హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 189. మస్జిద్‌లకు కాలి నడకన వెళ్ళటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 189వ అధ్యాయం: మస్జిద్‌లకు కాలి నడకన వెళ్ళటం. ఈ అధ్యాయంలో 8 హదీసులు (హదీసు 1053 – 1060) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

189. మస్జిద్‌లకు కాలి నడకన వెళ్ళటం

↑ విషయ సూచిక

باب فضل المشي إلى المساجد

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1053

హదీసు 1053

عن أَبي هريرةَ رضيَ اللَّه عنهُ أَنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ غَدا إِلى المسْجِدِ أَوْ رَاحَ، أَعَدَّ اللَّه لهُ في الجَنَّةِ نُزُلاً كُلَّمَا غَدَا أَوْ رَاحَ" مُتَّفَقٌ عليه.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రబోధించారని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: ఉదయం, సాయంత్రం మస్జిద్‌కు వెళ్ళే వ్యక్తి కోసం, అతను ఉదయం పూట గాని, సాయంత్రం వేళగాని ఎప్పుడు మస్జిద్‌కు వెళ్ళినా దేవుడు స్వర్గంలో అతని ఆతిథ్యానికి ఏర్పాట్లు చేస్తాడు.

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “He who goes to the mosque in the morning or in the evening, Allah prepares for him a place in Jannah whenever he goes to the mosque in the morning and returns from it in the evening.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|189. మస్జిద్‌లకు కాలి నడకన వెళ్ళటం|హదీసు 1053

1054

హదీసు 1054

وعنهُ أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "مَنْ تَطَهَّرَ في بَيْتِهِ، ثُمَّ مَضى إِلى بيْتٍ مِنْ بُيُوتِ اللَّهِ، لِيَقْضِيَ فَرِيضَةً مِنْ فَرائِضِ اللَّهِ، كانَتْ خُطُواتُهُ، إِحْدَاها تَحُطُّ خَطِيئَةً، والأُخْرى تَرْفَعُ دَرَجَةً" رواه مسلم.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవరయితే తమ ఇంటి దగ్గర చక్కగా పరిశుద్ధతనొంది (వుజూ లేదా గుసుల్ చేసి) దేవుడు విధించిన విధుల్లో ఏదో ఒకదాన్ని నిర్వర్తించే ఉద్దేశ్యంతో, దేవుని గృహాల్లో ఏదయినా ఒక గృహానికి వెళ్తారో, వారు వేసే అడుగుల్లో ఒక అడుగు, వారి వల్ల జరిగిన ఒక పాపాన్ని తుడిచిపెడ్తే, మరొక అడుగు ఒక అంతస్తును పెంచుతూ ఉంటుంది.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “He who purifies (performs Wudu’) himself in his house and then walks to one of the houses of Allah (mosque) for performing an obligatory Salat, one step of his will wipe out his sins and another step will elevate his rank (in Jannah).”[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో మస్జిద్‌కు వెళ్ళి సామూహికంగా నమాజ్ చేయమని పురికొల్పటం జరిగింది. దాని ఘనత కూడా వివరించబడింది. మస్జిద్‌కు కాలినడకన వెళితే అడుగడుగునా పుణ్యం లభిస్తుంది. పరలోకపు అంతస్తులు పెరుగుతాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|189. మస్జిద్‌లకు కాలి నడకన వెళ్ళటం|హదీసు 1054

1055

హదీసు 1055

وعن أُبَيِّ بنِ كعْبٍ رضيَ اللَّه عنه قَالَ: كانَ رجُلٌ مِنَ الأَنْصَارِ لاَ أَعْلم أَحدًا أَبْعدَ مِنَ المسْجِد مِنْهُ، وَكَانَتْ لا تُخْطِئُهُ صَلاةٌ، فَقيلَ لَهُ: لَوِ اشتَريْتَ حِمَارًا ِتَرْكَبهُ في الظَّلْمَاءِ وَفِي الرَّمْضَاءِ قالَ: مَا يَسُرُّني أَنَّ مَنْزلي إِلى جنْبِ المَسْجدِ، إِنِّي أُريدُ أَنْ يُكتَب لِي مَمْشاي إِلى المسْجِدِ، وَرجُوعِي إِذا رَجَعْتُ إِلى أَهْلي. فقالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"قَدْ جَمَع اللَّه لكَ ذَلكَ كُلَّه" رواه مسلم.

హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒక వ్యక్తి ఉండేవాడు. నాకు తెలిసినంతవరకు మస్జిద్ నుండి అతని ఇంటికన్నా దూరంగా ఎవరి ఇల్లూ లేదు. అయినా అతను ఒక్క నమాజును కూడా వదలిపెట్టేవాడు కాదు. అతనితో ఎవరో అన్నారు, బహుశా నేనే అన్నానేమో, "ఒక గాడిదను కొనుక్కొని చీకటి పడినప్పుడు, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు దానిపై ఎక్కి రావచ్చుగదా!?" అని. దానికతను "నా ఇల్లు మస్జిద్ చెంతనుండటం నాకిష్టం లేదండీ! నేను (దూరం నుండి) మస్జిద్‌కు నడిచి రావటం, తిరిగి మస్జిద్ నుండి ఇంటికి వెళ్ళటం నా కర్మల జాబితాలో లిఖించబడాలని నేను కోరు కుంటున్నాను" అన్నాడు. (అతని మాటలు విని) దైవప్రవక్త ﷺ "నువ్వు కోరుకున్నదంతా అల్లాహ్ (నీ ఖాతాలో) జమ చేశాడు" అని అన్నారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం)

English

Ubayy bin Ka`b (radiyallahu anhu) reported: There was a man of the Ansar whose house was the farthest from the mosque. As far as I know, he never missed Salat (in congregation). It was said to him: “If you buy a donkey, you may ride upon it in the dark nights and in the hot days.” He said: “I do not like that my house should be situated close to the mosque. I desire that my walking towards the mosque and returning home be recorded to my credit.” Upon this the Messenger of Allah ﷺ said, “Allah has gathered all (rewards) for you.”[Muslim].

ముఖ్యాంశాలు

ఇల్లు మస్జిద్‌కు దూరంగా ఉంటే నమాజ్ కోసం వస్తూ పోతూ ఉన్నప్పుడు ఎక్కువ అడుగులు వేయవలసి వస్తుంది. దానివల్ల పుణ్యం కూడా ఎక్కువగా లభిస్తుంది. అదే విధంగా ఎన్నో పాపాలు కూడా క్షమించబడతాయి. మనిషి సంకల్పం నిష్కల్మషంగా ఉంటే ఎన్నో గొప్పగొప్ప స్థానాలు పొందగలడు మరి!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|189. మస్జిద్‌లకు కాలి నడకన వెళ్ళటం|హదీసు 1055

1056

హదీసు 1056

وعن جابرٍ رضيَ اللَّه عنهُ قَالَ: خَلَتِ البِقَاعُ حَوْلَ المسْجِد، فَأَرادَ بَنُو سَلِمَةً أَنْ يْنتقلُوا قُرْبَ المَسْجِد، فَبَلَغَ ذلكَ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فقالَ لَهُمْ: "بَلَغَني أَنَّكُمْ تُريدُونَ أَن تَنْتَقِلُوا قُرْبَ المَسْجِد؟ قالوا: نعم يَا رَسولَ اللَّهِ قَدْ أَرَدنَا ذَلكَ، فقالَ:"يا بَنِي سَلمَةَ ديارَكُمْ تُكْتَبْ آثارُكُمْ، ديارَكُمْ تُكْتَبْ آثارُكُمْ" فقالوا: مَا يَسُرُّنَا أَنَّا كُنَّا تَحَولْنَا: رواه مسلم، وروى البخاري معناه من رواية أنَس.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం: మస్జిదె నబవీ చుట్టు ప్రక్కల్లో కొంత స్థలం ఖాళీ అయింది. అప్పుడు బనూ సలిమా తెగవారు మస్జిద్ సమీప ప్రాంతానికి తరలి వెళదామని నిశ్చయించుకున్నారు. ఈ విషయం దైవప్రవక్త ﷺకు తెలిసింది. ఆయన వారిని, "మీరందరూ మస్జిద్ సమీప ప్రాంతానికి తరలి వెళదామనుకుంటున్నారట.. ఏమిటీ?" అని అడిగారు. దానికి వారు, 'ఔను, దైవప్రవక్తా! మేము నిజంగానే వెళదామనుకుంటున్నాం' అని చెప్పారు.

