హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 170వ అధ్యాయం: వాహనమెక్కి ప్రయాణానికి బయలుదేరినప్పుడు పఠించవలసిన దుఆలు. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 3 హదీసులు (హదీసు 972 – 974) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
170. వాహనమెక్కి ప్రయాణానికి బయలుదేరినప్పుడు పఠించవలసిన దుఆలు
باب ما يقوله إذا ركب الدابة للسفرِ
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{وَجَعَلَ لَكُمْ مِنَ الْفُلْكِ وَالأَنْعَامِ مَا تَرْكَبُونَ لِتَسْتَوُوا عَلَى ظُهُورِهِ ثُمَّ تَذْكُرُوا نِعْمَةَ رَبِّكُمْ إِذَا اسْتَوَيْتُمْ عَلَيْهِ وَتَقُولُوا سُبْحَانَ الَّذِي سَخَّرَ لَنَا هَذَا وَمَا كُنَّا لَهُ مُقْرِنِينَ وَإِنَّا إِلَى رَبِّنَا لَمُنْقَلِبُونَ} [الزخرف: ١٤,١٢]
"మీ కొరకు పడవలనూ, పశువులనూ వాహనాలుగా చేసినవాడు ఆయనే కదా! మీరు వాటి వీపులపై ఎక్కడానికి; కనుక మీరు వాటి మీద కూర్చున్నప్పుడు మీ ప్రభువు ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకొని ఇలా అనండి, "వీటిని మాకు వశపరచినవాడు పరిశుద్ధుడు. లేకపోతే, వాటిని వశపరచుకునే శక్తి మాకు లేదు. నిశ్చయంగా ఏదో ఒకరోజున మేము (కూడా) మా ప్రభువు వైపుకు మరలిపోవలసి ఉన్నది." (అజ్ జుఖ్రుఫ్ : 12 – 14)
English
“… and has appointed for you ships and cattle on which you ride. In order that you may mount on their backs, and then may remember the Favour of your Rubb when you mount thereon, and say: `Glory to Him Who has subjected this to us, and we could never have it (by our efforts). And verily, to Our Rubb we indeed are to return!”’ [Az-Zukhruf 43:12–14]
హదీసు 972
وعن ابنِ عمر رَضِيَ اللَّه عنهما، أَنَّ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كانَ إِذا اسْتَوَى عَلَى بعِيرهِ خَارجاً إِلي سفَرٍ، كَبَّرَ ثَلاثاً، ثُمَّ قالَ: "سبْحانَ الَّذِي سخَّرَ لَنَا هَذَا وَمَا كنَّا لَهُ مُقرنينَ، وَإِنَّا إِلى ربِّنَا لمُنقَلِبُونَ. اللَّهُمَّ إِنَّا نَسْأَلُكَ في سَفَرِنَا هذا البرَّ والتَّقوى، ومِنَ العَمَلِ ما تَرْضى. اللَّهُمَّ هَوِّنْ علَيْنا سفَرَنَا هَذَا وَاطْوِ عنَّا بُعْدَهُ، اللَّهُمَّ أَنتَ الصَّاحِبُ في السَّفَرِ، وَالخَلِيفَةُ في الأهْلِ. اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ وعْثَاءِ السَّفَرِ، وكآبةِ المنظَرِ، وَسُوءِ المنْقلَبِ في المالِ والأهلِ وَالوَلدِ" وإِذا رجَعَ قَالهُنَّ وَزَادَ فيِهنَّ:"آيِبونَ تَائِبونَ عَابِدُون لِرَبِّنَا حَامِدُونَ "رواه مسلم. معنى"مُقرِنِينَ": مُطِيقِينَ."والوَعْثاءُ"بفتحِ الواوِ وَإسكان العين المهملة وبالثاءِ المثلثة وبالمد، وَهي: الشِّدَّة. وَ"الكَآبَةُ"بِالمدِّ، وَهِيَ: تَغَيُّرُ النَّفس مِنْ حُزنٍ ونحوه."وَالمنقَلَبُ": المرْجِعُ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ తన ఒంటెపై కూర్చొని ప్రయాణానికి బయలుదేరినప్పుడు మూడుసార్లు "అల్లాహు అక్బర్" అని చెప్పి ఈ విధంగా ప్రార్థించేవారు –
సుబ్హానల్లజీ సఖ్ఖరలనా హాజా వమాకున్నా లహూ ముఖ్రినీన్ వ ఇన్నా ఇలా రబ్బినా లమున్ఖలిబూన్. అల్లాహుమ్మ ఇన్నా నస్అలుక ఫీ సఫరినా హాజల్ బిర్ర వత్తఖ్వా వమినల్ అమలి మా తర్జా అల్లాహుమ్మ హవ్విన్ అలైనా సఫరనా హాజా వ అత్వి అన్నా బూదహూ. అల్లాహుమ్మ అంతస్సాహిబు ఫిస్సఫరి వల్ ఖలీఫతు ఫిల్ అహ్లి. అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మిన్ వాసాయిస్సఫరి వకఆబతిల్ మంజరి వ సూయిల్ ముంఖలబి ఫిల్మాలి వల్ అహ్లి."
