హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 358. అజాన్ తర్వాత మస్జిద్ నుండి వెళ్లిపోవటం అవాంఛనీయం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 358వ అధ్యాయం: అజాన్ తర్వాత కారణమేదీ లేకుండా ఫర్జ్ నమాజ్ చేయకుండా మస్జిద్ నుండి బయటికి వెళ్ళిపోవటం అవాంఛనీయం. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1787) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

358. అజాన్ తర్వాత కారణమేదీ లేకుండా ఫర్జ్ నమాజ్ చేయకుండా మస్జిద్ నుండి బయటికి వెళ్ళిపోవటం అవాంఛనీయం

↑ విషయ సూచిక

باب كراهة الخروج من المسجد بعد الأذان إلا لعذر حتى يصلي المكتوبة

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1787

హదీసు 1787

عَنْ أبي الشَّعْثاءِ قالَ: كُنَّا قُعُوداً مَع أبي هُريْرةَ رضي اللَّه عنهُ في المسْجِدِ، فَأَذَّنَ المؤَذِّنُ، فَقَام رَجُلٌ مِنَ المسْجِدِ يَمْشِي، فَأتْبعهُ أبُو هُريْرةَ بصَرهُ حتَّى خَرجَ مِنَ المسْجِدِ، فقَالَ أبُو هُريْرَةَ: أمَّا هَذَا فَقَدْ عصَى أبَا الْقَاسِمِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. رواه مسلم.

హజ్రత్ అబుష్షాసా కథనం: మేము అబూహురైరా (రదియల్లాహు అన్హు) వెంట మస్జిద్‌లో కూర్చొని ఉన్నాం. ముఅజ్జిన్ అజాన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక వ్యక్తి మస్జిద్‌లో నుండి లేచి బయటికి నడవసాగాడు. అబూహురైరా అతన్నే చూస్తూ ఉన్నారు. అతను బయటికి వెళ్ళిపోగానే ఆయన "ఇతను అబుల్ ఖాసిమ్ ﷺకు అవిధేయత చూపాడు" అని అన్నారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని మసాజిద్ ప్రకరణం)

English

Abu Sha`tha’ said: We were sitting with Abu Hurairah (radiyallahu anhu) in the mosque when the Mu’adhdhin proclaimed the Adhan. A man stood up in the mosque and started walking out. Abu Hurairah (radiyallahu anhu) stared at him till he went out of the mosque. Upon this Abu Hurairah (radiyallahu anhu) said: Indeed, this man has disobeyed Abul-Qasim ﷺ.[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|358. అజాన్ తర్వాత కారణమేదీ లేకుండా ఫర్జ్ నమాజ్ చేయకుండా మస్జిద్ నుండి బయటికి వెళ్ళిపోవటం అవాంఛనీయం|హదీసు 1787