హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 96. సాగనంపేటప్పుడు హితవు, ప్రార్థన

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 96వ అధ్యాయం: బంధుమిత్రుల్ని సాగనంపినప్పుడు హితవు చెప్పి మరీ సాగనంపాలి, వారి శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. తమకోసం కూడా ప్రార్థించమని వారిని కోరాలి. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 6 హదీసులు (హదీసు 712 – 717) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

96. బంధుమిత్రుల్ని సాగనంపినప్పుడు హితవు చెప్పి మరీ సాగనంపాలి, వారి శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. తమకోసం కూడా ప్రార్థించమని వారిని కోరాలి

↑ విషయ సూచిక

باب وداع الصاحب ووصيته عند فراقه لسفر وغيره والدعاء لَهُ وطلب الدعاء مِنْهُ

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

"ఇదే (ఇస్లాం) మార్గంలో నడవండి అని ఇబ్రాహీమ్ తన సంతానానికి హితోపదేశం చేశాడు. ఈ ఉపదేశాన్నే యాఖూబ్ కూడా తన సంతానానికి చేశాడు: "నా బిడ్డలారా! ఈ ధర్మాన్నే అల్లాహ్ మీ కొరకు ఎన్నిక చేశాడు. కనుక మీరు మరణించే వరకూ ముస్లిములు గానే ఉండండి." యాఖూబు మృత్యు దశలో ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నారా? మర ణించే ముందు అతను తన కుమారులను ఇలా అడిగాడు : "బిడ్డలారా! నా తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు?" వారంతా ఇలా సమాధానం చెప్పారు: "మీరూ, మీ పెద్దలైన ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్‌హాఖ్ దేవుడుగా భావించిన ఆ ఏకైక దేవుణ్ణే మేమూ ఆరా ధిస్తాం. మేము ఆయనకే ముస్లిం (విధేయు) లయి ఉంటాం." (అల్ బఖర : 132, 133)

పై దివ్య ఖుర్‌ఆన్ సూక్తుల్లో హజ్రత్ యాఖూబ్ (అలైహి) చరమ దశలో తన సంతానానికి హితోపదేశం చేశారు. ఈ సూక్తు లను ఆధారంగా చేసుకొని గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ప్రయాణ సమయాల్లో కూడా వెళ్ళేవారికి హితోపదేశం చేయవచ్చని అంటున్నారు. అదీగాకుండా మృత్యు దశను గుర్తించటం చాలా కష్టం. మరో వైపు స్థాని కంగా ఉండేటప్పటికన్నా ప్రయాణాల్లో ఉన్న ప్పుడు మనిషి మృత్యు వాతనపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంచేత ప్రయాణానికి బయలుదేరేవారికి హితోపదేశం చేసి సాగ నంపటం అన్ని విధాలా ఉత్తమం.

English

“And this (submission to Allah, Islam) was enjoined by Ibrahim (Abraham) upon his sons and by Ya`qub (Jacob) (saying), `O my sons! Allah has chosen for you the (true) religion, then die not except in the Faith of Islam (as Muslims – Islamic Monotheism).’ Or were you witnesses when death approached Ya`qub (Jacob)? When he said unto his sons, `What will you worship after me?’ They said, `We shall worship your Ilah (God – Allah) the Ilah (God) of your fathers, Ibrahim (Abraham), Isma`il (Ishmael), Ishaq (Isaac). One Ilah (God), and to Him we submit (in Islam)’.” [Al-Baqarah 2:132–133]

712

హదీసు 712

فمنها حَديثُ زيدِ بنِ أَرْقَمَ رضي اللَّه عنه الَّذِي سبق في بَابِ إِكرامِ أَهْلِ بَيْتِ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: قامَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فِينَا خَطِيباً، فَحَمِدَ اللَّه، وَأَثْنى عَلَيهِ، وَوَعَظَ وَذَكَّرَ ثُمَّ قَالَ: " أَمَّا بَعْدُ، أَلا أَيُّهَا النَّاسُ إِنَّمَا أَنا بشرٌ يُوشِكُ أَنْ يَأْتِيَ رَسُولُ رَبِّي فأُجيب، وأَنَا تَاركٌ فيكُمْ ثَقَليْنِ: أَوَّلهُمَا: كِتَابُ اللَّهِ، فيهِ الهُدَى وَالنُّورُ، فَخُذُوا بِكتاب اللَّه، وَاسْتَمْسِكُوا بِهِ" فَحَثَّ عَلى كِتَابِ اللَّه، ورَغَّبَ فِيهِ، ثُمَّ قَالَ:"وَأَهْلُ بَيْتي، أُذَكِّرُكُمُ اللَّه في أَهْلِ بَيْتي"رواه مسلم. وَقَدْ سَبَقَ بطُولِهِ.

