హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 10.3 దొంగతనానికి విధించబడే శిక్ష

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 10. శిక్షల పుస్తకం, 10.3: దొంగతనానికి విధించబడే శిక్ష. ఈ అధ్యాయంలో 11 హదీసులు (హదీసు 1053 – 1063) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

10.3 దొంగతనానికి విధించబడే శిక్ష

↑ విషయ సూచిక

باب حد السرقة

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

1053

హదీసు 1053

عَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-: { لَا تُقْطَعُ يَدُ سَارِقٍ إِلَّا فِي رُبُعِ دِينَارٍ فَصَاعِدًا } مُتَّفَقٌ عَلَيْهِ.‏ وَاللَّفْظُ لِمُسْلِم ٍ. وَلَفْظُ اَلْبُخَارِيِّ: "تُقْطَعُ يَدُ السَّارِقِ فِي رُبُعِ دِينَارٍ فَصَاعِدًا " وَفِي رِوَايَةٍ لِأَحْمَدَ "اِقْطَعُوا فِي رُبُعِ دِينَارٍ, وَلَا تَقْطَعُوا فِيمَا هُوَ أَدْنَى مِنْ ذَلِكَ"

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “కనీసం పావు (1/4) దీనారు లేక అంతకన్నా ఎక్కువ దొంగిలిస్తే తప్ప ఏ దొంగ చేతినీ నరకరాదు.” (బుఖారీ, ముస్లిం- హదీసు వాక్యాలు ముస్లింలోనివి) బుఖారీలో ఇలా వుంది : “పావు దీనారు మరియు అంతకన్నా ఎక్కువగా దొంగిలించినప్పుడే దొంగ చేతిని నరకాలి.”

అహ్మద్ ఉల్లేఖనం ఇలా ఉంది: పావు దీనారు దొంగిలిస్తే దొంగ చేతిని నరకండి. అంతకన్నా తక్కువ విలువ గల దొంగతనంపై చేతిని నరకకండి.”

English

'Aishah (RAA) narrated that Allah's Messenger (ﷺ) said: "A thief's hand should not be cut off except for a quarter of a Dinar or more." Agreed upon and the wording is from Muslim. The version of Al-Bukhari reads, 'The hand of a thief is to be cut off for a quarter of a Dinar or more."

In a version by Ahmad, "Cut off a thief's hand for a quarter of Dinar, and do not cut it off for what is less than that."

సారాంశం

నిర్ణీత పరిమాణంలో దొంగతనం చేసిన వారికి మాత్రమే చేతిని నరకాలని ఈ హదీసు సూచిస్తోంది. మెజారిటీ ఉలమాల అభిప్రాయం కూడా ఇదే. అయితే హసన్ బస్రీ, జాహరియ, ఖవారిజ్‌లు దివ్య ఖుర్ఆన్ ఆయత్ ఆధారంగా – ఎక్కువ తక్కువ పరిమాణాలతో నిమిత్తం లేకుండా – ప్రతి దొంగతనానికి చేతిని నరకాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు. కాని ఈ నిర్ణయం సరైనది కాదు. ఎందుకంటే దివ్య ఖుర్ఆన్‌కు హదీసు తాత్పర్యం మరియు వివరణ వంటిది. నిర్ణీత పరిమాణాన్ని హదీసు సూచిస్తున్నప్పుడు హదీసు ప్రకారమే శిక్షను అమలుపరచాలి. అయితే ఆ ‘నిర్ణీత పరిమాణం’ గురించి భిన్నాభిప్రాయాలు వెల్లడైనాయి. వాటిలో రెండు వాదనలు ప్రసిద్ధికెక్కాయి. మొదటిది: బంగారమైతే ఒక దీనారులో నాల్గోవంతు. వెండి అయితే కనీసం మూడు దిర్హములు. హిజాజ్ ప్రాంతానికి చెందిన ధర్మవేత్తలతోపాటు, ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) అభిప్రాయం కూడా ఇదే.

రెండవది : పది దిర్హముల విలువకు సమానమైన దొంగతనం. అంతకన్నా తక్కువ పరిమాణంలో దొంగతనం చేస్తే హస్తఖండన శిక్ష విధించబడదు. ఇమామ్ సుఫియాన్ సౌరీతోపాటు హనఫీ పండితుల విధానం కూడా ఇదే.

