హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 164. సంతాన వియోగం పట్ల సహనం వహించేవారికి లభించే పుణ్యం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 164వ అధ్యాయం: సంతాన వియోగం పట్ల సహనం వహించేవారికి లభించే పుణ్యం. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 952 – 954) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

164. సంతాన వియోగం పట్ల సహనం వహించేవారికి లభించే పుణ్యం

↑ విషయ సూచిక

باب فضل من مات لَهُ أولاد صغار

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

952

హదీసు 952

عن أنس رضي اللَّه عَنْه قَالَ: قَال رَسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَا مِنْ مُسلِمٍ يَمُوتُ لَهُ ثلاثَةٌ لَمْ يَبلُغُوا الحِنْثَ إِلاَّ أدخلَهُ اللَّه الجنَّةَ بِفَضْل رحْمَتِهِ إيَّاهُمْ". متفقُ عَلَيْهِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు : ఎవరయినా యుక్తవయసుకు రాని ముగ్గురు పిల్లల్ని కోల్పోతే దేవుడు ఆ పిల్లలపై తనకున్న మమకారం చలువతో అలాంటివారిని స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని జనాయెజ్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Any Muslim who loses three children before they reach the age of maturity, will be granted Jannah by Allah, the Exalted, out of His Mercy for them.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|164. సంతాన వియోగం పట్ల సహనం వహించేవారికి లభించే పుణ్యం|హదీసు 952

953

హదీసు 953

وعن أَبي هُرَيْرَةَ رضِيَ اللَّهُ عنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لاَ يَمُوتُ لأِحَدٍ مِنَ المُسْلِمِينَ ثَلاثةٌ مِنَ الوَلَدِ لاَ تمَسُّهُ النَّارُ إِلاَّ تَحِلَّةَ القَسَم" متفقٌ عليه. "وَتَحِلَّهُ القَسَم"قولُ اللَّهِ تَعَالَى: {وَإِنْ مِنْكُمْ إِلاَّ وَارِدُهَا} [مريم: من الآية٧١] والوُرُودُ: هُوَ العُبُورُ عَلى الصِّراطِ، وَهُوَ جسْرٌ مَنْصُوبٌ عَلَى ظهْرِ جَهَنَّمَ. عَافَانَا اللَّهُ مِنْهَا.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు : ముగ్గురు పిల్లల్ని కోల్పోయిన (అంటే వారి మరణం పట్ల సహనం వహించిన) ఏ ముస్లింనూ నరకాగ్ని ముట్టుకోజాలదు. అయితే ప్రమాణం నెరవేరటానికి అతను నరకం మీదుగా పోవలసి ఉంటుంది.

(బుఖారీ – ముస్లిం)

ఎందుకంటే దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : "మీలో నరకం మీదుగా పోనివారంటూ ఉండరు." (మర్యమ్ : 81) 'వురూద్' అంటే 'వంతెన దాటడం' అని అర్థం. నరకం పైన ఒక వంతెన కట్టబడి ఉంది. అల్లాహ్ మనల్నందరినీ క్షేమంగా ఆ వంతెన దాటేలా చేయుగాక!

(సహీహ్ బుఖారీలోని జనాయెజ్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “A Muslim whose three children die (in infancy) will not be touched by the Fire (of Hell) except for the fulfillment of Allah’s Oath.”[Al-Bukhari and Muslim].

[Allah’s Oath here refers to His Ayah: “There is not one of you but will cross over it (Hell).” (19:71) And the crossing will be across the `Bridge’ set over the Hell.]

ముఖ్యాంశాలు

నరకం మధ్యన ఓ వంతెన ఉంది. ప్రళయదినాన విశ్వాసులు, అవిశ్వాసులు అందరూ ఆ వంతెన దాటి వెళ్ళవలసి ఉంటుంది. అయితే విశ్వాసులు తమ ఆచరణలకు అనుగుణంగా కొందరు రెప్పపాటులో వంతెన దాటితే మరికొందరు మెరుపువేగంతో, వాయువేగంతో ఆ వంతెన దాటుతారు. కొందరు పక్షుల్లాగా, ఇంకొందరు అశ్వవేగంతో వంతెన దాటి వెళ్ళిపోతారు. మొత్తానికి చాలామంది విశ్వాసులు సురక్షితంగా వంతెన దాటుతారు. కొంతమంది బలహీన విశ్వాసులు మాత్రం ఆ వంతెన పూర్తిగా దాటలేక నరకంలో పడిపోతారు. ఆ తర్వాత కొంతకాలానికి ఎవరో ఒకరి సిఫారసుతో వారిని కూడా నరకం నుంచి రక్షించటం జరుగుతుంది. కాని అవిశ్వాసులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ వంతెన దాటలేరు. వారిలోని ప్రతి ఒక్కరూ నరకాగ్నికి ఆహుతి అవుతారు. ముగ్గురు పిల్లల్ని కోల్పోయిన ముస్లిం నరకానికి పోడు. కాని దివ్య ఖుర్‌ఆన్‌లోని దైవనిర్ణయం నెరవేరటానికన్నట్లు అతను నామమాత్రానికి ఆ నరక వంతెన దాటి తన అసలు నివాసమైన స్వర్గానికి వెళ్ళిపోతాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|164. సంతాన వియోగం పట్ల సహనం వహించేవారికి లభించే పుణ్యం|హదీసు 953

