హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 61. పిసినారితనానికి, పేరాశకు దూరంగా ఉండాలి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 61వ అధ్యాయం: పిసినారితనానికి, పేరాశకు దూరంగా ఉండాలి. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 1 హదీసులు (హదీసు 563) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

61. పిసినారితనానికి, పేరాశకు దూరంగా ఉండాలి

↑ విషయ సూచిక

باب النهي عن البخل والشُّحِّ

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు :

{وَأَمَّا مَنْ بَخِلَ وَاسْتَغْنَى وَكَذَّبَ بِالْحُسْنَى فَسَنُيَسِّرُهُ لِلْعُسْرَى وَمَا يُغْنِي عَنْهُ مَالُهُ إِذَا تَرَدَّى} [الليل:٨-١١]

"ఎవరు పిసినారితనం వహించాడో, (దేవుని పట్ల) నిర్లక్ష్య వైఖరి అవలంబించాడో, పైగా మంచిని తృణీకరించాడో అతనికి మేము కఠినమార్గంలో నడిచేందుకు సౌకర్యాన్ని కలుగజేస్తాము. అతను నశిస్తే ఇక అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది?" (అల్ లైల్ : 8 – 11)

ఇంకోచోట ఇలా అంటున్నాడు :

{وَمَنْ يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَئِكَ هُمُ الْمُفْلِحُونَ} [التغابن:١٦]

"తమ హృదయలోభత్వం నుండి రక్షణ పొందినవారే సాఫల్యం పొందేవారు." (అత్ తగాబున్ : 16)

వివరణ :

అరబీ భాషలో పిసినారితనానికి 'బుఖ్ల్' మరియు 'షుహ్' అనే రెండు పదాలు వస్తాయి. రెండింటికి దాదాపు అర్థం ఒక్కటే. అయితే కొంతమంది పండితులు ఈ రెండు పదాల మధ్య భేదాన్ని గుర్తిస్తున్నారు. మనిషి దైవమార్గంలో డబ్బు ఖర్చుపెట్టకపోవటం 'బుఖ్ల్' అవుతుందనీ, అదే ఇతరుల ధనాన్ని అక్రమంగా కబళిస్తే దాన్ని 'షుహ్' అంటారని అభిప్రాయపడుతున్నారు. ఆ విధంగా చూస్తే బుఖ్ల్ కన్నా షుహ్ ఇంకా ఘోరమైన నేరమని తెలుస్తోంది. పై సూక్తుల ప్రకారం మానవుల్లో తమ ధనంలో నుండి జకాత్ పన్నును చెల్లిస్తూ, అవసరమైనప్పుడు దానధర్మాలు చేస్తూ, అక్రమ ఆర్జనకు దూరంగా ఉండేవారు పరలోకంలో ముక్తిపొందుతారు. దీనికి భిన్నంగా పేరాశకు, పిసినారితనానికి గురైన వారు ఇహపరాల్లో వినాశాన్ని చవిచూస్తారు.

English

“But he who is greedy miser and thinks himself self-sufficient. And belies Al-Husna. We will make smooth for him the path for evil. And what will his wealth avail him when he goes down (in destruction)?” [Al-Layl 92:8–11]

“And whosoever is saved from his own covetousness, then they are the successful ones.” [At-Taghābun 64:16]

563

హదీసు 563

وعن جابر رضي اللَّه عنه أَنَّ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "اتَّقُوا الظُّلْمَ، فَإِنَّ الظُّلْمَ ظُلمَاتٌ يوْمَ القِيامَة، واتَّقُوا الشُّحَّ، فَإِنَّ الشُّحَّ أَهْلَكَ منْ كانَ قَبْلَكُمْ، حَمَلَهُم عَلَى أَن سَفَكُوا دِمَاءَهم واستحَلُّوا مَحَارِمَهُم" رواه مسلم.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : అన్యాయానికి దూరంగా ఉండండి. ఎందుకంటే అన్యాయం ప్రళయదినాన కటిక చీకట్ల రూపంలో ఉంటుంది. ఇంకా పేరాశకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ పేరాశే మీకు పూర్వం గతించిన సమాజాల్ని నాశనం చేసింది, ప్రజలు ఒండొకరి రక్తం చిందించేందుకు, నిషిద్ధ వస్తువుల్ని ధర్మసమ్మతం (హలాల్)గా చేసుకునేందుకు ప్రేరేపించింది. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)

English

Jabir bin `Abdullah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Beware of oppression, for oppression will be darkness on the Day of Resurrection; and beware of stinginess because it destroyed those who were before you. It incited them to shed their blood and deem unlawful as lawful.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|61. పిసినారితనానికి, పేరాశకు దూరంగా ఉండాలి|హదీసు 563