హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 306. అనవసరంగా కుక్కల్ని పెంచటం నిషిద్ధం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 306వ అధ్యాయం: వేటకోసం, పశువుల, పొలాల రక్షణ కోసం తప్ప ఇతర పనులకోసం కుక్కల్ని పెంచటం నిషిద్ధం. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 1690 – 1691) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

306. వేటకోసం, పశువుల, పొలాల రక్షణ కోసం తప్ప ఇతర పనులకోసం కుక్కల్ని పెంచటం నిషిద్ధం

↑ విషయ సూచిక

باب تحريم اتخاذ الكلب إلا لصَيْد أو ماشية أو زرع

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1690

హదీసు 1690

عنِ ابْنِ عُمَر رضي اللَّه عَنْهُما: قَالَ سمِعْتُ رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "مَنِ اقْتَنى كَلْباً إلاَّ كَلْب صَيْدٍ أوْ مَاشِيةٍ فإنَّهُ يَنْقُصُ مِنْ أجْرِهِ كُلَّ يوْمٍ قِيراطَانِ" متفقٌ عليه. وفي روايةٍ:"قِيرَاطٌ".

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు: ఎవరయితే వేట లేక పశువుల రక్షణ కోసం తప్ప (ఇతర ఉద్దేశ్యంతో) కుక్కని పెంచుతారో వారి పుణ్యం ప్రతి రోజూ రెండు ఖీరాతులు తగ్గుతూ ఉంటుంది. (బుఖారీ-ముస్లిం)

వేరొక ఉల్లేఖనంలో 'ఒక ఖీరాతు తగ్గుతుంది' అని ఉంది.

(సహీహ్ బుఖారీలోని జబాయెహ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని బుయూ ప్రకరణం)

English

Ibn `Umar (radiyallahu anhuma) said: The Messenger of Allah ﷺ said, “He who keeps a dog other than one for guarding the fields or herds or hunting, will lose two Qirat every day out of his rewards.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|306. వేటకోసం, పశువుల, పొలాల రక్షణ కోసం తప్ప ఇతర పనులకోసం కుక్కల్ని పెంచటం నిషిద్ధం|హదీసు 1690

1691

హదీసు 1691

وعَنْ أبي هُرَيْرَةَ رضي اللَّه عنْهُ قَالَ: قَالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ أمْسَكَ كَلْباً، فَإنَّهُ ينْقُصُ كُلَّ يَوْمٍ مِنْ عملِهِ قِيرَاطٌ إلاًَّ كَلْب حَرْثٍ أوْ مَاشِيَة" متفقٌ عليه. وفي رواية لمسلم: "مَنِ اقْتَنى كَلْباً لَيْسَ بِكَلْبِ صَيْدٍ، وَلاَ مَاشِيةٍ وَلاَ أرْضٍ فَإنَّهُ يَنْقُصُ مِنْ أجْرِهِ قِيراطَانِ كُلَّ يْومٍ".

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవరయితే కుక్కను (పెంచే ఉద్దేశ్యంతో) కట్టేశారో వారి ఆచరణ (పుణ్యం) ప్రతిరోజూ ఒక ఖీరాతు తగ్గుతూ ఉంటుంది. అయితే పొలాల, పశువుల రక్షణ కోసం కట్టేస్తే ఆ నష్టం ఉండదు. (బుఖారీ-ముస్లిం)

ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో "ఎవరయినా వేట కోసం, పశువుల, భూముల రక్షణ కోసం తప్ప (ఇతర ఉద్దేశ్యంతో) కుక్కను పెంచుతారో వారి పుణ్యం ప్రతిరోజూ రెండు ఖీరాతులు తగ్గుతూ ఉంటుంది" అని ఉంది.

(సహీహ్ బుఖారీలోని ముజారఅ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ముజారఅ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “He who keeps a dog, will lose out of his good deeds equal to one Qirat every day, except one who keeps it for guarding the fields or the herd.”[Al-Bukhari and Muslim].

