హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 235. అమరగతుల భౌతిక కాయాలకు గుస్ల్, జనాజా

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 235వ అధ్యాయం: పరలోకంలో లభించే పుణ్యం రీత్యా అమరగతులుగా పేర్కొనబడేవారి భౌతిక కాయాలకు, గుస్ల్ (స్నానం) చేయించి వారి జనాజా నమాజు కూడా చేయటం జరుగుతుంది. వీరికి భిన్నంగా అవిశ్వాసులతో యుద్ధం చేస్తూ అమరగతి నొందినవారి భౌతిక కాయాలకు స్నానం చేయించనవసరం లేదు. జనాజా నమాజు కూడా చేయనవసరం లేదు. ఈ అధ్యాయంలో 5 హదీసులు (హదీసు 1354 – 1358) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

235. పరలోకంలో లభించే పుణ్యం రీత్యా అమరగతులుగా పేర్కొనబడేవారి భౌతిక కాయాలకు, గుస్ల్ (స్నానం) చేయించి వారి జనాజా నమాజు కూడా చేయటం జరుగుతుంది. వీరికి భిన్నంగా అవిశ్వాసులతో యుద్ధం చేస్తూ అమరగతి నొందినవారి భౌతిక కాయాలకు స్నానం చేయించనవసరం లేదు. జనాజా నమాజు కూడా చేయనవసరం లేదు.

↑ విషయ సూచిక

باب بيان جماعة منَ الشهداء في ثواب الآخرة ويغسلون ويُصَلَّى عليهم بخلاف القتيل في حرب الكفار

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1354

హదీసు 1354

عنْ أبي هُرَيْرةَ، رضي اللَّه عَنْهٍُ، قالَ: قالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "الشُّهَدَاءُ خَمسَةٌ: المَطعُونُ، وَالمبْطُونُ، والغَرِيقُ، وَصَاحبُ الهَدْم وَالشَّهيدُ في سبيل اللَّه" متفقٌ عليهِ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: (పరలోకంలో పొందే పుణ్యం రీత్యా) అమరగతులు (షహీదులు)గా భావింపబడేవారు ఐదుగురు. 1) ప్లేగు వ్యాధితో చనిపోయినవాడు. 2) ఉదరవ్యాధితో చనిపోయిన వాడు. 3) (నీటిలో) మునిగి చనిపోయేవాడు. 4) బరువు క్రింద నలిగి చనిపోయినవాడు. 5) దైవమార్గంలో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయినవాడు. (బుఖారీ-ముస్లిం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “The martyrs are of five kinds: One who dies of plague; one who dies of disease of his belly; the drowned; one who dies under the debris (of construction, etc.), and one who dies while fighting in the way of Allah.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

అమరగతుణ్ణి అరబీ భాషలో 'షహీద్' అని అంటారు. షహీద్ అనే పదానికి ధాతువు 'షహాదత్' (సాక్ష్యం) అయినా కావచ్చు లేదా 'షుహూద్' (హాజరవటం) అయినా కావచ్చు. సాక్ష్యం అనే అర్థంలో తీసుకుంటే దైవమార్గంలో అమరగతినొందేవానికి స్వర్గం లభిస్తుందని స్వయంగా దేవుడు మరియు దైవప్రవక్తలే సాక్ష్యం చెప్పారు. కనుక అతన్ని 'షహీద్' అని అనటం జరిగింది. ఒకవేళ 'హాజరుకావటం' అనే అర్థంలో తీసుకుంటే దైవమార్గంలో అమరగతినొందేవాని వద్దకు కారుణ్యదూతలు హాజరవుతారనీ లేదా తనే స్వయంగా యుద్ధభూమికి హాజరై దైవసన్నిధిలో ప్రాణార్పణం చేస్తాడు కనుక అతణ్ణి 'షహీద్' అని పిలవటం జరుగుతుందని అర్థం చేసుకోవాలి.