వీరిలో మొదటి వర్గం వారు తమ వాదనకు ఆధారంగా సహీహైన్‌లోని హదీసును తీసుకోగా, రెండవ వర్గంవారు హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) హదీసును ఆధారంగా తీసుకున్నారు. దీని ప్రకారం దైవప్రవక్త ﷺ హయాంలో పది దిర్హముల విలువగల ‘డాలు’ను దొంగిలించిన వ్యక్తి చేతిని నరకటం జరిగింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.3 దొంగతనానికి విధించబడే శిక్ష|హదీసు 1053

1054

హదీసు 1054

وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا : { أَنَّ النَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَطَعَ فِي مِجَنٍ، ثَمَنُهُ ثَلَاثَةُ دَرَاهِمَ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ మూడు దిర్హముల విలువ గల డాలును దొంగిలించినందుకు హస్తఖండన శిక్ష విధించారు. (బుఖారీ, ముస్లిం)

English

Ibn 'Umar (RAA) narrated that the Messenger of Allah (ﷺ) cut off the hand of a thief for stealing a shield that was worth three Dirhams. Agreed upon.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.3 దొంగతనానికి విధించబడే శిక్ష|హదీసు 1054

1055

హదీసు 1055

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَعَنَ اَللَّهُ السَّارِقَ ؛ يَسْرِقُ الْبَيْضَةَ ، فَتُقْطَعُ يَدُهُ ، وَيَسْرِقُ الْحَبْلَ ، فَتُقْطَعُ يَدُهُ } مُتَّفَقٌ عَلَيْهِ أَيْضًا.‏

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “దొంగకు దేవుని శాపం కలుగుగాక! అతను గుడ్డును దొంగిలించి తన చేతిని నరికించుకుంటాడు, తాడును దొంగిలించి తన చేతిని నరికించుకుంటాడు.” (బుఖారీ, ముస్లిం)

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: "May Allah curse the thief who steals an egg for which his hand is cut off, or steals a rope for which his hand is to be cut off.' Agreed upon.

సారాంశం

దొంగతనం చిన్నదైనా, పెద్దదైనా అది దొంగతనమేననీ, ప్రతి చిన్న దొంగతనానికి సయితం హస్తఖండన శిక్ష విధించబడుతుందని ఈ హదీసు ద్వారా వెల్లడవుతోంది. కోడిగుడ్డును, త్రాడును ఉపమానంగా పేర్కొనటంలోని అసలు ఉద్దేశ్యమేమిటంటే దొంగతనం అనేది ఎంతో నీచమైన జుగుప్సాకరమయిన చేష్ట. ఈ చేష్టకు అలవాటుపడిన వ్యక్తి సమాజం పట్ల రానురానూ ఎంతో హానికరంగా పరిణమిస్తాడు. మొదట చిన్నా చితకా దొంగతనాలు చేస్తాడు, తరువాత మహాపరాధాలకు ఒడిగడతాడు. బందిపోటుగా, గజదొంగగా తయారవుతాడు. అందుకే ఇస్లామీయ షరీయత్ దొంగతనానికి కఠినమయిన శిక్షల్ని ప్రతిపాదించింది. ఆదిలోనే ఈ చెడుల వరదకు ఆనకట్ట వేయదలచింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.3 దొంగతనానికి విధించబడే శిక్ష|హదీసు 1055

1056

హదీసు 1056

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا ؛ أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { أَتَشْفَعُ فِي حَدٍ مِنْ حُدُودِ الْلَّهِ ؟ ". ثُمَّ قَامَ فَخَطَبَ ، فَقَالَ : " أَيُّهَا النَّاسُ ! إِنَّمَا أَهْلَكَ الَّذِينَ مِنْ قَبْلِكُمْ أَنَّهُمْ كَانُوا إِذَا سَرَقَ فِيهِمُ الشَّرِيفُ تَرَكُوهُ ، وَإِذَا سَرَقَ فِيهِمُ الضَّعِيفُ أَقَامُوا عَلَيْهِ الْحَدَّ… } الْحَدِيثَ. مُتَّفَقٌ عَلَيْهِ ، وَاللَّفْظُ لِمُسْلِمٍ. ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍وَلَهُ مِنْ وَجْهٍ آخَرَ : عَنْ عَائِشَةَ قَالَتْ: كَانَتِ امْرَأَةٌ تَسْتَعِيرُ الْمَتَاعَ ، وَتَجْحَدُهُ ، فَأَمَرَ الْنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-بِقَطْعِ يَدِهَا.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “ఏమిటీ, నీవు దేవుడు నిర్ణయించిన శిక్షలలో ఒక శిక్ష గురించి (నా దగ్గర) సిఫారసు చేయదలిచావా?” ఇలా అంటూ ఆయన ﷺ లేచి నిలబడి (ప్రజల ముందు) ఉపన్యసించారు. ఆ సందర్భంగా ఆయన ﷺ ఇలా అన్నారు: “ప్రజలారా! మీకు పూర్వం గతించిన వారు ఎందుకు నాశనమయ్యారంటే; వారు తమలోని స్థితిమంతుడు, పేరు ప్రతిష్ఠలుగల వ్యక్తి ఎవరయినా దొంగతనం చేస్తే అతన్ని శిక్షించకుండా వదలి పెట్టేసేవారు. అదే పేదవాడు, బలహీనుడైన వ్యక్తి దొంగతనంచేస్తే అతడ్ని శిక్షించేవారు.” (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి. ముస్లింలో హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) చేతనే ఉల్లేఖించబడిన మరో కథనంలో ఇలా వుంది : ఒక స్త్రీ జనుల వద్ద (అరువుగా) వస్తువులు అడుగుతూ తిరిగేది. తిరిగి ఇవ్వడానికి మాత్రం నిరాకరించేది. అందుచేత దైవప్రవక్త – సఅసం – ఆ స్త్రీకి హస్తఖండన శిక్ష విధించవలసిందిగా ఆదేశించారు)

