హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 201. మగ్రిబ్‌కు ముందు, తర్వాత సున్నత్‌లు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 201వ అధ్యాయం: మగ్రిబ్‌కు ముందు, దాని తర్వాత చేయబడే సున్నత్‌లు. ఈ అధ్యాయంలో 4 హదీసులు (హదీసు 1122 – 1125) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

201. మగ్రిబ్‌కు ముందు, దాని తర్వాత చేయబడే సున్నత్‌లు

↑ విషయ సూచిక

باب سُنَّة المغرب بَعدَها وقبلَها تقدم في هذه الأبواب حديثُ ابن عمر, وحديث عائشة, وهما صحيحان أنَّ النبيَّ, صلى الله عليه وسلم, كَانَ يُصَلِّي بَعدَ المَغْرِبِ رَكْعَتَيْنِ.

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

క్రితం అధ్యాయాల్లో హజ్రత్ ఇబ్నె ఉమర్ మరియు ఆయిషా (రదియల్లాహు అన్హుమా)లు వివరించిన ప్రామాణిక హదీసుల ద్వారా దైవప్రవక్త ﷺ మగ్రిబ్ తర్వాత రెండు రకాతులు చేసేవారని తెలుస్తోంది.

English

[In the previous chapter, the practice of the Prophet ﷺ has been reported by `Umar and `Aishah (radiyallahu anhuma) that he ﷺ used to perform two Rak`ah Sunnah after the obligatory Maghrib prayer].

1122

హదీసు 1122

وَعَنْ عَبْدِ اللَّهِ بنِ مُغَفَّلٍ رَضِيَ اللَّه عنهُ، عَنِ النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "صَلُّوا قَبلَ المَغرِب" قَالَ في الثَّالثَةِ: "لمَنْ شَاءَ" رواه البخاريُّ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ముగప్ఫల్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ "మగ్రిబ్‌కు ముందు నమాజ్ చేయండి" అని (మూడుసార్లు) అన్నారు. మూడోసారి 'చేయదలచినవారు' అని అన్నారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని తహజ్జుద్ ప్రకరణం)

English

`Abdullah bin Mughaffal (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Perform two Rak`ah before Maghrib prayer.” He ﷺ repeated it twice; when repeating it for the third time he added: “He who may so wish.”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

మగ్రిబ్ అజాన్ తర్వాత ఫర్జ్ నమాజ్‌కు ముందు రెండు రకాతుల సున్నత్ నమాజ్ చేయటం అభిలషణీయం. ఎన్నో ఇతర హదీసులు కూడా ఈ విషయాన్ని సమర్థిస్తున్నాయి. వాస్తవానికి ఈ నమాజు గైర్ ముఅక్కదా అయినప్పటికీ దైవప్రవక్త ﷺ దాన్ని నెరవేర్చమని మూడుసార్లు తాకీదు చేయటం ద్వారా దాని ప్రాముఖ్యత వెల్లడౌతోంది. మొత్తానికి ఈ నమాజు చేయటం అభిలషణీయం అన్న విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. రాబోయే హదీసులు ఈ విషయాన్ని మరింతగా నొక్కి వక్కాణిస్తునాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|201. మగ్రిబ్‌కు ముందు, దాని తర్వాత చేయబడే సున్నత్‌లు|హదీసు 1122

1123

హదీసు 1123

وعن أَنسٍ رَضيَ اللَّه عَنْه قالَ: لَقَدْ رَأَيْتُ كِبارَ أَصحابِ رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَبْتَدِرُونَ السَّوَارِيَ عندَ المغربِ. رواه البخاري.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవప్రవక్త సహచరుల్లో గొప్ప గొప్ప వారిని చూశాను. వారు మగ్రిబ్ వేళ మస్జిద్ స్తంభాల దగ్గరికి వెళ్ళటానికి తొందరపడేవారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని నమాజ్ ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: I saw the principal Companions of Messenger of Allah ﷺ rushing to the pillars (of the mosque) to perform two Rak`ah prayers behind them before the Maghrib prayer.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

దైవప్రవక్త సహచరులు మగ్రిబ్ వేళ ఫర్జ్‌కు ముందు మస్జిద్ నిట్టాడులను 'సుత్రా'గా చేసుకొని రెండు రకాతుల నమాజ్ చేసేవారు. అయితే మస్జిద్‌లో సహచరులందరికీ చాలినన్ని నిట్టాడులు ఉండేవికావు. అందుకని వారు నిట్టాడుల కోసం పరస్పరం పోటీ పడేవారు. ఈ హదీసు ద్వారా బోధపడే రెండో విషయం ఏమిటంటే, మస్జిద్‌లో నఫిల్ లేక సున్నత్ నమాజులు చేసేటప్పుడు ఎదురుగా ఏదయినా వస్తువు అడ్డం 'సుత్రా' పెట్టుకోవటం అవసరం. సుత్రా లేకుండా సాధారణంగా జనం నడిచే దారిలో నమాజుకు ఉపక్రమించకూడదు. ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మసలుకోవాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|201. మగ్రిబ్‌కు ముందు, దాని తర్వాత చేయబడే సున్నత్‌లు|హదీసు 1123

1124

హదీసు 1124

وعَنْهُ قَالَ: كُنَّا نُصَلِّي عَلى عَهدِ رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم رَكعَتيْنِ بعدَ غُروبِ الشَّمْس قَبلَ المَغربِ، فقيلَ: أَكانَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم صَلاَّهُمَا؟ قَالَ: كانَ يَرانَا نُصَلِّيهِمَا فَلَمْ يَأْمُرْنَا وَلَمْ يَنْهَنا. رَوَاه مُسْلِمٌ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ కాలంలో మేము సూర్యాస్తమయం తర్వాత మగ్రిబ్ ఫర్జ్‌కు ముందు రెండు రకాతులు చేసేవారము.

