు

అదీ బిన్ హాతిమ్ (రదియల్లాహు అన్హు) : అదీ బిన్ హాతింతాయి. ‘తై’ తెగతో ఈయనకు సంబంధం ఉండేది. తండ్రి మాదిరిగానే ఈయన పేరు మోసిన దాత. హిజ్రీ 7వ సంవత్సరం, షాబాన్ నెలలో దైవప్రవక్త ﷺ దగ్గరకు ఒక బృందంగా వచ్చారు. అరేబియాలో ధర్మభ్రష్ట ఉపద్రవం పొడసూపినపుడు ఈయన తన తెగవారితో సహా ఇస్లాంపై స్థైర్యం కనబరచారు. హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) పరిపాలనా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయనకు అందిన మొట్టమొదటి సదఖా (జకాత్) అదీ బిన్ హాతిమ్ మరియు ఆయన జాతి వారి సదఖాయే. మదాయన్ విజయంలో పాల్గొన్నారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)తో కలసి యుద్ధాలలో పాల్గొన్నారు. జమల్ యుద్ధ సందర్భంగా ఈయన కన్ను ఒకటి పోయింది. దానధర్మాల్లో, ఔదార్యంలో ఈయన నెలకొల్పిన ఉదాహరణలు విశ్వవిఖ్యాతి గాంచాయి. 120 సంవత్సరాలు జీవించి ఉన్నారు. హిజ్రీ 68లో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|12. అన్నపానీయాల పుస్తకం|12.1 జంతు వేట|హదీసు 1148

1149

హదీసు 1149

وَعَنْ عَدِيٍّ قَالَ: { سَأَلْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَنْ صَيْدِ اَلْمِعْرَاضِ فَقَالَ: "إِذَا أَصَبْتَ بِحَدِّهِ فَكُلْ, وَإِذَا أَصَبْتَ بِعَرْضِهِ, فَقُتِلَ, فَإِنَّهُ وَقِيذٌ, فَلَا تَأْكُلْ" } رَوَاهُ اَلْبُخَارِيُّ.

హజ్రత్ అదీ బిన్ హాతిం (రదియల్లాహు అన్హు) కథనం : నేను మొనలేని బాణం (లేక ఈటె) తో చేసిన వేట గురించి దైవప్రవక్త ﷺను విచారించగా ఆయన ﷺ ఇలా సమాధానమిచ్చారు : ఒకవేళ నీవు మొన వున్న వైపు నుంచి బాణం ప్రయోగిస్తే దాన్ని తినవచ్చు. ఒకవేళ అది అడ్డంగా తగిలి వేట జంతువు చచ్చిపోతే దెబ్బవల్ల చచ్చిన జంతువుగా పరిగణించబడుతుంది. కాబట్టి దాన్ని తినకు. (బుఖారీ)

English

'Adi (RAA) narrated, 'I asked the Messenger of Allah (ﷺ) about hunting using a featherless arrow (al-Mi'rad) [1]. He replied, "If The game is killed with its sharp edge (the iron piece) eat it; but if it strikes with the middle part of the shart (i.e. it is not penetrated with the sharp part) and the game is killed (due to being hit with it), it is considered a Mauqudhah [2], so do not eat it." Related by Al-Bukhari.

సారాంశం

వేట నియమాల్లోని ఒక ముఖ్యమైన నియమం పై హదీసులో సూచించబడింది. పదునైన మొనగల వస్తువు వల్ల గాయమై, రక్తం ప్రవహించి జంతువు లేక పక్షి చనిపోతే దాన్ని తినటం హలాల్ (ధర్మ సమ్మతం). కాని మరేదైనా దెబ్బవల్ల చచ్చిపోతే మాత్రం తినటం హరామ్ (నిషిద్ధం). ఖుర్ఆన్ మరియు హదీసు – రెండింటి ద్వారా కూడా నిరూపితమైన విషయమిది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|12. అన్నపానీయాల పుస్తకం|12.1 జంతు వేట|హదీసు 1149

1150

హదీసు 1150

وَعَنْ أَبِي ثَعْلَبَةَ ‏- رضى الله عنه ‏- عَنِ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { " إِذَا رَمَيْتَ بِسَهْمِكَ, فَغَابَ عَنْكَ, فَأَدْرَكْتَهُ فَكُلْهُ, مَا لَمْ يُنْتِنْ" } أَخْرَجَهُ مُسْلِمٌ.

