హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 52. ఆశాభావ విశిష్టత

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 52వ అధ్యాయం: ఆశాభావ విశిష్టత. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 3 హదీసులు (హదీసు 441 – 443) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

52. ఆశాభావ విశిష్టత

↑ విషయ సూచిక

باب فضل الرجاء

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ తన ప్రియదాసుడైన ఒకనొక విశ్వాసి గురించి చెబుతూ అతను ఇలా అన్నాడని ప్రస్తావించాడు:

{وَأُفَوِّضُ أَمْرِي إِلَى اللَّهِ إِنَّ اللَّهَ بَصِيرٌ بِالْعِبَادِ فَوَقَاهُ اللَّهُ سَيِّئَاتِ مَا مَكَرُوا} [غافر:٤٤،٤٥]

"నేను నా వ్యవహారాన్ని అల్లాహ్‌కు అప్పగిస్తున్నాను. ఆయన తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు. చివరకు ఆ విశ్వాసికి వ్యతిరేకంగా వారు పన్నిన అన్ని కుయుక్తుల నుంచి అల్లాహ్ అతనిని రక్షించాడు." (అల్ మూమిన్ : 44 – 45)

వివరణ

పై సూక్తిలో పేర్కొనబడిన విశ్వాసి మూసా (అలైహి) కాలానికి చెందిన వ్యక్తి. అతను ఫిరౌన్ జాతీయుడు అయి వుండి కూడా మూసా-అలైహి-ను విశ్వసించాడు. అతను తన జాతి వారికి చేసిన సుదీర్ఘమైన హితబోధను దివ్య ఖుర్‌ఆన్ సవివరంగా ప్రస్తావించింది. మూసాకు కీడు తలపెట్టే ప్రయత్నాలు మానుకోండని ఇతను తన జాతివారిని హెచ్చరించాడు. తాను మూసా – అలైహి – ధర్మాన్ని విశ్వసిస్తున్నానని చెప్పాడు. దాంతో ఫిరౌన్ తరఫునుండి అతని ప్రాణానికి అపాయం ఏర్పడింది. అంచేత అతను తన హితబోధ చివరిలో తన వ్యవహారాన్ని దేవునికి అప్పగిస్తున్నానని చెప్పాడు. దేవుడు తనకు మేలు చేస్తాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కనుక దేవుడు అతని ఆశను వమ్ము చేయకుండా ఫిరౌన్ పన్నిన కుట్రల నుంచి అతణ్ణి రక్షించాడు.

English

“(And the man who believed said:) `… and my affair I leave it to Allah. Verily, Allah is the All-Seer of (His) slaves.’ So Allah saved him from the evils that they plotted (against him)”. [Ghāfir 40:44–45]

441

హదీసు 441

وعن أَبي هريرة، رضيَ اللَّه عنه، عن رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَنَّهُ قَالَ: "قالَ اللَّه، عَزَّ وَجلَّ، أَنَا عِنْدَ ظَنِّ عَبْدي بِي، وأَنَا مَعَهُ حَيْثُ يَذْكُرُني، وَاللَّهِ للَّهُ أَفْرَحُ بتَوْبةِ عَبْدِهِ مِنْ أَحَدِكُمْ يجدُ ضالَّتَهُ بالْفَلاةِ، وَمَنْ تَقَرَّبَ إِلَيَّ شِبْراً، تَقرَّبْتُ إِلَيْهُ ذِرَاعاً، وَمَنْ تَقَرّبَ إِلَيَّ ذِراعاً، تقَرَّبْتُ إِلَيْهِ بَاعاً، وإِذَا أَقْبَلَ إِلَيَّ يمْشي، أَقبلتُ إلَيه أُهَرْوِلُ "متفقٌ عليه، وهذا لفظ إحدى رِوايات مسلم. وتقدم شرحه في الباب قبله. ورُوِيَ في الصحيحين: "وأنا معه حين يذكرني"بالنون, وفي هذه الرواية"حيث"بالثاء وكلاهما صحيح.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ దేవుడు ఇలా అంటున్నాడని తెలియజేశారు:

"నేను నా దాసునితో అతను నా గురించి ఊహించినట్టుగానే వ్యవహరిస్తాను. అతను నన్ను ఎక్కడ గుర్తుచేసుకున్నా నేను అతని తోడుంటాను." దైవసాక్షి! మీలో ఎవరికైనా తన వస్తువు అడవిలో తప్పిపోయి తిరిగి దొరికితే అతను ఎంతగా సంతోషిస్తాడో, దాసుడు పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు అంతకన్నా ఎక్కువగా సంతోషిస్తాడు. ఎవరైనా నా వైపు ఒక జానెడు దూరం జరిగితే నేను అతనివైపు మూరెడు దూరం జరుగుతాను. ఎవరైనా నా వైపు మూరెడు దూరం జరిగితే నేనతని వైపు బారెడు దూరం జరుగుతాను. అతను నా వైపునకు నడిచి వస్తే నేనతని వైపునకు పరుగెత్తుకొస్తాను. (బుఖారీ – ముస్లిం)

ఇవి ముస్లింలోని ఒకానొక ఉల్లేఖనంలోని వాక్యాలు. ఈ హదీసు వివరణ ఇంతకు ముందు అధ్యాయంలో వచ్చింది.