హజ్రత్ జైద్ బిన్ అర్ఖమ్ (రదియల్లాహు అన్హు) కథనం :

"ఓ రోజు దైవప్రవక్త ﷺ మా మధ్య నిలబడి ఉపన్యాసం ఇచ్చారు. ముందుగా ఆయన దేవుని ప్రశంసల్ని, ఆయన పొగడ్తల్ని స్తుతించారు. ప్రజలకు హితోపదేశం చేశారు. ఆ తరువాత ఇలా అన్నారు :

"ప్రజలారా! జాగ్రత్తగా వినండి! నేనూ ఒక మానవుణ్ణే. నా ప్రభువు దగ్గరి నుండి దూత వస్తే, (అందరిలాగే నేను కూడా) ప్రభువు పిలుపుకు హాజరు పలికి వెళ్ళిపోతాను. నేను మీ మధ్య రెండు బరువైన వస్తువులు వదలివెళ్తున్నాను. వాటిలో మొదటిది : దైవగ్రంథము. అందులో (మనిషి జీవన) సంవిధానముంది. (సన్మార్గంపై నడిపించే) వెలుగు ఉంది. కనుక మీరు దైవగ్రంథాన్ని అనుసరిస్తూ దాన్ని గట్టిగా పట్టుకోండి."

ఆ విధంగా అప్పుడు దైవప్రవక్త ﷺ దైవగ్రంథాన్ని ఆచరించమని ప్రజలను ప్రోత్సహించారు. దానిని అనుసరించమని పురికొల్పారు. తరువాత ఇలా అన్నారు :

ఇక (రెండో విషయం) నా కుటుంబీకులకు సంబంధించినది. నా కుటుంబీకుల విషయంలో నేను మీకు దేవుణ్ణి గుర్తుచేస్తున్నాను. (ముస్లిం)

English

Yazid bin Haiyan (radiyallahu anhu) reported: I went along with Husain bin Sabrah and `Amr bin Muslim to Zaid bin Arqam (radiyallahu anhuma) and, as we sat by his side, Husain said to him: “O Zaid, you acquired great merits that you saw Messenger of Allah ﷺ, listened to his talk, fought by his side in (different) battles, and offered Salat behind him. You have in fact earned great merits, Zaid! Could you then tell us what you heard from the Messenger of Allah ﷺ?” He said: “O my cousin! By Allah! I have grown old and have almost spent up my age and I have forgotten some of the things which I remembered in connection with Messenger of Allah ﷺ, so accept what I narrate to you, and what I fail to narrate, do not compel me to narrate that.” He then said: “One day Messenger of Allah ﷺ stood up to deliver a Khutbah at a watering place known as Khumm between Makkah and Al-Madinah. He praised Allah, extolled Him and delivered the Khutbah and exhorted (us) and said, `Amma Ba`du (now then)! O people, certainly I am a human being. I am about to receive a messenger (the angel of death) from my Rubb and I, in response to Allah’s Call, but I am leaving among you two weighty things: the Book of Allah in which there is right guidance and light, so hold fast to the Book of Allah and adhere to it.’ He exhorted (us) (to hold fast) to the Book of Allah and then said, `The second are the members of my household, I remind you (of your duties) to the members of my family.”’

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|96. బంధుమిత్రుల్ని సాగనంపినప్పుడు హితవు చెప్పి మరీ సాగనంపాలి, వారి శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. తమకోసం కూడా ప్రార్థించమని వారిని కోరాలి|హదీసు 712

713

హదీసు 713

وعن أَبي سُليْمَانَ مَالك بن الحُويْرثِ رضي اللَّه عنه قَالَ: أَتَيْنَا رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَنحْنُ شَبَبةٌ متَقَاربُونَ، فَأَقمْنَا عِنْدَهُ عشْرينَ لَيْلَةً، وكانَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم رَحِيماً رفِيقاً، فَظَنَّ أَنَّا قَدِ اشْتَقْنَا أَهْلَنَا. فسَأَلَنَا عَمَّنْ تَرَكْنَا مِنْ أَهْلِنَا، فَأَخْبَرْنَاهُ، فَقَالَ: "ارْجعُوا إِلى أَهْليكم فَأَقِيمُوا فِيهِمْ، وَعلِّموهُم وَمُرُوهُمْ، وَصَلُّوا صَلاةَ كَذا فِي حِين كَذَا، وَصَلُّوا كَذَا في حِين كَذَا، فَإِذَا حَضَرَتِ الصَّلاةُ فَلْيُؤذِّنْ لَكُمْ أَحَدُكُمْ، وَلْيؤمَّكُم أَكبَرُكُمَ" متفقٌ عَلَيْهِ. زاد البخاري في رواية لَهُ: "وَصَلَّوا كمَا رَأَيتُمُوني أُصَلِّي". قوله:"رَحِيماً رَفِيقاً"روِيَ بفاءٍ وقافٍ، وروِيَ بقافينٍ.