(అనువాదం : ఈ వాహనాన్ని మాకు వశపరచినవాడు పరిశుద్ధుడు. ఆయన వశపరచి ఉండకపోతే, దీన్ని మేము వశపరచుకునే అంతటి వాళ్ళం కాము. ఏదో ఒకనాడు మేము మా ప్రభువు వైపుకే మరలిపోవలసినవారమే. దేవా! ఈ ప్రయాణంలో మాకు మంచిని, భక్తిని, ఇంకా నీవు ఇష్టపడే పనుల్ని చేసే సద్బుద్ధిని ప్రసాదించమని నిన్ను కోరుతున్నాం. దేవా! మా ప్రయాణాన్ని సులభతరం చెయ్యి. దీని దూరాన్ని కుదించు. స్వామీ! నీవే మాకు రక్షకుడవు, మేము వదలి వెళ్తున్న మా ఇంటివారలకు సంరక్షకుడవూ నీవే. దేవా! నేను ప్రయాణ ప్రయాసల నుంచి, చెడు దృశ్యాల నుంచి, ప్రయాణం నుండి తిరిగి వచ్చినప్పటికి నా ఇంట్లో, నా ధనంలో, నా సంతానంలో చెడు పరిణామాలు చోటు చేసుకోవటం నుంచి నీ శరణు వేడుతున్నాను).
తిరుగు ప్రయాణంలోనూ దైవప్రవక్త ﷺ ఈ ప్రార్థనే చేసేవారు. అయితే అందులో అదనంగా ఈ వాక్యాలు పలికేవారు:
'ఆయిబూన, తాయిబూన, ఆబిదూన లిరబ్బినా హామిదూన"
(మేము ప్రయాణం నుంచి తిరిగొస్తున్న వాళ్ళం. దైవం వైపు మరలేవాళ్ళం. ఆయన్ని ఆరాధించేవాళ్ళం. మా ప్రభువుని స్తుతించేవాళ్ళం). (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని హజ్ ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: Whenever the Messenger of Allah ﷺ mounted his camel for setting out on a journey, he would recite: “Allahu Akbar (Allah is Greatest),” thrice. Then he ﷺ would supplicate: “Subhanal-ladhi sakh-khara lana hadha, wa ma kunna lahu muqrinin, wa inna ila Rabbina lamunqalibun. Allahumma inna nas’aluka fi safarina hadh al-birra wat-taqwa, wa minal-`amali ma tarda. Allahumma hawwin `alaina safarana hadha, watwi `anna bu`dahu. Allahumma Antas-Sahibu fissafari, wal-Khalifatu fil-ahli. Allahumma inni a`udhu bika min wa`ta’is-safari, wa kaabatil-manzari, wa su‘il-munqalabi fil-mali wal-ahli wal-waladi (Far removed from imperfection is the One Who has made this subservient to us, for we have no power to subjugate it, and certainly to our Rubb shall we return. O Allah, we ask You during this journey of ours for righteousness, piety and such deeds as are pleasing to You. O Allah, make easy for us this journey of ours and make the distance short for us. O Allah, You are our Companion during the journey and the Guardian of the family and the property in our absence. O Allah, I seek refuge in You from the hardships of travelling, unhappiness connected with ghastly scenes and evil turns in property and family).” When he returned, he recited this supplication making addition of these words: “Ayibuna, ta’ibuna, `abiduna, li-Rabbina hamidun (We are those who return; those who repent; those who worship and those who praise our Rubb).”[Muslim].
