హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 255. పరోక్ష నింద వినటం నిషిద్ధం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 255వ అధ్యాయం: పరోక్ష నింద వినటం నిషిద్ధం, నిషిద్ధమైన పరోక్ష నింద వింటే వెంటనే దాన్ని ఖండించాలి, నిందించేవాణ్ణి వారించాలి, తాను ఆ పని చేయలేకపోయినప్పుడు లేక తన మాటను ఎవరూ వినకపోయినప్పుడు వీలైతే ఆ సమావేశం నుండి వేరయిపోవాలి. ఈ అధ్యాయంలో 4 ఖుర్ఆన్ ఆయతులు, 3 హదీసులు (హదీసు 1529 – 1531) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

255. పరోక్ష నింద వినటం నిషిద్ధం, నిషిద్ధమైన పరోక్ష నింద వింటే వెంటనే దాన్ని ఖండించాలి, నిందించేవాణ్ణి వారించాలి, తాను ఆ పని చేయలేకపోయినప్పుడు లేక తన మాటను ఎవరూ వినకపోయినప్పుడు వీలైతే ఆ సమావేశం నుండి వేరయిపోవాలి

↑ విషయ సూచిక

باب تحريم سماع الغيبة وأمر من سمع غيبةً محرَّمة بردِّها، والإِنكار عَلَى قائلها فإنْ عجز أَوْ لَمْ يقبل منه فارق ذلك المجلس إن أمكنه

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{وَإِذَا سَمِعُوا اللَّغْوَ أَعْرَضُوا عَنْهُ} [القصص: ٥٥]

"వారు ఎప్పుడైనా అసహ్యకరమైన మాటను వింటే అక్కణ్ణుంచి దూరంగా జరిగిపోతారు." (ఖసస్ : 55)

{وَالَّذِينَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُونَ} [المؤمنون: ٣]

"విశ్వాసులు వ్యర్ధ విషయాల జోలికిపోరు." (మూమినూన్ : 3)

{إِنَّ السَّمْعَ وَالْبَصَرَ وَالْفُؤَادَ كُلُّ أُولَئِكَ كَانَ عَنْهُ مَسْؤُولاً} [الإسراء: ٣٦]

"నిశ్చయంగా కళ్ళూ, చెవులూ, మనస్సూ అన్నింటి విషయంలోనూ విచారణ జరుగుతుంది." (ఇస్రా: 36)

{وَإِذَا رَأَيْتَ الَّذِينَ يَخُوضُونَ فِي آيَاتِنَا فَأَعْرِضْ عَنْهُمْ حَتَّى يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ وَإِمَّا يُنْسِيَنَّكَ الشَّيْطَانُ فَلا تَقْعُدْ بَعْدَ الذِّكْرَى مَعَ الْقَوْمِ الظَّالِمِينَ} [الأنعام: ٦٨]

"ప్రవక్తా! ప్రజలు గనక మా ఆయతులలో తప్పులెన్నటాన్ని నీవు గమనిస్తే వారి మధ్య నుండి తొలగిపో, వారు ఈ ప్రస్తావనను వదలిపెట్టి మరో విషయాన్ని గురించి మాట్లాడటం మొదలుపెట్టేవరకు. ఒకవేళ నిన్ను షైతాను ఎప్పుడైనా ఏమరుపాటుకు గురిచేస్తే నీవు ఈ పొరపాటును గ్రహించిన తర్వాత మళ్ళీ అటువంటి దుర్మార్గుల వద్ద కూర్చోవద్దు." (అన్‌ఆమ్: 68)