(సహీహ్ బుఖారీలోని తౌహీద్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని పశ్చాత్తాప ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Allah says: `I am just as My slave thinks of Me when he remembers Me.’ By Allah! Allah is more pleased with the repentance of His slave than one of you who unexpectedly finds in the desert his lost camel. `He who comes closer to Me one span, I come closer to him a cubit; and he who comes closer to Me a cubit, I come closer to him a fathom; and if he comes to Me walking, I come to him running”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసు ప్రజలు దైవం పట్ల సదభిప్రాయాన్ని, దేవుడు తమకు మేలు చేస్తాడనే ఆశాభావాన్ని కలిగి ఉండాలని బోధిస్తోంది. అయితే ఎలాంటి కృషిచేయకుండా ఫలితం దక్కాలని కోరుకోవటం ఎంత మూర్ఖత్వమో, సదాచరణ చేయకుండా దేవుడు తమకు మంచి చేస్తాడని అనుకోవటం కూడా అంతే మూర్ఖత్వం అవుతుంది. అంటే ఒకవిధంగా ఈ హదీసు పరోక్షంగా మనిషిని ఆచరణ వైపునకు ప్రోత్సహిస్తోందన్నమాట! సాధారణంగా మంచిపనులు చేసేవారు దైవం పట్ల సదభిప్రాయాన్ని కలిగి ఉంటారు. చెడు పనులు చేసేవారు దైవం పట్ల దురభిప్రాయాన్నే కలిగి ఉంటారు. అలాంటప్పుడు దేవుడు కూడా వారితో వారి అభిప్రాయాలకు అనుగుణంగానే వ్యవహరిస్తాడు. మంచి అభిప్రాయం కలిగివున్న వారికి మంచి చేస్తాడు. చెడు అభిప్రాయం కలిగి ఉండేవారికి చెడు చేస్తాడు. వారి ఆశాభావాలకు మూలం వారి ఆచరణలే కాబట్టి దేవుడు వారి ఆచరణలకు అనుగుణంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|52. ఆశాభావ విశిష్టత|హదీసు 441

442

హదీసు 442

وعن جابِر بن عبدِ اللَّه، رضي اللَّه عنهما، أَنَّهُ سَمعَ النَبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، قَبْلَ موْتِهِ بثلاثَةِ أَيَّامٍ يقولُ: "لاَ يَمُوتَنّ أَحَدُكُم إِلاَّ وَهُوَ يُحْسِنُ الظَّنَّ باللَّه عزَّ وَجَلَّ "رواه مسلم.

దైవప్రవక్త ﷺ తన మరణానికి మూడు రోజుల ముందు ఇలా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు:

"మీలో ప్రతి ఒక్కరూ దైవం పట్ల సదభిప్రాయాన్ని (మంచి ఆశాభావాన్ని) కలిగివున్న స్థితిలోనే మరణించాలి సుమా!" (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని స్వర్గ సుఖాల ప్రకరణం)

English

Jabir bin `Abdullah (radiyallahu anhu) reported: I heard the Prophet ﷺ saying three days before his death: “Let none of you die unless he has good expectations from Allah”.[Muslim].

ముఖ్యాంశాలు

ఎవరు ఎప్పుడు మరణిస్తారో ఎవరికీ తెలియదు. మరణ సమయంలో మనిషికి దైవకారుణ్యం పట్ల ఆశాభావం ఉండాలి. మనిషి విశ్వసించి, సత్కార్యాలు చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. కనుక మనిషి ఎల్లప్పుడూ సత్కార్యాలు చేస్తూ ఉంటే దైవకారుణ్యం పట్ల ఆశాభావాన్ని కలిగివున్న స్థితిలో అతనికి మరణం సంభవించే అవకాశాలున్నాయి. దివ్య ఖుర్‌ఆన్‌లోని "మీరు ముస్లింలుగానే మరణించండి" అనే సూక్తికి భావం కూడా ఇదే!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|52. ఆశాభావ విశిష్టత|హదీసు 442