ప్లేగువ్యాధితో చనిపోయినవారు, ఉదరవ్యాధితో చనిపోయినవారు, నీళ్లలో మునిగి చనిపోయినవారు, బరువు క్రింద పడి నలిగి చనిపోయినవారు- ఈ నాలుగు రకాలవారు వాస్తవానికి అమరగతులు (షహీదులు) కాకపోయినా దేవుడు ప్రత్యేక కరుణాకటాక్షాలతో వారిని అమరగతుల స్థాయికి చేర్చి వారికి కూడా అంతటి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇతర హదీసుల ద్వారా అమరగతుల జాబితాలోకి వచ్చేవారు మరికొందరున్నారని తెలుస్తున్నది. వివిధ హదీసుల్లో ఈ అమరగతుల రకాల సంఖ్య వేర్వేరుగా ఉండటం వల్ల పైకి ఈ హదీసులు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కన్పిస్తాయి. వాస్తవానికి వాటి మధ్య ఎలాంటి వైరుధ్యం లేదు. ముందుగా దైవప్రవక్త ﷺ కు వహీ ద్వారా ఐదు రకాల అమరగతుల గురించి తెలుపబడింది. వాటిని ఆయన తన సహచరులకు బోధించారు. ఆ తర్వాత దేవుడు ఆ జాబితాలో మరికొందరిని చేర్చాడు. దైవప్రవక్త ﷺ వాటిని కూడా తన సహచరులకు వివరించారు. ఈ అమరగతుల్లో దైవమార్గంలో పోరాడుతూ వధింపబడినవాడు సిసలైన అమరగతుడు (షహీద్) కనుక అతనికి ఇతరుల మీద స్పష్టమైన ఆధిక్యత ఉంటుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|జిహాద్ ప్రకరణం|235. పరలోకంలో లభించే పుణ్యం రీత్యా అమరగతులుగా పేర్కొనబడేవారి భౌతిక కాయాలకు, గుస్ల్ (స్నానం) చేయించి వారి జనాజా నమాజు కూడా చేయటం జరుగుతుంది. వీరికి భిన్నంగా అవిశ్వాసులతో యుద్ధం చేస్తూ అమరగతి నొందినవారి భౌతిక కాయాలకు స్నానం చేయించనవసరం లేదు. జనాజా నమాజు కూడా చేయనవసరం లేదు.|హదీసు 1354

1355

హదీసు 1355

وعنهُ قالَ: قالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَا تَعُدُّونَ الشهداءَ فِيكُم؟ قالُوا: يَا رسُولِ اللَّهِ مَنْ قُتِل في سَبيلِ اللَّه فَهُو شهيدٌ. قَالَ:"إنَّ شُهَداءَ أُمَّتي إذاً لَقلِيلٌ،"قالُوا: فَمنْ يَا رسُول اللَّه؟ قَالَ:"منْ قُتِل في سبيلِ اللَّه فهُو شَهيدٌ، ومنْ ماتَ في سَبيلِ اللَّه فهُو شهيدٌ، ومنْ ماتَ في الطَّاعُون فَهُو شَهيدٌ، ومنْ ماتَ في البطنِ فَهُو شَهيدٌ، والغَريقُ شَهيدٌ "رواهُ مسلمٌ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ఓ రోజు దైవప్రవక్త ﷺ తన సహచరుల్ని ఉద్దేశించి, "మీరు మీలో ఎవరెవరిని అమరగతులుగా పరిగణిస్తున్నారు" అని అడిగారు. "దైవప్రవక్తా! (మా అభిప్రాయంలో) దైవమార్గంలో పోరాడుతూ వధింపబడినవాడే అమరగతుడు" అని బదులిచ్చారు సహచరులు. అది విని దైవప్రవక్త ﷺ "ఆ విధంగా చూస్తే నా అనుచర సమాజంలో అమరగతులు చాలా తక్కువ మంది ఉంటారు" అని అన్నారు. అందుకు సహచరులు, "దైవప్రవక్తా! మరయితే అమరగతులు ఎవర్ని అంటారు?" అని అడిగారు. అప్పుడు దైవప్రవక్త ﷺ ఈ విధంగా వివరించారు:

"దైవమార్గంలో పోరాడుతూ వధింపబడినవారు అమరగతులు. దైవమార్గంలో సహజమరణం పొందినవారూ అమరగతులే. ప్లేగువ్యాధితో చనిపోయినవారు కూడా అమరగతులే. అలాగే ఉదరవ్యాధితో చనిపోయినవారు, నీళ్ళలో మునిగి ప్రాణాలు కోల్పోయినవారూ అమరగతులే."