హజ్రత్ అబూ సాలబా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: నువ్వు నీ బాణంతో వేటాడగా, దానికి గురైన వేట జంతువు నీకు కనిపించకుండా పోతే, ఆ తరువాత (మరునాడు) నీకు అగుపించి దుర్వాసన రాని స్థితిలో ఉంటే దాన్ని తినవచ్చు. (ముస్లిం)

English

Abu Tha'labah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: "When you shoot your arrow and the game has gone our of sight, eat it when you come upon it, provided it has not become rotten."

సారాంశం

ఈ హదీసు ద్వారా అవగతమయ్యే దేమిటంటే, ఏదైనా పక్షిని వేటాడిన తర్వాత అది గాయపడి, కంటికి కానరాని చోట వెళ్ళి పడిపోయి, తరువాత చచ్చిపోయిన స్థితిలో దొరికితే, దానిపై ఆ వేటగాని బాణం గుర్తు తప్ప మరొక గాయం గుర్తు ఏదీ లేకుండా ఉంటే – అప్పుడది కుళ్ళిపోకుండా ఉంటే – దాన్ని తినవచ్చు. కాని అదేగనక నీటిలోపడి చచ్చిపోతే మాత్రం దాన్ని తినటం నిషిద్ధం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|12. అన్నపానీయాల పుస్తకం|12.1 జంతు వేట|హదీసు 1150

1151

హదీసు 1151

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا; { أَنَّ قَوْمًا قَالُوا لِلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-إِنَّ قَوْماً يَأْتُونَنَا بِاللَّحْمِ, لَا نَدْرِي أَذْكَرُوا اسْمَ اللَّهِعَلَيْهِ أَمْ لَا? فَقَالَ: " سَمُّوا اَللَّهَ عَلَيْهِ أَنْتُمْ, وَكُلُوهُ" } رَوَاهُ اَلْبُخَارِيُّ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : కొంతమంది సహచరులు దైవ ప్రవక్త ﷺ నుద్దేశించి, “జనులు మా వద్దకు మాంసం తీసుకువస్తుంటారు. ఆ మాంసం ఎలాంటిదో, అది దేవుని పేరుతోనే కోసారో లేదో మాకు తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో మేమేం చేయాలి?” అని సందేహం వెలిబుచ్చగా, “మీరు దానిపై అల్లాహ్ పేరు స్మరించి తినండి” అని ఆయన ﷺ అన్నారు. (బుఖారీ)

English

'Aishah (RAA) narrated, 'Some people said to Allah's Messenger (ﷺ), There are people who bring us meat and we do not know whether or not they have mentioned Allah's name over it.' He replied, "Mention Allah's name yourselves and eat it." Related by Al-Bukhari.

సారాంశం

ఒక ముస్లిం తోటి ముస్లింపై సతతం సదనుమానం కలిగి ఉండాలనీ, ఏదేని ఒక వస్తువు గురించి, అది ఖచ్చితంగా హరామ్ (నిషిద్ధం) అని తెలియనంతవరకూ సంశయాలు, సందేహాల ప్రాతిపదికన దాన్ని హరామ్‌గా ఖరారు చేయరాదనీ ఈ హదీసు ద్వారా అవగతం అవుతోంది. ముఖ్యంగా ఆ వస్తువు ఒక ముస్లిం అధీనంలో ఉన్నప్పుడు ఇలాంటి అనుమానాలకు అసలు ఆస్కారమే కలగకూడదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|12. అన్నపానీయాల పుస్తకం|12.1 జంతు వేట|హదీసు 1151