ముఖ్యాంశాలు

అబద్ధం, మోసం, లజ్జా రాహిత్యం, వ్యర్ధ విషయాలవంటి వాటికి దూరంగా ఉండటం విశ్వాసుల లక్షణమనీ, వాటికి దూరంగా ఉండమని విశ్వాసుల్ని ఆదేశించటం జరిగిందని పైన పేర్కొనబడిన సూక్తులు తెలుపుతున్నాయి. దీనిద్వారా పరోక్ష నిందను వినటం కూడా నిషిద్ధమేనని తెలుస్తోంది. ఎందుకంటే అది కూడా వ్యర్ధ విషయాల క్రిందికే వస్తుంది. అదే విధంగా దేవుని, దైవప్రవక్త ఆదేశాలను అపహాస్యం చేసే- ఆ అపహాస్యం నోటిద్వారా కానివ్వండి లేక చేతల ద్వారా కానివ్వండి- అలాంటి సమావేశాలను బహిష్కరించటం కూడా చాలా అవసరం. దైవాదేశాలను అపహాస్యం ఛేయటమంటే వాటికి విరుద్ధమైన పనులు చేయటమని అర్థం. అది కూడా ఒక విధంగా దైవాదేశాలను అపహాస్యం చేయటం క్రిందికే వస్తుంది. ఉదా: ఈ రోజుల్లో జరిగే నిశ్చితార్థం, పెళ్ళిపేరంటాలు, సున్తీ, పుట్టినరోజు వేడుకలన్నీ ఆ కోవకు చెందినవే. వాటిలో లజ్జారాహిత్యం, పరదా పాటించకపోవటం, ఛాయాచిత్రాలు తీయటం, డాన్సులు, పాటలు, స్త్రీ పురుషులు విచ్చలవిడిగా కలుస్తూ ఉండటం, అందమైన అమ్మాయిలు అతిథుల్ని స్వాగతించటం, వారిమీద పూలుజల్లటం లాంటి చెడు పనులు ఎన్నో జరుగుతూ ఉంటాయి. దురదృష్టవశాత్తు ముస్లింల రాజీధోరణి మూలంగా ఆ రుగ్మతలు మరింతగా పెరిగిపోతున్నాయి. మనిషి ఇలాంటి వేడుకల్లో జరిగే చెడు పనుల్ని ఆపలేకపోతే వాటికి హాజరు కావటం కూడా పెద్ద పాపం కనుక కనీసం వాటిని బహిష్కరించనయినా బహిష్కరించాలి.

English

“And when they hear Al-Laghw (dirty, false, evil vain talk) they withdraw from it.” [Al-Qaṣaṣ 28:55]

“And those who turn away from Al-Laghw (dirty, false, evil vain talk, falsehood, and all that Allah has forbidden).” [Al-Mu’minūn 23:3]

“Verily, the hearing, and the sight, and the heart, of each of those ones will be questioned (by Allah).” [Al-Isrā’ 17:36]

“And when you (Muhammad ﷺ) see those who engage in a false conversation about Our Verses (of the Qur’an) by mocking at them, stay away from them till they turn to another topic. And if Shaitan (Satan) causes you to forget, then after the remembrance sit not you in the company of those people who are the Zalimun (polytheists and wrongdoers).” [Al-An‘ām 6:68]

1529

హదీసు 1529

وعنْ أَبي الدَّرْداءِ رضي اللَّه عَنْهُ عنِ النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "منْ ردَّ عَنْ عِرْضِ أخيهِ، ردَّ اللَّه عنْ وجْههِ النَّارَ يوْمَ القِيَامَةِ" رواه الترمذي وقالَ: حديثٌ حسنٌ.

హజ్రత్ అబూ దర్దా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవరైనా తమ సోదరుని మానమర్యాదల మీద జరిగే దాడుల్ని ఖండిస్తే ప్రళయదినాన దేవుడు వారి మొహాలను అగ్ని నుండి రక్షిస్తాడు. (తిర్మిజీ-హసన్)

(సుననె తిర్మిజీలోని బిర్ర్, సిలా అధ్యాయాలు)

English

Abud-Darda’ (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “He who defends the honour of his (Muslim) brother, Allah will secure his face against the Fire on the Day of Resurrection.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ఏదైనా సమావేశంలో ఒకతని లోపాలు ఎత్తిచూపి అతన్ని పరాభవించే ప్రయత్నం జరుగుతున్నప్పుడు వెంటనే ఆ మాటల్ని ఖండించాలి. ఆ మనిషి మీద మోపుతున్న నిందలు నిజమైనవి కావనీ, అతను మంచివాడని వారికి తెలియజెప్పాలి. మానమర్యాదల మీద జరిగే దాడుల్ని ఖండించటమంటే అదే.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|255. పరోక్ష నింద వినటం నిషిద్ధం, నిషిద్ధమైన పరోక్ష నింద వింటే వెంటనే దాన్ని ఖండించాలి, నిందించేవాణ్ణి వారించాలి, తాను ఆ పని చేయలేకపోయినప్పుడు లేక తన మాటను ఎవరూ వినకపోయినప్పుడు వీలైతే ఆ సమావేశం నుండి వేరయిపోవాలి|హదీసు 1529

1530

హదీసు 1530

وعنْ عِتْبَانَ بنِ مالِكٍ رضي اللَّهُ عنْهُ في حدِيثِهِ الطَّويلِ المشْهورِ الَّذي تقدَّم في بابِ الرَّجاءِ قَالَ: قامَ النبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يُصلِّي فَقال: "أيْنَ مالِكُ بنُ الدُّخْشُمِ؟ "فَقَال رَجُلٌ: ذلكَ مُنافِقٌ لا يُحِبُّ اللَّه ولارسُولَهُ، فَقَال النبي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"لاَ تقُلْ ذلكَ، ألاَ تَراه قَدْ قَال: لا إلهَ إلاَّ اللهُ يُريدُ بِذَلكَ وجْه اللَّه، وإنَّ اللَّه قدْ حَرَّمَ عَلَى النَّارِ منْ قَالَ: لا إلهَ إلاَّ اللَّه يبْتَغِي بِذلكَ وجْهَ اللَّه" متفقٌ عَلَيْهِ. "وعِتبانُ"بكسر العين عَلَى المشهور، وحُكِي ضمُّها، وبعدها تاءٌ مثناةٌ مِنْ فوق، ثُمَّ باءٌ موحدةٌ. و"الدُّخْشُمُ"بضم الدال وإسكان الخاءِ وضمِّ الشين المعجمتين.

