హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 217వ అధ్యాయం: రమజాన్ ఉపవాసాల విధింపు, వాటి ఘనత, ఇంకా వాటికి సంబంధించిన ఇతర విషయాలు. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 7 హదీసులు (హదీసు 1216 – 1222) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
217. రమజాన్ ఉపవాసాల విధింపు, వాటి ఘనత, ఇంకా వాటికి సంబంధించిన ఇతర విషయాలు
باب وجوب صوم رمضان وبَيان فضل الصيام وَمَا يتعلق بِهِ
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
"విశ్వసించిన ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది: ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించేవారికి కూడా విధించబడిందో. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది………..
{شَهْرُ رَمَضَانَ الَّذِي أُنْزِلَ فِيهِ الْقُرْآنُ هُدىً لِلنَّاسِ وَبَيِّنَاتٍ مِنَ الْهُدَى وَالْفُرْقَانِ فَمَنْ شَهِدَ مِنْكُمُ الشَّهْرَ فَلْيَصُمْهُ وَمَنْ كَانَ مَرِيضاً أَوْ عَلَى سَفَرٍ فَعِدَّةٌ مِنْ أَيَّامٍ أُخَرَ} الآية [البقرة: ١٨٣- ١٨٥]
పవిత్ర ఖుర్ఆన్ అవతరించిన నెల రమజాను నెల. మానవులందరికీ (ఆ గ్రంథం) మార్గదర్శకం. రుజుమార్గం చూపే, సత్యా సత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇక నుండి రమజాను నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా ఉపవాసం ఉండాలి. కాని వ్యాధిగ్రస్తులైనవారు, లేదా ప్రయాణంలో ఉన్నవారు ఆ ఉపవాస దినాలను వేరే దినాలలో పూర్తిచేయాలి. " (అల్బఖర: 183-185)
ముఖ్యాంశాలు
ఒక పనిని తొలిసారిగా చేయటానికి సహజంగా ఎవరయినా వెనుకంజ వేస్తారు. దాని కష్టనష్టాలను బేరీజు వేసుకుంటారు. కాని అదే పనిని తనకంటే ముందు ఎంతోమంది చేసి ఉన్నారని తెలిస్తే, దాన్ని నిర్వర్తించటానికి ఎవరయినా ముందుకు వస్తారు. అదే విధంగా పైన పేర్కొనబడిన ఆయతులో ముహమ్మదీయ అనుచర సమాజం ఉపవాస వ్రతాన్ని పాటించటంలో ఇబ్బందిని ఊహించుకోకూడదన్న ఉద్దేశ్యంతో, వారిమీద దానిని విధించేటప్పుడు వారికి పూర్వం గతించిన జాతుల, సమాజాల ఉదాహరణను ఉటంకించటం జరిగింది. గత సమాజాల్లో కూడా ఈ ఉపవాస వ్రతం ఉండేదని చెప్పబడింది. అయితే వారు కూడా మనలాగే రమజాన్ మాసంలో ముప్ఫై లేక ఇరవై తొమ్మిది రోజులు ఉపవాసం పాటించేవారని దీని అర్థం ఎంతమాత్రం కాదు. ఈ ఉపమానం కేవలం ఉపవాస వ్రతానికి సంబంధించినది మాత్రమే. ఇకపోతే ఉపవాసాల దినాలు, వాటి సంఖ్య మొదలగు విషయాల్లో వారి మధ్య వ్యత్యాసాలుండవచ్చు.
'దివ్యఖుర్ఆన్ రమజాన్ మాసంలో అవతరించింది' అనే ఆయతుకు రెండు భావాలు ఉండవచ్చు. ఒకటి; బహుశా ఈ ఖుర్ఆన్ అవతరణ రమజాన్ మాసంలో ప్రారంభమైందని కావచ్చు. రెండు; మొత్తం ఖుర్ఆన్ ఒకేసారి 'లౌహె మహ్ఫూజ్' (సురక్షిత ఫలకం) నుండి మొదటి ఆకాశానికి దించబడి, అక్కణ్ణుంచి సందర్భానుసారం కొద్దికొద్దిగా అవతరించిందని కూడా కావచ్చు.
