హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 335. భార్య అకారణంగా భర్త పిలుపును నిరాకరించరాదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 335వ అధ్యాయం: భర్త తనను పడక మీదకు పిలిచినప్పుడు షరీఅత్ పరమైన కారణమేదీ లేకపోయినప్పటికీ పడకమీదకు వెళ్ళటానికి భార్య నిరాకరించటం నిషిద్ధం. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1751) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

335. భర్త తనను పడక మీదకు పిలిచినప్పుడు షరీఅత్ పరమైన కారణమేదీ లేకపోయినప్పటికీ పడకమీదకు వెళ్ళటానికి భార్య నిరాకరించటం నిషిద్ధం

↑ విషయ సూచిక

باب تحريم امتناع المرأة من فراش زوجها إِذَا دعاها ولم يكن لَهَا عذر شرعي

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1751

హదీసు 1751

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మనిషి తన భార్యను పడకమీదకు పిలవగా ఆమె నిరాకరించినందుకు అతను ఆమె మీద అలిగిన స్థితిలో రాత్రిగడిపితే తెల్లవారే వరకూ దైవదూతలు ఆమెను శపిస్తూ ఉంటారు. (బుఖారీ-ముస్లిం) వేరొక ఉల్లేఖనంలో "ఆమె తిరిగి (భర్త దగ్గరకు) వెళ్ళనంతవరకూ (దైవదూతలు శపిస్తూ ఉంటారు)" అని ఉంది.

(సహీహ్ బుఖారీలోని బదవుల్ ఖల్ఖ్ ప్రకరణం-సహీహ్ ముస్లింలోని నికాహ్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “If a man calls his wife to his bed and she refuses, and thus he spends the night angry with her, the angels continue cursing her till the morning.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

పడక మీదకు పిలవటమంటే రాత్రిపూట తోడుగా పడుకోవటం కోసమో లేక సంభోగం కోసమో పిలవటమని భావం. పగలయినా, రాత్రయినా భర్త తన లైంగిక కోర్కెలు తీర్చుకోవటం కోసం పడకమీదకు పిలిస్తే భార్య నిరాకరించరాదు. షరీఅత్ పరమైన కారణమేదయినా ఉంటే అది వేరే విషయం. ఉదా: రమజాన్ మాసంలో ఉపవాసం ఉన్నప్పుడు, వ్యాధికి లోనై ఉన్నప్పుడు, లేక రుతుస్రావానికి లోనై ఉన్నప్పుడు ఆమె నిజంగా భర్త ముచ్చట తీర్చలేదు. ఈ విధమైన షరీఅత్ పరమైన కారణమేదీ లేకుండా భర్త కోరికను నిరాకరిస్తే మాత్రం ఆమె దైవదూతల శాపానికి అర్హురాలవుతుంది. పురుషుని దృష్టి పరస్త్రీల మీద పడకూడదన్న ఉద్దేశ్యంతోనే భార్యకు ఇంతగా తాకీదు చేయటం జరిగింది. స్త్రీ గనక భర్త కోర్కెను తీర్చకపోతే అతను పెడదారులు తొక్కే ప్రమాదముంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|335. భర్త తనను పడక మీదకు పిలిచినప్పుడు షరీఅత్ పరమైన కారణమేదీ లేకపోయినప్పటికీ పడకమీదకు వెళ్ళటానికి భార్య నిరాకరించటం నిషిద్ధం|హదీసు 1751