English

'Aishah (RAA) narrated, 'Allah's Messenger (ﷺ) said (to Usamah bin Zaid), "Are you interceding with regards to one of Allah's prescribed penalties?" Then he got up and addressed the people saying, "O People! What destroyed the nations before you, was that when a noble person committed theft, they used to leave him (without punishment), but if a weak person among then committed theft, they would inflict the legal punishment on him" Agreed upon and the wording is from Muslim. Muslim has another version on the authority of 'Aishah (RAA) who said, 'A woman used to borrow (people's) belongings and deny having taken them, so the Prophet (ﷺ) ordered that her hand be cut off.'

సారాంశం

హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) నుద్దేశ్యించి, దైవప్రవక్త ﷺ ఆగ్రహంతో అన్న మాటలివి. ఫాతిమా అనే మఖ్జూమ్ తెగకు చెందిన ఒక స్త్రీ దొంగతనం చేసింది. దైవప్రవక్త ﷺ ఆమెకు హస్తఖండన శిక్ష విధించారు. అయితే ఈ శిక్షపై ఖురైష్ తెగవాళ్ళు కలవరం చెందారు. వారు పరస్పరం సంప్రతించుకుని ఈ వ్యవహారాన్ని దైవప్రవక్త ﷺకు నివేదించుకోవాలని అనుకున్నారు. దీనికోసం ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు)సరైన వ్యక్తి అని కూడా వాళ్ళంతా తీర్మానించుకున్నారు. ఏ విధంగానైనా తమ వర్గానికి చెందిన ఒక ‘మర్యాదస్తురాలి’ చేయి తెగకుండా చూడాలన్నది వారందరి తాపత్రయం. వాళ్ళ కోరిక మేరకు ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) ప్రతినిధిగా వెళ్ళి వాళ్ళందరి అభిమతాన్ని గురించి విన్నవించుకున్నారు. ఇది విని మహాప్రవక్త ﷺ గారి ముఖారవిందం ఆగ్రహంతో కందిపోయింది. ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) లాంటి నికార్సయిన సహచరుడు ఈ విధంగా సిఫారసు చేయటం కూడా ఆయన ﷺ ఆగ్రహానికి మరో కారణం అయి ఉండవచ్చు.

మొత్తమ్మీద దైవప్రవక్త ﷺ వారి నిష్పాక్షిక న్యాయానికి, వజ్ర సంకల్పానికి ఈ హదీసు అద్దం పడుతోంది. శిక్షల విధింపులో సిఫార్సులకు తావులేదని కూడా ఈ హదీసు చాటి చెబుతోంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.3 దొంగతనానికి విధించబడే శిక్ష|హదీసు 1056

1057

హదీసు 1057

وَعَنْ جَابِرٍ ‏- رضى الله عنه ‏- ، عَنِ النَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ : { لَيْسَ عَلَى خَائِنٍ وَلَا مُخْتَلِسٍ وَلَا مُنْتَهِبٍ ، قَطْعٌ } رَوَاهُ أَحْمَدُ ، وَالْأَرْبَعَةُ ، وَصَحَّحَهُ التِّرْمِذِيُّ ، وَابْنُ حِبَّانَ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) తెలిపారు : అవినీతికి పాల్పడిన వానికి (వస్తువును) లాక్కుపోయేవానికి, దోచుకుపోయేవానికి హస్తఖండన శిక్ష వర్తించదు. (దీనిని అహ్మద్ మరియు నలుగురు ఉల్లేఖించారు – తిర్మిజీ, ఇబ్నె హిబ్బాన్‌లు దీనిని ప్రామాణికంగా ఖరారు చేశారు)

