హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 59వ అధ్యాయం: చెమటోడ్చి డబ్బు సంపాదించి, తన స్వయాన్ని పోషించుకోవటంతోపాటు ఇతరులకు కూడా సహాయం చేయటం ఉత్తమ కార్యం. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 5 హదీసులు (హదీసు 539 – 543) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
59. చెమటోడ్చి డబ్బు సంపాదించి, తన స్వయాన్ని పోషించుకోవటంతోపాటు ఇతరులకు కూడా సహాయం చేయటం ఉత్తమ కార్యం
باب الحثَّ عَلَى الأكل من عمل يده والتعفف به من السؤال والتعرُّض للإعطاء
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు:
{فَإِذَا قُضِيَتِ الصَّلاةُ فَانْتَشِرُوا فِي الْأَرْضِ وَابْتَغُوا مِنْ فَضْلِ اللَّهِ} [الجمعة:١٠]
"విశ్వాసులారా! నమాజు ముగిసిన తరువాత భూమిపై వ్యాపించండి, అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషించండి." (అల్ జుముఅహ్ : 10)
వివరణ :
ఇక్కడ అల్లాహ్ అనుగ్రహమంటే ఉపాధి అని అర్థం. అంటే నమాజు ముగిసిన తరువాత వెంటనే తిరిగి బ్రతుకుతెరువుకు మార్గాలను అన్వేషించమని పై సూక్తికి భావం. ఈ వాక్యం మనిషి కష్టపడి పని చేయాలని ప్రబోధిస్తోంది. మనిషి ఏదైనా వ్యాపారంగాని, ఉద్యోగంగాని చేసి కష్టపడి డబ్బు సంపాదించుకుంటే అతనికి ఇతరుల ముందు చేయిచాపి అడుక్కోవాల్సిన అగత్యం ఉండదు. పైగా తనే నలుగురికి సహాయం చేయగల స్థాయికి ఎదుగుతాడు.
English
“Then when the (Jumu`ah) Salat (prayer) is ended, you may disperse through the land, and seek the Bounty of Allah (by working).” [Al-Jumu‘ah 62:10]
హదీసు 539
وعنْ أَبي عبدِ اللَّه الزُّبَيْرِ بنِ العوَّامِ رضي اللَّه عنه قالَ: قالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لأَنْ يَأْخُذَ أَحَدُكُم أَحبُلَهُ ثُمَّ يَأْتِيَ الجَبَلَ، فَيَأْتِيَ بحُزْمَةٍ مِن حَطَبٍ عَلى ظَهِرِهِ فَيَبيعَهَا، فَيَكُفَّ اللَّه بِهَا وَجْهَهُ، خَيْرٌ لَهُ مِنْ أَن يَسأَلَ النَّاسَ، أَعطَوْهُ أَوْ مَنَعُوهُ" رواه البخاري.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ బిన్ అవ్వామ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : ప్రజల ముందు ముష్టెత్తడంకన్నా తాడు తీసుకొని కొండపైకెళ్ళి వీపుమీద కట్టెలమోపు తీసుకొచ్చి అమ్ముకొని డబ్బు సంపాదించుకోవటం మేలు. పైగా అలా చేస్తే దేవుడు అతని ఆత్మాభిమానాన్ని కాపాడతాడు. అదే (ప్రజల దగ్గర అడుక్కుంటే) వారు ఇవ్వొచ్చు, ఇవ్వకపోవచ్చు.
(బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని జకాత్ ప్రకరణం)
English
Zubair bin `Awwam (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “It is far better for you to take your rope, go to the mountain, (cut some firewood) carry it on your back, and sell it and thereby save your face than begging from people whether they give you or refuse.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
ముష్టెత్తుకోవటం కంటే కష్టపడి డబ్బు సంపాదించటం అన్నివిధాలా మేలైనదని ఈ హదీసులో చెప్పబడింది. ఒక వృత్తి ప్రజల దృష్టిలో ఎంతటి నీచమైనదైనా సరే ఇంకొకరి ముందు చేయిచాపటం కన్నా అది ఎంతో గౌరవప్రదమైనది. అందులోనే మనిషి ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఉంటుంది. అలాగాకుండా ఇతరులను అడుక్కుంటూ తిరిగితే ఎన్నో అవమానాలు ఎదుర్కోవలసివస్తుంది. మొత్తానికి చెప్పొచ్చేదేమిటంటే ఇస్లాం ధర్మం మనిషిని అవమానకర జీవితం నుంచి వెలికితీసి గౌరవప్రదమైన జీవితపు బాటలో నడిపిస్తుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|59. చెమటోడ్చి డబ్బు సంపాదించి, తన స్వయాన్ని పోషించుకోవటంతోపాటు ఇతరులకు కూడా సహాయం చేయటం ఉత్తమ కార్యం|హదీసు 539
హదీసు 540
وعن أبي هُريرة رضي اللَّه عنه قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لأَنْ يحتَطِبَ أَحَدُكُم حُزمَةً عَلَى ظَهرِه، خَيْرٌ لَهُ مِنْ أَنْ يَسأَل أَحَداً، فَيُعُطيَه أَو يمنَعَهُ "متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మీరు ఇంకొకడి దగ్గర అడుక్కోవటం కన్నా వీపుమీద ఓ కట్టెల మోపు ఎత్తుకొని వచ్చి దాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో అవసరాలు తీర్చుకోవటం మేలు. ఎందుకంటే ఇంకొకడ్ని అడిగితే అతను ఇవ్వొచ్చు. ఇవ్వకపోవచ్చు (ఇవ్వని పక్షంలో మీరు అవమానం పాలౌతారు).