English
“O you who believe! the fasting is prescribed for you as it was prescribed for those before you, that you may become Al-Muttaqun (the pious). (Fasting) for a fixed number of days, but if any of you is ill or on a journey, the same number (should be made up) from other days. And as for those who can fast with difficulty, (e.g., an old man), they have (a choice either to fast or) to feed a Miskin (poor person) (for every day). But whoever does good of his own accord, it is better for him. And that you fast is better for you if only you know. The month of Ramadan in which was revealed the Qur’an, a guidance for mankind and clear proofs for the guidance and the criterion (between right and wrong). So whoever of you sights (the crescent on the first night of) the month (of Ramadan, i.e., is present at his home), he must fast that month, and whoever is ill or on a journey, the same number (of days which one did not fast must be made up) from other days.” [Al-Baqarah 2:183–185]
హదీసు 1216
وَعنْ أَبي هُريرة رضِي اللَّه عنْهُ، قَالَ: قَالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "قَالَ اللَّه عَزَّ وجلَّ: كُلُّ عملِ ابْنِ آدَمَ لهُ إِلاَّ الصِّيام، فَإِنَّهُ لِي وأَنَا أَجْزِي بِهِ. والصِّيام جُنَّةٌ فَإِذا كَانَ يوْمُ صوْمِ أَحدِكُمْ فَلاَ يرْفُثْ وَلاَ يَصْخَبْ، فَإِنْ سابَّهُ أَحدٌ أَوْ قاتَلَهُ، فَلْيقُلْ: إِنِّي صَائمٌ. والَّذِي نَفْس محَمَّدٍ بِيدِهِ لَخُلُوفُ فَمِ الصَّائمِ أَطْيبُ عِنْد اللَّهِ مِنْ رِيحِ المِسْكِ. للصَّائمِ فَرْحَتَانِ يفْرحُهُما: إِذا أَفْطرَ فَرِحَ بفِطْرِهِ، وإذَا لَقي ربَّهُ فرِح بِصوْمِهِ" متفقٌ عَلَيْهِ. وهذا لفظ روايةِ الْبُخَارِي. وفي روايةٍ لَهُ:"يتْرُكُ طَعامَهُ، وَشَرابَهُ، وشَهْوتَهُ، مِنْ أَجْلي، الصِّيامُ لي وأَنا أَجْزِي بِهِ، والحسنَةُ بِعَشْرِ أَمْثَالِهَا". وفي رواية لمسلم:"كُلُّ عَملِ ابنِ آدَمَ يُضَاعفُ الحسَنَةُ بِعشْر أَمْثَالِهَا إِلى سَبْعِمِائة ضِعْفٍ. قَالَ اللَّه تَعَالَى: إِلاَّ الصَّوْمَ فَإِنَّهُ لِي وأَنا أَجْزي بِهِ: يدعُ شَهْوتَهُ وَطَعامَهُ مِنْ أَجْلي. لِلصَّائم فَرْحتَانِ: فَرْحَةٌ عِنْدَ فِطْرِهِ، فَرْحةٌ عِنْدَ لقَاء رَبِّهِ. ولَخُلُوفُ فيهِ أَطْيَبُ عِنْدَ اللَّهِ مِنْ ريحِ المِسْكِ".
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దేవుడు ఇలా అంటున్నాడని దైవప్రవక్త ﷺ ప్రవచించారు: మనిషి, సత్కార్యాలన్నీ తన కోసమే చేసుకుంటాడు. కాని ఉపవాసం సంగతి అలాకాదు. అది ప్రత్యేకంగా నా కోసం పాటించబడుతుంది. కనుక దానికి ప్రతిఫలం కూడా స్వయంగా నేనే ఇస్తాను.
ఉపవాసం డాలు వంటిది. కనుక మీలో ఎవరయినా ఉపవాసం పాటిస్తే ఆ రోజునవారు వ్యర్ధమైన మాటలు మాట్లాడరాదు. నోరు పారేసుకోరాదు. ఒకవేళ తమ మీద ఎవరయినా దుర్భాషకు దిగితే లేక కయ్యానికి కాలు దువ్వితే వారితో, "నేను ఉపవాసమున్నానండీ!" అని (మర్యాదగా) చెప్పేయాలి.
