హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 89. ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా మాట్లాడాలి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 89వ అధ్యాయం: ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా మాట్లాడాలి. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 696 – 697) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

89. ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా మాట్లాడాలి

↑ విషయ సూచిక

باب استحباب بيان الكلام وإيضاحه للمخاطب وتكريره ليفهم إذا لم يفهم إلا بذلك

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

696

హదీసు 696

عن أنسٍ رضي اللَّه عنه أنَّ النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كانَ إِذَا تَكَلّم بِكلِمَةٍ أعَادها ثَلاثاً حَتَّى تُفْهَم عَنهُ، وَإِذَا أتَى عَلى قَوْمٍ فَسَلَّمَ عَلَيْهِمْ سَلَّمَ علَيْهِمْ ثَلاثاً. رواه البخاري.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఏదయినా విషయం చెప్పినప్పుడు అందరికీ అర్థమయ్యేలా మూడుసార్లు చెప్పేవారు. ఎవరిదగ్గరికయినా వెళ్ళి సలాం చేసినప్పుడు కూడా మూడుసార్లు సలాం చేసేవారు

(బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని విద్యా ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: Whenever the Prophet ﷺ said something, he would repeat his words thrice so that the meanings would be understood fully; and whenever he came upon a group of people, he would greet them, and he would repeat salutation thrice.[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|89. ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా మాట్లాడాలి|హదీసు 696

697

హదీసు 697

وعن عائشة رضي اللَّه عنها قالت: كَانَ كلامُ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَلاماً فَصْلا يفْهَمُهُ كُلُّ مَن يَسْمَعُهُ. رواه أَبُو داود.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ ఏదయినా మాట్లాడినప్పుడు ఆగి ఆగి మాట్లాడేవారు. ఆయన మాటలు వినే ప్రతి వ్యక్తి (చాలా సులభంగా) వాటిని అర్థం చేసుకోగలిగేవాడు. (అబూదావూద్)

(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: the speech of Messenger of Allah ﷺ was so clear that all those who listened to it would understand it.[Abu Dawud].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో 'ఫస్లన్' అనే పదం వాడబడింది. ఫస్లన్ అంటే స్పష్టంగా, సుబోధకంగా అని హదీసు వ్యాఖ్యానకర్తలు రాశారు. అయితే అందులోనే దైవప్రవక్త ﷺ ఆగి ఆగి మాట్లాడేవారన్న అర్థం కూడా వస్తుంది. ఆయన నోటినుండి వెలువడే ప్రతిమాట స్పష్టంగా ఉండేది. సంబోధకుల స్థాయిని బట్టి ఆయన వారితో అచ్చమైన అరబీ భాషలో మాట్లాడేవారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|89. ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా మాట్లాడాలి|హదీసు 697