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని జకాత్ ప్రకరణాలు)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “It is better for anyone of you to carry a bundle of wood on his back and sell it than to beg of someone whether he gives him or refuses.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|59. చెమటోడ్చి డబ్బు సంపాదించి, తన స్వయాన్ని పోషించుకోవటంతోపాటు ఇతరులకు కూడా సహాయం చేయటం ఉత్తమ కార్యం|హదీసు 540
హదీసు 541
وعنه عنِ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "كَانَ دَاوُدُ عليهِ السَّلامُ لا يَأْكُل إِلاَّ مِن عَملِ يَدِهِ" رواه البخاري.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : హజ్రత్ దావూద్ అలైహిస్సలాం చేతి కష్టార్జితం తినేవారు.
(బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని వాణిజ్య ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “(Prophet) Dawud ﷺ ate only out of that which he earned through his manual work.”[Al-Bukhari].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|59. చెమటోడ్చి డబ్బు సంపాదించి, తన స్వయాన్ని పోషించుకోవటంతోపాటు ఇతరులకు కూడా సహాయం చేయటం ఉత్తమ కార్యం|హదీసు 541
హదీసు 542
وعنه أَن رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "كَانَ زَكَرِيَّا عليه السَّلامُ نجَّاراً "رواه مسلم.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : జకరియ్యా అలైహిస్సలాం వడ్రంగి పని చేసేవారు.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలో ఘనతా విశిష్ఠతల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “(Prophet) Zakariyya ﷺ was a carpenter.”[Al-Bukhari].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|59. చెమటోడ్చి డబ్బు సంపాదించి, తన స్వయాన్ని పోషించుకోవటంతోపాటు ఇతరులకు కూడా సహాయం చేయటం ఉత్తమ కార్యం|హదీసు 542
హదీసు 543
وعن المِقدَامِ بنِ مَعْدِ يكَربَ رضي اللَّه عنه، عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قال: "مَا أَكَلَ أَحَدٌ طَعَاماً خَيْراً مِن أَنَ يَأْكُلَ مِن عمَلِ يَدِهِ، وَإِنَّ نَبيَّ اللَّه عَلَيْهِ السلام كَانَ يَأْكلُ مِن عَمَلِ يَدِهِ" رواه البخاري.
హజ్రత్ మిఖ్‌దాద్ బిన్ మాదీకరిబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : స్వహస్తాలతో సంపాదించే సంపాదన కన్నా పవిత్రమైన సంపాదన తినేవాడు మరెవడూ లేడు. దేవుని ప్రవక్త అయిన దావూద్ (అలైహి) స్వహస్తాలతో సంపాదించి తినేవారు.
(బుఖారీ)
(సహీహ్ బుఖారీ వాణిజ్య ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “No food is better to man than that which he earns through his manual work. Dawud ﷺ, the Prophet of Allah, ate only out of his earnings from his manual work.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
పైన పేర్కొనబడిన అన్ని హదీసుల సారాంశం ఒక్కటే. మనిషి ఇతరులపై ఆధారపడకుండా తన కష్టార్జితంతో జీవితం గడపాలి. ప్రజల ముందు దేబిరిస్తూ తిరగటం వల్ల, ముష్టెత్తి అడుక్కోవటం వల్ల, అతని ఆత్మాభిమానం దెబ్బతింటుంది. నలుగురిలో అవమానానికి గురికావాల్సి వస్తుంది. అంచేత ప్రతి మనిషీ కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించాలి. పూర్వకాలంలో దైవప్రవక్తలు కూడా కాయకష్టం చేసి డబ్బు సంపాదించేవారు. కష్టార్జితంగా వచ్చిన ధనాన్ని పవిత్రమైనదిగా భావించేవారు. బ్రతుకు తెరువు కోసం భౌతిక వనరులపై ఆధారపడటం దైవవిశ్వాసానికి విరుద్ధం కాదని దీనిద్వారా తెలుస్తోంది. ముందు జీవనోపాధి కోసం మార్గాలు అన్వేషించాలి. ఆపై దాని ఫలితం విషయంలో మాత్రం దేవుణ్ణే నమ్ముకోవాలి. అదే నిజమైన విశ్వాసం, నమ్మకం.
పై హదీసుల ద్వారా బోధపడే మరో ముఖ్య విషయం ఏమిటంటే ఏ వృత్తినీ, ఉపాధినీ అల్పమైనదిగా భావించకూడదు. స్వభావపరంగా సమాజంలోని ఏ వృత్తీ నీచమైనది, అంటరానిది కాదు. అలాంటప్పుడు వృత్తుల ప్రాతిపదికపై మానవ సమాజాన్ని వర్గాలుగా, వర్ణాలుగా విభజించి కొందరిని జన్మతా అల్పులుగా, అధములుగా జమకట్టడం, మరికొందరికి లేనిపోని పవిత్రతను అంటగట్టటం అమానుషమైన వైఖరి అనిపించుకుంటుంది. కాయకష్టం చేసేవారు వాస్తవానికి దైవప్రవక్తల వృత్తుల్ని, విధానాల్ని అనుసరిస్తున్నారు. కాబట్టి సమాజంలో అందరిలాగే వారికి కూడా సముచితమైన స్థాయి, గౌరవమర్యాదలు లభించాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|59. చెమటోడ్చి డబ్బు సంపాదించి, తన స్వయాన్ని పోషించుకోవటంతోపాటు ఇతరులకు కూడా సహాయం చేయటం ఉత్తమ కార్యం|హదీసు 543
You must be logged in to post a comment.