ఎవరి చేతిలో ముహమ్మద్ ప్రాణముందో ఆయన సాక్షి! ఉపవాసి నోటి నుండి వెలువడే వాసన దేవుని దృష్టిలో కస్తూరి సువాసన కన్నా ఎంతో మేలైనది (పవిత్రమైనది). ఉపవాసి రెండు సందర్భాల్లో అమితానందాన్ని అనుభవిస్తాడు. ఒకటి; ఇఫ్తార్ సమయంలో. ఉపవాసం విరమించగానే సంతోషిస్తాడు. రెండు; ప్రభువును కలుసుకున్నప్పుడు తన ఉపవాస ప్రతిఫలాన్ని చూసి సంతోషిస్తాడు. (బుఖారీ-ముస్లిం)
పైన పేర్కొనబడిన వాక్యాలు బుఖారీవి. బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : ఉపవాసి నా కోసం అన్నపానీయాలను, లైంగిక కోర్కెలను త్యజిస్తున్నాడు. ఉపవాసం ప్రత్యేకంగా నా కోసం పాటించబడుతుంది. కనుక నేను దానికి ప్రతిఫలం (ఎంతయినా) ప్రసాదిస్తాను. అయితే (ఇతర) సత్కార్యాలకు పదిరెట్లు పుణ్యం మాత్రమే లభిస్తుంది.
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ప్రతి మనిషికి అతను చేసే సత్కార్యానికిగాను, పది నుండి ఏడొందల రెట్ల పుణ్యం ప్రసాదించబడుతుంది. దేవుడు ఇలా అంటున్నాడు: కాని ఉపవాసం వీటన్నింటికీ భిన్నమైనది. ఉపవాసం ప్రత్యేకంగా నా కోసం పాటించబడుతుంది. అందువల్ల నేను స్వయంగా దానికి ప్రతిఫలం ప్రసాదిస్తాను. ఉప వాసికి రెండు సందర్భాల్లో అమితా నందం లభిస్తుంది. ఒకటి; ఉపవాసాన్ని విరమించేటప్పుడు. రెండోది; తన ప్రభువును కలుసుకున్నప్పుడు. నిశ్చయంగా అతని నోటి నుండి వెలువడే వాసన దేవుని దృష్టిలో కస్తూరి వాసన కన్నా మేలైనది.
(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Allah the Exalted and Majestic said: `Every act of the son of Adam is for him, except As-Siyam (the fasting) which is (exclusively) for Me, and I will reward him for it.’ Fasting is a shield. When anyone of you is observing fast, he should neither indulge in obscene language nor should he raise his voice; and if anyone reviles him or tries to quarrel with him, he should say: `I am fasting.’ By Him in Whose Hand the soul of Muhammad is, the breath of one observing Saum is sweeter to Allah than the fragrance of musk. The one who fasts, experiences two joys: he feels pleasure when he breaks the fast. He is joyful by virtue of his fast when he meets his Rubb.”[Al-Bukhari and Muslim].
In a narration by Al-Bukhari, the Messenger of Allah ﷺ said, “Allah says: `(The person observing Saum) has abstained from food and drink, and sexual pleasures for My sake; fasting is for Me, and I will bestow its reward. Every good deed has ten times its reward‘.”
In a narration by Muslim, the Messenger of Allah ﷺ said, “The reward of every (good) deed of a person is multiplied from ten to seven hundred times. Allah (SWT) says: `The reward of observing Saum is different from the reward of other good deeds; Saum is for Me, and I Alone will give its reward. The person observing Saum abstains from food and drink only for My sake.’ The fasting person has two joyous occasions, one at the time of breaking his fast, and the other at the time of meeting his Rubb. Surely, the breath of one observing Saum is better smelling to Allah than the fragrance of musk.”