1152

హదీసు 1152

وَعَنْ عَبْدِ اَللَّهِ بنِ مُغَفَّلٍ الْمُزَنِيِّ ‏- رضى الله عنه ‏- { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-نَهَى عَنِ اَلْخَذْفِ, وَقَالَ: "إِنَّهَا لَا تَصِيدُ صَيْدًا, وَلَا تَنْكَأُ عَدُوًّا, وَلَكِنَّهَا تَكْسِرُ اَلسِّنَّ, وَتَفْقَأُ اَلْعَيْنَ" } مُتَّفَقٌ عَلَيْهِ.‏ وَاللَّفْظُ لِمُسْلِمٍ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ముగఫ్ఫల్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ కంకర రాళ్ళు విసరి కొట్టడాన్ని వారించారు. ఇంకా ఆయన ﷺ ఇలా అన్నారు – “నువ్వు వీటితో వేటాడనూ లేవు. శత్రువును తరిమి కొట్టనూ లేవు. కాకపోతే వీటివల్ల ఒకరి పళ్ళు ఊడుతాయి లేదా కళ్ళు పగులుతాయి.” (బుఖారీ, ముస్లిం – వాక్యాలు ముస్లింలోనివి)

English

'Abdullah bin Mughaffal al-Muzani (RAA) narrated, 'The Messenger of Allah (ﷺ) prohibited throwing pebbles (on animals) and said, 'Such means do not hunt a game, nor do they injure an enemy, but they only may break a tooth or gouge out an eye.' Agreed upon, and it is Muslim's version.

సారాంశం

ఈ హదీసు ద్వారా తెలిసే ఒక ముఖ్య విషయం ఏమిటంటే కంకర్రాళ్ళు తగిలి చనిపోయిన పక్షులను తినటం ధర్మ సమ్మతం కాదు. కనుక ఈ చేష్ట వల్ల కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఈ లెక్కన ఘులైల్‌తో కొట్టిన జంతువును లేక పక్షిని తినటం కూడా హలాల్ కాదు. అలాగే తుపాకీ గుండుతో వేటాడిన జంతువును కూడా తినటం ధర్మసమ్మతం కాదని మెజారిటీ విద్వాంసులు అభిప్రాయపడ్డారు. అయితే తుపాకీ గుండు శరీరంలోకి దూసుకుపోయి, రక్తాన్ని స్రవింపజేస్తుందని, అందుచేత తుపాకీ గుండుతో వేటాడిన జంతువును తినవచ్చునని అల్లామా యమానీ (రహిమహుల్లాహ్) అభిప్రాయపడ్డారు. (సుబుల్)

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|12. అన్నపానీయాల పుస్తకం|12.1 జంతు వేట|హదీసు 1152

1153

హదీసు 1153

وَعَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { "لَا تَتَّخِذُوا شَيْئاً فِيهِ اَلرُّوحُ غَرَضًا" } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : “ఏ ప్రాణినయినాసరే దాన్ని (నిర్బంధించి) గురిపెట్టి చంపరాదు” అని దైవప్రవక్త ﷺ సెలవిచ్చారు. (ముస్లిం)

English

Ibn 'Abbas (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: "Do not take any living creature as a target."Related by Muslim.

సారాంశం

ప్రాణంతో వున్న ఏ జంతువు నైనాసరే కట్టేసి, గురిపెట్టి చంపటం హరామ్ అని ఈ హదీసు చెబుతోంది. ఎందుకంటే ఇలాంటి పోకడవల్ల ఆ జంతువుకు ఎనలేని బాధ కలుగుతుంది. జంతువులను సయితం అనుచితంగా వేధించటానికి ఇస్లామీయ షరీయత్ అనుమతించదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|12. అన్నపానీయాల పుస్తకం|12.1 జంతు వేట|హదీసు 1153

1154

హదీసు 1154

وَعَنْ كَعْبِ بْنِ مَالِكٍ ‏- رضى الله عنه ‏- { أَنّ امْرَأَةً ذَبَحَتْ شَاةً بِحَجَرٍ, فَسُئِلَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-عَنْ ذَلِكَ, فَأَمَرَ بِأَكْلِهَا } رَوَاهُ اَلْبُخَارِيُّ.