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని పధవుల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Whom do you reckon to be martyr amongst you?” The Companions replied: “The one who is killed in Allah’s way.” He said, “In that case, the martyrs among my people would be few.” The Companions asked: “O Messenger of Allah! Then who are the martyrs?” He replied, “He who is killed in the way of Allah is a martyr; he who dies naturally in the Cause of Allah is a martyr; he who dies of plague is a martyr; and he who dies of a belly disease is a martyr; and he who is drowned is a martyr.”[Muslim].

This Hadith shows the care Allah has for this Ummah, which is the best Ummah of mankind. (Editor’s Note)

ముఖ్యాంశాలు

దైవమార్గంలో సహజ మరణం పొందినవారంటే యుద్ధభూమిలో కత్తిపోట్లకో లేక ఖడ్గపు వేట్లకో లేక తుపాకీ గుండ్ల దెబ్బకో చనిపోకుండా వేరితర కారణాలతో చనిపోవటం అని అర్థం. ఉదా: జిహాద్‌కు వెళ్తూ మార్గమధ్యంలో గుర్రం లేక వేరితర వాహనంపై నుంచి క్రిందపడి ప్రాణాలు కోల్పోవటం లేక గుండెపోటు మొదలగు వ్యాధుల వల్ల మరణించటం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|జిహాద్ ప్రకరణం|235. పరలోకంలో లభించే పుణ్యం రీత్యా అమరగతులుగా పేర్కొనబడేవారి భౌతిక కాయాలకు, గుస్ల్ (స్నానం) చేయించి వారి జనాజా నమాజు కూడా చేయటం జరుగుతుంది. వీరికి భిన్నంగా అవిశ్వాసులతో యుద్ధం చేస్తూ అమరగతి నొందినవారి భౌతిక కాయాలకు స్నానం చేయించనవసరం లేదు. జనాజా నమాజు కూడా చేయనవసరం లేదు.|హదీసు 1355

1356

హదీసు 1356

وعن عبدِ اللَّهِ بن عمْرو بن العاص، رضي اللَّه عنْهُمَا، قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "منْ قُتِل دُونَ مالِه، فَهُو شهيدٌ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: తన ధనాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఇతరుల చేత వధించబడినవాడు అమరగతునిగా పరిగణించబడతాడు. (బుఖారీ- ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని దౌర్జన్యాల ప్రకరణం – సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

`Abdullah bin `Amr bin Al-`As (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ said, “He who is killed while defending his property is a martyr.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|జిహాద్ ప్రకరణం|235. పరలోకంలో లభించే పుణ్యం రీత్యా అమరగతులుగా పేర్కొనబడేవారి భౌతిక కాయాలకు, గుస్ల్ (స్నానం) చేయించి వారి జనాజా నమాజు కూడా చేయటం జరుగుతుంది. వీరికి భిన్నంగా అవిశ్వాసులతో యుద్ధం చేస్తూ అమరగతి నొందినవారి భౌతిక కాయాలకు స్నానం చేయించనవసరం లేదు. జనాజా నమాజు కూడా చేయనవసరం లేదు.|హదీసు 1356

1357

హదీసు 1357

وعنْ أَبي الأعْوَر سعيدِ بنِ زَيْدِ بنِ عَمْرو بنِ نُفَيْلٍ، أَحدِ العشَرةِ المشْهُودِ لَهمْ بالجنَّةِ، رضي اللَّه عنْهُمْ، قَالَ: سمِعت رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقولُ: " منْ قُتِل دُونَ مالِهِ فهُو شَهيدٌ، ومنْ قُتلَ دُونَ دمِهِ فهُو شهيدٌ، وَمَنْ قُتِل دُونَ دِينِهِ فَهو شهيدٌ، ومنْ قُتِل دُونَ أهْلِهِ فهُو شهيدٌ". رواه أَبو داود، والترمذي وَقالَ: حديثٌ حسنٌ صحيحٌ.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబుల్ ఆవర్ సయీద్ బిన్ జైద్ బిన్ అమ్ర్ బిన్ నుఫైల్ తెలియజేశారు: తమకు స్వర్గం లభిస్తుందని ఇహలోకంలోనే శుభవార్త పొందిన పదిమందిలో ఈయన కూడా ఒకరు:

