హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 271. ఇతరుల తప్పులెన్నటం, రహస్యంగా వినటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 271వ అధ్యాయం: ఇతరుల తప్పు లెన్నటం, ఇతరులకు ఇష్టం లేకపోయినా వారి మాటల్ని వినటానికి ప్రయత్నించటం చేయరాదు. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 3 హదీసులు (హదీసు 1572 – 1574) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

271. ఇతరుల తప్పు లెన్నటం, ఇతరులకు ఇష్టం లేకపోయినా వారి మాటల్ని వినటానికి ప్రయత్నించటం చేయరాదు

↑ విషయ సూచిక

باب النهي عن التجسّسوالتسمّع لكَلام مَن يكره استماعُهُ

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{وَلا تَجَسَّسُوا} [الحجرات: ١٢]

"మీరు ఇతరుల రహస్యాలను దేవులాడకండి." (హుజురాత్:12)

{وَالَّذِينَ يُؤْذُونَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ بِغَيْرِ مَا اكْتَسَبُوا فَقَدِ احْتَمَلُوا بُهْتَاناً وَإِثْماً مُبِيناً} [الأحزاب: ٥٨]

"ఏ తప్పూ చేయకపోయినా విశ్వాసులైన స్త్రీ పురుషులకు మనస్తాపం కలిగించేవారు ఒక పెద్ద అభాండభారాన్ని, ఒక స్పష్టమైన పాపభారాన్ని తమ తలపై మోపుకున్నట్లే." (అహ్‌జాబ్:58)

English

“And spy not.” [Al-Ḥujurāt 49:12]

“And those who annoy believing men and women undeservedly, bear on themselves the crime of slander and plain sin.” [Al-Aḥzāb 33:58]

1572

హదీసు 1572

وعنْ أَبي هُريْرةَ رضي اللَّه عنهُ أنَّ رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إيًاكُمْ والظَّنَّ، فَإنَّ الظَّنَّ أكذبُ الحدِيثَ، ولا تحَسَّسُوا، وَلاَ تَجسَّسُوا وَلاَ تنافَسُوا وَلاَ تحَاسَدُوا، وَلاَ تَباغَضُوا، وَلاَ تَدابَروُا، وكُونُوا عِباد اللَّهِ إخْواناً كَما أمركُمْ. المُسْلِمُ أخُو المُسْلِمِ، لاَ يظلِمُهُ، وَلاَ يخذُلُهُ وَلاَ يحْقرُهُ، التَّقوى ههُنا، التَّقوَى ههُنا"ويُشير إِلَى صَدْرِه"بِحْسبِ امريءٍ مِن الشَّرِّ أنْ يحْقِر أخاهُ المسِلم، كُلُّ المُسلمِ عَلَى المُسْلِمِ حرَامٌ: دمُهُ، وعِرْضُهُ، ومَالُه، إنَّ اللَّه لاَ يَنْظُرُ إِلَى أجْسادِكُمْ، وَلا إِلَى صُوَرِكُمْ، ولكنْ يَنْظُرُ إِلَى قُلُوبِكُمْ وأعْمَالِكُمْ". وَفِي رواية: "لاَ تَحاسَدُوا، وَلا تَبَاغَضُوا، وَلا تَجَسَّسُوا وَلاَ تحَسَّسُوا وَلاَ تَنَاجشُوا وكُونُوا عِبَادَ اللَّهِ إخْوَاناً". وفي روايةٍ: "لاَ تَقَاطَعُوا، وَلا تَدَابَرُوا، وَلا تَبَاغَضُوا وَلاَ تحَاسدُوا، وَكُونُوا عِبَادَ اللَّهِ إخْوَاناً". وفي رواية: "لا تَهَاجَروا وَلا يَبِعْ بَعْضُكُمِ عَلَى بَيْعِ بَعْضٍ". رواه مسلم: بكلِّ هذِهِ الروايات، وروى البخاريُّ أكثَرَها.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రబోధించారు: మీరు దురనుమానాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే విషయాల్లో అత్యంత అబద్ధమైన విషయం దురనుమానం. ఇతరుల తప్పుల్ని ఎన్నకండి. కూపీలు తీయకండి. ఇతరుల హక్కుల్ని కబళించే ప్రయత్నంలో ఒండొకరిని మించి పోవటానికి ప్రయత్నించకండి. పరస్పరం అసూయ చెందకండి. ద్వేషించుకోకండి. ఎడమొహం పెడమొహంతో ఉండకండి. దైవదాసులారా! దేవుడు ఆదేశించినట్టు మీరు పరస్పరం అన్నదమ్ముల్లా ఉండండి. ముస్లిం ముస్లింకు సోదరుడు. తను అతనిమీద దౌర్జన్యం చేయరాదు. అతన్ని నిస్సహాయునిగా వదలిపెట్టరాదు. అతన్ని అల్పునిగా భావించరాదు. తఖ్వా (దైవభీతి) అనేది ఇక్కడుంటుంది. తఖ్వా అనేది ఇక్కడుంటుంది. ఈ మాట ఆయన తన ఛాతీ వైపు సైగ చేస్తూ చెప్పారు.