English

Jabir (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: "There is no cutting of the hand for the treacherous, for snatching (like the one who snatches and runs away), or for forcibly seizure (looting or robbery)." Related by Ahmad and the four Imams. At-Tirmidhi and Ibn-Hibban graded it as Sahih.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.3 దొంగతనానికి విధించబడే శిక్ష|హదీసు 1057

1058

హదీసు 1058

وَعَنْ رَافِعِ بْنِ خَدِيجٍ ‏- رضى الله عنه ‏- ، قَالَ سَمِعْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ : : { لَا قَطْعَ فِي ثَمَرٍ وَلَا فِي كَثَرٍ } رَوَاهُ أَحْمَدُ وَالْأَرْبَعَةُ, وَصَحَّحَهُ أَيْضًا اَلتِّرْمِذِيُّ, وَابْنُ حِبَّان َ.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ రాఫె బిన్ ఖదీజ్ (రదియల్లాహు అన్హు) చెప్పారు : “పండ్లు ఫలాలు, ఖర్జూర చెట్ల గుజ్జ (బెండు)ను తీసుకున్నందుకుగాను హస్తఖండన శిక్ష ఉండదు.” (దీనిని అహ్మద్ మరియు ‘నలుగురు’ ఉల్లేఖించారు. తిర్మిజీ, ఇబ్నె హిబ్బాన్‌లు దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Rafi' bin Khudiaj (RAA) narrated, 'I heard the Messenger of Allah (ﷺ) say, "There is no cutting off of a hand for taking fruit or the pith of a palm tree." Related by Ahmad and four Imams. At-Tirmidhi and Ibn Hibban graded it as Sahih.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.3 దొంగతనానికి విధించబడే శిక్ష|హదీసు 1058

1059

హదీసు 1059

وَعَنْ أَبِي أُمَيَّةَ الْمَخْزُومِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: { أُتِِيَ النَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-بِلِصٍّ قَدِ اعْتَرَفَ اعْتِرَافًا، وَلَمْ يُوجَدْ مَعَهُ مَتَاعٌ، فَقَالَ لَهُ رَسُولُ اللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-"مَا إِخَالَكَ سَرَقْتَ".‏ قَالَ: بَلَى، فَأَعَادَ عَلَيْهِ مَرَّتَيْنِ أَوْ ثَلَاثًا، فَأَمَرَ بِهِ فَقُطِعَ.‏ وَجِيءَ بِهِ، فَقَالَ: "اسْتَغْفِرِ اللَّهَ وَتُبْ إِلَيْهِ"، فَقَالَ: أَسْتَغْفِرُ اللَّهَ وَأَتُوبُ إِلَيْهِ، فَقَالَ: "اللَّهُمَّ تُبْ عَلَيْهِ" ثَلَاثًا } أَخْرَجَهُ أَبُو دَاوُدَ وَاللَّفْظُ لَهُ، وَأَحْمَدُ، وَالنَّسَائِيُّ، وَرِجَالُهُ ثِقَاتٌ. وَأَخْرَجَهُ الْحَاكِمُ مِنْ حَدِيثِ أَبِي هُرَيْرَةَ، فَسَاقَهُ بِمَعْنَاهُ، وَقَالَ فِيهِ: { اذْهَبُوا بِهِ، فَاقْطَعُوهُ، ثُمَّ احْسِمُوهُ }. وَأَخْرَجَهُ الْبَزَّارُ أَيْضًا، وَقَالَ: لَا بَأْسَ بِإِسْنَادِهِ.

హజ్రత్ అబూ ఉమయ్య మఖ్జూమీ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ దగ్గరికి ఒక దొంగ హాజరుపరచబడ్డాడు. అతడు తన దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. కాని అతని దగ్గర దొంగిలించిన వస్తువులు మాత్రం లేవు. “నువ్వు దొంగతనం చేశావంటే నాకు నమ్మశక్యం కావటం లేదు” అని దైవ ప్రవక్త ﷺ అన్నారు. “లేదండి, ఈ పని చేసింది నేనే” అని ఆ వ్యక్తి అన్నాడు. ఆయన ﷺ రెండు లేక మూడు సార్లు ఇలాగే ప్రశ్నించగా, అతను ప్రతిసారీ తన తప్పును అంగీకరించాడు. అప్పుడాయన ﷺ అతని హస్తాన్ని ఖండించమని ఆదేశించారు. ఆదేశానుసారం అతని చేయి నరికివేయబడింది. అనంతరం ఆ వ్యక్తి దైవప్రవక్త ﷺ సమక్షంలో హాజరుపరచబడ్డాడు. ఆయన ﷺ అతనికి హితబోధ చేస్తూ, “నీ పాపాన్ని క్షమించమని అల్లాహ్‌ను వేడుకో. ఆయన సమక్షంలో పశ్చాత్తాపం చెందు” అని అన్నారు. నేను క్షమాభిక్షకై అల్లాహ్‌ను వేడుకుంటున్నాను, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం చెందుతున్నానని అతడు అన్నాడు. “దేవా! ఇతని పశ్చాత్తాపాన్ని స్వీకరించు” అని ఆయన ﷺ మూడుసార్లు అతని కొరకు ప్రార్థించారు. (అబూదావూద్ ఈ హదీసును సేకరించారు – హదీసు వాక్యాలు కూడా అబూ దావూద్‌కు చెందినవే. అహ్మద్, నసాయి కూడా దీనిని ఉల్లేఖించారు. దీని ఉల్లేఖకులు నమ్మకస్తులు)

అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఆధారంగా హాకిమ్ ఈ హదీసును సంగ్రహించారు. దీని ప్రకారం ఆయన ﷺ ఇలా సెలవిచ్చారు : ఇతన్ని తీసుకెళ్ళి హస్తఖండన చేయండి. తరువాత (రక్తస్రావం జరగకుండా) కాపు పెట్టండి.” (దీనిని బజ్జార్ ఉల్లేఖించారు. దీని పరంపరలో ఎలాంటి లోపం లేదని కూడా ఆయన అన్నారు)

English

Abu Umaiyah al-Makhzumi (RAA) narrated, 'A thief who has made a confession was brought to the Messenger of Allah (ﷺ) but no goods were found with him. Allah's Messenger (ﷺ) said to him, "I do not think you have stolen!" The man replied, 'Yes I have.' The Prophet (ﷺ) repeated it to him twice or thrice, so he gave his commands concerning him, and his hand was cut off. He was then brought to the Messenger of Allah (ﷺ) who said to him, "Ask forgiveness of Allah and turn to Him in repentance." The man said, 'I ask Allah's forgiveness and turn to Him in repentance.' The Messenger of Allah (ﷺ) then said three times, "O Allah! forgive him." Related by Abu Dawud, Ahmad and An-Nasa'i with a trustworthy chain or narrators, and it is Abu Dawud's version.

Al-Hakim transmitted the same hadith on the authority of Abu Hurairah (RAA) giving similar meaning. The Messenger of Allah (ﷺ) said: "Take him away and cut off his hand and cauterize him." Al-Bazzar transmitted the same hadith but commented that its chain of narrators is not sound.

సారాంశం

ఈ హదీసు ద్వారా బోధపడేదేమిటంటే న్యాయస్థానంలో ఒక వ్యక్తి తన నేరాన్ని ఒప్పుకున్న తరువాత, అతను దొంగిలించిన వస్తు సామగ్రి అతనివద్ద లభించినా లభించకపోయినా అతనికి విధించబడే శిక్ష మాత్రం హస్తఖండనే. చేయిని నరికిన తరువాత రక్తస్రావాన్ని ఆపడానికి చేతిని వెచ్చని నూనెలో ముంచడమో లేదా మరేదైనా చికిత్స చేయటమో అవసరం. సకాలంలో ఈ నివారణోపాయం చేయకపోతే రక్తస్రావం అధికంగా జరిగి అది ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదముంది. ఒకవేళ అదేగనక జరిగితే రక్త పరిహారం చెల్లించే బాధ్యత ప్రభుత్వంపై పడుతుంది. దొంగకు శిక్ష విధించడానికి అతడు తన నేరాన్ని ఒక్కసారి అంగీకరించినా చాలు అని అత్యధికమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. అయితే ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్), ఇస్‌హాఖ్‌ల దృష్టిలో దొంగ కనీసం రెండుసార్లు నేరాన్ని ఒప్పుకున్న తరువాతే హస్తఖండన శిక్ష విధించాలి.

హదీసు ఉల్లేఖకులు

అబూ ఉమయ్య మఖ్జూమ్ (రదియల్లాహు అన్హు): ఈయన హిజాజ్ ప్రాంతానికి చెందినవారు. సుప్రసిద్ధ సహాబీ. అయితే ఈయనచేత ఒక్క హదీసు మాత్రమే ఉల్లేఖించబడింది. హమ్మాద్ బిన్ మస్లమ కథనం ప్రకారం ఈయన మఖ్జూమ్ తెగవారు. హుమామ్ బిన్ యహ్యా ప్రకారం ఈయన అన్సారీ.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.3 దొంగతనానికి విధించబడే శిక్ష|హదీసు 1059