హజ్రత్ కాబ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒక స్త్రీ రాతి ముక్కతో ఒక మేకను కోసింది. ఆ మేకను తినే విషయమై దైవప్రవక్త ﷺను విచారించగా “దాన్ని తినండి” అని ఆయన ﷺ ఆదేశించారు. (బుఖారీ)

English

Ka'b bin Malik (RAA) narrated, 'A woman slaughtered a sheep with a stone, so the Prophet (ﷺ) was asked about that and he ordered it to be eaten.' Related by Muslim.

సారాంశం

జంతువును ‘జిబహ్’ చేయడానికి కత్తిని మాత్రమే గాక, వేరితర వస్తువులను కూడా ఉపయోగించవచ్చునని ఈ హదీసు ద్వారా బోధపడుతున్నది. హదీసులో ప్రస్తావనకు వచ్చిన మహిళ ఉపయోగించిన రాతి ముక్క పదునైన మొనగలదని, దాంతో మేకను జిబహ్ చేయగా రక్తం ప్రవహించిందని వేరొక ఉల్లేఖనంలో ఉంది. ముస్లిం మహిళ జిబహ్ చేస్తే నిస్సంకోచంగా తినవచ్చునన్న సంగతి కూడా ఈ హదీసు ద్వారా నిరూపితమవుతోంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|12. అన్నపానీయాల పుస్తకం|12.1 జంతు వేట|హదీసు 1154

1155

హదీసు 1155

وَعَنْ رَافِعِ بْنِ خَدِيجٍ ‏- رضى الله عنه ‏- عَنِ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { "مَا أُنْهِرَ اَلدَّمُ, وَذُكِرَ اِسْمُ اَللَّهِ عَلَيْهِ, فَكُلْ لَيْسَ اَلسِّنَّ وَالظُّفْرَ; أَمَّا اَلسِّنُّ; فَعَظْمٌ; وَأَمَّا اَلظُّفُرُ: فَمُدَى اَلْحَبَشَةِ" } مُتَّفَقٌ عَلَيْهِ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ రాఫె బిన్ ఖదీజ్ (రదియల్లాహు అన్హు) తెలిపారు : రక్తాన్ని ప్రవహింపజేసే ఏ వస్తువుతోనయినా, అల్లాహ్ పేరు పఠించి జిబహ్ చేస్తే, ఆ జంతువును తిను. జిబహ్ చేసే పరికరం దంతంగానీ, గోరుగానీ అయి ఉండకూడదు. ఎందుకంటే దంతం కూడా ఎముకే. గోరు అబిసీనియన్ల కత్తి. (బుఖారీ, ముస్లిం)

English

Rafi' bin Khadij (RAA) narrated that the Prophet (ﷺ) said: "You may eat an animal which is slaughtered by any means which causes the blood to gush out as long as Allah's Name is mentioned over it, except for the tooth and the claw (not allowed to be used). The tooth is a bone and the claw is the knife of the Abyssinians (Ethiopians)." Agreed upon.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|12. అన్నపానీయాల పుస్తకం|12.1 జంతు వేట|హదీసు 1155

1156

హదీసు 1156

وَعَنْ جَابِرِ بنِ عَبْدِ اَللَّهِ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { نَهَى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَنْ يُقْتَلَ شَيْءٌ مِنَ اَلدَّوَابِّ صَبْرًا } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) కథనం : ఏ జంతువునైనా కట్టేసి చంపటాన్ని దైవప్రవక్త ﷺ వారించారు. (ముస్లిం)

English

Jabir bin Abdullah (RAA) narrated, "The Messenger of Allah (ﷺ) prohibited beating a tied-animal to death." Related by Muslim.

సారాంశం

కట్టివేసి చంపటం అంటే భావం సజీవమైన పశువును దేనికయినా కట్టేసి, గురిపెట్టి ఆయుధాన్ని ప్రయోగించి చంపటం. వినోదం కోసం అలా చేసినా, మరే ఉద్దేశ్యంతో చేసినా అది సమ్మతం కాదు. అయితే జిబహ్ చేసేందుకు పశువును కట్టివేస్తే అది సమ్మతమే. ఇది ‘కట్టి చంపటం’ క్రిందికి రాదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|12. అన్నపానీయాల పుస్తకం|12.1 జంతు వేట|హదీసు 1156