"తన ధనాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఇతరులచేత వధింపబడినవాడు అమరగతుడౌతాడు. ఆత్మరక్షణ కోసం పోరాడుతూ వధింప బడినవాడూ అమరగతు డౌతాడు. తన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నంలో వధింపబడినవాడు కూడా అమరగతుడౌతాడు. తన ఇంటివారిని రక్షించే ప్రయత్నంలో వధింపబడినవాడూ అమర గతునిగా పరిగణించబడతాడు." (అబూ దావూద్, తిర్మిజీ-హసన్; సహీహ్)

(సుననె అబూదావూద్‌లోని సున్నహ్ ప్రకరణం – సుననె తిర్మిజీలోని రక్తపరిహారాల అధ్యాయం)

English

Sa`id bin Zaid bin `Amr bin Nufail (radiyallahu anhu) reported, one of the ten Companions who were given the glad tidings of entering Jannah reported: I heard the Messenger of Allah ﷺ saying: “He who dies while defending his property is a martyr; he who dies in defence of his own life is a martyr; and he who dies on defense of his faith is a martyr, he who dies in defence of his family is a martyr.”[Abu Dawud and At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ఇహలోకంలోనే స్వర్గసుఖాల శుభవార్తను పొందిన పదిమంది దైవప్రవక్త సహచరుల పేర్లు ఇవి: 1) అబూబక్ర్ సిద్దీఖ్ 2) ఉమర్ బిన్ ఖత్తాబ్ 3) ఉస్మాన్ బిన్ అప్ఫాన్ 4) అలీ బిన్ అబూతాలిబ్ 5) తల్హా బిన్ ఉబైదుల్లాహ్ 6) జుబైర్ బిన్ అవ్వామ్ 7) అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ 8) సాద్ బిన్ అబూ వఖ్ఖాస్ 9) అబూ ఉబైదా బిన్ జర్రాహ్ 10) ఈ హదీసు ఉల్లేఖకులైన సయీద్ బిన్ జైద్ (రదియల్లాహు అన్హు). దైవప్రవక్త ﷺ మరికొంత మందికి కూడా స్వర్గశుభవార్తను తెలియజేశారు. అయితే ఈ పదిమందినే 'అషరయె ముబష్షరహ్' (స్వర్గశుభవార్త పొందిన పదిమంది)గా ఎందుకు చెబుతారంటే వీరందరికీ ఒకే సందర్భంలో ఒకే హదీసులోనే దైవప్రవక్త ﷺ స్వర్గశుభవార్త వినిపించారు (సుననె తిర్మిజీ).

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|జిహాద్ ప్రకరణం|235. పరలోకంలో లభించే పుణ్యం రీత్యా అమరగతులుగా పేర్కొనబడేవారి భౌతిక కాయాలకు, గుస్ల్ (స్నానం) చేయించి వారి జనాజా నమాజు కూడా చేయటం జరుగుతుంది. వీరికి భిన్నంగా అవిశ్వాసులతో యుద్ధం చేస్తూ అమరగతి నొందినవారి భౌతిక కాయాలకు స్నానం చేయించనవసరం లేదు. జనాజా నమాజు కూడా చేయనవసరం లేదు.|హదీసు 1357

