హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 298. కుడిచేత్తో మలమూత్ర శుద్ధి చేసుకోరాదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 298వ అధ్యాయం: కుడిచేత్తో మలమూత్ర శుద్ధి చేసుకోరాదు, అకారణంగా కుడిచేత్తో మర్మాంగాన్ని ముట్టుకోరాదు. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1650) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

298. కుడిచేత్తో మలమూత్ర శుద్ధి చేసుకోరాదు, అకారణంగా కుడిచేత్తో మర్మాంగాన్ని ముట్టుకోరాదు

↑ విషయ సూచిక

باب كراهية الاستنجاء باليمين ومس الفرج باليمين من غير عذر

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1650

హదీసు 1650

عنْ أَبي قَتَادةَ رضي اللَّه عَنْهُ عنِ النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَال: "إذَا بَالَ أحدُكُمْ. فَلاَ يأْخُذَنَّ ذَكَرهُ بِيَمِينِهِ، وَلاَ يسْتَنْجِ بِيمِينِهِ، ولاَ يتنَفَّسْ فِي الإنَاءِ". متفقٌ عليه. وفي الْباب أحاديثٌ كَثِيرةٌ صحِيحةٌ.

హజ్రత్ అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మీలో ఎవరయినా మూత్రం పోసేటప్పుడు తన మర్మాంగాన్ని కుడిచేత్తో పట్టుకోరాదు. కుడిచేత్తో మూత్రశుద్ధి కూడా చేసుకోరాదు. (ఇంకా పానీయం తాగేటప్పుడు) నీళ్ళపాత్రలో శ్వాస వదల రాదు.

(బుఖారీ-ముస్లిం)

ఈ అధ్యాయంలో ప్రామాణికమైన హదీసులు చాలా ఉన్నాయి.

(సహీహ్ బుఖారీలోని వుజూ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)

English

Abu Qatadah (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “Do not touch your private parts with your right hand while urinating, nor for washing or cleaning (your private parts); and do not breathe into the drinking vessel from which you drink.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

తినటం త్రాగటం ఇంకా ఇతర మంచిపనుల కోసం కుడిచేతిని వాడమని ఆదేశించినట్లే కుడిచేతి గౌరవౌన్నత్యాల దృష్ట్యా మలమూత్ర శుద్ధి మొదలగు పనులకోసం ఎడమచేతిని వాడమని ఆదేశించటం జరిగింది. కాని కొందరు ముస్లింలు ఆంగ్లేయుల్ని అనుకరిస్తూ అన్నపానీయాల కోసం కూడా ఎడమ చేతినే ఉపయోగిస్తున్నారు. వారిలోని సహజత్వం వక్రీకరించిందని, దైవాజ్ఞల పట్ల వారి నిర్లక్ష్యం మితిమీరిపోతుందని చెప్పటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|298. కుడిచేత్తో మలమూత్ర శుద్ధి చేసుకోరాదు, అకారణంగా కుడిచేత్తో మర్మాంగాన్ని ముట్టుకోరాదు|హదీసు 1650