అప్పుడు ఆయన, "బనూ సలిమా తెగవారలారా! మీరు మీ ఇండ్లల్లోనే ఉండండి. మీ అడుగుల ముద్రలు లిఖించబడతాయి. మీరు మీ ఇండ్లల్లోనే ఉండండి. మీ అడుగుల ముద్రలు లిఖించబడతాయి" అని వారికి ఉపదేశించారు.

దాంతో వారు, "అయితే అక్కడికి తరలి వెళ్ళటం మా కిష్టం లేదు" అని చెప్పారు. (ముస్లిం)

ఇమామ్ బుఖారీ కూడా ఈ హదీసుని పోలిన హదీసునొకదాన్ని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఆధారంగా వెలికితీశారు.

(సహీహ్ బుఖారీలోని నమాజ్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం)

English

Jabir (radiyallahu anhu) reported: There were some plots of land lying vacant around the mosque. The people of Banu Salamah decided to move to this land and come nearer to the mosque. The Messenger of Allah ﷺ heard about it and said to them, “I have heard that you intend to move near the mosque.” They said: “Yes, O Messenger of Allah! We have decided to do that.” Thereupon the Messenger of Allah ﷺ said, “O Banu Salamah! Stay in your houses, because your footprints (when you come to the mosque) will be recorded.” He said this twice. They said: “We would not have liked it, had we moved near the mosque.”[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో కూడా మస్జిద్‌కు దూరంగా నివసించవలసిన ప్రాముఖ్యతను గురించి వివరించటం జరిగింది. అయితే ఈ ఆదేశం నిష్ఠాగరిష్ఠులకు మాత్రమే పరిమితం. మస్జిద్‌కు దూరం నుంచి రావటంలోని ఘనతను ప్రతి ఒక్కరూ గుర్తించగలరని చెప్పలేం. అందుకని దైవారాధన పట్ల, నమాజుల్ని నెరవేర్చటం పట్ల తక్కువ అభిరుచి కనబరచేవారు మస్జిద్‌కు సమీపంలో నివసించటమే ఉత్తమం. దానివల్ల వారు కనీసం ఫర్జ్ నమాజులన్నా సక్రమంగా నెరవేర్చగల్గుతారు. ఎందుకంటే నఫిల్ నమాజుల కన్నా ఫర్జ్ నమాజులు చాలా ముఖ్యమైనవి. వాటిని పాటించటం విధి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|189. మస్జిద్‌లకు కాలి నడకన వెళ్ళటం|హదీసు 1056

1057

హదీసు 1057

وعنْ أَبي موسى رضيَ اللَّه عنه قالَ: قالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِنَّ أَعْظَم النَّاسِ أَجرًا في الصَّلاةِ أَبْعَدُهُمْ إِليْها ممْشًى فَأَبْعَدُهُمْ. والَّذي يَنْتَظرُ الصَّلاةَ حتَّى يُصلِّيها مَعَ الإِمامِ أَعْظَمُ أَجراً مِنَ الَّذِي يُصلِّي ثُمَّ يَنَامُ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: నమాజు కోసం అందరికంటే ఎక్కువ దూరం నడిచి వచ్చే వ్యక్తికి అందరికన్నా ఎక్కువ పుణ్యం లభిస్తుంది. అతని తర్వాత దానికంటే తక్కువ దూరం నడిచి వచ్చే వ్యక్తికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది. అదే విధంగా (సామూహిక నమాజ్ కోసం ఎదురు చూడకుండా) తొందరగా నమాజ్ చేసి పడుకునే వ్యక్తి కంటే, ఇమామ్‌తోపాటు సామూహికంగా నమాజ్ చేసేంతవరకు నిరీక్షించే వ్యక్తికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది.

