హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 10.5 తేలికపాటి శిక్షలు

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 10. శిక్షల పుస్తకం, 5వ అధ్యాయం: తేలికపాటి శిక్షలు. ఈ అధ్యాయంలో 5 హదీసులు (హదీసు 1075 – 1079) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

10.5 తేలికపాటి శిక్షలు

↑ విషయ సూచిక

باب التعزير وحكم الصائل

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

1075

హదీసు 1075

عَنْ أَبِي بُرْدَةَ اَلْأَ نْصَارِيِّ ‏- رضى الله عنه ‏- أَنَّهُ سَمِعَ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: { " لَا يُجْلَدُ فَوْقَ عَشَرَةِ أَسْوَاطٍ, إِلَّا فِي حَدِّ مِنْ حُدُودِ اَللَّهِ" } مُتَّفَقٌ عَلَيْهِ.

దైవప్రవక్త ﷺ చెబుతుండగా తాను విన్నానని హజ్రత్ అబూబుర్దా (రదియల్లాహు అన్హు) చెప్పారు : “దేవుడు నిర్ణయించిన శిక్షల విషయంలో మినహా (మిగిలిన వాటిలో) పది కొరడా దెబ్బలకన్నా ఎక్కువ శిక్ష విధించకూడదు.” (బుఖారీ, ముస్లిం)

English

Abu Burdah Al-Ansari (RAA) narrated that he heard the Messenger of Allah (ﷺ) say, "No more than ten lashes are to be given except when inflicting one of the Hudud (prescribed punishments) of Allah." Agreed upon.

హదీసు ఉల్లేఖకులు

అబూ బుర్దా (రదియల్లాహు అన్హు) : ఈయన అసలు పేరు హనీ బిన్ నియార్. బలవీ తెగకు చెందిన వారు. దైవప్రవక్త ﷺ సహచరులు. బద్ర్ తదితర యుద్ధాలలో హాజరయ్యారు. హిజ్రీ 41 లేక 42 లేదా 45వ సంవత్సరంలో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.5 తేలికపాటి శిక్షలు|హదీసు 1075

1076

హదీసు 1076

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { " أَقِيلُوا ذَوِي اَلْهَيْئَاتِ عَثَرَاتِهِمْ إِلَّا اَلْحُدُودَ" } رَوَاهُ أَحْمَدُ وَأَبُو دَاوُدَ وَالنَّسَائِيُّ وَالْبَيْهَقِيُّ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : “దేవుడు నిర్ణయించిన శిక్షల విషయంలో తప్ప- క్షంతవ్యం కాదగ్గ సజ్జనుల, మర్యాదస్తుల తప్పులను (ఔదార్యంతో) మన్నించండి.” (దీనిని అహ్మద్, అబూదావూద్, నసాయి, బైహఖీలు ఉల్లేఖించారు)

English

'Aishah (RAA) narrated that Allah's Messenger (ﷺ) said: "Forgive the people with high moral values when they slip but not what calls for the infliction of Hudud." Related by Ahmad, Abu Dawud, An-Nasa'i and Al-Baihaqi.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.5 తేలికపాటి శిక్షలు|హదీసు 1076

1077

హదీసు 1077

وَعَنْ عَلِيٍّ ‏- رضى الله عنه ‏- قَالَ: { مَا كُنْتُ لِأُقِيمَ عَلَى أَحَدٍ حَدًّا, فَيَمُوتُ, فَأَجِدُ فِي نَفْسِي, إِلَّا شَارِبَ الْخَمْرِ; فَإِنَّهُ لَوْ مَاتَ وَدَيْتُهُ } أَخْرَجَهُ اَلْبُخَارِيُّ.

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “మద్యం సేవించిన వ్యక్తిని తప్ప – మరెవరినీ అతని ప్రాణంపోయే విధంగా, ఆ దుఃఖం నా హృదయాన్ని కలచివేసే విధంగా శిక్షించను. ఒకవేళ త్రాగుబోతు నేను విధించిన శిక్షకు మరణిస్తే అతని రక్తపరిహారం చెల్లిస్తాను.” (బుఖారీ)

English

'Ali (RAA) narrated, 'I would not blame myself for the death of a man when I inflicted prescribed punishment on him, with the exception of one who drunk Khamr, for if he were to die, I would pay Diyah for him.'

