హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 301వ అధ్యాయం: 'తకల్లుఫ్' చేయరాదు. తకల్లుఫ్ అంటే మాటల్లో, చేతల్లో అనవసరంగా ఇబ్బంది పడిపోవటం అని భావం. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 2 హదీసులు (హదీసు 1657 – 1658) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
301. 'తకల్లుఫ్' చేయరాదు. తకల్లుఫ్ అంటే మాటల్లో, చేతల్లో అనవసరంగా ఇబ్బంది పడిపోవటం అని భావం
باب النهي عن التكلف وهو فعلُ وقول ما لا مصلحة فيه بمشقة
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{قُلْ مَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ وَمَا أَنَا مِنَ الْمُتَكَلِّفِينَ} [ص: ٨٦]
"ప్రవక్తా! వారితో ఇలా అను, "నేను ఈ ధర్మ ప్రచారానికి మీ నుండి ఎటువంటి ప్రతిఫలాన్నీ కోరను, నేను లేనిపోని వాటిని కల్పించేవాణ్ణి కాను." (సాద్:86)
హదీసు 1657
وعنْ ابن عُمر، رضي اللَّه عنهُما، قَالَ: نُهينَا عنِ التَّكلُّفِ. رواه البُخاري.
హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పడిపోవటాన్ని వారించారు. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని ఏతిసామ్ ప్రకరణం)
English
`Umar (radiyallahu anhu) said: We have been forbidden to go into excess.[Al-Bukhari].
ముఖ్యాంశాలు
వేషభాషల్లో లేనిపోని డాబుని, బింకాన్ని ప్రదర్శించటం, అతిథి మర్యాదల కోసం అవసరానికి మించి డబ్బు ఖర్చుపెట్టటం, రకరకాల వంటకాలు తయారు చేయించటం మొదలగు పనులన్నీ కూడా తకల్లుఫ (అనవసరంగా ఇబ్బంది పడిపోవటం) క్రిందికే వస్తాయి. కనుక లేనిపోని ఆర్భాటం ప్రదర్శించటం, అనవసరంగా ఇబ్బందిపడిపోవటం తీవ్రంగా గర్హించదగినది. కాని శోచనీయమైన విషయం ఏమిటంటే నేడు మన ముస్లింలు తకల్లుఫే తమ ఆనవాలు అయినట్లు విందుభోజనాల్లో దుబారాగా డబ్బు ఖర్చుపెడ్తున్నారు. దైవం అటువంటివారికి సద్బుద్ధిని ప్రసాదించుగాక!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|301. 'తకల్లుఫ్' చేయరాదు. తకల్లుఫ్ అంటే మాటల్లో, చేతల్లో అనవసరంగా ఇబ్బంది పడిపోవటం అని భావం|హదీసు 1657
హదీసు 1658
وعنْ مسْرُوق قَال: دخَلْنَا على عبْدِ اللَّهِ بْنِ مسْعُودٍ رضي اللَّه عنُهُ فَقَال: يا أَيُّهَا النَّاس منْ عَلِم شَيئاً فَلْيقُلْ بهِ، ومنْ لَمْ يعْلَمْ، فلْيقُلْ: اللَّه أعْلَمُ، فإنَّ مِنَ الْعِلْمِ أن تَقُولَ لِمَا لا تَعْلَمُ: اللَّه أعْلَمُ. قَال اللَّه تَعالى لِنَبيِّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: {قلْ مَا أسأْلُكُمْ عَليْهِ مِنْ أجْرٍ وَمَا أَنَا مِنَ المُتَكَلِّفِين} رواهُ البخاري.
హజ్రత్ మస్రూఖ్ (తాబయీ) కథనం: మేము అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాకు ఇలా ఉపదేశించారు: ప్రజలారా! ఎవరికయినా ఏదయినా విషయం తెలిస్తే వారు దాన్ని వివరించాలి. తెలియకపోతే 'అల్లాహు ఆలము' (వాస్తవం అల్లాహ్కే బాగా తెలుసు) అని అనాలి. ఎందుకంటే తెలియని విషయం గురించి 'అల్లాహు ఆలము' అని అనటమే విజ్ఞత. దేవుడు తన ప్రవక్తకు ఇలా పురమాయించాడు: "ప్రవక్తా! వారితో ఇలా అను, నేను ఈ ధర్మ ప్రచారానికి మీనుండి ఎటువంటి ప్రతిఫలాన్నీ కోరను, నేను అనవసరంగా ఇబ్బందిపడిపోయేవాణ్ణి కూడా కాను." (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని తఫ్సీర్ ప్రకరణం)
English
Masruq (radiyallahu anhu) said: We visited `Abdullah bin Mas`ud (radiyallahu anhu) and he said to us: O people! He who has the knowledge of any matter may convey it to the others. And he who has no knowledge, thereof, should say: “Allahu a`lam (Allah knows better).” It is a part and parcel of knowledge that a man who has no knowledge of a matter should say: “Allah knows better.” Allah said to His Prophet ﷺ: “Say (O Muhammad ﷺ): `No wage do I ask of you for this (the Qur’an), nor am I one of the Mutakallifun (those who pretend and fabricate things which do not exist).”’ (38:86)[Al-Bukhari].
ముఖ్యాంశాలు
తమకు తెలియని విషయం గురించి ఊహలు అంచనాలతో మాట్లాడటం కూడా ఒక విధంగా అనవసరంగా ఇబ్బంది పడిపోవటమే కదా! అందుకని అవసరం లేని పక్షంలో అలాంటి ఊహాజనితమైన మాటలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే పండితులు కూడా తమకు తెలియని విషయాల గురించి ప్రశ్నలు అడగటం జరిగినప్పుడు డొంక తిరుగుడు మాటలు చెప్పకుండా స్పష్టంగా తమకు తెలియదనే చెప్పాలి. తమకు తెలియదని చెప్పటం కూడా విజ్ఞతకు నిదర్శనమే. కనుక తమకు తెలియనిదే, తాము పరిశోధించనిదే దేని గురించీ ఫత్వాలు జారీ చేయకూడదు. స్వంత అభిప్రాయాలు వెలిబుచ్చకూడదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|301. 'తకల్లుఫ్' చేయరాదు. తకల్లుఫ్ అంటే మాటల్లో, చేతల్లో అనవసరంగా ఇబ్బంది పడిపోవటం అని భావం|హదీసు 1658
You must be logged in to post a comment.