హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 265. పేరు చెప్పకుండా అవిధేయులను శపించవచ్చు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 265వ అధ్యాయం: నిర్ణీత వ్యక్తి పేరు తీసుకోకుండా అవిధేయతకు పాల్పడేవారినందర్నీ శపించవచ్చు. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు ఉన్నాయి. ప్రతి ఆయతు అరబీ మూలం, తెలుగు అనువాదం, English అనువాదంతో.

265. నిర్ణీత వ్యక్తి పేరు తీసుకోకుండా అవిధేయతకు పాల్పడేవారినందర్నీ శపించవచ్చు

↑ విషయ సూచిక

باب جواز لَعْن بعض أصحاب المعاصي غير المُعَيّنِين

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{أَلا لَعْنَةُ اللَّهِ عَلَى الظَّالِمِينَ} [هود: ١٨]

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "విను! దుర్మార్గులపై దేవుని శాపం పడుతుంది." (హూద్:18)

{فَأَذَّنَ مُؤَذِّنٌ بَيْنَهُمْ أَنْ لَعْنَةُ اللَّهِ عَلَى الظَّالِمِينَ} [الأعراف: ٤٤]

అప్పుడు ప్రకటించేవాడొకడు వారి మధ్య ఇలా ప్రకటిస్తాడు: "ప్రజలను అల్లాహ్ మార్గం నుంచి నిరోధించేవారూ, దానిని వక్రీకరించగోరేవారూ, పరలోకాన్ని తిరస్కరించేవారూ అయిన దుర్మార్గులపై అల్లాహ్ శాపం అవతరించుగాక!" (ఆరాఫ్:44)

దైవప్రవక్త ﷺ ఇలా అన్నారని సహీహ్ హదీసుల్లో ఉంది: "సవరం పెట్టే స్త్రీని, పెట్టించుకునే స్త్రీని దేవుడు శపించుగాక!" "వడ్డీ తినేవాణ్ణి దేవుడు శపించుగాక!" దైవప్రవక్త ﷺ చిత్రాలను రూపొందించేవారిని కూడా శపించారు. ఇంకా ఆయన ఇలా అనేవారు: "భూమి సరిహద్దుల్ని మార్చివేసేవాణ్ణి దేవుడు శపించుగాక!" 'గ్రుడ్డును దొంగిలించే దొంగని దేవుడు శపించుగాక!' 'తన తల్లిదండ్రులకు శాపనార్ధాలు పెట్టేవాణ్ణి దేవుడు శపించుగాక!' 'దైవేతరుల కోసం జంతువుల్ని జిబహ్ చేసేవాణ్ణి దేవుడు శపించుగాక!' 'ఈ మదీనా నగరంలో బిద్‌అత్‌ను సృష్టించే లేక బిద్‌అత్‌లను సృష్టించేవారికి శరణునిచ్చేవాడి మీద దేవుని, దైవదూతల, ఇంకా ప్రజలందరి శాపం పడుగాక!' "అల్లాహ్! రీల్, జక్‌వాన్, ఉసయ్యా తెగలను శపించు. వీరు దేవునికీ, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపారు." ఇవి మూడూ అరబ్బు తెగలు. దైవప్రవక్త ﷺ ఇంకా ఇలా అన్నారు: "దేవుడు యూదుల్ని శపించుగాక! వారు తమ ప్రవక్తల సమాధుల్ని ఆరాధనాలయాలుగా మార్చుకున్నారు." ఇంకా దైవప్రవక్త ﷺ స్త్రీలను అనుకరించే పురుషుల్ని, పురుషుల్ని అనుకరించే స్త్రీలను కూడా శపించారు.

(పైన పేర్కొనబడిన) ఈ వాక్యాలన్నీ సహీహ్ హదీసుల్లోనివే. వాటిలో కొన్ని సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం రెండిట్లోనూ ఉన్నాయి. మరి కొన్ని ఆ రెండిట్లో ఏదో ఒకదానిలో ఉంటాయి. వాటిని సూచించటంలో నేను సంక్షిప్త పద్ధతిని అవలంబించాను. అయితే వాటిలోని చాలా హదీసుల్ని నేను ఈ గ్రంథంలోని విభిన్న అధ్యాయాల్లో ప్రస్తావిస్తాను. ఇన్షా అల్లాహ్!

ముఖ్యాంశాలు

ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) పేర్కొన్న హదీసులు మరియు ఖుర్‌ఆన్ సూక్తుల ద్వారా బోధపడేదేమిటంటే, దుర్మార్గులపై, అబద్ధాలకోరులపై, బంధువిచ్ఛిత్తికి పాల్పడే మొదలగు వారిపై దేవుని శాపం పడాలని శపించవచ్చుగాని ఎవరో ఒకరి పేరు పెట్టి మరీ శాపనార్ధాలు పెట్టడం ధర్మసమ్మతం కాదు. అతను పైకి దుర్మార్గుడిగా, అబద్ధాలకోరుగా, బంధువిచ్ఛిన్నకారిగా కనిపించినా సరే: ఎందుకంటే ఆ శపించబడేవాడు ఒకవేళ తన వల్ల జరిగిన పాపానికి పశ్చాత్తాపం చెంది క్షమాభిక్ష వేడుకుంటే అతను దేవుని దృష్టిలో పాపాత్ముడిగా పరిగణించబడడు. అలాంటప్పుడు అతన్ని శపించటం కూడా సమంజసం కాదు. అందుకని పాపాత్ముడైన ఏ ముస్లింనూ- అతను ఎంత పెద్ద పాపాత్ముడయినా, అలాగే అతను బ్రతికి ఉన్నా లేక మరణించినా సరే- శపించటం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే మరణానికి ముందు అతను స్వచ్ఛమైన తౌబా చేసుకొని ఉంటే దేవుడు అతన్ని క్షమించి ఉండవచ్చు కదా. అందుకని ప్రత్యేకంగా ఒకరి పేరు తీసుకొని శాపనార్ధాలు పెట్టకుండా అబద్ధాలకోరుల మీద, దుర్మార్గుల మీద, ఫలనా వారి మీద దేవుని శాపం పడుగాక అని మాత్రమే అనాలి.

English

“No doubt! the Curse of Allah is on the Zalimun (polytheists, wrongdoers, oppressors).” [Hūd 11:18]

“Then a crier will proclaim between them: `The Curse of Allah is on the Zalimun (polytheists and wrongdoers).”’ [Al-A‘rāf 7:44] It has been authentically reported that the Messenger of Allah said, “Curse of Allah is upon those women who wear false hair, and those women who prepare such.” And he ﷺ said, “Curse of Allah is upon the one who eats Riba (usury).” And he also cursed the painters of pictures of living objects. And he ﷺ said, “Curse of Allah is upon him who make changes in land boundaries (to deprive others).” He ﷺ also said, “Curse of Allah is upon the thief who steals (even) an egg.” He also said, “Curse of Allah is upon the one who curses his parents.” And: “Curse of Allah is upon the one who sacrifices an animal for other than Allah.” And he ﷺ said, “Who invents heresies in religion here (Al-Madinah), and upon those who supported him, is the Curse of Allah and the angels and all the people.” And he ﷺ said, “O Allah! Curse be upon Ri`l, Dhakwan and Usaiyyah, the three tribes of Arab who are disobedient to Allah and His Messenger.” He also said, “Curse of Allah is upon the Jews who turned the graves of their Prophets into places of worship.” And he ﷺ cursed those men who imitate women and those women who imitate men. All these Ahadith are authentic, and are reported by Al-Bukhari or Muslim or by them both. These Ahadith will be cited under their respective chapters, In sha’ Allah.