సారాంశం

త్రాగుబోతుకు విధించిన శిక్ష వల్ల అతడు మరణిస్తే రక్త పరిహారం చెల్లిస్తానని హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) చెప్పడానికి కారణమేమిటంటే, దైవప్రవక్త ﷺ త్రాగుబోతుకు ఇదమిత్థంగా శిక్షను నిర్దేశించలేదు. అందువల్ల త్రాగుబోతుకు విధించిన శిక్ష కారణంగా అతడు చచ్చిపోతే అది హత్యగానే పరిగణించబడుతుంది. హత్యా నేరానికి రక్తపరిహారం ఇవ్వటం తప్పనిసరి. మెజారిటీ విద్వాంసుల దృక్పథం కూడా ఈ విషయంలో ఇదే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.5 తేలికపాటి శిక్షలు|హదీసు 1077

1078

హదీసు 1078

وَعَنْ سَعِيدِ بْنِ زَيْدٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ " مِنْ قُتِلَ دُونَ مَالِهِ فَهُوَ شَهِيدٌ" } رَوَاهُ اَلْأَرْبَعَةُ, وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ

హజ్రత్ సయీద్ బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “తన ధన సంపదలను, ఆస్తిపాస్తులను రక్షించుకునే యత్నంలో ప్రాణాలర్పించిన వ్యక్తి అమరగతుడు.” (దీనిని ‘నలుగురు’ ఉల్లేఖించగా, తిర్మిజీ ప్రామాణిక హదీసుగా ఖరారు చేశారు)

English

Sa'id bin Zaid (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: "Whoever is killed while protecting his property, he is a martyr." Related by the four Imams and At-Tirmidhi graded it as Sahih.

సారాంశం

తన ఆస్తిపాస్తులను, సాధన సంపత్తులను ఎవరయినా దోచుకుంటున్నప్పుడు యజమాని శాయశక్తులా ప్రతిఘటించటం ధర్మసమ్మతమే గాకుండా, ఆ ప్రతిఘటన అనివార్యం కూడా అని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. ఈ ప్రతిఘటనలో ఒకవేళ యజమాని చేతిలో దోపిడీ దొంగ హతమైతే యజమాని ఎలాంటి నష్టపరిహారాన్నిగానీ, రక్తపరిహారాన్ని గానీ చెల్లించవలసిన అవసరం లేదు. దొంగవాని వధింపు నిరర్థకమైపోతుంది.

అలాగే ఎవరయినా తన ధర్మాన్ని, విశ్వాసాన్ని, తన ఆత్మను, తన ఆలుబిడ్డలను రక్షించుకునే యత్నంలో చంపబడితే అతడు అమరగతి నొందుతాడు. ఒకవేళ ఈ యత్నంలో అతడు ప్రత్యర్థిని చంపితే దానికిగాను పరిహారం చెల్లించనవసరం లేదు. దీనిని బట్టి ఇస్లాం ధన ప్రాణాలకు, మానమర్యాదలకు ఎంత ప్రాముఖ్యం ఇచ్చిందో ఊహించవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.5 తేలికపాటి శిక్షలు|హదీసు 1078

1079

హదీసు 1079

وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ خَبَّابٍ [ قَالَ ]: سَمِعْتَ أَبِي ‏- رضى الله عنه ‏- يَقُولُ: سَمِعْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: { " تَكُونُ فِتَنٌ, فَكُنْ فِيهَا عَبْدَ اَللَّهِ اَلْمَقْتُولَ, وَلَا تَكُنْ اَلْقَاتِلَ" } أَخْرَجَهُ ابْنُ أَبِي خَيْثَمَةَ.‏ وَاَلدَّارَقُطْنِيُّ. وَأَخْرَجَ أَحْمَدُ نَحْوَهُ: عَنْ خَالِدِ بْنِ عُرْفُطَةَ ‏- رضى الله عنه ‏-.

దైవప్రవక్త ﷺ ప్రబోధించగా తాను విన్నానని మా నాన్నగారు చెబుతుండగా ఆ విషయం నేను విన్నానని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఖబ్బాబ్ (రదియల్లాహు అన్హు) తెలిపారు : “నా తదనంతరం ఉపద్రవాలు (గందరగోళం, కల్లోలం, అయోమయ స్థితి) ఏర్పడతాయి. కనుక ఓ దైవదాసుడా! నీవు ఆ స్థితికి ఆహుతి అయిపో. హంతకుడుగా మాత్రం నిలబడకు.” (దీనిని ఇబ్నె అబూ ఖైసమ, దారెఖుత్నీ సంగ్రహించారు. అహ్మద్ కూడా ఇదేవిధంగా ఖాలిద్ బిన్ ఉర్ఫుత నుండి ఉల్లేఖించారు)

English

'Abdullah bin Khabbab (RAA) narrated, 'I heard my father say: 'I heard the Messenger of Allah (ﷺ) say, "There will be times of Fitan, so O slave of Allah be in it the one who is killed and do not be the killer." Related by Abu Khaithamah and Ad-Daraqutni.

Ahmad transmitted a similar hadith on the authority of Khalid bin 'Urfutah.