1157

హదీసు 1157

وَعَنْ شَدَّادِ بْنِ أَوْسٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ " إِنَّ اَللَّهَ كَتَبَ اَلْإِحْسَانَ عَلَى كُلِّ شَيْءٍ, فَإِذَا قَتَلْتُمْ فَأَحْسِنُوا اَلْقِتْلَةَ, وَإِذَا ذَبَحْتُمْ فَأَحْسِنُوا اَلذِّبْحَةَ, وَلْيُحِدَّ أَحَدُكُمْ شَفْرَتَهُ, وَلْيُرِحْ ذَبِيحَتَهُ" } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ షద్దాద్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు- “అల్లాహ్ ప్రతి వస్తువు యెడల మేలు చేకూర్చడాన్ని విధిగా నిర్ధారించాడు. కాబట్టి మీరు చంపినా ఉత్తమ రీతిలోనే చంపండి. మీరు ఏదన్నా పశువును కోయదలచినపుడు ఉత్తమ పద్ధతిలో కోయండి. మీలో ప్రతి ఒక్కరూ (జిబహ్‌కు ఉపక్రమించినపుడు) తమ కత్తికి పదును పెట్టాలి. తాము జిబహ్ చేసే దానికి సౌఖ్యమొసగాలి.” (ముస్లిం)

English

Shaddad bin Aus (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: "Verily, Allah has prescribed proficiency in all things. Thus, if you kill, kill in the least painful manner you can; and when you slaughter an animal, do it in the best possible way; and any of you should sharpen his blade so that the animal may be spared from the suffering of the slaughtering."

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|12. అన్నపానీయాల పుస్తకం|12.1 జంతు వేట|హదీసు 1157

1158

హదీసు 1158

وَعَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ "ذَكَاةُ اَلْجَنِينِ ذَكَاةُ أُمِّهِ" } رَوَاهُ أَحْمَدُ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) తెలిపారు : “తల్లిని జిబహ్ చేస్తే దాని కడుపులోని శిశువు కూడా జిబహ్ అయిపోయినట్లే.” (దీనిని అహ్మద్ ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు)

English

Abu Sa'id Khudri (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: "The (legal) slaughtering of the fetus is included when its mother is slaughtered." Related by Ahmad and Ibn Hibban graded it as Sahih.

సారాంశం

ఇక్కడ ‘తల్లి’ అంటే ఆడ జంతువు అని భావం. జిబహ్ చేసిన సమయంలో ఒకవేళ అది సూడిదై ఉంటే, దాన్ని కోసిన మీదట దాని గర్భంలో వున్న శిశువు చనిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ అది హలాల్ గానే పరిగణించబడుతుంది – దాన్ని ప్రత్యేకంగా జిబహ్ చేయవలసిన అవసరం లేదు. ఇమామ్ అబూహనీఫా (రహిమహుల్లాహ్) మినహా విద్వాంసులందరి అభిప్రాయం ఇదే. ఇమామ్ అబూహనీఫా (రహిమహుల్లాహ్) మాత్రం దాన్ని తిరిగి ‘జిబహ్’ చేయాలని భావిస్తున్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|12. అన్నపానీయాల పుస్తకం|12.1 జంతు వేట|హదీసు 1158

