హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 178. ప్రయాణం నుండి తిరిగొచ్చాక మస్జిద్‌లో రెండు రకాతులు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 178వ అధ్యాయం: ప్రయాణం నుంచి తిరిగొచ్చేవారు, ముందుగా తమ ఇంటికి దగ్గర్లో ఉన్న మస్జిద్‌కు వెళ్ళి రెండు రకాతుల నమాజ్ చేసుకోవటం అభిలషణీయం. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 988) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

178. ప్రయాణం నుంచి తిరిగొచ్చేవారు, ముందుగా తమ ఇంటికి దగ్గర్లో ఉన్న మస్జిద్‌కు వెళ్ళి రెండు రకాతుల నమాజ్ చేసుకోవటం అభిలషణీయం

↑ విషయ సూచిక

باب استحباب ابتداء القادم بالمسجد الذي في جواره وصلاته فيه ركعتين

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

988

హదీసు 988

عن كعب بنِ مالكٍ رضي اللَّه عنهُ أَن رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كانَ إِذَا قَدِمَ مِنْ سَفرٍ بَدأَ بالمَسْجِدِ فَركع فِيهِ رَكْعتَيْنِ. متفقٌ عليه.

హజ్రత్ కాబ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ప్రయాణం నుండి తిరిగొచ్చినప్పుడు ముందుగా మస్జిద్‌కు వెళ్ళి రెండు రకాతుల నమాజ్ చేసేవారు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

Ka`b bin Malik (radiyallahu anhu) reported: Whenever the Messenger of Allah ﷺ returned from a journey, he would proceed straight to the mosque and perform two Rak`ah of (optional) prayer.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ప్రయాణం నుండి క్షేమంగా, సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చినందుకు కృతజ్ఞతగా దైవసన్నిధికి వెళ్ళి స్వచ్ఛందంగా రెండు రకాతుల నమాజ్ చేయటం అభిలషణీయం. ప్రయాణం నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు మనిషి సహజంగానే సంతోషిస్తాడు. సంతోష సమయాల్లో, ఆనంద ఘడియల్లో దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవటం, ఆయన ఘనతను, గొప్పదనాన్ని చాటడం విశ్వాసుల లక్షణం కదా!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|178. ప్రయాణం నుంచి తిరిగొచ్చేవారు, ముందుగా తమ ఇంటికి దగ్గర్లో ఉన్న మస్జిద్‌కు వెళ్ళి రెండు రకాతుల నమాజ్ చేసుకోవటం అభిలషణీయం|హదీసు 988