ముఖ్యాంశాలు
ఈ హదీసులో ఉపవాసం ఘనత, దాని ఉద్దేశ్యం బోధింపబడింది. ఉపవాసం అంటే కేవలం అన్నపానీయాలకు, లైంగిక వాంఛలకు దూరంగా ఉండటం ఒక్కటే కాదు, ఉపవాసం పాటించేవారు అన్ని రకాల చెడు పనులకు, వ్యర్ధచేష్టలకు దూరంగా ఉండాలి. దాంతోపాటు మంచి పనులు చేయటం కూడా చాలా అవసరం. అప్పుడే ఉపవాస వ్రతానికి సార్ధకత చేకూరుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|217. రమజాన్ ఉపవాసాల విధింపు, వాటి ఘనత, ఇంకా వాటికి సంబంధించిన ఇతర విషయాలు|హదీసు 1216
హదీసు 1217
وعنهُ أَنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "مَنْ أَنْفَقَ زَوْجَين في سَبِيلِ اللَّهِ نُودِيَ مِنْ أَبْواب الجَنَّةِ: يَا عَبْدَ اللَّهِ هَذَا خَيْرٌ، فَمَنْ كَان مِنْ أَهْلِ الصَلاةِ دُعِي منْ بَابِ الصَّلاةِ، ومَنْ كانَ مِنْ أَهْلِ الجِهَادِ دُعِي مِنْ بَابِ الجِهَادِ، ومَنْ كَانَ مِنْ أَهْل الصِّيامِ دُعِيَ مِنْ بَابِ الرَّيَّانِ ومنْ كَانَ مِنْ أَهْل الصَّدقَة دُعِي مِنْ بَابِ الصَّدقَةِ"قَالَ أَبُو بكرٍ رَضِيَ اللَّه عَنْهُ: بأَبي أَنت وأُمِّي يَا رسولَ اللَّه مَا عَلى مَنْ دُعِي مِنْ تِلكَ الأَبْوابِ مِنْ ضَرُورةٍ، فهلْ يُدْعى أَحدٌ مِنْ تلك الأَبْوابِ كلِّها؟ قال:"نَعَم وَأَرْجُو أَنْ تكُونَ مِنهم "متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: దైవమార్గంలో రెండేసి వస్తువుల్ని దానం చేసిన వారికి (మరణానంతరం) స్వర్గద్వారాల వైపు నుండి ఆహ్వానం వస్తుంది. "ఓ దైవదాసుడా! (ఇటు వచ్చేయి.) ఈ ద్వారం బాగుంది" అని అనటం జరుగుతుంది. నమాజ్ చేసే వ్యక్తిని నమాజు ద్వారం నుండి ఆహ్వానించటం జరుగుతుంది. ధర్మయోధుణ్ణి ధర్మపోరాటపు ద్వారం నుండి పిలవటం జరుగుతుంది. ఉపవాసిని రయ్యాన్ ద్వారం నుండి పిలవటం జరుగుతుంది. దానధర్మాలు చేసిన వాడిని దానద్వారం నుండి పిలవటం జరుగుతుంది.