1358

హదీసు 1358

وعنْ أَبي هُريرة، رضي اللَّه عنْهُ، قالَ: جاء رجُلٌ إِلَى رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَال: يَا رسولَ اللَّه أَرأَيت إنْ جاءَ رَجُلٌ يُرِيدُ أَخْذَ مَالِي؟ قَالَ:"فَلا تُعْطِهِ مالكَ"قَالَ: أَرأَيْتَ إنْ قَاتلني؟ قَالَ:"قَاتِلْهُ"قَالَ: أَرأَيت إنْ قَتلَني؟ قَالَ:"فَأنْت شَهيدٌ"قَالَ: أَرأَيْتَ إنْ قَتَلْتُهُ؟ قَالَ:"هُوَ فِي النَّارِ "رواهُ مسلمٌ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గరకు వచ్చి "దైవప్రవక్తా! ఎవరయినా బలవంతంగా నా సొమ్ము తీసుకోవటానికి వస్తే ఏం చెయ్యాలి?" అని అడిగాడు. "నీ సొమ్ము అతనికి ఇవ్వమాకు" అని బదులిచ్చారు దైవప్రవక్త ﷺ. "ఒకవేళ అతను నాతో తలపడితేనో?" అని అడిగాడా వ్యక్తి. "నువ్వు కూడా అతనితో తలపడు" చెప్పారాయన. "ఆ పోరులో అతను నన్ను హతమారుస్తే?" అడిగాడా వ్యక్తి. "నువ్వు అమర గతునిగా పరిగణించబడతావు" చెప్పారాయన. "ఒకవేళ నేనే అతన్ని హత మారిస్తే?" మళ్ళీ అడిగాడా వ్యక్తి. అందుకాయన సమాధానమిస్తూ "(నీకేం ఫర్వాలేదు) అతనే నరకానికి వెళ్తాడు" అని చెప్పారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: A man came to the Messenger of Allah ﷺ and asked, “O Messenger of Allah! What shall I do if someone comes to me with the intention of taking away my property?” He replied, “Do not hand over it to him.” The man asked, “What shall I do if he fights me?” The Messenger of Allah ﷺ said, “Then fight him.” “What will be my position in the Hereafter if he has killed me?” The Messenger of Allah ﷺ replied, “In that case you are a martyr.” The man asked: “What if I killed him?” The Messenger of Allah ﷺ replied, “He will be in the Hell-fire.”[Muslim].

ముఖ్యాంశాలు

ఆత్మరక్షణ కోసం, తమ ధనాన్ని రక్షించుకోవటం కోసం దోపిడీ దొంగలతో పోరాడి తప్పని పరిస్థితుల్లో వారిని హతమార్చితే అందులో తప్పులేదని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. ఆ విధంగా ఆత్మరక్షణ కోసం ఇతరుల్ని చంపినవారు నేరస్థులుగా కూడా పరిగణించబడరు. వారికి ఎలాంటి పాపం ఉండబోదు. పైగా హతులే నరకానికి వెళ్తారు. ఒకవేళ ఆత్మరక్షణ పోరాటంలో తనే మృత్యువాత పడితే అతను అమరగతుని (షహీద్)గా పరిగణించబడతాడు. అయితే ఇలాంటివారు సిసలైన అమరగతులు కారు. దేవుడు పరలోకంలో వీరికి ప్రత్యేక అనుగ్రహంతో అమరగతుల స్థాయిని ప్రసాదిస్తాడు. అంతే! కనుక సాధారణ మృతులకు చేసినట్లుగానే వీరికి కూడా శవస్నానం చేయించి జనాజా నమాజు చేయాల్సిందే. వీరికి భిన్నంగా యుద్ధభూమిలో అవిశ్వాసులతో పోరాడుతూ వధింపబడిన అమరవీరులకు మాత్రం శవస్నానంగాని, జనాజా నమాజ్‌గాని చేయాల్సిన అవసరంలేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|జిహాద్ ప్రకరణం|235. పరలోకంలో లభించే పుణ్యం రీత్యా అమరగతులుగా పేర్కొనబడేవారి భౌతిక కాయాలకు, గుస్ల్ (స్నానం) చేయించి వారి జనాజా నమాజు కూడా చేయటం జరుగుతుంది. వీరికి భిన్నంగా అవిశ్వాసులతో యుద్ధం చేస్తూ అమరగతి నొందినవారి భౌతిక కాయాలకు స్నానం చేయించనవసరం లేదు. జనాజా నమాజు కూడా చేయనవసరం లేదు.|హదీసు 1358