హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 267. చనిపోయినవారిని దూషించటం నిషిద్ధం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 267వ అధ్యాయం: చనిపోయినవారిని అన్యాయంగా, షరీఅత్ పరమైన అవసరమేదీ లేకుండా దూషించటం నిషిద్ధం. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1566) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

267. చనిపోయినవారిని అన్యాయంగా, షరీఅత్ పరమైన అవసరమేదీ లేకుండా దూషించటం నిషిద్ధం

↑ విషయ సూచిక

باب تحريم سَبّ الأموات بغير حقِّ ومصلحةٍ شرعية وهو التَّحْذِيرُ مِنَ الاقْتِدَاء بِهِ في بِدْعَتِهِ, وَفِسْقِهِ, وَنَحْوِ ذَلِكَ, وَفِيهِ الآيةُ والأحاديثُ السَّابِقَةُ في البَابِ قَبْلَهُ.

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

షరీఅత్‌పరమైన అవసరమంటే బిద్‌అతీల బిద్‌అత్‌ను, పాపాత్ముని పాపాన్ని, మొదలగు వారి చెడు విషయాలను అనుసరించకుండా ఇతర ప్రజలను కాపాడటం. ఈ విషయానికి మునుపటి అధ్యాయంలోని ఖుర్‌ఆన్ సూక్తులు, హదీసులు కూడా వర్తిస్తాయి.

ముఖ్యాంశాలు

గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) చెప్పదలచుకున్నదేమిటంటే- మరణించిన వ్యక్తి గనక బిద్‌అత్‌లు సృష్టించినవాడు, దైవ అవిధేయతకు పాల్పడినవాడయితే అతని చేష్టల దుష్ప్రభావం నుంచి కాపాడటానికి ప్రజలకు అతని గురించి తెలియజెప్పాలి. ఇది మృతుని గురించి చెడుగా చెప్పుకోవటం, దూషించటం క్రిందికి రాదు. పైగా అతని వాస్తవిక రూపాన్ని బయటపెట్టటంలో షరీఅత్‌పరమైన మేలు ఇమిడి ఉంది కనుక ఇలా చేయటంలో తప్పులేదు.

1566

హదీసు 1566

وعن عائِشةَ رَضِيَ اللَّه عنها قالتْ: قالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لا تَسُبُّوا الأمواتَ، فَإنَّهُمْ قَدْ أفْضَوْا إِلَى مَا قَدَّموا" رواه البخاري.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మరణించినవారు తాము చేసుకున్న కర్మలకు చేరుకున్నారు. అందుకని వారిని దూషించకండి. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని జనాయెజ్ ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) said: The Messenger of Allah ﷺ said, “Do not abuse the dead, because they have attained that which they had forwarded (i.e., their deeds, good or bad).”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

పై హదీసు భావం ఏమిటంటే చనిపోయినవారు తాము చేసుకున్న కర్మలను బట్టి శిక్షకో లేక బహుమానానికో అర్హులైపోతారు. అలాంటి వారి గురించి మనం చెడుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. కనుక చనిపోయిన వారిని ఎవరినీ తిట్టకూడదు. ముఖ్యంగా ఒకరి పేరు తీసుకొని తిట్టడం ఇంకా దిగజారిన విషయం. ఒకవేళ పైన పేర్కొనబడిన అధ్యాయపు శీర్షికలో, దాని ముఖ్యాంశాల్లో చెప్పబడినట్లు షరీఅత్‌పరంగా అలాంటి అవసరం ఏదైనా ఏర్పడితే అప్పుడు చెప్పవచ్చు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|267. చనిపోయినవారిని అన్యాయంగా, షరీఅత్ పరమైన అవసరమేదీ లేకుండా దూషించటం నిషిద్ధం|హదీసు 1566