ఒక మనిషి తన తోటి ముస్లిం సోదరుణ్ణి చులకనగా చూడటం చాలు అతను చెడ్డవాడని చెప్పటానికి. ఒక ముస్లిం కొరకు తోటి ముస్లిం ధనమాన ప్రాణాలు నిషిద్ధం. దేవుడు మీ శరీరాలను, మీ ముఖాలను చూడడు. ఆయన కేవలం మీ హృదయాల్ని, మీ ఆచరణల్ని మాత్రమే చూస్తాడు.

వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: "ఒకరి మీద ఒకరు అసూయ చెందకండి. పగ పెంచుకోకండి. కూపీలు తీయకండి. ఇతరుల తప్పుల్ని దేవులాడకండి. ఇతరుల్ని మోసగించే ఉద్దేశ్యంతో బేరం మీద బేరం చెప్పకండి. దైవదాసులారా! పరస్పరం అన్నదమ్ముల్లా బతకండి.

ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: పరస్పరం పలకరింపులు మానుకోకండి. ఒకరు బేరమాడుతున్నప్పుడు అతనికి వ్యతిరేకంగా బేరమాడకండి. ఈ ఉల్లేఖనాలన్నీ ఇమామ్ ముస్లిం వివరించినవి. వీటిలో ఎన్నో ఉల్లేఖనాల్ని ఇమామ్ బుఖారీ కూడా పేర్కొన్నారు.

(సహీహ్ బుఖారీలోని నికాహ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని బిర్ర్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “Beware of suspicion, for suspicion is the worst of false tales. Do not look for other’s faults. Do not spy one another, and do not practise Najsh (means to offer a high price for something in order to allure another customer who is interested in the thing). Do not be jealous of one another and do not nurse enmity against one another. Do not sever ties with one another. Become the slaves of Allah, and be brothers to one another as He commanded. A Muslim is the brother of a Muslim. He should neither oppress him nor humiliate him. The piety is here! The piety is here!” While saying so he pointed towards his chest. “It is enough evil for a Muslim to look down upon his Muslim brother. All things of a Muslim are inviolable for his brother in Faith: his blood, his wealth and his honour. Verily, Allah does not look to your bodies nor to your faces but He looks to your hearts and your deeds.”

Another narration is: “Do not feel envy against one another; do not nurse enmity; do not spy on one another and do not cheat one another. Be Allah’s slaves, brethren to one another.”

Another narration is: “Do not have estranged relations with one another. Do not nurse enmity and do not feel envy against one another. O Allah’s worshippers! Be brothers!”

Another narration is: “Do not estrange mutual relations and do not intervene into the transaction which is likely to be settled with another person.”[Muslim].

ముఖ్యాంశాలు

పై హదీసులో చేయబడిన బోధనల మొదటి ఉద్దేశ్యం, ముస్లింల మానమర్యాదలను రక్షించటం. అనవసరంగా దురనుమానాలకు లోనవటం, తప్పులెన్నటం ఒక ముస్లిం మానమర్యాదలకు విరుద్ధం. అందుకని వాటి నుంచి వారించటం జరిగింది. పోతే రెండో ఉద్దేశ్యం; ఇస్లామియ సౌభ్రాతృత్వాన్ని రక్షించటం. అందుకే ముస్లిం మీద దౌర్జన్యం చేయటాన్ని, అతన్ని నిస్సహాయునిగా వదలిపెట్టటాన్ని, చులకనగా చూడటాన్ని, అతని మీద గర్వాన్ని ప్రదర్శించటాన్ని వారించటం జరిగింది. ఒక ముస్లిం ధనమాన ప్రాణాలను ఇతరముస్లిం కొరకు నిషేధించటం జరిగింది. ఇతరుల్ని మోసపుచ్చే ఉద్దేశ్యంతో వస్తువుల ధరల్ని ఎక్కువ పలికించటం వల్ల, ఒకరి బేరానికి వ్యతిరేకంగా బేరమాడటం వల్ల ప్రజల్లో పరస్పర విద్వేషవైషమ్యాలు రగులుకుంటాయి. అందుకని వాటి నుండి కూడా వారించటం జరిగింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|271. ఇతరుల తప్పు లెన్నటం, ఇతరులకు ఇష్టం లేకపోయినా వారి మాటల్ని వినటానికి ప్రయత్నించటం చేయరాదు|హదీసు 1572