ఈ మాటలు విని హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) "దైవప్రవక్తా! నా తల్లిదండ్రుల్ని మీకు అర్పింతు! (అసలు కావలసింది స్వర్గ ప్రవేశం కనుక) ఏ ద్వారం నుండి పిలవబడినా నష్టం లేదు. కాని (నాకు తెలియక అడుగుతున్నాను) అన్ని ద్వారాల నుండి పిలవబడేవారు ఎవరైనా ఉంటారా?" అని అడిగారు. దానికాయన "ఆఁ, ఉంటారు. బహుశా మీరు అలాంటివారి కోవకు చెందినవారేనని నా నమ్మకం" అని చెప్పారు. (బుఖారీ, ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “He who spends a pair in the way of Allah will be called from the gates of Jannah: `O slave of Allah! This gate is better for you’ and one who is constant in Salat (prayer), will be called from the Gate of Salat; and whoever is eager in fighting in the Cause of Allah, will be called from the Gate of Jihad; and who is regular in observing Saum will be called from Ar-Raiyan Gate. The one who is generous in charity will be called from the Gate of Charity.” Abu Bakr (radiyallahu anhu) said: “O Messenger of Allah ﷺ! May my mother and father be sacrificed for you! Those who are called from these gates will stand in need of nothing. Will anybody be called from all of those gates?” He replied, “Yes, and I hope that you will be one of them.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|217. రమజాన్ ఉపవాసాల విధింపు, వాటి ఘనత, ఇంకా వాటికి సంబంధించిన ఇతర విషయాలు|హదీసు 1217
హదీసు 1218
وعن سهلِ بنِ سعدٍ رضي اللَّه عنهُ عن النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِنَّ فِي الجَنَّة بَاباً يُقَالُ لَهُ: الرَّيَّانُ، يدْخُلُ مِنْهُ الصَّائمونَ يومَ القِيامةِ، لاَ يدخلُ مِنْه أَحدٌ غَيرهُم، يقالُ: أَينَ الصَّائمُونَ؟ فَيقومونَ لاَ يدخلُ مِنهُ أَحَدٌ غَيْرُهُمْ، فإِذا دَخَلوا أُغلِقَ فَلَم يدخلْ مِنْهُ أَحَدٌ" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ సహ్ల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: స్వర్గంలో ఒక ద్వారం ఉంది. దాన్ని 'రయ్యాన్' అని పిలుస్తారు. ప్రళయదినాన దానిగుండా ఉపవాసులు స్వర్గప్రవేశం చేస్తారు. వారు తప్ప ఇతరులెవరూ దానిగుండా ప్రవేశించలేరు. ఆ రోజున "ఉపవాసులేరీ?" అని ఆరాతీయటం జరుగుతుంది. ఆ మాట వినగానే ఉపవాసులందరూ (స్వర్గప్రవేశానికి) బయలుదేరుతారు. వారు లోనికి ప్రవేశించగానే, ఇతరులెవరూ లోనికి రాకుండా, ఆ ద్వారం మూయ బడుతుంది.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
Sahl bin Sa`d (radiyallahu anhu): The Prophet ﷺ said, “In Jannah there is a gate which is called Ar-Raiyan through which only those who observe Saum (fasting) will enter on the Day of Resurrection. None else will enter through it. It will be called out, “Where are those who observe fasting?” So they will stand up and proceed towards it. When the last of them will have entered, the gate will be closed and then no one will enter through that gate.”[Muslim].
ముఖ్యాంశాలు
ఇక్కడ ఉపవాసులంటే రమజాన్ ఉపవాసాలతోపాటు ఇతర నఫిల్ ఉపవాసాలను కూడా అత్యధికంగా పాటించేవారని భావం. కేవలం రమజాన్ ఉపవాసాలనయితే ముస్లింలందరూ విధిగా పాటిస్తారు. (రమజాన్లోని) ఫర్జ్ ఉపవాసాలతోపాటు నఫిల్ ఉపవాసాలను కూడా పాటిస్తే మరింత మంచిది. అలాగని ఫర్జ్ ఉపవాసాలను నిర్లక్ష్యం చేసి నఫిల్ ఉపవాసాలకు ప్రాముఖ్యత ఇవ్వటం కూడా సమంజసం కాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|217. రమజాన్ ఉపవాసాల విధింపు, వాటి ఘనత, ఇంకా వాటికి సంబంధించిన ఇతర విషయాలు|హదీసు 1218
హదీసు 1219