ఇత్‌బాన్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు), ఇంతకు ముందు 'రజా' అధ్యాయంలో పేర్కొనబడిన తన సుప్రసిద్ధ, సుదీర్ఘ హదీసులో చేసిన కథనం ప్రకారం (ఒకసారి) దైవప్రవక్త ﷺ నమాజు చేయించటానికి నిలబడి "మాలిక్ బిన్ దుఖ్‌షుమ్ ఏడి?" అని అడిగారు. దానికి అక్కడున్నవారిలో ఒకతను "అతను కపటి, దేవునిపట్ల, దైవప్రవక్త పట్ల అతనికి అభిమానం లేదు" అన్నాడు.

ఆ మాట విని దైవప్రవక్త ﷺ అతన్ని (మందలిస్తూ) "అంత మాటనకు. అతను దైవప్రసన్నత కోసం 'లా ఇలాహ ఇల్లల్లాహ్' అని అనటం నీవు చూడలేదా? (ఒక విషయం గుర్తుంచుకో!) ఎవరయితే దైవప్రసన్నత కోసం లా ఇలాహ ఇల్లల్లాహ్ అని అంటారో దేవుడు వారిపై నరకాగ్నిని నిషిద్ధం చేసేస్తాడు" అని అన్నారు.

(బుఖారీ-ముస్లిం)

'ఇత్‌బాన్' అన్న పేరు సుప్రసిద్ధం. అయితే ఉత్‌బాన్ అని కూడా ఒక ఉల్లేఖనం ఉంది.

(సహీహ్ బుఖారీలోని సలాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని మసాజిద్ ప్రకరణం)

English

`Itban bin Malik (radiyallahu anhu) said in his long Hadith cited in the Chapter entitled `Hope’ reported: When the Prophet ﷺ stood up to offer As-Salat (the prayer) he asked, “Where is Malik bin Ad-Dukhshum?” A man replied: “He is a hypocrite. He does not love Allah and His Messenger.” The Prophet ﷺ said, “Do not say that. Do you not know that he said: La ilaha illallah (there is no true god except Allah),’ seeking His Pleasure. Allah has made the fire of Hell unlawful for him who affirms that none has the right to be worshipped but Allah.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

వివరాల కోసం 'రజా' అధ్యాయంలో 417వ హదీసు చూడండి. విశ్వాసిపై నరకం నిషిద్ధం చేయబడిందంటే విశ్వాసి శాశ్వతంగా నరకంలో ఉండడని భావం. ఎందుకంటే విశ్వాసి గనక ఘోరపాపానికి పాల్పడి దేవుడు అతనికి క్షమాభిక్ష పెట్టని పక్షంలో ఆయన తలచినంతకాలం విశ్వాసి కూడా నరకంలో శిక్ష అనుభవించాల్సిందే. ఆ తర్వాత అతన్ని స్వర్గానికి పంపటం జరుగుతుంది. ముస్లింను పరోక్షంగా నిందించటం నిషిద్ధమన్న సంగతి ఈ హదీసు ద్వారా కూడా బోధపడుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|255. పరోక్ష నింద వినటం నిషిద్ధం, నిషిద్ధమైన పరోక్ష నింద వింటే వెంటనే దాన్ని ఖండించాలి, నిందించేవాణ్ణి వారించాలి, తాను ఆ పని చేయలేకపోయినప్పుడు లేక తన మాటను ఎవరూ వినకపోయినప్పుడు వీలైతే ఆ సమావేశం నుండి వేరయిపోవాలి|హదీసు 1530

1531

హదీసు 1531

وعَنْ كعْبِ بنِ مالكٍ رضي اللَّه عَنْهُ في حدِيثِهِ الطَّويلِ في قصَّةِ توْبَتِهِ وَقَدْ سبقَ في باب التَّوْبةِ. قَالَ: قَالَ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وهُو جَالِسٌ في القَوْم بِتبُوكَ: "ما فَعَلَ كَعْبُ بنُ مَالِكٍ؟ "فقالَ رجُلٌ مِنْ بَني سلِمَةَ: يا رسُولَ اللَّه حبسهُ بُرْداهُ، والنَّظَرُ في عِطْفيْهِ. فقَال لَهُ معاذُ بنُ جبلٍ رضي اللَّه عنْه: بِئس مَا قُلْتَ، واللَّهِ يا رسُولَ اللَّهِ مَا عَلِمْنا علَيْهِ إلاَّ خيْراً، فَسكَتَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. مُتَّفَقٌ عَلَيهِ. "عِطْفَاهُ"جانِباهُ، وهو إشارةٌ إلى إعجابِهِ بنفسهِ.