ముఖ్యాంశాలు
పై హదీసులో పేర్కొనబడిన 'దుఆ' ఎంతో భావగర్భితమైనది. ప్రయాణంలో మనిషికి రెండు రకాల భయాలుంటాయి. ఒకవైపు తనకు ప్రయాణ విపత్తులు పొంచివుంటాయి. మరోవైపు తన పరోక్షంలో తన కుటుంబీకుల రక్షణ సమస్య కూడా అతన్ని దారిపొడుగునా పీడిస్తూ ఉంటుంది. పైన పేర్కొనబడిన దుఆలో ఆ రెండు సమస్యల పరిష్కారం కోసం ఎంతో సుందరమైన వాక్యాలతో దైవసన్నిధిలో రక్షణ ప్రార్థన చేయటం జరిగింది. తనకు, తన ఇంటివారికి అల్లాహ్ రక్షకుడిగా ఉంటే ఇక వారికి ఎవరు ఏం హాని తలపెట్టగలరు? అందుకని ప్రయాణానికి బయలుదేరినప్పుడు, ప్రయాణం నుంచి తిరిగొచ్చినప్పుడు – రెండు సందర్భాల్లోనూ ఈ దుఆ చేసుకోవాలి. తిరుగు ప్రయాణంలో "ఆయిబూన, తాయిబూన….." వాక్యాలు అదనంగా పలకాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|170. వాహనమెక్కి ప్రయాణానికి బయలుదేరినప్పుడు పఠించవలసిన దుఆలు|హదీసు 972
హదీసు 973
وعن عبد اللَّه بن سرْجِس رضي اللَّه عنه قَالَ: كَانَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِذا سَافَرَ يَتَعوَّذ مِن وعْثاءِ السفرِ، وكآبةِ المُنْقَلَبِ، والحوْرِ بعْد الكَوْنِ، ودعْوةِ المظْلُومِ. وسوءِ المنْظَر في الأهْلِ والمَال. رواه مسلم. هكذا هُوَ في صحيح مسلم: الحوْرِ بعْدَ الكوْنِ، بالنون، وكذا رواه الترمذي، والنسائي، قَالَ الترمذي: وَيُرْوَى"الكوْرُ"بِالراءِ، وكِلاهُما لهُ وجْهٌ. قَالَ العلماءُ: ومعناه بالنونِ والراءِ جَميعاً: الرُّجُوعُ مِن الاسْتقامَةِ أَوِ الزِّيادة إِلى النَّقْصِ. قالوا: وروايةُ الرَّاءِ مأْخُوذَةٌ مِنْ تكْوِير العِمامةِ، وهُوَ لَفُّهَا وجمْعُها، وروايةُ النون مِنَ الكَوْن، مصْدَرُ"كانَ يكُونُ كَوناً"إِذَا وُجد واسْتَقرَّ.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ సర్జిస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ప్రయాణానికి బయలుదేరినప్పుడు ప్రయాణంలో ఎదురయ్యే ప్రయాసల నుంచి, చెడు స్థితిలో తిరిగిరావటం నుంచి, స్థయిర్యం సడలి చాంచల్యం వైపుకు మరలించబడటం నుంచి, బాధితుని శాపానికి గురవటం నుంచి, ఆలుబిడ్డలు, సిరిసంపదల దయనీయ దృశ్యాలు చూడటం నుంచి దైవాన్ని శరణువేడేవారు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని హజ్ ప్రకరణం, సుననె అబూ దావూద్లోని ప్రార్థనల ప్రకరణం)
English