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం)

English

Abu Musa (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “The person who will receive the highest reward for Salat (prayer) is the one who comes to perform it in the mosque from the farthest distance. And he who waits for Salat to perform it with the Imam (in congregation) will have a greater reward than the one who observes it alone and then goes to sleep.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|189. మస్జిద్‌లకు కాలి నడకన వెళ్ళటం|హదీసు 1057

1058

హదీసు 1058

وعن بُرَيدَةَ رضي اللَّه عنه عن النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "بشِّروا المَشَائِينَ في الظُّلَمِ إِلى المسَاجِدِ بِالنور التَّامِّ يَوْمَ القِيامَةِ" رواه أبُو داود والترمذي.

హజ్రత్ బురైదా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: చీకట్లలో మస్జిదులకు నడిచి వెళ్ళేవారికి ప్రళయ దినాన సంపూర్ణ వెలుగు లభిస్తుందనే శుభవార్తను అందించండి.

(అబూదావూద్, తిర్మిజీ)

(సుననె అబూదావూద్‌లోని నమాజ్ ప్రకరణం- సుననె తిర్మిజీలోని నమాజ్ అధ్యాయాలు)

English

Buraidah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Convey glad tidings to those who walk to the mosque in the darkness. For they will be given full light on the Day of Resurrection.”[At-Tirmidhi and Abu Dawud].

ముఖ్యాంశాలు

చీకట్లలో మస్జిదులకు వెళ్ళటమంటే ఫజ్ర్ మరియు ఇషాకు సంబంధించిన సామూహిక నమాజులకు హాజరుకావటం అని భావం. నేటి ఆధునిక యుగంలో నగరవీధులు కాంతిమంతమైన విద్యుద్దీపాలతో ఎంతగా వెలిగిపోయినా, చీకటివల్ల కలిగే భయాందోళనలను ఎవరూ తొలగించలేరని గ్రహించాలి. అందుకే ఫజ్ర్ మరియు ఇషా నమాజులు నేటికీ చీకట్లో చేయబడే నమాజులుగానే పరిగణించబడతాయి. వాటిని నెరవేర్చే అదృష్టవంతులకు ప్రళయదినాన దేవుని తరపు నుండి పరిపూర్ణమైన వెలుగు లభిస్తుందనే శుభవార్త ఇవ్వబడింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|189. మస్జిద్‌లకు కాలి నడకన వెళ్ళటం|హదీసు 1058

1059

హదీసు 1059

وعن أَبي هريرةَ رضيَ اللَّهُ عنهُ أَنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "أَلا أَدُلُّكُمْ عَلى مَا يمْحُو اللَّهُ بِهِ الخَطَايَا، وَيَرْفَعُ بِهِ الدَّرَجَاتِ؟ " قَالُوا: بَلى يَا رسولَ اللَّهِ. قَالَ:"إِسْباغُ الْوُضُوءِ عَلى المَكَارِهِ، وَكَثْرَةُ الخُطَا إِلى المَسَاجِدِ، وَانْتِظَارُ الصَّلاةِ بعْد الصَّلاةِ، فَذلِكُمُ الرِّباطُ، فَذلكُمُ الرِّباطُ" رواه مسلم.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు)గారు చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ తన సహచరులనుద్దేశ్యించి, "దైవం (మానవుల) పాపాలను ప్రక్షాళనం చేసి, (వారి) అంతస్తులను పెంచేందుకు దోహదపడే విషయాలు ఏమిటో నేను మీకు చెప్పనా?" అని అడిగారు. దానికి ఆయన సహచరులు "తప్పకుండా చెప్పండి దైవప్రవక్తా!" అన్నారు. అప్పుడాయన ఇలా చెప్పారు: కష్టమనిపించినా చక్కగా వుజూ చేయటం, మస్జిద్‌ల వైపు ఎక్కువ అడుగులు వేయటం (అంటే దూరం నుంచి రావటం) ఒక నమాజు ముగిసిన పిదప తర్వాతి నమాజ్ కోసం ఎదురు చూడటం. ఇదే రిబాతు! ఇదే రిబాతు!!' (ముస్లిం)

(ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Shall I not tell you something by which Allah effaces the sins and elevates the ranks (in Jannah).” The Companions said: “Yes (please tell us), O Messenger of Allah.” He said, “Performing the Wudu’ properly in spite of difficult circumstances, walking with more paces to the mosque, and waiting for the next Salat (prayer) after a observing Salat; and that is Ar-Ribat, and that is Ar-Ribat.”[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసు ఇంతకు ముందు 'వుజూ ఘనత' అధ్యాయంలో వచ్చింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|189. మస్జిద్‌లకు కాలి నడకన వెళ్ళటం|హదీసు 1059

1060

హదీసు 1060

وعن أَبي سعيدٍ الخدْرِيِّ رضيَ اللَّهُ عنهُ عنِ النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذا رَأَيْتُمُ الرَّجُلَ يَعْتَادُ المَسَاجِد فاشْهدُوا لَهُ بِالإِيمَانِ" قال اللَّه عزَّ وجلَّ: {إِنَّمَا يَعْمُرُ مَسَاجِدَ اللَّهِ مَنْ آمَن بِاللَّهِ والْيَومِ الآخِرِ} [التوبة: ١٨] الآية. رواه الترمذي وقال: حديث حسن.

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మీరు ఒక వ్యక్తిని మస్జిదులకు వస్తూపోతుండగా చూస్తే మీరతని విశ్వాసానికి సంబంధించి సాక్ష్యం పలకండి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "అల్లాహ్‌నూ, అంతిమ దినాన్నీ విశ్వసించి, నమాజును స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్‌కు తప్ప మరెవరికీ భయపడనివారు మాత్రమే అల్లాహ్ మస్జిదులకు సంరక్షకులూ, సేవకులూ కాగలుగుతారు."

(తిర్మిజీ, హసన్)

(సుననె తిర్మిజీలోని వ్యాఖ్యానాల అధ్యాయాలు)

English

Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “When you see a man frequenting the mosque, testify that he is a believer because Allah says: `Allah’s mosques are visited only by those who believe in Allah and the Last Day.”’[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

హదీసు మూలంలో 'య-తాదు' అనే పదం వాడబడింది. ఇది 'ఔద్' లేక 'ఆదత్' అనే పదాల నుండి వచ్చింది. 'ఆదత్' అంటే 'తిరిగి వెళ్ళటం' అని అర్థం. మాటిమాటికీ మస్జిద్‌కు వెళ్ళి సామూహికంగా నమాజ్ చేయటమని దాని భావం. ఒక ముస్లిం బాహ్యస్థితిని చూసి అతని గురించి సాక్ష్యం ఇవ్వవచ్చని ఈ హదీసు తెలుపుతోంది. ఇంకా మస్జిదులతో సంఘటితమై ఉండటం, మస్జిదుల్లో దైవారాధన చేయటం, వాటిని సంరక్షించటం, వాటికి సేవచేయటం మొదలగు సత్కార్యాలు కూడా ఇందులో పొందుపరచబడ్డాయి. ఈ హదీసు ఆధారాల రీత్యా బలహీనమైనది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|189. మస్జిద్‌లకు కాలి నడకన వెళ్ళటం|హదీసు 1060