443

హదీసు 443

وعن أَنسٍ، رضي اللَّه عنه قَالَ: سمعتُ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُولُ: "قَالَ اللَّه تَعَالَى: يَا ابْنَ آدَمَ إِنَّكَ مَا دَعوْتَني وَرَجوْتَني غَفَرْتُ لَكَ عَلى مَا كَانَ مِنكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدمَ، لَوْ بَلغَتْ ذُنُوبُكَ عَنَانَ السماءِ، ثُمَّ اسْتَغْفَرْتَني غَفَرتُ لَكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَم، إِنَّكَ لَو أَتَيْتَني بِقُرابٍ الأَرْضِ خَطَايا، ثُمَّ لَقِيْتَني لاَ تُشْرِكُ بِي شَيْئاً، لأَتَيْتُكَ بِقُرَابِهَا مَغْفِرَةً" رواه الترمذي. وقال: حديث حسن. "عَنَانُ السماءِ"بفتح العين، قيل: هو مَا عَنَّ لَكَ مِنْهَا، أيْ: ظَهَرَ إذَا رَفَعْتَ رَأْسَكَ، وقيلَ: هو السَّحَابُ. وَ"قُرابُ الأَرض"بضم القاف، وقيلَ بكسرِها، والضم أصح وأشهر، وَهُوَ: مَا يقارِبُ مِلأَهَا، واللَّه أعلم.

దేవుడు ఇలా అంటున్నాడని దైవప్రవక్త ﷺ చెబుతుండగా తాను విన్నానని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు:

"ఓ ఆదం పుత్రుడా! నువ్వు నన్ను అర్థిస్తూ, నా నుండి మంచిని ఆశించినంతకాలం నేను నిన్ను క్షమిస్తూ ఉంటాను. నీ ఆచరణలు ఎలా వున్నా సరే నేను వాటిని పట్టించుకోను. ఓ ఆదం పుత్రుడా! నీ పాపాలు అంబరాలను చుంబిస్తున్నా సరే నువ్వు గనక నన్ను మన్నింపు కోసం అర్థిస్తే నేను నిన్ను మన్నించేస్తాను. ఓ ఆదం పుత్రుడా! నాకు ఇతరుల్ని సాటికల్పించే (షిర్క్) పాపం చేయకుండా ఇతర పాపాలు నువ్వు భూమండలం నిండా తీసుకొని నా దగ్గరికొస్తే నేను భూమండలం నిండా మన్నింపుతో వచ్చి నిన్ను కలుసుకుంటాను.

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి, దీన్ని హసన్ కోవకు చెందినదిగా పేర్కొన్నారు.)

(సుననె తిర్మిజీలోని ప్రార్థనల ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Allah, the Exalted, has said: `O son of adam, I forgive you as long as you pray to Me and hope for My forgiveness, whatever sins you have committed. O son of ‘Adam, I do not care if your sins reach the height of the heaven, then you ask for my forgiveness, I would forgive you. O son of ‘Adam, if you come to Me with an earth load of sins, and meet Me associating nothing to Me, I would match it with an earthload of forgiveness.”’[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

  1. ఈ హదీసు ఉద్దేశ్యం మనిషి తన జీవితాన్ని పాపమయం చేసుకోవాలన్నది కాదు. వాస్తవానికి ఈ హదీసు భావం ఏమిటంటే, ఏమరుపాటులో మనిషి వల్ల ఎన్ని పాపాలు జరిగిపోయినా సరే చివరికి అతని పాపాలతో భూమండలం నిండిపోయినాసరే అతను దైవకారుణ్యం పట్ల నిరాశ చెందనవసరం లేదు. మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి దైవాన్ని క్షమాభిక్ష పెట్టమని వేడుకుంటే దేవుడు తప్పకుండా అతన్ని తన కారుణ్య ఛాయల్లోకి తీసుకుంటాడు.
  2. బహుదైవారాధన క్షమార్హం కాని పాపం. మానవులు ఇతర పాపాలు ఎన్ని చేసినా దేవుడు క్షమిస్తాడు గాని తనకు ఇతరుల్ని సాటికల్పిస్తే మాత్రం ఆయన దానిని ఎన్నటికీ సహించడు. విశ్వాసులు బహుదైవారాధన మినహా ఇతర పాపాలేవయినా చేసివుంటే దేవుడు ప్రారంభంలోనే ఆ పాపాలను మన్నించి వారికి స్వర్గప్రవేశాన్ని కల్పిస్తాడు లేదా తాను తలచుకుంటే కొంతకాలం పాటు వారిని నరకంలోనే ఉంచి వారి పాపాలకు అనుగుణంగా వారికి శిక్ష విధించనూవచ్చు. కాని బహుదైవారాధకులకు మాత్రం శాశ్వత నరకయాతన తప్పదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|52. ఆశాభావ విశిష్టత|హదీసు 443