1060

హదీసు 1060

وَعَنْ عَبْدِ الرَّحْمَنِ بْنِ عَوْفٍ رَضِيَ اللَّهُ عَنْهُ؛ أَنَّ رَسُولَ اللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { لَا يَغْرَمُ السَّارِقُ إِذَا أُقِيمَ عَلَيْهِ الْحَدُّ } رَوَاهُ النَّسَائِيُّ، وَبَيَّنَ أَنَّهُ مُنْقَطِعٌ.‏ وَقَالَ أَبُو حَاتِمٍ: هُوَ مُنْكَرٌ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) తెలిపారు: “దొంగకు శిక్ష విధించబడిన తరువాత, ఇక (దొంగిలించబడిన) వస్తువుకు సంబంధించిన బాధ్యత అతనిపై లేదు.” (ఈ హదీసును నసాయి ఉల్లేఖించారు. దీని పరంపరలో లోపం ఉందని ఆయన స్వయంగా స్పష్టీకరించారు. అబూ హాతిం దీనిని మున్కర్‌గా ఖరారు చేశారు)

English

'Abdur Rahman bin 'Auf (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: "A thief is not to be fined if the prescribed punishment has been inflicted on him." Related by An-Nasa'i who said that its chain of narrators is disconnected.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.3 దొంగతనానికి విధించబడే శిక్ష|హదీసు 1060

1061

హదీసు 1061

وَعَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ رَضِيَ اللَّهُ عَنْهُمَا، عَنْ رَسُولِ اللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-؛ { أَنَّهُ سُئِلَ عَنِ التَّمْرِ الْمُعَلَّقِ؟ فَقَالَ: "مَنْ أَصَابَ بِفِيهِ مِنْ ذِي حَاجَةٍ، غَيْرَ مُتَّخِذٍ خُبْنَةً، فَلَا شَيْءَ عَلَيْهِ، وَمَنْ خَرَجَ بِشَيْءٍ مِنْهُ، فَعَلَيْهِ الْغَرَامَةُ وَالْعُقُوبَةُ، وَمَنْ خَرَجَ بِشَيْءٍ مِنْهُ بَعْدَ أَنْ يُؤْوِيَهُ الْجَرِينُ، فَبَلَغَ ثَمَنَ الْمِجَنِّ فَعَلَيْهِ الْقَطْعُ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ، وَالنَّسَائِيُّ، وَصَحَّحَهُ الْحَاكِمُ

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : చెట్టుమీద వ్రేలాడే ఖర్జూర పండ్ల గురించి దైవప్రవక్త ﷺను దర్యాప్తు చేయగా ఆయన ﷺ ఇలా వివరించారు -“ఎవరైనా ఆకలితో అలమటిస్తూ ఖర్జూర పండ్లు తుంచుకుంటే అతనికి శిక్ష ఉండదు. అయితే అతను ఆ పండ్లను మూట కట్టుకుపోరాదు. ఎవరయినా మూట గట్టుకునిపోతే అతనిపై జరిమానా వేయటంతో పాటు శిక్ష కూడా విధించబడుతుంది. ఇంకా ఎవరయినా, యజమాని ఆ పండ్లను కోసి ఒక సురక్షిత స్థలంలో నిలువచేసి ఉండగా ఖర్జూరాలను తీసుకుపోతే ఆ పండ్లు ఒక డాలు విలువకు సమానంగా ఉంటే – అతనికి హస్తఖండన శిక్ష విధించబడుతుంది.” (దీనిని అబూదావూద్, నసాయి వెలికి తీశారు. హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

'Abdullah bin 'Amro bin al-'As (RAA) narrated, 'The Messenger of Allah (ﷺ) was asked about dated which are still hanging on the palm tree, he then said, "If a needy person eats some dates, but without taking a supply away in his garment, he is not to be blamed, but if anyone takes away any of it, he is to be fined and punished. And if anyone takes away any of it (the dates) after it has been put in the place where it is going to be dried, and it amounts to the price of a shield, he must have his hand cut off." Related by Abu Dawud and An-Nasa'i. Al-Hakim graded it as Sahih.

