హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 348వ అధ్యాయం: సమాధుల్ని పక్కాగా కట్టి వాటిమీద (గుమ్మటాల మాదిరిగా) కట్టడాలు నిర్మించటం తగదు. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1769) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
348. సమాధుల్ని పక్కాగా కట్టి వాటిమీద (గుమ్మటాల మాదిరిగా) కట్టడాలు నిర్మించటం తగదు
باب النهي عن تجصيص القبر والبناء عليه
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1769
عَنْ جَابِرٍ رضِي اللَّه عَنْهُ قَالَ: نَهَى رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَنْ يُجَصَّصَ الْقَبْرُ، وَأَنْ يُقْعَدَ عَلَيهِ، وأَنْ يُبْنَى عَلَيْهِ. رواه مسلم.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం: సమాధిని పక్కాగా కట్టించటాన్ని, దాని మీద కూర్చోవటాన్ని, దాని మీద కట్టడం నిర్మించటాన్ని దైవప్రవక్త ﷺ వారించారు.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని జనాయెజ్ ప్రకరణం)
English
Jabir (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ forbade that the graves should be plastered (made into permanent structures), used as sitting places (for the people) or building over them.[Muslim].
ముఖ్యాంశాలు
సమాధిని పక్కాగా నిర్మించటం ఒక వృధా ప్రయాస మాత్రమే. దానివల్ల మరణించిన వారికి ఎలాంటి ప్రయోజనం దక్కదు. అదీగాక సమాధిని ఆ విధంగా గౌరవించటం, ఆరాధించడం మనిషిని షిర్క్ వైపుకు గొనిపోతుంది. సమాధుల మీద గుంబద్‌లు, గోపురాలు నిర్మించటం కూడా అలాంటిదే. పోతే సమాధుల మీద కూర్చోవటం వాటిలో ఉండే మనుషుల గౌరవానికి విరుద్ధం. కనుక పై మూడు పనులు చేయరాదని ఈ హదీసులో బోధించటం జరిగింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|348. సమాధుల్ని పక్కాగా కట్టి వాటిమీద (గుమ్మటాల మాదిరిగా) కట్టడాలు నిర్మించటం తగదు|హదీసు 1769
You must be logged in to post a comment.