ఇంతకుముందు పశ్చాత్తాపానికి సంబంధించిన అధ్యాయంలో కాబ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) గారు తన పశ్చాత్తాప సంఘటనకు సంబంధించిన సుదీర్ఘ హదీసులో చేసిన కథనం: దైవప్రవక్త ﷺ తబూక్ ప్రాంతంలో ప్రజల మధ్య కూర్చొని ఉన్నప్పుడు 'కాబ్ బిన్ మాలిక్ రాలేదా?' అని అడిగారు.

దానికి బనూ సలిమాకు చెందిన ఒకతను బదులిస్తూ, "దైవప్రవక్తా! అతన్ని అతని రెండు దుప్పట్లు, వాటి కొనల్ని చూసుకొని మురిసిపోవడాలు (యుద్ధానికి) రాకుండా చేశాయి" అని అన్నాడు. అది విని ముఆజ్ బిన్ జబల్ (అతని మాటల్ని ఖండిస్తూ) "అబద్ధం, దైవం సాక్షి! దైవప్రవక్తా! మాకు ఆయనలో మంచితనమే తెలుసు" అని చెప్పారు. ఆ మాట విని దైవప్రవక్త ﷺ మౌనం వహించారు.

(బుఖారీ-ముస్లిం)

'ఇత్‌ఫాహు' అంటే రెండు కొనలు అని అర్థం. ఇది ఆయన ఆత్మస్తుతికి సూచన.

English

Ka`b bin Malik (radiyallahu anhu) said in his long story about his repentance: The Prophet ﷺ was sitting among the people in Tabuk. He ﷺ said, “What happened to Ka`b bin Malik?” A person from the tribe of Banu Salamah said: “O Messenger of Allah! the embellishment of his cloak and an appreciation of his sides have allured him, and he was thus detained.” Mu`adh bin Jabal (radiyallahu anhu) said: “Woe be upon you! You have passed indecent remarks. O Messenger of Allah! by Allah, we know nothing about him but good.” The Messenger of Allah ﷺ remained silent.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసు ఇంతకుముందు పశ్చాత్తాపం అధ్యాయంలో పూర్తి వివరాలతో వచ్చింది. దీనిని మళ్ళీ ఈ అధ్యాయం క్రింద ప్రస్తావించటంలోని ఔచిత్యం ఏమిటంటే దైవప్రవక్త ﷺ ముందు ఒక వ్యక్తి కాబ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) గురించి తన దురనుమానాన్ని వెలిబుచ్చుతూ, "అతన్ని అతని మంచి వస్త్రధారణ, గర్వాహంకారాలు యుద్ధానికి రాకుండా చేశాయి" అని అన్నప్పుడు ముఆజ్ (రదియల్లాహు అన్హు) వెంటనే దాన్ని ఖండించారు. ఒకరిగురించి ఇలాంటి దురనుమానాలు పెట్టుకోవటం మంచిది కాదని చెప్పారు. ఈ సంభాషణ అంతా వింటున్న దైవప్రవక్త ﷺ మౌనం వహించారు. ముఆజ్ (రదియల్లాహు అన్హు) ఖండన సరైనదేనని చెప్పటానికి ఆయన మౌనమే ప్రబల నిదర్శనం. దీనిద్వారా బోధపడిందేమిటంటే ఏదైనా సమావేశంలో ఈ విధంగా ఎవరి గురించయినా చాడీలు చెప్పుకుంటుంటే, వారి మానమర్యాదల మీద దాడి చేయబోతుంటే వారి మాటల్ని ఖండించి ఆయా సోదరుల మానమర్యాదలను కాపాడటం అక్కడున్న ప్రతి ఒక్కరి బాధ్యత.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|255. పరోక్ష నింద వినటం నిషిద్ధం, నిషిద్ధమైన పరోక్ష నింద వింటే వెంటనే దాన్ని ఖండించాలి, నిందించేవాణ్ణి వారించాలి, తాను ఆ పని చేయలేకపోయినప్పుడు లేక తన మాటను ఎవరూ వినకపోయినప్పుడు వీలైతే ఆ సమావేశం నుండి వేరయిపోవాలి|హదీసు 1531