In a narration of Muslim, the Messenger of Allah ﷺ is reported to have said: “He who keeps a dog for any reason other than to guard his property (lands) or his flock of sheep, his good deeds equal to two Qirat will be deducted every day.”

ముఖ్యాంశాలు

వేటకోసం, పశువుల, పొలాల, భూముల, ఇండ్ల కాపలా కోసం కుక్కలను పెంచుకోవచ్చు. అంతకుమించి ఇతర ఉద్దేశ్యాలతో కుక్కలను పెంచుకోవటానికి అనుమతిలేదు. ఎవరైనా వేరితర ఉద్దేశంతో కుక్కలను పెంచినట్లయితే వారి పుణ్యంలో నుంచి ప్రతి రోజూ ఒకటి లేక రెండు ఖీరాతుల (యూనిట్ల) పుణ్యం తగ్గుతూ ఉంటుంది.

హదీసులో 'ఒకటి లేక రెండు' అన్న సందేహాస్పద ఫదం ఎందుకు ప్రయోగించబడింది? అనే ప్రశ్న ఈ సందర్భంగా జనించటం సహజమే. దీని గురించి పండితులు ఏమని వివరించారంటే దైవప్రవక్త ﷺ మొదటగా ఒక ఖీరాతు తగ్గుతుందని చెప్పారు. ఆ తర్వాత దాన్ని పెంచి రెండు ఖీరాతులు తగ్గుతుందని వివరించారు. ఈ హెచ్చుతగ్గులు గ్రామం, పట్టణాన్ని బట్టి వర్తిస్తాయని మరికొంతమంది పండితులు అన్నారు. పట్టణవాసుల పుణ్యం రెండు ఖీరాతులు తగ్గుతుందనీ, పల్లెవాసుల పుణ్యం ఒక ఖీరాతు మాత్రమే తగ్గుతుందని, పట్నవాసులకన్నా పల్లెవాసులకు కుక్కలను పెంచుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉండటమే ఈ హెచ్చుతగ్గులకు కారణమని చెప్పారు. అంటే ఎవరి ఇండ్లల్లోనయితే అటువంటి కుక్కల మూలంగా అపరిశుభ్రత ఎక్కువగా ఉంటుందో అటువంటి వారి పుణ్యం రెండు ఖీరాతులూనూ, అపరిశుభ్రత తక్కువగా ఉండేవారి పుణ్యం ఒక ఖీరాతునూ తగ్గుతూ ఉంటుందన్న మాట.

అసలు ఇంతకీ 'ఖీరాతు' అంటే ఎంత? దీని గురించి కూడా పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హదీసుల్లో జనాజా నమాజు పుణ్యం గురించి చెప్పినప్పుడు కూడా ఈ పదం వాడబడింది. అక్కడ ఖీరాతు అంటే ఉహుద్ పర్వతమంత అని చెప్పబడింది. మరి ఈ ఖీరాతు పరిమాణం – పై హదీసులో పేర్కొనబడిన ఖీరాతు పరిమాణం రెండూ సమానమేనా? దీనికి కొంతమంది పండితులు 'అవును, ఆ రెండు పదాలూ ఒకే పరిమాణాన్ని సూచిస్తున్నాయి' అని సమాధానమిచ్చారు. కాగా మరి కొంతమంది పండితులు ఏమన్నారంటే – జనాజా నమాజు సందర్భంగా వచ్చిన ఖీరాతు ప్రస్తావన దైవానుగ్రహానికి సంబంధించినది. దానికి భిన్నంగా ఇక్కడ ఈ పదం శిక్షను, పర్యవసానాన్ని సూచించే సందర్భంలో ప్రయోగించబడింది. దైవానుగ్రహం ఇతర వస్తువులన్నింటి కంటే గొప్పది. కనుక రెండు చోట్లా ఒకే అర్థం తీసుకోవటం సమంజసం కాదు' అని చెప్పారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|306. వేటకోసం, పశువుల, పొలాల రక్షణ కోసం తప్ప ఇతర పనులకోసం కుక్కల్ని పెంచటం నిషిద్ధం|హదీసు 1691