హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 230వ అధ్యాయం: ప్రతి నెలా మూడ్రోజులు ఉపవాసం పాటించటం అభిలషణీయం. ఈ అధ్యాయంలో 7 హదీసులు (హదీసు 1259 – 1265) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
230. ప్రతి నెలా మూడ్రోజులు ఉపవాసం పాటించటం అభిలషణీయం
باب استحباب صَوم ثلاثة أيام من كل شهر والأفضل صومُها في الأيام البيض, وهي: الثالثَ عشر, والرابعَ عشر, والخامسَ عشر. وقِيل: الثاني عشر, والثالِثَ عشر, والرابعَ عشر, والصحيح المشهور هُوَ الأول.
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
ప్రతి నెలా మూడు పున్నమి దినాల్లో ఉపవాసం ఉండటం శ్రేష్ఠమైన పద్ధతి. పున్నమి దినాలంటే చాంద్రమానం ప్రకారం నెలలోని 13, 14, 15 తారీకులు. మరికొందరి అభిప్రాయం ప్రకారం 12,13,14 తారీకులు. అయితే తొలి మాటే సరయినది, ప్రసిద్ధి చెందినదీను.
(ఈ పలుకులు మాత్రం ఇమామ్ నవవీ -రహిమహుల్లాహ్- గారివి. -అనువాదకుడు)
హదీసు 1259
وعن أَبي هُريرةَ رضِيَ اللَّه عَنْهُ، قَالَ: أَوْصَاني خلِيلي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، بثَلاثٍ: صيَامِ ثَلاثَةَ أَيَّامٍ مِن كلِّ شَهرٍ، وَرَكعَتَي الضُحى، وأَن أُوتِر قَبْلَ أَنْ أَنامَ. متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం: నా మిత్రులు (అంటే దైవప్రవక్త -సల్లం) నాకు మూడు విషయాల గురించి హితోపదేశం చేసి వెళ్ళారు. 1) ప్రతి నెలా మూడురోజులు ఉపవాసం పాటించటం, 2) చాష్త్ వేళ రెండు రకాతుల నమాజు చేయటం, 3) రాత్రి నేను నిద్రపోయే ముందే విత్ర్ నమాజు చేసుకోవటం. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని తహజ్జుద్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: My friend (the Messenger of Allah) ﷺ directed me to observe fast for three days in every month, to perform two Rak`ah (optional) Duha prayer at forenoon and to perform the Witr prayer before going to bed.[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|230. ప్రతి నెలా మూడ్రోజులు ఉపవాసం పాటించటం అభిలషణీయం|హదీసు 1259
హదీసు 1260
وعَنْ أَبي الدَرْدَاءِ رَضِيَ اللَّه عنهُ، قالَ: أَوْصَانِي حَبِيبي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بِثلاث لَنْ أَدَعهُنَّ مَا عِشْتُ: بصِيامِ ثَلاثَة أَيَّامٍ مِن كُلِّ شَهْر، وَصَلاةِ الضحَى، وَبِأَنْ لاَ أَنَام حَتى أُوتِر. رواهُ مسلمٌ.
హజ్రత్ అబూ దర్దా (రదియల్లాహు అన్హు) కథనం: నా ప్రియుడు (దైవప్రవక్త -సల్లం) నాకు మూడు విషయాల గురించి హితోపదేశం చేసి వెళ్ళారు. నేను వాటిని ఎన్నటికీ నిర్లక్ష్యం చేయను. అవి: 1) ప్రతి నెలా మూడు రోజులు ఉపవాసం పాటించటం, 2) చాష్త్ వేళ నమాజ్ చేయటం, 3) నిద్రపోకముందే విత్ర్ నమాజు చేసనుకోవటం. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)
English
Abud-Darda (radiyallahu anhu) reported: My friend (the Messenger of Allah) ﷺ directed me to observe Saum (fasting) for three days in every month, to perform two Rak`ah (optional) Duha prayer at forenoon, and to perform the Witr prayer before going to bed.[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|230. ప్రతి నెలా మూడ్రోజులు ఉపవాసం పాటించటం అభిలషణీయం|హదీసు 1260
హదీసు 1261
وَعَنْ عبدِ اللَّهِ بنِ عَمْرِو بنِ العاصِ رَضي اللَّه عنهُما، قالَ: قالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "صوْمُ ثلاثَةِ أَيَّامٍ منْ كلِّ شَهرٍ صوْمُ الدهْرِ كُلِّهُ". متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ప్రతి నెలా మూడు రోజులు ఉపవాసం ఉండటం సంవత్సరమంతా (లేక ఎల్లకాలం) ఉపవాసం ఉండటంతో సమానం. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
`Abdullah bin `Amr bin Al-`As (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ said, “Observing Saum (fasting) on three days of every month is equivalent to a full month’s fasting.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|230. ప్రతి నెలా మూడ్రోజులు ఉపవాసం పాటించటం అభిలషణీయం|హదీసు 1261
హదీసు 1262
وعنْ مُعاذةَ العَدَوِيَّةِ أَنَّها سَأَلَتْ عائشةَ رضيَ اللَّه عَنْهَا: أَكانَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يصومُ مِن كُلِّ شَهرٍ ثلاثةَ أَيَّامٍ؟ قَالَت: نَعَمْ. فَقُلْتُ: منْ أَيِّ الشَّهْر كَانَ يَصُومُ؟ قَالَتْ: لَمْ يَكُن يُبَالي مِنْ أَيِّ الشَّهْرِ يَصُومُ. رواهُ مسلمٌ.
