హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 269. పరస్పరం పగతో ఎడమొహం పెడమొహంతో ఉండరాదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 269వ అధ్యాయం: పరస్పరం పగతో, సంబంధాలు త్రెంచుకొని ఎడమొహం పెడమొహంతో ఉండరాదు. ఈ అధ్యాయంలో 3 ఖుర్ఆన్ ఆయతులు, 2 హదీసులు (హదీసు 1569 – 1570) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

269. పరస్పరం పగతో, సంబంధాలు త్రెంచుకొని ఎడమొహం పెడమొహంతో ఉండరాదు

↑ విషయ సూచిక

باب النهي عن التباغض والتقاطع والتدابر

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ} [الحجرات: ١٠]

"విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు." (అల్‌హుజురాత్:10)

{أَذِلَّةٍ عَلَى الْمُؤْمِنِين َ أَعِزَّةٍ عَلَى الْكَافِرِينَ} [المائدة: ٥٤]

"వారు విశ్వాసుల పట్ల మృదువుగానూ, అవిశ్వాసుల పట్ల కఠినంగానూ ప్రవర్తిస్తారు." (మాయిదా:54)

{مُحَمَّدٌ رَسُولُ اللَّهِ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ} [الفتح: ٢٩]

"ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త. ఆయన వెంట ఉన్నవారు, అవిశ్వాసుల పట్ల కఠినులుగానూ, పరస్పరం కరుణామయులుగానూ ఉంటారు." (అల్‌ఫత్‌హ్:29)

English

“The believers are nothing else than brothers (in Islamic religion).” [Al-Ḥujurāt 49:10]

“… humble towards the believers, stern towards the disbelievers …” [Al-Mā’idah 5:54]

“Muhammad ﷺ is the Messenger of Allah, and those who are with him are severe against disbelievers, and merciful among themselves.” [Al-Fatḥ 48:29]

1569

హదీసు 1569

وعنْ أنسٍ رضي اللَّه عَنهُ أنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لاَ تَباغَضُوا، وَلاَ تحاسدُوا، ولاَ تَدابَرُوا، وَلاَ تَقَاطعُوا، وَكُونُوا عِبادَ اللَّهِ إخْوَاناً، وَلاَ يَحِلُّ لِمُسْلِمٍ أنْ يهْجُرَ أخَاه فَوقَ ثلاثٍ" متفقٌ عليه.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: పరస్పరం పగబట్టకండి. అసూయ చెందకండి. ఎడమొహం పెడమొహంతో ఉండకండి. సంబంధాలు త్రెంచుకోకండి. దైవదాసులారా! పరస్పరం అన్నదమ్ములుగా ఉండండి. ఒక ముస్లిం తోటి (ముస్లిం) సోదరునితో మూడ్రోజులకు మించి మాట్లాడకుండా ఉండరాదు.

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని అదబ్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని బిర్ర్ ప్రకరణం)

English

Anas bin Malik (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “Do not harbour grudge against one another, nor jealousy, nor enmity; and do not show your backs to one another; and become as fellow brothers and slaves of Allah. It is not lawful for a Muslim to avoid speaking with his brother beyond three days.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

పరస్పరం పగబట్టకండి అంటే హృదయాల్లో ప్రతీకార, విరోధ భావాలను పెంచే మాటలకు, పనులకు దూరంగా ఉండండి అని అర్థం. అసూయ చెందకండి అంటే ఒక ముస్లింకు ఏదయినా వరంగాని లేక హోదా అంతస్తులుగాని లభిస్తే అవి క్షీణించిపోవాలని కోరుకోకండి అని అర్థం. ఎడమొహం పెడమొహంతో ఉండకండి అంటే పరస్పరం ఎదురుపడినప్పుడు కనీసం సలాం అయినా చేసుకోకుండా మొహం తిప్పుకొని వెళ్లిపోకండి అని అర్థం. వీటివల్ల మనుషుల్లో అంతరాల అగాధాలు పెరిగిపోతాయి. సామాజిక జీవితం ఛిన్నాభిన్నమైపోతుంది. కనుక మనుషులు మూడ్రోజులకు మించి తెగత్రెంపులు చేసుకొని మాట్లాడకుండా ఉండటం ధర్మసమ్మతం కాదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|269. పరస్పరం పగతో, సంబంధాలు త్రెంచుకొని ఎడమొహం పెడమొహంతో ఉండరాదు|హదీసు 1569

1570

హదీసు 1570

وعنْ أبي هُرَيْرَةَ رضي اللَّهُ عَنْهُ أنَّ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "تُفْتَحُ أبْوابُ الجَنَّةِ يَوْمَ الاثنَيْنِ ويَوْمَ الخَمِيس، فَيُغْفَرُ لِكُلِّ عبْدٍ لا يُشْرِكُ بِاللَّهِ شَيئاً، إلاَّ رجُلاً كانَت بيْنهُ وبَيْنَ أخيهِ شَحْناءُ فيقالُ: أنْظِرُوا هذيْنِ حتَّى يصطَلِحا، أنْظِرُوا هذَيْنِ حتَّى يَصطَلِحا،" رواه مسلم. وفي روايةٍ لَهُ: "تُعْرَضُ الأعْمالُ في كُلِّ يومِ خَميسٍ وَاثنَيْنِ" وذَكَر نحْوَهُ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: సోమ, గురువారాల్లో స్వర్గద్వారాలు తెరువబడతాయి. ఆ రోజు అల్లాహ్‌తోపాటు సహవర్తుల్ని నిలబెట్టని ప్రతి ఒక్కరి పాపాలూ మన్నించబడతాయి. కాని తనకూ తన తోటి (ముస్లిం) సోదరునికి మధ్య శత్రుత్వమున్నవాని పాపాలు మాత్రం మన్నించబడవు. వారి గురించి "వీరిద్దరూ తమ సంబంధాలు మెరుగుపరచుకునేదాకా గడువు ఇవ్వండి! వీరిద్దరూ తమ సంబంధాలు మెరుగుపరచుకునేదాకా గడువు ఇవ్వండి" అని అనటం జరుగుతుంది. (ముస్లిం)

ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో "ప్రతి సోమ గురువారాల్లో కర్మలు ప్రవేశపెట్టబడతాయి" అని ఉంది. ఆ తర్వాతి హదీసు అంతా యధాతథంగానే ఉంది.

(సహీహ్ ముస్లింలోని బిర్ర్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “The gates of Jannah are opened on Mondays and Thursdays, and then every slave (of Allah) is granted forgiveness if he does not associate anything with Allah in worship. But the person in whose heart there is rancour against his (Muslim) brother, they will not be pardoned and with regard to them it will be said twice: `Hold both of them until they are reconciled with each other.”’[Muslim].

ముఖ్యాంశాలు

పరస్పరం శత్రుత్వం, విద్వేష వైషమ్యాలు కలిగి ఉండటం స్వర్గ అనర్హతకు కారణభూతమవుతుందని ఈ హదీసు హెచ్చరిస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|269. పరస్పరం పగతో, సంబంధాలు త్రెంచుకొని ఎడమొహం పెడమొహంతో ఉండరాదు|హదీసు 1570