సారాంశం

ఈ హదీసులో వివిధ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పండ్లు కోతకు వచ్చి, ఇంకా కోత కోయకుండా చెట్టుకు వ్రేలాడుతున్న స్థితిలో ఎవరయినా ఆకలిగొన్న బాటసారి పండ్లు కోసుకు తిని ఆకలి తీర్చుకుంటే అతనిపై జరిమానా గానీ, శిక్షగానీ విధించబడదు. ఈ విషయంపై అందరిమధ్యా ఏకాభిప్రాయం ఉంది. కాని కోసిన పండ్లతో కడుపు నింపుకుని, మిగిలిన వాటిని మూటకట్టుకునిపోతే మాత్రం శిక్ష విధించబడటంతోపాటు జరిమానా కూడా వడ్డించబడుతుంది. దొంగిలించిన వస్తువుల విలువకు రెండింతల జరిమానా వేయబడుతుంది, పది కొరడా దెబ్బల శిక్ష విధించబడుతుందని బైహఖీ ఉల్లేఖనంలో ఉంది. తోట యజమాని సురక్షిత ప్రదేశంలో భద్రపరచుకున్న పండ్లను గనక ఎత్తుకుపోతే, ఆ పండ్ల వెల షరీయత్ నిర్ధారించిన పరిమాణానికి సమానంగా ఉంటే అట్టి పరిస్థితిలో హస్తఖండన శిక్ష విధించబడుతుంది. ధనరూపేణా జరిమానా చెల్లించవచ్చునన్న సంగతి కూడా ఈ హదీసు ద్వారా వెల్లడవుతున్నది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.3 దొంగతనానికి విధించబడే శిక్ష|హదీసు 1061

1062

హదీసు 1062

وَعَنْ صَفْوَانَ بْنِ أُمِّيَّةٍ ‏- رضى الله عنه ‏- أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ لَهُ لَمَّا أَمَرَ بِقَطْعِ اَلَّذِي سَرَقَ رِدَاءَهُ, فَشَفَعَ فِيهِ: { هَلَّا كَانَ ذَلِكَ قَبْلِ أَنْ تَأْتِيَنِي بِهِ? } أَخْرَجَهُ أَحْمَدُ, وَالْأَرْبَعَةَ. وَصَحَّحَهُ اِبْنُ اَلْجَارُودِ, وَالْحَاكِم ُ.

దుప్పటిని దొంగిలించిన వ్యక్తికి దైవప్రవక్త ﷺహస్తఖండన శిక్ష విధించినపుడు తాను ఆ వ్యక్తి కోసం సిఫారసు చేయగా, “నా దగ్గరికి తీసుకురాకముందే నీవు ఇతనిపై ఎందుకు జాలి చూపలేదు?” అని దైవప్రవక్త ﷺ తనతో అన్నారని హజ్రత్ సఫ్వాన్ బిన్ ఉమయ్య (రదియల్లాహు అన్హు) తెలిపారు. (దీనిని అహ్మద్ మరియు ‘నలుగురు’ ఉల్లేఖించారు – ఇబ్నె జారూద్ మరియు హాకిమ్ లిరువురూ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Safwan bin Umaiyah (RAA) narrated, 'When the Messenger of Allah (ﷺ) commanded that the thief who had stolen his cloak (i.e. Safwan's) should have his hand cut off. Safwan wanted to intercede, for the thief's hand not to be removed. Thereupon the Messenger of Allah (ﷺ) said to him, "Why didn't you do so before bringing him to me?" Related by Ahmad, the four Imams, and Al-Hakim graded it as Sahih.

సారాంశం

సఫ్వాన్ బిన్ ఉమయ్య (రదియల్లాహు అన్హు) బత్‌హా లోయలోనో లేక మస్జిద్‌లోనో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి సఫ్వాన్ తలగడగా పెట్టుకుని ఉన్న దుప్పటిని లాక్కున్నాడు. ఆ వ్యక్తి నిర్బంధించబడ్డాడు. అనంతరం అతన్ని దైవప్రవక్త ﷺ న్యాయస్థానంలో హాజరుపరచారు. దైవప్రవక్త ﷺ అతనికి హస్తఖండన శిక్ష విధించమని ఆదేశించారు. అప్పుడు సఫ్వాన్ అతన్ని క్షమిస్తున్నట్టు చెప్పారు. “ఇతన్ని నా దగ్గరకు తీసుకు రాకముందే ఎందుకు క్షమించలేదు?” అని దైవప్రవక్త ﷺ మందలించారు. ఆ తరువాత శిక్షను అమలు పరచమని ఆజ్ఞాపించారు. కేసు ఒకసారి న్యాయస్థానానికి వచ్చి, దానిపై విచారణ జరిపిన తరువాత ఇక మన్నింపుల వైఖరికి ఆస్కారముండదని ఈ హదీసు చెబుతోంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.3 దొంగతనానికి విధించబడే శిక్ష|హదీసు 1062