హజ్రత్ అబూ సులైమాన్ మాలిక్ బిన్ హువైరిస్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి మేము దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన మేమంతా దాదాపు సమవయస్కులైన నవయువకులం. ఆయన దగ్గర మేము ఇరవై రాత్రులు గడిపాం. ఆయన చాలా దయామయులు, మృదు మనస్కులు. మాకు మా వాళ్ళు గుర్తొస్తున్నారని గ్రహించి ఆయన మమ్మల్ని మా ఇండ్ల విషయాల గురించి అడిగారు. మేమాయనకు మా వివరాలన్నీ తెలియజేశాం.

అంతా విన్న తరువాత ఆయన మమ్మల్ని (మా స్వస్థలానికి సాగనంపుతూ) "మీరు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. మీ వాళ్ళలోనే ఉండి వారికి (ధర్మం గురించి) బోధించండి. (మంచిని గురించి) ఆదేశించండి. ఫలానా వేళకు ఫలానా నమాజు చేయండి, ఫలానా వేళకు ఫలానా నమాజ్ చేయండి. నమాజ్ వేళ అయినప్పుడు మీలో ఒకరు అజాన్ ఇవ్వాలి. అందరిలోకెల్లా ఎక్కువ వయస్సున్న వ్యక్తి నమాజ్ చేయించాలి" అని హితోపదేశం చేశారు. (బుఖారీ – ముస్లిం)

బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో ఈ వాక్యం అదనంగా ఉంది: "మీరు నన్ను ఏవిధంగా నమాజ్ చేస్తున్నట్లు చూశారో ఆ విధంగా నమాజ్ చేయండి."

(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణం)

English

Malik bin Al-Huwairith (radiyallahu anhu) reported: We came to the Messenger of Allah ﷺ when we were all young men of nearly equal age. We stayed with him for twenty days. He was extremely kind and considerate. He perceived that we missed our families so he asked us about those we left behind, and we informed him. Then he ﷺ said, “Go back to your families, stay with them, teach them (about Islam) and exhort them to do good. Perform such Salat (prayer) at such a time and such Salat at such a time. When the time for Salat is due, one of you should announce Adhan (call for prayer) and the oldest among you should lead Salat.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

  1. ఈ హదీసు యువకుల్లో ధార్మిక విద్య నేర్చుకోవాలనే ఆకాంక్ష ఉండాలని ప్రబోధిస్తోంది. హదీసులో చెప్పబడినట్లు ఒకానొక తెగకు చెందిన కొందరు యువకులు ధార్మిక విద్యను అభ్యసించాలనే పట్టుదలతో తమ ఆప్తుల్ని, ఆత్మీయులందర్నీ వదలి ఎంతో దూరం ప్రయాణంచేసి దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళారు. దీనిద్వారా విద్యాభ్యాసం కోసం అవసరమైతే దూరప్రాంతాలకు, విదేశాలకు కూడా వెళ్ళాలన్న విషయం బోధపడుతోంది.
  2. ధార్మిక విద్యను అభ్యసించిన తరువాత తెలియని వారికి దాన్ని బోధించాలి.
  3. నమాజ్ చేయటం కోసం ముందుగా అజాన్ ఇవ్వాలి.
  4. అందరిలోకీ ఎక్కువ వయస్సున్న వ్యక్తి సామూహిక నమాజ్‌కు సారథ్యం వహించాలి. అందరూ సమవయస్కులై ఉన్నప్పుడు అందరికన్నా బాగా ఖుర్‌ఆన్ పారాయణం చేయగలిగే వ్యక్తి నమాజ్‌కు నేతృత్వం వహించాలి. ఆ తర్వాత ఖుర్‌ఆన్ హదీసుల జ్ఞానంలో అందరికన్నా నిష్ణాతుడైన వ్యక్తి నమాజ్ చేయించటానికి అర్హుడిగా పరిగణించబడతాడు.
  5. అజాన్, ఇమామత్‌ల గురించి దైవప్రవక్త ﷺ చేసిన బోధనల సారం ఏమిటంటే, ఎక్కడయినా, ఏ సమయంలోనయినా అజాన్ ఇచ్చి సామూహికంగా నమాజ్ చేయటానికి కృషిచేయాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|96. బంధుమిత్రుల్ని సాగనంపినప్పుడు హితవు చెప్పి మరీ సాగనంపాలి, వారి శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. తమకోసం కూడా ప్రార్థించమని వారిని కోరాలి|హదీసు 713