وعَنْ أَبي سَعيدٍ الخُدْريِّ رَضيَ اللَّه عنهُ قال: قالَ رسولُ اللَّهِ: "مَا مِنْ عبْدٍ يصُومُ يَوماً في سبِيلِ اللَّه إِلاَّ باعَدَ اللَّه بِذلك اليَومِ وجهَهُ عَن النَّارِ سبعينَ خرِيفاً" متفقٌ عليه.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవరయితే దైవమార్గంలో ఒకరోజు ఉపవాసముంటారో వారి ముఖాలను దేవుడు ఆ ఒక్కరోజు మూలంగా నరకం నుండి డెబ్భై యేండ్ల (ప్రయాణం) మేరకు దూరంగా ఉంచుతాడు.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Every slave of Allah who observes Saum (fasting) for one day for the sake of Allah, Allah will draw his face farther from Hell-fire to the extent of a distance to be covered in seventy years.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
"దైవమార్గంలో" అంటే దైవమార్గంలో పోరాడుతూ ఉపవాసం పాటించటం కావచ్చు లేదా దైవప్రసన్నత కోసం ఉపవాసం పాటించటమని భావం కావచ్చు. ఏమయినప్పటికీ ఈ హదీసు ద్వారా ఉపవాస ఘనత వెల్లడౌతోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|217. రమజాన్ ఉపవాసాల విధింపు, వాటి ఘనత, ఇంకా వాటికి సంబంధించిన ఇతర విషయాలు|హదీసు 1219
హదీసు 1220
وعنْ أَبي هُرَيرةَ رضيَ اللَّه عنهُ، عن النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "مَنْ صَامَ رَمَضَانَ إِيمَاناً واحْتِساباً، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذنْبِهِ" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవరయినా రమజాన్ మాసంలో విశ్వాసంతో, పుణ్యఫలాపేక్షతో ఉపవాసం పాటిస్తే, గతంలో వారివల్ల జరిగిన పాపాలన్నీ మన్నించబడతాయి. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “He who observes fasting during the month of Ramadan with Faith while seeking its reward from Allah, will have his past sins forgiven.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|217. రమజాన్ ఉపవాసాల విధింపు, వాటి ఘనత, ఇంకా వాటికి సంబంధించిన ఇతర విషయాలు|హదీసు 1220
హదీసు 1221
وعنهُ رضيَ اللَّهُ عنهُ، أَنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "إِذا جَاءَ رَمَضَانُ، فُتِّحَتْ أَبْوَابُ الجنَّةِ، وغُلِّقَت أَبْوَابُ النَّارِ، وصُفِّدتِ الشياطِينُ" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు)గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: రమజాన్ మాసం రాగానే స్వర్గద్వారాలు తెరువబడతాయి. నరకద్వారాలు మూయబడతాయి. షైతానులను బంధించటం జరుగుతుంది.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “When Ramadan begins, the gates of Jannah are opened, the gates of Hell are closed, and the devils are chained.”
[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|217. రమజాన్ ఉపవాసాల విధింపు, వాటి ఘనత, ఇంకా వాటికి సంబంధించిన ఇతర విషయాలు|హదీసు 1221
హదీసు 1222
وعنهُ أَنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "صُومُوا لِرُؤْيَتِهِ، وَأَفْطِرُوا لِرُؤيَتِهِ، فإِن غمي عَليكم، فَأَكْمِلُوا عِدَّةَ شَعْبانَ ثَلاثينَ" متفقٌ عَلَيْهِ. وهذا لفظ البخاري. وفي رواية مسلم:" فَإِن غُمَّ عَليكم فَصُوموا ثَلاثِينَ يَوْماً ".
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: రమజాన్ నెలవంకను చూసి ఉపవాస దీక్ష ప్రారంభించండి. తిరిగి (షవ్వాల్) నెలవంక చూసిన తర్వాత ఉపవాసాన్ని విరమించండి. ఒకవేళ ఆకాశం మేఘావృతమై ఉండి (నెలవంక కనిపించకపోతే) షాబాన్ మాసపు ముప్ఫై దినాలు నిండ నివ్వండి.
(బుఖారీ – ముస్లిం – వాక్యాలు బుఖారీలోనివి)
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో "ఒకవేళ ఆకాశం మేఘావృతమై ఉండి (చంద్రుడు కనిపించకపోతే) ముప్ఫై రోజుల ఉపవాసాలు పూర్తిచేయండి" అని ఉంది.
(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Observe Saum (fast) on sighting the crescent and terminate it on sighting it (the new moon), but if the sky is cloudy before you, then complete the number (thirty days) of the month.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|217. రమజాన్ ఉపవాసాల విధింపు, వాటి ఘనత, ఇంకా వాటికి సంబంధించిన ఇతర విషయాలు|హదీసు 1222
You must be logged in to post a comment.