`Abdullah bin Sarjis (radiyallahu anhu) reported: Whenever the Messenger of Allah ﷺ proceeded on a journey, he would seek refuge in Allah from the hardships of the journey, and against deviation after guidance, and against the supplication of the oppressed, and occurrences of unpleasant events in the family and property. He would say: “Allahumma inni a`udhu bika min wa`tha’is-safari, wa kaabatil-munqalabi, wal-hauri ba`dal-kauni, wa da`watil-mazlumi, wa su‘il-manzari fil-ahli wal-mal.”[Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో 'హౌర్ – కౌన్' అనే రెండు పదాలు వాడబడ్డాయి. హౌర్ అంటే తలపాగా మడత విప్పటం. కౌన్ అంటే తలపాగాకు మడతవేయటం అని అర్థం. ఏదయినా వస్తువుని బాగుచేసిన తర్వాత అది పాడయిపోయిందని చెప్పటానికి అరబీ భాషలో తలపాగా మడత విప్పిన తర్వాత తిరిగి మడతపడిందనే సామెత వాడతారు. ఈ సామెత అభివృద్ధి నుండి పతనం వైపుకు, స్థిరత్వం నుండి అస్థిరత్వం వైపుకు మరలించబడటం అనే అర్థాన్నిస్తుంది. పై హదీసులో సందర్భాన్నిబట్టి మేము దాన్ని, "స్థయిర్యం సడలి చాంచల్యం వైపుకు మరలించబడటం" అని అనువదించాము. ప్రయాణావస్థలో మనిషికి అతని విశ్వాస స్థయిర్యాన్ని దెబ్బతీసే పరిస్థితులు ఎదురుకావచ్చు. అందుకే దైవప్రవక్త ﷺ వాటినుండి శరణువేడుకునేవారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|170. వాహనమెక్కి ప్రయాణానికి బయలుదేరినప్పుడు పఠించవలసిన దుఆలు|హదీసు 973
హదీసు 974
وعن علِيِّ بن ربيعة قَالَ: شَهدْتُ عليَّ بن أَبي طالب رَضي اللَّه عنهُ أُتِيَ بِدابَّةٍ لِيَرْكَبَهَا، فَلما وضَع رِجْلَهُ في الرِّكابِ قَالَ: بِسْم اللَّهِ، فلَمَّا اسْتَوَى عَلَى ظَهْرها قال: الحْمدُ للَّهِ ثُمَّ قَالَ: {سُبْحَانَ الَّذِي سَخَّرَ لَنَا هَذَا، وَمَا كُنَّا لَهُ مُقْرنينَ، وإنَّا إِلَى ربِّنَا لمُنْقلِبُونَ} [الزخرف: ١٤,١٣] ، ثُمَّ قَالَ: الحمْدُ للَّهِ ثَلاثَ مرَّاتٍ، ثُمَّ قَالَ: اللَّه أَكْبرُ ثَلاثَ مرَّاتٍ، ثُمَّ قَالَ: سُبْحانَكَ إِنِّي ظَلَمْتُ نَفْسِي فَاغْفِرْ لِي فإِنَّه لاَ يغْفِرُ الذُّنُوب إِلاَّ أَنْتَ، ثُمَّ ضحِك، فَقِيل: يَا أمِير المُؤْمِنينَ، مِنْ أَيِّ شَيءٍ ضَحِكْتَ؟ قَالَ: رأَيتُ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَعل كَما فعلْتُ، ثُمَّ ضَحِكَ فقلتُ: يَا رسول اللَّهِ مِنْ أَيِّ شَيء ضحكْتَ؟ قال: " إِنَّ رَبَّك سُبْحانَهُ يَعْجب مِنْ عَبْده إِذَا قَالَ: اغْفِرِ لِي ذنُوبي، يَعْلَمُ أَنَّهُ لاَ يغْفِرُ الذَّنُوبَ غَيْرِي". رواه أَبو داود، والترمذي وَقالَ: حديثٌ حسنٌ، وفي بعض النسخ: حسنٌ صحيحٌ. وهذا لفظ أَبي داود.