714

హదీసు 714

وعن عُمَرَ بنِ الخطاب رضي اللَّهُ عنه قَالَ: اسْتَأْذَنْتُ النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم في الْعُمْرَةِ، فَأَذِنَ، وَقالَ: "لاَ تنْسنَا يَا أخيَّ مِنْ دُعَائِك "فقالَ كَلِمَةً مَا يَسُرُّني أَنَّ لِي بهَا الدُّنْيَا. وفي رواية قَالَ: "أَشْرِكْنَا يَا أخَيَّ في دُعَائِكَ" رواه أَبُو داود، والترمذي وقال: حديث حسن صحيح.

హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి నేను ఉమ్రాకు వెళ్ళటానికి దైవప్రవక్త ﷺ అనుమతి కోరాను. అప్పుడు ఆయన అనుమతి ఇస్తూ, "సోదరా! (ఉమ్రాలో) నువ్వు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు మమ్మల్ని మరచిపోకు" అని అన్నారు. ఆయన అన్న ఆ మాటకు నేనెంత పొంగిపోయానంటే, మొత్తం ప్రపంచం నా సొంతమయినా నాకు అంత ఆనందం కలిగేది కాదు.

వేరొక ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : "సోదరా! నీ ప్రార్థనలో మమ్మల్ని కూడా చేర్చుకో."

(దీనిని అబూదావూద్ మరియు తిర్మిజీలు వెలికితీశారు. తిర్మిజీ దీనిని 'హసన్' మరియు 'సహీహ్'గా పేర్కొన్నారు.)

English

`Umar bin Al-Khattab (radiyallahu anhu) reported: I sought permission of the Prophet ﷺ to perform `Umrah, and he granted me leave and said, “Brother, do not forget us in your supplications.” I would not exchange these words of his for the whole world.

Another narration is: He ﷺ said, “Include us, my brother, in your supplications.”[Abu Dawud and At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|96. బంధుమిత్రుల్ని సాగనంపినప్పుడు హితవు చెప్పి మరీ సాగనంపాలి, వారి శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. తమకోసం కూడా ప్రార్థించమని వారిని కోరాలి|హదీసు 714

715

హదీసు 715

وعن سالم بنِ عَبْدِ اللَّه بنِ عُمَرَ أَنَّ عبدَ اللَّه بنِ عُمَرَ رضي اللَّه عنهما كَانَ يَقُولُ لِلرَّجُلِ إِذَا أَرَادَ سَفَراً: ادْنُ مِنِّي حَتَّى أُوَدِّعَكَ كمَا كَانَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يُودِّعُنَا فيقُولُ: "أَسْتَوْدعُ اللَّه دِينَكَ، وَأَمانَتَكَ، وخَوَاتِيمَ عَمَلِكَ"، رواه الترمذي، وقال: حديث حسن صحيح.

హజ్రత్ సాలిమ్ (రదియల్లాహు అన్హు) కథనం : హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ప్రయాణానికి నిశ్చయించుకున్న వ్యక్తిని ఉద్దేశ్యించి ఇలా అనేవారు: "దగ్గరకు రా. దైవప్రవక్త ﷺ మమ్మల్ని సాగనంపిన విధంగా నేను నిన్ను సాగనంపుతాను. ఆయన మమ్మల్ని ఈ విధంగా ఆశీర్వదించి సాగనంపేవారు:

"అస్తౌదివుల్లాహ దీనక, వ అమానతక, వ ఖవాతీమ అమలిక."

"నేను నీ ధర్మాన్ని, నీ నిజాయితీని, నీ ఆచరణల ముగింపుని దేవునికి అప్పజెబుతున్నాను."

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 'హసన్', 'సహీహ్'గా పేర్కొన్నారు.)

