హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 346వ అధ్యాయం: విసాల్ ఉపవాసం పాటించటం నిషిద్ధం. విసాల్ ఉపవాసమంటే రెండు లేక అంతకంటే ఎక్కువ రోజులు నిర్విరామంగా ఏమీ తినకుండా త్రాగకుండా ఉపవాసం ఉండటం. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 1766 – 1767) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
346. విసాల్ ఉపవాసం పాటించటం నిషిద్ధం. విసాల్ ఉపవాసమంటే రెండు లేక అంతకంటే ఎక్కువ రోజులు నిర్విరామంగా ఏమీ తినకుండా త్రాగకుండా ఉపవాసం ఉండటం
باب تحريم الوصَال في الصوم وَهُوَ أنْ يصوم يَومَينِ أَوْ أكثر، وَلاَ يأكل وَلاَ يشرب بينهما
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1766
عَنْ أَبي هُريْرَةَ وَعَائِشَةَ رَضِي اللَّه عنْهُمَا أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم نَهَى عَنِ الْوِصالِ. متفقٌ عليه.
హజ్రత్ అబూహురైరా మరియు ఆయిషా (రదియల్లాహు అన్హుమ్)ల కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ విసాల్ ఉపవాసం పాటించవద్దని వారించారు.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని సౌమ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని సియామ్ ప్రకరణం)
English
Abu Hurairah and `Aishah (radiyallahu anhuma) said: The Prophet ﷺ prohibited observing continuous voluntary fasts beyond one day.[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|346. విసాల్ ఉపవాసం పాటించటం నిషిద్ధం. విసాల్ ఉపవాసమంటే రెండు లేక అంతకంటే ఎక్కువ రోజులు నిర్విరామంగా ఏమీ తినకుండా త్రాగకుండా ఉపవాసం ఉండటం|హదీసు 1766
హదీసు 1767
وَعَن ابْنِ عُمَرَ رَضِي اللَّه عَنْهُما قالَ: نَهَى رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَنِ الْوِصالِ. قَالُوا: إِنَّكَ تُواصِلُ؟ قَالَ:"إِنِّي لَسْتُ مِثْلَكُمْ، إِني أُطْعَمُ وَأُسْقَى" متفقٌ عَلَيْهِ، وهذا لَفْظُ البُخاري.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ విసాల్ ఉపవాసాలు పాటించవద్దని వారించారు. అప్పుడు సహచరులు "మరి తమరు విసాల్ ఉపవాసాలు పాటిస్తారు కదా!" అని సందేహపడ్డారు. అందుకాయన, "నేను మీలాంటివాణ్ణి కాను. నాకు (దైవం తరపు నుండి ) తినిపించటం త్రాపించటం జరుగుతుంది" అని చెప్పారు.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని సౌమ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని సియామ్ ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) said: The Messenger of Allah ﷺ prohibited observing continuous fasts beyond one day. The Companions submitted: “But you do it.” He replied, “I am not like you. I am given to eat and to drink (from Allah).”
ముఖ్యాంశాలు
1) కొన్ని ధార్మిక విషయాల్లో దైవప్రవక్త ﷺకు కొన్ని ప్రత్యేక ఆదేశాలు ఇవ్వబడ్డాయి. వాటిని ఆయన తప్పనిసరిగా పాటించవలసి ఉండేది. అయితే ఆయన అనుచర సమాజం (ఉమ్మత్) కోసం మాత్రం అవి తప్పనిసరి (వాజిబ్) కావు. వీటిని 'ఆయనగారి ప్రత్యేకతలు'గా కూడా పేర్కొనటం జరుగుతుంది. దైవప్రవక్త ﷺకు మాత్రమే పరిమితమైన ఇటువంటి ప్రత్యేకతలను ఇతరులు అనుసరించటానికి షరీఅత్‌లో అనుమతి లేదు. పైగా అలా చేయటం పాపంగా పరిగణించబడుతుంది. విసాల్ ఉపవాసాలు కూడా అటువంటి ప్రత్యేకతల్లోనివే. అసలు ఏమీ తినకుండా త్రాగకుండా నిరంతరంగా ప్రతిరోజూ ఉపవాసం పాటిస్తూ పోవటాన్ని విసాల్ అంటారు. అల్లాహ్ దైవప్రవక్త ﷺకు ఓర్పు సహనాలకు సంబంధించి ప్రత్యేక శక్తిసామర్థ్యాలను ప్రసాదించాడు. వాటి మూలంగా ఆయన విసాల్ ఉపవాసాలు పాటించటానికి అనుమతి కలిగివుండేవారు. దీనికి భిన్నంగా సామాన్య మానవుల్లో వేరెవ్వరికీ అటువంటి శక్తిలేదు. కనుక ఇతరులు ఆ విధంగా నిరంతరాయ ఉపవాసాలు పాటించటానికి షరీఅత్ అనుమతించదు.
2) "నేను మీలాంటి వాణ్ణి కాను" అంటే అర్థం నాకు ఇవ్వబడిన ప్రత్యేకశక్తి మీకు ఇవ్వబడలేదు అని. అంతేగాని 'అసలు నేను మీలాంటి మానవుణ్ణే కాదు' అన్న అర్థం ఎంతమాత్రం కాదు. ఆ అర్థమే గనక తీసుకుంటే, ఆ భావం ఖుర్‌ఆన్‌లోని 'ఇన్నమా అన బషరుమ్ మిస్‌లుకుమ్' (నేనూ మీలాంటి మానవుణ్ణే) అన్న వాక్యానికి విరుద్ధం అవుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|346. విసాల్ ఉపవాసం పాటించటం నిషిద్ధం. విసాల్ ఉపవాసమంటే రెండు లేక అంతకంటే ఎక్కువ రోజులు నిర్విరామంగా ఏమీ తినకుండా త్రాగకుండా ఉపవాసం ఉండటం|హదీసు 1767
You must be logged in to post a comment.