అనస్ (రదియల్లాహు అన్హు) ఈ హదీసును వివరిస్తున్నప్పుడు ఎవరో ఆయన్ని "మరి దైవప్రవక్త ﷺ కూడా చేసేవారా?" అని అడగ్గా, 'మేము ఆ రెండు రకాతులు చేస్తుండగా ఆయన మమ్మల్ని చూసేవారు. అయితే ఆయన మమ్మల్ని చేయమని ఆజ్ఞాపించేవారు కాదు. వద్దని వారించేవారు కూడా కాదు" అని చెప్పారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: In the lifetime of the Messenger of Allah ﷺ, we used to perform two Rak`ah (optional prayer) after sunset before the Maghrib prayer. It was asked: “Did Messenger of Allah ﷺ perform them?” He replied: “He saw us performing it, but he neither ordered us to perform them nor did he forbid us from doing so.”[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసు ద్వారా దైవప్రవక్త సహచరులు మగ్రిబ్ ఫర్జ్‌కు ముందు రెండు రకాతులు, అది కూడా దైవప్రవక్త సమక్షంలోనే చేసేవారని తెలుస్తోంది. అయితే హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఈ హదీసులో దైవప్రవక్త ﷺ ఈ విషయంలో తటస్థ వైఖరిని అవలంబించారనీ, దీని గురించి ఆయన ఆజ్ఞాపించేవారు కాదనీ, దాన్ని వారించేవారు కూడా కాదనీ అభిప్రాయపడ్డారు. ఇది ఆయన అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన హదీసుల్లో దైవప్రవక్త ﷺ మగ్రిబ్‌కు ముందు నమాజు చేయమని మూడుసార్లు తాకీదు చేసి మరీ ఆదేశించారని చెప్పబడింది. బహుశా హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) గారికి ఈ హదీసు గురించి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే ఆయన ఆ విధంగా అభిప్రాయపడ్డారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|201. మగ్రిబ్‌కు ముందు, దాని తర్వాత చేయబడే సున్నత్‌లు|హదీసు 1124

1125

హదీసు 1125

وعنه قَالَ: كُنَّا بِالمَدِينَةِ فإِذا أَذَّنَ المُؤَذِّنُ لِصَلاةِ المَغرِبِ، ابْتَدَرُوا السَّوَارِيَ، فَرَكَعُوا رَكعَتْين، حَتى إنَّ الرَّجُلَ الغَرِيبَ ليَدخُلُ المَسجدَِ فَيَحْسَبُ أَنَّ الصَّلاةَ قدْ صُلِّيتْ مِنْ كَثرَةِ مَنْ يُصَلِّيهِما. رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ అనస్(రదియల్లాహు అన్హు) కథనం: మేము మదీనాలో ఉన్నప్పుడు ముఅజ్జిన్ మగ్రిబ్ నమాజ్ కోసం అజాన్ ఇవ్వగానే ప్రజలు (మస్జిద్) నిట్టాడుల కోసం పోటీపడేవారు. ఆ తర్వాత రెండు రకాతుల నమాజ్ చేసేవారు. వారు ఆ నమాజ్ ఎంత ఎక్కువగా చేసేవారంటే, క్రొత్త వ్యక్తి ఎవరయినా మస్జిద్‌కు వస్తే వారి వాలకం చూసి ఫర్జ్ నమాజ్ అయిపోయిందేమో (ప్రజలు ఆ తర్వాతి సున్నత్ నమాజులు చేసుకుంటున్నారేమో) ననుకుంటాడు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

ముఖ్యాంశాలు:

మొత్తానికి పై హదీసుల ద్వారా బోధపడేదేమిటంటే దైవప్రవక్త సహచరులు మస్జిదె నబవీలో మగ్రిబ్ వేళ ఫర్జ్ నమాజ్‌కు ముందు రెండు రకాతుల నఫిల్ నమాజును అనవాయితీగా చేసేవారు. అయినప్పటికీ ఆ నమాజు సున్నతె గైర్ ముఅక్కదాగానే పరిగణించబడుతుంది. ఫర్జ్ తర్వాత చేసే రెండు రకాతులు మాత్రం 'సున్నతె ముఅక్కదా'గా పరిగణించబడతాయి.

English

Anas bin Malik (radiyallahu anhu) reported: When we were in Al-Madinah, the moment the Mu’adhdhin finished the Adhan of the Maghrib prayer, the people hastened to the pillars of the mosque and performed two Rak`ah prayer behind them. A stranger coming into the mosque would think that the obligatory prayer had already been performed because of the number of people performing them.[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|201. మగ్రిబ్‌కు ముందు, దాని తర్వాత చేయబడే సున్నత్‌లు|హదీసు 1125