1159

హదీసు 1159

وَعَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { " اَلْمُسْلِمُ يَكْفِيهِ اِسْمُهُ, فَإِنْ نَسِيَ أَنْ يُسَمِّيَ حِينَ يَذْبَحُ, فَلْيُسَمِّ, ثُمَّ لِيَأْكُلْ" } أَخْرَجَهُ اَلدَّارَقُطْنِيُّ, وَفِيهِ رَاوٍ فِي حِفْظِهِ ضَعْفٌ, وَفِي إِسْنَادِهِ مُحَمَّدُ بنُ يَزِيدَ بنِ سِنَانٍ, وَهُوَ صَدُوقٌ ضَعِيفُ اَلْحِفْظِ.‏. وَأَخْرَجَهُ عَبْدُ اَلرَّزَّاقِ بِإِسْنَادٍ صَحِيحٍ إِلَى اِبْنِ عَبَّاسٍ, مَوْقُوفًا عَلَيْهِ. وَلَهُ شَاهِدٌ عِنْدَ أَبِي دَاوُدَ فِي "مَرَاسِيلِهِ" بِلَفْظِ: { "ذَبِيحَةُ اَلْمُسْلِمِ حَلَالٌ, ذَكَرَ اِسْمَ اَللَّهِ عَلَيْهَا أَمْ لَمْ يَذْكُرْ" } وَرِجَالُهُ مُوَثَّقُونَ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “ముస్లిం కొరకు అల్లాహ్ నామమే చాలు. అందుచేత ‘జిబహ్’ సమయంలో దైవనామం మరచిపోయినట్లయితే ‘బిస్మిల్లాహ్’ పలికి తినేయాలి.” (దారెఖుత్నీ). దీని పరంపరలో ఉన్న ఒక ఉల్లేఖకుని జ్ఞాపక శక్తి సన్నగిల్లింది. దీని పరంపరలో ముహమ్మద్ బిన్ యజీద్ బిన్ సినాన్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను సత్యసంధుడే గాని అతని జ్ఞాపక శక్తి కూడా బలహీనమే. అబ్దుర్రజ్జాఖ్ మాత్రం ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) నుండి దృఢమైన ఆధారాలతో నకలు చేశారు. అది మౌఖూఫ్ కోవకు చెందినది). ఈ హదీసు యొక్క సాక్ష్యం అబూదావూద్ ‘మురాసిల్’లో లభిస్తుంది. “ముస్లిం చేసిన జిబహ్ – అతడు దానిపై అల్లాహ్ నామాన్ని స్మరించినా, స్మరించక పోయినా – అది ధర్మ సమ్మతమే” అన్న వాక్యాలు అందులో వున్నాయి. (దీని ఉల్లేఖకులంతా విశ్వసనీయులే).

English

Ibn 'Abbas (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: "A Muslim's name is sufficient for him, so if he forgets to mention Allah's name when he slaughters an animal, he should mention Allah's name, then eat it." Related by Ad-Daraqutni but there is a weak narrator in its chain. Also there is Muhammad bin Yazid bin Sinan in its chain who is truthful but had a weak memory.

'Abdur Razzaq transmitted it with a sound chain of narrators on the authority of Ibn 'Abbas but it is not connected up to the Prophet (ﷺ).

Abu Dawud narrated a similar hadith that reads, "The slaughtering (of an animal) by any Muslim is Halal (lawful) whether or not he mentioned Allah's name over it." Its narrators are reliable.

సారాంశం

జిబహ్ సమయంలో ‘తక్బీరె జిబహ్’ ను మరచిపోయినప్పటికీ ఆ జంతువు హలాలే అన్నదానికి ఈ హదీసు ఒక నిదర్శనం. అయితే ఈ హదీసులు, ‘జిబహ్ సమయంలో తక్బీర్ పలకటం తప్పనిసరి’ అని చెప్పే సహీహ్ హదీసులతో ఏవిధంగానూ సరితూగలేవు. కాకపోతే ఈ హదీసులు ‘తక్బీర్ తప్పనిసరి’ అన్న వాదనలోని ఒత్తిడిని కొంత సడలింపజేస్తాయి.

హదీసు ఉల్లేఖకులు

ముహమ్మద్ బిన్ యజీద్ బిన్ సినాన్. ఈయన తమీమ్ తెగకు చెందినవారు. మరోపేరు అబూ అబ్దుల్లాహ్. ఈయన సాధు స్వభావుడేగాని, హదీసుల విషయంలో దృఢచిత్తం గలవారు కాదని అబూ హాతిం అన్నారు. ఆయనసలు లెక్కలోకి తీసుకోదగ్గవారు కాదని అబూదావూద్ వ్యాఖ్యానించారు. ఆయన గట్టివాడు కాడని ఇమామ్ నసాయి (రహిమహుల్లాహ్) అభిప్రాయపడ్డారు. ఇబ్నె హిబ్బాన్ (రహిమహుల్లాహ్) ఈయన్ని విశ్వసనీయులలో చేర్చారు. ఈయన హిజ్రీ 220లో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|12. అన్నపానీయాల పుస్తకం|12.1 జంతు వేట|హదీసు 1159