English

Salim bin `Abdullah bin `Umar (radiyallahu anhuma) reported: When a man was to set out on a journey, `Abdullah bin `Umar (radiyallahu anhuma) would say to him: “Draw near so that I may bid farewell to you as Messenger of Allah ﷺ used to bid farewell to us. (The Messenger of Allah ﷺ used to say: “`Astaudi`ullaha dinaka, wa amanataka, wa khawatima `amalika’ (I entrust Allah with your Deen, your trust and your last deeds).”[At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|96. బంధుమిత్రుల్ని సాగనంపినప్పుడు హితవు చెప్పి మరీ సాగనంపాలి, వారి శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. తమకోసం కూడా ప్రార్థించమని వారిని కోరాలి|హదీసు 715

716

హదీసు 716

وعن عبدِ اللَّهِ بنِ يزيدَ الخَطْمِيِّ الصَّحَابيِّ رضي اللَّه عنه قَالَ: كَانَ رسولُ اللَّه صلى الله عليه وسلم إِذا أَرَادَ أَنْ يُوَدِّعَ الجَيْش قالَ: "أَسْتَوْدعُ اللَّه دِينَكُمْ، وَأَمَانَتكُم، وَخَوَاتِيمَ أَعمَالِكُمْ". حديث صحيح، رواه أَبُو داود وغيره بإِسناد صحيح.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ యజీద్ ఖత్మీ సహాబీ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఏదయినా సైనిక దళాన్ని సాగనంపినప్పుడు ఈవిధంగా ఆశీర్వదించి మరీ సాగనంపేవారు: "నేను మీ ధర్మాన్ని, మీ నిజాయితీని, మీ ఆచరణల ముగింపుని దేవునికి అప్పజెబుతున్నాను."

(అబూదావూద్, దీని ఆధారాలు ప్రామాణికమైనవి.)

(సుననె అబూదావూద్‌లోని జిహాద్ ప్రకరణం)

English

`Abdullah bin Yazid Al-Khatmi (radiyallahu anhu) reported: When Messenger of Allah ﷺ intended to bid farewell to his army he would say: “Astau-di’ullaha dinakaum, wa amanatakum, wa khawatima `amalikum (I entrust Allah with your Deen, your trust and your last deeds).”[Abu Dawud].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|96. బంధుమిత్రుల్ని సాగనంపినప్పుడు హితవు చెప్పి మరీ సాగనంపాలి, వారి శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. తమకోసం కూడా ప్రార్థించమని వారిని కోరాలి|హదీసు 716

717

హదీసు 717

وعن أَنسٍ رضي اللَّه عنه قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَالَ: يَا رسُولَ اللَّه، إِني أُرِيدُ سَفَراً، فَزَوِّدْني، فَقَالَ: "زَوَّدَكَ اللَّه التَّقْوَى". قَالَ: زِدْني، قَالَ: "وَغَفَرَ ذَنْبَكَ"قَالَ: زِدْني، قَالَ:"وَيَسَّرَ لكَ الخيْرَ حَيْثُمَا كُنْتَ" رواه الترمذي وقال: حديث حسن.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి, "దైవప్రవక్తా! నేను (ఓ చోటుకి) ప్రయాణం చేయాలనుకుంటున్నాను. కనుక నాకు ప్రయాణ సామగ్రిని ప్రసాదించండి (అంటే నన్ను ఆశీర్వదించండి)" అని అడిగాడు. "దేవుడు నీకు భక్తి సామగ్రిని ప్రసాదించుగాక!" అని ఆశీర్వదించారు. దైవప్రవక్త ﷺ. ఇంకా ఆశీర్వదించమని అడిగాడా వ్యక్తి. దైవప్రవక్త, "దేవుఢు నీ పాపాలను క్షమించుగాక!" అని ఆశీర్వదించారు. ఆ వ్యక్తి మరింత సామగ్రి కావాలన్నాడు. అప్పుడు, "నువ్వెక్కడున్నా దేవుడు నీ కోసం మంచిని సులభం చేయుగాక!" అని ఆశీర్వదించారు ఆయన.

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి, 'హసన్' కోవకు చెందినదిగా పేర్కొన్నారు.)

English

Anas (radiyallahu anhu) reported: A man came to the Prophet ﷺ and said: “O Messenger of Allah! I intend to go on a journey, so supplicate for me.” He ﷺ said, “May Allah grant you the provision of piety.” The man said: “Please supplicate more for me.” He ﷺ said, “May He forgive your sins!” The man repeated: “Please supplicate more for me.” Messenger of Allah ﷺ said, “May He facilitate for you the doing of good wherever you are.”[At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|96. బంధుమిత్రుల్ని సాగనంపినప్పుడు హితవు చెప్పి మరీ సాగనంపాలి, వారి శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. తమకోసం కూడా ప్రార్థించమని వారిని కోరాలి|హదీసు 717