1573

హదీసు 1573

وعَنْ مُعَاويةَ رضي اللَّه عنْهُ قالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "إنَّكَ إنِ اتَّبعْتَ عَوْراتِ المُسْلِمينَ أفسَدْتَهُمْ، أوْ كِدْتَ أنْ تُفسِدَهُمَ" حديثٌ صحيح. رواهُ أبو داود بإسناد صحيح.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: నువ్వు గనక ముస్లింల లోపాలను ఎన్నటానికి ప్రయత్నిస్తే నువ్వే వారిని పాడుచేస్తావు. లేదా త్వరలోనే నువ్వు వారిని పాడు చేస్తావు. (ఇది సహీహ్ కోవకు చెందిన హదీసు. అబూదావూద్ దీనిని దృఢమైన ఆధారాలతో వెలికితీశారు.)

(సుననె అబూదావూద్‌లోని అదబ్ ప్రకరణం)

English

Muawiyah (radiyallahu anhu) said: I heard the Messenger of Allah ﷺ saying, “If you find faults with Muslims, you will corrupt them.”[Abu Dawud].

ముఖ్యాంశాలు

ఒక వ్యక్తి ఇతరుల లోపాలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే అది చూసి ఇతరులు కూడా అదేపని మొదలెడతారు. దానివల్ల సమాజంలో ఎంతటి కల్లోలం వ్యాపిస్తుందో వివరించనక్కర్లేదు. అందుకే షరీఅత్ ఇతరుల తప్పుల వెంట పడవద్దని చెబుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|271. ఇతరుల తప్పు లెన్నటం, ఇతరులకు ఇష్టం లేకపోయినా వారి మాటల్ని వినటానికి ప్రయత్నించటం చేయరాదు|హదీసు 1573

1574

హదీసు 1574

وعنِ ابنِ مسعودٍ رضي اللَّه عَنْهُ أنَّهُ أُتِىَ بِرَجُلٍ فَقيلَ لَهُ: هذَا فُلانٌ تَقْطُرُ لِحْيَتُهُ خَمراً، فقالَ: إنَّا قَدْ نُهينَا عنِ التَّجَسُّسِ، ولكِنْ إنْ يظهَرْ لَنَا شَيءٌ، نَأخُذْ بِهِ، حَديثٌ حَسَنٌ صحيحٌ. رواه أَبُو داود بإسْنادٍ عَلى شَرْطِ البخاري ومسلمٍ.

హజ్రత్ అబూ మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఆయన దగ్గరికి ఒక మనిషిని తీసుకురావటం జరిగింది. అతని గడ్డం నుంచి మద్యం చుక్కలు పడుతున్నాయని కూడా ఆయనతో చెప్పటం జరిగింది. అప్పుడాయన ఇలా అన్నారు: ఇతరుల తప్పుల వెంట పడకుండా మమ్మల్ని వారించటం జరిగింది. ఒకవేళ ఏదయినా తప్పు మన ముందుకు వస్తే అప్పుడు మనం దానిమూలంగా వారిని పట్టుకోవచ్చు.

ఈ హదీసు హసన్ సహీహ్ కోవలకు చెందినది. దీనిని అబూదావూద్ బుఖారీ ముస్లింల నియమాలకు అనుగుణంగా ఉన్న ఒక 'సనదు' ఆధారంగా వెలికితీశారు.

(సుననె అబూదావూద్‌లోని అదబ్ ప్రకరణం)

English

It has been reported that a man was brought before Abdullah bin Mas`ud (radiyallahu anhu) because his beard was giving out smell of wine. Ibn Mas`ud said: “We have been prohibited from spying (on Muslims) and finding faults (with them). But we can take to task only and only if the sin is overt.[Abu Dawud].

ముఖ్యాంశాలు

1) ఈ హదీసులో ఇస్లాం ఆదేశిస్తున్న ఒక పనిని దైవప్రవక్త సహచరులు ఆచరించిన తీరు వివరించబడింది. ఆయన సహచరులు ఇస్లామీయ విధి నిషేధాలను తు.చ. తప్పకుండా పాటించేవారు.

2) నిందితుల్ని కేవలం అనుమానం మీద శిక్షించటం, మందలించటం చేయకూడదు. శిక్ష విధించటం కోసం సరైన ఆధారాలు కావాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|271. ఇతరుల తప్పు లెన్నటం, ఇతరులకు ఇష్టం లేకపోయినా వారి మాటల్ని వినటానికి ప్రయత్నించటం చేయరాదు|హదీసు 1574