సారాంశం

హదీసు మూలంలో ‘ఫితన్’ అనే పదం వచ్చింది. ‘ఫితన్’ అనేది ‘ఫిత్నా’ అనే పదానికి బహువచనం. ఇక్కడ ఫిత్నా అంటే భావం రక్తపాతం, నరమేధం! ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియని అయోమయావస్థ!! ఇటువంటి అయోమయ స్థితి నెలకొన్నప్పుడు సాధ్యమైనంతవరకు వాటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరమని హదీసు చెబుతోంది. అయితే ఇరువర్గాల వారు సత్యాన్ని, ధర్మాన్ని లెక్కపెట్టకుండా పరస్పరం పోరాడుకుంటున్నప్పుడు – ఏ వర్గం సత్యంపై ఉన్నదని తెలిసిందో, ఆ వర్గానికి మద్దతు ఇవ్వాలి. అసత్యవాదుల మెడలు వంచే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దివ్య ఖుర్ఆన్‌లో సర్వోన్నత ప్రభువు ఇలా సెలవిచ్చాడు:

“ఒకవేళ విశ్వాసులలోని రెండు వర్గాల వారూ పరస్పరం పోట్లాడుకుంటే, వారి మధ్య రాజీ కుదిరించండి. తరువాత, ఒకవేళ వారిలో ఒక వర్గంవారు రెండో వర్గం వారిపై దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యం చేసినవారు అల్లాహ్ ఆజ్ఞ వైపునకు మరలేవరకు వారికి వ్యతిరేకంగా పోరాడండి.” (49:9)

కాని ఒకవేళ ఏ వర్గమైనా తనపై మెరుపుదాడి చేస్తే, లేదా తనను హతమార్చదలిస్తే, తన ఆస్తిపాస్తుల్ని దోచుకోబోతే అట్టి పరిస్థితిలో ఏం చేయాలి? పై హదీసు ప్రకారం ఆత్మ సమర్పణ చేసుకోవాలా? దైవప్రవక్త ﷺ వారి వేరొక ప్రబోధనం ప్రకారం ప్రతిఘటించవచ్చుని తెలుస్తోంది – ఈ ప్రతిఘటనలో అతను చంపబడితే షహాదత్ (అమరగతి) స్థాయి ప్రాప్తిస్తుంది. ఈ రెండు హదీసుల వెలుగులో ఆలోచిస్తే పరిస్థితుల స్వరూపాన్ని జాగ్రత్తగా బేరీజువేసి తనకు శ్రేయస్కరమైనదని భావించిన పద్ధతిని ఎంచుకోవచ్చుని బోధపడుతున్నది.

హదీసు ఉల్లేఖకులు

1. అబ్దుల్లాహ్ బిన్ ఖబ్బాబ్ : ప్రఖ్యాత తాబయి. మదీనావాసులు. హిజ్రీ 27వ సంవత్సరంలో హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) పై తిరుగుబాటు అనంతరం నహర్‌వాన్ మార్గంలో ఖార్జీ వర్గం వారు ఈయన్ని హత్యచేశారు. ఈయన్ని హత్య చేసిన తరువాత వాళ్ళు ఈయన ఇంటికి వెళ్ళి ఈయన సతీమణి కడుపును అమానుషంగా చీల్చారు. ఈయన కొడుకును చంపేశారు. ఈ సంఘటనే నహర్‌వాన్ యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధంలో హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) సహచరుల చేతుల్లో ఖార్జీయులంతా హతమార్చబడ్డారు. వారిలో ఏడుగురు మాత్రమే మిగిలారు. ఆ ఏడుగురే తరువాతి కాలంలో పొడసూపిన కల్లోలానికి సూత్రధారులయ్యారు.

2. ఖబ్బాబ్ (రదియల్లాహు అన్హు) : ఖబ్బాబ్ బిన్ అరత్ బిన్ జందల తమీమి. దైవమార్గంలో అవివాహితుడుగా మిగిలిపోయిన వారిలో ఒకరు. బద్ర్ యుద్ధంలో పాల్గొన్నారు. సిఫ్ఫీన్ సంగ్రామం నుండి తిరిగివస్తూ హిజ్రీ 37లో 73 సంవత్సరాల వయస్సులో కూఫాలో మరణించారు.

3. ఖాలిద్ బిన్ ఉర్ఫుత (రదియల్లాహు అన్హు) : ఉజ్రా తెగకు చెందినవారు. హజ్రత్ సాద్ బిన్ అబీ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) తరపున కూఫాలో అధికారిగా నియమితులయ్యారు. హిజ్రీ 61లో మరణించారు. యజీద్ మరణానంతరం ముఖ్తార్ బిన్ అబూ ఉబైద్ ఈయన్ని హత్యచేశాడని, ఈ సంఘటన హిజ్రీ 64లో జరిగిందని అనబడుతోంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.5 తేలికపాటి శిక్షలు|హదీసు 1079