హజ్రత్ ముఅజా అదవియ్యా, "దైవప్రవక్త ﷺ ప్రతి నెలా మూడు రోజులు ఉపవాసం ఉండేవారా?" అని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)ని అడిగారు. అందుకామె 'అవున'న్నారు. తర్వాత అదవియ్యా మళ్ళీ, "అయితే ఆయన నెలలోని ఏ రోజుల్లో ఉపవాసం ఉండేవారు?" అని అడిగారు. అందుకు ఆయిషా (రదియల్లాహు అన్హా) "నెలలోని ఏ రోజులన్న విషయాన్ని పట్టించుకోకుండా ఆయన ఉపవాసం ఉండేవారు" అని చెప్పారు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
Mu`adhah Al-`Adawiyah (radiyallahu anha) reported: I asked `Aishah (radiyallahu anha). Did the Messenger of Allah ﷺ use to observe three days of Saum (fasting) in every month?” She replied, “Yes.” I asked, “On which days in the month did he observed fast?” She replied that he did not mind on which days of the month he observed fast.[Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసు ద్వారా బోధపడేదేమిటంటే నెలలోని ఏ తేదీల్లోనయినా ఉపవాసం పాటించవచ్చు. ప్రత్యేకంగా ఫలానా తేదీల్లోనే నెలవారి నఫిల్ ఉపవాసాలు పాటించాలన్న నియమమేమీ లేదు. కాకపోతే 13,14,15 తేదీల్లో ఉపవాసం పాటించటం శ్రేష్ఠమైన పద్ధతి. దానిక్కారణం దైవప్రవక్త ﷺ ఆ తేదీల్లో ఉపవాసం పాటించమని ఆదేశించారు. చాలా సందర్భాల్లో స్వయంగా ఆయన కూడా ఆ తేదీల్లో ఉపవాసం పాటించటాన్ని ఇష్టపడేవారు. రాబోయే హదీసులు ఈ విషయాన్ని వివరిస్తున్నాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|230. ప్రతి నెలా మూడ్రోజులు ఉపవాసం పాటించటం అభిలషణీయం|హదీసు 1262
హదీసు 1263
وعنْ أَبي ذَرٍّ رَضِيَ اللَّه عنهُ، قَالَ: قالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِذا صُمْتَ مِنَ الشَّهْرِ ثَلاثاً، فَصُمْ ثَلاثَ عَشْرَةَ، وَأَرْبعَ عَشْرَةَ، وخَمْسَ عَشْرَةَ "رواه الترمِذيُّ وقال: حديثٌ حسنٌ.
హజ్రత్ అబూజర్ర్ (రదియల్లాహు అన్హు)కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: నువ్వు నెలలో మూడు రోజులు ఉపవాసం ఉండదలచుకుంటే, 13, 14, 15వ తేదీల్లో ఉపవాసముండు. (తిర్మిజీ-హసన్)
(సుననె తిర్మిజీలోని ఉపవాస ప్రకరణం)
English
Abu Dharr (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “If you want to observe Saum on three days in a month, then fast on the thirteenth, fourteenth and fifteenth of the (lunar) month.”[At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|230. ప్రతి నెలా మూడ్రోజులు ఉపవాసం పాటించటం అభిలషణీయం|హదీసు 1263
హదీసు 1264
وعنْ قتادَةَ بن مِلحَانَ رَضِيَ اللَّه عَنْهُ، قَالَ: كانَ رَسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يأْمُرُنَا بِصِيَامِ أَيَّامِ البيضِ: ثَلاثَ عشْرَةَ، وأَرْبَعَ عَشْرَةَ، وَخَمْسَ عَشْرَةَ. رواهُ أَبُو داودَ.
హజ్రత్ ఖతాదా బిన్ మిల్హాన్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ మమ్మల్ని పున్నమి దినాల్లో అంటే 13, 14,15 తేదీల్లో ఉపవాసం పాటించమని ఆజ్ఞాపించేవారు. (అబూదావూద్)
(సుననె అబూదావూద్లోని ఉపవాసాల ప్రకరణం)
English
Qatadah bin Milhan (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ directed us to observe Saum (fasting) on the thirteenth, fourteenth and fifteenth of the (lunar) month.[Abu Dawud].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|230. ప్రతి నెలా మూడ్రోజులు ఉపవాసం పాటించటం అభిలషణీయం|హదీసు 1264
హదీసు 1265
وعنْ ابنِ عبَّاسٍ رَضِيَ اللَّه عَنْهُمَا، قال: كانَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لاَ يُفْطِرُ أَيَّامَ البِيضِ في حَضَرٍ وَلا سَفَرٍ. رواهُ النسَائي بإِسنادٍ حَسنٍ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ స్వస్థలంలో వున్నా, ప్రయాణంలో వున్నా సరే; పున్నమి దినాల ఉపవాసాన్ని మాత్రం విడిచిపెట్టేవారు కారు.
(నసాయి-హసన్)
(సుననె నసాయిలోని ఉపవాసాల ప్రకరణం)
English
Ibn `Abbas (radiyallahu anhuma) reported: It was the practice of the Messenger of Allah ﷺ to not to omit fast on `bright days’ whether he was staying at a place or on a journey.[An-Nasa’i].
ముఖ్యాంశాలు
చాంద్రమాన నెలల్లోని 13,14,15వ తారీకులను పున్నమి దినాలని అంటారు. ఆయా రాత్రుల్లో చంద్రుని పరిమాణం క్రమంగా తగ్గుతూపోతుంది. మొత్తానికి ఆ రోజుల్లో ఉపవాసం పాటించటం శ్రేష్ఠమైన పద్ధతి. ఒకవేళ ఇతర దినాల్లో పాటించినా తప్పులేదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|230. ప్రతి నెలా మూడ్రోజులు ఉపవాసం పాటించటం అభిలషణీయం|హదీసు 1265
You must be logged in to post a comment.