954

హదీసు 954

وعن أَبي سعيدٍ الخُدْرِيِّ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: جَاءَتِ امرأَةٌ إِلى رَسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَالَتْ: يَا رَسُولَ اللَّهِ ذَهَبَ الرِّجالُ بحَديثِكَ، فاجْعَلْ لَنَا مِنْ نَفْسِكَ يَوْماً نَأْتيكَ فيهِ تُعَلِّمُنَا مِمَّا عَلَّمَكَ اللَّه، قَالَ: " اجْتَمِعْنَ يَوْمَ كَذَا وَكَذَا"فَاجْتَمَعْنَ، فَأَتَاهُنَّ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَعَلَّمَهنَّ مِمَّا علَّمهُ اللَّه، ثُمَّ قَالَ:"مَا مِنْكُنَّ مِن امْرَأَةٍ تُقَدِّمُ ثَلاثةً منَ الوَلَدِ إِلاَّ كانُوا لهَا حِجَاباً منَ النَّار"فَقالتِ امْرَأَةٌ: وَاثنينِ؟ فَقَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم"وَاثْنَيْن "متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక మహిళ దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి, "దైవప్రవక్తా! మీ మాటలు వినే అవకాశం పురుషులకు మాత్రమే లభిస్తుంది. అందుకని మీరు మా కోసం కూడా ఒక దినం నిర్ణయిస్తే, ఆ రోజు మేమూ మీ సన్నిధికి వస్తాం. అప్పుడు దేవుడు మీకు నేర్పిన విషయాలు మాకూ బోధించవచ్చు" అని విన్నవించుకుంది. దానికాయన, "అయితే మీ స్త్రీలంతా ఫలానా రోజున ఒకచోట సమావేశమవుతూ ఉండండి" అని అన్నారు. దైవప్రవక్త ﷺ ఆదేశానుసారం ఆ రోజు స్త్రీలందరూ సమావేశమయ్యారు. దైవప్రవక్త ﷺ వారి వద్దకు వెళ్ళి, దేవుడు తనకు నేర్పిన విషయాలు వారికి బోధిస్తూ "ముగ్గురు పిల్లల్ని కోల్పోయిన (అంటే వారి మరణం పట్ల సహనం వహించిన) స్త్రీ నరకానికి వెళ్ళకుండా ఆ పిల్లలు అడ్డుపడతారు" అని చెప్పారు. ఒక స్త్రీ ఈ మాట విని, "మరి ఇద్దరు పిల్లల్ని కోల్పోయి ఉంటేనో?" అని అడిగింది. అందుకాయన, "ఆ… ఇద్దరయినా" అని సమాధానమిచ్చారు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని జనాయెజ్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)

English

Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: A woman came to the Messenger of Allah ﷺ and said: “O Messenger of Allah! Only men benefit from your talks, so please fix a day for us, to teach us the knowledge which Allah has taught you.” The Messenger of Allah ﷺ fixed a day and directed them to assemble. When they gathered, the Prophet ﷺ went to them and taught them what Allah had taught him. He ﷺ then said, “Any woman of you whose three children die (in infancy) they will be a guard for her against Fire (of Hell).” One of the women asked: “What if she loses two?” The Messenger of Allah ﷺ replied, “Even two.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ధార్మిక సమావేశాలకు స్త్రీలు కూడా పాల్గొనవచ్చునీ, ధర్మజ్ఞాన సముపార్జనకు స్త్రీలకు కూడా అవకాశాలు కల్పించాలని పై హదీసు ద్వారా బోధపడుతోంది. స్వయంగా స్త్రీలలోనే ధర్మజ్ఞాన సముపార్జన పట్ల ఆసక్తి ఉండాలి. అప్పుడే వారు ధార్మిక విద్యను ఆర్జించి తమల్ని తాము సంస్కరించుకోవటంతో పాటు తమ కుటుంబాలను కూడా చక్కదిద్దుకోగల్గుతారు. తమ పిల్లలకు సరైన శిక్షణను అందించగల్గుతారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగుతో సమానం. ఒక స్త్రీ చదువుకొని సరైన శిక్షణతో ధర్మజ్ఞానాన్ని ఆర్జిస్తే, ఆమె ఓ మంచి ఇల్లాలిగా, ఉత్తమ గృహిణిగా, ఉత్తమ మహిళగా సమాజానికి తన వంతు సేవను అందజేయగలదు. తన కుటుంబంలోని వారందరినీ సరైన బాటలో నడిపించగలదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|164. సంతాన వియోగం పట్ల సహనం వహించేవారికి లభించే పుణ్యం|హదీసు 954