హజ్రత్ అలీ బిన్ రబీఅ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి నేను హజ్రత్ అలీ బిన్ అబూ తాలిబ్ (రదియల్లాహు అన్హు) దగ్గరికి వెళ్ళాను. స్వారీ చేయటంకోసం ఆయనకు ఒక జంతువాహనం సమర్పించబడింది. ఆయన 'బిస్మిల్లాహ్' అంటూ వాహనం రికాబుపై కాలుపెట్టారు. తర్వాత వాహనం వీపు మీద ఎక్కి కూర్చున్నప్పుడు ఈ విధంగా ప్రార్థించారు:
అల్హమ్దులిల్లాహిల్లజీ సఖ్ఖరలనా హాజా వమాకున్నా లహూ ముఖ్రినీన్ వ ఇన్నా ఇలా రబ్బినా లమున్ ఖలిబూన్.
– ఆ తర్వాత ఆయన మూడుసార్లు 'అల్హమ్దులిల్లాహ్', ఇంకో మూడుసార్లు 'అల్లాహు అక్బర్' పఠించారు. తర్వాత ఈ విధంగా ప్రార్థించారు:
"సుబ్హానక ఇన్నీ జలమ్తు నఫ్సీ ఫగ్ఫిర్లీ, ఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత."
(ఓ అల్లాహ్! నీవు పవిత్రుడవు. వాస్తవానికి నేనే నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను. కనుక నన్ను క్షమించు. నిజానికి నీవు తప్ప పాపాలను క్షమించే వాడెవడూ లేడు).
అందుకాయన "ఇప్పుడు నేను చేసినట్లుగా దైవప్రవక్త ﷺ చేస్తుండటం నేను చూశాను" అని అన్నారు. ఆ తర్వాత కాసేపటికి ఆయన మళ్ళీ నవ్వారు. "విశ్వాసుల నాయకా! తమరు ఇప్పుడు ఎందుకు నవ్వినట్టు?" అని ఎవరో అడగ్గా, అప్పుడాయన ఇలా చెప్పారు: దేవుని దాసుడు దైవాన్ని ప్రార్థిస్తూ, "దేవా! నా పాపాలను క్షమించు" అని అన్నప్పుడు మీ ప్రభువు చాలా సంతోషిస్తాడు. నేను తప్ప క్షమించే వాడెవడూ లేడని ఈ నా దాసుడు తెలుసుకున్నాడు అని అంటాడు.
(సుననె అబూ దావూద్లోని జిహాద్ ప్రకరణం, సుననె తిర్మిజీలోని ప్రార్థనల అధ్యాయాలు)
English
`Ali bin Rabi`ah reported: In my presence, a beast was brought to `Ali bin Abu Talib (radiyallahu anhu) for riding. When he put his foot in the stirrup, he said: “Bismillah (With the Name of Allah).” When he had settled himself on its back he recited: “Al-hamdu lillahil-ladhi sakh-khara lana hadha, wa ma kunna lahu muqrinin, wa inna ila Rabbina lamunqalibun. (All praise belongs to Allah Who has made this subservient to us, for we had not the strength to overpower it; and to our Rubb shall we return).” He then recited thrice: “Alhamdu lillah (Praise be to Allah),” and then three times: “Allahu Abkar (Allah is Greatest).” Then he said: “Subhanaka inni zalamtu nafsi faghfir li, innahu la yaghfirudh-dhunuba illa Anta (You are far removed from imperfection I have wronged myself, so forgive me, because none but You can forgive sins).” Then he smiled. It was asked: “Why have you smiled, O Amir Al-Mu’minin (Leader of the Believers)?” He replied: “I saw the Messenger of Allah ﷺ doing as I have done. I (i.e., Ali) asked him (the Messenger of Allah ﷺ) the reason for smiling. He ﷺ said, `Your Rubb, Glorious is He, is pleased when His slave seeks His forgiveness. He (the slave) has firm faith that none except Allah Alone can forgive sins)’.”[Abu Dawud and At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|170. వాహనమెక్కి ప్రయాణానికి బయలుదేరినప్పుడు పఠించవలసిన దుఆలు|హదీసు 974
You must be logged in to post a comment.