1063

హదీసు 1063

وَعَنْ جَابِرٍ قَالَ: جِيءَ بِسَارِقٍ إِلَى اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-فَقَالَ: { "اُقْتُلُوهُ".‏ فَقَالُوا: إِنَّمَا سَرَقَ يَا رَسُولَ اللَّهِ!.‏ قَالَ: "اِقْطَعُوهُ" فَقَطَعَ, ثُمَّ جِيءَ بِهِ اَلثَّانِيَةِ, فَقَالَ "اُقْتُلُوهُ" فَذَكَرَ مِثْلَهُ, ثُمَّ جِيءَ بِهِ الثَّالِثَةَ, فَذَكَرَ مِثْلَهُ, ثُمَّ جِيءَ بِهِ اَلرَّابِعَةِ كَذَلِكَ, ثُمَّ جِيءَ بِهِ اَلْخَامِسَةِ فَقَالَ: "اُقْتُلُوهُ" } أَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَالنِّسَائِيُّ, وَاسْتَنْكَرَه ُ. وَأَخْرُجَ مِنْ حَدِيثِ اَلْحَارِثِ بْنِ حَاطِبٍ نَحْوَه ُ. وَذَكَرَ اَلشَّافِعِيُّ أَنَّ اَلْقَتْلَ فِي اَلْخَامِسَةِ مَنْسُوخٌ.‏

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ సమక్షంలో ఒక దొంగ హాజరుపరచబడ్డాడు. “ఇతన్ని హతమార్చండి” అని ఆయన ﷺ అన్నారు. ‘దైవప్రవక్తా ﷺ! ఇతను దొంగతనం చేశాడు’ అని అక్కడున్న జనులు చెప్పగా “అయితే ఇతని చేయి నరకండి” అని ఆయన ﷺ అన్నారు. ఆ వ్యక్తి చేయి నరికివేయబడింది. మరోసారి ఆ వ్యక్తిని హాజరుపరచగా, “ఇతన్ని చంపేయండి” అని ఆయన ﷺ అన్నారు. మునుపటి వలెనే ప్రజలు విన్నవించుకున్నారు. మూడోసారి తేబడినప్పుడు కూడా అదే సంగతి పునరావృతమయింది. నాల్గవసారి కూడా అదే తతంగం. ఐదవసారి కూడా ఆ వ్యక్తిని బంధించి తీసుకురాగా, “ఇతనికి మరణ శిక్ష విధించండి” అని ఆయన ﷺ ఆదేశించారు.(దీనిని అబూదావూద్, నసాయి ఉల్లేఖించారు – దీనిని మున్కర్‌గా ఖరారు చేశారు. హారిస్ బిన్ హాతిబ్ హదీసు ద్వారా నసాయి కూడా ఇదే విధంగా తీసుకున్నారు. మరణ శిక్ష విధించమని ఐదవసారి చెప్పిన సంగతి రద్దుపరచబడిందని ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) అన్నారు)

English

Jabir (RAA) narrated, 'A thief was brought to the Prophet (ﷺ) and he said to them, "Kill him." The people said, 'He has just stolen O Messenger of Allah!' He then said, "Cut off his hand." He was brought to him the second time and the Messenger of Allah (ﷺ) also said, "Kill him." They said the same and the Messenger of Allah (ﷺ) said to them, 'Cut off his hand." The same man was brought a third time and a fourth time and same was said. When they brought him the fifth time, the Messenger of Allah (ﷺ) said: "Kill him." Related by Abu Dawud and An-Nasa'i who regarded it as Munkar (a type of weak hadith).

Ab-Nasa'i also reported a similar hadith on the authenticity of Al-Harith bin Hatib. Ash-Shafi'i mentioned that the killing in the fifth time (of stealing) is abrogated.

సారాంశం

దొంగతనం చేసిన నేరానికి మరణ శిక్ష విధించవచ్చునని ఈ హదీసు ద్వారా వెల్లడవుతోంది. అయితే ఈ హదీసు ప్రామాణికమైనది కాదు. ఇది ‘జయీఫ్’ కోవకు చెందినది. ఈ ఉల్లేఖనం త్రోసిపుచ్చదగినదని ఇమామ్ ఇబ్నె అబ్దుల్ బర్ అభిప్రాయపడ్డారు. ఇది ఆచరణ యోగ్యం కానిదన్న విషయంలో విద్వాంసులందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది.

హదీసు ఉల్లేఖకులు

హారిస్ బిన్ హాతిబ్ జుమహీ, ఖురషీ. అబీసీనియాలో పుట్టారు. అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ తరపున హిజ్రీ 66లో మక్కాలో గవర్నరుగా నియమితులయ్యారు. ఆరేళ్ళు తన సేవల్ని అందించారు. మర్వాన్ హయాంలో కూడా ఆయనకు సహాయకులుగా ఉన్నారు. హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలంలో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.3 దొంగతనానికి విధించబడే శిక్ష|హదీసు 1063