హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 203వ అధ్యాయం: జుమా నమాజ్ వేళ చేయబడే సున్నత్‌లు. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 1126 – 1128) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
203. జుమా నమాజ్ వేళ చేయబడే సున్నత్‌లు
باب سُنّة الجمعَة فِيهِ حديثُ ابنِ عُمرَ السَّابِقُ أَنَّهُ صلَّى مَعَ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم رَكعَتَيْنِ بَعْدَ الجُمُعَةِ. متفقٌ عَلَيْهِ.
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1126
ఇంతకు ముందు ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) వివరించిన "దైవప్రవక్త ﷺ వెంట నేను జుమా తర్వాత రెండు రకాతుల నమాజ్ చేశానన్న" (బుఖారీ-ముస్లిం) హదీసు ఈ అధ్యాయానికి కూడా వర్తిస్తుంది.
ముఖ్యాంశాలు
గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఈ అధ్యాయంలో జుమా తర్వాత ఎన్ని రకాతుల నమాజ్ చేయాలనే విషయం గురించి వివరిస్తున్నారు. రాబోవు రెండు హదీసుల్లో దానిగురించి ఇంకా వివరంగా విశదీకరిస్తారు. ఇకపోతే జుమాకు ముందు ఎన్ని రకాతులు చేయాలి? అనే విషయమై హదీసుల ద్వారా బోధపడేదేమిటంటే, జుమా నమాజ్ కోసం మస్జిద్‌కు వచ్చే వ్యక్తి రెండు రకాతులు చేసిన తర్వాతగాని కూర్చోకూడదు. ఆఖరికి ఖుత్బా (ప్రసంగం) సమయంలో వచ్చినాసరే, సంక్షిప్తంగానయినా రెండు రకాతులు చేసుకోవాలని దైవప్రవక్త ﷺ ఆదేశించారు. అయితే ప్రసంగానికి ముందు రెండు రకాతుల తహియ్యతుల్ మస్జిద్ నమాజ్ తర్వాత రెండేసి రకాతుల చొప్పున నఫిల్ నమాజు ఎన్ని రకాతులైనా చేసుకోవచ్చు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|203. జుమా నమాజ్ వేళ చేయబడే సున్నత్‌లు|హదీసు 1126
హదీసు 1127
عنْ أَبي هُريرةَ رضِيَ اللَّه عَنْهُ قالَ: قالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِذَا صَلَّى أَحدُكُمُ الجُمُعَةَ، فَلْيُصَلِّ بعْدَهَا أَرْبعاً" رواه مسلم.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మీలో ఎవరయినా జుమా తర్వాత నాలుగు రకాతుల నమాజ్ చేసుకోవాలి.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని జుమా ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “If anyone of you performs the Friday prayer, he should perform four Rak`ah (Sunnah) after it.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|203. జుమా నమాజ్ వేళ చేయబడే సున్నత్‌లు|హదీసు 1127
హదీసు 1128
وَعَنِ ابنِ عُمرَ رَضِي اللَّه عَنْهُمَا أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كانَ لاَ يُصلِّي بَعْدَ الجُمُعةِ حتَّى يَنْصَرِف فَيُصَلِّي رَكْعَتيْنِ في بَيْتِهِ، رواه مسلم.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ జుమా తర్వాత (మస్జిద్‌లో) ఎలాంటి నమాజ్ చేసేవారు కాదు. మస్జిద్ నుండి తిరిగి వెళ్ళిన తర్వాతే ఇంట్లో రెండు రకాతులు చేసేవారు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని జుమా ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: The Prophet ﷺ would not perform any Salat (in the mosque) after the Friday prayer till he had returned to his house. He would then perform two Rak`ah there.[Muslim].
Source: dar-us-salam english edition of riyad-us-saliheen
ముఖ్యాంశాలు
ఒక హదీసులో జుమా తర్వాత నాలుగు రకాతులు చేయాలనీ, మరో హదీసులో రెండు రకాతులు చేయాలని చెప్పబడింది. దీనిద్వారా రెండు పద్ధతులూ సరైనవేనని బోధపడుతోంది. కొంతమంది పండితులు ఈ రెండు హదీసుల్ని సమన్వయ పరచటానికి ప్రయత్నించారు. జుమా తర్వాత మస్జిద్‌లోనే నమాజ్ చేయదలచుకునేవారు నాలుగు రకాతులు చేయాలనీ, ఇంట్లో చేసేవారు రెండు రకాతులు చేసుకుంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు.
ఇకపోతే నాలుగు రకాతుల నమాజును ఏ విధంగా చేయాలి? ఈ విషయంలో కూడా రెండు అభిప్రాయాలున్నాయి. ఒక విధానం నాలుగు రకాతులు ఒకే సలాంతో చేయాలనీ, మరొక విధానం రెండేసి రకాతుల చొప్పున చేయాలని. రెండు పద్ధతులూ సమ్మతమైనవే. అయితే రెండేసి రకాతుల చొప్పున చేసుకోవటమే ఉత్తమం. ఎందుకంటే ఒక ప్రామాణిక హదీసులో రాత్రి మరియు పగటిపూట నఫిల్ నమాజులు రెండేసి రకాతులు చేయాలని చెప్పబడింది. ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) కూడా తన గ్రంథంలో "రాత్రి మరియు పగటి పూట (నఫిల్) నమాజులు రెండేసి రకాతులే" అనే శీర్షికతో ఒక అధ్యాయాన్ని ఏర్పరచారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|203. జుమా నమాజ్ వేళ చేయబడే సున్నత్‌లు|హదీసు 1128
You must be logged in to post a comment.